AP 10th Class Social Important Questions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

These AP 10th Class Social Studies Important Questions 22nd Lesson పౌరులు, ప్రభుత్వాలు will help students prepare well for the exams.

AP Board 10th Class Social 22th Lesson Important Questions and Answers పౌరులు, ప్రభుత్వాలు

10th Class Social 22th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium

1. సమాచార హక్కు చట్టం ఏ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది?
జవాబు:
2005 లో.

2. న్యాయ సేవల ప్రాధికార చట్టం ఏ సంవత్సరంలో చేసారు?
జవాబు:
2002 లో.

3. ఏదేని ప్రభుత్వ కార్యాలయంలో సమాచారం కావాలంటే ఎవరికి దరఖాస్తు చేయాలి?
జవాబు:
పౌర సమాచార అధికారికి (PIO)

4. లోక్ అదాలత్ ముఖ్య ప్రయోజనం ఏమిటి?
జవాబు:
సత్వర న్యాయం.

5. జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థకు ఛైర్మన్‌గా ఎవరు వ్యవహరిస్తారు?
జవాబు:
జిల్లా జడ్జి.

AP 10th Class Social Important Questions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

6. న్యాయ సేవల ప్రాధికార సంస్థ ద్వారా న్యాయ సహాయం పొందాలంటే వార్షిక ఆదాయం ఎంత లోపు ఉండాలి?
జవాబు:
ఒక లక్ష రూపాయల లోపు.

7. మీ గ్రామంలో వేసిన రోడ్డుకు ఎంత ఖర్చు అయిందో తెలుసుకోవాలంటే ఎవరికి దరఖాస్తు చేయాలి?
జవాబు:
ప్రజా పనుల శాఖకు.

8. సమాచార హక్కు చట్టంలో సవరణలు / మార్పులు చేయుటకు ఎవరికి అధికారం కలదు?
జవాబు:
పార్లమెంటుకు.

9. కక్షిదారులు నేరుగా జడ్జితో సంభాషించే అవకాశం ఏ న్యాయస్థానాల్లో ఉంది?
జవాబు:
లోక్ అదాలత్ లో.

10. “కోర్టు బయట సమర్థ, ప్రత్యామ్నాయ, సృజనాత్మక వివాద పరిష్కార విధానాన్ని రూపొందించటం,” దేని యొక్క ముఖ్య ఉద్దేశ్యం?
జవాబు:
న్యా య సేవల ప్రాధికార సంస్థ.

11. మీ పాఠశాలలో పౌర సమాచార అధికారి ఎవరు?
జవాబు:
ప్రధానోపాధ్యాయులు / ప్రిన్సిపాల్.

AP 10th Class Social Important Questions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

12. లోక్ అదాలలు ఏ వర్గాల వారికి న్యాయ సేవలు అందించేందుకు ఏర్పాటు చేయబడ్డవి?
జవాబు:
బలహీన వర్గాల.

13. సైనిక దళాల సమాచారం ….. హక్కు పరిధిలోకి రావు.
జవాబు:
సమాచార

14. PWDని విస్తరింపుము.
జవాబు:
ప్రజా పనుల శాఖ

15. ఇతరుల వ్యక్తిగత సమాచారాన్ని ……… హక్కు ద్వారా పొందలేం.
జవాబు:
సమాచార

16. ఎవరు ఇచ్చిన తీర్పులకు అప్పీలును అనుమతించరు?
జవాబు:
లోక్ అదాలనే

17. సమాన అవకాశాల ప్రాతిపదికన న్యాయాన్ని అందించేలా న్యాయవ్యవస్థని పనిచేసేలా చూడటానికి వేటిని ఏర్పాటు చేసారు?
జవాబు:
లోక్ అదాలత్.

18. న్యాయ సేవా పీఠాలు ఎవరి కోసం ఏర్పాటు చేసారు?
జవాబు:
పేద, బలహీన వర్గాలవారికోసం.

AP 10th Class Social Important Questions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

19. సమాచారాన్ని పొందటానికి పౌరులు ఎంత రుసుము చెల్లించాల్సి ఉంది?
జవాబు:
5 – 10 రూ||

20. పురుషులు, ముసలివారు, నిరుద్యోగులు, స్త్రీలలో ఎవరు ఉచిత న్యాయ సహాయానికి అర్హులు?
జవాబు:
స్త్రీలు

21. ఏవి కోర్టుల్లో చాలా కాలం నుండి పెండింగ్ లో ఉన్న కేసులను తక్కువ కాలంలో ఎటువంటి ఖర్చు లేకుండా పరిష్కరిస్తుంది?
జవాబు:
లోక్ అదాలలు.

22. అన్ని శాఖల పౌర సమాచార అధికారులు, అప్పిలేట్ అధికారులు ఎవరికి జవాబు దారీగా ఉంటారు?
జవాబు:
రాష్ట్ర పౌర సమాచార కార్యాలయానికి,

23. సమాచార హక్కు చట్టం – 2005 ప్రకారం సమాచారం కోరుతూ దరఖాస్తులను క్రింది ఏ పద్ధతి/తుల్లో కోరాలి?
i) చేత్తో వ్రాసిన ఉత్తరం ద్వారా
ii) ఎలక్ట్రానిక్ మెయిల్ ద్వారా
iii) మౌఖికంగా చెప్పడం ద్వారా
జవాబు:
i, ii & iii

24. న్యాయ సేవల ప్రాధికార సంస్థల చట్టంకు ఏఏ సంవత్సరాల్లో సవరణ చేసారు?
జవాబు:
1994, 2002

AP 10th Class Social Important Questions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

25. రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థకు పాట్రన్-ఇన్- ఛీ ఎవరు ఉంటారు?
జవాబు:
ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.

26. తాలుకా న్యాయ సేవా సంఘాల అధిపతి?
జవాబు:
సీనియర్ సివిల్ జడ్జి.

27. లోక్ అదాలత్ లో ఈ వివాదాన్ని పరిష్కరించుకోలేం.
→ వైవాహిక విభేదాలు
→ గృహహింస కేసులు.
→ భరణానికి సంబంధించిన కేసులు
→ ఆర్థిక నేరానాకి సంబంధించిన కేసులు
జవాబు:
ఆర్థిక నేరానికి సంబంధించిన కేసులు.

28. క్రింది వాక్యాలను పరిగణించండి.
i) ప్రతి ప్రభుత్వ శాఖ రికార్డులను నిర్వహించి, వాటిని పౌరులకు అందుబాటులో ఉంచాలి.
ii) ప్రతి ప్రభుత్వ శాఖ స్వచ్ఛందంగానే కొన్ని వివరాలను బహిర్గతం చేయాలి.
పై వాక్యా లలో సరైనది ఏది?
A) (i) మాత్రమే
B) (ii) మాత్రమే
C) (i) మరియు (ii)
D) రెండూ కావు
జవాబు:
C (i) మరియు (ii)

29. PIOని విస్తరించండి.
జవాబు:
పౌర సమాచార అధికారి.

30. SPICని విస్తరించండి.
జవాబు:
రాష్ట్ర పౌర సమాచార కమీషనర్.

AP 10th Class Social Important Questions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

31. CPIC ని విస్తరించండి.
జవాబు:
కేంద్ర పౌర సమాచార కమిషనర్

32. NALSA ని విస్తరించండి.
జవాబు:
జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ.

33. SLSA ని విస్తరించండి.
జవాబు:
రాష్ట్ర న్యాయ సేవల ప్రాథికార సంస్థ

34. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) వ్యభిచార వృత్తి నివారణ చట్టం ( ) a) 1956
ii) బాల నేరస్తుల న్యాయ చట్టం ( ) b) 1986
iii)న్యా య సేవల ప్రాధికార చట్టం ( ) c) 2002
iv)మానసిక ఆరోగ్య చట్టం ( ) d) 1987
జవాబు:
i – a, ii – b, iii – c, iv – d

10th Class Social 22th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
వివాదాల పరిష్కారానికి సంబంధించి లోక్ అదాలత్ వలన కలిగే ఏవైనా రెండు ప్రయోజనాలను పేర్కొనండి.
జవాబు:

  1. ఎటువంటి కోర్టు రుసుము లేకపోవడం.
  2. వివాదాల వేగవంతమైన విచారణ.
  3. విధానంలో వెసులుబాటు.
  4. కక్షిదారులు నేరుగా న్యాయమూర్తులతో సంభాషించే అవకాశం.

ప్రశ్న 2.
లోక్ అదాలత్ యొక్క ప్రయోజనాలను తెల్పండి.
జవాబు:
i) లోక్ అదాలత్ వల్ల సత్వర, వేగవంతంగా న్యాయం అందుతుంది.
ii) లోక్ అదాలత్ వల్ల తక్కువ వ్యయంతో న్యాయం చేకూరుతుంది.

ప్రశ్న 3.
సమాచార హక్కు చట్టంను ఎవరు, ఎప్పుడు చేశారు?
జవాబు:
సమాచార హక్కు చట్టంను కేంద్రప్రభుత్వం 2005లో చేసింది.

AP 10th Class Social Important Questions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

ప్రశ్న 4.
సమాచార హక్కు లేనపుడు ఆయా శాఖలను ఎవరు తనిఖీ చేసేవారు?
జవాబు:
ఆ శాఖలోని పై అధికారులు, లేదా మంత్రి మాత్రమే ఆ వివరాలను తీసుకొని, తనిఖీ చెయ్యగలిగి ఉండేవాళ్లు.

ప్రశ్న 5.
ప్రతి ప్రభుత్వశాఖ యొక్క కనీస బాధ్యత ఏమిటి?
జవాబు:
సమాచారా హక్కు చట్టం వల్ల ఇప్పుడు ప్రతి ప్రభుత్వ శాఖకు రికార్డులను నిర్వహించి, వాటిని అడిగిన పౌరులకు అందుబాటులో ఉంచాలి.

ప్రశ్న 6.
అన్ని శాఖల పౌర సమాచార అధికారులు, అప్పిలేట్ అధికారులు ఎవరికి బాధ్యత వహిస్తారు?
జవాబు:
అన్ని శాఖల పౌర సమాచార అధికారులు, అప్పిలేట్ అధికారులు రాష్ట్ర పౌర సమాచార కార్యాలయానికి జవాబుదారీగా ఉంటారు.

ప్రశ్న 7.
జరిమాన విధించే అధికారం ఎవరికి ఉంది?
జవాబు:
రాష్ట్ర, కేంద్ర సమాచార కమిషనర్లు సంబంధిత పౌరసమాచార అధికారికి జరిమానా విధించవచ్చు.

ప్రశ్న 8.
సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారం కొరకు దరఖాస్తు చేసుకునే వారిలో ఎవరు రుసుము చెల్లించనవసరం లేదు?
జవాబు:
సమాచారం కోరుతున్న వ్యక్తి దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారు రుసుము చెల్లించనవసరం లేదు.

ప్రశ్న 9.
ఏ చట్టం ప్రకారం మనదేశంలో ఉచిత న్యాయసేవలు అందిస్తున్నారు?
జవాబు:
“న్యాయసేవల ప్రాధికార సంస్థ (సవరణ) చట్టం, 2002”, ప్రకారం ఉచిత సేవలు అందిస్తున్నారు.

ప్రశ్న 10.
న్యాయ సేవా పీఠాలను ఏర్పాటుచేయుటలో ఉద్దేశం ఏమిటి?
జవాబు:
ఆర్థిక లేక ఏ ఇతర కారణాల వల్లనైనా ఏ పౌరుడికి కూడా న్యాయం లభించకుండా ఉండకూడదన్న ఉద్దేశంతో వీటిని ఏర్పాటుచేశారు.

ప్రశ్న 11.
దేని ప్రకారం లోక్ అదాలత్ లను ఏర్పాటు చేశారు?
జవాబు:
న్యాయసేవల పీఠాల చట్టం 1987ని 1994 లోనూ, తిరిగి 2002 లోనూ సవరించారు. దీని కింద లోక్ అదాలత్ లను (ప్రజాస్వామ్య పీఠాలను) ప్రతి రాష్ట్రంలోను ఏర్పాటుచేశారు.

AP 10th Class Social Important Questions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

ప్రశ్న 12.
రాష్ట్ర న్యాయసేవల ప్రాధికార సంస్థకి అధిపతిగా ఎవరుంటారు?
జవాబు:
అధిపతిగా, ప్యాట్రన్ – ఇన్ చీఫ్ గా రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉంటారు.

10th Class Social 22th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
సమాచార హక్కు చట్టం గూర్చి సంక్షిప్తంగా రాయండి.
(లేదా)
సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా సుసంపన్నం చేస్తుందో వివరించండి.
జవాబు:

  1. సమాచార హక్కు చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం 2005 సంవత్సరంలో ఆమోదించింది.
  2. ప్రజా ఉద్యమాల కారణంగా, పౌరులకు హక్కులు కల్పిస్తూ రాజ్యాంగంలోని అంశాల కారణంగా ఈ చట్టం రూపొందించబడింది.
  3. రాజ్యాంగం కింద ఏర్పడిన సంస్థ మరియు పార్లమెంటు లేదా రాష్ట్ర శాసన సభల ప్రకారం ఏర్పడిన సంస్థలు ఈ చట్టంలో విధులు నిర్వహిస్తాయి.
  4. ప్రస్తుతం ఏ పౌరుడైనా ప్రభుత్వానికి సంబంధించి ఏ శాఖలోనైనా రికార్డు రూపంలో ఉండే సమాచారం కావాలని అడిగినప్పుడు ఈ శాఖలో వారు పౌరునికి తప్పనిసరిగా సమాచారం ఇవ్వవలెను.
  5. ఈ చట్టం న్యాయసహాయాన్ని కూడా ప్రజలకు అందిస్తుంది. దాని కోసం లోక్ అదాలత్ లను ఏర్పాటు చేయటం జరిగింది.
  6. సమాచార హక్కు చట్టం వలన, ప్రతి ప్రభుత్వ శాఖ కూడా వారి పనులకు సంబంధించిన విషయాలను రికార్డు రూపంలో ఉంచి ప్రజలకు మరింత జవాబుదారీగా ఉంటున్నారు.

ప్రశ్న 2.
న్యాయ సేవల సంస్థ ద్వారా ఎవరెవరు ప్రయోజనం పొందవచ్చు?
(లేదా)
ఉచిత న్యాయ సహాయాన్ని పొందడానికి ఎవరు అర్హులు?
జవాబు:
క్రింద పేర్కొన్న వ్యక్తులు న్యాయ సేవల సంస్థ ద్వారా ప్రయోజనం పొందవచ్చును.

  1. షెడ్యూల్డ్ కులాలు లేదా షెడ్యూల్డ్ జాతులకు చెందిన వ్యక్తులు.
  2. మానవ అక్రమ రవాణా బాధితులు, భిక్షాటకులు,
  3. స్త్రీలు, పిల్లలు,
  4. మతిస్థిమితం లేనివారు లేదా అంగవైకల్యం ఉన్నవారు,
  5. పెను విపత్తు, జాత్యహంకార హింస, కుల వైషమ్యాలు, వరదలు, కరువులు, భూకంపాలు, పారిశ్రామిక విపత్తులకు గురైనవారు,
  6. పారిశ్రామిక కార్మికులు,
  7. నిర్బంధంలో ఉన్న వ్యక్తులు,
  8. లక్ష రూపాయలలోపు ఆదాయం ఉన్న వ్యక్తులు.

ప్రశ్న 3.
సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారం వెల్లడిచేయడానికి గల మినహాయింపులను తెలపండి.
జవాబు:
కొంత సమాచారాన్ని ప్రభుత్వం వెల్లడి చేయకుండా ఉండే అవకాశాన్ని చట్టం కల్పించింది. ఆ అంశాలు :

  1. భారతదేశ సార్వభౌమత్వం, సమగ్రతలను ప్రభావితం చేసే సమాచారం, విదేశీ శక్తుల సందర్భంలో కీలక ఆర్థిక, శాస్త్రీయ ప్రయోజనాలు కలిగి ఉండే అంశాలు.
  2. పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభల హక్కులకు భంగం కలిగించే సమాచారం.
  3. గోప్యంగా ఉంచుతారన్న భావనతో విదేశ ప్రభుత్వాల నుంచి అందిన సమాచారం.
  4. ఒక వ్యక్తి జీవితానికి లేదా భౌతిక భద్రతకు భంగం కలిగించే సమాచారం.
  5. (అంతిమ నిర్ణయం తీసుకోటానికి ముందు) మంత్రుల లేదా సెక్రటరీల బృందం ముందు ఉంచే క్యాబినెట్ పత్రాలు లేదా రికార్డులు.
  6. మన సైనిక దళాలు, భద్రతా సంస్థలు చాలా వరకు సమాచార కమిషన్ల పరిధిలోకి రావు.

AP 10th Class Social Important Questions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

ప్రశ్న 4.
సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారం కొరకు దరఖాస్తు ఏ విధంగా చేయాలి?
జవాబు:
సమాచారం కావాలన్న విన్నపాన్ని చేతితో రాసిన ఉత్తరం రూపంలో కానీ, ఎలక్ట్రానిక్ మెయిల్ రూపంలో కానీ ఇవ్వవచ్చు. సమాచారాన్ని ఆ రాష్ట్ర అధికార భాషలో కానీ, లేదా ఇంగ్లీషులో కానీ, లేదా హిందీలో కానీ ఇవ్వవచ్చు. ఒకవేళ ఒక వ్యక్తి ఉత్తరం రాయలేకపోతే పౌర సమాచార అధికారి లేదా రాష్ట్ర పౌర సమాచార అధికారి వద్ద మౌఖికంగా చెప్పటం ద్వారా, కూడా దరఖాస్తు ఇవ్వవచ్చు.

ప్రశ్న 5.
సమాచారం కోరే వ్యక్తి ఎంత రుసుం చెల్లించాలి?
జవాబు:
సమాచారాన్ని పొందటానికి పౌరులు నామమాత్రమైన రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఎక్కడి కార్యాలయం అనేదాన్ని బట్టి 5-10 రూపాయల మధ్య ఉంటుంది. సమాచారం కోరుతున్న వ్యక్తి దారిద్ర్యరేఖకు దిగువన ఉంటే అతను/ఆమె ఈ రుసుము చెల్లించనవసరం లేదు. కాబట్టి ఈ చట్టం అనేక విధాలుగా అందరికీ సమాచారం అందుబాటులో ఉండేలా చేసింది.

ప్రశ్న 6.
లోక్ అదాలలు ఏ విధంగా పనిచేస్తాయి?
జవాబు:
ఇప్పుడు వీటి ద్వారా న్యాయ కోవిదులు, అధికారులు, అనధికార ప్రముఖుల సమక్షంలో, సుహృద్భావ వాతావరణంలో, పరస్పర అంగీకారంతో తగాదాలు వివాదాలను పరిష్కరించుకోవచ్చు. ఖర్చు లేకుండా, త్వరితగతిన న్యాయం పొందటానికి ప్రజలు ఇప్పుడు లోక్ అదాలను ఉపయోగించుకుంటున్నారు. కోర్టులలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసులను ఎటువంటి ఖర్చు లేకుండా వెంటనే పరిష్కరించుకోటానికి లోక్ అదాలత్ సహాయపడుతుంది. ఒకవేళ అప్పటికే కక్షిదారులు కోర్టు రుసుము చెల్లించి ఉంటే అది కూడా వెనక్కి ఇస్తారు.

ప్రశ్న 7.
న్యాయ సేవల ప్రాధికార సంస్థలు నిర్వర్తించే విధులు ఏవి?
జవాబు:

  1. చట్టంలో పొందుపరిచిన ప్రకారం అర్హులైన వ్యక్తులకు న్యాయ సేవలను అందించటం.
  2. లోక్ అదాలలను నిర్వహించటం.
  3. ముందస్తు నివారణ, వ్యూహాత్మక న్యాయ సహాయ కార్యక్రమాలను చేపట్టటం.
  4. న్యాయసేవల ప్రాధికార సంస్థ నిర్ణయించే ఇతర విధులను నిర్వర్తించటం.

AP 10th Class Social Important Questions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

ప్రశ్న 8.
న్యాయసేవల ప్రాధికార సంస్థ ఉద్దేశాలు ఏమిటి?
జవాబు:

  1. సమాజంలోని బలహీన వర్గాలకు ఉచిత, సమర్ధ న్యాయసేవలను అందించటానికి న్యాయసేవ ప్రాధికార సంస్థ చట్టాన్ని చేయడం.
  2. ఆర్థిక లేక ఏ ఇతర కారణాల వల్లనైనా ఏ పౌరునికీ న్యాయం అందని పరిస్థితి లేకుండా చూడడం.
  3. సమాన అవకాశాల ప్రాతిపదికన న్యాయాన్ని అందించేలా న్యాయవ్యవస్థ పనిచేసేలా చూడటానికి లోక్ అదాలత్ లను ఏర్పాటు చెయ్యటం.
  4. కోర్టుల బయట సమర్థ, ప్రత్యామ్నాయ, సృజనాత్మక వివాద పరిష్కార విధానాన్ని రూపొందించటం.

ప్రశ్న 9.
సమాచార కమిషన్లో ప్రధాన బాధ్యులు ఎవరు?
జవాబు:

  1. ప్రతి ప్రభుత్వ శాఖలో ఒక పౌర సమాచార అధికారి ఉంటారు.
  2. అదేశాఖలో ఒక అప్పీలేట్ అధికారి ఉంటారు.
  3. అన్ని శాఖల పౌర సమాచార అధికారులు, అప్పీలేట్ అధికారులు రాష్ట్ర పౌర సమాచార కార్యాలయానికి జవాబుదారీగా ఉంటారు.
  4. దీనికి రాష్ట్ర సమాచార కమిషనర్లు ఉంటారు.
  5. ఈ సమాచార కార్యాలయాలు స్వయంప్రతిపత్తి కలిగి ఉంటాయి.

ప్రశ్న 10.
చమురు ధరలు పెరిగితే ప్రజాజీవనంపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
పై వ్యాఖ్యపై మీ అభిప్రాయం వ్రాయండి.
జవాబు:

  1. చమురు ధరలు పెరిగితే ప్రజాజీవితంపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
  2. దాని వలన నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పాలు, పండ్లు తదితరాల రేట్లు పెరగడం జరుగుతుంది.
  3. మనదేశం అత్యధికంగా చమురును దిగుమతి చేసుకుంటుంది. కావున అత్యధిక మొత్తాలు ఖర్చవుతాయి.
  4. విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోయే అవకాశం ఉంది.

ప్రశ్న 11.
ప్రజా సంక్షేమ పథకాల యొక్క ప్రయోజనాలు అర్హులైన వారికి అందడం లేదనే అభిప్రాయం ఉంది. దీనిపై మీ సలహాలు, సూచనలు వ్రాయండి.
జవాబు:

  1. ప్రజా సంక్షేమ పథకాలకు అర్హులను ఎంపిక చేయడంలో అధికార పక్షాలు, అధికారుల అవినీతి, బంధుప్రీతికి ఆస్కారం ఉండటం వలన అందరికీ ఫలాలు సరిగా అందడం లేదు.
  2. రాజకీయ పక్షపాతంకన్నా ప్రజా సంక్షేమమే పరమావధిగా ఉండాలి.
  3. పథకాలలో అవినీతి జరగనీయకుండా చూడాలి.
  4. అలాంటి వాటికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి.

10th Class Social 22th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
‘సమాచార హక్కు చట్టము ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిలువెత్తు దర్పణము’ – వివరించండి.
జవాబు:

  1. ప్రజాస్వామ్యానికి అన్ని విషయాలు తెలిసిన పౌరులు కావాలి.
  2. సమాచారంలో పారదర్శకత ఉండాలి.
  3. సమాచార హక్కు చట్టం ద్వారా పౌరులందరూ ఇటువంటి సమాచారాన్ని పొందగలరు.
  4. ఇది అవినీతిని అరికట్టడానికి తోడ్పడుతుంది.
  5. ప్రభుత్వాలు పౌరులకు జవాబుదారీగా ఉండేలా చేస్తుంది.
  6. గతంలో ప్రభుత్వ శాఖలు ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు మాత్రమే ప్రతిస్పందించేవి.
  7. కానీ ఇప్పుడు సాధారణ పౌరులకు సైతం జవాబులు చెబుతున్నాయి.

ప్రశ్న 2.
లోక్ అదాలలు సామాన్య మానవునకు ఏ విధంగా సహకరిస్తున్నాయి? వివరించండి.
జవాబు:

  1. ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు.
  2. వివాదాల వేగవంత విచారణ, విధానంలో వెసులుబాటు కల్పించబడ్డాయి.
  3. వాది ప్రతివాదులిరువురూ ప్రత్యక్షముగా న్యాయమూర్తితో సంభాషించవచ్చును.
  4. ఉచిత న్యాయసలహా అందజేయబడుతుంది.
  5. వివాదాల పరిష్కారములో కాలయాపన నివారించబడుతుంది.

AP 10th Class Social Important Questions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

ప్రశ్న 3.
“సమాచార హక్కు చట్టం వల్ల ప్రభుత్వం పనిని మెరుగు పరచడం, పర్యవేక్షించడం సాధ్యమవుతుంది.” దీనితో మీరు ఏకీభవిస్తారా ? మీ సమాధానమును సమర్థించండి.
జవాబు:
సమాచార హక్కుచట్టం:

  1. అవును. ఇవ్వబడిన వ్యాఖ్యతో నేను ఏకీభవిస్తాను.
  2. సమాచార హక్కు చట్టం వల్ల ప్రభుత్వ పనిని మెరుగుపరచడం, పర్యవేక్షించడం సాధ్యమవుతుంది.
  3. పరిపాలనలో పారదర్శకత పెరుగుతుంది.
  4. ఇది లంచగొండితనాన్ని అరికట్టడానికి దోహదపడుతుంది.
  5. ప్రభుత్వాలను సాధారణ పౌరులకు, వ్యక్తులకు జవాబుదారీగా ఉండేలా చేస్తుంది.

ప్రశ్న 4.
సమాచార హక్కు చట్టం పరిధిలోకి వచ్చే ప్రభుత్వ సంస్థలేవి?
జవాబు:
సమాచార హక్కు చట్టం కిందికి వచ్చే ప్రభుత్వ సంస్థలను చట్టం ఈ కింది విధంగా గుర్తించింది.
అ) రాజ్యాంగం కింద ఏర్పడిన సంస్థ
ఆ) పార్లమెంటు, లేదా రాష్ట్ర శాసన సభల ప్రకారం ఏర్పడిన సంస్థ
ఇ) సంబంధిత ప్రభుత్వ ఆదేశాలు లేదా నోటిఫికేషన్ ద్వారా ఏర్పడిన సంస్థ. ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వ నియంత్రిత సంస్థ, ప్రభుత్వం నిధులు సమకూర్చిన సంస్థలు ఈ చట్టం కిందికి వస్తాయి. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గణనీయ మొత్తంలో ప్రభుత్వ నిధులు అందే స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ చట్టం కిందికి వస్తాయి.

ప్రశ్న 5.
దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న తమ వివాదాలను పరిష్కరించుకోదలచిన వ్యక్తులు ఎవరికి, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి?
జవాబు:
దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న తమ వివాదాలు, తగాదాలు, కోర్టు కేసులను పరిష్కరించుకోదలచిన వ్యక్తులు తమ కేసు పూర్వపరాలు, కావలసిన పరిష్కారం, వివరిస్తూ సంబంధిత పత్రాలు మరియు తమ అర్హతను తెలియజేసే పత్రాలతో అఫిడవిట్ దాఖలు చేసి సత్వర, ఉచిత న్యాయాన్ని కోరవచ్చు.

వివిధ స్థాయిలలో ఎవరికి దరఖాస్తు చేయాలో దిగువన పేర్కొనబడినది.
జిల్లాస్థాయిలో – కార్యదర్శి, జిల్లా న్యాయసేవల ప్రాధికార సంస్థ, జిల్లా కోర్టు భవనాలు.
రాష్ట్రస్థాయిలో – సభ్యకార్యదర్శి, రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థ, న్యాయ సేవాసదన్, సిటీ సివిల్ కోర్టు భవనాలు, హైకోర్టు భవనాలు, హైదరాబాదు – 500 066
(లేదా)
హైకోర్టులో ఉన్న కేసులలో న్యాయ సహాయం కోరే వ్యక్తులు కార్యదర్శి, హైకోర్టు న్యాయ సేవల ప్రాధికార సంస్థ, హైకోర్టు భవనాలు, హైదరాబాదు – 500 066.

ప్రశ్న 6.
లోక్ అదాలత్ వల్ల ప్రయోజనాలు ఏమిటి?
జవాబు:

  1. ఎటువంటి కోర్టు రుసుము ఉండదు. ఒకవేళ కోర్టు రుసుము అప్పటికే చెల్లించి ఉంటే లోక్ అదాలత్ కేసు పరిష్కరింపబడినప్పుడు నియమాలకు లోబడి రుసుమును తిరిగి చెల్లిస్తారు.
  2. వివాదాల వేగవంత విచారణ, విధానంలో వెలుసుబాటు అన్నవి లోక్ అదాలత్ లోని ముఖ్యమైన అంశాలు. వివాదాలను లోక్ అదాలత్ పరిష్కరించే క్రమంలో పౌర విచారణ స్మృతి సాక్షాల చట్టం వంటి వాటిల్లో పేర్కొన్న విధానాలను కచ్చితంగా పాటించాలని లేదు.
  3. తమ సలహాదారు ద్వారా వివాదంలోని కక్షిదారులు నేరుగా జడ్జితో సంభాషించవచ్చు. ఇది సాధారణ న్యాయస్థానాల్లో సాధ్యంకాదు.
  4. లోక్ అదాలత్ ఇచ్చే తీర్పును వాది, ప్రతివాదులు గౌరవించాలి. సివిల్ కోర్టు ఇచ్చే తీర్పుకి ఉండే విలువ దీనికి కూడా ఉంటుంది. వివాద అంతిమ పరిష్కారం ఆలస్యం కాకుండా ఉండటానికి దీనిపై అప్పీలును అనుమతించరు.
  5. అడ్వకేట్ల ద్వారా ఉచిత న్యాయ సలహా అందిస్తారు. కోర్టులలో కేసును వాదించటానికి అడ్వకేట్లను నియమిస్తారు. ఉచిత న్యాయ సేవలు, మద్ధతుకి అర్హులైన వ్యక్తులకు సంబంధించిన కోర్టు కేసులలో కోర్టు ఖర్చులను భరిస్తారు, తీర్పు నకళ్లను ఉచితంగా అందచేస్తారు.

ప్రశ్న 7.
AP 10th Class Social Important Questions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు 1
ఇచ్చిన వార్తా కథనాలను చదివి సమాచార హక్కు ఉపయోగం గురించి చర్చించండి.
జవాబు:
పైన ఇచ్చిన వార్తా కథనాలను పరిశీలించినట్లయితే సమాచార హక్కు చట్టం మూలంగా అనేక అక్రమాలను, అవినీతి చర్యలను అరికట్టవచ్చని తెలుస్తుంది. మరియు ఈ చట్టం మూలంగా చాలా ఉపయోగాలున్నాయని తెలుస్తుంది.

కొన్ని ఉపయోగాలు :

  1. “తానే” నగరంలో అనుమతి లేని 40,000 ఆటోలు తిరుగుతున్నట్లుగా “సమాచార హక్కుచట్టం” ప్రకారం తెలిసింది.
  2. సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచార కమిషనర్ జరిమానాలను విధించినట్లుగా తెలియుచున్నది.
  3. ఇతర దేశాలలో 117 మంది భారతీయులను నిబంధనలకు వ్యతిరేకంగా ఖైదీలుగా బంధించారని సమాచార హక్కు చట్టం మూలంగా తెలుసుకోగలిగాం.
  4. సమాచారం అడిగేవారు. వారి అడ్రసులను ఇవ్వవలసిన అవసరం లేదు. కాని సమాచారం పొందడానికి కనీసం పోస్ట్బక్స్ నంబరు అయినా ఇవ్వవలయును అని ఢిల్లీ వార్తాపత్రిక తెలియచేయుచున్నది.
  5. చెన్నై కార్పొరేషనులో విద్యాపన్నుకు సంబంధించి 175 కోట్ల రూపాయలను వసూలు చేశారు, కాని గత 8 సంవత్సరాల నుండి ఆ డబ్బును ఉపయోగించలేదనే ఫిర్యాదు సమాచార హక్కు చట్టం ప్రకారం చెన్నైలో నమోదు అయ్యింది.

ఈ సమాచార హక్కు మూలంగా ఎన్నో అక్రమాలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తుంది. అదే విధంగా కొన్ని రాష్ట్రాలలో ఈ చట్టం మరుగున పడిపోయిందనే వార్తలు కూడా తెలుస్తున్నాయి.

ప్రశ్న 8.
మీకిచ్చిన భారతదేశ పటంలో ఈ క్రింది ప్రాంతాలను గుర్తించుము.
1) ఢిల్లీ 2) చెన్నై 3) ముంబయి 4) కోల్ కత 5) హైదరాబాద్ 6) బెంగళూరు
AP 10th Class Social Important Questions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు 2

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

These AP 10th Class Social Studies Important Questions 21th Lesson సమకాలీన సామాజిక ఉద్యమాలు will help students prepare well for the exams.

AP Board 10th Class Social 21th Lesson Important Questions and Answers సమకాలీన సామాజిక ఉద్యమాలు

10th Class Social 21th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium

1. “నాకొక కల ఉంది ……” అన్న చారిత్రాత్మక ఉపన్యాసం చేసినది ఎవరు?
జవాబు:
మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్.

2. అనేక మంది నలవాళ్ళు వేరేజాతి అని శ్వేత జాతీయుల పాలన నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాడాలని భావించినది ఎవరు?
జవాబు:
మాల్కం ఎక్స్

3. అణు కర్మాగారంలో ప్రమాదం జరిగిన ‘చెర్నోబిల్’ ఉన్న దేశం ఏది?
జవాబు:
రష్యా

4. ‘సైలెంట్ వ్యాలీ’ ఉద్యమం ఏ రాష్ట్రానికి సంబంధించినది?
జవాబు:
కేరళ.

5. మణిపూర్‌ను భారతదేశంలో ఏ సంవత్సరంలో విలీనం చేసినారు?
జవాబు:
1949.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

6. భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన కంపెనీ ఏది?
జవాబు:
యూనియన్ కార్బైడ్ కంపెనీ.

7. యూనియన్ కార్బైడ్ కంపెనీని తర్వాత ఏ కంపెనీ కొనుగోలు చేసింది?
జవాబు:
డౌ కంపెనీ (DOW)

8. 1980లో విజ్ఞాన శాస్త్రం, పర్యావరణ కేంద్రం అన్న సంస్థను స్థాపించిన దెవరు?
జవాబు:
అనిల్ అగర్వా ల్.

9. మైటై భాషలో మైరాపైబీ అంటే అర్థం ఏమిటి?
జవాబు:
కాగడాలు పట్టుకున్నవాళ్ళు.

10. ఆంధ్రప్రదేశ్ లో సారాను ఏ సంవత్సరంలో నిషేధించారు?
జవాబు:
1993

11. ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణ మధ్యపాన నిషేధం ఏ సంవత్సరంలో విధించారు?
జవాబు:
1995.

12. మణిపూర్ లో సైనిక నిర్బంధంలో మరణించిన మహిళ ఎవరు?
జవాబు:
తంగజం మనోరమ.

13. మణిపూర్‌లో సైనిక బలాల ప్రత్యేకాధికారాల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమమేది?
జవాబు:
మైరా పైబీ.

14. సైలెంట్ వ్యాలీలోని అరుదైన (అంతరించి పోతాయని భావించిన) జాతి కోతి ఏది?
జవాబు:
లయన్ టేల్డ్ మకాక్ (సింహపు తోక కోతి)

15. నందిగ్రాం సంఘటన (పోరాటం) ఏ రాష్ట్రంలో జరిగింది?
జవాబు:
పశ్చిమ బెంగాల్.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

16. 2012 లండన్ ఒలింపిక్స్ క్రీడలను స్పాన్సరు చేసిన ఏ కంపెనీకి వ్యతిరేకంగా సంతకాలు చేసారు?
జవాబు:
డౌ కంపెనీ. (DOW)

17. సర్దార్ సరోవర్ ఆనకట్ట నిర్మాణానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమమేది?
జవాబు:
నర్మదా బచావో ఆందోళన్ – NBA

18. ఎవరినీ అకారణంగా అరెస్ట్ చేయకూడదు, నిర్బంధించ కూడదు, బహిష్కరించకూడదు అని ఏ మానవ హక్కుల అధికరణ చెబుతుంది?
జవాబు:
అధికరణం తొమ్మిది (9).

19. గ్రీన్ పీస్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో కలదు?
జవాబు:
ఆమ్ స్టర్డాం

20. SALT ని విస్తరింపుము.
జవాబు:
వ్యూహాత్మక ఆయుధాల పరిమితి చర్చలు

21. START ని విస్తరింపుము.
జవాబు:
వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం.

22. నయా ఉదారవాదం, ప్రపంచీకరణ ఏ సంవత్సరం నుంచి మొదలయ్యాయి?
జవాబు:
1990 నుంచి.

23. అమెరికా బలగాలను ఎదుర్కోటానికి వియత్నాం ఏ యుద్ధ పంథాని అవలంభించింది.?
జవాబు:
గొరిల్లా యుద్ధ పంథా.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

24. మణిపూర్ ఉక్కు మహిళగా పేరొందినది ఎవరు?
జవాబు:
ఇరోం షర్మిలా

25. ‘దూబగుంట’ గ్రామం ఏ జిల్లాలో కలదు?
జవాబు:
నెల్లూరు.

26. ‘నర్మదా బచావో ఆందోళన్’ దీనికి సంబంధించిన ఉద్యమం.
A) నీటి ఉద్యమం
B) ప్రకృతి సేద్య ఉద్యమం
C) పర్యావరణ ఉద్యమం
D) సామాజిక ఉద్యమం
జవాబు:
C) పర్యావరణ ఉద్యమం

27. పడవ పేరునే ఉద్యమంగా మార్చుకున్న ఉద్యమమేది?
జవాబు:
గ్రీన్, పీస్ ఉద్యమం.

28. అమెరికాలో పౌరహక్కుల ఉద్యమం తీవ్రదశకు చేరుకున్న సమయమేది?
జవాబు:
1960 లలో.

29. అమెరికాలోని నల్లజాతి వారు ఒక సంవత్సరం పాటు బస్సులను బహిష్కరించిన ప్రాంతమేది?
జవాబు:
మాంట్ గోమరి.

30. ప్రఖ్యాత వాషింగన్ ప్రదర్శన ఏ రోజున నిర్వహించారు?
జవాబు:
ఆగస్టు 28, 1963.

31. డా॥ మార్టిన్ లూథర్ కింగ్ యొక్క కల ఏమిటి?
జవాబు:
ప్రజలు చర్మ రంగు ఆధారంగా కాకుండా వ్యక్తిత్వ లక్షణాల ఆధారంగా గౌరవించబడాలి.

32. సోవియట్ రష్యాలోని (USSR) మానవ హక్కుల ఉద్యమకారులు ఎవరు?
జవాబు:
అలెగ్జాండర్ సోల్డ్ నిత్సిన్ & ఆండ్రే సఖరోలు.

33. అమెరికా వియత్నంలో యుద్ధం నుండి ఏ సంవత్సరంలో విరమించుకుంది?
జవాబు:
1975.

34. గ్రీన్‌పీస్ ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
జవాబు:
1971 లో.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

35. గ్రీన్‌పీస్ ఉద్యమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి?
జవాబు:
అనంత వైవిధ్యంతో కూడిన జీవాన్ని భూమి పోషించే శక్తిని కాపాడటం.

36. భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితుల డిమాండ్/డిమాండ్లు ఏవి?
i) సరైన వైద్య సౌకర్యం
ii) అంతర్జాతీయ ప్రామాణికాల ఆధారంగా నష్ట పరిహారం
iii) యాజమాన్యాన్ని ఈ నేరానికి బాధ్యులుగా చేయటం.
iv) భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చూడడం.
జవాబు:
i, ii, iii & iv.

37. ఏ విషయాన్ని పరిశీలించటానికి జస్టిస్ B.P. జీవన్ రెడ్డి 40 దేశాల్లో కమిటీ వేయబడింది?
జవాబు:
మణిపూర్‌లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేసే అంశంపై.

38. NBAకు నాయకత్వం వహించింది ఎవరు?
జవాబు:
మేథా పాట్కర్.

39. సైలెంట్ వ్యాలీ ఉద్యమంలో ప్రజలను సమీకరించిన సంస్థ ఏది?
జవాబు:
KSSP (కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్)

40. సైలెంట్ వ్యాలీని ఏ సంవత్సరంలో జాతీయ పార్క్ గా మార్చారు?
జవాబు:
1985.

41. సామాజిక ఉద్యమాలన్నింటిలో ఉన్న సారూష్య అంశాలు ఏవో గుర్తించి రాయండి.
i) సమానత్వం
ii) మానవ హక్కులు
iii) ప్రజాస్వామ్యం
జవాబు:
i, ii & iii

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

42. అమెరికాలో నల్లజాతి అమెరికన్లు పట్ల క్రింది వానిలో ఏ విషయాలలో వివక్షత ఉండేది?
i) ఉద్యోగాలు
ii) గృహవసతి
iii) ఓటుహక్కు
జవాబు:
i, ii & iii

43. 1957 సెప్టెంబరు 4న లిటిల్ రాక్ స్కూల్ లో ప్రవేశించటానికి ప్రయత్నించిన నల్లజాతి అమ్మాయి ఎవరు?
జవాబు:
ఎలిజబెత్ ఎక్ఫోర్డ్.

44. USSR పెత్తనం నుంచి స్వేచ్ఛను కోరుకున్న దేశాలు ఏవి?
జవాబు:
హంగరీ, చెక్ స్లోవేకియా, పోలండ్.

45. USSRలో సోషలిస్టు వ్యవస్థకు అంతం పలకాలని ఉద్యమించిన నాయకులు ఎవరు?
జవాబు:
అలెగ్జాండర్ సోల్డ నిత్సిన్ మరియు ఆండ్రే సఖరోవ్.

46. అమెరికా – వియత్నాం యుద్ధంలో వియత్నాం, లావోస్, అమెరికా, కాంబోడియా దేశాల్లో ఏ దేశ పౌరులు చనిపోలేదు?
జవాబు:
అమెరికా

47. START పై అమెరికా, USSR ఎప్పుడు సంతకాలు చేసాయి?
జవాబు:
1991 లో.

48. 1971లో అమెరికా అణుపరీక్షలను ఎక్కడ చేపట్టింది?
జవాబు:
అలస్కా దగ్గర సముద్రగర్భంలో

49. ప్రస్తుతం గ్రీన్ పీస్ ఉద్యమం ఎన్ని దేశాలలో విస్తరించి ఉంది?
జవాబు:
40 దేశాలలో

50. “సుస్థిర అభివృద్ధి” అనే భావనను ముందుకు తెచ్చిన ఉద్యమం ఏది?
జవాబు:
గ్రీన్ పీస్ ఉద్యమం.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

51. భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఏ సంవత్సరంలో సంభవించింది?
జవాబు:
1984 లో

52. సైలెంట్ వ్యాలీకి ఆపేరు ఎందుకు వచ్చింది?
జవాబు:
ఇక్కడ కీచురాళ్ళు లేవు అందుకే ఈ అడవి నిశబ్దంగా ఉంటుంది.

53. KSSP ని విస్తరించండి.
జవాబు:
కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్.

54. మణిపూర్‌పై బ్రిటిషువారు ఎప్పుడు నియంత్రణ సాధించారు?
జవాబు:
1891లో.

55. విశ్వవ్యాప్త మానవ హక్కుల ప్రకటనలోని ఏ అధికరణ ప్రకారం ప్రతి ఒక్కరికీ సొంత దేశంతో సహా ఏ దేశాన్నైనా వీడే హక్కు తిరిగి సొంత దేశానికి చేరే హక్కు ఉంటాయి?
జవాబు:
అధికరణం 13(2)

56. APSPA ని విస్తరింపుము.
జవాబు:
(Armed Forces Special Power Act.)

57. AFSPA చట్టాన్ని ఏ సంవత్సరంలో చేసారు?
జవాబు:
1958 లో.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

58. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) సైలెంట్ వ్యా లీ ఉద్యమం ( ) a) మధ్య ప్రదేశ్
ii) మైరా పైబీ ( ) b) ఉత్తరాఖండ్
iii)చిప్కో ( ) c) మణిపూర్
iv) నర్మదా బచావో ( ) d) కేరళ
జవాబు:
i – d, ii – c, iii – b, iv – a

59. సైలెంట్ వ్యాలీ ఉద్యమం, నర్మదా బచావో ఆందోళన్, మైరా పై బీ, గ్రీన్ పీస్ ఉద్యమాల్లో పర్యావరణ ఉద్యమం కానిది ఏది?
జవాబు:
మైరా పైబీ ఉద్యమం.

60. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) మేథాపాట్కర్ ( ) a) నర్మదాబచావో
ii) మార్టిన్ లూథర్ కింగ్ (b) అమెరికాలో పౌరహక్కుల ఉద్యమం
iii)ఆండ్రే సఖరోవ్ ( c) USSR లో మానవ హక్కుల ఉద్యమం
iv) ఇరోం షర్మిలా ( ) d) మణిపూర్ లో మానవ హక్కుల
జవాబు:
i – a, ii – b, iii – c, iv – d

61. సర్దార్ సరోవర్ ఆనకట్ట నిర్మించబడిన రాష్ట్రం ఏది?
జవాబు:
గుజరాత్.

62. ఏ ఉద్దేశ్యంతో మైరాపైబీ ఉద్యమం మొదలయ్యింది?
జవాబు:
1970 ల కాలంలో, తాగి బజారుల్లో గొడవ చెయ్య కుండా నివారించటానికి

63. ఏ సంవత్సరంలో అమెరికాలోని బస్సులలో వివక్షతను న్యాయస్థానాలు నిషేధించాయి?
జవాబు:
1956 లో.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

64. సూర్యుని హానికర (అతి నీలలోహిత) కిరణాలను అడ్డుకునే వాతావరణంలోని పొర ఏది?
జవాబు:
ఓజోను పొర.

65. ఈశాన్య ప్రాంత మానవ హక్కుల పరిరక్షణను అధ్యయనం చేయటానికి నియమించిన కమిటీ ఏది?
జవాబు:
B.P. జీవన్ రెడ్డి కమిటి.

క్రింద నీయబడిన పటమును పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు 3
66. పటంలో సారా వ్యతిరేక ఉద్యమం జరిగిన రాష్ట్రాన్ని సూచించే సంఖ్య ఏది?
జవాబు:
1

67. పటంలో చిప్కో వ్యతిరేక ఉద్యమం జరిగిన రాష్ట్రాన్ని సూచించే సంఖ్య ఏది?
జవాబు:
4

68. పటంలో సైలెంట్ వ్యాలీ ఉద్యమం జరిగిన రాష్ట్రాన్ని సూచించే సంఖ్య ఏది?
జవాబు:
2

69. పటంలో మైరా పైజీ ఉద్యమం జరిగిన రాష్ట్రాన్ని సూచించే సంఖ్య ఏది?
జవాబు:
5

70. పటంలో నర్మదాబచావో ఉద్యమం జరిగిన రాష్ట్రాన్ని సూచించే సంఖ్య ఏది?
జవాబు:
3

71. చిప్కో ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది?
జవాబు:
ఉత్తరాఖండ్.

72. సైలెంట్ వ్యాలీ ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది?
జవాబు:
కేరళ.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

73. సారా వ్యతిరేక ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది?
జవాబు:
ఆంధ్రప్రదేశ్.

10th Class Social 21th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
మీకీయబడిన భారతదేశ రాజకీయ పటంలో కింది సామాజిక ఉద్యమాలు జరిగిన ఏదేని ఒక్కొక్క రాష్ట్రాన్ని గుర్తించండి.
A) నర్మదా బచావో ఆందోళన్
B) చిప్కో ఉద్యమం
జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు 1

ప్రశ్న 2.
క్రింది పటమును చదివి, ప్రశ్నకు సమాధానము ఇవ్వండి.
AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు 2
ప్రశ్న : ఇందిరా సాగర్ ప్రాజెక్టు ఏ నదిపై ఏ రాష్ట్రంలో కలదు?
జవాబు:
ఇందిరా సాగర్ ప్రాజెక్టు నర్మదానదిపై, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలదు.
(లేదా)

ప్రశ్న 3.
పై పటాన్ని పరిశీలించి దిగువ ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
i) నర్మదా నది యొక్క ప్రవాహ దిశ ఏది?
జవాబు:
తూర్పు నుండి పడమర

ii) నర్మదా నదిపై ఆనకట్టలు కట్టడానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడానికి కారణాలు :
జవాబు:
ప్రజలు నిర్వాసితులు కావడం
సారవంతమైన భూభాగం కోల్పోవడం
అడవులు, పొలాలు, ప్రజలు, జంతువులు నివసించే ప్రాంతాలు మునిగిపోవడం.

ప్రశ్న 4.
‘నర్మదా బచావో’ ఉద్యమంతో ముడిపడి ఉన్న రెండు ఉద్యమాల పేర్లు తెలపండి.
జవాబు:
‘నర్మదా బచావో’ ఉద్యమంతో ముడిపడి ఉన్న రెండు ఉద్యమాలు :

  1. మూలవాసీ ప్రజల ఉద్యమము.
  2. నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమము.

ప్రశ్న 5.
ఉద్యమాలలో ముఖ్యమైన ఉద్యమం ఏది?
జవాబు:
ఉద్యమాలలో అత్యంత ముఖ్యమైనది అమెరికాలోని పౌరహక్కుల ఉద్యమం.

ప్రశ్న 6.
‘పౌరనిరాకరణ’ అనగానేమి?
జవాబు:
వివక్షత కూడిన చట్టాలను శాంతియుతంగా ఉల్లంఘించటం.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

ప్రశ్న 7.
యుఎస్ఎస్ఆర్ లో మానవ హక్కుల ఉద్యమ నాయకులు ఎవరు?
జవాబు:
ప్రఖ్యాత రచయిత అలెగ్జాండర్ సోల్ నిత్సిన్, అణుశాస్త్రవేత్త ఆండ్రే సఖరోన్లు యుఎస్ఎస్ఆర్ లోని మానవ హక్కుల ఉద్యమ నాయకులు.

ప్రశ్న 8.
గోర్బచేవ్ ఎవరు?
జవాబు:
యుఎస్ఎస్ఆర్ అధ్యక్షుడు గోర్బచేవ్. ఈయన ప్రజలకు మరింత స్వేచ్ఛను కల్పించటానికి గ్లాస్ నోస్తే అన్న సంస్కరణల ప్రక్రియను ఆరంభించాడు.

ప్రశ్న 9.
రెండవ ప్రపంచ యుద్ధకాలంలో అమెరికా ఏ దేశం మీద అణుబాంబులను వేసింది?
జవాబు:
1945 ఆగష్టులో “జపాన్లోని హిరోషిమా, నాగసాకిల” పై అమెరికా అణుబాంబులను వేసింది.

ప్రశ్న 10.
వియత్నాం యుద్ధంలో అమెరికా వాడిన ఆయుధాలేమిటి?
జవాబు:
రసాయనిక ఆయుధాలు, నాపాలం బాంబులు వంటి కొత్త ఆయుధాలను అమెరికా కనిపెట్టి గ్రామాలను సమూలంగా నాశనం చేసింది.

ప్రశ్న 11.
ఆయుధ పోటీలో ప్రధాన దేశాలేవి?
జవాబు:
ఆయుధ పోటీలో ప్రధాన దేశాలు 2. అవి :

  1. అమెరికా
  2. యుఎస్ఎస్ఆర్ (రష్యా).

ప్రశ్న 12.
చరిత్రలో అత్యంత సంక్లిష్టమైన ఆయుధ నియంత్రణ ఏది?
జవాబు:
START (ఎసీఏఆర్) స్ట్రాటెజిక్ ఆర్మ్ రిడక్షన్ ట్రీటి వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం.

ప్రశ్న 13.
ప్రజలు ఈ మధ్య దేనివల్ల ముప్పును ఎదుర్కొంటున్నారు?
జవాబు:
గత కొద్ది దశాబ్దాలలో వాణిజ్య రైతులు, గనుల తవ్వకం సంస్థలు, ఆనకట్టల పథకాలు వంటి వాటి నుంచి గిరిజనులు, నిర్వాసితులైన ప్రజలు ముప్పును ఎదుర్కొంటున్నారు.

ప్రశ్న 14.
గ్రీన్‌పీస్ అంటే ఏమిటి? ఇది ఎక్కడుంది?
జవాబు:
గ్రీన్ పీస్ అనేది ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ. ఈ ఉద్యమం 40 దేశాలలో విస్తరించి ఉంది. దీని ప్రధాన కార్యాలయం ఆమ్ స్టర్ డాం (హాలెండ్)లో ఉంది.

ప్రశ్న 15.
భోపాల్ దుర్ఘటన దేనికి సంబంధించినది?
జవాబు:
భోపాల్ లో యూనియన్ కార్బైడ్ కంపెనీ (ఔ) నుంచి ఒక రాత్రి విషవాయువు వెలువడింది. దీనివల్ల వేలాది మంది చనిపోయారు, దాని ప్రభావం వల్ల ఇప్పటికీ వేలాదిమంది బాధపడుతున్నారు. ఈ దుర్ఘటన 1984లో జరిగింది.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

ప్రశ్న 16.
పర్యావరణ ఉద్యమాలు ప్రధానంగా దేనికి సంబంధించినవి?
జవాబు:
ఈ పర్యావరణ ఉద్యమాలు ప్రధానంగా అడవుల రక్షణ కోసం ఆరంభమయ్యాయి.

ప్రశ్న 17.
కొన్ని బహుళార్థసాధక ఆనకట్టల పేర్లు తెలుపుము.
జవాబు:

  1. భాక్రానంగల్
  2. హీరాకుడ్
  3. నాగార్జునసాగర్

ప్రశ్న 18.
సారా వ్యతిరేకత ఎక్కడ ప్రారంభమైంది?
జవాబు:
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా, దూబగుంట గ్రామంలో ఈ ‘సారా వ్యతిరేక’ ఉద్యమం ప్రారంభమైంది.

ప్రశ్న 19.
సారా నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం ఎప్పుడు జరిగాయి?
జవాబు:
1993 అక్టోబరులో సారాని అధికారికంగా నిషేధించారు. 1995లో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని విధించారు.

ప్రశ్న 20.
‘మైరా పైబీ ఉద్యమం’ యొక్క ఆరోపణలు ఏమిటి?
జవాబు:
సాయుధ దళాల ప్రత్యేక చట్టం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలున్నాయి.

ప్రశ్న 21.
మైరా పైబీ ఉద్యమకారులు నిరసనను ఏవిధంగా తెలియజేస్తున్నారు?
జవాబు:
గ్రామాలు, పట్టణాలలోని వార్డులలోని మహిళలు రోజూ పహారాలో పాల్గొంటారు. కాపలా కాస్తారు.

ప్రశ్న 22.
సారా వ్యతిరేక ఉద్యమంలో మహిళలు సమాజంలోని ఎవరిని ఎదుర్కొన్నారు?
జవాబు:
సమాజంలో అత్యంత పేదలైన వర్గానికి చెందిన మహిళలు ధనబలం, కండబలంతో పాటు రాజకీయ అండదండలున్న సారాయి తయారీదారులు, అమ్మకందారులను ఎదుర్కోగలిగారు.

10th Class Social 21th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
పర్యావరణ ప్రాముఖ్యతను తెల్పుతూ ఒక కరపత్రంను తయారు చేయండి.
జవాబు:

భూమి మనుగడకు పర్యావరణమే ప్రధానం

భూమిపై ప్రతీ ప్రాణి తన అవసరాలను పర్యావరణం నుంచే తీర్చుకుంటుంది. పర్యావరణం క్షీణించితే మానవ మనుగడ, భూమి మనుగడ ప్రశ్నార్థకమవుతుంది.

నేల, నీరు, గాలి, కాలుష్యాలు పర్యావరణానికి పెద్ద గాయాలు. వీటి మూలంగా సహజ వనరులను నష్టపోతున్నాము. దురదృష్టవశాత్తు ఇవన్నీ మానవ తప్పిదాలే. భవిష్యత్తులో ఇవే గనుక ఇదే విధంగా కొనసాగితే విశ్వంలో మన మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది.

కాబట్టి, మానవులారా ! ప్రకృతిని గాయపరచికాక, ప్రకృతికి అనుగుణంగా జీవించండి. ప్రకృతో రక్షతి రక్షిత :
ప్రతుల సంఖ్య : 1000
ప్రచురణ కర్త : పర్యావరణ పరిరక్షణ సమితి, ……………..

ప్రశ్న 2.
అమెరికాలో పౌరహక్కుల ఉద్యమానికి గల కారణాలేమిటి?
(లేదా)
నల్లజాతి అమెరికన్లు 1960లో పౌరహక్కుల ఉద్యమం ఎందుకు చేయవలసి వచ్చింది.
(లేదా)
అమెరికా పౌరహక్కుల ఉద్యమంను ఎవరు, ఎందుకొరకు చేశారు?
జవాబు:
ఉద్యమాల్లో అత్యంత ముఖ్యమైనది అమెరికాలోని పౌరహక్కుల ఉద్యమం. పాఠశాలల్లో, బస్సులలో బహిరంగ ప్రదేశాలలో నల్లజాతి వాళ్లను వేరుగా ఉంచటానికి, ఉద్యోగాలలో, గృహ వసతిలో, ఓటు హక్కులో సైతం వాళ్లపట్ల వివక్షత చూపటానికి వ్యతిరేకంగా ఆఫ్రో-అమెరికన్లు లేదా నల్లజాతి అమెరికన్లు సమానత్వానికి చేపట్టిన పోరాటం ఇది.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

ప్రశ్న 3.
పర్యావరణ పరిరక్షణకు సంబంధించి రెండు నినాదాలు రూపొందించండి. రణ పరిరక్షణకు సంబందించి రెండు నినాదాలు రూపొందించండి.
జవాబు:

  1. భూమి. కాలుష్యం – మన మనుగడకు ముప్పు.
  2. వృక్షో రక్షతి రక్షితః

ప్రశ్న 4.
ఈ క్రింది పేరాను చదివి మీ అభిప్రాయం వ్రాయండి.
“పౌరహక్కుల ఉద్యమంలో నల్లజాతి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయితే ఈ ఉద్యమంలోనూ పురుషుల ఆధిపత్యం ఉందని, తమని ఎవరూ పట్టించుకోవటం లేదని వాళ్ళు భావించసాగారు. ప్రఖ్యాత వాషింగ్టన్ ప్రదర్శనలో ఒక్క మహిళను కూడా మాట్లాడనివ్వలేదు. మహిళల సమానత్వం కోసం మహిళలు పోరాడాలని వాళ్ళు భావించసాగారు.”
జవాబు:
ప్రపంచవ్యాప్తంగా స్త్రీలందరూ ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణించబడుతున్నారు. ఈయబడిన పేరా మరోసారి ఇదే అంశాన్ని తెలియచేస్తోంది. గృహపరమైన అంశాల నుండి దేశ రాజకీయాల వరకు మహిళలు వెనుకంజలోనే ఉన్నారు. సాధారణంగా వారు ఎన్ని పోరాటాలు సల్పినా శతాబ్దాల తరబడి వారి పరిస్థితి అలానే ఉన్నది. మానవ హక్కుల గురించి అనునిత్యం పాఠాలు చెప్పే అమెరికాలో పరిస్థితే ఇలా ఉంటే మిగతా దేశాల్లో ఎలా ఉందో ఊహించుకోవచ్చు. విద్య, వృత్తి, ఉద్యోగాలలో మాత్రం మహిళలు ముందంజలో ఉన్నారని చెప్పుకోవచ్చు. రాజకీయాలలో మాత్రం తండ్రి లేదా భర్త లాంటి పురుషులు ఆ రంగంలో ఉంటేనే మహిళలు ఆ రంగంలో ఎదగగలుగుతున్నారు. గ్రామీణ స్థాయిలో మహిళల కోసం రిజర్వు చేయబడిన స్థానాలలో వారు నామమాత్రపు నాయకులుగా ఉంటే వారి భర్తలు అధికారాన్ని ఉపయోగిస్తున్నారు.
కాబట్టి ఈ పోరాటాలు పురుషులు కాక మహిళలే ముందుకొచ్చి చేయాలి. వారే వారికి ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేసుకోవాలి. అపుడే మహిళలు ముందంజ వేయగలుగుతారు.

ప్రశ్న 5.
‘సారా నిషేధం’ సమస్యను పరిష్కరించడానికి, నీవైతే ఏం చేసియుండేవాడివి?
జవాబు:

  • ప్రజలలో అవగాహనను కల్పించడం
  • సారా నిషేధ చట్టాన్ని సక్రమంగా అమలుపరచడం
  • గ్రామ సంఘాలను ఏర్పరచడం
  • మహిళలను ఉద్యమంలో పాల్గొనేలా చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించేవాడిని.

ప్రశ్న 6.
గత కొన్ని దశాబ్దాలుగా కాలుష్యం రోజు రోజుకీ ఎందుకు పెరిగిపోతోంది?
జవాబు:
గత కొన్ని దశాబ్దాలుగా కాలుష్యం పెరిగిపోవటానికి గల కారణాలు :

  • పరిశ్రమలు పెరగడం
  • వాహనాల సంఖ్య పెరగడం
  • రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకం పెరగడం
  • అడవుల నరికివేత

ప్రశ్న 7.
భోపాల్ గ్యాస్ బాధితుల నాలుగు ముఖ్యమైన కోరికలేవి?
జవాబు:
భోపాల్ గ్యాస్ బాధితుల ముఖ్యమైన కోరికలు:

  • ప్రభావితులైన వారికి సరైన వైద్య సౌకర్యం,
  • అంతర్జాతీయ ప్రామాణికాల ఆధారంగా నష్ట పరిహారం
  • బహుళజాతి కంపెనీ యాజమాన్యాన్ని నేరానికి బాధ్యులుగా చేయడం
  • భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా చూడటం.

ప్రశ్న 8.
క్రింది పటాన్ని పరిశీలించి దిగువ ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు 2
i) సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో నిర్మించబడింది?
జవాబు:
గుజరాత్

ii) నర్మదా నదిపై కట్టే ఆనకట్టలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం ఏది?
జవాబు:
నర్మదా బచావో ఆందోళన్

iii) నర్మదా నది జన్మస్థానం ఏది?
జవాబు:
అమర్ కంఠక్.

iv) నర్మదా నది పరివాహక ప్రాంతంలోని ఏవేని రెండు జలవిద్యుత్ కేంద్రాల పేర్లు రాయండి.
జవాబు:
సర్దార్ సరోవర్, ఇందిరాసాగర్, ఓంకారేశ్వర్.

ప్రశ్న 9.
భోపాల్ గ్యాస్ దుర్ఘటన వల్ల కలిగిన నష్టాలను రాయండి.
జవాబు:
భోపాల్ గ్యాస్ దురటన వల్ల కలిగిన నష్టాలు :

  1. వేలాదిమంది మరణాలు
  2. ప్రజలు నిరాశ్రయులు కావడం
  3. ఇప్పటికీ ఆ ప్రభావం కనిపించడం
  4. పర్యావరణం దెబ్బతినడం.

ప్రశ్న 10.
మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ప్రసిద్ధ ఉపన్యాసం “నాకొక కల ఉంది” యొక్క సందర్భం గురించి రాయండి.
జవాబు:
ఉద్యమాలలో అమెరికాలోని పౌరహక్కుల ఉద్యమం చాలా ముఖ్యమైనది. ఈ ఉద్యమాన్ని డా॥ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ డా|| కింగ్ ముందుకు నడిపించారు. అయితే ఈ ఉద్యమమనేది “పౌర నిరాకరణ” ధ్యేయంగా నడిచింది. (వివక్షతతో కూడిన చట్టాలను శాంతియుతంగా ఉల్లంఘించటం). డా॥ కింగ్ అమెరికా సమాజంపై ఉంచిన ఆదర్శాలు. పాఠశాలల్లో, బస్సుల్లో, బహిరంగ ప్రదేశాలలో నల్లజాతి వారిని వేరుగా ఉంచడానికి, ఉద్యోగాలలో, గుహవసతిలో, ఓటు హక్కులలో నల్లవారిని వివక్షతతో చూడకుండా వీరికి కూడా తెల్లవారితో సమానంగా హక్కులు కల్పించాలి. ఒక సంవత్సరం పాటు డా|| కింగ్ అధ్యక్షతన మాంటగోయెరిలో నల్లజాతీయులు బస్సులను బహిష్కరించారు. ఈయన పౌరహక్కుల చట్టాన్ని చేయాల్సిందిగా కోరారు. ఉపాధి కల్పనకు కార్యక్రమాలు పూర్తి న్యాయమైన ఉపాధి, మంచి గృహవసతి, ఓటు హక్కు, శ్వేజాతి, “నల్లజాతి పిల్లలు కలిసి చదువుకునే సమ్మిళిత విద్యా సదుపాయాలు కావాలని కోరాడు. మనుషులను శరీర రంగును బట్టి కాకుండా వాళ్ల వ్యక్తిత్వ లక్షణాలను బట్టి అంచనావేసే దేశంగా అమెరికా మారాలని డా||కింగ్ తన ఉపన్యాసంలో తెలియచేశాడు.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

ప్రశ్న 11.
వియత్నాం యుద్ధంలో ఎంత పౌరనష్టం జరిగింది?
జవాబు:
వియత్నాం యుద్ధంలో వియత్నాంకి చెందిన 8,00,000 సైనికులు, 30,00,000 పౌరులే కాకుండా అధిక సంఖ్యలో కంబోడియన్లు, లావోషియన్లు చనిపోయారు. అమెరికాకి ఎటువంటి పౌరనష్టం జరగలేదు. కానీ చాలా పెద్ద సంఖ్యలో సైనికులు చనిపోయారు, అంతకంటే అధిక సంఖ్యలో వికలాంగులయ్యారు.

ప్రశ్న 12.
ఆయుధ పోటీ ఏ విధంగా జరిగింది?
జవాబు:
వియత్నాం యుద్ధం ముగిసిన తరువాత మరిన్ని దేశాలు అణ్వాయుధాల నిల్వలలో ఒకదానితో ఒకటి పోటీ పడటంతో అణ్వాయుధ పోటీ తీవ్రరూపం దాల్చింది. ఈ ఆయుధాలను ఉత్పత్తిచేసే కంపెనీలు (వీటిని సైనిక పారిశ్రామిక కంపెనీలంటారు), ప్రభుత్వాలు సాధారణ ప్రజలలో యుద్ధ భయాన్ని కలిగించి, అణ్వాయుధాల మీద డబ్బును మరింతగా ఖర్చు పెట్టటానికి మద్దతు పొందేవి.

ప్రశ్న 13.
ఏ ఒప్పందంతో ఆయుధ నియంత్రణ జరిగింది?
జవాబు:
1991లో వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం (స్ట్రాటెజిక్ ఆర్ట్స్ రిడక్షన్ ట్రీటి – ఎఎఆర్డ్) మీద సంతకాలు చేశారు. చరిత్రలో అత్యంత పెద్ద, సంక్లిష్టమైన ఆయుధ నియంత్రణ ఒప్పందం ఇది. 2001లో ఇది అమలు అయినప్పుడు అప్పటికున్న అన్ని వ్యూహాత్మక అణ్వాయుధాలలో 80 శాతాన్ని తొలగించారు.

ప్రశ్న 14.
గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు నిర్వాసితులు కావడానికి కారణాలేమిటి?
జవాబు:
ఖనిజాలు, అరుదైన మొక్కలు, ప్రాణులు, నీళ్లు వంటి విలువైన వనరులను పెద్ద పెద్ద కంపెనీలు గ్రామీణ ప్రాంతాల్లో కనుక్కోవటంతో తరతరాలుగా ఉంటున్న ప్రాంతాల నుంచి గిరిజనులు, రైతులు తొలగింపబడుతున్నారు.

ప్రశ్న 15.
గ్రీన్ పీస్ ఉద్యమం ఎలా మొదలైంది?
జవాబు:
అలస్కా దగ్గర సముద్ర గర్భంలో అమెరికా 1971లో చేపట్టిన అణు పరీక్షలకు వ్యతిరేకంగా, ఈ ఉద్యమం మొదలయ్యింది. నిరసన తెలియచెయ్యటానికి స్వచ్ఛంద కార్యకర్తలు చిన్న పడవలో ప్రయోగ ప్రదేశానికి బయలుదేరారు. ఈ పడవ పేరు గ్రీన్ పీస్’, చివరికి ఇది ఆ ఉద్యమం పేరుగా మారింది.

ప్రశ్న 16.
గ్రీన్ పీస్ ఉద్యమం ముఖ్య ఉద్దేశాలేమిటి?
జవాబు:
వాతావరణ మార్పుపై పలు దేశాలలో, గ్రీన్ పీస్ ఉద్యమం చేపట్టింది. “అనంత వైవిధ్యతతో కూడిన జీవాన్ని భూమి పోషించే శక్తిని కాపాడటం” దాని ఉద్దేశం. కాలక్రమంలో ఈ ఉద్యమం ‘సుస్థిర అభివృద్ధి’ అన్న భావనను ముందుకు తెచ్చింది. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందని దేశాల ప్రజలందరికీ న్యాయంగా ఉండే, పర్యావరణ రీత్యా దీర్ఘకాలం మనగలిగే అభివృద్ధిని అది కోరుకుంటోంది.

ప్రశ్న 17.
భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు సంబంధించిన ఉద్యమకారుల కోరికలేమిటి?
జవాబు:
ప్రభావితులైన వాళ్లకి సరైన వైద్య సౌకర్యం; ఆ కంపెనీ బహుళజాతి కంపెనీ కాబట్టి అంతర్జాతీయ ప్రామాణికాల ఆధారంగా నష్ట పరిహారం; బహుళజాతి కంపెనీ యాజమాన్యాన్ని ఈ నేరానికి బాధ్యులుగా చెయ్యటం; చివరిగా భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా చూడటం.

ప్రశ్న 18.
“నర్మదా బచావో” ఉద్యమంలో నిర్వాసితులైన ప్రజల కోరికలేమిటి?
జవాబు:
ఈ పథకం వల్ల నిర్వాసితులయ్యే ప్రజలు కేవలం భూములున్న వాళ్లకే కాకుండా, అక్కడ ఉంటున్న వాళ్లందరికీ న్యాయమైన నష్టపరిహారం చెల్లించాలని కోరసాగారు. అంతేకాకుండా ఆనకట్ట వల్ల ముంపునకు గురైన అడవులకు బదులుగా అటవీ పెంపకాన్ని చేపట్టాలని, భూమి కోల్పోయిన వాళ్లకి బదులుగా భూమి ఇవ్వాలని, సరైన పునరావాసం కల్పించాలని కోరసాగారు.

ప్రశ్న1 9.
భారత పర్యావరణ కేంద్రం ఎప్పుడు ఏర్పడింది? దాని ముఖ్య ఉద్దేశాలేమిటి?
జవాబు:
1980లో విజ్ఞానశాస్త్రం, పర్యావరణ కేంద్రం (సెంటర్ ఫర్ సైన్స్ & ఎన్విరాన్మెంట్) అన్నదానిని అనిల్ అగర్వాల్ స్థాపించాడు. భారతదేశంలోని అభివృద్ధి, పర్యావరణ అంశాలపై అధ్యయనం చేసి వాటి పట్ల అవగాహన కలిగేలా చెయ్యటం దీని ఉద్దేశం.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

ప్రశ్న 20.
సాయుధ దళాల ప్రత్యేక చట్టంలోని ముఖ్యాంశాలేమిటి?
జవాబు:
భారతదేశంలో విలీనం కావటానికి వ్యతిరేకించిన వాళ్లను నియంత్రించటానికి భారత ప్రభుత్వం సైన్యాన్ని పంపించింది. శాంతి, భద్రతలను నెలకొల్పటానికి చేసిన చట్టాలలో ఒకటి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం, 1958. దేశవిద్రోహ చర్యలలో పాల్గొంటున్నారన్న అనుమానం వస్తే ఆ వ్యక్తిని అరెస్టు చెయ్యటానికి, లేదా కాల్చి చంపటానికి భద్రతా సిబ్బందికి ఈ చట్టం అధికారాన్ని ఇస్తుంది.

ప్రశ్న 21.
సాయుధ దళాల ప్రత్యేక చట్టం మీద ఉన్న ఆరోపణలేమిటి?
జవాబు:
ఈ చట్టంలోని అంశాలు దుర్వినియోగమయ్యాయని, అమాయకులైన వ్యక్తులు తరచు వేధింపులు, హింసకి గురయ్యారని, చంపబడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా సాయుధ దళాలు మహిళలను దోపిడీ, అత్యాచారాలకు గురిచేశాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దేశ విద్రోహ చర్యలలో పాల్గొంటున్నారన్న అనుమానంతో తమ కొడుకులను, భర్తలను నిర్బంధించి, హింసిస్తారన్న భయం కూడా మహిళలుగా, తల్లులుగా వీళ్లకు ఉండేది. తల్లులు, కూతుళ్లు స్వయంగా లైంగిక అత్యాచారానికి గురవుతున్నారు. ఇలా అత్యాచారానికి గురైన కొంతమంది మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

ప్రశ్న 22.
మీకిచ్చిన ప్రపంచపటంలో ఈ క్రింది వాటిని గుర్తించండి.

  1. అలస్కా
  2. గ్రీన్లాండ్
  3. ఇంగ్లాండ్
  4. క్యూబా
  5. చిలీ
  6. బ్రెజిల్
  7. కాంగో
  8. ఈజిప్టు
  9. దక్షిణాఫ్రికా
  10. రష్యా
  11. చైనా
  12. ఇండోనేషియా
  13. న్యూజిలాండ్

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు 5

ప్రశ్న 23.
ఆనకట్టలు, పరిశ్రమలు వంటి నిర్మాణాల వల్ల రైతులకు, గిరిజనులకు కలిగే ఇబ్బందులను వ్రాయండి.
జవాబు:

  1. ఖనిజాలు, అరుదైన మొక్కలు, ప్రాణులు, నీళ్ళు వంటి విలువైన వనరులను పెద్ద పెద్ద కంపెనీలు గ్రామీణ ప్రాంతాల్లో కనుక్కోవడంతో తరతరాలుగా ఉంటున్న ప్రాంతాల నుంచి గిరిజనులు, రైతులు తొలగింపబడుతున్నారు.
  2. దీంతో ప్రజలు కొత్త ప్రాంతాలలో చెల్లాచెదురై గిరిజన సంస్కృతి విధ్వంసమవుతోంది.
  3. రైతులు తమ వ్యవసాయ భూములు, జీవనాధారాలకు దూరమవుతున్నారు.
  4. ఈ ప్రక్రియల వల్ల ప్రకృతి వనరులకు తీవ్ర ముప్పు ఏర్పడటంతో పర్యావరణ ఉద్యమాలు చేపట్టారు.

ప్రశ్న 24.
“అంటరానితనం నిషేధం వల్ల సామాజిక సమానత్వం సాధించవచ్చు” దీనిపై మీ స్పందనలు తెలియజేయండి.
జవాబు:

  1. అంటరానితనం నిషేధించడం ద్వారా సమానత్వాన్ని సాధించవచ్చు.
  2. అంటరానితనం తొలగాలంటే కులవివక్షను రూపుమాపాలి.
  3. రాజ్యాంగంలోని 17వ అధికరణం ద్వారా అంటరానితనాన్ని నిషేధించి దానికి చట్టబద్ధత కలుగజేసింది.
  4. ప్రభుత్వాలు సదరు చట్టాల్ని నిజస్పూర్తితో అమలుపరచాలి.
  5. ప్రజలు అందరూ సమానమని గుర్తెరిగి అంటరానితనాన్ని రూపుమాపగలరు.

ప్రశ్న 25.
బహుళార్థక సాధక ఆనకట్టల వల్ల దేశానికి లాభమా, నష్టమా? మీ అభిప్రాయాన్ని సమర్ధించండి.
జవాబు:

  1. బహుళార్థ సాధక ఆనకట్టల వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని ప్రజలు నమ్నారు.
  2. అయితే వాటి నిర్మాణాలకు విపరీతమైన ధనవ్యయం కావడం, అనుకున్న మేర విద్యుత్ ఉత్పాదన, జలాల అందుబాటు, సాగునీటి సరఫరా చేయలేకపోవడం వల్ల ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారు.
  3. వాటి వలన లక్షలమంది ప్రజలు నిర్వాసితులవడం, లక్షల ఎకరాల అటవీ, సాగుభూములు పోవడం, ప్రత్యామ్నాయంగా అందించడానికి ప్రభుత్వ భూములు చాలినన్ని లేకపోవడం, నష్టపరిహారం ప్రభుత్వాలు సరిగా అందించకపోవడం, అరుదైన వృక్ష, జంతురాశులు అంతరించిపోవడం వంటి అనేక సమస్యలు వస్తున్నాయి.
  4. అయినప్పటికీ ఈ పథకాల నిర్మాణం తప్పనిసరి అవుతోంది.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

ప్రశ్న 26.
పౌరహక్కుల ఉద్యమకారుల కోరికలేమిటి?
జవాబు:
పౌరహక్కుల చట్టాన్ని చేయాల్సిందిగా కోరారు. ఉపాధి కల్పనకు కార్యక్రమాలు, పూర్తి న్యాయమైన ఉపాధి, మంచి గృహవసతి, ఓటు హక్కు శ్వేతజాతి, నల్లజాతి పిల్లలు కలిసి చదువుకునే సమ్మిళిత విద్యాసదుపాయాలు వంటివి వీళ్ల ప్రధాన కోరికలు.

10th Class Social 21th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
సామాజిక ఉద్యమాల మౌలిక అంశాలేమిటి?
జవాబు:

  1. న్యాయం, ప్రజాస్వామ్యం, పౌర హక్కులను కాపాడటం
  2. సంస్కృతిని కాపాడుకోవడం
  3. సామాజిక నిర్మాణం, విలువల పరిరక్షణ,
  4. ప్రజల ఆరోగ్యం , ప్రాణ రక్షణ
  5. సాంఘిక సమానత్వ సాధన
  6. మద్యపానము, మత్తు పదార్థాల నుండి రక్షణ పొందుట
  7. పర్యావరణ పరిరక్షణ
  8. పంట పొలాలను పరిరక్షించుకోవడం

ప్రశ్న 2.
క్రింది పట్టికను పరిశీలించి, విశ్లేషిస్తూ ఒక పేరాను వ్రాయుము.
AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు 4
జవాబు:

  1. పై పట్టిక మనకు కార్బన్ డైయాక్సెడ్ ఉద్గారాల విడుదలలో దేశాల ర్యాంకింగ్ మరియు ఎన్ని మిలియన్ మెట్రిక్ టన్నులను విడుదల చేస్తున్నాయో తెలియజేస్తుంది.
  2. మొత్తంగా గమనించినట్లయితే ఎక్కువగా తలసరి కార్బన్ డైయాక్సెడ్ ఉదారాలను విడుదల చేసేది అమెరికా.
  3. మొత్తంగా చైనా ఉన్నట్లయినా, తలసరిలో అమెరికానే ఎక్కువ ఉద్గారాలను విడుదల చేస్తుంది.
  4. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే కార్బన్ డైయాక్సెడ్ ఉద్గారాల విడుదలలో భారతదేశం 4వ స్థానాన్ని ఆక్రమించినప్పటికీ తలసరి విడుదలలో అన్ని దేశాల కన్న తక్కువ స్థాయిలో విడుదల చేస్తుంది.
  5. దానిని బట్టి మనం గమనించే విషయం ఏమిటంటే భారతదేశం శక్తి వినియోగంలో చాలా వెనుకబడి ఉంది. అంతేకాకుండా పర్యావరణాన్ని కాలుష్యం చేయడంలో కూడా వెనుకస్థానంలో ఉన్నది.
  6. ఇలా ప్రతిదేశం కాలుష్యాన్ని పెంచుతూపోతే చివరకు మానవ జీవనం భూమి మీద అంతరించిపోతుంది. ముప్పు వాటిల్లుతుంది. మన వినాశనాన్ని మనమే కోరుకుంటున్నాం. కావున ప్రతిదేశం వారు విడుదల చేసే కర్బన సమ్మేళనాల శాతాన్ని తగ్గించుకొని ప్రత్యామ్నాయ మరియు భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలి.

ప్రశ్న 3.
సామాజిక ఉద్యమాల మౌలిక అంశాల విశిష్టతను ప్రశంసిస్తూ ఒక వ్యాసం రాయండి.
జవాబు:
సామాజిక ఉద్యమాలలో సాధారణ ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనటం వలన అనుకూలత ఏర్పడి ఉద్యమం బలపడుతుంది. ఈ ఉద్యమాలు న్యాయం, ప్రజాస్వామ్యం పౌర హక్కులు అనే అంశాలతో సమ్మిళతమై ఉంటాయి. పర్యావరణం, మానవ హక్కులు అనే సరిహద్దులను చెరిపేస్తే ప్రజలకు నష్టపరిహారం, పునరావాసం కలిగించే దిశగా ఉద్యమాలు ఉంటాయి. — ఈ ఉద్యమాలు అహింసాయుత పద్ధతులలో కొనసాగుతూ ప్రజల స్వేచ్ఛపూరిత భావనలకు అవకాశం కల్పిస్తుంది. ఈ ఉద్యమాలు సాధారణంగా రాజకీయ పార్టీలకు దూరంగా ఉండి ఒక ఆశయం కోసం పనిచేస్తాయి. కొన్ని సందర్భాలలో తమపై రుద్దిన మార్పులను రాజకీయ వ్యవస్థలు సరిచేయలేనప్పుడు వాళ్ళ ఆశయ సాధనం కోసం ఉద్యమిస్తాయి. ఈ ఉద్యమాలు ఏ ఒక్కరి ప్రయోజనం కోసం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరి ఆశయ సాధన కోసం చేయడం జరుగుతుంది.
ఉదా :
1) గ్రీన్‌పీస్ ఉద్యమం,
2) పౌర హక్కులు,
3) మైరా పైబీ మొ||వి.

ప్రశ్న 4.
మైరా పైబీ ఉద్యమం గూర్చి వివరించండి.
జవాబు:
మైటీ భాషలో మైరాపైబీ అంటే కాగడాలు పట్టుకున్న వాళ్ళు అని అర్థం.

1970ల చివరి కాలంలో త్రాగి బజారుల్లో గొడవ చెయ్యకుండా నివారించడానికి మైరాపైబీ ఉద్యమం మొదలైంది.

సైనిక చర్యల వలన మానవహక్కులు దెబ్బ తింటున్నాయనే భావనతో ఈ ఉద్యమం అనుసంధానం అయినది. రాత్రిళ్ళు బజారులలో మైరాపైబీ పహరా కాయటం మొదలు పెట్టింది. గ్రామాలు, పట్టణాలలోని వార్డుల్లోని మహిళలు రోజూ ఈ పహరాలో పాల్గొనేవారు. అయితే వాళ్ళ చేతులలో ఆయుధాలు కాకుండా కర్రకు గుడ్డ చుట్టి కిరోసితో తడిపి వెలిగించిన కాగడాలు ఉండేవి. ప్రజాశాంతికి భంగం, ముప్పు వాటిల్లకుండా మహిళా బృందాలు ప్రతి రాత్రి, ప్రతి వారులో, ప్రతి కూడలిలో కూర్చుంటాయి. ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మహిళలు కాపలా కాసేవారు. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చెయ్యాలని కూడా మైరా పైబీ ఉద్యమం కోరుతుంది. వీరికి సహకారంగా ఇరోం షర్మిల అనే మహిళ 14 సం|| రాల నుండి గృహనిర్బంధంలో నిరాహారదీక్ష చేస్తుంది. ఈ ఉద్యమం మణిపూర్ రాష్ట్రానికి సంబంధించింది.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

ప్రశ్న 5.
అట్టడుగు వర్గాలకు చెందిన ప్రజల జీవితాలను ప్రపంచీకరణ, నయా ఉదారవాద విధానాలు ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో వివరించండి.
జవాబు:

  1. గిరిజనులు, పేద రైతులు, భూమి లేని కార్మికులు, మహిళలు, అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న వాళ్ళు అందరి కంటే ఎక్కువగా నష్టపోయారు.
  2. వీళ్ళకు మంచి చదువు, నైపుణ్యాలు వంటివి అందుబాటులో లేవు.
  3. అందువలన మంచి జీతాలు వచ్చే ఉద్యోగాలు కానీ, చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన పరిహారాలు కానీ వీళ్ళకు అందుబాటులో లేవు.
  4. గనుల త్రవ్వకం, ఆనకట్టల పథకాల వంటి వాటివల్ల అనేకమంది గిరిజనులు, రైతులు నిర్వాసితులు అవుతున్నారు.

ప్రశ్న 6.
ప్రాజెక్టుల నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనాలను, ప్రజలు ఎదుర్కొనే సమస్వలను వివరించండి.
జవాబు:
ప్రాజెక్టుల నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనాలు, సమస్యలు:
ప్రయోజనాలు :

  1. పెద్ద మొత్తంలో నీటి నిల్వ
  2. సాగునీరు
  3. విద్యుదుత్పత్తి
  4. వరదల నియంత్రణ
  5. కరవు నియంత్రణ

సమస్యలు :

  1. సారవంతమైన భూములు కోల్పోవడం
  2. అడవులు ముంపునకు గురికావడం
  3. జంతుజాలం నశించడం
  4. ప్రజలు నిర్వాసితులు కావడం
  5. ఖర్చు అధికం

ప్రశ్న 7.
బహుళార్థ సాధక పథకాల నిర్మాణం వల్ల కలిగే లాభనష్టాలను బేరీజు వేయండి.
జవాబు:
లాభాలు :

  1. పెద్దమొత్తంలో నీటిని నిల్వచేయడం.
  2. వ్యవసాయాభివృద్ధి.
  3. పెద్దమొత్తంలో విద్యుదుత్పత్తి చేయడం.
  4. వరదలు, కరువులను నియంత్రించడం.
  5. ఈ అసమానతలు సాధ్యమైనంత తొందరగా పరిష్కరింపబడాలి.

నష్టాలు:

  1. స్థానిక ప్రజలు నిర్వాసితులవుతారు.
  2. నిర్వాసితులందరికీ సరైన పునరావాసం కల్పించడం కష్టతరం, నిజానికి అసాధ్యం.
  3. జీవవైవిధ్యం దెబ్బతింటుంది.
  4. ఆశించిన స్థాయిలో నీటి నిల్వ, విద్యుదుత్పత్తి జరగలేదు.

ప్రశ్న 8.
ఈ క్రింది పేరాను చదివి, మీ అభిప్రాయం రాయండి.

1990ల నుంచి ప్రపంచీకరణ’, ‘నయా ఉదారవాదం’ అన్న పేర్లతో సంభవిస్తున్న ప్రపంచ వ్యాప్త ఆర్థిక, రాజకీయ మార్పుల వల్ల ఎటువంటి సదుపాయాలు లేని ప్రజల జీవితాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. గిరిజన ప్రజలు, పేద రైతులు, భూమి లేని కార్మికులు, మహిళలు, అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న పట్టణ పేదలు, పారిశ్రామిక కార్మికులు అందరి కంటే తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఇటువంటి ప్రజలలో ఎక్కువ మందికి పాఠశాల చదువు, సరైన పోషకాహారం, వైద్యం అందుబాటులో లేదు.
జవాబు:
ఈ పేరాగ్రాఫ్ ప్రపంచీకరణ యొక్క పరిణామాలను గురించి వివరిస్తోంది. అది ప్రధానంగా పేద ప్రజలను, గిరిజనులను ప్రభావితం చేస్తోంది. మరియు అవ్యవస్థీకృత రంగంలో పనిచేసేవారిపై కూడా ప్రపంచీకరణ ప్రభావం ఉంది. నిరక్షరాస్యులు మరియు పోషకాహార లోపంతో బాధపడేవారు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు.

సాంకేతిక ప్రగతి కారణంగా అనేక రకాల యంత్రాలు కనుగొనబడ్డాయి. అభివృద్ధి చెందిన సాంకేతికత అన్ని రంగాలను ప్రభావితం చేస్తోంది. వ్యవసాయంలో కంబైన్డ్ హార్వెస్టర్లు, నూర్పిడి యంత్రాలు (ధైషర్లు) ఉపయోగిస్తున్నారు. టాకరు మరియు టాన్‌ ప్లాంటేషన్ యంత్రాలను వినియోగిస్తున్నారు. కనుక కూలీలు తమ జీవనోపాధిని కోల్పోతున్నారు. రైల్వేలు, ఆనకట్టల వల్ల గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వేల విస్తరణ పనులు చేపట్టినప్పుడు పట్టాల క్రింద పరచడానికి గాను అనేక చెట్లు నరకబడతాయి. కావున అటవీ ప్రాంత నివాసితులు తరలింపు సమస్యను ఎదుర్కొంటారు. నీటి పారుదల సౌకర్యాలు పెంచడానికి ప్రభుత్వం ఆనకట్టల నిర్మాణానికి ఉద్దేశించినపుడు వాటిని అడవుల సమీపంలోనే నిర్మించడం తప్పనిసరి. ఈ పరిస్థితి గిరిజనుల తరలింపు సమస్యకు కారణమవుతుంది. గిరిజనులలో చాలామంది నిరక్షరాస్యులు. వారు తేనె, గింజలు, విత్తనాలు సేకరించడం వంటి తమ జీవనోపాధులను కోల్పోతారు. పట్టణాలు, నగరాల, పొలిమేరల సమీపంలో పారిశ్రామిక వాడలు కూడా పెరిగాయి. ఇది కాలుష్యానికి దారితీస్తుంది. కంప్యూటర్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజి, టెలికమ్యూనికేషన్, రవాణా సౌకర్యాలు పెరిగాయి మరియు పేద ప్రజలు, గిరిజనులపై దీని ప్రభావం పడుతోంది.

ప్రభుత్వానికి నా సూచన ఏమిటంటే ప్రజల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. మరియు వారి పునరావాసం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి సకాలంలో తగిన నష్టపరిహారం చెల్లించాలి. అధికారులు కూడా సంబంధిత చట్టాలను సరిగా అమలుచేయాలి.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

ప్రశ్న 9.
“వియత్నాం యుద్ధంలో అమెరికా చాలా క్రూరంగా ప్రవర్తించింది.” వ్యాఖ్యానించండి.
జవాబు:
వియత్నాం యుద్ధంలో అమెరికా చాలా క్రూరంగా ప్రవర్తించింది :

  1. వియత్నాంపై యుద్ధంలో అమెరికా చాలా క్రూరంగా ప్రవర్తించింది.
  2. ఏజెంట్ ఆరంజ్ వంటి రసాయన ఆయుధాలను ఉపయోగించడం ఈ క్రూరత్వానికి సరియైన ఉదాహరణ.
  3. ఏజెంట్ ఆరంజ్ అనేది మొక్కలను చంపే ఒక విషరసాయనం.
  4. దాదాపు 11 మిలియన్ గాలన్ల ఈ రసాయనాన్ని అమెరికా విమానాలు వియత్నాంపై చల్లాయి.
  5. అడవులను, పొలాలను నాశనం చేయడం ద్వారా వియత్నామీయులను తేలికగా చంపవచ్చని భావించారు.
  6. ఈనాటికి కూడా వియత్నాంలో ప్రజలపై ఈ రసాయన ప్రభావం ఉంది.
  7. పిల్లలలో మెదడు దెబ్బతినడానికి, క్యాన్సర్ వ్యాధికి ఇది కారణమవుతున్నది.
  8. రెండవ ప్రపంచయుద్ధంలో వాడిన మొత్తం బాంబుల బరువు కంటే వియత్నాం యుద్ధంలో అమెరికా వాడిన బాంబుల బరువే ఎక్కువ.

ప్రశ్న 10.
ప్రస్తుత ప్రపంచంలో గ్రీన్ పీస్ వంటి పర్యావరణ ఉద్యమాల ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు:

  1. అలాస్కా దగ్గర సముద్ర గర్భంలో అమెరికా 1971లో చేపట్టిన అణు పరీక్షలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం మొదలయ్యింది.
  2. నిరసన తెలియచెయ్యటానికి స్వచ్ఛంద కార్యకర్తలు చిన్న పడవలో ప్రయోగ ప్రదేశానికి బయలుదేరారు. ఈ పడవ పేరు ‘గ్రీన్‌పీస్’, చివరికి ఇది ఆ ఉద్యమం పేరుగా మారింది.
  3. ప్రస్తుతం ఈ ఉద్యమం నలభై దేశాలలో విస్తరించి ఉంది. దీని ప్రధాన కార్యాలయం ఆమ్ స్టడాం (హాలండ్)లో ఉంది. ఇది ముఖ్యమైన అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలలో ఒకటి.
  4. సూర్యుని హానికర కిరణాలను అడ్డుకునే వాతావరణంలోని ఓజోను పొర కాలుష్యం వల్ల దెబ్బ తింటోందని గత కొద్ది దశాబ్దాలలో శాస్త్రజ్ఞులు గుర్తించారు. కాలుష్యం వల్ల భూమి సగటు ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి.
  5. దీని కారణంగా ధ్రువ ప్రాంతాల వద్ద ఉండే మంచు టోపీలు (పెద్ద మొత్తంలో గడ్డకట్టిన నీళ్లు) కరుగుతున్నాయి. ఈ మంచు కరిగి సముద్రాలలో చేరటం వల్ల మహా సముద్రాలు, సముద్రాల నీటిమట్టం పెరిగి ప్రపంచమంతటా తీరప్రాంతాలు ముంపునకు గురవుతాయి.
  6. సముద్ర తీరం వెంట బంగ్లాదేశ్, శ్రీలంక, మారిషస్, భారతదేశం, ఇండోనేసియా వంటి దేశాలలో అధిక సంఖ్యలో ఉంటున్న ప్రజలు వరదలు, ముంపు వంటి తీవ్ర సమస్యలతో ప్రభావితమౌతారు.
  7. ప్రపంచం వేడెక్కటం వల్ల, వర్షపాతంలో తేడాల వల్ల (అకాల వర్షాలు, అధిక వర్షాలు, కరవులు), పంటలు నష్టపోవటం వల్ల తీర ప్రాంతానికి దూరంగా ఉన్న ప్రజలు కూడా ప్రభావితమౌతారు.
  8. ఇంకో మాటల్లో చెప్పాలంటే ప్రపంచవ్యాప్త వాతావరణ మార్పు వల్ల వ్యవసాయాధారిత ప్రజలు, దేశాలు ప్రధానంగా ప్రభావితమౌతాయి.
  9. వాతావరణ మార్పుపై పలు దేశాలలో గ్రీన్ పీస్ ఉద్యమం చేపట్టింది. “అనంత వైవిధ్యతతో కూడిన జీవాన్ని భూమి పోషించే శక్తిని కాపాడటం” దాని ఉద్దేశం. కాలక్రమంలో ఈ ఉద్యమం ‘సుస్థిర అభివృద్ధి’ అన్న భావనను ముందుకు తెచ్చింది.
  10. మానవుని కారణంగా పెరిగిపోతున్న భూగోళం వేడక్కడంను నివారించాలంటే ఇలాంటి ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రశ్న 11.
యుఎస్ఎస్ఆర్ లో మానవ హక్కుల ఉద్యమం ఆవిర్భవించడానికి కారణాలేమిటి?
జవాబు:
ఆ రోజుల్లో యుఎస్ఎస్ఆర్ లోనూ, దాని ప్రభావంలో ఉన్న తూర్పు యూరపు దేశాలలోనూ స్వేచ్ఛాపూరిత బహుళ పార్టీ ఎన్నికలను, సెన్సారులేని స్వేచ్ఛాపూరిత పత్రికలు, ప్రసార సాధనాలను, చివరికి సాధారణ ప్రజల స్వేచ్ఛాపూరిత భావ ప్రకటన, కదలికలు వంటి వాటిని అనుమతించలేదు. ఈ ప్రభుత్వాలు తమను కూలదోసే కుట్రల గురించి నిత్యమూ భయపడుతూ ఉండి ప్రజల అన్ని కార్యకలాపాలపై నియంత్రణ, నిఘా ఉంచేవి. ఇటువంటి నియంత్రణల వల్ల విసిగిపోయిన ప్రజలు భావప్రకటన, కదలికలకు స్వేచ్ఛ, స్వేచ్ఛాపూరిత పత్రికలు వంటి మానవ హక్కుల కోసం యుఎస్ఎస్ఆర్ లోని పలు ప్రాంతాల్లోనూ, తూర్పు యూరపులోనూ పలు ఉద్యమాలు చేపట్టారు.

ప్రశ్న 12.
వియత్నాం యుద్ధం మూలంగా అమెరికాకు వ్యతిరేకంగా వియత్నాం ప్రజలు చేపట్టిన ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా ఏ విధంగా స్ఫూర్తిని ఇచ్చింది?
జవాబు:
అమెరికాకు ఏ మాత్రం ప్రమాదకరం కాని అమాయకమైన ప్రజలపై బాంబులు వెయ్యడం ఎంతవరకు న్యాయం అని 1970ల ఆరంభంలో వియత్నాం నుంచి తిరిగి వస్తున్న అమెరికా సైనికులలో సందేహం పెరగసాగింది. అదే సమయంలో ఎక్కడో ఉన్న వియత్నాంలో యుద్ధానికి తమ పిల్లలని పంపించటానికి ఇష్టపడని అమెరికన్ల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. దాంతో వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికా అంతటా ప్రజా నిరసనలు ఉప్పొంగాయి. దీని వల్ల అంతిమంగా అమెరికా 1975లో యుద్ధాన్ని ఆపేసి వియత్నాం నుంచి బయటకు వచ్చేసింది. అమెరికాకు వ్యతిరేకంగా వియత్నాం ప్రజలు చేపట్టిన ఉద్యమం విజయం కావటం ప్రపంచ వ్యాప్తంగా శాంతి ఉద్యమాలకు స్ఫూర్తిని ఇచ్చింది.

ప్రశ్న 13.
భూగోళం వేడెక్కడం మూలంగా జరిగే అనర్థాలేమిటి?
జవాబు:
సూర్యుని హానికర కిరణాలను అడ్డుకునే వాతావరణంలోని ఓజోను పొర కాలుష్యం వల్ల దెబ్బతింటోందని గత కొద్ది దశాబ్దాలలో శాస్త్రజ్ఞులు గుర్తించారు. కాలుష్యం వల్ల భూమి సగటు ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. దీని కారణంగా ధ్రువ ప్రాంతాల వద్ద ఉండే మంచు టోపీలు (పెద్ద మొత్తంలో గడ్డకట్టిన నీళ్లు) కరుగుతున్నాయి. ఈ మంచు కరిగి సముద్రాలలో చేరటం వల్ల మహా సముద్రాలు, సముద్రాల నీటిమట్టం పెరిగి ప్రపంచమంతటా తీరప్రాంతాలు ముంపునకు గురవుతాయి. సముద్ర తీరం వెంట బంగ్లాదేశ్, శ్రీలంక, మారిషస్, భారతదేశం, ఇండోనేషియా వంటి దేశాలలో అధిక సంఖ్యలో ఉంటున్న ప్రజలు వఠదలు, ముంపు వంటి తీవ్ర సమస్యలతో ప్రభావితమవుతారు. ప్రపంచం వేడెక్కటం వల్ల, వర్షపాతంలో తేడాల వల్ల (అకాల వర్షాలు, అధిక వర్షాలు, కరవులు), పంటలు నష్టపోవటం వల్ల తీర ప్రాంతానికి దూరంగా ఉన్న ప్రజలు కూడా ప్రభావితమవుతారు. ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్త వాతావరణ మార్పు వల్ల వ్యవసాయాధారిత ప్రజలు, దేశాలు ప్రధానంగా ప్రభావితమవుతాయి.

ప్రశ్న 14.
అభివృద్ధి స్వభావం గురించి ఆలోచింపచేయటంలో “నర్మదా బచావో” ఉద్యమం ఏ విధంగా విజయం సాధించింది?
జవాబు:
సర్దార్ సరోవర్ ఆనకట్ట నిర్మాణాన్ని ఆపటంలో నర్మదా బచావో ఆందోళన విఫలమైనప్పటికీ అందరూ అభివృద్ధి స్వభావం గురించి ఆలోచించేలా చెయ్యటంలో అది విజయం సాధించింది – అది పేదవాళ్ల ప్రయోజనాల కోసమా, లేక ధనికులు, శక్తిమంతులకోసమా అని .ఆలోచింపచేసింది. ప్రకృతిలో పెద్ద ఎత్తున జోక్యం చేసుకుంటూ కట్టే పెద్ద పెద్ద కట్టడాల ప్రయోజనాల గురించి కూడా అందరూ ఆలోచించేలా చేసింది. ఇటువంటి అభివృద్ధి కారణంగా నిర్వాసితులైన’ ప్రజలకు ” తగినంత, గౌరవప్రదమైన నష్టపరిహారం చెల్లించే దిశలో ప్రభుత్వం ఆలోచించేలా చేసింది.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

ప్రశ్న 15.
మైరా పైబీ ఉద్యమంలోని మహిళల విధులేమిటి?
జవాబు:
రాత్రుళ్లు బజారులలో మైరా పైబీ పహరా తిరగటం మొదలు పెట్టింది. గ్రామాలు, పట్టణాలలోని వార్డులోని మహిళలు రోజూ ఈ పహారాలో పాల్గొనేవాళ్లు. అయితే వీళ్ల చేతుల్లో ఎటువంటి ఆయుధాలు కాకుండా కర్రకు గుడ్డచుట్టి, కిరోసితో తడిపి వెలిగించిన కాగడాలు మాత్రమే ఉండేవి. ప్రజాశాంతికి భంగం, ముప్పు కలుగకుండా మహిళా బృందాలు ప్రతి రాత్రి, ప్రతి వార్డులో, ప్రతి కూడలిలో కూర్చుంటాయి. కొంత శాంతియుత సమయాల్లో కొంతమంది మహిళలే వంతుల ప్రకారం పహరా ఉంటారు. కానీ ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న తరుణంలో పెద్ద సంఖ్యలో మహిళలు కాపలా ఉంటారు.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

These AP 10th Class Social Studies Important Questions 19th Lesson రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000 will help students prepare well for the exams.

AP Board 10th Class Social 19th Lesson Important Questions and Answers రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

10th Class Social 19th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium

1. 1977లో జరిగిన ఎన్నికలలో విజయం సాధించి జనతాపార్టీ తరపున ప్రధానమంత్రి అయిన వారు ఎవరు?
జవాబు:
మొరార్జీ దేశాయ్.

2. మొదటి కాంగ్రెసేతర ప్రధాని ఎవరు?
జవాబు:
మొరార్జీ దేశాయ్.

3. భారతదేశంలో అత్యవసర పరిస్థితి నిలుపుదల చేసిన సంవత్సరం ఏది?
జవాబు:
1977.

4. ఆపరేషన్ బ్లూస్టార్ చేపట్టినది ఎవరు?
జవాబు:
ఇందిరాగాంధీ.

5. L.K. అద్వానీచే రామజన్మభూమి రథయాత్ర ప్రారంభించ బడిన సంవత్సరం?
జవాబు:
1990.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

6. భారత రాష్ట్రపతి పదవికి ఏకగ్రీవంగా ఎన్నికై భారత ఆరవ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసినది ఎవరు?
జవాబు:
నీలం సంజీవరెడ్డి.

7. పంజాబ్ కి పరిమితమై నిక్కులకోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న పార్టీ ఏది?
జవాబు:
శిరోమణి అకాలీదళ్ (SAD)

8. 1970లలో అసోంలో వచ్చిన సామాజిక ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు?
జవాబు:
అఖిల అసోం విద్యార్థి సంఘం.

9. పంజాబులో తీవ్రవాద సిక్కుల బృందానికి నాయకత్వం వహించింది ఎవరు?
జవాబు:
బింద్రేన్ వాలా.

10. శ్రీలంకతో శాంతి ప్రక్రియలకు శ్రీకారం చుట్టిన మనదేశ ప్రధాని ఎవరు?
జవాబు:
రాజీవ్ గాంధీ.

11. 1989లోని మొదటి సంకీర్ణ ప్రభుత్వం తరపున ప్రధాన మంత్రి పదవిని చేపట్టినదెవరు?
(లేదా)
మొదటి సంకీర్ణ ప్రభుత్వం ఎవరి నేతృత్వంలో ఏర్పడింది?
జవాబు:
వి.పి. సింగ్

12. 1991 మే 21న రాజీవ్ గాంధీని పెరంబూర్‌లో హత్య గావించిన తీవ్రవాద సంస్థ ఏది?
జవాబు:
LTTE

13. ‘ఆపరేషన్ బర్గా’ను చేపట్టిన రాష్ట్రం ఏది?
జవాబు:
పశ్చిమ బెంగాల్.

14. రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన ప్రవేశ పెట్టుటకు దోహదం చేసే రాజ్యాంగ అధికరణ ఏది?
జవాబు:
356వ అధికరణ.

15. మండల్ కమీషన్ సిఫారసులను అమలు చేసిన ప్రభుత్వం ఏది?
జవాబు:
V.P. సింగ్ ప్రభుత్వం

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

16. తెలుగు దేశం పార్టీ ఏర్పాటులో ప్రధాన సిద్ధాంతం ఏది?
జవాబు:
ఆంధ్రుల ఆత్మగౌరవం.

17. స్థానిక సంస్థలలో స్త్రీలకు ఎన్నోవంతు సీట్లను కేటాయించారు?
జవాబు:
1/3 వంతు.

18. రెండూ లేదా అంతకంటే ఎక్కువ రాజకీయ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని ఏమంటారు?
జవాబు:
సంకీర్ణ ప్రభుత్వం

19. ‘బర్మా’ ప్రస్తుత నామం ఏమిటి?
జవాబు:
మయన్మార్.

20. చండిఘర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా కాక తమ రాష్ట్రానికి చెందాలని కోరిన రాష్ట్రం ఏది?
జవాబు:
పంజాబు.

21. 1986 ఏప్రిల్ లో ఎక్కడ జరిగిన సమావేశంలో ఖలిస్తాను స్వతంత్ర దేశంగా ప్రకటించారు?
జవాబు:
అకల్ తఖ్త్

22. 1977 సాధారణ ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్ లో అధికారంలోకి వచ్చిన పార్టీ ఏది?
జవాబు:
CPI(M)

23. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామస్థాయిలో స్థానిక స్వపరిపాలన పెట్టబడింది?
జవాబు:
73వ

24. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణ స్థాయిలో స్థానిక స్వపరిపాలన పెట్టబడింది?
జవాబు:
74 వ.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

25. స్థానిక స్వపరిపాలనకు రాజ్యాంగ గుర్తింపునిస్తూ 1992 సంవత్సరంలో రాజ్యాంగ సవరణ చేసిన ప్రభుత్వం ఏది?
జవాబు:
P.V. నరసింహారావు ప్రభుత్వం

26. ‘గోల్డెన్ టెంపుల్’ ఏ మతస్థులకు పవిత్ర స్థలం?
జవాబు:
సిక్కులకు

27. AGPని విస్తరింపుము.
జవాబు:
అస్సోం గణ పరిషత్.

28. SADని విస్తరింపుము.
జవాబు:
శిరోమణి అకాలీ దళ.

29. AASUని విస్తరింపుము.
జవాబు:
అఖిల అసోం విద్యార్థి సంఘం.

30. DMK ని విస్తరింపుము.
జవాబు:
ద్రవిడ మున్నేట్ర ఖజగం.

31. BLDని విస్తరింపుము.
జవాబు:
భారతీయ లోక్ దళ్

32. NDA ని విస్తరింపుము.
జవాబు:
నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్.

33. UPA ని విస్తరింపుము.
జవాబు:
యునైటెడ్ ప్రోగ్రెస్సివ్ అలయన్స్

34. ఇందిరా గాంధీని ఏ సంవత్సరంలో హత్య గావించారు?
జవాబు:
1984లో

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

35. సిక్కులు కోరిన ప్రత్యేక దేశంను ఏమంటారు?
జవాబు:
ఖలిస్తాన్.

36. వెనకబడిన తరగతులకు ఎంతశాతం రిజర్వేషన్లు కల్పించాలని మండల్ కమీషన్ సిఫారసు చేసింది?
జవాబు:
27%

37. ‘బోఫోర్సు’ కుంభకోణం ఆరోపణలను ఎదుర్కొన్న ప్రధాని ఎవరు?
జవాబు:
రాజీవ్ గాంధీ.

38. NDAకు నాయకత్వం వహిస్తున్న పార్టీ ఏది?
జవాబు:
బి.జె.పి. (BJP)

39. UPA కు నాయకత్వం వహిస్తున్న పార్టీ ఏది?
జవాబు:
కాంగ్రెస్ పార్టీ.

40. బెంగాలీ భాషలో ‘బర్గాదార్లు’ అనగా?
జవాబు:
కౌలుదార్లు.

41. ఆరవ సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?
జవాబు:
1977 మార్చిలో

42. ఆరవ లోకసభకు స్పీకర్‌గా ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు?
జవాబు:
నీలం సంజీవరెడ్డి.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

49. ఇంతవరకు లోకసభ స్పీకర్ గా అతి తక్కువ కాలం పనిచేసింది ఎవరు?
జవాబు:
నీలం సంజీవరెడ్డి.

44. మొట్ట మొదటిసారిగా ఏకగ్రీవంగా ఎన్నికైన భారత రాష్ట్రపతి ఎవరు?
జవాబు:
నీలం సంజీవరెడ్డి.

45. నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా ఉన్నకాలంలో మొరార్జీ దేశాయ్, వి.పి.సింగ్, చరణ్ సింగ్, ఇందిరాగాంధీలలో ఎవరు ప్రధాన మంత్రిగా పనిచేయలేదు?
జవాబు:
వి.పి.సింగ్.

46. 1977లో తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన పార్టీ ఏది?
జవాబు:
DMK

47. BLD ప్రధానంగా ఏ రాష్ట్రంలో ఉండేది?
జవాబు:
ఉత్తర ప్రదేశ్.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

48. SAD ఏ రాష్ట్రానికి పరిమితమైన పార్టీ?
జవాబు:
పంజాబు.

49. మొరార్జీ దేశాయ్ తర్వాత ప్రధాన మంత్రి ఎవరు?
జవాబు:
చరణ్ సింగ్.

50. ఏదైన ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటే (356 ప్రకారం) ఎవరి సిఫారసు అవసరం?
జవాబు:
ఆ రాష్ట్ర గవర్నర్.

51. కేంద్ర ప్రభుత్వం 356వ అధికరణాన్ని ప్రయోగించడానికి ఖచ్చితమైన నియమాలను ఏ తీర్పులో పేర్కొన్నారు?
జవాబు:
1994 సుప్రీంకోర్టు తీర్పులో

52. TDP ని ఎవరు స్థాపించారు?
జవాబు:
N.T. రామారావు

53. TDP ని ఎప్పుడు స్థాపించారు?
జవాబు:
1982లో

54. N.T. రామారావు ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేసిన గవర్నర్ ఎవరు?
జవాబు:
రామ్ లాల్.

55. కేంద్ర ప్రభుత్వం, AASU మధ్య ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది?
జవాబు:
1984

56. AASU కు అనుబంధంగా ఏర్పడిన పార్టీ ఏది?
జవాబు:
AGP.

57. పంజాబు రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది?
జవాబు:
1 నవంబరు, 1966 న

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

58. భాక్రానంగల్ ఆనకట్ట ఏ నదిపై, ఏ రాష్ట్రంలో నిర్మించారు?
జవాబు:
సట్లెజ్ నదిపై, హిమాచల్ ప్రదేశ్ లో.

59. గోల్డెన్ టెంపుల్ ని ఆక్రమించుకున్న సిక్కు తీవ్రవాదులను ఖాళీ చేయించడానికి చేసిన ఆపరేషన్ పేరేమిటి?
జవాబు:
ఆపరేషన్ బ్లూస్టార్ (1984).

60. ఇందిరాగాంధీ తర్వాత ప్రధాని అయినది ఎవరు?
జవాబు:
రాజీవ్ గాంధీ.

61. మిజో నేషనల్ ఫ్రంట్ కి, కేంద్ర ప్రభుత్వంకి మధ్య ఎప్పుడు ఒప్పందం కుదిరింది?
జవాబు:
1986 జూన్ 30 న.

62. “పేదలకోసం ఖర్చు పెడుతున్న ప్రతిరూపాయిలో 15 పైసలు కూడా వారికి చేరటం లేదని” అన్న ప్రధాని ఎవరు?
జవాబు:
రాజీవ్ గాంధీ.

63. 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల విషయంలో ఏ ప్రధానమంత్రి క్షమాపణలు చెప్పారు? ఎప్పుడు?
జవాబు:
మన్మోహన్ సింగ్, రాజ్యసభలో 2005 ఆగస్టు 11న.

64. బాబ్రీ మసీదు ఎక్కడ ఉంది?
జవాబు:
అయోధ్యలో (ఉత్తరప్రదేశ్)

65. బోఫోర్స్ శతఘ్నులను ఏ దేశం నుంచి కొన్నారు?
జవాబు:
స్వీడన్.

66. భారత రాజకీయ చరిత్రలో ఏర్పడిన మొట్టమొదటి సంకీర్ణ ప్రభుత్వమేది?
జవాబు:
నేషనల్ ఫ్రంట్.

67. భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ, భారతీయ జనతాపార్టీలలో భిన్నమైనది ఏది?
జవాబు:
భారతీయ జనతా పార్టీ.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

68. 1977లో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో గెలిచి, వామపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రి ఎవరు?
జవాబు:
జ్యోతిబసు.

69. ఆపరేషన్ బర్గాను పశ్చిమబెంగాల్ ఎప్పుడు చేపట్టింది?
జవాబు:
1978లో

70. BSP ని విస్తరించండి.
జవాబు:
బహుజన్ సమాజ్ పార్టీ,

71. రథయాత్ర చేస్తున్న L.K. అద్వానీని ఏ రాష్ట్రంలో అరెస్ట్ చేశారు?
జవాబు:
బీహార్‌లో

72. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి?
ఎ) రామజన్మభూమి రథయాత్ర – 1990
బి) రాజీవ్ గాంధీ హత్య – 1991
సి) ఆపరేషన్ బ్లూస్టార్ – 1984
డి) ఆపరేషన్ బర్గా – 1987
జవాబు:
డి) ఆపరేషన్ బర్గా – 1987.

73. క్రింది వానిలో సరిఅయిన జతను గుర్తించి, రాయండి.
→ కాంగ్రెసు (0) – ఇందిరాగాంధీ
→ SAD – హర్యానా రాష్ట్రం
→ BLD – ఉత్తర ప్రదేశ్
→ జనసంఘ్ – జమ్ము & కాశ్మీర్
జవాబు:
BLD – ఉత్తరప్రదేశ్

74. క్రింద ఇచ్చిన వానిలో అస్సోం రాష్ట్రం యొక్క ప్రధాన వనరులు ఏవి?
టీ, కాఫీ, ముడిచమురు, ఇనుప ఖనిజము.
జవాబు:
టీ, ముడిచమురు.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

75. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి.
i) తీవ్రవాద సిక్కు బృంద నాయకుడు, – బింద్రేన్‌వాలా
ii) SAD అధ్యక్షుడు – సంత్ లాంగో వాల్
iii) AGP అధ్యక్షుడు – జ్యోతిబసు
iv) భారతదేశ ఆరవ రాష్ట్రపతి – నీలం సంజీవరెడ్డి
జవాబు:
(iii)

76. క్రింది వాటిని సరిగా జతపరచండి.
i) DMK ( ) a) తమిళనాడు
ii) SAD ( ) b) పంజాబు
iii)AGP ( ) c) అస్సోం
iv) BLD ( ) d) ఉత్తరప్రదేశ్
జవాబు:
i – a, ii – b, iii – c, iv – d

77. ఇవ్వబడిన ప్రధాన మంత్రులను సరియైన కాలక్రమంలో
i) రాజీవ్ గాంధీ
ii) V.P. సింగ్
iii) ఇందిరాగాంధీ
iv) పి.వి. నరసింహారావు
జవాబు:
iii, i, ii & iv

78. క్రింద ఇవ్వబడిన సంఘటనలను సరియైన కాల క్రమంలో అమర్చండి.
i) TDP ఆవిర్భావం
ii) శ్రీలంకతో ఒప్పందం
iii) రామ జన్మభూమి రథయాత్ర.
iv) సరళీకృత ఆర్థిక విధానాలు
జవాబు:
i, ii, iii & iv

79. ‘విధాన పక్షపాతం’ అనగా నేమి?
జవాబు:
భాగస్వామ్య మద్దతు ఉపసంహరించుకుంటుందన్న భయంతో తీవ్ర మార్పులను అమలు చేయకపోవటం.

80. భారతదేశంలో ‘టెలికం విప్లవం’ను ప్రారంభించిన ప్రధాని ఎవరు?
జవాబు:
రాజీవ్ గాంధీ.

81. క్రింది వారిలో ప్రధానమంత్రి పదవిలో అతి తక్కువ కాలం కొనసాగిన వారు ఎవరు?
ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, P.V. నరసింహారావు, V.P. సింగ్
జవాబు:
రాజీవ్ గాంధీ

82. భారతదేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టిన ప్రధాని ఎవరు?
జవాబు:
P.V. నరసింహారావు

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

83. సరికాని జతను ఎంచుకుని, రాయండి.
→ రామజన్మభూమి రథయాత్ర – L.K. అద్వానీ
→ రాజీవ్ గాంధీ హత్య – LTTE
→ మండల కమీషన్ – OBC లకు రిజర్వేషన్లు
→ మొదటి సంకీర్ణ ప్రభుత్వం – P.V. నరసింహారావు
జవాబు:
మొదటి సంకీర్ణ ప్రభుత్వం – P.V. నరసింహారావు

84. క్రింది సంఘటనలను సరియైన కాలక్రమంలో అమర్చండి.
i) ఆపరేషన్ బ్లూస్టార్
ii) మిజోనేషనల్ ఫ్రంట్ తో ఒప్పందం
iii) జనతాదళ్ ప్రభుత్వం ఏర్పాటు
iv) బాబ్రీ మసీదు కూల్చివేత.
జవాబు:
i, ii, iii & in

85. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) సరళీకృత ఆర్థిక విధానాలు ( ) a) ఇందిరాగాంధీ
ii) టెలికం విప్లవం ( ) b) V.P. సింగ్ ఉంచండి.
iii)మండల కమీషన్ ( ) c) రాజీవ్ గాంధీ
iv) బ్యాంకుల జాతీయికరణ ( ) d) P.V. నరసింహారావు
జవాబు:
i – d, ii – c, iii – b, iv – a.

86. LTTE లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలంలో తమిళ ఈలం అనగా?
జవాబు:
తమిళ రాజ్యం

87. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) కాంగ్రెస్ పార్టీ ( ) a) ప్రాంతీయ పార్టీ
ii) భారతీయ జనతాపార్టీ ( ) b) వామపక్షం
iii) భారత కమ్యూనిస్ట్ పార్టీ ( ) c) NDA
iv) ద్రవిడ మున్నేట్ర కజగం ( ) d) UPA
జవాబు:
i – d, ii – c, iii – b, iv – a

88. సరళీకృత ఆర్థిక విధానాలలో భాగం కానిదాన్ని గుర్తించి, రాయండి.
→ రైతులకు ఇచ్చే సబ్సిడీలలో కోత మరియు సంక్షేమ పథకాల ఖర్చు తగ్గింపు
→ ఆర్థిక రంగంలోని అనేక రంగాలలో ప్రైవేటు పెట్టుబడి.
→ విదేశీ సరుకుల దిగుమతులమీద పరిమితులను తగ్గించటం.
→ భారతదేశంలో విదేశీ పెట్టుబడులపై ఆంక్షలు (పరిమితులు) విధించటం.
జవాబు:
భారతదేశంలో విదేశీ పెట్టుబడులపై ఆంక్షలు (పరిమితులు) విధించటం.

89. ‘ఓటు (హక్కు) విలువను తెలియజేయు ఒక నినాదంను రాయండి.
జవాబు:
ఓటరు చేతికి బ్రహ్మాస్త్రం – ఓటుహక్కు,
అవినీతిపరులకు ఓటు – దేశానికి చేటు.

90. ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమీషనర్ ఎవరు?
జవాబు:
సునీల్ అరోరా.

91. అత్యవసర పరిస్థితి తర్వాత, ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛని పునరుద్ధరిస్తామనే వాగ్దానంతో అధికారంలోకి వచ్చిన పార్టీ ఏది?
జవాబు:
జనతా పార్టీ

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

92. ఇందిరాగాంధీ విధానాలను వ్యతిరేకించిన కాంగ్రెసులోని సంప్రదాయవాద వర్గంతో ఏర్పాటు చేయబడిన పార్టీ ఏది?
జవాబు:
కాంగ్రెసు (ఓ)

93. ఏ సంవత్సరం చివరి నాటికి అంతిమంగా పంజాబులో శాంతి నెలకొన్నది?
జవాబు:
1990.

94. శ్రీలంక నుండి భారతదేశం తన సైన్యాన్ని వెనక్కి తీసుకున్న సంవత్సరం?
జవాబు:
1989.

95. ఏ సంవత్సరంలో షాబానో కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది?
జవాబు:
1985.

96. మహారాష్ట్రలోని రైతులు ఎవరి నాయకత్వంలో పోరాడుతున్నారు?
జవాబు:
శరద్ జోషి

97. ఉత్తరప్రదేశ్, హర్యానాలోని రైతులు ఎవరి నాయకత్వంలో పోరాడుతున్నారు?
జవాబు:
మహేంద్రసింగ్ తికాయత్

98. అయోధ్యలోని వివాదాస్పద మసీదును కూల్చివేసిన సంవత్సరం?
జవాబు:
1992.

99. భారతదేశ ప్రజాస్వామ్యానికి ఒక చారిత్రకమైన ఎన్నికలుగా ఏ ఎన్నికలను చెప్పవచ్చు?
జవాబు:
1977 ఎన్నికలు.

100. జాతీయస్థాయిలో కాంగ్రెసు పార్టీ ఓటమి చవిచూసిన ఎన్నికలు ఏవి ?
జవాబు:
1977 ఎన్నికలు.

101. హిందూ జాతీయవాద పార్టీగా పేరొందిన పార్టీ ఏది?
జవాబు:
జనసంఘ్.

102. పంచాయితీరాజ్ సంస్థలను క్రియాశీలకంగా మలచి పెద్ద సంఖ్యలో ప్రజలు పాలనలో భాగస్వామ్యులు అయ్యేలా ఉద్యమించారు?
జవాబు:
రాజీవ్ గాంధీ.

103. దళితుల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఏది?
జవాబు:
BSP (బహుజన సమాజ్ పార్టీ)

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

104. పంజాబుపై H.S. లాంగోవాలోనూ, అస్సోంపై AASU తోనూ రాజీవ్ గాంధీ ఒప్పందాలు ఏ సంవత్సరంలో చేసుకున్నారు?
జవాబు:
1985

105. అధికారంలో ఉండగా హత్యకు గురికాబడిన భారత ప్రధాని ఎవరు?
జవాబు:
ఇందిరాగాంధీ.

106. ఏ సంవత్సరం నుండి జాతీయ స్థాయిలో ఏర్పడిన ప్రభుత్వాలన్నీ సంకీర్ణ ప్రభుత్వాలే?
జవాబు:
1989 నుంచి.

107. L.K. అద్వాని రథయాత్ర 1990లో ఎక్కడ నుంచి ప్రారంభమైంది?
జవాబు:
సోమనాథ్ (గుజరాత్).

108. 1992లో ఏర్పడిన పి.వి.నరసింహారావు ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని నివారించటానికి చేపట్టిన అంశం ఏది?
జవాబు:
సరళీకృత ఆర్ధిక విధానం.

109. క్రింది వానిని పరిగణించండి.
i) కేంద్రంలో గెలుపొందిన జనతాపార్టీ తన స్థానాన్ని సుస్థిర పరచుకోటానికి తొమ్మిది రాష్ట్రాలలోని కాంగ్రెసు ప్రభుత్వాలను తొలగించింది.
ii) కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయిలో ఓడిపోయింది, కాబట్టి రాష్ట్రాలలో సైతం పాలించే హక్కును కోల్పోయింది.
పై వానిలో సరైనది ఏది?
A) (i) మాత్రమే
B) (ii) మాత్రమే
C) (i) మరియు (ii)
D) రెండూ కావు
జవాబు:
A (i) మాత్రమే

110. పంజాబు ఆందోళన వేర్పాటు వాదం వైపునకు మరళటానికి ప్రధాన కారణం ఏమిటి?
జవాబు:
మతపరమైన రంగు సంతరించుకోవటం.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

111. పంజాబు ఆందోళనకు కారణమైన సిక్కులు కోరిన అంశం కానిది.
→ రాజధాని చండీఘర్ కేంద్రపాలిత ప్రాంతంగా కాక తమకే చెందాలి.
→ భాక్రానంగల్ ఆనకట్ట నుంచి నీళ్ళు ఎక్కువ కావాలి.
→ సైన్యంలోకి ఎక్కువమంది సిక్కులను తీసుకోవాలి.
→ సిక్కు మతస్థులందరికి ప్రత్యేక దేశం కావాలి.
జవాబు:
సిక్కు మతస్థులందరికి ప్రత్యేక దేశం కావాలి.

112. ఏ రాష్ట్రంలో “తమని అంతర్గత వలస ప్రాంతంగా పరిగణిస్తున్నారని”, దీనిని ఆపివేయాలని ప్రజలు చేయటం మంచి పద్ధతని భావించిన ప్రధాని ఎవరు?
జవాబు:
అస్సోం.

113. 1977 ఎన్నికలలో అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ వ్యతిరేక వర్గంలో చేరటానికి కారణం.
జవాబు:
అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా.

114. నీలం సంజీవరెడ్డిగారి గురించిన సరియైన వాక్యం కానిది.
→ ఈయన ఆరవ లోకసభ స్పీకరుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
→ ఈయన భారత ఆరవ రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
→ 1977 జులై 25న స్పీకరుగా ప్రమాణ స్వీకారం చేశారు.
→ కాంగ్రెసు పార్టీతో సహా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి.
జవాబు:
→ 1977 జులై 25న స్పీకరుగా ప్రమాణ స్వీకారం చేశారు.

115. “ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛని పునరుద్ధరిస్తామన్న వాగ్దానంతో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది.” అయితే దీని కారణంగా ఆ పార్టీ పాలన ప్రభావితం అయ్యింది?
జవాబు:
అంతర్గత కీచులాటలు, ఫిరాయింపులు, అంతర్గత విభేదాలు

116. కాంగ్రెసేతర ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఒక వేదికగా ఏర్పడ్డానికి కారణం కానటువంటి అంశం.
జవాబు:
కేంద్ర విషయాల్లో జోక్యం చేసుకోవటం.

117. రాష్ట్రపతి పాలనకు సంబంధించిన వాక్యాలను పరిశీలించి, సరియైన సమాధానము ఎంచుకోండి.
I. రాజ్యాంగంలోని 356వ అధికరణం రాష్ట్రపతి పాలన గురించి వివరిస్తుంది.
II. గవర్నరు సిఫారసు మేరకు, ప్రధానమంత్రి సలహాతో, రాష్ట్రపతి పాలన బాధ్యతను గవర్నరుకు అప్పగించవచ్చు.
III. దీనికి సంబంధించిన ఖచ్చితమైన మార్గదర్శకాలు రాజ్యాంగంలో పొందుపరిచినారు.
A) I, II & III సత్యాలు
B) II, III సత్యాలు
C) I, II & III అసత్యాలు
D) I, II సత్యాలు
జవాబు:
D) I, 11 సత్యాలు

118. ఎన్.టి.రామారావు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం కానిది.
A) రెండు రూపాయలకు కిలో బియ్యం
B) మధ్యాహ్న భోజన పథకం
C) వృద్ధాప్య పింఛన్లు
D) మద్యపాన నిషేధం
C) వృద్ధాప్య పింఛన్లు

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

119. ఎన్.టి. రామారావు (రాజకీయాలలో) తెలుగుదేశం పార్టీ స్థాపనలో, ఎన్నికల్లో విజయం సాధించటానికి దోహదం చేసిన అంశం కానిది.
→ సినీహీరోగా ఉన్న నేపథ్యం.
→ రాజకీయ అనుభవం కలిగిన నాయకత్వం.
→ రాష్ట్ర ఆత్మగౌరవం కోసం పోరాటం.
→ పేదలకు జనాకర్షక సంక్షేమ పథకాలు
జవాబు:
రాజకీయ అనుభవం కలిగిన నాయకత్వం

120. అసోం ఉద్యమానికి కారణం.
జవాబు:
బెంగాలీ అధికారుల వివక్షత
బంగ్లాదేశ్ కాందిశీకుల రాక
సాంస్కృతిక మూలాలు కోల్పోతామన్న భయం

121. సంస్కృతి, జనాభా అంశాలే కాకుండా అసోం ఉద్యమానికి సంబంధించిన ఆర్థిక కోణం / కారణం
→ ఉపాధిలో బయట ప్రజలకు ప్రాధాన్యత
→ టీ పరిశ్రమ అస్సామేతర ప్రజల చేతుల్లో ఉండటం,
→ చమురు పరిశ్రమలో స్థానికులకు ప్రాధాన్యత తక్కువగా ఇవ్వటం
→ పైవన్నీ
జవాబు:
పైవన్నీ

122. ‘అసోం’ ఉద్యమంలోని ప్రజల ప్రధాన డిమాండ్ కానిది
→ అంతర్గత వలసగా పరిగణించటం
→ ఉపాధిలో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వటం
→ వనరులను స్థానిక ప్రజల ప్రయోజనం కోసం వినియోగించటం
→ బయటివాళ్లను తొలగించటం
జవాబు:
అంతర్గత వలసగా పరిగణించటం.

123. “ఈశాన్య ప్రాంతంలో ఘర్షణలు తగ్గించి, శాంతిని నెలకొల్పటానికి ఈ ప్రాంతాలలో సాయుధ బలగాలను కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున నియమించింది.” ఈశాన్య ప్రాంతంలో సాయుధ దళాలను ప్రయోగించటానికి కారణం కాని అంశం.
→ పొరుగు దేశాలతో సరిహద్దు ప్రాంతంగా ఉండటం
→ ఘర్షణల మతపర రంగు సంతరించుకోవడం
→ తిరుగుబాటు బృందాలు తరచు భారతదేశం నుంచి విడిపోవాలని కోరుకోవటం.
→ అల్పసంఖ్యాక వర్గాలపై తిరుగుబాటు బృందాలు హింసాత్మక దాడులకు పాల్పడటం.
జవాబు:
ఘరణలు మతపర రంగు సంతరించుకోవడం

124. క్రింది స్టేట్ మెంట్లను పరిశీలించి, సరియైన సమాధానము ఎంచుకోండి.
I. సిక్కు వేర్పాటు బృందాలు గోల్డెన్ టెంపుల్ ని ఆక్రమించుకోగా సైన్యం జోక్యం చేసుకోవలసి వచ్చింది.
II. దీనికి ప్రతిచర్యగా 1984లో ప్రధాని ఇందిరా
గాంధీని హత్య గావించారు.
A) I, II అసత్యాలు
B) I, II సత్యాలు
C) I మాత్రమే సత్యం
D) II మాత్రమే సత్యం
జవాబు:
B) I, II సత్యా లు

125. “పంజాబులో తీవ్రవాదాన్ని అణచివెయ్యటానికి ప్రభుత్వం చాలా తీవ్ర పదతులను ఉపయోగించింది. వీటిలో అనేకం పౌరుల రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించాయని భావించారు.” అయితే ఈ చర్యను సమర్థించే వ్యాఖ్య.
→ హింసను హింసతోటే అణచివెయ్యాలి. కావున ఈ చర్య సమర్థనీయమే.
→ రాజ్యాంగ యంత్రాంగమే కుప్పకూలే అంచున ఉండటంతో మానవహక్కుల ఉల్లంఘన సమర్థనీయమే.
→ శాంతి, భద్రతల రక్షణలో ఏ విధంగాను పౌరహక్కుల ఉల్లంఘన జరగకూడదు.
→ ఇటువంటి చర్యలు అప్రజాస్వామిక ధోరణులు బలపడటానికి దోహదం చేస్తాయి.
జవాబు:
రాజ్యాంగ యంత్రాంగమే కుప్పకూలే అంచున ఉండటంతో మానవహక్కుల ఉల్లంఘన సమర్థనీయమే.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

126. రాజీవ్ గాంధీ పాలనలో చేపట్టిన సంస్కరణ కానిది
→ శాంతి, భద్రతలు నెలకొల్పటం
→ టెలికాం విప్లవం
→ పంచాయితీరాజ్ సంస్థలను క్రియాశీలంగా మార్చటం.
→ ఆర్థిక విధానాలు కట్టుదిట్టం చేయటం.
జవాబు:
ఆర్థిక విధానాలు కట్టుదిట్టం చేయటం.

127. ఈ క్రింది కేసును పరిశీలించి, ఇచ్చిన ప్రశ్నకు సరియైన సమాధానము ఎంచుకోండి.
I. భర్త నుంచి విడాకులు పొందిన షాబానో అనే మహిళ కేసులో సుప్రీంకోర్టు ఆమె మాజీ భర్త ఆమెకు భరణం చెల్లించాలని తీర్పు ఇచ్చింది.
II. ఈ తీర్పు ఇస్లామిక్ చట్టంలో జోక్యం చేసుకుంటోందని దీనిని అనుమతిస్తే తమ మత జీవితంలో జోక్యం మరింత పెరుగుతుందని నిరసనలు చేపట్టారు.
III. 1986లో కొత్త చట్టం ప్రకారం ముస్లిం భర్తలకు ఎటువంటి బాధ్యత లేకుండా చేసి విడాకులు పొందిన మహిళలకు మూడు నెలలపాటు ముస్లిం మత సంస్థలు భరణం ఇస్తే సరిపోతుంది.
పై కేసును పరిశీలించిన మీదట మీకు అవగత మవుతున్న అంశం.
జవాబు:
ముస్లిం మహిళల ప్రయోజనాలు కాదని మత ఛాందసవాదులకు తలఒగ్గడం జరిగింది.

128. కేంద్రంలో ఏ ఒక్క పార్టీ కూడా తనంతట తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యలేకపోవడంతో జాతీయ, ప్రాంతీయ పార్టీలు కలసి ఇలాంటి ప్రభుత్వాలని ఏర్పరచాయి.
జవాబు:
సంకీర్ణ ప్రభుత్వాలు

129. వామపక్ష రాజకీయ పార్టీ కానిది.
A) CPI
B) CPM
C) ఫార్వర్డ్ బ్లాక్
D) SAD
జవాబు:
D) SAD

130. సంకీర్ణ ప్రభుత్వంలో ఏదో ఒక భాగస్వామి మద్దతు ఉపసంహరించుకుంటుదన్న భయంతో తీవ్ర మార్పులను తెచ్చే విధానాలను అమలుచేయ్యటానికి భయపడటాన్ని ఇలా అనవచ్చు.
జవాబు:
విధాన పక్షపాతం.

131. క్రింది స్టేట్మెంట్లను పరిశీలించి, సరియైన సమాధానము ఎంచుకోండి.
I. 1978 జూన్లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ‘ఆపరేషన్ బర్గా’ చేపట్టింది.
II. భూస్వాముల పేర్లను నమోదుచేసి, వాళ్ల హక్కులను కాపాడటానికి దీనిని చేపట్టారు.
III. ఆపరేషన్ బర్గాలో చేపట్టిన చర్యల ఫలితంగా పశ్చిమ బెంగాల్ లో వ్యవసాయ ఉత్పత్తి 30% దాకా పెరిగింది.
A) I, II & III సరియైనవి
B) I, II మాత్రమే సరియైనవి
C) I, III మాత్రమే సరియైనవి
D) II, III మాత్రమే సరియైనవి
జవాబు:
C) I, III మాత్రమే సరియైనవి.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

132. క్రింది స్టేట్ మెంట్లను పరిశీలించి, సరియైన సమాధానము జ. ఆర్థిక విధానాలు కట్టుదిట్టం చేయటం ఎంచుకోండి.
I. ప్రభుత్వ ఉద్యోగాలలోను, విద్యాసదుపాయాల లోను ఇతర వెనకబడిన తరగతులకు రిజర్వేషను ఉండాలని మండల్ కమీషన్ సిఫారసు చేసింది.
II. ఈ నివేదికను నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం వెలికి తీసింది.
III. వెనకబడిన తరగతులకు విద్య, ఉద్యోగాలలో 29% రిజర్వేషన్లను అమలు చేస్తున్నట్లు వి.పి.సింగ్ ప్రభుత్వం ప్రకటించింది.
IV. ఈ ప్రకటనకు భారతదేశం అంతట హర్షం వ్యక్తపరచి ఆదరించాయి.
A) I, II, III & IV సరియైనవి.
B) I, II మాత్రమే సరియైనవి
C) I, II, III మాత్రమే సరియైనవి
D) I, II, IV మాత్రమే సరియైనవి
జవాబు:
B) I, II మాత్రమే సరియైనవి

133. ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించి, సరియైన సమాధానము ఎంచుకోండి.
I. 73వ రాజ్యాంగ సవరణ గ్రామస్థాయిలో స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలను కల్పించింది.
II. 74వ రాజ్యాంగ సవరణ పట్టణ, నగరాల్లో స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలను కల్పించింది.
II. మొత్తం స్థానాల్లో 2/3 వంతు స్థానాలను స్త్రీలకు కేటాయించారు.
A) I, II & III సరియైనవి
B) I, II మాత్రమే సరియైనవి
C) II, III మాత్రమే సరియైనవి
D) I, III మాత్రమే సరియైనవి
జవాబు:
B) I, II మాత్రమే సరియైనవి

134. 1991లో భారతదేశం సరళీకృత ఆర్థిక విధానాలను అవలంభించటానికి కారణం కానిది.
→ అంతర్జాతీయ ద్రవ్యనిధి షరతులు
→ విదేశీ మారక నిల్వలు అడుగంటడం
→ తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి
→ పారిశ్రామికాభివృద్ధి సాధించటానికి
జవాబు:
పారిశ్రామికాభివృద్ధి సాధించటానికి

135. ఈ క్రింది సంఘటనలను సరియైన కాలక్రమంలో ఉంచండి.
i) తెలుగుదేశం పార్టీ స్థాపన
ii) ఆపరేషన్ బ్లూస్టార్
iii) అద్వా నీ రథయాత్ర
iv) సరళీకృత ఆర్థిక విధానం
A) i, ii, iii, iv
B) i, ii, iv, iii
C) i, iii, ii, iv a
D) iv, i, ii, iii
జవాబు:
A) i, ii, iii, iv

136. క్రింది వానిలో సరియైన జత కానిది
A) మొరార్జీదేశాయ్ – మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి
B) వి.పి.సింగ్-మొదటి సంకీర్ణ ప్రభుత్వ ప్రధానమంత్రి
C) రాజీవ్ గాంధీ – UPA మొదటి ప్రధానమంత్రి
D) పి.వి.నరసింహారావు-సరళీకృత ఆర్ధిక విధానాలు
జవాబు:
C) రాజీవ్ గాంధీ – UPA మొదటి ప్రధానమంత్రి

క్రింది సమాచారమును పరిశీలించి, ఇచ్చిన ప్రశ్నలకు సరియైన సమాధానము ఎంచుకోండి.
AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000 1

137. మూడు సంకీర్ణ ప్రభుత్వాల్లో అధికారం పంచుకున్న పార్టీ.
జవాబు:
JKNC

138. AIADMK ఈ పార్టీ ఏ రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీ?
జవాబు:
తమిళనాడు

139. NDA సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు మాత్రమే ఇచ్చిన పార్టీ
జవాబు:
TDP

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

140. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం పడిపోయిన సంవత్సరం
జవాబు:
1990

141. యునైటెడ్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వంలో గల జాతీయ పార్టీ పేరు రాయండి.
జవాబు:
సి.పి.ఐ.

142. NDA (అలయన్స్) ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఏ పార్టీ మద్దతును ఇచ్చింది?
జవాబు:
TDP

143. నేషనల్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వంలోని ఏవైనా రెండు ప్రాంతీయ పార్టీలను పేర్కొనండి?
జవాబు:
DMK, TDP, AGP,

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

144. యునైటెడ్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వానికి బయటి నుండి మద్దతు నిచ్చిన పార్టీ ఏది?
జవాబు:
సి.పి.యం.

10th Class Social 19th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
మీకీయబడిన భారతదేశ రాజకీయ పటంనందు ఏవేని రెండు ప్రాంతీయ పార్టీలు ప్రస్తుతం అధికారంలో గల రాష్ట్రాలను గుర్తించండి.
జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000 2

ప్రశ్న 2.
‘టెలీకం విప్లవం’ దేనికి దోహదపడింది?
జవాబు:
ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానంతో దేశంలో టెలిఫోనిక్ నెట్ వర్క్ వేగంగా విస్తరించటానికి ఇది దోహదపడింది. భారతదేశంలో టెలిఫోన్ విప్లవాన్ని ప్రారంభించింది రాజీవ్ గాంధీ.

ప్రశ్న 3.
సంకీర్ణ ప్రభుత్వం అనగా ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
అనేక జాతీయ, ప్రాంతీయ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం.
ఉదా : ఎన్.డి.ఏ, యు.పి.ఏ.
(లేదా)
సంకీర్ణ ప్రభుత్వము :
ఏ ఒక్క రాజకీయ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత రానప్పుడు కొన్ని పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే దానిని సంకీర్ణ ప్రభుత్వం అంటారు.

ప్రశ్న 4.
ప్రాంతీయ రాజకీయ పార్టీలకు రెండు ఉదాహరణలీయండి.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ : Y.S.R.C.P
తమిళనాడు : D.M.K, AIADMK
అసోం : AGP
జమ్మూ & కాశ్మీర్ : National Conference
పంజాబ్ : శిరోమణి అకాలీదళ్ళ

ప్రశ్న 5.
ఎన్.టి. రామారావు ప్రవేశపెట్టిన ఏ సంక్షేమ పథకాలు కొన్ని మార్పులతో నేటికీ ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్నాయి?
(లేదా)
యన్.టి.రామారావు ప్రవేశపెట్టిన ఏవేని రెండు అంశాలను పేర్కొనండి.
జవాబు:

  1. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం.
  2. పేదలకు సబ్సిడీ ధరకు బియ్యం అందించడం.

ప్రశ్న 6.
73వ రాజ్యాంగ సవరణ గురించి రాయండి.
జవాబు:
గ్రామీణ స్థాయిలో స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 7.
ఇవ్వబడిన సమాచారాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నకు సమాధానం రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000 7
యునైటెడ్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వంలో గల జాతీయ పార్టీ పేరు రాయండి.
జవాబు:
సి.పి.ఐ.

ప్రశ్న 8.
రాజ్యాంగంలోని మౌలిక విలువలు ఏవి?
జవాబు:
రాజ్యాంగంలోని మౌలిక విలువలు :

  1. ప్రజాస్వామ్యం
  2. దేశ ఐక్యత
  3. సమగ్రత
  4. సామాజిక, ఆర్థిక మార్పులు.

ప్రశ్న 9.
అత్యవసర పరిస్థితిని ముగించిన సంవత్సరమేది?
జవాబు:
అత్యవసర పరిస్థితిని ముగించిన సంవత్సరం – 1977.

ప్రశ్న 10.
ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ఏర్పాటైన సంవత్సరం ఏది?
జవాబు:
ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ఏర్పాటైన సంవత్సరం-1980.

ప్రశ్న 11.
ఆపరేషన్ ‘బ్లూ స్టార్’ చేపట్టిన సంవత్సరం ఏది?
జవాబు:
ఆపరేషన్ ‘బ్లూ స్టార్’ చేపట్టిన సంవత్సరం-1984.

ప్రశ్న 12.
ఇందిరాగాంధీ హత్యకు గురైన సంవత్సరం ఏది?
జవాబు:
ఇందిరాగాంధీ హత్యకు గురైన సంవత్సరం-1984.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 13.
భారతదేశ ప్రజాస్వామ్యానికి పరీక్షా కాలం వంటిది ఏది?
జవాబు:
భారతదేశ ప్రజాస్వామ్యానికి పరీక్షా కాలం వంటిది 1976-85.

ప్రశ్న 14.
1975-85 మధ్యకాలంలో భారతదేశ ప్రజాస్వామ్యం యొక్క ప్రాధాన్యత ఏమిటి?
జవాబు:
1975-85 మధ్యకాలంలో భారతదేశం ఏక పార్టీ ప్రజాస్వామ్యంలోకి జారిపోకుండా సమర్థవంతంగా నివారించబడింది.

ప్రశ్న 15.
1975-85 మధ్యకాలంలో భారతదేశంలో ఉద్భవించిన ఉద్యమాలు ఏవి?
జవాబు:
1975-85 మధ్యకాలంలో భారతదేశంలో ఉద్భవించిన ఉద్యమాలు పర్యావరణ ఉద్యమం, స్త్రీవాద ఉద్యమం, పౌరహక్కుల ఉద్యమం, సాహిత్య ఉద్యమం.

ప్రశ్న 16.
జనతా పార్టీగా ఏర్పడాలని నిర్ణయించిన పార్టీలు ఏవి?
జవాబు:
‘జనతా పార్టీగా ఏర్పడాలని నిర్ణయించిన పార్టీలు :

  1. కాంగ్రెస్ (ఓ)
  2. స్వతంత్ర పార్టీ
  3. భారతీయ జనసంఘ్
  4. భారతీయ లోక్ దళ్
  5. సోషలిస్టు పార్టీ.

ప్రశ్న 17.
కాంగ్రెస్ వ్యతిరేక, అత్యవసర పరిస్థితి వ్యతిరేక పార్టీలు అన్నీ ఒక తాటి కిందకు వచ్చి ఎన్నికలలో పోటీ చేయటంలో ముఖ్యపాత్ర పోషించినవారెవరు?
జవాబు:
జయప్రకాష్ నారాయణ్, ఆచార్య జె.బి. కృపలాని వంటి వారు కాంగ్రెస్ వ్యతిరేక, అత్యవసర పరిస్థితి వ్యతిరేక పార్టీలు అన్నీ ఒక తాటి కిందకు తేవడంలో ప్రధానపాత్ర పోషించారు.

ప్రశ్న 18.
భారతదేశ ప్రజాస్వామ్యానికి ఒక చారిత్రాత్మకమైన ఎన్నిక ఏది?
జవాబు:
భారతదేశ ప్రజాస్వామ్యానికి ఒక చారిత్రాత్మకమైన ఎన్నిక 1977 సాధారణ ఎన్నికలు.

ప్రశ్న 19.
జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీని ఓడించిన పార్టీ ఏది?
జవాబు:
జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీని ఓడించిన పార్టీ జనతా పార్టీ.

ప్రశ్న 20.
1977 సాధారణ ఎన్నికలలో గెలుపొందిన జనతా పార్టీ ఎన్ని రాష్ట్రాలలోని కాంగ్రెస్ ప్రభుత్వాలను తొలగించింది?
జవాబు:
1977 సాధారణ ఎన్నికలలో గెలుపొందిన జనతా పార్టీ 9 రాష్ట్రాలలోని కాంగ్రెస్ ప్రభుత్వాలను తొలగించింది.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 21.
1977 సాధారణ ఎన్నికల తరువాత జనతా పార్టీ ఏ ఏ రాష్ట్రాలలో విజయం సాధించింది?
జవాబు:
1977 సాధారణ ఎన్నికల తరువాత జనతా పార్టీ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాలలో విజయం సాధించింది.

ప్రశ్న 22.
పంజాబ్ కి పరిమితమై సిక్కుల కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న పార్టీ ఏది?
జవాబు:
పంజాబ్ కి పరిమితమై సిక్కుల కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న పార్టీ శిరోమణి అకాలీ దళ్.

ప్రశ్న 23.
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించే అధికరణం ఏది?
జవాబు:
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించే అధికరణం 356.

ప్రశ్న 24.
జనతా పార్టీ అధికారంలోకి రావడానికి చేసిన వాగ్దానం ఏది?
జవాబు:
జనతా పార్టీ అధికారంలోకి రావడానికి చేసిన వాగ్దానం ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్చని పునరుద్ధరిస్తామనడం.

ప్రశ్న 25.
భారతదేశంలోని విభిన్న ప్రాంతాల్లో మరింత స్వయం ప్రతిపత్తి కోసం జరిగిన మూడు ఉద్యమాలు ఏవి?
జవాబు:
భారతదేశంలోని విభిన్న ప్రాంతాల్లో మరింత స్వయం ప్రతిపత్తి కోసం జరిగిన మూడు ఉద్యమాలు

  1. ఆంధ్రప్రదేశ్
  2. అసోం
  3. పంజాబ్ ఉద్యమాలు.

ప్రశ్న 26.
ఎన్.టి. రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించింది ఎప్పుడు?
జవాబు:
ఎన్.టి. రామారావు తెలుగుదేశం పార్టీని 1982లో తన 60వ పుట్టినరోజున స్థాపించారు.

ప్రశ్న 27.
ఎ.ఎ.ఎస్.యు అనగానేమి?
జవాబు:
అఖిల అసోం విద్యార్థి సంఘం.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 28.
టీ పరిశ్రమ ప్రధానంగా ఏ నగరంలో ఉంది?
జవాబు:
టీ పరిశ్రమ ప్రధానంగా కోల్‌కతాలో ఉంది.

ప్రశ్న 29.
అంతర్గత వలస ప్రాంతంగా దేనిని పరిగణించారు?
జవాబు:
అంతర్గత వలస ప్రాంతంగా ‘అసోం’ ను పరిగణించారు.

ప్రశ్న 30.
అసోంలోని ఆదిమ వాసులెవరు?
జవాబు:
అసోంలోని ఆదిమవాసులు బోడోలు, ఖాసీలు, మిజోల, కర్జీలు.

ప్రశ్న 31.
బర్మా ప్రస్తుతం ఏ పేరుతో పిలువబడుతోంది?
జవాబు:
బర్మా ప్రస్తుతం మయన్మార్ పేరుతో పిలువబడుతోంది.

ప్రశ్న 32.
చండీగఢ్ ను కేంద్రపాలిత ప్రాంతంగా కాక తమ రాష్ట్రానికే చెందాలని కోరినది?
జవాబు:
చండీగఢ్ ను కేంద్రపాలిత ప్రాంతంగా కాక తమ రాష్ట్రానికే చెందాలని కోరినది-పంజాబ్.

ప్రశ్న 33.
తీవ్రవాద సిక్కుల, బృందానికి నాయకుడిగా వ్యవహరించిన వారెవరు?
జవాబు:
తీవ్రవాద సిక్కుల బృందానికి నాయకుడిగా వ్యవహరించింది ‘భింద్రేన్ వాలా.

ప్రశ్న 34.
సిక్కుల పవిత్రస్థలమేది?
జవాబు:
సిక్కుల పవిత్రస్థలం గోల్డెన్ టెంపుల్.

ప్రశ్న 35.
ఖలిస్తాను స్వతంత్రదేశంగా ప్రకటించినదెప్పుడు?
జవాబు:
1986 ఏప్రిల్ లో అకల్ తఖ్ వద్ద జరిగిన సమావేశంలో ఖలిస్తానను స్వతంత్ర దేశంగా ప్రకటించారు.

ప్రశ్న 36.
రాజీవ్ గాంధీ ఏ ఏ ప్రాంతాలలో శాంతి ప్రక్రియలు మొదలుపెట్టారు?
జవాబు:
రాజీవ్ గాంధీ పంజాబ్, అసోం, మిజోరంలలో, పొరుగుదేశమైన శ్రీలంకలో కూడా శాంతి ప్రక్రియలు మొదలు పెట్టారు.

ప్రశ్న 37.
శ్రీలంక నుంచి అంతిమంగా భారతదేశం తన సైన్యాన్ని వెనక్కి తీసేసుకున్న సంవత్సరమేది?
జవాబు:
శ్రీలంక నుంచి అంతిమంగా భారతదేశం తన సైన్యాన్ని వెనక్కి తీసేసుకున్న సంవత్సరం-1989.

ప్రశ్న 38.
పేదల కోసం ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయిలో 15 పైసలు కూడా అతడికి చేరటం లేదని అన్నవారెవరు?
జవాబు:
పేదల కోసం ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయిలో 15 పైసలు కూడా అతడికి చేరటం లేదని అన్నవారు రాజీవ్ గాంధీ.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 39.
సరళీకృత ఆర్థిక విధానం వైపు పయనం మొదలుపెట్టింది ఎవరు?
జవాబు:
1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ లో అమలులో ఉన్న కొన్ని నియంత్రణలను పరిమితులను తొలగించి సరళీకృత ఆర్థిక విధానంవైపు పయనం మొదలుపెట్టారు.

ప్రశ్న 40.
భారతదేశంలో టెలికం విప్లవం అనబడుతున్న దానిని ఆరంభించినదెవరు?
జవాబు:
భారతదేశంలో టెలికం విప్లవం అనబడుతున్న దానిని ఆరంభించింది-రాజీవ్ గాంధీ.

ప్రశ్న 41.
భర్త నుంచి విడాకులు పొందిన షా బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంవత్సరం ఏది?
జవాబు:
భర్త నుంచి విడాకులు పొందిన షా బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంవత్సరం – 1985.

ప్రశ్న 42.
ఉత్తరప్రదేశ్, హర్యానా రైతులు దేనికోసం మహేంద్రసింగ్ తికాయత్ నేతృత్వంలో పోరాటం చేస్తున్నారు?
జవాబు:
వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన ధరలకోసం డీజిల్, రసాయనిక ఎరువులు, విద్యుత్ వంటి ఉత్పాదకాలపై సబ్సిడీల కోసం పోరాటం చేస్తున్నారు.

ప్రశ్న 43.
ఎప్పటి నుండి జాతీయస్థాయిలో సంకీర్ణ/ మైనారిటీ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి?
జవాబు:
1989 నుంచి జాతీయస్థాయిలో ఏర్పడిన ప్రభుత్వాలన్నీ సంకీర్ణ మైనారిటీ ప్రభుత్వాలే.

ప్రశ్న 44.
బెంగాలులో వామపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఎవరు?
జవాబు:
బెంగాలులో వామపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది జ్యోతిబసు.

ప్రశ్న 45.
బర్గాదార్లు అంటే ఎవరు?
జవాబు:
కౌలుదార్లను బెంగాలీలో బర్గాదార్లు అంటారు.

ప్రశ్న 46.
ఒబిసిలు అంటే ఎవరు?
జవాబు:
ఇతర వెనుకబడిన తరగతులకు చెందినవారు.

ప్రశ్న 47.
ఒబిసిలకు ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించారు?
జవాబు:
సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 27% రిజర్వేషన్లు కల్పించారు.

ప్రశ్న 48.
హిందువుల మత అస్తిత్వం ఆధారంగా దేశాన్ని నిర్మించాలన్నది ఏ రాజకీయ పార్టీ ధోరణి?
జవాబు:
హిందువుల మత అస్తిత్వం ఆధారంగా దేశాన్ని నిర్మించాలన్న రాజకీయ ధోరణికి భారతీయ జనతాపార్టీ నేతృత్వం వహిస్తోంది.

ప్రశ్న 49.
ఎల్.కె. అద్వానీ రథయాత్ర ఎప్పుడు చేపట్టారు?
జవాబు:
ఎల్.కె. అద్వానీ రథయాత్ర 1990లో సోమనాథ్ నుంచి అయోధ్య వరకు చేపట్టారు.

ప్రశ్న 50.
వివాదాస్పద మసీదు ధ్వంసం చేయబడిన సంవత్సరమేది?
జవాబు:
వివాదాస్పద మసీదు ధ్వంసం చేయబడిన సంవత్సరం-1992.

ప్రశ్న 51.
సరళీకృత ఆర్ధిక విధానాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఏది?
జవాబు:
సరళీకృత ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం 1992లో ఏర్పడిన పి.వి. నరసింహారావు ప్రభుత్వం.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 52.
రాజ్యాంగంలో 356 అధికరణం యొక్క ప్రత్యేకత ఏమిటి?
జవాబు:

  1. రాజ్యాంగంలోని 356 అధికరణం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం, రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాన్ని పాలించుకోలేకపోతోందని గవర్నరు అభిప్రాయపడితే రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించమని, ఇంకా అవసరమైతే శాసన సభను రద్దు చెయ్యమని రాష్ట్రపతికి సిఫారసు చేయవచ్చు.
  2. అప్పుడు ప్రధానమంత్రి సలహాతో రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రపతి తొలగించి పాలనా బాధ్యతలను చేపట్టమని రాష్ట్ర గవర్నరును కోరవచ్చు.

ప్రశ్న 53.
సంకీర్ణ ప్రభుత్వాలకు రెండు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
సంకీర్ణ ప్రభుత్వాలకు ఉదాహరణలు :

  1. కాంగ్రెస్ నేతృత్వంలోని UPA – యునైటెడ్ ప్రోగ్రెస్సివ్ అలయెన్స్.
  2. BJP నేతృత్వంలోని NDA – నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్.

ప్రశ్న 54.
AIADMK ని విస్తరింపుము.
జవాబు:
All India Anna Dravida Munnetra Kazagam
అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం

10th Class Social 19th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.

1. అత్యవసర పరిస్థితి ముగింపు, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్
కింద జనతా పార్టీ ప్రభుత్వ ఏర్పాటు
1977
2. ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెసు ప్రభుత్వ ఏర్పాటు1980
3. T.D.P ఏర్పాటు1982
4. ఆపరేషన్ బ్లూస్టార్, ఇందిరాగాంధీ హత్య1984
5. రాజీవ్ గాంధీ పంజాబ్, అసోంలలో శాంతి ప్రక్రియ1985

ప్రశ్నలు:
1) కేంద్రంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెసేతర పార్టీ ఏది?
2) తెలుగుదేశం పార్టీ స్థాపకుడు ఎవరు?
జవాబు:

  1. జనతా పార్టీ
  2. నందమూరి తారక రామారావు (NTR)

ప్రశ్న 2.
2014 సాధారణ ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీలు, గెలిచిన సీట్ల సంఖ్యను సూచించే క్రింది ‘పై’ రేఖాచిత్రాన్ని పరిశీలించి రాజకీయ పార్టీల బలాబలాలను విశ్లేషించండి.
AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000 3
జవాబు:

  1. 2014 సాధారణ ఎన్నికలలో బి.జె.పి.కి 282 ఎం.పి. స్థానాలు లభించాయి.
  2. గతంలో పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం 44 స్థానాలను మాత్రమే సాధించింది.
  3. ప్రాంతీయ పార్టీలైన ఎ.ఐ.ఎ.డి.ఎం.కె., తెలుగుదేశంలకు వరుసగా 37, 16 స్థానాలు లభించాయి.
  4. ఇతరులకు 140 స్థానాలు లభించాయి.

ప్రశ్న 3.
క్రింది సమాచారం చదవండి. సమాధానం రాయండి.

“పంజాబ్ లో తీవ్రవాదాన్ని అణచివెయ్యటానికి ప్రభుత్వం చాలా తీవ్ర పద్ధతులను ఉపయోగించింది. వీటిల్లో అనేకం పౌరుల రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించాయని భావించారు. తీవ్రవాద కార్యకలాపాల వల్ల రాజ్యాంగ యంత్రాంగమే కుప్పకూలే అంచున ఉండటంతో మానవ హక్కుల, రాజ్యాంగ ఉల్లంఘన సమర్థనీయమే అని చాలామంది పరిశీలకులు భావించారు.”
పై సమాచారంపై మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి.
జవాబు:
1. రాజ్యాంగ యంత్రాంగమే కుప్పకూలే అంచున ఉన్నప్పుడు మానవ హక్కుల, రాజ్యాంగ ఉల్లంఘన సమర్ధనీయమే అని నా అభిప్రాయం.
(లేదా)
2. కొంతమంది తీవ్రవాదుల వలన ఏర్పడే సంక్షోభం నుండి దేశాన్ని రక్షించడానికి సాధారణ పౌరులను బాధించకూడదు.

ప్రశ్న 4.
ఇచ్చిన దత్తాంశాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000 1
A) నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలలో అధికారాలు ఉండడానికి బయట నుండి మద్దతు ఇచ్చిన పార్టీలు ఏవి?
B) మూడు ప్రభుత్వాలలోను అధికారంలో కొనసాగిన పార్టీ ఏది?
జవాబు:
A) నేషనల్ ఫ్రంట్ కు బయట నుంచి మద్దతు ఇచ్చిన పార్టీలు :
1) సి.పి.ఎం.
2) సి.పి.ఐ.
3) బి.జె.పి.
యునైటెడ్ ఫ్రంట్ కు బయట నుంచి మద్దతు ఇచ్చిన పార్టీ సి.పి.యం.

B) జమ్మూ – కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (JKNC)

ప్రశ్న 5.
ఇటీవలి కాలంలో ప్రాంతీయ పార్టీలు బలోపేతం కావటానికి దారితీసిన పరిస్థితులేవి?
జవాబు:

  1. జాతీయ నాయకత్వం సరిగా లేకపోవడమే ప్రధాన కారణం.
  2. ప్రాంతీయ, భాషా మతాభిమానాలు పెరిగిపోవడం.
  3. వివిధ ప్రజలకు ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించడం.
  4. తమ ప్రాంత సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడటం కోసం కృషి చేయడం వలన.
  5. తమ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేసుకోవాలనే కోరిక.
  6. తమకు స్వయం ప్రతిపత్తి కల్పించుకొని వారి గౌరవాన్ని కాపాడుకోవడం కోసం కృషి చేయడం వలన ప్రాంతీయ పార్టీలు బలోపేతము అయినాయి.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 6.
ప్రస్తుత ప్రభుత్వాలు ప్రారంభించిన ప్రజా సంక్షేమ పథకాల గురించి వ్రాయుము.
జవాబు:
ప్రస్తుత ప్రభుత్వాలు ప్రారంభించిన ప్రజాసంక్షేమ పథకాలు :

  1. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం
  2. ఉపాధి హామీ పథకం
  3. వృద్ధాప్య పింఛను
  4. గృహ వసతి
  5. ప్రజాపంపిణీ వ్యవస్థ – పేదలకు రూపాయికే కిలో బియ్యం
  6. పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంటు

ప్రశ్న 7.
ఈ క్రింది సమాచారాన్ని చదివి, క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
1980లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది. వెంటనే తొమ్మిది రాష్ట్రాలలోని కాంగ్రెసేతర, జనతా ప్రభుత్వాలను రద్దుచేసి జనతా పార్టీ రీతిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో మినహాయించి మిగిలిన అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ విజయం సాధించింది.
ప్రశ్నలు :
A) 1980 కు ముందు ఏ పార్టీ అధికారంలో ఉంది?
జవాబు:
1980కి ముందు జనతాపార్టీ అధికారంలో ఉంది.

B) ఏ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ ఓడిపోయింది?
జవాబు:
తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ లలో కాంగ్రెస్ ఓడిపోయింది.

ప్రశ్న 8.
భారత ప్రజాస్వామ్యాన్ని అత్యవసర పరిస్థితి ఏవిధంగా వెనక్కు తీసుకుపోయింది?
జవాబు:

  1. ఐదు సంవత్సరాలకు ఒకసారి జరగవలసిన సాధారణ ఎన్నికలను వాయిదా వేశారు.
  2. ప్రాథమిక హక్కులు హరించివేయబడ్డాయి.
  3. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగింది.
  4. రాజకీయ ప్రత్యర్థులను జైలుపాలు చేశారు.

పైన తెలిపిన అప్రజాస్వామిక చర్యల కారణంగా అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యం వెనక్కి వెళ్ళిందని చెప్పవచ్చు.

ప్రశ్న 9.
ఈ క్రింది పట్టికను పరిశీలించి, ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.

1. రాజీవ్ గాంధీ హత్య, పి.వి. నరసింహారావు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం1991
2. ఆర్థిక సరళీకరణ విధానాలు1990
3. బాబ్రీ మస్జిద్ కూల్చివేత1992
4. దేవెగౌడ, ఐ.కె. గుజ్రాలు ప్రధానమంత్రులుగా నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం1996
5. ఎ.బి. వాజ్ పేయి నేతృత్వంలో ఎన్.డి.ఏ. ప్రభుత్వం1998

a) 1996 ఎన్నికలలో ఏ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది?
b) పై పట్టికలోని సంకీర్ణ ప్రభుత్వాలు ఏవి?
జవాబు:
a) నేషనల్ ఫ్రంట్
b) నేషనల్ ఫ్రంట్ మరియు NDA ప్రభుత్వాలు

ప్రశ్న 10.
ఈ క్రింది పట్టికను పరిశీలించి, విశ్లేషించండి.
పట్టిక : 2014 ఎన్నికలలో వివిధ పార్టీలు గెలిచిన లోకసభ స్థానాలు

రాజకీయ పార్టీసాధించిన స్థానాలు
1. భారతీయ జనతా పార్టీ (BJP)282
2. భారత జాతీయ కాంగ్రెస్ (INC)45
3. తెలుగుదేశం పార్టీ (TDP)16
4. తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)11
5. వామ పక్షాలు (CPI + CPI(M)]10

జవాబు:
పట్టిక 2014 లోక్ సభ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తోంది. భారతీయ జనతా పార్టీకు అత్యధిక మెజార్టీ రాగా వామపక్షాలు, మాత్రం అట్టడుగు స్థాయిలో మిగిలిపోయాయి.

ఎవరితో పొత్తు పెట్టుకోకుండానే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేయగలదు. దగ్గర దగ్గర ఐదు దశాబ్దాలు దేశాన్ని ఏలిన కాంగ్రెసు ద్వితీయ స్థానానికి, రెండంకెల స్థానానికి పడిపోయింది.

ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీ అయిన వామపక్షాల కంటే అధిక స్థానాలు గెలుచుకున్నాయి. గెలిచిన వారు వారిపై ప్రజలుంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఓడినవారు ఆత్మ విమర్శ చేసుకుని మళ్ళీ ఎన్నికలలో వారి ఉనికిని కాపాడుకోవాలి.

ప్రశ్న 11.
క్రింది సమాచారం ఆధారంగా దిగువ ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

విపి సింగ్, చంద్రశేఖర్‌తో జనతాదళ్ ప్రభుత్వాల ఏర్పాటు1989
మండల కమిషన్ సిఫారసుల అమలుకు నిర్ణయం1989
రామజన్మభూమి రథయాత్ర1990
రాజీవ్ గాంధీ హత్య, పివి నరసింహారావు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం1991
ఆర్థిక సరళీకరణ విధానాలు1990
బాబ్రీ మసీదు కూల్చివేత1992
దేవెగౌడ, ఐకె గుజ్రాలు ప్రధానమంత్రులుగా నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం1996
ఎబి వాజ్ పేయి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం1998

i) బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో గల ప్రధానమంత్రి పేరు తెలపండి.
జవాబు:
పి.వి. నరసింహారావు

ii) సంకీర్ణ ప్రభుత్వాలకు రెండు ఉదాహరణలివ్వండి.
జవాబు:

  1. జనతాదళ్ ప్రభుత్వం
  2. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం
  3. NDA ప్రభుత్వం

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 12.
క్రింది రాజకీయ పార్టీలను “జాతీయ, ప్రాంతీయ” పార్టీలుగా వర్గీకరించండి.
బి.జె.పి., వై.యస్.ఆర్.సి.పి., టి.డి.పి., సి.పి.యమ్., సి.పి.ఐ., డి.యమ్.కె., కాంగ్రెస్-ఐ, ఎ.జి.పి.
జవాబు:

జాతీయ పార్టీలుప్రాంతీయ పార్టీలు
భారతీయ జనతా పార్టీD.M.K
కాంగ్రెస్ – (I)T.D.P
CPIA.G.P
CPMY.S.R.C.P

ప్రశ్న 13.
క్రింది పట్టికను పరిశీలించి విశ్లేషిస్తూ ఒక పేరాగ్రాఫ్ రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000 4
జవాబు:
పై పట్టిక ఏమి తెలియచేస్తుందంటే 2014 ఎన్నికలలో ముఖ్యమైన రెండు ప్రధాన పార్టీలు అయిన UPA కూటమి మరియు NDA కూటములు సాధించిన సీట్లను ఓట్ల శాతాన్ని ఇచ్చారు. 2014 ఎన్నికలలో UPA Congress కూటమి 19.31% ఓట్లు మరియు 44 లోకసభ స్థానాలను పొందింది. BJP 31% ఓట్లతో 282 స్థానాలను పొంది అతిపెద్ద పార్టీగా అవతరించినది. అది ఏమి తెలియచేస్తుందంటే స్వాతంత్ర్యానంతరం-1952 నుండి పరిపాలించిన పార్టీని కాదని BJP కి అధికారం ప్రజలు ఇచ్చారు.

దీనికి కారణం ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ లో అవినీతి రాజ్యం ఏలుతుంది. చాలామంది కాంగ్రెస్ నాయకులు కోర్టులలో అవినీతి కేసులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో ప్రజలకు అవినీతి రహిత సమాజం, నూతన సంస్కరణలతో అభివృద్ధి చెందుతున్న సమాజం కావాలి. అందుకోసం వారు కొత్త పార్టీలకు అధికారం ఇవ్వడం జరిగింది. ఇకముందు రాబోయే ఎన్నికలలో ఏమి జరుగుతుందో చూద్దాం.

ప్రశ్న 14.
“సంకీర్ణ ప్రభుత్వాలు రాజకీయ అస్థిరతకు కారణమవుతున్నాయి.” – దీనిపై వ్యాఖ్యానింపుము.
జవాబు:

  1. కొన్నిసార్లు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసినంత మెజారిటీ ఏ ఒక్క పార్టీకి రాదు. ఇటువంటి పరిస్థితులలో కొన్ని పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాయి.
  2. ప్రభుత్వ విధానాలకు సంబంధించి ఈ పార్టీల మధ్య ఒక ఉమ్మడి ఒప్పందం కుదరాల్సి వస్తుంది. కానీ ఇది అంత తేలికైన పని కాదు.
  3. వేర్వేరు పార్టీలు తమ ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాయి.
  4. ఏ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంటుందో అన్న భయంతో ప్రభుత్వాలు ఏ విధానాన్ని అమలు చేయలేని స్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వాలు అస్థిరాలు అవుతాయి.

ప్రశ్న 15.
‘కొన్నిసార్లు సంకీర్ణ ప్రభుత్వాల వల్ల ‘విధాన పక్షవాతం’ సంభవిస్తుంది. దీనితో ఏకీభవిస్తారా ? మీ అభిప్రాయం తెల్పండి.
జవాబు:
అవును. నేను దీనితో ఏకీభవిస్తాను. ఏదో ఒక భాగస్వామి మద్దతు ఉపసంహరించుకుంటుందన్న భయంతో తీవ్ర
మార్పులను తెచ్చే విధానాలను అమలు చెయ్యటానికి సంకీర్ణ ప్రభుత్వాలు భయపడతాయి.

ప్రశ్న 16.
భారతదేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు అవలంబించడం వలన కలిగిన ఫలితాలేమిటి?
జవాబు:
భారతదేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు – ఫలితాలు :

  1. విదేశీ సరుకులు భారత మార్కెట్లో ప్రవేశించాయి.
  2. చౌకగా లభించే విదేశీ ఉత్పత్తులతో పోటీపడలేక చాలా భారతీయ కర్మాగారాలు మూతపడ్డాయి.
  3. భారతీయ పారిశ్రామికవేత్తలు ప్రపంచస్థాయి తయారీదారులతో పోటీపడవలసి వచ్చింది.
  4. విదేశీ కంపెనీలు వచ్చి భారతదేశంలో సంస్థలు నెలకొల్పాయి.
  5. అనేక సబ్సిడీలకు కోతలు విధించారు.
  6. ప్రైవేటీకరణ పెరిగింది.

ప్రశ్న 17.
పంజాబ్ ఆందోళన గురించి రాయండి.
జవాబు:

  1. పంజాబ్ రాష్ట్రంలో స్వయం ప్రతిపత్తికి మరొక ఉద్యమం రూపుదిద్దుకొంది.
  2. ఇక్కడ కూడా అత్యధిక శాతం ప్రజలు మాట్లాడే భాష, మతమూ ఆధారంగా ప్రజల సమీకరణ జరిగింది.
  3. ఇక్కడ కూడా దేశాభివృద్ధిలో రాష్ట్రం పాత్రను విస్మరిస్తున్నారన్నదే పంజాబ్ ఆరోపణ.
  4. రాష్ట్రం ఏర్పడినప్పుడు తమకు అన్యాయం జరిగిందని వారు భావిస్తున్నారు.
  5. రాజధాని నగరమైన చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంగా కాక తమ రాష్ట్రానికే చెందాలని కోరసాగారు.
  6. భాక్రానంగల్ ఆనకట్ట నుంచి ఎక్కువ నీళ్ళు కావాలని, సైన్యంలోకి ఎక్కువమంది సిక్కులను తీసుకోవాలని కూడా కోరసాగారు.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 18.
రాజీవ్ గాంధీ చేపట్టిన శాంతి చర్యలు ఏవి?
జవాబు:
రాజీవ్ గాంధీ చేపట్టిన శాంతి చర్యలు :

  1. రాజీవ్ గాంధీ పంజాబ్, అసోం, మిజోరంలలో, పొరుగు దేశమైన శ్రీలంకలో కూడా శాంతి ప్రక్రియలు మొదలు పెట్టాడు.
  2. శ్రీలంకలో ఘర్షణ పడుతున్న ఇరుపక్షాల మధ్య శాంతి నెలకొల్పటానికి భారతదేశం తన సైన్యాన్ని పంపించింది.
  3. అయితే దీనికి అటు తమిళులు, ఇటు శ్రీలంక ప్రభుత్వమూ అంగీకరించకపోవటం వల్ల ఇదొక దుస్సాహస చర్యగా పరిణమించింది.
  4. అంతిమంగా భారతదేశం తన సైన్యాన్ని 1989లో వెనక్కి తీసేసుకుంది.

ప్రశ్న 19.
సంకీర్ణ రాజకీయాల శకం గురించి రాయుము.
జవాబు:

  1. 1990ల కాలంలో స్వాతంత్ర్యానంతర భారతదేశంలో చాలా కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
  2. పోటీతో కూడిన బహుళ పార్టీ వ్యవస్థకు మార్పుతో మెజారిటీ స్థానాలు గెలిచి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే స్థితి ఏ ఒక్క పార్టీకీ లేదు.
  3. 1989 నుంచి జాతీయస్థాయిలో ఏర్పడిన ప్రభుత్వాలన్నీ సంకీర్ణ /మైనారిటీ ప్రభుత్వాలే.
  4. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అనేక జాతీయ, ప్రాంతీయ పార్టీలు కలవవలసి వచ్చేది.
  5. దీని అర్థం అనేక పార్టీల రాజకీయ సిద్ధాంతాలను, కార్యక్రమాలను కలుపుకుని కనీస ఒప్పందాలకు రావలసివచ్చేది.

ప్రశ్న 20.
పశ్చిమ బెంగాలులో ఏర్పడిన వామపక్ష ప్రభుత్వం గురించి రాయుము.
జవాబు:

  1. వామపక్ష రాజకీయ పార్టీలైన భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ), ఫార్వర్డ్ బ్లాక్, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు (సి.పి.ఎం) వంటివి 1977లో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికలలో గెలిచి సి.పి.ఎం.కి చెందిన జ్యోతిబసు నాయకత్వంలో వామపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
  2. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉండిపోయిన భూసంస్కరణలను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ముందుగా చేపట్టినది.

ప్రశ్న 21.
ఆపరేషన్ బర్గాను గురించి వ్రాయుము.
జవాబు:

  1. 1978 జూన్లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కౌలుదార్ల పేర్లను నమోదుచేసి వాళ్ల హక్కును కాపాడటానికి ఆపరేషన్ బర్గాను చేపట్టింది.
  2. కౌలుదార్లను బెంగాలీలో బర్గాదార్లు అంటారు.
  3. వీళ్ళు భూస్వాముల భూములను సాగుచేస్తూ పంటలో అధికభాగం వాళ్ళకి కౌలుగా చెల్లిస్తూ ఉండేవాళ్లు.
  4. పశ్చిమ బెంగాల్ లో గ్రామీణ జనాభాలో ఈ కౌలుదార్లు అధికసంఖ్యలో ఉండేవాళ్ళు.

ప్రశ్న 22.
సరళీకృత ఆర్థిక విధానంలోని ప్రధాన అంశాలు ఏవి?
జవాబు:

  1. ప్రభుత్వ ఖర్చును బాగా తగ్గించుకోవటం, రైతులకు ఇచ్చే సబ్సిడీలలో కోత, ప్రజాసేవలు, ఆరోగ్యం వంటి వాటిల్లో కూడా ప్రభుత్వ ఖర్చును తగ్గించుకోవటం.
  2. విదేశీ సరుకుల దిగుమతుల మీద పరిమితులను, పన్నులను తగ్గించుకోవటం.
  3. భారతదేశంలో విదేశీ పెట్టుబడులపై పరిమితులను తగ్గించుకోవటం.
  4. ఆర్థిక రంగంలోని అనేక రంగాలలో ప్రైవేటు పెట్టుబడిదారులకు అవకాశం కల్పించటం.

ప్రశ్న 23.
అత్యవసర పరిస్థితిని తొలగించి ఇందిరాగాంధీ చేపట్టిన చర్యలు ఏవి?
జవాబు:

  1. 1977 జనవరిలో ఎన్నికలను ప్రకటించారు.
  2. రాజకీయ ఖైదీలందరినీ ఇందిరాగాంధీ విడుదల చేసి స్వేచ్ఛ, కదలికలు, ప్రచార ఉద్యమాలు, సమావేశాలను అనుమతించని అన్ని నియంత్రణలను, సెన్సారును తొలగించారు.

ప్రశ్న 24.
1977 సాధారణ ఎన్నికల తరువాత ఏ ఏ రాష్ట్రాలలో, ఏ ఏ కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి?
జవాబు:
1977 సాధారణ ఎన్నికల తరువాత ఏర్పడిన కాంగ్రెసేతర ప్రభుత్వాలు:

  1. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్‌లో జనతాపార్టీ
  2. పశ్చిమబెంగాల్ లో సి.పి.ఐ (ఎం)
  3. తమిళనాడులో డి.ఎం.కె గెలిచాయి.

ప్రశ్న 25.
1977 సాధారణ ఎన్నికల నాటి నుండి 1980 ఎన్నికల వరకు జాతీయస్థాయిలో జరిగిన రాజకీయ పరిస్థితిని వివరింపుము.
జవాబు:

  1. 1977 సాధారణ ఎన్నికలలో ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛని పునరుద్ధరిస్తామన్న ‘వాగ్దానంతో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది.
  2. అంతర్గత విభేదాల కారణంగా దాని పాలన ప్రభావితం అయ్యింది.
  3. అంతర్గత కీచులాటలకు, ఫిరాయింపులకు ఈ పాలన గుర్తుండిపోయింది.
  4. పార్టీలో అంతర్గత కుమ్ములాటల వల్ల 3 సం||రాల లోపే ప్రభుత్వం పడిపోయి 1980లో తాజా ఎన్నికల నిర్వహణకు దారితీసింది.
  5. 1980లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది.

ప్రశ్న 26.
1970 లో ఏర్పడ్డ కొన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఏవి?
జవాబు:
1970 లో ఏర్పడ్డ కొన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు :

  1. బి.ఎల్.డి – భారతీయ లోకదళ్ – ఉత్తరప్రదేశ్
  2. కాంగ్రెస్ (ఓ) – ఇందిరాగాంధీ విధానాలను వ్యతిరేకించిన కాంగ్రెస్లోని సంప్రదాయవాద వర్గం
  3. సి.పి.ఐ (ఎం) – భారతీయ కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు)
  4. డి.ఎం.కె – ద్రవిడ మున్నేట్ర కజగం – తమిళనాడు
  5. జనసంఘ్ – ఉత్తరాది రాష్ట్రాలకు పరిమితమైంది.
  6. ఎస్.ఎ.డి – శిరోమణి అకాలీ దళ్ – పంజాబ్.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 27.
ఈ క్రింది వాటిని భారతదేశ పటంలో గుర్తించండి.
1) ఆంధ్రప్రదేశ్
2) అసోం
3) పంజాబ్
4) తమిళనాడు
5) పశ్చిమబెంగాల్
6) ఉత్తరప్రదేశ్
7) నాగాలాండ్
8) మిజోరం
9) బీహార్
10) గుజరాత్
11) మహారాష్ట్ర
12) అయోధ్య
జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000 8

ప్రశ్న 28.
భారత రాజ్యాంగంలోని 73వ సవరణకు సంబంధించిన ముఖ్యాంశాలు ఏవి?
జవాబు:

  1. స్థానిక స్వపరిపాలనకు రాజ్యాంగ గుర్తింపునిస్తూ 1992 సంవత్సరంలో P.V. నరసింహారావు ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసింది.
  2. 73వ రాజ్యాంగ సవరణ గ్రామస్థాయిలో స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలను కల్పించగా, 74వ రాజ్యాంగ సవరణ ” పట్టణ, నగరాలకు వాటి స్థాయిలో ప్రభుత్వాలను సార్వత్రిక వయోజన ఓటింగ్ హక్కు ద్వారా మొదటిసారి ఎన్నుకున్నారు.
  3. మొత్తం స్థానాలలో 1/3 వంతు స్త్రీలు, SC, ST లకు కూడా కొన్ని స్థానాలు రిజర్వ్ చేశారు.
  4. స్థానిక స్వపరిపాలనకు కొన్ని విధులు, అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి వదిలి పెట్టారు.

ప్రశ్న 29.
73వ రాజ్యాంగ సవరణ వల్ల స్థానిక సంస్థలకు ఉపయోగముంటుందని మీరు భావిస్తున్నారా? కారణాలు తెల్పండి.
జవాబు:

  1. 73వ రాజ్యాంగ సవరణ వల్ల స్థానిక సంస్థలకు తప్పనిసరిగా ప్రయోజనం ఉంటుంది.
  2. రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను గౌరవిస్తూ స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలకు ఉండే విధులు, అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి వదిలిపెట్టారు.
  3. కొన్ని అంశాలలో కొంతమేర స్వయంప్రతిపత్తి స్థానిక ప్రభుత్వాలకు లభించింది.

ప్రశ్న 30.
నిరక్షరాస్యత ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో మీ అభిప్రాయాన్ని తెల్పండి.
జవాబు:

  1. నిరక్షరాస్యత ప్రజాస్వామ్యంపై ఋణాత్మక ప్రభావాన్ని చూపిస్తుంది.
  2. నిరక్షరాస్యులు ఓటు ప్రాధాన్యతను అర్థం చేసుకోలేరు.
  3. ఎన్నికలలోని అనుచిత ప్రవర్తనలు నిరక్షరాస్యులను కేంద్రంగా చేసుకొని జరుపబడతాయి.
  4. ప్రజాస్వామ్యం విజయవంతం కాకపోవడానికి నిరక్షరాస్యత కారణమయ్యే ప్రమాదముంది.

ప్రశ్న 31.
రాజీవ్ గాంధీ అనుసరించిన సరళీకృత ఆర్థిక విధానం దేశాభివృద్ధికి దోహదపడిందని భావిస్తున్నారా? అభిప్రాయం తెల్పండి.
జవాబు:

  1. రాజీవ్ గాంధీ అనుసరించిన సరళీకృత ఆర్థిక విధానాలు దేశాభివృద్ధికి ఖచ్చితంగా దోహదం చేశాయని నేను భావిస్తున్నాను,
  2. ఆర్థిక రంగంలో రాజీవ్ గాంధీ భిన్నమైన పంథాను అనుసరించడానికి ప్రయత్నించాడు.
  3. 1986లో అతడి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ లో అమలులో ఉన్న కొన్ని నియంత్రణలను, పరిమితులను తొలగించి సరళీకృత ఆర్థిక విధానంవైపు పయనం మొదలు పెట్టాడు.
  4. ఆ తర్వాత అవే ప్రపంచీకరణకు, ‘టెలికం విప్లవానికి బాటలు వేయడం జరిగింది.

ప్రశ్న 32.
పేజి 268లోని ఆంధ్రప్రదేశ్ శీర్షిక కింద గల “ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రులను …….. అతడు వాదించాడు.” వరకు, చదివి, దానిపై వ్యాఖ్యానించండి.
జవాబు:
ఆ కాలంలో ఎన్.టి. రామారావుగారు ఆంధ్రప్రదేశ్, భారతదేశ రాజకీయాలలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆయన నినాదం ‘తెలుగు వారి ఆత్మగౌరవం’ నాటికీ, నేటికీ అద్భుతమైనది. అప్పటి వరకు జాతీయ రాజకీయాలలో ఉత్తరాది వారే అధిక పాత్ర పోషిస్తున్నారు. కాని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జాతీయ రాజకీయాలలో ప్రాంతీయ పార్టీల హవా పెరిగింది. ముఖ్యంగా టి.డి.పి.ది.

ఎన్.టి.ఆర్ ప్రవేశపెట్టిన సబ్సిడీ బియ్యం పథకం, మద్యపాన నిషేధం మొదలైనవి ఆయన ప్రభుత్వ పనితనానికి ఉదాహరణలు – గర్వకారణాలు. ఆయన పార్టీలోనే కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆయన దానిని సమర్థవంతంగా అణిచివేశారు.

10th Class Social 19th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
అసోం ఉద్యమం గురించి రాయండి. అసోం ఉద్యమానికి గల ప్రధాన కారణాలు రాయండి.
జవాబు:

  1. అసోంలో అస్సామీ భాషే కాకుండా బెంగాలీ భాష కూడా ఎక్కువగా మాట్లాడతారు.
  2. బ్రిటిష్ పాలన నాటి నుంచి రాష్ట్ర పరిపాలనలోని కింది, మధ్య స్థాయి ఉద్యోగాలలో బెంగాలీలు ఉండేవారు.
  3. బెంగాలీ అధికారులు తమని సమానులుగా కాకుండా రెండవ తరగతి పౌరులుగా చూస్తున్నారని అస్సోమీయులు భావించేవారు.
  4. స్వాతంత్ర్యం తరువాత కూడా బెంగాలీలు అసోంలో ఎంతోమంది స్తిరపడ్డారు. దీనికి తోడు బంగ్లాదేశ్ నుంచి కూడా ఎంతోమంది వలసవచ్చి స్థానికులను అనేక ఇబ్బందులకు గురి చేయసాగారు.
  5. దీంతో స్థానిక ప్రజలు తమ సాంస్కృతిక మూలాలు కోల్పోతామని అసంతృప్తి చెంది 1970లో సామాజిక ఉద్యమాన్ని తెచ్చారు.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 2.
దేశ విభజన నాటి నుండి రాజకీయాలను మతము ప్రభావితం చేస్తుంది అనడానికి నిదర్శనాలు రాయండి. .
జవాబు:

  1. 1947లో జరిగిన మత మారణహోమం నుండి భారతదేశం విభజింపబడి భారతదేశం, పాకిస్థాన్ అను రెండు దేశాలుగా అవతరించాయి.
  2. దేశ విభజన తరువాత మన దేశాన్ని లౌకిక రాజ్యంగా ప్రకటించినప్పటికి దేశ రాజకీయాలను మతము అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది.
  3. పంజాబ్ లో సిక్కు మతస్థులు ప్రత్యేక ఖలిస్థాన్ కావాలని మారణ హోమం సృష్టించారు. ఇది దేశ ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు దారి తీసింది.
  4. షాబానో కేసులో ముస్లిం మత ఛాందసవాద వర్గాల ఒత్తిడికి తలొగ్గి కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసిందని చాలామంది భావించారు.
  5. అయోధ్యలో వివాదాస్పద కట్టడమైన బాబ్రీ మసీదు ఉన్న స్థానములో రాముడికి గుడి కట్టాలని హిందువులు ఉద్యమం మొదలు పెట్టి బాబ్రీ మసీదును కూల్చివేశారు.

ప్రశ్న 3.
టెలి కమ్యూనికేషన్ రంగం మానవ జీవనంలో నేడు అనేక మార్పులు తెచ్చింది. వాటిని వివరించండి.
జవాబు:
టెలి కమ్యూనికేషన్ రంగం మానవ జీవనంలో తెచ్చిన మార్పులు :

  1. సమయం ఆదా అవుతుంది.
  2. వేగంగా సమాచారం అందించడం జరుగుతుంది.
  3. ఆన్లైన్ సర్వీసుల విస్తరణ జరిగింది.
  4. సుఖవంతమైన / విలాసవంతమైన జీవనానికి దారులు ఏర్పడ్డాయి.
  5. ప్రజలు ఫోనులకు, ఇంటర్నెట్లకు బానిసలు (అడిక్షన్) కావడం.
  6. కూర్చొనే సమయం పెరగడం వలన ఊబకాయం రావడం జరిగింది. (ఒబేసిటి)
  7. జీవన వ్యయం పెరిగింది.
  8. ఫోనులకు అతుక్కుపోవడం వలన మానవ సంబంధాలు దెబ్బతిన్నాయి.

ప్రశ్న 4.
దిగువ అంశాన్ని చదివి ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.

పంచాయితీ రాజ్ & 73 వ సవరణ

స్థానిక స్వపరిపాలనకు రాజ్యాంగ గుర్తింపునిస్తూ 1992 వ సంవత్సరంలో పి.వి. నరసింహారావు ప్రభుత్వము రాజ్యాంగ సవరణ చేసింది. 73వ రాజ్యాంగ సవరణ గ్రామ స్థాయిలో స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలను కల్పించగా, 74వ రాజ్యాంగ సవరణ పట్టణ, నగరాలకు వాటి స్థాయిలో ప్రభుత్వాలను సార్వత్రిక వయోజన ఓటింగ్ ద్వారా మొట్టమొదటిసారి ఎన్నుకొన్నారు. మొత్తం స్థానాలలో మూడింట ఒక వంతు (1/3 వ వంతు) స్థానాలను స్త్రీలకు కేటాయించారు. షెడ్యూలు కులాలు, షెడ్యూలు జాతులకు కూడా కొన్ని స్థానాలను రిజర్వు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను గౌరవిస్తూ స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలకు ఉండే విధులు, అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి వదిలి పెట్టారు. అందువలన దేశవ్యాప్తంగా పనిచేసే స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాల అధికారాలలో తేడాలుంటాయి.

ప్రశ్నలు :
1) స్థానిక స్వపరిపాలన అంటే ఏమిటి?
2) స్థానిక సంస్థలకు రాజ్యాంగ గుర్తింపు నిచ్చిన ప్రభుత్వమేది?
3) 73వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించినది?
4) స్థానిక సంస్థలలో 1/3 వంతు సీట్లు మహిళలకు కేటాయించడం సమర్ధనీయమా? చర్చించండి.
జవాబు:

  1. గ్రామ, పట్టణ మరియు నగర ప్రాంతాలలో ప్రజలు స్థానికంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకొని తద్వారా వారికి గల ఉమ్మడి అవసరాలను తీర్చుకొనుటనే స్థానిక స్వపరిపాలన అంటారు.
  2. పి.వి. నరసింహారావు ప్రభుత్వం లేదా కాంగ్రెస్ ప్రభుత్వం
  3. గ్రామ స్థాయిలో స్థానిక స్వపరిపాలనకు సంబంధించినది.
  4. సమర్థనీయమే. రాజకీయ సమానత్వాన్ని సాధించడంకోసం మరియు వారిని స్థానిక పాలనలో భాగస్వాములను చేయుట కొరకు స్థానిక సంస్థలలో 1/3 వంతు సీట్లు కేటాయించడం సమర్ధనీయం.

ప్రశ్న 5.
ఈ క్రింది పట్టికను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
పార్లమెంట్ లో వివిధ రాజకీయ పార్టీల బలబలాలు

రాజకీయ పార్టీ పేరుసంవత్సరం 1952సంవత్సరం 1962
1. భారత జాతీయ కాంగ్రెస్364361
2. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా1629
3. సోషలిస్టు పార్టీ1212
4. కిసాన్ మజ్జూర్ పార్టీ09
5. పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్07
6. గణతంత్ర పరిషత్06
7. ఇతరులు3827
8. స్వతంత్ర అభ్యర్థులు3720
9. జనసంఘ్18
10. ప్రజా సోషలిస్ట్ పార్టీ12
11. DMK07

a) ఏ ఏ రాజకీయ పార్టీలు పార్లమెంట్ లో తమ బలాలు 1952 కంటే 1962 లో ఎక్కువ పొందినాయి?
b) 1962 నాటికి కనుమరుగైన రాజకీయ పార్టీలు ఏవి?
c) 1952 మరియు 1962లో తమ బలాన్ని కోల్పోయిన రాజకీయ పార్టీలు ఏవి?
d) 1952 కంటే 1962 నాటికి తమ సంఖ్యాబలాన్ని కోల్పోయిన రాజకీయ పార్టీలు ఏవి?
జవాబు:
a) కమ్యూనిస్టు పార్టీ
b) 1) జనసంఘ్
2) ప్రజా సోషలిస్టు పార్టీ
3) DMK

c) 1962 – 1) కిసాన్ మజ్జూర్ పార్టీ
2) పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (1952లో ఏ పార్టీ సీట్లను కోల్పోలేదు)
3) గణతంత్ర పరిషత్

d) ఇతరులు, స్వతంత్రులు, కాంగ్రెస్

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 6.
క్రింది పేరాను చదివి, అర్థం చేసుకొని వ్యాఖ్యానించుము.

భారతదేశంలోకి స్వేచ్ఛగా విదేశీ పెట్టుబడులు, వస్తువులను అనుమతించేలా భారత ఆర్థిక విధానం బలవంతంగా సరళీకృతం చేయబడింది. ఇంకొక వైపు కొత్త సామాజిక వర్గాలు మొదటిసారిగా తమ రాజకీయ అకాంక్షలను సాధించుకోటానికి ప్రయత్నించసాగాయి. అంతేగాకుండా రాజకీయ జీవితంలో మతపర జాతీయవాదం, మతం పేరుతో రాజకీయ సమీకరణలు ముఖ్యాంశాలుగా మారాయి. వీటన్నిటి కారణంగా భారతీయ సమాజం తీవ్ర కల్లోలానికి లోనయ్యింది. ఈ మార్పులను అర్థం చేసుకొని వాటిని అనుగుణంగా మారే ప్రయత్నంలోనే ఇంకా మనం ఉన్నాం.
జవాబు:
భారతదేశాన్ని సుస్థిరంగా, సమర్థవంతంగా, వేగవంతంగా అభివృద్ధి పరచడానికి ప్రణాళికలను అమలుపరచడం జరిగినది. దానివలన ప్రభుత్వ వ్యయం కూడా విపరీతంగా పెరిగిపోయింది. దానిని అధిగమించడానికి, భారతదేశంలోకి స్వేచ్చగా విదేశీ పెటుబడులు, వస్తువులను అనుమతించేలా భారత ఆర్థిక విధానం బలవంతంగా సరళీకృతం చేయబడింది.

దానికోసం ప్రజాసేవకు అయ్యే ఖర్చు మరియు రైతులకు ఇచ్చే సబ్సిడీలలో కోత విధించడం జరిగింది. అప్పుడే అభివృద్ధి చెందుచున్న మధ్య తరగతి కులాలవారు రాజకీయ పార్టీలను ప్రారంభించడం వారి ఆకాంక్షలను నెరవేర్చుకోవాలనుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా, మతం పేరుతో రాజకీయ, సమీకరణలు చేయడం జరిగింది. వీటన్నింటి కారణంగా సమాజంలో చాలా సమస్యలు ఎదురైనాయి. రిజర్వేషన్ కూడా ఒక సమస్యే. ప్రస్తుతం మన పరిస్థితి ఏమిటంటే ప్రస్తుత సమాజంలో జరిగే మార్పులకు అనుగుణంగా మనం మారడమే.

ప్రశ్న 7.
సరళీకృత ఆర్థిక విధానాల కారణంగా భారతదేశంలోకి విదేశీ సరుకులు రావటంతో భారతీయ పారిశ్రామికవేత్తలకు ప్రపంచ ఉత్పత్తిదారులలో పోటీ పడక తప్పలేదు. దీని వల్ల విదేశీ కంపెనీలు భారతదేశంలో పరిశ్రమలను నెలకొల్పి వ్యాపారాలు మొదలు పెట్టాయి. అయితే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే సబ్సిడీలలో కోత విధించడం వల్ల చౌక విదేశీ సరుకులు వెల్లువెత్తడంతో ఇక్కడ అనేక కర్మాగారాలు మూతపడడం వల్ల సాధారణ ప్రజలు, ఎన్నో కష్టాలకు గురయ్యారు. విద్య, ఆరోగ్యం, రవాణా వంటి అనేక ప్రభుత్వ సదుపాయాల ప్రవేటీకరణకు కూడా ఇది, దారితీయటంతో ఈ సేవలు అందించే ప్రవేటు వ్యక్తులకు ప్రజలు పెద్ద మొత్తంలో డబ్బులు/రుసుం చెల్లించాల్సి వస్తోంది.
ప్రశ్న : సరళీకృత ఆర్థిక విధానాల ఫలితాలపై మీ అభిప్రాయాన్ని వ్రాయుము.
జవాబు:

  1. భారతదేశము ప్రపంచ మార్కెట్ లోకి లాగబడింది.
  2. సరళీకరణ సమాచార విప్లవానికి దారితీసింది.
  3. ప్రపంచ ఉత్పత్తిదారులతో భారతీయ వ్యాపారులు పోటీపడవలసి వచ్చింది.
  4. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే సబ్సిడీలలో కోత విధించవలసి వచ్చినందున ప్రజలకు, స్థానిక పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
  5. విద్య, ఆరోగ్యము, రవాణా వంటి అనేక ప్రభుత్వ సదుపాయాల ప్రైవేటీకరణకు దారితీసింది.
  6. ప్రపంచీకరణకు మార్గం సుగమమైంది.
  7. సరళీకృత ఆర్థిక విధానాల వల్ల సంపన్న వర్గాల వారికి మాత్రమే ఎక్కువ మేలు జరిగిందని చెప్పవచ్చు.

ప్రశ్న 8.
క్రింది సమాచారాన్ని చదివి, క్రింది ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000 5
i) ఏ రాష్ట్రం నుండి జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది?
జవాబు:
బీహార్

ii) ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క ఒక ప్రత్యేకతను తెల్పండి.
జవాబు:
సంస్కృతం ఒక అధికార భాషగా ఉండటం.

iii) నవంబర్ 1, 2000 సంవత్సరంలో ఏర్పడిన రాష్ట్రం ఏది?
జవాబు:
ఛత్తీస్ గఢ్

iv) మధ్యప్రదేశ్ నుండి వేరుబడిన రాష్ట్రమేది?
జవాబు:
ఛత్తీస్ గఢ్

ప్రశ్న 9.
క్రింది పట్టికను పరిశీలించి, సంకీర్ణ ప్రభుత్వాల ధోరణిని విశ్లేషించండి.
AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000 6
జవాబు:

  1. పై పట్టికలో 1989వ సం||ము నుండి 2004 వరకు సంకీర్ణ ప్రభుత్వాల ధోరణి ఏ విధంగా ఉందో తెలియచేయడం జరిగినది.
  2. మూడు సంకీర్ణ ప్రభుత్వాలు మరియు వాటి పాలనా కాలం గురించి ఇవ్వబడింది.
  3. 1989 మరియు 1990 లలో జనతాదళ్, నేషనల్ ఫ్రంట్ అనే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినది. దానిలో JD, DMK, AGP, TDP, JINC లు అధికార పార్టీలుగా మరియు CPM, CPI, BJP లు మద్దతు పార్టీలుగా ఉన్నాయి.
  4. 1996 – 1998 సం||ల మధ్యకాలంలో యునైటెడ్ ఫ్రంట్ అనే ఇంకొక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. దానిలో JKNC. TDP. TMC, CPI, AGP, DMK, MGP లు అధికార పార్టీలుగా, CPM మద్దతుదారుగా ఉంది.
  5. 1998 – 2004 ల మధ్యకాలంలో నేషనల్ డెమోటిక్ అలయెన్స్ అనే ఇంకొక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. , దానిలో JDU, SAD, TMC, AIADMK, JKNC, BJD, శివసేన లు అధికార పార్టీలుగా, TDP మద్దతుదారుగా ఉంది.
  6. స్వాతంత్ర్యానంతరం, 1990 సంవత్సరం నుండి మన రాజకీయాలలో చాలా గమనించదగ్గ మార్పులు వచ్చాయి.
  7. బహుళ రాజకీయ పార్టీలు వాటి మధ్య పోటీ చివరకు ఏ పార్టీకి ఎన్నికలలో ఆధిక్యం రాని పరిస్థితి ఏర్పడినది.
  8. 1989 నుండి 2004 వరకు ఎక్కువగా మనం సంకీర్ణ రాజకీయ పార్టీలు మరియు సంకీర్ణ ప్రభుత్వాలనే చూడటం జరుగుతుంది.
  9. ఇది ప్రజల యొక్క ఆలోచనను తెలియచేస్తుంది. రాజకీయ పార్టీలు బాధ్యతగా వ్యవహరించాలని తెలియచేస్తుంది.

ప్రశ్న 10.
ఈ క్రింది పేరాను చదివి, మీ అభిప్రాయం రాయండి.

20వ శతాబ్దం ముగింపులో భారతదేశం ప్రపంచ మార్కెట్ లోకి లాగబడింది. ఈ భారతదేశంలో ఒక వైపున జనాభాలోని వివిధ వర్గాల గొంతులు వినిపించే ప్రజాస్వామ్యం విలసిల్లుతోంది. ఇంకో వైపున ప్రజలను విభజించే, మతపర రాజకీయ సమీకరణల వల్ల సామాజిక శాంతికి ముప్పు పొంచి ఉంది. యాభై ఏళ్ళకు పైగా అది కాలపరీక్షకు నిలబడింది. ఎంతో కొంత స్థిర ఆర్థిక పరిస్థితిని సాధించింది. ప్రజాస్వామిక రాజకీయాలు బలంగా వేళ్లూనుకున్నాయి. తీవ్ర పేదరికాన్ని, కులాలు, మతాలు, ప్రాంతాలు, స్త్రీ-పురుషుల మధ్య తీవ్ర అసమానతల్ని ఇది ఇంకా పరిష్కరించలేదు.
జవాబు:
పైన ఇవ్వబడిన పేరాగ్రాఫ్ ప్రజలను విభజించే మరియు మతపరమైన రాజకీయాలను గురించి వర్ణించడం జరిగినది. ఇవి సామాజిక శాంతికి ముప్పును కలిగిస్తాయి. మనకు స్వాతంత్ర్యం వచ్చిన మొదటి 30 మరియు 40 సంవత్సరాల వరకు సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడినది. ఆ తరువాతే అస్థిర ప్రభుత్వాల కాలం మొదలైనది. ప్రధాన సమస్యలైన పేదరికం, ఆర్థిక అసమానతలు మొ|| వాటిని ఇంకా పరిష్కరించలేదు.

నా అభిప్రాయములో రాజకీయాలు అనేవి ఓటు, బ్యాంకు మీద ఆధారపడి ఉన్నవి. మన దేశంలో కొన్ని సందర్భాలలో మతపరమైన గొడవలు జరిగిన సందర్భములో వాటి వెనుక కొందరు రాజకీయ నాయకుల పాత్ర కలదు. ముఖ్యమంత్రులను పదవి నుండి దింపడానికి, ఆ పార్టీకి చెందిన నాయకులే మత విద్వేషాలను రెచ్చగొట్టిన సందర్భాలు మనదేశంలో కలవు.

మన దేశంలో కుల ఆధారిత రాజకీయాలు నడుస్తాయి. ఆ ప్రాంతంలో ఏ కులంవారు ఎక్కువగా ఉంటే వారికి అక్కడ సీట్లు కేటాయించడం మరియు ఆ కులాలు గ్రూపులుగా ఏర్పడి ఎన్నికలలో అనుచిత చర్యలకు పాల్పడటం జరుగుతుంది. కొన్ని నియోజక వర్గాలలో ప్రత్యేకంగా కొన్ని మతాల వారు ప్రాతినిధ్యం వహించడం, వారి పెత్తనం చలాయించడం జరుగుచున్నది. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య అభివృద్ధికి ఆటంకంగా తయారవుతున్నాయి.

కావున ప్రజలు, పార్టీలు రాజకీయాలలో కులం, మతం ప్రస్తావనలకు దూరంగా ఉంటే దేశం చాలా బాగా అభివృద్ధి చెందుతుంది.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 11.
ప్రజాస్వామ్యంలో ప్రాంతీయ పార్టీ యొక్క ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు:

  1. జాతీయ, ప్రాంతీయ పార్టీలతో కూడిన బహుళ పార్టీ వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తుంది.
  2. సమాఖ్య రాజ్యస్ఫూర్తిని ప్రాంతీయ పార్టీలు ప్రతిబింబిస్తాయి.
  3. ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల సమస్యలు, అవసరాలపట్ల మంచి అవగాహన కలిగి ఉంటాయి.
  4. అవి తమ స్వీయ రాష్ట్రాల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తాయి.

ప్రశ్న 12.
సంకీర్ణ రాజకీయాల శకం ప్రారంభం కావడానికి గల కారణాలతో పాటు దాని ప్రభావాన్ని వివరించండి.
జవాబు:
సంకీర్ణ రాజకీయాల శకం ప్రారంభం కావడానికి గల కారణాలు :

  1. బహుళపార్టీ వ్యవస్థ
  2. ఏ పార్టీకి కావలసినంత మెజారిటీ రాకపోవడం
  3. ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పెరగడం.
  4. 1960ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజల మద్దతును క్రమంగా కోల్పోవడం.

ప్రభావం :

  1. రాజకీయ స్థిరత్వం లేకపోవడం
  2. రాజకీయ సిద్ధాంతాలను వదులుకోవడం
  3. జాతి ప్రయోజనాలకన్న పార్టీ ప్రయోజనాలకు ప్రాముఖ్యత ఇవ్వడం.
  4. అత్యధిక ప్రజల మద్దతు లేకపోయినప్పటికీ అధికారంలోకి రావడం.

ప్రశ్న 13.
షాబానో కేసులో 1985లో సుప్రీం కోర్సు ఇచ్చిన తీర్పు, “అన్యాయానికి గురవుతున్న మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ఇది అరికడుతుందనే” మహిళా ఉద్యమ నాయకుల వాదనను మీరు సమర్థిస్తారా? కారణాలు తెలపండి.
జవాబు:

  1. భర్త నుంచి విడాకులు పొందిన షా బానో అన్న మహిళ వేసిన కేసులో 1985లో సుప్రీంకోర్టు ఆమె మాజీ భర్త ఆమెకు భరణం చెల్లించాలని తీర్పు ఇచ్చింది.
  2. ప్రగతిశీల ముస్లిములు ఈ తీర్పును స్వాగతించారు.
  3. అయితే ఇతరులు ఈ తీర్పు ఇస్లామిక్ చట్టంలో జోక్యం చేసుకుంటోందనీ, దీనిని అనుమతిస్తే తమ మత జీవితంలో జోక్యం మరింత పెరుగుతుందని నిరసనలు చేపట్టారు.
  4. మహిళా ఉద్యమ నాయకులు, ముస్లిం సమాజంలో సంస్కరణలు కోరుకుంటున్న సభ్యులు ఏకపక్షంగా భర్తలతో విడాకులు ఇవ్వబడి అన్యాయానికి గురవుతున్న మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ఇది అరికడుతుందని వాదించసాగారు.

ప్రశ్న 14.
రామ జన్మభూమి – బాబ్రీ మసీదు వివాదంపై నీ అభిప్రాయమేమిటి?
జవాబు:

  1. అయోధ్యలో వివాదాస్పద కట్టడమైన బాబ్రీ మసీదు ఉన్న స్థానంలో రాముడికి గుడి కట్టాలని కొంతమంది హిందువులు ఉద్యమం మొదలుపెట్టారు.
  2. అది రాముని జన్మస్థలం అని, అంతకుముందు అక్కడ ఉన్న గుడిని పడగొట్టి మసీదు కట్టారని వాళ్ల వాదన.
  3. బాబ్రీ మసీదు నిర్వాహకులు ఇది నిజం కాదని, ఇది ముస్లింల ప్రార్థనాస్థలమని పేర్కొన్నారు.
  4. ఈ వివాదం కొంతకాలంగా సాగుతోంది. అంతిమ నిర్ణయం తీసుకునేదాకా సంవత్సరంలో ఒక రోజు తప్పించి మసీదును మూసి ఉంచాలని ఆదేశించింది.
  5. 1986లో కోర్టు తీర్పు ఇస్తూ మసీదుని సంవత్సరం పొడవునా తెరచి ఉంచవచ్చని, హిందువులను రోజువారీ పూజలకు అనుమతించాలని ఆదేశించింది.

ప్రశ్న 15.
రాజకీయాలలో మత వినియోగం గురించి బి.జె.పి అభిప్రాయాన్ని రాయుము.
జవాబు:

  1. జనాభా సంఖ్యలో అత్యధికులు అంటే హిందువుల మత అస్తిత్వం ఆధారంగా దేశాన్ని నిర్మించాలన్న రాజకీయ ధోరణికి భారతీయ జనతా పార్టీ నేతృత్వం వహిస్తోంది.
  2. ప్రజాస్వామ్యం, లౌకికవాదం వంటివి పాశ్చాత్య భావాలని, ఇవి సరిపోవని పురాతన భారతీయ సంస్కృతి నుంచి మనం ఎంతో నేర్చుకోవాలని ఈ పార్టీ విశ్వసిస్తుంది.
  3. అయితే మత గురువులు నడిపే మతపరమైన రాజ్యా నికి బి.జె.పి వ్యతిరేకం.
  4. లౌకికరాజ్యం అల్పసంఖ్యాక వర్గాలకు మాత్రమే ప్రత్యేక సదుపాయాలు కల్పించకూడదు.
  5. దేశ ప్రజలందరిని సమదృష్టితో చూడాలని బి.జె.పి లౌకికవాద స్వరూపం చర్చను ప్రారంభించింది.

ప్రశ్న 16.
భారత ప్రజాస్వామ్యం విజయవంతం అయ్యిందని ఎలా చెప్పగలవు?
జవాబు:
భారత ప్రజాస్వామ్యం అనేక సవాళ్ళను ఎదుర్కొని నిలిచిందని, ఆ ప్రక్రియలో అది మరింత బలపడిందని చెప్పవచ్చును.
కారణాలు:

  1. క్రమం తప్పకుండా జరిగే స్వేచ్ఛాయుత, న్యాయబద్ధమైన ఎన్నికలు
  2. ఎన్నికలలో ఓటు వేసేవాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం
  3. ప్రభుత్వాల మార్పు.
  4. కొత్త గ్రూపుల సాధికారీకరణ
  5. పౌర హక్కులను కాపాడటం వంటి అంశాలు.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 17.
కాంగ్రెస్ ఏకైక పార్టీ కాదనే వాదనను సమర్ధిస్తూ, ప్రత్యామ్నాయాలను చర్చించండి.
జవాబు:
కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏర్పడిన ప్రత్యామ్నాయాలు :

  1. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కలిసి పోటీ చెయ్యాలని నిర్ణయించాయి.
  2. కాంగ్రెస్ (ఓ), స్వతంత్ర పార్టీ, భారతీయ జనసంఘ్, భారతీయ లోకదళ్, సోషలిస్టు పార్టీలు విలీనమై జనతా పార్టీగా ఏర్పడాలని నిర్ణయించాయి.
  3. జగజ్జీవన్‌రాం వంటి ముఖ్యమైన కాంగ్రెస్ నేతలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ వ్యతిరేక వేదికతో చేరారు.
  4. ఇతర ప్రధాన ప్రతిపక్ష పార్టీ డి.ఎం.కె, ఎస్.ఎ.డి., సి.పి.ఐ (ఎం) వంటివి తమ ఉనికిని కొనసాగించాలనీ, అయితే ‘కాంగ్రెస్ వ్యతిరేక వేదికలో, జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి.
  5. కాంగ్రెస్ వ్యతిరేక, అత్యవసర పరిస్థితి వ్యతిరేక పార్టీలు అన్నీ ఒక తాటి కిందకు వచ్చి ఎన్నికలలో పోటీ చేయడం జయప్రకాష్ నారాయణ్, ఆచార్య జె.బి. కృపలాని వంటి సీనియర్ నాయకులు ముఖ్యపాత్ర పోషించారు.

ప్రశ్న 18.
జనాభా సంఖ్యలో అత్యధికులు అంటే హిందువుల మత అస్తిత్వ ఆధారంగా దేశాన్ని నిర్మించాలన్న రాజకీయ ధోరణికి భారతీయ జనతా పార్టీ నేతృత్వం వహిస్తోంది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం వంటివి పాశ్చాత్య భావాలని, ఇవి సరిపోవని, పురాతన భారతీయ సంస్కృతి నుంచి మనం నేర్చుకోవాలని ఈ పార్టీ విశ్వసిస్తుంది. అయితే మతగురువులు నడిపే మతపరమైన రాజ్యానికి బి.జె.పి వ్యతిరేకం. లౌకికరాజ్యం అల్పసంఖ్యాక వర్గాలకు మాత్రమే ప్రత్యేక సదుపాయాలు కల్పించడం కాకుండా, దేశ ప్రజలందరినీ సమదృష్టితో చూస్తూ ఒకే పౌర చట్టాన్ని అమలు చేయాలని బి.జె.పి లౌకికవాద స్వరూపం చర్చను ప్రారంభించింది.

1980ల వరకు భారత రాజకీయాలలో ఈ ధోరణి నామమాత్రంగా ఉండేది. ఉదాహరణకు 1984 లోకసభ ఎన్నికలలో వీళ్లు రెండు సీట్లు మాత్రమే గెలిచారు. అయితే అయోధ్య అంశాన్ని – రాముడు పుట్టిన ప్రదేశమంటూ మసీదు ఉన్నచోట గుడి కట్టటానికి ఉద్యమాన్ని చేపట్టటంతో బి.జె.పికి ఆదరణ గణనీయంగా పెరిగింది. ఈ అంశాలకు మద్దతుగా బి.జె.పి నాయకుడైన ఎల్.కె. అద్వాని 1990లో సోమనాథ్ నుంచి అయోధ్య వరకు ‘రథయాత్ర’ చేపట్టాడు. ఈ లౌకికవాద రాజకీయాలు అల్పసంఖ్యాక వర్గాలను, ప్రత్యేకించి ముస్లిములను సంతృప్తి పరచటానికి ప్రయత్నించి, అధిక సంఖ్యలో ఉన్న హిందువులను నిర్లక్ష్యం చేస్తున్నాయని వాదించసాగారు. ఈ ఉద్యమ సమయంలో ప్రజలు పలుపాంత్రాలలో మతపరంగా చీలిపోయారు. పెద్ద ఎత్తున మతపరమైన అల్లర్లు చెలరేగాయి. బీహార్ లో అద్వానీని అరెస్టు చెయ్యటంతో ఈ యాత్ర ముగిసింది. దీనికి ప్రతిగా వి.పి.సింగ్ ప్రభుత్వానికి బి.జె.పి తన మద్దతును ఉపసంహరించుకుని ముందుగానే ఎన్నికలు జరిపేలా చేసింది.

శ్రీలంకకు భారతీయ సైన్యాన్ని పంపించటంలో అతని పాత్రకు ప్రతీకారంగా శ్రీలంకలోని తమిళ వేర్పాటువాద బృందమైన ఎల్‌టిటిఇ చేతిలో ఈ ఎన్నికల ప్రచారంలో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యాడు. ఆ తరువాత కురిసిన సానుభూతి వెల్లువలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే లోకసభలో బి.జె.పి బలం 120కి పెరిగింది. రామాలయ ప్రచారంలో సమీకరింపబడిన పెద్దగుంపు 1992లో అయోధ్యకు చేరి మసీదును ధ్వంసం చేసింది. ఈ ఘటన తరువాత తీవ్ర నిరసనలు, మతకల్లోలాలు చెలరేగాయి. చాలా ప్రాణనష్టం జరిగింది.
“రాజకీయాలలో మత వినియోగంపై” నీ అభిప్రాయమేమిటి?
జవాబు:
దేశ విభజన సమయంలో రాజకీయ రంగం నుంచి మతాన్ని వేరుచేయటానికి కొంత ప్రయత్నం జరిగింది. అయితే ఆ , తరువాత రాజకీయాలలో మత ప్రమేయం కనిపించింది. రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకోవడం మొదలయ్యింది.

జనాభా సంఖ్యలో అత్యధికంగా ఉన్న హిందువుల మత ఆధారంగా దేశాన్ని నిర్మించాలని భారతీయ జనతా పార్టీ అభిప్రాయం. ప్రజాస్వామ్యం, లౌకికవాదం వంటివి పాశ్చాత్య భావాలని, పురాతన భారతీయ సంస్కృతి నుంచి మనం నేర్చుకోవాలని ఈ పార్టీ విశ్వసిస్తుంది. అయితే 1980 వరకు నామమాత్రంగా ఉన్న ఈ ధోరణి “అయోధ్య రాముడు పుట్టిన ప్రదేశమంతటా మసీదు ఉన్నచోట గుడి కట్టటానికి ఉద్యమాన్ని చేపట్టటంతో ఒక్కసారిగా బి.జె.పి.కి ఆదరణ పెరిగింది. దీనికి మద్దతుగా బి.జె.పి. నాయకుడు ఎల్.కె. అద్వాని 1990లో సోమనాథ్ నుంచి అయోధ్య వరకు “రథయాత్ర” చేశాడు. అంతేకాక లౌకికవాద రాజకీయాలు, అల్పసంఖ్యాక వర్గాలను, ప్రత్యేకించి ముస్లిములను సంతృప్తి, పరచటానికి ప్రయత్నించి, అధిక సంఖ్యలో ఉన్న హిందువులను నిర్లక్ష్యం చేస్తున్నామని వీరు వాదించారు.

ఈ అయోధ్య అంశంలో పెద్ద ఎత్తున మతపరమైన అల్లర్లు జరిగాయి. ప్రజలు చాలా ప్రాంతాలలో మతపరంగా చీలిపోయారు. చివరికి 1992లో అయోధ్యలోని మసీదును ధ్వంసం చేసారు. ఈ ఘటన తరువాత తీవ్ర నిరసనలు, మతకల్లోలాలు చెలరేగాయి. చాలా ప్రాణనష్టం కూడా జరిగింది..

ఈ విధంగా రాజకీయాలలో మతాన్ని వినియోగించి, ప్రాబల్యాన్ని పెంచుకున్నారు.

ప్రశ్న 19.
స్థానిక స్వపరిపాలనకు రాజ్యాంగ గుర్తింపునిస్తూ 1992వ సంవత్సరంలో పి.వి.నరసింహారావు ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసింది. 73వ రాజ్యాంగ సవరణ గ్రామస్థాయిలో స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలను కల్పించగా, 74వ రాజ్యాంగ సవరణ పట్టణ, నగరాలకు వాటి స్థాయిలో ప్రభుత్వాలను సార్వత్రిక వయోజన ఓటింగ్ ద్వారా మొట్టమొదటిసారి ఎన్నుకున్నారు. మొత్తం స్థానాలలో మూడింట ఒకవంతు (1/3వ వంతు) స్థానాలను స్త్రీలకు కేటాయించారు. షెడ్యూలు కులాలు, షెడ్యూలు జాతులకు కూడా కొన్ని స్థానాలను రిజర్వు చేసారు.
ఇచ్చిన పేరాను అధ్యయనం చేసి, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలిమ్ము.
ఎ. రాజ్యాంగంలోని ఏ రాజ్యాంగ సవరణ స్థానిక స్వపరిపాలనకు గుర్తింపునిచ్చింది?
జవాబు:
73వ రాజ్యాంగ సవరణ స్థానిక స్వపరిపాలనకు గుర్తింపు ఇచ్చింది.

బి. పట్టణాలు, నగరాలలో ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం మొదటిసారిగా సార్వత్రిక వయోజన ఓటింగ్ ద్వారా ఎన్నికలు జరిగాయి?
జవాబు:
74వ రాజ్యాంగ సవరణ ప్రకారం పట్టణాలు, నగరాలలో మొదటిసారిగా సార్వత్రిక వయోజన ఓటింగ్ ద్వారా ఎన్నికలు జరిగాయి.

సి. స్థానిక సంస్థలలో మొత్తం స్థానాలలో స్త్రీలకు ఎన్నవ వంతు కేటాయించారు?
జవాబు:
స్థానిక సంస్థలలో స్త్రీలకు 1/3వ వంతు కేటాయించారు.

ప్రశ్న 20.
ఈ కింది పట్టికను పరిశీలించి, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలిమ్ము.
AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000 9
ఎ) టి.డి.పి. ఏ సంవత్సరంలో ఏర్పాటైనది?
జవాబు:
టి.డి.పి. 1982లో ప్రారంభమైంది.

బి) ఇందిరాగాంధీ హత్య ఏ సంవత్సరంలో జరిగింది?
జవాబు:
ఇందిరాగాంధీ హత్య 1984లో జరిగింది.

సి) ఆర్థిక సరళీకరణ విధానాలు ఎప్పుడు జరిగినవి?
జవాబు:
ఆర్థిక సరళీకరణ విధానాలు 1984లో జరిగినవి.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

These AP 10th Class Social Studies Important Questions 18th Lesson స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977) will help students prepare well for the exams.

AP Board 10th Class Social 18th Lesson Important Questions and Answers స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

10th Class Social 18th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium

1. భారతదేశంలో ఎన్నికల నిర్వహణ బాధ్యతను ఎవరికి అప్పగించారు?
జవాబు:
ఎన్నికల సంఘానికి.

2. భారతదేశంలో మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏది?
జవాబు:
ఆంధ్రప్రదేశ్.

3. అలీన విధాన రూపశిల్పి ఎవరు?
జవాబు:
జవహర్‌లాల్ నెహ్రు.

5. మహారాష్ట్రలో, బొంబాయి మహారాష్ట్ర వాసులకే చెందాలని ఆందోళన చేసిన పార్టీ ఏది?
జవాబు:
శివసేన.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

6. నేషనల్ కాన్ఫరెన్స్ అనే ప్రాంతీయ పార్టీ ఏ రాష్ట్రానికి చెందినది?
జవాబు:
జమ్ము & కాశ్మీర్

7. జమ్ము & కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ ఏది?
జవాబు:
370.

8. మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది? 4. దక్షిణాదిన ఏ రాజకీయ పార్టీ హిందీ వ్యతిరేక ఉద్యమం చేపట్టింది ? జ. DMK
జవాబు:
వ్యవసాయరంగం.

9. పంచశీల సూత్రాలను రూపొందించిన వారు ఎవరు?
జవాబు:
జవహర్‌లాల్ నెహ్రు.

10. ఏ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అంతకు ముందెన్నడూ చవిచూడని ఫలితాలను చవి చూసింది?
జవాబు:
1967 ఎన్నికలు.

11. అస్సోంలోని ఖాసి, జైంతియా, గారో గిరిజన ప్రాంతాల తో 1969లో ఏర్పడిన కొత్త రాష్ట్రమేది?
జవాబు:
మేఘాలయ.

12. 1971లో భారత్ ఎవరికోసం పాకిస్థాన్‌తో యుద్ధం చేయవలసి వచ్చింది?
జవాబు:
బంగ్లాదేశ్.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

13. 1956లో రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏర్పడిన రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని?
జవాబు:
14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు.

14. ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచటానికి చేపట్టిన విప్లవం ఏది?
జవాబు:
హరిత విప్లవం.

15. అఖిల భారత జమ్ము & కాశ్మీర్ కాన్ఫరెన్స్ కు నాయకుడు ఎవరు?
జవాబు:
షేక్ మొహ్మద్ అబ్దుల్లా.

16. ప్రజల, హక్కులకు ఏ సందర్భంలో పరిమితులు విధించబడతాయి?
జవాబు:
అత్యవసర పరిస్థితులలో

17. బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమం నాయకుడు ఎవరు?
జవాబు:
ముజిబుర్ రెహ్మన్.

18. బ్రిటిషు పాలనలో కూడా క్రియాశీలకంగా ఉండి, తెలుగు మాట్లాడే ప్రజలను ఐక్యం చేసే ప్రయత్నం చేసిందెవరు?
జవాబు:
ఆంధ్ర మహాసభ.

19. ఎన్నికల సంఘం ఏ సమస్యను అధిగమించటానికి పార్టీలకూ గుర్తులు కేటాయిస్తుంది?
జవాబు:
నిరక్షరాస్యత.

20. మొదటి మూడు సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించింది?
జవాబు:
కాంగ్రెసు.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

21. పార్లమెంట్ రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ చట్టాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించింది?
జవాబు:
1956

22. ఏ తమిళ హీరోను తనకు మద్దతుగా DMK ఉపయోగించుకుంది?
జవాబు:
M. G. రామచంద్రన్ (MGR)

23. S.V.Dని విస్తరింపుము.
జవాబు:
సంయుక్త విధాయక దళ్

24. బ్యాంకుల జాతీయికరణ చేసిన ప్రధాని ఎవరు?
జవాబు:
ఇందిరాగాంధీ

25. రాజభరణాలను రద్దు చేసిన ప్రధాని ఎవరు?
జవాబు:
ఇందిరాగాంధీ.

26. 1973లో అరబ్ – ఇజ్రాయెల్ యుద్ధంతో వేటి ధరలు ఎన్నడూ లేనంతగా పెరిగాయి?
జవాబు:
ముడిచమురు ధరలు.

27. JP ఉద్యమ నాయకుడు ఎవరు?
జవాబు:
జయప్రకాష్ నారాయణ్.

28. లోక్ సభకు ఇందిరాగాంధీ ఎన్నికను ఏ కోర్టు రద్దు చేసింది?
జవాబు:
అలహాబాద్.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

29. జమ్ము కాశ్మీర్ సంస్థానానికి రాజు ఎవరు?
జవాబు:
రాజా హరిసింగ్

30. రెండవ పంచవర్ష ప్రణాళికలో ఏ రంగంకు ప్రాధాన్యత ఇచ్చారు?
జవాబు:
పారిశ్రామిక రంగంకు

31. స్విట్జర్లాండ్ లో మహిళలకు ఓటుహక్కు లభించిన సంవత్సరం ఏది?
జవాబు:
1971.

32. భారత్, పాకిస్తాన్ ల మధ్య మొదటిసారి యుద్ధం జరిగిన సంవత్సరం ఏది?
జవాబు:
1947.

33. మొట్టమొదటి రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ సంఘమును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసారు?
జవాబు:
1953.

34. స్వాతంత్రం వచ్చిన మొదటి 30 సంవత్సరములలో భారత రాజకీయ వ్యవస్థలో ఆధిపత్యం గల పార్టీ ఏది?
జవాబు:
భారత జాతీయ కాంగ్రెస్.

35. తూర్పు పాకిస్తాన్‌గా పిలువబడిన దేశం ఏది?
జవాబు:
బంగ్లాదేశ్.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

36. 1971 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెసు నినాదం ఏమిటి?
జవాబు:
గరీబీ హఠావో.

37. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనుసంధాన భాష ఏది?
జవాబు:
ఇంగ్లీషు.

38. హిందీ వ్యతిరేక ఉద్యమం ఏ రాష్ట్రంలో ప్రారంభమయ్యింది?
జవాబు:
తమిళనాడు.

39. ‘గరీబీ హరావో’ నినాదాన్ని ఇచ్చినది ఎవరు?
జవాబు:
ఇందిరాగాంధీ.

40. భారత దేశ అధికార భాష ఏది?
జవాబు:
హిందీ.

41. మొదటి సార్వత్రిక ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి?
జవాబు:
1952.

42. భారతదేశ మొదటి ప్రధాన మంత్రి ఎవరు?
జవాబు:
జవహర్‌లాల్ నెహ్రు.

43. ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోరుతూ 58 రోజులపాటు నిరాహారదీక్ష చేసినది ఎవరు?
జవాబు:
పొట్టి శ్రీరాములు.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

44. ప్రణాళిక సంఘం ఏ సంవత్సరంలో ఏర్పరిచారు?
జవాబు:
1950లో

45. భారతదేశం, చైనాతో యుద్ధం చేసిన సంవత్సరం ఏది?
జవాబు:
1962.

46. నెహ్రు చనిపోయిన సంవత్సరం?
జవాబు:
1964.

47. నెహ్రూ మరణానంతరం భారత ప్రధాని ఎవరు?
జవాబు:
లాల్ బహదూర్ శాస్త్రి.

48. విదేశాలలో మరణించిన భారత ప్రధాని ఎవరు?\
జవాబు:
లాల్ బహదూర్ శాస్త్రి.

49. లాల్ బహాదుర్ శాస్త్రి ఏ సంవత్సరంలో మరణించారు?
జవాబు:
1966.

50. హిందీని అధికార భాషగా చట్టం చేసిన సంవత్సరం?
జవాబు:
1963.

51. ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది?
జవాబు:
1953, అక్టోబర్ 1న

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

52. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది?
జవాబు:
1956, నవంబర్ 1న

53. పంజాబ్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది?
జవాబు:
1966.

54. పంజాబ్, హర్యానా ఉమ్మడి రాజధాని నగరం ఏది?
జవాబు:
చంఢీఘర్.

55. భారత రాజ్యాంగానికి 42వ సవరణ చేసిన సంవత్సరం.
జవాబు:
1976.

56. ఫజల్ అలి, కె.ఎం. ఫణిక్కర్. హృదయనాథ్ కుంజు, జయప్రకాష్ నారాయళ్లలో మొదటి SRCలో సభ్యులు కాని వారు ఎవరు?
జవాబు:
జయప్రకాష్ నారాయణ్.

57. నెహ్రు మొగ్గుచూపిన వ్యవసాయ విధానంలో ఇమిడి యున్న అంశం కానిది.
→ భూ సంస్కరణలు
→ వ్యవసాయ సహకార సంఘాలు
→ ్థానిక స్వపరిపాలన
→ భూమిని దానంగా ఇవ్వటం.
జవాబు:
భూమిని దానంగా ఇవ్వటం.

58. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) బీహార్ ( ) a) కుర్ని, కొయిరి
ii) మధ్యప్రదేశ్ ( ) b) లోథ్
iii) కర్ణాటక ( ) c) ఒక్కళి
iv) తమిళనాడు ( ) d) వెల్లాల
జవాబు:
i – a, ii – b, iii – c, iv – d

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

59. క్రింది వానిని సరిగా జతపరచండి.
I. మత కల్లోలాలు జరిగిన ప్రాంతం – II.రాష్ట్రం
i) రాంచి ( ) a) బీహార్
ii) అహ్మదాబాద్ ( ) b) గుజరాత్
iii) జలగావ్ ( ) c) మహారాష్ట్ర
iv) అలీఘర్ ( ) d) ఉత్తరప్రదేశ్
జవాబు:
i – a, ii – b, iii – c, iv – d

60. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అన్నింటిని సమైక్య పరిచింది ఎవరు?
జవాబు:
జయప్రకాష్ నారాయణ్.

61. రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ చట్టం 1956కు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించి సరైన వ్యాఖ్యలను ఎంచుకోండి.
i) 1953 ఆగస్ట్” SRC వేసారు.
ii) భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించవలసిందిగా ఈ సంఘాన్ని కోరారు.
iii) ఈ సంఘం నివేదిక ఆధారంగా 1956లో రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ చట్టం చేసారు.
A) (i) & (ii)
B) (ii) & (iii)
C) (i) & (iii)
D) (i), (ii) & (iii).
జవాబు:
D (i), (ii) & (iii)

62. 1968 – 69లో పంజాబు ప్రజల ఆందోళనకు కారణం ఏమిటి?
జవాబు:
ఉమ్మడి రాజధాని చండీఘర్ ని తమకు ఇవ్వాలని.

63. బ్యాంకుల జాతీయికరణ, గరీబీ హఠావో, ధరల నియంత్రణ, రాజభరణాల రద్దులలో ఇందిరాగాంధీ చేపట్టిన సంస్కరణ కానిది.
జవాబు:
ధరల నియంత్రణ.

64. ఈ క్రింది సంఘటనలను కాలక్రమంలో ఉంచండి.
i) బంగ్లాదేశ్ ఏర్పడిన సంవత్సరం
ii) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు
iii)మొదటి సార్వత్రిక ఎన్నికలు
iv) హిందీ అధికార భాషా చట్టం.
జవాబు:
iii, ii, iv, i

65. ప్రస్తుతం మైసూర్ రాష్ట్రాన్ని ఎలా పిలుస్తున్నారు?
జవాబు:
కర్ణాటక.

66. అత్యవసర పరిస్థితి సమయంలో ప్రజలను అసంతృప్తికి గురిచేసిన చర్య కానిది.
→ పౌరహక్కుల ఉల్లంఘన
→ మురికివాడల తొలగింపు
→ వెట్టి చాకిరీ నిర్మూలన
→ బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు
జవాబు:
వెట్టిచాకిరీ నిర్మూలన.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

67. భారతదేశ స్వాతంత్ర్య అనంతర చరిత్రలో తొలి సంవత్సరాలలో దేశ నాయకత్వం ముందున్న ప్రధాన సవాల్.
ఎ) దేశ ఐక్యతను కాపాడటం
బి) దేశ సమగ్రతను కాపాడటం.
సి) సామాజిక, ఆర్థిక మార్పులను తీసుకురావడం.
డి) పైవన్నీ
జవాబు:
డి) పైవన్నీ

68. “ఒక వ్యక్తి – ఒక ఓటు మరియు ఒక ఓటు – ఒకే విలువ” అన్న నినాదాన్ని ఇచ్చింది ఎవరు?
జవాబు:
అంబేద్కర్

69. జాతీయ ఓటర్ల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
జవాబు:
జనవరి 25 న.

70. ప్రచ్ఛన్న యుద్ధం ఏ దేశాల మధ్య మొదలయ్యింది?
జవాబు:
USA – USSR

71. ‘పంచశీల సూత్రాలు’ ఏయే దేశాల మధ్య ఒప్పందం అంటార?
జవాబు:
భారత్ – చైనా.

72. భారతదేశంలో అత్యవసర పరిస్థితి ఏ సంవత్సరంలో విధించారు?
జవాబు:
1975.

73. క్రింది వానిలో సరికాని జతను గుర్తించుము.
→ భారత్ × సాకిస్తాన్ యుద్ధం – 1965
→ భారత్ ×చైనా యుద్ధం – 1962
→ భారత్ ×చైనా యుద్ధం – 1968
→ భారత్ × పాకిస్తాన్ యుద్ధం – 1971
జవాబు:
భారత్ × చైనా యుద్ధం – 1968

74. 1947లో దేని ఆధారంగా దేశ విభజన జరిగింది?
జవాబు:
మతం ఆధారంగా.

75. చక్కని సంస్థాగత చట్టాన్ని ఏర్పరచడంలో భాగంగా మనదేశం ఏర్పాటు చేసుకున్న స్వతంత్ర వ్యవస్థ కానిది ఏది?
→ ఎన్నికల సంఘం
→ కంట్రోలర్ & ఆడిటర్ జనరల్
→ ప్రణాళిక సంఘం
→ న్యాయ వ్యవస్థ
జవాబు:
ప్రణాళిక సంఘం.

76. 1952లో లోకసభలోని (మొదటి లోకసభలోని) స్థానాలు ఎన్ని?
జవాబు:
489.

77. 1952 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుచుకున్న స్థానాల శాతం ఎంత?
జవాబు:
74%.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

78. ఆంధ్ర మహాసభ (AMS) ఎప్పుడు ఏర్పడింది?
జవాబు:
1930 లో.

79. పొట్టి శ్రీరాములు ఎప్పటి నుండి, ఎప్పటి వరకు నిరాహార దీక్ష చేసారు?
జవాబు:
19 అక్టోబరు 1952 నుండి 15 డిసెంబరు 1952 వరకు.

80. ఆంధ్రరాష్ట్రం ఏర్పడక ముందు ఈ ప్రాంతం ఏ రాష్ట్రంలో భాగంగా ఉండేది?
జవాబు:
మద్రాసు రాష్ట్రంలో.

81. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం ఏది?
జవాబు:
1951 – 56.

82. జమ్ము & కాశ్మీర్ రాష్ట్రంని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ఈ విభజన ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది?
జవాబు:
31 అక్టోబరు 2019 నుండి.

83. జమ్ము & కాశ్మీర్ కి సంబంధించిన ‘ఢిల్లీ’ ఒప్పందాన్ని అంగీకరించిన నాయకుడెవరు?
జవాబు:
షేక్ మొహమ్మద్ అబ్దుల్లా.

84. అవామీలీగ్ నాయకుడెవరు?
జవాబు:
షేక్ ముజిబుర్ రెహ్మాన్.

85. ప్రైవేట్ బ్యాంకుల జాతీయకరణ చేసిన సంవత్సరం.
జవాబు:
1969.

86. రాజభరణాల రద్దు చేసిన సంవత్సరం.
జవాబు:
1971.

87. మిని రాజ్యాంగం అని ఏ రాజ్యాంగ సవరణని పేర్కొంటారు?
జవాబు:
42వ సవరణని (1976)

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

88. ముజిబుర్ రెహ్మాన్ మద్దతుదారులు తూర్పు పాకిస్తాన్లో చేపట్టిన ఉద్యమం ఏది ?
జవాబు:
ముక్తిబాహిని.

10th Class Social 18th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
1956 లో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేస్తున్నప్పుడు, గిరిజన భాషలను ఎందుకు పట్టించుకోలేదు ?
జవాబు:
గిరిజనులు దేశంలో చెల్లాచెదురుగా అక్కడక్కడ ఉన్నారు. కనుక వారికి ఒక ప్రాంతంలో రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం కుదరదు. అందువలన గిరిజన భాషలను పట్టించుకోలేదు.

ప్రశ్న 2.
నెహ్రూ ప్రవేశపెట్టిన ఏవైనా రెండు గ్రామీణ అభివృద్ధి పథకాలను రాయండి.
జవాబు:
వ్యవసాయ రంగంలోని మార్పును నెహ్రూ కేవలం ఆర్థిక అంశంగా చూడలేదు. దానిని గ్రామీణ రంగ రాజకీయ, సామాజిక, ఆర్థిక మార్పుగా పరిగణించాడు. ఇందులో మూడు ప్రధాన అంశాలు ఉన్నాయి.

  1. భూసంస్కరణలు
  2. వ్యవసాయ సహకార సంఘాలు
  3. స్థానిక స్వపరిపాలన

3 రకాల భూసంస్కరణలను ప్రతిపాదించారు.

  1. జమిందారీ వ్యవస్థ రద్దు
  2. కౌలు విధానాల సంస్కరణ
  3. భూ పరిమితి విధానాలు

ప్రశ్న 3.
ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సూచించేలా గుర్తులు కేటాయించుటకు గల ముఖ్య ఉద్దేశ్యమేమిటి ?
జవాబు:
నిరక్షరాస్యతా సమస్యను అధిగమించటానికి ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలు, అభ్యర్థులను సూచించేలా రోజువారీ జీవితం నుంచి కొన్ని గుర్తులను ఉపయోగించాలనే వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. ఈ పద్ధతి ఇప్పటికీ అమలులో ఉంది.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 4.
భారతదేశంలో హరిత విప్లవం ఎందుకు తప్పనిసరి?
జవాబు:

  1. ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం ద్వారా పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడం కోసం.
  2. సక్రమ నీటి నిర్వహణ పద్ధతుల కోసం భారతదేశంలో హరిత విప్లవం తప్పనిసరి.

ప్రశ్న 5.
ఏక పార్టీ విధానానికి, బహుళ పార్టీ విధానానికి గల తేడా ఏమి?
జవాబు:

  1. ఏకపార్టీ విధానం – ఒక పార్టీ ఉండడం.
  2. బహుళపార్టీ విధానం – ఎక్కువ పార్టీలు ఉండడం.

ప్రశ్న 6.
భారతదేశంలో మొదటి సాధారణ ఎన్నికల నిర్వహణలో నిరక్షరాస్యతా సమస్యను ఎన్నికల సంఘం ఏ విధంగా అధిగమించింది?
జవాబు:

  1. ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు సూచించే కొన్ని గుర్తులను రోజువారీ జీవితం నుంచి కేటాయించింది.
  2. ప్రతి ఒక్క అభ్యర్థికి బయటవైపు వారికి కేటాయించిన గుర్తును అంటించబడిన వేరు వేరు బ్యాలెట్ పెట్టెలను ఏర్పాటు చేసింది.

ప్రశ్న 7.
స్వాతంత్ర భారత తొలి సంవత్సరములలో నాయకుల ముందున్న ప్రధాన సవాళ్ళు ఏవి?
జవాబు:

  1. దేశ ఐక్యత, సమగ్రతలను కాపాడటం.
  2. సామాజిక, ఆర్థిక మార్పులను తీసుకొనిరావడం.
  3. పేదరికం
  4. నిరుద్యోగం
  5. నిరక్షరాస్యత

ప్రశ్న 8.
స్విట్జర్లాండ్ లో మహిళలకు ఓటుహక్కు ఎప్పుడు వచ్చింది?
జవాబు:
స్విట్జర్లాండ్ లో మహిళలకు ఓటుహక్కు 1971లో వచ్చింది.

ప్రశ్న 9.
మొదటి సార్వత్రిక ఎన్నికల నిర్వహణ బాధ్యతను ఎవరికి అప్పగించారు?
జవాబు:
మొదటి సార్వత్రిక ఎన్నికలను నిర్వహించే బాధ్యతను ఎన్నికల సంఘానికి అప్పగించారు.

ప్రశ్న 10.
భారతదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?
జవాబు:
భారతదేశంలో 1952 లో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.

ప్రశ్న 11.
భారతదేశ మొదటి ప్రధానమంత్రి ఎవరు?
జవాబు:
జవహర్‌లాల్ నెహ్రూ భారతదేశ మొదటి ప్రధానమంత్రి.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 12.
బ్రిటిష్ కాలంలో దేశం ఏ విధంగా విభజింపబడి ఉంది?
జవాబు:
బ్రిటిష్ కాలంలో దేశం ప్రెసిడెన్సీలు (కలకత్తా, మద్రాస్, బాంబే) గాను, సెంట్రల్ ప్రావిన్సెస్, బీదర్ వంటి అనేక పెద్ద రాష్ట్రాలుగానూ విభజింపబడి ఉండేది.

ప్రశ్న 13.
మద్రాసులో ఏ ఏ భాషలు మాట్లాడే ప్రజలు ఉండేవాళ్లు?
జవాబు:
తమిళం, మళయాళం, కన్నడ, తెలుగు, గోండి, ఒడియా భాషలు మాట్లాడేవాళ్లు ఉండేవాళ్లు.

ప్రశ్న 14.
దేని ఆధారంగా దేశ విభజన జరిగింది?
జవాబు:
మతం ఆధారంగా దేశ విభజన జరిగింది.

ప్రశ్న 15.
ఆంధ్ర మహాసభ దేని కొరకు ప్రయత్నించింది?
జవాబు:
మద్రాస్ ప్రెసిడెన్సీలోని తెలుగు మాట్లాడే ప్రజలను ఒక్కతాటి కిందకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేసింది.

ప్రశ్న 16.
ఆంధ్ర మహాసభ, భాషా ప్రాతిపదిక రాష్ట్రాల కొరకు చేసిన ఉద్యమంలో ఏ పద్ధతులను ఉపయోగించింది?
జవాబు:
ఆంధ్ర మహాసభ, భాషా ప్రాతిపదిక రాష్ట్రాల కొరకు చేసిన ఉద్యమంలో విన్నపాలు, దరఖాస్తులు, వీధులలో కవాతులు, నిరాహార దీక్షలు వంటి పద్ధతులను ఉపయోగించింది.

ప్రశ్న 17.
పొట్టి శ్రీరాములు ఎవరు?
జవాబు:
ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోరుతూ 58 రోజులు నిరాహారదీక్ష చేసి 1952 అక్టోబరులో చనిపోయారు.

ప్రశ్న 18.
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘాన్ని (ఎస్.ఆర్.సి) ఎప్పుడు వేశారు? ఇందులోని సభ్యులెవరు?
జవాబు:
1953 ఆగష్టులో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘాన్ని వేశారు. దీనిలో ఫజల్ అలీ, కె.ఎం. ఫణిక్కర్, హృదయనాథ్ కుంజులు సభ్యులుగా ఉన్నారు.

ప్రశ్న 19.
1956 రాష్ట్రాల పున్యవస్థీకరణ చట్టం ప్రకారం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి?
జవాబు:
1956లో పార్లమెంటు ఆమోదించిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం భారతదేశంలో 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి.

ప్రశ్న 20.
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సందర్భంలో పరిగణనలోకి తీసుకోని భాషలేవి?
జవాబు:
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సందర్భంలో గోండి, సంథాలి లేదా ఒరావన్ వంటి గిరిజన భాషలను పరిగణనలోకి తీసుకోలేదు.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 21.
మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ అంశం మీద కేంద్రీకరించబడింది?
జవాబు:
మొదటి పంచవర్ష ప్రణాళిక వ్యవసాయం మీద కేంద్రీకరించి ఆహార ఉత్పత్తిని పెంచటానికి, రవాణా, ప్రసారాల రంగాల మెరుగుదలకు, సామాజిక సేవల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చింది.

ప్రశ్న 22.
1962లో ఏ దేశంతో యుద్ధానికి తలపడవలసి వచ్చింది?
జవాబు:
1962లో మనం చైనాతో యుద్ధం చేయవలసి వచ్చింది.

ప్రశ్న 23.
1967 ఎన్నికలలో కాంగ్రెస్ పరాజయం పొందిన రాష్ట్రాలేవి?
జవాబు:
బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, మద్రాస్, కేరళలో కాంగ్రెస్ పరాజయం పొందింది.

ప్రశ్న 24.
ప్రత్యేక తెలంగాణా వాదుల ఆరోపణ ఏమిటి?
జవాబు:
ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు నాయకత్వం వహించారు. “అభివృద్ధి ఫలాలు రాష్ట్రంలోని కొన్ని వర్గాలకే చెందుతున్నాయన్నది వీళ్ల ప్రధాన ఆరోపణ.

ప్రశ్న 25.
ఏ ఏ ప్రాంతాలతో ‘మేఘాలయ’ రాష్ట్రం ఏర్పడింది?
జవాబు:
1969లో అసోంలోని ఖాసి, జైంతియా, గారో గిరిజన ప్రాంతాలతో మేఘాలయ రాష్ట్రం ఏర్పడింది.

ప్రశ్న 26.
‘గరీబీ హటావో’ అని ఎవరు, ఎప్పుడు అన్నారు?
జవాబు:
1971 సార్వత్రిక ఎన్నికలలో ఇందిరాగాంధీ ఈ ‘గరీబీ హటావో’ అన్న నినాదాన్ని ఉపయోగించి ఘనవిజయం సాధించారు.

ప్రశ్న 27.
రాజ్యాంగసభ ప్రాముఖ్యతనిచ్చిన అంశాలేమిటి?
జవాబు:
రాజ్యాంగ సభ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, హోదా, అవకాశాలలో సమానత్వాన్ని కోరుకుంది. ‘ఆధునిక భారతదేశ నిర్మాణంలో సామాజిక, ఆర్థిక మార్పునకు అది ప్రముఖ స్థానాన్ని ఇచ్చింది.

ప్రశ్న 28.
ప్రణాళికల మూలంగా నెహ్రూ ఏమి ఆశించాడు?
జవాబు:
ప్రణాళికాబద్ధ అభివృద్ధి ద్వారా కులం, మతం, ప్రాంతం వంటి విభజన ధోరణులు తగ్గి భారతదేశం బలమైన, ఆధునిక దేశంగా ఎదుగుతుందని అతడు ఆశించాడు.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 29.
హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని ఎవరు, ఎందుకు చేశారు?
జవాబు:
1963లో అధికార భాషా చట్టాన్ని ఆమోదించినప్పుడు హిందీని మిగిలిన దేశం మీద రుద్దడానికి ఎత్తుగడగా భావించి, డి.ఎం.కె తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా హిందీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టింది.

ప్రశ్న 30.
క్రింది పేరాను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

1970 దశాబ్దం ప్రథమాంకంలో తూర్పు పాకిస్తాన్ (ఇప్పటి బంగాదేశ్లో ఆందోళనలు చోటు చేసుకున్నాయి. పశ్చిమ పాకిస్తాన్ తమపై సవతితల్లి ప్రేమ కనపరచటంపై నిరసనలు చెలరేగాయి, తమ బెంగాలీ అస్థిత్వాన్ని చాటుకోటానికి ఉద్యమాలు మొదలయ్యాయి. సార్వత్రిక ఎన్నికలలో ముజిబుర్ రెహ్మాన్ నాయకత్వంలోని పార్టీ గెలుపొందింది. కానీ అతడిని అరెస్టు చేసి పశ్చిమ పాకిస్తాన్ కి తీసుకెళ్లారు. తూర్పు పాకిస్తాన్లో సైనిక అణచివేత కాలం మొదలయ్యింది. అక్కడ నుంచి తరలి వచ్చిన లక్షలాది కాందిశీకులకు భారతదేశం వసతి కల్పించి ఆహారాన్ని అందించాల్సి వచ్చింది. ఈలోగా బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమం మొదలయ్యింది. దీంట్లో భారతదేశ సహాయాన్ని కోరారు. 1971లో భారతదేశం-పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలయ్యింది.
1) తూర్పు పాకిస్తాన్లో ఎప్పుడు ఆందోళనలు చోటు చేసుకున్నాయి.
జవాబు:
1970 దశాబ్దం ప్రమాంకంలో తూర్పు పాకిస్తాన్ (ఇప్పటి బంగ్లాదేశ్)లో ఆందోళనలు చోటు చేసుకున్నాయి.

2) సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీ గెలుపొందింది?
జవాబు:
సార్వత్రిక ఎన్నికలలో ముజిబుర్ రెహ్మాన్ నాయకత్వంలోని పార్టీ గెలుపొందింది.

3) భారత్-పాకిస్తాన్ల మధ్య యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?
జవాబు:
1971లో భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 31.
రాజ్యాంగంలోని 370వ అధికరణ యొక్క ప్రత్యేకత ఏమి?
జవాబు:

  1. రాజ్యాంగంలోని 370వ అధికరణంలో కాశ్మీరీలు భారతదేశ పూర్తి పౌరులుగా ఉంటారని తెలుపబడింది.
  2. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆ రాష్ట్రం అధిక స్వయంప్రతిపత్తి, అధికారాలు కలిగి ఉంటుంది.
  3. రాష్ట్ర మౌలిక స్వభావాన్ని కాపాడటానికి ఉద్దేశించిన అనేక అంశాలు ఈ ఆర్టికల్ 370లో కలవు.

ప్రశ్న 32.
“ప్రాథమిక విద్యకు, ప్రజారోగ్యానికి తక్కువ ప్రాధాన్యత నివ్వడం అతిపెద్ద లోపమని నిస్సందేహంగా చెప్పవచ్చు. పై వ్యాఖ్యపై వ్యాఖ్యానించండి.
జవాబు:

  1. స్వాతంత్ర్యానంతరం మనదేశం ప్రాథమిక విద్యకు, ప్రజారోగ్యానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వలేకపోయింది.
  2. అయితే దేశ అభివృద్ధికి విద్య, ప్రజారోగ్యం పెద్ద అవసరాలు
  3. కావున వాటికి తగినంత ప్రాధాన్యత ఇవ్వలేకపోవడం అతి పెద్ద లోపమని చెప్పవచ్చు.

10th Class Social 18th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
భారతదేశంలో భూసంస్కరణలు ఎలా అమలు చేశారు ? అవి ప్రజలకు ఎలా ఉపయోగపడ్డాయి?
జవాబు:

  1. భారతదేశమంతటా భూసంస్కరణలను మనఃస్పూర్తిగా అమలు చేయలేదు.
  2. జమిందారీ వ్యవస్థను రద్దు చేశారు కానీ, భూమి లేని వాళ్ళకి భూపంపిణీ జరగలేదు.
  3. గ్రామీణ ప్రాంతాలలో ధనికులు, శక్తిమంతులు భూమిలోని అధిక భాగాలపై నియంత్రణ కొనసాగిస్తూనే ఉన్నారు.
  4. దళితులు ఇంకా భూమిహీనులుగానే ఉన్నారు.
  5. కానీ వెట్టిచాకిరీ నిర్మూలన, అంటరానితనం నిషేధం వల్ల ప్రయోజనం పొందారు.

ప్రశ్న 2.
హరితవిప్లవ ఫలాలు ఏవి?
జవాబు:
హరితవిప్లవం వలన కలిగిన ఫలితాలు:

  1. వ్యవసాయం క్రింద సాగుచేసే భూమి పెరిగింది.
  2. రెండు పంటల విధానం అమలులోనికి వచ్చింది.
  3. నీటిపారుదల వ్యవస్థ బాగా పురోభివృద్ధి చెందింది.
  4. హెక్టారుకి వచ్చే పంట దిగుబడి పెరిగింది.
  5. క్రిమిసంహారక మందులు అధిక దిగుబడిని ఇచ్చే వంగడాల వాడకం బాగా పెరిగింది.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 3.
భారతదేశంలోని అన్ని భాషలు సమాన హోదా కలిగి ఉన్నాయా? ప్రతిస్పందించండి.
జవాబు:

  • భారతదేశంలోని అన్ని భాషలు సమాన హోదా కలిగిలేవు; కల్పించాలి.
  • అనేక గిరిజన (గోండు, సంథలి, ఒరావన్ మొదలైనవి), అట్టడుగు సమాజంలోని ప్రజల భాషలను … పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉంది.
  • రాజ్యాంగం ప్రకారం పౌరులకు తమ భాష, సంస్కృతిని రక్షించుకునే హక్కు ఉంది. భాషాపరమైన అల్ప సంఖ్యాకుల రక్షణకు చర్యలు (ప్రకరణలు) తీసుకోబడ్డాయి.
  • సమాజంలో శక్తిమంత (ఎక్కువ మంది) ప్రజానీకం మాట్లాడే భాషలను (హిందీ, తెలుగు, తమిళం, బెంగాలీ మొ||నవి) మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం అభిలషనీయం కాదు.
  • అన్ని భాషలకు సమాన హోదా ఉండాలి. దీనివల్ల భాషా ఉద్యమాలు తలెత్తవు. దేశ ఐక్యత, సమగ్రతలు కాపాడబడతాయి.

ప్రశ్న 4.
రాజ్యాంగానికి చేసిన 42 వ సవరణలోని అంశాలేమిటి?
(లేదా)
42వ రాజ్యాంగ సవరణ ఉద్దేశాలు ఏమిటి?
జవాబు:
రాజ్యాంగానికి చేసిన 42 వ సవరణ అనేక మార్పులను తీసుకువచ్చింది. ఈ సవరణ ఉద్దేశాలు :

  1. ఎన్నికల వివాదాలలో న్యాయస్థానాలకు చోటు లేకుండా చెయ్యటం.
  2. రాష్ట్ర ప్రభుత్వాలతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని బలపరచటం.
  3. సామాజిక, ఆర్థిక మార్పునకు ఉద్దేశించిన చట్టాలకు న్యాయస్థానాల నుంచి సాధ్యమైనంత రక్షణను కల్పించటం. న్యాయ వ్యవస్థ పార్లమెంటుకు లోబడి ఉండేలా చేయటం.
  4. ‘లౌకిక, సామ్యవాదం’ అనే పదాలను రాజ్యాంగంలోని ప్రవేశికలో చేర్చుట జరిగింది.

ప్రశ్న 5.
దేశ అభివృద్ధికి, స్వాతంత్రానికి, స్త్రీ, పురుషులకు సమాన అవకాశాలు వాళ్ల సమాన భాగస్వామ్యం అవసరమన్న దృక్పథంతో మీరు ఏకీభవిస్తారా?
జవాబు:

  1. అవును. నేను ఈ దృక్పథంతో ఏకీభవిస్తాను.
  2. కారణమేమనగా, అన్ని రంగాలలోను స్త్రీలు సగభాగం పాలు పంచుకుంటున్నారు.

ప్రశ్న 6.
భారతదేశంలో మొదటి సాధారణ ఎన్నికల నిర్వహణలో నిరక్షరాస్యతా సమస్యను ఎన్నికల సంఘం ఏ విధంగా అధిగమించింది?
జవాబు:
నిరక్షరాస్యతా సమస్యను అధిగమించడానికి ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలను, అభ్యర్థులను సూచించేలా రోజువారీ , జీవితం నుంచి కొన్ని గుర్తులను ఉపయోగించటం అన్న వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. ఈ సృజనాత్మక, వినూత్న ప్రయోగం కారణంగా సుదీర్ఘ వివరణల అవసరం లేకుండా బొమ్మను గుర్తిస్తే సరిపోయింది. ఇదే విధానం ఇప్పటికీ కొనసాగుతోంది. దీనిని మరింత సులభతరం చేయడానికి మొదటి ఎన్నికలలో ప్రతి అభ్యర్థికి బయటవైపు వాళ్ల గుర్తు అంటించిన వేరు వేరు బ్యాలెట్ పెట్టెలు కేటాయించారు. తాను ఎంచుకున్న అభ్యర్థి బ్యాలెట్ పెట్టెలో ఓటరు తన ఓటును వేస్తే సరిపోతుంది.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 7.
క్రింది పేరాను చదివి, మీ సొంత మాటలలో వ్యాఖ్యానించండి.
ప్రాథమిక విద్యకు, ప్రజారోగ్యానికి తక్కువ ప్రాధాన్యతను ఇవ్వటం పెద్ద లోపం అని నిస్సందేహంగా పేర్కొనవచ్చు. ఇది భారతదేశాన్ని చాలాకాలం పాటు పీడిస్తూ ఉంటుంది. ఇదే సమయంలో నూతన శకాన్ని ఆరంభించిన చైనా, కొరియా భారతదేశంతో పోలిస్తే ఈ రెండు అంశాల్లో ఎంతో ప్రగతిని సాధించాయి.
జవాబు:

  1. ప్రాథమిక విద్య మరియు ప్రజారోగ్యం అనేవి అత్యంత ముఖ్యమైన అంశాలు
  2. ఈ అంశాలకు ఏ దేశంలోనైనా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది.
  3. దురదృష్టవశాత్తూ భారతదేశంలో ఈ రెండు రంగాలు అనుకున్నంత ప్రగతిని సాధించలేకపోయాయి.
  4. ఈ రంగాలలో ఆశించిన లక్ష్యాలను సాధించేటందుకు ప్రభుత్వాలు కీలకపాత్ర పోషించాలి.

ప్రశ్న 8.
లాల్ బహదూర్ శాస్త్రిలోని ఏ గుణాలు నీకు నచ్చాయి? ఎందుకు?
జవాబు:
లాల్ బహదూర్ శాస్త్రిలో నాకు నచ్చిన గుణాలు :

  • సమస్య పరిష్కారం
  • ప్రజాస్వామిక విలువలకు ప్రాధాన్యతనివ్వడం.
  • హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని, ఆహార కొరతను ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించడం

ప్రశ్న 9.
ప్రాంతీయ పార్టీకి, జాతీయ పార్టీకి గల తేడాలు రాయండి.
జవాబు:

ప్రాంతీయ పార్టీజాతీయ పార్టీ
• రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లలో 3% ఓట్లు లేదా 3 శాసన సభ స్థానాలు పొందిన పార్టీ• సాధారణ ఎన్నికల్లో కనీసం 4 రాష్ట్రాలలో పోలైన ఓట్లలో 6% చొప్పున పొందిన ఓట్లు లేదా 4 వేర్వేరు రాష్ట్రాల నుండి 11 లోకసభ సీట్లు

ప్రశ్న 10.
భారతదేశ అవుట్ లైన్ పటం గీయండి.
జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977) 1

ప్రశ్న 11.
రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ చట్టం – 1956 గూర్చి రాయండి.
జవాబు:

  1. ఫజల్ అలీ అధ్యక్షతన రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ సంఘం ఏర్పాటు అయింది.
  2. భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల ఏర్పాటు అంశాన్ని పరిశీలించడం జరిగింది.
  3. 14 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయడం జరిగింది.
  4. ఈ చట్టంలో గిరిజన భాషలను పరిగణనలోకి తీసుకోలేదు.
  5. ఆధిపత్యం లేదా శక్తిమంత ప్రజానీకం మాట్లాడే భాషలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు.

ప్రశ్న 12.
ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఏర్పడింది?
జవాబు:
1953 ఆగష్టులో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘాన్ని (ఎస్.ఆర్.సి) వేశారు. దీంట్లో ఫజల్ అలీ, కె.ఎం. ఫణిక్కర్, హృదయనాథ్ కుంజ్రులు సభ్యులుగా ఉన్నారు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించవలసిందిగా ఈ సంఘాన్ని కోరారు. ఈ సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా 1956లో పార్లమెంటు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఆమోదించింది. దీని ఆధారంగా 1956, నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 13.
భారతదేశమంతటా భూసంస్కరణలు ఏ విధంగా అమలు జరిగాయి?
జవాబు:
అయితే భారతదేశమంతటా భూసంస్కరణలు మనస్పూర్తిగా అమలు చేయలేదు. జమీందారీ వ్యవస్థను రద్దు చేశారు. కానీ, భూమి లేనివాళ్లకి భూ పంపిణీ జరగలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ధనికులు, శక్తిమంతులు భూమిలోని అధిక భాగాలపై ఆధిపత్యం కొనసాగిస్తూనే ఉన్నారు. దళితులు ఇంకా భూమి హీనులుగానే ఉన్నారు.

ప్రశ్న 14.
భారతదేశ విదేశీ విధానం ఏమిటి?
జవాబు:
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలోనే ప్రచ్ఛన్న యుద్ధం మొదలయ్యి ప్రపంచమంతా రష్యా కూటమి (USSR) లేదా అమెరికా కూటమి (USA) గా విడిపోతోంది. జవహర్‌లాల్ నెహ్రూ ఏ శిబిరంలోనూ చేరకుండా రెండింటికీ సమదూరంలో ఉంటూ విదేశీ విధానంలో స్వతంత్రంగా వ్యవహరించసాగాడు. అదే సమయంలో స్వాతంత్ర్యం పొంది అదే విధానాన్ని కొనసాగించాలనుకుంటున్న ఇండోనేషియా, ఈజిప్టు, యుగోస్లేవియా వంటి దేశాలతో అతడు చేతులు కలిపాడు. వీళ్లంతా కలిసి అలీనోద్యమాన్ని నిర్మించారు.

ప్రశ్న 15.
పంచశీల సూత్రాలనగానేమి? వీటిని ఎవరు రూపొందించారు?
జవాబు:
పంచశీల అంటే ఐదు సూత్రాలు. ఇవేమంటే :

  1. ప్రతి రాజ్యంలోని ప్రాంతీయ సమగ్రత (Territorial integrity) నూ, సార్వభౌమత్వాన్ని, పరస్పరం గౌరవించాలి.
  2. ఒక రాజ్యంపై మరొక రాజ్యం దురాక్రమణ చేయరాదు.
  3. ఒక రాజ్యం ఆంతరంగిక వ్యవహారాల్లో మరొక రాజ్యం జోక్యం చేసుకోరాదు.
  4. రాజ్యాల పరస్పర శ్రేయస్సు, సమానత్వం ఆధారంగా స్నేహ సంబంధాలను నెలకొల్పాలి.
  5. రాజ్యాలు శాంతియుత సహజీవనాన్ని పాటించాలి.

పై సూత్రాలతో కూడిన ఒక ఒప్పందాన్ని, 28 జూన్ 1954న భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ) చైనా ప్రధాని (చౌ-ఎన్-లై) (Chou-En-Lai) సంయుక్తంగా ప్రకటించి ఆమోదించారు.

ప్రశ్న 16.
హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని ఏ విధంగా పరిష్కరించారు?
జవాబు:
అప్పటి ప్రధాని శాస్త్రి హిందీ అనుకూలవాదనని సమర్థించినప్పటికీ, హిందీ వ్యతిరేక శిబిరంలోని ఉద్వేగాలను శాంత పరచటానికి అనేక మినహాయింపులను ప్రకటించాడు. వీటిల్లో కొన్ని : ప్రతి రాష్ట్రానికి తన సొంత భాష కలిగి ఉండే హక్కు ఉంది, అది ప్రాంతీయ భాష కావచ్చు లేక ఇంగ్లీషు కావచ్చు. ప్రతి వ్యవహారమూ ఇంగ్లీషు అనువాదంతో ప్రాంతీయ భాషలలో ఉండవచ్చు. కేంద్రం-రాష్ట్రాల మధ్య వ్యవహార భాషగా ఇంగ్లీషు కొనసాగుతుంది. సివిల్ సర్వీసు పరీక్షలు కేవలం హిందీలోనే కాకుండా ఇంగ్లీషులో కూడా నిర్వహిస్తారు.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 17.
1971లో బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమానికి సహాయం చేసే సామర్థ్యం భారతదేశానికి ఏ విధంగా వచ్చింది?
జవాబు:
1971లో భారతదేశం-పాకిస్థాన్ మధ్య యుద్ధం మొదలయ్యింది. భారతదేశం నిర్ణయాత్మకంగా జోక్యం చేసుకుని బంగ్లాదేశ్ కు విముక్తి సాధించి, స్వతంత్ర దేశంగా ఏర్పడేలా సహాయపడింది. భారతదేశం తన సైనిక బలాన్ని పెంచుకోవటం వల్లనే కాకుండా అలీన దేశంగా తన స్థితిని నైపుణ్యంతో ఉపయోగించుకుని రెండు అగ్రరాజ్యాలు యుద్ధంలో జోక్యం చేసుకోకుండా చెయ్యటం వల్ల ఇది సాధ్యమయ్యింది.

ప్రశ్న 18.
అత్యవసర పరిస్థితి కాలంలో జరిగే మార్పులు ఏమిటి?
జవాబు:

  1. అనేక ప్రాథమిక హక్కులను నిలిపివేస్తారు.
  2. పార్లమెంట్ ఏ అంశంపైనైనా శాసనము చేయవచ్చు.
  3. కేంద్ర కార్యనిర్వాహక వర్గ సలహాల మేరకు రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం పాలనను కొనసాగించవలసి ఉంటుంది.
  4. ఎటువంటి మార్పులనైనా రాష్ట్రపతి ప్రవేశపెట్టవచ్చు.

ప్రశ్న 19.
ప్రచ్ఛన్న యుద్దమనగానేమి?
జవాబు:
రెండవ ప్రపంచ యుద్ధానంతరం అమెరికా అధ్వర్యంలోని పాశ్చాత్య రాజ్యాలకు అనగా కమ్యూనిస్టేతర రాజ్యాలకు, రష్యా ఆధిపత్యంలోనున్న కమ్యూనిస్టు రాజ్యాలకు మధ్యగల పరస్పర ద్వేషం, అనుమానాలు, ఉద్రిక్తతలు ప్రచ్ఛన్న యుద్ధంగా పిలువబడ్డాయి.

ప్రశ్న 20.
భారతదేశ పటంలో ఈ క్రింది ప్రాంతాలను గుర్తించండి.
1) కలకత్తా
2) మద్రాస్
3) బాంబే
4) మహారాష్ట్ర
5) పంజాబు
6) గుజరాత్
7) కర్ణాటక
8) మైసూరు
జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977) 3

ప్రశ్న 21.
అధికార వికేంద్రీకరణ అంటే ఏమిటి?
జవాబు:

  1. వివిధ స్థాయిలలో అధికారాలను పంపిణీ చేయడాన్ని అధికార వికేంద్రీకరణ అంటాం.
  2. దీనివలన ఏ స్థాయికి ఆ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడం సులభతరం అవుతుంది.
  3. అధికారాలు కేంద్రీకృతమై ఉంటే నిర్ణయాలు తీసుకోవడానికి చాలా సమయం పట్టడము మరియు వివిధ స్థాయిలలో ఫైల్స్ ఉండిపోయి తుది నిర్ణయాలకు ఇబ్బందులు ఏర్పడవచ్చు.
  4. అధికార వికేంద్రీకరణ వలన కొంతమేరకు వ్యవస్థాగత అవినీతిని అరికట్టవచ్చు.

ప్రశ్న 22.
భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు పునఃవ్యవస్థీకరణ చేయడానికి అప్పటి నాయకులకు ఉన్న అపోహలు ఏవి?
జవాబు:

  1. మతం ఆధారంగా దేశ విభజన జరగడంతో నాయకుల మనసులో భారతదేశ భద్రత, సుస్థిరత పట్ల అనుమానాలు, భయాలు కలుగసాగాయి.
  2. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల్ని పునఃవ్యవస్థీకరిస్తే దేశం ముక్కలు కావడానికి ఇది దారితీస్తుందని భయపడసాగారు.
  3. కాంగ్రెస్ పార్టీ భాషాప్రాతిపదికపై సంఘటితమై ఉన్నప్పటికీ, ఆ ఆధారంగా దేశాన్ని పునఃసంఘటితం చేస్తామని మాట ఇచ్చినప్పటికీ వెంటనే పూనుకోలేదు.

ప్రశ్న 23.
“ప్రపంచంలో ముంచుకొస్తున్న కొత్త సాంకేతిక విజ్ఞానాలను ప్రత్యేకించి కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్ సాంకేతిక విజ్ఞానాన్ని భారతదేశం అవలంబించడం వల్ల అభివృద్ధిలో దూసుకుపోగలదని చెప్పవచ్చు.” వ్యాఖ్యానించండి.
జవాబు:

  1. ప్రపంచంలో ముంచుకొస్తున్న కొత్త సాంకేతిక విజ్ఞానాలను ప్రత్యేకించి కంప్యూటరు, టెలికమ్యూనికేషన్ సాంకేతిక , విజ్ఞానాన్ని భారతదేశం అవలంబించాలని రాజీవ్ గాంధీ గట్టిగా నమ్మాడు.
  2. ప్రస్తుతం భారతదేశంలో ‘టెలికాం విప్లవం’ అనబడుతున్న దానిని అతడే ఆరంభించాడు.
  3. ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానంతో దేశంలో టెలిఫోనిక్ నెట్ వర్క్ వేగంగా, విస్తరించడానికి దోహదపడుతుంది.
  4. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, E-mail, Voicemail, Facebook, Twitter తదితరాలు అందుబాటులోకి వచ్చాయి.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 24.
జమ్ము & కాశ్మీరు రాష్ట్రానికి ప్రత్యేకంగా స్వయంప్రతిపత్తి కల్పించడం సమర్థనీయమేనని మీరు భావిస్తున్నారా?
జవాబు:

  1. భారత సమాఖ్యలో ఇతర సంస్థానాలలాగా కాకుండా జమ్మూ & కాశ్మీరు చేరిన పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.
  2. 1947 చివరినాటికి పాకిస్తాన్ మద్దతుతో రజాకార్ల దాడుల నేపథ్యంలో భారతదేశంలో విలీనం అయితేనే సైన్యం అందుబాటులోకి వస్తుంది.
  3. ఆ సమయంలో రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి, అది స్వయంప్రతిపత్తితో కొనసాగడం గురించి విస్తృత చర్చలు జరిగాయి.
  4. ఈ నేపథ్యంలో ఆర్టికల్ 370తో అధిక స్వయంప్రతిపత్తి, అధికారాలు పొందడం సమర్థనీయమని అనుకుంటున్నాను.

ప్రశ్న 25.
బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందడానికి భారత్ సహకరించడం సమంజసమేనని భావిస్తున్నారా? వివరణ ఇవ్వండి.
జవాబు:

  1. పాకిస్తాన్ లో భాగంగా ఉన్న తూర్పు పాకిస్తాన్ పై అది సవతితల్లి ప్రేమ కనపరచడంపై నిరసనలు చెలరేగాయి.
  2. సార్వత్రిక ఎన్నికలలో గెల్చిన ముజిబుర్ రెహ్మాన్ ను అరెస్ట్ చేసి పాకిస్తాన్ తీసుకెళ్ళడంతోపాటు తూర్పు పాకిస్తాన్ లో సైనిక అణచివేతకాలం మొదలైంది.
  3. తమ బెంగాలీ అస్థిత్వాన్ని చాటుకోవడానికి ఉద్యమాలు, లక్షలాది కాందిశీకులకు భారత్ వసతి, ఆహారం అందించింది.
  4. “ముక్తి బాహిని” ఉద్యమం చేస్తూ తూర్పు పాకిస్తాన్ ప్రజలు భారత సహాయాన్ని కోరితే నిర్ణయాత్మకంగా జోక్యం చేసుకొని బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడే సహాయం చేశాం.
  5. ఆ పరిస్థితులలో భారత్, తూర్పు పాకిస్తాన్ కి సహకరించడం సమంజసమేనని భావిస్తున్నాను.

ప్రశ్న 26.
స్థానిక స్వపరిపాలన వల్ల గ్రామాలు, పట్టణాలు, నగరాలు అభివృద్ధి చెందుతాయని మీరు భావిస్తున్నారా.? అభిప్రాయం తెల్పండి.
జవాబు:

  1. స్థానిక స్వపరిపాలన వలన గ్రామాలు మరియు పట్టణాలు, నగరాలు తప్పనిసరిగా అభివృద్ధి చెందుతాయి.
  2. దీనికి రాష్ట్రాల సహకారం ఎంతో అవసరం.
  3. స్థానిక సంస్థలకు అధికారాలు, విధులు, నిధులు అందజేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదే.
  4. 1992లో పి.వి. నరసింహారావు ప్రభుత్వంలో 73వ రాజ్యాంగ సవరణ గ్రామాలకు, 74వ సవరణ పట్టణాలు, నగరాలకు స్థానిక స్వపరిపాలన కట్టబెట్టింది.
  5. అవినీతిలేని, ఆశ్రిత బంధుప్రీతి రహిత, ప్రజాహిత స్థానిక ప్రభుత్వాల పనితీరుతో వృద్ధిని చూడగలం.

10th Class Social 18th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
క్రింది పేరాను చదివి, అర్థం చేసుకొని వ్యాఖ్యానించుము.

ఐక్యతను, దేశ సమగ్రతను కాపాడి, నిలపటంలో కూడా భారతదేశం విజయవంతమైంది. దేశంలోని అంతులేని వైవిధ్యత కారణంగా అది విచ్ఛిన్నం కావటానికి అనువైన దేశమని అందరూ భావించారు. అలా కాకపోవటం అన్నది ఇతర దేశాలకు చక్కని గుణపాఠంగా ఉపయోగపడుతుంది.
జవాబు:
భారతదేశమునకు స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ళలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది. ఇది గమనించిన వాళ్ళు అందరూ భారతదేశం విచ్చిన్నం అవుతుందని భావించారు. కాని వారిని ఆశ్చర్యపరుస్తూ భారతదేశం ఈ క్రింది విధానాల ద్వారా ఐక్యతను దేశ సమగ్రతను కాపాడటంలో విజయవంతం అయినది.

  1. భారతదేశంలో వివిధ భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు వారి మధ్య భేదాలు రాకుండా భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేసింది.
  2. దేశంలో వివిధ మతాలవారు ఉన్నారు. ఎటువంటి మతపరమైన అల్లర్లు జరుగకుండా అన్ని మతాలకు సమాన ప్రాధాన్యతను ఇస్తూ లౌకికవాదాన్ని అనుసరిస్తున్నది.
  3. పాలకులను ఎన్నుకోవడంలో ధనిక, పేదా తేడాలు చూపించకుండా వయోజనులందరికీ ఓటుహక్కును కల్పించింది.
  4. దేశ ఆర్థికాభివృద్ధి కోసం ప్రణాళికా సంఘాన్ని నెలకొల్పాం.
  5. సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన వర్గాల పట్ల నిజమైన శ్రద్ధ కనబరచడం జరిగింది.
  6. పండుగలను అందరూ కలసిమెలసి జరుపుకోవడం దేశ ఐక్యతకు ప్రధాన నిదర్శనం.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 2.
క్రింది పాఠ్యభాగాన్ని చదివి, ప్రశ్నకు జవాబు వ్రాయండి.

దీనితో ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. దేశంలో శాంతి భద్రతలకు అవసరమంటూ ప్రభుత్వం అనేక అణిచివేత చర్యలకు పాల్పండింది. అనేక ప్రాథమిక హక్కులను నిలిపివేశారు. ఏకారణం లేకుండా అరెస్టు చెయ్యటం, హింసించటం, పౌరహక్కులకు భంగం కలిగించటం వంటి అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ కాలంలో ధరల నియంత్రణ, నల్ల బజారు, వెట్టి చాకిరీలకు వ్యతిరేకంగా సాగే ఉద్యమాలను ప్రజలు స్వాగతించారు. అయితే ఇదే కాలంలో చేపట్టిన మురికివాడల తొలగింపు జనాభా నియంత్రణ పేరుతో బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించటం వంటి కార్యక్రమాలు ప్రజల కోపానికి కారణమయ్యాయి. అయితే పౌరహక్కులు లేనందువల్ల ప్రజలు తమ అసంతృప్తిని వెల్లడి చేసే మార్గాలు లేకపోయాయి. దాంతో దిద్దుబాటు చర్యలు చేపట్టే అవకాశం ప్రభుత్వానికి లేకుండా పోయింది.
అత్యవసర పరిస్థితిలో ఏ విధమైన మార్పులు వచ్చాయి?
జవాబు:

  1. ప్రజాస్వామ్యం లేకుండా పోయింది.
  2. శాంతి భద్రతల అవసరమంటూ ప్రభుత్వం అనేక అణచివేత చర్యలకు పాల్పడింది.
  3. ప్రాథమిక హక్కులు నిలిపివేయబడ్డాయి.
  4. జనాభా నియంత్రణ పేరుతో బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించబడ్డాయి.
  5. పౌర హక్కులు లేనందువల్ల ప్రజలు తమ అసంతృప్తిని వెల్లడి చేసే మార్గాలు లేకపోయాయి.

ప్రశ్న 3.
క్రింది పట్టికను చదివి, క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయుము.

విషయంసంబంధిత వ్యక్తిసంవత్సరాలు
1. అలీనోద్యమమునెహ్రూ1955 – 1961
2. హరిత విప్లవంM.S. స్వామినాథన్1964 – 1967
3. అత్యవసర పరిస్థితిఇందిరాగాంధీ1975 – 1977
4. ప్రణాళికలునెహ్రూ1951
5. పంచశీలనెహ్రూ1954

i) పంచశీల ఒప్పందంపై సంతకాలు చేసిన రెండు దేశాలు ఏవి?
ii) భారతదేశంలో ప్రణాళికలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి?
iii) అత్యవసర పరిస్థితిని విధించిన ప్రధానమంత్రి ఎవరు?
iv) హరిత విప్లవం అనగానేమి?
జవాబు:
i) చైనా, భారతదేశము.
ii) 1951
iii) ఇందిరా గాంధీ.
iv) అధిక దిగుబడి రకాలు, క్రిమి సంహారకాలు, మెరుగైన యాజమాన్య పద్ధతులు ఉపయోగించి ఆహార ధాన్యాల దిగుబడులను బాగా పెంచడం.

ప్రశ్న 4.
అత్యవసర పరిస్థితి కాలంలో భారతదేశం యొక్క పరిస్థితిని వర్ణించండి.
జవాబు:

  1. దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయింది.
  2. అనేక ప్రాథమిక హక్కులను నిలిపివేశారు.
  3. పౌరహక్కులకు భంగం వాటిల్లింది.
  4. ప్రజలు తమ అసంతృప్తిని వెల్లడి చేసే మార్గాలు సైతం లేకుండా పోయాయి.
  5. మురికివాడలు తొలగించబడ్డాయి.
  6. జనాభా నియంత్రణ పేరుతో బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయబడ్డాయి.

ప్రశ్న 5.
క్రింద ఇవ్వబడ్డ పట్టికను చదివి, ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి.

అంశమువివరాలు
ఓటు హక్కుస్విట్జర్లాండ్ మహిళలు 1971లో పొందారు.
ఎన్నికల చిహ్నాలునిరక్షరాస్యుల కొరకు.
కాంగ్రెస్ విజయం1952, 1957, 1962 ఎన్నికలు
ఆంధ్ర మహాసభమద్రాసు ప్రెసిడెన్సీలో తెలుగువారి ఐక్యత కోసం
రాష్ట్ర పునర్విభజన చట్టం1956
మొదటి పంచవర్ష ప్రణాళికవ్యవసాయం
D.M.K.తమిళనాడు

1) తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది?
జవాబు:
1953

2) తొలి సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం ఎదుర్కొన్న ఒక సవాలును పేర్కొనండి.
జవాబు:
నిరక్షరాస్యత

3) ఏ పంచవర్ష ప్రణాళికయందు వ్యవసాయానికి ప్రాధాన్యత యివ్వబడింది?
జవాబు:
మొదటి పంచవర్చ ప్రణాళిక

4) స్వాతంత్ర్యానంతరం మూడు తొలి దశాబ్దాలలో భారత రాజకీయాలపై ఆధిపత్యం వహించిన పార్టీ ఏది?
జవాబు:
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 6.
కింది పట్టికను పరిశీలించి, విశ్లేషించండి.
1952, 1962 ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీలు గెలుచుకున్న స్థానాలు

రాజకీయ పార్టీ19521962
1. భారత జాతీయ కాంగ్రెస్364361
2. భారత కమ్యూనిస్ట్ పార్టీ1629
3. స్వతంత్రులు3720
4. సోషలిస్ట్ పార్టీ1206
5. ఇతరులు3827

జవాబు:
పట్టికలో 1952, 1962 ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీలు, అవి గెలుచుకున్న స్థానాల గురించిన సమాచారం పొందుపరచబడింది.

  1. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 1952 ఎన్నికలలో 364 స్థానాలు సాధించగా, 1962 ఎన్నికలలో 361 స్థానాలు గెలుచుకుంది.
  2. భారత కమ్యూనిస్టు పార్టీ 1952 ఎన్నికలలో 16 స్థానాలను గెలుచుకొంది. ఈ పార్టీ 1962 ఎన్నికలలో కొంచెం పుంజుకొని 29 స్థానాలను సాధించింది.
  3. 1952 ఎన్నికలలో 37 స్థానాలను సాధించిన స్వతంత్రులు 1962 ఎన్నికలలో బలం కోల్పోయి 20 స్థానాలకే పరిమితమయ్యారు.
  4. 1952 ఎన్నికలలో 12 స్థానాలను గెలుచుకొన్న సోషలిస్టు పార్టీ 1962 ఎన్నికలలో 6 స్థానాలు మాత్రమే గెలవగలిగింది.
  5. ఇక ఇతరుల విషయానికి వస్తే వీరు 1952 ఎన్నికలలో 38 స్థానాలు పొందారు. 1962 ఎన్నికలలో వీరు సాధించిన స్థానాల సంఖ్య 27కే పరిమితమైంది.

పై పట్టిక రాజకీయ వ్యవస్థలో ఏకపార్టీ ఆధిపత్యాన్ని వెల్లడి చేస్తోంది. 1952, 1962లలో జరిగిన ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ అఖండ విజయాలు సాధించింది. ఇతర పార్టీలు కాంగ్రెస్ ని సవాలు చేయగలిగే సంఖ్యలో స్థానాలను గెలుచుకోలేకపోయాయి. ఇతర ఏ పార్టీ కూడా కాంగ్రెస్ కి సమీపంలో లేదు. ఈ విధంగా పై పట్టిక అప్పటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని తెలియజేస్తోంది.

ప్రశ్న 7.
ప్రస్తుత పరిస్థితులలో మెరుగైన ప్రజాస్వామ్యానికి, నీతివంతమైన ప్రభుత్వం ఏర్పాటుకు తగు సూచనలు చేయండి.
జవాబు:

  1. ప్రతి ఓటరు ఓటింగ్ లో పాల్గొనాలి.
  2. నిజాయితీపరులను ఎన్నుకోవడానికి ప్రాధాన్యతకు ఇవ్వాలి.
  3. ఎన్నుకోబడిన నాయకులు ప్రభుత్వం జవాబుదారీతనం కలిగి ఉండాలి.
  4. ఎన్నికలు పారదర్శకంగా ఉండాలి.
  5. సామాజిక తనిఖీ జరగాలి.
  6. రీకాల్ పద్ధతిని అమలు చేయాలి.
  7. పార్టీ ఫిరాయింపుల చట్టంను సమర్థవంతంగా అమలు చేయాలి.
  8. అక్షరాస్యత రేటు పెంచడం ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించాలి.
  9. ప్రజాస్వామ్యం ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలి.

ప్రశ్న 8.
“స్వాతంత్ర్యానంతరం మొదటి ముప్పై సంవత్సరాలు అత్యవసర పరిస్థితితో ముగిసినప్పటికీ, లాభనష్టాల పట్టిక తయారుచేస్తే తప్పులు కంటే ఒప్పులే ఎక్కువ ఉన్నాయి.” — వ్యాఖ్యానించండి.
జవాబు:
మొదటి ముప్పై సంవత్సరాలు అత్యవసర పరిస్థితితో ముగిసినప్పటికీ, లాభనష్టాల పట్టిక తయారు చేస్తే తప్పులు కంటే ఒప్పులే ఎక్కువ ఉన్నాయి.

  1. స్థిరమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పటం ఈ కాలంలో సాధించిన అత్యంత ముఖ్యమైన విషయంగా పేర్కొనవచ్చు.
  2. అదే సమయంలో స్వాతంత్ర్యం పొందిన ఇతర దేశాలతో భారతదేశాన్ని పోలిస్తే భిన్న ప్రయోజనాలు కలిగిన పార్టీలతో పోటీతో కూడిన బహుళపార్టీ వ్యవస్థ క్రమేపీ రూపొందటం అన్నది నిజమైన విజయంగా పేర్కొనాలి.
  3. ఇతర దేశాలలో లాగా కాకుండా భారతదేశంలో క్రమం తప్పకుండా, భయంలేని, స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు జరగటమే కుకుండా ప్రభుత్వాలు, నాయకులు కూడా మార్పుకి లోనయ్యారు.
  4. భారత రాజ్యాంగం పౌరహక్కులను ఇవ్వటమే కాకుండా వాటిని కాపాడటానికి వ్యవస్థాగత నిర్మాణం కూడా రూపొందించింది.
  5. న్యాయ వ్యవస్థ, ఎన్నికల సంఘం, కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ వంటి స్వతంత్ర వ్యవస్థాగత ఏర్పాట్లతో భారతదేశం చక్కని సంస్థాగత చట్రాన్ని ఏర్పరిచింది. పాలనాధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించటం కూడా గొప్ప విజయమనే చెప్పుకోవాలి.
  6. సైనిక దళాలపై పౌర నియంత్రణను ఏర్పరచటం మరొక ముఖ్యమైన విషయం. మన పొరుగు దేశమైన పాకిస్తాన్‌తో పోలిస్తే ప్రజాస్వామిక సంస్థలలో భారతదేశం ఎంతో ముందుంది.
  7. ఐక్యతను, దేశ సమగ్రతను కాపాడి, నిలపటంలో కూడా భారతదేశం విజయవంతం అయ్యింది. దేశంలోని అంతులేని వైవిధ్యత కారణంగా అది విచ్చిన్నం కావటానికి అనువైన దేశమని అందరూ భావించారు, అలాకాకపోవటం అన్నది ఇతర దేశాలకు చక్కని గుణపాఠంగా ఉపయోగపడుతుంది.
  8. ఆర్థిక లక్ష్యాల విషయంలో ప్రణాళికా సంఘాన్ని నెలకొల్పటం, సమతుల ప్రాంతీయ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకోవటం అన్న అంశాలు చెప్పుకోదగినవి.
  9. సమాజంలోని ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన వర్గాల పట్ల నిజమైన శ్రద్ధ కనబరిచారు.
  10. ఆహారం కోసం ఇతరులపై ఆధారపడిన స్థితి నుంచి కాలక్రమంలో ఆహార స్వయం సమృద్ధిని సాధించిన స్థితికి దేశం చేరుకుంది. ఇది పరిశ్రమలకు చక్కని పునాదిగా నిలచింది.
  11. అయితే ప్రాంతాల మధ్య సమాన అభివృద్ధి జరుగక కొన్ని ప్రాంతాలు ఇతర ప్రాంతాలకంటే ఎక్కువ అభివృద్ధి చెందాయి.
  12. అదేవిధంగా, ఉపాధి అవకాశాలు పెరగవలసినంతగా పెరగలేదు.
  13. ప్రాథమిక విద్యకి, ప్రజారోగ్యానికి తక్కువ ప్రాధాన్యతను ఇవ్వటం పెద్ద లోపమని నిస్సందేహంగా పేర్కొనవచ్చు. ఇది భారతదేశాన్ని చాలాకాలం పాటు పీడిస్తూ ఉంటుంది.
  14. కుల వ్యవస్థలోని గర్షించదగ్గ అంటరానితనం వంటి వాటిని తొలగించినప్పటికీ వివక్షత ఇంకా తీవ్రంగానే కొనసాగుతోంది. లింగ వివక్షత కూడా కొనసాగుతోంది.

ప్రశ్న 9.
క్రింది పటాన్ని పరిశీలించి ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977) 2
1) పటంలో చూపబడిన అతిచిన్న ప్రాంతం ఏది?
జవాబు:
పటంలో చూపబడిన అతిచిన్న ప్రాంతం పాండిచ్చేరి.

2) మద్రాసు-మైసూరు రాష్ట్రాల మధ్య ఉన్న చిన్న రాష్ట్రం ఏది?
జవాబు:
మద్రాసు-మైసూరు రాష్ట్రాల మధ్య ఉన్న చిన్న రాష్ట్రం కూర్గ్.

3) పటంలో దక్షిణంవైపు ఉన్న రాష్ట్రం ఏది?
జవాబు:
పటంలో దక్షిణంవైపు ఉన్న రాష్ట్రం ట్రావన్ కోర్-కొచ్చిన్.

4) పటంలో తూర్పువైపు ఉన్న రాష్ట్రం ఏది?
జవాబు:
పటంలో తూర్పువైపు ఉన్న రాష్ట్రం ఆంధ్రరాష్ట్రం.

5) ఆంధ్రరాష్ట్ర సరిహద్దులను పేర్కొనండి.
జవాబు:
బంగాళాఖాతం, హైదరాబాద్, మైసూరు, తమిళనాడు.

ప్రశ్న 10.
1952, 1962 ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీలు గెలుచుకున్న స్థానాలు
AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977) 4
పై రెండు గ్రామ్లు 1952, 1962లలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వివిధ పార్టీలు గెలుచుకున్న స్థానాలు తెలుపుతున్నాయి. వీటిని అధ్యయనం చేసి వ్యాఖ్యానించుము.
జవాబు:
1952 మరియు 1962 సంవత్సరాలలో జరిగిన ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీలు గెలుచుకున్న స్థానాలను పరిశీలించగా భారత రాజకీయ వ్యవస్థలో ఏకపార్టీ (భారత జాతీయ కాంగ్రెస్) ఆధిపత్యం స్పష్టంగా తెలియచేస్తుంది.

ఈ ఎన్నికలలో పోటీ చేసిన పార్టీలలో ఏ ఒక్క పార్టీకి కూడా ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు పొందలేకపోయింది. దీనికంతటికి కారణం ఏమనగా భారతదేశంలో ద్విపార్టీ వ్యవస్థ లేకుండా బహుళ పార్టీ వ్యవస్థ అమలులో ఉండడమే. 1952లో ఎన్నికలు జరిగిన మొత్తం స్థానాలు 489, అందులో కాంగ్రెస్ పార్టీకి 364 స్థానాలు వచ్చాయి. మిగతా ప్రతిపక్ష పార్టీలన్నింటికి కలిపి 125 స్థానాలు వచ్చాయి. అనగా కాంగ్రెస్ పార్టీకి సుమారు 73 శాతం సీట్లు రాగా మిగిలిన అన్ని ప్రతిపక్ష పార్టీలన్నిటికి కలిపి 27 శాతం సీట్లు మాత్రమే వచ్చాయి.

1962 ఎన్నికలలో 494 స్థానాలకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ పార్టీ 361 స్థానాలను గెలుచుకున్నది. మిగతా ప్రతిపక్ష పార్టీలు మరియు స్వతంత్రులు కలిపి 133 స్థానాలు మాత్రమే గెలుచుకున్నాయి. అనగా కాంగ్రెస్ పార్టీకి సుమారు 70 శాతం స్థానాలు వచ్చాయి. ప్రతిపక్ష పార్టీలకు 30 శాతం స్థానాలు వచ్చాయి. పై స్లు పరిశీలించగా ఈ విషయాలు తెలియుచున్నవి.

ప్రశ్న 11.
నెహ్రూ చేపట్టిన చర్యలతో వ్యవసాయరంగంలో మార్పులు తీసుకురావచ్చుననే వాదనతో ఏకీభవిస్తారా? కారణాలు తెలియచేయండి.
జవాబు:
ఇందులో మూడు ప్రధాన అంశాలు ఉన్నాయి : భూసంస్కరణలు, వ్యవసాయ సహకార సంఘాలు, స్థానిక స్వపరిపాలన, మూడు రకాల భూ సంస్కరణలను ప్రతిపాదించారు : జమీందారీ వ్యవస్థ రద్దు, కౌలు విధానాల సంస్కరణ, భూ పరిమితి : విధానాలు. వీటన్నిటి ప్రధాన ఉద్దేశం దున్నేవానికి భూమి చెందేలా చూసి మరింత ఉత్పత్తి చేయటానికి ప్రోత్సహించటం. సహకార సంఘాల ద్వారా ఆర్థికంగా లాభసాటి పరిమాణాన్ని చేరుకోవటమే కాకుండా విత్తనాలు, ఎరువులు, రసాయనాలు వంటి విలువైన ఉత్పాదకాలను అందించాలి. స్థానిక ప్రభుత్వాలు భూ సంస్కరణలు అమలు అయ్యేలా చూసి, గ్రామ ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగా సహకార సంఘాలు నడిచేలా చూస్తాయి.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 12.
1967 తరువాత వచ్చిన కొత్త ప్రభుత్వాలు భారత రాజకీయ చరిత్రలో ఒక మైలురాయి వ్యాఖ్యానించండి.
జవాబు:
భారత రాజకీయ చరిత్రలో ఈ కొత్త ప్రభుత్వాలు ఒక మైలురాయిగా ఉంటాయి. ఒక విధంగా ప్రజాస్వామిక తిరుగుబాటును ఇది సూచిస్తుంది. మధ్యస్థాయి కులాలు – ఇవి భూ సంస్కరణల వల్ల ప్రయోజనం పొంది ఆర్థికంగా లాభపడ్డాయి – మొదటిసారిగా రాజకీయ అధికారాన్ని పొందాయి. ఈ కులాలు-హర్యానా, ఉత్తరప్రదేశ్ లో జాట్, బీహార్ లో కుర్మీ, కొయిరి, మధ్యప్రదేశ్ లో లోథ్, ఈ అన్ని రాష్ట్రాలలో యాదవ్, ఆంధ్రప్రదేశ్ లో రెడ్డి, కమ్మ, కర్ణాటకలో ఒక్కళిగా, తమిళనాడులో వెల్లల. ఈ కులాలు ఆయా రాష్ట్రాలలో ఆధిపత్య కులాలుగా ఉండి జనాభా రీత్యా కూడా అధిక సంఖ్యలో ఉన్నాయి. ఇతర ఆధిపత్య (వెనకబడ్డ) కులాలు అధికారంలోకి రావటానికి డి.ఎం.కే పార్టీయే మంచి ఉదాహరణ.

AP 10th Class Social Important Questions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

These AP 10th Class Social Studies Important Questions 16th Lesson భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947 will help students prepare well for the exams.

AP Board 10th Class Social 16th Lesson Important Questions and Answers భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

10th Class Social 16th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium

1. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ ప్రధాని ఎవరు?
జవాబు:
విస్టన్ చర్చిల్.

2. భారత దేశ చివరి వైస్రాయ్ ఎవరు?
జవాబు:
మౌంట్ బాటెన్.

3. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ ఏది?
జవాబు:
CPI (భారత కమ్యూనిస్ట్ పార్టీ)

4. బ్రిటిషు అధికారం కింద వివిధ స్థాయిలలో సర్వ సత్తాక పాలనతో సుమారుగా ఉన్న సంస్థానాలు ఎన్ని?
జవాబు:
550.

5. భారత ప్రభుత్వం రాజ భరణాలను రద్దుచేసిన సంవత్సరం?
జవాబు:
1971.

AP 10th Class Social Important Questions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

6. గాంధీజీ చొరవతో అల్ప సంఖ్యాక వర్గాల హక్కులపై తీర్మానం చేసినది ఎవరు?
జవాబు:
కాంగ్రెసు నాయకుడు జవహర్ లాల్ నెహ్రు.

7. ‘అజాద్ హింద్ ఫౌజ్’ను స్థాపించిన వారు ఎవరు?
జవాబు:
సుభాష్ చంద్రబోస్.

8. బ్రిటిషు ప్రభుత్వ పాలనా విధానం ఏది?
జవాబు:
విభజించు – పాలించు.

9. ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలను కేటాయించిన సంవత్సరం?
జవాబు:
1909.

10. భారత దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వటానికి సుముఖత చూపిన బ్రిటన్ పార్టీ ఏది?
జవాబు:
లేబర్ పార్టీ

11. ఎవరి నాయకత్వంలో నౌకాదళ కేంద్రీయ సమ్మె సంఘం ఏర్పడింది?
జవాబు:
M.S. ఖాన్

12. బొంబాయి రేవులోని ఏ నౌకాదళం 1946 ఫిబ్రవరి 16న నిరాహార దీక్ష చేపట్టారు?
జవాబు:
రాయల్ నౌకాదళం.

AP 10th Class Social Important Questions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

13. ‘తెభాగ’ ఉద్యమం ఏ రాష్ట్రంలోని రైతులు చేపట్టారు?
జవాబు:
బెంగాల్.

14. మంత్రిత్రయ రాయభారం (ముగ్గురు సభ్యుల బృందం)ను ఢిల్లీకి పంపిన సంవత్సరం?
జవాబు:
1946.

15. భారతదేశాన్ని విభజించకుండా మూడంచెల సమాఖ్యను ప్రతిపాదించింది ఎవరు?
జవాబు:
క్యాబినెట్ మిషన్.

16. మొదటి స్వాతంత్ర దినోత్సవం నాడు సంబరాలు చేసుకోకుండా నిరాహార దీక్ష చేసిన ప్రముఖ నాయకుడు ఎవరు?
జవాబు:
గాంధీజీ.

17. 1937లో రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెసు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ సంవత్సరంలో రాజీనామా చేసాయి?
జవాబు:
1939.

18. ‘తెభాగ’ ఉద్యమానికి నాయకత్వం వహించిన సంస్థ ఏది?
జవాబు:
రాష్ట్ర కిసాన్ సభ.

19. దేశ విభజనను ప్రకటించిన వైస్రాయ్ ఎవరు?
జవాబు:
మౌంట్ బాటెన్.

20. ఏ పార్టీ భారతీయులందరికి ప్రాతినిధ్యం వహించటం లేదని బ్రిటిష్ వారి భావం?
జవాబు:
కాంగ్రెస్ పార్టీ.

21. సంపూర్ణ స్వరాజ్యం కోరిన పార్టీ?
జవాబు:
కాంగ్రెస్.

22. ఉత్తర ప్రదేశ్ లోని ముస్లిం భూస్వాముల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఏది?
జవాబు:
ముస్లిం లీగ్.

23. ముస్లింలీగ్ కు ఏ సంవత్సరం వరకు పెద్దగా ప్రజలకు మద్దతు లేదు?
జవాబు:
1930.

24. NWFC ని విస్తరింపుము
జవాబు:
నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్

25. RSSని విస్తరింపుము.
జవాబు:
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్.

AP 10th Class Social Important Questions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

26. అమెరికా, యూరపులో ఏదేశం సాధించిన విజయాలు భారతీయులపై బలమైన ముద్రలు వేశాయి?
జవాబు:
జపాన్.

27. INA ను విస్తరింపుము.
జవాబు:
భారత జాతీయ సైన్యం.

28. INA ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
జవాబు:
1942.

29. క్విట్ ఇండియాలో గాంధీజీ ఇచ్చిన నినాదం …..?
జవాబు:
చేయి లేదా చావండి. (Do or Die)

30. ‘సారే జహాసె అచ్చా హిందుస్తాన్ హమారా’ అన్న కవిత రాసిన వ్యక్తి ఏ భాషా కవి?
జవాబు:
ఉర్దూ కవి.

31. ‘దేశ రాజధాని అయిన ఢిల్లీకి అతడు 1947, సెప్టెంబడు 9న గాని రాలేదు. వాయువ్య భారతంలో పెద్ద ఎత్తున చెలరేగిన మత ఘర్షణలతో ఆ వృద్ధ నేత అసంతృప్తితో ఉన్నాడు. ప్రజల భయాలను దూరం చెరు, దానికి అతడు ప్రయత్నించాడు.” ఈ వాక్యంలోని నేత ఎవరు?
జవాబు:
గాంధీజీ.

32. ముస్లిం లీగ్ పార్టీ నాయకుడు ఎవరు?
జవాబు:
మహ్మద్ అలీ జిన్నా.

33. ముస్లిం లీగ్ ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ప్రకటించిన రోజు ఏది?
జవాబు:
1946, ఆగస్టు 16.

34. క్రింది వాక్యాలను పరిగణించండి.
i) 1937 ఎన్నికలలో మొత్తం ముస్లిం ఓట్లలో 4.4% మాత్రమే ముస్లిం లీగుకు వచ్చాయి.
ii) 1946 ఎన్నికలలో ముస్లిం నియోజక వర్గాల్లో సైతం ముస్లిం లీగు ఓడిపోయింది.
పై వాక్యా లలో సరైనది ఏది?
A) (i) మాత్రమే
B) (ii) మాత్రమే
C) (i) మరియు (ii)
D) రెండూ కావు
జవాబు:
A (i) మాత్రమే

35. ‘ఛలో ఢిల్లీ’ (ఢిల్లీ పదండి) నినాదం ఇచ్చింది ఎవరు?
జవాబు:
సుభాష్ చంద్రబోస్

36. “1930 లో ముస్లిం లీగుకు అధ్యక్షోపన్యాసం ఇస్తూ వాయవ్య ముస్లిం రాష్ట్ర ఆవశ్యకతను గురించి మాట్లాడాడు.” ఇక్కడ ఎవరు ఉపన్యాసం ఇచ్చింది?
జవాబు:
మహ్మద్ ఇక్బాల్.

37. క్రింది సమాచారంను పూరించండి.
AP 10th Class Social Important Questions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం 1939-1947 1
జవాబు:
బెలూచిస్తాన్.

38. 1939 లో కాంగ్రెసు ప్రభుత్వాలు రాజీనామా చెయ్యటానికి కారణమేమి?
జవాబు:
భారతీయులు 2వ ప్రపంచ యుద్ధంలో పాల్గొంటున్నారని బ్రిటన్ ప్రకటించడం.

39. “భారత దేశంలో విలీనం కావలసిన ఆవశ్యకత గురించి అతడు రాచరిక కుటుంబాలతో చర్చలు మొదలు పెట్టాడు”. ఈ వాక్యంలో ప్రస్తావించబడిన ‘అతడు’ ఎవరు?
జవాబు:
సర్దార్ వల్లభాయ్ పటేల్.

AP 10th Class Social Important Questions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

40. “సారే జహాసే అచ్ఛా హిందుస్తాన్ హమారా.” అన్నది ఎవరు?
జవాబు:
మహ్మద్ ఇక్బాల్.

41. మహ్మద్ అలీ జిన్నా క్రియాశీలకంగా పాల్గొన్న సంస్థ ఏది?
జవాబు:
ముస్లిం లీగ్.

42. క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యింది?
జవాబు:
1942.

43. హైదరాబాదులో తెలంగాణ ప్రాంత రైతుల ఉద్యమానికి నాయకత్వం వహించిన పార్టీ ఏది?
జవాబు:
కమ్యూనిస్ట్ పార్టీ.

44. 1947 లో సంస్థానాల విలీనం చేసే బాధ్యతను ఎవరికి అప్పగించడం జరిగింది?
జవాబు:
సర్దార్ వల్లభాయ్ పటేల్ కు.

45. ముస్లిం లీగు ప్రత్యక్ష కార్యాచరణ దినంను ప్రకటించడానికి కారణమేమి?
జవాబు:
పాకిస్తాన్ పేరిట ప్రత్యేక జాతీయ రాజ్యము కొరకు.

46. కులం, వర్గాలను అధిగమించి, హిందువులందరినీ ఏకం చేసి సామాజిక జీవితంలో సంస్కరణలు తీసుకురావాలని ఆశించే సంఘం ఏది?
జవాబు:
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS)

47. క్విట్ ఇండియా ఉద్యమానికి ప్రధాన కారణం ఏమి?
జవాబు:
క్రిప్స్ రాయభారం విఫలం అవ్వడం.

48. ‘రాజభరణం’ దేని కోసం మంజూరు చేశారు?
జవాబు:
రాచరిక కుటుంబాల వ్యక్తిగత ఖర్చులకు.

49. ‘తెభాగ’ ఉద్యమం చేసినది ఎవరు?
జవాబు:
చిన్న, పేద రైతులు.

50. బ్రిటిషు మంత్రివర్గం ముగ్గురు సభ్యుల బృందాన్ని 1946 మార్చిలో దేనికోసం ఢిల్లీకి పంపింది?
జవాబు:
భారతదేశ స్వాతంత్ర్యానికి అనువైన రాజకీయ చట్టం చేయడానికి.

51. బ్రిటిషు వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నడిపిన మూడవ పెద్ద ఉద్యమం ఏది?
జవాబు:
క్విట్ ఇండియా.

52. 1937లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెసు ఎన్ని రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చింది?
జవాబు:
8

AP 10th Class Social Important Questions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

53. భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చినపుడు బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరు?
జవాబు:
అట్లీ.

54. ముస్లింలీగు ఏ సంవత్సరంలో ఏర్పడింది?
జవాబు:
1906.

54. ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చేసిన సంవత్సరమేది?
జవాబు:
1909.

56. క్రిప్స్ రాయభారం భారతదేశానికి వచ్చిన సంవత్సరం?
జవాబు:
1942.

57. పాకిస్థాన్ స్వాతంత్ర్యం వచ్చిన తేది?
జవాబు:
1947 ఆగస్టు 14.

58. గాంధీజీ మరణించిన తేది?
జవాబు:
1948, జనవరి 30.

59. యుద్ధ సమయంలో ఇంగ్లండు ప్రధాని అయిన చర్చిల్ ఏ పార్టీకి చెందినవాడు?
జవాబు:
కన్సర్వేటివ్.

60. కాబినెట్ మిషన్ భారతదేశానికి వచ్చిన సంవత్సరం?
జవాబు:
1946.

61. పాకిస్తాన్ లేదా పాకిస్తాన్ అన్న పేరును రూపొందించిన వారు ఎవరు?
జవాబు:
చౌదరీ రెహ్మత్ అలీ.

62. ఏ సంవత్సరం నాటికి జపాను ఆగ్నేయ ఆసియాలోకి విస్తరించ సాగింది?
జవాబు:
1941.

63. పశ్చిమంలో సతార, తూర్పున మేదినిపూర్ వంటి జిల్లాల్లో స్వతంత్ర ప్రభుత్వాలను ప్రకటించిన సోషలిస్టు నాయకుడు ఎవరు?
జవాబు:
జయప్రకాశ్ నారాయణ్.

64. INA, బ్రిటిషు వాళ్ళకు వ్యతిరేకంగా దాదాపు ఎన్ని సంవత్సరాలు యుద్ధం చేసింది?
జవాబు:
3 సంవత్సరాలు

65. సాయుధ పోరాటం సంభవించిన ఒక ప్రాంతంను తెల్పండి.
జవాబు:
తెలంగాణ, ట్రావెన్‌కోర్‌ లోని పున్నప్రా-వాయలార్

66. మౌంట్‌బాటెను ముందు భారత వైస్రాయ్ ఎవరు?
జవాబు:
వావెల్.

67. గాంధీజీని హత్య గావించింది ఎవరు?
జవాబు:
నాథూరాం గాడ్సే,

68. భారతదేశంలో కొత్త రాష్ట్రాలను ఏర్పరిచే ఈ ప్రక్రియ ఏ సంవత్సరం వరకు కొనసాగింది?
జవాబు:
1956.

AP 10th Class Social Important Questions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

69. బ్రిటిషు పార్లమెంట్ ఆమోదించిన భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం రాష్ట్ర శాసన సభలకు ఓటు వేసే హక్కును ఎంత శాతంకు కేటాయించారు?
జవాబు:
12%

70. బ్రిటిషు ఇండియాలో 11 రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహించిన సంవత్సరం ఏది?
జవాబు:
1937.

71. కాంగ్రెస్ అనేక వ్యక్తిగత సత్యాగ్రహాలను ఏ సంవత్సరంలో నిర్వహించింది?
జవాబు:
1942

72. 1937 ఎన్నికలలో ముస్లింలీగుకు ఆదరణ లభించిన ప్రావిన్సులు ఏవి?
జవాబు:
బాంబే, మద్రాస్, యునైటెడ్ ప్రావిన్సెస్.

73. కాంగ్రెస్ సభ్యులు హిందూ మహాసభలో సభ్యులుగా ఉండే అవకాశాన్ని వ్యతిరేకించిన వారు ఎవరు?
జవాబు:
మౌలానా అబుల్ కలాం ఆజాద్.

AP 10th Class Social Important Questions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

74. భారత ఉపఖండంలో ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలలో కొంత స్వయం ప్రతిపత్తిని కోరుతూ ముస్లింలీగ్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం.
జవాబు:
1940, మార్చి 23.

75. 1946లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలు జరగగా రాష్ట్రంలోని 569 స్థానాలలో ముస్లింలీగ్ గెల్చుకున్న స్థానాలెన్ని?
జవాబు:
442.

76. జయప్రకాష్ నారాయణ్ వంటి సోషలిస్టు సభ్యులు చురుగ్గా పాల్గొన్న ఉద్యమం ఏది?
జవాబు:
క్విట్ ఇండియా ఉద్యమం.

77. బ్రిటిషు వారికి వ్యతిరేకంగా దేశంలో పలు ప్రాంతాలలో మిల్లులు, కర్మాగారాలలో పని ఆపేసిన సంవత్సరం ఏది?
జవాబు:
1946.

78. 1947 ఆగస్టు 15న బెంగాల్ లో అల్లర్లతో అతలా కుతలమైన నోవఖలీలో శాంతిని నెలకొల్పటానికి ప్రయత్నించిన నాయకుడు ఎవరు?
జవాబు:
మహాత్మా గాంధీజీ.

79. కాశ్మీర్, హైదరాబాద్, జునాగఢ్, బెంగాలలో భారతదేశ విలీన ఒప్పందంపై సంతకాలు చేసిన సంస్థానం ఏది?
జవాబు:
బెంగాల్.

80. భారత ప్రభుత్వం భరణాన్ని గత రాచరిక కుటుంబాల బిరుదులను ఏ సంవత్సరంలో రద్దు చేసింది?
జవాబు:
1971.

81. అఖిల భారత హిందూ మహాసభ రాజకీయ కార్యక్రమాన్ని త్యజించి నిజమైన సంస్థాగత పనిమీద దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించినది ఎప్పుడు?
జవాబు:
1948 ఫిబ్రవరి 14.

AP 10th Class Social Important Questions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

82. క్రింది ఘటనలను సరైన కాలక్రమంలో అమర్చండి.
క్రిప్స్ రాయబారం, క్విట్ ఇండియా ఉద్యమం, రాయల్ నేవి తిరుగుబాటు, ప్రత్యేక కార్యాచరణ దినం.
జవాబు:
క్రిప్స్ రాయబారం, క్విట్ ఇండియా ఉద్యమం, రాయల్ నేవి తిరుగుబాటు, ప్రత్యేక కార్యాచరణ దినం.

10th Class Social 16th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
‘రెండు దేశాల సిద్ధాంతం’ అనగానేమి?
జవాబు:
రెండు దేశాల సిద్ధాంతం :
హిందూ, ముస్లిం మత ప్రాతిపదికగా దేశాన్ని విభజించడమే రెండు దేశాల సిద్ధాంతం.

ప్రశ్న 2.
హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్లు ఏ మార్పు తీసుకురావాలని ఆశించాయి?
జవాబు:
కులం, వర్గాలను అధిగమించి హిందువులందరినీ ఏకం చేసి సామాజిక జీవితంలో సంస్కరణలను తీసుకురావాలని ఈ సంఘాలు ఆశించాయి.

ప్రశ్న 3.
రాజభరణములను రద్దు చేసిన ప్రధాన మంత్రి ఎవరు?
జవాబు:
రాజభరణములను రద్దు చేసిన ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ.

ప్రశ్న 4.
1909 లో ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలు ఎందుకు ఏర్పాటు చేశారు?
జవాబు:
1909లో ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలు ఏర్పాటు చేయడానికి కారణం :
i) ప్రభుత్వంలో ముస్లింల ప్రయోజనాలను కాపాడడం కోసం.
ii) ముస్లింల సమస్యలను ప్రస్తావించడం కోసం.

AP 10th Class Social Important Questions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

ప్రశ్న 5.
క్రింది ఉద్యమాలను సరైన కాలక్రమంలో అమర్చండి.
క్విట్ ఇండియా ఉద్యమం, వందేమాతరం ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం
జవాబు:
i) వందేమాతరం ఉద్యమం.
ii) శాసనోల్లంఘన ఉద్యమం.
1) క్విట్ ఇండియా ఉద్యమం.

ప్రశ్న 6.
“బ్రిటీష్ పాలకులను తరిమివెయ్యటానికి అతడు రహస్యంగా జర్మనీకి, అక్కడి నుండి జపానుకు వెళ్ళి 1942లో భారతీయ సైనికులతో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేశాడు.” ఈ వాక్యంలో చర్చించబడిన జాతీయ నాయకుడు ఎవరు?
జవాబు:
సుభాష్ చంద్రబోస్.

ప్రశ్న 7.
క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీజీ ఇచ్చిన నినాదమేమి?
జవాబు:
“చెయ్యండి లేదా చావండి” (Do or Die)

ప్రశ్న 8.
ఇవ్వబడిన దేశాలను అవి ఉన్న స్థానం ఆధారంగా తూర్పు నుండి పడమరకు అమర్చండి.
భారతదేశం, జపాన్, ఇంగ్లాండు, అమెరికా.
జవాబు:
జపాన్, భారతదేశం, ఇంగ్లాండు, అమెరికా.

ప్రశ్న 9.
అక్ష రాజ్యా లనగా ఏవి?
జవాబు:
జర్మనీ, జపాన్, ఇటలీలను కలిపి “అక్ష రాజ్యా ” లంటారు.

ప్రశ్న 10.
‘రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరు?
జవాబు:
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కన్సర్వేటివ్ పార్టీకి చెందిన “విన్స్టన్ చర్చిల్” ప్రధానమంత్రిగా ఉన్నారు.

ప్రశ్న 11.
ఎం.ఎ. జిన్నా ఎవరు?
జవాబు:
ఎం.ఎ. జిన్నా ముస్లిం లీగు నాయకుడు.

ప్రశ్న 12.
“క్విట్ ఇండియా” ఉద్యమం ఎప్పుడు, ఎందుకు ప్రారంభమైంది?
జవాబు:
క్రిప్స్ దౌత్యం విఫలమైన తరువాత బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గాంధీజీ 1942 ఆగస్టులో “క్విట్ ఇండియా” ఉద్యమాన్ని ప్రారంభించారు.

ప్రశ్న 13.
భారత జాతీయ సైన్యం అంటే ఏమిటి?
జవాబు:
బర్మా, మలయా దేశాలలో బ్రిటనను జపాన్ ఓడించి, కొంత మంది సైనికులను బందీలుగా తీసుకుంది. సుభాష్ చంద్రబోస్ జపాన్ వెళ్ళి ఈ బందీలను విడుదల చేయించి వారితో జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేసినాడు.

AP 10th Class Social Important Questions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

ప్రశ్న 14.
“ప్రత్యక్ష కార్యాచరణ” దినం ఏది?జవాబు:
1946 ఆగష్టు 16ను “ప్రత్యక్ష కార్యాచరణ” దినంగా ముస్లిం లీగు ప్రకటించింది.

ప్రశ్న 15.
చివరి వైస్రాయ్ ఎవరు?
జవాబు:
“మౌంట్ బాటెన్” భారతదేశానికి చివరి వైస్రాయ్ గా 1947 ఫిబ్రవరిలో వచ్చాడు.

ప్రశ్న 16.
భారత్, పాక్ కు స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది?
జవాబు:
పాకిస్తాన్‌కు 1947 ఆగస్టు 14న, భారత్ కు 1947 ఆగష్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది.

ప్రశ్న 17.
గాంధీజీ ఎప్పుడు మరణించాడు?
జవాబు:
గాంధీజీ 1948 జనవరి 30న మరణించాడు.

ప్రశ్న 18.
బ్రిటిష్ అధికారం క్రింద ఎన్ని సంస్థానాలున్నాయి?
జవాబు:
బ్రిటిష్ అధికారం క్రింద వివిధ స్థాయిలలో సుమారు 550 సంస్థానాలుండేవి.

ప్రశ్న 19.
రైతాంగం, ఎక్కడ సాయుధ పోరాటం చేపట్టింది?
జవాబు:
హైదరాబాదు, ట్రావన్ కోర్లలో పాలక జమీందార్లకు వ్యతిరేకంగా రైతాంగం సాయుధ పోరాటం చేపట్టింది.

ప్రశ్న 20.
సంస్థానాలను విలీనం చేసే బాధ్యతను ఎవరికి అప్పగించడమైనది?
జవాబు:
1947లో సంస్థానాలను విలీనం చేసే బాధ్యతను “సర్దార్ పటేల్” కి అప్పగించారు.

ప్రశ్న 21.
1947 ఆగష్టు 15 నాటికి భారతదేశంలో విలీనం కాని సంస్థానాలేవి?
జవాబు:
1947 ఆగష్టు 15 నాటికి భారతదేశంలో కాశ్మీర్, హైదరాబాదు, జునాగఢ్లు విలీనం కాలేదు.

ప్రశ్న 22.
రాష్ట్రాలను ఎందుకు ఏర్పరిచారు?
జవాబు:
అనేక సంస్థానాలను భారతదేశంలో విలీనం చెయ్యటం మూలంగా పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రాలను ఏర్పరిచారు.

ప్రశ్న 23.
భారతదేశంలో కొత్త రాష్ట్రాలను ఏర్పరిచే ప్రక్రియ ఎప్పటి వరకు కొనసాగింది?
జవాబు:
భారతదేశంలో కొత్త రాష్ట్రాలను ఏర్పరిచే ఈ ప్రక్రియ 1956 వరకు కొనసాగింది.

ప్రశ్న 24.
1971 భారత ప్రభుత్వం వేటిని రద్దు చేసింది?
జవాబు:
రాచరిక భరణాన్ని, గత రాచరిక కుటుంబాల బిరుదులను రద్దు చేసింది.

ప్రశ్న 25.
1935 భారత ప్రభుత్వ చట్టం ఎంత మందికి ఓటు హక్కును ఇచ్చింది?
జవాబు:
ఈ చట్టం రాష్ట్ర శాసనసభలకు 12%, కేంద్ర సభకు 1% ప్రజలకే ఓటు హక్కును కల్పించింది.

AP 10th Class Social Important Questions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

ప్రశ్న 26.
1937లో జరిగిన ఎన్నికలలో ఎన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ విజయం సాధించింది?
జవాబు:
1937 ఎన్నికలలో 11 రాష్ట్రాలకుగాను 8 రాష్ట్రాలలో కాంగ్రెస్ విజయం సాధించి ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.

ప్రశ్న 27.
కాంగ్రెస్ ఏ సభలో “పూర్ణ స్వరాజ్యం ” తమ ధ్యేయంగా తీర్మానించింది?
జవాబు:
1929 లో లాహోర్‌లో జరిగిన కాంగ్రెస్ సభలో ‘పూర్ణ స్వరాజ్యం” తమ ధ్యేయంగా కాంగ్రెస్ తీర్మానించింది.

ప్రశ్న 28.
1909 లో చేసిన చట్టం మూలంగా ముస్లింలకు లభించిన ప్రయోజనం ఏమిటి?
జవాబు:
1909 శాసన సభల చట్టం మూలంగా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు.

ప్రశ్న 29.
‘పాకిస్తాన్ లేదా పాకిస్తాన్’ అనే పదం ఏ విధంగా ఏర్పడింది?
జవాబు:
కేంబ్రిడ్జ్ లోని పంజాబీ ముస్లిం అయినా “చౌదరీ రెహ్మత్ ఆలి” అనే అతను పంజాబు, ఆఫ్ఘన్, కాశ్మీరు, సింధూ, బెలుచిస్థాన్లను ఇంగ్లీషు అక్షరాలతో రూపొందించినాడు.

ప్రశ్న 30.
లౌకిక రాజ్య మనగానేమి?
జవాబు:
మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ రాజ్యం నుండి రక్షణ లభిస్తుంది, సమాన హక్కులు ఉంటాయి. మత – ప్రమేయం ఉండదు. ఈ విధానాన్ని “లౌకికత్వం” అంటారు.

ప్రశ్న 31.
భారతదేశంలో విలీనం కావడానికి మొదట అంగీకరించని మూడు స్వదేశీ రాజ్యాలేవి?
జవాబు:
భారతదేశంలో విలీనం కావడానికి మొదట అంగీకరించని మూడు సంస్థానాలు :

  1. కాశ్మీర్
  2. జునాగఢ్
  3. హైదరాబాద్.

10th Class Social 16th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
గాంధీజీ హత్య ఉదంతాన్ని సంక్షిప్తంగా రాయండి.
జవాబు:

  1. 1947 ఆగస్టు 15న బెంగాల్లో అల్లర్లతో అతలాకుతలమైన నోవఖలీలో శాంతిని నెలకొల్పటానికి జాతిపిత గాంధీజీ ప్రయత్నించాడు.
  2. దేశ రాజధాని అయిన ఢిల్లీకి అతడు 1947 సెప్టెంబరు 9నగాని రాలేదు.
  3. వాయవ్య భారత్ లో పెద్ద ఎత్తున చెలరేగిన మత ఘర్షణలతో ఆ వృద్ధ నేత అసంతృప్తితో ఉన్నారు.
  4. ప్రజల భయాలను దూరం చెయ్యడానికి ప్రయత్నించారు.
  5. దేశంలోని ప్రజలలోని ఒక వర్గం భారతదేశ రాజకీయాలలో గాంధీ పాత్రతో కోపంగా ఉంది.
  6. గాంధీజీ నిర్వహిస్తున్న సర్వమత ప్రార్థన సమావేశాలను పలుమార్లు వాళ్ళు భంగపరచారు.
  7. గాంధీజీని చంపటానికి రెండు రోజుల ముందు అతడిపై జరిపిన హత్యాయత్నం విఫలమైంది.
  8. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆరు నెలల లోపే 1948 జనవరి 30 సాయంత్రం సర్వమత ప్రార్ధనకు వెళుతున్న జాతిపిత మూడు బుల్లెట్లకు నేలకొరిగాడు.

ప్రశ్న 2.
మహాత్మా గాంధీలో నీకు నచ్చిన లక్షణాలు ఏవి? ఎందుకు?
జవాబు:

  1. సత్యాన్ని పాటించడం.
  2. అహింసను పాటించడం.
  3. నిరాడంబరంగా ఉండడం.
  4. త్యాగనిరతి కలిగి ఉండడం.

AP 10th Class Social Important Questions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

ప్రశ్న 3.
‘భారతదేశం అనేక మతాల, జాతుల దేశము. అది అలాగే కొనసాగాలి.’ వ్యాఖ్యానించండి.
జవాబు:

  1. భారతదేశంలో అనేక మతాలు, జాతులు ఉన్నాయి.
  2. అయినప్పటికి ఇది ప్రజాస్వామిక లౌకిక రాజ్యం ‘గా కొనసాగుతున్నది.
  3. మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ రాజ్యం రక్షణ కల్పిస్తున్నది.
  4. పౌరులందరికీ సమాన హక్కులు ఉన్నాయి.

ప్రశ్న 4.
సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేసిన భారత జాతీయ సైన్యం గురించి రాయండి.
జవాబు:

  1. బ్రిటన్న జపాన్ ఓడించినపుడు కొందరు భారతీయ సైనికులు జపానుకు బందీలుగా చిక్కారు.
  2. ఈ సైనికులతో సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు.
  3. తరువాత ఎంతోమంది మహిళలతో సహా ఇతర భారతీయులు కూడా ఈ సైన్యంలో చేరారు.
  4. భారత జాతీయ సైన్యం బ్రిటీషువారికి వ్యతిరేకంగా దాదాపు 3 సంవత్సరాలపాటు యుద్ధం చేసింది.
  5. అంతిమంగా భారత జాతీయ సైన్యం బ్రిటీష్ వాళ్ళ చేతుల్లో ఓడిపోయింది.

ప్రశ్న 5.
సర్దార్ పటేల్ లో నీకు నచ్చిన గుణాలు ఏవి? ఎందుకు?
జవాబు:
సర్దార్ పటేలో నాకు నచ్చిన గుణాలు

  1. దేశభక్తి
  2. అంకితభావం మరియు నిబద్ధత

ప్రశ్న 6.
దొమీనియన్ ప్రతిపత్తి అనగానేమి?
జవాబు:
బ్రిటిష్ ప్రభుత్వం, 2వ ప్రపంచ యుద్ధం తరువాత సార్వభౌమాధికారం కలిగిన రాజ్యప్రతిపత్తిని భారతదేశానికి ఇస్తామని, అందుకొరకు ఒక రాజ్యాంగాన్ని రూపొందించి, దానిని బ్రిటిష్ అమలు చేస్తుందని ప్రకటించింది. దీనినే ” డొమీనియన్ ప్రతిపత్తి” అంటారు.

ప్రశ్న 7.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు 1939లో రాజీనామా ఎందుకు చేయవలసి వచ్చింది?
జవాబు:

  1. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. కాంగ్రెస్ ను సంప్రదించకుండానే భారతదేశం కూడా రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొనాలని బ్రిటిష్ వైస్రాయి ఏకపక్ష నిర్ణయం తీసుకున్నాడు.
  2. ఈ నిర్ణయాన్ని సహజంగానే కాంగ్రెస్ వ్యతిరేకించింది.
  3. యుద్ధంలో చురుగ్గా పాల్గొనడానికి ముందే భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం ప్రకటించాలని లేదా కనీసం ముఖ్యమైన అధికారాలను అప్పగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
  4. బ్రిటిష్ ప్రభుత్వం ఈ కోరికలను అంగీకరించలేదు. అందుకు నిరసనగా కాంగ్రెస్ మంత్రి వర్గాలు 1939లో రాజీనామా చేసినాయి.

ప్రశ్న 8.
హిందూ మహాసభ, ఆర్.ఎస్.ఎస్. ముఖ్య పాత్ర ఏమిటి?
జవాబు:

  1. ఈ రెండు కూడా ప్రజలను సమీకరించడానికి చురుకుగా పనిచేశాయి.
  2. కులం, వర్గాలను అధిగమించి హిందువులందరినీ ఏకం చేసి సామాజిక జీవితంలో సంస్కరణలు తీసుకురావాలని ఈ సంఘాలు ఆశించాయి.
  3. భారతదేశం అధిక సంఖ్యలో ఉన్న హిందువుల భూమి అన్న అభిప్రాయాన్ని కూడా వాళ్ళు కలిగించారు.

ప్రశ్న 9.
అమెరికా, యూరపులలో జపాన్ సాధించిన విజయాలు భారతీయులపై ఏ విధంగా ప్రభావం చూపాయి?
జవాబు:

  1. అమెరికా, యూరపులలో జపాన్ సాధించిన విజయాలు భారతీయులపై బలమైన ముద్రలు వేశాయి.
  2. జపాను ఆసియా దేశం. అది ఐరోపా వలస పాలకులను ఎదుర్కొగలిగింది. తాము కూడా బ్రిటనకు వ్యతిరేకంగా పోరాడి, గెలవగలమని భారతీయులు భావించసాగారు.
  3. ఆంగ్లేయులు ఉన్నత జాతికి చెందిన వాళ్లన్న భ్రమ బద్దలయ్యింది.

ప్రశ్న 10.
భారత జాతీయ సైన్యం ఏ విధంగా ఆవిర్భవించింది?
జవాబు:
బర్మా, మలయా దేశాలలో బ్రిటన్ తో జపాన్ యుద్ధం చేసి ఓడించినపుడు కొంతమంది బ్రిటిష్ సైనికులను జపాను బందీలుగా తీసుకున్నది. ఈ బందీలలోని భారత సైనికులను సుభాష్ చంద్రబోస్ తీసుకొని దానికి భారత జాతీయ సైన్యం అని పేరు పెట్టినాడు. బోస్, భారత జాతీయ సైన్యంను జపాన్ సైన్యంతో కలిపి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా దాదాపు మూడు సంవత్సరాలపాటు యుద్ధం చేశాడు.

AP 10th Class Social Important Questions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

ప్రశ్న 11.
“తెభాగ” ఉద్యమం అంటే ఏమిటి?
జవాబు:
బెంగాల్లో పెద్ద భూస్వాముల నుంచి భూమిని సాగుకు తీసుకున్న చిన్న, పేద రైతులు ఆందోళన చేయసాగారు. ఆ సమయంలో కౌలుకింద తమకు సగం, లేదా అంతకంటే తక్కువ ఇస్తుండగా తమ వాటాని మూడింట రెండు వంతులకు పెంచాలని వాళ్ళు కోరారు. దీనిని “తెభాగ” ఉద్యమం అంటారు. దీనికి ఆ రాష్ట్ర కిసాన్ సభ నేతృత్వం వహించింది.

ప్రశ్న 12.
“రాచరిక భరణం” అంటే ఏమిటి?
జవాబు:
భారతదేశంలో బ్రిటిష్ పాలనలో సుమారు 550 సంస్థానాలుండేవి. ఈ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసినాక భారత ప్రభుత్వం ఆయా రాచరిక కుటుంబాలకు వ్యక్తిగత ఖర్చులకు పెన్షను మంజూరు చేశారు. దీనినే “రాచరిక భరణం” అంటారు. అయితే ఈ రాజ భరణాలను 1971లో భారత ప్రభుత్వం రద్దు చేసింది. రాచరిక బిరుదులను కూడా రద్దు చేసింది.

ప్రశ్న 13.
1935 భారత ప్రభుత్వ చట్టంలోని ముఖ్యాంశాలేమిటి?
జవాబు:
3వ రౌండ్ టేబుల్ సమావేశంలో కొనసాగిన చర్చల ఫలితంగా 1935లో చట్టం చేయబడింది.
ముఖ్యాంశాలు :

  1. ఈ చట్టం ప్రకారం భారతదేశంలో ఫెడరల్ విధానం ఏర్పాటుకు సంబంధించిన అంశాలున్నాయి.
  2. రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన రద్దు అయినది.
  3. అన్ని శాఖలు మంత్రులకే అప్పగించడం జరిగింది.
  4. కాని గవర్నర్‌కు శాసన సభా తీర్మానాలను తోసి పుచ్చే అధికారం ఉండేది.

ప్రశ్న 14.
జాతీయోద్యమానికి సంబంధించిన ఈ క్రింది ప్రదేశాలను ఇవ్వబడిన భారతదేశపటంలో గుర్తించండి.
1) పంజాబ్
2) సింధు
3) కాశ్మీర్
4) బెలూచిస్తాన్
5) బెంగాల్
6) హైదరాబాద్
7) జునాగఢ్
8) అసోం
9) ఆఫ్ఘన్
జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం 1939-1947 2

ప్రశ్న 10.
భారతదేశ పటంలో ఈ క్రింది ప్రాంతాలను గుర్తించండి.
జవాబు:

  1. ఉత్తరప్రదేశ్
  2. బాంబే
  3. మద్రాసు
  4. బెంగాల్
  5. పంజాబ్

AP 10th Class Social Important Questions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం 1939-1947 3

ప్రశ్న 11.
మహాత్మాగాంధీలో మీకు నచ్చిన ఏవైనా నాలుగు లక్షణాలను తెలపండి.
జవాబు:

  1. గాంధీజీ స్వాతంత్ర్యోద్యమానికి పెద్ద ఎత్తున ప్రజల మద్దతు సంపాదించి పెట్టాడు.
  2. గాంధీజీ సత్యాగ్రహం, అహింస ఆయుధాలుగా స్వాతంత్ర్యం సంపాదించి పెట్టాడు.
  3. గాంధీ విభజన సందర్భంగా జరిగిన అల్లర్లలో, మరణాలు, నిర్వాసితులుగావడం పట్ల బాధతో మొదట స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోలేదు.
  4. గాంధీజీ చొరవతో అల్పసంఖ్యాక వర్గాల హక్కులపై నెహ్రూ, కాంగ్రెస్ ఒక తీర్మానాన్ని చేయడం జరిగింది.

ప్రశ్న 12.
భారతీయులు తమ స్వాతంత్ర్య పోరాటాన్ని పక్కన పెట్టి స్వేచ్ఛాయుత ప్రపంచంపై దృష్టి కేంద్రీకరించాల్సినంతగా హిట్లర్ బలం పుంజుకుని మానవాళి స్వేచ్చకు ముప్పు కలిగించేవాడా?
జవాబు:
మొదటి ప్రపంచయుద్ధం తరువాత ఆమోదించిన రెహ్మత్ ఆలివర్సయిల్స్ సంధి షరతులు జర్మనీకి అవమానకరంగా ఉన్నాయని హిట్లర్ భావించాడు. ఇతర దేశాల ఆధీనంలో ఉన్న జర్మన్ భూభాగాలను ఏకం చేయాలని ఆశించాడు. సంధి షరతులను ఉల్లంఘించినాడు. పెద్ద దేశాలను ఎదిరించి, దూర ప్రాచ్యంలో తమకు కూడా వలసలు కావాలని ఆశించాడు. జర్మనీని చూసి అగ్రరాజ్యలు భయపడేలా చేసాడు. అయితే మన స్వాతంత్ర్య పోరాటం వదిలి స్వేచ్ఛాయుత ప్రపంచం కొరకు దృష్టి పెట్టవలసినంత అవసరం లేదు. జర్మనీకి భారత జాతీయ పోరాటం మీద సానుభూతి కూడా ఉంది.

10th Class Social 16th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
దేశ విభజన సామాన్య ప్రజానీకంపై ఎలా ప్రభావితం చూపింది?
జవాబు:
దేశ విభజన సామాన్య ప్రజల జీవితాలను బాగా ప్రభావితం చేసింది.

  1. తమ ఊళ్ళు, ఇళ్ళు, పట్టణాలను విడిచి వెళ్ళవలసిరావటంతో ఒకరిపట్ల ఒకరికి కోపం, విద్వేషాలు చెలరేగాయి.
  2. మొత్తంగా 1.5 కోట్లు హిందువులు, ముస్లిములు నిర్వాసితులయ్యారు.
  3. హత్యలు, దోపిడి, దహనాలు యధేచ్ఛగా కొనసాగాయి.
  4. హిందువులు, ముస్లింలు కలిపి రెండు నుండి అయిదు లక్షల మంది చంపబడ్డారు.
  5. వాళ్ళు కాందిశీకులుగా మారారు, పునరావాస శిఖరాలలో గడిపారు.
  6. రైళ్ళలో కొత్త ఇళ్ళ అన్వేషణలో బయలుదేరారు.
  7. శాంతి, సౌభ్రాతృత్వ సందేశాలను పంచుతూ గాంధీజీ అల్లర్లకు గురైన ప్రజల శిబిరాల మధ్య ఆసుపత్రులలో గడిపాడు.
  8. గాంధీజీ చొరవతో “అల్ప సంఖ్యాక వర్గాల హక్కుల పై’ నెహ్రూ, కాంగ్రెస్ ఒక తీర్మానాన్ని చేశాయి.

AP 10th Class Social Important Questions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

ప్రశ్న 2.
ఈ క్రింది పేరాగ్రాను చదివి వ్యాఖ్యానించండి.
బ్రిటన్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమును సంప్రదించకుండనే భారతదేశం యుద్ధంలో పాల్గొంటుందని నిర్ణయం తీసుకుంది. దీంతో కాంగ్రెస్ సతమతమైపోయింది. అనేకమంది కాంగ్రెస్ నాయకులు హిట్లర్, ముస్సోలినిని, ఫాసిజాన్ని వ్యతిరేకించారు. ఇతర స్వతంత్ర దేశాలను జయించటానికి ప్రయత్నిస్తున్న ఫాసిస్ట్ శక్తులను ఎదుర్కోవాలన్న కృత నిశ్చయంతో వాళ్ళు ఉన్నారు. భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం ఇవ్వకుండా ఫాసిస్టులపై తమ పోరాటంలో భారతదేశం మద్దతు ఇవ్వాలని కోరుకోవటంలో అవలంబిస్తున్న ద్వంద్వ ప్రమాణాలను బ్రిటిష్ గుర్తిస్తుందని కాంగ్రెస్ ఆశించింది.

ప్రశ్న: బ్రిటిష్ వారి ద్వంద్వ ప్రమాణాలపై వ్యాఖ్యానించండి.
జవాబు:

  1. భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం ఇవ్వకుండా ఫాసిస్టులపై తమ పోరాటంలో భారతదేశం మద్దతు ఇవ్వాలని కోరుకోవటంలో అవలంబిస్తున్న ద్వంద్వ ప్రమాణాలను బ్రిటీషు ప్రభుత్వం గుర్తిస్తుందని కాంగ్రెస్ ఆశించింది.
  2. బ్రిటిషువారు దీనిని గుర్తించారు.
  3. కానీ తాము నిర్మించిన సామ్రాజ్యాన్ని వదులుకోవటం వాళ్ళకి చాలా కష్టంగా అనిపించింది.
  4. బ్రిటిష్ సామ్రాజ్యం కింద భారతదేశానికి డొమినియన్ ప్రతిపత్తి ఇవ్వటానికి బ్రిటిష్ వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్యం కోరింది.
  5. బ్రిటన్ దీనికి అభ్యంతరం పెట్టింది.
  6. కాంగ్రెస్ భారతీయులందరికీ ప్రాతినిధ్యం వహించటం లేదని బ్రిటన్ భావం.
  7. అనేకమంది భారతీయుల ప్రయోజనాలను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని వాటిని కాపాడాల్సిన బాధ్యత తమపైన ఉన్నదని బ్రిటన్ భావించింది.

ప్రశ్న 3.
ఈ క్రింది పేరాగ్రాను చదివి వ్యాఖ్యానించండి.

బెంగాల్లో పెద్ద భూస్వాముల నుంచి భూమికి సాగుకు తీసుకున్న చిన్న, పేద రైతులు ఆందోళన చేయసాగారు. ఆ సమయంలో కౌలు కింద తమకు సగం, లేదా అంతకంటే తక్కువ ఇస్తుండగా తమ వాటాని మూడింట రెండు వంతులకు పెంచాలని వాళ్ళు కోరారు. దీనినే ‘తేభాగ’ ఉద్యమం అంటారు. దీనికి ఆ రాష్ట్ర కిసాన్ సభ నేతృత్వం వహించింది.
ప్రశ్న: పై పేరాను చదివి చిన్న, పేద రైతుల డిమాండ్లను సమర్థిస్తావా? అయితే ఎలా? వ్యాఖ్యానించుము.
జవాబు:
అవును, నేను బెంగాల్ లోని చిన్న, సన్నకారు రైతుల ఆందోళనను సమర్థిస్తాను.

  1. బెంగాల్ ప్రజలకు కౌలు కింద తమకు సగం, లేదా అంతకంటే తక్కువ ఇస్తుండగా తమ వాటాని మూడింట రెండు వంతులకు పెంచాలని వాళ్ళు కోరారు.
  2. పంటను పండించటానికి రైతులు పెట్టుబడిని పెట్టినప్పటికీ రైతులకు సరియైన ఆదాయాన్ని యజమానులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు.
  3. పంటలు సరిగా పండకపోయినప్పటికీ రైతులు ఎక్కువ కౌలును చెల్లించవలసిరావడం మరియు వాళ్ళు చాలా ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొనవలసి రావడంతో తీసుకున్న రుణాలను కూడా తిరిగి చెల్లించలేకపోయినాయి.

ప్రశ్న 4.
కొత్తగా ఏర్పడిన భారతదేశంలోకి వివిధ సంస్థానాలను విలీనం చేసే ప్రక్రియ ఒక సవాలుగా పరిణమించింది. చర్చించండి.
జవాబు:

  1. బ్రిటిష్ పాలకులు భారతదేశంను విడిచి వెళ్ళే సమయానికి సుమారు 550 స్వదేశీ సంస్థానాలు ఉండేవి.
  2. బ్రిటిష్ వారి పాలన అనంతరం అవి స్వాతంత్ర్యం పొందాయి.
  3. ఈ సంస్థానాలను బ్రిటిష్ వారు భారతదేశంలో విలీనమవ్వడమో లేదా పాకిస్థాన్లో విలీనమవ్వడమో లేదా స్వతంత్రంగా ఉండటమో నిర్ణయం తీసుకోవలసిందిగా కోరారు.
  4. ఈ క్రమంలో హైదరాబాద్, ట్రావెన్ కోర్స్ లో పాలక జమీందార్లకు వ్యతిరేకంగా రైతాంగం సాయుధ పోరాటం చేపట్టింది.
  5. స్వదేశీ సంస్థానాలు భారత భూభాగంలో విలీనం చేసే బాధ్యతను 1947 జులై నెలలో సర్దార్ వల్లభాయి పటేల్‌కు అప్పగించబడింది.
  6. భారతదేశంలో ఈ సంస్థానాలు విలీనం కావలసిన ఆవశ్యకత గురించి పటేల్ రాచరిక కుటుంబాలతో చర్చించారు.
  7. ఫలితంగా కాశ్మీర్, హైదరాబాద్, జునాగఢ్ లు తప్పించి మిగిలిన సంస్థానాలన్నీ భారతదేశంతో విలీన ఒప్పంద పత్రంపై సంతకం చేశాయి.
  8. స్వాతంత్ర్యం పొందిన రెండు సంవత్సరాలలోనే మిగిలిన సంస్థానాలను కూడా విలీనం చేసి సర్దార్ పటేల్ సమర్ధవంతంగా ఈ సవాలును ఎదుర్కొన్నారు.

ప్రశ్న 5.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక రాజకీయ వ్యవస్థలుగా ప్రజాస్వామ్యాలే ఉన్నాయి. ఇవి ప్రజల ఆకాంక్షలకు పూర్తి న్యాయం చేశాయా?
జవాబు:

  1. అవును. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలకు న్యాయం చేస్తాయి.
  2. ఎందుకనగా అవి ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఏర్పడిన ప్రభుత్వాలు కనుక అవి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాయి.
  3. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం ప్రజలచేత ఆమోదించబడిన రాజకీయ వ్యవస్థ ప్రజాస్వామ్యము.
  4. ప్రజాస్వామ్యంలో ప్రజలు అత్యంత జాగరూకత మరియు అప్రమత్తత కలిగి ఉంటారు. కనుక వారి ఆకాంక్షలకు న్యాయం జరుగుతుంది.
  5. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వాలు నెరవేర్చని పక్షంలో ప్రజలు ఉద్యమాలు చేపడతారు.

AP 10th Class Social Important Questions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

ప్రశ్న 6.
1935 చట్టం ఇచ్చిన అధికారాలకు భారతీయులు బ్రిటిష్ ప్రభుత్వం పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉండాలా? మీ అభిప్రాయం తెలుపుము.
జవాబు:
లేదు. 1935 చట్టం ఇచ్చిన అధికారాలకు భారతీయులు బ్రిటిష్ ప్రభుత్వం పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండవలసిన అవసరము లేదు. ఎందుకంటే

  1. భారతదేశము భారతీయులదే.
  2. మనకు స్వేచ్ఛ కోరే హక్కు ఉన్నది.
  3. మన జాతీయ నాయకులు, స్వతంత్ర్య రాజ్యస్థాపనకై తిరుగుబాటు చేయడం మొదలు పెట్టారు.
  4. అందువల్లనే బ్రిటిష్ వారు 1935 చట్టాన్ని చేశారు.

కనుక, మనము మన జాతీయవాద నాయకులు, స్వాతంత్ర్య పోరాట వీరుల పట్ల కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి కానీ బ్రిటిష్ వారి పట్ల కాదు.

ప్రశ్న 7.
స్వాతంత్రం వచ్చిన తొలి సంవత్సరాలలో సామాజిక ఆర్థిక మార్పు తీసుకురావటానికి ఏ చర్యలు చేపట్టారు?
జవాబు:

  1. స్వాతంత్ర్యానంతరం 1950లో ప్రణాళికా సంఘం స్థాపించబడింది.
  2. పంచవర్ష ప్రణాళికలు 1951లో ప్రారంభం అయ్యా యి.
  3. భూ సంస్కరణలు అమలు చేయబడ్డాయి.
  4. జమిందారీ వ్యవస్థ రద్దు కాబడింది. 5) వ్యవసాయ సహకార సంఘాలను ఏర్పాటు చేశారు.
  5. కౌలుదారీ సంస్కరణలు మరియు భూపరిమితి చట్టాలు చేయబడ్డాయి.
  6. స్థానిక స్వపరిపాలన సంస్థలు ఏర్పాటు చేశారు.
  7. డ్యాంలు, పరిశ్రమల నిర్మాణం చేపట్టబడింది.

ఈ విధంగా స్వాతంత్ర్యం వచ్చిన తొలి సంవత్సరాలలో సామాజిక, ఆర్థిక మార్పు తీసుకురావడానికి పలు చర్యలు చేపట్టారు.

ప్రశ్న 8.
క్రింది ఇచ్చిన పేరాగ్రాఫును చదివి దిగువ ఇచ్చిన ప్రశ్నకు జవాబు రాయండి.
శాంతి, సౌభ్రాతృత్వం అనే సందేశాలను పంచుతూ గాంధీజీ శిబిరాలలోనూ, ఆసుపత్రులలోనూ తలదాచుకుంటున్న అల్లర్లకు గురైన ప్రజల మధ్య గడిపాడు. తను ఇంతగా కష్టపడింది. ఇటువంటి స్వేచ్ఛ, స్వరాజ్యాల కోసం కాదు. మొదటి స్వాతంత్ర్య దినోత్సవం నాడు జాతిపిత ఎటువంటి సంబరాలు చేసుకోలేదు. నిరాహారదీక్ష చేశాడు.
ప్రశ్న: నూతన దేశం పాకిస్తాన్ ఏర్పాటు కావడంతో కొత్తగా గీసిన సరిహద్దు రేఖకు ఇరువైపులా గల ప్రజలు ఎదుర్కొనవలసి వచ్చిన పరిస్థితుల గురించి వ్యాఖ్యానించండి.
జవాబు:

  1. భారత్ వైపు ఉన్న ముస్లింలలో, పాకిస్తాన్ వైపు ఉన్న హిందువులలో అభద్రత ఏర్పడింది. ఇళ్ళు, ఊళ్ళు విడిచి వెళ్ళవలసి రావడంతో ఒకరి పట్ల ఒకరికి కోపం, విద్వేషం చెలరేగాయి.
  2. 1.5 కోట్ల మంది హిందువులు, ముస్లిములు నిర్వాసితులయ్యారు. అనేకులు పునరావాస శిబిరాలలో గడిపారు.
  3. హత్యలు, దోపిడీలు, దహనాలు కొనసాగాయి. జనం రెండు నుండి ఐదు లక్షలమంది చంపబడ్డారు.
  4. స్వాతంత్ర్య దినోత్సవం నాడు అందరూ పండుగ చేసుకుంటుంటే జాతిపిత గాంధీ మాత్రం నిరాహార దీక్షలో గడిపాడు.

ప్రశ్న 9.
భారతదేశ విభజన వలన సంభవించిన పరిణామాలు వ్రాయండి.
జవాబు:
భారతదేశ విభజన వలన సంభవించిన పరిణామాలు :

  1. భారత్ వైపు ఉన్న ముస్లింలలో, పాకిస్థాన్ వైపు ఉన్న హిందువులలో అభద్రత ఏర్పడింది.
  2. ఇళ్ళు, ఊళ్ళు విడిచి వెళ్ళవలసి రావడంతో ఒకరి పట్ల ఒకరికి కోపం, విద్వేషం చెలరేగాయి.
  3. దాదాపు 1.5 కోట్ల మంది హిందువులు, ముస్లింలు నిర్వాసితులయ్యారు.
  4. అనేకులు పునరావాస శిబిరాలలో గడిపారు. 5) హత్యలు, దోపిడీలు, దహనాలు కొనసాగాయి.
  5. రెండు నుండి ఐదు లక్షల మంది జనం చంపబడ్డారు.

ప్రశ్న 10.
భారత జాతీయ సైన్యం భారత స్వాతంత్ర్యం కోసం ఎలా పోరాడిందో వివరించండి.
జవాబు:
భారతదేశ స్వాతంత్ర్యం అత్యంత ప్రాధాన్యత గల అంశమని, బ్రిటిష్ పాలకులను తరిమెయ్యటానికి జపాను వాళ్ల సహాయం తీసుకోవాలని సుభాష్ చంద్రబోస్ భావించాడు. అతడు రహస్యంగా జర్మనీకి, అక్కడినుంచి జపానుకి వెళ్లి 1942లో భారతీయ సైనికులతో ఒక సైన్యాన్ని తయారుచేశాడు. బర్మా, మలయా దేశాలలో బ్రిటన్న జపాను ఓడించినపుడు బందీలుగా తీసుకున్న బ్రిటిష్ సైన్యంలోని వాళ్ళే వీళ్లు. భారత జాతీయ సైన్యం అని పేరుపెట్టి తన సైన్యంలోకి బోస్ వీళ్లని తీసుకున్నాడు. తరువాత ఎంతోమంది మహిళలతో సహా ఇతర భారతీయులు కూడా ఈ సైన్యంలో చేరారు. అయితే బోతో గాంధీజీ ఏకీభవించలేదు, జపనీయులు భారతదేశానికి విముక్తి దాతలు కాలేరని అతడు భావించాడు. కానీ సుభాష్ తాను ఎంచుకున్న మార్గంలో ముందుకు సాగాడు. జపాను సైన్యంతో కలిసి తన సైన్యంతో బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా దాదాపు మూడు సంవత్సరాలపాటు యుద్ధం చేశాడు. . సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ సైన్యం బ్రిటిష్ వాళ్ల చేతుల్లో ఓటమి పాలయ్యింది. భారత జాతీయ సైన్యానికి చెందిన సైనికులను జైలుపాలు చేసి శిక్షించాలని బ్రిటిష్ పాలకులు నిర్ణయించారు.

AP 10th Class Social Important Questions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

ప్రశ్న 11.
కింది పేరాను చదివి, మీ అభిప్రాయాన్ని రాయండి.
అమెరికా యూరప్లో జపాన్ సాధించిన విజయాలు భారతీయులపై బలమైన ముద్రలు వేసాయి. ఐరోపా వలస పాలకులు త్వరలోనే ఓడింపబడతారని అనుకోసాగారు. జపాన్ ఆసియా దేశం. అది ఐరోపా వలస పాలకులను ఎదుర్కోగలిగింది. తాము కూడా బ్రిటన్‌కు వ్యతిరేకంగా పోరాడి, గెలవగలమని భారతీయులు అనుకోసాగారు.
జవాబు:

  1. జపాన్ 1905 రష్యా-జపాన్ యుద్ధంలో శక్తివంతమైన రష్యా సామ్రాజ్యాన్ని ఓడించింది.
  2. జపాన్ తనదైన ఫాసిస్టు సిద్ధాంతాన్ని రూపొందించుకొని చైనా, కొరియా వంటి దేశాలపై సైనిక దాడులకు పాల్పడింది.
  3. రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా 1942లో జపాన్ అమెరికా పై దాడి చేసింది.
  4. అమెరికా, యూరప్లో జపాను సాధించిన విజయాలు భారతీయులను ప్రభావితం చేశాయి.
  5. జపాను విజయాలతో భారతదేశం వంటి ఆసియా దేశాలలో జాతీయవాదం వెల్లువలా ఉప్పొంగింది.
  6. ఒక చిన్న ఆసియా దేశమైన జపాను ఐరోపా వలస పాలకులను ఎదుర్కోగలిగినట్లే తాము కూడా బ్రిటనకు వ్యతిరేకంగా పోరాడి, గెలవగలమని భారతీయులు భావించారు. ఆంగ్లేయులు ఉన్నత జాతికి చెందిన వారన్న భ్రమ బద్దలయ్యింది.
  7. ఈ విధంగా జపాను విజయాలు భారత స్వాతంత్ర్య పోరాటానికి స్ఫూర్తినిచ్చాయని చెప్పవచ్చు.

ప్రశ్న 12.
1909 భారత శాసనసభల చట్టంలోని ముఖ్యాంశాలేమిటి?
జవాబు:
I. 1) శాసనసభలను విస్తరించడమైంది.
2) ప్రతి శాసనసభలో మూడు రకాలయిన సభ్యులు ఏర్పాటు అయినారు.
A) అధికారులు
B) అనధికారులు
C) నామనిర్దేశక సభ్యులు.

3) రాష్ట్రాలలో కూడా ఇదే విధంగా మూడు రకాలయిన సభ్యులు ఉంటారు. కాని ఇక్కడ ఎన్నిక ద్వారా వచ్చేవారి సంఖ్య ఎక్కువ.

4) సభ్యులను ఎన్నుకోవడం కోసం మూడు రకాలయిన నియోజక వర్గాలు ఏర్పడినాయి.
a) సాధారణ నియోజక వర్గం
b) భూస్వాముల నియోజక వర్గం, ముస్లింల నియోజక వర్గం
C) వర్తక సంఘాలలాంటి ప్రత్యేక నియోజక వర్గాలు.

II. 5) మహమ్మదీయులకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చేసినారు.

III. 6) ఇంగ్లాండులోని ఇండియా కౌన్సిలులో రెండు స్థానాలు భారతీయులకు కేటాయించినారు. ఒకటి హిందువులకు, రెండవది మహమ్మదీయులకు.

ప్రశ్న 13.
1919 భారత రాజ్యాంగ చట్టమును వివరించండి.
జవాబు:
1919 భారత రాజ్యాంగ చట్టమును “మాంటేగు చేమ్సుఫర్డు సంస్కరణలు” అంటారు. ఈ చట్టంలో రెండు భాగాలున్నాయి.
I. బ్రిటన్‌లోని యంత్రాంగంలో మార్పులు చేయుట.
II. భారతదేశంలోని యంత్రాంగంలో మార్పులు చేయుట.

I. బ్రిటన్లోని యంత్రాంగంలోని మార్పులు :
a) భారత రాజ్యాంగ కార్యదర్శి (ఇండియా మంత్రి) జీతభత్యాల ఖర్చు బ్రిటిష్ ప్రభుత్వమే వహించడానికి నిర్ణయించబడింది.
b) కార్యదర్శి యొక్క అధికారాలను కొంత వరకు తగ్గించబడినాయి.
c) హై కమిషనర్ అనే ఒక కొత్త పదవి సృష్టించడమైనది. అతనిని భారత ప్రభుత్వమే నియమించి అతని ఖర్చులన్నీ భరించాలి.

II. భారత యంత్రాంగంలోని మార్పులు :
a) కేంద్ర శాసనసభలో దిగువశాఖ, ఎగువశాఖ అనే రెండు శాఖలు (Lower House and Upper House) ఏర్పడినాయి.
b) దిగువశాఖను శాసనసభ అనీ, ఎగువసభను రాజ్యసభ అనీ అంటారు.
c) ఎగువసభ కాలపరిమితి 5 సంవత్సరాలు, దిగువ సభ కాలపరిమితి 3 సంవత్సరములు.
d) ఈ చట్టం ద్వారా రాష్ట్రంలో రెండు రకాల అధికారాలు, శాఖలు అనగా రిజర్వు శాఖ, ట్రాన్స్ ఫర్డ్ శాఖలుగా విభజించబడ్డాయి.
e) ప్రాముఖ్యం లేదా వైద్యం, విద్య, వ్యవసాయం, పశుపోషణ, రిజిస్ట్రేషను, దేవాదాయాలు, పరిశ్రమాభివృద్ధి వంటి అంశాలు ట్రాన్స్ఫర్డ్ శాఖ ఆధీనంలో ఉంచబడినాయి.
f) భూమిశిస్తు, నీటి పారుదల, కార్మిక విషయాలు, వార్తా పత్రికలపై అజమాయిషి, క్షామనివారణ, శాంతి భద్రతలు వంటి కీలక అంశాలు రిజర్వ్డు శాఖ ఆధీనంలో ఉంచబడినాయి.
g) కేంద్రంలో వలెనే రాష్ట్రాలలో కూడా సాధారణ నియోజక వర్గాలు, ప్రత్యేక నియోజక వర్గాలు ఏర్పాటైనాయి.

AP 10th Class Social Important Questions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

ప్రశ్న 14.
1937-1947 మధ్య ముస్లింల ఆలోచనలు ఎందుకు మారాయి? అవి 1946 ఎన్నికలలో ముస్లిం లీగు విజయభేరి మోగించడానికి దోహదపడినాయా?
జవాబు:
ముస్లిముల పట్ల కాంగ్రెస్ సున్నితత్వంతో స్పందించటం లేదని అనేక అంశాలను ముస్లిం లీగు ఎత్తి చూపింది. ఉదాహరణకు యునైటెడ్ ప్రావిన్స్ లో ఎక్కువ సీట్లనే గెలుచుకున్న ముస్లిం లీగుతో కలిపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయటాన్ని కాంగ్రెస్ తిరస్కరించింది. తమ సభ్యులు ముస్లిం లీగులో సభ్యత్వం తీసుకోవటాన్ని కాంగ్రెస్ నిషేధించింది. అంతకుముందు వరకు కాంగ్రెస్ సభ్యులు హిందూ మహాసభలో కూడా సభ్యులుగా ఉండే అవకాశం ఉండేది. మౌలానా ఆజాద్ వంటి కాంగ్రెస్లోని ముస్లిం నాయకులు దీనికి అభ్యంతరం తెలిపిన తరువాత 1938లో దీనిని కూడా నిషేధించారు. ఈ విధంగా కాంగ్రెస్ మౌలికంగా హిందువుల పార్టీ అని, ముస్లిములతో అధికారాన్ని పంచుకోటానికి అది సుముఖంగా లేదన్న అభిప్రాయాన్ని ముస్లిం లీగు సృష్టించగలిగింది.

ప్రశ్న 15.
సర్ స్టాఫర్డ్ క్రిప్స్ రాయబారంలోని చర్చలు విఫలం అయినాయి అని ఏ విధంగా చెప్పగలవు?
జవాబు:
రెండవ ప్రపంచ యుద్ధానంతరం భారతదేశానికి డొమీనియన్ ప్రతిపత్తి మరియు రాజ్యాంగాన్ని రూపొందించుకోడానికి భారతదేశాన్ని అనుమతించే వాగ్దానం వంటి సంస్కరణలు క్రిప్స్ రాయబారంలో చర్చించినప్పటికి ఈ చర్చలు విఫలం అవడానికి ముఖ్య కారణాలు ఈ విధంగా ఉన్నాయి. అవి :

  1. ఏర్పాటు చేయబోయే రాజ్యాంగాన్ని తిరసరించే హక్కు సంస్థానాలకు ఇవ్వడం, దీని వల్ల కాంగ్రెస్ తిరస్కరించింది.
  2. పాకిస్తాన్ డిమాండను ఈ ప్రతిపాదన అంగీకరించలేదు. కాబట్టి ముస్లింలు కూడా దీన్ని అంగీకరించలేదు.

“దివాలా తీస్తున్న బ్యాంకు మీద ముందు రోజు తేది వేసి రాసిన చెక్కులాంటిదని” క్రిప్స్ రాయబారాన్ని గాంధీజీ తిరస్కరించడంతో ఈ చర్చలు విఫలం అయ్యాయని చెప్పవచ్చు.

ప్రశ్న 16.
“క్విట్ ఇండియా”. ఉద్యమం ఏ విధంగా విస్తరించింది?
జవాబు:

  1. 1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది.
  2. ఉద్యమ ప్రారంభంలోనే గాంధీజీని ఖైదు చేసినా యువకార్యకర్తలు దేశ వ్యాప్తంగా సమ్మెలు నిర్వహించారు.
  3. దాడులు చేసి, ఆస్తి నష్టం కలిగించారు.
  4. యువత పెద్ద సంఖ్యలో కళాశాల చదువులు వదిలి పెట్టి జైళ్ళకు వెళ్ళారు.
  5. మారుమూల గ్రామాలలోని రైతులను మేల్కొలిపారు.
  6. పోస్టాఫీసులు, రైల్వే స్టేషన్లపై దాడి జరిపారు.

పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా విప్లవం సాగింది. అయితే బ్రిటిష్ పాలకులు మరింత బల ప్రయోగంతో శక్తివంతంగా ఉద్యమాన్ని అణచివేశారు.

ప్రశ్న 17.
సంస్థానాల విలీనం ఏవిధంగా జరిగింది ? ఎవరు దీనికి నాయకత్వం వహించారు?
(లేదా )
సంస్థానాల విలీనంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ నిర్వహించిన పాత్ర గురించి వివరించండి.
జవాబు:
బ్రిటిష్ అధికారం క్రింద సుమారు 550 సంస్థానాలు ఉండేవి. ఈ సంస్థానాలను, భారతదేశంలో చేరతారో, పాకిస్తాన్లో చేరతారో, లేదా స్వతంత్రంగా ఉంటారో నిర్ణయించుకోమన్నారు. అయితే ఆయా సంస్థానాలలోని ప్రజలు ప్రజా మండల ఉద్యమాల్లో పాల్గొనటం మూలంగా ప్రజాస్వామిక హక్కులపట్ల చైతన్యం కలిగి, రాజరిక కుటుంబాల పాలన కొనసాగాలని వారికి లేదు. కాంగ్రెస్ ఈ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసే బాధ్యతను 1947లో సర్దార్ పటేల్ కి అప్పగించారు.

1947 ఆగష్టు 15 నాటికి కాశ్మీర్, హైదరాబాద్, జునాగు తప్పించి మిగిలిన సంస్థానాలన్నీ భారతదేశంలో విలీనం ఒప్పందంపై సంతకాలు చేశాయి. తరువాత రెండు సంవత్సరాలలోపు ఈ మూడు సంస్థానాలు కూడా భారతదేశంలో విలీనం అయ్యేటట్లు పటేలు చేశారు.

AP 10th Class Social Important Questions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

ప్రశ్న 18.
హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్

ఈ సమయంలో హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం (ఆర్ఎస్ఎస్) ప్రజలను సమీకరించటానికి చురుకుగా పని చేశాయి. కులం, వర్గాలను అధిగమించి హిందువులనందరినీ ఏకం చేసి సామాజిక జీవితంలో సంస్కరణలు తీసుకురావాలని ఈ సంఘాలు ఆశించాయి. భారతదేశం అధిక సంఖ్యలో ఉన్న హిందువుల భూమి అన్న అభిప్రాయాన్ని కూడా వాళ్లు కలిగించారు. ఈ సంఘాల కార్యకలాపాలతో అనేకమంది కాంగ్రెస్ వాదులు కూడా ప్రభావితమయ్యారు.
“ముస్లిం లీగు బలపడడానికి కాంగ్రెస్ వైఫల్యమే కారణం అనే విషయాన్ని నీవు అంగీకరిస్తావా? ఎందుకు? చర్చించుము.”
జవాబు:
అంగీకరిస్తాను – ఎందుకనగా ….. హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్ సంఘాలు, భారతదేశం అధిక సంఖ్యలో ఉన్న హిందువుల భూమి అన్న అభిప్రాయాన్ని కలిగించారు. ఈ సంఘాల కార్యకలాపాలతో అనేక మంది కాంగ్రెస్ వాదులు కూడా ప్రభావితమయ్యారు. అయితే తమ సభ్యులలో లౌకిక అవగాహనను పెంచటానికి కాంగ్రెస్ ఎంతో ప్రయత్నించింది. అయితే ముస్లిం లీగుకి హిందువుల ఆధిపత్యం పట్ల ఉన్న భయాలను బ్రిటన్ పెంచి పోషించింది.

చాలా ప్రాంతాలలో హిందువులు అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి హిందువులే అన్ని సభలకు ఎన్నికవుతారని, ప్రభుత్వంలో ముస్లిముల ప్రయోజనాలను కాపాడటం కష్టమవుతుందనే ముస్లిం లీగు భయాన్ని కాంగ్రెస్ తొలగించలేక పోయింది. పై పెచ్చు ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలు ఏర్పాటు చేయుటకు అంగీకరించి, ముస్లిం లీగు బలపడడానికి దోహదపడింది.

1937-1947ల మధ్య ముస్లిముల పట్ల కాంగ్రెస్ సున్నితత్వంతో స్పందించటం లేదని అనేక అంశాలను ముస్లిం లీగు ఎత్తి చూపింది మరియు యునైటెడ్ ప్రావిన్స్ లో ఎక్కువ సీట్లనే గెలుచుకున్న ముస్లిం లీగుతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయటాన్ని కాంగ్రెస్ తిరస్కరించింది. తమ సభ్యులు ముస్లిం లీగులో సభ్యత్వం తీసుకోవటాన్ని కాంగ్రెస్ నిషేధించింది. ఆ

ఈ విధమైన కాంగ్రెస్ ప్రవర్తన మరియు పద్ధతుల మూలంగా ముస్లిం లీగు బలపడిందని, అది చివరికి దేశ విభజనకు దారితీసిందని చెప్పవచ్చు.

AP 10th Class Social Important Questions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

These AP 10th Class Social Studies Important Questions 15th Lesson వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు will help students prepare well for the exams.

AP Board 10th Class Social 15th Lesson Important Questions and Answers వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

10th Class Social 15th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium

1. 20వ శతాబ్దం ఆరంభంలో చైనాని పాలిస్తున్న చక్రవర్తులు ఏ వంశానికి చెందినవారు?
జవాబు:
మంచూ.

2. చైనా ప్రజల గణతంత్రం ఎప్పుడు ఏర్పడింది?
జవాబు:
1949.

3. ఏ సమావేశంలోని నిర్ణయాలను నిరసిస్తూ 1919 మే, 4న బీజింగ్ లో ప్రఖ్యాత ‘మే, 4’ నిరసన ప్రదర్శన చేపట్టారు?
జవాబు:
వర్సయిల్స్ శాంతి సమావేశం.

4. ఆడపిల్లల పాదాలు పూర్తిగా పెరగకుండా నిరోధించే క్రూరమైన సాంప్రదాయం ఏ దేశంలో ఉండేది?
జ. చైనాలో.

5. ‘కలిసి పనిచేసే’ సహజాతం అలవాటుని పెంపొందించు, కోవాలని కోరినవాడు?
జవాబు:
చియాంగ్ కై షేక్.

AP 10th Class Social Important Questions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

6. చైనా చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన లాంగ్ మార్చ్ ను నిర్వహించినవారు ఎవరు?
జవాబు:
మావోజెడాంగ్.

7. 19 శతాబ్ది మధ్యకాలం నాటికి వియత్నాం ఎవరి ప్రత్యక్ష పాలనలోకి వచ్చింది?
జవాబు:
ఫ్రాన్స్ (ఫ్రెంచి)వారి

8. స్థానికులను నాగరికులుగా చెయ్యటానికి ఒక మార్గంగా వలస వాదులు దేనిని భావించారు?
జవాబు:
విద్యను.

9. ఉత్తర వియత్నాం మొదటి అధ్యక్షుడు ఎవరు?
జవాబు:
హె – చి – మిన్.

10. నైజీరియాలో మొదటి రాజకీయ పార్టీయైన నెజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీ (NNDP)ని స్థాపించింది ఎవరు?
జవాబు:
హెర్బార్ట్ మకాలే

11. 1936లో నైజీరియా యువ ఉద్యమంను (NYM) స్థాపించినది ఎవరు?
జవాబు:
ఎన్ నంది. అజికివే

12. నైజీరియా, కామెరూన్ల జాతీయ సంఘాన్ని (NCNC) ఏర్పరచిన సంవత్సరం?
జవాబు:
1944.

13. నైజీరియా ఎప్పుడు స్వాతంత్ర్యం పొందింది?
జవాబు:
1963, అక్బోర్ 1 న.

14, ఏ ప్రాంతంలోని ప్రజలు జాతీయ విముక్తి సమాఖ్య (NLR) పేరుతో నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడారు?
జవాబు:
దక్షిణ వియత్నాం

15. వియత్నాంలో కమ్యూనిస్ట్ ప్రాబల్యం పెరుగుతోందన్న ఆందోళనకు గురైన దేశం ఏది?
జవాబు:
అమెరికా.

AP 10th Class Social Important Questions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

16. నైజర్ డెల్టాలో ఏ సంవత్సరంలో ముడి చమురు నిల్వలు కనుగొన్నారు?
జ. 1950.

17. నైజర్ డెల్టాలోని చమురు వెలికితీసే హక్కులను పొందిన బహుళజాతి సంస్థ ఏది?
జవాబు:
డచ్ షెల్ కంపెనీ.

18. ఎజెంట్ ఆరెంజ్ లోని రసాయనిక పదార్థం ఏమి?
జవాబు:
డై ఆక్సిన్.

19. ఎవరి కార్యక్రమాన్ని మూడు సిద్దాంతాలు అంటారు?
జవాబు:
సన్ యెట్ సెన్

20. NYM ని విస్తరింపుము.
జవాబు:
నైజీరియా యువ ఉద్యమం.

21. NCNC ని విస్తరింపుము.
జవాబు:
నైజీరియా, కామెరూన్ల జాతీయ సంఘం.

22. NNDPని విస్తరింపుము.
జవాబు:
నైజీరియా, జాతీయ ప్రజాస్వామిక పార్టీ.

23. నైజీరియా ఏ దేశపు వలస?
జవాబు:
బ్రిటన్.

24. సామ్రాజ్యవాద కాంక్షలో భాగంగా ఏదేశం 1940లో వియత్నాంను ఆక్రమించింది?
జవాబు:
జపాన్.

25. వియత్నాం స్వాతంత్ర్య సమితిని ఏమని పిలుస్తారు?
జవాబు:
వియత్ మిన్.

26. NLF ని విస్తరింపుము.
జవాబు:
జాతీయ విముక్తి సమాఖ్య.

27. ఘానా స్వాతంత్ర్య యోధుడు, ఖండాంతర ఆఫ్రికా వాదంలో ప్రముఖ పాత్ర పోషించింది ఎవరు?
జవాబు:
క్వామెన్ క్రూమా.

AP 10th Class Social Important Questions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

28. ఆస్ట్రేలియా ఏ దేశానికి చెందిన వలస రాజ్యం?
జవాబు:
బ్రిటన్.

29. చైనాను సైనిక దేశంగా మార్చినది ఎవరు?
జవాబు:
చియాంగ్ కై షేక్.

30. చైనాలోని మధ్య తరగతి పట్టణ వాసులను ఏమంటారు?
జవాబు:
సియావోషిమిన్.

31. వియత్నాంను పరిపాలించిన రాజవంశం ఏది?
జవాబు:
ఎన్ గుయెన్.

32. ఉత్తర నైజీరియాలో అధికంగా నివసిస్తున్న గిరిజన తెగ ఏది?
జవాబు:
హౌసా – ఫులాని.

33. ‘కెన్నరో వివా’ ఒక ………..
జవాబు:
పర్యావరణవాది.

34. ఆగ్నేయ నైజీరియాలో ఏ తెగ ప్రజలున్నారు?
జవాబు:
ఈబో.

35. నైరుతి నైజీరియాలో ఏ తెగ ప్రజలున్నారు?
జవాబు:
యెరుబా.

36. నైజీరియాలోని అడవులు ప్రముఖంగా ఏ విధమైన అడవులు?
జవాబు:
మడ అడవులు.

37. చైనా కమ్యూనిస్ట్ పార్టీకి బలమైన పునాది వేసిన అంశం ఏది?
జవాబు:
భూ సంస్కరణలు & జాతీయీకరణ.

38. క్రింది సంఘటనలను సరియైన కాలక్రమంలో రాయండి.
i) పెకింగ్ యూనివర్సిటి ఏర్పాటు
ii) జపాన్ చైనాపై దాడి
iii)చైనా కమ్యూనిస్ట్ పార్టీ స్థాపన
iv)లాంగ్ మార్చ్
జవాబు:
i, iii, iv, ii

39. ఆధునిక చైనా నిర్మాత ఎవరు?
జవాబు:
సన్ యెట్ – సెన్

AP 10th Class Social Important Questions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

40. సన్ యెట్ – సెన్ యొక్క మూడు సిద్ధాంతాలు సన్, మిన్, చుయిలలో ‘మిన్’ అనగానేమి?
జవాబు:
ప్రజాస్వామ్యం.

41. చియాంగ్ జైషేక్, (చైనా) మహిళలు ఏ నాల్గు సుగుణాల పై శ్రద్ధ పెట్టాలని భావించాడు?
జవాబు:
పాతివ్రత్యం, రూపం, మాట, పని.

42. వియత్నాం యుద్ధంలో అమెరికా ‘ఏజెంట్ ఆరెంజ్’ను ఉపయోగించటానికి కారణమేమి?
జవాబు:
ప్రజలను అడవుల్లో దాక్కోకుండా, సులభంగా చంపడం కోసం.

43. తన విప్లవ కార్యక్రమానికి రైతాంగాన్ని ఆధారంగా చేసుకున్న చైనా కమ్యూనిస్ట్ నాయకుడు ఎవరు?
జవాబు:
మావో జెడాంగ్.

44. వియత్నాం దేశం ఏ ఖండంలో ఉంది?
జవాబు:
ఆసియా

AP 10th Class Social Important Questions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

45. నైజీరియా దేశం ఏ ఖండంలో ఉంది?
జవాబు:
ఆఫ్రికా.

46. సన్ యెట్ – సెన్ గణతంత్ర రాజ్యం ఎప్పుడు ఏర్పాటు చేశాడు?
జవాబు:
1911

47. చైనాలో ఏ విప్లవం తరువాత దేశం సంక్షోభ స్థితిలోకి నెట్టబడింది?
జవాబు:
గణతంత్ర విప్లవం.

48. గుయోమింగ్ డాంగ్ పార్టీ గుర్తించిన నాలుగు ప్రధాన అవసరాలు ఏవి?
జవాబు:
కూడు, గుడ్డ, ఇల్లు, రవాణా.

49. గుయోమింగ్ డాంగ్ పార్టీ నాయకుడెవరు?
జవాబు:
చియాంగ్ కైషేక్.

50. చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఏ సంవత్సరంలో ఆవిర్భ వించింది?
జవాబు:
1921లో

51. 1937లో చైనాపై దండెత్తిన దేశమేది?
జవాబు:
జపాన్.

52. 1931 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద బియ్యం ఎగుమతి చేసే దేశమేది?
జవాబు:
వియత్నాం

53. NNDP ఏ సంవత్సరంలో ఆవిర్భవించింది?
జవాబు:
1923లో.

54. వియత్నాంలో విద్యార్థులు ‘యువఅన్నాం’ పార్టీ స్థాపన?
జవాబు:
1920.

AP 10th Class Social Important Questions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

55. వియత్ మిస్, వియత్నాంలో భూమి కౌలును ఎంతశాతం తగ్గించింది?
జవాబు:
25%

56. వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ స్థాపకుడు ఎవరు?
జవాబు:
హూచి మిన్.

57. చైనా ఏ స్థానిక సైనిక శక్తుల నియంత్రణలో ఉండేది?
జవాబు:
యుద్ధ ప్రభువులు.

58. చైనాలో సంప్రదాయవాద నాయకుడు ఎవరు?
జవాబు:
చియాంగ్ కై షేక్.

59. ‘ప్రజాస్వామ్య గణతంత్ర వియత్నాం ఛైర్మన్ ఎవరు?
జవాబు:
హెచిమిన్.

60. వియత్నాంలో ముఖ్యమైన పంటలు ఏవైనా రెండింటిని రాయండి.
జవాబు:
వరి, రబ్బరు.

61. ఏ సంవత్సరంలో పారిలో శాంతి ఒప్పందంపై సంతకాలు జరిగాయి?
జవాబు:
1974.

62. 1930 లలో వియత్నాంలో ఎవరు రాసిన నవలలో ఒక మహిళ బలవంతపు పెళ్ళి కథ ఉంది?
జవాబు:
నాపిన్.

63. ఏ సంవత్సరంలో చైనాలో భూ సంస్కరణల అమలు మొదలు పెట్టారు?
జవాబు:
1950 – 51.

64. సన్ యెట్ – సెన్ భావనలతో ఏర్పడిన పార్టీ?
జవాబు:
గుయెమిండాంగ్

65. పెకింగ్ విశ్వ విద్యాలయం ఏ సంవత్సరంలో ఏర్పడింది?
జవాబు:
1902

66. చైనాలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి గ్రామీణ మహిళా సంఘాల ఏర్పాటును ప్రోత్సహించింది ఎవరు?
జవాబు:
మావో జెడాంగ్.

67. చైనాలో భూ సంస్కరణలతోపాటు రాజకీయ విద్య, అక్షరాస్యతలను వ్యాపింప చెయ్యటానికి పెద్ద ఎత్తున ప్రారంభించిన పాఠశాలలు ఏవి?
జవాబు:
వయోజన రైతాంగ పాఠశాలలు.

68. వియత్నాంను ఏ పంటను ఎగుమతి చేసే దేశంగా అభివృద్ధి చెయ్యాలని ఫ్రెంచ్ చాలా ఆసక్తి కనపరచింది?
జవాబు:
వరి.

69. వియత్నాంలోని అన్నాం ప్రాంతంలో భూమి అసలు లేని కుటుంబాలు సుమారు ఎంత శాతం ఉన్నాయి?
జవాబు:
53%

70. 20వ శతాబ్ది ఆరంభంలో ఆధునిక విద్యకోసం వియత్నాం విద్యార్థులు ఏ దేశానికి వెళ్ళేవారు?
జవాబు:
జపాన్.

AP 10th Class Social Important Questions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

71. జపాన్ వియత్నాంను ఏ సంవత్సరంలో ఆక్రమించింది?
జవాబు:
1940లో

72. వియత్నాం ప్రజాస్వామ్య గణతంత్రంగా ఏ సంవత్సరంలో ఏర్పడింది?
జవాబు:
1945 లో

73. 1954లో డీన్ బీన్ ఫు వద్ద వియత్నాం చేతిలో ఓడిపోయినది ఎవరు?
జవాబు:
ఫ్రెంచి వలస పాలకులు.

74. దక్షిణ వియత్నాంలో పురాతన చక్రవర్తినీ పడదోసి అధికారంలోకి వచ్చినది ఎవరు?
జవాబు:
ఎన్ గో డిన్ డీం.

75. ఉత్తర వియత్నాంలో భూ సంస్కరణలతో కొత్త యుగం మొదలైన సంవత్సరం ఏది?
జవాబు:
1954.

76. జాతీయ విముక్తి సమాఖ్య ఎప్పుడు సైగాన్లోని అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకోవటంతో ఉత్తర, దక్షిణ వియత్నాంలు ఒకటి అయ్యాయి?
జవాబు:
1975 ఏప్రిల్ 30 న.

77. 16వ శతాబ్దం నాటి నుంచి అమెరికాకు బానిసలను సరఫరా చెయ్యటంలో ఏ దేశం ప్రధాన కేంద్రంగా ఉండింది?
జవాబు:
నైజీరియా.

78. పశ్చిమ ఆఫ్రికాలోని ఏ నగరాన్ని విద్యా, వ్యాపారం, పరిపాలనలకు ప్రధాన కేంద్రంగా బ్రిటన్ రూపుదిద్దింది?
జవాబు:
లాగోస్.

79. NYM ను ఏ సంవత్సరంలో స్థాపించారు?
జవాబు:
1936.

80. ఏ సంవత్సరంలో అతివాద జాతీయవాద కార్మిక సంఘ నాయకులు ఆధ్వర్యంలో నైజీరియాలో జాతీయ సాధారణ సమ్మె నిర్వహించారు?
జవాబు:
1945

81. NPC ని విస్తరింపుము.
జవాబు:
ఉత్తర ప్రజల కాంగ్రెస్.

82. నైజీరియా ఏ ప్రాంతంలో యాక్షన్ గ్రూపు (AG) ఏర్పడింది?
జవాబు:
పశ్చిమ ప్రాంతంలో.

AP 10th Class Social Important Questions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

83. సుదీర్ఘ సైనిక నియంతృత్వ పాలన తరువాత నైజీరియాలో ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఎన్నుకున్న సంవత్సరం ఏది?
జవాబు:
1999.

83.ఎ) ఏజెంట్ ఆరెంజ్ అనునది ఏమిటి?
జవాబు:
మొక్కల నాశిని

84. క్రింది వానిని సరిగా జతపరచంది.
i) NNDP ( ) a) హెచిమిన్
ii) NYM ( ) b) మావో జెడాంగ్
iii)లాంగ్ మార్చ్ ( ) c) ఎన్ నంది అజికివే
iv) వియత్నాం ప్రజాస్వామ్య గణతంత్రం ( ) d) హెర్బార్ట్ మెకాలే
జవాబు:
i – d, ii – c, iii – b, iv – a.

85. క్రింది వాక్యాలను పరిగణించండి.
i) చాలా మంది అమెరికా పౌరులు వియత్నాంతో యుద్దాన్ని వ్యతిరేకించారు.
ii) గొప్పదైన అమెరికా సైన్యాన్ని ఓడించటంలో పేద వియత్నాం రైతాంగం కీలక పాత్ర పోషించింది.
పై వాక్యా లలో సరైనది ఏది?
A) (i) మాత్రమే
B) (ii) మాత్రమే
C) (i) మరియు (ii)
D) రెండూ కావు
జవాబు:
C (I) మరియు (ii)

86. అమెరికా ఉత్తర వియత్నాంతో ప్రత్యక్ష జోక్యం చేసుకొని యుద్దం చేయటానికి ప్రధాన కారణం.
→ ఫ్రెంచి వారికి మద్దతుగా
→ జాతీయతా భావానికి వ్యతిరేకంగా
→ నియంత పాలనకి వ్యతిరేకంగా
→ కమ్యూనిస్ట్ ప్రాబల్యం పెరుగుతుందనే భయం చేత
జవాబు:
కమ్యూనిస్ట్ ప్రాబల్యం పెరుగుతుందనే భయం చేత.

AP 10th Class Social Important Questions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

87. ఏవి చైనా భవిష్యత్తు ప్రగతికి పునాదిగా నిలిచాయని మేథావులంతా సాధారణంగా ఏకీభవిస్తారు?
జవాబు:
భూ సంస్కరణలు, అందరికీ ప్రాథమిక విద్య నందించటం.

క్రింద ఇచ్చిన పటంను పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు సరియైన జవాబులు రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు 1
88. పై పటం ఏ దేశానికి సంబంధించింది?
జవాబు:
నైజీరియా

89. ఈ దేశాన్ని వలస రాజ్యంగా చేసుకొన్న దేశమేది?
జవాబు:
బ్రిటన్.

90. నైజీరియాలో ఉన్న మూడు ముఖ్య గిరిజన తెగలు ఏవి?
జవాబు:
హౌసా – ఫులాని, ఈబో, యెరుబా.

91. పటంలో ‘A’ ప్రాంతంలో నివసిస్తున్న తెగ పేరేమి?
జవాబు:
హౌసా – ఫులాని.

92. నైరుతి ప్రాంతంలో నివసిస్తున్న తెగ పేరేమి?
జవాబు:
యెరుబా

93. ఈ దేశంలోని ప్రధాన ఖనిజ వనరు ఏది?
జవాబు:
ముడి చమురు.

క్రింద ఇచ్చిన పటంను పరిశీలించిఇచ్చిన ప్రశ్నలకు సరియైన జవాబులు రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు 2

94. ఈ దేశాన్ని వలసీకరించిన దేశం ఏది?
జవాబు:
ఫ్రాన్స్

95, ఈ దేశంలోని ప్రముఖ డెల్లా ప్రాంతం ఏది?
జవాబు:
మెకాంగ్ డెల్టా.

96. ఈ దేశ జాతీయోద్యమ నాయకుడు ఎవరు?
జవాబు:
హాచిమిన్

97. ఇండో – చైనీస్ కమ్యూనిస్ట్ ఏ దేశానికి చెందింది?
జవాబు:
వియత్నాం

98. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) చియాంగ్ కైషేక్ ( ) a) రైతాంగ విప్లవం
ii) మావో జెడాంగ్ ( ) b) సన్-మిన్-చుయి
iii) కెన్నరో వివా ( ) c) సైనిక పాలన
iv)సన్ యెట్ – సెన్ ( ) d) పర్యావరణ విప్లవం
జవాబు:
i – c, ii – a, iii – d, iv – b

10th Class Social 15th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
ఖండాంతర్గత ఆఫ్రికా వాదం అనగానేమి?
జవాబు:

  1. దేశ, తెగ తేడా లేకుండా ఆఫ్రికా ప్రజలందరినీ ఒకటిగా చేయడమే ఖండాంతర్గత ఆఫ్రికా వాదం.
  2. ఘనా స్వతంత్ర యోధుడు క్యామెన్ క్రుమా దీంట్లో ప్రముఖ పాత్ర పోషించాడు.

ప్రశ్న 2.
నైజీరియా డెల్టాలో యథేచ్ఛగా సాగుతున్న చమురు వెలికితీత వల్ల ఉత్పన్నమయిన సమస్యలు ఏవి?
(లేదా)
నైజీరియాలో వ్యవసాయ రంగం మీద చమురు వెలికితీత ఎలాంటి ప్రభావం చూపింది?
జవాబు:

  1. పర్యావరణం కలుషితమయ్యింది.
  2. మడ అడవులు నాశనమయ్యా యి.
  3. నేలలు, భూగర్భజలాలు కలుషితం కావడం వల్ల పంటలు దెబ్బతిన్నాయి.
  4. స్థానికంగా చేపల ఉత్పత్తి తగ్గిపోయింది.

AP 10th Class Social Important Questions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

ప్రశ్న 3.
నైజీరియాలో పౌరయుద్ధం ఎందుకు మొదలయ్యింది?
జవాబు:
నైజీరియాలో ప్రజాస్వామిక, న్యాయపూరిత సమతుల్యం సాధించలేకపోవటం వల్ల పౌరయుద్ధం మొదలయ్యింది.

ప్రశ్న 4.
వియత్నాం యుద్ధంలో అమెరికా ఎందుకు జోక్యం చేసుకొన్నది?
జవాబు:
వియత్నాం యుద్ధంలో అమెరికా జోక్యము : కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తారేమోననే భయం వల్ల వియత్నాం యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకున్నది.

ప్రశ్న 5.
నైజీరియా జాతీయతావాదం ముందు ఉన్న రెండు కరవ్యాలు ఏవి?
జవాబు:
నైజీరియా జాతీయతావాదం ముందు ఉన్న రెండు కర్తవ్యాలు :

  1. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడడం.
  2. ఘర్షణ పడుతున్న వివిధ తెగల మధ్య ఐక్యమత్యం సాధించడం.

ప్రశ్న 6.
ఇవ్వబడిన మ్యాపు ఆధారంగా క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు 3
i) ఆగ్నేయ ప్రాంతంలో నివసిస్తున్న తెగ పేరేమి?
ii) ఈ దేశాన్ని వలసీకరించిన దేశం ఏది?
జవాబు:
i) ఈబో తెగ.
ii) బ్రిటన్.

ప్రశ్న 7.
20వ శతాబ్దం ఆరంభంలో ఏ వంశ చక్రవర్తులు చైనాని పాలిస్తూ ఉండేవాళ్ళు?
జవాబు:
20వ శతాబ్దం ఆరంభంలో మంచూ వంశ చక్రవర్తులు చైనాని పాలిస్తూ ఉండేవాళ్ళు.

ప్రశ్న 8.
మంచూ సామ్రాజ్యాన్ని కూలదోసిన వారెవరు?
జవాబు:
మంచూ సామ్రాజ్యాన్ని కూలదోసి సన్యెట్-సెన్ 1911లో గణతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు.

ప్రశ్న 9.
బీజింగ్ లో నిరసన ప్రదర్శన ఎందుకు చేపట్టారు?
జవాబు:
వర్సయిల్స్ శాంతి సమావేశం నిర్ణయాలను నిరసిస్తూ 1919 మే 4న బీజింగ్ లో నిరసన ప్రదర్శన చేపట్టారు. దీనినే “మే . నాలుగు ఉద్యమం” అని కూడా అంటారు.

ప్రశ్న 10.
చియాంగ్ మహిళలు వేటిపై శ్రద్ధ పెట్టాలన్నారు?
జవాబు:
మహిళలు “పాతివ్రత్యం, రూపం, మాట, పని” అన్న నాలుగు సుగుణాలపై శ్రద్ధ పెట్టాలన్నారు.

ప్రశ్న 11.
చైనాలో కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడు ఏర్పడింది?
జవాబు:
రష్యా విప్లవం తరువాత 1921లో చైనాలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది.

ప్రశ్న 12.
నైజీరియాలో చమురు వల్ల ఉత్పన్నమైన పర్యావరణ సమస్యలపై పోరాటం చేసినవారెవరు?
జవాబు:
నైజీరియాలో చమురు వల్ల ఉత్పన్నమైన పర్యావరణ సమస్యలపై పోరాటం చేసినవారు “కెన్ సారో వివా”.

ప్రశ్న 13.
నైజీరియా ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఎప్పుడు ఎన్నుకుంది?
జవాబు:
నైజీరియా ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని 1999లో ఎన్నుకుంది.

ప్రశ్న 14.
ఏజెంట్ ఆరెంజ్ అనగా ఏమిటి?
జవాబు:
ఏజెంట్ ఆరెంజ్ అంటే చెట్లు, మొక్కలను చంపేసి భూమిని చాలా సంవత్సరాల పాటు బీడుగా మార్చే విషం.

ప్రశ్న 15.
ఉత్తర వియత్నాంలో భూసంస్కరణలలో కొత్త యుగం ఎప్పుడు మొదలైంది?
జవాబు:
1954 తరువాత ఉత్తర వియత్నాంలో భూసంస్కరణలలో కొత్త యుగం మొదలైంది.

ప్రశ్న 16.
వియత్నాం కమ్యూనిస్టు పార్టీని స్థాపించినదెవరు?
జవాబు:
పరస్పరం పోటీపడుతున్న జాతీయతా బృందాలను కలిపి 1930 ఫిబ్రవరిలో “సూచిమిన్” వియత్నాం కమ్యూనిస్టు పార్టీని స్థాపించాడు.

AP 10th Class Social Important Questions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

ప్రశ్న 17.
చైనా ప్రజల గణతంత్రం ఎప్పుడు ఏర్పడింది?
జవాబు:
1949లో చైనా ప్రజల గణతంత్రం ఏర్పడింది.

ప్రశ్న 18.
గుయోమిందాంగ్ పార్టీ రెండు ఆశయాలు ఏమిటి?
జవాబు:
గుయోమిండాంగ్ పార్టీ రెండు ఆశయాలు :

  1. భూసంస్కరణలు
  2. జాతీయకరణ

ప్రశ్న 19.
ఏ సం||లో భూసంస్కరణల అమలు మొదలు పెట్టారు?
జవాబు:
1950-51లో భూసంస్కరణల అమలు మొదలు పెట్టారు.

ప్రశ్న 20.
ప్రాథమిక స్థాయిలో వియత్నామీ భాష నేర్పినప్పటికీ ఉన్నత విద్య ఏ భాషలో ఉండేది?
జవాబు:
ప్రాథమిక స్థాయిలో వియత్నామీ భాష నేర్పినప్పటికీ ఉన్నత విద్య ఫ్రెంచి భాషలో ఉండేది.

ప్రశ్న 21.
భారతదేశాన్ని బ్రిటన్ ప్రభావితం చేసినట్లే వియత్నామీయుల జీవితాలలో అన్ని అంశాలను ఎవరు ప్రభావితం చేశారు?
జవాబు:
భారతదేశాన్ని బ్రిటన్ ప్రభావితం చేసినట్లే వియత్నామీయుల జీవితాలలో అన్ని అంశాలను ఫ్రెంచి వాళ్ళు ప్రభావితం చేసారు.

ప్రశ్న 22.
వియత్నాం వలసపాలిత ఆర్థిక పరిస్థితి ప్రధానంగా దేనిమీద ఆధారపడి ఉంది?
జవాబు:
వియత్నాం వలసపాలిత ఆర్థిక పరిస్థితి ప్రధానంగా ఫ్రెంచి, సంపన్న వియత్నామీయుల అధీనంలో ఉన్న వరి ఉత్పత్తి, రబ్బరు సాగుపై ఆధారపడి ఉంది.

ప్రశ్న 23.
యువ అన్నాం అనే పార్టీ స్థాపకులెవరు?
జవాబు:
యువ అన్నాం అనే పార్టీని విద్యార్థులు ఏర్పాటు చేశారు.

ప్రశ్న 24.
వియత్నాంలో నూతన గణతంత్ర వ్యవస్థ ఎవరు చక్రవర్తిగా ఉండగా ఏర్పడింది?
జవాబు:
వియత్నాంలో నూతన గణతంత్ర వ్యవస్థ “బావోదాయిని” చక్రవర్తిగా ఉండగా ఏర్పడింది.

ప్రశ్న 25.
ప్రస్తుతం నైజీరియాగా మనకు తెలిసిన దేశాన్ని ఎవరు ఏర్పరచారు?
జవాబు:
ప్రస్తుతం నైజీరియాగా మనకు తెలిసిన దేశాన్ని బ్రిటిష్ వారు ఏర్పరచారు.

AP 10th Class Social Important Questions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

ప్రశ్న 26.
ఆఫ్రికాలో అధిక జనాభా సాంద్రత గల దేశాలలో ఏ ప్రాంతం ఒకటి?
జవాబు:
నైజర్ నదీ ప్రాంతం

ప్రశ్న 27.
నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీ స్థాపకులెవరు?
జవాబు:
నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీ స్థాపకులు “హెర్బెర్ట్ మకాలే”.

ప్రశ్న 28.
సామ్యవాదం యొక్క రెండు ముఖ్య లక్షణాలు పేర్కొనండి.
జవాబు:
1) వస్తు ఉత్పత్తి, పంపిణీ ప్రభుత్వ అధీనంలో ఉండటం, ప్రైవేటు వ్యక్తులకు అవకాశం లేకపోవడం.
2) అందరికీ సమాన అవకాశాలు కల్పించబడటం.

ప్రశ్న 29.
‘NCNC’ ని విస్తరించుము.
జవాబు:
NCNC : National Council of Nigeria and Cameron (నైజీరియా, కామెరూన్ల జాతీయ సంఘం).

ప్రశ్న 30.
గణతంత్ర విప్లవం తర్వాత చైనాలో ఆవిర్భవించిన రాజకీయ పక్షాలు ఏవి?
జవాబు:
గణతంత్ర విప్లవం తర్వాత ఏర్పాటైన రాజకీయ పార్టీలు (చైనాలో) : గుయోమిండాంగ్ (KMT – జాతీయ ప్రజాపార్టీ) మరియు చైనా కమ్యూనిస్టు పార్టీ (CCP).

ప్రశ్న 31.
వియతమిన్ అని దేనిని పిలిచారు?
జవాబు:
వియత్నాం స్వాతంత్ర్య సమితి (వియత్నాం డాక్ లాప్ డాంగ్ మిన్) – దీనిని ‘వియత్ మిన్’ అని పిలుస్తారు.

10th Class Social 15th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
పాత సాంప్రదాయాలను, విదేశీ శక్తులను యువ చైనీయులు వ్యతిరేకించసాగడానికి గల కారణాలుగా వేటిని అనుకుంటున్నావు?
జవాబు:

  1. పాత సాంప్రదాయాలు, విదేశీ శక్తులు చైనా అభివృద్ధికి నిరోధకాలని యువ చైనీయులు భావించారు.
  2. ఆధునిక విజ్ఞాన శాస్త్రం, ప్రజాస్వామ్యం, జాతీయతావాదం ద్వారా చైనా ముందుకు వెళ్లాలని ఒక తరం ఉద్యమించింది.
  3. సాధారణ భాష, లిపిలను అనుసరించడం, మహిళల పరాధీనత, ఆడపిల్లల పాదాలు కట్టివెయ్యడం వంటి వాటిని వ్యతిరేకించటం, వివాహంలో సమానత్వం, పేదరికాన్ని అంతం చెయ్యడానికి ఆర్థిక అభివృద్ధి వంటి సంస్కరణలను వారు ప్రతిపాదించారు.
  4. దేశ వనరులను నియంత్రిస్తున్న విదేశీయులను తరిమివెయ్యాలని యువ చైనీయులు భావించారు.

ప్రశ్న 2.
అధికంగా చమురును వెలికి తీయడం వల్ల నైజీరియాపై ఎలాంటి ప్రభావం పడింది?
జవాబు:

  1. మడ అడవులు చమురును తట్టుకోలేక అంతరించిపోయాయి.
  2. దాని వలన జీవావరణ వ్యవస్థ దెబ్బతినడం జరిగింది.
  3. ఈ చమురు వల్ల నేలలు కలుషితం అయ్యాయి.
  4. అందువలన ఎంతో విస్తీర్ణంలో పంటలు నాశనం అయ్యాయి.
  5. త్రాగునీరు కలుషితం కావడం జరుగుతుంది.
  6. చేపల పెంపకం దెబ్బతిని, చేపల ఉత్పత్తి పడిపోయింది.
  7. త్రాగునీరు కలుషితం కావడంతో దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంది.

ప్రశ్న 3.
మే నాలుగు ఉద్యమం గూర్చి క్లుప్తంగా రాయుము.
(లేదా)
చైనాలో జరిగిన ‘మే 4 ఉద్యమం’ గురించి రాయండి.
జవాబు:
చైనా మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ పక్షాన పోరాడి గెలిచినా జపాన్ ఆక్రమిత ప్రాంతాలు ఇవ్వనందుకు నిరసనగా 1919 మే 4న ఈ ఉద్యమం ప్రారంభించింది. ఈ ఉద్యమాన్ని యువత నడిపించి, పాత సంప్రదాయాలను తిరస్కరించి, ఆధునిక విజ్ఞానం, ప్రజాస్వామ్యం, జాతీయతావాదం ద్వారా చైనా ముందుకెళ్లాలని తలచారు.

ప్రశ్న 4.
ఇచ్చిన పటాన్ని పరిశీలించి దిగువ ఇవ్వబడిన ప్రశ్నకు జవాబు రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు 3
ప్రశ్న : బ్రిటిష్ పాలకులు తమ ‘విభజించి పాలించు’ అనే సిద్ధాంతాన్ని నైజీరియాలో ఏ విధంగా అమలుపరచగలిగారు?
జవాబు:
1) నైజీరియాలో ప్రధానంగా మూడు గిరిజన తెగలు కలవు. అవి :
1. హౌసా-పులాని,
2. యొరుబా
3. ఈబో

2) ఈ తెగల మధ్య ఘర్షణ మరియు పోటీని ప్రోత్సహించడం ద్వారా బ్రిటిష్ వారు “విభజించి పాలించు” సిద్ధాంతాన్ని అమలుపరిచారు.

ప్రశ్న 5.
వియత్నాంలోని విద్యావిధానం అక్కడ జాతీయవాద భావాల ఆవిర్భావానికి ఏ విధంగా దోహదపడింది ?
జవాబు:

  1. వియత్నాంలో ఫ్రెంచివారు ఇచ్చిన పాఠ్యాంశాలను టీచర్లు, విద్యార్థులు గుడ్డిగా అనుసరించలేదు.
  2. పాఠాలు చెప్పేటప్పుడు వియత్నాం టీచర్లు పాఠాలలో ఉన్న అంశాలను మార్చి ఫ్రెంచి ప్రభుత్వాన్ని విమర్శించేవారు.
  3. దేశభక్తి భావనలతో విద్యార్థులు ప్రేరణ పొందారు.
  4. ఆధునిక విద్యకోసం జపాన్ వెళ్ళసాగిన విద్యార్థుల ప్రధాన ఉద్దేశ్యం వియత్నాం నుండి ఫ్రెంచివారిని తరిమివెయ్యడమే.

AP 10th Class Social Important Questions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

ప్రశ్న 6.
ఖండాంతర ఆఫ్రికా వాదం గురించి వివరించండి.
జవాబు:

  1. దేశ, తెగ తేడాలు లేకుండా ఆఫ్రికా ప్రజలందరిని ఒకటిగా చెయ్యడం.
  2. వలస పాలనను, జాతి వివక్షతను వ్యతిరేకించడం.
  3. సమానత్వం, సామాజిక న్యాయం, మానవ గౌరవం అన్న సూత్రాల ఆధారంగా అన్ని తెగల, ప్రజల సమూహాల మధ్య ఐకమత్యం సాధించడం.
  4. ఖండాంతర ఆఫ్రికా వాదం పెంపొందించటంలో క్వామెన్ క్రుమా ప్రముఖ పాత్ర పోషించాడు.

ప్రశ్న 7.
క్రింది పటమును పరిశీలించి యిచ్చిన ప్రశ్నలకు సమాధానాలు వ్రాయుము.
AP 10th Class Social Important Questions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు 3
1) నైజీరియాను వలసీకరించిన దేశం ఏది?
జవాబు:
నైజీరియాను వలసీకరించిన దేశం : బ్రిటన్

2) ఆగ్నేయ నైజీరియాలో అధికంగా యున్న ప్రజలు ఏ తెగకు చెందినవారు?
జవాబు:
ఆగ్నేయ నైజీరియాలోని తెగ : ఈబో

ప్రశ్న 8.
గ్రామీణ చైనా ఎదుర్కొన్న సంక్షోభాలను తెల్పండి.
జవాబు:
గ్రామీణ చైనా ఎదుర్కొంటున్న సమస్యలు :

  1. నేలలు నిస్సారం కావడం,
  2. అడవులు నరికి వేయడం.
  3. వరదలు రావడం.
  4. దోపిడీపూరిత భూమి కౌలు విధానం అమలులో ఉండటం.
  5. ఋణభారం పెరగడం.
  6. గ్రామీణులు పురాతన సాంకేతిక విజ్ఞానాన్ని కలిగి ఉండటం.
  7. గ్రామాలలో అభివృద్ధి చెందని ప్రసార మాధ్యమాలు ఉండటం.

ప్రశ్న 9.
సన్-యెట్-సెలో నీకు నచ్చిన గుణాలేవి? ఎందుకు?
జవాబు:
సన్-యెట్-సెన్లో నాకు నచ్చిన గుణాలు :
i) గణతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయుట.
ii) మంచూ వంశాన్ని, సామ్రాజ్యవాద శక్తులను పారద్రోలి ఆధునిక చైనా నిర్మాతగా ప్రసిద్ధి చెందడం.
iii)నూతన కార్యాచరణ పథకాన్ని రూపొందించి పరిశ్రమలపై నియంత్రణ, భూ సంస్కరణలను చేపట్టడం.

ప్రశ్న 10.
సయెట్-సెన్ 3 సిద్ధాంతాలేవి?
జవాబు:
సట్-సెస్ 3 సిద్ధాంతాలు సన్, మిన్, చుయి. ఇవి ఏమనగా జాతీయతావాదం అనగా విదేశీ శక్తులుగా భావింపబడుతున్న మంచూ వంశాన్ని, సామ్రాజ్యవాద శక్తులను పారదోలడం. ప్రజాస్వామ్యం అనగా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం. సామ్యవాదం అంటే పరిశ్రమలపై నియంత్రణ, భూసంస్కరణలు.

ప్రశ్న 11.
భూసంస్కరణ వలన చైనాలో కలిగే పరిణామాలేవి?
జవాబు:
చైనా సాగుభూమిలో 43 శాతాన్ని గ్రామీణ ప్రజలలో 60 శాతానికి పంచి పెట్టడంలో భూసంస్కరణలు విజయం సాధించాయి. పేద రైతుల కింద భూమి గణనీయంగా పెరిగింది. పాత సంపన్న వర్గానికి చెందిన అధికారం, ఆర్థిక వనరులను తీసేసుకోగా ఇంకో వైపున సిసిపి ద్వారా రాజకీయ రంగంలోకి వచ్చిన పేద, మధ్యతరగతికి చెందిన గ్రామ కార్యకర్తల . నుంచి కొత్త కులీనవర్గం ఏర్పడసాగింది.

ప్రశ్న 12.
వియత్నాం వలసపాలిత రైతాంగ జీవనప్రమాణం ఎందుకు పడిపోయింది?
జవాబు:
వియత్నాం వలసపాలిత ఆర్థిక పరిస్థితి ప్రధానంగా ఫ్రెంచి, కొంతమంది సంపన్న వియత్నామీయుల ఆధీనంలో ఉన్న వరి ఉత్పత్తి, రబ్బరు సాగుపై ఆధారపడి ఉంది. రబ్బరు తోటలలో వెట్టి కార్మికులను ఉపయోగించుకునేవాళ్ళు. గ్రామీణ ప్రాంతాలలో భూస్వామ్యం పెరిగి, పెద్ద పెద్ద భూస్వాములు చెన్న రైతుల భూములను చేజిక్కించుకుని వారితో కౌలు రైతులుగా పనిచేయించుకునేవాళ్ళు. ఫలితంగా రైతాంగ జీవనప్రమాణం పడిపోయింది.

ప్రశ్న 13.
అమెరికా, వియత్నాం యుద్ధ ఫలితాలు ఏమి?
జవాబు:
అమెరికా, వియత్నాం యుద్ధం కారణంగా అమెరికాకే కాకుండా వియత్నాంకు కూడా చాలా భారంగా పరిణమించింది. 1965 – 1972 మధ్యకాలంలో వియత్నాం యుద్ధంలో 34,00,000 అమెరికా సైనికులు పాల్గొన్నారు. ఈ యుద్ధంలో 47,244 మంది సైనికులు చనిపోగా, 3,03,704 మంది గాయపడ్డారు. సైనికులు శక్తిమంతమైన ఆయుధాలు, బాంబులతో విధ్వంసం సృష్టించారు. అమెరికా నాపాలం వంటి బాంబులు, ఏజెంట్ ఆరెంజ్ వంటి రసాయనాల వలన వియత్నాం విచ్చిన్నమైంది.

ప్రశ్న 14.
ఖండాంతర ఆఫ్రికావాదం గురించి వ్రాయండి.
జవాబు:

  1. దేశ, తెగ తేడాలు లేకుండా ఆఫ్రికా ప్రజలందరినీ ఒకటిగా చెయ్యడానికి ఖండాంతర ఆఫ్రికావాదం ప్రయత్నిస్తుంది.
  2. ఈ ఐకమత్యంతో వలసపాలనను, జాతి వివక్షను వ్యతిరేకించడమే కాక సమానత్వం, సామాజిక న్యాయం, మానవ గౌరవం అన్న సూత్రాల ఆధారంగా ఆఫ్రికా ఖండంలోని అన్ని తెగల, ప్రజల, సమూహాల మధ్య ఐకమత్యం సాధించడానికి ప్రయత్నించింది.
  3. ఘనా స్వాతంత్ర్య యోధుడు క్వామె క్రుమా దీంట్లో ప్రముఖ పాత్ర పోషించాడు.

AP 10th Class Social Important Questions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

ప్రశ్న 15.
వియత్నాంపై అమెరికా చేసిన యుద్ధం ప్రపంచ శాంతికి భంగం కలిగించేదిగా ఉందని నీవు భావిస్తున్నావా? అభిప్రాయం తెల్పండి.
జవాబు:

  1. వియత్నాంపై అమెరికా యుద్ధం తప్పనిసరిగా ప్రపంచ శాంతికి భంగం కల్గించేదే.
  2. వలసపీడిత దేశ పోరాటంలో వియత్నాంకు సహకరించాల్సిన అమెరికా, కమ్యూనిస్టు వ్యతిరేక భావనతో వియత్నాంపై యుద్ధానికి తెగించింది.
  3. అమెరికాతో ఏ విధమైన సంబంధం లేని వియత్నాం పై యుద్ధంతో అది తన కపట ప్రపంచ పోలీస్ ముసుగును బయట పెట్టుకుంది.
  4. జీవ రసాయన ఆయుధాలు, బాంబులు, విరివిగా వైమానిక దాడులతో వియత్నాం ప్రజలపట్ల అమానుషంగా ప్రవర్తించి స్వదేశ ప్రజల నుంచే తిరస్కారాన్ని పొందింది.

ప్రశ్న 16.
ప్రపంచ పటం నందు ఈ క్రింది ప్రాంతాలను గుర్తించుము.
1. నైజీరియా
2. చైనా
3. ఫ్రాన్స్
4. రష్యా
5. జపాన్
6. అమెరికా
7. ఇంగ్లాండు
జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు 4

10th Class Social 15th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
క్రింది అంశాన్ని చదివి ప్రశ్నలకు సమాధానము వ్రాయుము.
ఏజెంట్ ఆరెంజ్ – అత్యంత విష పదార్థము

ఏజెంట్ ఆరెంజ్ ఆకులు రాలిపోయేలా చేసి మొక్కల్ని చంపే విషం. నారింజ పట్టి ఉన్న డ్రమ్ములలో నిల్వ చెయ్యటం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. 1961 – 1971 మధ్య కాలంలో అమెరికా కార్గో యుద్ధ విమానాలు వియత్నాంపై 500 లక్షల లీటర్ల ఈ విషపూరిత రసాయనాన్ని చల్లాయి. అడవులను, పొలాలను నిర్మూలించటం ద్వారా ప్రజలు దాక్కోటానికి అవకాశం లేకుండా చేసి వాళ్ళని తేలికగా చంపొచ్చన్నది అమెరికా ప్రణాళిక. దేశంలోని 14 శాతం సాగుభూమి ఈ విషపూరిత రసాయనం వల్ల ప్రభావితం అయ్యింది. దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఈనాటికి కూడా ప్రజలపై దాని ప్రభావం ఉంది. ఏజెంట్ ఆరెంజ్ లోని రసాయనిక అంశమైన డై ఆక్సిన్ పిల్లల మెదడు దెబ్బ తినటానికి, క్యాన్సర్ కి కారకం. ఈ మందు పిచికారీ చేసిన ప్రాంతాలలో పిల్లలలో అవయవ లోపాలు అధికంగా ఉండటానికి ఈ విషమే కారణమని ఒక అధ్యయనం వెల్లడి చేసింది.

రసాయనిక ఆయుధాలతో సహా అమెరికా జోక్యంలో భాగంగా (ప్రధానంగా పౌరులను లక్ష్యంగా చేసుకుని) వియత్నాంపై వేసిన బాంబుల మొత్తం బరువు రెండవ ప్రపంచ యుద్ధకాలం మొత్తంలో కంటే ఎక్కువ.
ప్రశ్నలు:
1) ఏజెంట్ ఆరెంజ్ అనగానేమి?
2) ఏజెంట్ ఆరెంజ్ పిల్లలపై ఏ రకమైన ప్రభావాన్ని చూపుతుంది?
3) అడవులను, సాగుభూమి పొలాలను రసాయనాలు చల్లటం ద్వారా ఎందుకు నిర్మూలించారు?
4) అమెరికా దేశము పైరులపైన, అడవుల పైన కాలుష్య రసాయనాలను ప్రయోగించడం సమర్థనీయమని నీవు భావిస్తావా?
జవాబు:

  1. ఏజెంట్ ఆరెంజ్ అనగా ఆకులు రాలిపోయేలా చేసి మొక్కలను చంపే విషపదార్థము.
  2. పిల్లల మెదడు దెబ్బతినడానికి, క్యాన్సర్ వ్యాప్తికి మరియు అవయవలోపాలకు ఏజెంట్ ఆరెంజ్ కారణమౌతుంది.
  3. అడవులను, పొలాలను నిర్మూలించడము ద్వారా ప్రజలు దాక్కోవడానికి అవకాశం లేకుండా చేసి వాళ్ళను తేలికగా చంపడానికి.
  4. సమర్థనీయము కాదు.

ప్రశ్న 2.
నైజీరియాలోని చమురు వనరులలో అధికభాగం ఆగ్నేయ భాగంలో ఉన్నాయి. చమురు లాభాలలోని అధిక భాగం తమకు చెందాలని ఈబూలు భావిస్తారు. చమురు సంపదతో ఉత్తర ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యటాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఈ సమస్యకు న్యాయ పూరితమైన పరిష్కారం, మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.
జవాబు:

  1. ఈబూల కోరిక సమంజసం కాదు.
  2. దేశంలోని సహజవనరులు దేశ ప్రజలందరికీ చెందుతాయి.
  3. నైజీరియా ఉత్తర భాగం సామాజికంగాను, ఆర్ధికంగానూ వెనుకబడి ఉంది.
  4. ప్రభుత్వం పెట్రోలియం వనరులను దేశ ప్రజలందరి అభివృద్ధికి వినియోగించాల్సి ఉంటుంది.
  5. ఈబూ ప్రజలకు అధికభాగం వనరులను, ఖనిజాలను కేటాయించి వారిని శాంతపరచవచ్చు.

ప్రశ్న 3.
‘నేడు ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలలో ముఖ్యమైనది పర్యావరణ కాలుష్యం.’ నైజీరియాలోని నైజర్ డెల్టాను ఉదాహరణగా తీసుకొని, పర్యావరణ కాలుష్యానికి కారణాలు నాల్గింటిని మరియు కాలుష్య ఫలితాలు నాల్గింటిని పేర్కొనండి.
జవాబు:
పర్యావరణ కాలుష్యానికి కారణాలు :
ఉదా : నైజీరియన్ డెల్టా నైజీరియాలో చమురు వెలికితీత వలన అక్కడి చమురు సముద్రపు నీటిలో కలిసి జీవావరణ – వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అయింది.

పర్యావరణ కాలుష్యానికి కారణాలు :

  1. విచక్షణా రహితంగా అడవుల నరికివేత.
  2. విషపూరితాలైన పారిశ్రామిక వ్యర్థ పదార్థాలను మానవ నివాస ప్రాంతాలు, కాలువలు, నదులు, గాలిలోకి విడుదల చేయడం.
  3. అణుపరీక్షల వల్ల ఉత్పన్నమయ్యే రేడియో ధార్మికత.
  4. యంత్ర చోదిత వాహనాల నుండి కార్బన్ మోనాక్సైడ్ హైడ్రోకార్బన్లు పరిమితిని మించి వెలువడటం.
  5. C.E.C వల్ల ఓజోన్ పొర దెబ్బతినడం.
  6. అశాస్త్రీయ పద్ధతుల ద్వారా చమురు వెలికితీత.

ఫలితాలు :

  1. చమురు వెలికితీత వల్ల నేలలు, భూగర్భజలాల కలుషితం అయి త్రాగునీరు కలుషితం అయి దీర్ఘకాలంలో కాన్సర్ వంటి సమస్యలు వస్తాయి. చేపల ఉత్పత్తి తగ్గుతుంది.
  2. చెట్లు లేకపోతే వరదలు, కరవులు, ఎడారులు ఏర్పడటం మరియు ప్రకృతి వైపరీత్యాలు సంభవించడం.
  3. జీవావరణం సమతౌల్యత కోల్పోయి జీవనం అపాయానికి లోనవటం.
  4. మానవుల ఆరోగ్యానికి హానికరంగా పర్యావరణం మారుచున్నది. వీటన్నింటికి మానవుడు చేపట్టే కార్యక్రమాలే ప్రధాన కారణం.

AP 10th Class Social Important Questions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

ప్రశ్న 4.
చైనాలో ప్రజాస్వామ్యం ఏర్పడిన తరువాత ప్రవేశ పెట్టిన సంస్కరణలేవి?
జవాబు:

  1. చైనా ప్రజల గణతంత్రం నూతన ప్రజాస్వామ్యం అన్న సిద్ధాంతంపై ఏర్పడింది. భూస్వామ్య విధానాన్ని, సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే సామాజిక వర్గాలన్నీ ఈ సిద్ధాంతం ఆధారంగా ఏకమయ్యాయి.
  2. ఆర్థిక విధానంలోని కీలకాంశాలను ప్రభుత్వ అధీనంలో ఉంచారు.
  3. పెద్ద ఎత్తున భూ సంస్కరణలు అమలు చేశారు.
  4. భూస్వాముల భూమిని జప్తు చేసి పేద రైతాంగానికి పంచి పెట్టారు.
  5. మహిళల రక్షణకు, వాళ్ళ హక్కులకు, బహు భార్యత్వ నిషేధానికి కూడా చర్యలు చేపట్టారు.
  6. మహిళలు వివిధ రంగాలలో పురుషులతో సమానహోదా పొందగలిగారు.

ప్రశ్న 5.
అట్టడుగు వర్గాలకు చెందిన ప్రజల జీవితాలను ప్రపంచీకరణ, నయా ఉదారవాద విధానాలు ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో వివరించండి.
జవాబు:

  1. గిరిజనులు, పేద, రైతులు, భూమిలేని కార్మికులు, మహిళలు, అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న వాళ్ళు అందరికంటే ఎక్కువగా నష్టపోయారు.
  2. వీళ్ళకు మంచి చదువు, వైపుణ్యాలు వంటివి అందుబాటులో లేవు.
  3. అందువలన మంచి జీతాలు వచ్చే ఉద్యోగాలు కానీ, చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన పరిహారాలు కానీ వీళ్ళకు – అందుబాటులో లేవు.
  4. గనుల త్రవ్వకం, ఆనకట్టల పథకాల వంటి వాటివల్ల అనేకమంది గిరిజనులు, రైతులు నిర్వాసితులు అవుతున్నారు.

ప్రశ్న 6.
వియత్నాం జాతీయ ఉద్యమంలో పాఠశాల విద్య పాత్రను వివరింపుము.
జవాబు:
వియత్నాం జాతీయ ఉద్యమంలో పాఠశాల విద్య పాత్ర :

  1. ఫ్రెంచివాళ్ళు ఇచ్చిన పాఠ్యాంశాలను టీచర్లు గుడ్డిగా అనుసరించలేదు.
  2. పాఠాలు చెప్పేటప్పుడు వియత్నాం టీచర్లు పాఠాలలో ఉన్న దానిని మార్చి ఫ్రెంచి ప్రభుత్వాన్ని విమర్శించేవారు.
  3. కార్యాలయాలలో ఉద్యోగాలకు వియత్నామీయులను అనర్హులుగా చేసే విధంగా ఉన్న వలస ప్రభుత్వ ప్రయత్నాలను విద్యార్థులు ప్రతిఘటించసాగారు.
  4. దేశభక్తి భావంతో సమాజ ప్రయోజనం కోసం పోరాడటం, విద్యావంతుల విధి అను నమ్మకంతో వారు ప్రేరణ పొందారు.

ప్రశ్న 7.
ఈ క్రింది పేరాగ్రాను చదివి, నీ అభిప్రాయం వ్రాయండి.
“19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభంలో బ్రిటిష్ వలస సామ్రాజ్యంలో జాత్యహంకారం తిరిగి చోటు చేసికొంది. విద్యావంతులైన ఆఫ్రికా వాసులను సివిల్ సేవలకు అనుమతించలేదు. ఆఫ్రికా వ్యాపారవేత్తల పట్ల వివక్షత చూపేవాళ్ళు. అదే సమయంలో ప్రజలపై మరింత నియంత్రణను సాధించడానికి వీలుగా గిరిజన తెగ నాయకులు, సంపన్నులతో సంబంధాలు నెరిపారు.”
జవాబు:
నైజీరియా ఒక ఆఫ్రికా దేశం. ప్రస్తుతం నైజీరియాగా మనకు తెలిసిన దేశాన్ని బ్రిటిషువారు ఏర్పరిచారు. నైజర్ నదీ వ్యవస్థ కింద వివిధ తెగలు ఉంటున్న వేరు వేరు ప్రాంతాలను ఒకటిగా చెయ్యడం ద్వారా దానిని ఏర్పరిచారు. నైజీరియాలో 3 తెగలవారు ఉన్నారు. ఉత్తర ప్రాంతంలో హౌసా-ఫులాని ప్రజలు, ఆగ్నేయ ప్రాంతంలో ఈబో తెగ, నైరుతి భాగంలో యెరూబా తెగల ప్రజలు ఉన్నారు. ఈ ప్రాంతంలో బ్రిటిషువారు విభజించి పాలించు అనే సిద్ధాంతాన్ని అనుసరించారు. ఎందుకంటే వారు విద్యావంతులైతే బ్రిటిషు వారికి నైజీరియాలో మనుగడ ఉండదు. కనుక బ్రిటిషువారు నైజీరియాలో జాత్యాహంకారాన్ని ప్రదర్శించారు. విద్యావంతులైన ఆఫ్రికన్ వాసులను సివిల్ సేవలకు అనుమతి చూపలేదు. వ్యాపారుల పట్ల వివక్షత చూపారు. ప్రజలపై నియంత్రణ కోసం వీరు గిరిజన తెగ నాయకులతో సంపన్నులతో సంబంధాలు కలిగి ఉన్నారు. దానిని వ్యతిరేకించిన కొంతమంది విద్యావేత్తలు ఉమ్మడి నైజీరియా అనే భావన కలిగించి బ్రిటిషు పాలకులకు వ్యతిరేకంగా పోరాడసాగారు. చివరకు వారు విజయం సాధించారు.

ప్రస్తుతం అన్ని దేశాలలో సమానత్వం అనే భావన ఉంది. జాత్యాహంకారం అనే భావనను రూపుమాపటం జరిగింది.

ప్రశ్న 8.
వియత్నాంలో ఫ్రెంచివాళ్ళు అనుసరించిన విధానాలేవి?
జవాబు:

  1. ఫ్రెంచి వలస పాలన వియత్నామీయుల జీవితాలలో అన్ని అంశాలను ప్రభావితం చేసింది.
  2. వియత్నాంని వరి ఎగుమతి చేసే దేశంగా అభివృద్ధి చేయాలని ఫ్రెంచివారు చాలా ఆసక్తి కనబరిచారు.
  3. కాలువలు నిర్మించి సాగునీరు అందించారు.
  4. భూస్వాములను ప్రోత్సహించారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కు సహకరించారు.
  5. ఆర్ధిక వ్యవస్థ పారిశ్రామికీకరణ చెందడానికి ఫ్రెంచివారు ఏమీ చేయలేదు.
  6. వియత్నాం రైతాంగం అప్పుల విషవలయంలో చిక్కుకుపోయింది.
  7. మంచి విద్యను పొందడానికి అందరికీ అవకాశాలు లేవు.
  8. ఉన్నత విద్య అంతా ఫ్రెంచి భాషలోనే ఉండేది.

AP 10th Class Social Important Questions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

ప్రశ్న 9.
మీకివ్వబడిన డేటా ఆధారంగా ప్రశ్నలకు సమాధానాలు రాయంది.

మంచూ రాజవంశ పతనం1911
సన్-యెట్-సెన్ మూడు సిద్ధాంతాలుసన్-మిన్-చుయి
చైనా ప్రజల గణతంత్ర రాజ్యం అవతరణ1949
నాపాలంప్రాణాంతకమైన బాంబు
ఏజెంట్ ఆరెంజ్మొక్కల వినాశకారీ
ఐక్య వియత్నాం1975
ఖండాంతర ఆఫ్రికా వాదంక్యామెన్ క్రూమా
నైజీరియా పర్యావరణ వాదికెన్నోరో వివా
ప్రజాస్వామ్య నైజీరియా ప్రభుత్వం1999

ప్రశ్నలు :
a) మంచూ రాజవంశ పాలన కలిగిన దేశం ఏది?
b) ఆధునిక చైనా నిర్మాతగా ఎవరిని పరిగణిస్తారు?
c) నైజీరియాకు చెందిన ప్రముఖ మానవహక్కుల కార్యకర్త, పర్యావరణవాది ఎవరు?
d) ఖండాంతర ఆఫ్రికా వాదం అనగా నేమి?
జవాబు:
a) మంచూ రాజవంశ పాలన కలిగిన దేశం : చైనా
b) ఆధునిక చైనా నిర్మాత : సన్ యెట్ సెన్
c) నైజీరియా మానవహక్కుల కార్యకర్త, పర్యావరణ వాది : కెన్ సారో వివా
d) ఖండాంతర ఆఫ్రికావాదం : దేశ, తెగ తేడాలు లేకుండా ఆఫ్రికా ప్రజలందరినీ ఒకటిగా చేయడమే ఖండాంతర ఆఫ్రికావాదం.

ప్రశ్న 10.
గణతంత్రం ఏర్పాటులో సయెట్-సెన్ పాత్రను విపులీకరించుము.
జవాబు:
సయెట్-సెన్ని ఆధునిక చైనా నిర్మాతగా పరిగణించవచ్చు. ఆయన పేద కుటుంబానికి చెందినవాడు. అతడు చదివిన మిషనరీ పాఠశాలల్లో క్రైస్తవ మతంతోటి, ప్రజాస్వామ్య భావాలతోటి ప్రభావితం అయ్యాడు. వైద్యశాస్త్రం అభ్యసించినా చైనా భవిష్యత్తు పట్ల, అభివృద్ధి పట్ల ఆందోళన చెందాడు. చైనా సమస్యలను అధ్యయనం చేసి కార్యాచరణ పథకాన్ని రూపొందించాడు. మంచూ సామ్రాజ్యాన్ని కూలదోసి 1911లో గణతంత్ర రాజ్యాన్ని ఏర్పరచాడు. చైనా అభివృద్ధికై 3 సిదాంతాలు రూపొందించాడు. ఇవి (సన్, మిన్, చుయి) ‘జాతీయతావాదం’ అంటే విదేశీ పాలకులుగా భావింపబడుతున్న మంచూ వంశాన్ని, విదేశీ సామ్రాజ్యవాద శక్తులను పారదోలటం. ‘ప్రజాస్వామ్యం’ అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం. “సామ్యవాదం” అంటే పరిశ్రమలపై నియంత్రణ, భూమిలేని రైతాంగానికి భూమిని పంచటానికి భూసంస్కరణలు వంటి వాటి ద్వారా ఆధునిక నిర్మాతగా వెలుగొందాడు.

ప్రశ్న 11.
చైనా అభివృద్ధిలో చైనా కమ్యూనిస్టు పార్టీ కృషిని వివరించుము.
జవాబు:
రష్యా విప్లవం తరువాత కొద్ది కాలానికి 1921లో చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. దోపిడీని అంతం చేసి, సాధారణ ప్రజల జీవితాలను సుఖమయం చేయడానికి సిసిపి అవిరళ కృషి చేసింది. గ్రామీణ చైనా రెండు సంక్షోభాలను ఎదుర్కొంది. మొదటిది నేలలు నిస్సారం కావటం, అడవులను నరికి వెయ్యటం, వరదల వంటి జీవావరణ పరమైనవి. రెండోది దోపిడీ పూరిత భూమి కౌలు విధానాలు, ఋణభారం, పురాతన సాంకేతిక విజ్ఞానం, అభివృద్ధి చెందని ప్రసారమాద్యమాలతో కూడిన సామాజిక – ఆర్థికపరమైనవి.

పై సవాళ్ళను అధిగమించడానికి మావోజెడాంగ్ (1893 – 1976) తన విప్లవ కార్యక్రమాన్ని రైతాంగాన్ని ఆధారంగా చేసుకుని భిన్నమైన పంథాను అనుసరించాడు. భూస్వామ్యాన్ని అంతం చెయ్యడానికి గాను పోరాడేలా చైనా రైతాంగాన్ని సైన్యంగా మార్చాడు. ఇతర నాయకులలా కాకుండా స్వతంత్రంగా ఉండే ప్రభుత్వ సైన్యాలను మావో నిర్మించాడు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి గ్రామీణ మహిళా సంఘాలను ఏర్పాటు చేసి ప్రోత్సహించాడు. విడాకుల విధానాన్ని సరళీకృతం చేస్తూ. కొత్త వివాహ చట్టాన్ని చేశారు.

AP 10th Class Social Important Questions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

ప్రశ్న 12.
చైనాలో భూసంస్కరణలు అమలు జరిగిన విధానాన్ని విపులీకరించండి.
జవాబు:
చైనా భూసంస్కరణలు అమలు చెయ్యటంలో సాధించిన విజయాలు, చైనా భవిషత్తుకు బలమైన పునాదిగా నిలిచాయని మేధావులంతా సాధారణంగా ఏకీభవిస్తారు. “గ్రామీణ పరిస్థితిని అర్థం చేసుకోవడం”, రైతాంగ సంఘాల నిర్మాణం వంటి వాటితో రెండు సంవత్సరాలు శాంతియుతంగా గడచిన పిదప 1950-51లో భూసంస్కరణల అమలు మొదలుపెట్టారు. గ్రామాలలో ఉంటున్న అందరి వర్గాలను గుర్తించటం, తరువాత భూస్వాముల భూమి, ఇతర ఉత్పాదక ఆస్తులను స్వాధీనం చేసుకుని తిరిగి ఫంచటం వంటివి ఇందులో ముఖ్యమైన దశలు. ఈ ప్రక్రియలో ప్రధాన భూమికను “ప్రాంతస్థాయి భూసంస్కరణల సంఘం” పంపించిన పని బృందాలు పోషించాయి. రైతాంగ సంఘాలను ఏర్పాటుచేయడం, స్థానిక నాయకత్వ స్థానాలను వాటి నుంచి క్రియాశీలక సభ్యులను ఎంపిక చెయ్యడం వీటి ముఖ్య విధుల్లో భాగంగా ఉండేది. చైనా సాగుభూమిలో 43 శాతాన్ని గ్రామీణ ప్రజలలో 60 శాతానికి పంచి పెట్టడంలో భూసంస్కరణలు విజయం సాధించాయి. పేద రైతుల కింద ఉన్న భూమి గణనీయంగా పెరిగింది. మధ్య తరగతి రైతాంగం బలమైన స్థితిలో ఉన్నందువల్ల అది ఎక్కువ ప్రయోజనం పొందింది.

ప్రశ్న 13.
అమెరికా ఉపయోగించిన ఏజెంట్ ఆరెంజ్ గూర్చి వివరింపుము.
జవాబు:
ఏజెంట్ ఆరెంజ్ ఆకులు రాలిపోయేలా చేసి మొక్కల్ని చంపే విషం. నారింజ పట్టి ఉన్న డ్రమ్ములలో నిల్వ చెయ్యడం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. 1961-71 మధ్యకాలంలో అమెరికా కార్లో యుద్ధ విమానాలు వియత్నాంపై 500 లక్షల లీటర్ల ఈ విషపూరిత రసాయసాన్ని చల్లాయి. అడవులను, పొలాలను నిర్మూలించటం ద్వారా ప్రజలు దాక్కోటానికి అవకాశం లేకుండా చేసి వాళ్ళని తేలికగా చంపొచ్చన్నది అమెరికా ప్రణాళిక. దేశంలోని 14 శాతం సాగుభూమి ఈ విషపూరిత రసాయనం వల్ల ప్రభావితం అయింది. దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఈనాటికీ కూడా ప్రజలపై దాని ప్రభావం ఉంది. ఏజెంట్ ఆరెంజ్ లోని రసాయనిక అంశమైన డై ఆక్సిన్ పిల్లల్లో మెదడు దెబ్బతినడానికి, క్యాన్సర్ కి కారకం. ఈ మందు పిచికారీ చేసిన ప్రాంతాల్లో పిల్లలలో అవయవలోపాలు అధికంగా ఉండడానికి ఈ విషమే కారణమని ఒక అధ్యయనం వెల్లడి చేసింది.

ప్రశ్న 14.
నైజీరియాలో చమురు నిల్వల వలన పర్యావరణ సమస్యలు ఎలా ఉత్పన్నమయ్యా యి?
జవాబు:
నైజర్ డెల్టాలో 1950లలో చమురును కనుగొన్నారు. ఈ చమురును వెలికితీసే హక్కులను డచ్ షెల్ కంపెనీ నేతృత్వంలోని వివిధ బహుళజాతి కంపెనీలు పొందాయి. ప్రస్తుతం ఇది నైజీరియాకు ముఖ్యమైన వనరు. విదేశీ చమురు కంపెనీలు పర్యావరణాన్ని పట్టించుకోకుండా యథేచ్ఛగా చమురును వెలికితీయటం వల్ల తీరప్రాంత వాతావరణంలో అనేక సమస్యలు ఏర్పడ్డాయి. చమురు బావుల నుంచి సముద్రపు నీటిలో కలిసే చమురు వల్ల ఇక్కడి జీవావరణ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. ప్రత్యేకించి మడ అడవులు చమురుకి తట్టుకోలేవు. చమురు వల్ల నేలలు, భూగర్భజలాలు కలుషితమయ్యి పంటలు, చేపల పెంపకం వంటివి దెబ్బతింటున్నాయి. తాగునీళ్ళు కూడా కలుషితమయ్యాయి. తాగునీళ్ళు కలుషితం కావడం ఆరోగ్యంపై పెను ప్రభావం చూపింది. దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి సమస్యలు ఏర్పడ్డాయి. సముద్రజలాల్లో చమురు ఊటలు చాలా ఎక్కువగా ఉండి, తీరప్రాంత పర్యావరణం ప్రభావితమయ్యి, స్థానికంగా చేపల ఉత్పత్తి పడిపోయింది. పర్యావరణ పరిరక్షణకై కెన్ సారో వివా పర్యావరణ ఉద్యమాన్ని నడిపించి కొంత విజయం సాధించాడు.

ప్రశ్న 15.
“చమురు, పర్యావరణం, రాజకీయాలు” గురించి రాయండి.
జవాబు:
నైజర్ డెల్టాలో 1950లలో చమురును కనుగొన్నారు. ఈ చమురును వెలికితీసే హక్కులను డచ్ షెల్ కంపెనీ నేతృత్వంలోని వివిధ బహుళజాతి కంపెనీలు పొందాయి. ప్రస్తుతం ఇది నైజీరియాకి ముఖ్యమైన వనరు. చమురు బావులలో అనేకం బహుళజాతి సంస్థల అధీనంలో ఉన్నాయి. ఇవి చమురుని వెలికితీసి తమ లాభాల్లో కొంత శాతాన్ని సైనిక పాలకులతో పంచుకున్నాయి. సాధారణ ప్రజలకు దీనివల్ల ఎటువంటి ప్రయోజనమూ ఒనగూడలేదు. అంతేకాదు విదేశీ చమురు కంపెనీలు పర్యావరణాన్ని పట్టించుకోకుండా యధేచ్చగా చమురును వెలికి తీయటం వల్ల తీరప్రాంత వాతావరణంలో అనేక సమస్యలు ఏర్పడ్డాయి. చమురు బావుల నుంచి సముద్రపు నీటిలో కలిసే చమురు వల్ల ఇక్కడి జీవావరణ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమయ్యింది. ప్రత్యేకించి మడ అడవులు చమురుకి తట్టుకోలేవు. ఈ చమురు నేలలోకి ఇంకి ప్రతి సంవత్సరం ముంపుకి గురైనప్పుడు తిరిగి నీటిపైకి రావటం వల్ల చాలా విస్తీర్ణంలో మడ అడవులు అంతరించిపోయాయి. నెజీరియాలోని మడ అడవులు జీవావరణ వ్యవసలో 5-10 శాతం వరకు నరికివెయ్యబడటం వల్లగానీ, చమురు ఊటల వల్లగానీ నష్టపోయాయని అంచనా, ఈ చమురు వల్ల నేలలు, భూగర్భజలాలు కలుషితమయ్యి పంటలు, చేపల పెంపకం వంటివి దెబ్బతింటున్నాయి. తాగునీళ్లు కూడా తరచు కలుషితమవుతున్నాయి. స్థానిక నీటి మడుగులలో పలచటి నూనె జిడ్డు కనపడుతుంది. తాగునీళ్లు కలుషితం కావటంతో ఆరోగ్యంపై వెంటనే ప్రభావం కనపడకపోయినప్పటికీ, దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి సమస్యలు ఏర్పడవచ్చు. సముద్ర జలాల్లో చమురు ఊటలు చాలా ఎక్కువగా ఉండి, తీరప్రాంత పర్యావరణం – ప్రభావితమయ్యి స్థానికంగా చేపల ఉత్పత్తి పడిపోతుంది.

1990ల కాలంలో ప్రత్యేకించి నైజర్ డెల్టా ప్రాంతంలో ప్రజల ఆందోళన క్రమేపీ పెరగసాగింది. స్థానిక గిరిజన తెగలు సంవత్సరాల తరబడి జరిగిన జీవావరణ నష్టానికి పరిహారం చెల్లించాలని, తమ ప్రాంతంలోని చమురు వనరులపై తమకు నియంత్రణ కావాలని పోరాడసాగాయి. ఈ ఆందోళన మొదట జాతి ఆధారంగా సభ్యులలో ఐకమత్యం సాధించి శాంతియుతంగా ఉన్నది. ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త,’ పర్యావరణవాది అయిన కెన్ సారో వివాని అంతర్జాతీయ నిరసనల మధ్య మిలటరీ ప్రభుత్వం మరణశిక్ష వెయ్యటంతో పరిస్థితులు తీవ్రరూపం దాల్చాయి.

ఒక జాతిగా ఏర్పడటానికి, సుస్థిర ప్రజాస్వామిక వ్యవస్థను స్థాపించటానికి, తన భౌతిక వనరులపై నియంత్రణను – సాధించటానికి నైజీరియా ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

AP 10th Class Social Important Questions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

ప్రశ్న 16.
“నైజీరియాలోని చమురును యథేచ్చగా వెలికి తీయటం వల్ల అక్కడి పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందనే వాదనతో మీరు ఏకీభవిస్తారా”? మీ అభిప్రాయాలను చెప్పండి.
జవాబు:
పై వాదనతో నేను ఏకీభవిస్తాను. కారణాలు….

విదేశీ చమురు కంపెనీలు పర్యావరణాన్ని పట్టించుకోకుండా యధేచ్ఛగా చమురును వెలికి తీయటం వల్ల తీరప్రాంత వాతావరణంలో అనేక సమస్యలు వచ్చాయి. చమురు బావుల నుంచి సముద్రపు నీటిలో కలిసే చమురు వల్ల ఇక్కడి జీవావరణ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. అంతేకాక నైజీరియాలోని మడ అడవులు చమురును తట్టుకోలేక చాలా విస్తీర్ణంలో అంతరించిపోయాయి. ఈ మడ అడవులు జీవావరణ వ్యవస్థలో 5-10శాతం వరకు నరికి వెయ్యబడటం వల్లగానీ, చమురు ఊటల వల్ల గానీ నష్టపోయాయని అంచనా వేయబడింది.

ఈ చమురు వల్ల నేలలు, భూగర్భజలాలు కలుషితమయ్యి ఎంతో విస్తీర్ణంలో పంటలు, చేపల పెంపకం వంటివి దెబ్బతింటున్నాయి. త్రాగే నీరు కూడా కలుషితమవుతున్నాయి. త్రాగు నీళ్ళు కలుషితం కావటంతో దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి జబ్బులు రావటానికి అవకాశం ఉంది. నైజీరియా నీటి మడుగులలో ఎల్లప్పుడు పల్చటి నూనె జిడ్డు కనిపిస్తుంది.

సముద్ర జలాల్లో చమురు ఊటలు ఎక్కువగా ఉండి, తీరప్రాంత పర్యావరణం ప్రభావితమయ్యి స్థానికంగా చేపల ఉత్పత్తి కూడా పడిపోతుంది.

కావున చమురు మూలంగా నైజీరియా పర్యావరణం చాలా దెబ్బతింటుందనే అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

These AP 10th Class Social Studies Important Questions 14th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II will help students prepare well for the exams.

AP Board 10th Class Social 14th Lesson Important Questions and Answers ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

10th Class Social 14th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium

1. రష్యాను పాలించే రాజులను ఏమంటారు?
జవాబు:
జాలు.

2. రష్యా పార్లమెంట్ ను ఏమంటారు?
జవాబు:
డ్యూమా.

3. జపాన్ పార్లమెంట్ ను ఏమంటారు?
జవాబు:
డైట్.

4. జర్మనీ పార్లమెంట్ ను ఏమంటారు?
జవాబు:
రిచ్ స్టాగ్.

5. రష్యన్ విప్లవంలో మితవాద ధోరణిని అవలంభించిన వారి నేమంటారు?
జవాబు:
మెన్షివికు.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

6. రష్యన్ విప్లవంలో అతివాద ధోరణిని అవలంభించిన వారినేమంటారు?
జవాబు:
బోల్షివికు.

7. రష్యన్ మహిళా విప్లవ నాయకురాలు ఎవరు?
జవాబు:
మార్ఫా వాసిలేవా.

8. ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్ట్ విప్లవాన్ని ప్రోత్సహించటానికి ఏర్పడినది ఏది?
జవాబు:
కొమిటర్న్.

9. 1917లో సంభవించిన తొలి రష్యన్ విప్లవాన్ని ఏ విధంగా పిలుస్తారు?
జవాబు:
మార్చి విప్లవంగా.

10. ఏ సంవత్సరంలో USSR పంచవర్ష ప్రణాళికలతో ప్రణాళికాబద్ధ ఆర్థిక అభివృద్ధిని చేపట్టింది?
జవాబు:
1928.

11. రష్యా రాచరిక వాదుల సైన్యంను ఏమంటారు?
జవాబు:
తెల్ల సైన్యం

12. అంతర్జాతీయ మార్కెట్ తో అనుసంధానమై లేనందున మాంద్యం నుంచి తప్పించుకోగలిగిన దేశం ఏది?
జవాబు:
USSR (రష్యా)

13. ఏ దేశంలోని స్టాక్ మార్కెట్ కుప్పకూలటంతో ఆర్థిక మాంద్య పరిణామాలు మొదలయ్యాయి?
జవాబు:
అమెరికా.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

14. ఆర్థిక విధానం పురోగమించటంలో ప్రభుత్వానికి కీలక పాత్ర ఉందని, అది ప్రభావ వంతంగా జోక్యం చేసుకోకపోతే మాంద్యానికి దారితీస్తుందని చెప్పిన ఆర్థికవేత్త ఎవరు?
జవాబు:
J.M. కీన్స్.

15. ఆర్థిక మాంద్యం వల్ల అన్నిటికంటే ఎక్కువగా ప్రభావితం అయిన దేశమేది?
జవాబు:
జర్మనీ.

16. జర్మనీ రహస్య పోలీసు బృందంను ఏమని పిలుస్తారు?
జవాబు:
గెస్టాపో.

17. హిట్లర్ జర్మనీ ఆర్ధిక పునఃనిర్మాణ బాధ్యతను ఏ ఆర్థికవేత్తకు అప్పగించాడు?
జవాబు:
హజాల్మర్ షాకిక్ట్.

18. హిట్లర్ ఏ సంవత్సరంలో పోలెండ్ పై దండెత్తాడు?
జవాబు:
1939.

19. రెండవ ప్రపంచ యుద్ధ నీడలో మానవ మారణ హెూమాన్ని చేపట్టిన దేశమేది?
జవాబు:
జర్మనీ.

20. ప్రపంచ జనాభా విస్తరణలో మూడవ పెద్ద దేశమేది?
జవాబు:
రష్యా.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

21. రష్యా తొలి నాళ్ళల్లో భూముల్లో అధిక భాగం ఎవరి ఆధీనంలో ఉండేవి?
జవాబు:
ఫ్యూడల్ ప్రభువుల

22. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ప్రపంచంలో కెల్లా అతి పెద్ద సైన్యం ఏ దేశం కల్గి ఉండేది?
జవాబు:
రష్యా.

23. రష్యాలో పంచవర్ష ప్రణాళికలను ఎవరు ప్రవేశపెట్టారు?
జవాబు:
స్టాలిన్.

24. ఆర్థిక మాంద్యం కాలంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఎంత శాతం దాకా తగ్గి లక్షలాది రైతులు పేదవాళ్లుగా మారారు?
జవాబు:
60% దాకా.

25. అమెరికాలో ఎంతో అవసరమైన సామాజిక భద్రతా విధానాన్ని ఎవరు ప్రవేశ పెట్టారు?
జవాబు:
రూల్ట్.

26. కమ్యూనిజం, పెట్టుబడిదారీ విధానం రెండింటిని ఎవరి కుట్రగా హిట్లర్ పేర్కొన్నాడు?
జవాబు:
యూదుల

27. జర్మన్ ప్రజల కారు?
జవాబు:
వోక్స్ వాగెన్.

28. కొమిస్టర్న్ ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించిన భారతీయుడు ఎవరు?
జవాబు:
M.N. రాయ్.

29. ఆర్థిక మాంద్యం యొక్క ముఖ్య పరిణామం ఏమిటి?
జవాబు:
వస్తువుల గిరాకీ పడిపోవడం.

30. USA (అ. సం. రా) ఏ సంవత్సరంలో (ఎప్పుడు) రెండవ ప్రపంచ యుద్ధంలో చేరాయి?
జవాబు:
డిసెంబరు 8, 1941.

31. సోవియట్ రష్యాలో 1920లో కాలుపెట్టిన భారతీయుడు ఎవరు?
జవాబు:
M.N. రాయ్.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

32. పెద్ద ఎత్తున కరెన్సీ నోట్ల ముద్రణ దేనికి దారితీస్తుంది?
జవాబు:
ద్రవ్యోల్బణం.

33. మార్షల్ ప్రణాళిక ప్రకటించిన దేశమేది?
జవాబు:
అమెరికా.

34. జర్మనీ తూర్పు భాగమైన జర్మన్ గణతంత్ర ప్రజాస్వామ్యం (GDR) ఎవరి ప్రభావం క్రిందకు వెళ్ళింది?
జవాబు:
USSR.

35. జర్మనీ పశ్చిమ భాగమైన జర్మన్ గణతంత్ర సమాఖ్య (FRG) ఏ దేశ ప్రభావం క్రిందకు వెళ్ళింది?
జవాబు:
అమెరికా.

36, ఏ సంవత్సరంలో USSR జర్మనీపై దండెత్తింది?
జవాబు:
1941.

37. ‘యానిమల్ ఫాం’ అనే వ్యంగ్య నవలలో ఏ విప్లవం గూర్చి చర్చించారు?
జవాబు:
రష్యా విప్లవం.

38. సమాచారాన్ని పూరించండి.
జర్మనీలో నాజీజం ప్రాబల్యం :
వర్సయిల్స్ సంధి షరతులు → జర్మన్ అవమాన భారం → నాజీ పార్టీ విజృంభణ → హిట్లర్ నియంతృత్వం → ?
జవాబు:
రెండవ ప్రపంచ యుద్ధ ఆరంభం / నాంది.

39. సమాచారాన్ని పూరించండి.
ఆర్థిక మాంద్యం నాటి పరిస్థితులు
నిరుద్యోగం – పెరిగింది.
డిమాండ్ – తగ్గింది.
ధరలు – ?
జవాబు:
పడిపోయాయి.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

మొదటిజతలోని రెండు అంశాల మధ్యగల సంబంధం ఆధారంగా రెండవ జతను పూరించండి.

40. UNESCO : పారిస్ : : UNICEF 😕
జవాబు:
న్యూయార్క్

41. ఫాసిస్ట్ పార్టీ : ఇటలీ : : నాజీ పార్టీ : ?
జవాబు:
జర్మనీ.

42. మెన్షవిక్ : కెరన్స్క : : బోల్షివిక్ : ?
జవాబు:
లెనిన్.

43. జపాన్ : డైట్ : : రష్యా : ?
జవాబు:
డ్యూమా.

44. ఒట్టోమాన్ : టర్కీ : : వైమర్ రిపబ్లిక్ : ?
జవాబు:
జర్మనీ సామ్రాజ్యం

45. స్టాలిన్ : USSR : : రూజ్వెల్ట్ : ?
జవాబు:
USA.

46. రష్యాలో వచ్చిన ఫిబ్రవరి విప్లవం ముఖ్య ఫలితం ఏమిటి?
జవాబు:
జార్ చక్రవర్తి పారిపోవడం (పదవీచ్చుతుడవడం)

47. రష్యాలో పౌర యుద్ధ కాలం …………..?
జవాబు:
1917 – 1920.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

48. మార్చి 8, 1917న రాజధాని సెయింట్ పీటర్బర్గ్ లో ఊరేగింపుగా వెళ్ళిన సుమారు 10,000 మంది మహిళల డిమాండ్ ఏమిటి?
జవాబు:
రొట్టె, శాంతి.

49. క్రింది వానిలో సరికాని జతను గుర్తించి, రాయండి.
→ బ్రిటన్ – చర్చిల్
→ అమెరికా – రూజ్ వెల్ట్
→ రష్యా – స్టాలిన్
→ ఇటలీ – హిట్లర్
జవాబు:
ఇటలీ – హిట్లర్.

50. USSR లోని సోవియట్లు, రైతాంగం, కార్మికులు, సైనికులు, జమిందారులలో ఎవరికి సంబంధించని కౌన్సిల్లు?
జవాబు:
జమీందారులు.

51. హిట్లర్ ఏ చట్టము ద్వారా జర్మనీకి ఛాన్సలర్ అయ్యాడు?
జవాబు:
ఎనేబ్లింగ్ చట్టము.

52. హిట్లర్ రచించిన పుస్తకం పేరేమిటి?
జవాబు:
మైన్ కాంఫ్ (నా పోరాటం )

59. యుద్ధాన్ని నివారించ వలసిందిగా హిట్లరుకు విన్నపాన్ని పంపిన భారతీయ నాయకుడెవరు?
జవాబు:
మహాత్మాగాంధీ.

54. న్యూడీల్ పాలసీ ముఖ్య ఉద్దేశ్యమేమిటి?
జవాబు:
ఆర్థికమాంద్యం వలన నష్టపోయిన వారికి సహాయం చేయటం.

55. వేగవంతమైన పారిశ్రామికీకరణ, ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాలు అనే జోడెద్దుల విధానంను అనుసరించిన దేశమేది?
జవాబు:
USSR.

56. చిట్ట చివరి జార్ చక్రవర్తి ఎవరు?
(or)
రష్యా విప్లవ కాలంనాటి రష్యా చక్రవర్తి ఎవరు?
జవాబు:
జార్ నికోలస్ – II

57. ఎనెల్లింగ్ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది?
జవాబు:
1933.

58. మార్షల్ ప్రణాళికను అమెరికా ఏ దేశాల ఆర్థిక పునరుద్దరణకు ఏర్పాటు చేసింది?
జవాబు:
జర్మనీ మరియు జపాన్.

59. లెనిన్ మరణించిన సంవత్సరం?
జవాబు:
1924.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

60. పుట్టుక, లింగం, భాష వంటి వివక్షతలేని సమాజాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించిన దేశం?
జవాబు:
రష్యా USSR.

61. ‘రక్తసిక్త ఆదివారం’ విప్లవం (రష్యాలో) ఏ సంవత్సరంలో సంభవించింది?
జవాబు:
1905లో.

62. ఆర్థిక మాంధ్యం కాలంలో అమెరికాలో నిరుద్యోగుల శాతం ఎంత?
జవాబు:
25%

63. యూదులపై సామూహిక హత్యాకాండ ఏ సంవత్సరంలో జరిగింది?
జవాబు:
1941 లో

64. హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నది ఏ సంవత్సరంలో?
జవాబు:
1945 లో

65. 1917లో సంభవించిన మలి రష్యన్ విప్లవాన్ని ఏవిధంగా పిలుస్తారు?
జవాబు:
అక్టోబర్ విప్లవం.

66. గ్రెగోరియన్ క్యాలండర్ తేదీలు జులియన్ క్యాలండర్ తేదీల కంటే ఎన్ని రోజులు ముందుంటాయి?
జవాబు:
13 రోజులు.

67. మన క్యాలండర్ ప్రకారం రష్యాలో ఫిబ్రవరి విప్లవం మార్చి 12న, అక్టోబర్ విప్లవం ఏ తేదీన జరిగాయి?
జవాబు:
నవంబరు – 7.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

68. ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర మాంద్యం కొనసాగిన కాలం ఏది?
జవాబు:
1929 – 39.

69. “ఎకోస్ ఆఫ్ నేటివ్ ల్యాండ్ టు సెంచరీస్ ఆఫ్ ఎ రష్యన్ విలేజ్” అనే గ్రంథాన్ని రచించింది ఎవరు?
జవాబు:
సెర్జ్ ష్మెమాన్.

70. “అన్నిటి కంటే బలమైన జాతికి ప్రపంచాన్ని ఓడించే హక్కు ఉంది” అని అన్నది ఎవరు?
జవాబు:
హిట్లర్.

71. “ఈ లోకంలోకి మహిళ ఇచ్చే ప్రతి సంతానము ఒక యుద్దమే” అని అన్నది ఎవరు?
జవాబు:
హిట్లర్.

72. “ఏ పని చెయ్యటానికైనా సిద్ధమే” అని రాసిన కార్డులు మెడలో వేసుకుని ఏదేశంలోని నిరుద్యోగులు తిరిగారు?
జవాబు:
జర్మనీ.

73. మాంద్యం వల్ల అన్నిటికంటే ఎక్కువగా ప్రభావితం అయిన దేశమేది?
జవాబు:
జర్మనీ.

74. ఏ సంవత్సరంలో నాజీ పార్టీ జర్మనీలో 37% ఓట్లతో అతి పెద్ద పార్టీగా పరిణమించింది?
జవాబు:
1937.

75. నాజీ పార్టీ చిహ్నం ఏది?
జవాబు:
స్వస్తిక్

76. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ సైన్యాలు తొలుత విజయాలు సాధించినా, 1943 ఆరంభంలో ప్రఖ్యాతమైన ఏ యుద్ధంలో ఓటమితో అపజయాలుగా మారసాగాయి?
జవాబు:
లెనిన్ గ్రాడ్.

77. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న క్యాలండర్ ఏది?
జవాబు:
గ్రెగోరియన్ క్యాలండర్.

78. రష్యాలో భూముల ఏకీకరణ ప్రారంభమైన సంవత్సరం?
జవాబు:
1929.

79. 1920లో సోవియట్ రష్యాలో కాలుపెట్టిన భారతీయుడు ఎవరు?
జవాబు:
M.N. రాయ్

80. ఓష్ విడ్జ్ అనునది ఏమిటి?
జవాబు:
హిట్లర్ పాలనలోని శిక్షా శిబిరం.

81. జర్మనీ రాజధాని నగరం ఏది?
జవాబు:
బెర్లిన్.

82. ‘హోలో కాస్ట్’ అంటే?
జవాబు:
యూదుల సామూహిక విచారణ.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

83. క్రింది వానిని సరిగా జతపరచండి.
1) రక్తసిక్త ఆదివారం ( ) a) 1905
ii) కొమిన్ టర్న్ ఏర్పాటు ( ) b) 1919
iii)రష్యాలో మొదటి పంచవర్ష ప్రణాళికలు ( ) c) 1928
iv) వైమర్ గణతంత్ర ప్రకటన ( ) d) 1918
జవాబు:
i – a, ii – b, iii – c, iv – d

10th Class Social 14th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
“తీవ్ర ఆర్థికమాంద్యం” అనగానేమి?
జవాబు:

  1. ప్రపంచ వ్యాప్తంగా వస్తువులు గిరాకీ పడిపోవడం కలగ ధరలు క్షీణించడాన్ని తీవ్ర ఆర్థిక మాంద్యం అంటారు.
  2. ఇది ప్రపంచ వారంగా 1999 నుండి 1939 వరకు కొనసాగింది.

ప్రశ్న 2.
USSR తీవ్ర ఆర్థిక మాంద్యం నుండి ఎలా తప్పించుకోగలిగింది?
జవాబు:
అంతర్జాతీయ మార్కెట్ తో USSR అనుసంధానమై లేనందున ఈ మాంద్యం నుంచి తప్పించుకోగలిగింది.

ప్రణాళికాబద్ధమైన ఆర్థిక విధానం, ఏమి ఉత్పత్తి చెయ్యాలో, ఎంత ఉత్పత్తి చెయ్యాలో అన్న అంశాలు ప్రభుత్వ అధీనంలో ఉండటం మొ||నవి.

ప్రశ్న 3.
హిట్లర్ ప్రవేశపెట్టిన ఏవేని రెండు ఆర్థిక సంస్కరణ అను రాయండి.
జవాబు:

  1. సమ్మెల నిషేధం
  2. పన్నుల భారం తగ్గించడం
  3. యుద్ధ సామగ్రి ఉత్పత్తి చేసే పరిశ్రమల స్థాపన
  4. ఉపాధి కల్పన

ప్రశ్న 4.
1917 రష్యా విప్లవానికి, భారత స్వాతంత్రోద్యమానికి గల రెండు భేదాలను రాయండి.
జవాబు:

రష్యా విప్లవంభారత స్వాతంత్ర్యోద్యమం
1) జార్ నికోలస్ కు వ్యతిరేకంగా జరిగింది.1) బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగింది.
2) ‘రొట్టె, శాంతి’ కోసం డిమాండు జేయటం.2) స్వాతంత్ర్యం కోసం పోరాటం.
3) రెండు దశలు3) మూడు దశలు
4) ఉదారవాదులు, రాచరిక కుటుంబాలకు వ్యతిరేకంగా.4) విదేశీయులకు వ్యతిరేకంగా.

ప్రశ్న 5.
జర్మనీలో యూదుల పట్ల హిట్లర్ ప్రవర్తనకు సంబంధించి మీ అభిప్రాయాన్ని తెల్పండి.
జవాబు:
యూదుల పట్ల హిట్లర్ యొక్క ప్రవర్తన చాలా క్రూరమైనది మరియు అన్యాయమైనది.

ప్రశ్న 6.
ప్రసుత భారతదేశ ప్రభుత్వము అమలుచేస్తున్న ఏవైనా రెండు సంక్షేమ పథకాలు వ్రాయుము.
జవాబు:
ప్రస్తుత భారతదేశ ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు:

  1. సుకన్య సంవృద్ధి యోజన.
  2. ప్రధానమంత్రి జీవ జ్యోతి బీమా యోజన
  3. MNREGA
  4. అటల్ పెన్షన్ యోజన

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

ప్రశ్న 7.
‘ఉమ్మడి క్షేత్రాల’ వ్యవసాయం గురించి వ్రాయండి.
జవాబు:
ఉమ్మడి క్షేత్రాల వ్యవసాయం :

  • యు.ఎస్.ఎస్.ఆర్ లో చిన్న, పెద్ద రైతులు తమ భూములను వదిలేసి ఉమ్మడి క్షేత్రాలలో చేరేలా బలవంతం చేయడం.
  • ఈ క్షేత్రాలలో ఉమ్మడిగా ఆధునిక వ్యవసాయ పద్ధతులు అనుసరించి, ఉత్పత్తిని అందరూ పంచుకోవటం.

ప్రశ్న 8.
పార్లమెంటును పట్టించుకోకుండా ఉండే అధికారాన్ని హిట్లర్ ఎలా పొందాడు?
జవాబు:
హిట్లర్ పార్లమెంటును పట్టించుకోకుండా ఉండే అధికారాన్ని ఎనేబ్లింగ్ యాక్ట్ ఆమోదించడం ద్వారా పొందారు.

ప్రశ్న 9.
‘కొత్త ఒప్పందము’ (న్యూడీల్) నందలి ముఖ్యాంశములను పేర్కొనండి.
జవాబు:
‘కొత్త ఒప్పందము’ (న్యూడీల్) నందలి ముఖ్యాంశాలు :

  1. మాంద్యానికి గురైన వారికి పునరావాసం
  2. ఆర్థిక సంస్థల సంస్కరణ
  3. ఆర్థిక పరిస్థితి తిరిగి కోలుకోవడానికి చర్యలు

ప్రశ్న 10.
‘తీవ్ర ఆర్థిక మాంద్యము’ అనగా నేమి?
జవాబు:
తీవ్ర ఆర్థిక మాంద్యము : 1929 సం||ములో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన ఆర్ధిక క్షీణతనే తీవ్ర ఆర్థిక మాంద్యము అంటారు.

ప్రశ్న 11.
సమాచారాన్ని పూరించండి.
ఆర్థికమాంద్యం నాటి పరిస్థితులు.
నిరుద్యోగం – పెరిగింది.
డిమాండ్ – తగ్గింది.
ధరలు -?
జవాబు:
ధరలు – పడిపోయాయి.

ప్రశ్న 12.
జార్ పాలనలో చైనా, భారతదేశం తరువాత అతిపెద్ద జనాభాగల దేశం ఏది?
జవాబు:
జార్ పాలనలో చైనా, భారతదేశం తరువాత 15.6 కోట్ల జనాభాతో మూడవ అతి పెద్ద దేశంగా రష్యా అవతరించింది.

ప్రశ్న 13.
రష్యాలో కలిసున్న కొన్ని దేశాలేవి?
జవాబు:
ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, తుర్కోమానియా వంటి పలు దేశాలు రష్యాలో కలిసి ఉండేవి.

ప్రశ్న 14.
రొట్టె, శాంతి కావాలని ఏ నగరంలో మహిళలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు?
జవాబు:
రొట్టె, శాంతి కావాలని 10,000 మంది మహిళలు “సెంట్ పీటర్స్ బర్గ్” నగరంలో ప్రదర్శనలు చేశారు.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

ప్రశ్న 15.
మార్చి విప్లవం అని దేనినంటారు?
జవాబు:
1917లో సంభవించిన తొలి రష్యన్ విప్లవాన్ని రష్యన్ విప్లవమని లేదా మార్చి విప్లవం అని అంటారు.

ప్రశ్న 16.
రష్యా జులియన్ క్యాలెండర్‌ను ఎంతవరకు అనుసరించింది?
జవాబు:
రష్యా జులియన్ క్యాలెండర్‌ను 1918 ఫిబ్రవరి 1 వరకు అనుసరించింది.

ప్రశ్న 17.
బోల్షివిక్కుల నాయకుడెవరు?
జవాబు:
బోల్షివిక్కుల నాయకుడు బ్లడిమిర్ లెనిన్.

ప్రశ్న 19.
పౌరయుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది?
జవాబు:
పౌరయుద్ధం రష్యా రాచరికవాదుల తెల్ల సైన్యం, కమ్యూనిస్టు వ్యతిరేక సైనికుల మధ్య జరిగింది. ఇది 1918 – 20 సం||ల మధ్య జరిగింది.

ప్రశ్న 20.
రష్యా USSR గా ఎప్పుడు అవతరించింది?
జవాబు:
రష్యా యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్టు రిపబ్లిక్ గా 1924లో అవతరించింది.

ప్రశ్న 21.
రష్యాలో తీవ్ర కరవు ఎప్పుడు సంభవించింది?
జవాబు:
రష్యాలో తీవ్ర కరవు 1929-30లో సంభవించింది. ఫలితంగా పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోయారు.

ప్రశ్న 22.
ఏ నగరంలో 3 సం||ల కాలంలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించారు?
జవాబు:
“మాగ్నిటాగోర్క్స్” అన్న పట్టణంలో 3 సం||ల కాలంలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించారు.

ప్రశ్న 23.
“ది హిస్టరీ ఆఫ్ ఎ సోవియట్ కలెక్టిల్ ఫాం” అన్న గ్రంథాన్ని రాసినదెవరు?
జవాబు:
“ది హిస్టరీ ఆఫ్ ఎ సోవియట్ కలెక్టల్ ఫాం” అన్న గ్రంథాన్ని రాసింది “ఫెడార్ బెలోవ్”.

ప్రశ్న 24.
బోల్సివిక్లు రూపొందించిన విద్యావిధానం పేరేమి?
జవాబు:
బోల్షివికు రష్యాలో విస్తరించిన విద్యావిధానాన్ని రూపొందించారు.

ప్రశ్న 25.
ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు విప్లవాన్ని ప్రోత్సహించటానికి ఏర్పడిన సంస్థ పేరేమి?
జవాబు:
కమ్యూనిస్టు విప్లవాన్ని ప్రోత్సహించటానికి ఏర్పడిన సంస్థ “కొమ్మి ర్న్”.

ప్రశ్న 26.
“ఐరోపాలోని ఇతర రాజధానులతో పోలిస్తే మాస్కో అంత శుభ్రంగా అనిపించదు” అన్నదెవరు?
జవాబు:
రవీంద్రనాథ్ ఠాగూర్.

ప్రశ్న 27.
అరికమాంద్యం ఎప్పుడు ప్రారంభమై, ఎంతవరకు కొనసాగింది?
జవాబు:
ఆర్థికమాంద్యం 1929 చివరలో ప్రారంభమై, 1939 వరకు కొనసాగింది.

ప్రశ్న 28.
“పిల్లవాడికి మూడేళ్ళ వయస్సు నుంచే ఊపటానికి అతడికి ఒక చిన్న జెండా ఇస్తాం” అన్నదెవరు?
జవాబు:
జర్మను కార్మిక నాయకుడు రాబర్ట్ లే.

ప్రశ్న 29.
నాజీ సిద్ధాంతంలో ప్రాథమిక శిక్షణ ఏ వయసు పిల్లలకు ఇచ్చేవారు?
జవాబు:
ఆరు నుంచి పది (6-10) సంవత్సరాల మగపిల్లలందరూ నాజీ సిద్ధాంతంలో ప్రాథమిక శిక్షణ పొందేవాళ్ళు.

ప్రశ్న 30.
కమ్యూనిస్టులు, సోషలిస్టుల నాయకత్వంలోని శ్రామికవర్గ ఉద్యమాలను వ్యతిరేకించింది ఎవరు?
జవాబు:
కమ్యూనిస్టులు, సోషలిస్టుల నాయకత్వంలోని శ్రామికవర్గ ఉద్యమాలను వ్యతిరేకించింది హిట్లర్.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

ప్రశ్న 31.
“గెస్టాపో” అంటే ఏమిటి?
జవాబు:
జర్మనీ సమాజాన్ని నియంత్రించడానికి, భద్రతా పరిరక్షణకు ఏర్పాటు కాబడిన “రహస్య పోలీసు బృందం”.

ప్రశ్న 32.
జర్మన్ ఆర్థిక పునర్నిర్మాణ బాధ్యతను హిట్లర్ ఎవరికి అప్పగించాడు?
జవాబు:
జర్మన్ ఆర్థిక పునర్నిర్మాణ బాధ్యతను హిట్లర్ “ఆర్థికవేత్త హజాల్మర్ షాకిక్ట్”కి అప్పగించాడు.

ప్రశ్న 33.
తీవ్ర ఆర్థికమాంద్యం ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు:
1929-30లో సంభవించిన తీవ్ర ఆర్థికమాంద్యంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికవ్యవస్థ ఛిన్నాభిన్నం అయింది. నిరుద్యోగం పెరిగిపోయింది.

ప్రశ్న 34.
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అణుబాంబు దాడికి గురి అయిన జపానులోని నగరాలేవి?
జవాబు:
హిరోషిమా, నాగసాకి.

ప్రశ్న 35.
‘న్యూ డీల్’ కు సంబంధించిన మూడు విధానాలు (3R’s) ఏమిటి?
జవాబు:
పునరావాసం (ఆర్థికమాంద్యానికి గురైన వారికి), ఆర్థిక సంస్థల సంస్కరణ, ఆర్థిక పరిస్థితి కోలుకోడానికి చర్యలు.

ప్రశ్న 36.
బోల్షివిక్ విప్లవం అనగానేమి?
జవాబు:
1917 నవంబరులో లెనిన్ నాయకత్వాన షరతులు లేని శాంతి, భూ పంపిణీ తదితర డిమాండులతో వచ్చిన విప్లవాన్ని ‘బోల్షివిక్ విప్లవం’ అంటాం.

10th Class Social 14th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
క్రింది కాలపట్టికను పరిశీలించి ప్రశ్నలకు జవాబులివ్వండి.

కాలపట్టిక
వైమర్ గణతంత్ర రాజ్యాంగ ప్రకటననవంబర్ 9, 1918
హిట్లర్ జర్మనీకి ఛాన్సలర్‌గా కావడంజనవరి 30, 1933
జర్మనీ పోలెండ్ పై దండెత్తడం; రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభంసెప్టెంబర్ 1, 1939
USSR పై జర్మనీ దండెత్తడంజూన్ 22, 1941
యూదులపై సామూహిక హత్యాకాండజూన్ 23, 1941
అమెరికా సంయుక్త రాష్ట్రాలు రెండవ ప్రపంచ యుద్ధంలో చేరడండిసెంబర్ 8, 1941
సోవియట్ సేనలు ఆష్విల్డ్ కు విముక్తి కల్పించడంజనవరి 27, 1945
యూరప్లో కూటమిగా సాధించిన విజయంమే 8, 1945

A) రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియట్ యూనియన్ ఆష్వి కు విముక్తి కల్పించడం ద్వారా మిత్రదేశాలకు విజయానికి మార్గం సుగమం అయినది అని ఎలా చెప్పవచ్చు?
B) ప్రపంచ చరిత్రలో 1941 నాటి కీలక అంశాలు ఏవి?
జవాబు:
A) జర్మనీలో ఆష్విజ్ ప్రాంతాన్ని 1945లో రష్యా ఆక్రమించుకోవడంతో జర్మనీ బలహీన పడింది. దీంతో మిత్ర రాజ్య సైన్యాలు బెర్లిన్ ను ఆక్రమించుకున్నాయి. గత్యంతరం లేని పరిస్థితులలో హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు.

B) 1) యు.ఎస్.ఎస్.ఆర్. పై జర్మనీ దండెత్తడం
2) యూదులపై సామూహిక హత్యాకాండ
3) అమెరికా సంయుక్త రాష్ట్రాలు రెండవ ప్రపంచ యుద్ధంలో చేరడం.

ప్రశ్న 2.
ఈ క్రింది పటాన్ని పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-II 1
1) డచ్ ఈస్ట్ ఇండియాను ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు?
జవాబు:
డచ్ ఈస్ట్ ఇండియాను ఇప్పుడు ఇండోనేషియా అని పిలుస్తున్నారు.

2) ఏ చైనా ప్రాంతం జపాన్ అధీనంలో ఉంది?
జవాబు:
చైనాలోని మంచూరియా ప్రాంతం జపాన్ అధీనంలో ఉంది.

3) భారతదేశంతో భూభాగ సరిహద్దును కలిగి యుండి జపాన్ నియంత్రణలో లేని దేశం ఒకదాని పేరు వ్రాయండి.
జవాబు:
నేపాల్, టిబెట్, భూటాన్

ప్రశ్న 3.
ఏవేని రెండు ఆర్థిక మాంద్య ప్రభావాలను వ్రాయండి.
జవాబు:
ఆర్థిక మాంద్య ప్రభావాలు :

  1. నిరుద్యోగిత పెరగడం
  2. ధరల పతనం
  3. కర్మాగారాల మూసివేత
  4. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడం

ప్రశ్న 4.
క్రింది పేరాను చదవండి.
భూమి ఎవరికి కేటాయించబడి లేదు. ఎవరికీ బహుమతిగా కట్టబెట్టలేదు. తమ హృదయాలలో దాన్ని జయించగల సాహసం, దాన్ని కాపాడులోగల బలం, దాన్ని దున్నగల శ్రమ, చేయగల ప్రజలకు దేవుడు దానిని ఉద్దేశించాడు. బలమైన, జాతి తన జనాభాకి తగినట్టు సరిహద్దులను విస్తరించుకుంటుంది.
ప్రశ్న : బలం, శక్తి ఉన్నవాళ్ళకే ఈ ప్రపంచం చెందాలనే అభిప్రాయంపై వ్యాఖ్య రాయండి.
జవాబు:
నేను ఈ అభిప్రాయంతో ఏకీభవించడం లేదు. “ఎందుకనగా ఈ ప్రపంచం అందరిదీ పుట్టుకతో మానవులందరూ సమానులే.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

ప్రశ్న 5.
భారతదేశంలో ఈనాడు సంక్షేమ రాజ్యమునకు సంబంధించిన ఏయే అంశాలు అమలులో ఉన్నాయి?
జవాబు:
భారతదేశంలో అమలులో ఉన్న సంక్షేమ కార్యక్రమాలు :

  1. ప్రజా పంపిణీ వ్యవస్థ.
  2. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకము.
  3. గృహనిర్మాణ పథకాలు.
    ఉదా : PAY మొ||
  4. MNREGA
  5. వృద్ధాప్య పింఛన్లు.
  6. ఆరోగ్య పథకాలు.
    ఉదా : ఆయుష్మాన్ భారత్, యన్.టి.ఆర్. వైద్యసేవ మొ||వి.

ప్రశ్న 6.
యుద్ధాలను నివారించడం గురించి రెండు నినాదాలు రూపొందించండి.
జవాబు:
యుద్ధాలను నివారించడం గురించి రెండు నినాధాలు :

  1. యుద్ధం వద్దు – శాంతి ముద్దు.
  2. పొరుగు దేశాల వారిని ప్రేమించండి – వారూ మన వంటివారే.
  3. ఆయుధాలు వద్దు – అభివృద్ధి ముద్దు.
  4. విశ్వ మానవ సౌభ్రాతృత్వం – భగవంతునికి ప్రీతి.
  5. యుద్దాలను వీటో చేద్దాం – ప్రపంచ శాంతికి పట్టం కడదాం.

ప్రశ్న 7.
జార్ నికొలాస్ II కాలంలో రష్యాలో జరిగిన పరిణామాలు వివరించుము.
జవాబు:
నికొలాస్ II రష్యా విశాల సామ్రాజ్యాన్ని, సైన్యం, సమర్థులైన పాలనాధికారుల సహాయంతో పాలించాడు. అయితే ప్రపంచయుద్ధం వల్ల రష్యా ఆర్థిక పరిస్థితి పూర్తిగా ఛిన్నాభిన్నమైంది. మొదటి ప్రపంచయుద్ధానికి ముందు ప్రపంచంలో కెల్లా అతి పెద్ద సైన్యం రష్యాకు ఉండేది. 1917 నాటికి 20 లక్షల సైనికులు, పౌరులు చనిపోయి, మొదటి ప్రపంచయుద్ధంలో అత్యధిక ప్రాణనష్టం చవిచూసింది. యుద్ధ రంగానికి ఆహారాన్ని మళ్ళించడం వల్ల పట్టణాల్లో ఆహార కొరత ఏర్పడింది. రొట్టె, శాంతి కావాలని మహిళలు, కార్మికులు నిరసన ర్యాలీలతో పాటు ఉద్యమాలు చేపట్టారు. జార్ నికొలాస్ పరారు కావటంతో రాచరికానికి చెందని రష్యన్లు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు.

ప్రశ్న 8.
లెనిన్ నాయకత్వంలో రష్యాలో విప్లవం తరువాత బోల్షివిక సంస్కరణలు ఏమిటి?
జవాబు:
బోల్షివి లకు వ్లాడిమిర్ లెనిన్ (1870 – 1924) నాయకత్వం వహించాడు. రష్యాను అగ్రగామిగా చేయడానికి, ప్రజలలో ఆత్మసైర్యం పెంచడానికి అనేక సంస్కరణలు అమలు చేశారు.

  1. షరతులు లేని శాంతిని నెలకొల్పుట.
  2. భూమినంతటిని జాతీయం చేసి దానిని రైతులందరికీ పంచిపెట్టడం.
  3. ధరలను నియంత్రించి, మార్కెట్ ధర కల్పించడం.
  4. బ్యాంకులను, కర్మాగారాలను జాతీయం చేసి రైతాంగ, కార్మిక, సైనికుల విశ్వాసం చూరగొనడం.
  5. రష్యన్ అధీనంలో ఉన్న దేశాలన్నీ స్వతంత్రంగా ఉండేందుకు అవకాశం కల్పించడం వంటి సంస్కరణలు చేపట్టారు.

ప్రశ్న 9.
స్టాలిన్ నాయకత్వంలో రష్యా పురోభివృద్ధిని వివరించండి.
జవాబు:
1924లో లెనిన్ చనిపోయిన తరువాత స్టాలిన్ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు అయ్యాడు.

  1. తర్వాత దశాబ్దంలో అతడు తన పూర్తి నియంత్రణను సాధించుకొని, వ్యతిరేకత అన్నది లేకుండా చేశాడు.
  2. వివరణ, శాసించటానికి లేని అధికారంతో సోవియట్ రష్యాని బలమైన ఆర్ధిక శక్తిగా మలిచాడు.
  3. 1928లో పంచవర్ష ప్రణాళికలతో USSR ప్రణాళికాబద్ద ఆర్థిక అభివృద్ధిని చేపట్టాడు.
  4. వేగవంతమైన పారిశ్రామికీకరణతో పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు అందించాడు.
  5. “భూముల ఏకీకరణ” పేరుతో చిన్న, పెద్ద రైతులు తమ భూములను వదిలేసి ఉమ్మడి క్షేత్రాలలో వ్యవసాయం చేసే విధంగా రైతులను ప్రోత్సహించాడు.

ప్రశ్న 10.
రష్యా (USSR)కి సంబంధించిన హింసాత్మక ధోరణులు తెలుపుము.
జవాబు:
ఆర్థికమాంద్యం సమయంలో కూడా సమర్ధవంతంగా పనిచేసి అద్వితీయ ప్రగతి మార్గాలలో రష్యాను నడిపించిన నాయకులు, బోల్షివికు, కమ్యూనిస్టులు తరువాత కాలంలో అనేక హింసాత్మక చర్యలకు ఒడిగట్టారు.

  1. పౌరులకు సాధారణ ప్రజాస్వామిక స్వేచ్ఛ ఇవ్వలేదు.
  2. ప్రజలలో పెల్లుబికిన వ్యతిరేకతను బలంతో అణచివేసారు.
  3. ప్రతిపక్ష నాయకులను నిర్దాక్షిణ్యంగా అధిక సంఖ్యలో చంపేశారు.
  4. సోషలిస్టు వ్యవస్థ నిర్మాణం కొరకు అడ్డంగా ఉన్నారనే సాకుతో పెట్టుబడిదారులను తొలగించుకున్నారు.
  5. ప్రతిపక్ష రాజకీయ పార్టీలను నిషేధించారు.
  6. జార్జ్ ఆర్వెల్ అనే రచయిత “యానిమల్ ఫాం” అనే తన నవలలో రష్యన్ విప్లవంలోని ఆదర్శాలను USSR లో ఎలా నీరుకార్చారో వివరించాడు.

ప్రశ్న 11.
హిట్లర్ కొత్త శైలిని, రాజకీయంగా జర్మనీలో తీసుకొచ్చిన సంస్కరణలను వివరించుము.
జవాబు:
ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకొని, ప్రపంచం ఆకర్షించే విధానాలతో, ఆలోచనలతో ముందుకు నడిచి, జర్మనీని సరికొత్త మార్గంలో నడిపించిన గొప్పవ్యక్తి హిట్లర్. ఒక అద్భుతమైన వక్త. యువతను ఆకర్షించే క్రమంలో పని, ఉద్యోగ భద్రత కల్పిస్తానంటూ యువతను ఆకర్షించాడు. జర్మనీ ప్రజల గౌరవాన్ని నిలబెడతానంటూ ప్రజల్లో ఆత్మవిశ్వాసం నెలకొల్పాడు. తీవ్ర మాంద్యం, పెట్టుబడిదారీ విధానాన్ని రూపుమాపడానికి ప్రయత్నించి సఫలీకృతుడయ్యాడు. రాజకీయ ప్రత్యర్థులను, కమ్యూనిస్టులను అరెస్టు చేసి శిక్షణ శిబిరాలకు పంపించాడు. ప్రత్యేక నిఘా, రక్షణ దళాలను ఏర్పరిచాడు.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

ప్రశ్న 12.
“బలమైన జాతికి ప్రపంచాన్ని ఓడించే హక్కు ఉందంటూ” హిట్లర్ ఉపన్యాసాన్ని క్లుప్తంగా వివరించండి.
జవాబు:
అన్నింటికంటే బలమైన జాతికి ప్రపంచాన్ని ఓడించే హక్కు ఉంటుందని హిట్లర్ చెబుతూ, తన ప్రసంగ, బహిరంగ సమావేశాల ద్వారా, ఉపన్యాసాల ద్వారా ప్రజలను జాగృతం చేశాడు.

భూమి ఎవరికీ కేటాయించబడి లేదు. ఎవరికీ బహుమతిగా కట్టబెట్టలేదు. తమ హృదయాలలో దానిని జయించగల సాహసం, దానిని కాపాడుకోగల బలం, దానిని దున్నగల, శ్రమ చెయ్యగల ప్రజలకు దేవుడు దానిని ఉద్దేశించాడు. ఇది “ప్రపంచం ప్రాథమిక హక్కు శక్తి ఉన్నంతవరకు జీవించటానికి ఉన్న హక్కు. ఈ హక్కు ఆధారంగా బలమైన జాతి తన జనాభాకి తగినట్టు సరిహద్దులను విస్తరించుకుంటుంది. ఈ విధంగా తన వాగ్దాటితో ప్రజలను మంత్రముగ్ధుల్ని చేసాడు.

ప్రశ్న 13.
జార్ పాలనలో రష్యా ప్రగతిని 4 వాక్యాల్లో రాయుము.
జవాబు:
జార్ పాలనలో రష్యా రెండు ఖండాలలో విస్తరించి యూరో ఆసియా శక్తిగా విశాల సామ్రాజ్యంగా ఉండేది. చైనా, భారతదేశం తరువాత 15.6 కోట్ల జనాభాతో మూడవ అతి పెద్ద దేశంగా ఉండేది. రష్యన్లలో అధికశాతం వ్యవసాయంతో జీవనోపాధి పొందేవారు. ప్రపంచంలో అతి పెద్ద సైన్యం రష్యాకు ఉండేది. పెద సెన్యం రష్యాకు ఉండేది.

ప్రశ్న 14.
రష్యాలో సోవియట్లు ఎవరు?
జవాబు:
రెండో నికొలాస్ పదవీచ్యుతుడైన తరువాత రష్యాను పాలిస్తున్న ఉదారవాదులు, రాచరిక కుటుంబాల వాళ్ళు పితృభూమి గౌరవాన్ని కాపాడటానికి యుద్ధాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. ఆర్థిక కొరతను తీర్చి యుద్ధాన్ని వ్యతిరేకించిన వాళ్ళను సోవియట్లుగా పిలిచారు.

ప్రశ్న 15.
బోల్షివిక్కుల లక్ష్యాలేమిటి?
జవాబు:

  1. రష్యాలో శాంతిని నెలకొల్పడం.
  2. రైతులందరికీ అండగా నిలిచి మిగులు భూమిని పంచిపెట్టడం.
  3. కర్మాగారాలను, బ్యాంకులను జాతీయం చేయడం.
  4. రష్యా కింద ఉన్న దేశాలకు స్వేచ్ఛను ప్రసాదించడం.

ప్రశ్న 16.
“భూముల ఏకీకరణ” ను క్లుప్తంగా వివరించుము.
జవాబు:
పారిశ్రామికీకరణ, వ్యవసాయంలో భూముల ఏకీకరణ అన్న రెండు విధానాలను స్టాలిన్ ఆధ్వర్యంలో USSR లో అమలు చేశారు. ఈ విధానంలో ….. చిన్న, పెద్ద రైతులు తమ భూములను వదిలేసి “ఉమ్మడి క్షేత్రాలతో” చేరేలా బలవంతం చేసి చిన్న కమతాల ఉత్పత్తికి స్వస్తి పలకాలని ప్రయత్నించింది. గ్రామంలోని భూములు, పరికరాలు, యంత్రాలు, పశువులను ఉమ్మడి ఆస్తిగా భావించారు.

ప్రశ్న 17.
ప్రపంచ శాంతి పరిరక్షణ కొరకు యుద్దాలను నివారించడానికి కొన్ని పరిష్కారాలు సూచించండి.
జవాబు:

  1. ప్రపంచ శాంతి పరిరక్షణలో యుద్ధాలు జరగకుండా అనేక చర్యలు తీసుకోవచ్చు.
  2. సమస్యల సాధన కోసం ప్రపంచ దేశాలు వీలైనంతవరకు సామరస్యమైన చర్చలకు, అంతర్జాతీయ సమాజ సూచనలపై – ఆధారపడవచ్చు.
  3. ఎక్కువ యుద్ధాలు అగ్రరాజ్యాల స్వార్థాల కోసం, అవి అపార సహజవనరులపై ఆధిపత్యం కోసం, ప్రభావ ప్రాంతాల కోసం చేసిన ఏర్పాట్లవల్లే జరిగాయి. కావున అవి బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.
  4. శాంతియుత సహజీవనం కోసం ప్రపంచదేశాలన్నీ కలిసికట్టుగా సంయమనం పాటించాలి.

ప్రశ్న 18.
ఇచ్చిన కాలపట్టిక చదివి, ప్రశ్నలకు జవాబులివ్వండి.
AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-II 2
1) రెండవ ప్రపంచ యుద్ధానికి ప్రారంభం ఏది?
2) హిట్లర్ ఏ దేశానికి చెందినవాడు?
3) USA రెండవ ప్రపంచ యుద్ధంలో ఎప్పుడు చేరింది?
జవాబు:

  1. పోలెండ్ పై జర్మనీ దండెత్తడం రెండవ ప్రపంచ యుద్ధ ప్రారంభాన్ని సూచిస్తోంది.
  2. హిట్లర్ జర్మనీ దేశానికి చెందినవాడు.
  3. USA రెండవ ప్రపంచ యుద్ధంలో డిసెంబర్ 8, 1941లో చేరింది.

ప్రశ్న 19.
ఈ క్రింది పటాన్ని పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-II 1
1) భారతదేశానికి పొరుగున ఉన్న ఏ దేశం జపాన్‌చే ఆక్రమించబడింది?
జవాబు:
భారతదేశానికి పొరుగున ఉన్న బర్మా జపాన్‌చే ఆక్రమించబడింది.

2) జపాన్ అధీనంలో ఉన్న అధిక ప్రాంతం ఏ మహాసముద్రంలో భాగం?
జవాబు:
జపాన్ అధీనంలో ఉన్న అధిక ప్రాంతం పసిఫిక్ మహాసముద్రంలో భాగం.

3) 1942లో మంగోలియా జపాన్ అధీనంలో ఉందా?
జవాబు:
1942లో మంగోలియా జపాన్ అధీనంలో లేదు.

ప్రశ్న 20.
ఆర్థికమాంద్యంలో జరిగిన పరిణామాలు వివరించండి.
జవాబు:

  1. ఉపాధి అవకాశాలు కోల్పోయి, యువత వీధిన పడింది.
  2. కరెన్సీ విలువ పడిపోయి ఉద్యోగస్తుల, పింఛనుదారుల పొదుపులు కరిగిపోయాయి.
  3. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోయి, రైతులు కుప్పకూలిపోయారు.
  4. తమ పిల్లల కడుపులు నింపలేని మహిళలు తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనయ్యారు.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

ప్రశ్న 21.
జర్మనీ ప్రజలకు హిట్లర్ వాగ్దానాలేవి?
జవాబు:

  1. బలమైన దేశాన్ని నిర్మిస్తానన్నాడు.
  2. వర్సయిల్స్ ఒప్పందపు అన్యాయాన్ని రద్దు చేస్తానన్నాడు.
  3. జర్మనీ ప్రజల గౌరవాన్ని తిరిగి నిలబెడతానన్నాడు.
  4. పని కావాలనుకునే వారికి పని, యువతకు బంగారు భవిష్యత్తు అందిస్తానన్నాడు.
  5. విదేశీ కుట్రలను తిప్పికొడతానని వాగ్దానం చేశాడు.

10th Class Social 14th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
సోవియట్ రష్యా (USSR) లో జోసెఫ్ స్టాలిన్ వేడట్టిన వ్యవసాయ రంగ సంస్కరణలు ఏవి?
జవాబు:
స్టాలిన్ చేపట్టిన సంస్కరణలు :
1924లో లెనిన్ చనిపోయిన తర్వాత స్టాలిన్ కమ్యూనిస్టు పార్టీ నాయకుడయ్యాడు, రష్యాని బలమైన ఆర్థిక శక్తిగా మలిచాడు.

  • 1928లో పంచవర్ష ప్రణాళికలతో USSR ప్రణాళికాబద్ద ఆర్థిక అభివృద్ధిని చేపట్టాడు.
  • వేగవంతమైన పారిశ్రామికీకరణ, వ్యవసాయంతో భూముల ఏకీకరణ అన్న జోడు విధానాలను అవలంబించాడు.
  • స్టాలిన్ నాయకత్వంలో USSR చిన్న, పెద్ద రైతులు తమ భూములను వదిలేసి ‘ఉమ్మడి క్షేత్రాల’లో వేరేలా బలవంతం చేసి చిన్న రైతాంగ ఉత్పత్తికి స్వస్తి పలితాలని ప్రయత్నించింది.
  • ఈ క్షేత్రాలు గ్రామంలోని భూములు, పరికరాలు, యంత్రాలు, పశువులన్నింటిని ఉమ్మడి సొత్తుగా చేశాయి. అందరూ కలిసి వ్యవసాయం చేసి ఉత్పత్తిని పంచుకునేవారు.
  • పరిశ్రమలన్నీ ప్రభుత్వ అధీనంలో ఉండేవి, స్వేచ్ఛ కూర్కెట్ కి అనుమతినివ్వలేడు.
  • మొదట్లో వ్యవసాయ ఉత్పత్తి తగ్గినా, తరువాత అది పెరిగి అంతకు ముందెన్నడూ లేని స్థాయిలో పారిశ్రామికీకరణను USSR సాధించింది.
  • విస్తరించిన విద్యా విధానాన్ని రూపొందించి, కార్మికులు, రైతాంగం విశ్వవిద్యాలయాలలోకి ప్రవేశించే ఏర్పాట్లు చేశారు.
  • మహిళా కార్మికుల కోసం ప్యాక్టరీలలో శిశు సంరక్షణా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
  • తక్కువ ఖర్చుతో ప్రజారోగ్యం సంరక్షణ కల్పించి కార్మికులకు ఆదర్శ గృహ వసతిని ఏర్పాటు చేశారు.
  • USSR పౌరులందరికీ పూర్తి ఉపాధి కల్పించగలిగింది, వాళ్ళ జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయి.
  • ఇదే కాలంలో పాశ్చాత్య ప్రపంచం తీవ్ర మాంద్యాన్ని ఎదుర్కొంటుంది. కాని USSR ఈ మాంద్య ప్రభావానికి గురి కాకుండా ఉండటం గొప్ప విషయం.

ప్రశ్న 2.
అమెరికాలో తీవ్ర ఆర్థిక మాంద్యం యొక్క ప్రభావం ఏమిటి?
జవాబు:
(అమెరికాలో) 1929 తీవ్ర ఆర్థిక మాంద్యం యెక్క ప్రభావాలు :

  • అమెరికాలో స్టాక్ మార్కెట్ కుప్పకూలటంతో ఈ పరిణామాలు ప్రారంభమైనాయి.
  • నిరుద్యోగం పెరిగిపోయింది, దాదాపు 25% నిరుద్యోగులు పెరిగారు.
  • అనేక వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల ధరలు 60% దాకా తగ్గిపోయాయి.
  • పేదరికం పెరిగిపోయింది, పెద్ద సంఖ్యలో ఇళ్ళు లేనివాళ్ళతో నిర్జన ప్రాంతాలుగా మారాయి.
  • ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది.
  • డిమాండ్ తగ్గిపోవటంతో, కర్మాగారాలు మూతపడిపోయాయి.
  • ఉత్పత్తి తగ్గిపోవడం వలన వాణిజ్యం తగ్గిపోయింది.
  • ఉత్పత్తి, వ్యాపారం, వాణిజ్యం తగ్గిపోవడంతో ప్రజల నిజమైన ఆదాయం తగ్గిపోయింది.
  • ఈ విధంగా తీవ్ర మాంద్యం కాలంలో అమెరికా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది.
  • అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన రూస్వాల్ట్ న్యూడీలను ప్రకటించి, ఆర్థిక సంస్కరణలు చేపట్టి తిరిగి కోలుకోటానికి చర్యలు చేపట్టారు.

ప్రశ్న 3.
రష్యా విప్లవం రష్యన్ సమాజంలో తీసుకువచ్చిన మార్పులు ఏవి?
జవాబు:
రష్యన్ విప్లవం సమాజంలో ఎన్నో మార్పులను తెచ్చింది. 1917లో ప్రారంభమైన రష్యన్ విప్లవం ఫలితంగా 1920 నాటికి అనేక మార్పులు జరిగాయి.

  1. జార్ చక్రవర్తుల పాలన దూరమై ఉదారవాదులు, రాచరిక కుటుంబాల వాళ్ళు పరిపాలన చేపట్టారు.
  2. రష్యాలో “బోల్షివిక్”లు లెనిన్ నాయకత్వంలో అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు.
  3. షరతులు లేని శాంతిని నెలకొల్పి, భూమినంతటినీ జాతీయం చేసి దానిని రైతులందరికీ పంచిపెట్టడం జరిగింది.
  4. ధరలను నియంత్రించి కర్మాగారాలు, బ్యాంకులను జాతీయం చేశారు.
  5. స్టాలిన్ ఆధ్వర్యంలో రష్యాను బలమైన శక్తిగా మార్చి, పంచవర్ష ప్రణాళికలతో ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యవస్థను చేపట్టారు.

ప్రశ్న 4.
ప్రపంచ యుద్ధాల పరిణామాలేవి?
జవాబు:
ప్రపంచ యుద్ధాల పరిణామాలు:

  1. ప్రపంచ యుద్ధాల కారణంగా అసంఖ్యాక ప్రాణనష్టం జరిగింది.
  2. ప్రజాస్వామ్య సూత్రాల పునరుద్ధరణ జరిగింది. దాని ద్వారా ప్రజాస్వామ్య రాజ్యాలు పున:ప్రతిష్టించబడ్డాయి.
  3. అధికార సమతుల్యంలో మార్పులు ఏర్పడ్డాయి.
  4. నానాజాతి సమితి, ఐక్యరాజ్య సమితి వంటి కొత్త అంతర్జాతీయ సంస్థలు ఏర్పడ్డాయి.
  5. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత 1918లో మహిళలకు ఓటుహక్కు లభించింది.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

ప్రశ్న 5.
క్రింది పేరాగ్రాను చదివి, మీ వ్యాఖ్యానాన్ని రాయండి.
జవాబు:
“నాజీ పోలీసులు వారి అధికారాలను ఉపయోగించుకుని లక్షలాది రాజకీయ ఉద్యమకారులను, కార్మిక సంఘ నాయకులను అల్పసంఖ్యాక వర్గ ప్రజలను అరెస్టు చేసి హింసించేవాళ్ళు. అంతకు ముందెన్నడూ లేనంతగా దారుణాలకు ఒడిగట్టారు, వ్యతిరేకులను భయభ్రాంతుల్ని చేశారు.”
జవాబు:

  1. ఇవ్వబడిన పేరాగ్రాఫ్ నాజీ సైనికుల క్రూర విధానాలను విశదీకరిస్తుంది.
  2. హిట్లర్ జర్మనీలోని లక్షలాది రాజకీయ నాయకులను, కార్యకర్తలను, కార్మిక సంఘాల నాయకులను నిర్బంధించి, హింసించాడు. అల్పసంఖ్యాక వర్గాలవారు కూడా పీడించబడ్డారు. ఈ పరిస్థితి జర్మనీలో హిట్లర్ నాయకత్వంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించింది.
  3. 1932 ఎన్నికలలో గెలిచిన హిట్లర్ ‘ఎనేబ్లింగ్ యాక్ట్’ను తెచ్చి, గెస్టాపో, రక్షణ దళాలు, నేర విచారణ పోలీసులు, భద్రత సేవలు వంటి ప్రత్యేక నిఘా, భద్రతా దళాలను ఏర్పరిచాడు. ఈ దళాలు అమానుషంగా వ్యవహరించి, ప్రజల్లో భయందోళనలను సృష్టించాయి.
  4. హిట్లర్ ఏ రాజకీయ పార్టీని లేదా కార్మికసంఘాన్ని పనిచేయనీయలేదు. ప్రజలందరినీ నాజీలను అనుసరించమని ఆదేశించాడు. శాంతి అనేది శూన్యం. యూదులను శత్రువులుగా చూసేవాడు. వారిని నిర్బంధ శిబిరాలకు పంపేవాడు. వారిలో చాలామంది గ్యాస్ చాంబర్లలో చంపబడ్డారు.
  5. తను సూచించినదే ప్రతి ఒక్కరు అనుసరించాలని హిట్లర్ భావించేవాడు. తన చట్టాన్ని అమలుపరచడంలో హిట్లర్ . ఎంత మొండివాడో దీనివల్ల తెలుస్తోంది.
  6. ఒకవేళ హిట్లర్ ప్రజాస్వామిక విధానాలను అనుసరించి వుంటే, జర్మనులను ఒకే వేదిక పైకి తేగలిగేవాడు కాదు. వర్సయిల్స్ సంధిలో జర్మనీపై అనేక షరతులున్నందున, హిట్లరే ప్రతీకారం తీర్చకోవాలని భావించాడు.
  7. యూదుల పట్ల అతని క్రూర వైఖరి కారణంగా అందరు హిట్లర్‌ను విమర్శించారు. అతని చర్యల మూలంగా జర్మనీ మొత్తం భయభ్రాంతమయింది.
  8. నాజీలకు అనుకూలంగా ఉండేందుకు సమాజాన్ని నియంత్రించడానికి అనేక పోలీసు దళాలను ఏర్పరచాడు. ఎవరైనా హిట్లర్ విధానాలను వ్యతిరేకించినా విమర్శించినా గెస్టాపో (రహస్య పోలీసు బృందం) వారిని నిర్బంధించి, నిర్బంధ శిబిరాల్లో చంపేవారు.
  9. హిట్లర్ చర్యలు అన్యాయపూరితమైనవని, అప్రజాస్వామికమైనవని నేను భావిస్తాను. అమాయకులు ఎందరో బాధించబడ్డారు.
  10. ప్రస్తుతం అన్ని దేశాలు ప్రజాస్వామిక ప్రభుత్వాలవైపు నడుస్తున్నాయి. ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని విజయవంతం చేయాలంటే, అక్షరాస్యతా శాతం ప్రధాన అంశంగా ఉండాలి.
  11. అన్ని దేశాలు అక్షరాస్యతా శాతంపై దృష్టి సారించి, వివిధ కార్యక్రమాలను చేపట్టి, పటిష్టంగా అమలుపరచాలి. తద్వారా ఏ దేశంలోను అటువంటి పరిస్థితికి తావుండదు.

ప్రశ్న 6.
క్రింది పేరాను చదివి, మీ వ్యాఖ్యానాన్ని రాయండి.
“యుఎస్ఎస్ఆర్ ఫ్యూడల్ భూస్వాములు, రాజులు, పెట్టుబడిదారులు వంటి దోపిడీదారులు లేని దేశాన్ని నిర్మించటానికి ఒక బృహత్ ప్రయోగం ప్రారంభించింది. ఆధునిక పారిశ్రామిక సమాజాన్ని నిర్మిస్తూనే అసమానతలు, పుట్టుక, లింగం, భాష వంటి ప్రాతిపదికన వివక్షత లేని సమాజాన్ని ఏర్పాటు చెయ్యటానికి యుఎస్ఎస్ఆర్ ప్రయత్నించింది.”
జవాబు:

  1. యుఎస్ఎస్ఆర్ సమానత్వంతో కూడిన దేశాన్ని స్థాపించిందని ఈ పేరాగ్రాఫ్ వలన తెలుస్తోంది. అక్కడ పెట్టుబడిదారులు, దోపిడీదారులు మరియు పీడితులు లేరు.
  2. అది పారిశ్రామికీకరణ మరియు ఆధునిక సాంకేతిక, కాలానుగుణ జీవనశైలి వంటి వాటిని అనుసరించినా అసమానత అనేది ఏ రూపంలోనూ లేదు. అదే సోషలిజం యొక్క అసలైన ఉద్దేశ్యం.
  3. ఆ కాలంలో సమానత్వం, ఆధునిక ప్రగతి ఒక్క యుఎస్ఎస్ఆర్లో తప్ప మరే దేశంలోను లేదు.
  4. ఏ దేశంలోనైనా వివక్ష ఏదో ఒక రూపంలో కనిపిస్తుంది. కొన్ని దేశాల్లో వివక్ష రంగు రూపంలో కనిపిస్తుంది.
    ఉదా : తెల్లవారు, నల్లవారు.
  5. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలలోని అనేక దేశాలు ఆఫ్రికా నుండి ప్రత్యేకించి నైజీరియా నుండి బానిసలను కొనుగోలు చేసేవి. నైజీరియన్లు కూడ మానవులే కాని అమెరికన్లు అలా భావించేవారు కాదు.
  6. కొన్ని దేశాల్లో యూదులు ద్వితీయ శ్రేణి ప్రజలుగా పరిగణింపబడ్డారు. శారీరకంగా హింసించబడ్డారు. కొన్ని సందర్భాల్లో వారు గ్యాస్ చాంబర్లలో పాశవికంగా చంపబడ్డారు.
  7. మన దేశంలో కొన్ని కులాలు ఉన్నత కులాలుగా, మరికొన్ని తక్కువ కులాలుగా ఉండేవి. ఈ కుల, మత, లింగ, వర్ణ, భాషాపరమైన వివక్ష ప్రతిచోటా ఉంది.
  8. అసంఘటిత రంగంలో పురుషులకిచ్చే వేతనం కన్న స్త్రీలకిచ్చే వేతనం తక్కువ.
  9. బాలురను పై చదువులు చదివిస్తుంటే, బాలికలను అనేక కారణాలతో పాఠశాలలకు పంపడం లేదు.
  10. చాలా దేశాలు తమ రాజ్యాంగాలలోని పీఠికలలో సమానత్వానికి ప్రాధాన్యతనిస్తామని, వివక్ష ఏ రూపంలోనూ ఉండదని పేర్కొన్నాయి.
  11. పూర్వకాలంలో మన దేశాన్ని రాజులు, ఫ్యూడల్ భూస్వాములు పరిపాలించారు. కొంతమంది రాజులు ప్రజావాణికి విలువ ఇచ్చినా, అత్యధికులు ప్రజలను పట్టించుకోలేదు. అందువలన పేద ప్రజలు అవమానించబడ్డారు. వారికి తగిన గౌరవం దక్కలేదు.
  12. ప్రతి దేశం సమానత్వాన్ని పాటించాలని నేను కోరుకుంటాను. పీడిత వర్గాల ఉద్ధరణ జరగాలి. సమానత్వాన్ని పాటించే దేశం అన్ని దేశాలకు ఆదర్శప్రాయంగా ఉంటుంది.

ప్రశ్న 7.
తీవ్ర ఆర్థిక మాంద్యంకు గురికాకుండా ఉండటానికి రష్యా దేశం అనుసరించిన సంస్కరణలు, పద్ధతులు ఏవిధంగా ఉపయోగపడ్డాయో వ్రాయండి. .
జవాబు:

  1. అంతర్జాతీయ మార్కెట్ తో యు.ఎస్.ఎస్.ఆర్ అనుసంధానమై లేదు
  2. యు.ఎస్.ఎస్.ఆర్.లో ప్రణాళికాబద్ధమైన ఆర్థిక విధానం ఉండేది. 3) ఏమి ఉత్పత్తి చేయాలో, ఎంత ఉత్పత్తి చేయాలో ప్రభుత్వం నిర్ణయించేది.
  3. దీని డిమాండ్ – సరఫరా మధ్య సమతౌల్యాన్ని అది సాధించగలిగింది.

ప్రశ్న 8.
జర్మనీలో నాజీయిజం ప్రాబల్యం గురించి వివరించండి.
జవాబు:

  1. ఆర్థిక మాంద్యం వల్ల అన్నింటికంటే ఎక్కువగా ప్రభావితమయిన దేశం జర్మనీ.
  2. ఈ ఆర్థిక సంక్షోభం ప్రజలలో తీవ్ర భయాందోళలను కలిగించింది.
  3. ఈ పరిస్థితిని హిట్లర్ మరియు నాజీలు చాలా తెలివిగా వినియోగించుకున్నారు
  4. తన మాటల ద్వారా, ఉద్వేగం ద్వారా హిట్లర్ ప్రజలను కదిలించి వేశాడు.
  5. అన్ని విషయాలలో బలమైన దేశాన్ని నిర్మిస్తానని ప్రజలకు వాగ్దానం చేశాడు.
  6. రాజకీయాలలో కొత్తశైలిని ప్రవేశపెట్టి ప్రజలను ఆకర్షించాడు.
  7. వీటన్నిటి ఫలితంగా 1932 నాటికి నాజీ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించింది.
  8. 1933లో ఆమోదం పొందిన ఎనేబ్లింగ్ యాక్ట్ ద్వారా హిట్లర్ జర్మనీకి నియంతగా అవతరించాడు. నాజీ ప్రభుత్వం అత్యంత శక్తివంతంగా అవతరించింది.

ప్రశ్న 9.
ఈ క్రింది కాలపట్టిక సహాయంతో దిగువ ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానమిమ్ము.
AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-II 2
1) రెండవ ప్రపంచ యుద్ధమునకు తక్షణ కారణమేమి?
2) అమెరికా ఎప్పుడు రెండవ ప్రపంచ యుద్ధములోనికి ప్రవేశించింది?
3) వైమర్ రిపబ్లిక్ ఏ దేశమునకు చెందినది?
4) 1941లో సంభవించిన ఏవేని రెండు సంఘటనలు వ్రాయండి.
జవాబు:

  1. పోలెండ్ పై జర్మనీ దండెత్తడం రెండవ ప్రపంచ యుద్ధ ప్రారంభాన్ని సూచిస్తోంది.
  2. డిసెంబరు 8, 1941
  3. జర్మనీ
  4. 1. యు.ఎస్.ఎస్.ఆర్ పై జర్మనీ దండెత్తడం
    2. యూదులపై సామూహిక హత్యాకాండ
    3. అమెరికా సంయుక్త రాష్ట్రాలు రెండవ ప్రపంచ యుద్ధంలో చేరడం.

ప్రశ్న 10.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన రూజ్ వెల్ట్ కొత్త ఒప్పందాన్ని ప్రకటించాడు. దీని ప్రకారం మాంద్యానికి గురైన వారికి పునరావాసం, ఆర్థిక సంస్థల సంస్కరణ, ఆర్థిక పరిస్థితి తిరిగి కోలుకోటానికి చర్యలు చేపట్టారు. దీనికోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టసాగింది. అయితే రెండవ ప్రపంచ యుద్ధం మొదలుకావటంతో సైన్యం, ఆయుధాలపై ప్రభుత్వ ఖర్చు పెట్టసాగింది. అయితే రెండవ ప్రపంచ యుద్ధం మొదలుకావటంతో సైన్యం, ఆయుధాలపై ప్రభుత్వ ఖర్చు పెరిగి కర్మాగారాల ఉత్పత్తి, వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకి ఒక్కసారిగా పెరిగాయి. అమెరికాలో ఎంతో అవసరమైన సామాజిక భద్రతా విధానాన్ని కూడా రూజ్ వెల్ట్ ప్రవేశపెట్టాడు. అందరికీ వర్తించే ఎంతో అవసరమైన సామాజిక భద్రతా విధానాన్ని కూడా రూజ్ వెల్ట్ ప్రవేశపెట్టాడు. అందరికీ వర్తించే పదవీ విరవమణ పింఛను, నిరుద్యోగ బీమా, వికలాంగులకు, తండ్రిలేని కుటుంబాలలో అవసరమున్న పిల్లలకు సంక్షేమ ప్రయోజనాలు వంటివి దీనివల్ల సమకూరాయి. అమెరికాలోని సంక్షేమ వ్యవస్థకు ఇది ఒక చట్రాన్ని ఏర్పరిచింది. మాంద్యం మొదలుకాక ముందు మొదటి ప్రపంచ యుద్ధకాలంలోనే ఈ దిశలో బ్రిటన్ కొన్ని చర్యలు చేపట్టింది. నిరుద్యోగ బీమా, వృద్ధాప్య పింఛను పథకాలను ఏర్పరించింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి బ్రిటన్ కూడా నిరుద్యోగ భృత, అనారోగ్యానికి ఖర్చులు, ఆరోగ్య పథకాలు, శిశు సంరక్షణ వంటి సామాజిక భద్రతా చర్యలను విస్తృతంగా చేపట్టింది. ఇవన్నీ సంక్షేమ రాజ్యం అన్న దానిని ఏర్పరచటానికి దోహదం చేశాయి. దీని ప్రకారం ప్రజలందరికీ కనీస జీవనస్థాయి, ఆహారం, గృహవసతి, ఆరోగ్యం , విద్య, శిశు, వృద్ధాప్య సంరక్షణ వంటి మౌలిక అంశాలకు ప్రభుత్వం హామీగా ఉంటుంది. పని చెయ్యగల పౌరులందరికీ ఉపాధిని కల్పించే బాధ్యతను చాలావరకు ప్రభుత్వం తీసుకుంది. ఈ విధంగా ప్రభుత్వం మార్కెటు ఆధారిత పెట్టుబడిదారీ విధానంలోని ఒడిదుడుకులను తగ్గించటానికి ప్రయత్నించింది.
“రూజ్ వెల్ట్ ప్రకటించిన కొత్త ఒప్పందంలోని సంస్కరణలు ప్రజల ఆర్ధిక పరిస్థితి బాగుచేసి, సంక్షేమ రాజ్యానికి దోహదం చేశాయి.” అనే వాదనతో మీరు ఏకీభవిస్తారా? చర్చించండి.
జవాబు:
అవును. ఏకీభవిస్తాను.

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన రూజ్వెల్ట్ కొత్త ఒప్పందాన్ని ప్రకటించి, దాని ప్రకారం ప్రజలకు అనేక సంస్కరణలను కల్పించాడు. అవి

  1. ఆర్థిక మాంద్యానికి గురైన వారికి పునరావాసం, ఆర్థిక సంస్థల సంస్కరణల ద్వారా ప్రజల ఆర్థిక పరిస్థితి కోలుకోటానికి అవసరం అయిన చర్యలు చేయబడ్డాయి.
  2. ప్రజలకు అవసరం అయినా సంస్కరణల కొరకు ప్రభుత్వం చాలా ధనాన్ని ఖర్చు పెట్టింది.
  3. ఇదే సమయంలో రెండవ ప్రపంచ యుద్ధం మొదలు కావటంతో కర్మాగారాల ఉత్పత్తి, వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ పెరిగాయి.
  4. అమెరికా, ప్రజలకు ఎంతో అవసరం అయిన ‘సామాజిక భద్రతా విధానాన్ని’ ప్రవేశపెట్టింది. ‘సామాజిక భద్రతా విధానంలోని కొన్ని అంశాలు :
    ఎ) ప్రజలందరికి వర్తించే పదవీ విరమణ పింఛను,
    బి) నిరుద్యోగులకు బీమా పథకాలు కల్పించడం,
    సి) వికలాంగులకు, తండ్రిలేని కుటుంబాలలో అవసరమున్న పిల్లలకు సంక్షేమ ప్రయోజనాలు వంటివి కూడా కల్పించబడినాయి.
    5) సంక్షేమ రాజ్యం అనే విధానం ప్రకారం, ప్రజలందరికీ కనీస జీవనస్థాయి, ఆహారం, గృహవసతి, ఆరోగ్యం , విద్య, శిశు, వృద్ధాప్య సంరక్షణ వంటి విషయాలకు ప్రభుత్వం హామీగా ఉంటుంది.

పై సంస్కరణలను ప్రజలందరికీ కల్పించి, వాటి అమలుకు ప్రభుత్వమే హామీగా పంపి, అమలు జరిగేలా చూసి, సంక్షేమ రాజ్యానికి ఈ సంస్కరణ దోహదం చేశాయని చెప్పవచ్చు.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

ప్రశ్న 11.
ఈ క్రిందివాటిని ప్రపంచపటంలో గుర్తించుము.

  1. సెయింట్ పీటర్స్బర్గ్
  2. మాస్కో
  3. కిర్గిజ్స్తాన్
  4. యుక్రెయిన్
  5. ఉజ్బెకిస్తాన్
  6. తజికిస్తాన్
  7. కజికిస్తాన్
  8. టర్కో మేనియా

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-II 3

ప్రశ్న 12.
పట్టిక ఆధారంగా జర్మనీ చరిత్రలోని ముఖ్య సంఘటనలను విశ్లేషించుము.
AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-II 2
జవాబు:
పై కాలపట్టికను పరిశీలించగా ఈ విషయాలు తెలియుచున్నవి.

జర్మనీ, మొదటి ప్రపంచయుద్ధం తరువాత 1918,నవంబరు 9న ‘వైమర్’ గణతంత్ర రాజ్యంగా ప్రకటించబడింది. నెమ్మదిగా నాజీజం వ్యాప్తిలోకి వచ్చి, చివరికి- 1933, జనవరి 30న నాజీ-అధ్యక్షుడు హిట్లర్ జర్మనీకి ఛాన్సలర్ అయ్యాడు. ప్రపంచంలో జర్మనీ జాతి గొప్పదనే భావనను హిట్లర్ ప్రచారం చేశాడు. సామ్రాజ్య కాంక్షతో అనేక దేశాలను ఆక్రమించుకుంటూ చివరికి 1939, సెప్టెంబర్ 1న, జర్మనీ పోలెండ్ పై దాడి చేయటం రెండవ ప్రపంచయుద్ధ ప్రారంభానికి కారణం అయింది. ఈ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో 1941, జూన్ 22న జర్మనీ యు.ఎస్.ఎస్.ఆర్ పై దండయాత్ర చేసింది. హిట్లర్కు యూదులంటే ద్వేషం. వారి మీదున్న ద్వేషంతో అనేక మంది యూదులను హింసలకు గురిచేశాడు. 1941, జూన్ 23న హిట్లరు యూదులపై సామూహికంగా హత్యకాండ జరిపినాడు అని కాలపట్టిక ద్వారా తెలియుచున్నది.

AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

These AP 10th Class Social Studies Important Questions 13th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I will help students prepare well for the exams.

AP Board 10th Class Social 13th Lesson Important Questions and Answers ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

10th Class Social 13th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium

1. మొదటి ప్రపంచ యుద్ధంలో ఎంతమంది భారతీయ సైనికులు మరణించారు?
జవాబు:
75,000.

2. అణుబాంబుల వల్ల కలిగే ప్రాణాంతక వ్యాధులేవి?
జవాబు:
ల్యుకేమియా, క్యాన్సర్.

3. సెర్బియన్ చేతిలో హత్యకు గురైన ఫెర్డినాండ్ ఏ దేశానికి చెందిన ఆర్చ్ డ్రుకీ?
జవాబు:
ఆస్టియా.

4. పోలాండ్ ఏ రేవును జర్మనీకి అప్పగించటానికి నిరాకరించింది?
జవాబు:
డాంజింగ్.

5. ఏ సంవత్సరం నుంచి ఇటలీలో ఫాసిజం దురహంకార పూరిత జాతీయతావాదంగా ఉంది?
జవాబు:
1923.

6. 19 శతాబ్దం ముగిసే నాటికి ఏ శక్తుల మధ్య వలస ప్రాంతాలకోసం పోటీ మొదలయ్యింది?
జవాబు:
ఐరోపా.

AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

7. కొత్త పారిశ్రామిక (దేశాలు) శక్తులకు ఉదాహరణ నిమ్ము?
జవాబు:
జర్మనీ, జపాన్, ఇటలీ.

8. 1870లో ఫ్రాన్సి ని ఓడించిన తరువాత జర్మనీ ఛాన్సలర్ అయినది ఎవరు?
జవాబు:
బిస్మార్క్.

9. మిత్రదేశాల కూటమి ఏ సంవత్సరంలో ఏర్పడింది?
జవాబు:
1907.

10. 1880 నుంచి 1914 నాటికి ఆరు ప్రధాన శక్తుల (దేశాల) సైనిక ఖర్చు ఎంత శాతానికి పెరిగింది?
జవాబు:
300%

11. మొదటి ప్రపంచ యుద్ధం ఏ సంధితో ముగిసింది?
జవాబు:
వర్సయిల్స్ సంధి.

12. 1934 నాటికి నానాజాతి సమితిలో ఎన్ని దేశాలు సభ్యత్వం కల్గి ఉన్నాయి?
జవాబు:
58.

13. USSRని విస్తరింపుము.
జవాబు:
సోవియట్ సోషలిస్టు దేశాల సమాఖ్య (Union of Soviet Socialist Republic).

14. UNESCO ని విస్తరింపుము.
జవాబు:
విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ.

15. WHOని విస్తరింపుము.
జవాబు:
ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation)

AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

16. UNICEF ని విస్తరింపుము.
జవాబు:
అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి.

17. ILOని విస్తరింపుము.
జవాబు:
అంతర్జాతీయ కార్మిక సంస్థ (International Labour Organisation)

18. ఐక్యరాజ్య సమితి ఎన్ని సిద్ధాంతాల ఆధారంగా ఏర్పడిన ప్రపంచ ప్రభుత్వం లాంటిది?
జవాబు:
నాలుగు.

19. వైమర్ గణతంత్రంగా ఏర్పడిన దేశమేది?
జజవాబు:
జర్మనీ.

20. 1922లో ఇటలీలో ఎవరి విజయంతో ఫాసిజం మొదలయ్యింది?
జజవాబు:
బెనిటో ముస్సోలినీ.

21. 1918లో ఏ దేశ ఓటమితో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది?
జవాబు:
జర్మనీ.

22. మొదటి ప్రపంచ యుద్ధ కాలం …….. ?
జవాబు:
1914 – 1918.

23. హెల్ కాస్ట్లో ఎంతమంది యూదులు చంపబడ్డారు?
జవాబు:
60 లక్షలు.

24. వలస ప్రాంతాలను తిరిగి విభజించాలని ఎవరు కోరుకున్నారు?
జవాబు:
కొత్త పారిశ్రామిక శక్తులు.

25. ఫ్రాన్స్ నుంచి 1871లో స్వాధీనం చేసుకున్న ఏ ప్రాంతాలను జర్మనీ వదులుకుంది?
జవాబు:
అల్సెస్, లోరైస్.

26. భవిష్యత్తులో యుద్ధాలను నివారించటానికి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటైన ప్రపంచ సంస్థ ఏది?
జవాబు:
నానాజాతి సమితి.

27. ఎవరి కింద జర్మనీ తిరిగి వేగంగా పారిశ్రామికీకరణ చెందింది?
జవాబు:
నాజీల.

28. మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణమేమి?
జవాబు:
Murder of Ferdinand (1914, జూన్ 28)

AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

29. రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణమేమి?
జవాబు:
పోలెండ్ పై జర్మనీ దండెత్తటం. (1939, సెప్టెంబర్ 1)

30. ఒట్టోవాన్ సామ్రాజ్యం ఏర్పడిన దేశమేది?
జవాబు:
టర్కీ

31. ఫ్లోరెన్స్ ఓవెన్ ఏ దేశానికి చెందిన వ్యక్తి?
జవాబు:
పోలెండ్.

32. బ్రిటన్ లో మహిళలకు ఓటుహక్కు లభించిన సంవత్సరం ఏది?
జవాబు:
1918.

33. ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంలో స్థాపించారు?
జవాబు:
1945.

34. రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు ముగిసింది?
జవాబు:
1945 ఆగస్టు.

35. రెండవ ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారకుడు ఎవరు?
జవాబు:
హిట్లర్.

36. జర్మనీ, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్ లో భిన్నమైన దేశమేది?
జవాబు:
ఫ్రాన్స్,

37. అంతర్జాతీయ మహిళల ఓటుహక్కు ఉద్యమ సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పడింది?
జవాబు:
1914.

38. నానాజాతి సమితి రూపశిల్పి ఎవరు?
జవాబు:
ఉడ్రోవిల్సన్ (అమెరికా).

39. జపాన్లోని ఏ నగరాలపై అణుబాంబు దాడి జరిగింది?
జవాబు:
హిరోషిమా, నాగసాకి.

40. జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రియా, ఇటలీలో తైపాక్షిక కూటమిలో లేని దేశమేది?
జవాబు:
ఫ్రాన్స్

41. USSR ఏ సంవత్సరంలో ఏర్పాటయ్యింది?
జవాబు:
1924.

42. అక్షరాజ్యాల / కేంద్ర రాజ్యాల కూటమికి నాయకత్వం వహించిన దేశమేది?
జవాబు:
జర్మనీ.

43. బ్రిటన్, అమెరికా, ఆస్ట్రియా, రష్యాలలో భిన్నమైనది ఏది?
జవాబు:
ఆస్ట్రియా.

AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

44. రష్యా విప్లవం ఏ సంవత్సరంలో సంభవించింది?
జవాబు:
1917.

45. సామ్రాజ్య వాదానికి మూల కారణమేమి?
జవాబు:
పారిశ్రామిక విప్లవం.

46. వర్సయిల్స్ సమావేశానికి ఎన్ని దేశాలు హాజరయ్యాయి?
జవాబు:
32 దేశాలు.

47. అమెరికా పార్లమెంట్ ను ఏమని పిలుస్తారు?
జవాబు:
కాంగ్రెస్.

48. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) ఫాసిజమ్ ( ) a) ఇటలీ
ii) నాజియిజమ్ ( ) b) జర్మనీ
iii) సోషలిజం ( ) c) రష్యా
iv) పారిశ్రామిక విప్లవం ( ) d) ఇంగ్లండు
జవాబు:
i -a, ii – b, iii – c, iv – d

49. క్రింది వానిని జతపరచండి.
i) ముస్సోలిని ( ) a) ఆస్ట్రియా
ii) ఉడ్రోవిల్సన్ ( ) b) రష్యా
iii)జార్ నికొలస్ ( ) c) అమెరికా
iv) ఫెర్డినాండ్ ( ) d) ఇటలీ
జవాబు:
i – d, ii – c, iii – b, iv – a

50. 20వ శతాబ్దాన్ని “తీవ్ర సంచలనాల యుగం” అని అభివర్ణించింది ఎవరు?
జవాబు:
ఎరిక్ హాక్బీమ్.

51. తీవ్ర ఆర్థిక మాంద్యం ఏ సంవత్సరంలో ఏర్పడింది?
జవాబు:
1929.

AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

52. నానాజాతి సమితి ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?
జవాబు:
జెనీవా.

53. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?
జవాబు:
న్యూయార్క్.

54. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి.
→ ఫాసిజం – ఫ్రాన్స్
→ నాజీజం – జర్మనీ
→ సామ్యవాదం – రష్యా
→ పెట్టుబడిదారీ దేశం – అమెరికా
జవాబు:
ఫాసిజం – ఫ్రాన్స్,

55. మొదటి ప్రపంచ యుద్ధంలో శక్తి కూటములకు సంబంధించి భిన్నమైన దానిని గుర్తించండి
బ్రిటన్, ఆస్ట్రియా, ఫ్రాన్స్, రష్యా.
జవాబు:
ఆస్ట్రియా.

56. చరిత్రకారుడైన ఎరిక్ హాబ్స్ బామ్ 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగంగా పేర్కొనడానికి కారణం కాని అంశం?
తీవ్ర ఆర్థికమాంద్యం సంభవించటం.
ప్రపంచ యుద్ధాలు జరగడం.
మూఢ విశ్వాసాలు పెరిగిపోవటం.
సినిమాలు వంటి కొత్తకళలు ఆవిర్భవించటం.
జవాబు:
మూఢ విశ్వాసాలు పెరిగిపోవటం.

57. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) UNESCO ( ) a) పారిస్
ii) WHO ( ) b) జెనీవా
iii) UNICEF ( ) c) న్యూయార్క్
iv) అంతర్జాతీయ న్యాయస్థానం ( ) d) ది హేగ్
జవాబు:
i – a, ii – b, iii – c, iv – d

58. క్రింది వానిలో సరికాని జతను గుర్తించి రాయండి.
→ తీవ్ర ఆర్థిక మాంద్యం – 1929
→ రష్యా విప్లవం – 1917
→ రెండవ ప్రపంచ యుద్ధ ఆరంభం – 1939
→ ఐక్యరాజ్య సమితి ఏర్పాటు – 1947
జవాబు:
ఐక్యరాజ్య సమితి ఏర్పాటు – 1947

59. ప్రపంచ యుద్ధాలకు ప్రధాన కారణం సామ్రాజ్యవాదం అయితే ఈ సామ్రాజ్యవాదానికి మూలం ఏది?
జవాబు:
పారిశ్రామిక విప్లవం.

AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

60. ILO, WHO, అంతర్జాతీయ న్యాయస్థానం, UNESCO లలో నానాజాతి సమితిలో ఏర్పడిన సంస్థ కానిది ఏది?
జవాబు:
UNESCO

61. హిట్లర్ పోలెండను ఆక్రమించిన సంవత్సరం?
జవాబు:
1939.

62. యుద్ధాన్ని నివారించ వలసిందిగా హిట్లరుకు విన్నపాన్ని పంపిన భారత జాతీయ నాయకుడు ఎవరు?
జవాబు:
మహాత్మా గాంధీ.

63. నానాజాతి సమితి ఉద్దేశ్యాన్ని కొనసాగించడానికి ఏర్పడిన సంస్థ ఏది?
జవాబు:
ఐక్యరాజ్య సమితి.

64. ప్రపంచ శాంతి కోసం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటయిన సంస్థ?
జవాబు:
ఐక్యరాజ్య సమితి.

65. 1870లో బిస్మార్క్. ఏ దేశాన్ని ఒంటరిని చేయాలని చూశాడు?
జవాబు:
ఫ్రాన్స్

66. నానాజాతి సమితిలో చేరడానికి ఆహ్వానించబడని దేశాలు ఏవి?
జవాబు:
జర్మనీ, రష్యా.

67. రష్యా విప్లవం ఏ సంవత్సరంలో సంభవించింది?
జవాబు:
1917.

68. బోల్షివిక్ పార్టీ స్థాపకుడు ఎవరు?
జవాబు:
లెనిన్.

69. నాజీ పార్టీ యొక్క అసలు పేరు?
జవాబు:
నేషనల్ సోషలిస్టు పార్టీ.

AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

70. ఏ సంవత్సరంలో హిట్లర్ రష్యాపై దండెత్తాలని నిర్ణయించు కున్నాడు?
జవాబు:
1942.

71. 1939లో ఏ రెండు దేశాలు పరస్పరం దండెత్తకుండా ఉండటానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి?
జవాబు:
జర్మనీ, రష్యా,

72. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ఫ్రాన్స్, బెల్జియంలపై దాడిచేసిన దేశమేది?
జవాబు:
జర్మనీ.

73. రష్యా – జపాన్ యుద్ధం జరిగిన సంవత్సరం ఏది?
జవాబు:
1905.

74. ఏ సంవత్సరంలో నానాజాతి సమితి రద్దు చేయబడింది?
జవాబు:
1946.

AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

75. ఆస్ట్రో – హంగేరియన్, ఒట్టోమాన్ సామ్రాజ్యాలను విచ్ఛిన్నం చేసిన సంధి ఏది?
జవాబు:
వర్సయిల్స్.

76. స్పెయిన్లో జనరల్ ఫ్రాంకో అధికారంలోకి వచ్చిన సంవత్సరం?
జవాబు:
1939.

77. ఏ సంవత్సరంలో హిట్లర్, అతడి నాజీ పార్టీ అధికారంలోకి వచ్చింది?
జవాబు:
1933.

78. రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్లు మూడు మిదేశాల కూటమిగా ఏ సంవత్సరంలో ఏర్పడ్డాయి?
జవాబు:
1907.

79. 1880 నుంచి 1914 నాటికి జర్మనీ, రష్యా, ఆస్ట్రియా, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల సైనిక ఖర్చు 192 మి|| పౌండ్ల నుంచి ఎంతకు పెరిగింది?
జవాబు:
397 మి|| పౌండ్లకు.

80. ఏ శతాబ్దం ముగిసే నాటికి ఐరోపా శక్తుల మధ్య వలస ప్రాంతాలకోసం పోటీ మొదలయ్యింది?
జవాబు:
19వ శతాబ్దం

81. 1871లో ఏ దేశం నుండి స్వాధీనం చేసుకున్న అల్సెన్, లోరైన్ వంటి ప్రాంతాలను జర్మనీ వదులుకుంది?
జవాబు:
ఫ్రాన్స్

AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

82. ప్రపంచ యుద్ధాల్లో మరణించిన వాళ్ళల్లో అధిక శాతం మంది ఎన్ని సంవత్సరాలలోపు వారున్నారు?
జవాబు:
40 ఏళ్ళలోపు.

10th Class Social 13th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
UNICEF ను విస్తరింపుము.
జవాబు:
అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి (యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్)

ప్రశ్న 2.
ఈ క్రింది కాలపట్టికను పరిశీలించి, ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
కాలపట్టిక

మొదటి ప్రపంచ యుద్ధ ప్రారంభం ఆగస్టు 11914
రష్యా విప్లవము1917
మొదటి ప్రపంచ యుద్ధం ముగింపు1918
వర్సెయిల్స్ ఒప్పందము1919
నానాజాతి సమితి ఏర్పాటు1919
జర్మనీలో హిట్లర్ ప్రాభవం1933
రెండవ ప్రపంచ యుద్ధ ప్రారంభం1939
రష్యాపై జపాన్ దండెత్తడం1942
ఐక్యరాజ్యసమితి ఏర్పాటు1945
రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు1945

ప్రశ్న. రెండు ప్రపంచ యుద్ధాల అనంతరము ఏర్పడిన శాంతికాముక సంస్థలు ఏవి?
జవాబు:

  1. నానాజాతి సమితి
  2. ఐక్యరాజ్య సమితి (యు.ఎన్.ఓ)

ప్రశ్న 3.
ఈ క్రింది ను పరిశీలించి ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 1
యుద్ధ మరణాలు, మిలియన్లలో ప్రతి వెయ్యి మందికి మరణాలు

1) 20వ శతాబ్దంలో ప్రతి వెయ్యిమందిలో ఎంతమంది యుద్ధాల వల్ల చనిపోయారు?
జవాబు:
20వ శతాబ్దంలో ప్రతి వెయ్యిమందిలో 44.4 మంది యుద్ధాల వల్ల చనిపోయారు.

2) ఏ శతాబ్దంలో యుద్ధ మరణాలు తక్కువగా ఉన్నాయి?
జవాబు:
16వ శతాబ్దంలో యుద్ధ మరణాలు తక్కువగా ఉన్నాయి.

3) 1900-1999లో యుద్ధ మరణాల సంఖ్య అధికంగా ఎందుకు ఉన్నది?
జవాబు:

  • ప్రపంచ యుద్ధాలు జరగడం వలన
  • ఆధునిక ఆయుధాలు ఉపయోగించడం వలన
    ఉదా : అణ్వాయుధాలు, విషవాయువులు

ప్రశ్న 4.
ఆయుధ పోటీకి సంబంధించిన బార్ గ్రాఫ్ ను పరిశీలించి కింది ప్రశ్నలకు సమాధానం రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 2
→ ఏ సంవత్సరాల మధ్య ఆయుధ పోటీ పెరిగినట్లు తెలుస్తుంది?
జవాబు:
1880వ సంవత్సరం నుండి 1914 సంవత్సరాల మధ్య కాలంలో ఆయుధాల పోటీ కొనసాగింది.

→ సైనిక ఖర్చులు 1900 నుండి 1914 వరకు ఎంత పెరిగింది?
జవాబు:
పై గ్రాఫ్ 1880-1914, మధ్య ప్రధాన శక్తులైన జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ, బ్రిటన్, రష్యా, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల – సైనిక ఖర్చుని సూచిస్తోంది.

ప్రశ్న 5.
మొదటి ప్రపంచ యుద్ధానికి గల తక్షణ కారణం ఏమిటి?
జవాబు:
ఆస్ట్రియా యువరాజు ఆర్చ్ డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ ఒక సెర్బియన్ ఉన్మాది చేతిలో హత్య కావింపబడటం మొదటి ప్రపంచ యుద్ధానికి గల తక్షణ కారణం.

ప్రశ్న 6.
వర్సయిల్స్ సంధి షరతుల్లోని ఒకదానిని పేర్కొనండి.
జవాబు:
వర్సయిల్స్ సంధి షరతులు :

  • ఆర్థికపరమైన
  • భూభాగపరమైన
  • సైనిక, నౌకా పరమైన

ప్రశ్న 7.
శాంతి యొక్క ఆవశ్యకతను తెలుపుతూ రెండు నినాదాలు రాయండి.
జవాబు:

  1. యుద్ధాన్ని ద్వేషిద్దాం – శాంతిని ప్రేమిద్దాం
  2. శాంతియే నాగరికత

ప్రశ్న 8.
బిస్మార్క్ ఏ దేశాలతో రహస్య ఒప్పందాలను చేసుకున్నాడు?
జవాబు:
బిస్మార్క్ ఆస్ట్రియా, ఇటలీ దేశాలతో రహస్య ఒప్పందాలను చేసుకున్నది.

ప్రశ్న 9.
రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏమిటి?
జవాబు:
రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం : పోలండ్ లోని డాంజిన్, రేవు కోసం జర్మనీ పోలండ్ పై దాడి చేయడం.

ప్రశ్న 10.
ఈ చిత్రంలోని వ్యక్తి నానాజాతి సమితి స్థాపనలో కీలక పాత్ర పోషించాడు. అతను ఎవరు?
AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 3
జవాబు:
ఉడ్రోవిల్సన్.

ప్రశ్న 11.
20వ శతాబ్దపు ఆరంభంలో ప్రపంచ జనాభా ఎంత?
జవాబు:
20వ శతాబ్దపు ఆరంభంలో ప్రపంచ జనాభా 160 కోట్లు.

ప్రశ్న 12.
ఫాసిజం అనే పదానికి అర్థం ఏమిటి?
జవాబు:
ఫాసిజం అనే పదానికి అర్ధం కడ్డీల కట్ట.

ప్రశ్న 13.
హిట్లర్ ఏర్పరచిన పార్టీ ఏది?
జవాబు:
హిట్లర్ ఏర్పరచిన పార్టీ నాజీ పార్టీ.

AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

ప్రశ్న 14.
రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణమేమి?
జవాబు:
రెండవ ప్రపంచ యుద్ధానికి ట్లర్ పోలెండ్ పై దాడిచేయడం తక్షణ కారణం.

ప్రశ్న 15.
జపాన్‌లోని ఏ నగరాలప్పై ఆ సంయుక్త రాష్ట్రాలు అణుబాంబులు వేసాయి?
జవాబు:
జపాన్లోని హిరోషిమా, నాగసాలపై అమెరికా సంయుక్త రాష్ట్రాలు రెండవ ప్రపంచయుద్ధాన్ని త్వరితంగా సమాప్తం చేయడానికి అణుబాంబులను వేసింది.

ప్రశ్న 16.
నానాజాతి సమితి ఎప్పుడు ఏర్పడింది?
జవాబు:
నానాజాతి సమితి 1920లో ఏర్పడింది.

ప్రశ్న 17.
నానాజాతి సమితి రూపశిల్పి ఎవరు?
జవాబు:
నానాజాతి సమితి రూపశిల్పి అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడైన ఉడ్రోవిల్సన్.

ప్రశ్న 18.
త్రైపాక్షిక కూటమిలో ఏ ఏ దేశాలున్నాయి?
జవాబు:
తైపాక్షిక కూటమిలో ఇంగ్లాండ్, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలున్నాయి.

ప్రశ్న 19.
త్రైపాక్షిక సంధిలో ఏ ఏ దేశాలున్నాయి?
జవాబు:
త్రైపాక్షిక సంధిలో ఆస్ట్రియా, ఇటలీ, హంగరీ దేశాలున్నాయి.

ప్రశ్న 20.
మొదటి ప్రపంచ యుద్ధం ఏ ఏ సం||ల మధ్య జరిగింది?
జవాబు:
మొదటి ప్రపంచ యుద్ధం 1914 – 18 సం||ల మధ్య జరిగింది.

ప్రశ్న 21.
రష్యాలో విప్లవం ఏ సం||లో సంభవించింది?
జవాబు:
రష్యాలో విప్లవం 1917లో సంభవించింది.

ప్రశ్న 22.
మొదటి ప్రపంచ యుద్ధంలో విజేతలైన 5 పెద్ద దేశాలు ఏవి?
జవాబు:
అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్.

ప్రశ్న 23.
సామ్రాజ్యవాదం అనగానేమి?
జవాబు:
వలసరాజ్య విస్తరణలో ఏర్పడ్డ శత్రుత్వమే సౌమ్రాజ్యవాదం.

ప్రశ్న 24.
బోల్షివిక్ పార్టీ స్థాపకుడెవరు?
జవాబు:
బోల్షివిక్ పార్టీ స్థాపకుడు లెనిన్.

ప్రశ్న 25.
మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణమేమి?
జవాబు:
ఆస్ట్రియా రాకుమారుడైన ఫెర్డినాండును, సతీసమేతంగా సరయోవో నగరంలో ఒక సెర్బియన్ హత్య గావించాడు.

ప్రశ్న 26.
బిస్మార్క్ జర్మనీ చాన్నలగా ఎప్పుడు నియమించబడ్డాడు?
జవాబు:
జర్మనీ చాన్సలర్ గా బిస్మార్క్ 1870లో నియమించబడ్డాడు.

AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

ప్రశ్న 27.
వర్సయిల్స్ ఒప్పందం నానాజాతి సమితిని ఎందుకు ఏర్పాటు చేసింది?
జవాబు:
వర్సయిల్స్ ఒప్పందం నానాజాతి సమితిని భవిష్యత్తులో యుద్ధాలను నివారించటానికి ఏర్పాటు చేసింది.

ప్రశ్న 28.
యు.ఎస్.ఎస్.ఆర్ ను విస్తరించుము.
జవాబు:
యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్టు రిపబ్లిక్.

ప్రశ్న 29.
బ్రిటిష్ మహిళలకు ఏ సం||లో ఓటు హక్కు లభించింది?
జవాబు:
బ్రిటిష్ మహిళలకు 1918లో ఓటు హక్కు లభించింది.

ప్రశ్న 30.
రెండవ ప్రపంచ యుద్ధం ఏ ఏ సం||ల మధ్య కొనసాగింది?
జవాబు:
రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుండి 1945 సం||ల మధ్య కొనసాగింది.

ప్రశ్న 31.
రెండవ ప్రపంచ యుద్ధానికి నాందిగా దేనిని భావిస్తారు?
జవాబు:
హిట్లర్ పోలెండ్ పై దండెత్తడాన్ని రెండవ ప్రపంచ యుద్ధానికి నాందిగా భావిస్తారు.

10th Class Social 13th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
కింది పేరాగ్రాను చదివి ‘మహిళలకు ఓటు హక్కు లభించడం అనేది ఒక పెద్ద ముందడుగు’ అని ఎలా సమర్థిస్తావో రాయుము.

ఓటు హక్కు వంటి రాజకీయ హక్కుల కోసం సుదీర్ఘ పోరాటం తర్వాత 1918లో బ్రిటిషు మహిళలకు ఓటు హక్కు లభించింది. ప్రపంచ యుద్ధాల మాదిరి దీర్ఘ కాలం పాటు జరిగే యుద్ధకాలంలో పారిశ్రామిక ఉత్పత్తి ఇతర సేవలు కొనసాగవలసిన అవసరం ఉంది. మగవాళ్ళు యుద్ధభూమిలో ఉండటంతో ఫ్యాక్టరీలు, దుకాణాలు, కార్యాలయాలు, స్వచ్చంద సేవలు, ఆసుపత్రులు, పాఠశాలల వంటి వాటిలో మహిళలు పని చేయాల్సి వచ్చింది. సంపాదనపరులు కావటంతో పెరిగిన ఆత్మ విశ్వాసంతో జీవితంలోని అన్ని అంశాలలో మహిళలు సమానత్వాన్ని కోరసాగారు. ఆ దిశలో ఓటు హక్కు లభించడం అనేది ఒక పెద్ద ముందడుగు.
జవాబు:
‘మహిళలకు ఓటుహక్కు లభించడం అనేది ఒక పెద్ద ముందడుగు’ అనడంలో సందేహం లేదు. ఎలాగంటే

  • మహిళలకు ఓటుహక్కు కల్పించకుండా ఉంటే అది దేశ విధానాలను చాలా ప్రభావితం చేస్తుంది.
  • పౌరులు అందరికీ (మహిళలకు) ఓటుహక్కు లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. నేటి ప్రభుత్వాలన్ని ప్రజాస్వామ్యాలే కాబట్టి మహిళలకు ఓటుహక్కు అవసరం.
  • మహిళలకు ఓటుహక్కు లేనట్లయితే ‘వివక్షత’ చూపించినట్లవుతుంది. సామాజిక న్యాయం అనేది నేతిబీరకాయ చందంగా ఉండేది.
  • దేశంలో సగం జనాభా మహిళలే, అందువల్ల ప్రభుత్వ ఏర్పాటులో, పాలనలో వీరి భాగస్వామ్యం తప్పనిసరి.
  • మహిళలకు సమాన అవకాశాలు, (రాజకీయ) హక్కులు ఉన్నట్లయితే మరింత సామాజిక సమానత్వంవైపు తీసుకెళ్లటం సాధ్యమయ్యేది. అందుకని చట్టసభల్లో రిజర్వేషన్లు కూడా కల్పించి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి.

ప్రశ్న 2.
ఈ క్రింది కాలపట్టికను పరిశీలించి, ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
కాలపట్టిక

మొదటి ప్రపంచ యుద్ధ ప్రారంభం ఆగస్టు 11914
రష్యా విప్లవము1917
మొదటి ప్రపంచ యుద్ధం ముగింపు1918
వర్సెయిల్స్ ఒప్పందము1919
నానాజాతి సమితి ఏర్పాటు1919
జర్మనీలో హిట్లర్ ప్రాభవం1933
రెండవ ప్రపంచ యుద్ధ ప్రారంభం1939
రష్యాపై జపాన్ దండెత్తడం1942
ఐక్యరాజ్యసమితి ఏర్పాటు1945
రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు1945

ప్రశ్నలు :
1) రష్యా విప్లవం ఎప్పుడు సంభవించినది?
2) రెండవ ప్రపంచ యుద్ధానంతరము ప్రపంచ శాంతి స్థాపనకు ఏర్పడిన శాంతికాముక సంస్థ ఏమిటి?
(లేదా)
A) మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత శాంతి స్థాపనకు ఏర్పాటు చేయబడిన అంతర్జాతీయ సంస్థ పేరేమి?
B) హిట్లర్ జర్మనీకి చాన్సలర్‌గా ఏ సంవత్సరంలో అవతరించాడు?
C) యుద్ధం ముగియక ముందే రష్యా మొదటి ప్రపంచ యుద్ధం నుండి ఎందుకు విరమించుకుంది?
D) మొదటి ప్రపంచ యుద్ధం ఏ శాంతి సమావేశంతో ముగిసింది?
జవాబు:
1) రష్యా విప్లవం 1917లో సంభవించినది.
2) ఐక్యరాజ్య సమితి
(లేదా)
A) నానాజాతి సమితి.
B) 1933వ సం||రంలో
C) అంతర్గత విప్లవం కారణంగా, 1917లో రష్యా మొదటి ప్రపంచ యుద్ధం నుంచి విరమించుకుంది.
D) వర్సయిల్స్ (సంధి) ఒప్పందం.

AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

ప్రశ్న 3.
కింది పట్టికను పరిశీలించి మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న దేశాల సైనిక ఖర్చును విశ్లేషించండి.

సంవత్సరంసైనిక ఖర్చు (మిలియన్ పౌండ్లలో)
1. 1880132
2. 1890158
3. 1900205
4. 1910288
5. 1914397

జవాబు:

  1. 1880వ సంవత్సరంలో 132 మిలియన్ పౌండ్లలో డబ్బును ప్రధాన దేశాలు ఆయుధాల తయారీకి ఉపయోగించినట్లుగా తెలుస్తుంది.
  2. 1890వ సంవత్సరంలో ఆయుధ పోటీ మూలంగా 158 మిలియన్ పౌండ్లు ఖర్చు పెట్టబడిందని తెలుస్తుంది.
  3. 1900లలో 205 మిలియన్ పౌండ్లు, 1910లో 288 మిలియన్ పౌండ్లు, 1914లో 397 మిలియన్ పౌండ్లు ఆయుధాల ఉత్పత్తి కొరకు అగ్రరాజ్యాలు ఉపయోగించాయి.
  4. ఆయుధాల ఉత్పత్తిని గమనించినట్లయితే ఈ అగ్రరాజ్యాలన్ని కూడా తమ ఆదాయంలో అధిక భాగాన్ని ఆయుధ సేకరణ కొరకు వినియోగించారని తెలుస్తుంది. తద్వారా యుద్ధాలను కోరుకున్నాయని కూడా చెప్పవచ్చు.
  5. పైగా ఈ విధంగా ఆయుధ సేకరణ పెరగడానికి ముఖ్య కారణం తమ దగ్గర ఎంత ఎక్కువ ఆయుధ సంపత్తి ఉంటే, అంత ఎక్కువ భద్రత” అనే భావన అయి ఉండవచ్చు.

కావున 1880 నుండి 1914 వరకు ఆయుధ ఉత్పత్తి కొరకు అత్యధిక ధనాన్ని వినియోగించారని ఈ పట్టిక ద్వారా తెలుస్తున్నది.

ప్రశ్న 4.
ఈ క్రింది గ్రాఫ్ ను పరిశీలించి, ఆయుధ పోటీ గురించి ఒక పేరాగ్రాఫ్ రాయండి.
(లేదా)
క్రింద ఇవ్వబడిన గ్రాలోని సమాచారాన్ని విశ్లేషిస్తూ కొన్ని వాక్యాలు వ్రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 2
1880-1914 మధ్య ప్రధాన శక్తులైన జర్మనీ, ఆస్ట్రియా-హంగరీ, బ్రిటన్, రష్యా, ఇటలీ, ఫ్రాన్ల సైనిక ఖర్చు (మూలం : టైమ్స్ ప్రపంచ చరిత్ర అట్లాసు, లండన్, 1978)
జవాబు:

  1. పై బార్ గ్రాఫ్ 1880-1914 మధ్య ప్రధాన శక్తులైన జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ, బ్రిటన్, రష్యా, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల సైనిక ఖర్చును సూచిస్తుంది.
  2. 1880లో 132 మిలియన్ పౌండ్లు ఉన్న ఖర్చు, 1914లో 397 మిలియన్ పౌండ్లకు పెరిగిపోయింది.
  3. ఆయా దేశాలు అధిక ఆయుధాలు సమకూర్చుకోవడంతో ప్రతి 10 సం||లకు ఖర్చు పెరుగుతూ పోయింది. తద్వారా యుద్ధాలను కోరుకొని ప్రపంచ శాంతికి భంగం కలిగించాయి.
  4. ఈ ఆయుధ పోటీతో రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. దాని వలన ధన, మాన, ప్రాణ నష్టాలు సంభవించాయి. కనుక మున్ముందు రాజ్యాల మధ్య ఈ ఆయుధ పోటీ లేకుండుటయే మంచిది.

ప్రశ్న 5.
‘శాంతి’ ని ప్రోత్సహించేలా రెండు నినాదాలు రూపొందించండి.
జవాబు:
శాంతిని ప్రోత్సహించేలా రెండు నినాదాలు
i) యుద్ధం వద్దు – శాంతి ముద్దు
ii) ఆయుధాలు వద్దు – అభివృద్ధి ముద్దు
iii) యుద్ధం జన నష్టం – శాంతి ప్రాణ రక్షణం
iv) పోరు నష్టం – పొందు లాభం

ప్రశ్న 6.
20వ శతాబ్దాన్ని ‘తీవ్ర సంచలనాల యుగము’ అని పిలవడాన్ని సమర్థించే ఏవైనా రెండు సంఘటనలను పేర్కొనండి.
జవాబు:

  1. ఈ కాలంలోనే రెండు ప్రపంచ యుద్ధాలు సంభవించాయి.
  2. ఇదే సమయంలో తీవ్ర ఆర్థిక మాంద్యం చోటు చేసుకున్నది.
  3. విజ్ఞాన శాస్త్రం కొత్త శిఖరాలను అందుకుంది.
  4. మొదటిసారిగా మహిళలకు ఓటుహక్కు లభించింది.

కనుక 20వ శతాబ్దాన్ని ‘తీవ్ర సంచలనాల యుగము’ అని పిలుస్తారు.

ప్రశ్న 7.
క్రింది పట్టికలోని సమాచారాన్ని ఒక బార్ గ్రాఫ్ పై చూపండి.
AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 4
జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 5

ప్రశ్న 8.
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, మరో ప్రపంచ యుద్ధం సంభవిస్తే జరిగే పరిణామాలను రాయండి.
జవాబు:
మరో ప్రపంచ యుద్ధం వస్తే సంభవించే పరిణామాలు

  1. అత్యధిక మరణాలు, జీవకోటికి తీవ్ర నష్టం
  2. ఆస్తుల వినాశనం
  3. పర్యావరణ కాలుష్యం పెరగడం
  4. జీవకోటి మనుగడకు కష్టం

ప్రశ్న 9.
ప్రపంచ శాంతి పరిరక్షణకు కొన్ని సూచనలు వ్రాయండి.
జవాబు:
ప్రపంచ శాంతి పరిరక్షణకు సూచనలు :

  1. అన్ని దేశాలు పరస్పరం స్నేహపూరిత సంబంధాలను సాగించాలి.
  2. ప్రతి దేశము ఇతర దేశాల హోదాను, సార్వభౌమత్వాన్ని గౌరవించాలి.
  3. దేశాలు, యుద్ధాలకు పోకుండా శాంతియుత చర్చల ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలి.

ప్రశ్న 10.
మొదటి ప్రపంచయుద్ధ ఫలితాలు ఏవి?
జవాబు:
1914 నుండి 1918 వరకు మొదటి ప్రపంచయుద్ధం కొనసాగింది.
ఫలితాలు :

  1. యుద్దానికి ముఖ్య కారకుడైన జర్మన్ చక్రవర్తి రెండో కైజర్ విలియం మిత్రరాజ్యాల చేతులలో పరాజయం పొంది హాలెండ్ కు పారిపోయాడు.
  2. దాదాపు కోటి మంది చనిపోయారు. సుమారు 65 లక్షల మంది గాయపడ్డారు.
  3. జర్మనీ తన భూభాగాలనే కాకుండా సైనికబలాన్ని కూడా కోల్పోయింది.
  4. నానాజాతి సమితి ఏర్పడడానికి మొదటి ప్రపంచయుద్ధం మూలం.
  5. వర్సయిల్స్ సంధి 1919 లో నిర్వహించారు.

AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

ప్రశ్న 11.
ఎరిక్ హాకీ బామ్ కు 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగంగా ఎందుకు పేర్కొన్నాడు?
(లేదా)
ఇరవయ్యవ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగమని పిలవడానికి గల కారణాలను వివరించండి.
జవాబు:
చరిత్రకారుడైన ఎరిక్ హ్బా ్బమ్ కు 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగంగా పేర్కొన్నాడు.

  1. రాజకీయంగా చూస్తే ప్రపంచంలోని ఇతర ప్రజల పట్ల ద్వేషం, అవధులు లేని అధికారంతో ఫాసిజం భావజాలం తీవ్రరూపం దాలుస్తున్న క్రమంలోనే ప్రజలలో ప్రజాస్వామిక ఆకాంక్షలు చిగురులు వేశాయి.
  2. అంతటా అందరికీ అక్షరాస్యతాస్థాయి, సగటు జీవితకాలం అపారంగా పెరిగాయి.
  3. ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాలు స్వాతంత్ర్యం పొంది స్వేచ్ఛావాయువులు పీల్చసాగాయి.
  4. ఇది గొప్ప ప్రయోగాల కాలం కూడా.
  5. విజ్ఞానశాస్త్రం కొత్త శిఖరాలను అందుకుని పరమాణువు, జీవుల రహస్యాన్ని ఛేదించింది.

ప్రశ్న 12.
దురహంకారపూరిత జాతీయవాదం అంటే ఏమిటి?
జవాబు:

  1. 1923 నుంచి ఇటలీలో ఫాసిజం, జర్మనీలో నాజీయిజం రెండూ కూడా విధ్వంసకర రూపంలోని దురహంకార పూరిత జాతీయవాదాలు.
  2. జర్మనీ, ఇటలీలు ఏకీకరణ సాధించి స్వతంత్ర దేశాలుగా అవతరించాయి.
  3. ముఖ్యంగా జర్మనీలో జాత్యహంకారం పెల్లుబికింది. ఇంగ్లాండుతో జర్మనీ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
  4. ఇటలీపై ఆస్ట్రియా పాలన ఉంది. ఈ 5) బాల్కన్ దీవులలో దురాక్రమణపూరిత జాతీయవాదం, కల్లోలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి.
  5. జర్మనీ నౌకాదళశక్తిని, పారిశ్రామికోత్పత్తులను విపరీతంగా పెంచుకున్నది.

ప్రశ్న 13.
రహస్య ఒప్పందాలు, కూటముల గూర్చి వివరించుము.
జవాబు:

  1. 1870లో ఫ్రాన్స్ ని ఓడించిన తరువాత జర్మనీ ఛాన్సలర్ అయిన బిస్మార్క్, ఫ్రాన్స్ ని ఒంటరిని చెయ్యాలని చూశాడు.
  2. దీనికి అనుగుణంగా అతడు ఆస్ట్రియాతో 1879 లోనూ, ఇటలీతో 1882 లోనూ రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నాడు.
  3. 1907లో రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్లు మూడు మిత్రదేశాల కూటమిగా ఏర్పడ్డాయి.
  4. జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ కేంద్ర రాజ్యాలకూటమిగా ఏర్పడ్డాయి.
  5. ఐరోపా దేశాలు తమ స్వాతంత్ర్యంతో పాటు వాణిజ్య, ఆర్ధిక ప్రయోజనాలను కాపాడుకోడానికి రహస్య కూటములుగా ఏర్పడ్డాయి.

ప్రశ్న 14.
రెండవ ప్రపంచయుద్ధ ఫలితాలు తెలుపుము.
జవాబు:
రెండవ ప్రపంచయుద్ధం 1939 నుండి 1945 వరకు కొనసాగింది.
ఫలితాలు :

  1. అగ్ర రాజ్యంగా రష్యా అవతరించింది.
  2. సుమారు 2.2 – 2.5 కోట్ల మంది సైనికులు చనిపోయారు.
  3. బ్రిటన్, ఫ్రాన్లు తమ ప్రాబల్యాన్ని కోల్పోవటంతో ఆసియా, ఆఫ్రికా దేశాలలోని వలస రాజ్యాలు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాయి.
  4. జర్మనీ రెండు భాగాలుగా విభజింపబడింది.
  5. సుమారు 4, 5 కోట్ల మంది పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
  6. నార్వే, డెన్మార్క్, నెదర్లాండ్స్, బెల్జియంలలో ప్రజాస్వామ్య రాజ్యాలు పునః ప్రతిష్టించబడ్డాయి.
  7. ప్రపంచ శాంతికి దోహదం చేసే ఐక్యరాజ్యసమితి ఏర్పడినది.

ప్రశ్న 15
మొదటి ప్రపంచయుద్ధం ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగింది? దాని ప్రధాన కారణాంశాలేవి?
జవాబు:
మొదటి ప్రపంచయుద్ధం 1914 నుండి 1918 వరకు కొనసాగింది.

ప్రధాన కారణాలు :

  1. దురహంకారపూరిత జాతీయవాదం
  2. సామ్రాజ్యవాదం
  3. సైనికవాదం
  4. రహస్య ఒప్పందాలు
  5. ఆస్ట్రియా యువరాజైన ఫెర్డినాండ్ సతీసమేతంగా హత్య చేయబడటం
  6. జర్మనీ జాత్యహంకారం

ప్రశ్న 16.
రెండవ ప్రపంచయుద్ధ కారణాలు ఏవి?
జవాబు:
రెండవ ప్రపంచయుద్ధం 1939 – 1945 వరకు కొనసాగింది.
కారణాలు :

  1. వర్సయిల్స్ సంధిలోని అవమానకర షరతులు
  2. వివిధ దేశాల మధ్య సిద్ధాంతపర విభేదాలు
  3. సైనిక ఏర్పాట్లు
  4. నానాజాతి సమితి వైఫల్యం
  5. పోలెండ్ పై హిట్లర్ దాడి

ప్రశ్న 17.
నానాజాతి సమితి ఎందుకు విఫలమైంది?
(లేదా)
నానాజాతి సమితి వైఫల్యాలకు రెండు కారణాలు రాయండి.
జవాబు:
భవిష్యత్తులో యుద్దాలను నివారించటానికి వర్సయిల్స్ సంధి ఆలోచనలకు అనుగుణంగా 1920లో నానాజాతి సమితి ఏర్పడింది.

  1. ఈ కూటమిలో చేరటానికి రష్యా, జర్మనీలను ఆహ్వానించలేదు.
  2. కూటమి ఏర్పడటంలో అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్ చురుకైన పాత్ర పోషించినప్పటికీ అతని ప్రతిపాదనను అమెరికా కాంగ్రెస్ ఆమోదించటానికి తిరస్కరించటంతో అది కూడా సభ్యత్వం పొందలేదు.
  3. అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించకుండా, ఇతర దేశాలపై దండెత్తకుండా జర్మనీ, ఇటలీలను ఇది నివారించలేక పోయింది.

ప్రశ్న 18.
సామ్రాజ్యవాదం అంటే ఏమిటి?
జవాబు:
బ్రిటన్, జర్మనీ వంటి ఐరోపా దేశాలలోనూ, అమెరికాలోనూ పారిశ్రామిక మూలధనం అభివృద్ధి పొందడంతో తమ ఉత్పత్తులకు మార్కెట్, ముడిసరుకుల అందుబాటు అవసరమయ్యాయి. సైనికశక్తిని ఉపయోగించుకొని, వలసలను స్థాపించి సామ్రాజ్యాలను విస్తరించుకున్నారు. ఇతర దేశాలలో వలసలను స్థాపించుకొని తమ రాజ్యాధికారాన్ని విస్తృత పరచుకొనుటయే సామ్రాజ్యవాదం.

ప్రశ్న 19.
మొదటి ప్రశంచ యుద్ధానికి తక్షణ కారణం ఏమిటి?
జవాబు:

  1. ప్రతి యుద్ధానికి దీర్ఘకాలంగా మసులుతున్న కారణాలతోపాటు తక్షణ కారణాలు ఉంటాయి.
  2. మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం 1914 జూన్ 28న ఆస్ట్రియాకు చెందిన ఆర్చ్ డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ను ఒక సెర్బియన్ ఉన్మాది హత్య చేయడం.
  3. దీనితో ఆస్ట్రియా సెర్బియాపై యుద్ధం ప్రకటించింది.

ప్రశ్న 20.
ఆయుధ పోటీకి సంబంధించిన బార్ గ్రాఫ్ ను పరిశీలించి కింది ప్రశ్నలకు సమాధానం రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 2
1) పై గ్రాఫ్ దేనిని సూచిస్తుంది?
జవాబు:
పై గ్రాఫ్ 1880-1914 మధ్య ప్రధాన శక్తులైన జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ, బ్రిటన్, రష్యా, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల సైనిక ఖర్చుని సూచిస్తోంది.

2) ఏ దేశాలు ఆయుధాలపై ఎక్కువ ఖర్చు పెట్టాయి?
జవాబు:
ఆయుధాలపై ఎక్కువ ఖర్చు పెట్టిన దేశాలు : జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ, బ్రిటన్, రష్యా, ఇటలీ, ఫ్రాన్స్ మొ||.

3) ఆయుధాలపై ఖర్చు ప్రతి 10 సంవత్సరాలకి ఎందుకు పెరుగుతూ పోయింది?
జవాబు:
ఆయా దేశాలు అధిక ఆయుధాలు సమకూర్చుకోవడంతో ప్రతి 10 సం||లకు ఖర్చు పెరుగుతూ పోతోంది.

4) 1914లో ఆయుధాలపై ఎంత ఖర్చు జరిగింది?
జవాబు:
1914లో ఆయుధాలపై పెట్టబడిన మొత్తం ఖర్చు : 397 మి|| పౌండ్లు.

AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

ప్రశ్న 21.
కింది పేరా చదివి ఇచ్చిన ప్రశ్నకు జవాబు రాయండి.
ప్రపంచ యుద్ధాల కారణంగా ఎంతోమంది చనిపోయారు. గాయపడ్డారు. మొదటి ప్రపంచ యుద్ధంలో దాదాపు కోటిమంది. రెండవ ప్రపంచ యుద్ధంలో 2-2.5 కోట్ల మంది చనిపోయారు. చనిపోయిన వాళ్లల్లో అధిక శాతం 40 ఏళ్లలోపు పురుషులే. ఈ రెండు యుద్ధాల వల్ల మారణాయుధాల పోటీ ప్రత్యేకించి అణుబాంబులు, రసాయనిక ఆయుధాల పోటీ పెరిగింది. ఇటువంటి ఆయుధాలు ప్రమాదవశాత్తు పేలిపోయినా పూర్తి వినాశనం, మానవ నష్టం జరిగే ముప్పు కలుగుతుందనే భయంతో ప్రపంచం ఈనాటికీ జీవిస్తూ ఉంది.
ప్రశ్న : మరో ప్రపంచ యుద్ధం గనుక వస్తే అది ప్రపంచ మానవులందరికీ అత్యంత ప్రమాదకరం – వ్యాఖ్యానించండి.
జవాబు:

  1. ప్రపంచ యుద్దాల కారణంగా ఎంతోమంది చనిపోయారు, గాయపడ్డారు.
  2. మొదటి ప్రపంచ యుద్ధంలో 1 కోటి మంది చనిపోయారు. రెండవ ప్రపంచ యుద్ధంలో 2-2.5 కోట్ల మంది చనిపోయారు.
  3. వీరిలో అధిక శాతం 40 సం॥లలోపు పురుషులే.
  4. రెండు యుద్ధాలలో అణుబాంబులు, రసాయనిక ఆయుధాల పోటీ జరిగింది.
  5. ఇవి ప్రమాదవశాత్తు పేలినా పూర్తి వినాశనం, మానవనష్టం జరిగే ముప్పుతో ప్రపంచం నేటికీ జీవిస్తుంది.
  6. మరొక ప్రపంచ యుద్ధం వస్తే కనుక అది ప్రపంచ మానవులందరికీ ప్రమాదకరం.

10th Class Social 13th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
రెండు ప్రపంచ యుద్ధాలకు దారితీసిన కారణాలు ఏవి?
(లేదా)
ప్రపంచంలో సంభవించిన రెండు ప్రపంచ యుద్ధాలకు గల ప్రధాన కారణములను పేర్కొనండి.
జవాబు:
రెండు ప్రపంచ యుద్ధాలకు దారితీసిన కారణాలు :
దురహంకారపూరిత జాతీయవాదం :
జాతీయవాదం అనే భావజాలం ఒక మంచి ప్రేరణ. అయితే ఈ భావజాలం తమపట్ల గర్వాన్ని, ఇతరులపట్ల ద్వేషాన్ని కలిగించడానికి కూడా వాడుకున్నారు. 1923 నుంచి ఇటలీ ఫాసిజం, జర్మనిలో నాజీజం రెండూ కూడా విధ్వంసకర రూపంలోని దురహంకారపూరిత జాతీయవాదాలు.

సామ్రాజ్యవాదం :
వలసల ఏర్పాటులో ఐరోపా దేశాల మధ్య ఏర్పడిన పోటీనే (ఘర్షణ) సామ్రాజ్యవాదం అనవచ్చు. కొత్త పారిశ్రామిక శక్తులు (జపాను, జర్మనీ, ఇటలీ) ఏర్పడటంతో ఇవి వలస ప్రాంతాలను తిరిగి విభజించాలని తీవ్ర ఒత్తిడులకు, తరడు యుద్ధాలకు కారణం అవుతుండేది.

ఆయుధ పోటీ :
పెద్దసంఖ్యలో ఆయజధాలు సమకూర్చుకోవటంలో ఈ దేశాలు ఒకదానితో ఒకటి పోటీపడ్డాయి. ఆయుధాలను ఉత్పత్తి బేసే పెద్ద పారిశ్రామిక సంస్థలు ఆవిర్భవించి దౌత్య సతుస్యల పరిష్కారానికి యుద్దాన్ని ఉపగించటాన్ని ప్రోత్సహించాయి.

సైనికవాదం :
భద్రతకు సైనికశక్తి మంచి మార్గమని, సమస్యల పరిష్కారానికి యుద్ధమే సరైన విధానమని నమ్మటాన్ని సైనికవాదం అంటారు. 1880 నుంచి 1914 నాటికి ఐరోపా ప్రధాన దేశాల సైనిక ఖర్చు మూడింతలు పెరిగింది.

రహస్య ఒప్పందాలు :
మిత్రదేశాల కూటమి, త్రైపాక్షిక కూటమి మొదలైన ఒప్పందాల వల్ల ఐరోపా దేశాలు ఒకదానినొకటి శంకించసాగాయి. ఈర్యపడసాగాయి. ఈ కూటముల వల్ల సాయుధ శాంతి, భయ వాతావరణం నెలకొన్నాయి.

వర్సెయిల్స్ ఒప్పందం :
మొదటి ప్రపంచ యుద్ధం 1919 లో వర్సయిల్స్ శాంతి సమావేశంతో ముగిసింది. జర్మనీ బలహీనపర్వతానికిగాను ఈ ఒప్పందం దాని మీద సైనిక కోతలు, భౌగోళిక పరిమితులను విధించింది. ఈ ఒప్పందం బలవంతంగా జర్మనీపై రుద్దినదిగా భావించటం జరిగింది.

నానాజాతి సమితి వైఫల్యం :
భవిష్యత్తులో యుద్ధాలను నివారించటానికి తర్పయిల్స్ ఒప్పందం నానాజాతి సమితిని ఏర్పాటు చేసింది. కానీ అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించకుండా, ఇతర దేశాల పై దండెత్తి కూడా జర్మనీ, – ఇటలీలను ఇది నివారించలేకపోయింది.

జర్మనీ ప్రతీకారేచ్ఛ :
వర్సయిల్స్ ఒప్పందం వల్ల తాము కోల్పోయిన ప్రాంతాలను తిరిగి సాధించుకోవాలని, మధ్య యూరపుపై జర్మనీ తిరిగి ఆధిపత్యం పొందాలని, జర్మనీ ఆయుధాలపై ఉన్న పరిమితులకు అంతం పలకాలని జర్మన్స్ కోరుకున్నారు.

సామ్యవాదం, ఈష్యా షట్ల భయాలు :
రష్యాలో 1917లో విప్లవం సంభవించి అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది. 1924లో USSR గా మారింది. పాశ్చాత్య పెట్టుబడిదారీ దేశాలు యూరపులోని ఇతర దేశాలలో కూడా ఇలాంటి విప్లవాలే సంభవిస్తాయని భయపడి సోమియట్ సోషలిజానికి వ్యతిరేకశక్తిగా ఉంటుందని హిట్లర్, సౌజీలు బలపడటాన్ని మొదట్లో బలపరిచాయి. చివరికి బ్రిటన్, ఫ్రాన్స్ కూటమికి వ్యతిరేకంగా హిట్లర్ నిలిచాడు.

తక్షణ కారణం :
19.14లో ఆస్ట్రియా-హంగరీకి వారసుడైన రాకుమారుడిని సెర్బియతి చెందిన తీవ్రవాది హత్య 1. చేశాడు. దానితో 1914 జులై 28న సెర్బియాపై ఆస్ట్రియా దాడి చేసింది. ఈ విధంగా అందటి ప్రపంచ యుద్ధం
మొదలైంది. అలాగే 1939లో హిట్లర్ పోలాండ్ పై దండెత్తడంతో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది.

AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

ప్రశ్న 2.
ప్రపంచ యుద్ధాలకు జాతీయవాదం ఎలా దోహదపడింది?
జవాబు:

  1. జాతీయ రాజ్యాలలో జాతీయతా భావం ఒక ప్రముఖ ప్రేరేపణ.
  2. నూతన శక్తికి అంకురార్పణ.
  3. ఆధునిక రాజ్యా లు ఏర్పడడానికి, జర్మనీ, ఇటలీ వంటి దేశాలు ఏకీకరణ సాధించడానికి ఇది మూలమైంది.
  4. జాతీయతా భావం ఆయా దేశాల అహంకారానికి, గర్వానికి పరాకాష్ఠ. అంతేకాకుండా ఇతరుల పట్ల ద్వేషాన్ని కలిగించడానికి కూడా ఈ దేశస్థులు జాతీయభావాన్ని ఉపయోగించుకున్నారు.
  5. ఈ ద్వేషం, అహంకారం యూరప్ లోని దేశాల మధ్య వైరం పెరగడానికి, అభద్రతాభావం ఏర్పడడానికి మూలమైంది.
  6. మరో ప్రక్క ఇటలీలో ఫాసిజం, జర్మనీలో నాజీయిజం రెండూ కూడా విధ్వంసకర రూపంలో దురహంకారపూరిత జాతీయవాదాన్ని రెచ్చగొట్టి, జర్మనీయే ప్రపంచానికి మార్గదర్శకత్వం వహిస్తుందని, విజేతయై ప్రపంచాన్ని పాలిస్తుందని, పుకార్లు షికార్లు చేయించి, ప్రపంచంలోని దేశాల మధ్య ద్వేషాలు, అభద్రతాభావం పెంచి యుద్ధకాంక్షను పురిగొల్పడానికి కారణమైంది.

ప్రశ్న 3.
వర్సయిల్స్ ఒప్పందంలోని నిబంధనలు ఏవి ? రెండవ ప్రపంచ యుద్ధానికి వర్సయిల్స్ ఒప్పందం ఎంతవరకు కారణమయినదో వివరించండి.
జవాబు:
మొదటి ప్రపంచ యుద్ధం 1919లో వర్సయిల్స్ శాంతి సమావేశంతో ముగిసింది. ఓటమి పాలైన దేశాలను ఈ సమావేశానికి ఆహ్వానించకపోవడం వలన వాళ్ళ భావాలను పరిగణన లోనికి తీసుకోలేక పోయినారు. దాని వలన వర్సయిల్స్ సంధి తమ మీద బలవంతంగా రొద్దబడినదని భావించి వారి దానిని వ్యతిరేకించారు.

వర్సయిల్స్ నిబంధనలు :

  1. జర్మనీని బలహీన పరచటానికి వర్సయిల్స్ ఒప్పందం దాని మీద సైనిక కోతలను, భౌగోళిక పరిమితులను విధించినవి.
  2. ఆల్సెస్, లోరైన్లను ఫ్రాన్సుకు తిరిగి ఇచ్చివేసింది.
  3. సైనిక బలాన్ని తగ్గించుకోమని జలాంతర్గాములు ఉండకూడదని ఆరు యుద్ధ నౌకలకు సరిపోయిన నౌకాదళం మాత్రమే ఉండాలని నిర్దేశించింది.
  4. పోలిష్ కారిడార్‌ను ఏర్పాటు చేయడం ద్వారా జర్మనీని రెండు భాగాలుగా చీల్చినారు.
  5. జర్మనీ బొగ్గు, ఉక్కు వనరులను కోల్పోయింది.
  6. జర్మనీ తన చెల్లింపు సామర్థ్యానికి మించిన నష్టపరిహారాలను చెల్లించాల్సి వచ్చింది.
  7. ఆర్థికంగా, సైనికంగా వర్సెటల్స్ సంధి జర్మనీని బలహీనపరచింది.

కారణం :
వర్సయిల్స్ సంధిని జర్మనీ మరియు ఓడిపోయిన మిగతా దేశాలు చాలా అవమానకరమైన సంధిగా భావించి దానిని వ్యతిరేకించి వారు గెలిచిన వారి మీద ప్రతికారం తీర్చుకోవడాని రెండవ ప్రపంచ యుద్ధానికి సన్నద్ధమైనారు.

ఈ విధంగా వర్సయిల్స్ సంధి రెండవ ప్రపంచ యుద్ధానికి ఒక కారణమయినది.

ప్రశ్న 4.
యూరప్ పటాన్ని పరిశీలించి వార్సా కూటమికి చెందిన రెండు దేశాలను మరియు నాటో కూటమికి చెందిన రెండు దేశాలను రాయుము.
జవాబు:

వార్సా పోల్నాటో పోల్
పోలెండ్U.S.A.
అల్బేనియాకెనడా
రుమేనియాబెల్జియం
బల్గేరియాడెన్మార్క్
హంగరీఫ్రాన్సు
మొదలైనవిమొదలైనవి పోర్చుగల్, బ్రిటన్ మొదలైనవి.

ప్రశ్న 5.
మీకియబడిన యూరప్ పటాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నకు జవాబు రాయుము.
AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 6
అక్షరాజ్యాలను మరియు మిత్రరాజ్యాల జాబితాను తయారుచేయుము.
జవాబు:

కేంద్రరాజ్యా లుమిత్ర రాజ్యాలు
1) ఆస్ట్రేలియాUSSR
2) జర్మనీబ్రిటన్
3) టర్కీరుమేనియా
4) బల్గేరియాఫ్రాన్స్
5) ఇటలీUSA
6) జపాన్పోలెండ్

ప్రశ్న 6.
ఈ క్రింది గ్రాను పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 2
1880-1914 మధ్య ప్రధాన శక్తులైన జర్మనీ, ఆస్ట్రియా-హంగరీ, బ్రిటన్, రష్యా, ఇటలీ, ఫ్రాన్ల సైనిక ఖర్చు

1) 1914లో ప్రధాన శక్తుల సైనిక ఖర్చు ఎంత?
జవాబు:
397 మిలియన్ పౌండ్లు

2) త్రైపాక్షిక కూటమిలోని దేశాలు ఏవి?
జవాబు:
జర్మనీ, ఆస్ట్రియా-హంగరీ, ఇటలీ

3) మిత్ర రాజ్యాలు అని వేటినంటారు?
జవాబు:
గ్రేట్ బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్

4) 1880 నుండి 1914 మధ్య కాలంలో ప్రధాన రాజ్యా ల సైనిక ఖర్చు ఎన్ని రెట్లు పెరిగినది?
జవాబు:
3 రెట్లు

ప్రశ్న 7.
ప్రపంచ యుద్ధాల పరిణామాలను వర్ణించండి.
జవాబు:
ప్రపంచ యుద్ధాల పరిణామాలు :

  1. ప్రపంచ యుద్ధాల కారణంగా ఎంతోమంది చనిపోయారు మరియు గాయపడ్డారు. ఆయుధ పోటీ పెరిగింది.
  2. అధికారం ప్రజాస్వామ్యబద్ధంగా ఉండవలసిన ఆవశ్యకతను గుర్తించారు.
  3. అనేక సామ్రాజ్యాలు అంతం అయ్యాయి. వలసలు స్వాతంత్ర్యం పొందాయి.
  4. ప్రపంచశాంతి కోసం నానాజాతి సమితి, ఐక్యరాజ్యసమితి వంటి నూతన అంతర్జాతీయ సంస్థలు ఏర్పడ్డాయి.
  5. బ్రిటన్లో మహిళలకు మొదటిసారిగా ఓటుహక్కు లభించింది.

ప్రశ్న 8.
క్రింది బార్ గ్రాఫ్ ని పరిశీలించి, విశ్లేషణ చేయండి.
AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 7
జవాబు:

  1. ఈ బార్ గ్రాలో రెండు పారిశ్రామిక దేశాలయిన బ్రిటన్ మరియు జర్మనీ దేశాలు తయారుచేస్తున్న ప్రేలుడు పదార్థాల గురించిన సమాచారం ఉంది.
  2. రెండు దేశాలు వివిధ శత్రుకూటములకు చెందిన దేశాలు.
  3. 1914వ సంవత్సరంలో ప్రేలుడు పదార్థాల ఉత్పత్తి బ్రిటన్లో 4 టన్నులు మరియు జర్మనీలో 8 టన్నులు మాత్రమే.
  4. కాని ఆ సంవత్సరం నుండి ప్రేలుడు పదార్థాల ఉత్పత్తి గణనీయంగా పెరిగినది.
  5. 1914తో పోల్చినట్లయితే ప్రేలుడు పదార్థాల ఉత్పత్తి జర్మనీ కంటే బ్రిటన్లో చాలా తక్కువగా ఉంది.
  6. 1917వ సంవత్సరం నాటికి పరిస్థితి మొత్తం తారుమారు అయినది.
  7. బ్రిటన్లో పేలుడు పదార్థాల ఉత్పత్తి 184 టన్నులు అంటే గడచిన 4 సంవత్సరాలలో 45 రెట్లు పెరిగినది.
  8. జర్మనీలో 1914తో పోల్చితే 1917లో ప్రేలుడు పదార్థాల ఉత్పత్తి 140 టన్నులు. అంటే 18 రెట్లు పెరిగినది అని అర్థం అవుతుంది.
  9. ఈ ప్రేలుడు పదార్థాల ఉత్పత్తి మొదటి ప్రపంచ యుద్ధంలో దేశాలు ఆర్థికంగా బాగా నష్టపోవడానికి కారణం అయ్యింది.

ప్రశ్న 9.
13వ శతాబ్దంలో సంభవించిన ప్రపంచ యుద్ధాలలో జాతీయ రాజ్యాలు, జాతీయతా భావం యుద్ధకాంక్షను ఎలా ప్రభావితం చేశాయి.
జవాబు:
జాతీయ రాజ్యాలు, జాతీయతా భావం :

  1. జాతీయతావాదం అనే భావజాలం ఒక మంచి ప్రేరేపణ. ఈ భావజాలం ఆధునిక జాతీయ రాజ్యాలు ఏర్పడడానికి, జర్మనీ, ఇటలీల ఏకీకరణకు కారణం అయింది.
  2. కానీ దీనిని తమపట్ల గర్వాన్ని ఇతరుల పట్ల ద్వేషాన్ని కలిగించడానికి ఎక్కువగా వాడారు.
  3. 19వ శతాబ్దంలో యూరప్ లోని దేశాల మధ్య ఈ ద్వేషం క్రమేపీ పెరుగుతూ వచ్చింది.
  4. ఇటలీలో ఫాసిజం, జర్మనీలో నాజీజం రెండూ కూడా విధ్వంసకర రూపంలోని దురహంకారపూరిత జాతీయతావాదాలు. ఇవి ఆ రెండు దేశాల ప్రజలను యూరప్ లోని ఇతర దేశాలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టాయి.

ప్రశ్న 10.
క్రింది గ్రాఫ్ లోని సమాచారం ఆధారంగా దిగువ ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 2
ప్రశ్నలు:
1) ఏ సంవత్సరంలో సైనిక వ్యయం అధికంగా వుంది? ఎందుకు?
2) ఒక దేశ అభివృద్ధిని ఆయుధపోటీ ఏ విధంగా ప్రభావితం చేస్తుంది?
జవాబు:
1) సైనిక వ్యయం అధికంగా గల సంవత్సరం : 1914
కారణం : మొదటి ప్రపంచయుద్ధం ప్రారంభం కావడం.

2) దేశాభివృద్ధిపై ఆయుధపోటీ ప్రభావం :
a) దేశ అభివృద్ధి కుంటుపడుతుంది.
b) సంక్షేమ పథకాల అమలు కష్టతరమవుతుంది.

ప్రశ్న 11.
క్రింది గ్రాఫ్ ని పరిశీలించి, విశ్లేషణ చేయండి.
AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 8
జవాబు:
పైన ఇవ్వబడిన గ్రాఫ్ మొదటి ప్రపంచ యుద్ధంలో వివిధ దేశాలు చేసిన ఖర్చును గురించి వివరించారు.

ఇక్కడ జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రియాహంగేరి, అమెరికా మరియు రష్యా దేశాలు చేసిన ఖర్చును వివరించారు.

పై గ్రాఫ్ ను పరిశీలించినట్లయితే జర్మనీ ఎక్కువగా 37,500 మిలియన్ పౌండ్లను ఖర్చు పెట్టగా, జపాన్ అతితక్కువగా 1000 మిలియన్ పౌండ్లను మాత్రమే ఖర్చు పెట్టింది.

ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఎక్కువ ఖర్చు చేసినా, తక్కువ ఖర్చు చేసినా అన్ని దేశాలు యుద్ధం వలన చాలా బాగా మరియు ఎక్కువగానే నష్టపోయాయి అని చెప్పవచ్చు.

1914-1918 మరియు 1939 – 1945 సంవత్సరాల మధ్య ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలకు 50 సం||రాల ముందు నుండే దేశాలు ఒకరితో ఒకరు భవిష్యత్తులో యుద్ధం వస్తే వాటి నుండి కాపాడుకోవడానికి, సైనిక, ఆర్థిక మరియు రాజకీయ పరమైన ఒప్పందాలను చేసుకోవడం కూడా జరిగింది. వీటి వలన దేశాల మధ్య శత్రుత్వం పెరిగి యుద్ధాలకు దారి తీసింది.

ప్రపంచంలో చాలా ప్రాంతాలలో తన వలస పాలన కొనసాగించిన గ్రేట్ బ్రిటన్ కూడా ఇక్కడ 36,000 మిలియన్ పౌండ్లను ఖర్చు చేసింది. పూర్వకాలంలో యుద్ధం జరిగితే ఉదా : రామాయణం మరియు మహాభారతాలను తీసుకొంటే ఎవరు యుద్ధంలో పాల్గొంటారో వారు మాత్రమే చనిపోవడం జరిగేది. కాని ప్రస్తుతం మనం వాడుతున్న రసాయనిక ఆయుధాల వలన ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ప్రజలు ప్రభావితం అవడమే కాకుండా పర్యావరణ కాలుష్యం జరిగి మన మనుగడ అంతమయ్యే స్థితికి చేరుకుంటున్నాం.

యుద్ధాలకు ప్రధాన కారణం ఒకరి మీద మరొకరు ఆధిపత్యం చెలాయించాలని కోరుకోవడం, నా సలహా ఏమిటంటే మనం సైన్యానికి ఆయుధాల కోసం చేసే ఖర్చుని, ప్రపంచశాంతి కోసం మరియు ప్రపంచ ప్రజల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టినట్లయితే, ప్రతిదేశం పేదరికాన్ని మరియు నిరుద్యోగాన్ని అనారోగ్య రుగ్మతలను ప్రపంచం నుండి పారద్రోల వచ్చును.

AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

ప్రశ్న 12.
ఈ క్రిందివాటిని ప్రపంచపటంలో గుర్తించుము.

  1. ఆస్ట్రియా
  2. సెర్బియా
  3. జపాన్
  4. చైనా
  5. అమెరికా
  6. రష్యా
  7. ఫ్రాన్స్
  8. ఇంగ్లండ్
  9. జర్మనీ
  10. ఇటలీ
  11. హంగేరీ
  12. టర్కీ
  13. బల్గేరియా
  14. రుమేనియా
  15. ఇండియా

AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 9

ప్రశ్న 13.
యుద్ద మరణాల గ్రాఫ్ ను పరిశీలించి, 1500 – 1999 మధ్య జరిగిన మరణాలను విశ్లేషించుము.
AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 1
యుద్ధ మరణాలు, మిలియన్లలో ప్రతి వెయ్యిమందికి మరణాలు
జవాబు:

  1. యుద్ధమరణాలు 1500-1999 గ్రాఫ్ ను పరిశీలిస్తే ఆందోళన కలిగించే విషయాలు విదితమవుతాయి.
  2. 1500-1599 మధ్య ప్రతి వెయ్యిమందికి చనిపోతున్న వారి సంఖ్య గమనిస్తే నలుగురు కంటే తక్కువ చనిపోయారు.
  3. 1900-1999 మధ్య మరణాలను పరిశీలిస్తే ఆందోళన కలిగించే అంశం ఏంటంటే, మొదటి, రెండవ ప్రపంచయుద్దాల వలన ప్రతి వెయ్యిమందికి 44 మంది వరకు చనిపోవడం గమనించవచ్చు. అంటే సుమారు 4.5% ప్రజలు.
  4. అత్యాధునిక అణుబాంబులు వంటివి యుద్ధంలో ప్రయోగించడం మూలంగా, లక్షల్లో సైనికులు మరణించడం వలన ఈ విపరీత పరిణామాలు ఏర్పడ్డాయి.
  5. ఈ మరణాలకు యుద్ధ బీభత్సమే కాకుండా ఆ తర్వాత పలు వ్యాధులు సోకిన రోగులు గాయపడ్డవారు క్రమేపి మరణించడం జరిగింది.

ప్రశ్న 14.
ప్రక్క ను పరిశీలించి వివిధ దేశాల మధ్య పెరిగిన ఆయుధ పోటీని విశ్లేషించుము.
AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 10
జవాబు:
ఇవ్వబడిన గ్రాఫు అధ్యయనం చేస్తే ఈ క్రింది అంశాలు తెలుస్తున్నాయి.

  1. 1880 వ సంవత్సరంలో 132 మిలియన్ పౌండ్లలో డబ్బును ప్రధాన దేశాలు ఆయుధాల తయారీకి ఉపయోగించినట్లుగా తెలుస్తుంది.
  2. 1890వ సంవత్సరంలో ఆయుధ పోటీ మూలంగా 158 మిలియన్ పౌండ్లు ఖర్చు పెట్టబడిందని తెలుస్తుంది.
  3. 1900లలో 205 మిలియన్ పౌండ్లు, 1910లో 288 మిలియన్ పౌండ్లు, 1914లో 397 మిలియన్ పౌండ్లు ఆయుధాల ఉత్పత్తి కొరకు అగ్రరాజ్యాలు ఉపయోగించాయి.
  4. ఆయుధాల ఉత్పత్తిని గమనించినట్లయితే ఈ అగ్రరాజ్యాలన్నీ కూడా తమ ఆదాయంలో అధిక భాగాన్ని ఆయుధ సేకరణ కొరకు వినియోగించారని తెలుస్తుంది. తద్వారా యుద్ధాలను కోరుకున్నాయని కూడా చెప్పవచ్చు.
  5. పైగా ఈ విధంగా ఆయుధ సేకరణ పెరగడానికి ముఖ్య కారణం “తమ దగ్గర ఎంత ఎక్కువ ఆయుధ సంపత్తి ఉంటే, అంత ఎక్కువ భద్రత” అనే భావన అయి ఉండవచ్చు.

కావున 1880 నుండి 1914 వరకు ఆయుధ ఉత్పత్తి కొరకు అత్యధిక ధనాన్ని వినియోగించారని ఈ గ్రాఫ్ ద్వారా తెలుస్తున్నది.

ప్రశ్న 15.
రెండవ ప్రపంచయుద్ధ సమయంలో జర్మనీ సామ్రాజ్యంలోని దేశాలను పట సహాయంతో గుర్తించుము.
జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 11

AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

These AP 10th Class Social Studies Important Questions 12th Lesson సమానత – సుస్థిర అభివృద్ధి will help students prepare well for the exams.

AP Board 10th Class Social 12th Lesson Important Questions and Answers సమానత – సుస్థిర అభివృద్ధి

10th Class Social 12th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium

1. ఉత్తరాఖండ్ లో ప్రారంభమైన చిప్కో ఉద్యమ ప్రధాన లక్ష్య మేమిటి?
జవాబు:
అటవీ సంరక్షణ.

2. ‘సైలెంట్ సింగ్’ అన్న పుస్తకములోని ఇతివృత్త మేమిటి?
జవాబు:
DDT వాడకం వల్ల కలిగే ప్రభావములు.

3. రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం నిషేధించిన రాష్ట్రమేది?
జవాబు:
సిక్కిం

4. ధారావి మురికివాడ ఏ నగరంలో ఉంది?
జవాబు:
ముంబయి.

5. ప్రపంచంలోనే అతి పెద్ద మురికివాడ ఏది?
జవాబు:
ధారావి.

AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

6. మొత్తంగా సేంద్రీయ వ్యవసాయానికి మారాలని నిర్ణయించుకున్న మొదటి రాష్ట్రం ఏది?
జవాబు:
సిక్కిం

7. ‘NBA’ అనగా?
జవాబు:
నర్మదా బచావో ఆందోళన్.

8. జీవితాన్ని పూర్తిగా ఆనందించటానికి కాలుష్య రహిత నీటిని, గాలిని పొందే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు 1991 సంవత్సరంలో ఇచ్చిన తీర్పు దేనికి (ఏ హక్కుకు) సంబంధించినది?
జవాబు:
జీవించే హక్కు

9. ‘జీవించే హక్కు’ను తెలియజేసే రాజ్యాంగ ప్రకరణ ఏది?
జవాబు:
21వ ప్రకరణ.

10. చిప్కో అనే పదానికి అర్థం ఏమిటి?
జవాబు:
హత్తుకోవడం.

11. ‘సైలెంట్ స్ప్రింగ్’ పుస్తకాన్ని రచించినది ఎవరు?
జవాబు:
రాచెల్ కార్సన్.

12. ‘సైలెంట్ స్పింగ్’ పుస్తకాన్ని ఏ సంవత్సరంలో ప్రచురించారు?
జవాబు:
1962.

13. భారత సుప్రీంకోర్టు వెలువరించిన అనేక ఆదేశాలు ప్రకారము ‘ప్రజా రవాణా’ వాహనాలన్నీ ఉపయోగించ వలసిన ఇంధనం ఏది?
జవాబు:
CNG (పీడనానికి గురిచేసిన సహజవాయువు)

AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

14. క్రింది వానిలో తప్పుగా జతచేయబడినది గుర్తించి రాయండి.
→ సైలెంట్ వ్యాలి – కేరళ
→ సేంద్రియ రాష్ట్రం – సిక్కిం
→ నర్మదాబచావో – కర్ణాటక
→ చిప్కో – ఉత్తరాఖండ్
జవాబు:
నర్మదాబచావో – కర్ణాటక.

15. క్రింది వాక్యాలను పరిగణించండి.
i) మొత్తంగా సేంద్రియ వ్యవసాయానికి మారాలని నిర్ణయించుకున్న మొదటి రాష్ట్రం సిక్కిం.
ii) 100 శాతం సేంద్రియ రాష్ట్రంగా మారే ఇదే పంథాని ఉత్తరాఖండ్ కూడా అనుసరిస్తోంది.
పై వాక్యాలలో సరైనది ఏది?
A) (i) మాత్రమే
B) (ii) మాత్రమే
C) (i) మరియు (ii)
D) రెండూ కావు
జవాబు:
C – (i) మరియు (ii)

16. నర్మదా బచావో ఆందోళన్ ముఖ్య ఉద్దేశ్యమేమి?
జవాబు:
పర్యావరణ పరిరక్షణ.

17. రసాయనిక ఎరువులు, పురుగు మందులు అధికంగా, ఇష్టానుసారంగా వాడినందువల్ల కలిగే దుష్పరిణామం కానిది.
A) భూసారం తగ్గుతుంది
B) నీటి కాలుష్యం (భూగర్భజలం)
C) పంట దిగుబడి పెరుగుతుంది.
D) పర్యావరణం క్షీణతకు గురౌతుంది.
జవాబు:
C) పంట దిగుబడి పెరుగుతుంది.

AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

18. “ప్రకృతి వనరుల దోపిడి చేయకుండా అభివృద్ధి అనేది సాధ్యం కాదు” ………
ఎ) ఇది అన్యాయమైన అభిప్రాయము.
బి) ఇది అన్యాయమైన అభిప్రాయము అయినా ఇదే వాస్తవం.
సి) ఇది అన్యాయము మరియు అవాస్తవం కూడా.
డి) అభివృద్ధికే తొలి ప్రాధాన్యం, ప్రకృతి పరిరక్షణ తర్వా త.
జవాబు:
బి – ఇది అన్యాయమైన అభిప్రాయము అయినా ఇదే వాస్తవం.

19. NBA ఉద్యమానికి కారణమైన ప్రధాన ఆనకట్ట ఏది?
జవాబు:
సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్.

20. పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలను తీర్చటానికి, పంటల దిగుబడిని పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే పంటల దిగుబడి పెంచటానికి అత్యంత పర్యావరణ హితమైన వ్యవసాయ విధానం ఏది?
జవాబు:
సేంద్రియ వ్యవసాయం (ప్రకృతి వ్యవసాయం).

21. చిప్కో ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన వారు ఎవరు?
జవాబు:
గ్రామీణ మహిళలు.

22. కాలుష్యాన్ని పర్యావరణం గ్రహించి ప్రమాద రహితంగా మార్చే పర్యావరణ విధి ఏది?
జవాబు:
శుద్ధి చేసే విధి.

23. సుమారుగా 300 జిల్లాల్లో గత 20 సంవత్సరాలలో భూగర్భ జలాలు ఎన్ని మీటర్ల మేర పడిపోయాయి?
జవాబు:
4 మీటర్లు.

24. చిప్కో ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరు?
జవాబు:
సుందర్లాల్ బహుగుణ.

AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

25. ప్రస్తుత తరం రాబోయే తరాలకు నాణ్యమైన జీవనం అందించటాన్ని ఏమంటారు?
జవాబు:
సుస్థిరాభివృద్ధి.

26. ప్రత్యామ్నాయ ప్రజా పంపిణీ వ్యవస్థకు (మెదక్ జిల్లాలో) తోడ్పడిన స్వచ్చంద సంస్థ ఏది?
జవాబు:
డెక్కన్ డెవలప్మెంట్ సొసైటి (DDS)

27. భారతదేశంలో నిషేధించిన పురుగుమందు ఏది?
జవాబు:
ఎండో సల్సాన్.

28. DDT ని విస్తరింపుము.
జవాబు:
డైక్లోరో డైఫినాల్ టైక్లోరో ఈథేన్.

29. జలసింధి గిరిజన భాష ఏది?
జవాబు:
భిలాలా.

30. ఈ భూమి మీద ఎన్నోరకాల మొక్కలు, జంతువులు మొ||న రకరకాల జీవులు ఉండటాన్ని ఏమంటారు?
జవాబు:
జీవ వైవిధ్యం

31. భారతదేశంలో వార్షిక ఆదాయం ఎంతకంటే తక్కువ ఉంటే నిమ్న వర్గాలుగా పేర్కొంటారు?
జవాబు:
₹1.5 లక్షల కంటే తక్కువ.

32. కాసర్ గోడ్ జిల్లా ఏ రాష్ట్రంలో కలదు?
జవాబు:
కేరళ.

33. చిప్కో ఉద్యమం ఏ సంవత్సరంలో ఆరంభమైంది?
జవాబు:
1970.

34. భారతదేశంలోని ఎంత శాతం జిల్లాల్లో చేతి పంపులలోని నీళ్లు తాగడానికి పనికిరావు?
జవాబు:
59%

35. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) కెన్యా ( ) a)మస్సాయి
ii) ఖజకిస్తాన్ ( ) b) యుర్తా
iii) టిబెట్ ( ) c) కియాంగ్
iv) దక్షిణ అమెరికా (d) గౌచా
జవాబు:
i – a, ii – b, iii – c, iv – d

AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

36. దక్కన్ పీఠభూమి మధ్య భాగం తక్కువ వర్షపాతాన్ని పొందుతుంది. దీనికి ప్రధాన కారణమేమి?
జవాబు:
ఇది వర్షచ్చాయ ప్రాంతంలో ఉండటం.

37. “మానవులు అభివృద్ధి, సంతోషం పేరుతో ప్రకృతిని నాశనం చేస్తున్నారు…….
→ A) అవునూ, మనం నేటి సంతోషాన్ని చూస్తున్నాం కాని రేపటి ఆపదను పట్టించుకోవటం లేదు.
→ B) నిజమే కానీ, అభివృద్ధి, సంతోషము తర్వాతే ఏమైనా.
→ C) ప్రకృతి సహజంగానే శుద్ధి చేసుకుంటుంది.
→ D) లేదు, అలా జరగడం లేదు.
జవాబు:
A) అవునూ, మనం నేటి సంతోషాన్ని చూస్తున్నాం కాని రేపటి ఆపదను పట్టించుకోవటం లేదు.

38. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) ధారావి ( ) a) ప్రత్యామ్నాయ ప్రజాపంపిణి
ii) జలసింధి ( ) b) సేంద్రియ వ్యవసాయము
iii) సిక్కిం ( ) c) నర్మదా బచావో
iv) జహీరాబాద్ ( ) d) మురికివాడ
జవాబు:
i – d, ii – c, iii – b, iv – a.

39. చిప్కో ఉద్యమం గురించి సరియైన వాక్యం కానిది.
→ ఉత్తరాఖండ్ లోని గఢీవాల్ కొండలలో ఆరంభమైంది.
→ 1970 లో ప్రారంభమైంది.
→ చిప్కో అంటే హత్తుకోవడం.
→ హింసాయుత పద్ధతుల్లో చెట్లను నరికి వెయ్యటాన్ని వ్యతిరేకించారు.
జవాబు:
హింసాయుత పద్ధతుల్లో చెట్లను నరికి వెయ్యటాన్ని వ్యతిరేకించారు.

40. కేరళలోని ఉత్తర ప్రాంతమైన కాసర్‌గోడ్ జిల్లాలో ఏ రసాయనిక పురుగు మందు జీడిమామిడి తోటల పైన పిచికారి చేయటం వల్ల 5,000 మంది మరణించడంతో పాటు, చాలా మందికి అవయవ లోపాలతోపాటు క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడుతున్నారు.
జవాబు:
(Endo Sulfan) ఎండో సల్సాన్.

41. శ్రామిక వర్గం ఎక్కువగా అవ్యవస్థీకృత రంగంలో ఉన్నప్పటికీ GDPలో పెరుగుదల దేనికి సూచిక?
జవాబు:
పెరుగుతున్న వస్తు సేవల ప్రయోజనం కొద్దిమందే పొందుతున్నారు.

42. మనం ఉపయోగించే పురుగు మందులో ఎంత శాతం పురుగుమీద ప్రభావం చూపుతుంది?
జవాబు:
1%

AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

43. జలసింధి గ్రామము ఏ రాష్ట్రంలో ఉంది?
జవాబు:
మధ్య ప్రదేశ్.

44. జలసింధి గ్రామము ఏ జిల్లాలో ఉంది?
జవాబు:
ఝాబువా.

45. “గుజరాత్ లోని మైదానాల్లోకి వెళ్లండి, మీ పరిస్థితి మెరుగుపడుతుంది, మీరు అభివృద్ధి చెందుతారు” అంటూ మీరు సలహాలు ఇస్తారు. కాని మేం ఎనిమిది సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం”. ఈ వాక్యం అన్నది ఎవరు?
జవాబు:
బావా మహాలియా.

46. క్రింది వానిలో సరియైన వాక్యం/లు ఎంచుకొని రాయండి.
i) ప్రజల ఆదాయాలు అవకాశాలలో అంతరాలు సమ సమాజ నిర్మాణానికి అడ్డంకి.
ii) అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండూ విరుద్ధ భావనలు.
పై వాక్యా లలో సరైనది ఏది?
A) (i) సత్యము
B) (ii) సత్యము
C) (i) మరియు (ii) సత్యము
D) రెండూ కావు
జవాబు:
A – (i) సత్యము

47. క్రింది వాక్యాలను పరిగణించండి.
i) సుస్థిర అభివృద్ధి అంటే భవిష్యత్తు తరాలు తమ అవసరాలను తీర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీయ కుండా ప్రస్తుత తరాల అవసరాలను తీర్చుకోవటం.
ii) ప్రస్తుత తరం యొక్క నాణ్యమైన జీవనాన్ని మాత్రమే సుస్థిర అభివృద్ధి కోరుకుంటుంది.
పై వాక్యా లలో సరైనది ఏది?
A) (i) మాత్రమే
B) (ii) మాత్రమే
C) (i) మరియు (ii)
D) రెండూ కావు
జవాబు:
C – (i) మరియు (ii)

48. క్రింది వాక్యాలను పరిగణించండి.
i) విధానాలను నిర్ణయించేవాళ్ళు అధిక ఆర్థిక అభివృద్ధి, సంపన్నత సాధించిన తరువాత కాలుష్యాన్ని, పర్యావరణ క్షీణతను పరిష్కరించవచ్చని భావించారు.
ii) అభివృద్ధి చెందిన దేశాల మాదిరి మనం కూడా వృద్ధి సాధించి వనరులను, ఇంధనాన్ని వినియోగిస్తే పర్యావరణ హితంగా భూమి వినాశనాన్ని అరికట్టవచ్చు.
పై వాక్యా లలో సరైనది ఏది?
A) (1) మాత్రమే
B) (ii) మాత్రమే
C) (i) మరియు (ii)
D) రెండూ కావు
జవాబు:
C – (i) మరియు (ii)

AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

క్రింది పట్టికను పరిశీలించి ఇచ్చిన ప్రశ్నకు సమాధానము రాయండి.
పట్టిక : భారతదేశంలో కొన్ని కీలక ఖనిజాల తవ్వకం (వేల టన్నులలో)

ఖనిజం1997-982008-09
బాక్సైట్6,10815,250
బొగ్గు2,97,0004,93,000
ఇనుప ఖనిజం75,723 2,23,544
క్రోమైట్1,5153,976

49. అతి తక్కువగా వెలికి తీసిన ఖనిజాలు ఏవి?
జవాబు:
బాక్సైట్, క్రోమైట్.

50. ఖనిజాలు అధికంగా వెలికితీయటం వలన కలిగే సమస్య కానిది.
→ అటవీ నిర్మూలన → కాలుష్యం అధికమవుతుంది → భవిష్యత్తు ఖనిజాల సమస్య → పారిశ్రామికాభివృద్ధి,
జవాబు:
పారిశ్రామికాభివృద్ధి.

51. క్రింది చిత్రంను పరిశీలించి, ఇది ఏ ఉద్యమంనకు సంబంధించినదో పేర్కొనండి.
AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి 2
జవాబు:
చిప్కో ఉద్యమం.

52. పర్యావరణ నేపధ్యంలో క్రింద ఇచ్చిన చిత్రానికి ఒక శీర్షిక రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి 3
జవాబు:
పర్యావరణ పరిరక్షణ – మన తక్షణ కర్తవ్యం (లేదా) పర్యావరణ పరిరక్షణకై ఉద్యమం.

53. సహజ వనరులను అందించటంలో పర్యావరణ సామర్థ్యాన్ని ఏ విధంగా పిలుస్తారు ?
జవాబు:
మేథాపాట్కర్.

AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

54. నర్మదా బచావో ఆందోళన్ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు ఎవరు?
జవాబు:
పర్యావనరుల సరఫరా విధి.

10th Class Social 12th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
సుస్థిర అభివృద్ధి అనగానేమి?
జవాబు:
భవిష్యత్ తరాలు తమ అవసరాలను తీర్చుకొనే సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా ప్రస్తుత తరాల అవసరాలను తీర్చుకుంటూ అభివృద్ధి సాధించడం.

ప్రశ్న 2.
రాచెల్ కార్సన్ పుస్తకం ‘సైలెంట్ స్ప్రింగ్’ ముఖ్య ఇతివృత్తం (Theme) ఏమిటి?
జవాబు:
దోమల నియంత్రణ కోసం డి.డి.టి. పిచికారి చెయ్యటం వల్ల మనుషులపై, పక్షులపై పడే ప్రభావం గురించి తెలియజేయడం.

ప్రశ్న 3.
భారతదేశంలో అన్నిచోట్ల అటవీ విస్తీర్ణం తగ్గిపోతున్నది. అటవీ నిర్మూలనను నిరోధించడానికి రెండు పరిష్కారాలను తెలియజేయండి.
జవాబు:
అటవీ నిర్మూలనను నిరోధించడానికి పరిష్కారాలు : –

  1. అడవుల నరికివేత నియంత్రించడం.
  2. వాల్టా చట్టాన్ని సమర్థవంతంగా అమలుపరచడం.

ప్రశ్న 4.
ఒకవేళ నీవే అడవుల నరికివేతను నివారించే అధికారివి అయివుంటే, దానికై నీవు తీసికొనే రెండు చర్యలను పేర్కొనుము.
జవాబు:
ఒక వేళ నేనే అడవుల నరికివేతను నివారించే అధికారిని అయివుంటే,

  • అటవీ చట్టాలను పకడ్బందీగా అమలుపరుస్తాను.
  • అటవీ సంరక్షణ గురించి ప్రజలను చైతన్యపరుస్తాను.

AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

ప్రశ్న 5.
చిప్కో ఉద్యమము యొక్క ఉద్దేశ్యము తెల్పండి.
జవాబు:
చిప్కో ఉద్యమము యొక్క ఉద్దేశ్యము : అటవీ పరిరక్షణ.

ప్రశ్న 6.
పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఏవేని నినాదాలు వ్రాయుము.
జవాబు:
పర్యావరణ పరిరక్షణ – నినాదాలు:

  1. పర్యావరణాన్ని కాపాడండి – ప్రపంచాన్ని కాపాడండి.
  2. మంచి పర్యావరణంతోనే – మంచి భవిష్యత్తు.

ప్రశ్న 7.
సుస్థిరాభివృద్ధి అనగా నేమి?
జవాబు:
సుస్థిరాభివృద్ధి :
సుస్థిరాభివృద్ధి అనగా భవిష్యత్తు తరాలు తమ అవసరాలను తీర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బ తీయకుండా ప్రస్తుత తరాల అవసరాలను తీర్చుకోవడం.

ప్రశ్న 8.
‘సైలెంట్ స్ప్రింగ్’ పుస్తకంలోని ప్రధాన అంశాన్ని తెల్పండి.
జవాబు:
దోమల నియంత్రణ కోసం డి.డి.టి. పిచికారి చెయ్యటం వల్ల మనుషులపై, పక్షులపై పడే ప్రభావం గురించి తెలియజేయడం.

ప్రశ్న 9.
ఉత్పత్తి ప్రక్రియలో సహాయపడే సహజ వనరులేవి?
జవాబు:
భూమి, నీరు, ఖనిజాలు, చెట్ల నుంచి వచ్చే ఉత్పత్తులు, పశువులు వంటివి ఉత్పత్తి ప్రక్రియలో సహాయపడే సహజ వనరులు.

ప్రశ్న 10.
భూగర్భజలాల వినియోగం ఏ ఏ ప్రాంతాలలో ఎక్కువగా ఉంది?
జవాబు:
వ్యవసాయపరంగా సంపన్నంగా ఉన్న పంజాబ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ లోను, మధ్య, దక్షిణ పీఠభూములలోని రాతి ప్రాంతాలలోనూ, కొన్ని కోస్తా ప్రాంతాలలోను, వేగంగా పెరుగుతున్న పట్టణ ప్రాంతాలలోనూ భూగర్భజలాల వినియోగం ఎక్కువగా ఉంది.

AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

ప్రశ్న 11.
సైలెంట్ స్ప్రింగ్ (నిశ్శబ్ద వసంతం) అనే పుస్తకాన్ని రచించినదెవరు?
జవాబు:
సైలెంట్ స్ప్రింగ్ (నిశ్శబ్ద వసంతం) అనే పుస్తకాన్ని రచించింది : రాచెల్ కార్సన్ అనే మహిళ.

ప్రశ్న 12.
జలసింధి గ్రామంలో ఇళ్ళ నిర్మాణం ఎలా చేపడతారు?
జవాబు:
అడవిలో దొరికే టేకు, వెదురుతో ఇళ్ళు నిర్మించుకుంటారు. నింగోండి, హియాలీ రకం వెదురును చీల్చి తడికలు అల్లుతారు.

ప్రశ్న 13.
వ్యవసాయంలో మేలు చేసే జంతుమిత్రులు ఎవరు?
జవాబు:
జంతువులు : పాము, వానపాము, బల్లి, తొండ, ఊసరవెల్లి, ఉడుం మొ||నవి.

ప్రశ్న 14.
వ్యవసాయంలో మేలు చేసే పక్షుల మిత్రులు ఎవరు?
జవాబు:
పక్షులు :
పోలీస్ పిట్ట, గోరింక, బయోపిచ్చుక, గుడ్లగూబ, కొంగ, పాలపిట్ట.

ప్రశ్న 15.
వ్యవసాయంలో కీడుచేసే శత్రు పక్షులు, జంతువులు ఏవి?
జవాబు:
పక్షులు :
పిచ్చుక, చిలుక

జంతువులు :
ఎలుక, ఉడుత, ‘కుందేలు, మొ||నవి.

ప్రశ్న 16.
ప్రాథమికరంగ కార్యకలాపాలు ఏవి?
జవాబు:
వ్యవసాయం, గనుల తవ్వకం, చేపల పెంపకం ప్రాథమిక రంగ కార్యకలాపాలు.

ప్రశ్న 17.
ఆర్థికాభివృద్ధిలో పర్యావరణం అందించే సామర్థ్యాన్ని ఏమంటారు?
జవాబు:
వనరులను అందించటంలో పర్యావరణ సామర్థ్యాన్ని “పర్యావరణ వనరుల సరఫరా విధి” అంటాం.

ప్రశ్న 18.
పర్యావరణం నిర్వర్తించే ముఖ్య విధి ఏమిటి?
జవాబు:
వివిధ కార్యక్రమాల ద్వారా విడుదలయ్యే వ్యర్థాలను శుద్ధిచేసి, ప్రమాదరహితంగా చేయటం.

AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

ప్రశ్న 19.
రాచెల్ కార్సన్ రాసిన పుస్తకమేది? అందులో ఏముంది?
జవాబు:
రాచెల్ కార్సన్ అన్న మహిళ “సైలెంట్ స్ప్రింగ్” (నిశ్శబ్ద వసంతం) అన్న పుస్తకం రాసింది. దోమల నియంత్రణ కోసం డిడిటి పిచికారీ చెయ్యటం వల్ల మనుష్యులపైన, పక్షుల పైనా పడే ప్రభావం గురించి వివరించింది.

ప్రశ్న 20.
ఎండోసల్ఫాన్ పురుగుమందు దుష్ఫలితాలేవి?
జవాబు:
గాలి, నీళ్ళు, మొత్తం పర్యావరణం ఎండోసల్ఫాతో కలుషితమైనది. ప్రజల మీద దాని ప్రభావం ఎక్కువగా పడింది.

ప్రశ్న 21.
జలసింధి గ్రామంలో పశుసంపద ఏది?
జవాబు:
జలసింధి గ్రామంలో పశుసంపద కోళ్ళు, గొర్రెలు, ఆవులు, గేదెలు. దాదాపు ప్రతి ఒక్కరికి 10-20-40 మేకలు ఉన్నాయి.

ప్రశ్న 22.
చిప్కో ఉద్యమం ఎందుకు మొదలైంది?
జవాబు:
చెట్లు నరకటాన్ని అడ్డుకుని, గుత్తేదార్లు, కాంట్రాక్టర్ల నుంచి ముప్పును ఎదుర్కొంటున్న గఢ్ వాల్ కొండవాసుల సంప్రదాయ అటవీ హక్కుల కోసం చిప్కో ఉద్యమం ప్రారంభమైంది.

ప్రశ్న 23.
సుస్థిర పద్ధతుల్లో ఆహార ఉత్పత్తి, దాని పంపిణీకి ఉదాహరణనిమ్ము.
జవాబు:
సుస్థిర పద్ధతుల్లో ఆహార ఉత్పత్తి, దాని సమాన పంపిణీకి చక్కని ఉదాహరణ ప్రత్యామ్నాయ ప్రజాపంపిణీ వ్యవస్థ. దీనిని . తెలంగాణలోని జహీరాబాద్ ప్రాంతంలో ప్రజాబృందాలు చేపట్టాయి.

ప్రశ్న 24.
ప్రత్యామ్నాయ ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా చేపట్టే కార్యక్రమాలు ఏవి?
జవాబు:
వర్షాధార భూములను సాగులోకి తేవడం, పంట బయట అమ్మకుండా గ్రామస్థాయిలో ప్రజాధాన్య బ్యాంకు ప్రారంభించడం, ప్రజాపంపిణీ వ్యవస్థ మాదిరి పనిచేయడం ప్రత్యామ్నాయ ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా చేపట్టే కార్యక్రమాలు.

ప్రశ్న 25.
హరిత విప్లవం ద్వారా ఏ ఏ పంటలకు ప్రాధాన్యం ఇచ్చారు?
జవాబు:
హరిత విప్లవం ద్వారా గోధుమ, వరికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ పంటల ఆహారధాన్యాలే ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా చౌకధరల దుకాణాలలో లభించేవి.

ప్రశ్న 26.
మిశ్రమ పంటల వలన లాభమేమి?
జవాబు:
మిశ్రమ పంటల వల్ల ఒక పురుగు తీవ్ర నష్టం కలిగించే స్థాయికి చేరకుండా నిరోధింపబడుతుంది. సాగుచేసే పంటల నేలకి, మనుషులకు, పశువులకు సమతుల పోషకాహారాన్ని ఇచ్చేలా ఎంపిక చేస్తారు.

ప్రశ్న 27.
సేంద్రియ వ్యవసాయం వల్ల లాభమేమి?
జవాబు:
సేంద్రియ వ్యవసాయం వల్ల జీవవైవిధ్యం పెరుగుతుంది. ఒకటి, రెండు పంటలే కాకుండా అనేక పంటలను సాగుచెయ్యవచ్చు. హానికరమైన పురుగులను తినే జీవులను ప్రోత్సహించడం కూడా సాధ్యమవుతుంది.

ప్రశ్న 28.
ప్రాథమిక హక్కులలోని జీవించే హక్కు ఏమి చెబుతుంది?
జవాబు:
ప్రాథమిక హక్కులలోని జీవించే హక్కు జీవితాన్ని పూర్తిగా ఆనందించటానికి కాలుష్యరహిత నీటిని, గాలిని పొందే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

ప్రశ్న 29.
అభివృద్ధికి కొలబద్దలుగా వేటిని పరిగణిస్తారు?
జవాబు:
అభివృద్ధికి కొలబద్దగా తలసరి ఆదాయం, స్థూల జాతీయోత్పత్తులకంటే మానవ అభివృద్ధి సూచిక మెరుగైనది.

ప్రశ్న 30.
HDI అనగానేమి?
జవాబు:
HDI : Human Development Index (మానవ అభివృద్ధి సూచిక).

ప్రశ్న 31.
భూగర్భజలాల పునరుద్ధరణ అనగానేమి?
జవాబు:
భూమిలోనికి ఇంకిపోయిన నీటిని తోడుకోవడానికి వీలుగా చేయడాన్ని ‘భూగర్భజలాల పునరుద్ధరణ’ అంటారు. దీనికి ఎక్కువగా వర్షం సహకరిస్తుంది.

10th Class Social 12th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
భారతదేశంలో కొన్ని కీలక ఖనిజాల త్రవ్వకమును సూచించు పట్టికను పరిశీలించండి.
పట్టిక : ఖనిజాల త్రవ్వకం (వేల టన్నులలో)

ఖనిజం1997-982008-09
బాక్సైట్6,10815,250
బొగ్గు2,97,0004,93,000
ఇనుప ఖనిజం75,723 2,23,544
క్రోమైట్1,5153,976

పై పట్టికను పరిశీలించి, గనుల త్రవ్వకము వేగంగా అభివృద్ధి చెందటం వల్ల పర్యావరణానికి ఏ విధమైన నష్టము జరుగుతుందో విశ్లేషించండి.
జవాబు:

  1. ఖనిజాలు అధికంగా వెలికితీయటం వలన అనేక పర్యావరణ సమస్యలు ఉత్పన్నమవుతాయి.
  2. ఉష్ణోగ్రతలు పెరిగి మనుషులకు సమస్యలు ఏర్పడతాయి.
  3. అటవీ ప్రాంతాలు, వివిధ జంతువులు, పక్షులు, జీవరాసులు నశిస్తాయి.
  4. కాలుష్యం అధికమవుతుంది.
  5. మృత్తికా క్రమక్షయం జరిగి జలాశయాలలో ఇసుక మేట వేయడం జరుగుతుంది.

AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

ప్రశ్న 2.
పర్యావరణ పరిరక్షణను గురించి ప్రజలను చైతన్య పరచడానికి రెండు నినాదాలు రాయండి.
జవాబు:
“పర్యావరణాన్ని కాపాడితే – ప్రపంచాన్ని కాపాడినట్లే”
“చెట్లను రక్షించండి – కాలుష్యాన్ని నివారించండి.”
“భూమిని రక్షించండి – మీ జీవితాన్ని కాపాడుకోండి.”

ప్రశ్న 3.
ఒక దేశ అభివృద్ధిలో పర్యావరణ ప్రాముఖ్యతను తెలియజేయుము.
జవాబు:
ఒక దేశ అభివృద్ధిలో పర్యావరణ ప్రాముఖ్యత :

  1. భూమి, నీరు, ఖనిజాలు వంటి సహజ వనరుల లభ్యత.
  2. చెట్లు, పశువుల నుంచి వచ్చే ఉత్పత్తులు.
  3. ప్రాథమిక, ద్వితీయ మరియు తృతీయ రంగాలు సహజ వనరులు మీద ఆధారపడి ఉంటాయి.
  4. వాతావరణ కాలుష్యం దేశ అభివృద్ధికి నిరోధకంగా ఉంటుంది.

ప్రశ్న 4.
సేంద్రీయ వ్యవసాయం జీవవైవిధ్యాన్ని ఎలా పెంపొందింస్తుందో తెలపండి.
జవాబు:

  1. సేంద్రీయ వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగుమందులను వినియోగించరు.
  2. పర్యావరణానికి అనుకూలంగా ఉండే వ్యవసాయ పద్ధతులను పాటిస్తారు.
  3. పంట మార్పిడి, కంపోస్టు వినియోగము, స్థానికవనరులను వినియోగించడం వంటి పద్ధతులను పాటిస్తారు.
  4. సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న కొన్ని సేవలు విస్తరించాయి.

ప్రశ్న 5.
నేటి కాలంలో సుస్థిరాభివృద్ధిపై దృష్టి నిలపవలసిన అవసరమెందుకు ఏర్పడింది?
జవాబు:

  • ప్రస్తుత, భవిష్యత్ తరాల అవసరాలు తీర్చడం
  • ప్రస్తుత, రాబోయే తరాలకు నాణ్యమైన జీవనాన్ని అందించడం
  • భూసార సంరక్షణ
  • నీటి కాలుష్యం కాకుండా చూడడం
  • పరిశ్రమలు వెదజల్లే విషవాయువుల నియంత్రణ

ప్రశ్న 6.
‘సుస్థిర అభివృద్ధి’ ప్రాముఖ్యతపై కరపత్రం తయారు చేయండి.
జవాబు:
సుస్థిర అభివృద్ధి’ ప్రాముఖ్యతపై కరపత్రం

భవిష్యత్తు తరాలు తమ అవసరాలను తీర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా ప్రస్తుత తరాల అవసరాలను తీర్చటమే సుస్థిర అభివృద్ధి, మెరుగైన జీవన ప్రమాణాలు కేవలం మన కొరకే కాదు భవిష్యత్తు తరాల వారికీ అవసరం. ప్రస్తుత అభివృద్ధి భావన ఆ విధంగా ఉండటం లేదు.

ఆర్థికాభివృద్ధి, పారిశ్రామికీకరణ పేరుతో ప్రకృతి వనరులను ధ్వంసం చేసే తీరు చూస్తోంటే రాబోయే తరాలు తమ అవసరాలకై ఎన్ని ఇబ్బందులకు గురవుతారో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. సహజ వనరులైన నీరు, గాలి, నేల మొదలైన వాటిని ఉపయోగించుకొనే హక్కు అన్ని తరాలకూ వుంటుంది. మనం దీనిని దృష్టిలో ఉంచుకొని వ్యవహరించకుండా వనరులను, ఇంధనాన్ని విచక్షణా రహితంగా వినియోగిస్తున్నాము.

సహజ వనరులు మనకు ఏ మేరకు అవసరమో ఆ మేరకే వినియోగించాలి. ఈ భావన ప్రజలందరిలో విస్తృతంగా వ్యాపించాలి. వేగవంతమైన ఆర్థికాభివృద్ధి వల్ల అనేక రంగాలలో ఇప్పటికే మనం వ్యతిరేక పరిణామాలను చవిచూస్తున్నాం. పర్యావరణంపై ఆధారపడి అనేక వేల సమూహాలు నివసిస్తున్నాయి. పర్యావరణాన్ని విధ్వంసం చెయ్యటమంటే ఈ సమూహాలను మట్టు పెట్టడమే.

కావున ప్రభుత్వం ఈ విషయమై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి. పర్యావరణానికి హాని తలపెట్టేవారిపై, పర్యావరణ చట్టాలను ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రగతితోపాటు పర్యావరణ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. పేదరికం నుండి బయటపడటానికి పర్యావరణరీత్యా సుస్థిర మార్గాన్ని కనుగొనాలి. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి, సమానతతో కూడిన సుస్థిర అభివృద్ధి భావన సఫలమయ్యే విధంగా తగిన చర్యలు చేపట్టడం ఆవశ్యకం.

ప్రశ్న 7.
పర్యావరణ ‘వనరుల సరఫరా విధి’ మరియు ‘శుద్ధి చేసే విధి’ ల మధ్య తేడా తెల్పండి.
జవాబు:
పర్యావరణ ‘వనరుల సరఫరా విధి’ మరియు ‘శుద్ధి చేసే విధి’ ల మధ్య గల తేడా :

పర్యావరణ ‘వనరుల సరఫరా విధి’:
సహజవనరులను అందించడంలో పర్యావరణమునకు గల సామర్థ్యాన్ని “పర్యావరణ వనరుల సరఫరా విధి” అంటారు. పర్యావరణ శుద్ధి చేసే విధి : కాలుష్యాన్ని గ్రహించి ప్రమాదరహితంగా మార్చడంలో పర్యావరణమునకు గల సామర్థ్యాన్ని పర్యావరణ శుద్ధిచేసే విధి అంటారు.

ప్రశ్న 8.
సహజ వనరులను వేగంగా సంగ్రహించడం భవిష్యత్తు అభివృద్ధి అవకాశాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? వివరించండి.
జవాబు:
సహజ వనరులను వేగంగా సంగ్రహించడం వల్ల భవిష్యత్తు అభివృద్ధి అవకాశాలపై కలిగే ప్రభావం :

  1. సహజ వనరులను పరిమితికి మించి వినియోగించడం మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కోవడం వంటిది.
  2. అది భవిష్యత్ అభివృద్ధిని తీవ్రంగా దెబ్బతీస్తుంది.
  3. పునరుద్ధరించడానికి సాధ్యంకాని సహజవనరులను ఒక్కసారి పూర్తిగా వాడేస్తే భవిష్యత్తు తరాలకు జీవించడమే అసాధ్యమవుతుంది.
  4. సహజవనరులను కొల్లగొట్టడం ద్వారా చేసే అభివృద్ధి మారువేషంలో ఉన్న విధ్వంసమే అని చెప్పవచ్చు.

ప్రశ్న 9.
సేంద్రియ వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ కరపత్రము తయారు చేయండి.
జవాబు:
సేంద్రియ వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత
సేంద్రియ వ్యవసాయాన్ని ప్రకృతి సిద్ధమైన పర్యావరణ అనుకూలమైన జీవాధారిత వ్యవసాయంగా వర్ణించవచ్చు.

సేంద్రియ వ్యవసాయం జీవుల వైవిధ్యాన్ని, జీవుల వివిధ దశలను మరియు నేలలో గల సూక్ష్మజీవుల పనితనాన్ని వృద్ధి పరుస్తుంది. ముఖ్యంగా ప్రాంతీయంగా లభించే వనరులతో వ్యవసాయం చేయుటకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ హానికర రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని విస్మరిస్తూ సేద్య, జీవ సంబంధ మరియు యాంత్రిక పద్ధతులతో F.A.O., W.H.D., పరిధి ప్రాప్తికి వ్యవసాయం చేయుటకు అవకాశం కల్పిస్తుంది.

సేంద్రియ వ్యవసాయం వలన మనకు చాలా లాభాలు ఉన్నాయి.

  1. నేల సంరక్షించబడుతుంది.
  2. అతి తక్కువ లోతులో దుక్కి చేయగలము. దీని వలన సూక్ష్మజీవులు, ప్లవకాల సంఖ్య (ఫోరా, ఫానా) ఎక్కువగా ఉంటుంది.
  3. మిశ్రమ పంటలు : దీని వలన పురుగుల తాకిడిని తగ్గించగలము.
  4. పంటమార్పిడి : దీని వలన నేలను ఆరోగ్యంగా ఉంచగలము. సూక్ష్మజీవులు సహజసిద్ధంగా పనిచేయుటకు దోహదపడుతుంది.
  5. సేంద్రియ పదార్థములను పునరుత్పత్తి చేయగలము. కావున ప్రభుత్వము ప్రజలను సేంద్రియ వ్యవసాయ పద్ధతులు

వైపు ప్రోత్సహించవలెను. సేంద్రియ వ్యవసాయం వలన ప్రజలలో ప్రబలుతున్న రోగాలను నిరోధించవచ్చును. ప్రజలకు పౌష్టిక ఆహారాన్ని అందించగలము.

ముగింపు :
ప్రస్తుతం వ్యవసాయదారులు లాభాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ దిగుబడి కోసం కొన్ని రకాలైన రసాయనిక విధానాలను అనుసరించడం వలన నేల సారాన్ని కోల్పోవడమే కాకుండా వారు పర్యావరణాన్ని కాలుష్యానికి గురిచేస్తూ వారు అనారోగ్యం పాలవుతున్నారు.

నా విజ్ఞప్తి ఏమిటంటే వ్యవసాయదారులు అందరూ సేంద్రియ వ్యవసాయాన్ని అనుసరిస్తే మన సమాజానికి, దేశానికి చాలా మేలు చేసినవారు అవుతారు.
కాపీల సంఖ్య : 2500
” ప్రచురణ కర్త :
సంక్షేమ సంస్థ

AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

ప్రశ్న 10.
ముఖ్యమైన పర్యావరణ సమస్యలేవి?
జవాబు:
కాలానుగుణంగా మానవ వినియోగంలో మార్పు వల్ల పర్యావరణపరంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం.

  1. పురుగుమందుల వినియోగం
  2. శిలాజ ఇంధనాల మీద ఆధారపడటం
  3. వ్యవసాయంలో రసాయనిక ఎరువుల వినియోగం
  4. భూగర్భజలాలు తరిగిపోవడం
  5. కాలుష్యం పెరుగుతుండడం
  6. శీతోష్ణస్థితిలో మార్పు

ప్రశ్న 11.
పర్యావరణం నిర్వర్తించే అతి ముఖ్యమైన విధి ఏది?
జవాబు:
పర్యావరణం నిర్వర్తించే ముఖ్యమైన విధి ఏమనగా, వివిధ కార్యక్రమాల ద్వారా విడుదలయ్యే. వ్యర్థాలను శుద్ధిచేసి, ప్రమాదరహితంగా చేయటం. ఉత్పత్తి, వినియోగాలలో నిరుపయోగమైన ఉప ఉత్పత్తులు, ఉదాహరణకు ఇంజన్ల నుండి వెలువడే పొగ, శుభ్రం చెయ్యటానికి ఉపయోగించిన నీళ్ళు, పారేసిన అట్టపెట్టెలు, వస్తువులు వంటి వాటిని పర్యావరణం శుభ్రం చేస్తుంది.

ప్రశ్న 12.
దోమల నియంత్రణ కోసం డిడిటి పురుగుమందు కలిగించే అనర్థాలు ఏవి?
జవాబు:
డిడిటి పురుగుమందులోని భారలోహాలు పర్యావరణంలో కరిగిపోకుండా జీవులలో పేరుకునిపోతాయి. డిడిటి ఉన్న నీళ్ళు చెరువులలోకి చేరి కలుషితం చేసినప్పుడు డిడిటి లోని విషపదార్థం ఆ చెరువుల్లోని చేపల్లో పేరుకోవటం మొదలవుతుంది. ఆ ఈ విష మోతాదు తక్కువగా ఉండి చేపలు చనిపోవు. కానీ ఒక పక్షి అనేక చేపలను తిన్నప్పుడు వాటన్నిటిలో ఉండే అధిక విషమోతాదు ఆ పక్షిని చంపటానికి కారణమవుతుంది.

ప్రశ్న 13.
జలసింధి గ్రామంలో ప్రజలు పండించే పంటలేవి?
జవాబు:
జలసింధి గ్రామంలో ప్రజలు వారి యొక్క శ్రమతోనే వ్యవసాయం చేస్తారు. పశువుల నుంచి వచ్చే ఎరువునే వాడి నాణ్యమైన విత్తనాలను వాడుతారు. వీరికి ప్రధాన ఆహారం మొక్కజొన్న, వారి యొక్క అటవీ భూమిలో సజ్జలు, జొన్నలు, శనగలు, మిటికెలు, మినుములు, నువ్వులు, పల్లీలు పండిస్తారు.

ప్రశ్న 14.
జలసింధి గిరిజన గ్రామం యొక్క ఆరాధ్య దేవతలు ఎవరు? వారు జరుపుకొనే పండుగలు ఏవి?
జవాబు:
జలసింధి గిరిజన గ్రామంలో వారి యొక్క పూర్వీకులు చనిపోయిన తర్వాత ఒక పెద్దరాతిని పెట్టి వారి జ్ఞాపకార్థం పూర్వీకులను పూజిస్తారు.

కాలో రానో, రాజా పాంతో, ఇంది రాజాలను పూజిస్తారు. ఆయి ఖాడా, భేడు బాయిని కూడా పూజిస్తారు. రాణి కాజోల్ వారి పెద్ద దేవత. ఇందల్, దివస, ధివాలి వంటి పండుగలు జరుపుకోటానికి అందరూ ఉత్సాహం చూపుతారు.

ప్రశ్న 15.
బావా మహాలియా ఆవేదనను క్లుప్తంగా రాయండి.
జవాబు:
బావా మహాలియా జలసింధి గ్రామ గిరిజన నాయకుడు. సర్దార్ సరోవర్ ఆనకట్ట వలన తమ గ్రామం ముంపునకు గురవుతుందని భావించి, ఆవేదనతో ముఖ్యమంత్రికి ఉత్తరం ద్వారా వివరిస్తూ, అడవే తమకు ఆధారమని, అడవిలోని ప్రతి చెట్టు, పొద, మొక్క పేరు తెలుసని, వాటి ఉపయోగాలు కూడా తెలుసంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కష్టాన్నే నమ్ముకొని, శ్రమ ద్వారా వ్యవసాయం చేసి, సంప్రదాయ ఆచారాలకు విలువనిస్తూ జంతువులతో మచ్చిక చేసుకొని, అడవితో కలిసిపోయామని ఆవేదన చెందాడు.

ప్రశ్న 16.
సేంద్రియ వ్యవసాయం గూర్చి రాయండి.
జవాబు:
వ్యవసాయ రంగంలో సేంద్రియ పద్దతులు సారవంతమైనవి. సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు రసాయనిక ఎరువులు, పురుగుమందులను వినియోగించరు. ఇందుకు బదులుగా పంటమార్పిడి, పెంటపోగు ఎరువు పురుగుల జైవిక నియంత్రణ వంటి సహజ పద్దతులను అవలంబిస్తారు. ఈ విధానంలో ముఖ్యమైన లక్షణం స్థానిక వనరులను వినియోగించటం, మిత్ర, కీటకాలను రక్షించడం.

ప్రశ్న 17.
రసాయనిక పురుగుల మందు పర్యావరణంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో వివరించండి.
జవాబు:

  1. రసాయనిక పురుగుల మందు వినియోగం పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
  2. ఒక స్థాయిని మించిన విషపదార్థాలను పర్యావరణం జీర్ణించుకోలేదు.
  3. పురుగుల మందులలోని భారలోహాలు పర్యావరణంలో కరిగిపోకుండా జీవులలో పేరుకొనిపోతాయి.
  4. గాలి, నీళ్ళు, మొత్తం పర్యావరణం ఎండోసల్ఫాతో ప్రభావితమైన ఘటన కేరళలోని కాసర్ గోలో జరిగింది.

ప్రశ్న 18.
భారతదేశంలో శతకోటీశ్వరులకు ఉన్న మొత్తం సంపద (బిలియన్ రూ॥లలో) గ్రాఫ్ రూపంలో వివరించుము.
జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి 4
భారతదేశంలో శతకోటీశ్వరులకు ఉన్న మొత్తం సంపద (బిలియన్ రూ||లలో)

ప్రశ్న 19.
భారతదేశంలో శతకోటీశ్వరుల (బిలియనీర్ల) సంఖ్య పెరుగుదలను సూచించే గ్రాఫ్ గీయండి.
జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి 5
భారతదేశంలో శతకోటీశ్వరులు (బిలియనీర్ల) సంఖ్య పెరుగుదల

ప్రశ్న 20.
అభివృద్ధికి కొలబద్దగా మానవ అభివృద్ధి సూచికను (HDI) తీసుకోవడం ఎంతవరకు సమంజసం?
జవాబు:

  1. అభివృద్ధికి కొలబద్దగా తలసరి ఆదాయం , స్థూల జాతీయోత్పత్తి కంటే మానవాభివృద్ధి సూచిక మెరుగైనది.
  2. ఉత్పత్తి, ఆదాయాలు వేగంగా పెరుగుతున్నప్పటికీ అధిక శాతం ప్రజలు పోషకాహార లోపంతోనూ, విద్యా, వైద్య సదుపాయాలు అందని పరిస్థితులు ఉంటున్నాయి.
  3. అయితే అభివృద్ధిలో సామాజిక సూచికలైన విద్య, వైద్యం వంటివి చోటుచేసుకొనేలా మానవ అభివృద్ధి సూచిక చూస్తుంది.

ప్రశ్న 21.
‘పర్యావరణ వనరుల సరఫరా విధి’ గురించి వివరించండి.
జవాబు:

  1. ఉత్పత్తి ప్రక్రియలో భూమి, నీరు, ఖనిజాలు, చెట్ల నుంచి వచ్చే ఉత్పత్తులు, పశువులు వంటి సహజవనరులు ఎంతో ముఖ్య మైనవి.
  2. వ్యవసాయం, గనుల తవ్వకం వంటి ప్రాథమికరంగ కార్యకలాపాల్లోనే కాకుండా తయారీ, ఇంధన రంగాలలో కూడా సహజ వనరుల మీద ఉత్పత్తి ప్రధానంగా ఆధారపడి ఉంది.
  3. ఆర్థిక వ్యవస్థలోని ఇతర రంగాలు కూడా వివిధ స్థాయిలలో సహజ వనరుల మీద ఆధారపడి ఉన్నాయి.
  4. ఈ వనరులను అందించడంలో పర్యావరణ సామర్థ్యాన్ని ‘పర్యావరణ వనరుల సరఫరా విధి’ అంటారు.

AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

ప్రశ్న 22.
తక్కువ ఆదాయం వచ్చేవారి శాతం ఎక్కువగా ఉన్నప్పుడు స్థూల జాతీయోత్పత్తి పెరుగుతూ ఉండడం అంటే పెరుగుతున్న వస్తువులు, సేవలవల్ల కొద్దిమంది మాత్రమే ప్రయోజనం పొందుతున్నారని అర్థం. దీనిని చదివి, వ్యాఖ్యానించండి.
జవాబు:

  1. ఒక దేశంలో ఉత్పత్తి అవుతున్న వస్తువులు, సేవల విలువను GDP సూచిస్తుంది.
  2. అయితే అభివృద్ధిని కేవలం వస్తువులు, సేవల ఉత్పత్తికే పరిమితం చెయ్యలేం.
  3. ఉత్పత్తి, ఆదాయాలు పెరిగినపుడు కూడా తక్కువ ఆదాయం వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటే దానివల్ల వారు ప్రయోజనం పొందలేదని అర్థం.
  4. అయితే పెరిగిన స్థూల జాతీయోత్పత్తి వల్ల కొద్దిమందే ప్రయోజనం పొందితే అది హర్షణీయం కాదు.

ప్రశ్న 23.
శుద్ధిచేయు విధి అనగానేమి?
జవాబు:
పర్యావరణం నిర్వర్తించే వాటిలో ఒక విధిని శుద్ధిచేయు విధి అంటారు.

వివిధ కార్యక్రమాల ద్వారా విడుదలయ్యే వ్యర్థాలను శుద్ధిచేసి, ప్రమాదరహితంగా చేయటం. ఉత్పత్తి వినియోగాలలో నిరుపయోగమైన ఉప ఉత్పత్తులు – ఉదాహరణకు ఇంజన్ల నుండి వెలువడే పొగ, శుభ్రం చెయ్యటానికి ఉపయోగించిన నీళ్ళు, పారేసిన పనికిరాని అట్టపెట్టెలు, వస్తువులు వంటి వాటిని పర్యావరణం శుభ్రం చేస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విధి. కాలుష్యాన్ని పర్యావరణం గ్రహించి ప్రమాదరహితంగా మార్చే శక్తిని, ‘శుద్ధిచేయు విధి’ అని అంటారు.

10th Class Social 12th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
క్రింది గ్రాఫ్ చిత్రపటమును పరిశీలించండి.
AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి 1
భారతదేశంలోని సమాజ అంతరాలను గురించి క్లుప్తంగా వివరించండి.
జవాబు:

  1. భారతదేశంలో 30 లక్షల కుటుంబాలకు ఆదాయం 17 లక్షలకు పైగా ఉంది.
  2. 3 కోట్ల 10 లక్షల కుటుంబాలకు ఆదాయం 3.4 లక్షల రూపాయల నుండి 17 లక్షల రూపాయల వరకు ఉంది.
  3. 7 కోట్ల 10 లక్షల కుటుంబాలకు ఆదాయం 1.5 లక్షల నుండి 3.4 లక్షల రూపాయల మధ్య ఉంది.
  4. 13 కోట్ల 50 లక్షల కుటుంబాలకు ఆదాయం 1.5 లక్షల కంటే తక్కువగా ఉంది.
  5. మనదేశంలో 90% పైగా ప్రజలు అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారు.
  6. పై చిత్రాన్ని పరిశీలిస్తే ధనికులు మరింత ధనవంతులుగానూ, పేదవారు మరింత పేదవారుగానూ మారుతున్నారు.
  7. ఆదాయంలోనూ, సంపదలోనూ మరియు అవకాశాలలోనూ అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
  8. ఈ ఆదాయ అసమానతలు సమసమాజానికి అవరోధంగా ఉన్నాయి.

ప్రశ్న 2.
ఈ క్రింది పేరా చదివి నీ అభిప్రాయం రాయుము.
స్థానిక పర్యావరణం నుండి నిర్వాసితులు కావటం వల్ల నష్టపోయేది ప్రజలు ఒక్కరే కాదన్నది ముఖ్యంగా గుర్తించాలి. ప్రజలతోపాటు సాంప్రదాయ జ్ఞానం మాయమైపోతుంది. సుసంపన్నమైన పర్యావరణ జీవ వైవిధ్యత అంతరించిపోతుంది.
జవాబు:
నిర్మించిన ఆనకట్టలలోకెల్లా సర్దార్ సరోవర్ అతి పెద్దది. దీనివల్ల 37,000 హెక్టార్ల అడవి, వ్యవసాయ భూమి ముంపునకు గురి అవుతుంది. అయిదు లక్షలకు పైగా ప్రజలు దీనివల్ల నిర్వాసితులు అవుతున్నారు. భారతదేశంలోని అత్యంత సారవంతమైన నేలలు దీనివల్ల నాశనం అవుతాయి. వేలాది ఎకరాలలో అటవీ ప్రాంతం, వ్యవసాయ భూమి ముంపునకు గురికావటం వలన జీవ వైవిధ్యత మానవ జీవితాలు ధ్వంసం అయ్యాయి. నిర్వాసితులలో ఎక్కువ శాతం ఆదివాసీలు, దళితులు.

పర్యావరణం అందుబాటులో ఉన్నప్పుడు దానినుంచి వాళ్ళ అనేక అవసరాలు తీరతాయి. అదే లేకపోతే వీటికి డబ్బులు చెల్లించాల్సి వస్తుంది.

నిర్వాసితులైనందువల్ల పర్యావరణం అందుబాటులో లేకుండా పోయినా, లేదా అది కలుషితమైనా, విధ్వంసమైనా ‘ ఎక్కువగా నష్టపోయేది పేదవాళ్ళే. పర్యావరణం, సుస్థిరత అన్న అంశాలు సమానత అన్న అంశంతో బలంగా ముడిపడి ఉన్నాయి.

ప్రశ్న 3.
ప్రజల జీవనశైలి పర్యావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది ? పర్యావరణ పరిరక్షణకై నీవు ఏ సూచనలు ఇస్తావు?
జవాబు:

  1. అత్యంత ఆనందంగా జీవితాన్ని గడపడానికి ప్రస్తుతకాలంలో మానవుడు ప్రయత్నిస్తున్నాడు.
  2. కనీసం బజారు నుండి కూరగాయలు తీసుకురావడానికి కూడా తన చేతిలో గుడ్డ సంచిని తీసుకుని వెళ్ళకుండా దుకాణదారులు ఇచ్చే ప్లాస్టిక్ సంచిని వాడుతున్నాడు.
  3. ప్లాస్టికను అతిగా ఉపయోగించడం వల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుంది.
  4. వాహనాలు, ఎ.సి.లు, ఫ్రిట్లు మొదలగు వాటి వినియోగం పెరగడం వలన వాటి నుండి వెలువడే విషవాయువులు పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి.
  5. అడవుల నరికివేత, రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం ఎక్కువై భూమి, నీరు, గాలి కలుషితమవుతున్నాయి.

పర్యావరణ పరిరక్షణకు సూచనలు :

  1. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి.
  2. తక్కువ దూరాలకు సైకిళ్ళను ఉపయోగించడం.
  3. రసాయన ఎరువుల, పురుగుమందుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ ఎరువులను వాడడం.
  4. చెట్లను పెంచడాన్ని ప్రోత్సహించాలి.

ప్రశ్న 4.
ఈ పట్టికను పరిశీలించి, క్రింది ప్రశ్నలకు జవాబులు రాయుము.

భారతదేశంలో కొన్ని కీలక ఖనిజాల తవ్వకంలో పెరుగుదల (వేల టన్నులలో)
ఖనిజం1997-982008-09
బాక్సెట్6,10815,250
బొగ్గు2,97,0004,93,000
ఇనుప ఖనిజం75,7232,23,544
క్రోమైట్1,5153,976

a) పై పట్టికలోని వివరాలు దేనిని తెలియజేస్తాయి?
b) ఇతర ఖనిజాలతో పోల్చినప్పుడు ఏ ఖనిజము యొక్క వెలికితీత 2008-09 నాటికి రెండింతల కన్నా ఎక్కువ కాలేదు?
C) గనుల తవ్వకం పెరగడానికి కారణాలేమై ఉంటాయి?
d) గనుల తవ్వకం వేగంగా వృద్ధి చెందటం వల్ల పర్యావరణానికి, మనుషులకు ఏ విధమైన నష్టాలు జరుగుతాయి?
జవాబు:
a) పై పట్టికలోని వివరాలు భారతదేశంలో కొన్ని కీలక ఖనిజాల తవ్వకంలోని పెరుగుదలను తెలియజేస్తాయి.
b) ఇతర ఖనిజాలతో పోల్చితే ‘బొగ్గు’ యొక్క వెలికితీత 2008-09 నాటికి రెండింతల కన్నా ఎక్కువ కాలేదు.

c) గనుల తవ్వకం పెరగడానికి కారణాలు :

  • పరిశ్రమల సంఖ్య విరివిగా పెరగటం.
  • గనుల తవ్వకంలో యంత్రాల వాడకం.
  • వినియోగం పెరగడం, జనాభా పెరగడం వల్ల వస్తువుల వినియోగం పెరగడం.
  • మానవులు సంపాదనకై (దురాశ) అర్రులు చాస్తు ఖనిజాలను విపరీతంగా తవ్వి పారేస్తున్నారు.

d) గనులు వేగంగా తవ్వటం వల్ల నష్టాలు :

  • అడవులు అంతరించిపోయి పర్యావరణం దెబ్బతింటుంది.
  • నదుల ప్రవాహ దిశ మారటం, ఫలితంగా తరచుగా వరదలు రావటం సంభవిస్తాయి.
  • ఖనిజ వనరులు భవిష్య తరాలకు మిగలవు. తత్ఫలితంగా ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకోవాలి. విదేశీ మారక ద్రవ్యం ఖర్చయిపోతుంది.

AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

ప్రశ్న 5.
మీ ప్రాంతంలోని పర్యావరణ సమస్యలపై మీ జిల్లా కలెక్టర్‌కు ఉత్తరం రాయుము.
జవాబు:

సింగ్ నగర్,
విజయవాడ.
తేదీ : 9 సెప్టెంబర్, 20xx.

గౌరవనీయులైన కలెక్టరు గారికి,
నా పేరు ……………….. నేను సింగ్ నగర్ లో నివసిస్తున్నాను. మా ప్రాంతంలో ఉన్న పర్యావరణ సమస్యల గురించి మీకు తెలియపరుస్తున్నాను.

మా ప్రాంతంలో వలస కూలీల సంఖ్య పెరిగింది. వారు వారి అవసరాలు తీర్చుకోవడానికి నగరానికి వచ్చి ఇక్కడ క్రొత్త సమస్యలను సృష్టిస్తున్నారు. నీటి సరఫరా కొరత, మురికివాడల పెరుగుదల, వ్యర్థ పదార్థాలను రోడ్ల మీద పడవేయడం వల్ల రవాణా మరియు కాలుష్యం పెరిగి పర్యావరణం దెబ్బతింటుంది. ప్లాస్టిక్ కవర్లను ఎక్కడ పడితే అక్కడ రోడ్లమీద వదలివేయడం, వాటిని తిన్న చాలా జంతువులు మరణించాయి. చెత్తాచెదారం పెరిగింది. దానిని సరిగా శుభ్రం చేయడం లేదు. భయంకరమైన దుర్గంధం వెలువడుతుంది. ఇవి వివిధ రకాల రోగాలకు కారణమవుతున్నాయి.

నేను చేసుకునే విన్నపం ఏమిటంటే వీటిని బాగుచేయించటంతోపాటు కాలుష్యాన్ని కలిగించే పరిశ్రమలు ఊరికి దూరంగా ఏర్పాటుచేయడం వలన మరియు కాలుష్యానికి కారణం అవుతున్న వాహనాలను కూడా నిలిపివేయవలసినదిగా ప్రార్థిస్తున్నాను.

మీయందు విధేయత గల,
……………………………………….

చిరునామా:
జిల్లా కలెక్టర్,
విజయవాడ.

ప్రశ్న 6.
వ్యవసాయంలో జీవవైవిధ్యత భారతీయ రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెల్పుము.
జవాబు:
వ్యవసాయంలో జీవవైవిధ్యత భారతీయ రైతులకు ఈ క్రింది విధంగా ఉపయోగపడుతుంది.

వ్యవసాయ రంగంలో సేంద్రీయ రైతులు రసాయనిక ఎరువులు, పురుగు మందులను వినియోగించరు. ఇందుకు బదులుగా పంటమార్పిడి, పెంట పోగు ఎరువు, పురుగుల జైవిక నియంత్రణ వంటి సహజ పద్దతులను వీళ్ళు అవలంబిస్తారు. సేంద్రియ వ్యవసాయంలో ముఖ్యమైన ఒక లక్షణం లైనిక వనరులను వినియోగించటం. ఉదాహరణకు హానికరమైన పురుగులను తినే జీవులను అనగా పక్షులు, సాలీళ్ళు, మేలుచేసే పురుగులను ప్రోత్సహించటం, పోషకాలను మొక్కలకు అందుబాటులోకి తెచ్చే నేలలోని సూక్ష్మజీవులను అనగా రైజోబియం, అజటోబాక్టర్ వంటి వాటిని పెంపొందించటం. కృత్రిమ రసాయనక పదార్థాల వినియోగాన్ని సాధ్యమైనంతగా తగ్గిస్తారు. అలాగే ఒకటి రెండు పంటలు మాత్రమే కాకుండా అనేక పంటలను సాగుచెయ్యటం వల్ల, జీవవైవిధ్యత పెరుగుతుంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులలో సాధించిన ఉత్పత్తిని ఈ పద్ధతులలోనూ పొందవచ్చు.

ప్రశ్న 7.
“అభివృద్ధిని సాధించడంలో పర్యావరణ అంశాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి” – వివరించండి.
జవాబు:

  1. అభివృద్ధిని సాధించడంలో పర్యావరణ అంశాలను తప్పనిసరిగా దృష్టిలో ఉంచుకోవాలి.
  2. అభివృద్ధిని సాధించే క్రమంలో వనరులను అతివేగంగా వినియోగించడం వలన పర్యావరణ వనరుల సరఫరా విధి దెబ్బతింటుంది.
  3. ఎక్కువ మోతాదులో వ్యర్థ పదార్థాలు ఉత్పన్నమవుతూ ఉండడం వలన పర్యావరణానికి దీర్ఘకాల నష్టం కలుగుతుంది.
  4. భారీ ప్రాజెక్టుల వలన జీవవైవిధ్యతకి హాని కలుగుతుంది.
  5. ఆధునిక వ్యవసాయంలో భాగంగా ఉపయోగిస్తున్న రసాయన ఎరువులు, పురుగుమందులు పర్యావరణానికి నష్టం కలిగిస్తాయి.
  6. పారిశ్రామికాభివృద్ధిలో ఉపయోగిస్తున్న ఇంధనం, వాయుకాలుష్యానికి దారితీస్తుంది.
  7. భూగర్భ జలాలు అంతరించిపోతున్నాయి.
  8. అడవులు నరికివేయబడుతున్నాయి.
  9. నిమ్న ఆదాయ దేశాల, భవిష్యత్ తరాల హక్కులని కూడా దృష్టిలో ఉంచుకోవాలి.

ప్రశ్న 8.
క్రింది పేరాగ్రాఫ్ ను చదివి, అర్ధం చేసుకొని, దానిపై మీ అభిప్రాయం రాయండి.
పారిశ్రామికీకరణ వల్ల కొంతమందికి అనేక వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. అయితే దీని ఫలితంగా ప్రపంచ సహజ వనరులు అంతరించి పోతున్నాయి. వాతావరణం కూడా అతలాకుతలమయిపోతుంది. ఈ రకమైన వృద్ధి ఎంతో కాలం కొనసాగలేదు.
జవాబు:
పారిశ్రామికీకరణ ఫలితంగా మానవుడు సుఖజీవనం సాగించడానికి ఎన్నో వస్తువులు, సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. మానవుడు గనుల తవ్వకం ద్వారా వచ్చిన లోహాలతో గుండుసూది మొదలు విమానం వరకు ఆవిష్కరించాడు. అయితే మానవునికి దూరదృష్టి లేని కారణంగా ఖనిజాలు వేగంగా అంతరించిపోతున్నాయి. మానవుని అత్యాశ ఫలితంగా సహజ వనరులు, ఖనిజాలు, శిలాజ ఇంధనాలు తరిగిపోతున్నాయి. ఈ వనరులను అధికంగా వినియోగించడం వల్ల వాతావరణం పెను మార్పులకు గురవుతూ అతలాకుతలమవుతోంది.

ఆర్థిక అభివృద్ధిని సాధించే క్రమంలో పారిశ్రామికీకరణ పేరిట పర్యావరణ వనరులను ఇంతకుముందు కనీవినీ ఎరుగని రీతులలో ఉపయోగిస్తూ నాశనం చేస్తున్నారు. అడవులను నరికివేస్తున్నారు. నేల కోతకు గురవుతోంది. భూగర్భజలాలు తరిగిపోతున్నాయి. కాలుష్యం తీవ్ర స్థాయిలో పెరుగుతోంది. ఇంకా ఇతర పర్యావరణ సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి. ఈ రకమైన వృద్ధి ఎంతోకాలం కొనసాగలేదు. ఇది సుస్థిర అభివృద్ధికి విరుద్ధమైనది. పారిశ్రామికంగా ముందంజ వేస్తూనే పర్యావరణ పరిరక్షణ చేయడం మనందరి ముందున్న తక్షణ కర్తవ్యం.

AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

ప్రశ్న 9.
మన జీవితాలు అనేక విధాలుగా పర్యావరణంపై ఆధారపడి ఉన్నాయి. వివరించండి.
జవాబు:
మన జీవితాలు అనేక విధాలుగా పర్యావరణంపై ఆధారపడి ఉన్నాయి.

  • మానవుడు అత్యంత ఆవశ్యకమైన ఆహారం, ప్రాణవాయువు (0) ఆవాసం కొరకు ఎల్లప్పుడు పర్యావరణం పైనే ఆధారపడి ఉండాల్సి ఉంటుంది.
  • పేదరికాన్ని తగ్గించటానికి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచటానికి, అధిక GDP ని సాధించటానికి ప్రకృతి వనరులనే ఎక్కువగా వినియోగించాల్సి ఉంది.
  • పారిశ్రామికాభివృద్ధికై మనం గనుల త్రవ్వకం, అడవుల నిర్మూలన, వాతావరణ కాలుష్యం తప్పనిసరియైంది.
  • వ్యవసాయాభివృద్ధికి, అధిక దిగుబడులకుగాను (హరిత విప్లవం) రసాయన ఎరువులు, పురుగు మందులు విరివిగా వాడుతూ భూ, జల కాలుష్యం చేస్తున్నాం.
  • ఈ విధంగా దేశ, మానవ అభివృద్ధి నెపంతో పర్యావరణంపై విపరీతంగా ఆధారపడిపోతూ, పర్యావరణానికి అత్యంత నష్టం వాటిల్లేలా ప్రవర్తిస్తున్నాం.

కాబట్టి

  • విరివిగా చెట్లను పెంచడాన్ని ప్రోత్సహించాలి, చెట్లను నరకడాన్ని నేరంగా ప్రకటించాలి. ఆ ప్లాస్టిక్ వినియోగాన్ని మానివెయ్యాలి, గుడ్డ, జూట్ సంచులు వాడాలి.
  • రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగంను తగ్గించి సేంద్రియ ఎరువులు (ప్రకృతి వ్యవసాయం) వాడాలి.
  • వాహనాలు, ఎ.సిలు, ఫ్రిజ్ ల వాడకం అత్యంత కనిష్ఠంగా వాడాలి.

ప్రశ్న 10.
చిప్కో ఉద్యమం గూర్చి రాయుము.
జవాబు:
చిప్కో ఉద్యమం ఉత్తరాఖండ్ లోని గడవాల్ కొండలలో ఛమోలి జిల్లాలోని గోపేశ్వర్ పట్టణంలో ఒకానొక శుభోదయాన ప్రారంభమైంది. ఇది ఒక పర్యావరణ ఉద్యమం. అటవీ ప్రాంతంలో నివసించే ప్రజలకు ఆయా అడవులు ప్రత్యక్షంగా ఆహారం, కట్టెపుల్లలు, పశువుల మేత ఇవ్వటమే కాకుండా పరోక్షంగా నేల, నీటి వనరులను సుస్థిరపరచటంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. వ్యాపారం, పరిశ్రమల కోసం అడవులను నరకటం తీవ్రరూపం దాల్చటంతో తమ జీవనోపాధులను కాపాడుకోడానికి అహింసా పద్ధతులలో వ్యతిరేకించాలని ప్రజలు చిప్కో ఉద్యమం చేపట్టారు. ‘చిప్కో’ అంటే హత్తుకోవడం (కౌగిలించుకోవడం). చెట్లను పల్లెవాసులు హత్తుకొని కాంట్రాక్టర్లు, గుత్తేదార్ల గొడ్డళ్ళకు అడ్డుగా నిలిచారు. ఈ ఉద్యమంలో ‘గౌరీదేవి’ అను మహిళ నాయకత్వంలో మహిళలు ప్రధానపాత్ర పోషించారు.

ప్రశ్న 11.
ఆర్థిక అభివృద్ధిని సాధించే క్రమంలో పర్యావరణ పరంగా, సామాజికంగా ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించవచ్చని పాలకులు భావించారు?
జవాబు:
అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో పేదరికం ఉంది కాబట్టి ఆర్థికాభివృద్ధి అవసరమని పాలకులు భావించారు. పర్యావరణ పరంగా ఎన్ని విపరీత పరిణామాలున్నా అభివృద్ధి మాత్రం తప్పనిసరి తలచారు. పేదరికాన్ని తగ్గించడానికి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచటానికి, ఆధునిక పరిశ్రమలలోనూ, స్థూల జాతీయోత్పత్తిలోను అభివృద్ధి సాధించడం అవసరమనే నిశ్చయానికి వచ్చారు. అధిక ఆర్థికాభివృద్ధి, సంపన్నత సాధించిన తరువాత కాలుష్యాన్ని, పర్యావరణ క్షీణతను పరిష్కరించవచ్చని ఆశించారు. డబ్బు ఖర్చు చేసి నదులను, గాలిని శుభ్రపరచవచ్చని, సీసాలలోని నీళ్ళు త్రాగవచ్చని, ఇంధనాన్ని పొదుపుగా వినియోగించే వాహనాలను రూపొందించవచ్చని పాలకులు భావించారు.

ప్రశ్న 12.
అధిక ఆర్థికాభివృద్ధి, సంపన్నత పేరుతో జరిగే పర్యావరణ నష్టాలను క్లుప్తంగా వివరించండి.
జవాబు:
ఆర్థిక అభివృద్ధి, సంపన్నత, పారిశ్రామికీకరణ పేరుతో పర్యావరణం తీవ్ర క్షీణతకు గురైంది. వనరులను, ఇంధనాన్ని వినియోగించి, పర్యావరణాన్ని కలుషితం చేయడం వలన భూమి వినాశనానికి లోనైంది. పర్యావరణానికి జరిగిన హానిని తిరిగి సరిదిద్దగల స్థితిలో మనం లేం. జరిగిన నష్టాన్ని పర్యావరణం తనంతట తాను సరిచేసుకుంటుందన్న భావన సరైంది కాదు. భవిష్యత్తు తరాలు జరిగిన నష్టాన్ని సరిదిద్దగలిగినా ఇప్పుడు చేసిన కాలుష్యాన్ని తొలగించడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. భూగర్భజలాలు, రసాయనిక పురుగుమందుల సమస్యలు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు.

ప్రశ్న 13.
భారతదేశంలో భూగర్భజల వినియోగంలో జరిగే విపరీత పరిణామాలను వివరించుము.
జవాబు:
మన దేశంలో భూగర్భజల వనరులను అధికంగా వినియోగించడం వల్ల తీవ్ర సంక్షోభంలో ఉన్నాం. మన దేశంలో మూడవ వంతు ప్రాంతంలో భూగర్భజలాల పునరుద్దరణకంటే ఆ నీటి వినియోగం ఎక్కువగా ఉంది. సుమారుగా 300 జిల్లాల్లో గత 20 సంవత్సరాలలో భూగర్భజలాలు 4 మీటర్ల మేర పడిపోయాయి. ప్రస్తుతం భూగర్భజలాలు కొన్ని – వందల అడుగుల లోతుకు వెళ్ళిపోయాయి. దీనినిబట్టి భూగర్భ నీటిని చాలా ఎక్కువగా వాడుకుంటున్నామని తెలుస్తుంది. పీఠభూములలోని రాతి ప్రాంతాలలోనూ, కొన్ని కోస్తా ప్రాంతాలలోనూ, వేగంగా పెరుగుతున్న పట్టణ ప్రాంతాలలోనూ భూగర్భజలాల వినియోగం చాలా ఎక్కువగా ఉంది. భూగర్భజలాలు తగ్గిపోవడమే కాదు. వాటి నాణ్యత కూడా తగ్గిపోతున్నది. మన దేశంలో 59% జిల్లాల్లో చేతి పంపులలోని నీళ్ళు తాగటానికి పనికిరావు.

ప్రశ్న 14.
భారతదేశంలో నర్మదాలోయ అభివృద్ధి పథకం వలన జరిగే పర్యావరణ సమస్యలేవి?
జవాబు:
ప్రపంచంలోని అతి పెద్ద జల విద్యుత్ ప్రాజెక్టులలో ఇది ఒకటి. మన దేశంలో నర్మదా లోయ అభివృద్ధి పథకం అతి పెద్ద ఆనకట్ట. దీనివల్ల విద్యుత్ ఉత్పత్తి, సాగునీటి వసతి, వరదల నియంత్రణ వంటి ప్రయోజనాలున్నా పర్యావరణ పరంగా.. ఎదురయ్యే సమస్యలే ఎక్కువ. అవి:

  1. ఈ ప్రాజెక్టులోని 3000 పెదా, చిన్నా ఆనకట్టల వల్ల పర్యావరణానికి జరిగే నష్టం ఎంతో ఎక్కువ.
  2. నిర్మించిన ఆనకట్టలలో కెల్లా సర్దార్ సరోవర్ అతిపెద్దది.
  3. దీనివల్ల 37,000 హెక్టార్ల అడవి, వ్యవసాయ భూమి ముంపునకు గురి అవుతుంది.
  4. 5 లక్షలకు పైగా ప్రజలు నిర్వాసితులు అవుతున్నారు.
  5. జీవవైవిధ్యం, మానవ జీవితాలు ధ్వంసం అయ్యాయి.
  6. నిర్వాసితులైన వాళ్ళలో అధిక శాతం ఆదివాసీలు, దళితులు.

AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

ప్రశ్న 15.
ఈ క్రింది వాటిని భారతదేశ పటంలో గుర్తించుము.
1) ముంబయి.
2) హైదరాబాద్
3) మధ్యప్రదేశ్
4) గుజరాత్
5) తమిళనాడు
6) కేరళ
7) పంజాబ్
8) ఉత్తరప్రదేశ్
9) నర్మదానది
10) సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్
11) ఆంధ్రప్రదేశ్
12) ఢిల్లీ
AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి 7

ప్రాజెక్టు

సేంద్రియ వ్యవసాయం నేపథ్యంలో మీరు పెంటపోగు ఎరువు గురించి చదివారు. మీ బడిలో, ఇంటి దగ్గర ప్రయత్నించటానికి తేలికైన పద్ధతి ఇదిగో :
* ఒక పెద్ద పాత్ర తీసుకుని అధికంగా ఉన్న నీళ్లు పోవటానికి కింద భాగంలో రంధ్రాలు చెయ్యండి.
* కొబ్బరి పీచు ఒక పొర వేయండి. అధికంగా ఉన్న నీళ్లు పోటానికి ఇది దోహదం చేస్తుంది.
* ఒక పలచటి మట్టి పొరతో దీనిని కప్పండి.
* కూరగాయల పొట్టు ఇతర వ్యర్థ పదార్థాలను ఒక పొర లాగా వెయ్యండి.
* మరొక పొర మట్టి వెయ్యండి.
* కూరగాయల వ్యర్థాలను మళ్లీ పొరలాగా వెయ్యండి.
* మట్టితో కప్పుండి.
* వారం రోజుల తరువాత దీంట్లోకి వానపాములను ప్రవేశ పెట్టండి.
* ఇది కుళ్లిన తరువాత మీ తోటలో కావలసిన మొక్కలు పెంచటానికి ఈ మట్టిని ఉపయోగించండి.

AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

These AP 10th Class Social Studies Important Questions 11th Lesson ఆహార భద్రత will help students prepare well for the exams.

AP Board 10th Class Social 11th Lesson Important Questions and Answers ఆహార భద్రత

10th Class Social 11th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium

1. ప్రభుత్వము ఆహార ధాన్యాల నిల్వకోసం, ప్రధానంగా గోధుమలు, బియ్యం దేని ద్వారా సేకరిస్తుంది?
జవాబు:
FCI

2. కనీస మద్దతు ధరను ఎవరు నిర్ణయిస్తారు?
జవాబు:
ప్రభుత్వం

3. పోషకాహార సమస్యను అధిగమించుటకై పాఠశాలల్లో అమలవుతున్న పథకం ఏది?
జవాబు:
మధ్యాహ్న భోజన పథకం.

4. రోజుకు పట్టణ ప్రాంత ప్రజలు తీసుకోవలసిన ఆహారంలో కేలరీలు ఎన్ని?
జవాబు:
2100 కేలరీలు.

5. రోజుకు గ్రామీణ ప్రాంత ప్రజలు తీసుకోవలసిన ఆహారంలో కేలరీలు ఎన్ని?
జవాబు:
2400 కేలరీఅం.

6. అంత్యోదయ కార్డు కుటుంబాలకు, నెలకు కుటుంబానికి ఎన్ని కిలోల ఆహార ధాన్యాలు అందజేస్తారు?
జవాబు:
35 కిలోలు.

AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

7. జాతీయ ఆహార భద్రతా చట్టం ఏ సంవత్సరంలో చేసారు?
జవాబు:
2013.

8. తక్కువ ఆదాయ వర్గాల వారికి ఆహార ఉత్పత్తులను సరఫరా చేయునది.
జవాబు:
ప్రజాపంపిణీ వ్యవస్థ.

9. 2018 – జాతీయ ఆహార భద్రత చట్టం ప్రజల యొక్క ఏ హక్కుకు చట్టబద్ధత కల్పిస్తోంది?
జవాబు:
ఆహారం పొందే హక్కు

10. మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు పరచిన మొదటి రాష్ట్రం ఏది?
జవాబు:
తమిళనాడు.

11. జాతీయ పోషకాహార సంస నెలకొని ఉన్న ప్రదేశం ఏది?
జవాబు:
హైద్రాబాద్.

12. 1943 – 45 సంవత్సరాలలో ఏ రాష్ట్రంలో తీవ్రమైన కరువు ఏర్పడింది?
జవాబు:
బెంగాల్.

13. (సంవత్సరంలో లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు + జనాభా) / 365 =?
జవాబు:
తలసరి ఆహార ధాన్యాల లభ్యత.

14. తలసరి ఆహార ధాన్యాల లభ్యత ఎక్కువగా కలిగి ఉన్న దేశం ఏది?
జవాబు:
అమెరికా.

15. జొన్న, సజ్జ, రాగి, గోధుమలలో చిరు లేదా తృణ ధాన్యం కానిది ఏది?
జవాబు:
గోధుమ.

16. ఏ రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ చక్కగా పనిచేస్తుందని అధ్యయనాలు తెల్పుతున్నాయి?
జవాబు:
తమిళనాడు.

AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

17. ఆహార ధాన్యాల కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయించు ధర నేమంటారు?
జవాబు:
కనీస మద్దతు ధర.

18. అంగన్ వాడీకి వచ్చే పిల్లల వయసు ఏ సంవత్సరాల మధ్య ఉంటుంది?
జవాబు:
1- 6 సంవత్సరాలు

19. ప్రపంచంలో కెల్లా అత్యంత పెద్ద పాఠశాల భోజన పథకం ఏ దేశంలో అమలవుతుంది?
జవాబు:
భారత్ లో

20. భారతదేశ గ్రామీణ ప్రాంతాలలో ఎంత శాతం ప్రజలు కేలరీల దృష్ట్యా తినవలసిన దానికంటే తక్కువ ఆహారం తీసుకుంటున్నారు?
జవాబు:
80%

21. ఆహార ధాన్యాల దిగుబడి పెంచటం కోసం చేపట్టిన కార్యక్రమంను ఏమన్నారు?
జవాబు:
హరిత విప్లవం.

22. భారతదేశంలో ప్రజల మొత్తం వినియోగంలో ఎంత శాతం బియ్యం, ఎంత శాతం గోధుమలు చౌకధరల దుకాణాల నుంచి కొనుగోలు చేస్తున్నారు, వరుసగా………
జవాబు:
39%, 28%

23. BMI ని విస్తరింపుము
జవాబు:
శరీర బరువు సూచిక (బాడీ మాస్ ఇండెక్స్)

24. FCI ని విస్తరింపుము.
జవాబు:
భారత ఆహార సంస్థ (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)

25. MSP ని విస్తరింపుము
జవాబు:
కనీస మద్దతు ధర (మినిమం సపోర్ట్ ప్రెస్)

AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

26. PDSని విస్తరింపుము.
జవాబు:
ప్రజా పంపిణీ వ్యవస్థ. (పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్)

27. ఆరోగ్యవంతుని BMI (సాధారణ BMI )ఎంత?
జవాబు:
18.5.

28. బరువు చాలా తక్కువగా ఉన్న తీవ్ర పరిస్థితి మొత్తం మీద ఎంత శాతం పిల్లల్లో ఉంది?
జవాబు:
16%.

29. BMI 25 కంటే ఎక్కువ ఉంటే ఎలా పరిగణిస్తారు?
జవాబు:
ఊబకాయం

30. రోజుకు ప్రతి వ్యక్తి 300 మి.లీ. పాలు తీసుకోవలసి ఉండగా ఎన్ని మి. లీ. మాత్రమే లభ్యత ఉంది?
జవాబు:
210 మి.లీ.

31. సంవత్సరంలో ప్రతి వ్యక్తి 180 గ్రుడ్లు తీసుకోవలసి ఉండగా ఎన్ని లభ్యత ఉన్నాయి?
జవాబు:
30

32. పురుషులలో తీవ్ర శక్తిలోపం ఎంత శాతం, ఊబకాయం ఎంత శాతంగా ఉంది?
జవాబు:
35%, 10%.

33. మహిళల్లో తీవ్ర శక్తి లోపం ఎంత శాతం, ఊబకాయం ఎంత శాతంగా ఉంది?
జవాబు:
35%, 14%

34. సగటున ప్రతి వ్యక్తికి, ప్రతిరోజూ లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు =?
జవాబు:
(సంవత్సరానికి లభ్యతలో ఉన్న ఆహారధాన్యాలు ÷ జనాభా) / 365.

35. ఒక టన్నుకి ఎన్ని కిలోలు?
జవాబు:
1000 కిలోలు.

AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

36. అందరిలో శారీరక శ్రమ, కష్టమైన పనులు చేసేది ఏ ప్రాంతవాసులు?
జవాబు:
గ్రామీణ ప్రాంత వాసులు.

37. భారత ప్రభుత్వం భారత ఆహార సంస్థ ద్వారా కొని నిల్వచేసే ఆహార ధాన్యాలను ఏవిధంగా పిలుస్తారు?
జవాబు:
బఫర్ నిల్వలు.

38. శారీరక ఎదుగుదలకు, కణజాల పునరుద్దరణ కోసం దోహదం చేసేవి ఏవి?
జవాబు:
చిక్కుళ్ళు, పప్పులు, మాంసం, గ్రుడ్లు.

39. 3 – 5 సంవత్సరాల పిల్లల్లో తక్కువ బరువు ఉన్న పిల్లలు గుజరాత్ రాష్ట్రంలో ఎంత శాతం మంది ఉన్నారు?
జవాబు:
58%

40. 3 – 5 సంవత్సరాల పిల్లల్లో తక్కువ బరువు ఉన్న పిల్లలు కేరళ రాష్ట్రంలో ఉన్నారు. అయితే ఎంత శాతం మంది కేరళలో ఉన్నారు?
జవాబు:
24%

41. వయోజనులైన స్త్రీ, పురుషులలో పోషకాహార స్థాయిని దేనితో కొలుస్తారు?
జవాబు:
శరీర బరువు సూచికతో.

42. మహిళలలో భారతదేశంలోని ఒడిశా, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, కేరళ ఏ రాష్ట్రంలో అధికశక్తి లోపం ఉన్న మహిళలు తక్కువగా ఉన్నారు?
జవాబు:
కేరళ.

43. తలసరి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో యూరప్ లో లభ్యతలో ఉన్నది ఎంత?
జవాబు:
200 గ్రా||లు.

AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

44. కింది వాక్యాలను పరిగణించండి.
i) రోజుకు పట్టణ ప్రాంతాల్లో 2100 కాలరీలు, గ్రామీణ ప్రాంతాల్లో 2400 కేలరీలు శక్తిని ఇచ్చే ఆహారాన్ని తీసుకోవాలి.
ii) కాలరీల వినియోగం 1983 తో పోలిస్తే 2004
నాటికి పెరిగింది.
పై వాక్యా లలో సరైనది ఏది?
A) (i) మాత్రమే
B) (ii) మాత్రమే
C) (i) మరియు (ii)
D) రెండూ కావు
జవాబు:
A – (i) మాత్రమే

45. 2010-11 సంవత్సరంలో హెక్టారుకు ‘వరి’ దిగుబడి ఎన్ని కిలోలు?
జవాబు:
2250 కిలోలు.

46. 2010 – 11 సంవత్సరంలో హెక్టారుకు ‘గోధుమ’ దిగుబడి ఎన్ని కిలోలు?
జవాబు:
3000 కిలోలు.

47.
AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత 1
జవాబు:
శరీర బరువు సూచిక (BMI)

48. హరిత విప్లవం వలన బాగా దిగుబడి పెరిగిన పంట ఏది.
జవాబు:
గోధుమ.

49. ప్రజా పంపిణీ వ్యవస్థలో అత్యంత పేదలకు ఇవ్వబడిన కార్డు ఏది?
జవాబు:
అంత్యోదయ కార్డు.

50. ICDS ను విస్తరింపుము.
జవాబు:
సమగ్ర శిశు సంక్షేమాభివృద్ధి సంస్థ.

51. పోషకాహార స్థాయిని సూచించే ప్రమాణం ఏది?
జవాబు:
BMI

52. భారత దేశంలో సగటున ప్రతి వ్యక్తికి రోజుకు అందుబాటులో ఉన్న కూరగాయలు?
జవాబు:
58 గ్రా.

53. భారతదేశంలో ఏ రాష్ట్రంలో అమూల్ డైరీ కలదు?
జవాబు:
గుజరాత్

AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

54. క్రింది వానిలో సరి అయిన జతను గుర్తించండి.
→ ఆహార ధాన్యాల ఉత్పత్తి – హరిత విప్లవం.
→ ఆహార ధాన్యాల తలసరి లభ్యత – ఆహార ధాన్యాల లభ్యత + జనాభా.
→ ఆహార ధాన్యాల అందుబాటు – ప్రజా పంపిణీ వ్యవస్థ.
→ బఫర్ నిల్వలు – జాతీయ పోషకాహార సంస్థ.
జవాబు:
బఫర్ నిల్వలు – జాతీయ పోషకాహార సంస్థ.

55. క్రింది వానిలో సరికాని జతను గుర్తించి రాయండి.
→ MSP – కనీస మద్దతు ధర.
→ FCI – ప్రపంచ ఆహార సంస్థ.
→ BMI – శరీర బరువు సూచిక.
→ PDS – ప్రజా పంపిణీ వ్యవస్థ.
జవాబు:
FCI – ప్రపంచ ఆహార సంస్థ.

56. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) మాంసకృత్తులు ( ) a) పప్పుదినుసులు
ii) పిండి పదార్థాలు ( ) b) గోధుమలు, బియ్యం
iii) విటమిన్లు ( ) c) పళ్లు, మొలకలు
iv) ఖనిజ లవణాలు ( ) d) ఆకుకూరలు
జవాబు:
i – a, ii – b, iii – c, iv – d

57. క్రింది వానిని సరిగా జతపరచండి.
AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత 2
జవాబు:
i – c, ii – d, iii – b, iv – a

క్రింది ను పరిశీలించి ఇవ్వబడిన ప్రశ్నకు సమాధానము రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత 3

58. గ్రామీణ భారతంలో అట్టడుగు వర్గం వారు (కింది విభాగం) అతి తక్కువ కాలరీలు తీసుకోవటానికి కారణమేమి?
జవాబు:
వారి ఆదాయం తక్కువగా ఉండటం (కొనుగోలు శక్తి – తక్కువగా ఉండటం)

59. క్రింది గ్రాను చదివి, ఇచ్చిన ప్రశ్నకు సరియైన సమాధానము రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత 4
ప్ర. ప్రజలు తమ ఆహార ధాన్యాల అవసరంలో అధిక భాగం ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు?
జవాబు:
రిటైల్ మార్కెట్లో

60. ప్రజా పంపిణీ వ్యవస్థ అద్వాన్నంగా ఉన్న రాష్ట్రమేది?
జవాబు:
బీహార్.

ఇచ్చిన గ్రాఫ్ ను పరిశీలించి క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానమును రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత 5

61. ఆహార ధాన్యాల ఉత్పత్తి ధోరణి ఎలా ఉంది?
జవాబు:
పెరుగుతుంది.

62. ఏ ఆహార ధాన్యం ఉత్పత్తి తక్కువగా ఉంది?
జవాబు:
జొన్న

63. 1970 – 2011 కాలంలో ఏ పంట ఉత్పత్తి పెరగక పోగా తగ్గింది?
జవాబు:
నూనెగింజలు.

64. ఈ 40 ఏళ్ళ కాలంలో ఉత్పత్తి వేగంగా పెరిగిన ఆహార పంట ఏది?
జవాబు:
వరి.

క్రింద ఇవ్వబడిన పట్టికను పరిశీలించి, ప్రశ్నలకు సరియైన జవాబులు రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత 6

65. ఇవ్వబడిన పట్టికలో ‘A’ అనే అక్షర స్థానంలో ఉండాల్సిన విలువను లెక్కించండి.
జవాబు:
481 గ్రాములు.

66. ఇవ్వబడిన పట్టికలో ‘B’ అనే అక్షర స్థానంలో ఉండాల్సిన విలువను లెక్కించండి.
జవాబు:
219.5

AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

67. ఇవ్వబడిన (ను పరిశీలించి ఇచ్చిన ప్రశ్నకు సమాధానము రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత 7
ప్ర. గోధుమ ఉత్పత్తి అనూహ్యంగా పెరగటానికి కారణ మేమిటి?
జవాబు:
హరిత విప్లవం.

10th Class Social 11th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
కనీస మద్దతు ధర అనగానేమి?
జవాబు:
ఆహార ధాన్యాలను ప్రభుత్వం కొనుగోలు చేయు (ముందుగా ప్రకటించిన) ధర. ప్రభుత్వ సంస్థ ప్రతి సంవత్సరానికి MSP ప్రకటిస్తుంది.

ప్రశ్న 2.
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పెట్టడానికి గల కారణమేమిటి?
జవాబు:

  1. అక్షరాస్యతను పెంచడం.
  2. ఎక్కువమంది బాలబాలికలు పాఠశాలల్లో వారి పేరు నమోదు చేసుకునేలాగా చూడటం.
  3. పేదవారికి, పిల్లలకు కనీసం ఒక్కపూట అయినా పౌష్టిక ఆహారం అందేలా చూడటానికి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు.

ప్రశ్న 3.
పిల్లల్లో పౌష్టికాహార లోపాల పరిష్కారానికి నీవు సూచించే రెండు మార్గాలేవి?
జవాబు:

  1. ప్రతిరోజూ పిల్లలకు పాలు, పండ్లు, గుడ్లు తమ ఆహారంలో ఇవ్వడం.
  2. పిల్లలకు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచటం.

ప్రశ్న 4.
FCI విస్తరించుము.
జవాబు:
Food Corporation of India (భారత ఆహార సంస్థ).

ప్రశ్న 5.
ఆహార భద్రత అమలయ్యేలా చూడటంలో భారత న్యాయ వ్యవస్థ కూడా చురుకైన పాత్ర పోషించడంతో దీనివల్ల పిల్లలకు ఎలాంటి ఉపయోగాలు కలుగుతున్నాయి?
జవాబు:

  1. పిల్లలకు పౌష్టికాహారం లభించుచున్నది.
  2. మధ్యాహ్నభోజనం పాఠశాలల్లో అమలు చేయడం వలన వారు పాఠశాలకు క్రమం తప్పకుండా వచ్చి విద్య నేర్చుకోగలుగుతున్నారు.

ప్రశ్న 6.
విటమిన్లు పుష్కలంగా లభించే ఆహార పదార్థాలకు రెండు ఉదాహరణలిమ్ము.
జవాబు:
పళ్ళు, ఆకుకూరలు, మొలకలు, ముడి బియ్యం వంటి ఆహార పదార్థాలలో విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.

AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

ప్రశ్న 7.
పోషక ఆహార ధాన్యాలకు రెండు ఉదాహరణలు వ్రాయుము.
జవాబు:
జొన్న, రాగి, సజ్జ మొదలైనవి.

ప్రశ్న 8.
భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు ఏర్పడిన (1943-45) కరవు ఏ ప్రాంతంలో ఏర్పడింది?
జవాబు:
భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు 1943-45 సం||రాలలో ‘బెంగాల్’లో అతి పెద్ద కరవు పరిస్థితి ఏర్పడింది.

ప్రశ్న 9.
భారతదేశంలో వరి, గోధుమలను పండిస్తున్న విధానం సురక్షిత పద్ధతేనా? ఎందుకని?
జవాబు:
అధిక దిగుబడుల కోసం అనుసరిస్తున్న విధానం సురక్షిత, సుస్థిర పద్ధతి కాదని శాస్త్రజ్ఞులు, వ్యవసాయరంగ వ్యక్తులు భావిస్తున్నారు. ఈ పద్ధతులవల్ల నేల క్షీణతకు గురయ్యింది, భూగర్భజల వనరులు అంతరించిపోతున్నాయి.

ప్రశ్న 10.
2010-11 సం||రంలో హెక్టారుకు వరి దిగుబడి ఎన్ని కిలోలు?
జవాబు:
2250 కిలోలు.

ప్రశ్న 11.
2010-11 సం||రంలో హెక్టారుకు గోధుమల దిగుబడి ఎన్ని కిలోలు?
జవాబు:
3000 కిలోలు.

ప్రశ్న 12.
సంవత్సరానికి లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలను ఎలా అంచనా వేస్తారు?
జవాబు:
సంవత్సరానికి లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు = సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి (ఉత్పత్తి – విత్తనం, దాణా, వృథా) + నికర దిగుమతులు (దిగుమతులు – ఎగుమతులు) – ప్రభుత్వ నిల్వలలో తేడా (సంవత్సరం ముగిసే నాటికి ఉన్న నిల్వలు – సంవత్సరం ఆరంభం నాటికి ఉన్న నిల్వలు).

ప్రశ్న 13.
తలసరి ఆహార ధాన్యాల లభ్యత అనగానేమి?
జవాబు:
సగటున ప్రతి వ్యక్తికి, ప్రతిరోజూ లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలను తలసరి ఆహార ధాన్యాల లభ్యత అంటారు.

ప్రశ్న 14.
తలసరి ఆహార ధాన్యాల లభ్యతను ఎలా అంచనా వేస్తారు?
జవాబు:
తలసరి ఆహార ధాన్యాల లభ్యత (ప్రతిరోజు) = (సంవత్సరానికి లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు + జనాభా )/365.

ప్రశ్న 15.
2011 సంవత్సరంలో తలసరి ఆహార ధాన్యాల లభ్యత ఎంతగా ఉంది?
జవాబు:
2011 సంవత్సరంలో తలసరి ఆహార ధాన్యాల లభ్యత ఒక రోజుకు 500 గ్రాములు.

AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

ప్రశ్న 16.
ప్రధాన ఆహార ధాన్యాలకు రెండు ఉదాహరణలిమ్ము.
జవాబు:
వరి, గోధుమ.

ప్రశ్న 17.
చిరు లేదా తృణ ధాన్యాలకు ఉదాహరణలిమ్ము.
జవాబు:
చిరు లేదా తృణ ధాన్యాలకు ఉదాహరణలు : జొన్న, రాగి, సజ్జ మొదలగునవి.

ప్రశ్న 18.
ప్రస్తుతం పోషక ధాన్యాలుగా వేటిని వ్యవహరిస్తున్నారు?
జవాబు:
చిరు లేదా తృణ ధాన్యాలను పోషకధాన్యాలుగా వ్యవహరిస్తున్నారు.

ప్రశ్న 19.
ఆహార పదార్థాల ఉత్పత్తి చేపట్టటానికి రైతులకు ఏ రూపంలో మద్దతు అవసరం?
జవాబు:
ఆహార పదార్థాల ఉత్పత్తి చేపట్టటానికి రైతులకు ఉత్పాదకాలు, మార్కెట్ అవకాశాల రూపంలో మద్దతు అవసరం.

ప్రశ్న 20.
భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి రోజుకు ఎన్ని గ్రాముల కూరగాయలు, పళ్లు తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచించారు?
జవాబు:
భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి రోజుకు వరుసగా 300 గ్రా||ల కూరగాయలు, 100 గ్రా||ల పళ్లు తీసుకోవాలని సూచించారు.

ప్రశ్న 21.
వ్యవసాయ వైవిధీకరణ అనగానేమి?
జవాబు:
ఆధునిక పద్ధతులు, విధానాలు అవలంబించి ఆహార మరియు వాణిజ్య పంటలు మరియు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను అభివృద్ధి చేయుట.

ప్రశ్న 22.
తలసరి ఆహార ధాన్యాల అభ్యత ఎక్కువగా ఉన్న దేశమేది?
జవాబు:
తలసరి ఆహార ధాన్యాల లభ్యత ఎక్కువగా ఉన్న దేశం అమెరికా.

ప్రశ్న 23.
పట్టణ ప్రాంతంలో నివసించే వ్యక్తులు తీసుకోవలసిన కనీస కాలరీలు ఎన్ని?
జవాబు:
పట్టణ ప్రాంతంలో నివసించే వ్యక్తులు తీసుకోవలసిన కనీస కాలరీలు 2100.

ప్రశ్న 24.
గ్రామీణ ప్రాంతంలో వ్యక్తులు శక్తి కోసం తీసుకోవలసిన కనీస కాలరీలు ఎన్ని?
జవాబు:
గ్రామీణ ప్రాంతంలో వ్యక్తులు శక్తి కోసం తీసుకోవలసిన కనీస కాలరీలు 2400.

ప్రశ్న 25.
భారతదేశ గ్రామీణ ప్రాంతంలో ఎంత శాతం ప్రజలు కాలరీల దృష్ట్యా తినవలసిన దానికంటే తక్కువ ఆహారం తింటున్నారు?
జవాబు:
భారతదేశ గ్రామీణ ప్రాంతంలో 80 శాతం మంది ప్రజలు కాలరీల దృష్ట్యా తినవలసిన దానికంటే తక్కువ ఆహారం తింటున్నారు.

ప్రశ్న 26.
భారతదేశంలో ఏ ప్రాంతంలో ప్రజాపంపిణీ వ్యవస్థ బాగుందని అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయి?
జవాబు:
భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాలలో ప్రజాపంపిణీ వ్యవస్థ బాగుందని అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయి.

ప్రశ్న 27.
ఏ రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది?
జవాబు:
తమిళనాడు రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది.

ప్రశ్న 28.
భారతదేశంలో ప్రజల మొత్తం బియ్యం వినియోగంలో ఎంత శాతం చౌక ధరల దుకాణం నుంచి కొనుగోలు చేస్తున్నారు?
జవాబు:
భారతదేశంలో ప్రజల మొత్తం బియ్యం వినియోగంలో 39 శాతం చౌక ధరల దుకాణం నుంచి కొనుగోలు చేస్తున్నారు.

ప్రశ్న 29.
బఫర్ నిల్వలు అనగానేమి?
జవాబు:
భారత ప్రభుత్వం భారత ఆహార సంస్థ (FCI) ద్వారా కొని నిల్వచేసే ఆహార ధాన్యాలను బఫర్ నిల్వలు అంటారు.

ప్రశ్న 30.
ప్రజాపంపిణీ వ్యవస్థ అనగానేమి?
జవాబు:
ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వాతా ఆహార ధాన్యాలు మరియు ఇతర నిత్యావసర వస్తువులను సబ్సిడీ ధరపై సరఫరా చేయడాన్ని ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) అంటారు.

ప్రశ్న 31.
భారత ప్రభుత్వం ఆహార భద్రత చట్టం ఏ సంవత్సరంలో చేసింది?
జవాబు:
భారత ప్రభుత్వం ఆహార భద్రత చట్టం 2013 సంవత్సరంలో చేసింది.

ప్రశ్న 32.
పేదలలో అత్యంత పేదలకు ఎన్ని కిలోల ఆహార ధాన్యాలు ఈ చట్టం ప్రకారం అందుతాయి?
జవాబు:
పేదలలో అత్యంత పేదలకు 35 కిలోల ఆహార ధాన్యాలు ఈ చట్టం ప్రకారం అందుతాయి.

ప్రశ్న 33.
అంగన్‌వాడీకి వచ్చే పిల్లల వయస్సు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది?
జవాబు:
అంగన్వాడీకి వచ్చే పిల్లల వయస్సు 1 – 5 సంవత్సరాలు ఉంటుంది.

ప్రశ్న 34.
ప్రపంచంలోకెల్లా అత్యంత పెద్ద పాఠశాల భోజన పథకం ఏది?
జవాబు:
ప్రపంచంలోకెల్లా అత్యంత పెద్ద పాఠశాల భోజన పథకం భారతదేశంలోని మధ్యాహ్న భోజన పథకం.

ప్రశ్న 35.
పోషకాహారం అనగానేమి?
జవాబు:
శరీరం అన్ని విధులను నిర్వహించడానికి శక్తికి, ఎదుగుదలకు, ఆరోగ్యంగా ఉండటానికి, రోగాలతో పోరాడటానికి అవసరమయిన ఆహారాన్నే పోషకాహారం అంటారు.

AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

ప్రశ్న 36.
జాతీయ పోషకాహార సంస్థ ఎక్కడ ఉంది?
జవాబు:
జాతీయ పోషకాహార సంస్థ హైదరాబాద్లో ఉంది.

ప్రశ్న 37.
పిల్లల్లో తక్కువ బరువు ఉండటం సమస్య అన్నిటికంటే తక్కువగా ఉన్న రాష్ట్రమేది?
జవాబు:
పిల్లల్లో తక్కువ బరువు ఉండటం సమస్య అన్నిటికంటే తక్కువగా ఉన్న రాష్ట్రం కేరళ.

ప్రశ్న 38.
శరీర బరువు సూచికను (BMI)ని ఏ విధంగా లెక్కిస్తారు?
జవాబు:
BMI = బరువు కిలోలలో / మీటర్లలో ఎత్తు వర్గం.

ప్రశ్న 39.
మహిళల్లో తీవ్రశక్తి లోపం, ఊబకాయం (అధిక బరువు) కలిగి ఉన్న వారి శాతమెంత?
జవాబు:
35% తీవ్ర శక్తి లోపం, 14% ఊబకాయం మహిళల్లో కన్పిస్తుంది.

ప్రశ్న 40.
సాధారణ BMI (ఆరోగ్యవంతుని BMI) ఎంత?
జవాబు:
18.5 [BMI = 18.5]

ప్రశ్న 41.
ఆహార భద్రతకు, తీవ్ర శక్తి లోపానికి గల సంబంధం ఏమిటి?
జవాబు:
సరిపడా ఆహారం ఉంటే (తింటే) ఎవరూ ఉండవలసిన దానికంటే తక్కువ బరువు కాని, తక్కువ ఎత్తు కాని ఉండరు.

10th Class Social 11th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
మీ కుటుంబము యొక్క ఒక వారం ఆహారపుటలవాట్లను విశ్లేషించండి. దీని ప్రభావము వ్యవసాయం, పర్యావరణంపై ఏ విధంగా పడుతుందో రాయండి.
జవాబు:
మా కుటుంబ ఆహారపు అలవాట్లు :

  1. ప్రధానంగా అన్నం (వరి), పప్పు (కందులు), కూరలు (కూరగాయలు), పెరుగు, పాలు, గ్రుడ్లు మొదలైనవి.
  2. అల్పాహారంగా ఇడ్లీ, దోశ, పూరి, చపాతి మొదలైనవి.
  3. అప్పుడప్పుడు మాలో కొంతమంది మాంసాహారం తీసుకుంటారు.

వ్యవసాయంపై ఆహారపు అలవాట్ల ప్రభావం :

  1. వివిధ పంటల (వరి, పప్పు ధాన్యాలు, కూరగాయలు మొదలైనవి) దిగుబడి పెంచుటకై అత్యధిక మోతాదులో రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకం జరుగుతుంది.
  2. గ్రుడ్లు, పాలు, మాంసానికై పాడి పశువులను కృత్రిమ పద్ధతుల్లో, అవాంఛనీయ పద్ధతుల్లో పెంచడం జరుగుతుంది.

పర్యావరణంపై ప్రభావం :

  1. మోతాదు మించి వాడే రసాయన ఎరువులు, పురుగు మందుల కారణంగా వాయు, జల కాలుష్యం ఏర్పడుతుంది.
  2. అడవులను నరికి మొత్తం వ్యవసాయ భూమిగా మార్చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదం.
  3. జీవ వైవిధ్యం దెబ్బతినేలా జంతువులను వినియోగించడం జరుగుతుంది.

ప్రశ్న 2.
ఆహారధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించలేకపోవడానికి గల కారణములను తెల్పండి.
జవాబు:
జనాభా పెరిగిన స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుట లేదు. దీనికి కారణాలు :

  1. సరైన నీటి నిర్వహణా పద్ధతులను ఉపయోగించలేకపోవడం.
  2. రైతులు పురాతన వ్యవసాయ పద్ధతులను ఉపయోగించడం.
  3. చిన్న భూ కమతాలలో వ్యవసాయం చేయడం.
  4. ఎరువులను తగిన మోతాదులలో వాడకపోవుట.

AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

ప్రశ్న 3.
ప్రజా పంపిణీ వ్యవస్థలో నీవు గుర్తించిన ఏవేని రెండు లోపాలను గురించి వ్రాయుము.
జవాబు:

  1. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు వస్తువులను విక్రయించడం
  2. తూకంలో మోసం చేయడం
  3. బ్లాక్ మార్కెట్‌కు వస్తువులు తరలించడం
  4. అనర్హత కలిగిన వ్యక్తులు తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉండుట
  5. నెలలో కొద్ది రోజులు మాత్రమే సరుకులు అమ్మడం.

ప్రశ్న 4.
ప్రస్తుత ప్రజా పంపిణీ వ్యవస్థ పని తీరును మెరుగుపరచడానికి నీవు సూచించే చర్యలు తెలుపుము.
జవాబు:

  1. రేషన్ కార్డులను పేదలకు మరియు అతి నిరు పేదలకు మాత్రమే కేటాయించాలి.
  2. ప్రతినెల వీరు ప్రజాపంపిణీ ద్వారా అన్ని సదుపాయాలను వస్తువులను పొందుతున్నారో లేదా తెలుసుకోవాలి.
  3. ప్రభుత్వం పంపిణీ చేసే వస్తువుల నాణ్యత పెంచాలి.
  4. ఏవైతే దొంగ రేషన్ కార్డ్స్ ఉన్నాయో వాటిని తొలగించాలి.

ప్రశ్న 5.
ప్రజలకు ఆహారాన్ని పొందే హక్కు కోసం 2013 లో భారత ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టం రూపొందించింది. ఈ చట్టం అమలు కావడానికి నీవు సూచించే ముఖ్యమైన చర్యలేవి?
జవాబు:
జాతీయ ఆహార భద్రతా చట్టం – 2013 అమలు కావడానికి సూచనలు :

  1. ప్రజాపంపిణీ వ్యవస్థ సక్రమంగా పనిచేసేటట్లు చూడాలి.
  2. అధిక దిగుబడినిచ్చే ఆహార పంటలను ప్రోత్సహించాలి.
  3. ఆహార ఉత్పత్తులకు ప్రభుత్వం సబ్సిడీ అందించాలి.
  4. కరువు పరిస్థితులను ఎదుర్కొనుటకు గిడ్డంగులను ఏర్పాటు చేయాలి.

ప్రశ్న 6.
క్రింది రేఖాచిత్ర పటంను పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత 3
i) గ్రామీణ భారతదేశంలో ఎంత భాగం ప్రజలు అవసరమైన దానికన్నా ఎక్కువ కాలరీలు వినియోగిస్తున్నారు?
ii) గ్రామీణ భారతదేశంలో అవసరమైన దానికన్నా తక్కువ కాలరీలు వినియోగించడానికి కారణమేమిటి?
జవాబు:
i) 20%
ii) 1) ప్రజల కొనుగోలు శక్తి తక్కువగా ఉండటం.
2) ఆహారం కొనడానికి సరిపడా ఆదాయం ప్రజలకు ఉండటం లేదు.
3) పేదరికం, నిరుద్యోగం కూడా ప్రధాన కారణాలు.

ప్రశ్న 7.
ఆహార ధాన్యాల అధికోత్పత్తికి హరిత విప్లవం ఏ విధంగా దోహదం చేసింది?
జవాబు:

  1. అధిక దిగుబడినిచ్చే వంగడాలను వాడటం.
  2. నీటి పారుదల వసతులను మెరుగుపరచడం.
  3. నూతన వ్యవసాయ పద్ధతులను అవలంబించడం.
  4. క్రిమి సంహారక మందులు మరియు రసాయనిక ఎరువులు వాడటం.
    మొదలగు హరిత విప్లవంలోని అంశాలు ఆహార ధాన్యాల అధికోత్పత్తికి దోహదం చేసినవి.

ప్రశ్న 8.
భారత సుప్రీం కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశించి అన్ని పాఠశాలల్లోను మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టాలని ఆదేశించింది. మధ్యాహ్న భోజన పథకం సక్రమ నిర్వహణ మీద ఒక కరపత్రాన్ని తయారుచేయండి.
జవాబు:
మధ్యాహ్న భోజన పథకంపై కరపత్రము :

  1. స్థానికంగా పండించే ఆహార ధాన్యాలను వినియోగించాలి.
  2. నిర్దేశించిన మెనూను తప్పక అనుసరిస్తూ విద్యార్థులకు తగిన పోషక పదార్థాలు అందించాలి.
  3. పరిశుభ్రమైన పరిసరాలలో ఆహార పదార్థాలను తయారుచేయాలి.
  4. మధ్యాహ్న భోజన తయారీ, పంపిణీలో విద్యార్థుల, ఉపాధ్యాయుల భాగస్వామ్యం ఉండాలి.

ప్రశ్న 9.
మీ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో ఆహార వృథాను అరికట్టడానికి సూచనలు వ్రాయండి.
జవాబు:

  1. ఆహారాన్ని రుచిగా, శుభ్రంగా వండాలి.
  2. ఆహార వృథా పరిణామాలను గురించి విద్యార్థులకు వివరించాలి.
  3. భోజన సమయంలో ఉపాధ్యాయులు పర్యవేక్షణ చేయాలి.

AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

ప్రశ్న 10.
ప్రభుత్వ పాఠశాలల్లో అమలుచేస్తున్న మధ్యాహ్న భోజన పథకం వలన ఏయే ప్రయోజనాలు చేకూరుతున్నాయో ప్రశంసించండి.
జవాబు:
మధ్యాహ్న భోజన పథకం వలన ప్రయోజనాలు : .

  1. ఆహార భద్రతను సమకూరుస్తుంది.
  2. పోషకాహారాన్ని అందిస్తుంది.
  3. నికర హాజరు శాతం పెరగడానికి సహాయపడుతుంది.

ప్రశ్న 11.
మీ ప్రాంతంలో ‘ప్రజా పంపిణీ వ్యవస్థ’ సక్రమ అమలుకు, సంబంధిత అధికారికి ఒక లేఖ రాయండి.
జవాబు:

సిరిసిల్ల
31 మార్చి 20xx.

To
తహశీల్దారు గారికి,
మండల రెవెన్యూ కార్యాలయము,
సిరిసిల్ల,

అయ్యా
విషయం : మా ప్రాంతంలో సక్రమంగా లేని చౌక ధరల దుకాణం నిర్వహణ దుకాణం సక్రమ నిర్వహణకు అభ్యర్ధన.

నేను సిరిసిల్లలోని సుభాష్ నగర్ ప్రాంత వాసిని. మా ప్రాంతంలో ప్రజా పంపిణీ వ్యవస్థ క్రింద పనిచేయుచున్న చౌక . ధరల దుకాణం నిర్వహణ సక్రమంగా లేదు ఎప్పుడు చూసినా మూయబడి వుంటుంది. రేషను వినియోగదారులు తమ సరకులు తీసుకెళ్ళేందుకు వచ్చి, దుకాణం మూయబడి ఉండటంతో ప్రభుత్వాన్ని, దుకాణం డీలరును నిందిస్తూ వెనుదిరిగి వెళుతున్నారు. వారు విధి లేని పరిస్థితులలో బహిరంగ మార్కెట్ ను ఆశ్రయించవలసి వస్తోంది. రోజువారీ పనులు చేసుకొనే వారు అటువంటి సందర్భాల్లో ఆ రోజు ఆదాయాన్ని కోల్పోవలసి వస్తోంది. దుకాణాన్ని ఎప్పుడో ఒకసారి తెరచినా అరకొరగా సరకులు అందిస్తున్నారు. కొన్ని సమయాలలో ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నారు.

కావున మా ప్రాంతంలో చౌక ధరల దుకాణం సక్రమంగా పనిచేయు విధంగా ఆవశ్యక చర్యలు చేపట్టవలసిందిగా, తద్వారా మా ప్రాంత పేద ప్రజలకు మేలు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దీని ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ అసలు ఉద్దేశ్యం నెరవేరుతుంది. తమరు తక్షణ మరియు సానుకూల చర్యలు చేపట్టవలసినదిగా విజ్ఞప్తి చేయుచున్నాను.

ధన్యవాదములతో,

భవదీయుడు,
XXXXXXX.

To
తహశీల్దారు గారికి,
సిరిసిల్ల మండలం,
సిరిసిల్ల

ప్రశ్న 12.
భారతదేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ఉపయోగాలను వర్ణించండి.
జవాబు:
భారతదేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ఉపయోగాలు :

  1. భారతదేశంలో ఆహారధాన్యాలు అందుబాటులో ఉండటానికి చౌకధరల దుకాణాలు ఎంతో ముఖ్యమైనవి.
  2. ప్రజా పంపిణీ వ్యవస్థ పేదవారికి సబ్సిడీ ధరలలో ఆహార ధాన్యాలను అందిస్తుంది.
  3. తక్కువ ఆదాయం గలవారికి, నిరుపేదలకు ఆహార ధాన్యాలు అందుతాయి.
  4. పేద ప్రజలందరూ పోషకాహార స్థాయిని సాధించటానికి PDS దోహదం చేస్తుంది.

ప్రశ్న 13.
ఆహార వృథాను అరికట్టడానికి ఏవేని రెండు నినాదాలను రాయండి.
జవాబు:
ఆహార వృధాను అరికట్టడానికి నినాదాలు :

  1. అన్నం పరబ్రహ్మ స్వరూపం – కనుక వృధా చేయకండి.
  2. మీరు వృధా చేసే ప్రతి మెతుకు – నింపు మరొకరి కడుపు
  3. ఆహారం వృధా చేసే ముందు, ఆలోచించు రైతు కష్టం.

ప్రశ్న 1.
గ్రామీణ, పట్టణ ప్రాంతవాసులకు కనీసం అవసరమైన కాలరీలు, తీసుకుంటున్న వినియోగిస్తున్న కాలరీల గురించి వివరించుము.
జవాబు:
రోజుకు పట్టణ ప్రాంతాల్లో 2100 కాలరీలు, గ్రామీణ ప్రాంతాల్లో 2400 కాలరీలు శక్తిని ఇచ్చే ఆహారం తీసుకోవాలి. తీసుకోవలసిన కాలరీల కంటే గ్రామీణ, పట్టణ ప్రాంతాల జాతీయ సగటు తక్కువగా ఉంది. అంతేకాకుండా కాలరీల వినియోగం 1983తో పోలిస్తే 2004 నాటికి తగ్గింది. మన దేశ ఆర్థిక పరిస్థితి వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇలా జరగటం ఆందోళనకరంగా ఉంది.

ప్రశ్న 2.
ఎత్తు, బరువు సూచికల ఆధారంగా వేనిని అంచనా వేయవచ్చు?
జవాబు:
ప్రజా పంపిణీ వ్యవస్థ సామర్థ్యం, ఆహార పంటలను పండించటానికి ప్రాధాన్యత, ప్రజల కొనుగోలు శక్తి వంటి వాటినన్నింటినీ ప్రజల ఎత్తు, బరువు వంటి సూచికల ఆధారంగా అంచనా వేయవచ్చు. అంతే కాకుండా ఒక వ్యక్తి ఎత్తు ద్వారా అతనికి/ ఆమెకు బాల్యంలో సరిపడా ఆహారం అందిందో లేదో చెప్పవచ్చు. తక్కువ బరువు, తక్కువ ఎత్తు ఉన్న వాళ్లు పోషకాహార లోపానికి గురయ్యారని పేర్కొంటారు.

ప్రశ్న 3.
క్రింది గ్రాఫ్ ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నలకు సరియైన సమాధానములిమ్ము.
AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత 3
i) దేశంలో సంపన్నులైన 25% ప్రజలు సగటున రోజుకు ఎన్ని కాలరీలు తీసుకుంటున్నారు?
జవాబు:
దేశంలో సంపన్నులైన 25% ప్రజలు సగటున రోజుకు 2521 కాలరీలు తీసుకుంటున్నారు.

ii) ధనికులకు కింది పావుభాగం (25%) ప్రజలకు తీసుకుంటున్న కాలరీల్లో తేడా ఎంత?
జవాబు:
2521-1624 = 897 కాలరీలు.

iii) ఎవరు అతి తక్కువ కాలరీలు తీసుకుంటున్నారు?
జవాబు:
అట్టడుగు వర్గం వారు. (కింది పావుభాగం) అతి తక్కువ కాలరీలు తీసుకుంటున్నారు.

iv) కారణమేమి?
జవాబు:
కారణం : వారి ఆదాయం తక్కువగా ఉండటం, ఆహార పదార్థాల కొనుగోలు శక్తి తక్కువగా ఉండటం వలన.

v) ఈ గ్రాఫ్ ను బట్టి నీవు ఏ అభిప్రాయానికి వచ్చావు?
జవాబు:
ఆర్థికస్థాయి, ఆహారస్థాయిని నిర్దేశిస్తుంది.

10th Class Social 11th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
“కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడింట ఒక వంతు ఆహారధాన్యాలను రైతుల నుంచి కొనుగోలు చేస్తాయి. వివిధ పథకాల ద్వారా ఈ ఆహార ధాన్యాలను ప్రజలకు పంపిణీ చేస్తాయి.”
ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా ప్రభుత్వాలు ప్రజలకు సక్రమంగా ఆహార భద్రతను కల్పిస్తున్నాయని నీవు భావిస్తున్నావా? నీ అభిప్రాయం సవివరంగా తెలియజేయుము.
జవాబు:

  1. ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా ప్రభుత్వాలు ప్రజలకు సక్రమంగా ఆహార భద్రత కల్పిస్తున్నాయని నేను భావిస్తున్నాను.
  2. భారతదేశ దక్షిణాది రాష్ట్రాలలో ప్రజాపంపిణీ వ్యవస్థ బాగుందని అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయి.
  3. ప్రజా పంపిణీ వ్యవస్థలు అందరికి తక్కువ ధరలకు ఆహార ధాన్యాలను అందిస్తాయి.
  4. అంత్యోదయ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి నెలకు 35 కిలోల ఆహార ధాన్యాలను ప్రజాపంపిణీ వ్యవస్థ అందిస్తుంది.
  5. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలలోని ప్రతివ్యక్తికి సబ్సిడీ ధరలకు 5 కిలోల ఆహారధాన్యాలు అందిస్తున్నాయి.
    కనుక పై చర్యల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు సక్రమంగా ఆహార భద్రతను కల్పిస్తున్నాయి.

ప్రశ్న 2.
క్రింది పేరాను చదివి, మీ అభిప్రాయం రాయండి.
‘భారత పార్లమెంటు జాతీయ ఆహారభద్రత చట్టం వంటి చట్టాలను, సమగ్ర శిశు అభివృద్ధి పథకం వంటి పథకాలను అమలు చేస్తుండగా ఇటీవల కాలంలో ఆహారభద్రత అమలు అయ్యేలా చూడటంలో భారత న్యాయ వ్యవస్థ కూడా చురుకైన పాత్ర పోషిస్తుంది. స్వచ్ఛంద సంస్థలు చేసిన దావాలలో తీర్పును ఇస్తూ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెట్టమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.
జవాబు:

  1. ఈ పేరా ఆహార భద్రతా చట్టం పిల్లలకు బాగా ఉపయోగపడుతుందని తెలియజేస్తుంది.
  2. కోర్టులు చెప్పిన తీర్పుల ప్రకారం ప్రతి ఒక్కరికి ఆహారం అందించే బాధ్యతను ప్రభుత్వాలు తీసుకున్నాయి.
  3. దాని ప్రకారమే పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెట్టమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.
  4. ఈ పథకం ప్రకారం పాఠశాలల్లో చదువుతున్న 14 కోట్ల మంది పిల్లలు ఈ రోజు మధ్యాహ్న భోజనం తింటున్నారు.
  5. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చెయ్యటానికి నిరాకరించినప్పుడు న్యాయ స్థానం పర్యవేక్షణ విధానాన్ని కూడా నెలకొల్పింది.
  6. అలాగే స్థానికంగా పండించిన ఆహార ధాన్యాలను ఉపయోగించాలని, వేడిగా వండి పెట్టాలని (అప్పటి దాకా అనేక ప్రభుత్వాలు ఆహార ధాన్యాలు లేదా తినుబండారాలు ఇచ్చేవి), అది శుభ్రంగా, పోషకాహారంగా (సిఫారసు చేసిన కాలరీలు ఉండేలా) ఉండాలని, వారంలో ప్రతిరోజు వేర్వేరు పదార్థాలు పెట్టాలంటూ, మధ్యాహ్న భోజన పథకాన్ని మెరుగ్గా అమలుపరచటానికి అనేక సిఫారసులు న్యాయస్థానం చేసింది.
  7. ఆహారం వండటంలో దళితులకు, విధవలకు, ఏ ఆధారం లేని మహిళలకు ప్రాధాన్యతనివ్వాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
  8. ప్రపంచంలోకెల్లా ఇదే అత్యంత పెద్ద పాఠశాల భోజన పథకం. ఈ పథకానికి డబ్బులు సమకూర్చుకోటానికి పన్నులు విధించమని కూడా భారత ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పుడు అంగన్వాడీలలోని పిల్లలకు కూడా వేడిగా ‘వండిన ఆహారం పెడుతున్నారు.

AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

ప్రశ్న 3.
ప్రస్తుతం దేశానికి “ఆహార భద్రత’ అవసరం ఎంతవరకు ఉంది?
జవాబు:
ప్రస్తుతం దేశానికి “ఆహార భద్రత” అవసరం :

  1. ఆహార ధాన్యాల లభ్యత
  2. సరిపడా కాలరీలు అందించే ఆహారం లభ్యం కాకపోవడం.
  3. కొనుగోలు శక్తి తక్కువగా ఉండటం.
  4. పేదరికం.
  5. నిరుద్యోగం
  6. ప్రజా సదుపాయాలు సరిపోయినంతగా లేకపోవడం.
  7. ఆహార ధాన్యాలు పేదలకు, పేదలు కాని వారికి వేర్వేరు ధరలకు అమ్మడం.
  8. పిల్లలలో పోషకాహార లోపం.

ప్రశ్న 4.
క్రింది పట్టాను పరిశీలించండి.
పంటల దిగుబడి (హెక్టారుకు కిలోలు)

పంట1950-512000-2001
వరి6681901
గోధుమ6552708
పప్పుధాన్యాలు441544
నూనెగింజలు481810
పత్తి88190
జనపనార10432026

వివిధ రకాల పంటల దిగుబడి ధోరణులను విశ్లేషిస్తూ ఒక పేరా రాయండి.
జవాబు:
1950-1951 మరియు 2000-2001వ సంవత్సరంలో పంటల దిగుబడి ఎలా ఉందో పై పట్టిక తెలియచేస్తుంది. వరి మరియు గోధుమల ఉత్పత్తిలో చాలా పెరుగుదల కనిపించింది. కాని పప్పు ధాన్యాల ఉత్పత్తి 100 కిలోలు మాత్రమే పెరిగింది. నూనె గింజలు, ప్రత్తి, జనపనార ఉత్పత్తుల పెరుగుదల రెట్టింపు అయ్యింది.

దానికి అంతటికీ ప్రధాన కారణం హరిత విప్లవం. అన్ని ఆహార పదార్థాలను పరిశీలిస్తే హరిత విప్లవం వలన వరి మరియు గోధుమ పంటలు బాగా లాభపడ్డాయని చెప్పవచ్చు. అలాగే మిగతా ఆహారధాన్యాల ఉత్పత్తి కూడా బాగా పెరిగింది.

ప్రశ్న 5.
ప్రజాపంపిణీ వ్యవస్థ పేదవారికి ఆహార అందుబాటును ఎలా కలిగిస్తుందో విశ్లేషించుము.
జవాబు:
ప్రజాపంపిణీ వ్యవస్థ – పేదవారికి ఆహార అందుబాటు విశ్లేషణ :

  1. జాతీయ ఆహారభద్రత చట్టం ప్రజలకు ఆహారాన్ని పొందే హక్కుకు చట్టబద్ధతనిచ్చింది.
  2. భారతదేశంలోని మూడింట రెండు వంతుల జనాభాకు వర్తిస్తుంది.
  3. ప్రజాపంపిణీ వ్యవస్థ పేదవారికి సబ్సిడీ ధరలలో ఆహార ధాన్యాలను అందిస్తుంది.
  4. అంత్యోదయ కార్డు ఉన్నవాళ్ళకు ప్రతి కుటుంబానికి, నెలకు 35 కిలోల ఆహార ధాన్యాలు (బియ్యం లేదా గోధుమలు) అందుతాయి.
  5. తక్కువ ఆదాయం గలవారికి ఆహార ధాన్యాలు అందుతాయి.
  6. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా 75 శాతం వారికి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలు అందిస్తున్నారు.
  7. పట్టణ జనాభాలో 50% మందికి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలు అందిస్తున్నారు.
  8. పోషకాహార స్థాయిని సాధించటానికి ప్రజాపంపిణీ వ్యవస్థ దోహదం చేస్తుంది.
  9. భారతదేశ దక్షిణాది రాష్ట్రాలలో ప్రజాపంపిణీ వ్యవస్థ బాగుందని అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయి.

ప్రశ్న 6.
పట్టికలో ఇవ్వబడిన సమాచారమును పరిశీలించి విశ్లేషించండి.
AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత 8
జవాబు:
పట్టికలోని 1961-2011 వరకు భారతదేశంలో తలసరి ఆహారధాన్యాల అభ్యత వివరాలు పొందుపరచబడినవి.

  1. 1951 దేశ జనాభా 361 మిలియన్లు. ఆహారధాన్యాల ఉత్పత్తి 50.8 మిలియన్ టన్నులు కాగా ఒక రోజుకు తలసరి ఆహారధాన్యాల లభ్యత 395 గ్రాములు.
  2. 1961 సంవత్సరానికి 78 మిలియన్ల జనాభా మరియు దాంతోపాటే సుమారు 32 మిలియన్ టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగింది. తలసరి ఆహారధాన్యాల లభ్యత ఒక రోజుకు 469 గ్రాములుగా ఉంది.
  3. 1971, 1991 మరియు 2011లలో జనాభా మరియు అదే స్థాయిలో ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగింది. కాని 1961, 1971లలో తలసరి ఆహారధాన్యాల లభ్యత పెరగలేదు, ఒకే విధంగా ఉంది.
  4. 1991 నుండి 2011 వరకు ఆహారధాన్యాల లభ్యత వరదలు, కరవులు మరియు ప్రకృతి వైపరీత్యాల వల్ల కుంటుపడింది. అధిక జనాభా కూడా ఇందుకు మరో కారణం.

1991 వరకు జనాభా, ఆహారధాన్యాల ఉత్పత్తి మరియు తలసరి ఆహారధాన్యాల లభ్యత పెరిగింది. కాని 2011లో జనాభా మరియు ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగిన స్థాయిలో తలసరి ఆహారధాన్యాల లభ్యత పెరగకపోగా క్షీణించింది.

దేశం మొత్తానికి సరిపడా ఆహారధాన్యాలను పండించడం ప్రాథమిక అవసరం. దేశంలో తలసరి సగటు ఆహారధాన్యాల లభ్యత సరిపడా ఉండాలి. కాలక్రమంలో పెరుగుతూ ఉండాలి. పై సమాచారం బట్టి 2011 నుండి తలసరి ఆహార ధాన్యాల లభ్యత క్షీణిస్తోందని వెల్లడవుతోంది.

కావున ప్రభుత్వం ఈ విషయమై ఆవశ్యకమైన చర్యలు చేపట్టాలి. ఆహారధాన్యాలు ఎక్కువగా పండించేలా రైతులను ప్రోత్సహించాలి. ఎగుమతులపై నియంత్రణ విధించాలి. కొన్ని సమయాల్లో ప్రజలు ఆహారధాన్యాలు లేక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం తమకు అవసరమైనవి దిగుమతి చేసుకోవడానికిగాను ఆహారధాన్యాలను ఇతరదేశాలను ఎగుమతి చేస్తుంది. దేశ ప్రజలందరికీ ముఖ్యంగా పేదవారికి ఆహారధాన్యాలు అందుబాటులో ఉండేలా చేయటం అన్నది సంక్షేమ ప్రభుత్వ కనీస కర్తవ్యం.

ప్రశ్న 7.
“ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రజలకు ఆహార భద్రత ఉండేలా చూడగలదు.” వివరింపుము.
జవాబు:
ప్రజాపంపిణీ వ్యవస్థ – ఆహార భద్రత :

  1. భారతదేశంలో ఆహారధాన్యాలు అందుబాటులో ఉండటానికి ప్రజలకు చౌకధరల దుకాణాలు ఎంతో ముఖ్యమైనవి.
  2. పేద ప్రజలందరికీ అతితక్కువ ధరలకు చౌకధరల దుకాణాల ద్వారా ఆహారధాన్యాలు అందుతాయి.
  3. పేదలలో కూడా అత్యంత పేదలకు ప్రత్యేక కేటాయింపులు ఉన్నాయి.
    ఉదా : అంత్యోదయ కార్డువారికి ఒక్కో కుటుంబానికి నెలకు 35 కేజీల చొప్పున ఆహారధాన్యాలు అందుతాయి.
  4. గ్రామీణ ప్రాంతాలలో 75%, పట్టణ ప్రాంతాలలో 50% ప్రజలకు ప్రజాపంపిణీ వ్యవస్థ నుంచి ఆహారధాన్యాలను కొనుగోలు చేసే హక్కు ఉంది.
    ఈ విధంగా ప్రజాపంపిణీ వ్యవస్థ ప్రజలకు ఆహారభద్రత ఉండేలా చూడగలదు.

ప్రశ్న 8.
ప్రస్తుతము జాతీయ ఆహార భద్రతా చట్టం ఏ విధంగా అమలౌతోంది?
జవాబు:
ప్రస్తుతం జాతీయ ఆహార భద్రతా చట్టం అమలు అవుతున్న తీరు.

  1. ప్రజలకు ఆహారము పొందే హక్కుకు చట్టబద్ధతనిచ్చిన చట్టం.
  2. ఆహార భద్రత చట్టం పరిధిలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు :

ఎ. ప్రజా పంపిణీ వ్యవస్థ :

  1. ప్రజాపంపిణీ వ్యవస్థలో చౌక ధరల దుకాణాలు ప్రధానమయినవి. నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు అందించేవి చౌకధరల దుకాణాలు.
  2. భారతదేశంలో ఆహారధాన్యాలు అందుబాటులో ఉండటానికి, ప్రజలకు చౌకధరల దుకాణాలు ఎంతో ముఖ్యమైనవి.
  3. చౌకధరల దుకాణాల నుంచి కొనుగోలు చేసే ఆహారధాన్యాలు, వాళ్ళ మొత్తం ఆహార ధాన్యాల వినియోగంలో ఎక్కువ శాతమే ఉంది.
  4. ఈ ప్రజాపంపిణీ వ్యవస్థలో ప్రజలకు తెల్లకార్డులు, పింక్ కార్డులు, అంత్యోదయ కార్డుల ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయబడతాయి.

బి. అంగన్‌వాడీ కేంద్రాలు :

  1. అంగన్ వాడీల ద్వారా 1-6 వయసు గల పిల్లలకు, పాలిచ్చే తల్లులకు, గర్భిణీ స్త్రీలకు పోషకాహారం సరఫరా చేయబడుతుంది.
  2. పిల్లల యొక్క ఎత్తు, బరువులను ఎప్పటికప్పుడు పరీక్షించి, తగుచర్యలు తీసుకుంటారు.
  3. పిల్లలకు అవసరమైన వైద్య, ఆరోగ్య సూచనలు ఆందింళబడతాయి, వ్యాక్సినేషన్ ఉంటుంది.
  4. ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణం ఉండటం వలన పిల్లల ఎదుగుదల చక్కగా ఉంటుంది.
  5. అంగన్ వాడీ కేంద్రంలో సరఫరా చేయు గ్రుడ్లు, ప్రోటీన్స్ (సోయాబీన్స్ పొడి), సమతౌల్య ఆహారం పొడి మొ||నవి – పిల్లల ఎదుగుదలకు, అభివృద్ధికి ఎంతో తోడ్పడతాయి.

సి. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం (6-14 వయసు పిల్లలకు) అమలవుతుంది.

AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

ప్రశ్న 9.
భారతదేశంలో ప్రజలకు ఇతర ఆహార పదార్థాల కనీస అవసరం, లభ్యత ఎలా ఉంది?
జవాబు:
కాలక్రమంలో ఇతర ఆహార పదార్థాల ఉత్పత్తి పెరిగినప్పటికి రోజువారీ కనీస ఆహార అవసరాలు తీర్చటానికి సరిపడేటంతగా ఇది లేదు. భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి రోజుకు 300 గ్రాముల కూరగాయలు, 100 గ్రాముల పళ్లు తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే, వీటి లభ్యత వరుసగా 180 గ్రాములు, 58 గ్రాములు మాత్రమే ఉంది. అదే విధంగా సగటున ప్రతి వ్యక్తి సంవత్సరంలో 180 గుడ్లు తీసుకోవలసి ఉండగా వీటి అభ్యత 30 మాత్రమే. ఆహారంలో మాంసం సగటున ప్రతి వ్యక్తి సంవత్సరానికి 11 కిలోలు తీసుకోవలసి ఉండగా లభ్యత 3.2 కిలోలు మాత్రమే. రోజుకు ప్రతి వ్యక్తి 300 మిల్లీలీటర్ల పాలు తీసుకోవలసి ఉండగా లభ్యత 210 మిల్లీలీతార్లు మాత్రమే ఉంది.

ప్రశ్న 10.
ఆహార భద్రత అమలు అయ్యేలా చూడటంలో న్యాయ వ్యవస్థ పాత్రను వివరించుము.
జవాబు:
ఇటీవలి కాలంలో ఆహార భద్రత అమలు అయ్యేలా చూడటంలో భారత న్యాయ వ్యవస్థ కూడా చురుకైన పాత్ర పోషిస్తోంది. స్వచ్ఛంద సంస్థలు వేసిన దావాలలో తీర్పును ఇస్తూ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకం తమిళనాడు వంటి రాష్ట్రాలలో చిన్న స్థాయిలో అమలు అవుతూ ఉండేది. ఇప్పుడు ఈ పథకం అన్ని రాష్ట్రాలలో అమలు అవుతోంది. పాఠశాలల్లో చదువుతున్న 14 కోట్ల మంది పిల్లలు ఈ రోజు మధ్యాహ్న భోజనం తింటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చెయ్యటానికి నిరాకరించినప్పుడు న్యాయం స్థానం పర్యవేక్షణ విధానాన్ని కూడా నెలకొల్పింది. అలాగే స్థానికంగా పండించిన ఆహార ధాన్యాలను ఉపయోగించాలని, వేడిగా వండి పెట్టాలని (అప్పటి దాకా అనేక ప్రభుత్వాలు ఆహార ధాన్యాలు లేదా తినుబండారాలు ఇచ్చేవి), అది శుభ్రంగా, పోషకాహారంగా (సిఫారసు చేసిన కాలరీలు ఉండేలా) ఉండాలని, వారంలో ప్రతిరోజు జేర్వేరు పదార్థాలు పెట్టాలంటూ, మధ్యాహ్న భోజన పథకాన్ని మెరుగ్గా అమలు పరచటానికి అనేక సిఫారసులు న్యాయస్థానం చేసింది. ఆహారం వండటంలో దళితులకు, విధవలకు, ఈ ఆధారం లేని మహిళలకు ప్రాధాన్యతనివ్వాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచంలోకెల్లా ఇదే అత్యంత పెద్ద పాఠశాల భోజన పథకం. ఈ పథకానికి డబ్బులు సతుకూర్చుకోటానికి పన్నులు విధించతుని కూడా భారత ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పుడు అంగన్‌వాడీలలోని పిల్లలకు కూడా వేడిగా వండిన ఆహారం పెడుతున్నారు.

ప్రశ్న 11.
భారతదేశం ప్రజలకు ఆహారం అందేలా చూడడానికి ఏ ఏ విధి విధానాలను రూపొందించింది?
జవాబు:

  1. భారతదేశంలో ఆహార ధాన్యాలు అందుబాటులో ఉంచడానికి ప్రజలకు చౌక ధరల దుకాణాలు ఎంతో ముఖ్యమైనవి.
  2. 2013లో భారత ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టం అనే కొత్త చట్టం చేసింది.
  3. భారతదేశంలో మూడింట రెండు వంతుల జనాభాకు ఇది వర్తిస్తుంది.
  4. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలలోని ప్రతి వ్యక్తికి సబ్సిడీ ధరకు 5 కిలోల బియ్యం అందుతాయి.
  5. పేదవాళ్ళలో అత్యంత పేదలకు 35 కిలోలు ఇవ్వాలి.
  6. గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు, అంగన్‌వాడీకి వచ్చే 1-6 సం|| పిల్లలకు, బడికి వచ్చే 6-14 సంవత్సరాల పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టాలి.
  7. ఇలా ప్రభుత్వం అందరికీ ఆహారం అందుబాటులో ఉంచింది.

ప్రాజెక్టు

” అమ్మ అనే క్రింది కవిత చదవండి. ఆహార భద్రతకు సంబంధించి ఏదో ఒక అంశంపైన మీరు కూడా ఒక కవిత రాయండి.

అమ్మ

పేగుల అరుపులను పట్టించుకోకుండా
ఎండిన గొంతు, పెదాలతో బాధపడుతూ
ప్రవహించే కన్నీటిని ఆపుతూ
తటాకాలైన కళ్లతో నిన్ను చూశాను …..

నువ్వు మాత్రం సగమే తింటూ,
అందరికీ తినటానికి ఉండాలని
ఒక రొట్టె, ఇంకొంచెం
ఏదో చెయ్యటానికి

పొయ్యిముందు కూర్చుని
నీ ఎముకలనే కాల్చిన
నిన్ను చూశాను …

అందరి ఇళ్లల్లో బట్టలు ఉతుకుతూ,
అంట్లు తోముతూ
వాళ్లు పారేసింది నీకు ఇస్తే
పరమాన్నంగా తీసుకున్న
నిన్ను చూశాను …

విద్యార్థులు స్వయంగా రాయగలరు :
ఆధారం :
పేదవాడి ఆకలిని ఏ హక్కు ఇచ్చి తీర్చలేం, ఆకలితో ఉన్నవాడికి ఆహారం కాకుండా ఏ విధమైన (రాజకీయ) అవకాశం, సమానత్వం ఇచ్చిన వ్యర్థమే … ఆహార భద్రత తప్ప అనే భావనతో ఈ కవిత …… -మ.శ్రీ

ఏమని వివరించను ! ఎవరికి విన్నవించను
కాలే కడుపుల కష్టాల గురించి,

ఆకలితో తడిమిన చేతికి కడుపు, వీపు
ఏకమయ్యి తగిలితే,

నీరసంతో నేలను తాకిన ఎముకల గూడుకు
అల్లుకున్న వస్త్ర చర్మం చలికి వణుకుతుంటే, …..

ఈ కణకణలాడే ఉదరకొలిమి గురించి ….
కాలకూట విషం మింగిన ఆ శివునికే ఎరుక.

ఓటు తీరుస్తుందా? సీటు ఆర్పుతుందా? …. నా ఆకలి – మంటలను
పార్లమెంటు ఆపుతుందా? ప్రజాస్వామ్యం అంతం చేస్తుందా? ….. నా పేగుల అరుపులను.
అందుకే …… అమ్మలాంటి ఆహార భద్రత చట్టం
చెయ్యకండి భరతమాత బిడ్డలకు దూరం.

AP 10th Class Social Important Questions Chapter 10 ప్రపంచీకరణ

These AP 10th Class Social Studies Important Questions 10th Lesson ప్రపంచీకరణ will help students prepare well for the exams.

AP Board 10th Class Social 10th Lesson Important Questions and Answers ప్రపంచీకరణ

10th Class Social 10th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium

1. ఎక్కువ దేశాలలో ఉత్పత్తులను నియంత్రించే సంస్థలను ఏమంటారు?
జవాబు:
బహుళజాతి సంస్థ.

2. ప్రపంచీకరణ ప్రధాన ఫలితం ఏమిటి?
జవాబు:
దేశాల మధ్య పోటీ పెరగడం.

3. హోండా, నోకియా, పెప్సి, టాటా మోటార్స్ లలో భారతీయ బహుళజాతి కంపెనీ ఏది?
జవాబు:
టాటా మోటార్స్.

4. WTO ను విస్తరింపుము.
జవాబు:
వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (ప్రపంచ వాణిజ్య సంస్థ)

5. SEZ ను విస్తరింపుము.
జవాబు:
స్పెషల్ ఎకనామిక్ జోన్ (ప్రత్యేక ఆర్థిక మండలి)

AP 10th Class Social Important Questions Chapter 10 ప్రపంచీకరణ

6. IBRD ను విస్తరింపుము.
జవాబు:
ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ & డెవలెప్ మెంట్ (అంతర్జాతీయ అభివృద్ధి మరియు పునర్నిర్మాణ బ్యాంక్).

7. IMF ను విస్తరింపుము.
జవాబు:
ఇంటర్నేషనల్ మానిటరి ఫండ్ (అంతర్జాతీయ ద్రవ్య నిధి).

8. వినియోగదారుల సేవలు అందించేవి ఏవి?
జవాబు:
కాల్ సెంటర్స్,

9. ప్రపంచీకరణ వలన విదేశీ వాణిజ్యాలలో అధిక భాగాన్ని ఏవి నియంత్రిస్తాయి?
జవాబు:
బహుళ జాతి సంస్థలు.

10. WTO యొక్క ప్రధాన ఉద్దేశము.
జవాబు:
అంతర్జాతీయ వాణిజ్యాన్ని సరళీకృతం చేయుట.

11. భారతదేశంలో సరళీకృత ఆర్థిక విధానం ఏ సంవత్సరం లో ప్రారంభమైనది?
జవాబు:
1991.

12. అంతర్జాతీయ ఆర్థిక మార్పిడిలలో ఎన్ని రకాల ప్రవాహాలను మనం గుర్తించవచ్చు?
జవాబు:
మూడు.

13. ప్రపంచీకరణ ఏ శతాబ్దం చివర సంభవించిన పరిమాణం?
జవాబు:
20 వ.

14. భారతదేశంలో ఇంగ్లీషు మాట్లాడగలిగిన విద్యావంతులైన యువత ఎటువంటి సేవలు అందిస్తున్నారు?
జవాబు:
వినియోగదారుల సేవలు (కస్టమర్ కేర్)

AP 10th Class Social Important Questions Chapter 10 ప్రపంచీకరణ

15. బహుళజాతి కంపెనీలు, ఆయా దేశాల క్లినిక కంపెనీలు కలిసి ఉత్పత్తిని చేపడితే వాటిని ఏమంటారు?
జవాబు:
జాయింట్ వెంచర్లు.

16. బహుళజాతి సంస్థలు ఖర్చు పెట్టే పెట్టుబడిని ఏమంటారు?
జవాబు:
విదేశీ పెట్టుబడి.

17. IDA ని విస్తరింపుము.
జవాబు:
ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ అసోసియేషన్ (అంతర్జాతీయ అభివృద్ధి సంఘం)

18. IBRD, IDA సంస్థలు దేనిలో భాగం?
జవాబు:
ప్రపంచ బ్యాంక్ లో.

19. వివిధ దేశాలలోని మార్కెట్లను అనుసంధానం చేయునది ఏది?
జవాబు:
విదేశీ వాణిజ్యం.

20. పశ్చిమ ఆసియా, ఉత్తర ఆఫ్రికా దేశాలు ప్రభావితమై నియంతలను తొలగించడానికి చేసిన విప్లవాలను ప్రసార మాధ్యమాలు ఏవిధంగా పేర్కొన్నాయి?
జవాబు:
అరబ్ వసంతంగా.

21. WTO లో సభ్యదేశాల సంఖ్య.
జవాబు:
150.

22. ప్రపంచీకరణ వల్ల ఏ రాజ్యాలు అంతరించి పోతాయో అన్నది చర్చనీయాంశమైనది?
జవాబు:
జాతీయ రాజ్యాలు.

23. జపాన్, జర్మనీ, యు.కె, ఫ్రాన్స్ వంటి దేశాలకు IBRD, IDA లలో ఉన్న ఓటు విలువ ఎంత?
జవాబు:
3 – 6%

24. ఏ సంస్థల కారణంగా దూరప్రాంతాలలోని ఉత్పత్తి మధ్య అనుసంధానం ఏర్పడింది?
జవాబు:
బహుళ జాతి సంస్థలు.

AP 10th Class Social Important Questions Chapter 10 ప్రపంచీకరణ

25. ప్రపంచ బ్యాంకులో అమెరికా ఓటుకు ఎంత విలువ ఉంది?
జవాబు:
16%.

26. ప్రపంచ బ్యాంకులో ఏ దేశాల ఓటుకు తక్కువ విలువ ఉంటుంది?
జవాబు:
పేద దేశాలకు.

27. IBRD, IDA సంస్థలలో సభ్య దేశాలుగా ఉన్న దేశాలు ఎన్ని?
జవాబు:
170.

28. ప్రపంచీకరణ వల్ల భారతదేశంలో ఏ వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరింది?
జవాబు:
సంపన్న వర్గం.

29. క్రింది వానిలో బహుళ జాతి సంస్థలుగా ఎదిగిన భారతీయ కంపెనీలను రాయండి.
i) టాటా మోటర్స్ ii) ఇన్ఫోసిస్ iii) కార్గిల్ ఫుడ్స్ iv) ఏషియన్ పెయింట్స్.
జవాబు:
(i), (ii) & (iv)

30. భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విదేశీ కంపెనీలను ఆకర్షించుకోడానికి చేపట్టినవి ఏవి?
జవాబు:
ప్రత్యేక ఆర్థిక మండళ్ళు

31. ప్రభుత్వం విధించిన అవరోధాలను, పరిమితులను తొలగించటాన్ని ఏమి అంటారు?
జవాబు:
ఆర్థిక సరళీకరణ.

32. ఫోర్డ్ మోటార్స్ అనేది ఏ దేశ కంపెనీ?
జవాబు:
అమెరికా

AP 10th Class Social Important Questions Chapter 10 ప్రపంచీకరణ

33. ఏ సంవత్సరం నుండి దీర్ఘకాలం ప్రభావం చూపించేలా భారతదేశ విధానాలలో మార్పులు చేశారు?
జవాబు:
1991.

34. వస్తువులు, పెట్టుబడులు కదిలినంత స్వేచ్చగా కార్మికుల వలసలు లేనప్పటికీ దాదాపుగా 5 కోట్ల మంది యూరపు నుంచి ఏ దేశాలకు వెళ్ళి ఉంటారని అంచనా?
జవాబు:
అమెరికా, ఆస్ట్రేలియా.

35. ఒక పెద్ద బహుళజాతి సంస్థ ప్రపంచమంతటా అమ్మే సరుకులకు సేవలను అందించేవి ఏవి?
జవాబు:
వినియోగదారుల సేవ (కస్టమర్ కేర్)

36. ఉత్పత్తి ప్రక్రియను చిన్న చిన్న భాగాలుగా చేసి వాటిని ప్రపంచంలో పలుచోట్ల చేపట్టే సంస్థలు ఏవి?
జవాబు:
బహుళ జాతి సంస్థలు.

37. ఫోర్డ్ మోటార్స్ అనే అమెరికా కంపెనీ భారతదేశానికి చెందిన ఏ కంపెనీతో కలసి చెన్నె దగ్గర కర్మాగారాన్ని నెలకొల్పింది?
జవాబు:
మహీంద్ర & మహింద్రా.

38. ప్రపంచీకరణ ప్రక్రియకు ముఖ్య కారణమేమి?
జవాబు:
సాంకేతిక పరిజ్ఞానం వేగవంతంగా అభివృద్ధి చెందడం.

39. ‘E-mail’ ను పంపించటానికి అవసరమైనది.
జవాబు:
ఇంటర్నెట్.

40. లండన్లోని బ్యాంకు నుంచి విజయవాడలోని బ్యాంకుకు దీనిద్వారా డబ్బులను ట్రాన్స్ఫర్ చేయవచ్చు.
జవాబు:
ఇంటర్నెట్ బ్యాంకింగ్.

41. విదేశీ వాణిజ్యాన్ని పెంచటానికి లేదా తగ్గించటానికి ప్రభుత్వం వేటిని విధిస్తుంది?
జవాబు:
పరిమితులను.

42. ప్రపంచీకరణలో భారతదేశంలోని ఉత్పత్తిదారులు మనుగడ సాగించాలి అంటే?
జవాబు:
నాణ్యతను మెరుగు పరచుకోవాలి.

AP 10th Class Social Important Questions Chapter 10 ప్రపంచీకరణ

43. ప్రపంచంలోని అధికశాతం జనాభాను ప్రభావితం చేసే కీలక అంశాలపై నిర్ణయాలను తీసుకుంటున్న సంస్థలు ఏవి?
జవాబు:
ప్రపంచ పరిపాలనా సంస్థలు.

44. విదేశీ పెట్టుబడులను ఆకర్షించటానికి భారత ప్రభుత్వం ఏ చట్టాలను సడలించింది?
జవాబు:
కార్మిక చట్టాలను.

45. జాతీయ భావన పలచబడటానికి కారణమేమి?
జవాబు:
ప్రపంచీకరణ.

46. అమెరికా GDP లో వ్యవసాయ రంగం వాటా ఎంత?
జవాబు:
19

47. దేశాల మధ్య వేగంగా పెరుగుతున్న అనుసంధానం, అంత: సంబంధాలను ఏమంటారు?
జవాబు:
ప్రపంచీకరణ.

48. ఫోర్డ్ మోటార్స్ ఏ సంవత్సరంలో భారతదేశంలోని చెన్నై దగ్గర కంపెనీ ప్రారంభించింది?
జవాబు:
1995.

49. ఫోర్ట్ మోటార్స్ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని దేశాలలో ఉత్పత్తిని నిర్వహిస్తోంది?
జవాబు:
26.

50. అమెరికా మొత్తం ఉపాధిలో ఎంతశాతం వ్యవసాయ వాటా కల్గి ఉంది?
జవాబు:
0.5%

51. నైక్, పెప్సి, హెూండా, ఇన్ఫోసిస్ లో భారతీయ MNC ఏది?
జవాబు:
ఇన్ఫోసిస్.

AP 10th Class Social Important Questions Chapter 10 ప్రపంచీకరణ

52. అంతర్జాతీయ ఆర్థిక మార్పిడిలతో ఏర్పడే ప్రవాహం కానిది ఏది?
→ వస్తువులు, సేవల ప్రవాహం.
→ శ్రమ ప్రవాహం
→ పెట్టుబడి ప్రవాహం
→ మార్కెట్ ప్రవాహం.
జవాబు:
మార్కెట్ ప్రవాహం.

53. వాణిజ్య అవరోధానికి ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
పన్ను.

54. ప్రపంచీకరణ దేశాలను అనుసంధానం చేయటం వల్ల ఎవరి మధ్య పోటీని పెంచుతుంది?
జవాబు:
ఉత్పత్తిదారుల మధ్య.

55. ప్రత్యేక ఆర్థిక మండళ్ళ (SEZ) లో ఉండే ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఏవి?
i) రవాణ il) విద్యుత్తు iii) గిడ్డంగులు iv) ఋణ సదుపాయం v) విద్య
జవాబు:
(i), (ii), (iii) & (iv)

56. WTO, IMF, WHO, IBRD లలో ప్రపంచ ద్రవ్య సంస్థ కానిది ఏది ?
జవాబు:
WHO

57. ఒకప్పుడు సర్వసత్తాక ప్రభుత్వాలు కరెన్సీ విలువను నిర్ణయించడం వంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేవి. ఇప్పుడు ప్రభుత్వం వెలుపల, ప్రభుత్వానికి ఎటువంటి నియంత్రణ లేని “మార్కెట్ శక్తులు” ఆ నిర్ణయాలు చేస్తున్నాయి. ఈ ఉదాహరణలు ఊటంకించిన ఆ మార్కెట్ శక్తులు ఏవి?
జవాబు:
బహుళజాతి కంపెనీలు.

58. ప్రభుత్వాలు తమ విధానాలను రూపొందించుకోవటం లో ప్రపంచ బ్యాంకు సలహా ఇచ్చి మార్గదర్శనం చేస్తూ వాటిని ప్రభావితం చేయగలుగుతుంది. అయితే, ప్రపంచ బ్యాంక్ లో ఇమిడియున్న సంస్థలు ఏవి?
జవాబు:
IBRD, IDA.

59. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) ఫోర్డ్ మోటార్స్ ( ) a) IT
ii) రాన్బాక్సీ ( ) b) నటులు, బోల్టులు
iii) సుందరం ఫాస్టెనర్స్ ( ) c) మందులు
iv) ఇన్ఫోసిస్ ( ) d) కార్లు
జవాబు:
i-d, ii – c, iii – b, iv-a.

AP 10th Class Social Important Questions Chapter 10 ప్రపంచీకరణ

60. ఈ-మెయిల్, వాయిస్-మెయిల్, టెలిగ్రామ్, ఈ-బ్యాంకింగ్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కానిది ఏది?
జవాబు:
టెలిగ్రామ్.

61. క్రింది వానిలో సరికాని జత.
→ SEZ – ప్రత్యేక ఆర్థిక మండలి.
→ IBRD – ప్రపంచ బ్యాంక్.
→ IMF – అంతర్జాతీయ మార్కెట్ సంస్థ.
→ WTO – ప్రపంచ వాణిజ్య సంస్థ.
జవాబు:
IMF – అంతర్జాతీయ మార్కెట్ సంస్థ.

62. IT ని విస్తరింపుము.
జవాబు:
సమాచార సాంకేతిక పరిజ్ఞానం.

63. క్రింది ఇవ్వబడిన చిత్రంను పరిశీలించి చిత్రానికి సరిపోయే ఒక నినాదం రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 10 ప్రపంచీకరణ 1
జవాబు:
స్వదేశీ నారికేళముండగా – విదేశీ కోలా ఎందుకు దండగా.

10th Class Social 10th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
I.B.R.D. ని విస్తరించుము.
జవాబు:
International Bank for Reconstruction and Development (అంతర్జాతీయ పునఃనిర్మాణ మరియు అభివృద్ధి బ్యాంకు / ప్రపంచ బ్యాంకు)

ప్రశ్న 2.
SEZS ను విస్తరించుము.
జవాబు:
Special Economic Zones (ప్రత్యేక ఆర్థిక మండలి).

ప్రశ్న 3.
WTO ను విస్తరింపుము.
జవాబు:
ప్రపంచ వాణిజ్య సంస్థ (లేదా) World Trade Organisation.

AP 10th Class Social Important Questions Chapter 10 ప్రపంచీకరణ

ప్రశ్న 4.
అరబ్ వసంతం అనగా నేమి?
జవాబు:
అరబ్ వసంతం :
ఉత్తర ఆఫ్రికా మరియు పశ్చిమ ఆసియాలలోని ట్యునీషియా, ఈజిప్ట్ వంటి దేశాలలో నియంతలను తొలగించడం కోసం చోటుచేసుకున్న విప్లవాలను అరబ్ వసంతం అని పిలుస్తారు.

ప్రశ్న 5.
ఈనాడు ఏ వర్గానికి చెందిన ప్రజల వలసలకు గిరాకీ ఉంది?
జవాబు:
ఈనాడు వృత్తి నైపుణ్యం ఉన్న ప్రజల వలసలకు గిరాకీ ఉంది.

ప్రశ్న 6.
జాయింట్ వెంచర్లు అంటే ఏమిటి?
జవాబు:
కొన్ని సందర్భాలలో బహుళజాతి కంపెనీలు ఆయా దేశాల స్థానిక కంపెనీలతో కలసి ఉత్పత్తిని చేపడతాయి. వీటిని జాయింట్ వెంచర్లు అంటారు.

ప్రశ్న 7.
ఫోర్డ్ మోటర్స్ కంపెనీ తమ కర్మాగారాన్ని ఎచట నెలకొల్పింది?
జవాబు:
ఫోర్డ్ మోటర్స్ కంపెనీ తమ కర్మాగారాన్ని చెన్నైలో 1995లో నెలకొల్పింది.

ప్రశ్న 8.
ఫోర్డ్ మోటర్స్ భారతదేశంలో ఏ కంపెనీతో కలసి కర్మాగారాన్ని స్థాపించింది?
జవాబు:
ఫోర్డ్ మోటర్స్ భారతదేశంలో మహీంద్ర & మహీంద్రతో కలసి కర్మాగారాన్ని స్థాపించింది.

ప్రశ్న 9.
చైనా బొమ్మలు భారతదేశంలో ఎందుకు ఆదరణ పొందాయి?
జవాబు:
చైనా బొమ్మలు కొత్త డిజైన్లు, తక్కువ ధర కారణంగా భారతదేశంలో ఆదరణ పొందాయి.

ప్రశ్న 10.
ప్రపంచీకరణలో ప్రధాన పాత్ర పోషిస్తున్నదెవరు?
జవాబు:
ప్రపంచీకరణలో బహుళజాతి సంస్థలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

AP 10th Class Social Important Questions Chapter 10 ప్రపంచీకరణ

ప్రశ్న 11.
ఇంటర్నెట్ ద్వారా తక్షణమే పంపే సమాచారాన్ని ఏమంటారు?
జవాబు:
ఇంటర్నెట్ ద్వారా తక్షణమే పంపే సమాచారాన్ని ఎలక్ట్రానిక్ మెయిల్ (e-mail) అంటాం.

ప్రశ్న 12.
IT ని విస్తరించండి.
జవాబు:
Information Technology (సమాచార సాంకేతిక పరిజ్ఞానం).

ప్రశ్న 13.
ఆర్థిక సరళీకరణ అనగా నేమి?
జవాబు:
ప్రభుత్వం విధించిన అవరోధాలను, పరిమితులను తొలగించటాన్ని ఆర్థిక సరళీకరణ అంటారు.

ప్రశ్న 14.
WB ను విస్తరించండి.
జవాబు:
World Bank (ప్రపంచ బ్యాంకు).

ప్రశ్న 15.
IMF ను విస్తరించండి.
జవాబు:
International Monetary Fund (అంతర్జాతీయ ద్రవ్య నిధి).

ప్రశ్న 16.
విదేశీ వాణిజ్యం మౌలిక విధి ఏమిటి?
జవాబు:
విదేశీ వాణిజ్యం వివిధ దేశాలలోని మార్కెట్లను అనుసంధానం చేస్తుంది.

ప్రశ్న 17.
WTOని విస్తరించండి. అది చేసే పని ఏమిటి?
జవాబు:
WTO అనగా World Trade Organisation “ప్రపంచ వాణిజ్య సంస్థ”. ఇది అంతర్జాతీయ వాణిజ్యంలో సరళీకృత విధానాలు ఏర్పడేలా చేసే ఉద్దేశంతో పనిచేస్తుంది.

10th Class Social 10th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
ప్రపంచీకరణ దేశాలను అనుసంధానం చేయటం వల్ల ఉత్పత్తిదారుల మధ్య పోటీని పెంచుతుంది. సమర్థించుము.
జవాబు:
ప్రపంచీకరణ దేశాలను అనుసంధానం చేయటం వల్ల ఉత్పత్తిదారుల మధ్య పోటీని పెంచుతుందనుటలో సందేహం లేదు.

  • సాధారణంగా బహుళజాతి సంస్థలే వివిధ దేశాలలో ఉత్పత్తి, వాణిజ్యం చేస్తున్నాయి.
  • వివిధ దేశాల మార్కెట్ ను కైవసం చేసుకోవటానికి MNC లు కచ్చితంగా పోటీపడతాయి.
  • MNC లు భారీ పరిశ్రమల ద్వారా ఉత్పత్తి చేస్తాయి. సాధారణంగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తాయి. ఈ స్థాయిలో స్వదేశీ సంస్థలు తట్టుకోవాలంటే కొంచెం కష్టం.
  • ఈ పోటీ వలన, భారీతరహా ఉత్పత్తి వలన, ఉత్పత్తి వ్యయం తగ్గించి వస్తువు ధర కూడా తగ్గుతుంది.
  • ఉత్పత్తికి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానమును వినియోగించుకుని ఉత్పత్తిని పెంచుతారు.
  • స్వేచ్చా మార్కెట్ కారణంగా వివిధ కంపెనీలు ఉండుట వలన వినియోగదారునికి ఎంపిక అవకాశం ఉంటుంది. దీని వలన కంపెనీల మధ్య పోటీ ఏర్పడుతుంది.
  • కొత్త వాణిజ్య అవకాశాలు పెరగటం (ఉదా : e-కామర్స్) వలన కూడా పోటీ వాతావరణం నెలకొంది.
  • మారుతున్న ఫ్యాషన్లకనుగుణంగా అనేక రకాల కొత్త మోడల్స్ (కార్లు, ఫోన్లు మొదలైనవి) రావటం వలన అవి స్వదేశీ మార్కెట్ కు తీసుకురావటంలో కూడా పోటీ ఏర్పడుతుంది.

AP 10th Class Social Important Questions Chapter 10 ప్రపంచీకరణ

ప్రశ్న 2.
భారతదేశంలోని స్థానిక పరిశ్రమలపై ప్రపంచీకరణ ప్రభావాన్ని అంచనా వేయుము.
జవాబు:
ప్రపంచీకరణ వలన కలిగే మంచి (అనుకూల) ప్రభావం :

  1. పెరుగుతున్న పోటీ వలన చాలా భారతదేశ కంపెనీలు ప్రయోజనాన్ని పొందాయి.
  2. వారు కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉత్పత్తిని పెంచి ఉత్పాదక సామర్థ్యాన్ని కూడా పెంచుకున్నాయి.
  3. కొన్ని కంపెనీలు విదేశీ కంపెనీలతో కలిసిపోయి వాటి ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు పంపించగలుగుతున్నాయి.

ప్రపంచీకరణ వలన చెడు ప్రభావం :

  1. ఈ పోటీని తట్టుకోలేక చాలా చిన్న తరహా కంపెనీలు మూత పడినాయి. కొన్ని మూతపడే స్థాయికి వచ్చాయి.
  2. దీనివలన చాలామంది కార్మికులు. నిరుద్యోగులుగా మారుతున్నారు.

ప్రశ్న 3.
ప్రపంచ బ్యాంకు యొక్క ప్రపంచ అభివృద్ధి నివేదిక (2012)’ వివిధ దేశాలను ఎలా వర్గీకరించిందో తెలుపుము.
జవాబు:
‘ప్రపంచ బ్యాంకు అభివృద్ధి నివేదిక 2012’ ప్రకారం వార్షిక తలసరి ఆదాయం ఆధారంగా దేశాలు ఈ క్రింది విధంగా వర్గీకరించబడ్డాయి.

  1. అధిక ఆదాయ దేశాలు – 12,600 అమెరికా డాలర్లు, అంతకంటే ఎక్కువ.
  2. మధ్య ఆదాయ దేశాలు – 1036 నుండి 12,599 అమెరికా డాలర్ల వరకు.
  3. అల్ప ఆదాయ దేశాలు – 1035 అమెరికా డాలర్లు మరియు అంతకంటే తక్కువ.

ప్రశ్న 4.
ప్రపంచీకరణకు దోహదం చేసిన కారణాలను ఏవైనా నాల్గింటిని రాయండి..
జవాబు:
ప్రపంచీకరణకు దోహదం చేసిన కారణాలు :

  1. సాంకేతిక పరిజ్ఞానం
  2. రవాణా
  3. విదేశీ వాణిజ్య సరళీకరణ
  4. విదేశీ పెట్టుబడుల సరళీకరణ
  5. రాజకీయ వాతావరణం.

ప్రశ్న 5.
భారతదేశంలో ప్రపంచీకరణ ప్రభావాలను వివరించండి.
జవాబు:

  1. భారతదేశంలో ప్రపంచీకరణ ప్రభావం ఒకే రకంగా లేదు.
  2. ఇది సంపన్న వినియోగదారులకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చింది.
  3. నైపుణ్యం, విద్య, అపార సంపద ఉన్న ఉత్పత్తిదారులకు లాభదాయకంగా ఉంది.
  4. సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న కొన్ని సేవలు విస్తరించాయి.
  5. కొన్ని నూతన ఉద్యోగాలు సృష్టించబడ్డాయి.
  6. కొన్ని భారతీయ కంపెనీలు బహుళజాతి సంస్థలుగా ఎదగగలిగాయి.
  7. అనేకమంది చిన్న ఉత్పత్తిదారులు, కార్మికులు నష్టపోయారు.
  8. వారి ఉపాధికి, హక్కులకు భంగం వాటిల్లింది.

ప్రశ్న 6.
ప్రస్తుతం భారతీయ కంపెనీలు ప్రపంచీకరణ వల్ల ఎలా లాభపడుతున్నాయి?
జవాబు:
ప్రస్తుతం భారతీయ కంపెనీలు ప్రపంచీకరణ వల్ల లాభపడడానికి దోహదపడే అంశాలు.

  1. కొత్త సాంకేతిక విజ్ఞానము
  2. ఉత్పత్తి ప్రమాణాలను పెంచడం
  3. విదేశీ కంపెనీలతో కలిసి పనిచేయడం

ప్రశ్న 7.
ప్రపంచీకరణకు చోదక శక్తి ఏది? ఆర్థిక రంగమా? రాజకీయ నిర్ణయాలా?
జవాబు:
ప్రపంచీకరణకు ఆర్థిక రంగమే మూలం అని భావించేవాళ్లు దానికి ఆర్థిక శక్తులు కారణమని, దాని ఎల్లలను అవే నిర్ణయిస్తాయని వాదిస్తారు. రాజకీయాలు కారణం అని భావించేవాళ్లు ప్రభుత్వ నిర్ణయాల వల్ల ముందుగా ఇది మొదలయ్యిందని అంటారు. ప్రభుత్వాలు పరిమితులు విధిస్తాయి, లేదా వాటిని తొలగిస్తాయి. ఒక ప్రదేశం అనువుగా ఉందో, లేదో అంచనా వేసుకోటానికి మార్కెటు పరిస్థితులే కాకుండా రాజకీయ వాతావరణం కూడా ముఖ్యమైన అంశం అవుతుంది. వాస్తవం ఏమిటంటే పై రెండింటికీ సంబంధం ఉంది. ఒక ప్రత్యేక నేపధ్యంలో రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారని గుర్తిస్తే, ఇవి ఆపాటికే వచ్చిన ఆర్థిక, సాంకేతిక మార్పులను పరిగణనలోకి తీసుకుంటాయని అర్థం అవుతుంది.

ప్రశ్న 8.
అంతర్జాతీయ ఆర్థిక మార్పిడిలతో ఎన్ని ప్రవాహాలున్నాయి? వాటిని గూర్చి క్లుప్తంగా రాయండి.
జవాబు:
అంతర్జాతీయ ఆర్థిక మార్పిడిలతో మనం మూడు రకాల ప్రవాహాలను గుర్తించవచ్చు. మొదటిది వస్తువులు, సేవల ప్రవాహం. రెండవది శ్రమ ప్రవాహం – ఉపాధికోసం వెతుక్కుంటూ ప్రజలు వలస వెళ్లటం. మూడవది పెట్టుబడి ప్రవాహం – స్వల్పకాల, లేదా దీర్ఘకాల ప్రయోజనాల కోసం దూర ప్రాంతాలకు పెట్టుబడి ప్రవహించటం.

ప్రశ్న 9.
బహుళజాతి సంస్థలు తమ వస్తువులను ప్రపంచ వ్యాప్తంగా అమ్మడమే కాకుండా వస్తువుల, సేవల ఉత్పత్తి ప్రపంచవ్యాప్తంగా – విస్తరింపజేస్తుంది – ఉదహరించండి.
జవాబు:
పారిశ్రామిక పరికరాలను తయారుచేసే ఒక పెద్ద బహుళజాతి సంస్థ వాటిని అమెరికాలోని పరిశోధనా కేంద్రాలలో డిజైన్ చేయిస్తుంది. ఈ రకంగా అమెరికా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటుంది. తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయగల చైనాలో విడిభాగాలు తయారు చేస్తుంది. వాటి మార్కెట్ లక్ష్యాలయిన అమెరికా, యూరప్ లకు సమీపంలోని మెక్సికో, తూర్పు యూరప్లో అసెంబ్లింగ్ చేస్తారు. భారతదేశంలో ఇంగ్లీష్ తెలిసిన యువకుల ద్వారా కాల్ సెంటర్లను నిర్వహిస్తారు.

AP 10th Class Social Important Questions Chapter 10 ప్రపంచీకరణ

ప్రశ్న 10.
చైనా బొమ్మల ఉత్పత్తిదారులు భారతీయ మార్కెట్ లను ఎలా ఆక్రమించారు?
జవాబు:
చైనా ఉత్పత్తిదారులు భారతదేశానికి ప్లాస్టిక్ బొమ్మలు ఎగుమతి చేయసాగారు. భారతదేశంలో కొనుగోలుదార్లకు ఇప్పుడు భారతీయ, చైనా బొమ్మలలో ఎంచుకునే అవకాశం ఉంది. కొత్త డిజైన్లు, తక్కువ ధర కారణంగా చైనా బొమ్మలు ఎంతో – ఆదరణ పొందాయి. ఒక సంవత్సర కాలంలో బొమ్మల దుకాణాలలో 70 – 80 శాతం భారతీయ బొమ్మలకు బదులుగా . చైనా బొమ్మలను అమ్మసాగాయి. గతంలో కంటే ఇప్పుడు భారతదేశంలో బొమ్మలు చవకగా ఉన్నాయి.

చైనాలో బొమ్మల ఉత్పత్తిదారులకు ఇది తమ వ్యాపారాన్ని విస్తరింపచేసుకోటానికి అవకాశం ఇచ్చింది.

ప్రశ్న 11.
ప్రపంచీకరణ వలన దేశాలు అనేక అంశాలలో నియంత్రణను కోల్పోయాయి. వ్యాఖ్యానించుము.
జవాబు:
పెట్టుబడి, ప్రజలు సాంకేతిక పరిజ్ఞానాల ప్రవాహం వల్ల సరిహద్దులు లేని ప్రపంచం ఏర్పడింది. ఫలితంగా అనేక దేశాలు తమ దేశ సరిహద్దుల లోపల కూడా జీవితానికి సంబంధించిన అనేక అంశాలపై నియంత్రణ కోల్పోతారు. ఉదాహరణకు ఒకప్పుడు, సర్వసత్తాక ప్రభుత్వాలు కరెన్సీ విలువను నిర్ణయించడం వంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసికొనేవి. ఇప్పుడు ప్రభుత్వం వెలుపల, ప్రభుత్వానికి ఎటువంటి నియంత్రణ లేని మార్కెటు శక్తులు ఆ నిర్ణయాలు చేస్తున్నాయి.

ప్రశ్న 12.
అమెరికాలో కేవలం అరశాతం (0.5%) మాత్రమే వ్యవసాయరంగంలో ఉన్నా ఆ దేశ రైతులు తమ ఉత్పత్తులను ఇతర దేశాలలో చౌకగా ఎలా అమ్ముతున్నారు?
జవాబు:
అమెరికా GDP లో వ్యవసాయం వాటా 1 శాతం కాగా మొత్తం ఉపాధిలో 0.5% మాత్రమే వ్యవసాయంలో ఉన్నారు. అయినాకానీ అమెరికా వ్యవసాయంలో ఉన్న ఈ కొద్దిమందికే ఉత్పత్తికి, ఇతర దేశాల ఎగుమతికి అమెరికా ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు లభిస్తాయి. పెద్ద ఎత్తున లభించే ఈ సబ్సిడీల వల్ల అమెరికా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను చాలా తక్కువ ధరకు అమ్మగలుగుతున్నారు. అదనంగా ఉన్న వ్యవసాయ ఉత్పత్తులను వీళ్లు ఇతర దేశాల మార్కెట్లలో చాలా తక్కువ ధరలకు అమ్మగలుగుతున్నారు.

ప్రశ్న 13.
అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలకు భిన్నంగా రైతులకు పెద్ద మొత్తంలో రాయితీ వచ్చినపుడు అభివృద్ధి చెందిన దేశాలు అమెరికాను ఏమని ప్రశ్నిస్తాయి?
జవాబు:
అన్యాయపూరిత వాణిజ్య అవరోధాల కొనసాగింపులో భాగంగా అమెరికా తమ రైతులకు పెద్ద మొత్తంలో రాయితీలు ఇచ్చినపుడు అభివృద్ధి చెందిన రైతులు క్రింది విధంగా ప్రశ్నిస్తారు. “ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాల ప్రకారం మేం వాణిజ్య అవరోధాలను తొలగించాం. కానీ మీరు ఆ నియమాలను పట్టించుకోకుండా మీ రైతులకు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నారు. మా రైతులకు మద్దతు ఇవ్వొద్దని మా ప్రభుత్వాలకు చెప్పి మీరు మీ రైతులకు మద్దతును కొనసాగిస్తున్నారు. స్వేచ్ఛా, న్యాయమైన వాణిజ్యం అంటే ఇదేనా?”

ప్రశ్న 14.
బహుళజాతి సంస్థలు పని ప్రదేశాన్ని ఎంచుకోడానికి ఉపయోగించే సాధారణ సూచికలు ఏవి?
జవాబు:
బహుళజాతి సంస్థలు పని ప్రదేశాన్ని ఎంచుకోడానికి ఉపయోగించే సాధారణ సూచికలు : మార్కెట్లకు దగ్గరగా ఉండటం, తక్కువ ఖర్చుతో నైపుణ్యం ఉన్న, నైపుణ్యం లేని కార్మికుల లభ్యత ఇతర ఉత్పత్తి కారకాల అందుబాటు, తమ ప్రయోజనాలను కాపాడే ప్రభుత్వ విధానాలు ఉండటం మొదలైనవి.

ప్రశ్న 15.
విదేశీ వాణిజ్యం వివిధ దేశాలలోని మార్కెట్లను ఎలా అనుసంధానం చేస్తుంది?
జవాబు:
ఉత్పత్తిదారులకు దేశీయ మార్కెట్లకు మించిన అవకాశాలను విదేశీ వాణిజ్యం అందిస్తుంది. అదేవిధంగా కొనుగోలుదారులకు స్థానికంగా ఉత్పత్తి అయిన వస్తువులే కాకుండా మరిన్ని వస్తువులు అందుబాటులోకి వస్తాయి. అంటే విదేశీ వాణిజ్యం వివిధ దేశాలలోని మార్కెట్లను అనుసంధానం చేస్తుంది.

ప్రశ్న 16.
1950-1960 ప్రాంతంలో భారతదేశం దిగుమతులపై ఎందుకు అవరోధాలు విధించింది?
జవాబు:
1950-1960లలో పరిశ్రమలు అప్పుడే నెలకొల్పబడుతున్నాయి. ఈ దశలో దిగుమతుల నుంచి పోటీని అనుమతించి ఉంటే ఈ పరిశ్రమలు నిలదొక్కుకుని ఉండేవి కావు. కాబట్టి అత్యవసర వస్తువులైన యంత్రాలు, రసాయనిక ఎరువులు, ముడి చమురు వంటి వాటి దిగుమతిని మాత్రమే ప్రభుత్వం అనుమతించింది.

ప్రశ్న 17.
“ప్రపంచీకరణ వలన జీవన ప్రమాణాలు పెరిగాయి.” వివరించండి.
జవాబు:
ప్రపంచీకరణ ఫలితంగా ప్రజల జీవితాలు ప్రభావితం అవుతున్నాయి. ప్రపంచీకరణ వల్ల వినియోగదారులు, ప్రత్యేకించి పట్టణాలలోని సంపన్నులకు మేలు జరిగింది. వీళ్లు ఎంచుకోటానికి ఇప్పుడు ఎన్నో వస్తువులు లభిస్తున్నాయి. అనేక ఉత్పత్తులలో నాణ్యత పెరిగి, ధరలు తగ్గాయి. ఫలితంగా ఈ ప్రజలకు అంతకు ముందు సాధ్యం కానంతగా మెరుగైన “జీవన ప్రమాణాలను అనుభవిస్తున్నారు.

AP 10th Class Social Important Questions Chapter 10 ప్రపంచీకరణ

ప్రశ్న 18.
బహుళజాతి సంస్థలు అంటే ఏమిటి? అవి ఎలా పని చేస్తాయో వివరించండి.
జవాబు:

  1. ఒకదేశం కంటే ఎక్కువ దేశాలలో ఉత్పత్తిని చేపట్టి లేదా ఉత్పత్తులను నియంత్రించే సంస్థలను బహుళజాతి సంస్థలు అంటారు.
  2. కార్మికులు, ఇతర వనరులు చౌకగా లభించే ప్రాంతాలలో బహుళజాతి సంస్థలు తమ కార్యాలయాలను, కర్మాగారాలను నెలకొల్పుతాయి.
  3. ఉత్పత్తి ఖర్చులను తగ్గించి ఇలా లాభాలు పెంచుకుంటాయి.
  4. ఉత్పత్తి ప్రక్రియను చిన్నచిన్న భాగాలుగా చేసి వాటిని ప్రపంచంలో పలుచోట్ల చేపడతాయి. అంతేకాక వినియోగదారుల సేవ అందిస్తాయి.

10th Class Social 10th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
వ్యాపారము మరియు పెట్టుబడుల విధానాల సరళీకరణ ప్రపంచీకరణకు ఏవిధంగా తోడ్పడుతుంది?
జవాబు:

  1. వ్యాపారము మరియు పెట్టుబడుల విధానాల సరళీకరణ వలన ప్రపంచీకరణ సులభతరమైంది.
  2. సరళీకరణ విధానాల వలన పరిశ్రమల స్థాపనలో ఉన్న అవరోధాలు తొలగించబడ్డాయి.
  3. వస్తువులు, సేవలు ప్రపంచవ్యాప్తంగా అందరికి అందుబాటులోకి వచ్చాయి.
  4. బహుళ జాతి కంపెనీల ఏర్పాటు వలన ప్రపంచీకరణ వేగవంతమైంది.
  5. వస్తువుల నాణ్యత పెరిగింది.
  6. వ్యాపార మరియు పెట్టుబడుల సరళీకరణ వల్ల రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెందాయి.
  7. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, అంతర్జాలం సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చి ప్రపంచీకరణకు దోహదం కలిగింది.
  8. అంతర్జాలం ద్వారా ప్రపంచం నలుమూలల నుండి ఏ సమాచారాన్నైనా క్షణాలలో తక్కువ ఖర్చుతో పొందగలుగుతున్నారు.

ప్రశ్న 2.
బహుళ జాతి సంస్థలు ప్రపంచీకరణకు ఏవిధంగా సహాయపడతాయో వివరించండి.
జవాబు:

  1. ప్రపంచీకరణ సాధించడంలో బహుళజాతి సంస్థల పాత్ర గణనీయంగా ఉంది.
  2. పెట్టుబడి, శ్రమ, సాంకేతిక పరిజ్ఞానం మొదలగు వాటి ప్రవాహాల ద్వారా బహుళజాతి సంస్థలు సరిహద్దు లేని ప్రపంచాన్ని సృష్టించాయి.
  3. బహుళజాతి సంస్థలు తమ ఉత్పత్తులనే కాక క్రొత్త వ్యాపార విధానాలను మరియు వివిధ దేశాల సంస్కృతులను పరిచయం చేస్తున్నాయి.
  4. వివిధ స్థానిక కంపెనీల మధ్య పోటీతత్వాన్ని పెంపొందించడానికి బహుళజాతి కంపెనీలు దోహదం చేస్తున్నాయి.
  5. బహుళజాతి సంస్థలు వివిధ రకాల వాహనాలను ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తున్నాయి.
  6. ప్రపంచ ప్రజల మధ్య విశాల దృక్పథాన్ని పెంపొందించడానికి బహుళజాతి సంస్థలు తోడ్పడుతున్నాయి.

ప్రశ్న 3.
భారత ప్రభుత్వం విదేశీ పెట్టుబడి, వాణిజ్యాలపై అవరోధాలు కల్పించడానికి గల కారణాలు ఏమిటి? ఈ అవరోధాలను తొలగించాలని ఎందుకు అనుకున్నది?
జవాబు:
విదేశీ పెట్టుబడులపై, వాణిజ్యాలపై భారత ప్రభుత్వం అవరోధాలు కల్పించటానికి గల కారణాలు.

  1. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం.
  2. మన దేశంలో పరిశ్రమలు తగినంత స్థాయిలో అభివృద్ధి చెందకపోవడం.
  3. విదేశీ పెట్టుబడులు మన ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని చూపిస్తాయని భావించడం.
  4. విదేశీ ఉత్పత్తులతో పోలిస్తే మన వస్తువుల నాణ్యత తక్కువగా ఉండటం.
  5. దేశంలోని ఉత్పత్తిదారులకు విదేశీ పోటీ నుండి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని భావించిన భారత ప్రభుత్వం విదేశీ వాణిజ్యం, విదేశీ పెట్టుబడుల పై అవరోధాలు కల్పించింది. అయితే 1991 నుండి భారత ఉత్పత్తిదారులు ప్రపంచవ్యాప్త ఉత్పత్తిదారులతో పోటీపడాల్సిన అవసరం ఉందని నిర్ణయించి ఈ అవరోధాలను తొలగించారు. దానికి గల కారణాలు :
    1) ప్రపంచ దేశాలన్నీ ప్రపంచీకరణ వైపు మొగ్గుచూపడం.
    2) విదేశీ పెట్టుబడుల వల్ల స్థానిక కంపెనీలు అభివృద్ధి చెందడం.
    3) ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తేవడం.

AP 10th Class Social Important Questions Chapter 10 ప్రపంచీకరణ

ప్రశ్న 4.
బహుళజాతి కంపెనీల వలన కలుగు లాభ, నష్టాలు ఏవి?
జవాబు:
బహుళజాతి కంపెనీల వలన కలుగు లాభాలు :

  1. ఉపాధి అవకాశాలు పెరుగుచున్నాయి.
  2. నాణ్యమైన ఉత్పత్తులు తక్కువ ధరకు లభిస్తున్నాయి.
  3. ప్రజలు నైపుణ్యాలను మెరుగు పరచుకున్నారు.
  4. ప్రజల జీవన ప్రమాణ స్థాయి మెరుగుపడింది.
  5. ఉత్పత్తిదారుల మధ్య పోటీ పెరిగింది.
  6. భారతదేశం కూడా ప్రపంచంలోని అగ్రదేశాలతో ఉత్పత్తులు విషయంలో పోటీపడగలుగుతుంది.
  7. వీటివలన దేశంలో అవస్థాపన సౌకర్యాలు మెరుగుపడతాయి.
  8. దేశాల మధ్య అనుసంధానం పెరుగుతుంది.

బహుళజాతి కంపెనీల వలన కలుగు నష్టాలు :

  1. సాంకేతిక పరిజ్ఞానం కలవారికి మాత్రమే ఉపాధి లభిస్తుంది, మిగతావారు నిరుద్యోగులవుతున్నారు.
  2. చిన్న ఉత్పత్తిదారులు పోటీని తట్టుకోలేక పరిశ్రమలను మూసివేస్తున్నారు.
  3. వ్యవసాయరంగం పూర్తిగా విస్మరించబడింది.
  4. గ్రామాలు కనుమరుగై పట్టణాల సంఖ్య పెరుగుతుంది.
  5. దేశీయ మార్కెట్ పై బహుళజాతి కంపెనీల పెత్తనం పెరిగింది.

ప్రశ్న 5.
బహుళజాతి కంపెనీ (MNC) లు రావడం వలన కుటీర చిన్నతరహా పరిశ్రమలు ఎలా అంతరించుకుపోతున్నాయో ఉదాహరణలతో వివరించండి.
జవాబు:
బహుళజాతి కంపెనీలు రావడం వలన కుటీర / చిన్నతరహా పరిశ్రమలు అంతరించిపోవడానికి కారణాలు :

  1. బహుళజాతి కంపెనీల ప్రధాన లక్ష్యం ఎక్కువ లాభాలను గడించడం.
  2. దీని కొరకు అవి అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాలలో పెట్టుబడులు పెడతాయి.
  3. ఈ బహుళజాతి కంపెనీలు అది పెట్టుబడి పెట్టిన దేశంలోని వనరులను సాధ్యమైనంత వరకు ఎక్కువగా ఉపయోగించుకుంటాయి.
  4. ఉత్పత్తి ఖర్చులను తగ్గించి, వస్తువులను తక్కువ ధరలలో అమ్ముతాయి.
  5. అందువలన చిన్న ఉత్పత్తిదారులు ఈ పోటీని తట్టుకోలేక పరిశ్రమలను మూసివేసే స్థాయికి వస్తున్నారు.

ఉదా :
1) బుట్టలు తయారుచెయ్యడం :
ప్లాస్టిక్, స్టీలు తదితర వస్తువులతో తయారయ్యేవి తక్కువ ధరకు దొరకడం వలన ఈ కుటీర పరిశ్రమ మూతబడే స్థాయికి వచ్చింది.

2) చేనేత పరిశ్రమ :
మరమగ్గాలు ఉపయోగించడం వలనను, కృత్రిమ వస్త్రాలు లభ్యత వలనను ఈ పరిశ్రమ కూడా కష్టకాలంలో ఉంది.

ప్రశ్న 6.
భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచీకరణ ప్రభావాలేమిటి ? విస్తరిస్తున్న ప్రపంచీకరణ వల్ల భారతదేశానికి ప్రయోజనాలేమిటి ? నీ అభిప్రాయాన్ని వివరించుము.
జవాబు:
భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచీకరణ ప్రభావం :

  1. ప్రపంచీకరణ వల్ల వినియోగదారులు ప్రత్యేకించి పట్టణాలలోని సంపన్నులకు మేలు జరిగింది.
  2. వినియోగదారులకు ఎంచుకోవడానికి ఇప్పుడు ఎన్నో వస్తువులు లభిస్తున్నాయి.
  3. అనేక ఉత్పత్తులలో నాణ్యత పెరిగింది.
  4. ప్రజలు అంతకు ముందు సాధ్యం కానంతగా మెరుగైన జీవన ప్రమాణాలను అనుభవిస్తున్నారు.

ప్రపంచీకరణ వల్ల దేశానికి ప్రయోజనాలు:

  1. బహుళజాతి సంస్థలు భారతదేశంలో తమ పెట్టుబడులను పెంచాయి.
  2. పారిశ్రామిక, సేవారంగాలలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి.
  3. భారతీయ కంపెనీలు విదేశీ కంపెనీలతో కలసి పనిచేయడం వల్ల లాభపడ్డారు.
  4. ప్రపంచీకరణ వల్ల కొన్ని పెద్ద భారతీయ కంపెనీలు స్వయంగా బహుళజాతి కంపెనీలుగా ఎదిగాయి.
    ఉదా: టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, రానాలాక్సీ
  5. ప్రపంచీకరణ వల్ల ఐ.టి.తో కూడిన సేవలు అందించే కంపెనీలకు కొత్త అవకాశాలు లభించాయి.

ప్రశ్న 7.
కార్మిక చట్టాల సడలింపు వలన కంపెనీలు ప్రస్తుతం ఏ విధంగా లాభపడుతున్నాయి?
జవాబు:
కార్మిక చట్టాల సడలింపు వలన ప్రస్తుత కంపెనీలకు కలిగే లాభం :

  1. తక్కువ కాలవ్యవధికి కార్మికులను నియమించుకోవడం (తాత్కాలికం).
  2. తక్కువ వేతనాలు ఇవ్వడం.
  3. ఉత్పత్తి ఖర్చును తగ్గించుకోవడం.
  4. బహుళ జాతి కంపెనీలను ఆకర్షించడం.
  5. ఎక్కువ పనిగంటలు.
  6. ఉత్పత్తి పెరగడం
  7. కార్మికులకు సౌకర్యాలు కల్పించలేకపోవడం.
  8. కార్మికులను ఎప్పుడైనా తొలగించడం.

AP 10th Class Social Important Questions Chapter 10 ప్రపంచీకరణ

ప్రశ్న 8.
“ఉత్పత్తిదారులు, కార్మికులపై ప్రపంచీకరణ ప్రభావం ఒకేరకంగా లేదు.” దీనిపై నీ అభిప్రాయాలను తెలుపండి.
జవాబు:

  1. ప్రపంచీకరణ ప్రయోజనాలు సమంగా పంపిణీ కాలేదు.
  2. అపార సంపద ఉన్న ఉత్పత్తిదారులకు, సంపన్న వినియోగదారులకు అది ప్రయోజనకరంగా ఉంది.
  3. మరొక వైపున చిన్న ఉత్పత్తిదారులకు, కార్మికులకు, వారి ఉపాధికి, హక్కులకు భంగం కలుగుతున్నది.
  4. ప్రపంచీకరణ న్యాయంగా జరగాలి. అది అందరికీ అవకాశాలు కల్పించాలి.
  5. దీనిని సాధ్యం చేయడంలో ప్రభుత్వాలు ప్రధాన పాత్రను పోషించాలి.
  6. కార్మిక చట్టాలను సక్రమంగా అమలయ్యేలా, కార్మికులకు తమ హక్కులు లభించేలా చూడాలి.

ప్రశ్న 9.
ప్రత్యేక ఆర్థిక మండళ్ళకు నీవు మద్దతిస్తావా? వ్యతిరేకిస్తావా? ఎందువలన?
జవాబు:
నేను ప్రత్యేక ఆర్థిక మండళ్ళను వ్యతిరేకిస్తాను.
కారణమేమనగా :

  1. ప్రత్యేక ఆర్థిక మండళ్ళ కొరకు జరిగే భూసేకరణ వలన వ్యవసాయాధార జీవనంపై ప్రభావితం చూపుతుంది.
  2. ముందుగా ప్రకటించిన విధంగా ప్రత్యేక ఆర్థిక మండళ్ళు ఉపాధిని కల్పించలేకపోతున్నాయి.
  3. కొన్ని సందర్భాలలో ప్రత్యేక ఆర్థిక మండళ్ళు పర్యావరణ సమతౌల్యాన్ని దెబ్బతీస్తున్నాయి.

లేదా

నేను ప్రత్యేక ఆర్థిక మండళ్ళను సమర్థిస్తాను. కారణాలు:

  1. ప్రత్యేక ఆర్థిక మండళ్ళు పెద్ద యెత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి.
  2. అవి ప్రపంచస్థాయి అవస్థాపనా సౌకర్యాలను ఒకే ప్రదేశంలో అందిస్తాయి.
  3. విదేశీ పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమల స్థాపనకు దోహదపడతాయి.

ప్రశ్న 10.
క్రింది పేరాగ్రాఫ్ ను చదివి, వ్యాఖ్యానించుము.
సమాచార, భావ ప్రసార సాంకేతిక రంగంలో అభివృద్ధి ఇంకా గణనీయంగా, వేగంగా ఉన్నది. టెలికమ్యూనికేషన్ సేవలను ప్రపంచంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి మారుమూల ప్రాంతాల నుండి కూడా సమాచారాన్ని వెంటనే గ్రహించడానికి ఉపయోగించుకుంటున్నారు.
జవాబు:
పైన ఇవ్వబడిన పేరాగ్రాలో సాంకేతిక రంగంలో అభివృద్ధిని గురించి వివరిస్తూ దానితోపాటు సమాచార భావప్రసార సాంకేతిక రంగాల అభివృద్ధిని వివరించారు.

త్వరిత గతిన అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో ప్రతి శాఖకు కూడా నూతన సమాచారంను చేర్చి ఆధునికీకరించ బడినవి. సాంకేతిక, సమాచార రంగంలో ఇలా మార్పులు రావడానికి కారణం ఇ-మెయిల్, గూగుల్, ఇంటర్నెట్ మొదలైనవి. ఇవి మన సమస్యలను, మన పనులను త్వరగా పరిష్కరించుకోవడానికి సహాయపడటమే కాకుండా మన జీవన విధానాన్ని కూడా మార్చివేశాయి. అంతేకాకుండా మొబైల్ ఫోన్ ద్వారా కూడా మనం చాలా సమాచారాన్ని సేకరించడమే కాకుండా వివిధ రకాల బిల్లులను కూడా కట్టవచ్చు. ప్రభుత్వంవారు GO లను, Memo లను mail ద్వారా సంబంధిత అధికారులకు పంపించడం జరుగుతోంది.

అయితే దీనివలన కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. దీనివలన యువత కొన్ని అసభ్యకర అంశాలను చూడటమే కాకుండా చెడుదారిన పడుతున్నారు. కావున ప్రభుత్వం సమాచార, సాంకేతిక శాఖలు ప్రజలకు ప్రయోజనకరంగా ఉండేలా చూడాలి మరియు అసభ్యకర అంశాలు ఉండకుండా కట్టుదిట్టం చేయాలి.

ప్రశ్న 11.
ప్రపంచీకరణకు దోహదం చేసిన అంశాలను వివరించండి.
జవాబు:

  1. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందింది.
  2. దీనివలన ఉత్పత్తి, వాణిజ్యము, మరీ ముఖ్యంగా సమాచార సాంకేతిక రంగాలలో విప్లవాత్మక మార్పులు సంభవించాయి.
  3. నేడు కంప్యూటర్, ఇంటర్నెట్ కారణంగా ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోయింది.
  4. 1991 తరువాత విదేశీ వాణిజ్యం, విదేశీ పెట్టుబడులపై గల పరిమితులను చాలావరకు భారతదేశంలో తొలగించారు.
  5. ఇది భారతదేశంలో ప్రపంచీకరణ ప్రక్రియను వేగవంతం చేసింది.
  6. WTO వంటి అంతర్జాతీయ సంస్థలు అనుసరించిన విధానాలు ప్రపంచవ్యాప్తంగా బహుళ జాతి సంస్థల ప్రయోజనాలను ప్రోత్సహిస్తున్నాయి.

ప్రశ్న 12.
క్రింది పేరాగ్రాను చదివి వ్యాఖ్యానించండి.
ప్రపంచీకరణ ప్రయోజనాలు అందరికీ సమానంగా పంపిణీ కాదు. సంపన్న వినియోగదారులకు, నైపుణ్యం, విద్య, అపార సంపద ఉన్న ఉత్పత్తిదారులకు అది ప్రయోజనకరంగా ఉంది. సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న కొన్ని సేవలు విస్తరించాయి. ఇంకొకవైపున వేలాదిమంది చిన్న ఉత్పత్తిదారులకు, కార్మికులకు వాళ్ళ ఉపాధికి, హక్కులకు భంగం కలుగుతోంది. రెండు పార్శ్వాలున్న ఈ ప్రపంచీకరణను అర్థం చేసుకోవడం ముఖ్యం.
జవాబు:
ప్రపంచీకరణ ప్రభావం – వ్యాఖ్య :

  1. భారతదేశం పై ప్రపంచీకరణ ప్రభావం సమానంగా లేదు.
  2. కొన్ని భారతీయ కంపెనీలు బహుళజాతి కంపెనీలుగా ఎదిగాయి.
  3. ఇంకొకవైపున అనేకమంది చిన్న ఉత్పత్తిదారులు ప్రపంచీకరణ పట్ల సంతోషంగా లేరు.
  4. భారీస్థాయిలో విదేశాల నుండి దిగుమతి అవుతున్న చవక వస్తువులతో పోటీ పడలేక వారి యొక్క అనేక సంస్థలు మూతపడ్డాయి.
  5. ప్రపంచీకరణ న్యాయంగా లేకుంటే సమాజంలో ఆర్థిక అసమానతలు పెరుగుతాయి.
  6. ప్రపంచీకరణ వల్ల అందరికీ న్యాయం జరిగేటట్లు ఎలా చెయ్యాలి’ అనేది ప్రస్తుతం మన ముందున్న ముఖ్యమైన ప్రశ్న.

AP 10th Class Social Important Questions Chapter 10 ప్రపంచీకరణ

ప్రశ్న 13.
క్రింది పేరాగ్రాఫ్ ను చదివి, వ్యాఖ్యానించండి.
ఈ ప్రపంచీకరణకు ఆర్థిక రంగమే మూలం అని భావించేవాళ్ళు దానికి ఆర్థిక శక్తులు కారణమని, దాని ఎల్లలను అవే | నిర్ణయిస్తాయని వాదిస్తారు. రాజకీయాలు కారణం అని భావించే వాళ్ళు ప్రభుత్వ నిర్ణయాల వల్ల ముందుగా ఇది మొదలయ్యిందని అంటారు.
జవాబు:
పైన ఇవ్వబడిన పేరాగ్రాఫ్ ప్రకారం, ప్రపంచీకరణకు ప్రధాన కారణం ఆర్థికపరమైన అంశాలు.
ఉదా : మనదేశంలో 1992లో రూపాయి విలువ పతనమౌతున్న సందర్భంలో అప్పటి ప్రధాని పి.వి. నరసింహారావుగారు కొన్ని షరతులతో కూడిన ప్రపంచీకరణ అంశాన్ని రూపొందించడం జరిగింది.

ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే మరియు ఇతర దేశాలతో పాటు సమానంగా అన్ని అంశాలలో పోటీని ఇవ్వాలి అంటే ప్రపంచీకరణ తప్పనిసరి. దానికి ఆర్థిక అంశాలే కాకుండా, రాజకీయ అంశాలు కూడా ముఖ్యమైనవే.

అయితే మనం మనదేశ ఆర్థిక అభివృద్ధి కోసం బహుళజాతి సంస్థలను ఆహ్వానిస్తున్నాం. అవి మన రాజకీయ నాయకులను ఇక్కడ ఉన్న వ్యాపారులను ప్రలోభపెట్టి వారు లాభాలను గడిస్తున్నారు.

కావున ప్రభుత్వాలు బహుళజాతి సంస్థలకు లోబడకుండా మనదేశంలో ఏ ఏ రంగాలలో మాత్రమే అవి అవసరం అని గమనించి అక్కడ మాత్రమే వాటికి ప్రాధాన్యత ఇవ్వడం వలన మన చిన్న, చిన్న వ్యాపారస్తులు వ్యవసాయదారులు, పరిశ్రమల వారు నష్టపోకుండా ఉంటారు.

బహుళ జాతి సంస్థల వలన మరియు ప్రపంచీకరణ వలన మనం మనకు నచ్చిన వస్తువులను మనకు అందుబాటులో ఉన్న ధరలకు కొనుగోలు చేయగలుగుతున్నాం.

కాని ఇక్కడ ప్రభుత్వాలు గమనించవలసిన విషయం ఏమిటంటే సాధ్యమైనంతవరకు మన దేశంలోని చిన్న, చిన్న వ్యాపారులకు ప్రభుత్వమే తక్కువ వడ్డీకి పెట్టుబడిని అందించి ఆ వస్తువులు అన్ని మనదేశంలో కూడా తయారుచేసే లాగా చేయవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది.

దీని వలన మన ప్రజలకు ఉపాధితో పాటు, మనదేశం కూడా ఎంతో అభివృద్ధి సాధిస్తుంది. దీని వలన మన ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్ళకుండా మన మానవ వనరులను మనం ఉపయోగించుకోవచ్చు.

ప్రశ్న 14.
ప్రపంచీకరణకు సాంకేతిక పరిజ్ఞానం ముఖ్యకారణం – సమర్థింపుము.
జవాబు:
ప్రపంచీకరణ ప్రక్రియకు ముఖ్య కారణం సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందడం. ఉదాహరణకు, గత యాభై సంవత్సరాలలో రవాణా, సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందాయి. ఫలితంగా ఎంతో దూరాలకు త్వరగా, తక్కువ ధరలకు వస్తువులను చేరవేస్తున్నారు.

సమాచార, భావ ప్రసార సాంకేతిక రంగంలో అభివృద్ధి ఇంకా గణనీయంగా, వేగంగా ఉన్నాయి. టెలికమ్యూనికేషన్ సేవలను (టెలిగ్రాఫ్, టెలిఫోను, మొబైల్ ఫోన్లతో సహా ఫ్యాక్స్) ప్రపంచంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోటానికి, మారుమూల ప్రాంతాలనుంచి కూడా సమాచారాన్ని వెంటనే గ్రహించడానికి ఉపయోగించుకుంటున్నారు. ఉపగ్రహ ప్రసార సాధనాల వల్ల ఇదంతా సాధ్యమయ్యింది. ప్రస్తుతం ప్రతి రంగంలో కంప్యూటర్లు ప్రవేశించాయి. ఇంటర్నెట్ అనే అద్భుత ప్రపంచంతో మీకు పరిచయం ఉండి ఉంటుంది. దీని ద్వారా మీరు ఏ విషయం గురించైనా సమాచారాన్ని పొందవచ్చు, మీ దగ్గర ఉన్న సమాచారాన్ని పంచుకోవచ్చు. ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలో ఎక్కడికైనా నామమాత్రపు ఖర్చుతో మీరు తక్షణమే ఎలక్ట్రానిక్ మెయిల్ (e-mail) పంపించవచ్చు. ఎవరితోనైనా (voice-mail) మాట్లాడవచ్చు.

ప్రశ్న 15.
ప్రపంచ వాణిజ్య సంస్థ గూర్చి నీకేం తెలుసు?
(లేదా)
సరళీకృత విధానాలు ఏర్పడేలా ప్రపంచ వాణిజ్య సంస్థ కృషి చేస్తుంది? సమర్ధింపుము.
జవాబు:
అంతర్జాతీయ వాణిజ్యంలో సరళీకృత విధానాలు ఏర్పడేలా చూసే ఉద్దేశంతో పని చేస్తున్న సంస్థలలో ప్రపంచ వాణిజ్య సంస్థ ఒకటి. అభివృద్ధి చెందిన దేశాల చొరవతో ఏర్పడిన ఈ సంస్థ అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి నియమాలను రూపొందించి, అవి పాటించబడేలా చూస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలోని దాదాపు 150 దేశాలు ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్యులుగా ఉన్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ అందరూ స్వేచ్ఛా వాణిజ్యం చేపట్టేలా చూడాలి. అయితే ఆచరణలో అభివృద్ధి చెందిన దేశాలు అన్యాయపూరిత వాణిజ్య అవరోధాలను ఇంకా కొనసాగిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలు అభివృద్ధి చెందుతున్న దేశాలను వాణిజ్యం అవరోధాలు తొలగించాలని ఒత్తిడి చేస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల్లో వాణిజ్యంపై ఉత్పత్తుల్లో వాణిజ్యంపై ప్రస్తుతం జరుగుతున్న చర్చ దీనికి ఉదాహరణ.

ప్రశ్న 16.
ప్రత్యేక ఆర్థిక మండళ్ళు (SEZS) ఏర్పాటు ద్వారా భారతదేశంలోకి పెట్టుబడులను ఎలా ఆకర్షిస్తున్నారు?
జవాబు:
ఇటీవలి కాలంలో భారతదేశంలో పెట్టుబడులు పెట్టేలా విదేశీ కంపెనీలను ఆకర్షించటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. ప్రత్యేక ఆర్థిక మండలి (SEZS) అనే పారిశ్రామిక ప్రాంతాలను నెలకొల్పుతున్నాయి. ఈ సెజ్ లో ప్రపంచస్థాయి సౌకర్యాలు ఉంటాయి. విద్యుత్తు, నీళ్లు, రోడ్లు, రవాణా, గిడ్డంగులు, విద్య, వినోద సదుపాయాలు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల (SEZ) లో కర్మాగారాలను స్థాపించే కంపెనీలు మొదటి అయిదేళ్లపాటు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు.

విదేశీ పెట్టుబడులను ఆకర్షించటానికి ప్రభుత్వం కార్మిక చట్టాలను సడలించింది. కార్మికులను దీర్ఘకాలిక ప్రాతిపదికన కాకుండా పని ఒత్తిడిని బట్టి తక్కువ కాల వ్యవధికి నియమించుకునే అవకాశం ఉంది. దీనివల్ల కంపెనీకి కార్మికుల పైన అయ్యే ఖర్చు తగ్గుతుంది. అయితే విదేశీ కంపెనీలు కార్మిక చట్టాలను ఇంకా సడలించాలని కోరుతున్నాయి.

ప్రశ్న 17.
ప్రపంచీకరణ ఫలితాలు అందరికీ అందాలంటే ప్రభుత్వం ఏం చేయాలి?
జవాబు:
ప్రపంచీకరణ వల్ల అందరూ ప్రయోజనం పొందలేదు. విద్య, నైపుణ్యం, సంపద ఉన్న వాళ్లు కొత్త అవకాశాల వల్ల బాగా లాభపడ్డారు. ఇంకొకవైపున ఎటువంటి ప్రయోజనం పొందని ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు. ప్రపంచీకరణ ఇప్పుడు ఎవరూ కాదనలేని వాస్తవం. ప్రపంచీకరణ వల్ల అందరికీ న్యాయం జరిగేటట్లు ఎలా చెయ్యాలి అనేది మన ముందున్న ప్రశ్న. న్యాయమైన ప్రపంచీకరణ అందరికీ అవకాశాలు సృష్టిస్తుంది. దాని ప్రయోజనాలు మరింత బాగా పంచుకోబడతాయి.

దీనిని సాధ్యం చెయ్యటం ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంటుంది. ప్రభుత్వ విధానాలు ధనికులు, అధికారం ఉన్న వాళ్లవే కాక దేశంలోని ప్రజలందరి ప్రయోజనాలను కాపాడేలా ఉండాలి. ప్రభుత్వం చేపట్టగలిగిన కొన్ని చర్యల గురించి మీరు తెలుసుకున్నారు. ఉదాహరణకు కార్మిక చట్టాలు సరిగా అమలు అయ్యేలా చూసి కార్మికులకు తమ హక్కులు లభించేలా చూడాలి. చిన్న ఉత్పత్తిదారులు తమ సామర్థ్యాన్ని పెంచుకుని పోటీపడగల శక్తి వచ్చేంతవరకు వాళ్లకు సహాయపడాలి. అవసరమైతే ప్రభుత్వం వాణిజ్య, పెట్టుబడి అవరోధాలను ఉపయోగించుకోవచ్చు. మరింత న్యాయపూరిత నియమాల కోసం ప్రపంచ వాణిజ్య సంస్థతో సంప్రదింపులు జరపవచ్చు. ఇవే ఆసక్తులు ఉన్న ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో కలసి, ప్రపంచ వాణిజ్య సంస్థలో అభివృద్ధి చెందిన దేశాల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడవచ్చు.

AP 10th Class Social Important Questions Chapter 10 ప్రపంచీకరణ

ప్రశ్న 18.
ప్రపంచీకరణను వ్యతిరేకించే వారి భయాలు ఏమిటి?
జవాబు:
అసమానత్వంలోని మరొక కోణం ఇతర దేశాల విధానాలలో ధనిక దేశాల పెత్తందారీ ఆధిపత్యం. వాణిజ్యం, పెట్టుబడులు, వలస వంటి అంతర్జాతీయ ఆర్థిక విధానాలలో అయితేనేమి, దేశ వ్యవహారాలలో అయితేనేమి ధనిక పాశ్చాత్య దేశాలు మిగిలిన ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO), ప్రపంచ బ్యాంకు (WB). అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) వంటి అంతర్జాతీయ సంస్థలు అభివృద్ధి చెందుతున్న దేశాలకంటే అభివృద్ధి చెందిన దేశాల ప్రయోజనాలకు ఎక్కువగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఒకవైపున ప్రపంచీకరణకు మద్దతు పలికేవాళ్లు విశ్వ అనుసంధానం ద్వారా ప్రపంచీకరణ అభివృద్ధికి, సంపదకు అవకాశాలను అందిస్తుందని భావించగా, దానిని విమర్శించే వాళ్లు ప్రపంచంపై ఆధిపత్యం పొందటానికి కొన్ని పాశ్చాత్య దేశాలు చేసే ప్రయత్నమని భావిస్తున్నారు. అనేక పేద దేశాలలో దీనివల్ల ప్రజాస్వామ్యం, కార్మికుల హక్కులు, పర్యావరణానికి భంగం కలుగుతోందని వీళ్లు వాదిస్తున్నారు.

ప్రశ్న 19.
కెపాసిటర్లు ఉత్పత్తి చేసిన రవి పై ప్రపంచీకరణ ప్రభావం ఏమిటి?
జవాబు:
2001లో ప్రపంచ వాణిజ్య సంస్థతో ఒప్పందం కారణంగా ప్రభుత్వం కెపాసిటర్ల దిగుమతిలో పరిమితులను తొలగించటంతో అతడి కష్టాలు మొదలయ్యాయి. అతడి ప్రధాన కొనుగోలుదారులైన టెలివిజన్ కంపెనీలు టెలివిజన్ సెట్ల ఉత్పత్తికి కెపాసిటర్లతో సహా వివిధ విడి భాగాలను పెద్ద సంఖ్యలో కొనేవి. అయితే బహుళజాతి సంస్థ (MNC)ల టీవీ బ్రాండుల నుంచి పోటీ ఫలితంగా భారతీయ టెలివిజన్ కంపెనీలు బహుళజాతి సంస్తలకు అసెంబ్లింగ్ కేంద్రాలుగా మారిపోయాయి. అవి ఒకవేళ కెపాసిటర్లు కొనాల్సి ఉన్నా వారు దిగుమతి చేసుకున్నవి రవి లాంటి ఉత్పత్తిదారులు ఇస్తున్న ధరలో సగానికి వస్తున్నాయి. కాబట్టి వాటికే మొగ్గు చూపుతారు.

ఇప్పుడు రవి 2000 సంవత్సరంలో ఉత్పత్తి చేసిన సంఖ్యలో సగమే ఉత్పత్తి చేస్తున్నాడు. అతని దగ్గర ఇప్పుడు ఏడుగురు కార్మికులు మాత్రమే పని చేస్తున్నారు.

ప్రశ్న 20.
ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య సంస్థల గూర్చి నీకేం తెలుసు?
జవాబు:
పునర్నిర్మాణం, అభివృద్ధికి అంతర్జాతీయ బ్యాంకును (IBRD), అంతర్జాతీయ అభివృద్ధి సంఘాలను (IDA) కలిపి ప్రపంచ బ్యాంకుగా వ్యవహరిస్తారు. ఈ రెండు సంస్థలలో 170కి పైగా సభ్యదేశాలు ఉన్నాయి. అమెరికా వంటి దేశాలు ఈ సంస్థల పనిని నిర్దేశిస్తాయి. ఈ నాటికి కూడా అమెరికా ఓటుకు 16% విలువ ఉంది. జపాన్, జర్మనీ, యుకె, ఫ్రాన్స్, వంటి దేశాలు ఒక్కొక్కదానికి 3-6% ఓటు అధికారం ఉంది. పేద దేశాల ఓటుకు తక్కువ విలువ ఉంది. ప్రస్తుతం ఇతర పేద దేశాలతో పోలిస్తే ఇండియా, చైనాలకు ఎక్కువ ఓటింగు అధికారం ఉంది. ప్రభుత్వాలు తమ విధానాలను రూపొందించుకోవటంలో ప్రపంచ బ్యాంకు సలహా ఇచ్చి, మార్గదర్శనం చేస్తూ వాటిని ప్రభావితం చెయ్యగలుగుతోంది.

ప్రశ్న 21.
సంస్కృతి, భాషలపై ప్రపంచీకరణ ప్రభావం……… ఈ అంశంలో వినిపిస్తున్న భిన్న వాదనలేమి?
జవాబు:
అందరి దృష్టిని ఆకర్షించిన మరొక అంశం, ప్రపంచీకరణ సాంస్కృతిక వైవిధ్యతకు దారితీస్తుందా లేక సాంస్కృతిక మూసపోతకు దారితీస్తుందా అనేది. ఆధునిక ప్రసార సాధనాలు, సాంకేతిక పరిజ్ఞానంతో కొన్ని సంస్కృతులు, భావాలు ప్రాచుర్యం పొంది ఇతర స్థానిక, అల్ప సంఖ్యాక వర్గాల సంస్కృతులు పక్కకు నెట్టివేయబడ్డాయని కొందరు వాదిస్తారు. అయితే మరికొందరు ప్రత్యేక, తరచుగా పక్కకు నెట్టివేయబడిన సాంస్కృతిక అలవాట్లకు ప్రపంచీకరణ తగినంత చోటు ఇచ్చి అవి విస్తరించడానికి దోహదపడిందని భావిస్తున్నారు. కొన్ని భాషలు విస్తృతంగా ఉపయోగింపబడి అంతర్జాతీయ ప్రసార సాధనాలకు వారధిగా ఉండి ఇతర భాషలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, కొన్ని అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయని కొంతమంది పేర్కొంటున్నారు.

ప్రశ్న 22.
ఈ క్రింది దేశాలను ప్రపంచపటంలో గుర్తించండి.
1) అమెరికా
2) చైనా
3) మెక్సికో
4) భారతదేశం
5) తూర్పు యూరోపియన్ దేశాలు :
i) పోలాండ్
ii) ఉక్రెయిన్
iii) రొమేనియా
iv) బల్గేరియా
v) చెక్ రిపబ్లిక్
vi) స్లోవేకియా
AP 10th Class Social Important Questions Chapter 10 ప్రపంచీకరణ 2

AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

These AP 10th Class Social Studies Important Questions 9th Lesson రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ will help students prepare well for the exams.

AP Board 10th Class Social 9th Lesson Important Questions and Answers రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

10th Class Social 9th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium

1. ఒక హెక్టారు ఎన్ని ఎకరాలకు సమానం?
జవాబు:
2 ½ ఎకరాలు

2. ఒక హెక్టారుకు ఎన్ని చదరపు మీటర్లుకు సమానం?
జవాబు:
10,000 చ.కి.మీ.

3. భూమిని కొలవడానికి ప్రామాణిక కొలమానము ఏది?
జవాబు:
హెక్టారు.

4. ఖరీఫ్ కాలంలో పండించే పంటకు ఒక ఉదాహరణ ఇవ్వండి ?
జవాబు:
వరి, జొన్న, సజ్జ.

5. రబీ కాలంలో పండించే ప్రధాన పంటకు ఉదాహరణ ఇవ్వండి?
జవాబు:
గోధుమ.

AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

6. ఉత్పత్తికి అవసరం లేని సహజ వనరు ఏది?
జవాబు:
గాలి.

7. ఉత్పత్తి ప్రక్రియలో వస్తువులు, యంత్రాలు మరియు నిర్మాణాలను ఏమని పిలుస్తారు?
జవాబు:
స్థిర / భౌతిక మూలధనం

8. MGNREGA ని విస్తరింపుము.
జవాబు:
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం

9. వర్షాకాలపు పంట ఋతువు నేమంటారు?
జవాబు:
ఖరీఫ్.

10. శీతాకాలపు పంట ఋతువు నేమంటారు?
జవాబు:
రబీ.

11. వేసవి కాలపు పంట ఋతువు నేమంటారు?
జవాబు:
జయాద్.

12. భారతదేశ గ్రామాలలో ప్రధాన ఉత్పత్తి / ఉపాధి కార్యకలాపం ఏది?
జవాబు:
వ్యవసాయం.

13. రాంపురం గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది?
జవాబు:
ఉత్తరప్రదేశ్.

14. రాంపురంలో సాగుభూమి ఏ సంవత్సరం నుంచి సాగుభూమి విస్తీర్ణం పెరగలేదు?
జవాబు:
1921.

15. ఒకే విస్తీర్ణంలో సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ పంటలను సాగు చెయ్యటాన్ని ఏమంటారు?
జవాబు:
బహుళ పంటల సాగు.

16. ఈనాటికి కూడా దేశంలోని సాగు విస్తీర్ణంలో ఎంత శాతాని కంటే తక్కువ విస్తీర్ణానికి సాగునీటి సదుపాయం ఉంది?
జవాబు:
40%

17. రాంపురం జనాభా ఎంత? ఎన్ని కుటుంబాలున్నాయి?
జవాబు:
2660, 450

AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

18. రాంపురంలో ఎన్నో వంతు మందికి భూమి లేదు?
జవాబు:
1/3 వంతు.

19. రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమిని సాగుచేసే రైతుల నేమంటారు?
జవాబు:
చిన్న రైతులు.

20. రెండు హెక్టార్ల కంటే ఎక్కువ భూమిని సాగుచేసే రైతుల నేమంటారు?
జవాబు:
పెద్ద, మధ్య తరగతి రైతులు.

21. గ్రామాలలో పని దొరకని రోజులలో వ్యవసాయ కూలీలు ఏ పథకంలో పనికోసం పంచాయితీలో దరఖాస్తు చేసుకొంటారు?
జవాబు:
MGNREGA.

22. రాంపురంలోని పనిచేసే వాళ్ళల్లో ఎంత శాతం మంది వ్యవసాయేతర పనుల్లో ఉన్నారు?
జవాబు:
25%

23. 2009 – 2010లో భారతదేశంలోని ప్రతి 100 మంది గ్రామీణ కార్మికులలో ఎంతమంది వ్యవసాయేతర పనుల్లో ఉన్నారు?
జవాబు:
32 మంది.

24. చెరుకు యొక్క పంటకాలం ఎంత?
జవాబు:
సంవత్సరం.

25. శ్రమ అంటే కేవలం శారీరక శ్రమే కాకుండా దీనికి అవసరమైన మానవ ప్రయత్నాలన్నింటినీ అది సూచిస్తుంది?
జవాబు:
ఉత్పత్తికి.

26. వ్యవసాయ ఉత్పత్తికి ఏ ఉత్పత్తికారకం చాలా కీలకమైన అంశం?
జవాబు:
భూమి.

27. అక్టోబరు – డిసెంబరు నెలల మధ్య ఏ పంట సాగుచేస్తారు?
జవాబు:
బంగాళాదుంప.

28. భూమి, శ్రమ, భౌతిక పెట్టుబడులను కలుపుకుని వ్యక్తులు లేదా వ్యాపార వేత్తలు ఉత్పత్తి చేస్తారు. వీటిని ఏమంటారు?
జవాబు:
ఉత్పత్తి కారకాలు.

29. రాంపురంలోని నేలలు ఏ రకపు నేలలు?
జవాబు:
ఒండ్రు.

30. రాంపురం గ్రామంలో విద్యుత్ సౌకర్యం లేనప్పుడు రైతులు బావుల నుంచి నీళ్లు పైకి తోడటానికి ఏ పరికరాన్ని వాడారు?
జవాబు:
పర్షియన్ వీల్.

31. భూసారం తగ్గడానికి గల కారణాలలో ఏదైన ఒకదానిని రాయండి?
జవాబు:
రసాయనిక ఎరువుల వాడకం, పురుగుమందుల వాడకం.

32. భారతదేశంలో 2 హెక్టార్లకంటే తక్కువ విస్తీర్ణాన్ని సాగుచేస్తున్న చిన్న రైతుల శాతం ఎంత?
జవాబు:
87%

33. భారతదేశంలో మధ్య తరగతి, పెద్ద రైతులు సాగుచేస్తున్న సాగు భూమి శాతం ఎంత?
జవాబు:
52%

34. వస్తువులు లేదా సేవలను ఉత్పత్తి చేయటానికి ఉత్పత్తిదారులకు కావలసిన సహజ వనరులు ఏవి?
జవాబు:
భూమి, నీరు, ఖనిజలవణాలు, అడవులు, సూర్యరశ్ని.

35. సంవత్సరాల తరబడి ఉపయోగపడటానికి, వాటికి కొంత మరమ్మత్తు, నిర్వహణ కోసం పెట్టే పెట్టుబడి నేమంటారు?
జవాబు:
భౌతిక పెట్టుబడి.

36. ముడి సరుకు కొనుగోలు పై పెట్టే పెట్టుబడి నేమంటారు?
జవాబు:
నిర్వాహక పెట్టుబడి.

37. 2011 డిసెంబరు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విత్తనాలు నాటినందుకు పురుషునికి ఇచ్చే రోజువారీ కూలీరేటు ఎంత ఉంది?
జవాబు:
197 రూపాయలు.

38. పాలను నిల్వ చేయటానికి ఉపయోగించు ప్రక్రియ ఏది?
జవాబు:
శీతలీకరణ.

39. రాంపురం నందు రెండు హెక్టార్లకు మించి భూమి ఉన్న పెద్ద, మధ్యతరగతి కుటుంబాలు ఎన్ని?
జవాబు:
60.

AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

40. రాంపురంలో మూడవ పంటగా ఏమి పంట పండిస్తున్నారు ?
జవాబు:
బంగాళాదుంప.

41. ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలం చెల్లించగా మిగిలిన ఉత్పత్తిని ఏమంటారు?
జవాబు:
మిగులు ఉత్పత్తి (లేదా) రైతు మిగులు.

42. రాంపురంలో వస్తువుల తయారీ పరిశ్రమలో ఉపాధి పొందుతున్న వాళ్ళు ఎంత మంది కంటే తక్కువ ఉన్నారు?
జవాబు:
50 మంది.

43. గ్రామీణ ప్రాంతంలో రెండవ సాధారణ కార్యకలాపం ఏది?
జవాబు:
పశుపోషణ.

44. కమతాల వరిమాణం తగ్గిపోవడానికి ప్రధాన కారణమేమి?
జవాబు:
వారసత్వ చట్టాలు (కుటుంబాలు విచ్చిన్నం కావడం)

45. శ్వేత విప్లవం దేనికి సంబంధించినది?
జవాబు:
పాల ఉత్పత్తికి.

46. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంలో ప్రధాన పరిమితి ఏమిటి?
జవాబు:
సాగుభూమి విస్తీర్ణత కొరత.

47. భారతదేశంలో మధ్యతరగతి, పెద్ద రైతులు ఎంత శాతం ఉన్నారు?
జవాబు:
13%

48. భారతదేశంలో చిన్న రైతులు సాగుచేస్తున్న సాగుభూమి శాతం ఎంత?
జవాబు:
48%

49. పెద్ద రైతులు వేటిపై ఆధారపడటం పెరగడంతో గ్రామీణ ప్రాంతాలలో కూలీలకు లభించే పని దినాలు తగ్గి పోతున్నాయి?
జవాబు:
యంత్రాలు.

50. చాలామంది చిన్న రైతులు నిర్వాహణ పెట్టుబడి కోసం ఎవరిపై ఆధారపడతారు?
జవాబు:
వడ్డీ వ్యాపారులు.

51. క్రింది వానిలో భౌతిక / స్థిర పెట్టుబడి కానిది?
→ ట్రాక్టర్ → నాగలి → జనరేటర్ → ముడిసరుకు
జవాబు:
ముడిసరుకు

52. క్రింది వానిలో సరియైన వాక్యాలను ఎంచుకుని రాయండి?
i) ముడిసరుకు, డబ్బు అవసరాలు – నిర్వాహక పెట్టుబడి.
ii) యంత్రాలు, పరికరాలు, భవనాలు- స్థిర పెట్టుబడి
iii) పైవన్నీ ఉత్పత్తి ప్రక్రియలు పూర్తిగా వినయగారిచేవిడి వివరికి మిగలవు.
జవాబు:
(i) మరియు (ii)

AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

53. క్రింది వానిలో సరికాని జత.
→ వర్షాకాలం – ఖరీఫ్.
→ చలికాలం – రబీ.
→ ఋతుపవనకాలం- దాళ్వా,
→ ఎండాకాలం – జయాద్..
జవాబు:
ఋతుపవన కాలం – దాళ్వా.

54. భూమి, స్థిర పెట్టుబడి, వడ్డీ, వ్యవస్థాపనంలలో ఉత్పత్తి కారకం కానిది ఏది?
జవాబు:
వడ్డీ.

55. క్రింది వాక్యాలను పరిగణించండి.
i) ఒకే విస్తీర్ణంలో సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ పంటలను సాగుచెయ్యటాన్ని బహుళ పంటల సాగు అంటారు.
ii) భూమి నుంచి ఉత్పత్తి పెంచటానికి ఇది అత్యంత సాధారణ పద్దతి.
పై వాక్యా లలో సరైనది ఏది?
A) (i) మాత్రమే
B) (ii) మాత్రమే
C) (i) మరియు (ii)
D) రెండూ కావు
జవాబు:
C – (i) మరియు (ii)

56. 2010 సంవత్సరం నాటికి భారతదేశంలోని సాగు విస్తీర్ణం; (మి|| హెక్టార్లు) ఎంత?
జవాబు:
140 మిలియన్ హెక్టార్లు

57. క్రింది వాక్యాలను పరిగణించండి.
i) గ్రామాలలో అనేక రకాల వ్యవసాయేతర పనులలో చాలా కొద్దిమందికే ఉపాధి దొరుకుతుంది.
ii) 2009 -10లో భారతదేశంలోని ప్రతి 100 మంది గ్రామీణ కార్మికులలో 32 మంది వ్యవసాయేతర పనుల్లో ఉన్నారు.
పై వాక్యా లలో సరైనది ఏది?
A) (1) మాత్రమే
B) (II) మాత్రమే
C) (1) మరియు (ii)
D) రెండూ కావు
జవాబు:
C – (i) మరియు (ii)

క్రింది పట్టికను పరిశీలించి ఇచ్చిన ప్రశ్నకు సరియైన సమాధానము రాయుము.
పట్టిక : డిసెంబరు 2011లో వివిధ వ్యవసాయ పనులకు
ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కూలి రేట్లు (రూపాయలలో)
AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 1

58. పురుషులు మాత్రమే చేస్తున్న పని ఏది?
జవాబు:
దున్నటం.

59. స్త్రీలు మాత్రమే చేస్తున్న పనులు ఏవి?
జవాబు:
నాట్లు వేయటం, పత్తి ఏరడం

60. స్త్రీ, పురుష కూలి రేట్లలో వ్యత్యాసం ఎందుకుంది?
జవాబు:
ఆడవారికంటే మగవారు ఎక్కువ పనిచేయగలరనే భావన.

క్రింది రేఖాచిత్రము పరిశీలించి ఇచ్చిన ప్రశ్నకు సరియైన సమాధానము వ్రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

61. పై రేఖా చిత్రం ఏమి తెలియజేస్తుంది?
జవాబు:
సాగుభూమి పంపిణీలో అసమానతలను.

62. తక్కువ మంది కలిగి ఉండి, ఎక్కువ సాగుభూమి కలిగి ఉన్న రైతులు ఎవరు?
జవాబు:
మధ్య తరగతి, పెద్ద రైతులు.

63. ఎక్కువ మంది ఉండి, తక్కువ సాగుభూమి కలిగి ఉన్న రైతులు ఎవరు?
జవాబు:
చిన్న రైతులు.

10th Class Social 9th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
బహుళ పంటల విధానమనగానేమి?
జవాబు:
ఒక నిర్ణీత భూభాగంలో ఒకటి కంటే ఎక్కువ పంటలను పండించటాన్ని బహుళ పంటల విధానం అంటారు.

ప్రశ్న 2.
మీ ప్రాంతంలో గల ప్రధానమైన వ్యవసాయేతర కార్యకలాపాలేవి?
జవాబు:
కోళ్ల పెంపకం, రవాణా, బుట్టల తయారీ, పాడిపరిశ్రమ, వడ్రంగం పని, ఇటుకల తయారీ, దుకాణాల ఏర్పాటు, చేపల పెంపకం.

AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 3.
రాంపురం గ్రామ ఆర్థిక రంగంలో నీకు నచ్చిన రెండు అంశాలు రాయుము.
జవాబు:
రాంపురంలో నాకు నచ్చిన అంశాలు :

  1. రాంపురంలో ఖాళీగా ఉన్న భూమి కొంచెం కూడా లేకపోవడం అంటే మొత్తం వ్యవసాయానికి వినియోగించడం.
  2. వ్యవసాయేతర పనులు కూడా అభివృద్ధి చెందడం.
  3. రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందటంతో మిగతా రంగాలు కూడా బాగా అభివృద్ధి చెందాయి.

ప్రశ్న 4.
వ్యవసాయ రంగంలో ఉత్పత్తి కారకాలలో ప్రధానమైనది ఏది?
జవాబు:
వ్యవసాయ రంగంలో ఉత్పత్తి కారకాలలో ప్రధానమైనది భూమి.

ప్రశ్న 5.
రాంపురం గ్రామములో మధ్య తరగతి, పెద్ద రైతులు వ్యవసాయ కూలీలు తమ దగ్గర పని చేయటానికి ఏమి చేస్తారు?
జవాబు:
రాంపురం గ్రామములో మధ్య తరగతి, పెద్ద రైతులు వ్యవసాయ కూలీలు తమ దగ్గర పనిచేయడానికి అన్నం పెడతారు, పనికి కూలీ చెల్లిస్తారు. కూలీ పంట రూపేణాకాని, డబ్బు రూపేణాకానీ ఉంటుంది.

ప్రశ్న 6.
ఉత్పత్తి కారకాలను పేర్కొనండి.
జవాబు:
ఉత్పత్తి కారకాలు :

  1. భూమి,
  2. శ్రమ (లేదా) శ్రామికులు,
  3. మూలధనం (లేదా) పెట్టుబడి,
  4. వ్యవస్థాపన (లేదా) జ్ఞానం, వ్యాపార దక్షత

ప్రశ్న 7.
ఒకే పనికి స్త్రీల కంటే పురుషులకు ఎక్కువ వేతనాన్ని సాధారణంగా ఎందుకు చెల్లిస్తారు?
జవాబు:

  1. పురుషాధిక్య సమాజం కావడం వలన
  2. లింగ వివక్షత ఉండడం వలన

ప్రశ్న 8.
ఉత్పత్తి కారకాలని వేటినంటారు?
జవాబు:
భూమి, శ్రమ, పూలధనము, జ్ఞానం, వ్యాపార దక్షత / వ్యవస్థాపనము, భౌతిక పెట్టుబడులను ఉత్పత్తి కారకాలంటాం.

ప్రశ్న 9.
‘వ్యవసాయం ప్రాముఖ్యత’ గురించి ఒక నినాదం రాయండి.
జవాబు:

  1. సేంద్రీయ వ్యవసాయం – ఆరోగ్య ఫలసాయం
  2. రైతులేనిదే – ఆహారం లేదు
  3. జలమే జీవం – వ్యవసాయమే జీవనం.

ప్రశ్న 10.
చిన్న రైతులు వ్యవసాయానికి ఆతసరమైన పెట్టుబడిని ఎలా సమకూర్చుకుంటారు?
జవాబు:
చిన్న రైతులు వ్యవసాయానికి ఆశ్వసర్వక పెట్టుబడులని సమకూర్చుకునే విధానాలు

  1. పెద్ద రైతుల నుండి అప్పుడు
  2. వడ్డీ వ్యాపారస్తుల నుండి అప్పు
  3. ఉత్పాదకాలను సరఫరా చేసే వ్యాపారస్తుల నుండి అప్పు

ప్రశ్న 11.
భౌతిక పెట్టుబడికి, నిర్వహణ పెట్టుబడికి మధ్య గల తేడా ఏమిటి?
జవాబు:
భౌతిక పెట్టుబడికి నిర్వహణ పెట్టుబడికి గల తేడా :

భౌతిక పెట్టుబడినిర్వహణ పెట్టుబడి
అనేక సంవత్సరాల పాటు వస్తువుల ఉత్పత్తిలో ఉపయోగపడే యంత్రాల కోసం పెట్టే పెట్టుబడి.ముడిసరుకు మరియు ఉత్పత్తి పూర్తి చేయటానికి కావలసిన చెల్లింపుల కోసం వెచ్చించే ‘డబ్బు.

ప్రశ్న 12.
రాంపురం ఎక్కడ ఉంది?
జవాబు:
పశ్చిమ ఉత్తరప్రదేశ్ లోని సారవంతమైన గంగా మైదానపు ఒండ్రునేలల్లో రాంపురం ఉంది.

ప్రశ్న 13.
వర్షాకాలం, శీతాకాలంలో వీటిని పంటల సీజన్లుగా ఏమని పిలుస్తాం.
జవాబు:
వర్షాకాలాన్ని, ఖరీగా, శీతాకాలాన్ని రబీ అని పిలుస్తాం.

AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 14.
రాంపురంకు సమీపంలో మార్కెట్ యార్డ్ ఎక్కడ ఉంది?
జవాబు:
రాంపురంకు సమీపంలో రాయిగంజ్ లో మార్కెట్ యార్డ్ ఉంది.

ప్రశ్న 15.
రాంపురంకు సమీపంలోని పట్టణమేది?
జవాబు:
రాంపురంకు 12 కి.మీ. దూరంలో జహంగీరాబాదు అనే పట్టణం కలదు.

ప్రశ్న 16.
బహుళ పంటల సాగు అంటే ఏమిటి?
జవాబు:
ఒకే విస్తీర్ణంలో సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ పంటలను సాగుచేయడాన్ని ‘బహుళ పంటల సాగు’ అంటాం.

ప్రశ్న 17.
విద్యుత్ రాకముందు రాంపురం గ్రామస్తులు బావుల నుండి నీళ్లు పైకి తోడడానికి ఉపయోగించిన పరికరం ఏది?
జవాబు:
పర్షియన్ వీల్

ప్రశ్న 18.
రాంపురం జనాభా ఎంత ? అక్కడ ఎన్ని కుటుంబాలున్నాయి?
జవాబు:
రాంపురం జనాభా 2660. అక్కడ 450 కుటుంబాలున్నాయి.

ప్రశ్న 19.
ఉత్పత్తి ప్రక్రియలో లాభ, నష్టాలను భరించే వారినేమంటారు?
జవాబు:
యజమానులు.

ప్రశ్న 20.
భారతదేశంలోని ప్రధాన ఉత్పత్తి కార్యకలాపాలేంటి?
జవాబు:
భారతదేశ గ్రామాలలో వ్యవసాయం ప్రధాన ఉత్పత్తి కార్యకలాపం. ఇతర ఉత్పత్తి కార్యకలాపాలను వ్యవసాయేతర కార్యకలాపాలు అంటారు. వీటిలో చిన్న చిన్న వస్తువుల ఉత్పత్తి, రవాణా, దుకాణాల నిర్వహణ వంటివి ఉంటాయి.

ప్రశ్న 21.
ఉత్పత్తిలో పెట్టుబడి ఎన్ని రకాలుగా ఉంటుందో వర్గీకరించండి.
జవాబు:
ఉత్పత్తిలో పెట్టుబడి రెండు రకాలుగా ఉంటుంది.

  1. భౌతిక లేదా స్థిర పెట్టుబడి.
  2. నిర్వహణ పెట్టుబడి.

10th Class Social 9th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
కరువు వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి తెలుపుతూ మీ తహసీల్దార్ (MRO) కు లేఖ రాయండి.
జవాబు:

ప్రదేశము : ………..
తేది : ……………

తహసీల్దార్ (MRO) గారి దివ్యసముఖమునకు
…………………
…………………

గౌరవనీయులైన అయ్యా,

నేను …………… ప్రాంతం వాడిని. మా ప్రాంతంలో ఈ సంవత్సరము తగినంత వర్షపాతము లేదు. పంటలు దెబ్బ తినడం వలన వ్యవసాయదారుల జీవనము అస్తవ్యస్తముగా మారినది. వ్యవసాయదారులు పెట్టుబడుల వలన, పంట నష్టాల వలన, పని దొరకకపోవడం వలన అనేక ఇబ్బందులు పాలైనారు. చాలా కుటుంబాలు అనాసక్తతతో ఉన్నాయి.

ప్రభుత్వమువారు ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి, అవసరమైన సహాయక చర్యలను తీసుకోవలెను. బ్యాంకు నుండి లోన్లు ఇప్పించడం ద్వారా, ఉపాధి పనుల ద్వారా రైతు కుటుంబాలను ఆదుకోవలెను.

ధన్యవాదములు.

మీ విశ్వాసపాత్రుడు,
……………………..

చిరునామా:
………………………… ,
………………………… ,
………………………… .

ప్రశ్న 2.
క్రింది పట్టికలో ఇవ్వబడిన సమాచారానికి ఒక ‘పై’ (Pie) చిత్రాన్ని (చిత్తుపటం) గీయండి. మీ పరిశీలనను రాయండి.

రైతుల రకాలుసాగుభూమి శాతం
చిన్న రైతులు48%
మధ్య తరగతి, పెద్ద రైతులు52%

జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 2
పరిశీలన :
ఎక్కువ వాటా భూమి (52%) మధ్యతరగతి మరియు పెద్ద రైతుల చేతిలో ఉండగా, తక్కువ వాటా భూమి (48%) చిన్న రైతుల చేతిలో ఉన్నది.

ప్రశ్న 3.
క్రింది పట్టికను పరిశీలించి, దిగువ ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 3
a) చిన్న రైతులు అంటే ఎవరు?
జవాబు:
రెండు హెక్టార్ల కంటే తక్కువగా సాగుభూమి కలిగినవారిని చిన్న రైతులు అంటారు.

b) భారతదేశంలో సాగుభూమి పంపిణీలో అసమానతలు ఉన్నాయని నీవు అంగీకరిస్తావా? వివరించుము.
జవాబు:
అవును. అసమానతలు ఉన్నాయని అంగీకరిస్తాను. కారణమేమనగా 87% రైతులు కేవలం 18% భూమిని సాగుచేస్తుండగా కేవలం 13% రైతులు 52% భూమిని సాగు చేస్తున్నారు.

ప్రశ్న 4.
ప్రస్తుతం గ్రామాలలో వ్యవసాయేతర కార్యకలాపాలు పెరగాల్సిన ఆవశ్యకత ఏమిటి?
జవాబు:
ప్రస్తుతం గ్రామాలలో వ్యవసాయేతర కార్యకలాపాలు పెరగాల్సిన ఆవశ్యకత :

  • అనిశ్చిత ఋతుపవనాలు
  • అక్షరాస్యుల సంఖ్య పెరగడం
  • సాంకేతిక విజ్ఞాన ప్రభావం
  • బ్యాంకు సేవలు – రుణాలు

ప్రశ్న 5.
క్రింది సమాచారాన్ని చదివి, మీ పరిశీలనను రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ
జవాబు:

  1. మొత్తం రైతులలో 87% మంది చిన్నరైతులు.
  2. 13% మంది మధ్యతరగతి మరియు పెద్దరైతులు.
  3. 13% ఉన్న పెద్ద, మధ్యతరగతి రైతుల చేతుల్లో 52% సాగుభూమి ఉంది.
  4. భారతదేశంలో భూమి పంపిణీలో తీవ్ర అసమానతలు ఉన్నాయి.

ప్రశ్న 6.
ఉత్పత్తి కారకాలలో ఒకదాని గురించి వివరించండి.
జవాబు:
భూమి, శ్రమ, పెట్టుబడి, జ్ఞానం, వ్యాపార దక్షతలను ఉత్పత్తి కారకాలంటారు.
శ్రమ :
శ్రమ అనగా కేవలం కార్మికులు చేసే శ్రమయే కాకుండా ఉత్పత్తికి అవసరమైన మానవ ప్రయత్నాలన్నింటినీ ఇది సూచిస్తుంది.

AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 7.
చిన్న రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను క్లుప్తంగా వివరించండి.
జవాబు:
చిన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు :

  1. సాగునీటి సదుపాయం లేక వర్షాలపై ఆధారపడటంతో అతివృష్టి లేదా అనావృష్టి.
  2. ఎరువుల కొరత
  3. వ్యవసాయ కూలీల కొరత.
  4. పెట్టుబడి అందించే సంస్థాగత (నియత రుణాలు) ఏర్పాట్లు లేకపోవడం.
  5. పంటకు సరియైన గిట్టుబాటు ధరలు అందకపోవడం.
  6. సరియైన మార్కెటింగ్ సమాచారం రైతులకు తెలియకపోవడం.
  7. దళారుల వ్యవస్థ (వారి పెత్తనం) మొదలైనవి.

ప్రశ్న 8.
భారతదేశంలో సాగునీటి సదుపాయాలు గూర్చి క్లుప్తంగా రాయండి.
జవాబు:
భారతదేశంలోని అన్ని గ్రామాలకు ఇంతటి సాగునీటి సదుపాయం లేదు. దేశంలోని నదీ మైదానాలు, కోస్తా ప్రాంతాలలో మాత్రమే సాగునీటి సదుపాయాలు బాగున్నాయి. ఇందుకు విరుద్దంగా దక్కన్ పీఠభూమి వంటి పీఠభూమి ప్రాంతాలలో సాగునీటి సదుపాయాలు. తక్కువ. ఈనాటికి కూడా దేశంలోని సాగు విస్తీర్ణంలో 40 శాతానికంటే తక్కువ విస్తీర్ణానికి సాగునీటి సదుపాయం ఉంది. మిగిలిన ప్రాంతాలలో వ్యవసాయం ప్రధానంగా వర్షాధారంగా ఉంది.

ప్రశ్న 9.
రాంపురంలో గ్రామంలో పెద్ద రైతులు సమకూర్చుకున్న భౌతిక పెట్టుబడులు ఏవి?
జవాబు:
ఈ గ్రామంలోని పెద్ద రైతులందరికీ ట్రాక్టర్లు ఉన్నాయి. తమ పొలాలను దున్నటానికి, విత్తటానికి ఉపయోగించటమే కాకుండా వీటిని ఇతర చిన్న రైతులకు అద్దెకు ఇస్తారు. వీళ్లల్లో చాలామందికి నూర్పిడి యంత్రాలు ఉన్నాయి, కొంత మందికి పంటకోత యంత్రాలు కూడా ఉన్నాయి. ఈ పెద్ద రైతులందరికీ తమ పొలాలకు సాగునీళ్లు అందించటానికి అనేక బోరుబావులు ఉన్నాయి. ఈ పరికరాలు, యంత్రాలు అన్నీ వ్యవసాయానికి అవసరమైన భౌతిక పెట్టుబడితో భాగం.

ప్రశ్న 10.
కొత్త వ్యవసాయ పద్ధతులు శ్రామికులను వ్యవసాయరంగానికి దూరం చేస్తున్నాయా?
జవాబు:
అవును. కొత్త వ్యవసాయ పద్ధతులు శ్రామికులను వ్యవసాయరంగానికి దూరం చేస్తున్నాయి. ఉత్పత్తి కారకాలలో శ్రమ ప్రధాన కారణమైనందున కొత్త వ్యవసాయ పద్ధతులు ఎక్కువ శ్రమను ఉపయోగించుకోగలిగితే బాగుంటుంది. దురదృష్టవశాత్తు ఇటువంటిది జరగలేదు. వ్యవసాయంలో శ్రమను మితంగా ఉపయోగించుకుంటున్నారు. దాంతో శ్రామికులు అవకాశాల కోసం వెదుక్కుంటూ పక్క గ్రామాలకు, పట్టణాలు, నగరాలకు వలస వెళుతున్నారు. కొంతమంది కార్మికులు గ్రామంలో వ్యవసాయేతర పనులు చేపడుతున్నారు.

ప్రశ్న 11.
రాంపురంలో భూపంపిణీ ఎలా జరిగింది?
జవాబు:
రాంపురంలో మూడింట ఒక వంతు అంటే 150 కుటుంబాలకు భూమి లేదు. భూమిలేని వాళ్లలో అధికశాతం దళితులు. రెండు హెక్టార్లకు మించి భూమి ఉన్న పెద్ద, మధ్యతరగతి కుటుంబాలు 60 దాకా ఉన్నాయి. పెద్ద రైతులలో కొంత మందికి 10 హెక్టార్లకు మించి సాగు భూమి ఉంది. రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమిని సాగుచేసే కుటుంబాలు 240 ఉన్నాయి.

ప్రశ్న 12.
నిర్వహణ పెట్టుబడి కోసం చిన్న రైతులు ఏం చేస్తారు?
జవాబు:
నిర్వహణ పెట్టుబడి కోసం చాలా మంది చిన్న రైతులు అప్పు చేయాల్సి ఉంటుంది. వాళ్లు పెద్ద రైతుల నుంచి కానీ, వడ్డీ వ్యాపారస్తుల నుంచి కానీ, సాగుకు అవసరమయ్యే వివిధ ఉత్పాదకాలను సరఫరాచేసే వ్యాపారస్తుల నుంచి కానీ అప్పు – తీసుకుంటారు. ఇటువంటి అప్పుల మీద వడ్డీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ అప్పులు తిరిగి చెల్లించటం వాళ్లకు చాలా భారంగా ఉంటుంది.

ప్రశ్న 13.
పాడి పరిశ్రమలో ఉత్పత్తి కారకాలను వివరించండి.
జవాబు:
పాడి పరిశ్రమలో ఉత్పత్తి కారకాలు :
భూమి : గ్రామంలో సొంత కొట్టం (షెడ్డు).
శ్రమ : కుటుంబ శ్రమ ; ప్రధానంగా మహిళలు గేదెల పోషణ పని చూస్తారు.
భౌతిక పెట్టుబడి : పశువుల సంతలో కొన్న గేదెలు.
నిర్వహణ పెట్టుబడి : తమ భూమిలోంచి వచ్చిన పశువుల మేతతో పాటు కొన్న మందులు.

AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 14.
మిశ్రిలాల్ ఏం పనిచేస్తాడు?
జవాబు:
మిశ్రిలాల్ విద్యుచ్ఛక్తితో పనిచేస్తూ చెరకు రసం తీసే యంత్రం కొని బెల్లం తయారుచేస్తాడు. అంతకు ముందు చెరకురసం. తియ్యడానికి ఎడ్లను ఉపయోగించేవాళ్లు, కాని ఇప్పుడు అందరూ యంత్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తను పండించిన చెరకును ఉపయోగించటమే కాకుండా మిశ్రిలాల్ ఇతర రైతుల నుంచి కూడా చెరకు కొని బెల్లం తయారుచేస్తాడు.

ప్రశ్న 15.
ఆధునిక వ్యవసాయ పద్ధతులను గురించి తెలపండి.
జవాబు:

  1. ఆధునిక వ్యవసాయంలో అధిక దిగుబడి విత్తనాలను ఉపయోగిస్తున్నారు.
  2. అలాగే రసాయనిక ఎరువులను, పురుగుల మందులను వినియోగిస్తున్నారు.
  3. మునుపటి కంటే లోతైన బోరుబావులు తవ్వి డీజిల్ / విద్యుత్ వినియోగంతో సాగునీటిని పొందుతున్నారు.
  4. ఆధునిక వ్యవసాయం సుస్థిరతతో కూడినది కాదు.

ప్రశ్న 16.
“శ్రామికులు ఉత్పత్తికి అవసరమైన వనరు.” ఈ వాక్యాన్ని చదివి, అర్థం చేసుకొని వ్యాఖ్యానించండి.
జవాబు:

  1. కొన్ని ఉత్పత్తి ప్రక్రియలకు అవసరమైన పనులు చేయటానికి బాగా చదువుకున్న, నైపుణ్యాలు ఉన్న కార్మికులు కావాలి.
  2. మిగిలిన పనులు చేయడానికి శారీరక శ్రమ చేసే కార్మికులు కావాలి.
  3. ప్రతి శ్రామికుడు ఉత్పత్తికి అవసరమైన శ్రమను అందిస్తున్నాడు.
  4. కావున శ్రామికులు ఉత్పత్తికి అవసరమైన వనరు.

ప్రశ్న 17.
“పనిముట్లు, యంత్రాలు, భవనాలపై పెట్టే ఖర్చును భౌతిక పెట్టుబడి” అని అంటారు. ఎందుకో వివరించండి.
జవాబు:

  1. రైతులు ఉపయోగించే నాగలి పనిముట్లు నుంచి మొదలుకొని జనరేటర్లు, టర్బైన్లు, కంప్యూటర్‌తో నడిచే యంత్రాల వంటి అత్యంత సంక్లిష్టమైన యంత్రాలు ఉండవచ్చు. అవి ఉత్పత్తి ప్రక్రియతో అయిపోవు.
  2. అనేక సంవత్సరాల పాటు ఇవి వస్తువుల ఉత్పత్తిలో ఉపయోగపడతాయి.
  3. ఇలా సంవత్సరాల తరబడి ఉపయోగపడటానికి వాటికి కొంత మరమ్మతు నిర్వహణ అవసరం అవుతాయి.
  4. వీటిని స్థిర పెట్టుబడి లేదా భౌతిక పెట్టుబడి అంటారు.

ప్రశ్న 18.
దేశవ్యాప్తంగా భూగర్భజలమట్టాలు గణనీయంగా పడిపోతున్నాయి. ఇందుకోసం కొన్ని ప్రత్యామ్నాయాలను చూపండి.
జవాబు:

  1. దేశవ్యాప్తంగా భూగర్భజలమట్టాలు గణనీయంగా పడిపోతున్నాయి.
  2. నీటిని నిల్వచేసుకొనే ఇంకుడు గుంటలు, చెక్ డ్యాంలు, వనీకరణ, బండ్స్ నిర్మాణం, వాటర్‌షెడ్ పథకాలు చేపట్టాలి.
  3. సాగునీటి అవసరాలకు కాకుండా కేవలం త్రాగునీటికోసమే బోరుబావులను అనుమతించాలి.
  4. తక్కువ నీటితోనే పండే ప్రత్యామ్నాయ పంటలవైపు రైతులు చూడాలి.

ప్రశ్న 19.
మీ ప్రాంతంలో పాడి పరిశ్రమ – పాల సేకరణ ఎలా జరుగుతుందో వివరించండి.
జవాబు:

  1. మా ప్రాంతంలో అనేక కుటుంబాలు పాల ఉత్పత్తి చేస్తాయి.
  2. గేదెలకు వివిధ రకాల గడ్డి, జొన్న, సజ్జ మేతను మేపుతారు.
  3. ఇద్దరు వ్యాపారస్తులు పాల సేకరణ, శీతలీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
  4. కుటుంబ శ్రమ, ప్రధానంగా మహిళలు గేదెల పోషణ చూస్తారు.

ప్రశ్న 20.
మీ ప్రాంతంలోని ఏదైనా వ్యాపారి యొక్క వ్యాపార దక్షతను గురించి వివరించంది.
జవాబు:

  1. మా ప్రాంతంలో వెంకటేశ్వరరావు అనే వస్త్రాల వ్యాపారి ఉన్నాడు.
  2. తొలుత అతను ఇంటింటికి తిరిగి దుస్తులు అమ్ముతూ వారం వారం డబ్బులు తీసుకుంటుండేవాడు.
  3. వ్యాపారం నమ్మకంగా చేస్తూ, నాణ్యమైన వస్త్రాలు అందజేస్తూ ప్రాంత ప్రజల విశ్వాసం చూరగొన్నాడు.
  4. తదుపరి పెట్టుబడితో స్వయంగా ఒక వస్త్ర దుకాణాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పటికీ ఆ దుకాణం విజయవంతంగా నడుస్తోంది.

AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 21.
1960లో గోవిందు అనే రైతుకు 2.25 హెక్టార్ల భూమి ఉండేది. అప్పుడు దానికి సాగునీటి వసతి అంతగా లేదు. ముగ్గురు కొడుకుల సహాయంతో గోవిందు వ్యవసాయం చేసేవాడు. భోగభాగ్యాలు లేకపోయినా కుటుంబానికి ఉన్న ఒక బర్రెతో వచ్చే అదనపు ఆదాయంతో సరిపోయే ఆహారాన్ని పొందగలిగేవాళ్లు. కొన్ని సంవత్సరాలకు గోవిందు చనిపోవటంతో ముగ్గురు కొడుకులు భూమిని పంచుకున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరికి 0.75 హెక్టార్ల భూమి మాత్రమే ఉంది. మెరుగైన సాగునీటి వసతి, ఆధునిక వ్యసాయ పద్ధతులతో కూడా గోవిందు కొడుకులకు భూమినుంచి కుటుంబ అవసరాలు పూర్తిగా తీరడం లేదు. సంవత్సరంలో కొన్ని నెలలపాటు వాళ్ళు ఇతర పనులు వెతుక్కోవలసి వస్తోంది. పై పేరాను చదివి, క్రింది ప్రశ్నకు జవాబు రాయండి.
ప్రశ్న : కుటుంబ పరిమాణం పెరిగినపుడు గోవిందు లాంటి చిన్నరైతులు ఎలా స్పందించారు? బోరు బావిలో సాగునీరు ఎంతవరకు ఉపయోగపడింది?
జవాబు:

  1. కుటుంబ పరిమాణం పెరిగినపుడు భూమిని పంచుకోవలసి రావడం వలన చిన్న చిన్న కమతాలు ఏర్పడినాయి.
  2. చిన్న కమతాలతో మెరుగైన నీటివసతి, ఆధునిక వ్యవసాయ పద్ధతుల వలన కూడా కుటుంబ అవసరాలు తీరడం లేదు.
  3. వారు సంవత్సరంలో కొన్ని నెలలు వేరే పని చూసుకోవల్సి వచ్చింది.
  4. బోరుబావి నీరు వ్యవసాయ నీటిపారుదల అవసరాన్ని తీర్చలేదు.

ప్రశ్న 22.
భారతదేశంలో రైతులు, వాళ్లు సాగుచేసే భూముల వివరాలు కింద ఇచ్చిన పట్టికలో ఉన్నాయి.
AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 3
పై పట్టికను చదివి, క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
1. రైతులు ఎన్ని రకాలు ఉన్నారు?
2. ఏ రైతులు ఎక్కువ శాతం ఉన్నారు?
3. సాగుభూమి శాతంలో తేడా ఎంత?
4. మధ్యతరగతి, పెద్ద రైతుల విషయంలో రైతుల శాతం తక్కువగా ఉన్నా, సాగుభూమి శాతం అధికంగా ఉండడానికి కారణాలను ఊహించండి.
జవాబు:

  1. రైతులు 2 రకాలు.
    i) చిన్న లేదా సన్నకారు రైతులు.
    ii) మధ్యతరగతి లేదా పెద్ద రైతులు.
  2. చిన్న రైతులు (87%) ఎక్కువ శాతం ఉన్నారు.
  3. సాగుభూమి శాతంలో 4% తేడా ఉంది. పెద్ద రైతులు ఎక్కువ సాగుభూమి కల్గి ఉన్నారు.
  4. మధ్యతరగతి, పెద్ద రైతుల భూకమతాలు పెద్దవిగా ఉంటాయి.

10th Class Social 9th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
క్రింది పట్టికను పరిశీలించండి.
పట్టిక : డిసెంబరు 2011లో వివిధ వ్యవసాయ పనులకు ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కూలి రేట్లు (రూపాయలలో)
AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 1

ఎ) పురుషులు మాత్రమే చేస్తున్న పనులు ఏవి?
జవాబు:
దున్నటం ఒక్కటే పురుషులు మాత్రమే చేస్తున్న పనులు.

బి) స్త్రీలు మాత్రమే చేస్తున్న పనులు ఏవి?
(లేదా)
స్త్రీలు మాత్రమే పాల్గొంటున్న వ్యవసాయ పనులేవి?
జవాబు:
నాట్లు వేయడం, ప్రతి ఏరడం మాత్రమే స్త్రీలు చేస్తున్న పనులు.

సి) ఏయే పనులలో స్త్రీ, పురుషుల కూలి రేట్లలో వ్యత్యాసం ఉన్నది?
జవాబు:
అన్ని పనులలో పురుషుల స్త్రీల కూలీ రేట్లలో వ్యత్యాసం ఉంది.

డి) పురుషుల కంటే స్త్రీలకు తక్కువ కూలి ఇవ్వడానికి కారణం ఏమిటి?
(లేదా)
ఒకే పనికి ఆడవాళ్ళ కంటే మగవాళ్ళకి ఎందుకు ఎక్కువ కూలీ లభిస్తుంది.
జవాబు:
స్త్రీలకంటే పురుషులు ఎక్కువ పనిచేయగలరనే భావన వలన ఒక పనికి స్త్రీల కంటే పురుషులకు ఎక్కువ కూలి ఇస్తున్నారు.

ప్రశ్న 2.
కింది వివరాల ఆధారంగా ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 4
a) రాంపురం గ్రామంలో ఏ రకపు ఇళ్ళు అధికంగా ఉన్నాయి?
b) రాంపురం గ్రామంలో 60% ప్రజలు ఏ తరగతికి చెందినవారు?
c) రాంపురం గ్రామంలో మధ్యతరగతికి చెందిన ప్రజల జనాభా సుమారుగా ఎంత ఉండవచ్చును?
d) సిమెంటు, ఇటుకలతో కట్టిన డాబా ఇండ్లలో ఎవరు నివసిస్తున్నారని భావిస్తావు?
జవాబు:
a) గుడిసెలు, తాటాకు ఇళ్ళు
b) పేదప్రజలు
C) 25%
d) ధనికులు

ప్రశ్న 3.
క్రింది పట్టికను పరిశీలించి, విశ్లేషించండి.
రైతులు సాగుచేసే భూమి వివరాలు తెలిపే దత్తాంశం
AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 3
జవాబు:
పైన ఇవ్వబడిన పట్టికలో రైతులు, వారు సాగుచేస్తున్న భూమి వివరాలు ఇవ్వడం జరిగింది ఈ పట్టికలో రెండు రకాల రైతులను పేర్కొనడం జరిగినది.

  1. చిన్న లేదా సన్నకారు రైతులు
  2. మధ్య తరగతి, పెద్ద రైతులు

సన్నకారు రైతులు 87% మంది 2 హెక్టార్ల కంటే తక్కువ సాగు భూమిని కలిగివున్నారు. వారి వద్ద 48% వ్యవసాయ భూమి మాత్రమే కలదు. మధ్యతరగతి, పెద్ద రైతులు 13% మాత్రమే కాని వారు 2 హెక్టార్ల కంటే ఎక్కువ సాగు భూమిని కలిగి మొత్తం సాగు భూమిలో 52% కలిగి ఉన్నారు. అనగా దేశంలోని అత్యధిక సాగుభూమి కొద్ది మంది రైతుల చేతులలోనే ఉందని తెలుస్తోంది.

దీని ప్రకారం మనకు తెలిసినది ఏమిటంటే చిన్న రైతులు గ్రామాల్లో ఎక్కువ మంది ఉన్నారు. సాగుచేసే సమయంలో వారి వద్ద డబ్బులు లేక సరియైన విత్తనాలు, ఎరువులు కొనలేక లాభాలను గడించలేకపోతున్నారు. కాని పెద్ద రైతులకు బ్యాంకులలో మిగులు డబ్బు మరియు వారి భూమి మీద లోన్ తీసుకుని ట్రాక్టర్లను, యంత్రాలను వాడి ఆధునిక వ్యవసాయం చేసి మరింత లాభాలను గడిస్తున్నారు. ‘సన్నకారు రైతులు తమ పంటలకు కనీస మద్దతు ధర కూడా లభించక ఇబ్బందులు పడుతున్నారు.

కావున ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు రుణ సదుపాయం విషయంలో, విత్తనాలు, ఎరువుల కొనుగోలులో చేయూత ఇచ్చి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.

AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 4.
ఉత్పత్తి కారకాలను పేర్కొని, ఏవేని రెండింటిని గురించి వివరించండి.
జవాబు:
ఉత్పత్తి కారకాలు :
1. భూమి
2. శ్రమ / శ్రామికులు
3. మూలధనం / పెట్టుబడి
4. సాంకేతిక పరిజ్ఞానం / వ్యాపార దక్షత

1. భూమి :
ఉత్పత్తికి భూమి, నీరు, అడవులు, ఖనిజ లవణాలు వంటి సహజవనరులు కావాలి.

2. శ్రామికులు :
సాధారణ వాడుకలో కంటే భిన్నంగా శ్రమ అంటే కేవలం శారీరక శ్రమే కాకుండా ఉత్పత్తికి అవసరమైన మానవ ప్రయత్నాలన్నింటినీ ఇది సూచిస్తుంది. వృత్తి నైపుణ్యం గల కార్మికులు, శారీరక శ్రమచేసే శ్రామికులు ఈ విభాగంలోకి వస్తారు.

ప్రశ్న 5.
దిగువ ఇచ్చిన ను పరిశీలించి విశ్లేషించండి.
AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 5
జవాబు:
ఇవ్వబడిన గ్రాఫ్ నాలుగు రకాల రైతులు – చిన్న రైతులు, మధ్య తరగతి రైతులు, భూమిలేని రైతులు మరియు పెద్ద రైతుల శాతం గురించి వెల్లడిస్తోంది. దత్తాంశం 2011 జనాభా గణనకు సంబంధించినది. అందరికంటే ఎక్కువగా చిన్న రైతులు 60% మంది ఉన్నారు. పెద్ద రైతులు చాలా తక్కువగా అనగా 7% మంది మాత్రమే ఉన్నారు. మధ్యతరగతి రైతులు 19% మంది ఉండగా భూమిలేని రైతులు 14% మంది ఉన్నారు.

దశాబ్దాలుగా చాలా మంది ప్రజలకు భూములు లేవు. కాలక్రమంలో కొంతమంది భూములు సంపాదించుకున్నారు. వారు తమ కష్టార్జితంతో భూములను కొనుగోలు చేశారు. అత్యధిక గ్రామీణ కుటుంబాలలో కుటుంబ సభ్యుల సంఖ్య ఎక్కువ. తండ్రి భూమి కొడుకుల దాకా వచ్చేసరికి వారికి సమాన భాగాలలో పంచబడుతుంది. సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండటం వలన కొడుకులు తక్కువ భూమిని పొందుతున్నారు. భారతదేశంలో గరిష్టశాతం భూమి పెద్ద రైతుల నియంత్రణలో ఉంది. చాలా మంది రైతులకు తక్కువ భూమి ఉన్నందున వారి కుటుంబ సభ్యులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. పెద్ద రైతులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.

ప్రభుత్వం ఇటువంటి చిన్న రైతులను, భూమి లేని రైతులను గురించి వారికి సరిపడినంత భూమిని పంపిణీ చేయాలి. కొన్ని సందర్భాలలో కొన్ని ప్రభుత్వాలు కులం ఆధారంగా భూమి పంపిణీ చేస్తున్నాయి. అలా కాకుండా వారి ఆర్థిక స్థితి గతులు మరియు వారు భూమిని కలిగివున్నారా లేదా అనేది పరిగణనలోకి తీసుకొని భూమి పంపిణీ చేస్తే అత్యధిక శాతం రైతులు ప్రయోజనం పొందుతారు.

ప్రశ్న 6.
భూగర్భ జలాలు, రసాయన మందులు వాడకం ఎక్కువైతే ఏం జరుగుతుంది?
జవాబు:
రసాయనిక ఎరువులు, పురుగుమందులను అధికంగా, ఇష్టానుసారంగా వాడినందువల్ల భూసారం తగ్గుతోందని మన అనుభవం ద్వారా తెలుస్తోంది. నీటి పరిస్థితి కూడా అంతే ఆందోళన కలిగిస్తోంది. రాంపురం గ్రామం మాదిరిగానే భారతదేశం అంతటా సాగునీటికి ప్రధానంగా భూగర్భ జలాలమీదే ఆధారపడి ఉన్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా భూగర్భ జలమట్టాలు గణనీయంగా పడిపోతున్నాయి. వర్షాలు బాగా ఉండి, వాననీళ్ళు నేలలోకి ఇంకటానికి అనువుగా ఉండే ప్రాంతాలలో కూడా భూగర్భ జలాలు చాలా ప్రమాదకర స్థాయికి పడిపోతున్నాయి. భూగర్భజలమట్టం పడిపోతుంటే రైతులు, మునుపటికంటే లోతైన బోరుబావులు తవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల సాగునీటికి డీజిలు/విద్యుత్తు వినియోగం కూడా పెరుగుతుంది.

ప్రశ్న 7.
రాంపురం వ్యవసాయరంగంలో ముందంజలో ఉండుటకు కారణాలేంటి?
జవాబు:
రాంపురంలో బాగా అభివృద్ధి చెందిన నీటిపారుదల వ్యవస్థ ఉన్నందువల్ల రైతులు సంవత్సరంలో మూడు పంటలదాకా సాగు చేస్తున్నారు. రాంపురానికి ఎంతో ముందుగానే విద్యుత్తు వచ్చింది. దీంతో సాగునీటి వ్యవస్థ రూపురేఖలు మారిపోయాయి. అప్పటివరకు రైతులు బావుల నుంచి నీళ్లు పైకి తోడటానికి ‘పర్షియన్ వీల్’ అనే పరికరాన్ని ఉపయోగించి సాగునీటి కింద చాలా తక్కువ విస్తీర్ణాన్ని సాగు చేసేవాళ్లు. విద్యుత్ తో నడిచే బోరుబావుల ద్వారా తేలికగా ఎక్కువ విస్తీర్ణానికి సాగునీటిని అందివ్వవచ్చని రైతులు గుర్తించారు. దాదాపు 50 సంవత్సరాల క్రితమే మొదటి బోరుబావులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తరువాత రైతులు సొంత ఖర్చుతో బోరుబావులు ఏర్పాటు చేసుకోసాగారు. ఫలితంగా 1970 దశాబ్ది మధ్యకాలం నాటికి 264 హెక్టార్ల వ్యవసాయ భూమి సాగునీటి కిందికి వచ్చింది.

AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 8.
వ్యవసాయ కూలీలు ఎవరు ? కూలీల వినియోగంలో ప్రాంతాల మధ్యగల తేడాలేవి?
జవాబు:
వ్యవసాయ పనులు చేసే కూలీలను వ్యవసాయ కూలీలంటాం.

భూమిలేని కుటుంబాల నుంచి లేదా చిన్న రైతు కుటుంబాల నుంచి వ్యవసాయ కార్మికులు వస్తారు. తమ సొంత పొలాల్లో పనిచేసే రైతుల మాదిరి కాకుండా వ్యవసాయ కూలీలకు భూమిలో పండించే పంటలపై ఎటువంటి హక్కు ఉండదు. దానికి బదులుగా వాళ్లు చేసిన పనికి రైతు కూలీ చెల్లిస్తాడు. ఆ పని చెయ్యటానికి వీళ్లను నియమించుకుంటారు.

డబ్బు రూపేణా కానీ, వస్తు (పంట) రూపేణా కానీ కూలీ ఉండవచ్చు. కొన్ని సమయాల్లో కూలీలకు అన్నం కూడా పెడతారు. ప్రాంతాన్ని బట్టి, పంటను బట్టి, పనిని బట్టి (ఉదాహరణకు విత్తడం, పంటకోత) కూలిరేట్లలో చాలా తేడా ఉంది. పని దొరికే రోజులలో కూడా చాలా తేడా ఉంది. వ్యవసాయ కూలీని రోజువారీ కూలీగా పెట్టుకోవచ్చు, లేదా ఒక ప్రత్యేక పనికి గుత్త పద్ధతిలో పెట్టుకోవచ్చు, లేదా సంవత్సరమంతా జీతానికి పెట్టుకోవచ్చు.

ప్రశ్న 9.
వ్యవసాయేతర ఉత్పత్తి కార్యక్రమాలు దోహదపడే అంశాలు రాయండి.
జవాబు:
భవిష్యత్తులో గ్రామాలలో వ్యవసాయేతర ఉత్పత్తి కార్యకలాపాలు ఇంకా పెరగాలి. వ్యవసాయంలా కాకుండా వ్యవసాయేతర పనులకు చాలా తక్కువ భూమి కావాలి. కోంత పెట్టుబడి ఉన్న వాళ్లు వ్యవసాయేతర పనులు చేపట్టవచ్చు. ఎవరికైనా పెట్టుబడి ఎలా లభిస్తుంది ? ఇందుకు సొంతంగా ఉన్న పొదుపు మొత్తాలను ఉపయోగించవచ్చు, అయితే తరచుగా దాని కోసం అప్పు తీసుకోవాల్సి వస్తుంది. తక్కువ వడ్డీతో అప్పులు అందుబాటులో ఉండటం ముఖ్యం, అప్పుడు పొదుపు మొత్తాలు లేనివాళ్లు కూడా అప్పు తీసుకుని ఏదో ఒక వ్యవసాయేతర పని మొదలుపెట్టగలుగుతారు. వ్యవసాయేతర పనులు విస్తరించటానికి మరొక ముఖ్యమైన అవసరం ఉత్పత్తి చేసిన వస్తువులు, సేవలు అమ్మటానికి మార్కెటు ఉండటం. రాంపురంలో ఉత్పత్తి అవుతున్న పాలు, బెల్లం, గోధుమల వంటి వాటికి చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాలు, నగరాలలో మార్కెటు ఉండటాన్ని చూశాం. మంచిరోడ్లు, రవాణా, టెలిఫోను సౌకర్యం వంటివి మెరుగుపడటం ద్వారా గ్రామాలకు పట్టణాలు, నగరాలతో మంచి అనుసంధానం ఏర్పడి రానున్న సంవత్సరాలలో గ్రామాలలో వ్యవసాయేతర , ఉత్పత్తి కార్యకలాపాలు పెరుగుతాయి.

ప్రశ్న 10.
వస్తువులు లేదా సేవలు ఉత్పత్తి చేయుటకు ఉత్పత్తిదారులకు కావలసిన వస్తువులేవి? లేదా ఉత్పత్తి కారకాలేవి? వివరించుము.
జవాబు:
వస్తువులు లేదా సేవలు ఉత్పత్తి చేయుటకు ఉత్పత్తిదారులకు కావలసిన వస్తువులనే ఉత్పత్తి కారకాలంటారు. అవి
1. భూమి,
2. శ్రమ,
3. పెట్టుబడి,
4. జ్ఞానము, వ్యాపార దక్షత.

1. భూమి :
ఉత్పత్తికి భూమి, నీరు, అడవులు, ఖనిజ లవణాలు వంటి సహజవనరులు కావాలి.

2. శ్రామికులు :
సాధారణ వాడుకలో కంటే భిన్నంగా శ్రమ అంటే కేవలం శారీరక శ్రమే కాకుండా ఉత్పత్తికి అవసరమైన మానవ ప్రయత్నాలన్నింటినీ ఇది సూచిస్తుంది. వృత్తి నైపుణ్యం గల కార్మికులు, శారీరక శ్రమచేసే శ్రామికులు ఈ విభాగంలోకి వస్తారు.

3. పెట్టుబడి :
పనిముట్లు, యంత్రాలు, భూమి, భవనాలు వంటి శాశ్వత అంశాలపై పెట్టుబడి – ధీనినే స్థిర పెట్టుబడి లేదా భౌతిక పెట్టుబడి అంటారు.

దీంతోపాటు నిర్వహణ పెట్టుబడి అనగా ముడిసరుకు, ఇతర ఖర్చులకు డబ్బు కూడా పెట్టుబడిలో భాగమే.

4. జ్ఞానం, వ్యాపార దక్షత :
భూమి, శ్రమ, పెట్టుబడిని ఉపయోగించి సరుకులు లేదా సేవలు ఉత్పత్తి చేయుటకు ఉత్పత్తి ప్రక్రియకు సంబంధించిన జ్ఞానము, ఆత్మ విశ్వాసం, వ్యాపార దక్షత అవసరం.