AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

SCERT AP 10th Class Physics Study Material Pdf 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Physical Science 5th Lesson Questions and Answers మానవుని కన్ను-రంగుల ప్రపంచం

10th Class Physical Science 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
హ్రస్వదృష్టి లోపాన్ని మీరెలా సవరిస్తారు?
(లేదా)
కన్ను యొక్క హ్రస్వ దృష్టిని మీరు ఏ విధంగా సవరిస్తారు?
జవాబు:
1) ఒక వ్యక్తి గరిష్ఠ దూర బిందువుకు ఆవల ఉన్న వస్తువును చూడలేకపోవు దోషాన్ని “హ్రస్వదృష్టి” అంటారు.

2) ఏ దూరం వద్ద నున్న బిందువుకు లోపల గల వస్తువుకు మాత్రమే కంటి కటకం రెటీనా పై ప్రతిబింబాన్ని ఏర్పరచుకోగలదో ఆ బిందువును గరిష్ఠ దూర బిందువంటారు.

3) గరిష్ఠ దూరబిందువుకు, స్పష్ట దృష్టి కనీస దూరాన్ని తెలిపే బిందువుకు మధ్య వస్తువు ఉన్నప్పుడు కంటి కటకం రెటీనా పై ప్రతిబింబమును ఏర్పరచగలదు.
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 1

|4) గరిష్ఠ దూరబిందువు ఆవల ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబాన్ని కంటి కటకం రెటీనా కంటే ముందు ఏర్పరుస్తుంది.
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 2

5) కావున ఒక కటకంను ఉపయోగించి గరిష్ఠ దూర బిందువుకు ఆవల ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబాన్ని గరిష్ఠ దూర బిందువు మరియు స్పష్ట దృష్టి కనీస దూరాన్ని తెలిపే బిందువుల మధ్యకు తేగలిగితే ఆ ప్రతిబింబం కంటి కటకానికి వస్తువులా పని చేస్తుంది.

6) హ్రస్వదృష్టిని నివారించేందుకు అనంతదూరంలో ఉండే వస్తువు యొక్క ప్రతిబింబాన్ని గరిష్ఠ దూర బిందువు వద్ద ఏర్పరచగలిగే కటకాన్ని ఎంచుకోవాలి.

7) దీని కొరకు ద్విపుటాకార కటకమును వాడాలి.

8) ఈ ద్విపుటాకార కటకం ఏర్పరిచే ప్రతిబింబం కంటి కటకానికి వస్తువు వలె పనిచేసి, చివరకు వస్తు ప్రతిబింబంను రెటీనా పై ఏర్పరచును.
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 3

ప్రశ్న 2.
దీర్ఘదృష్టి లోపాన్ని సవరించే విధానాన్ని వివరించండి.
(లేదా)
కన్ను యొక్క దీర్ఘదృష్టిని మీరు ఏ విధంగా సవరిస్తారు?
జవాబు:
1) దీర్ఘదృష్టి గల వ్యక్తి దూరంలో వున్న వస్తువులను స్పష్టంగా చూడగలడు. కానీ దగ్గరి వస్తువులను చూడలేడు.
2) దీనికి గల కారణము కంటి కటక కనిష్ఠ నాభ్యంతరం 2.27 సెం.మీ. కన్నా ఎక్కువగా ఉండడమే.
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 4
3) పై పటంలో చూపినట్లుగా ఈ సందర్భంలో దగ్గరలోని వస్తువు నుండి వచ్చే కాంతి కిరణాలు కంటి కటకం ద్వారా వక్రీభవనం చెంది ప్రతిబింబం రెటీనాకు ఆవల ఏర్పడుతుంది.
4) వస్తువు కనిష్ఠ దూర బిందువుకు ఆవల ఉంటే, కంటి కటకం రెటీనా పై ప్రతిబింబాన్ని ఏర్పరచగలదు.
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 5
5) కనుక దీర్ఘదృష్టిని నివారించడానికి ద్వికుంభాకార కటకాన్ని ఉపయోగించాలి.
6) ఈ కటకం వలన ఏర్పడే ప్రతిబింబం కంటి కటకానికి వస్తువుగా పనిచేస్తుంది.
7) అందువలన చివరకు కంటి కటకం వలన ఏర్పడే ప్రతిబింబం పటంలో చూపినట్లుగా రెటీనా పై ఏర్పడును.

ప్రశ్న 3.
పట్టక పదార్థ వక్రీభవన గుణకాన్ని ప్రయోగపూర్వకంగా ఎలా కనుగొంటారు?
(లేదా)
పట్టకపు వక్రీభవన గుణకమును కనుగొను కృత్యంను వ్రాయుము. (ప్రయోగశాల కృత్యం)
జవాబు:
ఉద్దేశ్యం : పట్టక వక్రీభవన గుణకాన్ని కనుగొనడము.

కావలసిన వస్తువులు :
పట్టకం, తెల్లని డ్రాయింగ్ చార్ట్ (20 X 20 సెం.మీ.), పెన్సిల్, గుండుసూదులు, స్కేలు మరియు కోణమానిని.
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 6

నిర్వహణ పద్దతి :

  1. ఒక గాజు పట్టకాన్ని తీసుకొని, దాని త్రిభుజాకార పతనకిరణం, AM ఆధారం డ్రాయింగ్ చార్ట్ పై ఉండే విధముగా అమర్చుము.
  2. పట్టక ఆధారం చుట్టూ పెన్సిల్ తో గీత గీసి పట్టకాన్ని తీసివేయాలి.
  3. త్రిభుజ భుజం PQ పై ఒక బిందువు ‘M’ ను గుర్తించుము.
  4. M వద్ద PQ కు లంబాన్ని గీయాలి.
  5. M వద్ద PQ తో 30° కోణాన్ని గుర్తించి, ఒక రేఖను గీయుము. ఇదియే పతన కిరణం అగును.
  6. ఈ కోణమును “పతన కోణము” అంటారు.
  7. పట్టకాన్ని తిరిగి దాని స్థానంలో ఉంచి పతన కిరణం AB పై రెండు గుండు సూదులను నిలువుగా గుచ్చుము.
  8. పట్టకం రెండోవైపు నుండి గుండుసూదుల ప్రతిబింబాలతో ఒకే వరుసలో ఉండునట్లు C, D బిందువుల వద్ద మరో రెండు గుండు సూదులను గుచ్చుము.
  9. ఇప్పుడు C, D లను కలుపుము. ఇది బహిర్గత కిరణమును సూచించును.
  10. పతన కిరణం, బహిర్గత కిరణాలను వెనుకకు పొడిగించిన అవి రెండూ ‘O’ వద్ద ఖండించుకుంటున్నాయి.
  11. ‘O’ బిందువు వద్ద ఈ రెండు కిరణాల మధ్య కోణమును కొలిచిన, అది విచలన కోణం (d) అగును.
  12. ఈ విధంగా వివిధ పతన కోణాలకు, విచలన కోణాల విలువలను తెలుసుకొని, వాటిని నమోదు చేయుము.
  13. ఈ ప్రయోగం ద్వారా పతన కోణం పెరుగుతున్న కొలదీ కొంతమేర విచలన కోణం విలువ తగ్గి తర్వాత పతన కోణంతో పాటుగా పెరగడం గమనించవచ్చును.
    AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 7
  14. పతన కోణంను X-అక్షం వెంబడి, విచలన కోణంను Y-అక్షం వెంబడి తీసుకొని గ్రాఫును గీసిన సున్నిత వక్రం ఏర్పడుతుంది.
  15. ఈ వక్రం ద్వారా కనిష్ట విచలన కోణం ‘D’ ను కనుగొనవచ్చును.
  16. ‘పట్టక కోణం ‘A’ కనిష్ఠ విచలన కోణం ‘D’ అయితే పట్టక వక్రీభవన గుణకము \(n=\frac{\sin \left[\frac{(A+D)}{2}\right]}{\sin \frac{A}{2}}\) అగును.

AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

ప్రశ్న 4.
ఇంద్రధనుస్సు ఏర్పడే విధానాన్ని వివరించండి. (కృత్యం – 5)
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 8

  1. ప్రకృతిలోని తెల్లని సూర్యకాంతి, అనేక లక్షల నీటి బిందువుల చేత విక్షేపణం చెందడం వల్ల ఇంద్రధనుస్సు ఏర్పడును.
  2. పటంలో చూపినట్లుగా నీటి బిందువు పై ప్రాంతం నుండి సూర్యుని కాంతికిరణం లోపలికి ప్రవేశించును.
  3. అక్కడ జరిగే మొదటి వక్రీభవనంలో తెల్లని కాంతి వివిధ రంగులుగా విక్షేపణం చెందును.
  4. అన్ని రంగులు నీటి బిందువు రెండో వైపుకు చేరాక, సంపూర్ణాంతర పరావర్తనం వల్ల నీటి బిందువులోనే వెనుకకు పరావర్తనం చెందుతాయి.
  5. ఫలితముగా నీటి బిందువు మొదటి ఉపరితలాన్ని చేరాక, ప్రతీ రంగు మరలా గాలిలోకి వక్రీభవనం చెందును.
  6. నీటి బిందువులోకి ప్రవేశించే కిరణాలు, బయటకు వెళ్ళే కిరణాల మధ్య కోణం (0° నుండి 42° మధ్య ఎంతైనా ఉండవచ్చు.
  7. ఆ కోణం 42° లకు దాదాపు సమానంగా ఉన్నప్పుడు ప్రకాశవంతమైన ఇంద్రధనుస్సును మనం చూడగలము.
  8. ప్రతి నీటి బిందువు కాంతిని ఏడు రంగులలోకి విడగొట్టినా, ఒక పరిశీలకుడు తాను ఉన్న స్థానాన్ని బట్టి, ఒక నీటి బిందువు నుండి వచ్చే రంగులలో ఏదో ఒకదానిని మాత్రమే చూడగలడు.
  9. సూర్యకాంతి పుంజానికి, నీటి బిందువుచే వెనుకకు పంపబడిన కాంతికి మధ్యకోణం 42° ఉన్నప్పుడే మనకు ఎరుపు రంగు కనబడుతుంది.
  10. 40° ల నుండి 42°ల మధ్య కోణంలో VIBGYOR లోని మిగిలిన రంగులు కనిపిస్తాయి.
    AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 9
  11. ఈ విధముగా ప్రకృతిలో ఇంద్రధనుస్సు ఏర్పడును.

ప్రశ్న 5.
ఆకాశం నీలి రంగులో కనబడటానికి గల కారణాన్ని క్లుప్తంగా వివరించండి.
(లేదా)
మనకు ఆకాశము నీలముగా కనబడుటకు గల కారణమును వివరింపుము.
జవాబు:

  1. ఆకాశం నీలిరంగుగా ఉండుటకు కారణము కాంతి యొక్క పరిక్షేపణము.
  2. కాంతి పరిక్షేపణమనగా ఒక కణం శోషించుకున్న కాంతిని తిరిగి అన్ని దిశలలో వివిధ తీవ్రతలతో విడుదల చేయడాన్ని “కాంతి పరిక్షేపణం” అంటాము.
  3. వాతావరణంలో వివిధ పరిమాణాలు గల కణాలుంటాయి.
  4. వాతావరణంలోని నైట్రోజన్, ఆక్సిజన్ అణువు పరిమాణం నీలిరంగు కాంతి తరంగదైర్ఘ్యంతో పోల్చదగిన విధముగా ఉంటుంది.
  5. ఈ అణువులు నీలిరంగు కాంతికి పరిక్షేపణ కేంద్రాలుగా పనిచేస్తాయి.
  6. వాతావరణంలో నైట్రోజన్, ఆక్సిజన్ అణువులు ఎక్కువగా వుండటం వల్ల, అవి నీలిరంగు కాంతికి పరిక్షేపణ కేంద్రాలుగా పనిచేయడం వల్ల ఆకాశం నీలిరంగులో కనిపిస్తుంది.

ప్రశ్న 6.
అంశం (A) : కాంతి పరిక్షేపణం వలన ఆకాశం నీలిరంగులో కనబడుతుంది.
కారణం (R) : తెల్లని కాంతిలోని వివిధ కాంతులలో నీలిరంగు కాంతి తరంగదైర్ఘ్యం తక్కువ.
a) A, R రెండూ సరియైనవి. మరియు A కు R సరైన వివరణ.
b) A, R రెండూ సరియైనవి. కానీ A కు R సరైన వివరణ కాదు.
c) A సరియైనది. కానీ R సరియైనది కాదు.
d) A మరియు R సరైనవి కావు.
e) A సరియైనది కాదు కానీ R సరైనది.
జవాబు:
a) A, R లు రెండూ సరియైనవి. మరియు A కు R సరైన వివరణ.

కారణము :
ఆకాశం నీలిరంగుకు కాంతి పరిక్షేపణమే కారణము. తక్కువ తరంగదైర్ఘ్యం గల కాంతికి, అధిక తరంగదైర్ఘ్యం గల కాంతితో పోల్చితే పరిక్షేపణ సామర్థ్యం ఎక్కువ.

ప్రశ్న 7.
తరగతి గదిలో ఇంద్రధనుస్సును ఏర్పరిచేందుకు ఒక ప్రయోగాన్ని తెల్పండి. ప్రయోగ విధానాన్ని వివరించండి. (కృత్యం-4)
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 10

  1. ఒక లోహపు పళ్ళాన్ని తీసుకొని; నీటితో నింపుము.
  2. నీటి ఉపరితలంతో కొంతకోణం చేసే విధంగా ఒక సమతల దర్పణమును పటంలో చూపిన విధంగా ఉంచుము.
  3. పటంలో చూపినట్లుగా నీటి గుండా అద్దం పై తెల్లని కాంతిని ప్రసరింపజేయుము.
  4. ఈ అమరికకు కొంత ఎత్తులో తెల్లటి కార్డుబోర్డుపై వివిధ రంగులతో ఇంద్రధనుస్సు ఏర్పడుటను గమనించవచ్చును.

AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

ప్రశ్న 8.
కొన్ని బైనాక్యులర్లందు పట్టకాలను వినియోగిస్తారు. బైనాక్యులర్లలో పట్టకాలు ఎందుకు వినియోగిస్తారో తెలియజేసే – సమాచారాన్ని సేకరించండి.
(లేదా)
పట్టకములకు సంబంధించిన సమాచారాన్ని సేకరించుము. వాటిని బైనాక్యులలో ఎందుకు వాడుతారో వివరింపుము.
జవాబు:

  1. పరిశీలకునికి దూరపు వస్తువులను పరీక్షించుటకు సమాంతరంగా కదిలే విధంగా రెండు కటకాలను అమర్చుతారు.
  2. అధిక -పరావర్తనం కోసం బైనాక్యులర్లలో పట్టకాలను ఉపయోగిస్తారు.
  3. పట్టకాలను ఉపయోగించి బైనాక్యులర్ యొక్క పరిమాణంను తగ్గిస్తారు.
  4. పట్టకములను ఉపయోగించి వస్తు పరిమాణం మరియు దృక్ తీవ్రతలను పెంచవచ్చును.
  5. సాధారణంగా బైనాక్యులర్లలో లంబకోణ పట్టకం లేదా ద్విపట్టకాలను ఉపయోగిస్తారు.
  6. బైనాక్యులలో పట్టకాలను ఉపయోగించి తక్కువ ఖర్చుతోనే వాటి పరావర్తన సామర్థ్యాన్ని 95% వరకు పెంచవచ్చును.

ప్రశ్న 9.
పటంలో పట్టక తలం AB పై పడిన పతన కిరణాన్ని, పట్టక తలం AC నుండి వచ్చే బహిర్గత కిరణాన్ని చూపడం జరిగింది. పటంలో లోపించిన వాటిని గీయండి.
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 11
జవాబు:
AB, AC లు వక్రీభవన తలాలు మరియు BC పరావర్తన తలము.
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 12

ప్రశ్న 10.
ఆకాశం నీలిరంగులో కనబడడానికి కారణమైన వాతావరణంలోని అణువుల పాత్రను మీరెలా అభినందిస్తారు?
(లేదా)
ఆకాశం నీలి రంగులో కనబడుటకు కారణం ఏమిటి ? ఈ విషయంలో వాతావరణంలోని అణువుల పాత్రను మీరెలా అభినందిస్తారు?
జవాబు:

  1. ఆకాశం నీలిరంగులో ఉండుటకు ముఖ్యకారణము కాంతి పరిక్షేపణమే.
  2. వాతావరణంలోని N2, O2 అణువుల పరిమాణం నీలిరంగు కాంతి తరంగదైర్ఘ్యంతో పోల్చదగిన విధముగా ఉంటుంది.
  3. ఈ అణువులు నీలిరంగు కాంతికి పరిక్షేపణ కేంద్రాలుగా పనిచేస్తాయి.
  4. వాతావరణంలో నైట్రోజన్, ఆక్సిజన్ అణువుల శాతము ఎక్కువగా ఉండటం వలన, అవి నీలిరంగు కాంతికి పరిక్షేపణ కేంద్రాలుగా పనిచేయడం వలన ఆకాశం నీలిరంగులో కనిపిస్తుంది.
  5. ఈ విధమైన ఆకాశపు నీలిరంగుకి కారణమైన వాతావరణంలోని N2 మరియు O2ల పాత్రను నేను అభినందించుచున్నాను.

ప్రశ్న 11.
కంటిలోని సిలియరి కండరాల పనితీరును మీరెలా అభినందిస్తారు?
(లేదా)
సిలియరి కండరాల పనితీరు మన కంటికి ఏ విధమైన అవసరమో అభినందించుము.
జవాబు:
కంటిలోని సిలియరి కండరాల పనితీరు కంటిపై ప్రతిబింబంను ఏర్పరుచుటలో ఎంతో అభినందనీయమైనది. ఎందుకనగా

  1. కంటిలోని కటకానికి ఆనుకొని ఉన్న ఈ కండరాలు కటక వక్రతా వ్యాసార్ధాన్ని మార్చడం ద్వారా కటకం తన నాభ్యంతరమును మార్చుకోవడానికి దోహదపడతాయి.
  2. దగ్గరలో వున్న వస్తువును కన్ను చూస్తున్నప్పుడు, సిలియరి కండరాలు ఒత్తిడికి గురికావడం వల్ల కంటి కటక నాభ్యంతరం తగ్గుతుంది.
  3. దూరంలో ఉన్న వస్తువును కన్ను చూస్తున్నప్పుడు, సిలియరి కండరాలు విశ్రాంత స్థితిలో ఉండటం వల్ల కంటి కటక నాభ్యంతరం గరిష్ఠమవుతుంది.
  4. ఈ విధమైన సర్దుబాటును సిలియరి కండరాలు చేస్తాయి.

ప్రశ్న 12.
కొన్ని సందర్భాలలో ఆకాశం తెలుపురంగులో కనబడుతుంది. ఎందుకు?
(లేదా)
అప్పుడప్పుడు ఆకాశం తెలుపు రంగులో కనబడుటకు వెనుకన గల కారణాలేమిటో వ్రాయుము.
జవాబు:

  1. వాతావరణంలో వివిధ పరిమాణాలు గల కణాలుంటాయి.
  2. ఆ కణాలు వాటి పరిమాణాలకనుగుణంగా వివిధ తరంగదైర్ఘ్యాలు గల కాంతిని పరిక్షేపణం చేస్తాయి.
  3. వేసవి రోజుల్లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల వాతావరణంలోకి నీటి ఆవిరి చేరుతుంది.
  4. దీని ద్వారా వాతావరణంలో నీటి అణువులు ఇతర పౌనఃపున్యాలు గల కాంతులను పరిక్షేపణం చేస్తాయి.
  5. N2, O2 ల పరిక్షేపణం వల్ల వచ్చే నీలిరంగు కాంతి, నీటి అణువుల పరిక్షేపణం వల్ల వచ్చే ఇతర రంగుల కాంతులన్నీ కలిసి మన కంటిని చేరినప్పుడు తెలుపురంగు కాంతి కనబడుతుంది.

AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

ప్రశ్న 13.
తెల్లకాగితానికి నూనె పూస్తే, అది పాక్షిక పారదర్శకంగా పనిచేస్తుంది. ఎందుకు?
(లేదా)
కాగితం (లేదా) న్యూస్ పేపర్ కు నూనెను పూసిన అది పాక్షిక పారదర్శకంగా పని చేయుటకు గల కారణాలను వ్రాయుము.
జవాబు:

  1. తెల్లని కాగితం కాంతినిరోధములా ప్రవర్తించును.
  2. తెల్లని కాగితానికి నూనె పూస్తే అది పాక్షిక పారదర్శక పదార్థంగా పనిచేయును.
  3. కాగితము మరియు నూనెల వక్రీభవన గుణకాలు సమానమైతే, దానిమీద పడిన కాంతి సమాన వక్రీభవన గుణకాల వలన కాగితం నుండి నూనెలోనికి ప్రవేశించునపుడు ఎటువంటి పరిక్షేపణం చెందకుండా ప్రయాణించును.
  4. ఈ కారణం చేత నూనె పూసిన కాగితము పాక్షిక పారదర్శకముగా పనిచేయును.

ప్రశ్న 14.
“దీర్ఘదృష్టి” గల ఒక వ్యక్తికి 100 సెం.మీ. నాభ్యంతరం గల కటకాన్ని వాడమని డాక్టర్ సలహా ఇచ్చారు. కనిష్ఠ దూరబిందువు యొక్క దూరాన్ని, కటక సామర్థ్యాన్ని కనుగొనండి. (జవాబు : 33.33 సెం.మీ., 1D)
జవాబు:
వస్తు దూరము u =- 25 సెం.మీ. –
ప్రతిబింబదూరం V = కనిష్ఠ దూరము = -d
నాభ్యంతరము f = 100 సెం.మీ.
కనిష్ఠ దూరము ‘d’ మరియు నాభ్యంతరం ‘f అయిన
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 13

ప్రశ్న 15.
ఒక వ్యక్తి దూరంలో ఉన్న వస్తువును చూస్తున్నాడు. అతని కంటిముందు కేంద్రీకరణ కటకాన్ని ఉంచితే, అతనికి వస్తువు పెద్దదిగా కనబడుతుందా? కారణాన్ని తెల్పండి.
(లేదా)
రావు, అతనికి దూరంగా గల వస్తువును చూస్తున్నప్పుడు అతని స్నేహితుడు శ్రీను ఒక కుంభాకార కటకంను అతని కంటి ముందు ఉంచిన అది అతనికి వస్తువును పెద్దదిగా కనబడేటట్లు చేస్తుందా? దీనికి గల కారణాలను వ్రాయుము.
జవాబు:

  1. ఒక వ్యక్తి దూరంలో వున్న వస్తువును చూస్తున్నప్పుడు, అతని కంటి ముందు కేంద్రీకరణ కటకాన్ని ఉంచిన, వస్తు ప్రతిబింబం మసకబారుతుంది.
  2. కేంద్రీకరణ (లేక) కుంభాకార కటకపు ప్రతిబింబ విషయం వస్తు స్థానంపై ఆధారపడును.
  3. దూరంగా ఉన్నటువంటి వస్తువులను చూస్తున్నపుడు కుంభాకార కటకం వలన అవి మసకగా కనిపిస్తాయి.
  4. ఒకవేళ వస్తువును కుంభాకార కటకపు విషయంలో కటకనాభి, కటక కేంద్రముల మధ్య ఉంచినపుడు నిటారైన, వృద్ధీకరణ చెందిన ప్రతిబింబం ఏర్పడును.

ప్రశ్న 16.
కృత్రిమ ఇంద్రధనుస్సును పొందే విధానాన్ని రెండు కృత్యాల ద్వారా వివరించండి. (AS1)
(లేదా)
మీ ఉపాధ్యాయుడు నిన్ను ఒక ఇంద్రధనుస్సును ఏర్పరచమన్న నీవు ఏ విధంగా ఏర్పరచెదవో ఒక కృత్యంను వ్రాయుము. (కృత్యం : 1)
జవాబు:

  1. తెల్లని గోడకు దగ్గరగా ఒక టేబుల్ ను ఉంచుము.
  2. ఒక కార్డ్ బోర్డు షీట్ కు మధ్యలో సన్నని రంధ్రం చేసి, దానిని టేబుల్ పై నిలువుగా అమర్చుము.
  3. కార్డ్ బోర్డుకు, గోడకు మధ్యలో ఒక పట్టకాన్ని ఉంచుము.
  4. తెలుపురంగు కాంతినిచ్చే కాంతి జనకాన్ని కార్డ్ బోర్డ్ కు దగ్గరగా ఉంచి, దాని రంధ్రం గుండా కాంతిని ప్రసరింపజేయుము.
  5. ఈ కాంతి సన్నని పుంజంగా ఉంటుంది. దీనిని పట్టకం యొక్క ఏదో ఒక దీర్ఘచతురస్రాకార తలంపై పడే విధముగా పట్టుకొని పట్టకాన్ని త్రిప్పుతూ ఉంటే, గోడపై ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది.

కృత్యం : 2
జవాబు:
7వ ప్రశ్న జవాబు చూడుము.

AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

ప్రశ్న 17.
పట్టక వక్రీభవన గుణక సూత్రాన్ని ఉత్పాదించండి. (AS1)
(లేదా)
పట్టకపు వక్రీభవన గుణకంను కనుగొను సూత్రంను వ్రాసి, రాబట్టుము.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 15
1) పటంలో PQR అను పట్టకం యొక్క పట్టక కోణము ‘A’, పట్టక పదార్థపు వక్రీభవన గుణకము ‘n’, PQ, PRలు వక్రీభవన తలాలు.
2) AB పతన కిరణము, CD బహిర్గామి కిరణము పతన కోణము i1 బహిర్గామి కోణం i2 అనుకొనుము.

3) త్రిభుజము OMN నుండి,
d= i1 – r1 + i2 – r2
∴ d = (i1 + i2) – (r1 + r2) ………. (1)

4) త్రిభుజము PMN నుండి,
A + (90° = r1) + (90° – r2) = 180°
r1 + r2 = A ……………… (2)
5) (1), (2) సమీకరణాల నుండి
=d = (i1 + i2) – A
= A+ d = i1 + i2 ……………………… (3)

6) పతన కోణం, బహిర్గత కోణం, విచలన కోణము మరియు పట్టక కోణాల మధ్య సంబంధమును సమీకరణం- (3) తెలియజేస్తుంది.

7) స్నెల్ నియమం n1 sin i = n2 sin r కనుక, M బిందువు వద్ద, గాలి వక్రీభవన గుణకము n1 = 1, పట్టక వక్రీభవన గుణకము n2 = n, పతన కోణము i = i1, వక్రీభవన కోణం r = r1 లను స్నెల్ నియమంలో ప్రతిక్షేపించగా
sin i1 = n sin r1 ………. (4)

8) అదే విధముగా N బిందువు వద్ద, పట్టక వక్రీభవన గుణకము n1 = n, గాలి వక్రీభవన గుణకము n2 = 1, పతన కోణం i = r2, వక్రీభవన కోణం r= i2, స్నెల్ నియమంలో ప్రతిక్షేపించగా
n sin r2 = sin i2 ………. (5)

9) కనిష్ఠ విచలన కోణం (D) వద్ద పతన కోణం, బహిర్గామి కోణాల విలువలు సమానం. అనగా i1 = i2

10) సమీకరణం (3) నుండి కనిష్ఠ విచలన కోణంకు A + D = i + i
⇒ A + D = 2i1
∴ \(\mathrm{i}_{1}=\frac{\mathrm{A}+\mathrm{D}}{2}\)
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 16

ప్రశ్న 18.
λ1 తరంగదైర్ఘ్యం గల కాంతి n1 వక్రీభవన గుణకం గల యానకం నుండి n2 వక్రీభవన గుణకం గల యానకంలోకి ప్రవేశించింది. రెండవ యానకంలో ఆ కాంతి తరంగదైర్ఘ్యం ఎంత? (AS1)
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 17
2) రెండు యానకాలలో తరంగదైర్ఘ్యాలు వరుసగా λ1 మరియు λ2 అనుకొనుము.

3) రెండు యానకాల వక్రీభవన గుణకాలు వరుసగా n1 మరియు n2 అనుకొనుము.

4) ఒక యానకపు వేగము (v), తరంగదైర్ఘ్యం (λ) మరియు పౌనఃపున్యాల (υ) మధ్య సంబంధము v = υλ.

5) కాంతి ఒక యానకం నుండి వేరొక యానకంలోకి ప్రవేశించినపుడు, దాని పౌనఃపున్యంలో మార్పు ఉండదు.

6) కావున v1 = υλ1 మరియు v2 = υλ2 అగును.
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 18

ప్రశ్న 19.
అంశం (A) : పట్టక వక్రీభవన గుణకం, ఆ పట్టక తయారీకి వాడిన గాజురకంపై మరియు కాంతి రంగుపై మాత్రమే ఆధారపడుతుంది. (AS2)
కారణం (R) : పట్టక వక్రీభవన గుణకం, పట్టక వక్రీభవన కోణంపై మరియు కనిష్ఠ విచలన కోణంపై ఆధారపడుతుంది.
a) A, R రెండూ సరియైనవి. మరియు A కు R సరైన వివరణ.
b) A, R రెండూ సరియైనవి. కానీ Aకు R సరైన వివరణ కాదు.
c) A సరియైనది. కానీ R సరియైనది కాదు.
d) A మరియు R సరైనవి కావు.
e) A సరియైనది కాదు కానీ R సరైనది.
జవాబు:
b) ‘A, R’ లు రెండూ సరియైనవే, కాని A కు R సరైన వివరణ కాదు.
కారణము :
పట్టక వక్రీభవన సూత్రము ప్రకారం వక్రీభవన గుణకము, పట్టకం తయారీకి వాడిన గాజురకంపై మరియు కాంతి రంగుపై ఆధారపడుతుంది.
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 19

AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

ప్రశ్న 20.
మన చుట్టూ ఉన్న రంగుల ప్రపంచాన్ని మనం చూడడానికి ఉపయోగపడేది కన్ను. కంటి కటకానికి గల సర్దుబాటు లక్షణం వల్ల ఇది సాధ్యమవుతుంది. ఈ విషయంపై మీ స్పందనను తెలియజేసే విధంగా ఆరు వాక్యాల పద్యాన్ని రాయండి. (AS6)
జవాబు:
ఇంద్రియాలన్నింటిలో కన్నే మిన్నరా
అది లేకపోతే బ్రతుకే సున్నరా
సృష్టిని చూడగల్గడమే మహాభాగ్యంరా
దృష్టిని కల్గి ఉండడమే గొప్ప అదృష్టంరా
మన్నువంటి ఆధారం లేదురా
కన్నువంటి ప్రకాశం లేదురా
‘A’ విటమిన్ లోపిస్తే అంధత్వమేరా
అంధులైతే జీవితమే వృధారా
అందుకే కంటిని జాగ్రత్తగా కాపాడుకోవాలిరా.

ప్రశ్న 21.
గాజు పారదర్శక పదార్థం. ఒక తలం గరుకుగా చేయబడిన గాజు పాక్షిక పారదర్శకంగానూ, తెలుపురంగులోనూ కనబడుతుంది. ఎందుకు?
(లేదా)
సమరీతి, నునుపైన గాజు పారదర్శక పదార్థంగానూ, గరుకు చేయబడిన గాజు పాక్షిక పారదర్శకంగానూ, తెలుపు రంగులో కనబడుటకు గల కారణాలను వ్రాయుము.
జవాబు:

  1. గాజు ఒక పారదర్శక పదార్థం. ఇది తన గుండా కాంతిని ప్రసారం చేయును.
  2. గాజును ఒక తలం గరుకుగా చేయడం వల్ల ఆ ఉపరితలంలో అనేక ఎత్తు పల్లాలు అనగా అసమతలం ఏర్పడుతుంది.
  3. ఇటువంటి అసమతలం క్రమరహిత పరావర్తనమును ఏర్పరుస్తుంది.
  4. దీనివల్ల కొంతి ప్రసారం జరుగదు.
  5. దీని ప్రభావం వలన గాజు పాక్షిక పారదర్శకముగా పని చేస్తుంది.
  6. అందుకనే గరుకుతలం తెలుపురంగులో కనబడుతుంది.

ప్రశ్న 22.
పట్టకం యొక్క ఒక తలంపై 40° కోణంతో పతనమైన కాంతి కిరణం, 30° కనిష్ఠ విచలనాన్ని పొందింది. అయిన పట్టక కోణాన్ని, ఇచ్చిన తలం వద్ద వక్రీభవన కోణాన్ని కనుగొనండి. (జవాబు : 50°, 25°) (AS7)
జవాబు:
పట్టకపు తలంపై పతనమయ్యే కాంతి పతన కోణము = i = 40°
కనిష్ఠ విచలన కోణము = D = 30°
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 20

ఖాళీలను పూరించండి

1. స్పష్ట దృష్టి కనిష్ఠ దూరం విలువ …………. (25 సెం.మీ.)
2. రెటీనా, కంటి కటకాల మధ్య దూరం ………….. (2.5 సెం.మీ.)
3. కంటి కటకం యొక్క గరిష్ఠ నాభ్యంతరం విలువ …………… (2.5 సెం.మీ.)
4. మానవుని కంటి యొక్క నాభ్యంతరం మారటానికి దోహదపడే కండరాలు ………………. (సిలియరి)
5. కటకం యొక్క సామర్థ్యం 1D అయిన, ఆ కటక నాభ్యంతరం …………….. (100 సెం.మీ.)
6. హ్రస్వ దృష్టిని నివారించేందుకు ………………….. కటకాన్ని వాడుతారు. (పుటాకార)
7. దీర్ఘదృష్టిని నివారించేందుకు ……………… కటకాన్ని వాడుతారు. (కుంభాకార)
8. పట్టకం కనిష్ఠ విచలన స్థానంలో ఉన్నప్పుడు పతన కోణం ………………….. కు సమానం. (బహిర్గామికోణం)
9. తెల్లని కాంతి వివిధ రంగులుగా (VIBGYOR) విడిపోవడాన్ని ………………… అంటాం. (కాంతి విక్షేపణం)
10. వక్రీభవనం జరిగినప్పుడు కాంతి ………………….. లో మార్పు రాదు. (పౌనఃపున్యం)

సరైన సమాధానాన్ని ఎన్నుకోండి

1. మానవుని కన్ను గ్రహించే వస్తు పరిమాణం ప్రాథమికంగా …. పై ఆధారపడుతుంది.
A) వస్తువు నిజ పరిమాణం
B) కన్ను నుండి వస్తువుకు గల దూరం
C) నల్లగుడ్డు రంధ్రం
D) రెటీనాపై ఏర్పడ్డ ప్రతిబింబ పరిమాణం
జవాబు:
B) కన్ను నుండి వస్తువుకు గల దూరం

2. వివిధ దూరాలలో గల వస్తువులను చూస్తున్నప్పుడు కింది వాటిలో ఏది స్థిరంగా ఉంటుంది?
A) కంటి కటక నాభ్యంతరం
B) కంటి కటకం నుండి వస్తువుకి గల దూరం
C) కంటి కటక వక్రతా వ్యాసార్ధం
D) కంటి కటకం నుండి ప్రతిబింబ దూరం
జవాబు:
D) కంటి కటకం నుండి ప్రతిబింబ దూరం

3. కింది వాటిలో వక్రీభవన సమయంలో మారని విలువ
A) తరంగదైర్ఘ్యం
B) పౌనఃపున్యం
C) కాంతివేగం
D) పైవన్నీ
జవాబు:
B) పౌనఃపున్యం

4. పటంలో చూపిన విధంగా టేబుల్ పై ఉంచిన ఒక సమద్విబాహు పట్టకంపై కాంతి పతనమైంది. కనిష్ఠ విచలనానికి సంబంధించి కింది వాటిలో ఏది సరియైనది?
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 14
A) ఆధారానికి సమాంతరరేఖ PQ
B) ఆధారానికి సమాంతరరేఖ QR
C) ఆధారానికి సమాంతరరేఖ RS
D) ఆధారానికి సమాంతర రేఖ PQ లేదా RS
జవాబు:
B) ఆధారానికి సమాంతరరేఖ QR

AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

5. హ్రస్వదృష్టితో బాధపడే వ్యక్తి యొక్క గరిష్ఠ దూరం 5 మీ. దీనిని నివారించి సాధారణ దృష్టి వచ్చేట్లు చేయాలంటే …. ను వినియోగించాలి.
A) 5 మీ. నాభ్యంతరం గల పుటాకార కటకం
B) 10 మీ. నాభ్యంతరం గల పుటాకార కటకం
C) 5 మీ. నాభ్యంతరం గల కుంభాకార కటకం
D) 2.5 మీ. నాభ్యంతరం గల కుంభాకార కటకం
జవాబు:
A) 5 మీ. నాభ్యంతరం గల పుటాకార కటకం

6. సూర్యకాంతిని శోషించుకున్న అణువు వివిధ కాంతి తీవ్రతలతో అన్ని దిశలలోనూ కాంతిని విడుదల చేయడాన్ని …….. అంటాం.
A) కాంతి పరిక్షేపణం
B) కాంతి విక్షేపణం
C) కాంతి పరావర్తనం
D) కాంతి వక్రీభవనం
జవాబు:
A) కాంతి పరిక్షేపణం

10th Class Physical Science 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం Textbook InText Questions and Answers

10th Class Physical Science Textbook Page No. 90

ప్రశ్న 1.
విమానంలో ప్రయాణించే వ్యక్తికి ఇంద్రధనుస్సు ఏ ఆకారంలో కనిపిస్తుందో ఊహించగలరా? మీ స్నేహితులతో చర్చించండి. సమాచారాన్ని సేకరించండి.
జవాబు:
విమానంలో ప్రయాణించే వ్యక్తికి ఇంద్రధనుస్సు పూర్తిగా వృత్తాకారంలో కన్పించును.

10th Class Physical Science Textbook Page No. 90

ప్రశ్న 2.
మన కంటిముందున్న అన్ని వస్తువులనూ మనం స్పష్టంగా చూడగలమా?
జవాబు:
మన కంటి ముందు 25 సెం.మీ. దూరానికి అవతల ఉన్న అన్ని వస్తువులను మనం స్పష్టంగా చూడగలం.

10th Class Physical Science Textbook Page No. 91

ప్రశ్న 3.
స్పష్ట దృష్టి యొక్క సరాసరి దూరం విలువ ఎంత?
జవాబు:
స్పష్ట దృష్టి యొక్క కనీస దూరం 25 సెం.మీ.

ప్రశ్న 4.
మీ కంటికి 25 సెం.మీ. దూరంలో ఉంచిన వస్తువు ఆకారం ఎలా ఉన్నా, దానిని పై నుండి కింది వరకు మీరు చూడగలరా?
జవాబు:
చూడలేము. ఎందుకనగా స్పష్ట దృష్టి కనీస దూరం విలువ వయస్సుపై ఆధారపడి ఉంటుంది. అదే విధంగా కంటి వద్ద 60° కోణంతో కనబడే వస్తుభాగం మాత్రమే మనం చూడగలం.

10th Class Physical Science Textbook Page No. 92

ప్రశ్న 5.
స్పష్ట దృష్టి కనీస దూరం, దృష్టికోణం విలువలు వ్యక్తినిబట్టి, వయసునుబట్టి ఎందుకు మారతాయి?
జవాబు:
ఈ విలువలన్నీ కంటి నిర్మాణం మరియు సిలియరి కండరాల పనితీరుపై ఆధారపడి ఉంటాయి కాబట్టి.

10th Class Physical Science Textbook Page No. 93

ప్రశ్న 6.
వివిధ వస్తుదూరాలకు ఒకే ప్రతిబింబదూరం ఉండడం ఎలా సాధ్యం?
జవాబు:
కటకనాభ్యంతరం విలువను మారుస్తూ ఉంటే వివిధ వస్తు దూరాలకు ఒకే ప్రతిబింబ దూరం ఉండటం సాధ్యపడుతుంది.

ప్రశ్న 7.
కటకాల గుండా వక్రీభవనం గురించి మీకున్న అవగాహనతో పై ప్రశ్నకు సమాధానం చెప్పగలరా?
జవాబు:
చెప్పగలము. వస్తుదూరం మారినప్పుడు ప్రతిబింబ దూరం స్థిరంగా ఉండాలంటే కటక నాభ్యాంతరం మారాలి.

10th Class Physical Science Textbook Page No. 94

ప్రశ్న 8.
కన్ను తన నాభ్యంతరాన్ని ఎలా మార్చుకుంటుంది? కనుగుడ్డులో ఈ మార్పు ఎలా జరుగుతుంది?
జవాబు:
కనుగుడ్డులోని కటకానికి ఆనుకుని ఉన్న సిలియరి కండరాలు కటక వక్రతా వ్యాసార్థాన్ని మారుస్తాయి. ఈ మార్పు ద్వారా కన్ను తన నాభ్యంతరాన్ని మార్చుకుంటుంది.

ప్రశ్న 9.
కంటి కటకం నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుందా? మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుందా?
జవాబు:
కంటి కటకం వస్తువు నిజ ప్రతిబింబాన్ని రెటీనా పై తలక్రిందులుగా ఏర్పరుస్తుంది.

AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

ప్రశ్న 10.
కంటి కటక నాభ్యంతరం మార్పుకు ఏదైనా హద్దు ఉందా?
జవాబు:
అవును. కటక నాభ్యంతరానికి గరిష్ఠ, కనిష్ఠ విలువలుంటాయి.

10th Class Physical Science Textbook Page No. 95

ప్రశ్న 11.
కంటి కటకం తన నాభ్యంతరాన్ని మార్చుకోలేకపోతే ఏం జరుగుతుంది?
జవాబు:
కంటి కటకం తన నాభ్యంతరాన్ని మార్చుకోలేకపోతే వస్తువును సులభంగా, స్పష్టంగా చూడలేము.

ప్రశ్న 12.
కంటి కటక నాభ్యంతరం 2.27 – 2.5 సెం.మీ.లకు మధ్యస్థంగా లేకపోతే ఏమవుతుంది?
జవాబు:
కంటి కటక నాభ్యంతరం 2.27 – 2.5 సెం.మీ. లకు మధ్యస్థంగా లేకపోతే కంటి దోషాలు ఏర్పడతాయి.

10th Class Physical Science Textbook Page No. 97

ప్రశ్న 13.
‘కంటి కటక కనిష్ఠ నాభ్యంతరం 2.27 సెం.మీ. కంటే ఎక్కువైతే ఏం జరుగుతుంది?
జవాబు:

  1. కంటి కటక కనిష్ఠ నాభ్యంతరం 2.27 సెం.మీ. కంటే ఎక్కువైతే దీర్ఘదృష్టి ఏర్పడుతుంది.
  2. అంటే ఆ వ్యక్తి దూరంలో ఉన్న వస్తువులను స్పష్టంగా చూడగలదు కాని దగ్గరి వస్తువులను చూడలేదు.

10th Class Physical Science Textbook Page No. 98

ప్రశ్న 14.
దీర్ఘదృష్టిని సవరించడానికి ఏం చేయాలి?
జవాబు:
దీర్ఘదృష్టి సవరణ :

  1. వస్తువు కనిష్ఠదూర బిందువుకు ఆవల ఉంటే, కంటికటకం రెటీనా పై ప్రతిబింబాన్ని ఏర్పరచగలదు.
  2. కనుక కనిష్ఠదూర బిందువు (H) కు స్పష్ట దృష్టి కనీస దూరాన్ని తెలిపే బిందువు (L) కు మధ్యనున్న వస్తువు యొక్క ప్రతిబింబాన్ని కనిష్ఠదూర బిందువుకు ఆవల ఏర్పరచగలిగే కటకాన్ని అంటే ద్వికుంభాకార కటకాన్ని ఉపయోగించాలి.
  3. ద్వికుంభాకార కటకాన్ని వాడటం వల్ల ఇది సాధ్యపడుతుంది.

10th Class Physical Science Textbook Page No. 99

ప్రశ్న 15.
కంటి డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షన్ లోని వివరాలను మీరెప్పుడైనా పరిశీలించారా?
జవాబు:
కంటి డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షన్లోని వివరాలను పరిశీలించాను. అవి +, – గుర్తులతో సూచింపబడి ఉంటాయి.

ప్రశ్న 16.
సైట్ పెరగడం లేదా తగ్గడం అంటే ఏమిటి?
జవాబు:
కంటి చూపులోని పెరుగుదల లేదా తగ్గుదల.

ప్రశ్న 17.
కటక సామర్థ్యం అంటే ఏమిటి?
జవాబు:
కటక సామర్థ్యం :
ఒక కటకం కాంతికిరణాలను కేంద్రీకరించే స్థాయి లేదా వికేంద్రీకరించే స్థాయిని కటక సామర్థ్యం అంటాం. (లేదా) కటక నాభ్యంతరం యొక్క విలోమ విలువను కటక సామర్థ్యం అంటాం.

ఒక కటక నాభ్యంతరం గ అనుకుంటే,
కటక సామర్థ్యం P = 1/f (మీటర్లలో) ; P = 100/f (సెం.మీ.లలో)
కటక సామర్థ్యానికి ప్రమాణం డయాప్టర్ (Dioptre). దీనిని D తో సూచిస్తాం.

10th Class Physical Science Textbook Page No. 100

ప్రశ్న 18.
పట్టకం అంటే ఏమిటి?
జవాబు:
ఒకదానికొకటి కొంత కోణం చేసే కనీసం రెండు సమతలాలతో పరిసరయానకం నుండి వేరుచేయబడి ఉన్న పారదర్శక యానకాన్ని “పట్టకం” అంటారు.

10th Class Physical Science Textbook Page No. 105

ప్రశ్న 19.
తెల్లని కాంతి రంగులుగా విడిపోవడాన్ని కిరణ సిద్ధాంతంతో వివరించగలమా?
జవాబు:
తెల్లని కాంతి రంగులుగా విడిపోవడాన్ని కిరణ సిద్ధాంతంతో వివరించలేము.

ప్రశ్న 20.
వివిధ రంగులు గల కొంతుల వేగాలు వేర్వేరుగా ఉంటాయా?
జవాబు:
శూన్యంలో వివిధ రంగులు గల కాంతుల వేగాలు స్థిరంగా ఉంటాయి. యానకంలో వివిధ రంగులు గల కాంతుల వేగాలు వేర్వేరుగా ఉంటాయి.

AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

ప్రశ్న 21.
పట్టకం గుండా తెలుపురంగు కాంతిని పంపితే అది వివిధ రంగులుగా ఎందుకు విడిపోతుందో ఇప్పుడు మీరు ఊహించగలరా?
జవాబు:
శూన్యంలో అన్ని రంగుల కాంతి వేగాలు ఒకటే అయినప్పటికీ, ఒక యానకంలో ప్రయాణించేటప్పుడు కాంతివేగం దాని తరంగదైర్యంపై ఆధారపడును. అందువల్ల కాంతి వివిధ రంగులుగా విడిపోతుంది.

10th Class Physical Science Textbook Page No. 106

ప్రశ్న 22.
పట్టకం గుండా తెలుపురంగు కాంతిని పంపితే అది వివిధ రంగులుగా ఎందుకు విడిపోతుందో ఇప్పుడు మీరు ఊహించగలరా?
జవాబు:
యానకంలో ప్రయాణించేటప్పుడు కాంతి వేగం దాని తరంగదైర్ఘ్యంపై ఆధారపడుతుంది. అందువల్ల కాంతి వివిధ రంగులుగా విడిపోతుంది.

ప్రశ్న 23.
కృత్యం – 3లో చూసినట్లు ప్రకృతిలో మీరు రంగులు చూడగలిగే సందర్భానికి ఒక ఉదాహరణ ఇవ్వగలరా?
జవాబు:
ప్రకృతిలో రంగులు చూడగలిగే సందర్భం ఇంద్రధనుస్సు.

10th Class Physical Science Textbook Page No. 108

ప్రశ్న 24.
ఆకాశం నీలిరంగులో ఎందుకు కనిపిస్తుంది?
జవాబు:
వాతావరణంలోని N2, O2 అణువులు సూర్యుని కాంతిలోని నీలం రంగు కాంతిని పరిక్షేపణం చెందించడం వల్ల ఆకాశం నీలి రంగులో కనిపిస్తుంది.

10th Class Physical Science Textbook Page No. 109

ప్రశ్న 25.
పరిక్షేపణం అంటే ఏమిటి?
జవాబు:
ఒక కణం శోషించుకున్న కాంతిని తిరిగి అన్ని దిశలలో వివిధ తీవ్రతలతో విడుదల చేయడాన్ని “కాంతి పరిక్షేపణం” అంటారు.

ప్రశ్న 26.
స్వేచ్ఛా పరమాణువు లేదా అణువుపై నిర్దిష్ట పౌనఃపున్యం గల కాంతి పతనం చెందితే ఏం జరుగును?
జవాబు:
పరమాణువులు లేదా అణువులపై కాంతి పతనం చెందినపుడు అవి కాంతి శక్తిని శోషించుకుని, అందులో కొంత భాగాన్ని వివిధ దిశల్లో ఉద్గారం చేస్తాయి. ఇదే కాంతి పరిక్షేపణంలోని ప్రాథమిక నియమము.

10th Class Physical Science Textbook Page No. 94

ప్రశ్న 27.
వస్తువు ఆకారం, పరిమాణం మరియు రంగులలో ఏ మార్పు లేకుండా వస్తువును మనం గుర్తించే విధంగా రెటీనాపై ప్రతిబింబం ఎలా ఏర్పడుతుంది?
జవాబు:

  1. రెటీనా అనేది ఒక సున్నితమైన పొర.
  2. దీనిలో దండాలు (rods) మరియు శంఖువులు (cones) అనబడే దాదాపు 125 మిలియన్ల గ్రాహకాలు (receptors) ఉంటాయి.
  3. ఇవి కాంతి సంకేతాలను (signals) గ్రహిస్తాయి. శంఖువులు రంగును గుర్తిస్తాయి. దండాలు కాంతి తీవ్రతను గుర్తిస్తాయి.
  4. ఈ సంకేతాలు దాదాపు 1 మిలియన్ దృక్ నాడుల (optic – nerve fibres) ద్వారా మెదడుకు చేరవేయబడతాయి.
  5. వాటిలోని సమాచారాన్ని మెదడు విశ్లేషించడం ద్వారా వస్తువు ఆకారం, పరిమాణం మరియు రంగులను మనం గుర్తిస్తాం.

ప్రశ్న 28.
కంటి కటకం యొక్క కనిష్ఠ, గరిష్ఠ నాభ్యంతరాలు ఎంత? వాటిని మనం ఎలా కనుగొంటాము?
జవాబు:
గరిష్ఠ నాభ్యంతరం

  1. పటంలో చూపినట్లు అనంతదూరంలో ఉన్న వస్తువు నుండి వచ్చే
    సమాంతర కాంతి కిరణాలు కంటి కటకంపై పడి వక్రీభవనం చెందాక
    రెటీనా పై ఒక బిందురూప ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి.
  2. ఈ సందర్భంలో కంటి కటక నాభ్యంతరం గరిష్టంగా ఉంటుంది.
  3. దీని విలువ fగరిష్ఠ = 2.5 సెం.మీ. ఉండును.

కనుగొనే విధానం :
వస్తుదూరం = µ = α
ప్రతిబింబ దూరం = v = 2.5 సెం.మీ (కంటికటకం నుండి రెటీనాకు దూరం)
నాభ్యంతరం = f = ?
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 21

కనిష్ఠ నాభ్యంతరము :

  1. పటంలో చూపినట్లు కంటి ముందు 25 సెం.మీ. దూరంలో వస్తువు ఉందనుకొనుము.
  2. ఈ సందర్భంలో కంటి కటక నాభ్యంతరం కనిష్ఠంగా ఉంటుంది.
  3. దీని విలువ fకనిష్ఠ = 2.27 సెం.మీలుగా ఉండును.

కనుగొనే విధానం :
వస్తు దూరం = u = 25 సెం.మీ.
ప్రతిబింబ దూరం = v = 25 సెం.మీ. (కంటి కటకం నుండి రెటీనాకు గల దూరం)
నాభ్యంతరం = f = ?
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 22

10th Class Physical Science Textbook Page No. 96

ప్రశ్న 29.
హ్రస్వదృష్టిని సవరించడానికి ఏం చేయాలి?
జవాబు:
హ్రస్వదృష్టికి సవరణ :

  1. గరిష్ఠదూర బిందువుకు, స్పష్ట దృష్టి కనీస దూరాన్ని తెలిపే బిందువుకు మధ్య వస్తువు ఉన్నప్పుడు కంటికటకం రెటీనా పై ప్రతిబింబాన్ని ఏర్పరచగలదు.
  2. కాబట్టి ఒక కటకాన్ని ఉపయోగించి గరిష్ఠ దూర బిందువుకు ఆవల ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబాన్ని గరిష్ఠ దూరబిందువు (M) మరియు స్పష్ట దృష్టి కనీస దూరాన్ని తెలిపే బిందువు (L) ల మధ్యకు తేగలిగితే, ఆ ప్రతిబింబం కంటి కటకానికి వస్తువులా పనిచేస్తుంది.
  3. పుటాకార కటకాన్ని వాడడం వల్ల ఇది సాధ్యపడుతుంది.

10th Class Physical Science Textbook Page No. 97

ప్రశ్న 30.
హ్రస్వదృష్టిని నివారించడానికి వాడవలసిన పుటాకార కటక నాభ్యంతరం ఎంత ఉండాలనేది ఎలా నిర్ణయిస్తాం?
జవాబు:

  1. హ్రస్వదృష్టిని నివారించడానికి, అనంతదూరంలో ఉండే వస్తువు యొక్క ప్రతిబింబాన్ని గరిష్ఠ దూరబిందువు వద్ద ఏర్పరచగలిగే కటకాన్ని అంటే ద్విపుటాకార కటకాన్ని ఎంచుకోవాలి.
  2. ఈ కటకం ఏర్పరచే ప్రతిబింబం కంటి కటకానికి వస్తువులా పనిచేసి చివరగా ప్రతిబింబం రెటీనాపై ఏర్పడుతుంది.
  3. ఈ సందర్భంలో వస్తుదూరం (u) అనంతం. ప్రతిబింబదూరం (v) గరిష్ఠ దూర బిందువుకు గల దూరానికి సమానం. కావున
    u = – ∞, v = -D (గరిష్ఠ దూరబిందువుకు, కంటికి గల దూరం)
  4. ద్విపుటాకార కటక నాభ్యంతరం గ అనుకుంటే..
    1/f = 1/v – 1/4 సూత్రాన్ని ఉపయోగించినపుడు 1/f = 1/-D ⇒ f = -D
  5. ఇక్కడ f కు ‘ఋణ విలువ’ రావడమనేది పుటాకార కటకాన్ని తెలియజేస్తుంది.

10th Class Physical Science Textbook Page No. 108

ప్రశ్న 31.
వాననీటి బిందువులతో విక్షేపణం చెందిన కాంతి అర్ధవలయాకారంలో ఎందుకు కన్పిస్తుంది?
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 23

  1. ఇంద్రధనుస్సు అనునది మనకు కనబడే విధంగా పలుచని ద్విమితీయ చాపం కాదు.
  2. ఇంద్రధనుస్సు అనేది మీ కంటి వద్ద తన కొనభాగాన్ని కల్గి వున్న త్రిమితీయ శంఖువు.
  3. పటంలో చూపినట్లు శంఖువు అక్షం వెంబడి మనం భాగం భూమి పైని వాతావరణంలోని కణాల నుండి, శంఖువు కింది సగ భాగం నేలపైని వస్తువుల నుండి వచ్చే కాంతులను మన కంటికి చేరవేస్తున్నాయి.
  4. కావున గాలిలోని నీటి బిందువుల నుండి వచ్చే కాంతి (శంఖువు పై సగం) మనకు ఇంద్రధనుస్సును అర్ధ చంద్రాకారంలో ఏర్పరుస్తుంది.
  5. మనం భూమి నుండి నిర్ణీత ఎత్తుకు వెళ్తే ఇంద్ర ధనుస్సును పూర్తి వలయంగా చూడవచ్చు.

10th Class Physical Science Textbook Page No. 110

ప్రశ్న 32.
వేసవి రోజుల్లో (ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న రోజుల్లో) ఒక నిర్దిష్ట దిశలో చూస్తున్నపుడు కొన్ని సందర్భాలలో ఆకాశం తెలుపురంగులో కనిపిస్తుంది. ఎందుకు?
జవాబు:

  1. వాతావరణంలో వివిధ పరిమాణాలు గల కణాలుంటాయి. వాటి పరిమాణాల కనుగుణంగా అవి వివిధ తరంగదైర్యాలు గల కాంతిని పరిక్షేపణం చేస్తాయి.
  2. ఉదాహరణకు N2, O2 అణువుల కన్నా నీటి అణువు పరిమాణం ఎక్కువ. కాబట్టి అది నీలిరంగుకాంతి కంటే తక్కువ పౌనఃపున్యాలు (ఎక్కువ తరంగదైర్యాల) గల కాంతులకు పరిక్షేపణ కేంద్రంగా పనిచేస్తుంది.
  3. వేసవి రోజుల్లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల వాతావరణంలోకి నీటి ఆవిరి చేరుతుంది.
  4. తద్వారా వాతావరణంలో నీటి అణువులు అధిక స్థాయిలో ఉంటాయి.
  5. ఈ నీటి అణువులు ఇతర పౌనఃపున్యాలు (నీలిరంగు కానివి) గల కాంతులను పరిక్షేపణం చేస్తాయి.
  6. N2, O2, ల పరిక్షేపణం వల్ల వచ్చే నీలిరంగుకాంతి, నీటి అణువుల పరిక్షేపణం వల్ల వచ్చే ఇతర రంగుల కాంతులు అన్నీ కలిసి మన కంటిని చేరినప్పుడు తెలుపు రంగు కాంతి కనబడుతుంది.

AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

10th Class Physical Science Textbook Page No. 111

ప్రశ్న 33.
సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాలలో సూర్యుడు ఎర్రగా కనబడడానికి గల కారణం మీకు తెలుసా?
జవాబు:

  1. సూర్యోదయం, సూర్యాస్తమయ సమయంలో సూర్యుని నుండి వెలువడే కాంతి మీ కంటిని చేరడానికి భూ వాతావరణంలో అధిక దూరం ప్రయాణించాల్సి ఉంటుంది.
  2. ఎరుపు రంగు కాంతి తప్ప మిగిలిన అన్ని రంగుల కాంతులు అధికంగా పరిక్షేపణం చెంది కాంతి మీ కంటిని చేరే లోపే ఆ రంగులన్నీ కనుమరుగవుతాయి.
  3. ఎరుపు రంగు కాంతి తక్కువగా పరిక్షేపణం చెందడం వల్ల అది మీ కంటిని చేరును.
  4. ఫలితంగా సూర్యుడు, సూర్యోదయం మరియు సూర్యాస్తమయ సమయాలలో ఎరుపుగా కన్పిస్తాడు.

ప్రశ్న 34.
మధ్యాహ్న వేళల్లో సూర్యుడు ఎర్రగా ఎందుకు కనబడడో ఊహించగలరా?
జవాబు:

  1. ఉదయం, సాయంత్రం వేళల కంటే మధ్యాహ్నం సమయంలో వాతావరణంలో సూర్యకాంతి ప్రయాణించే దూరం తక్కువ.
  2. కాబట్టి కాంతి ఎక్కువగా పరిక్షేపణం చెందక పోవడం వల్ల అన్ని రంగులూ మీ కంటిని చేరతాయి.
  3. కాబట్టి మధ్యాహ్న వేళల్లో సూర్యుడు తెల్లగా కనబడతాడు.

10th Class Physical Science Textbook Page No. 98

ప్రశ్న 35.
దీర్ఘదృష్టిని నివారించడానికి వాడవలసిన కుంభాకార కటక నాభ్యంతరం ఎంత ఉండాలనేది ఎలా నిర్ణయిస్తాం?
జవాబు:
1) కటక నాభ్యంతరాన్ని కనుగొనడానికి, స్పష్ట దృష్టి కనీస దూరాన్ని తెలిపే బిందువు (L) వద్ద ఒక వస్తువు ఉన్నదని ఊహించవలెను.

2) పటంలో చూపినవిధంగా L వద్ద ఉన్న వస్తువు ప్రతిబింబాన్ని కనిష్ఠదూర బిందువు (H) వద్ద ఏర్పరచగలిగే ద్వికుంభాకార కటకాన్ని ఉపయోగిస్తే దృష్టిదోషం సవరించబడుతుంది.

3) ఆ ప్రతిబింబం కంటికటకానికి వస్తువుగా పనిచేస్తుంది.

4) కనుక చివరగా కంటి కటకం వలన ఏర్పడే ప్రతిబింబం రెటీనా పై ఏర్పడుతుంది.

5) ఈ సందర్భంలో, వస్తుదూరం
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 5
(u) = -25 సెం.మీ.
ప్రతిబింబం దూరం (v) = – d
(కంటికి, కనిష్ఠ దూరబిందువుకు గల దూరం)
మనం వాడే ద్వికుంభాకార కటక నాభ్యంతరం f అనుకుంటే.
1/f = 1/v – 1/4 సూత్రాన్ని ఉపయోగించినపుడు :
1/f = 1/-d – 1/(-25) ⇒ 1/f = -1/d + 1/25
1/f = (d – 25)/25d ⇒ f = 25d(d – 25)
d > 25 కాబట్టి గ విలువ ధనాత్మకం అవుతుంది. అనగా కుంభాకార కటకం వాడాలని తెలుస్తుంది.

పరికరాల జాబితా

పొడవైన కర్ర లేదా పివిసి పైపు ముక్కలు (20, 30, 35, 40, 50 సెం.మీ.,) అడ్డు కడ్డీ, రిటారు స్టాండు, కంటి నిర్మాణం ప్రదర్శించే నమూనా, డ్రాయింగ్ షీట్, పెన్సిల్, గుండుసూదులు, స్కేలు, కోణమానిని, పట్టకం, చిన్న రంధ్రం కలిగిన కార్డుబోర్డు, తెల్లని కాంతి జనకం (టార్చిలైటు), లోహపు పళ్లెం, అద్దం, నీరు, గాజుబీకరు, సోడియం’
థయో సల్ఫేట్, సల్ఫూరికామ్ల ద్రావణాలు

10th Class Physical Science 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం Textbook Activities

కృత్యములు

కృత్యం – 1

ప్రశ్న 1.
స్పష్ట దృష్టి కనీస దూరమును కనుగొనుటకు ఒక కృత్యాన్ని వ్రాయుము.
జవాబు:

  1. ఒక పుస్తకాన్ని తెరచి మీ కంటి ముందు కొంతదూరంలో పట్టుకొని చదవడానికి ప్రయత్నించండి.
  2. నెమ్మదిగా ఆ పుస్తకాన్ని మీ కంటివైపుగా, కంటికి అతి దగ్గరగా చేరే వరకు కదిలించండి.
  3. పుస్తకంలోని అక్షరాలు మసకబారినట్లుగా అనిపిస్తాయి లేదా మీ కన్ను ఒత్తిడికి గురైనట్లు అనిపిస్తుంది.
  4. పుస్తకంలోని అక్షరాలను మీ ‘కన్ను ఏ ఒత్తిడి లేకుండా చూడగలిగే స్థానం వరకు నెమ్మదిగా పుస్తకాన్ని వెనుకకు . జరపండి.
  5. ఈ సందర్భంలో పుస్తకానికి, మీ కంటికి గల దూరాన్ని కొలిస్తే అది దాదాపు 25 సెం.మీ. ఉంటుంది.
  6. ఈ దూరం వ్యక్తికి, వ్యక్తికీ వయస్సును బట్టి మారుతుంది.
  7. మన కంటికి ఏ ఒత్తిడి లేకుండా, స్పష్టంగా ఒక వస్తువును మనము చూడాలంటే ఉండవలసిన కనీస దూరాన్ని “స్పష్ట దృష్టి కనీస దూరం” అంటారు.

కృత్యం – 2

ప్రశ్న 2.
“దృష్టికోణం” ను కనుగొనేందుకు ఒక కృత్యాన్ని తెల్పుము.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 24 AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 25

  1. బట్టలషాప్ లో బట్టల చుట్టలకు వచ్చే కర్రలను లేదా PVC పైపులను సేకరించుము.
  2. ఈ వస్తువులను 20 సెం.మీ., 30 సెం.మీ., 35 సెం.మీ., 40 సెం.మీ., 50 సెం.మీ. పొడవు గల ముక్కలుగా ఆ కత్తిరించుము.
  3. ఒక రిటార్ట్ స్టాండును బల్లపై ఉంచి, రిటార్ట్ స్టాండు నిలువు కడ్డీ ప్రక్కన మీ తల ఉండే విధముగా బల్ల దగ్గర నిలబడండి.
  4. మీ కంటి నుండి 25 సెం.మీ. దూరంలో రిటార్టు స్టాండ్ అడ్డుకడ్డీకి క్లాంప్ ను బిగించి, 30 సెం.మీ. పొడవు గల కర్రను కట్టమని మీ స్నేహితునికి చెప్పుము.
  5. ఇప్పుడు అడ్డుకడ్డీ వెంబడి మీ దృష్టి సారిస్తూ, కర్రముక్కను పై అంచు నుండి క్రింది అంచు వరకు మొత్తంగా చూడడానికి ప్రయత్నించుము.
  6. కర్రముక్క 25 సెం.మీ. దూరంలో ఉన్నప్పుడు దాని రెండు చివరలను మీరు స్పష్టంగా చూడలేకపోతే, అడ్డుకడ్డీ వెంబడి కర్రముక్కను వెనుకకు జరుపుము.
  7. ఏ కనీస దూరం వద్ద మీరు దానిని పూర్తిగా చూడగలరో అక్కడ దానిని అడ్డుకడ్డీకి ఇంప్ సహాయంతో బిగించండి.
  8. వస్తువు యొక్క చివరి బిందువుల నుండి వచ్చే కిరణాలు కంటి వద్ద కొంత కోణం చేస్తాయి.
  9. ఈ కోణం 60° కంటే తక్కువగా ఉంటే ఆ వస్తువును పూర్తిగా మనము చూడగలము.
  10. ఈ కోణం 60° కంటే ఎక్కువగా ఉంటే ఆ వస్తువులో కొంతభాగం మాత్రమే మనము చూడగలము.
  11. ఏ గరిష్ఠ కోణము వద్ద మనము పూర్తిగా చూడగలమో, ఆ కోణాన్ని “దృష్టికోణం” అంటారు.
  12. ఈ విధముగా దృష్టికోణమును కనుగొంటారు.

AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

కృత్యం – 6

ప్రశ్న 3.
కాంతి పరిక్షేపణాన్ని ప్రయోగ పూర్వకముగా వ్రాయుము.
జవాబు:

  1. ఒక బీకరులో సోడియం థయోసల్ఫేట్ (హైపో) మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లాల ద్రావణాన్ని తీసుకొనుము.
  2. ఈ గాజు బీకరును ఆరుబయట సూర్యుని వెలుగులో ఉంచుము.
  3. బీకరులో సల్ఫర్ స్పటికాలు ఏర్పడటాన్ని గమనించుము.
  4. రసాయన చర్య జరుగుతున్న కొలదీ సల్ఫర్ అవక్షేపం (precipitation) ఏర్పడటం గమనించవచ్చును.
  5. ప్రారంభంలో సల్ఫర్ స్పటికాలు చాలా చిన్నవిగానూ చర్య జరిగే కొలదీ వాటి పరిమాణం పెరుగును.
  6. మొదట సల్ఫర్ స్పటికాలు నీలిరంగులో ఉం, వాటి పరిమాణం పెరుగుతున్నకొలదీ తెలుపు రంగులోకి మారును. దీనికి కారణం కాంతి పరిక్షేపణము.
  7. ప్రారంభంలో సల్ఫర్ స్పటికాల పరిమాణం చాలా తక్కువగా ఉండి, అది నీలిరంగు కాంతి తరంగదైర్ఘ్యంతో పోల్చడానికి వీలైనదిగా ఉంటుంది. కావున అపుడు అవి నీలిరంగులో కనబడతాయి.
  8. సల్పర్ స్పటికాల పరిమాణం పెరుగుతున్న కొలదీ వాటి పరిమాణం ఇతర రంగు కాంతుల తరంగదైర్యాలతో పోల్చడానికి వీలయ్యేదిగా ఉంటుంది.
  9. అప్పుడు ఆ స్పటికాలు ఇతర రంగుల కాంతులకు పరిక్షేపణ కేంద్రాలుగా పనిచేస్తాయి.
  10. ఈ అన్ని రంగులూ కలిసి తెలుపు రంగులా కనబడుతుంది.

AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం

SCERT AP 10th Class Physics Study Material Pdf 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Physical Science 4th Lesson Questions and Answers వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం

10th Class Physical Science 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
కంచరగాడిద (Zebra) ఫోటో కావాలనుకున్న వ్యక్తి కెమెరా కటకానికి నల్లచారలున్న గాజుపలకను అమర్చి తెల్ల గాడిదను ఫోటో తీశాడు. అతనికి ఏ ఫోటో లభిస్తుంది? వివరించండి. (AS1)
జవాబు:

  1. కెమెరా కటకానికి నల్లచారలున్న గాజుపలకను అమర్చాడు. కావున అతను తెల్ల గాడిద ఫోటోను మాత్రమే పొందగలడు.
  2. దీనికి కారణము వస్తువు (గాడిద) నుండి వచ్చిన కాంతికిరణాల తీవ్రత గాజుపలక వలన తగ్గుతాయి. కావున అతను తెల్లని గాడిద’ ఫోటోనే (ప్రతిబింబం) పొందగలిగాడు.

ప్రశ్న 2.
20 సెం.మీ. నాభ్యంతరం గల కేంద్రీకరణ కటకం ముందు 60 సెం.మీ. దూరంలో వస్తువు వుంది. ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది ? దాని లక్షణాలు తెలపండి. (AS1)
(లేదా)
వస్తువు 20 సెం.మీ.ల నాభ్యంతరం గల కుంభాకార కటకంకు 60 సెం.మీ.ల దూరంలో ఉంచిన, దాని ప్రతిబింబం ఎక్కడ ఏర్పడును? ఆ ప్రతిబింబ లక్షణాలను తెలుపుము.
జవాబు:
కేంద్రీకరణ కటక నాభ్యంతరం = f = 20 సెం.మీ.
వస్తుదూరము = u = 60 సెం.మీ.
ప్రతిబింబదూరము = v = ?
AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 1

లక్షణాలు :
కటకానికి రెండోవైపు 30 సెం.మీ. దూరంలో తలక్రిందులుగా ఉన్న నిజప్రతిబింబం, వస్తుపరిమాణం కంటే తక్కువ పరిమాణంతో ఏర్పడుతుంది.

AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం

ప్రశ్న 3.
ఒక ద్వికుంభాకార కటకపు రెండు వక్రతలాల వక్రతా వ్యాసార్ధాలు సమానం (R). కటక వక్రీభవన గుణకం n = 1.5 అయిన కటక నాభ్యంతరాన్ని కనుగొనండి. (AS1)
(లేదా)
రెండు వక్రతా వ్యాసార్ధాలు సమానముగా గల ద్వికుంభాకార కటకపు వక్రీభవన గుణకం విలువ 1.5 అయిన ఆ కటక నాభ్యంతరం విలువ ఎంత?
జవాబు:
ద్వికుంభాకార కటకాల రెండు వక్రతలాల వక్రతావ్యాసార్ధాలు సమానము.
రెండు వక్రతలాలు వరుసగా R1 మరియు R2 లు అనుకొనుము. ∴ R1 = R2 = R అగును.
కటక వక్రీభవన గుణకము = n = 1.5 ; కటక నాభ్యంతరం = f = ?
రెండు కటకాల మధ్య దూరం వాటి నాభ్యాంతరాల మొత్తానికి సమానమయ్యే విధంగా కటకాలను అమర్చాలి.
AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 2
∴ కటక నాభ్యంతరము విలువ ‘R’ అగును. ∴ కటక నాభ్యంతరము వక్రతా వ్యాసార్ధానికి సమానము.

ప్రశ్న 4.
కటక సూత్రాన్ని రాయండి. అందులోని పదాలను వివరించండి. (AS1)
(లేదా)
రవి ఒక కటకాన్ని తయారు చేయాలనుకున్నాడు. దానికి అతను ఏ సూత్రాన్ని ఉపయోగిస్తాడు ? ఆ సూత్రం వ్రాసి అందలి పదాలను వివరింపుము.
జవాబు:
కటక తయారీ సూత్రము : 1) \(\frac{1}{f}=(n-1)\left(\frac{1}{R_{1}}-\frac{1}{R_{2}}\right)\)
ఈ సూత్రమును కటకంను గాలిలో ఉంచిన సందర్భంలో వాడతారు. దీనిలో
R1, R2 లు వక్రతావ్యాసార్ధాలు ; n – వక్రీభవన గుణకము ; f – నాభ్యంతరము

2) కటకంను ఏదైనా యానకంలో ఉంచిన సందర్భం దీనిలో \(\frac{1}{f}=\left(n_{b a}-1\right)\left(\frac{1}{R_{1}}-\frac{1}{R_{2}}\right)\)
R1, R2లు వక్రతా వ్యాసార్ధాలు.
f – నాభ్యంతరం
nba – యానకం పరంగా కటకపు వక్రీభవన గుణకం.
nb – కటకం తయారుచేసిన పదార్థపు వక్రీభవన గుణకం.
na – కటకం ఉంచిన యానకపు వక్రీభవన గుణకం.

ప్రశ్న 5.
ఒక కటక నాభ్యంతరాన్ని ప్రయోగపూర్వకంగా ఎలా కనుగొంటారు ? (ప్రయోగశాల కృత్యం-1) (AS1)
(లేదా)
కటక నాభ్యాంతరాన్ని UV పద్ధతిలో కనుగొనే ప్రయోగాన్ని రాయండి.
జవాబు:
ఉద్దేశ్యం : కుంభాకార కటక నాభ్యంతరమును UV పద్ధతిలో కనుగొనుట.

కావలసిన పరికరాలు :
టేబుల్, V – స్టాండ్, కుంభాకార కటకం, మీటరు స్కేలు, కొవ్వొత్తి (వస్తువు), తెర.

పద్ధతి : ఉజ్జాయింపుగా కటక నాభ్యంతరంను కనుగొనుట :

  1. కటకంను V – స్టాండుపై ఉంచుము.
  2. కటకంకు చాలా దూరంగా కటక ప్రధానాక్షం పై వెలుగుతున్న కొవ్వొత్తి నుంచుము.
  3. కటకంకు రెండోవైపున కొవ్వొత్తి ప్రతిబింబంను తెరపై ఏర్పడునట్లు అమర్చుము.
  4. ఇప్పుడు కటకం నుండి ప్రతిబింబానికి గల దూరంను కొలిచిన మనకు ఉజ్జాయింపు కటక నాభ్యంతరం తెలియును.

ప్రయోగ లెక్కింపు పద్ధతి (లేదా) u – v పద్ధతి :

1. ఈ పద్ధతిలో కొవ్వొత్తిని కటకంకు 60 సెం.మీ. దూరంలో కటక ప్రధానాక్షంపై, ఉంచుము.
2. కటకమునకు మరోవైపున తెరపై స్పష్టమైన ప్రతిబింబాన్ని ఏర్పరచు స్థానంలో ఉంచుము.
3. ఇపుడు ప్రతిబింబదూరము (v) ను కొలువుము.
4. ఈ విధంగా వస్తువును కటకమునకు 50 సెం.మీ., 40 సెం.మీ., 30 సెం.మీ. మొ॥గు దూరాలలో ఉంచుతూ, ప్రతి సందర్భంలో ప్రతిబింబదూరం (V) ను కొలువుము.
5. పైన పొందిన u, v విలువలను పట్టికలో నమోదు చేయుము.
AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 3
6. u, v విలువల నుండి f = \(\mathrm{f}=\frac{\mathrm{uv}}{\mathrm{u}+\mathrm{v}}\) ద్వారా కటక నాభ్యంతరంను లెక్కించి ప్రతి సందర్భంలోనూ స్థిరమని గమనించుము.

మరొక పద్ధతి :

  1. కుంభాకార కటకాన్ని సూర్యునికి అభిముఖంగా ఉంచండి.
  2. కటకానికి రెండోవైపు ఒక తెరని అమర్చి, ఆ తెరను కటకం వద్ద నుండి మెల్లగా వెనుకకు జరుపుతూ తెరపై ఎక్కడ ప్రకాశవంతమైన, దాదాపు బిందురూపంలో ఉండే సూర్యుని ప్రతిబింబం ఏర్పడుతుందో గుర్తించండి. కటకంపైన పడిన సూర్యకిరణాలన్నీ ఒక చోట కేంద్రీకరింపబడటం వలన ఇలా జరుగుతుంది.
  3. ఇప్పుడు కటకం నుండి తెరకు గల దూరాన్ని కొలవండి. ఈ విలువే కటక నాభ్యాంతరం అవుతుంది.

ప్రశ్న 6.
ద్వికుంభాకార కటకం కేంద్రీకరణ కటకంగా పనిచేస్తుందని సిద్దూతో హర్ష చెప్పాడు. హర్ష చెప్పేది నిజం కాదని తెలిసిన సిద్దూ, హర్షని కొన్ని ప్రశ్నలు అడిగి అతని భావనను సరిచేశాడు. ఆ ప్రశ్నలేమై ఉంటాయి? (AS2)
జవాబు:

  1. కుంభాకార కటకం గుండా కాంతికిరణాలు ప్రసరించిన ఏమగును?
  2. ద్వికుంభాకార కటక ఆకారమేమి?
  3. ద్వికుంభాకార కటకం గుండా ప్రసరించు కాంతి లక్షణం ఏమిటి?
  4. సమతల కుంభాకార కటకం గుండా ప్రసరించు కాంతి లక్షణం ఏమిటి?
  5. ఈ రెండు కటకాల ప్రతిబింబాల మధ్య గల తేడాలేమిటి?

ప్రశ్న 7.
పటంలో చూపినట్లు ఒక కుంభాకార కటకం మూడు వేర్వేరు పదార్థాలతో తయారుచేయబడింది. అది ఎన్ని ప్రతిబింబాలను ఏర్పరుస్తుంది? (AS2)
(లేదా)
మూడు వేర్వేరు పదార్థాలతో తయారుచేయబడిన కటకంతో ఏర్పడు ప్రతిబింబాల సంఖ్యను తెల్పుము.
AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 4
జవాబు:

  1. ఇచ్చిన కటకం మూడు వేర్వేరు పదార్థాలతో తయారు చేయబడినది. కావున వాటి వక్రీభవన గుణకాలు వేర్వేరుగా ఉండును.
  2. ఈ లక్షణం వలన కాంతి ఈ కటకం గుండా ప్రయాణించిన, మూడు ప్రతిబింబాలను ఏర్పరచును.

ప్రశ్న 8.
మీ దగ్గరలోని కళ్ళజోళ్ళ షాపులో దొరికే కటకాల గురించి సమాచారాన్ని సేకరించండి. కటకం యొక్క సామర్థ్యాన్ని (power) బట్టి దాని నాభ్యంతరం ఎలా కనుగొంటారో తెలుసుకోండి. (AS4)
జవాబు:

  1. కళ్ళజోళ్ళ షాపునందు అనేక రకాల కటక సామర్థ్యం గల కటకాలను మనము చూడవచ్చును.
  2. వాటిని మానవుని దృష్టి లోపమును బట్టి డాక్టర్ సలహా మేరకు వివిధ కటక సామర్థ్యాలు గల కటకాలతో కూడిన కళ్ళజోళ్ళను వాడేందుకు సలహా ఇస్తారు.
  3. కటక సామర్థ్యం : కటక నాభ్యంతరం యొక్క విలోమమును కటక సామర్థ్యం అంటారు.
  4. కుంభాకార కటకంకు ఈ విలువ ధనాత్మకము, పుటాకార కటకంకు ఈ విలువ ఋణాత్మకము.
  5. కటక సామర్థ్యంను డయాఫ్టర్లలో కొలుస్తారు.
  6. AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 5
    ఉదా : కటక సామర్థ్యము \(+\frac{1}{4}\) డయాప్టర్లు అయిన దాని నాభ్యంతరం 25 సెం.మీ. లుండును.

ప్రశ్న 9.
గెలీలియో తన టెలిస్కోప్ లో వాడిన కటకాలను గురించి సమాచారాన్ని సేకరించండి. (AS4)
(లేదా)
ఏ రకపు టెలిస్కోపులను గెలీలియో తన టెలిస్కోపులో ఉపయోగించెను?
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 6

  1. గెలీలియో టెలిస్కోప్ లో రెండు వేర్వేరు నాభ్యంతరాలు గల కటకాలను వాడినారు.
  2. ఈ కటకాలలో ఒకటి వస్తుకటకంగాను, మరొకటి అక్షికటకంగాను పనిచేస్తాయి.
  3. అక్షికటకం పరిశీలకుని కంటికి దగ్గరగా ఉంటుంది.
  4. వస్తుకటకం వస్తువు ఉన్నవైపు, దానికి దగ్గరగా ఉంటుంది.
  5. అక్షికటకపు నాభ్యంతరం తక్కువగా ఉంటుంది.
  6. వస్తుకటకపు నాభ్యంతరం అక్షికటకం కంటే ఎక్కువగా ఉంటుంది.
  7. వస్తు ప్రతిబింబం వస్తుకటకపు నాభి వద్ద ఏర్పడును.
  8. ఈ ప్రతిబింబం అక్షికటకంకు వస్తువుగా పనిచేసి, దాని ప్రతిబింబం వృద్దీకరణం చెందిన, నిటారుగా ఏర్పడును.
  9. ప్రక్కన గెలీలియో టెలిస్కోప్రలోని కటకాల అమరిక నమూనాను ఇవ్వడమైనది.

ప్రశ్న 10.
వికేంద్రీకరణ కటకం గుండా ప్రయాణించే AB కిరణాన్ని పటం చూపుతుంది. పటంలో కటక నాభుల స్థానాలను బట్టి కటకం వరకు ఆ కిరణ పథాన్ని గీయండి. (AS5)
AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 7
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 8
ఇచ్చిన కటకం. వికేంద్రీకరణ కటకం. వక్రీభవన కిరణం (AB) ని వెనుకకు పొడిగించిన ప్రధానాక్షంపై గల నాభి (F) వద్ద ఖండించును. కావున పతన కిరణం ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చిందని తెలుస్తుంది.

ప్రశ్న 11.
ఒక బిందురూప వస్తువును, N1 N2 ప్రధానాక్షం గల కటకంతో ఏర్పడిన ప్రతిబింబాన్ని పటం చూపుతుంది. కిరణచిత్రం ద్వారా కటకస్థానాన్ని, దాని నాభులను కనుగొనండి. (AS5)
AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 9
జవాబు:
పుటాకార కటకం వాడినప్పుడు :
AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 10
O – వస్తువు
I – ప్రతిబింబం
F1 – నాభి
P – దృక కేంద్రం
N1N2 – ప్రధానాక్షం

AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం

ప్రశ్న 12.
పటంలో చూపిన వస్తువు స్థానం S, ప్రతిబింబస్థానం S’ లను ఉపయోగించి కిరణచిత్రాన్ని గీసి, నాభిని కనుక్కోండి. (AS5)
AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 11
జవాబు:
కటకం : కుంభాకార కటకం
AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 12
S – వస్తువు
S’ – ప్రతిబింబం
P – దృక కేంద్రం
F1 – నాభి
N1N2 – ప్రధానాక్షం

ప్రశ్న 13.
కింది సందర్భాలకు సంబంధించిన కిరణచిత్రాలను గీయండి. ప్రతిబింబస్థానం, లక్షణాలను వివరించండి. (కుంభాకార కటకాన్ని వాడినప్పుడు)
i) 2F2 వద్ద వస్తువు ఉన్నప్పుడు ii) F2 మరియు దృక్ కేంద్రం (P)ల మధ్య వస్తువు ఉన్నప్పుడు (AS5)
జవాబు:
i) వస్తువును వక్రతా కేంద్రం (2F2) వద్ద ఉంచినప్పుడు 2F1 వద్ద ప్రతిబింబం ఏర్పడుతుంది.
AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 13

ప్రతిబింబ లక్షణాలు :
a) నిజప్రతిబింబం
b) వస్తువు పరిమాణంకు సమాన పరిమాణం గల ప్రతిబింబం.
c) తలక్రిందులుగా గల ప్రతిబింబం ఏర్పడును.

ii) వస్తువును నాభికి, కటక దృక కేంద్రానికి మధ్య ఉంచినపుడు వస్తువున్న వైపునే ప్రతిబింబం ఏర్పడును.
AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 14
లక్షణాలు :
a) మిథ్యా ప్రతిబింబం
b) వస్తువు పరిమాణం కంటే ఎక్కువ పరిమాణం గల ప్రతిబింబం
c) వృద్దీకరణం చెందిన ప్రతిబింబం ఏర్పడును.

ప్రశ్న 14.
ఒక సౌష్టవ కేంద్రీకరణ కటకం యొక్క నాభ్యంతరం, వక్రతా వ్యాసార్ధం సమానమైన, దాని వక్రీభవన గుణకొన్ని కనుగొనండి. (AS7)
జవాబు:
కటకం యొక్క నాభ్యంతరం =f
కటకం యొక్క వక్రతా వ్యాసార్ధం = R అనుకొనుము.
దత్తాంశం నుండి
కటకం యొక్క నాభ్యంతరం, వక్రతావ్యాసార్ధాలు సమానము. కావున f = R

ఇచ్చిన కటకం సౌష్ఠవ కేంద్రీకరణ కటకం, కావున దీనికి రెండు వక్రతావ్యాసార్ధాలుండును.
అవి R1 మరియు R2 అనుకొనుము.
R1 = R2 = R అనుకొనుము.
R1 = R మరియు R2 = – R అనుకొనుము.
AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 15
∴ సౌష్ఠవ కేంద్రీకరణ కటక వక్రీభవన గుణకం విలువ = n = 1.5

ప్రశ్న 15.
రెండు బిందురూప వస్తువులు ఒకదానికొకటి 24 సెం.మీ. దూరంలో ఉన్నాయి. 9 సెం.మీ. నాభ్యంతరం గల కేంద్రీకరణ కటకాన్ని వాటి మధ్య ఎక్కడ ఉంచితే, వాటి రెండు ప్రతిబింబాలు ఒకే స్థానంలో ఏర్పడతాయి? (AS7)
జవాబు:
బిందురూప వస్తువుల మధ్య దూరము d = 24 సెం.మీ.
కటక నాభ్యంతరం విలువ = f = 9 సెం.మీ.

పటంలో చూపినట్లుగా మొదటి బిందు జనకము నుండి కటకము X సెం.మీ.ల దూరము ఉందనుకొనుము.
ఇక్కడ వస్తుదూరము = u= -x; ప్రతిబింబదూరము = v = v ; నాభ్యంతరము = f = 9
AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 16
∴ కేంద్రీకరణ కటకంను మొదటి వస్తువుకు 6 లేక 18 సెం.మీ.ల దూరం ఉంచిన వాటి రెండు ప్రతిబింబాలు ఒకే స్థానంలో ఏర్పడతాయి.

ప్రశ్న 16.
సమాంతర కిరణాల మార్గంలో రెండు కేంద్రీకరణ కటకాల నుంచి, రెండు కటకాల గుండా ప్రయాణించాక కూడా కాంతి కిరణాలు సమాంతరంగానే ఉండాలంటే ఆ కటకాలను ఎలా అమర్చాలి? పటం సహాయంతో వివరించండి. (AS1)
జవాబు:
1) సమాంతర కాంతికిరణాల మార్గంలో రెండు కేంద్రీకరణ కటకాలనుంచారు.

2) సమాంతర కాంతికిరణపుంజము కేంద్రీకరణ కటకంపై పడిన, అవి నాభి వద్ద కేంద్రీకరించబడతాయి.

3) నాభి నుండి ప్రయాణించే కాంతికిరణం వక్రీభవనం చెందాక ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది.

4) పటంలో చూపినట్లుగా రెండు కటకాలను ఒకే ప్రధానాక్షంపై ఉంచిన, వక్రీభవనం తర్వాత కూడా కాంతికిరణాలు సమాంతరంగానే ప్రయాణిస్తాయి. రెండు కటకాల మధ్య దూరం వాటి నాభ్యంతరాల మొత్తానికి సమానమయ్యే విధంగా కటకాలను అమర్చాలి.
AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 17
పై పటంలో f1 మరియు f2లు కటక నాభ్యంతరాలు.

5) దీనినిబట్టి కాంతికిరణాలు మొదటి కటకంలో వక్రీభవనం చెంది నాభి వద్ద కేంద్రీకరించబడ్డాయి. నాభి నుండి రెండవ కటకం ద్వారా వక్రీభవనం తర్వాత ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించాయి. రెండు కటకాల నాభి బిందువులు ఏకీకృతం కాబడ్డాయి.

AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం

ప్రశ్న 17.
కుంభాకార కటకాన్ని నీటిలో ఉంచినపుడు, దాని నాభ్యంతరం పెరుగుతుందని ప్రయోగపూర్వకంగా మీరు ఎలా సరిచూస్తారు? (కృత్యం – 2) (AS1)
(లేదా)
ఒక కుంభాకార కటకంను నీటిలో ఉంచిన, దాని నాభ్యంతరంలో మార్పు సంభవించునో లేదో? ఒక కృత్యం ద్వారా వివరింపుము.
(లేదా)
కటకపు నాభ్యంతరము పరిసర యానకంపై ఏ విధంగా ఆధారపడునో ప్రయోగం ద్వారా వివరింపుము.
జవాబు:
ఉద్దేశ్యం : కుంభాకార కటకంను నీటిలో ఉంచినపుడు, నాభ్యంతరం పెరుగుతుందని పరిశీలించుట.

కావలసిన పరికరాలు :
నాభ్యంతరం తెలిసిన కుంభాకార కటకం, కటకంను ఉంచే రింగు, రాయి, స్థూపాకార గాజు పాత్ర మరియు నీరు.
AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 18

పద్ధతి :

  1. నాభ్యంతరం తెలిసినటువంటి కుంభాకార కటకంను తీసుకొని, దాని విలువను నోట్ చేసుకొనుము.
  2. గాజు గ్లాసు వంటి ఒక స్థూపాకార పాత్రను తీసుకొనుము.
  3. పాత్ర ఎత్తు కటకపు నాభ్యంతరం కంటే చాలా ఎక్కువ (దాదాపు 4 రెట్లు) ఉండేటట్లు చూడాలి.
  4. పాత్ర అడుగున నల్లటి రాయిని ఉంచుము.
  5. రాయిపై నుండి కటక నాభ్యంతరం కన్నా ఎక్కువ ఎత్తు వరకు ఉండునట్లు పాత్రలో నీరు నింపుము.
  6. పటంలో చూపినట్లుగా కటకాన్ని నీటి ఉపరితలానికి సమాంతరంగా ఉండేటట్లు నీటిలో కొద్ది లోతు వరకు కటకాన్ని సమాంతరంగా ముంచుము.
  7. రాయి ఉపరితలం నుండి కటకానికి గల దూరం కటక నాభ్యంతరానికి ఎక్కువగా ఉండే విధంగా కటకాన్ని పట్టుకొనుము.
  8. కటకం గుండా రాయిని గమనించుము.
  9. కటకం గుండా రాయిని చూడగలము, కానీ గాలిలో రాయి, కటకంకు మధ్య దూరం నాభ్యంతరం కంటే తక్కువ దూరం లోపే రాయి ప్రతిబింబాన్ని చూడగలిగాము. దీనినిబట్టి నీటిలో ఉన్నప్పుడు కటక నాభ్యంతరం పెరిగిందని తెలుస్తుంది.
  10. ఈ కృత్యం ద్వారా కటక నాభ్యంతరం పరిసర యానకంపై ఆధారపడుతుందని మనం నిర్ధారించవచ్చును.

ప్రశ్న 18.
భావన (A) : నీటిలో ఉన్న చేపకు ఒడ్డున ఉన్న మనిషి అతని వాస్తవ ఎత్తు కంటే ఎక్కువ ఎత్తుగా కనిపిస్తాడు.
కారణం (R) : నీటి నుండి వచ్చే కాంతికిరణం గాలిలోకి ప్రవేశించేటప్పుడు లంబానికి దూరంగా విచలనమవుతుంది. కింది వాటిలో ఏది సరియైనది? వివరించండి. (AS2)
a) A, R లు రెండూ సరియైనవి. మరియు A కు R సరైన వివరణ.
b) A, R లు రెండూ సరియైనవి. కానీ A కు R సరైన వివరణ కాదు.
c) A సరియైనది. R సరియైనది కాదు.
d) A, R లు రెండూ సరైనవి కావు.
e) A సరైనది కాదు. కానీ R సరియైనది.
జవాబు:
‘C’ సరియైన సమాధానము.

వివరణ :
1) కాంతి విరళ యానకం నుండి సాంద్రతర యానకంలోకి ప్రయాణించునపుడు లంబానికి దగ్గరగా వంగును.
2) ఈ లక్షణం వలన చేపకు వాస్తవ ఎత్తు కంటే ఎక్కువ ఎత్తుగా మనిషి కనిపిస్తాడు.

ప్రశ్న 19.
మిథ్యా ప్రతిబింబాన్ని కెమెరాతో ఫోటో తీయగలమా? (AS2)
(లేదా)
కెమెరాతో మిథ్యా ప్రతిబింబంను తీసిన అది ఏ విధముగా ఏర్పడును?
జవాబు:
మిథ్యా ప్రతిబింబాన్ని మనము కెమెరాతో ఫోటో తీయగలము.
ఉదా :
1) సమతల దర్పణం(అద్దం)లో ఏర్పడిన మన ప్రతిబింబంను ఫోటో తీయగలగడం.
2) మిథ్యా ప్రతిబింబంను కెమెరా సూత్రంపై పనిచేయు మన కన్ను చూడగలగడం మొ||నవి.

ప్రశ్న 20.
మీ దగ్గరున్న కటకం యొక్క నాభ్యంతరం కనుక్కోవడానికి చేసే ప్రయోగంలో తీసుకోవలసిన జాగ్రత్తలు సూచించండి. (AS3)
జవాబు:
జాగ్రత్తలు :

  1. కటకం యొక్క ప్రధానాక్షాన్ని ఊహించడంలో జాగ్రత్త వహించవలెను.
  2. వెలుగుతున్న క్రొవ్వొత్తి కటకానికి ఎదురుగా పట్టుకొనవలెను.
  3. ప్రతిబింబాన్ని తెరపై ఏర్పరచునపుడు తెరను నెమ్మదిగా ముందుకు, వెనుకకు జరపవలెను.
  4. నాభ్యాంతరం విలువ ఒకేలా రాలేదంటే, ప్రయోగం నిర్వహించినప్పుడు దోషాలు (errors) జరిగి ఉండవచ్చు. అటువంటప్పుడు గణించిన నాభ్యాంతరం విలువల సరాసరి తీసుకొనవలెను.

ప్రశ్న 21.
ఒక వ్యవస్థలో f1, f2 నాభ్యంతరాలు గల రెండు కటకాలున్నాయి. కింది సందర్భాలలో ఆ వ్యవస్థ యొక్క నాభ్యంతరాన్ని ప్రయోగపూర్వకంగా ఎలా కనుగొంటారు? (AS3)
i) రెండూ ఒకదానినొకటి ఆనుకొని ఉన్నప్పుడు
ii) రెండూ ఒకే ప్రధానాక్షంపై d దూరంలో ఉన్నప్పుడు
జవాబు:
కటకాల యొక్క నాభ్యంతరాలు f1 మరియు f2 లు

i) రెండు కటకాలు ఒకదానికొకటి ఆనుకొని ఉన్నప్పుడు :
మనకు ఇచ్చిన కటకాలు కుంభాకార కటకాలు అనుకొనుము. వాటి నాభ్యంతరాలు f1 మరియు f2 లు అనుకొనుము.
AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 19

  1. ఈ రెండు కటకాలను ఒకదానితో ఒకటి ఆనుకొని ఉండునట్లు అమర్చి వాటిని సూర్యునికి అభిముఖంగా ఉంచాలి.
  2. ఆ కటకాలకు మరోవైపు తెరను ఉంచి దానిపై సూర్యుని యొక్క బిందురూప ప్రతిబింబం ఏర్పరచాలి.
  3. రెండో కటకం నుండి తెరకు గల దూరం కొలిసే అదే ఆ వ్యవస్థ యొక్క నాభ్యాంతరం అవుతుంది.

ii) రెండూ ఒకే ప్రధానాక్షంపై ‘d’ దూరంలో ఉన్నపుడు :
కటకాలను మధ్య దూరం ‘d’లో ఉంచినపుడు వాటి ఫలిత నాభ్యంతరం.

  1. కటకాలను d దూరంలో ఉండునట్లు ఒక గొట్టంలో అమర్చాలి.
  2. ఈ వ్యవస్థతో సూర్యుని బిందురూప ప్రతిబింబం తెరపై ఏర్పరచాలి.
  3. రెండో’ కటకం నుండి తెరకు గల దూరమే ఈ వ్యవస్థ యొక్క నాభ్యంతరం అవుతుంది.

ప్రశ్న 22.
పాఠంలోని పట్టిక – 19 (ప్రయోగశాల కృత్యం – 1) ఉపయోగించి u మరియు V లకు, 1/u మరియు 1/v లకు లు గీయండి. (AS5)
జవాబు:
పట్టిక – 1లోని విలువల నుండి 1 విలువలను X – అక్షంపై, V – విలువలను Y – అక్షంపై తీసుకుని గీసిన గ్రాఫ్
AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 21

\(\frac{1}{\mathrm{u}}\) విలువలను X – అక్షంపై, \(\frac{1}{\mathrm{v}}\) విలువలను Y – అక్షం పై తీసుకుని గీసిన గ్రాఫ్
AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 22

AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం

ప్రశ్న 23.
40 సెం.మీ. నాభ్యంతరం గల కేంద్రీకరణ కటకంపై సమాంతర కిరణాలు పతనం చెందాయి. 15 సెం.మీ. నాభ్యంతరం గల వికేంద్రీకరణ కటకాన్ని ఎక్కడ ఉంచితే, రెండు కటకాల గుండా ప్రయాణించిన తర్వాత ఆ కిరణాలు తిరిగి సమాంతరంగా ఉంటాయి. కిరణచిత్రాన్ని గీయండి. (AS5)
జవాబు:
కిరణచిత్రము :
AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 23
కుంభాకార కటకం నుండి 25 సెం.మీ. దూరంలో పుటాకార దర్పణాన్ని ఉంచాలి.

వివరణ : కుంభాకార దర్పణానికి :
u = ∞ (ప్రధానాక్షానికి సమాంతరంగా కాంతి కిరణాలు వస్తున్నాయి)
v = f (అవి నాభి వద్ద కేంద్రీకరింపబడుతున్నాయి)
f = + 40 సెం.మీ.

పుటాకార దర్పణానికి :
u = ?
v = ∞ (వక్రీభవన కిరణాలు ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్తున్నాయి)
f = – 15 సెం.మీ.
AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 24

అనగా కటకం అవతల 15 సెం.మీ. దూరంలో వస్తువు ఉన్నట్లు భావించాలి. కనుక కుంభాకార దర్పణం వలన కాంతికిరణాలు ఎక్కడ కేంద్రీకరింపబడతాయో (f = 40) ఆ బిందువు కన్నా 15 సెం.మీ. ముందు పుటాకార దర్పణాన్ని ఉంచాలి. అప్పుడు రెండు కటకాల మధ్య దూరం 25 సెం.మీ. అవుతుంది.

ప్రశ్న 24.
ప్రయోగఫలితాలు, కిరణచిత్రాల ఫలితాలు ఒకే విధంగా ఉండడాన్ని మీరెలా అభినందిస్తారు? (AS6)
జవాబు:
ప్రయోగ ఫలితాలు, కిరణ చిత్ర ఫలితాలు ఒకే విధంగా ఉంటాయి. కనుక ప్రయోగం చేయకుండానే కిరణచిత్రాల ద్వారా వివిధ వస్తుదూరాలకు ప్రతిబింబ స్థానాలను, లక్షణాలను తెలుసుకోవచ్చును.
కావున కిరణ చిత్రాలు మనకు ఎంతో ఉపయోగపడతాయి.

ప్రశ్న 25.
వక్రీభవన గుణకం n = 1.5 గల గాజుతో ఒక కుంభాకార – పుటాకార కేంద్రీకరణ కటకం తయారు చేయబడింది. దాని నాభ్యంతరం 24 సెం.మీ. దాని ఒక వక్రతావ్యాసార్ధం మరొక వక్రతా వ్యాసార్ధానికి రెట్టింపైన ఆ రెండు వక్రతా వ్యాసార్ధాలను కనుగొనండి. (R1 = 6 సెం.మీ. R2 = 12 సెం.మీ.) (AS7)
జవాబు:
గాజు యొక్క వక్రీభవన గుణకం = n = 1.5
కుంభాకార – పుటాకార కేంద్రీకరణ కటకం నాభ్యంతరం = f = 24 సెం.మీ.

పుటాకార – కుంభాకార కటక వక్రతావ్యాసార్ధాలు R1 మరియు R2 లు అనుకొనుము. ఇవి రెండూ ఒకే సంజ్ఞను కలిగి ఉంటాయి.

ఒక వక్రతా వ్యాసార్ధం మరొక వక్రతా వ్యాసార్ధానికి రెట్టింపు కావున R2 = 2R1
AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 25

ప్రశ్న 26.
ఒక ఈతకొలనులో అంచువెంబడి నీటిలో మునిగి మీరు ఈదుతున్నారనుకుందాం. ఒడ్డుపై మీ స్నేహితుడు నిలబడి ఉన్నాడు. మీకు మీ స్నేహితుడు, అతని వాస్తవ ఎత్తుకన్నా ఎక్కువ ఎత్తుగా కనబడతాడా లేక తక్కువ ఎత్తుగా కనబడతాడా? ఎందుకు? (AS7)
(లేదా)
రాజు అతని స్నేహితులు కొలనులో ఈత కొడుతున్నారు. వారిలో ఒకరు ఒడ్డుపై నిలబడి ఉన్నాడు. వారికి ఆ స్నేహితుడు, అతని వాస్తవ ఎత్తుకన్నా ఎక్కువ ఎత్తుగా కనబడతాడా? లేదా? ఎందుకు?
జవాబు:
అతని వాస్తవ ఎత్తుకన్నా ఎక్కువ ఎత్తుగా కనబడతాడు.

కారణం :
కాంతి విరళ యానకం నుండి సాంద్రతర యానకంలోనికి ప్రయాణించునపుడు లంబానికి దగ్గరగా వక్రీభవనం చెందును.
AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 26

ఖాళీలను పూరించండి

1. దూరంలో ఉన్న వస్తువు నుండి వచ్చే కిరణాలు కుంభాకార కటకం వల్ల వక్రీభవనం చెంది …………… గుండా ప్రయాణిస్తాయి. (నాభి వద్ద)
2. కటకం యొక్క ……….. గుండా ప్రయాణించే కిరణం విచలనం పొందదు. (దృక్ కేంద్రం)
3. కటక సూత్రం ….. \(\left(\frac{1}{f}=\frac{1}{v}-\frac{1}{u}\right)\)
4. ఒక సమతల కుంభాకార కటక నాభ్యంతరం 28, వక్రతా వ్యాసార్ధం R అయిన కటక తయారీకి వాడిన పదార్థ వక్రీభవన గుణకం …………… (1.5)
5. నిజ మరియు మిథ్యా ప్రతిబింబాలను ఏర్పరచే కటకం ………………. (కుంభాకార కటకం)

సరైన సమాధానాన్ని ఎన్నుకోండి

1. కింది పదార్థాలలో కటక తయారీకి పనికిరానిది
A) నీరు
B) గాజు
C) ప్లాస్టిక్
D) బంకమన్ను
జవాబు:
D) బంకమన్ను

AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం

2. కింది వాటిలో ఏది సరియైనది?
A) కుంభాకార కటకంతో ఏర్పడ్డ మిథ్యా ప్రతిబింబ దూరం ఎల్లప్పుడూ వస్తుదూరం కంటే ఎక్కువ.
B) కుంభాకార కటకంతో ఏర్పడ్డ మిథ్యా ప్రతిబింబ దూరం ఎల్లప్పుడూ వస్తుదూరం కంటే తక్కువ లేదా సమానం.
C) కుంభాకార కటకం వల్ల ఎల్లప్పుడూ నిజప్రతిబింబం ఏర్పడుతుంది.
D)కుంభాకార కటకం వల్ల ఎల్లప్పుడూ మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది.
జవాబు:
A) కుంభాకార కటకంతో ఏర్పడ్డ మిథ్యా ప్రతిబింబ దూరం ఎల్లప్పుడూ వస్తుదూరం కంటే ఎక్కువ.

3. n వక్రీభవన గుణకం, R వక్రతావ్యాసార్ధం గల ఒక సమతల కుంభాకార కటకం యొక్క నాభ్యంతరం …
A) f= R
B) f = R/2
C) f = R(n – 1)
D) F = (n – 1)/R
జవాబు:
C) f = R(n – 1)

4. ఏ సందర్భంలో కటకనాభ్యంతర విలువకు ప్రతిబింబ దూరం విలువ సమానం?
A) కిరణాలు దృక కేంద్రం గుండా ప్రయాణించినప్పుడు
B) కిరణాలు ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించినప్పుడు
C) కిరణాలు నాభి గుండా ప్రయాణించినప్పుడు
D) అన్ని సందర్భాలలో
జవాబు:
B) కిరణాలు ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించినప్పుడు

5. కింది వాటిలో కటక తయారీ సూత్రం ఏది?
A) 1/f = (n – 1) (1/R1 + 1/R2)
B) 1/f = (n + 1) (1/R1 – 1/R2)
C) 1/f = (n – 1) (1/R1 – 1/R2)
D) 1/f = (n + 1) (1/R1 + 1/R2)
జవాబు:
C) 1/f = (n – 1) (1/R1 – 1/R2)

పరికరాల జాబితా

వివిధ రకాల కటకాలు, V – స్టాండు, కుంభాకార కటకం, తెర, కొవ్వొత్తి, గాజు బీకరు, కటకం ఉంచే రింగు.

10th Class Physical Science 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం Textbook InText Questions and Answers

10th Class Physical Science Textbook Page No. 68

ప్రశ్న 1.
రెండు యానకాలను వేరు చేసే వక్రతలంపై కాంతికిరణం పతనమైతే ఏం జరుగుతుంది?
జవాబు:
కాంతి వక్రతలం వద్ద వక్రీభవనం చెందుతుంది.

ప్రశ్న 2.
వక్రతలంపై పతనమైన కాంతికిరణాలు ఎలా విచలనం పొందుతాయి?
జవాబు:
విరళ యానకం నుండి సాంద్రతర యానకంలోనికి ప్రయాణించేటప్పుడు లంబానికి దగ్గరగా జరుగుతాయి.

10th Class Physical Science Textbook Page No. 69

ప్రశ్న 3.
ప్రధానాక్షం వెంట ప్రయాణించే కిరణం ఏమవుతుంది? అలాగే వక్రతా కేంద్రం గుండా ప్రయాణించే కిరణం ఏమవుతుంది?
జవాబు:
రెండు కిరణాలు లంబం వెంటే ప్రయాణిస్తాయి.
విచలనం పొందవు.
AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 27

10th Class Physical Science Textbook Page No. 74

ప్రశ్న 4.
రెండు వక్రతలాలున్న పారదర్శక పదార్థాన్ని కాంతికిరణ మార్గంలో ఉంచితే, ఆ కిరణం ఏమవుతుంది?
జవాబు:
కాంతికిరణం రెండుసార్లు వక్రీభవనం చెందుతుంది.

ప్రశ్న 5.
కటకం గుండా ప్రయాణించిన కాంతి కిరణం ఎలా ప్రవర్తిస్తుంది?
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 28

10th Class Physical Science Textbook Page No. 76

ప్రశ్న 6.
నాభి గుండా ప్రయాణించే కాంతి కిరణం ఎలా ప్రవర్తిస్తుంది?
జవాబు:
నాభి గుండా ప్రయాణించే కాంతి కిరణం వక్రీభవనం పొందాక ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది.
AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 29

10th Class Physical Science Textbook Page No. 77

ప్రశ్న 7.
ప్రధానాక్షానికి కొంత కోణం చేస్తూ వచ్చే సమాంతర కాంతి కిరణాలు కటకంపై పతనం చెందితే ఏం జరుగుతుంది?
జవాబు:
ప్రధానాక్షానికి కొంత కోణం చేస్తూ వచ్చే సమాంతర కాంతి కిరణాలు నాభీయతలంపై ఏదేని బిందువు వద్ద కేంద్రీకరించ బడతాయి. (లేదా) నాభీయ తలంపై నున్న బిందువు నుండి బయలుదేరి వస్తునట్లు కనిపిస్తాయి.
AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 30

ప్రశ్న 8.
వస్తువు అనంతదూరంలో ఉండటం అంటే ఏమిటి?
జవాబు:
వస్తువు కటకానికి బాగా దూరంగా ఉంటే అనంత దూరంలో ఉందని అంటాం. అనంతదూరంలో వస్తువు ఉన్నప్పుడు కటకంపై పడే కాంతి కిరణాలు ప్రధానాక్షానికి సమాంతరంగా ఉంటాయి.

10th Class Physical Science Textbook Page No. 83

ప్రశ్న 9.
u – V పద్ధతిలో అన్ని సందర్భాలలోనూ కటక నాభ్యంతరం ఒకే విలువ వచ్చునా?
జవాబు:

  1. u, v విలువలు మారిన అన్ని సందర్భాలలోనూ ఒకే విలువ ఉండును.
  2. నాభ్యంతరం విలువ ఒకేలా రాకుంటే గణించిన నాభ్యంతరం విలువల సరాసరిని తీసుకోవాలి.

AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం

10th Class Physical Science Textbook Page No. 84

ప్రశ్న 10.
కటకం యొక్క నాభ్యంతరం ఏ ఏ అంశాలపై ఆధారపడుతుంది?
జవాబు:
కటకం యొక్క నాభ్యంతరం

  1. కటకం తయారైన పదార్థ లక్షణంపై
  2. కటక వక్రతా వ్యాసార్ధాలపై
  3. పరిసర యానకంపైన ఆధారపడుతుంది.

10th Class Physical Science Textbook Page No. 69

ప్రశ్న 11.
ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే కిరణం ఏమవుతుంది?
AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 31
జవాబు:
a, C లలో వక్రీభవన కిరణం ప్రధానాక్షం పై ఒక నిర్దిష్ట బిందువును చేరుతుంది. Ab, d లలో ప్రధానాక్షానికి దూరంగా జరిగింది. వెనుకకు పొడిగిస్తే అది ప్రధానాక్షాన్ని అదే బిందువు వద్ద ఖండిస్తుంది.

ప్రశ్న 12.
i) 4(ఎ), 4(బి) పటాలలో వక్రీభవన కిరణాల మధ్య ఏం తేడా గమనించారు?
జవాబు:
4(ఎ) లో వక్రీభవన కిరణం ప్రధానాక్షంపై నిర్దిష్ట బిందువు వద్ద చేరింది.
4(బి) లో వక్రీభవన కిరణం ప్రధానాక్షానికి దూరంగా జరిగింది.

10th Class Physical Science Textbook Page No. 70

ii) ఈ (4(ఎ), 4(బి) మధ్య తేడాకు కారణం ఏమై ఉంటుంది?
జవాబు:
దీనికి ముఖ్యకారణం కాంతికిరణం వేర్వేరు యానకాలలో వక్రీభవనం చెందుట.

iii) 4(సి), 4(డి) పటాలలో వక్రీభవన కిరణాల మధ్య ఏం తేడా గమనించారు?
జవాబు:
4(సి) లో వక్రీభవన కిరణం ప్రధానాక్షంపై నిర్దిష్ట బిందువు వద్ద చేరింది.
4(డి) లో ప్రధానాక్షానికి దూరంగా జరిగింది.

iv) ఈ (4(సి), 4(డి) మధ్య తేడాకు కారణం ఏమై ఉంటుంది?
జవాబు:
దీనికి ముఖ్యకారణం కాంతికిరణం వేర్వేరు యానకాలలో వక్రీభవనం చెందుట.

v) నిమ్మకాయ పరిమాణంలో కనిపించే ఈ మార్పును ఎలా వివరిస్తారు?
జవాబు:
కాంతి సాంద్రతర యానకం నుండి విరళయానకంలోకి ప్రయాణించినపుడు లంబానికి దూరంగా వంగును.

vi) పెద్దగా కనిపించే నిమ్మకాయ అసలు నిమ్మకాయా? లేక దాని ప్రతిబింబమా?
జవాబు:
నిమ్మకాయ యొక్క ప్రతిబింబము.

10th Class Physical Science Textbook Page No. 72 ఉదాహరణ : 1)

ప్రశ్న 13.
ఆకాశంలో ఉన్న పక్షి సరస్సులోని నీటి ఉపరితలం దిశగా లంబంగా స్థిరవడితో కిందికి ప్రయాణిస్తుంది. పక్షికి లంబంగా నీటిలో ఒక చేప ఉంటే, ఆ చేపకు
a) పక్షి అసలు స్థానం కంటే దూరంలో కనబడుతుంది.
b) పక్షి అసలు స్థానం కంటే దగ్గరగా కనబడుతుంది.
c) పక్షి యొక్క వాస్తవ వేగం కంటే ఎక్కువ వేగంతో కదులుతున్నట్లు కనబడుతుంది.
d) పక్షి యొక్క వాస్తవ వేగం కంటే తక్కువ వేగంతో కదులుతున్నట్లు కనబడుతుంది.
పై అంశాలలో ఏవి సరియైనవి ? వాటిని మీరు ఎలా నిరూపిస్తారు? (AS7)
AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 32
జవాబు:
సమతలం వద్ద వక్రీభవనానికి మనం ఉపయోగించే సూత్రం \(\frac{\mathrm{n}_{2}}{\mathrm{~V}}=\frac{\mathrm{n}_{1}}{\mathrm{u}}\) . ……. (1)

ఒకానొక సమయంలో నీటి ఉపరితలం నుండి X ఎత్తులో పక్షి ఉందనుకుందాం.
నీటి వక్రీభవన గుణకం n అనుకుందాం.
గాలి వక్రీభవన గుణకం (n1) = 1; నీటి వక్రీభవన గుణకం (n2) = n
పటం ప్రకారం, వస్తుదూరం (u) = – X; ప్రతిబింబదూరం (v) =-y

ఈ విలువలను సమీకరణం (1) లో ప్రతిక్షేపించగా
\(\frac{n}{(-y)}=\frac{1}{(-x)} \Rightarrow y=n x\)

నీటి వక్రీభవన గుణకం (1) విలువ 1 కన్నా ఎక్కువని మనకు తెలుసు. కాబట్టి పై సమీకరణం ప్రకారం y విలువ X కంటే ఎక్కువ. కాబట్టి చేపకు పక్షి దాని అసలు స్థానం కంటే దూరంగా కనబడుతుంది. పక్షి స్థిరవడితో లంబంగా కిందికి ప్రయాణిస్తుందని మనం భావించాం. భూమిపై నుండి చూసే పరిశీలకునికి నిర్దిష్ట సమయంలో పక్షి X దూరం ప్రయాణించినట్లు కనిపిస్తే, అదేకాలంలో పక్షి ల దూరం ప్రయాణించినట్లుగా చేపకు కనబడుతుంది. X కన్నా y విలువ ఎక్కువ కాబట్టి పక్షి వాస్తవ వేగం కంటే ఎక్కువ వేగంతో కదులుతున్నట్లుగా చేపకు కనబడుతుందని మనం చెప్పవచ్చు.
దీనినిబట్టి సమస్యలో ఇచ్చిన అంశాలలో (a) మరియు (c) సరియైనవి.

10th Class Physical Science Textbook Page No. 73 (ఉదాహరణ : 2)

ప్రశ్న 14.
R వ్యాసార్ధం గల పారదర్శక గోళం గాలిలో ఉంది. దాని వక్రీభవన గుణకం n. వస్తు దూరానికి సమాన దూరంలో గోళానికి రెండోవైపు నిజప్రతిబింబం ఏర్పడాలంటే, ప్రధానాక్షంపై గోళం ఉపరితలం నుండి ఎంత దూరంలో వస్తువును ఉంచాలి?
AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 33
జవాబు:
పటంను పరిశీలిస్తే వస్తుదూరానికి సమానమైన దూరంలో ప్రతిబింబం ఏర్పడాలంటే గోళంలో ప్రయాణించే వక్రీభవన కిరణం ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించాలని తెలుస్తుంది.
గాలి వక్రీభవన గుణకం n1 = 1; గోళం వక్రీభవన గుణకం n2 = n

పటం నుండి, వస్తుదూరం u = – X; ప్రతిబింబదూరం V = 0 (ఒకటో వక్రతలం వద్ద వక్రీభవనం పొందిన కిరణం ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది.)
AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 34

AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం

ఉదాహరణ : 3

ప్రశ్న 14.
ఒక పారదర్శక గోళకేంద్రం వద్ద ఒక చిన్న అపారదర్శక బిందువు ఉంది. గోళం బయటి నుండి చూసినపుడు ఆ బిందువు యథాస్థానంలో కనబడుతుందా?
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 35
అంటే వస్తుదూరం, ప్రతిబింబదూరం సమానం. కనుక బిందువు ఏ స్థానంలో ఉందో, అదే స్థానంలో కనిపిస్తుంది. ఇది పదార్థం యొక్క వక్రీభవన గుణకంపై ఆధారపడదు.

10th Class Physical Science Textbook Page No. 76 (ఉదాహరణ : 4)

ప్రశ్న 15.
కుంభాకార కటకం యొక్క ప్రధానాక్షం (MN)పై నాభి (F)కి ఆవల ఒక బిందురూప వస్తువు (S)ను ఉంచినపుడు, ప్రతిబింబ స్థానాన్ని గుర్తించడానికి కిరణచిత్రాన్ని గీయండి.
జవాబు:
నాభి (F’) వద్ద ప్రధానాక్షానికి ఒక లంబరేఖ గీయండి.

బిందురూప వస్తువు (S) నుండి కటకంపై ఏదేని బిందువు (P’) ను చేరేటట్లు ఒక కిరణాన్ని గీయండి. వస్తువు (S) నుండి గీసిన కిరణానికి సమాంతరంగా కటక దృక కేంద్రం (P) గుండా పోయే మరో రేఖను గీయండి. ఈ రేఖ, నాభి వద్ద గీసిన లంబాన్ని F0 వద్ద ఖండిస్తుంది.
AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 36

– P’ బిందువు నుండి బయలుదేరి F0 బిందువు గుండా పోతూ ప్రధానాక్షాన్ని I అనే బిందువు వద్ద ఖండించే విధంగా మరొక రేఖను గీయండి.

– S అనే బిందురూప వస్తువుకు ‘I’ బిందువు ప్రతిబింబం అవుతుంది.

10th Class Physical Science Textbook Page No. 80 (ఉదాహరణ : 5)

ప్రశ్న 16.
పటం (ఎ), (బి) లలో చూపిన కిరణాలు కటకం గుండా ప్రయాణించాక ఏర్పడే వక్రీభవన కిరణాల మార్గాలను గీయండి.
AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 37
జవాబు:
కిరణచిత్రాలను గీయడానికి ఉదాహరణ 4లో తెలిపిన సూచనలను పాటించండి. ఆ కిరణాల మార్గాలు (సి), – (డి) పటాలలో చూపిన విధంగా ఉంటాయని మీరు గుర్తిస్తారు.
AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 38

10th Class Physical Science Textbook Page No. 83 (ఉదాహరణ : 6)

ప్రశ్న 17.
ఒక టేబుల్ పై వెలుగుతున్న విద్యుత్ బల్బు, తెరను ఒకదానికి ఒకటి 1 మీ|| దూరంలో ఉంచాం. 21 సెం.మీ. నాభ్యంతరం గల కుంభాకార కటకాన్ని వీటి మధ్య ఏ స్థానంలో ఉంచితే స్పష్టమైన ప్రతిబింబం ఏర్పడుతుంది?
AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 39
జవాబు:
వస్తువు (విద్యుత్ బల్బు) కు, తెరకు మధ్య దూరం d మరియు వస్తువుకు, కటకానికి మధ్య దూరం X అనుకుందాం. పటం ప్రకారం u = – X, V = d – x

ఈ విలువలను కటక సూత్రంలో ప్రతిక్షేపించగా
\(\frac{1}{f}=\frac{1}{(d-x)}+\frac{1}{x}\)
ఈ సమీకరణాన్ని సాధించి x² – dx + fd = 0 అని పొందవచ్చు.
ఇది ఒక వర్గసమీకరణం. దీనికి రెండు సాధనలుంటాయి. అవి

f = 21 సెం.మీ.; d= 1 మీ. 100 సెం.మీ. అని ఇవ్వబడింది.

ఈ విలువలను పై సమీకరణంలో ప్రతిక్షేపించి, x1 = 70 సెం.మీ. మరియు x2 = 30 సెం.మీ. అని పొందవచ్చు.

గమనిక : f విలువ 25 సెం.మీ. లేదా అంతకన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే బల్బ్ యొక్క ప్రతిబింబం స్పష్టంగా ఏర్పడుతుంది.

దీనికి గల కారణమేమిటో, సమీకరణం – (1) ఉపయోగించి చర్చించండి. ఉపాధ్యాయుని సహకారం తీసుకోండి.

10th Class Physical Science Textbook Page No. 89 (అనుబంధ ఉదాహరణ)

ప్రశ్న 18.
వక్రీభవన గుణకం n = 1.5 గల ఒక ద్విపుటాకార కటకం గాలిలో ఉంచబడింది. కటకం యొక్క రెండు వక్రతలాల వక్రతావ్యా సార్ధాలు R1 = – 30 సెం.మీ., R2 = 60 సెం.మీ. అయిన ఆ కటక నాభ్యంతరం ఎంత?
జవాబు:
పటం ప్రకారం సంజ్ఞా సంప్రదాయాన్ని ఉపయోగించి
R1 = – 30 సెం.మీ. R2 = 60 సెం.మీ. అని రాయవచ్చు. n = 1.5 అని ఇవ్వబడింది.
పై విలువలను \(\frac{1}{\mathrm{f}}=(\mathrm{n}-1)\left(\frac{1}{\mathrm{R}_{1}}-\frac{1}{\mathrm{R}_{2}}\right)\)
AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 40
పై సమీకరణాన్ని సాధిస్తే f = – 40 సెం.మీ. అవుతుంది. ఇందులో ‘-‘ అనేది వికేంద్రీకరణ కటకాన్ని తెలియజేస్తుంది.

10th Class Physical Science 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం Textbook Activities

కృత్యములు

కృత్యం – 1

ప్రశ్న 1.
వక్రతలాల ద్వారా కాంతి వక్రీభవనంను అవగాహన చేసుకోవడానికి ఒక కృత్యంను వ్రాయుము.
జవాబు:
ఉద్దేశ్యం : వక్రతలాలపై కాంతి వక్రీభవనంను అవగాహన చేసుకొనుట.

కావలసిన పరికరాలు :
మందపాటి కాగితం ముక్క నల్ల స్కెచ్ పెన్, గాజు స్థూపాకార పాత్ర, టేబుల్ మరియు నీరు.

పద్ధతి : సందర్భం – 1:

  1. ఒక మందపాటి కాగితం ముక్కను తీసుకొనుము.
  2. దానిపై నల్లని స్కెచ్ తో 4 సెం.మీ. బాణం గుర్తును గీయుము.
  3. టేబుల్ పై గాజు గ్లాసు వంటి స్థూపాకారపు పాత్ర నుంచుము.
  4. ఆ పాత్ర గుండా అవతల వైపునున్న బాణం గుర్తును పరిశీలించుము.
  5. బాణం గుర్తు కంటే తక్కువ పరిమాణం గల ప్రతిబింబం ఏర్పడును.
  6. దీనికి కారణం బాణం గుర్తునుండి వచ్చే కాంతి వక్రతలం ద్వారా వక్రీభవనం చెంది గాజు గుండా ప్రయాణించింది. మరల గాజు నుండి గాలిలోకి, మరొకసారి వక్రీభవనం చెందడం వలన చిన్న ప్రతిబింబం ఏర్పరుస్తుంది.

సందర్భం – 2 :

  1. ఇప్పుడు గాజు పాత్రను నీటితో నింపుము.
  2. అదే స్థానంలో ఉండి మరల బాణం గుర్తును పరిశీలించుము.
  3. ప్రతిబింబం వ్యతిరేకదిశలో ఏర్పడుతుంది.
  4. దీనికి కారణము కాంతి వక్రతలంలోకి ప్రవేశించి నీటిగుండా ప్రయాణించి, నీటి నుండి బయటకు వచ్చాక వ్యతిరేక ఆ దిశలో ఉన్న ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది.

AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం

కృత్యం – 2

ప్రశ్న 2.
కటకం యొక్క నాభ్యంతరం ఏఏ అంశాలపై ఆధారపడుతుంది?
జవాబు:
ఉద్దేశ్యం : కటక నాభ్యంతరం పరిసర యానకంపై ఆధారపడుతుందని నిరూపించుట.

కావలసిన పరికరాలు :
కటకం, స్థూపాకార పాత్ర, నల్లటి రాయి, నీరు
AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 18

ప్రయోగం :

  1. నాభ్యాంతరం తెలిసిన కటకాన్ని తీసుకొంటిని.
  2. కటక నాభ్యాంతరానికి 4 రెట్లు ఎత్తు ఉండే గాజు గ్లాసు వంటి ఒక ఇక స్థూపాకార పాత్రను తీసుకొంటిని.
  3. పాత్ర అడుగుభాగాన నల్లటి రాయి నుంచితిని.
  4. రాయిపై నుండి కటక నాభ్యాంతరం కన్నా ఎక్కువ ఎత్తు వరకు ఉండేటట్లు పాత్రలో నీరు నింపితిని.
  5. పటంలో చూపినట్లు కటకాన్ని నీటి ఉపరితలానికి సమాంతరంగా నీటిలో యుంచితిని.
  6. రాయి ఉపరితలం నుండి కటకానికి గల దూరం, కటక నాభ్యంతరానికి సమానంగా గానీ, లేదా తక్కువగా గానీ ఉండే విధంగా కటకాన్ని పట్టుకుంటిని.

పరిశీలనలు :

  1. రాయి ప్రతిబింబాన్ని చూడగలిగాను.
  2. గాలిలో రాయి, కటకానికి మధ్య దూరం కటక నాభ్యాంతరం కంటే తక్కువ ఉంటేనే రాయి ప్రతిబింబం కనబడుతుంది.
  3. కానీ ప్రయోగంలో కటకం గాలిలో ఉన్నప్పుడు కనుగొన్న నాభ్యంతరం కంటే, రాయి-కటకం మధ్య దూరం ఎక్కువగా ఉండే విధంగా కటకాన్ని నీటిలో ముంచిన రాయి ప్రతిబింబం కనబడింది.
  4. దీనిని బట్టి నీటిలో ఉన్నప్పుడు కటక నాభ్యంతరం పెరిగిందని తెలుస్తుంది.

నిర్ణయము :
కనుక కటక నాభ్యంతరం పరిసరయానకంపై ఆధారపడుతుంది.

AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం

SCERT AP 10th Class Physics Study Material Pdf 1st Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Physical Science 3rd Lesson Questions and Answers సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం

10th Class Physical Science 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
నీటిలో ఈదే చేపను తుపాకీతో కాల్చడం కష్టం. ఎందుకు? (AS1)
జవాబు:
నీటిలో ఈదే చేపను తుపాకీతో కాల్చడం కష్టం. దీనికి కారణం కాంతి యొక్క వక్రీభవన లక్షణమే.

వివరణ :

  1. చేప, పరిశీలకుడు వేర్వేరు యానకాలలో ఉన్నారు. అనగా చేప నీరు అను సాంద్రతర యానకంలోనూ, పరిశీలకుడు గాలి అను విరళయానకంలోనూ కలరు.
  2. గమనించగా – నీరు, గాలి అనే యానకాలను వేరుచేసే తలం వద్ద చేప ఉపరితలం వైపునకు పైకి వచ్చినట్లుగా కనపడుతుంది.
  3. కావున తుపాకీని గురి పెట్టినపుడు దాని నిజమైన స్థానానికి బదులుగా స్థానభ్రంశం చెందిన స్థానం కనిపిస్తుంది. అందుకనే నీటిలో ఈదే చేపను తుపాకీతో కాల్చడం కష్టం.

ప్రశ్న 2.
శూన్యంలో కాంతివేగం 3,00,000 కి.మీ./సె., వజ్రంలో కాంతివేగం 1,24,000 కి.మీ./సె. అయిన, వజ్రం వక్రీభవన గుణకాన్ని కనుగొనండి. (AS1)
జవాబు:
వజ్రంలో కాంతివేగం (V) : 1,24,000 కి.మీ./సె.
శూన్యంలో కాంతివేగం (C) = 3,00,000 కి.మీ./సె.
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 1

ప్రశ్న 3.
నీటిపరంగా గాజు వక్రీభవన గుణకం 9/8. గాజుపరంగా నీటి వక్రీభవన గుణకం ఎంత? (AS1)
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 2

ప్రశ్న 4.
బెంజీన్ యొక్క సందిగ్ధ కోణం 42°. అయిన బెంజీన్ వక్రీభవన గుణకం కనుగొనండి. (AS1)
(లేదా)
బెంజీన్ సందిగ్ధకోణం విలువ 42° అయిన దాని యొక్క వక్రీభవన గుణకం విలువ ఎంత?
జవాబు:
బెంజీన్ సందిగ్ధ కోణం (C) = 42°
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 3

ప్రశ్న 5.
ఎండమావులు ఏర్పడే విధానాన్ని వివరించండి. (AS1)
(లేదా)
ఎండమావులు ఏ విధముగా ఏర్పడతాయో వివరించుము.
(లేదా)
వేసవిలో రోడ్డుపై ఏర్పడే మానవుని యొక్క దృక్ భ్రమను వివరించుము.
(లేదా)
రాజు రోడ్డుపై ప్రయాణించుచున్నాడు. అతనికి కొంతదూరంలో రోడ్డుపై నీటిగుంట వున్నట్లు కన్పించినది. అక్కడకు వెళ్ళి చూడగా నీటిగుంట లేదు. ఈ దృగ్విషయాన్ని ఏమంటారు? అది ఎలా సాధ్యపడినది? వివరింపుము.
(లేదా)
ఎండ తీవ్రంగా ఉన్న మధ్యాహ్నం సమయంలో తారురోడ్డుపై కొన్ని సార్లు నీరు ఉన్నట్లు కన్పిస్తుంది. కాని అక్కడ నీరు ఉండదు ఆ దృగ్విషయం ఏమిటి? అది ఎందుకు ఆ విధంగా జరుగుతుందో వివరించండి.
జవాబు:
ఎండ తీవ్రంగా ఉన్న మధ్యాహ్న సమయంలో తారు రోడ్డుపై కొన్నిసార్లు నీరు ఉన్నట్లు కన్పించును, కానీ అక్కడ నీరుండదు. ఈ దృగ్విషయాన్ని “ఎండమావి” అంటారు.

  1. ఎండమావులు దృఢమ వల్ల ఏర్పడు ఒక ఊహాత్మక చిత్రం.
  2. ఎండమావులు యానకపు వక్రీభవన గుణకాలలోని తేడాల వలన మరియు కాంతి సంపూర్ణాంతర పరావర్తనం వలన ఏర్పడతాయి.
    ఏర్పడు విధానం :
    AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 4
  3. వేసవికాలంలో రోడ్డు ఉపరితలానికి దగ్గరగా ఉన్న గాలి వేడిగానూ, రోడ్డు ఉపరితలానికి చాలా ఎత్తులో ఉన్న గాలి వక్రీభవన గుణకం తగ్గుతుంటుంది. చల్లగానూ ఉండును.
  4. దీనినిబట్టి ఎత్తుపై ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీనివలన గాలి సాంద్రత పెరుగుతుంది.
  5. ఎత్తు పెరుగుతున్న కొలదీ గాలి వక్రీభవన గుణకం పెరుగును. కావున రోడ్డు ఉపరితలానికి దగ్గరగా ఉన్న వేడిగాలి కంటే పైన ఉన్న చల్లగాలి వక్రీభవన గుణకం ఎక్కువ.
    AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 5
  6. కాబట్టి పైన ఉన్న చల్లని సాంద్రతర గాలికంటే, క్రింద ఉన్న వేడి విరళగాలిలో కాంతి వేగంగా ప్రయాణించును.
  7. కాంతి పై నుండి కిందకు, సాంద్రత మారుతున్నటువంటి గాలిగుండా ప్రయాణిస్తూ రోడ్డుకు దగ్గరగా వచ్చినపుడు వక్రీభవనానికి లోనై సంపూర్ణాంతర పరావర్తనం వల్ల పటంలో చూపిన విధంగా ప్రయాణిస్తుంది.
  8. ఈ విధంగా కాంతి నేలపై పరావర్తనం చెంది వస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది.
  9. ఇలా జరగడం వల్లనే ఆకాశం యొక్క మిథ్యా ప్రతిబింబం పటంలో చూపినట్లు మనకు రోడ్డుపై నీళ్ళవలె కనబడుతుంది. దీనినే “ఎండమావి” అంటాం.

AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం

ప్రశ్న 6.
\(\frac{\sin i}{\sin r}\) విలువ స్థిరమని ప్రయోగపూర్వకంగా ఎలా సరిచూస్తారు? (ప్రయోగశాల కృత్యం – 1) (AS1)
(లేదా)
పతన కోణము మరియు వక్రీభవన కోణంలకు మధ్యనగల సంబంధంను ప్రయోగ పూర్వకముగా వ్రాయుము.
(లేదా)
పటం ద్వారా పతన మరియు పరావర్తన కోణంల మధ్య సంబంధంను ప్రయోగ పూర్వకముగా వివరించుము.
జవాబు:
ఉద్దేశ్యం :
పతనకోణానికి, వక్రీభవన కోణానికి మధ్య గల సంబంధాన్ని గుర్తించడం.

కావలసిన వస్తువులు :
ప్రొ సర్కిల్, తెల్ల డ్రాయింగ్ షీట్, స్కేలు, నలుపురంగు వేసిన చిన్న కార్డుబోర్డు ముక్క (10 సెం.మీ. X 10 సెం.మీ.), 2 సెం.మీ. మందం గల అర్ధవృత్తాకారపు గాజుపలక, పెన్సిల్ మరియు లేజర్ లైట్.

ప్రొ సర్కిల్ తయారీ :
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 6

  1. కార్డుబోర్డు షీట్ పై తెల్ల డ్రాయింగ్ షీట్ ను అంటించుము.
  2. డ్రాయింగ్ షీట్ మధ్యలో రెండు లంబరేఖలను పటంలో చూపిన విధంగా గీయుము.
  3. ఆ లంబరేఖల ఖండన బిందువును ‘0’ గా గుర్తించుము.
  4. లంబరేఖలకు MM, NN అని పేర్లు పెట్టుము.
  5. ఈ రేఖలలో MM అనునది రెండు యానకాలను వేరుచేసే తలాన్ని సూచిస్తుంది.
  6. NN అనునది MM రేఖకు ‘O’ బిందువు వద్ద గీసిన లంబాన్ని సూచిస్తుంది.
  7. NN రేఖ వెంబడి ఒక కోణమానిని ఉంచి, దాని కేంద్రం బిందువు ‘O’ తో ఏకీభవించునట్లు చేయుము.
  8. పటంలో చూపిన విధంగా NN యొక్క రెండు చివరల నుండి అనగా 0-90° కోణాలను గుర్తించుము.
  9. ఈ విధంగా -NN కు రెండోవైపు కూడా కోణాలను గుర్తించుము.
  10. పటంలో చూపిన విధముగా ఈ కోణరేఖలన్నింటినీ ఒక వృత్తం పై వచ్చునట్లుగా గుర్తించుము.

ప్రయోగ నిర్వహణ పద్ధతి :
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 7

  1. క్రింది పటంలో చూపిన విధంగా అర్ధవృత్తాకారపు గాజు పలకను MM వెంబడి అమర్చుము.
  2. గాజుపలక వ్యాసం MM తో ఏకీభవించాలి. దాని కేంద్రం (0) బిందువుతో ఏకీభవించాలి.
  3. ఇప్పుడు లేజర్ లైట్ తో NN వెంబడి కాంతిని ప్రసరింపజేయుము.
    ఈ కాంతి మొదట గాలిలో ప్రయాణించి రెండు యానకాలను వేరుచేయు తలం అయిన MM గుండా ‘O’ బిందువు వద్ద గాజులోకి ప్రవేశిస్తుంది.
  4. పటంలో చూపినట్లుగా గాజు నుండి బయటకు వచ్చు కాంతి యొక్క మార్గాన్ని గమనించుము.
  5. ఇప్పుడు NN రేఖకు 15° కోణం (పతన కోణం) చేసే రేఖ వెంబడి లేజర్ కాంతిని ప్రసరింపజేసిన అది ‘O’ బిందువు గుండా పోయే విధంగా జాగ్రత్త తీసుకొనుము.
  6. ఈ కాంతి గాజుపలక యొక్క వక్రతలం గుండా బయటకు వచ్చు కాంతిని పరిశీలించి, దాని వక్రీభవన కోణమును కొలువుము.
  7. ఈ విధంగా వివిధ పతన కోణాలు 209, 30, 409, 50° మరియు 60° లతో ఈ ప్రయోగాన్ని చేసి, వాటి వక్రీభవన కోణాలను క్రింది పట్టికలో నమోదు చేయుము.
    AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 8
  8. ప్రతీ i, r విలువలకు sini, sin r లను లెక్కించి, \(\frac{\sin i}{\sin r}\) విలువను గణించుము.
  9. ప్రతీ సందర్భంలో sin i, sin r నిష్పత్తి విలువ స్థిరము.

ప్రశ్న 7.
సంపూర్ణాంతర పరావర్తనాన్ని ఏదేని కృత్యంతో వివరించండి. (కృత్యం – 5) (AS1)
జవాబు:
ఉద్దేశ్యం : కాంతి సంపూర్ణాంతర పరావర్తనాన్ని వివరించుట.

కావలసిన వస్తువులు :
ప్రొ సర్కిల్, తెల్ల డ్రాయింగ్ షీట్, స్కేలు, నలుపురంగు వేసిన చిన్న కార్డుబోర్డు ముక్క (10 సెం.మీ. X 10 సెం.మీ.), 2 సెం.మీ. మందం గల అర్ధవృత్తాకారపు గాజుపలక, పెన్సిల్ మరియు లేజర్ లైట్.

నిర్వహణ పద్ధతి :
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 9

  1. ప్రయోగశాల కృత్యం – 1 లో ఉంచినట్లుగానే అర్ధవృత్తాకార గాజుదిమ్మె వ్యాసం యానకాలను వేరుచేసే రేఖ MM తో ఏకీభవించేటట్లుగా అమర్చండి.
  2. MM మధ్య బిందువు ‘O’ తో గాజు దిమ్మె వ్యాసం యొక్క మధ్య – బిందువు ఏకీభవించాలి.
  3. గాజు దిమ్మె వక్రతలం వైపు నుండి కాంతిని పంపండి.
  4. మనం కాంతిని సాంద్రతర యానకం నుండి విరళయానకంలోకి పంపుతున్నాము.
  5. మొదటగా 0° పతన కోణంతో ప్రారంభించి గాజు దిమ్మె రెండోవైపు వక్రీభవన కిరణంను పరిశీలించుము.
  6. వక్రీభవన కిరణం తన మార్గాన్ని మార్చుకోలేదని మనము గమనించవచ్చును.
  7. ఇదే విధంగా 59, 10, 15-9, ….. పతన కోణాలతో కాంతిని పంపి వక్రీభవన కోణాలను లెక్కించుము.
  8. i, r విలువలను క్రింది పట్టికలో నమోదు చేయుము.
    AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 10
  9. నిర్దిష్ట పతనకోణం వద్ద వక్రీభవన కిరణం గాజు, గాలి యానకాలను వేరుచేయు రేఖ వెంబడి ప్రయాణించడం గమనించవచ్చును.
  10. ఈ సందర్భంలో ఏర్పడు పతనకోణం సందిగ్ధ కోణం అగును.
  11. ఏదైనా పతన కోణం (i) కి పరావర్తన కోణం (r) అయినపుడు స్నెల్ నియమం ప్రకారం
    AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 11

AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 12

15) సందిగ్ధ కోణం కన్నా పతనకోణం ఎక్కువైనపుడు యానకాలను వేరుచేయు తలం వద్ద కాంతికిరణం తిరిగి సాంద్రతర ఆ యానకంలోకే పరావర్తనం చెందును.
16) అనగా కాంతికిరణం విరళయానకంలోకి ప్రవేశించదు. ఈ దృగ్విషయాన్ని సంపూర్ణాంతర పరావర్తనం అంటాం.

AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం

ప్రశ్న 8.
సాంద్రతర యానకం నుండి విరళయానకంలోకి కాంతి ప్రయాణించినప్పుడు, పతనకోణం కన్నా వక్రీభవన కోణం విలువ ఎక్కువని ప్రయోగపూర్వకంగా ఎలా సరిచూస్తారు? (AS1)
(లేదా)
సాంద్రతర యానకం నుండి విరళయానకంలోకి కాంతి ప్రయాణించినపుడు లంబానికి దూరంగా వంగుతుందని r > i అని తెలిపే కృత్యాన్ని వ్రాయండి.
జవాబు:
ఉద్దేశ్యం :
సాంద్రతర యానకం నుండి విరళ యానకంలోకి కాంతి ప్రయాణించినప్పుడు లంబానికి దూరంగా వంగుతుందని లేదా r> i అగునని నిరూపించుట.

కావలసిన పరికరాలు :
కోణమాని, రెండు స్ట్రాలు, నీరు.
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 13AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 14

నిర్వహణ పద్ధతి :

  1. ఒక వృత్తాకారపు కోణమానిని తీసుకొని దానిపై కేంద్రం వద్ద రెండు ‘స్ట్రా’లను, కేంద్రం చుట్టూ సులభంగా తిరిగేటట్లు అమర్చండి.
  2. ఒక స్ట్రాను 10° కోణరేఖ వెంబడి అమర్చుము.
  3. ఈ కోణమానిని పటం (బి) లో చూపినట్లు పారదర్శక పాత్రలో గల నీటిలో సగం వరకు ముంచుము.
  4. కోణమానిని నీటిలో ముంచినపుడు 10° కోణరేఖ వద్ద ఉంచిన స్ట్రా నీటిలో మునిగి ఉండేటట్లు జాగ్రత్త వహించాలి.
  5. పాత్ర పై భాగం నుండి నీటిలో మునిగి ఉన్న స్ట్రాను చూస్తూ, నీటి బయట – ఉన్న స్ట్రాను లోపల ఉన్న స్ట్రాతో సరళరేఖలో ఉండే విధంగా అమర్చుము.
  6. తరువాత కోణమానిని నీటి నుండి బయటకు తీసి రెండు స్ట్రాలను పరిశీలించుము.
  7. పరిశీలించగా రెండూ ఒకే సరళరేఖలో లేవని గుర్తించవచ్చును.
  8. రెండవ ‘కు, లంబానికి మధ్య కోణాన్ని కొలవండి.
  9. పట్టికలో i, r విలువలు నమోదు చేయండి.
    AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 15
  10. ప్రయోగంలో పతనకోణం 48°లను మించకుండా i, r విలువలకు వక్రీభవన గుణకాలను కనుగొనుము.
  11. నీటి నుండి గాలిలోకి కాంతి ప్రయాణించేటపుడు ప్రతి సందర్భంలోనూ r విలువ 1 విలువ కన్నా ఎక్కువ ఉంటుందని గమనించవచ్చును.
  12. దీనినిబట్టి సాంద్రతర యానకం నుండి విరళయానకంలోకి కాంతి ప్రయాణించేటప్పుడు లంబానికి దూరంగా వంగుతుందని, r > i అని చెప్పవచ్చును.

ప్రశ్న 9.
ప్రకాశవంతమైన ఒక లోహపు గోళాన్ని తీసుకొని, కొవ్వొత్తి నుండి వచ్చే మసితో గోళాన్ని నల్లగా చేయండి. ఆ గోళాన్ని నీటిలో ముంచండి. ఆ గోళం ఎలా కనిపిస్తుంది? ఎందుకు? (AS2)
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 16 AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 17

  1. ప్రకాశవంతమైన లోహపు గోళాన్ని కొవ్వొత్తి నుండి వచ్చు మసితో నల్లగా మార్చుము.
  2. ఈ లోహపు గోళాన్ని నీటిలో ఉన్న పాత్రలో ముంచుము.
  3. ఈ సందర్భంలో నీటికి, మసికి మధ్య ఒక ఖాళీ పటంలో చూపినట్లుగా, ఏర్పడును.
  4. ఇక్కడ ఏర్పడిన ఖాళీ విరళయానకంగానూ, నీరు సాంద్రతర యానకంగానూ పనిచేయును.
  5. కాంతికిరణం నీటి గుండా ఆ ఖాళీ వైపునకు ప్రయాణించును.
  6. ఏ సందర్భంలోనైతే పతనకిరణము కన్నా సందిగ్ధ కోణము ఎక్కువ అగునో అప్పుడు సంపూర్ణాంతర పరావర్తనం జరుగును.
  7. ఈ సంపూర్ణాంతర పరావర్తనం వలన కాంతిగోళం మెరయును.
  8. అదే విధంగా కాంతి వక్రీభవనం వలన కూడా గోళం మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరచి కొంత ఎత్తులో కనపడును. దాని అసలు పరిమాణం కన్నా ఎక్కువ పరిమాణంతో కూడా వక్రీభవనము కనపడును.

ప్రశ్న 10.
కృత్యం – 7ను మరలా చేయండి. నీటి సందిగ్ధ కోణాన్ని మీరు ఎలా కనుగొంటారు? కనుగొనే పద్ధతిని వివరించండి. (AS3)
జవాబు:

  1. ఒక స్థూపాకార పారదర్శక పాత్రను తీసుకొనుము.
  2. ఆ పాత్ర అడుగున ఒక నాణాన్ని ఉంచుము.
  3. పటంలో చూపిన విధంగా ఆ నాణెం ప్రతిబింబం నీటి ఉపరితలంపై కనబడేంత వరకు ఆ పాత్రలో నీరు పోయుము.
  4. బీకరు ప్రక్క భాగం నుండి నీటి ఉపరితలాన్ని చూడండి.
  5. నీరు పోయకముందు నాణెం కనిపించదు. కాని నీరు పోసిన తరువాత నాణెం కనిపిస్తుంది.
  6. దీనికి కారణము కాంతి సంపూర్ణాంతర పరావర్తనము.
  7. నీటి వక్రీభవన గుణకం = 1.33
    AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 19 AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 18

ప్రశ్న 11.
ఆప్టికల్ ఫైబర్స్ పనిచేసే విధానాన్ని వివరించే సమాచారాన్ని సేకరించండి. మన నిత్యజీవితంలో ఆప్టికల్ ఫైబర్స్ ఉపయోగాల గురించి ఒక నివేదిక తయారుచేయండి. (AS4)
(లేదా)
ఆప్టికల్ ఫైబర్స్ ఏ విధముగా పనిచేయునో, మనదైనందిన జీవితంలో వాటి ఉపయోగాలను తెలుపు సమాచారాన్ని సేకరించి, నివేదికను చూపుము.
(లేదా)
ఆప్టికల్ ఫైబర్స్ అంటే ఏమిటి ? దాని పనిచేయు విధానమును వర్ణించుము.
జవాబు:
పనిచేయు విధానము :
ఆప్టికల్ ఫైబర్స్ సంపూర్ణాంతర పరావర్తనంపై ఆధారపడి పనిచేస్తాయి.

  1. ఆప్టికల్ ఫైబర్ అనునది గాజు లేదా ప్లాస్టిక్ తో తయారు చేయబడిన అతి సన్నని తీగ.
  2. ఇటువంటి సన్నని తీగలు కొన్ని కలిసి లైట్ పైప్ గా ఏర్పడతాయి.

AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 20

పనిచేయు విధానం :

  1. ఆప్టికల్ ఫైబర్ లో కాంతి ప్రయాణించే విధానాన్ని పక్క పటం వివరిస్తుంది.
  2. ఆప్టికల్ ఫైబర్ యొక్క అతి తక్కువ వ్యాసార్ధం వల్ల దానిలోకి ప్రవేశించు కాంతి, దాని లోపలి గోడలకు తగులుతూ పతనం చెందుతుంది.
  3. పతనకోణం సందిగ్ధ కోణం కన్నా ఎక్కువ ఉండడం వల్ల సంపూర్ణాంతర పరావర్తనం జరుగుతుంది.
  4. తద్వారా ఆప్టికల్ ఫైబర్ గుండా కాంతి ప్రయాణిస్తుంది.
  5. ఆ కాంతి పొట్ట లోపలి భాగాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.
  6. ఆ లోపలి కాంతి, లైట్ పైపులోని మరికొన్ని ఆప్టిక్ ఫైబర్స్ ద్వారా బయటకు వస్తుంది.
  7. ఆ ఫైబర్స్ రెండవ చివర నుండి వచ్చు కాంతిని పరిశీలించడం ద్వారా పొట్ట లోపలి భాగాల చిత్రాన్ని పరిశీలకులు తెలుసుకుంటారు.

ఉపయోగాలు :

  1. మానవ శరీరంలోని కంటితో చూడలేని లోపలి అవయవాలను లేపరోస్కోపీ, ఎండోస్కోపీల ద్వారా పరీక్ష చేస్తారు.
  2. గుండెలోని రక్త ప్రసరణను కొలుచుటలో,
  3. పీడనాన్ని మరియు ఉష్ణోగ్రతను కొలవడంలో వాడే “సెన్సార్స్”లలో,
  4. వివిధ రకాల ద్రవాల యొక్క వక్రీభవన గుణకాలను కనుగొనుటలో,
  5. సమాచార సంకేతాలను ప్రసారం చేయుటకు ఈ ఆప్టికల్ ఫైబర్ లను విరివిగా వాడతారు.

AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం

ప్రశ్న 12.
గాజు దిమ్మెలో కాంతి వక్రీభవనం చెందే విధానాన్ని పటం గీసి, వివరించండి. (ప్రయోగశాల కృత్యం – 2) (AS5)
(లేదా)
గాజు దిమ్మె గుండా కాంతి పార్శ్వ విస్థాపనం కనుగొనే ప్రయోగశాల కృత్య విధానాన్ని వ్రాయండి.
జవాబు:
ఉద్దేశ్యం :
గాజుదిమ్మెను ఉపయోగించి పార్శ్వవిస్థాపనం అవగాహన చేసికొనుట.

కావలసిన వస్తువులు :
డ్రాయింగ్ బోర్డు, డ్రాయింగ్ చార్టు, క్లాంట్లు, స్కేలు, పెన్సిల్, పలుచని గాజుదిమ్మె మరియు గుండుసూదులు.

నిర్వహణ పద్దతి :

  1. డ్రాయింగ్ బోర్డుపై డ్రాయింగ్ చార్టును ఉంచి దానికి క్లాంట్లు పెట్టుము.
  2. డ్రాయింగ్ చార్టు మధ్య భాగంలో గాజు దిమ్మెను ఉంచి, చార్టుపై దిమ్మె దాని అంచువెంబడి ‘పెన్సిల్ లో గీత , గీయుము. ఇది దీర్ఘచతురస్రంలో ఉంటుంది.
  3. ఈ దీర్ఘచతురస్ర శీర్షాలకు A, B, C, D అని పేర్లు పెట్టుము.
    AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 21
  4. దీర్ఘచతురస్రం పొడవులలో ఒక దానికి (AB) ఏదైనా బిందువు వద్ద ఒక లంబరేఖను గీయుము.
  5. మరలా గాజు దిమ్మెను యథాస్థానంలో ఉంచుము.
  6. రెండు గుండుసూదులను మీరు గీసిన లంబంపై నిలువుగా ఒకే ఎత్తులో గుచ్చుము.
  7. మరో రెండు గుండుసూదులను తీసుకొని గాజు దిమ్మెకు రెండోవైపు నుండి చూస్తూ మొదటి రెండు గుండుసూదులతో ఒకే సరళరేఖలో ఉండు విధంగా గుచ్చుము.
  8. గాజు దిమ్మెను, గుండుసూదులను తీసివేసి గుండుసూదుల వల్ల ఏర్పడిన గుర్తులను కలుపుతూ AB వరకు గీత గీయుము.
  9. గాజు దిమ్మె ఉపరితలంపై లంబంగా పతనమైన కాంతి కిరణం ఎటువంటి విచలనం పొందకుండా గాజు దిమ్మె రెండోవైపు నుండి బయటకు వస్తుంది.
  10. ఇప్పుడు మరొక డ్రాయింగ్ చార్టును కార్డుబోర్డు షీట్ పై ఉంచి అది కదలకుండా క్లాంట్లు పెట్టుము. పై విధంగానే గాజు దిమ్మె అంచును తెలిపే ABCD దీర్ఘచతురస్రాన్ని, AB లంబాన్ని గీయుము.
  11. ఈ లంబంతో 30° కోణం చేస్తూ, లంబం మరియు AB రేఖలు కలిసే బిందువును చేరే విధంగా మరొక రేఖను గీయుము. ఇది పతన కిరణాన్ని సూచిస్తుంది. లంబంతో ఈ రేఖ చేసే కోణం పతనకోణం అగును.
  12. ఇప్పుడు గాజు దిమ్మెను ABCD దీర్ఘచతురస్రంలో ఉంచుము. పతనకిరణంపై రెండు గుండుసూదులను నిలువుగా, ఒకే ఎత్తులో గుచ్చుము.
  13. గాజు దిమ్మె యొక్క రెండోవైపు నుండి చూస్తూ మొదటి రెండు గుండుసూదులతో సరళరేఖలో ఉండే విధంగా మరో . రెండు గుండుసూదులను దిమ్మెకు రెండోవైపు గుచ్చుము.
  14. ఈ గుండుసూదుల గుర్తులను కలుపుతూ CD వరకు రేఖను గీయుము. ఈ రేఖ బహిర్గత కాంతికిరణాన్ని తెలుపును.
  15. ఈ బహిరత కిరణం CD ని తాకే బిందువు వద్ద, CD రేఖకు ఒక లంబంను గీయుము.
  16. ఆ లంబానికి, బహిర్గత కిరణానికి మధ్య కోణాన్ని కొలువుము. దీనినే “బహిర్గత కోణం” అంటాము.
  17. ఈ పతన, బహిరత కోణాలు సమానము. ఈ పతన, బహిరత రేఖలు సమాంతరాలు. ఈ రెండు సమాంతర రేఖల మధ్య దూరాన్ని “పార్శ్వ విస్థాపనం” అంటాం.

ప్రశ్న 13.
వజ్రం ప్రకాశించడానికి కారణమేమిటి? ఇందులో ఇమిడి ఉన్న అంశాన్ని మీరెలా అభినందిస్తారు? (AS6)
(లేదా)
ఏ కారణం చేత వజ్రము ప్రకాశించును? దీని తయారీకి కారణమైన పదార్థ స్వభావంను నీవు ఏ విధంగా అభినందిస్తావు?
జవాబు:

  1. వజ్రం యొక్క సందిగ్ధ కోణము విలువ చాలా తక్కువ (24.49).
  2. కావున వజ్రంలోనికి ప్రవేశించిన కాంతి సంపూర్ణాంతర పరావర్తనం చెందును.
  3. ఈ లక్షణం వలన వజ్రం ప్రకాశించును.
  4. వజ్రమును కోసినపుడు పతనకోణం, సందిగ్ధకోణం కన్నా ఎక్కువై సంపూర్ణాంతర పరావర్తనం పదేపదే జరుగును.
  5. అనగా వజ్రంలోకి ప్రవేశించిన కాంతి సులభంగా సంపూర్ణాంతర పరావర్తనం చెంది వజ్రం మిరుమిట్లు గొలిపే కాంతిలో ప్రకాశవంతంగా మెరయును.

ప్రశ్న 14.
కిరణ చిత్రాలను గీయడంలో ‘ఫెర్మాట్ సూత్రం’ ప్రాముఖ్యతను మీరెలా అభినందిస్తారు? (AS6)
(లేదా)
“ఫెర్మాట్ సూత్రంను ఆధారంగా చేసుకొని కిరణ చిత్రాలను గీయగలము”, ఈ విధముగా ఉపయోగపడు ఫెర్మాట్ సూత్రం ప్రాముఖ్యతను అభినందించుము.
జవాబు:

  1. కాంతి ఫెర్మాట్ సూత్రంపై ఆధారపడి ప్రసరించును.
  2. కాంతి యొక్క ఫలితాలను, దాని ధర్మాలను క్లుప్తంగా వివరించుటకు కిరణ చిత్రాలు ఉపయోగపడతాయి.
  3. కిరణ చిత్రాలను గీయడంలో ఫెర్మాట్ సూత్రం ఇమిడి ఉంటుంది.
  4. ఈ విధముగా కొన్ని దృక్ సాధనాల పనితీరును పూర్తిగా తెలుసుకొనుటకు ఫెర్మాట్ సూత్రం ఎంతో ఉపయోగపడినందున ఇది అభినందనీయమైంది.

ప్రశ్న 15.
మనం చలిమంట కాచుకుంటున్నప్పుడు మంట వెనుక భాగాన ఉన్న వస్తువులు స్వల్పంగా ఊగుతున్నట్లుగా కనిపిస్తాయి. కారణం ఏమిటి? (AS7)
(లేదా)
ఏదైనా మంట వద్ద ఉన్నప్పుడు మనకు అభిముఖంగా (వ్యతిరేకంగా లేదా మంట వెనుక) ఉన్న వస్తువులు కదులుతున్నట్లు
(లేదా) ఊగుతున్నట్లుగా కనిపించుటకు గల కారణంను వివరించుము.
జవాబు:

  1. చలిమంట కాచుకుంటున్నప్పుడు ఉష్ణం బహిర్గతమగును.
  2. ఈ బహిర్గతమైన ఉష్ణము చుట్టుప్రక్కల గల పరిసరాలలోనికి ప్రసారమగును.
  3. దీని ద్వారా గాలి యొక్క దృశ్య సాంద్రత పదేపదే మారుతూ ఉండును. కావున దాని యొక్క వక్రీభవన గుణకం కూడా మారును.
  4. ఈ విధమైన సాంద్రత మరియు వక్రీభవన గుణకాల నిరంతర మార్పు వలన పరావర్తన కోణము మరియు విస్థాపన విలువలు మారును.
  5. అందుకనే మంట వెనుక ఉన్న వస్తువులు స్వల్పంగా కదులుతున్నట్లు మన కంటికి కనిపించుచుండును.

ప్రశ్న 16.
నక్షత్రాలు ఎందుకు మిణుకుమిణుకుమంటాయి? (AS7)
(లేదా)
నక్షత్రాలు మిణుకు మిణుకుమనుటకు గల కారణంను వివరింపుము.
జవాబు:

  1. వాతావరణం యొక్క వక్రీభవనం వలన నక్షత్రాలు మిణుకు మిణుకుమంటాయి.
  2. వాతావరణం యొక్క వక్రీభవన గుణకపు మార్పుల వలన వక్రీభవనం జరుగును.
  3. నక్షత్రం నుండి వచ్చిన కాంతి విరళ యానకం లేక శూన్యం నుండి సాంద్రతర యానకం (వాతావరణం) లోనికి ప్రయాణించుట వలన, లంబానికి దూరంగా ప్రయాణించుట వలన దాని స్థానం నుండి కొద్దిగా దూరంగా గాని, దగ్గరగా గాని కనిపించును.
  4. అందువలన పరావర్తనం కొన్నిసార్లు సరిగా జరిగి, కొన్నిసార్లు సరిగా జరగక మిణుకుమిణుకుమని ప్రకాశిస్తాయి.

AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం

ప్రశ్న 17.
ఒకే ఆకారంలో తయారుచేయబడిన గాజుముక్క వజ్రాలలో వజ్రం ఎక్కువగా మెరుస్తుంది. ఎందుకు? (AS7)
(లేదా)
ఒకే ఆకృతిలో గల గాజు ముక్క వజ్రాలలో ఎక్కువగా వజ్రం మెరయుటకు గల కారణంను వివరింపుము.
జవాబు:

  1. వజ్రం యొక్క సందిగ్ధ కోణము విలువ 24.4°. అనగా చాలా తక్కువ.
  2. వజ్రంలోకి ప్రవేశించిన అన్ని కాంతి కిరణములు సంపూర్ణాంతర పరావర్తనం చెంది వజ్రం ప్రకాశవంతంగా మెరయును.
  3. గాజు యొక్క సందిగ్ధ కోణం విలువ 42° అనగా వజ్రం విలువ కన్నా ఎక్కువ.
  4. వజ్ర రూపంలో కత్తిరించబడిన గాజులోనికి ప్రవేశించిన కాంతి కిరణాలు చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే సంపూర్ణాంతర పరావర్తనం చెందుట వలన వజ్రం కంటే గాజు తక్కువగా మెరయును.

ప్రశ్న 18.
నీటి పరమ వక్రీభవన గుణకం 4/8. అయిన నీటి సందిగ్ధ కోణం ఎంత?
జవాబు:
నీటి పరమ వక్రీభవన గుణకం = 4/3
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 22

ప్రశ్న 19.
ఒక గాజు పాత్రలో సగం వరకు గ్లిజరిన్ పోయండి. తరువాత దాని నిండుగా నీరు నింపండి. ఈ పాత్రలో క్వార్ట్ గాజుకడ్డీని ఉంచండి. పాత్ర ప్రక్కభాగం నుండి గాజుకడ్డీని పరిశీలించండి.
ఎ) మీరు ఏం మార్పులు గమనించారు?
బి) ఈ మార్పులకు కారణాలేమై ఉంటాయి?
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 23
ఎ) ఈ కృత్యంలో పాత్ర ప్రక్క భాగం నుండి గాజుకడ్డీని పరిశీలించిన, గ్లిజరిన్ లో మునిగిన గాజుకడ్డీ యొక్క భాగం కనిపించదు. అందువలన గాజుకడ్డీ నీటి పై తేలుతున్నట్లుగా కనిపించును. నీటిలోని గాజుకడ్డీ భాగము కనిపించును.
బి) గాజుకడ్డీ యొక్క భాగం మనకు కనిపించదు. దీనికి కారణం గాజుకడ్డీ మరియు గ్లిజరిన్స్ యొక్క వక్రీభవన గుణకాలు సమానం మరియు వాటిలో కాంతి గ్లిజరిన్ వేగాలు కూడా సమానం కావున కాంతి పరావర్తన ప్రక్రియ జరగదు.

ప్రశ్న 20.
కింది యానకాల వక్రీభవన గుణకాల విలువలను సేకరించండి.
నీరు, కొబ్బరినూనె, ఫ్లింట్ గాజు, వజ్రం, బెంజీన్, హైడ్రోజన్ వాయువు.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 24

ప్రశ్న 21.
థర్మాకోల్ షీట్ తో 2 సెం.మీ., 3 సెం.మీ., 4 సెం.మీ.,. 4.5 సెం.మీ, 5 సెం.మీ. మొదలగు వ్యాసార్ధాలు కలిగిన వృత్తాకార ముక్కలను తయారు చేయండి. ప్రతిదానికి కేంద్రాన్ని గుర్తించండి. అన్ని వృత్తాలకు కేంద్రం వద్ద 6 సెం.మీ. పొడవు గల సూదిని గుచ్చండి. ఒక వెడల్పాటి అపారదర్శక పాత్రలో నీటిని తీసుకొని, 2 సెం.మీ. వ్యాసార్ధం గల థర్మాకోల్ ముక్కను పటంలో చూపిన విధంగా సూది నీటిలో ఉండేటట్లుగా అమర్చండి. ఆ సూది రెండవ చివరను పాత్ర పై నుండే చూడడానికి ప్రయత్నించండి.
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 25
1) సూది కొనను మీరు చూడగలిగారా? ఎందుకు?
వేర్వేరు వ్యాసార్ధాలను కలిగిన మిగతా థర్మాకోల్ వృత్తాలతో ఈ ప్రయోగాన్ని మళ్ళీ చేయండి. సూది కొనభాగాన్ని చూడడానికి ప్రయత్నించండి.
గమనిక : ప్రతి సందర్భంలోనూ థర్మాకోల్ వృత్తం యొక్క స్థానం, మీ కంటి స్థానం మారకుండా జాగ్రత్త వహించండి.
2) ఏయే వ్యాసార్ధాలు కలిగిన వృత్తాలకు ఉంచిన సూదుల కొనలను మీరు చూడలేకపోయారు? వాటిలో తక్కువ వ్యాసార్ధం విలువ ఎంత?
3) కొన్ని సూదుల కొనలను మీరు చూడలేకపోవడానికి కారణమేమిటి?
4) యానకం యొక్క సందిగ్ధ కోణాన్ని కనుగొనడానికి మీకు ఈ కృత్యం సహాయపడిందా?
5) వివిధ సందర్భాలలో సూది కొన నుండి కాంతి ప్రయాణాన్ని తెలిపే చిత్రాలను గీయండి.
జవాబు:
ఈ ప్రయోగంను సాధించుటకు కాంతి యొక్క సంపూర్ణాంతర పరావర్తన ధర్మం ఉపయోగపడును.

ఇచ్చిన వృత్తాకార ముక్కలనుపయోగించి సూది మొనను చూచుటకు ఆ ముక్కల వ్యాసార్ధంను కనుగొనవలెను.
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 26

  1. అవును, సూదిమొనను చూడగలిగాను. ఎందుకనగా గరిష్ఠ వ్యాసార్ధం కన్నా ఇచ్చిన వ్యాసార్ధము తక్కువ కావటం చేత.
  2. గరిష్ఠ వ్యాసార్ధానికి సమానమైన వ్యాసార్ధం గల వృత్తంకు ఉంచిన సూదిమొనను చూడలేకపోయాను.
  3. కారణమేమనగా వస్తువు నుండి వచ్చు కాంతి కిరణాల పతనకోణం కన్నా సందిగ్ధకోణం విలువ ఎక్కువై సంపూర్ణాంతర పరావర్తనం చెందటం వలన సూదికొనను చూచుట సాధ్యపడలేదు.
  4. అవును, సందిగ్ధకోణంను కల్గొనగలము.
    గాలి యొక్క వక్రీభవన గుణకం విలువ = 1.003 = n2
    నీటి యొక్క వక్రీభవన గుణకం విలువ = 1.33 = n1

AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 27

ప్రశ్న 22.
టేబుల్ పై ఒక వస్తువును ఉంచండి. దానిని ఒక గాజు దిమ్మెగుండా చూస్తే ఆ వస్తువు మీకు చేరువుగా కనిపిస్తుంది. ఈ సందర్భంలో కాంతికిరణ ప్రయాణాన్ని వివరించే కిరణ చిత్రాన్ని గీయండి.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 28
పై పటంలో O – వస్తు స్థానం
O’ – ప్రతిబింబ స్థానం (లేదా) దృశ్యస్థానం
y- వస్తు, ప్రతిబింబ స్థానమార్పిడి

ప్రశ్న 23.
గాలి – ఒక ద్రవం వేరు చేయబడే తలం వద్ద కాంతి కిరణం 45° కోణంతో పతనమై 30° కోణంతో వక్రీభవనం పొందింది. ఆ ద్రవం వక్రీభవనగుణకం ఎంత? వక్రీభవన కిరణం, పరావర్తన కిరణం మధ్య కోణం 90° ఉండాలంటే కాంతి ఎంత కోణంతో పతనం చెందాలి?
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 29

ప్రశ్న 24.
ఒక పాత్రలోని నీటిలో నిర్దిష్ట కోణంతో ముంచబడిన పరీక్ష నాళికను (పరీక్షనాళికలోకి నీరు చేరరాదు) ఒక ప్రత్యేక స్థానం నుండి చూసినప్పుడు, పరీక్షనాళిక గోడ అద్దం వలె కనిపిస్తుంది. దీనికి కారణమేమిటో వివరించగలరా?
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 30

  1. పరీక్షనాళిక యొక్క ఉపరితలం నీటిని మరియు గాలిని వేరుచేస్తుంది.
  2. పరీక్షనాళికపై కాంతికిరణము పతనమైనపుడు అది సంపూర్ణాంతర పరావర్తనం చెంది వెనుదిరిగి అదే యానకంలోకి ప్రవేశించును.
  3. ఒక ప్రత్యేక స్థానం నుండి చూసినప్పుడు పరీక్షనాళిక గోడ అద్దంవలె కనిపించుటకు సంపూర్ణాంతర పరావర్తనమే కారణము.

ప్రశ్న 25.
ఏ సందర్భాల్లో కాంతి కిరణం యానకాలను వేరుచేసే తలం వద్ద విచలనం పొందదు?
(లేదా)
రెండు యానకాలను వేరు చేయు తలం వద్ద ఏ సందర్భాల్లో కాంతి కిరణం విచలనం చెందదు?
జవాబు:
కాంతి కిరణం క్రింది సందర్భాలలో ఎటువంటి విచలనం పొందదు.
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 31

ఖాళీలను పూరించండి

1. సందిగ్ధ కోణం వద్ద వక్రీభవన కోణం విలువ ………… (90)
2. n1 sin i = n2 sin r ను ……………….. అంటాం. (స్నెల్ నియమం)
3. శూన్యంలో కాంతివడి విలువ ………… (3 × 108 మీ/సె)
4. సంపూర్ణాంతర పరావర్తనం జరగాలంటే కాంతి కిరణం ……………….యానకం నుండి ……….. యానకంలోనికి ప్రయాణించాలి. (సాంద్రతర, విరళ)
5. ఒక పారదర్శక పదార్థ వక్రీభవన గుణకం 3/2. ఆ యానకంలో కాంతివడి ……………. (2 × 108 మీ/సె)
6. ఎండమావులు ……………………… కు ఒక ఉదాహరణ. (సంపూర్ణాంతర పరావర్తనం)

సరైన సమాధానాన్ని ఎన్నుకోండి

1. కింది వాటిలో స్నెల్ నియమం …..
(లేదా)
స్నెల్ నియమాన్ని తెలుపు సమీకరణం
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 32
జవాబు:
C

2. గాలి పరంగా గాజు వక్రీభవన గుణకం 2. గాజు – గాలి కలిసే తలం యొక్క సందిగ్ధ కోణం …
A) 0°
B) 45°
C) 30°
D) 60°
జవాబు:
C) 30°

AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం

3. సంపూర్ణాంతర పరావర్తనం జరగాలంటే కాంతి …….. లోకి ప్రయాణించాలి.
A) విరళ యానకం నుండి సాంద్రతర యానకం
B) విరళ యానకం నుండి విరళ యానకం
C) సాంద్రతర యానకం నుండి విరళ యానకం
D) సాంద్రతర యానకం నుండి సాంద్రతర యానకం
జవాబు:
C) సాంద్రతర యానకం నుండి విరళ యానకం

4. గాజు దిమ్మె వల్ల కాంతి పొందే విచలన కోణం …….. .
A) 0°
B) 20°
C) 90°
D) గాజు దిమ్మెతలానికి గీసిన లంబంతో కాంతికిరణం చేసే కోణంపై ఆధారపడి ఉంటుంది.
జవాబు:
D) గాజు దిమ్మెతలానికి గీసిన లంబంతో కాంతికిరణం చేసే కోణంపై ఆధారపడి ఉంటుంది.

పరికరాల జాబితా

పింగాణీ పాత్ర, ఐదు రూపాయిల నాణెం, నీరు, తెల్లని డ్రాయింగ్ ‘షీట్, కార్డు బోర్డు షీట్, కోణమానిని, అర్ధవృత్త ఆకారపు గాజు పలక, రెండు స్ట్రాలు, వృత్తాకారపు కోణమానిని, నీరు, 1 లీ. గాజు బీకరు, క్లాంపు, స్కేలు, పలుచని గాజు దిమ్మె, గుండు సూదులు.

10th Class Physical Science 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం Textbook InText Questions and Answers

10th Class Physical Science Textbook Page No. 60

ప్రశ్న 1.
ఎండమావి నిలిచి ఉన్న నీరులా ఎందుకు కనిపిస్తుంది?
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 4

  1. ఆకాశం నుండి లేదా ఎత్తైన చెట్టు నుండి వచ్చే కాంతి “పై నుండి క్రిందకు సాంద్రత మారుతున్నటువంటి గాలి” గుండా ప్రయాణిస్తూ రోడ్డుకు దగ్గరగా వచ్చినపుడు వక్రీభవనానికి లోనై సంపూర్ణాంతర పరావర్తనం వల్ల పటంలో చూపినట్లుగా వక్రమార్గంలో ప్రయాణిస్తుంది.
  2. ఈ వక్రీభవన కాంతి పటంలో చూపిన మార్గంలో పరిశీలకున్ని చేరుతుంది.
  3. ఆ కాంతి నేలపై పరావర్తనం చెంది వస్తున్నట్లుగా పరిశీలకునికి కనిపిస్తుంది.
  4. ఇలా జరగడం వల్లనే ఆకాశం యొక్క మిథ్యా ప్రతిబింబం, రోడ్డుపై నీళ్ళవలె కనబడుతుంది.

ప్రశ్న 2.
ఎండమావిని మీరు ఫోటో తీయగలరా?
జవాబు:
ఎండమావి ఒక మిథ్యా ప్రతిబింబం కావున దీనిని ఫోటో తీయలేము.

10th Class Physical Science Textbook Page No. 47

ప్రశ్న 3.
ఒక పాత్రలోని నీటిలో పడవేసిన నాణెం ఆ పాత్ర అడుగు భాగం నుండి పైకి కొంత ఎత్తులో కనబడటం మీరు గుర్తించి ఉంటారు కదా! అదేవిధంగా ఒక గాజు గ్లాసులోని నీటిలో ఉంచిన నిమ్మకాయ పరిమాణం పెరిగినట్లు కనబడుతుంది. కాగితంపై రాసిన అక్షరాలపై ఒక మందపాటి గాజుపలకనుంచి చూస్తే ఆ అక్షరాలు కాగితంపై నుండి కొంత ఎత్తులో కనబడతాయి. ఈ విధమైన మార్పులకు కారణమేమై ఉంటుంది?
జవాబు:
ఈ విధమైన మార్పులకు కారణము కాంతి యొక్క వక్రీభవన లక్షణమే.

10th Class Physical Science Textbook Page No. 49

ప్రశ్న 4.
వక్రీభవన కిరణాల ప్రవర్తనకు, కాంతి వేగాలకు ఏదైనా సంబంధం ఉందా?
జవాబు:

  1. వక్రీభవన కాంతి వేగము యానకము నుండి యానకమునకు మారును.
  2. సాధారణ కాంతి వేగములో యానకము మారినప్పటికీ ఎట్టి మార్పుండదు.

10th Class Physical Science Textbook Page No. 51

ప్రశ్న 5.
వివిధ పదార్థ యానకాల వక్రీభవన గుణకాలు వేర్వేరుగా ఎందుకుంటాయి?
జవాబు:
వక్రీభవన గుణకము పదార్థ స్వభావంపై ఆధారపడును. అందుకనే వివిధ పదార్థాల యానకాల వక్రీభవన గుణకాలు వేర్వేరుగా ఉంటాయి.

AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం

ప్రశ్న 6.
ఒక యానకం యొక్క వక్రీభవన గుణకం ఏ అంశాలపై ఆధారపడుతుంది?
జవాబు:
వక్రీ. “కం పదార్థ స్వభావం, ఉపయోగించిన కాంతి తరంగదైర్ఘ్యంపై ఆధారపడి ఉంటుంది.

10th Class Physical Science Textbook Page No. 54

ప్రశ్న 7.
పతనకోణానికి, వక్రీభవన కోణానికి మధ్య సంబంధాన్ని తెలిపే సూత్రాన్ని మనం ఉత్పాదించగలమా?
జవాబు:
అవును ఉత్పాదించగలము. కాంతి పతన కోణానికి, వక్రీభవన కోణానికీ మధ్యగల సంబంధమును తెలుపు సూత్రము
n1 sin i = n2 sin r

10th Class Physical Science Textbook Page No. 56

ప్రశ్న 8.
వక్రీభవన కోణం 90° అయ్యే సందర్భం ఉంటుందా? అది ఎప్పుడు అవుతుంది?
జవాబు:
అవును, పతన కోణము, సందిగ్ధ కోణముకు సమానమైన సందర్భంలో వక్రీభవన కోణం 90° అగును.

AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం

10th Class Physical Science Textbook Page No. 57

ప్రశ్న 9.
సందిగ్ధకోణం కంటే పతనకోణం ఎక్కువైనప్పుడు కాంతి కిరణం ఏమవుతుంది?
జవాబు:
సందిగ్ధకోణం కన్నా పతన కోణం ఎక్కువైనపుడు యానకాలను వేరుచేసే తలం వద్ద కాంతి కిరణం తిరిగి సాంద్రతర యానకంలోకే పరావర్తనం చెందును.

10th Class Physical Science Textbook Page No. 61

ప్రశ్న 10.
కాంతి ప్రసార మార్గంలో ఒక గాజుదిమ్మెను అడ్డుగా ఉంచితే ఏం జరుగుతుంది?
జవాబు:
కాంతి ప్రసారమార్గంలో గాజు దిమ్మెనుంచిన కాంతి రెండుసార్లు వక్రీభవనం చెందును.

10th Class Physical Science Textbook Page No. 49

ప్రశ్న 11.
పటం (ఎ), (బి) పటాలలోని వక్రీభవన కిరణాలలో మీరు ఏం తేడా గమనించారు?
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 35
జవాబు:
పటం – (ఎ) లో కాంతి కిరణము లంబము వైపుగా వంగినది.
పటం – (బి) లో కాంతి కిరణము లంబము నుండి దూరముగా వంగినది.

10th Class Physical Science 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం Textbook Activities

కృత్యములు

కృత్యం – 1

• ఒక గాజు గ్లాసులోని నీటిలో పెన్సిల్ ఉంచినపుడు నీ పరిశీలనలు వ్రాయుము.
జవాబు:

  1. ఒక గాజు గ్లాసులో కొంత నీటిని తీసుకొనుము.
  2. దీనిలో ఒక పెన్సిల్ ను ఉంచుము.
  3. గ్లాసు పై భాగం నుండి, ప్రక్క భాగం నుండి పెన్సిల్ ను గమనించగా దాని స్థానంలో మార్పు ఉండును.
  4. పెన్సిల్ ను పై భాగం నుండి గమనించగా అది వంగినట్లుగా కనబడును.

కృత్యం – 2

కాంతి వక్రీభవనాన్ని తెలిపే కృత్యాన్ని రాయండి.
జవాబు:

  1. సూర్యుని ఎండపడుతున్న ఒక పొడవైన గోడ వద్దకు మీరు, మీ స్నేహితుడు వెళ్ళండి.
  2. గోడ ఒక చివర వద్ద మీరు నిల్చొని, మరొక చివర వద్ద ప్రకాశవంతమైన ఒక లోహపు వస్తువును చేతిలో పట్టుకొనమని మీ స్నేహితునికి చెప్పండి.
  3. గోడకు కొద్ది అంగుళాల దూరంలో ఆ లోహపు వస్తువున్నప్పుడు వస్తువు మసకబారినట్లుగా కనబడుతుంది.
  4. గోడ అద్దం వలె ప్రవర్తిస్తున్నట్లుగా దానిపై లోహపు వస్తువు ప్రతిబింబము కనబడుతుంది.
  5. కాంతి వక్రీభవనం చెందడం వలన గోడపై ఆ లోహపు వస్తువు యొక్క ప్రతిబింబం కనబడును.

కృత్యం – 3

కాంతి ఒక యానకం నుండి మరొక యానకంలోనికి ప్రయాణించునపుడు దాని దిశలో మార్పు ఏ రకంగా వస్తుందో కృత్యం ద్వారా వివరించుము.
(లేదా)
నీటి పాత్ర అడుగుభాగాన ఉన్న నాణెం పైకి కొంత ఎత్తులో కనబడుటను కిరణ చిత్రం ద్వారా చూపుము.
జవాబు:

  1. అపారదర్శక పదార్థంతో తయారు చేయబడిన, తక్కువ లోతు కలిగిన పాత్రను తీసుకొనుము.
  2. పాత్ర అడుగున నాణెమునుంచుము.
  3. ఆ నాణెము మీకు కనపడకుండాపోయే వరకు పాత్ర నుండి వెనుకకు జరుగుము.
  4. మీరు అక్కడే నిల్చుని మీ స్నేహితుడిని ఆ పాత్రను నీటితో నింపమనుము.
  5. పాత్రను నీటితో నింపితే నాణెం కనబడుతుంది.

AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 33

పరిశీలన :

  1. కాంతి ఋజుమార్గంలో ప్రయాణిస్తుంది అనే అంశం ఆధారంగా నాణెం నుండి మీ కంటికి చేరే కాంతి కిరణ చిత్రం గీయుము.
  2. కాంతి కిరణాన్ని పరిశీలిస్తే నీరు, గాలి అనే యానకాలను వేరు చేసే తలం వద్ద కాంతికిరణం తన దిశను మార్చుకుంటుంది.
  3. నాణెం నుండి కంటిని చేరడానికి అతి తక్కువ కాలం పట్టేందుకుగాను కాంతి కిరణం ఈ మార్గాన్ని ఎన్నుకుంది.
  4. అనగా వివిధ యానకాలలో కాంతి వేగం వేర్వేరుగా ఉంటుంది.
  5. ఈ రకంగా కాంతి వక్రీభవనం చెందిందని చెప్పవచ్చును.

కృత్యం – 6

ఒక గాజు గ్లాసు అడుగున ఒక నాణెము నుంచి, గ్లాసు పక్క భాగం నుండి పరిశీలించినపుడు నాణెం కనుమరుగవుతుంది. కారణం తెలపండి.
జవాబు:

  1. ఒక టేబుల్ పై నాణాన్ని ఉంచి దానిపై ఒక గాజు గ్లాసును పెట్టుము.
  2. గాజు ప్రక్క భాగం నుండి పరిశీలించుము.
  3. ఆ నాణెం యొక్క ప్రతిబింబం పూర్వంకన్నా పెద్దగా కనిపిస్తుంది.
  4. ఇపుడు ఆ గ్లాసును నీటితో నింపుము.
  5. మరల ఆ నాణాన్ని పరిశీలించుము.
  6. నాణెం మనకు కనపడదు.
  7. దీనికి గల కారణము సంపూర్ణాంతర పరావర్తనము.

AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం

కృత్యం – 7

గాజుగ్లాసులోని నీటిలో ఉన్న నాణెం కొంచెం పైకి లేచినట్లు కనబడుతుంది. ఎందుకు?
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 18

  1. ఒక స్థూపాకార పారదర్శక పాత్రను తీసుకొనుము.
  2. ఆ పాత్ర అడుగున ఒక నాణాన్ని ఉంచుము.
  3. ఆ నాణెం యొక్క ప్రతిబింబం నీటి ఉపరితలంపై కనబడేంత వరకు ఆ పాత్రలో నీరు పోయుము.
  4. సంపూర్ణాంతర పరావర్తనం వలన నాణెం యొక్క ప్రతిబింబం ఏర్పడుతుంది.

కృత్యం – 8

గాజు దిమ్మె యొక్క వక్రీభవన గుణకాన్ని కనుగొనుటను కృత్యం ద్వారా చూపుము.
(లేదా)
కాంతి వక్రీభవననుపయోగించి ఒక గాజు దిమ్మె యొక్క వక్రీభవన గుణకంను ఏ విధంగా కనుగొనవచ్చునో ప్రయోగపూర్వకంగా తెల్పుము. గాజు దిమ్మె నిలువు విస్థాపనము ద్వారా వక్రీభవనంను కనుగొను ప్రయోగమును వివరింపుము.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 34

  1. గాజు దిమ్మె మందాన్ని కొలిచి మీ నోట్ బుక్ లో రాసుకొనుము.
  2. గాజు దిమ్మెను డ్రాయింగ్ చార్టుపై మధ్య భాగంలో ఉంచుము.
  3. గాజు దిమ్మె అంచు ABCD దీర్ఘచతురస్రాన్ని గీయుము.
  4. AB రేఖకు ఏదేని బిందువు వద్ద లంబాన్ని గీయుము.
  5. గాజు దిమ్మెను ABCD దీర్ఘ చతురస్రంలో ఉంచుము.
  6. ఒక గుండుసూదిని తీసుకొని, AB రేఖకు గీసిన లంబంపై గాజు దిమ్మె నుండి 15 సెం.మీ. దూరంలో P బిందువు వద్ద ఉంచుము.
  7. ఆ గుండుసూదిని గాజు దిమ్మె యొక్క రెండోవైపు నుండి చూస్తూ మరొక గుండుసూదిని మొదటిదానితో ఒకే సరళరేఖలో ఉండునట్లు అమర్చుము.
  8. గాజు దిమ్మెను తొలగించి గుండుసూదుల స్థానాన్ని పరిశీలించుము.
  9. రెండవ గుండుసూది కొన నుండి మొదటి గుండుసూది ఉంచిన రేఖ పైకి ఒక లంబాన్ని గీయుము.
  10. వాటి ఖండన బిందువు Q గా గుర్తించుము.
  11. P, Q ల మధ్య దూరాన్ని కొలిచిన, ఇది లంబ విస్థాపనం అగును.
  12. గాజు దిమ్మె నుండి గుండుసూది దూరాన్ని మార్చి ఈ ప్రయోగాన్ని మరలా చేయుము.
  13. లంబవిస్థాపనం మారదని మనము గుర్తించవచ్చును.
  14. గాజు వక్రీభవన గుణకాన్ని క్రింది సూత్రం ద్వారా కనుగొనవచ్చును.

AP Board 10th Class Physical Science Solutions 1st Lesson ఉష్ణం

SCERT AP 10th Class Physics Study Material Pdf 1st Lesson ఉష్ణం Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Physical Science 1st Lesson Questions and Answers ఉష్ణం

10th Class Physical Science 1st Lesson ఉష్ణం Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
20°C ఉష్ణోగ్రత గల 50 గ్రాముల నీటిని, 40°C ఉష్ణోగ్రత గల 50 గ్రాముల నీటికి కలిపితే మిశ్రమం ఫలిత ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? (AS1)
జవాబు:
T1 = 20°C ; m1 = 50 గ్రా.
T2 = 40°C ; m2 = 50 గ్రా.
AP Board 10th Class Physical Science Solutions 1st Lesson ఉష్ణం 1
∴ మిశ్రమం ఫలిత ఉష్ణోగ్రత = 30°C.

ప్రశ్న 2.
వేసవి రోజుల్లో కుక్కలు నాలుకను బయటకు చాచి ఉంచటానికి (panting) గల కారణాన్ని ‘బాష్పీభవనం’ భావనతో వివరించండి. (AS1)
(లేదా)
కుక్కలు ఏ విధముగా వాటి శరీరమును చల్లబరుచుకుంటాయి? బాష్పీభవనం ప్రక్రియతో వివరించుము.
జవాబు:

  1. కుక్కలకు శరీరంపై స్వేదరంధ్రాలు ఉండవు. శరీరం వెంట్రుకలతో నిండి ఉంటుంది. కేవలం పాదాలలో మాత్రమే స్వేద రంధ్రాలు ఉంటాయి.
  2. మానవులకు శరీరంపై స్వేదరంధ్రాలు ఉండి, వాటి ద్వారా నీరు బాష్పీభవనం చెందుతుంది.
  3. బాష్పీభవనం చెందుట వలన శరీరం ఉష్ణోగ్రత తగ్గి చల్లబడుతుంది.
  4. కుక్కలు వేసవిలో నాలుక బయటకు చాచుట వలన నాలుకపై నీరు బాష్పీభవనం చెందుతుంది. తద్వారా శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది.
  5. ఈ విధంగా కుక్కలు శరీరాన్ని చల్లబరుచుకుంటాయి.

ప్రశ్న 3.
“కూల్ డ్రింక్” సీసా బయట ఉపరితలంపై తుషారం ఎందుకు ఏర్పడుతుంది? (AS1)
(లేదా)
రాజు ఫ్రిజ్ నుంచి తీసిన కూల్ డ్రింక్ సీసా యొక్క పై భాగమున నీటి తుంపరలు ఏర్పడుటను గమనించెను. ఈ విధముగా ఏర్పడుటకు గల కారణములను వ్రాయుము.
జవాబు:

  1. ఫ్రిజ్ నుండి తీసిన కూల్ డ్రింక్ సీసా లాంటి ఘనపదార్థాల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి.
  2. ఈ చల్లటి సీసాలను తాకిన గాలిలోని నీటి ఆవిరి సాంద్రీకరణం చెంది చిన్నచిన్న నీటి బిందువులుగా మారి సీసా ఉపరితలంపై ఏర్పడుతుంది.
  3. ఈ చిన్నచిన్న నీటి బిందువులను తుషారం అంటారు.

AP Board 10th Class Physical Science Solutions 1st Lesson ఉష్ణం

ప్రశ్న 4.
బాష్పీభవనం, మరగటం మధ్య భేదాలను తెల్పండి. (AS1)
(లేదా)
సీత, ఒక పాత్రలో ఆరుబయట ఉంచబడిన పెట్రోల్ పరిమాణం తగ్గుటను గమనించినది. అదే విధంగా రాము నీటిని వేడి చేస్తున్నపుడు బుడగలు ఏర్పడుటను గమనించినాడు. ఈ రెండు ప్రక్రియలు ఏమిటి? వీటి మధ్యన గల భేదాలను వ్రాయుము.
జవాబు:

బాష్పీభవనంమరగటం
1) ద్రవంలోని అణువులు ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ఉపరితలాన్ని వీడిపోయే ప్రక్రియను బాష్పీభవనం అంటారు.1) స్థిర ఉష్ణోగ్రతా పీడనాల వద్ద ద్రవస్థితిలోని పదార్థం వాయుస్థితిలోనికి మారే ప్రక్రియను మరగటం అంటారు.
2) బాష్పీభవనం ఏ ఉష్ణోగ్రత వద్దనైనా జరగవచ్చు.2) మరగటం స్థిర ఉష్ణోగ్రత వద్ద మాత్రమే జరుగును.

ప్రశ్న 5.
నీటి ఆవిరి సాంద్రీకరణం చెందేటప్పుడు పరిసరాలలోని గాలి చల్లబడుతుందా? వేడిగా అవుతుందా? వివరించండి. (AS1)
జవాబు:

  1. వాయువు ద్రవంగా స్థితి మార్పు చెందటమే సాంద్రీకరణం.
  2. అధిక ఉష్ణోగ్రతలో నీటి ఆవిరి చల్లటి వస్తువులను తాకగానే ప్రతి గ్రాము ద్రవ్యరాశి 540 కేలరీల ఉష్ణశక్తిని విడుదల చేస్తుంది. ఇది ఉష్ణమోచక చర్య.
  3. ఇందువల్లనే వేడినీటి కంటే నీటి ఆవిరి మనల్ని ఎక్కువగా గాయపరుస్తుంది.
  4. కాబట్టి నీటి సాంద్రీకరణ ఒక ఉద్ధీయ ప్రక్రియ.
  5. ఆవిరి సాంద్రీకరణం చెందినప్పుడు పరిసరాలలోని గాలి వేడెక్కుతుంది.

ప్రశ్న 6.
కింది ప్రశ్నలకు సమాధానాలివ్వండి. (AS1)
a) 100°C వద్ద గల 1 గ్రా. నీటి ఆవిరి 100°C గల నీరుగా సాంద్రీకరణం చెందడానికి ఎంత ఉష్ణం బదిలీ కావాలి?
జవాబు:
100°C వద్ద గల 1 గ్రా. నీటి ఆవిరి 100°C గల నీరుగా సాంద్రీకరణం చెందటానికి 540 కేలరీల ఉష్ణం పరిసరాలలోనికి బదిలీ కావాలి.

వివరణ :
మరిగే నీటి ఉష్ణోగ్రత = 1 గ్రా. ; నీటి బాష్పీభవన గుప్తోష్ణం = 540 కేలరీ/గ్రా.
మరిగే నీరు → నీరు
100°C → 100°C

స్థితి మారింది కావున గుప్తోష్ణం పరిగణనలోకి తీసుకుంటే L = \(\frac{Q}{m}\) ⇒ Q = mL =1 × 540 = 540 కేలరీలు.

b) 100°C వద్ద గల 1 గ్రా. నీటి ఆవిరి 0°C గల నీరుగా సాంద్రీకరణం చెందడానికి ఎంత ఉష్ణం బదిలీ కావాలి?
జవాబు:
నీటి ద్రవ్యరాశి = 1 గ్రా. ; . నీటి విశిష్టోష్ణం = 1 cal/g°C
మరిగే నీరు → నీరు 100°C → 0°C
బదిలీ కాబడిన ఉష్ణం Q = mS∆T = 1 × 1 × (100 – 0) = 100 కేలరీలు.

c) 0°C వద్ద గల 1 గ్రా. నీరు, 0°C వద్ద గల మంచుగా మారడానికి ఎంత ఉష్ణం గ్రహింపబడాలి లేదా విడుదలవ్వాలి?
జవాబు:
0°C వద్ద గల 1 గ్రా. నీరు, 0°C వద్ద మంచుగా మారటానికి 80 కేలరీల శక్తి బయటకు విడుదలవ్వాలి.
వివరణ :
నీరు → మంచు
0°C → 0°C
ఉష్ణోగ్రతలో మార్పు లేదు కావున, సాంద్రీకరణ గుప్తోష్ణం ప్రకారం
L = \(\frac{Q}{m}\) ⇒ Q = mL =1 × 80 = 80 కేలరీలు.

d) 100°C వద్ద గల 1 గ్రా. నీటి ఆవిరి, 0°C వద్ద గల మంచుగా మారడానికి ఎంత ఉష్ణం గ్రహింపబడాలి లేదా విడుదలవ్వాలి?
జవాబు:
100°C వద్ద గల 1 గ్రా. నీటి ఆవిరి, 0°C వద్ద మంచుగా మారటానికి 520 కేలరీల శక్తి విడుదల అవ్వాలి.
వివరణ : నీటి ఆవిరి ద్రవ్యరాశి = 1 గ్రా.
నీటి ఆవిరి → నీరు → నీరు → మంచు
100°C → 100°C → 0°C → 0°C

100°C వద్దనున్న నీటి ఆవిరి, 100°C లోనున్న నీరుగా మారడానికి కావలసిన ఉష్ణరాశి
Q1 = mL = 1 × 540 = 540 కేలరీలు.

100°C వద్దనున్న నీరు, 0°C లోనున్న నీరుగా మారడానికి కావలసిన ఉష్ణరాశి
Q2 = mS∆T = 1 × 1 × (100 – 0) = 100 కేలరీలు.

0°C వద్దనున్న నీరు, 0°C లోనున్న మంచుగా మారడానికి కావలసిన ఉష్ణరాశి
Q3 = mL = 1 × 80 = 80 కేలరీలు,

మొత్తం వ్యవస్థలోని ఉష్ణరాశి
Q = Q1 + Q2 + Q3
= 540 + (100) + 80
= 720 కేలరీలు.

AP Board 10th Class Physical Science Solutions 1st Lesson ఉష్ణం

ప్రశ్న 7.
ఘనపదార్థ విశిష్టోష్ణాన్ని ప్రయోగపూర్వకంగా కనుగొనే విధానాన్ని వివరించండి. (AS1)
(లేదా)
ఏదైనా ఘనపదార్ధపు విశిష్టోష్ణంను ఏ విధంగా కనుగొంటావో ప్రయోగపూర్వకముగా వివరించుము.
(లేదా)
వంటపాత్రలపై మూతగా ఉపయోగించుటకు ఎక్కువ విశిష్టోషం గల లోహముతో తయారుచేసిన మూతను ఉపయోగించాలని మనోభిరామ్ భావించాడు. దానికొరకు అల్యూమినియం, రాగి లోహాల విశిష్టోష్ణాలను ప్రయోగపూర్వకంగా కనుగొనాలంటే ఏ ఏ పరికరాలు కావాలి? ఆ ప్రయోగాన్ని ఎలా నిర్వహించాలి?
జవాబు:
ఉద్దేశ్యం : ఇచ్చిన ఘనపదార్థాల విశిష్టోష్ణం కనుగొనుట.

కృత్యం :
కావలసిన పరికరాలు :
కెలోరిమీటర్, ఉష్ణమాపకం, మిశ్రమాన్ని కలిపే కాడ, నీరు, నీటి ఆవిరి గది, చెక్కపెట్టె, సీసపు గుళ్లు.

  1. కెలోరీ మీటరు ద్రవ్యరాశి = m, gr.
  2. కెలోరీ మీటరు విశిష్టోష్ణం = S, కేలరీ/గ్రాం × °C
  3. నీటితో సహా కెలోరీ మీటరు ద్రవ్యరాశి = m2 gr.
  4. నీటి ద్రవ్యరాశి = నీటితో సహా కెలోరీ మీటరు ద్రవ్యరాశి – కెలోరీ మీటరు ద్రవ్యరాశి
    నీటి ద్రవ్యరాశి = m2 – m1
  5. నీటి విశిష్టోష్ణం = Sw కేలరీ/గ్రాం × °C .
  6. నీటి తొలి ఉష్ణోగ్రత = T1 °C
  7. సీసపు గుళ్లను తీసుకొని వేడినీటిలో లేదా హిట్ చాంబర్ లో ఉంచి 100°C వరకు వేడి చెయ్యండి.
  8. సీసపు గుళ్ల ఉష్ణోగ్రత = T2°C
  9. AP Board 10th Class Physical Science Solutions 1st Lesson ఉష్ణం 2
  10. నీరు, సీసపు గుళ్లు, కెలోరీ మీటరు ద్రవ్యరాశి = m3 గ్రా.
  11. నీరు, సీసపు గుళ్లు, కెలోరీమీటరు ఉష్ణోగ్రత = T3°C
  12. సీసపు గుళ్ల ద్రవ్యరాశి = m3 – m2
  13. సీసపు గుళ్లు కోల్పోయిన ఉష్ణరాశి
    Q = m × S× ∆T
    Q1 = (m3 – m2) × Sl × (T2 – T3)
  14. నీరు గ్రహించిన ఉష్ణరాశి Q2 = (m2 – m1) × Sw × (T3 – T1)
  15. కెలోరీ మీటరు గ్రహించిన ఉష్ణరాశి Q3 = m1 × Sc × (T3 – T1)
  16. కానీ సీసపు గుళ్లు కోల్పోయిన ఉష్ణం = కెలోరీ మీటరు + నీరు గ్రహించిన ఉష్ణరాశి
    AP Board 10th Class Physical Science Solutions 1st Lesson ఉష్ణం 3

ప్రశ్న 8.
20°C ను కెల్విన్ మానంలోకి మార్చండి. (AS1)
జవాబు:
కెల్విన్ K = 273 + °C. = 273 + 20 = 293 K

ప్రశ్న 9.
బాష్పీభవనానికి, మరగడానికి గల తేడాను మీ స్నేహితుడు గుర్తించలేకపోయాడు. అతను ఆ తేడాను గుర్తించడానికి కొన్ని ప్రశ్నలు అడగండి. (AS2)
(లేదా)
కుమార్ బాష్పీభవనం, మరగడంలకు తేడాలను గుర్తించలేకపోతున్నానని తన టీచర్ తో చెప్పాడు. అప్పుడు ఆ టీచర్ తనని కొన్ని ప్రశ్నలు అడిగి వాటికి సమాధానాలు రప్పించడం ద్వారా తేడాలను గ్రహించేటట్లు చేశాడు. ఆ టీచర్ కుమారిని అడిగిన ప్రశ్నలేమై ఉంటాయి?
జవాబు:

  1. బాష్పీభవనం ఏ ఉష్ణోగ్రత వద్ద జరుగును?
  2. నీరు మరగటం ఏ ఉష్ణోగ్రత వద్ద జరుగును?
  3. నీటిని వేడిచేసినపుడు ఆవిరిగా మారును ఈ ప్రక్రియను ఏమంటారు?
  4. రోడ్ల ప్రక్కన నిల్వ ఉన్న నీరు ఏ ప్రక్రియ వలన ఆవిరగును?
  5. తడిబట్టలు ఆరడం ఏ ప్రక్రియ వలన జరుగును?
  6. శరీరంపై చెమట ఆరడం ఏ ప్రక్రియ వలన జరుగును?
  7. 100°C వద్ద నీరు ఆవిరిగా మారే ప్రక్రియను ఏమంటారు?

ప్రశ్న 10.
తడిబట్టలు పొడిగా మారినప్పుడు వాటిలోని నీరు ఏమవుతుంది? (AS3)
జవాబు:
తడిబట్టలు గాలిలో లేదా ఎండలో ఆరబెట్టినపుడు బట్టలలోని నీటి అణువులు నిరంతరం చలిస్తూ అభిఘాతాలు చెందుతాయి. ఈ సందర్భంలో అణువులు శక్తిని వేరొక అణువులకు బదిలీ చేస్తాయి.

బదిలీ చెందిన శక్తి ఉపరితలంలో ఉన్న అణువులకు అందితే ఉపరితలాన్ని వదిలి పైకిపోతాయి. ఈ విధంగా నీరు ఆవిరిగా బాష్పీభవనం చెందును. బట్టలు క్రమేణ పొడిగా మారతాయి. తడిబట్టలను గాలి తగిలే ప్రాంతంలో ఆరబెడితే బాష్పీభవన రేటు వేగంగా జరిగి బట్టలు త్వరగా ఆరిపోతాయి.

AP Board 10th Class Physical Science Solutions 1st Lesson ఉష్ణం

ప్రశ్న 11.
ఒక చిన్న మూత, ఒక పెద్ద పాత్రలో ఒకే పరిమాణం గల ద్రవాన్ని ఉంచితే, ఏది త్వరగా బాష్పీభవనం చెందుతుంది? (AS3)
(లేదా)
శ్రీను ఒక పాత్రనందు మరియు వెడల్పు మూతనందు సమాన పరిమాణం గల నీటిని పోసి ఆరుబయట ఉంచెను. అతను గమనించిన విషయమేమి? దీనిని ప్రయోగ పూర్వకంగా వివరింపుము.
జవాబు:

  1. ఒక సెకను కాలంలో నీటి అణువులు ఆవిరిగా మారే సంఖ్యను బాష్పీభవన రేటు అంటారు.
  2. బాష్పీభవనరేటు పాత్ర యొక్క ఉపరితల వైశాల్యానికి, ఉష్ణోగ్రతకు, అర్ధతకు అనులోమానుపాతంలో ఉండును.
  3. కాబట్టి చిన్న మూతలో, పెద్ద పాత్రలో ఒకే పరిమాణం గల ద్రవాన్ని ఉంచినా పెద్ద పాత్రలోని ద్రవమే త్వరగా బాష్పీభవనం చెందును.

ప్రశ్న 12.
బాష్పీభవనం అనేది ద్రవ ఉపరితలం, పరిసరాలలో ఉన్న గాలిలోని ద్రవభాష్పం వంటి అంశాలపై ఆధారపడుతుందని నిరూపించడానికి ఒక ప్రయోగాన్ని సూచించండి. (AS3)
జవాబు:

  1. ఒక పరీక్షనాళిక, పింగాణీ పాత్రలో విడివిడిగా 5 మి.లీ. నీటిని తీసుకోండి.
  2. రెండింటిని తిరుగుతున్న ఫ్యాన్ క్రింద ఉంచండి.
  3. మరొక పింగాణీ పాత్రలో 5 మి.లీ. నీటిని తీసుకొని దానిని బీరువాలో ఉంచండి.
  4. గది ఉష్ణోగ్రతను నమోదు చెయ్యండి.
  5. మూడు సందర్భాలలో నీరు బాష్పీభవనానికి పట్టిన కాలాన్ని నమోదు చెయ్యండి.
  6. వర్షం కురిసిన రోజున కూడా ఇదే కృత్యం నిర్వహించండి. పరిశీలన నమోదు చెయ్యండి.
  7. ఫ్యాన్ క్రింద ఉంచిన పింగాణీ పాత్రలో నీరు బాష్పీభవనం చెందటం మనం గమనిస్తాం.
  8. కారణం పరీక్షనాళిక కంటే పింగాణీ పాత్ర యొక్క ఉపరితల వైశాల్యం ఎక్కువ.
  9. బాష్పీభవనం ఉపరితల దృగ్విషయం. ఉపరితల వైశాల్యం పెరిగితే ఎక్కువ కణాలు బాష్పంగా మారే అవకాశం ఏర్పడుతుంది.
  10. బాష్పీభవనం మరొక అంశం ఆర్థత.
  11. గాలిలోని తేమశాతాన్ని అర్థత అంటారు.
  12. పరిసరంలోని గాలి నిర్దిష్ట పరిమాణం మేరకు మాత్రమే నీటి బాష్పాన్ని నిలిపి ఉంచుకోగలుగుతుంది.
  13. గాలిలో నీటి బాష్పం అనగా ఆర్ధత ఎక్కువ ఉంటే బాష్పీభవన వేగం తగ్గుతుంది.
  14. ఇందువల్ల తడిబట్టలు వర్షాకాలంలో నెమ్మదిగానూ, గాలి వేగంగా వీచే రోజులలో వేగంగానూ ఆరతాయి.

ప్రశ్న 13.
అంచు కలిగిన ఒక పళ్లెంలో నీరు పోసి అందులో ఒక గరాటును బోర్లించండి. గరాటు అంచు పూర్తిగా పళ్లానికి ఆని ఉండకుండా, గరాటును ఒక వైపు నాణెంపై ఉంచండి. ఈ పళ్లాన్ని బర్నర్ పై ఉంచి నీరు మరగడం ప్రారంభించే వరకు వేడిచేయండి. మొదట ఎక్కడ బుడగలు ప్రారంభమయ్యాయి? ఎందుకు? ఈ ప్రయోగ పరిశీలన ఆధారంగా గీజర్ (వేడినీటి ఊట) పనిచేసే విధానాన్ని మీరు వివరించగలరా? (AS4)
జవాబు:

  1. అంచు కలిగిన పళ్లెంలో నీరుపోసి అందులో ఒక గరాటును ఉంచండి.
  2. గరాటు యొక్క అంచు పూర్తిగా పళ్లానికి ఆనకుండా ఒక నాణెంపై ఉంచండి.
  3. పళ్లాన్ని బర్నర్‌పై ఉంచి నీరు మరిగే వరకు వేడి చెయ్యండి.
  4. ఉషాన్ని మొదట పళ్ళెం గ్రహించి, నీటికి అందించును.
  5. నీరు ఉష్ణరాశిని గ్రహించును. నీటిలో ఉష్ణప్రసారం సంవహన పద్ధతిలో జరుగును.
  6. అనగా ఉష్ణాన్ని గ్రహించిన నీటి అణువులు తేలికై బుడగల రూపంలో నీటి పైకి చేరును. పైన చల్లగా ఉన్న నీటి అణువులు నీటి అడుగుకు చేరును. ఈ విధంగా అణువులు చక్రీయంగా తిరుగుతూ ఉష్ణాన్ని గ్రహిస్తాయి.
  7. గరాటు-నాణెం విషయానికి వస్తే నాణెం దగ్గర నీటి బుడగలు తక్కువగా ఉంటాయి. నాణేనికి దూరంలో నీటి బుడగలు ప్రారంభమవుతాయి.
  8. కారణం నీరు బాష్పీభవనం చెందటానికి కావలసిన ఉష్ణరాశి అందదు. ఎక్కువ ఉష్ణాన్ని లోహంతో తయారైన నాణెం గ్రహిస్తుంది.
  9. గీజర్ లో హీటింగ్ కాయిల్ దగ్గర ఉన్న నీటి అణువులు ఉష్ణాన్ని గ్రహించి దూరంగా పోతాయి.
  10. తక్కువ ఉష్ణోగ్రత ఉన్న నీటి అణువులు హీటింగ్ కాయిల్ దగ్గరకు చేరుతాయి.
  11. హీటింగ్ కాయిల్ నుండి ఉష్ణప్రసారం సంవహన పద్ధతిలో జరుగును.

ప్రశ్న 14.
వేసవి, శీతాకాలాల్లో వాతావరణ ఉష్ణోగ్రత దాదాపు స్థిరంగా ఉండడంలో నీటి విశిష్టోష్ణం పాత్రను మీరెలా అభినందిస్తారు? (AS6)
జవాబు:
నీటికి విశిష్టోష్ణం విలువ ఎక్కువగా ఉండుట వలన వేసవిలో పగటిపూట నీటి ఉష్ణోగ్రత పెరగదు. కాని భూమి ఉష్ణోగ్రత అమాంతం పెరిగి భూమిపై గాలి వేడెక్కి వ్యాకోచం చెంది సాంద్రత తగ్గును. కావున సముద్రపు చల్లగాలులు భూమి వైపునకు వ్యాపించి వాతావరణాన్ని చల్లబరుచును.

  1. శీతాకాలంలో రాత్రిళ్లు భూమి, నీటికంటే త్వరగా ఉష్ణాన్ని కోల్పోయి చల్లబడును. సముద్రంలో నీరు ఎక్కువ ఉష్ణోగ్రతతో ఉండి పరిసరాలలోని గాలి వేడెక్కి వ్యాకోచించి సాంద్రత తగ్గును. కావున భూమిపై శీతల పవనాలు సముద్రం వైపునకు ప్రయాణించును.
  2. ఈ విధంగా భూమి యొక్క వాతావరణాన్ని నీరు సమతుల్యం చేస్తుంది.
  3. నీటికి గల అధిక విశిష్టోష్ణం వలన నీరు త్వరగా ఉష్ణాన్ని కోల్పోదు. అందువలన చలి ప్రదేశాలలో రబ్బరు బాటిల్స్ లో నీటిని నింపి బెడ్ క్రింద ఉంచుతారు.
  4. గదులు వెచ్చగా ఉంచటానికి పైపులలో వేడినీటిని సరఫరా చేస్తారు.
  5. థర్మల్ పవర్ స్టేషన్లలో నీటి విశిష్టోష్ణం అధికంగా ఉండుటవలన శీతలీకరణిగా వాడతారు.

ఈ విధంగా అనేక రకాలుగా ఉపయోగపడుతూ వాతావరణాన్ని సమతుల్యం చేస్తుంది కాబట్టి మనం నీటిని తప్పక అభినందించవలసి యున్నది.

AP Board 10th Class Physical Science Solutions 1st Lesson ఉష్ణం

ప్రశ్న 15.
ఫ్రిజ్ నుండి బయటకు తీసిన ‘పుచ్చకాయ’ ఎక్కువ సమయం పాటు చల్లగా ఉండటంలో విశిష్టోష్ణం పాత్రను వివరించండి. (AS7)
జవాబు:

  1. సాధారణంగా పుచ్చకాయలో అధికశాతం నీరు ఉండును.
  2. పదార్థాలన్నింటిలో విశిష్టోష్ణం విలువ నీటికి గరిష్ఠంగా ఉండును.
  3. అనగా ఎక్కువ విశిష్టోష్ణం ఉన్న పదార్థాలు ఉష్ణోగ్రత పెరుగుదలను వ్యతిరేకిస్తాయి. అనగా చల్లదనాన్ని కొనసాగిస్తాయి.
  4. అందువల్ల పుచ్చకాయ ఎక్కువ సమయం పాటు చల్లదనాన్ని నిలిపి ఉంచుకుంటుంది.

ప్రశ్న 16.
మీరు చల్లని నీటితో స్నానం చేసినా, స్నానం తర్వాత స్నానాల గదిలో అలాగే ఉంటే వేడిగా అనిపిస్తుంది. ఎందుకు? (AS7)
జవాబు:

  1. స్నానాల గదిలో ప్రమాణ ఘనపరిమాణంలోని నీటి ఆవిరి అణువుల సంఖ్య, స్నానాల గది బయట ప్రమాణ ఘన పరిమాణంలోని నీటిఆవిరి అణువుల సంఖ్య కంటే ఎక్కువ.
  2. మనం కండువాతో శరీరాన్ని తుడుచుకున్నప్పుడు మన చుట్టూ ఉన్న నీటి ఆవిరి అణువులు చర్మంపై సాంద్రీకరణం చెందుతాయి.
  3. సాంద్రీకరణం ఉష్ణాన్ని విడుదల చేసే ప్రక్రియ.
  4. కనుక మన శరీరం వెచ్చగా అనిపిస్తుంది.

ప్రశ్న 17.
A అనే వస్తువు 30°C వద్ద, B అనే వస్తువు 303 K వద్ద, C అనే వస్తువు 420K వద్ద కలవు. ఈ మూడు వస్తువులు ఉయ స్పర్శలో ఉన్నట్లయితే,
1) A, B, C లలో ఏ రెండు వస్తువులు ఉష్ణ సమతాస్థితిలో కలవు?
2) A, B, C లలో ఏ రెండు వస్తువుల మధ్య ఉష్ణ ప్రసారం జరుగుతుంది?
జవాబు:
1) 303K = 273K + 30K = 0°C + 30°C = 30°C.
∴ A మరియు B వస్తువులు ఉష్ణ సమతాస్థితిలో కలవు.

2) A మరియు B వస్తువులకు, C వస్తువు నుండి ఉష్ణ ప్రసారం జరుగుతుంది.

ఖాళీలను పూరించండి

1. విశిష్టోష్ణానికి S.I. ప్రమాణం ………… (J/kg – K)
2. అధిక ఉష్ణోగ్రత వద్ద గల వస్తువు నుండి అల్ప ఉష్ణోగ్రత వద్ద గల వస్తువుకు ……………. ప్రవహిస్తుంది. (ఉష్ణం)
3. …………. అనేది ఒక శీతలీకరణ ప్రక్రియ. (బాష్పీభవనం)
4. 10°C వద్ద గల A అనే వస్తువును, 10K వద్ద గల B అనే వస్తువుతో ఉష్ట్రీయ స్పర్శలో ఉంచితే ఉష్ణం …………. నుండి ………… కు ప్రవహిస్తుంది. (10°C నుండి 100)
5. మంచు ద్రవీభవన గుప్తోష్ణం విలువ …………….. (80 కెలోరీలు/గ్రాం)
6. వస్తువు ఉష్ణోగ్రత ……………………… కు అనులోమానుపాతంలో ఉంటుంది. (కణాల సరాసరి గతిజశక్తికి)
7. మిశ్రమాల పద్ధతి సూత్రం ప్రకారం వేడివస్తువులు కోల్పోయిన ఉష్ణం = ……………… (చల్లని వస్తువులు గ్రహించిన ఉష్ణం)
8. వేసవి రోజుల్లో ఉక్కపోతకు కారణం ……….. (ఆర్ధత ఎక్కువ లేదా అధిక నీటి బాష్పం)
9. …………. ను శీతలీకరణిగా వాడతాం. (నీటిని)
10. నీటిపై మంచు తేలడానికి కారణం ……………………. (సాంద్రత తగ్గడం)

సరైన సమాధానాన్ని ఎన్నుకోండి

1. కింది వాటిలో ఏది ఉద్ధీకరణ ప్రక్రియ (warming process)?
A) బాష్పీభవనం
B) సాంద్రీకరణం
C) మరగడం
D) పైవన్నీ
జవాబు:
B) సాంద్రీకరణం

2. A, B మరియు C అనే వస్తువులు ఉష్ణ సమతాస్థితిలో ఉన్నాయి. B యొక్క ఉష్ణోగ్రత 45°C అయిన, C యొక్క ఉష్ణోగ్రత …………..
A) 45°C
B) 50°C
C) 40°C
D) 90°C
జవాబు:
A) 45°C

AP Board 10th Class Physical Science Solutions 1st Lesson ఉష్ణం

3. ఒక స్టీలు కడ్డీ ఉష్ణోగ్రత 330 K. దాని ఉష్ణోగ్రత °C పరంగా
A) 55°C
B) 57°C
C) 59°C
D) 53°C
జవాబు:
B) 57°C

4. విశిష్టోష్ణం S = ………..
A) Q/∆T
B) Q∆T
C) Q/m∆r
D) m∆T/Q
జవాబు:
C) Q/m∆r

5. సాధారణ వాతావరణ పీడనం వద్ద నీటి మరుగుస్థానం ……….
A) 0°C
B) 100°C
C) 110°C
D) -5°C
జవాబు:
B) 100°C

6. ద్రవీభవనం చెందేటప్పుడు మంచు ఉష్ణోగ్రత
A) స్థిరంగా ఉంటుంది
B) పెరుగుతుంది
C) తగ్గుతుంది
D) చెప్పలేము
జవాబు:
A) స్థిరంగా ఉంటుంది

పరికరాల జాబితా

చెక్కముక్క, లోహపు ముక్క గాజు గ్లాసులు, రెండు ఉష్ణ మాపకములు, వేడినీరు, కొబ్బరి నూనె, రెండు బీకర్లు, మూత, రెండు స్టాండులు, రెండు పరీక్ష నాళికలు, పెద్ద జాడీ, రబ్బరు బిరడా, సారాయి దీపం, కెలోరిమీటర్, మిశ్రమాన్ని కలిపే షర్రర్, నీటి ఆవిరి గది, చెక్కపెట్టె, సీసపు గుళ్ళు లేదా 50 గ్రా. ఇనుప బోల్ట్, డ్రాపర్, పేట్రిడిష్ లేదా వాచ్ గ్లాస్, స్పిరిట్, బున్సెన్ బర్నర్, ఫుడ్ కలర్ లేదా పొటాషియం పర్మాంగనేట్.

10th Class Physical Science 1st Lesson ఉష్ణం Textbook InText Questions and Answers

10th Class Physical Science Textbook Page No. 2

ప్రశ్న 1.
ఉష్ణోగ్రత అంటే ఏమిటి?
జవాబు:
చల్లదనం, వెచ్చదనం స్థాయిని ఉష్ణోగ్రత అంటారు. దీనిని T తో సూచిస్తారు.

10th Class Physical Science Textbook Page No. 2

ప్రశ్న 2.
ఉష్ణం, ఉష్ణోగ్రతకు తేడా ఏమిటి?
జవాబు:

ఉష్ణంఉష్ణోగ్రత
1) అధిక ఉష్ణోగ్రత ప్రాంతం నుండి అల్ప ఉష్ణోగ్రత ప్రాంతం వైపునకు ప్రవహించే శక్తి స్వరూపాన్ని ఉష్ణం అంటారు.1) చల్లదనం, వెచ్చదనం స్థాయిని ఉష్ణోగ్రత అంటారు.
2) ఉష్ణం కారణం (Cause).2) ఉష్ణోగ్రత ఫలితం (Effect).
3) ఉష్టాన్ని కెలోరీమీటరుతో లెక్కిస్తారు.3) ఉష్ణోగ్రతను థర్మామీటరుతో లెక్కిస్తారు.
4) S.I. యూనిట్ : జౌల్4) S.I. యూనిట్ : కెల్విన్

ప్రశ్న 3.
గీజర్ (geiser) పనిచేసే విధానాన్ని తెలియచేసే సమాచారాన్ని సేకరించి, ఒక నివేదికను తయారుచేయండి.
జవాబు:

  1. విద్యుచ్ఛక్తిని, యాంత్రిక శక్తిగా మార్చే పరికరాన్ని గీజర్ అంటారు.
  2. దీనిలో హీటింగ్ కాయిల్ అమర్చబడి ఉండును. ఇది నీటికి కావలసిన ఉష్ణోగ్రతను అందించును.
  3. దీనికి రెండు పైపు మార్గాలు ఉండును. మొదటి పైప్ లైన్ చల్లటి నీటిని గీజర్ లోనికి పంపించటానికి ఉపయోగపడును.
  4. రెండవ పైప్ లైన్ వేడినీటిని బయటకు పంపించును.
  5. గీజర్ లోని హీటింగ్ ఎలిమెంట్ కు థర్మోస్టాట్ ను అమర్చుతారు.
  6. ఈ థర్మోస్టాట్ కొంతవరకు మాత్రమే ఉష్ణోగ్రత పెరిగేలా కంట్రోల్ చేయబడును.
  7. గీజర్ ట్యాంక్ నుండి ఉష్ణం వికిరణ రూపంలో బయటకు పోకుండా ఉండటానికి ఉష్ణబంధక పదార్థమైన గాజు, ఉన్నితో సీల్ చేస్తారు.
  8. గీజర్ ను లోహపు స్థూపాకార పాత్రలో ఉంచి గోడకు బిగించటానికి అనువుగా తయారుచేస్తారు.

AP Board 10th Class Physical Science Solutions 1st Lesson ఉష్ణం

ప్రశ్న 4.
-5°C వద్ద గల రెండు కి.గ్రా. మంచుకు నిరంతరంగా ఉష్ణాన్ని అందిస్తున్నామనుకోండి. 0°C వద్ద మంచు కరుగుతుందని, 100°C వద్ద నీరు మరుగుతుందని మీకు తెలుసు. మంచు నీరుగా మారి, మరగడం ప్రారంభించేవరకు వేడిచేస్తూనే ఉండండి. ప్రతి నిమిషానికి ఉష్ణోగ్రత నమోదు చేయండి. మీరు పొందిన సమాచారంతో ఉష్ణోగ్రత, కాలానికి మధ్య గ్రాఫ్ గీయండి. గ్రాఫ్ ద్వారా మీరు ఏం తెలుసుకున్నారు? మీ నిర్ధారణలు రాయండి.
జవాబు:

  1. – 5°C ఉన్న మంచుగడ్డ 0°C వద్ద కరుగుట ప్రారంభమైంది.
  2. A బిందువు అనగా 0°C వద్ద మంచు కరుగుట ప్రారంభమైంది. దీనిని ద్రవీభవన స్థానం అంటారు.
  3. B, C బిందువుల మధ్య ఉష్ణోగ్రత స్థిరంగా ఉంది అనగా మంచు నీరుగా మారేవరకు ఉష్ణం ఎంత అందించిన ఉష్ణోగ్రతలో మార్పులేదు. దీనినే ద్రవీభవన గుప్తోష్ణం అంటారు.
  4. B, C బిందువుల మధ్య అందించిన ఉష్ణం మంచు కరిగి నీరుగా మారడానికి అనగా స్థితి మార్చటానికి మాత్రమే ఉపయోగపడింది.
  5. C, D ల మధ్య నీటి ఉష్ణోగ్రత క్రమేణ 100°C వరకు పెరిగింది. అంటే నీరు బాష్పీభవనం చెందుతుంది.
  6. D బిందువు వద్ద నీరు 100°C కి చేరుకుంది.
  7. దీనినే నీటి మరుగు ఉష్ణోగ్రత అంటారు.
  8. D, E ల మధ్య అందించిన ఉష్ణం నీటి స్థితిని మార్చటానికి మాత్రమే ఉపయోగపడింది. కానీ ఉష్ణోగ్రత పెరగలేదు. దీనినే బాష్పీభవన గుప్తోష్ణం అంటారు.
  9. F బిందువు వద్ద నీరు పూర్తిగా ఆవిరయింది. దీనినే నీటి ఆవిరి అంటారు.

ప్రశ్న 3.
1 లీ. నీటికి కొంతసేపు ఉష్ణాన్ని అందిస్తే దాని ఉష్ణోగ్రత 2°C పెరిగిందనుకుందాం. అంతే ఉష్ణాన్ని అంతే సమయం పాటు 2 లీ. నీటికి అందిస్తే ఆ నీటి ఉష్ణోగ్రతలో పెరుగుదల ఎంత ఉంటుంది?
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 1st Lesson ఉష్ణం 4
∴ నీటి ఉష్ణోగ్రత 1°C పెరుగును.

10th Class Physical Science 1st Lesson ఉష్ణం Textbook Activities

కృత్యములు

కృత్యం – 1

ప్రశ్న 1.
ఉష్ణసమతాస్థితిని ఒక కృత్యం ద్వారా వివరించుము.
(లేదా)
ఉష్ణోగ్రత అను పదంను ఉదాహరణతో వివరింపుము.
(లేదా)
వెచ్చదనం లేక చల్లదనం యొక్క తీవ్రతను దేనితో పిలుస్తారు? దీని పరిమాణంను ఉదాహరణతో వివరింపుము.
(లేదా)
ఉష్ణోగ్రత నిర్వచనాన్ని వివరించే కృత్యాన్ని రాయండి.
జవాబు:

  1. ఒక చెక్కముక్కను, ఒక లోహపు ముక్కను తీసుకొని వాటిని ఫ్రిజ్ లేదా ఐస్ బాక్స్ లో 15 నిమిషాలు ఉంచి, బయటకు తీయవలెను.
  2. ఇప్పుడు చెక్కముక్కను, లోహపు ముక్కను తాకి ఏది చల్లగా ఉందో గమనించవలెను.
  3. ఫ్రిజ్ నుండి బయటకు తీసినప్పుడు చెక్కముక్క ఉష్ణోగ్రత కంటే లోహపు ముక్క ఉష్ణోగ్రత తక్కువగా ఉందని గమనిస్తాము.
  4. ఒక వేడి వస్తువును, ఒక చల్లని వస్తువును ఒకదానికొకటి తాకే విధముగా ఉంచినప్పుడు ఏమి జరుగుతుందో గమనించవలెను.
  5. వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ఉష్ణశక్తి బదిలీ అవుతుందని గమనిస్తాము.
  6. వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ఉష్ణశక్తి ఎప్పటి వరకు బదిలీ అవుతుందో గమనించవలెను.
  7. ఆ రెండు వస్తువులు ఒకే వెచ్చదనం తీవ్రత లేదా చల్లదనం తీవ్రత పొందే వరకు ఈ ఉష్ణశక్తి బదిలీ కొనసాగుతుందని గమనిస్తాము.
  8. పై పరిశీలన నుండి పరిసరాల నుండి వెచ్చదనం లేదా చల్లదనం అనుభూతిని పొందకపోతే, శరీరం పరిసరాల వాతావరణంతో ఉష్ణ సమతాస్థితిలో ఉంటుందని తెలుస్తుంది.

కృత్యం – 2

ప్రశ్న 2.
ఉష్ణ నిర్వచనాన్ని వివరించే కృత్యాన్ని రాయండి.
జవాబు:

  1. రెండు గాజు గ్లాసులను తీసుకొని ఒకదానిని వేడినీటితో, మరొక దానిని చల్లని నీటితో నింపవలెను.
  2. ఒక ఉష్ణమాపకాన్ని తీసుకొని వేడి నీటిలో ఉంచినప్పుడు పాదరసమట్టము ఎలా ఉంటుందో గమనించవలెను.
  3. పాదరసమట్టంలో పెరుగుదలను గమనిస్తాము.
  4. చల్లని నీటిలో ఉంచినప్పుడు పాదరసమట్టము ఎలా ఉంటుందో గమనించవలెను.
  5. పాదరసమట్టంలో తగ్గుదలను గమనిస్తాము.
  6. ఉష్ణమాపకానికి, నీటికి మధ్య ఉష్ణ సమతాస్థితి ఏర్పడితే పాదరసమట్టము ఎలా ఉంటుందో గమనించవలెను.
  7. పాదరసమట్టము నిలకడగా ఉంటుందని గమనిస్తాము.
  8. ఈ కృత్యం ద్వారా ఉష్ణాన్ని క్రింది విధంగా నిర్వచించవచ్చు.
  9. ఉష్ణం : అధిక ఉష్ణోగ్రత గల వస్తువు నుండి అల్ప ఉష్ణోగ్రత గల వస్తువుకు ప్రవహించే శక్తి స్వరూపాన్ని ‘ఉష్ణం’ అంటారు.

కృత్యం – 3 ఉష్ణం మరియు గతిజశక్తి

ప్రశ్న 3.
ఉష్ణం మరియు గతిజశక్తుల మధ్య గల సంబంధాన్ని వివరించే కృత్యాన్ని రాయండి.
(లేదా)
ఒక పదార్థం యొక్క అణువుల సగటు గతిశక్తి, దాని పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉండునని చూపు కృత్యమును వ్రాయుము.
(లేదా)
ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రత, దాని సగటు గతిశక్తికి సూచన అని నిరూపించు కృత్యం వ్రాయుము.
జవాబు:

  1. రెండు గాజు పాత్రలను తీసుకొని ఒకదానిని వేడినీటితో, మరొక దానిని చల్లని నీటితో నింపవలెను.
  2. రెండు పాత్రల నీటి ఉపరితలాలపై ఫుడ్ కలర్ చల్లి, ఆ కణాల కదలికను గమనించవలెను.
  3. చల్లని నీటిలోని కణాల కంటే వేడినీటిలోని కణాలు వేగంగా కదులుతున్నాయని గమనిస్తాము.
  4. ఆ రెండు పాత్రలలోని నీటి గతిశక్తులు వేరువేరుగా ఉన్నందున కణాల కదిలికల వేగాలు కూడా వేరువేరుగా ఉన్నాయి.
  5. పై పరిశీలన ద్వారా అణువుల సరాసరి గతిజశక్తి చల్లని వస్తువులో కంటే వేడి వస్తువులో ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది.
  6. కనుక ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రత దానిలోని అణువుల సరాసరి గతిజశక్తిని సూచిస్తుంది.

∴ “ఒక వస్తువులోని అణువుల సరాసరి గతిజశక్తి దాని పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది”.

AP Board 10th Class Physical Science Solutions 1st Lesson ఉష్ణం

కృత్యం – 4

ప్రశ్న 4.
రెండు వేరువేరు ఉష్ణోగ్రతలు గల ద్రవాల మధ్య ప్రసరించే గతిజశక్తిని వివరించే కృత్యాన్ని రాయండి.
లేదా
వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ఉష్ణ ప్రసారం జరుగుతుందని ప్రయోగ పూర్వకముగా తెలుపదానికి కావలసిన పరికరాల జాబితాను, ప్రయోగంను వ్రాయుము.
(లేదా)
ఉష్ణమాపకం ఉష్ణం ఏ దిశలో ప్రవహించును? దీనిని ప్రయోగ పూర్వకంగా వ్రాయుము.
AP Board 10th Class Physical Science Solutions 1st Lesson ఉష్ణం 5
జవాబు:

  1. ఒక పాత్రలో నీటిని తీసుకొని 60°C వరకు వేడి చేయవలెను.
  2. ఒక స్థూపాకార పారదర్శక గాజు జాడీని తీసుకొని దానిలో సగం వరకు నీటిని నింపవలెను.
  3. గాజు జాడీ అంచుల వెంబడి జాగ్రత్తగా నీటి తలంపై కొబ్బరినూనేను పోయవలెను.
  4. రెండు రంధ్రాలు గల మూతను ఉంచవలెను.
  5. రెండు ఉష్ణమాపకాలను ఒకటి నీటిలో, మరొకటి నూనెలో మునిగి ఉండేటట్లుగా రంధ్రాలలో అమర్చవలెను.
  6. ఉష్ణమాపకాల రీడింగులను గమనించగా నూనెలో ఉంచిన ఉష్ణమాపకం రీడింగ్ పెరుగుతూ, నీటిలో ఉంచిన ఉష్ణమాపకం. రీడింగు తగ్గుతూ ఉంటుంది.
  7. దీనికి కారణం నీటి అణువుల సరాసరి గతిజశక్తి తగ్గుతుంటే, నూనె అణువుల సరాసరి గతిజశక్తి పెరుగుతుంది.
  8. అంటే నీటి ఉష్ణోగ్రత తగ్గుతుండగా నూనె ఉష్ణోగ్రత పెరుగుతుంది.

కృత్యం – 5

ప్రశ్న 5.
ఉష్ణోగ్రత పెరుగుదల రేటు పదార్థ స్వభావంపై ఆధారపడి ఉంటుందనే కృత్యాన్ని వివరించండి.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 1st Lesson ఉష్ణం 6

  1. ఒక పెద్ద జాడీలో నీటిని తీసుకొని 80°C వరకు వేడి చేయవలెను.
  2. ఒకే పరిమాణం గల రెండు పరీక్షనాళికలను తీసుకొని ఒక దానిలో 50 గ్రాముల నీటిని, మరొక దానిలో 50 గ్రాముల నూనెను పోయవలెను.
  3. రబ్బరు బిరడాల సహాయంతో రెండు పరీక్షనాళికలలో రెండు ఉష్ణమాపకాలను అమర్చవలెను.
  4. ప్రతి 3 నిమిషాలకు ఒకసారి ఉష్ణమాపకాల రీడింగులను గమనించవలెను.
  5. రెండు పరీక్షనాళికలు ఒకే ఉష్ణోగ్రత గల నీటిలో సమాన కాలవ్యవధులలో ఉంచబడినవి.
  6. కాబట్టి నీరు, నూనెలకు ఒకే పరిమాణం గల ఉష్ణం సమకూర్చబడి ఉండాలి.
  7. కాని నూనె ఉష్ణోగ్రత పెరుగుదల రేటు, నీటి ఉష్ణోగ్రత పెరుగుదల రేటు కంటే ఎక్కువగా ఉంది.
  8. కనుక ఉష్ణోగ్రత పెరుగుదల రేటు పదార్థ స్వభావంపై ఆధారపడి ఉంటుంది.

కృత్యం – 6

ప్రశ్న 6.
విశిష్టోష్ణం నిర్వచనాన్ని వివరించే కృత్యాన్ని రాయండి.
(లేదా)
ఒక పదార్థపు ఉష్ణోగ్రతలో పెరుగుదలకు, దాని స్వభావంకు మధ్య గల సంబంధంను తెలుపు కృత్యంను వ్రాయుము.
(లేదా)
పదార్థపు ఉష్ణోగ్రతలో పెరుగుదల రేటు, పదార్థ స్వభావంపై ఆధారపడునని సూచించు ప్రయోగంను వివరింపుము.
(లేదా)
శరీరముపై వేడినీటి కన్నా వేడి నూనె ఎక్కువ ప్రభావంను చూపుటకు గల కారణమును ప్రయోగపూర్వకముగా తెల్పుము.
జవాబు:

  1. ఒకే పరిమాణం గల రెండు బీకర్లను తీసుకొని ఒకదానిలో 250 గ్రా. నీటిని, మరొకదానిలో ఒక కిలోగ్రాం నీటిని తీసుకొని ఉష్ణమాపకం సహాయంతో వాటి తొలి ఉష్ణోగ్రతలను గుర్తించండి.
  2. వాటి తొలి ఉష్ణోగ్రతలు రెండునూ సమానంగా ఉన్నాయి.
  3. బీకర్లలోని నీటి ఉష్ణోగ్రత వాటి తొలి ఉష్ణోగ్రత కంటే 60° పెరిగే వరకు రెండు బీకర్లను వేడిచేసి, రెండు బీకర్లలో నీటి ఉష్ణోగ్రత 60° పెరగడానికి అవసరమైన కాలవ్యవధులను గుర్తించవలెను.
  4. ఉష్ణోగ్రత పెరగడానికి 250 గ్రా. నీటితో పోలిస్తే, 1 కి.గ్రా. నీటికి ఎక్కువ సమయం పట్టిందని గమనిస్తాము.
  5. ఇప్పుడు ఒక బేకరులో 1 లీటరు నీటిని తీసుకుని వేడిచేసి ప్రతి 2 నిమిషాలకు ఉష్ణోగ్రతలోని మార్పును గుర్తించవలెను.
  6. ఉష్ణాన్ని అందించే సమయానికి అనుగుణంగా ఉష్ణోగ్రతలో పెరుగుదల స్థిరంగా ఉంటుంది.
  7. దీనిని బట్టి స్థిర ద్రవ్యరాశి గల నీటి ఉష్ణోగ్రతలోని మార్పు అది గ్రహించిన ఉష్ణానికి అనులోమానుపాతంలో ఉంటుంది.
  8. విశిష్టోష్ణం : ప్రమాణ ద్రవ్యరాశి గల పదార్థ ఉష్ణోగ్రతను 1°C పెంచడానికి కావలసిన ఉష్ణాన్ని ఆ పదార్థ విశిష్టోష్ణం అంటారు.

కృత్యం – 7

ప్రశ్న 7.
ఒక మిశ్రమము యొక్క అంత్య ఉష్ణోగ్రతను ఏవిధంగా కనుగొనవచ్చును?
(లేదా)
“మిశ్రమముల నియమము” అంటే ఏమిటి? దీనిని ఒక కృత్యం ద్వారా వివరించుము.
జవాబు:
సందర్భం -1:

  1. ఒకే పరిమాణంలో ఉండే రెండు బీకరులను తీసుకొని, ఒక్కొక్క దానిలో 200 మి.లీ. నీటిని పోయపలెను.
  2. ఈ రెండు బీకర్లలో నీటిని ఒకే ఉష్ణోగ్రత వరకు వేడి చేయవలెను.
  3. ఈ రెండు బీకర్లలోని నీటిని వేరొక పెద్ద బీకరులోకి మార్చవలెను.
  4. ఈ మిశ్రమ నీటి ఉష్ణోగ్రతలో ఎలాంటి మార్పు ఉండదు.

సందర్భం – 2:

  1. ఒక బీకరులోని నీటిని 90° C వరకు, రెండవ బీకరులోని నీటిని 60° C వరకు వేడిచేసి, ఈ నీటిని వేరొక పెద్ద బీకరులో కలపండి.
  2. ఈ మిశ్రమ నీటి ఉష్ణోగ్రత 90°C మరియు 60° C ల మధ్య ఉంటుంది.
  3. దీనికి కారణం ఉష్ణము 90° C ఉన్న వేడి నీటి నుండి 60° C ఉన్న వేడి నీటిలోనికి ప్రవహించడమే.

సందర్భం – 3:

  1. 90°C వద్ద ఉన్న 100 మి.లీ. నీటిని, 60°C వద్ద ఉన్న 200 మి.లీ. నీటిని తీసుకొని వాటిని వేరొక బీకరులోకి కలపండి.
  2. ఈ మిశ్రమం ఉష్ణోగ్రత 90°C మరియు 60°C ల మధ్య ఉంటుంది.
  3. కాని రెండవ సందర్భంలోని మిశ్రమం ఉష్ణోగ్రత కంటె మూడవ సందర్భంలో మిశ్రమం ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది.

ప్రశ్న 8.
ఒక ఘనపదార్థం యొక్క విశిష్టోష్ణాన్ని ఎలా కనుగొంటారు?
(లేదా)
ఘనపదార్థ విశిష్టోష్ణాన్ని ప్రయోగపూర్వకముగా కనుగొను విధానాన్ని వివరించుము.
జవాబు:
ఉద్దేశ్యం : ఇచ్చిన ఘనపదార్థ విశిష్టోష్ణాన్ని కనుగొనడం.

కావలసిన వస్తువులు :
కెలోరిమీటర్, ఉష్ణమాపకం, మిశ్రమాన్ని కలిపే కాడ లేదా స్టర్రర్, నీరు, నీటిఆవిరి గది, చెక్కపెట్టె మరియు సీసపుగుళ్ళు లేదా ఇనుపబోల్టు (కనీసం 50గ్రాII).

నిర్వహణ విధానం :

  1. స్టర్రర్ తో సహా కెలోరిమీటర్ ద్రవ్యరాశి ‘m1‘ ను కనుగొనండి.
  2. ఇప్పుడు కెలోరిమీటర్ ను 1/3 వంతు వరకు నీటితో నింపవలెను.
  3. నీటితో సహా కెలోరిమీటర్ ద్రవ్యరాశి m2 ను కనుగొనవలెను.
    నీటితో సహా కెలోరిమీటరు ద్రవ్యరాశి m2 = …………
  4. నీటి ద్రవ్యరాశి m12 – m1 ను కనుగొనవలెను.
  5. కెలోరిమీటర్ లోని నీటి ఉష్ణోగ్రత T1 ను కనుగొనవలెను.
  6. కెలోరిమీటర్ మరియు నీటి ఉష్ణోగ్రతలు సమానంగా ఉంటాయి.
  7. కొన్ని సీసపు గుళ్ళను తీసుకొని, వేడినీటిలో లేదా స్టీమ్ చాంబర్ లో ఉంచి 100°C వరకు వేడిచేయండి. ఈ ఉష్ణోగ్రతను T2 అనుకొనవలెను.
  8. ఉష్ణనష్టం జరగకుండా, సీసపుగుళ్ళను త్వరగా కెలోరిమీటర్ లోకి మార్చవలెను.
  9. కొద్దిసేపటి తర్వాత ఈ మిశ్రమం ఒక స్థిర ఉష్ణోగ్రతకు చేరుతుంది.
  10. నీరు, సీసపు గుళ్ళతో సహా కెలోరిమీటర్ ద్రవ్యరాశి m3 ను కనుగొనవలెను.
  11. సీసపు గుళ్ళ ద్రవ్యరాశి m3 – m1 ను కనుగొనవలెను.
  12. ఇప్పుడు ఫలిత ఉష్ణోగ్రత T3 ను కనుగొనవలెను.
  13. కెలోరీమీటర్, ఘనపదార్ధం, (సీసపుగుళ్ళు) మరియు నీటి విశిష్టోష్ణాలు వరుసగా S1c, Sl మరియు Sw అనుకొనవలెను.
  14. మిశ్రమాల పద్ధతి సూత్రం ప్రకారం …..
    ఘనపదార్థం (సీసపు గుళ్ళు) కోల్పోయిన ఉష్ణం = కెలోరిమీటర్ గ్రహించిన ఉష్ణం + నీరు గ్రహించిన ఉష్ణం
  15. (m3– m2) Sl (T2 – T3) = m1 Sc (T3 – T1) + (m2 – m1) Sw (T3 – T1)
    ∴ Sl = [m1Sc + (m2 – m1) Sw] (T3 – T1)/ (m3 – m2) (T2 – T3)
  16. కెలోరిమీటర్, నీటి విశిష్టోష్టాలు తెలిస్తే, పై సమీకరణంతో ఘనపదార్థం (సీసపుగుళ్ళు) విశిష్టోష్ణాన్ని లెక్కగట్టవచ్చును.

AP Board 10th Class Physical Science Solutions 1st Lesson ఉష్ణం

కృత్యం – 8

ప్రశ్న 9.
బాష్పీభవన ప్రక్రియను వివరించే కృత్యాన్ని రాయండి.
(లేదా)
రాజు ఒక పాత్రలో ఆరుబయట ఉంచిన స్పిరిట్ మాయమవుటను గమనించెను. దీనిని వివరించు ప్రయోగము తెలుపుము.
జవాబు:

  1. ఒక కప్పులో కొద్దిగా స్పిరిట్ తీసుకొని రెండు లేదా మూడు చుక్కలను అరచేతిలో వేసుకొనవలెను.
  2. స్పిరిట్ బాష్పీభవనం చెందడం వలన చర్మం చల్లగా అనిపిస్తుంది.
  3. రెండు పెట్టాడిలో సుమారు 1 మి.లీ. స్పిరిట్ ను తీసుకొనవలెను.
  4. ఒక పెట్రెడిషను గాలి తగిలే విధంగా, మరొకదానిని గాలి తగలకుండా మూతపెట్టి ఉంచవలెను.
  5. 5 నిమిషాల తరువాత పరిశీలించిన గాలికి ఉంచిన పెట్రెడిష్ లోని స్పిరిట్ ఏమి లేకపోవడం, మూత పెట్టిన స్పిరిట్ అలాగే ఉండటం గమనిస్తాము.
  6. గాలికి ఉంచిన స్పిరిట్ బాష్పీభవనం చెందడం వలన ఏమీ లేకుండా పోయినది.
  7. బాష్పీభవనం : ద్రవ అణువులు ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ద్రవ ఉపరితలాన్ని వీడిపోయే ప్రక్రియనే బాష్పీభవనం అంటారు.
  8. బాష్పీభవన సమయంలో వ్యవస్థ ఉష్ణోగ్రత తగ్గుతుంది.

కృత్యం – 9 / సాంద్రీకరణం

ప్రశ్న 10.
సాంద్రీకరణాన్ని వివరించే కృత్యాన్ని రాయండి.
(లేదా)
మనోభిరామ్ తన స్నేహితునితో చల్లని రస్నాను గ్లాసులో పోసిన, కొంతసేపటికి దాని బయట వైపు నీటి తుంపరలు ఏర్పడుటను గమనించెనని చెప్పెను. ఈ దృగ్విషయంకు కారణమైన విషయంను ప్రయోగ పూర్వకముగా తెలుపుము.
జవాబు:

  1. ఒక గాజుగ్లాసులో సగం వరకు చల్లని నీరు పోయవలెను.
  2. గ్లాసు బయటి గోడలపై నీటి బిందువులు ఏర్పడటం గమనిస్తాము.
  3. నీటి బిందువులు ఏర్పడటానికి గల కారణం :
    a) చల్లని నీటి ఉష్ణోగ్రత కన్నా, దాని పరిసరాలలోని గాలి. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది.
    b) గాలిలో ఆవిరి రూపంలో నీటి అణువులుంటాయి.
    c) గాలిలోని నీటి అణువులు చలనంలో ఉన్నప్పుడు, చల్లని నీరు గల గ్లాసు ఉపరితలాన్ని తాకితే అవి తమ గతిశక్తిని కోల్పోతాయి. అందువల్ల వాటి ఉష్ణోగ్రత తగ్గిపోయి నీటి బిందువులుగా మారతాయి.
    d) గాలిలోని నీటి అణువులు కోల్పోయిన శక్తి గాజుగ్లాసు అణువులకు అందజేయబడుతుంది. అందువల్ల గాజు అణువుల సరాసరి గతిజశక్తి పెరుగుతుంది.
    e) ఆ శక్తి గాజు గ్లాసులోని నీటి అణువులకు అందజేయబడుతుంది.
    f) తద్వారా గ్లాసులోని నీటి అణువుల సరాసరి గతిజశక్తి పెరుగుతుంది. కాబట్టి, గ్లాసులోని నీటి ఉష్ణోగ్రత పెరుగుతుంది.
    g) ఈ ప్రక్రియనే సాంద్రీకరణం అంటాం. ఇది ఒక ఉద్ధీకరణ ప్రక్రియ.
  4. సాంద్రీకరణం : “వాయువు ద్రవంగా స్థితిమార్పు చెందడమే సాంద్రీకరణం”.

కృత్యం – 10 మరగడం

ప్రశ్న 11.
‘మరగడం’ అనే ప్రక్రియను వివరించే కృత్యాన్ని రాయండి.
(లేదా)
“మరుగుట” అను ప్రక్రియను ఉదాహరణతో వివరింపుము.
(లేదా)
రాజు నీటిని వేడి చేస్తున్నప్పుడు కొన్ని బుడగలు ఉపరితలంపై చేరుటను గమనించెను. ఈ దృగ్విషయంను కృత్యం ద్వారా వివరింపుము.
జవాబు:
1) ఒక బీకరులో నీరుపోసి బర్నరో వేడిచేయవలెను.

2) ప్రతి 2 నిమిషాలకు నీటి ఉష్ణోగ్రతను థర్మామీటర్ సహాయంతో పరిశీలించవలెను. ఇక్కడ మూడు విషయాలను గమనిస్తాము.
a) నీటి ఉష్ణోగ్రత 100°C ని చేరే వరకు నిరంతరం పెరుగుతుందని గమనిస్తాము.
b) 100°C తరువాత ఇంకా ఉష్ణాన్ని అందిస్తున్నా నీటి ఉష్ణోగ్రతలో పెరుగుదల ఉండదు.
c) 100°C వద్ద నీటి ఉపరితలంలో చాలా ఎక్కువ మొత్తంలో బుడగలు ఏర్పడటం గమనిస్తాము.

3) ఈ విధంగా జరగడానికి గల కారణము :
a) నీరు ఒక ద్రావణం. ఇందులో కొన్ని వాయువులతో సహా అనేక రకాల మలినాలు కరిగి ఉంటాయి.
b) నీటిని లేదా ఏదేని ద్రవాన్ని వేడిచేసినప్పుడు అందులోని వాయువుల ద్రావణీయత తగ్గుతుంది.
c) అందువల్ల ద్రవంలో పాత్ర అడుగున, గోడల వెంబడి వాయు బుడగలు ఏర్పడతాయి.
d) బుడగల చుట్టూ ఉన్న ద్రవంలోని నీటి అణువులు బాష్పీభవనం చెంది బుడగలలో చేరడం వల్ల, అవి పూర్తిగా నీటి ఆవిరితో నిండిపోతాయి.
e) ద్రవం ఉష్ణోగ్రత పెరుగుతున్న కొలదీ బుడగలలో పీడనం పెరుగుతుంది.
f) ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద బుడగలలోని నీటి ఆవిరి పీడనం, బుడగలపై కలుగజేయబడే బయటి పీడనంతో సమానమవుతుంది.
g) అప్పుడు బుడగలు నెమ్మదిగా ఉపరితలం వైపు కదలడం ప్రారంభిస్తాయి.
h) ద్రవ ఉపరితలాన్ని చేరాక బుడగలు విచ్ఛిన్నమై వాటిలోని నీటి ఆవిరిని గాలిలోకి విడుదల చేస్తాయి.
i) మనం ఉష్ణాన్ని అందిస్తున్నంత వరకూ, ద్రవం వాయువుగా మారే ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. అందువల్ల నీరు మరుగుతున్నట్లు మనకు కనిపిస్తుంది.

4) మరగడం :
ఏదేని పీడనం, స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలోని పదార్థం వాయుస్థితిలోకి మారడాన్ని మరగడం అంటారు.

AP Board 10th Class Physical Science Solutions 1st Lesson ఉష్ణం

కృత్యం – 11 / ద్రవీభవనం

ప్రశ్న 12.
ద్రవీభవనాన్ని వివరించే కృత్యాన్ని రాయండి.
(లేదా)
ద్రవీభవన ప్రక్రియను మరియు ద్రవీభవన గుప్తోష్ణంలను వివరించు ప్రక్రియను వ్రాయుము.
(లేదా)
0°C వద్ద మంచును వేడి చేసిన అది నీరుగా మారుట జరిగినది. కాని ఉష్ణోగ్రతలో కొంత సేపటి వరకు మార్పులేదు. ఈ దృగ్విషయంలో ఇమిడి ఉన్న పద్ధతి ఏమిటి? వివరింపుము.
జవాబు:
1) ఒక బీకరులో కొన్ని మంచుముక్కలు తీసుకొని, థర్మామీటరు సహాయంతో ఉష్ణోగ్రతను కొలవవలెను.

2) బీకరును బర్నర్ పై ఉంచి వేడిచేస్తూ ప్రతి నిమిషం ఉష్ణోగ్రతను నమోదు చేయవలెను.

3) మంచుముక్కలు కరిగేటప్పుడు మనం ఈ క్రింది విషయాలను గమనిస్తాము.
a) ప్రారంభంలో మంచు తక్కువ ఉష్ణోగ్రత 0°C లేదా అంతకంటే తక్కువగా ఉంటుందని గమనిస్తాము.
b) 0°C కంటే తక్కువగా ఉంటే 0°C ను చేరే వరకు ఉష్ణోగ్రత నిరంతరము పెరుగుతుంది.
c) మంచు కరగడం ప్రారంభం అవగానే ఎంత ఉష్ణాన్ని అందిస్తున్నా ఉష్ణోగ్రతలో మార్పు లేకపోవడం గమనిస్తాము.

4) ఈ విధముగా జరగడానికి గల కారణము :
a) మంచుముక్కలకు మనం అందించిన ఉష్ణం మంచు అణువుల అంతర్గత శక్తిని పెంచుతుంది.
b) ఇలా పెరిగిన అంతర్గత శక్తి మంచులోని అణువుల (H2O) మధ్య గల బంధాలను బలహీనపరచి, తెంచుతుంది.
c) అందువల్ల మంచు (ఘన స్థితి) నీరుగా (ద్రవస్థితి) మారుతుంది.
d) ఈ ప్రక్రియ స్థిర ఉష్ణోగ్రత (0°C లేదా 273K) వద్ద జరుగుతుంది. ఈ ఉష్ణోగ్రతను ద్రవీభవన స్థానం (melting point) అంటాం.

5) ద్రవీభవన స్థానం :
స్థిర ఉష్ణోగ్రత వద్ద ఘనస్థితిలో ఉన్న పదార్థం ద్రవస్థితిలోకి మారే ప్రక్రియనే ద్రవీభవనం అంటారు.

6) ద్రవీభవనం చెందేటప్పుడు ఉష్ణోగ్రత మారదు.

7) ఎందుకనగా, మంచుకు అందించబడిన ఉష్ణం పూర్తిగా నీటి అణువుల మధ్య గల బంధాలను తెంచడానికే వినియోగపడుతుంది.

AP Board 10th Class Physical Science Solutions 1st Lesson ఉష్ణం

కృత్యం – 12

ప్రశ్న 13.
ఘనీభవించేటప్పుడు నీరు వ్యాకోచిస్తుందని నిరూపించే కృత్యాన్ని రాయండి.
(లేదా)
నీటితో నింపబడిన గాజు సీసాను అతిశీతలీకరణం చేసిన పగులుటకు గల కారణంను ప్రయోగ పూర్వకంగా వీవరించుము. మంచు సాంద్రత, నీటి కన్నా ఎక్కువగా ఉండుటకు గల కారణంను వివరించుము.
(లేదా)
నీటి కన్నా మంచు ఘనపరిమాణం ఎక్కువని ప్రయోగపూర్వకంగా వివరించుము.
జవాబు:

  1. మూత కలిగిన గాజు సీసాను తీసుకొని, గాలి బుడగలు లేకుండా పూర్తిగా నీటితో నింపవలెను.
  2. కొన్ని గంటల పాటు సీసాను ఫ్రిజ్ లో ఉంచవలెను.
  3. సీసాను తరువాత బయటకు తీసి పరిశీలిస్తే సీసాకు పగుళ్ళు ఏర్పడటాన్ని గమనిస్తాము.
  4. సీసాలో పోసిన నీటి ఘనపరిమాణం, సీసా ఘనపరిమాణానికి సమానము.
  5. నీరు ఘనీభవించినప్పుడు సీసా పగిలింది. అనగా మంచు ఘనపరిమాణం, సీసాలో నింపిన నీటి ఘనపరిమాణం కంటే ఎక్కువై ఉండాలి.
  6. దీనిని బట్టి, ఘనీభవించినప్పుడు నీరు వ్యాకోచిస్తుంది (ఘనపరిమాణం పెరుగుతుంది) అని చెప్పవచ్చు.
  7. కనుక నీటి సాంద్రత కన్నా మంచు సాంద్రత తక్కువ. అందుకే నీటి పై మంచు తేలుతుంది.

AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని

SCERT AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Physical Science 6th Lesson Questions and Answers ధ్వని

8th Class Physical Science 6th Lesson ధ్వని Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
ఖాళీలలో సరియైన సమాధానాలు రాయండి. (AS1)
ఎ) వస్తువు విరామ స్థానం నుండి ముందుకు, వెనుకకు కదలడాన్ని …………… అంటారు.
జవాబు:
కంపనం

బి) ఒక సెకనులో ఏర్పడే కంపనాల సంఖ్యను …………. అంటారు.
జవాబు:
పౌనఃపున్యము

సి) ధ్వని తీవ్రతను …………….. లో కొలుస్తాం.
జవాబు:
డెసిబెల్

డి) ధ్వని …………. గుండా ప్రయాణించలేదు.
జవాబు:
శూన్యం

ఇ) కంపించే వస్తువులు ……. ఉత్పత్తి చేస్తాయి.
జవాబు:
ధ్వనిని

ఎఫ్) ఒక వస్తువు తన విరామ స్థితి నుండి పొందే గరిష్ఠ స్థానభ్రంశాన్ని …………… అంటారు.
జవాబు:
కంపన పరిమితి

ప్రశ్న 2.
ఒక సాధారణ మానవుడు ధ్వనిని ……… నుండి …… కంపనాలు / సెకను వరకు వినగలుగుతాడు. (AS1)
జవాబు:
20 నుండి 20,000

AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని

ప్రశ్న 3.
వివిధ ధ్వనుల కంపన పరిమితి, పౌనఃపున్యానికి గల తేడాను తెలపండి. మీ దైనందిన జీవితం నుండి రెండు ఉదాహరణలివ్వండి. (AS1)
జవాబు:

కంపన పరిమితిపౌనఃపున్యం
1) కంపన పరిమితి పెరుగుతూ ఉంటే ధ్వని తీవ్రత క్రమంగా పెరుగును.

ఉదా : సింహం గర్జించినపుడు ధ్వని కంపన పరిమితి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ధ్వని తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

1) పౌనఃపున్యం తగ్గుతుంటే ధ్వని యొక్క కీచుదనం (పిచ్) క్రమంగా తగ్గుతుంది.

ఉదా : సింహం గర్జించినపుడు, ధ్వని పౌనఃపున్యం తక్కువగా ఉంటుంది. కాబట్టి కీచుదనము (పిచ్) తక్కువగా ఉంటుంది.

2) కంపన పరిమితి తగ్గుతుంటే ధ్వని తీవ్రత క్రమంగా తగ్గుతుంది.

ఉదా : తుమ్మెద ఝంకారం చేసినపుడు ధ్వని యొక్క కంపన పరిమితి తక్కువగా ఉంటుంది. కాబట్టి ధ్వని తీవ్రత తక్కువగా ఉంటుంది.

2) పౌనఃపున్యం పెరుగుతూ ఉంటే ధ్వని యొక్క కీచుదనము(పిచ్) క్రమంగా పెరుగును.

ఉదా : తుమ్మెద ఝంకారం చేసినపుడు ధ్వని యొక్క పౌనఃపున్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కీచుదనము (పిచ్) ఎక్కువగా ఉంటుంది.

ప్రశ్న 4.
మీకు తెలిసిన మూడు సంగీత పరికరాల పేర్లు వ్రాయండి. అవి ఏ విధంగా ధ్వనిని ఉత్పత్తి చేస్తాయో వివరించండి. (AS1)
జవాబు:
1. తబల :
తబలపై ఉండే చర్మం లేదా పొర మరియు తబల లోపల ఉన్న గాలి కంపించడం వల్ల ధ్వని ఉత్పత్తి అవుతుంది.

2. సితార్ :
సితార్ లోని తీగను కంపింపజేసినపుడు ధ్వని ఉత్పత్తి అవుతుంది.

3. వీణ :
ఒక నిలువుపాటి చెక్కపై మెట్లు బిగించి ఉంటాయి. వీణకు ఒక చివర ఎండిన సొరకాయతో చేసిన “బుర్ర” ఉంటుంది. మెట్ల మీదుగా లోహపు తీగలు అమర్చుతారు. ఈ తీగలను చేతితో మీటితే అవి కంపించి ధ్వని ఉత్పత్తి అవుతుంది. మెట్లమీద వేళ్లను కదిలించడం ద్వారా తీగల పొడవులను మార్చుతూ, వివిధ తీవ్రతలు గల ధ్వనులను ఉత్పత్తి చేస్తారు.

ప్రశ్న 5.
కీచురాళ్లు (కీటకాలు) రొద విని మనం చెవులు ఎందుకు మూసుకుంటాము? (AS1)
జవాబు:
కీచురాళ్ళు (కీటకాలు) వినడానికి ఇబ్బందికరంగా ఉండే కఠోర ధ్వనులను ఉత్పత్తి చేస్తాయి. మరియు కీచురాళ్ళు చేసే ధ్వని యొక్క పౌనఃపున్యం ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ కీచుదనం (పిచ్) ఉన్న ధ్వని విడుదలవుతుంది. కాబట్టి కీచురాళ్లరొద వినలేక మనం చెవులు మూసుకుంటాము.

ప్రశ్న 6.
రాబర్ట్ ఒక సంగీత వాయిద్యం ధ్వనిని ఉత్పత్తి చేయడం గమనించాడు. కానీ ఆ వాయిద్యంలో ఏ భాగమూ కంపనాలు చెందడం అతను గుర్తించలేకపోయాడు. ఈ పరిశీలన వల్ల అతని మెదడులో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. అతనికి తలెత్తిన ప్రశ్నలు ఏమిటో మీరు ఊహించగలరా? వాటిని వ్రాయండి. (AS2)
జవాబు:
రాబర్ట్ మెదడులో తలెత్తిన ప్రశ్నలు :

  1. కంపనం చెందకుండా వస్తువులు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయా?
  2. వాయు వాయిద్యంలో ఏ భాగము కంపనం చెందుతుంది?
  3. వాయు వాయిద్యంలో కంపనం చెందే భాగము కనిపిస్తుందా?
  4. డప్పు వాయిద్యాలలో గాలి కంపనం చెందుతుందా?
  5. పిల్లనగ్రోవిలో కంపించే భాగము ఏది?
  6. గిటార్ వాయించినపుడు గాలి కంపిస్తుందా?
  7. తబల, డోలలను వాయించినపుడు వాటిలో గల చర్మం లేదా పొరతోపాటు కంపించేది ఏది?
  8. విజిల్ ను ఊదినపుడు ఏ భాగం కంపించి ధ్వని వస్తుంది?
  9. వాయు వాయిద్యాన్ని తట్టడం లేదా కొట్టడం గాని చేయం. గాలిని మాత్రమే ఊదుతాం. అయితే ఏ భాగం కంపనం చెంది ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది?

AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని

ప్రశ్న 7.
“ఒక వస్తువులోని కంపనాలు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి” అని మీరు ఎలా రుజువు చేస్తారు? (AS3)
జవాబు:
సైకిల్ బెల్ ను మోగించండి. బెల్ పైన గల స్త్రీలు గిన్నె కంపనం చెందడం వలన సైకిల్ బెల్ నుండి ధ్వని ఉత్పత్తి అవుతుంది. సైకిల్ బెల్ మ్రోగుతున్నపుడు చేతితో స్టీలు గిన్నెను పట్టుకోండి. అది కంపనం చెందుతున్నట్లు చేతి స్పర్శ ద్వారా కూడా తెలుస్తుంది. స్త్రీలు గిన్నెను పట్టుకొన్నప్పుడు ధ్వని ఆగిపోతుంది. కారణం కంపనం చెందడం ఆగిపోవుట వలన ధ్వని ఆగిపోతుంది. దీనిని బట్టి కంపిస్తున్న వస్తువు నుండి ధ్వనిని ఉత్పత్తి చేయవచ్చును అని తెలుస్తుంది.

ప్రశ్న 8.
చిలుకలు మాట్లాడతాయా? మీ స్నేహితులతో చర్చించి, సమాచారం సేకరించండి. (AS4)
జవాబు:
చిలుకలకు సరియైన రీతిలో తర్ఫీదు ఇస్తే చక్కగా మాట్లాడతాయి. మనం టి.వి.లో చిలుకలు మాట్లాడటం, పాటలు పాడడం లాంటివి చూస్తూనే ఉంటాము. వీటికి సంబంధించిన ఉదాహరణలు :

  1. తూర్పు గోదావరి జిల్లాలో ద్వారక తిరుమలలో SBI లో పనిచేస్తున్న శ్రీ భాస్కరరావుగారు 1985 నుండి చిలుకను పెంచుతున్నారు. ఈ చిలుక చక్కగా మాట్లాడడం మరియు ఇంట్లో సభ్యులను పేరుతో పిలవడం లాంటివి చేస్తుంది. ఈ వార్త N – Studio లో సెప్టెంబర్ 22వ తేదీ 2011న ప్రసారమైనది.
  2. అవధూత దత్తపీఠంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గారు చాలా చిలకలకు మాట్లాడడంలో తర్ఫీదు ఇస్తున్నారు. ఈ చిలుకలు చక్కగా మాట్లాడడం మరియు స్వామీజీ చెప్పిన చిన్న చిన్న పనులు చేస్తున్నాయి.

పై ఉదాహరణలను బట్టి చిలుకలు మాట్లాడతాయని మనకు తెలుస్తుంది.

ప్రశ్న 9.
స్థానిక సంగీతకారుల ఫోటోలను సేకరించండి. వాటిని మీ తరగతిగదిలో ప్రదర్శించండి. (AS4)
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని 2

ప్రశ్న 10.
ధ్వని కాలుష్యం జరిగే రకరకాల సంఘటనల చిత్రాలను సేకరించి ఒక స్క్రిప్ పుస్తకంను తయారు చేయండి. (AS4)
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని 3

ప్రశ్న 11.
“కంపనాలు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి. మరియు ధ్వని కంపనాలను ఉత్పత్తి చేస్తుంది” ఈ విధంగా మనం ప్రతిధ్వనిని వినగలుగుతున్నాం” అని జాకీర్ అన్నాడు. ఈ వాక్యం నిజమని మీ పరిసరాలలో గమనించి సరైన ఉదాహరణల ద్వారా తెల్పండి. (AS4)
జవాబు:
1. కంపనాలు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి :
i) పాఠశాలలో లోహపు గంటను, లోహపు కడ్డీతో కొట్టినపుడు లోహపు గంట కంపించడం వలన ధ్వని ఉత్పత్తి – అవుతుంది.
ii) సైకిల్ బెల్ ను మ్రోగించినపుడు, ‘సైకిల్ బెల్ పై గల స్త్రీలు గిన్నె కంపనం చెందడం వలన ధ్వని ఉత్పత్తి అగును. పై ఉదాహరణల ద్వారా కంపించే వస్తువులు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి అని తెలుస్తుంది.

2. ధ్వని కంపనాలను ఉత్పత్తి చేస్తుంది :
ఒక ప్లాస్టిక్ డబ్బాను తీసుకొని రెండు వైపులా కోసి ఒక పైపు వలె తయారుచేయవలెను. ఒక చివర రబ్బరు బెలూనుతో మూస్తూ రబ్బరు బ్యాండ్ ను కట్టాలి. రబ్బరు బెలూనుపై కొన్ని చక్కెర కణాలను లేదా తేలికపాటి చిన్న గింజలను ఉంచాలి. రెండవ వైపు నుండి మీ స్నేహితుణ్ణి బిగ్గరగా మాట్లాడమని, చక్కెర కణాలను పరిశీలించండి. స్నేహితుడు మాట్లాడుతున్నపుడు చక్కెర కణాలు పైకి ఎగురుతూ ఉంటాయి. దీన్నిబట్టి ధ్వని కంపనాలను ఉత్పత్తి చేస్తుంది అని చెప్పవచ్చును.

AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని

ప్రశ్న 12.
మీ పరిసరాలలో లభించే వస్తువులతో సంగీత పరికరాలను తయారుచేసి మీ తరగతిలో ప్రదర్శించండి. (AS5)
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని 4
1) ఏతార :
ఒక కొబ్బరి చిప్పపై ఒక దళసరి కాగితంను అంటించి పటంలో చూపిన విధంగా వెదురు కర్ర, తీగతో తయారు చేయండి. తీగను కంపింప చేసినపుడు సంగీత ధ్వని ఏర్పడును.

2) మంజిర (Manjira) :
రెండు రేకుడబ్బా మూతలకు మధ్యలో రంధ్రాలను చేసి తాడుతో కట్టి మంజిర తయారుచేయవచ్చును.

AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని 5
3) డోలక్ :
కావలసిన వస్తువులు : PVC పైపు, పాలిథిన్ కవర్లు, నైలాన్ దారం.

విధానం :

  1. 6 అంగుళాల వ్యాసం, 12 అంగుళాల పొడవు గల ఒక PVC. పైపును తీసుకోండి.
  2. PVC పైపుకు రెండు వైపుల పాలిథిన్ కవరును గట్టి నైలాన్ దారంతో కట్టండి. డోలక్ తయారగును.

AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని 6
4) తబల :
కావలసిన వస్తువులు : ఒకవైపు తెరిచి ఉన్న ప్లాస్టిక్ డబ్బా, పాలిథిన్ కవరు, నైలాన్ దారం.

విధానము :
ప్లాస్టిక్ డబ్బా తెరచి ఉన్న వైపు పాలిథిన్ కవరును ఉంచి, నైలాన్ దారంతో గట్టిగా కట్టండి. పాలిథిన్ కవరు బిగుతుగా ఉండేట్లు చూడవలెను.

ప్రశ్న 13.
సూర్యునిలో జరిగే ప్రేలుళ్ల ధ్వనులను మనం ఎందుకు వినలేమో వివరించండి. (AS7)
జవాబు:
ధ్వని ప్రసరించాలంటే యానకం కావలెను. ధ్వని శూన్యంలో ప్రయాణించదు. సూర్యునిలో జరిగే ప్రేలుళ్ల ధ్వనులు మనం వినలేము కారణం సూర్యునికి, భూమికి మధ్యలో శూన్య ప్రదేశం ఉంటుంది. ధ్వని శూన్యంలో ప్రయాణించలేదు కావున సూర్యునిలోని ధ్వనులను వినలేము.

ప్రశ్న 14.
ధ్వని కాలుష్యాన్ని తగ్గించేందుకు ఉపయోగపడే రెండు నినాదాలు రాయండి. (AS6)
జవాబు:

  1. “ధ్వని కాలుష్యం తగ్గించు – ప్రశాంత జీవనం సాగించు”.
  2. “చెట్లను విరివిగా నాటుదాం – ధ్వని కాలుష్యాన్ని తగ్గించుదాం”.

ప్రశ్న 15.
ధ్వని కాలుష్యాన్ని తగ్గించేందుకు మీరిచ్చే సలహాలు ఏమిటి? (AS7)
జవాబు:
ఈ క్రింది సలహాలు పాటించడం ద్వారా ధ్వని కాలుష్యాన్ని తగ్గించవచ్చును.

  1. వాహనాలకు, ఇతర మిషన్లకు సైలెన్సర్లు బిగించడం.
  2. తక్కువ ధ్వని ఉత్పత్తి చేసే యంత్రాలను తయారు చేయడం.
  3. టి.వి., టేప్ రికార్డులు, రేడియోలను ఉపయోగించేటప్పుడు ధ్వని స్థాయి తగ్గించడం.
  4. ధ్వని కాలుష్యాన్ని తగ్గించేందుకు చెట్లను విరివిగా పెంచడం.
  5. పరిశ్రమలను, విమానాశ్రయాలను నివాస ప్రాంతాలకు దూరంగా నిర్మించడం.
  6. వాహనదారులు అవసరంలేని సమయంలో హారన్లను మోగించరాదు.

AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని

ప్రశ్న 16.
ధ్వని కాలుష్యం జీవ వైవిధ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? వివరించండి. (AS7)
జవాబు:
ధ్వని కాలుష్యం జీవవైవిధ్యంపై ప్రభావం చూపే విధం :

  1. దీపావళి ఔట్లు పేల్చినప్పుడు, డైనమైట్లతో కొండ రాళ్లను పేల్చినపుడు, పక్షులు గోల చేస్తూ చెల్లాచెదురుగా తమ ఆవాసాలను వీడి ఎగిరిపోతాయి.
  2. జెట్ బాంబర్లూ, కన్ కార్డ్ విమానాలు ఆకాశంలో ఎగిరేటప్పుడు వచ్చే విపరీతమైన ధ్వనికి ఆకాశ హార్శ్యాలు (స్కైస్క్రైపర్లు) ప్రకంపనలు చెంది, గోడలు కూలిపోతే వాటిలో నివసించే జనాలకు ప్రాణ హాని కలుగుతుంది.
  3. సైలెన్సర్లు లేని మోటారు వాహనాలను జన సమ్మర్థం గల రోడ్లపై నడిపితే ధ్వని కాలుష్యం వలన వృద్ధులలో ఉద్రేకం పెరగడం, రక్తపోటు వృద్ధి కావడం జరుగుతుంది.
  4. కర్ణకఠోరమైన ధ్వనులు వింటే పసిపిల్లలలో కర్ణభేరి చెడిపోయి వినికిడి శక్తి తగ్గవచ్చు.

పరికరాల జాబితా

చెక్కగంట, రబ్బరు బ్యాండ్, నీటితో ఉన్న పళ్లెం, గ్లాసులు, హాక్ సా బ్లేడు, సగం కోసి గ్లాసులా చేసిన ప్లాస్టిక్ బాటిల్, సెల్ ఫోన్, బెలూన్, రబ్బరు బ్యాండు, ఒకే పరిమాణంగల బీకరులు, చెక్కబల్ల, లోహపు కడ్డీ లేదా చెక్క స్కేలు, దారం, టెలిఫోన్, కీచుమని శబ్దం చేసే బొమ్మ, బకెట్, నీరు, ఇనుప గంట, ఇత్తడి గంట, వివిధ సంగీత పరికరాలను చూపే చార్టు, స్వరపేటిక నిర్మాణం చార్టు, కర్ణభేరి నిర్మాణం చార్టు, ధ్వని కాలుష్యం ప్రభావాలను చూపే చార్టు, చెక్కబల్ల, ఇటుక.

8th Class Physical Science 6th Lesson ధ్వని Textbook InText Questions and Answers

ఆలోచించండి – చర్చించండి

8th Class Physical Science Textbook Page No. 86

ప్రశ్న 1.
ధ్వని ప్రసరణ పై గాలిలో తేమ ప్రభావం ఏ విధంగా ఉంటుంది? వేసవి, శీతాకాలాలలో గాలిలో ధ్వని ప్రసారంలో ఏమైనా తేడా ఉంటుందా? మీ స్నేహితులతో చర్చించండి.
జవాబు:

  1. గాలిలో తేమ పెరుగుతూ ఉంటే ధ్వని ప్రసరణ పెరుగును.
  2. గాలిలో తేమ ఎక్కువగా ఉండుట వల్ల వేసవి కాలంలో ధ్వని ప్రసరణ ఎక్కువగా ఉంటుంది.
  3. శీతాకాలంలో ధ్వని ప్రసరణ తక్కువగా ఉంటుంది.

8th Class Physical Science Textbook Page No. 87

ప్రశ్న 2.
కంపనాలు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి మరియు ధ్వని కంపనాలను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఏది నిజం?
జవాబు:

  1. కంపనాలు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి నిజం. ఎందుకంటే ఏ వస్తువునైనా కంపింపచేసినపుడు ధ్వని ఉత్పత్తి అవుతుంది. ఉదాహరణకు పాఠశాల గంట.
  2. ధ్వని కంపనాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా నిజం. ఉదాహరణ ధ్వని మన చెవిని చేరినపుడు ధ్వనికి మన చెవిలోని కర్ణభేరి కంపిస్తుంది.
  3. మనం టెలిఫోన్లో మాట్లాడుతున్నపుడు టెలిఫోన్ లోని డయాఫ్రమ్ ను ధ్వని కంపింపచేస్తుంది.

AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని

ప్రశ్న 3.
మన చెవిలో ధ్వని ప్రసారానికి అనుకూలించే మూడు రకాల యానకాలున్నాయి. మీ స్నేహితులతో చర్చించి ఈ వాక్యం సరైనదో కాదో నిర్ణయించండి.
జవాబు:
మన చెవిలో ధ్వని ప్రసారానికి అనుకూలించే మూడు రకాల యానకాలు ఉన్నాయి. ఈ వాక్యం సరైనది. ఎందుకంటే

  1. చెవి వెలుపలి భాగంలోని రంధ్రంలో గాలి వాయు యానకంలా పనిచేస్తుంది.
  2. మధ్య చెవి భాగంలోని తేలికైన మూడు ఎముకలు మ్యాలియస్, ఇంకస్ మరియు స్టీలు ఘనస్థితిలో ఉన్నాయి. ఇవి ఘన యానకంలా పనిచేస్తాయి
  3. లోపలి చెవి భాగం అయిన కోక్లియా చిక్కని ద్రవంతో నింపబడి ఉన్నది. ఇది ద్రవ యానకంలా పనిచేస్తుంది. కాబట్టి మన చెవిలో ధ్వని ప్రసారానికి అనుకూలించే 3 రకాల యానకాలు ఉన్నాయి.

8th Class Physical Science 6th Lesson ధ్వని Textbook Activities

కృత్యములు

కృత్యం – 1 ధ్వనిని విని, ధ్వని జనకాన్ని ఊహించుట :

ప్రశ్న 1.
మీకు వినిపించే ధ్వనులను వినండి. ఆయా ధ్వనులు ఏ ఏ వస్తువుల నుండి ఉత్పత్తి అయి ఉంటాయో ఊహించి ఈ క్రింది పట్టికలో నమోదు చేయండి.
జవాబు:

విన్న ధ్వనిధ్వని జనకం
1. నెమ్మదిగా మొరుగుటదూరంగా ఉన్న కుక్క
2. గంట ధ్వనిపాఠశాలలో ఉన్న గంట
3. విద్యార్థుల గోలఆటస్థలంలో ఆటలాడుతున్న విద్యార్థుల అల్లరి
4. వాహనాల ధ్వనులురోడ్డుపై వెళ్లే వాహనాల ధ్వనులు
5. మోటారు ధ్వనిపాఠశాలలో గల మంచినీటి బోర్ మోటారు ధ్వని
6. చప్పట్ల ధ్వనివిద్యార్థులు చప్పట్లు కొట్టడం

కృత్యం – 2 వివిధ ధ్వనులను గుర్తించండి :

ప్రశ్న 2.
వివిధ ధ్వనులను గుర్తించండి :
జవాబు:
ఒక విద్యార్థిని పిలిచి నల్లబల్లవైపు తిరిగి నిలబడమని చెప్పండి. మిగిలిన విద్యార్థులను వివిధ రకాల ధ్వనులను ఒకరి తరువాత ఒకరిని చేయమని చెప్పండి. నల్లబల్ల వద్ద నున్న విద్యార్థిని తాను విన్న ధ్వనులను, ఆ ధ్వనులు ఉత్పత్తి అయిన విధానాన్ని ఈ క్రింది పట్టికలో నమోదు చేయమనండి.

విన్న ధ్వనిధ్వని ఉత్పత్తి అయిన విధానము
1. గలగలఒక రేకు పెట్టెలో రాళ్లు వేసి ఊపడం వల్ల
2. ఈలధ్వనిఒక విద్యార్థి ఈల వేయడం వలన
3. చప్పట్లుఒక విద్యార్థి చప్పట్లు కొట్టడం వల్ల
4. అలారమ్ ధ్వనిగడియారము అలారమ్ వల్ల
5. కిర్, కిర్, కిర్కిర్ చెప్పులతో నడవడం వల్ల
6. టక్, టక్టేబుల్ పై, ఇనుప స్కేలుతో కొట్టడం వల్ల

AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని

కృత్యం – 3 కంపించే వస్తువు ధ్వనిని ఉత్పత్తి చేయడం :

ప్రశ్న 3.
కంపించే వస్తువుల నుండి ధ్వనిని ఉత్పత్తి చేయవచ్చును అని కొన్ని కృత్యాల ద్వారా వివరించండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని 7 AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని 8

పై కృత్యాల ద్వారా కంపించే వస్తువుల నుండి ధ్వని ఉత్పత్తి అవుతుందని తెలుస్తుంది.

కృత్యం – 4 ధ్వని శక్తిని కలిగి ఉంది :

ప్రశ్న 4.
ధ్వనికి శక్తి ఉందని నిరూపించుటకు ఒక కృత్యాన్ని సూచించండి.
జవాబు:
ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్ పై భాగాన్ని కోసి గ్లాసులాగా తయారు చేయండి. దానిలో ఒక సెల్ ఫోన్ ను ఉంచండి. ప్రక్క పటంలో చూపిన విధంగా ఒక రబ్బరు బెలూతో మూసి రబ్బరు బ్యాండుతో గట్టిగా బిగించండి. బెలూను సాగదీసి ఉంచడం వల్ల అది డయాఫ్రం వలె పనిచేస్తుంది. బెలూన్‌ పొర పై కొన్ని చక్కెర పలుకులు లేదా ఇసుక రేణువులను వేసి మరొక సెల్ ఫోన్లో రింగ్ చేయండి. బెలూన్ పొర పై గల చక్కెర పలుకులు లేదా ఇసుక రేణువులు మరియు రబ్బరు పొర కదులుతున్నాయి. సెల్ ఫోన్ రింగ్ ఆపుచేయగానే చక్కెర పలుకులు లేదా ఇసుక రేణువులు, బెలూను రబ్బరు పొర నిలకడగా ఉంటాయి. బెలూను కంపనాలు మరియు చక్కెర లేదా ఇసుక. రేణువుల కదలికలకు కారణం సెల్ ఫోన్ ఉత్పత్తి చేసిన ధ్వని. దీని ద్వారా ధ్వనికి బెలూను రబ్బరు మూత పైన గల ఇసుక రేణువులను కంపింపజేసే శక్తి ఉందని తెలుస్తుంది.
AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని 9

కృత్యం – 5

ప్రశ్న 5.
వర్షం పడేటప్పుడు వినిపించే చప్పుడును పోలిన ధ్వనులను కృత్యం ద్వారా సృష్టించండి.
జవాబు:
మన చేతి వేళ్లను ఉపయోగించి వర్షం వచ్చే శబ్దాన్ని సృష్టించవచ్చును. ఎడమ అరచేతి మీద కుడి చూపుడు వేలితో కొడుతూ శబ్దం చేయాలి. మధ్యవేలిని దానికి జత కలపాలి. తరువాత ఉంగరపు వేలిని, చివరగా చిటికెన వేలితో శబ్దం చేయాలి. తరువాత చిటికెన వేలు నుండి చూపుడు వేలు వరకు ఒక్కొక్కటిగా తీస్తూ శబ్దం చేయండి. ఈ విధంగా తరగతిలోని పిల్లలందరు కలిసి ఒకేసారి ఇలా చేస్తే వర్షం పెరుగుతున్న శబ్దం, వర్షం తగ్గుతున్న శబ్దం వినిపిస్తుంది.

AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని

కృత్యం – 6 ధ్వనిలోని మార్పును పరిశీలించడం :

ప్రశ్న 6.
కంపించే వస్తువు నుండి మరియు వాయిద్య పరికరాలలోని ఖాళీ ప్రదేశాల గుండా ప్రసరించే గాలి కారణంగా ధ్వని ఏర్పడుతుందని జలతరంగిణి కృత్యం ద్వారా వివరించండి.
AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని 10
జవాబు:
4 నుండి 5 లోహపు లేదా గాజు గ్లాసులను తీసుకొని, వాటిని ఆరోహణ తీసుకొని ఒక్కొక్క గ్లాసు అంచుమీద మెల్లగా కొట్టండి. ఈసారి వాటిని సమాన స్థాయిలో నీటితో నింపండి. ప్రతి పాత్రను పైన చెప్పిన విధంగా చెంచాతో కొట్టండి. గ్లాసులో నీటిమట్టం మారే కొలది ఉత్పత్తి అయిన ధ్వనిలో క్రమమైన మార్పు ఉంటుంది. కంపించే వస్తువు నుండి మరియు వాయిద్య పరికరాలలో ఖాళీ ప్రదేశాల గుండా ప్రసరించే గాలి కారణంగా ధ్వని వెలువడుతుంది.

కృత్యం – 7 మాట్లాడుతున్నపుడు స్వరతంత్రులలోని కదలికలను గమనించడం :

ప్రశ్న 7.
మాట్లాడుతున్నపుడు స్వరతంత్రులలోని కదలికలను పరిశీలించి ధ్వని ఏ విధంగా ఏర్పడునో వివరించండి.
జవాబు:
మీ స్నేహితుని తల పైకెత్తమని చెప్పండి. అతని నోటికి అడ్డంగా ఒక చాక్లెట్ పై కాగితాన్ని (Wrapper) ఉంచండి. దాని పైకి బలంగా గాలి ఊదమని చెప్పండి. అతని స్వరపేటికను పరిశీలిస్తే స్వరపేటిక ఉబ్బి ఎక్కువ ధ్వని వెలువడుతుంది. ఈసారి మెల్లగా ఊదమని చెప్పి పరిశీలిస్తే సాధారణ స్థాయిలో ధ్వని వెలువడుతుంది. ఈ ధ్వనులు స్వరతంత్రులు మరియు చాక్లెట్ కాగితాల కంపనాల కలయిక వల్ల ఉత్పత్తి అయినవి.

కృత్యం – 8 ఘన పదార్థాలలో ధ్వని ప్రసారాలను పరిశీలించుట :

ప్రశ్న 8.
ఘన పదార్థాలలో ధ్వని ప్రసరణ జరుగుతుందని ఒక కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని 11
పై కృత్యాల ద్వారా “ధ్వని చెక్క లోహం, దారం వంటి ఘనపదార్థ యానకాల ద్వారా ప్రయాణిస్తుందని” తెలుస్తుంది.

AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని

కృత్యం – 9 ద్రవ పదార్థాలలో ధ్వని ప్రసరణ :

ప్రశ్న 9.
ద్రవ పదార్థాలలో ధ్వని ప్రసరణ జరుగుతుందని ఒక కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని 12

  1. రెండు రాళ్లను తీసుకొని ఒకదానితో మరొకటి గాల్లో కొట్టినప్పుడు ఉత్పత్తి అయ్యే ధ్వనిని మీ మిత్రున్ని వినమనండి.
  2. ఒక వెడల్పాటి బకెట్ ను నీటితో నింపండి.
  3. పక్క పటంలో చూపిన విధంగా చేతిలోని రాళ్లు నీటిలో ఉంచి, ఒక దానితో ఒకటి కొట్టండి.
  4. అదే సమయానికి మీ స్నేహితున్ని ఆ బకెట్ యొక్క బయటి గోడకు చెవిని ఆనించి ధ్వనిని వినమనండి.
  5. గాలిలో విన్న ధ్వనికి, నీటి ద్వారా విన్న ధ్వనికి మధ్య తేడాను మీ మిత్రున్ని అడగండి. గాలిలో కంటె నీటి ద్వారా ఎక్కువ ధ్వని వినబడుతుంది. కావున పై కృత్యం ద్వారా ధ్వని ద్రవాల ద్వారా ప్రయాణిస్తుందని తెలుస్తుంది.

కృత్యం – 10 యానకం లేకపోతే ధ్వని ప్రసరించగలదా?

ప్రశ్న 10.
యానకం లేకపోతే ధ్వని ప్రసరిస్తుందో లేదో ఒక కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని 13

  1. ఒక పొడవైన ప్లాస్టిక్ గ్లాసును లేదా గాజు గ్లాసును తీసుకోండి.
  2. గ్లాసు పొడవుకన్నా తక్కువ పొడవు ఉన్న సెల్ ఫోన్ ను గ్లాసులో నిలువుగా ఉంచండి.
  3. సెల్ ఫోన్లో రింగ్ టోన్ ను ఏర్పాటు చేయండి.
  4. ఆ రింగ్ టోన్ ధ్వని స్థాయిని జాగ్రత్తగా వినండి.
  5. ఇప్పుడు గ్లాసులో ఉన్న గాలిని ప్రక్క పటంలో చూపిన విధంగా మీ నోటితో పీల్చివేయండి.
  6. ఇలా గాలి పీల్చినప్పుడు గాలి బంధనం వల్ల గ్లాసు యొక్క అంచు మీ మూతి చుట్టూ అంటుకుంటుంది.
  7. ఇప్పుడు రింగ్ టోన్ స్థాయిని వినండి. గ్లాసులో గాలి ఉన్నప్పుడు ఎక్కువ ధ్వని వినపడింది.
  8. గ్లాసులోని గాలిని పీల్చిన తర్వాత రింగ్ టోన్ ధ్వని వినబడలేదు.
  9. ఈ కృత్యం ద్వారా ధ్వని ప్రసరణకు యానకం అవసరమని తెలుస్తుంది.

ప్రయోగశాల కృత్యం – 1

ప్రశ్న 11.
ధ్వని తీవ్రతకు, ధ్వనిని ఉత్పత్తి చేసిన వస్తువు కంపన పరిమితికి మధ్య గల సంబంధాన్ని ఒక ప్రయోగం ద్వారా వివరించండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని 14
లక్ష్యం :
ధ్వని తీవ్రతకు, ధ్వనిని ఉత్పత్తి చేసిన వస్తువు కంపన పరిమితికి మధ్యగల సంబంధాన్ని తెలుసుకొనుట.

కావలసిన పరికరాలు :
చెక్కబల్ల, 30 సెం.మీ. పొడవు గల ఇనుప స్కేలు లేదా హాక్-సా బ్లేడు, ఇటుక.

పద్దతి :

  1. బ్లేడు పొడవులో 10 సెం.మీ. బల్ల ఉపరితలంపై ఉండునట్లు, మిగిలిన బ్లేడు భాగం గాలిలో ఉండునట్లుగా అమర్చి ఒక బరువైన ఇటుకను బల్ల ఉపరితలంపై ఉన్న స్కేలుపై ఉంచండి.
  2. కొద్ది బలాన్ని ఉపయోగించి బ్లేడులో కంపనాలను కలుగచేయండి. ఆ కంపనాల కంపన పరిమితిని, విడుదలైన ధ్వనిని పరిశీలించండి. ఈ విధంగా 3,4 సార్లు చేసి కంపనాల కంపన పరిమితిని విడుదలైన ధ్వనిని పట్టికలో నమోదు చేయండి.
  3. ఎక్కువ బలమును ఉపయోగించి బ్లేడులో ‘కంపనాలను కలుగజేసి, ఏర్పడ్డ కంపనాల కంపనపరిమితిని, ధ్వనిని పరిశీలించండి. ఇదే విధంగా 3,4 సార్లు చేసి, పరిశీలనలను ఈ క్రింది పట్టికలో నమోదు చేయండి.

AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని 16
బ్లేడు కంపనాల కంపన పరిమితి పెరుగుతుంటే క్రమంగా ధ్వని తీవ్రత పెరుగుతుంది. బ్లేడు కంపనాల యొక్క కంపన పరిమితి తగ్గుతుంటే క్రమంగా ధ్వని తీవ్రత తగ్గుతుంది.

AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని

ప్రయోగశాల కృత్యం – 2

ప్రశ్న 12.
ధ్వని యొక్క కీచుదనము మరియు కంపనాల మధ్య గల సంబంధాన్ని ప్రయోగపూర్వకంగా వివరించండి.
(లేదా)
ధ్వని యొక్క కీచుదనాన్ని గుర్తించుటను ఒక కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:
లక్ష్యం :
ధ్వని యొక్క కీచుదనం మరియు కంపనాల మధ్యగల సంబంధాన్ని కనుగొనుట.

కావలసిన పరికరాలు :
ఒక చెక్క బల్ల, రెండు 30 సెం.మీ. పొడవు గల హాక్-సా బ్లేడు, రెండు ఇటుకలు.
AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని 15

పద్ధతి :

  1. బల్ల తలంపై ఒక చివర మొదటి బ్లేడు 10 సెం.మీ. పొడవు బల్లపై ఉండునట్లుగా మిగిలిన బ్లేడు భాగం బయటకు గాలిలో ఉండేలాగా అమర్చండి. బల్లపై ఉన్న 10 సెం.మీ. బ్లేడు భాగంపై బరువు కొరకు ఒక ఇటుకను బ్లేడులో, కంపనాలు ఉంచండి.
  2. రెండవ బ్లేడులో 25 సెం.మీ. భాగం బల్లపై మిగిలిన 5 సెం.మీ. భాగం గాలిలో ఉండేట్లు అమర్చండి. (ఇలా అమర్చిన బ్లేడ్ల మధ్య కనీసం 10 సెం.మీ. దూరం ఉండేటట్లు చూడాలి) బల్లపైన ఉంచిన భాగంపై ఇటుకను ఉంచాలి.
  3. రెండు బ్లేడ్లు ఒకే బలముతో కంపనాలకు గురి చేయండి. అప్పుడు బ్లేడ్లలో కలిగే కంపనాలను, వెలువడే ధ్వనులను పరిశీలించి ఈ క్రింది పట్టికలో నమోదు చేయండి.
గాలిలో బ్లేడు పొడవుకంపనాలుధ్వని
స్కేలు 1 : 20 సెం.మీ. పొడవుతక్కువ కంపనాలు
(తక్కువ పౌనఃపున్యము)
తక్కువ కీచుదనము గల ధ్వని వినబడింది.
స్కేలు 2 : 5 సెం.మీ. పొడవుఎక్కువ కంపనాలు
(ఎక్కువ పౌనఃపున్యము)
ఎక్కువ కీచుదనము (పిచ్) గల ధ్వని వినబడింది.

పై ప్రయోగం ద్వారా పొట్టి స్కేలు (ఎక్కువ కంపనాలు గల స్కేలు) ఉత్పత్తి చేసిన ధ్వని యొక్క కీచుదనము (పిచ్) ఎక్కువగా వున్నది. పొడవు స్కేలు (తక్కువ కంపనాలు గల స్కేలు) ఉత్పత్తి చేసిన ధ్వని యొక్క కీచుదనము తక్కువగా ఉన్నది.

ధ్వని యొక్క కీచుదనము (పిచ్) దాని పౌనఃపున్యము (కంపనాల) పై ఆధారపడి ఉన్నది.

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

SCERT AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Physical Science 4th Lesson Questions and Answers కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

8th Class Physical Science 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
కొన్ని దారాలను మాత్రమే మనము కృత్రిమ దారాలు అని ఎందుకంటాం? వివరించండి. (AS1)
జవాబు:

  1. నైలాన్, రేయాన్, అక్టోలిక్ మరియు పాలిస్టర్ వంటి కొన్ని దారాలను కృత్రిమ దారాలు అంటారు.
  2. పెట్రో రసాయనాలను ఎన్నో రసాయనిక ప్రక్రియలకు గురిచేయడం ద్వారా ఏర్పడే దారాలను కృత్రిమ దారాలు లేదా మానవ నిర్మిత దారాలు అంటారు. కృత్రిమ దారాలు అన్నీ పాలిమర్లు.
  3. నైలాన్ అనేది బొగ్గు, నీరు మరియు గాలి నుండి తయారు చేయబడిన కృత్రిమ దారం.
  4. రేయాన్ సెల్యులోజ్ తయారుచేయబడ్డ ఒక కృత్రిమ పట్టుదారం.
  5. అక్టోలిక్ అనేది నేలబొగ్గు, గాలి, నీరు, నూనె మరియు సున్నపురాయి నుండి తయారయ్యే కృత్రిమ ఉన్ని.

ప్రశ్న 2.
వివిధ పదార్థాలను నిలువ చేయడానికి ప్లాస్టిక్ పాత్రలను వాడడానికి గల కారణాలు చెప్పండి. (AS1)
(లేదా)
ప్లాస్టిక్ లను వాడటం వల్ల అనేక హానికర ప్రభావాలు ఉన్నప్పటికీ మనం ప్లాస్టిక్ లను వినియోగిస్తున్నాము. ఆ ప్లాస్టిక్స్ వలన లాభాలేమిటి ?
జవాబు:

  1. ప్లాస్టిక్ నీరు మరియు ఇతర రసాయనాలతో చర్య జరుపదు.
  2. పదార్థాలను క్షయం చేయదు.
  3. ప్లాస్టిక్ చాలా తేలికైనది, దృఢమైనది, మన్నికైనది.
  4. ప్లాస్టిక్ పరిమాణంలోను, విభిన్న రూపాలలోకి మలచగలిగేదిగా ఉంటుంది.
  5. ప్లాస్టిక్ వస్తువులు లోహాల కంటే తక్కువ ధరకు లభిస్తాయి.
  6. ప్లాస్టికు ఉష్ణబంధక మరియు విద్యుత్ బంధక పదార్థాలు.
  7. ప్లాస్టిక్ లను వివిధ రంగులలో తయారుచేసుకోవచ్చును.
    పై కారణాల వలన ప్లాస్టిక్ పాత్రలను వస్తువులను భద్రపరచుకొనేందుకు వాడుతారు.

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

ప్రశ్న 3.
ఈ క్రింది వానిలో ఏ ఏ పదార్థాలను రీసైక్లింగ్ చేయగలమో, వేటిని చేయలేమో వీడదీయండి. (AS1)
ప్లాస్టిక్ బొమ్మలు, విద్యుత్ స్విచ్లు, ప్లాస్టిక్ కుర్చీలు, బాల్‌ పాయింట్ పెన్నులు, టెలిఫోన్ వస్తువులు, ప్లాస్టిక్ పాత్రలు, కుక్కర్ పిడులు, ప్లాస్టిక్ సీసాలు, పాలిథీన్ సంచులు, పాత్రలు, పళ్ళుతోముకునే బ్రష్ లు, ప్లాస్టిక్ చెప్పులు, ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ బకెట్లు మొదలగునవి.
జవాబు:

రీసైక్లింగ్ చేయగల పదార్థాలురీసైక్లింగ్ చేయలేని పదార్థాలు
ప్లాస్టిక్ బొమ్మలు, ప్లాస్టిక్ కుర్చీలు, ప్లాస్టిక్ పాత్రలు, ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ చెప్పులు, ప్లాస్టిక్ బకెట్లువిద్యుత్ స్విచ్ లు, బాల్ పాయింట్ పెన్నులు, టెలిఫోన్ వస్తువులు, కుక్కర్ పిడులు, పళ్ళుతోముకునే  బ్రష్ లు, ప్లాస్టిక్ ప్లేట్లు, పాలిథీన్ సంచులు.

ప్రశ్న 4.
ఎలక్ట్రిక్ స్విచ్ లు థర్మోప్లాస్టిక్ తో తయారుచేస్తే ఏమి జరుగుతుంది? (AS1)
జవాబు:
విద్యుత్ ప్రవాహంలో హెచ్చుతగ్గుల వలన ఎలక్ట్రిక్ స్వి లో ఉష్ణం ఏర్పడుతుంది. థర్మోప్లాస్టిక్ తో తయారుచేసిన ఎలక్ట్రిక్ స్వి లు అయితే ఈ ఉష్ణానికి కరిగిపోతాయి.

ప్రశ్న 5.
థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ కన్నా “ధర్మోప్లాస్టిక్ కు ప్రకృతి నేస్తాలు”. నీవేమి చెబుతావు? ఎందుకు? (AS1)
జవాబు:
థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్ ల కన్నా “థర్మోప్లాస్టికు ప్రకృతి నేస్తాలు” ఈ వాక్యాన్ని నేను సమర్థిస్తాను. ఎందుకంటే

  1. విరిగిపోయిన, వాడలేని, పాతబడిన థర్మోప్లాస్టిక్ ను వివిధ పద్ధతుల్లో శుభ్రపరచి, రీసైకిల్ చేసి తిరిగి కొత్త వస్తువులను తయారుచేయవచ్చును.
  2. థర్మోప్లాస్టిక్ వస్తువులను ప్రతి ఒక్కరూ మళ్లీ మళ్లీ (Reuse) వాడటం ద్వారా పర్యావరణాన్ని కాపాడిన వారమవుతాం.
  3. పట్టణాలలోని ఘన వ్యర్థాలలో ఎక్కువ భాగం థర్మోప్లాస్టిక్ వస్తువులే ఉంటాయి. వాటినుండి సేకరించిన వ్యర్థాలను వివిధ పద్ధతుల ద్వారా విద్యుత్, ఉష్ణం, కంపోస్ట్, ఇంధనాల వంటి వివిధ రూపాలలోనికి మార్చి, ఈ వ్యర్థాలను తిరిగి వనరులుగా ఉపయోగిస్తాం.

ప్రశ్న 6.
కింది వాటిని వివరించండి. (AS1)
ఎ) మిశ్రణం
బి) జీవ విచ్ఛిన్నం చెందడం
సి) రీసైక్లింగ్
డి) వియోగం చెందడం
జవాబు:
ఎ) మిశ్రణం :

  1. ఏదైనా కృత్రిమ దారాన్ని రెండు లేదా ఎక్కువ ఇతర దారాలతో కలిపే ప్రక్రియను మిశ్రణం అంటారు.
  2. టెర్లిన్ ను, నూలుతో మిశ్రణం చేస్తే టెరికాట్ ఏర్పడుతుంది. ఇది సౌకర్యవంతంగా, నలిగిపోనిదిగా ఉంటుంది.
  3. టెర్లిన్, ఊన్నితో మిశ్రణం చెందితే టెరిడోల్ ఏర్పడుతుంది.
  4. టెర్లిన్, సిల్క్ తో మిశ్రణం చెందితే టెరిసిల్క్ ఏర్పడుతుంది.

బి) జీవ విచ్చిన్నం చెందడం :

  1. సహజ ప్రక్రియ ద్వారా పదార్థం సులువుగా వియోగం చెందితే ఆ పదార్థాన్ని జీవ విచ్ఛిన్నం చెందడం అంటారు.
  2. పండ్లు, కూరగాయలు, చనిపోయిన జీవులు జీవ విచ్ఛిన్నం చెందుతాయి.

సి) రీసైక్లింగ్ :

  1. విరిగిపోయి వాడలేని, పాతబడిన ప్లాస్టిక్ లను వివిధ పద్ధతుల్లో శుభ్రపరచి, తిరిగి ఉపయోగించడానికి అనుకూలంగా కొత్త వస్తువులను తయారుచేయుటను రీసైక్లింగ్ అంటారు.
  2. PET (కోడ్-1), PS (కోడ్-6) మరియు HDPE (కోడ్-B) లను రీసైకిల్ చేస్తారు.

డి) వియోగం చెందడం :

  1. కొన్ని పదార్థాలు నీరు, సూర్య కాంతి, ఆక్సిజన్ సమక్షంలో ఉంచినపుడు సూక్ష్మభాగాలుగా విడగొట్టబడతాయి. ఈ సూక్ష్మభాగాలు బ్యాక్టీరియా చేత మరల విభజింపబడే ప్రక్రియనే వియోగం చెందడం అంటారు.
  2. వియోగం చెందడానికి కావలసిన సమయాన్ని బట్టి ఆ పదార్థం జీవ విచ్ఛినం చెందిందా, చెందలేదా నిర్ణయించవచ్చును.

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

7. జతపరచండి. (AS1)

1) పాలిస్టర్ఎ) వంటసామాగ్రి
2) PETబి) కృత్రిమ పట్టు
3) రేయాన్సి) ఎక్కువ సంఖ్యలో మోనోమర్లు
4) నైలాన్డి) ఎలక్ట్రిక్ స్వి చు
5) మెలమిన్ఇ) చిహ్నం
6) పాలిథీన్ఎఫ్) ప్రసిద్ధిగాంచిన దుస్తుల సామాగ్రి
7) బేకలైట్జి) అన్ని దారాలకన్నా దృఢమైనది

జవాబు:

1) పాలిస్టర్ఎఫ్) ప్రసిద్ధిగాంచిన దుస్తుల సామాగ్రి
2) PETఇ) చిహ్నం
3) రేయాన్బి) కృత్రిమ పట్టు
4) నైలాన్జి) అన్ని దారాలకన్నా దృఢమైనది
5) మెలమిన్ఎ) వంటసామాగ్రి
6) పాలిథీన్సి) ఎక్కువ సంఖ్యలో మోనోమర్లు
7) బేకలైట్డి) ఎలక్ట్రిక్ స్వి చు

8. ఖాళీలను పూరించండి. (AS1)

i) కృత్రిమ దారాలను …………………….. అని కూడా పిలుస్తాం.
జవాబు:
మానవ నిర్మిత దారాలు

ii) కృత్రిమ దారాలను ………………… పదార్థాల నుండి సంశ్లేషిస్తారు.
జవాబు:
పెట్రోలియం ముడి

iii) కృత్రిమ దారం లాగే ప్లాస్టిక్ కూడా ………
జవాబు:
పాలిమర్

iv) బట్టలపై లేబిళ్లు ……….
ఎ) చట్ట ప్రకారం అవసరం
బి) దారము రకాన్ని గుర్తించడానికి
సి) ఎ, బి లు రెండూ
డి) పైవేవీ కావు
జవాబు:
సి) ఎ, బి లు రెండూ

v) రేయావ్ దీనితో తయారవుతుంది.
ఎ) నేలబొగ్గు
బి) ఆక్సిజన్
సి) నార
డి) సెల్యులోజ్
జవాబు:
డి) సెల్యులోజ్

vi) పట్టుదారము యొక్క నునుపైన తలము కాంతిని శోషిస్తుంది.
ఎ) అవును
బి) కాదు
సి) చెప్పలేము
జవాబు:
ఎ) అవును

ప్రశ్న 9.
రీసైక్లింగ్ ప్రక్రియను మనం ఎక్కడ ఉపయోగిస్తాం? ఇది ఎలా ఉపయోగకరమైనదో ఉదాహరణతో తెల్పండి. (AS1)
జవాబు:
రీసైక్లింగ్ ప్రక్రియను ప్లాస్టిక్ లో మరియు లోహాలలో ఉపయోగిస్తారు.

ఉదాహరణలు :

  1. (PET చిహ్నం-1 గలవి) వాడిన లేదా పాడయిన శీతలపానీయాలు, నీటి మరియు పండ్ల రసాల సీసాలు మరియు ట్రేలను రీసైక్లింగ్ చేసి వాహనాల పరికరాలను, ఫ్యూజ్ బాక్స్ లను, బంపరను, తలుపుల ఫ్రేములను, కుర్చీలను మరియు టేబులను తయారు చేస్తారు.
  2. HDPE చిహ్నం -2 గలవి) వాడిన లేదా పాడయిన బొమ్మలు, విద్యుత్ బంధక పరికరాలు, పాత్రలు, కుర్చీలు, సీసాలు మొదలగునవి రీసైక్లింగ్ చేసి పెన్నులు, పాటైల్స్, డ్రైనేజి పైపులు మొదలగునవి తయారు చేస్తారు.
  3. (PP చిహ్నం-6 గలవి) వాడినవి లేదా పాడయిపోయిన దువ్వెనలు, ఇంటికప్పులు, TV క్యారి కంటైనర్లు, CD కేసులు, డిస్పోజబుల్ ప్లేట్స్, కప్పులు, కోడిగ్రుడ్డు కేసులు మొదలగునవి రీసైక్లింగ్ చేసి విద్యుత్ బంధకాలు, ఎలక్ట్రికల్ స్విలు, గ్రుడ్ల పెట్టెలు, ఫాస్ట్ ఫుడ్ ప్యాకింగ్లు, ఫోమ్ ప్యాకింగ్ న్లు, క్యారి అవుట్ కంటైనర్లు మొదలగునవి తయారు చేస్తారు.

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

ప్రశ్న 10.
రకరకాల కృత్రిమ దారాలతో తయారుచేసే గృహోపకరణాలు వివరించేటట్లు ఒక పట్టిక తయారు చేయండి. (AS4)
జవాబు:

కృత్రిమ దారంకృత్రిమ దారాలతో తయారుచేసే గృహోపకరణాలు
1. నైలాన్బ్రష్ యొక్క కుంచె, తాళ్ళు, చేపలవేటకు వాడే వలలు, గుడారాలు, చీరలు, స్త్రీల మేజోళ్ళు మరియు కాళ్ళకు వేసుకునే చిన్న మేజోళ్ళు (Socks), బెల్టులు, దిండ్లు (Sleeping bags), డోర్ కర్టన్స్, పారాచూట్లు, ఈతదుస్తులు, లో దుస్తులు (Sheer hosiery), తెరచాపలు, గొడుగులకు వాడే గుడ్డ, బట్టలు, కారు టైర్లు మొదలగునవి.
2. రేయాన్దుస్తులు, దుప్పట్లు, తివాచీలు, లంగోటాలు (Diapers), బ్యాండేజీలు మొదలగునవి.
3. అక్రలిక్స్వెటర్లు, శాలువాలు, దుప్పట్లు, రగ్గులు, కాళ్ళకు వేసుకొనే మేజోళ్ళు (Socks), క్రీడా దుస్తులు, ప్రయాణ సామగ్రి మరియు వాహనాల కవర్లు మొదలగునవి.
4. పాలిస్టర్దుస్తులు, చీరలు, బెడ్ షీట్స్, కార్పెట్స్, జాడీలు, సీసాలు, ఫిల్మ్ లు, తీగలు, ప్లాస్టిక్ వస్తువులు, పరికరాలు మొదలగునవి.

ప్రశ్న 11.
థర్మోప్లాస్టిక్ లకు, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ లకు మోనోమర్ అమరిక విషయంలో ఉండే భేదాలను పట సహాయంతో వివరించండి. (AS5)
జవాబు:

థర్మో ప్లాస్టిక్లుథర్మోసెట్టింగ్ ప్లాస్టికు
1. వేడి చేసినప్పుడు మృదువుగాను, చల్లబరచినప్పుడు కఠినంగాను మారే ధర్మం గల ప్లాస్టికన్ను థర్మోప్లాస్టిక్ అంటారు.1. ఒకసారి ఒక రూపంలోనికి మలచి, చల్లబరచిన తర్వాత దాని రూపాన్ని మరలా వేడిచేసినా సరే మార్చలేని ప్లాస్టిక్ ను థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అంటారు.
2. థర్మోప్లాస్టిక్ లోని మోనోమర్లు రేఖీయ అమరికను కలిగి ఉంటాయి.
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 1
మోనోమర్ల రేఖీయ అమరిక
2. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ లోని మోనోమర్లు అడ్డంగా అనుసంధా నించబడిన అమరిక కలిగి ఉంటాయి.
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 2
మోనోమర్లు అడ్డంగా అనుసంధానించబడిన అమరిక
3. వీటిని వేడి చేసినపుడు ద్రవస్థితిలోనికి, తగినంత చల్లబరిస్తే గాజు స్థితిలోకి ఘనీభవిస్తుంది.3. వీటిని వేడి చేసినపుడు నల్ల బొగ్గుగా మారుతుంది లేదా మండుతుంది.
4. వీటిని రీసైక్లింగ్ చేయవచ్చును.4. వీటిని రీసైక్లింగ్ చేయలేము.

ప్రశ్న 12.
“వస్త్ర పరిశ్రమలో కృత్రిమ దారాల పరిచయం వస్త్రధారణ విషయంలో ప్రపంచమంతటా సంస్కృతి, సాంప్రదాయాలకు అతీతంగా విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది”. దీనిని మీరు ఎలా ప్రశంసిస్తారు? (AS6)
జవాబు:
వస్త్ర పరిశ్రమలో సహజ దారాలు సంస్కృతిని, సంప్రదాయాలను తెలియజేసే విధంగా ఉండేవి. సహజ దారాల స్థానంలో వచ్చిన కృత్రిమ దారాలు సహజ దారాలకంటే మెరుగైన లక్షణాలు కలిగి ఉన్నాయి. పాలిస్టర్ అనే కృత్రిమ దారాన్ని కనుగొన్న తరువాత, పాలిస్టర్ దారాలు వస్త్ర పరిశ్రమలో మరియు దుస్తుల సంస్కృతిలో విప్లవాత్మక మార్పులను తెచ్చాయి. ఎందుకంటే ప్లాస్టిక్ వస్త్రము సులభంగా ముడుచుకుపోదు. ఇది ఎక్కువ మన్నికగాను, సులువుగా ఉతుక్కోవడానికి వీలుగాను మరియు తక్కువ ధరలో ఉంటుంది. అందుకే దుస్తులు తయారుచేయడానికి ఈ దారాలు సరిగ్గా సరిపోతాయి. పాలిస్టర్ మిగిలిన దారాల వలె నేయడానికి కూడా వాడవచ్చును. పాలిస్టర్ దారాన్ని సహజదారాలతో కలిపి మిశ్రణం చెందించడం వల్ల సహజ దారాల మరియు కృత్రిమ దారాల లక్షణాలు గల వస్త్రం తయారగును.

వివిధ వృత్తుల వారికి కావలసిన లక్షణాలు గల వస్త్రాలను కృత్రిమ మరియు మిశ్రణం చెందించగా ఏర్పడే వస్త్రాల నుండి పొందవచ్చును. ఈ వస్త్రాలు ప్రపంచమంతటా సంస్కృతి, సంప్రదాయాలకు అతీతంగా విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాయని చెప్పవచ్చును.

ప్రశ్న 13.
కృత్రిమ దారాలు మన రోజువారీ జీవితాన్ని ఏ విధంగా మార్చివేసినవి? (AS7)
జవాబు:

  1. కృత్రిమ దారాలతో తయారైన గృహోపకరణాల జాబితా చాలా పెద్దది. ఇవన్నీ మన రోజువారీ కృత్యాలతో ముడిపడి ఉంటాయి.
  2. కృత్రిమ దారాలు పట్టు వస్త్రాల కంటే ఎక్కువ మెరుపుగల దుస్తులు తయారు చేయడానికి సహాయపడతాయి.
  3. నైలాన్ దారం బలంగా ఉండి సాగే గుణాన్ని కలిగి ఉండటం వలన ఈ దుస్తులు త్వరగా చిరిగిపోవు.
  4. తక్కువ నీటిని ఉపయోగించి తేలికగా ఉతకవచ్చు.
  5. తివాచీలు తయారుచేయడానికి ప్రస్తుతం ఉన్నికి బదులు నైలాన్ వాడుతున్నారు.
  6. ఈత కొట్టేటప్పుడు ధరించే దుస్తులు, లోదుస్తులు, గొడుగులు, తెరచాపలు, చేపలు పట్టే వలలు, కార్ల టైర్లు వంటి ఉపయోగకరమైన వస్తువులెన్నో తయారుచేస్తున్నారు.
  7. కనుక మన జీవిత విధానం ఈ కృత్రిమ దారాల వినియోగం వలన పూర్తిగా మారిపోయింది.

ప్రశ్న 14.
సుజాత తన తల్లిదండ్రులకు శీతాకాలంలో వేసుకొనే దుస్తులు కొనాలని అనుకొంది. నీవు ఏ రకమైన బట్టలను కొనమని సలహా ఇస్తావు? కారణాలు చెప్పండి. (AS7, AS1))
జవాబు:

  1. సుజాత, తన తల్లిదండ్రులకు శీతాకాలంలో వేసుకొనే దుస్తులను కొనాలని అనుకుంది.
  2. నేనైతే నిభాకు ఈ క్రింది దుస్తులను కొనమని సలహా ఇస్తాను.
  3. సహజమైన ఉన్నితో తయారైన స్వెట్టర్లూ, శాలువాలూ, దుప్పట్లూ మొదలైనవి. కాని ఇవి చాలా ఖరీదైనవి.
  4. శీతాకాలంలో వేసుకొనే దుస్తులలో చాలా వాటిని ప్రస్తుతం అక్రలిక్ అనే కృత్రిమ దారంతో తయారుచేస్తున్నారు.
  5. ఈ అక్రలిక్ చూడటానికి సహజ ఉన్ని మాదిరిగానే ఉంటుంది.
  6. దీనిని కృత్రిమ ఉన్ని అనవచ్చు లేదా నకిలీ ఉన్ని అని కూడా అనవచ్చు.
  7. అక్టోలిక ను తడి లేదా పొడి స్పిన్నింగ్ పద్ధతిలో మెలి పెట్టి పురి పెడతారు.
  8. దారాలు బాష్పీభవనం ద్వారా ఘనస్థితిని పొందుతాయి.
  9. అజోలిక్ తో తయారైన బట్టలు సహజ ఉన్ని బట్టల కన్నా చౌకగా లభిస్తాయి.
  10. కనుక నిభా తన తల్లిదండ్రులకు అక్రలిక్ తో చేసిన దుస్తులను కొనడం మంచిది.

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

ప్రశ్న 15.
వాడిన ప్లాస్టిక్ ను తగిన రీతిలో త్యజించకపోతే (Dispose) వచ్చే అనర్థాలేమిటి? (AS7)
జవాబు:
ప్లాస్టిక్ ను తగిన రీతిలో త్యజించకపోతే వచ్చే అనర్థాలు :

  1. ప్లాస్టిక్ కు జీవ విచ్ఛిన్నం చెందనివి కావున ప్లాస్టిక్ వలన భూమి కలుషితం అవుతుంది.
  2. వాడి విసిరేసిన పాలిథీన్ సంచులు డ్రైనేజీ వ్యవస్థకు అడ్డుపడి, డ్రైనేజి నీరు రోడ్లపై ప్రవహించుట మరియు కాల్వలో డ్రైనేజి నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు పెరిగి వివిధ రోగాలకు కారణమౌతాయి.
  3. ఆవులు, మేకలు మొదలగు జంతువులు పాలిథీన్ సంచుల్లోని ఆహార పదార్థాలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ, శ్వాసక్రియలు చెడిపోవడం ద్వారా జంతువులు చనిపోతున్నాయి.
  4. ప్లాస్టిక్ వ్యర్థాలు చెరువులు, సరస్సులు, నదులు మరియు సముద్రాలలో చేరడం వలన జలచరాలు చనిపోవడం జరుగుతుంది.
  5. ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో చేరడం వలన వర్షం నీరు భూమిలోకి చేరక భూ జలవనరులు క్రమంగా తగ్గిపోతాయి.
  6. ప్లాస్టిక్ వ్యర్థాలను మండిస్తే, వాతావరణంలో విషవాయువులు విడుదలవడం వలన వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది.

ప్రశ్న 16.
“ప్లాస్టిక్ విచక్షణారహిత వాడకం జీవ వైవిధ్యానికి ప్రమాదకర హెచ్చరిక” దీనికి సంబంధించి ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు తీసుకొంటున్న చర్యలేమిటి? (AS7)
జవాబు:

  1. ప్లాస్టిక్ విచక్షణారహిత వాడకం వలన ప్రకృతిలో కాలుష్యం ఎక్కువైపోతుంది.
  2. ఈ వస్తువులు త్వరగా జీవ విచ్ఛిన్నం చెందవు.
  3. అందుచేత ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి “4R” సూత్రాన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు సుప్రీంకోర్టు ఆదేశాల
    మేరకు విధిగా పాటిస్తున్నాయి.
  4. ఈ “4R” లు ఏమంటే
    i) తగ్గించడం (Reduce) : మన నిత్య జీవితంలో ప్లాస్టిక్ ను వీలైనంత తక్కువగా ఉపయోగించాలి.
    ii) మరల ఉపయోగించడం (Reuse) : ప్రతి సారి కొత్త క్యారీ బ్యాగులాంటి వాటిని కొనకుండా వీలైనన్ని ఎక్కువసార్లు మరల మరల తిరిగి వాడాలి.
    iii) తిరిగి ఉపయోగించడానికి అనుకూలంగా తయారు చేయడం (Recycle) : పనికిరాని ప్లాస్టిక్ వస్తువులను వదలివేయకుండ. పాత సామానులు కొనేవాడికి ఇవ్వాలి.
    iv) తిరిగి పొందడం (Recover) : సేకరించిన ప్లాస్టిక్ లాంటి వ్యర్థాలను విద్యుత్, ఉష్ణం వంటి రూపాలలోకి మార్చే పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా అవగాహన కల్పించాలి.
  5. ప్రభుత్వ సంస్థలు, స్థానిక స్వపరిపాలనా సంస్థలు, “మేజిమెంట్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్” కొరకు ఏర్పడిన స్వచ్ఛంద సంస్థలు ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటున్నాయి.

పరికరాల జాబితా

పట్టుచీర, నూలు చీర, స్వెటర్, కార్పెట్, బ్రష్, నైలాన్ తాడు, పూసల దండ, పేపర్ క్లిట్ల దండ, వివిధ దారాలు, దారాల ‘మిశ్రణానికి సంబంధించిన లేబుల్స్, రీసైక్లింగ్ చిహ్నాలు గల వస్తువులు, ప్లాస్టిక్ వస్తువుల నమూనాలు, థర్మో ప్లాస్టిక్ వస్తువులు (పివిసి పైపు ముక్క పాలిథీన్ కవర్, బొమ్మలు, దువ్వెన) థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ వస్తువులు (బేకలైట్ స్విచ్, వంటపాత్ర పిడి, మెలమిన్ (కీబోర్డు, ఫైబర్ ప్లేటు) టూత్ బ్రష్, ప్లాస్టిక్ బకెట్, ప్లాస్టిక్ కప్పు, కూరగాయలు, పండ్ల తొక్కలు, తినగా మిగిలిన పదార్థాలు, కాగితం, నూలు బట్ట, ప్లాస్టిక్ సంచి, ఇనుప స్టాండ్, బరువులు వేయడానికి అనువైన పళ్లెములు, బరువులు, లాండ్రీ లేబుల్ కోడ్స్ చార్టు, పట్టుకారు, సారాయి దీపం, రీసైక్లింగ్ చిహ్నాలు చార్టు.

ప్రయత్నించండి

ప్రశ్న 17.
జుట్టు, ఉన్ని, పట్టు, నూలుదారం, ప్లాస్టిక్ ముక్క, స్వెటర్ దారం, తాడుముక్క మొదలగునవి తీసుకొని జాగ్రత్తగా జ్వాల పరీక్ష (Flame test) ను నిర్వహించండి. వాసన, కరిగే విధానాన్ని బట్టి వాటిని సహజ, కృత్రిమ దారాలుగా వర్గీకరించండి. (AS1)
జవాబు:
జ్వా ల పరీక్ష:
ఉద్దేశ్యము :
జ్వాల పరీక్ష ద్వారా నమూనాలను సహజ, కృత్రిమ దారాలుగా వర్గీకరించుట.

కావలసిన పరికరాలు :
పట్టుకారు, సారాయిదీపం, నమూనాలు (జుట్టు, ఉన్ని, పట్టు, కాగితం, నూలుదారం, ప్లాస్టిక్ ముక్క, స్వెటర్ దారం, తాడుముక్క)

పద్ధతి :

  1. సారాయి దీపమును తీసుకొని వెలిగించండి.
  2. పట్టుకారు సహాయంతో నమూనాలను పట్టుకోండి.
  3. సారాయి దీపపు మంటపై నమూనాను పెట్టండి. మండుతున్నప్పుడు వాసన, కరిగే మార్పులను గమనించండి.
  4. మిగిలిన నమూనాలతో ఇదే విధంగా మరలా చేయండి. ఫలితాలను పట్టికలో నమోదు చేయండి.

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 3

ప్రశ్న 18.
ప్లాస్టిక్ రీసైక్లింగ్ చిహ్నాలు, వాటి పూర్తి పేరు, మరియు దాని సంక్షిప్త నామం, గృహ అవసరాలలో వాటి వినియోగం, రీసైక్లింగ్ అవుతుందా లేదా ఒకవేళ రీసైక్లింగ్ అయితే వాటి నుండి ఏమి తయారు అవుతాయో వీటన్నింటినీ వివరించే ఒక చార్టను తయారుచేయండి. (AS5)
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 4
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 5

8th Class Physical Science 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు Textbook InText Questions and Answers

ఆలోచించండి – చర్చించండి

8th Class Physical Science Textbook Page No. 46

ప్రశ్న 1.
సహజ దారాలకు ప్రత్యామ్నాయాలను గూర్చి మానవులు అన్వేషించడానికి కారణమేమిటి?
జవాబు:

  1. సహజ దారాల ఉత్పత్తి ప్రస్తుతం సరిపోవకపోవడం.
  2. వీటికి మన్నిక తక్కువ.
  3. ఇవి అధిక ఉష్ణం మరియు పీడనాలకు తట్టుకోలేవు.
  4. ఇవి ఎక్కువ నీటిని పీల్చుకుంటాయి.
  5. వీటితో తయారుచేయబడిన వస్త్రాలు త్వరగా ఆరవు.
  6. వీటిని ఎక్కువగా వాష్ చేస్తే పాడవుతాయి. కారణం సంపీడనాలను ఇవి తట్టుకోలేవు.
  7. ఇవి ఎక్కువ ధరను కలిగి ఉంటాయి.
  8. ఇవి ముడులుగా ఉంటాయి కాబట్టి తప్పకుండా ఇస్త్రీ చేయాలి.
  9. ఇవి మెరుపును కలిగి ఉండవు.
  10. వీటికి గట్టితనం తక్కువ.
    పై కారణాల వల్ల మానవులు సహజదారాలకు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారు.

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

ప్రశ్న 2.
ఏ దారపు వనరులు తరిగిపోకుండా ఉంటాయి? ఎందుకు?
జవాబు:
సహజ దారపు వనరులు తరిగిపోకుండా ఉంటాయి. ఎందుకంటే సహజ దారములు వృక్ష మరియు జంతువుల నుండి తయారవుతాయి.

8th Class Physical Science Textbook Page No. 47

ప్రశ్న 3.
ప్రస్తుత స్థానానికి కృత్రిమ దారాల పరిణామం ఎలా జరిగింది?
జవాబు:
సహజ దారాలు మానవ అవసరాల కన్నా తక్కువ పరిమాణంలో ఉత్పత్తి అవుతున్నాయి. సహజ దారాలకు ప్రత్యామ్నాయంగా కృత్రిమ దారాల కొరకు అన్వేషించవలసిన అవసరం ఏర్పడింది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో మొట్టమొదట నైలాన్ అనే కృత్రిమ దారాన్ని కనుగొనడం జరిగింది. నైలాన్ దారం బలంగా ఉండి సాగే గుణమున్న తేలికైన పదార్థం. నైలాన్ తో తయారైన బట్టలు మంచి మెరుపును కలిగి ఉంటూ, తేలికగా ఉతుక్కోవడానికి వీలుగా ఉండడం మరియు త్వరగా ఆరే గుణం ఉండడం వల్ల కృత్రిమ దారాల వాడకం పెరిగింది.

8th Class Physical Science Textbook Page No. 49

ప్రశ్న 4.
పారాచూట్ తయారుచేయడానికి నూలుగుడ్డ, నూలు తాడులను వాడితే ఏం జరుగుతుంది?
జవాబు:
నూలుగుడ్డ, నూలు తాడులను పారాచూట్లో వాడితే కింద పడిపోవడం జరుగుతుంది.

కారణాలు :

  1. నూలు గుడ్డ, నూలు తాడులు అధిక పీడన, సంపీడనాలను తట్టుకోలేవు.
  2. నూలు గుడ్డలో సన్నని రంధ్రాలు ఉండడం వలన గాలి సన్నని రంధ్రాల గుండా సులభంగా ప్రయాణిస్తుంది.
  3. నూలు తాడు అధిక బరువులకు తెగిపోతుంది.

ప్రశ్న 5.
పూర్వకాలంలో చేపలు పట్టేవారు నూలు వలలను వాడేవారు. ప్రస్తుతం వారు నైలాన్ వలలను వాడుతున్నారు. నైలాన్ వలల వాడకం వలన లాభాలు ఏమిటి?
జవాబు:

  1. నైలాన్ దారాలు అధిక బరువులను తట్టుకోగలవు. కావున వలలు తెగిపోవు.
  2. ఇవి గట్టిగా, దృఢంగా ఉండడం వలన చేపలు కొరికినా తెగిపోవు.
  3. ఈ దారాలు తడిసినా పాడుకావు.
  4. ఇవి అధిక పీడనాన్ని తట్టుకోగలవు.
  5. ఇవి నీటిని ఎక్కువగా పీల్చుకోవు. నీటిలో వీటి బరువు ఎక్కువగా ఉండదు.

ప్రశ్న 6.
నైలాన్ చీరలు నూలు చీరల కంటే మెరుగైనవి. మీరు అంగీకరిస్తారా? ఎందుకు?
జవాబు:
నైలాన్ చీరలు నూలు చీరల కంటే మెరుగైనవి. ఎందుకంటే

  1. తేలికగా ఉంటాయి.
  2. మెరుపును కలిగి ఉంటాయి.
  3. ఎక్కువ కాలం మన్నికగా, ఉంటాయి.
  4. సులభంగా ఉతకవచ్చును.
  5. నీటిని ఎక్కువగా పీల్చవు.
  6. త్వరగా ఆరతాయి.
  7. ముడుతలు పడవు. ఇస్త్రీ చేయవలసిన అవసరం ఉండదు.
  8. కీటకాలు తినవు.
  9. పీడన, సంపీడనాలను తట్టుకుంటాయి.
  10. తక్కువ ఖరీదుకు లభిస్తాయి.

8th Class Physical Science Textbook Page No. 50

ప్రశ్న 7.
సహజ పట్టుకంటే కృత్రిమ రేయాన్ మెరుగైనదిగా తయారు కావడానికి ఏ లక్షణాలు తోడ్పడతాయి?
జవాబు:

  1. రేయాన్ సహజ పట్టు కన్నా చవకైనది.
    చెమటను పీల్చుకొనే స్వభావం ఉండడం.
    స్పర్శకు మృదువుగా మరియు సిల్కీగా ఉండడం.
    కాంతి మరియు మెరుపును కలిగి ఉండడం.
    పై లక్షణాలు సహజ పట్టుకంటే కృత్రిమ రేయాన్ మెరుగైనది అనడానికి తోడ్పడుతున్నాయి.

ప్రశ్న 8.
కృత్రిమ దారముతో తయారైన ఇంటి గడప ముందు కాళ్లు తుడుచుకునే గుడ్డ (Door mat) ను కొనాలని భావిస్తే ఎలాంటి దానితో తయారైన కృత్రిమ దారంను ఎన్నుకుంటావు? ఎందుకు?
జవాబు:
రేయాన్ దారముతో తయారైన కాళ్లు తుడుచుకొను (Door mat) గుడ్డను ఎన్నుకుంటాను. ఎందుకంటే రేయాన్ కి నీరు, తేమను పీల్చుకునే స్వభావం ఉన్నది కనుక.

ప్రశ్న 9.
ఆరోగ్య రక్షణకై వాడే లంగోటీలు (Diapers) మరియు బ్యాండేజ్ లను నైలాన్ తో తయారుచేస్తే ఏమి జరుగుతుంది?
జవాబు:
ఆరోగ్య రక్షణకై వాడే లంగోటీలు మరియు బ్యాండేజ్ లను నైలాన్ తో తయారుచేస్తే నీటిని, చెమటను పీల్చుకొనదు.

8th Class Physical Science Textbook Page No. 51

ప్రశ్న 10.
శీతాకాలంలో ఏ రకపు మిశ్రణం దుస్తులు ఎక్కువ అనుకూలంగా ఉంటాయి? ఎందుకు?
జవాబు:
శీతాకాలంలో టెర్లిన్, ఉన్నితో మిశ్రణం చేసిన టెరిడోల్ దుస్తులు ఎక్కువ అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే ఇది సహజదారాలు మరియు కృత్రిమ దారాల ధర్మాలను కలిగి ఉంటుంది.

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

ప్రశ్న 11.
సహజ, కృత్రిమ, మిశ్రణం దుస్తులు మనకు లభ్యమవుతున్నాయి కదా! శుభకార్యాలు, పండుగల సమయంలో ఏ దుస్తులు ధరించడానికి ఇష్టపడతారు? ఎందుకు?
జవాబు:
శుభకార్యాలు, పండుగల సమయంలో సహజ దారాలతో తయారైన పట్టు దుస్తులను ధరించడానికి ఇష్టపడతాను. ఎందుకంటే

  1. శరీరానికి ఎక్కువ గాలిని తగిలేటట్లు చేస్తాయి.
  2. చెమటను పీల్చుకుంటాయి.
  3. శరీరానికి చిరాకును కలిగించే రసాయనాలు ఉండవు.
  4. వేడికి కరగవు కావున శరీరానికి అంటుకుపోవు.
  5. సహజ దారాలు శరీరానికి సౌకర్యంగా ఉంటాయి.

8th Class Physical Science Textbook Page No. 52

ప్రశ్న 12.
సహజ లేదా కృత్రిమ దుస్తులలో వేటిని మీరు ఇష్టపడతారు? ఎందుకు? ఈ రెండింటి మధ్య భేదాలను వ్రాయండి.
జవాబు:
కృత్రిమ దుస్తులు ఇష్టపడతాను. ఎందుకంటే కృత్రిమ దుస్తులు మన్నికైనవి, కాంతిని, మెరుపును కలిగి ఉంటాయి. అన్ని కాలాలకు అణుగుణమైన కృత్రిమ దుస్తులు లభిస్తాయి.

సహజ దుస్తులుకృత్రిమ దుస్తులు
1) సహజ దారాలు ఎక్కువ ఖరీదైనవి.1) కృత్రిమ దారాలు చౌకైనవి.
2) సహజ దుస్తులు ముడతలు పడతాయి.2) కృత్రిమ దుస్తులు ముడతలు పడవు.
3) ఇవి ఎక్కువ నీటిని పీల్చుకుంటాయి.3) ఇవి తక్కువ నీటిని పీల్చుకుంటాయి.
4) ఇవి త్వరగా ఆరవు.4) ఇవి త్వరగా ఆరుతాయి.
5) ఇవి మన్నికైనవి కావు.5) ఇవి మన్నికైనవి.
6) ఇవి కాంతిని, మెరుపును కలిగి ఉండవు.6) ఇవి కాంతిని, మెరుపును కలిగి ఉంటాయి.

ప్రశ్న 13.
మన దుస్తులను ఇంట్లో ఉతకడానికి, లాండీల్లో డ్రైక్లీనింగ్ చేయడానికి తేడా ఏమిటి?
జవాబు:

ఇంట్లో ఉతకడండ్రైక్లీనింగ్
1. దుస్తులను ఉతకడానికి డిటర్జెంట్లు, వాషింగ్ పౌడర్లను ఉపయోగిస్తారు.డ్రైక్లీనింగ్ లో కర్బన ద్రావణులను ఉపయోగిస్తారు.
2. దుస్తులు అధిక ఉష్ణోగ్రత మరియు ఒత్తిడికి లోనౌతాయి.2. దుస్తులు అధిక ఒత్తిడికి లోను కావు.
3. రక్తం, గ్రీజు, నూనె, , పెయింట్ల వంటి మరకలు పోవు.3. రక్తం, గ్రీజు, నూనె, పెయింట్ల వంటి మరకలు పోతాయి.

8th Class Physical Science Textbook Page No. 57

ప్రశ్న 14.
కొన్ని వేపుడు పెనాలకు (Fry Pans) ఆహార పదార్థాలు అంటుకోవు ఎందుకు?
జవాబు:
కొన్ని వేపుడు పెనాలకు ఆహార పదార్థాలు అంటుకోవు. ఎందుకంటే టెఫ్లాతో వేపుడు పెనాలపై పూత పూయబడి ఉంటుంది.

ప్రశ్న 15.
అగ్నిమాపకదళ సిబ్బంది ధరించే దుస్తులు మంటలకు అంటుకోవు. ఎందుకు?
జవాబు:
అగ్నిమాపక దళ సిబ్బంది ధరించే దుస్తులు మంటలకు అంటుకోవు, ఎందుకంటే అవి థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ తో తయారు చేసిన దుస్తులు కాబట్టి.

8th Class Physical Science 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు Textbook Activities

కృత్యములు

కృత్యం – 1

ప్రశ్న 1.
మీ ఇంటిలో సహజ మరియు కృత్రిమ దారాలతో తయారైన వస్తువులను గుర్తించండి. మీ పాఠశాల, ఇల్లు మరియు మీ పరిసరాలలో ఉన్న వివిధ వస్తువులను, గృహోపకరణాలను గుర్తించి ఆ జాబితాను పట్టికలోని సరియైన గడిలో పొందుపరచండి.
జవాబు:

వనరుగృహోపకరణాలు
మొక్కల నుండి వచ్చే సహజ దారాలతో తయారయ్యేవి.నూలు చీర, ఖాదీ బట్టలు, దుప్పట్లు, డోర్ కర్టన్లు, బ్యాండేజీలు మొదలగునవి.
జంతువుల నుండి వచ్చే సహజ దారాలతో తయారయ్యేవి.పట్టు చీర, స్వెటర్లు, శాలువాలు, డోర్ కర్టన్లు, రగ్గులు మొదలగునవి.
కృత్రిమ దారాలతో తయారయ్యేవి.బ్రష్ యొక్క కుంచె, తాళ్లు, చేపల వలలు, గుడారాలు, మేజోళ్లు, బెల్ట్ లు, దిండ్లు, తివాచీలు, ఈత దుస్తులు, గొడుగుకు వాడే గుడ్డ, బ్యాండేజీలు, లంగోటీలు మొదలగునవి.

కృత్యం – 2 పూసలు మరియు పేపర్ క్లిక్స్ అమరిక :

ప్రశ్న 2.
కొన్ని పేపర్ క్లిప్ ను తీసుకొని వాటిని పటంలో చూపినట్లు ఒకదానితో ఒకటి కలపండి. క్లిక్స్ అమరిక పద్ధతిని గమనించండి. పూసల దండకు, పేపర్ క్లిక్స్ గొలుసుకు మధ్య ఏమైనా పోలికలు గుర్తు పట్టగలరా?
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 6
జవాబు:
పూసల దండలోనూ, పేపర్ క్లిప్ ల గొలుసులోనూ ఒక్కొక్క పేపర్ క్లిప్ పేపర్ క్లి గొలుసు పూస లేక ఒక్కొక్క పేపర్ క్లిప్ రెండవ దానితో కలిసి ఒక పెద్ద గొలుసులాగా ఏర్పడినాయి.

కృత్యం – 3 దారాలను గుర్తించడం – మండించే పరీక్ష :

ప్రశ్న 3.
వివిధ సహజ, కృత్రిమ దారాలను మండించి వాటి లక్షణాలను ఒక పట్టికలో నమోదు చేయండి.
(లేదా)
వివిధ రకాల దారాలను కాల్చినపుడు జరిగే మార్పుల ఆధారంగా దారాలను గుర్తించి పట్టికలో నింపుము.
జవాబు:
పరీక్షించవలసిన వివిధ సహజ, కృత్రిమ దారాలను ఒక్కొక్కటిగా తీసుకొని దాని పురిని, ముడులను విప్పి సారాయి దీపముపై మండించితిని. మండినపుడు పరిశీలించి వాటి లక్షణాలను పట్టికలో వ్రాసితిని.

దారంలక్షణాలు (మండించినపుడు)
1. నూలు (పత్తి)వేగంగా మండింది. కాగితం కాలిన వాసన వచ్చింది.
2. ఉన్నినెమ్మదిగా మండింది. వెంట్రుకలు కాలిన వాసన వచ్చింది.
3. పట్టునెమ్మదిగా మండింది. వెంట్రుకలు కాలిన వాసన వచ్చింది.
4. రేయాన్వేగంగా మండింది. కాగితం కాలిన వాసన వచ్చింది.
5. నైలాన్నెమ్మదిగా మండింది. దారము జ్వాలలో కరిగింది.
6. అక్రలిక్నెమ్మదిగా మండింది. దారము జ్వాలలో కరిగింది.

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

కృత్యం – 4

ప్రశ్న 4.
నైలాన్ ఎంత బలమైనది ? వివిధ దారాల బలాలను తెలుసుకొను కృత్యమును వివరించండి.
జవాబు:
క్లాంపుతో ఉన్న ఒక ఇనుపస్టాండును తీసుకోండి. 50 సెం. మీ. పొడవున్న నూలు, ఉన్ని, నైలాన్ మరియు పట్టుదారాలను తీసుకోండి. కింది పటంలో చూపిన విధంగా నూలు దారాన్ని కట్టండి. దారం మరొక చివర బరువులు వేయడానికి వీలుగా ఉండే పళ్లెమును వేలాడదీయండి. ఆ పళ్లెములో మొదట 10గ్రా.ల బరువుతో ప్రారంభించి బరువును దారం తెగేంత వరకు పెంచండి. దారం తెగగానే దాని బరువును పట్టికలో నమోదు చేయండి. ఈ విధంగా వివిధ దారాలతో చేసి బరువులను పట్టికలో నమోదు చేయండి. తీసుకున్న అన్ని దారాలు ఒకే పొడవు, దాదాపు ఒకే మందము ఉండేటట్లు చూడండి.

దారపు రకందారం తెగిపోవడానికి అవసరమైన భారం సంఖ్య  (గ్రాములలో)
1. నూలు250
2. ఉన్ని500
3. పట్టు550
4. నైలాన్1200

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 7

పై కృత్యంలో దారాల బలాలు పెరిగే క్రమం : నూలు < ఉన్ని < పట్టు < నైలాన్

కృత్యం – 6

ప్రశ్న 5.
ఇచ్చిన సీసా (Bottle) PET సీసా అని ఎలా చెప్పగలవు?

మీ తరగతి స్నేహితుల నుండి వేర్వేరు నీటి సీసాలను సేకరించి వాటిని జాగ్రత్తగా పరిశీలించండి. సీసాల అడుగున త్రిభుజాకారములో ఏదైనా గుర్తు ఉన్నదా? లేదా బ్రాండ్ లేబుల్ స్టిక్కర్ (brand label sticker) పైన ఆ గుర్తు ఉందా? ఆ త్రిభుజంలో ఏ అంకె ఉన్నది? కింది పటంను పరిశీలించండి. చాలా బాటిళ్లకు త్రిభుజాకోరం మధ్యలో 1 అనే అంకె ఉండడం గమనిస్తావు. ఇలా ‘1’ ఉన్నట్లైతే అది PET బాటిల్ అవుతుంది.
రెసినను గుర్తించేందుకు చిహ్నములు :
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 8

చిహ్నముల సంఖ్యలు (Code Numbers)

  1. పాలీఎథిలీన్ టెరిఫాల్ట్ (PET, PETE)
  2. అధిక సాంద్రత గల పాలీ ఎథిలీన్ (HDPE)
  3. పాలీవినైల్ క్లోరైడ్ (PVC)
  4. అల్ప సాంద్రత గల పాలీ ఎథిలీన్ (LDPE)
  5. పాలీ ప్రొపిలీన్ (PP)
  6. పాలీ స్టెరీన్ (PS)
  7. ఇతరము (1, 2, 3, 4, 5 లేక 6 అని స్పష్టంగా లేని వాటిని లేదా ఒకటి కంటే ఎక్కువ రెసిన్ కలయిక ద్వారా ఏర్పడిన వాటిని ఈ కోడ్తో సూచిస్తారు.)

కృత్యం – 7

ప్రశ్న 6.
వివిధ రకాల వస్తువులను వాటికి గల రీసైక్లింగ్ చిహ్నం ద్వారా గుర్తించండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 9

కృత్యం – 8

ప్రశ్న 7.
ప్లాస్టిక్ రకాలు :
ప్లాస్టిక్ తో తయారైన ఒక PP బాటిల్, మరొక సాధారణమైన బాటిల్ (PET)ను తీసుకొని వేడి నీటిని రెండింటిలో పోయండి.
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 10

a) ఏమి మార్పులను గమనించారు?
జవాబు:
సాధారణమైన బాటిల్ ముడుచుకొనిపోయింది. తద్వారా దాని ఆకృతి మారినది.

b) రూపం మారిన సీసా యొక్క చిహ్నము (Code) ను చూడండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 11

c) టప్పర్ వేర్ ప్లాస్టిక్ ఏ రకమైనదో నీవు చెప్పగలవా?
జవాబు:
థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

ప్రయోగశాల కృత్యం

ప్రశ్న 8.
మీకు ఇచ్చిన ప్లాస్టిక్ థర్మో ప్లాస్టిక్లు మరియు థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ లను గుర్తించండి.
(లేదా)
ప్లాస్టిక్ దువ్వెన, పళ్ళుతోముకునే బ్రష్, ప్లాస్టిక్ బకెట్, కుక్కర్ పిడిలు, ఎలక్ట్రిక్ స్విచ్, ప్లాస్టిక్ ప్లేటు, కాఫీ మగ్లను నీకు ఇచ్చినపుడు ఏ కృత్యం చేయడం ద్వారా ఏది థర్మోప్లాస్టిక్, ఏది థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్ అని గుర్తించగలవో ఆ కృత్యమును వివరింపుము.
ఉద్దేశము :
జ్వాల పరీక్షను ఉపయోగించి థర్మోప్లాస్టికు మరియు థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ లను గుర్తించుట.

కావలసిన పరికరాలు :
పట్టుకారు, సారాయి దీపం, ఇచ్చిన ప్లాస్టిక్ నమూనాలు.
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 12

పద్ధతి :

  1. సారాయి దీపమును తీసుకొని దానిని వెలిగించండి.
  2. పట్టుకారు సహాయంతో ప్లాస్టిక్ నమూనాను పట్టుకోండి.
  3. సారాయి దీపపు మంటపై ఈ నమూనాను పెట్టండి. మండుతున్నప్పుడు జరుగుతున్న మార్పులను గమనించండి.
  4. ఈ విధంగా అన్ని నమూనాలను పరీక్షించండి. మీ పరిశీలనలను పట్టికలో నమోదు చేయండి.
  5. వేడిచేసినప్పుడు ముడుచుకుపోయే, వంచడానికి వీలయ్యే వాటిని థర్మోప్లాస్టిక్ అంటారు.
  6. ఒకసారి మలచిన తర్వాత వేడిచేయుట ద్వారా మృదువుగా మార్చలేకపోతే అటువంటి థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అని అంటారు.
ప్లాస్టిక్ నమూనామెత్తబడడం/కాలిన వాసనతో మండడం/తర్వాత గట్టిపడడంథర్మోప్లాస్టిక్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్
1. టూత్ బ్రష్ కుంచెనెమ్మదిగా మండి మెత్తబడడం, కాలిన వాసనతో మండడంథర్మోప్లాస్టిక్
2. దువ్వెనమెత్తబడడం, కాలినవాసనతో మండడంథర్మోప్లాస్టిక్
3. బకెట్ చిన్నముక్కమెత్తబడడం, కాలిన వాసనతో మండడంథర్మోప్లాస్టిక్
4. వంటపాత్ర పిడితర్వాత గట్టిపడడంథర్మోసెట్టింగ్ ప్లాస్టిక్
5. విద్యుత్ స్విచ్తర్వాత గట్టిపడడంథర్మోసెట్టింగ్ ప్లాస్టిక్
6. పళ్లెంతర్వాత గట్టిపడడంథర్మోసెట్టింగ్ ప్లాస్టిక్
7. కాఫీకప్పుతర్వాత గట్టిపడడంథర్మోసెట్టింగ్ ప్లాస్టిక్

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

కృత్యం – 9 జీవ విచ్ఛిన్నం చెందేవి, జీవ విచ్ఛిన్నం చెందనివి :

ప్రశ్న 9.
ఇచ్చిన పదార్థాలలో జీవ విచ్ఛిన్నం చెందేవి, జీవ విచ్ఛిన్నం చెందనివి గుర్తించి, జీవ విచ్ఛిన్నం చెందుటకు పట్టేకాలాన్ని కనుగొనండి.
జవాబు:
ఒక గుంతను తవ్వి, ఇచ్చిన పదార్థాలను గుంతలో వేయండి. కొన్ని రోజుల తర్వాత గుంతను మరల తవ్వి ఏ పదార్థాలు భూమిలో కలిసిపోయాయో, ఏవి మిగిలిపోయాయో పరిశీలించండి. వివరాలను పట్టికలో వ్రాయండి.

వ్యర్థం పేరుభూమిలో కలిసిపోవడానికి పట్టేకాలంమార్పు
1. కూరగాయలు, పండ్ల తొక్కలు10 – 20 రోజులుజీవ విచ్ఛిన్నం చెందును.
2. తినగా మిగిలిన పదార్థాలు10-20 రోజులుజీవ విచ్ఛిన్నం చెందును.
3. కాగితం10-30 రోజులుజీవ విచ్ఛిన్నం చెందును.
4. నూలు బట్ట2-6 నెలలుజీవ విచ్ఛిన్నం చెందును.
5. ప్లాస్టిక్ సంచి100 సం||ల కన్నా ఎక్కువజీవ విచ్ఛిన్నం చెందదు.

AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం

SCERT AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Physical Science 3rd Lesson Questions and Answers మన చుట్టూ ఉన్న పదార్థం

8th Class Physical Science 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
కింది వాటిని వివరించే కృత్యాలను తెలపండి. (AS1)
(అ) కణాల చలనం (ఆ) కణాల మధ్య ఆకర్షణ , (ఇ) కణాల మధ్య స్థలం
జవాబు:
(అ) కణాల చలనాన్ని వివరించే కృత్యం :

  1. రెండు ‘250 మి.లీ. బీకర్లు తీసుకొని వాటిలో కొద్దిగా నీరు నింపండి.
  2. ఒక డ్రాపర్ సహాయముతో ఎరుపు / నీలం ఇంకును ఒక బీకరు గోడల వెంబడి నీటిలో కలపండి.
  3. రెండవ బీకరులోని నీటికి పొటాషియం పర్మాంగనేటు (KMNO4) ద్రావణాన్ని కలపండి.
  4. మొదటి బేకరులో ఇంకు కణాలు నెమ్మదిగా నీటిలో వ్యాపనం చెందడాన్ని గమనిస్తాము.
  5. రెండవ బీకరులో పొటాషియం పర్మాంగనేటు కణాలు నీటిలో త్వరగా వ్యాపనం చెందడాన్ని గమనిస్తాము.
  6. ఈ కృత్యం ద్వారా పదార్థంలోని కణాలు చలిస్తాయని తెలుస్తుంది.

(ఆ) కణాల మధ్య ఆకర్షణను వివరించే కృత్యం : (కృత్యం – 9 )
AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం 1

  1. ఒక కుళాయి (నల్లా)ను విడిచి నీరు ధారగా వచ్చునట్లు చేయండి.
  2. నీటి ధారను మధ్యగా మీ చేతి వేలితో విడగొట్టే ప్రయత్నం చేయండి.
  3. నీటి ధారను పాక్షికంగా విడగొట్టగలిగాముగాని, శాశ్వతంగా విడగొట్టలేము.
  4. నీటి అణువుల మధ్య గల ఆకర్షణ బలమే నీటి ధార విడిపోకుండా నిరంతరంగా కలిసి ఉండడానికి కారణము.
  5. ఇప్పుడు ఒక మేకును మీ చేతితో విరగగొట్టడానికి ప్రయత్నం చేయండి.
  6. మేకులోని కణాల మధ్యగల ఆకర్షణ బలం చాలా ఎక్కువగా ఉండడం వల్ల మేకును విరగగొట్టలేము.
  7. ఇదే విధంగా సుద్దముక్కను విరవడానికి ప్రయత్నించినపుడు సులభంగా విరవగలము.
  8. దీనికి కారణం, సుద్దముక్కలోని కణాల మధ్య గల బలహీన ఆకర్షణ బలాలే.
  9. పై పరిశీలనల ద్వారా పదార్థపు కణాల మధ్య ఆకర్షణ బలం ఉంటుందని, ఆ బలం పదార్థ కణాలను కలిపి ఉండేలా చేస్తుందని చెప్పవచ్చు.
  10. కణాల మధ్య ఉండే ఈ ఆకర్షణ బలం పదార్థం యొక్క అన్ని స్థితులలో ఒకేలా ఉండదు.

(ఇ) కణాల మధ్య స్థలాన్ని వివరించే కృత్యం : (కృత్యం – 8)
AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం 2

  1. ఒక బీకరులో కొంత నీటిని తీసుకొని దాని మట్టాన్ని గుర్తించండి.
  2. దానికి కొద్దిగా ఉప్పును కలిపి, అది కరిగే వరకు గాజు కడ్డీతో తిప్పండి.
  3. నీటి మట్టంలో ఏమైనా తేడా ఉందేమో గమనించండి. ఎటువంటి ఆ తేడాను గమనించము.
  4. మరికొంత ఉప్పును కలిపి చూడండి.
  5. మరల నీటి మట్టాన్ని గుర్తించండి. ఇప్పుడు కూడా ఎటువంటి తేడాను గమనించము.
  6. బీకరులోని నీటిలో కొంత ఉప్పు కరగకుండా ఉండే వరకు ఈ ప్రక్రియను కొనసాగించండి.
  7. ఈ కృత్యము నుండి ఘన, ద్రవ పదార్థాలలోని కణాల మధ్య కొంత ఖాళీస్థలం ఉంటుందని తెలుస్తుంది.
  8. ఘన పదార్థాలను ద్రవ పదార్థాలలో కరిగించినపుడు ఘన పదార్థాలలోని కణాలు ద్రవాల మధ్య గల ఈ ఖాళీ స్థలంలోకి చేరతాయి.
  9. ఈ విధంగా కణాలు ఖాళీ స్థలాన్ని ఆక్రమించిన తరువాత ఘన పదార్థంలోని కణాలను, ఆక్రమించుకోవడానికి ఖాళీ స్థలం లేకపోవడం వల్ల కరగకుండా ఉండిపోతాయి.

AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం

ప్రశ్న 2.
వ్యాపన ధర్మం ఆధారంగా పదార్థ లక్షణాలను వివరించండి. (AS1)
జవాబు:
వ్యాపన ధర్మం ఆధారంగా పదార్థ లక్షణాలు కింది విధంగా ఉన్నాయి. అవి :

  1. పదార్థం అతి సూక్ష్మమైన కణాలచే నిర్మింపబడి ఉంటుంది.
  2. పదార్థంలోని కణాల మధ్య ఖాళీ స్థలం ఉంటుంది.
  3. ఘన మరియు ద్రవ పదార్థ కణాలు ద్రవాలలోకి వ్యాపనం చెందుతాయి.
  4. వాయు కణాలు వాయు పదార్థంలోకి వ్యాపనం చెందుతాయి.
  5. వ్యాపన రేటు వాయు పదార్థాలకు అధికంగాను, ఘన పదార్థాలకు అత్యల్పంగాను, ద్రవ పదార్థాలకు మధ్యస్థంగాను ఉంటుంది.
  6. ఘన పదార్థాలను ద్రవ పదార్థాలలో కరిగించినపుడు, ఘన పదార్థాలలోని కణాలు ద్రవకణాల మధ్య గల ఖాళీ స్థలంలోకి చేరతాయి.
  7. పదార్థం యొక్క కణాలు ద్రవ మరియు వాయు పదార్థాలలో నిరంతరం చలిస్తుంటాయి.

ప్రశ్న 3.
“నీటిలో చక్కెర కలిపినపుడు ద్రావణం ఘనపరిమాణం పెరగదు.” ఈ వాక్యం సరైనదా? కాదా? కారణాన్ని తెలపండి. చక్కెర, నీటి పరిమాణాలను దృష్టిలో పెట్టుకుని పై వాక్యాన్ని గురించి వ్యాఖ్యానించండి. (AS1)
ఈ వాక్యం సరైనదే.
కారణం :
చక్కెరను నీటిలో కలిపినపుడు చక్కెర కణాలు నీటి అణువుల మధ్యనున్న ఖాళీ స్థలాన్ని ఆక్రమిస్తాయి. కావున నీటి ఘనపరిమాణములో ఎటువంటి మార్పూ ఉండదు.

ప్రశ్న 4.
పదార్థ స్థితిలో మార్పు జరిగినపుడు దాని ద్రవ్యరాశిలో మార్పు ఉంటుందా? ఉదాహరణతో వివరించండి. (AS1)
జవాబు:

  1. ఒక బీకరును తీసుకొని దానిని మంచు ముక్కలతో నింపండి.
  2. స్ప్రింగు బాలెన్స్ ద్వారా మంచు ముక్కలతో సహా బీకరు ద్రవ్యరాశిని (m1) కనుగొనండి.
  3. బీకరును కొంత సేపు నిలకడగా ఉంచి మంచు ముక్కలు కరగనివ్వండి.
  4. ఇప్పుడు మరల స్ప్రింగు బాలెన్స్ సహాయంతో బీకరు ద్రవ్యరాశిని (m2) కనుగొనండి.
  5. m1 = m2 అని మనము గమనిస్తాము.
  6. దీని ద్వారా పదార్థ స్థితిలో మార్పు జరిగినపుడు దాని ద్రవ్యరాశిలో మార్పు ఉండదని తెలుస్తుంది.

ప్రశ్న 5.
అన్ని పదార్థాలు వేడిచేసినపుడు ఘనస్థితి నుండి ద్రవస్థితికి, ద్రవస్థితి నుండి వాయుస్థితికి మారుతాయా? వివరించండి. (AS1)
జవాబు:
అన్ని పదార్థాలు వేడిచేసినపుడు ఘనస్థితి నుండి ద్రవస్థితికి, ద్రవస్థితి నుండి వాయుస్థితికి మారవు.
ఉదా :

  1. చెక్కను వేడిచేసినపుడు అది ఘనస్థితి నుండి ద్రవస్థితికి మారదు. కానీ దాని రూపంలో మార్పు వస్తుంది.
  2. రక్తాన్ని వేడిచేసినపుడు ద్రవస్థితి నుండి ‘ఘనస్థితికి మారును.

AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం

ప్రశ్న 6.
కింది వానిని నిర్వచించండి. (AS1)
అ) ద్రవీభవన స్థానం – ఆ) మరుగుస్థానం ఇ) ఇగురుట
జవాబు:
అ) ద్రవీభవన స్థానం :
ఏ ఉష్ణోగ్రత వద్ద ఘనపదార్థం కరిగి ద్రవ పదార్థంగా మారుతుందో, ఆ ఉష్ణోగ్రతను ద్రవీభవన స్థానం అంటారు.

ఆ) మరుగుస్థానం :
వాతావరణ పీడనం వద్ద ద్రవాలు బాష్పంగా మారే ఉష్ణోగ్రతను ‘మరుగుస్థానం’ అంటారు.

ఇ) ఇగురుట :
మరుగు స్థానం కన్నా దిగువున ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ద్రవాలు బాష్పంగా మారగలిగే దృగ్విషయాన్ని ‘ఇగురుట’ అంటారు.

ప్రశ్న 7.
కింద ఇవ్వబడిన వాక్యాలను సరిచేయండి. (AS1)
అ) వాతావరణ పీడనంలో 100°C.వద్ద నీరు మరుగును.
జవాబు:
ఈ వాక్యము సరియైనది.

ఆ) ద్రవం ఉష్ణోగ్రత మరుగుస్థానం దాటిన తరువాత మాత్రమే ద్రవం ఇగురుతుంది.
జవాబు:
ఈ వాక్యము సరియైనది కాదు.
కారణం :
మరుగు స్థానం దిగువన ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ద్రవం ఇగురుతుంది.

ఇ) ఘన పదార్థాలలో కణాల మధ్య ఎక్కువ స్థలం ఉంటుంది.
జవాబు:
ఈ వాక్యం సరియైనది కాదు.

కారణం :

  1. ఘన పదార్థాలలో కణాల మధ్య ఖాళీ స్థలం చాలా తక్కువ.
  2. దీనివల్ల కణాల మధ్య ఆకర్షణ బలం అధికంగా ఉంటుంది.
  3. అందువల్లనే ఘనపదార్థాలు నిర్దిష్ట ఆకారాన్ని, స్థిరమైన ఘనపరిమాణాన్ని కలిగి ఉంటాయి.

ఈ) వాయు పదార్థాలలో కణాల మధ్య బలమైన ఆకర్షణ బలం ఉంటుంది.
జవాబు:
ఈ వాక్యము సరియైనది కాదు.

సరైన వాక్యం :
వాయు పదార్థాల కణాల మధ్య బలహీనమైన ఆకర్షణ బలం ఉంటుంది.

వివరణ :

  1. వాయువులలో కణాల మధ్య ఖాళీ స్థలం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కణాల మధ్య ఆకర్షణ బలాలు చాలా బలహీనంగా ఉంటాయి.
  2. దీనివల్ల వాయు పదార్థాలు స్థిరమైన ఆకారాన్ని గాని, నిర్దిష్టమైన ఘనపరిమాణాన్ని గాని కలిగి ఉండవు.
  3. వాయు పదార్థాలను మూయబడిన సిలిండర్లలో మాత్రమే నిలువ చేస్తారు.

ప్రశ్న 8.
వేడిగా ఉన్న ‘టీ’ ని కప్పుతో పోల్చినపుడు సాసర్ తో త్వరగా త్రాగవచ్చు. ఎందుకు? (AS1)
జవాబు:

  1. సాసర్ యొక్క ఉపరితల వైశాల్యము కప్పు యొక్క ఉపరితల వైశాల్యము కన్న ఎక్కువ.
  2. ఉపరితల వైశాల్యం పెరిగినపుడు వేగంగా ఇగరడం మనకు తెలుసు.
  3. దీనివల్ల వేడి ‘టీ’ లోని కణాలు కప్పుకన్నా సాసర్ నుండి త్వరగా తప్పించుకొనిపోగలవు.
  4. అందువల్ల కప్పుకన్నా సాసరులో టీ త్వరగా చల్లారును.

ప్రశ్న 9.
నీరు ఘనీభవించి మంచుగా మారుతుంది. ఈ ప్రక్రియలో ఉష్ణోగ్రత ………. (AS1)
అ) కోల్పోతుంది ఆ) గ్రహిస్తుంది ఇ) మార్పు ఉండదు
ఈ) ఆయా పరిస్థితులననుసరించి గ్రహించడం కాని, కోల్పోవడం కాని జరుగుతుంది.
జవాబు:
అ) కోల్పోతుంది.

ప్రశ్న 10.
కింద ఇవ్వబడిన ఉష్ణోగ్రతలను సెల్సియస్ డిగ్రీలలోకి మార్చండి. (AS1)
అ) 283K
ఆ) 570K
జవాబు:
అ) 283K
283K = 283 – 273 = 10
∴ 283K = 10°C

ఆ) 570K
570K = 570 – 273 = 297
∴ 570K = 297°C

AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం

ప్రశ్న 11.
కింద ఇవ్వబడిన ఉష్ణోగ్రతలను కెల్విన్ డిగ్రీలలోనికి మార్చండి. (AS1)
అ) 27°C
ఆ) 367°C
జవాబు:
అ) 27°C
0°C = 273K
27°C = 273 + 27 = 300
∴ 27°C = 300K

ఆ) 367°C
0°C = 273K
367° = 273 + 367 = 640
∴ 367°C = 640K

ప్రశ్న 12.
ఖాళీలను పూర్తి చేయండి. (AS1)
అ) పదార్థాన్ని ఒక స్థితి నుండి మరొక స్థితిలోకి మార్చడానికి ………. ను తగ్గించాలి, లేదా ……. ను పెంచాలి.
జవాబు:
ఉష్ణోగ్రత, పీడనము

ఆ) ఘన పదార్థం ద్రవస్థితిలోకి మారకుండానే నేరుగా వాయు స్థితిలోకి మారడాన్ని ……… అంటారు.
జవాబు:
ఉత్పతనం

ప్రశ్న 13.
కింది వాటిని జతపరచండి. (AS1)

1. ద్రవస్థితి నుండి వాయు స్థితికి మార్పుA. వాయువు
2. సంపీడ్యము కాకపోవటంB. ఘనస్థితి
3. వీలైనంత విస్తరించటంC. కణం
4. పదార్థంలో భాగంD. ఇగురుట

జవాబు:

1. ద్రవస్థితి నుండి వాయు స్థితికి మార్పుD. ఇగురుట
2. సంపీడ్యము కాకపోవటంB. ఘనస్థితి
3. వీలైనంత విస్తరించటంA. వాయువు
4. పదార్థంలో భాగంC. కణం

ప్రశ్న 14.
అత్తరు ఉంచిన స్థానం నుండి కొన్ని మీటర్ల దూరం వరకు వాసనను గుర్తించగలం. ఎందుకు? (AS2, AS1)
జవాబు:

  1. వాయు కణాలు, గాలిలో వేగంగా చలిస్తాయని మనకు తెలుసు.
  2. అదే విధంగా అత్తరు కణాలు కూడా గాలిలో కొన్ని .మీటర్ల దూరం వరకు చలిస్తాయి.
  3. అందువల్ల అత్తరు ఉంచిన స్థానం నుండి కొన్ని మీటర్ల దూరం వరకు వాసనను గుర్తించగలం.

ప్రశ్న 15.
శరీరంపై వేడి నీరు కన్నా నీటి ఆవిరి (steam) ఎక్కువ గాయం కలుగజేస్తుంది. ఎందుకు? (AS2, AS1)
జవాబు:

  1. వేడి నీటి కణాలకన్నా నీటి ఆవిరి కణాలకు ఎక్కువ శక్తి ఉంటుంది.
  2. బాష్పీభవన గుప్తోష్ణం రూపంలో నీటి ఆవిరి కణాలు అధిక శక్తిని గ్రహించడం వల్ల వీటి శక్తి అధికంగా ఉంటుంది.
  3. అందువల్ల శరీరంపై వేడి నీరు కన్నా నీటి ఆవిరి ఎక్కువ గాయం కలుగజేస్తుంది.

ప్రశ్న 16.
ఘన, ద్రవ, వాయుస్థితులలో కణాల అమరికను చూపే నమూనాను రూపొందించండి. (AS5)
జవాబు:
విద్యార్థులు జాగ్రత్తగా ఆలోచించి తమ సొంత నమూనాలు ఉపాధ్యాయుని సహకారంతో తయారు చేసుకోవాలి.

AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం

ప్రశ్న 17.
శరీరంలోని చెమట ద్వారా మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే ప్రక్రియను నీవు ఎలా ప్రశంసిస్తావు? (AS6)
జవాబు:

  1. మనం ఏదైనా భౌతిక వ్యాయామం చేసినపుడు కానీ, ఎండలో కష్టపడి పనిచేసినప్పుడు గాని మన శరీరంపై చెమట ఏర్పడుటను గమనిస్తాము.
  2. మన శరీరంలోని వేడిని సంగ్రహించిన చెమట శరీర ఉపరితలం నుండి ఇగురును.
  3. అనగా ద్రవరూపంలోని చెమట బిందువులు, మన శరీరం నుండి వేడిని సంగ్రహించి పరిసరాలలోనికి ఇగిరిపోవును.
  4. దీనివల్ల మనము చల్లదనాన్ని అనుభవిస్తాము.

8th Class Physical Science 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం Textbook InText Questions and Answers

ఆలోచించండి – చర్చించండి

8th Class Physical Science Textbook Page No. 34

ప్రశ్న 1.
రబ్బర్ బాండ్ లాగండి, దాని ఆకారం మారిందా?
రబ్బర్ బాండ్ ఘన పదార్థమా లేక ద్రవ పదార్థమా? ,ఎందుకు? అలాగడం ఆపినపుడు ఏం జరుగుతుంది? అలాగే ఎక్కువగా లాగినపుడు ఏం జరుగుతుంది? ఆలోచించండి.)
జవాబు:

  1. రబ్బరు బ్యాండును లాగినపుడు దాని ఆకారం మారుతుంది.
  2. ఇది ఒక ఘనపదార్థం.
  3. లాగడం ఆపినపుడు తిరిగి పూర్వపు ఆకారాన్ని పొందుతుంది.
  4. అలాగే ఎక్కువగా లాగినపుడు అది తన ఆకారాన్ని శాశ్వతంగా కోల్పోతుంది. (తెగిపోతుంది)

కారణం :
రబ్బరు బాండ్ ఘనపదార్థమే అయినప్పటికీ, దానిని తయారుచేసిన పదార్థ కణాల స్వభావం వల్ల పై ఫలితాలు కనబడుతాయి.

ప్రశ్న 2.
సన్నని పొడిగా ఉన్న ఉప్పును కొంత పరిమాణంలో తీసుకుని రెండు వేర్వేరు గాజు గ్లాసులలో వేసినపుడు ఆ ఉప్పు ఏ ఆకారాన్ని పొందింది? ఆకారంలో వచ్చిన మార్పు కారణంగా ఉప్పు ద్రవస్థితిలో ఉందని చెప్పగలమా? సమర్థించండి.
జవాబు:

  1. పొడిగా ఉన్న ఉప్పు అది పోసిన పాత్ర యొక్క ఆకారాన్ని పొందుతుంది.
  2. ఇది ఒక ఘనపదార్థము.

సమర్థన :

  1. స్థితి లేదా ఆకారంలోని మార్పు అనగా కణాల అమరికలో పూర్తి మార్పు.
  2. కానీ పొడిగానున్న ఉప్పు అతి సూక్ష్మ కణాల కలయిక. ఇవి తమ ఆకారాన్ని కోల్పోవు.

ప్రశ్న 3.
ఒక స్పాంజ్ ముక్కను తీసుకొని దాని ఆకారాన్ని పరిశీలించండి. స్పాంజ్ ను మీరు అదమగలరా? ఇది ఘన పదార్ధమేనా? ఎందుకు? (స్పాంజ్ ను అదిమినపుడు దాని నుండి ఏదైనా పదార్థం బయటకు వస్తుందా? ఆలోచించండి) మనం కర్రముక్కను ఎందుకు అదమలేం?
జవాబు:
స్పాంజ్ ని అదమగలము. ఇది ఒక ఘనపదార్థము.
సమర్థన:

  1. సాధారణ దృఢ వస్తువు కన్నా, స్పాంజ్ లోని కణాల మధ్య ఖాళీ స్థలం కొంచెం ఎక్కువగా ఉంటుంది.
  2. కావున దీనిని అదిమి, దాని ఆకారాన్ని మార్చగలము.
  3. చెక్కముక్కలో కణాల మధ్య ఖాళీ స్థలం చాలా తక్కువగా వుంటుంది.
  4. కావున కర్ర/ చెక్కను సాధారణ పరిస్థితులలో అదిమి, దాని ఆకారాన్ని మార్చలేము.

8th Class Physical Science Textbook Page No. 42

ప్రశ్న 4.
వేసవి కాలంలో నూలు దుస్తులు ఎందుకు ధరిస్తాము?
జవాబు:

  1. వేసవిలో బాహ్య వాతావరణంలో అధిక ఉష్ణోగ్రత వల్ల మన శరీరం నుండి చెమట అధికంగా వెలువడుతుంది.
  2. చెమట బాష్పంగా మారినపుడు మన శరీరం చల్లగా ఉందనే అనుభూతి కలుగుతుంది.
  3. నూలు దుస్తులు చెమటను త్వరగా పీల్చుకుంటాయి. అందువల్ల చల్లదనం అనే అనుభూతి కలుగుతుంది.
  4. సిల్కు పాలిస్టర్ లాంటి సింథటిక్ వస్త్రాలు చెమటను పీల్చుకోవు.
  5. అందువల్ల వేసవిలో నూలు దుస్తులను మాత్రమే ధరిస్తాము.

AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం

ప్రశ్న 5.
మంచుముక్కలు గల గాజుపాత్ర వెలుపలి గోడలపై నీటి బిందువులు ఎందుకు ఏర్పడతాయి?
జవాబు:

  1. గ్లాసులోని మంచుముక్కలు గ్లాసు యొక్క ఉపరితలాన్ని చల్లబరుస్తాయి.
  2. గ్లాసు ఉపరితలం చుట్టుపక్కల గల గాలిలో నీటి బాష్పం ఉంటుంది. ఈ నీటి బాష్పం , గ్లాసు ఉపరితలం కన్నా ఎక్కువ వేడిగా ఉంటుంది.
  3. చల్లని గ్లాసు ఉపరితలం, తన చుట్టుపక్కలనున్న నీటి బాష్పాన్ని చల్లబరుస్తుంది.
  4. ఈ నీటి బాష్పం మరల నీరుగా మారుతుంది.
  5. ఈ నీరు గ్లాసు ఉపరితలంపై నీటి బిందువులుగా ఏర్పడుతుంది.

ప్రశ్న 6.
వేడి ఎక్కువగా ఉన్న రోజులలో పందులు నీటి గుంటలలో ఎక్కువ సమయం గడుపుతాయి. ఎందుకు?
జవాబు:

  1. పందుల చర్మం పైనున్న స్వేదరంధ్రాలు మామూలు జంతువులు/ మనుషుల కన్నా కొంచెం పెద్దవిగా వుంటాయి.
  2. పెద్ద స్వేదరంధ్రాల ద్వారా శరీరంలోని నీరు అధికంగా చెమట రూపంలో బయటకు రావడంతో శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది.
  3. దీనిని అరికట్టడానికై పందులు బురదలో పొర్లి తమ చర్మం పైనున్న పెద్ద స్వేద రంధ్రాలను బురదతో కప్పి ఉంచుతాయి.
  4. అందువల్ల చెమట ఇగురుట అనేది త్వరగా జరుగదు.

8th Class Physical Science Textbook Page No. 31

ప్రశ్న 7.
నీటి వలె మూడు స్థితులలో లభించే పదార్థాలేమైనా ఉన్నాయా?
జవాబు:
‘మైనం’ కూడా నీటి .వలె మూడు స్థితులలో లభిస్తుంది.

ప్రశ్న 8.
పెట్రోల్, పాలను ఏ ధర్మాల ఆధారంగా ద్రవాలుగా పరిగణిస్తాము?
జవాబు:
పెట్రోల్, పాలు వంటి వాటికి నిర్దిష్ట ఆకారం లేదు. ఇవి, వాటిని పోసిన పాత్రల ఆకారాన్ని పొందుతాయి. అందువల్ల వీటిని ద్రవాలుగా పరిగణించవచ్చు.

8th Class Physical Science Textbook Page No. 32

ప్రశ్న 9.
ఘన పదార్థాలకు నిర్దిష్టమైన ఆకారం, ఘనపరిమాణం ఉంటుందా?
జవాబు:
ఘన పదార్థాలు నిర్దిష్ట ఆకారాన్ని, స్థిరమైన ఘనపరిమాణాన్ని కలిగి ఉంటాయి.

AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం

ప్రశ్న 10.
నీటిని నేలపై పోస్తే ఏ ఆకారంలోకి మారుతుంది?
జవాబు:
నీటిని నేల పై జారవిడిస్తే అది నేలపై ప్రవహిస్తుంది.

ప్రశ్న 11.
ప్రవాహి అంటే ఏమిటో చెప్పగలరా?
జవాబు:
ప్రవహించే పదార్థాన్ని ‘ప్రవాహి’ అంటారు.

8th Class Physical Science Textbook Page No. 33

ప్రశ్న 12.
CNG కి నిర్దిష్టమైన ఘనపరిమాణం ఉంటుందా?
జవాబు:
CNG కి నిర్దిష్టమైన ఘనపరిమాణం ఉండదు.

ప్రశ్న 13.
CNG కి నిర్దిష్టమైన ఆకారం ఉంటుందా?
జవాబు:
CNG కి నిర్దిష్టమైన ఆకారం లేదు. అది దానిని నిల్వ ఉంచిన సిలిండర్ ఆకారాన్ని పొందుతుంది.

8th Class Physical Science Textbook Page No. 34

ప్రశ్న 14.
అగరబత్తి, అత్తరు వాసనలు ఒకే సమయంలో ఒక మూల నుండి మరొక మూలకు చేరతాయా?
జవాబు:
అత్తరు వాసన, అగరబత్తి వాసన కన్నా త్వరగా ఒక మూల నుండి మరొక మూలకు చేరుతుంది. వాయువుల వ్యాపన వేగంలో మార్పే దీనికి కారణము.

8th Class Physical Science Textbook Page No. 36

ప్రశ్న 15.
ఘన, ద్రవ పదార్థాల కన్నా వాయువులు ఎందుకు వేగంగా వ్యాపనం చెందుతాయి?
జవాబు:
వాయుకణాల మధ్య ఖాళీ స్థలం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఖాళీ స్థలం ఘనపదార్థ కణాలు, ద్రవపదార్థ కణాల కన్నా అధికం. అందువల్ల వాయుకణాల మధ్య ఆకర్షణ బలం చాలా బలహీనంగా ఉంటుంది. కావున వాయువులు త్వరగా వ్యాపనం చెందుతాయి.

ప్రశ్న 16.
నీరు ఎప్పుడు మంచుగా మారుతుంది? ఎప్పుడు బాష్పంగా మారుతుంది?
జవాబు:

  1. నీటిని రిఫ్రిజిరేటరులో ఉంచి చల్లబరచినపుడు (ఉష్ణోగ్రతను తగ్గించినపుడు) మంచుగా మారును.
  2. నీటిని వేడిచేసినపుడు (ఉష్ణోగ్రతను పెంచినపుడు) భాష్పంగా మారును.

8th Class Physical Science Textbook Page No. 38

ప్రశ్న 17.
పదార్థం ఒక స్థితి నుండి మరొక స్థితికి మారేటప్పుడు ఆ పదార్థంలో అంతర్గతంగా ఏ ఏ మార్పులు సంభవిస్తాయి?
జవాబు:
పదార్థం ఒక స్థితి నుండి మరొక స్థితికి మారేటప్పుడు ఆ పదార్థంలో అంతర్గతంగా ఘనపరిమాణం పెరుగుట/ తగ్గుటను గమనిస్తాము.

8th Class Physical Science Textbook Page No. 39

ప్రశ్న 18.
పదార్థంలో స్థితి మార్పు ఎలా జరుగుతుంది?
జవాబు:
పదార్థ ఉష్ణోగ్రతలో మార్పు వల్ల స్థితి మార్పు జరుగుతుంది.

AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం

ప్రశ్న 19.
పదార్థ స్థితిలో మార్పు జరిగేటప్పుడు కణాలు ఎలాంటి మార్పుకు లోనవుతాయి?
జవాబు:
పదార్థ స్థితిలో మార్పు జరిగేటప్పుడు కణాల గతిశక్తిలో (పెరుగుదల/తగ్గుదల) మార్పు జరుగుతుంది. దీనివల్ల కణాల మధ్య ఆకర్షణ బలం (పెరుగుట / తగ్గుట)లో మార్పు జరుగుతుంది.

8th Class Physical Science Textbook Page No. 41

ప్రశ్న 20.
ఒక సిలిండర్ లో ఉన్న వాయువుపై పీడనాన్ని పెంచి సంపీడ్యం చెందిస్తే ఏం జరుగుతుంది?
జవాబు:
ఒక సిలిండర్ లో ఉన్న వాయువుపై పీడనాన్ని పెంచి సంపీడ్యం చెందిస్తే దాని ఘనపరిమాణం తగ్గుతుంది (బాయిల్ నియమం).

ప్రశ్న 21.
సిలిండర్ లోని వాయు కణాలు దగ్గరగా వస్తాయా?
జవాబు:
వాయు కణాల మధ్య ఖాళీస్థలం బాగా తగ్గి, సిలిండర్ లోని వాయుకణాలన్నీ దగ్గరగా వస్తాయి.

ప్రశ్న 22.
పదార్థ పీడనంలో మార్పు కలిగిస్తే పదార్థపు స్థితిలో మార్పు వస్తుందని మీరు భావిస్తున్నారా?
జవాబు:
పదార్థ పీడనంలో మార్పు కలిగిస్తే పదార్ధపు స్థితిలో మార్పు వస్తుంది.

ప్రశ్న 23.
పీడనాన్ని పెంచటం ద్వారా లేదా ఉష్ణోగ్రత తగ్గించడం ద్వారా వాయువును ద్రవస్థితిలోకి మార్చగలమా?
జవాబు:
వాయువును వాటి సంక్లిష్ట ఉష్ణోగ్రత కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద చల్లబరచినపుడు ద్రవస్థితిలోకి మార్చవచ్చు. కావున – పీడనం, ఉష్ణోగ్రతలలో మార్పు ద్వారా వాయువును ద్రవస్థితిలోకి మార్చవచ్చు.

ప్రశ్న 24.
పదార్థ స్థితిని మార్చడానికి మనం ప్రతిసారి దానికి ఉష్ణాన్ని అందించడం లేక పీడనంలో మార్పు కలిగించడం చేయవలసిందేనా?
జవాబు:
సహజంగా నీరు ఇగిరే ప్రక్రియ వంటి కొన్ని సహజ దృగ్విషయాలకు మినహా మిగిలిన సందర్భాలలో స్థితిని మార్చడానికి దానికి ఉష్ణాన్ని అందించడం లేక పీడనంలో మార్పు కలిగించడం అవసరమే.

ప్రశ్న 25.
ద్రవాలు వాటి ఉష్ణోగ్రత బాష్పీభవన స్థానాన్ని చేరకుండానే ద్రవస్థితి నుండి బాష్పంగా మారడం సాధ్యమేనా?
జవాబు:
తడి బట్టలు పొడిగా మారే ప్రక్రియలో, నీరు దాని బాష్పీభవన స్థానాన్ని చేరకుండానే ద్రవస్థితి నుండి బాష్పంగా మారుతుంది. కావున ఇది సాధ్యమే.

ప్రశ్న 26.
స్థితి మార్పులకు మరికొన్ని ఉదాహరణలివ్వండి.
జవాబు:
అయొడిన్ ఉత్పతనము, తడిగావున్న శరీరం ఆరుట మొదలైనవి.

AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం

ప్రశ్న 27.
ఈ రకమైన స్థితిమార్పులకు కారణం ఏమై ఉంటుంది?
జవాబు:

  1. పదార్ధంలోని ప్రతికణం దాని స్థితులతో సంబంధం లేకుండా నిర్దిష్ట ఉష్ణోగ్రతల వద్ద ఎంతో కొంత శక్తిని కలిగి ఉంటుంది.
  2. ఉదాహరణకు ద్రవాల ఉపరితలంపై ఉండే కణాలు ద్రవం లోపలి భాగంలో ఉండే మిగతా కణాల కన్నా అధిక శక్తిని కలిగి ఉంటాయి.
  3. అందువల్ల ఈ కణాలు వాటి మధ్యగల ఆకర్షణ బలాన్ని సులువుగా అధిగమించి బాష్పంగా మారతాయి.

పరికరాల జాబితా

వివిధ ఆకారములలో ఉన్న పాత్రలు, బీకరు, కొలజాడీ, శాంకువకు ప్పె, గోళాకారపు గాజుకుప్పె, పరీక్ష నాళిక, పెద్ద సిరంజి, అగరుబత్తి, సెంటు సీసా, పొటాషియం పర్మాంగనేట్, కాపర్ సల్ఫేట్, గుర్తించబడిన స్కేలు గల గాజు గొట్టం, రెండు రబ్బరు కార్కులు, దూది, అమ్మోనియా, హైడ్రోక్లోరికామ్ల ద్రావణాలు, డ్రాపర్, నీరు, ఉప్పు, ధర్మామీటరు, సారాయి దీపం, పింగాణి పాత్ర.

8th Class Physical Science 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం Textbook Activities

కృత్యములు

కృత్యం – 1

ప్రశ్న 1.
ద్రవాల ఆకార, పరిమాణాలను గుర్తించటం :
AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం 3
a) ద్రవ పదార్థాలకు నిర్దిష్ట ఆకారం లేదని నిరూపించుము.
జవాబు:

  1. ఒక స్థూపాకార కొలజాడిని, వేరు వేరు ఆకారాలలో ఉన్న పారదర్శకమైన పాత్రలను కొన్నింటిని తీసుకోండి.
  2. కొలజాడిలో కొంత పరిమాణంలో నీటిని తీసుకోండి.
  3. ఈ నీటిని ఒక పాత్రలో పోసి ఆ నీటి ఆకారాన్ని గమనించండి.
  4. ఇదే నీటిని వేరు వేరు పాత్రలలో పోసి, నీరు పొందిన ఆకారాన్ని ఒకే ఘనపరిమాణం, వివిధ ఆకారం గల ద్రవం గమనించండి.
  5. నీరు (ద్రవపదార్థం) అది పోసిన పాత్ర యొక్క ఆకారాన్ని పొందుతుందని గమనిస్తాము.
  6. ఈ కృత్యం ద్వారా ద్రవ పదార్థాలకు నిర్దిష్టమైన ఆకారం లేదని, అవి వాటిని పోసిన పాత్ర యొక్క ఆకారాన్ని పొందుతాయని తెలుస్తుంది.

b) ద్రవ పదార్థాలు నిర్దిష్ట ఘనపరిమాణాన్ని కలిగి ఉంటాయని నిరూపించండి.
జవాబు:

  1. ఒక కొలజాడి సహాయంతో 50 మి.లీ. నీటిని తీసుకోండి.
  2. ఈ నీటిని ఒక గాజు బీకరులో పోయండి.
  3. ఈ బీకరులో నీటి మట్టాన్ని గుర్తించి, నీటిని పారపోయండి.
  4. ఇప్పుడు కొలజాడితో 50 మి.లీ. పాలను కొలిచి అదే బీకరులో పోయండి.
  5. పాల మట్టాన్ని గ్లాసుపై గుర్తించండి. ఫాలను బీకరు నుండి తొలగించండి.
  6. పాలు మరియు నీరు ఒకే మట్టంలో ఉన్నట్లు గుర్తిస్తాము.
  7. ఇప్పుడు కొంత నూనెను తీసుకొని, దానిని గాజు బీకరులో నీటి మట్టం గుర్తించినంత వరకు పోయండి.
  8. ఈ నూనె ఘనపరిమాణాన్ని కొలజాడి సహాయంతో కొలవండి. అది 50 మి.లీ. ఉండడం గమనిస్తాము.
  9. ఈ కృత్యం ద్వారా ద్రవాలను వివిధ ఆకారాలు గల పాత్రలలోనికి మార్చినపుడు అవి వేర్వేరు ఆకారాలు పొందినప్పటికి వాటి ఘనపరిమాణంలో ఎలాంటి మార్పూ ఉండదు అని తెలుస్తుంది.

కృత్యం – 2 వాయువులకు నిర్దిష్ట ఆకారం, ఘనపరిమాణాలను పరిశీలించడం :

ప్రశ్న 2.
వాయువులకు నిర్దిష్టమైన ఘనపరిమాణంకాని, ఆకారంగాని ఉండదని ఒక కృత్యం ద్వారా నిరూపించండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం 4 AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం 5

  1. CNG అనగా సంపీడత సహజ వాయువు (Compressed Natural Gas).
  2. ఈ వాయువును ఫిల్లింగ్ స్టేషన్లలో ఎక్కువ పరిమాణంలో ఉన్న వాయువును తక్కువ పరిమాణంలో నిల్వ చేస్తారు.
  3. అదే విధంగా ఫిల్లింగ్ స్టేషన్ నుండి వాహనాలలోనికి ఎక్కువ పరిమాణ వాయువును తక్కువ పరిమాణంలో ఎక్కిస్తారు.
  4. కనుక CNG కి నిర్దిష్టమైన ఘనపరిమాణం, నిర్దిష్టమైన ఆకారం ఉండదు.
  5. పై పరిశీలనల ఆధారంగా CNG మరియు ఇతర అన్ని వాయువులు నిర్దిష్టమైన ఘనపరిమాణాన్ని కాని, ఆకారాన్ని కాని కలిగి ఉండవని నిర్ధారించవచ్చు.

AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం

కృత్యం – 3 వివిధ పదార్థాల సంపీడ్యతా ధర్మాన్ని పరిశీలించడం :

ప్రశ్న 3.
ఘన, ద్రవ పదార్థాలతో పోల్చినపుడు వాయు పదార్థాలు అధిక సంపీడ్యతను కలిగి ఉంటాయని చూపండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం 6

  1. 50 మి.లీ.ల సిరంజిని తీసుకోండి.
  2. సిరంజిలోకి గాలి వెళ్ళేలా పిస్టన్ ను వెనుకకు లాగండి.
  3. నాజిల్ నుండి గాలి బయటకు రాకుండా మీ వేలును అడ్డంగా ఉంచి పిస్టనన్ను ముందుకు వత్తండి.
  4. సిరంజిలోనికి పిస్టన్ ఎంత దూరం నెట్టబడిందో గమనించి, గాలి స్తంభం ఎత్తును గుర్తించండి.
  5. గాలి స్తంభం కొంత ఎత్తును చేరుకున్న తరువాత పిస్టనను నెట్టడం కష్టమవడాన్ని గమనిస్తాము.
  6. ఇక్కడ సిరంజిలోని గాలి సంపీడ్యం చెందబడింది.
  7. ఇప్పుడు సిరంజిని నీటితో నింపి ఇదే ప్రయోగాన్ని చేయండి.
  8. సిరంజిలోని పిస్టనను నొక్కడం కష్టమనిపించినపుడు నీటి స్తంభం ఎత్తును కొలవండి.
  9. నీటి, స్తంభం ఎత్తు, గాలిస్తంభం ఎత్తుకన్న ఎక్కువగా ఉండడాన్ని గమనిస్తాము.
  10. ఇప్పుడు ఒక చెక్కముక్కను తీసుకొని నీ బొటనవేలితో నొక్కి చూడండి.
  11. చెక్క ఘనపరిమాణంలో ఎటువంటి గమనించదగ్గ మార్పూ కనబడదు.
  12. పై పరిశీలనల నుండి వాయు పదార్థాలు, ఘన, ద్రవపదార్థాల కంటే అధికంగా సంపీడ్యత చెందుతాయని తెలుస్తుంది.

కృత్యం – 4 వాయువుల వ్యాపనంను పరిశీలించుట :

ప్రశ్న 4.
వాయువుల వ్యాపనాన్ని పరిశీలించడానికి ఒక కృత్యాన్ని వివరింపుము.
జవాబు:

  1. మీ స్నేహితుడిని ఒక అగర్ బత్తి పట్టుకొని గదిలోని ఒక మూల నిలుచోమని చెప్పండి.
  2. మీరు గదిలో ఇంకో మూలలో నిలబడండి.
  3. గదిలో వాసనలో ఎటువంటి మార్పును గమనించము. (కొన్ని రకాల అగర్బత్తిలకు ఇది వర్తించదు)
  4. ఇప్పుడు అగర్బత్తిని వెలిగించమని మీ స్నేహితుడికి చెప్పండి.
  5. కొన్ని సెకనుల తరువాత గదిలో అగరబత్తి వాసనను గమనిస్తాము.
  6. అగర్ బత్తి వెలిగించగానే దానిలోని సుగంద ద్రవ్యం ఆవిరిగా మారి అగరబత్తి పొగతో బాటు గాలిలో కలిసి, గది అన్ని వైపులా వ్యాపించి మన ముక్కును చేరుతుంది.
  7. ఈ కృత్యం ద్వారా వాయువులు వ్యాపనం చెందుతాయని తెలుస్తుంది.

కృత్యం – 5 ద్రవాలలో వ్యాపనాన్ని పరిశీలించుట :

ప్రశ్న 5.
ద్రవాలలో వ్యాపనాన్ని పరిశీలించుట :
జవాబు:
250 మి.లీ. గోళాకార గాజుకుప్పెను తీసుకొని దానిలో కొద్దిగా నీరు నింపండి. డ్రాపర్ సహాయంతో రెండు లేదా మూడు చుక్కల నీలం లేదా ఎరుపు సిరాను లేదా పొటాషియం పర్మాంగనేట్ (KMnO4) ద్రావణాన్ని బీకరు గోడల వెంట నెమ్మదిగా నీటిలో వేయండి.

పరిశీలన :
వాయువులలో వ్యాపనం జరిగినట్లుగానే ద్రావాలలోనూ వ్యాపనం జరుగుతుందని మీరు గుర్తించవచ్చు.

AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం

కృత్యం – 6 ద్రవాలలో ఘనపదార్థ కణాల వ్యాపనం పరిశీలించుట :

ప్రశ్న 6.
ద్రవాలలో ఘనపదార్థాల కణాలు వ్యాపనం చెందుతాయని ఒక కృత్యం ద్వారా చూపండి.
జవాబు:

  1. ఒక బీకరును తీసుకొని దానిని పూర్తిగా నీటితో నింపండి.
  2. అందులో కొద్దిగా పొటాషియం పర్మాంగనేట్ స్ఫటికాలను కలిపి మార్పులను గమనించండి.
  3. పొటాషియం పర్మాంగనేట్ స్ఫటికాలు నీటిలో వ్యాపనం చెంది నీటి రంగును మార్చుటను గమనిస్తాము.
  4. ఇదే ప్రయోగాన్ని కాపర్ సల్ఫేట్ స్ఫటికంతో చేయండి.
  5. ఇక్కడ కూడా కాపర్ సల్ఫేట్ స్ఫటికం నీటిలో వ్యాపనం చెంది నీటి రంగును మార్చుటను గమనిస్తాము.
  6. పై ప్రయోగాల నుండి, ఘనపదార్థ కణాలు ద్రవాలలో వ్యాపనం చెందుతాయని తెలుస్తుంది.

ప్రయోగశాల కృత్యం రెండు వాయువుల మధ్య వ్యాపనం :

ప్రశ్న 7.
రెండు వాయువుల మధ్య వ్యాపన వేగం కనుగొనుటకు ఒక ప్రయోగాన్ని వివరించండి.
జవాబు:
లక్ష్యం : రెండు వాయువుల వ్యాపన వేగం పరిశీలించుట.

కావలసిన పదార్థాలు :
గుర్తించబడిన స్కేలు గల గాజు గొట్టం, అమ్మోనియం ద్రావణం(NH3), హైడ్రోక్లోరిక్ ఆమ్లం (HCl), దూది, రెండు రబ్బరు బిరడాలు, టాంగ్స్.
AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం 7

విధానం :

  1. 1 మీటరు పొడవైన, గుర్తించబడిన స్కేలు గల సన్నని గాజు గొట్టం తీసుకోండి.
  2. రెండు దూది ఉండలు తీసుకొని టాంగ్స్ సహాయంతో ఒకదానిని అమ్మోనియం ద్రావణంలో, రెండవ దానిని హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో ముంచండి.
  3. వాటిని గాజు గొట్టం రెండు చివర్లలో ఉంచి బిరడాలతో రెండు చివరలను మూయండి. ఇప్పుడు గొట్టాన్ని పరిశీలించండి.
  4. హైడ్రోక్లోరిక్ ఆమ్లం హైడ్రోజన్ క్లోరైడ్ వాయువును, అమ్మోనియా ద్రావణం అమ్మోనియా వాయువును వెలువరిస్తాయి.
  5. రెండు వాయువులు పరస్పరం చర్య జరుపుకొని అమ్మోనియం క్లోరైడ్ అనే తెల్లని పదార్థాన్ని ఏర్పరుస్తాయి.
  6. గొట్టం రెండు చివరల నుండి, తెల్లని అవక్షేపం ఎంత దూరంలో ఉందో కొలవండి.
  7. అమ్మోనియా ద్రావణం ఉన్న చివరి నుండి ఎక్కువ దూరంలో అవక్షేపం ఏర్పడినది.
  8. ఈ ప్రయోగం ద్వారా అమ్మోనియా వాయువు ఎక్కువ వేగంతోనూ, హైడ్రోజన్ క్లోరైడ్ వాయువు తక్కువ వేగంతోనూ వ్యాపనం చెందాయని తెలుస్తుంది.

కృత్యం – 7 పదార్థంలో ఉండే కణాలు ఎంత చిన్నవి?

ప్రశ్న 8.
పదార్థంలోని కణాలు ఎంతో చిన్నవని ఒక ప్రయోగం ద్వారా చూపుము.
AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం 8
జవాబు:

  1. ఒక బీకరులో నీరు తీసుకొని, దానిపై నీటి మట్టాన్ని గుర్తించండి.
  2. దానికి 1 లేదా 2 పొటాషియం పర్మాంగనేట్ స్ఫటికాలను కలపండి.
  3. నీరు, ఊదారంగులోకి మారడాన్ని గమనిస్తాము.
  4. ఇప్పుడు ఆ ద్రావణాన్ని సుమారు 10 మి.లీ. తీసుకొని, వేరొక బీకరులోని 90 మి.లీ. నీటికి కలపండి.
  5. ఇప్పుడు నీటి యొక్క ఊదారంగు ఇంతకు మునుపు కంటే కొంచెం తక్కువగా ఉండడాన్ని గమనిస్తాము.
  6. మరల దీని నుండి 10 మి.లీ. ద్రావణాన్ని తీసుకొని మరొక బీకరులోని 90 మి.లీ. నీటికి కలపండి.
  7. ఈ ప్రక్రియను 4, 5 సార్లు చేసి ద్రావణం యొక్క రంగులోని మార్పును గమనించండి.
  8. చివరి బీకరులోని నీరు కూడా కొంచెం ఊదారంగు కలిగి ఉండుటను గమనిస్తాము.
  9. ఈ కృత్యం ద్వారా ఘన, ద్రవ పదార్థాలు అతి సూక్ష్మ కణాలను కలిగి ఉంటాయని తెలుస్తుంది.

కృత్యం – 10 పదార్థ స్థితి మార్పుపై ఉష్ణోగ్రత ప్రభావం :

ప్రశ్న 9.
ఒక పదార్థం యొక్క స్థితిలో జరుగు మార్పుపై ఉష్ణోగ్రత ప్రభావంను తెల్పు కృత్యంను వ్రాయుము.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం 9

  1. పటంలో చూపిన విధముగా ఒక బీకరులో సుమారు 100 గ్రా||ల మంచు ముక్కలను తీసుకొనుము.
  2. ప్రయోగశాలలో ఉపయోగించు థర్మామీటరును తీసుకొనుము.
  3. దాని బల్బ్ ను మంచు ముక్కలకు తాకు విధముగా అమర్చుము. ఉష్ణోగ్రతను గుర్తించుము.
  4. బీకరును నెమ్మదిగా సారాయి) దీపంతో వేడి చేయుము.
  5. గాజు కడ్డీతో మంచు ముక్కలను కలుపుతూ ప్రతి 30 సెకన్లకు ఉష్ణోగ్రతలో వచ్చు’ మార్పులను పరిశీలించుము.
  6. పదార్థం ఘనస్థితి నుండి ద్రవస్థితికి మారుటకు ఉష్ణోగ్రతలో పెరుగుదల కారణమైనది.
  7. ఒక గాజు కడ్డీని బీకరులో ఉంచి వేడి చేయుము.
  8. నీరు క్రమముగా మరగడం ప్రారంభమై కొంత సమయం తర్వాత బాష్పంగా మారును.
  9. ఇక్కడ పదార్థం ద్రవస్థితి నుండి వాయుస్థితికి మారుటకు ఉష్ణోగ్రతలో పెరుగుదల కారణమైనది.
  10. దీనిని బట్టి పదార్థ స్థితిలో మార్పునకు ఉష్ణోగ్రత ప్రభావం కారణమని అవగాహన చేసుకొనవచ్చును.

AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం

కృత్యం – 11

ప్రశ్న 10.
బాష్పీభవనంపై పదార్థ ఉపరితల వైశాల్యం, గాలి వేగం, ఆర్థతల ప్రభావం :
ఎ) బాష్పీభవనంపై ఉపరితల వైశాల్యం యొక్క ప్రభావమును వివరింపుము.
జవాబు:
ఉపరితల వైశాల్యం పెరిగినపుడు ఇగిరే వేగం పెరుగుతుంది.

వివరణ :

  1. ఇగిరే ప్రక్రియలో, ద్రవ ఉపరితల కణాలు బాష్పంగా మారతాయి.
  2. ఉపరితల వైశాల్యం పెరగడం వల్ల ఉపరితలంలోని ఎక్కువ కణాలు బాష్పంగా మారడానికి అవకాశం ఏర్పడుతుంది.
  3. అందువల్ల ఇగిరే వేగం పెరుగుతుంది.
    ఉదా : పింగాణి పాత్రలోని నీరు, పరీక్షనాళికలోని నీటి కన్నా వేగంగా ఇగురుతుంది.

బి) బాష్పీభవనంపై ఆర్థత యొక్క ప్రభావాన్ని వివరింపుము.
జవాబు:
గాలిలో ఆర్ధత అధికంగా ఉంటే ఇగిరే వేగం తగ్గుతుంది.

వివరణ :

  1. గాలిలో గల తేమ శాతాన్ని ఆర్ధత అంటారు.
  2. మన పరిసరాలలో ఉన్న గాలి ఒక నిర్దిష్ట పరిమాణం వరకు మాత్రమే నీటి బాష్పంను నిలిపి ఉంచగలుగుతుంది.
  3. గాలిలో నీటి బాష్పం అధికంగా ఉంటే ఇగిరే వేగం తగ్గుతుంది.
    ఉదా : సాధారణ రోజు కన్నా వర్షమున్న రోజున బట్టలు నెమ్మదిగా ఆరతాయి.

సి) బాష్పీభవనంపై గాలి వేగం యొక్క ప్రభావాన్ని వివరింపుము.
జవాబు:
గాలి వేగం పెరిగినపుడు ఇగిరే వేగం పెరుగుతుంది.

వివరణ :

  1. గాలి వేగంగా వీయడం వల్ల అందులోని నీటి బాష్పం గాలితో పాటు దూరంగా వెళుతుంది.
  2. తద్వారా పరిసరాలలోని గాలిలో నీటి బాష్పం కూడా తగ్గుతుంది.
  3. ఇది ఇగిరే వేగాన్ని పెంచుతుంది.
    ఉదా : గాలి బలంగా వీచే రోజున కాని, ఫ్యాను కింద కాని బట్టలు సాధారణంగా కన్నా త్వరగా ఆరతాయి.

AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ

SCERT AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Physical Science 2nd Lesson Questions and Answers ఘర్షణ

8th Class Physical Science 2nd Lesson ఘర్షణ Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
“ఘర్షణ మానవాళికి మిత్రుడు మరియు విరోధి” ఈ వాక్యాన్ని నీవు సమర్థిస్తావా? ఉదాహరణలతో వివరింపుము. (AS1)
జవాబు:
“ఘర్షణ మానవాళికి మిత్రుడు మరియు విరోధి” ఈ వాక్యాన్ని నేను సమర్థిస్తాను.

ఘర్షణ మానవాళికి మిత్రుడు అనుటకు ఉదాహరణలు :

  1. ఘర్షణ వలన మనం నడవగలుగుతున్నాము మరియు పరుగెత్తగలుగుతున్నాము.
  2.  వాహనాలను నడుపగలుగుతున్నాము.
  3. వడ్రంగి చెక్క తలాలను నునుపు చేయగలుగుతున్నాడు.
  4. కాగితంపై పెన్నుతో మరియు బ్లాక్ బోర్డ్ పై చాక్ పీతో వ్రాయగలుగుతున్నాము.
  5. గోడకు మరియు చెక్కలకు మేకులను దించగలుగుతున్నాము.
  6. భవనాలను నిర్మించగలుగుతున్నాము.
  7. వస్తువులను పట్టుకోగలుగుతున్నాము.
  8. వివిధ ఆటలు ఆడగలుగుతున్నాము.
  9. బరువులను ఎత్తగలుగుతున్నాము.
  10. మట్టిని తవ్వగలుగుతున్నాము.

ఘర్షణ మానవాళికి విరోధి అనుటకు ఉదాహరణలు :

  1. ఘర్షణ వల్ల యంత్రభాగాలలో పగుళ్లు వస్తాయి.
  2. యంత్రభాగాలు అరిగిపోతాయి.
  3. యంత్రభాగాలు వేడెక్కి పాడవుతాయి.
  4. ఘర్షణ వలన శక్తి నష్టం జరుగుతుంది.
  5. వాహనాల వడి తగ్గుతుంది.
  6. యంత్రాల సామర్థ్యం తగ్గుతుంది.

ప్రశ్న 2.
ఆటగాళ్లు వేసుకొనే బూట్లకు అడుగు భాగంలో చిన్న, చిన్న బొడిపెలు ఎందుకుంటాయి? (AS1)
(లేదా)
అడుగున గాడులు ఉన్న బూట్లను క్రీడాకారులు ధరిస్తారు ఎందుకు?
జవాబు:
ఆటగాళ్లు వేసుకొనే బూట్లకు అడుగుభాగంలో చిన్న చిన్న బొడిపెలు ఉంటాయి. ఎందుకంటే

  1. బూట్ల అడుగుభాగాన గల చిన్న, చిన్న బొడిపెలు ఘర్షణను పెంచుతాయి.
  2. బొడిపెలు నేలను గట్టిగా పట్టి ఉంచి, సురక్షితంగా నడవడానికి, పరుగెత్తడానికి ఉపయోగపడతాయి.

AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ

ప్రశ్న 3.
సబ్బు నీళ్లు పడిన పాలరాతి బండలపై (మార్బుల్) నడవటం సులభమా? కష్టమా? ఎందుకు? (AS1)
జవాబు:
సబ్బు నీళ్ళు పడిన పాలరాతి బండలపై నడవటం కష్టము. ఎందుకంటే

  1. సబ్బు నీళ్ళు పాలరాతి బండలపై ఘర్షణను తగ్గిస్తాయి. ఈ
  2. కాబట్టి సబ్బు నీళ్ళు పడిన పాలరాతి బండలపై నడచినపుడు జారిపడిపోతారు.

ప్రశ్న 4.
ఘర్షణ తగ్గించడానికి నీవిచ్చే సూచనలు ఏమిటి? (AS1)
జవాబు:

  1. స్పర్శలో ఉండే వస్తువు తలాలు నునుపుగా ఉండాలి.
  2. వస్తువులకు చక్రాలను ఉపయోగించాలి.
    ఉదా : సూట్ కేసులు, బ్యాగులు.
  3. యంత్ర భాగాల మధ్య ఘర్షణను తగ్గించడానికి కందెనలను వాడాలి.
  4. యంత్రాలలో భ్రమణంలో గల ఇనుప రాడ్ల మధ్య బాల్ బేరింగ్లను ఉపయోగించాలి.
  5. ప్రవాహి ఘర్షణను తగ్గించడానికి వాహనాలను తగిన ఆకృతిలో నిర్మించాలి.

ప్రశ్న 5.
స్థైతిక ఘర్షణ వస్తువుల మధ్య ఉండాలంటే కావలసిన షరతులు ఏమిటి? (AS1)
జవాబు:

  1. తలాలు గరుకుగా ఉండాలి.
  2. వస్తువు భారాలు (బరువు) ఎక్కువగా ఉండాలి.
  3. వస్తువుపై అభిలంబ బలం ఎక్కువగా ఉండాలి.
  4. వస్తువు ఉండే తలం క్షితిజ సమాంతరంగా ఉండాలి.
  5. వస్తువులు ఉండే తలాలు పొడిగా (తడి లేకుండా) ఉండాలి.

ప్రశ్న 6.
స్థైతిక ఘర్షణ మనకు సహాయపడే సందర్భాలకు కొన్ని ఉదాహరణలివ్వండి. (AS1)
జవాబు:

  1. మనం కూర్చోవడానికి, పడుకోవడానికి మరియు నిలబడడానికి ఉపయోగపడుతుంది.
  2. భవన నిర్మాణంలో ఉపయోగపడుతుంది.
  3. టేబుల్ పై వివిధ వస్తువులను ఉంచడానికి ఉపయోగపడుతుంది.
    ఉదా : టి.వి., కంప్యూటర్.
  4. అల్మరాలో వస్తువులను ఉంచడానికి ఉపయోగపడుతుంది.
  5. లైబ్రరీలో రాక్స్ నందు పుస్తకాలను ఉంచుటకు ఉపయోగపడుతుంది.
  6. షాపులలో రాక్స్ నందు వివిధ రకాల వస్తువులను ఉంచడానికి ఉపయోగపడుతుంది.
  7. వాహనాలను నిలిపి ఉంచడానికి ఉపయోగపడుతున్నది.
  8. టేబుళ్ళను, కుర్చీలను, సోఫాలను మరియు ఇతర సామగ్రిని నేలపై ఉంచుటకు ఉపయోగపడుతుంది.
  9. నిశ్చలస్థితిలో ఉండే ప్రతి వస్తువూ సైతిక ఘర్షణను ఉపయోగించుకుంటుంది.

AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ

ప్రశ్న 7.
జారుడు ఘర్షణ ఉండే సందర్భాలకు కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. (AS1)
జవాబు:

  1. కేరమ్ బోర్డుపై పౌడరు చల్లి ఆట ఆడుతున్నప్పుడు, కేరమ్ కాయిన్ సులభంగా కదులుట.
  2. తలుపు యొక్క మడత బందులు కదులుట.
  3. టేబుల్ యొక్క సొరుగులు కదులుట.
  4. పిండి మిల్లులో లేదా వడ్ల మిల్లులో ధాన్యం జారుట.
  5. పార్కులలో జారుడు బల్లపై పిల్లలు జారుట.
  6. బాల్ పాయింట్ పెన్నుతో కాగితంపై వ్రాయుట.
  7. సైకిల్ పెడల్ తొక్కినపుడు చక్రాలు వేగంగా తిరుగుట.
  8. బురదగా ఉన్న నేలపై నడుచుచున్నపుడు జారుట.
  9. అరటిపండు తొక్కపై కాలు వేసినపుడు జారుట.
  10. సబ్బు నీళ్ళు పడిన మార్బుల్ గచ్చు జారుట.

ప్రశ్న 8.
ఘర్షణ బలాన్ని ఎలా కొలుస్తారు? వివరించండి. (AS1)
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ 1

  1. ఒక సన్నని తాడుకు చెక్క దిమ్మెను కట్టి గచ్చు నేలపై ప్రక్క పటంలో చూపిన విధంగా స్ప్రింగ్ త్రాసుతో లాగండి.
  2. ఇక్కడ స్ప్రింగ్ త్రాసు చెక్క దిమ్మెపై ప్రయోగించిన బలాన్ని కొలుచుటకు ఉపయోగపడుతుంది.
  3. స్ప్రింగ్ త్రాసును బలంగా లాగినపుడు దానిలోని స్ప్రింగు సాగుతుంది. స్ప్రింగు త్రాసుపై అధిక బలాన్ని ప్రయోగించిన స్ప్రింగులో ఎక్కువ సాగుదలను గమనించవచ్చు. అనగా స్ప్రింగులో సాగుదల దానిపై ప్రయోగించిన బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది.
  4. స్ప్రింగ్ త్రాసును లాగి చెక్క దిమ్మెను కదిలించడానికి ఆ ప్రయత్నించండి.
  5. చెక్క దిమ్మె కదలటానికి సిద్ధంగా ఉన్నప్పుడు స్పింగ్ త్రాసు రీడింగ్ ను నమోదు చేయండి.
  6. ఈ స్థితిలో చెక్క దిమ్మెపై క్షితిజ సమాంతర దిశలో రెండు బలాలు పనిచేస్తాయి.
    AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ 2
  7. ఒకటి ఘర్షణ బలం (f), రెండవది ప్రయోగించిన బలం (F).
  8. ఈ రెండు బలాలు చెక్క దిమ్మె కదులుటకు సిద్ధంగా ఉన్నపుడు సమాన పరిమాణంలో ఉంటూ వ్యతిరేక దిశలో ఉంటాయి.
  9. కాబట్టి నమోదు చేసిన స్ప్రింగ్ త్రాసు రీడింగ్ ఘర్షణ బలానికి సమానం అవుతుంది.
  10. ఈ విధంగా స్ప్రింగ్ త్రాసు రీడింగ్ తో ఘర్షణ బలంను తెలుసుకొనవచ్చును.
  11. ఘర్షణ బలాన్ని “ట్రైబో మీటరు” (Tribometer) అను పరికరం ద్వారా కూడా తెలుసుకోవచ్చును.

ప్రశ్న 9.
కందెనలు ఏ విధంగా ఘర్షణను తగ్గిస్తాయి? వివరించండి. (AS1)
జవాబు:

  1. స్పర్శలో ఉండే కదిలే భాగాల మధ్య కందెనలను పూస్తారు.
  2. రెండు తలాల మధ్య కందెనలు పలుచని పొరలాగా మారి భాగాల మధ్య రాపిడిని తగ్గిస్తాయి.
  3. కందెనలు స్పర్శలో ఉన్న భాగాల మధ్య చేరి వాటి చిన్న చిన్న ఎత్తుపల్లాల మధ్య బంధాలు ఏర్పడకుండా నిరోధిస్తాయి.
  4. కావున వాటి కదలిక సులభమై ఘర్షణ తగ్గుతుంది.

ప్రశ్న 10.
ఘర్షణ బలాలు ఎన్ని రకాలో తెల్పండి. (AS1)
జవాబు:
ఘర్షణ బలాలు 3 రకాలు. అవి :

  1. సైతిక ఘర్షణ బలం
  2. జారుడు ఘర్షణ బలం
  3. దొర్లుడు ఘర్షణ బలం

ప్రశ్న 11.
జారుడు ఘర్షణ, సైతిక ఘర్షణ కంటే ఎందుకు తక్కువ ఉంటుందో వివరించండి. (AS1)
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ 3

  1. చెక్క దిమ్మె యొక్క కొక్కానికి ప్రక్క పటంలో చూపిన విధంగా స్ప్రింగ్ త్రాసు కొక్కాన్ని తగిలించి టేబులుపై అమర్చండి.
  2. స్ప్రింగ్ త్రాసును బలంగా లాగినపుడు అది, దానిపై ప్రయోగించిన బలాన్ని న్యూటన్లలో తెలుపుతుంది.
  3. స్ప్రింగ్ త్రాసుపై బలాన్ని ఉపయోగించడం ద్వారా నిశ్చల స్థితిలో గల చెక్క దిమ్మెను కదల్చడానికి ప్రయత్నించండి.
  4. చెక్క దిమ్మె కదలడానికి సిద్ధంగా ఉన్నప్పుడు స్ప్రింగ్ త్రాసులోని రీడింగ్ ను నమోదుచేయండి.
  5. ఈ రీడింగ్ చెక్క దిమ్మె యొక్క సైతిక ఘర్షణ బలాన్ని తెలియజేస్తుంది.
  6. ఈసారి స్ప్రింగ్ త్రాసుపై బలాన్ని ఉపయోగిస్తూ చెక్క దిమ్మెను సమవడితో కదిలేటట్లు చేయాలి.
  7. చెక్క దిమ్మె సమవడిలో ఉన్నప్పుడు స్ప్రింగ్ త్రాసు రీడింగ్ ను నమోదు చేయాలి.
  8. ఇపుడు రీడింగ్ చెక్క దిమ్మె యొక్క జారుడు ఘర్షణ బలాన్ని తెలియజేస్తుంది.
  9. పైన వచ్చిన సైతిక ఘర్షణ బలం, “జారుడు ఘర్షణ బలాల విలువలను పరిశీలించిన జారుడు ఘర్షణ బలం తక్కువగా ఉన్నదని తెలుస్తుంది.
  10. పై ప్రయోగం ద్వారా జారుడు ఘర్షణ, స్టైతిక ఘర్షణ కంటే తక్కువగా ఉంటుంది అని నిరూపించబడినది.

ప్రశ్న 12.
శక్తి నష్టానికి ఘర్షణ ఎలా కారణమో ఉదాహరణలతో వివరించండి. ఘర్షణ ద్వారా జరిగే శక్తి నష్టాలను తగ్గించడానికి మీరు ఇచ్చే సలహాలు ఏమిటి? (AS1)
జవాబు:
1) శక్తి నష్టానికి ఘర్షణ కారణం :
స్పర్శలో ఉన్న రెండు వస్తువుల యొక్క తలాల మధ్య ఉండే ఘర్షణను అధిగమించడానికి ఎక్కువ శక్తి ఇవ్వవలసి వస్తుంది. కాబట్టి శక్తి నష్టానికి ఘర్షణ కారణం.

2) ఉదాహరణలు :

  1. యంత్రాలలో భ్రమణంలో ఉండే స్పర్శ చక్రాల మధ్య ఘర్షణ వల్ల అవి వేడెక్కడం, అరిగిపోవడం మరియు పగిలిపోవడం వంటివి జరుగుతాయి.
  2. వాహన ఇంజన్లో స్పర్శలో ఉండే చక్రాల మధ్య ఘర్షణ వల్ల ఇంజన్ వేడెక్కడం, ఇంజన్లోని భాగాలు అరిగిపోవడం జరుగుతుంది.
  3. సైకిల్ చక్రాలు, గొలుసులకు కందెనలు పూయనట్లయితే ఎంత తొక్కినా ఘర్షణ బలం వల్ల సైకిల్ నెమ్మదిగానే కదులుతుంది.

3) ఘర్షణ ద్వారా జరిగే శక్తి నష్టాలను తగ్గించడం :

  1. స్పర్శలో ఉండే వస్తువుల తలాలు నునుపుగా ఉండాలి.
  2. స్పర్శలో ఉండే వస్తువుల తలాలకు కందెనలను పూయాలి.
  3. యంత్రాలలో ఘర్షణను తగ్గించుటకు బాల్ బేరింగ్ ను ఉపయోగించాలి.
  4. ప్రవాహి ఘర్షణను తగ్గించుటకు ప్రత్యేక ఆకృతిలో వాహనాల ఆకారాన్ని తయారుచేయవలెను.

AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ

ప్రశ్న 13.
కదులుతున్న బస్సు పైభాగంలో గల సామాన్లను సీత గమనించింది. బస్సు మెల్లగా కదిలేటప్పుడు దానిపై సామాన్ల స్థితిలో కొద్దిగా మార్పు గమనించింది. కానీ బస్సు వడి పెరిగి వేగంగా కదలటం ప్రారంభించగానే బస్సుపై ఉన్న సామాన్లు వెనుకకు పడడం సీత గమనించింది. ఈ సంఘటన వల్ల ఆమె మదిలో బస్సుపై గల సామాన్లపై మరియు బస్సు టైర్లపై పనిచేసే ఘర్షణకు సంబంధించి అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. వాటిని మీరు చెప్పగలరా? ఆ ప్రశ్నలను వ్రాయండి. (AS2)
జవాబు:

  1. బస్సు పైభాగంలో గల సామాన్లు వెనుకకు పడడంలో ఏ బలం పనిచేసింది?
  2. బస్సు ఉపరితలం ప్రయోగించే ఘర్షణ బలం ఏ దిశలో ఉంటుంది?
  3. బస్సు ఉపరితలం ప్రయోగించే ఘర్షణ బలం బస్సు ప్రయాణించే దిశలో ఎందుకు ఉంటుంది?
  4. బస్సుపై సామాన్లు వెనుకకు జరుగుటకు పనిచేసే బలం ఎక్కడి నుండి ఏర్పడినది?
  5. బస్సు టైర్లపై ఘర్షణ బలం ఏ దిశలో పనిచేస్తుంది?
  6. బస్సు టైర్లపై కలిగే ఘర్షణ బలం, బస్సుపై గల సామాన్లకు బస్సు ఉపరితలం కలిగించే ఘర్షణ బలం ఎందుకు వ్యతిరేక దిశలో ఉన్నాయి?

ప్రశ్న 14.
ఘర్షణ వల్ల కలిగే శక్తి నష్టాలను అధిగమించడానికి వాడే నూతన పద్ధతులను గురించి సమాచారాన్ని వివిధ పుస్తకాలు మరియు ఇంటర్నెట్ నుండి సేకరించండి. ఆ సమాచారాన్ని మీ మాటల్లో రాయండి. (AS4)
జవాబు:
ఘర్షణ వల్ల కలిగే శక్తి నష్టాలను అధిగమించడానికి, ఘర్షణను తగ్గించడానికి వాడే వివిధ పద్ధతులు :

1) కందెనలు (లూబ్రికెంట్స్) ఉపయోగించుట :

  1. యంత్రభాగాల మధ్య ఘర్షణను తగ్గించే పదార్థాలను కందెనలు (లూబ్రికెంట్స్) అంటారు.
  2. నూనెలను, గ్రీజులను కందెనలుగా ఉపయోగిస్తారు.
  3. సాధారణంగా యంత్రభాగాలలో ఘర్షణను తగ్గించుటకు మరియు శక్తి నష్టాలను అధిగమించడానికి కందెనలను ఉపయోగిస్తారు.
  4. స్పర్శలో ఉండే కదిలే యంత్రభాగాల మధ్య కందెనలు పూయడం వల్ల ఆ రెండు తలాల మధ్య పలుచని పొరగా మారి యంత్రభాగాల మధ్య రాపిడిని తగ్గిస్తాయి.
  5. కందెనలు స్పర్శలో ఉన్న భాగాల మధ్య చేరి వాటిలో గల చిన్న చిన్న ఎత్తుపల్లాల (గరుకుతలాల) మధ్య బంధాలు ఏర్పడకుండా నిరోధిస్తాయి. కాబట్టి ఘర్షణ తగ్గి, శక్తి నష్టాలను అధిగమించవచ్చును.

2) తలాలను నునుపుగా (పాలిషింగ్) చేయుట :

  1. స్పర్శలో ఉండే యంత్రభాగాల తలాలపై గరుకుతనం తొలగిచడం వల్ల ఘర్షణకు తగ్గించి, శక్తి నష్టాలను అధిగమించవచ్చును
  2. కాబట్టి స్పర్శలో ఉండే యంత్రభాగాలను నునుపుగా (పాలిషింగ్) చేయడం వలన శక్తి నష్టాలను అధిగమించవచ్చును.

3) బాల్ బేరింగ్లు ఉపయోగించడం :

  1. బాల్ బేరింగ్లను ఉపయోగించడం వలన చాలా ఎక్కువగా శక్తి నష్టాలను తొలగించవచ్చును.
  2. యంత్రాలలో భ్రమణంలో గల ఇరుసు, చక్రాల మధ్య బాల్ బేరింగ్లను ఉపయోగించి శక్తి నష్టాలను తగ్గిస్తారు.
  3. యంత్రాలలో మరియు వాహనాలలో శక్తి నష్టాలను తగ్గించుటకు బాల్ బేరింగ్ లను ఉపయోగిస్తారు.
  4. శక్తి నష్టాలను తగ్గించడంలో ఇది ఉత్తమమైన పద్ధతి.

4) ప్రత్యేక ఆకారం ద్వారా :
వాహనాలలో ప్రవాహుల ఘర్షణను తగ్గించుటకు, శక్తి నష్టాలను తగ్గించుటకు ప్రత్యేక ఆకారాలలో వాహనాలను తయారుచేస్తారు.

5) చక్రాల ద్వారా :
బరువైన, పెద్ద పెద్ద కంటైనర్లను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలించడానికి చక్రాలు కలిగిన ట్రాలీలను ఉపయోగిస్తారు. చక్రాలు ఉపయోగించడం వలన ఘర్షణను తగ్గించి, శక్తి నష్టాలను అధిగమించవచ్చును.

ప్రశ్న 15.
వాలుతలంపై జారుతున్న వస్తువుపై పనిచేసే బలాలను తెలిపే స్వేచ్ఛా వస్తుపటం గీయండి. (AS5)
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ 4

ప్రశ్న 16.
“యంత్రాల్లో గల వివిధ భాగాల మధ్య ఘర్షణను సాధ్యమయినంత తగ్గించడం ద్వారా శక్తి నష్టమును తగ్గించవచ్చు మరియు జీవ వైవిధ్యాన్ని కాపాడవచ్చు”. దీనిని మీరెలా సమర్థిస్తారు? వివరించండి. (AS7)
జవాబు:

  1. యంత్రాల్లో గల వివిధ భాగాల మధ్య ఘర్షణ వల్ల శక్తి ఉష్ణశక్తి రూపంలో వృధా అయిపోతుంది.
  2. దీనివలన విద్యుచ్ఛక్తి, ఇంధనశక్తి వంటి శక్తి వనరుల లోపం ఏర్పడుతుంది.
  3. దీనిని అరికట్టాలంటే మనం యంత్రాల్లో గల వివిధ భాగాల మధ్య ఘర్షణను సాధ్యమయినంత వరకు తగ్గించాలి.
  4. శక్తి నిత్యత్వ సిద్ధాంతం ప్రకారం ఈ ప్రకృతిలో శక్తి పరిమాణం స్థిరం, దానిని సృష్టించలేము మరియు నశింప చేయజాలము కనుక శక్తి వనరులను వీలైనంత తక్కువగా వినియోగించాలి.
  5. వృధా అయ్యే శక్తిని అదుపుచేయడం ఒక మార్గం. కనుక వీలైనంతవరకు యంత్రాల్లో గల వివిధ భాగాల మధ్య ఘర్షణను తగ్గించి తద్వారా జీవవైవిధ్యాన్ని కాపాడగలం.

8th Class Physical Science 2nd Lesson ఘర్షణ Textbook InText Questions and Answers

ఆలోచించండి – చర్చించండి

8th Class Physical Science Textbook Page No. 22

ప్రశ్న 1.
ఘర్షణ చలనాన్ని వ్యతిరేకిస్తుందా? తలాల మధ్య సాపేక్ష చలనాన్ని వ్యతిరేకిస్తుందా?
జవాబు:
ఘర్షణ తలాల మధ్య సాపేక్ష చలనాన్ని వ్యతిరేకిస్తుంది.

ప్రశ్న 2.
ఘర్షణ ఉందని చూపుటకు ఏ పరిశీలనలు మరియు ప్రయోగాలు తెలుపుతావు?
ప్రయోగము :
AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ 1
ఉద్దేశం :
వస్తువులు ఘర్షణను కలుగజేస్తాయి అని తెలుపుట.

పరికరాలు :
సన్నని తాడు, చెక్క దిమ్మె, స్ప్రింగ్ త్రాసు.

విధానం :

  1. ఒక సన్నని తాడుకు చెక్క దిమ్మెను కట్టి ప్రక్క పటంలో చూపిన విధంగా అమర్చండి.
  2. నిశ్చల స్థితిలోని చెక్క దిమ్మెపై స్ప్రింగ్ త్రాసుపై బలాన్ని ఉపయోగించి స్ప్రింగ్ త్రాసులో రీడింగ్ ను పరిశీలించండి.
  3. చెక్క దిమ్మె కదులుటకు సిద్ధంగా ఉన్నప్పుడు ప్రయోగించిన బలం, ఘర్షణ బలానికి సమానంగా ఉంటుంది.
  4. చెక్క దిమ్మె కదులుటకు సిద్ధంగా ఉన్నప్పుడు స్ప్రింగ్ త్రాసు రీడింగ్ ను గుర్తించాలి. ఈ రీడింగ్ ఘర్షణ బలానికి సమానం అగును.
  5. దీనిని బట్టి వస్తువులకు ఘర్షణ బలం ఉంటుందని తెలుస్తుంది.

AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ

ప్రశ్న 3.
‘జారుడు ఘర్షణ’ గురించి ఏ పరిస్థితుల్లో మాట్లాడతాం?
జవాబు:
ప్రయోగించిన బలము, స్టెతిక ఘర్షణ కంటే ఎక్కువుగా నున్నపుడు వస్తువు చలించటం మొదలవుతుంది. ఆ పరిస్థితుల్లో జారుడు ఘర్షణ’ గురించి మాట్లాడతాం.

8th Class Physical Science Textbook Page No. 25

ప్రశ్న 4.
నేలపై నిలకడగా ఉన్న బల్లపై ఘర్షణ బలం పనిచేస్తుందా?
జవాబు:

  1. నేలపై నిలకడగా ఉన్న బల్లపై ఘర్షణ బలం పనిచేస్తుంది.
  2. నేలపై నిలకడగా ఉన్న బల్లపై సైతిక ఘర్షణ బలం పనిచేస్తుంది.

ప్రశ్న 5.
అభిలంబ బలాన్ని రెండింతలు చేస్తే, ఘర్షణ బలం ఏమవుతుంది? చర్చించండి.
జవాబు:
1) ఘర్షణ బలం, అభిలంబ బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది.
∴ ఘర్షణ బలం (Ff) ∝ అభిలంబ బలం (Fn).
ఘర్షణ బలం (Ff) = µsఅభిలంబ బలం (fn)
µs ను అనుపాత స్థిరాంకం అంటారు. దీనినే ఘర్షణ గుణకం అని కూడా అంటారు.
∴ Ff = µs . Fn ఇక్కడ Ff = ఘర్షణ బలం ; Fn = అభిలంబ బలం

సందర్భం – 1 : అభిలంబ బలం Fn = x అయినప్పుడు ఘర్షణబలం (Ff1 ) = µs × x
∴ Ff1 = µs x
∴ µs x = Ff1 …….. (1)

సందర్భం – II : అభిలంబ బలం Fn = 2x అయినపుడు ఘర్షణ బలం (Ff2 ) = µs × 2x
Ff2 = 2µs × x
Ff2 = 2µs × x ……. (B)
సమీకరణం (B) లో µs x విలువలను ప్రతిక్షేపించగా
∴ Ff2 = 2Ff1
∴ అభిలంబ బలాన్ని రెట్టింపు చేసినపుడు ఘర్షణ బలం రెట్టింపు అగును.

ప్రశ్న 6.
“ఘర్షణ వస్తువుల స్పర్శా వైశాల్యంపై ఆధారపడుతుంది” అని స్నేహితుడు అన్నాడు. ఏ ప్రయోగంతో నీ స్నేహితుడిని నీవు సరిచేస్తావు?
జవాబు:
ప్రయోగము :
ఉద్దేశం : “ఘర్షణ వస్తువుల స్పర్శా వైశాల్యంపై ఆధారపడదు” అని నిరూపించుట.

పరికరాలు :
చెక్క దిమ్మె, సన్నని త్రాడు, స్ప్రింగ్ త్రాసు.
AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ 5
AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ 6

విధానం :

  1. ఒక సన్నని తాడును చెక్క దిమ్మెకు కట్టి దానిని స్ప్రింగ్ త్రాసు యొక్క కొక్కేనికి తగిలించి, గచ్చుపై పటంలో చూపిన విధంగా అమర్చండి.
  2. చెక్క దిమ్మె యొక్క స్పర్శా వైశాల్యం ఎక్కువగా ఉండునట్లు గచ్చుపై అమర్చి స్ప్రింగ్ త్రాసుపై బలాన్ని క్రమంగా ప్రయోగించాలి.
  3. స్ప్రింగ్ త్రాసుపై ప్రయోగించిన బలము న్యూటన్లలో స్ప్రింగ్ త్రాసు తెలియచేస్తుంది.
  4. స్ప్రింగ్ త్రాసుపై బలాన్ని ప్రయోగిస్తున్నపుడు చెక్క దిమ్మె కదులుటకు సిద్ధంగా ఉన్నప్పుడు స్ప్రింగ్ త్రాసు రీడింగ్ ను నమోదు చేయండి.
  5. ఈ రీడింగ్ చెక్క దిమ్మె స్పర్శా వైశాల్యం ఎక్కువగా ఉన్నప్పుడు ఘర్షణ బలాన్ని తెలియజేస్తుంది.
  6. పై ప్రయోగాన్ని ఈసారి చెక్క దిమ్మె స్పర్శా వైశాల్యం తక్కువగా (చెక్క దిమ్మె నిలువుగా) ఉండేటట్లు గచ్చుపై ఉంచి చేసి ఘర్షణ బలాన్ని నమోదుచేయండి.
  7. రెండవసారి కనుగొన్న ఘర్షణ బలం స్పర్శా వైశాల్యం తక్కువ ఉన్నప్పుడు ఘర్షణ బలం అవుతుంది.
  8. పై ప్రయోగాలలో వచ్చిన ఘర్షణ బలాల విలువలు సమానంగా ఉంటాయి. కాబట్టి ఘర్షణ బలం వస్తువు యొక్క స్పర్శా వైశాల్యంపై ఆధారపడదు అని తెలియుచున్నది.

AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ

ప్రశ్న 7.
ఘర్షణ భారంపై ఆధారపడదు కాని ఇది అభిలంబ బలంపై ఆధారపడుతుంది. దీనిని నీవు అంగీకరిస్తావా? వివరించుము.
జవాబు:

  1. ఘర్షణ బలం, వస్తువు భారంపై మరియు అభిలంబ బలంపై ఆధారపడుతుంది అని నేను అంగీకరిస్తాను.
  2. ఘర్షణ బలం, అభిలంబ బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి ఘర్పణ బలం, అభిలంబ బలంపై ఆధారపడును.
  3. వస్తువు భారంపై అభిలంబ బలం ఆధారపడి ఉంటుంది. కాబట్టి వస్తువు భారంపై ఘర్షణ బలం ఆధారపడి ఉంటుంది.

8th Class Physical Science Textbook Page No. 26

ప్రశ్న 8.
మానవుల మరియు జంతువుల జీవితాల్లో ఘర్షణ ఎలాంటి పాత్రను పోషిస్తుంది? వివరించండి.
జవాబు:

  1. మానవులు మరియు జంతువులు పరుగెత్తడానికి, నడవడానికి ఉపయోగపడుతుంది.
  2. మానవులు మరియు జంతువులు కూర్చోగలుగుతున్నాయి, పడుకోగలుగుతున్నాయి.
  3. నీటి జంతువులు నీటిలో ఈదగలుగుతున్నాయి.
  4. పక్షులు గాలిలో ఎగరగలుగుతున్నాయి.
  5. జీవులలో జీవక్రియలకు ఉపయోగపడుతున్నది.
    ఉదా : శ్వాసక్రియ.
  6. జీవులు ఆహారము నమలగలుగుతున్నాయి.
  7. జీవులు పనులు చేయగలుగుతున్నాయి.
    ఉదా : పక్షులు గూళ్ళు కట్టుకోవడం.

ప్రశ్న 9.
రవాణాలో ఘర్షణ ఎందుకు ప్రాముఖ్యమైనది?
జవాబు:

  1. రవాణాకు ఉపయోగపడే వాహనాలను నడపడానికి, ఆపడానికి ఉపయోగపడుతుంది.
  2. వస్తువులు రవాణా చేయుటకు, వాహనాలలో వస్తువులను ఉంచడానికి ఉపయోగపడుతుంది.
  3. నీటిలో వాహనాలు ప్రయాణించడానికి ఉపయోగపడుతుంది.
    ఉదా : ఓడలు, పడవలు.
  4. గాలిలో ప్రయాణించే వాహనాలకు ఉపయోగపడుతుంది.
    ఉదా : విమానాలు, హెలికాప్టర్లు, రాకెట్లు.
  5. బరువైన పెద్ద పెద్ద వస్తువులను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చేరవేయుటకు ట్రాలీలు ఉపయోగపడుతున్నాయి.

8th Class Physical Science Textbook Page No. 28

ప్రశ్న 10.
తలాల మధ్య ఘర్షణను పూర్తిగా తొలగించగలమా? వివరించండి.
జవాబు:

  1. తలాల మధ్య ఘర్షణను పూర్తిగా తొలగించలేము.
  2. తలాలు నునుపుగా ఉంచడం వలన ఘర్షణను కొంతమేరకు తగ్గించవచ్చును.
  3. కందెనలు, బాల్ – బేరింగ్లు ఉపయోగించడం వలన చాలామేరకు ఘర్షణను తగ్గించవచ్చును.

AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ

ప్రశ్న 11.
యంత్రభాగాల్లో బాల్ – బేరింగ్ ను ఏ ఉద్దేశంతో వాడుతారు? నిజ జీవిత పరిస్థితులకు అన్వయించి వివరించండి.
జవాబు:
యంత్రభాగాల్లో బాల్ – బేరింగ్లను ఘర్షణను తగ్గించడానికి మరియు యంత్ర సామర్థ్యాన్ని పెంచుటకు ఉపయోగిస్తారు.

నిజ జీవిత పరిస్థితుల్లో బాల్ – బేరింగ్ల ఉపయోగం :

  1. వాహనాలలో బాల్ – బేరింగ్లను ఉపయోగిస్తారు. ఉదా : సైకిల్, మోటారు వాహనాలు.
  2. ఫ్యాన్లలో బాల్ – బేరింగ్లను ఉపయోగిస్తారు.
  3. మోటర్లలో బాల్ – బేరింగ్ లను ఉపయోగిస్తారు.
  4. డైనమోలలో బాల్ – బేరింగ్ య్ ను ఉపయోగిస్తారు.
  5. పిండిమిల్లులలో మరియు క్రైండర్లలో బాల్ – బేరింగ్ లను ఉపయోగిస్తారు.
  6. పరిశ్రమలలో, యంత్రాలలో బాల్ – బేరింగ్లను ఉపయోగిస్తారు.
  7. కుట్టుమిషన్లలో బాల్ – బేరింగ్ లను ఉపయోగిస్తారు.

పరికరాల జాబితా

పుస్తకము, పురిలేని దారము, గుడ్డ, కార్పెట్, అగ్గిపెట్టె, అంతరిక్ష నౌకలకు అమర్చే హీట్ షీల్డ్ చిత్రాలు, స్పూను, గ్రీజు, కొబ్బరి నూనె, షూ, టైరు, క్యారమ్ బోర్డు నమూనాలు, చక్రాలు గల సూట్ కేసు నమూనా, బాల్ బేరింగ్లు, గాజు గ్లాసు, పక్షి నమూనా, విమానం నమూనా, కారు నమూనా, ట్రాలీ, చెక్క దిమ్మ, బరువులు, బరువులు వేలాడదీసే కొక్కెం, కప్పీ, పొడవైన బల్ల, బరువైన పెట్టి, వాలుతలము, స్ప్రింగ్ త్రాసు, ఇటుక.

8th Class Physical Science 2nd Lesson ఘర్షణ Textbook Activities

కృత్యములు

కృత్యం – 1

1. ఒక వస్తువుపై పనిచేసే వివిధ బలాలు మరియు ఘర్షణబల ప్రభావాన్ని ఒక కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:

AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ 7AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ 8

  1. ఒక పుస్తకాన్ని క్షితిజసమాంతర తలం గచ్చుపై ఉంచి ప్రక్క పటంలో చూపిన విధంగా నెట్టండి.
  2. పుస్తకం దానిని నెట్టిన దిశలో వడి పొంది, ఆ వడి క్రమంగా తగ్గుతూ చివరకు నిశ్చలస్థితిలోకి వస్తుంది.
  3. క్షితిజ సమాంతర దిశలో పుస్తకం వడి తగ్గుతూ ఉంటుంది. అంటే చలన దిశకు వ్యతిరేక దిశలో గచ్చు, పుస్తకం పై బలాన్ని ప్రయోగిస్తుంది అని తెలుస్తున్నది.
  4. గచ్చు; పుస్తకంపై ప్రయోగించే ఈ క్షితిజ సమాంతర బలాన్నే ఘర్షణ బలం అంటారు.

AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ 9
పుస్తకంపై పనిచేసే బలాలు :

  1. పుస్తకంపై కిందకు పనిచేసే భూమ్యాకర్షణ బలం (గురుత్వబలం)
    Fg = W (పుస్తకభారం)
  2. గచ్చుచేత పుస్తకంపై ప్రయోగింపబడే అభిలంబ బలం (in = N)
  3. క్షితిజ లంబదిశలో పుస్తకం చలనంలో ఎటువంటి మార్పు లేదు కనుక ఈ దిశలో ఫలిత బలం శూన్యం
    (Fnet = 0) అనగా Fg = Fn ; W = N = 10
  4. పుస్తకంపై ప్రయోగించిన బలం (F) క్షితిజ సమాంతరంగా బలం ప్రయోగించిన దిశలో ఉంటుంది.
  5. గచ్చు పుస్తకంపై ప్రయోగించిన ఘర్షణ బలం (F) క్షితిజ సమాంతరంగా పుస్తకం కదిలే దిశకు వ్యతిరేక దిశలో ఉంటుంది.

ప్రయోగశాల కృత్యం

2. ఘర్షణ స్వభావాన్ని మరియు సైతిక ఘర్షణ భావనను ఒక కృత్యం ద్వారా వివరించండి.
ఉద్దేశ్యం :
ఘర్షణ స్వభావాన్ని మరియు సైతిక ఘర్షణ (static friction) భావనను అర్థం చేసుకోవటం.

కావలసిన పరికరాలు :
ట్రాలీ (Trolley), చెక్కదిమ్మ, పురిలేని సాగని తీగ, బరువులు, కప్పి (pulley), బరువు వ్రేలాడదీసే కొక్కెం (Weight hanger) మరియు పొడవైన బల్ల.
AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ 10

నిర్వహణ విధానం :
పటంలో చూపిన విధంగా ట్రాలీపై ఒక చెక్కదిమ్మను అమర్చండి.

ట్రాలీకి ఒక దారాన్ని కట్టి దానిని కప్పి ద్వారా పంపండి. దారం రెండవ చివర బరువు వ్రేలాడదీసే కొక్కెం (weight hanger) వ్రేలాడదీయండి.

అతిచిన్న బరువును వెయిట్ హేంగర్ పై ఉంచి, ట్రాలీ మరియు చెక్కదిమ్మ చలనాలలో మార్పులను గమనించండి.

a) ట్రాలీపై ఉంచిన చెక్కదిమ్మ స్థితిలో ఏం మార్పు గమనించారు?
జవాబు:
ట్రాలీపై ఉంచిన చెక్కదిమ్మ స్థితిలో ఏ మార్పు లేదు.

b) చెక్కదిమ్మ పడిపోతుందా లేదా ట్రాలీతోపాటు కదులుతుందా?
జవాబు:
చెక్కదిమ్మ ట్రాలీతోపాటు కదులుతుంది.

c) ట్రాలీ మరియు చెక్కదిమ్మ చలనాల్లో వచ్చే మార్పులేమిటి?
జవాబు:
ట్రాలీ మరియు చెక్కదిమ్మ రెండూ కలిసి ఎడమవైపుకు కదులుతున్నాయి.

d) ఇప్పుడు హేంగర్ పై కొద్ది కొద్దిగా బరువులను పెంచుతూ, ట్రాలీ మరియు చెక్కదిమ్మ చలనాలను పరిశీలించండి.
జవాబు:
ఈ విధంగా హేంగర్ పై బరువులను క్రమంగా పెంచుతుంటే ఒక నిర్దిష్ట బరువు వద్ద లేక నిర్దిష్ట త్వరణం వద్ద చెక్కదిమ్మ ట్రాలీ ఉపరితలం పరంగా వెనుకకు చలిస్తుంది.

e) చెక్కదిమ్మకు బదులు అంతే ద్రవ్యరాశి గల రాయి, ఇనుపదిమ్మలతోనూ, వేర్వేరు ద్రవ్యరాశులు గల రాయి, ఇనుప దిమ్మలతోనూ ప్రయోగం చేస్తే ఏం జరుగుతుంది?
జవాబు:

  1. చెక్కదిమ్మతో సమాన ద్రవ్యరాశి గల రాయి, ఇనుప దిమ్మలతో ఈ ప్రయోగాన్ని చేస్తే ఫలితంలో ఎటువంటి మార్పు ఉండదు.
    కాని వేర్వేరు ద్రవ్యరాశులు గల రాయి, ఇనుప దిమ్మలతో ఈ ప్రయోగం చేస్తే, ఫలితంలో మార్పు కలుగుతుంది. కారణం ద్రవ్యరాశిని బట్టి వస్తువు పై పనిచేసే ఘర్షణ బలం మారుతుంది.

f) రాయి, ఇనుప దిమ్మ మరియు ట్రాలీకి మధ్య సాపేక్ష చలనం కలిగించే గరిష్ఠ బరువు (limiting weight) లో ఏమైనా మార్పు వస్తుందా? లేదా? ఎందుకు?
జవాబు:
మార్పు వస్తుంది. కారణం ద్రవ్యరాశిని బట్టి వస్తువు పై పనిచేసే ఘర్షణ బలం మారుతుంది.

చెక్కదిమ్మ అడుగు’ తలానికి గ్రీజు పూసి, ట్రాలీ ఉపరితలంపై ఉంచి పై ప్రయోగం చేయండి.
g) గరిష్ఠ బరువు (limiting weight)లో ఏమైనా మార్పు వస్తుందా?
జవాబు:
గరిష్ఠ బరువు విలువ తగ్గుతుంది.

h) గరిష్ఠ బరువు విలువను పెంచాలంటే మనం ఏమి చేయాలి?
జవాబు:
గరిష్ఠ బరువు విలువను పెంచాలంటే వస్తువు చలించే ఉపరితలం మీద ఇసుక వేసి దాన్ని గరుకుగా చేయాలి లేదా చెక్కదిమ్మ ద్రవ్యరాశిని పెంచాలి.

i) ఈ ప్రయోగాల ఆధారంగా మీరేం గమనించారు?
జవాబు:
ఈ ప్రయోగాల ఆధారంగా నునుపుతలం కంటె గరుకుతలం చలించే వస్తువు పై ఎక్కువ ఘర్షణ బలాన్ని కలుగజేస్తుంది.

కృత్యం – 2

3. ఘర్షణలో వచ్చే మార్పును గమనించుట.
AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ 11
a) పటంలో చూపినట్లు నేలపై ఉంచిన బరువైన పెట్టెను తక్కువ బలంతో నెట్టండి. అది కదలదు (చలించదు). ఎందుకంటే మనం ప్రయోగించిన బలానికి వ్యతిరేకంగా, అంతే పరిమాణంలో గచ్చు పెట్టెపై ఘర్షణ బలాన్ని ప్రయోగిస్తుంది.

AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ 12
b) ఇప్పుడు పెట్టెపై ప్రయోగించే బలాన్ని క్రమంగా పెంచుతూపొండి. అయినా కూడా పెట్టి చలించదు. ఇక్కడ ప్రయోగబలం, ఘర్షణ బలం రెండూ సమానంగా వుంటూ, వ్యతిరేకంగా ఉన్నవి. అనగా ప్రయోగించిన బలంతోపాటు ఘర్షణ బలం కూడా పెరిగింది అన్న మాట. అందుకే పెట్టెలో చలనం లేదు. కనుక సైతిక ఘర్షణ అనేది స్వయం సర్దుబాటు బలం (self adjusting force) అని అనవచ్చు.

AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ 13
c) కాని ఈ సైతిక ఘర్షణకు ఒక గరిష్ఠ హద్దు వుంటుంది. మనం ప్రయోగించే బలాన్ని క్రమంగా పెంచుతూపోతే ఒకానొక సందర్భంలో అనగా ప్రయోగించిన బలం సైతిక ఘర్షణ యొక్క గరిష్ఠ హద్దు కంటే ఎక్కువైనప్పుడు పెట్టి కదులుతుంది. ఇది పటంలో చూపబడింది.

కృత్యం – 3

4. ఘర్షణ బలంపై గరుకుతల ప్రభావం :
ఘర్షణ బలంపై గరుకుతల ప్రభావంను ఒక కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ 14

  1. క్షితిజ సమాంతరంగా ఉన్న గచ్చుపై చెక్కబోర్డు సహాయంతో ఒక వాలు తలాన్ని ప్రక్క పటంలో చూపిన విధంగా ఏర్పరచండి.
  2. వాలు తలంపై ఏదేని బిందువు “A” వద్ద ఒక గుర్తు పెట్టండి. వాలుతలంపై బంతి చలనం
  3. A నుండి బంతి లేదా పెన్సిల్ సెల్ ను విడిచి పెట్టండి.
  4. అవి వాలు తలం అడుగుభాగం నుండి ఎంత దూరం ప్రయాణించి నిశ్చలస్థితికి వచ్చాయో వాటి దూరాలను స్కేలుతో కొలిచి నమోదు చేయండి.
  5. వాలు తలం అడుగుభాగం నుండి కొద్ది దూరం వరకు ఎలాంటి మడతలు లేకుండా గుడ్డను పరచండి.
  6. మరల పై ప్రయోగాన్ని చేసి బంతి లేదా పెన్సిల్ సెల్ ప్రయాణించిన దూరాలను కనుగొనండి.
  7. ఈసారి ఒక గాజు ఉపరితలాన్ని వాలు తల అడుగుభాగాన ఉండేలా అమర్చండి.
  8. మరల పై ప్రయోగాన్ని బంతి లేదా పెన్సిల్ సెల్ తో చేసి, అవి కదిలిన దూరాలను కనుగొనండి.
  9. పై ప్రయోగాల వల్ల ఒకే వస్తువు వివిధ తలాలపై వేరు వేరు దూరాలు ప్రయాణించడం గమనించవచ్చును.
  10. వివిధ వస్తువులు ఒకే తలంపై వివిధ దూరాలు ప్రయాణించడం కూడా గమనించవచ్చును.
  11. ‘పై పరిశీలన ద్వారా వస్తువులు ప్రయాణించే దూరాలను వస్తువు, నేల తలాల గరుకుదనాలు ప్రభావితం చేస్తాయని తెలుస్తుంది.
  12. దీని ద్వారా “తలం గరుకుదనం పెరిగే కొద్దీ ఘర్షణ పెరుగుతుంది” అని తెలుస్తుంది.

AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ

కృత్యం – 4

5. ఘర్షణ బలంపై స్పర్శావైశాల్య ప్రభావం :

ఘర్షణ బలం వస్తువు స్పర్శా వైశాల్యంపై ఆధారపడదు అని ఒక కృత్యం ద్వారా నిరూపించండి.
(లేదా)
ఘర్షణ స్పర్శాతల వైశాల్యంపై ఆధారపడదు. దీనిని నిరూపించుటకు నీవు ఏ విధమైన కృత్యాన్ని నిర్వహిస్తావు ? వివరించండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ 1
AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ 6

  1. ఒక సన్నని తాడును చెక్క దిమ్మెకు కట్టి గచ్చుపై ప్రక్క పటంలో చూపిన విధంగా స్ప్రింగ్ త్రాసుతో లాగండి.
  2. ఇక్కడ చెక్క దిమ్మెను ఎక్కువ వైశాల్య భాగము గచ్చుతో స్పర్శలో ఉండునట్లు ఉంచండి.
  3. స్ప్రింగ్ త్రాసు చెక్క దిమ్మెపై ప్రయోగించిన బలాన్ని చెక్క దిమ్మెను స్ప్రింగ్ త్రాసుతో లాగుట న్యూటనలో తెలియజేస్తుంది.
  4. చెక్క దిమ్మె కదలటానికి సిద్ధంగా ఉన్నప్పుడు స్ప్రింగ్ త్రాసులో రీడింగ్ ను గుర్తించి నమోదు చేయండి.
  5. ఈ రీడింగ్ ఘర్షణ బలాన్ని తెలియజేస్తుంది.
  6. చెక్క దిమ్మెను తక్కువ వైశాల్య భాగం గచ్చుతో స్పర్శలో ఉండునట్లు ఉంచండి.
  7. పైన తెలిపిన విధంగా మరల ప్రయోగాన్ని చేసి, ఘర్షణ దిమ్మెను లాగుట బలాన్ని కనుగొనండి.
  8. స్పర్శా వైశాల్యం మారటం వల్ల ఘర్షణ బలంలో ఎలాంటి మార్పు కనబడదు.
  9. స్పర్శా వైశాల్యముతో ఎటువంటి సంబంధం లేకుండా రెండు సందర్భాల్లోనూ ఒకే ఘర్షణ బలం ఉండటం గమనించవచ్చును.
  10. ఈ కృత్యం ద్వారా “ఘర్షణ బలం వస్తువు స్పర్శా వైశాల్యంపై ఆధారపడదు” అని తెలుస్తుంది.

కృత్యం – 5

6. ఘర్షణపై అభిలంబ బల ప్రభావం :
ఘర్షణపై అభిలంబ బల ప్రభావమును ఒక కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ 1

  1. ఒక సన్నని తాడును చెక్క దిమ్మెకు కట్టి గచ్చుపై పటంలో చూపిన విధంగా స్ప్రింగ్ త్రాసుతో లాగండి.
  2. ఇక్కడ స్ప్రింగ్ త్రాసు చెక్క దిమ్మెపై ప్రయోగించిన బలాన్ని న్యూటనలో తెలియజేస్తుంది.
  3. చెక్క దిమ్మె కదలటానికి సిద్ధంగా ఉన్నప్పుడు స్ప్రింగ్ త్రాసులో రీడింగ్ ను నమోదు చేయండి.
  4. ఈ రీడింగ్ ఘర్షణ బలాన్ని తెలియజేస్తుంది.
  5. ఈసారి చెక్క దిమ్మెపై మరొక చెక్క దిమ్మెను అమర్చి ప్రయోగాన్ని మరల చేయండి.
  6. రెండవసారి ఘర్షణ బలాన్ని కనుగొనండి.
  7. మొదటిసారి, రెండవసారి చేసిన ప్రయోగాలలో వచ్చిన ఘర్షణ బలం విలువల్లో రెండవసారి ‘ఘర్షణ బలం విలువ ఎక్కువగా ఉండుటను గమనించవచ్చును.
  8. రెండవ ప్రయోగంలో చెక్క దిమ్మెపై మరొక చెక్క దిమ్మెను ఉంచడం వల్ల అభిలంబ బలం (చెక్క దిమ్మెల భారం) పెరిగింది.
  9. కాబట్టి రెండవ ప్రయోగంలో ఘర్పణ బలం కూడా పెరిగినది.
  10. పై ప్రయోగం వలన ఘర్షణ బలం అభిలంబ బలానికి అనులోమానుపాతంలో ఉంటుందని తెలుస్తుంది.
    ∴ ఘర్షణ బలం ∝ అభిలంబ బలం= Ff ∝ fN.

కృత్యం – 6

7. ఘర్షణ ఉష్ణాన్ని జనింపచేస్తుంది.
ఘర్షణ వలన ఉష్ణం ఉత్పత్తి అవుతుందని ఒక కృత్యం ద్వారా వివరించండి.
AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ 15
జవాబు:

  1. అరచేతులను ఒకదానిపై మరొకటి ఉంచి కాసేపు రుద్దండి.
  2. రెండు చేతులు వేడెక్కిన అనుభూతిని పొందుతాము.
  3. ఘర్షణ వలన రెండు చేతుల ఉష్ణోగ్రత పెరుగుతుంది.
  4. కాబట్టి ఘర్షణ ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది అని తెలుస్తుంది.

AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ

కృత్యం – 7

8. ఘర్షణను ఎలా తగ్గించాలి?
ఘర్షణను ఎలా తగ్గించవచ్చునో రెండు కృత్యాల ద్వారా వివరించండి.
జవాబు:
ఎ)

  1. కేరమ్ బోర్డుపై పౌడర్ చల్లకుండా ఆడితిని.
  2. కేరమ్ కాయిన్స్ సులభంగా కదలలేదు.
  3. ఎందుకంటే ఘర్షణబలం వల్ల కేరమ్ కాయిన్స్ సులభంగా కదలలేదు.
  4. ఈసారి కేరమ్ బోర్డుపై పౌడరు చల్లి ఆడితిని.
  5. కేరమ్ కాయిన్స్ సులభంగా కదిలినవి.
  6. ఎందుకంటే పౌడర్ వల్ల ఘర్షణ బలం తగ్గడంతో కేరమ్ కాయిన్స్ సులభంగా కదిలినవి.

బి)

  1. తలుపు యొక్క ఇనుప మడతబందులపై కొన్ని నూనె చుక్కలు వేయకుండా కదిపితిని.
  2. తలుపు సులభంగా కదలలేదు.
  3. తలుపు యొక్క ఇనుప మడతబందులపై కొన్ని నూనె చుక్కలు వేసి కదిపితిని.
  4. తలుపు సులభంగా కదిలినది.
  5. తలుపు యొక్క మడతబందులపై నూనె చుక్కలు వేయడం వలన ఘర్షణ తగ్గింది.
    పై కృత్యాల ద్వారా మనం కదిలే భాగాల మధ్య పౌడర్, కందెనలు పూయడం వల్ల ఘర్షణను తగ్గించవచ్చునని తెలియుచున్నది.

కృత్యం – 8

9. ఘర్షణపై చక్రాల ప్రభావం :
చక్రాల ద్వారా ఘర్షణను తగ్గించవచ్చునని ఒక కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ 16

  1. ఒక బల్లపై పుస్తకాన్ని ఉంచి నెట్టండి.
  2. పుస్తకం నెమ్మదిగా కదులుతుంది. కారణం ఘర్షణ బలం.
  3. ఈసారి బల్లపై రెండు లేదా మూడు పెన్సిళ్ళను లేదా మూతలేని పెన్లను ఉంచి, వాటిపై పుస్తకాన్ని ఉంచి నెట్టండి.
  4. ఈసారి పుస్తకం సులభంగా కదులుతుంది.
    పై కృత్యం ద్వారా ఒక వస్తువు, రెండవ తలంపై జారటం కంటే దొర్లటం సులభం అని తెలుస్తుంది. కాబట్టి చక్రాల ద్వారా ఘర్షణను తగ్గించవచ్చును.

కృత్యం – 9

10. బాల్ బేరింగ్ సూత్రం అవగాహన :
AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ 17
ఎ) రెండు డబ్బా మూతలను తీసుకోండి. ఒక మూతను ఎడమచేతిలో స్థిరంగా వుంచి, రెండవ మూతను మొదటి మూతపై వుంచి త్రిప్పండి. ఏమి గమనిస్తారు?
జవాబు:
అతి కష్టం మీద మూత నిదానంగా తిరిగినది.

బి) ఇప్పుడు నాలుగు లేదా ఐదు గోళీలను మొదటి మూతపై ఉంచి, రెండవ మూతను గోళీలపై ఉంచి త్రిప్పండి. ఏమిగమనిస్తారు?
జవాబు:
ఇప్పుడు పై మూత చాలా సులభంగాను, వేగంగాను తిరిగినది.

కృత్యం – 10

11. ప్రవాహి ఘర్షణను పరిశీలించడం :
AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ 18
ప్రవాహికి ఘర్షణ ఉంటుందని ఒక కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:

  1. నీటితో ఉన్న గాజు గ్లాసులో చెంచాతో నీటిని తిప్పండి.
  2. నీరు ఒక అక్షం పరంగా శ్రమిస్తుంది.
  3. చెంచాతో తిప్పుట ఆపివేయండి.
  4. తిరుగుతున్న నీటి వడి క్రమంగా తగ్గుతూ కొంత సేపటికి నీరు నిశ్చలస్థితికి వస్తుంది.
  5. ద్రవంలోని పొరల మధ్య మరియు ద్రవతలానికి, గాజు గ్లాసు తలానికి మధ్య గల ఘర్షణ బలం వల్ల నీరు నిశ్చలస్థితికి వచ్చింది.

AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ

కృత్యం – 11

12. ప్రవాహి ఘర్షణను ప్రభావితం చేసే అంశాలు :
ఒక టబ్ లో నీటిని తీసుకోండి. అరచేతి వేళ్ల దిశలో, చేతిని నిలువుగా నీటిలో పైకి కిందికి కదపండి. ఇపుడు అరచేతి తలానికి లంబదిశలో చేతిని కదపండి.
ఏ సందర్భంలో ఎక్కువ నిరోధ బలాన్ని అనుభవిస్తాం? ఎందుకు?
జవాబు:

  1. అరచేతి తలానికి లంబదిశలో చేతిని కదిపినపుడు ఎక్కువ నిరోధ బలాన్ని అనుభవిస్తాం.
  2. ఈ స్థితిలో అరచేతి తలాల యొక్క ఎక్కువ వైశాల్యం నీటి ఉపరితలంతో స్పర్శలో ఉండటం వలన నిరోధ బలం ఎక్కువైంది.

AP 8th Class Biology Important Questions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

These AP 8th Class Biology Important Questions 11th Lesson మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది? will help students prepare well for the exams.

AP Board 8th Class Biology 11th Lesson Important Questions and Answers మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

ప్రశ్న 1.
వైరల్ వ్యాధులకు యాంటీబయోటిక్స్ ఎందుకు పనిచేయవు ?
జవాబు:
వైరస్లు కణకవచాన్ని రక్షక కవచంగా మార్చుకోవడమనే జీవరసాయనిక మార్గాన్ని అసలు అనుసరించవు. కాబట్టి వైరల్ వ్యాధులకు యాంటీబయోటిక్స్ పనిచేయవు.

AP 8th Class Biology Important Questions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

ప్రశ్న 2.
గాలి ద్వారా వ్యాధులు ఎలా వ్యాపిస్తాయి? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:

  1. కొన్ని అంటు వ్యాధులు గాలి ద్వారా వ్యాపిస్తాయి.
  2. జలుబు చేసిన వ్యక్తి తుమ్మినప్పుడు కాని, దగ్గినప్పుడు గాని ఏర్పడే తుంపరల ద్వారా వ్యాధికారక జీవులు వ్యాప్తి చెందుతాయి.
  3. ఆ తుంపరలు ఎదుటి వ్యక్తి పీల్చినప్పుడు బ్యాకీరియాలు అతనిలో ప్రవేశించి వ్యాధిని సంక్రమింపచేస్తాయి.
  4. గాలి ద్వారా వ్యాప్తి చెందేవి జలుబు, ‘న్యూమోనియా, క్షయ మొదలైన వ్యాధులు.

ప్రశ్న 3.
నీటి ద్వారా వ్యాధులు ఎలా వ్యాపిస్తాయి ? వివరించండి.
జవాబు:

  1. కొన్ని రకాల వ్యాధులు నీటి ద్వారా వ్యాప్తి చెందుతాయి.
  2. వ్యాధి సోకిన వ్యక్తి విసర్జక పదార్థాల (మలమూత్రాలు) వలన. కొన్ని రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతాయి.
  3. కలరా, రక్తవిరేచనాలు నీటి ద్వారా వ్యాపిస్తాయి.
  4. కలరాను కలిగించే సూక్ష్మజీవులు త్రాగేనీటిలో కలిసిపోవడం వలన ఆ నీరు తాగిన ప్రజలకు వ్యాధి సోకుతుంది.
  5. కలరా కలిగించే వ్యాధి జనకం క్రొత్త అతిథేయిలోకి త్రాగే నీటి ద్వారా ప్రవేశించి వ్యాధిని కలుగచేస్తుంది.
  6. రక్షిత మంచినీటి సరఫరా లేని ప్రాంతాలలో ఇటువంటి వ్యాధులు త్వరగా సోకుతాయి.

ప్రశ్న 4.
లైంగిక వ్యాధులు ఎలా వ్యాపిస్తాయి ? ఎలా వ్యాపించవు ?
జవాబు:

  1. కొన్ని రకాల వ్యాధులు కేవలం లైంగిక పరమైన సంబంధాల వలన మాత్రమే వస్తాయి.
  2. సిఫిలిస్, ఎయిడ్స్ వంటివి లైంగిక వ్యాధులు.
  3. ఇలాంటి వ్యాధులు కలిగిన వ్యక్తులతో లైంగిక కార్యకలాపాలలో పాల్గొనడం వలన ఒకరి నుండి మరొకరికి వ్యాధులు వ్యాప్తి చెందుతాయి.
  4. లైంగిక వ్యాధులు భౌతిక స్పర్శ వలన వ్యాపించవు.
  5. సర్వసాధారణంగా కరచాలనం, కౌగిలించుకోవటం, లేక కుస్తీ పోటీలు వంటి ఆటల వలన కానీ కలిసి కూర్చోవడం, పనిచేయడం, ప్రయాణించడం వంటి వాటి వలన సోకవు.

AP 8th Class Biology Important Questions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

ప్రశ్న 5.
వ్యాధికారక సూక్ష్మజీవులు శరీరంలో ఎక్కడ చేరతాయి ?
జవాబు:

  1. వ్యాధికారక జీవులు శరీరంలోని వివిధ భాగాలలోకి చేరి పరిణితి చెందుతాయి.
  2. శరీరంలోని వివిధ భాగాలు వ్యాధి కారక జీవులకు ప్రవేశ మార్గాలుగా పనిచేస్తాయి.
  3. ఏ శరీర భాగం వీటికి ఆవాసంగా మారుతుంది అనే విషయం ఏ మార్గం ద్వారా ఇది శరీరంలోకి ప్రవేశిస్తుందనే దానిపైన ఆధారపడి ఉంటుంది.
  4. ఉదాహరణకు గాలిద్వారా ముక్కులోకి ప్రవేశించినప్పుడు అది చివరికి ఊపిరితిత్తులలోకి చేరే అవకాశముంటుంది.
  5. క్షయ వ్యాధిని కలుగచేసే బ్యాక్టీరియా కూడా ఈ మార్గం ద్వారానే శరీరంలోకి ప్రవేశిస్తుంది.
  6. ఒకవేళ నోటి ద్వారా ప్రవేశిస్తే అవి జీర్ణాశయ, చిన్నప్రేగు గోడల్లో నిల్వ ఉండి, వ్యాధిని కలుగజేస్తాయి.
    ఉదా : టైఫాయిడ్.
  7. బాక్టీరియా కొన్ని రకాల వైరస్లు కాలేయంలో చేరడం వల్ల కామెర్ల వ్యాధి కలిగే అవకాశం ఉంది.
  8. కానీ ప్రతిసారి ఇలా జరుగదు. ఉదాహరణకి హెచ్.ఐ.వి. లైంగిక అవయవాల ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పటికీ . లింఫ్ గ్రంథుల నుండి మొత్తం శరీరంలోకి వ్యాపిస్తాయి.
  9. మలేరియా కలుగజేసే వ్యాధికారక జీవులు దోమకాటు ద్వారా కాలేయంలోకి వెళ్ళి అక్కడి నుండి ఎర్రరక్త కణాలలోకి వెళ్తాయి.
  10. మెదడు వాపు వ్యా ధి (Japanese encephalitis) కలుగచేసే వైరస్ దోమకాటు వలన ప్రవేశించి మెదడుకు చేరి వ్యాధిని కలుగచేస్తుంది.

ప్రశ్న 6.
వ్యాధి లక్షణాలు దేనిపైన ఆధారపడతాయి? ఉదహరించండి.
జవాబు:

  1. వ్యాధి జనక జీవులు ఏరకమైన అవయవాలు లేదా కణజాలాలలో ప్రవేశిస్తాయో వాటి ఆధారంగా వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.
  2. వ్యాధికారక జీవులు ,ఊపిరితిత్తులను ఆశ్రయిస్తే దగ్గు, శ్వాసకోశ సంబంధ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.
  3. కాలేయాన్ని ఆశ్రయిస్తే కామెర్ల వ్యాధి లక్షణాలు కనబడుతాయి.
  4. మెదడులో ప్రవేశించినట్లయితే తలనొప్పి, వాంతులు, స్పృహకోల్పోవడం వంటి వ్యాధి లక్షణాలను చూస్తాం.
  5. వ్యాధి జనక జీవులు దాడిచేసే కణజాలం లేదా అవయవం విధులను బట్టి మనం వ్యాధి లక్షణాలను ఊహించవచ్చు.

ప్రశ్న 7.
పరిసరాలను ఆరోగ్యవంతంగా ఉంచుకోవడానికి ప్రజలను చైతన్యపరచడానికి ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:
కరపత్రం

“చికిత్స కన్నా నివారణ అత్యుత్తమం” అన్న సూక్తిని అనుసరించి, మనం మన ఇంటి పరిసరాలను చెత్తాచెదారం, మురికి గుంటలలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. మురుగు నీటి కాల్వలలో కిరోసిన్ చల్లడం ద్వారా దోమల లార్వాలను. అరికట్టవచ్చు.. ఆహార పదార్థాలను ఎప్పుడు వేడిగా ఉన్నప్పుడే భుజించాలి. మల విసర్జన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. తగినంత శారీర వ్యాయామం అనంతరం స్నానం చేయాలి. ఆరోగ్యవంతమైన అలవాట్ల ద్వారా అందరూ ఆరోగ్యంగా ఉంటారు.

AP 8th Class Biology Important Questions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

1 మార్కు ప్రశ్నలు

ప్రశ్న 1.
స్వల్పకాలిక వ్యాధులు ఎందుకు దీర్ఘకాలిక వ్యాధులుగా మారతాయి ?
జవాబు:
స్వల్పకాలిక వ్యాధులకు తరచు గురి అవుతూ ఉన్నప్పుడు, స్వల్పకాలిక వ్యాధులను సరిగా గుర్తించలేనప్పుడు, స్వల్పకాలిక వ్యాధులను నిర్లక్ష్యం చేసినపుడు, స్వల్పకాలికంగా ఉన్నప్పుడు సరిగా చికిత్స చేయించుకోకపోయినప్పుడు దీర్ఘకాలిక వ్యాధులుగా మారతాయి.
ఉదా : ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు.

ప్రశ్న 2.
మంచి ఆరోగ్యానికి కావల్సిన రెండు పరిస్థితులను వివరించండి.
జవాబు:
1. శరీర అవయవాలు అన్నీ చక్కగా పనిచేయుట : దీని వలన శరీరంలో ప్రతి అవయవం చక్కగా పనిచేయును. ఉదాహరణకు నాట్యం చేసే వ్యక్తిలో మంచి ఆరోగ్యం అంటే తన శరీరాన్ని ఎలా కావలిస్తే అలా వంచుతూ వివిధ భంగిమలతో అద్భుతంగా నాట్యం చేయడం.
2. మనలోని ప్రత్యేక సామర్థ్యాలను గుర్తించగలిగితే మంచి ఆరోగ్యంగా ఉంటాము.

ప్రశ్న 3.
అసంక్రామ్యత అంటే ఏమిటి ?
జవాబు:
ఒక వ్యాధికి ఒక వ్యక్తి పలుసార్లు గురి అయినప్పుడు ఆ వ్యాధిని ఎదురుకొనే శక్తి అతనికి వస్తుంది. దీనిని అసంక్రామ్యత అంటారు.

AP 8th Class Biology Important Questions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

ప్రశ్న 4.
వైరల్ వ్యాధులకు యాంటిబయోటిక్స్ ఎందుకు పనిచేయవు ?
జవాబు:
వైరస్లు కణకవచాన్ని రక్షక కవచంగా మార్చుకోవడమనే జీవరసాయనిక మార్గాన్ని అసలు అనుసరించవు. కాబట్టి ఆ వైరల్ వ్యాధులకు యాంటీబయోటిక్స్ పనిచేయవు.

లక్ష్యాత్మక నియోజనము

ప్రశ్న 1.
కామెర్ల వ్యాధి కలుగచేసే వైరస్ ఎలా వ్యాప్తి చెందును?
ఎ) గాలి
బి) నీరు
సి) జంతువులు
డి) ఆహారం
జవాబు:
బి) నీరు

ప్రశ్న 2.
దీర్ఘకాలిక వ్యా ధి ఏది ?
ఎ) జలుబు
బి) జ్వరం
సి) ఊపిరితిత్తుల క్షయ
డి) ఏదీ కాదు
జవాబు:
సి) ఊపిరితిత్తుల క్షయ

ప్రశ్న 3.
ఈ క్రింది వానిలో అసాంక్రమిక వ్యాధి
ఎ) గుండెపోటు
బి) జలుబు
సి) క్షయ
డి) కలరా
జవాబు:
ఎ) గుండెపోటు

ప్రశ్న 4.
మార్షల్ మరియు వారెను దేనిపై పరిశోధన జరిపినారు?
ఎ) ఊపిరితిత్తులు
బి) గుండె
సి) మూత్రపిండాలలో రాళ్ళు
డి) జీర్ణాశయ అల్సర్
జవాబు:
డి) జీర్ణాశయ అల్సర్

AP 8th Class Biology Important Questions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

ప్రశ్న 5.
వ్యాధిగ్రస్తుడి నుండి వ్యాధి ఏ విధంగా ఉన్నప్పుడు సులువుగా వ్యాపించును ?
ఎ) దూరంగా
బి) దగ్గరగా
సి) బాగా దూరంగా
డి) ఏదీకాదు
జవాబు:
బి) దగ్గరగా

ప్రశ్న 6.
తల్లి నుండి బిడ్డకు సోకకుండా చేసిన వ్యాధి
ఎ) మెదడువాపు
బి) కలరా
సి) ఎయిడ్స్
డి) టైఫాయిడ్
జవాబు:
సి) ఎయిడ్స్

ప్రశ్న 7.
సూక్ష్మజీవ నాశికకు ఉదాహరణ
ఎ) పెన్సిలిన్
బి) 2, 4 – డి .
సి) పారాసిటమల్
డి) వార్ఫిన్
జవాబు:
ఎ) పెన్సిలిన్

ప్రశ్న 8.
ఈ క్రింది వానిలో ప్రపంచంలో ఎక్కడా లేని వ్యాధి
ఎ) ఆటలమ్మ
బి) మశూచి
సి) డెంగ్యూ
డి) ఎయిడ్స్
జవాబు:
బి) మశూచి

AP 8th Class Biology Important Questions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

ప్రశ్న 9.
ఆరోగ్యంగా ఉండడం అంటే
ఎ) శారీరకంగా బాగుండటం
బి) మానసికంగా బాగా ఉండటం
సి) సామాజికంగా సరైన స్థితిలో ఉండటం
డి) పైవన్నీ
జవాబు:
డి) పైవన్నీ

ప్రశ్న 10.
వ్యక్తిగత పరిశుభ్రతలో చాలా ముఖ్యమైనది
ఎ) పరిసరాల శుభ్రత
బి) సామాజిక పరిశుభ్రత
సి) గ్రామ పరిశుభ్రత
డి) పైవన్నీ
జవాబు:
బి) సామాజిక పరిశుభ్రత

ప్రశ్న 11.
ఈ క్రింది వానిలో దీర్ఘకాలిక వ్యా ధి
ఎ) మలేరియా
బి) ఫైలేరియా
సి) టైఫాయిడ్
డి) జ్వరం
జవాబు:
బి) ఫైలేరియా

ప్రశ్న 12.
పేదరికం, ప్రజా పంపిణీ వ్యవస్థ వ్యాధి కారకతలో ఎన్నవ దశకు చెందిన కారణాలు ?
ఎ) ప్రథమ దశ
బి) రెండవ దశ
సి) మూడవ దశ
డి) నాల్గవ దశ
జవాబు:
సి) మూడవ దశ

AP 8th Class Biology Important Questions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

ప్రశ్న 13.
పౌష్టికాహారం దొరకకపోవటం వ్యాధికారకతలో ఎన్నవ దశకు చెందిన కారణం?
ఎ) ప్రథమ దశ
బి) రెండవ దశలో
సి) మూడవ దశ
డి) నాల్గవ దశ
జవాబు:
బి) రెండవ దశలో

ప్రశ్న 14.
సాంక్రమిక సూక్ష్మజీవులు వ్యాధికి
ఎ) సత్వర కారకం
బి) దోహదకారకం
సి) పై రెండూ
డి) పైవేవీ కావు
జవాబు:
ఎ) సత్వర కారకం

AP 8th Class Biology Important Questions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

ప్రశ్న 15.
కేన్సర్ ఒక
ఎ) సాంక్రమిక వ్యాధి
బి) అసాంక్రమిక వ్యాధి.
సి) దీర్ఘకాలిక వ్యాధి
డి) బి మరియు సి
జవాబు:
డి) బి మరియు సి

ప్రశ్న 16.
జీర్ణాశయ అల్సరకు ఈ క్రింది బాక్టీరియా కారణమని వారెన్, మార్షల్ కనుగొన్నారు.
ఎ) స్టాఫైలోకోకస్
బి) విబ్రియోకామా
సి) హెలికోబాక్టర్ పైలోరి
డి) లాక్టోబాసిల్లస్
జవాబు:
సి) హెలికోబాక్టర్ పైలోరి

ప్రశ్న 17.
ఈ క్రింది వానిలో వైరస్ వల్ల రాని వ్యాధి.
ఎ) ఎయిడ్స్
బి) ఆంధ్రాక్స్
సి) ఇనూయెంజా
డి) డెంగ్యూ
జవాబు:
బి) ఆంధ్రాక్స్

AP 8th Class Biology Important Questions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

ప్రశ్న 18.
ఈ క్రింది వానిలో బాక్టీరియా వ్యాధి కానిది
ఎ) జలుబు
బి) టైఫాయిడ్
సి) కలరా
డి) క్షయ
జవాబు:
ఎ) జలుబు

ప్రశ్న 19.
ఈ క్రింది వానిలో ప్రోటోజోవన్ల వలన కలిగే వ్యాధి
ఎ) మలేరియా
బి) ఫైలేరియా
సి) టైఫాయిడ్
డి) డెంగ్యూ జ్వరం
జవాబు:
ఎ) మలేరియా

ప్రశ్న 20.
ఈ క్రింది వానిలో హెల్మింథిస్ జాతి క్రిముల వలన కలిగే వ్యాధి
ఎ) మలేరియా
బి) ఫైలేరియా
సి) టైఫాయిడ్
డి) డెంగ్యూ జ్వరం
జవాబు:
బి) ఫైలేరియా

ప్రశ్న 21.
ఎల్లప్పుడు అతిథేయి కణాలలో జీవించేవి
ఎ) బాక్టీరియా
బి) వైరస్
సి) ప్రోటోజోవా
డి) హెల్మింథిస్
జవాబు:
బి) వైరస్

AP 8th Class Biology Important Questions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

ప్రశ్న 22.
యాంటీబయోటిక్స్ వైరస్ మీద పని చేయకపోటానికి కారణం
ఎ) వైరస్టు అతిధేయ కణాల వెలుపల నిర్జీవంగా ఉండటం
బి) వైరస్లు కణకవచాన్ని రక్షక కవచంగా మార్చుకోక పోవటం
సి) వైరస్లు ప్రత్యేకమయిన జీవ రసాయన మార్గాలను అవలంబించటం
డి) బి మరియు సి
జవాబు:
సి) వైరస్లు ప్రత్యేకమయిన జీవ రసాయన మార్గాలను అవలంబించటం

ప్రశ్న 23.
ఈ క్రింది వానిలో గాలి ద్వారా వ్యాప్తి చెందని వ్యాధి
ఎ) కలరా
బి) క్షయ
సి) న్యుమోనియా
డి) జలుబు
జవాబు:
ఎ) కలరా

ప్రశ్న 24.
ఈ క్రింది వానిలో నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి
ఎ) జలుబు
బి) క్షయ
సి) న్యుమోనియా
డి) రక్త విరేచనాలు
జవాబు:
డి) రక్త విరేచనాలు

ప్రశ్న 25.
ఈ క్రింది వానిలో లైంగిక సంబంధాల వలన వచ్చే
ఎ) మలేరియా
బి) ఫైలేరియా
సి) గనేరియా
డి) ఢిల్జీరియా
జవాబు:
సి) గనేరియా

AP 8th Class Biology Important Questions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

ప్రశ్న 26.
అసంక్రామ్యత వ్యాధి జనక జీవులను చంపటానికి కొత్త కణాలను కణజాలాలలోనికి చేర్చటానికి కనిపించే లక్షణాలు
ఎ) నొప్పి
బి) వాపు
సి) జ్వరం
డి) పైవన్నీ
జవాబు:
డి) పైవన్నీ

ప్రశ్న 27.
క్రింది వానిలో టీకాలేని వ్యాధి
ఎ) ఆటలమ్మ
బి) కామెర్లు
సి) రేబిస్
డి) ఎయిడ్స్
జవాబు:
డి) ఎయిడ్స్

ప్రశ్న 28.
హెపటైటిస్ వ్యాధి కలుగచేసే వైరస్ దేని ద్వారా వ్యాప్తి చెందును?
ఎ) గాలి
బి) నీరు
సి) జంతువులు
డి) ఆహారం
జవాబు:
బి) నీరు

ప్రశ్న 29.
చిత్రంలో ఏ జీవి కాలా అజార్ వ్యాధిని కలిగిస్తుంది ?
AP 8th Class Biology Important Questions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది 1
జవాబు:
AP 8th Class Biology Important Questions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది 2

ప్రశ్న 30.
వ్యాధులను కింది విధంగా వర్గీకరిస్తారు.
(A) సాంక్రమిక వ్యాధులు మరియు అసాంక్రమిక వ్యాధులు
(B) దీర్ఘకాల వ్యాధులు మరియు స్వల్పకాల వ్యాధులు
(C) A మరియు B
(D) దీన్ని వర్గీకరించలేము
జవాబు:
(C) A మరియు B

AP 8th Class Biology Important Questions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

ప్రశ్న 31.
కింది వాటిలో , కామెర్ల వ్యాధిలో అధికంగా ప్రభావితమయ్యే అంగము
(A) కాలేయం
(B) మూత్రపిండాలు
(C) ఊపిరితిత్తులు
(D) కళ్ళు
జవాబు:
(A) కాలేయం

ప్రశ్న 32.
జీవజాతులను సంరక్షించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసినవి SA-II : – 2016-17 ( D )
(A) జాతీయ పార్కులు
(B) సంరక్షణ కేంద్రాలు
(C) శాంక్చురీలు
(D) పైవన్నీ
జవాబు:
(D) పైవన్నీ

AP 8th Class Biology Important Questions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

These AP 8th Class Biology Important Questions 8th Lesson మొక్కల నుండి ఆహారోత్పత్తి will help students prepare well for the exams.

AP Board 8th Class Biology 8th Lesson Important Questions and Answers మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 1.
రైతులు నాట్లు వేసి పండించే పంటలకు రెండు ఉదాహరణలు రాయండి.
జవాబు:
వరి, గోధుమ, మిరప

AP 8th Class Biology Important Questions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 2.
ఖరీఫ్, రబీ అంటే ఏమిటి ? ఈ కాలంలో పండే పంటలకు ఉదాహరణలు రాయండి.
జవాబు:

  1. వర్షాకాలంలో పండే పంటల్ని ఖరీఫ్ పంటలు అంటారు.
  2. ఖరీఫ్ పంట కాలం జూన్ – అక్టోబర్.
  3. ఖరీఫ్ లో పండించే పంటలు వరి, పసుపు, చెరుకు, జొన్న
  4. శీతాకాలంలో పండే పంటల్ని రబీ రబీ పంటలు అంటారు. రబీ పంటకాలం .అక్టోబరు, మార్చి.
  5. రబీలో పండించే పంటలు గోధుమ వరి, జీలకర్ర, ధనియాలు, ఆవాలు.

ప్రశ్న 3.
క్రింది చిత్రం చూడండి. అడిగిన ప్రశ్నలకు సమాధానం రాయండి.
AP 8th Class Biology Important Questions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 1
ఎ) ఇది ఏరకమైన ఎరువు ?
బి) ఇందులో ఉన్న రసాయన పదార్థాలు ఏవి ?
సి) 20-5-10 దేనిని సూచిస్తుంది.
డి) ఇలాంటి ఎరువులు వాడడం వల్ల లాభమా ? నష్టమా ? ఎందుకు ?
జవాబు:
ఎ) రసాయనిక ఎరువు
బి) నైట్రోజన్ (N) ఫాస్పరస్ (P) పోటాషియం (K)
సి) 20 – నైట్రోజన్ శాతం 5 – ఫాస్పరస్ శాతం – 10 – పొటాషియం శాతం
డి) ఇలా ఈ రసాయనిక ఎరువులను అధిక మొత్తాలలో వాడటం వలన నేల ఆరోగ్యం తగ్గిపోతుంది.

AP 8th Class Biology Important Questions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 4.
కింది పట్టికను చదివి ప్రశ్నలకు సమాధానం రాయండి.
AP 8th Class Biology Important Questions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 2

1. మొక్కలలో శిలీంధ్రాల ద్వారా వచ్చే వ్యాధులేవి ?
జవాబు:
చెరకు ఎర్రకుళ్ళు తెగులు, వేరుశనగ టిక్కా తెగులు.

2. ఏయే వ్యాధులు గాలి ద్వారా వ్యాపిస్తాయి ?
జవాబు:
ఎర్ర కుళ్ళు తెగులు, సిట్రస్ కాంకర్, వేరుశగన టిక్కా తెగులు.

3. వేరుశనగలో తిక్కా తెగులుకు కారణమైన సూక్ష్మజీవి ఏది ?
జవాబు:
శిలీంధ్రం

4. వైరస్టు దేని ద్వారా పొగాకులో మొజాయిక్ వ్యాధిని కలిగిస్తాయి ?
జవాబు:
కీటకాల ద్వారా

AP 8th Class Biology Important Questions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

5. స్ప్రింక్లర్ మరియు బిందు సేద్యం మధ్య పోలిక ఏమి ?
జవాబు:
స్ప్రింకర్లు మరియు బిందు సేద్య పద్ధతులను నీరు తక్కువగా లభించే ప్రాంతాలలో పంటలను పండించడానికి . వినియోగించే సూక్ష్మ సేద్య పద్ధతులు.

1 మార్కు ప్రశ్నలు

ప్రశ్న 1.
రామయ్య తన పొలాన్ని చదునుగా దున్నాడు. సోమయ్య పొలం హెచ్చుతగ్గులు ఉంది. ఎవరు అధిక దిగుబడి సాధిస్తారు? ఎందుకు ?
జవాబు:
రామయ్య ఎక్కువ దిగుబడి సాధిస్తాడు. కారణం నేలను చదును చేయడం వలన పొలంలో నీరు అన్నివైపులకు సమానంగా ప్రసరించును. పొలంలో వేసిన పశువుల ఎరువు కూడా సమానంగా నేలలో కలిసి అన్ని మొక్కలకు అందును. విత్తనాలు వేయుటకు లేదా నారు మొక్కలు నాటడానికి వీలుగా ఉండును.

ప్రశ్న 2.
విత్తనాలు నేలలో విత్తే ముందర శిలీంధ్ర నాశకాల వంటి రసాయనిక పదార్థాలతో శుద్ధి చేస్తారు. ఎందుకు ?
జవాబు:
విత్తనాలు నేలలో విత్తే ముందర శిలీంధ్ర నాశకాల వంటి రసాయనిక పదార్థాలతో శుద్ధి చేస్తారు. ఎందుకంటే నేలలో ‘ఉన్న ఏవైనా శిలీంధ్రాలు, ఇతర సూక్ష్మజీవుల నుండి విత్తనాలను రక్షించుకొనుటకు.

ప్రశ్న 3.
వేసవి దుక్కులు అంటే ఏమిటి ?
జవాబు:
రైతులు వేసవికాలంలోనే తమ పొలాలను దున్నుతారు. వీటిని వేసవి దుక్కులు అంటారు.

AP 8th Class Biology Important Questions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 4.
మన దేశంలోని అన్ని ప్రాంతాలలో పండే పంటలు ఏవి ?
జవాబు:
వరి, గోధుమ, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, ప్రత్తి.

ప్రశ్న 5.
కొన్ని పంటలను అన్ని ప్రాంతాలలోనూ ఎందుకని పండించగలుగుతున్నారు ?
జవాబు:
సారవంతమైన భూమి, నీరు లభ్యత వలన.

ప్రశ్న 6.
గోధుమ పంటను నవంబర్ లో సాగుచేస్తే ఏమవుతుంది ?
జవాబు:
గోధుమ పంటను నవంబర్ లో సాగుచేస్తే పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది. కారణం ఫిబ్రవరిలో రాత్రి సమయం 12 1/2 గంటలు ఉండి బాగా పుష్పిస్తాయి.

ప్రశ్న 7.
ఎందుకు కొన్ని విత్తనాలు నీళ్ళ పై తేలుతాయి ?
జవాబు:
కొన్ని విత్తనాలు నీళ్ళపై తేలుతాయి. కారణం అవి పుచ్చు విత్తనాలు అయి ఉండటం వలన విత్తనం లోపల ఖాళీగా ఉండి నీటికన్న తక్కువ సాంద్రత కలిగి ఉంటాయి. అందుకని నీటిపై తేలుతాయి.

ప్రశ్న 8.
తేలిన విత్తనాలను ఎందుకు తీసివేయాలి ?
జవాబు:
తేలిన విత్తనాలకు మొలకెత్తే సామర్థ్యం ఉండదు కాబట్టి వాటిని తీసివేయాలి.

AP 8th Class Biology Important Questions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 9.
విత్తనాలను ఒక రోజంతా నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి ?
జవాబు:
విత్తనాలను ఒక రోజంతా నీళ్ళలో నానబెట్టడం వలన విత్తనం తేమగా అయ్యి విత్తనాలకు అంకురించే శక్తి వస్తుంది.

ప్రశ్న 10.
విత్తనాలను నేలలో విత్తిన తరువాత మట్టితో ఎందుకు కప్పుతారు ?
జవాబు:
విత్తనాలను నేలలో విత్తిన తరువాత మట్టితో కప్పుటకు కారణాలు మట్టి నుండి వాటికి కావలసిన తేమను, వేడిమిని పొందుటకు మరియు గుల్లగా ఉన్న నేల నుండి గాలిని తీసుకొనుటకు. మట్టిలో విత్తిన తర్వాత కప్పకపోతే పక్షులు, ఇతర జంతువులు ఆ విత్తనాలను తినేస్తాయి.

ప్రశ్న 11.
జపాన్లో అధిక దిగుబడి సాధించడానికి గల కారణాలేవి ?
జవాబు:
జపాన్ వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు ఉపయోగించటం, జపాన్ అత్యధిక దిగుబడి నిచ్చే వరి విత్తనాలు ఉపయోగించటం.

ప్రశ్న 12.
భారతదేశంలో తక్కువ దిగుబడి సాధించడానికి గల కారణాలేవి ?
జవాబు:
భారతదేశం వ్యవసాయ రంగంలో ప్రాచీన పద్ధతులు ఉపయోగించటం, వ్యవసాయంలోనికి చదువుకున్న వాళ్ళు రాకపోవటం.

ప్రశ్న 13.
మూడవ పంట అన్ని ప్రాంతాలలో పండించకపోవడానికి కారణాలు ఏమిటి?
జవాబు:
నీటి పారుదల వసతి లేకపోవడం. నేల సారాన్ని కోల్పోవడం.

AP 8th Class Biology Important Questions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 14.
వరి పండించే పొలాన్ని చిన్న చిన్న మడులుగా ఎందుకు చేస్తారు ?
జవాబు:
పంటకు నీరు అందించుట సులభంగా ఉంటుంది. కాబట్టి వరి పండించే పొలాన్ని చిన్న చిన్న మడులుగా చేస్తారు.

ప్రశ్న 15.
వరిని ఎలా పండిస్తారు ?
జవాబు:
వరిని నారుపోసి, నాట్లు వేసి చిన్న చిన్న మడులలో పండిస్తారు.

ప్రశ్న 16.
ప్రస్తుతం సంప్రదాయంగా సాగుచేస్తున్న విత్తనాలు కనుమరుగవుతున్నాయి ? ఇలా ఎందుకు జరుగుతోంది ఆలోచించండి.
జవాబు:
ప్రస్తుతం సంప్రదాయంగా సాగుచేస్తున్న విత్తనాలు కనుమరుగవుతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే వాటి స్థానాన్ని సంకరణ జాతి విత్తనాలు ఆక్రమించటం వలన.

ప్రశ్న 17.
నారు నాటడం ద్వారా ఇంకా ఏ ఏ పంటలు పండిస్తారు?
జవాబు:
మిరప, వంగ, టమోటా మొదలైన పంటలు నారు నాటడం ద్వారా పండిస్తారు.

ప్రశ్న 18.
ఎందుకు నారు మొక్కలను దూరం దూరంగా నాటుతారు ?
జవాబు:
నారు మొక్కలు దూరం దూరంగా నాటుటకు కారణం అవి పెరిగి పెద్దగా అయిన తర్వాత స్థలం కోసం, నీటి కోసం, ఆహార పదార్థాల కోసం పోటీ లేకుండా ఉండుటకు.

AP 8th Class Biology Important Questions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 19.
అన్ని రకాల పంటలను నారు మొక్కల్లాగానే పీకి మళ్ళీ నాటుతారా ? అలా ఎందుకు చేయరు ?
జవాబు:
అన్ని రకాల పంటలను నారు మొక్కల్లాగా మళ్ళీ పీకి నాటరు. కారణం వాటి విత్తనాలు పెద్దవిగా ఉండటం.

ప్రశ్న 20.
వ్యాధి సోకిన పంటలోని మొక్కలను రైతు ఏం చేస్తాడు ?
జవాబు:
వ్యాధి సోకిన పంటలోని మొక్కల ఆకులు, అవసరం అనుకొంటే మొక్కలను రైతు తొలగిస్తాడు. అవి అన్నీ ఒకచోట వేసి కాలుస్తాడు.

ప్రశ్న 21.
కలుపు మొక్కలను ఎందుకు తొలగించాలి ?
జవాబు:
కలుపు మొక్కలు పోషక పదార్థాలు, నీరు, వెలుతురు కోసం పంట మొక్కలతో పోటీపడతాయి. దీనివల్ల సాగు మొక్కలు పెరగవు. అందుకే కలుపు మొక్కలు తొలగించాలి.

లక్ష్యాత్మక నియోజనము

ప్రశ్న 1.
ఈ కింది వాటిలో మొక్కలు పుష్పించడానికి రాత్రికాల – సమయానికి ప్రభావం ఏమాత్రం ఉండదు.
ఎ) వేరుశనగ
బి) పత్తి
సి) సోయా చిక్కుడు
డి) వరి
జవాబు:
సి) సోయా చిక్కుడు

AP 8th Class Biology Important Questions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 2.
నాగలితో నేలను దున్నినపుడు ఏ ఆకారంలో చాళ్ళు ఏర్పడతాయి?
ఎ) T
బి) S
సి) V
డి) W
జవాబు:
సి) V

ప్రశ్న 3.
విత్తనాలను ఎప్పుడు రసాయనిక పదార్థాలతో శుద్ధి చేస్తారు?
ఎ) ఏర్పడినప్పుడు
బి) నాటే ముందు
సి) దాచే ముందు
డి) కోతల ముందు
జవాబు:
డి) కోతల ముందు

ప్రశ్న 4.
వేరుశనగలో వచ్చే శిలీంధ్ర వ్యాధి
ఎ) తుప్పు తెగులు
బి) టిక్కా తెగులు
సి) ఏర్రకుళ్ళు తెగులు
డి) అగ్గి తెగులు
జవాబు:
బి) టిక్కా తెగులు

ప్రశ్న 5.
కలుపు మొక్కలను ద్విదళ బీజాలలో నిర్మూలించుటకు ఉపయోగించే రసాయనం పేరు
ఎ) నాప్తలీన్ ఎసిటికామ్లం
బి) ఇండోల్ బ్యూటరిక్ ఆమ్లం
సి) ఎసిటికామ్లం
డి) 2,4 – D
జవాబు:
డి) 2,4 – D

ప్రశ్న 6.
పంట నుండి గింజలను సేకరించుటను ఏమి అంటారు ?
ఎ) పంటకోతలు
బి) పంట నూర్పిళ్ళు
సి) నీటి పారుదల
డి) కలుపు తీయుట
జవాబు:
బి) పంట నూర్పిళ్ళు

AP 8th Class Biology Important Questions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 7.
మొదటి వరి పంట రైతులు ఎవరికి పెడతారు ?
ఎ) పిచ్చుకలు
బి) గ్రద్దలు
సి) కాకులు
డి) కోళ్ళు
జవాబు:
ఎ) పిచ్చుకలు

ప్రశ్న 8.
పంట అనగా
ఎ) మనకు ఉపయోగపడే మొక్కలను అధిక సంఖ్యలో పెంచడం
బి) ఆహారంగా ఉపయోగపడే మొక్కలను అధిక సంఖ్యలో పెంచడం
సి) తోటలు పెంచడం
డి) ధాన్యాన్ని పండించడం
జవాబు:
ఎ) మనకు ఉపయోగపడే మొక్కలను అధిక సంఖ్యలో పెంచడం

ప్రశ్న 9.
దీర్ఘకాలిక పంటలు పండించడానికి ఎన్ని రోజుల కన్నా ఎక్కువ సమయం పడుతుంది ?
ఎ) 90 రోజులు
బి) 180 రోజులు
సి) 270 రోజులు
డి) 360 రోజులు
జవాబు:
బి) 180 రోజులు

ప్రశ్న 10.
క్రింది వానిలో దీర్ఘ కాలిక పంట కానిది
ఎ) జొన్న
బి) కందులు
సి) మినుములు
డి) పైవేవీ కావు
జవాబు:
సి) మినుములు

AP 8th Class Biology Important Questions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 11.
క్రింది వానిలో స్వల్పకాలిక పంట ఏది?
ఎ) పెసలు
బి) మినుములు
సి) ఎ మరియు బి
డి) పైవేవీ కావు
జవాబు:
సి) ఎ మరియు బి

ప్రశ్న 12.
స్వల్పకాలిక పంటలు పండటానికి ఇంతకన్నా తక్కువ సమయం పడుతుంది.
ఎ) 60 రోజులు
బి) 100 రోజులు
సి) 120 రోజులు
డి) 150 రోజులు
జవాబు:
బి) 100 రోజులు

ప్రశ్న 13.
అరబిక్ భాషలో ఖరీఫ్ అనగా
ఎ) ఎండ
బి) గాలి
సి) వర్షం
డి) చలి
జవాబు:
సి) వర్షం

ప్రశ్న 14.
ఈ క్రింది వానిలో ఖరీఫ్ కాలం
ఎ) జూన్ నుండి అక్టోబర్
బి) అక్టోబర్ నుండి మార్చి
సి) ఆగస్టు నుండి అక్టోబర్
డి) ఆగస్టు నుండి మార్చి
జవాబు:
ఎ) జూన్ నుండి అక్టోబర్

ప్రశ్న 15.
ఈ క్రింది వానిలో ఖరీఫ్ పంట కానిది
ఎ) శనగలు
బి) పసుపు
సి) చెణకు
ది) జొన్న
జవాబు:
ఎ) శనగలు

AP 8th Class Biology Important Questions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 16.
రబీ కాలం అనగా
ఎ) జూన్ నుండి అక్టోబర్
బి) అక్టోబర్ నుండి మార్చి
సి) ఆగస్టు నుండి అక్టోబర్
డి) ఆగస్టు నుండి మార్చి
జవాబు:
బి) అక్టోబర్ నుండి మార్చి

ప్రశ్న 17.
అరబిక్ భాషలో రబీ అనగా
ఎ) వర్షం
బి) ఎండ
సి) గాలి
డి) చలి
జవాబు:
డి) చలి

ప్రశ్న 18.
ఈ క్రింది వానిలో రబీ పంట కానిది
ఎ) ఆవాలు
బి) ధనియాలు
సి) జీలకర్ర
డి) మీరపు
జవాబు:
డి) మీరపు

ప్రశ్న 19.
గోధుమ పంట పండే కాలము
ఎ) ఖరీఫ్
బి) రబీ
సి) వర్షాకాలం
డి) చలికాలం
జవాబు:
బి) రబీ

AP 8th Class Biology Important Questions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 20.
గోధుమ పంట బాగా పందాలంటే వాతావరణం ఇలా ఉండాలి.
ఎ) వేడి
బి) తేమ
సి) ఆర్ధత
డి) చల్లదనం
జవాబు:
ఎ) వేడి

ప్రశ్న 21.
విశ్వధాన్యపు పంట అని దేనినంటారు ?
ఎ) వరి
బి) గోధుమ
సి) చెఱకు
డి) మొక్కజొన్న
జవాబు:
ఎ) వరి

ప్రశ్న 22.
ప్రపంచంలో అధిక విస్తీర్ణంలో వరిని పండించే దేశం
ఎ) చైనా
బి) జపాన్
సి) భారత్
డి) అమెరికా
జవాబు:
సి) భారత్

AP 8th Class Biology Important Questions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 23.
ఒక హెక్టారుకు వరి దిగుబడి అధికంగా ఉన్న దేశం
ఎ) అమెరికా
బి) చైనా
సి) జపాన్
డి) భారత్
జవాబు:
సి) జపాన్

ప్రశ్న 24.
ఏరువాక పండుగలో
ఎ) వ్యవసాయ పనులు మొదలు పెడతారు.
బి) నారు పోస్తారు.
సి) నాట్లు వేస్తారు.
డి) పంట నూర్పిళ్ళు చేస్తారు.
జవాబు:
ఎ) వ్యవసాయ పనులు మొదలు పెడతారు.

ప్రశ్న 25.
అక్షయ తృతీయ పండుగతో
ఎ) వ్యవసాయ పనులు మొదలు పెడతారు.
బి) నాట్లు వేస్తారు.
సి) నీరు పెట్టి ఎరువులు వేస్తారు.
డి) పంట నూర్పిళ్ళు చేస్తారు.
జవాబు:
బి) నాట్లు వేస్తారు.

ప్రశ్న 26.
పంట నూర్పిళ్ళప్పుడు వచ్చే పందుగ
ఎ) ఓనం
బి) సంక్రాంతి
సి) ఎ మరియు బి
డి) పైవేవీ కావు
జవాబు:
సి) ఎ మరియు బి

AP 8th Class Biology Important Questions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 27.
కలుపు మొక్కలను తొలగించటానికి ఉపయోగపడేది
ఎ) నాగలిబి
బి) మల్లగొర్రు
సి) చదును పలక
డి) గుంటక
జవాబు:
బి) మల్లగొర్రు

ప్రశ్న 28.
నేలను చదును చేయుటకు దీనిని ఉపయోగిస్తారు.
ఎ) నాగలి
బి) మడ్ల గొర్రు
సి) చదును పలక
డి) పార
జవాబు:
సి) చదును పలక

ప్రశ్న 29.
మంచి విత్తనాలు యిలా ఉంటాయి.
ఎ) తేలికగా ముడుతలతో
బి) బరువుగా ముడుతలతో
సి) తేలికగా గుండ్రంగా
డి) బరువుగా గుండ్రంగా
జవాబు:
డి) బరువుగా గుండ్రంగా

ప్రశ్న 30.
ఆసియాలో పండించే వరి రకం
ఎ) ఒరైజా సటైవా
బి) ఒరైజా గ్లజెర్రిమా
సి) ఒరైజా గ్లుమోపాట్యులా
డి) ఒరైజా ఒరైజా
జవాబు:
ఎ) ఒరైజా సటైవా

ప్రశ్న 31.
అమృతసారి, బంగారుతీగ, కొల్లేటి కుసుమ, పొట్టి బాసంగి ఏ సాంప్రదాయ పంట రకాలు ?
ఎ) వరి
బి) గోధుమ
సి) జొన్న
డి) వేరుశనగ
జవాబు:
ఎ) వరి

AP 8th Class Biology Important Questions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 32.
సోనా రకం బియ్యం ఈ జిల్లాలో ఎక్కువగా పండుతాయి.
ఎ) కడప
బి) కర్నూలు
సి) నెల్లూరు
బి) గుంటూరు
జవాబు:
బి) కర్నూలు

ప్రశ్న 33.
నెల్లూరు జిల్లాలో పండే వరి రకం
ఎ) సోనా
బి) అమృతసారి
సి) మొలగొలుకులు
డి) పొట్టి బాసంగి
జవాబు:
సి) మొలగొలుకులు

ప్రశ్న 34.
రైతులకు మంచి విత్తనాలు అందించే సంస్థ
ఎ) ICRISAT
బి) NSDC
సి) IRRI
డి) NSRI
జవాబు:
బి) NSDC

ప్రశ్న 35.
శ్రీ వరి సాగులో SRI అనగా
ఎ) సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్
బి) సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటిగ్రిటి
సి) సీల్డింగ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్
డి) సీడ్లింగ్ ఆఫ్ రోస్ ఇంటెన్సిఫికేషన్
జవాబు:
ఎ) సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్

ప్రశ్న 36.
టిక్కా తెగులు ఈ పంటలో వస్తుంది.
ఎ) వరి
బి) చెటుకు
సి) నిమ్మ
డి) వేరుశనగ
జవాబు:
డి) వేరుశనగ

AP 8th Class Biology Important Questions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 37.
దైథేన్ ఎమ్ – 45 అనేది ఒక
ఎ) ఎరువు
బి) కలుపునాశిని
సి) కీటకనాశిని
డి) ఫంగి సైడ్
జవాబు:
సి) కీటకనాశిని

ప్రశ్న 38.
క్రిమి సంహారక మందు తయారుచేయటానికి ఉపయోగపడే మొక్క
ఎ) వేప
బి) పొగాకు
సి) చామంతి
డి) పైవన్నీ
జవాబు:
డి) పైవన్నీ

ప్రశ్న 39.
D.D.T ని విస్తరించగా
ఎ) డై క్లోరో డై ఫినైల్ టై క్లోరో ఈథేన్
బి) డై ఫినైల్ డై క్లోరో టై క్లోరో ఈథేన్
సి) డైక్లోరో డై ఫినైల్ టై క్లోరో మీథేన్
డి) డై ఫినైల్ డై క్లోరో టై క్లోరో మీథేన్
జవాబు:
ఎ) డై క్లోరో డై ఫినైల్ టై క్లోరో ఈథేన్

ప్రశ్న 40.
సైలెంట్ స్ప్రింగ్ పుస్తకాన్ని రచించినది
ఎ) స్వామినాథన్
బి) అమర్త్యసేన్
సి) రేచల్ కార్సన్
డి) అరుంధతీ రాయ్
జవాబు:
సి) రేచల్ కార్సన్

AP 8th Class Biology Important Questions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 41.
ఏరసాయనిక పదార్థం ఆహారపు గొలుసులోకి ప్రవేశించి పక్షుల గ్రుడ్లు పగిలిపోటానికి కారణమవుతుంది.
ఎ) D.D.T
బి) B.H.C
సి) ఎండ్రిన్
డి) ఎండోసల్ఫాన్
జవాబు:
ఎ) D.D.T

ప్రశ్న 42.
ఈ క్రింది వానిలో స్థూల పోషకం కానిది ఏది ?
ఎ) నత్రజని
బి) కాల్షియం
సి) పొటాషియం
డి) భాస్వరం
జవాబు:
బి) కాల్షియం

ప్రశ్న 43.
నీటిని మొక్కలకు పొదుపుగా అందించే పద్దతి
ఎ) స్ప్రింక్లర్
బి) బిందు సేద్యం
సి) పై రెండూ
డి) పైవేవీ కావు
జవాబు:
సి) పై రెండూ

AP 8th Class Biology Important Questions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 44.
స్ప్రింక్లర్ ఈ సూత్రంపై ఆధారపడి పని చేస్తుంది.
ఎ) గాలిపీడనం
బి) నీటి పీడనం
సి) విద్యుత్
డి) ప్రవాహవేగం
జవాబు:
బి) నీటి పీడనం

ప్రశ్న 45.
మనదేశానికి అమెరికా నుండి గోధుమలతో దిగుమతి చేయబడిన కలుపు మొక్క
ఎ) వరి ఎల్లగడ్డి
బి) వయ్యారిభామ
సి) గోలగుండి
డి) గడ్డిచామంతి
జవాబు:
బి) వయ్యారిభామ

ప్రశ్న 46.
2, 4 Dఒక
ఎ) ఏకదళబీజ కలుపునాశిని
బి) ద్విదళబీజ కలుపునాశిని
సి) కీటకనాశిని
డి) శిలీంధ్రనాశిని
జవాబు:
బి) ద్విదళబీజ కలుపునాశిని

ప్రశ్న 47.
తొందరగా చెడిపోయి రంగు మారిపోయే పంట ఉత్పత్తులను ఎక్కడ భద్రపరుస్తారు ?
ఎ) గారెలు
బి) గోదాములు
సి) శీతల గిడ్డంగులు
డి) భూమిలోపాతర
జవాబు:
సి) శీతల గిడ్డంగులు

AP 8th Class Biology Important Questions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 48.
రత్నబాబు, నీటి కొరత వున్న తన పొలంలో పంట పండించాలని అనుకున్నాడు. కింది వాటిలో ఏ పద్ధతిని ఉత్తమమైన పద్ధతిగా అతనికి సూచించవచ్చు.
(A) చాళ్ళ ద్వారా నీటి పారుదల
(B) మడుల ద్వారా నీటి పారుదల
(C) బిందు సేద్యం
(D) పంపునీరు
జవాబు:
(C) బిందు సేద్యం

ప్రశ్న 49.
కింది వాటిలో తక్కువ పగలు (లేదా) ఎక్కువ రాత్రి కాలపు పంట
(A) సోయాబీన్
(B) జొన్న
(C) బఠాణి
(D) గోధుమ
జవాబు:
(D) గోధుమ

ప్రశ్న 50.
ఖరీఫ్ ఈ మధ్య కాలంలో పెంచబడే పంట
(A) డిసెంబర్ – ఏప్రిల్
(B) నవంబర్ – మార్చి
(C) అక్టోబర్ – ఏప్రిల్
(D) జూన్ – నవంబర్
జవాబు:
(D) జూన్ – నవంబర్

AP 8th Class Biology Important Questions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 51.
సరైన క్రమంలో అమర్చండి
1. ఎరువులు అందించడం
2. నేలను సిద్ధం చేయడం
3. నీటి పారుదల సౌకర్యం కల్పించడం
4. విత్తనాలు నాటడం
(A) 1, 2, 3, 4
(B) 2, 4, 1, 3
(C) 3, 1, 4, 2
(D) 3, 1, 2, 4
జవాబు:
(B) 2, 4, 1, 3

ప్రశ్న 52.
వ్యవసాయంలో యంత్రాలు వాడటం వలన జరిగే పరిణామం
(A) సమయం వృధా అవుతుంది
(B) ధనం వృధా అవుతుంది
(C) శ్రమ అధికమవుతుంది.
(D) కూలీలు పని కోల్పోతారు.
జవాబు:
(D) కూలీలు పని కోల్పోతారు.

ప్రశ్న 53.
ప్రస్తుతం భారతదేశంలో సాగుబడిలో ఉండే వరి వంగదాల సంఖ్య
(A) 1 డజను
(B) 2 డజనులు
(C) 3 డజనులు
(D) 4 డజనులు
జవాబు:
(A) 1 డజను

AP 8th Class Biology Important Questions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 54.
బెల్లంలో ఉండే మూలకం
(A) కాల్షియం
(B) ఇనుము
(C) హైడ్రోజన్
(D) క్లోరిన్
జవాబు:
(B) ఇనుము

ప్రశ్న 55.
కృత్రిమ ఎరువు కానిది
(A) కుళ్ళిన వ్యర్థాలు
(B) యూరియా
(C) అమ్మోనియం ఫాస్పేట్
(D) అమ్మోనియం నైట్రేట్
జవాబు:
(A) కుళ్ళిన వ్యర్థాలు

ప్రశ్న 56.
కింది వాక్యాలను చదవండి.
P. అఫిడ్స్ మరియు తెల్లదోమలు మొక్కలనుండి రసాలను పీల్చడమేకాక మొక్కలకు వైరస్ వ్యాధులను కలుగజేస్తాయి.
Q. రెక్కలు లేని దక్కను జాతి గొల్లభామను రబీ సీజన్లోనే చూడగలము. పై వాటిలో సరైనవి
(A) P, Q రెండూ సరైనవి
(B) P,Q రెండూ సరికాదు
(C) P సరైనది, Q సరైనది కాదు
(D) P సరైనది కాదు. Q సరైనది
జవాబు:
(A) P, Q రెండూ సరైనవి

AP 8th Class Biology Important Questions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 57.
నేలను దున్నడం వల్ల కలిగే ప్రయోజనాలు
(A) వర్షం పడినప్పుడు నీరు బాగా శోషించబడుతుంది
(B) నేలలోకి గాలి బాగా ప్రసరిస్తుంది.
(C) నేలలోని అపాయకరమైన సూక్ష్మజీవులు చనిపోతాయి
(D) పైవన్నీ
జవాబు:
(D) పైవన్నీ

ప్రశ్న 58.
కింది వాక్యాలను చదవండి.
(A) : స్ప్రింక్లర్ ఒక ఆధునిక నీటి పారుదల పద్ధతి
(R) : నీటి ఎద్దడి గల ప్రాంతాలలో ‘బిందు సేద్యం’ అనువైన పద్ధతి
(A) A, R రెండూ సరైనవి. R, Aకి సరైన వివరణ
(B) A, Rలు రెండూ సరైనవి, R, Aకి సరైన వివరణ కాదు
(C) A సరికాదు. R సరియైనది.
(D) A, Rలు రెండూ సరికావు
జవాబు:
(B) A, Rలు రెండూ సరైనవి, R, Aకి సరైన వివరణ కాదు

AP 8th Class Biology Important Questions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

These AP 8th Class Biology Important Questions 7th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలు will help students prepare well for the exams.

AP Board 8th Class Biology 7th Lesson Important Questions and Answers వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 1.
ఆవరణ వ్యవస్థ అన్న పదాన్ని మొదట ఎవరు ఉపయోగించారు ? దాని అర్థం ఏమిటి ?
జవాబు:

  1. 1935 సంవత్సరంలో ఎ.జి. టాన్ ప్లే అనే బ్రిటిష్ వృక్ష, ఆవరణ శాస్త్రవేత్త ‘ఆవరణవ్యవస్థ’ ‘Eco system’ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించాడు.
  2. ప్రకృతి యొక్క మూలప్రమాణాన్ని ఆవరణ వ్యవస్థగా వర్ణించాడు.
  3. టాన్ ప్లే పర్యావరణ వ్యవస్థ (Ecological System) ను కుదించి ఆవరణ వ్యవస్థ ‘Eco System’ అని నామకరణం చేశాడు.
  4. అతని ప్రకారం ప్రకృతి ఒక వ్యవస్థలాగా పనిచేస్తుంది. అందులోని జీవులు వాటి జాతి సమూహాలు, అనేక నిర్జీవ, వాతావరణ కారకాలు ఒకదానినొకటి తీవ్రంగా ప్రభావితం చేసుకుంటాయి.

AP 8th Class Biology Important Questions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 2.
ఆవరణ వ్యవస్థలోని శక్తికి సూర్యుడు మూలమని ఎలా చెప్పగలవు ?
జవాబు:

  1. ఆవరణ వ్యవస్థలోని ఏ స్థాయి జీవులకైనా బతకడానికి ఆహారం ద్వారా వచ్చే శక్తి అవసరమవుతుంది.
  2. సజీవులన్నింటికీ సూర్యుని ద్వారా శక్తి లభిస్తుంది.
  3. ఆకుపచ్చని మొక్కలు సూర్యరశ్మిలోని శక్తిని కిరణజన్య సంయోగక్రియ ద్వారా నిక్షిప్తం చేసుకుంటాయి.
  4. అయితే జంతువులు మొక్కల మాదిరిగా సూర్యశక్తిని నేరుగా ఉపయోగించుకోలేవు.
  5. చాలా రకాల జంతువులు మొక్కలను ఆహారంగా తీసుకుంటాయి.
  6. అయితే మొక్కలు ఆహారం తయారుచేసుకోవటానికి సూర్యరశ్మిని ఉపయోగిస్తాయి కాబట్టి ఈ శక్తి మొక్కల నుండి జంతువులకు బదిలీ అవుతుంది.
  7. మొక్కలను తినని జంతువులు కూడా సూర్యరశ్మిలోని శక్తి పైనే ఆధారపడతాయి.
  8. అవి మొక్కలను తినే జంతువులను తింటాయి. కాబట్టి సూర్యశక్తి బదిలీ అయినట్లే.

ప్రశ్న 3.
ఆహారపు గొలుసు అనగానేమి ? దానిలోని స్థాయిలు ఏమిటి ?
జవాబు:
ఆవరణవ్యవస్థలోని జీవుల మధ్యగల ఆహార సంబంధాలను ఆహార గొలుసు అంటారు. ఆహారపు గొలుసులో మూడు స్థాయిలు ఉంటాయి.
ఉత్పత్తిదారులు : చాలా రకాల మొక్కలు, శైవలాలు మొదలైనవన్నీ సూర్యరశ్మిని ఉపయోగించి ఆహారం తయారు చేసుకుంటాయి. వాటిని ఉత్పత్తిదారులు (Producers) అంటారు.
వినియోగదారులు : ఉత్పత్తిదారులను తిని శక్తిని గ్రహించే జీవులను వినియోగదారులు (Consumers) అంటారు.
విచ్ఛిన్నకారులు : చివరిస్థాయిలో విచ్ఛిన్నకారులు (decomposers) ఉంటాయి. ఇవి మొక్కలు, జంతువులు విసర్జించిన వ్యర్థ పదార్థాల నుండి కాని లేదా వాటి నిర్జీవ పదార్థాల నుండి కానీ ఆహారపదార్థాలను సేకరిస్తాయి.

ప్రశ్న 4.
ఆవాసంలో ఒక జాతి సంఖ్యను మరొక జాతి ఎలా నియంత్రిస్తుంది ? ఉదాహరణతో వివరించండి.
జవాబు:

  1. ఆవాసంలో జీవుల మధ్య ఆహార సంబంధాలు ఉంటాయి.
  2. ఈ సంబంధాలు జీవుల సంఖ్యను నియంత్రించటంలో తోడ్పడతాయి.
  3. ఉదాహరణకి పక్షుల ఆవాసంలో చాలా రకాల కీటకాలు ఉంటాయి. పక్షులు కీటకాలను తినటం వలన కీటకాల సంఖ్య పెరగకుండా చేస్తాయి.
  4. దీని వలన పక్షుల ఆవాసం మరియు మొత్తం ఆవరణ వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉండి స్థిరంగా ఉంటుంది.
  5. కానీ కీటకాలు తినే పక్షుల సంఖ్య ఎక్కువ అయితే కీటకాల సంఖ్య తొందరగా తగ్గిపోతుంది తద్వారా పక్షులకు సరిపడే ఆహారం దొరకదు.
  6. ఇటువంటి సందర్భాలలో పక్షులు వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోతాయి లేదా చనిపోతాయి.
  7. వాటి స్థానంలో కొన్ని కొత్త ఆహారపు అలవాట్లు కలిగిన పక్షులు పుట్టడం వలన తిరిగి ఆవరణవ్యవస్థ సమతాస్థితిలోకి వస్తుంది.

AP 8th Class Biology Important Questions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 5.
మానవ ప్రమేయం ఆధారంగా ఆవరణవ్యవస్థల వర్గీకరణను ఫ్లోచార్టులో చూపండి.
జవాబు:
AP 8th Class Biology Important Questions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు 1

ప్రశ్న 6.
మాంగ్రూవ్ అడవుల గురించి రాయండి.
జవాబు:

  1. భూమిపైన విస్తరించిన ఆవరణ వ్యవస్థలో మాంగ్రూవ్స్ లేదా మడ అడవులు ప్రముఖమైనవి.
  2. ఇవి వెనుకకు తన్నిన సముద్రపు నీటితో నిండిన (Back water) లోతు తక్కువ ప్రాంతాలలోనూ, నదులు, సముద్ర జలాలు కలిసే చోట మడ అడవులు విస్తారంగా పెరుగుతాయి.
  3. వీటిని మంచి ఉత్పాదక ఆవరణవ్యవస్థగా పేర్కొనవచ్చు.
  4. ఈ రకమైన అడవులు తనకు కావల్సిన పోషకాలను భూమిపై పొరలలో ఉన్న మంచినీటి నుంచి, సముద్ర అలల ఉప్పునీటి నుండి గ్రహిస్తాయి.
  5. మాంగ్రూవ్స్ వాణిజ్యపరమైన ప్రాధాన్యత గల సముద్ర జీవులకు ముఖ్యమైన ఆహారంగా, నర్సరీలుగా, ప్రజనన స్థలంగా ఉపయోగపడతాయి.
  6. అంతే కాకుండా కనుమరుగయ్యే జాతులకు రక్షిత ప్రాంతాలుగా కూడా ఉపయోగపడతాయి.

ప్రశ్న 7.
కోరింగ మాంగ్రూవ్స్ అనగానేమి ? వాటికి ఆ పేరు ఎలా వచ్చింది ?
జవాబు:
కోరింగ మాంగ్రూవ్స్ (మడ అడవులు) కాకినాడ దక్షిణ సముద్రతీరంలో విశాఖపట్టణ దక్షిణ ప్రాంతం నుండి దాదాపుగా 150 కి.మీ. దూరం విస్తరించి ఉన్నాయి. కోరంగై నది పేరుమీద ఈ మాంగ్రూవకు కోరింగ అని పేరుపెట్టారు. కోరింగ మాంగ్రూవ్స్ గౌతమీ, గోదావరి ఉపనదులైన కోరింగ, గాడేరు నదుల నుండి మంచినీటిని తీసుకుంటాయి. అదేవిధంగా కాకినాడ సముద్రతీరం నుంచి ఉప్పునీటిని తీసుకుంటాయి. అనేక నదీ పాయలు, కాలువలు ఈ ఆవరణవ్యవస్థ గుండా ప్రవహిస్తాయి.

ప్రశ్న 8.
కోరింగ ఆవరణవ్యవస్థలో ఉండే సజీవ, నిర్జీవ అంశాలను తెలపండి.
AP 8th Class Biology Important Questions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు 2
జవాబు:
కోరింగ ఆవరణవ్యవస్థలో ఉండే సజీవ, నిర్జీవ అంశాలు :
జీవ అంశాలలో ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు ఉంటాయి.

  • ఉత్పత్తిదారులు : మడచెట్లు, స్పైరోగైరా, యూగ్లీనా, ఆసిల్లటోరియా, నీలిఆకుపచ్చ శైవలాలు, యూలోథిక్స్ మొదలైన ఉత్పత్తిదారులుంటాయి.
  • వినియోగదారులు : పీతలు, హైడ్రా, ప్రోటోజోవాలు, నత్తలు, తాబేళ్ళు, డాఫ్నియా, గొట్టం పురుగులు మొదలైనవి ఉంటాయి.
  • విచ్ఛిన్నకారులు : డెట్రిటస్ వంటి విచ్ఛిన్నకర బ్యాక్టీరియాలుంటాయి.
  • నిర్జీవ అంశాలు : ఉప్పునీరు, మంచినీరు, గాలి, సూర్యరశ్మి, మృత్తిక మొదలైనవి.

ప్రశ్న 9.
ఎడారి ఆవరణవ్యవస్థలో ఉత్పత్తిదారుల అనుకూలనాలు ఏమిటి ?
AP 8th Class Biology Important Questions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు 3
జవాబు:

  1. పొదలు, గడ్డిజాతులు, కొన్ని వృక్షాలు ఎడారిలో ఉత్పత్తిదారులుగా ఉంటాయి.
  2. ఇక్కడి పొదలు భూమి లోపలికి వ్యాపించిన శాఖాయుతమైన వేరు వ్యవస్థ కలిగి ఉంటాయి.
  3. కాండాలు, పత్రాలు రూపాంతరం చెంది ముళ్ళుగా లేదా మందంగా మారి ఉంటాయి.
  4. ఎడారుల్లో కనబడే కాక్టస్ (బ్రహ్మజెముడు) లాంటి మొక్కల కాండాలు రసభరితంగా మారి నీటిని నిలువ చేసుకొని ఉంటాయి.
  5. నీటికొరత ఉన్నప్పుడు ఆ నీటిని వినియోగించుకుంటాయి.
  6. కొన్ని నిమ్నశ్రేణి రకాలైన లైకెన్లు, ఎడారి మాన్లు, నీటి ఆకుపచ్చ శైవలాలు కూడా ఎడారులలో కనబడతాయి.

AP 8th Class Biology Important Questions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 10.
ఆవరణ వ్యవస్థలోని శక్తి ప్రవాహం గురించి రాయండి.
జవాబు:
ఆవరణ వ్యవస్థలోని శక్తి ప్రవాహం :

  1. సజీవ ప్రపంచ మనుగడ అనేది ఆవరణవ్యవస్థలో శక్తి ప్రవాహం , పదార్థాల ప్రసరణ పై ఆధారపడి ఉంటుంది.
  2. వివిధ రకాల జీవక్రియలు నిర్వహించడానికి శక్తి అవసరం.
  3. ఈ శక్తి సూర్యుని నుండి లభిస్తుంది. అంతరిక్షంలో సౌరశక్తి సూర్యకిరణాల రూపంలో ప్రసరిస్తుంది.
  4. సౌరశక్తిలో దాదాపు 57% వాతావరణంలో శోషించబడుతుంది మరియు అంతరిక్షంలో వెదజల్లబడుతుంది.
  5. 35% సౌరశక్తి భూమిని వేడిచేయడానికి, నీటిని ఆవిరిచేయడానికి ఉపయోగపడుతుంది.
  6. దాదాపు 8% సౌరశక్తి మొక్కలకు చేరుతుంది. దీని 80-85% సౌరశక్తిని మొక్కలు శోషిస్తాయి.
  7. శోషించిన దానిలో 50% మాత్రమే కిరణజన్య సంయోగక్రియలో వినియోగించబడుతుంది.

ప్రశ్న 11.
AP 8th Class Biology Important Questions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు 4
ఆకు గొంగళి పురుగు ఊసరవెల్లి పాము గ్రద్ద పైన ఇచ్చిన పటం ఆధారంగా, ఆహారపు గొలుసులోని జీవులను ఉత్పత్తిదారులు, ప్రాథమిక, ద్వితీయ, తృతీయ మరియు ఉన్నత స్థాయి వినియోగదారులుగా వర్గీకరించండి.
జవాబు:
పైన చూపబడిన ఆహారపు గొలుసులో

  1. ఆకు – ఉత్పత్తిదారుడు
  2. గొంగళిపురుగు – ప్రథమ వినియోగదారుడు
  3. ఊసరవెల్లి – ద్వితీయ వినియోగదారుడు
  4. పాము – తృతీయ వినియోగారుడు
  5. గ్రద్ద – ఉన్నత స్థాయి మాంసాహారి

ప్రశ్న 12.
ఆవరణ వ్యవస్థలోని రకాలను సూచించే ఫ్లోచార్టను గీయండి. ఆవరణవ్యవస్థ పేరు పెట్టినది ఎవరు ?
జవాబు:
AP 8th Class Biology Important Questions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు 5
“ఆవరణ వ్యవస్థ” అను పదాన్ని ప్రవేశపెట్టినది A.G. టాన్ ప్లే.”

AP 8th Class Biology Important Questions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 13.
కింది పేరాను చదవండి. కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
చాలారకాల మొక్కలు, శైవలాలు మొదలైనవన్నీ సూర్యరశ్మిని ఉపయోగించుకొని ఆహారం తయారుచేసుకుంటాయి. , వాటిని ‘ఉత్పత్తి దారులు’ అంటారు. వీటిని తిని శక్తిని గ్రహించే జీవులను వినియోగదారులు అంటారు. చివరిస్థాయిలో విచ్ఛిన్నకారులు ఉంటారు. ఇవి మొక్కలు, జంతువులు విసర్జించిన వ్యర్థ పదార్థాలనుండి కాని లేదా వాటి నిర్జీవ పదార్థాలనుండి కానీ ఆహారాన్ని సేకరిస్తాయి. వీటిని పునరుత్పత్తిదారులు అంటాం.
1. ఆహారజాలకంలోని ఉత్పత్తిదారులు ఏవి ? వాటిని ఎందుకు ఉత్పత్తిదారులు అంటారు ?
2. వినియోగదారులు అంటే ఏమి ? కొన్ని ఉదాహరణలు ఇవ్వండి.
3. పునరుత్పత్తిదారులు ఏవి ? ఎందుకు వాటిని అలా పిలుస్తారో ఉదాహరణతో వివరించండి.
4. ఆహారపు గొలుసులో ఎన్ని స్థాయిలు ఉంటాయి ? అవి ఏవి ?
జవాబు:
1. శైవలాలు, మొక్కలు ఆహార జాలకంలో ఉత్పత్తిదారులుగా ఉంటాయి. ఎందుకంటే అవి సూర్యరశ్మిని వినియోగించుకొని స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి.
2. ఉత్పత్తిదారులను ఆహారంగా స్వీకరించి శక్తిని గ్రహించే జీవులను వినియోగదారులు అంటారు. ఉదా : జింక, మిడత, కుందేలు
3. విచ్ఛిన్నకారులుగా పూతికాహార బాక్టీరియా శిలీంధ్రాలు ఉంటాయి. ఇవి మొక్కల జంతువుల నిర్జీవ పదార్థాల నుండి ఆహారాన్ని సేకరిస్తాయి. వాటిని మూలకాలుగా విడగొట్టి తిరిగి ఆవరణ వ్యవస్థలో ప్రవేశపెడతాయి. అందువల్ల వీటిని పునరుత్పత్తి. దారులు అంటారు.
4. ఆహారపు గొలుసులో 4 స్థాయిలు ఉంటాయి.
ఉత్పత్తిదారులు ప్రాథమిక వినియోగదారులు ద్వితీయ వినియోగదారులు తృతీయ వినియోగదారులు

ప్రశ్న 14.
క్రింది అంశంను చదివి ప్రశ్నలకు జవాబులిమ్ము.
భూభాగంలో దాదాపు 17% మేర ఎడారులు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఇసుకతో కూడిన నేల ఉండి సగటు వర్షపాతం 23 మి.మీల కన్నా తక్కువగా ఉంటుంది. ఇక్కడ పెరిగే మొక్కలు నీటిని నష్టపోకుండా అనుకూలనాలు కలిగి ఉంటాయి. అత్యధిక ఉష్ణోగ్రత వలన ఇక్కడ జీవజాతులు ప్రత్యేక లక్షణాలను కలిగి ఇక్కడి వాతావరణానికి అనుకూలనాలు పొంది ఉంటాయి.
1. ఎడారి జీవులు ఎలాంటి అనుకూలనాలను పొంది ఉండాలి ?
2. ఉత్పత్తిదారులైన ఎడారి మొక్కలు చూపే అనుకూలనాలేవి ?
3. ఒంటెను ఎడారి ఓడ అని ఎందుకు అంటారు ?
4. ఎడారుల్లో జంతువైవిధ్యం తక్కువగా ఉంటుంది. ఎందుకు ?
జవాబు:
1. అక్కడి అధిక ఉష్ణోగ్రతలకు నీరు నష్టపోకుండా అనుకూలనాలను కలిగి ఉంటుంది.
2. ఎడారి మొక్కలు పత్రరంధ్రాలను కలిగి ఉండవు. అందువల్ల భాష్పోత్సేకం ద్వారా నీటిని నష్టపోవు.
3. ఒంటె ఎడారి వాతావరణాన్ని ఎన్నో అనుకూలనాలను కల్గి ఎడారిలో ప్రయాణానికి ఎంతో అనువైన జంతువు. అందువల్ల ఒంటెను ఎడారి ఓడ అని అంటారు.
4. ఎడారిలో ఉండే అత్యధిక ఉష్ణోగ్రతలను నీటి ఎద్దడిని తట్టుకొని జీవించడం చాలా కష్టం. అందువలన అక్కడ జంతు వైవిధ్యం తక్కువ.

ప్రశ్న 15.
మీ పరిసరాలలో మీరు గమనించి ఉత్పత్తిదారులు, వినియోగదారుల జాబితాలను తయారు చేయండి.
జవాబు:
నా పరిసరాలలో నేను గమనించిన ఆహార జాలకం
AP 8th Class Biology Important Questions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు 6

1 మార్కు ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆహారపు గొలుసు అంటే ఏమిటి?
జవాబు:
ఉత్పత్తిదారుడు, ప్రథమ, ద్వితీయ, తృతీయ వినియోగదారులు ఉన్న గొలుసు లాంటి జంతువుల శక్తి మార్పిడి వ్యవస్థను ‘ఆహారపు గొలుసు’ అంటారు.

AP 8th Class Biology Important Questions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 2.
‘ఆహార జాలకం’ అంటే ఏమిటి?
జవాబు:
అనేక ‘ఆహారపు గొలుసులు’ ఒక దానిలో ఒకటి కలిసిపోయి ఒక సమూహంగా, ఆవరణ వ్యవస్థలో కొనసాగే క్రియాత్మక, వ్యవస్థను ‘ఆహార జాలకం’ అంటారు.

ప్రశ్న 3.
ఆహార జాలకంలోని మొక్కలు చనిపోతే ఏమవుతుంది ?
జవాబు:
1. ఆహార జాలకంలోని మొక్కలు చనిపోతే శక్తిని ఉత్పత్తిచేసే.అవకాశం పోతుంది.
2. దీనితో సూర్యరశ్మి నుంచి శక్తి బదలాయింపు ఆగిపోతుంది.
3. కొంత కాలం తర్వాత నెమ్మదిగా క్రింది స్థాయి నుంచి ఉన్నతస్థాయి జీవులన్నీ అంతరించిపోతాయి.

ప్రశ్న 4.
ఆహారం ఒక్కటే కాకుండా జంతువులు బ్రతకటానికి కావల్సిన ఇతర అంశాలు ఏమిటి ?
జవాబు:
జంతువులకు ఆహారంతో పాటు
1. నీరు
2. గాలి
3. ఆవాసం బతకటానికి కావాల్సి ఉంటుంది.

లక్ష్యాత్మక నియోజనము

ప్రశ్న 1.
గడ్డిని ……….. గా పిలవవచ్చు.
ఎ) వినియోగదారు
బి) ఉత్పత్తిదారు
బి) విచ్ఛిన్నకారి
డి) బాక్టీరియా
జవాబు:
బి) ఉత్పత్తిదారు

ప్రశ్న 2.
కొన్ని ఆహారపు గొలుసుల కలయిక వల్ల ……….. ఏర్పడును.
ఎ) ఆహార జాలకం
బి) ఆవాసం
సి) జీవావరణం
డి) ప్రకృతి
జవాబు:
ఎ) ఆహార జాలకం

AP 8th Class Biology Important Questions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 3.
నెమలికి ఇష్టమైన ఆహారం ………..
ఎ) బల్లులు
బి) పురుగులు
సి) పాములు
డి) కీటకాలు
జవాబు:
సి) పాములు

ప్రశ్న 4.
కోరింగ మడ అడవులు ………. పట్టణానికి సమీపంలో ఉన్నాయి.
ఎ) రాజమండ్రి
బి) కాకినాడ
సి) విజయవాడ
డి) హైదరాబాద్
జవాబు:
బి) కాకినాడ

ప్రశ్న 5.
భూభాగంలో ………. % మేరకు ఎడారి ఆవరణ వ్యవస్థలు ఉన్నాయి.
ఎ) 14
బి) 15
సి) 16
డి) 17
జవాబు:
డి) 17

ప్రశ్న 6.
ఇది గోదావరికి ఉపనది. ఆ
ఎ) పాములేరు
బి) గాడేరు
సి) బుడమేరు
డి) పాలవాగు
జవాబు:
డి) పాలవాగు

ప్రశ్న 7.
నిశాచరాలకు ఉదాహరణ ……….
ఎ) గేదె
బి) ఆవు
సి) గుడ్లగూబ
డి) మానవుడు
జవాబు:
ఎ) గేదె

AP 8th Class Biology Important Questions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 8.
ఒంటె శరీరంలోని ……….. భాగంలో నీరు దాచు కుంటుంది.
ఎ) నోరు
బి) చర్మం
సి) జీర్ణాశయం
డి) కాలేయం
జవాబు:
సి) జీర్ణాశయం

ప్రశ్న 9.
సూర్యకాంతి ………. చే శోషింపబడుతుంది.
ఎ) జంతువులు
బి) మొక్కలు
సి) సరీసృపాలు
డి) క్షీరదాలు
జవాబు:
బి) మొక్కలు

ప్రశ్న 10.
సింహం ………. శ్రేణి మాంసాహారి.
ఎ) ప్రాథమిక
బి) ద్వితీయ
సి) తృతీయ
డి) చతుర్ధ
జవాబు:
సి) తృతీయ

ప్రశ్న 11.
ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని 1935 సం||లో మొదటిసారిగా ఉపయోగించిన శాస్త్రవేత్త
ఎ) చార్లెస్ ఎల్టన్
బి) యూజీస్ పి.ఓడమ్
సి) A.C. టాన్స్లే
డి) చార్లెస్ డార్విన్
జవాబు:
సి) A.C. టాన్స్లే

ప్రశ్న 12.
ఆవరణ వ్యవస్థలోని అతిపెద్ద భాగం
ఎ) ఆవాసం
బి) పర్యావరణం
సి) జీవావరణం
డి) నివాసం
జవాబు:
ఎ) ఆవాసం

ప్రశ్న 13.
ఆవరణ వ్యవస్థలో శక్తికి మూలం
ఎ) ఆహారం
బి) ఆకుపచ్చని మొక్కలు
సి) సూర్యుడు
డి) భూమి
జవాబు:
సి) సూర్యుడు

ప్రశ్న 14.
ఆవరణ వ్యవస్థలో నిర్జీవ అంశం కానిది
ఎ) గాలి
బి) నీరు
సి) మృత్తిక
డి) సూక్ష్మజీవులు
జవాబు:
డి) సూక్ష్మజీవులు

ప్రశ్న 15.
ఆవరణ వ్యవస్థలో సూర్యరశ్మిని నేరుగా గ్రహించగలిగేవి
ఎ) ఉత్పత్తిదారులు
బి) ప్రాథమిక వినియోగదారులు
సి) ద్వితీయ వినియోగదారులు
డి) విచ్ఛిన్నకారులు
జవాబు:
ఎ) ఉత్పత్తిదారులు

AP 8th Class Biology Important Questions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 16.
ఆవరణ వ్యవస్థలో పునరుత్పత్తిదారులు అని వేనిని అంటారు?
ఎ) ఉత్పత్తిదారులు
బి) ప్రాథమిక వినియోగదారులు
సి) ద్వితీయ వినియోగదారులు
డి) విచ్చిన్నకారులు
జవాబు:
డి) విచ్చిన్నకారులు

ప్రశ్న 17.
ఆవరణ వ్యవస్థలో చివరి స్థాయి జీవులు
ఎ) విచ్ఛిన్నకారులు
బి) ప్రాథమిక వినియోగదారులు
సి) ద్వితీయ వినియోగదారులు
డి) తృతీయ వినియోగదారులు
జవాబు:
ఎ) విచ్ఛిన్నకారులు

ప్రశ్న 18.
ఆవరణ వ్యవస్థలో శక్తి బదిలీ విధానాన్ని వివరించడానికి ఉపయోగపడేది
ఎ) పోషకస్థాయి
బి) ఎకలాజికల్ నిచ్
సి) ఆహారపు గొలుసు
డి) ఆహారపు జాలకం
జవాబు:
సి) ఆహారపు గొలుసు

ప్రశ్న 19.
ఆవరణ వ్యవస్థను తొందరగా నాశనం చేసేవి
ఎ) బలమైన గాలులు
బి) భూకంపాలు
సి) సునామి
డి) పైవన్నీ
జవాబు:
డి) పైవన్నీ

ప్రశ్న 20.
భూమిపై ఉండే అతి పెద్ద ఆవరణ వ్యవస్థ
ఎ) జీవావరణం
బి) పర్యావరణం
సి) భౌమావరణం
డి) జలావరణం
జవాబు:
ఎ) జీవావరణం

ప్రశ్న 21.
మడ అడవులు యిక్కడ పెరుగుతాయి.
ఎ) నది ఒడ్డున
బి) సముద్రం ఒడ్డున
సి) నది, సముద్రం కలిసే చోట
డి) సముద్రం సముద్రం కలిసే చోట
జవాబు:
సి) నది, సముద్రం కలిసే చోట

ప్రశ్న 22.
ఆహారపు జాలకాన్ని ఏర్పరిచేవి
ఎ) ఉత్పత్తిదారులు
బి) వినియోగదారులు
సి) విచ్ఛిన్నకారులు
డి) ఆహారపు గొలుసులు
జవాబు:
డి) ఆహారపు గొలుసులు

ప్రశ్న 23.
ఈ క్రింది వానిలో కృత్రిమ ఆవరణ వ్యవస్థ
ఎ) గడ్డిభూమి
బి) అడవి
సి) ఎడారి
డి) కార్తీకవనాలు
జవాబు:
డి) కార్తీకవనాలు

ప్రశ్న 24.
కోరింగ వద్ద ఉన్న ఆవరణ వ్యవస్థ
ఎ) గడ్డిభూమి ఆవరణ వ్యవస్థ
బి) మాంగ్రూప్ ఆవరణ వ్యవస్థ
సి) అడవి ఆవరణ వ్యవస్థ
డి) ఎడారి ఆవరణ వ్యవస్థ
జవాబు:
బి) మాంగ్రూప్ ఆవరణ వ్యవస్థ

AP 8th Class Biology Important Questions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 25.
ఈ క్రింది వానిలో సహజ ఆవరణ వ్యవస్థ
ఎ) మామిడి తోట
బి) వరి చేను
సి) కార్తీకవనం
డి) ఎడారి
జవాబు:
డి) ఎడారి

ప్రశ్న 26.
ఇండో పసిఫిక్ సముద్రంలో ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఎన్ని జీవజాతులున్నాయి ?
ఎ) 10
బి) 100
సి) 1000
డి) 10,000
జవాబు:
సి) 1000

ప్రశ్న 27.
అత్యధిక జీవులు యిక్కడ ఉన్నాయి.
ఎ) నేల
బి) నది
సి) సముద్రం
డి) అడవి
జవాబు:
సి) సముద్రం

ప్రశ్న 28.
ఈ క్రింది వానిలో ఆవరణ వ్యవస్థ కానిది
ఎ) ఒక దుంగ
బి) ఒక గ్రామం
సి) ఒక అంతరిక్ష నౌక
డి) పైవేవీ కావు
జవాబు:
డి) పైవేవీ కావు

ప్రశ్న 29.
ప్రకృతి యొక్క క్రియాత్మక ప్రమాణం అని దీనిని అనవచ్చు.
ఎ) ఆవరణ వ్యవస్థ
బి) జీవావరణం
సి) పర్యావరణం
డి) ఆవాసం
జవాబు:
ఎ) ఆవరణ వ్యవస్థ

AP 8th Class Biology Important Questions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 30.
భూభాగంలో ఎంత శాతం ఎడారులు విస్తరించి ఉన్నాయి ?
ఎ) 7%
బి) 17%
సి) 27%
డి) 37%
జవాబు:
బి) 17%

ప్రశ్న 31.
ఎడారులలో వర్షపాతం ఇంతకన్నా తక్కువ.
ఎ) 10 మిల్లీ మీటర్లు
బి) 17 మిల్లీ మీటర్లు
సి) 20 మిల్లీ మీటర్లు
డి) 23 మిల్లీ మీటర్లు
జవాబు:
డి) 23 మిల్లీ మీటర్లు

ప్రశ్న 32.
నిశాచరులు యిక్కడ ఎక్కువగా ఉంటాయి
ఎ) గడ్డిభూమి ఆవరణ వ్యవస్థ
బి) మంచినీటి ఆవరణ వ్యవస్థ
సి) ఎడారి ఆవరణ వ్యవస్థ
డి) పైవేవీ కావు
జవాబు:
సి) ఎడారి ఆవరణ వ్యవస్థ

ప్రశ్న 33.
అటవీ పరిసరాలను ప్రభావితం చేసేవి
ఎ) శీతోష్ణస్థితి
బి) పోషకాల క్రియాశీలత
సి) నీటివనరులు
డి) పైవన్నీ
జవాబు:
డి) పైవన్నీ

ప్రశ్న 34.
మొత్తం సౌరశక్తిలో వాతావరణంలోకి శోషించబడే సౌరశక్తి, భూమిని వేదిచేయడానికి కావలసిన శక్తి, మొక్కలు గ్రహించే సౌరశక్తి వరుసగా
ఎ) 67%, 35%, 8%
బి) 8%, 35%, 57%
సి) 57%, 8%, 355
డి) 35%, 8%, 57%
జవాబు:
ఎ) 67%, 35%, 8%

ప్రశ్న 35.
సౌరశక్తి ఉత్పత్తిదారులలో ఈ రూపంలో నిల్వ ఉంటుంది.
ఎ) గతిశక్తి
బి) స్థితిశక్తి.
సి) ఉష్ణశక్తి
డి) అయానికశక్తి
జవాబు:
బి) స్థితిశక్తి.

ప్రశ్న 36.
ఆహారపు గొలుసులోని సరియైన వరుసక్రమాన్ని గుర్తించండి.
ఎ) ఉత్పత్తిదారులు → ప్రాథమిక వినియోగదారులు → ద్వితీయ వినియోగదారులు → విచ్ఛిన్నకారులు
బి) ప్రాథమిక వినియోగదారులు → ద్వితీయ వినియోగదారులు → ఉత్పత్తిదారులు → విచ్ఛిన్నకారులు
సి) విచ్ఛిన్నకారులు → ప్రాథమిక వినియోగదారులు → ద్వితీయ వినియోగదారులు → ఉత్పత్తిదారులు
డి) ఉత్పత్తిదారులు → విచ్ఛిన్నకారులు → ప్రాథమిక వినియోగదారులు → ద్వితీయ వినియోగదారులు
జవాబు:
ఎ) ఉత్పత్తిదారులు → ప్రాథమిక వినియోగదారులు → ద్వితీయ వినియోగదారులు → విచ్ఛిన్నకారులు

AP 8th Class Biology Important Questions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 37.
ఆహారపు గొలుసులో స్థాయిల సంఖ్య
ఎ) 1
బి) 2
సి) 3
డి) 4
జవాబు:
సి) 3

ప్రశ్న 38.
ఆవరణ వ్యవస్థలో మాంసాహారులు
ఎ) ఉత్పత్తిదారులు
బి) విచ్ఛిన్నకారులు
సి) ప్రాథమిక వినియోగదారులు
డి) ద్వితీయ వినియోగదారులు
జవాబు:
డి) ద్వితీయ వినియోగదారులు

ప్రశ్న 39.
ఉత్పత్తిదారులలో నిక్షిప్తమైన శక్తి
ఎ) మొత్తం ప్రాథమిక ఉత్పత్తి
బి) మిగిలిన ప్రాథమిక ఉత్పత్తి,
సి) వినియోగించబడని శక్తి
డి) వినియోగదారులచే శోషించబడని శక్తి
జవాబు:
ఎ) మొత్తం ప్రాథమిక ఉత్పత్తి

ప్రశ్న 40.
కాక్టస్ ఇక్కడ కనిపిస్తుంది.
ఎ) గడ్డిభూమి
బి) అడవి
సి) ఎడారి
డి) నది
జవాబు:
సి) ఎడారి

ప్రశ్న 41.
ఒంటె శరీరంలో నీటిని ఎక్కడ నిల్వ ఉంచుకుంటుంది ?
ఎ) మూపురం
బి) చర్మం క్రింద
సి) జీర్ణాశయం
డి) కాలేయం
జవాబు:
సి) జీర్ణాశయం

ప్రశ్న 42.
ఒక ఆవరణ వ్యవస్థలో కింది వాటిలోని ఏ జత జీవులు ఉత్పత్తిదారులుగా వుంటాయి ?
(A) ఎంప్, స్పైరోగైరా
(B) మస్సెల్, డాఫియా
(C) అసిల్లటోరియా, యులోత్రిక్స్
(D) యూగ్లీనా, బ్యాక్టీరియా
జవాబు:
(C) అసిల్లటోరియా, యులోత్రిక్స్

AP 8th Class Biology Important Questions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 43.
1. ఉత్పత్తిదారులకు ఉదాహరణ గడ్డిజాతులు
2. వినియోగదారులకు ఉదాహరణ గ్రద్దలు
(A) 1, 2 సరైనవి కావు
(B) 1 సరైనది, 2 కాదు
(C) 1, 2 సరైనవి
(D) 1 సరైనదికాదు 2 సరైనది
జవాబు:
(C) 1, 2 సరైనవి

ప్రశ్న 44.
ఎడారి ఓడ అని పిలవబడే జీవి
(A) ఏనుగు
(B) ఒంటె
(C) నిప్పు కోడి
(D) కంచర గాడిద
జవాబు:
(B) ఒంటె

ప్రశ్న 45
ఎడారి జంతువులు కలిగి ఉండేవి
(A) బాహ్య అనుకూలనాలు
(B) శరీరధర్మ అనుకూలనాలు
(C)ఏ అనుకూలనాలు ఉండవు
(D) బాహ్య మరియు శరీరధర్మ అనుకూలనాలు
జవాబు:
(D) బాహ్య మరియు శరీరధర్మ అనుకూలనాలు

ప్రశ్న 46.
ఒకేసారి అధిక సంఖ్యలో కుందేళ్ళను గడ్డిభూముల్లో ప్రవేశపెడితే జరిగేది
(A) అధిక సంఖ్యలో కుందేళ్ళు కనిపిస్తాయి
(B) కుందేళ్ళ మధ్య ఆహారం కోసం తీవ్రమైన పోటీ ఏర్పడుతుంది
(C) ఆవరణ వ్యవస్థలో ఎలాంటి మార్పు ఉండదు
(D) గడ్డి పెరగడంపై ఏ ప్రభావం ఉండదు
జవాబు:
(B) కుందేళ్ళ మధ్య ఆహారం కోసం తీవ్రమైన పోటీ ఏర్పడుతుంది

ప్రశ్న 47.
భౌమావరణ వ్యవస్థలోని మొక్కల్లో పత్రరంధ్రాలు లేకపోతే ఇరిగేది
(A) భాష్పోత్సేకం జరగదు
(B) వాయువినిమయం జరగదు ,
(C) మొక్కలపై ఏ ప్రభావం ఉండదు
(D) A మరియు B
జవాబు:
(D) A మరియు B

AP 8th Class Biology Important Questions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 48.
భూ ఆవరణ వ్యవస్థలో P, Q మరియు ఎడారి ఆవరణ వ్యవస్థలు ఉంటాయి. ఇందులో P,Qలు
(A) అడవి, గడ్డిభూమి
(B) గడ్డి భూమి, కొలను
(C) మంచినీరు, ఉప్పునీరు
(D) అడవి, ఉప్పునీరు
జవాబు:
(A) అడవి, గడ్డిభూమి

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం – సంరక్షణ

These AP 8th Class Biology Important Questions 6th Lesson జీవ వైవిధ్యం – సంరక్షణ will help students prepare well for the exams.

AP Board 8th Class Biology 6th Lesson Important Questions and Answers జీవ వైవిధ్యం – సంరక్షణ

ప్రశ్న 1.
70 సం||ల క్రితం ఉన్న జంతువులకు, ఇప్పుడు కనిపించే జంతువులలో భేదాలు ఏమిటి ? అవి కనిపించకుండా పోవటానికి కారణాలు ఏమిటి ?
జవాబు:
70 సం||రాల క్రితం ఉండే పులులు, చిరుతలు, కొండ్రిగాడు, ముళ్ళపందులు వంటి జంతువులు నేడు కనిపించటం కరువైపోయింది. వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. వీటికి ప్రధాన కారణం గతంలో ఉన్న దట్టమైన అడవులు.

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 2.
మీ ప్రాంతంలో ఏదైనా జాతి అంతరించి పోయిందా ? వాటి గురించి తెలుసుకొని రాయండి.
జవాబు:
మా ప్రాంతాలలో రాబందులు అంతరించిపోయాయి. ఒకప్పుడు మృతకళేబరాలను అనటానికి వచ్చే ఈ పెద్ద పక్షులు నేడు కనిపించటం లేదు. అదేవిధంగా పిచ్చుకల సంఖ్య కూడ గణనీయంగా తగ్గి కనిపించుట లేదు.

ప్రశ్న 3.
ఈ జీవులు అంతరించి పోవటానికి కారణాలు చర్చించండి.
జవాబు:
1. అధిక మోతాదులో వాడిన D.D.T. వలన రాబందుల గుడ్లు పెంకు పలచబడి వాటి ఉత్పత్తి సామర్థ్యం తగ్గిందని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు.
2. నేటి కాలంలో బాగా అభివృద్ధి చెందిన మొబైల్ వాడకం వలన సెల్ టవర్ రేడియేషన్ పిచ్చుకల ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీశాయని పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు.
3. వీటితోపాటుగా మారుతున్న జీవన విధానాల వలన, చెట్లు నరకటం, పూరి గుడిసెలు తగ్గటం వంటి చర్యలు కూడా పిచ్చుకలు అంతరించటానికి మరికొన్ని కారణాలు.

ప్రశ్న 4.
మన రాష్ట్రానికే పరిమితమైన ఒక ఎండమిక్ జాతిని పేర్కొనండి.
జవాబు:
‘జెర్డాన్స్ కర్’ ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఒక ఎండిమిక్ జాతి.

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 5.
క్రింది చిత్రాలలో ఏ జంతువు మన దేశానికి ఎండమిక్ జాతి అవుతుంది?
AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ 1
జవాబు:
పై చిత్రాలలో బెంగాల్ టైగర్ మన దేశానికి చెందిన ఎండమిక్ జాతి.

ప్రశ్న 6.
మీ తల్లిదండ్రులను అడిగి వారి బాల్యంలో గల వివిధ రకాల వరి రకాల గురించి తెలుసుకోండి.
జవాబు:
మా తల్లిదండ్రుల బాల్యంలో క్రింది వరి రకాలు కలవు.

  1. స్వర్ణ
  2. మసూరి
  3. నంబర్లు
  4. హంస
  5. పాల్గుణ

ప్రశ్న 7.
ఆపదలో ఉన్న ఈ క్రింది జంతు, వృక్ష జాతులను గుర్తించి పేర్లు రాయండి.
జవాబు:
AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ 2

ప్రశ్న 8.
ఆంధ్రప్రదేశ్ లోని అంతరించిపోతున్న రెండు జంతువులు ఏమిటి ? వాటి గురించి రాయండి.
జవాబు:
అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం (IUCN) మరియు జంతుశాస్త్ర సంఘం, లండన్ (ISL) విడుదల చేసిన జాబితా ప్రకారం ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, కర్నూల్ జిల్లాలోని నంధ్యాల, కొన్ని ప్రాంతాలలో ఉండే సాలీడు-గూటి టారంటలా (Gooty-tarantula) అలాగే కర్నూల్ లోని పుల్లెందు పక్షుల సంరక్షణ కేంద్రంలోని బట్టమేక పక్షి (Great indian bustard) అత్యంత ఆపదలో ఉన్న జీవులుగా పేర్కొన్నారు.

ఎ) గూటీ టారంటలా సాలీడు :
AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ 3
1) శాస్త్రీయంగా ఫిసిలో తీరియా మెటాలికా అని పిలువబడే గూటీ టారంటలా సాలీడు ఆన్ లైన్ ద్వారా అమెరికా, యూరప్ మార్కెట్లలో అమ్ముడవుతోంది.
2) ఆవాసాలను ధ్వంసం చేయడం, అడవులను నరికివేయడం, వంట చెరకు సేకరణ మొదలైన కార్యక్రమాలు ఈ సాలీళ్ల సంఖ్య తగ్గడానికి కారణమవుతున్నాయి.
3) ఆవాసాల సంరక్షణ, క్షేత్ర స్థాయిల్లో అవగాహన, జాతీయ అటవీ సంరక్షణ చట్టం, జాతీయ, అంతర్జాతీయ వ్యాపార చట్టాలు పటిష్టంగా అమలుచేయడం ద్వారా ఈ జాతుల సంరక్షణకు కృషి చేయాలని సూచిస్తున్నారు.

బి) బట్టమేక పిట్ట :
AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ 4
1) బట్టమేక పక్షులు రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించి ఉన్నప్పటికీ వీటి సంఖ్య కేవలం 50 నుండి 249 వరకు మాత్రమే ఉన్నట్లు అంచనా.
2) అడవులను నరికివేసి వ్యవసాయ భూములుగా మార్చటం వల్ల వీటికి ఆపద ఏర్పడింది.
3) సౌత్ కొరియాలోని ‘జేజూ’లో జరిగిన అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘ సమావేశంలో (ZSL మరియు IUCN) ప్రమాదం అంచున ఉన్న జీవజాతుల గురించిన జాబితాను విడుదల చేసింది.

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 9.
ప్రజల్లో జీవవైవిధ్యంపై అవగాహన కలిగించుటకు కొన్ని నినాదాలు లేదా ఒక కరపత్రం చేయండి.
జవాబు:
నినాదాలు :
జీవ హింస – మహాపాపం
జీవించు – అన్ని జీవులనూ జీవించనివ్వు
బ్రతికే హక్కు – అన్ని జీవులకూ ఉంది
జీవులను కాపాడుదాం – జీవవైవిధ్యాన్ని నిలబెడదాం
జీవులు లేని ప్రకృతి – జీవం లేని ప్రకృతి
కరపత్రం : నానాటికీ మన చుట్టూ ఉన్న చాలా రకాల జీవులు అంతరించిపోతున్నాయి. బాధాకరమైన విషయం ఏమిటంటే, ఇవి అంతరించటానికి ప్రధాన కారణం మానవ చర్యలే. ఈ ప్రకృతిలో మనతోపాటు ప్రతి జీవికీ జీవించే హక్కు ఉంది. దానిని మనం ధిక్కరించరాదు. భూమిపై అన్ని జీవరాశులు ఉన్నప్పుడే జీవుల మధ్య తులాస్థితి ఉంటుంది. మన జీవనం సక్రమంగా ఉంటుంది. కావున మనం జీవిద్దాం, ఇతర జీవులను జీవించనిద్దాం.

ప్రశ్న 10.
కంప్రెస్ట్ కార్డ్ బోర్డ్ ఎలా తయారవుతుంది ? దాని ప్రయోజనం ఏమిటి ?
జవాబు:
కంప్రెస్ట్ కార్డ్ బోర్డ్ :

  1. ఇది చెక్కపొట్టు, కర్రముక్కలతో కలిపి చేసిన గుజ్జుతో తయారవుతుంది.
  2. ఈ గుజ్జుకు రసాయన సల్ఫేట్లు కలిపి సెల్యులోజును తయారుచేస్తారు.
  3. గుజ్జును రెండు పొరలుగా పేర్చి వాటి మధ్యలో కర్రపొట్టును చేర్చుతారు.
  4. దీనిని గట్టిగా అదిమి (కంప్రెస్) పెట్టి ఆరబెడతారు.
  5. ఇలా తయారయిన కార్డ్ బోర్డ్ కర్రలా గట్టిగా బలంగా ఉంటుంది.

ప్రయోజనం :
1. ‘కంప్రెస్ట్ కార్డ్ బోర్డ్’ తయారీకి చెక్కముక్కలు, చెక్కపొట్టు అవసరం.
2. కాబట్టి చెట్టును నరకవలసిన అవసరం ఉండదు.
3. ఇది అడవుల నరికివేత తగ్గించటంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రశ్న 11.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని జాతీయ పార్కులు మరియు సంరక్షణ కేంద్రాల గురించి సమాచారం సేకరించండి.
జవాబు:
AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ 5
AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ 6

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 12.
రీసైకిల్డ్ కాగితాన్ని వృథా వార్తాపత్రికల నుంచి ఎలా తయారుచేస్తారు ? (లేదా) కాగితాన్ని పునఃచక్రీయ పద్ధతిలో తయారుచేసే విధానాన్ని రాయండి.
జవాబు:
రీసైకిల్డ్ కాగితాన్ని వృథా వార్తాపత్రికల నుంచి తయారుచేయడం
కావలసిన వస్తువులు : రెండు ప్లాస్టిక్ తొట్టెలు, కర్ర గరిటె, నీరు, శుభ్రమైన నూలు దుస్తులు, పాత వార్తా పత్రికలు, వైర్ స్క్రీన్, కొలపాత్ర, ప్లాస్టిక్ చుట్ట, బ్లెండర్ (mixer) బరువైన పుస్తకాలు, రోలర్.

తయారీ పద్ధతి :
1) కత్తిరించిన న్యూస్ పేపర్ ముక్కలను నీటితో నిండిన తొట్టెలో వేసి ఒక రోజు నానబెట్టాలి.
2) పిండి రుబ్బే దానిలో (బ్లెండర్) రెండు కప్పులు నానబెట్టిన కాగితం, ఆరు కప్పుల నీటిని చేర్చండి. మెత్తని గుజ్జు తయారయ్యేలా రుబ్బి శుభ్రమైన తొట్టెలో వేయాలి.
3) తొట్టెను 1/4వ వంతు నూరిన పేపర్ గుజ్జు మిశ్రమం (Paper pulp) తో నింపాలి.
4) పొడిగా, బల్లపరుపుగా ఉన్న తలంపై ఒక వస్త్రాన్ని పరచాలి. తడి పేపర్ గుజ్జు కింద వైర్ స్క్రీన్ ను ఉంచాలి. స్క్రీన్‌ను మెల్లగా బయటికి తీసి పేపర్ గుజ్జును ఒత్తుతూ అందులోని నీటిని తీసివేయాలి.
5) జాగ్రత్తగా వస్త్రం ఫైన స్క్రీన్ ను బోర్లించాలి. గట్టిగా క్రిందికీ ఒత్తి స్క్రీన్ ను తీసివేయాలి.
6) కాగితపు గుజ్జు మిశ్రమంపై మరో గుడ్డ , వస్త్రంను పరచాలి. గుడ్డపై ఒక ప్లాస్టిక్ షీట్ ను పరిచి దానిపై బరువు కోసం పుస్తకాలను పేర్చాలి.
7) కొన్ని గంటల తరువాత పుస్తకాలు, గుడ్డను తీసి పేపరును ఎండలో ఆరనివ్వాలి.
8). హెయిర్ డ్రయర్‌ను ఉపయోగించి కూడా పేపరును ఆరబెట్టవచ్చును.
9) రంగులు గల పేపర్‌ను తయారుచేయడానికి కాగితపు గుజ్జుకు వంటకాల్లో ఉపయోగించే రంగు చుక్కలను కలపాలి. ఏర్పడిన కాగితాన్ని ఇస్త్రీ చేసి కావలసిన పరిమాణంలో, ఆకారంలో కత్తిరించుకోవాలి.
10) అందమైన గ్రీటింగ్ కార్డులు, ఫైల్ కవర్లు, బ్యాగులు మొదలగునవి రీ సైకిల్డ్ పేపరను ఉపయోగించి తయారు చేయవచ్చును.

ప్రశ్న 13.
మీకు తెలిసిన ఏవైనా నాలుగు ఔషధ మొక్కల పేర్లు మరియు వాటి ఉపయోగాలు తెలపండి.
జవాబు:
మా ప్రాంతంలో నాకు తెలిసిన ఔషధ మొక్కలు

  1. తులసి – దగ్గును నివారిస్తుంది
  2. వేప – యాంటీ సెప్టిక్
  3. పసుపు – యాంటిసెప్టిక్ మరియు సౌందర్య లేపనాల తయారీ
  4. సర్పగంధి – పాము కాటు నివారణ మందుల తయారీలో ఉపయోగపడుతుంది.

ప్రశ్న 14.
జతపరచండి మరియు కింది ప్రశ్నకు జవాబివ్వండి.
AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ 8
జవాబు:
1 – డి, 2 – సి, 3 – ఎ, 4 – బి

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 15.
పక్షులు ఆహారం, నివాసం కొరకు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళే విధానాన్ని ఏమంటారు. ఇలా వెళ్ళే పక్షుల పేర్లు వ్రాయండి.
జవాబు:
పక్షులు ఆహారం, నివాసం మరియు సంతానోత్పత్తికి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడాన్ని వలసపోవడం అంటారు. ఉదా : సైబీరియన్ కొంగ, పెలికన్ పక్షులు.

ప్రశ్న 16.
మీ ప్రదేశంలోని జీవ వైవిధ్యాన్ని పరిరక్షణకై ఏవైనా 2 నినాదాలు రాయండి.
జవాబు:
1. ప్రకృతిలో జీవించు – జీవజాతులను పరిరక్షించు ,
2. వృక్షోరక్షతి రక్షితః –
3. ప్రకృతిలో ప్రతిజీవి అపురూపం – వాటిని సంరక్షించడం మన కర్తవ్యం.

ప్రశ్న 17.
కింది పేరాను చదవండి.
“ఒక్కోసారి రాత్రివేళల్లో కూడా కొన్ని పక్షులు ఆకాశంలో గుంపులుగా ఎగురుతూ కనిపిస్తాయి. కొన్ని పక్షులకు శాశ్వత నివాసం ఉండదు. ఇవి గుంపులు గుంపులుగా ఒక చోటు నుండి మరో చోటుకు ఆవాసం, ఆహారం కోసం వెళుతుంటాయి. దీనినే వలస అంటారు. ఈ పక్షులనే “వలసపక్షులు” అంటారు. ఈ వలస పక్షులు వర్షాకాలంలో మన రాష్ట్రంలోని కొల్లేరు, పులికాట్ సరస్సులకు వస్తాయి. ఈ సరస్సుల దగ్గరున్న గ్రామాలలోని చెట్లపై ఇవి నివసిస్తూ ఉంటాయి. ప్రస్తుతం చెట్లను నరికివేయడం వలన నివాసాలు అందుబాటులో లేకపోవడంతో వలస పక్షుల సంఖ్య తగ్గిపోయింది.
ఎ) వలస పక్షులు అని వేటిని అంటారు ? అవి ఎందుకు వలసపోతాయి ?
బి) మనదేశానికి పక్షుల వలస తగ్గిపోవడానికి కారణం ఏమి ?
జవాబు:
ఎ) ఆహారం కోసం ఆవాసం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళే పక్షులను వలస పక్షులు అంటారు.
బి) పక్షులు వలస వచ్చే ప్రాంతాల గ్రామాలలో చెట్లను కొట్టివేయడం వల్ల ఆవాసాలు తగ్గి పక్షుల వలస తగ్గిపోతున్నది.

ప్రశ్న 18.
కాగితాన్ని పొదుపుగా వాడుకొనేందుకు నీవు తీసుకొనే జాగ్రత్తలు ఏమిటి ?
జవాబు:
1. కాగితాలను అవసరమైతేనే వాడాలి. రీసైకిల్ చేయబడిన కాగితాన్ని వాడాలి.
2. ప్రభుత్వ లావాదేవీలన్నీ ఎలక్ట్రానిక్ పద్ధతిలోకి మారితే పేపర్ల వినియోగం చాలావరకు తగ్గుతుంది.

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 19.
కింది తెలిపిన సమాచారాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
ప్రతిరోజు ఒకేరకమైన పక్షులు కనిపిస్తున్నాయా ? ప్రత్యేకించి కొన్ని కాలాలలో హఠాత్తుగా ఏమైనా మార్పులు ఏర్పడినాయా? కొత్తరకం పక్షులు ఎక్కడి నుండి వచ్చాయి ? ఈ విధంగా కొత్త పక్షులు మన ప్రాంతానికి ఆహారం, నివాసం కొరకు వస్తుంటాయి. దీనినే ‘వలస’ అంటారు. ఇలాంటి పక్షులను వలస పక్షులు అంటారు. వర్షాకాలంలో ఎన్నో రకాల పక్షులు మనరాష్ట్రంలో కొల్లేరు, పులికాట్ సరస్సులకు వలస వస్తాయి. ఇవి సమీప గ్రామాలలోని చెట్లపై గూళ్లు కట్టుకొంటాయి. పూర్వపు రోజుల్లో పక్షుల రాకను శుభసూచకం అని నమ్మేవారు. కానీ ప్రస్తుతం చెట్లు నరికివేతకు గురవుతుండటం వల్ల పక్షులు గూళ్ళు కట్టుకోవడానికి అనువైన స్థలాలు లేక అవి తమ విడిదిని మార్చుకొంటున్నాయి.

1. పై సమాచారం ఏ అంశాన్ని తెలియజేస్తోంది ?
జవాబు:
పక్షుల వలసపై పర్యావరణ ప్రభావం

2. వేరే ప్రాంతం నుండి కొత్త పక్షులు మన ప్రాంతానికి రావడాన్ని ఏమంటారు ?
జవాబు:
పక్షుల వలస

3. పక్షుల వలస రావాలంటే ఏమి చేయాలి ?
జవాబు:
వాటికి ఆవాసాలైన చెట్లను నరకకుండా పరిరక్షించాలి. సరస్సుల పర్యావరణాన్ని మానవ కార్యకలాపాలు కలుషితం , కాకుండా చూడాలి.

4. నీకు తెలిసిన కొన్ని వలస పక్షుల పేర్లు రాయండి ?
జవాబు:
పెలికన్ పక్షులు, సైబీరియన్ కొంగ.

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

1 మార్కు ప్రశ్నలు

ప్రశ్న 1.
జీవవైవిధ్యం అంటే ఏమిటి ?
జవాబు:
జీవవైవిధ్యం : మొక్కలు, జంతువుల్లో కనపడే వైవిధ్యాలను జీవవైవిధ్యం అంటారు.

ప్రశ్న 2.
అంతరించిన జాతులు అంటే ఏమిటి?
జవాబు:
అంతరించిన జాతులు : భూమి పైనున్న ఆవరణ వ్యవస్థలలో పూర్తిగా కనబడకుండా అంతరించిపోయిన జాతులను అంతరించిన జాతులు అంటారు. ఉదా : డైనోసార్లు, హంసల్లాంటి తెల్ల కొంగలు మొదలయినవి. ఇక ఇలాంటి జీవులను మనం తిరిగి భూమిపై చూడలేము.

ప్రశ్న 3.
ఆపదలో ఉన్న జాతులు అని వేటిని అంటారు.
జవాబు:
భూమిపైనున్న ఆవరణ వ్యవస్థలలో సంఖ్యాపరంగా బాగా తక్కువగా ఉన్న జాతులను ఆపదలో ఉన్న జాతులు అంటారు. అవి నివసించే ప్రాంతాలు మానవుని వల్ల నాశనం చేయబడటం వల్ల అవి నివాసం కోల్పోయి ఆపదలో ఉన్నాయి.

ప్రశ్న 4.
ఎండమిక్ జాతులు అనగానేమి?
జవాబు:
భూమిపై ఒక ప్రత్యేక ఆవాసానికి పరిమితమైన జాతులను ఎండమిక్ జాతులు అంటారు.
ఉదా : 1. కంగారూలు ఆస్ట్రేలియాలోనే వుంటాయి.
2. కోపిష్టి మదపుటేనుగులు ఆఫ్రికా అడవులలోనే ఉంటాయి.
3. ఒంగోలు జాతి గిత్తలు మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటాయి. కానీ ఈ మధ్య వీటిని కృత్రిమ గర్భధారణ ద్వారా బ్రెజిల్ లో పెంచుతున్నారు)

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 5.
భూమిపై అధిక జీవవైవిధ్యం ఎక్కడ కనిపిస్తుంది ?
జవాబు:
భూమిపై అధిక జీవవైవిధ్యం అడవులలో మాత్రమే కనిపిస్తున్నది. అడవులలో ఒకే జాతి మొక్కలు, జంతువుల మధ్య వైవిధ్యం కనబడుతుంది.

ప్రశ్న 6.
వలస అనగానేమి?
జవాబు:
వాతావరణ ప్రతికూలతల వల్ల ప్రత్యుత్పత్తి జరుపుకొనటానికి పక్షులు వాటి సహజ నివాసం వీడి మరొక చోటుకు (మారటాన్ని) వెళ్ళటాన్ని ‘వలస’ అంటారు.

ప్రశ్న 7.
రామగుండంలో పులులు ఎందుకు అంతరించాయి ?
జవాబు:
1. ఇక్కడ థర్మల్ పవర్ కేంద్రం ఏర్పాటు వల్ల వేల ఎకరాల అటవీ భూమి తగ్గిపోయింది.
2. అందుకే పులుల సంఖ్య తగ్గింది.

ప్రశ్న 8.
మన దేశంలో పులులు ఎక్కడైనా కనిపిస్తున్నాయా ?
జవాబు:
అవును. శ్రీశైలం అడవులలో కనిపిస్తున్నాయి.

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 9.
అడవిని, అడవి జీవులను కాపాడటంలో టైగర్ ప్రాజెక్ట్ ఎలా ఉపయోగపడింది ?
జవాబు:
1. పులిని కాపాడాలంటే. అడవిని కాపాడాలి.
2. అడవిని కాపాడితే అది జీవవైవిధ్యపు నిల్వగా మారి ఎన్నో రకాల మొక్కలు, జంతువులు, పక్షులకు ఆవాసంగా మారుతుంది.
3. ఇలా అడవిని సంరక్షించటం అంటే పులుల సంరక్షణే !

ప్రశ్న 10.
ఇదివరకు పులులు ఉండి, ఇప్పుడు తగ్గితే అది జింకలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ?
జవాబు:
1. పులుల ఆహారం ఎక్కువగా జింకలే.
2. పులులు’ తగ్గితే జింకల జనాభా పెరుగుతుంది.

ప్రశ్న 11.
జింకల సంఖ్య పెరిగితే మొక్కల పరిస్థితి ఏమిటి ?
జవాబు:
1. జింకలు గడ్డిని, మొక్కలను, వేరుశనగ, కందిచెట్లను తింటాయి.
2. పులులు తగ్గి, జింకల సంఖ్య పెరగటం వల్ల, అవి మొక్కలను తింటాయి కాబట్టి మొక్కల సంఖ్య బాగా తగ్గుతుంది.

ప్రశ్న 12.
మన రాష్ట్రానికే పరిమితమైన ఒక ఎండమిక్ జాతిని పేర్కొనండి.
జవాబు:
‘జెర్డాన్స్ కర్’ ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఒక ఎండమిక్ జాతి.

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 13.
ప్రకృతిలో మిమ్మల్ని అధికంగా ఆకర్షించినదేది?
జవాబు:
ప్రకృతిలో మా ఊరి చెరువు, దాని ప్రక్కన ఉన్న దేవాలయం నన్ను అధికంగా ఆకర్షించాయి. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా, అందంగా, హాయిగా ఉంటుంది.

లక్ష్యాత్మక నియోజనము

ప్రశ్న 1.
ప్రపంచం అంతటా రోజుకు ………….. జాతులు అంతరించిపోతున్నాయి.
ఎ) 26
బి) 27
సి) 28
డి) 30
జవాబు:
బి) 27

ప్రశ్న 2.
నెమళ్ళకు ……………… ఆహారం అంటే ఎంతో ఇష్టం
ఎ) చీమలు
బి) సాలీడు
సి) పాములు
డి) పిల్ల నెమళ్ళు
జవాబు:
సి) పాములు

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 3.
‘పులుల లోయగా’ ఒకప్పుడు ఈ పట్టణం వద్ద నున్న అడవి పిలవబడింది.
ఎ) మంచిర్యాల
బి) కరీంనగర్
సి) అడ్డతీగల
డి) చిత్తూరు
జవాబు:
ఎ) మంచిర్యాల

ప్రశ్న 4.
ఏనుగుల బీభత్సం ఎక్కువగా ఏ జిల్లాలో ఉంటుంది? )
ఎ) చిత్తూరు
బి) ఖమ్మం
సి) వరంగల్
డి) రంగారెడ్డి
జవాబు:
ఎ) చిత్తూరు

ప్రశ్న 5.
కొల్లేరు సరస్సు ఏ జిల్లాలో ఉంది?
ఎ) పశ్చిమగోదావరి
బి) వరంగల్
సి) శ్రీకాకుళం
డి) విజయనగరం
జవాబు:
ఎ) పశ్చిమగోదావరి

ప్రశ్న 6.
పాండా సంరక్షణ బాధ్యతను తీసుకున్న సమాఖ్య
ఎ) IUWC
బి) NGC
సి) WWF
డి) ZSL
జవాబు:
సి) WWF

ప్రశ్న 7.
మన దేశంలో బిల్లులు ఎక్కువగా ……………. కనుమలలో ఉన్నాయి.
ఎ) తూర్పు
బి) పశ్చిమ
సి) ఉత్తర
డి) దక్షిణ
జవాబు:
బి) పశ్చిమ

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 8.
శ్రీశైల అభయారణ్యం ……………. సంరక్షణ కోసం కేటాయించారు.
ఎ) సింహాల
బి) జింకల
సి) పాముల
డి) పులుల
జవాబు:
డి) పులుల

ప్రశ్న 9.
రాబందుల ఆహారం ………………..
ఎ) మృత కళేబరాలు
బి) లేళ్ళు
సి) కుందేళ్ళు
డి) నక్కలు
జవాబు:
ఎ) మృత కళేబరాలు

ప్రశ్న 10.
టైగర్ ప్రాజెక్టు ………….. సం||లో ప్రారంభించారు.
ఎ) 1971
బి) 1972
సి) 1973
డి) 1974
జవాబు:
బి) 1972

ప్రశ్న 11.
హైదరాబాద్ లో ప్రపంచ జీవవైవిధ్య సదస్సు జరిగిన సంవత్సరం
ఎ) 2010
బి) 2012
సి) 2015
డి) 2011
జవాబు:
బి) 2012

ప్రశ్న 12.
ప్రపంచంలో అంతరించిపోతున్న 100 జంతువుల ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ కి చెందినవి
ఎ) 2
బి) 4
సి) 6
డి) 8
జవాబు:
ఎ) 2

ప్రశ్న 13.
గూటీ టారంటలా సాలీడు ఏ జిల్లాలో కన్పిస్తుంది ?
ఎ) కర్నూలు
బి) కడప
సి) అనంతపురం
డి) చిత్తూరు
జవాబు:
ఎ) కర్నూలు

ప్రశ్న 14.
బట్టమేక పక్షిని సంరక్షించే పుల్లెందు పక్షుల సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉన్నది ?
ఎ) కడప
బి) ప్రకాశం
సి) కర్నూలు
డి) అనంతపురం
జవాబు:
సి) కర్నూలు

ప్రశ్న 15.
జీవ వైవిధ్యానికి దారితీసేవి
ఎ) జీవుల మధ్య పోలికలు
బి) జీవుల మధ్య భేదాలు
సి) జీవుల మధ్య పోరాటాలు
డి) జీవుల అలవాట్లు
జవాబు:
బి) జీవుల మధ్య భేదాలు

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 16.
E.O. విల్సన్ అభిప్రాయం ప్రకారం ప్రపంచమంతటా సంవత్సరానికి ఎన్ని జాతులు అంతరించిపోతున్నాయి?
ఎ) 100
బి) 1000
సి) 10,000
డి) 1,00,000
జవాబు:
సి) 10,000

ప్రశ్న 17.
W.W.F ను విస్తరించి వ్రాయగా
ఎ) వరల్డ్ వైడ్ ఫండ్
బి) వరల్డ్ వైడ్ ఫెడరేషన్
సి) వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్
డి) వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్
జవాబు:
డి) వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్

ప్రశ్న 18.
I.U.W.C విస్తరించి వ్రాయగా
ఎ) ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్
బి) ఇండియన్ యూనియన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్
సి) ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వెల్త్ కన్జర్వేషన్
డి) ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వైల్డ్ లైఫ్ కమిటీ
జవాబు:
ఎ) ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్

ప్రశ్న 19.
అంతరించిపోతున్న మొక్కలు, జంతువుల సమాచారాన్ని తెల్పేది
ఎ) రెడ్ డేటా బుక్
బి) గ్రీన్ డేటా బుక్
సి) బ్లూడేటా బుక్
డి) బ్లాక్ డేటా బుక్
జవాబు:
ఎ) రెడ్ డేటా బుక్

ప్రశ్న 20.
ఎండమిక్ జాతులు అనగా
ఎ) అంతరించిపోతున్న జాతులు
బి) అరుదైన జాతులు
సి) ఒక ప్రాంతానికి పరిమితమైన జాతులు
డి) అంతరించిపోయిన జాతులు
జవాబు:
సి) ఒక ప్రాంతానికి పరిమితమైన జాతులు

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 21.
ఈ క్రింది వానిలో ఎండమిక్ జాతి
ఎ) ఏనుగు
బి) సింహం
సి) కంగారు
డి) పులి
జవాబు:
సి) కంగారు

ప్రశ్న 22.
ఈ క్రింది వానిలో విదేశీ ఆక్రమణ జాతికి ఉదాహరణ
ఎ) హైదరాబాదు కాకి
బి) హైదరాబాదు పావురం
సి) హైదరాబాదు పిచ్చుక
డి) హైదరాబాదు చిలుక
జవాబు:
బి) హైదరాబాదు పావురం

ప్రశ్న 23.
గుట్టపుడెక్క దేనికి ఉదాహరణ ?
ఎ) ఆపదలో ఉన్న జాతి
బి) అంతరించిపోతున్న జాతి
సి) విదేశీయ ఆక్రమణ జాతి
డి) అరుదైన జాతి
జవాబు:
సి) విదేశీయ ఆక్రమణ జాతి

ప్రశ్న 24.
పూర్వకాలంలో భారతదేశంలో ఎన్ని రకాల వరి వంగడాలు సాగులో ఉన్నాయి?
ఎ) 10,000
బి) 20,000
సి) 40,000
డి) 50,000
జవాబు:
డి) 50,000

ప్రశ్న 25.
పూర్వకాలంలో ఎన్ని రకాల మొక్కల జాతులను మానవుడు ఆహారంగా ఉపయోగించాడు?
ఎ) 5,000
బి) 10,000
సి) 15,000
డి) 20,000
జవాబు:
ఎ) 5,000

ప్రశ్న 26.
మనదేశంలో ఎన్ని పులి సంరక్షక కేంద్రాలున్నాయి ?
ఎ) 23
బి) 25
సి) 27
డి) 29
జవాబు:
సి) 27

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 27.
పులులను సంరక్షించుకోవటం ద్వారా వీనిని కాపాడుకోవచ్చు.
ఎ) అడవులు
బి) గడ్డిమైదానాలు
సి) పర్వత ప్రాంతాలు లోయలు
డి) ఆవరణ వ్యవస్థలు
జవాబు:
డి) ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 28.
జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ కలదు ?
ఎ) అస్సోం
బి) గౌహతి
సి) మేఘాలయ
డి) షిల్లాంగ్
జవాబు:
బి) గౌహతి

ప్రశ్న 29.
పాకాల వన్య సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో కలదు ?
ఎ) కరీంనగర్
బి) ఖమ్మం
సి) వరంగల్
డి) ఆదిలాబాదు
జవాబు:
సి) వరంగల్

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 30.
ఒకటన్ను పేపర్ తయారు చేయడానికి ఎన్ని వృక్షాలని నరికివేయవలసి ఉంటుంది ?
ఎ) 17
బి) 22
సి) 25
డి) 27
జవాబు:
ఎ) 17

ప్రశ్న 31.
మనదేశానికి పక్షులు యిక్కడ నుండి వలస వస్తాయి.
ఎ) సైబీరియా
బి) మంగోలియ
సి) చైనా
డి) కజకిస్థాన్
జవాబు:
ఎ) సైబీరియా

ప్రశ్న 32.
అడవుల నరికివేత తగ్గించుటలో ఉపయోగపడే కలప
ఎ) టేకు
బి) కంప్రెస్ట్ కార్డ్ బోర్డ్
సి) బైండింగ్ కార్డ్ బోర్డ్
డి) క్బార్డ్
జవాబు:
బి) కంప్రెస్ట్ కార్డ్ బోర్డ్

ప్రశ్న 33.
కోరింగ జంతు సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో కలదు ?
ఎ) తూర్పు గోదావరి
బి) పశ్చిమ గోదావరి
సి) కృష్ణా
డి) విజయనగరం
జవాబు:
ఎ) తూర్పు గోదావరి

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 34.
రేడియేషన్ వల్ల ప్రస్తుతం అంతరిస్తున్న పక్షి జాతి
ఎ) కాకి
బి) రాబందు
సి) పిచ్చుక
డి) కొంగలు
జవాబు:
సి) పిచ్చుక

ప్రశ్న 35.
ఇటీవల మనదేశంలో అంతరిస్తున్న పక్షి జాతి
ఎ) నెమళ్ళు
బి) రాబందులు
సి) కాకులు
డి) కొంగలు
జవాబు:
బి) రాబందులు

ప్రశ్న 36.
భారత ప్రభుత్వం టైగర్ ప్రాజెక్టును ప్రారంభించిన సంవత్సరం
A) 1978
B) 1979
C) 1988
D) 1972
జవాబు:
D) 1972

ప్రశ్న 37.
కింది వాటిలో జాతుల వైవిధ్యాన్ని వివరించునది.
A) ఇవ్వబడిన ప్రాంతంలో ఉండే ఆపదలో వున్న జాతుల జనాభా
B) ఇవ్వబడిన ప్రాంతంలో ఉండే వివిధ రకాల జాతులు
C) ఇచ్చిన ప్రాంతంలో అంతరించిపోయిన జాతులు లేకపోవటం
D) ఇవ్వబడిన ప్రాంతానికి స్థానికము కాని జాతుల సంఖ్య
జవాబు:
B) ఇవ్వబడిన ప్రాంతంలో ఉండే వివిధ రకాల జాతులు

ప్రశ్న 38.
భారతదేశంలో అధిక సంఖ్యలో ఎండమిక్ జాతులు వున్నాయి. ప్రపంచంలోని ఎండమిక్ జాతులైన ఉ భయచరాలలో దాదాపు 62%, బల్లుల్లో 50% భారతదేశంలో ఈ ప్రాంతంలో వున్నాయి.
A) హిమాలయాలు
B) పశ్చిమ కనుమలు
C) ఆరావళి
D) రాజస్థాన్ ఎడారి
జవాబు:
B) పశ్చిమ కనుమలు

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 39.
“జాతి భావం” (Species Concept) కు సంబంధించిన వాక్యం
A) అన్ని జీవులకు వర్తించదు
B) లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవులకు వర్తించును
C) ఆలైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవులకు వర్తించదు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

ప్రశ్న 40.
జాతీయపార్కు అనే దానికి సరియైన స్టేట్ మెంట్ గుర్తించండి.
1. ఒక విశాలమైన స్థలంలో వన్యజాతి జీవులను సహజమైన ఆవాసంలో సంరక్షించే ప్రదేశాలు
2. ఆయా జీవజాతుల ఆవాసాలపై ప్రభావం చూపకుండా ఉండేవిధంగా మానవ చర్యలను పరిమితంగా అనుమతించేవి
A) 1 మాత్రమే
B) 1 మరియు 2
C) 2 మాత్రమే
D) పై రెండు కాదు
జవాబు:
B) 1 మరియు 2

ప్రశ్న 41.
జతపరచుటలో సరైన సమాధానం గుర్తించండి.
AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ 7
A) 1-ఎ, 2-సి, 3-బి
B) 1-సి, 2-బి, 3-ఎ
C) 1 -బి, 2 – ఎ, 3-సి
D) 1-సి, 2-ఎ, 3-బి
జవాబు:
D) 1-సి, 2-ఎ, 3-బి

ప్రశ్న 42.
పర్యావరణ నిర్వహణ ఎందుకు అవసరం ?
A) మానవ మనుగడ కొనసాగింపు కొరకు
B) జంతువులు అంతరించకుండా
C) ప్రకృతి సమతుల్యత కొరకు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

ప్రశ్న 43.
రెడేటా పుస్తకం నందు కింది అంశాలు ఉంటాయి.
A) ఆపదలో ఉన్న అంతరించిపోతున్న జీవుల జాబితా ఉంటుంది
B) సాధారణ మరియు అపాయకరమైన జీవుల జాబితా ఉంటుంది
C) అరుదైన మరియు విదేశీ జాతులు ఉంటాయి
D) ఎండమిక్ జాతుల వివరాలు
జవాబు:
A) ఆపదలో ఉన్న అంతరించిపోతున్న జీవుల జాబితా ఉంటుంది

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 44.
కింది వానిలో వలస పక్షిని గుర్తించండి
A) కాకి
B) ఫ్లెమింగో
C) గ్రద్ద
D) చిలుక
జవాబు:
B) ఫ్లెమింగో

ప్రశ్న 45.
రెడ్ డేటా బుక్ అనేది దీనిని ఉద్దేశించిననది
A) అంతరించిపోతున్న జంతువుల సమాచారం తెలిపేది
B) వలస పక్షుల గురించి తెలిపేది
C) వివిధ ప్రాంతాలలో నివసించే జంతువులను గురించి తెలిపేది
D) విలుప్తమైన జీవుల గురించి తెలిపేది
జవాబు:
A) అంతరించిపోతున్న జంతువుల సమాచారం తెలిపేది

ప్రశ్న 46.
నీ మిత్రుడు తన ఇంటి మిద్దె మీద పక్షుల కొరకు గూళ్ళు ఏర్పాటు చేసి అవి తాగేందుకు నీటిని కూడా వుంచాడు. దీనిపై నీ ప్రతిస్పందన
A) ఇది ప్రోత్సహించవలసిన చర్య కాదు
B) ఇది చాలా గొప్ప చర్య అతన్ని నేను అభినందిస్తాను
C) ఈ చర్యవల్ల పక్షులు దూరమవుతాయి
D) ఈ చర్యను నేను వ్యతిరేకిస్తాను
జవాబు:
(B) ఇది చాలా గొప్ప చర్య అతన్ని నేను అభినందిస్తాను

ప్రశ్న 47.
చిత్రంలో ఉన్న జీవి ప్రత్యేకత ఏమిటి ?
AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ 9
1) అత్యంత ఆపదలో ఉన్న కీటకం
2) దీనిని ‘గూటి టరాంటులా’ అంటారు.
3) ఇది హిమాలయాలలో ఉంటుంది.
4) దీనిని ‘బట్ట మేక’ పక్షి అంటారు.
పై వాక్యా లలో సరైనవి
A) 1, 2 మాత్రమే
B) 3, 4 మాత్రమే
C) 1, 4 మాత్రమే
D) 2, 4 మాత్రమే
జవాబు:
A) 1, 2 మాత్రమే