Students can go through AP Board 7th Class Maths Notes 10th Lesson త్రిభుజాల నిర్మాణం to understand and remember the concept easily.
AP Board 7th Class Maths Notes 10th Lesson త్రిభుజాల నిర్మాణం
→ త్రిభుజము : మూడు రేఖాఖండాలతో ఏర్పడే సరళ సంవృత పటాన్ని త్రిభుజం అంటారు.
→ త్రిభుజ అసమానత్వ నియమాలు :
- ఒక త్రిభుజంలోని ఏవైనా రెండు భుజాల పొడవుల మొత్తం మూడవ భుజం పొడవు కన్నా ఎక్కువ.
- ఒక త్రిభుజంలోని ఏవైనా రెండు భుజాల పొడవుల భేదం మూడవ భుజం పొడవు కన్నా తక్కువ.
→ త్రిభుజ అంతరకోణ ధర్మం : త్రిభుజంలోని మూడు కోణముల మొత్తము 180°.
→ త్రిభుజం బాహ్యకోణ ధర్మం : త్రిభుజంలో ఒక భుజమును పొడిగించగా ఏర్పడు బాహ్యకోణం దాని అంతరాభిముఖ కోణముల మొత్తానికి సమానం.
→ త్రిభుజ కోణాలు, భుజాల మధ్య సంబంధం :
- త్రిభుజంలో పెద్ద కోణానికి ఎదురుగా గల భుజం మిగిలిన రెండు భుజాలకన్నా పెద్దదిగా ఉంటుంది.
- త్రిభుజంలో చిన్న కోణానికి ఎదురుగా గల భుజం మిగిలిన రెండు భుజాల కన్నా చిన్నదిగా ఉంటుంది.
- త్రిభుజంలో సమాన కోణాలకు ఎదురుగా గల భుజాలు సమానాలు.
→ త్రిభుజ నిర్మాణమునకు మూడు స్వతంత్ర కొలతలు కావలెను.. ఈ మూడు స్వతంత్ర కొలతలలో కనీసం ఒక భుజం కొలత అవసరము.