AP Board 9th Class Social Solutions Chapter 3 జలావరణం

SCERT AP 9th Class Social Studies Guide Pdf 3rd Lesson జలావరణం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 3rd Lesson జలావరణం

9th Class Social Studies 3rd Lesson జలావరణం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
భిన్నంగా ఉన్న దానిని గుర్తించి మీ ఎంపికకు కారణాన్ని వివరించండి. (AS1)
i) అ) బాష్పీభవనం ఆ) ద్రవీభవనం ఇ) లవణీకరణ ఈ) అవపాతం
జవాబు:
ఇ) భిన్నంగా ఉన్నది లవణీకరణ.
బాష్పీభవనం :
నేలమీదనున్న నీరు ఆవిరి కావటం ద్వారా వాతావరణంలోకి ప్రవేశించే ప్రక్రియలో నీరు ద్రవరూపం నుంచి వాయు రూపంలోకి మారడాన్ని బాష్పీభవనం అంటారు.

ద్రవీభవనం :
రవాణా చేయబడిన నీటి ఆవిరి ద్రవీభవనం చెంది చిన్న నీటి బిందువులుగా, మబ్బులుగా మారడాన్ని ద్రవీభవనం అంటారు.

అవపాతం :
అవపాతం అనగా వాతావరణంలోని నీరు భూమి ఉపరితలానికి చేరటం.
పై మూడు ఒకే తరగతికి చెందిన ప్రక్రియలు. కాబట్టి లవణీకరణ భిన్న ప్రక్రియ.

లవణీకరణ :
అనగా సముద్రనీటిలో ఉన్న ఉప్పదనం. ఉప్పు రుచిని చూపిస్తుంది.

ii) అ) ఫలకాలు ఆ) అపకేంద్రబలం ఇ) సౌరశక్తి ఈ) అవపాతం
జవాబు:
అ) భిన్నంగా ఉన్నది ఫలకాలు.
ఫలకాలు రెండవ పాఠ్యాంశానికి చెందిన అంశం.

ఆ) అపకేంద్ర బలం ఇ) సౌరశక్తి ఈ) అవపాతం
ఈ మూడు ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అంశాలు.

AP Board 9th Class Social Solutions Chapter 3 జలావరణం

ప్రశ్న 2.
తప్పు వాక్యాలను సరిచేయండి. (AS1)
అ) సముద్రాలకు దగ్గరగా సముద్రపు అగాధాలు ఉంటాయి.
ఆ) మైదాన ప్రాంతంలో మాదిరిగానే సముద్రాలలోనూ ఉపరితల రూపాలు ఉంటాయి.
ఇ) శతాబ్దాలుగా భూమి మీద నుంచి కొట్టుకురావటం వల్ల సముద్రాలలో, అధికశాత లవణం ఏర్పడింది.
ఈ) ప్రపంచమంతటా మహాసముద్రాల నీళ్ళు ఒకే ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి.
జవాబు:
అ) సముద్రాలకు దగ్గరగా సముద్రపు అగాధాలు ఉంటాయి. ఇది సరైన వాక్యము కాదు.
జవాబు:
సముద్ర అగాధాలు సముద్రపు మధ్య భాగంలో కాకుండా ఖండాలకు దగ్గరగా ఉంటాయి.

ఆ) మైదాన ప్రాంతంలో మాదిరిగానే సముద్రాలలోను ఉపరితల రూపాలు ఉంటాయి.
జవాబు:
ఇది సరైన వాక్యము.

ఇ) శతాబ్దాలుగా భూమి మీద నుంచి కొట్టుకురావటం వల్ల సముద్రాలలో, అధికశాత లవణం ఏర్పడింది.
జవాబు:
ఇది సరైన వాక్యము.

ఈ) ప్రపంచమంతటా మహాసముద్రాల నీళ్ళు ఒకే ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. ఇది సరైన వాక్యము కాదు.
జవాబు:
సముద్రపు లోతుల్లోకి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. మొదటి కిలోమీటరు లోతుకి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయ.

ప్రశ్న 3.
మీరు నివసిస్తున్న ప్రాంతంపై సముద్ర తరంగాలు చూపే ఒక ప్రభావాన్ని వివరించండి. (AS6)
జవాబు:
మన దక్షిణ భారతదేశంపై సముద్ర ప్రవాహాలు నేరుగా కాకుండా పరోక్షంగా ప్రభావాన్ని చూపుతున్నాయి. భూమితో పోలిస్తే సముద్రాల మీద ఉష్ణోగ్రతలలో కొద్దిపాటి తేడాలే ఉంటాయి. ఈ ఉష్ణోగ్రతల తేడాల వల్ల సముద్ర ప్రవాహాలు ఏర్పడుతున్నాయి. ఈ – ఉష్ణోగ్రతలలో తేడాల వల్ల మా ప్రాంతంపై నైరుతి రుతుపవనాలు ప్రభావితమవుతున్నాయి. ఈ ప్రభావం వలన వర్షాలు, తుపానులు మా ప్రాంతంలో వస్తున్నాయి.

ప్రశ్న 4.
భూమిని నీలిగ్రహం అనడం సరైనదేనా? సముద్రాలను ప్రభావితం చేసే మీ చర్యల్లో ఒకదానిని వివరించండి. (AS1)
జవాబు:
భూమిని నీలిగ్రహం అనడం సరైనదే. కారణం ఇప్పటి వరకు నీరు ఉన్న గ్రహం భూమి మాత్రమే. అందువల్ల భూమిని జలయుత గ్రహం అంటారు.

సముద్రాలను ప్రభావితం చేసే మానవచర్యలు :

  1. భూమి మీద మానవుడు అనేక రకాల రసాయనాలను ఉపయోగిస్తున్నాడు. . వీటివలన సముద్రజలం కలుషితం అవుతుంది.
  2. భూమి మీద మానవుడు అనేక రకాల యంత్రాలను ఉపయోగించడం వలన అవి విడుదల చేసే వాయువుల వల్ల వాతావరణం వేడెక్కుతుంది. దానితో ధ్రువాల వద్ద ఉన్న మంచు కరిగి సముద్రాలలోనికి ప్రవేశిస్తుంది.
  3. దానితో సముద్రాల నీటిమట్టం పెరుగుతుంది. భూమి మీద తక్కువ ఎత్తులో ఉన్న దీవులు ముంపునకు గురౌతున్నాయి.

AP Board 9th Class Social Solutions Chapter 3 జలావరణం

ప్రశ్న 5.
సముద్రాల లవణీయతలో వ్యత్యాసాలు ఎందుకు ఉంటాయి? (AS1)
జవాబు:
సముద్రంలోని అధిక శాతం ఉప్పు నేల నుంచే వచ్చింది. లక్షల సంవత్సరాలపాటు సోడియం క్లోరైడ్ మూలకం ఉన్న కొండలపై వర్షంపడి వాగులు, నదులు ప్రవహించి దానిని సముద్రంలోకి చేర్చాయి. మహాసముద్రాలలోని ఉప్పు కొంతవరకు సముద్రపు అగ్ని పర్వతాల నుంచి, జల-ఉష్ణదారుల నుంచి వస్తుంది. సాధారణంగా సముద్రాల లవణీయతలో వ్యత్యాసాలు ఎందుకు ఉంటాయంటే ………………..

  • నీరు ఆవిరి కావటం, అవపాతాలలో తేడాలు వలన
  • తీర ప్రాంతంలో నదుల నుంచి ప్రవహించే మంచినీళ్ళు, ధృవప్రాంతాలలో మంచు గడ్డకట్టటం, కరగటంలో తేడాలు వలన
  • నీటిని ఇతర ప్రాంతాలకు తరలించే గాలుల వలన.
  • సముద్రపు ప్రవాహాలు / తరంగాల వలన వచ్చే తారతమ్యాల వలన లవణీయతలో తేడాలు కానవస్తాయి.

ప్రశ్న 6.
మానవ మనుగడ మహాసముద్రాలతో ఏ విధంగా ముడిపడి ఉంది? (AS6)
(లేదా)
సముద్రాలు మానవ జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి?
జవాబు:
భూమి మీద అధిక శాతం జీవులు నీటిలో ఉన్నాయి. నీటిలో ఉన్న అన్ని జీవాలను గుర్తించే ప్రక్రియను మానవులు ఇంకా పూర్తి చేయలేదు. పురాతన కాలం నుంచి మానవులు తమ ఆహారం కోసం, జీవనోపాధి కోసం సముద్రాలపై ఆధారపడేవారు. అనంతమైన ఉప్పు, మత్స్య సంపదను సముద్రాలు అందిస్తాయి. ఇసుక, గులక రాళ్ళు వంటి వాటిని ఇళ్ళకు, పరిశ్రమలలో ఉపయోగిస్తారు. క్లోరిన్, ఫ్లోరిన్, అయోడిన్ వంటి ఖనిజాలను మానవులు సముగ్రాల నుంచి వెలికి తీస్తున్నారు. సముద్ర అలలతో విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నారు. సముద్రగర్భం నుంచి చమురు వెలికి తీస్తున్నారు. సముద్రం నుంచి ముత్యాలు, రత్నాలు కూడా లభిస్తున్నాయి. శతాబ్దాలుగా సముద్ర తీరాలలో నాగరికతలు వెల్లివిరిశాయి. సముద్రఁ పై ప్రయాణాలు చేస్తూ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఏర్పడ్డాయి.

ప్రశ్న 7.
ఓ నెం. 35లోని పటాన్ని పరిశీలించి, కొన్ని ఉష్ణ, శీతల ప్రవాహాలను రాయండి. (AS5)
AP Board 9th Class Social Solutions Chapter 3 జలావరణం 1
జవాబు:
ఉష్ణప్రవాహాలు

  1. కురోషివో సముద్ర ప్రవాహం
  2. తూర్పు ఆస్ట్రేలియా సముద్ర ప్రవాహం
  3. కరేబియన్ సముద్ర ప్రవాహం
  4. మెక్సికన్ గల్ఫ్ సముద్ర ప్రవాహం
  5. బ్రెజిల్ సముద్ర ప్రవాహం
  6. పాక్ లాండ్ సముద్ర ప్రవాహం
  7. భారతీయ ప్రతి ప్రవాహం
  8. మడగాస్కర్ సముద్ర ప్రవాహం
  9. మెజబిక్ సముద్ర ప్రవాహం

శీతల ప్రవాహాలు

  1. కురైల్ ప్రవాహం
  2. పెరువియన్ సముద్ర ప్రవాహం
  3. లాబ్రడార్ సముద్ర ప్రవాహం
  4. బెంగ్యులా సముద్ర ప్రవాహం
  5. అసలహాన్ సముద్ర ప్రవాహం

AP Board 9th Class Social Solutions Chapter 3 జలావరణం

ప్రశ్న 8.
పేజి నెం. 33, 34లోని ‘వనరులుగా మహాసముద్రాలు’ అంశం చదివి, వాఖ్యానించండి. (AS2)
జవాబు:
మానవ జీవితంలో అతి ప్రధానమైన అంశం వనరులుగా మహాసముద్రాలు. ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అనాదిగా మానవుడు సముద్రాల మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. అతి ప్రధానమైన నాగరికతలన్నీ సముద్ర తీరాలలోనే వెలిశాయి. అతి విలువైన, అతి ఖరీదైన ముత్యాలు, రత్నాలు వంటి అమూల్యమైన వస్తువులకు సముద్రాలే ఆధారం. అతి ప్రధానమైన విద్యుత్ ఉత్పత్తికి సముద్రాలే కారకాలు. పెట్రోలియం వంటి అతి విలువైన ఖనిజ వనరులకు సముద్రాలే కీలకాధారం. మత్స్య సంపదను మన దేశానికే కాకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేసి విదేశీ మారక ద్రవ్యాన్ని సముపార్జించి పెడుతున్నాయి.

అయితే ఇటీవలి కాలంలో సముద్రాలు కూడా కలుషితమౌతూ, దోపిడీకి గురౌవుతున్నాయి. తిమింగలాల వంటి పెద్ద జంతువులు అంతరించిపోతున్నాయి. ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్థాలు సముద్రాలలో పారవేస్తూ వాటిని కలుషితం చేస్తున్నారు.

9th Class Social Studies 3rd Lesson జలావరణం InText Questions and Answers

9th Class Social Textbook Page No.32

ప్రశ్న 1.
బాల్టిక్ సముద్రంలో తక్కువ లవణీయత ఉండటానికి గల కారణాలను పేర్కొనండి.
జవాబు:
బాల్టిక్ సముద్రంలో తక్కువ లవణీయత ఉండటానికి గల కారణాలు :

  1. నదులు వచ్చి ఎక్కువగా కలుస్తాయి.
  2. హిమానీనదాలు కలుస్తాయి.
  3. మంచు కరిగి ఆ నీరు వచ్చి ఎక్కువగా కలుపుంది. 4) నీరు చాలా తక్కువగా ఆవిరి అవుతుంది.
    అందువలన బాల్టిక్ సముద్రంలో తక్కువ లవణీయత ఉంటుంది.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
పసిఫిక్, అట్లాంటిక్ హిందూ మహాసముద్రాలలో కనపడే ప్రవాహాల జాబితా తయారుచేయండి. వివిధ మహాసముద్రాలలోని ఉష్ణ, శీతల ప్రవాహాలను గుర్తించి క్రింది పట్టికలో నమోదు చేయండి.
AP Board 9th Class Social Solutions Chapter 3 జలావరణం 2
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 3 జలావరణం 3

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు

SCERT AP 9th Class Social Studies Guide Pdf 2nd Lesson భూమి – ఆవరణములు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 2nd Lesson భూమి – ఆవరణములు

9th Class Social Studies 2nd Lesson భూమి – ఆవరణములు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
ఖాళీలను పూరించండి. (AS1)
1. జలావరణం …………………………….. సంబంధించినది.
2. శిలావరణం ………………………… సంబంధించినది.
3. వాతావరణం ……………………….. సంబంధించినది.
4. జీవావరణం ……………………….. సంబంధించినది.
జవాబు:

  1. నీటికి
  2. శిలలకు
  3. వాయువులకు
  4. జీవులకు

ప్రశ్న 2.
శిలావరణం నేపథ్యంలో కింద ఇచ్చిన వాటిలో సరిపోనిది ఏమిటి? మీ ఎంపికకు కారణం పేర్కొనండి. (AS1)
‘బైసన్ గార్జ్, గ్రాండ్ కాన్యన్, థార్ ఎడారి
జవాబు:
థార్ ఎడారి శిలావరణం నేపథ్యానికి సరిపోదు.

కారణాలు :
థార్ ఎడారి అంతా ఇసుకతో ఏర్పడినది.
ఇక్కడ ఏ విధమైన రాతి పొరలు భూ ఉపరితల భాగంలో లేవు.
అందువలన ఇది శిలావరణం నేపథ్యానికి సరిపోదు.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు

ప్రశ్న 3.
శిలావరణం ఎలా ఏర్పడింది? (AS1)
జవాబు:

  1. శిలావరణం ఏర్పడిన విధానము : భూమిలో ఘనీభవించిన పొర, లేదా గట్టిగా ఉండే పై పొర ఇది.
  2. దీంట్లో రాళ్ళు, ఖనిజ లవణాలు ఉండి మందపాటి మట్టి పొర ఉంటుంది.
  3. ఈ ఆవరణాన్ని ఇంగ్లీషులో ,లితోస్పియిర్ అంటారు. లితో అంటే గ్రీకు భాషలో రాయి లేదా శిల అని అర్థం.
  4. ‘స్పేయిరా’ గోళం లేదా బంతి అని అర్థం. అనగా ఈ పొర చదునుగా ఉండే ఉపరితలం కాదు.
  5. ఎత్తైన కొండలు, పీఠభూములు, మైదాన ప్రాంతాలు, లోయలు నీటితో నిండిన లోతైన అగాధాలు వంటివి ఉండటం మీరు మ్యాపుల్లో చూసే ఉంటారు.
  6. వీటిల్లో పలు అంశాలు గాలి, నీటి ప్రభావాల వల్ల రూపుదిద్దుకున్నాయి.
  7. ఈ పై పొరలోని కొంత భాగం దుమ్ము వంటి వాటి రూపంలో గాలిలో కలిసి ఉంటుంది.

ప్రశ్న 4.
ఖండ ఫలకాలు ఎలా ఏర్పడ్డాయి? అవి అంతిమంగా ఎలా అంతరించిపోతాయి? (AS1)
జవాబు:

  1. ఎన్నో సంవత్సరాల సునిశిత అధ్యయనం ద్వారా ఖండాలు, మహాసముద్రాలు కూడా “ఫలకాలు” అనే అతి పెద్ద రాళ్ళ మీద ఉన్నాయని శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు.
  2. భూమిలో పెద్ద ఫలకాలు, అనేక చిన్న ఫలకాలు ఉన్నాయి.
    పెద్ద ఫలకాలకు ఉదా : ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఇండో – ఆస్ట్రేలియా, అంటార్కిటిక్, యూరేసియా, పసిఫిక్. చిన్న ఫలకాలకు ఉదా : నాజ్ కా, అరేబియా వంటివి.
  3. ఈ ఫలకాలు వాస్తవంగా మధ్య పొరమీద తేలుతూ ఉంటాయి. ఇవి నిరంతరం నెట్టబడుతూ ఉంటాయి.
  4. అందువల్ల అవి మెల్లగా కదులుతూ ఉంటాయి.
  5. అవి చాలా నిదానంగా కదులుతూ ఉంటాయి. కాబట్టి వాటి కదలిక మనకు తెలియదు.
  6. ఈ కదలిక ఫలితంగా ఒక ఫలకం పక్కనున్న మరొక ఫలకాన్ని నెడుతూ ఉంటుంది.
  7. రెండు ఫలకాలు కలిసే చోట ఒకదానినొకటి నెట్టుకుంటాయి. ఒక దాని మీద మరొకటి ఎంతో ఒత్తిడి చూపుతుంది.
  8. ఒక ఫలకం కిందికి మధ్య పొరలోకి వెళితే మరొక ఫలకం పైకి నెట్టబడి పర్వత శ్రేణులు ఏర్పడతాయి.
  9. ఈ ఫలకాల కదలికను ఫలక చలనాలు అంటారు. ఈ ప్రక్రియ వల్ల భూకంపాలు వంటివి సంభవిస్తాయి.

ప్రశ్న 5.
నదీ ప్రభావం వల్ల ఏర్పడే భూస్వరూపాలను పేర్కొనండి. (AS1)
జవాబు:
నదీ ప్రభావం వల్ల ఏర్పడే భూస్వరూపాలు :

  1. ఎత్తైన కొండలలో నది పుట్టిన చోటు నుంచే దాని ప్రభావం మొదలవుతుంది.
  2. వాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నదీ ప్రవాహం వేగంగా ఉండి కొండను నిలువుగా కోతకు గురిచేస్తుంది.
  3. దీని ఫలితంగా లోతైన లోయ ఏర్పడుతుంది. ఇది కింద సన్నగా పైగా వెడల్పుగా ఉంటుంది. దీనిని సాధారణంగా “V” ఆకారపు లోయ అంటారు.
  4. రాళ్ళు చాలా గట్టిగా ఉన్న ప్రాంతాలలో నది తన ప్రవాహ మార్గాన్ని సన్నటి, లోతైన లోయగా కోస్తుంది.
  5. దీని అంచులు నిటారుగా ఉంటాయి. వీటిని “గార్జెస్” అంటారు.
  6. మరొక ముఖ్యమైన రూపాన్ని ‘అగాధదరి అంటారు. దీనిలో నది అంచులు తీవ్ర వాలుతో చాలా లోతుకు కోతకు గురవుతాయి. అగాధదరిలో కింద కంటే పై భాగం ఎక్కువ వెడల్పుగా ఉంటుంది.
  7. వాలులో తేడాలు బాగా ఎక్కువగా ఉండే పర్వత ప్రాంతాలలో జలపాతాలు అధిక సంఖ్యలో ఉంటాయి.
  8. జలపాతంలో నీళ్లు ఎంతో శక్తితో కిందకు పడతాయి. ఆ నీళ్లు కిందపడే చోట “దుముకు మడుగు” ఏర్పడుతుంది.
  9. నదికి వరదలు వచ్చినపుడు అది నేలను కోతకు గురిచేస్తుంది. వరద తగ్గుముఖం పట్టినపుడు కోసిన మట్టిని వేరేచోట మేట వేస్తుంది. దీనిని “ఒండ్రు” అంటారు.
  10. మెలిక తిరిగిన భాగం నది నుంచి తెగిపోయి ఒక చెరువులాగా ఏర్పడుతుంది. ఇటువంటి వాటిని ‘ఆక్స్ బౌ సరస్సు’ అంటారు.
  11. సముద్రాన్ని నది చేరుకున్నప్పుడు దాంట్లో మేటవేయని రేణువులు ఉంటే అవి నదీ ముఖంలో మేట వేయబడి డెల్టా ప్రాంతం ఏర్పడుతుంది.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు

ప్రశ్న 6.
కింద పేర్కొన్న విధంగా పట్టిక తయారుచేసి సమాచారాన్ని నింపండి. భూమి బయటి మార్పుల నేపథ్యంలో మీకు కనిపించే తేడాలు, పోలికలను వివరించడానికి ఒక పేరా రాయండి. (AS3)
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు 1

ప్రశ్న 7.
మీ పరిసరాల్లో హిమానీనదాలు ఎందుకు కనిపించవు? (AS1)
జవాబు:

  1. హిమాలయాలు, ఆల్బ్ వంటి బాగా చలిగా ఉండే ప్రాంతాలలో మంచు బాగా కురుస్తుంది.
  2. అక్కడ వర్షానికి బదులు మంచు కురుస్తుంది.
  3. మంచు పోగుబడి గడ్డగా మారుతుంది.
  4. అలా పోగుపడుతున్న క్రమంలో అది కింది వైపు మెల్లగా కదలటం మొదలు పెడుతుంది.
  5. అలా ప్రయాణించి కొంచెం వెచ్చగా ఉండే ప్రాంతాన్ని చేరుకునే సరికి మంచు కరిగి చిన్న నది మొదలవుతుంది.
  6. హిమాలయాలలోని గంగోత్రి హిమానీనదం నుంచి గంగానది ఈ విధంగానే ఏర్పడుతుంది.
  7. మా పరిసరాల్లో హిమానీనదాలు ఎందుకు లేవు అనగా ఇక్కడ హిమాలయాలు, ఆల్బ్ వంటి బాగా చలిగా ఉండే ప్రాంతాలు లేవు.
  8. అందువలన మా ప్రాంతాల్లో హిమానీనదాలు లేవు.

ప్రశ్న 8.
బీలు ఎలా ఏర్పడతాయి? కొన్ని బీచ్ పేర్లు రాయండి.
జవాబు:
సముద్ర అలలు తీరం వెంట మేటవేసే పదార్థాల వల్ల బీచ్లు ఏర్పడతాయి.
ఉదా: విశాఖపట్టణంలోని రామకృష్ణ బీచ్
మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్
చెన్నైలోని మెరీనా బీచ్

ప్రశ్న 9.
ఏడారుల విస్తరణకు మానవ జీవన విధానం ఏ విధంగా కారణమౌతున్నది?
జవాబు:
ఏడారుల విస్తరణకు మానవ జీవన విధానం ప్రధాన కారణం
కారణాలు :

  1. పారిశ్రామిక విప్లవం తరువాత పరిశ్రమల స్థాపన సంఖ్య పెరిగింది.
  2. పరిశ్రమల నుండి విడుదలయ్యే కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువుల వల్ల వాతావరణం వేడెక్కుతుంది.
  3. అలాగే మానవుని రవాణా సాధనాల సంఖ్య, మోటారు వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది.
  4. దీంతో ఈ రవాణా సాధనాలు విడుదల చేసే కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువుల వల్ల వాతావరణం వేడెక్కుతుంది.
  5. అలాగే మానవుని విలాస జీవితానికి ఆలవాలమైన రిఫ్రిజిరేటర్లు, కూలర్లు, ఎయిర్ కండిషన్స్ సంఖ్య నానాటికి పెరుగుతుండడంతో అవి విడుదలచేసే వాయువుల వల్ల కూడా వాతావరణం వేడెక్కుతుంది.

ఈ విధంగా వాతావరణం వేడెక్కడం వల్ల వర్షపాతం తగ్గిపోతుంది. వర్షపాతం తగ్గిపోవడం వల్ల భూ ఉపరితలం ఎడారిగా మారిపోతుంది. కావున ఎడారుల విస్తరణకు మానవ జీవన విధానం ప్రధాన కారణం.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు

ప్రశ్న 10.
ఇవి ఏ శ్రేణి భూస్వరూపాలలో తెలియజేయండి. (AS1)
జవాబు:

భూ స్వరూపంభూస్వరూప శ్రేణి
1. హిమాలయ పర్వతాలురెండవ శ్రేణి భూస్వరూపం
2. పసిఫిక్ మహాసముద్రంమొదటి శ్రేణి భూస్వరూపం
3. ఆసియా ఖండంమొదటి శ్రేణి భూస్వరూపం
4. బైసన్ గార్జ్మూడవ శ్రేణి భూస్వరూపం
5. జోగ్ జలపాతంమూడవ శ్రేణి భూస్వరూపం
6. రాఖీ పర్వతాలురెండవ శ్రేణి భూస్వరూపం
7. హిందూ మహాసముద్రంమొదటి శ్రేణి భూస్వరూపం
8. గొప్ప విధీర్ణధరిమూడవ శ్రేణి భూస్వరూపం

ప్రశ్న 11.
పటం – 2ను చూసి ప్రపంచ పలకలను గీయండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు 2

ప్రశ్న 12.
ఓ నెం. 20 లోని (ప్రవహిస్తున్న …….. క్రమక్షయం అని అంటారు) క్రమక్షయం పేరాను చదివి వాఖ్యానించండి. (AS2)
జవాబు:
ప్రవహిస్తున్న నీటికి, గాలికి ఎంతో శక్తి ఉంటుంది. అది రాళ్ళను నిదానంగా కరిగించి వేస్తుంది. మట్టి పై పొరలను తొలగించివేస్తుంది. వాన, నది, ప్రవహిస్తున్న భూగర్భజలం, సముద్ర అలలు, హిమానీ నదులు వంటి అనేక రూపాలలో నీళ్ళు ప్రభావం చూపుతాయి. గాలి కూడా స్థిరమైన గాలులు, ఈదురు గాలులు, తుపాను గాలులు వంటి అనేకరూపాలను తీసుకుంటుంది. గాలి, నీటి శక్తుల కారణంగా భూమి ఉపరితలం పై పొరలు కొట్టుకుపోవడాన్ని క్రమక్షయం అని అంటారు.

9th Class Social Studies 2nd Lesson భూమి – ఆవరణములు InText Questions and Answers

9th Class Social Textbook Page No.14

ప్రశ్న 1.
బెరైటీస్, బొగ్గు వంటి ఖనిజాల తవ్వకం గురించి మీరు చదివారు. ఇది శిలావరణాన్ని, జలావరణాన్ని, వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
జవాబు:
శిలావరణాన్ని ప్రభావితం చేసే విషయం :
శిలలను కూడా ధ్వంసం చేసి బెరైటీస్, బొగ్గు వంటి ఖనిజాలను వెలికి తీస్తున్నారు.

జలావరణాన్ని ప్రభావితం చేసే విషయం :
బొగ్గు వలన జలావరణం కలుషితం అవుతుంది. జలావరణం వలన బెరైటీస్ గనులు దెబ్బతింటున్నాయి.

వాతావరణాన్ని ప్రభావితం చేసే విషయం :
బొగ్గు, బెరైటీస్ వలన వాతావరణం కలుషితం అవుతుంది.

ప్రశ్న 2.
రోగాలు నయం చేయడానికి మనుషులు అధిక సంఖ్యలో యాంటిబయాటిక్ మందులు తీసుకుంటున్నారు. ఇది శిలావరణాన్ని, జలావరణాన్ని, వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
జవాబు:

  1. మనుషులు అధిక సంఖ్యలో తీసుకునే యాంటిబయాటిక్ మందులు తయారుచేసే ఫ్యాక్టరీలు వివిధ రకాల రసాయనాలను విడుదల చేస్తాయి.
  2. ఈ రసాయనాల వలన శిలావరణం, జలావరణం, వాతావరణాల సమతుల్యత దెబ్బతింటుంది.
  3. మనుషులు వీటిని అధికంగా వాడటం వలన కొన్ని సూక్ష్మజీవులు, వైరస్లు నశించిపోతాయి. మరికొన్ని వాతావరణంలోనికి విడుదల చేయబడతాయి. తద్వారా భూమ్యావరణములు కలుషితమవుతాయి.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు

ప్రశ్న 3.
అనేక శాస్త్రీయ పదాల మూలాలు గ్రీకు భాషలో ఉండటం మీరు గమనించి ఉంటారు. ఇలా ఎందుకు ఉంది? మీ టీచరుతో చర్చించండి.
జవాబు:
శాస్త్ర, సాంకేతిక రంగాలకు మూలం గ్రీకు నాగరికత. గ్రీకు భాష కూడా ప్రాచీనమైనది. గ్రీకు తత్త్వవేత్తలు ఆయా ఆంశాలను గురించి వివరించి చెప్పడమే గాక ప్రయోగ పూర్వకంగా ఋజువు చేయడానికి ప్రయత్నించారు. అందువలన ప్రాచీన పదాలు ఎక్కువగా గ్రీకు భాష నుండి ఉద్భవించాయి.

9th Class Social Textbook Page No.15

ప్రశ్న 4.
వాన ఎలా పడుతుంది?
జవాబు:
భూమి ఉపరితలంపై ఉన్న నీరు ఆవిరై మేఘంగా ఏర్పడి, ఆ మేఘాలు చల్లదనానికి నీటిని నిల్వ ఉంచుకోక వర్షం రూపంలో భూమిపైకి మరల నీటిని వదులుతాయి. ఆ విధంగా వర్షం కురుస్తుంది.

ప్రశ్న 5.
డెల్టాలు ఎలా ఏర్పడతాయి?
జవాబు:
సముద్రాన్ని నది చేరుకున్నప్పుడు దాంట్లో మేటవేయని రేణువులు ఉంటే అవి నదీ ముఖంలో మేటవేయబడి డెల్టా ప్రాంతం ఏర్పడుతుంది. ఈ ప్రాంతం గ్రీకు అక్షరం డెల్టా (A) రూపంలో ఉంటుంది. కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు

ప్రశ్న 6.
భూకంపాలు, అగ్నిపర్వతాలు ఎలా సంభవిస్తాయి?
జవాబు:
భూకంపాలు సంభవించే విధానం :

  1. భూమికి సంబంధించి ఫలకాలు వాస్తవంగా మధ్య పొర మీద తేలుతూ ఉంటాయి.
  2. ఇవి నిరంతరం నెట్టబడుతూ ఉంటాయి. అందుకే అవి మెల్లగా కదులుతూ ఉంటాయి.
  3. అవి చాలా నిదానంగా కదులుతూ ఉంటాయి. కాబట్టి వాటి కదలిక మనకు తెలియదు.
  4. ఈ కదలిక ఫలితంగా ఒక ఫలకం పక్కనున్న మరొక ఫలకాన్ని నెడుతూ ఉంటుంది.
  5. రెండు ఫలకాలు కలిసేచోట ఒకదానినొకటి నెట్టుకుంటాయి.
  6. ఒక దాని మీద మరొకటి ఎంతో ఒత్తిడి చూపుతుంది.
  7. ఒక ఫలకం కిందికి మధ్య పొరలోకి వెళితే మరొక ఫలకం పైకి నెట్టబడి పర్వత శ్రేణులు ఏర్పడతాయి.
  8. ఈ ఫలకాల కదలికను ఫలక చలనాలు అంటారు. ఈ ప్రక్రియ వల్ల భూకంపాలు వంటివి సంభవిస్తాయి.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు 3
అగ్నిపర్వతాలు సంభవించే విధానం :
భూ గర్భంలోని శిలాద్రవం అనుకూల పరిస్థితులలో గొట్టం వలె ఉండే భాగాల నుండి బయటకు వస్తుంది. బయటికి ప్రవహించిన శిలాద్రవం ముఖద్వారం చుట్టూ ఘనీభవించి ఒక శంఖాకార పర్వత నిర్మాణంగా ఏర్పడుతుంది. దీనినే అగ్ని పర్వతం అంటారు.

ప్రశ్న 7.
కొండలు ఎందుకు ఉన్నాయి?
జవాబు:
ఒక ఫలకను ఇంకొక ఫలక నెట్టడం వలన కొండలు ఏర్పడుతున్నాయి.

ప్రశ్న 8.
నదుల వెంట లోయలు, అగాధాలు వంటివి ఎందుకు ఉన్నాయి?
జవాబు:

  1. వాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో నదీ ప్రవాహం వేగంగా ఉండి కొండను నిలువుగా కోతకు గురిచేస్తుంది. దీని ఫలితంగా లోతైన లోయ ఏర్పడుతుంది. అందువల్ల నదుల వెంట లోయలు ఏర్పడతాయి.
  2. రాళ్ళు చాలా గట్టిగా ఉన్న ప్రాంతాలలో నది తన ప్రవాహ మార్గాన్ని సన్నటి లోతైన లోయగా కోస్తుంది. దీని అంచులు నిటారుగా ఉంటాయి. అగాధాలలో పైన ఎక్కువ వెడల్పుగాను, కింద భాగం సన్నగాను ఉంటాయి. అందువల్ల అగాధాలు వంటివి కూడా నదుల వెంట ఉంటాయి.

ప్రశ్న 9.
గాలులు ఎలా వీస్తాయి?
జవాబు:
గాలులు ఎల్లప్పుడు అధిక పీడన ప్రాంతం నుండి అల్ప పీడన ప్రాంతం వైపు వీస్తాయి.

9th Class Social Textbook Page No.17

ప్రశ్న 10.
హిమాలయ, ఆండిస్, రాకీ పర్వత శ్రేణులను పటం మీద గుర్తించండి. అవి అక్కడే ఎందుకు ఏర్పడ్డాయి? కారణాలు సూచించండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు 4
1. హిమాలయాలు ఏర్పడటానికి కారణం :
యూరేసియా ఫలకాన్ని ఇండియా ఫలకం నెట్టటం వల్లనే హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు 5
2. అండీస్ పర్వతాలు ఏర్పడటానికి కారణం :
దక్షిణ అమెరికా ఫలకాన్ని ఇండో- ఆస్ట్రేలియా ఫలకం నెట్టటం వల్లనే ఆండీస్ పర్వతాలు ఏర్పడ్డాయి.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు 6
3. రాకీ పర్వతాలు ఏర్పడటానికి కారణం :
ఉత్తర అమెరికా ఫలకాన్ని యూరేసియా ఫలకం నెట్టటం వల్లనే రాకీ పర్వతాలు ఏర్పడ్డాయి.

ప్రశ్న 11.
భూమి మీద శిలలు అన్నీ మహాసముద్ర మధ్యమిట్ట ప్రాంతంలోనే ఏర్పడ్డాయా?
జవాబు:
భూమి మీద గుట్టలన్నీ మహసముద్ర మధ్యమిట్ట ప్రాంతంలోనే ఏర్పడ్డాయి.

  1. సముద్రాలలోని భూమి పై పొరను అధ్యయనం చేస్తున్న భూ శాస్త్రజ్ఞులు పసిఫిక్ మహాసముద్రం వంటి కొన్ని మహా సముద్రాలలోని, మధ్య భాగంలో మిట్టలు, పర్వత శ్రేణులు ఉన్నాయని కనుగొన్నారు.
  2. మధ్య పొరల నుంచి పైకి లేచే లావా వల్ల ఇవి ఏర్పడుతున్నాయి.
  3. మిట్టప్రాంతంలో నేలపైకి నెట్టబడి బీటలు వారటం వల్ల బసాల్ట్ రాళ్ళతో కూడిన సముద్రపు కొత్తనేల తయారవుతుంది.
  4. ఆ తరువాత ఇది మిట్టనుంచి రెండు వైపులా పక్కలకు విస్తరిస్తుంది. అంటే మన భూమి మీద మహాసముద్ర మధ్య ప్రాంతంలోని మిట్టలలో అత్యంత తాజాగా ఏర్పడిన పై పొర ఉంటుంది.

ప్రశ్న 12.
భూగర్భవేత్తలు హిమాలయాల్లో సముద్ర జీవుల శిలాజాలను కనుగొన్నారు. వీటిల్లో చాలా వాటిని ‘సాలగ్రామాలు’ (శివలింగాకారంలో) గా ఇళ్లల్లో పూజిస్తారు. ఈ శిలాజాలు హిమాలయాల్లో ఎందుకు ఉన్నాయి?
జవాబు:

  1. ఖండఫలకాలు జరిగేటప్పుడు ఖండాల అంచులలో ఉన్న శిలాద్రవం పైకి వచ్చి పర్వతాలు ఏర్పడతాయి.
  2. హిమాలయాలు ప్రపంచంలో నూతన ముడుత పర్వతాలు.
  3. యురేసియా ఫలకాన్ని ఇండియా ఫలకం నెట్టడం వల్లనే హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి.
  4. కనుక సముద్ర జీవుల శిలాజాలు నూతనంగా ఏర్పడిన హిమాలయాల్లోనే ఉన్నాయి.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు

ప్రశ్న 13.
భూమి మీద జరుగుతున్న ఇటువంటి పెనుమార్పులు మన అనుభవంలోకి ఎందుకు రావటం లేదు? అవి మనల్ని ప్రభావితం చేయకపోవడంవల్లనా? ఈ మార్పులు అసలు మనల్ని ఏరకంగానైనా ప్రభావితం చేస్తాయా?
జవాబు:
భూమి మీద జరుగుతున్న ఇటువంటి పెనుమార్పులు కొన్ని వందల, వేల సంవత్సరాలకు జరుగుతుంటాయి. అప్పటికి మానవుల జీవిత కాలం చాలదు. అందువల్ల అవి మన అనుభవంలోకి రావడం లేదు. అవి మనల్ని ప్రభావితం చేయటం లేదు. ఈ మార్పులు మనల్ని మన తరువాత తరాల్ని అనేక రకాలుగా ప్రభావితం చేస్తాయి. జీవన విధానాన్ని మార్చివేస్తాయి.

9th Class Social Textbook Page No.19

ప్రశ్న 14.
అగ్నిపర్వతం పేలుడు వల్ల ఆ ప్రాంతంలో సంభవించే నష్టాలను ఊహించి రాయండి.
జవాబు:
అగ్నిపర్వతాలు పేలడం వల్ల ఆ ప్రాంతంలో సంభవించే నష్టాలు :

  1. అగ్ని పర్వతాలు పేలడం వల్ల సమీప ప్రాంతాలలో కూడా ధన, ప్రాణ నష్టాలు సంభవిస్తాయి.
  2. పంటలు నాశనమౌతాయి, జలాలు కలుషితమౌతాయి.
  3. బూడిద, అనేక రకాల వాయువులు, ధూళితో వాతావరణం కలుషితమవుతుంది.

9th Class Social Textbook Page No.20

ప్రశ్న 15.
శిలలోని అంతర్భాగం బయటిభాగం కంటే ఎందుకు కఠినంగా ఉంటుంది?
జవాబు:
శిలలోని అంతర్భాగం బయటిభాగం కంటే కఠినంగా ఉండటానికి గల కారణాలు :

  1. రాళ్ళు వేడెక్కినప్పుడు వ్యాకోచిస్తాయి. చల్లబడినప్పుడు సంకోచిస్తాయి.
  2. ఇది ప్రతి పగలూ, రాత్రి, వేసవి, శీతా కాలాల్లో సంవత్సరాల తరబడి జరుగుతూ ఉంటుంది.
  3. పైన ఉన్న రాళ్ళు సంకోచించి, వ్యాకోచించి తిరిగి సంకోచిస్తూ ఉండటం వల్ల అవి పెళుసుగా మారి ముక్కలవుతాయి.
  4. నీళ్ళు, గాలిలోని తేమ కూడా ఈ ప్రక్రియకు దోహదం చేస్తుంది.
  5. అందువలన అంతర్భాగం గట్టిగా ఉంటుంది.

9th Class Social Textbook Page No.21

ప్రశ్న 16.
ఆనకట్టలు కట్టటానికి గార్జెస్ అనువుగా ఉంటాయి. ఎందుకో చెప్పండి.
జవాబు:

  1. రాళ్ళు (శిలలు) చాలా గట్టిగా ఉన్న ప్రాంతాలలో నది తన ప్రవాహ మార్గాన్ని సన్నటి, లోతైన లోయగా కోస్తుంది. దీని అంచులు నిటారుగా ఉంటాయి. వీటిని గార్జెస్ అంటారు.
  2. గార్జెస్ వద్ద ఆనకట్టలు కట్టడానికి అనుకూలంగా ఉంటుంది. కారణం
  3. నదులు సన్నగా ఉంటాయి.
  4. రెండు వైపులా నిటారుగా రాళ్ళు ఉంటాయి. ఇవి కోతకు గురికాకుండా ఆనకట్టలు ఉంటాయి.
  5. అందువల్ల ఇవి ఆనకట్టలు నిర్మించడానికి అనుకూలంగా ఉంటాయి.

9th Class Social Textbook Page No.22

ప్రశ్న 17.
జలపాతాలు ఎలా ఉపయోగపడతాయో వివరించండి.
జవాబు:

  1. వినోద పర్యటనానికి ఉపయోగపడతాయి.
  2. జలవిద్యుత్ ప్రాజెక్టులు నిర్మించడానికి అనువుగా ఉంటాయి.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు

ప్రశ్న 18.
మన రాష్ట్రంలోని జలపాతాల వివరాలు సేకరించండి.
జవాబు:

  1. విశాఖపట్టణం జిల్లాలోని రణజిల్లెడ జలపాతం.
  2. గుంటూరు జిల్లాలోని మాచర్ల వద్ద ఎత్తిపోతల జలపాతం.

ప్రశ్న 19.
కొన్ని జలపాతాల చిత్రాలు సేకరించండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు 7
AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు 8

9th Class Social Textbook Page No.23

ప్రశ్న 20.
పర్వత, మైదాన ప్రాంతాలలో నదీ ప్రవాహంలోని పోలికలు, తేడాలు పేర్కొనండి. ఈ రెండింటి మధ్య సంబంధం ఏమిటి?
జవాబు:
పర్వత ప్రాంతాలు :

  1. వాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నదీ ప్రవాహం వేగంగా ఉండి కొండను నిలువుగా కోతకు గురిచేస్తుంది.
  2. ‘V’ ఆకారపు లోయలను ఏర్పరుస్తాయి.
  3. రాళ్ళు చాలా గట్టిగా ఉన్న ప్రాంతాలలో నది తన ప్రవాహ మార్గాన్ని సన్నటి లోతైన లోయగా కోస్తుంది. వీటిని గార్డెన్ అంటారు.
  4. వాలులో తేడాలు బాగా ఎక్కువగా ఉండే పర్వత ప్రాంతాలలో జలపాతాలు అధిక సంఖ్యలో ఉంటాయి.

మైదాన ప్రాంతాలు :

  1. మైదాన ప్రాంతంలో వాలు చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి నదీ ప్రవాహ వేగం తగ్గుతుంది.
  2. అప్పుడు బరువైన రేణువులను తీసుకువెళ్ళే శక్తి నదికి ఉండదు.
  3. నదికి వరదలు వచ్చినపుడు అది నేలను కోతకు గురిచేస్తుంది.
  4. వరద తగ్గుముఖం పట్టినపుడు కోసిన మట్టిని వేరేచోట మేట వేస్తుంది.
  5. మైదాన ప్రాంతాలలో నది తరచూ తన ప్రవాహ దారిని మారుస్తూ ఉంటుంది.
  6. మైదాన ప్రాంతాలలో నదులు డెల్టాలను ఏర్పరచుతాయి.

రెండింటి మధ్య సంబంధం :

  1. కొండలలో పడిన వర్షపు నీరు నదులలో ప్రవహించి మైదాన ప్రాంతాలలో డెల్టాలను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది.
  2. కొండల ప్రాంతంలో నదీప్రవాహ వేగం ఎక్కువగా ఉండటం వలన సారవంతమైన పై పొర కొట్టుకు వచ్చి మైదాన ప్రాంతాలలో నదీ ప్రవాహ వేగం తక్కువగా ఉంటుంది కాబట్టి దానిని అక్కడ మేట వేయగలదు.
  3. దాని వలన సారవంతమైన మైదానాలు ఏర్పడి తద్వారా పంటలు బాగా పండటానికి అవకాశం ఉంటుంది.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు

ప్రశ్న 21.
పర్వత ప్రాంతాలతో పోలిస్తే వరద మైదానాలు మానవ ఆవాసానికి ఎందుకు అనువుగా ఉంటాయి?
జవాబు:

  1. కొండ ప్రాంతాలు ఎత్తైన ప్రాంతాలు. ఇవి మానవ నివాసానికి అనువైన ప్రాంతాలు కావు.
  2. ఇవి ఎగుడు దిగుడు స్థలాకృతులను కలిగి ఉంటాయి.
  3. అందువలన వ్యవసాయం చేయడానికి, పంటలు.పండించడానికి అనువైనవి కావు.
  4. శిలా నిర్మితమై ఉంటుంది. కాబట్టి మొక్కలు నాటటానికి అనుకూలంగా ఉండవు.
  5. అదే వరద మైదానాలు అయితే బల్లపరుపుగా ఉంటాయి.
  6. విశాలంగా ఉంటాయి. నీటిని నిలువ చేసుకోడానికి అనుకూలంగా ఉంటాయి.
  7. సారవంతమైన నేలలు ఉంటాయి.
  8. పంటలు సమృద్ధిగా పండుతాయి.
  9. ఇళ్లు నిర్మించడానికి అనుకూలంగా ఉంటాయి. నివాస యోగ్యాలుగా ఉంటాయి. కనుక ప్రజలు కొండ ప్రాంతాల్లో కన్నా మైదాన ప్రాంతాలలోనే ఎక్కువగా నివసిస్తారు.

ప్రశ్న 22.
వరద మైదానాలలో ఉండటంలోని ప్రమాదాలు ఏమిటి?
జవాబు:
వరద మైదానాలలో ఉండటంలోని ప్రమాదాలు :

  1. తరచుగా వరదలు వస్తాయి.
  2. పంటలు పాడైపోతాయి.
  3. ఒక్కొక్కసారి చెట్లు, ఇళ్లు కూలిపోతాయి.
  4. జంతువులు, వస్తువులు కొట్టుకుపోతాయి.
  5. ప్రాణనష్టం, ఆస్తినష్టం జరుగుతుంది.
  6. కనుక వరద మైదానాలలో ఉండటం వలన పై ప్రమాదాలు ఎదురవుతాయి.

ప్రశ్న 23.
కొండ లేదా వరద మైదానాల్లో నివసిస్తున్న ప్రజల గురించి మీరు చదివిన దానిని గుర్తుకు తెచ్చుకోండి.
జవాబు:

  1. కొండ ప్రాంతాలలో గిరిజనులు, ఆదిమ వాసులు నివసిస్తారు.
  2. వారికి అంతగా నాగరికత తెలియదు.
  3. ఇప్పుడిప్పుడే పోడు వ్యవసాయం చేస్తున్నారు.
  4. అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తారు.
  5. రవాణా సౌకర్యాలను కల్పించడం కష్టంతో కూడుకున్న పని.
  6. మైదాన ప్రాంతాలలో నాగరీకులు నివసిస్తారు.
  7. అధునాతన, వ్యవసాయ పరికరాలను ఉపయోగించి వ్యవసాయం చేస్తారు.
  8. అధిక దిగుబడులను సాధిస్తారు.
  9. అధునాతన రవాణా సౌకర్యాలను సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చు.
  10. పరిశ్రమలను స్థాపించవచ్చు. పారిశ్రామిక ఉత్పత్తులను ఉత్పత్తి చేయవచ్చు.

9th Class Social Textbook Page No.25

ప్రశ్న 24.
లోయస్ మైదానాలను డెల్టాతో పోల్చండి. వాటి మధ్య పోలికలు తేడాలు ఏమిటి?
జవాబు:
లోయస్ మైదానాలు:

  1. మెత్తగా ఉండే దుమ్ము ఎడారులను దాటి, కొట్టుకెళ్ళి పక్క భూముల మీద పడుతుంది. ఇటువంటి నేలను ”లోయస్” అంటారు.
  2. ఇది చక్కటి ఒండ్రు. దీంట్లో సున్నం చాలా ఎక్కువగా ఉంటుంది.
  3. రేణువులు ఒకదానితో ఒకటి అతుక్కుని ఉండి అదే సమయంలో దానికి నీళ్లు బాగా ఇంకిపోయే గుణముంటుంది.
  4. లోయస్ మేటతో ఏర్పడిన మైదానాలను లోయస్ మైదానాలు అంటారు.

డెల్టాలు :
1. సముద్రాన్ని నది చేరుకునేటప్పుడు దాంట్లో మేట వేయని రేణువులు ఉంటే అవి నదీ ముఖంలో మేట వేయబడి డెల్టా ప్రాంతం ఏర్పడుతుంది.

ఈ ప్రాంతం గ్రీకు అక్షరం డెల్టా (∆) రూపంలో ఉంటుంది. కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది.

పోలికలు :

  1. రెండూ ఇసుక రేణువులతో ఏర్పడినవే.
  2. రెండింటిలోనూ నీరు త్వరగా ఇంకిపోతుంది.
  3. రెండింటిలోనూ ఒండ్రు ఉంటుంది.

తేడాలు :

లోయస్ మైదానాలుడెల్టా
1. లోయస్ దుమ్ముతో ఏర్పడినది.1. డెల్టా నదులు తీసుకొచ్చిన ఒండ్రుతో ఏర్పడినది.
2. లోయలో సున్నం ఉంటుంది.2. డెల్టాలలో గవ్వల రూపంలో సున్నం ఉంటుంది.
3. లోయలో నీరు ఎక్కువగా ఇంకిపోతుంది.3. డెల్టాలలో నీరు ఎక్కువగా ఇంకిపోదు. నదులు ఎల్లప్పుడు ప్రవహిస్తూ ఉంటాయి. కాబట్టి నీరు ఎక్కువగా ఉంటుంది.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు

ప్రాజెక్టు

ప్రశ్న 1.
వివిధ వార్తాపత్రికలు, మ్యాగజైన్స్ ద్వారా భూకంపాలు, అగ్ని పర్వతాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఒక క్రమంలో అమర్చండి. ఇవి ఏ విధంగా ఏర్పడతాయి? మానవ జీవనాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి?
జవాబు:
అగ్ని పర్వతాలు ఎలా ఏర్పడతాయి అనగా :

  1. భూమి లోపలికి పోయేకొలది ప్రతి 32 మీటర్లకు 1°C ఉష్ణోగ్రత పెరుగుతుంది.
  2. అందువల్ల భూమిలోపల కొన్ని ప్రదేశాలలో శిలలు కరిగిపోయి శిలాద్రవంగా (మాగ్మా) గా మారతాయి.
  3. ఈ మాగ్మా పైన కార్బన్ డై ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్ లాంటి వాయువులు ఉత్పత్తి అయి యుగ్మాను ఒత్తిడి చేసినందున మాగ్మా బలహీనంగా ఉన్న భూ పొరలను చీల్చుకుంటూ ఒక రంధ్రం చేస్తూ బయటపడి శంఖువు ఆకారంలో ఘనీభవించి అగ్ని పర్వతాలు ఏర్పడతాయి.

మానవ జీవనాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి. అనగా

  1. అగ్ని పర్వతాలు ఉద్భేదనము చెందిన ప్రాంతాలలోనూ సమీప పరిసర ప్రాంతాలలో కూడ ధన, ప్రాణ నష్టాలు సంభవిస్తాయని మనందరకూ తెలుసు.
  2. అయితే ఆ తరువాత ఎంతోకాలంపాటు ఈ అగ్నిపర్వతాలు ఉద్భేదనము ఫలితంగా మానవ జాతి అనేక విధాలుగా లాభం పొందుతుంది.
  3. ఈ ఉద్భేదనము ఫలితముగా భూమి లోతుల నుండే విలువైన ఖనిజాలు భూమి ఉపరితలానికి దగ్గరగా తీసుకుని రాబడతాయి.
  4. ఈ ప్రదేశాలలో సారవంతమైన నేలలు ఏర్పడతాయి.
    ఉదా : భారతదేశంలోని డెక్కన్ ట్రాప్స్ ప్రాంతంలో ఏర్పడిన నల్లరేగడి నేలలు నూనెగింజలు, ప్రత్తి మొదలైన వాణిజ్య పంటలకు నిలయాలుగా ఉన్నాయి.

AP Board 9th Class Social Solutions Chapter 1 భూమి – మనం

SCERT AP 9th Class Social Studies Guide Pdf 1st Lesson భూమి – మనం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 1st Lesson భూమి – మనం

9th Class Social Studies 1st Lesson భూమి – మనం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
అట్లాస్ లో భారతదేశ పటాన్ని చూసి కింది ప్రదేశాల అక్షాంశ, రేఖాంశాలను గుర్తించండి. (AS5)
1. కన్యాకుమారి : ……………………., ………………………….
2. ఇంఫాల్ ……………………….., ……………………………
3. జైసల్మేర్ ……………………………, …………………………
4. పూనా ……………………………., …………………………
5. పాట్నా ……………………………, ………………………….
జవాబు:
1. 8°35′ ఉత్తర అక్షాంశం, 77°36′ తూర్పు రేఖాంశం.
2. 24°44′ ఉత్తర అక్షాంశం, 93°58′ తూర్పు రేఖాంశం.
3. 26° 55′ ఉత్తర అక్షాంశం, 70° 54′ తూర్పు రేఖాంశం.
4. 18°32′ ఉత్తర అక్షాంశం, 73°52′ తూర్పు రేఖాంశం.
5. 27°34′ ఉత్తర అక్షాంశం, 81°46′ తూర్పు రేఖాంశం.

ప్రశ్న 2.
అక్షాంశ, రేఖాంశాలతో సరిపోయే పదాలను గుర్తించండి. (AS1)
జవాబు:

అక్షాంశాలురేఖాంశాలు
సమాంతర రేఖలునిలువురేఖలు
వృత్తాలుఅర్ధవృత్తాలు
ఉహాజనిత రేఖలుఉహాజనిత రేఖలు
అడ్డంగా గీయబడినవికాలాన్ని నిర్ణయిస్తాయి.

ప్రశ్న 3.
క్రింద ఉన్న ప్రపంచ కాల మండలాల పటం చూడండి. (AS5)
AP Board 9th Class Social Solutions Chapter 1 భూమి - మనం 1
(అ) మీరు విజయవాడ నుండి పారిస్ కి వెళుతుంటే ఏ కాల మండలానికి ప్రయాణిస్తున్నారు?
జవాబు:
పశ్చిమానికి ప్రయాణించడం జరుగుతుంది.

(ఆ) హైదరాబాదు నుంచి టోక్యోకి వెళుతుంటే ఏ కాల మండలానికి ప్రయాణిస్తున్నారు?
జవాబు:
తూర్పునకు ప్రయాణించడం జరుగుతుంది.

ప్రశ్న 4.
భూమి ఏర్పడటం, దాని నిర్మాణం గురించి అధ్యయనం చేయటం ఎందుకు కష్టమైనది? (AS1)
జవాబు:
భూమి ఏర్పడటం, దాని నిర్మాణం గురించి అధ్యయనం చేయటం కష్టం ఎందువల్లనంటే …

  1. భూమి పుట్టుక మీద భిన్నాభిప్రాయాలుండటం.
  2. ప్రారంభంలో భూమి చలనం లేకుండా స్థిరంగా ఉందని, మిగిలినవి అన్నీ దానిచుట్టూ తిరుగుతున్నాయని భావించారు.
  3. 500 సం||రాల క్రితం శాస్త్రజ్ఞులు ఒక కొత్త అవగాహనకు వచ్చారు.
  4. భూమి విశ్వానికి మధ్యలో లేదని, వాస్తవానికి అది సూర్యుని చుట్టూ తిరుగుతోందని, ఆ సూర్యుడు కూడా తిరుగుతూ ఉన్నాడని, ఆకాశంలో అసంఖ్యాకంగా ఉన్న నక్షత్రాలు వాస్తవానికి సూర్యుళ్లని తెలుసుకున్నారు.
  5. నక్షత్రాలు కూడా పుడతాయని, పెరుగుతాయని, చివరికి చనిపోతాయని తెలుసుకున్నారు.
  6. పెద్ద విస్ఫోటనంతో 1370 కోట్ల సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించిందని, కొన్ని వందల కోట్ల సం||రాల తరువాత అంతరించిపోతుందని అభిప్రాయపడ్డారు.
  7. భూమి పుట్టుక అధ్యయనం చేయడానికి సరైన శాస్త్ర విజ్ఞానం కూడా అంతగా ఇంకా అభివృద్ధి చెందలేదు.
  8. శాస్త్రీయ పరికరాలు ఇంకా కనిపెట్టవలసిన అవసరం ఉంది.
  9. ఇంకా ఎన్నో అంశాలు ఋజువు కావలసి ఉంది.

AP Board 9th Class Social Solutions Chapter 1 భూమి - మనం

ప్రశ్న 5.
క్రింది పేరాను చదివి కింది ప్రశ్నకు సమాధానం రాయండి. (AS2)
కేంద్ర భాగంలో ఉండే పదార్థం అగ్నిపర్వతాల నుండి సముద్ర తలంలోని పగుళ్ల నుండి పైకి వచ్చి, చల్లబడి భూమి పై పొరగా మారుతుంది. భూమిలో అనేక ప్రాంతాలలో పై పొర తిరిగి మధ్యపొరలోకి ప్రవేశించి ద్రవంగా మారుతుంది. ఈ విధంగా భూపటలం నిత్యం ఏర్పడుతూ, నశిస్తూ ఉండటం భూమి ఇంకా సక్రియంగా ఉందన్న వాస్తవాన్ని వెల్లడి చేస్తుంది. భూమి లోపలి పొరల్లోని ప్రక్రియల వల్ల ఏర్పడే భూకంపాలు, అగ్నిపర్వతాలు, భూమి లోపలికి కుంగటం, కొండల పైకి లేవటం వంటి వాటి ద్వారా మనం నివసిస్తున్న పైపొర నిత్యం మారుతూనే ఉంది.
ప్ర. భూమి ఇప్పటికీ క్రియాశీలకంగా ఉందని మీరు ఎలా చెప్పగలరు.? అయితే కారణాలు ఏమిటి?
జవాబు:
భూమి ఇప్పటికీ క్రియాశీలకంగా ఉంది.

కారణాలు :

  1. కేంద్రభాగంలో ఉండే పదార్థం అగ్నిపర్వతాల నుండి సముద్ర తలంలోని పగుళ్ల నుండి పైకి వచ్చి, చల్లబడి భూమిపై పొరగా మారుతుంది.
  2. భూమిలో అనేక ప్రాంతాలలో పై పొర తిరిగి మధ్య పొరలోకి ప్రవేశించి ద్రవంగా మారుతుంది.
  3. ఈ విధంగా భూ పటలం నిత్యం ఏర్పడుతూ, నశిస్తూ ఉండటం భూమి ఇంకా సక్రియంగా ఉందన్న వాస్తవాన్ని వెల్లడి చేస్తుంది.
  4. భూమి లోపలి పొరల్లోని ప్రక్రియల వల్ల ఏర్పడే భూకంపాలు, అగ్నిపర్వతాలు, భూమి లోపలికి కుంగటం, కొండలు పైకి లేవటం వంటి వాటి ద్వారా మనం నివసిస్తున్న పై పొర నిత్యం మారుతునే ఉంది. అందువల్ల భూమి ఇంకా క్రియాశీలకంగా ఉంది.

ప్రశ్న 6.
గ్రిడ్ అనగా నేమి? అది మనకు ఎలా సహాయపడుతుంది? (AS1)
జవాబు:
గ్లోబు మీద అక్షాంశాలు, రేఖాంశాలు గీసి ఉంటాయి. ఈ నిలువు, అడ్డ గీతలతో గళ్లు ఏర్పడతాయి. దీనిని గ్రిడ్
అంటారు. గ్రిడ్ మనకు ఏ విధంగా సహాయపడుతుందనగా: – 1. ఈ గళ్ల సహాయంతో పటం మీద ఒక ప్రదేశాన్ని గుర్తించగలం. 2. దాని గురించి ఎన్నో విషయాలు తెలుసుకోగలం. ఉదా : అక్కడ ఎంత వేడిగా ఉన్నది, ఎంత చల్లగా ఉన్నది, అక్కడికి చేరుకోవటానికి ఏ దిశగా ప్రయాణం చేయాలి.
ఏ క్షణంలో అక్కడ సమయం ఎంత ఉంటుంది వంటి అంశాలను తెలుసుకోవచ్చు.

ప్రశ్న 7.
కింది వాని మధ్యగల తేడాలు వివరించండి. (AS1)
జవాబు:
ఆ) స్థానిక కాలం – ప్రామాణిక కాలం
ఆ) భూమధ్యరేఖ – ప్రామాణిక కాలం

అ) స్థానిక కాలం :

  1. భూభ్రమణం వల్ల భూమి మీద ఉన్న ఏ స్థలమైనా 24 గంటలలో ఒకసారి సూర్యునికి ఎదురుగా వస్తుంది.
  2. అంటే ప్రతి రేఖాంశం ఒక దినంలో ఒకసారి సూర్యునికి ఎదురుగా వస్తుంది.
  3. అప్పుడు ఆ రేఖాంశంపై ఉన్న ప్రాంతాలకు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలు అవుతుంది.
  4. ఈ సమయాన్ని ఆ ప్రాంతం యొక్క స్థానిక కాలం అంటారు.

ప్రామాణిక కాలం :

  1. ప్రతి దేశానికి ఒక ప్రామాణిక కాలాన్ని నిర్ణయించారు.
  2. దీని వల్ల కాలాన్ని గుర్తించడం సులభమౌతుంది.
  3. సాధారణంగా ప్రామాణిక కాలాన్ని నిర్ధారించడానికి ఆ దేశం మధ్యగా పోయే రేఖాంశాన్ని గుర్తిస్తారు.
  4. ఆ రేఖాంశం యొక్క స్థానిక కాలాన్ని ఆ దేశమంతటికి ప్రామాణిక కాలంగా వర్తింపజేస్తారు.

ఆ) భూమధ్యరేఖ :

  1. భూమికి మధ్యలో అడ్డంగా వెళ్లే వృత్తాన్ని భూమధ్యరేఖ. అంటారు.
  2. ఇది ఉత్తర, దక్షిణ ధృవాల నుంచి సమదూరాలలో ఉంటుంది.
  3. ఇది భూమిని రెండు సమభాగాలుగా చేస్తుంది. కాబట్టి దీనిని భూమధ్య రేఖ అంటారు.
  4. దీనిని 0° అక్షాంశంగా గుర్తిస్తారు.

ప్రామాణిక రేఖాంశం :

  1. ఇంగ్లాండ్ లోని గ్రీన్ విచ్ (Greenwich – ఉచ్చారణ గ్రీనిచ్) లోని నక్షత్రశాల గుండాపోయే రేఖాంశాన్ని 0° మెరిడియన్ లేదా ప్రామాణిక రేఖాంశం లేదా గ్రీనిచ్ మెరిడియన్ అంటారు.
  2. ఆ కాలంలో ప్రపంచంలో అధిక భాగాన్ని ఇంగ్లాండ్ పరిపాలిస్తుండేది. దాంతో వాళ్ళు అనుసరిస్తున్న విధానాన్ని మిగిలిన అందరూ అనుసరించటం మొదలుపెట్టారు.

AP Board 9th Class Social Solutions Chapter 1 భూమి - మనం

ప్రశ్న 8.
భారతదేశంలో ప్రతి రాష్ట్రం తమ స్థానిక సమయం పాటిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి? (AS1)
జవాబు:
భారతదేశంలో ప్రతి రాష్ట్రం తమ స్థానిక సమయాన్ని పాటిస్తే –

  1. సమయం విషయంలో గందరగోళం నెలకొంటుంది.
  2. సమయాన్ని నిర్ణయించటం మరింత క్లిష్టమవుతుంది.
  3. ఒక గంట వ్యవధితో దేశాన్ని పలు కాల మండలాలుగా విభజిస్తారు.

ప్రశ్న 9.
మీ ఉపాధ్యాయుల సహాయంతో నేపాల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, మలేషియా, జపాన్ దేశాల ప్రామాణిక రేఖాంశాన్ని గుర్తించండి. (AS5)
జవాబు:
నేపాల్ ప్రామాణిక రేఖాంశం – 82° 30′ తూర్పు రేఖాంశం (+ 5.45 యుటిసి)
పాకిస్థాన్ ప్రామాణిక రేఖాంశం – 74°22 తూర్పు రేఖాంశం (యుటిసి + 6 గం)
బంగ్లాదేశ్ ప్రామాణిక రేఖాంశం – 90° 24 తూర్పురేఖాంశం (యుటిసి + 4 గం)
ఇంగ్లాండ్ ప్రామాణిక రేఖాంశం – 0°07 పశ్చిమరేఖాంశం (యుటిసి + 1 గం).
మలేషియా ప్రామాణిక రేఖాంశం – 105° తూర్పురేఖాంశం (యుటిసి + 8 గం)
జపాన్ ప్రామాణిక రేఖాంశం – 135° తూర్పురేఖాంశం (యుటిసి + 9 గం)

ప్రశ్న 10.
భూ పరిరక్షణ కోసం ఆలోచింపజేసే ఒక పోస్టరు తయారుచేయండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 1 భూమి - మనం 2
భూ పరిరక్షణ కోసం ఆలోచింపజేసే పోస్టర్

9th Class Social Studies 1st Lesson భూమి – మనం InText Questions and Answers

9th Class Social Textbook Page No.2

ప్రశ్న 1.
సుదూరంగా ఉన్న నక్షత్రాలు, పాలపుంతల రహస్యాల గురించీ, విశ్వం ఆవిర్భావం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఈనాటి మానవులకు ఎందుకు ఉంది?
జవాబు:

  1. వేల సంవత్సరాలుగా మనుషులు ఆకాశంలోకి చూస్తూ అక్కడ మెరిసే వాటి గురించి తెలుసుకోటానికి ప్రయత్నిస్తున్నారు.
  2. ఆకాశంలో సంచరిస్తూ ఉండే సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు ఇతర నక్షత్రాలలో పోలిస్తే ఎప్పుడూ ఒకే దూరంలో ఉండే నక్షత్రాలు. ఇవి ఏమిటి? వీటికీ మనకూ సంబంధం ఏమిటి? ఇవి మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయి? వంటి వాటిని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించారు.
  3. ఆకాశంలో గల వీటి కదలికలను, ఘటనలను నమోదు చేస్తూ అవి ఏమిటో, అవి ఎలా కదులుతున్నాయో అర్థం చేసుకోటానికి ప్రయత్నించారు. అందువల్ల విశ్వం ఆవిర్భావం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఈనాటి మానవులకు ఉంది.

AP Board 9th Class Social Solutions Chapter 1 భూమి - మనం

ప్రశ్న 2.
విశ్వం మధ్యలో భూమి ఉందనీ, సృష్టిలో ముఖ్యమైనది మానవులనీ మొదట భావించేవాళ్లు. ఈ అనంత విశ్వంలో మనం అతి చిన్న నలుసు మాత్రమేనని తెలుసుకోవటం వల్ల అది మనపై ఎటువంటి ప్రభావం చూపుతుంది?
జవాబు:

  1. మొదట్లో భూమి చలనం లేకుండా స్థిరంగా ఉందనీ, మిగిలినవన్నీ దాని చుట్టూ తిరుగుతున్నాయని భావించారు.
  2. వేల సంవత్సరాలుగా ఇలాగే ఉంది కాబట్టి ఎటువంటి మార్పులూ లేకుండా భూమి, నక్షత్రాలు, సూర్యుడు శాశ్వతంగా ఇలాగే ఉంటాయని భావించారు.
  3. కానీ తరువాత భూమి విశ్వానికి మధ్యలో లేదని, వాస్తవానికి అది సూర్యుని చుట్టూ తిరుగుతోందని, ఆ సూర్యుడు కూడా తిరుగుతూ ఉన్నాడని, ఆకాశంలో అసంఖ్యాకంగా ఉన్న నక్షత్రాలు వాస్తవానికి సూర్యుళ్లని తెలుసుకున్నారు.
  4. నక్షత్రాలు కూడా పుడతాయని, పెరుగుతాయని, చివరికి చనిపోతాయని కూడా గత వంద సంవత్సరాల కాలంలో అర్థం చేసుకున్నారు. ఇది మనపై చూపే ప్రభావం ఏదీ శాశ్వతం కాదని, అనంత విశ్వంలో మనం చాలా చిన్న నలుసులం మాత్రమేనని అర్థమవుతుంది. కావున మనకు తెలిసినది తక్కువ అని, తెలియాల్సిందే ఎక్కువ అని కూడా అర్థమౌతుంది.

9th Class Social Textbook Page No.3

ప్రశ్న 3.
భూమి మీద కాలాలు ఏర్పడటానికి గల కారణాలను కింది వానిలో గుర్తించండి.
1. అక్షంపై రోజుకు ఒకసారి భూమి తన చుట్టూ తాను తిరగడం
2. భూమి చుట్టూ చంద్రుడు నెలకు ఒకసారి తిరగటం
3. అక్షంపై సూర్యుడు తన చుట్టూ తాను తిరగటం
4. సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమణం
5. కక్ష్య తలంతో పోలిస్తే భూమి అక్షం వంగి ఉండటం
6. భూమి గోళాకారంలో ఉండటం
7. సంవత్సర పరిభ్రమణ కాలంలో సూర్యుడి నుండి భూమి ఉండే దూరం
జవాబు:
1. అక్షంపై రోజుకు ఒకసారి భూమి తన చుట్టూ తాను తిరగడం
2. సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమణం
3. కక్ష్య తలంతో పోలిస్తే భూమి అక్షం వంగి ఉండటం
4. భూమి గోళాకారంలో ఉండటం

9th Class Social Textbook Page No.4

ప్రశ్న 4.
భూమి అకస్మాత్తుగా ఏర్పడిందని అనుకుంటున్నారా లేక అది ఒక సుదీర్ఘ, సంక్లిష్ట ప్రక్రియల ఫలితంగా ఏర్పడిందని అనుకుంటున్నారా?
జవాబు:
భూమి ఒక సుదీర్ఘ సంక్లిష్ట ప్రక్రియల ఫలితంగానే ఏర్పడింది.

  1. ఎక్కువమంది శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం సుమారుగా 450 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడటం మొదలయ్యింది.
  2. భూమి అనేక దశలలో మార్పు చెంది, ప్రస్తుత రూపాన్ని సంతరించుకుంది.
  3. పరిభ్రమిస్తున్న ధూళి, మేఘాల గోళంగా మొదలై, ద్రవ దశ గుండా పరిణమించింది.
  4. ఆ దశలో భూమి చాలా వేడిగా ఉండేది.
  5. విశ్వం నుంచి పెద్ద పెద్ద రాళ్ళు, ఇతర పదార్థాలు దానిని ఢీకొంటూ ఉండేవి.
  6. ఆ విధంగా భూమి పరిమాణం పెరిగింది.
  7. భూమి అత్యంత వేడిమి గల ద్రవంగా ఉండేది.
  8. బరువైన పదార్థాలు ద్రవరూప కేంద్రభాగంగా మారితే, తేలిక పదార్థాలు పైకి లేచి చల్లబడ్డాయి. కాల క్రమంలో ద్రవరూప కేంద్రాన్ని కప్పుతూ తేలికైన, చల్లబడిన పదార్థాలతో పై పొర ఏర్పడింది.

AP Board 9th Class Social Solutions Chapter 1 భూమి - మనం

ప్రశ్న 5.
అనేక యాదృచ్చిక ఘటనల ఫలితంగా భూమి మీద మానవులు రూపొందారని కొంతమంది నమ్ముతారు. లేకుంటే భూమి మీద ప్రాణం ఏర్పడి ఉండేదే కాదు. వాళ్ళతో మీరు ఏకీభవిస్తారా? మీ కారణాలను పేర్కొనండి.
జవాబు:
మా కారణాలు కూడా శాస్త్రవేత్తలు తెల్పినవే.

  1. భూమి చరిత్రలో సగం కాలం ఎటువంటి ప్రాణీ లేకుండా నిర్జీవంగా గడిచింది.
  2. ఆ తరువాత సముద్రాలలో జీవం మొదలైంది.
  3. లక్షల సంవత్సరాల పరిణామక్రమంలో మనుషులతో సహా అనేక రకాల మొక్కలు, జంతువులు రూపొందాయి.

9th Class Social Textbook Page No.5

ప్రశ్న 6.
భూప్రావారంను అధ్యయనం చేయటానికి మనం దాని వరకు ప్రయాణించలేం. అయితే భూప్రావారంలోని పదార్థాల ద్వారా దాన్ని అధ్యయనం చేయవచ్చు. ఈ పదార్థాలు ఏమిటో, వాటిని ఎలా పొందవచ్చో చెప్పండి.
జవాబు:
భూప్రావారం:

  1. ఈ పొర భూమి లోపల 100 కిలోమీటర్ల నుంచి మొదలుకొని 2900 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
  2. భూ ప్రావారంలో పై పొర తేలుతూ ఉంటుంది.
  3. ఇందులో ప్రధానంగా సిలికేట్లు అనే రసాయనాలు ఉంటాయి.
  4. అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందటం వలన మరియు యంత్రాలను భూ అంతర్భాగంలోనికి పంపడం ద్వారా వీటిని పొందవచ్చు.

9th Class Social Textbook Page No.7

ప్రశ్న 7.
ప్రపంచ పటాన్ని జాగ్రత్తగా గమనించండి. ‘జిగ్ సా పజిల్’ లోని రెండు ముక్కలుగా ఏవైనా రెండు ఖండాలు కనిపిస్తున్నాయా? ఆ ఖండాలు ఏవి?
జవాబు:
జిగ్ సా పజిల్ లోని రెండు ముక్కలుగా కనిపించే రెండు ఖండాలు:

  1. లారెన్షియా
  2. గోండ్వానా భూమి.

ప్రశ్న 8.
ఆస్ట్రేలియా ఏ దిశవైపునకు కదిలింది?
జవాబు:
దక్షిణం వైపునకు కదిలింది.

AP Board 9th Class Social Solutions Chapter 1 భూమి - మనం

ప్రశ్న 9.
భారతదేశం ఏ దిశవైపునకు కదిలింది?
జవాబు:
తూర్పు వైపునకు కదిలింది.

9th Class Social Textbook Page No.8

ప్రశ్న 10.
కింద ఇచ్చిన పటం ఆధారంగా దిగువ పట్టిక నింపండి.
AP Board 9th Class Social Solutions Chapter 1 భూమి - మనం 3

అర్ధ గోళంఖండాలు
ఉత్తరార్ధగోళం
పశ్చిమార్ధగోళం
దక్షిణార్ధగోళం
తూర్పు అర్ధగోళం

జవాబు:

అర్ధ గోళంఖండాలు
ఉత్తరార్ధగోళంఉత్తర అమెరికా, ఆసియా, ఐరోపా, ఆఫ్రికాలో సగభాగం.
పశ్చిమార్ధగోళంఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా.
దక్షిణార్ధగోళందక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికాలో సగభాగం, అంటార్కిటికా.
తూర్పు అర్ధగోళంఆఫ్రికా, ఐరోపా, ఆసియా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా.

9th Class Social Textbook Page No.12

ప్రశ్న 11.
అట్లాస్ చూసి ఈ దేశాలలో ఎన్ని ప్రామాణిక కాల మండలాలు (Time Zones) ఉన్నాయో తెలుసుకోండి.
అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా, జపాన్, జింబాబ్వే, చిలీ.
జవాబు:

  1. అమెరికా : ఐదు ప్రామాణిక కాలమండలాలు ఉన్నవి. అవి -9, -3, -2, -6, -5 మండలాలు.
  2. ఆస్ట్రేలియా : మూడు ప్రామాణిక కాల మండలాలు ఉన్నవి. అవి +8, +9, +10 మండలాలు.
  3. రష్యా : పది ప్రామాణిక కాలమండలాలు ఉన్నవి. అవి +3, +4, +5, +6, +7, +8, +9, +10, +11, +12 మండలాలు.
  4. జపాన్ : ఒకే ఒక్క ప్రామాణిక కాలమండలం ఉంది. అది +9 మండలం.
  5. జింబాబ్వే : ఒకే ఒక్క ప్రామాణిక కాలమండలం ఉంది. అది +2 మండలం.
  6. చిలీ : ఒకే ఒక్క ప్రామాణిక కాలమండలం ఉంది. అది -5 మండలం.

ప్రశ్న 12.
హైదరాబాదులోని ఒక కాల్ సెంటరులో స్వాతి పనిచేస్తోంది. ఆమె క్లయింటులు అమెరికాలో ఉన్నారు. కంప్యూటర్ సమస్యలకు సంబంధించి క్లయింటుల ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇస్తుంది. ఆమె ఎప్పుడూ రాత్రివేళల్లోనే పనిచేస్తుంది. ఎందుకని ? భూగోళశాస్త్రాన్ని ఉపయోగించి తెలుసుకోండి.
జవాబు:

  1. భారతదేశము తూర్పు అర్ధగోళంలోనూ, అమెరికా పశ్చిమార్ధగోళంలోనూ ఉంది.
  2. రెండు దేశాల మధ్య దాదాపు 12 గంటల కాల వ్యత్యాసం ఉంది.
  3. అమెరికా వాళ్ల మధ్యాహ్న 12 గంటల సమయం, మనకు అర్ధరాత్రి 12 గంటల సమయమవుతుంది.
  4. అందువలన స్వాతి ఎప్పుడూ వాళ్లకు పగటివేళలయిన, మన రాత్రివేళల్లోనే, పనిచేయవలసి వస్తుంది.

AP Board 9th Class Social Solutions Chapter 1 భూమి - మనం

ప్రశ్న 13.
మెదడుకు మేత :
గ్రీన్ విచ్ (0) వద్ద మధ్యాహ్నం 12 : 00 అయితే ఈ దిగువ ప్రదేశాల్లో స్థానిక సమయం ఎంతో తెలుసుకోండి :
(అ) ముంబయి (73° తూ.రే) ; (ఆ) షికాగో (87° 30 ప.రే) ; (ఇ) సిడ్నీ ‘(151° తూ.రే.).
జవాబు:
ఒక్కొక్క రేఖాంశానికి సమయ వ్యత్యాసం 4 ని||లు.
(అ) ముంబయి (73° తూ.రే) :

  1. 73 × 4 = 292 నిమిషాలు = 4 గం||ల 52 ని॥లు
  2. తూర్పు రేఖాంశము గ్రీన్ విచ్ కు పైన ఉంటుంది. కనుక 4 గం|| 52 ని||లు కలుపవలసి ఉంటుంది.
  3. 12-00 + 4-52 = 16-52 అనగా స్థానిక సమయం సాయంత్రం 4 గం|| 52 ని||లు.

(ఆ) షికాగో (87° 30 ప.రే) :

  1. 87.30 × 4 = 87½ × 4 = 350 నిమిషాలు = 5 గం|| 50 ని||
  2. పశ్చిమ రేఖాంశము గ్రీన్ కు క్రింద ఉంటుంది. కనుక 5 గం|| 50 ని||లు తీసివేయవలసి ఉంటుంది.
  3. 12.00 – 5.50 = 6 గం|| 10 ని||
    అందువలన స్థానిక సమయం ఉదయం 6గం|| 10ని||

(ఇ) సిడ్నీ (151° తూ.రే.) :

  1. 151 × 4 = 604 ని||లు = 10 గం|| 4 ని||
  2. తూర్పు రేఖాంశము గ్రీన్ విచ్ కు పైన ఉంటుంది.
  3. 12.00 + 10 – 04 = 22-04
    అనగా స్థానిక సమయం రాత్రి 10 గం|| 4 ని||

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

SCERT AP 9th Class Biology Guide Pdf Download 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Biology 8th Lesson Questions and Answers వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

9th Class Biology 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
మన దేశంలో ధాన్యం ఉత్పత్తిలో పెంపుదల సాధించాలంటే ఏమి చేయాలో సూచించండి. (AS 1)
(లేదా)
ఒక పక్క జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. కాని పంటలు పండే భూమి మాత్రం తగ్గిపోతుంది. మరి పెరుగుతున్న జనాభాకు సరిపడేలా ఆహారోత్పత్తి పెంచాలంటే చేపట్టాల్సిన పరిష్కార మార్గాలు సూచించండి.
జవాబు:

  1. సాగుభూమి విస్తీర్ణాన్ని పెంచడం.
  2. ప్రస్తుతం సాగుచేస్తున్న భూమినందు ఉత్పత్తిని పెంచడం.
  3. ఎక్కువ దిగుబడినిచ్చే వరి సంకర జాతులను అభివృద్ధి చేయడం.
  4. వివిధ వాతావరణ పరిస్థితులలో పెరిగే నూతన రకములను ఉత్పత్తి చేయడానికి వరి మొక్క జన్యు వైవిధ్యమును పరిరక్షించడం.
  5. మంచి నీటిపారుదల పద్ధతులు, సరియైన యాజమాన్య పద్ధతులను పాటించాలి.
  6. పోషక పదార్థములను సక్రమముగా వినియోగించడానికి వరి పంట.యాజమాన్య పద్ధతులను అవలంబించాలి.
  7. సేంద్రియ ఎరువులను ఉపయోగించాలి.
  8. పంటమార్పిడి, మిశ్రమ పంటల పద్ధతులను అవలంబించాలి.

ప్రశ్న 2.
రసాయన ఎరువుల కంటే జీవ ఎరువులు ఏ విధంగా మెరుగైనవి? (AS 1)
జవాబు:

  1. జీవ ఎరువులు సహజ పోషకాలను నేలకు అందిస్తాయి.
  2. నేల నిర్మాణాన్ని మరియు నేల సేంద్రియ పదార్థాన్ని జీవ ఎరువులు పెంచుతాయి.
  3. జీవ ఎరువులు నీటి నిల్వ సామర్థ్యాన్ని మరియు నేల గట్టిపడే సమస్యలను తగ్గిస్తాయి.
  4. నేల మరియు నీటి కోరివేతను జీవ ఎరువులు తగ్గిస్తాయి.
  5. పంట యొక్క ఉత్పత్తిని జీవ ఎరువులు పెంచుతాయి.
  6. జీవ ఎరువుల వాడకం ద్వారా నేలలో హ్యూమస్ శాతం పెరిగి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.

ప్రశ్న 3.
అ) అధిక దిగుబడినిచ్చే పంటలు పండించడానికి, రసాయన ఎరువులు ఎక్కువ వాడడం వలన కలిగే దుష్ఫలితాలు ఏమిటి? (AS 1)
జవాబు:

  1. రసాయనిక ఎరువులు సరస్సులు, నదులు మరియు వాగులను కలుషితం చేస్తాయి.
  2. నేలలో జీవించే వానపాములతో సహా ఇతర జీవులను నాశనం చేస్తాయి.
  3. రసాయనిక ఎరువులను వినియోగించుట ద్వారా కేవలం 20 నుండి 30 సంవత్సరాలు మాత్రమే అధిక ఉత్పత్తిని సాధించగలం.
  4. ఆ తరువాత నేల మొక్కల పెరుగుదలకు అనుకూలించదు.
  5. నేల సారాన్ని రసాయన ఎరువులు పాడు చేస్తాయి.
  6. రసాయన ఎరువుల వాడకం వలన పంటలు వ్యాధులకు గురి అవుతాయి.
  7. కొన్ని మొక్కలు పోషక పదార్థాలను గ్రహించడాన్ని నిరోధిస్తాయి.
  8. రసాయన ఎరువులు ఉపయోగించి పండించిన ఆహార పదార్థాలు అంత రుచికరంగా ఉండవు.

ఆ) అధిక దిగుబడినిచ్చే వంగడాలను రసాయన ఎరువులు లేకుండా పెంచవచ్చా? ఎలా? (AS 1)
జవాబు:

  1. అవును. అధిక దిగుబడినిచ్చే వంగడాలను రసాయన ఎరువులు లేకుండా పెంచవచ్చును.
  2. రసాయన ఎరువులు మరియు కృత్రిమంగా తయారయిన కీటక నాశనులకు బదులుగా జీవ ఎరువులను ఉపయోగించుట ద్వారా మనము అధికోత్పత్తిని పొందవచ్చు.

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

ప్రశ్న 4.
విత్తనాలు విత్తడానికి ముందు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి? (AS 1)
జవాబు:

  1. విత్తనాలు విత్తే ముందు నేలను సిద్ధపరచాలి.
  2. నేలను వదులుగా చేయడానికి, గట్టిగా ఉన్న మట్టి గడ్డలను పగలగొట్టడానికి నేలను దున్నాలి.
  3. విత్తనాలు చల్లే ముందు నీళ్ళు పెట్టాలి. .
  4. నేలలో పుట్టే లేదా విత్తనముల ద్వారా వచ్చే వ్యాధులను అరికట్టడానికి విత్తన శుద్ధి చేయాలి.

ప్రశ్న 5.
వర్షాభావ పరిస్థితులు అధికంగా ఉండే ప్రదేశంలో మీ పొలం ఉంటే దానిలో ఏ రకమైన పంటలు పండిస్తావు? ఎలా పండిస్తావు? (AS 1)
జవాబు:

  1. జొన్న, సజ్జ, కంది, పెసలు, ఉలవలు మొదలగు పంటలను వర్షాభావ పరిస్థితులు గల మా పొలంలో పండిస్తాను.
  2. వర్షపు నీటిని సంరక్షించడం, చెక్ డ్యాంలను నిర్మించడం, డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి, వాటర్ షెడ్ పథకము మరియు నేల మరియు నీటి సంరక్షణ పద్ధతుల ద్వారా పై పంటలను పండిస్తాను.

ప్రశ్న 6.
కాలానుగుణంగా ఆశించే కీటకాలు పంట పొలాన్ని నాశనం చేయకుండా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటారు? (AS 1)
జవాబు:

  1. సాధారణంగా రైతులు కృత్రిమంగా తయారుచేసిన ఎరువులు, కీటకనాశనులు ఉపయోగించి పంటలపై వచ్చే కీటకాలను అదుపులో ఉంచుతారు.
  2. కొందరు కీటకాలను చేతితో ఏరివేయడం ద్వారా కీటకాల బారి నుండి పంట పొలాన్ని రక్షిస్తారు.
  3. కీటకాలకు హాని కలిగించే పరభక్షక కీటకాలను ఉపయోగించి పంట పొలం నాశనం కాకుండా చూస్తారు.
  4. చేతితో కీటకాలను ఏరి వేసే పద్ధతిలో పంటపొలం మధ్యలో దీపపుతెరలు ఉంచడంవల్ల కీటకాలన్నీ దాని ఆకరణకు లోనై ఒకే చోటికి చేరతాయి. ఇలా చేయడం వల్ల వాటిని ఏరివేయడం సులభం.
  5. కీటకనాశనులను అవసరమైన సందర్భాలలో వినియోగించడం వల్ల కూడా పంటపొలాన్ని కీటకాలు నాశనం చేయకుండా చూడవచ్చు.

ప్రశ్న 7.
ఒక రైతు తన పొలంలో చాలా కాలంగా ఒకే క్రిమిసంహారక మందును ఉపయోగిస్తున్నాడు. అయితే కింది వాటిపై దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది? (AS 2)
అ) కీటకాల జనాభా
ఆ) నేల ఆవరణ వ్యవస్థ
జవాబు:
అ) కీటకాల జనాభా :

  1. రైతు క్రిమిసంహారక మందును ఎక్కువకాలం ఉపయోగించడం వలన కీటకాలు వ్యాధి నిరోధకతను పెంచుకుంటాయి.
  2. అందువలన కీటకాల జనాభా పెరుగుతుంది.

ఆ) నేల ఆవరణ వ్యవస్థ :

  1. క్రిమి సంహారకాలను ఎక్కువకాలం ఉపయోగించడం వల్ల ఆ మందులు నేలలోనే ఉండిపోతాయి.
  2. ఆ మందులు నేలలోని పురుగులను చంపివేస్తాయి. తద్వారా పంట దిగుబడి తగ్గుతుంది.
  3. నేలలో లవణాల శాతం పెరిగి నేల ఆవరణ వ్యవస్థ దెబ్బ తింటుంది.

ప్రశ్న 8.
రామయ్య తన పొలానికి భూసార పరీక్ష చేయించాడు. పోషకాల నిష్పత్తి 34-20-45గా ఉంది. ఈ నిష్పత్తి చెరకు పండించడానికి అనుకూలమేనా? ఏ రకమైన పంటలు పండించడానికి ఈ పొలం అనుకూలమని భావిస్తావు? (AS 2)
జవాబు:

  1. రామయ్య పొలము చెరకు పంట పండించడానికి అనుకూలం కాదు.
  2. ఎందుకంటే చెరకు పంట పండించడానికి నేలలో 90% నత్రజని ఉండాలి, కాని రామయ్య పొలంలో కేవలం 34% నత్రజని మాత్రమే ఉంది.
  3. భాస్వరము 20% ఉండడం వలన మొక్కజొన్నను, పొటాషియం 45% ఉండడం వలన వేరుశనగ పంటను పండించవచ్చు.

ప్రశ్న 9.
మీ సమీపంలోని పొలానికి వెళ్ళి రైతులు కలుపు నివారణకు పాటిస్తున్న పద్ధతులు గురించిన సమాచారం సేకరించి నివేదిక రాయండి. (AS 3)
జవాబు:
కలుపు నివారణకు పాటిస్తున్న పద్ధతులు :

రైతు పేరునివారణ పద్ధతి
1. రామారావుకూలీలతో చేతితో ఏరివేయిస్తున్నాడు.
2. వెంకటయ్యఈ రైతుది మెట్ట పొలం అయినందున గుంటక వంటి పరికరాలు వాడి నివారణ చేస్తున్నాడు.
3. సోమేశంకలుపు నాశకాలను చల్లి నివారణ చేస్తున్నాడు.
4. శ్రీనివాసరావుదుక్కిలోనే కలుపు వినాశకాలను వాడి, దున్ని కలుపును రాకుండా నివారిస్తున్నాడు.

ఈ నాలుగు పద్ధతులను చాలా మంది రైతులు పాటించుటను గమనించాను.

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

ప్రశ్న 10.
మీ ప్రాంతంలోని ప్రధానమైన కలుపు మొక్కల జాబితా తయారుచేయండి. వాటిలో వేర్వేరు పంటలలో పెరిగే కలుపు మొక్కలను కింది పట్టికలో నమోదు చేయండి. (AS 4)
జవాబు:
ప్రధానమైన కలుపు మొక్కల జాబితా :
సైనోడాన్ డాక్టలాన్ (గరిక), సైపరస్ రొటండస్ (తుంగ), డిజిటారియా లాంగిఫోలియా, డాక్టలో క్లీనియమ్ కలోనమ్, సెటేరియా గ్లూకా, సైపరస్ డిఫార్మిస్, ఐకోర్నియా క్రాసిప్స్ (బుడగ తమ్మ), సాల్వీనియా మొలస్టా, ఆల్టర్ నాంతిర సెసైలిస్ (పొన్నగంటి), సెలోషియా అర్జెన్షియా (గురంగుర) లూకాస్ ఏస్పిరా (తుమ్మి), పోర్చు లేక ఒలరేషియా (పావలికూర), క్లియోమ్ విస్కోసా (కుక్కవామింట), సొలానమ్ నైగ్రమ్ (బ్లాక్ నైట్ షేడ్), అర్జిమోన్ మెక్సికానా (బాలరక్కొస), ఎబుటిలాన్ ఇండికమ్ (తుత్తురి బెండ), యూఫోర్బియా హిరా (పచ్చబొట్లు), వెర్నోనియా సిన్నోరా, ఇఖ్ నోక్లోవా కొలోనమ్ (ఉడలు), కొమ్మెలైనా బెంగాలెన్సిస్ (వెన్నవెదురు), అవినాఫాట్యువ (అడవియవలు), ఇళ్ల నోక్లోవా క్రస్ గల్లి (నీటిగడ్డి), ఎల్యు సైన్ ఇండికా (గూ గ్రాస్), ఎభిరాంథిస్ ఏస్పిరా (ఉత్తరేణి), ఇక్లిష్టా ప్రోస్టేట (గుంట కలగర లేదా) భృంగరాజ మొదలగునవి.

పంట రకంపంటపై పెరిగే కలుపు మొక్కలు
వరిగరిక, తుంగ, బుడగ తమ్మ, పొన్నగంటి
వేరుశనగగురంగుర, గరిక, తుంగ, తుత్తురి బెండ, వెన్న వెదురు, కుక్కవామింట, తుమ్మి, పావలికూర, బాలరక్కిస.
మినుములుగరిక, తుంగ, తుత్తురి బెండ, వెన్న వెదురు, సాల్వీనియా మొలస్టా, పచ్చబొట్లు, బంగారు తీగ.
మొక్కజొన్నపచ్చబొట్లు, సొలానమ్ నైగ్రమ్, గరిక, తుంగ
పెసలుఉడలు, గరిక, తుంగ, బాలరక్కొస, పావలికూర

ప్రశ్న 11.
మీ గ్రామ పటం గీచి, నీటివనరులను గుర్తించండి. నీవు ఒక మంచి రైతుగా వాటిని ఎలా ఉపయోగిస్తావు? ఏ ఏ వ్యవసాయ పద్ధతులను పాటిస్తావు? (AS 5)
జవాబు:
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 1
నేను ఒక మంచి రైతుగా ఆ నీటి వనరులను సక్రమ పద్ధతిలో ఉపయోగిస్తాను. నీటివనరులు తక్కువగా ఉంటే బిందుసేద్యం పద్ధతిని ఉపయోగిస్తాను.

ప్రశ్న 12.
రసాయన ఎరువులు శిలీంధ్రనాశకాలు, కీటకనాశకాలు, కలుపు మందులు అధిక మోతాదులో వినియోగిస్తే పర్యావరణంపై కలిగే పరిణామాలు ఏమిటి? (AS 6)
జవాబు:

  1. మనం కీటకనాశనులు, శిలీంధ్రనాశకాలను, కలుపు మందులను అధిక మొత్తంలో వాడడం వలన ఈ మందులు నేలలోనే మిగిలిపోతాయి.
  2. వర్షాలు పడినప్పుడు నేల నుండి నీటిలో కరిగి నీటి వనరులను కూడా కలుషితం చేస్తాయి.
  3. నేల పొరలోకి దిగి నేలను కలుషితం చేసాయి.
  4. ఈ మందులను పొలంలో చల్లే రైతులు తరచుగా వీటి ప్రభావానికి గురి అయ్యి ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయి. కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చు.
  5. కీటకనాశనులు ఉపయోగపడే కీటకాలతో సహా మొత్తం కీటకాలను నాశనం చేస్తాయి.
  6. అధిక మొత్తంలో రసాయన ఎరువులు, కీటక నాశనులు, కలుపు ందులను వాడడం వలన కొంత కాలానికి నేల పంట పండించడానికి ఉపయోగపడదు.

ప్రశ్న 13.
“జీవ వైవిధ్యానికి సేంద్రియ ఎరువులు సహాయపడతాయి”. దీనిని నీవెలా సమర్థిస్తావు? (AS 6)
జవాబు:

  1. నేల మరియు నేలలో ఉండే జీవులపై జరిగిన జీవశాస్త్ర అధ్యయనము సేంద్రియ సేద్యమునకు అనుకూలమని నిరూపించబడినది.
  2. రసాయన పదార్థాలను, వృక్ష మరియు జంతు సంబంధమైన వ్యర్థాల నుండి బాక్టీరియా మరియు శిలీంధ్రాలు నేల పోషక పదార్థములను విడగొడతాయి.
  3. అంతేకాకుండా బాక్టీరియా మరియు శిలీంధ్రాలు ఆరోగ్యకరమైన దిగుబడిని ఇవ్వడానికి మరియు భవిష్యత్తుల్లో పండించబోయే పంటలకు అనుకూలమైన నేలను అందిస్తాయి.

ప్రశ్న 14.
“ఎక్కువ మోతాదులో శిలీంధ్రనాశకాలు వాడితే జీవవైవిధ్యం, పంట దిగుబడిపై తీవ్రమైన ప్రమాదం కలుగుతుంది”. దీనిని నీవెలా సమర్థిస్తావు? (AS 6)
జవాబు:

  1. ఎక్కువ మోతాదులో శిలీంధ్రనాశకాలు వాడితే అవి ఎక్కువ భాగం మృత్తికలలో చేరి మృత్తికలోని జీవులను నాశనం చేస్తాయి.
  2. వర్షము కురిసినప్పుడు మృత్తిక నుండి వర్షపు నీటి ద్వారా చెరువులు, నదులలోని నీటిలోకి చేరి జలజీవులకు హాని కలుగచేస్తాయి.
  3. ఈ మందులను పొలంలో చల్లే రైతులు తరుచుగా వీటి ప్రభావానికి గురి కావడం జరుగుతుంది. కొన్ని రసాయనిక పదార్థాలు శరీరంలోకి ప్రవేశించి, కొన్నిసార్లు ప్రాణాపాయం కలుగుతుంది.
  4. క్రిమి సంహారక మందులను పంటలపై చల్లినప్పుడు అవి పరాగ సంపర్కానికి ఉపయోగపడే కీటకాలను కూడా చంపివేస్తాయి.

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

ప్రశ్న 15.
అధిక దిగుబడినిచ్చే వంగడాలను ఉపయోగించడం వలన కలిగే ప్రతికూల ప్రభావం ఏమిటి? (AS 7)
జవాబు:
అధిక దిగుబడినిచ్చే వంగడాలను ఉపయోగించడం వలన
i) అవి ఎక్కువ మొత్తంలో నేల నుండి పోషకాలను వినియోగించుకుంటాయి.
ii) నిరంతరం ఉపయోగించడం వలన నేల సారాన్ని కోల్పోతుంది.
iii) సారాన్ని పెంచటానికి రసాయన ఎరువులు వాడాల్సి ఉంటుంది.
iv) ఇది వ్యవసాయ ఖర్చును పెంచుతుంది.

ప్రశ్న 16.
రసాయన ఎరువులు ఉపయోగిస్తున్న రైతుకు సేంద్రియ ఎరువులు ఉపయోగించే విధంగా ఏ రకంగా వివరించి ఒప్పిస్తావు? (AS 7)
జవాబు:

  1. పోషక పదార్థాలు తిరిగి నేలలో కలిసే విధంగా మరియు మట్టిగడ్డలు చిన్నవిగా చేయడానికి జీవ ఎరువులు తోడ్పడతాయి.
  2. నేలలో ఉండే జీవుల మనుగడను జీవ ఎరువులు ఎక్కువ చేస్తాయి.
  3. సేంద్రీయ ఎరువులు పంట దిగుబడి ఎక్కువ వచ్చే విధంగా చేస్తాయి.
  4. నేల యొక్క సహజ సమతౌల్యాన్ని కాపాడతాయి.
  5. కొన్ని పంటలకు వ్యాధులు సోకకుండా నివారిస్తాయి.
  6. పర్యావరణానికి హాని చేయని మిత్రులుగా సేంద్రియ ఎరువులు ఉంటాయి.

పైన పేర్కొన్న సేంద్రియ ఎరువుల యొక్క ఉపయోగాలను రైతుకు స్పష్టంగా వివరించి, వాటినే ఉపయోగించేలా ఆ రైతును ఒప్పిస్తాను.

ప్రశ్న 17.
వెంకటాపురం అనే గ్రామం తీవ్ర వర్షాభావ పరిస్థితులున్న ప్రాంతం. సోమయ్య తన పొలంలో చెరకును పండించాలనుకుంటున్నాడు. ఇది లాభదాయకమా? కాదా? వివరించండి. (AS 7)
జవాబు:

  1. సోమయ్య తన పొలంలో చెరకును పండించాలనుకోవడం లాభదాయకం కాదు.
  2. ఎక్కువ నీటి లభ్యత కలిగిన ప్రదేశాలలో మాత్రమే చెరకు పండుతుంది.
  3. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రదేశాలలో ఆరుతడి పంటలు పండించడం లాభదాయకం.

ప్రశ్న 18.
“సహజ కీటకనాశన పద్ధతులు జీవ వైవిధ్యానికి దోహదం చేస్తాయి”. వ్యాఖ్యానించండి. (AS 7)
జవాబు:

  1. కొన్ని రకాల కీటకాలు మనకు హాని కలిగించే, నష్టం కలిగించే కీటకాలను అదుపులో ఉంచుతాయి. వీటిని మిత్ర కీటకాలు అంటారు.
    ఉదా : సాలెపురుగు, డ్రాగన్ ప్లే, క్రిసోపా మొదలగునవి.
  2. ట్రైకో డెర్మా బాక్టీరియం కాండం తొలిచే పురుగు గుడ్లలో నివసిస్తుంది.
  3. పొగాకును తినే గొంగళి పురుగు, ధాన్యాన్ని తినే గొంగళిపురుగు వంటి వాటిని గ్రుడ్ల దశలోనే బాక్టీరియాతో నాశనం చేయవచ్చు.
  4. బాసిల్లస్ తురంజనిసిన్ వంటి కొన్ని రకాల బాక్టీరియాలు కీటకాలను నాశనం చేస్తాయి.
  5. కొన్ని రకాల మిశ్రమ పంటలు కీటకాలను, వ్యాధులను అదుపులో ఉంచుతాయి.
  6. అందువలన సహజ కీటక నాశన పద్దతులు జీవ వైవిధ్యానికి దోహదం చేస్తాయి. దీని ద్వారా కేవలం హానికరమైన కీటకాలు మాత్రమే చనిపోతాయి.

9th Class Biology 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు Textbook InText Questions and Answers

9th Class Biology Textbook Page No. 115

ప్రశ్న 1.
బిందుసేద్యం వంటి నీటి సరఫరా పద్ధతి, పంటలకు, రైతులకు ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించండి.
జవాబు:

  1. నీటి వృథాను అరికట్టడానికి బిందుసేద్యం (Drip Irrigation) అత్యంత ప్రయోజనకరమైన పద్ధతి.
  2. బిందుసేద్యం పద్ధతిలో నీరు చిన్న చిన్న గొట్టాల గుండా సరఫరా అవుతుంది.
  3. ఈ గొట్టాలకు అక్కడక్కడ సన్నటి రంధ్రాలుంటాయి.
  4. ఈ రంధ్రాల గుండా నీరు చుక్కలు చుక్కలుగా పడుతుంది.
  5. ఈ పద్ధతి ద్వారా ఎరువులను వృథా కాకుండా మొక్కలకు అందించవచ్చును.

9th Class Biology Textbook Page No. 115

ప్రశ్న 2.
వాటర్ షెడ్ పథకం భూగర్భజలాలను పెంచడానికి ఎంతగానో తోడ్పడుతుంది. దీనిని నీవు ఎట్లా సమర్థిస్తావు?
జవాబు:

  1. వాటర్ షెడ్ తో పంటలకి కావల్సిన నీళ్ళు ఇవ్వడమే కాకుండా చుట్టూ ఉన్న జంతువులకి, పశువులకి, పక్షులకి నీళ్ళందించవచ్చు.
  2. నేలలో తేమ శాతాన్ని పెంచవచ్చు.
  3. నేలపై మట్టి కొట్టుకుపోకుండా ఆపడానికి కూడా పాటర్ షెడ్ ఉపయోగపడుతుంది.
  4. కొండవాలు ప్రాంతాల్లో, ఎత్తైన గుట్టల్లో పడ్డ వాన నీళ్ళని సద్వినియోగం చేసుకొని, చుట్టూ ఉన్న ఆవాసంలో అన్ని అవసరాలకి నీళ్ళని అందించే ఏకైక మార్గం వాటర్‌షెడ్.

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

9th Class Biology Textbook Page No. 121

ప్రశ్న 3.
వర్మీ కంపోస్టు ఎరువు రసాయనిక ఎరువుల కంటే ఎలా మేలైనది?
జవాబు:

  1. రసాయనిక ఎరువుల వలన నేలకలుషితం, వాతావరణ కలుషితం జరుగుతుంది.
  2. రసాయనిక ఎరువులు వాడిన ఆహార పదార్థాలు తినడం వలన మానవుల ఆరోగ్యం పాడవుతుంది.
  3. కాని వర్మీ కంపోస్టు వాడడం వలన ఎలాంటి కాలుష్య లేదా ఆరోగ్య సమస్యలు ఏర్పడవు. అందువలన వర్మీ కంపోస్టు ఎరువు రసాయనిక ఎరువులకంటే చాలా మేలైనది.

9th Class Biology Textbook Page No. 109

ప్రశ్న 4.
a) నెలకు ఎంత ధాన్యం మీ ఇంట్లో అవసరం అవుతుందో అంచనా వేయటానికి ప్రయత్నించండి.
జవాబు:
నెలకు మా ఇంట్లో సుమారుగా 50 కి.గ్రా. ధాన్యం ఖర్చు అవుతుంది. సంవత్సరానికి 600 కి.గ్రా. ధాన్యం అవసరమవుతుంది.

b) ఆ ధాన్యం పండటానికి ఎంత నేల అవసరమో ఊహించంది.
జవాబు:
600 కి.గ్రా. ధాన్యం పండటానికి సుమారు 1.4 చ.కి.మీ. నేల అవసరమవుతుంది.

9th Class Biology Textbook Page No. 109

ప్రశ్న 5.
ఈ క్రింది పట్టికను పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 2
a) ఏ దశాబ్దంలో జనాభా పెరుగుదల అధికంగా ఉంది?
జవాబు:
1961-1971 దశాబ్దంలో జనాభా పెరుగుదల అధికంగా ఉంది.

b) ఏ దశాబ్దంలో ఆహారధాన్యాల ఉత్పత్తి అధికంగా ఉంది?
జవాబు:
1981-1991 దశాబ్దంలో ఆహారధాన్యాల ఉత్పత్తి అధికంగా ఉంది.

c) పై పట్టికలో ఏయే తేడాలు మీరు గమనించారు?
జవాబు:
జనాభా పెరుగుదలతో సమానంగా ఆహారధాన్యాల ఉత్పత్తి పెరగటం లేదు.

d) పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహారధాన్యాల ఉత్పత్తి జరుగుతున్నదా?
జవాబు:
లేదు, జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆహారధాన్యాల ఉత్పత్తి జరగటం లేదు.

e) ఏ దశాబ్దంలో జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆహారధాన్యాల ఉత్పత్తి సంతృప్తికరంగా లేదు?
జవాబు:
1991-2001 దశాబ్దంలో జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆహారధాన్యాల ఉత్పత్తి జరగలేదు. పెరుగుదల రేటు కేవలం 0.56 మాత్రమే.

f) తగినంత ఆహారధాన్యాల ఉత్పత్తి జరగకపోతే ఏమి జరుగుతుంది?
జవాబు:
తగినంత ఆహారధాన్యాల ఉత్పత్తి జరగకపోతే, దేశంలో తీవ్ర ఆహార కొరత ఏర్పడుతుంది.

g) 1991-2001 దశాబ్దంలో జనాభాని పోల్చితే సగమే ఆహారధాన్యాల, ఉత్పత్తి జరిగింది. ఫలితంగా ఆ దశాబ్దంలో ఏం జరిగి ఉంటుందని నీవు భావిస్తున్నావు?
జవాబు:
1991-2001 దశాబ్దంలో జనాభా పెరుగుదలకు సమానంగా ఆహారధాన్యాల ఉత్పత్తి జరుగలేదు. దానివలన దేశంలో తీవ్ర కరువు పరిస్థితి నెలకొని ఉండి ఉంటుంది. ప్రజలు ఆహార కొరతను ఎదుర్కొని ఉంటారు.

9th Class Biology Textbook Page No. 110

ప్రశ్న 6.
ఆహారధాన్యాల ఉత్పత్తిలో పెంపుదలకు మీరిచ్చే సూచనలు రాయండి.
జవాబు:

  1. మంచి నాణ్యమైన వ్యాధి నిరోధకత కలిగిన వంగడాలు పంటకు ఎన్నుకోవాలి.
  2. నీటి వనరుల ఆధారంగా నేల స్వభావం పరిశీలించి సరైన పంటను ఎన్నుకోవాలి.
  3. సహజ ఎరువులకు ప్రాధాన్యమివ్వాలి.
  4. వ్యాధుల నివారణకు సహజ నియంత్రణ పద్ధతులు పాటించాలి.
  5. పంట మార్పిడి, అంతర పంటలకు ప్రాధాన్యమివ్వాలి.
  6. యంత్రాలు, ఆధునిక సాంకేతికతను వాడటం వలన అధిక దిగుబడి సాధించవచ్చు.

9th Class Biology Textbook Page No. 111

ప్రశ్న 7.
అధిక ఆహార ఉత్పత్తి సాధించటానికి కొన్ని పరిష్కార మార్గాలు చూపండి.
జవాబు:

  1. సాగునేల విస్తీర్ణాన్ని పెంచడం.
  2. ప్రస్తుతం సాగులో ఉన్న నేలలోనే అధిక దిగుబడి సాథించడం.
  3. అధిక దిగుబడిని ఇచ్చే వంగడాలను అభివృద్ధి చేయడం.
  4. పంట మార్పిడి చేయడం.
  5. మిశ్రమ పంటలు పండించడం.
  6. స్వల్పకాలిక పంటలు పండించడం.

ఎ) పై వాటిలో ఏది ప్రయోజనకరమో చర్చించండి.
జవాబు:

  1. సాగునేల విస్తీర్ణాన్ని పెంచటం వలన అడవులను నరికివేయాల్సి వస్తుంది. కావున సరైన చర్యకాదు.
  2. ప్రస్తుతం సాగులో ఉన్న నేలలోనే అధిక దిగుబడి సాధించటం ప్రయోజనకర పద్దతి..
  3. ఈ పద్ధతిలోది, వంగడాల అభివృద్ధి, పంటమార్పిడి, మిశ్రమ పంటలు వంటి అన్ని పద్ధతులూ ఇమిడి ఉంటాయి.

9th Class Biology Textbook Page No. 112

ప్రశ్న 8.
ఈ క్రింది గ్రాఫ్ ను పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 3
a) పై గ్రాఫ్ ఆధారంగా పంట దిగుబడిలో నీటిపారుదల ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు:

  1. నీటిపారుదల పంటకు అత్యంత అవసరము.
  2. నీటిపారుదల సక్రమంగా ఉన్నప్పుడు పంట దిగుబడి బాగా ఉంది.
  3. సరిపడినంత ఎరువులు అందించినప్పటికి, నీటిపారుదల సక్రమంగా లేకుంటే మంచి దిగుబడి పొందలేము.

b) ఒకే పరిమాణంలో నత్రజని అందించినప్పటికీ నీటిపారుదల కల్పించిన పొలంలో, నీటిపారుదల కల్పించని పొలంలో పంట దిగుబడిలో తేడాలున్నాయా? ఉంటే అవి ఏమిటి?
జవాబు:

  1. తేడాలు ఉన్నాయి. ఒకే పరిమాణంలో నత్రజని అందించినప్పటికీ సరైన నీటిపారుదల ఉన్న పంటలు అధిక దిగుబడిని ఇచ్చాయి.
  2. నీటిపారుదల సక్రమంగా లేని పంటలు, ఎరువులు అందించినప్పటికీ సరైన దిగుబడిని ఇవ్వలేదు.

9th Class Biology Textbook Page No. 113

ప్రశ్న 9.
ఈ క్రింది గ్రాఫ్ ను పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 4
a) పై గ్రాఫ్ లో ఏ నెలల్లో మొక్కలు అధిక నీటిని ఆవిరి రూపంలో విడుదల చేస్తున్నాయో గుర్తించండి.
జవాబు:
మే మరియు జూన్ నెలల్లో మొక్కల నుండి నీరు ఆవిరి రూపంలో అధికంగా కోల్పోతున్నాయి.

b) కొన్ని నెలలలో వర్షాలు అధికంగా ఉన్నప్పటికీ మొక్కలు విడుదలచేసే నీటి ఆవిరి పరిమాణం ఒకే విధంగా ఉంటుందా?
జవాబు:
వర్షాలు ఉన్నప్పుడు పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. అందువలన మొక్కలు విడుదల చేసే నీటి ఆవిరి పరిమాణం తక్కువగా ఉంటుంది.

c) నీరు అధికంగా లభిస్తే మొక్కలపై నీటి ప్రభావం ఏవిధంగా ఉంటుంది?
జవాబు:

  1. నీరు అధికంగా లభించినపుడు మొక్కలు వేగంగా పెరుగుతాయి.
  2. భూమి నుండి పోషకాలను బాగా గ్రహించగలుగుతాయి.

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

9th Class Biology Textbook Page No. 114

ప్రశ్న 10.
a) వాతావరణం వేడిగా ఉన్నప్పుడు పత్ర రంధ్రాలు మూసుకొని పోతాయనుకున్నాం కదా ! మరి ఇది కార్బన్ డై ఆక్సైడ్ శోషణపై ఏ ప్రభావాన్ని చూపుతుంది?
జవాబు:

  1. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు పత్ర రంధ్రాలు మూసుకొనిపోతాయి.
  2. అందువలన CO2 శోషణ మొక్కలలో తగ్గుతుంది.

b) కార్బన్ డై ఆక్సైడ్ శోషణ రేటులో మార్పు మొక్కలపై ఏ విధమైన ప్రభావం చూపుతుంది?
జవాబు:
కార్బన్ డై ఆక్సైడ్ శోషణ రేటు తగ్గటం వలన మొక్కలలో ఆహారోత్పత్తి తగ్గుతుంది. దీనివలన మొక్కల పెరుగుదల తగ్గుతుంది. కొత్త కొమ్మలు, ఆకులు ఏర్పడవు.

c) ఇలాంటి సమయంలో మొక్కలకు నీళ్ళు లేకపోతే ఏమౌతుంది?
జవాబు:
ఇలాంటి సమయంలో మొక్కలకు నీళ్ళు లేకపోతే మొక్కల ఆరోగ్యం పాడైపోతుంది. పంట దిగుబడి తీవ్రంగా తగ్గుతుంది.

9th Class Biology Textbook Page No. 114

ప్రశ్న 11.
వ్యవసాయానికి నీరు ప్రధాన అవసరం. మీ గ్రామంలో వ్యవసాయం కోసం ఉన్న ముఖ్యమైన నీటి వనరులు ఏమున్నాయి? రైతులు వాటిని ఎలా ఉపయోగించుకుంటున్నారు?
జవాబు:

  1. మా గ్రామంలో వ్యవసాయం కొరకు కాలువలు, చెరువులు ఉన్నాయి.
  2. వర్షపునీరు చెరువును చేరి నిల్వ చేయబడుతుంది.
  3. ఈ నీటిని పంటకాలువల ద్వారా పంట పొలాలకు మళ్ళించి వ్యవసాయం చేస్తారు.
  4. మా గ్రామంలో కొంత ప్రాంతం సాగర్ కాలువ కింద సాగుబడిలో ఉంది.

9th Class Biology Textbook Page No. 114

ప్రశ్న 12.
వరి పండించటానికి అధిక పరిమాణంలో నీరు అవసరం. ఇలా నీరు ఎక్కువగా అవసరమయ్యే పంటల పేర్లు చెప్పగలరా?
జవాబు:
వరితోపాటుగా గోధుమ, చెరకు వంటి పంటలకు అధిక నీరు అవసరమౌతుంది.

9th Class Biology Textbook Page No. 115

ప్రశ్న 13.
తక్కువ నీరు కావలసిన పంటల పేర్ల జాబితా రాయండి.
జవాబు:
ప్రత్తి, జనపనార, సజ్జలు, మొక్కజొన్న, కొబ్బరి, మినుములు, పెసలు, వేరుశనగలకు తక్కువ నీరు అవసరం.

9th Class Biology Textbook Page No. 116

ప్రశ్న 14.
a) ఒక పొలంలో చాలా సంవత్సరాల పాటు ఒకే పంట సాగుచేస్తూ ఉంటే, నేలలోని పోషకాలు ఏమౌతాయి?
జవాబు:
ఒక పొలంలో చాలా సంవత్సరాల పాటు ఒకే పంట సాగుచేస్తే ఒకే విధమైన పోషకాలు శోషించబడి, నేలలో పోషకాల కొరత ఏర్పడుతుంది. అందువలన పంట దిగుబడి విపరీతంగా తగ్గుతుంది.

b) కోల్పోయిన పోషకపదార్థాలను నేల తిరిగి ఎలా పొందుతుంది?
జవాబు:
నేల కోల్పోయిన పోషకపదార్థాలను వృక్ష, జంతు వ్యర్థాలు కుళ్ళటం వలన హ్యూమస్ రూపంలో తిరిగి పొందుతుంది. కానీ ఇది చాలా నెమ్మదైన ప్రక్రియ. అందువలన రైతులు రసాయన ఎరువులు వాడుతున్నారు. ఇవి ఖర్చుతో కూడుకొని నేల ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి.

9th Class Biology Textbook Page No. 116

ప్రశ్న 15.
ఒక రైతు తన పొలంలో గత 5 సంవత్సరాల నుండి చెరకు పంటను పండిస్తున్నాడు. మరో రైతు మొదటి సంవత్సరం చెరకు పంట, రెండవ సంవత్సరం సోయా చిక్కుళ్ళు, మూడవ సంవత్సరం తిరిగి చెరకు పంట పండించాడు. ఏ పొలంలో పోషకపదార్థాలు నశిస్తాయి? ఎందుకు?
జవాబు:
వరుసగా ఐదు సంవత్సరాలు చెరకు పండించిన రైతు పొలంలో పోషకాలు లోపిస్తాయి. చెరకు ఒకే విధమైన పోషకాలను ప్రతి సంవత్సరం నేల నుండి గ్రహిస్తుంది. కావున నేలలో ఆ పోషకాలు తగ్గిపోయి, పోషకాల కొరత ఏర్పడుతుంది.

పంట మార్పిడి పాటించటం వలన నేలలోని పోషకాల వినియోగం మారి, పోషకాలు పునరుద్ధరింపబడతాయి. పంట మార్పిడి విధానంలో లెగ్యూమినేసి పంటలు మంచి ఫలితాలను ఇస్తాయి.

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

9th Class Biology Textbook Page No. 118

ప్రశ్న 16.
తమలపాకులను మిశ్రమపంటలుగా మాత్రమే పండిస్తారు. ఎందుకు?
జవాబు:

  1. తమలపాకు మొక్క తీగవలె ఉండి ఎత్తు మొక్కలకు అల్లుకొంటుంది.
  2. నేల అంతా ఖాళీగా ఉండుట వలన అంతర పంటకు అనుకూలంగా ఉంటుంది.
  3. అందువలన తమలపాకుతో పాటు పెసర, మినుము వంటి మిశ్రమపంటలు పండిస్తారు.
  4. దీనివలన రైతుకు రెండు పంటలు పండి ఆర్థికలాభం చేకూరుతుంది.
  5. నేలలో పోషకాలు పునరుద్ధరింపబడతాయి.

9th Class Biology Textbook Page No. 118

ప్రశ్న 17.
లెగ్యూమినేసి జాతికి చెందిన పంటల పేర్లు కొన్నింటిని చెప్పండి.
జవాబు:
చిక్కుడు, మినుము, పెసర, వేరుశనగ, పిల్లి పెసర వంటి పంటలు లెగ్యూమినేసి జాతికి చెందుతాయి. ఇవి నేలలో నత్రజనిని స్థాపించి పోషక విలువలను పెంచుతాయి.

9th Class Biology Textbook Page No. 118

ప్రశ్న 18.
నత్రజని స్థాపన చేసే బాక్టీరియాల పేర్లను తెలుసుకోండి.
జవాబు:
రైజోబియం, అజటో బాక్టర్, నైట్రోమోనాస్, సూడోమోనాస్ వంటి బాక్టీరియాలు నత్రజని స్థాపనకు తోడ్పడుతాయి. ఇవి వాతావరణంలోని నత్రజనిని నైట్రేట్లుగా మార్చి మొక్కలకు అందిస్తాయి.

9th Class Biology Textbook Page No. 122

ప్రశ్న 19.
ఈ క్రింది పట్టిక పరిశీలించి, ప్రశ్నలకు సమాధానాలు రాయంది.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 5

a) పై పట్టిక నుండి మీరు ఏం గ్రహించారు?
జవాబు:
నత్రజని స్థాపనలో బాక్టీరియాతో పాటు, శైవలాలు కూడా పాల్గొంటున్నాయి. మరికొన్ని బాక్టీరియాలు, శైవలాలు, శిలీంధ్రాలు, ఫాస్పరస్ ను మొక్కలకు అందిస్తున్నాయి.

b) ఏ మూలకాలు అధికంగా సంశ్లేషణ చేయబడతాయి?
జవాబు:
నత్రజని నేలలో అధికంగా సంశ్లేషణ చేయబడుతుంది.

9th Class Biology Textbook Page No. 123

ప్రశ్న 20.
ఈ క్రింది పట్టికను పరిశీలించి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 6
a) పై పట్టిక ఆధారంగా చూస్తే మనం 50 కి.గ్రా.ల యూరియాను నేలకు అందిస్తే 23 కి.గ్రా. నత్రజని (466) నేలలోకి పునరుద్ధరింపబడుతుంది. అంతే పరిమాణంలో నత్రజని పొందాలంటే ఎంత అమ్మోనియం సల్ఫేట్ నేలలో కలపాలి?
జవాబు:
అంతే పరిమాణంలో (23 కి.గ్రా. ) నత్రజని పొందాలంటే సుమారు 100 కి.గ్రా. అమ్మోనియం సల్ఫేట్ (యూరియా)ను నేలలో కలపాలి.

b) 50 కి.గ్రా.ల సూపర్ ఫాస్ఫేట్ నేలలో కలిపితే ఎంత ఫాస్పేట్ నేలలోకి చేరుతుంది?
జవాబు:
50 కి.గ్రా. ల సూపర్ ఫాస్ఫేట్ నేలలో కలిపితే, 4 నుండి 4.5 కి.గ్రా. ఫాస్పేట్ నేలలోకి చేరుతుంది.

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

9th Class Biology Textbook Page No. 123

ప్రశ్న 21.
స్థానిక వరి రకం (బంగారు తీగ) మరియు హైబ్రిడ్ వరి రకం (IR – 3) పై నత్రజని ఎరువులను చల్లడం వల్ల కలిగే ప్రభావాన్ని కింది స్లో చూడండి.
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 7
a) నత్రజని ఎరువుల ప్రభావం బంగారు తీగ మరియు IR- 8 వరి రకాలపై చూపే ప్రభావంలో తేడా ఏమిటి?
జవాబు:

  1. నత్రజని ఎరువుల ప్రభావం, స్థానిక వరి రకం బంగారు తీగపై వ్యతిరేక ప్రభావం చూపింది.
  2. ఎరువు మోతాదు పెరిగేకొలది పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది.
  3. వరి రకం IR – 8 మీద నత్రజని ప్రభావం సానుకూలంగా ఉంది.
  4. నత్రజని ఎరువు మోతాదు పెరిగే కొలది హైబ్రిడ్ రకం IR-8 లో దిగుబడి కూడా పెరుగుతూ వచ్చింది.

9th Class Biology Textbook Page No. 125

ప్రశ్న 22.
మనుషుల ఆరోగ్యంపై క్రిమిసంహారులు, కలుపు నాశకాలు ఏ విధమైన ప్రభావాన్ని చూపుతాయి?
జవాబు:

  1. మనుషుల ఆరోగ్యంపై క్రిమిసంహారులు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.
  2. క్రిమిసంహారులను పిచికారి చేసే సమయంలో ఊపిరితిత్తులు తీవ్ర విష ప్రభావానికి లోనవుతాయి.
  3. వీటి వలన అనేక చర్మవ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పడుతున్నాయి.
  4. కొన్ని హానికర రసాయనాలు నాడీవ్యవస్థను, రక్తప్రసరణ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి.

9th Class Biology Textbook Page No. 126

ప్రశ్న 23.
ఈ మధ్యకాలంలో పొద్దుతిరుగుడు పంటలో రైతులు చేతిగుడ్డతో పుష్పాలను అద్దుతూ పోతున్నారు. ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడిందో చెప్పగలరా?
జవాబు:

  1. రైతులు విచక్షణారహితంగా కీటకనాశనులు వాడటం వలన ఉపయోగకర కీటకాలు కూడా మరణించాయి.
  2. అందువలన మొక్కలలో పరాగసంపర్కం జరుగక పంట దిగుబడి తగ్గిపోయింది.
  3. దీనిని అధిగమించటానికి రైతులు పొద్దుతిరుగుడు పంటలలో చేతిగుడ్డతో పుష్పాలను అద్ది కృత్రిమ పరాగసంపర్కం చేయాల్సి వచ్చింది.

9th Class Biology Textbook Page No. 126

ప్రశ్న 24.
పంట పొలంలో కీటక నిర్మూలన గురించి స్నేహితులతో చర్చించండి. ప్రత్యామ్నాయాలు సూచించండి.
జవాబు:

  1. కీటక నిర్మూలన కొరకు కీటక నాశకాలు వాడటం వలన అవి పంట ఉత్పత్తులు, పర్యావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.
  2. దీనిని అధిగమించటానికి రైతులు సహజ నియంత్రణ పద్ధతులు పాటించాలి.
  3. వెల్లుల్లి రసం, N.P.U ద్రావణం వంటి బయో పెస్టిసైడ్స్ వాడాలి.
  4. వ్యాధి క్రిములను తినే మిత్ర కీటకాలను ప్రోత్సహించాలి.
  5. పంట మార్పిడి విధానం, విత్తనశుద్ధి పద్ధతులలో వ్యాధులను ఎదుర్కొనవచ్చు.
  6. ఆకర్షక పంటలు వేసి కీటకాల తాకిడి తగ్గించవచ్చు.

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

9th Class Biology Textbook Page No. 127

ప్రశ్న 25.
పత్తి పొలాలలో జనుము మరియు బంతిపూలను ఎందుకు పండిస్తారో మీరు చెప్పగలరా?
జవాబు:

  1. పత్తి పొలాలలో జనుమును మరియు బంతిపూలను ఆకర్షక పంటగా పండిస్తారు.
  2. ఇవి కీటకాలను సులభంగా ఆకర్షిస్తాయి.
  3. అందువలన ప్రధానపంటలు కీటకాల నుండి రక్షింపబడతాయి.
  4. కీటకాలను ఎదుర్కొనటానికి ఇదొక సహజ నియంత్రణ పద్ధతి.

9th Class Biology 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1

1. బాష్పోత్సేకము
1) ఒక పాలిథిన్ సంచిని తీసుకోవాలి.
2) ఆరోగ్యంగా ఉన్న మొక్క ఆకులను సంచిలో కప్పి ఉంచి దారంతో కట్టాలి.
3) 4-5 గంటలపాటు దానిని పరిశీలిస్తూ ఉండాలి.
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 8

పరిశీలనలు :

  1. ఆకులను పాలిథిన్ సంచితో కప్పి ఉంచినప్పుడు మొక్క ఎంత మొత్తంలో నీటిని నీటి ఆవిరి రూపంలో గాలిలోనికి విడుదల చేస్తుందో చూడవచ్చు.
  2. పిండి పదార్థాలను తయారుచేయడానికి మొక్క తాను పీల్చుకున్న నీటిలో 0.1 శాతం నీటిని మాత్రమే వినియోగించుకుంటుంది.
  3. బాష్పోత్సేకము రేటు రాత్రి కంటే పగలు ఎక్కువగా ఉంటుంది.

కృత్యం – 2

2. a) మీ గ్రామ చిత్రపటాన్ని గీసి, గ్రామంలోని ముఖ్యమైన నీటి వనరులను గుర్తించండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 9

b) ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల పటంలో నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువ మార్గాలను చూపండి. ఏ ఏ జిల్లాలకు నీటి వసతి లభిస్తుందో గుర్తించండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 10

కృత్యం – 3

3. మీ ప్రాంతంలో పంట పొలాల్లో కల్పించే ప్రముఖమైన కలుపు మొక్కల జాబితా తయారుచేయండి. అవి ఏ పంటతో పాటు పెరుగుతాయో రాయండి.
జవాబు:
కలుపు మొక్కల జాబితా :
సైనోడాన్ డాక్టలాన్, సైపరస్ రొటండస్ (తుంగ), డిజిటారియా లాంగిఫోలిమా, డాక్టలోనియమ్ కలోనమ్, సెటేరియా గ్లూకా, సైపరస్ డిఫార్మిస్, ఐకోర్నియా క్రాసిప్స్ (బుడగతమ్మ), సాల్వీనియా మొలస్టా, ఆల్టర్ నాంతిర సెసైలిస్ (పొన్నగంటి), సెలోషియా అర్జెన్షియా (గురంగుర), లూకాస్ ఏస్పిరా (తుమ్మి), పోర్చులేక ఒలరేషియా (పావలికూర), క్లియోమి విస్కోసా (కుక్కవామింటా), సొలానమ్ నైగ్రమ్ (బ్లాక్ నైట్ షేడ్), అర్జిమోన్ మెక్సికానా (బాలరక్కొస) ఎబుటిలాన్ ఇండికమ్ (తుత్తురి బెండ), యూఫోర్బియా హిరా (పచ్చబొట్లు), వెర్నోనియా సిన్నోరా, ఇఖనోక్లోవ కొలానమ్ (ఉడలు), కొమ్మలైనా బెంగా లెన్సిస్ (వెన్నవెదురు), అవినా ఫాట్యువ (అడవియవలు), ఇఖనోక్లోవ క్రస్ గల్లి (నీటి గడ్డి), ఎల్యుసైన్ ఇండికా (గూ గ్రాస్), ఎకిరాంథిస్ ఏస్పిరా (ఉత్తరేణి), ఇక్లిష్టా ప్రోస్టేట (గుంటకలగర లేదా బృంగరాజ) మొదలగునవి.

పంట రకంపంటపై పెరిగే కలుపు మొక్కలు
వరిగరిక, తుంగ, బుడగ తమ్మ, పొన్నగంటి
వేరుశనగగురంగుర, గరిక, తుంగ, తుత్తురి బెండ, వెన్న వెదురు, కుక్కవామింట, తుమ్మి, పావలికూర, బాలరక్కిస.
మినుములుగరిక, తుంగ, తుత్తురి బెండ, వెన్న వెదురు, సాల్వీనియా మొలస్టా, పచ్చబొట్లు, బంగారు తీగ.
మొక్కజొన్నపచ్చబొట్లు, సొలానమ్ నైగ్రమ్, గరిక, తుంగ
పెసలుఉడలు, గరిక, తుంగ, బాలరక్కొస, పావలికూర

ప్రయోగ కృత్యములు.

ప్రయోగశాల కృత్యము – 1

1. 1) తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు, కూరగాయలు పండ్లలో ప్రతిదానికి ఉదాహరణ తీసుకోండి.
2) ముందుగా వాటిలో ఉన్న లక్షణాలను రాయండి.
3) ఆ పంటలలో ఏ మార్పులు మీరు కోరుకుంటున్నారో రాయండి. మీరు కోరుకుంటున్న మార్పులకు తగిన కారణాలు రాయండి.
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 11

2. సొంత హైబ్రిడ్ పుష్పాలను ఉత్పత్తి చేయటం:
జవాబు:

  1. 5 లేక 6 ఎరుపు రంగు పుష్పాల (చంద్రకాంత) మొక్కలను ఎంపిక చేసుకోవాలి.
  2. మిగిలిన పుష్పాలన్నింటిని తెంచివేయాలి.
  3. ప్రతి పుష్పానికి ఉండే కేసరావళిని తొలగించాలి.
  4. పసుపు రంగు పుష్పాన్ని తీసుకొని, ఎరుపురంగు పుష్పంలో ఉండే కీలాగ్రంపై రుద్ది పరాగ సంపర్కం జరపాలి. (సాయంత్రం వేళల్లో చేయాలి)
  5. సంకరణం చేసిన మొక్కలను గుర్తించడానికి ఆ పుష్పాలుండే కాండాలకు తాడు కాని, దారం కాని గుర్తుగా కట్టాలి. ఎందుకంటే కొద్ది రోజుల్లో ఆ పుష్పాల నుండి ఏర్పడే గింజలను సేకరించాల్సి ఉంటుంది.
  6. ఒక వారం రోజుల్లో నల్లని విత్తనాలు ఏర్పడతాయి.
  7. విత్తనాలను రెండు వారాలపాటు ఎండనిచ్చి వేరొక కుండలో నింపాలి.
  8. కొత్త మొక్క పెరిగి పుష్పించే వరకు జాగ్రత్తగా సంరక్షించాలి.
  9. ఆ మొక్క నుండి ఏర్పడే పుష్పాలను పరిశీలించాలి.

పరిశీలనలు :
మొక్క నుండి ఏర్పడే పుష్పాలు నారింజ రంగులో ఉంటాయి. ఎరుపు మరియు పసుపు రంగు పుష్పాల కలయికతో నారింజ రంగు పుష్పాలు ఏర్పడతాయి.

AP Board 9th Class Social Solutions Chapter 24 రోడ్డు భద్రతా విద్య

SCERT AP 9th Class Social Studies Guide Pdf 24th Lesson రోడ్డు భద్రతా విద్య Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 24th Lesson రోడ్డు భద్రతా విద్య

9th Class Social Studies 24th Lesson రోడ్డు భద్రతా విద్య Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
వాహన చోదకులు ఏ విధమైన ధృవపత్రాలను తమ వెంట ఉంచుకోవాలి? ఏ విధమైన నైపుణ్యాలు భద్రతాపరమైన డ్రైవింగ్ కు అవసరం.? (AS1)
జవాబు:
వాహన చోదకులు ఈ క్రింది పేర్కొన్న ధ్రువపత్రాలను తమ వెంట ఉంచుకోవాలి.

  1. డ్రైవింగ్ లైసెన్స్
  2. వాహన రిజిస్ట్రేషన్
  3. వాహనం యొక్క ఇన్స్యూరెన్స్
  4. వాహనం యొక్క కాలుష్యరహిత ధ్రువపత్రం

భద్రతాపరమైన డ్రైవింగ్ కు నైపుణ్యాలు :

  1. రక్షిత, ప్రయాణానికి ఎల్లప్పుడూ హెల్మెట్ ధరించాలి.
  2. ట్రాఫిక్ సిగ్నల్స్ ను అతిక్రమించరాదు.
  3. భారీ వాహనదారులు తప్పనిసరిగా సీటు బెల్ట్ లు ఉపయోగించాలి.
  4. తమ వాహనాన్ని మంచి స్థితిలో ఉంచుకోవాలి.
  5. ఎడమవైపు నుంచి వాహనాలను దాటరాదు.

ప్రశ్న 2.
ట్రాఫిక్ గుర్తులను ఒకవేళ ఎవరైనా పాటించకుండా వెళితే ఏమవుతుంది? (AS1)
జవాబు:

  1. ట్రాఫిక్ గుర్తులను పాటించకపోవడం వలన ప్రమాదాలు జరగటానికి అవకాశం ఉంటుంది.
  2. ప్రమాదాలు ఒక్కొక్కసారి తీవ్ర గాయాలకు, అంగవైకల్యానికి దారితీయవచ్చు.
  3. ఘోర ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలను కోల్పోవటానికి అవకాశం ఉంటుంది.
  4. ట్రాఫిక్ గుర్తులను పాటించకపోవడం వలన మనకు మాత్రమేగాక ఎదుటివారికి కూడా హాని జరగవచ్చు.
  5. విలువైన వాహనాలు దెబ్బతింటాయి.
  6. అందువల్ల ట్రాఫిక్ గుర్తులను పాటిస్తూ మన ప్రాణాలను కాపాడుకుంటూ, ఎదుటివారి ప్రాణాలకు కూడా రక్షణ కల్పిస్తే మానవ జీవితానికి సార్థకత చేకూరుతుంది.

AP Board 9th Class Social Solutions Chapter 24 రోడ్డు భద్రతా విద్య

ప్రశ్న 3.
రోడ్డు భద్రతకుగాను మీ ప్రాంతంలో తీసుకుంటున్న చర్యలను సూచించండి. (AS4)
జవాబు:
రోడ్డు భద్రతకుగాను మా ప్రాంతంలోని వివిధ వర్గాల వారు తీసుకుంటున్న చర్యలు :
డ్రైవర్ తీసుకుంటున్న చర్యలు :

  1. ఎడమవైపున ఉండి కుడివైపున వేగంగా వెళ్లే వాహనాలకు దారి వదులుతున్నారు.
  2. ఎడమవైపు నుంచి వాహనాలను దాటరు.
  3. రక్షిత ప్రయాణానికి ఎల్లప్పుడూ హెల్మెట్ ధరిస్తారు.
  4. తక్కువ కార్బన్ మోనాక్సైడ్ వదిలే వాహనాలనే ఉపయోగిస్తున్నారు.
  5. అనవసరంగా హారన్ మోగించరు.
  6. భారీ వాహనదారులు తప్పనిసరిగా సీటు బెల్టులు ఉపయోగిస్తున్నారు.
  7. ట్రాఫిక్ సిగ్నలను అతిక్రమించరు.
  8. తమ వాహనాన్ని మంచి స్థితిలో ఉంచుతారు.
  9. ఆల్కహాల్ సేవించి వాహనాలను నడపరు.
  10. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడపరు.

పాదచారులు పాటిస్తున్న నిబంధనలు :

  1. పాదచారులకు నిర్దేశించిన మార్గంలోనే నడుస్తారు. ఒకవేళ అలాంటి ప్రత్యేక మార్గం లేకుంటే, రోడ్డు ఇరుకుగా ఉంటే రోడ్డుకు కుడివైపునే ఎదురుగా వస్తున్న వాహనాలను పరిశీలిస్తూ నడుస్తారు.
  2. రాత్రివేళ బయట రోడ్డుపై నడుస్తున్నప్పుడు తప్పనిసరిగా ప్రతిబింబించే దుస్తులను ధరిస్తారు.
  3. రాత్రివేళల్లో నడిచేటప్పుడు విధిగా టార్చిలైట్ దగ్గర ఉంచుకుంటారు.
  4. రోడ్డును దాటునపుడు ఎడమవైపు, కుడివైపు చూసి వాహనాలు రాకుండా ఉన్నప్పుడు దాటుతారు.
  5. ఒకవేళ వాహనాలు రెండువైపులా, వస్తూ ఉంటే అవి వెళ్లే వరకు వేచి ఉంటారు.
  6. వాహనాలు రాకుండా ఉన్నప్పుడు వేగంగా నడుచుకుంటూ రోడ్డును దాటుతారు. రెండువైపులా వాహనాలు వస్తున్నాయో లేదో గమనిస్తారు.
  7. రోడ్డును దాటుటకు జీబ్రా క్రాసింగ్ ను ఉపయోగిస్తారు.
  8. రోడ్డుపై నడుస్తున్నపుడు, రోడ్డును దాటుతున్నపుడు మొబైల్ ఫోన్ ను ఉపయోగించరు.
  9. ట్రాఫిక్ పోలీస్ సహాయంతో రోడ్డును దాటుతారు.

ప్రశ్న 4.
తప్పనిసరిగా, జాగ్రత్తపడే, సమాచార నిమిత్తం ఉన్న ట్రాఫిక్ గుర్తులను ఉదాహరణలతో వివరించండి. (AS1)
జవాబు:
ట్రాఫిక్ గుర్తులు :

  1. తప్పనిసరిగా పాటించవలసిన గుర్తులు
  2. సమాచార గుర్తులు
  3. జాగ్రత్తపరచే గుర్తులు.

AP Board 9th Class Social Solutions Chapter 24 రోడ్డు భద్రతా విద్య 4

ప్రశ్న 5.
కమల ఒక నూతన వాహనాన్ని కొనాలని భావించింది. ఆమెకు ఏ విధమైన ధ్రువపత్రాలు రిజిస్ట్రేషన్ సమయంలో అవసరమవుతాయో వివరించండి. (AS1)
జవాబు:
కమల ఒక నూతన వాహనాన్ని కొనాలని భావించినప్పుడు ఆమెకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ సమయంలో అవసరమైన ధ్రువపత్రాలు :

  1. అమ్మకం చేసినట్లుగా డీలర్ నుంచి ధ్రువపత్రం
  2. రోడ్డుపై నడపటానికి వీలైనది అని తెలిపే ధ్రువీకరణ పత్రం
  3. వాహన బీమా ధ్రువపత్రం
  4. కాలుష్య నియంత్రణ ధ్రువపత్రం
  5. నివాస రూఢీ ధ్రువపత్రం

శాశ్వత రిజస్ట్రేషన్ :
తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేయించేటపుడు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలను నిర్ణీత దరఖాస్తుతో పాటుగా ఆర్.టి.ఏ అధికారులకు ఒక నెలలోపుగా సమర్పించి శాశ్వత రిజిస్ట్రేషన్ పొందవచ్చు.

AP Board 9th Class Social Solutions Chapter 24 రోడ్డు భద్రతా విద్య

ప్రశ్న 6.
రాము తన వాహన రిజిస్ట్రేషన్ నెంబర్‌ను వేరే వాహనానికి మార్చాలని భావించాడు. ఇది చేయవచ్చా చేయకూడదా? ఎందుకో వివరించండి. (AS6)
జవాబు:
రాము తన వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ ను వేరే వాహనానికి మార్చడానికి వీల్లేదు. ఒక వాహన రిజిస్ట్రేషన్ నెంబర్‌కు, వేరొక రిజిస్ట్రేషన్ నెంబర్‌కు పోలిక ఉండదు.

అలా మార్చడం వలన :

  1. ప్రమాదాలు జరిగిన సమయంలో ఇబ్బందులు ఎదురౌతాయి.
  2. నియమ నిబంధనలకు వ్యతిరేకం.
  3. ఒక్కొక్క నెంబరు ప్రారంభం ఒక్కొక్క వాహనానికి వేరేగా ఉంటుంది.
  4. రిజిస్ట్రేషన్ సందర్భంలో ఆర్.టి.ఏ. అధికారులకు అప్పగించిన ధృవపత్రాలలో తేడా రాకూడదు.
  5. అలా మార్చిన వాహనాలను ఆర్.టి.ఏ. అధికారులు సీజ్ చేస్తారు.

కాబట్టి ఒక వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ ను వేరొక రిజిస్ట్రేషన్ నెంబరుకు మార్చకూడదు.

ప్రశ్న 7.
రోడ్డు భద్రతా ఆవశ్యకతను వివరించండి. (AS1)
జవాబు:

  1. జనాభా, పారిశ్రామికీకరణ, నగరీకరణ, గ్లోబలైజేషన్ వంటి వాటి పెరుగుదల వాహనాల రద్దీని కూడా పెంచింది.
  2. అందువల్ల రవాణా సులభతరం కావడానికి ఒక క్రమబద్ధీకరణ అవసరం.
  3. క్రమబద్ధీకరణ అనగా రోడ్డును ఉపయోగించే వారందరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించడమే.
  4. రోడ్డు భద్రతా నియమాలను పాటించడం రోడ్డును ఉపయోగించుకునే ప్రతి ఒక్కరి బాధ్యత.
  5. రోడ్డు భద్రతా నియమాలను పాటించకపోతే ప్రాణాంతకమైన ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది.
  6. రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ద్వారా మనం సుఖంగా ఉండడమే గాక తోటి ప్రయాణికులను కూడా సుఖంగా ఉంచవచ్చును.

ప్రశ్న 8.
పేజీ నెం. 286లోని ‘ప్రమాద బాధితులు – వయస్సు’ పట్టిక చదివి అత్యధిక కేసులు నమోదైన వయస్సు వారిని గుర్తించి, బార్ ను గీయండి. (AS3)
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 24 రోడ్డు భద్రతా విద్య 5

ప్రశ్న 9.
పేజీ నెం. 287లోని ‘ట్రాఫిక్ ఇబ్బందులు’ అంశాన్ని చదివి, వ్యాఖ్యానించండి. (AS2)
జవాబు:
ఇప్పుడు ప్రతీ పట్టణంలో, నగరాలలో అతి ముఖ్యమైన సమస్య ట్రాఫిక్ ఇబ్బందులు (గందరగోళం) తెల్లవారి లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు వివిధ పనులు నిమిత్తం, ఉద్యోగ రీత్యా ప్రజలు వాహనాలనే ఉపయోగించే తమ ప్రయాణాలు చేయడం వలన ట్రాఫిక్ జాంకు కారణమౌతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, శ్రామికులు, డాక్టర్లు ఇలా ఎందరో వివిధ పనుల నిమిత్తం బయలుదేరి ట్రాఫిక్ లో చిక్కుకుని బాధలు అనుభవిస్తుంటారు. డ్రైనేజీ నిర్మాణం సక్రమంగా లేకపోవడం, వీధుల్లో సంచరించే జంతువులు, పండ్లు, కూరగాయల వ్యాపారులు, వాహనదారులు ముఖ్యంగా కారు, ఆటో రిక్షా వారు “నిలుపుటకు వీలులేదు” అనే ప్రదేశంలో వాహనాలు నిలుపుట వల్ల ట్రాఫిక్ జాంకు కారణమౌతున్నాయి.

కాబట్టి వీలైనంత వరకు దగ్గర పనులకు నడవడం ద్వారా కొంత వరకు ఈ ఇబ్బందులను అధిగమించవచ్చు.

9th Class Social Studies 24th Lesson రోడ్డు భద్రతా విద్య InText Questions and Answers

9th Class Social Textbook Page No.286

ప్రశ్న 1.
ఏ గ్రూపు వయస్సు వారిపై ఎక్కువ కేసులు ఉన్నాయి? ఎందుకో మీరు చెప్పగలరా?
జవాబు:
25 – 30 సం||రాల మధ్య వయస్కులపై ఎక్కువ కేసులు ఉన్నాయి. వారిపై ఎక్కువ కేసులు ఉండటానికి కారణం :

  1. ప్రతి విషయంలోనూ ఈ వయస్సువారు దుడుకుతనంతో వ్యవహరిస్తారు.
  2. తనకు నచ్చినట్లే చేయాలనే స్వభావం ఎక్కువగా కలిగి ఉంటారు.
  3. వివిధ అవసరాల నిమిత్తం రోడ్డును ఎక్కువగా ఉపయోగిస్తున్నది కూడా ఈ వయస్సు వారే.
  4. ఈ వయస్సులోనివారు స్వతంత్రతను ఎక్కువగా కోరుకోవడంతో వారు ప్రమాదాలను కూడా ఎక్కువగా ఎదుర్కోవలసి వస్తున్నది.
  5. కాబట్టి ఈ వయస్సు వారే ఎక్కువగా ప్రమాదాలకు గురౌతున్నారు.

ప్రశ్న 2.
20 – 25, 25 – 30 వయస్సు వారిపై ఎన్ని కేసులు ఉన్నాయి?
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 24 రోడ్డు భద్రతా విద్య 2

9th Class Social Textbook Page No.287

ప్రశ్న 3.
ఈ చిత్రాన్ని పరిశీలించి ప్రమాదాలకు గురైన వాహనాల యొక్క సమాచారంతో మీ తరగతిలో చర్చించండి.
AP Board 9th Class Social Solutions Chapter 24 రోడ్డు భద్రతా విద్య 1

హైదరాబాద్ నగరం

ద్విచక్ర వాహనాల ప్రమాదాల శాతం30%
త్రిచక్ర వాహనాల ప్రమాదాల శాతం11%
నాలుగు చక్రాల వాహనాల ప్రమాదాల శాతం28%
డి.సి.యంల ప్రమాదాల శాతం3%
తెలియని వాహనాల ప్రమాదాల శాతం5%
ఆర్టీసీ బస్సుల ప్రమాదాల శాతం11%
ప్రైవేట్ బస్సుల ప్రమాదాల శాతం1%
ట్రక్కుల ప్రమాదాల శాతం5%
టెంపోట్రాలి ప్రమాదాల శాతం2%
ఇతరములు4%
మొత్తం ప్రమాదాల సంఖ్య2577

ప్రశ్న 4.
ఏ రకమైన వాహనాలు ఎక్కువ ప్రమాదాలకు కారణం అయ్యాయి. ఎందుకో చెప్పగలవా?
జవాబు:
ద్విచక్రవాహనాలు ఎక్కువ ప్రమాదాలకు కారణం అయ్యాయి. ఎందుకంటే

  1. యువకులు ఆ వాహనాలను ఎక్కువగా ఉపయోగించటం.
  2. వారు రోడ్డు నియమ నిబంధనలను పాటించకపోవటం.
  3. ద్విచక్ర వాహనాలకు ప్రమాదం జరగటం సులభతరం.

AP Board 9th Class Social Solutions Chapter 24 రోడ్డు భద్రతా విద్య

ప్రశ్న 5.
రోడ్డు నియమ నిబంధనలు అంటే ఏమిటో మీ తరగతి గదిలో చర్చించండి.
జవాబు:

  1. రోడ్డు నియమ నిబంధనలు అనగా రోడ్డుపై వెళ్ళువారు తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు.
  2. అలా పాటించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
  3. కారణం జనాభా విపరీతంగా పెరగడం వలన, రోడ్లు ఇరుకుగా ఉండటం వలన, రోడ్డు పైకి వచ్చే వారి సంఖ్య పెరుగుతుంది కాబట్టి ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది.
  4. రోడ్డు పైకి వచ్చేవారు ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వారు త్వరగా వెళ్ళాలి అనే భావంతో ప్రయాణించడం వలన ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది.
  5. రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే రోడ్డుపైకి వచ్చేవారు కొన్ని నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. దానితో ప్రమాదాలను నివారించడానికి అవకాశం ఉంటుంది.

9th Class Social Textbook Page No.288

ప్రశ్న 6.
డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకు తప్పనిసరిగా కలిగి ఉండాలి?
జవాబు:
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడపరాదు. ఇది ఎవ్వరికీ, మినహాయింపు కాదు.
డ్రైవింగ్ లైసెన్స్ రకాలు :
1) లెర్నర్ లైసెన్స్ :
ఇది తాత్కాలికమైనది. డ్రైవింగ్ నేర్చుకొనుటకు ఆరునెలల కాల పరిమితితో దీనిని జారీ చేస్తారు.

2) శాశ్వత లైసెన్స్ :
తాత్కాలిక లైసెన్స్ జారీచేసిన ఒక నెల తరువాత నుంచి శాశ్వత లైసెన్స్ పొందుటకు అర్హత లభిస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు డ్రైవింగ్ చేసే విధానం అంతా పరిశీలించి ఇస్తారు కాబట్టి రోడ్డుపై వాహనాలు నడిపేవారికి డ్రైవింగ్ వచ్చి ఉండాలి మరియు డ్రైవింగ్ విధి విధానాలు తెలిసిఉండాలి. కావున రోడ్డుపై వాహనాలు నడుపువారికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.

9th Class Social Textbook Page No.290

ప్రశ్న 7.
మీ టీచర్ సహాయంతో రోడ్డు ఉపరితలంపై సూచించే గుర్తులను ఆర్.టి.ఏ అధికారులు / ట్రాఫిక్ పోలీసుల నుంచి సేకరించి వివిధ గుర్తుల ద్వారా కలిగే ప్రయోజనాలను మీ తరగతి గదిలో చర్చించండి.
జవాబు:
రోడ్డుపైన సూచించే గుర్తులు :
రోడ్డు ఉపరితలంపై పొదచారుల కోసం, వాహన చోదకులకు మార్గ నిర్దేశనం చేయుటకు ఈ గుర్తులు ఉపయోగిస్తారు. రోడ్డుపై గందరగోళాన్ని, అగమ్యాన్ని నివారించడానికి ఒకే విధమైన గుర్తులను ఉపయోగిస్తారు.

1) పాదచారుల దారి :
రోడ్డుకు ఇరువైపులా పాదచారులు నడవటానికి వీలుగా ఉండే దారి. ఇది సుమారు రెండు మీటర్లు వెడల్పు ఉంటుంది.

2) డివైడర్ :
రోడ్డును రెండు సమాన భాగాలుగా విభజించేది.

3) జీబ్రా క్రాసింగ్ :
పాదచారులు రోడ్డును ఒక వైపు నుంచి మరొక వైపునకు దాటడానికి ఉద్దేశించినది.

రోడ్డుపై సూచించే గుర్తుల వల్ల ప్రయోజనాలు :

  1. పాదచారుల దారి మీదకు వాహనాలు ఏవీ రావు కాబట్టి పాదచారులు నడవటానికి అనుకూలంగా ఉంటుంది. ఏ విధమైన ప్రమాదాలు సంభవించవు.
  2. రోడ్డును రెండు సమానభాగాలుగా విభజించటం వలన ఏ విధమైన రాకపోకలకు అవాంతరాలు ఎదురుకావు మరియు ప్రమాదాలు జరగవు.
  3. జీబ్రా క్రాసింగ్ అనేది పాదచారులు రోడ్డు దాటవలసిన ప్రదేశము. వాహనాలు జీబ్రా క్రాసింగ్ గుర్తులున్నచోట నెమ్మదిగా వెళ్తాయి కాబట్టి పాదచారులు రోడ్డు దాటవలసి వస్తే ఇక్కడే దాటాలి. దీనితో ప్రమాదాలు నివారించబడతాయి.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
మీకు అందుబాటులో ఉన్న ట్రాఫిక్ పోలీస్ / ఆర్.టి.ఎ అధికారులను అడిగి క్రింది విషయాలు సేకరించండి.
AP Board 9th Class Social Solutions Chapter 24 రోడ్డు భద్రతా విద్య 3
మీ ప్రాంతంలో ట్రాఫిక్ పరిస్థితులను తరగతి గదిలో చర్చించండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 24 రోడ్డు భద్రతా విద్య 6

AP Board 9th Class Social Solutions Chapter 23 విపత్తుల నిర్వహణ

SCERT AP 9th Class Social Studies Guide Pdf 23rd Lesson విపత్తుల నిర్వహణ Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 23rd Lesson విపత్తుల నిర్వహణ

9th Class Social Studies 23rd Lesson విపత్తుల నిర్వహణ Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
ప్రకృతి ప్రమాదాలు ఏవిధంగా విపత్తులు మారుతున్నాయో వివరించండి. (AS1)
జవాబు:

  1. ప్రణాళికలు లేకుండా నగరాలు విస్తరించడం.
  2. మురుగునీరు పోవడానికి సరైన సౌకర్యం లేకపోవడం.
  3. జనాభా వేగంగా పెరగడం.
  4. మానవుల నిర్లక్ష్యం వల్ల లేదా కావాలని ఒక వ్యక్తి లేదా బృందం చేసే పనుల వల్ల విపత్తులు సంభవిస్తున్నాయి.
  5. ఈ విపత్తులు వల్ల ప్రాణనష్టం జరుగుతుంది.
  6. దేశ ఉత్పాదక, ఆర్థిక సామర్థ్యంపై దీర్ఘకాల ప్రభావం ఉంటుంది.
  7. వీటితోపాటు రోడ్డు, రైలు, విమాన ప్రమాదాలు జరగడం వల్ల వాటివల్ల విలువైన ప్రాణ, ఆస్థి నష్టాలు సంభవిస్తున్నాయి.
  8. వీటితోపాటు అగ్నిప్రమాదాలు, వరదలు, కరవుకాటకాలు, భూకంపాలు వంటి విపత్తులు సంభవించి ప్రాణ, ఆస్తినష్టాలు జరుగుతున్నాయి.

ప్రశ్న 2.
ఉగ్రవాదం అనగానేమి? వారి యొక్క లక్ష్యాలు ఏమిటి? (AS1)
జవాబు:
ఉగ్రవాదం అనగా :
హింసాత్మక చర్యల ద్వారా ప్రజలను, పాలకులను, దేశాధినేతలను బెదిరిస్తూ, తమ కోర్కెలను సాధించుకొనేందుకు చేపట్టే ఉగ్ర భయంకర దుష్ట చేష్టలనే ఉగ్రవాదము అంటారు.

ఉగ్రవాదం యొక్క లక్ష్యాలు :

  1. యుద్ధం, అంతర్గత పౌర యుద్ధాలు పెచ్చుమీరిపోయి ప్రాణ, ఆస్తి నష్టాలకు కారణము కావడం.
  2. అల్లర్లను సృష్టించి, ప్రశాంత వాతావరణం లేకుండా చేయడం.
  3. సైనికులను, సామాన్య ప్రజానీకాన్ని భయ భ్రాంతులకు గురి చేయడం.
  4. రక్తపాతాన్ని సృష్టించడం.
  5. మందు పాతరలు పెట్టి రైళ్ళను పడగొట్టడం, వంతెనలు పేల్చడం, సైనికులను చంపడం వంటివి చేయడం.
  6. పిల్లలు కూడా నిత్యం దాడులకు భయపడుతూ గడుపుతుంటారు.

AP Board 9th Class Social Solutions Chapter 23 విపత్తుల నిర్వహణ

ప్రశ్న 3.
అగ్నిప్రమాదాల నుంచి రక్షణ పొందడానికి మనం’ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
జవాబు:
అగ్నిప్రమాదాల నుంచి రక్షణ పొందడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

  1. నిప్పు లేదా పొగ చూసినప్పుడు అలారం మోగించండి / హెచ్చరిక జారీ చేయండి.
  2. సాధ్యమైనంత త్వరగా భవనం నుంచి బయటకు వెళ్లండి. వీలైతే మిమ్మల్ని కప్పుకోండి. వరండాలో బయటకు తప్పించుకునే మార్గంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడండి.
  3. ఫోను ఎక్కడుందో తెలుసుకుని 101కి ఫోన్ చేయండి. నిదానంగా, స్థిమితంగా మీ చిరునామా చెప్పి అగ్నిమాపక దళాన్ని పంపించమని అడగండి.
  4. పొగ ఉన్నప్పుడు నేలమీద పాకుతూ వెళ్లండి. వేడిగాలి, పొగ పైకి లేస్తాయి కాబట్టి నేల దగ్గర గాలి బాగుంటుంది.
  5. మీరు బైటకు వెళ్లేదారి మూసివేసి ఉంటే కిటికీ ఉన్న ఒక గదిలోకి వెళ్లండి. తలుపు వేసి పొగ లోపలికి రాకుండా చేయండి. కిటికీ తలుపు తెరిచి సహాయం కోసం అరవండి.
  6. తలుపు మూసి ఉంటే మంటలు వేగంగా వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటాయి. భవనాన్ని ఖాళీ చేస్తున్నప్పుడు అందరికంటే వెనకనున్న వాళ్లు తలుపులు వేసుకుంటూ రావాలి.
  7. విద్యుత్తు స్విచ్చులన్నీ తీసేసి ఉంచాలి. మెయిన్ స్విచ్ ను కట్టెయ్యటం ఉత్తమం.
  8. అతుకులు, పలు ఉన్న విద్యుత్తు తీగలు, కేబుళ్లకోసం చూడండి. ఇవి ప్రమాదకరమైనవి కాబట్టి వీటిని వెంటనే మార్చాలి. ప్లగ్ పాయింట్లు కిందకల్లా ఉంటే, ప్రత్యేకించి ప్రాథమిక తరగతుల్లో వాటికీ టేపు వేసేసి ఉంచాలి. లేకపోతే చిన్నపిల్లలు వాటిల్లో వేళ్లు పెట్టినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశముంది.
  9. బడిలో ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్తు తీగలను గమనించండి. ఏవైనా గోడలు నెమ్ముకుంటూ ఉంటే వాటిని వెంటనే మరమ్మతు చేసి, విద్యుత్తు తీగలను మార్చివేయాలి. నిప్పు, లేదా పొగ చూసినప్పుడు అలారం మోగించండి/హెచ్చరిక జారీ చేయండి.
  10. సాధ్యమైనంత త్వరగా భవనం నుంచి బయటకు వెళ్లండి. వీలైతే మిమ్మల్ని కప్పుకోండి. వరండాలో బయటకు తప్పించుకునే మార్గంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడండి.

చేయగూడనివి :

  1. మీ బొమ్మలు, పెంపుడు జంతువులు వంటి వాటికోసం అగ్నిప్రమాదానికి గురైన భవనం లోపలికి మళ్లీ వెళ్లవద్దు. అగ్నిమాపకదళం మీకంటే వేగంగా ముఖ్యమైన వాటిని బయటకు తీసుకురాగలరు.
  2. మంచం కిందగానీ, అలమర లోపలగానీ ఎప్పుడూ దాక్కోవద్దు. పెద్దగా అరుస్తూ భవనం నుంచి బయటకు వెళ్లాలి.
  3. చాపలు, తివాచీ వంటి వాటికింద నుంచి విద్యుత్తు తీగలు, కేబుళ్లు వంటివి తీస్తే అవి పాడైపోయి ప్రమాదాలకు దారి తీయవచ్చు. ఈ పరిస్థితి ఎక్కువగా పాఠశాల పరిపాలనా విభాగంలో ఎదురవుతూ ఉంటుంది.
  4. తేలికగా కాలిపోవటానికి వీలుండే కర్టెన్లు, ఇతర వస్తువులకు దగ్గరగా విద్యుత్తు బల్బులు అమర్చగూడదు.

ప్రశ్న 4.
రోడ్డు ప్రమాదాలకు ప్రధానమైన కారణాలేవి? వాటిని తగ్గించడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
జవాబు:
రోడ్డు ప్రమాదాలకు ప్రధానమైన కారణాలు :

  1. నిర్లక్ష్యంగా వాహనాలను నడపడం.
  2. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించటం.
  3. తాగి వాహనం నడపటం.
  4. వాహనాలు సరైన స్థితిలో ఉండక పోవటం.
  5. వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవటం.

రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి మనం తీసుకోవాల్సిన చర్యలు :

  1. మద్యం సేవించి వాహనాలను నడపరాదు.
  2. వాహనాలను నడిపేవారు మందులను తీసుకుంటూ నడపరాదు.
  3. అలసిపోయి ఉన్నవారు, అలసట ఉన్నవారు వాహనాలను నడపరాదు.
  4. జబ్బుపడినవారు, గాయాల పాలైన వారు వాహనాలను నడపరాదు.
  5. కోపంగా లేదా ఆందోళనగా ఉన్నవారు వాహనాలను నడపరాదు.
  6. రోడ్డు మీద అసహనంగా ఉండరాదు. రోడ్డు మీద పరుగులు తీయరాదు.
  7. మలుపు / మూల వద్ద రోడ్డును ఎప్పుడూ దాటరాదు.
  8. బస్సు / వాహనం ఎక్కటానికి పరుగులు పెట్టరాదు.
  9. ట్రాఫిక్ సిగ్నళ్ళు ఉన్నచోట, జీబ్రా క్రాసింగ్ ఉన్నచోట మాత్రమే రోడ్డు దాటాలి.
  10. బస్సు పూర్తిగా ఆగిన తరువాత ఎక్కాలి. క్యూ పద్ధతి పాటించాలి.

మొదలైన చర్యలు జాగ్రత్తగా పాటించడం వలన రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చును.

ప్రశ్న 5.
ఉగ్రవాదుల దాడుల వలన ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంది. వీరి చర్యలను అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి?
జవాబు:
ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో వారి చర్యలను అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

  1. రవాణా వాహనాలలో, బహిరంగ ప్రదేశాలలో ఎవరికీ చెందని సూట్ కేసు, సంచి వంటిని గమనిస్తే పోలీసులకు తెలియజేయాలి. ఎందుకంటే వాటిలో పేలుడు పదార్థాలు ఉండవచ్చు.
  2. “100” నంబరుకి పోలీస్ కంట్రోలు రూమ్ కి ఫోన్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ ఫోన్ చేసే హక్కు ఉంది. తద్వారా ప్రమాదాన్ని వారి ద్వారా నివారించవచ్చు.
  3. పోలీసులకు తెలియజేసిన పిదప అనుమానాస్పద వస్తువులపై నిఘా ఉంచాలి. ఇతరులను కూడా దాని నుంచి దూరంగా ఉండమని చెప్పాలి.
  4. అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులు వారి ప్రవర్తనపై, నిలిపి ఉన్న వాహనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
  5. పౌరుల భద్రత అందరికీ సంబంధించిన విషయం కాబట్టి భద్రత పట్ల అవగాహన కల్పించటానికి వివిధ సంస్థలు తమ విధి విధానాలు ప్రకటిస్తూ ప్రజలను జాగృతం చేయాలి.
  6. ఉగ్రవాదాన్ని ఎదుర్కోటానికి, క్షేమకర జీవితం గడపటానికి పోలీసులు కొన్ని పోస్టర్లు జారీ చేస్తారు. వాటి గురించి తెలుసుకుని వాటిని జీవితంలో అనుసరించాలి.

AP Board 9th Class Social Solutions Chapter 23 విపత్తుల నిర్వహణ

ప్రశ్న 6.
రైలు ప్రమాదాలకు గల కారణాలను గుర్తించండి. (AS1)
జవాబు:
ప్రపంచంలో ఎక్కువ రైలు మార్గాలు ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి. భారతదేశంలో రైలు ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. తరుచుగా జరిగే రైలు ప్రమాదాలకు గల కారణాలు :

  1. రైలు ప్రమాదాలకు కారణాలలో రైలు పట్టాలు తప్పటం ఒకటి.
  2. రైలు మార్గాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం.
  3. విద్రోహ చర్యలు, కారణంగా కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి.
  4. మానవ పొరపాట్లు, అప్రమత్తంగా లేకపోవడం.
  5. గ్యాస్, పెట్రోల్, బొగ్గు, నూనె వంటి మండే పదార్థాల రవాణా కారణంగా కూడా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి.
  6. రైలులో పొగత్రాగడం, సిగరెట్, బీడీ వంటి వాటి వలన కూడా అగ్ని ప్రమాదాలు రైలులో జరుగుటకు కారణం.
  7. కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద కూడా ప్రమాదాలకు మూలమౌతున్నాయి.

ప్రశ్న 7.
మీ గ్రామంలో, పాఠశాలలో, మీ ఇంటి దగ్గర సంభవించగల ప్రమాదాలను గుర్తించండి. (AS4)
జవాబు:
మా గ్రామంలో, పాఠశాలలో, మా ఇంటి దగ్గర సంభవించగల ప్రమాదాలు :

  1. మలుపు / మూలల దగ్గర రోడ్డు దాటేటప్పుడు.
  2. పాఠశాల వదిలి పెట్టిన సమయం.
  3. బస్సు / వాహనం ఎక్కడానికి పరుగులు తీసే సమయం.
  4. బడివాళ్ళు నిర్దేశించిన బస్సులు తప్పించి ఇతర బస్సులు ఎక్కే సమయం.
  5. ట్రాఫిక్ సిగ్నళ్ళు పాటించకపోవడం.
  6. జీబ్రా క్రాసింగ్ గుర్తులున్న చోటనే రోడ్డును దాటకపోవడం వంటి సమయాలు.

ప్రశ్న 8.
భారతదేశ పటంలో ఉగ్రవాదుల దాడులకు గురైన ఈ కింది నగరాలను గుర్తించండి. (AS5)
జవాబు:
ఎ) ముంబై బి) హైదరాబాద్ సి) భాగల్ పూర్ డి) కుంభకోణం ఇ) బెంగళూరు
AP Board 9th Class Social Solutions Chapter 23 విపత్తుల నిర్వహణ 1

ప్రశ్న 9.
మీకు తెలిసిన ఒక ప్రమాద సంబంధ వైపరీత్యం గురించి రాయండి. (AS6)
జవాబు:
ఇటీవల కాలంలో మా జిల్లాలో అత్యంత దురదృష్టకరమైన రైలు ప్రమాదం జరిగింది. దీని కారణంగా సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మంది వరకు గాయాలపాలయ్యారు. విజయనగరం దగ్గరి గొట్లాం సమీపంలో రాత్రి 7 గంటల సమయంలో బొకారో ఎక్స్ ప్రెస్ రైలులో పొగచిమ్మగా, పెద్ద ప్రమాదం రైలులో సంభవిస్తుందని తోటి ప్రయాణికులలో అలజడులు రేగగా, ఆ పుకార్లు షికార్లు చేసి భయంతో ప్రయాణీకులు గొలుసులాగి, ఎదురుగా పట్టాలపై పరిగెత్తసాగారు. అదే సమయంలో విజయవాడ వెళుతున్న రాయగడ పాసింజర్ ఈ ప్రయాణీకులను ఢీకొనగా అక్కడికక్కడే చనిపోయారు. ఇది నాకు తెలిసిన ఇటీవల జరిగిన అత్యంత ప్రమాద సంబంధ వైపరీత్యం.

AP Board 9th Class Social Solutions Chapter 23 విపత్తుల నిర్వహణ

ప్రశ్న 10.
పేజీ నెం. 281లోని ‘అగ్ని ప్రమాదం’ అంశం చదివి వ్యాఖ్యానించండి. (AS2)
జవాబు:
ప్రతి సంవత్సరం అగ్ని ప్రమాదాల కారణంగా సుమారు 30,000 మంది చనిపోతున్నారు. వేడిమి, ఇంధనం, ప్రాణ వాయువు – ఈ మూడు కలిసినపుడు అగ్ని ప్రమాదం జరుగుతుంది. ఈ మూడింటిలో ఏదో ఒకటి అందకుండా చేయడం ద్వారా నిప్పును ఆపవచ్చు. ఇటీవల కాలంలో అగ్ని ప్రమాదాలు సంభవించి విలువైన ప్రాణాలు, ఆస్తి నష్టం సంభవిస్తున్నాయి. మానవ నిర్లక్ష్యం, లేదా అవగాహన లోపం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగి విపరీత నష్టాలకు మూలమౌతున్నాయి.
ఉదా :
తమిళనాడులోని కుంభకోణంలోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో 93 మంది బాలలు చనిపోయారు. అగ్ని ప్రమాదం జరిగినపుడు ఏం చేయాలో టీచర్లకు, విద్యార్థులకు తెలియకపోవడం, అవగాహన లేకపోవడం వల్ల విలువైన ప్రాణాలు కోల్పోయారు. అగ్ని ప్రమాదాలపై ప్రజలకు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అవగాహన ఉంటే ఇటువంటి సందర్భాలలో అపాయం నుంచి తప్పించుకోవచ్చు.

9th Class Social Studies 23rd Lesson భారతదేశంపై వలసవాద ప్రభావం InText Questions and Answers

9th Class Social Textbook Page No.277

ప్రశ్న 1.
ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏర్పడే విపత్తులు ఎంతవరకు సహజమైనవి? దీని గురించి ఎప్పుడైనా విశ్లేషించారా? ముంబాయిలోని వరదలను ఉదాహరణగా తీసుకుందాం. పెద్ద ఎత్తున జరిగిన ఆస్తి, ప్రాణ నష్టాలకు కారణాలు ఏమిటి? భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున విధ్వంసం జరిగిందా?
జవాబు:
ప్రకృతి వైపరీత్యాలనేవి కొంతవరకు సహజమైనవి. కొంతవరకు మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నాయి.

మానవులు చేసే తప్పులను దిద్దుకుంటే కొన్ని వైపరీత్యాలను నివారించవచ్చు. ముంబయిలోని వరదలను ఉదాహరణగా తీసుకుంటే పెద్ద ఎత్తున జరిగిన ఆస్తి, ప్రాణ నష్టాలకు కారణాలు :

  1. ఏ ప్రణాళికా లేకుండా నగరం విస్తరించటం.
  2. మురుగునీరు పోవటానికి సరైన సౌకర్యం లేకపోవటం.
  3. జనాభా వేగంగా పెరగటం వంటి కారణాల వలన, భారీ వర్షాల వలన పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది.

దేశ ఉత్పాదక, ఆర్థిక సామర్థ్యం పైన కూడా దీర్ఘకాల ప్రభావం పడింది. ప్రకృతి వైపరీత్యాలలో సహజమైనవాటికి ఉదాహరణగా వరదలు, కరవు కాటకాలు, భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనం వంటి అంశాలను పేర్కొనవచ్చు.

అగ్నిప్రమాదాలు, రోడ్డు, రైలు, విమాన ప్రమాదాలు వంటి వాటిని మానవ కారక వైపరీత్యాలుగా చెప్పవచ్చును.

9th Class Social Textbook Page No.279, 280

ప్రశ్న 2.
రైలు ప్రమాదాలను తగ్గించటానికి పాటించవలసిన భద్రతా చర్యలు ఏవి?
జవాబు:
రైలు ప్రమాదాలను తగ్గించటానికి పాటించవలసిన భద్రతా చర్యలు :

  1. రైల్వే క్రాసింగ్ దగ్గర సిగ్నల్ కోసం చూడండి. రైలు గేటును గమనిస్తూ ఉండండి.
  2. గార్డులేని రైల్వే క్రాసింగ్ దగ్గర వాహనం దిగి రెండువైపులా చూసిన తరవాత పట్టాలు దాటాలి.
  3. రైల్వే క్రాసింగ్ వద్ద గేటు కింద నుంచి దూరి పట్టాలు దాటరాదు.
  4. ప్రయాణీకులను తరలించడానికి వీలుకాని వంతెన మీద, సొరంగాల వద్ద రైలును, రైలింజన్ డ్రైవర్లు ఆపకూడదు.
  5. మండే గుణమున్న పదార్థాలను రైలులో తీసుకెళ్ళరాదు.
  6. నడుస్తున్న రైలులో తలుపు దగ్గర నిలబడరాదు. బయటకు తొంగి చూడరాదు.
  7. ఆగి ఉన్నలేదా కదులుతున్న రైలులోంచి మీ తల, చేతులు బయటపెట్టరాదు.
  8. స్టేషనులో రైలు పట్టాల మీదుగా దాటరాదు. ప్లాట్ ఫారం మారటానికి ఉద్దేశించిన పాదచారుల వంతెనను ఉపయోగించండి.
  9. అనుమానాస్పద వస్తువులను తాకరాదు. పట్టాలమీద, రైల్వే యార్డులలో ఆటలు ఆడవద్దు. రైలుబోగీలు ఉన్నట్టుండి కదలడం వల్ల అక్కడ ఉన్నవారు ప్రమాదానికి గురవుతారు.
  10. కదులుతున్న రైలు మీదకి ఎటువంటి వస్తువులు విసరవద్దు. దీనివల్ల తీవ్రగాయాలు అవుతాయి.

9th Class Social Textbook Page No.281

ప్రశ్న 3.
విమానం ఎక్కినప్పుడు పాటించవలసిన విషయాలు ఏవి?
జవాబు:

  1. ప్రయాణ సమయంలో పాటించవలసిన భద్రతలను తెలియచేస్తున్నప్పుడు శ్రద్ధగా వినండి.
  2. మీరు కూర్చున్న ముందు సీటు జేబులో ఉండే భద్రతా వివరాల కార్డును జాగ్రత్తగా చదవండి.
  3. దగ్గరలో అత్యవసర ద్వారం ఎక్కడ ఉందో తెలుసుకోండి. దానిని ఎలా తెరవాలో తెలుసుకోండి.
  4. సీటులో కూర్చుని ఉన్నప్పుడు తప్పనిసరిగా సీటుబెల్టు పెట్టుకుని ఉండండి.

AP Board 9th Class Social Solutions Chapter 23 విపత్తుల నిర్వహణ

ప్రశ్న 4.
విమాన ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి?
జవాబు:

  1. ప్రశాంతంగా ఉండండి. విమాన సిబ్బంది చెపుతున్నది విని, అనుసరించండి. మీకు సహాయం చేయటం క్యాబిన్ సిబ్బంది ముఖ్యమైన బాధ్యత.
  2. అత్యవసర ద్వారాన్ని తెరవటానికి ముందు. కిటికీ నుండి బయటకు చూడండి బయట మంటలు ఉంటే తలుపు తెరవవద్దు. తలుపు తెరిస్తే మంటలు లోపలికి వ్యాపిస్తాయి. బయటకు వెళ్ళటానికి ఉన్న మరొక దారిని ఉపయోగించండి.
  3. పొగ పైకి లేస్తుందని గుర్తుంచుకోండి. కాబట్టి క్యాబిన్లో పొగ ఉంటే నేలమీదకి ఉండండి.
  4. నేలలో ఉండే అత్యవసర దీపాలను అనుసరించండి. ఇవి బయటకు వెళ్లే ద్వారాలను సూచిస్తాయి.
  5. మీ దగ్గర గుడ్డ | రుమాలు ఉంటే ముక్కు, మూతికి అడ్డంగా పెట్టుకోండి.

9th Class Social Textbook Page No.283

ప్రశ్న 5.
సమీప అగ్నిమాపక కేంద్రానికి వెళ్ళి అగ్నిప్రమాదాలు తగ్గించటంలో మీరు పాటించగల మెలకువల గురించి తెలుసుకోండి.
జవాబు:
సమీప అగ్నిమాపక కేంద్రానికి వెళ్ళి అగ్ని ప్రమాదాలను తగ్గించటంలో మేము పాటించగల మెలకువలు గురించి తెలుసుకున్నాము. అవి :

  1. నిప్పుతో ఆటలాడరాదు.
  2. నిప్పు అవసరము తీరిన వెంటనే ఆర్పవలెను.
  3. సిగరెట్లు, బీడీలు కాల్చువారు కూడా సిగరెట్టు, బీడీ కాల్చుకుని మండుతున్న అగ్గిపుల్లను విసిరేసి వెళ్లిపోతారు. అది ప్రక్కన ఉన్న చెత్త చెదారంతో కలిసిపోయి పెద్ద పెద్ద మంటలు రావడానికి అవకాశం ఉంటుంది.
  4. అలాగే సిగరెట్లు, బీడీలు కాల్చుకుని ఆర్పివేయకుండా విసిరేసి వెళ్ళిపోతారు. దాని వలన కూడా పెద్ద పెద్ద మంటలు రావడానికి అవకాశం ఉంటుంది.
  5. గ్రామీణ ప్రాంతాల యందు కట్టెల పొయ్యి మీద అన్నం, కూరలు వండి, నిప్పును ఆర్పకుండా వారు వేరే పనులలో నిమగ్నమైపోతారు. అలాంటి సమయాలలో కూడా పెద్ద పెద్ద మంటలు ఏర్పడవచ్చును.
  6. అలాంటి పరిస్థితులు వీలైనంత వరకు తటస్థపడకుండా జాగ్రత్తలు వహించాలి.
  7. అతుకులు, పట్టీలు ఉన్న విద్యుత్ తీగలు ఉపయోగించరాదు.

ప్రశ్న 6.
ఉగ్రవాద దాడి జరిగినప్పుడు మీరు పాటించవలసిన విషయాలు ఏవి?
జవాబు:

  1. ప్రశాంతంగా ఉండండి. ఉద్రేకానికి లోనవ్వవద్దు.
  2. స్థానిక అత్యవసర అధికారుల సూచనలు పాటించండి.
  3. వార్తల కోసం, సూచనల కోసం రేడియో వినండి. లేదా టీ.వి. చూడండి.
  4. మీ దగ్గరలో దాడులు జరిగితే ఎవరికైనా గాయాలు అయ్యాయేమో చూడండి. ప్రథమచికిత్స చేయండి. తీవ్ర గాయాలైన వారికి సహాయం అందేలా చూడండి.
  5. దెబ్బతిన్న పరికరాలను ఆపివేయండి.
  6. పెంపుడు జంతువులను కట్టేసి ఉంచండి. లేదా గదిలో బంధించి ఉంచండి.
  7. మీ కుటుంబ మిత్రులకు ఫోను చేయండి. ప్రాణానికి ముప్పు ఉంటే తప్పించి మళ్ళీ ఫోను ఉపయోగించవద్దు.
  8. మీ చుట్టు పక్కల వాళ్ళ గురించి, ప్రత్యేకించి వృద్ధులు, వైకల్యం ఉన్న వాళ్ళ గురించి ఆరా తీయండి.

9th Class Social Textbook Page No.284

ప్రశ్న 7.
భారతదేశంలో ఇటీవల కాలంలో ఉగ్రవాదులు జరిపిన దుశ్చర్యలను గుర్తించండి. అవి చిన్న పిల్లల మీద చూపే ప్రభావాన్ని
వివరించండి. జ. భారతదేశంలో ఇటీవల కాలంలో ఉగ్రవాదులు జరిపిన దుశ్చర్యలు : .

  1. ముంబయిలో తాజ్ హోటల్ పై ఉగ్రవాదులు చేసిన దాడులు.
  2. హైదరాబాద్ లోని బాంబు పేలుళ్ళు.
  3. బెంగళూరులోని ‘బాంబు పేలుళ్ళు.

ఉగ్రవాదుల దాడులు చిన్న పిల్లల మీద అనేక రకాలుగా ప్రభావాన్ని చూపుతున్నాయి. ఉగ్రవాదులు దాడులు చేసే ప్రాంతాలలో పిల్లలు నిత్యం దాడులకు భయపడుతూ గడుపుతుంటారు.

పిల్లలు పాఠశాలకు హాజరు కావటానికి, సాధారణ జీవితాలు గడపటానికి అవకాశాలు లేకుండా పోతున్నాయి.

AP Board 9th Class Social Solutions Chapter 23 విపత్తుల నిర్వహణ

ప్రాజెక్టు

ప్రశ్న 1.
పత్రికలు, మ్యాగజైన్స్ ద్వారా ఇటీవల సంభవించిన మానవ విపత్తులు సమాచారాన్ని సేకరించండి. ఒకవేళ అలాంటి ప్రమాదాలు మీ ప్రాంతంలో సంభవిస్తే నష్ట నివారణకు ఎలాంటి చర్యలు తీసుకొంటారు.?
జవాబు:
మానవ విపత్తులు సంభవించిన సమయంలో సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఒక మానవునిగా తోటి మానవుని ఆదుకోవటానికి అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుంది.

వారికి బట్టలు సరఫరా చేయటం కాని, ఆహార పదార్థాలు సరఫరా చేయటం కాని, ఇతర గృహనిర్మాణ సామానులు కాని, గృహోపకరణములు గానీ సరఫరా చేయటం జరుగుతుంది.

పశువులకు పశుగ్రాసం నష్టం వాటిల్లితే దానిని అందజేయడం జరుగుతుంది.

ప్రశ్న 2.
ఉగ్రవాదం వలన సంభవించే వివిధ రకాల నష్టాలను పట్టిక ద్వారా చూపండి.
జవాబు:
ఉగ్రవాదం – వివిధ రకాల నష్టాలు

  1. మానవ జీవనం అస్తవ్యస్తం అవుతుంది.
  2. జనజీవనం అల్లకల్లోలం
  3. వందల మంది మరణాలు
  4. వేలమంది క్షత్రగాత్రులు
  5. కోట్ల విలువైన ఆస్తినష్టాలు
  6. ప్రపంచ మేధావులలో అభద్రతా భావాలు
  7. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలలో భయాందోళనలు
  8. అమాయక ప్రజల ఆర్తనాదాలు
  9. మత సామరస్య విఘాతం
  10. అభివృద్ధి కుంటుపడటం.

AP Board 9th Class Social Solutions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

SCERT AP 9th Class Social Studies Guide Pdf 22nd Lesson మహిళా రక్షణ చట్టాలు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 22nd Lesson మహిళా రక్షణ చట్టాలు

9th Class Social Studies 22nd Lesson మహిళా రక్షణ చట్టాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
బాల్య వివాహాల దుష్ఫలితాలు ఏవి? (AS1)
జవాబు:
బాల్య వివాహాల దుష్ఫలితాలు :

  1. చిన్న వయసులో గర్భవతులు కావడం.
  2. ఆడ పిల్లల అక్రమ రవాణాకు, అమ్మకానికి అవకాశం ఏర్పడడం.
  3. చదువుకు ఆటంకం.
  4. శారీరక ఎదుగుదలకు ఆటంకం.
  5. కుటుంబ పోషణకై బాలకార్మికులుగా మారుట.
  6. మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తడం.
  7. వైకల్యంతో కూడిన శిశు జననాలు లేదా మృత శిశువులు జన్మించడం.
  8. ఎదుగుదల లేని పిల్లలను బలవంతంగా కుటుంబ వ్యవస్థలోకి నెట్టివేయడం.
  9. అధిక సంఖ్యలో గర్భ విచ్ఛిత్తి, గర్భస్రావం, నెలలు నిండక ముందే ప్రసవం జరగడం ఫలితంగా మాతృ మరణాలు, శిశు మరణాల సంఖ్య పెరగడం.

AP Board 9th Class Social Solutions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

ప్రశ్న 2.
గృహహింస ఎందుకు సర్వసాధారణమైంది? అది ఏయే రూపాల్లో కనిపిస్తుంది? కారణాలు రాయండి. (AS1)
జవాబు:
మన రాజ్యాంగం పౌరులందరికీ గౌరవంగా బ్రతికే హక్కును ఇచ్చింది. స్త్రీలు కూడా పౌరులే. స్త్రీలు కూడా గౌరవంగా బ్రతకాలి. వారిని దూషించకుండా, అవమానించకుండా ఉండాలి. స్త్రీలు చేసే పనిని గౌరవించి, వారి హక్కులు, స్వేచ్ఛా వాతావరణంలో అనుభవించేటట్లు పరిస్థితులు కల్పించాలి. ప్రతీ కుటుంబంలో స్త్రీలను శారీరకంగా, మానసికంగా దెబ్బ తీస్తున్నారు. స్త్రీ పై ఆధిపత్యం కోసం పద్ధతి ప్రకారం జరిపే చర్యల క్రమమే గృహహింస.

కారణాలు :

  1. స్త్రీలలో గల అమాయకత్వం.
  2. స్త్రీల రక్షణకు కల్పించే చట్టాలపై అవగాహన లేకపోవడం.
  3. స్త్రీలలో గల నిరక్షరాస్యత.
  4. పురుష అహంకార సమాజం.
  5. స్త్రీల పట్ల సమాజం చిన్న చూపు.
  6. స్త్రీకి స్త్రీయే శత్రువుగా మారటం.
  7. స్త్రీలలో గల నిరాసక్తత.

ప్రశ్న 3.
మీరు బాలికలు, మహిళల యొక్క వివిధ సమస్యల గురించి చదివారు. ఇలాంటి సమస్యలు మీ గ్రామంలో లేదా పట్టణంలో ఎప్పుడైనా గమనించారా? అయితే, ఏం చేయాలి? (AS4)
జవాబు:
మా గ్రామం మరియు మా పరిసర ప్రాంతాలలో బాల్య వివాహాలు, వరకట్నం, లైంగిక వేధింపులు గమనించాం.

మా గ్రామంలో వరకట్న సమస్య ప్రధానంగా కనిపిస్తుంది. ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు గల కుటుంబాలు, మధ్య తరగతి కుటుంబాలు చితికిపోతున్నాయి. వరుడ్ని వేలంలో కొన్నట్లు ఎవరు ఎక్కువ కట్నం ఇస్తే వారిని పెండ్లాడే సంస్కృతి కనిపిస్తుంది.

  1. ముందుగా సమాజంలో మార్పు రావాలి.
  2. స్త్రీల యొక్క గుణగణాలకు, కుటుంబ సాంప్రదాయాలకు ప్రాధాన్యత నివ్వాలి.
  3. వరకట్నం అడిగే పెద్దలను, వరుడ్ని పోలీసులకు అప్పజెప్పాలి.
  4. స్త్రీలలో మార్పు రావాలి.
  5. ఇంకా కట్నం కోసం వేధించే భర్తలను నిర్భయంగా పోలీసులకు, కోర్టులకు, స్వచ్ఛంద సంస్థల ముందుంచాలి.

ప్రశ్న 4.
బాలికలు, మహిళల సంరక్షణకై ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేసింది. వాటిని సక్రమంగా అమలు చేయడానికి మీరిచ్చే సూచనలు ఏవి?
(లేదా)
బాలికలు, మహిళల అభివృద్ధి మరియు సంరక్షణకై ప్రభుత్వం ఎన్నో పథకాలు మరియు చట్టాల రూపకల్పన చేస్తుంది. వాటిని సక్రమంగా అమలు చేయటానికి మీరందించే సూచనలు ఏమిటి?
జవాబు:
అనాదిగా మవదేశం పురుషాధిక్యత గలది. స్త్రీలు అంటే చిన్న చూపు పురాతన కాలం నుండి కొనసాగుతుంది. అంతేకాకుండా స్త్రీలు ఎదుర్కొను అనేక సమస్యల నుండి, వేధింపుల నుండి, హింసల నుండి రక్షణకై అనేక చట్టాలు రూపొందించి, అండగా ఉంటూ అధికారులు, న్యాయస్థానాలు ఆదుకుంటున్నాయి.

అయితే చట్టాలు సక్రమంగా అమలు చేయడానికిగాను సలహాలు :

  1. చట్టాలపై స్త్రీలలో అవగాహన కలిగించడానికి గ్రామీణ ప్రాంత మహిళలలో చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి.
  2. అవగాహన సదస్సులు, బహిరంగ వేదికలలో చట్టాలపై వివరంగా తెలియజేయాలి.
  3. సమాచార సాధనాలైన రేడియో, టీ.వి, వార్తాపత్రికలు, సినిమాల ద్వారా చట్టాలపై అవగాహన కలిగించడానికి ఎక్కువ సమయం, స్థలం కేటాయించాలి.
  4. స్త్రీలు విద్యావంతులు కావాలి.
  5. పాఠశాల స్థాయి నుండే బాలికలలో చట్టాలపై పూర్తి అవగాహన కలిగించాలి.
  6. డ్వాక్రా, మహిళా సంఘాల సమావేశాలలో చట్టాలు – లభించే ప్రయోజనాలు, కల్పించే సౌకర్యాలు వివరించాలి.

AP Board 9th Class Social Solutions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

ప్రశ్న 5.
మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్యలపై ఒక వ్యాసం రాయండి.
జవాబు:
ఈ రోజుల్లో మహిళలు స్వేచ్ఛగా బయట తిరగడానికి సాహసించడం లేదు. ఆడ పిల్లలను చదివించడానికి బయట ప్రాంతాలకు పంపించడానికి కూడా తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఇంట్లో తల్లిదండ్రుల, కుటుంబ సభ్యుల ఆంక్షలు, బయట ప్రపంచంలో మహిళలను వేధించడం, బాధించడం, తక్కువ చేసి మాట్లాడటం, ఆడవాళ్ళు కనిపిస్తే ఎగతాళి చేయడం, లైంగిక వేధింపులకు గురి చేయడం, మానసిక క్షోభకు గురిచేసే మాటలనడం, అవమానించడం, భయపెట్టి, బెదిరించి, మాయమాటలు చెప్పి, ప్రేమలో దించి, లొంగదీసుకొని, హత్యా నేరాలకు పాల్పడడం మనం నిత్యం చూస్తున్నాం. అంతేకాకుండా వరకట్నం పెండ్లి సమయంలోనే కాకుండా, వివాహానంతరం కూడా ఇంకా అధికంగా కట్నం తెమ్మని, లేకపోతే బలవంతంగా చంపడం జరుగుతుంది. అమ్మాయి జన్మిస్తే తల్లిని నిందించడం నిరంతరం మనం చూస్తూనే ఉన్నాం.

ప్రశ్న 6.
మీరు తహశీల్దారు అయితే, బాల్య వివాహాలను ఎలా అరికడతారు?
జవాబు:
బాల్యం జీవితాంతం గుర్తుండే తీపి గుర్తు. వెంటాడే సుందర దృశ్యం. బాల్యం మధురానుభూతులు అనుభవించక ముందే, చదువుకోవాలనే కోరిక తీరక ముందే, బాలబాలికల వివాహ వయస్సు రాకముందే అంటే బాలురకు 21 సం||లు బాలికకు 18 సం|| నిండక ముందే చాలా ప్రాంతాలలో బాల్యవివాహాలు జరుగుతున్నాయి.

నేనే తహశీల్దారును అయితే :

  1. నా మండల పరిధిలోగల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో గల విద్యార్థులలో చైతన్యం కల్గించే అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాను.
  2. పోలీస్ అధికారి, ప్లీడర్, ఒక డాక్టర్‌ను ప్రతీ గ్రామానికి పంపించి తల్లిదండ్రులకు బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలు, బలవంతంగా వివాహాలు జరిపిస్తే వేసే శిక్షలు, ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు వివరిస్తాను. (వారి ద్వారా)
  3. ఎక్కడైనా అవగాహన లోపంతో బాల్య వివాహాలు జరిగినట్లు వివిధ గ్రామాధికారులు ద్వారా తెలుసుకొని, మహిళా సంక్షేమ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ద్వారా మనస్తత్వ నిపుణులచే కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తాను.
  4. ప్రతీ గ్రామంలో కూడా బాల్య వివాహాల నిరోధానికై కమిటినీ ఏర్పాటు చేసి, అంగన్‌వాడీ టీచర్, ANM, ఆశ వర్కర్, సామాజిక కార్యకర్తలు, డ్వాక్రా, మహిళా సంఘాల సభ్యులను కమిటీగా నియమించి నిరోధానికి కృషి చేస్తాను.
  5. ప్రతీ గ్రామ సభలో దండోరా వేయించి సామాజిక అవగాహన కలిగింపజేస్తాను.

ప్రశ్న 7.
మహిళలు ఎదుర్కొనే సమస్యలపై అవగాహన కొరకు ఒక కరపత్రాన్ని తయారుచేయండి. (AS6)
జవాబు:
మహిళలు ఎదుర్కొనే సమస్యలపై కరపత్రం :

ఆడదే ఆధారం – కాని వారికి లేదు సహకారం

సృష్టికి మూలకారణం ఆడది. ఆడది లేకుంటే ఈ సృలేదు. తల్లిగా, చెల్లిగా, భార్యగా సమాజానికి దశను, దిశను నిర్దేశించే ముహిళలు నేడు అణగదొక్కబడుతున్నారు. ఆత్మన్యూనతా భావంతో అడుగంటిపోతున్నారు. చివరకు ఆత్మహత్యలే ప్రధానమనుకుంటున్నారు.

అక్రమ రవాణా :
ఉద్యోగం ఇప్పిస్తామని, సినిమాలలో అవకాశాలు కల్పిస్తామని నమ్మబలికి, వేరే ప్రాంతాలకు తీసుకెళ్ళి, వ్యభిచార గృహాలకు విక్రయించి, హింసించి మహిళల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు.

వరకట్నపు పిచాచి :
అమ్మాయి, అబ్బాయి వివాహం అనంతరం (వధూవరులు) ఆనందంగా జీవించడానికి పెండ్లి సమయంలో అత్తవారు ఇచ్చే కానుకలు రోజురోజుకు వెర్రితలలు వేసి నేడు వరకట్నంను వేలం వేస్తున్నారు. కట్నం ఇవ్వలేని తల్లిదండ్రులు, వారి ఆడపిల్లలకు పెండ్లిండ్లు చేయలేని సందర్భాలెన్నో. కొన్నిసార్లు వివాహాలు జరిపించినా, తదనంతరం అదనపు కట్నం కొరకు అమ్మాయిని వేధించడం, తిట్టడం, కొట్టడం, కొన్ని సందర్భాలలో చంపివేయడం చూస్తున్నాం. ఇది న్యాయమా?

గృహ హింస :
స్త్రీలు చేసే పనిని గౌరవించాలి, ఆదరించాలి, చేయూతనందించాలి. అలాకాకుండా నాలుగు గోడల మధ్య మహిళలను రకరకాల పద్ధతులతో హింసించి, మానసిక క్షోబకు గురిచేసి ఆత్మహత్యా విధానాలకు పురికొల్పుతూ, నిండు జీవితాలను బలిచేస్తున్నారు.

లైంగిక ఆత్యాచారాలు, వేధింపులు :
ఇటీవల కాలంలో మహిళలపై ఆత్యాచారాలు, లైంగిక వేధింపులు నిత్యకృత్యమై పోయాయి. ఆఫీసులలో, లైంగిక వేధింపులు తట్టుకోలేకపోతున్నారు. ఎదురు తిరిగిన వారిని యాసిడ్ తో దాడి చేస్తున్నారు. కనీస మర్యాద కూడా పాటించకుండా పశువులతో సమానంగా ప్రవర్తిస్తున్నారు.

మారాలి, సమాజం మారాలి. స్త్రీలను ఎక్కడ గౌరవిస్తామో, ఎక్కడ మర్యాదలు ఆందజేస్తామో ఆ సమాజమే బాగుపడుతుంది. ఇప్పటికైనా మహిళలకు అందించాలి సహకారం.

AP Board 9th Class Social Solutions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

ప్రశ్న 8.
పేజీ నెం. 275లోని ‘అత్యాచారం, లైంగిక వేధింపులు’ అంశం చదివి, వ్యాఖ్యానించండి.
జవాబు:
ఇటీవల కాలంలో విదేశీ సంస్కృతి వెర్రి తలలు వేసి మహిళలపట్ల చిన్నచూపు ఏర్పడి విచక్షణా జ్ఞానాన్ని మరచిపోయి, మహిళలపట్ల అనేక క్రూర చర్యలకు పాల్పడుతున్నారు. అందులో ప్రధానమైన దుశ్చర్య అత్యాచారాలు – లైంగిక వేధింపులు. స్వేచ్ఛగా, హాయిగా విహరించలేని, తిరగలేని దౌర్భాగ్యం మనకు మహిళల పట్ల కానవస్తుంది. రోజు రోజుకు మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాలు, ‘ వేధింపులు మానవత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఇటీవల ఈ రకమైన వేధింపుల నిరోడానికి, లైంగిక, అత్యాచార నియంత్రణకు జస్టిస్ జె.యస్. వర్మ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియుమించి ఫిబ్రవరి 2, 2013న దానిని రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేశారు. దీని ప్రకారం

  1. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడిన వారికి 20 సంవత్సరాల జైలుశిక్ష విధించబడుతుంది.
  2. మహిళలపై యాసిడ్ దాడి సమయంలో పెనుగులాటలో దాడి చేసినవారు మరణించినా మహిళలకు శిక్షలేదు.
  3. మహిళా పోలీస్ ద్వారా విచారణ జరుపబడుతుంది.
    ఈ విధంగా మహిళలకు రక్షణ కల్పించబడుతుంది.

9th Class Social Studies 22nd Lesson మహిళా రక్షణ చట్టాలు InText Questions and Answers

9th Class Social Textbook Page No.271

ప్రశ్న 1.
అప్పుడప్పుడు 15 సంవత్సరములు కూడా నిండని పిల్లలకు వారి ప్రమేయం, ఇష్టాయిష్టాలు చూడకుండా పెళ్ళిళ్లు చేస్తున్నారు. ఇలాంటివి ఎలా ఆపవచ్చు? ఎవరు సహాయం చేస్తారు?
జవాబు:
అప్పుడప్పుడూ గ్రామీణ పల్లె ప్రాంతాలలో 18 సం||లు పూర్తికాకుండా 13, 14, 15 సం||ల వయసులో బాల్య వివాహాలు జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అవగాహనా లోపం, తల్లిదండ్రులలో, పిల్లలలో చైతన్యం లేకపోవడం, తదనంతర కష్టాలు, నష్టాలు వారికి తెలియకపోవడం. అంతేకాకుండా పిల్లల పుట్టిన తేదీ, వయస్సు విషయాలలో తల్లిదండ్రులకు పూర్తి సమాచారం లేకపోవడం. ఇలాంటి బాల్య వివాహాలు జరిగినట్లు మొదట గుర్తించేది గ్రామ కార్యదర్శి. గ్రామ కార్యదర్శి జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్, డివిజన్ స్థాయిలో ఆర్.డి.ఓ, మండల స్థాయిలో తహశీల్దారుకు తెలియజేస్తాడు. ఈ సందర్భంగా వారికి ఫిర్యాదు చేస్తాడు. పై అధికారుల సూచన మేరకు మహిళ సంక్షేమ అధికారి CDPO మరియు సబ్ ఇన్ స్పెక్టరు, సామాజిక కార్యకర్త, ఉపాధ్యాయులు మొ||వారు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా పెళ్ళిళ్ళు ఆపవచ్చు.

9th Class Social Textbook Page No.273

ప్రశ్న 2.
మీ నివాస ప్రాంతంలో కట్నం కోసం మహిళలను వేధించడం గమనించారా? ఎలాంటి వేధింపులు జరుగుతున్నాయి? దీనిని నిరోధించాలంటే సమాజంలో ఎలాంటి మార్పులు రావాలి? ఎవరు బాధ్యత వహించాలి?
జవాబు:
మా ప్రాంతంలో కట్నం కోసం మహిళలను వేధించడం నిరంతరం చూస్తున్నాం. అదనపు కట్నం తెమ్మని అత్త మామలు, ఆడపడుచులు, భర్త తరచుగా వేధించడం, తిట్టడం, కొట్టడం, కొన్ని సందర్భాలలో బలవంతంగా చంపి, ఆత్మహత్యలుగా చిత్రీకరించడం చేస్తున్నారు. మరికొన్ని సందర్భాలలో ఈ మహిళలు ఈ వేధింపులు, బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

దీనిని నిరోధించాలంటే సమాజంలో ఖచ్చితంగా మార్పు రావాలి. వరకట్నం అనే సాంఘిక దురాచారం రూపు మాపడానికి రేపటి భావిభారత పౌరులైన విద్యార్థుల నుండే చైతన్యం రావాలి. చదువుకున్న వారిలో, తల్లిదండ్రులలో అవగాహన పెరగాలి. కట్నం వేధింపులకు విధించే శిక్షలు కఠినంగా ఉండాలి. దీనిని రూపుమాపడానికి సమాజంలో ఉన్న ప్రతీ ఒక్కరూ బాధ్యత వహించాలి.

AP Board 9th Class Social Solutions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

9th Class Social Textbook Page No.274

ప్రశ్న 3.
గృహ హింస ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు మొదలై రాను రాను దురలవాటుగా మారిపోతుంది. హింస నుండి మరింత హింస పుడుతుంది. దీన్ని ఎలా ఆపవచ్చు? ఎవరు సహాయపడతారు?
జవాబు:
స్త్రీలు కూడా పౌరులే. స్త్రీలు గౌరవంగా బ్రతకడం, ఎవరూ దూషించకుండా, అవమానించకుండా ఉండడం, స్త్రీలు చేసే పనిని గౌరవించడమే కాకుండా వారికున్న హక్కులను అనుభవించేటట్లు పరిస్థితులు కల్పించడం సమాజంలోని ప్రతీ ఒక్కరి బాధ్యత.

ప్రారంభంలో చిన్న చిన్న మాటలతో అవమానించి, చులకన చేసి మాట్లాడి చివరకు శారీరక, మానసిక క్షోభకు గురిచేసి జీవితాన్ని దుర్భరం చేస్తున్నారు.

గృహహింస మొదట ప్రారంభం కుటుంబం నుండి ప్రారంభం అవుతుంది. కాబట్టి కుటుంబ సభ్యుల్లో మార్పు రావాలి. మానవత్వం వెల్లివిరియాలి. కుటుంబ సభ్యుల్లో మార్పు రానప్పుడు, గృహహింస అనేక రూపాల్లో బయట పడుతున్నప్పుడు, మహిళలు పోలీస్ అధికారికి గాని, జుడీషియల్ అధికారికిగాని, ఫస్ట్ క్లాస్/మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కు స్వయంగాగాని, ఫోన్ ద్వారాగాని, ఇ-మెయిల్ ద్వారాగాని ఫిర్యాదు చేయవచ్చు. గృహహింస జరిగినప్పుడు, జరుగుతున్నప్పుడు, జరుగుతుందని తెలిసినప్పుడు పై అధికారులకు తెలియచేస్తూ ఆపగలరు. నిరోధించగలరు. సహాయపడగలరు.

AP Board 9th Class Social Solutions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

ప్రాజెక్టు

ప్రశ్న 1.
పేదవారికి ఉచిత న్యాయ సహాయం పొందడానికి ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుంది. మీకు సమీపంలో ఉన్న వకీలు/ప్లీడరును సంప్రదించి సమాచారం సేకరించండి.
జవాబు:
న్యాయం దృష్టిలో అందరూ సమానులే. ఏ పౌరుడు కూడా ఆర్థిక కారణాల మూలంగా, ఇతర బలహీనతల కారణంగా న్యాయాన్ని పొందే అవకాశాలను కోల్పోకుండా ఉండటం కోసం ప్రభుత్వం ఉచిత న్యాయ సహాయం’ అందిస్తుంది. ఇందులకై కేంద్రప్రభుత్వం 1976వ సం||లో భారత రాజ్యాంగానికి ఆర్టికల్ 39(ఎ) జత చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలను న్యాయ సహాయాన్ని అందించేలా చేయడానికి లోక్ అదాలత్ లను ఏర్పరచింది.

న్యాయ సహాయం పొందడానికి అర్హులు :

  1. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు.
  2. మానవ అక్రమ రవాణా బాధితులు, యాచకులు, స్త్రీలు, పిల్లలు, మతిస్థిమితం లేనివారు, అవిటివారు.
  3. ప్రకృతి వైపరీత్యాల బాధితులు, వ్యవసాయ, పారిశ్రామిక కార్మికులు.

రూ. 50,000 కంటే తక్కువ సాంవత్సరిక ఆదాయం కలవారు.

దరఖాస్తు చేసే విధానం :
జిల్లా కోర్టు, హైకోర్టు న్యాయసేవా అధికార సంస్థకు సహాయం కొరకు దరఖాస్తు చేస్తే సహాయం అందించబడుతుంది.

న్యాయ సహాయ విధానాలు :

  1. న్యాయవాదిచే ఉచితంగా న్యాయ సలహా ఇప్పించుట.
  2. న్యాయ సహాయం పొందిన వారికి కోర్టు ఫీజు, కేసుకు సంబంధించిన కోర్టు ఖర్చులు భరించడం.
  3. కేసులకు పరిశీలించిన మీదట, అవసరమైనచో దరఖాస్తుదారుని తరఫున న్యాయవాదులను నియమించి ఆయా కోర్టులలో కేసులు చేపట్టడం.
  4. న్యాయ సహాయం పొందినవారికి ఆయా కేసులలో తీర్పుల నకళ్ళు ఉచితంగా ఇవ్వడం, మొదలగు సహాయాలు అందించబడతాయి.

AP Board 9th Class Social Solutions Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

SCERT AP 9th Class Social Studies Guide Pdf 20th Lesson ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 20th Lesson ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

9th Class Social Studies 20th Lesson ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
జవాబుదారీ, బాధ్యతాయుత, చట్టబద్ధ ప్రభుత్వం ఉండేలా ప్రజాస్వామ్యం ఎలా చూస్తుంది? (AS1)
జవాబు:

  1. ప్రజాస్వామ్యం అంటే అంతిమంగా ప్రజల నుంచి అధికారం పొంది, దానికి జవాబుదారీగా ఉండే ప్రభుత్వం.
  2. దీనిలో ప్రజాప్రతినిధులను ఎప్పటికప్పుడు కొంతకాలానికి ఎన్నుకుంటారు.
  3. ఎన్నికైన ప్రజాప్రతినిధులు వివిధ రకాలుగా ప్రజలకు జవాబుదారీగా ఉంటారు.
  4. ప్రజలు ఎన్నుకున్న శాసనసభలలో ప్రభుత్వ పక్ష ప్రతినిధులు తమ పనిని వివరించాలి, పనుల ప్రణాళికను ఈ శాసనసభలే ఆమోదించాలి.
  5. ప్రభుత్వం చేసిన పనికి సంబంధించిన సమాచారాన్ని ఏ పౌరుడైనా అడగవచ్చు. ఆ సమాచారాన్ని ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వానిది. అన్నిటికీ మించి నిర్దిష్ట కాలం తరువాత మళ్ళీ ఎన్నికలుంటాయి.
  6. ప్రజాప్రతినిధులు మళ్ళీ ప్రజల మద్దతును పొందవలసి ఉంటుంది.
  7. వాళ్ళు చేసిన పనిని వివరించమని అడిగి అది సంతృప్తికరంగా లేనప్పుడు ప్రజలు వాళ్లను తిరస్కరించవచ్చు.

ప్రశ్న 2.
సామాజిక వైవిధ్యతలను కలుపుకుని వెళ్లే స్వభావాన్ని ప్రజాస్వామ్యాలు ఏ స్థితిలో ప్రదర్శిస్తాయి? (AS1)
జవాబు:

  1. ప్రజల పాలన అని. అన్నప్పుడు వయోజనులైన అందరూ అని అర్థం.
  2. వాళ్ళు పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ధనికులు కావచ్చు,. పేదవాళ్ళు కావచ్చు. నల్లవాళ్లు కావచ్చు, తెల్లవాళ్లు కావచ్చు, హిందువులు లేదా క్రిస్టియన్లు లేదా ముస్లింలు లేదా నాస్తికులు కావచ్చు. ఏ భాష మాట్లాడే వాళ్లేనా కావచ్చు. ఈ భావన ఏర్పడటానికి చాలాకాలం పట్టింది.
  3. సూచికగా ఎన్నికలలో ఓటు చేసే హక్కును తీసుకుందాం.
  4. మొదట్లో ఆస్తి ఉన్న కొంతమంది పురుషులకు మాత్రమే ఓటుహక్కు ఉండేది.
  5. క్రమేపీ కొన్ని దేశాలలో ఈ హక్కును పేదవాళ్ళకు కల్పించారు. ఆ తరువాత అది మహిళలకు లభించింది.
  6. చివరికి అన్ని మతాల, జాతుల వాళ్ళకు ఓటు హక్కు లభించింది.
  7. 1920 నుంచి అమెరికాలో శ్వేతజాతి మహిళలకు ఓటుహక్కు లభించింది.
  8. 1965 లో నల్లజాతీయులైన పౌరుల ఓటు హక్కుపై వివక్షతను తొలగించింది.
  9. న్యూజీలాండ్ 1893లోనే అన్ని వర్గాల ప్రజలకు ఓటుహక్కు కల్పించిన మొదటి దేశం.
  10. సార్వజనీన ఓటుహక్కు కల్పించిన తొలి పెద్ద దేశం యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్.

రాజకీయ సమానత్వం, అందరినీ కలుపుకోవటం అన్న మౌలిక సూత్రంపై ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంది. ప్రజాస్వామ్యంలో వయోజనులైన ప్రతి ఒక్క పౌరునికి ఒక ఓటుహక్కు ఉండాలి. ప్రతి ‘ఓటుకు సమాన విలువ ఉండాలి.

AP Board 9th Class Social Solutions Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

ప్రశ్న 3.
కింద వ్యాఖ్యానాలను సమర్ధించటానికి వ్యతిరేకించటానికి మీ వాదనలు పేర్కొనండి : (AS2)
అ. పారిశ్రామిక దేశాలు ప్రజాస్వామ్య విధానాన్ని అనుసరించగలవు, కానీ పేద దేశాలు ధనిక దేశాలు కావాలంటే నియంతృత్వం ఉండాలి.
జవాబు:
పేద దేశాలు ధనిక దేశాలు కావాలంటే నియంతృత్వం కన్నా ప్రజాస్వామ్యం ఉంటేనే బాగుంటుంది.

కారణం ప్రజాస్వామ్య దేశాలలో ప్రభుత్వ కార్యక్రమాల రూపకల్పనలోను, ప్రభుత్వ విధానాలు, చట్టాలు తయారు చేయటంలో, వాటిని అమలు చేయటంలో ప్రజలు భాగస్వాములు కావాలి. ప్రజలందరూ బహిరంగంగా పాల్గొని తమ అవసరాలు, అభిప్రాయాలు స్పష్టంగా పేర్కొనేలా బహిరంగ చర్చలు జరపాలి తరువాత చట్టాలు, విధానాలు రూపొందించాలి ఆ విధంగా ప్రజల సంక్షేమ పథకాలు అమలు చేయటం వల్ల ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సమాన అవకాశాలు పొందుతారు. అందువలన పేద దేశాలు కూడా ధనిక దేశాలుగా మారతాయి.

పారదర్శకత (దాపరికం లేని పరిపాలన), అమలు జరిగినపుడు,. అవినీతి, అన్యాయం, లంచగొండితనం వంటివి లేనప్పుడు పేదదేశాలు ప్రజాస్వామ్యాన్ని అమలు చేసినప్పటికీ ధనిక దేశాలుగా మారతాయి.

అందువల్ల పేద దేశాలు ధనిక దేశాలు కావాలంటే నియంతృత్వం కన్నా ప్రజాస్వామ్యమే మేలు.

ఆ. పౌరుల మధ్య ఆదాయాలలో అసమానతలను ప్రజాస్వామ్యం తగ్గించలేదు.
జవాబు:

  1. సమాజం ధనిక – పేదలుగా, పైకులాలు – దళితులుగా విభజింపబడి ఉంటే రాజకీయ సమానత్వం అర్థరహితం అవుతుంది.
  2. ఉన్నత హెూదా, సంపద ఉన్నవాళ్ళు తమకు అనుకూలంగా ఓటు వేయమని మిగిలిన వాళ్లని తేలికగా ప్రభావితం చేయగలుగుతారు.
  3. చాలా కుటుంబాలలో ఆ కుటుంబానికి పెద్ద అయిన పురుషుడు మహిళలతో సహా కుటుంబ సభ్యులందరూ ఎవరికి ఓటు వేయాలో నిర్ణయిస్తారు.
  4. అమెరికా వంటి అనేక దేశాలలో అనేక ప్రసార సాధనాలు ధనిక కార్పొరేట్ సంస్థలు లేదా వ్యక్తుల చేతుల్లో ఉంటాయి.
  5. దేనిని ఎక్కువగా ప్రసారం చేస్తారు ? దేనిని విస్మరిస్తారు ? అన్న దానిని బట్టి వీళ్ళు ప్రజాభిప్రాయాన్ని తీర్చిదిద్దుతారు. ప్రభావితం చేస్తారు.
  6. సంపన్నులకు, శక్తిమంతులకు శాసనసభ్యులు, మంత్రులు అందుబాటులో ఉంటారు. కాబట్టి వాళ్ళు విధానాలను, కార్యక్రమాలను ప్రభావితం చేయగలుగుతారు.
  7. ఇంకోవైపున పేదలకు నిరక్షరాస్యులకు ప్రభుత్వ వర్గాలు ఈ విధంగా అందుబాటులో ఉండవు కాబట్టి అనేక దేశాల ప్రభుత్వాలు ధనికులకు అనుకూలంగా, పేదల ప్రయోజనాలకు విరుద్దంగా ఉండే విధానాలను అనుసరిస్తుంటాయి.
  8. కాబట్టి రాజకీయ సమానత్వంతో పాటు సామాజిక, ఆర్థిక సమానత్వం ఉంటే తప్ప పౌరుల మధ్య ఆదాయాలలో అసమానతలను ప్రజాస్వామ్యం తగ్గించలేదు.

ఇ. పేద దేశాలలోని ప్రభుత్వాలు పేదరికం తగ్గించటం, ఆరోగ్యం , విద్యల పై తక్కువ ఖర్చు చేసి, పరిశ్రమలకు, మౌలిక సదుపాయాలకు ఎక్కువ ఖర్చు చేయాలి.
జవాబు:
పేద దేశాలలోని ప్రభుత్వాలు పేదరికం తగ్గించటం, ఆరోగ్యం , విద్యలపై తక్కువ ఖర్చుచేసి, పరిశ్రమలకు మౌలిక సదుపాయాలకు ఎక్కువ ఖర్చు చేయడానికి కారణం.

అర్థశాస్త్ర పరిభాషలో వ్యయాలు రెండు రకాలు :

  1. ఉత్పాదక వ్యయం
  2. అనుత్పాదక వ్యయం

ఉత్పాదక వ్యయం అనగా పరిశ్రమలు, వ్యవసాయంపై చేసే వ్యయం.

అనుత్పాదక వ్యయం అనగా రోడ్లు, భవనాలపై చేసే వ్యయం.

అందువలన పేద దేశాలు ఉత్పాదక వ్యయం మీద ఎక్కువ ఖర్చు చేస్తాయి. అనుత్పాదక వ్యయంపై చేసే వ్యయం వలన అదనపు రాబడులు ఏమీరావు.

ఈ. ప్రజాస్వామ్యంలో పౌరులందరికీ ఒక ఓటు ఉంటుంది కాబట్టి ఆధిపత్యానికి, ఘర్షణలకు తావు ఉండదు.
జవాబు:
ప్రజాస్వామ్యంలో పౌరులందరికీ ఒక ఓటు ఉంటుంది. పౌరుల మధ్య ఓటు హక్కు విషయంలో ఏ విధమైన వ్యత్యాసం ఉండదు. ప్రతి ఓటుకీ సమాన విలువ ఉంటుంది.

పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదలు, నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు, హిందువులు, క్రిస్టియన్లు లేదా ముస్లింలు లేదా నాస్తికులు అయినా, ఏ భాష మాట్లాడేవారైనా ఎవరికైనా ఓటుహక్కు ఉంటుంది కాబట్టి ఏ విధమైన వ్యత్యాసం ఉండదు. కావున ఏ విధమైన ఆధిపత్యానికీ, ఘర్షణలకూ తావు ఉండదు.

ప్రశ్న 4.
ప్రజాస్వామ్యాన్ని అంచనా వేయటంలో కింద ఉన్న వాటిల్లో ఏది వర్తించదు? (AS1)
ప్రజాస్వామ్యంలో :
అ. స్వేచ్ఛాయుత ఎన్నికలు
ఆ. వ్యక్తి గౌరవం
ఇ. అధిక సంఖ్యాకుల పాలన
ఈ. చట్టం ముందు అందరూ సమానులు
జవాబు:
ఆ. వ్యక్తి గౌరవం .

AP Board 9th Class Social Solutions Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

ప్రశ్న 5.
ప్రజాస్వామ్యంలో రాజకీయ, సామాజిక అసమానతలపై అధ్యయనం ఈ కింది విషయాన్ని వెల్లడి చేస్తోంది. (AS1)
అ. ప్రజాస్వామ్యం, అభివృద్ధి కలిసి ఉంటాయి.
ఆ. ప్రజాస్వామ్యంలో అసమానతలు ఉంటాయి.
ఇ. నియంతృత్వంలో అసమానతలు ఉండవు
ఈ. ప్రజాస్వామ్యం కంటే నియంతృత్వం మంచిది.
జవాబు:
(ఆ) ప్రజాస్వామ్యంలో అసమానతలు ఉంటాయి.

ప్రశ్న 6.
ఆరు దేశాలకు సంబంధించిన సమాచారం దిగువన ఉంది. ఈ సమాచారాన్ని బట్టి ఆయా దేశాలను ఏ రకంగా వర్గీకరిస్తారు? ఒక్కొక్కదాని ఎదురుగా “ప్రజాస్వామికం’ లేదా ‘అప్రజాస్వామికం’ లేదా ‘ఖచ్చితంగా చెప్పలేం’ అని రాయండి. (AS1)
దేశం (అ) : దేశ అధికారిక మతాన్ని అంగీకరించని ప్రజలకు ఓటు హక్కు ఉండదు.
దేశం (ఆ) : ఒకే పార్టీ గత ఇరవై సంవత్సరాలుగా ఎన్నికలలో గెలుస్తోంది.
దేశం (ఇ) : గత ఎన్నికలలో అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోయింది.
దేశం (ఈ) : సైన్యాధిపతి ఆమోదం లేకుండా సైన్యానికి సంబంధించిన చట్టాన్ని పార్లమెంటు చేయలేదు.
దేశం (ఉ) : న్యాయవ్యవస్థ అధికారాలను తగ్గిస్తూ పార్లమెంటు చట్టం చేయలేదు.
దేశం (ఊ) : దేశానికి సంబంధించి ముఖ్య ఆర్థిక నిర్ణయాలన్నీ కేంద్ర బ్యాంకు అధికారులు తీసుకుంటారు, వీటిని మంత్రులు మార్చలేరు.
జవాబు:
దేశం (అ) : ప్రజాస్వామికం
దేశం (ఆ) : ప్రజాస్వామికం
దేశం (ఇ) : ప్రజాస్వామికం
దేశం (ఈ) : అప్రజాస్వామికం
దేశం (ఉ) : ప్రజాస్వామికం
దేశం (ఊ) : అప్రజాస్వామికం

ప్రశ్న 7.
కింద ఉన్న ప్రతి వాక్యంలో ప్రజాస్వామిక, అప్రజాస్వామిక అంశాలు ఉన్నాయి. ప్రతి వాక్యానికి ఆ రెండింటినీ వేరుగా రాయండి. (AS1)
అ. ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్ణయించిన నియంత్రణలకు లోబడి పార్లమెంటు కొన్ని చట్టాలు చేయాలని మంత్రి చెప్పారు. –  ప్రజాస్వామికం

ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్ణయించిన నియంత్రణలకు లోబడి పార్లమెంటు . కొన్ని చట్టాలు చేయవలసిన అవసరం లేదు అని మంత్రి చెప్పారు. – అప్రజాస్వామికం

ఆ. పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగిందని నివేదికలు వచ్చిన నియోజకవర్గంలో మళ్ళీ ఎన్నికలను నిర్వహించవలసిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. – ప్రజాస్వామికం

పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగిందని నివేదికలు వచ్చిన నియోజకవర్గంలో మళ్ళీ ఎన్నికలు నిర్వహించవలసిందిగా ఎన్నికల సంఘం ఆదేశించలేదు. – అప్రజాస్వామికం

పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం ఏనాడూ 10 శాతం మించలేదు. ఈ కారణంగా పార్లమెంటులో మూడవ వంతు సీట్లు మహిళలకు కేటాయించాలని మహిళా సంఘాలు ఉద్యమం మొదలు పెట్టాయి. – ప్రజాస్వామికం

పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం ఏనాడూ 10 శాతం మించలేదు. ఈ కారణంగా పార్లమెంటులో మూడవ వంతు సీట్లు మహిళలకు కేటాయించాలని మహిళా సంఘాలు ఉద్యమం మొదలు పెట్టలేదు. అసలు ఆ ప్రస్తావన కూడా తేలేదు. – అప్రజాస్వామికం

ప్రశ్న 8.
ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్న కింది వాదనలకు మీ ప్రతిస్పందన రాయండి : (AS4)
అ. దేశంలో అత్యంత క్రమశిక్షణ ఉండి, అవినీతిలేని వ్యవస్థ సైన్యం ఒక్కటే. కాబట్టి దేశాన్ని సైన్యం పరిపాలించాలి.
జవాబు:
సైన్యం పరిపాలిస్తే బాగుంటుంది కానీ ప్రజల సమస్యలు సైన్యానికి అంతగా తెలియవు. తెలిసిన వాటిని చేయాలి అనే దృఢ సంకల్పం సైన్యానికి ఉండకపోవచ్చు. కారణం. సైన్యం అనేది ఉద్యోగస్వామ్యం మాత్రమే. ప్రజాసమస్యలు ప్రజాస్వామ్యంలోనే చక్కగా పరిష్కరింపబడతాయి. కానీ నాయకులలో అవినీతి, బంధుప్రీతి, లంచగొండితనం వంటి అంశాలు లేకపోతే ప్రజాస్వామ్యంలో దేశం త్వరితగతిన అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో నాయకులు ప్రజలనుండి వస్తారు కాబట్టి ప్రజాసమస్యలు బాగా పరిష్కరింపబడతాయి.

ఆ. అధిక సంఖ్యాకుల పాలన అంటే ఏమీ తెలియని ప్రజల పాలన. తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ మనకు కావలసింది విజ్ఞుల పాలన.
జవాబు:
అధిక సంఖ్యాకుల పాలన ఆంటే ప్రజలందరి పాలన. అనగా ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. ప్రజలందరు ప్రభుత్వ కార్యకలాపాలలో భాగస్వాములు కావడం.

తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ మనకి కావలసింది విజ్ఞుల పాలన. అనగా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. ప్రజలు విజ్ఞులైన నాయకులను ఎన్నుకొని వారి ద్వారా పరిపాలింపబడడం. ఇలాంటి విధానం వలన సమయం ధనం ఆదా కావడానికి అవకాశం ఉంటుంది.

ఇ. ఆధ్యాత్మిక విషయాలలో మతగురువుల మార్గదర్శనం కోరుకున్నప్పుడు రాజకీయాల్లో కూడా మార్గదర్శనం చేయమని ఎందుకు అడగకూడదు? దేశాన్ని మతగురువులు పరిపాలించాలి.
జవాబు:
ఆధ్యాత్మిక విషయాలలో మత గురువులు. కానీ వారు రాజనీతిలో కాని రాజకీయాలలోకాని, సంక్షేమ పథకాల రూపకల్పనలో, కాని, వాటిని అమలు చేయడంలో కాని మత గురువులకు అవగాహన ఉండవలసిన అవసరం ఉండదు. కాబట్టి దాని పట్ల వారికి సరైన అవగాహన ఉండకపోవచ్చు. పైగా మత గురువులు మతపరమైన విషయాలపట్ల చూపించిన ప్రతిభ రాజకీయ, ప్రజాపాలన విషయాలలో చూపించకపోవచ్చును, మతం అనేది మత్తుమందు లాంటిది. రాజకీయాలు ఆ విధమైనవి కావు.

ప్రశ్న 9.
ప్రపంచ పటంలో ఈ క్రింది దేశాలను గుర్తించండి. (AS5)
అ) శ్రీలంక
ఆ) బెల్జియం
ఇ) రష్యా
ఈ) అమెరికా (యు.ఎస్.ఎ)
AP Board 9th Class Social Solutions Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన 1

ప్రశ్న 10.
‘పౌరుల గౌరవం, స్వేచ్ఛ’ అనే శీర్షిక కింద గల మొదటి రెండు పేరాలు చదివి దిగువ ప్రశ్నకు సమాధానం ఇవ్వండి :
ప్రజాస్వామిక దేశంలో పౌరుల గౌరవం, స్వేచ్ఛ గురించి మీ సొంతమాటల్లో రాయండి. (AS2)
జవాబు:
వ్యక్తి గౌరవాన్ని, స్వేచ్ఛని కాపాడటంలో వివిధ రకాల ప్రభుత్వాలలో ప్రజాస్వామ్యం మెరుగైనది.

ప్రతి వ్యక్తికీ తోటి మానవుల నుంచి గౌరవం పొందాలని ఉంటుంది.

తనకు తగినంత మర్యాద ఇవ్వటం లేదని భావించినందువల్లనే తరచు వ్యక్తుల మధ్య ఘర్షణలు తలెత్తుతుంటాయి. • గౌరవం, స్వేచ్ఛల పట్ల నిబద్దతే ప్రజాస్వామ్యానికి పునాది. ప్రపంచ వ్యాప్తంగా ఈ విషయాన్ని కనీసం సూత్రబద్దంగానైనా ప్రజాస్వామిక దేశాలు గుర్తించాయి.

దీనిని వివిధ ప్రజాస్వామ్యాలలో వివిధ స్థాయిలలో సాధించారు. ఆధిపత్యం, పరాధీనత ఆధారంగా తరతరాలుగా నడిచిన సమాజాలలో అందరూ సమానం అని అంగీకరించటం అంత తేలికైన విషయం కాదు.

ప్రశ్న 11.
ప్రజలు ప్రజాస్వామ్యం కొరకు పోరాడడానికి గల కారణాలను తెల్పండి.
జవాబు:
తరతరాలుగా రాచరిక, నియంతృత్వ పరిపాలనపై ప్రజల గౌరవానికి, స్వేచ్ఛకు విలువ లేకుండా, ప్రజల భాగస్వామ్యంతో పరిపాలన కొనసాగించడంపై ప్రజలు ఎదిరించారు. పౌరుల హక్కులకు భంగం వాటిల్లినప్పుడు, బాధ్యత లేని పరిపాలన కొనసాగినప్పుడు ప్రజలు, రాచరిక పునాదులపై నడిచే ప్రభుత్వాలను, సైనిక పాలనలను సైతం ప్రజలు తిరస్కరించారు. సమానత్వ సూత్రంపై నడిచే, ప్రజల సంక్షేమం, ఉపాధి మెరుగుపరిచే ప్రజాస్వామ్యంపై ప్రజలు ఇష్టత చూపించారు. కుల ఆధారిత అసమానతలు, అత్యాచారాలు, వ్యక్తికి చట్టపర నైతిక విలువలు లేని పాలనను కాదని ప్రజాస్వామ్యం కావాలన్నారు.

AP Board 9th Class Social Solutions Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

ప్రశ్న 12.
మన పాఠశాలల్లో ప్రజాస్వామ్యం అమలు జరుగుతుందనడానికి కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. (AS6)
జవాబు:
మన పాఠశాలల్లో ప్రజాస్వామ్యం జరుగుతుంది అనడానికి కొన్ని ఉదాహరణలు :

  1. మన పాఠశాలల్లో కులమతాలు, ధనిక, పేదాయని భేదం లేకుండా అందరికీ యూనిఫారమ్స్ ధారణ ద్వారా సమానత్వం లభిస్తుంది.
  2. అదేవిధంగా తరగతులు, ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండా అందరికీ మధ్యాహ్న భోజనం అందించబడుతుంది.
  3. అన్ని మతాల పండుగలకు ప్రాధాన్యతనిస్తూ ఆ రోజులలో సెలవును మంజూరు చేయడమే కాకుండా స్థానిక ప్రాంత పండుగలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.
  4. తరగతి నాయకుడి ఎన్నిక కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో మెజార్టీ విద్యార్ధుల అభిప్రాయం మేరకు, ఎన్నిక ప్రకారం ఎంపిక చేయడం జరుగుతుంది.
  5. పేదవారికి, వెనుకబడిన వారికి ఆర్థికంగా చేయూత నందించుటకుగాను స్కాలర్ షిప్స్, ఆర్థిక పథకాలు అందించడం జరుగుతుంది.

9th Class Social Studies 20th Lesson ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన InText Questions and Answers

9th Class Social Textbook Page No.247

ప్రశ్న 1.
పరిపాలనలో భాగస్వాములు కావటం ప్రజలకు ఎందుకు ఇష్టం ఉండదు? సరైన అవగాహన లేకపోవటం వల్లనా, ఆసక్తి లేకనా, లేక తమ అభిప్రాయానికి విలువ ఉండదని భావించటం వల్లనా?
జవాబు:

  1. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు కేవలం ఎన్నికల్లో పాల్గొని, పాలకులను ఎన్నుకోవటం మాత్రమే కాదు.
  2. ప్రభుత్వ విధానాలు, చట్టాలు తయారు చేయటంలో, వాటిని అమలు చేయటంలో కూడా ప్రజలు భాగస్వాములు కావాలి.
  3. ప్రజలందరూ బహిరంగంగా పాల్గొని తమ అవసరాలు, అభిప్రాయాలు స్పష్టంగా పేర్కొనేలా బహిరంగ చర్చలు జరిపిన తరువాత ,చట్టాలు, విధానాలు రూపొందించినప్పుడు ఇది సాధ్యమవుతుంది.
  4. స్వతంత్ర పౌర సంఘాలుగా ఏర్పడి చట్టాలు, విధానాలు సమర్థంగా అమలు అయ్యేలా చూడటంలో ప్రజలు భాగస్వాములు కావాలి.
  5. అనేక దేశాలలో ఎన్నికైనా ప్రభుత్వాలు కూడా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించవు. పైగా దానిని అడ్డుకుంటాయి.
  6. ప్రజలు కూడా దేశ వ్యవహారాలలో అంత ఆసక్తి చూపకుండా ఉదాసీనంగా ఉండిపోతారు.
  7. కారణం ప్రజలందరికి పరిపాలన పట్ల అవగాహన లేకపోవడం, ఆసక్తి చూపకపోవడం.
  8. ఒకవేళ ఆసక్తి చూపినా పాలకులు వారి అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకోకపోవడం.

9th Class Social Textbook Page No.248

ప్రశ్న 2.
ప్రపంచంలో అనేక ప్రభుత్వాలు ప్రజలకు పౌరహక్కులను ఇచ్చాయి. అయితే ప్రజల ఫోనులను టాపింగ్ చేయటం, వాళ్ళ ఉత్తరాలు చదవటం, వాళ్ళ కార్యకలాపాలపై నిఘా ఉంచటం వంటి చర్యలు చేపడతాయి. ఇది సరైనదేనా?
జవాబు:

  1. ప్రజాస్వామ్యానికి పౌరహక్కులు ఉండాలి.
  2. తెలుసుకోటానికి, చర్చించటానికి, స్వతంత్ర అభిప్రాయాలు ఏర్పరచుకోటానికి, వాటిని వ్యక్తపరచటానికి సంఘాలుగా ఏర్పడి తమ భావాల అమలుకు పోరాడటానికి పౌరులకు స్వేచ్ఛ ఉన్నప్పుడే వాళ్ళు నిర్ణయాలు తీసుకోవటంలో భాగస్వాములు అవుతారు.
  3. అంతేకాని ప్రజల ఫోనులను టాపింగ్ చేయటం, వాళ్ళ ఉత్తరాలు చదవటం, వాళ్ల కార్యకలాపాలపై నిఘా ఉంచడం వంటి చర్యల వల్ల వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛను హరించివేయడమే అవుతుంది.
  4. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది సరైనదికాదు.

AP Board 9th Class Social Solutions Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

ప్రశ్న 3.
ప్రజాస్వామికంగా, ప్రజలందరి ప్రయోజనాల కోసం పనిచేసే ప్రభుత్వాలు ఉన్నప్పటికీ అనేక దేశాలలో తీవ్రస్థాయిలో అసమానతలు ఎందుకు కొనసాగుతున్నాయి?
జవాబు:

  1. అనేక దేశాల ప్రభుత్వాలు ధనికులకు అనుకూలంగా, పేదల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండే విధానాలను అనుసరిస్తూ ఉంటాయి.
  2. ప్రజాస్వామికంగా ప్రజలందరి ప్రయోజనాల కోసం పనిచేసే ప్రభుత్వాలు ఉన్నప్పటికీ అనేక దేశాలలో తీవ్ర స్థాయిలో అసమానతలు ఉండటానికి కారణాలు.
    అ) తరతరాలుగా వస్తున్న వారసత్వపు సంపద.
    ఆ) ఉన్నత వర్గాలకు చెందినవారు మంచి విద్య, ఉద్యోగావకాశాలు పొందడం.
    ఇ) సంపద మరికొంత సంపదను సముపార్జించి పెట్టడం.
    ఈ) ఉన్న వర్గాలకు చెందినవారు పారిశ్రామిక, వాణిజ్య వర్గాలపై ఆధిపత్యం చెలాయించడం.
    ఉ) ఆలోచనా విధానాలలోనూ మార్పులు రావడం.

9th Class Social Textbook Page No.250

ప్రశ్న 4.
మన దేశంలోని ఎన్నికలను ఉదాహరణగా తీసుకుందాం. ఒక ప్రాంతంలో ఉంటున్న వాళ్ళలో 1000 మందికి ఓటు హక్కు ఉందని అనుకుందాం. సాధారణంగా ఎన్నికల్లో 60 శాతం ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కుని ఉపయోగించుకుంటారు. అంటే ఎన్నికల్లో 600 మంది ఓటు వేస్తారు. ఎన్నికల్లో 10 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని అనుకుందాం. గెలిచిన అభ్యర్థికి 250 ఓట్లు, రెండవ అభ్యర్థికి 200 ఓట్లు, మిగిలిన 8 మందికి కలిపి 150 ఓట్లు పడ్డాయని అనుకుందాం. 250 . ఓట్లు వచ్చిన వ్యక్తి గెలిచినట్లు ప్రకటిస్తారు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల ప్రయోజనాలకు, దృక్పథాలకు గెలిచిన అభ్యర్థి ఏ మేరకు ప్రాతినిధ్యం వహిస్తారు? గెలిచిన అభ్యర్థికి ఓటర్లలో 25 శాతం మద్దతు మాత్రమే ఉంది. ఇది న్యాయమైన ప్రజాస్వామిక ఏర్పాటేనా? నిర్ణయాలు తీసుకునే సంస్థలకు ప్రజల ప్రతినిధులను ఎన్నుకోటానికి మరో విధానం ఏమైనా ఉందా?
జవాబు:
మన దేశంలోని ఎన్నికలను ఉదాహరణగా తీసుకుందాం. ఒక ప్రాంతంలో ఉంటున్న వాళ్ళలో 1000కి ఓటుహక్కు ఉందని అనుకుందాం. సాధారణంగా ఎన్నికల్లో 60 శాతం ఓటర్లు మాత్రమే తమ ఓటుహక్కుని ఉపయోగించుకుంటారు. అనగా ఎన్నికల్లో 600 మంది ఓటు వేస్తారు. అయితే ఎన్నికల్లో 10 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారని అనుకుందాం. గెలిచిన అభ్యర్థికి 250 ఓట్లు, రెండవ అభ్యర్థికి 200 ఓట్లు, మిగిలిన 8 మందికి కలిపి 150 ఓట్లు పడ్డాయని అనుకుందాం. కానీ 250 ఓట్లు వచ్చిన వ్యక్తి గెలిచినట్లు ప్రకటిస్తారు. అయితే అతను ఆ 250 మందికి మాత్రమే ప్రతినిధిగా కాకుండా ప్రజలందరికి ప్రతినిధిగా వ్యవహరిస్తాడు.

ప్రజలందరికి అభిప్రాయాలను తెలుసుకుంటాడు. ప్రజలందరికి ప్రాతినిధ్యం వహిస్తాడు. ప్రజలందరికి సంక్షేమ పథకాలను వర్తింపచేస్తాడు. ప్రజలందరికి అవసరాలు తీర్చటానికి కృషి చేస్తాడు. అందువల్ల ఇది న్యాయమైన ప్రజాస్వామిక వ్యవస్థగానే కొనసాగుతుంది. నిర్ణయాలు తీసుకునే సంస్థలకు ప్రజల ప్రతినిధులను ఎన్నుకోటానికి మరో విధానం.

  1. ప్రజలకు ఓటు చేసే హక్కుతో పాటు తిరస్కరించే అధికారం కూడా ఇవ్వాలి.
  2. ఎక్కువమంది ప్రజలు తిరస్కరించిన అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించరాదు.
  3. అనుకూలమైన ఓట్లతో పాటు వ్యతిరేకమైన ఓట్లను కూడా పరిగణనలోనికి తీసుకోవాలి.

9th Class Social Textbook Page No.254

ప్రశ్న 5.
సామాజిక, మత, భాషాపర వైవిధ్యతలను కలుపుకుని వెళ్ళటానికి ఈ రెండు (బెల్జియం, శ్రీలంక) దేశాలు అనుసరించిన మార్గాలను చర్చించండి.
జవాబు:
బెల్జియం, శ్రీలంకలు రెండు ప్రజాస్వామిక దేశాలే అయినప్పటికీ రెండు దేశాలు అధికారాన్ని పంచుకోవటంలో భిన్నమైన మార్గాలు అవలంబించాయి.

1) బెల్జియం :
వివిధ ప్రాంతాల ప్రజల ప్రయోజనాలు, భావనలను మన్నించినపుడే దేశం ఐక్యంగా ఉంటుందని బెల్జియం నాయకులు గుర్తించారు. ఈ అవగాహన కారణంగా అధికారాన్ని పంచుకోటానికి అందరికీ ఆమోదయోగ్యమైన ఏర్పాట్లు చేసుకున్నారు.

2) శ్రీలంక :
అధిక సంఖ్యలో ఉన్న ప్రజలు అధికారాన్ని పంచుకోటానికి ఇష్టపడక తమ ఆధిపత్యాన్ని ఇతరులపై రుద్దాలని ప్రయత్నించినపుడు దేశ సమైక్యత దెబ్బ తింటుందని, అంతర్యుద్ధాలు, పౌర యుద్ధాల కారణంగా దేశం వందల సంవత్సరాలు వెనుకబడుతుందని శ్రీలంక నిరూపించింది.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
మీ ఉపాధ్యాయుని సహాయంతో తరగతి ప్రతినిధిని ఎన్నుకోటానికి తరగతిలో ఎన్నికలు నిర్వహించండి.

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

SCERT AP 9th Class Social Studies Guide Pdf 18th Lesson భారతదేశంపై వలసవాద ప్రభావం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 18th Lesson భారతదేశంపై వలసవాద ప్రభావం

9th Class Social Studies 18th Lesson భారతదేశంపై వలసవాద ప్రభావం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
బ్రిటిష్ పాలనకు ముందు ప్రజలు అడవులను ఎలా ఉపయోగించుకున్నారు ? ఆ రోజుల్లో అడవులు, పూర్తిగా నాశనమయ్యే అవకాశం అంత ఎక్కువగా ఎందుకు లేదు? (AS1)
జవాబు:
అనాదిగా అడవులలో నివసిస్తున్న ప్రజలు, ఆదివాసీలు తమ రోజువారీ జీవితాలకు కావలసిన అనేక వస్తువులను అడవుల నుండి పొందేవాళ్ళు. ఒక విధంగా అడవుల యజమానులు వాళ్ళే. వేటాడడానికి దుంపలు, పళ్ళు, పూలు, మూలికలు సేకరించటానికి, పశువులను మేపుకోవడానికి అడవులను ఉపయోగించుకునే వాళ్ళు. లాభాల కోసం అడవిలో లభించే కలప, ఇతర వస్తువులను అమ్మే వాళ్ళుకాదు.

వ్యవసాయ భూముల కోసం అడవులను నరికినప్పటికీ రైతులు, ఆదివాసీల మధ్య ఘర్షణలు ఉన్నప్పటికీ అడవి కింద విస్తార భూభాగాలు ఉండేవి. అడవులను ఉపయోగించుకున్నప్పటికీ ప్రజలు వాటిని రక్షించే వాళ్ళు. కలపకు పెద్ద చెట్లు నరికి, కొత్త చెట్లను పెరగనిచ్చేవాళ్ళు. విచ్చలవిడిగా విశాల పరిధిలో అడవులను వాళ్ళు నరికెయ్యలేదు. అందువల్ల అడవులు పూర్తిగా నాశమయ్యే అవకాశం అంత ఎక్కువగా లేదు.

ప్రశ్న 2.
ఆదివాసీలు ఎవరికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు? తమ కోపాన్ని, నిరసననీ వాళ్ళు ఎలా వ్యక్తం చేశారు? కొన్ని – ఉదాహరణలు ఇవ్వండి. (AS1)
జవాబు:
బ్రిటిష్ పరిపాలనకు ముందు ఆదివాసీలు అడవిలో లభించే అనేక ఫలసాయాన్ని, అటవీ ఉత్పత్తులను అమ్ముకొని, జీవించేవాళ్ళు. లాభాల కోసం అడవిలో లభించే కలప, ఇతర వస్తువులను అమ్మేవాళ్ళు కాదు. కానీ బ్రిటిష్ వారి పాలనలో ఆదివాసీల జీవితాలు దుర్భరమైనాయి. వారి జీవన పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయి. మధ్యప్రదేశ్, తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల పారిశ్రామిక అభివృద్ధికి విదేశస్థులపై ఆధారపడవలసి వచ్చేది. స్వాతంత్ర్యం తరువాత . కూడా విద్యకు తగినంత ప్రాముఖ్యత ఇవ్వకపోవడం వల్ల అంతగా చదువుకోని కార్మికశక్తి పారిశ్రామిక అభివృద్ధికి ఆటంకంగా కొనసాగింది.

ఛత్తీస్ గఢ్ కు చెందిన బైగా, మురియా, గోండ్, భిల్ జాతులు, ఆంధ్రప్రదేశ్ కి చెందిన కోయ, రెడ్డి, కోలం జాతులు, ఒడిశాలోని సవర ఆదివాసీలు అటవీశాఖ లేదా గుత్తేదారుల వద్ద కూలీలుగా పనిచేయవలసి వచ్చేది. వడ్డీ వ్యాపారస్తుల వద, రైతుల పొలాల్లో వెట్టి కార్మికులుగా మారేవాళ్ళు, బయట నుండి వచ్చిన ప్రజలు ఆదివాసీల భూములను ఆక్రమించుకుని, హింసలకు గురి చేశారు. అటవీశాఖ అధికారులు జరిమానాలు విధించడం, చిన్న చిన్న కారణాలకు ప్రజలను కొట్టడం, బలవంతంగా ఇళ్ళలో చొరబడి వస్తువులను లాక్కోవడం, ఆడవారిపట్ల అసభ్యంగా ప్రవర్తించడం, లంచాలు తీసుకోవడం వంటి విషయాలు సాధారణమైపోయాయి.

ఇటువంటి ప్రతికూల పరిస్థితులకు వ్యతిరేకంగా ఆదివాసీలు అనేక ప్రాంతాలలో ప్రతిఘటించసాగారు. ఈ ప్రతిఘటనలలో పోలీసు స్టేషన్లు, అటవీశాఖ కేంద్రాలు, వడ్డీ వ్యాపారస్తుల ఇళ్ళు వంటివి తగలబెట్టేవాళ్ళు. అనేకసార్లు అడవిని తగలబెట్టేవాళ్ళు.
ఉదా : 1856 జార్ఖండ్ సంతాల్ తిరుగుబాట్లు.
1922 ఆంధ్రప్రదేశ్ కోయ తిరుగుబాట్లు.

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

ప్రశ్న 3.
అదివానీ తిరుగుబాటులను బ్రిటిష్ పాలకులు ఏ విధంగా అణచివేశారు?
జవాబు:
అడవి హక్కులు అనుభవించడానికి, స్వేచ్ఛా జీవితం గడపడానికి బయట వ్యక్తుల దోపిడీల నుండి రక్షణ పొందడానికి, వేధింపుల నుండి బయటపడడానికి, అడవిలో హాయిగా నివసించడానికి గాను ఆదివాసీలు తిరుగుబాట్లు చేశారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు చేశారు. ప్రధానంగా జార్ఖండ్ కి చెందిన సంతాల్ ఆదివాసీలు బ్రిటిష్ పాలనను నిరసిస్తూ వ్యతిరేకించసాగారు. 1855-56లో సంతాలులు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. జమిందారులను, వడ్డీ వ్యాపారస్తులను చంపి దోచుకోసాగారు. అయితే సంతాలుల వద్ద విల్లంబులు, బాణాలు తప్పించి వేరే ఆయుధాలు లేవు. తుపాకులున్న బ్రిటిష్ సైనికులను వాళ్ళు ఎక్కువ కాలం నిలువరించలేకపోయారు.

జార్బండ్ రాష్ట్రంలో ఉన్న చోటానాగపూర్ పీఠభూమిలోని ముండా ఆదివాసీలు 1874 – 1901 మధ్య ‘బిర్సా’ అనే యువకుడి నాయకత్వంలో బ్రిటిష్ పాలనను అంతం చేయాలనుకున్నారు. వడ్డీ వ్యాపారస్తులు, జమీందారులకు రక్షణ నిచ్చిన విదేశీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలనుకున్నారు. కానీ నాయకులను పట్టుకొని జైలుపాలు చేయటంతో చివరికి ముండా తిరుగుబాటును అణచివేయగలిగారు. 1900లో బిర్సాముండా జైలులో చనిపోయాడు.

ఆంధ్రప్రదేశ్ లో కోయ ఆదివాసీలు, బస్తర్, మరియా, మురియా ఆదివాసీలు, గోండ్, కోలం ఆదివాసీల తిరుగుబాట్లను ఉత్తరాఖండ్ లోని కుమావూ తిరుగుబాట్లను బ్రిటిష్ పాలకులు కుటిల కుతంత్రాలతో, ఆధునిక ఆయుధాలతో అణచివేశారు.

ప్రశ్న 4.
భారతదేశ వివిధ ప్రాంతాలలో ఆదివాసీల తిరుగుబాటులను తెలియజేసే కాల పట్టిక తయారుచేయండి. (AS3)
జవాబు:
భారతదేశ వివిధ ప్రాంతాలలో ఆదివాసీల తిరుగుబాటులను తెలియచేసే కాల పట్టిక :
1880 C : ఆంధ్రప్రదేశ్ లో కోయలు తిరుగుబాటు.
1866 – 56 : జార్ఖండ్ కి చెందిన సంతాల్ ఆదివాసీల తిరుగుబాట్లు.
1874 – 1901 : జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న చోటానాగపూర్ పీఠభూమిలోని ముండా ,ఆదివాసీల తిరుగుబాట్లు
1910 : మధ్యప్రదేశ్ లోని బస్తర్ లో మరియా, మురియా ఆదివాసీల తిరుగుబాట్లు.
1922 : ఆంధ్రప్రదేశ్ కోయ, కోలం ఆదివాసీల తిరుగుబాట్లు.
1940 : గోండ్, కోలం ఆదివాసీల తిరుగుబాట్లు.
1921 – 22 : ఉత్తరాఖండ్ లోని కుమావూ ప్రాంతంలోని ఆదివాసీల తిరుగుబాట్లు చేశారు.

ప్రశ్న 5.
బ్రిటిష్ ప్రభుత్వంతో భారతీయ పారిశ్రామికవేత్తలకు ఎటువంటి సమస్యలు ఉండేవి?
జవాబు:
బ్రిటిష్ ప్రభుత్వంతో భారతీయ సారిశ్రామిక వేత్తలకు ఎదురయిన సమస్యలు :

  • రోడ్డు, రైలు మార్గాలు, విద్యుత్, బొగ్గు, ఇనుము వంటి అనేక వనరులు, సౌకర్యాలు భారతీయ పారిశ్రామిక వేత్తలకు కావాలి. కానీ బ్రిటిష్ ప్రభుత్వం ఈ రంగాలపై తగినంత దృష్టి నిలపలేదు.
  • భారతీయ పారిశ్రామిక వేత్తలు తమకు కావలసిన యంత్రాలన్నింటినీ విదేశాల నుంచి కొనుగోలు చేయాల్సి వచ్చేది. యంత్రాలను తయారుచేసే పరిశ్రమలు భారతదేశంలో ఇంకా స్థాపించబడలేదు.
  • పరిశ్రమల అభివృద్ధికి శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణుల సహాయం కావాలి. చదువుకున్న కార్మికులు అన్ని స్థాయిలలో కావాలి. అయితే భారతదేశంలో చదువుకు అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. భారతీయ శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల పారిశ్రామిక అభివృద్ధికి విదేశస్థులపై ఆధారపడవలసి వచ్చేది. స్వాతంత్ర్యం తరువాత . కూడా విద్యకు తగినంత ప్రాముఖ్యత ఇవ్వకపోవడం వల్ల అంతగా చదువుకోని కార్మికశక్తి పారిశ్రామిక అభివృద్ధికి ఆటంకంగా కొనసాగింది.

ప్రశ్న 6.
బ్రిటిష్ పాలనలో పరిశ్రమలు నెలకొల్పటం భారతీయ కంపెనీల కంటే విదేశీ కంపెనీలకు ఎందుకు ఎక్కువ అవకాశాలు ఉండేవి ? కొన్ని కారణాలను పేర్కొనండి. (AS1)
జవాబు:
బ్రిటిష్ పాలనలో చాలా కార్మాగారాలు, బ్యాంకులు, ఓడలు వంటివి భారతీయుల చేతుల్లో కాకుండా బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అందువల్ల ఈ కంపెనీలకు ఎన్నో ప్రయోజనాలు సమకూరాయి. బ్రిటిష్ ప్రభుత్వంలోని వివిధ . స్థాయిల అధికారులు, ఉద్యోగస్తులు, బ్రిటిష్ వాళ్లకు అందుబాటులో ఉండేవాళ్ళు. ఆ సౌకర్యం భారతీయ కంపెనీలకు లేదు. విదేశీ వ్యాపారం అంతా యూరపు కంపెనీల చేతుల్లో ఉన్నందువల్ల వాళ్ళకు ఎటువంటి నిధుల కొరతాలేదు. భారతదేశంలో సాంకేతిక నైపుణ్యం, పారిశ్రామికీకరణలో ప్రగతి సాధించే శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు విదేశీ కంపెనీలలో చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. తద్వారా భారతీయ కంపెనీల కంటే విదేశీ కంపెనీలకు ఎక్కువ అవకాశాలు ఉండేవి.

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

ప్రశ్న 7.
కార్మిక చట్టాలు ముందుగా పిల్లలకు, ఆ తర్వాత మహిళలకు, చివరకు పురుషులకు చేశారు. వీటిని ఈ క్రమంలో ఎందుకు చేశారు?
జవాబు:
మిల్లులలో మరియు యంత్రాలలో పని ప్రతిరోజూ సూర్యోదయంతో మొదలయ్యి సూర్యాస్తమయం తరువాతే ముగిసేది. కార్మాగారపు వేడి, తేమ, మోత, ధూళితో రోజంతా గడిచేది. అనారోగ్యాలు, జబ్బులు, అంటువ్యాధులతో రోజూ వేసవిలో 14 గంటలు, శీతాకాలంలో 12 గంటలు పనిచేయవలసి వచ్చేది.

పై దుర్భర కష్టాలన్నీ పిల్లలు, స్త్రీలు కూడా అనుభవించారు. 1-12 సం||ల వయసుగల బాలలు భయంకరమైన పనులు చేసేవారు. బాల్యమంతా మిల్లులలో కరిగిపోయేది. పూవులాంటి పసి పిల్లల కన్నీళ్ళు తుడవాలని, బాల్య మాధుర్యాన్ని పిల్లలకు అందించాలని తలంచి పనిభారం నుండి ముందుగా విముక్తులను చేయడానికి పిల్లలకు చట్టాలు కల్పించారు.

అదే విధంగా మహిళలు కూడా, ఇంటి పని, వంట పని, కుటుంబ భారమంతా మోస్తూ మరల కర్మాగారాలలో 14 నుండి 18 గంటలు పురుషులతో పాటు పనిచేయడం అందులో గర్భిణులుగా, బాలింతలుగా ఉండటం వల్ల మహిళలు నరకయాతన అనుభవించే వాళ్ళు. దీనిని దృష్టిలో పెట్టుకుని మిల్లులలో పిల్లలు, మహిళలకే ఎక్కువగా దుర్భర పరిస్థితులు ఉన్నందున ముందుగా వాళ్ళకి విముక్తి చట్టాలు రూపొందించారు.

ప్రశ్న 8.
పారిశ్రామిక అభివృద్ధిని విద్య ఎలా ప్రభావితం చేస్తుంది ? తరగతిలో చర్చించండి. (AS6)
జవాబు:
చాలా దేశాలలో పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి, సాంకేతిక విజ్ఞానంతో పయనించి, ప్రపంచ పోటీలో నిలదొక్కుకో సుకానికి ఆయా దేశాలు ముందుగా విద్యకు ప్రాధాన్యత నిచ్చాయి. ముఖ్యంగా, ఇంగ్లాడ్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు పారిశ్రామిక అభివృద్ధికి, విద్యకు పెద్దపీట వేశాయి.

చదువుకున్న కార్మికులు అన్ని స్థాయిలలో ఉండాలి. అప్పుడే పారిశ్రామిక అభివృద్ధి సాగుతుంది. పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు, విషయ నిపుణతగల సాంకేతిక నిపుణులు కావాలి. వీరంతా మేధావంతులుగా మారి పరిశ్రమలు వేగవంతం కావడంలో విద్య ప్రధాన భూమిక పోషిస్తుంది. వివేచనా జ్ఞానం, అద్భుత తెలివితేటలతో పరిశ్రమలను వివిధ స్థాయిలలో అభివృద్ధి చేసి, పోటీని తట్టుకోగలగాలి. కాబట్టి పారిశ్రామిక అభివృద్ధిని విద్య ముఖ్య భూమిక పోషిస్తుంది.

ప్రశ్న 9.
20వ శతాబ్దంలోని ప్రధాన పారిశ్రామిక పట్టణాలను భారతదేశ పటంలో గుర్తించండి. (AS5)
జవాబు:
నా శ్రామిక పట్టణాలు :

  1. ముంబై
  2. అహ్మదాబాద్
  3. జంషెడ్ పూర్
  4. చెన్నై (మద్రాస్)
  5. సూరత్
  6. హైదరాబాద్
  7. పూనె
  8. విశాఖపట్నం
  9. కోల్ కతా
  10. కాన్పూర్
  11. నాగపూర్
  12. ఇండోర్
  13. సేలం

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం 1

ప్రశ్న 10.
ఆదివాసీల తిరుగుబాట్లు ఎక్కడెక్కడ జరిగాయో తెలుసుకొని ఆ ప్రదేశాలను భారతదేశ పటంలో గుర్తించండి. (AS5)
జవాబు:
ఆదివాసీల తిరుగుబాట్లు జరిగిన ప్రదేశాలు పటంలో చూడండి.

  1. జార్ఖండ్
  2. చోటానాగపూర్ పీఠభూమి
  3. ఉత్తరాఖండ్
  4. చింతపల్లి
  5. ఆదిలాబాద్

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం 2

ప్రశ్న 11.
పేజీ నెం. 221లోని “ఆదివాసీ తిరుగుబాట్లు” అంశాన్ని చదివి, వాఖ్యానించండి. (AS2)
జవాబు:
అనాదిగా అడవులను ఆధారం చేసుకొని, అభివృద్ధికి ఆమడ దూరంలో ఆదివాసీలు జీవనం సాగించేవాళ్లు. మధ్యప్రదేశ్, చత్తీ కి చెందిన బైగా, మురియా, గోండ్, బిల్ జాతులు, ఆంధ్రప్రదేశ్ కి చెందిన కోయ, రెడ్డి, కోలం జాతులు, ఒడిశాలోని సవర జాతులు అటవీశాఖాదికారులు, గుత్తేదారుల వద్ద, లేదా వడ్డీ వ్యాపారస్తుల వద్ద వెట్టిచాకిరీ కార్మికులుగా శ్రమను చిందించేవారు. బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాల నుండి మైదాన ప్రాంతం నుండి వచ్చిన ప్రజలు, గిరిజనుల భూములను చేజిక్కించుకుని, గిరిజనులను అణగదొక్కారు. అదేవిధంగా అటవీశాఖాధికారులు కూడా గిరిజనులను ఇబ్బందులకు గురిచేసి జరిమానాలు విధించి, చిన్న కారణాలకు సైతం ప్రజలను కొట్టడం, బలవంతంగా ఇళ్లల్లోకి చొరబడి వస్తువులను లాక్కోని, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం నిత్యసత్యమైపోయాయి.

ఇటువంటి ప్రతికూల పరిస్థితులకు వ్యతిరేకంగా ఆదివాసీలు అనేక ప్రాంతాలలో ప్రతిఘటించసాగారు. దీనికిగాను వారు విప్లవ పంథాను ఎంచుకుని, పోలీస్ స్టేషన్లు, అటవీశాఖ కేంద్రాలు, వడ్డీ వ్యాపారస్తుల ఇళ్లు వంటిని తగలబెట్టేవారు. కొన్ని సందర్భాలలో అడవిని తగలబెట్టేవాళ్లు. ఈ తిరుగుబాట్లు 1856లో జార్ఖండ్ సంతాల్ ఆదివాసీలు, 1880, 1922 ఆంధ్రప్రదేశ్ కోయ ఆదివాసీలు, 1940లలో గోండ్, కోలం ఆదివాసీలు చేశారు.

9th Class Social Studies 18th Lesson భారతదేశంపై వలసవాద ప్రభావం InText Questions and Answers

9th Class Social Textbook Page No.220

ప్రశ్న 1.
బ్రిటిష్ పాలనకు ముందు ఆదివాసుల జీవనవిధానం, అడవులను వాళ్ళు ఉపయోగించుకున్న విధానాలను తెలియజేసే నాలుగు వాక్యాలను గుర్తించండి.
జవాబు:
అడవులలో ఆనందంగా జీవించే ఆదివాసీలే అడవులకు యజమానులు. తమ రోజూవారీ జీవనానికి కావలసిన అనేక ఉత్పత్తులు హాయిగా అడవుల నుండి పొందేవాళ్ళు. వేటాడుతూ, తమ ఆహారానికి అవసరమైన దుంపలు, పళ్ళు’ ఆరగిస్తూ, పూలు, వనమూలికలు సేకరిస్తూ, పశువులను మేపుకుంటూ అడవులను ఉపయోగించుకునే వాళ్ళు.

9th Class Social Textbook Page No.221

ప్రశ్న 2.
రైల్వే పట్టాలలో ఒకప్పుడు ఉపయోగించిన కలప స్లీపర్లను మీరు చూశారా? వీటికి బదులుగా ప్రస్తుతం ఏమి వాడుతున్నారు? ఈ మార్పు ఎందుకు చేయవలసి వచ్చింది? చర్చించండి.
జవాబు:
భారతదేశం బ్రిటిష్ పరిపాలనకు ముందు అడవులతో పచ్చని చెట్లతో వికసించేది. పరిశ్రమల అభివృద్ధి పేరుతో ఓడలు, గనుల నిర్మాణాలకు కలప కోసం అడవులలో లభించే చెట్లను నరికేవారు. రైలు మార్గాలు అభివృద్ధి చెందిన తరువాత, ప్రతి సంవత్సరం కొత్త రైలు మార్గాలు వేయటానికి ఒక కోటికి పైగా కలప స్లీపర్లు అవసరమయ్యేవి. తద్వారా అడవులు రానురాను అంతరించడమే కాకుండా అడవులు కనుమరుగయ్యే సూచనలు కనిపిస్తుండటంతో ప్రస్తుతం కలప స్లీపర్లకు బదులు ఇనుప స్లీపర్లను వాడుతూ, పర్యావరణాన్ని, ప్రకృతిని, అడవులను కాపాడుతున్నారు.

9th Class Social Textbook Page No.225

ప్రశ్న 3.
‘రక్షిత మార్కెటు’ అంటే ఏమిటో చర్చించండి.
జవాబు:
ఇతర దేశాల నుండి దిగుమతి అవుతున్న వస్తువులపై లేదా బట్టలపై పన్నులను విధించినట్లయితే విదేశీ వస్తు ధరలు పెరుగుతాయి. మన దేశంలో వస్తువులపై పన్ను విధించకుండా తక్కువ ఖరీదుకు వస్తువులను అమ్మినట్లయితే భారతదేశ వస్తువులకు విలువ, ప్రాధాన్యత, పనితనం కనిపించి వస్తువులు అమ్మటానికి అనువైన వాతావరణం కనిపిస్తుంది. దీనినే రక్షిత మార్కెట్ అంటారు.

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

ప్రశ్న 4.
భారతదేశానికి వస్తున్న బ్రిటిష్ సరుకులపై పన్నులు విధించాలని భారతీయులు కోరసాగారు. ఇది న్యాయమైన కోరికేనా? భారతీయ, బ్రిటిష్ పరిశ్రమలతో ప్రభుత్వం సమానంగానే వ్యవహరించాలా?
జవాబు:
భారతదేశానికి వస్తున్న బ్రిటిష్ సరుకులపై పన్నులు విధించాలని భారతీయులు కోరడం న్యాయమైన కోరికే. ఎందుకంటే మన దేశంలో ముడి పదార్థాలను అతి చౌకగా కొని, వాటిని వారి దేశంలో వస్తువులుగా మార్చి , అధిక ధరలకు మన దేశ మార్కెట్లో అమ్మి మన సంపదనంతా వస్తు రూపంలో దోచుకుంటున్నారు. అదే విధంగా వారు తయారుచేసిన వస్తువులలో సాంకేతిక విజ్ఞానం, పనితనం కనిపించడం వలన ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షించగలుగుతున్నాయి. పన్నులు విధించడం వల్ల బ్రిటిష్ వస్తు ఖరీదు పెరగడమే కాకుండా మన దేశ వస్తువుల అమ్మకాలు పెరుగుతాయి. కాబట్టి దోపిడీ పాలన గల బ్రిటిష్ పరిశ్రమల విషయంలో ప్రభుత్వం సమానంగా వ్యవహరించవలసిన అవసరం లేదు.

9th Class Social Textbook Page No.226

ప్రశ్న 5.
మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో భారత పరిశ్రమలు ఎందుకు వేగంగా వృద్ధి చెందాయి?
జవాబు:
మొదటి ప్రపంచ యుద్ధకాలంలో (1914-18) భారతదేశంలోని విదేశీ వస్తువుల దిగుమతి గణనీయంగా పడిపోయింది. సరుకు రవాణా ఓడలను యుద్ధ సంబంధ పనులకు మళ్ళించడం వల్ల ఓడల కొరత ఏర్పడడం ఒక కారణం. అంతేకాకుండా యూరప్ కర్మాగారాలలో యుద్దానికి కావలసిన వస్తువులను ఉత్పత్తి చేయసాగారు. దాంతో భారతదేశ మార్కెటు కోసం ఉత్పత్తి చేసే వస్తువులు తగ్గిపోయాయి.

ఈ పరిస్థితులలో భారతదేశంలో ఏర్పాటు చేసిన కర్మాగారాలు తమ ఉత్పత్తిని, అమ్మకాలను పెంచుకున్నాయి. ఈ అమ్మకాలతో ప్రేరణ పొంది పరిశ్రమలు వేగంగా వృద్ధి చెందాయి.

9th Class Social Textbook Page No.227

ప్రశ్న 6.
బ్రిటిష్ పాలనలో భారతదేశంలో ఏ పరిశ్రమలు స్థాపించారు?
జవాబు:
బ్రిటిష్ పాలనలో భారతదేశంలో నూలు, వస్త్ర పరిశ్రమ. జెంషెటాటా ఆధ్వర్యంలో జంషెడ్ పూర్ వద్ద ఉక్కు కర్మాగారం స్థాపించారు.

ప్రశ్న 7.
స్వాతంత్ర్య సమయంలో భారత పరిశ్రమల అభివృద్ధికి ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి?
జవాబు:
భారతదేశ స్వాతంత్ర్య సమయంలో చాలా కర్మాగారాలు, బ్యాంకులు, ఓడలు వంటివి భారతీయుల చేతులలో లేవు. ఇవి చాలా ఎక్కువగా బ్రిటిష్ వారి అధీనంలో ఉండేవి. పరిశ్రమల అభివృద్ధికి కావలసిన అధికారాలు, ఉద్యోగస్తులు బ్రిటిష్ వాళ్ళకు అందుబాటులో ఉండేవాళ్ళు. ఇటువంటి మేధావులైన కార్మికులు మన దేశ పరిశ్రమలలో పనిచేసేవారు కాదు. పరిశ్రమల అభివృద్ధికి కావలసిన నిధులు కూడా మన పరిశ్రమలకు కొరతగా ఉండేవి. శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు కూడా తగినంత మంది లేకపోవడం కూడా మన పరిశ్రమలు సమస్యలు ఎదుర్కోవడానికి కారణమైంది.

9th Class Social Textbook Page No.229

ప్రశ్న 8.
భారతదేశంలో తొలినాటి కర్మాగారాలలో కార్మికుల పని, విశ్రాంతికి సంబంధించిన నియమాలు ఏమిటి?
జవాబు:
మిల్లులలో పనిచేసే కార్మికుల పని ప్రతిరోజూ సూర్యోదయంతో మొదలయ్యి సూర్యాస్తమయం తరువాతే ముగిసేది. తెల్లవారకముందే నిద్రలేచి మిల్లులకు బారులు తీరిన కార్మికులు పని మొదలు పెడితే ఆపడమనేదే లేదు.

విశ్రాంతి చాలా తక్కువగా ఉండేది. 15 -20 నిమిషాలు భోజనానికి విశ్రాంతి ఉండేది. సూర్యుడు అస్తమించిన తరువాత చీకటిలో చూడటం అసాధ్యమైనప్పుడు మాత్రమే యంత్రాలతో ఆ రోజుకి పని ఆగేది. వారానికి ఒక రోజు సెలవులేదు. ముఖ్యమైన పండుగలకు మాత్రమే సెలవు ఇచ్చేవారు. మిగతా సమయంతా పనిలోనే కార్మికులు నిమగ్నమయ్యేవాళ్ళు.

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

ప్రశ్న 9.
వేతనాల చెల్లింపునకు సంబంధించిన నియమాలు ఏమిటి?
జవాబు:
కార్మికులు ఉత్పత్తి చేసిన సరుకులను బట్టి కూలీ చెల్లించే వాళ్ళు. “ఎంత ఉత్పత్తి చేస్తే అంత కూలీ” అన్న నియమాన్ని యజమానులు అమలు చేశారు. ఒక్కొక్క సారి యంత్రాలు పనిచేయకపోయినా చెల్లింపులు ఉండవని చెప్పేవారు. నెల అయిన తరువాత కార్మికులకు మిల్లు యజమాని మొత్తం కూలీ చెల్లించేవాడు కాదు. మళ్ళీ నెల వరకు కొంత డబ్బు తన వద్దే అట్టే పెట్టుకొనే వాళ్ళు. ఇటువంటి పరిస్థితులలో ఎవరైనా కార్మికులు పనిమానేసి వెళ్లిపోవటం సాధ్యం అయ్యేది కాదు.

ప్రశ్న 10.
ఏ కారణాల వల్ల కార్మికుల వేతనాలను తగ్గించేవాళ్ళు?
జవాబు:
కార్మికులకు జరిమానాలు విధించేవాళ్ళు. ప్రతీ చిన్న విషయానికి, పనికి ఆలస్యంగా వచ్చారని, బట్ట పాడైపోయిందని, కార్మికులు చిత్తశుద్ధితో పనిచేయలేదని యజమానికి అనిపించినా జరిమానాలు విధించి, కార్మికులకు నెలలో రావలసిన వేతనం నుంచి మినహాయించే వాళ్ళు.

9th Class Social Textbook Page No.230

ప్రశ్న 11.
కార్మికులు సమ్మె ఎందుకు చేసేవాళ్ళు?
జవాబు:
కార్మికుల దుర్భర పరిస్థితుల నుండి తమ హక్కుల సాధన కొరకు సమ్మె చేసేవారు.

  • కొన్ని సందర్భాలలో తమ వేతనాలు తగ్గించినందుకు నిరసనగా, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె చేశారు.
  • అంతేకాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా, తమ జీవన విధానం కొరకు వేతనాలను పెంచమని సమ్మె చేశారు.
  • మరి ముఖ్యంగా కార్మికులు వేతనాలు, హక్కుల కోసమే కాకుండా బ్రిటిష్ పాలకుల నిరంకుశ పాలన నుండి విముక్తి కొరకు సమ్మెల ద్వారా కార్మికులు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు.

ప్రశ్న 12.
ఇతర చర్యలకు బదులు సమ్మెనే ఆయుధంగా ఎందుకు ఉపయోగించే వాళ్ళు?
జవాబు:
ఈ సమ్మె చేయడం ద్వారా పరిశ్రమలు మూతబడతాయి.

  • ఉత్పత్తి నిలిచిపోతుంది. ఈ పరిశ్రమలకు, కంపెనీకి కోట్లలో నష్టం వస్తుంది.
  • కంపెనీ ఉత్పత్తులపై సమాజంలో చెడు ప్రభావం పడుతుంది.
  • నిరంకుశ నిర్ణయాలు గల యజమానుల నుండి మార్పు కొరకు సమ్మెనే ఎంచుకుంటారు.

సమ్మె ద్వారా వచ్చే నష్టం కంటే వారి కోరికలు తీర్చడమే ప్రధానమని యజమానులు భావించి, కార్మికుల కోర్కెలు తీరుస్తారు. నిరసనలు, ఉపన్యాసాలు, ఊరేగింపుల ద్వారా కంపెనీ యజమానులలో మార్పురాదు. కాబట్టి బలమైన ఆయుధం సమ్మెనే కార్మికులు ఎంచుకుంటారు.

9th Class Social Textbook Page No.231

ప్రశ్న 13.
మీరు ఏ సంవత్సరంలో పుట్టారు? కాల పట్టికలో దానిని గుర్తించండి. మీ తల్లిదండ్రులు, తాత, అవ్వలు, వీలైతే కొంతమంది వృద్ధ బంధువులు పుట్టిన సంవత్సరాలను కూడా గుర్తించండి.
జవాబు:
నేను 1999లో జన్మించాను. మా నాన్నగారు 1963లో జన్మించారు. మా అమ్మగారు 1965లో జన్మించారు. మా తాతగారు 1943లో, మా అవ్వ 1939లో జన్మించారు.

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

ప్రశ్న 14.
వాళ్ళలో ఎవరైనా ఏదైనా కార్మిక చట్టాల వల్ల ప్రయోజనం పొందారేమో కనుక్కోండి.
జవాబు:
మా తాతగారు షుగర్ ఫ్యాక్టరీ (పంచదార పరిశ్రమ) లో పనిచేసేవారు. ఈ కార్మిక చట్టాల వలన పనిగంటలు తగ్గాయని, చాలా విషయాలలో కంపెనీ యజమానులు ప్రయోజనం కల్పించారని, వైద్య సదుపాయాలు మరియు విశ్రాంతికి తగిన అవకాశాలు కల్పించారని చెప్పారు.

ప్రశ్న 15.
మొదట్లో కార్మికుల సంక్షేమంపై భారతదేశంలోని విద్యావంతులు ఎందుకు అంతగా దృష్టి పెట్టలేదు?
జవాబు:

  • కార్మికులకు స్థిర ఆదాయాలు, సెలవు వంటి సౌకర్యాలు కల్పిస్తే మిల్లు ఉత్పత్తి తగ్గిపోతుందని,
  • యజమానుల ఖర్చులు పెరిగిపోతాయని,
  • దీనివల్ల కార్మాగారాలలో ఉత్పత్తి చేసే వస్తువుల ఖర్చు పెరిగిపోతుందని,

ఇదే జరిగితే బ్రిటన్ నుంచి వచ్చే వస్తువులు తేలికగా అమ్ముడయ్యి, భారతదేశంలో పరిశ్రమల ప్రగతి కుంటుపడుతుందని కార్మికుల సంక్షేమంపై అంతగా దృష్టి పెట్టలేదు.

ప్రశ్న 16.
కార్మిక చట్టాలు పారిశ్రామికవేత్తలను ఏ విధంగా ప్రభావితం చేసి ఉంటాయి?
జవాబు:
కార్మిక చట్టాలు పారిశ్రామికవేత్తలను భయందోళనకు గురిచేశాయి. కార్మిక చట్టాల వల్ల పని గంటలు తగ్గడమే కాకుండా విశ్రాంతి గంటలు పెరగడం వలన ఉత్పత్తి తగ్గుతుందని, వారిలో ఐక్యత, సమ్మెవంటి హక్కులు ద్వారా మిల్లు యజమానులకు ఖర్చులు పెరిగి, నష్టాలు వచ్చే ప్రమాదముందని భయపడ్డారు.

ప్రశ్న 17.
బ్రిటిష్ పారిశ్రామికవేత్తలు భారతదేశంలో పరిశ్రమల అభివృద్ధిని వ్యతిరేకించారు. అయినప్పటికీ వాళ్ళు భారతదేశ కార్మికుల పక్షాన నిలబడ్డారు. ఎందుకు?
జవాబు:
బ్రిటిష్ పారిశ్రామిక ఉత్పత్తులపై భారతదేశంలో పన్నులు విధించడం వల్ల వాళ్ళ వస్తూత్పత్తి ధరలు పెరగసాగాయి. కానీ భారతదేశంలో అధిక కార్మికులు తక్కువ వేతనానికి అధిక పని గంటలు పనిచేసి అధికోత్పత్తి సాధించడమే కాకుండా తక్కువ ధరకు భారతీయ ఉత్పత్తులు లభిస్తున్నాయి. కాబట్టి కార్మికులకు మరిన్ని హక్కులు, సౌకర్యాలు కల్పించి, పని గంటలు తగ్గించి, వేతనాలు పెంచినట్లయితే భారతీయ వస్తువుల ధరలు పెరిగి, తమ ఉత్పత్తులపై కొనుగోలు శక్తి పెరిగి అధిక లాభాలు పొందవచ్చని భావించారు.

ప్రశ్న 18.
బ్రిటిషు కాలంలో ఏ వయస్సు లోపల పిల్లలను కార్మికులుగా పెట్టుకోకుండా చేశారు?
జవాబు:
9 సం||ల లోపు పిల్లలను కార్మికులుగా పిల్లలను పెట్టుకోకుండా చేశారు.

ప్రశ్న 19.
ప్రస్తుత చట్టాల ప్రకారం ఏ వయస్సు లోపల పిల్లలను కార్మికులుగా పెట్టుకోకూడదు?
జవాబు:
14 సంవత్సరాల లోపు పిల్లలను కర్మాగారాలలో నియమించకూడదు.

ప్రశ్న 20.
కార్మిక చట్టాల ప్రకారం పిల్లలు, మహిళలు, పురుషులు రోజుకి ఎన్ని గంటల పాటు పనిచేయాలి?
జవాబు:

  1. కార్మిక చట్టాల ప్రకారం పిల్లలతో రోజుకి 7 గంటల కంటే ఎక్కువ పని చేయించకూడదు.
  2. మహిళా కార్మికులతో రోజుకి 11 గంటలకు మించి పనిచేయించకూడదు.
  3. పురుష కార్మికులతో రోజుకి 12 గంటల కంటే ఎక్కువ పని చేయించకూడదు.

9th Class Social Textbook Page No.232

ప్రశ్న 21.
బ్రిటిష్ కాలంలో భారతదేశంలో ఏర్పడిన రెండు ముఖ్యమైన కార్మిక సంఘాలు ఏవి?
జవాబు:
1920 ల నుంచి కార్మిక సంఘాలు ఏర్పడ్డాయి.

  1. సోషలిస్టు భావాలతో ఏర్పడిన “గిర్నికాంగార్ యూనియన్”.
  2. అహ్మదాబాదులో గాంధీజీ ప్రభావంతో ఏర్పడిన శక్తివంతమైన కార్మిక సంఘం “మజూర్ మహాజన్”.

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

ప్రశ్న 22.
కార్మికులకు కార్మిక సంఘం ఎందుకు ముఖ్యమైనది? చర్చించండి.
జవాబు:

  1. కార్మికుల సంక్షేమం కోసం.
  2. తమ హక్కుల సాధన కొరకు.
  3. మెరుగైన వేతనాలు సాధించుకోడానికి.
  4. మిల్లు యజమానులతో ఒప్పందాలు కుదుర్చుకోడానికి.
  5. కార్మికులకు ప్రమాదాలు, మరణాలు సంభవించినప్పుడు, మెరుగైన నష్టపరిహారాలు యజమానుల నుండి పొందడానికి.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
అటవీ శాఖకు వెళ్ళి అడవులను ఎలా కాపాడుకోవాలి, స్థానిక ప్రజలు, కర్మాగారాలు వాటిని జాగ్రత్తగా ఎలా వినియోగించుకోవాలి అనే అంశాలపై ఒక అధికారితో ముఖాముఖి నిర్వహించండి.
జవాబు:
అటవీ శాఖకు వెళ్ళి ‘అడవులను కాపాడుకోవాల్సిన విధం, స్థానిక ప్రజలు, కర్మాగారాలు వాటిని జాగ్రత్తగా ఎలా వినియోగించుకోవాలి అనే అంశాలపై ఒక అధికారితో ముఖాముఖి :

నేను – అటవీ శాఖాధికారిగారూ….. అడవులను ఎలా కాపాడుకోవాలి?

అటవీ శాఖాధికారి – అడవులను నరకరాదు. అవి మన జాతీయ సంపద.

నేను – మన కలప అవసరాలు అడవుల ద్వారానే కదా తీరేది.

అటవీ శాఖాధికారి – అడవులనుండి మనకు కలప లభిస్తున్నప్పటికి, అడవులను విచ్చలవిడిగా నరకరాదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో నరకవలసి వచ్చిన వాటి స్థానంలో మొక్కలను నాటాలి.

నేను – అంటే చెట్లను నరుకుతున్న ప్రదేశాలలో క్రొత్త మొక్కలను నాటవలసి ఉంటుందన్నమాట.

అటవీ శాఖాధికారి – అంతేకాదు, మనం నివసిస్తున్న ప్రదేశాలందు ఖాళీగా ఉన్న ప్రాంతాలలోను, ఆ పాఠశాలల, కళాశాలల ఆవరణములలోని పారిశ్రామిక ప్రాంతాలయందు, రోడ్లకిరువైపుల నదులు, కాలువగట్లపైన మొక్కలను నాటవలసి ఉంటుంది.

నేను – మొక్కలను పెంచడం వలన ఇంకా ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా?

అటవీ శాఖాధికారి – అనేక ఉపయోగాలు ఉన్నాయి. పర్యావరణం పరిరక్షించబడుతుంది. వర్షాలు సంభవిస్తాయి. వరదలను అరికట్టడం జరుగుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే వృక్షో రక్షతి రక్షితః – వృక్షాలను మనం రక్షిస్తే అవి మనలను రక్షిస్తాయి.

ప్రశ్న 2.
మీకు దగ్గరలో ఉన్న ఒక కర్మాగారాన్ని సందర్శించి దాని చరిత్ర, సాంకేతిక విజ్ఞానం ఎలా మారింది, కార్మికులు ఎక్కడ నుంచి వస్తారు తెలుసుకోండి. కొంతమంది కార్మికులు, యాజమాన్య ప్రతినిధులతో మాట్లాడి వాళ్ళ దృక్పథాలు తెలుసుకోండి.

పట నైపుణ్యాలు

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం 3
అల్లూరి సీతారామరాజు
తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల సరిహద్దు ప్రాంతాలలో సీతారామరాజు గిరిజన తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. బెంగాలీ విప్లవకారుల దేశభక్తితో స్ఫూర్తి పొంది, చింతపల్లి, రంపచోడవరం, కె.డి. పేట, రాజవొమ్మంగి, అడ్డతీగల, నర్సీపట్నం, అన్నవరం పోలీస్ స్టేషన్లపై రాజు దాడులు చేశారు. గిరిజనుల సంక్షేమం కోసం కృషిచేసిన రాజును మంప గ్రామం వద్ద బ్రిటిష్ ప్రభుత్వం కాల్చి చంపింది.

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం 4
కొమరం భీం
సీతారామరాజు పోరాటంతో, బిర్సాముండా తిరుగుబాటుతో స్ఫూర్తి పొంది, నిజాంకి వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టాడు. గొండు, కోయ యువకులతో భీం గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆయుధాలను ప్రయోగించడంలో గిరిజన ప్రజలకు శిక్షణ ఇచ్చాడు. జోడేఘాట్ అడవులలో ఒక పౌర్ణమి రోజున నిజాం సైన్యంతో జరుగుతున్న పోరాటంలో కొమరం భీం వీరమరణం పొందారు.

AP Board 9th Class Telugu Important Questions Chapter 11 ధర్మదీక్ష

AP State Syllabus AP Board 9th Class Telugu Important Questions Chapter 11 ధర్మదీక్ష.

AP State Syllabus 9th Class Telugu Important Questions 11th Lesson ధర్మదీక్ష

9th Class Telugu 11th Lesson ధర్మదీక్ష Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

క్రింది పరిచిత గద్యాలను చదివి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. బాగా చీకటి పడింది. అయినా ఇంకా ఆవు తిరిగి రాలేదు. గోశాలలో గోవత్సాలన్నీ తోకలెత్తి పెట్టి ఎంతో సంతోషంగా పాలు కుడుచుకుంటున్నాయి. కాని ఆ ఒక్క ఆవుదూడ మాత్రం ‘అంబా’ ‘అంబా’ అని అదేపనిగా అరవడం మొదలు పెట్టింది. ఆ దూడ పుట్టినప్పటి నుంచీ నందగోపాలుని ఇల్లంతా పాడి పంటలతో కలకలలాడింది. అందుచేత ఆ ఆవన్నా, ఆ దూడన్నా నందగోపాలుని కెంతో ఇష్టం. అది అదే పనిగా అరవడం మొదలు పెట్టేసరికి అతని కారాత్రి మరి అన్నం సయించలేదు.
ప్రశ్నలు:
1. గోశాలలో ఆవుదూడలు ఎలా ఉన్నాయి?
2. ‘నందగోపాలుడికి ఆ దూడ అంటే ఎంతో ఇష్టం’ ఎందుకు?
3. నందగోపాలుడికి ఆ రాత్రి అన్నం ఎందుకు సయించలేదు?
4. పై పేరాపై మీరు ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబులు:
1. గోశాలలో ఆవుదూడలు అన్నీ తోకలు ఎత్తిపెట్టి, ఎంతో సంతోషంగా పాలు తాగుతున్నాయి.
2. ఆ దూడ పుట్టినప్పటి నుండి నందగోపాలుడి ఇల్లంతా పాడిపంటలతో కలకలలాడింది. అందుకే ఆ దూడ అంటే నందగోపాలుడికి ఎంతో ఇష్టం.
3. నందగోపాలుడికి ఇష్టమైన ఆవు ఇంటికి రాలేదు. అందువల్ల దాని దూడ ‘అంబా’ అంటూ అరవడం మొదలు పెట్టింది. అందుకే నందగోపాలుడికి ఆ రాత్రి అన్నం సయించలేదు.
4. ఆవుదూడ ‘అంబా’ ‘అంబా’ అని ఎందుకు అరుస్తోంది?

2. “నందుడంతలో గోవును వటవృక్షచ్ఛాయలో నిలిపి నురుగులు గక్కుకుంటూ పరుగెత్తుకు వచ్చి బుద్ధదేవుని పాదాలపై సాగిలపడ్డాడు. కొంత సేపటికి లేచి అతివినయంగా దోసిలి ఒగ్గి నిలబడ్డాడు. చివరికెలాగైనా దర్శన భాగ్యమైనా లభించింది గదా ! అని ఎంతో సంతోషించాడు. వెంటనే గౌతముడు లేచి నిలబడ్డాడు. వెనువెంటనే భిక్షువులందరూ లేచి నిలుచున్నారు! బుద్ధదేవుడెంతో ఆత్రంగా పక్కనే నిలబడిన భిక్షువులతో “ఇంకా భోజన పదార్థాలేమైనా మిగిలి ఉన్నాయా ?” అన్నాడు.
ప్రశ్నలు:
1. అవును నందుడు ఎక్కడ నిలబెట్టాడు?
2. నందుడు ఎందుకు సంతోషించాడు?
3. “ఇంకా భోజన పదార్థాలు మిగిలి ఉన్నాయా?” అని ఎవరు, ఎవరిని అడిగారు?
4. పై పేరా పై మీరు ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబులు:
1. ఆవును నందుడు వటవృక్షచ్ఛాయలో నిలబెట్టాడు.
2. తాను ఆలస్యంగా వచ్చినా, తనకు గౌతమబుద్ధుని దర్శన భాగ్యం లభించింది కదా అని నందుడు సంతోషించాడు.
3. బుద్ధుడు తన శిష్యులను “ఇంకా భోజన పదార్థాలు మిగిలి ఉన్నాయా?” అని అడిగాడు.
4. నందుడు బుద్ధుని పాదాలపై పడిన తర్వాత ఏమి జరిగింది?

AP Board 9th Class Telugu Important Questions Chapter 11 ధర్మదీక్ష

3. “నందగోపుని భోజనానంతరం బుద్ధదేవుడతనిని వెంటబెట్టుకొని నెమ్మదిగా వటవృక్షచ్ఛాయకు తిరిగివచ్చాడు. వెంటనే అష్టాంగ ధర్మ ప్రవచనం ప్రారంభమైంది. అమృతవర్ష ప్రాయమైన ఆ ప్రసంగం ఆలకిస్తూ, భిక్షువులు, ఆళవీ గ్రామస్థులు ఆనంద తరంగాలలో తలమునకలైనారు. ధర్మప్రవచనం చేస్తూన్నంత సేపు బుద్ధదేవుడు చిరునవ్వులతో నందగోపాలుని వైపలవోకగా తిలకిస్తూనే ఉన్నాడు.
ప్రశ్నలు:
1. బుద్ధుడు భోజనానంతరం నందుడిని ఎక్కడకు తీసుకువచ్చాడు?
2. బుద్ధుని ధర్మప్రవచనం ఎలా ఉంది?
3. ఆనంద తరంగాలలో ఎవరు తలమునకలయ్యారు? ఎందుకు?
4. పై పేరాపై మీరు ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబులు:
1. భోజనానంతరం బుధుడు నందుని వెంటబెట్టుకొని వటవృక్షచ్చాయకు వచ్చాడు.
2. బుద్ధుని ధర్మప్రవచనం, అమృతవర్ష ప్రాయంగా ఉంది.
3. అమృత వర్షం వంటి బుుడి ధర్మప్రవచనం విని భిక్షువులు, ఆళవీ గ్రామస్తులు ఆనంద తరంగాలలో తలమునకలయ్యారు.
4. ధర్మప్రవచనం చేస్తునప్పుడు బుద్ధుడు ఏమి చేశాడు?

4. ఈ క్రింది గద్యాన్ని చదివి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (S.A. II – 2018-19)

“మీదే వూరు నాయనా”
“అళవీగ్రామమే”

“అలాగా ! అయితే పొరుగూళ్ళ జనం అంతా తీర్థ ప్రజలాగ ఇక్కడకే వస్తూంటే నీవు ఉన్న గ్రామం విడిచి పెట్టి పోతాలేమయ్యా” ! అని ఒక చిరునవ్వు విసిరాడా ముసలి తాత నందుడతనికి తన ప్రయాణ కారణం తెలియజేసాడు. అడవిలో ఆ ఆవు ఏ పులివాత పడిందోనని భయపడుతున్నానని కూడా అన్నాడు. ఆ మాట విన్న తరువాత ముసలి తాత మరి అతని మాటకడ్డు చెప్పలేక తన దారిని వెళ్ళిపోయాడు. అతని వెంట ఇంకా ఎందరెందరో పరిసర గ్రామస్థులు అళవీగ్రామం వైపు నడిచి వెళ్ళాడు.

అది చూడగానే నందగోపాలుని హృదయంలో ఆరాటం ప్రారంభమయింది. గోవు గొడవ విడిచి పెట్టి తాను కూడా వారి వెంటపడి పోవాలని అనుకున్నాడు. ఇక ఈ సమయంలో కాకపోతే మరింక తథాగతుని దర్శన భాగ్యమే కలగదేమో అని అతనికొక భయం పట్టుకుంది. వెంటనే వెనక్కి తిరిగి రెండు మూడడుగులు వేశాడు.
ప్రశ్నలు:
1. పొరుగూళ్ళ నుండి జనం అళవీ గ్రామానికి ఎవరిని దర్శించడానికి వెళుతున్నారు?
2. నందుడు తాతతో తానే విషయంలో భయపడుతున్నానన్నాడు?
3. నందుడు ఏ ఊరి నందు నివసించేవాడు?
4. పై పేరాననుసరించి సరైన ప్రశ్న తయారుచేయండి.
జవాబులు:
1. తథాగతుని
2. ఆవు
3. అళవీ
4. పై పేరాలో ద్విగు సమాసానికి చెందిన ఉదాహరణను గుర్తించండి.

AP Board 9th Class Telugu Important Questions Chapter 11 ధర్మదీక్ష

5. క్రీ.శ. 7వ శతాబ్దారంభం నుంచీ తెలుగు పదం శాసనాలలో కనబడుతున్నదని సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకలు మల్లంపల్లి సోమశేఖర శర్మగారు చెబుతారు. ఒక శాసనంలో “తెలుంగునాడు” అనే ప్రయోగం కూడ ఉంది. అప్పటికే ఆంధ్ర, తెలింగ, తెలుంగ శబ్దాలు ఒక జాతిని, దేశాన్ని తెలిపేందుకు వాడారని తెలుస్తోంది. తొలుత ఏర్పడిన తెలుగు పదం త్రిలింగ, త్రైలింగ ఐనట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
ప్రశ్నలు – జవాబులు:
1. తెలుగు పదం శాసనాలలో ఎప్పటి నుండి కనబడుతున్నది?
జవాబు:
7వ శతాబ్దం

2. దీనిలో సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు ఎవరు?
జవాబు:
మల్లంపల్లి సోమశేఖర శర్మ

3. శాసనంలో ఉన్న ప్రయోగం ఏది?
జవాబు:
తెలుంగనాడు

4. జాతిని, దేశాన్ని తెలిపేందుకు వాడిన పదాలేవి?
జవాబు:
ఆంధ్ర, తెలింగ, తెలుంగ

6. గంగానది వరద రోజులలో తప్ప – మిగిలిన రోజులలో ప్రశాంతంగా ఉంటుంది. మురుగుకాలువ మోతతో ప్రవహిస్తుంది. అలాగే పెద్దలు హుందాగా ప్రవర్తిస్తారు. అల్పులు ఆవేశానికి లోనై, దురుసుతనంతో ప్రవర్తిస్తారు.
ప్రశ్నలు – జవాబులు:
1. ప్రశాంతంగా ప్రవహించేది?
జవాబు:
గంగానది

2. మోతతో ప్రవహించేది?
జవాబు:
మురుగు కాలువ

3. హుందాగా ప్రవర్తించేది ఎవరు?
జవాబు:
పెద్దలు

4. అల్పులు ఎలా ప్రవర్తిస్తారు?
జవాబు:
ఆవేశానికిలోనై, దురుసుతనంతో

7. అయిపోయిన పనిని గురించి చింతింపవద్దు. దుష్టులను మెచ్చుకొనవద్దు. నీకు సాధ్యము కాని దానిని పొందలేక పోతినని చింతించుట పనికిరాదు. భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి చెందుము.
ప్రశ్నలు – జవాబులు:
1. దేని గూర్చి చింతింపకూడదు?
జవాబు:
అయిపోయిన పని గూర్చి

2. ఎవరిని మెచ్చుకోకూడదు?
జవాబు:
దుష్టులను

3. భగవంతుడు ఇచ్చినదానితో ఏమి చెందాలి?
జవాబు:
తృప్తి

4. ‘సాధ్యము’ వ్యతిరేకపదం?
జవాబు:
అసాధ్యం

II. స్వీయరచన

అ) క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘ధర్మదీక్ష’ ప్రక్రియను గూర్చి రాయండి.
జవాబు:
ధర్మదీక్ష పాఠం పిలకా గణపతి శాస్త్రిగారు రాసిన “ప్రాచీన గాథాలహరి” అనే పుస్తకంలోనిది. ఇది కథా ప్రక్రియకు చెందినది. కథాంశం ప్రాచీనమైన, రచన ఆధునిక వచనంలో సాగింది. “కథ్యతే ఇతి కథా” అని వ్యుత్పత్తి. కథ పిల్లల్లో సున్నిత భావాలు పెంపొందిస్తుంది. ధర్మ ప్రబోధాన్ని, ఉత్తమ గుణాలను పెంపొందించడంలో కథ ఉపకరిస్తుంది.

AP Board 9th Class Telugu Important Questions Chapter 11 ధర్మదీక్ష

ప్రశ్న 2.
భోజన సమయంలో నందగోపుడు బుద్ధునికి చెప్పిన విషయాలేవి?
జవాబు:
బుద్ధుడు నందగోపుని భోజనం పూర్తి అయ్యేవరకు అతని ప్రక్కనే కూర్చున్నాడు. ఎంతో ఆప్యాయంగా అతని గోవును గూర్చి, కోడె దూడను గూర్చి ఎన్నో కుశల ప్రశ్నలు వేశాడు. నందగోపుడు తన కోడెదూడ నుదుటి మీది నల్లని మచ్చలను గురించీ, ఒంటిమీది సుడులను గురించి ఎవరికీ తెలియని రహస్య సాముద్రిక విషయాలెన్నో చెప్పాడు. ప్రత్యేకంగా వంశపారంపర్యంగా తెలుసుకొన్న గోసాముద్రిక రహస్యాలు బుద్ధునికి చెప్పాడు.

ప్రశ్న 3.
బౌద్ధ భిక్షకులు (కొందరు అసూయ చెందడానికి కారణమేమిటి?
జవాబు:
ఆళవీ గ్రామం పరిసర గ్రామాలు బుద్ధుని దర్శనం కోసం, ధర్మబోధ వినడం కోసం ఎదురు చూస్తున్నాయి. కానీ గౌతమ దేవుని విశాల నేత్రాలు అప్పుడు ఎవరికోసమో నిరీక్షించడం శ్రమణకులు గమనించారు. ఆ తర్వాత వచ్చిన నందగోపునికి తానే దగ్గరుండి భోజనం వడ్డించడం వారికి ఆశ్చర్యం కల్గించింది. చుట్టూరా నిలిచిన కొందరు భిక్షకులకు వారి ప్రసంగాలు విడ్డూరాన్ని కలిగించాయి. ఆ తర్వాత ధర్మ ప్రవచనం చేస్తున్నంత సేపు బుద్ధదేవుడు చిరునవ్వుతో నందగోపాలుని వైపు అలవోకగా చూస్తూనే ఉన్నాడు. బుద్ధుని ఈ చర్య భిక్షకులకు అసూయ కలగడానికి కారణమైంది.

ఆ) క్రింది ప్రశ్నలకు పది పన్నెండు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
అష్టాంగ ధర్మాలు/ మార్గాలు ఏవి?
జవాబు:
కేశములను పూర్తిగా నశింపజేయుటకు గల మార్గమేది? అను ప్రశ్నకు బుద్ధుడు ఇట్లు పల్కెను – ఆర్య ! అష్టాంగ మార్గమే క్లేశ క్షయానికి దారితీయును. అవి :
అష్టాంగ మార్గాలు.
1. సమ్యక్ దృష్టి – అసమంజసములైన భావములతో కాక విషయమును ఉన్నది ఉన్నట్లుగా తెలిసికొనుట.
2. సమ్యక్ వాక్కు – సౌమ్యముగా, సత్యమును, కరుణతో చెప్పుట.
– సామ్యముగా, సత్యములు తమ
3. సమ్యక్ కర్మ – శాంతం, శుద్ధం, ధార్మికము అగు కర్మలను ఆచరించుట.
4. సమ్యక్ సంకల్పం లక్ష్యం – ఉన్నతములు, గంభీరములు అగు భావాలతో ఉండుట.
5. సమ్యక్ చేతన మనస్తత్వం – జీవహింస చేయకుండ సచ్చీలమున జీవించుట
6. సమ్యక్ జీవనం – సునిశితమైన పరిశీలన, తీక్షణమైన బుద్ధి కలిగియుండుట
7. సమ్యక్ వ్యాయామం – యమ నియమాది సాధనములను ఆచరణలోకి తెచ్చుట.
8. సమ్యక్ భావన – జీవితానికి లక్ష్యాలగు తాత్త్విక విషయాలపై మననం, ధ్యాననం కలిగి ఉండుట.

వ్యక్తీకరణ – సృజనాత్మకత

క్రింది ప్రశ్నకు సమాధానము రాయండి. మీ ఊరిలో జరిగిన / నీవు చూసిన ఆధ్యాత్మిక ప్రసంగాన్ని గూర్చి మిత్రునికి లేఖ రాయండి. మిత్రునికి లేఖ
జవాబు:

ఒంగోలు,
x x x x x

ప్రియమిత్రుడు విష్ణుదత్తకు,
నేను క్షేమం. నీవు క్షేమమే కదా ! ఇటీవల మా ఊరిలో గొప్ప ఆధ్యాత్మిక ప్రసంగం జరిగింది. ‘రామాయణం మన జీవన పారాయణం’ అంశం మీద చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనం చెప్పారు. ఎంత బాగుందో ! రామాయణం కుటుంబ బాంధవ్యాలను మనం ఆదర్శంగా తీసుకోవాలని, గౌరవాన్ని, అనురాగాన్ని పంచాలని వివరించారు. మన ఇల్లు బాగుంటేనే దేశం బాగుంటుందని తెలిపారు. ఇలా ఎన్నో విషయాలను ఆ వేదికపై నుండి చక్కగా తెలియజేసారు. నీవు కూడా ఇటువంటి ప్రసంగాన్ని వినమని కోరుతూ …….

నీ ప్రియ మిత్రుడు,
కె. లీలాకృష్ణ సాయిశ్రీ ప్రసాద్.

చిరునామా :
యస్. విష్ణుదత్త,
9వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూల్,
బాపట్ల.

III. భాషాంశాలు (పదజాలం , వ్యాకరణం)

1. పర్యాయపదాలు:

ఆవు : గోవు, ధేనువు
పులి : శార్దూలం, వ్యాఘ్రం, పుండరీకం
నేత్రం : కన్ను, చక్షువు
నిర్వాణం : మోక్షం, కైవల్యం
ఉద్రేకం : ఆవేశం, కోపం
సూర్యుడు : భానుడు, భాస్కరుడు, ఆదిత్యుడు
శ్రమణకులు : సన్యాసులు, భిక్షువులు
ఆచార్యుడు : గురువు, ఉపాధ్యాయుడు
ఆరాటం : తొందర, ఆత్రం

2. వ్యుత్పత్యర్థాలు :

అదృష్టం : దృష్టము కానిది (భ్యాగం)
అతిథి : తిథివార నక్షత్రములు చూడకుండా వచ్చేవాడు (చుట్టం, స్నేహితుడు)
ఆచార్యుడు : వేదవ్యాఖ్యానము చేయువాడు (గురువు)
నిర్వాణము : సుఖదుఃఖాలు లేనిది (మోక్షం)
హృదయం : హరింపబడునది (గుండె, మనస్సు)
అమృతం : మృతం లేనిది (సుధ)
అసూయ : గుణములందు దోషారోపాణ చేయుట (ఓర్వలేనితనం)
దీక్ష : యజ్ఞాది క్రియారంభమున అనుష్ఠింపబూనుకొనెడు (ఆచార నియమం)

3. నానార్థాలు :

భాగ్యం : అదృష్టం, సంపద
పక్షం : పగ, ప్రక్క రెక్క, 15 రోజులు, బలం
జ్యోతి : ప్రకాశం, ధనం, కొడుకు, చంద్రుడు
నేత్రం : కన్ను, పేరు, ఏఱు, పట్టువస్త్రం
ప్రసంగం : విషయ విస్తరం, ప్రస్తావం, భక్తి, సంభాషణ
వంశం : తండ్రి తాతల పరంపర, వెన్నెముక, వెదురు, కులము, పిల్లనగ్రోవి.
గోవు : ఆవు, కన్ను, బాణం, దిక్కు
అహ్నం : పగలు, రోజు, కాలము
భానువు : సూర్యుడు, శివుడు, వృద్ధుడు
బుద్ధుడు : పండితుడు, బుద్ధదేవుడు

4. ప్రకృతి – వికృతులు :

భాగ్యం – బాగెము
ప్రశ్న – పన్నము
ప్రాణం – పానం
బిక్ష – బిచ్చము
రాత్రి – రాతిరి, రేయి, రేతిరి
ఆశ్చర్యం – అచ్చెరువు
దృష్టి – దిస్టి
గౌరవం – గారవం
విడ్డూరం – విడ్వరం
ధర్మం – దమ్మము
హృదయం – ఎద, ఎడద
భోజనం – బోనం
అంబా – అమ్మా
సంతోషం – సంతసం
వంశం – వంగడం
ముఖము – మొగము

5. సంధులు :

అరుణ + ఉదయ = అరుణోదయ – గుణసంధి
నూతన + ఆనంద + ఆవేశాలు = నూతనానందావేశాలు – సవర్ణదీర్ఘ సంధి
మధ్య + అహ్నం = మధ్యాహ్నం – సవర్ణదీర్ఘ సంధి
నిడు + ఊర్పు = నిట్టూర్పు – ద్విరుక్తటకరాదేశ సంధి
కాషాయ + అంబరధారులు = కాషాయాంబరధారులు – సవర్ణదీర్ఘ సంధి
ప్రతి + అక్షము = ప్రత్యక్షము – యణాదేశ సంధి
ఆసన్నము + అగు = ఆసన్నమగు – ఉత్వసంధి
సుఖ + ఆసనం = సుఖాసనం – సవర్ణదీర్ఘ సంధి
నేత్రము + లు = నేత్రాలు – లు,ల, నల సంధి
క్షుధ + ఆరుడు = క్షుధార్తుడు – సవర్ణదీర్ఘ సంధి
సమ్యక్ + బుద్ధి = సమ్యగ్బుద్ధి – జశ్త్వసంధి
దుః+ సహము = దుస్సహము – విసర్గ సంధి
శ్రమ + ఆర్జితం = శ్రమార్జితం – విసర్గ సంధి
ఆరాటము + పడు = ఆరాటపడు – పడ్వాది సంధి
ప్రతి + ఏకం = ప్రత్యేకం – యణాదేశ సంధి
నెఱు + మది = నెమ్మది – ప్రాతాది సంధి
సూత్రం : అన్యంబులకు సహితమిక్కార్యంబు కొండకచో కానంబడియెడు.
భోజన + అనంతరం = భోజనానంతరం – సవర్ణదీర్ఘ సంధి
మహా + ఆత్ముడు = మహాత్ముడు – సవర్ణదీర్ఘ సంధి

6. సమాసాలు :

గోశాల = గోవుల యొక్క శాల లో – షష్ఠీ తత్పురుష సమాసం
శిష్య సమూహం = శిష్యుల యొక్క సమూహం – షష్ఠీ తత్పురుష సమాసం
పెన్నిధి = పెద్ద (గొప్ప) దైననిధి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
సుఖాసనం = సుఖమైన ఆసనం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
వటవృక్షం = మట్టి అను పేరుగల వృక్షం – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
మధ్యాహ్నం = అహ్నము మధ్య భాగం – ప్రథమా తత్పురుష సమాసం.
దుస్సహము = సహింపరానిది – అవ్యయీభావ సమాసం
చిరునవ్వు = చిన్నదైన నవ్వు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
శ్రావస్తీనగరం = శ్రావస్తి అనే పేరుగల నగరం – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
ముఖజ్యోతి = ముఖమనెడి జ్యోతి – రూపక సమాసం
ధర్మప్రవచనం = ధర్మమును గూర్చి ప్రవచనం – ద్వితీయా తత్పురుష సమాసం
సందర్శన భాగ్యం = సందర్శనమనెడి భాగ్యం – రూపక సమాసం
ఆకటి చిచ్చు = ఆకలి అనెడి చిచ్చు – రూపక సమాసం
మహాత్మ = గొప్పదైన ఆత్మ – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

9th Class Telugu 11th Lesson ధర్మదీక్ష 1 Mark Bits

1. కందర్ప దర్పదములగు సుందర దరహాసములు – ఈ వాక్యంలో అలంకారాన్ని గుర్తించండి. (S.A. I – 2018-19)
ఎ) వృత్త్యనుప్రాస
బి) లాటానుప్రాస
సి) ఛేకానుప్రాస
డి) అర్థాంతరన్యాస
జవాబు:
సి) ఛేకానుప్రాస

2. నా హృదయంలో వాగ్గేవి కొలువై ఉంది. – (వికృతి పదం గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) ఎదయం
బి) సదయం
సి) ఎద
డి) ఎదడ
జవాబు:
సి) ఎద

AP Board 9th Class Telugu Important Questions Chapter 11 ధర్మదీక్ష

3. ఓ కుమారా ! నీకు వంద వందనాలు – ఏ అలంకారమో గుర్తించండి. (S.A. II – 2017-18)
ఎ) లాటానుప్రాస
బి) ఛేకానుప్రాస
సి) అంత్యానుప్రాస
డి) అర్థాంతరన్యాస
జవాబు:
బి) ఛేకానుప్రాస

4. నందగోపుడు భోజనం చేశాడు. (గీత గీసిన పదానికి గణాన్ని గుర్తించండి) (S.A. III – 2016-17)
ఎ) త గణము
బి) మ గణము
సి) ర గణము
డి) భ గణము
జవాబు:
ఎ) త గణము

5. “ఏమిటి విశేషం” అని నందగోపుడు అడిగాడు. (ఈ ప్రత్యక్ష కథనానికి పరోక్ష కథనాన్ని గుర్తించండి. ) (S.A. III – 2016-17)
ఎ) “ఏమిటి విశేషమని” నందగోపుడు అడగలేదు.
బి) ఏమిటి విశేషమని నందగోపుడు అడిగాడు.
సి) “విశేషం ఏంటి” అని నందగోపుడు అడిగాడు.
డి) ఏమి విశేషం లేదా అని నందగోపుడు అడిగాడు.
జవాబు:
బి) ఏమిటి విశేషమని నందగోపుడు అడిగాడు.

6. ఆయన దర్శన భాగ్యం కలుగుతుందో ! కలగదో ! (ఏ రకమైన వాక్యమో గుర్తించండి. ) (S.A. III – 2016-17)
ఎ) హేత్వర్ణకం
బి) సామర్థ్యార్థకం
సి) సందేహాహాకం
డి) ఆశీరర్థకం
జవాబు:
సి) సందేహాహాకం

భాషాంశాలు (పదజాలం, వ్యాకరణం)

1. అర్థాలు :

7. మార్కుల కోసం ఆరాటపడడం కాదు. శ్రద్ధ ఉండాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) కోపం
B) ఆత్రపడు
C) సంతోషం
D) కష్టం
జవాబు:
B) ఆత్రపడు

8. భిక్షవులు బుద్ధుని వెంట నడిచారు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) బిచ్చగాళ్ళు
B) మునులు
C) సన్యాసులు
D) జనులు
జవాబు:
C) సన్యాసులు

9. ప్రతి ఒక్కరు వ్యసనాలను విసర్జించాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) విడుచు
B) పొందు
C) దగ్గర
D) దూరం
జవాబు:
A) విడుచు

10. పెద్దల మాట ఆలకించాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) చూడు
B) విను
C) శ్రద్ధ
D) మాట్లాడు
జవాబు:
B) విను

11. చిన్నపిల్లల ముద్దుమాటలు చూసి పెద్దలు మురిసిపోతారు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) గంతులు
B) బాధ
C) సంతోషం
D) ఎగతాళి
జవాబు:
C) సంతోషం

AP Board 9th Class Telugu Important Questions Chapter 11 ధర్మదీక్ష

12. అపరిచితులతో చనువుగా ఉండరాదు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) కోపం
B) ద్వేషం
C) ఇష్టం
D) స్నేహం
జవాబు:
D) స్నేహం

13. నందుని హృదయంలో జిజ్ఞాస రేకెత్తింది – గీత గీసిన పదానికి అర్థం ఏమిటి ?
A) కోపము
B) తెలుసుకోవాలనే కోరిక
C) ఆనందము
D) ఆసక్తి
జవాబు:
B) తెలుసుకోవాలనే కోరిక

14. భిక్షువులను అతిథి సత్కారాలతో ఎంతో ఆప్యాయంగా ఆదరించారు – గీత గీసిన పదం అర్థం గుర్తించండి.
A) ప్రేమగా
B) గౌరవంగా
C) ఇష్టంగా
D) కోపంగా
జవాబు:
A) ప్రేమగా

15. కొంత సేపటికి శ్రవణకులు అందరూ వటవృక్షచ్ఛాయలో సమాసీనులయ్యారు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) గ్రామ ప్రజలు
B) శిష్యులు
C) బౌద్ధ భిక్షువులు
D) సన్యాసులు
జవాబు:
C) బౌద్ధ భిక్షువులు

AP Board 9th Class Telugu Important Questions Chapter 11 ధర్మదీక్ష

16. అవగాహన చేసికొన్న వారికి నిర్వాణం కరతలామలకం – గీత గీసిన పదానికి అర్థం ఏమిటి ?
A) బాగా తెలిసినది
B) చేయి
C) ఉసిరికాయ
D) సంపాదింపబడేది
జవాబు:
A) బాగా తెలిసినది

2. పర్యాయపదాలు :

17. గోవు దేవతల ప్రతిరూపంగా పూజలందుకుంటుంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) ఆవు దూడ
B) ధేనువు, ఆవు
C) గిడ్డి, గరుడ
D) మొదవు, మేగము
జవాబు:
B) ధేనువు, ఆవు

18. మన జాతీయ జంతువు పులి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) వ్యాఘ్రం, కరి
B) శార్దూలం, సారంగి
C) పుండరీకం, శార్దూలం
D) సింహం, నక్క
జవాబు:
C) పుండరీకం, శార్దూలం

19. బుద్ధుని వెంట శ్రవణుకులు నడిచారు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) జనులు, ప్రజలు
B) రైతులు, కూలీలు
C) మునులు, ఋషులు
D) సన్యాసులు, భిక్షువులు
జవాబు:
D) సన్యాసులు, భిక్షువులు

20. ‘నిర్వాణం’ – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) మోక్షం, కైవల్యం
B) మోక్షం, శుభం
C) ముక్తి, విముక్తి
D) స్వర్గం, నరకం
జవాబు:
A) మోక్షం, కైవల్యం

21. సర్వలోకాలకు కాంతి ప్రదాత సూర్యుడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) భానుడు, చంద్రుడు
B) భాస్కరుడు, తస్కరుడు
C) ఆదిత్యుడు, రవి
D) రవి, రాము
జవాబు:
C) ఆదిత్యుడు, రవి

22. కన్నులతో వినే శక్తి పాముకు కలదు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) నేత్రం, ఆత్రం
B) చక్షువు, దృష్టి
C) అక్షి, పక్షి
D) నయనం, నయం
జవాబు:
B) చక్షువు, దృష్టి

23. అది నందుడు పెంచి పెద్దచేసిన ఆవు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) హయము, తురగము
B) గిడ్డి, ధేనువు
C) మొదవు, హరి
D) కపిల, హస్తి
జవాబు:
B) గిడ్డి, ధేనువు

3. వ్యుత్పత్త్యర్థాలు :

24. ‘దృష్టము కానిది‘ భాగ్యం – గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.
A) దురదృష్టం
B) అదృష్టం
C) భోగం
D) శుభం
జవాబు:
B) అదృష్టం

AP Board 9th Class Telugu Important Questions Chapter 11 ధర్మదీక్ష

25. దుఃఖాదులు లేనిదే జీవితం లేదు – గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.
A) నిర్వాకం
B) నిర్వహణ
C) నిర్వాణం
D) బాధ
జవాబు:
C) నిర్వాణం

26. ‘హృదయం’ దీనికి వ్యుత్పత్తి గుర్తించండి.
A) హరింపబడునది
B) ద్వేషించునది
C) ప్రేమించునది
D) దయలేనిది
జవాబు:
A) హరింపబడునది

27. ‘గుణములందు దోషారోపణ చేయుట’ హీనుల పని – వ్యుత్పత్త్యర్థం తగినది గుర్తించండి.
A) మదం
B) కోపం
C) అసూయ
D) ద్వేషం
జవాబు:
C) అసూయ

28. యజ్ఞాది క్రియారంభమున అనుష్ఠింప పూనుకొనెడు ఆచారనియమం – సరైనది గుర్తించండి.
A) కంకణ బద్దులు
B) దీక్ష
C) నడుం కట్టుట
D) పట్టుదల
జవాబు:
B) దీక్ష

29. “తిథి, వార నియమాలు లేకుండా వచ్చేవాడు” – ఈ పదానికి వ్యుత్పత్యర్థం ఏది?
A) బంధువు
B) అతిథి
C) అభ్యాగతి
D) సోదరుడు
జవాబు:
B) అతిథి

4. నానార్థాలు :

30. పక్షములు రెండు. శుక్లపక్షం, కృష్ణపక్షం – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) రెక్క ముక్క
B) ప్రక్క సందు
C) 15 రోజులు, రెక్క
D) బలం, శక్తి
జవాబు:
C) 15 రోజులు, రెక్క

31. అహ్మము యొక్క మధ్యభాగం మధ్యాహ్నం – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) పగలు, రాత్రి
B) రోజు, కాలం
C) కాలం, సమయం
D) రోజు, దినం
జవాబు:
B) రోజు, కాలం

AP Board 9th Class Telugu Important Questions Chapter 11 ధర్మదీక్ష

32. వంశం నిలబెట్టేది వివాహమే కదా ! – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) కులం, కలం
B) వెదురు, బెదురు
C) వెన్నెముక, ఎముక
D) తండ్రితాతలపరంపర, పిల్లనగ్రోవి
జవాబు:
D) తండ్రితాతలపరంపర, పిల్లనగ్రోవి

33. బుద్ధుడు మానవాళికి ఒక కొత్త దారి చూపాడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) తెలియనివాడు, అమాయకుడు
B) మేధావి, తెలివి
C) పండితుడు, పామరుడు
D) బుద్ధదేవుడు, పండితుడు
జవాబు:
C) పండితుడు, పామరుడు

34. జ్యోతులు వెలిగించే కార్తీకమాసం పవిత్రమైంది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) చంద్రుడు, బుధుడు
B) ప్రకాశం, కొడుకు
C) ధనం, డబ్బు
D) కొడుకు, పుత్రుడు
జవాబు:
B) ప్రకాశం, కొడుకు

35. నేత్రదానంతో మరొకరికి చూపు నివ్వండి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) కన్ను, పేరు
B) ఏరు, పారు
C) పట్టువస్త్రం, గుడ్డ
D) పేరు, నామం
జవాబు:
B) ఏరు, పారు

36. పెద్దల ప్రసంగాలు అమృతతుల్యాలు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) విషయవిస్తారం, కథ
B) మాటలు, పాటలు
C) భక్తి, ముక్తి
D) సంభాషణ, ప్రస్తావం
జవాబు:
D) సంభాషణ, ప్రస్తావం

37. ‘ఒక చిరునవ్వు విసిరాదా ముసలి తాత” – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) తండ్రి తండ్రి, ముసలి
B) తండ్రి, బ్రహ్మ
C) బ్రహ్మ, ముసలిది
D) రక్షకుడు, తల్లి తండ్రి
జవాబు:
B) తండ్రి, బ్రహ్మ

5. ప్రకృతి – వికృతులు :

38. లేగదూడలు తల్లులకై ‘అంబా‘ అని అరుస్తున్నాయి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) అంబ
B) అమ్మా
C) అబ్బా
D) అయ్యా
జవాబు:
B) అమ్మా

39. చిన్నపిల్లలకు ఎవరి కన్ను పడకుండా దిస్టి చుక్క పెడతారు – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
A) దోషం
B) చూపు
C) దృష్టి
D) కన్ను
జవాబు:
C) దృష్టి

40. వ్యాసుడు భిక్ష పాత్రను పగులగొట్టాడు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) బిచ్చము
B) బిక్ష
C) భిచ్చం
D) బికష
జవాబు:
A) బిచ్చము

AP Board 9th Class Telugu Important Questions Chapter 11 ధర్మదీక్ష

41. భోజనం చేసేటప్పుడు మెతుకులు చుట్టూ పడకూడదు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) బువ్వ
B) అన్నం
C) సద్ది
D) బోనం
జవాబు:
D) బోనం

42. దమ్మము తప్పి ప్రవర్తించకూడదు – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
A) న్యాయం
B) ధర్మం
C) అహింస
D) సత్యం
జవాబు:
B) ధర్మం

43. తాను చేసుకున్న పూర్వ పుణ్యం అంతే కదా! – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
A) పుణ్యము
B) పున్నెం
C) పున్యము
D) పూర్వము
జవాబు:
B) పున్నెం

44. ఆకటి చిచ్చు వేధించినా, అతడు గోపాలక ధర్మం వీడలేదు – గీత గీసిన పదానికి ప్రకృతి ఏది?
A) చిచ్చి
B) శుచి
C) అగ్ని
D) చిత్తు
జవాబు:
C) అగ్ని

6. సంధులు :

45. అరుణోదయ కాంతులతో తూర్పు దిక్కు మెరుస్తోంది – గీత గీసిన పదానికి సంధిని గుర్తించండి.
A) సవర్ణదీర్ఘ
B) వృద్ధి
C) గుణ
D) యణాదేశ
జవాబు:
C) గుణ

46. ‘నిడు + ఊర్పు’ – సంధి పేరేమిటి?
A) టుగాగమ
B) ద్విరుక్తటకారం
C) ప్రాతాది
D) జశ్త్వ
జవాబు:
B) ద్విరుక్తటకారం

AP Board 9th Class Telugu Important Questions Chapter 11 ధర్మదీక్ష

47. ‘సమ్యగ్బుద్ధి’ విడదీయము.
A) సమ్యక్ + బుద్ధి
B) సమ్య + బుద్ధి
C) సమ్య + కుబుద్ధి
D) సమయక్ + బుద్ధి
జవాబు:
A) సమ్యక్ + బుద్ధి

48. కింది వానిలో విసర్గసంధి ఉదాహరణను గుర్తించండి.
A) నేత్రాలు
B) సుఖాసనం
C) మధ్యాహ్నం
D) దుస్సహం
జవాబు:
D) దుస్సహం

49. ‘నెఱ + మది’ – సంధి పేరేమిటి?
A) ఆమ్రేడిత సంధి
B) ప్రాతాది
C) పడ్వాది
D) యణాదేశ
జవాబు:
B) ప్రాతాది

50. ప్రతి + ఏకం – సంధి చేయండి.
A) ప్రతేకం
B) ప్రతియేకం
C) ప్రత్యేకం
D) ప్రతిఏకం
జవాబు:
C) ప్రత్యేకం

51. యణాదేశ సంధికి ఉదాహరణను గుర్తించండి.
A) ప్రత్యక్షం
B) అరుణోదయం
C) ఆరాటపడు
D) నేత్రాలు
జవాబు:
A) ప్రత్యక్షం

52. ‘సుఖాసనం’ – సంధిని గుర్తించండి.
A) గుణ
B) యణాదేశ
C) వృద్ధి
D) సవర్ణదీర్ఘ
జవాబు:
D) సవర్ణదీర్ఘ

53. ‘నిట్టూర్పు’ పదాన్ని విడదీయండి.
A) నిట్ట + ఊర్పు
B) నిట్టు + ఊర్పు
C) నిడు + ఊర్పు
D) నిట + టూర్పు
జవాబు:
C) నిడు + ఊర్పు

54. ‘పొరుగూళ్ళు’ – ఈ పదంలో గల సంధి ఏది?
A) అత్వసంధి
B) సవర్ణదీర్ఘ సంధి
C) ఉత్వసంధి
D) ఇత్వసంధి
జవాబు:
C) ఉత్వసంధి

AP Board 9th Class Telugu Important Questions Chapter 11 ధర్మదీక్ష

55. ‘హృదయాంతరాళంలో ప్రేమ లేదు’ – గీత గీసిన పదం ఏ సంధి?
A) గుణ సంధి
B) వృద్ధి సంధి
C) అత్వ సంధి
D) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
D) సవర్ణదీర్ఘ సంధి

7. సమాసాలు:

56. నేడు ప్రభుత్వం గోశాలలపై శ్రద్ధ పెట్టాలి – గీత గీసిన పదానికి విభక్తిని గుర్తించండి.
A) కంటె
B) వలన
C) యొక్క
D) అందు
జవాబు:
D) అందు

57. ‘సహింపరానిది’ – సమాసపదం గుర్తించండి.
A) స్వభావోక్త
B) ఉత్ప్రేక్ష
C) ఉపమా
D) యమకం
జవాబు:
D) యమకం

58. ‘ముఖ జ్యోతి’ దీనిలోని విభక్తిని గుర్తించండి.
A) కొఱకు
B) యొక్క
C) చేత
D) అనెడి
జవాబు:
D) అనెడి

59. సంభావనా పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణను గుర్తించండి.
A) శ్రావస్తీ నగరం
B) చిరునవ్వు
C) ఆకటిచిచ్చు
D) మహాత్మ
జవాబు:
A) శ్రావస్తీ నగరం

AP Board 9th Class Telugu Important Questions Chapter 11 ధర్మదీక్ష

60. ‘మధ్యాహ్నం’ సమాసం గుర్తించండి.
A) రూపక
B) అవ్యయిభావ
C) ప్రథమా తత్పురుష
D) చతుర్టీ
జవాబు:
C) ప్రథమా తత్పురుష

61. ధర్మమును గూర్చి ప్రవచనం – గీత గీసిన పదానికి విభక్తిని గుర్తించండి.
A) ప్రథమా
B) ద్వితీయా
C) తృతీయా
D) చతుర్థి
జవాబు:
D) చతుర్థి

62. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణను గుర్తించండి.
A) శ్రావస్తీ నగరం
B) సందర్శన భాగ్యం
C) మధ్యాహ్నం
D) పెన్నిధి
జవాబు:
B) సందర్శన భాగ్యం

63. ‘భిక్షాపాత్రము’-ఇది ఏ సమాసమో గుర్తించండి.
A) తృతీయా తత్పురుష
B) చతుర్దీ తత్పురుష
C) దంద్వము
D) షష్ఠీ తత్పురుష
జవాబు:
B) చతుర్దీ తత్పురుష

64. ‘మధ్యాహ్నము’ – ఈ సమాసానికి విగ్రహవాక్యాన్ని గుర్తించండి.
A) అహ్నము యొక్క మధ్య భాగం
B) అహ్నము మరియు మధ్యము
C) మధ్యముగా ఉన్న అహ్నము
D) మధ్యమును, అహ్నమును
జవాబు:
A) అహ్నము యొక్క మధ్య భాగం

65. ‘అతిదూరము కానిది’ – సమాసపదంగా కూర్చండి.
A) అతి దూరము
B) అనతి దూరము
C) అభ్యంతరము
D) అదూరము
జవాబు:
B) అనతి దూరము

8. అలంకారాలు :

66. “గౌతముని ముఖజ్యోతి ఉదయిస్తున్న సూర్యబింబంలా ఉంది” – గీత గీసిన పదంలోని అలంకారాన్ని గుర్తించండి.
A) ఉపమా
B) రూపక
C) అతిశయోక్తి
D) శ్లేష
జవాబు:
B) రూపక

AP Board 9th Class Telugu Important Questions Chapter 11 ధర్మదీక్ష

67. “గౌతముని ముఖ వర్చస్సు ఉదయించే సూర్యబింబంలా ఉంది” – దీనిలో అలంకారాన్ని గుర్తించండి.
A) సాససం
B) దుస్సహం
C) అసహ్యం
D) అసహనం
జవాబు:
C) అసహ్యం

68. “ఎండ నెత్తి మాడ్చింది. ఆకలి దహిస్తోంది. నాలుక పిడచ గట్టింది” – దీనిలోని అలంకారం గుర్తించండి.
A) స్వభావోక్తి
B) శ్లేష
C) అతిశయోక్తి
D) ముక్తపదగ్రస్తం
జవాబు:
A) స్వభావోక్తి

69. ఒకే అక్షరం, లేదా రెండు మూడక్షరాలు, వాక్యం చివర మాటిమాటికీ వస్తే, దాన్ని ఏ అలంకారం అంటారు?
A) వృత్త్యనుప్రాస
B) ఛేకానుప్రాస
C) అంత్యానుప్రాస
D) ఉపమాలంకారం
జవాబు:
C) అంత్యానుప్రాస

70. ‘గ్రామస్తులు ఆనంద తరంగాలలో తలమునకలయ్యారు’ – ఈ వాక్యంలో గల అలంకారాన్ని గుర్తించండి.
A) రూపకము
B) ఉపమా
C) ఉత్ప్రేక్ష
D) వృత్త్యనుప్రాస
జవాబు:
A) రూపకము

71. ‘ఫలము’ – ఈ పదం ఏ గణము?
A) భ గణం
B) ర గణము
C) త గణము
D) న గణము
జవాబు:
D) న గణము

9. ఆధునిక వచనాన్ని గుర్తించడం :

72. ‘మీ సభా కార్యక్రమము నంతయుఁ జెడఁ గొట్టితిని’ – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి. (S.A. II – 2018-19)
A) మీ సభా కార్యక్రమాన్నంతా చెడగొట్టాను
B) మీ సభా కార్యక్రమాన్ని అంతా చెడగొట్టితిని
C) మీ సభా కార్యక్రమం చెడగొట్టాము
D) మీ సభలో కార్యక్రమాన్ని అంతా చెడగొట్టారు
జవాబు:
A) మీ సభా కార్యక్రమాన్నంతా చెడగొట్టాను

AP Board 9th Class Telugu Important Questions Chapter 11 ధర్మదీక్ష

73. ‘జపించు వేదమటవీ మధ్యంబులో నేద్పగున్’ – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి.
A) జపించే వేదం, అడవి మధ్యలో ఏడ్పవుతుంది
B) జపించే వేదము, అటవీ మధ్యంలో ఏడుపు
C) జపించే వేదము అటవీ మధ్యలో ఏడ్పు
D) జపించే వేదం అటవి మధ్యమంలో ఏడ్పవుతుంది
జవాబు:
A) జపించే వేదం, అడవి మధ్యలో ఏడ్పవుతుంది

10. కర్తరి, కర్మణి వాక్యాలను గుర్తించడం :

74. గౌతముడు ఎన్ని ప్రశ్నలు వేసాడు – కర్మణి వాక్యం గుర్తించండి.
A) ఎన్నో ప్రశ్నలు వేశాడు గౌతముడు
B) గౌతముడు వేసాడ ఎన్నో ప్రశ్నలు
C) గౌతమునిచే ఎన్నో ప్రశ్నలు వేయబడ్డాయి
D) ప్రశ్నలు ఎన్నో గౌతముడు వేసాడు
జవాబు:
C) గౌతమునిచే ఎన్నో ప్రశ్నలు వేయబడ్డాయి

75. అటువైపు చూడబడ్డారు – కర్తరి వాక్యం గుర్తించండి.
A) చూడబడ్డారు అటువైపు
B) అటువైపు చూచారు
C) వైపు అటు చూడబడ్డారు
D) అటు చూసి
జవాబు:
B) అటువైపు చూచారు

76. బుద్ధుడు ప్రవచనం ముగించాడు – కర్మణి వాక్యం గుర్తించండి.
A) బుద్ధునిచే ప్రవచనం ముగించబడింది
B) బుద్దునిచే ప్రవచనం ముగించాడు
C) బుద్ధుడు ప్రవచనం ముగించబడింది.
D) ప్రవచనంచే బుద్దుడు ముగించబడింది.
జవాబు:
A) బుద్ధునిచే ప్రవచనం ముగించబడింది

AP Board 9th Class Telugu Important Questions Chapter 11 ధర్మదీక్ష

77. పెక్కు విషయములను ఉపన్యసించారు – ఈ కర్తరి వాక్యానికి కర్మణి వాక్యాన్ని గుర్తించండి.
A) పెక్కు విషయాలు ఉపన్యసిస్తారు
B) పెక్కు విషయాలు ఉపన్యసింపబడ్డాయి
C) పెక్కు విషయములు ఉపన్యసింపబడతాయి
D) పెక్కు విషయాలు ఉపన్యసింపబడును
జవాబు:
B) పెక్కు విషయాలు ఉపన్యసింపబడ్డాయి

78. ‘ఎన్నో విషయాలు కృష్ణారావుగారిచే వివరింపబడ్డాయి – ఈ కర్మణి వాక్యానికి కర్తరి వాక్యాన్ని
A) ఎన్నో విషయాలను కృష్ణారావుగారు వివరిస్తారు అవుతుంది
B) ఎన్నో విషయాలను కృష్ణారావుగారు వివరించారు
C) ఎన్నో విషయాలు కృష్ణారావుగారు వివరింపగలరు
D) ఎన్నో విషయాలు కృష్ణారావుగారు తెలిపారు
జవాబు:
B) ఎన్నో విషయాలను కృష్ణారావుగారు వివరించారు

11. ప్రత్యక్ష, పరోక్ష కథనాలను గుర్తించడం :

79. “నేనేమి ఎరగని వట్టి అమాయకుణ్ణి” అని అన్నాడు – పరోక్ష కథనం గుర్తించండి.
A) నేను ఏమి ఎరగని వట్టి అమాయకుణ్ణి అన్నాడు.
B) తానేమి ఎరగని వట్టి అమాయకుణ్ణి అన్నాడు.
C) అతను ఏమి ఎరగని వట్టి అమాయకుణ్ణి అన్నాడు.
D) తానేమి ఎరగని వట్టి అమాయకుణ్ణి అన్నాడు.
జవాబు:
D) తానేమి ఎరగని వట్టి అమాయకుణ్ణి అన్నాడు.

80. “నాయనా ! నీ లేగదూడ తల్లి దగ్గర పాలు తాగుతోంది. నీవు భోజనం చేయి” అని అన్నాడు – పరోక్ష కథనం గుర్తించండి.
A) (అతనితో) లేగదూడ తల్లి దగ్గర పాలు తాగుతోంది. భోజనం చేయి అని అన్నాడు.
B) అతనిని సంబోధిస్తూ లేగదూడ తల్లి దగ్గర పాలు తాగుతోంది, భోజనం చేయని అన్నాడు.
C) బాబూ లేగదూడ తల్లి దగ్గర పాలు తాగుతోంది భోజనం చేయని అన్నాడు.
D) అతనితో తమ లేగదూడ తల్లివద్ద పాలు తాగుతోంది. భోజనం చేయని అన్నాడు.
జవాబు:
B) అతనిని సంబోధిస్తూ లేగదూడ తల్లి దగ్గర పాలు తాగుతోంది, భోజనం చేయని అన్నాడు.

AP Board 9th Class Telugu Important Questions Chapter 11 ధర్మదీక్ష

81. “మా అన్నయ్య ముస్తఫాకమల్ కి ఒక కిరాణా దుకాణం ఉంది” అన్నారు కలామ్ – ఈ ప్రత్యక్ష కథనానికి పరోక్ష కథనాన్ని గుర్తించండి.
A) తమ అన్నయ్య ముస్తఫాకమల్ కి, ఒక కిరాణా దుకాణం ఉందని కలామ్ అన్నారు.
B) మా అన్నయ్య ముస్తఫాకమలకు కిరాణా దుకాణం ఉందని కలామ్ అన్నారు.
C) వారి అన్నయ్య ముస్తఫాకమల్ కి కిరాణ దుకాణం ఉందని కలామ్ చెప్పారు.
D) నా అన్నయ్య ముస్తఫాకమల్ కి కిరాణా దుకాణం ఉండేదని కలామ్ అన్నారు.
జవాబు:
A) తమ అన్నయ్య ముస్తఫాకమల్ కి, ఒక కిరాణా దుకాణం ఉందని కలామ్ అన్నారు.

12. వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించడం :

82. సమృద్ధిగా ఉన్నాయి.
A) సమృద్ధిగా ఉండవచ్చు
B) సమృద్ధిగా ఉంటాయి
C) సమృద్ధిగా లేవు
D) సమృద్ధిగా ఉంటున్నాయి
జవాబు:
C) సమృద్ధిగా లేవు

83. కుశల ప్రశ్నలు వేశాడు.
A) కుశల ప్రశ్నలు వేస్తాడు
B) కుశల ప్రశ్నలు వేయలేదు
C) కుశల ప్రశ్నలు వేయవచ్చు
D) కుశల ప్రశ్నలు వేస్తుంటాడు
జవాబు:
B) కుశల ప్రశ్నలు వేయలేదు

84. ‘సన్యాసులందరితో కలిసి భోజనం చేశారు’ – ఈ వాక్యానికి వ్యతిరేకార్థ వాక్యాన్ని గుర్తించండి.
A) సన్యాసులందరితో కలిసి భోజనం చేయలేదు
B) సన్యాసులు భోజనం చేస్తారు
C) సన్యాసులు భోజనం చేయరు
D) సన్యాసులు భోజనం తినగలరు
జవాబు:
A) సన్యాసులందరితో కలిసి భోజనం చేయలేదు

AP Board 9th Class Telugu Important Questions Chapter 11 ధర్మదీక్ష

85. ‘నందుడతనికి తన ప్రయాణ కారణం తెలియజేశాడు’ – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
A) నందుడతనికి తన ప్రయాణ కారణం తెలుపలేదు
B) నందుడతనికి తన ప్రయాణ కారణం తెలియజేయలేదు
C) నందుడతనికి తన ప్రయాణ కారణం తెలుపడు
D) నందుడతనికి తన ప్రయాణ కారణం తెలుపరు
జవాబు:
B) నందుడతనికి తన ప్రయాణ కారణం తెలియజేయలేదు

13. వాక్యరకాలను గుర్తించడం :

86. ఎంతో భయభక్తులతో సాగిలపడి, లేచి నిలబడ్డాడు – ఇది ఏ రకమైన వాక్యం?
A) సంయుక్త
B) సంక్లిష్ట
C) సామాన్య
D) మహావాక్యం
జవాబు:
B) సంక్లిష్ట

87. గౌతముడు నిలబడ్డాడు, శిష్యులు నిలబడ్డారు – ఇది ఏ రకమైన వాక్యం?
A) సంక్లిష్ట
B) మహావాక్యం
C) సంయుక్త
D) సామాన్య
జవాబు:
C) సంయుక్త

88. ‘ఆచార్యుని కెదిరింపకు’ – ఇది ఏ రకమైన వాక్యం?
A) ఆశీరర్ధకం
B) విద్యర్థకం
C) నిషేధార్థకం
D) అనుమత్యర్థకం
జవాబు:
C) నిషేధార్థకం

AP Board 9th Class Telugu Important Questions Chapter 11 ధర్మదీక్ష

89. ‘రాముడు చెట్టు ఎక్కి కాయలు కోశాడు’ – ఇది ఏ రకమైన వాక్యం?
A) సామాన్య వాక్యం
B) సంక్లిష్ట వాక్యం
C) సంయుక్త వాక్యం
D) మహావాక్యం
జవాబు:
B) సంక్లిష్ట వాక్యం

14. ప్రక్రియలను గుర్తించడం:

90. చిరునవ్వు చూసి ఆనందం కలిగింది – గీత గీసిన పదం ఏ ప్రక్రియ?
A) చేదరకం
B) క్వార్థకం
C) శత్రర్థకం
D) ప్రశ్నార్థకం
జవాబు:
B) క్వార్థకం

91. ఈ గ్రామానికెందుకు వచ్చానో ఎరుగుదురా? – గీత గీసిన పదం ఏ ప్రక్రియ?
A) ధాత్వార్ధం
B) తద్ధర్మార్థకం
C) ప్రశ్నార్థకం
D) నిశ్చయార్థకం
జవాబు:
C) ప్రశ్నార్థకం

92. ‘వాటిని ఇనప్పెట్టెలో పెట్టి తాళాలు వేసి’ – గీత గీసిన పదాలు, ఏ రకం అసమాపక క్రియకు చెందును?
A) చేదర్థకం
B) క్వార్ధకం
C) ప్రశ్నార్థకం
D) శత్రర్థకం
జవాబు:
B) క్వార్ధకం

AP Board 9th Class Telugu Important Questions Chapter 11 ధర్మదీక్ష

93. వర్తమానకాల అసమాపక క్రియను ఏమంటారు?
A) చేదర్థకం
B) క్వార్థకం
C) శత్రర్థకం
D) అద్యర్థకం
జవాబు:
C) శత్రర్థకం

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

AP State Syllabus AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట.

AP State Syllabus 9th Class Telugu Important Questions 7th Lesson ఆడినమాట

9th Class Telugu 7th Lesson ఆడినమాట Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

క్రింది అపరిచిత గద్యాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. “సర్వాంగం దుర్జనే విషమ్” అన్న పెద్దల మాట ఒకసారి పరికిస్తే – తేలుకు ఒక తోక (కొండి) లోనే విషం ఉంటుంది. ఈగకు తలలో మాత్రమే విషం ఉంటుంది. పాముకు కోరల్లోనే విషం ఉంటుంది. ఈ మూడింటిలో విషం ఒకచోటే ఉన్నప్పటికీ వాటివలన ప్రజలకు ఎంతో హాని జరుగుతున్నది. కాని ఒళ్ళంతా విషం ఉన్న దుర్జునుని వలన ప్రజలకు ఇంకా హాని ఎంత జరుగుతుందో !
ప్రశ్నలు – జవాబులు:
1. పెద్దలు ఏమన్నారు ?
జవాబు:
సర్వాంగం దుర్జనే విషమ్

2. తోకలో విషం కలిగినది ఏది?
జవాబు:
తేలు

3. ఈగకు విషం ఎక్కడ ఉంటుంది?
జవాబు:
తలలో

4. ఒళ్ళంతా విషం ఎవరికి ఉంది?
జవాబు:
దుర్జునునికి

2. తాను తలచిన విధముగ చెప్పుట, చెప్పిన విధముగ ఆచరించుట. ఈ ప్రకారముగ మనస్సు, వాక్కు, క్రియ ఒకే రూపము కలిగియుండట మహనీయుల లక్షణం.
ప్రశ్నలు – జవాబులు:
1. దీనిలో వేటి గురించి చెప్పబడింది?
జవాబు:
త్రికరణాలు (మనస్సు, వాక్కు, క్రియలు)

2. మాట ఎలా ఉండాలి?
జవాబు:
తాను తలచిన విధంగా (ఏదైతే ఆలోచిస్తామో ఆ విధంగా)

3. ఆచరణ దేనికి అనుబంధం ఉండాలి?
జవాబు:
చెప్పిన మాటకు

4. మనస్సు, వాక్కు, క్రియ ఒకే రూపంగా కలిగి ఉండేది ఎవరి లక్షణం?
జవాబు:
మహనీయుల లక్షణం.

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

3. ఈ కింది సంభాషణ చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. I – 2017-18)

పావురం : అసలు అడవులు నాశనం చేయడం వల్లనే వర్షాలు కురవడం లేదు, పంటలు పండటంలేదు. ఎటు చూసినా కరవు. తిండికి, నీటికి అన్నిటికీ కరవే !

చిలుక : ఎక్కడ చూసినా కరవే కాదు కాలుష్యం కాలుష్యం.

పావురం : జనం పెరగడం వల్లనే ఈ కాలుష్యం, కరవూ అన్నీ వస్తున్నాయి. కరవు, కాలుష్యం వల్లనే రోగాలు ఎక్కువ అయ్యాయి.

నక్క : మనకు చేసిన ద్రోహానికి శిక్ష అనుభవిస్తున్నారు.
పావురం : అలా అనకూడదు. మంచిది కాదు. ప్రకృతిని, అడవులను సంరక్షించుకోవాలి. అది అందరి బాధ్యత.
ప్రశ్నలు – జవాబులు:
1. వర్షాలు ఎందుకు కురవడం లేదు?
జవాబు:
అడవులు నాశనం చేయడం వల్ల

2. కరవు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి?
జవాబు:
చెట్లు పెంచాలి.

3. ప్రకృతిని, అడవులను ఎవరు సంరక్షించాలి?
జవాబు:
మనందరం

4. పై సంభాషణ ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
‘మనకు ద్రోహం చేశారు’ అని అన్నదెవరు?

4. ఈ కింది అపరిచిత గద్యాన్ని చదివి ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. II – 2017-18)

నిజానికి పావురాలకు అద్భుతమైన దిశా పరిజ్ఞానం ఉంది. ఏనుగులూ, పావురాల కన్నా తమ తమ యజమానుల పట్ల ఎక్కువ విశ్వాసం ప్రదర్శించే ప్రాణులను నేనింతవరకూ చూడలేదు. ఈ రెండింటితోనూ నాకు సన్నిహిత పరిచయం ఉంది. వనసీమలోని గజరాజులు కానివ్వండి, నగర సీమలలోని పావురాలు గానివ్వండి, అవి తమ యజమానులంటే ప్రాణం పెడతాయి.
ప్రశ్నలు :
1. పై పేరాలో రచయితకు ఇష్టమైన జంతువేది?
2. ‘వనసీమ’ అంటే మీకేమర్థమయింది?
3. యజమానిపట్ల విశ్వాసం ప్రదర్శించే పక్షి ఏది?
4. పై పేరాకు తగిన పేరు పెట్టండి.
జవాబులు:
1. ఏనుగు
2. అరణ్యం
3. పావురం
4. ‘విశ్వాసము’

II. స్వీయరచన

అ) క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘కథాకావ్యం’ ప్రక్రియ గురించి రాయండి.
జవాబు:
‘కథ్యతే ఇతి కథా’ అని వ్యుత్పత్తి. ‘కథాకావ్యం’ అనే పదబంధం తెలుగువారు ఏర్పరచుకున్నదైనా, పైశాచీ భాషలో గుణాఢ్యుడు వ్రాసిన ‘బృహత్కథ’ తొలికథా కావ్యంగా ప్రసిద్ధికెక్కింది. కథాకావ్యం అంటే విషయ ప్రధానమైనది. వివిధ కథల సమాహారం కథాకావ్యం. దీనిలో వస్తు ప్రధానమై, రమణీయ కథన శోభితమై, మనోరంజనంతో పాటు నీతిని, వ్యవహార దక్షతను, కార్యకుశలతను, ధర్మ ప్రబోధాన్ని, ఉత్తమ గుణాలను పెంపొందించే కథావళి ఉంటుంది.

ప్రశ్న 2.
“ఆడినమాట’ పాఠ్యభాగ కవి రచనా శైలి గూర్చి రాయండి.
జవాబు:
అనంతామాత్యుని భోజరాజీయం కావ్యంలోని షష్ఠాశ్వాసం నుండి ‘ఆడినమాట’ అను పాఠ్యభాగం గ్రహించబడింది. ఈయన 15వ శతాబ్దానికి చెందినవారు. అనంతామాత్యుని అపూర్వ మేథాశక్తి నుండి ఆవిర్భవించిన సుమధుర కథా సముచ్ఛయం, విచిత్ర కథా రత్నాకరం ‘భోజరాజీయం’. మానవత్వపు విలువలకు, జీవన ప్రమాణాలకు మచ్చలేని మకుటం (అద్దం)గా నిల్చి కవికి మహోన్నత ఖ్యాతి తెచ్చిన గ్రంథం భోజరాజీయం. నీతిబద్ధమైన మానసిక బలం, శారీరక బలం కంటే వేయి రెట్లు శక్తివంతమని, ఘోర వ్యాఘ్రమును గంగిగోవుగా చేయగలదని కవి చేసిన ధర్మప్రతిపాదన అనుపమానము. అనంతుడు అనేక నీతులను, లోకం పోకడలను సందర్భోచితంగా చెబుతూ ఉత్తమ జీవనమే లక్ష్యమని సిద్దాంతము చేసాడు. జంతువుల పాత్రల ద్వారా మనిషిలోని పశుప్రాయాన్ని తొలిగించడంలో సఫలీకృతుడు అయ్యాడు అనంతామాత్యుడు.

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

ప్రశ్న 3.
ఆవు తన బిడ్డకు బుద్ధులు చెప్పింది కదా ! ఇలా చెప్పించడంలో కవి ఉద్దేశం ఏమిటి?
జవాబు:
‘సమాజహితం సాహిత్యం ‘ అన్నారు పెద్దలు. కథలు, కావ్యాలు రాయడంలో వారి ఆంతర్యం సమాజ శ్రేయస్సే. ఏది చెప్పినా, పాత్రల ద్వారా చెప్పించినా అది ఆ కాల ప్రజలకూ, భావితరాల వారిని ఉద్దేశించినవే. ‘కాకిపిల్ల కాకికి ముద్దు’ అన్నట్లు పిల్లలు ఎన్ని తప్పులు చేసినా కప్పిపుచ్చి తమ పిల్లలంత మంచివారు లేరనే తల్లిదండ్రులను మనం చూస్తూనే ఉంటాం. అలాంటి వారి వల్ల లోకానికే కాదు, ఆ కుటుంబానికి కలిగే మేలు తక్కువే. పశువైనా, తన బిడ్డకు అసత్యం పలుకవద్దని, చెడ్డ స్నేహాలు వద్దని, ఎవరితోనైనా సరే గొడవలకు పోవద్దని నీతిబోధ చేసింది. ఇలా ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పుతున్నారు ? ‘విద్యా విహీనః పశుః’ అన్నారు భర్తృహరి. మరి పశువే ఇంత చక్కగా బిడ్డకు బుద్ధులు నేర్పుతుంటే, మనుష్యులు ఏం చేయాలి ? ఏం చేస్తే సమాజానికి మేలు జరుగుతుందో మనం ఆలోచిస్తే కవి ఉద్దేశ్యం తేలికగా అర్థమౌతుంది.

ప్రశ్న 4.
పులిని ఆవు ఏ మాటలతో నమ్మించింది? (S.A. III – 2016-17)
జవాబు:
తనను చంపయిన పులితో కుమారుడికి కడుపునిండా పాలిచ్చి వెంటనే వస్తానన్న ఆవు మాటల్ని నమ్మదు పులి. అప్పుడు ఆవు పులితో ఇలా అంది. “కటినమైన మాటలు మాట్లాడి పెద్దలకు బాధ కలిగించేవాడు, తండ్రికి, తల్లికి ఎదురు మాట్లాడేవాడు, ఆకలితో గట్ల వెంబడి గడ్డిని మేస్తున్న పశువును వెళ్ళగొట్టేవాడు. ఏ నరకాల్లో పడతారో, తిరిగి నీ దగ్గరికి రాకుంటే నేను ఆ నరకాల్లోనే పడతాను” అని నమ్మించింది. (171 పేజిలో)

ఆ) క్రింది ప్రశ్నలకు పది లేక పన్నెండు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
అవు – పులి మధ్య జరిగిన సంభాషణను సొంతమాటల్లో రాయండి.
జవాబు:
తెలుగు కథాకావ్యాల్లో ఉత్తమ గ్రంథం అనంతామాత్యుని భోజరాజీయం. నీతిసారమగు ఈ ప్రబంధం షష్ఠాశ్వాసం నుండి ‘ఆడినమాట’ గ్రహించబడింది. ఆవు, పులి పాత్రల ద్వారా మానవతా విలువలు, సత్యవాక్కుకు ఉన్న శక్తి నిరూపితం అయినాయి. ‘ధర్మో రక్షతి రక్షితః’ అన్న మాటలు నిజం చేసింది ఆవు. అన్నింటికి మూలమైన ‘సత్యం’ అనే సూత్రంతో జీవనం సాగిస్తే ముందడుగే గాని వెనకడుగు లేదనే సత్యాన్ని చాటి చెప్పింది ఈ కథ. ఇక కథలోకి వెళితే –

పులి తనకు ఆహారంగా దొరికిన ఆవును చంపబోయింది. అప్పుడు ఆవు, తనకు ఇంటివద్ద మేతమేయడం కూడా రాని పాలు తాగే పసిబిడ్డ ఉన్నాడని, అనుమతిస్తే బిడ్డకు కడుపార పాలు ఇచ్చి వస్తానంటుంది. అప్పుడు పులి ఎగతాళిగా “చెప్పేవాడు చెప్పినా, వినేవాడికి వివేకం ఉండద్దా ? నన్ను అమాయకుణ్ణి చేసి, మరల వస్తానంటే నమ్మవచ్చా ?” అని మాట్లాడింది. ఆ సమయంలో ఆవు తల్లిదండ్రులకు ఎదురు మాట్లాడేవారు, ఆకలితో గడ్డి మేసే పశువును తోలేవాడు ఏ నరకంలో పడతారో నేను రాకపోతే నాకూ ఆ గతి అని చెప్పి, పులిని ఒప్పించి, సంతోషంగా బిడ్డ వద్దకు వెళ్ళింది.

కొడుకు పాలు తాగుతున్నంతసేపు తన ఆలోచనంతా బిడ్డపైనే ఉంచి, శిలా ప్రతిమాలా ఆవు నిలిచింది. తన బిడ్డతో “ఇక నుంచి అమ్మను తలచుకోకు. అబద్దపు మాటలు ఆడకు. చెడు స్నేహాలు చేయకు. ఎవరితోను కుమ్ములాడవద్దు. ఎవరితోను ఎదురు సమాధానం చెప్పవద్దు. దేనికీ భయపడవద్దు” అంటూ జరిగిన సంగతి అంతా చెప్పింది. అక్కడి నుండి మాట ప్రకారం పులి ఉన్న చోటుకు వచ్చింది. ఆవును చూసి పులి ఆశ్చర్యపడింది. ‘ఆడినమాట’ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని ‘ఆవు’ సామాన్యురాలిగా కనిపించలేదు. నిన్ను హింసించటం, పాపాన్ని మూటగట్టుకోవడం ఒకటే కనుక నీవు సంతోషంగా వెనుకకు వెళ్ళమని పులి ఆవుతో చెప్పింది. నన్ను పరీక్షించకు. నేను సిద్ధపడే వచ్చాను అని ముందడుగు ఆవు వేయగా, ఆ పులి వెనకడుగు వేసింది. తినమని ఆవు, తిననని పులి వాదులాడుకున్నాయి. ఆవు
సత్యవాక్ శుద్ధికి, పులి కరుణరస బుద్ధికి దేవతలు సంతోషించారు.

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

ప్రశ్న 2.
సాధుజంతువైన ఆవునకు ఎదురైన ఆపద ఏమిటి ? ఏ విధంగా తను ఆడినమాటను నిలబెట్టుకుంది? (S.A. II – 2017-18)
జవాబు:
మేతకోసం అడవికి వెళ్ళిన ఆవుకు పులి ఎదురైంది. పులి తనకు ఆహారంగా దొరికిన ఆవును చంపబోయింది. సాధు జంతువైన ఆవుకు ఎదురైన ఆపద ఇదే. అప్పుడు ఆవు, తన ఇంటి వద్ద మేత మేయడం కూడా రాని పాలుతాగే పసిబిడ్డ ఉన్నాడని, అనుమతిస్తే బిడ్డకు, కడుపార పాలు ఇచ్చి వస్తానంటుంది. అప్పుడు పులి ఎగతాళిగా ‘చెప్పేవాడు చెప్పినా వినేవాడికి వివేకం ఉండదా ?’ అని ఒప్పుకోదు. ఆవు పులిని బ్రతిమాలి, ఒప్పించి, సంతోషంగా బిడ్డ వద్దకు వెళ్ళింది. కొడుకు పాలు తాగుతున్నంతసేపు తన ఆలోచనంతా బిడ్డపైనే ఉంచింది. జరిగిన సంగతంతా చెప్పి, ఎవరితోను కుమ్ములాడవద్దని, చెడు స్నేహాలు చేయకని, అబద్దాలాడవద్దని బుద్ధులు చెప్పింది. అక్కడి నుండి ‘ఆడినమాట’ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయక అసామాన్యమైన వ్యక్తిత్వం కల ఆవు పులి ఉన్న చోటుకు వచ్చింది. ఈ విధంగా తను ఆడిన మాటను ఆవు నిలబెట్టుకుంది.

వ్యక్తీకరణ – సృజనాత్మకత

క్రింది ప్రశ్నకు సమాధానము రాయండి.

ప్రశ్న 1.
సత్యం గొప్పతనం గూర్చి నీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

విజయవాడ,
x x x x x

ప్రియమైన మిత్రుడు జశ్వంత్ కు,

నేను క్షేమం. అక్కడ నీవు క్షేమమని తలుస్తాను. ముఖ్యంగా రాయునది ఇటీవల నేను “సత్యహరిశ్చంద్ర” బొమ్మల కథల పుస్తకం చదివాను. ఆ పుస్తకం చాలా బాగుంది. హరిశ్చంద్రుడు, చంద్రమతి, లోహితాశుడు ఎన్ని కష్టాలు పడ్డారో! చాలా బాధేసింది. ఇచ్చిన మాటకోసం రాజ్య సంపదలన్నీ ధార పోశాడు. అడవులపాలయ్యాడు. భార్యాపిల్లలను అమ్మాడు. తానూ అమ్ముడు పోతాడు. చివరకు భార్యను నరకబోతాడు. ఇదంతా దేనికోసం అని ఆలోచిస్తే ‘సత్యం’ కోసం అని తెలుస్తుంది. చివరకు దేవతలంతా వచ్చి ఈ పరీక్షలంతా నీలోని మానసిక శక్తిని పరీక్షించడానికే, సత్యం కోసం : ఎంతవరకు నిలబడతావో లోకానికి చాటి చెప్పడానికే అని దీవిస్తారు. ఇలాంటి పుస్తకం నీవూ తప్పక చదువు.

ఇట్లు,
నీ మిత్రుడు,
కె. ఫణిరామ్,

చిరునామా :
కె. జశ్వంత్ సమీర్,
9వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూల్,
బాపట్ల,
గుంటూరు జిల్లా.

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

ప్రశ్న 2.
‘ఆడినమాట’ కోసం ఆవు ప్రాణాలు సైతం లెక్క చేయలేదు కదా ! ఇలాగే సత్యం కోసం నిలబడిన వారిని గూర్చి కథ రాయండి. (హరిశ్చంద్రుడు)
జవాబు:
సత్యహరిశ్చంద్రుడు

‘సత్యమేవ జయతే’ అన్న సూక్తికి నిలువుటద్దం హరిశ్చంద్రుని కథ. సమాజంలో ఈనాడు కావల్సినవి నైతిక విలువలు. అందుకు సమాజంలో సత్యానికి ప్రాధాన్యం ఇవ్వడం అవసరం. సత్యాన్ని మించిన దైవమే లేదని అన్న విశిష్ఠ సంస్కృతి మనది. జాతిపిత గాంధీజీ జీవితానికే స్ఫూర్తినిచ్చిన ఇతివృత్తం హరిశ్చంద్ర.

తాను నమ్మిన సత్యాన్ని విడువక రాజ్యాన్ని, భార్యాపిల్లలను విడిచిన మహనీయుడు హరిశ్చంద్రుడు. నిత్య సత్యవ్రతుడు. గురువైన విశ్వామిత్రునికి ఇచ్చిన మాటకోసం రాజ్య సంపదలను అతనికే ఇచ్చాడు. రాజ్యం విడిచి కట్టుబట్టలతో, భార్యాపిల్లలతో అడవులకు వెళ్ళాడు. విశ్వామిత్రుడు దారిలో ఎన్నో ఆటంకాలు కలిగించినా సత్యాన్ని విడువక ధైర్యంగా ముందుకు నడిచాడు. తనతోపాటు కష్టాలు పడుతున్న భార్య చంద్రమతి, కుమారుడు లోహితాశుని చూసి బాధపడ్డాడు. దారిలో ఎదురైన కష్టాలు ఆ దంపతులిద్దరి సత్యము, పతిభక్తి, దైవానుగ్రహం వల్ల తొలిగాయి.

విశ్వామిత్రుని అప్పు తీర్చడానికి తన భార్యాపిల్లలను అమ్మాడు. తాను కూడా కాటికాపరిగా అమ్ముడుపోయి, ఆ ధనాన్ని నక్షత్రకుడికి ద్వారా పంపాడు. నిందపడ్డ తన భార్యను సైతం చంపడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు విశ్వామిత్రుడు వచ్చి ఇదంతా నా మాయేనని చెప్పి ఆడాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా సత్యాన్ని విడిచి పెట్టక సత్యహరిశ్చంద్రుడు దేవతలు సైతం కీర్తించేటట్లు జీవించాడు.

III. భాషాంశాలు (పదజాలం , వ్యాకరణం)

1. పర్యాయపదాలు :

సుకృతం : పుణ్యము, పున్నెము
ఉదరం : పొట్ట, కడుపు
తల్లి : మాత, అమ్మ, జనని
తండ్రి : పిత, నాన్న, జనకుడు
వృషభం : ఎద్దు, ఆబోతు, కోడె, గిత్త, కాసరం, బసవుడు
చేను : పంట నేల, సస్యము, పొలం
నరకం : దుర్గతి, పాపలోకం
బుద్ధి : మతి, ధీ, మేధ, జ్ఞప్తి, ప్రజ్ఞ
భీతి : భయం, వెఱుపు, బెదురు, త్రాసం
పురము : పురి, నగరం, పట్టణం
అసత్యం : అబద్దం, బొంకు, కల్ల, హుళక్కి
వృత్తాంతం : చరిత్ర, వార్త, సంగతి
దురంతం : పాపం, కిల్బిషం, దురితం
మాంసం : పలలం, పొలసు, పిశితం, తరసం
రక్తం : నెత్తురు, రుధిరం
సురలు : దేవతలు, అమరులు
తనువు : శరీరం, కాయం, దేహం

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

2. వ్యుత్పత్త్యర్థాలు :

సుకృతం : లెస్సగా చేయబడినది (పుణ్యం, ధర్మం )
నరకం : పాపులను తన సమీపమున బొందించునది (దుర్గతి)

3. నానార్థాలు :

సుకృతం : పుణ్యం, శుభం
వివేకం : ఆలోచన, తెలివి
కుమారుడు : కొడుకు, కుమారస్వామి, బాలుడు
గోవు : ఆవు, కన్ను, బాణం, ఎద్దు
పాలు : క్షీరం, భాగం, వంతు, తెల్లనివి
రక్తము : నెత్తురు, ఎఱుపు, కుంకుమ, రాగి, అనురాగం
ఉత్తరం : జవాబు, లేఖ, ఒక దిక్కు

4. ప్రకృతి – వికృతులు :

పుత్ర – పట్టి
అగ్ని – అగ్గి
వ్యాఘ్ర – వేగి
వృషభం – బసవన్న
బుద్ధి – బుద్ధి
స్తనం – చన్ను
భీతి – బీతు
దోషం – దోసం
ప్రాణం – పానం
ప్రౌఢ – ప్రోడ = (తెలివిగలది)
సఖీ – సకి (య) = చెలికత్తె పుణ్యం
పుణ్యం – పున్నెం
ఉపవాసం – ఉపాసం (పస్తు)
రత్నం – రతనం
గహనం – గగనం
గుణము – గొనయము
నిజము – నిక్కము
కులము – కొలము
ధర్మం – దమ్మం
సదృశం – సరి (సమానం)
విలాసం – వెళుకు = (కులాసా)
పురీ – ప్రోలు
దైవం – దయ్యం
సత్యం – సత్తు (నిజం)
బ్రధ్న – పొద్దు (వేళ)
ప్రీతి – బాతి
కథ – కత
కపిల – కవిల = (నల్లని)
సాధు – సాదు

5. సంధులు :

ఉదర + అగ్ని = ఉదరాగ్ని – సవర్ణదీర్ఘ సంధి
నిజ + ఆవాసం = నిజావాసం – సవర్ణదీర్ఘ సంధి
శోభన + అంగి = శోభనాంగి – సవర్ణదీర్ఘ సంధి
ముహుః+ భాషితంబులు = ముహుర్భాషితంబులు – విసర్గరేఫాదేశ సంధి
నీవు + ఎరుంగవే = నీ వెరుంగవే – ఉత్వసంధి
ప్రల్లదము + ఆడి = ప్రల్లదమాడి – ఉత్వసంధి
ఎగ్గు + ఆడిన = ఎగ్గాడిన – ఉత్వసంధి
చన్ను + ఇచ్చితి = చన్నిచ్చితి – ఉత్వసంధి
వృత్తాంతంబు + అంతయు = వృత్తాంతంబంతయు – ఉత్వసంధి
భక్షింపుము + అని = భక్షింపుమని – ఉత్వసంధి
ప్రసన్నులు + ఐరి = ప్రసన్నులైరి – ఉత్వసంధి
ఆ + పులికిన్ = అప్పులికిన్ – త్రికసంధి
ఆ + మొదవు = అమ్మొదవు – త్రికసంధి
ఈ + తనువు = ఇత్తనువు – త్రికసంధి
ఆ + అవసరం = అయ్యవసరం – యడాగమ, త్రిక సంధులు
ధర్మవిద + ఆలు = ధర్మవిదురాలు – రుగాగమ సంధి
తోరము + భీతి = తోరపుభీతి – పుంప్వాదేశ సంధి
నిన్నును + కని = నిన్నుఁగని – సరళాదేశ సంధి
ఈన్ + చూడకు = ఈఁజూడకు – సరళాదేశ సంధి
పుట్టగన్ + చేసిన = పుట్టగఁజేసిన – సరళాదేశ సంధి
చంపగన్ + చాల = చంపగఁజాల – సరళాదేశ సంధి
మహా + అనుభావుడు = మహానుభావుడు – సవర్ణదీర్ఘసంధి
అతి + అనురాగం = అత్యనురాగం – యణాదేశ సంధి

6. సమాసాలు:

ముద్దులపట్టి – ముద్దుయైన పట్టి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఏడురోజు – ఏడు సంఖ్య గల రోజులు – ద్విగు సమాసం
ఉదరాగ్ని – ఉదరమనెడి అగ్ని- రూపక సమాసం
కులభూషణ – కులమునందు శ్రేష్ఠుడు – సప్తమీ తత్పురుష సమాసం
తోరపు భీతి – పెద్దదైన భయం- విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
మహానుభావులు – గొప్పదైన తేజస్సు కలవారు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
రక్తమాంసాలు – రక్తము, మాంసము – ద్వంద్వ సమాసం
సత్యప్రౌఢి – సత్యము యొక్క గొప్పతనం – షష్ఠీ తత్పురుష సమాసం

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

7. గణాలు:

1. మునుమును బుట్టె నాకు నొక ముద్దులపట్టి, యతండు పుట్టి యే
జవాబు:
AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట 1

2. గుమ్మెడు పాత నా సుతున కుం బరి తృప్తి జ నించుఁగా నిమాం
జవాబు:
AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట 2

8. అలంకారాలు:

ఉదరాగ్ని- రూపకాలంకారం
ఉపమేయం – ఉదరం
ఉపమానం – అగ్ని
వీటికి అభేదం చెప్పబడినది. ఉపమాన ఉపమేయములకు అభేదము చెప్పుట రూపకాలంకారం.

9th Class Telugu 7th Lesson ఆడినమాట 1 Mark Bits

1. ఆ సంఘటనకు అచ్చెరువు నొందితిని. (ప్రకృతి పదం గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) అపూర్వం
బి) ఆచరం
సి) ఆశ్చర్యం
డి) హాచెర్యం
జవాబు:
సి) ఆశ్చర్యం

2. ఇచ్చోట వసింపదగదు. (గీత గీసిన పదానికి సంధి గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) ద్రుత సంధి
బి) ఆమ్రేడిత సంధి
సి) ఇత్వసంధి
డి) త్రికసంధి
జవాబు:
డి) త్రికసంధి

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

3. నా సుతుడు సంగీత విద్వాంసుడు – (గీత గీసిన పదానికి సమాసం పేరు గుర్తించండి.) (S.A. II – 2018-19)
ఎ) తృతీయా తత్పురుష
బి) చతుర్దీ తత్పురుష
సి) రూపక సమాసం
డి) షష్ఠీ తత్పురుష
జవాబు:
డి) షష్ఠీ తత్పురుష

4. గోవునకు కొడుకు మొన్న మొన్ననే పుట్టాడు…. ముద్దు ముద్దుగా ఉంటాడు. ఏడెనిమిది రోజుల వయసు కలవాడు. గడ్డి అయిననూ తినలేడు – ఈ వాక్యంలో అలంకారాన్ని గుర్తించండి. (S.A. II – 2018-19)
ఎ) అతిశయోక్తి
బి) స్వభావోక్తి
సి) ఉత్ప్రేక్ష
డి) రూపకం
జవాబు:
బి) స్వభావోక్తి

5. అరణ్యంలో పుండరీకం గాండ్రించగానే చిన్న జంతువులు కకావికలమయ్యాయి. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) పులి
బి) సింహం
సి) ఏనుగు
డి) ఎలుగుబంటి
జవాబు:
ఎ) పులి

6. ముక్కంటి కోపానికి త్రిపురాలు భస్మమైనాయి. (ఏ సమాసమో గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) బహువ్రీహి
బి) విశేషణ పూర్వపద కర్మధారయం
సి) ద్విగువు
డి) ద్వంద్వ
జవాబు:
ఎ) బహువ్రీహి

7. అడవిలో పుండరీకములున్న సరస్సు ఒడ్డున ఒక పుండరీకం జింకను వేటాడింది. (గీత గీసిన పదాలకు తగిన నానార్థపదాలు గుర్తించండి) (S.A. III – 2016-17)
ఎ) పులి, బెబ్బులి
బి) పులి, సివంగి
సి) తెల్లతామర, పులి
డి) పులి, మల్లెపూవు
జవాబు:
సి) తెల్లతామర, పులి

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

8. బహుబ్లి హి సమాసానికి ఉదాహరణను గుర్తించండి. (S.A. III – 2016-17)
ఎ) చక్రధారి
బి) చతుర్ముఖుడు
సి) చరకుడు
డి) మేధ
జవాబు:
బి) చతుర్ముఖుడు

9. నీవు బాగా పాడుతావు. (వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) నీవు బాగా పాడావు
బి) నీవు బాగా పాడవు
సి) నీవు బాగా పాడుతున్నావు
డి) నీవు బాగా పాడావా?
జవాబు:
బి) నీవు బాగా పాడవు

10. కడుపారఁజన్లుడిపి చయ్యన వచ్చెద (ఆధునిక వచనాన్ని గుర్తించండి.) (S.A. II – 2018-19 )
ఎ) కడుపు నిండా పాలిచ్చి, వెంటనే వస్తాను
బి) కడుపు నిండకుండా పాలిచ్చి వెంటనే రాను
సి) కడుపు నిండా పాలిచ్చి, రేపు వస్తాను
డి) కడుపు నిండా పాలిచ్చి, సాయంత్రం వస్తాను.
జవాబు:
ఎ) కడుపు నిండా పాలిచ్చి, వెంటనే వస్తాను

11. అబద్ధపు మాటలు అనవద్దు (వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) సత్యమును ఎపుడూ చెప్పు
బి) అబద్ధపు మాటలంటే ఇష్టం
సి) అబద్దపు మాటలు ఆడు
డి) అబద్ధపు మాటలు ఆడవా !
జవాబు:
సి) అబద్దపు మాటలు ఆడు

12. “రవి అల్లరి చేస్తున్నాడు” (వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) రవి అల్లరి చేయడు
బి) రవి అల్లరి చేయలేదా?
సి) రవి అల్లరి చేయడం లేదు
డి) రవి అల్లరి చేయలేడు
జవాబు:
సి) రవి అల్లరి చేయడం లేదు

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

13. చదువుపై శ్రద్ధ తగ్గింది. (వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) చదువుపై శ్రద్ధ తగ్గుతోంది.
బి) చదువుపై శ్రద్ధ తగ్గడం లేదు.
సి) చదువుపై శ్రద్ధ తగ్గదు.
డి) చదువుపై శ్రద్ధ తగ్గలేదు.
జవాబు:
డి) చదువుపై శ్రద్ధ తగ్గలేదు.

భాషాంశాలు (పదజాలం, వ్యాకరణం)

1. అర్థాలు :

14. పూర్వజన్మ సుకృతంబు వల్ల ఈ భరతమాత బిడ్డనై పుటాను – గీత గీసిన పదానికి అరాన్ని గురించండి.
A) దానం
B) పుణ్యం
C) పాపం
D) దయ
జవాబు:
B) పుణ్యం

15. గురువుల పట్ల అపహాస్యము తగదు- గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
A) భక్తి
B) గౌరవం
C) ఎగతాళి
D) మర్యాద
జవాబు:
C) ఎగతాళి

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

16. నిక్కమ్ము నిప్పు వంటిది – గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
A) పాపం
B) పుణ్యం
C) భక్తి
D) నిజం
జవాబు:
D) నిజం

17. పాశ్చాత్య ధోరణి పై గల మోజు మన సంస్కృతిని దుర్గతి పాలు జేస్తోంది – గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
A) నాశనం
B) అశ్రద్ధ
C) వృద్ధి
D) సమం
జవాబు:
A) నాశనం

18. సురభి కామధేనువు – గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
A) పులి
B) గుఱ్ఱం
C) గోవు
D) గేదె
జవాబు:
C) గోవు

19. కష్టాలలో భీతిల్లకూడదు – గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
A) అభయం
B) భయం
C) ధైర్యం
D) పిటికి
జవాబు:
B) భయం

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

20. సున్నిత మనస్కులు కానివారిని పాషాణ హృదయులు అనవచ్చు – గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
A) రాయి
B) రేయి
C) మట్టి
D) మొద్దు
జవాబు:
A) రాయి

21. ఇతరులు ఎగ్గు ఆడినన్ తిరిగి సమాధానము ఇవ్వకు – గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
A) పొగడ్త
B) ఎగతాళి
C) కోపం
D) కీడు
జవాబు:
D) కీడు

22. తన బిడ్డకు జరిగిన వృత్తాంతమంతా తెలిపింది – గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
A) నాటిక
B) సంగతి
C) వ్యాసం
D) నవల
జవాబు:
B) సంగతి

23. ఆవు పులుల సంభాషణను విన్న సురలు సంతోషించారు – గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
A) ప్రజలు
B) పిల్లలు
C) దేవతలు
D) మునులు
జవాబు:
C) దేవతలు

24. నా బిడ్డ పూరియు మేయనేరడు – గీత గీసిన పదానికి అర్థం ఏమిటి?
A) పూరీ
B) పిండివంట
C) గడ్డి
D) పాలు
జవాబు:
C) గడ్డి

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

25. అడవిలో పుండరీకము మేకను ఎత్తుకుపోయింది – గీత గీసిన పదానికి అర్థం ఏట? (S.A. II – 2017-18)
A) సింహము
B) తెల్ల తామర
C) ఏనుగు
D) పెద్దపులి
జవాబు:
D) పెద్దపులి

26. నీవు మాట్లాడిన ప్రల్లదములు, కర్ణ కఠోరంగా ఉన్నాయి – గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
A) తిట్టు
B) శపథము
C) కఠినపు మాట
D) శాపవాక్యం
జవాబు:
C) కఠినపు మాట

27. వ్యాఘ్రము వస్తే వృషభము బెదిరి పారిపోయింది – గీత గీసిన పదానికి అర్థం ఏది?
A) పెద్దపులి
B) ఎద్దు
C) ఆవు
D) మేక
జవాబు:
B) ఎద్దు

28. మా ఇంటిలో మొదటి నుండి మొదవులను పెంచుతాము – గీత గీసిన పదానికి అర్థం ఏది?
A) ఆవు
B) కుక్క
C) గేదె
D) కోడి
జవాబు:
A) ఆవు

29. సరస్సులో పుండరీకములు సూర్యుని రాకతో ఉదయించాయి – గీత గీసిన పదానికి గల మరో అర్థమును గుర్తించండి.
A) తెల్లతామర
B) మల్లి
C) బంతి
D) గులాబి
జవాబు:
A) తెల్లతామర

2. పర్యాయపదాలు :

30. పొట్ట కూటికోసం మనుష్యులు అనేక వేషాలు వేస్తారు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) ఉదరం, కడుపు
B) కుక్షి, అక్కు
C) కడుపు, విడుపు
D) ఉదరం, చదరం
జవాబు:
A) ఉదరం, కడుపు

31. శివుని వాహనం వృషభం – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) ఎద్దు, పిల్లి
B) బసవుడు, సాంబ
C) ఎద్దు, బసవుడు
D) కోడె, పుంజు
జవాబు:
C) ఎద్దు, బసవుడు

32. కంచె చేను మేస్తే అన్నది సామెత – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) నేల, భూమి
B) సస్యం, పొలం
C) పంటనేల, బంజరు
D) రాతినేల, చవుడు
జవాబు:
B) సస్యం, పొలం

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

33. తన దుఃఖము నరకమండ్రు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) పాపలోకం, స్వర్గం
B) దుర్గతి, అశుభం
C) యమపురి, స్వర్ణపురి
D) దుర్గతి, పాపలోకం
జవాబు:
D) దుర్గతి, పాపలోకం

34. హరిశ్చంద్రుడు ఎప్పుడూ అసత్వం పలుకలేదు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) అబద్ధం, నిజం
B) బొంకు, కుంకు
C) కల్ల, అబద్ధం
D) హుళక్కి, బులాకి
జవాబు:
A) అబద్ధం, నిజం

35. రాక్షసులు మాంసాహారులు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) పలలం, పదిలం
B) పొలసు, పిశితం
C) తరసం, విరసం
D) పిశితం, పసరు
జవాబు:
B) పొలసు, పిశితం

36. స్వాతంత్ర్యం కోసం ఎందరో రక్తం చిందించారు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) నెత్తురు, నెతురు
B) రుధిరం, మధురం
C) నల్ల, నల్లి
D) నెత్తురు, రుధిరం
జవాబు:
D) నెత్తురు, రుధిరం

37. మా ఇంటిలోని ధేనువు హర్యానా జాతికి చెందినది – గీత గీసిన పదానికి పర్యాయపదాలేవి?
A) బఱ్ఱె, వృషభము
B) మొదవు, గోవు
C) మేక, జింక
D) గేదె, ఆవు
జవాబు:
B) మొదవు, గోవు

38. సర్కసులో పులిచే బాగా నాట్యం చేయించారు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) సింహము, హరి
B) కరి, గజము
C) శార్దూలము, వ్యాఘ్రము
D) శరభము, శార్దూలం
జవాబు:
C) శార్దూలము, వ్యాఘ్రము

39. దీనులను ఆదుకుంటే సుకృతము వస్తుంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) మంచి పని, పుణ్యము
B) న్యాయము, ధర్మము
C) పాపము, పుణ్యం
D) మోక్షం, స్వర్గము
జవాబు:
A) మంచి పని, పుణ్యము

3. వ్యుత్పత్త్యర్థాలు :

40. ‘పాపులను తన సమీపమున బొందించునది’ – వ్యుత్పత్తి పదం గుర్తించండి.
A) భూమి
B) నరకం
C) పాతాళం
D) స్వర్గం
జవాబు:
B) నరకం

41. ‘లెస్సగా చేయబడినది’ – వ్యుత్పత్తి పదం గుర్తించండి.
A) పాపం
B) అబద్దం
C) సుకృతం
D) దానం
జవాబు:
C) సుకృతం

42. దేవతాదులనుద్దేశించి మూడు సార్లు కుడివైపుగా తిరగడం – వ్యుత్పత్తి పదం ఏది?
A) దేవతా వందనం
B) ప్రదక్షిణం
C) త్రిప్రదక్షిణం
D) అప్రదక్షిణం
జవాబు:
B) ప్రదక్షిణం

4. నానార్థాలు :

43. వివేకహీనుడు తనకు, ఇతరులకు హాని చేస్తాడు – గీత గీసిన పదానికి నానార్థాలను గుర్తించండి.
A) ఆలోచన, అలవాటు
B) తెలివి, అలవాటు
C) బుద్ధి, తిక్క
D) ధర్మం, దయ
జవాబు:
B) తెలివి, అలవాటు

44. నందుని కుమారుడు శ్రీకృష్ణుడు – గీత గీసిన పదానికి నానార్థాలను గుర్తించండి.
A) కొడుకు, బాలుడు
B) కుమారస్వామి, వినాయకుడు
C) బాలుడు, బాలిక
D) కొడుకు, పుత్రుడు
జవాబు:
A) కొడుకు, బాలుడు

45. గోవులలో కపిల బహుక్షీర – గీత గీసిన పదానికి నానార్థాలను గుర్తించండి.
A) ఆవు, ధేనువు
B) కన్ను, నేత్రం
C) ఆవు, బాణం
D) ఎద్దు, దున్న
జవాబు:
C) ఆవు, బాణం

46. విద్యార్థి దశ నుండి సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలి – గీత గీసిన పదానికి నానార్థాలను గుర్తించండి.
A) భాగం, ఇష్టం
B) క్షీరం, క్షారం
C) తెలుపు, తెల్లనివి
D) క్షీరం, భాగం
జవాబు:
D) క్షీరం, భాగం

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

47. భారతదేశానికి ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయి – గీత గీసిన పదానికి నానార్థాలను గుర్తించండి.
A) జవాబు, ప్రశ్న
B) లేఖ, ఒక దిక్కు
C) జాబు, జేబు
D) లేఖ, ఉత్తరం
జవాబు:
B) లేఖ, ఒక దిక్కు

48. సీత గుణములు చెవిసోకగానే, రాముడు శివధనుస్సుకు గుణమును బిగించాడు – గీత గీసిన పదాలకు నానార్థాలు గుర్తించండి.
A) స్వభావము, బాణము
B) గుణము, నారి
C) అమ్ము, నారి
D) విల్లు, ఈటె
జవాబు:
B) గుణము, నారి

5. ప్రకృతి – వికృతులు :

49. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) బిడ్డ
B) కొడుకు
C) బొట్టె
D) సుతుడు
జవాబు:
C) బొట్టె

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

50. గోవ్యాఘ్ర సంవాదము భోజరాజీయములోనిది – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) వేగి
B) వాగ
C) పులి
D) వాగర
జవాబు:
A) వేగి

51. డూడూ బసవన్న అంటూ గంగిరెద్దుల వాళ్ళు తిరుగు తారు – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
A) ఎద్దు
B) వృషభం
C) నంది
D) ఆబోతు
జవాబు:
B) వృషభం

52. అతని కంఠధ్వని సింహగర్జన సదృశం – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) అదృశ్యం
B) ప్రత్యక్షం
C) సదసం
D) సరి
జవాబు:
D) సరి

53. సత్యం కోసం హరిశ్చంద్రుడు రాజ్యాన్ని విడిచాడు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) నిజం
B) సూనృతం
C) సత్తు
D) ఋజు
జవాబు:
C) సత్తు

54. దేవతలు గగన మార్గంలో ప్రయాణిస్తారు – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
A) ఆకాశం
B) గహనం
C) ఆకసం
D) గాలి
జవాబు:
B) గహనం

55. కులం కన్న గుణం మిన్న- గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) కొలము
B) గొల్ల
C) కాలం
D) గులాం
జవాబు:
A) కొలము

56. ప్రౌఢ వ్యాకరణం బహుజపల్లి వారి దివ్య గ్రంథం – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) బాల
B) పౌడ
C) ప్రోడ
D) ప్రొడ
జవాబు:
C) ప్రోడ

6. సంధులు :

57. అ – ఇ – ఉ – ఋ లకు అవియే అచ్చులు పరమైన వాని దీర్ఘములు ఏకాదేశమగును. ఈ సూత్రంతో సరిపోవు కింది ఉదాహరణను గుర్తించండి.
A) ప్రల్లదమాడి
B) నిజావాసం
C) అత్వనురాగం
D) ధర్మవిధురాలు
జవాబు:
B) నిజావాసం

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

58. ‘నీవు + ఎరుంగవే’ కలిపి రాయండి.
A) నీవు యెరుంగవే
B) నీవే యెరుంగవే
C) నీ వెరుంగవే
D) నీవు ఎరుంగవే
జవాబు:
C) నీ వెరుంగవే

59. ‘ఈ + తనువు’ – సంధి పేరేమిటి?
A) త్రికసంధి
B) ఇత్వసంధి
C) యణాదేశసంధి
D) వృద్ధి సంధి
జవాబు:
A) త్రికసంధి

60. విసర్గసంధికి ఉదాహరణను గుర్తించండి.
A) ఎగ్గాడిన
B) అప్పులికిన్
C) శోభనాంగి
D) ముహుర్భాషితంబులు
జవాబు:
D) ముహుర్భాషితంబులు

61. ‘ఆ + అవసరం’ – సంధి చేయండి.
A) ఆయవసరం
B) అయ్యవసరం
C) అ అవసరం
D) ఆ అవసరం
జవాబు:
B) అయ్యవసరం

62. ‘నిన్నుఁగని’ – విడదీయుము.
A) నిన్ను + కవి
B) నిన్నే + కని
C) నిన్నున్ + కని
D) నిన్ను + గని
జవాబు:
C) నిన్నున్ + కని

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

63. ‘అతి + అనురాగం’ – సంధి పేరేమిటి?
A) యణాదేశ సంధి
B) యడాగమ సంధి
C) గుణసంధి
D) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
A) యణాదేశ సంధి

64. తోరము + భీతి – కలిపి రాయండి.
A) తోరముభీతి
B) తోరపు భీతి
C) తోరభీతి
D) తోరముబీతి
జవాబు:
B) తోరపు భీతి

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

65. ‘అప్పులి’ ఈ సంధి పదాన్ని విడదీయండి.
A) అప్పు + లి
B) అ + ప్పులి
C) ఆ + పులి
D) ఆ + ప్పులి
జవాబు:
C) ఆ + పులి

66. ‘ఉదరాగ్ని’ అనే పదంలో గల సంధి ఏది?
A) యణాదేశ సంధి
B) అత్వసంధి
C) గుణసంధి
D) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
D) సవర్ణదీర్ఘ సంధి

67. ‘తోరపు భీతి’లో గల సంధి ఏది?
A) రుగాగమ సంధి
B) పుంప్వాదేశ సంధి
C) యడాగమ సంధి
D) పజ్వవర్ణాదేశ సంధి
జవాబు:
B) పుంప్వాదేశ సంధి

7. సమాసాలు:

68. ఉదరాగ్ని కై ప్రాణికోటి పలు ఇబ్బందులు పడును – సమాసం పేరు గుర్తించండి.
A) చతుర్డీ
B) తృతీయా
C) రూపకం
D) షష్టి
జవాబు:
C) రూపకం

69. ‘సత్య ప్రౌఢి’ విగ్రహవాక్యమున వచ్చు విభక్తిని గుర్తించండి.
A) అనెడి
B) యొక్క
C) చేత
D) వలన
జవాబు:
B) యొక్క

70. ‘రక్తమాంసాలు’ – సమాసం పేరేమిటి?
A) బహువ్రీహి
B) ద్వంద్వ
C) రూపకం
D) సప్తమీ
జవాబు:
B) ద్వంద్వ

71. ‘కుల భూషణుడు’ విగ్రహవాక్యమున వచ్చు విభక్తిని గుర్తించండి.
A) చేత
B) అనెడి
C) అందు
D) యొక్క
జవాబు:
C) అందు

72. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణను గుర్తించండి.
A) సత్యప్రౌఢి
B) ముద్దుల పట్టి
C) ఏడు రోజులు
D) రక్తమాంసాలు
జవాబు:
A) సత్యప్రౌఢి

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

73. ‘రత్నము వంటి ధేనువు’ – అనే విగ్రహం గల సమాస పదాన్ని గుర్తించండి.
A) రత్నధేనువు
B) ధేను రత్నము
C) ధేనూత్తమము
D) మంచి గోవు
జవాబు:
B) ధేను రత్నము

74. ద్విగు సమాసానికి ఉదాహరణమేది?
A) త్రినయనుడు
B) ముక్కంటి
C) చతుస్సనములు
D) చతుర్ముఖుడు
జవాబు:
C) చతుస్సనములు

75. ‘చతుర్ముఖుడు’ సమాసానికి విగ్రహవాక్యాన్ని గుర్తించండి.
A) నాల్గు ముఖాలు
B) మూడు కన్నులు గలవాడు
C) త్రినేత్రుడు
D) నాల్గు ముఖాలు కలవాడు
జవాబు:
D) నాల్గు ముఖాలు కలవాడు

76. ‘ధర్మమును తెలిసిన వాడు’ – సమాసపదంగా కూర్చండి.
A) ధర్మరతుడు
B) ధర్మవిదుడు
C) ధర్మమూర్తి
D) ధర్మ ప్రభువు
జవాబు:
B) ధర్మవిదుడు

8. గణాలు :

77. ‘గుమ్మెడు’ గురులఘువులు గుర్తించండి.
A) UUI
B) IUU
C) UII
D) IIU
జవాబు:
C) UII

78. ‘UTU’ దీనికి సరియగు పదం గుర్తించండి.
A) పుట్టియే
B) అతండు
C) ముద్దల
D) సుతుడు
జవాబు:
A) పుట్టియే

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

79. చంపకమాల యతిస్థానం గుర్తించండి.
A) 10
B) 11
C) 13
D) 14
జవాబు:
B) 11

80. ఉత్పలమాల గణాలు గుర్తించండి.
A) స భ ర న మ య వ
B) మ స జ స త త గ
C) న జ భ జ జ జ ర
D) భ ర న భ భ ర వ
జవాబు:
D) భ ర న భ భ ర వ

81. ‘వినియెడు వారి కించుక వివేకము పుట్టదె యింత యేటికిన్’ పై పద్యపాదము ఏ వృత్తమునకు చెందినది?
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) శార్దూలము
D) మత్తేభము
జవాబు:
B) చంపకమాల

82. మత్తేభ పద్యానికి గల గణాలు ఇవి.
A) మ స జ స త త గ
B) స భ ర న మ య వ
C) భ ర న భ భ ర వ
D) న జ భ జ జ జ ర
జవాబు:
B) స భ ర న మ య వ

83. ‘తెళ్ళెడు’ ఈ పదం ఈ గణానికి సంబంధించినది.
A) న గణము
B) య గణము
C) త గణము
D) భ గణము
జవాబు:
D) భ గణము

84. ర గణానికి ఉదాహరణం ఏది?
A) పాదము
B) శ్రీరామ
C) శ్రీలక్ష్మీ
D) అమ్మణి
జవాబు:
B) శ్రీరామ

9. అలంకారాలు :

85. ఉపమాన, ఉపమేయములకు అభేదం చెప్పుట – ఇది ఏ అలంకారం?
A) ఉపమా
B) ఉత్ప్రేక్ష
C) రూపక
D) అతిశయోక్తి
జవాబు:
C) రూపక

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

86. “గోవు పై నీగ సోకిన గదలకుండె నెమ్మి బాషాణధేనువు నిలిపినట్లు” – ఈ పాదంలో గల అలంకారం ఏది?
A) ఉత్ప్రేక్ష
B) రూపకము
C) ఉపమ
D) స్వభావోక్తి
జవాబు:
C) ఉపమ

87. ‘జింకలు, బిత్తరి చూపులు చూస్తూ, చెవులు నిగిడ్చి, చెంగు చెంగున గెంతుతున్నాయి – ఈ వాక్యంలో గల అలంకారమేది? (S.A. II – 2017-18)
A) అతిశయోక్తి
B) స్వభావోక్తి
C) రూపకము
D) ఉపమాలంకారము
జవాబు:
B) స్వభావోక్తి

10. ఆధునిక వచనాన్ని గుర్తించడం :

88. చెప్పెడు వారు చెప్పినన్ వినియెడువారి కించుక వివేకము పుట్టదె – ఆధునిక వచనాన్ని గుర్తించండి.
A) చెప్పేవారు చెప్పినా, వినేవారికి ఏమైనా బుద్ధి ఉండదా.
B) చెప్పేవాడు చెప్పినా, వినేవాడికి కొంచెం వివేకం కలుగదా.
C) చెప్పేవాడికి, వినేవాడికి వివేకం ఉండదా.
D) చెప్పేవాడికి, లేకపోయినా వినేవాడికి బుద్ధిలేదా.
జవాబు:
B) చెప్పేవాడు చెప్పినా, వినేవాడికి కొంచెం వివేకం కలుగదా.

89. నెమ్మిఁ బాషాణధేనువు నిలిపినట్లు – ఆధునిక వచనాన్ని గుర్తించండి.
A) ఆవు నిదానంగా బొమ్మలా నిల్చుంది
B) ప్రేమతో రాతిలా నిల్చుంది
C) ప్రేమతో రాతిబొమ్మలా ఆవు నిలుచుంది
D) రాతి బొమ్మలా ఆవు నిలబడింది
జవాబు:
C) ప్రేమతో రాతిబొమ్మలా ఆవు నిలుచుంది

90. విని వినని వాని చొప్పునఁ జనుమీ – ఆధునిక వచనాన్ని గుర్తించండి.
A) విని విననట్లు నటించి వెళ్ళు
B) విని విననట్లు వెళ్ళు
C) పెడచెవిగా వెళ్ళు
D) విని కూడా వినని వాడిలా వెళ్ళిపో
జవాబు:
D) విని కూడా వినని వాడిలా వెళ్ళిపో

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

91. దైవ మీ పట్టునఁ బూరి మే పెడినే? – ఆధునిక వచనాన్ని గుర్తించండి.
A) దైవం ఇప్పుడు గడ్డి తినిపిస్తాడా?
B) దైవం ఈ సమయంలో గడ్డినే తినమంటాడా?
C) దైవమే ఇప్పుడు గడ్డి వేస్తాడా?
D) దైవమా గడ్డి తినాలా?
జవాబు:
A) దైవం ఇప్పుడు గడ్డి తినిపిస్తాడా?

92. ‘చయ్యనఁ బోయి వచ్చెదన్’ – దీనికి ఆధునిక వచనాన్ని గుర్తించండి.
A) వెంటనే పోయివస్తా
B) శీఘ్రంగా పోయి వస్తాను
C) వేగంగా తిరిగి వెడతా
D) చయ్యన పోయిరమ్ము
జవాబు:
A) వెంటనే పోయివస్తా

93. ‘ప్రాణములింతనె పోవుచున్నవే !! – ఆధునిక వచనాన్ని గుర్తించండి.
A) ప్రాణాలు ఇప్పుడు పోవు
B) ప్రాణాలు ఇంతట్లో పోతాయా?
C) ప్రాణాలు ఈ మాత్రానికే పోతాయా?
D) ప్రాణాలిప్పుడు పోవు
జవాబు:
C) ప్రాణాలు ఈ మాత్రానికే పోతాయా?

11. కర్తరి, కర్మణి వాక్యాలను గుర్తించడం :

94. ‘ఆవు తిరిగి వస్తానని మాట ఇచ్చింది’ – కర్మణి వాక్యం గుర్తించండి.
A) ఆవు తిరిగి వస్తానంది
B) మాట ఈయబడింది చేత ఆవు
C) ఆవుచేత తిరిగి వస్తానని మాట ఈయబడింది
D) ఆవుచేత తిరిగి రానని మాట ఈయబడింది
జవాబు:
C) ఆవుచేత తిరిగి వస్తానని మాట ఈయబడింది

95. ఫులిచేత ఆవు చంపబడలేదు – కర్తరి వాక్యం గుర్తించండి.
A) ఆవు పులిని చంపలేదు
B) ఆవును పులి చంపలేదు
C) ఆవు పులి చంపలేదు
D) పులిని ఆవు చంపలేదు
జవాబు:
B) ఆవును పులి చంపలేదు

12. ప్రత్యక్ష, పరోక్ష కథనాలను గుర్తించడం :

96. “నేను నిన్ను నమ్మాను” అని పులి, ఆవుతో అంది – పరోక్ష కథనం గుర్తించండి.
A) తను దానిని నమ్మానని పులి, ఆవుతో అంది.
B) తన దీనినే నమ్మానని పులి, ఆవుతో అంది.
C) నేను దానిని నమ్మానని ఆవు, పులితో అంది.
D) తన నిన్ను నమ్మానని పులితో ఆవు అంది.
జవాబు:
A) తను దానిని నమ్మానని పులి, ఆవుతో అంది.

97. తనచే గడ్డి తినిపిస్తాడాయని పులి అంది – ప్రత్యక్ష
కథనం గుర్తించండి.
A) “నన్ను గడ్డి తినిపిస్తాడా?” అని పులి అంది.
B) “నాచే గడ్డి తినిపిస్తాడా?” అని పులి అంది.
C) “నాతో గడ్డి తినిపించగలడా?” అని పులి అంది.
D) “నన్ను గడ్డి తినమంటాడా?” అని పులి అంది.
జవాబు:
B) “నాచే గడ్డి తినిపిస్తాడా?” అని పులి అంది.

13. వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించడం :

98. నీ ఇంటికి నీవు వెళ్ళు – వ్యతిరేక వాక్యం గుర్తించండి. (S.A. II – 2018-19)
A) నీ ఇంటికి నీవు వెళ్ళకు
B) నీ ఇంటికి వెళ్ళకు
C) వెళ్ళకు
D) ఏదీకాదు
జవాబు:
A) నీ ఇంటికి నీవు వెళ్ళకు

99. నాకు పుణ్యం ప్రసాదించు – వ్యతిరేక వాక్యం గుర్తించండి.
A) ప్రసాదించకు
B) పుణ్యం ప్రసాదించకు
C) నాకు పుణ్యం ప్రసాదించుకు
D) ఏదీకాదు
జవాబు:
C) నాకు పుణ్యం ప్రసాదించుకు

100. అబద్దపు మాటలు ఆడకు – వ్యతిరేక వాక్యం గుర్తించండి.
A) అబద్దం ఆడు
B) అబద్దం మాట ఆడు
C) అబద్ధపు మాటలు ఆడు
D) పైవన్నీ
జవాబు:
C) అబద్ధపు మాటలు ఆడు

14. వాక్యంకాలను గుర్తించడం :

101. ఆవు తన మెడ ఎత్తి, పులి దగ్గరగా వెళ్ళింది – ఇది ఏ వాక్యం?
A) సంయుక్త
B) సంక్లిష్ట
C) సామాన్య
D) మహావాక్యం
జవాబు:
B) సంక్లిష్ట

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

102. పులి ఆవుని నమ్మింది – ఇది ఏ వాక్యం?
A) మహావాక్యం
B) సంక్లిష్ట
C) సంయుక్త
D) సామాన్య
జవాబు:
D) సామాన్య

AP Board 9th Class Telugu Important Questions Chapter 10 బతుకు పుస్తకం

AP State Syllabus AP Board 9th Class Telugu Important Questions Chapter 10 భూమి పుత్రుడు.

AP State Syllabus 9th Class Telugu Important Questions 10th Lesson బతుకు పుస్తకం

9th Class Telugu 10th Lesson బతుకు పుస్తకం Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

క్రింది పరిచిత గద్యాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. “తాతగారూ మీరసలు దేవుణ్ణి చూశారా?” అని అడిగిన పసివాడైన మనవణ్ణి కసరకుండా ఎంతో హాయిగా ‘నేను చూడలేదురా? ఉన్నాడో లేడో చెప్పలేను. కష్టాలు పంచుకొనే వాడొకడున్నాడనుకుంటే బావుంటుంది కదా ! అందుకని ప్రార్థిస్తున్నాను.” అన్నారట. అదీ శిశువు ముందు శిరసొర్లే నిరహంకారమంటే !
ప్రశ్నలు:
1. ఇక్కడ సంభాషణ ఎవరి మధ్య జరిగింది?
2. పసివాడు ఏమని అడిగాడు?
3. దేవుణ్ణి ప్రార్థించటం దేనికోసం?
4. “అదీ శిశువు ముందు శిరసొగ్గే నిరహంకారమంటే” దీని భావం ఏమిటి?
జవాబులు:
1. తాత-మనవడు
2. మీరసలు దేవుణ్ణి చూశారా?
3. ఆత్మ సంతృప్తి కోసం
4. సరైన జవాబు ఇవ్వలేకపోతున్నా అని, వినయంగా / నిజాయితీగా చెప్పడం

2. మెల్లీని లక్ష్మణరావుగారు మొదట చూసింది కరుణగల విజ్ఞానిగానే ! మెడిసిన్ చదివే ఆ ఇరవై నాలుగేళ్ళ యువతి పాలమీగడ లాంటి తెల్లని ఫ్రాకులో విందుకు వెళ్తూ దారిలో పెంటబండిని ఈడ్వలేకపోతున్న వృద్ధుని అగచాట్లు చూసి సహించలేక బండిని వెనక నుంచి తోసి సహాయపడి విందుకు ఆ నల్లని మరకలతోనే ఆలస్యంగా వెళ్తూ నిస్సంకోచంగా పాల్గొనడం ఆ దారినే ఆ విందుకే వెళ్ళిన లక్ష్మణరావుగారు చూడడం జరిగింది.
ప్రశ్నలు – జవాబులు:
1. ఇక్కడ మెడిసిన్ చదువుతున్నదెవరు?
జవాబు:
మెల్లీ

2. అగచాట్లు పడుతున్నదెవరు?
జవాబు:
వృద్ధుడు

3. విందుకు ఎవరెవరు వెళ్ళారు?
జవాబు:
మెల్లీ, లక్ష్మణరావు

4. ఇక్కడ ఎవరూ సహజంగా చేయలేని పనులు ఏవి?
జవాబు:
పెంటబండిని తోయడానికి వెళ్ళడం (ఫంక్షన్ కు వెళ్తూ కూడా), మరకలతోనే నిస్సంకోచంగా (బిడియపడకుండా) విందుకెళ్ళడం.

AP Board 9th Class Telugu Important Questions Chapter 10 బతుకు పుస్తకం

3. బెజవాడ సిమెంట్ కంపెనీ కొత్త మేనేజింగ్ డైరెక్టరు నారాయణ గణపతిరాజు గారొకసారి లక్ష్మణరావుగారు తయారు చేసి తెచ్చిన స్టాకిస్టుల జాబితాలో తనకిష్టులైన వారికి హెచ్చుకోటాలు పడలేదనే కోపంతో కాగితాన్ని కింద పడేస్తే “అయ్యా ! దాన్ని ముందు తీసి బల్లమీద పెడతారా? నన్నిప్పుడే రాజీనామా ఇచ్చి పొమ్మంటారా?” అని అడిగారట.
ప్రశ్నలు:
1. ఈ పేరాలోని వ్యక్తుల పేర్లేమిటి?
2. డైరెక్టరుకు ఎందుకు కోపం వచ్చింది?
3. దానికి రెండవ వ్యక్తి ఏమన్నాడు?
4. ఇక్కడ ఏ కంపెనీ పేరు ఉంది?
జవాబులు:
1. నారాయణ గణపతిరాజు, లక్ష్మణరావు
2. స్టాకిస్టు జాబితాలో తన వారికి హెచ్చుకోటా పడలేదని
3. అయ్యా ! దాన్ని ముందు తీసి బల్ల మీద పెడతారా? నన్నిప్పుడే రాజీనామా ఇచ్చి పొమ్మంటారా?
4. బెజవాడ సిమెంట్,

4. నిరుత్సాహికి ఉత్సాహాన్ని, రికానికి బాధ్యతనీ, అజ్ఞానికైనా జిజ్ఞాసువుకైనా విజ్ఞానాన్ని, తగు మాత్రపు ఆర్ధతనూ, తప్పక అందించగలగాలి పుస్తకం. అమ్మో ! మనకెక్కడ అర్థమవుతుంది అనిపించకుండ ఒక డైరీలా, ఒక నేస్తం రాసిన ఉత్తరంలా సన్నిహితంగా ఉండాలి. నాకోసమే ఇంత శ్రమ పడి ఇంత రాసేడు ఓపిక తెచ్చుకుని అనిపించాలి. తన బాధేదో దాచుకోకుండా చెప్తున్నాడు విందాం! అనిపించేంత నిరహంకారంగా, ఆత్మీయంగా ఉండాలి. చదువుతున్నంత సేపు ఎంత చక్కని విషయాలు తెలుసుకుంటున్నామో అనే హాయి కలగాలి. చదివిన తర్వాత ‘నయం’ ‘ఇన్నాళ్ళకైనా దీన్ని చదవగలిగాను’ అనిపించాలి. విషయం క్లిష్టమైనా వివరణ స్పష్టంగా ఉండాలి.
ప్రశ్నలు – జవాబులు:
1. పుస్తకం ఎలా ఉండాలి?
జవాబు:
ఒక డైరీలా, ఒక నేస్తం రాసిన ఉత్తరంలా

2. పుస్తకం ఏమేమి అందించగలగాలి?
జవాబు:
ఉత్సాహం, బాధ్యత, విజ్ఞానం, అర్ధత అందించాలి.

3. స్పష్టంగా ఉండవలసినదేది?
జవాబు:
వివరణ

4. పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
చదివిన తర్వాత ఏమని అనిపించాలి?

5. శబ్దాలకు అర్థాలను తెలిపే గ్రంథాలను నిఘంటువు అంటారు. అనుశాసనం, అభిధానము, కోశము అనేవి దీనికి పర్యాయపదాలు. వీటిల్లో నిఘంటు పదమే అతి ప్రాచీనంగా కనిపిస్తుంది. ఈ పదాలన్నింటిని ఒకచోట కూర్చి పర్యాయములను చూపి, అర్థములను వివరించేవే గ్రంథాలు. భాషకు నిశ్చయముగాను, లెస్సగాను శబ్ద స్వరూపములను, అర్థ విశేషమును తెలుపునది అని వ్యుత్పత్త్యర్ధము.
ప్రశ్నలు:
1. నిఘంటువు అనగా అర్థం?
2. నిఘంటువుకు ఉన్న పర్యాయపదాలేవి?
3. నిఘంటువుకు ఉన్న వ్యుత్పత్త్యమేమి?
4. ‘గ్రంథాలు’ విడదీయుము.
జవాబులు:
1. శబ్దాలకు అర్థాలను తెలుపు గ్రంథం.
2. అనుశాసనం, అభిధానం, కోశం
3. భాషకు నిశ్చయముగాను, లెస్సగాను శబ్ద స్వరూపములను అర్థ విశేషాలను తెలుపునది.
4. గ్రంథ + ఆలు

6. సంక్రాంతి కొత్త సంవత్సరంలో వచ్చే తొలి పెద్ద పండుగ. వాస్తవానికి ఇదీ పంటల పండుగ. పల్లెటూళ్ళలో అప్పుడు పంటలు ఇంటికి చేరి, ప్రతి ఇల్లు ధాన్యలక్ష్మితో కళకళలాడుతూ ఉంటుంది. రైతులు ఉత్సాహంగా || ఉంటారు. సంక్రాంతి అంటే సంక్రమణం. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారడాన్ని సంక్రమణం అంటారు. సంక్రాంతి నుండి సూర్యుడు మకరరాశిలో ప్రవేశిస్తాడు. కనుకనే ‘మకర సంక్రాంతి’ అని పేరు వచ్చింది. ఆనాటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలంగా రోజూ కొందరు సంకల్పం చెప్పుకుంటారు. ఎండాకాలం సమీపిస్తుందని
సంక్రాంతి హెచ్చరిస్తుంది. అందరూ కొత్త బట్టలు ధరించడం ఒక ఆచారం.
ప్రశ్నలు – జవాబులు:
1. కొత్త సంవత్సరంలో తొలి పెద్ద పండుగ ?
జవాబు:
సంక్రాంతి

2. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారడాన్ని ఏమంటారు?
జవాబు:
సంక్రమణం

3. సంక్రాంతి ఏమని హెచ్చరిస్తుంది?
జవాబు:
ఎండాకాలం సమీపిస్తుందని

4. ఈ పండుగ ఏ పుణ్యకాలాన్ని తెలుపుతుంది?
జవాబు:
ఉత్తరాయణ పుణ్యకాలం

AP Board 9th Class Telugu Important Questions Chapter 10 బతుకు పుస్తకం

ఈ కింది సమీక్ష చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. I – 2018-19)

7. వాల్మీకి రామాయణం ప్రాతిపదికగా తెలుగులో ఎన్నో రామాయణాలు వచ్చాయి. ఆ పరంపరలోనిదే టంగుటూరి మహలక్ష్మి రచించిన సుమధుర రామాయణం. పద్నాలుగు వందల తేటగీతులలో తేట తెలుగులో శబ్దశక్తి, అర్థయుక్తితో సరళసుందరంగా ఆవిష్కరించారు. పఠనయోగ్యత, కల్పనాచాతుర్యం ఈ గ్రంథం ప్రత్యేకతలు.
సుమధుర రామాయణం రచన – టంగుటూరి మహలక్ష్మి
పేజీలు – 248, వెల రూ. 180 సమీక్షకులు డా. విద్వత్ శ్రీనిధి.
ప్రశ్నలు:
1. సుమధుర రామాయణాన్ని సమీక్షించింది ఎవరు?
2. రచయిత్రి రామాయణాన్ని ఏ ఛందస్సులో రాశారు?
3. ఈ గ్రంథం ప్రత్యేకత ఏమిటి?
4. పై సమీక్ష ఆధారంగా ఒక ప్రశ్న తయారుచెయ్యండి.
జవాబులు:
1. డా|| విద్వత్ శ్రీనిధి
2. తేటగీతి
3. పఠనయోగ్యత, కల్పనాచాతుర్యం
4. సుమధుర రామాయణంలోని పద్యాల సంఖ్య ఎంత?

II. స్వీయరచన

అ) క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
లక్ష్మణరావుగారు తను రాసిన పుస్తకాన్ని వాళ్ళమ్మగారికి ఇచ్చినపుడు ఆమె చెప్పిన మాటలేమిటి?
జవాబు:
లక్ష్మణరావుగారు తొలుత రాసిన ‘అతడు – ఆమె’ పుస్తకంగా ప్రచురిస్తూ బైండు చేయించడానికి ముందు అచ్చుప్రతిని వాళ్ళమ్మగారికి, పిన్నులకు ఇచ్చారు. అది చదివిన వాళ్ళమ్మగారు మొగుడూ – పెళ్ళాల కీచులాట ఏమీ బాగాలేదు. దేశంలో స్వాతంత్ర్యం యజ్ఞం జరుగుతోంది. ఈ మహా సంగ్రామం పూర్వరంగంగా మలి నవల చిత్రించి ఉంటే బాగుండేది. నవలకు కొంత విలువ ఉండేది. ఇప్పటి రూపంలో నవల అతి సామాన్యంగా ఉంది” అన్నారు.

ప్రశ్న 2.
“సహృదయుడైన రచయిత అంటే లక్ష్మణరావులా ఉండాలి” – దీనిపై మీ అభిప్రాయం.
జవాబు:
నూటికి నూరుపాళ్ళు ఈ మాటతో నేను ఏకీభవిస్తాను. ‘సామాన్యంగా ఉంది నవల’ అని విమర్శించిన తల్లి మాటను గౌరవిస్తూ, ప్రచురణ ఆపు చేయించి, మళ్ళీ కొత్తగా వాళ్ళమ్మ గారి విమర్శను దృష్టిలో ఉంచుకొని అనేక చోట్ల బాగా మార్చి తిరగరాసిన లక్ష్మణరావు నిజంగా సహృదయుడైన రచయిత అని చెప్పవచ్చు.

ప్రశ్న 3.
“అతడు ఆమె”, “బతుకు పుస్తకం” రచనలు సావిత్రిలో ఎలాంటి భావాలు కల్గించాయి?
జవాబు:
సమాజానికి ఉప్పల లక్ష్మణరావుగారి వంటి నిజాయితీ గల సాహితీమూర్తుల ఆవిర్భావం ఒక చారిత్రక అవసరం అనే చెప్పాలి. వారి “అతడు – ఆమె” చదివినప్పుడు దశాబ్దాలుగా నాలో ఉన్న నీరసం పటా పంచలై ఎక్కడాలేని ఉత్సాహం పుట్టుకొచ్చింది. తనతో సమంగా ప్రతి ఒక్కరూ జీవించాలనే సదాశయం గల వ్యక్తి తప్పించి మరొకరు రాయలేరు ఆ పుస్తకం అన్పించింది. ‘బతుకు పుస్తకం’ నా ఆశ నిజమేనని నిరూపించింది. ‘అతడు – ఆమె’ వంటి పుస్తకం రాయగలిగే అర్హత వారికే ఉన్నదని నిరూపించింది ఈ బతుకు పుస్తకం. అని సావిత్రి తనలోని భావాలు ఇలా పంచుకొంది.

ప్రశ్న 4.
ఉప్పల లక్ష్మణరావు గారి గూర్చి రాయండి.
జవాబు:
రచయితగా ‘అతడు – ఆమె’ నవలతో ప్రసిద్ధులైన ఉప్పల లక్ష్మణరావుగారు 1898 ఆగస్టు 11న బరంపురంలో జన్మించారు. కలకత్తాలో బి.ఎస్.సి. వృక్షశాస్త్రం చదివి, పై చదువుల కోసం ఎడిన్‌బరోకు, జర్మనీకి వెళ్ళి వృక్షశాస్త్ర పరిశోధనలో డాక్టర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేసారు. కాకినాడ కళాశాలలో, ఆలీఘడ్ యూనివర్సిటీలో అధ్యాపకులుగా పనిచేసారు. “ప్రాచీన భారతంలో బానిసలు” అనే రచనను జర్మనీ నుండి తెలుగులోకి అనువదించారు. ‘అతడు – ఆమె’ నవలతో ప్రసిద్ధులయ్యారు. ‘బతుకు పుస్తకం’ వీరి ఆత్మకథ. ఆంధ్రజ్యోతి వారపత్రికలో ధారావాహికంగా వెలువడినప్పుడే ఇది ఎందరినో ఆకర్షించింది. రాసిన రెండు పుస్తకాలతోనే సాహిత్యంలో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. సాంఘిక, రాజకీయ, విద్యా, పారిశ్రామిక రంగాలలోనూ సేవ చేసారు.

ప్రశ్న 5.
‘పుస్తక పరిచయం’ ప్రక్రియ గూర్చి రాయండి. ఈ (S.A.II 2018-19)
జవాబు:
ఏదైనా ఒక పుస్తకాన్ని సమగ్రంగా చదివి అందులోని విషయాల్ని సంక్షిప్తంగా పరిచయం చేస్తూ, గుణదోషాల్ని తెలియజేయడమే పుస్తక పరిచయం. ఇది చదవగానే ఆ పుస్తకం మీద ప్రాథమిక అవగాహన, చదవాలనే ఆసక్తి కల్గుతాయి. దీనికే ముందుమాట, పీఠిక, తొలిపలుకు, మున్నుడి, అవతారిక అను నామాంతరాలు.

III. భాషాంశాలు (పదజాలం, వ్యాకరణం)

1: పర్యాయపదాలు :

కరుణ : దయ, జాలి
నిదర్శనం : దృష్టాంతం, ఉదాహరణ
ఏకీభవించు : ఒక్కటియగు, కలిసిపోవు
సన్నిహితం : చేరువ, సమీపం
స్వస్తిచెప్పు : చాలించు, ముగించు
ఇల్లాలు : భార్య, అర్ధాంగి
నేస్తం : స్నేహితుడు, మిత్రుడు
అబ్దం : సంవత్సరం, ఏడాది
దాస్యం : సేవ, బానిసం
యజ్ఞం : యాగం, హోమం
సౌజన్యం : సుజనత్వం, మంచితనం
జైలు : చెరసాల, కారాగారం

2. నానార్థాలు :

ఆశ్రమం : పర్ణశాల, మునిపల్లె, మఠం, గుడిసె
విమర్శ : పరామర్శ, తిట్టు
వృద్ధుడు : ముసలివాడు, తెలిసినవాడు
అర్థం : శబ్దార్థం, కారణం, ధనం
స్వస్తి : శుభం, ముగింపు
అబ్దం : సంవత్సరం, అద్దం, మేఘం

3. ప్రకృతి – వికృతులు :

పుస్తకం – పొత్తం
స్త్రీ – ఇంతి
ఉత్తరం – ఉత్తరువు (జవాబు)
శ్రమ – చెమట, సొమ్ము
యజ్ఞం – జన్నం
సౌందర్యం – చందు
స్నేహం – నేస్తం, నెయ్యం
విజ్ఞానం – విన్నాణం
ప్రజా – పజ
మూర్ఖ – మంకు
అమావాస్య – అమవస, అమాస
రాత్రి – రాతిరి, రేయి, రేతిరి
ఆశ – ఆస

4. సంధులు :

సత్ + ఆశయం = సదాశయం – జత్త్వసంధి
దశ + అబాలు = దశాబ్దాలు – సవర్ణదీర్ఘ సంధి
స్వాతంత్ర్య + ఉద్యమం = స్వాతంత్ర్యోద్యమం – గుణసంధి
నిః + అహంకారం = నిరహంకారం – విసర్జరేఫాదేశ సంధి
అభి + అంతరం = అభ్యంతరం – యణాదేశ సంధి
అతి + అంత = అత్యంత – యణాదేశ సంధి
అభి + ఉదయం = అభ్యుదయం – యణాదేశ సంధి
ని + సంకోచం = నిస్సంకోచం – విసర్గసంధి
నిః + శబ్దం = నిశ్శబ్దం – విసర్గ సంధి
శత + అబ్దం = శతాబ్దం – సవర్ణదీర్ఘ సంధి
శ్రమము + పడి = శ్రమపడి – పడ్వాదిసంధి
దుసు + సాహసం = దుస్సాహసం – విసర్గ సంధి
ఇష్టులు + ఐన = ఇష్టులైన – ఉత్వసంధి
శిరసు + ఒగై = శిరసొగ్గా – ఉత్వసంధి
సు + అస్తి = స్వస్తి – యణాదేశ సంధి

AP Board 9th Class Telugu Important Questions Chapter 10 బతుకు పుస్తకం

5. సమాసాలు :

దశాబ్దం = దశ సంఖ్య గల అబ్దం – ద్విగు సమాసం
శతాబ్దం = శత సంఖ్య గల అబ్దం – ద్విగు సమాసం
సదాశయం = మంచిదైన ఆశయం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
దాస్య శృంఖాలు = దాస్యమనెడి శృంఖలాలు – రూపక సమాసం
మహాగ్రంథం = గొప్పదైన గ్రంథం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
రెండురోజులు = రెండు సంఖ్య గల రోజులు – ద్విగు సమాసం
మెగుడు పెళ్ళాలు = మెగుడు మరియు పెళ్ళాము – ద్వంద్వ సమాసం
ప్రతిరోజు = రోజూ, రోజూ – అవ్యయీభావ సమాసం
స్త్రీల అభ్యుదయం = స్త్రీల యొక్క అభ్యుదయం – షష్ఠీ తత్పురుష సమాసం
వృద్ధుని అగచాట్లు = వృద్ధుని యొక్క అగచాట్లు – షష్ఠీ తత్పురుష సమాసం
సబర్మతి ఆశ్రమం = సబర్మతి అను పేరుగల ఆశ్రమం – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
దేశచరిత్ర = దేశము యొక్క చరిత్ర – షష్ఠీ తత్పురుష సమాసం

9th Class Telugu 10th Lesson బతుకు పుస్తకం 1 Mark Bits

1. రమేశ్ నిన్న చదివాడు (వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) రమేశ్ రేపు చదవడు
బి) రమేశ్ నిన్నట్నుంచీ చదువుతున్నాడు
సి) రమేశ్ నిన్న చదవలేదు.
డి) రమేశ్ నేడు చదవలేదు.
జవాబు:
సి) రమేశ్ నిన్న చదవలేదు.

2. రాము ఎక్కడ ఉన్నాడు ? (ఇది ఏ రకమైన వాక్యం) (S.A.I-2018-19)
ఎ) హేత్వర్థక వాక్యం
బి) చేదర్థక వాక్యం
సి) ఆశ్చర్యార్థక వాక్యం
డి) ప్రశ్నార్థక వాక్యం
జవాబు:
డి) ప్రశ్నార్థక వాక్యం

3. కింది వానిలో ప్రశ్నార్థకం గుర్తించండి. (S.A. II – 2017-18)
ఎ) మోహన్ వస్తాడా?
బి) మోహన్ వస్తాడో ! రాడో !
సి) మోహన్ రావచ్చు.
డి) మోహన్ రావద్దు.
జవాబు:
ఎ) మోహన్ వస్తాడా?

AP Board 9th Class Telugu Important Questions Chapter 10 బతుకు పుస్తకం

4. ఆమె రాత్రి వేళ గేటు దూకి, గస్తీ కాసింది. (ఈ సంక్లిష్ట వాక్యాన్ని సామాన్య వాక్యాలుగా మార్చినది గుర్తించండి.) (S.A. III – 2016-17)
ఎ) ఆమె రాత్రి వేళ గేటు దూకి, గస్తీ కాయలేదు.
బి) ఆమె రాత్రి వేళ గేటు దూకలేదు, గస్తీ కాయలేదు.
సి) ఆమె రాత్రి వేళ గేటు దూకినా, గస్తీ కాయలేదు.
డి) ఆమె రాత్రి వేళ గేటు దూకింది, ఆమె రాత్రి వేళ గస్తీ కాసింది.
జవాబు:
డి) ఆమె రాత్రి వేళ గేటు దూకింది, ఆమె రాత్రి వేళ గస్తీ కాసింది.

భాషాంశాలు (పదజాలం , వ్యాకరణం)

1. అర్థాలు :

5. మహాత్ముల ఆవిర్భావం సమాజ శ్రేయస్సు కొరకు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) కలయిక
B) పుట్టుక
C) నడక
D) ప్రయాణం
జవాబు:
B) పుట్టుక

6. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) స్త్రీ
B) మహిళ
C) భార్య
D) యువతి
జవాబు:
C) భార్య

7. నాకు డైరీ రాసే అలవాటు ఉంది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) పుస్తకం
B) పేపరు
C) రోజు
D) దినచర్య
జవాబు:
D) దినచర్య

8. అనాలోచితమైన పనులు అగచాట్లు పాలు చేస్తాయి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) ఆపదలు
B) ఆకలి
C) ఆనందం
D) కోపం
జవాబు:
A) ఆపదలు

9. దేశ సరిహద్దుల్లో సిపాయిలు ప్రాణాలు పణంగా పెట్టి గస్తీ తిరుగుతారు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) కాలక్షేపం
B) కాపలా
C) కులాసా
D) నిర్లక్ష్యం
జవాబు:
B) కాపలా

10. పుస్తకం, నిరుత్సాహికి ఉత్సాహాన్ని, రికామికి బాధ్యతనీ అందించగలగాలి – గీత గీసిన పదానికి అర్థం ఏది?
A) చురుకైన
B) పనిలేనివాడు
C) తెలివైనవాడు
D) అజ్ఞాని
జవాబు:
B) పనిలేనివాడు

11. నాలో పేరుకుపోయిన నీరసం పటాపంచలై పోయింది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) ఎక్కువ
B) తక్కువ
C) చెల్లాచెదురు
D) ముక్కముక్కలు
జవాబు:
C) చెల్లాచెదురు

12. లక్ష్మణరావు గారు బోటనీ పరిశోధనలకు స్వస్తి చెప్పారు – గీత గీసిన పదానికి అర్థం ఏది?
A) మంగళము
B) శుభము
C) ముగింపు
D) కొనసాగించు
జవాబు:
C) ముగింపు

2. పర్యాయపదాలు :

13. చదువును యజ్ఞంలా భావించాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) ఆగం, యాగం
B) హోమం, యాగం
C) హోమం, హూనం
D) యూపం, పాపం
జవాబు:
B) హోమం, యాగం

14. భరతమాత దాస్య శృంఖలాలు మహాత్ముల త్యాగాలతో తొలగాయి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) ధనిక, పేద
B) పరిచర్య, పని
C) సేవ, బానిసత్వం
D) సాయం, పని
జవాబు:
C) సేవ, బానిసత్వం

15. చెడు అలవాట్లకు స్వస్తి పలకాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) ముగింపు, చాలించు
B) ఆపు, మొదలు
C) తొలి, మలి
D) శుభం, జైహింద్
జవాబు:
A) ముగింపు, చాలించు

16. మా ఊరిలో నేను మిత్రుల సౌజన్యంతో కిరాణాషాపు పెట్టాను – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) స్నేహం, మిత్రుడు
B) చుట్టం, బంధువు
C) మంచి, చెడు
D) మంచితనం, సుజనత్వం
జవాబు:
D) మంచితనం, సుజనత్వం

AP Board 9th Class Telugu Important Questions Chapter 10 బతుకు పుస్తకం

17. దేశద్రోహులను పట్టి, జైలులో బంధించాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) ఇల్లు, నివాసం
B) చెరసాల, కారాగారం
C) బందిఖానా, గృహం
D) నిలయం, ఆవాసం
జవాబు:
B) చెరసాల, కారాగారం

14. భగవంతుని సృష్టి గొప్పదని చెప్పడానికి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) కారణం, హేతువు
B) లక్ష్యం, గమ్యం
C) దృష్టాంతం, ఉదాహరణ
D) ఋజువు, మూలం
జవాబు:
C) దృష్టాంతం, ఉదాహరణ

18. మెల్లీ స్విట్జర్లాండు మహిళ. ఈమె లక్ష్మణరావు గారి ఇల్లాలు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) స్త్రీ, యువతి
B) నారి, వనిత
C) పడతి, ఇల్లాలు
D) ఉవిద, విజ్ఞాని
జవాబు:
B) నారి, వనిత

19. లక్ష్మణరావుగారి తల్లి మంచి విమర్శకురాలు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) అమ్మ, మాత
B) జనని, తండ్రి
C) మహిళ, యువతి
D) జనయిత్రి, స్త్రీ
జవాబు:
A) అమ్మ, మాత

20. పుస్తకం జిజ్ఞాసువుకు విజ్ఞానాన్ని అందివ్వాలి – గీత గీసిన పదానికి సమానార్థక పదం ఏది?
A) జ్ఞాని
B) విజ్ఞాని
C) తెలిసికోగోరువాడు
D) అజ్ఞాని
జవాబు:
C) తెలిసికోగోరువాడు

3. నానార్థాలు :

21. పూర్వం మునులు ఆశ్రమ ధర్మాలు పాటించి, ధర్మాన్ని నిలిపారు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) పర్ణశాల, మఠం
B) గుడిసె, పూరిల్లు
C) మదం, ముదం
D) కుటీరం, ఇల్లు
జవాబు:
A) పర్ణశాల, మఠం

22. బాధ్యతగా పని చేసేటప్పుడు విమర్శలు సహజం – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) తిట్టు, పొగడ్త
B) పరామర్శ, తిట్టు
C) పరామర్శ, విసుగు
D) దూషణ, భీషణ
జవాబు:
B) పరామర్శ, తిట్టు

23. వయసు పెరిగినవాడు వృద్ధుడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) ముదుసలి, తాత
B) పెద్ద, చిన్న
C) ముసలివాడు, తెలిసినవాడు
D) తెలిసినవాడు, కుర్రాడు
జవాబు:
C) ముసలివాడు, తెలిసినవాడు

24. పరీక్షల సమయంలో ఆటలకు స్వస్తి పలకాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) ప్రారంభం, ముగింపు
B) మొదలు, చివర
C) శుభం, అశుభం
D) శుభం, ముగింపు
జవాబు:
D) శుభం, ముగింపు

25. మనం మాట్లాడే మాటకు అర్థం ఉండాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) ధనం, సంపద
B) శబ్దార్ధం, కారణము
C) కారణం, హేతువు
D) శబ్దార్ధం, భావం
జవాబు:
B) శబ్దార్ధం, కారణము

AP Board 9th Class Telugu Important Questions Chapter 10 బతుకు పుస్తకం

26. నారీమణులను విస్మరించకూడదు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) పట్టణం, ఇల్లు
B) స్త్రీ, వింటి త్రాడు
C) స్వేచ్ఛ, భిన్నం
D) కలశం, కమలం
జవాబు:
B) స్త్రీ, వింటి త్రాడు

4. ప్రకృతి – వికృతులు :

27. ఆశ్వియుజ అమావాస్య నాడు దీపావళి పండుగ – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) ఆమాసా
B) అమావాస
C) అమవస
D) అవమస
జవాబు:
C) అమవస

28. శ్రమను నమ్మి బ్రతికేవారు శ్రామికులు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) సొమ్మ
B) శమ
C) సమ
D) ప్రేమ
జవాబు:
A) సొమ్మ

29. మూర్ఖుల మనసును రంజింపలేము – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) మూడుడు
B) మంకు
C) మూర్కు
D) మెట్ట
జవాబు:
B) మంకు

30. పుస్తకం హస్త భూషణం – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) పుసకం
B) పుసతకం
C) పుస్కం
D) పొత్తం
జవాబు:
D) పొత్తం

31. యజ్ఞ యాగాదులు దేవతల ప్రీతికై చేస్తారు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) జతనం
B) జన్నం
C) మగ్గం
D) యెగ్గం
జవాబు:
B) జన్నం

32. ఇంతుల అందాలు మేలు బంతులు – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
A) స్త్రీ
B) యువతి
C) కన్య
D) మహిళ
జవాబు:
A) స్త్రీ

AP Board 9th Class Telugu Important Questions Chapter 10 బతుకు పుస్తకం

33. దాస్య శృంఖలములను ట్రెంచడానికి స్వాతంత్ర్యోద్యమం సాగింది – గీత గీసిన పదానికి వికృతి ఏది?
A) సంకెల
B) సంఖల
C) జంకులు
D) గొలుసు
జవాబు:
A) సంకెల

5. సంధులు :

34. సదాశయాలతో నాయకులు దేశాన్ని ముందుకు నడిపించాలి – గీత గీసిన పదాన్ని విడదీయుము.
A) సద + ఆశయం
B) సత్ + ఆశయం
C) సదా + అశయం
D) సత్ + ఆశయం
జవాబు:
B) సత్ + ఆశయం

35. ‘నిః + అహంకారం’ – పదాన్ని కలపండి.
A) నిహహంకారం
B) ని అహంకారం
C) నిరహంకారం
D) నీ అహంకారం
జవాబు:
C) నిరహంకారం

36. ‘అత్యంత’ – సంధి పేరేమిటి?
A) యణాదేశ సంధి
B) యడాగమ సంధి
C) గుణసంధి
D) త్రికసంధి
జవాబు:
A) యణాదేశ సంధి

37. ‘నిశ్శబ్దం’ – పదాన్ని విడదీయండి.
A) నిర్ + శబ్దం
B) ని + శబ్దం
C) అన్ + శబ్దం
D) నిః + శబ్దం
జవాబు:
D) నిః + శబ్దం

38. ‘స్వస్తి’ – పదాన్ని విడదీయండి.
A) స్వ + అస్తి
B) సు + అస్తి
C) సస్ + అస్తి
D) స్వస్ + అస్తి
జవాబు:
B) సు + అస్తి

39. శ్రమము + పడి – సంధి పేరేమిటి?
A) పుంప్వాదేశ సంధి
B) ఆమేడిత సంధి
C) పడ్వాది సంధి
D) ప్రాతాదిసంధి
జవాబు:
C) పడ్వాది సంధి

AP Board 9th Class Telugu Important Questions Chapter 10 బతుకు పుస్తకం

40. ‘దుష్టులైన’ – సంధి పేరేమిటి?
A) ఉత్వసంధి
B) ఇత్వసంధి
C) అత్వసంధి
D) వృద్ధి సంధి
జవాబు:
A) ఉత్వసంధి

41. ‘శతాబ్దం’ – విడదీసి రాయండి.
A) శత్ + అబ్దం
B) శత + బ్దం
C) శః + అబ్దం
D) శత + అబ్దం
జవాబు:
D) శత + అబ్దం

42. మెల్లి స్విట్జర్లాండు దేశస్థురాలు – గీత గీసిన పదాన్ని విడదీయండి.
A) దేశస్థు + రాదు
B) దేశస్థ + రాలు
C) దేశస్థ + ఆలు
D) దేశస్థు + ఆలు
జవాబు:
A) దేశస్థు + రాదు

43. ‘దేశపు దాస్యము’ లో గల సంధి ఏది?
A) రుగాగమ సంధి
B) పుంప్వాదేశ సంధి
C) టుగాగమ సంధి
D) ఇత్వ సంధి
జవాబు:
B) పుంప్వాదేశ సంధి

44. ‘దుడుకు + దుడుకు’ – సంధి కలిపిన పదాన్ని గుర్తించండి.
A) దుడుకుదుడుకు
B) దుందుడుకు
C) తుందుడుకు
D) దుడుస్టుడుకు
జవాబు:
B) దుందుడుకు

45. ‘అభ్యుదయము’ సంధి పదాన్ని విడదీయండి.
A) అభ్యు + దయము
B) అభి + యుదయము
C) అభి + ఉదయము
D) అభ్యుద + యము
జవాబు:
C) అభి + ఉదయము

6. సమాసాలు :

46. దశాబ్దాల నుండి పేదవాడు పేదవానిగానే ఉన్నాడు – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
A) దశమైన అబ్దం
B) దశ సంఖ్యగల అబ్దం
C) దశమనెడి అబ్దం
D) దశము, అర్ధము
జవాబు:
B) దశ సంఖ్యగల అబ్దం

AP Board 9th Class Telugu Important Questions Chapter 10 బతుకు పుస్తకం

47. ‘దాస్య శృంఖలాలు’ – విగ్రహవాక్యంలోని పదాన్ని గుర్తించండి.
A) యొక్క
B) కొఱకు
C) అనెడి
D) వలన
జవాబు:
C) అనెడి

48. ‘రోజూ, రోజూ’ సమాస పదం గుర్తించండి.
A) ప్రతిరోజు
B) రోరోజూ
C) రోజూ రోజూ
D) అన్ని రోజు
జవాబు:
A) ప్రతిరోజు

49. సంభావనా పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణ గుర్తించండి.
A) మహాగ్రంథం
B) సదాశయం
C) శతాబ్దం
D) సబర్మతి ఆశ్రమం
జవాబు:
D) సబర్మతి ఆశ్రమం

50. ‘మొగుడు పెళ్ళాలు’ – సమాసం పేరేమిటి?
A) ద్విగు
B) ద్వంద్వం
C) రూపకం
D) బహువ్రీహి
జవాబు:
B) ద్వంద్వం

51. ‘స్త్రీల అభ్యుదయం’ – విగ్రహవాక్యంలోని విభక్తిని గుర్తించండి.
A) గూర్చి
B) వలన
C) యొక్క
D) అందు
జవాబు:
C) యొక్క

52. “దాస్యమనెడి శృంఖలాలు’ – సమాస పదంగా కూర్చండి.
A) దాస్య శృంఖలాలు
B) దాస్యం శృంఖలాలు
C) దాస్యపు శృంఖలాలు
D) శృంఖలా దాస్యం
జవాబు:
A) దాస్య శృంఖలాలు

53. ‘స్వాతంత్ర్య యజ్ఞము’ – దీని విగ్రహవాక్యాన్ని గుర్తించండి.
A) స్వాతంత్ర్యము కొఱకు యజ్ఞము
B) స్వాతంత్ర్యము యొక్క యజ్ఞము
C) స్వాతంత్ర్యమనే యజ్ఞము
D) స్వాతంత్ర్యమును, యజ్ఞమును
జవాబు:
C) స్వాతంత్ర్యమనే యజ్ఞము

54. ‘స్త్రీల పత్రికలు’ – ఇది ఏ సమాసమో గుర్తించండి.
A) తృతీయా తత్పురుష
B) బహు బీహి
C) ద్వంద్వ
D) చతుర్థి తత్పురుషము
జవాబు:
D) చతుర్థి తత్పురుషము

7. గణాలు :

55. మ, స, జ, స, త, త, గ గణాలు గల వృత్తము ఏది?
A) చంపకమాల
B) ఉత్పలమాల
C) శార్దూలము
D) తేటగీతి
జవాబు:
C) శార్దూలము

56. ఉపమానోపమేయములకు భేదం లేనట్లు చెప్పే అలంకారము ఏది?
A) ఉపమా
B) రూపకము
C) ఉత్ప్రేక్ష
D) శ్లేష
జవాబు:
B) రూపకము

8. ఆధునిక వచనాన్ని గుర్తించడం :

57. ‘ఈతరాని కప్ప యే దేశమందైన నుండునా ?’ – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి.
A) ఈతరాని కప్ప ఏ దేశంలోనూ ఉండదు
B) ఈతరాని కప్ప ఎక్కడేనా ఉంటుందా?
C) ఈతరాని కప్ప ఏ దేశము నందూ ఉండదు
D) ఈతరాని కప్ప ఎక్కడా ఉండదు కదా !
జవాబు:
B) ఈతరాని కప్ప ఎక్కడేనా ఉంటుందా?

AP Board 9th Class Telugu Important Questions Chapter 10 బతుకు పుస్తకం

58. ‘ఏమి గతిందలంచినం పగకు మేలిమి లేమి ధ్రువంబు’ – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి.
A) ఏ విధంగా తలచినా పగ మంచిది కాదు
B) ఏ విధంగా చూసినా పగ నిశ్చయంగా మంచిది
C) ఏమి గతిని చూచినా నిశ్చితంగా శత్రుత్వము మంచిది కాదు
D) ఏమి గతి తలచినా ధ్రువముగా పగ మంచి కాదు
జవాబు:
B) ఏ విధంగా చూసినా పగ నిశ్చయంగా మంచిది

9. కర్తరి, కర్మణి వాక్యాలను గుర్తించడం:

59. లక్ష్మణరావు బతుకు పుస్తకం రాసారు – కర్మణి వాక్యం గుర్తించండి.
A) లక్ష్మణరావుచే బతుకు పుస్తకం రాయబడింది
B) లక్ష్మణరావుచే రాయబడింది
C) లక్ష్మణరావు బతుకు పుస్తకం రాస్తారు
D) లక్ష్మణరావు బతుకు పుస్తకం రాస్తున్నారు
జవాబు:
A) లక్ష్మణరావుచే బతుకు పుస్తకం రాయబడింది

60. మెల్లీ లక్ష్మణరావుచే చూడబడింది – కర్తరి వాక్యం?
A) మెల్లీ లక్ష్మణరావును చూసింది.
B) లక్ష్మణరావును చూసింది మెల్లీ.
C) మెల్లీని లక్ష్మణరావు చూశారు కాదు
D) లక్ష్మణరావుచే మెల్లీ చూడబడింది
జవాబు:
A) మెల్లీ లక్ష్మణరావును చూసింది.

61. ‘రమేష్ భారతాన్ని చదివాడు’ – ఈ కర్తరి వాక్యానికి కర్మణి వాక్యాన్ని గుర్తించండి.
A) రమేష్ చే భారతం చదవబడింది
B) రమేష్ చే భారతాన్ని చదువుతాడు
C) రమేష్ భారతాన్ని చదువుతాడు
D) రమేష్ భారతం చదువగలడు
జవాబు:
A) రమేష్ చే భారతం చదవబడింది

AP Board 9th Class Telugu Important Questions Chapter 10 బతుకు పుస్తకం

62. ‘వారిచే విషయం గమనింపబడుతుంది’ – ఈ వాక్యానికి కర్తరి వాక్యాన్ని గుర్తించండి.
A) వారు విషయం గమనిస్తారు
B) వారు విషయాన్ని గమనిస్తారు
C) వారివల్ల విషయము గమనింపబడుతుంది
D) వారు తప్పక విషయం చూస్తారు
జవాబు:
B) వారు విషయాన్ని గమనిస్తారు

3. ప్రత్యక్ష, పరోక్ష కథనాలను గుర్తించడం :

63. ‘ఇది అంతర్జాతీయ సమస్య అవుతుంది’ అని మెల్లీ బెదిరించింది – ఈ ప్రత్యక్ష కథనానికి పరోక్ష కథనాన్ని గుర్తించండి.
A) ఇది అంతర్జాతీయ సమస్య అవుతుందని మెల్లీ బెదిరించింది
B) అది అంతర్జాతీయ సమస్య కాగలదు
C) అది అంతర్జాతీయ సమస్య అవుతుందని మెల్లీ బెదిరించింది
D) అది అంతర్జాతీయ సమస్య అని మెల్లీ చెప్పింది
జవాబు:
C) అది అంతర్జాతీయ సమస్య అవుతుందని మెల్లీ బెదిరించింది

4. వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించడం :

64. ఆయన ఆవేదన పడలేదు – వ్యతిరేక వాక్యం గుర్తించండి.
A) ఆవేదన పడ్డారు
B) ఆయన పడ్డారు
C) ఆయన ఆవేదన పడ్డారు
D) పడిరి
జవాబు:
C) ఆయన ఆవేదన పడ్డారు

65. ఆమె బెదిరించింది – వ్యతిరేక వాక్యం గుర్తించండి.
A) బెదిరించలేదు
B) ఆమె బెదిరించలేదు
C) అతణ్ణి బెదిరంచలేదు
D) లేదు
జవాబు:
B) ఆమె బెదిరించలేదు

66. మనశ్శాంతి కలిగించాలి – వ్యతిరేక వాక్యం గుర్తించండి.
A) మనశ్శాంతి కలిగించకూడదు
B) మనశ్శాంతి లేదు
C) మనశాంతి రాదు
D) కల్గించకూడదు
జవాబు:
A) మనశ్శాంతి కలిగించకూడదు

AP Board 9th Class Telugu Important Questions Chapter 10 బతుకు పుస్తకం

67. ‘ఒక్క పలుకైనా ఆయన నోటి నుండి వెలువడలేదు’ – దీని వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించండి.
A) ఒక్క పలుకైనా ఆయన నోటి నుండి వెలువడింది
B) ఒక్క పలుకే ఆయన నోటి నుండి వెలువరించాడు
C) ఒక్క పలుకు ఆయన నోట వచ్చింది
D) ఒక్క పలుకు ఆయన వెలువరించాడు
జవాబు:
A) ఒక్క పలుకైనా ఆయన నోటి నుండి వెలువడింది

5. వాక్య రకాలను గుర్తించడం :

68. ‘మానసికంగా ఎదిగినట్లైతే’ విజయం కల్గుతుంది – గీత గీసిన వాక్యం ఏ రకమైన వాక్యం?
A) క్వార్థకము
B) శత్రర్థకము
C) చేదర్థకం
D) ప్రశ్నార్థకం
జవాబు:
C) చేదర్థకం

69. ‘అతడి దైన్య స్థితిని చూశారా?’ – ఇది ఏ రకమైన వాక్యం?
A) ఆశీరర్థకం
B) అనుమత్యర్థకం
C) ప్రశ్నార్థకం
D) విధ్యర్థకం
జవాబు:
C) ప్రశ్నార్థకం