Andhra Pradesh AP Board 1st Class Telugu Solutions 5th Lesson ఆట, జడ – దండ Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 1st Class Telugu Solutions Chapter 5 ఆట, జడ – దండ
Textbook Page No. 54
ఆట లంటే మాకిష్టం
పాటలంటే మాకిష్టం
ఆటలకన్నా పాటలకన్నా
అల్లరి పనులే మాకిష్టం
కొత్తదుస్తులు మాకిష్టం
పౌడరు తిలకం మాకిష్టం
దుస్తులు కన్నా పౌడరుకన్నా
మట్టిలొ ఆటలు మాకిష్టం
వెన్నెలంటే మాకిష్టం
వానలంటే మాకిష్టం
వెన్నెలకన్నా వానలకన్నా
అమ్మ ముద్దులే మాకిష్టం
Textbook Page No. 55
వినండి – మాట్లాడండి.
అ) గేయం పాడండి. అభినయించండి.
జవాబు:
గేయాన్ని పాడుట, అభినయించుట.
ఆ) పాఠం చిత్రంలో ఎవరేం చేస్తున్నారో చెప్ప౦డి.
జవాబు:
పిల్లలు ఆటలాడుతున్నారు. చెమ్మచెక్క చేరడేసి మొగ్గ అని ఇద్దరు ఆడుతున్నారు. ఒక అమ్మాయి తొక్కుడు బిళ్ళ ఆట ఆడుతుంది. ఇద్దరు అబ్బాయిలు కుక్కపిల్ల మీద చేయివేసి ఆడుతున్నారు. కొందరు ఆశ్చర్యంగా చూస్తున్నారు.
ఇ) కింది చిత్రం ఆధారంగా మాట్లాడండి.
జవాబు:
పాలు పిండుతున్నారు. ఒక బాబు పాలు పిండుతున్నాడు. పాప గిన్నెలో పాలుపడుతుంది. బుజ్జి దూడను పిల్లలు గోముగా దగ్గర చేర్చుకుంటున్నారు. పాప తలను నెమరుతుంది. మానవులు జంతువులు కలిసి ప్రేమతో జీవిస్తాయి.
చదవండి.
అ) గేయంలోని వాక్యాలలో “ఆట” పదానికి చుట్టండి.
ఆ) కింది వాక్యాలలో “ఆట” పదానికి చుట్టండి.
జవాబు:
Textbook Page No. 56
ఇ) చిత్రం చూడండి. పదం చదవండి. అక్షరాలను వర్ణమాలలో గుర్తించండి.
ఈ) కింది గళ్ళలో అక్షరాలు చెప్ప౦డి.
1వ అక్షరం ఏమిటి ?
జవాబు: ఆ
2వ అక్షరం ఏమిటి ?
జవాబు: ట
1, 2 అక్షరాలు కలిపి చదవండి.
జవాబు: ఆట
3, 4, 2 అక్షరాలు కలిపి చదవండి.
జవాబు: మంట
1, 3, 6 అక్షరాలు కలిపి చదవండి.
జవాబు: ఆమడ
ఉ) కింది బొమ్మలు ఆ, ట అనే అక్షరాలతో మొదలవుతాయి. వాటి పేర్లు చెప్ప౦డి.
ఊ) పదాలను చదవండి. ఆ, ట అక్షరాలకు చుట్టండి.
జవాబు:
Textbook Page No. 57
రాయండి.
అ) గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయండి.
ఆ) చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి.
జవాబు:
ఇ) కింది గళ్ళలోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి.
జవాబు:
సృజనాత్మకత:
పిల్లలూ ! చుక్కలు కలుపుతూ చిత్రం గీయండి. రంగులు వేయండి. పేరు రాయండి.
జవాబు:
ఆట
Textbook Page No. 58
జడ – దండ
జ, ద
సీతమ్మ వాకిట సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టేమో విరగబూసింది
చెట్టు వంచకుండా కొమ్మ వంచండి
కొమ్మ విరగకుండా పూలు కోయండి
కోసిన పూలన్నీ దండ గుచ్చండి
దండ తీసుకువెళ్ళి సీతకివ్వండి.
రాముడంపాడమ్మ సిరిమల్లె దండ
ముడుచుకో సీతమ్మ ముచ్చటగ జడ నిండ
Textbook Page No. 59
వినండి- మాట్లాడండి.
అ) గేయం పాడండి. అభినయించండి.
జవాబు:
గేయాన్ని పాడుట, అభినయించుట.
ఆ) పాఠం చిత్రంలో ఎవరేం చేస్తున్నారో చెప్ప౦డి.
జవాబు:
చిత్రంలో పిల్లలు పూలు, దండగా గుచ్చుతున్నారు. బాబూ, పాప పూల కుండీని మోసుకొస్తున్నాడు. పిల్లి ఉన్నది. దూడ కట్టివేయబడి ఉన్నది. సిరిమల్లె చెట్టు ఉన్నది. చెట్లు ప్రకృతితో అందమైన ఇల్లు ఉన్నది.
ఇ) కింది చిత్రం ఆధారంగా మాట్లాడండి.
జవాబు:
ఇంటి ప్రక్కన పెరడులో మంచం వేసుకొని ఉన్నారు. అక్క చెల్లికి జడ వేస్తుంది. అద్దంలో చూసుకుంటుంది. మంచం క్రింద పిల్లి ఉన్నది. గుమ్మడికాయలు, పచ్చిమిరపకాయలు గోడ మీద పరచి ఉన్నాయి. చెట్టు బెరడు పై పక్షి ఉన్నది. కోడి పిల్లలతో మొక్కల దగ్గర ఆడుతోంది.
చదవండి.
అ) గేయంలోని వాక్యాలలో “జడ, దండ” పదాలకు చుట్టండి.
ఆ) కింది వాక్యాలలో “జడ, దండ” పదాలకు చుట్టండి.
జవాబు:
ఇ) చిత్రం చూడండి. పదం చదవండి. అక్షరాలను వర్ణమాలలో గుర్తించండి.
ఈ) కింది గళ్ళలో అక్షరాలు చెప్ప౦డి..
1వ అక్షరం ఏమిటి ? జవాబు: జ
2వ అక్షరం ఏమిటి ? జవాబు: డ
1, 2 అక్షరాలు కలిపి చదవండి. జవాబు: జడ
3, 2 అక్షరాలు కలిపి చదవండి. జవాబు: దండ
4, 5, 1, 2, అక్షరాలు కలిపి చదవండి. జవాబు: లతజడ
ఉ) కింది బొమ్మలు జ, ద అనే అక్షరాలతో మొదలవుతాయి. వాటి పేర్లు చెప్ప౦డి.
ఊ) పదాలను చదవండి. జ, ద అక్షరాలకు చుట్టండి.
జవాబు:
Textbook Page No. 61
రాయండి.
ఆ) గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయండి.
ఆ) చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి.
జవాబు:
ఇ) కింది గళ్ళలోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి.
జవాబు:
సృజనాత్మకత:
పిల్లలూ ! చిత్రానికి తగిన రంగులు వేయండి. పేరు రాయండి.
జవాబు:
దండ