AP Inter 2nd Year Physics Study Material Chapter 16 సంసర్గ వ్యవస్థలు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Physics Study Material 16th Lesson సంసర్గ వ్యవస్థలు Textbook Questions and Answers.

AP Inter 2nd Year Physics Study Material 16th Lesson సంసర్గ వ్యవస్థలు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సంసర్గ వ్యవస్థ ప్రాథమిక ఖండరూపాలు (blocks) ఏమిటి?
జవాబు:
సంచార వ్యవస్థలో ప్రధాన భాగాలు. 1) ప్రసారిణి 2) గ్రాహకం 3) ఛానెల్ (మాధ్యమం)

ప్రశ్న 2.
వరల్డ్ వైడ్ వెబ్ (www) అంటే ఏమిటి?
జవాబు:
టిమ్ – బెర్నెర్స్ – లీ ప్రపంచ వ్యాప్త వెబ్ (www) ని ఆవిష్కరించాడు. www అనేది విజ్ఞానానికి సంబంధించిన బృహత్ ఎన్సైక్లోపీడియా. ఇది ఎప్పుడూ 24 గంటలు అందరికీ అందుబాటులో ఉండే వ్యవస్థ.

ప్రశ్న 3.
మాట్లాడే సంకేతాల పౌనఃపున్య వ్యాప్తిని పేర్కొనండి.
జవాబు:
వాక్ సంకేతాలకు పౌనఃపున్య వ్యాప్తి 300HZ నుండి 3100HZ.

ప్రశ్న 4.
ఆకాశ తరంగ వ్యాపనం అంటే ఏమిటి?
జవాబు:
భూమి నుంచి వచ్చి తనపై పడిన రేడియో తరంగాలను ఐనో మండలం భూమికి తిరిగి పరావర్తితం చేస్తుంది. ఈ ప్రక్రియను ఆధారంగా చేసుకొని కొన్ని MHZ నుండి 30 MHZ పౌనఃపున్య వ్యాప్తిలో ఎక్కువ దూరం సంచారాన్ని సాధించవచ్చు. ఈ రకమైన ప్రసరణను వ్యోమ తరంగ ప్రసరణం అంటారు.

ప్రశ్న 5.
ఐనోవరణం వివిధ భాగాలను పేర్కొనండి.
జవాబు:
ఐనోవరణంలోని భాగాలు:

  1. D (స్వతాప మండలం యొక్క భాగం) 65 – 70 Km పగలు మాత్రమే
  2. E (సమతాప మండలం యొక్క భాగం) 100 Km పగలు మాత్రమే
  3. F1 (మధ్య మండలం యొక్క భాగం) 170 Km నుండి 190 Km
  4. F2 (ఉష్ణ మండలం) రాత్రిపూట 300 Km, పగటిపూట 250 – 400 Km

AP Inter 2nd Year Physics Study Material Chapter 16 సంసర్గ వ్యవస్థలు

ప్రశ్న 6.
మాడ్యులేషన్ను నిర్వచించండి. దాని ఆవశ్యకత ఎందుకు? [AP. Mar: ’17; AP & TS. Mar.’16; TS. Mar.’15; Mar, ’14]
జవాబు:
అల్ప పౌనఃపున్యము గల ఆడియో సంకేతం, హెచ్చు పౌనఃపున్య సంకేతంతో కలిసిపోయే ప్రక్రియను మాడ్యులేషన్ అంటారు.

పరిమితులు:

  1. ఆంటెన్నా (లేదా) ఏరియల్ పరిమాణం.
  2. ఆంటెన్నా వల్ల ఉద్గారమైన ఫలిత సామర్థ్యం.
  3. వేర్వేరు ప్రసారిణిల నుండి వెలువడే సంకేతాలు ఒకదానితో ఒకటి కలిసిపోవడం.

ప్రశ్న 7.
మాడ్యులేషన్ ప్రాథమిక పద్ధతులను పేర్కొనండి. [TS. Mar.’17; AP. Mar.’16; TS. Mar: ’15]
జవాబు:
మాడ్యులేషన్ లో మూడు రకాలు ఉంటాయి.

  1. కంపన పరిమితి మాడ్యులేషన్ (A.M)
  2. పౌనఃపున్య మాడ్యులేషన్ (F.M)
  3. దశా మాడ్యులేషన్ (PM)

ప్రశ్న 8.
మొబైల్ ఫోన్లలో ఏవిధమైన సంసర్గాన్ని వాడతారు?
జవాబు:
మొబైల్ ఫోన్లలో అంతరిక్ష తరంగ ప్రసరణ జరుగుతుంది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సాధారణీకరించిన సంసర్గ వ్యవస్థ ఖండరూప పటాన్ని గీచి, క్లుప్తంగా వివరించండి. [AP. Mar.’15]
జవాబు:
ప్రతి సంచార వ్యవస్థలో మూడు ప్రధాన భాగాలు ఉంటాయి. అవి 1) ప్రసారిణి, 2) మాధ్యమం/ఛానెల్, 3) గ్రాహకం సంచార వ్యవస్థ సాధారణ రూపాన్ని పటంలో చూడవచ్చు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 16 సంసర్గ వ్యవస్థలు 1

సంచార వ్యవస్థలో ఒక ప్రదేశం వద్ద ప్రసారిణి, మరొక ప్రదేశం వద్ద గ్రాహకం ఉంటాయి. ఈ రెండింటిని కలిపే భౌతిక యానకమే ఛానెల్.

సమాచార జనకం వల్ల ఉత్పత్తి అయిన సందేశ సంకేతాన్ని ఛానెల్ గుండా ప్రసారం కావడానికి వీలయ్యే రూపంలోకి మార్చడమే ప్రసారిణి యొక్క పని. సందేశ సంకేతం గనుక ఒకవేళ (ఒక వాక్ సంకేతం) విద్యుత్ సంకేతం కాకపోతే, దాన్ని ప్రసారిణికి నివేశనంగా పంపించే ముందు ట్రాన్స్యూసర్ సహాయంతో విద్యుత్ రూపంలోకి మారుస్తారు.

ఛానెల్ వెంబడి సంకేతం ప్రసారం అవుతున్నప్పుడు ఛానెల్ అసమగ్రతవల్ల సంకేతం విరూపణం చెందవచ్చు. దీనికి తోడు ప్రసారం అవుతున్న సంకేతానికి అనవసర శబ్దం కలపడం వల్ల గ్రాహకం గ్రహించే సంకేతం దోషపూరితం అవుతుంది. ఈ సంకేతాన్ని గ్రాహకం తొలి సందేశ సంకేతంగా మార్చి సమాచారాన్ని ఉపయోగించుకుంటున్న వ్యక్తికి చేరవేస్తుంది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 16 సంసర్గ వ్యవస్థలు

ప్రశ్న 2.
భూతరంగం అంటే ఏమిటి? సంసర్గానికి దానిని ఎప్పుడు వాడతారు?
జవాబు:
సంకేతాలను అత్యంత సమర్ధవంతంగా ఉద్గారించడానికి ఆంటెన్నా పరిమాణం సంకేత తరంగదైర్ఘ్యానికి (λ) సమానంగా (కనీసం λ/4) ఉండవలెను. అధిక తరంగదైర్ఘ్యాల వద్ద ఆంటెన్నాలు పెద్దపరిమాణం కలిగి భూమికి అతి సమీపంలో ఉంటాయి. ప్రామాణిక AB బ్రాడ్కాస్ట్లో సాధారణంగా భూమిపై నిట్టనిలువుగా అమర్చిన గోపురాలను ప్రసరణ ఆంటెన్నాలుగా ఉపయోగిస్తారు. ఇలాంటి ఆంటెన్నాల విషయంలో సంకేత ప్రసారంపై భూమి బలమైన ప్రభావాన్ని కలుగచేస్తుంది. ఈ రకమైన ప్రసారాన్ని భూ ఉపరితల తరంగ ప్రసరణ అంటారు. ఈ తరంగం భూమి ఉపరితలం మీద సున్నితంగా జాలువారుతుంది. తరంగం నేలపై ప్రయాణిస్తున్న ప్రాంతంలో విద్యుత్ ప్రవాహాన్ని ప్రేరేపిస్తాయి. భూమి శక్తిని శోషించుకోవడం వల్ల ఈ తరంగం క్షీణిస్తుంది. పౌనఃపున్యం పెరుగుతున్నకొలదీ ఉపరితల తరంగాల క్షీణత చాలా వేగంగా పెరుగుతుంది. ఈ తరంగాల వ్యాప్తి యొక్క గరిష్ట అవధి ప్రసరణ సామర్థ్యం మరియు పౌనఃపున్యాలపై ఆధారపడి ఉంటుంది.

ప్రశ్న 3.
ఆకాశ తరంగాలు అంటే ఏమిటి? ఆకాశ తరంగ వ్యాపనాన్ని క్లుప్తంగా వివరించండి.
జవాబు:
ఆకాశ తరంగము (లేదా) వ్యోమ తరంగము :
AP Inter 2nd Year Physics Study Material Chapter 16 సంసర్గ వ్యవస్థలు 2
భూమి నుంచి వచ్చి ఐనో మండలముపై పడిన రేడియో తరంగాలను, మరల భూమికి పరావర్తితమగును. ఈ ప్రక్రియలో గల తరంగాలను వ్యోమ తరంగాలు అంటారు. కొన్ని MHz నుంచి 30 MHz పౌనఃపున్య వ్యాప్తిలో వరణపు పొడలు ఎక్కువ దూరం సంచారాన్ని సాధించవచ్చు. ఈ రకమైన ప్రసరణాన్ని వ్యోమ తరంగ ప్రసరణం అంటారు. స్వల్ప తరంగ బ్రాడ్కాస్ట్ సేవలకు దీన్ని ఉపయోగిస్తారు. అధిక సంఖ్యలో అయాన్లు లేదా ఆవేశిత కణాలు ఉండటంవల్ల ఐనో మండలాన్ని ఆ పేరుతో పిలుస్తారు. ఇది భూ ఉపరితలం నుండి ~ 65 km నుండి 400 km వరకు విస్తరించి ఉంటుంది. అయనీకరణం (అయోనైజేషన్) జరగడానికి కారణం గాలి అణువులవల్ల సూర్యుడి నుండి ఉద్గారింపబడుతున్న అతినీలలోహిత మరియు ఇతర అధిక శక్తిగల వికిరణాల శోషణయే.

ఈ అయనీకరణం యొక్క తీవ్రత (degree) ఎత్తుతోపాటు మారుతుంది. వాతావరణ సాంద్రత ఎత్తుతోపాటు తగ్గుతుంది. ఎక్కువ ఎత్తుల వద్ద సౌర వికిరణం తీవ్రత ఎక్కువే. కాని అక్కడ అయనీకరణం చెందటానికి అణువుల సంఖ్య తక్కువగా ఉంటుంది. భూమికి సమీపంలో అణుసాంద్రత చాలా ఎక్కువగా ఉన్నప్పటికి వికిరణ తీవ్రత చాలా తక్కువ. అందువల్ల మరలా అయనీకరణం తక్కువే. అయితే, కొన్ని మధ్యంతర ఎత్తులవద్ద అయనీకరణ సాంద్రత గరిష్ఠంగా ఉంటుంది. ఐనో మండలపు పొర నిర్దిష్ట పౌనఃపున్యాల వ్యాప్తికి (3 నుండి 30 MHz) ఒక పరావర్తకం (reflector) వలె పనిచేస్తుంది. 30MHz కంటే ఎక్కువ పౌనఃపున్యాలు కలిగిన విద్యుదయస్కాంత తరంగాలు ఐనో మండలం గుండా చొచ్చుకొనిపోతాయి. ఈ ప్రక్రియలను పటంలో చూపడం జరిగింది.

ప్రశ్న 4.
అంతరిక్ష రంగ సంసర్గం అంటే ఏమిటి? వివరించండి.
జవాబు:
అంతరిక్ష తరంగం (Space – Wave) :
దృష్టి రేఖా (line-of-sight (LOS)) సంచారానికి మరియు ఉపగ్రహ సంచారానికి అంతరిక్ష తరంగాలను ఉపయోగిస్తారు. 40 MHz కంటే ఎక్కువ పౌనఃపున్యాల వద్ద సంచారం తప్పనిసరిగా దృష్టి రేఖా (line-of-sight) మార్గాలకు లోబడి ఉంటుంది. ఈ పౌనఃపున్యాల వద్ద ఆంటెన్నాలు సాపేక్షంగా చిన్నవిగా ఉంటాయి. వీటిని భూమిపై అనేక తరంగదైర్ఘ్యాల ఎత్తుల వద్ద ఉంచవచ్చు.

పటంలో చూపబడినట్లు భూమి యొక్క వక్రతవల్ల కొన్ని బిందువుల వద్ద ప్రత్యక్ష శరంగాలు ఆపబడటానికి కారణం ప్రసరణం యొక్క దృష్టి రేఖా స్వభావమే. క్షితిజానికి ఆవల సంకేతాన్ని గ్రహించడానికి, గ్రాహక ఆంటెన్నా దృష్టి రేఖా తరంగాలను ఛేదించడానికి తగినంత ఎత్తులో ఉండాలి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 16 సంసర్గ వ్యవస్థలు 3

ప్రసరణ ఆంటెన్నా ఎత్తు hT వద్ద క్షితిజ దూరం dT మరియు గ్రాహక ఆంటెన్నా ఎత్తు hR వద్ద క్షితిజ దూరం dR అయిన రెండు ఆంటిన్నాలమధ్య దృష్టి రేఖా దూరం dM అయితే
dM = dT + dR ఇక్కడ R = భూ వ్యాసార్ధము
dM = (\(\sqrt{2 R h_T}+\sqrt{2 R h_R}\))
ఉదా : టెలివిజన్ బ్రాడ్కాస్ట్, మైక్రోతరంగ అనుసంధానాలు, ఉపగ్రహ సంచారం మొదలైనవి..

ప్రశ్న 5.
మాడ్యులేషన్ అంటే మీరు ఏం అర్థం చేసుకొన్నారు? మాడ్యులేషన్ అవసరాన్ని వివరించండి.
జవాబు:
మాడ్యులేషన్ :
ఆడియో పౌనఃపున్య సంకేతం, హెచ్చు పౌనఃపున్య సంకేతంతో కలిసిపోయే ప్రక్రియను మాడ్యులేషన్ అంటారు.

ఒక విద్యుత్ సంకేతాన్ని చాలా ఎక్కువ దూరం ప్రసారం చేయడానికి ఈ క్రింది పరిమితులు ఎదురవుతాయి. అవి 1) ఆంటెన్నా, 2) ఆంటెన్నా వల్ల ఉద్గారమైన ఫలిత సామర్థ్యం, 3) వేర్వేరు ప్రసారిణుల నుండి వెలువడే సంకేతాలు ఒక దానితో ఒకటి కలిసిపోవడం.

20kHz సంకేతానికి ఆంటెన్నా యొక్క ఎత్తు 4km, అయితే ఈ ఎత్తు చాలా ఎక్కువే. ఈ ఎత్తులు ఆచరణ యోగ్యంకావు.

ఈ స్వల్ప పౌనఃపున్యాలకు (20Hz నుండి 20kHz) ప్రసరణ ఆంటెన్నా నుండి నేరుగా పంపినప్పటికి సంకేతాలు వాతావరణంలో ఇది వరకువున్న మిలియన్ల కొద్దీ స్వల్ప పౌనఃపున్య సంకేతాలతో కలిసిపోయే అవకాశం ఉంది. ఈ సంకేతాలను గ్రహించే చోట వాటిని గుర్తించడం అసాధ్యమవుతుంది. అందువలన మాడ్యులేషన్ అవసరం.

AP Inter 2nd Year Physics Study Material Chapter 16 సంసర్గ వ్యవస్థలు

ప్రశ్న 6.
ఆంటెన్నా లేదా ఏరియల్ పరిమాణం ఎంత ఉండాలి? వికిరణం చెందిన సామర్థ్యం, తరంగదైర్ఘ్యం, ఆంటెన్నా పొడవులతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉంటుంది?
జవాబు:
ఆంటెన్నా (లేదా) ఏరియల్ పరిమాణం :
సంకేతాన్ని ప్రసారం చేయడానికి ఆంటెన్నా అవసరం. ఆంటెన్నా పరిమాణము సంకేతంయొక్క తరంగదైర్ఘ్యముతో పోల్చవచ్చు. (కనీసం λ/4). కాబట్టి ఆంటెన్నా కాలంతో మారే సంకేతాన్ని సరిగా పంపుతుంది. విద్యుదయస్కాంత తరంగాల పౌనఃపున్యము 20kHz తరంగదైర్ఘ్యము (λ) 15 km కు పెద్ద ఆంటెన్నాను నిర్మించి, పనిచేయించడం సాధ్యం కాదు. అందువల్ల ప్రసారం కోసం తప్పనిసరిగా తక్కువ పౌనఃపున్యంగల సంకేతాన్ని, అధిక పౌనఃపున్యంగల సంకేతంగా మార్చాలి.

ఆంటెన్నా ద్వారా ప్రభావ వికిరణ సామర్ధ్యము :
ఒక రేఖీయ ఆంటెన్నా (పొడవు l) లో సామర్థ్య వికిరణము \(\frac{l}{\lambda^2}\)కు అనులోమానుపాతంలో ఉంటుంది. అదే పొడవు గల ఆంటెన్నాలో λ ను తగ్గించి సామర్థ్య వికిరణాన్ని పెంచుతుంది. అనగా పౌనఃపున్యము పెరుగుతుంది. కాబట్టి ఎక్కువ తరంగ దైర్ఘ్యముగల బేస్బండ్ సంకేతం ప్రభావ వికిరణ సామర్ధ్యము తక్కువ.

ప్రశ్న 7.
డోలన పరిమితి మాడ్యులేషన్ను వివరించండి.
జవాబు:
కంపన పరిమితి మాడ్యులేషన్:
ఈ పద్ధతిలో వాహక తరంగ పౌనఃపున్యం మరియు దశలను స్థిరంగా ఉంచి మాడ్యులేటింగ్ సంకేతానికి అనుగుణంగా వాహక కంపన పరిమితి మార్పు చెందుతుంది.

మాడ్యులేటింగ్ సంకేతాన్ని ఉపయోగించి A.M. ను వివరించవచ్చు.
c(t) = Ac sin ωct అనునది వాహక తరంగం
m(t) = Am sin ωmt అనునది మాడ్యులేటింగ్ సంకేతం
మాడ్యులేటింగ్ cm (t) ని ఇలా వ్రాయవచ్చు.
cm (t) = (Ac + Am sin ωmt) sin ωct
cm (t) = Ac [1 + \(\frac{A_m}{A_c}\)sin ωmt] sin ωct → (1)

ఇక్కడ ωm = 2πfm = సందేశ సంకేతం యొక్క కోణీయ పౌనఃపున్యము మాడ్యులేటింగ్ సంకేతం, సందేశ సంకేతాన్ని కలిగి ఉంటుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 16 సంసర్గ వ్యవస్థలు 4

ఇక్కడ (ωc – ωm) మరియు (ωc + ωm) లు క్రింది భాగం మరియు పైభాగంలో పౌనఃపున్యాలు మొత్తానికి వాహక తరంగాలు ఒకదానితో ఒకటి కలవకుండా ప్రసారమవుతాయి.

ప్రశ్న 8.
డోలన పరిమితి మాడ్యులేటెడ్ తరంగాన్ని ఏవిధంగా ఉత్పత్తి చేస్తారు?
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 16 సంసర్గ వ్యవస్థలు 5
మాడ్యులేటెడ్ సంకేతం Am sin ωmt ని వాహక తరంగ సంకేతం Ac sin ωct కి కలిపితే x(t) సంకేతం జనిస్తుంది. x(t) = Am sin ωmt + Ac sin ωct ని చదర నియమ పరికరం గుండా పంపితే నిర్గమనం జనిస్తుంది.
y(t) = B × (t) + c x² (t)
ఇక్కడ B మరియు C లు స్థిరాంకాలు.

ఈ సంకేతాన్ని బ్యాండ్ పాస్ ఫిల్టర్ గుండా పంపితే, దాని నిర్గమనం నుండి A.M. తరంగం జనిస్తుంది. బ్యాండ్ పాస్ d.c. ఫిల్టర్లో ωm, 2ωm మరియు 2ωc లు నిరాకరించబడతాయి. మరియు ωc, (ωc – ωm) మరియు (ωc + ωm) లు తొలగించబడతాయి.

ప్రశ్న 9.
డోలన పరిమితి మాడ్యులేటెడ్ తరంగాన్ని ఏవిధంగా శోధిస్తారు?
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 16 సంసర్గ వ్యవస్థలు 6
గ్రాహకం యొక్క రేఖా చిత్రాన్ని పటంలో చూడండి. మాడ్యులేటెడ్ వాహక తరంగం నుండి మాడ్యులేటింగ్ సంకేతాన్ని తిరిగి పొందడాన్ని శోధనం అంటారు.

మాడ్యులేటెడ్ వాహక తరంగంలో ωc మరియు ωc ± ωm పౌనఃపున్యాలు కలిగి ఉంటుంది. ωm కోణీయ పౌనః పున్యముగల సందేశ సంకేతం m(t) ని పొందుటకు సరళమైన పద్ధతిని పటంలో చూడండి.

మాడ్యులేటెడ్ సంకేతంను ధిక్కారిణి గుండా సంపి నిర్గమ సందేశ సంకేతాన్ని పొందవచ్చు. ఈ సందేశ సంకేతాన్ని ఆచ్ఛాదన శోధకం (Rc వలయం) గుండా పంపుతారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 16 సంసర్గ వ్యవస్థలు 7

అభ్యాసాలు Textual Exercises

ప్రశ్న 1.
ఆకాశ తరంగాలను ఉపయోగించి క్షితిజానికి ఆవల జరిగే సంసర్గానికి క్రింద ఇచ్చిన పౌనఃపున్యాలలో ఏది అనుకూలమైంది?
a) 10 kHz b) 10 MHz c) 1 GHz D) 1000GHz.
జవాబు:
10kHz పౌనఃపున్యాలు పెద్ద ఆంటెన్నా ద్వారా వికిరణం చెందవు. 1 GHz మరియు 1000 GHz చొచ్చుకుపోతాయి. కావున (b) సరియైనది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 16 సంసర్గ వ్యవస్థలు

ప్రశ్న 2.
UHF వ్యాప్తిలోని పౌనఃపున్యాలు సాధారణంగా క్రింది తరంగాల ప్రసారం ద్వారా అవుతాయి.
a) భూతరంగాలు b) ఆకాశ తరంగాలు c) ఉపరితల తరంగాలు d) అంతరిక్ష తరంగాలు
జవాబు:
UHF వ్యాప్తిలో పౌనఃపున్యాలు వ్యోమ తరంగాల రూపంలో ప్రసారం అవుతాయి. అధిక పౌనఃపున్యము గల అంతరిక్ష తరంగాలు భూమివైపు వంగవు కాని పౌనఃపున్య మాడ్యులేషన్ ఆదర్శంగా ఉంటుంది.

ప్రశ్న 3.
డిజిటల్ సంకేతాలు
i) అవిచ్ఛిన్న విలువలను సమకూర్చవు
ii) విలువలను వివిక్త మెట్లగా సూచిస్తాయి.
iii) ద్విసంఖ్యామానాన్ని ఉపయోగించుకోవచ్చు.
iv) దశాంశ, ద్విసంఖ్యా వ్యవస్థలు రెండింటిని ఉపయోగించుకోవచ్చు. పై ప్రవచనాలలో ఏవి సరైనవి?
a) (i), (ii) మాత్రమే
b) (ii), (iii) మాత్రమే
c) (i), (ii), (iii) కానీ (iv) కాదు
d) (i), (ii), (iii), (iv) అన్నీ
జవాబు:
డిజిటల్ సంకేతం, అనలాగ్ సంకేతం కన్నా కాలంతోపాటు అవిచ్ఛిన్న ప్రమేయంగా ఉంటుంది. డిజిటల్ సంకేతాలు డిజిటల్ డాటా రూపంలో నిల్వయుండి టెలిఫోన్ లైన్ల ద్వారా ప్రసారం చెందవు. డిజిటల్ సంకేతాలను డెసిమల్ సంకేతాలుగా వినియోగించరు.

ప్రశ్న 4.
దృష్టిరేఖా సంసర్గంలో ప్రసార ఆంటెన్నా ఎత్తు గ్రాహక ఆంటెన్నా ఎత్తుకు సమానంగా ఉండటం అవసరమా? ఒక టివి ప్రసార యాంటెన్నా 81m పొడవు ఉంది. గ్రాహకం ఆంటెన్నా భూస్థాయిలో ఉంటే ప్రసార ఆంటెన్నా ఎంత వైశాల్యంలో సేవలను అందించగలదు?
జవాబు:
ఆంటెన్నా ఎత్తు (h) = 81 m
భూమి వ్యాసార్థం (R) = 6.4 × 106 m
దృష్టి రేఖా మార్గాలకు తప్పనిసరికాదు. కావున రెండు ఆంటెన్నాలు ఒకే ఎత్తులో ఉండనవసరంలేదు.
వైశాల్యం = πd²,
వ్యాప్తి (d) = √2hR
సర్వీసు వైశాల్యం = π × 2hR = \(\frac{22}{7}\) × 2 × 81 × 6.4 × 106
= 3258.5 × 106
= 3258.5 km²

ప్రశ్న 5.
ఒక సందేశ సంకేతాన్ని ప్రసారం చేయడానికి 12V శిఖర వోల్టేజిగల వాహక తరంగాన్ని ఉపయోగించారు. మాడ్యులేషన్ సూచి 75% ఉండటానికి మాడ్యులేటింగ్ సంకేతం శిఖర వోల్టేజి ఎంత ఉండాలి?
జవాబు:
శిఖర వోల్టేజి (V0) = 12v
AP Inter 2nd Year Physics Study Material Chapter 16 సంసర్గ వ్యవస్థలు 8

ప్రశ్న 6.
పటంలో చూపినట్లు, మాడ్యులేటింగ్ సంకేతం ఒక చతురస్రాకార తరంగం.
AP Inter 2nd Year Physics Study Material Chapter 16 సంసర్గ వ్యవస్థలు 9
వాహక తరంగం c(t) = 2 sin(8πt) వోల్ట్లుగా ఉంటే,
i) డోలన పరిమితి మాద్యులేషన్ చెందిన తరంగ రూపాన్ని గీయండి. ii) మాడ్యులేషన్ సూచి ఏమిటి?
జవాబు:
వాహక తరంగ సమీకరణం c(t) = 2 sin (8πt)
(a) పటం నుండి
మాడ్యులేషన్ సంకేతం కంపన పరిమితి (Am) = 1V
వాహక తరంగం కంపన పరిమితి (Ac) = 2v
Tm = 1S
ωm = \(\frac{2 \pi}{T_m}=\frac{2 \pi}{1}\) = 2π rad/s
c(t) = 2 sin 8π t
= Ac sin ωc t
ωc = 8π
ωc = 4ωm
మాడ్యులేషన్ తరంగం కంపన పరిమితి (A) = Am + Ac = 2 + 1 = 3V
AP Inter 2nd Year Physics Study Material Chapter 16 సంసర్గ వ్యవస్థలు 10
(b)మాడ్యులేషన్ ఇండెక్స్ (μ) = \(\frac{A_m}{A_c}=\frac{1}{2}\) = 0.5

AP Inter 2nd Year Physics Study Material Chapter 16 సంసర్గ వ్యవస్థలు

ప్రశ్న 7.
డోలన పరిమితి మాడ్యులేషన్ చెందిన తరంగం గరిష్ఠ కంపన పరిమితి 10 V గా, కనిష్ఠ కంపన పరిమితి 2 Vగా కనుక్కొన్నారు. మాడ్యులేషన్ సూచి μ ని నిర్ధారించండి. కనిష్ఠ కంపన పరిమితి సున్నా వోల్టు అయితే μ విలువ ఏమిటి?
జవాబు:
గరిష్ఠ కంపన పరిమితి (Aగరిష్ఠం) = 10V
కనిష్ఠ కంపన పరిమితి (Aకనిష్ఠం) = 2V
Ac మరియు Am లు వాహక తరంగం మరియు మాడ్యులేషన్ తరంగం కంపన పరిమితులు
Aగరిష్ఠం = Ac + Am = 10 → (i)
Aకనిష్ఠం = Ac – Am = 2 → (ii)
(i) మరియు (ii) లను కూడగా, 2A = 12
Ac = 6v
మరియు Am = 10 – 6 4v
AP Inter 2nd Year Physics Study Material Chapter 16 సంసర్గ వ్యవస్థలు 11

ప్రశ్న 8.
ఆర్థిక కారణాలవల్ల, AM తరంగంలో ఎగువ పార్శ్వ పట్టీని మాత్రమే ప్రసారం చేసారు. అయితే గ్రాహక కేంద్రం వద్ద వాహక తరంగాన్ని ఉత్పత్తి చేసే సౌకర్యం ఉంది. రెండు సంకేతాలను గుణించగలిగే పరికరం అందుబాటులో ఉంటే గ్రాహక కేంద్రం వద్ద మాడ్యులేటింగ్ సంకేతాన్ని తిరిగి పొందడం సాధ్యమవుతుందని చూపండి.
జవాబు:
ωc అనునది వాహక తరంగ కోణీయ పౌనఃపున్యము మరియు ωm సంకేత తరంగాల కోణీయ పౌనఃపున్యము.
గ్రాహక స్టేషన్లో సంకేతం
se = E1 cos (ωc + ωm) t
వాహక తరంగం తక్షణ వోల్టేజి
AP Inter 2nd Year Physics Study Material Chapter 16 సంసర్గ వ్యవస్థలు 12

సాధించిన సమస్యలు Textual Examples

ప్రశ్న 1.
ఒక విఖరంపైన ఉన్న ప్రసార ఆంటెన్నా ఎత్తు 32 m. గ్రాహక ఆంటెన్నా ఎత్తు 50 m. దృష్టిరేఖా పద్ధతి (LOS) లో ఈ రెండింటి మధ్య సంతృప్తకరమైన ప్రసారం కోసం ఉండవలసిన గరిష్ట దూరం ఎంత? భూ వ్యాసార్ధం 6.4 × 106 m. అని ఇచ్చారు.
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 16 సంసర్గ వ్యవస్థలు 13

AP Inter 2nd Year Physics Study Material Chapter 16 సంసర్గ వ్యవస్థలు

ప్రశ్న 2.
10kHz పౌనఃపున్యం, శిఖర వోల్టేజి 10 V గల ఒక సందేశ సంకేతాన్ని, 1 MHz పౌనఃపున్యం, 20 V శిఖర వోల్టేజి గల వాహక రంగాన్ని మాడ్యులేట్ చేయడానికి ఉపయోగించారు.
(a) మాడ్యులేషన్ సూచి,
(b) ఉత్పత్తి అయిన పార్శ్వ పట్టీలను కనుక్కోండి.
జవాబు:
(a) మాడ్యులేషన్ సూచి = 10/20 = 0.5

(b) పార్శ్వ పట్టీలు ; (1000+ 10 KHz) = 1010kHz, (1000 – 10kHz) 990kHz వద్ద ఉంటాయి.

AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Physics Study Material 15th Lesson అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు Textbook Questions and Answers.

AP Inter 2nd Year Physics Study Material 15th Lesson అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
n- రకం అర్ధవాహకం అంటే ఏమిటి? దీనిలో అధిక సంఖ్యాక, అల్ప సంఖ్యాక ఆవేశ వాహకాలు ఏమిటి?
జవాబు:
చతుస్సంయోజనీయ శుద్ధ అర్ధవాహకానికి, పంచసంయోజక మాలిన్యాలను కలిపితే n – రకం అర్ధవాహకం ఏర్పడుతుంది. n – రకం అర్ధవాహకంలో ఎలక్ట్రాన్లు అధిక సంఖ్యాక ఆవేశ వాహకాలు మరియు రంధ్రాలు అల్పసంఖ్యాక ఆవేశ వాహకాలు.

ప్రశ్న 2.
స్వభావజ, అస్వభావజ అర్ధవాహకాలు అంటే ఏమిటి? [AP. Mar. ’15]
జవాబు:
స్వచ్ఛమైన అర్ధవాహకాన్ని స్వభావజ అర్ధవాహకం అంటారు.

స్వచ్ఛమైన అర్ధవాహకాలకు మాలిన్యాలను కలుపుట వల్ల వాటి వహనత పెరుగుతుంది. వీటిని అస్వభావజ అర్ధవాహకాలు
అంటారు.

ప్రశ్న 3.
p – రకం అర్ధవాహకం అంటే ఏమిటి? దీనిలో అధిక సంఖ్యాక, అల్ప సంఖ్యాక ఆవేశ వాహకాలు ఏమిటి ? [TS. Mar.’17]
జవాబు:
చతుస్సంయోజనీయ శుద్ధ అర్ధవాహకానికి, త్రిసంయోజక మాలిన్యాలను కలిపితే p – రకం అర్ధవాహకం ఏర్పడుతుంది. p- రకం అర్ధవాహకంలో అధిక సంఖ్యాక ఆవేశ వాహకాలు రంధ్రాలు మరియు అల్పసంఖ్యాక ఆవేశ వాహకాలు ఎలక్ట్రాన్ల

ప్రశ్న 4.
p-n సంధి డయోడ్ అంటే ఏమిటి? లేమి పొరను నిర్వచించండి.
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 1
త్రిసంయోజక మాలిన్యాలను కలిపిన స్వభావజ అర్ధవాహకాన్ని ఒక వైపు మరియు పంచసంయోజక మాలిన్యాలను కలిపిన స్వభావజ అర్ధవాహకాన్ని మరొక వైపు, ఒక సంధి ఏర్పడునట్లు కలిపితే దానిని – సంధి డయోడ్ అంటారు.

p-n సంధికి ఇరువైపులా ఎలాంటి ఆవేశ వాహకాలు లేని ఒక పలుచని పొర ఏర్పడుతుంది. దీనిని లేమి పొర అంటారు.

ప్రశ్న 5.
సంధి డయోడ్కు i) పురోశక్మం, ii) తిరోశక్మంలలో బాటరీని ఏ విధంగా కలుపుతారు?
జవాబు:

  1. p-n సంధి డయోడ్ p- రకానికి బ్యాటరీ ధన ధ్రువాన్ని మరియు n- రకానికి బ్యాటరీ రుణ ధ్రువాన్ని కలిపితే ఆ డయోడ్ పురోబయాస్లో ఉందని అంటారు.
    AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 2
  2. p-n సంధి డయోడ్లో p- రకానికి బ్యాటరీ రుణ ధ్రువాన్ని మరియు n- రకానికి బ్యాటరీ ధన ధ్రువాన్ని కలిపితే ఆ డయోడ్ తిరోబయాస్లో ఉందని’ అంటారు.
    AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 3

AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు

ప్రశ్న 6.
అర్ధ తరంగ, పూర్ణ తరంగ ధిక్కరణులలో గరిష్ఠ ధిక్కరణ శాతం ఎంత?
జవాబు:

  1. అర్ధతరంగ ఏకధిక్కారిలో దక్షత శాతం 40.6 %
  2. పూర్ణతరంగ ఏకధిక్కారిలో దక్షత శాతం 81.2 %

ప్రశ్న 7.
జీనర్ వోల్టేజి (Vz) అంటే ఏమిటి? వలయాలలో సాధారణంగా జీనర్ డయోడ్ను ఏవిధంగా కలుపుతారు?
జవాబు:

  1. జీనర్ డయోడ్ తిరోబయాస్లో ఉన్నప్పుడు, ఒక నిర్దిష్ట వోల్టేజి వద్ద విద్యుత్ ప్రవాహము ఆకస్మికంగా పెరుగుతుంది. దానిని జీనర్ వోల్టేజి (లేదా) భంజన వోల్టేజి అంటారు.
  2. జీనర్ డయోడ్ను ఎల్లప్పుడూ, తిరోబయాస్లో లోనే కలపాలి.

ప్రశ్న 8.
అర్ధ తరంగ, పూర్ణ తరంగ ధిక్కరణుల
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 4

ప్రశ్న 9.
p-n సంధి డయోడ్లోని లేమి పొర వెడల్పుకు i) పురోశక్మం, ii) తిరోశక్మంలలో ఏమి జరుగుతుంది?
జవాబు:

  1. p-n సంధి డయోడ్ పురోబయాస్లో ఉన్నప్పుడు లేమి పొర మందం పలుచగా ఉంటుంది.
  2. తిరోబయాస్లో ఉన్నప్పుడు లేమి పొర మందం అధికంగా ఉంటుంది.

ప్రశ్న 10.
p-n-p, n-p-n ట్రాన్సిస్టర్ల వలయ సంకేతాలను గీయండి. [TS. Mar. 16; Mar. ’14]
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 5

ప్రశ్న 11.
వర్ధకం, వర్ధన కారకం పదాలను నిర్వచించండి.
జవాబు:

  1. బలహీన సంకేత బలాన్ని పెంచే ప్రక్రియను వర్ధనం అంటారు. అందుకు వాడే పరికరాన్ని వర్ధకం అంటారు.
  2. నిర్గమ వోల్టేజికి, నివేశ వోల్టేజికి గల నిష్పత్తిని వర్ధక గుణకం అంటారు. A = \(\frac{V_0}{V_i}\)

ప్రశ్న 12.
జీనర్ డయోడ్ను వోల్టేజి నియంత్రణకారిగా వాడాలంటే ఏ బయాస్లో వాడాలి?
జవాబు:
తిరోబయాస్లో జీనర్ డయోడ్ను వోల్టేజి నియంత్రకంగా వాడతారు.

ప్రశ్న 13.
ఏ తర్క ద్వారాలను సార్వత్రిక ద్వారాలు అంటారు?
జవాబు:
NAND ద్వారం మరియు NOR ద్వారా లను సార్వత్రిక ద్వారాలంటారు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు

ప్రశ్న 14.
NAND ద్వారం నిజపట్టికను వ్రాయండి. AND ద్వారంతో ఇది ఏవిధంగా విభేదిస్తుంది?
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 6

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
n-రకం, p-రకం అర్ధవాహకాలు అంటే ఏమిటి? అర్ధవాహక సంధి ఏవిధంగా ఏర్పడుతుంది?
జవాబు:
n- రకం అర్ధవాహకాలు :
స్వచ్ఛమైన అర్ధవాహకానికి, పంచ సంయోజక మాలిన్యాలు ఆర్సనిక్, ఆంటిమోని, బిస్మత్ మొదలగువాటిని కలిపితే n-రకం అర్ధవాహకాలు అంటారు.

p-రకం అర్ధవాహకాలు :
స్వచ్ఛమైన అర్ధవాహకానికి, త్రిసంయోజక మాలిన్యాలు ఇండియమ్, గాలియమ్, అల్యూమినియమ్ మొదలగు వాటిని కలిపితే p-రకం అర్ధవాహకాలు ఏర్పడతాయి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 7

p-n సంధి ఏర్పడుట :
ఒక p-n సంధి ఏర్పడినప్పుడు, n – ప్రాంతంలోని ఎలక్ట్రాన్లు p-ప్రాంతం వైపుగా విసరణ చెంది, అక్కడ. ఉండే రంధ్రాలతో సంయోగం చెంది తటస్థీకృతం అవుతాయి. అదే విధంగా p- ప్రాంతంలోని రంధ్రాలు n ప్రాంతం వైపు విసరణ చెంది, అక్కడి ఎలక్ట్రాన్లతో సంయోగం చెంది తటస్థీకృతం అవుతాయి.

దీని ఫలితంగా సంధికి ఇరువైపులా ఎలాంటి ఆవేశ వాహకాలు లేని ఒక సన్నని ప్రదేశం ఏర్పడుతుంది. దీనిని లేమి పొర అంటారు.

సంధికి దగ్గరగా ఉన్న n- రకంవైపు ధనావేశం, p- వైపు రుణావేశం ఏర్పడుతుంది. అందువల్ల p-n సంధివద్ద పొటెన్షియల్ అవరోధం ఏర్పడుతుంది. ఈ పొటెన్షియల్ అవరోధం ఆవేశ వాహకాలు సంధి వద్ద విసరణ చెందకుండా నిరోధిస్తుంది.

ప్రశ్న 2.
p-n సంధి ప్రవర్తనను చర్చించండి. సంధి వద్ద అవరోధ శక్మం ఎలా వృద్ధిచెందుతుంది?
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 8
ఒక p-n సంధి ఏర్పడినప్పుడు n – ప్రాంతంలోని ఎలక్ట్రాన్లు p- ప్రాంతం వైపుగా విసరణ చెంది, అక్కడి రంధ్రాలతో సంయోగం చెంది తటస్థీకృతం అవుతాయి. ఇదే విధంగా p- ప్రాంతంలోని రంధ్రాలు, n- ప్రాంతం వైపుగా విసరణ చెంది, అక్కడి ఎలక్ట్రాన్లతో సంయోగం చెంది తటస్థీకృతం అవుతాయి. ఫలితంగా సంధికి ఇరువైపులా ఎలాంటి ఆవేశ వాహకాలు లేని సన్నని పొర ఏర్పడుతుంది. దీనిని లేమి పొర అంటారు.

సంధి వద్ద n – ప్రాంతం వైపు ధనావేశం, p-ప్రాంతం వైపు రుణావేశం ఏర్పడతాయి. అందువల్ల సంధి వద్ద ఒక విద్యుత్ క్షేత్రం ఏర్పడుతుంది. దీనిని పొటెన్షియల్ అవరోధం అంటారు.

సంధికి ఒక వైపు నుంచి రెండవ వైపుగా రంధ్రాలు గాని, ఎలక్ట్రాన్లు గాని విసరణ చెందకుండా ఈ అవరోధ పొటెన్షియల్ నిరోధిస్తుంది.

ప్రశ్న 3.
పురోశక్మం, తిరోశక్మంలలో సంధి డయోడ్ (I-V) అభిలక్షణాలను గీసి, వివరించండి.
జవాబు:
అనువర్తిత వోల్టేజి (V) మరియు డయోడ్ గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహం (1) గీసిన గ్రాఫ్ను డయోడ్ యొక్క అభిలక్షణ వక్రం అంటారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 9

పురోబయాస్ వోల్టేజి (V) పెరిగిన కొద్దీ అవరోధ పొటెన్షియల్ తగ్గుతూ వస్తుంది. కాని మొట్టమొదట్లో (OA ప్రాంతం) విద్యుత్ ప్రవాహంలో వృద్ధి ఏమీ కనిపించదు. దీనికి కారణం అవరోధ పొటెన్షియల్ ఒకానొక పురోవోల్టేజి వద్ద విద్యుత్ ప్రవాహం చెప్పుకోదగినంతగా పెరగడం మొదలవుతుంది ఈ పురోవోల్టేజిని విచ్ఛేదన వోల్టేజి (లేదా) జాను వోల్టేజి అంటారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 10

తిరోబయాస్లో స్వల్ప విద్యుత్ ప్రవాహానికి కారణం అల్పసంఖ్యాక ఆవేశ వాహకాలు. అనువర్తిత తిరోవోల్టేజి, ఈ అల్ప సంఖ్యాక వాహకాలకు మాత్రం పురోబయాస్లో గా ఉంటుంది. అందువల్ల వ్యతిరేక దిశలో అతి స్వల్ప విద్యుత్ ప్రవహిస్తుంది. తిరోవోల్టేజిని ఇంకా పెంచుకుంటూపోతే ఒకానొక వోల్టేజి వద్ద విద్యుత్ ప్రవాహంలో హఠాత్తుగా విపరీతమైన పెరుగుదల కనిపిస్తుంది. ఈ ప్రాంతాన్ని విచ్ఛేదన ప్రాంతం అంటారు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు

ప్రశ్న 4.
అర్ధవాహక డయోడ్ను అర్ధ తరంగ ఏకధిక్కారిగా ఏవిధంగా ఉపయోగిస్తారో వర్ణించండి. [AP & TS. Mar.’16; Mar. ’14]
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 11

  1. ఒకే ఒక డయోడ్ అర్ధతరంగ ఏకధిక్కరణిని నిర్మిస్తారు. ఏకధిక్కరణం చేయవలసిన a.cని పరివర్తకం ప్రాథమిక తీగచుట్టకు, భారనిరోధం R ను గౌణ తీగచుట్టకు కలుపుతారు. భారనిరోధం R వద్ద నిర్గమనాన్ని తీసుకుంటారు.
  2. ధన అర్ధచక్రానికి డయోడ్ పురోబయాస్లో వుండి, దాని గుండా విద్యుత్ ప్రవహిస్తుంది.
  3. రుణ అర్ధచక్రానికి డయోడ్ తిరోబయాస్లో వుండి, భారనిరోధం గుండా విద్యుత్ ప్రవహించదు.
  4. కాబట్టి డయోడ్ గుండా ధనాత్మక అర్ధచక్రంలో మాత్రమే విద్యుత్ ప్రవహిస్తుంది. రుణాత్మక అర్ధచక్రంలోని విద్యుత్ ప్రవాహాన్ని డయోడ్ నిరోధిస్తుంది. అందువలన కేవలం ధన అర్ధ తరంగం మాత్రమే నిర్గమనం చెందుతాయి.
  5. నిర్గమన d.c సామర్ధ్యానికి, నివేశ a.c సామర్థ్యానికి గల నిష్పత్తిని ఏకధిక్కరణి దక్షత అంటారు.
    AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 12

ప్రశ్న 5.
ఏకధిక్కరణం అంటే ఏమిటి? పూర్ణతరంగ ఏకధిక్కరణి పనిచేసే విధానాన్ని వివరించండి. [AP & TS. Mar: ’15]
జవాబు:
ఏకాంతర విద్యుత్ ప్రవాహాన్ని ఏకముఖ విద్యుత్ ప్రవాహంగా మార్చే ప్రక్రియనే ఏకధిక్కరణం అంటారు. ఇందుకు వాడే పరికరాన్ని ఏకధిక్కరణి అంటారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 13

  1. పూర్ణ తరంగ ఏకధిక్కరణిని రెండు డయోడ్లు D, మరియు D లతో నిర్మిస్తారు.
  2. పరివర్తకం గౌణ తీగచుట్ట C వద్ద సెంటర్ ట్యాప్ చేయబడి, దాని చివరలకు D మరియు D డయోడ్ల _p-ప్రాంతాలు కలపబడతాయి.
  3. భారనిరోధం RL వద్ద నిర్గమన వోల్టేజిని తీసుకుంటాం.
  4. ధన అర్ధచక్రానికి, D1 పురోబయాస్లో పనిచేసి భారనిరోధం RL గుండా విద్యుత్ ప్రవహిస్తుంది. అదే కాలంలో డయోడ్ D2 తిరోబయాస్లో పనిచేసి అది స్విచ్ ఆఫ్ అవుతుంది.
  5. నివేశిత a.c యొక్క రుణ అర్ధచక్రాలకు డయోడ్ D2 పురోబయాస్లో లో పనిచేసి, RL, గుండా విద్యుత్ ప్రవహిస్తుంది. అదే కాలంలో D1 తిరోబయాస్లో ఉండి స్విచ్ ఆఫ్ అవుతుంది.
  6. అందువల్ల నివేశిత యొక్క రెండు అర్ధ చక్రాలలోను కూడా, భారనిరోధం RL గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహం ఒకే దిశలో మాత్రమే ఉంటుంది.
  7. నిర్గమ d.c సామర్ధ్యానికి, నివేశ a.c సామర్థ్యానికి గల నిష్పత్తిని ఏకధిక్కరణి దక్షత అంటారు.
    AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 14
    పూర్ణ తరంగ ఏకధిక్కరణి దక్షత 81.2 %

ప్రశ్న 6.
అర్ధ, పూర్ణ తరంగ ఏకధిక్కరణుల మధ్య భేదాలను తెల్పండి. [AP. Mar. ’17]
జవాబు:

అర్ధ తరంగ ఏకధిక్కరణిపూర్ణ తరంగ ఏకధిక్కరణి
1. ఒక డయోడు మాత్రమే ఉపయోగిస్తారు.1. రెండు డయోడ్లను ఉపయోగిస్తారు.
2. కేవలం అర్ధ తరంగం మాత్రమే ఏకధిక్కరణ చెందుతుంది.2. పూర్ణ తరంగం ఏకధిక్కరణ చెందుతుంది.
3. ఏకధిక్కరణి దక్షత η = \(\frac{0.406 \mathrm{R}_{\mathrm{L}}}{\mathrm{r}_{\mathrm{f}}+\mathrm{R}_{\mathrm{L}}}\)3. ఏకధిక్కరణి దక్షత η = \(\frac{0.812 \mathrm{R}_{\mathrm{L}}}{\mathrm{r}_{\mathrm{f}}+\mathrm{R}_{\mathrm{L}}}\)
4. అర్ధంతరంగా ఏకధిక్కరణి దక్షత 40.6%.4. పూర్ణతరంగ ఏకధిక్కరణి దక్షత 81.2 %.
5. నిర్గమనం విచ్ఛిన్నంగాను, స్పందనాత్మకంగా ఉంటుంది.5. నిర్గమనం అవిచ్ఛిన్నంగాను, స్పందనాత్మకంగా ఉంటుంది.

ప్రశ్న 7.
జీనర్ భంజన వోల్టేజి, అవలాంచి (avalanche) భంజన వోల్టేజి మధ్య భేదాలను తెల్పండి.
జవాబు:

జీనర్ భంజన వోల్టేజిఅవలాంచి (avalanche) భంజన వోల్టేజి
1. అధికంగా మాదీకరణం చెందిన డయోడ్లలో జీనర్ భంజన వోల్టేజి ఉంటుంది.1. అల్పంగా మాదీకరణం చెందిన డయోడ్లలో అవలాంచి భంజన వోల్టేజి ఉంటుంది.
2. ఇది అల్ప తిరోబయాస్ వోల్టేజి వద్ద ఉంటుంది.2. ఇది అధిక తిరోబయాస్ వోల్టేజి వద్ద ఉంటుంది.
3. క్షేత్ర ఉద్గారం వల్ల ఇది వస్తుంది.3. అభిఘాతాల వల్ల అయనీకరణచెంది ఇది వస్తుంది.
4. లేమి పొర మందం చాలా తక్కువగా ఉంటుంది.4. లేమి పొర మందం చాలా ఎక్కువగా ఉంటుంది.

ప్రశ్న 8.
స్వభావజ అర్ధవాహకాలలో రంధ్రాల వహనాన్ని వివరించండి.
జవాబు:
స్వచ్ఛమైన అర్ధవాహకాలను స్వభావజ అర్ధవాహకాలు అంటారు. తక్కువ ఉష్ణోగ్రత వద్ద సంయోజక పట్టీ ఎలక్ట్రాన్లతోను నిండి మరియు వహన పట్టీ ఖాళీగా ఉంటుంది. కాబట్టి అల్ప ఉష్ణోగ్రతల వద్ద ఇది బంధకంలాగా పనిచేస్తుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 15

ఉష్ణోగ్రత పెరిగే కొలది సంయోజక పట్టీలో ఎలక్ట్రాన్లు శక్తిని పొంది శక్తి అంతరాన్ని దాటి వహన పట్టీలోకి దూకుతాయి. సంయోజక పట్టీలో వాటిస్థానంలో ఖాళీ ఏర్పడుతుంది.

సంయోజక పట్టీలో ఖాళీని రంధ్రాలు (holes) అంటారు. రంధ్రాలు ధనావేశం కలిగి ఉంటాయి మరియు సంయోజక పట్టీలోనే చలిస్తాయి. దీని వల్ల రంధ్రాల విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది.

దీనిలో ఫెరీశక్తిస్థాయి నిషిద్ధ శక్తి పట్టికి మధ్యలో ఉంటుంది.

ప్రశ్న 9.
ఫోటో డయోడ్ అంటే ఏమిటి? అది పనిచేసే విధానాన్ని వలయ సహాయంతో వివరించి, దాని I-V అభిలక్షణాలను గీయండి.
జవాబు:
ఫోటో డయోడ్ :
ఫోటో డయోడ్ ఆప్టో ఎలక్ట్రానిక్స్ పరికరం. దీనిలో ఫోటాన్లు ఉత్తేజితం చెందినప్పుడు విద్యుత్ వాహకాలు జనిస్తాయి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 16
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 17

పనిచేయువిధానం :
పారదర్శక కిటికీ ద్వారా డయోడ్పై కాంతి పడే విధంగా దీన్ని తయారుచేస్తారు. ఈ డయోడ్ను తిరోశక్మంలో పనిచేయిస్తారు. ఫోటో డయాడ్ను ఫోటానులతో ప్రదీపనం చేసినప్పుడు ఎలక్ట్రాను – రంధ్రాల జంటలు ఉత్పత్తి అవుతాయి. సంధి వద్ద ఉన్న విద్యుత్ క్షేత్రం వల్ల ఎలక్ట్రాన్- రంధ్రాల పునఃసంయోగం కంటే ముందుగానే అవి వేరవుతాయి. అందువల్ల సంధి వల్ల తిరో విద్యుత్ ప్రవాహం ఉత్పత్తి అవుతుంది.

తిరోశక్యాన్ని అనువర్తించినట్లైతే పతన కాంతి తీవ్రతతో విద్యుత్ ప్రవాహంలో వచ్చే మార్పును చాలా సులభంగా గమనించవచ్చు. ఫోటో విద్యుత్ ప్రవాహంలో పెరుగుదల పతన కాంతి తీవ్రత పెరుగుదలపై ఆధారపడుతుంది.

ఫోటో డయోడ్ IV అభిలక్షణాలను పటం (b) లో చూడండి. ఫోటో విద్యుత్ ప్రవాహం పతన కాంతి తీవ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది.

ఉపయోగాలు :

  1. వీటిని కాంతి సంకేతాల శోధనకు ఫోటో శోధకంలాగా వాడవచ్చు.
  2. దృశా సంకేతాలను డీమాడ్యులేషన్ చేయడానికి ఉపయోగిస్తారు.

ప్రశ్న 10.
LED పనిచేసే విధానాన్ని వివరించండి. తక్కువ సామర్థ్యం ఉన్న సంప్రదాయ ఉష్ణదీప్త బల్బు (incandescent lamp) తో పోలిస్తే దీని లాభాలు ఏమిటి?
జవాబు:
కాంతి ఉద్గార డయోడ్:
విద్యుత్ శక్తిని, కాంతిశక్తిగా మార్చే కాంతి విద్యుత్ పరికరంను కాంతి ఉద్గార డయోడ్ అంటారు.

ఇది అధికంగా మాదీకరణం చెందిన p-n సంధి డయోడ్. దీనిలో స్వచ్ఛందంగా కాంతి ఉద్గారమవుతుంది. ఈ డయోడ్ పై పారదర్శక పొర ఉండుటచే ఉద్గార కాంతి బయటకు వస్తుంది.

పనిచేయు విధానం :
p-n సంధి డయోడ్ పురోబయాస్లో ఉన్నప్పుడు, సంధి వద్ద అధిక సంఖ్యాక ఆవేశ వాహకాలలో కదలిక వస్తుంది. ఎలక్ట్రాన్లు n ప్రాంతం నుండి p- ప్రాంతానికి మరియు రంధ్రాలు p- ప్రాంతం నుండి n- ప్రాంతానికి పంపబడతాయి.

దీని ఫలితంగా సంధి వద్ద అధిక ఆవేశ వాహకాల గాఢత పెరుగుతుంది. సంధి వద్ద బయాస్ లేదు కాబట్టి అల్పసంఖ్యాక వాహకాలు సంధికి దగ్గరలో ఉన్న అధిక సంఖ్యాక వాహకాలతో పునఃసంయోగం చెందుతాయి. పునఃసంయోగం వల్ల శక్తి ఫోటాన్ల రూపంలో విడుదలవుతుంది.

ఉష్ణదీప్త కాంతి జనకాల కన్నా LED ల వల్ల లాభాలు :

  1. LED లు చాలా చవకైనవి మరియు దృఢమైనవి.
  2. అల్ప పనిచేసే వోల్టేజి, తక్కువ సామర్థ్యం.
  3. వేగవంతమైన చర్య, వేడెక్కడానికి సమయం అవసరం లేదు.
  4. వీటిని బల్గర్ అలారమ్లలో వాడతారు.

ప్రశ్న 11.
సౌర ఘటం పనిచేసే విధానాన్ని తెలిపి దాని I-V అభిలక్షణాలను గీయండి.
జవాబు:
సౌర ఘటం ప్రాథమికంగా ఒక p-n సంధి, సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మార్చే పరికరాన్ని సౌరఘటం అంటారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 18

దీనిలో సిలికాన్ (లేదా) జర్మేనియమ్ – ఆర్సెనిక్ p-n సంధి డయోడ్ను, పైన గాజు మూత గల క్యాన్లో అమర్చుతారు. పై పొరలో p-రకం అర్ధవాహకం ఉంటుంది. ఇది బాగా పలుచగా ఉంటుంది. కాబట్టి పతన కాంతి ఫోటాన్లు తేలికగా p-n సంధిని చేరతాయి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 19

పనిచేయు విధానం :
కాంతి సంధి వద్ద పతనం చెందినప్పుడు, అక్కడ ఎలక్ట్రాన్ రంధ్రాల (e-h) జంటలు జనిస్తాయి. సంధి వద్ద విద్యుత్ క్షేత్రం వల్ల ఎలక్ట్రాన్లు మరియు రంధ్రాలు వ్యతిరేక దిశలలో చలిస్తాయి. తద్వారా p – వైపు ధనాత్మకం, n – వైపు రుణాత్మకం అయ్యి ఫోటో వోల్టేజిని ఇస్తాయి.

పై లోహపు ఎలక్ట్రోడ్ ధనాత్మకంగాను, అడుగున ఉన్న లోహపు ఎలక్ట్రోడ్ రుణాత్మకం అవుతాయి. ఈ లోహ ఎలక్ట్రోమ్లలకు భారనిరోధాన్ని కలిపితే ఫోటో విద్యుత్ భారం ద్వారా ప్రవహిస్తుంది.

I-V అభిలక్షణాలు:
సౌరఘటం విలక్షణ IV అభిలక్షణాలను చూపుతుంది. నిరూపక అక్షాల నాల్గవ భాగంలో ఘటం అభిలక్షణాలు గీస్తారు. ఎందుకంటే సౌరఘటం విద్యుత్ ప్రవాహాన్ని నిరోధానికి సరఫరా చేస్తుందే గాని అది తీసుకోదు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 20

ఉపయోగాలు :
సౌరఘటాలను కాలిక్యులేటర్స్, చేతిగడియారాలలో కృత్రిమ ఉపగ్రహాలలోను ఉపయోగిస్తారు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు

ప్రశ్న 12.
వివిధ రకాల ట్రాన్సిస్టర్ విన్యాసాలను పటాల సహాయంతో వివరించండి.
జవాబు:
ట్రాన్సిస్టర్ యొక్క మూడు విన్యాసాలు

  1. ఉమ్మడి ఆధార విన్యాసం
  2. ఉమ్మడి ఉద్గార విన్యాసం
  3. ఉమ్మడి సేకరణి విన్యాసం

1) ఉమ్మడి ఆధార విన్యాసం :
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 21
ఉమ్మడి ఆధార విన్యాసంలో ఆధారంను భూమికి కలపబడుతుంది. ఆధారం నివేశ, నిర్గమనాలకు ఉమ్మడిగా ఉంటుంది. ఆధారం – ఉద్గారకం మధ్య నివేశనాన్ని ఇచ్చి ఆధారం – సేకరణి మధ్య నిర్గమనాన్ని తీసుకుంటారు.

2) ఉమ్మడి ఉద్గార విన్యాసం :
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 22
ఈ రకం విన్యాసంలో ఉద్గారకంను భూమికి కలుపుతారు. ఆధారం – ఉద్గారకంల మధ్య నివేశనాన్ని ఇచ్చి ఉద్గారకం సేకరణి మధ్య నిర్గమనాన్ని తీసుకుంటారు. ఉద్గారకం నివేశ, నిర్గమనాలకు ఉమ్మడిగా ఉంటుంది.

3) ఉమ్మడి సేకరణి విన్యాసం :
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 23
ఈ రకం విన్యాసంలో సేకరణిని భూమికి కలుపుతారు. సేకరణి నివేశ, నిర్గమనాలకు ఉమ్మడిగా ఉంటుంది. సేకరణి – ఆధారం మధ్య నివేశనాన్ని ఇచ్చి సేకరణి – ఉద్గారకం మధ్య నిర్గమనాన్ని తీసుకుంటారు.

ప్రశ్న 13.
ట్రాన్సిస్టర్ మీటగా ఎలా పనిచేస్తుందో వివరించండి.
జవాబు:
ట్రాన్సిస్టర్ స్విచ్ వలె పనిచేయడాన్ని అర్థం చేసుకుందాం.
i) మొత్తానికి Vi తక్కువైతే, ట్రాన్సిస్టర్ పురోబయాస్లో ఉండదు. Vcc వద్ద V0 అధికం.
ii) Vi అధికంగా ఉంటే, ట్రాన్సిస్టర్ సంతృప్త స్థితికి మారి, V0 తక్కువగా ఉంటుంది. అనగా సున్నాకు దగ్గరగా ఉంటుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 24
iii) ట్రాన్సిస్టర్ పనిచేయకపోతే అది స్విచ్ ఆఫ్గను మరియు సంతృప్త స్థితిని చేరితే స్విచ్ ఆన్ అంటారు.
iv) నివేశం తక్కువైతే నిర్గమనం ఎక్కువగాను, నివేశం ఎక్కువైతే, నిర్గమనం తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు.
v) ట్రాన్సిస్టర్ను సంతృప్త స్థితిలో స్విచ్గా ఉపయోగించవచ్చు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 25

ప్రశ్న 14.
డోలకంగా ట్రాన్సిస్టర్ ఏ విధంగా పనిచేస్తుందో వివరించండి.
జవాబు:
i) డోలకంలో బాహ్య నివేశ సంకేతం లేకుండా a.c నిర్గమనాన్ని పొందవచ్చు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 26
ii) ట్రాన్సిస్టర్ VBB బ్యాటరీతో పురోబయాస్లో ఉన్నప్పుడు ఉద్గార – ఆధార వలయంలో L – C వలయాన్ని చేర్చాలి.
iii) L1 తీగచుట్టను సేకరణి – ఉద్గార వలయంలో చేర్చాలి. ఇది L లో సంయుగ్మంగా ఉంటుంది.

పనిచేయు విధానం:

  1. కీ (K) ని మూస్తే, L1 ప్రేరకం వల్ల బలహీన సేకరణి విద్యుత్ ప్రవాహం కాలంతో పాటు పెరుగుతుంది. ఫలితంగా L1 మరియు L లో అయస్కాంత అభివాహం పెరుగుతుంది.
  2. అన్యోన్య ప్రేరణ వల్ల, L లో విద్యుచ్ఛాలక బలం ప్రేరితమై C కెపాసిటర్ యొక్క పై పలకలో మారుతుంది. పర్యవసానంగా ఉద్గార – ఆధార వలయంను బలపరుస్తుంది.
  3. దీని ఫలితంగా ఉద్గార ప్రవాహం పెరుగుతుంది మరియు సేకరణి ప్రవాహం కూడా పెరుగుతుంది.
  4. దీని వలన, L1 మరియు L లలో అయస్కాంత అభివాహం అధికంగా పెరుగుతుంది.
  5. పై ప్రక్రియ కొనసాగుతూ సేకరణి ప్రవాహం గరిష్ఠ (లేదా) సంతృప్త స్థితిని చేరుతుంది.
  6. డోలకంలో ట్యూనింగ్ వలయం యొక్క అనునాద పౌనఃపున్యము
    ν = \(\frac{1}{2 \pi \sqrt{L C}}\)

ప్రశ్న 15.
NAND, NOR ద్వారాలను నిర్వచించి వాటి నిజ పట్టికలను ఇవ్వండి. [TS. Mar.’17]
జవాబు:
NAND ద్వారం :
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 27
AND ద్వారం యొక్క నిర్గమనానికి NOT ద్వారంను కలిపితే NAND ద్వారంను పొందవచ్చు. NAND ద్వారంను సార్వత్రిక ద్వారం అంటారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 28

  1. రెండు నివేశాలు అల్పమైతే, నిర్గమనం అధికం
    A = 0, B = 0, X = 1
  2. ఏ నివేశనం అయినా అల్పమైతే, నిర్గమనం అధికం
    A = 0, B = 1, X = 1
    A = 1, B = 0, X = 1
  3. రెండు నివేశాలు అధికమైతే, నిర్గమనం అల్పం
    A = 1, B = 1, X = 1

NOR ద్వారం :
OR ద్వారం యొక్క నిర్గమనానికి NOT ద్వారంను కలిపితే NOR ద్వారం ఏర్పడుతుంది. దీనిలో రెండు (లేదా) ఎక్కువ నివేశాలు మరియు ఒక నిర్గమనం ఉంటాయి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 29
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 30

  1. రెండు నివేశాలు అల్పమైతే, నిర్గమనం అధికం.
    A = 0, B = 0, X = 1
  2. ఏ నివేశ నిర్గమనం అయినా అధికమైతే, నిర్గమనం అల్పం.
    A = 0, B = 1, X = 0
    A = 1, B = 0, X = 0
  3. రెండు నివేశాలు అధికమైతే, నిర్గమనం అల్పం.
    A = 1, B = 1, X = 0

NOR ద్వారంను సార్వత్రిక ద్వారం అంటారు.

ప్రశ్న 16.
NOT ద్వారం పనితీరును వివరించి దాని నిజ పట్టికను ఇవ్వండి.
జవాబు:
NOT ద్వారం :
NOT ద్వారం ఆధార ద్వారం. దీనిలో ఒక నివేశం మరియు ఒక నిర్గమనం ఉంటాయి. NOT ద్వారంను ఇన్వర్టర్ అంటారు. NOT ద్వారం వలయ సంకేతాన్ని పటంలో చూడండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 31

i) నివేశం అల్పమైతే నిర్గమనం అధికం
A = 0, X = \(\overline{\mathrm{0}}\) = 1

ii) నివేశం అధికమైతే నిర్గమనం అల్పం
A = 1, X = T = 0

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సంధి డయోడ్ అంటే ఏమిటి? సంధి వద్ద లేమి పొర ఎలా ఏర్పడుతుందో వివరించండి. వాలు, బయాస్, ఎదురు బయాస్లలో లేమి పొరలో వచ్చే మార్పులను వివరించండి.
జవాబు:
p-n సంధి డయోడ్ :
p- రకం అర్ధవాహకాన్ని, n- రకం అర్ధవాహకంతో తగిన విధంగా జతపరిస్తే p-n సంధి డయోడ్ ఏర్పడుతుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 32
p-n సంధి డయోడ్ వలయం సంకేతాన్ని పటంలో చూడండి.

సంధి వద్ద లేమి పొర ఏర్పదుట:
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 33
ఒక p-n సంధి ఏర్పడినప్పుడు n ప్రాంతంలోని స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు p- ప్రాంతంవైపుగా విసరణచెంది అక్కడ ఉండే రంధ్రాలలో తటస్థీకృతం అవుతాయి. ఇదే విధంగా p ప్రాంతంలోని రంధ్రాలు, n- ప్రాంతంవైపుగా విసరణచెంది, అక్కడి ఎలక్ట్రాన్లతో సంయోగం చెంది తటస్థీకృతం అవుతాయి. దీని ఫలితంగా సంధికి ఇరువైపులా, ఎలాంటి ఆవేశవాహకాలు లేని ఒక పలుచని పొర ఏర్పడుతుంది. దీనిని లేమిపొర అంటారు.

సంధికి దగ్గరగా ఉన్న n – రకం ధనావేశితం కావడం, p రకం రుణావేశితం కావడం జరుగుతుంది. దీని ఫలితంగా సంధి వద్ద విద్యుత్ క్షేత్రం ఏర్పడుతుంది. దీనినే పొటెన్షియల్ అవరోధం అంటారు. సంధికి ఒక వైపునుండి రెండవ వైపుగా రంధ్రాలుగాని, ఎలక్ట్రాన్లుగాని విసరణ చెందకుండా ఈ అవరోధ పొటెన్షియల్ నిరోధిస్తుంది.

అవరోధ పొటెన్షియల్ విలువ (1) స్ఫటిక స్వభావం మీద (2) ఉష్ణోగ్రత మీద (3) మాదీకరణం పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది.

పురోబయాస్ :
“ఒక బ్యాటరీ ధన ధ్రువాన్ని p- ప్రాంతానికి, రుణధ్రువాన్ని n- ప్రాంతానికి కలిపితే, ఆ డయోడ్ పురోబయాస్లో ఉందని అంటారు”.
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 34

p – ప్రాంతంలోని రంధ్రాలు బ్యాటరీ ధనధ్రువం చేత వికర్షింపబడి, సంధివైపుగా ప్రయాణిస్తాయి. అదేవిధంగా n – ప్రాంతంలోని ఎలక్ట్రాన్లు బ్యాటరీ రుణ ధ్రువం చేత వికర్షింపబడి, సంధివైపుగా ప్రయాణిస్తాయి.

దీని ఫలితంగా లేమి పొర మందం తగ్గుతుంది. ఆవేశ వాహకాలు సంధిని దాటుట వల్ల వలయంలో విద్యుత్ ప్రవహిస్తుంది.

పురోబయాస్లో ఉన్నప్పుడు డయోడ్ నిరోధం చాలా తక్కువ. దీనిని స్విచ్ ఆన్ స్థితి అంటారు.

తిరోబయాస్ :
“ఒక బ్యాటరీ రుణ ధ్రువాన్ని p-ప్రాంతానికి, ధనధ్రువాన్ని an-ప్రాంతానికి కలిపితే ఆ డయోడ్ తిరోబయాస్లో ఉందని అంటారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 35

p- ప్రాంతంలోని రంధ్రాలు బ్యాటరీ రుణ ధ్రువంచేత ఆకర్షింపబడి సంధి నుండి దూరంగా జరుగుతాయి. అదేవిధంగా n ప్రాంతంలోని ఎలక్ట్రాన్లు బ్యాటరీ ధన ధ్రువం వైపు ఆకర్షింపబడి సంధి నుండి దూరంగా జరుగుతాయి. దీని ఫలితంగా సంధి వద్ద లేమి పొర మందం పెరుగుతుంది. మరియు అవరోధ పొటెన్షియల్ కూడా పెరుగుతుంది. కాబట్టి p – n సంధి డయోడ్ నిరోధం పెరుగుతుంది. డయోడ్ తిరోబయాస్లో ఉంటే దానిని స్విచ్ ఆఫ్ స్థితి అంటారు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు

ప్రశ్న 2.
ఏకధిక్కరణి అంటే ఏమిటి? పటాల సహాయంతో అర్ధ, పూర్ణ తరంగ ఏకధిక్కరణుల పనివిధానాన్ని వివరించండి.
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 36

  1. ఒకే ఒక డయోడ్తో అర్ధతరంగ ఏకధిక్కరణిని నిర్మిస్తారు. ఏకధిక్కరణం చేయవలసిన a.c ని పరివర్తకం ప్రాథమిక తీగచుట్టకు, భారనిరోధం R ను గౌణ తీగచుట్టకు కలుపుతారు. భారనిరోధం R. వద్ద నిర్గమనాన్ని తీసుకుంటారు.
  2. ధన అర్ధచక్రానికి డయోడ్ పురోబయాస్లో వుండి, దాని గుండా విద్యుత్ ప్రవహిస్తుంది.
  3. రుణ అర్ధచక్రానికి డయోడ్ తిరోబయాస్లో వుండి, భారనిరోధం గుండా విద్యుత్ ప్రవహించదు.
  4. కాబట్టి డయోడ్ గుండా ధనాత్మక అర్ధచక్రంలో మాత్రమే విద్యుత్ ప్రవహిస్తుంది. రుణాత్మక అర్ధచక్రంలోని విద్యుత్ ప్రవాహాన్ని డయోడ్ నిరోధిస్తుంది. అందువలన కేవలం ధన అర్ధ తరంగం మాత్రమే నిర్గమనం చెందుతాయి.
  5. నిర్గమని d.c సామర్ధ్యానికి, నివేశ a.c సామర్థ్యానికి గల నిష్పత్తిని ఏకధిక్కరణి దక్షత అంటారు.
    AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 37
    ఇక్కడ rf = డయోడ్ పురోనిరోధం, RL = భార నిరోధం
    ఏకధిక్కరణి దక్షత 40.6%.

ఏకాంతర విద్యుత్ ప్రవాహాన్ని ఏకముఖ విద్యుత్ ప్రవాహంగా మార్చే ప్రక్రియనే ఏకధిక్కరణ అంటారు. ఇందుకు వాడే పరికరాన్ని ఏకధిక్కరణి అంటారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 38

  1. పూర్ణ తరంగ ఏకధిక్కరణిని రెండు డయోడ్లు D1 మరియు D2 లతో నిర్మిస్తారు.
  2. పరివర్తకం గౌణ తీగచుట్ట C వద్ద సెంటర్ ట్యాప్ చేయబడి, దాని చివరలకు D1 మరియు D2 డయోడ్ల p- ప్రాంతాలు కలపబడతాయి.
  3. భారనిరోధం RL వద్ద నిర్గమన వోల్టేజిని తీసుకుంటాం.
  4. ధన అర్ధచక్రానికి, D1 పురోబయాస్ లో పనిచేసి భారనిరోధం RL గుండా విద్యుత్ ప్రవహిస్తుంది. అదే కాలంలో డయోడ్ D2 తిరోబయాస్లో పనిచేసి అది స్విచ్ ఆఫ్ అవుతుంది.
  5. నివేశిత a.c యొక్క రుణ అర్ధచక్రాలకు డయోడ్ D2 పురోబయాస్లో పనిచేసి, RL గుండా విద్యుత్ ప్రవహిస్తుంది. అదే కాలంలో D1 తిరోబయాస్లో ఉండి స్విచ్ ఆఫ్ అవుతుంది.
  6. అందువల్ల నివేశిత యొక్క రెండు అర్ధ చక్రాలలోను కూడా, భారనిరోధం RL గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహం ఒకే దిశలో మాత్రమే ఉంటుంది.
  7. నిర్గమ d.c సామర్ధ్యానికి, నివేశ a.c సామర్థ్యానికి గల నిష్పత్తిని ఏకధిక్కరణి దక్షత అంటారు.
    AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 39
    పూర్ణ తరంగ ఏకధిక్కరణి దక్షత 81.2 %

ప్రశ్న 3.
జీనర్ డయోడ్ అంటే ఏమిటి? దాన్ని వోల్టేజి నియంత్రణిగా ఎలా ఉపయోగిస్తారో వివరించండి.
జవాబు:
జీనర్ డయోడ్ :
ఇది అధికంగా మాదీకరణం చెందిన జర్మేనియం (లేదా) సిలికాన్ – సంధి డయోడ్. ఇది తిరోబయాస్లో విచ్ఛేదన ప్రాంతంలో పనిచేస్తుంది.

జీనర్ డయోడ్ వలయ సంకేతాన్ని పటంలో చూడండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 40

జీనర్ డయోడ్ను వోల్టేజి నియంత్రకంగా వాడతారు. సాధారణంగా జీనర్ డయోడ్ను వలయాలలో తిరోబయాస్లో కలుపుతారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 41

  1. ఒక నిరోధం R గుండా జీనర్ డయోడ్ని బ్యాటరీకి కలుపుతారు. జీనర్ డయోడ్ తిరోబయాస్లో ఉండేటట్లుగా బ్యాటరీ ధ్రువాలను డయోడ్కి కలుపుతాం.
  2. భారనిరోధం RL ను డయోడు సమాంతరంగా కలుపుతారు.
  3. భారనిరోధం RL లేనప్పుడు డయోడ్ కాలిపోకుండా, దాని గుండా ప్రవహించగలిగిన గరిష్ఠ విద్యుత్ ప్రవాహానికి, డయోడ్లోని ప్రవాహం పరిమితం అయ్యేటట్లుగా R విలువను ఎన్నుకుంటాం.
  4. ఇప్పుడు డయోడ్కు సమాంతరంగా కలిపిన భారనిరోధం తనగుండా ప్రవాహాన్ని లాగుకోంటుంది.
  5. అంటే మొత్తంలో విద్యుత్ ప్రవాహము డయోడ్లో తగ్గుతుంది. కాని భారనిరోధం వద్ద వోల్టేజి స్థిరంగా ఉంటుంది.
  6. నిర్గమన వోల్టేజిలోని హెచ్చు, తగ్గులను R నిరోధం సర్దుబాటు చేస్తుంది. భారనిరోధం వద్ద వోల్టేజి స్థిరంగా ఉంటుంది.
  7. భారనిరోధం RL మారుతున్నప్పుటికీ, జీనర్ డయోడికి సమాంతరంగా ఉండే వోల్టేజి స్థిరంగా ఉంటుంది. అందువల్ల జీనర్ డయోడ్ వోల్టేజి నియంత్రకంగా పనిచేస్తుంది.
  8. నివేశన ప్రవాహం I, జీనర్ ప్రవాహం IZ మరియు భార ప్రవాహం IL అయితే
    I = IZ + IL ; Vనివేశ = IR + VZ
    కాని Vనిర్గమ = VZ
    ∴ Vనిర్గమ = Vనివేశ – IR

ప్రశ్న 4.
ట్రాన్సిస్టర్ను వర్ణించి దాని పనితీరును వివరించండి.
జవాబు:
ట్రాన్సిస్టర్ :
ట్రాన్సిస్టర్ రెండు p- సంధులు ఒకదాని తర్వాత ఒకటి అమర్చినట్లు ఉండే పరికరం. ట్రాన్సిస్టర్ అనగా నిరోధం బదిలీ అని అర్ధం.

ట్రాన్సిస్టర్లో మూడు ప్రాంతాలు ఉంటాయి. అవి (1) ఉద్గారకం (2) ఆధారం (3) సేకరణి

(1) ఉద్గారకం (E) :
ట్రాన్సిస్టర్లో ఒక చివర ఉండే భాగాన్ని ఉద్గారకం అంటారు. ఇది అత్యధికంగా మాదీకరణం చెందిన ప్రాంతం. ఇది ఆవేశ వాహకాలను సప్లై చేస్తుంది.

(2) ఆధారం (B) :
ఇది ట్రాన్సిస్టర్లో మధ్యభాగం. ఇది చాలా తక్కువగా మాదీకరణం చెంది ఉంటుంది. చాలా పల్చగా ఉంటుంది. దీనిలోకి ప్రవేశించిన ఆవేశ వాహకాలు తటస్థీకరణం చెందకుండా సేకరణిలోనికి ప్రవేశిస్తాయి.

(3) సేకరణి (C) :
ఇది ట్రాన్సిస్టర్ రెండవ చివరిభాగం. ఇది ఒక మాదిరిగా మాదీకరణం చెంది ఉంటుంది. భౌతికంగా ఇది పెద్దదిగా ఉంటుంది. ఆధారం నుండి వచ్చే ఆవేశ వాహకాలను సేకరిస్తుంది.

గమనిక :
సాధారణంగా ఉద్గార సంధి పురోబయాస్లోను, సేకరణిసంధి తిరోబయాస్లోను ఉంటుంది.

p-n-p ట్రాన్సిస్టర్ పనిచేయు విధానం :
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 42
ఇందులో ఆధారభాగం n- రకంతోను, ఉద్గార మరియు సేకరణి భాగాలు p-రకంతోను తయారవుతాయి. p-n-p ట్రాన్సిస్టర్ యొక్క వలయ సంకేతాన్ని పటంలో చూడండి.

బ్యాటరీ ధనధ్రువాన్ని ఉద్గారకానికి, రుణధ్రువాన్ని ఆధారానికి కలిపి ఉద్గార సంధికి పురోబయాస్ని అనువర్తిస్తారు. అదే విధంగా రెండవ బ్యాటరీ రుణ ధ్రువాన్ని సేకరణికి, ధనధ్రువాన్ని ఆధారానికి కలిపి సేకరణి సంధికి తిరోబయాస్ ను అనువర్తిస్తారు.

ఉద్గారకం (p-ప్రాంతం) లోని రంధ్రాలు బ్యాటరీ ధన ధ్రువం చేత వికర్షింపబడి, ఉద్గారసంధిని దాటి ఆధారంలోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల ఉద్గార విద్యుత్ (IE) జనిస్తుంది. ఆధారంలోకి చేరిన రంధ్రాలలో కొన్ని అక్కడి ఎలక్ట్రాన్లచే తటస్థీకృతం అవుతాయి. ఫలితంగా ఆధార విద్యుత్ ప్రవాహం (IB) జనిస్తుంది. ఆధారంలోకి ప్రవేశించిన రంధ్రాలలో అధికభాగం తటస్థం చెందకుండా సేకరణిలోకి ప్రవేశిస్తాయి. ఈ రంధ్రాలను బ్యాటరీరుణధ్రువం తనవైపుకు లాక్కుంటుంది. ఇందువల్ల సేకరణి విద్యుత్ ప్రవాహం (IC) జనిస్తుంది.
IE = IB + IC

p-n-p ట్రాన్సిస్టర్ లోపల ఆవేశ వాహకాలు రంధ్రాలు, కాని బాహ్యవలయంలో ఆవేశ వాహకాలు ఎలక్ట్రాన్లు.

n-p-n ట్రాన్సిస్టర్ :
దీనిలో ఆధారభాగం p-రకంతోను, ఉద్గారకం మరియు సేకరణి భాగాలు n-రకం అర్ధవాహకాలతో తయారవుతాయి. n-p-n ట్రాన్సిస్టర్ వలయ సంకేతాన్ని పటంలో చూడండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 43

బ్యాటరీ రుణధ్రువాన్ని ఉద్గారానికి, ధనధ్రువాన్ని ఆధారానికి కలిపి ఉద్గారసంధి పురోబయాస్లో లో ఉండేటట్లు చేస్తారు. ఇదే విధంగా రెండవ బ్యాటరీ రుణధ్రువాన్ని ఆధారానికి, ధనధ్రువాన్ని సేకరణికి కలిపి సేకరణి సంధి తిరోబయాస్లో ఉండేట్లు చేస్తారు.

ఉద్గారకం (n-ప్రాంతం) లోని ఎలక్ట్రాన్లు బ్యాటరీ రుణ ధ్రువం చేత వికర్షింపబడి, ఉద్గార సంధిని దాటుతాయి. దీని వల్ల ఉద్గార విద్యుత్ ప్రవాహం (IE) ఏర్పడుతుంది. ఆధారంలోకి ప్రవేశించిన కొన్ని ఎలక్ట్రాన్లు అక్కడి రంధ్రాలతో సంయోగం చెంది తటస్థీకృతం అవుతాయి. దీనివల్ల ఆధారప్రవాహం (IB) జనిస్తుంది.

అధిక సంఖ్యలో ఎలక్ట్రాన్లు సేకరణి సంధిని దాటి, సేకరణిలోకి ప్రవేశిస్తాయి. రెండవ బ్యాటరీ ధనధ్రువం, ఈ ఎలక్ట్రాన్లను తనవైపు లాక్కొని, సేకరణి విద్యుత్ ప్రవాహం (IC) కారణమవుతుంది.
IE = IB + IC

n-p-n ట్రాన్సిస్టర్ లోపల మరియు వెలుపల ఆవేశ వాహకాలు ఎలక్ట్రాన్లు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు

ప్రశ్న 5.
వర్ధనం అంటే ఏమిటి? ఉమ్మడి ఉద్గారక వర్ధకం పనిచేసే విధానాన్ని అవసరమైన పటం సహాయంతో వివరించండి.
జవాబు:
వర్ధనం :
బలహీనమయిన ఒక సంకేత బలాన్ని పెంచే ప్రక్రియను వర్ధనం అంటారు. ఈ పనిచేసే పరికరాన్ని వర్ధకం అంటారు.

ఈ పద్ధకాలు రెండు (1) సామర్థ్య వర్ధకాలు (2) వోల్టేజి వర్ధకం

వర్ధన గుణకం :
నిర్గమ వోల్టేజికి, నివేశన వోల్టేజికి గల నిష్పత్తిని వర్ధన గుణకం అంటారు.
A = \(\frac{V_0}{V_i}\)

ఉమ్మడి ఉద్గార్ ట్రాన్సిస్టర్ వర్ధకం:
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 44
n-p-n ఉమ్మడి ఉద్గార వర్ధక వలయాన్ని పటంలో చూడండి. ఈ వలయంలో బ్యాటరీ VBB ద్వారా ఆధార ఉద్గార సంధికి అవసరమైన బయాస్ వోల్టేజి VBE సమకూరుతుంది. బ్యాటరీ VCC ద్వారా సేకరణి ఉద్గారకాల మధ్య VCE పొటెన్షియల్ భేదం ఏర్పడుతుంది. ఉద్గార సంధి పురోబయాస్లోను, సేకరణిసంధి తిరోబయాస్లోను ఉన్నాయి. ఉద్గారకం నుండి వెలువడే ఎలక్ట్రాన్లు దాదాపు అన్నీ ఆధారప్రాంతాన్ని దాటి సేకరణిలోకి ప్రవేశిస్తాయి.

వర్ధనం చెందవలసిన నివేశన సంకేతం ఆధార వలయంలో బ్యాటరీ VBB తో శ్రేణిలో కలపబడి ఉంటుంది. భారనిరోధం RL ని సేకరణి వలయంలో కలిపి ఉంచుతాయి. నిర్గమన వోల్టేజిని RL కు సమాంతరంగా తీసుకుంటారు.

నివేశ సంకేతం కారణంగా, ఆధారం – ఉద్గారకం వోల్టేజి VBE మారుతుంది. దానికి అనురూపంగా ఆధార ప్రవాహం (IB) కూడా మారుతూ ఉంటుంది. దీనివల్ల సేకరణి ప్రవాహం (∆IC) లో పెద్దగా మార్పు వస్తుంది. RL వద్ద సేకరణి, ఉద్గారకంలోని వోల్టేజిలో మార్పు (∆VCE) ను తీసుకుంటారు. ఈ విధంగా RL వద్ద వర్ధనం చెందిన వోల్టేజిని పొందవచ్చు.

ప్రవాహ లాభం (β) :
సేకరణి ప్రవాహంలో మార్పుకు మరియు ఆధార ప్రవాహంలో మార్పుకు గల నిష్పత్తిని ప్రవాహ లాభం అంటారు. β = \(\frac{\Delta \mathrm{I}_{\mathrm{C}}}{\Delta \mathrm{I}_{\mathrm{B}}}\)

వోల్టేజి లాభం (AV) :
నిర్గమన వోల్టేజిలో మార్పుకు (∆VCE) మరియు నివేశ వోల్టేజిలో మార్పుకు గల నిష్పత్తిని వోల్టేజి లాభం అంటారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 45

సామర్ధ్య లాభం :
ప్రవాహ లాభం, వోల్టేజి లాభాల నిష్పత్తిని సామర్ధ్య లాభం అంటారు.
సామర్ధ్య లాభం (Ap) = ప్రవాహ లాభం × వోల్టేజి లాభం.

ప్రశ్న 6.
రెండు డయోడ్లను ఉపయోగించి OR ద్వారాన్ని గీసి దాని పనితీరును వివరించండి. OR ద్వారం నిజ పట్టికను, తర్క సంకేతాన్ని వ్రాయండి.
జవాబు:
OR ద్వారం :
ఈ ద్వారం రెండు నివేశిత టెర్మినల్లు, ఒక నిర్గమన టెర్మినల్ కలిగి ఉంటుంది. రెండు నివేశాలు తక్కువైతే, నిర్గమనం కూడా తక్కువ అవుతుంది. ఒక నివేశిత టెర్మినల్ ఎక్కువ (లేదా) రెండు నివేశాలు ఎక్కువైతే, నిర్గమనం కూడా ఎక్కువ. OR ద్వారం సత్యపట్టికను పటంలో చూడండి.

ABQ = A + B
తక్కువతక్కువతక్కువ
ఎక్కువతక్కువఎక్కువ
తక్కువఎక్కువఎక్కువ
ఎక్కువఎక్కువఎక్కువ
నివేశాలునిర్గమనం
ABQ = A + B
000
101
011
111

సత్యపట్టికలో ఇచ్చిన లాజిక్ ప్రమేయాన్ని A OR B ద్వారా రాయాలి. ‘OR’ లాజిక్ ప్రమేయాన్ని కూడిక ద్వారాచూపాలి. Q = A + B

డయోడ్లను ఉపయోగించి OR ద్వారాన్ని పొందుట :
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 46
D1, D2 లు రెండు డయోడ్లు, పొటెన్షియల్ 5V విలువను ఒకటిగాను IV పొటెన్షియల్ను సున్నాగాను గుర్తించాలి.

A = 0, B = 0 అయితే రెండు డయోడ్లు తిరోబయాస్లో ఉండి, వాటి గుండా విద్యుత్ ప్రవహించదు. అందువల్ల Q వద్ద పొటెన్షియల్ సున్నా అవుతుంది. i. e., Q = 0.
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 47

A = 1, B = 0 అయినప్పుడు D1 పురోబయాస్ చెంది, A = 0, B = 1 అయినప్పుడు D, పురోబయాస్ల్చెంది, A = 1, B = 1 అయినప్పుడు రెండు డయోడ్లు D1 మరియు పురోబయాస్ చెంది, R గుండా విద్యుత్ ప్రవహిస్తుంది. దీని వల్ల నిర్గమనంలో Q = 1 అవుతుంది. నిర్గమన విలువలు OR ద్వారానికి సమానంగా ఉండటం గుర్తించవచ్చు.

ప్రశ్న 7.
రెండు డయోడ్లతో ప్రాథమిక AND వలయాన్ని గీసి దాని పనితీరును వివరించండి.
జవాబు:
AND ద్వారం :
AND ద్వారం రెండు నివేశిత టెర్మినల్లు ఒక నిర్గమ టెర్మినల్ కలిగి ఉంటుంది.
రెండు నివేశాలు తక్కువ (లేదా) ఏ ఒక్క నివేశిత విలువ తక్కువైనా నిర్గమనం తక్కువ.
రెండు నివేశాలు ఎక్కువ అయినప్పుడు మాత్రమే నిర్గమనం ఎక్కువ.

లాజిక్ ప్రమేయాన్ని AND అనేది చుక్క (Dot) ద్వారా సూచించినట్లయితే Q = A.B గా గుర్తించాలి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 48

వలయంలో వాడే AND ద్వారాన్ని పటంలో చూడండి. AND లాజిక్ ప్రమేయాన్ని గుణింతంలో పోల్చవచ్చు.

నివేశాలునిర్గమనం
ABQ = A.B
తక్కువతక్కువతక్కువ
ఎక్కువతక్కువతక్కువ
తక్కువఎక్కువతక్కువ
ఎక్కువఎక్కువఎక్కువ
నివేశాలునిర్గమనం
ABQ = A.B
000
100
010
111

డయోడ్ ద్వారా AND ద్వారాన్ని పొందడం :
D1 మరియు D2 లు డయోడ్లు. 5 V గల పొటెన్షియల్ను లాజిక్ ఒకటిగాను, V గల పొటెన్షియల్ను లాజిక్ సున్నాగాను గుర్తించాలి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 49

A = 0, B = 0 విలువలు డయోడ్లు D1, D2 లకు ఇచ్చినప్పుడు అవి పురోబయాస్ చెంది, మూయబడిన స్విచ్లుగా పనిచేస్తాయి. కాబట్టి నిర్గమనంలో విలువ సున్నా (Q = 0) వస్తుంది.

ఎప్పుడైనా A = 0 (లేదా) B = 0 అయితే D1 (లేదా) D2 డయోడ్లు పురోబయాస్ చెంది నిర్గమనం (Q = 0) సున్నా అవుతుంది.

A = 1, B = 1 అయినప్పుడు రెండు డయోడ్లు తిరోబయాస్లో ఉండి తెరచిన స్విచ్లు వలె పనిచేస్తాయి. అప్పుడు నిర్గమనం Q = 1 అవుతుంది. దీని నిర్గమనం AND ద్వారం నిర్గమనం వలె ఉంది.

మాదీకరణం చేయడం వల్ల అర్ధవాహక వాహకత్వంలోని మార్పు :
ఒక పరిశుద్ధమైన చతుస్సంయోజక అర్ధవాహకానికి, పంచసంయోజక మాలిన్యాన్ని (ఆర్సెనిక్) కలిపితే n రకం అర్ధవాహకం ఏర్పడుతుంది. ఆర్సెనిక్ పరమాణువులో ఐదు సంయోజక ఎలక్ట్రాన్లు ఉన్నాయి. కాని ప్రక్కనే ఉన్న జెర్మేనియం పరమాణువుతో సంయోజనీయ బంధాలను ఏర్పరచడానికి నాలుగు ఎలక్ట్రాన్లు సరిపోతాయి. అందువల్ల ఐదవ, ఎలక్ట్రాన్, కేంద్రంతో బలహీనమైన బంధం కలిగి స్వేచ్ఛగా ఉంటుంది. అందువల్ల విద్యుద్వహనానికి, అదనంగా ఒక ఎలక్ట్రాను లభిస్తోంది. ఫలితంగా అర్ధవాహకం వాహకత పెరుగుతుంది.

అదే విధంగా జెర్మేనియంకు ఇండియమ్ వంటి త్రిసంయోజక మాలిన్యాలను కలిపినప్పుడు p- రకం అర్ధవాహకం ఏర్పడుతుంది. ఇండియమ్ పరమాణువు సంయోజనీయ పట్టీలో రంధ్రం విద్యుద్వహనానికి తోడ్పడుతుంది. అందువల్ల అర్ధవాహకం వాహకత పెరుగుతుంది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు

ప్రశ్న 8.
మాదీకరణం అర్ధవాహకాలలో వాహకత్వాన్ని ఎలా పెంచుతుందో వివరించండి?
జవాబు:
శుద్ధమైన అర్ధవాహకానికి కొద్ది మోతాదులో మాలిన్యాలను కలపడం ద్వారా వాహకతను చాలా రెట్లు పెంచవచ్చు. అటువంటి పదార్థాలను అస్వభావజ అర్ధవాహకాలు అంటారు.

ఎంపికచేసిన మాలిన్యాలను ఉద్దేశపూర్వకంగా కలపడాన్ని మాదీకరణం అంటారు. మాలిన్యపదార్థ పరమాణువులు స్ఫటికంలోని మౌలిక అర్ధవాహక పరమాణువుల స్థానాల్లో చాలా కొన్ని స్థానాలను మాత్రమే ఆక్రమిస్తాయి.

జర్మేనియం, సిలికాన్ ను మాదీకరణం చేయడంలో రెండు రకాల మాలిన్యాలను ఉపయోగిస్తారు. (i) పంచసంయోజక మాలిన్యాలు ఆర్సెనిక్ (AS), ఆంటిమొని (Sb), ఫాస్పరస్ (P) మొదలైనవి (ii) త్రిసంయోజక మాలిన్యాలు ఇండియమ్ (In), బోరాన్ (B), అల్యూమినియమ్ (A/I) మొదలగునవి.

పంచ మరియు త్రిసంయోజనీయ మాలిన్యాలను Si (లేదా) Geకు కలిపినప్పుడు (i).n-రకం మరియు (ii) p-రకం అర్ధవాహకాలు ఏర్పడతాయి.

(i) n- రకం అర్ధవాహకం :
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 50
సిలికాన్ (లేదా) జర్మేనియమ్క పంచసంయోజక మాలిన్యాలను చేర్చామనుకొనుము. 5 సంయోజకత ఉన్న పరమాణువు (Si), స్ఫటిక జాలకంలో పరమాణుస్థానాన్ని ఆక్రమించినప్పుడు, దాని నాలుగు ఎలక్ట్రాన్లు నాలుగు పరిసరసిలికాన్ పరమాణువులతో బంధాలను ఏర్పరచుకోగా, మిగిలిన ఐదో ఎలక్ట్రాను మలిన పదార్ధపు పరమాణువుతో బలహీనంగా బంధితమై ఉంటుంది.

ఫలితంగా ఐదవ ఎలక్ట్రానును స్వేచ్ఛా ఎలక్ట్రానుగా చేయడానికి కావలసిన అయనీకరణ శక్తి చాలా స్వల్పంగా ఉంటుంది. గది ఉష్ణోగ్రత వద్దే ఎలక్ట్రాను స్వేచ్ఛగా అర్ధవాహక జాలకంలో చలించగలుగుతుంది.

తగినస్థాయిలో మాదీకరణం చేయడం వల్ల వాహక ఎలక్ట్రానుల సంఖ్యను (n) రంధ్రాసంఖ్య (n) కంటే అధికంగా చేయవచ్చు. అందువలన దీనిలో ఎలక్ట్రాన్లు అల్పసంఖ్యాక ఆవేశవాహకాలు, రంధ్రాలు అల్పసంఖ్యాక వాహకాలుగా ఉంటాయి.

(i) p- రకం అర్ధవాహకం :
సిలికాన్ (లేదా) జర్మేనియమ్క త్రిసంయోజక మాలిన్యాలైన అల్యూమినియమ్ (AI), ఇండియమ్ (In), బోరాన్(B), మొదలైన వాటితో మాదీకరణంచేస్తే p- రకం అర్ధవాహకాలు ఏర్పడతాయి.

Si (లేదా) Ge కంటే మాలిన్య పదార్ధంలో ఒక సంయోజక ఎలక్ట్రాన్ తక్కువ కాబట్టి మాలిన్య పరమాణువు చుట్టూ ఉన్న మూడు Si పరమాణువులతో సంయోజనీయ బంధాలను ఏర్పరుస్తుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 51

ప్రక్కన ఉన్న నాల్గవ Si పరమాణువుతో బంధం ఏర్పాటుకు దీని వద్ద మరొక ఎలక్ట్రాను ఉండదు. కాబట్టి నాల్గవ Si పరమాణువుకు, త్రిసంయోజక పరమాణువుకు ఉన్న బంధంలో ఖాళీ (లేదా) రంధ్రం ఏర్పడుతుంది. దగ్గరలో ఉన్న పరమాణువులోని బాహ్య కక్ష్యలో ఉన్న ఎలక్ట్రాను ఈ ఖాళీని భర్తీ చేయడానికి దూకవచ్చు. ఈ క్రమంలో దూకిన ఎలక్ట్రాను స్థానంలో ఖాళీ (లేదా) రంధ్రం ఏర్పడుతుంది. అంటే వహనానికి రంధ్రం అందుబాటులో కలదు. ఈ రంధ్రాలు స్వభావజంగా ఉత్పత్తి అయిన రంధ్రాలకు అదనం. అందువల్ల ఈ రకం పదార్థాలలో రంధ్రాలు అధిక సంఖ్యాక వాహకాలుగా, ఎలక్ట్రానులు అల్పసంఖ్యాక వాహకాలుగా ఉంటాయి.

అర్ధవాహకాల శక్తి పట్టీ నిర్మాణం మాదీకరణ వల్ల ప్రభావితం అవుతుంది. అస్వభావజ అర్ధవాహకాలలో దాతమాలిన్యాలు (ED), గ్రహీత మాలిన్యాలు (EA) కారణంగా అదనపు శక్తిస్థాయిలు కూడా వ్యవస్థితమవుతాయి.

లెక్కలు Problems

ప్రశ్న 1.
ఒక అర్థంతరంగ ఏకాధిక్కరణిలో 20 ఓమ్ల అంతరనిరోధం ఉన్న p-n సంధి డయోడ్ను ఉపయోగించారు. ఆ వలయంలో 2 ఓమ్ల భార నిరోధాన్ని వాడితే, ఆ అర్ధ తరంగ ఏకధిక్కరణి దక్షతను కనుక్కోండి.
సాధన:
అంతర నిరోధం (rf) = 20Ω
RL = 2kΩ = 2000Ω
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 52

ప్రశ్న 2.
పూర్ణతరంగ p-n సంధి డయోడ్ ఏకధిక్కరణి 1300 ఓమ్ భారనిరోధాన్ని ఉపయోగించుకొంటుంది. ప్రతీ డయోడ్ అంతరనిరోధం 9 ఓమ్లు. ఈ పూర్ణతరంగ ఏకధిక్కరణి దక్షతను కనుక్కోండి.
సాధన:
ఇచ్చినది RL = 1300Ω
rf = 9Ω
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 53

ప్రశ్న 3.
సేకరిణి విద్యుత్ ప్రవాహంలో మార్పు 1mA, ఆధారం ప్రవాహంలో మార్పు 20µA ఉన్నప్పుడు ప్రవాహ వర్ధన కారం β (beta) ను కనుక్కోండి.
సాధన:
సేకరిణి విద్యుత్ ప్రవాహంలో మార్పు (∆IC) = 1mA = 10-3 A
ఆధారం ప్రవాహంలో మార్పు (∆IB) = 20 µA = 20 × 10-6
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 54

ప్రశ్న 4.
ఒక ట్రాన్సిస్టర్ వర్ధకానికి సేకరిణి భారనిరోధం R = 2k ohm, నివేశ నిరోధం R = 1 K ohm గా ఉన్నాయి. ప్రవాహవృద్ధి 50 అయితే వర్ధకం వోల్టేజి వృద్ధిని గణించండి.
సాధన:
RL = 2kΩ = 2 × 10³Ω
Ri = 1kΩ = 1 × 10³Ω
β = 50.
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 55

అభ్యాసాలు Textual Exercises

ప్రశ్న 1.
n- రకం సిలికాన్కు సంబంధించి కింది ప్రవచనాలలో ఏది ఒప్పు?
(a) ఎలక్ట్రానులు అధికసంఖ్యాక వాహకాలు, త్రిసంయోజక పరమాణువులు మాలిన్యాలు.
(b) ఎలక్ట్రానులు అధికసంఖ్యాక వాహకాలు, పంచ సంయోజక పరమాణువులు మాలిన్యాలు.
(c) రంధ్రాలు అల్పసంఖ్యాక వాహకాలు పంచ సంయోజక పరమాణువులు మాలిన్యాలు.
(d) రంధ్రాలు అధికసంఖ్యాక వాహకాలు, త్రిసంయోజక పరమాణువులు మాలిన్యాలు.
సాధన:
(c). n- రకం అర్ధవాహకాలను పొందుటకు Ge (లేదా) Si కు పంచసంయోజక మాలిన్యాలను కలపాలి. n- రకం 3 అర్ధవాహకాలలో ఎలక్ట్రాన్లు అధిక సంఖ్యాక ఆవేశ వాహకాలు మరియు రంధ్రాలు అల్పసంఖ్యాక వాహకాలు.

ప్రశ్న 2.
p-రకం అర్ధవాహకాలకు 1 ప్రశ్నలో ఇచ్చిన ప్రవచనాలలో ఏ ప్రవచనం సరైనది?
సాధన:
Ge (లేదా) Si కు త్రిసంయోజక మాలిన్యాలను కలిపితే p- రకం అర్ధవాహకాలను పొందవచ్చు. P రకంలో రంధ్రాలు అధిక సంఖ్యాక ఆవేశ వాహకాలు మరియు ఎలక్ట్రాన్లు అల్పసంఖ్యాక ఆవేశ వాహకాలు.

ప్రశ్న 3.
కార్బన్, సిలికాన్, జర్మేనియంలలో ప్రతిదాని సంయోజక ఎలక్ట్రానుల సంఖ్య నాలుగు. వాటి సంయోజక, వాహక పట్టీల మధ్య శక్తి అంతరం వరసగా (Eg)C, (Eg)Si, (Eg)Ge గా ఉన్నాయి. ఈ శక్తి అంతరాలతో వీటి లక్షణాలను చెప్పవచ్చు. కింద ఇచ్చిన ప్రవచనాలలో ఏది సరైనది?
(a) (Eg)Si < (Eg)Ge < (Eg)C
(b) (Eg)C < (Eg)Ge > (Eg)Si
(c) (Eg)C > (Eg)Si > (Eg)Ge
(d) (Eg)C = (Eg)Si = (Eg)Ge
సాధన:
(c). శక్తి అంతర పట్టీ కార్బను అధికంగా ఉంటుంది. సిలికాన్కు తక్కువగా ఉంటుంది. జెర్మేనియమ్కు కనిష్ఠంగా ఉంటుంది.

ప్రశ్న 4.
బయాస్ చేయని (unbiased) p-n సంధిలో, రంధ్రాలు p-ప్రాంతం నుంచి n-ప్రాంతం వైపు విసరణ చెందడానికి కారణం
(a) n- ప్రాంతంలోని స్వేచ్ఛా ఎలక్ట్రానులు వాటిని ఆకర్షిస్తాయి.
(b) పొటెన్షియల్ భేదం కారణంగా అవి సంధి గుండా చలిస్తాయి.
(c) p- ప్రాంతంలో రంధ్రాల గాఢత n- ప్రాంతంతో పోలిస్తే ఎక్కువ.
(d) పైవి అన్నీ.
సాధన:
(c). బయాస్ లేని p-n సంధి వద్ద, ఆవేశ వాహకాలు అధిక సాంద్రత ఉన్న ప్రాంతంనుండి అల్పసాంద్రత ఉన్న వైపుకు విసరణ చెందుతాయి. p-ప్రాంతంలో రంధ్రాల సాంద్రత, n-ప్రాంతంలో ఎలక్ట్రాన్ల సాంద్రత కన్నా అధికం.

ప్రశ్న 5.
p- సంధికి పురోశక్మం అనువర్తించినపుడు, అది
(a) అవరోధ శక్మాన్ని పెంచుతుంది.
(c) అవరోధ శక్మాన్ని తగ్గిస్తోంది.
(b) అధిక సంఖ్యాక వాహకాల ప్రవాహాన్ని శూన్యానికి తగ్గిస్తోంది.
(d) పైన పేర్కొన్నవి ఏవీ కావు.
సాధన:
(c). p–n సంధి పురోబయాస్లో ఉన్నప్పుడు, అనువర్తిత వోల్టేజి, అవరోధ వోల్టేజిని వ్యతిరేకిస్తుంది. అందువలన పొటెన్షియల్ అవరోధము సంధి వద్ద తగ్గుతుంది.

ప్రశ్న 6.
ట్రాన్సిస్టర్ చర్యకు క్రింది ఇచ్చిన ప్రవచనాలలో ఏది సరైనది?
(a) ఆధారం, ఉద్గారకం, సేకరిణి ప్రాంతాలు ఒకే విధమైన పరిమాణం, మాదీకరణ గాఢత కలిగి ఉండాలి.
(b) ఆధారం ప్రాంతం చాలా పలుచగా, ‘తక్కువ మాదీకరణతో ఉండాలి.
(c) ఉద్గారకం సంధి పురోశక్మంలో, సేకరిణి సంధి తిరోశక్మంలో ఉండాలి.
(d) ఉద్గారకం, సేకరిణి సంధులు రెండూ పురోశక్మంలోనే ఉండాలి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 56
నివేశ నిరోధము, సేకరణి ప్రవాహంనకు విలోమానుపాతంలో ఉండును. సేకరణి ప్రవాహం అధికంగా ఉంటే, Rనివేశ తక్కువగా ఉంటుంది. ఆధార ప్రాంతం పలుచగా ఉండి, తక్కువగా మాదీకరణం చెంది ఉంటుంది. ట్రాన్సిస్టర్లో ఉద్గారసంధి పురోబయాస్లో ను సేకరణి సంధి తిరోబయాస్లోను ఉంటుంది.

ప్రశ్న 7.
ట్రాన్సిస్టర్ వర్ధకానికి, వోల్టేజి వృద్ధి
(a) అన్ని పౌనఃపున్యాలకు స్థిరంగా ఉంటుంది.
(b) అధిక, అల్ప పౌనఃపున్యాల వద్ద ఎక్కువగా ఉండి మధ్యస్థ పౌనఃపున్యాల వద్ద స్థిరంగా ఉంటుంది.
(c) అధిక, అల్ప పౌనఃపున్యాల వద్ద తక్కువగా ఉండి మధ్యస్థ పౌనఃపున్యాల వద్ద స్థిరంగా ఉంటుంది.
(d) పైవి ఏవీ కావు.
సాధన:
(c). అధిక మరియు అల్ప పౌనఃపున్యాల వద్ద వోల్టేజి లాభం తక్కువ మరియు మధ్య పౌనఃపున్యాల వద్ద స్థిరంగా ఉంటుంది.

ప్రశ్న 8.
అర్ధ తరంగ ఏకధిక్కరణంలో నివేశ పౌనఃపున్యం 50 Hz అయితే నిర్గమ పౌనఃపున్యం ఎంత ? ఇంతే నివేశ పౌనఃపున్యం ఉన్నప్పుడు పూర్ణతరంగ ఏకధిక్కరణి ఎంత నిర్గమ పౌనఃపున్యాన్ని ఇస్తుంది?
సాధన:
అర్ధతరంగ ఏకధిక్కారిలో నిర్గమ a.c లో అర్ధ తరంగం మాత్రమే ఏకధిక్కరణ జరుగుతుంది. కాని పూర్ణ తరంగ ఏక ధిక్కారిలో నివేశ a.c యొక్క రెండు అర్ధ తరంగాలు ఏకధిక్కరణ చెందుతాయి. ఒక పూర్తి భ్రమణానికి రెండు సార్లు పనిచేస్తుంది.

∴ అర్ధతరంగ ఏకధిక్కారి నిర్గమ పౌనఃపున్యము = 50Hz.
పూర్ణ తరంగ ఏకధికారి నిర్గమ పౌనఃపున్యము = 2 × 50 = 100Hz.

ప్రశ్న 9.
CE- ట్రాన్సిస్టర్ వర్ధకంలో సేకరిణి వద్ద కలిపిన 2 kΩ నిరోధకం కొనల మధ్య ఒక ఆడియో సంకేతం వోల్టేజి 2. ట్రాన్సిస్టర్ ప్రవాహ వర్ధక కారకం 100 అయితే, ఆధారం నిరోధకం 1 kΩ ఉన్నప్పుడు నివేశ సంకేతం వోల్టేజిని, ఆధారం ప్రవాహాన్ని కనుక్కోండి.
సాధన:
సేకరణి నిరోధము (Rనిర్గమ) = 2KΩ = 2000Ω.
ట్రాన్సిస్టర్ ప్రవాహ లాభం (βAC) = 100.
నిర్గమ వోల్టేజి (Vనిర్గమ) = 2V
ఆధార నిరోధము (Rనివేశ) = 1KΩ = 1000Ω
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 57

ప్రశ్న 10.
రెండు వర్ధకాలను ఒకదాని వెనుక ఒకటి శ్రేణిలో కలిపారు. (అంచెలుగా). మొదటి వర్ధకం, వోల్టేజి వృద్ధి 10 కాగా రెండవ వర్ధకం వోల్టేజి వృద్ధి 20. నివేశ సంకేతం 0.01 volt అయితే నిర్గమ ac సంకేతాన్ని లెక్కకట్టండి.
సాధన:
మొదటి వర్ధకం వోల్టేజి లాభం (Av1) = 10
రెండవ వర్ధకం వోల్టేజి లాభం (Av2) = 20
నివేశ వోల్టేజి (Vi) = 0.01V
మొత్తం వోల్టేజి లాభం (AV) = \(\frac{V_0}{V_i}\) = Av1 × Av2
\(\frac{V_0}{0.01}\) = 10 × 20; V0 = 2V.

AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు

ప్రశ్న 11.
ఒక p-n ఫోటోడయోడ్ను 2.8 eV శక్తి అంతరం గల అర్ధవాహకంతో తయారుచేసారు. అది 6000 nm తరంగదైర్ఘ్యాన్ని శోధించగలదా (గుర్తించగలదా)?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 58
శక్తి అంతరం 2.8 eV మరియు శక్తి E విలువ శక్తి అంతరం కన్నా తక్కువ (E < Eg). కావున p–n సంధి తో | 6000nm తరంగదైర్ఘ్యంను కనుక్కోవడం సాధ్యం కాదు.

అదనపు అభ్యాసాలు Additional Exercises

ప్రశ్న 12.
ఘనపు మీటరు (md) లో ఉండే సిలికాన్ పరమాణువుల సంఖ్య 5 × 1028. దీన్ని ఏకకాలంలో ఘనపు మీటరుకు 5 × 1022 పరమాణువులు గల ఆర్సెనిక్ తోనూ, ఘనపు మీటరు 5 × 1020 పరమాణువులు గల ఇండియంతోనూ మాదీకరణ చేసారు. ఎలక్ట్రానులు, రంధ్రాల సంఖ్యను లెక్కించండి. దత్తాంశం ni = 1.5 × 1016 m-3. ఈ విధంగా తయారైన పదార్ధం n- రకమా లేదా P- రకమా?
సాధన:
ప్రతి ఆర్సెనిక్ పరమాణువు మాదీకరణం చెందినప్పుడు ఒక స్వేచ్ఛా ఎలక్ట్రానన్ను కలిగి ఉంటుంది. అదే విధంగా ఇండియమ్ మాదీః రణ చెందినప్పుడు ఒక ఖాళీ ఏర్పడుతుంది.

కాబట్టి పంచసంయోజక మాలిన్యాలను కలుపుట వల్ల చేరిన ఎలక్ట్రాన్ల సంఖ్య
(ni) = NAs = 5 × 1022 m³ ———– (1)

పంచసంయోజక మాలిన్యాలను కలుపుట వల్ల చేరిన రంధ్రాల సంఖ్య
ne – nh = 5 × 1022 – 5 × 1020.
ne – nh = 4.95 × 1022 ———– (2)
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 59
ఎలక్ట్రాన్ల సంఖ్య ne (4.95 × 1022), రంధ్రాల సంఖ్య nh (4.5 × 109)
కన్నా ఎక్కువ. కావున ఇది n- రకం అర్ధవాహకం.

ప్రశ్న 13.
ఒక స్వభావజ అర్ధవాహకంలో శక్తి అంతరం Eg 1.2 eV. దానిలో రంధ్రాల చలనశీలత (mobility) ఎలక్ట్రానుల కంటే చాలా తక్కువ మరియు ఉష్ణోగ్రతపై ఆధారపడదు. 600K, 300K ఉష్ణోగ్రతల వద్ద ఉండే వాహకత్వాల నిష్పత్తి ఎంత? స్వభావజ వాహకాల గాఢత ni ఉష్ణోగ్రతపై ఆధారపడే సంబంధం కింది విధంగా ఇవ్వబడింది.
ni = n0 exp(\(\frac{E_g}{2K_{B}T}\)) ఇక్కడ nn0 స్థిరాంకం.
సాధన:
స్వభావజ వాహక సాంద్రత (ni) = nn0e-Eg2kBT మరియు శక్తి సాంద్రత Eg = 1.2 eV.
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 60

ప్రశ్న 14.
p-n సంధి డయోడ్లో ప్రవాహం I ని కింది విధంగా వ్యక్తపరచవచ్చు.
I = I0, exp(\(\frac{1}{2}\) -1)
ఇక్కడ I0, అనేది ఉత్రమ సంతృప్త విద్యుత్ ప్రవాహం, డయోడ్ చివరల వోల్టేజి V. ఇది పురోశక్మంలో ధనాత్మకం, తిరోశక్మంలో రుణాత్మకం, డయోడ్ ద్వారా విద్యుత్ ప్రవాహం I, బోల్ట్ మన్ స్థిరాంకం kB (8.6 × 10-5 eV/K), T పరమ ఉష్ణోగ్రత. ఇచ్చిన డయోడు I0 = 5 × 10-12 A, T= 300 K అయితే,
(a) పురోశక్మ వోల్టేజి 0.6 V వద్ద పురోశక్మ విద్యుత్ ప్రవాహం ఎంత?
(b) డయోడ్ చివరల వోల్టేజిని 0.7 V కు పెంచితే ప్రవాహంలో వచ్చే పెరుగుదల ఎంత?
(c) గతిక నిరోధం ఎంత?
(d) తిరోశక్మం వోల్టేజి IV నుంచి 2 V కి మారినట్లైతే, విద్యుత్ ప్రవాహం ఎంత?
సాధన:
I0 = 5 × 10-12 A, T = 300K
kB = 8.6 × 10-5eV/K = 8.6 × 10-5 × 1.6 × 10-19 J/K

a) వోల్టేజి V = 0.6V వద్ద
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 61

d) వోల్టేజి 1V నుండి 2V కు మారితే, విద్యుత్ ప్రవాహము I దాదాపుగా
I0 = 5 × 10-12 A కు సమానము
ఈ కారణంచేత తిరోబయాస్లో డయోడ్ నిరోధము అనంతంగా ఉంటుంది.

ప్రశ్న 15.
పటంలో చూపిన రెండు వలయాలను మీకు ఇచ్చారు. వలయం (a) OR ద్వారం లాగా, వలయం (b) AND ద్వారంలాగా పనిచేస్తోందని చూపండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 62
సాధన:
a) ద్వారంను విడదీస్తే
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 63
A మరియు B నివేశాలకు, OR – ద్వారం నిర్గమం C, NOT ద్వారం 1 యొక్క నివేశం, D అనునది NOT ద్వారం -1 నిర్గమం. ఇది NOT ద్వారం 2, యొక్క నివేశనం. తర్వాత Y నిర్గమనం

ABY
000
011
101
111

ఇది OR – ద్వారం. కావున వలయం OR ద్వారం లాగా పనిచేస్తుంది.

b)
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 64
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 65
A, B, C నివేశాలకు, A మరియు D లకు B మరియు E లు నిర్గమనాలు. ఇది OR ద్వారం యొక్క నిర్గమనం. ఇది . NOT ద్వారానికి నివేశనం అవుతుంది. Y నిర్గమనం అవుతుంది.

ABY
000
100
010
111

ఇది AND ద్వారం వలె ఉంది. కావున ఇచ్చిన వలయము AND ద్వారం.

AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు

ప్రశ్న 16.
పటంలో చూపిన విధంగా కలిపిన NAND ద్వారం నిజపట్టికను వ్రాయండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 66
తద్వారా పై వలయం చేసే కచ్చితమైన తర్క పరిక్రియను (operation) ను గుర్తించండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 67
యదార్థ పట్టిక

ABY
001
110

B అనునది AND ద్వారం నిర్గమనం మరియు NOT ద్వారానికి నివేశన
కావున A నివేశనం, Y నిర్గమనం

AY
01
10

ఇది NOT ద్వారం వలె ఉన్నది. కావున పై వలయం NOT ద్వారం.

ప్రశ్న 17.
పటంలో చూపిన NAND ద్వారాలతో ఉన్న రెండు వలయాలను మీకు ఇచ్చారనుకోండి. రెండు వలయాలు చేసే తర్క పరిక్రియను గుర్తించండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 68
సాధన:
a)
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 69
AND ద్వారం 1 యొక్క నిర్గమనం C, ఇది NOT ద్వారం నివేశనం. D దాని నిర్గమనం అవుతుంది. E అనునది AND ద్వారం 2 యొక్క నిర్గమనం. ఇది NOT ద్వారం 2 యొక్క నివేశనం. చివరిగా Y నిర్గమనం అవుతుంది.

యదార్థ పట్టిక

ABY
000
010
100
111

కావున ఇది AND ద్వారము.

b)
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 70
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 71
AND ద్వారం 1 నిర్గమనం C
AND ద్వారం 2 నిర్గమనం D
NOT ద్వారం 1 నిర్గమనం E
NOT ద్వారం 2 నిర్గమనం F
AND ద్వారం 3 నిర్గమనం G మరియు ఇది NOT ద్వారం 3 నివేశనం అవుతుంది.
కావున ఇది OR ద్వారం మాదిరిగా ఉన్నది. A, B లు నివేశాలు, Y నిర్గమనం.

ABY
000
101
011
111

కావున ఇది OR – ద్వారం.

ప్రశ్న 18.
పటంలో చూపిన NOR ద్వారాలతో గీసిన వలయానికి నిజ పట్టికను వ్రాసి ఈ వలయం ప్రదర్శించే తర్క పరిక్రియ (OR, AND, NOT) ను గుర్తించండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 72
Hint: (A = 0, B = 1 అయినప్పుడు రెండవ NOR ద్వారం A, B నివేశాలు 0 అయ్యి, Y = 1 గా ఉంటుంది. ఇదే విధంగా A, B లకు ఇతర సంయోగాలను రాసి Y విలువలను పొందండి. వీటిని OR, AND, NOT ద్వారాల నిజ పట్టికలతో పోల్చి సరైనదాన్ని కనుక్కోండి.)
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 73
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 74
C అనునది OR ద్వారం 1 నిర్గమనం.
D అనునది NOT ద్వారం నిర్గమనం.
E అనునది OR ద్వారం 2 యొక్క నిర్గమనం. ఇది NOT ద్వారం 2 నివేశనం అవుతుంది.
కావున ఇది OR ద్వారం వలె ఉంది. A మరియు B నివేశాలు, Y నిర్గమనం

ABY
000
101
011
111

కావున ఇది OR ద్వారం అవుతుంది.

ప్రశ్న 19.
NOR ద్వారాలను మాత్రమే కలిగి ఉన్న పటంలో చూపిన వలయానికి నిజ పట్టికను వ్రాయండి. ఈ రెండు వలయాలు చేసే తర్క పరిక్రియలను (OR, AND, NOT) గుర్తించండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 75
జవాబు:
a)
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 76
B అనునది OR ద్వారం నిర్గమనం, ఇది NOT ద్వారానికి నివేశనం కావున ఇది NOT ద్వారం, A నివేశనం మరియు నిర్గమ.

AY
01
10

b)
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 77
OR ద్వారం 1 నిర్గమనం C మరియు ఇది NOT ద్వారం 1 నివేశనం, OR ద్వారం 2 నిర్గమనం D మరియు ఇది NOT ద్వారం 2 నివేశనం, NOT ద్వారం 1 నిర్గమనం E మరియు NOT ద్వారం 2 నిర్గమనం F, OR ద్వారం 3 నిర్గమనం G మరియు ఇది NOT ద్వారం 3 నివేశనం కావున ఇది AND ద్వారం వలె ఉన్నది. A, B లు నివేశాలు మరియు Y నిర్గమనం.

ABY
000
100
010
111

సాధించిన సమస్యలు Textual Examples

ప్రశ్న 1.
C, Si, Ge లు ఒకే జాలక నిర్మాణాన్ని కలిగి ఉన్నాయి. అయితే Si, Ge లు స్వభావజ అర్ధవాహకాలు అయినప్పుడు C ఎందుకు బంధకంగా ఉంటుంది?
సాధన:
C, Si లేదా Ge లలోని 4 బంధక ఎలక్ట్రానులు వరసగా రెండు, మూడు, నాలుగవ కక్ష్యలలో ఉంటాయి. కాబట్టి ఈ పరమాణువుల నుంచి ఒక ఎలక్ట్రానును తీయడానికి అవసరమయ్యే శక్తి (అయనీకరణ శక్తి, Eg) Ge కి కనిష్ఠంగా, ఆ తరువాత Si కు ఉండి C కి అత్యధికంగా ఉంటుంది. దీని వల్ల Ge, Si ల వాహక పట్టీలో ఒక మోస్తరు సంఖ్యలో స్వేచ్ఛా ఎలక్ట్రానులు ఉంటే C లో పరిగణించనవసరం లేనంత తక్కువగా ఉంటాయి.

AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు

ప్రశ్న 2.
శుద్ధ Si స్ఫటికంలో 5 × 1028 atoms m-3 ఉన్నాయనుకొందాం. దీనిని పంచ సంయోజక As తో 1 ppm గాఢతతో మాదీకరణం చేసారు. దీనిలో ఎలక్ట్రాన్లు, రంధ్రాల సంఖ్యను లెక్కించండి. ni = 1.5 × 1016 m-3 అని ఇచ్చారు.
సాధన:
మాదీకరణం వల్ల ఉత్పత్తి అయిన ఎలక్ట్రానులతో పోలిస్తే ఉష్ట్రీయంగా జనించిన ఎలక్ట్రానులు (ni ~ 1016 m-3) ఉపేక్షించేంత స్వల్పంగా ఉంటాయి.
కాబట్టి, ne ≅ ND.
ne nh = ni² కాబట్టి, రంధ్రాల సంఖ్య, nh = (1.5 × 1016)² / 5 × 1028 × 10-6
nh = (2.25 × 1032)/(5 × 1022) ~ 4.5 × 109m-3

ప్రశ్న 3.
p- రకం అర్ధవాహక పలకను తీసుకొని దాన్ని మరొక n- రకం అర్ధవాహక పలకకు భౌతికంగా కలపడం వల్ల p-n సంధిని పొందగలమా?
సాధన:
పొందలేం ! ఎంత చదునుగా ఉన్నా ప్రతీ పలకపై ఉండే గరుకుతనం స్ఫటిక అంతర పరమాణు దూరం (~2 నుంచి 3 A°) కంటే చాలా ఎక్కువ. కాబట్టి పరమాణు స్థాయిలో అవిచ్ఛిన్న స్పర్శ (continuous contact) ను పొందడం ‘సాధ్యం కాదు. ఆవేశ వాహకాల ప్రవాహానికి సంధి విచ్ఛిన్నంగా (discontinuity) గా వ్యవహరిస్తోంది.

ప్రశ్న 4.
పటంలో సిలికాన్ డయోడ్ V-I అభిలక్షణాలను చూపారు. డయోడ్ నిరోధాన్ని (a) ID = 15 mA,
(b) VD = −10 V ల వద్ద కనుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 78
డయోడ్ అభిలక్షణాలను I = 10 mA నుంచి I = 20 mA మధ్య సరళరేఖీయంగా, ఆది బిందువు నుంచి వెళుతున్నట్లుగా భావిస్తే, ఓమ్ సూత్రం ఉపయోగించి నిరోధాన్ని కనుక్కోవచ్చు.

a) అభిలక్షణ వక్రం నుంచి, I = 20 mA వద్ద V = 0.8
V I = 10 mA వద్ద V = 0.7 V
rfb = ∆V/∆I = 0.1V/10mA – 102

b) వక్రం నుంచి, V = – 10 V వద్ద I = -1 µA.
కాబట్టి, rrb = 10V/1µA = 1.0 × 107

ప్రశ్న 5.
జీనర్ నియంత్రిత వోల్టేజి సరఫరా పరికరంలో నియంత్రణ కోసం Vz = 6.0 V ఉన్న జీనర్ డయోడ్ను వాడారు. నియంత్రణ కాని నివేశ వోల్టేజి 10.0V, భార నిరోధం ద్వారా విద్యుత్ ప్రవాహం 4.0 mA గా ఉంది. శ్రేణి నిరోధం Rs విలువ ఎంత ఉండాలి?
సాధన:
భార నిరోధం ద్వారా వెళ్ళే ప్రవాహం కంటే జీనర్లో ప్రవాహం ఎక్కువ ఉండే విధంగా Rs విలువ ఉండాలి. దీని వల్ల మంచి భార నియంత్రణ ఉంటుంది. భార విద్యుత్ ప్రవాహం (load current) కంటే జీనర్ ప్రవాహం సుమారు 5 రెట్లు ఎంచుకోండి, అంటే IZ = 20 mA. అప్పుడు RS ద్వారా మొత్తం విద్యుత్ ప్రవాహం 24 mA అవుతుంది. RS కొనల మధ్య వోల్టేజి పాతం 10.0 – 6.0 = 4.0 Vగా ఉంటుంది. దీని నుంచి RS = 4.0V/(24 × 10-3) A = 167Ω. దీనికి సమీపంగా ఉండే కార్బన్ నిరోధకం విలువ 150Ω. కాబట్టి 150Ω శ్రేణి నిరోధకం సరైనది. నిరోధకం విలువలో స్వల్ప తేడా పట్టించుకోవలసిన అంశం కాదు. ముఖ్యమైన అంశం ఏమిటంటే IZ విలువ IL కంటే తగినంత అధికంగా ఉండాలి.

ప్రశ్న 6.
పురోశక్మంలో విద్యుత్ ప్రవాహం (~mA) తిరోశక్మం (~ µA) లో కంటే ఎక్కువని తెలుసు. ఫోటో డయోడ్ను తిరోశక్మంలో పనిచేయించడానికి కారణం ఏమిటి?
సాధన:
n- రకం అర్ధవాహకం సందర్భాన్ని తీసుకోండి. అధిక సంఖ్యాక వాహకాల సాంద్రత (n), అల్పసంఖ్యాక వాహకాల సాంద్రత p కంటే చాలా అధికం అంటే, n>> p) గానే ఉంటుంది. ప్రదీపనంతో అదనంగా ఉత్పత్తి అయిన ఎలక్ట్రానులు, ‘రంధ్రాలు వరసగా ∆n, ∆p అనుకొందాం :
n’ = n + ∆n
p’ p + ∆p

ఇక్కడ n’, p’ లు ఏదైనా ప్రత్యేక ప్రదీపనం వద్ద ఎలక్ట్రానుల, రంధ్రాల గాఢతలు. ప్రదీపనం లేని సందర్భంలో వాహకాల గాఢతలు n, p. ఇక్కడ ∆n = ∆p, n >> p అని గుర్తుంచుకోండి. కాబట్టి అధిక సంఖ్యాక వాహకాలు అంశిక మార్పు (fractional change) (అంటే ∆n/n) అల్పసంఖ్యాక వాహకాల అంశిక మార్పు (అంటే ∆p/p) కంటే చాలా తక్కువగా ఉంటుంది. సాధారణంగా, ఫోటో ప్రభావాల వల్ల అల్పసంఖ్యాక వాహకాల ఆధిపత్యం వహించే ఉత్రమ ప్రవాహంలో వచ్చే అంశిక మార్పును పురోశక్మం ప్రవాహంలో వచ్చే అంశిక మార్పు కంటే సులభంగా కొలవవచ్చు అని చెప్పవచ్చు. కాబట్టి, తిరోశక్మంలో ఉన్న ఫోటో డయోడ్ను కాంతి తీవ్రతను కొలవడానికి ప్రాధాన్యత ఇస్తారు.

ప్రశ్న 7.
Si, GaAs పదార్థాలను సౌర ఘటాలకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తారు?
సాధన:
పటంలో మనం స్వీకరించే సౌర వికిరణ వర్ణపటాన్ని చూపిస్తోంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 79

కాంతి ఉత్తేజనం hv > Eg కి గరిష్ట తీవ్రత సుమారు 1.5 eV దగ్గర ఉంటుంది. కాబట్టి శక్తి అంతరం 1.5 eV లేదా కొంచెం తక్కువ గల అర్ధవాహకం ఉత్తమ సౌరశక్తి మార్పిడి దక్షతను ఇస్తోంది. సిలికాన్కు Eg ~ 1.1 eV గా ఉంటే, GaAs కు~ 1.53 e ఉంటుంది. నిజానికి కంటే GaAs (శక్తి అంతరం ఎక్కువ అయినప్పటికీ) మెరుగైనది, ఎందుకంటే దీనికి సాపేక్షంగా అధిక శోషణ గుణకం ఉంటుంది. కాబట్టి. CdS లేదా CdSe (Eg – 2.4 eV) వంటి పదార్ధాలను ఎంచుకొంటే సౌరశక్తిలో అధిక శక్తి అంశాన్ని ఫోటో మార్పిడి (photo-conversion) కి ఉపయోగించు కోగలుగుతాం. చెప్పుకోదగిన శక్తి భాగం ఎటువంటి ఉపయోగం లేకుండా పోతుంది.

సౌర వికిరణ వర్ణపటంలో గరిష్ఠ పౌనఃపున్యం ν కి అనురూపంగా hν > Eg షరతు సంతృప్తిపరచే PbS (Eg ~ 0.4 eV) వంటి పదార్థాలను ఎందుకు ఉపయోగించం అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇటువంటి పదార్థాలను ఉపయోగిస్తే సౌర వికిరణంలో చాలా భాగాన్ని సౌర ఘటం పై పొర శోషణం చేసుకోవడంతో లేమి ప్రాంతంలోకి లేదా దాని దగ్గరకు చేరదు. సంధి విద్యుత్ క్షేత్రం వల్ల ఎలక్ట్రాను – రంధ్రాల విభజన ప్రభావాత్మకంగా ఉండాలంటే సంధి ప్రాంతంలో కాంతి వల్ల ఆవేశాల ఉత్పత్తి జరగాలి.

ప్రశ్న 8.
ఈ క్రింది పటంలో చూపిన నిర్గమ అభిలక్షణాల నుంచి ట్రాన్సిస్టర్ βac, βdc విలువలను VCE = 10 V, IC = 4.0 o mA అయినప్పుడు లెక్కించండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 80
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 81
ఇచ్చిన VCE, IC విలువల నుంచి βac, βdc విలువలను కింది విధంగా లెక్కించవచ్చు. ఇచ్చిన IC విలువకు పైనా, కింద ఉండే రెండు IB విలువలకు చెందిన రెండు అభిలక్షణ వక్రాలను తీసుకోండి. ఇక్కడ IC = 4.0 mA. (IB = 30, 20A గల వక్రాలను ఎంచుకోండి) VCE = 10V వద్ద గ్రాఫ్ నుంచి రెండు IC విలువలను తీసుకొందాం. అప్పుడు
∆IB = (30-20)μA = 10μA.
∆IC = (4.5 – 3.0) mA = 1.5mA
కాబట్టి, βac = 1.5 mA/ 10µA = 150

βdc ని నిర్ణయించడానికి VCE = 10V వద్ద IC = 4.0mA లకు అనురూపంగా ఉండే IB విలువను అంచనా వేయడం లేదా తీసుకొన్న రెండు అభిలక్షణ వక్రాల నుంచి βdc ని లెక్కించి వాటి సగటు విలువను కనుక్కోవడం.
కాబట్టి, IC = 4.5 mA, IB = 30 µA అయినప్పుడు
βdc = 4.5 mA/ 30 μA = 150
IC = 3.0 mA/ IB = 20 µA అయినప్పుడు
βdc = 3.0 mA/20 μA = 150
అందువల్ల βdc = (150 + 150)/2 = 150.

ప్రశ్న 9.
ఈ క్రింది పటంలో VBB సరఫరాను 0V నుంచి 5.0 V వరకూ మార్చవచ్చు. Si ట్రాన్సిస్టర్ βdc = 250, RB = 100 kΩ, RC = 1 KΩ, VCC = 5.0V లను కలిగి ఉంది. ట్రాన్సిస్టర్ సంతృప్త స్థితిలో ఉన్నప్పుడు VCE = 0V, VBE = 0.8Vగా ఊహించుకోండి. కింది వాటిని లెక్కించండి. (a) ట్రాన్సిస్టర్ సంతృప్త స్థితికి వెళ్ళడానికి కావలసిన కనిష్ఠ ఆధారం ప్రవాహం, తద్వారా (b) ట్రాన్సిస్టర్ స్విచ్ అన్ అయ్యే V1 ని కనుక్కోండి. (c) ఏ V1 అవధులలో ట్రాన్సిస్టర్ స్విచ్ ఆఫ్, స్విచ్ ఆన్ అవుతుందో కనుక్కోండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 82
సాధన:
సంతృప్త స్థితి వద్ద VCE = 0V, VBE = 0.8V గా ఇచ్చారు.
VCE = VCC -ICRC
IC = VCC/RC = 5.0V/1.0kΩ = 5.0mA
కాబట్టి, IB. IC
= 5.0mA/250 = 20 µA

ట్రాన్సిస్టర్ సంతృప్త స్థితిలో వెళ్ళే నివేశ వోల్టేజిని కింది విధంగా వ్యక్తం చేయవచ్చు.
VIH = VBB = IBRB + VBE
= 20μА × 100 kΩ + 0.8V = 2.8V

ట్రాన్సిస్టర్ ఏ నివేశ వోల్టేజి విలువ కంటే దిగువన కటాఫ్ స్థితిలోకి వెళ్ళే వోల్టేజి విలువను ఇలా రాయవచ్చు.
VIL =0.6V, VIH = 2.8V

ట్రాన్సిస్టర్ 0.0V నుంచి 0.6V మధ్య స్విచ్ ఆఫ్ స్థితిలో ఉంటుంది. స్విచ్ ఆన్ స్థితిలో 2.8 నుంచి 5.0V మధ్య ఉంటుంది.

IB విలువ 0.0mA నుంచి 20mA మధ్య మారుతున్నప్పుడు ట్రాన్సిస్టర్ క్రియాశీల స్థితిలో ఉంఉందని గమనించండి. ఈ అవధిలో IC = βIB గా చెల్లుతుంది. సంతృప్త స్థితి వ్యాప్తిలో IC ≤ βIB.

AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు

ప్రశ్న 10.
CE ట్రాన్సిస్టర్ వర్ధకంలో 2.0 kΩ సేకరిణి నిరోధం వద్ద ఆడియో సంకేత వోల్టేజి 2.0 V. ట్రాన్సిస్టర్ ప్రవాహ వృద్ధి కారకం 100 అయితే, ఆధారం dc ప్రవాహం, సంకేత ప్రవాహం కంటే 10 రెట్లు ఎక్కువగా ఉండాలంటే జనకం VBB. 2.0 V కి శ్రేణిలో కలిపే RB విలువ ఎంత ఉండాలి? సేకరిణి నిరోధం వద్ద dc పాతం కనుక్కోండి. ఈ క్రింది పటాన్ని చూడండి.
సాధన:
నిర్గమ ac వోల్టేజి 2.0 V. కాబట్టి, ac సేకరణి ప్రవాహం iC = 2.0/2000 = 1.0 mA. ఆధారం ద్వారా సంకేతం ప్రవాహాన్ని ఈవిధంగా రాయవచ్చు.

iB = iC/β = 1.0 mA/100 = 0.010 mA. ఆధారం dc ప్రవాహం 10 × 0.010 = 0.10 mA గా ఉండాలి.
సమీకరణం VBB = VBE + IB RB నుంచి RB = (VBB – VBE)/IB ; VBE = 0.6V అనుకొంటే,
RB – (2.0 – 0.6)/0.10 = 14kΩ.

dc సేకరణి ప్రవాహం IC = 100 × 0.10 = 10mA.
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 83

ప్రశ్న 11.
OR ద్వారానికి కింద ఇచ్చిన ఇన్పుట్ A, B లతో వచ్చే అవుట్పుట్ తరంగ రూపం (Y) ఈ క్రింది పటంలో చూపినట్లు ఉంటుందని నిరూపించండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 84
సాధన:
క్రింది వాటిని గమనించండి:

  • t < t1 వద్ద ; A = 0, B = 0; కాబట్టి Y = 0
  • t1 నుంచి t2 వరకు; A = 1, B = 0; కాబట్టి Y = 1
  • t2 నుంచి t3 వరకు ; A = 1, B = 1; కాబట్టి Y = 1
  • t3 నుంచి t4 వరకు; A = 0, B = 1; కాబట్టి Y = 1
  • t4 నుంచి t5 వరకు; A = 0, B = 0; కాబట్టి Y = 0
  • t5 నుంచి t6 వరకు; A = 1, B = 0; కాబట్టి Y = 1
  • t > t6 అయినప్పుడు; A = 0, B = 1; కాబట్టి Y = 1
    అందువల్ల, తరంగ రూపం Y పటంలో చూపినట్లు ఉంటుంది.

ప్రశ్న 12.
A, B ఇన్పుట్ తరంగ రూపాలుగా 11 వ ఉదాహరణలో చూపిన వాటినే తీసుకోండి. AND ద్వారం ఇచ్చే అవుట్పుట్ తరంగ రూపాన్ని గీయండి.
సాధన:

  • t ≤ t1 అయినప్పుడు; A = 0, B = 0; = కాబట్టి Y = 0
  • t1 నుంచి t2 వరకు ; A = 1, B = 0; = కాబట్టి Y=0
  • t2 నుంచి t3 వరకు ; A = 1, B = 1; = కాబట్టి Y = 1
  • t3 నుంచి t4 వరకు ; A = 0, B = 1; = కాబట్టి Y = 0
  • t4 నుంచి t5 వరకు; A = 0, B = 0; = కాబట్టి Y = 0
  • t5 నుంచి t6 వరకు ; A = 1, B = 0; = కాబట్టి Y = 0
  • t > t6 అయినప్పుడు; A = 0, B = 1 ; = కాబట్టి Y = 0
    పై వివరణ బట్టి, AND ద్వారం అవుట్పుట్ తరంగ రూపాన్ని కింది విధంగా గీయవచ్చు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 85

AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు

ప్రశ్న 13.
NAND ద్వారానికి కింద ఇచ్చిన A, B ఇన్పుట్లకు అనుగుణంగా వచ్చే అవుట్పుట్ Y ని గీయండి.
సాధన:

  • t ≤ t1 అయినప్పుడు ; A = 1, B = 1; కాబట్టి Y = 0
  • t1 నుంచి t2 వరకు; A= 0, B = 0; కాబట్టి Y = 1
  • t2 నుంచి t3 వరకు; A = 0, B = 1; కాబట్టి Y = 1
  • t3 నుంచి t4 వరకు A = 1, B = 0; కాబట్టి Y = 1
  • t4 నుంచి t5 వరకు; A = 1, B = 1; కాబట్టి Y = 0
  • t5 నుంచి t6 వరకు; A = 0, B = 0; కాబట్టి Y = 1
  • t > t6 అయినప్పుడు; A = 0, B = 1; కాబట్టి Y = 1

AP Inter 2nd Year Physics Study Material Chapter 15 అర్ధవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికారాలు, సరళవలయాలు 86

AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Physics Study Material 14th Lesson కేంద్రకాలు Textbook Questions and Answers.

AP Inter 2nd Year Physics Study Material 14th Lesson కేంద్రకాలు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఐసోటోపులు, ఐసోబార్లు అంటే ఏమిటి?
జవాబు:
ఐసోటోప్ ఒకే పరమాణు సంఖ్య (Z) కలిగి వేరువేరు ద్రవ్యరాశి సంఖ్య (A) లు గల కేంద్రకాలను ఐసోటోప్లు అంటారు.
ఉదా : 168O, 178O, 188O

ఐసోబార్ :
ఒకే ద్రవ్యరాశి సంఖ్య (A) కలిగి వేరువేరు పరమాణు సంఖ్య (Z) లు గల కేంద్రకాలను ఐసోబార్లు
ఉదా : 146C, 147N.

ప్రశ్న 2.
ఐసోటోన్లు, ఐసోమర్లు అంటే ఏమిటి?
జవాబు:
ఐసోటోన్ :
ఒకే న్యూట్రాన్ సంఖ్య (N) కలిగి వేరువేరు పరమాణు సంఖ్య (24)లు గల కేంద్రకాలను ఐసోటోన్లు అంటారు.
ఉదా: 19880Hg, 19779Au.

ఐసోమర్ :
ఒకే ద్రవ్యరాశి సంఖ్య (A), ఒకే పరమాణు సంఖ్య (Z) కలిగి రేడియోధార్మిక క్షయం, అయస్కాంత భ్రామకంవంటి కేంద్రక ధర్మాలు భిన్నంగాగల కేంద్రకాలను ఐసోమర్లు అంటారు.
ఉదా : 8035Brm, 8035Brg.

ప్రశ్న 3.
పరమాణు ద్రవ్యరాశి ప్రమాణం (a.m.u.) అంటే ఏమిటి? దానికి తుల్యమైన శక్తి ఏమిటి?
జవాబు:
కార్బన్ పరమాణువు 126C ద్రవ్యరాశిలో \(\frac{1}{12}\) వంతు ద్రవ్యరాశిని పరమాణు ద్రవ్యరాశి ప్రమాణం అంటారు.
1 a.m.u = \(\frac{1}{12}\)× 126C పరమాణు ద్రవ్యరాశి = 1.66 × 10-27 kg
a.mu కు సమానమైన శక్తి = 931.5 MeV.

ప్రశ్న 4.
A1, A2 ద్రవ్యరాశి సంఖ్యలు గల రెండు కేంద్రకాల వ్యాసార్థాల నిష్పత్తి ఎంత?
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 1

ప్రశ్న 5.
సహజ రేడియోధార్మికతను ప్రదర్శించే చాలా కేంద్రకాలు ఎక్కువ ద్రవ్యరాశి సంఖ్య కలిగినవి. ఎందుకు?
జవాబు:
సాపేక్షంగా ఒక న్యూక్లియాన క్కు బంధనశక్తి 7.6 MeV కన్నా తక్కువ కలిగి, ఆవర్తన పట్టికలో సీసం (lead) కు అవతలగల భార కేంద్రకాలు సహజ రేడియోధార్మికతను ప్రదర్శిస్తాయి. అందువల్ల ఎక్కువ స్థిరత్వాన్ని పొందుతాయి.

AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు

ప్రశ్న 6.
ఒక కేంద్రకం నుంచి α – కణం వెలువడిన తరవాత, ఆ కేంద్రకంలోని న్యూట్రాన్ల నిష్పత్తి పెరుగుతుందా? తగ్గుతుందా? స్థిరంగా ఉంటుందా?
జవాబు:
పెరుగుతుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 2
1.6 > 1.57 కావున న్యూట్రాన్ల మరియు ప్రోటాన్ల నిష్పత్తి పెరుగుతుంది.

ప్రశ్న 7.
కేంద్రకం ఎలక్ట్రాన్లను కలిగి ఉండదు. కాని ఎలక్ట్రాన్లను ఉద్గారం చేయగలదు. ఏవిధంగా?
జవాబు:
కేంద్రకంలోని ఒక న్యూట్రాన్, ప్రోటాన్ గా మారినప్పుడు, ఒక ఎలక్ట్రాన్ విడుదలవుతుంది.

ప్రశ్న 8.
విఘటన స్థిరాంకం ప్రమాణాలు, మితులు ఏమిటి?
జవాబు:
λ = \(\frac{0.693}{T}\)
ప్రమాణం = (సెకను)-1
మితులు = -1

ప్రశ్న 9.
బీటా క్షయంలో విడుదలయ్యే ఎలక్ట్రాన్లన్నీ ఎందువల్ల ఒకే శక్తిని కలిగి ఉండవు?
జవాబు:
ఒక న్యూట్రాన్, ప్రోటాన్ గా మారినపుడు, ఒక ఎలక్ట్రాన్ మరియు న్యూట్రినో ఉద్గారమవుతాయి.
0n¹ → 1H¹ + -1eo + v
β-క్షయంలో ప్రోటాన్ కేంద్రకంలో ఉంటుంది. β-కణం మరియూ న్యూట్రినోలు స్థిర మొత్తం శక్తితో విడుదలవుతాయి. న్యూట్రినో శక్తి స్థిరంగా ఉండదు. అందువల్ల ఎలక్ట్రాన్లన్నీ ఒకే శక్తి కలిగి ఉండవు.

ప్రశ్న 10.
కేంద్రక చర్యలను ఉత్పత్తి చేయడానికి న్యూట్రాన్లు అత్యుత్తమ ప్రక్షేపకాలు. ఎందుకు?
జవాబు:
న్యూట్రాన్ ఆవేశరహిత కణం మరియు ఇది విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలలో అపవర్తనం చెందదు. కావున కేంద్రక చర్యలను ప్రేరేపించడానికై న్యూట్రాన్లు అత్యుత్తమ ప్రక్షేపకాలు.

ప్రశ్న 11.
న్యూట్రాన్లు అయనీకరణాన్ని కలిగించలేవు. ఎందుకు?
జవాబు:
న్యూట్రాన్లు అనావేశిత కణాలు కావున అవి అయనీకరణాన్ని కలిగించలేవు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు

ప్రశ్న 12.
విలంబన న్యూట్రాన్ల లు అంటే ఏమిటి?
జవాబు:
కేంద్రక విచ్ఛిత్తిలో కొంత సమయం తర్వాత ఉద్గారమయ్యే న్యూట్రాన్లను విలంబన న్యూట్రాన్లు అంటారు.

ప్రశ్న 13.
ఉష్ట్రీయ న్యూట్రాన్లు అంటే ఏమిటి? వాటి ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు:
సుమారు 0.025 eV గతిశక్తిగల న్యూట్రాన్లను నెమ్మది న్యూట్రాన్లు (లేదా) ఉష్ట్రీయ న్యూట్రాన్లు అంటారు.

ప్రాముఖ్యత :
ఈ ఉష్ట్రీయ న్యూట్రాన్లతో తాడనం చేసినపుడు మాత్రమే 235U విచ్ఛిత్తి చెందుతుంది.

ప్రశ్న 14.
నియంత్రిత శృంఖల చర్య, అనియంత్రిత శృంఖల చర్యలలో న్యూట్రాన్ ప్రత్యుత్పాదక గుణకం విలువ ఎంత?
జవాబు:
నియంత్రిత శృంఖల చర్యలో న్యూట్రాన్ ప్రత్యుత్పాదన గుణకం K = 1
అనియంత్రిత శృంఖల చర్యలో K > 1

ప్రశ్న 15.
కేంద్రక రియాక్టర్ నియంత్రణ కడ్డీల పాత్ర ఏమిటి?
జవాబు:
న్యూక్లియర్ రియాక్టర్ నియంత్రణ కడ్డీలు (కాడ్మియం, బోరాన్) న్యూట్రాన్లను శోషణం చేసుకుని, విచ్ఛిత్తి రేటును నియంత్రణలో ఉంచుతాయి.

ప్రశ్న 16.
కేంద్రక సంలీన చర్యలను, ఉష్ణకేంద్రక చర్యలు అని ఎందుకంటారు?
జవాబు:
కేంద్రక సంలీన చర్య చాలా ఎక్కువ ఉష్ణోగ్రతవద్ద జరుగుతుంది. కావున దీనిని ఉష్ణకేంద్రక చర్య అంటారు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు

ప్రశ్న 17.
బెకరల్, క్యూరీలను నిర్వచించండి.
జవాబు:
బెకరల్ :
ఒక సెకనులో జరిగే ఒక విఘటనం (లేదా) క్షయంనే బెకరల్ అంటారు. దీని SI ప్రమాణం క్రియాశీలత.
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 3

ప్రశ్న 18.
శృంఖల చర్య అంటే ఏమిటి?
జవాబు:
శృంఖల చర్య :
ఒక కేంద్రకం యొక్క విచ్ఛిత్తిలో ఉత్పత్తి అయ్యే న్యూట్రానులు తిరిగి తమ ప్రక్కనున్న ఇతర కేంద్రకాలలో విచ్ఛిత్తికి దోహదం చేస్తాయి. తద్వారా పెద్ద మొత్తంలో న్యూట్రాన్ల ఉత్పత్తి జరిగి, విచ్ఛిత్తికర పదార్థమంతా విఘటనం చెందేదాక కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియ కొనసాగుతుంది. దీనినే శృంఖల చర్య అంటారు.

ప్రశ్న 19.
ఒక కేంద్రక రియాక్టర్లో మితకారి పాత్ర ఏమిటి?
జవాబు:
విచ్ఛిత్తి ప్రక్రియలో ఉద్గారమైన వేగవంతమైన న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించటానికి మితకారిని ఉపయోగిస్తారు.
ఉదా : భారజలం, బెరీలియం.

ప్రశ్న 20.
నాలుగు ప్రోటాన్లు సంలీనం చెందుతూ ఒక హీలియం కేంద్రకంగా ఏర్పడేటప్పుడు విడుదలయ్యే శక్తి ఎంత?
జవాబు:
26.7 MeV శక్తి విడుదలవుతుంది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పరమాణు సాంద్రత కంటే కేంద్రక సాంద్రత ఎందుకు ఎక్కువగా ఉంటుంది? కేంద్రక ద్రవ్యం సాంద్రత, అన్ని కేంద్రకాలకు సమానంగానే ఉంటుందని చూపండి.
జవాబు:
1) పరమాణు ఘనపరిమాణం, కేంద్రకం యొక్క ఘనపరిమాణం కన్నా ఎక్కువ.
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 4
i.e., కేంద్రకం ఘనపరిమాణం, ద్రవ్యరాశి సంఖ్య A కు అనులోమానుపాతంలో ఉండును.
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 5
6) పై సమీకరణం నుండి స్పష్టంగా కేంద్రక సాంద్రత, ద్రవ్యరాశి సంఖ్యపై ఆధారపడదు. కావున అన్ని కేంద్రకాలకు సాంద్రత సమానం.

ప్రశ్న 2.
న్యూట్రాన్ ఆవిష్కరణ మీద ఒక లఘుటీక వ్రాయండి.
జవాబు:
1) బోథే మరియు బెకర్లు, 5 MeV శక్తి గల α – కణాలతో బెరీలియంను తాడనం జరిపినపుడు, ఎక్కువ దూరం చొచ్చుకుపోయే వికిరణం ఉద్గారమవుతుందని కనుగొన్నారు.

2) పై ప్రక్రియకు సమీకరణంను క్రింది విధంగా వ్రాయవచ్చును.
94Be + 42He → 136C + γ(వికిరణ శక్తి)

3) ఈ వికిరణాలు విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలలో ప్రభావం చూపవు.

4) 1932, జేమ్స్ చాడ్విక్ నైట్రోజన్ మరియు ఆర్గాన్లను బెరీలియం వికిరణానికి గురిచేసాడు. ఈ వికిరణం కొత్త రకమైన కణాల సముదాయమని ప్రతిపాదించి ప్రయోగ ఫలితాన్ని వివరించాడు. స్థితిస్థాపక అభిఘాత సూత్రాలను అన్వయించి ఈ కణాలు దాదాపు ప్రోటాన్ ద్రవ్యరాశికి సమానమైన ద్రవ్యరాశిని కలిగి, విద్యుదావేశపరంగా తటస్థంగా ఉంటుందని చూపించాడు. ఈ తటస్థ కణాలను న్యూట్రాన్లుగా వ్యవహరించారు. ఈవిధంగా న్యూట్రాన్ ఆవిష్కృతమైంది.

5) ఈ ప్రయోగ ఫలితంను ఈ క్రింది సమీకరణం ద్వారా సూచించవచ్చు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 6

ప్రశ్న 3.
న్యూట్రాన్ ధర్మాలు ఏమిటి?
జవాబు:
న్యూట్రాన్లు-ధర్మాలు :

  1. న్యూట్రాన్లు ఆవేశ రహిత కణములు. అందువలన ఇవి విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలలో విక్షేపం చెందవు.
  2. న్యూట్రాన్కు చొచ్చుకుపోవు సామర్థ్యం చాలా ఎక్కువ మరియు అయనీకరణ సామర్ధ్యం చాలా తక్కువ.
  3. కేంద్రకం లోపల ఉన్న న్యూట్రాన్ స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే కేంద్రకం వెలుపల ఉండే ఒక వియుక్త న్యూట్రాన్ స్థిరంగా ఉండలేక, స్వచ్ఛందంగా, ప్రోటాన్, ఎలక్ట్రాన్ మరియు విరుద్ధ న్యూట్రినో (v) లుగా క్షయమవుతుంది. ఒక వియుక్త న్యూట్రాన్ యొక్క సరాసరి జీవిత కాలం దాదాపు 1000 సెకనులు ఉంటుంది.
    10n → 11H + 0-1e + \(\overline{\mathrm{v}}\)
  4. భారజలం, పారఫిన్ మైనం, గ్రాఫైట్ వంటి పదార్థాల ద్వారా అధిక ధ్రుతి న్యూట్రాన్లను పంపించి వాటి వేగం తగ్గేట్లు చేయవచ్చును.
  5. న్యూట్రాన్లను, స్ఫటికాల ద్వారా పంపించినపుడు వివర్తనం చెందుతాయి.

AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు

ప్రశ్న 4.
కేంద్రక బలాలు అంటే ఏమిటి? వాటి ధర్మాలను రాయండి.
జవాబు:
కేంద్రకంలో న్యూక్లియాన్లను పట్టి ఉంచటానికి కావల్సిన బలాలను, కేంద్రక బలాలు అంటారు.

ధర్మాలు :

  1. కేంద్రక బలాలు ఆకర్షణ బలాలు. ఇవి ప్రోటాన్-ప్రోటాన్ (P – P), ప్రోటాన్ మరియు న్యూట్రాన్ (P – N) మరియు న్యూట్రాన్ – న్యూట్రాన్ (N – N) ల మధ్య ఉంటాయి.
  2. కేంద్రక బలం, న్యూక్లియాన్ల విద్యుదావేశంపై ఆధారపడదు. ప్రోటాన్-ప్రోటాన్ ల మధ్య బలం, న్యూట్రాన్ – న్యూట్రాన్ మధ్య బలంనకు సమానం.
  3. కేంద్రక బలం అల్ప వ్యాప్తి బలం. ఈ బలాలు స్వల్ప దూరం వరకు మాత్రమే పనిచేస్తాయి. సాధారణంగా కేంద్రక బలంవ్యాప్తి 10-15 m వరకు ఉండును.
  4. కేంద్రక బలం పూర్తి కేంద్రీయ బలం కాదు.
  5. కేంద్రక బలం ఒక వినిమయ బలం.
  6. కేంద్రక బలం న్యూక్లియాన్ల స్పిన్పై ఆధారపడి ఉంటుంది.
  7. కేంద్రక బలం సంతృప్త స్వభావం కలది.
  8. ప్రకృతిలో కేంద్రీయ బలాలు దృఢమైన బలాలు.

ప్రశ్న 5.
ఒక కేంద్రకం ఎక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉండాలంటే, ఒక్కో న్యూక్లియాన్ బంధన శక్తి ఎక్కువ విలువను కలిగి ఉండాలి. ఎందుకు?
జవాబు:

  1. యురేనియం సగటు బంధన శక్తి సాపేక్షంగా 7.6 MeV కన్నా తక్కువ ఉంటుంది. కాబట్టి యురేనియం మరింత స్థిరత్వం పొందటానికి, యురేనియం కేంద్రకం సమాన ద్రవ్యరాశులుగల కేంద్రకాలుగా విచ్ఛిన్నమవుతుంది. దీనినే కేంద్రక విచ్ఛిత్తి అంటారు.
  2. ఉదజని వంటి స్వల్ప ద్రవ్యరాశులుగల కేంద్రకాలు మరింత స్థిరత్వాన్ని పొందటానికి, కేంద్రక సంలీనం ద్వారా హీలియం కేంద్రకాన్ని తయారుచేస్తాయి.
  3. ఇనుము సగటు బంధన శక్తి 8.7 MeV విలువను కలిగి గరిష్ఠంగా ఉంటుంది. కాబట్టి ఇనుము అటు విచ్ఛిత్తికి, ఇటు సంలీనానికి గురికాకుండా స్థిరంగా ఉంటుంది.

ప్రశ్న 6.
α – క్షయాన్ని వివరించండి.
జవాబు:
α – క్షయం :

  1. ఒక రేడియోధార్మిక మూలకం నుండి α – కణం ఉద్గార దృగ్విషయంను ఆ-క్షయం అంటారు. కేంద్రకము – కణాన్ని ఉద్గారిస్తే ద్రవ్యరాశి సంఖ్య 4 తగ్గును మరియు ఆవేశ సంఖ్య 2 తగ్గును.
  2. సాధారణంగా α – క్షయంను క్రింది సమీకరణంలో సూచిస్తారు.
    zXAz-2YA-4 + 2He4 + Q,
    ఇక్కడ Q. ఈ క్షంలో విడుదలయ్యే శక్తి.
  3. క్రియాజనకాల మొత్తం ద్రవ్యశక్తి, తొలి కేంద్రక ద్రవ్యశక్తి కన్నా తక్కువ.
  4. ఈ ప్రక్రియలో తొలి ద్రవ్యశక్తి మరియు క్రియాజనకాల ద్రవ్యశక్తి భేదంను, విఘటన శక్తి (Q) అంటారు.
  5. ఈ విఘటన శక్తిని ఐన్స్టీన్ ద్రవ్యరాశి – శక్తి తుల్యతా సంబంధం E = (∆m) C² ప్రకారం గణిస్తారు.
    i.e., Q = (mx – my – mHe) c²
    ఈ విడుదలయ్యే శక్తి (Q) ని జనక కేంద్రము మరియు α – కణములు పంచుకుంటాయి.

ప్రశ్న 7.
β – క్షయాన్ని వివరించండి.
జవాబు:
β – క్షయం :
1) బీటా క్షయంలో, రేడియోధార్మిక కేంద్రకం నుండి ఎలక్ట్రాన్ ఉద్గారమవుతుంది.

2) పితృ కేంద్రకం β-కణంను ఉద్గారిస్తే, ద్రవ్యరాశి సంఖ్య మారదు. దీనికి కారణం ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి విస్మరించతగ్గ స్వల్ప విలువ కలిగి ఉండును. ఈ ప్రక్రియలో కోల్పోయిన ప్రమాణ రుణ ఆవేశమునకు తుల్యమైన ప్రమాణ ధనావేశంను పొందును. కావున పరమాణు సంఖ్య ఒకటి పెరుగును.

3) సాధారణంగా బీటా క్షయంను క్రింది సమీకరణంతో సూచిస్తారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 7

5) β క్షయంలో ఎలక్ట్రాన్తోపాటు, విరుద్ధ న్యూట్రినో వెలువడును. β+ క్షయంలో ఎలక్ట్రాన్తో పాటు న్యూట్రినో వెలువడును. ఎలక్ట్రాన్లతో పోల్చిన న్యూట్రాన్లు ద్రవ్యరాశి తక్కువ. న్యూట్రాన్ లు తటస్థ కణాలు. అందువల్ల న్యూట్రాన్లు మిగిలిన కణాలతో బలహీనమైన అంతరచర్యలు కలిగి ఉండును.

AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు

ప్రశ్న 8.
γ – క్షయాన్ని వివరించండి.
జవాబు:
γ – క్షయం :

  1. ఒక రేడియోధార్మిక కేంద్రకం నుండి గామా కిరణం ఉద్గారంను – క్షీణత అంటారు.
  2. ఒక పరమాణువువలె కేంద్రకము, భూస్థాయి మరియు ఉత్తేజిత స్థాయిలలో వియుక్త శక్తిస్థాయిలను కలిగి ఉండును.
  3. ఉత్తేజిత స్థాయిలో ఉన్న ఒక కేంద్రకము భూస్థాయికి చేరితే, ఆ రెండు శక్తిస్థాయిల భేదంనకు సమానమైన శక్తితో ఫోటాన్ ఉద్గారమవుతుంది. దీనినే గామా క్షీణత అంటారు.
  4. గామా కిరణాలు చాలా తక్కువ తరంగదైర్ఘ్యం కలిగి ఉండును. కఠిన X-కిరణ తరంగదైర్ఘ్యం కన్నా తక్కువగా ఉండును.
  5. α మరియు β క్షీణతల ఫలితంగా, జనక కేంద్రకము ఉత్తేజిత స్థాయిలో ఉంటే గామా కిరణం ఉద్గారమగును.
  6. 27C060 బీటా క్షీణత రూపాంతరణలో, ఉత్తేజిత 28Ni60 కేంద్రకం ఏర్పడును. ఇది (28Ni60) 1.17 MeV మరియు 1.33 MeV శక్తి కలిగివున్న గామా కిరణాలను ఉద్గారించి భూస్థాయికి చేరును. ఇది పటంలో చూపబడింది.
    AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 8

ప్రశ్న 9.
ఒక రేడియోధార్మిక పదార్థానికి అర్ధజీవిత కాలం, విఘటన స్థిరాంకాలను నిర్వచించండి. వాటి మధ్యగల సంబంధాన్ని రాబట్టండి.
జవాబు:
అర్ధ జీవిత కాలము (T) :
ఒక రేడియోధార్మిక పదార్థం యొక్క రేడియోధార్మిక కేంద్రకాల సంఖ్యలో సగం విఘటనం కావడానికి పట్టే కాలాన్ని, ఆ రేడియోధార్మిక పదార్థం యొక్క అర్ధజీవిత కాలం (1) అంటారు.

విఘటన స్థిరాంకం (λ) :
రేడియోధార్మిక విఘటన రేటుకు మరియు ఆ క్షణాన ఉన్న కేంద్రకాల సంఖ్యకుగల నిష్పత్తిని, విఘటన స్థిరాంకం అంటారు.
ఇది అనుపాత స్థిరాంకము మరియు దీనిని ‘λ’ తో సూచిస్తారు. ∴ λ = \(\frac{-(\frac{dN}{dt})}{N}\)

అర్ధ జీవిత కాలం మరియు విఘటన స్థిరాంకముల మధ్య సంబంధము :
1) ఒక రేడియోధార్మిక నమూనాలో, రేడియోధార్మిక కేంద్రకాల సంఖ్య, కాలంతో ఘాతీయ క్రమంలో తగ్గునని రేడియోధార్మిక విఘటన నియమము N = No e-λtలో తెల్పుతుంది. ఇక్కడ λ ను విఘటన స్థిరాంకం అంటారు.

2) ప్రారంభ కాలం t = 0 వద్ద, రేడియోధార్మిక కేంద్రకాలు N0 ఉన్నాయనుకుందాము. t కాలం తరువాత దానిలో N రేడియోధార్మిక కేంద్రకాలు మిగిలి ఉన్నాయనుకుందాము.

AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 9

ప్రశ్న 10.
ఒక రేడియోధార్మిక పదార్థం సగటు జీవితకాలాన్ని నిర్వచించండి. విఘటన స్థిరాంకం, సగటు జీవిత కాలాల మధ్య సంబంధాన్ని రాబట్టండి.
జవాబు:
సగటు జీవిత కాలము (τ) :
N0 సంఖ్యగల అన్ని కేంద్రకాల యొక్క మొత్తం జీవిత కాలంను, విఘటన చెందుటకు ముందు ఉండే తొలి కేంద్రకాల మొత్తం సంఖ్యతో భాగిస్తే వచ్చే విలువ, సగటు జీవిత కాలానికి సమానము.
విఘటన స్థిరాంకము మరియు సగటు జీవిత కాలాల మధ్య సంబంధము :
1) ప్రారంభ కాలం t = 0 వద్ద, రేడియోధార్మిక కేంద్రకాలు N0 ఉన్నాయనుకుందాము. t మరియు t + dt కాలంల మధ్య విఘటనం చెందిన కేంద్రకాల సంఖ్య dN.
2) ఈ dN కేంద్రకాల విఘటనానికి పట్టుకాలము t dN. ప్రారంభంలో నమూనా (sample) లోని అన్ని కేంద్రకాలు
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 10

ప్రశ్న 11.
ఒక రేడియోధార్మిక పదార్థం అర్ధజీవిత కాలం, సగటు జీవితకాలాల మధ్య సంబంధాన్ని రాబట్టండి.
జవాబు:
అర్ధ జీవిత కాలం (T) మరియు సగటు జీవిత కాలం (τ) ల మధ్య సంబంధము :
1) రేడియోధార్మిక విఘటన నియమము, N = N0e-λt ……………. (1)
2) t = 0 వద్ద తొలికేంద్రకాల సంఖ్య N0 అని, T కాలం తరువాత కేంద్రకాల సంఖ్య \(\frac{N_0}{2}\) అని, 2T కాలం తరువాత కేంద్రణాల సంఖ్య \(\frac{N_0}{4}\) అని భావిద్దాం.
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 11
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 12

ప్రశ్న 12.
కేంద్రక విచ్ఛిత్తి అంటే ఏమిటి? దీనిని ఒక ఉదాహరణతో వివరించండి.
జవాబు:
కేంద్రక విచ్ఛిత్తి :
ఒక భారయుత కేంద్రకం, రెండు సమాన ద్రవ్యరాశులు గల రెండు మూలకాలుగా విడిపోవటాన్నే కేంద్రక విచ్ఛిత్తి అంటారు.
ఉదా : కేంద్రక విచ్ఛిత్తి చర్య, 23592U + ¹0n → 14156Ba + 9236Kr + 3¹0n + Q
ఇక్కడ Q అనేది విడుదలయ్యే శక్తిని సూచిస్తుంది.
se l Ba + 36Kr+ 3jn+Q
Q = (క్రియాజన్యాల ద్రవ్యరాశి – క్రియాజనకాల ద్రవ్యరాశి) C²
= [23592 ద్రవ్యరాశి + ¹0n ద్రవ్యరాశి ] – [14156Ba ద్రవ్యరాశి + 9236Kr ద్రవ్యరాశి + మూడు న్యూట్రాన్ల ద్రవ్యరాశి] C²
= (235.043933 – 140.9177 – 91.895400 – 2 × 1.008665) amu × C².
= 0.2135 x 931.5 MeV = 198.9 MeV = 200 MeV

AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు

ప్రశ్న 13.
కేంద్రక సంలీనం అంటే ఏమిటి? కేంద్రక సంలీనం సంభవించడానికి గల నిబంధనలను వ్రాయండి.
జవాబు:
కేంద్రక సంలీనం :
రెండు తేలికైన కేంద్రకాలు కలిసి ఒక భార కేంద్రకంగా ఏర్పడుతూ, శక్తిని విడుదల చేసే ప్రక్రియను కేంద్రక సంలీనం అంటారు.
ఉదా : హైడ్రోజన్ (1H¹) కేంద్రకాలు ఒకదానితో మరొకటి సంలీనం చెంది, భార హీలియం (2He4) ను ఏర్పరచినపుడు 25.71 MeV శక్తి విడుదలయగును.

కేంద్రక సంలీనంనకు నిబంధనలు :

  1. కేంద్రక సంలీనం అత్యధిక ఉష్ణోగ్రత 107 కెల్విన్ మరియు అధిక పీడనాల వద్ద జరుగును. ఈ రెండు ఆటంబాంబ్ విస్పోటనంలో పొందవచ్చును.
  2. రెండు తేలిక కేంద్రకాల మధ్య తరుచుగా అభిఘాతాలు జరుగుటకు సాంద్రత ఎక్కువగా ఉండాలి.

ప్రశ్న 14.
కేంద్రక సంలీనం, కేంద్రక విచ్ఛిత్తిల మధ్య వ్యత్యాసాలను తెలపండి.
జవాబు:

కేంద్రక విచ్ఛిత్తికేంద్రక సంలీనం
1) ఇందులో భార కేంద్రకం విడిపోవుట జరుగుతుంది.1) ఇందులో తేలిక కేంద్రకాలు కలిసిపోవును.
2) దీనికి న్యూట్రాన్లు అవసరం.2) దీనికి న్యూట్రాన్లు అవసరంలేదు.
3) విచ్ఛిత్తి ఖండములు, రేడియోధార్మిక లక్షణాలు కలిగి ఉండును.3) సంలీన ఉత్పాదికములు రేడియోధార్మిక లక్షణాలు కలిగి ఉండును.
4) అధిక ఉష్ణోగ్రతలు అవసరం లేదు.4) అత్యధికమయిన ఉష్ణోగ్రతలు అవసరం.
5) దీనిలో 200 MeV శక్తి విడుదలయగును.5) దీనిలో విడుదలయ్యే శక్తి 24.7 MeV.
6) ఒక్కొక్క న్యూక్లియాన్కి విడుదలయ్యే శక్తి 0.9 MeV.6) ఒక్కొక్క న్యూక్లియాన్కి విడుదలయ్యే శక్తి 7 MeV.
7) ఈ సూత్రంపై ఆటంబాంబ్ తయారు చేయబడింది.7) ఈ సూత్రంపై హైడ్రోజన్ బాంబ్ తయారుచేయబడింది.

ప్రశ్న 15.
శృంఖల చర్య, ప్రత్యుత్పాదన గుణకం అనే పదాలను వివరించండి. ఒక శృంఖల చర్య ఎలా కొనసాగుతుంది?
జవాబు:
శృంఖల చర్య :
ఒక కేంద్రకం యొక్క విచ్ఛిత్తిలో ఉత్పత్తి అయ్యే న్యూట్రాన్లు తిరిగి ప్రక్కనున్న ఇతర కేంద్రకాలలో విచ్ఛిత్తికి దోహదం చేస్తాయి. తద్వారా పెద్ద మొత్తంలో న్యూట్రాన్ల ఉత్పత్తి జరిగి విచ్ఛిత్తికర పదార్థమంతా విఘటనం చెందేదాక కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియ కొనసాగుతుంది. దీనినే శృంఖల చర్య అంటారు.

ప్రత్యుత్పాదన గుణకం :
ప్రస్తుత సంఘటనలో ఉత్పత్తి అయిన న్యూట్రాన్ల సంఖ్యకు అంతకుముందు సంఘటనలో ఉత్పత్తి అయిన న్యూట్రాన్ల సంఖ్యకుగల నిష్పత్తినే న్యూట్రాన్ ప్రత్యుత్పాదన కారకం (K) అంటారు.

శృంఖల చర్య సమసిపోకుండా కొనసాగాలంటే యురేనియం ద్రవ్యరాశి ఒక నిర్దిష్ట ద్రవ్యరాశికంటే సమానంగాను లేదా అంతకంటే ఎక్కువగాను ఉండాలి. ఈ ద్రవ్యరాశినే “సందిగ్ధ ద్రవ్యరాశి” అంటారు. న్యూట్రాన్ గుణకారి కారకం K 21 ఉంటే శృంఖల చర్య కొనసాగుతుంది.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ద్రవ్యరాశి లోపం, బంధన శక్తులను నిర్వచించండి. ఒక్కో న్యూక్లియాన్కు గల బంధన శక్తి, ద్రవ్యరాశి సంఖ్యతో ఎలా మారుతుంది? దాని ప్రాధాన్యత ఏమిటి?
జవాబు:
1) ద్రవ్యరాశి లోపం :
కేంద్రకంలోని కణాల ద్రవ్యరాశుల మొత్తానికి, ఆ కేంద్రం ద్రవ్యరాశికి మధ్య ఉండే వ్యత్యాసాన్నే ద్రవ్యరాశి లోపం అంటారు. కేంద్రకం ద్రవ్యరాశి M ఎల్లప్పుడు దానిని నిర్మిస్తున్న కేంద్రక కణాల ద్రవ్యరాశుల మొత్తం కన్నా తక్కువ.
ద్రవ్యరాశి లోపం, ∆M = [Zmp + (A – Z)mn] – M

2) బంధన శక్తి :
ఒక కేంద్రకాన్ని దాని అంశభాగాలైన న్యూక్లియాన్లు (ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు)గా విడగొట్టడానికి కావలసిన శక్తినే కేంద్రక బంధనశక్తి అంటారు.
బంధన శక్తి E = AMC² = [Zmp + (A – Z)mn – M] 931.5 MeV.
కేంద్రక బంధన శక్తి, కేంద్రకము స్థిరత్వంను సూచిస్తుంది.
ఒక న్యూక్లియాన్పై బంధన శక్తి Ebn = \(\frac{E_b}{A}\)

3) ద్రవ్యరాశి సంఖ్య A తో ఒక్కొక్క న్యూక్లియాన్కుగల బంధన శక్తి (సగటు బంధన శక్తి) ఏ విధంగా మారుతుందో ఈ క్రింది గ్రాఫ్ సూచిస్తుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 13

4) కేంద్రక బంధన శక్తి 28 < A < 138 వ్యాప్తిలో అత్యధికంగా ఉందని, గ్రాఫ్ ద్వారా పరిశీలించవచ్చు. ఈ వ్యాప్తిలో ఉన్న కేంద్రకాల బంధన శక్తులు 8.7 MeV విలువకు చాలా దగ్గరలో ఉన్నాయి.

5) ద్రవ్యరాశి సంఖ్య పెరిగే కొద్దీ, సగటు బంధన శక్తి తగ్గుతుంటుంది. అందువల్ల యురేనియంవంటి భారయుత కేంద్రకానికి సగటు బంధన శక్తి విలువ 7.6 MeV ఉంటుంది.

6) ద్రవ్యరాశి సంఖ్య తక్కువగా ఉన్న ప్రాంతంలో సగటు బంధన శక్తి వక్రం అభిలక్షణ కనిష్టాలను, గరిష్టాలను ప్రదర్శిస్తుంది.

7) బేసి సంఖ్యలో ప్రోటాన్లను, న్యూట్రాన్లలను కలిగి ఉండే 63Li, 105B, 147N వంటి మూలక కేంద్రకాలతో కనిష్టాలు 42He, 126C, 168O వంటి మూలక కేంద్రకాలతో గరిష్ఠాలు ముడిపడి ఉంటాయి.

ప్రాధాన్యత :

  1. వక్రము, ఒక్కొక్క న్యూక్లియాన క్కుగల బంధన శక్తి మరియు కేంద్రకం స్థిరత్వంల మధ్య సంబంధంను తెల్పుతుంది.
  2. యురేనియం 7.6 MeV సగటు బంధన శక్తి కలిగి ఉండును. కాబట్టి యురేనియం మరింత స్థిరత్వంను పొందుటకు రెండు సమాన ద్రవ్యరాశిగల కేంద్రకాలుగా విడిపోవును. దీనినే కేంద్రక విచ్ఛిత్తి అంటారు.
  3. హైడ్రోజన్ వంటి తేలిక కేంద్రకాలు మరింత స్థిరత్వం పొందటానికి, కేంద్రక సంలీనం ద్వారా హీలియం కేంద్రకాన్ని తయారు చేస్తాయి.
  4. ఇనుము సగటు బంధన శక్తి 8.7 MeV విలువ కలిగి గరిష్ఠంగా ఉంటుంది. కావున ఇనుము అటు విచ్ఛిత్తికి, ఇటు సంలీనంనకు గురికాకుండా స్థిరంగా ఉంటుంది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు

ప్రశ్న 2.
రేడియోధార్మికత అంటే ఏమిటి? రేడియోధార్మిక క్షయా నియమాన్ని పేర్కొనండి. రేడియోధార్మిక క్షయం స్వభావం ఒక ఘాత ప్రమేయంగా ఉంటుందని చూపండి. [TS. Mar.’16]
జవాబు:
1) రేడియోధార్మికత :
అస్థిరమైన కేంద్రకాలు స్థిరత్వాన్ని పొందడానికి స్వచ్ఛందంగా α, β మరియు γ కిరణాలను ఉద్గారం చేయడం ద్వారా విఘటనం చెందుతాయి. ఈ కిరణాలను ఉద్గారించు దృగ్విషయంను, సహజ రేడియోధార్మికత అంటారు.

2) రేడియోధార్మిక విఘటనం లేక క్షయా నియమము:
“రేడియోధార్మిక విఘటన రేటు, ఆ క్షణంలో పదార్థంలో మిగిలి ఉన్న కేంద్రకాల సంఖ్యకు అనులోమానుపాతంలో ఉంటుంది.” దీనినే క్షయా నియమము అంటారు.

3) రేడియోధార్మిక క్షయా స్వభావం ఒక ఘాత ప్రమేయం అని చూపుట :
ఒక ద్రవ్య నమూనాలో ప్రారంభంలో అనగా కాలం t = 0 వద్ద N0 రేడియోధార్మిక కేంద్రకాలున్నాయనుకొనుము. t కాలం తరువాత దానిలో N రేడియోధార్మిక కేంద్రకాలు మిగిలి ఉంటాయనుకున్నప్పుడు, రేడియోధార్మిక విఘటన రేటు (\(\frac{dN}{dt}\)), ఆ క్షణంలో మిగిలి ఉన్న కేంద్రకాల సంఖ్య (N) కు అనులోమానుపాతంలో ఉండును.
\(\frac{dN}{dt}\) ∝ N
dN= – λ Ndt ………… (1)
‘ఇక్కడ అనుపాత స్థిరాంకం ‘λ’ ను క్షయా స్థిరాంకం లేదా విఘటన స్థిరాంకం అంటారు. రుణ గుర్తు రేడియోధార్మిక కేంద్రజాల సంఖ్య తగ్గుదలను సూచిస్తుంది.

4) సమీకరణం (1) నుండి, \(\frac{dN}{N}\) = – λ dt ………… (2)

5) ఇరువైపులా సమాకలనం చేయగా,
∫\(\frac{dN}{N}\) = – λ ∫ dt
In N = – λt + C ………… (3)
ఇక్కడ C సమాకలన స్థిరాంకము.

6) t = 0 వద్ద N = N0 కావున In N0o = C
In N = – λt + In N0
ln N – In N0 = – λt
In (\(\frac{N}{N_0}\)) = – λt
N = N0 e-λt
పై సమీకరణం రేడియోధార్మిక క్షయా నియమమును తెల్పును.

7) పై సమీకరణంబట్టి రేడియోధార్మిక కేంద్రకాల సంఖ్య కాలంతోపాటు ఘాతీయ క్రమంలో తగ్గునని తెలియును.

ప్రశ్న 3.
చక్కని పటం సహాయంతో ఒక కేంద్రక రియాక్టర్ సూత్రం పనిచేసే విధానాలను వివరించండి. [TS. Mar.’17; AP. Mar.’17; AP. Mar.’16; AP & TS. Mar.’15, ’14]
జవాబు:
సూత్రం :
నియంత్రణ చెందిన గొలుసు ప్రక్రియతో కేంద్రక విచ్ఛిత్తి జరిగే పరికరాన్ని కేంద్రక రియాక్టర్ అంటారు. సహజ యురేనియం 238U ను 235U తో సంవృద్ధం చేసి నియంత్రిత శృంఖల చర్యను సాధించే సూత్రంపై ఆధారపడి రియాక్టర్ పనిచేయును.

కేంద్రక రియాక్టర్లో ప్రధానమైన భాగాలు :
(1) ఇంధనం (2) మితకారి (3) నియంత్రణ కడ్డీలు (4) రేడియోధార్మిక కవచం (5) శీతలకారి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 14

1) ఇంధనం మరియు తొడుగు :
దీనిలో ఇంధనాన్ని పొడవైన స్థూపాకారపు కడ్డీలుగా చేసి, వాటి సముదాయాన్ని ఇంధన సముదాయంగా ఉపయోగిస్తారు. ఇవి ఒక గొట్టపు తొడుగులో అమర్చడం వలన విచ్ఛిత్తి ప్రక్రియలో కలిగే దుష్ఫలితాల్ని నియంత్రించవచ్చును. ఇంధనాన్ని నిల్వ ఉంచే భాగాన్ని రియాక్టర్ యొక్క గర్భం (కోర్) అంటారు.

సహజ యురేనియం, సంవృద్ధ యురేనియం, ప్లుటోనియంలు ఇంధనాలుగా వాడతారు.

2) మితకారి :
విచ్ఛిత్తి ప్రక్రియలో విడుదలయ్యే న్యూట్రాన్లను మితకారి పదార్థంతో పరిక్షేపక అభిఘాతమునకు గురిచేయడం ద్వారా వాటి వేగాన్ని తగ్గించవచ్చును. ఈ మితవేగం కలిగిన మందభ్రుతి న్యూట్రాన్లు మరిన్ని విచ్ఛిత్తి సంఘటనలను ప్రేరేపిస్తాయి. ఇంధన సముదాయము చుట్టూ ఈ మితకారి పదార్ధము అమర్చబడి ఉండును. భారజలము లేదా గ్రాఫైట్ కడ్డీలను మితకారి పదార్థాలుగా వాడతారు.

3) నియంత్రణ కడ్డీలు :
విచ్ఛిత్తి ప్రక్రియలో విడుదలయిన న్యూట్రాన్ల ను ఈ కడ్డీలు శోషించుకొనుట ద్వారా చర్యను నియంత్రించవచ్చును. ఈ కడ్డీల కదలికలను నియంత్రించుట ద్వారా విచ్ఛిత్తి ప్రక్రియ రేటును నియంత్రించవచ్చు.

కడ్డీల రూపంలో ఉన్న కాడ్మియం, బోరాన్లను నియంత్రణ కడ్డీలుగా వాడతారు.

4) రక్షణ కవచం :
కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియలో న్యూట్రాన్లతోపాటు బీటా, గామా కిరణాలు విడుదలవుతాయి. ఇది చుట్టుపక్కల వారికి హాని కలుగచేస్తాయి. కావున స్టీల్, సీసం, సిమెంట్వంటి పదార్థాలతో తగిన రక్షణ కవచం రియాక్టర్ చుట్టూ. ఏర్పాటు చేస్తారు.

5) శీతలకారి :
ఇంధన కడ్డీలు ఉత్పత్తిచేసే అత్యధిక ఉష్ణాన్ని వాటి చుట్టూ అనువైన చల్లని ద్రవాలను పంపింగ్ చేయడం ద్వారా తగ్గిస్తారు. అత్యధిక పీడనాలలో ఉన్న నీరు, ద్రవీకృత సోడియంలను శీతలకారిణులుగా వినియోగిస్తారు.

పనిచేయు విధానము :
పటములో చూపినట్లు రియాక్టర్ అల్యూమినియంతో చేసిన స్థూపాకారపు గొట్టాలలో యురేనియంను కడ్డీల రూపంలో అమర్చి వాని మధ్య మితకారి గ్రాఫైట్ను ఉంచుతారు. ఈ గ్రాఫైట్ దిమ్మెలకుండే రంధ్రాలలో కాడ్మియం లేదా బోరాన్ వంటి నియంత్రిత కడ్డీలను అమర్చుతారు.

235U కేంద్రక విచ్ఛిత్తికి లోనైనపుడు విడుదలయ్యే అధిక ధ్రుతి న్యూట్రాన్లను గ్రాఫైట్ (మితకారి) ద్వారా ప్రయాణించుట వలన శక్తిని కోల్పోయి మంద ధ్రుతిగల ఉష్ట్రీయ న్యూట్రాన్లుగా మారతాయి. వీటిని 235U గ్రహించి కేంద్రక విచ్ఛిత్తికి లోనగును. నియంత్రిత కడ్డీలను తగిన లోతు వరకు పంపించుట ద్వారా విచ్ఛిత్తి సంఘటనలను నియంత్రించవచ్చును.

ఈ ప్రక్రియలో విడుదలయిన ఉష్ణాన్ని శీతలకారిణులను వేడిచేయటానికి ఉపయోగిస్తారు.

శీతల ద్రవాలను వేడిచేయుటద్వారా వచ్చిన ఆవిరి సహాయంతో టర్బయిన్లు తిరిగేటట్లు చేస్తారు. ఈ టర్బయిన్లు జనరేటర్లు పనిచేసేటట్లు చేసి విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేస్తారు.

ప్రశ్న 4.
నక్షత్రాల శక్తికి మూలాన్ని వివరించండి. నక్షత్రాలలో సంభవించే కార్బన్-నైట్రోజన్ చక్రం, ప్రోటాన్-ప్రోటాన్ చక్రాలను వివరించండి.
జవాబు:
సూర్యుడు మరియు నక్షత్రాలలో శక్తి జనించడానికి మూల కారణాలుగా శాస్త్రవేత్తలు రెండు రకాలైన చక్రీయ ప్రక్రియలను పేర్కొన్నారు. అందులో మొదటి దాన్ని కార్బన్-నైట్రోజన్ చక్రం అనీ, రెండోదాన్ని ప్రోటాన్-ప్రోటాన్ చక్రం అని పిలుస్తారు.

1) కార్బన్-నైట్రోజన్ చక్రం :
ఒక ప్రోటాన్ సాధారణ కార్బన్ ఢీకొని నైట్రోజన్ యొక్క అల్పభార ఐసోటోప్ 13N ను ఏర్పరుస్తుంది. ఈ 13N రేడియోధార్మికతను కలిగి ఉంటుంది. 13N ఒక పాజిట్రాన్ ను ఉద్గారించి కార్బన్ ఐసోటోప్ 13C గా మారుతుంది. మరో ప్రోటాన్ ఈ 13C ను సాధారణ నైట్రోజన్ “N గా మారుస్తుంది. ఈ 14N తో మరో ప్రోటాన్ ఢీకొని ఆక్సిజన్ యొక్క అస్థిర ఐసోటోప్ 15O ఏర్పడుతుంది. ఈ అస్థిర ఐసోటోప్ పాజిట్రాన్ ను ఉద్గారించడం ద్వారా క్షయమై నైట్రోజన్ ఐసోటోప్ 15N ను ఏర్పరుస్తుంది. చివరకు ఈ 15N నాల్గవ ప్రోటాన్తో చర్యనొంది కార్బన్ కేంద్రకం 12C మరియు హీలియం కేంద్రకం 4He ను ఏర్పరుస్తుంది.

ఈ కేంద్రక చర్యల క్రమం దిగువ చూపించిన విధంగా ఉంటుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 15

2. ప్రోటాన్-ప్రోటాన్ చక్రం :
అత్యధిక ఉష్ణోగ్రత వద్ద, ప్రోటాన్ల యొక్క ఉష్ణశక్తి ఒక డ్యూటరాన్ మరియు ఒక పాజిట్రాన్లను ఏర్పరచేందుకు సరిపోతుంది. ఇప్పుడు డ్యూటరాన్ మరొక ప్రోటాన్తో కలిసి అల్పభారం గల హీలియం కేంద్రకాల్ని (32He) ఏర్పరుస్తుంది. అలాంటి రెండు హీలియం కేంద్రకాలు కలిసి హీలియం కేంద్రకం 42He ను మరియు రెండు ప్రోటాన్లను ఏర్పరుస్తాయి. ఈ క్రమంలో 25.71 MeV నికర శక్తి వెలువడుతుంది. ఈ కేంద్రక సంలీన చర్యలను దిగువన పొందుపరిచాం.
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 16

లెక్కలు Problems

ప్రశ్న 1.
ఒక కేంద్రకం సాంద్రత, దాని ద్రవ్యరాశి సంఖ్య మీద ఆధారపడదని చూపండి. (సాంద్రత, ద్రవ్యరాశి మీద ఆధారపడదు).
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 17
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 18

ప్రశ్న 2.
ద్రవ్యరాశి సంఖ్యలు 27, 64 గా ఉన్న కేంద్రకాల వ్యాసార్ధాలను పోల్చండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 19
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 20

AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు

ప్రశ్న 3.
ఆక్సిజన్ కేంద్రకం 168O వ్యాసార్ధం 2.8 × 10-15 m గా ఉంటే, సీసం కేంద్రకం 20582Pb వ్యాసార్ధాన్ని కనుక్కోండి.
సాధన:
R0 = 2.8 × 10-15 m; A0 = 16
APb = 205; RPb = ?
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 21

ప్రశ్న 4.
Fe పరమాణు ద్రవ్యరాశి 55.9349u హైడ్రోజన్ ద్రవ్యరాశి 1.00783u న్యూట్రాన్ ద్రవ్యరాశి 1.00876u గా ఉంటే 5626Fe బంధన శక్తి కనుక్కోండి.
సాధన:
హైడ్రోజన్ పరమాణువు
mp = 1.00876 u; mn = 1.00867 u
Z = 26; A = 56
ఇనుము పరమాణు ద్రవ్యరాశి, M = 55.9349 u

i) ద్రవ్యరాశి లోపం, ∆M
= [Zmp + (A – Z) mn – M]
= [26 × 1.00783 + (56-26) (1.00876) – 55.93493] u
∴ ∆M = 0.53148u

ii) కేంద్రక బంధన శక్తి = ∆MC²
= ∆M × 931.5 MeV
= (0.53148) 931.5 meV
= 495.07 meV

ప్రశ్న 5.
విలక్షణ మధ్యస్థ ద్రవ్యరాశి కలిగిన 12050Sn కేంద్రకాన్ని, దాని ఆంగిక న్యూక్లియాన్లుగా విడదీయడానికి అవసరమయ్యే శక్తిని లెక్కించండి. (12050n ద్రవ్యరాశి =119.902199u, ప్రోటాన్ ద్రవ్యరాశి = 1.007825u, నూట్రాన్ ద్రవ్యరాశి = 1.008665u)
సాధన:
mp = 1.007825u
mn = 1.008665u
Sn, కు Z = 50;
A = 120; M = 119.902199u

i) ద్రవ్యరాశి లోపం, ∆m
= [Zmp + (A – Z) mn – M]u
= 50 [(1.007825) + (120-50) (1.008665)119.902199]u
= [50 × 1.007825 + 70 × 1.008665 – 119.902199]u
= [50.39125 + 70.60655 – 119.902199]u
∆M = [120.9978 – 119.902199]
= 1.095601u

ii) న్యూక్లియాన్లను వేరుచేయుటకు కావల్సిన శక్తి
= కేంద్రకం బంధన శక్తి = ∆M × C²
= ∆M × 931.5 MeV
= 1.095601 × 931.5 MeV
= 1020.5 MeV
= 1.0087u,

ప్రశ్న 6.
α – కణం బంధన శక్తిని లెక్కించండి. ప్రోటాన్ ద్రవ్యరాశి = 1.0073 u, న్యూట్రాన్ ద్రవ్యరాశి α – కణం ద్రవ్యరాశి = 4.0015u.
సాధన:
2He4, A = 4, Z = 2, mp = 1.0073u
mn = 1.0087u, M = 4.0015u

i) ∆M
= [Zmp + (A – Z) mn – M]
= [2(1.0073) + (4 – 2) (1.0087) – 4.00260]
= [2 × 1.0073 + 2 × 1.0087-4.00260]
= (2.01462.0174) – 4.0015
∆M = [4.032 – 4.0015] = 0.0305 u

ii) BE = ∆M × C² ∆M × 931.5 MeV
= 0.0305 × 931.5
∴ BE = 28.41 MeV

AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు

ప్రశ్న 7.
168O కేంద్రకాన్ని నాలుగు α – కణాలుగా విడగొట్టడానికి అవసరమయ్యే శక్తి ఎంత? α-కణం ద్రవ్యరాశి 4.002603u, ఆక్సిజన్ పరమాణు ద్రవ్యరాశి 15.994915u.
సాధన:
‘O’ విడగొట్టుటకు కావల్సిన శక్తి = (క్రియాజనకాల మొత్తం శక్తి –
[4 × 2He4 ద్రవ్యరాశి – 8O16O’ ద్రవ్యరాశి] × c²
= [(4 × 4.002603) 15.994915] u × c²
= [16.01041215.994915] u × c²
= (0.015497) 931.5 MeV = 14.43 MeV

ప్రశ్న 8.
3517Cl కేంద్రకం ఒక్కో న్యూక్లియాన్ బంధనశక్తిని లెక్కించండి. ఇచ్చినవి 3517Cl కేంద్రక ద్రవ్యరాశి = 34.98000 u, ప్రోటాన్ ద్రవ్యరాశి = 1.007825u, న్యూట్రాన్ ద్రవ్యరాశి = 1.008665u, 1u ద్రవ్యరాశికి తుల్యమైన శక్తి 931 MeV.
సాధన:
3517Cl కు, A = 35, Z = 17; mp = 1.007825 u
mn = 1.008665 u, M = 34.98 u

(i) ∆M = [Zmp + (A – Z) mn – M]
[17 × 1.007825 + (35 – 17) (1.008665) – 34.98]
= 17.13303 + 18.15597 – 34.98
∆M = [35.289 – 34.98] = 0.3089 u

(ii) BE = ∆MC²
= 0.3089 × 931 MeV = 287.5859 MeV
∴ ఒక్కో న్యూక్లియాన్ బంధనశక్తి
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 22

ప్రశ్న 9.
4020Ca కేంద్రకం ఒక్కో న్యూక్లియాన్ బంధనశక్తిని లెక్కించండి. ఇచ్చినవి : 4020Ca కేంద్రక ద్రవ్యరాశి = 39.962589 u, ప్రోటాన్ ద్రవ్యరాశి = 1.007825 u, న్యూట్రాన్ ద్రవ్యరాశి = 1.008665 u, lu ద్రవ్యరాశికి తుల్యమైన శక్తి 931 MeV.
సాధన:
4020Ca కు A = 40, Z = 20; mp = 1.007825 u
mn = 1.008665 u; M = 39.962589 u

(i) ∆M = [Zmp + (A – Z) mn – M)
= [(20) (1.007825) + (40 – 20) (1.008665) – 39.962589]
= [(20 × 1.007825) + (20 × 1.008665) – 39.962589]
= [40.3298 – 39.962589] = 0.3672 u

(ii) BE = ∆MC² = 0.3672 × 931 MeV
= 341.86 MeV

iii) న్యూక్లియాన్పై B.E = \(\frac{B.E}{A}=\frac{341.86}{40}\)
= 8.547 MeV

ప్రశ్న 10.
126C కేంద్రకం (i) ద్రవ్యరాశి లోపం, (ii) బంధన శక్తి, (iii) 126C కేంద్రకంలో ఒక్కో న్యూక్లియాన్ బంధన భక్తులను లెక్కించండి. 126 కేంద్రక ద్రవ్యరాశి = 12.000000 u; ప్రోటాన్ ద్రవ్యరాశి = 1.007825u, న్యూట్రాన్ ద్రవ్యరాశి = 1.008665 u.
సాధన:
126C కు, A = 12; 2 = 6; mp = 1.007825u
mn = 1.008665u; M = 12.000000 u
i) ∆M = [Zmp + (A – Z) mn – M]
= [6(1.007825) + (12 – 6) (1.008665) – 12.000000]
= [6.04695 6.05199 – 12.000000]
∆M = [12.09894-12.000000] 0.098944

(ii) BE = ∆M × C² = 0.09894 × 931.5 MeV
= 92.16 MeV

(iii) న్యూక్లియాన్పై BE
= \(\frac{B.E}{A}=\frac{92.16}{12}\) = 7.68 MeV

AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు

ప్రశ్న 11.
డ్యుటీరియం, హీలియంలో ఒక్కో న్యూక్లియాన్ బంధన శక్తులు వరసగా 1.1MeV, 7.0 MeV లుగా ఉన్నాయి. చర్చలో 106 ద్యుటిరాన్లు పాల్గొంటే ఎన్ని వాళ్ళ శక్తి విడుదలవుతుంది?
సాధన:
డ్యుటీరియంకు, A = 2, He కు A = 4
(\(\frac{B.E}{A}\))D = 1.1 MeV ⇒ [B.E]D
= A × 1.1 MeV = 2 × 1.1 MeV = 2.2 MeV
(\(\frac{B.E}{A}\))He = 7.0 MeV ⇒ [B.E]He
= A × 7.0 MeV = 4 × 7.0 MeV = 28.0 MeV
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 23
ఋణగుర్తు శక్తి విడుదలను సూచిస్తుంది.

ప్రశ్న 12.
లిథియంను ప్రోటాన్లతో తాడనం చెందించినప్పుడు, ఈ విధంగా చర్య జరుగుతుంది :
73Li + ¹1H → 2[42He] + Q. ఈ చర్యలో Q-విలువను కనుక్కోండి. లిథియం, ప్రోటాన్, హీలియంల ద్రవ్యరాశులు వరసగా 7.016u, 1.008, 4.004uలు.
సాధన:
లిథియం ద్రవ్యరాశి = 7.016u
mp = 1.008 u
హీలియం ద్రవ్యరాశి = 4.004 u;
u = 931.5 MeV
Q = [లిథియం ద్రవ్యరాశి + mp – 2 × హీలియం ద్రవ్యరాశి × 931.5 MeV
= [7.016 + 1.008 – 2(4.004)] × 931.5 MeV
= [8.024 – 8.008] × 931.5 MeV
∴ Q = 0.016 x 931.5 MeV
= 14.904 MeV

ప్రశ్న 13.
రేడియం అర్ధజీవిత కాలం 1600 సంవత్సరాలు. ౧g రేడియం 0.125 g లుగా తగ్గడానికి ఎంత కాలం తీసుకొంటుంది? [TS. Mar. 16]
సాధన:
రేడియం అర్ధజీవిత కాలం = 1600 సంవత్సరాలు
పదార్ధం తొలి ద్రవ్యరాశి = 1g
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 24

ప్రశ్న 14.
ప్లుటోనియం, అర్ధజీవిత కాలం 24,000 సంవత్సరాలతో క్షయం చెందుతోంది. ప్లుటోనియంను 72,000 సంవత్సరాలు నిల్వ ఉంచితే అందులో ఎంత భాగం మిగిలి ఉంటుంది?
సాధన:
ప్లుటోనియం అర్ధజీవితకాలం = 24,000 సంవత్సరాలు
పట్టిన కాలము = 72,000 సంవత్సరాలు
తొలి ద్రవ్యరాశి = Mg
తుది ద్రవ్యరాశి = mg
అర్ధజీవిత కాలంల సంఖ్య (n)
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 25

ప్రశ్న 15.
ఒకానొక పదార్థం క్షయమవుతూ ఉండటం వల్ల 24 రోజుల్లో దాని క్రియాశీలత, తొలి క్రియాశీలతలో 1/232 వ వంతుకు పడిపోతుంది. దాని అర్ధజీవిత కాలాన్ని
సాధన:
పదార్థం పాక్షిక క్షీణత
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 26
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 27

ప్రశ్న 16.
ఒక రేడియోధార్మిక పదార్థం అర్ధజీవిత కాలం 20 రోజులు. ఆ పదార్థం దాని తొలి ద్రవ్యరాశిలో 7/8వ వంతుకు విఘటనం చెందడానికి ఎంత సమయం పడుతుంది?
సాధన:
అర్ధజీవిత కాలం = 20 రోజులు
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 28
విఘటనాలకు పట్టుకాలము
= n × అర్ధజీవిత కాలము
= 3 × 20 = 60 రోజులు

ప్రశ్న 17.
α – క్షయం పరంగా, 23892U అర్ధజీవిత కాలం 1.42 × 10-7s అయితే 1 గ్రాము 330లో 1 సెకనుకు సంభవించే విఘటనాల సంఖ్య ఎంత?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 29

ప్రశ్న 18.
ఒక రేడియోధార్మిక పదార్థం అర్ధజీవిత కాలం 100 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల్లో దాని క్రియాశీలత, తొలి క్రియాశీలతలో 1/10వ వంతుకు తగ్గుతుంది?
సాధన:
T = 100 సంవత్సరాలు
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 30

ప్రశ్న 19.
α – క్షయం ద్వారా 1 గ్రాము రేడియం 5 సంవత్సరాల్లో 2 మిల్లి గ్రాములకు తగ్గింది. రేడియం అర్ధజీవిత కాలాన్ని లెక్కించండి.
సాధన:
తొలిద్రవ్యరాశి (N0) = 1 గ్రా.
– కోల్పోయిన ద్రవ్యరాశి = 2 మి.గ్రా. = 0.002 గ్రా.
తుది ద్రవ్యరాశి (N) = 1 – 0.002 = 0.998 గ్రా
t = 5 సంవత్సరాలు
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 31

AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు

ప్రశ్న 20.
ఒక రేడియోధార్మిక పదార్ధం అర్ధజీవిత కాలం 5000 సంవత్సరాలు. దాని తొలి క్రియాశీలత విలువకు 0.2 రెట్లు క్రియాశీలత తగ్గడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? log105 = 0.6990.
సాధన:
T = 5000 సంవత్సరాలు; t = ?
క్రియాశీలత A = Nλ = తొలి విలువకు 0.2 రెట్లు
తొలి క్రియాశీలత A0 = N0λ
రేడియోధార్మికతలో
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 32

ప్రశ్న 21.
ఒక 235U పరమాణు బాంబు విస్ఫోటనం 7.6×10 13 J శక్తిని విడుదల చేసింది. ఒక 235 శ్రీ పరమాణువు విచ్ఛితిలో 200 MeV శక్తి విడుదలైతే (i) విచ్ఛిత్తికి లోనయ్యే యురేనియం పరమాణువుల సంఖ్యను (i) పరమాణు బాంబులో వినియోగించిన యురేనియం ద్రవ్యరాశిని లెక్కించండి.
సాధన:
విడుదలయిన శక్తి (E) = 7.6 × 1013 J
విచ్ఛితిలో విడుదలయిన శక్తి (E) = 200 MeV
= 200 × 106 × 1.6 × 10-19 J
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 33

ప్రశ్న 22.
ఒకానొక పరమాణు బాంబు విస్ఫోటనంలో ఒక మైక్రోగ్రామ్ 23592U సంపూర్ణంగా నాశనమైతే, ఎంత శక్తి విడుదలవుతుంది?
సాధన:
m = 1µg = 1 × 10గ్రా =1 × 10-6 × 10-3 కి. గ్రా.
= 10-9 కి. గ్రా.
c = 3 × 108m/s
E = mc² = 1 × 10-9 × 9 × 106 = 9 × 107 J

ప్రశ్న 23.
2 గ్రాముల 23592U విచ్ఛిత్తిలో విడుదలయ్యే శక్తిని kWh లలో లెక్కించండి. ఒక విచ్ఛిత్తిలో విడుదలయ్యే శక్తి 200 MeV గా తీసుకోండి..
సాధన:
యురేనియం ద్రవ్యరాశి = 2 గ్రా.
ప్రతి విచ్ఛిత్తిలో శక్తి = 200 MeV
2గ్రా. లో పరమాణువుల సంఖ్య,
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 34

ప్రశ్న 24.
ఒక 235U కేంద్రకం విచ్ఛిత్తికి లోనైనప్పుడు, 200 MeV శక్తి విడుదలయింది. 1 మెగావాట్ సామర్థ్యాన్ని ఉత్పత్తి – చేయడానికి ఒక సెకనుకు అవసరమయ్యే కేంద్రక విచ్ఛిత్తుల సంఖ్యను లెక్కించండి.
సాధన:
E = 200 MeV
P = 1 × 106 W
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 35

ప్రశ్న 25.
400MW వద్ద పనిచేస్తున్న పరమాణు విద్యుత్ శక్తి ఉత్పత్తి కేంద్రంలో 235U యొక్క ద్రవ్యరాశి, సంపూర్ణంగా శక్తిగా మారినప్పుడు ఒక్క రోజులో ఎంత 235U వినియోగమవుతుంది?
సాధన:
P = 400 MW = 400 × 106W,
c = 3 × 108 m/s
t = 24 గంటలు = 24 × 60 × 60 సెకన్లు
E = mc²
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 36
∴ కావల్సిన ద్రవ్యరాశి = 384 × 10-6 × 10³ గ్రా.
= 0.384గ్రా.

అభ్యాసాలు Textual Exercises

ప్రశ్న 1.
a. లిథియం రెండు స్థిర ఐసోటోపులు 63Li, 73Li ల సమృద్ధతలు వరసగా 7.5%, 92.5% ఈ ఐసోటోపుల ద్రవ్యరాశులు వరుసగా 6.01512u, 7.01600 u గా ఉంటే లిథియం పరమాణు ద్రవ్యరాశిని కనుక్కోండి.
b. బోరాన్ రెండు స్థిర ఐసోటోపులు 105B, 115B లను కలిగి ఉంది. వాటి ద్రవ్యరాశులు వరసగా 10.01294u, 11.00931u లుగా, బోరాన్ పరమాణు ద్రవ్యరాశి 10.811u గా ఉన్నప్పుడు 105B, 115Bల సమృద్ధతలను కనుక్కోండి.
సాధన:
a) పరమాణు ద్రవ్యరాశి
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 37

ప్రశ్న 2.
నియాన్ మూడు స్థిర ఐసోటోపులు : 2010Ne, 2110Ne, 2210Ne. వీటి సమృద్ధతలు వరసగా 90.51%, 0.27%, 9.22%. మూడు ఐసోటోపుల పరమాణు ద్రవ్యరాశులు వరుసగా 19.994, 20.99 u, 21.99u, నియాన్ సగటు పరమాణు ద్రవ్యరాశిని కనుక్కోండి.
సాధన:
మూడు ఐసోటోవ్ ద్రవ్యరాశులు 19,99u, 20.99u, 21.99u

వాటి సమృద్ధతలు 90.51%, 0.27% మరియు 9.22%
∴ నియాన్ సగటు పరమాణు ద్రవ్యరాశి,
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 38

ప్రశ్న 3.
ఒక నైట్రోజన్ కేంద్రకం (147N) బంధన శక్తిని (MeV లలో) లెక్కించండి. m (147N) = 14.00307 u అని ఇచ్చారు.
సాధన:
7N14 కేంద్రకము 7 ప్రోటాన్లు మరియు 7 న్యూట్రాన్స్ కలిగి ఉండును.
∴ ద్రవ్యరాశి లోపము
(∆m) = 7mH + 7mn – M.
= 7 × 1.00783 + 7 × 1.00867 – 14.00307
= 7.05481 + 7.06069 – 14.00307
= 0.11243 u

బంధన శక్తి = 0.11243 × 931 MeV
= 104.67 MeV

AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు

ప్రశ్న 4.
5626Fe, 20983Bi కేంద్రకాల బంధన శక్తులను MeV లలో ఇచ్చిన దత్తాంశాల సహాయంతో లెక్కించండి :
m (5626Fe) = 55.934939 u, m (20983Bi) = 208.980388 u.
సాధన:
(i) 26Fe56 కేంద్రకం, 26 ప్రోటానులు మరియు 56- 26) = 30 న్యూట్రాన్లను కలిగి ఉండును.
26 ప్రోటాన్ల ద్రవ్యరాశి = 26 × 1.007825
= 26.20345 u

30 న్యూట్రాన్ల ద్రవ్యరాశి = 30 × 1.008665
= 30.25995 u

26Fe56 కేంద్రక కణాల మొత్తం శక్తి = 56.46340 u
F కేంద్రకం ద్రవ్యరాశి = 55.934939 u
∴ ద్రవ్యరాశి లోపం

∆m = 56.46340 – 55.934939
= 0.528461 u
మొత్తం బంధన శక్తి = 0.524861 × 931.5 MeV
= 492.26 MeV

ఒక న్యూక్లియాను సరాసరి బంధన శక్తి = \(\frac{492.26}{56}\)
= 8.790 MeV.

(ii) 83Bi209 కేంద్రకం 83 ప్రోటాన్లు మరియు (209 – 83) = 126 న్యూట్రాన్లను కల్గి ఉండును.
83 ప్రోటాన్ల ద్రవ్యరాశి = 83 × 1.007825
= 83.649475 u

126 న్యూట్రాన్ల ద్రవ్యరాశి = 126 × 1.008665
= 127.09190 u

న్యూక్లియాన్ల మొత్తం ద్రవ్యరాశి = 210.741260 u
83Bi209 కేంద్రక ద్రవ్యరాశి = 208.980388 u
ద్రవ్యరాశి లోపం, ∆m = 210.741260 – 208.980388
= 1.760872
మొత్తం బంధన శక్తి = 1.760872 × 931.5 MeV
= 1640.26 MeV

ఒక న్యూక్లియాన్పై సరాసరి బంధన శక్తి = \(\frac{1640.26}{209}\)
= 7.848 MeV

ఒక న్యూక్లియాను 83Bi209 బంధన శక్తి కన్నా 26Fe56 బంధన శక్తి ఎక్కువగా ఉండును.

ప్రశ్న 5.
ఇచ్చిన ఒక నాణెం ద్రవ్యరాశి 3.0g గా ఉంది. దాన్లో అన్ని న్యూట్రాన్లు, ప్రోటాన్లను విడివిడిగా వేరు చేయడానికి అవసరమయ్యే కేంద్రక శక్తిని లెక్కించండి. సరళత కోసం ఆ నాణెం అంతా 6329Cu పరమాణువులతో తయారయిందని భావించండి. (6329Cu ద్రవ్యరాశి = 62.92960 u).
సాధన:
3g నాణెంలో పరమాణువుల సంఖ్య
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 39

ఒక రాగి పరమాణువు 29 ప్రోటాన్ లు మరియు 34 న్యూట్రాన్లు కలిగి ఉండును.
∴ ప్రతి పరమాణువు ద్రవ్యరాశి లోపం
= [29 × 1.00783 + 34 × 1.00867] – 62.92960
= 0.59225 u
అన్ని పరమాణువుల మొత్తం ద్రవ్యరాశి లోపం
= 0.59225 × 2.868 × 1022 u
∆m = 1.6985 × 1022 u
1u = 931 MeV
∴ కావల్సిన కేంద్రక శక్తి
= 1.6985 × 1022 × 931 MeV
= 1.58 × 1025 MeV

ప్రశ్న 6.
క్రింది వాటికి కేంద్రక చర్య సమీకరణాలు వ్రాయండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 40
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 41

ప్రశ్న 7.
ఒక రేడియోధార్మిక ఐసోటోపు అర్ధజీవిత కాలం T సంవత్సరాలు. దాని క్రియాశీలత a)3.125% తగ్గడానికి పట్టే కాలం, b) తొలి క్రియాశీలతలో 1% తగ్గడానికి పట్టే కాలం ఎంత?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 42
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 43

ప్రశ్న 8.
కార్బన్ కలిగిన ఒక జీవ పదార్థం సాధారణ క్రియాశీలత ఒక నిమిషానికి ప్రతి గ్రాము కార్బన్ నుంచి సుమారుగా 15 విఘటనాలుగా ఉందని కనుక్కొన్నారు. ఈ క్రియాశీలత, దాన్లోని స్థిర కార్బన్ ఐసోటోపు 126C తో స్వల్ప అనుపాతంలో ఉన్న రేడియో ఐసోటోపు 126C తో కలుగుతుంది. జీవి చనిపోయినప్పుడు, వాతావరణంవల్ల దాని అన్యోన్య చర్య (క్రియాశీలత యొక్క సమతా స్థితిని కొనసాగించేది) ఆగిపోతుంది, దాని క్రియాశీలత తగ్గడం మొదలవుతుంది. అర్ధజీవిత కాలం తెలిసిన 126C, లెక్కించిన క్రియాశీలత నుంచి ఆ నమూనా వయస్సును సుమారుగా అంచనా వేయవచ్చు. పురాతత్వ శాస్త్రంలో ఉపయోగించే 126C కార్బన్ డేటింగ్ (dating) లోని సూత్రం ఇదే. మెహొంజోదారో నుంచి సేకరించిన ఒక నమూనా క్రియాశీలత ఒక నిమిషానికి ప్రతి గ్రాము కార్బన్ నుంచి 9 విఘటనాలుగా ఉంటే సింధులోయ (Indus-Valley) నాగరికత వయస్సును దాదాపుగా అంచనావేయండి.
సాధన:
ఇక్కడ సాధారణ క్రియాశీలత, R0 = 15 విఘటనాలు/నిమిషం
ప్రస్తుతం క్రియాశీలత R = 9 విఘటనాలు/నిమిషం,
T = 5730 సం||లు
వయస్సు t = ?
క్రియాశీలత, రేడియోధార్మిక పరమాణువుల సంఖ్యకు అనులోమానుపాతంలో ఉండును.
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 44
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 45

AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు

ప్రశ్న 9.
8.0 m Ci సత్వంతో ఉండే రేడియోధార్మిక జనకాన్ని పొందడానికి అవసరమైన 6027CO పరిమాణాన్ని పొందండి. 6027CO అర్ధజీవిత కాలం 5.3 సంవత్సరాలు.
సాధన:
ఇక్కడ 27CO60 ద్రవ్యరాశి = ?
జనకం సామర్ధ్యం \(\frac{dN}{dt}\) = 8.0 mCi
= 8.0 × 3.7 × 107 విఘటనాలు / సెకను
అర్ధజీవిత కాలం T = 5.3 సం||లు
= 5.3 × 365 × 24 × 60 × 60 సెకను
= 1.67 × 108 సెకను
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 46
అవొగాడ్రో సంఖ్య నిర్వచనం ప్రకారం, 27Co60లో =606.023 × 1023 వరమాణువుల ద్రవ్యరాశి = 60g
27Co60 లో 7.15 × 1016 పరమాణువుల ద్రవ్యరాశి
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 47

ప్రశ్న 10.
9038Sr అర్ధజీవిత కాలం 28 సంవత్సరాలు. 15 mgల ఈ ఐసోటోపు విఘటన రేటు ఎంత?
సాధన:
ఇక్కడ, T = 28 సం॥లు – 28 × 3.154 × 107s
90 g 38Sr90 V లో పరమాణువుల సంఖ్య
= 6.023 × 1023
∴ 15mg 38Sr90లో పరమాణువుల సంఖ్య
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 48

ప్రశ్న 11.
బంగారం ఐసోటోపు 19779Au, వెండి ఐసోటోపు 10747Ag కేంద్రకాల వ్యాసార్థాల నిష్పత్తిని ఉజ్జాయింపుగా పొందండి.
సాధన:
ఇక్కడ, A1 = 197 మరియు A2 = 107
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 49

ప్రశ్న 12.
(a) 22688Ra, (b) 22086Rnల α-క్షయంలో విడుదలయ్యే α-కణం Q-విలువ, గతిజశక్తిని గణించండి. ఇచ్చినవి
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 50
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 51

ప్రశ్న 13.
రేడియో న్యూక్లైడ్ 11C,
116C → 115B + e+ + v : ప్రకారం క్షయం చెందుతుంది. T1/2 = 20.3 116C → 115C B + e+ + v : T1/2 = 20.3 నిమిషాలు. దీనిలో ఉద్గారమైన పాసిట్రాన్ గరిష్ట శక్తి 0.960 MeV.
ఇచ్చిన విలువలు : m(116C) = 11.011434u, m(115B) = 11.009305 u, Q విలువను లెక్కించి, ఉద్గారమైన పాసిట్రాన్ గరిష్ఠ శక్తితో పోల్చండి.
సాధన:
ఇచ్చిన చర్యలో ద్రవ్యరాశి లోపం
∆m = m(6C11) = [m (5B11) + Me]
ఇది కేంద్రక ద్రవ్యరాశుల పదాలలో ఉన్నది. Q విలువను పరమాణు ద్రవ్యరాశి పదాలలో వ్యక్తపరిస్తే, కేంద్రక ద్రవ్యరాశులను పొందుటకు 6me ను కార్బన్ పరమాణు ద్రవ్యరాశి నుండి మరియు 5me ను బొరాన్ నుండి తీసివేయాలి.
∴ ∆m = [m(6C11) – 6 me – m(5B11) + 5 me – me]
= [m(6C11) – m (5B11)-2 m.] – 2me]
= [11.011434 – 11.009305 – 2 × 0.000548] u
= 0.001033u
lu = 931 MeV
∴ Q = 0.001033 × 931 MeV = 0.961 MeV
ఇదే, పాసిట్రాన్ ఉద్గారించే గరిష్ట శక్తి..

ప్రశ్న 14.
β ఉద్గారంతో 2310Ne కేంద్రకం క్షయమవుతుంది. అప్పుడు β-క్షయం సమీకరణాన్ని రాయండి. ఉద్గారమైన ఎలక్ట్రాన్లు గరిష్ఠ గతిజశక్తిని నిర్ధారించండి. ఇచ్చినవి:
m(2310Ne) = 22.994466 u
m(2311Na) = 22.089770 u.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 52

11Na23 భారమైంది. 4.3792 MeV శక్తిని e మరియు \(\overline{\mathrm{υ}}\) జత పంచుకొనును. \(\overline{\mathrm{υ}}\) మోసుకొని వెళ్ళి శక్తి సున్నా అయితే, e గరిష్ట K.E = 4.372 MeV.

ప్రశ్న 15.
ఒక కేంద్రక చర్య A + b → C + d. Q విలువను Q = [ma mb – mC – md]C²గా నిర్వచించారు. ఇక్కడ ద్రవ్యరాశులు ఆయా కేంద్రకాలకు సంబంధించినవి. క్రింద ఇచ్చిన దత్తాంశాల ఆధారంగా, ఇచ్చిన చర్యల Q- విలువలను కనుక్కొని ఆ చర్యలు ఉష్ణమోచక లేదా ఉష్ణగ్రాహక చర్యలో తెలపండి.
i) ¹1H + ³1H → ²1H + ²1H
ii) 126C + 121C → 2010Ne + 42He
పరమాణు ద్రవ్యరాశుల విలువలు ఈవిధంగా ఉన్నాయి.
m(21H) = 2.014102u
m(31H) = 3.016049 u
m(126C) = 12.000000u
m(2010Ne) = 19.992439 u
సాధన:
i) 1H¹ + 1H³ → 1H² + 1
Q = ∆M × 931 MeV
= [m (1H¹) = + m(1H³) – 2m (1H²)] × 931 MeV
= [1.007825 + 3.016049 – 2 × 2.0141021] × 931 MeV = – 4.03 MeV
∴ పై చర్య ఉష్ణగ్రాహక చర్య

ii) 6C12 + 1C1210Ne20 + 2He4
Q = ∆M × 931 MeV.
[2m (6C12) – m (10Ne20) – m(2He4)] × 931 MeV
= [24.000000 – 19.992439 – 4.002603] × 931 MeV
= + 4.61 MeV
∴ పై చర్య ఉష్ణమోచక చర్య.

AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు

ప్రశ్న 16.
ఒక 5626Fe కేంద్రకం విచ్ఛిత్తి చెంది రెండు సమాన 2813Al కేంద్రక శకలాలుగా విడిపోయిందని భావిస్తే, ఆ విచ్ఛిత్తి శక్తి దృష్ట్యా సాధ్యమవుతుందా ? ప్రక్రియ Q విలువ ఆధారంగా సమర్థించండి.
ఇచ్చినవి, m(5626Fe) = 55.93494 u,
m(2813Al) = 27.98191 u.
సాధన:
Q = [m(26Fe56 – 2m (13Al28)] × 931.5 MeV
= [55.93494 – 2 × 27.9819] × 931.5 MeV
Q = -0.02886 × 931.5 MeV = – 26.88 MeV
ఇది రుణాత్మకం.
శక్తిపరంగా, విచ్ఛిత్తి సాధ్యం కాదు.

ప్రశ్న 17.
23994Pu – విచ్ఛిత్తి ధర్మాలు 23892U విచ్ఛిత్తికి చాలా సాదృశ్యంగా ఉంటాయి. ఒక్కో విచ్చకి విదలయ్యే సగటు శక్తి 180 MeV. 1kgav ‘Pu లోని -అని పరమాణువులు విచ్ఛిత్తికి లోనయితే ఎంత శక్తి MeV లలో విడుదలవుతుంది?
సాధన:
పరిశుద్ధమైన 1 kg Pu239 లో పరమాణువుల సంఖ్య
\(\frac{6.023 \times 10^{23}}{239}\) × 1000 = 2.52 × 1024
ఒక విచ్ఛిత్తిలో విడుదలైన సరాసరి శక్తి = 180 MeV
∴ మొత్తం శక్తి విడుదల = 2.52 × 1024 × 180 MeV
= 4.53 × 1026 MeV

ప్రశ్న 18.
ఒక 1000 MWకేంద్రక రియాక్టర్5.00సంవత్సరాలలో దాని ఇంధనంలోని సగభాగాన్ని వినియోగిస్తుంది. అది తొలుతగా ఎంత 23592U ని కలిగి ఉంది? రియాక్టర్ పనిచేసిన కాలం 80% అనుకొంటే, అప్పుడు విడుదలయిన శక్తి అంతా 23592U విచ్ఛిత్తి నుంచి వచ్చినదే అని, ఈ విచ్ఛిత్తి ప్రక్రియ వల్ల మాత్రమే న్యూక్లైడ్ వినియోగమైంది అని భావించండి.
సాధన:
ఒక 92U235 కేంద్రకం విచ్ఛిత్తిలో, ఉత్పత్తి అయ్యే శక్తి = 200 MeV
1 kg, 92U235 విచ్ఛిత్తిలో ఉత్పత్తి అయ్యే శక్తి
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 53
= 1544 kg
92U235 తొలి పరిమాణం = 2 × 1544 kg
= 3088 kg.

ప్రశ్న 19.
2.0 kg డ్యుటీరియం సంలీనం వల్ల (వచ్చిన శక్తితో) ఒక 100 W సామర్థ్యం ఉన్న ఒక విద్యుద్దీపం ఎంత కాలం వెలుగుతుందిx? ఈ సందర్భంలో సంలీన చర్య ఈ విధంగా ఉంటుంది.
²1H + ²1H → ³2He + n + 3.27 MeV
సాధన:
2.0 kg లో డ్యుటీరియం పరమాణువుల సంఖ్య
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 54

ప్రశ్న 20.
రెండు డ్యుటీరియమ్ ముఖాముఖి అభిఘాతానికి పొటెన్షియల్ అవరోధం ఎంత ఎత్తును కలిగి ఉంటుందో లెక్కించండి. (Hint : రెండు డ్యుటీరియమ్లు నామ మాత్రంగా ఒకదానితో ఒకటి తాకిన సందర్భంలో వాటి మధ్య కూలుమ్ వికర్షణను పొటెన్షియల్ అవరోధం ఎత్తు ఇస్తుంది. ఆ రెండు డ్యుటీరియమ్లను 2.0 fm వ్యాసార్ధం గల గట్టి గోళాలుగా ఊహించండి.
సాధన:
ముఖాముఖి అభిఘాతంలో, రెండు డ్యూట్రాన్ కేంద్రకాల మధ్య దూరం
= r = 2 × వ్యాసార్ధం
r = 4 fm = 4 × 10-15 m
ప్రతి డ్యూట్రాన్ ఆవేశం e = 1.6 ×10-10 C స్థితిజ శక్తి
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 55
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 56

ప్రశ్న 21.
R = R0A1/3 సంబంధం నుంచి, కేంద్రకం పదార్థ సాంద్రత దాదాపు స్థిరాంకంగా ఉంటుందని (అంటే, A మీద ఆధారపడకుండా) చూపండి. ఇక్కడ R0 ఒక స్థిరాంకం, A కేంద్రక ద్రవ్యరాశి సంఖ్య.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 57

ప్రశ్న 22.
ఒక కేంద్రకం నుంచి β+ (పాసిట్రాన్) విడుదలకు పోటీగా ‘ఎలక్ట్రాన్ ప్రగ్రహణం’ అనే మరో ప్రక్రియ జరుగుతుంది. (అంతర కక్ష్యలో ఉన్న ఎలక్ట్రాన్ (K – కర్పరం అనుకోండి) ను కేంద్రకం ప్రగ్రహించడం వల్ల న్యూట్రినో ఉద్గారమవడం.
e+ + AZX → z-1AY + ν
β+ విడుదల శక్తివంతంగా సాధ్యపడినప్పుడు, ఎలక్ట్రాన్ ప్రగ్రహణం తప్పనిసరిగా సాధ్యపడాలి. కాని ఎలక్ట్రాన్ ప్రగ్రహణ సాధ్యపడినప్పుడు β+ విడుదల సాధ్యం కాదు అని చూపండి.
సాధన:
ZXA కేంద్రకం నుండి β+ ఉద్గారం క్రింది విధంగా సూచిస్తే,
ZXA = z-1YA + 1e0 + ν + Q1 ——— (i)
ఎలక్ట్రాన్ ప్రగ్రహణం చేసే మరియొక ప్రక్రియ క్రింద చూపబడింది.
-1e0 + ZXA = z-1YA + ν + Q2 ——— (ii)

(i) విడుదలయ్యే శక్తిని ఇస్తుంది.
Q1 = [mN (ZXA) – mN (z-1YA) – me) c²
Q1 = [m(ZXA) – m (z-1YA) – 2me) c² ——— (iii)

ఇక్కడ mN కేంద్రక ద్రవ్యరాశిని మరియు m పరమాణు ‘ద్రవ్యరాశిని తెల్పును. ఇదే విధంగా (ii) నుండి,
Q2 = [mN (ZXA) + me – mN(z-1YA)] c²

= [mN (ZXA) + Zme +me mN(z-1YA) – (Z – 1) me – me] c²
Q2 = [m (zXA) + m – (z-1YA)] c²
Q1 > 0 అయితే Q2 > 0.
β+ విడుదల శక్తిమంతంగా సాధ్యపడినపుడు, ఎలక్ట్రాన్ ప్రగ్రహణం తప్పనిసరిగా సాధ్యపడాలి. కాని ఎలక్ట్రాన్ ప్రగ్రహణం సాధ్యపడినపుడు β+ విడుదల సాధ్యం కాదు.

అదనపు అభ్యాసాలు Additional Exercises

ప్రశ్న 23.
ఆవర్తన పట్టికలో మెగ్నీషియం సగటు పరమాణు ద్రవ్యరాశి 24.312 u గా ఇవ్వడమైంది. భూమ్మీద వాటి సాపేక్ష సహజ సమృద్ధత ఆధారంగా సగటు విలువ ఉంటుంది. మూడు ఐసోటోవులు, వాటి ద్రవ్యరాశులు వరుసగా 2412Mg (23.98504u), 2512Mg (24.98584u), 2612Mg (25.98259u). 2412Mg ఐసోటోపు సహజ సమృద్ధత ద్రవ్యరాశి పరంగా 78.99% గా ఉంది. మిగిలిన రెండు ఐసోటోపుల సమృద్ధతలను లెక్కించండి.
సాధన:
12Mg25 సమృద్ధత = x%
12Mg26 సమృద్ధత = (100 – 78.99 – x)%
= (21.01 – x)%
మెగ్నీషియం సరాసరి పరమాణు ద్రవ్యరాశి = 24.312
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 58

ప్రశ్న 24.
న్యూట్రాన్ ఎడబాటు శక్తిని (neutron separation energy) కేంద్రకం నుంచి ఒక న్యూట్రాన్ను తొలగించడానికి అవసరమైన శక్తిగా నిర్వచించడమైంది. కింద ఇచ్చిన దత్తాంశాల సహాయంతో 4120Ca, 2713Al కేంద్రకాల న్యూట్రాన్ ఎడబాటు శక్తులను పొందండి :
m(4020Ca) = 39.962591 u
m(4120Ca) = 40.962278 u
m(2613Al) = 25.986895 u
m(2713Al) = 26.981541 u
సాధన:
20Ca41 నుండి న్యూట్రాన్ ను వేరుచేయగా మిగిలినది
20Ca40 10 i.e. 20Ca4120Ca40 + 0n¹ ద్రవ్యరాశి లోపం
∆M = m(20Ca40) + mn – m (20Ca41)
= 39.962591 + 1.008665 – 40.962278
= 0.008978 u
∴ న్యూట్రాన్ ను వేరుచేయు శక్తి
= 0.008978 × 931MeV 8.362 MeV
ఇదే విధంగా 13Al2713Al26 + 0
∴ ద్రవ్యరాశి లోపం,
∆M = m (13Al26) + mn – m (13Al27)
= 25.986895 + 1.008665 – 26.981541
= 0.0138454 u
∴ న్యూట్రాన్ ను వేరుచేయు శక్తి
= 0.0138454 × 931MeV
= 12.89 MeV

AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు

ప్రశ్న 25.
ఒక జనకం రెండు ఫాస్పరస్ రేడియో న్యూక్లైడ్లను 3215P (T½ = 14.3d), 3315P (T½ = 25.3d) కలిగి ఉంది. తొలుత 10% క్షయాలు 3315P నుంచి వచ్చాయి. మిగతా 90% జరగడానికి ఎంత కాలం పడుతుంది?
సాధన:
మొదట జనకం 90% 15P132 మరియు 15P32, కల్గి ఉందని భావిద్దాం. 9x గ్రామ్ P2 మరియు × గ్రామ్ P1 గా తీసుకుందాము.
t రోజుల తరువాత, జనకం 90%.

15P233 మరియు 10% 15P132 కల్గి ఉందని భావిద్దాం. i. e., y గ్రామ్ P2 మరియు 9y గ్రామ్ P1 గా తీసుకుందాము.
మనం t ను గణించాలి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 59

ప్రశ్న 26.
కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఒక కేంద్రకం – కంటే మరింత భారయుతమైన కణాన్ని ఉద్గారం చేస్తూ క్షయం చెందవచ్చు. క్రింది ఇచ్చిన క్షయా ప్రక్రియలను పరిగణించండి.
22388Ra → 20982Pb + 146C ; 22388Ra → 21986Pb + 42He
ఈ క్షయాలకు Q విలువలను లెక్కించండి. రెండు చర్యలూ శక్తిమంతంగా సాధ్యమవుతాయని నిర్ధారించండి. సాధన. i) క్షీణత ప్రక్రియ
88Ra22382Pb209 + 6C14 + Q
ద్రవ్యరాశి లోపము, ∆M
Ra223 ద్రవ్యరాశి – (Pb209 ద్రవ్యరాశి + C14 ద్రవ్యరాశి)
= 223.01850 – (208.98107 + 14.00324)
= 0.03419 u
∴ Q = 0.03419 × 931 MeV = 31.83 MeV

ii) ఇచ్చిన క్షయ ప్రక్రియ 88Ra22386Rn219 + 2H4 + Q
ద్రవ్యరాశి లోపం, ∆M = Ra223 ద్రవ్యరాశి – (Rn219 ద్రవ్యరాశి + He4 ద్రవ్యరాశి)
= 223.01850 – (219.00948 + 4.00260)
= 0.00642 u

∴ Q = 0.00642 × 931 MeV = 5.98 MeV
పై రెండు సందర్భాలలో Q విలువలు ధనాత్మకము, కావున రెండు క్షయాలు శక్తిపరంగా సాధ్యమే.

ప్రశ్న 27.
అధిక ధృతి న్యూట్రాన్లతో 23892U విచ్ఛిత్తిని పరిగణించండి. ఒక విచ్ఛిత్తి ఘటనలో న్యూట్రాన్ వి విడుదల కాలేదు. ప్రాథమిక శకలాలు బీటా క్షయఁ తో తుది అంత్య ఉత్పన్నాలు 14058Ce, లు. ఈ విచ్ఛిత్తి ప్రక్రియకు Qని లెక్కించండి. దీనికి సంబంధించిన పరమాణు, కణ ద్రవ్యరాశులు,
m (23892U) = 238.05079 u
m (14058Ce) = 139.90543 u
m(9944Ru) = 98.90594 u
సాధన:
విచ్ఛిత్తి చర్యలో,
92U238 + 0n¹ → 58Ce140 + 44Ru99 + Q
ద్రవ్యరాశి లోపము,
∆M = U238 ద్రవ్యరాశి + n ద్రవ్యరాశి – (Ce140 ద్రవ్యరాశి + Ru99 ద్రవ్యరాశి)
= 238.05079 + 1.00867 (139.90543 + 98.90594)
= 0.24809u
∴ Q=0.24809×931 MeV = 230.97 MeV

ప్రశ్న 28.
D-T చర్యను (డ్యుటీరియం-ట్రిటియం సంలీనం) పరిగణించండి. ²1H + ³1H → 42He + n
a) ఇచ్చిన దత్తాంశంతో ఈ చర్యలో విడుదలైన శక్తిని MeV లలో లెక్కించండి.
m(²1H) = 2.014102 u
m(³1H) = 3.016049 u
b) డ్యుటీరియం, ట్రిటియంల రెండింటి వ్యాసార్ధాలను, ఉజ్జాయింపుగా 2.0 fm గా తీసుకోండి. రెండు కేంద్రకాల మధ్య గల కూలుమ్ వికర్షణను అధిగమించడానికి కావలసిన గతిజశక్తి ఎంత? చర్యను ప్రారంభించడానికి వాయువును ఎంత ఉష్ణోగ్రత వరకు వేడిచేయాలి?
(Hint : ఒక సంలీన ఘటనకు అవసరమైన గతిజశక్తి చర్యలో పాల్గొనే కణాల వద్ద అందుబాటులో ఉండే సగటు ఉష్ట్రీయ గతిజశక్తి = 2(3kT/2);k =బోల్డెమన్ స్థిరాంకం, T = వరము ఉష్ణోగ్రత.)
సాధన:
a) 1H² + 1H³ → 2He4 + n + Q
Q = [m(1H²) + m (1H³) + m,He) – Mn] × 931 MeV
= (2.014102 +3.016049 – 4.002603 – 1.00867) × 931 MeV
= 0.018878 × 931 = 17.58 MeV

b) కేంద్రకాలు రెండు స్పర్శించుకొనేటట్లు ఉంటే, వికర్షణ స్థితిజశక్తి
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 60
సాంప్రదాయకంగా, ఈ కూలుమ్ వికర్షణను అతిక్రమించుటకు కనీస K.E కు సమానం కావాలి. ఈ సంబంధంను ఉపయోగిస్తే, K.E. = 2 ×\(\frac{3}{2}\) KT చర్యను ప్రారంభించడానికి వాయువును వేడి చేయవలసిన ఉష్ణోగ్రత,
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 61
వాస్తవంగా చర్యను ప్రారంభించుటకు కావల్సిన ఉష్ణోగ్రత తక్కువగా ఉండును.

AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు

ప్రశ్న 29.
పటంలో చూపిన క్షయా పథకం నుంచి β-కణాల గరిష్ఠ గతిజశక్తి, γ-క్షయాల వికిరణ పౌనఃపున్యాలను పొందండి. మీకు ఇచ్చినవి:
m(198Au) = 197.968233 u
m(198Hg) = 197.966760 u.
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 62
సాధన:
γ1 కు అనురూపమైన శక్తి
E1 = 1.088 – 01.088 MeV
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 63
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 64

ప్రశ్న 30.
a) సూర్యుని అంతర్భాగంలో లోతులో ఉన్న 1.0 kg హైడ్రోజన్ సంలీనంలో, b) ఒక విచ్చిత్తి రియాక్టర్ లోని 1.0 kg 235U యురేనియం విచ్ఛిత్తిలో విడుదలయ్యే శక్తిని చెక్కించి, పోల్చండి.
సాధన:
సూర్యునిలో, నాలుగు హైడ్రోజన్ కేంద్రకాలు సంలీనం వల్ల హీలియం కేంద్రకం ఏర్పడినపుడు 26 MeV శక్తిని విడుదల చేస్తుంది.
1 kg హైడ్రోజన్ సంలీనంలో విడుదలయ్యే శక్తి
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 65
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 66
-i.e., సంలీనంలో శక్తి విడుదల, విచ్ఛిత్తిలో శక్తి విడుదలకు 7.65 రెట్లు.

ప్రశ్న 31.
భారతదేశం 2020 AD నాటికి 2,00,000 MW ల విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయడం, దాన్లోను 10% శక్తి అణువిద్యుత్ కేంద్రాల నుంచి ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందనుకొందాం. ఆ లక్ష్యం మన కిచ్చారనుకొంటే సరాసరిన రియాక్టర్ లో ఉత్పత్తి అయిన ఉష్ణశక్తి యొక్క ఉపయోగకరమైన దక్షత (అంటే, విద్యుత్ శక్తిగా పరివర్తనం చెందడం) 25% 2020 నాటికి మన దేశానికి, ఒక్కో సంవత్సరానికి ఎంత పరిమాణంలో విచ్ఛేదనీయ యురేనియం అవసర అవుతుంది? ఒక్కో విచ్ఛిత్తికి 235U నుంచి ఉష్ణశక్తి సుమారుగా 200 MeV గా విడుదలవుతుందని తీసుకోండి.
సాధన:
మొత్తం లక్ష్య సామర్ధ్యం = 2 × 105 MW
మొత్తం కేంద్రక సామర్థ్యం = 2 × 105 MW లో 10%
= 2 × 104 MW
విచ్ఛిత్తిలో ఉత్పత్తి అయిన శక్తి = 200 MeV
పవర్ ప్లాంట్ దక్షత = 25%
∴ ఒక విచ్ఛిత్తిలో విద్యుత్ శక్తిగా మారిన శక్తి
\(\frac{25}{100}\) × 200 = 50 MeV
= 50 × 1.6 × 10-13 ఔల్
ఉత్పత్తి అయిన మొత్తం విద్యుత్ శక్తి
= 2 × 104 MW = 2 × 104 × 106 వాట్
= 2 × 1010 జౌల్/సెకను
= 2 × 1010 × 60 × 60 × 24 × 365 జౌల్/సం॥
ఒక సం॥లో విచ్ఛిత్తిల సంఖ్య
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 67

సాధించిన సమస్యలు Textual Examples

ప్రశ్న 1.
ఇనుము కేంద్రక ద్రవ్యరాశి 55.85u, A = 56 అయితే, దాని కేంద్రక సాంద్రతను కనుక్కోండి.
సాధన:
mFe = 55.85, u = 9.27 × 10-26 kg
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 68
ఈ సాంద్రత, న్యూట్రాన్ నక్షత్రాల (ఒక ఖగోళ భౌతిక వస్తువు) పదార్థ సాంద్రతతో పోల్చదగింది. ఈ ఖగోళ వస్తువులలో పదార్థం అంతా ఒక బృహత్ కేంద్రకాన్ని పోలి ఉండేంతగా సంపీడ్యం చెంది ఉంటుందని ఇది తెలుపుతుంది.

ప్రశ్న 2.
1g పదార్థానికి తుల్యమైన శక్తిని లెక్కించండి.
సాధన:
E = 10-3 × (3 × 108)² J
E = 10-3 × 9 × 1016 = 9 × 1013 J
కాబట్టి, ఒక గ్రాము పదార్థాన్న శక్తిగా మార్చినటైతే విపరీత పరిమాణంలో శక్తి విడుదలవుతుంది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు

ప్రశ్న 3.
ఒక పరమాణు ద్రవ్యరాశి ప్రమాణానికి తుల్యమైన శక్తిని తొలుత జౌళ్ళలోను, తరవాతMeVలలోను కనుక్కోండి. దీన్ని ఉపయోగిస్తూ 168O ద్రవ్యరాశి లోపాన్ని MeV c² లలో తెలపండి.
సాధన:
1u = 1.6605 × 10-27 kg
దీనిని శక్తి ప్రమాణాలలోనికి మార్చడానికి, c² తో గుణించినప్పుడు, తుల్యశక్తి
= 1.6605 × 10-27 × (2.9979 × 108)² kg m²/s²
= 1.4924 × 10-10 J
= \(\frac{1.4924 \times 10^{-10}}{1.602 \times 10^{-19}}\)eV
= 0.9315 × 109 eV = 931.5 MeV
లేదా 1 u = 931.5 MeV/c²
168O కు ∆M = 0.13691 u
= 0.13691 × 931.5 MeV/c² = 127.5 MeV/c²
168O ను దాని ఆంగిక భాగాలుగా విడగొట్టడానికి అవసరమయ్యే శక్తి 127.5 MeV/c².

ప్రశ్న 4.
α-క్షయానికి లోనవుతున్న 23892U అర్ధజీవిత కాలం 4.5 × 109 సంవత్సరాలు. 23892U యొక్క 1 గ్రాము నమూనా పదార్థం క్రియాశీలత ఎంత?
సాధన:
T1/2 = 4.5 × 109y
= 4.5 × 109 y × 3.16 × 107 s/y
= 1.42 × 1017 s
ఒక k mol ఉన్న ఏ ఐసోటోపులోనైనా అవగాడ్రో సంఖ్యలో పరమాణువులుంటాయి. కాబట్టి, 1 గ్రాము 23892U లో ఉండే పరమాణువుల సంఖ్య.
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 69

ప్రశ్న 5.
β-క్షయానికి లోనవుతున్న ట్రిటియం అర్ధజీవిత కాలం 12.5 సంవత్సరాలు. 25 సంవత్సరాల తరవాత స్వచ్ఛమైన ట్రిటియం నమూనా పదార్థం ఎంత భాగం క్షయం కాకుండా మిగిలి ఉంటుంది?
సాధన:
అర్థజీవితకాలం నిర్వచనం ప్రకారం, తొలి పదార్థంలో సగం భాగం పదార్ధం క్షయం కాకుండా 125సంవత్సరాల తరవాత మిగిలి ఉంటుంది. ఆ తరవాత 12.5 సంవత్సరాల కాలంలో ఈ మిగిలిన అర్ధభాగంలోని సగభాగం కేంద్రకాలు క్షయం చెందుతాయి. కాబట్టి 1/4వ వంతు పదార్థం క్షయం కాకుండా, స్వచ్ఛమైన ట్రియంగా మిగిలి ఉంటుంది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు

ప్రశ్న 6.
క్రింది పరమాణు ద్రవ్యరాశులు మనకు ఇవ్వడమైనది:
AP Inter 2nd Year Physics Study Material Chapter 14 కేంద్రకాలు 70
ఇక్కడ Pa ప్రొటాక్టినియం (protactinium) మూలకం (Z = 91) గుర్తు.
a) 23892U ఆల్ఫా క్షయంలో విడుదలయిన శక్తిని లెక్కించండి.
b) 23892U స్వచ్ఛందంగా ఒక ప్రోటాన్ ను ఉద్గారం చేయలేదని చూపండి.
సాధన:
23892U అల్ఫా క్షయం, సమీకరణం
లో ఇవ్వడమైంది.
ఈ ప్రక్రియలో విడుదలయిన శక్తిని సూచించేది
Q = (MU – MTh – MHe) c²
దత్తాంశంలో ఇచ్చిన పరమాణు ద్రవ్యరాశులను ప్రతిక్షేపిస్తే
Q = (238.05079 – 234.04363 – 4.00260)u × c²
= (0.00456 u) c²
= (0.00456 u) (931.5 MeV/u)
= 4.25 MeV.

b) 23892U స్వచ్ఛందంగా ఒక ప్రోటాన్ విడుదల చేసినట్లైతే క్షయ ప్రక్రియ ఈ విధంగా ఉండాలి.
23892U → 23892Pa + ¹1H
ఈ ప్రక్రియకు Q పొందాలంటే జరగాల్సింది
= (MU -MPa – MH) c²
= (238.05079-237.051211.00783) u × c²
= (-0.00825 u) c²
= – (0.00825 u) (931.5 MeV/u)
= -7.68 MeV

ఇక్కడ, ప్రక్రియ Q రుణాత్మకం కాబట్టి, ప్రక్రియ స్వచ్ఛందంగా జరగదు. 23892U కేంద్రకం నుంచి ఒక ప్రోటాన్ ను విడుదల చేయించాలంటే మనం దానికి 7.68 MeVల శక్తిని అందించాల్సి ఉంటుంది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Physics Study Material 13th Lesson పరమాణువులు Textbook Questions and Answers.

AP Inter 2nd Year Physics Study Material 13th Lesson పరమాణువులు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బోర్ నమూనాలో హైడ్రోజన్ పరమాణువు రెండవ కక్ష్యలోని ఎలక్ట్రాన్ కోణీయ ద్రవ్యవేగం ఎంత?
జవాబు:
హైడ్రోజన్ పరమాణు రెండవ కక్ష్యలో ఎలక్ట్రాన్ కోణీయ ద్రవ్యవేగము L = \(\frac{2h}{2 \pi}=\frac{h}{\pi}\) [∵ L = \(\frac{nh}{2 \pi}\)]

ప్రశ్న 2.
సూక్ష్మ నిర్మాణ స్థిరాంకం (fine structure constant) సమాసం ఏమిటి ? దాని విలువ ఏమిటి ?
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 1

ప్రశ్న 3.
‘ఎలక్ట్రాన్ రుణాత్మక శక్తి’ కి భౌతిక అర్ధం ఏమిటి?
జవాబు:
ఆకర్షణబలం వల్ల ఎలక్ట్రాన్ కేంద్రకంతో బంధించబడి ఉండటాన్ని, ఎలక్ట్రాన్ రుణశక్తి తెలుపుతుంది.

ప్రశ్న 4.
ఒక వాయువు వర్ణపటంలో సునిశిత (Sharp) రేఖలు ఉన్నాయి. ఇది దేనిని సూచిస్తుంది?
జవాబు:
వాయు వర్ణపటంలోని సునిశిత రేఖలు, నల్లని బ్యాక్ గ్రౌండ్్ప వెలుగు రేఖలను తెలుపును.

ప్రశ్న 5.
కోణీయ ద్రవ్యవేగం మితులకు సమానమైన మితులు కలిగి ఉన్న భౌతికరాశిని పేర్కొనండి.
జవాబు:
ప్లాంక్ స్థిరాంకము

AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు

ప్రశ్న 6.
α – కణానికి, హీలియం పరమాణువుకు మధ్యగల భేదమేమిటి?
జవాబు:

α – కణముహీలియం పరమాణువు
1. ఇది + 2 ఆవేశం గల హీలియం కేంద్రకము.1. ఇది ఆవేశంను కలిగి ఉండదు.
2. ఇది 2 ప్రోటానులు మరియు 2 న్యూట్రానులు కలిగి ఉండును.2. ఇది 2 ప్రోటానులు, 2 ఎలక్ట్రానులు మరియు 2 న్యూట్రానులు కలిగి ఉండును.

ప్రశ్న 7.
అభిఘాత పరామితికి, పరిక్షేపణ కోణానికి మధ్య సంబంధమేమిటి?
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 2

ప్రశ్న 8.
ఆల్ఫా, బీటా, గామా వికిరణాలలో ఏవి విద్యుత్ క్షేత్రానికి ప్రభావితం అవుతాయి?
జవాబు:
ఆల్ఫా మరియు బీటా వికిరణాలు విద్యుత్ క్షేత్రంలో ప్రభావితం అవుతాయి.

ప్రశ్న 9.
భూస్థాయి పరమాణువు అనే పదబంధాన్ని మీరెలా అర్థం చేసుకొంటారు?
జవాబు:
పరమాణువులో ఎలక్ట్రాన్ భూస్థాయిలో ఉంటే, దానిని భూస్థాయి పరమాణువు అంటారు.

ప్రశ్న 10.
రూథర్ ఫర్డ్ ప్రయోగంలోని పరిక్షేపణలో కేంద్రకం ద్రవ్యరాశికి ఏమాత్రం ప్రాధాన్యత లేదు. ఎందుకు?
జవాబు:
పరమాణు పరిమాణం 10-10 m మరియు కేంద్రకం పరిమాణం 10-15 m. కావున పరమాణువులో ఎక్కువ ఖాళీ ప్రదేశం ఉండును. అందువల్ల రూథర్ ఫర్డ్ ప్రయోగంలో కేంద్రకం ద్రవ్యరాశికి ఎటువంటి ప్రాముఖ్యత లేదు.

ప్రశ్న 11.
హైడ్రోజన్ వర్ణపటంలోని లైమన్ శ్రేణి అతినీలలోహిత ప్రాంతంలో ఉంటుంది. ఎందుకు? [AP. Mar. ’15]
జవాబు:
అతినీలలోహిత ప్రాంత వర్ణపటంలో గణించిన తరంగదైర్ఘ్య విలువలు, హైడ్రోజన్ వర్ణపటం లైమన్ శ్రేణిలో ప్రయోగ పూర్వకంగా పరిశీలించిన తరంగదైర్ఘ్యం విలువలతో ఏకీభవిస్తున్నాయి.

AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు

ప్రశ్న 12.
వివిధ వర్ణపట శ్రేణుల దీర్ఘ, హ్రస్వ (longest and shortest) తరంగదైర్ఘ్యాలను ఇస్తూ ఒక పట్టికను రాయండి.
జవాబు:

వర్ణపటం శ్రేణిగరిష్ఠ తరంగదైర్ఘ్యం
λmax Å
కనిష్ఠ తరంగదైర్ఘ్యం
λmin Å
1. లైమన్1216912
2. బామర్65633646
3. పాశ్చన్18,7518,220
4. బ్రాకెట్40,51414,585
5. ఫండ్74,58322,789

ప్రశ్న 13.
హైడ్రోజన్ వర్ణపటంలోని కొన్ని వర్ణపటరేఖల తరంగదైర్ఘ్యాలు 1216 A, 6463 A, 9546 . వీటిలో ఏ తరంగదైర్ఘ్యం పాశ్చన్ శ్రేణికి చెందినది?
జవాబు:
1956Å తరంగదైర్ఘ్యం ఉన్న వర్ణపట రేఖ పాశ్చన్ శ్రేణికి చెందినది.

ప్రశ్న 14.
రూథర్ ఫర్డ్ పరమాణు నమూనా యొక్క ఏవైనా రెండు లోపాలను ఇవ్వండి.
జవాబు:
రూథర్ ఫర్డ్ పరమాణు నమూనాలో లోపాలు :

  1. కక్ష్యలో తిరుగుతూ ఉన్న ఎలక్ట్రాన్ క్రమంగా శక్తిని పరమాణువు కోల్పోతూ, చివరకు కేంద్రకంలో పడి నశించాలి. కాని ద్రవ్యం స్థిరం కాని, పరమాణువు నశించదు.
  2. పరమాణువులు అవిచ్ఛిన్న వర్ణపటంను ఉద్గారించాలి. కాని మనం ఒక్క రేఖా వర్ణపటంను పరిశీలించటం జరిగింది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అభిఘాత పరామితి, పరిక్షేపణ కోణం అంటే ఏమిటి? అవి ఒకదానికొకటి ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాయి?
జవాబు:
1) అభిఘాత పరామితి (b) :
α-కణం తొలివేగ సదిశకు, కేంద్రకం కేంద్రానికి మధ్య ఉండే లంబ దూరమును అభిఘాత పరామితి అంటారు.

2) పరిక్షేపణ కోణం (θ) : α – కణం కేంద్రకంను సమీపించు దిశకు మరియు విచలన దిశకు మధ్యగల కోణంను పరిక్షేపణ కోణం అంటారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 3

ప్రశ్న 2.
బోర్ పరమాణు నమూనా ప్రకారం హైడ్రోజన్ పరమాణువులోని ఏదైనా కక్ష్యలో ఉన్న ఎలక్ట్రాన్ స్థితిజ, గతిజ శక్తులకు సమాసాన్ని ఉత్పాదించండి. n పెరిగే కొద్దీ స్థితిజశక్తి ఏవిధంగా మారుతుంది? [TS. Mar.’15]
జవాబు:
1) బోర్ నియమము ప్రకారము, పరిభ్రమిస్తూ ఎలక్ట్రాన్లకు మరియు కేంద్రకంనకు మధ్య ఉన్న స్థిరవిద్యుత్ ఆకర్షణ బలం Fe, ఎలక్ట్రాన్లు తమ కక్ష్యలలో పట్టి ఉంచేందుకు అభికేంద్ర బలంను సమకూర్చును.
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 4
6) ‘n’ పెరిగిన, పొటెన్షియల్ శక్తి (U) కూడా పెరుగును.

ప్రశ్న 3.
హైడ్రోజన్ పరమాణువు యొక్క బోర్ సిద్ధాంతం పరిమితులు ఏమిటి? [AP. Mar.’17; Mar. ’14]
జవాబు:
హైడ్రోజన్ పరమాణువు బోర్ సిద్ధాంతం పరిమితులు :

  1. ఈ సిద్ధాంతం, Z = 1 వంటి సరళ హైడ్రోజన్ వంటి పరమాణువులకు మాత్రమే వర్తిస్తుంది. Z > 1 అయిన మూలక పరమాణువుల సందర్భంలో ఈ సిద్ధాంతం వర్తించదు.
  2. ఎలక్ట్రాన్ల కక్ష్యలు వృత్తాకారంగా ఎందుకు తీసుకుంటారో వివరించలేదు. ఎలక్ట్రాన్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలు కూడా సాధ్యమే.
  3. వర్ణపట రేఖల సాపేక్ష తీవ్రతలు గురించి బోర్ సిద్ధాంతం వివరించలేదు.
  4. ఎలక్ట్రాన్ల తరంగ ధర్మాలను బోర్ సిద్ధాంతం పరిగణనలోనికి తీసుకోలేదు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు

ప్రశ్న 4.
అత్యంత సామీప్య దూరం (distance of closest approach), అభిఘాత పరామితులను వివరించండి.
జవాబు:
అత్యంత సామీప్య దూరం:
1) ఒక α–కణం, తొలిగతిజ శక్తి (K.E) తో పరమాణు కేంద్రకం, కేంద్రం వైపు చలిస్తుందని భావిద్దాం.

2) కేంద్రకము మరియు α-కణంకు మధ్య కూలుంమ్ వికర్షణ బలంను లెక్కలోనికి తీసుకుంటే, α- కణం గతిజశక్తి సమీపిస్తుంటే తగ్గును. తరువాత కణం స్థితిజశక్తి పెరుగును.

3) కేంద్రకం నుండి ‘d’ దూరం వద్ద, α-కణం గతిజశక్తి సున్నాకు తగ్గును. కణం ఆగిపోవును. కేంద్రకంను సమీపించలేదు. కణం, కేంద్రకంచే వికర్షించబడును. కణం 180° తిరిగి వచ్చిన మార్గంను అనుసరించును.

4) ఈ దూరం ను అత్యంత సామీప్యదూరం అంటారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 5

ప్రశ్న 5.
థామ్సన్ పరమాణు నమూనాకు ఒక సంక్షిప్త వివరణ ఇవ్వండి. దీని పరిమితులు ఏమిటి?
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 6
థామ్సన్ పరమాణు నమూనా:

  1. థామ్సన్ నమూనా ప్రకారము, ప్రతి పరమాణువు, 10-10 m వ్యాసార్థం ఉన్న ధనావేశగోళము. దానిలో పరమాణు ద్రవ్యరాశి మరియు ఆవేశం ఏకరీతి వితరణ కలిగి ఉండును.
  2. ఈ గోళం లోపల, ఎలక్ట్రాన్లు పుచ్చకాయలోని విత్తనాలవలె లేక ధనావేశం, గుజ్జువలె కలిగి ఉంటుంది.
  3. పరమాణువులో ఎలక్ట్రాన్లు కలిగి ఉండే రుణావేశం, పరమాణు ధనావేశంనకు సమానము. కావున పరమాణువు విద్యుత్ పరంగా తటస్థము.

పరిమితులు :

  1. ఇది ప్రయోగపూర్వకంగా పరిశీలించిన, మరియు ఇతర పరమాణు వర్ణపట శ్రేణుల మూలంను వివరించలేదు.
  2. రూథర్ ఫర్డ్ పరిశీలించిన, పలుచని లోహ పలకల నుండి – కణాలు హెచ్చు పరిక్షేపణ కోణాలను, వివరించలేదు.

ప్రశ్న 6.
రూథర్ ఫర్డ్ పరమాణు నమూనాను వర్ణించండి. ఈ నమూనా లోపాలు ఏమిటి?
జవాబు:
రూథర్ ఫర్డ్ పరమాణు నమూనా : రూథర్ఫర్డ్ గ్రహమండల నమూనాను ప్రతిపాదించాడు.

  1. ప్రతి పరమాణువు చిన్న కేంద్రీయ కోర్ను కలిగి ఉండును. దీనిని పరమాణు కేంద్రకం అంటారు. దానిలో మొత్తం ధనావేశం మరియు పరమాణు మొత్తం ద్రవ్యరాశి కేంద్రీకరించబడును.
  2. కేంద్రక పరిమాణం 10-15 m, పరమాణు కేంద్రకం 10-10m తో పోల్చిన చాలా తక్కువ.
  3. కేంద్రకం చుట్టూ నిర్దిష్టమైన ఎలక్ట్రాన్లు ఉండును. పరమాణువులో కేంద్రం చుట్టూ ఉన్న ఎలక్ట్రాన్ల మొత్తం రుణావేశం, కేంద్రకంపై ధనావేశం మొత్తంనకు సమానం. కావున పరమాణువు మొత్తం మీద విద్యుత్పరంగా తటస్థము.
  4. గ్రహాలు సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నట్లే, ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ వేర్వేరు వృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తూ ఉంటాయి. ఎలక్ట్రాన్ పరిభ్రమించడానికి కావాల్సిన అభికేంద్రబలమును, ఎలక్ట్రాన్ మరియు కేంద్రకమునకు మధ్య ఉన్న స్థిర విద్యుత్ ఆకర్షణ బలం అందిస్తుంది.

లోపాలు :
సాంప్రదాయక విద్యుదయస్కాంత సిద్ధాంతం ప్రకారము,

  1. కక్ష్యలో తిరుగుతూ ఉన్న ఎలక్ట్రాన్ క్రమంగా శక్తిని కోల్పోతూ, చివరకు కేంద్రకంలో పడి పరమాణువు నశించాలి. కాని ద్రవ్యం స్థిరం కాని పరమాణువు నశించదు.
  2. పరమాణువులు అవిచ్ఛిన్న వర్ణపటంను ఉద్గారించాలి. కాని మనం ఒక్క రేఖావర్ణపటంను పరిశీలించటం జరిగింది.

ప్రశ్న 7.
ఉత్తేజన పొటెన్షియల్ (excitation potential), అయనీకరణ పొటెన్షియల్ల మధ్య భేదమేమిటి?
జవాబు:
ఉత్తేజిత పొటెన్షియల్ :
1) ఒక ఎలక్ట్రాన్ శక్తిని శోషణం చేసి, తక్కువ కక్ష్య నుండి ఎక్కువ కక్ష్యలోనికి దూకి ఎలక్ట్రాన్ ను ఉత్తేజిత ఎలక్ట్రాన్ అని, ఈ ప్రక్రియను ఉత్తేజిత ప్రక్రియ అంటారు. ఎలక్ట్రాన్ లోపలి కక్ష్య (భూస్థాయి) నుండి బయట కక్ష్యలోనికి ఎలక్ట్రాన్ దూకటానికి కావాల్సిన శక్తిని, త్వరణ పొటెన్షియల్ ఇస్తుంది. ఈ పొటెన్షియల్ను ఉత్తేజిత పొటెన్షియల్ లేక అనునాద పొటెన్షియల్ అంటారు.

2) a) ఉదాహరణకు, హైడ్రోజన్ పరమాణు సందర్భంలో E1 = – 13.6 eV.
E2 = -3.4 eV, E3 = -1.5leV ………… E = 0
∴ ఎలక్ట్రాన్ భూస్థాయి (n = 1) నుండి మొదటి ఉత్తేజిత స్థాయి (n = 2) లోనికి వెళ్ళటానికి కావాల్సిన శక్తి E = E2 – E1 = -3.4 – (−13.6) = 10.2 ev.
అనురూప ఉత్తేజిత పొటెన్షియల్ = 10.2 ev.
b) ఇదేవిధంగా, ఎలక్ట్రాన్ భూస్థాయి (n = 1) నుండి రెండవ ఉత్తేజిత (n = 3) స్థాయిలోనికి వెళ్ళటానికి కావాల్సిన
శక్తి E = E3 – E1 = -1.51 (-13.6)=-1.51 13.6
అనురూప ఉత్తేజిత పొటెన్షియల్ = 12.09 Volt

3) ఒక పరమాణువు ఉత్తేజిత పొటెన్షియల్ ఒకటికాదు. పరమాణువు ఏ స్థాయిలోనికి ఉత్తేజితం చెందిందో, దానిపై ఆధారపడి, ఇది అనేక విలువలు కలిగి ఉండును.

అయనీకరణ పొటెన్షియల్:

  1. పరమాణువు బాహ్య కక్ష్య నుండి ఎలక్ట్రాన్ను తొలగించటానికి కావాల్సిన శక్తిని అయనీకరణ శక్తి అని, ఈ ప్రక్రియను అయనీకరణం అంటారు.
  2. పరమాణువు నుండి ఎలక్ట్రానన్ను తొలగించటానికి కావాల్సిన శక్తిని, త్వరణ పొటెన్షియల్ ఇస్తుంది. దీనినే అయనీకరణ పొటెన్షియల్ అంటారు.
  3. ఉదాహరణకు హైడ్రోజన్ పరమాణువు భూస్థాయిలో ఉన్న ఎలక్ట్రాన్కు మొత్తం శక్తి + 13.6 eV కావాలి.
  4. ఒక పరమాణువు అయనీకరణ పొటెన్షియల్ సాధారణ సమీకరణము V = \(\frac{13.6Z^2}{n^2}\) వోల్ట్.
    ఇక్కడ Z పరమాణు సంఖ్య మరియు n ఎలక్ట్రాన్ తొలగించబడిన కక్ష్య సంఖ్య.
  5. ఇచ్చిన మూలకంనకు, అయనీకరణ పొటెన్షియల్ స్థిరం. వేర్వేరు మూలకాలు వేర్వేరు అయనీకరణ పొటెన్షియల్ విలువలు కలిగి ఉండును.

AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు

ప్రశ్న 8.
హైడ్రోజన్ పరమాణువులోని వివిధ రకాల వర్ణపట శ్రేణులను వివరించండి. [TS. Mar. 16; AP. Mar.’15]
జవాబు:
హైడ్రోజన్ పరమాణువు ఉద్గారించు రేఖ వర్ణపటం ఐదు శ్రేణులను కలిగి ఉండును.
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 7

ప్రశ్న 9.
క్వాంటీకరణను సూచించే బోర్ రెండవ ప్రతిపాదనకు డిబ్రాయ్ ఇచ్చిన వివరణపై లఘుటీకా వ్రాయండి. [TS. Mar ’17]
జవాబు:
బోర్ రెండవ క్వాంటీకరణ భావనకు డిబ్రాయ్ వివరణ :
1) బోర్ పరమాణు నమూన రెండవ భావన, కేంద్రకము చుట్టూ తిరగే ఎలక్ట్రాన్ కోణీయ ద్రవ్యవేగం క్వాంటీకరణం అవుతుందని చెబుతుంది.
i.e., mvr = \(\frac{nh}{2 \pi}\) ఇక్కడ n = 1, 2, 3, ….
2) డిబ్రాయ్ ప్రకారము, వృత్తాకార కక్ష్యలో ఉన్న ఎలక్ట్రాన్, బోర్ ప్రతిపాదించిన విధంగా, కణ తరంగముగా చూడవచ్చును.
3) రెండు వైపులా స్థిరంగా బిగించిన తీగను మీటితే, హెచ్చు తరంగదైర్ఘ్యాల సంఖ్య ఉన్న స్థావర తరంగం ఏర్పడును.
4) తీగలో స్థావర తరంగాలు ఏర్పడినపుడు, తరంగముపైకి మరియు క్రిందికి ప్రయాణించిన మొత్తం దూరము తరంగధైర్ఘ్యాల సంఖ్యకు పూర్ణ గుణిజాలుగా ఉండును.
5) డీబ్రాయ్ ప్రకారము, ఒక స్థావర కక్ష్య తిరిగే ఎలక్ట్రాన్తో డీబ్రోగ్లీ తరంగాల పూర్ణ సంఖ్యను కలిగి ఉండును.
6) ఒక ఎలక్ట్రాన్ rn వ్యాసార్ధము ఉన్న గవ వృత్తాకార కక్ష్యలో భ్రమణం చెందితే, మొత్తం ప్రయాణించిన దూరము = కక్ష్య వృత్త పరిధి = 2πrn
∴ అనుమతించబడిన కక్ష్యకు, 2πrn = nλ
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 8
i.e., nవ కక్ష్యలో తిరిగే ఎలక్ట్రాన్ కోణీయ ద్రవ్యవేగము \(\frac{h}{2 \pi}\) పూర్ణ గుణజంనకు సమానం.
బోర్ ప్రతిపాదించిన రెండవ భావనకు ఇదియే షరతు.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
α – కణాల పరిక్షేపణపై గైగర్-మార డెన్ల ప్రయోగాన్ని వర్ణించండి. ఈ ప్రయోగంలో కేంద్రక పరిమాణాన్ని ఎలా అంచనా వేస్తారు?
జవాబు:

  1. రూథర్ ఫర్డ్ మరియు అతని సహోద్యోగులు, గైగర్ మరియు మారె డెన్ ప్రయోగ అమరిక పటంలో చూపబడింది.
  2. సీసపు రంధ్రములోని రేడియోధార్మిక జనకం నుండి ఉద్గారమయ్యే – కణాలు, సీసపు చీలిక ద్వారా సన్నని పుంజంగా సమాంతీకరించబడతాయి.
    AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 9
  3. సమాంతరీకరణ పుంజము 2.1 × 10-7m మందం ఉన్న పలుచని బంగారు రేకుపై పతనమవుతాయి.
  4. వేర్వేరు దిశలలో పరిక్షేపణ α- కణాలను, జింక్ సల్ఫైడ్ తెర మరియు మైక్రోస్కోప్ కలిగి ఉన్న భ్రమణ శోధకం ద్వారా పరిశీలిస్తారు.
  5. జింక్ సల్ఫైడ్ తెరపై వెలుగు మెరుపులు లేక ప్రస్ఫురణలను ఏర్పడతాయి.
  6. పతన పుంజం దిశ నుండి వేర్వేరు కోణాల వద్ద మైక్రోస్కోప్ ద్వారా పరిశీలించి గణిస్తారు.
  7. α –కణం, తొలిదశ నుండి విచలనకోణం θ ను పరిక్షేపణ కోణం θ అంటారు.

పరిశీలనలు:

  1. బంగారు రేకు ద్వారా ఎక్కువ x-కణాలు సరళపథంలో చలిస్తాయి. α- కణాలు, బంగారు పరమాణువులతో అభిఘాతం పవు.
  2. పతన α- కణాలలో 0.14% మాత్రమే 1° కన్నా ఎక్కువ పరిక్షేపణ చెందుతాయి.
  3. 8000 α-కణాలలో, ఒక్క – కణం 90° కన్నా ఎక్కువ అపవర్తనం చెందును.

కేంద్రకం పరిమాణం నిర్ణయించుట:

  1. రూథర్ఫర్డ్ భావన ప్రకారము, పరమాణువు మొత్తం ధనావేశం, పరమాణువు చిన్న కేంద్రక కోర్లో కేంద్రీకకరించబడును. ప్రతిపరమాణు చిన్న కేంద్రక కోర్ను, పరమాణు కేంద్రకం అంటారు.
  2. గ్రహాలు, సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్లే కేంద్రము చుట్టూ కక్ష్యలలో ఎలక్ట్రాన్లు చలిస్తాయి.
  3. రూథర్ ఫర్డ్ ప్రయోగము, కేంద్రకం యొక్క పరిమాణం 10-15 m నుండి 10-14m ఉండునని తెలిపినవి. గతిజ సిద్ధాంతం నుండి పరమాణు పరిమాణం 10-10m, సుమారుగా కేంద్రక పరిమాణంనకు 10,000 నుండి 1,00,000 రెట్లు ఎక్కువగా ఉండును.

ప్రశ్న 2.
హైడ్రోజన్ పరమాణువు వర్ణపటాన్ని వివరించే బోర్ సిద్ధాంతాన్ని చర్చించండి.
జవాబు:

  1. బోర్ నమూన ప్రకారము, ఎలక్ట్రాన్ నిర్విరామంగా స్థిర కేంద్రకం చుట్టూ స్థావర కక్ష్యలలో భ్రమణం చెందును. దీనినే పరమాణు భూస్థాయి అంటారు. భూస్థాయి ఎటువంటి వికిరణాన్ని ఉద్గారించదు.
  2. పరమాణువుకు కొంతశక్తిని ఇస్తే, ఆ శక్తిని ఎలక్ట్రాన్ శోషణం చేయును. దీనినే పరమాణువు ఉత్తేజిత స్థాయి అంటారు. ఈ స్థితిలో ఎలక్ట్రాన్ తరువాత హెచ్చు కక్ష్యలలోనికి దూకును. అక్కడ 10-8 sec. మాత్రమే ఉండి, వెంటనే భూస్థాయికి వచ్చును. స్థాయిలలోని శక్తిభేదము వర్ణపట రేఖగా ఉద్గారమగును.
  3. బోర్ మూడవ భావన ప్రకారము, ఉద్గారశక్తి E = hν = E2 – E
    AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 10

హైడ్రోజన్ పరమాణువు యొక్క వర్ణ పట శ్రేణి :
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 11
హైడ్రోజన్ పరమాణువు ఐదు శ్రేణుల వర్ణపట రేఖలను కలిగి ఉండును. అవి

1. లైమన్ శ్రేణి :
ఎలక్ట్రాన్ బాహ్యకక్ష్యల నుండి మొదటి కక్ష్యలోనికి దూకిన, అతినీల లోహిత ప్రాంతంలో వర్ణపట రేఖలు ఏర్పడును. ఇక్కడ n1 = 1, n2 = 2, 3, 4, 5…..
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 12

2) బామర్ శ్రేణి :
ఎలక్ట్రాన్ బాహ్యకక్ష్యల నుండి, రెండవ కక్ష్యలలోనికి దూకితే, దృశ్యా ప్రాంతంలో వర్ణపట రేఖలు ఏర్పడును. ఇక్కడ n1 = 2, n2 = 3, 4, 5…..
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 13

3) పాశ్చన్ శ్రేణి :
ఎలక్ట్రాన్ బాహ్యకక్ష్యల నుండి మూడవ కక్ష్యలోనికి దూకితే సమీప పరారుణ ప్రాంతంలో వర్ణపట రేఖలు ఏర్పడును. ఇక్కడ n1 = 3, n2 = 4, 5, 6 …..
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 14

4) బ్రాకెట్ శ్రేణి :
ఎలక్ట్రాన్ బాహ్యకక్ష్యల నుండి నాల్గవ కక్ష్యలోనికి దూకితే, పరారుణ ప్రాంతంలో వర్ణపట రేఖలు ఏర్పడతాయి. ఇక్కడ n1 = 4, n2 = 5, 6, 7 ….
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 15

5) ఫండ్ శ్రేణి :
ఎలక్ట్రాన్ బాహ్యకక్ష్యల నుండి ఐదవ కక్ష్యలోనికి దూకితే, దూరపరారుణ ప్రాంతంలో వర్ణపట రేఖలు ఏర్పడును. ఇక్కడ n1 = 5, n2 = 6, 7, 8, …..
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 16

AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు

ప్రశ్న 3.
పరమాణు వర్ణపటాన్ని వివరించే బోర్ సిద్ధాంతం యొక్క ప్రతిపాదనలను (postulates) తెలపండి. వీటినుంచి హైడ్రోజన్, పరమాణువులో కక్ష్యా వ్యాసార్థానికి, కక్ష్యలోని ఎలక్ట్రాన్ శక్తికి సమీకరణాలను పొందండి. [AP. Mar.’16]
జవాబు:
a) బోర్ సిద్ధాంత భావనలు :
1) పరమాణువులో కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు వేర్వేరు కక్ష్యలలో తిరుగుతాయి. వీటినే స్థావర కక్ష్యలు అంటారు. ఎలక్ట్రాన్లు వాని స్థావర స్థాయిలలో చలిస్తున్నప్పుడు వికిరణంను ఉద్గారించవు.

2) ఎలక్ట్రాన్ అనుమతించబడిన కక్ష్యలలో మాత్రమే తిరుగును. వాని కోణీయ ద్రవ్యవేగం \(\frac{h}{2 \pi}\) కు పూర్ణంక గుణిజంగా ఉండును.
i.e., mυnrn = \(\frac{nh}{2 \pi}\) → (1)
ఇక్కడ n = 1, 2, 3…..

3) ఒక ఎలక్ట్రాన్ హెచ్చుశక్తి (E2) కక్ష్య నుండి తక్కువ శక్తి (E1) కక్ష్యలోనికి దూకితే, వాని శక్తుల భేదంనకు సమాన శక్తి గల వికిరణం ఉద్గారమగును.
i.e., E = hν = E2 – E ⇒ ν = \(\frac{E_2-E_1}{h}\) → (2)

b) ఉద్గార వికిరణం శక్తి :
హైడ్రోజన్ పరమాణువులో ఆ ఆవేశం ఉన్న ఒక ఎలక్ట్రాన్, e ఆవేశం ఉన్న కేంద్రకం చుట్టూ rn వ్యాసార్థం ఉన్న వృత్తాకార కక్ష్యలో తిరుగుతుంది.

1) ఎలక్ట్రాన్ గతిజశక్తి :
ఎలక్ట్రాన్ వృత్తాకార కక్ష్యలో తిరుగుటకు, అభికేంద్ర బలం = ఎలక్ట్రాన్ మరియు కేంద్రకం మధ్య స్థిరవిద్యుదాకర్షణ బలం.
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 17
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 18

4) మొత్తం శక్తి (En) :
కేంద్రకం చుట్టూ తిరుగు ఎలక్ట్రాన్కు గతిజశక్తి మరియు స్థితిజశక్తి ఉండును.
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 19

అభ్యాసాలు Textual Exercises

ప్రశ్న 1.
ఒక హైడ్రోజన్ పరమాణువు మొదటి ఎలక్ట్రాన్ కక్ష్యావ్యాసార్థం 5.3 × 10-11m. రెండవ కక్ష్య వ్యాసార్థం ఎంత?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 20

ప్రశ్న 2.
హైడ్రోజన్ పరమాణువు మొదటి కక్ష్య వ్యాసార్ధాన్ని కనుక్కోండి. మొదటి కక్ష్యలోని ఎలక్ట్రాన్ వేగం, పౌనఃపున్యాలు ఎంత ఉంటాయి?
దత్తాంశం: h = 6.62 × 10-34 Js, m = 9.1 × 10-31kg, e = 1.6 × 10-19 C, k = 9 × 109 m²C.
సాధన:
ఇచ్చినవి h = 6.62 × 10-34 J-s,
m = 9.1 × 10-31 kg
e = 1.6 × 10-19C;
K = 9 × 109 Nm²C-2, n = 1
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 21

ప్రశ్న 3.
హైడ్రోజన్ పరమాణువులో మొదటి ఉత్తేజిత స్థాయిలోని ఎలక్ట్రాన్ మొత్తం శక్తి -3.4eV. ఈ స్థాయిలో ఎలక్ట్రాన్ స్థితిజశక్తి ఎంత?
సాధన:
మొదటి కక్ష్యలో, E = – 3.4 eV
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 22

ప్రశ్న 4.
హైడ్రోజన్ పరమాణువులో మొదటి ఉత్తేజిత స్థాయిలోని ఎలక్ట్రాన్ మొత్తం శక్తి -3.4eV. ఈ స్థాయిలో ఎలక్ట్రాన్ గతిజశక్తి ఎంత?
సాధన:
హైడ్రోజన్ వంటి పరమాణువుకు,
K = – మొత్తం శక్తి అవుతుంది.
ఇక్కడ E = – 3.4eV
∴ K = – (-3.4) = 3.4 eV.

ప్రశ్న 5.
భూస్థాయిలో ఉన్న హైడ్రోజన్ పరమాణువు వ్యాసార్థాన్ని లెక్కించండి. n = 1 వ కక్ష్యలో ఎలక్ట్రాన్ వేగాన్ని కూడా
h = 6.63 × 10-34Js, m = 9.1 × 10-31 kg, e = 1.6 × 10-19 C, K = 9 × 109N m²C-2.
సాధన:
n = 1, h = 6.63 × 10-34 J-s,
m = 9.1 × 10-31 kg
e = 1.6 × 10-19C,
K = 9 × 109 Nm²C-2

AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 23

ప్రశ్న 6.
హైడ్రోజన్ పరమాణువు అయనీకరణ శక్తి 13.6 eV అని చూపండి.
సాధన:
భూస్థాయికి, n = 1
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 24
హైడ్రోజన్ పరమాణువు, భూస్థాయి నుండి ఎలక్ట్రాన్ను స్వేచ్ఛగా ఉంచటానికి కావాల్సిన కనీస శక్తి = 13.6 eV,
∴ హైడ్రోజన్ పరమాణువు యొక్క అయనీకరణ శక్తి = 13.6 eV.

AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు

ప్రశ్న 7.
లిథియం పరమాణువు అయనీకరణ శక్తిని లెక్కించండి.
సాధన:
3Li7 పరమాణువుకు, Z = 3, n = 2 [∵ Li=1s² 2s¹]
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 25
∴ లిథియం అయనీకరణ = 30.6eV.

ప్రశ్న 8.
లైమన్ శ్రేణిలోని మొదటి రేఖ (first member) తరంగదైర్ఘ్యం 1216 Å. బామర్ శ్రేణిలోని రెండవ రేఖ (second member) తరంగదైర్ఘ్యాన్ని లెక్కించండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 26
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 27

ప్రశ్న 9.
బామర్ శ్రేణిలోని మొదటి రేఖ తరంగదైర్ఘ్యం 6563 Å. లైమన్ శ్రేణిలోని రెండవ రేఖ తరంగదైర్ఘ్యాన్ని లెక్కించండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 28

ప్రశ్న 10.
హైడ్రోజన్ వర్ణపటం లైమన్ శ్రేణిలోని రెండవరేఖ తరంగదైర్ఘ్యం 5400 Å. దీనిలోని మొదటిరేఖ తరంగదైర్ఘ్యాన్ని కనుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 29
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 30

ప్రశ్న 11.
బామర్ శ్రేణిలోని హ్రస్వ తరంగదైర్ఘ్యాన్ని లెక్కించండి (లేదా) బామర్ శ్రేణి అవధి తరంగదైర్ఘ్యాన్ని లెక్కించండి.
R = 10970000m-1.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 31

ప్రశ్న 12.
రిడ్బర్గ్ ఫార్ములాను ఉపయోగించి, హైడ్రోజన్ పరమాణువు బామర్ శ్రేణిలోని మొదటి నాలుగు వర్ణపట రేఖల తరంగదైర్యాలను లెక్కించండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 32

అదనపు అభ్యాసాలు Additional Exercises

ప్రశ్న 1.
ప్రతివాక్యం చివర ఇచ్చిన ఆధారాలను ఆసరాగా చేసుకొని సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి :
a) థామ్సన్ నమూనాలో పరమాణు పరిమాణం, రూథర్ ఫర్డ్ నమూనాలోని పరమాణు పరిమాణం….. (కంటే చాలా ఎక్కువ / లలో తేడా ఏమి ఉండదు / కంటే చాలా తక్కువ).
b) ……. లో భూస్థాయిలోని ఎలక్ట్రాన్లు స్థిర సమతాస్థితి (stable equilibrium) లో ఉంటాయి. అయితే ………. లో ఎలక్ట్రాన్లు ఎప్పుడూ ఒక నికర బలాన్ని అనుభవిస్తాయి. (థామ్సన్ నమూనా / రూథర్ఫర్డ్ నమూనా).
c) ………… పై ఆధారపడిన ఒక సంప్రదాయక పరమాణువు అంతిమంగా కుప్పకూలిపోయి నశించాల్సిందే. (థామ్సన్ నమూనా / రూథర్ ఫర్డ్ నమూనా).
d) ……..లో ఒక పరమాణువు దాదాపు అవిచ్ఛిన్న ద్రవ్యరాశి వితరణను కలిగి ఉంటుంది. కాని …………… లోనైతే అత్యధిక అసమరీతి ద్రవ్య వితరణను కలిగి ఉంటుంది. (థామ్సన్ నమూనా / రూథర్ ఫర్డ్ నమూనా).
e) ……….. పరమాణువు ధనావేశిత భాగం మొత్తం ద్రవ్యరాశిలో అత్యధిక ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది. (రూథర్ ఫర్డ్ నమూనాలో / రెండు నమూనాల్లోను).
జవాబు:
a) వేరే రూపంలో ఉండదు.
b) థామ్సన్ నమూనా, రూథర్ ఫర్డ్ నమూనా
c) రూథర్ ఫర్డ్ నమూనా
d) థామ్సన్ నమూనా, రూథర్ఫర్డ్ నమూనా
e) రెండు నమూనాలు

ప్రశ్న 2.
బంగారు రేకు స్థానంలో పలుచని ఘన హైడ్రోజన్ పలకను ఉపయోగించి ఆల్ఫా-కణ పరిక్షేపణ ప్రయోగాన్ని మరోసారి నిర్వహించడానికి, ఒకవేళ మీకొక అవకాశం ఇస్తే మీరు ఏయే ఫలితాలను ఆశిస్తారు? (14 K కంటే తక్కువ ఉష్ణోగ్రతల వద్ద హైడ్రోజన్ ఘనపదార్థ రూపంలో ఉంటుంది).
జవాబు:
బంగారు రేకు స్థానంలో ఘనహైడ్రోజన్ పలకను, . కణంను ప్రక్షేపకంగా ఉపయోగించి పరిక్షేపణ ప్రయోగంను మరల చేస్తే విజయం సాధించలేము. కారణం హైడ్రోజన్ చాలా తేలికైనది. స్థితిస్థాపక అభిఘాతంలో, అభిఘాతం తరువాత లక్ష్య హైడ్రోజన్, ఆల్ఫాతో పోల్చిన వేగంగా చలించును. కావున హైడ్రోజన్ కేంద్రకము పరిమాణాన్ని నిర్ధారించలేము.

AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు

ప్రశ్న 3.
వర్ణపట రేఖల పాశ్చన్ శ్రేణిలో హ్రస్వ తరంగదైర్ఘ్యం ఎంత?
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 33

ప్రశ్న 4.
ఒకానొక పరమాణువులో 2.3 eV భేదం రెండు శక్తిస్థాయిలను వేరుచేస్తుంది. ఆ పరమాణువు ఎగువ శక్తి స్థాయి నుంచి దిగువ శక్తి స్థాయికి సంక్రమణం చెందినప్పుడు ఉద్గారమయ్యే వికిరణం పౌనఃపున్యం ఎంత?
జవాబు:
E = 2.3eV = 2.3 × 1.6 × 10-19 J
E = hν
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 34

ప్రశ్న 5.
హైడ్రోజన్ పరమాణువు భూస్థాయి శక్తి-13.6 eV. ఈ స్థాయిలో ఉన్న ఎలక్ట్రాన్ గతిజ, స్థితిజశక్తులు ఎంతెంత?
జవాబు:
మొత్తం శక్తి, E = – 13.6 eV
K.E = -E = 13.6 eV
P.E. = -2.K.E. = -2 × 13.6 = -27.2 eV.

ప్రశ్న 6.
తొలుత భూస్థాయిలో ఉన్న ఒక హైడ్రోజన్ పరమాణువు ఒక ఫోటాన్ ను శోషించుకొని, n = 4 స్థాయికి ఉత్తేజితం చెందింది. ఫోటాన్ తరంగదైర్ఘ్యం, పౌనఃపున్యాలను నిర్ధారించండి.
జవాబు:
భూస్థాయికి n1 = 1 మరియు n2 = 4
ఫోటాన్ శోషణ శక్తి E = E2 – E1
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 35

ప్రశ్న 7.
బోర్ నమూనాను ఉపయోగించి హైడ్రోజన్ పరమాణువు n = 1, 2, 3 స్థాయిలలో (a) ఎలక్ట్రాన్ వడిని లెక్కించండి. (b) ఇందులోని ప్రతిస్థాయిలో (ఎలక్ట్రాన్) కక్ష్య ఆవర్తన కాలాన్ని లెక్కగట్టండి.
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 36
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 37

ప్రశ్న 8.
హైడ్రోజన్ పరమాణువులోని అత్యంత అంతర (innermost) ఎలక్ట్రాన్ కక్ష్యా వ్యాసార్ధం 5.3 × 10-11 m అయితే n = 2, n = 3 కక్ష్యల వ్యాసార్థాలు ఎంతెంత?
జవాబు:
rn = n²r
∴ r2 = 4r1 = 4 × 5.3 × 10-11m = 2.12 × 10-10m
r3 = 9r1 = 9 × 5.3 × 10-11m = 4.77 × 10-10m.

ప్రశ్న 9.
12.5 eV ఎలక్ట్రాన్ శక్తి పుంజాన్ని గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న వాయు హైడ్రోజన్ ను తాడనం చేయడానికి ఉపయోగించారు. ఏయే తరంగదైర్ఘ్యాలు శ్రేణులు ఉదార్గమవుతాయి?
జవాబు:
భూస్థాయిలో, గది ఉష్ణోగ్రత వద్ద హైడ్రోజన్ వాయువు శక్తి -13.6 eV, 12.5 eV శక్తి ఉన్న ఎలక్ట్రాన్ పుంజం, హైడ్రోజన్తో ఢీకొన్నప్పుడు, శక్తి = – 13.6 + 12.5 = -1.1eV.
ఎలక్ట్రాన్ n = 1 నుండి n = 3కు దూకితే, E3 = \(\frac{-13.6}{3^2}\) = -1.1eV

ఎలక్ట్రాన్ n = 3 నుండి n = 2 కు దూకి, బామర్ శ్రేణిని ఇస్తుంది. ఎలక్ట్రాన్ n = 3 నుండి n = 1 కి దూకి, లైమన్ శ్రేణిని ఇస్తుంది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు

ప్రశ్న 10.
1.5 × 1011 m వ్యాసార్ధం ఉన్న కక్ష్యలో 3 × 104 m/s కక్ష్యా వడిలో సూర్యుడి చుట్టూ తిరుగుతున్న భూమి పరిభ్రమణాన్ని అభిలక్షణీకరించే క్వాంటం సంఖ్యను బోర్ నమూనాకు అనుగుణంగా లెక్కించండి.
(భూమి ద్రవ్యరాశి = 6.0 × 1024 kg.)
జవాబు:
r = 1.5 × 1011m, v = 3 × 104m/s, m = 6.0 × 1024kg
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 38

ప్రశ్న 11.
థామ్సన్ నమూనా, రూథర్ఫర్డ్ నమూనాల మధ్య భేదాన్ని మీరు బాగా అర్ధం చేసుకోవడంలో తోడ్పడే క్రింది ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వండి.
a) α – కణాలు పలుచని బంగారు రేకుపై పడి అపవర్తనం చెందే ప్రయోగంలో, థామ్సన్ నమూనా ఆధారంగా ప్రాగుక్తం చేసిన α – కణ సరాసరి అపవర్తన కోణం, రూథర్ ఫర్డ్ నమూనా ఆధారంగా అంచనా వేసిన సరాసరి అపవర్తన కోణం కంటే తక్కువా? దాదాపు సమానమా? ఎక్కువా?
b) థామ్సన్ నమూనా ప్రాగుక్తం చేసిన తిరోగామి పరిక్షేపణ (అంటే, 90° కంటే ఎక్కువ కోణాలతో α-కణాల పరిక్షేపణం) సంభావ్యత రూథర్ ఫర్డ్ నమూనా ఆధారంగా ప్రాగుక్తం చేసిన తిరోగామి పరిక్షేపణ సంభావ్యత కంటే చాలా తక్కువగా ఉంటుందా? దాదాపు సమానంగా ఉంటుందా? లేదా చాలా ఎక్కువగా ఉంటుందా?
c) మిగతా ఇతర కారకాలను స్థిరంగా ఉంచినప్పుడు, ఒక స్వల్ప మందం t కి మధ్యస్థ కోణాల వద్ద పరిక్షేపణ అయ్యే α – కణాల సంఖ్య కి అనులోమానుపాతంలో ఉంటుందని ప్రయోగపూర్వకంగా కనుక్కొన్నారు. ఇదిలా పై రేఖీయంగా ఆధారపడి ఉండటం దేనిని సూచిస్తుంది?
d) ఒక పలుచని రేకుతో α-కణాలు పరిక్షేపణం చెందిన సందర్భంలో వాటి సరాసరి పరిక్షేపణ కోణాన్ని లెక్కించడం కోసం ఏ నమూనాలో బహుళ పరిక్షేపణాన్ని నిర్లక్ష్యం చేయడం పూర్తిగా తప్పవుతుంది?
జవాబు:
a) దాదాపు సమానం.
b) చాలా తక్కువగా ఉంటుంది. కారణం రూథర్ ఫర్డ్ నమూనా వలె, థామ్సన్ నమూనాలో కేంద్రకంలో కేంద్ర కోర్లో ద్రవ్యం ఉండదు.
c) a- కణాలు అధిక పరిక్షేపణను వివరించును.
d) థామ్సన్ ప్రయోగంలో,

ప్రశ్న 12.
హైడ్రోజన్ పరమాణువులోని ఎలక్ట్రాన్, ప్రోటాన్ల మధ్య ఉండే గురుత్వాకర్షణ బలం, వాటి మధ్య ఉండే కూలుమ్ – ఆకర్షణ బలం కంటే సుమారు 1040 కారకంతో బలహీనంగా ఉంటుంది. ఈ వాస్తవాన్ని మరోవిధంగా పరిశీలించడం అంటే, హైడ్రోజన్ పరమాణువులోని ఎలక్ట్రాన్, ప్రోటానులు గురుత్వాకర్షణ వల్ల బద్ధమైనట్లయితే (bound) అప్పుడా పరమాణువు బోర్ మొదటి కక్ష్య వ్యాసార్థాన్ని అంచనా వేయడమే. లభించే సమాధానం మీకు ఆసక్తి గొలుపుతుంది.
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 39
ఈ విలువ అంచనా వేసిన మొత్తం విశ్వం పరిమాణం కన్నా చాలా ఎక్కువ.

ప్రశ్న 13.
ఒక హైడ్రోజన్ పరమాణువు n స్థాయి నుంచి (1 – 1) స్థాయికి అనుత్తేజితం (de-excites) చెందినప్పుడు ఉద్గారమయ్యే వికిరణ పౌనఃపున్యానికి సమాసాన్ని పొందండి. అత్యధిక n విలువలకు, ఈ పౌనఃపున్యం, ఆ కక్ష్యలో తిరుగుతున్న ఎలక్ట్రాన్ సంప్రదాయక పరిభ్రమణ పౌనఃపున్యానికి సమానంగా ఉంటుందని చూపండి.
జవాబు:
హైడ్రోజన్ పరమాణువు n నుండి (n – 1) స్థాయికి వచ్చినప్పుడు పౌనఃపున్యం ఉన్న ఉద్గార వికిరణ శక్తి E = hν = E2 – E1.
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 40
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 41
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 42
ఇది (i) ను పోలి ఉన్నది.
n హెచ్చు విలువలకు, n వ కక్ష్యలో ఎలక్ట్రాన్ సాంప్రదాయక భ్రమణ పౌనఃపున్యం, హైడ్రోజన్ పరమాణువు n నుండి (n – 1) స్థాయికి ఉద్గారమయినపుడు వికిరణ పౌనఃపున్యమునకు సమానము.

ప్రశ్న 14.
ఒక పరమాణువు కేంద్రకం చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్, సంప్రదాయకంగా చూస్తే కేంద్రకం చుట్టూ ఉన్న ఏ కక్ష్యలలో అయినా ఉండవచ్చు. అలాంటప్పుడు పరమాణు విలక్షణ పరిమాణాన్ని ఏది నిర్ణయిస్తుంది ? ఒక పరమాణువు దాని విలక్షణ పరిమాణం కంటే, మనం మాటవరసకు అనుకోవడానికైనా, వెయ్యిరెట్లు ఎందుకు పెద్దదిగా ఉండదు? మీరీ పుస్తకంలో నేర్చుకొన్న ప్రఖ్యాతమైన పరమాణు నమూనాను బోర్ రూపొదించకముందు అతడిని బాగా కలవరపెట్టిన ప్రశ్న ఇది. బోర్, తన ఆవిష్కరణకు ముందు ఏమిచేసి ఉంటాడో దాన్ని మనం అనుకరించడానికి, ప్రకృతి యొక్క ప్రాథమిక స్థిరాంకాలతో కింద వివరించినట్లుగా వినోదిస్తూ, మనకు ఇంతకు ముందే తెలిసిన పరమాణు పరిమాణానికి (~ 1010m) దాదాపు సమానంగా ఉంటూ పొడవు మితులు కలిగినటువంటి భౌతిక రాశిని మనమేమైనా పొందగలమో లేదో చూద్దాం.
a) e, m, c అనే ప్రాథమిక స్థిరాంకాల నుంచి, పొడవు మితులు కలిగి ఉండే రాశిని నిర్మించండి. దాని సంఖ్యాత్మక విలువను నిర్ధారించండి.
b) పరమాణువు కొలతల పరిమాణ క్రమంతో పోల్చి చూస్తే, (a) నుంచి పొందిన పొడవు విలువ చాలా చాలా స్వల్పంగా ఉంటుందని మీరు తెలుసుకొంటారు. అంతేగాక, ఇందులో c మిళితమై ఉంటుంది. కాని ఎక్కడైతే పోషించే పాత్ర అంటూ ఏమీ ఉండదని భావిస్తామో, అలాంటి నిరపేక్షక్షేత్ర (non-relativistic domain) పరిధిలోనే పరమాణువుల శక్తి విలువలు అత్యధికంగా ఉంటాయి. సరియైన పరమాణు పరిమాణాన్ని పొందే ప్రయత్నంలో బహుశా ఈ తర్కమే c ని వదిలివేసి, ‘మరేదో ఇతర రాశి’పై దృష్టిసారించడానికి బోర్ను పులికొల్పి ఉంటుంది. ఈ విధంగా ఆలోచిస్తున్న సమయంలోనే అంతకు ముందుగానే ఏదో ఒకచోట ఉన్న ప్లాంక్ స్థిరాంకం h తెరముందుకు వచ్చింది. h, me, e అనే రాశులు పరమాణువు యొక్క సరియైన పరిమాణాన్ని అందిపుచ్చుకోవడంలో ఉపకరిస్తాయని బోర్ గుర్తించడంలోనే అతడి సునిశిత దృష్టి దాగి ఉంది. h, me, ఆ రాశుల నుంచి పొడవు మితి కలిగిన ఒక రాశిని రూపకల్పన చేయండి. అంతేగాక, దాని సంఖ్యాత్మక విలువ వాస్తవానికి సరైన పరిమాణ క్రమంలోనే ఉందని నిర్ధారించండి.
జవాబు:
a) ప్రాథమిక స్థిరాంకాలు e, me మరియు c లను ఉపయోగించి, పొడవు మితి గల రాశిని నిర్మించవచ్చు. ఈ రాశి
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 43
ఇది విలక్షణ పరమాణు పరిమాణం కన్నా చాలా తక్కువ.

b) c ను వదిలేసి hc, me మరియు ఆ లను ఉపయోగించి ఒక రాశిని నిర్మించుటకు, అది పొడవు మితులను కలిగి
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 44
ఇది పరమాణువు పరిమాణంనకు సమానం.

ప్రశ్న 15.
హైడ్రోజన్ పరమాణువులోని మొదటి ఉత్తేజిత స్థాయిలోని ఎలక్ట్రాన్ మొత్తం శక్తి దాదాపు 3.4 eV ఉంటుంది.
a) ఈ స్థాయిలోని ఎలక్ట్రాన్ గతిజశక్తి ఎంత?
b) ఈ స్థాయిలోని ఎలక్ట్రాన్ స్థితిజశక్తి ఎంత?
c) స్థితిజశక్తి శూన్య విలువను వేరేవిధంగా ఎంపిక చేసుకొంటే పై సమాధానాల్లోని ఏ సమాధానం మారిపోతుంది?
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 45
స్థితిజ శక్తి = -2 (గతిజశక్తి).
ఈ గణనలో, విద్యుత్ పొటెన్షియల్ మరియు స్థితిజశక్తి అనంత దూరం వద్ద శూన్యం.
మొత్తం శక్తి = PE + KE = 2KE + KE = -KE

a) మొదటి ఉత్తేజిత స్థాయిలో, మొత్తం శక్తి = -3.4 eV
∴K.E = – (-3.4eV) = + 3.4 eV.

b) మొదటి ఉత్తేజిత స్థాయిలో, ఎలక్ట్రాన్ స్థితిజశక్తి = -2KE = -2 × 3.4 = -6.8 eV.

c) శూన్య స్థితిజశక్తి మారితే, గతిజ శక్తి మారదు. KE విలువ + 3.4 eV ఉండును. ఏమైనప్పటికి శూన్యస్థితిజ శక్తి ఎన్నికతో PE. మరియు మొత్తం శక్తి మారవచ్చును.

AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు

ప్రశ్న 16.
బోర్ క్వాంటీకరణ ప్రతిపాదన (కోణీయ వేగం = nh/2π) అనేది ప్రకృతి యొక్క ఒక ప్రాథమిక నియమం అయినట్లయితే, అది గ్రహచలనాల సందర్భంలో కూడా అదేవిధంగా చెల్లుబాటు అయ్యితీరాలి. మరి అలాంటప్పుడు, సూర్యుని చుట్టూ తిరిగే గ్రహకక్ష్యల క్వాంటీకరణ గురించి మనమెప్పుడూ ఎందుకు మాట్లాడం?
జవాబు:
బోర్ క్వాంటీకరణ ప్రతిపాదన, ప్లాంక్ స్థిరాంకము h పదములో ఉండును. కాని భూగ్రహం కోణీయ ద్రవ్యవేగం = 1070 h. బోర్ క్వాంటీకరణ ప్రతిపాదన పదములలో, ఇది 107 కు అనురూపంగా ఉండును. n హెచ్చు విలువలకు, వరుస శక్తులు మరియు కోణీయ ద్రవ్యవేగ క్వాంటీకరణ శక్తుల మధ్య భేదము చాలా స్వల్పము. కావున స్థాయిలు అవిచ్ఛిన్నం మరియు విముక్తం కాదు.

ప్రశ్న 17.
ఒక మ్యూయానిక్ హైడ్రోజన్ పరమాణువు (munotic hydrogen atom) [సుమారు 207 me ద్రవ్యరాశి, రుణ విద్యుదావేశం కలిగి, ప్రోటాన్ చుట్టూ ఒక కక్ష్యలో తిరిగే జ్యుయాన్ (µ) కలిగి ఉండే ఒకానొక పరమాణువు] బోర్ మొదటి కక్ష్యా వ్యాసార్థాన్ని, భూస్థాయి శక్తినీ కనుక్కోండి.
జవాబు:
మ్యూనిక్ హైడ్రోజన్ ఒక పరమాణువు. దీనిలో ప్రోటాన్ వెంట 207 me ద్రవ్యరాశి, రుణావేశ మ్యూయాన్ పరిభ్రమించును.
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 46

సాధించిన సమస్యలు Textual Examples

ప్రశ్న 1.
రూథర్ ఫర్డ్ పరమాణు కేంద్రక నమూనాలో కేంద్రకం (వ్యాసార్థం సుమారు 10-15 m) సౌరమండల నమూనాలోని సూర్యుడితో సాదృశ్యంగా ఉంటుంది. కేంద్రకం చుట్టూ ఒక నిర్దిష్ఠ కక్ష్యలో (వ్యాసార్థం ≈ 10-10 m) తిరిగే ఎలక్ట్రాన్ ను సూర్యుడి చుట్టూ ఒక నిర్దిష్ట కక్ష్యలో తిరిగే భూమితో సరిపోల్చుకోవచ్చు. ఒకవేళ, సౌరవ్యవస్థ కొలతలు, పరమాణువు కొలతలు ఒకే అనుపాతంలో ఉన్నాయనుకొంటే, భూమి సూర్యునికి ఇప్పుడు వాస్తవంగా ఉన్న దూరం కంటే తక్కువ దూరంలో ఉంటుందా ? ఎక్కువ దూరంలో ఉంటుందా? భూకక్ష్య వ్యాసార్థం సుమారు 1.5 × 1011m, సూర్యుని వ్యాసార్థాన్ని 7 × 108 m గా తీసుకోవడమైంది.
సాధన:
ఎలక్ట్రాన్ కక్ష్యావ్యాసార్థం, కేంద్రక వ్యాసార్థానికి మధ్యనిష్పత్తి (10-10 m) / (10-15 m) = 105, అంటే, ఎలక్ట్రాన్ కక్ష్యా వ్యాసార్థం, కేంద్రక వ్యాసార్థం కంటే 105 రెట్లు ఎక్కువ. ఒకవేళ, సూర్యుని చుట్టూ ఉండే భూకక్ష్యా వ్యాసార్థం, సూర్యుని వ్యాసార్థం కంటే 105 రెట్లు అధికంగా ఉండి ఉంటే, భూకక్ష్యా వ్యాసార్థం 105 × 7 × 108 m = 7 × 1013 m గా లెక్కతేలుతుంది. ఈ విలువ భూకక్ష్యా వ్యాసార్థం వాస్తవమైన విలువ కంటే 100 రెట్ల కంటే ఎక్కువ. కాబట్టి ఈ సందర్భంలో భూమి, సూర్యునికి మునుపటికంటే చాలా ఎక్కువ దూరంలో ఉంటుంది.

ఈ ఉదాహరణ వల్ల అర్థమయ్యేదేమిటంటే, మన సౌరవ్యవస్థలో ఉండే ఖాళీ ప్రదేశం కంటే చాలా ఎక్కువ భాగం ఖాళీ ప్రదేశాన్ని పరమాణువు కలిగి ఉంటుంది.

ప్రశ్న 2.
గైగర్-మార్సడెన్ ప్రయోగంలో, 7.7 MeV శక్తి గల α – కణం కేంద్రకాన్ని సమీపిస్తూ క్షణికంగా ఆగి వెనకకు మరలినట్లయితే, కేంద్రకానికి, α-కణానికి మధ్య ఉండే అత్యంత సామీప్య దూరం ఎంత?
సాధన:
ఇక్కడ, కీలకమైన భావన ఏమిటంటే α – కణం, బంగారపు కేంద్రకాలతో కూడిన వ్యవస్థ యొక్క మొత్తం యాంత్రిక శక్తి పరిక్షేపణ ప్రక్రియ అంతా నిత్యత్వమవుతుంది. α – కణం, కేంద్రకాల మధ్య అన్యోన్య చర్య జరగక ముందు వ్యవస్థ తొలి యాంత్రిక శక్తి Ei అనీ, α–కణం క్షణికంగా ఆగినప్పుడు ఆ వ్యవస్థ తుది యాంత్రిక శక్తి Ef అని అనుకొందాం. తొలిశక్తి Ei కేంద్రకంవైపు వస్తున్న α-కణం యొక్క గతిజశక్తి K, తుది గతిజశక్తి Ef వ్యవస్థ విద్యుత్ పొటెన్షియల్ శక్తి U. ఈ పొటెన్షియల్ శక్తి U ని, సమీకరణం నుంచి లెక్కించవచ్చు. α-కణం విరామ స్థానం వద్ద ఉన్నప్పుడు α – కణం కేంద్రం, బంగారపు కేంద్రకం మధ్యగల దూరం అనుకొందాం. అప్పుడు మనం, శక్తి నిత్యత్వం Ei = Ef ఈవిధంగా రాయవచ్చు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 47

ప్రకృతిసిద్ధ జనకం నుంచి ఉత్పత్తి అయిన α-కణాలు గరిష్ఠ గతిజశక్తి 7.7 MeV లేదా 1.2 × 10-12 J గా లెక్క తేలింది. 1/4πε0 = 9.0 × 109Nm²/C² కాబట్టి, e = 1.6 × 10-19 C గా తీసుకొంటే,
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 48

లోహపు రేకు బంగారంది కాబట్టి, బంగారు (Au) పరమాణు సంఖ్య Z = 79
d(Au) = 3.0 × 10-14m = 30 fm. (1 fm (అంటే ఫెర్మి) = 10-15m.)
కాబట్టి, బంగారపు కేంద్రకం వ్యాసార్థం 3.0 × 10-14 m కంటే తక్కువ. బంగారపు కేంద్రక వ్యాసార్థం వాస్తవ విలువ 6 fm కాబట్టి, ఈ విలువకు పరిశీలించిన విలువకు అంత బాగా పొత్తు కుదరడం లేదు. ఈ విధమైన అసంగత్వానికి కారణం ఏమంటే, α-కణ వ్యాసార్థం, బంగారపు కేంద్రకం వ్యాసార్థాల మొత్తం కంటే, అత్యంత సామీప్య దూరం చాలా ఎక్కువ. కాబట్టి, α–కణం, బంగారపు కేంద్రకాన్ని నిజానికి స్పృశించకుండానే వెనకకు మరలి వెళ్తుంది.

ప్రశ్న 3.
ఒక హైడ్రోజన్ పరమాణువును ప్రోటాన్ , ఎలక్ట్రాన్ గా విడగొట్టడానికి 13.6 eV శక్తి అవసరమవుతుందని ప్రయోగం ద్వారా తెలిసింది. హైడ్రోజన్ పరమాణువులోని ఎలక్ట్రాన్ కక్ష్యా వ్యాసార్థాన్ని, వేగాన్ని లెక్కించండి.
సాధన:
హైడ్రోజన్ పరమాణువులోని ఎలక్ట్రాన్ మొత్తం శక్తి – 13.6 eV = – 13.6 × 1.6 × 10-19J = – 2.2 × 10-18 J.
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 49

ప్రశ్న 4.
సంప్రదాయక విద్యుదయస్కాంత సిద్ధాంతం ప్రకారం, హైడ్రోజన్ పరమాణువులోని ప్రోటాన్ చుట్టూ పరిభ్రమిస్తున్న ఎలక్ట్రాన్ ఉద్గారించే కాంతి తొలి పౌనఃపున్యాన్ని లెక్కగట్టండి.
సాధన:
హైడ్రోజన్ పరమాణువులో ప్రోటాన్ చుట్టూ 5.3 × 10-11 h m వ్యాసార్థం ఉన్న కక్ష్యలో తిరిగే ఎలక్ట్రాన్ వేగం 2.2 × 10-6 m/s అని పైన ఉదాహరణ నుంచి మనకు తెలుసు. కాబట్టి, ప్రోటాన్ చుట్టూ తిరుగుతున్న ఎలక్ట్రాన్ పౌనః పున్యం
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 50

సంప్రదాయక విద్యుదయస్కాంత సిద్ధాంతం ప్రకారం, కేంద్రకం చుట్టూ పరిభ్రమిస్తున్న ఎలక్ట్రాన్ల లు ఉద్గారించే విద్యుదయస్కాంత తరంగాల పౌనఃపున్యం, కేంద్రకం చుట్టూ దాని పరిభ్రమణ పౌనఃపున్యానికి సమానం అని మనకు తెలుసు. కాబట్టి, ఉద్గారకాంతి తొలి పౌనఃపున్యం కూడా 6.6 × 1015 Hz అవుతుంది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు

ప్రశ్న 5.
10 kg ల ఒక కృత్రిమ ఉపగ్రహం 8000 km వ్యాసార్థంగల ఒక కక్ష్యలో భూమి చుట్టూ ప్రతి 2 గంటలకొకసారి చుట్టి వస్తుంది. హైడ్రోజన్ పరమాణువులోని ఎలక్ట్రాన్లు వర్తించినట్లుగానే బోర్ కోణీయ ద్రవ్యవేగ ప్రతిపాదన ఈ కృత్రిమ ఉపగ్రహానికి కూడా వర్తిస్తుందని మనం ఊహిస్తే ఈ కృతిమ ఉపగ్రహం కక్ష్య యొక్క క్వాంటం సంఖ్యను కనుక్కోండి.
సాధన:
nrn = nh/2π

ఇక్కడ m = 10 kg and rn = 8 × 106m. వృత్తాకారంగా తిరుగుతున్న ఉపగ్రహం ఆవర్తన కాలం T = 2h అంటే,
T = 7200 s. కాబట్టి, వేగం υn = 2πrn/T.
కృత్రిమ ఉపగ్రహ కక్ష్య యొక్క క్వాంటం సంఖ్య n = (2πrn)² × m(T × h)
ఆయా విలువలను ప్రతిక్షేపించగా,
n = (2π × 8 × 106m)² × 10/(7200 s × 6.64 × 10-34 Js) = 5.3 × 1045

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, కృత్రిమ ఉపగ్రహ చలనం సందర్భంలోని క్వాంటం సంఖ్య చాలా చాలా ఎక్కువ ! నిజానికి ఇటువంటి అతిపెద్ద క్వాంటం సంఖ్యల సందర్భంలో క్వాంటీకరణ నిబంధన మూలంగా లభించే ఫలితాలు, సంప్రదాయక భౌతికశాస్త్ర ఫలితాలకు దగ్గరగా ఉంటాయి.

AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు

ప్రశ్న 6.
రిడ్ బర్గ్ ఫార్ములాను ఉపయోగించి, హైడ్రోజన్ వర్ణపటం లైమన్ శ్రేణిలోని మొదటి నాలుగు వర్ణపట రేఖల తరంగదైర్ఘ్యాలను లెక్కించండి.
సాధన:
రిడ్ బర్గ్ ఫార్ములా
AP Inter 2nd Year Physics Study Material Chapter 13 పరమాణువులు 51

AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Physics Study Material 12th Lesson వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం Textbook Questions and Answers.

AP Inter 2nd Year Physics Study Material 12th Lesson వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కాథోడ్ కిరణాలు అంటే ఏమిటి? [AP. Mar.’17]
జవాబు:
రుణావేశ ఎలక్ట్రాన్ల (కణాల) ప్రవాహంను కాథోడ్ కిరణాలు అంటారు.

ప్రశ్న 2.
మిల్లికాన్ ప్రయోగం ఏ ముఖ్యమైన యదార్థాన్ని వెలువరించింది?
జవాబు:
విద్యుదావేశం క్వాంటీకృతం అవుతుందనే ముఖ్యమైన యదార్థాన్ని వెలువరించింది. విద్యుదావేశం ఎల్లప్పుడు ఎలక్ట్రాన్  ఆవేశంనకు పూర్ణాంక గుణకంగా ఉంటుంది. i.e. Q = ne.

ప్రశ్న 3.
పనిప్రమేయం అంటే ఏమిటి? [TS. Mar: ’17; TS. Mar.’15]
జవాబు:
లోహతలం నుంచి ఒక ఎలక్ట్రాన్ బయటకు రావటానికి కావల్సిన కనిష్ట శక్తిని, పని ప్రమేయం అంటారు.

ప్రశ్న 4.
ఫోటోవిద్యుత్ఫలితం అంటే ఏమిటి? [AP. Mar.’17; TS. Mar. ’16; Mar. ’14]
జవాబు:
ఒక లోహ ఉపరితలంపై తగినంత శక్తి ఉన్న కాంతి పతనమయితే, ఎలక్ట్రాన్లు ఉద్గారమగును. ఈ దృగ్విషయంను ఫోటోవిద్యుత్ఫలితం అంటారు.

ప్రశ్న 5.
ఫోటో సూక్ష్మగ్రాహ్యక పదార్థాలకు ఉదాహరణలివ్వండి. వాటిని ఆ విధంగా ఎందుకు పిలుస్తారు?
జవాబు:
ఫోటో సూక్ష్మగ్రాహ్యక పదార్థాలకు ఉదాహరణలు : Li, Na, K, Rb మరియు Cs మొదలైనవి.

క్షారలోహాల పనిప్రమేయం చాలా తక్కువ. సాధారణ దృశ్య కాంతి, క్షారలోహంపై పతనమయినప్పుడు ఫోటో విద్యుత్ ఉద్గారంను ఏర్పరుచును. కావున ఈ క్షార లోహాలను ఫోటో సూక్ష్మగ్రాహ్యక పదార్థాలంటారు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం

ప్రశ్న 6.
ఐన్స్టీన్ ఫోటోవిద్యుత్ సమీకరణాన్ని రాయండి. [AP. Mar.’15]
జవాబు:
ఐన్స్టీన్ ఫోటో విద్యుత్ సమీకరణము, Kగరిష్ట = \(\frac{1}{2}\) mv²గరిష్ట = hν – Φ0.

ప్రశ్న 7.
డి బ్రాయ్ సంబంధాన్ని రాసి, అందులోని పదాలను వివరించండి. [AP & TS. Mar.’16]
జవాబు:
డి బ్రాయ్ సంబంధం, λ = \(\frac{h}{p}=\frac{h}{mυ}\) ఇందులో λ డి బ్రాయ్ తరంగదైర్ఘ్యం, h ప్లాంక్స్ స్థిరాంకము, p ద్రవ్యవేగం, m కణద్రవ్యరాశి, υవేడి.

ప్రశ్న 8.
హైస్బర్గ్ అనిశ్చితత్వ సూత్రాన్ని పేర్కొనండి. [TS. Mar.’17; Mar. ’14]
జవాబు:
హైసన్బర్గ్ అనిశ్చితత్వ సూత్రము: “ఒక ఎలక్ట్రాను (లేదా మరేదైనా కణం) స్థానం, ద్రవ్యవేగం రెండింటినీ ఒకే కాలంలో యథాతథంగా కొలవడం సాధ్యం కాదు”.
i. e., ∆x. ∆p ≈ h
ఇచ్చట ∆x స్థానాన్ని నిర్దేశించడంలో అనిశ్చితత్వం, ∆p ద్రవ్యవేగాన్ని నిర్దేశించటంలో అనిశ్చితత్వం.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఫోటో విద్యుత్ ప్రవాహంపై (i) కాంతి తీవ్రత (ii) పొటెన్షియల్ లు కలిగించే ప్రభావం ఏమిటి?
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 1
(i) కాంతి విద్యుత్ ప్రవాహంపై కాంతి కాంతి తీవ్రత ప్రభావము :
కాంతి తీవ్రత (I) ఉన్న కాంతి పౌనఃపున్యం, ఆరంభ పౌనఃపున్యం కన్నా ఎక్కువైతే (υ > v0) ఫోటో ఎలక్ట్రాన్లు ఉద్గారమవుతాయి. కాంతి తీవ్రత పెరిగిన, ఫోటో విద్యుత్ ప్రవాహం కూడా పెరుగును.
ie, i α I

ii) ఫోటో విద్యుత్ ప్రవాహంపై పొటెన్షియల్ ప్రభావము :
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 2

  1. ఫోటో ఎలక్ట్రాన్లను సేకరించు ఎలక్ట్రోడుల ధన పొటెన్షియల్ పెంచిన, ఫోటో విద్యుత్ ప్రవాహము పెరుగును. ఒక నిర్దిష్ట ధన పొటెన్షియల్ వద్ద, ఫోటో విద్యుత్ ప్రవాహం గరిష్టం అగును. దీనినే సంతృప్త విద్యుత్ ప్రవాహం (saturated cument) అంటారు.
  2. సేకరణి ఎలక్ట్రోడ్ యొక్క రుణ పొటెన్షియల్ పెంచిన, ఫోటో విద్యుత్ ప్రవాహం క్రమముగా తగ్గుతుంది. ఒక నిర్దిష్ట రుణ పొటెన్షియల్ వద్ద విద్యుత్ ప్రవాహం శూన్యం అగును. ఈ రుణ పొటెన్షియల్ను నిరోధక పొటెన్షియల్ అంటారు.
  3. నిరోధక పొటెన్షియల్, పతనకాంతి తీవ్రతపై ఆధారపడదు. తీవ్రత పెంచిన, సంతృప్త విద్యుత్ ప్రవాహ విలువ కూడా పెరుగును. కాని నిరోధక పొటెన్షియల్ మారదు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం

ప్రశ్న 2.
నిరోధక పొటెన్షియల్పైన పతన వికిరణ పౌనఃపున్యం ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి ఒక ప్రయోగాన్ని వర్ణించండి.
జవాబు:
నిరోధక పొటెన్షియల్పై పతనకాంతి వికిరణ పౌనఃపున్యం ప్రభావం ప్రయోగం ద్వారా వివరణ :
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 3
1) ప్రయోగ అమరిక పటంలో చూపబడింది.

2) తగినంత శక్తి(E=hν) ఉన్న ఏకవర్ణ కాంతి, కాంతి ఉద్గార పలకం C పై పతనమయితే, ఎలక్ట్రాన్లు ఉద్గారమవుతాయి.

3) ఘటం, విద్యుత్ క్షేత్రంను C మరియు Aల మధ్య ఏర్పరుచుట వల్ల సేకరణి పలక A, ఎలక్ట్రాన్లను సేకరిస్తుంది.

4) కమ్యుటేటర్ (దిక్ పరివర్తకం) మరియు Aల ధ్రువణతను ఉత్రమం చేస్తుంది.

5) పతన వికిరణ ఒక ప్రత్యేక పౌనఃపున్యంనకు, పలక Aకు కనీస రుణ పొటెన్షియల్ V ప్రయోగించిన, కాంతి విద్యుత్ ప్రవాహం శూన్యం అగును. ఈ పొటెన్షియల్ను నిరోధక పొటెన్షియల్ అంటారు.

6) ప్రయోగంను వేర్వేరు పౌనఃపున్యాల వద్ద చేస్తే, వేర్వేరు పౌనఃపున్యాలకు, వేర్వేరు నిరోధక పొటెన్షియల్ ను వోల్ట్ మీటర్లో కొలుస్తారు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 4
7) గ్రాఫ్ నుండి
i) వేర్వేరు వికిరణ పౌనఃపున్యాలకు, వేర్వేరు నిరోధక పొటెన్షియల్ విలువలు ఉండును.
ii) హెచ్చు పతన వికిరణ పౌనఃపున్యంనకు, నిరోధక పొటెన్షియల్ రుణ విలువ చాలా ఎక్కువగా ఉండును.
iii) సంతృప్త విద్యుత్ ప్రవాహం విలువ వికిరణ తీవ్రతపై ఆధారపడును. సంతృప్త విద్యుత్ ప్రవాహం విలువ పతన వికిరణ పౌనఃపున్యంపై ఆధారపడదు.

ప్రశ్న 3.
విద్యుదయస్కాంత వికిరణానికి ఉన్న ఫోటాన్ చిత్రణను సారాంశీకరించండి.
జవాబు:
విద్యుదయస్కాంత వికిరణం ఫోటాన్ క్రింది విషయాలు తెలుపును.
1) ద్రవ్యంతో వికిరణం అంతర చర్యలో, వికిరణం, కణాల సమూహంగా ప్రవర్తించును. ఈ కణాలను ఫోటాన్లు అంటారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 5
3) ఒకే తరంగదైర్ఘ్యం ఉన్న కాంతి తీవ్రతను పెంచిన, మధ్యచ్ఛేద వైశాల్యం గుండా ఒక సెకనులో పోవు ఫోటాన్ల సంఖ్య పెరుగును. ప్రతి ఫోటాన్ శక్తి సమానము. ఫోటాన్ శక్తి, వికిరణ తీవ్రతపై ఆధారపడదు.
4) ఫోటాన్లు, విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలలో అపవర్తనం చెందవు. దీనిని బట్టి ఫోటాన్లు తటస్థ కణాలని తెలుస్తుంది.
5) ఫోటాన్-కణం అభిఘాతంలో, శక్తి మరియు ద్రవ్యవేగంలు నిత్యత్వం. అభిఘాతంలో ఫోటాన్ల సంఖ్య నిత్యత్వం కావు. ఒక ఫోటాన్ ను శోషణం చేయవచ్చు లేక క్రొత్త ఫోటాన్ ఉద్భవించవచ్చు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 6
V కణం వేగం మరియు C కాంతివేగం.

ప్రశ్న 4.
0.12 Kg ల ద్రవ్యరాశి కలిగి వడి 20 ms-1 తో చలిస్తున్న బంతి డి బ్రాయ్ తరంగదైర్ఘ్యం ఎంత? ఈ ఫలితం నుంచి మనం చేయగలిగే అనుమితి (inference) ఏమిటి?
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 7
బంతి తరంగదైర్ఘ్యం చాలా స్వల్పం. కావున దాని చలనంను పరిశీలించవచ్చును.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఫోటో విద్యుత్ ప్రవాహంపై తీవ్రత, పొటెన్షియల్లు కలిగించే ప్రభావాన్ని ఐన్స్టీన్ ఫోటో విద్యుత్ సమీకరణం ఏ విధంగా వివరించింది ? నిరోధక పొటెన్షియల్పై ఉండే పతన కాంతి పౌనఃపున్యం ప్రభావాన్ని ఈ సమీకరణం ఏవిధంగా వివరించండి?
జవాబు:
1) ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఫోటో విద్యుత్ ప్రభావంనకు సరైన విశ్లేషణను అభివృద్ధి చేశాడు.

2) కాంతి పుంజం, చిన్న శక్తి ప్యాకెట్లను కలిగి ఉండునని ఐన్స్టీన్ ప్రతిపాదించాడు. వీటినే ఫోటాన్లు లేక క్వాంటం అంటారు.

3) ఫోటాన్ శక్తిE=hv. ఇక్కడh’ప్లాంక్ స్థిరాంకం, Vపతనకాంతి (లేక వికిరణం) పౌనఃపున్యం,

4) ఫోటాన్ శోషణం శక్తి, పని ప్రమేయం(Φ0 = hν0) కన్నా ఎక్కువగా ఉంటే, గరిష్ట గతిజ శక్తితో ఎలక్ట్రాన్ ఉద్గారమగును.
i.e., Kగరిష్ట = \(\frac{1}{2}\)mυ²గరిష్ట = hν – Φ0 ఈ సమీకరణంను ఐన్స్టీన్ ఫోటో విద్యుత్ సమీకరణం అంటారు.

కాంతి విద్యుత్ ప్రవాహంపై కాంతి తీవ్రత:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 8
5) (i) కాంతి విద్యుత్ ప్రవాహంపై (1) ఉన్న కాంతి పౌనఃపున్యం, ఆరంభ పౌనఃపున్యం కన్నా ఎక్కువైతే ఫొటో ఎలక్ట్రాన్లు ఉద్గారమవుతాయి. కాంతి తీవ్రత పెరిగిన, ఫొటో విద్యుత్ ప్రవాహం కూడా పెరుగును. ie, i ∝ I.

ii) ఫోటో విద్యుత్ ప్రవాహంపై పొటెన్షియల్ ప్రభావము :
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 9

  1. ఫోటో ఎలక్ట్రాన్లను సేకరించు ఎలక్ట్రోడుల ధన పొటెన్షియల్ పెంచిన, ఫోటో విద్యుత్ ప్రవాహము పెరుగును. ఒక నిర్దిష్ట ధన పొటెన్షియల్ వద్ద, ఫోటో విద్యుత్ ప్రవాహం గరిష్టం అగును. దీనినే సంతృప్త విద్యుత్ ప్రవాహం (saturated current) అంటారు.
  2. సేకరణి ఎలక్ట్రోడ్ యొక్క రుణ పొటెన్షియల్ పెంచిన, ఫోటో విద్యుత్ ప్రవాహం క్రమముగా తగ్గుతుంది. ఒక నిర్దిష్ట రుణ పొటెన్షియల్ వద్ద విద్యుత్ ప్రవాహం శూన్యం అగును. ఈ రుణ పొటెన్షియల్ను నిరోధక పొటెన్షియల్ అంటారు.
  3. నిరోధక పొటెన్షియల్, పతనకాంతి తీవ్రతపై ఆధారపడదు. తీవ్రత పెంచిన, సంతృప్త విద్యుత్ ప్రవాహ విలువ కూడా పెరుగును. కాని నిరోధక పొటెన్షియల్ మారదు

iii) నిరోధక పొటెన్షియల్పై పతన కాంతివికిరణ పౌనఃపున్యం ప్రభావం – ప్రయోగం ద్వారా వివరణ :
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 10

  1. ప్రయోగ అమరిక పటంలో చూపబడింది.
  2. తగినంత శక్తి(E=hν) ఉన్న ఏకవర్ణ కాంతి, కాంతి ఉద్గార పలకC పై పతనమయితే, ఎలక్ట్రాన్లు ఉద్గారమవుతాయి.
  3. ఘటం, విద్యుత్ క్షేత్రంనుC మరియు Aల మధ్య ఏర్పరుచుట వల్ల సేకరణి పలకA, ఎలక్ట్రాన్లను సేకరిస్తుంది.
  4. కమ్యుటేటర్ (దిక్ పరివర్తకం) మరియు Aల ధ్రువణతను ఉత్రమం చేస్తుంది. –
  5. పతన వికిరణ ఒక ప్రత్యేక పౌనఃపున్యంనకు, పలక Aకు కనీస రుణ పొటెన్షియల్ V ప్రయోగించిన, కాంతి విద్యుత్ ప్రవాహం శూన్యం అగును. ఈ పొటెన్షియల్ను నిరోధక పొటెన్షియల్ అంటారు.
  6. ప్రయోగంను వేర్వేరు పౌనఃపున్యాల వద్ద చేస్తే, వేర్వేరు పౌనఃపున్యాలకు, వేర్వేరు నిరోధక పాటెన్షియల్లను వోల్ట్ మీటర్ తో కొలుస్తారు.
    AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 11
  7. గ్రాఫ్ నుండి
    i) వేర్వేరు వికిరణ పౌనఃపున్యాలకు, వేర్వేరు నిరోధక పొటెన్షియల్ విలువలు ఉండును.
    ii) హెచ్చు పతన వికిరణ పౌనఃపున్యంనకు, నిరోధక పొటెన్షియల్ రుణ విలువ చాలా ఎక్కువగా ఉండును.
    iii) సంతృప్త విద్యుత్ ప్రవాహం విలువ వికిరణ తీవ్రతపై ఆధారపడును. సంతృప్త విద్యుత్ ప్రవాహం విలువ పతన వికిరణ పౌనఃపున్యంపై ఆధారపడదు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం

ప్రశ్న 2.
డేవిస్సన్, జెర్మర్ల ప్రయోగాన్ని వర్ణించండి. ఈ ప్రయోగం నిష్కర్షగా నిరూపించిందేమిటి?
జవాబు:
డేవిస్సన్ మరియు జెర్మర్ ప్రయోగము :
1) ప్రయోగ అమరిక పటంలో చూపబడింది.
2) స్థూపంకు ధన పొటెన్షియల్ అనువర్తించిన సన్నని ఎలక్ట్రాన్ కాంతి పుంజం ఫిలమెంటు F నుండి వెలువడుతుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 12
3) ఈ సూక్ష్మ సమాంతరీకృత ఎలక్ట్రాన్ పుంజం నికెల్ స్ఫటికంపై పతనమవుతుంది. స్ఫటిక పరమాణువులు, ఎలక్ట్రాన్లను అన్ని దిశలలోనికి పరిక్షిప్తము చెందించును.

4) ఎలక్ట్రాన్ పరిక్షేపణ తీవ్రతను, ఎలక్ట్రాన్ శోధకం (సేకరణి)తో కొలవవచ్చును. శోధకంను వృత్తాకార స్కేలుపై జరిపి సున్నితమైన గాల్వనామాపకంతో, విద్యుత్ ప్రవాహంను నమోదు చేయవచ్చును.

5) గాల్వనా మాపకం అపవర్తనం, సేకరిణిలోనికి ప్రవేశించే ఎలక్ట్రాన్ పుంజం తీవ్రతకు అనులోమానుపాతంలో ఉండును.

6) ఈ పరికరము అంతా శూన్యీకృత పేటికలో ఆవృతమై ఉంటుంది.

7) త్వరణ వోల్టేజి44 నుండి 68Vవరకు మార్చుతూ ప్రయోగం నిర్వహించబడింది. 54Vకు 50°వద్ద తీవ్రత గరిష్టం అని కనుగొనబడింది.

8) θ = 50°ల వద్ద ఎలక్ట్రాన్ పుంజము స్పర్శకోణం Φ(ఎలక్ట్రాన్ పరిక్షేపణ పుంజము స్ఫటిక పరమాణువుల తలంతో చేయు కోణం) ను క్రింద విధంగా గణించవచ్చును.
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 13
Φ + θ + Φ = 180°
Φ = \(\frac{1}{2}\)[180° -50°] = 65°

9) బ్రాగ్స్ నియమము ప్రకారము మొదటి కోటి(n=1) గరిష్టంనకు 2dsinΦ = 1 × λ
⇒ λ = 2 × 0.91 × sin 65° = 1.65Å = 0.165 pm. (వు మారుగా).
[∵ నికెల్ స్ఫటికంలో అంతరపరమాణు దూరంd = 0.91Å]

10) డీ బ్రోగ్లీ భావన ప్రకారం, ఎలక్ట్రాన్లతో అనుబంధితమై ఉండే తరంగదైర్ఘ్యం
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 14

11) డీ బ్రోగ్లీ తరంగదైర్ఘానికి గల సైద్ధాంతిక విలువ, ప్రయోగాత్మకంగా పొందిన విలువల మధ్య అత్యుత్తమైన పరస్పర అంగీకారం ఉంది.

అభ్యాసాలు Textual Exercises

ప్రశ్న 1.
30kVఎలక్ట్రాన్ల వల్ల ఉత్పత్తయ్యే X కిరణాల
(a) గరిష్ట పౌనఃపున్యాన్ని
(b) కనిష్ట తరంగదైర్ఘ్యాన్ని కనుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 15

ప్రశ్న 2.
సీజియం లోహం పనిప్రమేయం2.14eV. ఈ లోహ ఉపరితలంపైన 6 × 1014 Hz పౌనఃపున్యం గల కాంతి పతనం చెందినప్పుడు ఎలక్ట్రానుల ఫోటో ఉద్గారం సంభవిస్తుంది. అయితే,
(a) ఉద్గారిత ఎలక్ట్రానుల గరిష్ఠ గతిజశక్తి ఎంత?
(b)నిరోధక పొటెన్షియల్ ఎంత?
(c) ఉద్గారిత ఫోటో ఎలక్ట్రానుల గరిష్ట వడి ఎంత?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 16

ప్రశ్న 3.
ఒకానొక ప్రయోగంలో ఫోటోవిద్యుత్ కటాఫ్ వోల్టేజి 1.5 V. ఉద్గారిత ఫోటో ఎలక్ట్రానుల గరిష్ట గతిజశక్తి ఎంత?
జవాబు:
గరిష్ట గతిజశక్తి, eV0 = e × 1.5V = 1.5 eV.

ప్రశ్న 4.
ఒక హీలియం-నియాన్ లేజరు తరంగదైర్ఘ్యం 632.8 pm గల ఏకవర్ణ కాంతిని ఉత్పత్తి చేస్తుంది. ఉద్గారమైన సామర్థ్యం 9.42 mW.
(a) ఆ కాంతి పుంజంలోని ఒక్కొక్క ఫోటాను శక్తి, ద్రవ్యవేగాలను కనుక్కోండి.
(b) ఈ పుంజం ఉద్యోతనం చేసే లక్ష్యం వద్దకు సెకనుకు సగటున ఎన్ని ఫోటానులు చేరుకొంటాయి? (ఈ పుంజానికి, లక్ష్యం వైశాల్యం కంటే తక్కువైన ఏకరీతి మధ్యచ్ఛేద వైశాల్యం ఉంటుందని అనుకోండి.)
(c) ఇందులోని ఫోటానుకు ఉన్న ద్రవ్యవేగానికి సమాన ద్రవ్యవేగం ఉండాలంటే ఒక హైడ్రోజన్ పరమాణువు ఎంత వడితో ప్రయాణించవలసి ఉంటుంది?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 17

ప్రశ్న 5.
భూఉపరితలాన్ని చేరుకొనే సూర్యుని శక్తి అభివాహం 1.388 × 10³W/m². అప్పుడు భూమిపైన ఒక సెకనుకు, ఒక చదరపు మీటరుకు (దాదాపు) ఎన్ని ఫోటాన్లు పతనమవుతాయి? సూర్యకాంతిలోని ఫోటాన్లకు 550 nm ల సగటు తరంగదైర్ఘ్యం ఉంటుందని అనుకోండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 18
= 3.84 × 1021 ఫోటాన్లు/మీ² – సె.

ప్రశ్న 6.
ఫోటో విద్యుత్ ఫలితంపైన జరిపిన ఒక ప్రయోగంలో కటాఫ్ వోల్టేజి పతన కాంతి పౌనఃపున్యాలకు చెందిన గ్రాఫు వాలు 4.12 × 10-15 V s ఉందని కనుక్కొన్నారు. ప్లాంక్ స్థిరాంకం విలువను గణించండి.
సాధన:
గ్రాఫ్ వాలు \(\frac{h}{e}\) = 4.12 × 10-15 Vs
h = 4.12 × 10-15 × e = 4.12 × 10-15 × 1.6 × 10-19
∴ h = 6.592 × 10-34 J s.

ప్రశ్న 7.
ఒక 100 సోడియం దీపం ఏకరీతిగా అన్ని దిశల్లోనూ శక్తిని వికిరణ చేస్తుంది. ఈ దీపం ఒక పెద్ద గోళ కేంద్రం వద్ద ఉండగా, తనపైన పతనం చెందే సోడియం కాంతిని అంతా ఈ గోళం శోషించుకొంటుంది. సోడియం కాంతి తరంగదైర్ఘ్యం 589 nm. (a) సోడియం కాంతితో అనుబంధితమై (associate) ఉండే ఒక్కో ఫోటాను శక్తి ఎంత?
(b) ఆ గోళానికి ఏ రేటుతో ఫోటాన్లు అందించబడతాయి?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 19

ప్రశ్న 8.
ఒకానొక లోహానికి ఆరంభ పౌనఃపున్యం 3.3 × 1014 Hz. ఆ లోహంపైన 8.2 × 1014 Hz పౌనఃపున్యం గల కాంతి పతనం చెందిందనుకొంటే, ఏర్పడే ఫోటో విద్యుత్ ఉద్గారానికి కటాఫ్ వోల్టేజిని ప్రాగుక్తం (predict) చేయండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 20

ప్రశ్న 9.
ఒక లోహానికి పనిప్రమేయం 4.2 ev. తరంగదైర్ఘ్యం 330 pm గల పతన వికిరణానికి ఈ లోహం ఫోటో విద్యుత్ ఉద్గారాన్ని ఇస్తుందా ?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 21
ఫోటాన్ పతన, శక్తి E < Φ0. కావున ఎలక్ట్రిక్ కాంతి ఉద్గారము సంభవించదు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం

ప్రశ్న 10.
పౌనఃపున్యం 721 × 1014 Hz గల కాంతి ఒక లోహ ఉపరితలంపైన పతనమైంది. ఆ తలంపై నుంచి 6.0 × 105m/ Sల గరిష్ట వడితో ఎలక్ట్రానులు బయటకు వెలువడ్డాయి. ఎలక్ట్రానుల ఫోటో ఉద్గారానికి ఉండే ఆరంభ పౌనఃపున్యం ఎంత?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 22

ప్రశ్న 11.
ఫోటో విద్యుత్ ఫలితంలో ఉపయోగించిన ఒక ఆర్గాన్ లేజరు ఉత్పత్తిచేసే కాంతి తరంగదైర్ఘ్యం 488nm. ఈ వర్ణపట రేఖ నుంచి కాంతి ఉద్గారకం పైన పతనమైనప్పుడు, ఫోటో ఎలక్ట్రానుల నిరోధక (కటాఫ్) పొటెన్షియల్ 0.381. అయితే ఆ ఉద్గారకపు పదార్థం పనిప్రమేయాన్ని కనుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 23

ప్రశ్న 12.
పొటెన్షియల్ తేడా 56Vల ద్వారా త్వరితమయ్యే ఎలక్ట్రానుల
(a) ద్రవ్యవేగాన్ని
(b)డి బ్రాయ్ తరంగదైర్ఘ్యాన్ని గణించండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 24

ప్రశ్న 13.
గతిజశక్తి 120eVతో ఉన్న ఒక ఎలక్ట్రాన్కు ఉండే
(a) ద్రవ్యవేగం, (b)వడి, (c)డి బ్రాయ్ తరంగదైర్ఘ్యం ఎంతెంత?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 25

ప్రశ్న 14.
సోడియం వర్ణపట ఉద్గార రేఖ నుంచి వెలువడే కాంతి తరంగదైర్ఘ్యం 589nm. అయితే ఏ గతిజశక్తి వద్ద (a) ఒక ఎలక్ట్రాను, (h) ఒక న్యూట్రానులకు ఒకే బ్రాయ్ తరంగదైర్యం ఉంటుందో కనుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 26

ప్రశ్న 15.
(a) ద్రవ్యరాశి 0.040 kg గల ఒక తూటా 1.0 km/sవడితో ప్రయాణిస్తున్నప్పుడు,
(b)ద్రవ్యరాశి 0.060 kgగల ఒక బంతి 1.0m/sవడితో చలిస్తున్నప్పుడు,
(c) ద్రవ్యరాశి 1.0 × 10-9 kgద్రవ్యరాశి గల ధూళి కణం 2.2 m/s వడితో అవసరం (drift) చెందుతున్నప్పుడు వా టికి ఉండే డి బ్రోయ్ తరంగదైర్ఘ్యం ఎంతెంత?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 27

ప్రశ్న 16.
ఒక ఎలక్ట్రాను, ఒక ఫోటాను ఒక్కొక్కదానికి ఉన్న తరంగదైర్ఘ్యం 1.00nm అయితే,
(a)వా టి ద్రవ్యవేగాలు, (b) ఫోటాను శక్తి, (c) ఎలక్ట్రాను గతిజశక్తులను కనుక్కోండి.
సాధన:
a) ఎలక్ట్రాన్ లేక ఫోటాన్, ద్రవ్యవేగము,
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 28

ప్రశ్న 17.
(a) ఒక న్యూట్రానుకు ఎంత గతిజశక్తి ఉంటే దాని అనుబంధిత డి బ్రాయ్ తరంగదైర్ఘ్యం 1.40 × 10-10 mఉంటుంది?
(b) 300 Kవద్ద సగటు గతిజశక్తి (32) kTకలిగి ఉండి, ద్రవ్యంతో ఉష్ణ సమతాస్థితిలో ఉన్న ఒక న్యూట్రాన్ డి బ్రాయ్ తరంగదైర్యాన్ని కూడా కడుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 29

ప్రశ్న 18.
విద్యుదయస్కాంత వికిరణం తరంగదైర్ఘ్యం, దాని క్వాంటం (ఫోటాను)కు ఉండే డి బ్రాయ్ తరంగదైర్ఘ్యానికి సమానం అని చూపండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 30

ప్రశ్న 19.
300Kవద్ద గాలిలోని ఒక నైట్రోజన్ అణువుకు డి బ్రాయ్ తరంగదైర్ఘ్యం ఎంత? ఈ ఉష్ణోగ్రత వద్ద అణువులకు ఉండే వర్గమధ్యమ మూల(ms) వడితో ఈ అణువు చలిస్తున్నదని అనుకోండి (నైట్రోజన్ పరమాణు ద్రవ్యరాశి = 14.0076u)
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 31

అదనపు అభ్యాసాలు Additional Exercises

ప్రశ్న 20.
(a) ఒక శూన్యీకృత నాళంలోని వేడిచేసిన ఉద్గారకం నుంచి ఉద్గారమైన ఎలక్ట్రానులు, ఉద్గారకానికి సాపేక్షంగా 500Vల పొటెన్షియల్ తేడా వద్ద ఉన్న సేకరిణిపైకి ఏ వడితో పతనమౌతాయో అంచనా కట్టండి. ఆ ఎలక్ట్రానుల అల్పమైన తొలి వడులను ఉపేక్షించండి. ఎలక్ట్రాను విశిష్టావేశం, అంటేe/mవిలువ 1.76 × 1011 Ckg-1.
(b) మీరు (a) లో వాడిన ఫార్ములానే ఉపయోగించి, ఒక సేకరిణి పొటెన్షియల్ 10 MV ఉంటే ఎలక్ట్రాను వడి ఎంత కనుక్కోండి. దీంట్లోని తప్పును గమనించగలుగుతున్నారా? ఫార్ములాను ఏవిధంగా మార్చవలసి ఎంత?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 32

AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం

ప్రశ్న 21.
(a) ఎలక్ట్రాను వడి 5.20 × 106 m s-1 తో ఉన్న ఒక ఏకశక్తి ఎలక్ట్రాన్ పుంజం, పుంజం వేగానికి లంబంగా ఉన్న 1.30 × 10-4 T అయస్కాంత క్షేత్ర ప్రభావానికి లోనవుతుంది. ఎలక్ట్రానుకు e/m విలువ 1.76 × 1011 C kg-1 అనుకొంటే, పుంజం గీచే వృత్తం వ్యాసార్థం ఎంత?
(b) మీరు (a) లో వాడే ఫార్ములా ఒక 20 MeV ఎలక్ట్రాను పుంజం చేసే పథ వ్యాసార్థాన్ని గణించడానికి చెల్లుబాటు అవుతుందా ? కాకపోతే, దాన్ని ఏవిధంగా మార్చాలి?
[సూచన : అభ్యాసాలు 20(b), 21(b), ఈ పుస్తక పరిధిని మించిన సాపేక్షక యాంత్రిక శాస్త్రానికి మిమ్మల్ని తీసుకొనివెళతాయి. అయితే వీటిని ఇక్కడ పొందుపరచడానికి కారణం పై అభ్యాసాల్లోని (a) భాగంలో మీరు ఉపయోగించే ఫార్ములాలు చాలా అధిక వడులు లేదా శక్తుల వద్ద అవి చెల్లవనే అంశాన్ని కేవలం నొక్కి వక్కాణించి చెప్పడం కోసమే. చాలా అధిక వడి లేదా శక్తి అంటే అర్థం తెలుసుకోవడానికి చివరలో ఇచ్చిన జవాబులను చూడండి.]
సాధన:
a) ఇచ్చట, v = 5.20 × 106 ms-1;
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 33
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 34

ప్రశ్న 22.
అల్పపీడనం (~ 10-2 mm of Hg) వద్ద ఉన్న హైడ్రోజన్ వాయువును కలిగి ఉన్న ఒక గోళాకార బల్బులో 100V ల పొటెన్షియల్ వద్ద సేకరిణి గల ఒక ఎలక్ట్రాన్ గన్ ఎలక్ట్రానులను పేల్చుతుంది. 2.83 × 10-4 T ల ఒక అయస్కాంత క్షేత్రం ఈ ఎలక్ట్రానుల పథాన్ని వ్యాసార్థం 12.0 cm గల వృత్తీయ కక్ష్యలోకి మళ్ళిస్తుంది. (ఈ పథాన్ని మనం చూడగలం, ఎందుకంటే ఈ పథంలోని వాయు అయానులు, ఎలక్ట్రానులను ఆకర్షించడం ద్వారా, ఎలక్ట్రాను ప్రగ్రహణం (capture) ద్వారా కాంతిని ఉద్గారిస్తూ పుంజాన్ని కేంద్రీకరిస్తాయి. ఈ పద్ధతిని సూక్ష్మపుంజనాళం(‘fine beam tube’) పద్ధతి అంటారు.) ఈ దత్తాంశాల నుంచి e/m ని నిర్ణయించండి.
సాధన:
ఇచ్చట, V = 100 V; B = 2.83 × 10-4 T; r = 12.0 cm = 12.0 × 10-2M
ఎలక్ట్రానులు V వోల్ట్లతో త్వరణం చెందితే, ఎలక్ట్రాన్ గతిజ శక్తిలో పెరుగుదల,
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 35

ప్రశ్న 23.
(a) ఒక X-కిరణ నాళం, 0.45 Åల వద్ద అల్పతరంగదైర్ఘ్యపు కొన ఉన్న ఒక వికిరణ అవిచ్ఛిన్న వర్ణపటాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ వికిరణంలోని ఒక ఫోటానుకు ఉండే గరిష్ట శక్తి ఎంత?
(b) మీకు (a)లో వచ్చే జవాబు నుంచి, అలాంటి ఒక నాళంలో (ఎలక్ట్రానులకు) ఏ క్రమంలోని త్వరణ వోల్టేజి అవసరమవుతుందో కనిపెట్టండి?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 36

b) X-కిరణ గోట్టంలో, త్వరణ వోల్టేజి టార్గెట్పై ఎలక్ట్రాన్లు తాకటానికి కావల్సిన శక్తినిచ్చి, X-కిరణాలను ఉత్పత్తి చేయును. 27.6 KeV, X-కిరణ ఫోటానులు పొందుటకు కనీసం 27.6 KeV గతిజ శక్తిని, పతన ఎలక్ట్రానులు కలిగి ఉండాలి. X-కిరణ గొట్టం వెంట 30 Ke V త్వరణ వోల్టేజి ప్రయోగించి, కావల్సిన X-కిరణ ఫోటాన్లను పొందవచ్చును.

ప్రశ్న 24.
పాజిట్రానులతో, అధిక శక్తి అభిఘాతాలు చేసే ఎలక్ట్రానులపై చేసిన ఒక త్వరణకం ప్రయోగంలో, ఒక నిర్దిష్ట సంఘటనను మొత్తం శక్తి 10.2 BeV గల ఒక ఎలక్ట్రాన్ – పాజిట్రాన్ జంట రెండు సమాన శక్తి గల కిరణాలుగా లయం (annihilation) చెందుతుందని వివరించారు. ఒక్కొక్క γ-కిరణానికి అనుబంధితమైన తరంగదైర్ఘ్యం ఎంత? (1 BeV = 109 eV).
సాధన:
2 γ – కిరణాల మొత్తం శక్తి = 10.2 BeV = 10.2 × 109 eV
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 37

ప్రశ్న 25.
క్రింది రెండు సంఖ్యలను అంచనా కట్టడం ఆసక్తిదాయకంగా ఉండాలి. మొదటి సంఖ్య ఏం చెబుతుందంటే – రేడియో ఇంజనీర్లు ఫోటాన్ల గురించి అంతగా కలత చెందనవసరం లేదని! ఇక రెండవ సంఖ్య, మన కన్ను, కేవలం గుర్తించగలిగే కాంతిలో సైతం ఉండే ఫోటాన్లను ఎన్నటికీ లెక్కించలేదు అని చెబుతుంది.
(a) తరంగదైర్ఘ్యం 500 m గల రేడియో తరంగాలను ఉద్గారించే 10 kW సామర్థ్యం గల మధ్యమ తరంగ (మీడియం వేవ్) ట్రాన్సిమిటర్ సెకనుకు ఉద్గారించే ఫోటాన్ల సంఖ్య.
(b) మానవులు పసిగట్టగలిగే కనిష్ట తీవ్రతగల (-10-10 Wm-2) తెలుపు కాంతికి చెంది మన కనుపాపలోకి సెకనుకు ప్రవేశించే ఫోటాన్ల సంఖ్య. ఈ కనుపాప వైశాల్యం సుమారుగా 0.4 cm² ఉంటుందని, తెలుపు కాంతి సగటు పౌనఃపున్యం దాదాపు 6 × 1014 Hz ఉంటుందని తీసుకోండి.
సాధన:
a) ట్రాన్సిమిటర్ సామర్థ్యం, P = 10 kW = 104W
∴ సెకనుకు ఉద్గారమయ్యే మొత్తం శక్తి = P × t = 104 × 1 = 104J
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 38

b) విద్యార్థి వైశాల్యం, A = 0.4cm² = 0.4 × 10-4 m², v = 6 × 1014 HZ
తీవ్రత = 10-10 Wm-2
ఫోటాన్ శక్తి, E = hv
= 6.63 × 10-34 × 6 × 1014 = 4 × 10-19 J.

N = ప్రమాణ వైశాల్యంపై పతనమయ్యే ఫోటాన్ల సంఖ్య అయితే, ఈ ఫోటానుల వల్ల ఒక సెకనులో ప్రమాణ వైశాల్యంపై శక్తి = n ఫోటానుల మొత్తం శక్తి = N × 4 × 10-19 Jm-2.
తీవ్రత = ఒక సెకనులో ప్రమాణ వైశాల్యంపై శక్తి
∴ 10-10 = N × 4 × 10-19 లేక N = \(\frac{10^{-10}}{4\times10^{-19}}\) = 2.5 × 108 m-2s-1

ఒక సెకనులో విద్యార్థిలోనికి ప్రవేశించే ఫోటానుల సంఖ్య = N × విద్యార్థి వైశాల్యం
= 2.5 × 108 × 0.4 × 10-4 s-1 = 104 s-1

ఈ ఫోటానుల సంఖ్య (a) లో వచ్చిన ఫోటాన్ల సంఖ్య కన్నా చాలా తక్కువ. కనుక మన కన్ను, కేవలం గుర్తించగలిగే కాంతిలో ఉండే ఫోటాన్లను ఎన్నటికీ లెక్కించలేము.

AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం

ప్రశ్న 26.
100 W ల పాదరస (దీప) జనకం నుంచి వెలువడే 2271 Åల తరంగదైర్ఘ్యం గల అతినీలలోహిత కాంతి, మాలిబ్దినం లోహంతో తయారైన ఒక ఫోటోసెల్ను ఉద్యోతనం (irradiate) చేస్తుంది. దీనికి నిరోధక పొటెన్షియల్ – 1.3 V అయితే లోహం పని ప్రమేయాన్ని అంచనా కట్టండి. ఈ ఫోటో సెల్, He-Ne లేజరు ఉత్పత్తి చేసే 6328 Å తరంగదైర్ఘ్యం గల, అధిక తీవ్రత (−105 Wm-2) ఉన్న అరుణ కాంతికి ఏవిధంగా స్పందించవచ్చు?
సాధన:
λ = 2271Å = 2271 × 10-10 m, V0 = 1.3 V; Φ0 = ?
eV0 = hν – Φ0
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 39
ఎర్రని కాంతికి తీవ్రత ఎక్కువ అయినప్పటికి, νr < ν కావున ఫోటోసెల్ లేక కాంతి ఘటం స్పందించదు.

ప్రశ్న 27.
ఒక నియాన్ దీపం నుంచి వెలువడే 640.2 nm (Inm = 10-9 m) తరంగదైర్ఘ్యాన్ని కలిగిన ఏకవర్ణ వికిరణం టంగ్స్టన్ పైన సీజియంతో చేయబడిన ఫోటో సూక్ష్మగ్రాహ్యక పదార్థాన్ని ఉద్యోతనం చేస్తుంది. దీనికి నిరోధక పొటెన్షియల్ 0.54V ఉంటుందని కొలిచారు. ఈ జనకానికి బదులు ఇనుము జనకాన్ని ఉపయోగించినప్పుడు దాని 427.2 nm రేఖ అదే ఫోటోసెలు ఉద్యోతనం చేస్తుంది. కొత్త నిరోధక పొటెన్షియల్ను ప్రాగుక్తం చేయండి.
సాధన:
నియాన్ దీపం λ = 6.10.20nm = 640.2 × 10-9 m ; V0 = 0.54 V
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 40

ప్రశ్న 28.
ఫోటో విద్యుత్ ఉద్గారం పౌనఃపున్యంపై ఆధారపడటాన్ని అధ్యయనం చేయడానికి ఒక పాదరస (మెర్క్యురీ) దీపం ఒక అనుకూలమైన జనకం, ఎందుకంటే ఇది దృశ్య వర్ణపటంలోని UV (అతినీలలోహిత) నుంచి ఎరుపు కొన వరకు వ్యాపించిన అనేక సంఖ్యలో గల వర్ణపటరేఖలను ఇస్తుంది. రుబీడియం ఫోటోసెల్తో చేసిన మన ప్రయోగంలో, ఒక పాదరస జనకం నుంచి వెలువడే క్రింది రేఖలను ఉపయోగించాం :
λ1 = 3650 Å, λ21 = 4047 Å, λ3 = 4358 Å, λ4 = 5461 Å, λ5 = 6907 Å,
వీటికి కొలిచిన నిరోధక పొటెన్షియల్ లు వరసగా
V01 = 1.28 V, V02 = 0.95 V, V03 = 0.74 V, V04 = 0.16 V, V05 = 0 V.
ప్లాంక్ స్థిరాంకం h విలువను, ఈ పదార్థానికి ఆరంభ పౌనఃపున్యాన్ని, పని ప్రమేయాన్ని నిర్ణయించండి.
[సూచన : ఈ దత్తాంశాల నుంచి h పొందాలంటే, మీకు ఆ విలువ తెలిసి (1.6 × 10-19 C గా తీసుకోవచ్చు). ఉండాలని మీరు గుర్తిస్తారు. ఈ రకమైన ప్రయోగాలను మిల్లికాన్ Na, Li, K మొదలైన వాటిపైన చేశాడు. అతను (తన తైల బిందు ప్రయోగం నుంచి లభించిన) తన సొంత విలువను ఆ కి ఉపయోగించి ఐన్స్టీన్ ఫోటోవిద్యుత్ సమీకరణాన్ని | ధ్రువపరచడమేగాక h కు స్వతంత్రంగా అంచనా కట్టిన విలువను ఇచ్చాడు.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 41
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 42
పౌనఃపున్యం υ మరియు అవరోధ పొటెన్షియల్ మధ్య గీసిన గ్రాఫ్ సరళరేఖ. నాల్గు బిందువులతో కలిపిన సరళరేఖ X-అక్షాన్ని 5.0 × 1014 Hz వద్ద ఖండిస్తుంది. ఐదవ బిందువు υ < υ0 వ్యాప్తిలో ఉండి ఫోటో విద్యుత్ ఉద్గారం చూపదు. కావున విద్యుత్ను ఆపుటకు అవరోధ పొటెన్షియల్ అవసరం ఉండదు. గ్రాఫ్ నుండి సరళరేఖవాలు
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 43

ప్రశ్న 29.
క్రింది లోహాలకు పని ప్రమేయాలను ఇచ్చాం :
Na : 2.75 eV; K : 2.30 eV; Mo : 4.17 eV; Ni : 5.15 eV. ఫోటోసెల్ నుంచి 1m దూరంలో ఉంచిన He-Cd లేజర్ నుంచి వెలువడే 3300 Åల తరంగదైర్ఘ్యం గల వికిరణానికి, వీటిలో ఏ లోహం ఫోటోవిద్యుత్ ఉద్గారంను ఇవ్వదు? లేజరును దగ్గరకు తెచ్చి 50 cm దూరంలో ఉంచితే ఏం జరుగుతుంది?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 44
ఈ శక్తి Na మరియు K ల పని ప్రమేయంల కన్నా ఎక్కువ మరియు Mo మరియు Ni కన్నా తక్కువ. ఫొటో విద్యుత్ ఉద్గారం Na మరియు K లోహాలలో మాత్రమే సంభవిస్తుంది.

లేజర్ను దగ్గరగా తీసుకొస్తే, పతన వికిరణ తీవ్రత పెరుగుతుంది. ఇది Mo మరియు Ni లోహాలపై ఫలిత ప్రభావం చూపదు. దీని తీవ్రత పెరిగిన Na మరియు K ల ఫోటోఎలక్ట్రిక్ ఉద్గారం అనుపాతంగా పెరుగును.

ప్రశ్న 30.
ఉపరితల వైశాల్యం 2cm² గల ఒక సోడియం ఫోటోసెల్పైన తీవ్రత 10-5 Wm-2 గల కాంతి పడుతుంది. ఈ పతన శక్తిని సోడియం యొక్క 5 స్తరాలు (పొరలు) శోషించుకొంటాయని అనుకొంటే, ఫోటో విద్యుదుద్గారానికి పట్టే కాలం వికిరణం తరంగ చిత్రణలో ఎంత ఉంటుందో అంచనా వేయండి. ఈ లోహానికి పని ప్రమేయం దాదాపు 2 eV గా ఉంది. మీ జవాబులో ఉన్న అంతస్సూచన (implication) ఏమిటి?
సాధన:
I = 10-5W/m²; A = 2 cm² = 2 × 10-4m²; n = 5, t = ? W0 = 2eV= 2 × 1.6 × 10-19J.
సోడియం పరమాణువు ఒక వాహక ఎలక్ట్రానన్ను కలిగి ఉండును.
ప్రభావ పరమాణు వైశాల్యం = 10-20
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 45
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 46

తరంగపటం, ఈ ప్రయోగంనకు ప్రయోగించకూడదు.

ప్రశ్న 31.
స్ఫటిక వివర్తన ప్రయోగాలను X-కిరణాలను ఉపయోగించి గానీ లేదా తగు వోల్టేజి ద్వారా త్వరితం అయ్యే ఎలక్ట్రానులను ఉపయోగించి గానీ చేయవచ్చు. ఈ రెండింటిలో ఏ శోధన పరికరం (probe) ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది? (పరిమాణాత్మకంగా పోల్చడం కోసం, శోధన తరంగదైర్ఘ్యం 1 కి సమానమని తీసుకోండి. ఈ తరంగదైర్ఘ్యం జాలకంలోని అంతర్ పరమాణుక మధ్య దూరం క్రమంలో ఉంది) (m = 9.11 × 10-31 kg).
సాధన:
ఎలక్ట్రాను, λ = 1 Å = 10-10 m; m = 9.11 × 10-31 kg
గతిజశక్తి ఉన్న ఎలక్ట్రాన్లు X-కిరణాలను ఉత్పత్తి చేయును.
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 47
కావున ఒకే తరంగదైర్ఘ్యంనకు, ఫోటాన్ ఎలక్ట్రాన్ కన్నా ఎక్కువ గతిజశక్తి కలిగి ఉండును.

AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం

ప్రశ్న 32.
(a) గతిజశక్తి 150 eV కలిగిన ఒక న్యూట్రాన్కు డి బ్రాయ్ తరంగదైర్ఘ్యాన్ని పొందండి. అభ్యాసం 31లో మీరు చూసినట్లుగా, ఇదే శక్తి కలిగిన ఎలక్ట్రాన్ పుంజం స్ఫటిక వివర్తన ప్రయోగాలకు తగిన విధంగా ఉంటుంది. మరి, ఇదే శక్తి కలిగి ఉన్న ఒక న్యూట్రాన్ పుంజం సమానంగా తగినదై ఉంటుందా? వివరించండి. (mn = 1.6752 × 10-27 kg)
(b) గది ఉష్ణోగ్రత (27 °C) వద్ద ఉన్న ఉప్లీయ న్యూట్రాన్లతో అనుబంధితమైన డి బ్రాయ్ తరంగండి. తద్వారా ఒక వేగవంతమైన వడిగల న్యూట్రాను పంజాన్ని న్యూట్రాన్ వివర్తన ప్రయోగాలకు వినియోగించగలగాలంటే దాన్ని పరిసరాలతో (environment), ఉష్ఠీకృతం (thermalise) చేయవలసిన అవసరం ఎందుకు ఉంటుందో
వివరించండి.
సాధన:
a) న్యూట్రాన్ గతిజశక్తి, E = 150 eV = 150 × 1.6 × 10-19 J
న్యూట్రాన్ ద్రవ్యరాశి, m = 1.675 × 10-27 kg.
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 48
అంతర పరమాణువుల మధ్యదూరం 1Å(= 10-10m), తరంగదైర్ఘ్యం కన్నా 100 రెట్లు ఎక్కువ.
∴ వివర్తన ప్రయోగంలో, న్యూట్రాన్ పుంజము శక్తి 150 ev సరిపోదు.

b) T = t + 273 = 27 + 273 = 300 K
బోల్ట్స్మన్ స్థిరాంకం,K = 1.38 × 10-23 J/mol/K
పరమ ఉష్ణోగ్రత T వద్ద, న్యూట్రాన్ సరాసరి గతిజశక్తి
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 49
ఈ తరంగదైర్ఘ్యం జాలకంలోని అంతర పరమాణుక మధ్య దూరం క్రమంలో ఉంది. కావున ఒక వేగవంతమైన వడిగల న్యూట్రాను పుంజాన్ని న్యూట్రాన్ వివర్తన ప్రయోగాలకు వినియోగించగలగాలంటే దాన్ని పరిసరాలతో ఉష్ఠీకృతం చేయవలసిన అవసం ఉంటుంది.

ప్రశ్న 33.
ఒక ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని 50 kV వోల్టేజి ద్వారా త్వరితమైన ఎలక్ట్రానులను, ఉపయోగించుకొంటుంది. ఈ ఎలక్ట్రానులతో అనుబంధితమైన డి బ్రాయ్ తరంగదైర్ఘ్యాన్ని నిర్ణయించండి. ఒకవేళ ఇతర కారకాలు (సంఖ్యాత్మక అపర్చర్ (కంత/ దారి) మొదలైనటువంటివి) కొంచెం అటుఇటుగా (roughly) ఇవే విలువలను కలిగి ఉన్నాయని తీసుకొంటే, ఒక ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని యొక్క పృథక్కరణ సామర్థ్యం, పసుపు కాంతిని వాడే దృశా సూక్ష్మదర్శిని పృథక్కరణ సామర్ధ్యంతో ఏ విధమైన పోలిక కలిగి ఉంటుంది?
సాధన:
V = 50 KV = 50 × 10³ Volt
∴ ఎలక్ట్రాన్ గతిజశక్తి, E = 50 × 10³ ev = 50 × 10³ × 1.6 × 10-19J
= 50 × 1.6 × 10-16 J
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 50

పసుపు కాంతి తరంగదైర్ఘ్యం (λ) = 5.9 × 10-7 m

పృథక్కరణ సామర్థ్యం, తరంగదైర్ఘ్యంనకు విలోమానుపాతంలో ఉండుట వల్ల ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ పృథక్కరణ సామర్థ్యం, దృశ్య మైక్రోస్కోప్నకు 105 రెట్లు. సాధారణంగా జ్యామితీయ కారకంలలో తేడా వాని పోల్చుటలో మార్పు తెచ్చును.

ప్రశ్న 34.
ఒక శోధన పరికరం (probe) తరంగదైర్ఘ్యం, అది కొన్ని వివరాల పరిధి వరకు (in some detail) పరిశీలించగలిగే నిర్మాణం యొక్క పరిమాణానికి కొంచెం అటు ఇటుగా ఉన్న కొలమానమే. ప్రోటాన్లు, న్యూట్రాన్లకు ఉండే క్వార్క్ రచన 10-15 m లేదా అంతకంటే తక్కువ సూక్ష్మమైన పొడవు మానం (length scale) లో ఉన్నట్లు కనిపిస్తుంది. USA లోని స్టాన్ఫోర్డ్ వద్దగల ఒక రేఖీయ త్వరణకం ఉత్పత్తి చేసే అధికశక్తి ఎలక్ట్రాన్ పుంజాలను ఉపయోగించి 1970 లోని తొలి రోజుల్లో మొట్టమొదటగా ఈ నిర్మాణాన్ని లోతుగా పరిశీలించడం జరిగింది. ఈ ఎలక్ట్రాన్ పుంజాల శక్తి ఏ క్రమంలోనిదై ఉండవచ్చో ఊహించి కనిపెట్టండి. (ఎలక్ట్రాన్ విరామ ద్రవ్యరాశి శక్తి = 0.511 MeV.)
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 51
కావున త్వరణకారి నుండి ఎలక్ట్రాన్ శక్తులు కొన్ని BeV లను కల్గి ఉండును.

ప్రశ్న 35.
గది ఉష్ణోగ్రత (27 °C), 1 atm పీడనం వద్ద ఉన్న హీలియం వాయువులోని ఒక He పరమాణువుతో అనుబంధితమైన విలక్షణ డి బ్రాయ్ తరంగదైర్ఘ్యాన్ని కనుక్కోండి. ఈ పరిస్థితుల్లో రెండు పరమాణువుల మధ్య ఉండే సగటు ఎడంతో దీన్ని (డి బ్రాయ్ తరంగదైర్ఘ్యాన్ని) పోల్చండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 52

ప్రశ్న 36.
27 °C వద్ద ఉన్న ఒక లోహంలోని ఒక ఎలక్ట్రాన్ విలక్షణ డి బ్రాయ్ తరంగదైర్ఘ్యాన్ని లెక్కకట్టి, ఒక లోహంలోని రెండు ఎలక్ట్రాన్ల మధ్య ఉండే సగటు ఎడం (ఇది దాదాపు 2 × 10-10 m ఉంటుందనుకోండి) తో పోల్చండి.
[సూచన : అభ్యాసాలు 35, 36 లు కింది విషయాన్ని బహిరంగ పరుస్తాయి. సాధారణ పరిస్థితుల్లో ఉండే వాయురూప అణువులతో ఉండే అనుబంధిత తరంగ పొట్లాలు అతిపాతం చెందకుండా ఉండగా, ఒక లోహంలోని ఎలక్ట్రాన్ తరంగ పొట్లాలు ఒకదానితో ఒకటి ప్రబలంగా అతిపాతం చెందుతాయి. సాధారణ వాయువులోని అణువులు విడివిడిగా గుర్తించగలిగేవిగా ఉంటే, ఒక లోహంలోని ఎలక్ట్రానులను ఒకదాని నుంచి మరొకదానిని విడదీసి గుర్తించగలలేనివిగా ఉంటాయని ఇది సూచిస్తుంది. ఈ అభేద్యత (indistinguishibility) అనేక ప్రాథమిక అంతస్సూచనలను కలిగి ఉంటుంది. వీటిని మీరు మరింత ఉన్నతమైన భౌతికశాస్త్ర కోర్సులలో అన్వేషిస్తారు (explore)].
సాధన:
లోహంలో ఎలక్ట్రాన్ ద్రవ్యవేగం, P = √3mKT
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 53

ప్రశ్న 37.
కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
(a) ప్రోటాన్లు, న్యూట్రాన్ల అంతర్భాగంలోని క్వార్క్లు, ఆంశిక (fractional) ఆవేశాలు [(+2/3)e; (-1/3)e] ను కలిగి ఉంటాయని అనుకుంటారు. అలాంటప్పుడు అవి మిల్లికాన్ తైలబిందు ప్రయోగంలో ఎందుకు కనిపించలేదు?
సాధన:
క్వార్క్స్ ఆంశిక ఆవేశాలను కలిగిఉండును. ఈ క్వార్క్స్లు బలాలతో బంధితమగును. క్వార్క్ లు దూరంగా లాగటానికి ప్రయత్నిస్తే, ఈ బలాలు దృఢంగా ఉంటాయి. అందువల్ల క్వార్క్లు దగ్గరగా ఉంటాయి. ఈ కారణం వల్ల ప్రకృతిలో ఆంశిక ఆవేశాలు ఇమడతాయి. కాని పరిశీలించిన ఆవేశాలు, ఎలక్ట్రాన్ ఆవేశంనకు పూర్ణాంక గుణిజాలుగా ఉండును.

(b) కలయిక e/m పట్ల గల ప్రత్యేకత ఏమిటి? e,m ల గురించి కేవలంగా, విడివిడిగా మనం ఎందుకు మాట్లాడం?
సాధన:
విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలలో ఎలక్ట్రాన్ చలనంను \(\frac{1}{2}\)mυ² = eV లేక Beυ = \(\frac{mυ^2}{r}\) అనే రెండు సమీకరణాలు తెలుపుతాయి. ఈ రెండు సమీకరణాలు e మరియు m రెండింటిని కలిగి ఉండును. ఏ ఒక్క సమీకరణంలో e లా m లను ఒక్కొక్కటిగా లేదు. అందువల్ల \(\frac{e}{m}\) మాత్రమే తీసుకుంటాము.

(c) సాధారణ పీడనాల వల్ల వాయువులు ఎందుకు బంధకాలు కావాలి, అత్యల్ప పీడనాల వద్ద అవి వహనాన్ని ఎందుకు ప్రారంభిస్తాయి?
సాధన:
సాధారణ పీడనం వద్ద వాయు అణువుల అయనీకరణం వల్ల స్వల్ప ధన అయాన్లు మరియు ఎలక్ట్రాన్లు ఏర్పడును. ఎలక్ట్రోడ్లు బంధకాలు అవటం వలన ధన అయాన్లు మరియు ఎలక్ట్రాన్లు చేరలేవు. అల్ప పీడనం వద్ద, సాంద్రత తగ్గుతుంటే, సరాసరి స్వేచ్ఛా పథము పెద్దదిగా ఉండును. అధిక పొటెన్షియల్ వద్ద, అవి సరిపోయినంత శక్తిని పొంది, అవి అణువులతో అభిఘాతం జరిపి, అయనీకరణను కలిగించును. దీని వల్ల, వాయువులో అయాన్ల సంఖ్య పెరుగును.
మరియు ఇది వాహకంగా మారును.

(d) ప్రతి లోహానికి ఒక నిర్దిష్ట పని ప్రమేయం ఉంటుంది. పతన వికిరణం ఏకవర్ణకం అయినప్పుడు అన్ని ఫోటో ఎలక్ట్రానులు ఒకే శక్తితో ఎందుకు బయటకు రావు? ఫోటో ఎలక్ట్రానులకు శక్తి వితరణ అంటూ ఎందుకు ఉంది?
సాధన:
లోహంలో ఎలక్ట్రాన్లన్నీ ఒకే శక్తి స్థాయిని కలిగి ఉండును. కాని అవి అవిచ్ఛిన్న స్థాయిలను ఆక్రమించును. లోహతలం పై వికిరణం పతనమయితే, వేర్వేరు శక్తులతో, వేర్వేరు స్థాయిల నుండి ఎలక్ట్రాన్లు బయటకు వచ్చును.

(e) ఒక ఎలక్ట్రాన్ యొక్క శక్తి, ద్రవ్యవేగం, దాని అనుబంధిత ద్రవ్యతరంగ పౌనఃపున్యం, తరంగదైర్ఘ్యాలతో కింది విధంగా సంబంధం కలిగి ఉన్నాయి.
E = h ν, p = \(\frac{h}{\lambda}\)
కాని λ విలువ భౌతికంగా సార్థకం (significant) కాగా, ν విలువ (అందువల్ల, ప్రావస్థ వడి ν λ) కు మాత్రం భౌతిక సార్ధకత ఏమీలేదు. ఎందుకు?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 54

సాధించిన సమస్యలు Textual Examples

ప్రశ్న 1.
ఒక లేజర్ 6.0 × 1014 Hz పౌనఃపున్యం ఉన్న ఏకవర్ణ కాంతిని ఉత్పత్తిచేసింది. తద్వారా ఉద్గారమైన సామర్థ్యం 2.0 × 10-3W. (a) ఈ కాంతి పుంజంలో ఒక ఫోటాను శక్తి ఎంత? (b) సగటున ఒక సెకనుకు ఎన్ని ఫోటాన్లను జనకం ఉద్గారిస్తుంది?
సాధన:
a) ఒక్కొక్క ఫోటాన్ కు ఉండే శక్తి
E = hν = (6.63 × 10-34 J s) (6.0 × 1014 Hz)
= 3.98 × 10-19 J

b) ప్రతి సెకనుకు జనకం నుంచి ఉద్గారమయ్యే ఫోటాన్ల సంఖ్య N అనుకొంటే, పుంజంలో ప్రసారితమయ్యే సామర్థ్యం P, ఒక్కొక్క ఫోటానుకు ఉండే శక్తి Eకి N రెట్లకు సమానమవుతుంది. అందువల్ల P = N E. అప్పుడు,
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 55

ప్రశ్న 2.
సీజియంకు పని ప్రమేయం 2.14 eV అయితే (a) సీజియంకు ఆరంభ పౌనఃపున్యాన్ని (b)0.60 V ల నిరోధక పొటెన్షియల్ వల్ల ఫోటోవిద్యుత్ ప్రవాహం సున్నాకు తీసుకొనిరావడమైంది అనుకొంటే పతన కాంతి తరంగదైర్ఘ్యాన్ని కనుక్కోండి. [AP. Mar.’16]
సాధన:
a) కటాఫ్ లేదా ఆరంభ పౌనఃపున్యానికి, పతన వికిరణ శక్తి hν0 పని ప్రయేయం Φ0 కి సమానం కావాలి. కాబట్టి,
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 56
అంటే, ఈ ఆరంభ పౌనఃపున్యం కంటే తక్కువ విలువ ఉన్న పౌనఃపున్యాలకు, ఫోటో ఎలక్ట్రానులు బయటకు రావు.

b) మందక శక్మం V0 వల్ల కలిగే స్థితిజశక్తి e V0 కు ఉద్గారిత ఫోటో ఎలక్ట్రానుల గరిష్ట గతిజశక్తి సమానమైనప్పుడే ఫోటో విద్యుత్ ప్రవాహం సున్నాకు తగ్గిపోతుంది. ఐన్స్టీన్ ఫోటో విద్యుత్ సమీకరణం ప్రకారం,
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 57

AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం

ప్రశ్న 3.
దృశ్య ప్రాంతంలో కాంతి తరంగదైర్ఘ్యం, నీలలోహిత (ఊదా) వర్ణానికి సుమారుగా 390 nm, పసుపు-ఆకుపచ్చ వర్ణానికి దాదాపు 550 nm (సగటు తరంగదైర్ఘ్యం), ఎరుపు వర్ణానికి దాదాపు 760nm.
(a) ఈ దృశ్య వర్ణపటంలోని (i) నీలలోహిత కొనవద్ద, (ii) పసుపు-ఆకుపచ్చ వర్ణపు సగటు తరంగదైర్ఘ్యం వద్ద, (iii) ఎరుపు కొనవద్ద ఫోటాన్లకు ఉండే శక్తి విలువలు (eV) లలో ఏవిధంగా ఉంటాయి?
(h = 6.63 × 10-34 J s 1 eV = 1.6 × 10-19 J అని తీసుకోండి)
(b) (a) లోని (i), (ii); (iii) ల ఫలితాలను ఉపయోగిస్తూ, పట్టికలోని జాబితాలో ఉన్న ఫోటో సూక్ష్మగ్రాహ్మక పదార్థాలు, వాటి పని ప్రమేయాల నుంచి, దృశ్యకాంతితో పనిచేసే ఒక ఫోటోవిద్యుత్ పరికరాన్ని మీరు నిర్మించగలరా?
సాధన:
a) పతన ఫోటాను శక్తి, E = hv = hc/λ
E = (6.63 × 10-34 Js) (3 × 108m/s) /λ
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 58

i) నీలలోహిత కాంతికి, λ1 = 390 nm (అల్పతమ తరంగదైర్ఘ్యం కొన)
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 59

b) ఒక ఫోటోవిద్యుత్ పరికరం ప్రచలితం కావాలంటే పతన కాంతి శక్తి E విలువ పదార్థ పని ప్రమేయం 60 విలువకు సమానం లేదా అధికంకానీ కావలసి ఉంటుంది. కాబట్టి నీలలోహిత కాంతి (E = 3.19 eV) కి ఫోటోవిద్యుత్ పరికరం Na (Φ0 = 2.75 eV), K (Φ0 = 2.30 eV), Cs (Φ0 = 2.14 eV) ఫోటో సూక్ష్మగ్రాహ్యక పదార్థాలతో ప్రచాలితం కాగలదు. పసుపు-ఆకుపచ్చ కాంతి (E = 2.26 eV తో)కి కూడా Cs (Φ0 = 2.14 eV) తో మాత్రమే ప్రచలితం అవుతుంది. అయితే, ఈ సూక్ష్మగ్రాహ్యక పదార్థాల్లో దేనితో కూడా, ఎరుపు కాంతి (E = 1.64 eV) కి ప్రచలితం కాదు.

ప్రశ్న 4.
(a) 5.4 × 106 m/s వడితో చలిస్తున్న ఒక ఎలక్ట్రాన్తో, (b) 150 g ద్రవ్యరాశి కలిగి 30.0 m/s తో ప్రయాణించే బంతితో అనుబంధితమై ఉండే డి బ్రాయ్ తరంగదైర్ఘ్యం ఎంత?
సాధన:
a) ఎలక్ట్రానుకు :
ద్రవ్యరాశి m = 9.11 × 10-31 kg, వడి, υ = 5.4 × 106 m/s.
అప్పుడు ద్రవ్యవేగం p = m υ = 9.11 × 10-31 (kg) × 5.4 × 106 (m/s)
p = 4.92 × 10-24 kg m/s
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 60

b) బంతికి
ద్రవ్యరాశి, m’ = 0.150 kg, వడి υ’ = 30.0 m/s.
అప్పుడు ద్రవ్యవేగం, p’ = m’ υ’ = 0.150 (kg) × 30.0 (m/s)
p’ = 4.50 kg m/s
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 61

ఎలక్ట్రాను డి బ్రాయ్ తరంగదైర్ఘ్యం, X-కిరణ తరంగదైర్ఘ్యాలతో పోల్చదగినదిగా ఉంది. అయితే, బంతికి అది ప్రోటాన్ పరిమాణం (సైజు)కు 10-19 రెట్లు ఉంది, అంటే, ప్రయోగపూర్వక కొలతకు చాలా ఆవల ఉంది.

ప్రశ్న 5.
ఒక ఎలక్ట్రాను, ఒక α-కణం, ఒక ప్రోటాను ఒకే గతిజశక్తిని కలిగి ఉన్నాయి. ఈ కణాలలో దేనికి అతిచిన్న డి బ్రాయ్ తరంగదైర్ఘ్యం ఉంటుంది? [TS. Mar. ’15]
సాధన:
ఒక కణానికి, డి బ్రాయ్ తరంగదైర్ఘ్యం, λ = h/p
గతిజశక్తి, K = p²/2m
అప్పుడు, λ = h/√2mk

ఒకే గతిజశక్తి ఉన్న సందర్భానికి, కణంతో అనుబంధితమై ఉండే డి బ్రాయ్ తరంగదైర్ఘ్యం వాటి ద్రవ్యరాశుల వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఒక ప్రోటాను (¹1H) ద్రవ్యరాశి ఎలక్ట్రాను ద్రవ్యరాశికి 1836 రెట్లు కాగా, α-కణం (42He) ప్రోటాను ద్రవ్యరాశికి నాలుగు రెట్ల ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది.

కాబట్టి, α-కణానికి అతిచిన్న డి బ్రాయ్ తరంగదైర్ఘ్యం ఉంటుంది.

ప్రశ్న 6.
ఒక ఎలక్ట్రాన్ కంటే మూడు రెట్లు వడితో ఒక కణం చలిస్తోంది. ఆ కణానికి చెందిన డి బ్రాయ్ తరంగదైర్ఘ్యానికీ, ఎలక్ట్రాను తరంగదైర్ఘ్యానికి ఉన్న నిష్పత్తి 1.813 × 10-4 అయితే, ఆ కణం ద్రవ్యరాశిని గణించి, కణాన్ని గుర్తించండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 62
కాబట్టి, ఈ ద్రవ్యరాశి గల ఆ కణం ఒక ప్రోటాను లేదా ఒక న్యూట్రాను అయి ఉండవచ్చు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం

ప్రశ్న 7.
100 వోల్టుల పొటెన్షియల్ తేడా ద్వారా త్వరితమయ్యే ఎలక్ట్రానుతో అనుబంధితమై ఉండే డి బ్రాయ్ తరంగదైర్ఘ్యం ఎంత? [AP. Mar. ’15]
సాధన:
త్వరితం చేసే పొటెన్షియల్ V = 100. డి బ్రాయ్ తరంగదైర్ఘ్యం λ
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 63
ఈ సందర్భానికి, ఒక ఎలక్ట్రానుతో అనుబంధితమై ఉండే డి బ్రాయ్ తరంగదైర్ఘ్యం X-కిరణ తరంగదైర్ఘ్యాల క్రమంలో ఉంది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Physics Study Material 11th Lesson విద్యుదయస్కాంత తరంగాలు Textbook Questions and Answers.

AP Inter 2nd Year Physics Study Material 11th Lesson విద్యుదయస్కాంత తరంగాలు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
X – కిరణాల సగటు తరంగదైర్ఘ్యం ఎంత?
జవాబు:
X – కిరణాల తరంగదైర్ఘ్య వ్యాప్తి 10-8 m (10nm) నుండి 10-13 m (10-4 nm)
X – కిరణాల సగటు తరంగదైర్ఘ్యము = \(\frac{10+0.0001}{2}\) = 5.00005 nm

ప్రశ్న 2.
పరారుణ కిరణాల ఒక ఉపయోగాన్ని తెలపండి. [AP. Mar. 16]
జవాబు:

  1. భూమిని వేడిగా ఉంచడంలో పరారుణ కిరణాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి.
  2. ఫిజియోథెరపీలో పరారుణ దీపాలను ఉపయోగిస్తారు.
  3. భూ ఉపగ్రహాల ఉనికిని గుర్తించడానికి పరారుణ శోధకాలను వాడతారు.
  4. మంచు, పొగ మొదలగు పరిస్థితులలో ఫొటోలు తీయడానికి వీటిని ఉపయోగిస్తారు.

ప్రశ్న 3.
విద్యుదయస్కాంత వికిరణ తరంగదైర్ఘ్యాన్ని రెట్టింపు చేస్తే ఫోటాన్ శక్తి ఎలా మారుతుంది?
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 1

ప్రశ్న 4.
విద్యుదయస్కాంత తరంగాల ఉత్పత్తి సూత్రం ఏమిటి?
జవాబు:
అంతరాళం మరియు కాలంలో అయస్కాంత క్షేత్రం మరియు విద్యుత్ క్షేత్రం మారి ఆవేశము త్వరణము చెందితే, విద్యుదయస్కాంత తరంగాలు జనిస్తాయి.

ప్రశ్న 5.
శూన్యంలో పరారుణ కిరణాల, అతినీలలోహిత కిరణాల వడుల నిష్పత్తి ఎంత?
జవాబు:
శూన్యంలో పరారుణ కిరణాలు మరియు అతినీలలోహిత కిరణాల వేగాల నిష్పత్తి 1 : 1 శూన్యంలో విద్యుదయస్కాంత తరంగాలు అన్నీ ఒకే వేగం 3 × 108 మి/సె కలిగి ఉంటాయి.

AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు

ప్రశ్న 6.
స్వేచ్ఛాంతరాళంలో ఒక విద్యుదయస్కాంత తరంగానికి, విద్యుత్, అయస్కాంత క్షేత్రాల గోలన పరిమితుల మధ్య సంబంధం ఏమిటి?
జవాబు:
E0 = CB0
ఇక్కడ E0 = విద్యుత్ క్షేత్రం యొక్క కంపన పరిమితి
B0 = అయస్కాంత క్షేత్రం యొక్క కంపన పరిమితి
C = కాంతి వేగం:

ప్రశ్న 7.
సూక్ష్మ (మైక్రో) తరంగాల అనువర్తనాలేమిటి? [TS. Mar.’15]
జవాబు:

  1. మైక్రో తరంగాలను రాడార్లలో ఉపయోగిస్తారు.
  2. మైక్రో తరంగాలను వంట చేయుటకు ఉపయోగిస్తారు.
  3. చలనంలో ఉన్న వాహనం యొక్క వేగాన్ని అంచనా వేయడానికి మైక్రో తరంగాలలో రాడార్లలో వాడతారు.

ప్రశ్న 8.
రాడార్లలో సూక్ష్మ తరంగాలను ఉపయోగించడానికి కారణం ఏమిటి? [Mar. ’14]
జవాబు:
మైక్రో- తరంగాలు స్వల్ప తరంగదైర్ఘ్యాన్ని కలిగి ఉంటాయి. అందువలన ఒక నిర్దిష్ట దిశలో కిరణ సంకేతం వలె ప్రసారం చేయవచ్చు. ఇవి ప్రయాణించు మార్గంలో అడ్డు యొక్క అంచు వద్ద వంగవు.

ప్రశ్న 9.
పరారుణ కిరణాల రెండు ఉపయోగాలను ఇవ్వండి. [TS. Mar.’17]
జవాబు:

  1. డీహైడ్రేటెడ్ పండ్ల తయారీలో పరారుణ కిరణాలను వాడతారు.
  2. గోడలపై పురాతన కాలంనాటి రాతలను గుర్తించడానికి వీటిని వాడతారు.
  3. గ్రహం వేడిగా ఉండుటకు హరిత గృహప్రభావాన్ని కలిగించుటకు వీటిని వాడతారు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు

ప్రశ్న 10.
ఒక కెపాసిటర్ను ఆవేశితం చేయడానికి 0.6A విద్యుత్ ప్రవాహాన్ని పంపితే ప్లేట్ల మధ్యలో స్థానభ్రంశ విద్యుత్ ప్రవాహం ఎంత?
జవాబు:
i = కెపాసిటర్లో విద్యుత్ ప్రవాహము = 0.6 A
i = id = εo\(\frac{d \phi_{\mathrm{B}}}{\mathrm{dt}}\)
∴ i = id = 0.6. A
∴ స్థానభ్రంశ విద్యుత్ ప్రవాహము (id) = 0.6 A.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఒక విద్యుదయస్కాంత తరంగం ఏమి కలిగి ఉంటుంది? శూన్యంలో దాని వేగం ఏయే అంశాలపై ఆధారపడి ఉంటుంది?
జవాబు:
అంతరాళంలో పరస్పరం లంబంగా విద్యుత్ మరియు అయస్కాంతక్షేత్ర సదిశలు మారి విద్యుదయస్కాంత తరంగాలు జనిస్తాయని మాక్స్వెల్ భావించాడు. ఇవి అంతరాళంలో ఎలాంటి యానకం అవసరం లేకుండా ప్రయాణిస్తాయి. ఈ తరంగాలను విద్యుదయస్కాంత తరంగాలని అంటారు.

మాక్స్వెల్ భావన ప్రకారం విద్యుదయస్కాంత తరంగాలలో విద్యుత్ మరియు అయస్కాంతక్షేత్ర సదిశలు పరస్పరం లంబంగా సైన్ వక్రంగా మారుతూ, తరంగ ప్రసార దిశకు లంబంగా ఉంటాయి. అందువల్ల విద్యుదయస్కాంత తరంగాలు తిర్యక్ స్వభావాన్ని కలిగి ఉంటాయి.
విద్యుత్ క్షేత్రం Ex = E0 Sin (Kz – ωt)
అయస్కాంత క్షేత్రం By0 = B0, sin (Kz – ωt)
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 2

విద్యుదయస్కాంత తరంగాల వేగము (i) శూన్య యానకం యొక్క ప్రవేశ్యశీలత (µo) (ii) శూన్యయానకం యొక్క పెర్మిటివిటీ (εo) పై ఆధారపడును. విద్యుదయస్కాంత తరంగాల వేగము = 3 × 108 m / s.

ప్రశ్న 2.
హరితగృహ ప్రభావం అంటే ఏమిటి? భూఉపరితల ఉష్ణోగ్రత పరంగా దాని పాత్ర ఏమిటి?
జవాబు:
హరిత గృహప్రభావం :
వాతావరణంలోని CO2, CH4, N2, క్లోరోఫోరో కార్బన్ వంటి వాయువులు భూమి వెలువరించిన వికిరణాలను బంధించడం వల్ల భూమి యొక్క ఉష్ణోగ్రతలు పెరుగుటను హరిత గృహప్రభావం అంటారు.

  1. సూర్యుడి నుండి వచ్చే వికిరణము వాతావరణంలోకి ప్రవేశించి, భూమి పై వస్తువులను వేడెక్కిస్తుంది. వాటి నుండి పరారుణ కిరణాలు ఉద్గారమవుతాయి.
  2. ఈ కిరణాలు భూమి ఉపరితలం నుండి పరావర్తనం చెంది, భూవాతావరణంలో బంధించబడి, భూమి ఉష్ణోగ్రత పెరుగుతుంది.
  3. కార్బన్ డయాక్సైడ్ పొరలు మరియు తక్కువ ఎత్తులో ఉండే మేఘాలు భూవాతావరణం నుండి పరారుణ కిరణాలు తప్పించుకుపోకుండా అడ్డుకుంటాయి.
  4. రోజురోజుకు వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ పెరిగి, వాతావరణంలో పరారుణ కిరణాలు అధికంగా బంధించబడతాయి.
  5. కాబట్టి రోజు రోజుకు భూ ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతుంది.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
విద్యుదయస్కాంత తరంగాల అవిష్కరణ సంబంధిత చరిత్రను క్లుప్తంగా తెలపండి.
జవాబు:
1. ఫారడే తన ప్రయోగాల ద్వారా విద్యుదయస్కాంత ప్రేరణను అధ్యయనం చేసినప్పుడు కాలంతో పాటు అయస్కాంతక్షేత్రం మారినప్పుడు, విద్యుత్ క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది.

2. 1865 వ సంవత్సరంలో మాక్స్వెల్ తన సైద్ధాంతిక అధ్యయనం ప్రకారం, కాలంతో పాటు మారే విద్యుత్ క్షేత్రం, అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది.

3. అయస్కాంత క్షేత్ర జనకం పర్యవసానంగా స్థానభ్రంశ ప్రవాహం ఏర్పడును.

4. దీనర్ధం కాలంతో పాటు మారే విద్యుత్ (లేదా) అయస్కాంతక్షేత్రాలు మరొక క్షేత్రాన్ని ఏర్పరుస్తాయి.

5. మాక్స్వెల్ భావన ప్రకారం అంతరాళంలో పరస్పరం లంబంగా మారే విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాల సదిశల వల్ల విద్యుదయస్కాంత తరంగాలు జనిస్తాయి.

6. ఈ విద్యుదయస్కాంత తరంగాలు అంతరాళంలో ఎలాంటి యానకం అవసరం లేకుండా ప్రయాణిస్తాయి.

7. విద్యుత్ మరియు అయస్కాంతక్షేత్రాలు రెండూ అంతరాళం మరియు కాలంతో మారేటప్పుడు ఒకే పౌనఃపున్యాలను కలిగి ఉంటాయి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 3

8. విద్యుత్ క్షేత్రసదిశ \(\overrightarrow{E}\) మరియు అయస్కాంతక్షేత్ర సదిశ \(\overrightarrow{B}\) లు y మరియు z అక్షం దిశలలో కంపిస్తే, x- అక్షం దిశలో విద్యుదయస్కాంత తరంగాలు ప్రసరిస్తాయి.

9. విద్యుదయస్కాంత తరంగాలు శూన్యంలో ప్రయాణించే వేగాన్ని మాక్స్వెల్ కనుగొన్నాడు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 4

10. యానకంలో విద్యుదయస్కాంత తరంగాల వేగము v = \(\frac{1}{\sqrt{\mu \varepsilon}}\)

11. మాక్స్వెల్ భావన ప్రకారం విద్యుదయస్కాంత తరంగాలు తిర్యక్ స్వభావాన్ని కలిగి ఉంటాయి.

12. స్పార్క్ డోలకంను ఉపయోగించి 1888 లో హెర్జ్ ప్రయోగపూర్వకంగా విద్యుదయస్కాంత తరంగాలను ఉత్పత్తి చేయడం మరియు శోధించడంను వివరించాడు.

13. 1895లో జగదీష్ చంద్రబోస్ 5 m.m నుండి 25 m.m తరంగదైర్ఘ్యం గల విద్యుదయస్కాంత తరంగాలను ఉత్పత్తి చేశాడు.

14. 1899 లో మార్కొని మొట్టమొదటిగా 50 కిలోమీటర్ల దూరం వరకు పనిచేసే వైర్లెస్ సంచారవ్యవస్థను ఏర్పరిచాడు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు

ప్రశ్న 2.
విద్యుదయస్కాంత తరంగాల ఆరు అభిలక్షణాలను తెలపండి. హరితగృహ ప్రభావం అంటే ఏమిటి?
జవాబు:
విద్యుదయస్కాంత తరంగాల ధర్మాలు (లేదా) అభిలక్షణాలు :
1. విద్యుదయస్కాంత తరంగాల ప్రసరణకు ఎలాంటి యానకం అవసరం లేదు. ఇవి శూన్యంలో మరియు యానకంలో ప్రసరిస్తాయి.

2. శూన్యంలో (లేదా) స్వేచ్ఛా అంతరాళంలో విద్యుదయస్కాంత తరంగాల వేగము
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 5

3. యానకంలో విద్యుదయస్కాంత తరంగాల వేగము v = \(\frac{1}{\sqrt{\mu \varepsilon}}\)

4. విద్యుదయస్కాంత తరంగాలు తిర్యక్ స్వభావాన్ని కలిగి ఉంటాయి.
విద్యుత్ క్షేత్ర సదిశ \(\overrightarrow{E}\) మరియు అయస్కాంతక్షేత్ర సదిశ \(\overrightarrow{B}\) లు పరస్పరం లంబంగా ఉండి, తరంగ ప్రసారదిశకు లంబంగా ఉంటాయి.

5. విద్యుదయస్కాంత తరంగాలు అంతరాళంలో స్వయంగా నిలకడ విద్యుత్ మరియు అయస్కాంత డోలనాలు కలిగి ఉంటాయి.

6. విద్యుదయస్కాంత తరంగాల ప్రసారశక్తి
పాయింటింగ్ సదిశ (\(\overrightarrow{P}\)) = = (\(\overrightarrow{E}\times\overrightarrow{B}\))

7. శూన్యంలో విద్యుత్ క్షేత్ర సదిశ \(\overrightarrow{E}\) మరియు అయస్కాంతక్షేత్ర సదిశల మధ్య సంబంధం. C = \(\frac{E_0}{B_0}\)

8. విద్యుదయస్కాంత తరంగాలు విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలలో అపవర్తనం చెందవు.

9. విద్యుదయస్కాంత తరంగాలు పరావర్తనం, వక్రీభవనం, వ్యతికరణం, వివర్తనం మరియు ధ్రువణం చెందుతాయి.

10. విద్యుదయస్కాంత తరంగాలు అధ్యారోపణ నియమాన్ని పాటిస్తాయి.

11. విద్యుదయస్కాంత తరంగాల సగటు విద్యుత్ శక్తి సాంద్రత
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 6

హరిత గృహ ప్రభావం :
వాతావరణంలోని CO2, CH4, N2O, క్లోరోఫ్లోరో కార్బన్ వంటి వాయువులు భూమి వెలువరించిన వికిరణాలను బంధించడం వల్ల భూమి యొక్క ఉష్ణోగ్రతలు పెరుగుటను హరిత గృహప్రభావం అంటారు.

అభ్యాసాలు Textual Exercises

ప్రశ్న 1.
ఒక కెపాసిటర్ వృత్తాకార ప్లేట్ల వ్యాసార్థం 12cm. వీటి మధ్య దూరం 5.0 cm (పటం). ఒక బాహ్య జనకం ద్వారా (పటంలో చూపలేదు) ఈ కెపాసిటర్ను ఆవేశితం చేస్తున్నారు. ఆవేశితం చేయడానికి 0.15 Aస్థిర విద్యుత్ ప్రవాహాన్ని పంపారు.
a) కెపాసిటర్ కెపాసిటెన్స్ను లెక్కించండి ; ప్లేట్ల మధ్య పొటెన్షియల్ భేదం రేటును కనుక్కోండి.
b) ప్లేట్ల మధ్య స్థానభ్రంశ విద్యుత్ ప్రవాహం లెక్కించండి.
c) కెపాసిటర్ ప్రతి ప్లేటు వద్ద కిర్కాఫ్ మొదటి నియమం (సంధి నియమం) చెల్లుబాటు అవుతుందా? వివరించండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 7
జవాబు:
పలకల వ్యాసార్ధం (r) = 12cm = 12 × 10-2 m
రెండు వృత్తాకార పలకల మధ్య దూరం (d) = 5 cm = 5 × 10-2 × m,
విద్యుత్ ప్రవాహం (I) = 0.15A

AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 8
(b) స్థానభ్రంశ విద్యుత్, వాహన విద్యుత్కు సమానం (Id) = 0.15 A.
(c) అవును, కిర్కాఫ్ మొదటి నియమం పాటిస్తుంది. కారణం ఇక్కడ వహన విద్యుత్ మరియు స్థానభ్రంశ విద్యుత్ల మొత్తం విద్యుత్ తీసుకుంటాం.

ప్రశ్న 2.
వ్యాసార్ధం R = 6.0 cm గల వృత్తాకార ప్లేట్లతో చేసిన సమాంతర ప్లేట్ల కెపాసిటర్ కెపాసిటెన్స్ C = 100 pF (పటం). ఈ కెపాసిటర్ను (కోణీయ) పౌనఃపున్యం 300 rad s-1 తో గల ఒక 230 Vల a.c జనకంతో సంధానం చేశారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 9
a) వహన (conduction) విద్యుత్ ప్రవాహ rms విలువ ఎంత?
b) వహన విద్యుత్ ప్రవాహ విలువ స్థానభ్రంశ విద్యుత్ ప్రవాహానికి సమానమా?
c) ప్లేట్ల మధ్యలో అక్షం నుంచి 3.0 cm వద్ద B పరిమాణం కనుక్కోండి.
జవాబు:
పలకల వ్యాసార్ధము (R) = 6 cm = 6 × 10-2 m
కెపాసిటర్ యొక్క కెపాసిటీ (C) = 100 PF 100 × 10-12 = 10-10F
వోల్టేజి (V) = 230 V
పౌనఃపున్యము (ω) = 300 rad/s

AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 10
b) అవును వహన ప్రవాహము, స్థానభ్రంశ ప్రవాహానికి సమానం.
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 11
c) పలకల మధ్య అక్షము నుండి బిందువు వలకు దూరం
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 12

AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు

ప్రశ్న 3.
10-10m తరంగదైర్ఘ్యం గల X- కిరణాలకూ, 6800 Å తరంగదైర్ఘ్యం గల ఎరుపు కాంతికీ, 500 m తరంగదైర్ఘ్యం గల రేడియో తరంగాలకూ సమానమైన భౌతికరాశి ఏది?
జవాబు:
ఇక్కడ X – కిరణాలు, ఎరుపు కాంతి మరియు రేడియో తరంగాలు అన్నీ విద్యుదయస్కాంత తరంగాలు. విద్యుదయస్కాంత తరంగాలు కాంతి వేగం (C) తో ప్రయాణిస్తాయి. అందువలన X – కిరణాలు, ఎరుపు కాంతి మరియు రేడియో తరంగాలు కాంతివేగంతో ప్రయాణిస్తాయి.

ప్రశ్న 4.
ఒక సమతల విద్యుదయస్కాంత తరంగం శూన్యంలో Z – దిశలో ప్రయాణిస్తున్నది. దాని విద్యుత్, అయస్కాంత క్షేత్ర సదిశల దిశల గురించి ఏమి చెప్పగలరు? తరంగ పౌనఃపున్యం 30MHz అయితే దాని తరంగదైర్ఘ్యం ఎంత?
జవాబు:
విద్యుదయస్కాంత తరంగాల దిశ, విద్యుత్ మరియు అయస్కాంతక్షేత్రాలకు లంబంగా ఉంటుంది. విద్యుదయస్కాంత తరంగం Z – అక్షం దిశలో ప్రయాణిస్తే, విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలు పరస్పరం లంబంగా X-Y దిశలలో ఉంటాయి.

పౌనఃపున్యము (f) = 30MHz = 30 × 106 Hz
వేగం (C) = 3 × 108 m/s
C = f λ
తరంగదైర్ఘ్యము (λ) = \(\frac{3\times10^8}{30\times10^6}=\frac{300}{30}\) = 10 m

ప్రశ్న 5.
ఒక రేడియో 7.5 MHz నుంచి 12 MHz వ్యాప్తి గల బ్యాండ్లో ఏ ప్రసార కేంద్రంతో అయినా శృతి కాగలదు. ఈ బ్యాండ్కు అనురూపమైన తరంగదైర్ఘ్యం బ్యాండ్ ఏమిటి?
జవాబు:
పౌనఃపున్యము (f1) = 7.5 MHz, (f2) = 12 MHz,
విద్యుదయస్కాంత తరంగాల వేగం (C) = 3 × 108 m/s
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 13
కాబట్టి తరంగదైర్ఘ్యము 25 m నుండి 40 m వరకు ఉండును.

ప్రశ్న 6.
ఒక విద్యుదావేశిత కణం తన మాధ్యమిక (సమతాస్థితి) బిందువు పరంగా 109 Hz పౌనఃపున్యంతో డోలనం చేస్తున్నది. ఈ డోలకం వల్ల ఉత్పత్తి అయిన విద్యుదయస్కాంత తరంగాల పౌనఃపున్యం ఎంత?
జవాబు:
విద్యుదయస్కాంత తరంగాల పౌనఃపున్యము = 109 Hz.
డోలకం ద్వారా జనించి విద్యుదయస్కాంత తరంగాల పౌనఃపున్యము, సమతాస్థితి నుండి డోలనం చెందే ఆవేశిత కణం పౌనఃపున్యానికి సమానం.

ప్రశ్న 7.
శూన్యంలో ఒక హరాత్మక విద్యుదయస్కాంత తరంగ అయస్కాంత క్షేత్ర భాగం (అంశ) దోలన పరిమితి B0 = 510 nT. ఈ తరంగ విద్యుత్ క్షేత్ర భాగం (అంశ) దోలన పరిమితి ఎంత?
జవాబు:
అయస్కాంతక్షేత్రం B0 = 510nT
శూన్యంలో కాంతివేగం (C) = \(\frac{E_0}{B_0}\)
E0 అనునది తరంగం విద్యుత్ అంశభాగం
3 × 108 = \(\frac{E_0}{510\times10^{-9}}\)
E0 = 153 N/C

ప్రశ్న 8.
ఒక విద్యుదయస్కాంత తరంగ విద్యుత్ క్షేత్ర పరిమాణం E0 = 120 N/C అనీ, దాని పౌనఃపున్యం V = 50.0 MHz. అనీ భావించండి. (a) B0, ω, k, λ లనూ b) E, B లకు సమాసాలనూ కనుక్కోండి.
జవాబు:
విద్యుదయస్కాంత తరంగం కంపన పరిమితి E0 = 120N/C
పౌనఃపున్యము (f) = 50 MHz 50 × 106 Hz

a) శూన్యంలో కాంతివేగం
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 14

b) విద్యుత్ క్షేత్రం E = E0 sin (kx – ωt)
E = 120 sin (1.05 × 3.14 × 108 t)
అయస్కాంత క్షేత్రం B = B0 sin (kx – wt )
B = 4 × 10-7 sin (1.05 x -3.14 × 108 t)

AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు

ప్రశ్న 9.
విద్యుదయస్కాంత తరంగ వర్ణపటంలోని వివిధ భాగాల పారిభాషిక పదాలను పాఠంలో పేర్కొన్నారు. – E = hυ సూత్రాన్ని ఉపయోగించి (వికిరణ శక్తి క్వాంటంకు: ఫోటాన్) ఫోటాన్ శక్తిని eV ప్రమాణాలలో, వివిధ విద్యుదయస్కాంత వర్ణపట భాగాలకు, కనుక్కోండి. మీరు పొందిన ఫోటాన్ శక్తుల వివిధ స్కేళ్ళు (మానాలు) ఏ (విధంగా) విద్యుదయస్కాంత వికిరణ జనకాలకు సంబంధించినవో తెలపండి.
జవాబు:
ఫోటాన్ శక్తి (E) = hν

γ – కిరణాలకు :
γ – కిరణాల పౌనఃపున్యము V = 3 × 1020 Hz
γ – కిరణాల శక్తి E = hν = 6.6 × 10-34 × 3 × 1020 = 19.8 × 10-14 J
E = \(\frac{19.8\times10^{-14}}{1.6\times10^{-19}}\) = 1.24 × 106 eV
γ – కిరణాల కేంద్రక విస్ఫోటనం, సంలీనం అప్పుడు జనిస్తాయి.

X- కిరణాలకు :
పౌనఃపున్యము (v) = 3 × 1018 Hz
(E)=hv 6.6 × 10-34 × 3 × 1020 = 19.8 × 10-14 J
E = \(\frac{19.8\times10^{-14}}{1.6\times10^{-19}}\) = 1.24 × 104 eV

అత్యధిక వేగంలో ఉన్న ఎలక్ట్రాన్ త్వరణం తగ్గుట వల్ల X- కిరణాలు జనిస్తాయి.

అతినీలలోహిత కిరణాలు :
పౌనఃపున్యము (v) = 1015 Hz
(E) hv 6.6 × 10-34 × 1015 = 6.6 × 10-19 J
E = \(\frac{6.6\times10^{-19}}{1.6\times10^{-19}}\) = 4.125 eV

దృగ్గోచర కాంతి :

పౌనఃపున్యము (v) = 6 × 1014 Hz
శక్తి (E) = hν = 6.6 × 10-34 × 6 × 1014 = 39.6 × 10-20 J
E = \(\frac{39.6\times10^{-20}}{1.6\times10^{-19}}\) = 2.475 eV

పరారుణ కిరణాలు :
పౌనఃపున్యము (v) = 1013 Hz
శక్తి (E) = hν = 6.6 × 10-34 × 1013 = 6.6 × 10-21 J
E = \(\frac{6.6\times10^{-21}}{1.6\times10^{-19}}\) = 4.125 × 10-2 eV

మైక్రోతరంగాలు :
పౌనఃపున్యము (v) = 1010 Hz
శక్తి (E) = hν = 6.6 × 10-34 × 1010 6.6 × 10-24 J
E = \(\frac{6.6\times10^{-24}}{1.6\times10^{-19}}\) = 4.125 × 105 eV

రేడియో తరంగాలు:
పౌనఃపున్యము (v) = 3 × 108 Hz
శక్తి (E) = hν = 6.6 × 10-34 × 3 × 108 = 19.8 × 10-26 J
E = \(\frac{19.8\times10^{-26}}{1.6\times10^{-19}}\) = 1.24 × 10-6 eV

వికిరణ రకంఫోటాన్ శక్తి
γ – కిరణాలు1.24 × 106 eV
X – కిరణాలు1.24 × 104 eV
అతినీలలోహిత కిరణాలు4.12 eV
దృగ్గోచర కాంతి2.475 eV
పరారుణ కిరణాలు4.125 × 10-2 eV
మైక్రో తరంగాలు4.125 × 10-5 eV
రేడియో తరంగాలు1.24 × 10-6 eV

ప్రశ్న 10.
ఒక సమతల విద్యుదయస్కాంత తరంగంలో విద్యుత్ క్షేత్రం జ్యావక్రీయంగా 2.0 × 1010 Hz పౌనఃపున్యంతో డోలనం చేస్తున్నది ; దోలన పరిమితి 48 Vma-1.
a) తరంగం తరంగదైర్ఘ్యం ఎంత?
b) డోలనం చేసే అయస్కాంతక్షేత్ర దోలన పరిమితి ఎంత?
c) E క్షేత్ర సగటు శక్తి సాంద్రత, B క్షేత్ర సగటు శక్తిసాంద్రతకు సమానం అని చూపండి. [c = 3 × 108 ms-1‘].
జవాబు:
డోలన పౌనఃపున్యము = 2 × 1010 Hz
C = 3 × 108m/s
విద్యుత్ క్షేత్ర కంపన పరిమితి (E0) = 48V/m
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 15

విద్యుత్ క్షేత్ర సగటు శక్తి సాంద్రత, అయస్కాంత క్షేత్ర (B) శక్తి సాంద్రతకు సమానం.

అదనపు అభ్యాసము Additional Exercises

ప్రశ్న 11.
శూన్యంలో ఒక విద్యుదయస్కాంత తరంగ విద్యుత్ క్షేత్ర (అంశం) భాగం
E = {(3.1 N/C) cos [(1.8 rad/m) y + {5.4 × 106 rad /s} t]} i.
a) తరంగ ప్రసార దిశ ఏమిటి?
b) తరంగ తరంగదైర్ఘ్యం ఎంత?
c) పౌనః పున్యం v ఎంత?
d) తరంగ అయస్కాంతక్షేత్ర భాగం డోలన పరిమితి ఎంత?
e) తరంగ అయస్కాంత క్షేత్ర భాగానికి సమాసాన్ని రాయండి.
జవాబు:
a) సమీకరణం నుండి ఇది ఋణ y – అక్షం దిశలో చలిస్తుంది. కాబట్టి – \(\hat{j}\) దిశలో చలిస్తుంది.
b) శూన్యంలో విద్యుదయస్కాంత తరంగం విద్యుత్ అంశం
E = 3.1 cos (1.84 +5.4 x 106t) \(\hat{i}\)
దీనిని E = E0 cos (ky + ωt) తో పోల్చగా
కోణీయ పౌనఃపున్యము (a) = 5.4 × 106 rad/s
తరంగసంఖ్య (K) 1.8 rád/m
తరంగం యొక్క విద్యుత్ అంశం కంపన పరిమితి E0 = 3.1N/C
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 16

e) అయస్కాంత క్షేత్ర అంశము
B = B0 cos (ky + ωt) \(\hat{k}\)
B = 1.03 × 108 cos (1.8 y + 5.4 × 108 t) \(\hat{k}\)

AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు

ప్రశ్న 12.
100 W విద్యుత్ బల్బు సామర్ధ్యంలో దాదాపు 5% దృశ్య వికీరణంగా పరివర్తనం చెందింది. అయితే,
a) బల్బు నుంచి 1m దూరంలో
b) బల్బు నుండి 10m దూరంలో
దృశ్య వికిరణ సగటు తీవ్రత ఎంత? వికిరణ సమదైశికంగా ఉద్గారమౌతుందనీ, పరావర్తనాన్ని ఉపేక్షించవచ్చనీ భావించండి.
జవాబు:
మొత్తం సామర్ధ్యం = 100 W
దృగ్గోచర వికిరణ సామర్ధ్యము = మొత్తం సామర్ధ్యంలో 5% = \(\frac{5}{100}\) × 100 = 5W

a) 1m దూరంలో, శక్తి గోళాకారంగా వితరణ చెంది ఉంటే గోళం యొక్క వైశాల్యం = 4π (వ్యాసార్ధం)²
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 17

ప్రశ్న 13.
λm T = 0.29 cm K ఫార్ములాను ఉపయోగించి విద్యుదయస్కాంత వర్ణపటంలోని వివిధ భాగాల అభిలక్షణ ఉష్ణోగ్రతా వ్యాప్తులను కనుక్కోండి. మీరు పొందిన విలువలు (సంఖ్యలు) ఏమి చెబుతాయి?
జవాబు:
λm T = 0.29cm-K, λm = 10-68m తీసుకుంటే
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 18
ఈ ఉష్ణోగ్రతలు విద్యుదయస్కాంత తరంగాల ఉష్ణోగ్రతల వ్యాప్తిని తెలుపుతాయి.

ప్రశ్న 14.
భౌతిక శాస్త్రంలో వివిధ సందర్భాల్లో విద్యుదయస్కాంత వికిరణాలకు సంబంధించిన ప్రముఖమైన సంఖ్యలు కింద ఇవ్వడమైంది. వీటిలో ప్రతి సంఖ్య ఏ విద్యుదయస్కాంత వర్ణపట భాగానికి సంబంధించినదో తెలపండి.
a) 21 cm (అంతర్ నక్షత్ర, అంతరాళంలోని పరమాణు హైడ్రోజన్ ఉద్గారించే తరంగదైర్ఘ్యం)
b) 1057 MHz (లాంబ్ విస్థాపనం : అత్యంత సమీపంలో ఉన్న రెండు హైడ్రోజన్ శక్తిస్థాయిల మధ్య ఎలక్ట్రాన్ సంక్రమణ వికిరణ పౌనఃపున్యం).
c) 2.7K [విశ్వారంభపు తొలి పేలుడుతో అంతరాళంలో నిండిన సమదైశిక అవశేష వికిరణ సంబంధిత ఉష్ణోగ్రత).
d) 5890 Å – 5896 Å [సోడియం జంట వర్ణపట రేఖలు]
e) 14.4 keV [అధిక పృథక్కరణ వర్ణపటశాస్త్ర పద్ధతికి సంబంధించిన 57Fe కేంద్రకంలో ప్రత్యేక సంక్రమణంలో వెలువడిన శక్తి (మాస్బార్ (Mossbauer) వర్ణపట శాస్త్రం)].
జవాబు:
a) ఈ తరంగదైర్ఘ్యం (21 cm) రేడియో తరంగాలకు సంబంధించినది.
b) ఈ పౌనఃపున్యము (1057 MHz) కూడా రేడియో తరంగాలకు సంబంధించినది.
c) T = 2.7 K
λm T = 0.29 cm – K
∴ λm = \(\frac{0.29}{2.7}\) cm = 0.11cm
ఈ తరంగదైర్ఘ్యం మైక్రోతరంగాలకు సంబంధించినది.

d) ఈ తరంగదైర్ఘ్య అవధి దృగ్గోచర ప్రాంతానికి చెందినది.
e) శక్తి (E) = 14,4KeV = 14.4 × 10³ × 1.6 × 10-19J
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 19
ఈ పౌనఃపున్యము X- కిరణాలకు సంబంధించినది.

ప్రశ్న 15.
కింది ప్రశ్నలకు సమాధానం తెలపండి.
a) సుదూర రేడియో ప్రసారాలకై హ్రస్వ – తరంగ బ్యాండ్ (short-wave bands) (హ్రస్వ తరంగదైర్ఘ్య వ్యాప్తి) ని వాడతారు. ఎందుకు?
b) సుదూర T.V ప్రసారాలకు ఉపగ్రహాలను వాడటం అవసరం. ఎందుకు?
c) ఖగోళ శాస్త్ర అధ్యయనానికి భూఉపరితలంపై దృశ్య, రేడియో టెలిస్కోప్ల నిర్మాణం జరిగింది. అయితే X-కిరణ ఖగోళశాస్త్ర అధ్యయనం కేవలం భూమిచుట్టూ తిరిగే కృత్రిమ ఉపగ్రహాలవల్లనే సాధ్యం. ఎందువల్ల?
d) మానవజాతి మనుగడకు స్ట్రాటో ఆవరణపైన గల సన్నటి ఓజోన్ పొర అత్యంత కీలకమైంది. ఎందుకు?
e) ఒకవేళ భూమి వాతావరణాన్ని కలిగి ఉండకపోతే, సగటు భూతల ఉష్ణోగ్రత విలువ ఇప్పటి విలువ కంటే ఎక్కువగా ఉండేదా ? తక్కువగా ఉండేదా?
f) భూగోళంపై ప్రపంచ వ్యాప్త న్యూక్లియర్ యుద్ధం తరువాత వచ్చే తీవ్రమైన న్యూక్లియర్ శీతాకాలంతో భూమిపై జీవాలకు వినాశకరమైన ఫలితం కలగబోతుందని కొంతమంది శాస్త్రజ్ఞులు భవిష్యద్దర్శనం చేశారు. ఈ భవిష్యద్దర్శనం మూలం ఏమై ఉండవచ్చు?
జవాబు:
a) రేడియో తరంగాలను ఎక్కువ దూరం ప్రసారంచేయుటకు అల్పతరంగదైర్ఘ్యాలను వాడతారు. కారణం అవి ఐనో ఆవరణం నుండి పరావర్తనం చెందుతాయి.

b) T.V ప్రసారాలకు ఉపగ్రహాలను వాడతారు కారణం T.V సంకేతాలు అధిక పౌనఃపున్యాలు కలిగి ఐనో ఆవరణము నుండి పరావర్తనం చెందవు కావున పరావర్తనం చెందించడానికి ఉపయోగిస్తారు.

c) రేడియో తరంగాలు వాతావరణం గుండా చొచ్చుకు పోతాయి కాబట్టి దృశా మరియు రేడియో టెలీస్కోప్లలో వాడతారు. కాని X- కిరణాలు తక్కువ తరంగదైర్ఘ్యం కలిగి వాతావరణంలో శోషింపబడతాయి. కావున దృశా మరియు రేడియో టెలీస్కోప్లు భూమిపై పనిచేస్తాయి. కాని X- కిరణాలను భూ వాతావరణంలో పరిభ్రమించే ఖగోళ దూరదర్శినిలలో ఉపయోగిస్తారు.

d) సన్నని ఓజోన్ పొర అతినీలలోహిత కిరణాలను అధిక భాగం శోషించుకుంటుంది. ఇవి చాలా ప్రమాదకరం, కణజాలాన్ని నష్టపరుస్తాయి. ఓజోన్ పొర అతినీలలోహిత కిరణాలు భూమిని చేరకుండా, మనలను కాపాడుతుంది.

e) భూమిపై వాతావరణం లేకపోతే, వాతావరణంలో గ్రీన్ హౌస్ ప్రభావం లేకపోతే భూవాతావరణం చల్లగా ఉంటుంది.

f) అణుయుద్ధం వలన భూమిపై మేఘాలు ఏర్పడి, సూర్యకాంతి భూమిని చేరదు. అందువలన భూమిపై శీతాకాలం వలె ఉంటుంది.

సాధించిన సమస్యలు Textual Examples

ప్రశ్న 1.
1m వ్యాసార్ధం ఉన్న వృత్తాకార ప్లేట్లుగల ఒక సమాంతర పలకల కెపాసిటర్ కెపాసిటెన్స్ 1 nF. t = 0 వద్ద ఈ కెపాసిటర్ను ఆవేశితం చేయడానికిగానూ 2 V బ్యాటరీకి,’ నిరోధం R = 1 M Ω తో శ్రేణిలో సంధానం చేశారు. t = 10-3s తరవాత కెపాసిటర్ ప్లేట్ల అంచుకు, కేంద్రానికి సరిగ్గా మధ్యలో అయస్కాంత క్షేత్రాన్ని లెక్కించండి. కాలం t వద్ద కెపాసిటర్పై ఆవేశం q (t) = CV [1 – exp (−t/7)], ఇక్కడ కెపాసిటర్ కాల స్థిరాంకం. ఇది CR కి సమానం.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 20
CR వలయ కాల స్థిరాంకం τ = CR = 10-3s. అప్పుడు,
q(t) = CV [1 – exp (−t/τ)] = 2 × 10-9 [1 – exp (−t / 10-3]
కాలం వద్ద ప్లేట్ల మధ్య విద్యుత్ క్షేత్రం
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 21

ఇప్పుడు సమాంతర ప్లేట్లకు సమాంతరంగా వ్యాసార్థం (1/2)m ఉండేట్లు, P బిందువు ద్వారా పోయే ఒక వృత్తాకార లూప్ను ఊహించండి. ఈ లూప్ పరిధి వెంబడి అన్ని బిందువుల వద్ద అయస్కాంత క్షేత్రం B సమాన విలువను కలిగి ఉంటుంది.

ఈ లూప్ ద్వారా విద్యుత్ క్షేత్ర అభివాహం,
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 22

ప్రశ్న 2.
శూన్యంలో, X – అక్షం దిశలో ప్రయాణిస్తున్న ఒక సమతల విద్యుదయస్కాంత తరంగ పౌనఃపున్యం 25 MHz. కాల-అంతరాళంలో ఒక నిర్దిష్ట బిందువు వద్ద, E = 6.3 j V/m. ఆ బిందువు వద్ద B ఎంత?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 23
దిశను కనుక్కోవడానికి, y- అక్షం వెంబడి Eని, X- అక్షం వెంబడి తరంగం ప్రసారమవుతుందని గుర్తిద్దాం. అందువల్ల x, y అక్షాలకు రెండింటికీ లంబ దిశలో B తప్పక ఉండి తీరాలి. సదిశా బీజగణితాన్ననుసరించి, Ex B x-అక్షం దిశలోనే ఉండాలి. ఎందుకంటే, (+ \(\hat{j}\)) × (+ \(\hat{k}\)) = i కాబట్టి B z- అక్షం వెంబడి ఉంటుంది.
అందువల్ల, B = 2.1 × 10-8 \(\hat{k}\)T.

AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు

ప్రశ్న 3.
ఒక సమతల విద్యుదయస్కాంత తరంగంలోని అయస్కాంత క్షేత్రం సమీకరణం BH = 2 × 10-7 sin (0.5 × 10³ x + 1.5 × 1011t)T.
a) తరంగం తరంగదైర్ఘ్యం, పౌనఃపున్యం ఎంత?
b) విద్యుత్ క్షేత్రానికి సమాసాన్ని వ్రాయండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 24
b) E0 = B0c = 2 × 10-7 T × 3 × 108 m/s = 6 × 10¹ V/m
తరంగ ప్రసార దిశకూ, అయస్కాంత క్షేత్ర దిశకు లంబంగా విద్యుత్ క్షేత్ర అంశం ఉంటుంది. అందువల్ల, 2- అక్షం వెంబడి విద్యుత్ క్షేత్ర అంశాన్ని, Ez = 60 sin (0.5 × 10³x + 1.5 ×x 1011t) V/m అని పొందవచ్చు.

ప్రశ్న 4.
ఒక అపరావర్తక తలంపై లంబంగా పతనమయ్యే కాంతి శక్తి అభివాహం 18 W/cm². తలం వైశాల్యం 20 cm² అయితే, 30 నిమిషాల కాలంపాటు తలంపై ప్రయోగించే సగటు బలం కనుక్కోండి.
సాధన:
తలంపై పతనమయ్యే మొత్తం శక్తి, U = (18 W/cm²) × (20 cm²) × (30 × 60) = 6.48 × 105 J
అందువల్ల, (పూర్తి శోషణానికి) తలానికి అందిన మొత్తం ద్రవ్యవేగం,
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 25
తలం పరిపూర్ణ పరావర్తకమైతే మీ సమాధానం ఎలా మారుతుంది?

AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు

ప్రశ్న 5.
దూరంలో ఉన్న 100 W విద్యుద్దీపం నుంచి వెలువడే వికిరణం వల్ల జనించే విద్యుత్, అయస్కాంతక్షేత్రాలను లెక్కించండి. దీపాన్ని బిందు జనకంగానూ, దాని దక్షతను 2.5% గానూ భావించండి.
సాధన:
బిందు జనకంగా భావించిన విద్యుద్దీపం అన్ని దిశల్లోకి ఏకరీతిగా కాంతిని వెలువరిస్తుంది. దానికి 3m దూరంలో ఉన్న ఆవరించగలిగిన గోళం ఉపరితల వైశాల్యం A = 4π² = 4π(3)² = 113 m²
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 26

పైన కనుక్కొన్న E విలువ విద్యుత్ క్షేత్రం వర్గమధ్యమ మూలం (root mean square) విలువను ఇస్తుంది. ఒక కాంతిపుంజంలోని విద్యుత్ క్షేత్రం జ్యావిక్రీయం కాబట్టి, విద్యుత్త్ర శిఖర విలువ
Eo = √2 Erms = √2 × 2.9 V/m = 4.07 V/m

మనం చదవడానికి ఉపయోగించే కాంతి విద్యుత్ క్షేత్ర తీవ్రత చాలినంత అధికంగా ఉండటాన్ని మనం గమనిస్తాం. కొన్ని మైక్రో వోల్ట్ / మీటర్ విద్యుత్ క్షేత్ర తీవ్రత ఉండే టి.వి లేదా FM తరంగాల విద్యుత్ క్షేత్రంతో కాంతి విద్యుత్ క్షేత్ర తీవ్రతను పోల్చి చూడండి.
ఇప్పుడు మనం అయస్కాంత క్షేత్ర సత్వాన్ని (strength) లెక్కిద్దాం.
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 27

అయస్కాంత క్షేత్రపు శక్తి విద్యుత్ ప్రేరపు శక్తికి సమానమైన అయస్కాంత క్షేత్ర తీవ్రత చాలా బలహీనమైనదని స్పష్టమోతోంది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Physics Study Material 9th Lesson విద్యుదయస్కాంత ప్రేరణ Textbook Questions and Answers.

AP Inter 2nd Year Physics Study Material 9th Lesson విద్యుదయస్కాంత ప్రేరణ

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఫారడే, హెన్రీ చేసిన ప్రయోగాలు ఏమి నిరూపించాయి?
జవాబు:
ఫారడే మరియు హెన్రీ అనేక ప్రయోగాల ఆధారంగా విద్యుదయస్కాంత ప్రేరణ ఆవిష్కరణ మరియు అర్థం చేసుకోవడం జరిగింది.

ప్రశ్న 2.
అయస్కాంత అభివాహాన్ని నిర్వచించండి.
జవాబు:
ఒక తలం నుండి పోయే మొత్తం అయస్కాంత బలరేఖల సంఖ్యను అయస్కాంత అభివాహం అంటారు.
ΦB = \(\overrightarrow{B}.\overrightarrow{AB}\) = BA cos θ
C.G.S ప్రమాణం → మాక్స్వెల్
S.I. ప్రమాణం → వెబర్ (wb)
అయస్కాంత అభివాహం అదిశరాశి.

ప్రశ్న 3.
ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ నియమాన్ని తెలపండి.
జవాబు:
ప్రేరిత విద్యుచ్ఛాలక బలం పరిమాణం, అయస్కాంత అభివాహంలో మార్పు రేటుకు అనులోమానుపాతంలో ఉంటుంది.
ε ∝ \(\frac{-\mathrm{d} \phi}{\mathrm{dt}}\)

ప్రశ్న 4.
లెంజ్ నియమాన్ని తెలపండి.
జవాబు:
ప్రేరిత విద్యుచ్ఛాలక బలదిశ ఎప్పుడూ దాన్ని కలగచేసిన అయస్కాంత క్షేత్ర అభివాహం మార్పును వ్యతిరేకిస్తుంది. ఈ నియమాన్ని లెంజ్ నియమం అంటారు.

ప్రశ్న 5.
ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో వాహకాన్ని కదిలించినప్పుడు యాంత్రిక శక్తి (చలనం యొక్క) ఏమౌతుంది?
జవాబు:
అయస్కాంత క్షేత్రంలో వాహకం చలనం వల్ల చలన విద్యుచ్ఛాలక బలం జనిస్తుంది.
చలన వి.చా.బ (ε) = Blυ.

AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ

ప్రశ్న 6.
ఎడ్డీ విద్యుత్ ప్రవాహాలు అంటే ఏమిటి? [AP. Mar. ’15]
జవాబు:
ఎడ్డీ విద్యుత్ ప్రవాహాలు లేదా ఫోకాల్టు ప్రవాహాలు:
వాహకాలను మారుతున్న అయస్కాంత అభివాహానికి గురిచేసినప్పుడు, వాటిలో ప్రేరిత విద్యుత్ ప్రవాహాలు ఉత్పన్నమవుతాయి. ఈ సుళ్ళు తిరిగే విద్యుత్ ప్రవాహాలను ఎడ్డీ ప్రవాహాలు అంటారు. ఎడ్డీ ప్రవాహాల వల్ల ఉష్ణరూపంలో శక్తి నష్టం జరుగుతుంది.

ప్రశ్న 7.
ప్రేరకత్వాన్ని నిర్వచించండి.
జవాబు:
ప్రేరకత్వం అనునది విద్యుదయస్కాంత ప్రేరణ గుణకం. ఇది కెపాసిటెన్స్ వలె పదార్థం యొక్క స్వతస్సిద్ధ ధర్మం. ప్రేరకత్వం అనునది అదిశరాశి. ఇది తీగచుట్ట జ్యామితిపైన ఆధారపడుతుంది.

ప్రశ్న 8.
‘స్వయం ప్రేరకత్వం’ అంటే మీరు ఏమి అర్ధం చేసుకొన్నారు?
జవాబు:
ఒక తీగచుట్టలో విద్యుత్ ప్రవాహంలో మార్పు రేటు ఏకాంక విలువ అయితే, దానిలో జనించే ప్రేరిత విద్యుచ్ఛాలక బలాన్ని స్వయం ప్రేరకత అంటారు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 1

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
గమన తలానికి లంబంగా ఉన్న ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో విద్యుత్ వాహకం చలించినప్పుడు వాహకం కొనల మధ్య ప్రేరితమయ్యే విద్యుచ్ఛాలక బలానికి సమాసాన్ని పొందండి.
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 2
దీర్ఘ చతురస్రాకార వాహకం ABCD పై l పొడవు గల PQ వాహకం \(\overrightarrow{B}\) ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో υ ఏకరీతి వేగంలో స్వేచ్ఛగా చలిస్తోందనుకొనుము. ఏదైనా అనియత ఆవేశము q వాహకంలో అదే వేగంతో క్షేత్రంలో చలిస్తోందనుకొనుము.
ఈ ఆవేశంపై లారెంజ్ బలం
(F) = Bqυ ……….. (1)
P నుండి Qకు ఆవేశము చలించుటకు జరిగిన పని
W = బలం × స్థానభ్రంశం
W = Bqυ × l (2) (బలం దిశ ఫ్లెమింగ్ ఎడమచేతి నియమం ఆధారంగా చూపబడుతుంది.)
చలనాత్మక విద్యుచ్ఛాలక బలం (ε) = \(\frac{w}{q}\)
ε = \(\frac{Bqυl}{q}\)
చలనాత్మక విద్యుచ్ఛాలక బలం (ε) = Blυ.

ప్రశ్న 2.
ఎడ్డీ విద్యుత్ ప్రవాహాలను లాభదాయకంగా ఎన్ని విధాలుగా ఉపయోగించవచ్చో వర్ణించండి. [AP. Mar.’17; AP. Mar: ’16; AP & TS. Mar.’15]
జవాబు:
i) రైళ్ళలో అయస్కాంత బ్రేకులు :
విద్యుత్ సామర్థ్యంతో నడిచే కొన్ని రైళ్ళలో, వాటిలోని ఇనుప కమ్మీలపైన ప్రబల విద్యుదయస్కాంతాలను అమరుస్తారు. ఈ విద్యుదయస్కాంతాలు చర్యలోకి రాగానే, ఆ ఇనుప కమ్మీలలో ప్రేరితమయ్యే ఎడ్డీ ప్రవాహాలు రైలు చలనాన్ని వ్యతిరేకిస్తాయి. కాబట్టి రైలు ఆగిపోవడం అనే ప్రభావం మృదువుగా జరుగుతుంది.

ii) ప్రేరణ మోటార్ :
షార్ట్ సర్క్యూట్ చేసిన రోటర్ను ఎడ్డీ విద్యుత్ ప్రవాహాలు తిప్పుతాయి. సీలింగ్ ఫ్యాన్ కూడా ప్రేరణ మోటార్. ఇది ఒకే దశ ఏకాంతర విద్యుత్ ప్రవాహంలో పనిచేస్తుంది.

iii) విద్యుదయస్కాంత అవరుద్ధం :
కొన్ని గాల్వనీ మాపకాలలో అయస్కాంతీయ లోహ పదార్థంతో తయారయిన ఒక కోర్ బిగించి ఉంటుంది. ఇందులోని తీగచుట్ట డోలనాలు చేసినప్పుడు ఆ కోర్లో ఉత్పత్తి అయ్యే ఎడ్డీ ప్రవాహాలు దాని చలనాన్ని వ్యతిరేకించి, వెంటనే తీగచుట్టను విరామస్థితికి తీసుకొస్తాయి.

iv) ప్రేరణ కొలిమి :
అత్యధిక ఉష్ణోగ్రతలను ఉత్పత్తి చేయడానికి ప్రేరణ’ కొలిమిని ఉపయోగించవచ్చు. ఈ ఉష్ణోగ్రతలను వాడుకోవడం ద్వారా అంశిక భాగాలుగా ఉన్న లోహాలను కరిగించి మిశ్రమ లోహాలను తయారుచేయవచ్చు. కరిగించవలసిన లోహాలను ఆవృతం చేసే తీగచుట్ట ద్వారా అధిక పౌనఃపున్యం గల ఏకాంతర విద్యుత్ ప్రవాహాన్ని పంపిస్తారు. అప్పుడు ఆ లోహాలలో జనించే ఎడ్డీ ప్రవాహాలు ఆ లోహాలను కరిగించే ఉష్ణోగ్రతలను ఉత్పత్తి చేస్తాయి.

v) విద్యుత్ సామర్థ్య మీటర్లు :
మన ఇళ్ళలో వాడే అనలాగ్ మీటర్లలోని మెరిసే లోహపు బిళ్ళ ఎడ్డీ ప్రవాహాల వల్లనే భ్రమిస్తూ ఉంటుంది. ఒక తీగచుట్టలో జ్యావక్రీయంగా మారే ప్రవాహాలు ఉత్పత్తి చేస్తే అయస్కాంత క్షేత్రాలు ఈ బిళ్ళలో విద్యుత్ ప్రవాహాలను ప్రేరేపిస్తాయి. ఈ విధంగా తిరుగుతున్న మెరిసే బిళ్ళను మీ ఇంట్లోని సామర్థ్య మీటర్లో గమనించవచ్చు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ

ప్రశ్న 3.
రెండు పొడవైన సహాక్ష సాలినాయిడ్ల అన్యోన్య ప్రేరకత్వానికి ఒక సమాసాన్ని పొందండి.
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 3
పటంలో రెండు సాలినాయిడ్లను చూడవచ్చు. ప్రాథమిక చుట్ట పొడవు l మరియు అడ్డుకోత వైశాల్యం A అనుకొనుము. N1 మరియు N2లు ప్రాథమిక, గౌణ చుట్టలలో చుట్ల సంఖ్య n1 మరియు n2లు. ప్రమాణ పొడవులలో చుట్లసంఖ్య [n1 = \(\frac{N_1}{l}\) మరియు n2 = \(\frac{N_2}{l}\)]. ప్రాథమిక తీగచుట్టలో విద్యుత్ ప్రవాహం i అనుకొనుము.
ప్రాథమిక తీగచుట్టలో అయస్కాంత ప్రేరణ (B) = µ0n1 I = \(\frac{\mu_0 \mathbf{N}_1 \mathrm{I}}{l}\) …………. (1)
ప్రాథమిక తీగచుట్టలో ప్రతి చుట్ట గుండా అయస్కాంత అభివాహం
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 4

ప్రశ్న 4.
అయస్కాంత క్షేత్రం, సాలినాయిడ్ వైశాల్యం, పొడవు పదాలలో సాలినాయిడ్లో నిల్వ ఉండే అయస్కాంత శక్తికి ఒక సమాసాన్ని పొందండి.
జవాబు:
L ప్రేరకత గల ప్రేరకం గుండా విద్యుత్ ప్రవహిస్తే, దానిలో ప్రేరిత విద్యుచ్ఛాలక బలం
ε = -L \(\frac{dI}{dt}\)dI ………….. (1)
(ఇక్కడ ఋణ గుర్తు వి.చా. బ., విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకిస్తుంది.)
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 5

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఫారడే, హెన్రీలు చేసిన అసాధారణ ప్రయోగాలను సంగ్రహంగా వివరించి, విద్యుదయస్కాంతత్వాన్ని అర్థం చేసుకోవడంలో ఈ ప్రయోగాలు చేసిన అంశదానాల ప్రాధాన్యతను ఇవ్వండి.
జవాబు:
ఫారడే మరియు హెన్రీ ప్రయోగాలు :
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 6
ప్రయోగం 1:
సాపేక్ష చలనం వల్ల అయస్కాంతం విద్యుత్ ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది.

  1. పరికరంలో తీగచుట్టకు గాల్వనామీటరు G కలుపబడి ఉంటుంది మరియు దండాయస్కాంతము ఉంటుంది.
  2. దండాయస్కాంతం (NS) నిశ్చలంగా ఉన్నప్పుడు, గాల్వనా మీటరులో అపవర్తనం ఉండదు.
  3. దండాయస్కాంతం యొక్క ఉత్తర ధృవాన్ని తీగచుట్టవైపు జరిపితే వలయంలో ప్రేరిత విద్యుత్ ప్రవహించి, గాల్వనామీటరులో ఒకవైపు అపవర్తనం కలుగుతుంది.
  4. దండాయస్కాంతం యొక్క ఉత్తర ధృవాన్ని, తీగచుట్ట నుండి దూరంగా జరిపితే వలయంలో ప్రేరిత విద్యుత్ ప్రవహించి, గాల్వనామీటరులో ఇప్పుడు వ్యతిరేక దిశలో అపవర్తనం కలుగుతుంది.
  5. దండాయస్కాంతంను తీగచుట్టకు దగ్గరగా (లేదా) దూరంగా వేగంగా జరిపితే గాల్వనామీటరులో అపవర్తనం ఎక్కువగా ఉంటుంది.
  6. దండాయస్కాంతం దక్షిణ ధ్రువాన్ని తీగచుట్టకు దగ్గరగా (లేదా) దూరంగా జరిపితే గాల్వనామీటరులో అపవర్తనం ఉత్తర ధ్రువంలో వచ్చు అపవర్తనానికి వ్యతిరేక దిశలో ఉంటుంది.

దీనిని బట్టి తీగచుట్టకు, అయస్కాంత క్షేత్రానికి మధ్య సాపేక్షవేగం ఉన్నప్పుడు మాత్రమే విద్యుచ్ఛాలకు బలం ప్రేరితమవుతుంది. అయస్కాంతం మరియు తీగచుట్టకు మధ్య సాపేక్ష చలనం అధికంగా ఉంటే ప్రేరిత వి.చా.బ (లేదా) విద్యుత్ అధికంగా జనిస్తుంది.

ప్రయోగం 2:
తీగచుట్ల మధ్య సాపేక్ష గమనం వల్ల ప్రేరిత విద్యుత్ జనించుట :
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 7

  1. దండాయస్కాంతంను తీసివేసి బ్యాటరీ కలిపిన గౌణ తీగచుట్ట C2 ను పటంలో చూడండి.
  2. తీగచుట్టలో C2 లో స్థిర విద్యుత్ ప్రవాహము స్థిర అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది.
  3. C2 తీగచుట్టను C1 తీగచుట్ట వైపు జరిపితే, గాల్వనామీటరు అపవర్తనాన్ని చూపుతుంది. తీగచుట్ట C1 లో విద్యుత్ ప్రవాహం ప్రేరితమవుతుందని ఇది సూచిస్తుంది.
  4. C2 తీగచుట్టను దూరంగా జరిపితే గాల్వనా మీటరులో వ్యతిరేక దిశలో అపవర్తనం కలుగుతుంది.
  5. C2 తీగచుట్ట చలనంలో ఉన్నంతసేపు అపవర్తనం చూపుతుంది.
  6. C2 తీగచుట్టను స్థిరంగా ఉంచి, C1 ని కదిల్చినా ఒకే విధమైన ప్రభావాన్ని చూడవచ్చు.

ప్రయోగం 3 :
సాపేక్ష చలనం లేకుండా మారే విద్యుత్ ప్రవాహం, విద్యుత్ ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది :
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 8

  1. ఫారడే ప్రయోగం ద్వారా సాపేక్ష గమనం తప్పనిసరి కాదని నిరూపించాడు.
  2. పటంలో C1 మరియు C2 తీగచుట్టలు నిశ్చలంగా ఉన్నాయి.
  3. C1 తీగచుట్టకు ట్యాప్ కీ Kతో బ్యాటరీని కలుపుతారు మరియు C2 తీగచుట్టకు గాల్వనా మీటరును కలుపుతారు.
  4. ట్యాప్ కీని నొక్కినప్పుడు గాల్వనా మీటరులో అపవర్తనం కలుగుతుంది.
  5. గాల్వనామీటరులో సూచీ ఆకస్మికంగా తిరిగి సున్నాను చూపుతుంది.
  6. ట్యాప్ కీని అవిచ్ఛిన్నంగా మూసి ఉంచితే, గాల్వనా మీటరులో అపవర్తనం కలుగదు.
  7. ట్యాప్ కీని వదిలితే, గాల్వనా మీటరులో వ్యతిరేక దిశలో అపవర్తనం కలుగుతుంది.
  8. కొయ్య కాండానికి బదులు ఇనుప కడ్డీని ఉపయోగించినప్పుడు, విద్యుత్ ప్రవాహ పరిమాణం పెరుగుతుంది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ

ప్రశ్న 2.
ఏకాంతర విద్యుత్ ప్రవాహ జనరేటర్ సాధనం పనితీరును సరళమైన పటం, అవసరమైన సమాసాల సహాయంతో వర్ణించండి.
జవాబు:
యాంత్రికశక్తిని విద్యుత్ శక్తిగా మార్చే విద్యుత్ యంత్రాన్ని AC జనరేటర్ (లేదా) ఆల్టర్నేటర్ అంటారు.

సూత్రం :
ఇది విద్యుదయస్కాంత ప్రేరణపై పనిచేస్తుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 9

నిర్మాణం :
i) ఆర్మేచర్ :
మెత్తని ఇనుపకోర్పై బంధిత రాగితీగను అనేక చుట్లుగా చుట్టబడిన ABCD ని ఆర్మేచర్ తీగచుట్ట అంటారు.

ii) బలమైన అయస్కాంతం :
బలమైన శాశ్వత అయస్కాంతం (లేదా) విద్యుదయస్కాంత ధ్రువాలు N మరియు S స్థూపాకారంగా ఉంటాయి. ఇది బలమైన క్షేత్ర అయస్కాంతంగా ఉపయోగపడుతుంది. అయస్కాంత ధ్రువాల మధ్య ఆర్మేచర్ తీగచుట్ట తిరుగుతుంది.

iii) స్లిప్ రింగ్లు :
ఆర్మేచర్ తీగచుట్ట రెండు చివరలకు రెండు ఇత్తడి స్లిపింగ్లు R1 మరియు R2 లు కలుపబడి ఉంటాయి. ఈ స్లిప్ రింగ్లు ఆర్మేచర్ దిశలో తిరుగుతాయి.

iv) బ్రష్లు :
B1 మరియు B2 అను రెండు కార్బన్ బ్రష్ లు స్లిపింగ్లను నొక్కుతాయి. బ్రష్లు స్థిరంగా ఉంటాయి, కాని స్లిపింగ్లు ఆర్మేచర్ తిరిగే దిశలో తిరుగుతాయి. ఈ బ్రష్ల నుండి పొందిన నిర్గమనాన్ని లోడ్కు కలుపుతారు.

పనిచేయు విధానం :
ABCD ఆర్మేచర్ తీగచుట్ట అయస్కాంత క్షేత్రంలో తిరిగితే బలమైన అయస్కాంత క్షేత్రాన్ని అందిస్తుంది. ఇది అయస్కాంత బలరేఖలను ఖండిస్తుంది. ఆర్మేచర్ భ్రమణం వల్ల తీగచుట్టలో అయస్కాంత అభివాహం మారుతుంది. అందువలన తీగచుట్టలో విద్యుచ్చాలకు జలం ప్రేరితమవుతుంది.

అర్థ భ్రమణానికి బ్రష్ B1 ద్వారా ఒక దిశలో విద్యుత్ ప్రవహిస్తుంది. మరియు తర్వాత అర్థ భ్రమణానికి బ్రష్ B2 ద్వారా వ్యతిరేక దిశలో విద్యుత్ ప్రవహిస్తుంది. ఈ ప్రక్రియ కొనసాగుతూ ఏకాంతరంగా విద్యుచ్ఛాలక బలం జనిస్తుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 10

సిద్ధాంతం:
i) తీగచుట్ట స్థిర కోణీయ వేగం ω తో తిరుగుచున్నది.
ii) తీగచుట్ట యొక్క లంబానికి, అయస్కాంత క్షేత్రానికి \(\overrightarrow{B}\) ఏదైనా సమయంలో
కోణము θ = ωt ………… (1)
iii) తీగచుట్ట తలానికి లంబంగా ఉన్న అయస్కాంత క్షేత్ర అంశము B cos θ = B cosωt ………… (2)
iv) ఒక చుట్టు గల తీగచుట్టలో అయస్కాంత అభివాహం = (B cos ωt) A ………… (3)
A అనునది తీగచుట్ట వైశాల్యం మరియు n అనునది చుట్ల సంఖ్య
v) తీగచుట్టలో మొత్తం అయస్కాంత అభివాహం (Φ) = n(B cos ωt) A ………… (4)
ఫారడే నియమం ప్రకారం
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 11
విద్యుత్ ప్రవాహ దిశ ఆవర్తనంగా మారుతుంది మరియు దీనిని ఏకాంతర ప్రవాహం (A.C) అంటారు.

అభ్యాసాలు Textual Exercises

ప్రశ్న 1.
(a) నుంచి (f) వరకు గల కింద ఇచ్చిన పటాలలో వర్ణించిన పరిస్థితులలో ప్రేరిత విద్యుత్ ప్రవాహ దిశను ప్రాగుక్తీకరించండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 12
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 13
జవాబు:
a) ఇక్కడ దక్షిణ ధృవంను తీగచుట్ట వైపు కదిల్చితే లెంజ్ నియమం ప్రకారం విద్యుత్ ప్రవాహము సవ్య దిశలో ప్రవహిస్తుంది. అనగా విద్యుత్ p నుండి q కు ప్రవహిస్తుంది.

b) p-q తీగ చుట్టలో q వద్ద s ను q వైపు జరిపితే ఇది దక్షిణ ధృవం వలే పనిచేస్తుంది. విద్యుత్ ప్రవాహము సవ్య దిశలో ఉంటుంది. (అనగా p నుండి q) ఉత్తర ధృవంను దూరం జరిపితే చివర దక్షిణ ధృవం వలె పనిచేస్తుంది. విద్యుత్ ప్రవాహము సవ్య దిశలో X నుండి y కు ఉంటుంది.

c) ట్యాప్ కీని మూస్తే, తీగచుట్టలో విద్యుత్ పెరిగి, అయస్కాంత అభివాహం పెరుగుతుంది. మాక్స్వెల్ నియమం ప్రకారం‘అయస్కాంత క్షేత్రం ఎడమవైపుకు పనిచేస్తుంది. ప్రేరిత విద్యుత్ ప్రవాహ దిశ, క్షేత్రాన్ని తగ్గిస్తుంది. క్షేత్ర దిశ కుడి వైపు పనిచేస్తుంది. మాక్స్వెల్ నియమం ప్రకారం ప్రేరిత విద్యుత్ ప్రవాహ దిశ అపసవ్య దిశలో అనగా xyz దిశలో ఉండును.

d) రియోస్టాట్ను మారిస్తే, విద్యుత్ మారుతుంది. క్షేత్రదిశ ఎడమవైపు చూపుతుంది. ఎడమ తీగచుట్టలో ప్రేరిత విద్యుత్ ప్రవాహ దిశ వలన జనించే క్షేత్ర దిశ కుడివైపుకు ఉంటుంది. అందువలన ఎడమ చుట్టలో విద్యుత్ దిశ అపసవ్య దిశ అనగా Zyx దిశలో ఉండును.

e) కీని వదిలితే విద్యుత్ అపసవ్య దిశలో ప్రవహించి తగ్గుతుంది. దాని వలన ప్రేరిత విద్యుత్ జనించి, ఎడమచుట్టలో క్షేత్రం పెరుగుతుంది. కావున కుడివైపు చుట్టలో అయస్కాంత క్షేత్రం కుడివైపు పనిచేస్తుంది. కావున ప్రేరిత విద్యుత్ అపసవ్య దిశలో అనగా x నుండి yx దిశలో ఉండును.

f) విద్యుత్ ప్రవాహ తీగలో అయస్కాంత క్షేత్ర రేఖలు చుట్ట తలంలో ఉంటాయి. కావున తీగచుట్టలో ప్రేరిత విద్యుత్ జనించదు.

ప్రశ్న 2.
పటం చూపిన సందర్భాలలో ప్రేరిత విద్యుత్ ప్రవాహ దిశను నిర్ధారించడానికి లెంజ్ నియమాన్ని ఉపయోగించండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 14
(a) అక్రమాకారంలో ఉన్న తీగ వృత్తాకారంలోకి మారుతున్నప్పుడు.
(b) వృత్తాకార లూప్ సన్నని నిలువైన తీగగా
(a) విరూపణం చెందుతున్నప్పుడు.
జవాబు:
a) ఇక్కడ అయస్కాంత క్షేత్ర దిశ కాగితపు తలానికి లంబంగా లోనికి పనిచేస్తుంది. తీగను వృత్తాకారంగా చుడితే దాని వైశాల్యం పెరుగుతుంది. అందువలన అయస్కాంత అభివాహం పెరుగుతుంది. ఆ దిశలో ప్రేరిత విద్యుత్ జనించి అయస్కాంత క్షేత్రాన్ని తగ్గిస్తుంది. విద్యుత్ ప్రవాహము అపసవ్య దిశలో అనగా adcb a దిశలో ఉండును.

b) వృత్తాకార తీగచుట్టను సన్నని తీగలాగా మార్చితే, దాని అయస్కాంత అభివాహం తగ్గుతుంది. ప్రేరిత విద్యుత్ అపసవ్య దిశలో ప్రవహిస్తుంది. అనగా a’d’c’b’a’. దీనివలన కాగితపు తలానికి వెలుపల అయస్కాంత క్షేత్రం జనిస్తుంది.

ప్రశ్న 3.
సెంటీమీటర్కు 15 చుట్లు గల పొడవైన సాలినాయిడ్ లోపల దాని అక్షానికి లంబంగా 2.0 cm3 వైశాల్యం గల చిన్న లూప్ను ఉంచారు. సాలినాయిడ్లో ప్రవహిస్తున్న విద్యుత్ ప్రవాహం 4.0 A నుంచి 2.0 A లకు 0.1 సెకనులో నిలకడగా మార్పు చెందితే, విద్యుత్ ప్రవాహం మారుతున్నప్పుడు లూప్ లో ప్రేరితమయ్యే విద్యుచ్ఛాలక బలం ఎంత?
సాధన:
చుట్ల సంఖ్య (n) = 15/cm = 1500/m
వైశాల్యం (A) = 2 cm² = 2 × 10-4 m².
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 15

ప్రశ్న 4.
చిన్న గాటు (small cut) కలిగి, భుజాలు 8 cm, 2 cm గల ఒక దీర్ఘచతురస్రాకార లూప్ 0.3 T పరిమాణం గల ఏకరీతి అయస్కాంత క్షేత్ర ప్రాంతం నుంచి బయటకు చలిస్తుంది. క్షేత్ర దిశ లూప్కు లంబంగా ఉన్నది. లూప్ 1 cms-1 వేగంతో (a) పెద్ద భుజానికి, (b) చిన్న భుజానికి, లంబ దిశలో కదిలితే గాటు వద్ద వృద్ధిచెందే విద్యుచ్ఛాలక బలం ఎంత? ప్రతి సందర్భంలో ప్రేరిత వోల్టేజి ఎంత సమయం పాటు ఉంటుంది?
సాధన:
తీగచుట్ట పొడవు (l) = 8 cm = 8 × 10-2 m.
మందము (b) = 2 cm = 2 × 10-2 m.
వేగము = 1 cm/s = 0.01 m/s
అయస్కాంత ప్రేరణ B = 0.3 T

AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 16
a) వేగము పొడవుగా ఉన్న వైపుకు లంబంగా ఉంటే
l = 8 cm = 8 × 10-2 m
చలనాత్మక వి.చా.బ (e) = Blυ = 0.3 × 8 × 10-2 × 0.01
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 17
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 18

ప్రశ్న 5.
1.0 m పొడవైన లోహ కడ్డీని కడ్డీకి లంబంగా, , కడ్డీ ఒక కొన ద్వారా పోయే అక్షం దృష్ట్యా 400 rad s-1 కోణీయ పౌనః పున్యంతో భ్రమణం చేశారు. కడ్డీ రెండో కొన ఒక వృత్తాకార లోహ కంకణంతో స్పర్శలో కలదు. స్థిర, ఏకరీతి 0.5 T అయస్కాంత క్షేత్రం అక్షానికి సమాంతరంగా అంతటా వ్యాపించి ఉంది. కంకణం, దాని కేంద్రం మధ్య వృద్ధి చెందే విద్యుచ్ఛాలక బలాన్ని లెక్కించండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 19
కడ్డీ యొక్క పొడవు (l) = 1m
కోణీయ పౌనఃపున్యము (ω) = 400 rad/s
అయస్కాంత ప్రేరణ (B) = 0.5 T
రేఖీయ వేగం = 0
మరొక రేఖీయ వేగం = lω
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 20

ప్రశ్న 6.
3.0 × 10-2 T పరిమాణం గల ఏకరీతి క్షితిజ సమాంతర అయస్కాంత క్షేత్రంలో 8.0 cm వ్యాసార్థం 20 చుట్లు గల వృత్తాకార తీగచుట్టను దాని నిట్టనిలువు వ్యాసం దృష్ట్యా 50 rad s-1 కోణీయ వడితో భ్రమణం చేశారు. తీగచుట్టలో ప్రేరితమయ్యే గరిష్ఠ, సగటు విద్యుచ్ఛాలక బలాన్ని పొందండి. తీగచుట్ట 10౧ నిరోధం గల సంవృత వలయాన్ని ఏర్పరిస్తే, తీగచుట్టలోని గరిష్ఠ విద్యుత్ ప్రవాహ విలువను లెక్కించండి. జౌల్ ఉష్టీకరణం కారణంగా జరిగే సగటు సామర్థ్య నష్టాన్ని లెక్కించండి. ఈ సామర్థ్యం ఎక్కడి నుండి వచ్చింది?
సాధన:
తీగచుట్ట వ్యాసార్థము = 8 cm = 0.08 cm
చుట్ల సంఖ్య = 20; నిరోధము = 10Ω
కోణీయ వేగము (ω) = 50 rad/s
అయస్కాంత ప్రేరణ (B) = 3 × 10-2 T
ప్రేరిత వి.చా.బ. (e) = NBA ω sin ωt
గరిష్ఠ వి. చా. బ. sin ωt = 1
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 21
సామర్ధ్య నష్టం తీగచుట్టలో ఉష్ణం రూపంలో వెలువడును.

AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ

ప్రశ్న 7.
భూ అయస్కాంత క్షేత్ర క్షితిజ సమాంతర అంశం 0.30 × 10-4 Wb m-2 కి లంబంగా తూర్పు నుంచి పశ్చిమంగా విస్తరించి ఉన్న 10 m పొడవైన క్షితిజ సమాంతర తిన్నని తీగ 5.0 m s-1 వేగంతో పడుతుంది.
(a) తీగలో ప్రేరితమైన విద్యుచ్ఛాలక బలం తాక్షణిక విలువ ఎంత?
(b) విద్యుచ్ఛాలక బలం దిశ ఏమిటి ?.
(c) తీగ ఏ కొన అధిక విద్యుత్ పొటెన్షియల్ వద్ద ఉంటుంది?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 22
తిన్నని తీగ వేగం = 5 m/s
అయస్కాంత ప్రేరణ (B) = 0.30 × 10-4Wb/m-2
తీగ పొడవు l = 10m
a) తీగలో వి.చా.బ. (e) = Blυsin θ
ఇక్కడ θ = 90°, sin θ = 1
e = 0.3 × 10-4 × 10 × 5 = 1.5 × 10-3 V.

b) ఫ్లెమింగ్ ఎడమచేతి నియమం ప్రకారం, బలం క్రింద వైపుకు, ప్రేరిత వి. చా.బ పడమర నుండి తూర్పు వైపుకు ఉంటుంది.

c) ప్రేరిత వి.చా.బ (లేదా) విద్యుత్ దిశ పడమర నుండి తూర్పుకు ఉంటే పడమర వైపు అధిక పొటెన్షియల్ వద్ద ఉంటుంది.

ప్రశ్న 8.
ఒక వలయంలో విద్యుత్ ప్రవాహం 5.0 A నుంచి 0.0 A కి 0.1 s లో పడిపోయింది. 200 V సగటు విద్యుచ్ఛాలకు బలం ప్రేరితం అయితే, ఆ వలయం స్వయం ప్రేరకత్వాన్ని అంచనా వేయండి. [TS. Mar.’16; Mar.’14]
సాధన:
విద్యుత్ ప్రవాహంలో మార్పు (dI) = 5 – 0 = 5A
కాలంలో మార్పు (dt) = 0.1 sec
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 23

ప్రశ్న 9.
పక్కపక్కన ఉన్న ఒక జత తీగచుట్ల అన్యోన్య ప్రేరకత్వం 1.5 H. ఒక చుట్టలో విద్యుత్ ప్రవాహం 0 నుంచి 20 A లకు 0.5 s లలో మారినట్లయితే, రెండవ తీగచుట్టలో అభివాహ బంధనంలో వచ్చే మార్పు ఎంత?
సాధన:
అన్యోన్య ప్రేరణ (M) = 1.5 H
విద్యుత్ ప్రవాహంలో మార్పు (dl) 20 – 0 = 20 A
కాలంలో మార్పు (dt) = 0.5 sec
ప్రేరిత వి.చా.బ. (e) = M\(\frac{dI}{dt}=\frac{-\mathrm{d} \phi}{\mathrm{dt}}\)
dΦ = M.dI = 1.5 × 20
అభివాహంలో మార్పు (dΦ) = 30 Wb

ప్రశ్న 10.
ఒక జెట్ విమానం 1800 km/h వడితో పశ్చిమ దిశ వైపు ప్రయాణిస్తోంది. ఆ ప్రదేశపు భూఅయస్కాంత క్షేత్ర పరిమాణం 5 × 10-4 T, అవపాత కోణం 30° అయితే 25 m వరకు వ్యాపించి ఉన్న రెక్క కొనల మధ్య వృద్ధి చెందే వోల్టేజి భేదం ఎంత?
సాధన:
జెట్ విమాన గం (V) = 1800 km/h = 1800 × \(\frac{5}{8}\) = 500 m/s
రెక్కల మధ్య దూరం (l) = 25m
అయస్కాంత ప్రేరణ (B) = 5 × 10-4T
డిప్ కోణం (δ) = 30°
చలన వి.చా.బ. (e) = BvVl
e = B sin δ Vl (∵ Bv = B sin δ),
e = 5 × 10-4 + sin 30° × 500 × 25
e = 3.1 V.

అదనపు అభ్యాసాలు Additional Exercises

ప్రశ్న 11.
అభ్యాసం 4 లోని లూప్ స్థిరంగా ఉందనుకోండి. అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తున్న విద్యుదయస్కాంతానికి అందించే విద్యుత్ ప్రవాహాన్ని క్రమంగా తగ్గించడం ద్వారా క్షేత్రం తొలి విలువ 0.3 T నుంచి 0.02 T s-1 రేటు వరకు క్షీణింపచేశారు. లూప్ ని గాటును (cut) కలిపినట్లయితే మరియు లూప్ నిరోధం 1.6Ω అయితే, లూప్ వల్ల ఎంత శక్తి ఉష్ణ రూపంలో దుర్వ్యయమవుతుంది? ఈ సామర్థ్యానికి జనకం ఏమిటి?
సాధన:
వైశాల్యం = 8 × 2 = 16 cm² 16 × 10-4
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 24

ప్రశ్న 12.
X, Y అక్షాలకు సమాంతరంగా 12 cm భుజం గల చతురస్రాకార లూప్ 8 cm s-1 వేగంతో ధన X అక్షం దిశలో, అయస్కాంత క్షేత్రం ధన Z- అక్షం దిశ ఉన్న పరిసరం (environment) లో చలిస్తుంది. క్షేత్రం ప్రాదేశికంగా ఏకరీతిగా, కాలంతో స్థిరంగా లేదు. రుణ X- దిశలో క్షేత్రం 10-3 T cm-1 ప్రవణతను కలిగి ఉంది. (అంటే ధన X- దిశలో చలిస్తున్నప్పుడు క్షేత్ర విలువ 10-3 T cm-1” చొప్పున పెరుగుతుంది). కాలంతోపాటు 10-3 Ts-1 చొప్పున క్షేత్ర విలువ తగ్గుతుంది. లూప్ నిరోధం 4.50 ml అయితే, ప్రేరిత విద్యుత్ ప్రవాహం దిశను, పరిమాణాన్ని నిర్ణయించండి.
సాధన:
తీగచుట్ట భుజం (a) = 12 cm
వైశాల్యం (A) = a² = (12)² = 144 cm² = 144 × 10-4
వేగము (v) = 8 cm/s = 8 × 10-2 m/s.
దూరంతో పాటు అయస్కాంత ప్రేరణలో మార్పు = \(\frac{dB}{dx}\) = 10-3 T/cm
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 25
ప్రేరిత విద్యుత్ దిశ కూడా ధన Z- అక్షం దిశలోనే ఉంటుంది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ

ప్రశ్న 13.
ఒక శక్తివంతమైన లౌడ్ స్పీకర్ అయస్కాంతపు ధృవాల మధ్య క్షేత్రాన్ని కొలవాలనుకున్నారు. 2 cm² వైశాల్యంతో 25 దగ్గర చుట్లు గల చిన్న సమతల శోధన తీగచుట్టను క్షేత్రానికి లంబదిశలో ఉంచి క్షేత్రం ప్రాంతం నుంచి శీఘ్రంగా బయటకు లాగారు (తుల్యంగా, ఆ తీగచుట్టను క్షేత్ర దిశకు సమాంతరంగా తీసుకొనిరావడానికి దానికి శీఘ్రంగా 90° భ్రమణం కూడా ఇవ్వచ్చు). తీగచుట్ట ద్వారా ప్రయాణించిన మొత్తం ఆవేశం (తీగకు కలిపి ప్రక్షేపక గాల్వనా మాపకం ద్వారా కొలవగా) 7.5 mC. తీగ, గాల్వనా మాపకం రెండింటి సంయోగ నిరోధం 0.50Ω అయస్కాంత క్షేత్ర సత్వాన్ని అంచనా వేయండి.
సాధన:
తీగచుట్ట వైశాల్యం (A) = 2cm² = 2 × 10-4
చుట్ల సంఖ్య (N) = 25
తీగచుట్టలో మొత్తం ఆవేశం (Q) = 7.5 mc = 7.5 × 10-3 c
నిరోధము (R) = 0.5Ω
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 26

ప్రశ్న 14.
శాశ్వత అయస్కాంత ధృవాల మధ్య ఉంచిన నునుపైన AB పట్టాల పై PQ లోహ కడ్డీ పటంలో చూపిన విధంగా నిశ్చలంగా ఉంది. పట్టాలు, కడ్డీ, అయస్కాంత క్షేత్రం ఒకదానితో ఒకటి పరస్పరం లంబ దిశలలో ఉన్నాయి. గాల్వనీ మాపకం G స్విచ్ K ద్వారా పట్టాలను కలుపుతుంది. కడ్డీ పొడవు= 15 cm, B = 0.50 T, కడ్డీని కలిగి ఉన్న సంస్కృత లూప్ నిరోధం = 9.0 mΩ. అయస్కాంత క్షేత్రం ఏకరీతిగా ఉందనుకోండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 27
a) పటంలో చూపిన దిశలో స్విచ్ Kని తెరిచినప్పుడు కడ్డీ 12 cm s-1 వడితో కదిలిందనుకోండి. ప్రేరిత విద్యుచ్ఛాక బలం ధృవణత, పరిమాణాన్ని ఇవ్వండి.
b) K ని తెరిచినప్పుడు కడ్డీ కొనల వద్ద ఏదైనా అదనపు ఆవేశం వృద్ధి అవుతుందా? K ని మూసినప్పుడు ఏమి జరుగుతుంది?
c) Kని తెరిచినప్పుడు, కడ్డీ ఏకరీతిగా చలిస్తున్నప్పుడు, కడ్డీ PQ లోని ఎలక్ట్రాన్లు కడ్డీ చలనం వల్ల అయస్కాంతీయ బలాన్ని అనుభవించినప్పటికీ వాటిపై పనిచేసే నికర బలం ఏమి ఉండదు. వివరించండి.
d) Kని మూసినప్పుడు, కడ్డీపై ఉండే మందక (retarding) బలం ఏమిటి?
e) Kని మూసినప్పుడు, కడ్డీని అదే వడితో (=12 cm s-1) చలింపచేయడానికి (బాహ్య ఏజెంట్ వల్ల) ఎంత సామర్థ్యం అవసరం?
f) మూసిన (సంవృత) వలయంలో ఎంత సామర్థ్యం ఉష్ణంగా దుర్వ్యయం అయ్యింది? ఈ సామర్థ్యానికి జనకం ఏమిటి?
g) లంబ దిశకు బదులు అయస్కాంత క్షేత్ర దిశ పట్టాలకు సమాంతరంగా ఉంటే చలిస్తున్న కడ్డీలో ప్రేరితమయ్యే విద్యుచ్ఛాలక బలం ఎంత?
సాధన:
కడ్డీ పొడవు (I) = 15 cm = 15 × 10-2 m
అయస్కాంత ప్రేరణ (B) = 0.5 T
నిరోధము (R) = 9mΩ = 9 × 10-3
కడ్డీ వేగము (V) = 12 cm/s = 12 × 10-2 m/s.
a) చలన వి.చా.బ. () = BVI = 0.5 × 12 × 10-2 × 15 × 10-2
e = 9 × 10-3 V.

ఫ్లెమింగ్ ఎడమచేతి నియమం ప్రకారం లోరెంజ్ బలం
F = – e(V × B) ఎలక్ట్రాన్లపై PQ లో P నుండి Q కు ఉంటుంది. కావున P ధనావేశమును, Q ఋణావేశమును పొందును.

b) అవును. P వద్ద అదనపు ధనావేశము ఏర్పడును. కీని తెరచినప్పుడు అంటే పరిమాణంలో Q వద్ద ఋణావేశము ఏర్పడును. కీని మూస్తే ప్రేరిత విద్యుత్ ప్రవహించి, అదనపు ఆవేశము కలిగి ఉండును.

c) కీని తెరిస్తే, ఎలక్ట్రాన్లపై ఎలాంటి బలం పనిచేయదు. అందుకు కారణం P మరియు Q వద్ద విద్యుత్ క్షేత్రం వల్ల అదనపు ఆవేశం ఏర్పడును. అయస్కాంత క్షేత్రబలం, విద్యుత్ క్షేత్ర బలానికి సమానం కావున కడ్డీపై ఫలితం శూన్యం.

d) కీని మూసివేస్తే, విద్యుత్ ప్రవహించి, విద్యుత్ ప్రవహించే తీగలో అయస్కాంత క్షేత్రం వల్ల ఋణబలం పనిచేస్తుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 28

e) కడ్డీ అదే వేగంతో ఉండుటకు అవసరమైన సామర్థ్యం = ఋణబలం × వేగం = 7.5 × 10-2 × 12 × 10-2 × 10-3 W
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 29

g) క్షేత్రము కడ్డీలకు సమాంతరంగా ఉంటే (8 = 0), ప్రేరిత వి.చా.బ. = e = BVl sin θ
(∵ sin θ° = (0). ఈ సందర్భంలో చలించే కడ్డీ క్షేత్ర రేఖలను ఖండించదు. కావున అభివాహంలో మార్పు శూన్యం మరియు ప్రేరిత వి.చా. బ శూన్యం.

ప్రశ్న 15.
30 cm పొడవు, 25 cm2 మధ్యచ్ఛేద వైశాల్యం, 500 చుట్లు కలిగి, గాలి కాండం (కోర్) గల సాలినాయిడ్లో 2.5 A విద్యుత్ ప్రవహిస్తోంది. విద్యుచ్ఛాలక బలం జనకం నుంచి సాలినాయిడ్ను విడదీసినప్పుడు దానిలో విద్యుత్ ప్రవాహం 10×sలో శూన్యానికి పడిపోతుంది. వలయంలో తెరిచి ఉంచిన స్విచ్ కొనల మధ్య ఏర్పడే సగటు తిరోదిశా విద్యుచ్ఛాలక బలం ఎంత ? సాలినాయిడ్ కొనల దగ్గర అయస్కాంత క్షేత్ర మార్పును ఉపేక్షించండి.
సాధన:
సాలినాయిడ్ పొడవు (1) = 30 cm = 30 × 10-2 m
అడ్డుకోత వైశాల్యం (A) = 25 cm² = 25 × 10-4
చుట్ల సంఖ్య (N) = 500
విద్యుత్ ప్రవాహం (I1) = 2.5A, I2 = 0
కాలం (dt) = 10-3 sec
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 30

ప్రశ్న 16.
(a) పటంలో చూపిన పొడవైన తిన్నని తీగ a భుజం గల చతురస్రాకార లూప్ మధ్య ఉండే అన్యోన్య ప్రేరకత్వానికి ఒక సమాసాన్ని పొందండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 31
(b) ఇప్పుడు తిన్నని తీగలో 50 A విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తున్నట్లు, కుడి పక్కకు, స్థిర వేగం υ = 10 m/s తో లూప్ చలించినట్లు భావించండి. x = 02mఅయిన సందర్భంలో లూప్లో ప్రేరితమయ్యే విద్యుచ్ఛాలక బలాన్ని లెక్కించండి. a = 0.1 m గా తీసుకొని, లూప్ చాలా అధిక నిరోధాన్ని కలిగి ఉన్నట్లుగా భావించండి.
సాధన:
a) ఒక అల్పాంశము మందము dx. ఇది తీగనుండి దూరంలో ఉంది. తీగలో విద్యుత్ ప్రవాహము I.
చతుర్భుజము పొడవు = a
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 32
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 33

ప్రశ్న 17.
M ద్రవ్యరాశి, R వ్యాసార్థం గల చక్రం అంచుకు ఏకరీతిగా ఏకాంక పొడవుకు రేఖీయ ఆవేశం)ఇవ్వడమైంది. చక్రం తేలికైన అవాహక ఊచ (ఆకు—spoke) లు కలిగి, ఘర్షణ లేకుండా స్వేచ్ఛగా దాని అక్షం దృష్ట్యా భ్రమణం చేయగలదు. ఏకరీతి అయస్కాంత క్షేత్రం చక్రం అంచులోపల వృత్తాకార ప్రాంతం అంతా విస్తరించి ఉంది. దీనిని
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 34
B=-B0k (r ≤ a; a < R)
= 0 (మరొక విధంగా otherwise)
గా సూచించారు. క్షేత్రాన్ని ఒక్కసారిగా ఆపివేసిన (switched off) తరువాత చక్రం కోణీయ వేగం ఎంత ?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 35
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 36

సాధించిన సమస్యలు Textual Examples

ప్రశ్న 1.
a) గాల్వనామీటర్లో అధిక అపవర్తనం పొందడానికి మీరు ఏం చేస్తారు? (b) గాల్వనా మీటర్ లేకుండా వలయంలో ప్రేరిత విద్యుత్ ప్రవాహం ఉండటాన్ని ప్రాయోగికంగా ఏ విధంగా ప్రదర్శిస్తారు?
సాధన:
a) గాల్వనామీటర్లో అధిక అపవర్తనాన్ని పొందడానికి కింది విధంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విధానాలను అవలంబించవచ్చు. (i) తీగచుట్ట C, లోపల మెత్తని ఇనుపకడ్డీని ఉపయోగించడం, (ii) తీగచుట్టను శక్తివంతమైన బ్యాటరీకి అనుసంధానం చేయడం, (iii) అమరికనంతా తీగచుట్ట C, వైపు వేగంగా జరపడం.

b) వలయంలో గాల్వనామీటర్కు బదులుగా చిన్న టార్చ్ లైట్ ఉపయోగించే చిన్న బల్బును ఉపయోగించండి. ఈ రెండు తీగచుట్టల మధ్య సాపేక్ష చలనం బల్బు, వెలిగేలా చేస్తుంది. ఈ విధంగా ప్రేరిత ప్రవాహం ఉండటాన్ని ప్రాయోగికంగా ప్రదర్శించవచ్చు.

ప్రయోగ భౌతికశాస్త్రంలో ఎవరైనా నూతన రీతుల కల్పనను నేర్చుకోవాల్సి ఉంటుంది. అత్యుత్తమ ప్రయోగవేత్తలలో ఒకరుగా, శాశ్వతంగా ఉన్నత స్థానంలో ఉన్న మైఖేల్ ఫారడే నూతన రీతులను కనుక్కొనే నైపుణ్యం వల్ల చారిత్రకంగా ప్రసిద్ధి చెందాడు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ

ప్రశ్న 2.
భుజం 10 cm, నిరోధం 0.5 Ωలు గల ఒక చతురస్రాకార లూప్ను తూర్పు – పడమర తలానికి నిలువుగా ఉంచారు. దాని తలం వెంట 0.10 T తీవ్రత గల ఏకరీతి అయస్కాంత క్షేత్రాన్ని ఉత్తర – దక్షిణ దిశల్లో ఏర్పాటు చేశారు. అయస్కాంత క్షేత్రాన్ని నిలకడ రేటుతో 0.70 s లలో శూన్యానికి తగ్గించారు. ఈ కాల వ్యవధిలో ప్రేరిత విద్యుచ్ఛాలక ‘బలం, ప్రవాహాల పరిమాణాలను కనుక్కోండి.
సాధన:
తీగచుట్ట వైశాల్య సదిశ, అయస్కాంత క్షేత్ర దిశతో చేసే కోణం θ = 45°.
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 37

భూ అయస్కాంత క్షేత్రం కూడా లూప్ ద్వారా అభివాహాన్ని జనింపచేస్తుంది అని గమనించండి. కాని ఇది నిలకడ క్షేత్రం (ప్రయోగం జరుగుతున్నంత కాలం మారకుండా ఉండేది) కాబట్టి అది ఏ విధమైన విద్యుచ్ఛాలక బలాన్ని ప్రేరేపించదు.

ప్రశ్న 3.
వ్యాసార్థం 10 cm, నిరోధం 2 Ω, 500 చుట్లు ఉన్న ఒక వృత్తాకార తీగచుట్ట తలాన్ని భూఅయస్కాంత క్షేత్ర క్షితిజ సమాంతర అంశానికి లంబంగా ఉండేటట్లు ఉంచారు. ఈ. తీగచుట్టను దాని నిలువు వ్యాసం పరంగా 0.25 s కాలంలో 180° భ్రమణం చెందించారు. ఆ తీగచుట్టలో ప్రేరితమైన విద్యుచ్ఛాలక బలం, ప్రవాహాలను అంచనావేయండి. ఆ ప్రదేశంలో భూ అయస్కాంత క్షేత్ర క్షితిజ సమాంతర అంశం 3.0 × 10-5 T.
సాధన:
తీగచుట్ట ద్వారా తొలి అభివాహం, ΦB(తాలి) = BA cos θ = 3.0 × 10-5 × (π. × 10-2) × COS 0°
= 3π × 10-7 Wb.

భ్రమణం చెందిన తరువాత తుది అభివాహం, ΦB(తుది) = 3.0 × 10-5 × (π × 10-2) × cos 180°
= -3π × 10-7 Wb.

కాబట్టి, ప్రేరిత విద్యుచ్ఛాలక బలం యొక్క అంచనా విలువ,
ε = N\(\frac{\Delta \phi}{\Delta \mathrm{t}}\) = 500 × (6π × 10-7)/0.25 = 3.8× 10-3 v
I = ε/R = 1.9 × 10-3 A.

ε, I ల పరిమాణాలు అంచనావేసిన విలువలు అని గమనించండి. వాటి తక్షణ విలువలు వేరుగా ఉండి, అవి ఆ క్షణం వద్ద తీగచుట్ట భ్రమణ వడిపై ఆధారపడతాయి.

ప్రశ్న 4.
పటంలో చూపినట్లు వివిధ ఆకృతులు గల సమతల లూప్లు వాటి తలాలకు లంబంగా (పాఠకుని నుంచి దూరంగా) ఉన్న అయస్కాంత క్షేత్రం (పుటతలం నుంచి లోపలికి ఉన్న) లోకి, బయటకు చలిస్తున్నాయి. లెంజ్ నియమం ప్రకారం ప్రతి లూప్ ని ప్రేరిత విద్యుత్ ప్రవాహ దిశను నిర్ణయించండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 38
సాధన:
i) దీర్ఘ చతురస్రాకార లూప్ abcd అయస్కాంత క్షేత్రంలోకి చలించడం వల్ల దాని ద్వారా అయస్కాంత అభివాహం పెరుగుతుంది. ప్రేరిత విద్యుత్ ప్రవాహం తప్పకుండా పథం వెంబడి ప్రవహించాలి. అప్పుడే అది పెరిగే అభివాహాన్ని వ్యతిరేకిస్తుంది.
ii) త్రిభుజాకార ఉచ్చు abc అయస్కాంత క్షేత్రం నుంచి బయటకు చలించడం వల్ల దాని ద్వారా పోయే అయస్కాంత అభివాహం తగ్గుతుంది. దీనివల్ల ప్రేరిత విద్యుత్ ప్రవాహం అభివాహంలోని మార్పును వ్యతిరేకించేలా bacd వెంబడి ప్రవహిస్తుంది.
iii) అక్రమాకార ఉచ్చు abcd అయస్కాంత క్షేత్ర ప్రాంతం నుంచి బయటకు చలించడం వల్ల దాని ద్వారా అయస్కాంత అభివాహం తగ్గడం వల్ల, అభివాహంలోని మార్పును వ్యతిరేకించేలా ప్రేరిత విద్యుత్ ప్రవాహం cdabc వెంబడి ప్రవహిస్తుంది.

అయితే లూప్లు పూర్తిగా అయస్కాంత క్షేత్రం లోపల గాని, బయటగాని ఉన్నంత వరకు ఎలాంటి ప్రేరిత విద్యుత్ ప్రవాహం ఉండదని గమనించండి.

ప్రశ్న 5.
a) స్థిరంగా బిగించి ఉన్న రెండు శాశ్వత అయస్కాంతాల ఉత్తర దక్షిణ ధృవాల మధ్య అయస్కాంత క్షేత్రంలో ఒక సంవృత లూపు స్థిరంగా ఉంచారు. చాలా బలమైన అయస్కాంతాలను ఉపయోగించి ఆ లూప్ ద్వారా విద్యుత్ ప్రవాహాన్ని ఉత్పత్తి చేసే అవకాశం కలదా?
b) ఒక పెద్ద కెపాసిటర్ పలకల మధ్య స్థిర విద్యుత్ క్షేత్రానికి లంబంగా ఒక సంవృత లూప్ చలిస్తుంది. ఆ సంవృత లూప్ (i) పలకల మధ్య ప్రదేశం లోపల పూర్తిగా మధ్యలో ఉన్నప్పుడు, (ii) పలకల నుంచి పాక్షికంగా బయటకు ఉన్నప్పుడు దానిలో విద్యుత్ ప్రవాహం ప్రేరితమవుతుందా? విద్యుత్ క్షేత్రం లూప్ తలానికి లంబంగా ఉన్నది.
c) పటంలో మాదిరిగా, ఒక దీర్ఘచతురస్రాకార లూప్, వృత్తాకార లూప్లు ఏకరీతి అయస్కాంత క్షేత్రం నుంచి బయటవైపుకు క్షేత్రరహిత ప్రాంతానికి V స్థిర వేగంతో చలిస్తున్నాయి. ఆ లూప్ల తలాలకు అయస్కాంత క్షేత్రం లంబంగా ఉన్నది. ప్రేరిత విద్యుచ్ఛాలక బలం స్థిరంగా ఉంటుందని మీరు అయితే క్షేత్రం నుంచి బయటకి పోతున్నప్పుడు ఏ లూప్లో ఆశించగలరు?
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 39
d) పటం ద్వారా వర్ణించిన పరిస్థితిలో కెపాసిటర్ ధృవణతను ఊహించండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 40
సాధన:
a) ఉత్పత్తి చేయలేం. అయస్కాంతం ఎంత బలమైనది అయినప్పటికీ లూప్ ద్వారా పోయే అయస్కాంత అభివాహాన్ని ‘ మార్చడం వల్ల మాత్రమే విద్యుత్ ప్రవాహాన్ని ప్రేరేపితం చేయవచ్చు.

b) ఏ సందర్భంలోను ఎలాంటి విద్యుత్ ప్రవాహం ప్రేరితం కాదు. విద్యుత్ అభివాహాన్ని మార్చడం వల్ల విద్యుత్ ప్రవాహాన్ని ప్రేరేపితం చేయలేం.

c) దీర్ఘచతురస్రాకార లూప్ విషయంలో మాత్రమే ప్రేరిత విద్యుచ్ఛాలక బలం స్థిరంగా ఉంటుందని ఆశించవచ్చు. వృత్తాకార లూప్ విషయంలో, అది క్షేత్ర ప్రాంతం నుంచి బయటకు వచ్చేటప్పుడు దాని వైశాల్యంలోని మార్పు రేటు స్థిరంగా ఉండదు. అందువల్ల దానికి అనుగుణంగా ప్రేరిత విద్యుచ్ఛాలక బలం మారుతుంది.

d) కెపాసిటర్ B పలక పరంగా, A పలక ధృవణత ధనాత్మకంగా ఉంటుంది.

ప్రశ్న 6.
1m పొడవు ఉన్న ఒక లోహపు కడ్డీని 1m వ్యాసార్థం గల వృత్తాకార లోహపు కంకణం కేంద్రం వద్ద కడ్డీ ఒక చివర, కంకణం పరిధి వద్ద మరొక చివర ఉండేటట్లుగా ఉంచి, కంకణం కేంద్రం ద్వారా పోతూ, కంకణ తలానికి లంబంగా ఉండే అక్షం పరంగా 50 rev/ S పౌనఃపున్యంతో భ్రమణం చెందించారు. 1 T ఏకరీతి, స్థిర అయస్కాంత క్షేత్రం, అక్షానికి సమాంతరంగా అంతటా ఉంది. లోహపు కంకణానికి, కేంద్రానికీ మధ్య విద్యుచ్ఛాలక బలం ఎంత?
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 41
సాధన:
పద్ధతి – I :
కడ్డీ భ్రమణం చెందినప్పుడు, కడ్డీలోని స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు లోరెంజ్ బలం వల్ల బయట చివరివైపు చలించి, కంకణంపై వితరణ చెందుతాయి. ఈ విధంగా వేరయిన ఆవేశాలు కడ్డీ చివరల మధ్య విద్యుచ్ఛాలక బలాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఒక నిర్ణీత విద్యుచ్ఛాలక బలం విలువ వద్ద ఇక ఎలక్ట్రాన్ల ప్రవాహం ఉండక నిలకడ స్థితి చేరుతుంది. -సమీకరణం – Bl\(\frac{dx}{dt}\) = dx = Blυ ని ఉపయోగించి, కడ్డీ అయస్కాంత క్షేత్రానికి లంబంగా చలించినప్పుడు కడ్డీ పొడవు dr చివరల మధ్య ఉత్పత్తి అయిన విద్యుచ్ఛాలక బల పరిమాణం
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 42

పద్ధతి – II :
విద్యుచ్ఛాలక బలాన్ని లెక్కించడానికి ఒక సంవృత లూప్ OPQ ని ఊహించవచ్చు. దీనిలో బిందువులు 0, P లు నిరోధకం Rతో సంధానం అయి ఉంటే, 0Q అనేది భ్రమణం చెందే కడ్డీ. నిరోధకం కొనల మధ్య పొటెన్షియల్ భేదం అప్పుడు ప్రేరిత విద్యుచ్ఛాలక బలానికి సమానమవుతుంది. అది B × (లూప్ వైశాల్యం మార్పురేటు) కు సమానం. θ అనేది t కాలం వద్ద కడ్డీకి, P వద్ద వృత్త వ్యాసార్థానికి మధ్య కోణం అయితే, OPQ భాగం (సెక్టార్) వైశాల్యం,
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 43
ఈ సమాసం, పద్ధతి – I ద్వారా పొందిన సమాసంతో సర్వసమంగా ఉంది. మనం ఒకే ε విలువను పొందుతాం.

AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ

ప్రశ్న 7.
ఒక్కొక్కటి 0.5 m పొడవున్న 10 లోహపు కమ్మీలు (పుల్లలు – spokes) గల ఒక చక్రాన్ని 120 rev/min వడితో ఒక ప్రదేశంలో భూఅయస్కాంత క్షేత్ర క్షితిజ సమాంతర అంశానికి లంబంగా ఉండే తలంలో భ్రమణం చెందించారు. ఆ ప్రదేశంలో HE = 0.4 G (గ్రాస్) అయితే చక్రం ఇరుసు (అక్షం) కు, చక్రం అంచు (రిమ్)కు మధ్య ప్రేరిత విద్యుచ్ఛాలక బలం ఎంత? 1G = 10-4 T అని గమనించండి.
సాధన:
ప్రేరిత విద్యుచ్ఛాలక బలం = (1/2) ωBR² (పై problem నుంచి)
= (1/2) × 4π × 0.4 × 10-4 × (0.5)² = 6.28 × 10-5 v
చక్రం కమ్మీల సంఖ్య అముఖ్యమైంది. ఎందుకంటే, కమ్మీల చివరల విద్యుచ్ఛాలక బలాలు సమాంతరం.

ప్రశ్న 8.
పటం (a) చూడండి. ఇందులో PQRS దీర్ఘ చతురస్ర వాహకంలో PQ భుజం X = 0 నుంచి బయటవైపుకు చలించింది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 44
x = 0 నుంచి x = b వరకు ఏకరీతి అయస్కాంత క్షేత్రం విస్తరించి, ఆ పైన x > b కి శూన్యం అయ్యే విధంగా ఉండి, ఈ వాహక తలానికి అయస్కాంత క్షేత్రం లంబంగా ఉన్నది. PQ భుజం మాత్రమే చెప్పుకోదగిన నిరోధం rని కలిగి ఉంది. PQ భుజాన్ని x = 0 నుండి x = 2b వరకు బయటవైపుకు లాగి తిరిగి x = 0 వరకు స్థిర వడితో జరిపే పరిస్థితిని పరిగణించండి. అప్పుడు అభివాహం, ప్రేరిత విద్యుచ్ఛాలక బలం PQ భుజాన్ని లాగడానికి కావలసిన బలం, జౌల్ ఉష్ణం రూపంలో దుర్వ్యయం అయ్యే సామర్థ్యాలకు సమాసాలను పొందండి. ఈ రాశుల మార్పులను చిత్రీకరించండి.
సాధన:
ముందుగా PQ భుజం x = 0 నుంచి x = 2b వరకు ముందుకు కదిలే సందర్భాన్ని తీసుకోండి.
అప్పుడు వలయం SPQR తో బంధితమైన అభివాహం
ΦB అనుకుంటే,
ΦB = Blx 0 ≤ x< b
= Blb b ≤ x < 2b

ప్రేరిత విద్యుచ్ఛాలక బలం,
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 45

x = 2b నుంచి x = 0 కి లోపలికి చలింపచేసినప్పుడు కూడా ఇదే విధమైన సమాసాలను పొందుతారు. పటం (b) లో ప్రదర్శించిన వివిధ రాశుల రేఖాచిత్రాన్ని పరీక్షించిన తరువాత ఈ మొత్తం ప్రక్రియను ఒకరు అంచనా కట్టవచ్చు.

ప్రశ్న 9.
ఒకటి తక్కువ వ్యాసార్థం r1, మరొకటి అధిక వ్యాసార్థం r2, కలిగి, r1, << r2 అయ్యే విధంగా ఉన్న రెండు ఏక కేంద్ర వృత్తాకార తీగచుట్టలను వాటి కేంద్రాలు ఏకీభవించేలా సహాక్షంగా ఉంచారు. ఈ అమరిక అన్యోన్య ప్రేరకత్వాన్ని పొందండి.
సాధన:
బాహ్య వృత్తాకార తీగ చుట్టలో I2, విద్యుత్ ప్రవహిస్తుందనుకోండి. అప్పుడు ఆ తీగచుట్ట కేంద్రం వద్ద అయస్కాంత క్షేత్రం B1 = µ0I2/2r2. దీనితో సహాక్షంగా ఉంచిన తీగచుట్ట చాలా తక్కువ వ్యాసార్థం కలిగి ఉన్నది. కాబట్టి దాని మధ్యచ్ఛేదంపై అయస్కాంత క్షేత్రం B2 స్థిరంగా ఉన్నట్లు భావించవచ్చు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 46

π r²1 వైశాల్యంపై అయస్కాంత క్షేత్రం B2 ఏకరీతిగా ఉంటుందనుకొని, Φ1 యొక్క ఉజ్జాయింపు విలువ నుంచి M12 ని లెక్కించామని గమనించండి. ఏదేమైనప్పటికీ, మనం ఈ విలువను అంగీకరించవచ్చు. ఎందుకంటే r1 << r2.

ప్రశ్న 10.
a) సాలినాయిడ్లో నిల్వ ఉండే అయస్కాంత శక్తికి సమాసాన్ని అయస్కాంత క్షేత్రం B, సాలినాయిడ్ వైశాల్యం A, పొడవు l పదాలలో పొందండి.
b) ఏ విధంగా ఈ అయస్కాంత శక్తి, కెపాసిటర్లో నిల్వ ఉండే స్థిర విద్యుత్ శక్తితో పోల్చదగింది?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 47
రాబట్టినవి. అయితే, అవి అయస్కాంత క్షేత్రం లేదా (మరియు) విద్యుత్ క్షేత్రం ఉన్నటువంటి అంతరాళంలోని ఏ ప్రదేశంలో అయినా వర్తిస్తాయి.

AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ

ప్రశ్న 11.
నిశ్చల స్థితిలో ఉన్న సైకిల్ పెడల్స్ను కమల తొక్కుతోంది. ఈ పెడల్స్ను 0.10 m2 వైశాల్యం, 100 చుట్లు ఉన్న తీగచుట్టకు కలిపారు. ఈ తీగచుట్ట సెకనుకు అర్ధ పరిభ్రమణం చొప్పున భ్రమణం చేస్తుంది. తీగచుట్టను తీగచుట్ట భ్రమణాక్షానికి లంబంగా ఉండే 0.01 T ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో ఉంచారు. తీగచుట్టలో గరిష్ఠంగా ఉత్పత్తి అయ్యే వోల్టేజి ఎంత?
సాధన:
ఇక్కడ f = 0.5 Hz; N = 100, A = 0.1 m², B = 0.01 T.
సమీకరణం ε = NBA @ sin ot ని ఉపయోగించగా.
ε0 = NBA (2πv)
= 100 × 0.01 × 0.1 × 2 × 3.14 × 0.5 = 0.314 V
గరిష్ఠ వోల్టేజి 0.314 V

AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Physics Study Material 8th Lesson అయస్కాంతత్వం-ద్రవ్యం Textbook Questions and Answers.

AP Inter 2nd Year Physics Study Material 8th Lesson అయస్కాంతత్వం-ద్రవ్యం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అయస్కాంత క్షేత్రంలో ఉంచిన అయస్కాంత ద్విధృవం ఒక నికర బలానికి గురవుతుంది. అయస్కాంత క్షేత్ర స్వభావం గురించి మీరేమి చెప్పగలరు?
జవాబు:
ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో, అయస్కాంత ద్విధృవం (దండాయస్కాంతం) నికర బలంను (లేక టార్క్ను) ప్రయోగించును.

ప్రశ్న 2.
భూమి ధృవాల మధ్య ఉండే అయస్కాంత సూదికి ఏమవుతుంది? [TS. Mar. ’17]
జవాబు:
ధృవాల వద్ద, భూమి క్షేత్రము ఖచ్చితంగా నిలువుగా ఉండును. అందువల్ల కంపాసు సూచి, క్షితిజ సమాంతర తలంలో స్వేచ్ఛగా తిరుగును. ఇది ఏ దిశనైనా చూపవచ్చును.

ప్రశ్న 3.
ఇచ్చిన పదార్థ మచ్చు యొక్క అయస్కాంతీకరణం గురించి మీరు ఏమి అర్థం చేసుకొంటారు? [AP. Mar.’16]
జవాబు:
అయస్కాంత నమూనాను అయస్కాంత క్షేత్రంలో ఉంచిన, వాని అయస్కాంత భ్రామకాలు అన్నీ అయస్కాంత క్షేత్ర దిశలో ఉండును. కావున నమూనా నికర అయస్కాంత భ్రామకం (mనికర ≠ 0) కలిగి ఉండును.

ప్రమాణ ఘనపరిమాణంనకు నికర అయస్కాంత భ్రామకంను అయస్కాంతీకరణం అంటారు. i. e., M = \(\frac{m_{నికర}}{V}\)

ప్రశ్న 4.
సాలినాయిడ్లో అనుబంధితమైన అయస్కాంత భ్రామకం ఎంత?
జవాబు:
సాలినాయిడ్ అయస్కాంత ద్విధృవ భ్రామకము m = NIA, ఇక్కడ ‘N’ లూపు చుట్ల సంఖ్య ‘T’ విద్యుత్ మరియు A సదిశ వైశాల్యము.

AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం

ప్రశ్న 5.
అయస్కాంత భ్రామకం, అయస్కాంత ప్రేరణం, అయస్కాంత క్షేత్రాలకు ఉన్న ప్రమాణాలు ఏవి? [TS. Mar.’16]
జవాబు:

  1. అయస్కాంత భ్రామకము m Am² లేక JT-1.
  2. అయస్కాంత ప్రేరణ – wb m-2 లేక టెస్లా (I)
  3. అయస్కాంత క్షేత్రము – టెస్లా.

ప్రశ్న 6.
అయస్కాంత రేఖలు అవిచ్ఛిన్న సంవృత లూప్లను ఏర్పరుస్తాయి. ఎందుకు? [TS. Mar ’17; AP. Mar ’16]
జవాబు:
అయస్కాంత బలరేఖలు దండాయస్కాంతం వెలుపల ఉత్తర ధృవం నుండి బయలుదేరి, దక్షిణ ధృవంను వక్ర పథంలో చలించును. .దండాయస్కాంతం లోపల దక్షిణ ధృవం నుండి ఉత్తర ధృవంనకు సరళ పథంలో చలించును. కావున బలరేఖలు సంవృత లూపులను ఏర్పరుచును.

ప్రశ్న 7.
అయస్కాంత దిక్పాతాన్ని నిర్వచించండి. [Mar. ’14]
జవాబు:
అయస్కాంత దిక్పాతము (D) :
నిజ భౌగోళిక ఉత్తర ధృవంనకు మరియు కంపాసు సూచి చూపు ఉత్తర ధృవంనకు మధ్యగల కోణంను అయస్కాంత దిక్పాతము అంటారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 1

ప్రశ్న 8.
అయస్కాంత ప్రవణత లేదా అవపాత కోణం నిర్వచించండి. [AP & TS. Mar.’15]
జవాబు:
అయస్కాంత అవపాతము లేక అవపాత కోణము (I) :
భూ అయస్కాంత క్షేత్రం మొత్తం తీవ్రత ఏదైనా ప్రదేశంలో క్షితిజ సమాంతర దిశతో చేయు కోణంను అయస్కాంత అవపాతము (I) అంటారు.

ప్రశ్న 9.
అయస్కాంతత్వం దృష్ట్యా క్రింది పదార్థాలను వర్గీకరించండి. మాంగనీస్, కోబాల్ట్, నికెల్, బిస్మత్, ఆక్సిజన్, కాపర్. [TS. Mar. ’16 ’15]
జవాబు:
ఫెర్రో అయస్కాంత పదార్థాలు → కోబాల్టు, నికెల్
పారా అయస్కాంత పదార్థాలు → ఆక్సిజన్, మాంగనీసు
డయా అయస్కాంత పదార్థాలు → బిస్మత్, రాగి

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
r వ్యాసార్థం, ఏకాంక పొడవుకు n చుట్లు, i విద్యుత్ ప్రవాహం ఉన్న సాలినాయిడ్ అక్షీయ క్షేత్రానికి సమాసాన్ని ఉత్పాదించండి.
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 2
సాలినాయిడ్ అక్షీయ క్షేత్రమునకు సమాసము :
1) 2l పొడవు మరియు ‘a’ వ్యాసార్ధమున్న సాలినాయిడ్ ప్రమాణ పొడవుపై ‘n’ చుట్లు కలిగి ఉన్నాయని భావిద్దాం.
2) సాలినాయిడ్లో విద్యుత్ ప్రవాహము ‘I’.
3) సాలినాయిడ్ అక్షంపై ఏదైనా బిందువు P వద్ద అయస్కాంత క్షేత్రంను గణిద్దాం. OP = r గా తీసుకుందాము.
4) సాలినాయిడ్పై O నుండి ‘x’ దూరం వద్ద dx మందం ఉన్న చిన్న మూలకాన్ని భావిద్దాం.
5) మూలకంలో చుట్ల సంఖ్య = ndx.
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 3

ప్రశ్న 2.
గాలిలో d ఎడం ఉన్న రెండు అయస్కాంత ధృవాల మధ్య బలం F. వాటి మధ్య ఏ దూరం ఉంటే బలం రెట్టింపు అవుతుంది?
జవాబు:
రెండు అయస్కాంత ధృవాల మధ్య బలం, F1 = F
రెండు అయస్కాంత ధృవాల మధ్య దూరం, d1 = d
రెండు అయస్కాంత ధృవాల మధ్య బలం రెట్టింపు చేసినప్పుడు, F2 = 2F
రెండు అయస్కాంత ధృవాల మధ్య దూరం, d2 = ?
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 4

AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం

ప్రశ్న 3.
పారా, దయా, ఫెర్రో అయస్కాంత పదార్థాల ధర్మాలను పోల్చండి.
జవాబు:

డయా అయస్కాంత పదార్థాలుపారా అయస్కాంత పదార్థాలుఫెర్రో అయస్కాంత పదార్థాలు
a) ఈ పదార్థాలు, బాహ్య అయస్కాంత క్షేత్రానికి వ్యతిరేక దిశలో బలహీన అయస్కాంతీకరణను పొందుతాయి.a) ఈ పదార్థాలు, బాహ్య అయస్కాంత క్షేత్ర దిశలో, బలహీన అయస్కాంతీ కరణను పొందుతాయి.a) ఈ పదార్థాలు, అయస్కాంత క్షేత్ర దిశలో, బలంగా అయస్కాంతీకరణను పొందుతాయి.
b) ఈ పదార్థ కడ్డీని ఏకరీతి క్షేత్రంలో స్వేచ్ఛగా వ్రేలాడదీస్తే, అయస్కాంత క్షేత్ర దిశకు లంబంగా విరామ స్థితికి వచ్చును.b) ఈ పదార్థ కడ్డీని ఏకరీతి క్షేత్రంలో ‘స్వేచ్ఛగా వ్రేలాడదీస్తే, అయస్కాంత. క్షేత్ర దిశలో విరామ స్థితికి వచ్చును.b) ఈ పదార్థ కడ్డీని ఏకరీతి క్షేత్రంలో స్వేచ్ఛగా వ్రేలాడదీస్తే, ఆయస్కాంత క్షేత్ర దిశలో విరామ స్థితికి వచ్చును.
c) ఈ పదార్థాలను అసమరీతి క్షేత్రంలో ఉంచితే, బలమైన క్షేత్రం నుండి బలహీన క్షేత్రం వైపుకు చలించును.c) ఈ పదార్థాలను అసమరీతి క్షేత్రంలో ఉంచితే, బలహీన క్షేత్రం నుండి బలమైన క్షేత్రం వైపుకు చలించును.c) ఈ పదార్థాలను అసమరీతి క్షేత్రంలో ఉంచితే, బలహీన క్షేత్రం నుండి బలమైన క్షేత్రం వైపుకు చలించును.
d) వీని సాపేక్ష ప్రవేశ్యశీలత µr >1 మరియు ధనాత్మకము.d) వీని సాపేక్ష ప్రవేశ్యశీలత µr >1 మరియు ధనాత్మకము.d) వీని సాపేక్ష ప్రవేశ్యశీలత, µr < 1 మరియు రుణాత్మకము.
e) వీని ససెప్టిబిల్టి (χ) విలువ తక్కువ మరియు రుణాత్మకం.
ఉదా : రాగి, బిస్మత్, నీరు, బంగారం, ఆంటిమొని, పాదరసం, క్వార్ట్జ్, వజ్రం etc.
e) వీని ససెప్టిబిల్టి (χ) విలువ స్వల్పము మరియు ధనాత్మకం
ఉదా: అల్యూమినియం, మెగ్నీషియం, టంగ్స్టన్, ప్లాటినమ్, మాంగనీస్, ద్రవ ఆక్సిజన్, ఫెర్రిక్ క్లోరైడ్, క్యూప్రిక్ క్లోరైడ్.
e) వీని ససెప్టిబిల్టి (χ) విలువ ఎక్కువ మరియు ధనాత్మకము.
ఉదా : ఇనుము, కోబాల్ట్, నికెల్, గడోలినియమ్ మరియు దాని మిశ్రమ లోహాలు.

ప్రశ్న 4.
భూఅయస్కాంత క్షేత్ర ప్రాథమిక రాశులను వివరించి, క్షితిజలంబ, క్షితిజ సమాంతర అంశాల మధ్య సంబంధాన్ని, అవపాత కోణాన్ని వివరించే పటాన్ని గీయండి.
జవాబు:
భూమి ఉపరితలముపై ఏదైనా బిందువు వద్ద భూమి అయస్కాంత క్షేత్రంను, దిక్పాతము D, అవపాతము I మరియు భూమి క్షితిజ సమాంతర అంశము HE లతో గుర్తిస్తారు. వీటినే భూ అయస్కాంత క్షేత్ర మూలకాలు అంటారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 5

వివరణ :

  1. P బిందువు వద్ద మొత్తం అయస్కాంత క్షేత్రంను క్షితిజ అంశము HE మరియు లంబ అంశము ZE లుగా విడదీస్తారు.
  2. HE తో BE చేయు కోణము (డిప్ కోణము) అవపాత కోణము I.
  3. లంబ అంశమును ZE తో సూచిస్తే, అప్పుడు
    ZE = BE Sin I
    HE = BE Cos I
    tan I = \(\frac{Z_E}{H_E}\)

ప్రశ్న 5.
రిటెంటివిటి, కోయెర్సివిటీలను నిర్వచించండి. మెత్తని ఇనుము, ఉక్కులకు హిస్టిరిసిస్ వక్రాలను గీయండి. ఈ వక్రాల నుంచి మీరేమి అనుమితం చేస్తారు?
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 6
1) రెటింటివిటి :
అయస్కాంతీకరణ బలం (H) ను సున్నాకు తగ్గించిన, ఫెర్రో అయస్కాంత పదార్థ నమూన (specimen) అయస్కాంత క్షేత్ర తీవ్రత (\(\overrightarrow{B}\)) విలువను రెటెంటివిటి లేక రిసిడ్యువల్’ అయస్కాంతీకరణము అంటారు.

2) కోయెర్సివిటి :
రెటెంటివిటి సున్నాకు రావటానికి, వ్యతిరేక దిశలో ప్రయోగించాల్సిన అయస్కాంతీకరణ బలం (H) విలువను కోయెర్సిటి లేక కోయిర్సీవ్ బలం అంటారు.

3) హిస్టిరిసిస్ :
ఒక ఫెర్రో అయస్కాంత పదార్థము యొక్క అయస్కాంత ప్రేరణ (B) లేక అయస్కాంతీకరణ తీవ్రత (I) కు అయస్కాంతీకరణ బలం లేక అయస్కాంత తీవ్రత (\(\overrightarrow{H}\)) కు మధ్య సంబంధమును తెలుపు వక్రమును హిస్టిరిసిస్ వక్రము అంటారు.

4) మెత్తని ఇనుము మరియు ఉక్కుకు గల హిస్టారిసిస్ వక్రము పటంలో చూపబడింది.
మెత్తని ఇనుము మరియు ఉక్కుల హిస్టారిసిస్ వక్రాలు క్రింది విషయాలు తెలుపును.
i) మెత్తని ఇనుము రెటింవిటి, ఉక్కు రెటింవిటి కన్నా ఎక్కువ.
ii) మెత్తని ఇనుము, ఉక్కు కన్నా ఎక్కువ దృఢత్వంను కలిగి ఉండును.
iii) మెత్తని ఇనుము కోమెర్సివిటి, ఉక్కు కన్నా తక్కువ. ఉక్కు కన్నా మెత్తని ఇనుము అయస్కాంతీకరణను త్వరగా కోల్పోవును.
iv) మెత్తని ఇనుము I – Hవక్రము, ఉక్కు I H వక్రము కన్నా చాలా తక్కువ. మెత్తని ఇనుము సందర్భంలో హిస్టారిసిస్ నష్టము, ఉక్కు సందర్భంలో హిస్టారిసిస్ నష్టము కన్నా చాలా తక్కువ.

AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం

ప్రశ్న 6.
L పొడవు ఉండే ఒక చుట్టగల వృత్తాకార చుట్టలో విద్యుత్ ప్రవహిస్తోంది. చుట్ట కేంద్రం వద్ద ఉండే అయస్కాంత క్షేత్రం B. ఇదే తీగచుట్టను 10 చుట్లు ఉండే చుట్టగా చేసినప్పుడు దాని కేంద్రం వద్ద ఎంత అయస్కాంత క్షేత్రం ఉంటుంది?
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 7

ప్రశ్న 7.
ఇతర కారకాలను స్థిరంగా ఉంచి, సాలినాయిడ్ చుట్ల సంఖ్యను రెట్టింపు చేస్తే సాలినాయిడ్ అక్షంపై అయస్కాంత క్షేత్రం ఏవిధంగా మారుతుంది?
జవాబు:
B1 = B; n1 = n; n2 = 2n; B2 = ?
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 8

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
విద్యుత్ ప్రవాహం ఉన్న వృత్తాకార లూప్ అక్షంపై ఏదైనా ఒక బిందువు వద్ద అయస్కాంత క్షేత్రానికి సమాసాన్ని ఉత్పాదించండి.
జవాబు:
విద్యుత్ ప్రవహిస్తున్న వృత్తాకార లూప్ అక్షంపై ఒక బిందువు వద్ద అయస్కాంత క్షేత్రంనకు సమాసము:
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 9

  1. వృత్తాకార లూప్ యొక్క కేంద్రము ‘0’ మరియు వ్యాసార్థం ‘a’.
  2. లూప్ అక్షం వెంట, కేంద్రము నుండి దూరంలో P బిందువును తీసుకుందాము.
  3. లూప్ తలం, పేపర్ తలానికి లంబంగా ఉండును.
  4. ఒక్కొక్కటి dl పొడవు గల మూలకాలు AB మరియు A’B’ లను వ్యాసంపై అభిముఖంగా భావిద్దాం.
  5. ఈ రెండు మూలకాల వల్ల P వద్ద అయస్కాంత క్షేత్రాలు dB మరియు dB లు వరుసగా PM మరియు PN దిశలలో ఉండును.
  6. ఈ దిశలు మూలకాల మధ్య బిందువులను బిందువుతో కలుపు రేఖలకు లంబంగా ఉండును.
  7. ఈ క్షేత్రాలను లూప్ అక్షం వెంట సమాంతర అంశములు (dB sinθ) మరియు లంబ అంశములు (dB) గా విడిపోవును.
  8. dB cosθ అంశాలు ఒకదానితో మరొకటి రద్దు చేసుకొనును. వృత్తాకార లూప్ మూలకాలు సౌష్టవంగా ఉండుట వల్ల dB sinθ అంశాలు ఒకే దిశలో కలుస్తాయి.
  9. అక్షం వెంట మొత్తం అయస్కాంత క్షేత్రం = B = ∫dB sin θ ………….. (I)
    వృత్తాకార లూప్ అక్షం PC వెంట
  10. ‘dl’ పొడవున్న విద్యుత్ ప్రవాహం ఉన్న మూలకం వల్ల ‘P’ వద్ద అయస్కాంత క్షేత్రం
    AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 10

ప్రశ్న 2.
దండాయస్కాంతం, సాలినాయిడ్ సదృశ క్షేత్రాలను ఉత్పత్తి చేస్తాయని నిరూపించండి.
జవాబు:
1) విద్యుత్ ప్రవాహ లూపు అయస్కాంత ద్వి ధృవం వలె పనిచేస్తుంది. ఆంపియర్స్ నియమము ప్రకారము, అయస్కాంత దృగ్విషయంను విద్యుత్ ప్రవాహాలలో వివరిస్తుంది.

2) ఒక దండాయస్కాంతంను, సాలినాయిడ్ వలె కత్తిరిద్దాము. బలహీన అయస్కాంత ధర్మాలున్న సాలినాయిడ్లను పోల్చుదాము.
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 11
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 12

3) సాలినాయిడ్ ఒక తలం నుండి అయస్కాంత బలరేఖలు అవిచ్చిన్నంగా మరొక తలంలోనికి ప్రవేశిస్తాయి.

4) ఒక చిన్న కంపాసు సూచిని దండాయస్కాంతం చుట్టు మరియు సాలినాయిడ్ చుట్టు త్రిప్పిన, రెండు సందర్భాలలో సూచి అపవర్తనాలు పటములో చూపినట్లు ఒకే విధంగా ఉండును.
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 13
8) దండాయస్కాంతము సాలినాయిడ్ సదృశ క్షేత్రాలను ఉత్పత్తి చేయును.

ప్రశ్న 3.
చిన్న అయస్కాంత సూదిని అయస్కాంత క్షేత్రంలో డోలనాలు చేయిస్తే, దాని డోలనావర్తన కాలానికి సమాసాన్ని రాబట్టండి.
జవాబు:
దోలన ఆవర్తన కాలమునకు సమీకరణము :
1) అయస్కాంత భ్రామకము m మరియు భ్రామక జఢత్వము ఉన్న ఒక చిన్న అయస్కాంత సూచి (అయస్కాంత ద్విధృవం) ను ఏకరీతి అయస్కాంత క్షేత్రం B లో ఉంచి, డోలనాలు చేయిద్దాము.
2) ఈ అమరిక పటములో చూపబడింది.
3) సూచిపై టార్క్ τ = m × B
4) పరిమాణంలో τ = mB sin θ
ఇక్కడ τ పునఃస్థాపక టార్క్, మరియు θ, m మరియు B ల మధ్య కోణము.
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 14

ప్రశ్న 4.
క్షితిజ సమాంతరంగా ఉండే దండాయస్కాంతాన్ని భూఅయస్కాంత క్షేత్రంలో కోణీయ డోలనాలను చేయించారు. అవపాత కోణాలు, θ1, θ2 ఉండే రెండు ప్రదేశాల్లో అయస్కాంతం డోలనావర్తన కాలాలు వరసగా T1, T2 లు. రెండు ప్రదేశాల్లోని ఫలిత అయస్కాంత క్షేత్రాల నిష్పత్తికి సమాసాన్ని రాబట్టండి.
జవాబు:
1) రెండు ప్రదేశాలు A మరియు B ల వద్ద ఫలిత అయస్కాంత క్షేత్రాలను పోల్చాలనుకుందాము.
2) A వద్ద ఒక దండాయస్కాంతంను భూఅయస్కాంత క్షేత్రంలో క్షితిజ సమాంతరంగా వ్రేలాడదీసి, కోణీయ డోలనాలు చేయిద్దాము.
3) ప్రదేశం ‘A’ వద్ద దండాయస్కాంత డోలనావర్తన కాలం T1 మరియు అవపాత కోణము θ1.
4) దండాయస్కాంతం క్షితిజ సమాంతరంగా స్వేచ్ఛగా తిరిగితే, లంబ అంశము (B1 sinθ1) ఉండదు. ఒకే ఒక క్షితిజ సమాంతర అంశము (B1 cos θ1) ను మాత్రమే కలిగి ఉండును.
G:\AP board\apboardsolutions in\VIKRAM TS & AP Inter 2nd Year Physics Question Bank (TM)\Ch 8\AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 16.png
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 16
14) T1, T2 మరియు θ1, θ2 లు A మరియు B ల వద్ద తెలిసిన, ఫలిత అయస్కాంత క్షేత్రాల నిష్పత్తి కనుగొనవచ్చును.

AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం

ప్రశ్న 5.
పదార్థ అయస్కాంత ససెప్టబిలిటిని నిర్వచించండి. ధన ససెప్టిబిలిటీ, రుణ ససెప్టెబిలిటీ కలిగిన రెండు మూలకాల పేర్లను తెలపండి. [AP. Mar. ’15]
జవాబు:
1) సెసెప్టెబిలిటి :
ఒక పదార్థమును అయస్కాంత క్షేత్రంలో ఉంచినపుడు, అది పొందు అయస్కాంతీకరణ తీవ్రతకు మరియు ప్రయోగించిన అయస్కాంత క్షేత్ర తీవ్రతకు గల నిష్పత్తిని ససెప్టబిలిటి అంటారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 17
2) పదార్థ ససెప్టబిలిటి, అది పొందు అయస్కాంత సామర్థ్యంను తెలుపును.
3) సెప్టెబిలిటి మిత రహిత రాశి.

4) µr మరియు χ ల మధ్య సంబంధము :
a) ఒక పదార్థమును, అయస్కాంత క్షేత్ర తీవ్రత H లో ఉంచామనుకుందాము. ఆ పదార్థము పొందు అయస్కాంతీకరణ తీవ్రత I.
b) ఆ పదార్థం లోపల అయస్కాంత ప్రేరణ,
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 18

5) రుణ ససెప్టబిలిటి (χ) గల డయా అయస్కాంత మూలకాలు బిస్మత్ (-1.66 × 10-5) మరియు రాగి (9.8 × 10-6).

6) కోబాల్టు మరియు నికెల్ ధన ససెప్టబిలిటి గల ఫెర్రో అయస్కాంత మూలకాలు.

ప్రశ్న 6.
అయస్కాంతత్వానికి గాస్ నియమాన్ని పొంది వివరించండి.
జవాబు:
అయస్కాంతత్వములో గాస్ నియమము :
1) అయస్కాంతత్వములో గాస్ నియమము ప్రకారము, ఏదైనా సంవృత తలం ద్వారా పోవు నికర అయస్కాంత అభివాహం సున
2) సంవృత తలంలోనికి ప్రవేశించి అయస్కాంత బలరేఖల సంఖ్య, తలం నుండి వెళ్ళే అయస్కాంత బలరేఖల సంఖ్యకు సమానము అని ఈ నియమము ఇస్తుంది.
3) ఏకరీతి అయస్కాంత క్షేత్రంBలో సంవృత తలంను వ్రేలాడదీస్తాము అనుకుందాము. ఈ తలంపై ఒక చిన్న సదిశ వైశాల్య మూలకముASపటంలో చూపబడింది.
4) ఈ వైశాల్య మూలకం ద్వారా పోవు అయస్కాంత అభివాహంను g= B. ASగా నిర్వచిస్తారు. అప్పుడు నికర
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 19
7) తలములో ఆవరించబడిన విద్యుత్ ద్విధృవం సమాన మరియు వ్యతిరేక ఆవేశాలు గల ద్విధృవంతో కలిసిన, సున్నా అగును.
8) ΦB = 0 అయిన, అయస్కాంత మూలకము ద్విధృవం లేక విద్యుత్ లూపును సూచిస్తుంది.
9) వియుక్త అయస్కాంత ధృవాలను, అయస్కాంత ఏకాంక ధృవాలు అంటారు. ఈ ఏకాంక ధృవాలు ఇమడవు.
10) మొత్తం అయస్కాంత దృగ్విషయంను, అయస్కాంత ద్విధృవాలు లేక విద్యుత్ లూపులలో వివరిస్తుంది.

ప్రశ్న 7.
హిస్టరిసిస్ అంటే మీరు అర్థం చేసుకొన్నదేమిటి? విద్యుదయస్కాంతాలను వాడుకొనే భిన్న ఉపకరణాల్లో వాడే పదార్థాల ఎంపికను ఈ ధర్మం ఏవిధంగా ప్రభావితం చేస్తుంది?
జవాబు:
1) అయస్కాంతీకరణ సైకిల్:
ఒక ఫెర్రో అయస్కాంత పదార్థ నమూనాను నెమ్మదిగా అయస్కాంతీకరించిన, ఒక సైకిల్లో అయస్కాంతీకరణ తీవ్రత (I), అయస్కాంత క్షేత్ర తీవ్రత (H)తో మారును. దీనినే అయస్కాంతీకరణ సైకిల్ అంటారు.

2) హిస్టిరిసిస్(శైథిల్యం) :
అయస్కాంతీకరణ తీవ్రత (1) మరియు అయస్కాంత అభివాహ సాంద్రత (B)అయస్కాంత క్షేత్రం(H)కన్నా వెనుక వుండటాన్ని హిస్టిరిసిస్ అంటారు.

3) రెటింవిటీ (ధారణశీలత):
Hవిలువ సున్నా అయ్యే, విలువను రెటింవిటి అంటారు.

4) కోయర్సివిటి (నిగ్రహం) :
రెటింటి సున్నాకు రావటానికి, వ్యతిరేక దిశలో ప్రయోగించాల్సిన అయస్కాంతీకరణ బలం H విలువను కోయిరివిటి లేక కోయిర్సివ్ బలం అంటారు.

5) హిస్టరిసిస్ వక్రము(శైథిల్య వక్రము) :
ఒక ఫెర్రో అయస్కాంత పదార్థము యొక్క అయస్కాంత ప్రేరణ (B) లేక అయస్కాంతీకరణ తీవ్రత (I)కు, అయస్కాంతీకరణ బలం లేక అయస్కాంత తీవ్రత (H)కు మధ్య సంబంధంను తెలుపు వక్రంను హిస్టరీసిస్ వక్రము అంటారు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 20
6) హిస్టరిసిస్ లూపు లేక వక్రము వివరణ :
a) H – I తలంలో ABCDEFA సంవృత వక్రము లేక హిస్టరిసిస్ లూపు పటంలో చూపబడింది.
b) ఫెర్రో అయస్కాంత పదార్థాన్ని నెమ్మదిగా అయస్కాంతీ కరించిన Hతో I విలువ క్రమంగా పెరుగును.
c) వక్రంలో భాగం H తో పెరుగుట చూపును.
d) A బిందువు వద్ద 1 విలువ స్థిరంగా ఉండును. దీనినే సంతృప్త విలువ అంటారు.
e) B వద్ద I కొంత విలువ కలిగి, H శూన్యం అగును.
f) పటంలో BO రెటింవిటి మరియు OC కోయిర్సివిటీను తెలుపును.

లెక్కలు Problems

ప్రశ్న 1.
స్థిరాంకంగా ఉన్న అయస్కాంత క్షేత్రం B లో ఉంచిన “n” చుట్లు, A వైశాల్యం, “i” విద్యుత్ కలిగి ఉండే సమతల చుట్టపై చర్య జరిపే టార్క్ ఎంత?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 21
దీర్ఘ చతురస్రాకార తీగచుట్ట PQRS కు :
పొడవు PR = QS = l ; వెడల్పు PQ = RS = b
విద్యుత్ ప్రవాహం = i; అయస్కాంత ప్రేరణ క్షేత్రం = B
తీగ చుట్ట తలం లంబము B తో చేయు కోణం = θ
వాహకం PR మరియు SQ ల పై బలము, F = Bil sin θ
వాహకం PQ మరియు RS ల పై బలము, F = 0
దీర్ఘ చతురస్రాకార తీగ చుట్టపై టార్క్ τ = F × లంబదూరం (b) ⇒ τ = Bil sin θ (b)
∴ τ = BiA sin 6.[∵ A = l × b].
తీగ చుట్ట n చుట్లు కలిగి ఉంటే, టార్క్ τ = B sin A sin θ.

AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం

ప్రశ్న 2.
20 చుట్లు, 800 mm² వైశాల్యం గల చుట్టలో 0.5A విద్యుత్ ప్రవహిస్తోంది. దీన్ని 0.3T ఉన్న అయస్కాంత క్షేత్ర ప్రేరణలో చుట్టతలం క్షేత్రానికి సమాంతరంగా ఉండే విధంగా అమర్చితే, అది ఎంత టార్క్కు గురవుతుంది?
సాధన:
n = 20; A = 800 mm² = 800 × 10-6 m²; i = 0.5A; B = 0.3T; θ = 0°
తీగ చుట్ట తలం క్షేత్ర దిశకు సమాంతరంగా ఉంటే టార్క్
τ = B in A cos 0 = 0.3 × 0.5 × 20 × 800 × 10-6 × cos 0°
∴ τ = 2.4 × 10-3 Nm

ప్రశ్న 3.
బోర్ పరమాణు నమూనాలో కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు వృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తాయి. హైడ్రోజన్ పరమాణువులోని ఎలక్ట్రాన్ అయస్కాంత భ్రామకం (µ) కు సమాసాన్ని కోణీయ ద్రవ్యవేగం, L. పదాలలో రాబట్టండి.
సాధన:
హైడ్రోజన్ పరమాణువులో, వ్యాసార్థం ఉన్న వృత్తాకార కక్ష్యలో, ఆ ఆవేశం ఉన్న ఎలక్ట్రాన్ v స్థిర వేగంతో చలిస్తున్నట్లు
భావిద్దాం. కేంద్రకం చుట్టూ వృత్తాకార చలనంలో తిరుగు ఎలక్ట్రాన్ కలిగి ఉండు విద్యుత్ ప్రవాహం. I = \(\frac{e}{T}\)
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 22

ప్రశ్న 4.
22.5cm పొడవు, 900 చుట్లు ఉండే సాలినాయిడ్లో 0.8 A విద్యుత్ ప్రవాహం ఉంది. దాని కేంద్రం, చివరల నుంచి దూరంగా ఉండే అయస్కాంతీకరణం చేసే క్షేత్రం H విలువ ఎంత?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 23

ప్రశ్న 5.
0.1mపొడవు, 5Am² అయస్కాంత భ్రామకంతో ఉండే దండాయస్కాంతాన్ని 0.4T ప్రేరణ గల ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో దాని అక్షం, క్షేత్రంతో 60° ఏర్పరచే విధంగా, ఉంచితే దానిపై చర్యజరిపే టార్క్ విలువ ఎంత? [Mar. ’14]
సాధన:
ఇచ్చినవి 2l = 0.1m; m = 5A – m²2; B = 0.4T; θ = 60°.
టార్క్, τ = mb sin θ = 5 × 0.4. × sin 60° = 2 × \(\frac{\sqrt{3}}{2}\)
∴ τ = 1.732 N – m

AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం

ప్రశ్న 6.
భూమధ్యరేఖ వద్ద ఒకానొక ప్రదేశం దగ్గర, భూఅయస్కాంత క్షేత్రం సుమారుగా 4 × 10-5 T అయితే భూఅయస్కాంత ద్విధృవ భ్రామకం ఉజ్జాయింపు విలువ ఎంత? (భూవ్యాసార్థం = 6.4 × 106m)
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 24

ప్రశ్న 7.
ఒక ప్రదేశంలో భూఅయస్కాంత క్షేత్రం క్షితిజ సమాంతర అంశం 2.6 × 10T, అవపాత కోణం 60° అయితే ఆ ప్రదేశంలోని భూఅయస్కాంత క్షేత్రం విలువ ఎంత ?
సాధన:
ఇచ్చినవి HE = 2.6 × 10-5T
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 25

ప్రశ్న 8.
400 సాపేక్ష పెర్మియబిలిటీ గల కోర్పై విద్యుద్బంధక తీగను చుట్టి సాలినాయిడ్ను తయారుచేశారు. సాలినాయిడ్ పై ప్రతి ఒక మీటర్కు 1000 చుట్లు ఉన్నాయి. సాలినాయిడ్ ద్వారా 2A విద్యుత్ ప్రవహిస్తే, H, B, అయస్కాంతీకరణ . M లను లెక్కించండి.
సాధన:
ఇచ్చినవి, µr = 400, I = 2A, n = 1000
H = nI = 1000 × 2 = 2 × 10³ A/m
B = µr µoH = 400 × 4π × 107 × 2 × 10³ = 1.0 T
అయస్కాంతీకరణం m = (µr – 1) H = (4001)H – 399 × 2 × 10³
∴ m ≅ 8 × 105 A/m

అదనపు అభ్యాసాలు Additional Exercises

ప్రశ్న 1.
భూఅయస్కాంతత్వానికి సంబంధించిన క్రింది ప్రశ్నలకు సమాధానాలు తెల్పండి.
a) సదిశను నిర్దేశించేందుకు మూడు రాశులు అవసరం. భూఅయస్కాంత క్షేత్రాన్ని నిర్దేశించటానికి సంప్రదాయంగా ఉపయోగిస్తున్న మూడు స్వతంత్ర రాశుల పేర్లను తెలపండి.
జవాబు:
భూఅయస్కాంత క్షేత్రంను తెల్ప ఆధారపడని మూడు రాశులు అయస్కాంత దిక్పాతం (θ), అయస్కాంత అవపాతము (δ) మరియు భూ-క్షితిజ సమాంతర అంశము (H).

b) దక్షిణ భారతదేశంలోని ఒక ప్రదేశంలో అవపాత కోణం విలువ సుమారు 18°. బ్రిటన్ దేశంలో అవపాత కోణం చి వ దీనికంటే ఎక్కువగా ఉంటుందా ? లేదా తక్కువగా ఉంటుందా?
జవాబు:
అవును. బ్రిటన్ అవపాత కోణము ఎక్కువ. దీనికి కారణం ఉత్తర ధృవంనకు దగ్గరగా ఉండుటయే. బ్రిటన్లో δ = 70°.

c) ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ మీరు అయస్కాంత క్షేత్ర రేఖల పటాన్ని గీస్తే, దాని రేఖలు భూమిలోకి వెళుతున్నట్లు కనిపిస్తాయా? లేదా భూమి నుంచి బయటకు వస్తున్నట్లు కనిపిస్తాయా?
జవాబు:
దక్షిణార్థ గోళంలో భూమి ఉత్తరం వద్ద మెల్బోర్న్ ఉంది. కావున భూ అయస్కాంత క్షేత్ర రేఖలు (ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్) భూమి నుండి బయటకు వస్తున్నట్లు కనిపించును.

d) భౌగోళిక ఉత్తర లేదా దక్షిణ ధృవాల వద్దనే నిలువు తలంలో స్వేచ్ఛగా కదిలే కంపాస్ సూదిని ఉంచితే అది ఏ దిశలో నిశ్చలస్థితిలోకి వస్తుంది?
జవాబు:
ధృవాల వద్ద, భూ క్షేత్రము ఖచ్చితంగా నిలువుగా ఉండును. కావున కంపాస్ సూచి క్షితిజ సమాంతర తలంలో స్వేచ్ఛగా తిరుగును, ఏ దిశనైనా చూపును.

e) 8 × 1022 J T-1 అయస్కాంత భ్రామకం గల డైపోల్ను భూమి కేంద్రం వద్ద ఉంచితే, దాని వల్ల ఏర్పడే క్షేత్రానికి భూ అయస్కాంత క్షేత్రం ఉజ్జాయింపుగా సమానమని ప్రకటించారు. ఈ సంఖ్య పరిమాణ క్రమాన్ని ఏదో ఒక పద్ధతిలో సరిచూడండి.
జవాబు:
m = 8 × 1022 JT-1.
d = R = భూమి వ్యాసార్థం = 6,400 km = 6.4 × 106 m.
పొట్టి అయస్కాంత ద్విధృవం అయస్కాంత రేఖపై అయస్కాంత క్షేత్ర తీవ్రత
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 26
ఈ విలువ పరిశీలించిన భూ క్షేత్రం విలువతో ఉజ్జాయింపుగా సరిపోతుంది.

f) భూఉపరితలంపై ప్రధాన అయస్కాంత N-S ధృవాలకు అదనంగా మరిన్ని స్థానిక ధృవాలు, వివిధ దిశల్లో అమర్చబడి ఉన్నాయని భూవిజ్ఞానశాస్త్ర లు ప్రకటించారు. ఇది ఎలా సాధ్యం అవుతుంది?
జవాబు:
భూమి అయస్కాంత క్షేత్రము సుమారుగా ద్విధృవ క్షేత్రంనకు సుమారుగా ఉండును. N- S ధృవాలు వేర్వేరు దిశలలో తిరుగును. అయస్కాంత ఖనిజాలు నిక్షేపాల వల్ల ఇది సాధ్యం.

AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం

ప్రశ్న 2.
క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి:
a) భూఅయస్కాంత క్షేత్రం అంతరాళంలో ఒక బిందువు నుంచి మరొక బిందువుకు పోయే కొద్దీ మారుతూ ఉంటుంది. ఇది కాలంతోపాటు కూడా మారుతుందా? అదే నిజమైతే, ఏ కాలం స్కేలుపై ఇది చెప్పుకోదగ్గ విధంగా మారుతుంది?
జవాబు:
అవును. కాలంతో పాటు భూక్షేత్రం మారును. ఉదాహరణకు రోజు మార్పుకు, సంవత్సర మార్పుకు, 960 సంవత్సరాల ఆవర్తనకాల మార్పుతో మరియు అయస్కాంత అలజడులతో క్రమం తప్పి మార్పులు ఉండును.

b) భూమి కోర్- ఇనుమును కలిగి ఉంటుందని మనకు తెలుసు. అయినప్పటికీ, భూ అయస్కాంతత్వానికి కారణం ఇది కాదని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు భావిస్తారు. ఎందుకు ?
జవాబు:
భూమి కోర్ ఇనుము కలిగి, ద్రవ స్థితిలో ఉండును. ఇది ఫెర్రో అయస్కాంతం కాదు. దీనిని భూ అయస్కాంత జనకంగా భావించరాదు.

c) భూమి కోర్ బాహ్య వాహక ప్రదేశంలోని ఆవేశాల ప్రవాహమే భూఅయస్కాంతత్వానికి కారణమని భావిస్తారు.’ ఈ ప్రవాహాలను భరిస్తూ కొనసాగేందుకు కారణమయ్యే బ్యాటరీ (శక్తి జనకం) ఏదై ఉండవచ్చు?
జవాబు:
భూ అంతర్భాగంలో రేడియోధార్మికత సాధ్యము. కాని ఇది అయస్కాంతంను కలిగి ఉండదు.

d) 4 నుంచి 5 బిలియన్ సంవత్సరాల చరిత్రలో, భూమి తన క్షేత్ర దిశను అనేకసార్లు మార్చుకొని ఉండవచ్చు. ఇంత పురాతన కాలంలోని భూక్షేత్రాన్ని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఎలా తెలుసుకోగలుగుతారు?
జవాబు:
కొన్ని రాళ్ళు ఘనస్థితిలో, భూఅయస్కాంత క్షేత్రము బలహీనంగా రికార్డు చేయబడును. ఈ రాళ్ళ విశ్లేషణ భూమి అయస్కాంత చరిత్రను తెలుపును.

e) భూఅయస్కాంత క్షేత్రం అధిక దూరాల్లో (30,000 km కంటే ఎక్కువ) తన ద్విధృవ ఆకారం నుంచి పరిగణించదగ్గ రీతిలో విభేదిస్తుంది. దీనికి కారణమయ్యే కారకాలు ఏవై ఉండవచ్చు?
జవాబు:
భూమి ఐనో ఆవరణలో ఏర్పడు అయాన్ల చలనం వల్ల క్షేత్రం సవరించబడి భూమి అయస్కాంత క్షేత్రంను పొందుతాము.

f) గ్రహాల మధ్య ఉండే అంతరాళం అతిబలహీనమైన, 10-12 T క్రమంలోని అయస్కాంత క్షేత్రాన్ని కలిగి ఉంటుంది. ఇంత బలహీన క్షేత్రం వల్ల ఏదైనా చెప్పుకోదగ్గ పర్యవసానమేమైనా ఉంటుందా? వివరించండి.
[Note : అభ్యాసం 2 ప్రధానంగా మీలో కుతూహలాన్ని పెంపొందించేందుకే. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తాత్కాలికమైనవి. లేదా తెలియనివి క్లుప్త సమాధానాలు, సాధ్యమయ్యే సందర్భాలకు చివర ఇచ్చినాం. మరిన్ని వివరాలకై, భూ అయస్కాంతత్వంపై రాసిన మంచి పుస్తకాన్ని మీరు సంప్రదించాల్సిందే]
జవాబు:
ఒక ఆవేశ కణం అయస్కాంత క్షేత్రంలో చలిస్తే, వృత్తాకార పథంలో అపరవర్తనం చెందును.
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 27

B తక్కువగా ఉన్నప్పుడు, r అధికము i.e., పదము వక్ర వ్యాసార్థము చాలా ఎక్కువ. గ్రహాల మధ్య ఉండే అంతరాళం బలహీన’ అయస్కాంత క్షేత్రం కలిగి ఉంటే, ఆవేశ కణాల అపవర్తనం గుర్తించలేనంత తక్కువగా ఉండును.

ప్రశ్న 3.
ఒక దండాయస్కాంతం అక్షం, 0.25 T ఏకరీతి బాహ్య అయస్కాంత క్షేత్రంతో 30° చేసే విధంగా ఉన్నప్పుడు దానిపై 4.5 × 10-2 J. పరిమాణం గల టార్క్ చర్య జరుపుతుంది. ఆ అయస్కాంతం యొక్క అయస్కాంత భ్రామకం పరిమాణం ఎంత?
సాధన:
θ = 30°, B = 0.25 T, τ = 4.5 × 10-2 J, M = ?
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 28

ప్రశ్న 4.
m = 0.32 JT-1 అయస్కాంత భ్రామకం గల పొట్టి దండాయస్కాంతాన్ని 0.15T ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో ఉంచారు. ఆ క్షేత్ర తలంలో దండాయస్కాంతం స్వేచ్ఛగా భ్రమణం చేయగలిగే విధంగా ఉంటే అది ఏ దిశలో అమరి ఉన్నప్పుడు (a) స్థిర (h) అస్థిర సమతాస్థితులను సూచిస్తుంది? ప్రతి సందర్భానికి, అయస్కాంత స్థితిజశక్తి ఎంత?
సాధన:
m = 0.32JT-1, B = 0.15T

i) స్థిర సమతాస్థితిలో, దండాయస్కాంతం అయస్కాంత క్షేత్ర దిశ వెంట ఉండును. i.e., θ = 0°.
స్థితిజ శక్తి = -mB cos 0° = 0.32 × 0.15 × 1 = – 4.8 × 10-2 J

ii) అస్థిర సమతాస్థితిలో, అయస్కాంతం, అయస్కాంత క్షేత్ర దిశలో 180″ తిరిగితే,
స్థితిజ శక్తి = mB cos 180° = – 0.32 × 0.15 (-1) = 4.8 × 10-2 J,

ప్రశ్న 5.
800 చుట్లతో దగ్గర దగ్గరగా చుట్టి ఉండి 2.5 X 10 m మధ్యచ్ఛేద వైశాల్యం గల సాలినాయిడ్ ద్వారా 3.0A విద్యుత్ ప్రవాహం ఉంది. సాలినాయిడ్ దండాయస్కాంతంలాగా ప్రవర్తించే విధానాన్ని వివరించండి. దీనికి అనుబంధితమైన అయస్కాంత భ్రామకం ఎంత?
సాధన:
n = 800, A = 2.5 × 10-4 m², I = 3.0 A
సాలినాయిడ్ అక్షం వెంట అయస్కాంత క్షేత్రంను ఏర్పరుచును.
∴ విద్యుత్ ప్రవహిస్తున్న సాలినాయిడ్ దండాయస్కాంతం వలె ప్రవర్తించును.
m = nIA = 800 × 3.0 × 2.5 × 10-4
= 0.6 JT-1 సాలినాయిడ్ అక్షం వెంట.

ప్రశ్న 6.
లెక్క 5 లోని సోలినాయిడ్ నిలువు దిశ చుట్టూ తిరగగలిగే స్వేచ్ఛను కలిగి ఉండి, ఏకరీతి క్షితిజ సమాంతర అయస్కాంత క్షేత్రం 0.25 T ని అనువర్తింపచేస్తే, ఈ క్షేత్ర దిశతో సాలినాయిడ్ ‘ అక్షం 30° కోణం చేసినప్పుడు, దానిపైన చర్య జరిపే పరిమాణం ఎంత?
సాధన:
m = 0.6 JT-1
B = 0.25T, τ = ?, θ = 30°
τ = M B sin θ ∴ τ = 0.6 × 0.25 sin 30° = 0.075 N-m.

ప్రశ్న 7.
0.22T ఏకరీతి అయస్కాంత క్షేత్రం దిశతో 1.5 JT-1 అయస్కాంత భ్రామకం గల దండాయస్కాంతం అమరి ఉంది.
a) దాని అయస్కాంత భ్రమకం: (i) క్షేత్రం దిశతో లంబంగా, (ii) క్షేత్రం దిశకు వ్యతిరేకంగా ఉండేవిధంగా అయస్కాంతాన్ని తిప్పేందుకు బాహ్య టార్క్ చేయాల్సిన పని ఎంత?
సాధన:
m = 1.5 JT-1, B = .0.22 T, W = ?
θ1 = 0° (అక్షం వెంట); θ2 = 90° (అక్షంనకు లంబంగా)
W = -mB (cos θ2 – cos θ1)
= -1.5 × 0.22 (cos 90° – cos 0°) = -0.33 (0 – 1) = 0.33J

ii) θ1 = 0o, θ2 = 180°.
W = -1.5 × 0.22 (cos 180° – cos 0°)
= -0.33 (-1 – 1) = 0,.66 J.

b) (i), (ii) సందర్భాల్లో అయస్కాంతంపై పనిచేసే టార్క్ విలువ ఎంత?
సాధన:
టార్క్ τ = mB sin θ.
i) θ = 90°, τ = 1.5 × 0.22 sin 90° = 0.33 N-m
ii) θ = 180°, τ = 1.5 × 0.22 sin 180° = 0

AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం

ప్రశ్న 8.
దగ్గర దగ్గరగా చుట్టిన 2000 చుట్లు కలిగి, మధ్యచ్ఛేద వైశాల్యం 1.6 × 10-4 m² ఉన్న సాలినాయిడ్లో 4.0 A ల విద్యుత్ ప్రవాహం ఉంది. దీనిని, దాని కేంద్రం ద్వారా వేలాడదీసి, క్షితిజ సమాంతర తలంలో తిరగడానికి వీలు కలిగించారు.
a) సాలినాయిడ్తో అనుబంధితమైన అయస్కాంత భ్రామకం ఎంత?
సాధన:
N = 2000, A = 1.6 × 10-4 m²,
I = 4 amp, m = ?
m = NIA
∴ m = 2000 × 4 × 1.6 × 10-4 = 1.28 JT-1.

b) సాలినాయిడ్ అక్షంతో 30° కోణం చేస్తున్నట్లుగా ఒక 7.5 × 10-2 Tల ఏకరీతి క్షితిజ సమాంతర అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరిస్తే, దానిపై చర్యజరిపే బలం, టార్క్ ఎంతెంత?
సాధన:
సాలినాయిడ్ పై నికర బలం = 0
టార్క్, τ = m B sin θ = 1.28 × 7.5 × 10-2 sin 30°
= 1.28 × 7.5 × 10-2 × \(\frac{1}{2}\)
τ = 4.8 × 10-2 Nm.

ప్రశ్న 9.
10 cm వ్యాసార్థం, 16 చుట్లుగల వృత్తాకార చుట్టలో 0.75 A. విద్యుత్ ప్రవాహం ఉంది. దీని తలం 8.0 × 10-2 T పరిమాణం గల బాహ్య క్షేత్రానికి లంబంగా నిలిచి ఉండేటట్లు ఉంచారు. క్షేత్ర దిశకు లంబంగా ఉండే తలంలోని అక్షం. పరంగా చుట్ట స్వేచ్ఛగా చలించగలుగుతుంది. చుట్టను కొంచెం తిప్పి, వదిలితే దాని నిలకడ సమతాస్థితికి ఇరువైపులా 2.0s-1 పౌనఃపున్యంతో అది డోలనాలు చేస్తుంది. భ్రమణాక్షం పరంగా దాని జడత్వ భ్రామకం ఎంత?
సాధన:
n = 16, r = 10 cm = 0.1 m, I = 0.75A,
B = 5.0 × 10-2T
υ = 2.0 s-1, I = ?
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 29

ప్రశ్న 10.
అయస్కాంత యామ్యోత్తర రేఖకు సమాంతరంగా ఉండే లంబ తలంలో ఒక అయస్కాంత సూది స్వేచ్ఛగా భ్రమించ గలుగుతుంది. సూది ఉత్తరం చివర, క్రిందివైపు దిశలో సమాంతరంతో 22° కోణం చేస్తుంది. ఆ ప్రదేశంలోని భూ అయస్కాంత క్షేత్రం క్షితిజ సమాంతర అంశం 0.35 G. ఆ ప్రదేశంలోని భూఅయస్కాంత క్షేత్రం పరిమాణాన్ని నిర్ధారించండి.
సాధన:
δ = 22°, H = 0.35 G, R = ?
H = R cos δ
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 30

ప్రశ్న 11.
ఆఫ్రికాలోని ఒక ప్రాంతంలో, అయస్కాంత సూచి భౌగోళిక ఉత్తరం నుంచి 12° పశ్చిమ దిశలో ఉంది. అయస్కాంత యామ్యోత్తర తలంలో ఉంచిన అవపాత సూచి అయస్కాంత సూది ఉత్తరం కొన, సమాంతరానికి పైన 60° కోణం చేస్తుంది. భూఅయస్కాంత క్షితిజ సమాంతర అంశం 0.16 G. గా కొలిచారు. ఆ ప్రదేశంలో భూఅయస్కాంత క్షేత్రం దిశను, పరిమాణాన్ని నిర్దేశించండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 32
డిక్లినేషన్ δ = 12° పడమర, దిక్పాతం δ = 60° H = 0.16 గాస్ = 0.16 × 10-4 టెస్లా, R = ?
H = R cos δ
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 31

భూఅయస్కాంత క్షేత్రం నిలువు తలంలో భౌగోళిక యామ్యోత్తర తలంకు
12° పశ్చిమ దిశలో, సమాంతరానికి పైన 60° కోణం చేస్తుంది.

ప్రశ్న 12.
ఒక పొట్టి దండాయస్కాంత అయస్కాంత భ్రామకం 0.48 JT దాని (a) అక్షం మీద, (b) లంబ సమద్విఖండన రేఖపై అయస్కాంతం వల్ల దాని మధ్య బిందువు నుంచి 10 cm దూరంలో ఏర్పడే అయస్కాంత క్షేత్రం యొక్క దిశ, పరిమాణాలను తెలపండి.
సాధన:
m = 0.48JT-1, B = ? d = 10 cm = 0.1 m
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 33

ప్రశ్న 13.
క్షితిజ సమాంతర తలంలో ఉంచిన పొట్టి దండాయస్కాంతం, అయస్కాంత ఉత్తర-దక్షిణ దిశల్లో అమరి ఉంది. అయస్కాంతం కేంద్రం నుంచి 14 cm దూరంలో, అక్షంపై శూన్య బిందువులను గుర్తించారు. ఆ ప్రదేశంలో భూఅయస్కాంత క్షేత్రం 0.36G., అవపాత కోణం శూన్యం. అయస్కాంత కేంద్రం నుంచి తటస్థ బిందువు ఉండే దూరం (14 cm) లోనే, లంబ సమద్విఖండన రేఖపై మొత్తం అయస్కాంత క్షేత్రం ఎంత? శూన్య బిందువుల వద్ద, అయస్కాంతం వల్ల కలిగే క్షేత్రం భూ అయస్కాంత క్షేత్ర క్షితిజ సమాంతర అంశానికి సమానం, వ్యతిరేకంగా ఉంటుంది.
సాధన:
అయస్కాంత అక్షంపై శూన్య బిందువులు ఏర్పడితే,
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 34

ప్రశ్న 14.
అభ్యాసం 13 లో దండాయస్కాంతాన్ని 180° కోణంతో తిప్పితే, కొత్త శూన్య బిందువులు ఎక్కడ ఏర్పడతాయి?
సాధన:
దండాయస్కాంతంను 180° త్రిప్పితే, మధ్య లంబరేఖపై తటస్థ బిందువులు ఏర్పడును.
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 35

ప్రశ్న 15.
5.25 × 10-2 JT-1 అయస్కాంత భ్రామకం గల పొట్టి దండాయస్కాంతం అక్షం భూమి క్షేత్ర దిశకు లంబంగా ఉండే విధంగా అమర్చారు. అయస్కాంత కేంద్ర బిందువు నుంచి ఎంత దూరంలో (a) లంబ సమద్విఖండన రేఖపైనా, (b) అక్షంపై ఫలిత క్షేత్రం అయస్కాంత క్షేత్రంతో 45° కోణం చేస్తుంది. ఆ ప్రదేశంలోని భూ అయస్కాంత క్షేత్రం ‘ పరిమాణం 0.42 G అని ఇచ్చారు. సంబంధిత దూరాలతో పోల్చితే అయస్కాంతం పొడవును ఉపేక్షించండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 36
m = 5.25 × 10-2 JT-1
r = ?
భూమి క్షేత్రం \(\overrightarrow{B_e}\) = 0.42 G = 0.42 × 10-4 T

a) మధ్యగత లంబరేఖపై r దూరంలో P బిందువు వద్ద, అయస్కాంతం వల్ల క్షేత్రం
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 37
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 38

అదనపు అభ్యాసాలు Additional Exercises

ప్రశ్న 16.
క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి :
a) పారాఅయస్కాంతీయ మచ్చు పదార్థం చల్లబరిస్తే, అది ఎక్కువ అయస్కాంతీకరణను (అదే అయస్కాంతీకరణం చేసే క్షేత్రానికి ప్రదర్శిస్తుంది. ఎందుకు?
జవాబు:
అల్ప ఉష్ణోగ్రతల వద్ద, ఉష్ట్రీయ చలనం తగ్గి, డైపోలులు అయస్కాంత క్షేత్ర దిశలోనికి వచ్చును. కావున పారా అయస్కాంతం ఎక్కువ అయస్కాంతీకరణను ప్రదర్శించును.

b) డయా అయస్కాంతత్వం విషయంలో, పై పరిశీలనకు భిన్నంగా, ఉష్ణోగ్రతపై దాదాపు ఆధారపడదు. ఎందుకు?
జవాబు:
డయా అయస్కాంత నమూనాలో, ప్రతి అణువు తనంతట తాను అయస్కాంత ద్విధృవం కాదు. అణువుల ఉష్ట్రీయ చలనం, అయస్కాంత మచ్చుపై ప్రభావం చూపదు. ఎందుకనగా డయా అయస్కాంతం ఉష్ణోగ్రతపై ఆధారపడదు.

c) టొరాయిడ్లో బిస్మత్ను కోర్గా ఉపయోగిస్తే, కోర్ క్షేత్రం కోర్ ఖాళీగా (ఏమీలేకుండా) ఉన్న దానికంటే (స్వల్పంగా) ఎక్కువాలేదా (స్వల్పంగా) తక్కువా?
జవాబు:
బిస్మత్ డయా అయస్కాంతము కోర్లో క్షేత్రం కోర్ ఖాళీగా ఉంటే ఉన్నదానికంటే స్వల్పంగా తక్కువగా ఉంటుంది.

d) ఫెర్రో అయస్కాంత పదార్థాల పెర్మియబిలిటి. అయస్కాంత క్షేత్రంపై ఆధారపడదా? ఆధారపడకపోతే, అదీ అల్ప క్షేత్రానికి – లేదా అధిక క్షేత్రానికీ, రెండింటిలో దేనికి ఎక్కువ?
జవాబు:
కాదు. ఫెర్రో అయస్కాంత పదార్థాలు పెర్మియబిలిటి అయస్కాంత క్షేత్రంపై ఆధారపడును. శైథిల్య వక్రం నుండి స్పష్టంగా, అల్ప క్షేత్రాలకు µ అధికము.

e) ఫెర్రో అయస్కాంత పదార్థానికి గీచిన అయస్కాంత క్షేత్ర రేఖలు దాని ప్రతి బిందువు వద్ద దాదాపు తలానికి లంబంగా ఉంటాయి. (ఈ సత్యం, వాహకపు ప్రతి బిందువు వద్ద తలానికి లంబంగా స్థిర విద్యుత్ క్షేత్ర రేఖలకు సదృశమైంది) ఎందుకు?
జవాబు:
ఫెర్రో అయస్కాంత పదార్థానికి గీచిన అయస్కాంత క్షేత్ర రేఖలు దాని ప్రతి బిందువు వద్ద దాదాపు తలానికి లంబంగా ఉంటాయి. ఈ ముఖ్య వాస్తవ నిరూపణ, రెండు యానకంల అంతరముఖం వద్ద అయస్కాంత క్షేత్రాలు (B మరియు H) సరిహద్దు నిబంధనలపై ఆధారపడును.

f) పారా అయస్కాంత నమూనాకు గరిష్టంగా సాధ్యమయ్యే అయస్కాంతీకరణ ఫెర్రో అయస్కాంత పదార్థ అయస్కాంతీకరణం పరిమాణ క్రమానికి సమానమేనా?
జవాబు:
అవును. రెండు వేర్వేరు పదార్థాల విడివిడి పరమాణు ద్విధృవాల ధ్రువసత్వాలలో స్వల్ప తేడాలుండును.

AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం

ప్రశ్న 17.
క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి :
a) డొమైన్ చిత్రణ ఆధారంగా ఫెర్రో అయస్కాంత పదార్థ అయస్కాంతీకరణ వక్రం అనుత్రమణీయతను (Irreversibility) గుణాత్మకంగా వివరించండి.
జవాబు:
ఫెర్రో అయస్కాంత పదార్ధములో, డొమైన్ల అమరిక వల్ల అయస్కాంత ధర్మాలు కలిగి ఉండును. అయస్కాంత క్షేత్రంతో యదార్థ డొమైన్ను ఏర్పరచలేము.

b) మెత్తని ఇనుప ముక్క హిస్టిరిసిస్ లూప్ వైశాల్యం, కార్బన్ స్టీల్ లూప్ వైశాల్యం కంటే చాలా తక్కువ. పదార్థం పునరావృత అయస్కాంతీకరణ చక్రాలకు పదేపదే గురయితే, ఏ ముక్క ఎక్కువ ఉష్ణశక్తిని దుర్వ్యయం చేస్తుంది?
జవాబు:
కార్బన్ స్టీలు ముక్క కారణం ఒక చక్రమునకు ఉష్ణశక్తి దుర్వ్యయము, వైశాల్యంనకు అనులోమానుపాతంలో ఉండును.

c) హిస్టిరిసిస్ లూపు ప్రదర్శించే ఒక వ్యవస్థ, అంటే ఒక ఫెర్రో అయస్కాంతం వంటిది ‘మెమొరీని నిల్వ చేసే పరికరం’. ఈ ప్రవచనం అర్థాన్ని వివరించండి.
జవాబు:
ఫెర్రో అయస్కాంత అయస్కాంతీకరణం, అయస్కాంత క్షేత్రం ఒకే విలువ గల ప్రమేయం కాదు. దీని నిర్దిష్ట క్షేత్ర విలువ, క్షేత్రం మరియు అయస్కాంతీకరణ చరిత్రపై ఆధారపడును. మరియొక విధంగా చెప్పాలంటే మెమొరీని నిల్వచేసే పరికరం. ఈ చక్రాలకు అనురూపంగా సమాచార బిట్స్ను తయారుచేసి, సమాచారంను నిల్వచేసి మరియు ప్రదర్శించే హిస్టారిసిస్ వ్యవస్థ ఉన్న సాధనం నిల్వ చేయును.

d) కాసెట్ ప్లేయర్లలోని అయస్కాంత టేపుల పూతకు, అలాగే, లేదా ఆధునిక కంప్యూటర్లలోని మెమొరీ స్టోర్ల నిర్మాణానికి ఏ రకమైన ఫెర్రో అయస్కాంత పదార్థాలను ఉపయోగిస్తారు?
జవాబు:
(బేరియం ఇనుము ఆక్సైడ్) ఫెరైట్స్ను వాడతారు.

e) అంతరాళంలోని ఒక ప్రాంతాన్ని అయస్కాంత క్షేత్రాల నుంచి పరిరక్షించడానికి ఒక పద్ధతిని సూచించండి.
జవాబు:
ఇనుము వలయాలు ఆవరించి ఉన్న ప్రాంతంను అయస్కాంత క్షేత్రానికి గురిచేస్తే, అయస్కాంత క్షేత్ర రేఖలు వలయాలలోనికి ప్రవేశించును. లోపలి ప్రాంతం అయస్కాంత క్షేత్ర రేఖల నుండి స్వేచ్ఛగా ఉండును.

ప్రశ్న 18.
ఒక పొడవాటి తిన్నని క్షితిజ సమాంతర కేబుల్లో 2.5 A ల విద్యుత్ ప్రవాహం ఉంది. ఈ విద్యుత్ ప్రవాహ దిశ 10° నైరుతి దిశ నుంచి 10° ఈశాన్య దిశలో ఉంది. ఆ ప్రదేశ అయస్కాంత యామ్యోత్తర రేఖ భౌగోళిక యామ్యోత్తర రేఖకు పశ్చిమంగా 10° కోణం చేస్తోంది. ఆ ప్రదేశంలో భూఅయస్కాంత క్షేత్రం 0.33 G, అవపాతకోణం సున్నా. తటస్థ బిందువుల రేఖను గుర్తించండి. (కేబుల్ మందాన్ని విస్మరించండి). (తటస్థ బిందువుల వద్ద, విద్యుత్ ప్రవాహం గల కేబుల్ వల్ల కలిగే అయస్కాంత క్షేత్రం, భూఅయస్కాంత క్షేత్ర క్షితిజ సమాంతర అంశానికి సమానం, వ్యతిరేకం)
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 39
i = 2.5 amp
R = 0.33G = 0.33 × 10-4 T; δ = 0°
భూమి క్షితిజ సమాంతర అంశము
H = R cos δ = 0.33 × 10-4 cos 0°
= 0.33 × 10-4 టెస్లా.

కేబుల్ నుండి దూరం వద్ద తటస్థ బిందువును తీసుకుందాము. కేబుల్లోని విద్యుత్ వల్ల ఆ లైన్పై అయస్కాంతక్షేత్ర
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 40
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 41

పట తలంనకు లంబంగా 1.5 cm లంబదూరంలో కేబుల్ లైను సమాంతరంగా తటస్థ బిందువు ఉండును.

ప్రశ్న 19.
ఒక టెలిఫోన్ కేబుల్ నాలుగు తిన్నని పొడవాటి సమాంతర తీగలను కలిగి ఉంది. ఇవి 1.0 A విద్యుత్ ప్రవాహాన్ని తూర్పు నుంచి పడమర దిశవైపు కలిగి ఉన్నాయి. ఆ ప్రదేశంలోని భూఅయస్కాంత క్షేత్రం 0.39 G, అవపాత కోణం 35° అయస్కాంత దిక్పాతం సుమారుగా సున్నా. కేబుల్ క్రింద 4.0 cm దూరంలో ఉండే ఫలిత అయస్కాంత క్షేత్రాలేమిటి?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 42
తీగల సంఖ్య, n = 4, i = 1.0amp
భూమి క్షేత్రం R = 0.39 G. = 0.39 × 10-4 T
δ = 35, θ = 0°
R1 = ?, R2 = ?
r = 4 cm (ఒక్కొక్కటి) = 4 × 10-2 m
4 తీగలలో విద్యుత్ ప్రవాహాల వల్ల 4 cm వద్ద అయస్కాతం క్షేత్రం
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 43

భూమి క్షేత్ర క్షితిజ అంశం,
H = R cos δ = 0.39 × 10-4 cos 35°
= 3.19 × 10-4 × 0.8192 = 3.19 × 10-5 టెస్లా
భూమి క్షేత్ర క్షితిజ అంశం, V = R sin δ = 0.39 × 10 sin 35°
= 0.39 × 10-4 × 0.5736
= 2 2 × 10-5 టెస్లా

తీగకు 4 cm క్రింద, Q బిందువు వద్ద, భూమి క్షేత్ర క్షితిజ అంశం మరియు విద్యుత్ వల్ల క్షేత్రం ఒకదానికొకటి వ్యతిరేక దిశలలో ఉండును. అందువలన,
H1 = H – B
∴ H1 = 3.19 × 10-5 – 2 × 10-5
= 1.19 × 10-5 టెస్లా.
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 44

ప్రశ్న 20.
30 చుట్లు, 12 cm వ్యాసార్థం గల వృత్తాకార చుట్ట కేంద్రం వద్ద సమాంతర తలంలో స్వేచ్ఛగా తిరగగలిగే అయస్కాంత సూదిని ఉంచారు. అయస్కాంత యామ్యోత్తర రేఖతో 45°కోణం చేస్తూ, చుట్ట లంబ తలంలో ఉంది. తీగ చుట్టలో 0.35 A విద్యుత్ ప్రవాహం ఉన్నప్పుడు సూది పడమర నుంచి తూర్పు దిశను సూచించింది.
a) ఆ ప్రదేశంలోని భూఆయస్కాంత క్షేత్ర సమాంతర అంశాన్ని నిర్ధారించండి.
b) చుట్టలోని విద్యుత్ ప్రవాహ దిశను ఉత్రమం చేసి, చుట్టను దాని లంబాక్షంపై 90° కోణంతో పై నుంచి చూస్తు, అప సవ్యదిశలో తిప్పారు. సూది దిశను ప్రాగుక్తీకరించండి. ఆ ప్రాంతంలోని అయస్కాంత దిక్పాతాన్ని సున్నాగా తీసుకోండి.
సాధన:
a) n = 30, r = 12 cm 12 × 10-2 m, i = 0.35 amp, H = ?
సూచి పడమర నుండి తూర్పుకు మాత్రమే స్పష్టంగా సూచించును.
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 45

ప్రశ్న 21.
ఒక అయస్కాంత డైపోల్ను రెండు అయస్కాంత క్షేత్రాల ప్రభావానికి గురిచేశారు. రెండు క్షేత్రాల దిశల మధ్య కోణం 60° మరియు అందులోని ఒక క్షేత్ర పరిమాణం 1.2 × 10-2 T. ఈ క్షేత్రంలో 15° కోణం వద్ద డైపోల్ నిలకడ సమతాస్థితికి చేరుకొంటే, ఇతర క్షేత్రం పరిమాణం ఎంత?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 46
θ = 60°; B1 = 1.2 × 10-2 టెస్లా
θ1 = 15°; θ2 = 60° – 15° = 45°
సమతాస్థితిలో, రెండు క్షేత్రాల వల్ల టార్క్ లు తుల్యమగును.
i.e., τ1 = τ2
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 47

AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం

ప్రశ్న 22.
18kev ఏకశక్తి కలిగి, క్షితిజ సమాంతర దిశలో ప్రయాణిస్తున్న ఎలక్ట్రాన్ పుంజాన్ని 0.04G క్షితిజ సమాంతర అయస్కాంత క్షేత్రానికి, ఎలక్ట్రాన్ల ప్రవాహ (తొలి) దిశకు లంబదిశలో గురిచేశారు. 30 cm దూరంలో పుంజం పొందే ఊర్థ్వ లేదా అథో అపవర్తనాన్ని అంచనా వేయండి. (me = 9.11 × 10-31 kg). (Note: టి.వి.లోని తెరను ఎలక్ట్రాన్ గన్ నుంచి చేరే ఎలక్ట్రాన్ పుంజం చలనంపై భూఅయస్కాంత క్షేత్ర ప్రభావాన్ని అవగాహన చేసుకొనే విధంగా ఈ అభ్యాసంలోని దత్తాంశం, జవాబులు ఎంచుకోబడ్డాయి.]
సాధన:
శక్తి E = 18 KeV = 18 × 1.6 × 10-19 J
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 48

ప్రశ్న 23.
ఒక పారా అయస్కాంత లవణ మచ్చు ఒక్కొక్కటి 1.5 × 10-23 J T-1 ద్విధృవ భ్రామకం గల 2.0 × 1024 పరమాణు ద్విధృవాలను కలిగి ఉంది. మచ్చును 0.64 T సజాతీయ అయస్కాంత క్షేత్రంలో ఉంచి, దాన్ని 4.2 K ఉష్ణోగ్రతకు చల్లబరిచారు. 15%. అయస్కాంత సంతృప్తత స్థాయిని పొందారు. 0.98 T అయస్కాంత క్షేత్రానికి, 2.8 K ఉష్ణోగ్రతకు మచ్చు కలిగి ఉండే మొత్తం ద్విధృవ భ్రామకం విలువ ఎంత? (క్యూరీ నియమాన్ని పరిగణించండి)
జవాబు:
ద్విధృవాల సంఖ్య n = 2 × 10-24
ఒక్కొక్క మచ్ఛు ద్విధృవం అయస్కాంత భ్రామకం m¹ = 1.5 × 10-23 JT-1.
మొత్తం మచ్చు ద్విధృవ భ్రామకం = n × m¹ = 2 × 1024 × 1.5 × 10-23 = 30
15% సంతృప్త స్థాయిని చేరితే, తుల్య ద్విధృవ భ్రామకం,
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 49

ప్రశ్న 24.
800 సాపేక్ష పెర్మియబిలిటి గల ఫెర్రో అయస్కాంత కోర్పై 3500 తీగ చుట్లు చుట్టిన 15 cm సగటు వ్యాసార్థం గల రోలాండ్ రింగ్ ఉంది. అయస్కాంతీకరణ చేసే విద్యుత్ ప్రవాహం 1.2 A అయితే కోర్ కలిగి ఉండే అయస్కాంత క్షేత్రం B విలువ ఎంత?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 50

ప్రశ్న 25.
క్వాంటం సిద్ధాంతం ప్రాగుక్తీకరించిన ఎలక్ట్రాన్ స్పిన్ కోణీయ ద్రవ్యవేగం S కక్ష్యా కోణీయ ద్రవ్యవేగం 1 లతో అనుబంధితం అయి ఉన్న అయస్కాంత భ్రామక సదిశలు వరసగా µsµlలు (ప్రయోగాత్మకంగా అధిక యదార్ధత ధృవీకరించబడినవి) : µs = -(e/m) S, µl = -(e/2m)1
ఈ రెండు సంబంధాలలో ఏ సంబంధం సంప్రదాయంగా ఆశించే ఫలితానికి అనుగుణంగా ఉంది ? సంప్రదాయ ఫలితం ఉత్పాదనకు చెందిన బాహ్యరూపు రేఖలను (Outline) ఇవ్వండి.
జవాబు:
ఇచ్చిన రెండు సంబంధాలలో, ఒకే ఒకటి సాంప్రదాయక భౌతికశాస్త్రంతో అనుగుణంగా ఉంటుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 51

సాధించిన సమస్యలు Textual Examples

ప్రశ్న 1.
పటంలో అయస్కాంత సూది అయస్కాంత భ్రామకం 6.7 × 10-2 Am² జడత్వ భ్రామకం, 9 = 7.5 × 10-26 kg m² లను కలిగి ఉంది. అది 6.70 s లలో 10 డోలనాలు పూర్తిచేస్తుంది. అప్పుడు అయస్కాంత క్షేత్ర పరిమాణం ఎంత
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 52

ప్రశ్న 2.
ఒక పొట్టి దండాయస్కాంత అక్షాన్ని 800 G బాహ్య క్షేత్రంతో 30′ కోణంతో ఉంచినప్పుడు అది 0.016 Nm టార్కుకు లోనయ్యింది.
(a) ఆ అయస్కాంతం అయస్కాంత భ్రామకం ఏమిటి?
(b) దాని అత్యంత స్థిరస్థానం నుంచి అత్యంత అస్థిరస్థానానికి కదిలించడానికి జరిగిన పని ఎంత?
(c) ఈ పొట్టి దండాయస్కాంతానికి బదులు 2 × 10-4 m² మధ్యచ్ఛేద వైశాల్యం, 100 చుట్లూ, అంతే అయస్కాంత భ్రామకం గల సాలినాయిడ్ను ఉంచారు. అప్పుడు ఆ సాలినాయిడ్ ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహాన్ని కనుక్కోండి.
సాధన:
a) సమీకరణం τ = m × B నుంచి, τ = m B sin θ, θ = 30°, కాబట్టి, sin θ = 1/2.
అందువల్ల 0.016 = m × (800 × 10 T) × (1/2)
m = 160 × 2/800 = 0.40 Am²

b) సమీకరణం -m.B నుంచి, అత్యంత స్థిరస్థానం θ = 0° అయితే అస్థిర స్థానం θ = 180° జరిగిన పని
W = Um (θ = 180) – Um (θ = 0′)
= 2 m B = 2 × 0.40 × 800 × 10-4 = 0.064 J

c) ms = NIA. విభాగం (a) నుంచి, ms = 0.40 Am²
= 0.40 1000 × I × 2 × 10-4
I = 0.40 × 104/(1000 × 2) = 2A

ప్రశ్న 3.
a) ఒక దండాయస్కాంతాన్ని రెండు ముక్కలుగా (i) దాని పొడవుకు లంబంగా, (ii) దాని పొడవు వెంబడి ఖండిస్తే ఏమవుతుంది?
b) ఒక ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో అయస్కాంతీకృత సూది ఒక టార్క్కు లోనవుతుంది. కాని నికర బలానికి లోనుకాదు. అయితే, ఒక దండాయస్కాంతం దగ్గర ఉన్న ఒక ఇనుపమేకు మాత్రం టార్కు అదనంగా ఒక ఆకర్షణ బలాన్ని కూడా అనుభవిస్తుంది. ఎందుకు?
c) ప్రతి అయస్కాంతత్వ ఆకృతి ఉత్తర ధృవం, దక్షిణ ధృవం కలిగి ఉండాలా? ఒక టొరాయిడ్ వల్ల జనించే క్షేత్రం మాట ఏమిటి?
d) సర్వసమంగా కనిపించే A, B అనే రెండు ఇనుప కడ్డీలను ఇచ్చారు. ఇందులో ఏదో ఒకదానిని అయస్కాంతీకృతం చేసారని నిశ్చయంగా తెలుసు (దేన్ని చేసారో తెలియదు). రెండింటినీ అయస్కాంతీకృతం చేసారో లేదో అని ఎలా నిర్ధారించుకుంటారు? ఒకవేళ ఒక దానిని మాత్రమే’ అయస్కాంతీకృతం చేసి ఉంటే, దేనిని చేసామో ఎలా నిర్ధారించుకొంటాం? [ఇక్కడ దందాలు A, B లను తప్ప మరేమీ ఉపయోగించకండి.].
సాధన:
a) ఏ సందర్భంలోనైనా, ప్రతిదానికి ఉత్తర, దక్షిణ ధృవాలు ఉన్న రెండు అయస్కాంతాలు లభిస్తాయి.

b) క్షేత్రం ఏకరీతిగా ఉన్నట్లయితే, ఏ బలం ఉండదు. ఇనుపమేకు, దండాయస్కాంతం మూలంగా ఒక అసమరీతి క్షేత్రాన్ని అనుభవిస్తుంది. అప్పుడా మేకులో ప్రేరిత అయస్కాంత భ్రామకం ఉంటుంది. అందువల్ల, అది బలమూ, టార్కూ రెండింటినీ అనుభవిస్తుంది. ఈ నికర బలం ఆకర్షణాత్మకం. ఎందుకంటే, మేకులోని ప్రేరిత దక్షిణ ధృవం దండాయస్కాంత ధృవానికి ప్రేరిత ఉత్తర ధృవం కంటే దగ్గరగా ఉంటుంది.

c) ఆవశ్యకమేమీ కాదు. క్షేత్ర జనకానికి ఒక నికర అశూన్య అయస్కాంత భ్రామకం ఉన్నప్పుడు మాత్రమే అది సత్యం. టొరాయిడ్ లేదా తిన్నని అనంత వాహకానికి సైతం అది అలా కాదు.

d) కడ్డీల విభిన్న కొనలను దగ్గరగా తీసుకురావడానికి ప్రయత్నించండి. ఏదో ఒక పరిస్థితిలో తలెత్తే వికర్షణ బలం రెండు కడ్డీలూ అయస్కాంతీకృతం అయినవే అని నిర్ధారిస్తుంది. ఒకవేళ అది ఎప్పుడూ ఆకర్షణ బలం అయినట్లయితే, వాటిలో ఏదో ఒకటి అయస్కాంతీకృతం కానిదై ఉంటుంది. ఒక దండాయస్కాంతంలో అయస్కాంత క్షేత్ర తీవ్రత (intensity) దాని రెండు చివరల (ధృవాల వద్ద ప్రబలంగాను, మధ్యస్థ ప్రాంతంలో దుర్బలంగాను ఉంటుంది. ఈ వాస్తవాన్ని, A, B లలో ఏది అయస్కాంతమో నిర్ధారించడానికి ఉపయోగించుకోవచ్చు. ఈ సందర్భంలో, ఈ రెండు కడ్డీలలో ఏది అయస్కాంతమో చూడటానికి, ఏదో ఒక కడ్డీని (A అందాం) పట్టుకోండి. ఇప్పుడా కడ్డీ ఏదో ఒక కొనను, తొలుతగా వేరే కడ్డీ (B అందాం) ఒకానొక కొనకు తగిలిద్దాం. ఆ తరువాత B మధ్య ప్రాంతంలో తగిలిద్దాం. B యొక్క ఈ మధ్య ప్రాంతంలో A. ఏ విధమైన బలాన్ని అనుభవించలేదని మీరొక వేళ గమనిస్తే, అప్పుడు B అయస్కాంతీకృతమైనదన్నట్లు. ఒకవేళ B కొన నుంచి దాని మధ్య వరకు మీరు ఏ మార్పును గమనించకపోయినట్లయితే, అప్పుడు A అయస్కాంతీకృతమైనట్లు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం

ప్రశ్న 4.
8.0 cm పొడవు ఉన్న ఒక దండాయస్కాంతం మధ్య బిందువు నుంచి 50 cm దూరం వద్ద ఆ దండాయస్కాంతం మూలంగా నెలకొనే మధ్య లంబరేఖా క్షేత్రం, అక్షీయరేఖా క్షేత్రాల పరిమాణాలను లెక్కించండి. 2వ సమస్యలో లాగానే, ఇక్కడ కూడా దండాయస్కాంతం అయస్కాంత భ్రామకం 0.40 Am² గా ఉంది.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 53

ప్రశ్న 5.
బిందువు Q వద్ద ఉంచిన ఒక చిన్న అయస్కాంత సూది P ని పటం చూపిస్తున్నది. బాణం గుర్తు దాని అయస్కాంత భ్రామకం దిశను చూపిస్తున్నది. మిగతా బాణం గుర్తులు దానితో సర్వసమం అయిన వేరొక అయస్కాంత సూది Q యొక్క వివిధ స్థానాలను (మరియు అయస్కాంత భ్రామకం దిగ్విన్యాసాలను చూపిస్తున్నవి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 54
a) ఏ విన్యాసం(configuration) లో వ్యవస్థ సమతాస్థితిలో ఉండదు?
b) ఏ విన్యాసంలో వ్యవస్థ (i) స్థిర సమతాస్థితి, (ii) అస్థిర సమతాస్థితిలో ఉంటుంది?
c) ఇక్కడ చూపించిన విన్యాసాలన్నింటిలో ఏ విన్యాసం అత్యల్ప స్థితిజ. శక్తికి చెంది ఉంటుంది?
సాధన:
ద్విధృవం (P) అయస్కాంత క్షేత్రంలో ద్విధృవం Q కలిగి ఉండే స్థితిజశక్తి వల్ల ఆ అమరికకు స్థితిజశక్తి ఉత్పన్నమవుతుంది. P మూలంగా ఉత్పన్నమయ్యే క్షేత్రాన్ని క్రింది సమాసాల ద్వారా ఇవ్వవచ్చు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 55

ఇక్కడ mp ద్విధృవం P యొక్క అయస్కాంత భ్రామకం.
mo అనేది Bp కి సమాంతరం అయినప్పుడు సమతాస్థితి స్థిరమైనదిగాను, Bp కి ప్రతిసమాంతరం అయినప్పుడు అది అస్థిరమైనదిగాను ఉంటుంది.

ఉదాహరణకు, ద్విధృవం P యొక్క లంబ సమద్విఖండన రేఖ వెంబడి Q ఉన్నటువంటి అమరిక Q3 విషయంలో Q యొక్క అయస్కాంత భ్రామకం, స్థితి 3 వద్ద ఉన్న అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా ఉంది. కాబట్టి, Q3 స్థిరం. అందువల్ల,
a) PQ1, PQ2
b) (i) PQ3, PQ6 (స్థిరం); (ii) PQ5, PQ4 (అస్థిరం)
c) PQ6

ప్రశ్న 6.
పటంలో ఇచ్చిన అనేక పటాలలో అయస్కాంత క్షేత్రరేఖలను (దట్టంగా ఉన్న రేఖలను) తప్పుగా చూపించారు. వాటిలో ఏమి తప్పు ఉందో ఎత్తి చూపండి. వాటిలో కొన్ని స్థిరవిద్యుత్ క్షేత్ర రేఖలను సరిగ్గానే చూపించి ఉండవచ్చు. అవి ఏవో ఎత్తిచూపండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 56
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 57
జవాబు:
a) తప్పు, పటంలో చూపించిన విధంగా అయస్కాంత క్షేత్ర రేఖలు ఒక బిందువు నుంచి ఎప్పుడూ బహిర్గతం కాలేవు. ఏదైనా సంవృత ఉపరితలం ద్వారా, నికర అభివాహం B ఎప్పుడూ సున్నానే అయి తీరాలి. అంటే పటంలో ఉపరితలంలోకి ఎన్ని క్షేత్ర రేఖలు వచ్చినట్లుగా కనిపిస్తాయో అన్నే రేఖలు దాని నుంచి బయటకు వెళ్ళాల్సి ఉంటుంది. నిజానికి, పటంలో చూపించిన క్షేత్ర రేఖలు, ఒక పొడవైన ధనాత్మక ఆవేశిత తీగ విద్యుత్ క్షేత్రాన్ని సూచిస్తాయి. సరియైన అయస్కాంత క్షేత్ర రేఖలు అధ్యాయం 7లో వర్ణించినట్లుగా ఆ తిన్నని వాహకం చుట్టూ వృత్తాకారంలో చుట్టి ఉంటాయి.

b) తప్పు. అయస్కాంత రేఖలు (విద్యుత్ క్షేత్ర రేఖల లాగానే) ఒకదానికొకటి ఖండించుకోవు. ఎందుకంటే ఒకవేళ అలాకాక అవి ఖండించుకొంటే, ఆ ఖండన బిందువు వద్ద క్షేత్ర దిశ సందిగ్ధంగా (ambiguous) ఉంటుంది. పటంలో మరో తప్పు ఉంది. స్థిర అయస్కాంత క్షేత్ర రేఖలు ఖాళీ ప్రదేశం చుట్టూతా సంవృత వలయాలను ఎప్పటికీ ఏర్పరచలేవు. స్థిర అయస్కాంత క్షేత్రపు ఒక సంవృత వలయం విద్యుత్ తన ద్వారా ప్రవహిస్తున్న ఒక ప్రదేశాన్ని ఆవృతం చేయాలి. దానికి విరుద్ధంగా, స్థిర విద్యుత్ క్షేత్ర రేఖలు ఖాళీ ప్రదేశంలో గాని లేదా లూప్ విద్యుదావేశాలను ఆవృతం చేసినప్పుడు గాని సంవృత లూప్లను ఏర్పరచలేవు.

c) ఒప్పు. అయస్కాంత రేఖలు ఒక టొరాయిడ్లో సంపూర్ణంగా బంధితమై ఉంటాయి. ప్రతి లూప్ విద్యుత్ ప్రవహిస్తున్న ఒక ప్రాంతాన్ని చుట్టి ఉంటుంది. కాబట్టి, ఇక్కడ క్షేత్ర రేఖలు సంవృత లూప్లను ఏర్పరచడంలో తప్పేమీ లేదు. పటంలో స్పష్టత కోసం, టొరాయిడ్ లోపల కొన్ని క్షేత్ర రేఖలను మాత్రమే చూపిండమైందని గమనించండి. నిజానికి, తీగచుట్టలతో ఆవృతమైన ప్రాంతమంతా అయస్కాంత క్షేత్రాన్ని కలిగి ఉంటుంది.

d) తప్పు. సాలినాయిడ్ చివరల వద్ద, దాని బయటా క్షేత్ర రేఖలు అంత పూర్తిగా తిన్నగాను, బంధితమై ఉండలేవు. అలాంటిది .ఆంపియర్ నియమాన్ని ఉల్లంఘిస్తుంది. సాలినాయిడ్ రెండు కొనల వద్ద ఈ రేఖలు వక్రరూపంలో బయటకు చొచ్చుకు వచ్చి ఎట్టకేలకు సంవృత లూప్లను ఏర్పరుస్తాయి.

e) ఒప్పు. ఇవి ఒక దండాయస్కాంతం బయటా, లోపలా ఉండే క్షేత్ర రేఖలు. లోపల ఉండే క్షేత్ర రేఖల దిశను జాగ్రత్తగా గమనించండి. క్షేత్ర రేఖలు అన్నీ ఉత్తర ధృవం నుంచి బహిర్గతం కావు (లేదా దక్షిణ ధృవం వద్దకు అభిసరణం చెందవు). N-ధృవం, S-ధృవం రెండింటి చుట్టూతా క్షేత్ర నికర అభివాహం సున్నా అవుతుంది.

f) తప్పు. బహుశా ఈ క్షేత్ర రేఖలు ఒక అయస్కాంత క్షేత్రాన్ని సూచించవు. పటంలోని పైన ఉన్న క్షేత్ర ప్రాంతాన్ని చూడండి. క్షేత్ర రేఖలన్నీ ఛాయా ఫలకం (shaded plate) నుంచి బయటకు వస్తున్నట్లుగా అనిపిస్తున్నది. ఈ ఛాయా ఫలకాన్ని చుట్టుముట్టి ఉన్న ఉపరితలం ద్వారా పోయే నికర అభివాహం సున్నా కాదు. అయస్కాంత క్షేత్రం విషయంలో ఇది అసాధ్యం. ఇక్కడ ఇచ్చిన క్షేత్ర రేఖలు నిజానికి, ఒక ధనవిద్యుదావేశ ఎగువ పలక, రుణ విద్యుదావేశ దిగువ పలక చుట్టూతా ఉన్న స్థిర విద్యత్ క్షేత్ర రేఖలను చూపిస్తున్నాయి. పటం[(e), (f)]ల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి.

g) తప్పు, రెండు ధృవపు ముక్కల మధ్య ఉన్న రేఖలు కొనల వద్ద నిక్కచ్చిగా తిన్నగా ఉండజాలవు. రేఖలు కొంత వంపు తిరగడం అనేది తప్పదు. అలాకాకపోతే, ఆంపియర్ నియమం ఉల్లంఘన అవుతుంది. విద్యుత్ క్షేత్ర రేఖల విషయంలో కూడా ఇది నిజం.

ప్రశ్న 7.
a) ఒక చిన్న అయస్కాంత సూది, ఒక రేఖ వెంబడి (ఆ బిందువు వద్ద) ఏ దిశలో అమరి ఉంటుందో ఆ దిశను (ప్రతి బిందువు వద్దా) క్షేత్ర రేఖలు చూపిస్తాయి. చలనంలో ఉన్న ఒక ఆవేశిత కణంపై ప్రతి బిందువు వద్ద బలరేఖలను ఈ అయస్కాంత క్షేత్ర రేఖలు సూచిస్తాయా?
b) ఒక టొరాయిడ్ కోర్ లోపల అయస్కాంత క్షేత్ర రేఖలన్నింటినీ సంపూర్ణంగా బంధించవచ్చు. కాని ఒక తిన్నని సాలినాయిడ్ లోపల బంధించలేము. ఎందుకు?
c) ఒకవేళ, అయస్కాంత ఏక ధృవాలు ఉనికిలో ఉంటే, అయస్కాంతత్వం యొక్క గాస్ నియమాన్ని ఎలా మార్చాల్సి ఉంటుంది?
d) ఒక దండాయస్కాంతం దాని స్వయం క్షేత్రం మూలంగా దానిపైన అదే ఒక టార్క్ను ప్రయోగించుకొంటుందా? విద్యుత్ ప్రవహిస్తున్న ఒక తీగలోని ఒక స్వల్పాంశం అదే తీగ మరో స్వల్పాంశంపై బలాన్ని ప్రయోగిస్తుందా?
e) చలనంలో ఉన్న ఆవేశాల మూలంగా అయస్కాంత క్షేత్రం తలెత్తుతుంది. ఒక వ్యవస్థ నికర ఆవేశం సున్నా అయినప్పటికీ, ఆ వ్యవస్థ అయస్కాంత భ్రామకాలను కలిగి ఉంటుందా?
జవాబు:
a) లేదు. అయస్కాంతీయ బలం Bకి లంబంగానే ఉంటుంది. (అయస్కాంతీయ బలం = qv × B అని గుర్తు తెచ్చుకోండి). అయస్కాంత క్షేత్ర రేఖలను, బలరేఖలుగా పిలవడం అనేది తప్పుదారి పట్టించడం.

b) తిన్నని సాలినాయిడ్ రెండు చివరల మధ్య క్షేత్ర రేఖలన్నీ బంధితమైతే, ప్రతి చివరన ఆ మధ్యచ్ఛేదాల ద్వారా పోయే. అభివాహం సున్నా కానిది అవుతుంది. ఏదైనా ఒక సంవృత ఉపరితలం ద్వారా పోయే క్షేత్రం B యొక్క అభివాహం ఎప్పుడూ సున్నా అయితీరాలి. టొరాయిడ్ విషయంలో ఈ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే, దానికి ఏ ‘చివరలు’ ఉండవు కాబట్టి.

c) ఏదైనా ఒక సంవృత ఉపరితలం ద్వారా పోయే B యొక్క అభివాహం ఎప్పుడూ సున్నా అవుతుందని, అయస్కాంతత్వం యొక్క గాస్ నియమం ప్రవచిస్తుంది \(\int_{\mathrm{s}}\)B. ds = 0.
ఒకవేళ, ఏక ధృవాలు ఉనికిలో ఉన్నట్లయితే, కుడిచేతివైపు ఉన్న పదం S తో ఆవృతమైన ఏకధృవం (అయస్కాంత ఆవేశం) qm కు సమానమయ్యేది. (స్థిర విద్యుత్ శాస్త్రంలోని గాస్ నియమం \(\int_{\mathrm{s}}\)B.ds = µ0qm కు సాదృశ్యంగా, ఇక్కడ qmm అనేది (ఏకధృవం) S తో ఆవృతమైన ఆయస్కాంత ఆవేశం.)

d) లేదు. ఒకానొక స్వల్పాంశంపై ఆ స్వల్పాంశం వల్లనే ఉత్పత్తి అయిన క్షేత్రం మూలంగా బలం లేదా టార్క్ ఉండదు. కాని అదే తీగపై ఉన్న స్వల్పాంశంపై బలం (లేదా టార్క్ ఉంటుంది (ఒక తిన్నని తీగ ఉన్నప్పటి ప్రత్యేక సందర్భంలో, ఈ బలం సున్నా).

e) అవును. ఆ వ్యవస్థలోని ఆవేశం యొక్క సరాసరి సున్నా కావచ్చు.. అంతమాత్రాన, అనేక విద్యుత్ ప్రవాహ లూప్ల వల్ల కలిగే అయస్కాంత భ్రామకాల మాధ్యమం సున్నా అవ్వాలని లేదు. నికర ఆవేశం సున్నా అయినప్పటికీ నికర ద్విధృవ భ్రామకం ఉన్నటువంటి పరమాణువులను కలిగి ఉండే పారా అయస్కాంత పదార్థాలలో మనకి ఇలాంటి ఉదాహరణలు ఎదురవుతాయి.

ప్రశ్న 8.
భూమధ్య రేఖ వద్ద భూఅయస్కాంత క్షేత్రం ఉజ్జాయింపుగా 0.4 G. భూమి ద్విధృవ భ్రామకాన్ని అంచనావేయండి.
సాధన:
సమీకరణం మధ్య లంబరేఖపై అయస్కాంత క్షేత్రం,
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 58
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 59
ఈ విలువ భూ అయస్కాంత్వం 8 × 1022 Am² విలువకు దగ్గరగా ఉంది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం

ప్రశ్న 9.
ఒకానొక నిర్దిష్ట ప్రదేశపు అయస్కాంత యామ్యోత్తర తలంలో భూ అయస్కాంత క్షేత్రం క్షితిజ సమాంతర అంశం 0.26 G అవపాత కోణం (dip angle) 60°. ఈ ప్రదేశం వద్ద భూ అయస్కాంత క్షేత్రం ఎంత?
సాధన:
HE = 0.26 G. అని ఇచ్చారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 60

ప్రశ్న 10.
సాపేక్ష పెర్మియబిలిటి 400 గల పదార్థాన్ని కోర్ గా ఒక సాలినాయిడ్ కలిగి ఉంది. సాలినాయిడ్ చుట్టలు కోర్ నుంచి విద్యుద్బంధితమై, వాటిలో 2A విద్యుత్ ప్రవహిస్తున్నది. ఒక మీటర్కు చుట్ల సంఖ్య 1000 ఉన్నట్లయితే(a) H, (b) M, (c) B, (d) అయస్కాంతీకరించే విద్యుత్ ప్రవాహం Imలను లెక్కించండి.
సాధన:
a) క్షేత్రం H అనేది కోర్ పదార్థం మీద ఆధారపడుతుంది. అది
H = nI = 1000 × 2.0 = 2 × 10³ A/m.

b) అయస్కాంత క్షేత్రం,
B = µrµ0, H
= 400 × 4π × 10-7 (N/A²) × 2 × 10³ (A/m) = 1.0 T

c) అయస్కాంతీకరణం,
M = (B – µ0 H)/µ0
= (µrµ0 H – µ0 H) / µ0 = (µr – 1) H = 399 × H × 8 × 105 A/m.

d) అయస్కాంతీకరించే విద్యుత్ ప్రవాహం IM అనేది కోర్ లేనప్పుడు సాలినాయిడ్ చుట్టల ద్వారా ప్రవహింపచేయాల్సిన అదనపు ప్రవాహం. ఇది కోర్ ఉన్నప్పుడు కలిగే B ని ఇస్తుంది. కాబట్టి, B = µrn0 (I + IM) . I = 2A, B = 1 T లను ఉపయోగించి, IM = 794 A పొందుతాం.

AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం

ప్రశ్న 11.
ఫెర్రో అయస్కాంత ఇనుములోని ఒక డొమైన్ (domain) 1pm భుజం పొడవు గల ఘనాకారంలో ఉన్నది.
డొమైన్లోని ఇనుము పరమాణువుల సంఖ్య, గరిష్టంగా సాధ్యమయ్యే ద్విర్భవ భ్రామకం, డొమైన్ అయస్కాంతీకరణాలను అంచనా వేయండి. ఇనుము అణు ద్రవ్యరాశి 55g/mole, దాని సాంద్రత 7.9 g/cm³, ప్రతి ఒక్క ఇనుము పరమాణువు 9.27 × 10-24 Am² ద్విధృవ భ్రామకాన్ని కలిగి ఉన్నదనుకోండి.
సాధన ఘనాకార డొమైన్ ఘనపరిమాణం,
V = (10-6 m)³ = 10-18 m³ = 10-12 cm³
డొమైన్ ద్రవ్యరాశి అంటే దాని ఘనపరిమాణం × సాంద్రత = 7.9 g cm-3 × 10-12 cm³ = 7.9 × 10-12 g
అవగాడ్రో సంఖ్య (6.023 × 1023పరమాణువుల ద్రవ్యరాశి 55g అని ఇవ్వడమైంది. కాబట్టి, డొమైన్లోని పరమాణువుల సంఖ్య
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 61

అన్ని పరమాణు భ్రామకాలు పరిపూర్ణంగా ఒకే వరసలోకి అమరినప్పుడు (అవాస్తవికం) గరిష్ఠంగా సాధ్యమయ్యే ద్విధృవ
mగరిష్ఠం ని పొందగలుగుతాం. కాబట్టి,
mగరిష్ఠం = (8.65 × 1010) × (9.27 × 10-24)
= 8.0 × 10-13 A m²
పర్యవసానంగా కలిగే అయస్కాంతీకరణ,
Mగరిష్ఠం = mగరిష్ఠం / డొమైన్ ఘనపరిమాణం
= 8.0 × 10-13 Am²/10-18
= 8.0 × 105 Am-1.

AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Economics Study Material 10th Lesson అర్థగణాంక శాస్త్రం Textbook Questions and Answers.

AP Inter 2nd Year Economics Study Material 9th Lesson అర్థగణాంక శాస్త్రం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
విస్తరణ ప్రయోజనాలు ఏమిటి ?
జవాబు:
శ్రేణుల యొక్క పంపిణీని తెలియజేసేది విస్తరణ.
బౌలే అభిప్రాయం ప్రకారం “అంశాల విచరణ మానమే విస్తరణ”. బ్రూక్స్ మరియు డిక్ అభిప్రాయం ప్రకారం “సగటు చుట్టూ సంఖ్య దత్తాంశపు విలువలు ఏ స్థాయిలో వ్యాపింపబడి ఉంటాయో దానిని “దత్తాంశ విస్తరణ” అంటారు.

విస్తరణ లక్షణాలు :

  1. విస్తరణ మానం సూక్ష్మంగా గుణించడానికి వీలుగా ఉండవలెను.
  2. విస్తరణ మానం నిర్దిష్టంగా నిర్వచింపబడి ఉండాలి.
  3. విస్తరణ మానం శ్రేణి పంపిణీలో ప్రతి అంశంపై ఆధారపడినదై ఉండాలి.
  4. బీజీయ ప్రస్తావనకు తగినదిగా ఉండవలెను.
  5. విస్తరణ మానంకు ప్రతిచయన సుస్థిరత్వం ఉండవలెను.
  6. విస్తరణ మానం అంత్య అంశాల ద్వారా ప్రభావితం కాకూడదు.

ప్రాముఖ్యత :

  1. సగటు విశ్వసనీయతను నిర్ధారించవచ్చును.
  2. విస్తరణ స్వభావాన్ని, కారణాలను విశ్లేషించడం.
  3. అధ్యయనం చేసిన చలరాశులలో గల విచరణత్వాన్ని అదుపులో, నియంత్రణ చేయడంలో తోడ్పడటం.
  4. ఇతర గణాంక మానాలను కొలవడానికి కొలబద్దగా సహకరించడం.

AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం

ప్రశ్న 2.
విస్తరణ అనగానేమి ? వివిధ విస్తరణ మానాల పద్ధతుల గురించి వివరించండి.
జవాబు:
కేంద్రస్థానపు కొలతలైన అంకమధ్యమం, మధ్యగతం, బాహుళకం మొదలగునవి దత్తాంశానికి ప్రాతినిధ్యం వహించే అంకెలను తెలియజేస్తాయి. శ్రేణుల పంపిణీని తెలియజేసేది విస్తరణ.

బౌలే అభిప్రాయం ప్రకారం “అంశాల విచరణ మానమే విస్తరణ”.

బ్రూక్స్ మరియు డిక్ అభిప్రాయంలో “సగటు చుట్టూ సంఖ్యా దత్తాంశపు విలువలు ఏ స్థాయిలో వ్యాపింపబడి ఉంటాయో దానిని దత్తాంశ విస్తరణ” అంటారు.
విస్తరణ మానాలను ఈ క్రింది పద్ధతుల ద్వారా కొలవవచ్చు.

  1. వ్యాప్తి
  2. చతుర్థాంశపు విచలనం
  3. మధ్యమ లేదా సగటు విచలనం
  4. ప్రామాణిక విచలనం
  5. లారెంజ్ వక్రరేఖ

1) వ్యాప్తి : విస్తరణను అధ్యయనం చేయడంలో అతి సులభమైన పద్ధతి వ్యాప్తి. కెండాల్ ప్రకారం “అత్యధిక, అత్యల్ప విలువల తేడాను వ్యాప్తి” గా చెప్పవచ్చు.
ఇందులో
R = L – S
R = వ్యాప్తి
L = అత్యధిక విలువ
S = అత్యల్ప విలువ

2) చతుర్ధాంశ విచలనం : ఇచ్చిన పౌనఃపున్యం విభాజనం ఎగువ, దిగువ చతుర్థాంశాల సగటు పరమ వ్యత్యాసాన్ని చతుర్థాంశ విచలనమని అంటారు. ఈ చతుర్థాంశ విచలనము మధ్య గతమునకు అటూ, ఇటూ గల వివిధ అంశాలను అధ్యయనం చేస్తుంది. దీనిలో మొత్తం దత్తాంశాన్ని నాలుగు సమాన భాగాలుగా విభజించినట్లయితే ప్రతి భాగం 25 శాతం విలువను కల్గి ఉంటుంది, దీనితో మనం చతుర్థాంశ విచలనం మరియు మధ్యగతం విలువలను పొందవచ్చును.
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 1

Q.D = చతుర్థాంశ విచలనం
Q3 = ఎగువ చతుర్థాంశం
Q1 = దిగువ చతుర్థాంశం

3) మధ్యమ విచలనం : క్లార్క్ అభిప్రాయంలో “విచలనం గుర్తుల్ని విస్మరిస్తూ అంక మధ్యమం నుండి గాని, మధ్యగతం నుంచి గాని, బాహుళకం నుంచి గాని విభాజనంలో వ్యాపించిన అంశాల సగటు మొత్తాన్ని సగటు విచలనం లేదా మధ్యమ విచలనం అంటారు.
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 2
M.D = మధ్యమ విచలనం
f = పౌనఃపున్యం
N = అంశాల సంఖ్య
|D| = మాడ్యులస్

4) ప్రామాణిక విచలనం : విస్తరణ కొలమానాలలో ముఖ్యమైనది ప్రామాణిక విచలనం. దీనిని 1893వ సం॥లో కారల్ పియర్సన్ అభివృద్ధిపరిచారు. దీనిని “విచలనాల వర్గముల సగటు యొక్క వర్గమూలం” అనవచ్చు. విచలనాలను అంక మధ్యమము నుండి తీసుకొనవలసి ఉంటుంది. దీనిని గ్రీక్ అక్షరం (సిగ్మా) తో తెలియజేస్తారు.
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 3

5) లారెంజ్ వక్రరేఖ : విస్తరణ రేఖా పద్ధతిలో అధ్యయనం చేయడాన్ని లారెంజ్ రేఖాపద్ధతి అంటారు. ఈ పద్ధతి ఆర్థిక అసమానతలను కొలవడానికి, లాభాల పంపిణీ, వేతనాల పంపిణీ మొదలైన అంశాలను అధ్యయనం చేయడానికి ఉపయోగిస్తారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం

ప్రశ్న 3.
చతుర్థాంశ విచలన గుణకం గణన చేయండి.
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 4
జవాబు:
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 5
దిగువ చతుర్థాంశ గణన = n/4 వ అంశం
= 40/4 = 10వ అంశం
ఇది సంచిత పౌనఃపున్యంలో 13 కంటే తక్కువగా ఉంది. కనుక తరగతి అంతరం 10-20
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 6
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 7

ప్రశ్న 4.
కార్ల్ పియర్సన్ సహ సంబంధ గుణకంను గణన చేయండి.
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 8
జవాబు:
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 9
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 10

AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం

అదనపు ప్రశ్నలు

ప్రశ్న 1.
ఈ క్రింది దత్తాంశాన్ని కోటి సహసంబంధంను గణన చేయండి.
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 11
జవాబు:
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 12

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మధ్యమ విచలనము, ప్రామాణిక విచలనము మరియు చతుర్థాంశ విచలనము మధ్య సంబంధాన్ని నిర్వచింపుము.
జవాబు:
ఇచ్చిన పౌనఃపున్యం విభాజనం ఎగువ, దిగువ చతుర్థాంశాల సగటు పరమ వ్యత్యాసాన్ని చతుర్థాంశ విచలనమని అంటారు. ఈ పరిస్థితులలో మొత్తం దత్తాంశాన్ని నాలుగు సమాన భాగాలుగా విభజించినట్లయితే ప్రతి భాగం 25 శాతం విలువను కల్గి ఉంటూ, చతుర్థాంశ విచలనం మరియు మధ్యగతం విలువలను పొందగలము.

మధ్యమ విచలనము : విచలనం గుర్తుల్ని విస్మరిస్తూ అంక మధ్యమం నుంచి గాని, మధ్యగతం నుంచి గాని, బాహుళకం నుంచి గాని విభాజనంలో వ్యాపించిన అంశాల సగటు మొత్తాన్ని సగటు విచలనం అని అంటారు. ప్రామాణిక విచలనం : ప్రామాణిక విచలనాన్ని విచలనాల వర్గముల సగటు యొక్క వర్గమూలమని అనవచ్చును. విచలనాలను అంక మధ్యమం నుండి తీసుకొనవలసి ఉంటుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం

ప్రశ్న 2.
క్రింది అంశాలకు ప్రామాణిక విచలనమును లెక్కకట్టండి.
5, 10, 25, 30, 50.
జవాబు:
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 13
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 14

ప్రశ్న 3.
లారెంజ్ వక్రరేఖను నిర్వచిస్తూ ఉపయోగించే పద్ధతిని వివరించండి.
జవాబు:
విస్తరణను రేఖాపద్ధతి ద్వారా అధ్యయనం చేయడాన్ని లారెంజ్ వక్రరేఖా పద్ధతి అంటారు. ఈ పద్ధతి ఆర్థిక అసమానతలను కొలవడానికి, లాభాల పంపిణీ, వేతనాల పంపిణీ మొదలైన అంశాలను అధ్యయనం చేయడానికి ఉపయోగిస్తారు.

ఈ క్రింది వివరాల ఆధారంగా ఒక కంపెనీలో పనిచేస్తున్న ఏ ఉద్యోగస్తుల ఆదాయంతో విచరణత్వం తక్కువగా ఉందో లారెంజ్ వక్రరేఖా పద్ధతి ఉపయోగించి తెలుసుకోవచ్చు. ఉదాహరణకు
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 15

AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం

లారెంజ్ వక్రరేఖ నిర్మాణాలకు ఈ క్రింది నియమాలు పాటించాలి.

  1. దత్తాంశంలోని చలనరాశుల విలువలను, వాటి పౌనఃపున్యాలను సంచితం చేయాలి.
  2. సంచితం చేసిన ఈ రెండు విలువలకు శాతాలను వేర్వేరుగా లెక్కించాలి.
  3. ‘X’ అక్షంపై సంచిత చేసిన పౌనఃపున్యాల సంచిత శాతాలను, Y అక్షంపై సంచితం చేసిన చలనరాశుల శాతాలను చూపాలి.
  4. చలనరాశుల సంచిత శాతాలను వ్యతిరేకంగా, పౌనఃపున్యాల సంచిత శాతాలను గుర్తించి, ఆ బిందువులను కలుపుతూ వక్రరేఖ గీయండి. ఆ రేఖను లారెంజ్ వక్రరేఖ అంటారు.
    AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 16

పై రేఖాపటంలో సమ విభజన రేఖకు (0) లారెంజ్ వక్రరేఖ దూరం ఎక్కువగా ఉంటే విచరణత్వం ఎక్కువగా ఉందని, ఆ రెండు రేఖలు చాలా సమీపంలో ఉండే విచరణత్వం చాలా తక్కువగా ఉందని చెప్పవచ్చును.

ప్రశ్న 4.
సహ సంబంధం అనగానేమి ? సహ సంబంధం ప్రాముఖ్యత తెలియజేయండి. [Mar ’16]
జవాబు:
ఒక చలరాశిలో వచ్చిన మార్పులు వేరొక చలరాశిలో ఎలాంటి మార్పులను ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి సహ సంబంధం ఉపయోగపడుతుంది.

A.M. ట్యిటల్ ప్రకారం “రెండు లేదా అంతకంటే ఎక్కువ చలరాశుల మధ్యగల విచరణాన్ని అధ్యయం చేయడానికి ఉపయోగపడే గణాంక పద్ధతి.

సిమ్సన్ మరియు కబ్కా ప్రకారం “రెండు లేదా అంతకంటే ఎక్కువ చలరాశుల మధ్యగల సంబంధ స్థాయిని నిర్ణయించడానికి ఉపయోగపడే గణాంక పద్ధతి సహ సంబంధం.

  1. రెండు లేదా అంతకంటే ఎక్కువ సంబంధిత అంశాలను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది.
  2. వ్యాపార ఆర్థిక రంగాలకు సంబంధించిన సహ సంబంధం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది.
  3. ఒక చలనరాశి విలువ ఆధారంగా వేరొక చలనరాశి విలువను అంచనా వేయవచ్చును.
  4. సహ సంబంధం ద్వారా ప్రతిచయన దోషాలను కూడా కొలవవచ్చును.
  5. వ్యాపారవేత్తలకు వ్యయాలను, అమ్మకాలను, ధరను, ఇతర సంబంధిత అంశాలను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది.

ప్రశ్న 5.
సూచీ సంఖ్యల రకాలు ఎన్ని ?
జవాబు:
క్రీ.శ. 1764లో మొదటిసారిగా సూచీ సంఖ్యలను ఉపయోగించారు. ధరలలో మార్పులు అధ్యయనం చేయడం |కోసం ఉపయోగించిన సూచీసంఖ్యలు దేశంలోని ఆర్థిక పరిస్థితులు, ఉత్పత్తి కార్యకలాపాలను ప్రస్తుతం ఎక్కువగా వాడుతున్నారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం

క్రోటాన్ మరియు కౌటన్ ప్రకారం “పరస్పర సంబంధం కలిగి ఉన్న చలరాశుల సముదాయ పరిమాణంలోని వ్యత్యాసాలను కొలవడానికి ఉపయోగపడే సాధనాలే సూచీ సంఖ్యలు”.

సూచీ సంఖ్యల వర్గీకరణ : ఆర్థిక వ్యాపార రంగాలలో ఉపయోగించే సూచీ సంఖ్యలను ఈ క్రింది రకాలుగా వర్గీకరించవచ్చును. అవి :

  1. ధరల సూచీ సంఖ్యలు
  2. పరిమాణ సూచీ సంఖ్యలు
  3. విలువ సూచీ సంఖ్యలు
  4. ప్రత్యేక అవసర సూచీ సంఖ్యలు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వ్యాప్తి. [Mar ’17, ’16]
జవాబు:
విస్తరణను అధ్యయనం చేయడంలో అతి సులభమైన పద్దతి వ్యాప్తి. కెండాల్ ప్రకారం “అత్యధిక, అత్యల్ప విలువల తేడాను వ్యాప్తి” గా పరిగణించవచ్చును.
R=L-S

ప్రశ్న 2.
మధ్యమ విచలనము.
జవాబు:
కేంద్రస్థానపు కొలతల నుంచి తీసుకున్న విచలనాల పరమ సగటుగా మధ్యమ విచలనాన్ని చెప్పవచ్చును. క్లార్క్ అభిప్రాయం ప్రకారం “విచలనం గుర్తుల్ని విస్మరిస్తూ అంక మధ్యమం నుంచి గాని, మధ్యగతం నుంచి గాని, బాహుళకం నుంచి గాని విభాజనంలో వ్యాపించిన అంశాల సగటు మొత్తాన్ని సగటు విచలనం లేదా మధ్యమ విచలనం” అంటారు.
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 17

ప్రశ్న 3.
సహ సంబంధం. [Mar ’17]
జవాబు:
ఒక చలనరాశిలో వచ్చిన మార్పులు వేరొక చలనరాశిలో ఎలాంటి మార్పులను ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి ఈ సహ సంబంధం ఉపయోగపడుతుంది. ఇది మూడు రకాలు.

  1. వ్యాపనపటం పద్ధతి
  2. కార్ల్ పియర్సన్ పద్దతి
  3. స్పియర్మన్ కోటి సహ సంబంధ గుణకం.

ప్రశ్న 4.
కోటి సహ సంబంధం.
జవాబు:
1904వ సంవత్సరంలో చార్లెస్ ఎడ్వర్డ్ స్పియర్ మన్ దీనిని ప్రతిపాదించాడు. గుణాత్మక దత్తాంశంలో అంశాలను క్రమ పద్ధతిలో కోడీకృతం చేసి, ఆ చలనరాశుల మధ్య సహ సంబంధ గుణకంను కోటి సహ సంబంధ గుణకం అంటారు.

ప్రశ్న 5.
సూచీ సంఖ్యలు.
జవాబు:
1764వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా సూచీ సంఖ్యలను ఉపయోగించారు. పరస్పర సంబంధం కలిగి ఉన్న చలరాశుల సముదాయ పరిమాణంలోని వ్యత్యాసాలను కొలవడానికి ఉపయోగపడే సాధనాలే సూచీ సంఖ్యలు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం

ప్రశ్న 6.
లాస్పెయిర్ సూచీ సంఖ్య సూత్రం.
జవాబు:
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 18

ప్రశ్న 7.
పాషి సూచీ సంఖ్య సూత్రం.
జవాబు:
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 19

ప్రశ్న 8.
ఫిషర్ సూచీ సంఖ్య సూత్రం.
జవాబు:
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 20

AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Physics Study Material 7th Lesson చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం Textbook Questions and Answers.

AP Inter 2nd Year Physics Study Material 7th Lesson చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆయిర్టెడ్ ప్రయోగం ప్రాముఖ్యత ఏమిటి? [TS. Mar.’17]
జవాబు:
విద్యుత్ ప్రవాహ వాహకం చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఇది విద్యుత్ ప్రవాహ వాహకానికి లంబంగా ఉంటుంది. దీనినే ఆయిర్ స్టెడ్ ప్రయోగ ప్రాముఖ్యత అంటారు.

ప్రశ్న 2.
ఆంపియర్, బయోట్-సవర్ట్ నియమాలను తెలపండి.
జవాబు:
ఆంపియర్ నియమం : విద్యుత్ ప్రవాహం గల వాహకం చుట్టూ తీసుకున్న ఒక సంవృత పరిపథంలో \(\overrightarrow{B}.\overrightarrow{dl}\) యొక్క రేఖీయ సమాకలని µ0 కి సమానం.
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 1

బయోట్-సవర్ట్ సూత్రం :
బయోట్-సవర్ట్ నియమం ప్రకారం అల్పాంశం యొక్క అయస్కాంత ప్రేరణ (dB) విలువ

  1. విద్యుత్ ప్రవాహనికి (i)
  2. అల్పాంశం పొడవుకు (dl)
  3. r మరియు dl మధ్యకోణం sin విలువకు అనులోమానుపాతంలోను మరియు
  4. అల్పాంశం నుండి బిందువు వరకు దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలోను ఉంటుంది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 2 AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 3

ప్రశ్న 3.
విద్యుత్ ప్రవహిస్తున్న వృత్తాకార తీగచుట్ట అక్షంపై ఏదైనా బిందువు వద్ద అయస్కాంత ప్రేరణకు సమాసం రాయండి. దీనినుంచి, దాని కేంద్రం వద్ద అయస్కాంత ప్రేరణను పొందండి.
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 3

ప్రశ్న 4.
‘r వ్యాసార్థం, N చుట్లు ఉన్న వృత్తాకార తీగచుట్టలో “1” విద్యుత్ ప్రవహిస్తుంది. దాని అయస్కాంత భ్రామకం ఎంత?
జవాబు:
అయస్కాంత భ్రామకం (M) = Ni A
M = Ni (πr²) (∵ A = πr²)
∴ M = π N i r²

ప్రశ్న 5.
L పొడవు గల వాహకంలో “i” విద్యుత్ ప్రవహిస్తుంది. దీనిని B ప్రేరణ గల అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు దానిపై పనిచేసే బలం ఎంత? ఆ బలం ఎప్పుడు గరిష్టం అవుతుంది?
జవాబు:
i) వాహకంపై పనిచేసే బలం (F) = B i L sin θ

ii) θ = 90° అయితే Fగరిష్టం = B i L

AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం

అనగా విద్యుత్ ప్రవాహము మరియు అయస్కాంతక్షేత్రము పరస్పరం లంబంగా ఉంటాయి. అందువలన బలం గరిష్టంగా ఉంటుంది.

ప్రశ్న 6.
“q” ఆవేశం ఉన్న కణం, “v” వేగంతో, B ప్రేరణ గల ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో చలిస్తున్నప్పుడు దానిపై పనిచేస్తే బలం ఎంత? అది ఎప్పుడు గరిష్ఠం అవుతుంది?
జవాబు:
i) ఆవేశిత కణంపై పనిచేసే బలం (F) = B q v sin θ.
ii) θ – 90° అయితే Fగరిష్టం = B q v.

ప్రశ్న 7.
అమ్మీటరు, వోల్టు మీటరు మధ్య భేదాలను గుర్తించండి. [AP. Mar, ’15]
జవాబు:

అమ్మీటరువోల్టు మీటరు
1) దీనిని విద్యుత్ ప్రవాహం కొలిచేందుకు ఉపయోగిస్తారు.1) దీనిని రెండు బిందువుల మధ్య పొటెన్షియల్ తేడాలను కొలిచేందుకు ఉపయోగిస్తారు.
2) ఆదర్శ అమ్మీటరు నిరోధం సున్నా.2) ఆదర్శ వోల్టు మీటరు నిరోధం అనంతం.
3) దీనిని వలయాలలో ఎల్లప్పుడూ శ్రేణిలో కలుపుతారు.3) దీనిని వలయాలలో ఎల్లప్పుడూ సమాంతరంగా కలుపుతారు.

ప్రశ్న 8.
కదిలే తీగచుట్ట గాల్వానా మీటరు సూత్రం ఏమిటి?
జవాబు:
విద్యుత్ ప్రవహించే తీగచుట్టను ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు దానిపై టార్క్ పని చేస్తుంది. దీనిపై కదిలే తీగచుట్ట గాల్వానా మీటరు ఆధారపడుతుంది.
∴ తీగచుట్టలో విద్యుత్ ప్రవాహం (i) ∝ అపవర్తన కోణం (θ).

ప్రశ్న 9.
కదిలే తీగచుట్ట గాల్వానా మీటరు కొలవగల విద్యుత్ ప్రవాహ కనిష్ఠ విలువ ఎంత?
జవాబు:
కదిలే తీగచుట్ట గాల్వానా మీటరు చాలా సున్నిత గాల్వానా మీటరు. దీనిని ఉపయోగించి 10-9 A వరకు అతిస్వల్ప విద్యుత్ ప్రవాహాలను కొలవవచ్చు.

ప్రశ్న 10.
కదిలే తీగచుట్ట గాల్వానా మీటరును అమ్మీటరుగా ఎలా మారుస్తావు? [Mar.’14]
జవాబు:
కదిలే తీగచుట్ట గాల్వానా మీటరుకు సమాంతరంగా స్వల్పనిరోధాన్ని కలిపితే, అమ్మీటరుగా మారుతుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 4

ప్రశ్న 11.
కదిలే తీగచుట్ట గాల్వనా మీటరును వోల్టు మీటరుగా ఎలా మారుస్తావు? [AP & TS. Mar.’16; TS. Mar:’15]
జవాబు:
కదిలే తీగచుట్ట గాల్వానా మీటరుకు శ్రేణిలో అధిక నిరోధాన్ని కలిపితే వోల్టు మీటరుగా మారుతుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 5

ప్రశ్న 12.
స్వేచ్ఛాంతరాళపు పెర్మిటివిటి ε0, స్వేచ్ఛాంతరాళపు పెర్మియబిలిటి µ0, శూన్యంలో కాంతి వడుల మధ్య సంబంధం ఏమిటి?
జవాబు:
శూన్యంలో కాంతి వేగం (C) = \(\frac{1}{\sqrt{\mu_0 \varepsilon_0}}\)
ఇక్కడ µ0 = m0 = శూన్యయానకం పెర్మియబులిటీ
ε0 = శూన్యంలో పెర్మిటివిటీ

AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం

ప్రశ్న 13.
విద్యుత్ ప్రవహిస్తున్న ఒక వృత్తాకార లూప్ మృదువైన క్షితిజ సమాంతర తలంపై ఉంది. లూపు దాని లంబాక్షం పరంగా తిరిగే విధంగా ఏకరీతి అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పాటు చేయవచ్చా?
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 6

ఇక్కడ i విద్యుత్ ప్రవాహం, వైశాల్య సదిశ \(\overrightarrow{A}\), అయస్కాంత క్షేత్రం \(\overrightarrow{B}\). వైశాల్య సదిశ \(\overrightarrow{\tau}\) తీగ చుట్ట తలానికి లంబంగా ఉంటుంది. కాబట్టి నిలువు అక్షంలో టార్క్ (\(\overrightarrow{A}\)) పని చేయదు. అందువలన తీగచుట్ట లంబాక్షంపరంగా తిరిగితే అయస్కాంత క్షేత్రం ఏర్పడదు.

ప్రశ్న 14.
విద్యుత్ ప్రవహిస్తున్న వృత్తాకార లూప న్ను ఏకరీతి బాహ్య అయస్కాంత క్షేత్రంలో ఉంచారు. లూప్ స్వేచ్ఛగా తిరగగలిగితే, అది స్థిరమైన సమతాస్థితిని పొందినప్పుడు దాని దిగ్విన్యాసం ఏవిధంగా ఉంటుంది?
జవాబు:
తీగచుట్ట తలం అయస్కాంత క్షేత్ర దిశకు లంబంగా ఉండుటచే దానిపై టార్క్ పనిచేయదు.

ప్రశ్న 15.
విద్యుత్ ప్రవహిస్తున్న క్రమరహిత తీగ లూపు బాహ్య అయస్కాంత క్షేత్రంలో ఉంచారు. తీగ నమ్యంగా (flexible) ఉంటే, అది ఎటువంటి ఆకారానికి మారుతుంది? ఎందుకు?
జవాబు:
అన్ని ఆకారాలకన్నా వృత్తం యొక్క చుట్టుకొలత అధికం. అందువలన అయస్కాంత అభివాహం గరిష్ఠంగా ఉండుటకు వృత్తం తలము అయస్కాంత క్షేత్రానికి లంబంగా ఉండునట్లు తీసుకుంటారు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బయోట్-సవర్ట్ నియమాన్ని తెలిపి, వివరించండి. [TS. Mar: ’17; AP. Mar.’17; TS. Mar.’16; Mar.’14]
జవాబు:
ఒక వాహకంలో అల్ఫాంశము యొక్క పొడవు dl దీనిగుండా విద్యుత్ ప్రవహిస్తోందనుకోండి. దీనినుండి దూరంలో p బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ (dB) విలువ i) విద్యుత్ ప్రవాహము (i) ii) అల్పాంశము పొడవు (dl) iii) r మరియు dl ల మధ్యకోణం sin విలువకు అనులోమానుపాతంలోను మరియు iv) అల్పాంశం నుండి దూరం యొక్క వర్గానికి విలోమాను పాతంలోను ఉంటుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 7
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 8

ప్రశ్న 2.
ఆంపియర్ నియమాన్ని తెలిపి, వివరించండి.
జవాబు:
ఆంపియర్ నియమం :
విద్యుత్ ప్రవాహం గల వాహకం చుట్టూ ఒక సంవృత పరిపథంలో \(\overrightarrow{B}.\overrightarrow{dl}\) యొక్క రేఖీయ సమాకలని µ0i కి సమానం.
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 9

ప్రశ్న 3.
విద్యుత్ ప్రవహిస్తున్న పొడవైన వాహకం వల్ల కలిగే అయస్కాంత ప్రేరణను కనుక్కోండి.
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 10
ఒక తిన్నని పొడవైన వాహకం గుండా విద్యుత్ ప్రవహిస్తోందనుకొనుము. వాహకం నుండి దూరంలో ఒక బిందువు P ని తీసుకోండి. వాహకం చుట్టూ వ్యాసార్థంలో ఒక వృత్తాన్ని గీయాలి.

ఈ వృత్తంపై అయస్కాంత ప్రేరణ అన్ని బిందువుల వద్ద ఒకేవిధంగా ఉండును. ఒక అల్పాంశం పొడవు dl.
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 11
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 12

ప్రశ్న 4.
విద్యుత్ ప్రవహిస్తున్న వృత్తాకార తీగచుట్ట కేంద్రం వద్ద అయస్కాంత ప్రేరణకు సమాసాన్ని బయోట్-సవర్ట్ నియమాన్ని ఉపయోగించి రాబట్టండి.
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 13
ఒక వృత్తాకార తీగచుట్ట వ్యాసార్థము r, దీనిగుండా i విద్యుత్ ప్రవహిస్తోందనుకొనుము. ఒక అల్పాంశం యొక్క పొడవు ‘dl’ అనుకొనుము. తీగచుట్ట కేంద్రము అనుకొనుము. బయోట్-సవర్ట్ నియమం ఉపయోగించి
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 14

వృత్తాకార తీగచుట్టలో అన్ని అల్పాంశాల యొక్క క్షేత్రాలు ఒకేదిశలో ఉండును. (1)వ సమీకరణంసు సమాకలనం చేయగా ఫలిత అయస్కాంత క్షేత్రాన్ని పొందవచ్చు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 15

AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం

ప్రశ్న 5.
విద్యుత్ ప్రవహిస్తున్న వృత్తాకార తీగచుట్ట అక్షంపై ఏదైనా బిందువు వద్ద అయస్కాంత ప్రేరణకు సమాసాన్ని బయోట్ – సవర్ట్ నియమాన్ని ఉపయోగించి రాబట్టండి.
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 16
ఒక వృత్తాకార తీగ చుట్ట వ్యాసార్థం R, దానిలో విద్యుత్ ప్రవాహం i అనుకొనుము. దానికేంద్రము O నుండి x దూరంలో అక్షంపై ఒక బిందువు P ని తీసుకొనుము. అల్పాంశము dl నుండి P వరకు దూరము అనుకొనుము.
బయోట్ – సవర్ట్ నియమం నుండి
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 17

dBని రెండు అంశాలుగా విభజించవచ్చు. dB cosθ మరియు dB sinθ. AB కి వ్యతిరేక దిశలో మరొక అల్పాంశమును తీసుకొనుము. అక్షం వైపు ఉన్న అంశాలను కూడాలి మరియు అక్షానికి లంబంగా ఉన్న అంశాలు రద్దవుతాయి.
P వద్ద ఫలిత అయస్కాంత ప్రేరణ
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 18

ప్రశ్న 6.
విద్యుత్ ప్రవాహ లూస్ అయస్కాంత ద్విద్భవ భ్రామకానికి సమాసాన్ని రాబట్టండి.
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 19
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 20

ప్రశ్న 7.
పరిభ్రమించే ఎలక్ట్రాన్ అయస్కాంత ద్విర్భవ భ్రామకానికి సమాసాన్ని రాబట్టండి. [AP. Mar. 16]
జవాబు:
r వ్యాసార్థం, v వేగం మరియు పౌనఃపున్యము గల ఎలక్ట్రాన్ వృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తుందనుకొందాం. వృత్తాకార కక్ష్యపై P అనే ఒక బిందువును గుర్తించాలి. ప్రతి పరిభ్రమణంలో ఎలక్ట్రాన్ ఈ బిందువును ఒక్కసారి దాటుతుంది. ఒక పరిభ్రమణంలో ఎలక్ట్రాన్ ప్రయాణించిన దూరం = 2πr.
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 21

ప్రశ్న 8.
వ్యత్యస్త క్షేత్రాలు (crossed fields) E, B లు వేగ వరణకం (velocity selector) గా ఎలా పనిచేస్తాయో వివరించండి.
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 24
q ఆవేశిత కణం, V వేగంలో విద్యుత్ క్షేత్రం మరియు అయస్కాంత క్షేత్రం రెండింటిలో చలిస్తోందనుకొనుము.
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 22
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 23

అందువలన విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలు పరస్పరం లంబంగా ఉంటాయి.

E మరియు B లను సరిచేసి, వాటి బలాలను సమానం చేస్తే
FE = FB
qE= q υ B
υ = \(\frac{E}{B}\)

ఈ నిబంధన ఉపయోగించి ఆవేశిత కణాల వేగాన్ని నిర్ణయించవచ్చు. అందువలన E మరియు B సదిశా క్షేత్రాలను వేగవరణకంగా ఉపయోగిస్తారు.

ప్రశ్న 9.
సైక్లోట్రాన్ ప్రాథమిక ఘటకాలు (components) ఏవి? వాటి ఉపయోగాలను పేర్కొనండి.
జవాబు:
ప్రోటాన్లు, α – కణాలు, డ్యుటరాన్లు మొదలగు ధనావేశిత కణాలను త్వరణం చెందించుటకు ఉపయోగించే పరికరాన్ని సైకోట్రాస్ అంటారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 25

సైక్లోట్రాన్లో ప్రాథమిక ఘటకాలు

  1. D ఆకారంలో ఉన్న రెండు లోహపు చాంబర్లు
    D1 మరియు D2
  2. అధిక పౌనఃపున్య డోలకం
  3. బలమైన విద్యుదయస్కాంతం
  4. శూన్య ఆవరణ

సైక్లోట్రాన్ ఉపయోగాలు :

  1. వైద్యశాస్త్రంలో రేడియోధార్మిక పదార్థాలను ఉత్పత్తి చేయడానికి దీనిని వాడతారు. అనగా డయాగ్నస్టిక్ మరియు క్రోనిక్ వ్యాధుల నివారణలో వీటిని వాడతారు.
  2. అయాన్లను చొప్పించి ఘనపదార్థాల నాణ్యతను మెరుగుపరచవచ్చు.
  3. క్రొత్త పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.
  4. అధికంగా త్వరణం చెందిన కణాలతో కేంద్రకాలను తాడనం చెందించి కేంద్రక చర్యలను అధ్యయనం చేయవచ్చు.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అయస్కాంత క్షేత్రంలో ఉన్న విద్యుత్ ప్రవాహం గల వాహకంపై పనిచేసే బలానికి సమాసాన్ని రాబట్టండి. విద్యుత్ ప్రవహిస్తున్న రెండు సమాంతర వాహకాల మధ్య ఏకాంక పొడవుకు పని చేసే బలానికి సమాసాన్ని ఉత్పాదించండి.
జవాబు:
విద్యుత్ ప్రవహించే వాహకంపై పనిచేసే బలానికి సమీకరణం రాబట్టుట :
ఒక తిన్నని పొడవైన వాహకం పొడవు ‘l’ మరియు అడ్డుకోత వైశాల్యం ‘A’, దానిగుండా ‘i’ విద్యుత్ ప్రవహిస్తోందనుకొనుము. దీనిని ‘B’ అయస్కాంత ప్రేరణ గల క్షేత్రములో ఉంచామనుకొనుము.

వాహకంలో ఎలక్ట్రాన్లపై బలం పనిచేసి, అవి ‘Vd‘ డ్రిఫ్ట్ వేగంతో చలిస్తాయి. సాంప్రదాయ విద్యుత్ ప్రవాహదిశ, డ్రిఫ్ట్ వేగానికి వ్యతిరేకంగా ఉంటుంది. క్షేత్రదిశ ‘B’, విద్యుత్ ప్రవాహ దిశకు ‘θ’ కోణం చేయుచున్నది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 26

Bలో ‘q’ ఆవేశముపై పని చేయు బలం
F’ = q Vd B sin θ

ప్రమాణ ఘనపరిమాణంలో ఎలక్ట్రాన్ల సంఖ్య ‘n’
∴ విద్యుత్ ప్రవాహం (i) = nq Vd A

‘l’ పొడవులో మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్య (N) = nlA (∵ n = \(\frac{N}{V}\))
వాహకంపై మొత్తం బలం (F) = F’.N (∵ N = nV = n × A × l)
= (q Vd B sin θ) (nlA)
= (nqVdA) (lB sin θ)
∴ F = ilB sin θ

సందర్భం (i) : θ = 0° అయితే Fకనిష్ఠం = 0

సందర్భం (ii) : θ = 90° అయితే Fగరిష్టం = Bil

రెండు తిన్నని పొడవైన సమాంతర వాహకాల మధ్య పని చేయుబలము :
‘AB మరియు ‘CD’ అను రెండు తిన్నని సమాంతర వాహకాల గుండా ‘i1‘ మరియు ‘i2‘ విద్యుత్లు ప్రవహిస్తున్నాయి. ‘ఇవి గాలిలో ‘r’ దూరంలో ఉన్నాయనుకొనుము.

AB మరియు CD వాహకాల చుట్టూ ఏర్పడే అయస్కాంత ప్రేరణలు B1 మరియు B2. AB వాహకం నుండి r దూరంలో
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 27

AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం

ప్రశ్న 2.
ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో ఉంచిన విద్యుత్ ప్రవహిస్తున్న లూప్పై పనిచేసే టార్కు సమాసాన్ని పొందండి. కదిలే తీగచుట్ట గాల్వానా మీటరు నిర్మాణం, పనిచేసే విధానం వర్ణించండి.
జవాబు:
ఏకరీతీ అయస్కాంత క్షేత్రంలో విద్యుత్ ప్రవాహ తీగచుట్టలో పని చేసే టార్క్:
ఒక దీర్ఘచతురస్రాకార తీగచుట్ట ABCD యొక్క పొడవు l = AB = CD మరియు వెడల్పు b = AD = BC. దీనిలో విద్యుత్ ప్రవాహము “i” దీనిని B అయస్కాంత అభివాహ సాంద్రత గల క్షేత్రంలో ఉంచామనుకొనుము.

తీగచుట్ట తలం నుండి గీసిన లంబము ON, అయస్కాంత క్షేత్రం B తో చేయు కోణము ‘θ’.
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 28

కావున ఈ బలాలు రద్దవుతాయి.
AB భుజంపై బలం = Bil
CD భుజంపై బలం = Bil

ఈ రెండు సమాన మరియు వ్యతిరేక బలాలు తీగచుట్టను త్రిప్పితే బలయుగ్మ భ్రామకం ఏర్పడుతుంది.
టార్క్ (లేదా) బల యుగ్మ భ్రామకం = బలం × లంబదూరం = Bil × (PQ sin θ)
టార్క్ = Bilb sinθ (∴ A = 1 × b)
∴ τ = iAB sin θ

తీగచుట్టలో ‘n’ చుట్లు ఉన్నాయనుకొంటే
τ = n i AB sin θ
‘Φ’ అనునది తీగ ట్ట తలానికి, అయస్కాంత క్షేత్రం B గల కోణం అనుకుంటే
τ = ni AB cos Φ

కదిలే తీగచుట్ట గాల్వనామీటరు :
సూత్రం :
విద్యుత్ ప్రవాహ తీగచుట్టను ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు దానిపై టార్క్ పని చేస్తుంది.

నిర్మాణం :

  1. దీనిలో విద్యుత్ బంధిత రాగి తీగతో ఒక ఫ్రేముపై చుట్టిన దీర్ఘచతురస్రాకారపు తీగచుట్ట ఉంటుంది.
  2. ఈ చుట్టను విమోటన శీర్షం నుండి ఒక ఫాస్ఫర్ బ్రాంజ్ తీగతో బలమైన గుర్రపునాడా అయస్కాంత ధ్రువాల మధ్య వ్రేలాడదీస్తారు.
  3. తీగచుట్ట క్రింది కొన ఫాస్ఫార్ బ్రాంజ్ స్ప్రింగ్కు కలుపుతారు.
  4. ఒక చిన్న దర్పణం M ను ఫాస్పార్ బ్రాంజ్ తీగకు వ్రేలాడదీసి తీగచుట్టలో అపవర్తనాన్ని కొలుస్తారు.
  5. ఒక ఇనుప స్థూపాన్ని తీగచుట్ట మధ్యలో బిగిస్తారు. అందువలన అయస్కాంత ప్రేరణ తీవ్రత పెరుగుతుంది.
  6. పుటాకార అయస్కాంత ధ్రువాలు వాటిమధ్య ఉన్న అయస్కాంత క్షేత్రాన్ని రేడియల్ క్షేత్రంగా చేస్తాయి.
  7. ఈ మొత్తం అమరికను ఒక గాజు కిటికి ఉన్న ఇత్తడి పెట్టెలో ఉంచుతారు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 29

సిద్ధాంతం :
l పొడవు, b వెడల్పు మరియు i విద్యుత్ ప్రవాహం గల దీర్ఘచతురస్రాకార తీగచుట్టను B అయస్కాంత ప్రేరణ గల క్షేత్రంలో వ్రేలాడదీశామనుకోండి.

అపవర్తన టార్క్ (τ) = BiAN → (5)
A = తీగచుట్ట వైశాల్యం,
N = మొత్తం చుట్ల సంఖ్య
పునఃస్థాపక టార్క్ (τ) = C θ → (6)

తీగలో ప్రమాణ పురిపెట్టడానికి అవసరమైన బలయుగ్మభ్రామకం C.
సమతాస్థితిలో, అపవర్తన టార్క్ = పునఃస్థాపక టార్క్
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 30

తీగచుట్టలో అపవర్తనం, దానిలో విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది. దీపము-స్కేలు ఏర్పాటుతో తీగచుట్టలో అపవర్తనాన్ని కొలుస్తారు.

ప్రశ్న 3.
గాల్వనా మీటరును అమ్మీటరుగా ఎలా మార్చవచ్చు? గాల్వనా మీటరుకు సమాంతరంగా కలిపిన నిరోధం గాల్వనా మీటరు నిరోధం కంటే ఎందుకు తక్కువగా ఉంటుంది?
జవాబు:
గాల్వనా మీటరును అమ్మీటరుగా మార్చుట :
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 31
గాల్వానా మీటరుకు తగిన నిరోధాన్ని సమాంతరంగా కలిపితే అమ్మీటరుగా మారుతుంది.

ఈ ఏర్పాటు వల్ల ఫలిత నిరోధం తగ్గుతుంది. విద్యుత్ వలయాలలో విద్యుత్ ప్రవాహాన్ని కొలిచేందుకు అమ్మీటరును ఉపయోగిస్తారు. వలయంలో అమ్మీటరును కలుపుట వల్ల విద్యుత్ ప్రవాహం మారదు. ఆదర్శ అమ్మీటరు నిరోధము సున్నా.

G మరియు S అనునవి గాల్వానా మీటరు నిరోధం మరియు షంట్ నిరోధాలు. i అనునది మొత్తం విద్యుత్. A వద్ద ig మరియు is గా విభజించబడినాయి.
కిరాఫ్ మొదటి నియమం ప్రకారం, i = ig + is

‘G’ మరియు ‘S’ సమాంతరంగా ఉన్నాయి కనుక
‘మీటరు వద్ద పొటెన్షియల్ తేడా = షంట్ వద్ద పొటెన్షియల్ తేడా
ig G = is S
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 32
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 33

కాబట్టి గాల్వానా మీటరులో విద్యుత్ ప్రవాహము, మొత్తం విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది. S గుండా అధికభాగం విద్యుత్ ప్రవహిస్తుంది. మరియు G గుండా తక్కువ భాగం విద్యుత్ ప్రవహిస్తుంది.

సమాంతర నిరోధము గాల్వానామీటరు నిరోధం కన్నా తక్కువగా ఉండుట వల్ల అధిక విద్యుత్ షంట్ గుండా ప్రవహిస్తుంది. కాబట్టి షంట్ వల్ల అధిక విద్యుత్ ప్రవాహాల బారినుండి గాల్వానా మీటరు రక్షింపబడుతుంది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం

ప్రశ్న 4.
గాల్వనా మీటరును వోల్టు మీటరుగా ఎలా మార్చవచ్చు? శ్రేణి నిరోధం గాల్వనామీటరు నిరోధం కంటే ఎందుకు ఎక్కువగా ఉంటుంది?
జవాబు:
గాల్వనా మీటరును వోల్టు మీటరుగా మార్చుట : అధిక నిరోధం (R) ను గాల్వానా మీటరుకు శ్రేణిలో కలుపుట వల్ల అది వోల్టు మీటరుగా మారుతుంది. వోల్టు మీటరును వలయంలో రెండు బిందువుల మధ్య పొటెన్షియల్ తేడాలు కొలిచేందుకు వాడతారు. వోల్టు మీటరును వలయాలలో సమాంతరంగా కలుపుతారు.

‘A’ మరియు ‘B’ బిందువుల మధ్య పొటెన్షియల్ తేడా “V” అనుకొనుము.
∴ V = (R+G) ig [∵ V = iR]
ఇక్కడ G = గాల్వనా మీటరు నిరోధం
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 34

పై సూత్రంను ఉపయోగించి Rవిలువను లెక్కించవచ్చు. గాల్వానా మీటరు వద్ద గరిష్ఠ పొటెన్షియల్ తేడా (Vg) = ig G
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 35

గమనిక :
n = \(\frac{V}{V_g}\) అనునది గరిష్ఠ వోల్టేజికి, గాల్వానా మీటరు వద్ద గరిష్ఠ వోల్టేజికి గల నిష్పత్తి.

శ్రేణి నిరోధము, గాల్వనా మీటరు నిరోధం కన్నా ఎక్కువ. కారణం బాహ్య నిరోధంలో విద్యుత్ ప్రవాహం మరియు పొటెన్షియల్ తేడా తగ్గుతాయి మరియు గాల్వానా మీటరు నిరోధము పెరుగుతుంది.

ప్రశ్న 5.
బాగా పొడవైన విద్యుత్ ప్రవహిస్తున్న రెండు సమాంతర వాహకాల మధ్య పనిచేసే బలానికి సమాసాన్ని రాబట్టండి. దీనినుంచి ఆంపియర్ను నిర్వచించండి.
జవాబు:
రెండు తిన్నని సమాంతర వాహకాల మధ్య పని చేయు బలం :
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 36
A మరియు B అను రెండు తిన్నని సమాంతర వాహకాల గుండా i1 మరియు i2 విద్యుత్లు ఒకే దిశలో ప్రవహిస్తున్నాయి. వీటిని గాలిలో దూరంలో ఉంచామనుకొనుము.

i1 విద్యుత్ ప్రవాహం వల్ల A వాహకం చుట్టూ అయస్కాంత ప్రేరణ B1 మరియు i2 విద్యుత్ ప్రవాహం వల్ల B వాహకం ట్టూ అయస్కాంత ప్రేరణ B2 ప్రతివాహకం పొడవు l అనుకొనుము.

A నుండి దూరంలో అయస్కాంత ప్రేరణ B1

AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 37
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 38
“అనంతమైన పొడవు ఉన్న రెండు తిన్నని సమాంతర వాహకాలు శూన్యంలో 1m ఎడంగా ఉన్నప్పుడు వాటి మధ్య ప్రతి మీటరు పొడవుపై పని చేసే బలం 2 × 10-7Nm ఉండునట్లుగా ఆ రెండు వాహకాలలో ఒక్కొక్క దానిలో ప్రవహించే విద్యుత్ ప్రవాహ విలువను ఒక ఆంపియర్ అంటారు”.

లెక్కలు Problems

ప్రశ్న 1.
10 A విద్యుత్ ప్రవహిస్తున్న బాగా పొడవైన రెండు తీగలను ఒకదానికొకటి సమాంతరంగా 1m దూరంలో ఉంచారు. వాటి మధ్య ఏకాంక పొడవుకు పని చేసే బలం ఎంత? [TS. Mar.’15]
సాధన:
i1 = i2 = 10A
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 39

ప్రశ్న 2.
ఒక కదిలే తీగచుట్ట గాల్వనా మీటరు 10-6 A విద్యుత్ ప్రవాహాన్ని కొలవగలదు. 1A విద్యుత్ ప్రవాహాన్ని కొలవాటంటే షంట్ నిరోధం ఎంత ఉండాలి? గాల్వనామీటర్ నిరోధం GΩ.
సాధన:
గాళ్యానామీటరులో విద్యుత్ ప్రవాహము (ig) 10-6, i = 1A
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 40
G = గాల్వానా మీటరు నిరోధం

ప్రశ్న 3.
30cm వ్యాసార్థం ఉన్న వృత్తాకార లూప్ ద్వారా 3.5 A విద్యుత్ ప్రవహిస్తుంది. దాని అక్షంపై కేంద్రం నుంచి 40 cm దూరంలో ఉన్న బిందువు వద్ద అయస్కాంత క్షేత్రాన్ని కనుక్కోండి.
సాధన:
వ్యాసార్థము (r) = 30 cm = 30 × 10-2m
విద్యుత్ ప్రవాహము (i) = 3.5 A
x = 40 సెం.మీ = 40 × 10-2 m
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 41

అభ్యాసాలు Textual Exercises

ప్రశ్న 1.
0.40 A విద్యుత్ ప్రవహిస్తున్న వృత్తాకార తీగచుట్టలో 100 చుట్లు ఉన్నాయి. ప్రతిచుట్ట వ్యాసార్థం 8.0 cm. తీగచుట్ట కేంద్రం వద్ద అయస్కాంత క్షేత్రం B పరిమాణం ఎంత?
సాధన:
ఇక్కడ n = 100, r = 8cm = 8 × 10-2 m, i = 0.40 A
కేంద్రం వద్ద అయస్కాంత క్షేత్రం
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 42
అయస్కాంతక్షేత్ర దిశ, విద్యుత్ ప్రవాహ దిశపై ఆధారపడుతుంది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం

ప్రశ్న 2.
పొడవైన తిన్నని తీగలో 35 A విద్యుత్ ప్రవహిస్తుంది. తీగ నుంచి 20 cm దూరంలో క్షేత్ర పరిమాణం B ఎంత?
సాధన:
P వద్ద అయస్కాంత క్షేత్రం
I = 35 A, r = 20 cm = 0.2 m
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 43

ప్రశ్న 3.
పొడవైన తిన్నని తీగలో క్షితిజ సమాంతర తలంలో 50 A విద్యుత్, ఉత్తరం నుంచి దక్షిణం దిశకు ప్రవహిస్తుంది. తీగ నుంచి 2.5 m దూరంలో తూర్పు దిశగా B పరిమాణాన్ని, దిశను కనుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 44
l = 50A మరియు r = 2.5 m
అయస్కాంత క్షేత్ర పరిమాణం
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 45
అయస్కాంత క్షేత్ర దిశ P వద్ద కాగితపు తలానికి లంబంగా వెలుపలికి పని చేస్తుంది.

ప్రశ్న 4.
పైన ఉండే (overhead) ఒక క్షితిజ సమాంతర విద్యుత్ తీగ ద్వారా తూర్పు నుంచి పడమర దిశలో 90 A విద్యుత్ ప్రవహిస్తుంది. ఈ తీగలోని విద్యుత్ ప్రవాహం వల్ల, దానికంటే 1.5 m దిగువన అయస్కాంత క్షేత్రం పరిమాణం, దిశ ఏమిటి?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 46
అయస్కాంత క్షేత్ర దిశ P వద్ద కాగితపు తలానికి లంబంగా వెలుపలికి ఉంటుంది.

ప్రశ్న 5.
0.15 T ఏకరీతి అయస్కాంత క్షేత్ర దిశతో 30° కోణం చేస్తున్న 8A విద్యుత్ ప్రవహిస్తున్న తీగపై ఏకాంక పొడవుకు పనిచేసే అయస్కాంత బలం పరిమాణం ఎంత ?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 47
I = 8 A, 0 = 30°, B = 0.15 T, 1 = 1 m
అయస్కాంత బలం (F) = 1 (1 × B) = Bil. sin θ
= 8 × 1 × 0.15 × sin 30°
= \(\frac{8\times0.15}{2}\) = 4 × 0.15 = 0.6 N/m
బలది కాగితపు తలానికి లంబంగా లోనికి పనిచేస్తుంది.

ప్రశ్న 6.
10 A విద్యుత్ ప్రవహిస్తున్న 3.0 cm పొడవున్న తీగను, సోలినాయిడ్ లోపల దాని అక్షానికి లంబంగా ఉంచారు. సోలినాయిడ్ లోపల అయస్కాంత క్షేత్రం 0.27T. ఈ తీగపై పనిచేసే అయస్కాంత బలం ఎంత?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 48
ఇక్కడ అయస్కాంత క్షేత్రం మరియు విద్యుత్ ప్రవాహదిశ మధ్యకోణం 90°.
l = 3 cm = 3 × 10-2 m, I = 10A, B = 0.27 T
అయస్కాంత బలపరిమాణం (F) = I l B sin θ°
= 10 × 3 × 10-2 × 0.27 × sin 90°
= 8.1 × 10-2 N
బలదిశ కాగితపు తలానికి లంబంగా లోనికి పనిచేస్తుంది.

ప్రశ్న 7.
4.0cm దూరంలో ఉన్న రెండు పొడవైన సమాంతర తీగలు A, B ల ద్వారా ఒకే దిశలో పోయే విద్యుత్ ప్రవాహాలు వరుసగా 8.0 A, 5.0 A. తీగ A యొక్క 10 cm భాగంపై పనిచేసే బలాన్ని లెక్కకట్టండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 49
ఫ్లెమింగ్ ఎడమ చేతినియమం ప్రకారం బలం B వైపు పని చేస్తుంది.

ప్రశ్న 8.
దగ్గరగా చుట్టిన 80 cm పొడవు ఉన్న సోలినాయిడ్ 5 పొరలు కలిగి ఉంది. ప్రతి పొరలో, 400 చుట్లు ఉన్నాయి. సోలినాయిడ్ వ్యాసం 1.8 cm. ప్రవహించే విద్యుత్ 8.0 A అయితే సోలినాయిడ్ అంతర్భాగంలో దాని కేంద్రం దగ్గర B పరిమాణాన్ని లెక్కించండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 50
సాలినాయిడ్ పొడవు 1 = 80 cm = 0.8 m
పొరల సంఖ్య = 5
ప్రతి పొరలో చుట్లసంఖ్య = 400
సాలినాయిడ్ వ్యాసము = 1.8 cm
విద్యుత్ ప్రవాహం I = 8 A
∴ మొత్తం చుట్ల సంఖ్య N = 400 × 5 = 2000
ప్రమాణ పొడవులో చుట్ల సంఖ్య (n) = \(\frac{2000}{0.8}\) = 2500
సాలినాయిడ్ లోపల అయస్కాంత ప్రేరణ (B) = µ0nI = 4 × 3.14 × 10-7 × 2500 × 8 = 2.5 × 10-2 T అయస్కాంత క్షేత్ర దిశ సాలినాయిడ్ అక్షం వైపు ఉండును.

ప్రశ్న 9.
10 cm భుజం పొడవు గల చతురస్రాకర తీగచుట్టలో 20 చుట్లు ఉన్నాయి. దీనిద్వారా 12 A విద్యుత్ ప్రవహిస్తుంది. ఈ తీగచుట్టను క్షితిజ లంబంగా వేలాడదీశారు. 0.80 T పరిమాణం ఉన్న ఏకరీతి క్షితిజ సమాంతర అయస్కాంత క్షేత్రంలో తీగచుట్ట తలం యొక్క లంబం 30° కోణం చేస్తుంది. తీగచుట్ట లోనయ్యే టార్క్ పరిమాణం ఎంత?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 51
తీగచుట్ట భుజం = 10 cm = 0.1 m
(n) = 20, I = 12 A, θ = 30°, B = 0.80 T
టార్క్ (τ) = NI AB sinθ
= 20 × 12 × (10 × 10-2)² × 0.80 × sin 30°
\(\frac{2.4\times0.8}{2}\) = 0.96 N – m

AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం

ప్రశ్న 10.
M1, M2 అనే కదిలే తీగచుట్ల మీటర్లు క్రింది వివరాలను కలిగి ఉన్నాయి :
R1 = 10 Ω, N1 = 30,
A1 = 3.6 × 10-3 m², B1 = 0.25 T
R2 = 14Ω, N, = N2 = 42
A2 = 1.8 × 10-3 m², B2 = 0.50 T
(ఈ రెండు మీటర్లకు స్ప్రింగ్ స్థిరాంకాలు సర్వసమం)
M1, M2 (a) విద్యుత్ ప్రవాహ సున్నితత్వం, (b) వోల్టేజి సున్నితత్వం నిష్పత్తులను కనుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 52

ప్రశ్న 11.
ఒక గదిలో (chamber), 6.5 G (1 G = 10-4 T) ఏకరీతి అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పాటు చేయడమైంది. క్షేత్రంలోకి లంబంగా 4.8 × 106 m s-1 వడితో ఒక ఎలక్ట్రాన్ను వదిలారు. ఈ ఎలక్ట్రాన్ పథం ఎందుకు వృత్తాకారంగా ఉంటుందో వివరించండి. వృత్తాకార కక్ష్యా వ్యాసార్థాన్ని కనుక్కోండి.
(e = 1.5 × 10-19 C, Me = 9.1 × 10-31 kg)
సాధన:
అయస్కాంత క్షేత్రము B = 6.5 G = 6.5 × 10-4T
ఆవేశము (e) = -1.6 × 10-19 C
ఎలక్ట్రాన్ యొక్క వేగము (V) = 4.8 × 106 m/s
ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి (m) = 9.1 × 10-31 kg
అయస్కాంత క్షేత్రం మరియు ఎలక్ట్రాన్ మధ్య కోణం (θ) – 90°
ఆవేశిత కణంపై అయస్కాంత క్షేత్రంలో బలం F = q (V × B) = e (V × b)
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 53

ప్రశ్న 12.
అభ్యాసం 11 లో ఇచ్చిన వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్న ఎలక్ట్రాన్ పరిభ్రమణ పౌనఃపున్యాన్ని పొందం సమాధానం, ఎలక్ట్రాన్ వడిపై ఆధారపడుతుందా? వివరించండి.
సాధన:
B = 6.5 G = 6.5 × 10-4 T, V = 4.8 × 106 m/s, e = 1.6 × 10-19 C
me = 9.1 × 10-31 kg
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 54

ప్రశ్న 13.
(a) 6.0 A విద్యుత్ ప్రవహిస్తున్న వృత్తాకార తీగచుట్టను 1.0 T పరిమాణం ఉన్న ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో క్షితిజ లంబంగా వేలాడదీశారు. దీని వ్యాసార్థం 8.0 cm, చుట్ల సంఖ్య 30. తీగ చుట్ట తలం లంబంతో క్షేత్ర రేఖలు -60° కోణం చేస్తున్నాయి. తీగచుట్ట తిరగకుండా ఆపడానికి అనువర్తించే ప్రతిటార్క్ (counter torque) పరిమాణాన్ని లెక్కించండి.

(b) వృత్తాకార తీగచుట్ట బదులుగా అంతే వైశాల్యం ఉన్న క్రమరహితంగా ఉన్న సమతల తీగచుట్టను ఉంచితే మీ సమాధానం మారుతుందా? (మిగతా అన్నివివరాలు మారకుండా ఉన్నాయి.)
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 55
a) చుట్ల సంఖ్య (n) = 30, వ్యాసార్ధము (r) = 8 cm = 0.08 m
తీగ చుట్టలో విద్యుత్ ప్రవాహము (I) = 6A, అయస్కాంత ప్రేరణ (B) = 1.0 T, θ = 60°
టార్ (τ) = n I AB sinθ
= 30 × 6 × π (0.08)² × 1 × sin 60°
= 30 × 6 × 3.14 × 0.08 × 0.08 × \(\frac{\sqrt{3}}{2}\)
τ = 3.133 N – m

b) తీగచుట్టపై పనిచేసే టార్క్ దాని ఆకారంపై ఆధారపడదు. దాని వైశాల్యం స్థిరం కనుక టార్క్ కూడా స్థిరంగా ఉంటుంది.

అదనపు అభ్యాసాలు Additional Exercises

ప్రశ్న 14.
ఉత్తరం నుంచి దక్షిణం దిశలో ఉన్న ఒక నిలువు తలంలో X, Y అనే రెండు ఏకకేంద్ర వృత్తాకార తీగచుట్టలు ఉన్నాయి. వాటి వ్యాసార్థాలు వరుసగా 16 cm, 10 cm. X తీగచుట్టలో 20 చుట్లు ఉన్నాయి, దానిలో 16 A విద్యుత్ ప్రవహిస్తుంది. Yతీగచుట్టలో 25 చుట్లు ఉన్నాయి. దానిలో 18 A విద్యుత్ ప్రవహిస్తుంది. పడమరకు అభిముఖంగా ఉండి తీగచుట్టలను చూస్తున్న పరిశీలకునికి, విద్యుత్, X లో అపసవ్యదిశలోను, Yలో సవ్యదిశలోను ప్రవహిస్తున్నట్లు కనిపిస్తుంది. తీగమట్టలు కేంద్రం వద్ద అయస్కాంత క్షేత్రం పరిమాణం, దిశను తెలపండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 56
X తీగచుట్టలో
వ్యాసార్ధము (rx) = 16 cm = 0.16 m
చుట్ల సంఖ్య (nx) = 20
విద్యుత్ ప్రవాహము (Ix) = 16A

Y తీగచుట్టలో
వ్యాసార్థము (ry) = 10 cm = 0.1m
చుట్ల సంఖ్య (ny) = 25
విద్యుత్ ప్రవాహం (Iy) = 18 A
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 57

AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం

ప్రశ్న 15.
10cm రేఖీయ పరిమాణం, 10-3 m² మధ్యచ్ఛేద వైశాల్యం ఉన్న ప్రాంతంలో 100 G (1 G = 10-4 T) ఏకరీతి అయస్కాంత క్షేత్రం కావాలి. ఒక కోర్కు ఏకాంక పొడవుకు చుట్టగలిగే చుట్ల సంఖ్య 1000 చుట్లు m-1. తీగచుట్ట ద్వారా ప్రవహించగలిగే గరిష్ఠ విద్యుత్ ప్రవాహం 15 A. ఈ అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పాటు చేయడానికి, తగిన సోలినాయిడ్ రూపకల్పనకు వివరాలను సూచించండి. కోర్ ఫెర్రో అయస్కాంత పదార్థం కాదని ఊహించండి.
సాధన:
అయస్కాంత ప్రేరణ B = 100 G = 100 × 10-4
గరిష్ఠ విద్యుత్ (I) = 15A, n = 1000/m
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 58
I = 8A and మరియు చుట్ల సంఖ్య n = 1000
మరొక డిజైన్లో I = 10A మరియు n = 800/m.

ప్రశ్న 16.
R వ్యాసార్థం, N చుట్లు ఉన్న వృత్తాకార తీగచుట్టలో 1 విద్యుత్ ప్రవహిస్తుంది. ఈ తీగచుట్ట అక్షంపై దాని కేంద్రం నుంచి
X దూరంలో ఉన్న బిందువు వద్ద అయస్కాంత క్షేత్ర పరిమాణం
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 59 అని ఇచ్చారు.
a) తీగచుట్ట కేంద్రం వద్ద అయస్కాంత క్షేత్రానికి, ఇది బాగా తెలిసిన ఫలితాన్ని ఇస్తుందని చూపండి. .
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 60

b) ఒకే చుట్ల సంఖ్య N, వ్యాసార్థం R కలిగి R దూరంలో వేరయి ఉన్న రెండు సమాంతర సహాక్ష వృత్తాకార తీగచుట్ల ద్వారా సమాన విద్యుత్ ప్రవాహాలు ఒకే దిశలో ప్రవహిస్తున్నాయనుకోండి. తీగచుట్ల అక్షంపై వాటి మధ్య ఉన్న బిందువు చుట్టూ Rతో పోల్చినప్పుడు స్వల్పదూరాలకు, క్షేత్రం ఏకరీతిగా ఉంటుందని, ఇది ఉజ్జాయింపుగా B = 0.72 \(\frac{\mu_0 \mathbf{N I}}{\mathbf{R}}\) గా ఉంటుందని చూపండి.
[చిన్న ప్రాంతంలో దాదాపు ఏకరీతి అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరనే ఏర్పాటును ‘హెల్మ్ హోల్డ్(Helmholtz) తీగచుట్టలు అంటారు.]
సాధన:
రెండు సహక్ష తీగచుట్ల వ్యాసార్థం = R, చుట్ల సంఖ్య = N మరియు విద్యుత్ ప్రవాహము = I
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 61
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 62
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 63

ప్రశ్న 17.
ఒక టొరాయిడ్ కోర్పై (ఫెర్రో అయస్కాంత పదార్థం కాదు) 3500 తీగచుట్లు చుట్టడం జరిగింది. దాని అంతర్ వ్యాసార్థం 25 cm, బాహ్య వ్యాసార్థం 26 cm. తీగలో ప్రవహించే విద్యుత్ 11 A అయితే (a) టొరాయిడ్ వెలుపల, (b) టొరాయిడ్ కోర్ లోపల, (c) టొరాయిడ్తో ఆవరించిన ఖాళీ ప్రదేశంలో అయస్కాంత క్షేత్రం ఎంత?
సాధన:
a) టొరాయిడ్ వెలుపల అయస్కాంత క్షేత్రం శూన్యం. అయస్కాంతక్షేత్రం కేవలం టొరాయిడ్ లోపల, దాని పొడవు వెంట ఉండును.

b) టొరాయిడ్ అంతర వ్యాసార్ధం r1 = 25 cmi = 0.25 m
బాహ్య వ్యాసార్థం, r2 = 26 cm = 0.26 m
చుట్ల సంఖ్య N = 3500
తీగచుట్టలో విద్యుత్ ప్రవాహము, I = 11 A
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 64

c) టొరాయిడ్ లోపల ఖాళీప్రదేశంలో అయస్కాంత క్షేత్రం శూన్యం. కారణం అయస్కాంత క్షేత్రం దాని పొడవు వెంబడి మాత్రమే’ ఉండును.

AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం

ప్రశ్న 18.
క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి :
a) స్థిరమైన దిశ (తూర్పు నుంచి పడమరకు) కలిగి, బిందువు నుంచి బిందువుకు పరిమాణం మారే అయస్కాంత క్షేత్రాన్ని ఒక గదిలో ఏర్పాటు చేయడమైంది. ఈ గదిలోకి ప్రవేశించిన ఆవేశ కణం, స్థిర వడితో అపవర్తనం చెందకుండా సరళరేఖా మార్గంలో ప్రయాణిస్తుంది. కణం తొలివేగం గురించి మీరు ఏమీ చెప్పగలరు ?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 65
అయస్కాంత క్షేత్రం దిశ తూర్పు నుండి పడమర వైపు స్థిరంగా ఉంది. ఇచ్చిన ప్రశ్న ప్రకారం ఆవేశిత కణం స్థిరవేగంతో సరళరేఖా మార్గంలో ప్రయాణిస్తోంది. ఆవేశిత కణంపై అయస్కాంత క్షేత్రం వల్ల కలిగే బలం శూన్యం కావడం వల్ల మాత్రమే ఇది సాధ్యం. చలించే ఆవేశంపై క్షేత్రంలో కలిగే బలం F = qvB sin θ. ఇక్కడ 8 అనునది V మరియు B ల మధ్య కోణం. sin θ = = 0 అయితే F = 0 (v ≠ 0, q ≠ 0, B ≠ 0) అవుతుంది. వేగం మరియు అయస్కాంత క్షేత్రం మధ్యకోణం 0° (లేదా) 180° లను సూచిస్తుంది. అందువలన ఆవేశిత కణం క్షేత్రదిశకు సమాంతరంగా (లేదా వ్యతిరేకంగా చలిస్తుంది.

b) బిందువు నుంచి బిందువుకు దిశ, పరమాణం రెండూ మారుతున్న బలమైన అసమరీతి అయస్కాంత క్షేత్ర పరిసరాల్లోకి ఒక ఆవేశిత కణం ప్రవేశించి, ఒక సంక్లిష్టమయిన ప్రక్షేపక మార్గం అనుసరించి వెలుపలికి వచ్చింది. ఇది పరిసరాలతో అభిఘాతం చెందకుండా ఉంటే, దాని తొలి వడి తుది వడికి సమానంగా ఉంటుందా?
సాధన:
అవును. ఆవేశిత కణంపై పని చేసే బలం కేవలం వేగదిశను మారుస్తుంది కాని వేగ పరిమాణంను మార్చదు. కనుక తుది వేగం, తొలివేగం సమానం.

c) పడమర నుంచి తూర్పుకు ప్రయాణించే ఒక ఎలక్ట్రాన్, ఉత్తరం నుంచి దక్షిణం దిశగా ఏకరీతి స్థిర విద్యుత్ క్షేత్రం ఏర్పాటు చేసిన గదిలోకి ప్రవేశించింది. ఎలక్ట్రాన్ సరళరేఖా మార్గం నుంచి అపవర్తనం చెందకుండా ఉండటానికి ఏ దిశలో ఏకరీతి అయస్కాంత క్షేత్రం ఏర్పాటు చేయాలి?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 66
ఉత్తరం వైపు ధనావేశం, దక్షిణం వైపు ఋణావేశం ఉండుటవలన విద్యుత్ క్షేత్ర దిశ ఉత్తరం నుండి దక్షిణం వైపు ఉంటుంది. అందువలన ఎలక్ట్రాన్లు ధనపలక వైపు ఆకర్షించబడును. ఎలక్ట్రాన్ మార్గంపై అయస్కాంత బలం లేకపోతే దక్షిణం దిశవైపు ఉండును. F = -e(V × B), వేగదిశ పడమర నుండి తూర్పు వైపు ఉంటుంది. బలదిశ దక్షిణం వైపు, క్షేత్ర దిశ కాగితం తలానికి లంబంగా లోనికి ఉంటుంది.

ప్రశ్న 19.
వేడి చేసిన కేథోడ్ నుంచి ఉద్గారమైన ఎలక్ట్రాన్ 2.0 KV పొటెన్షియల్ తేడాగల విద్యుత్ క్షేత్రంలో ప్రయాణించినప్పుడు త్వరణం చెంది, 0.15 T పరిమాణం గల ఏకరీతి అయస్కాంత క్షేత్రంలోకి ప్రవేశించింది. క్షేత్రం (a) దాని తొలివేగానికి లంబంగా ఉన్నప్పుడు, (b) తొలి వేగదిశకు 30° కోణం చేస్తున్నప్పుడు, ఎలక్ట్రాన్ ప్రక్షేపక మార్గాన్ని కనుక్కోండి.
సాధన:
పొటెన్షియల్ తేడా (V) = 2KV = 2000 V
ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం (e) = 1.6 × 10-19 C
ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి (m) = 9.1 × 10-31 kg
పొటెన్షియల్ తేడా వలన ఎలక్ట్రాన్ త్వరణం చెంది దానిలో గతిజశక్తిగా మారుతుంది. V అనునది ఎలక్ట్రాన్ వేగం.
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 67
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 68

ప్రశ్న 20.
హెల్మ్ హోల్డ్ తీగచుట్టలను ఉపయోగించి (అభ్యాసం 16లో వర్ణించడమైంది) ఒక చిన్న ప్రాంతంలో ఏర్పాటు చేసిన అయస్కాంత క్షేత్రం ఏకరీతిగా ఉంటుంది. దాని పరిమాణం 0.75 T. ఇదే ప్రాంతంలో తీగచుట్టల ఉమ్మడి అక్షానికి లంబంగా ఏకరీతి స్థిర విద్యుత్ క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. 15 kV తో త్వరణం చెందిన ఆవేశిత కణాల సన్నని కిరణపుంజం, తీగచుట్టల అక్షం, స్థిర విద్యుత్ క్షేత్రం రెండింటికి లంబంగా ఈ ప్రాంతంలోకి ప్రవేశించింది. 9.0 × 10-5 V m-1స్థిర విద్యుత్ క్షేత్రం ఉన్నప్పుడు ఈ కిరణపుంజం అపవర్తనం చెందకుండా ఉంటే, కిరణపుంజంలో ఏమి ఉంటాయో ఊహించండి. ఇది ఏకైక (unique) సమాధానం ఎందుకు కాదు?
సాధన:
B = 0.75 T, పొటెన్షియల్ తేడా (V) = 15 KV = 15 × 10³ V
విద్యుత్ క్షేత్రం (E) = 9 × 105 Vm
స్థితిజశక్తి, గతిజశక్తిగా మారును
V = \(\frac{1}{2}\) mv² ……… (1)
విద్యుత్ క్షేత్రం వల్ల కలిగే బలం, అయస్కాంత క్షేత్రం వల్ల కలిగే బలానికి సమానం.
qE= q(V × B)
qE = qVB
V = \(\frac{E}{B}\) ………….. (2)
సమీకరణం (2)ను సమీకరణం (1)లో ప్రతిక్షేపించగా
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 69

ప్రశ్న 21.
0.45m పొడవు, 60 g ద్రవ్యరాశి ఉన్న తిన్నని క్షితిజ సమాంతర వాహక కడ్డీని దాని చివరలకు కట్టిన రెండు నిలువు తీగల ద్వారా వ్రేలాడదీశారు. ఈ తీగల ద్వారా 5.0 A విద్యుత్ ప్రవాహం కడ్డీలో ఏర్పాటు చేశారు.
a) తీగలలో తన్యత శూన్యం కావాలంటే వాహకానికి లంబంగా ఎంత అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పాటు చేయాలి ?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 70
కడ్డీ పొడవు l = 0.45 m
కడ్డీ ద్రవ్యరాశి (m) = 60 gm = 60 × 10-3 kg
విద్యుత్ ప్రవాహం (I) = 5A
అయస్కాంత క్షేత్రం B పని చేసినప్పుడు, అయస్కాంత బలం తీగ భారానికి సమానం మరియు తీగలో తన్యత శూన్యం.
అయస్కాంత బలం = కడ్డీ భారం
I(l × B) = mg (B మరియు l మధ్యకోణం 90°)
IlB sin 90° = mg
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 71

b) ఇంతకు ముందు లాగానే అదే అయస్కాంత క్షేత్రాన్ని ఉంచి, విద్యుత్ను వ్యతిరేక దిశలో ప్రవహింపచేస్తే తీగలలోని మొత్తం తన్యత ఎంత ? తీగ ద్రవ్యరాశిని లెక్కలోకి తీసుకోనక్కర్లేదు) g = 9.8 m s-2.
సాధన:
అయస్కాంతక్షేత్ర దిశ మారితే అయస్కాంత బలం, భారం రెండూ క్రిందకు పని చేస్తాయి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 72
T = B I l + mg = (0.26 × 5 × 0.45) + (60 + 10-3 × 9.8)
T = 1.176 N

ప్రశ్న 22.
ఆటోమోబైల్ను ఆరంభించే(starting) మోటారును, బ్యాటరీని కలిపే తీగలలో ప్రవహించే విద్యుత్ 300 A (స్వల్ప కాలాలకు). ఈ తీగల పొడవు 70 cm ఉండి వాటిని 1.5 cm ఎడంగా ఉంచితే, ఏకాంక పొడవుకు వాటి మధ్య పనిచేసే బలం ఎంత? ఇది ఆకర్షణ బలమా లేదా వికర్షణ బలమా?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 74
I1 = I2 = 300 A
దూరం (r) = 1.5 cm = 1.5 × 10-2 m
పొడవు (l) = 70 cm
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 73
విద్యుత్ ప్రవాహాలు వ్యతిరేక దిశలలో ఉన్నాయి కనుక వాటిమధ్య వికర్షణ బలం పని చేస్తుంది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం

ప్రశ్న 23.
10.0 cm వ్యాసార్థం స్తూపాకార ప్రాంతంలో, దాని అక్షానికి సమాంతరంగా, తూర్పు నుంచి పడమర దిశలో, 1.5 T ఏకరీతి అయస్కాంత క్షేత్రం ఉంది. 7.0 A విద్యుత్ ప్రవహిస్తున్న తీగ, ఉత్తరం నుంచి దక్షిణ దిశలో ఈ’ ప్రాంతం ద్వారా వెళుతుంది.
a) తీగ అక్షాన్ని ఖండించినప్పుడు
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 75
B = 1.57
వ్యాసార్థం = 10 cm = 0.1 m
విద్యుత్ ప్రవాహం (I) = 7A
బలం (F) = I(l × B = IIB sin 90°
∴ తీగపై బలం (F) = I × 2r × B = 7 × 2 × 0.1 × 1.5 = 21 N
ఫ్లెమింగ్ ఎడమ చేతి నియమం ప్రకారం బలం, కాగితం తలానికి లంబంగా లోనికి పని చేస్తుంది.
F = 2.1 N

b) తీగ ఉత్తర – దక్షిణం నుంచి ఈశాన్యం – వాయువ్యం దిశకు తిరిగితే,
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 76
క్షితిజ సమాంతర అంశము ఎలాంటి బలం కలిగించదు.
క్షితిజ లంబ అంశము (Y) = స్థూపం వ్యాసం
బలం (F) = I l B sin 90°
= 7 × 0.1 × 1.5 × 2 × 1
= 2.1 N
ఫ్లెమింగ్ ఎడమ చేతి నియమం ప్రకారం బలం, కాగితం తలానికి లంబంగా లోనికి పని చేస్తుంది.

c) ఉత్తర-దక్షిణ దిశలో ఉన్న తీగను అక్షం నుంచి 6.0 cm దూరం క్రిందకు దించినప్పుడు తీగపై పనిచేసే బలం దిశ, పరిమాణం ఏమిటి ?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 77
తీగ 6 cm దూరం జరిగితే, తీగ యొక్క కొత్తస్థానం CD
OE = 6 cm
OD = 10 cm
DE = EC = X
ODE నుండి D² = OE² + DE²
100 = 36 + DE²
DE²= 64 ⇒ DE = 8 cm
l¹ = CD = 2DE = 16 cm = 0.16 m
బలపరిమాణం (F¹) = I ( × B) = 7. × 0.16 × 1.5 × sin 90° = 1.68 N
బలదిశ కాగితపు తలానికి లంబంగా క్రిందకు పని చేస్తుంది.

ప్రశ్న 24.
ధన, z-అక్షం వెంబడి 3000 G ఏకరీతి అయస్కాంత క్షేత్రం ఏర్పడింది. 10 cm, 5 cm భుజాలుగా గల ఒక దీర్ఘచతురస్రాకార లూప్ ద్వారా 12 A విద్యుత్ ప్రవహిస్తుంది. పటంలో చూపిన వివిధ సందర్భాల్లో లూప్పై పనిచేసే టార్క్ ఎంత? ప్రతి సందర్భంలో పనిచేసే బలం ఎంత? ఏ సందర్భానికి స్థిరమైన సమతాస్థితి ఉంటుంది?
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 78
సాధన:
z–అక్షం దిశలో ఏకరీతి అయస్కాంత క్షేత్రం (B) = 3000 G = 3000 × 10-4 = 0.3 T
దీర్ఘచతురస్ర చుట్ట వైశాల్యం (A) = 10 × 5 = 50 cm² = 50 × 10-4
విద్యుత్ ప్రవాహం (I) = 12 A
టార్ (τ) = I(A × B)

a) B=0.3 KT (Z – అక్షం దిశలో)
A = 50 × 10-4 m² (x అక్షం దిశలో)
మరియు I = 12 A
τ = 12(50 × 10-4 i × 0.3 K)
τ = -1.80 × 10-2 J N-m
టార్క్ ఋణ Y-అక్షం దిశలో పని చేస్తుంది.

b) B = 0.3 KT, A = 50 × 10-4 i m² మరియు I = 12 A
టార్క్ (τ) = I(A × B) = 12 × 50 × 10 i × 0.3
= -1.80 × 10² JNm
టార్క్ ఋణ Y-అక్షం దిశలో పని చేస్తుంది.

c) B = 0.3 KT, A = 50 × 10-4 (-J)m² మరియు I = = 12 A
టార్క్ (τ) = 12(-50 × 10-4 J × 0.3 K
=-1.80 × 10² i N-m
టార్క్ ఋణ X-అక్షం దిశలో పని చేస్తుంది.

d) B = 0.3 KT, A = 50 × 10-4 m² మరియు I = 12 A
టార్క్ (τ) = 12 × 50 × 10-4 × 0.3 = 1.80 × 10-2 N-m
ఋణ X-అక్షం దిశలో (900 + 300) పని చేస్తుంది. ధన X-అక్షం దిశలో 3600-1200 = 2400 టార్క్ పని చేస్తుంది.

e) B = 0.3 KT, A = 50 × 10-4 km-4 మరియు I = 12 A
టార్క్ (τ) = 12(50 × 10-4 K × 0.3 K) = 0

f) B = 0.3 KT, A = -50 × 10-4 km-4 మరియు I = 12 A
టార్క్ (τ) = 12(–50 × 10-4 K × 0.3 K) = 0

AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం

ప్రశ్న 25.
10 cm వ్యాసార్థం, 20 చుట్లు ఉన్న వృత్తాకార తీగచుట్టను, 0.10 T ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో, తీగచుట్ట తలానికి లంబంగా ఉండేట్లు ఉంచారు. తీగచుట్ట ద్వారా ప్రవహించే విద్యుత్ 5.0 A అయితే,
(a) తీగచుట్టపై పనిచేసే మొత్తం టార్క్,
(b) తీగచుట్టపై పనిచేసే బలం,
(c) అయస్కాంత క్షేత్రం వల్ల తీగచుట్టలోని ప్రతి ఎలక్ట్రాన్పై పనిచేసే సగటు బలాలను లెక్కించండి.
(10-5 m² మధ్యచ్చేద వైశాల్యం ఉన్న రాగి తీగతో తీగచుట్టను తయారుచేశారు. రాగిలోని స్వేచ్ఛా ఎలక్ట్రాన్ సాంద్రత సుమారుగా 1029 m-3 ఉంటుందని ఇచ్చారు.)
సాధన:
చుట్ల సంఖ్య (n) = 20, వృత్తాకార తీగ చుట్ట వ్యాసార్థం (r) = 10 cm = 0.1 m,
అయస్కాంత ప్రేరణ (B) = 0.1 T,
వైశాల్య సదిశ మరియు అయస్కాంత ప్రేరణ మధ్యకోణం (0) = 0°
విద్యుత్ ప్రవాహం (1) = 5A

a) తీగ చుట్టపై టార్క్ (T) = nIAB sin θ = 20 × 5 × π (0.1)² × sin θ = 0.

b) తీగచుట్ట ఎదురెదురు తలాలపై పనిచేయు బలం సమానం మరియు వ్యతిరేకం.
కావున తీగచుట్టపై మొత్తం బలం శూన్యం.
∵ (F1 = -F2 మరియు F3 – F4)

AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 80
c) ఎలక్ట్రాన్ల సాంద్రత (N) = 1029/m³
వైశాల్యం (A) = 10-5
బలపరిమాణం (F) = e(vd × B)
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 79

ప్రశ్న 26.
60 cm పొడవు, 7.0 cm వ్యాసార్థం ఉన్న సోలినాయిడ్లో 3 పొరలలో చుట్లు చుట్టి ఉన్నాయి. ప్రతి పొరకు 300 చుట్లు ఉన్నాయి. సోలినాయిడ్ లోపల దాని అక్షానికి లంబంగా (దాని కేంద్రానికి దగ్గరగా 2.0 cm పొడవు, 2.5 g ద్రవ్యరాశి ఉన్న ఒక తీగ ఉంది. తీగ, మరియు సోలినాయిడ్ అక్షం రెండూ క్షితిజ సమాంతర తలంలో ఉన్నాయి. ఈ తీగను, సోలినాయిడ్ అక్షానికి సమాంతరంగా ఉన్న రెండు చాలక తంత్రుల (leads) ద్వారా 6.0 A విద్యుత్ను సరఫరా చేసే బ్యాటరీకి కలిపారు. సోలినాయిడ్ చుట్లలోని ఏ విద్యుత్ ప్రవాహ విలువ (ప్రసరణ దిశ తగు విధంగా ఉంటూ) తీగ భారాన్ని మోయగలదు? g = 9.8 m s-2.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 81
సాలినాయిడ్ పొడవు l = 60 cm
వ్యాసార్ధము = 4.cm
పొరల సంఖ్య = 3
ప్రతిపొరలో చుట్ల సంఖ్య = 300
తీగ యొక్క పొడవు lw = 2 cm
ద్రవ్యరాశి m = 2.5 gm
విద్యుత్ ప్రవాహము lw = 6A
సోలీనాయిడ్లో విద్యుత్ ప్రవాహం I అయితే సోలినాయిడ్లో అయస్కాంత ప్రేరణ (B) = µ0ni
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 82

ప్రశ్న 27.
ఒక గాల్వనా మీటరు తీగచుట్ట నిరోధం 12Ω. ఇది 3 mA విద్యుత్ ప్రవాహానికి పూర్తి స్కేలు అపవర్తనం చూపిస్తుంది. దీనిని 0 నుంచి 18 V ల వ్యాప్తి ఉన్న వోల్టు మీటరుగా మీరు ఏ విధంగా మారుస్తారు?
సాధన:
గాల్వానా మీటరు నిరోధం (G) = 12Ω,
గాల్వానా మీటరులో విద్యుత్ ప్రవాహం (Ig) = 3mA = 3 × 10-3 A,
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 83

ప్రశ్న 28.
గాల్వనా మీటరు తీగచుట్ట నిరోధం 15 Ω. ఇది 4 mA విద్యుత్ ప్రవాహానికి పూర్తి స్కేలు అపవర్తనం చూపిస్తుంది. దీనిని 0 నుంచి 6 Aల వ్యాప్తి ఉన్న అమ్మీటరుగా మీరు ఏ విధంగా మారుస్తారు?
సాధన:
గాల్వానా మీటరు నిరోధము (G) = 15Ω,
గాల్వానా మీటరులో విద్యుత్ ప్రవాహము (Ig) =4 × 10-3A, I = 6A
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 84
S = 0.01 0 షంట్ను గాల్వానా మీటరుకు సమాంతరంగా కలపాలి.

సాధించిన సమస్యలు Textual Examples

ప్రశ్న 1.
1.5 m పొడవు, 200 g ద్రవ్యరాశి ఉన్న తిన్నని తీగ గుండా 2 A విద్యుత్ ప్రవహిస్తుంది. పటంలో చూపినట్లు ఏకరీతి అయస్కాంత క్షేత్రం B వల్ల ఈ తీగను గాలిలో కిందకి పడకుండా ఉండేటట్లు చేశారు. అయస్కాంత క్షేత్ర పరిమాణం ఎంత?
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 85
సాధన:
II B పరిమాణం ఉన్న F అనే ఊర్థ్వబలం పని చేస్తుందని (=Il × B) మనకు తెలుస్తుంది. గాలిలో కిందకి పడకుండా ఉండేటట్లు చేయడానికి ఈ బలం గురుత్వ బలంతో సంతులనం కావాలి.
mg = IIB
B = \(\frac{\mathrm{mg}}{\mathrm{I} l}=\frac{0.2 \times 9.8}{2 \times \mathrm{l} .5}\) = 0.65 T
ఏకాంక పొడవుకు తీగ ద్రవ్యరాశి m/l ని చెప్పుకుంటే సరిపోయేది. భూఅయస్కాంత క్షేత్రం దాదాపు 4 × 10° T కాబట్టి, దానిని మనం ఉపేక్షించడమైంది.

ప్రశ్న 2.
అయస్కాంత క్షేత్ర ధన y-అక్షానికి సమాంతరంగా ఉండి, X- అక్షం దిశలో ఆవేశిత కణం చలిస్తున్నట్లయితే (పటం), (a) ఎలక్ట్రాన్ (రుణావేశ కణం), (b) ప్రోటాన్ (ధనావేశం)లకు లోరెంజ్ బలం ఏ దిశలో ఉంటుంది?
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 86
సాధన:
కణం – అక్షం దిశలో వేగంతో చలిస్తుంటే B y అక్షం దిశలో ఉండటం వల్ల vx Bz-అక్షం దిశలో ఉంటుంది. (మర సూత్రం లేదా కుడిచేతి బొటనవేలు సూత్రం). కాబట్టి (a) ఎలక్ట్రాన్కు -z అక్షం దిశలో ఉంటుంది. (b) ధనావేశానికి (ప్రోటాన్) బలం +z అక్షం దిశలో ఉంటుంది.

ప్రశ్న 3.
6 × 10-4 T అయస్కాంత క్షేత్రానికి లంబంగా 3 × 107 m/s వేగంతో చలిస్తున్న ఎలక్ట్రాన్ (ద్రవ్యరాశి 9 × 10-31 kg, ఆవేశం 1.6 × 10-19 C) పథం వ్యాసార్థం ఎంత? దాని పౌనఃపున్యం ఎంత ? శక్తిని keV లలో లెక్కించండి. (1 eV = 1.6 × 10-19 J).
సాధన:
సమీకరంణం r = mυ/qB ను ఉపయోగిస్తే,
r = mυ/(qB) = 9 × 10-31 kg × 3 × 107 m s-1 / (1.6 × 10-19 C × 6 × 10-4T)
= 26 × 10-2 m = 26 cm
v = υ / (2 πr) = 2 × 106 s-1 = 2 × 106 Hz = 2MHz.
E = (½) mυ² = (½) 9 × 10-31 kg × 9 × 1014 m²/s² = 40.5 × 10-17 J
= 4 × 10-16 J = 2.5 keV.

AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం

ప్రశ్న 4.
ఒక సైక్లోట్రాన్ డోలక పౌనఃపున్యం 10 MHz. ప్రోటాన్లను త్వరణం గావించడానికి ప్రచాలన (operating) అయస్కాంత క్షేత్రం ఎంత ఉండాలి? డీల వ్యాసార్థం 60 cm ఉంటే త్వరణకారిలో జనించే ప్రోటాను పుంజం గతిజశక్తి (MeV లలో) ఎంత? (e = 1.60 × 10-19 C, mp = 1.67 × 10-27 kg, 1 MeV = 1.6 × 10-13 J),
సాధన:
డోలక పౌనఃపున్యం, ప్రోటాన్ యొక్క సైక్లోట్రాన్ పౌనఃపున్యానికి సమానంగా ఉండాలి.
సమీకరణాలను ఉపయోగిస్తే r = mυ/qb మరియు o = 2πυ = \(\frac{qB}{m}\)
B = 2r m υ/q = 6.3 × 1.67 × 10-27 × 107 / (1.6 × 10-19) = 0.66 T
ప్రోటాన్ల తుది వేగం
υ = r × 2π v = 0.6 m × 6.3 × 107 = 3.78 × 107 m/s.
E = ½ mv² = 1.67 × 10-27 × 14.3 × 1014 / (2 × 1.6 × 10-13) = 7 MeV.

ప్రశ్న 5.
అధిక విద్యుత్ ప్రవాహం I = 10 A ప్రవహిస్తున్న ∆1 = ∆ x \(\hat{i}\) అనే మూలకం మూలబిందువు వద్ద కలదు. (పటం) 0.5 m దూరంలో y-అక్షంపై అయస్కాంత క్షేత్రం ఎంత? ∆x = 1 cm.
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 87
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 88
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 89

ప్రశ్న 6.
A విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తున్న తిన్నని తీగను 2.0 cm వ్యాసార్థం ఉన్న అర్థ వృత్త చాపంగా పటంలో చూపినట్లు వంచారు. చాపం కేంద్రం వద్ద అయస్కాంత క్షేత్రం B ని పరిగణిద్దాం. (a) తిన్నని ఖండాల (segments) వల్ల అయస్కాంత క్షేత్రం ఎంత? (b) Bకి అర్థ వృత్తం నుంచి కలిగే అంశదానం, వృత్తాకార ఉచ్చు నుంచి కలిగే అంశదానంతో ఏ విధంగా నేరుగా ఉంటుంది, ఏ విధంగా పోలిక కలిగి ఉంటుంది? (c) పటంలో చూపినట్లు తీగను అంతే వ్యాసార్థం ఉన్న అర్ధవృత్తంగా వ్యతిరేక దిశలో వంచితే మీ సమాధానం మారుతుందా?
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 90
సాధన:
a) తిన్నని ఖండాల ప్రతి మూలకానికి dl, rలు సమాంతరంగా ఉంటాయి. కాబట్టి, dl × r=0. తిన్నని ఖండాలు |B| కి అంశదానాన్ని ఇవ్వవు.

b) అర్థవృత్తాకార చాపం అన్ని ఖండాలకు dl × rలు అన్నీ ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి (పుట తలానికి లోపలికి అటువంటి అన్ని అంశదానాల పరిమాణాలు కలుస్తాయి. కుడిచేతి నిబంధన అర్థవృత్త చాపానికి B దిశని ఇస్తుంది. పరిమాణం వృత్తాకార ఉచ్చు వల్ల కలిగే పరిమాణంలో సగం ఉంటుంది. అందువల్ల B విలువ 1.9 × 10-4 T పుట తలానికి లంబంగా లోపలివైపుకు ఉంటుంది.

c), b) లో వచ్చిన B పరిమాణానికి సమానంగా, దిశలో వ్యతిరేకంగా ఉంటుంది.

ప్రశ్న 7.
10cm వ్యాసార్థం కలిగి, 1A విద్యుత్ ప్రవహిస్తున్న బిగుతుగా చుట్టిన 100 చుట్లు ఉన్న తీగ చుట్టను పరిగణించండి. తీగచుట్ట కేంద్రం వద్ద అయస్కాంత క్షేత్ర పరిమాణం ఎంత?
సాధన:
తీగచుట్టను బిగుతుగా చుట్టడం వల్ల ప్రతి వృత్తాకార మూలకానికి ఒకే వ్యాసార్థం R = 10 cm = 0.1 m ఉన్నట్లు
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 91

ప్రశ్న 8.
విద్యుత్ ప్రవహిస్తున్న పొడవైన తీగ వల్ల అయస్కాంత క్షేత్రం : విద్యుత్ ప్రవహిస్తున్న తీగచుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని ఆయిర్ స్టెడ్ ప్రయోగాలు తెలిపాయి. I విద్యుత్ ప్రవహిస్తున్న పొడవైన తిన్నని తీగ నుంచి కొంత దూరంలో అయస్కాంతక్షేత్రాన్ని నిర్ధారిద్దాం.
సాధన:
కుడిచేతి నిబంధన ద్వారా క్షేత్రం దిశను ఇస్తారు. విద్యుత్ ప్రవహిస్తున్న తీగ మూలకం dlను పటంలో చూపడమైంది.

ఎక్కడైతే క్షేత్రాన్ని నిర్ధారించాలనుకొంటున్నామో ఆ బిందువు P నుంచి తీగకు ఉన్న లంబ దూరం ‘s’. dl నుంచి P కి గల స్థాన సదిశ r.

బయోట్-సవర్ట్ నియమం, dl వల్ల అయస్కాంత క్షేత్రం పరిమాణం dBని ఇస్తుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 92

ప్రశ్న 9.
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 93
సాధన:
a) అపసవ్య దిశలో పథం చుట్టూ వెళ్ళినప్పుడు, I, ను ధనాత్మకంగా తీసుకొంటే, I, రుణాత్మకం అవుతుంది. 12, 14 విద్యుత్ ప్రవాహాలు పథంతో అప్పడం అవలేదు కాబట్టి వాటిని లెక్కలోకి తీసుకోనక్కరలేదు…

సూచన :
I2, I4 విద్యుత్ ప్రవాహాలు వాటి చుట్టూ అయస్కాంత క్షేత్రాలను ఏర్పరుస్తాయి. వీటివల్ల కలిగే B పథంపై ఏ మూలకం పైన అయినా శూన్యం కాదు. అయితే వాటి వల్ల కలిగే B.dl మొత్తం శూన్యమవుతుంది.

b) మొత్తం పథానికి B. dl గణనను రెండు వేరు వేరు గణనలుగా విడగొట్టవచ్చు. ఒకటి I1 చుట్టూ అపసవ్య దిశలో ప్రయాణించినప్పుడు అన్ని అంశదానాలను తీసుకొంటూ, ఇంకొకటి I3 చుట్టూ సవ్య దిశలో ప్రయాణించినప్పుడు అన్ని అంశదానాలను తీసుకొంటూ. అందువల్ల
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 95

ప్రశ్న 10.
నిలకడ విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తున్న వ్యాసార్థం ఉన్న పొడవైన తిన్నని తీగ వృత్తాకార మధ్యచ్చేదాన్ని పటం చూపుతుంది. మధ్యచ్ఛేదం అంతా విద్యుత్ ప్రవాహం I ఏకరీతిగా వితరణ చేయబడింది. a (చుక్కల గీతలతో చూపిన బాహ్య వృత్తం) ఉన్న ప్రాంతంలో అయస్కాంత క్షేత్రాన్ని లెక్కించండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 96
సాధన:
a) r > a సందర్భాన్ని పరిగణిద్దాం. 2 అని రాసిన ఆంపిరియన్ లూప్ వృత్తాకార మధ్యచ్ఛేదంతో ఉన్న ఏక కేంద్రవృత్తం.
ఈ లూప్కు L = 2 πr.
Ie = ఉచ్చుతో ఆవృతం అయిన విద్యుత్ ప్రవాహం = I
ఈ ఫలితం, పొడవైన తిన్నని తీగకు ఉపయోగపడేది B(2πr) = µ0I
B = \(\frac{\mu_0 \mathrm{I}}{2 \pi \mathrm{r}}\) …………… (1)

b) r < a సందర్భాన్ని పరిగణించండి. I అని రాసిన ఆంపిరియన్ లూప్ ఒక వృత్తం. ఈ లూప్కు వృత్త వ్యాసార్థాన్ని rగా తీసుకొన్నప్పుడు, L = 2 πr.
ఇప్పుడు ఆవృతం అయిన విద్యుత్ ప్రవాహం Ie, I కి సమానంగా ఉండక దాని కంటే తక్కువగా ఉంటుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 97

(r< a కాబట్టి), విద్యుత్ ప్రవాహం ఏకరీతిగా వితరణమవడం వల్ల ఆవృతం అయిన విద్యుత్ ప్రవాహం,
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 98
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 99

తీగ కేంద్రం (అక్షం) నుంచి దూరానికి B పరిమాణానికి గీసిన గ్రాఫ్ను పటం చూపిస్తుంది. వృత్తాకార ‘ లూప్ (1 లేదా 2) లకు స్పర్శరేఖీయంగా క్షేత్రం దిశ ఉంటుంది. ఇంతకుముందు సెక్షన్లో వివరించిన కుడిచేతి నిబంధన ఈ దిశను ఇస్తుంది.

ఈ ఉదాహరణ కావలసిన సౌష్ఠవాన్ని కలిగి ఉంది. కాబట్టి ఆంపియర్ నియమాన్ని అనువర్తించవచ్చు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం

ప్రశ్న 11.
500 చుట్లు, 0.5 m పొడవు ఉన్న సోలినాయిడ్ వ్యాసార్థం 1 cm. దీని ద్వారా ప్రవహిస్తున్న విద్యుత్ ప్రవాహం 5A. సోలినాయిడ్ అంతర్భాగంలో అయస్కాంత క్షేత్రం పరిమాణం ఎంత?
సాధన:
ఏకాంక పొడవుకు చుట్ల సంఖ్య n = \(\frac{500}{0.5}\) = 1000 చుట్లు/మీ.
పొడవు l = 0.5 మీ, వ్యాసార్థం = 0.01 మీ. అందువల్ల l/a = 50 అంటే l >> a
అందువల్ల పొడవైన సోలినాయిడ్ ఫార్ములా, B = µ0nI సమీకరణంను ఉపయోగించవచ్చు.
B = µ0nI = 4π × 10-7 × 10³ × 5 = 6.28 × 10-3 T.

ప్రశ్న 12.
ఒక నిర్ణీత ప్రదేశం వద్ద భూఅయస్కాంత క్షేత్ర క్షితిజ సమాంతర అంశం 3.0 × 10-5 T. దాని దిశ భౌగోళిక దక్షిణం నుంచి భౌగోళిక ఉత్తరం వైపుకు ఉంది. బాగా పొడవైన తిన్నని వాహకం ద్వారా 1A స్థిరవిద్యుత్ ప్రవహిస్తుంది. దాన్ని క్షితిజ సమాంతర బల్లపై ఉంచినప్పుడు విద్యుత్ ప్రవాహ దిశ (b) తూర్పు నుంచి పడమరకు, (a) దక్షిణం నుంచి ఉత్తరానికి ఉన్నప్పుడు దాని ఏకాంక పొడవుపై పనిచేసే బలాన్ని కనుక్కోండి.
సాధన:
F = Il × B
F = IlB sin θ
ఏకాంక పొడవుకు బలం f = F/l = I B sin θ

a) విద్యుత్ తూర్పు నుంచి పడమరకు ప్రవహించినప్పుడు, θ = 90° కాబట్టి,
f = I B
= 1 × 3 × 10 ° = 3 × 10-5 Nm-1

ఆంపియర్ నిర్వచనంలో తెలిపిన 2 × 10-7 Nm-1 విలువ కంటే ఈ విలువ పెద్దది. అందువల్ల ఆంపియర్ను ప్రామాణీకరించేటప్పుడు భూఅయస్కాంత క్షేత్రం, ఇతర అవాంఛిత క్షేత్రాల ప్రభావాలను తొలగించడం చాలా ముఖ్యం. బల దిశ అధోముఖంగా ఉంటుంది. సదిశల వజ్రలబ్ధం దిశా ధర్మం నుంచి ఈ దిశను మనం పొందవచ్చు.

b) విద్యుత్ దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రవహిస్తున్నప్పుడు,
θ = 0°
f = 0
అంటే వాహకంపై బలం పనిచేయదు.

ప్రశ్న 13.
10 cm వ్యాసార్థం కలిగి, 100 చుట్లు దగ్గరగా చుట్టిన వృత్తాకార తీగచుట్టలో 3.2. A విద్యుత్ ప్రవహిస్తుంది. (a) తీగచుట్ట కేంద్రం వద్ద క్షేత్రం ఎంత? (b) ఈ తీగచుట్ట అయస్కాంత భ్రామకం ఎంత? తీగచుట్టను నిలువు తలంలో ఉంచారు. దాని వ్యాసంతో ఏకీభవించే క్షితిజ సమాంతర అక్షం పరంగా స్వేచ్ఛగా భ్రమణం చేస్తుంది. క్షితిజ సమాంతర దిశలో 2T ఏకరీతి అయస్కాంత క్షేత్రం, ప్రారంభంలో తీగచుట్ట అక్షం క్షేత్ర దిశలో ఉండే విధంగా ఉంది. అయస్కాంత క్షేత్ర ప్రభావంతో తీగచుట్ట 90″ కోణంతో భ్రమణం చేస్తుంది. (c) తొలి, తుది స్థానాల్లో తీగచుట్టపై పనిచేసే టార్క్ పరిమాణం ఎంత? (d) తీగచుట్ట 90° భ్రమణం చెందినప్పుడు అది పొందే కోణీయ వడి ఎంత? తీగచుట్ట జడత్వ భ్రామకం 0.1 kg m².
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 100
కుడిచేతి బొటనవేలు నిబంధన దిశను ఇస్తుంది.

b) సమీకరణం అయస్కాంత భ్రామకాన్నిస్తుంది.
m = N I A = N I π r² = 100 × 3.2 × 3.14 × 10-2 = 10 A m²
మళ్ళీ, కుడిచేతి బొటనవేలు నిబంధన దిశను ఇస్తుంది.

c) τ = |m × B| (సమీకరణం నుంచి)
= mB sin θ

ప్రారంభంలో, θ = 0. అందువల్ల, తొలి టార్క్ 7. = 0 తుదకు, θ = \(\frac{\pi}{2}\) (లేదా 90°).
అందువల్ల, తుది టార్క్ τf = m B = 10 × 2 = 20 N m.

d) న్యూటన్ రెండవ నియమం నుంచి,
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 101

ప్రశ్న 14.
a) ఒక నునుపైన క్షితిజ సమాంతర తలంపై విద్యుత్ ప్రవహిస్తున్న వృత్తాకార లూప్ ఉంది. లూప్ తన చుట్టూ తాను తిరిగే విధంగా ఏకరీతి అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పాటు చేయవచ్చా? (నిలువు అక్షం పరంగా తిరగడం).
సాధన:
లేదు. అలా జరగాలంటే τ నిలువు దిశలో ఉండాలి. కాని τ = IA × B క్షితిజ సమాంతర లూప్ యొక్క A నిలువు దిశలో ఉంది. కాబట్టి ఏ B కైనా τ లూప్ తలంలో ఉంటుంది.

b) ఏకరీతి బాహ్య అయస్కాంత క్షేత్రంలో విద్యుత్ ప్రవహిస్తున్న వృత్తాకార లూప్ కలదు. ఈ లూప్ స్వేచ్ఛగా తిరగ గలిగితే దాని స్థిరమైన సమతాస్థితి యొక్క దిగ్విన్యాసం ఏది? ఈ దిగ్విన్యాసంలో మొత్తం క్షేత్ర (బాహ్య క్షేత్రం + లూప్ వల్ల ఏర్పడిన క్షేత్రం) అభివాహం గరిష్ఠం అని రూపండి.
సాధన:
లూప్ వైశాల్య సదిశ A బాహ్య అయస్కాంత క్షేత్ర దిశలో ఉంటే అది ఒక స్థిర సమతాస్థితి దిగ్విన్యాసం అవుతుంది. ఈ దిగ్విన్యాసంలో లూప్ ఉత్పత్తి చేసిన అయస్కాంత క్షేత్రం, బాహ్య అయస్కాంత క్షేత్రం ఒకే దిశలో ఉంటూ, లూప్ తలానికి ఈ రెండూ లంబంగా ఉండటం వల్ల మొత్తం క్షేత్ర అభివాహం గరిష్టంగా ఉండేట్లు చేస్తుంది.

c) బాహ్య అయస్కాంత క్షేత్రంలో విద్యుత్ ప్రవహిస్తున్న క్రమరహిత లూప్ను ఉంచారు. తీగ నమ్యంగా (flexible) ఉంటే, ఎందుకు అది వృత్తాకారంగా మారుతుంది? లూప్ లోని విద్యుత్ ప్రవాహం, అయస్కాంత క్షేత్ర దిశలు ఏ విధంగా ఉంటాయి?
సాధన:
ఇచ్చిన చుట్టుకొలతకు, ఏ ఇతర ఆకారాల కంటే వృత్తం ఎక్కువ వైశాల్యాన్ని ఆవృతం చేస్తుంది. కాబట్టి, అభివాహం గరిష్ఠంగా ఉండేందుకు తలం క్షేత్రానికి లంబంగా ఉండేట్లు అది వృత్తాకారాన్ని పొందుతుంది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం

ప్రశ్న 15.
పటంలో చూపిన వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కొలవాలి. పటంలో చూపిన అమ్మీటర్ (a) నిరోధం RG = 60.00 Ω తో గాల్వనామీటరు అయినప్పుడు; (b) పైన (a) లో వర్ణించిన విధంగా ఉన్న గాల్వనామీటరును, (b) షంట్ నిరోధం ద్వారా అమ్మీటరుగా మార్చినప్పుడు; (c) శూన్య నిరోధం కలిగిన ఆదర్శ అమ్మీటరు అయినప్పుడు, విద్యుత్ ప్రవాహ విలువలు ఎంత?
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 102
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 103

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Economics Study Material 9th Lesson ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ Textbook Questions and Answers.

AP Inter 2nd Year Economics Study Material 9th Lesson ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థపై ఒక వ్యాసాన్ని వ్రాయండి.
జవాబు:
నైసర్గిక స్వరూపము: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 12°41′ మరియు 22° ల ఉత్తర అక్షాంశ రేఖలకు మరియు 77°, 80°40′ తూర్పు రేఖాంశాల మధ్య ఏర్పడి ఉత్తరాన మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, తెలంగాణ మరియు ఒడిషా, తూర్పున బంగాళాఖాతము, దక్షిణాన తమిళనాడు, పడమర కర్ణాటక రాష్ట్రాలను సరిహద్దులుగా కలిగి ఉంది. గోదావరి, కృష్ణా మరియు తుంగభద్ర వంటి ప్రధాన నదులు ఈ రాష్ట్రం గుండా ప్రవహిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సహజ మరియు మానవ వనరులను సమృద్ధిగా కలిగి, పోటీ తత్వానికి కావల్సిన సామాజిక ఆర్థిక పరిపుష్టులను కలిగివుంది. మొత్తం 1,60,20,400 హెక్టార్ల భౌగోళిక భూభాగాన్ని కల్గిన భారతదేశంలోని 8వ పెద్ద రాష్ట్రంగా నిల్చింది. గుజరాత్ తర్వాత దేశంలో 974 కి.మీ. తీరప్రాంతము కల్గిన 2వ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. మొత్తం భూభాగంలో 21.81 శాతము అంటే 34,93,475 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని కలిగివుంది. ఆంధ్రప్రదేశ్ ఒకవైపు ఎత్తైన పర్వత ప్రాంతాలు, మైదానాలు, మరొకవైపు తీరప్రాంతము మరియు పీఠభూములతో కూడిన బహువిధ భౌతిక లక్షణాలు కల్గి ఉంది.

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ – లక్షణాలు: భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ వైశాల్యము మరియు జనాభా దృష్ట్యా పెద్ద రాష్ట్రాల్లో ఒకటిగా నిల్చింది. దేశ భూభాగములో 4.96 శాతం భూమిని కల్గిన 8వ పెద్ద రాష్ట్రంగా ఉన్నది. రాష్ట్రము 4.6 కోట్ల జనాభాతో దేశ జనాభాలో 4.10 శాతం కల్గి ఉండి, జనాభా దృష్ట్యా 10వ అతిపెద్ద రాష్ట్రంగా ఉన్నది. మొత్తం భూభాగంలో 40.95% వ్యవసాయ యోగ్య భూమి, 21.81% అడవులను కల్గివున్నది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

1) రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (GSDP): రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి మరియు భారతదేశ స్థూల దేశీయోత్పత్తి, వాటి వృద్ధి రేటులతోపాటు రాష్ట్ర, దేశ స్థూల ఉత్పత్తి విలువ 2004 – 05 మరియు 2013-14ల మధ్య దాదాపు రెట్టింపు అయినట్లుగా విశదమవుతున్నది. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో నిరంతర పెరుగుదల ధోరణి కనిపిస్తున్నది. 2004 – 05 లో R 1,34,767 కోట్లుగా ఉన్న రాష్ట్ర ఉత్పత్తి విలువ 2013 – 14 నాటికి 2,50,282 కోట్లుగా చేరుకొన్నది. 2011-12 తర్వాత రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి జాతీయ సగటు GDP పెరుగుదల కన్నా అధికంగా నమోదయినది. రాష్ట్ర GSDP భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో 4.36 శాతాన్ని కల్గివుంది.

2) తలసరి ఆదాయము: రాష్ట్ర తలసరి ఆదాయం, దేశ సగటు తలసరి ఆదాయం కన్నా 2, 3 సం॥లలో తప్ప మిగిలిన సంవత్సరాలలో అధికంగా నమోదు అయ్యింది. దీనిని రాష్ట్రంలో పెరుగుతున్న ప్రజల జీవన ప్రమాణానికి సూచికగా పరిగణింపవచ్చును. 2013-14 సం॥లో రాష్ట్ర, దేశ తలసరి ఆదాయాల మధ్య తేడా ? 11,417 లుగా ఉంది.

3) జనాభా వృద్ధిరేటులో పోకడలు: 2011 జనాభా లెక్కల ప్రకారం 13 జిల్లాలలోని మరియు 4.96 కోట్ల జనాభాతో ఆంధ్రప్రదేశ్ దేశంలో పదవస్థానంలో నిల్చింది. మొదటి నుండి భారతదేశ జనాభా వృద్ధి రేటు కన్నా, రాష్ట్ర జనాభా దశాబ్ద వృద్ధి రేటు తక్కువగానే నమోదవుతున్నది.
మొదటిసారి 2011 దశకంలో రాష్ట్ర వార్షిక జనాభా వృద్ధిరేటు 1% కన్నా తక్కువ (0.921)గా నమోదయింది.

4) రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో రంగాల వాటా: దీనిలో వివిధ రంగాల వాటా వర్తమాన సంవత్సర ధరల ప్రకారం కాని, ఆధార సంవత్సర (2004-05) ధరల ప్రకారం కాని అనేక మార్పులకు గురవుతూ, వాటా ఆధిపత్యం వ్యవసాయం నుండి క్రమంగా సేవారంగానికి మారుతూ వస్తున్నది.

రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి 2004-05 ఆర్థిక సంవత్సరంలో కౌ 1,36,767 కోట్లుగా ఉంది. ఇందులో వ్యవసాయ రంగం R 40,232 కోట్లు సమకూర్చగా, గనులు, వస్తు తయారీ, విద్యుత్, గ్యాస్, నీటి సప్లయి మొదలగు ఉపరంగాలు కలిగిన పారిశ్రామిక రంగం 29,124 కోట్లు మరియు సేవారంగం 65,411 కోట్లను సమకూర్చడం జరిగింది. | 2013 – 14 సంవత్సర తాత్కాలిక అంచనాల ప్రకారం మొత్తం రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో 2004 – 05 ఆధార సంవత్సరం ధరలలో 58,390 కోట్లు, పారిశ్రామిక రంగం కౌ 51,838 కోట్లు మరియు సేవారంగము శౌ 1,40,054 కోట్లు సమకూర్చడం జరిగింది.

5) నిరుద్యోగిత రేటు: నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ (NSS) అనే సంస్థ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి దేశంలో ఉద్యోగిత, నిరుద్యోగితలను అంచనా వేస్తుంది. ఇటీవలి (2011-12) సర్వే ప్రకారం నిరుద్యోగుల రేటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో, దేశ సగటు కన్నా ఎక్కువగా నమోదయింది. రాష్ట్రంలో ఈ రేటు 2004 – 05 వరకు పెరిగి ఆ తర్వాత మొత్తం దేశంలో లాగానే గ్రామీణ, పట్టణ ప్రాంతంలో తగ్గుతూ వస్తున్నది.

ప్రతి వెయ్యిమంది శ్రామిక శక్తిలో నిరుద్యోగులుగా ఉన్న వారి సంఖ్యను “నిరుద్యోగిత రేటు” అంటారు. 2011 – 12 సంవత్సరానికి NSS వారు వేసిన 68వ రౌండు అంచనాల ప్రకారం గ్రామీణ ప్రాంత నిరుద్యోగిత రేటు (12%), భారత గ్రామీణ నిరుద్యోగిత రేటు (17%) కన్నా తక్కువగా ఉంది. కాని పట్టణ నిరుద్యోగితా రేటు విషయంలో రాష్ట్ర నిరుద్యోగిత రేటు (43%), దేశ సగటు కన్నా (34%) ఎక్కువగా నమోదయ్యింది.

6) పేదరికము: ఆంధ్రప్రదేశ్ వివిధ నూతన పేదరిక నిర్మూలనా పథకాలకు రూపొందించడంలో అగ్రగామిగా ఉంది. సబ్సిడీలు, మహిళా సాధికారత కోసం ఇందిర క్రాంతి పథం (IKP), పేదలకు గృహ నిర్మాణం కోసం రాజీవ్ స్వగృహ పథకం, వృద్ధాప్య పింఛన్లు, ఆరోగ్యశ్రీ వంటి వైద్య పథకాలు మొదలైనవి రాష్ట్రంలో అమలవుతున్నాయి.

ప్రశ్న 2.
రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (GSDP) అనగానేమి ? ఆంధ్రప్రదేశ్ (SGDP) సరళిని పరిశీలించండి.
జవాబు:
భారతదేశములో ఆంధ్రప్రదేశ్ వైశాల్యము మరియు జనాభా దృష్ట్యా రాష్ట్రాల్లో ఒకటిగా నిల్చింది. దేశ భూభాగంలో 4.96 శాతం భూమిని కల్గిన 8వ పెద్ద రాష్ట్రంగా ఉన్నది. రాష్ట్రము 4.6 కోట్ల జనాభాతో దేశ జనాభాలో 4.10 శాతం కల్గివుండి జనాభా దృష్ట్యా 10వ అతిపెద్ద రాష్ట్రముగాను ఉన్నది. మొత్తం భూభాగములో 40.95 శాతం వ్యవసాయ యోగ్య భూమి, 21.81 శాతం అడవులను కల్గివున్నది.

రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (GSDP): రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి మరియు భారతదేశ స్థూల దేశీయోత్పత్తి, వాటి వృద్ధి రేటులతోపాటు రాష్ట్ర, దేశ స్థూల ఉత్పత్తి విలువ 2004-05 మరియు 2013-14ల మధ్య దాదాపు రెట్టింపు అయినట్లుగా విశదమవుతున్నది. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో నిరంతర పెరుగుదల ధోరణి కన్పిస్తున్నది. 2004-05లో 3 1,34,767 కోట్లుగా ఉన్న రాష్ట్ర ఉత్పత్తి విలువ 2013-14 నాటికి 2,50,282 కోట్లకు చేరుకొన్నది. – 2011 – 12 తర్వాత రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి జాతీయ సగటు GDP పెరుగుదల కన్నా అధికంగా నమోదు అయినది. రాష్ట్ర GSDP భారతదేశ స్థూల దేశీయ ఉత్పత్తిలో 4.36 శాతాన్ని కల్గివున్నది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి మరియు భారతదేశ స్థూల దేశీయ ఉత్పత్తి నిలకడ (2004 – 05) ధరలలో
AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 1

ప్రశ్న 3.
ఆంధ్రప్రదేశ్లో జనాభా మరియు తలసరి ఆదా మీ వృజ్ఞ పోకడలను తెలపండి.
జవాబు:
రాష్ట్ర తలసరి ఆదాయం. దేశ సగటు తలసరి ఆదాయం కన్నా 2, 3 సం॥లలో తప్ప మిగతా సం॥లలో అధికంగా నమోదు అయింది. దీనిని రాష్ట్రంలో పెరుగుతున్న ప్రజల జీవన ప్రమాణ సూచికగా చెప్పవచ్చు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం మరియు భారతదేశ తలసరి ఆదాయం (ప్రస్తుత ధరలలో) రూ.లలో
AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 2

2013 – 14 సం||లో రాష్ట్ర, దేశ తలసరి ఆదాయాల మధ్య తేడా కౌ 11,417 లుగా ఉంది. జనాభా: 2011 జనాభా లెక్కల ప్రకారం 13 జిల్లాలలోని మరియు 4.96 కోట్ల జనాభాతో ఆంధ్రప్రదేశ్ దేశంలో 10వ స్థానంలో నిలిచింది.

ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశంలో దశాబ్ద జనాభా వృద్ధిరేటు (శాతంలో)
AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 3

ప్రశ్న 4.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం ప్రాధాన్యత.
జవాబు:
వ్యవసాయ రంగం: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తున్నది. మన రాష్ట్రం “Bejeweled rice bowl of India” గా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ దాదాపు 60 శాతం జనాభా వ్యవసాయాన్నే తమ ప్రధాన వృత్తిగా భావిస్తున్నారు. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో కూడా వ్యవసాయరంగ వాటా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది.

1) రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (GSDP) లో వాటా: భారత ఆర్థిక వ్యవస్థలో మాదిరే రాష్ట్ర GSDPలో కూడా వ్యవసాయరంగ వాటా క్రమంగా తగ్గుతున్నప్పటికీ దాని ప్రాధాన్యత నిరర్ధకమైనదిగా భావించరాదు. 2004 – 05 మరియు 2013 – 14 సం||లలో రాష్ట్ర GSDPలో వ్యవసాయ మరియు దాని అనుబంధ రంగాల వాటాను ఇతర రంగాల వాటాను ఈ క్రింది పట్టికలో చూపబడినది.

రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం, మిగతా రంగాల వాటా (%)
AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 4
మూలం: ఆంధ్రప్రదేశ్ గణాంక సూచిక 2014, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పేజీ నెం. 233 మరియు 234.
గమనిక: సంఖ్యలు 2004-05 నిలకడ ధరలలో

పై పట్టిక మరియు చిత్రమును గమనిస్తే రాష్ట్ర GSDPలో వ్యవసాయరంగ వాటా క్రమంగా తగ్గుతూ, ఆ మేరకు సేవారంగం వాటా పెరుగుతున్నట్లు అర్థం అవుతున్నది. పారిశ్రామికరంగ వాటా, పరిశీలనలోని కాలాలలో దాదాపు స్థిరంగా కొనసాగుతున్నది. 2007వ సంవత్సరం నాటికి సేవారంగం వాటా 50 శాతం స్థాయిని దాటితే 2010-11 నాటికి వ్యవసాయరంగ వాటా 25 శాతం కన్నా దిగువకు పడిపోయింది. అయితే ఇప్పటికీ రాష్ట్ర వ్యవసాయరంగ వాటా జాతీయ వ్యవసాయం వాటా కన్నా ఎక్కువ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పటికీ కూడా రాష్ట్ర GSDPలో వ్యవసాయ రంగం 1/5 వంతు వాటాను సమకూరుస్తుంది.

2) ఉపాధి కల్పన: రాష్ట్రంలోని అత్యధిక జనాభాకు వ్యవసాయమే ప్రధాన ఉపాధి మార్గము. సగాని కన్నా ఎక్కువమంది ప్రజలు ఈ రంగంపైనే ఆధారపడి పనిచేస్తున్నారు. పారిశ్రామిక, సేవారంగాలు ఎంతగా అభివృద్ధి జరిగినా, ఉపాధి కల్పనలోను, ప్రధాన ఆదాయ వనరుగా వ్యవసాయం తన ప్రాధాన్యతను కొనసాగిస్తూ ఉన్నది.

2011 జనాభా లెక్కల ప్రకారం వ్యవసాయ రంగం అటు వ్యవసాయదారులకు, ఇటు వ్యవసాయ కూలీలకు కలిపి మొత్తం 62.36 శాతం మందికి ఉపాధి కల్పిస్తున్నది. ఇప్పటికినీ దేశం మరియు రాష్ట్రాలలో 50 శాతం కన్నా ఎక్కువ మందికి వ్యవసాయమే ప్రధాన ఉపాధి మూలం.

3) భూమిని ఉపయోగించే తీరు: ఆంధ్రప్రదేశ్ 160.20 లక్షల హెక్టార్ల మొత్తం భూభాగంతో భారతదేశంలో ఎనిమిదవ అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. రాష్ట్రంలో భూమిని ఉపయోగిస్తున్న తీరు స్వల్ప మార్పులతో చాలాకాలంగా దాదాపు యధాతథంగా కొనసాగుతూ ఉంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

4) ఆహార మరియు ఆహారేతర పంటల క్రింద ఉన్న భూమి: రాష్ట్రంలో పండే పంటలను స్థూలంగా ఆహార మరియు ఆహారేతర పంటలుగా విభజించవచ్చు. అన్ని తృణధాన్యాలు, పప్పుదినుసులు, వంటనూనెలు మొదలైనవి ఆహారపంటల క్రిందకు వస్తే, పసుపు, ప్రత్తి, చెరకు మొదలైనవి ఆహారేతర లేక వాణిజ్య పంటల క్రిందకు వస్తాయి. మొత్తం భూభాగాన్ని ఆహార, ఆహారేతర పంటల కోసం కేటాయించిన తీరునుబట్టి ఈ ప్రాంతంలో వ్యవసాయ వాణిజ్యీకరణ ఏ మేరకు జరిగిందో అంచనా వేయవచ్చు. 2013-14 సం॥లో మొత్తం 81.28 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమిలో 54. 92 లక్షల హెక్టార్లు అంటే 67.57 శాతం భూమిని ఆహారపంటల ఉత్పత్తికి కేటాయించడం జరిగింది.
వాణిజ్య పంటలను 32 శాతం వ్యవసాయ భూమిలో పండించడం జరుగుతున్నది. 2013-14లో ఆహారేతర పంటలను 32.43 లక్షల హెక్టార్లలో పండించడం జరుగుతుంది.

5) ప్రధాన పంటల ఉత్పాదకత: సగటున ఒక హెక్టారు భూమిలో పండిన పంటను ఉత్పాదకత అంటారు. ప్రధాన పంటల ఉత్పాదకత 2010-11 మరియు 2013-14 సం॥లలో మిశ్రమ సరళిని కలిగివున్నది.
వరి ఉత్పాదకత ఒక హెక్టారుకో గరిష్టంగా నెల్లూరులోను (4,051) మరియు కర్నూలులో (3,670) ఉంది. గోధుమ ఉత్పత్తి రాష్ట్రంలో అత్యల్పంగా ఉంది.

6) నీటిపారుదల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి, కృష్ణ, తుంగభద్ర, పెన్న మరియు వంశధార వంటి ముఖ్యమైన నదులను ప్రసాదింపబడింది. రాష్ట్రంలో అన్ని రకాల ప్రవాహాలు, నదులు, వంకలు కలిపివున్న మొత్తం నీటి పరిమాణం | 2,746 TMC లు. కాని ఇప్పటివరకు ఉపయోగించుకుంటున్న నీరు కేవలం 1,753 TMC లు. నదులే కాకుండా రాష్ట్రంలో ఇతర కృత్రిమ సరస్సులు, రిజర్వాయర్లు కూడా త్రాగునీరు, సాగునీటి అవసరాలు తీరుస్తున్నాయి.

2013 – 14 సం||నికి మొత్తం వ్యవసాయ యోగ్యమైన భూమిలో నీటిపారుదల కలిగిన నికర భూమి 46 శాతం, 65.61 లక్షల సాగుభూమిలో 30.14 లక్షల హెక్టార్లు నీటిపారుదలను కలిగివున్నాయి. నీటిపారుదల కలిగిన నికర సాగుభూమిలో 48 శాతం కాలువలు (canals), చెరువుల ద్వారా 9 శాతం మరియు అన్ని రకాల బావుల ద్వారా 40 శాతం భూమి నీటిపారుదలను పొందినది.

ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల మూలాలు (హెక్టార్లలో)
AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 5
జిల్లాలను పరిశీలిస్తే 4.38 లక్షల హెక్టార్ల నీటిపారుదల గల సాగుభూమితో అంటే మొత్తం జిల్లా భూభాగంలో 14.5 శాతంతో గుంటూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. 3.83 లక్షల హెక్టార్ల నీటిపారుదల సాగుభూమితో పశ్చిమ గోదావరి రెండవ స్థానంలో కొనసాగుతుంది. 2013-14 సం॥కి విజయనగరం మరియు అనంతపురంలు రాష్ట్రం మొత్తం మీద అతితక్కువ నీటిపారుదల భూమిని కలిగివున్నాయి.

ఇతర అంశాలు:
రాష్ట్రంలో సగటు భూకమతము 1.6 హెక్టార్లు. మొత్తం రైతుల సంఖ్యలో ఉపాంత రైతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. పెద్ద రైతుల విషయంలో సగటు కమత పరిమాణం ఎక్కువగా ఉంది.

సంస్థాగత పరపతిలో 70 శాతం వాణిజ్య బ్యాంకులు, 20 శాతం సహకార బ్యాంకులు మరియు 11 శాతం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పరపతిని అందిస్తున్నాయి.
వ్యవసాయ మార్కెటింగ్లోని లోపాలను సరిచేయడానికి “రైతుబంధు పథకం”, DAATT సెంటర్లు, కంప్యూటరీకరణ, సహకార మార్కెటింగ్ మొదలైన అనేక చర్యలు చేపట్టడం జరిగింది.

రాష్ట్రం సముద్ర ఉత్పత్తులైన చేపలు, రొయ్యలు మొదలైనవాటి ఉత్పత్తి ద్వారా 3,000 కోట్లు అంటే భారతదేశ మొత్తం సముద్ర ఉత్పత్తి విలువలో 50 శాతం ఆర్జించి పెడుతున్నది.
పట్టు పరిశ్రమలోను, పట్టు ఉత్పత్తిలోను రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానంలో ఉంది.

ప్రశ్న 5.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక రంగం ప్రాధాన్యత.
జవాబు:
పారిశ్రామిక రంగం: ఏ ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగాన్నైనా పారిశ్రామిక పాత్రనే నిర్ణయిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ రకాలైన సహజవనరులు, దక్షిణ భారతదేశంలోనే పొడవైన సముద్ర తీర ప్రాంతము, అవస్థాపన సౌకర్యాలు, కమ్యూనికేషన్లు, సాంకేతిక నిపుణులు మరియు విస్తృత మార్కెట్ అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయి.

ఎ) రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో పారిశ్రామికరంగ వాటా: రాష్ట్ర (GSDP) లో ఆధార సం||పు 2004 – 05 ధరల ప్రకారం వివిధ సంవత్సరాలలో పారిశ్రామికరంగ వాటాను క్రింది పట్టిక తెలుపుతుంది.

రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో పరిశ్రమరంగ వాటా
AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 6

నిరపేక్షికంగా రాష్ట్ర GSDPలో పారిశ్రామిక రంగ వాటా క్రమంగా పెరుగుతున్నది. 2004 – 05 ఆధార సం॥లో ఈ రంగ మొత్తం విలువ 7 29,124 కోట్లు మాత్రమే ఉండగా, ఒక్క 2008-09 సంవత్సరాన్ని మినహాయిస్తే 2013 – 14 వరకు నిరంతరంగా పెరిగి ఔ 51,838 కోట్లకు చేరుకుంది. 2007-08లో 23.7 శాతం ఉన్న ఈ రంగ వాటా 2013-14 నాటికి 20.7 శాతానికి తగ్గిపోయింది.

బి) ఉపాధి అవకాశాల కల్పన: ఏ ఆర్థిక వ్యవస్థలోనైనా ఒక రంగం యొక్క వాటాను ఆ రంగంపై ఆధారపడి పనిచేస్తున్న శ్రామికుల సంఖ్యను ఒక సూచికగా భావించి చెప్పవచ్చు. దేశంలోను, రాష్ట్రంలోను మొదటి నుండి పారిశ్రామిక రంగం కల్పిస్తున్న ఉపాధి శాతములో చెప్పుకోదగ్గ మార్పులు జరగలేదు. 2011 నాటికి రాష్ట్ర, జాతీయ స్థాయిలలో పారిశ్రామిక రంగం దాదాపు 21 శాతము మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నది.

సి) పరిశ్రమలకు ప్రణాళికా కేటాయింపులు: రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికై ప్రణాళికలలో చెప్పుకోదగ్గ కేటాయింపులే జరిగాయి. 12వ ప్రణాళికలోని మొదటి వార్షిక ప్రణాళిక 2012-13లో మొత్తం ప్రణాళిక వ్యయం 48,935 కోట్ల రూపాయలలో 784 కోట్ల రూపాయలు పరిశ్రమలు మరియు ఖనిజ రంగానికి కేటాయించారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

డి) పారిశ్రామిక ఉత్పత్తి సూచిక: పారిశ్రామిక ప్రగతిని కొలిచే ఒక సాధనమే పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (IIP). ఒక కాలంలో జరిగిన భౌతిక పారిశ్రామిక ఉత్పత్తి, అంతకుముందు కాలం కన్నా సాపేక్షికంగా ఎంత మార్పు జరిగిందో ఇది తెలుపుతుంది. రాష్ట్ర IIP విలువ 2004-05 ఆధార సంవత్సర ఉత్పత్తి ప్రకారం ముదింపు చేయబడుతుంది. ఇ) రిజిస్టరు అయిన ఫ్యాక్టరీల సంఖ్య: వివిధ సెకన్ల ప్రకారం రిజిస్టరు అయిన పనిచేసే ఫ్యాక్టరీల సంఖ్యను చూపడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్లో పని చేయుచున్న ఫ్యాక్టరీల సంఖ్య
AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 7
పట్టిక ప్రకారం 2m(i), 2m (ii) సెక్షన్ల ప్రకారం నమోదు అయిన ఫ్యాక్టరీల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. 2008 – 09లో 9,972 గా ఉన్నా ఈ ఫ్యాక్టరీల సంఖ్య 2011 – 12 నాటికి 11,195కు పెరిగాయి. 2010 – 11 మరియు 2011 – 12 మధ్య ఒక సంవత్సర కాలంలో కొత్తగా 837 ఫ్యాక్టరీలు స్థాపించబడ్డాయి.

ఎఫ్) ఇతర ముఖ్యాంశాలు:

  • రాష్ట్రం నుండి వెళ్ళే పారిశ్రామిక ఎగుమతుల విలువ క్రమంగా పెరుగుతున్నది. 2012-13 సంవత్సరంలో దీని విలువ 1,29,001 కోట్ల రూపాయలు.
  • దేశంలోని మొత్తం ఖాయిలా పడ్డ పరిశ్రమలో, రాష్ట్రంలోని ఖాయిలా పరిశ్రమలు 10.2 శాతం మరియు వీటి విషయంలో రాష్ట్రం నాల్గవ స్థానంలో ఉంది.
  • ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అవస్థాపనా కార్పొరేషన్ (APIIC) రాష్ట్రంలోని స్పెషల్ ఎకనామిక్ జోన్ (SEZ) లకు నోడల్ ఏజెన్సీగా పనిచేస్తున్నది. పూర్తిస్థాయి SEZ విధానాన్ని ప్రకటించిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.
  • మార్చి, 2014 నాటికి రాష్ట్రంలో 32 SEZలు ఉండగా అందులో 10IT రంగానికి, 6 విభిన్న వస్తువులకు, 4 ఔషధాలకు, 2 బయోటిక్, 10 రంగ ప్రాధాన్యత గల SEZలు ఉన్నాయి.

ప్రశ్న 6.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో సేవారంగం ప్రాధాన్యత.
జవాబు:
సేవా మరియు అవస్థాపన రంగాలు: భారతదేశంలో వలే రాష్ట్రంలో కూడా సేవారంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది. పారిశ్రామిక రంగం స్థిరంగా ఉండడం వల్ల వ్యవసాయ రంగం కోల్పోతున్న రేటులో, సేవా రంగం అభివృద్ధి సాధిస్తున్నది.

ఎ) రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో వాటా: 2004-05 సంవత్సరంలో రాష్ట్ర (GSDP)లో 48.54 శాతం తోను, 2013 -14లో ఇంకా పెరిగి 55.99 శాతంలో సేవా రంగం అతి ప్రధాన వాటాదారుగా కొనసాగుతున్నది. 2004 -05 సంవత్సరంలో 3 64,411 కోట్లు, రాష్ట్ర GSDPకి సమకూర్చినది ఈ రంగమే. ఈ రంగం 2013-14 నాటికి ఏకంగా కౌ 1,40,054 కోట్లు ఆర్జించి పెట్టింది. అంటే రాష్ట్ర GSDPలో సగ భాగానికన్నా ఎక్కువ ఒక సేవారంగమే సమకూరుస్తుంది.

బి) ఉపాధి కల్పన: రాష్ట్రంలో సేవారంగం ఉపాధి కల్పనలో మూడు రంగాలలో రెండవ స్థానంలో ఉండి, దాదాపు 1/4 వంతు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నది. రాష్ట్రంలో 24.5 శాతం శ్రామిక శక్తికి ఉపాధిని కల్పిస్తున్నది. ఇది జాతీయ సగటున 25.4 శాతానికి దాదాపు సమానము.

సి) నీటిపారుదల: ప్రస్తుత రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా సాగునీటి అభివృద్ధి, నిర్వహణ అత్యంత ప్రాధాన్యతను కలిగివుంది. రాష్ట్రం ప్రధాన నదీ వనరులైన గోదావరి, కృష్ణ, తుంగభద్ర, వంశధార వంటి ప్రముఖ నదులను కలిగి “నదుల రాష్ట్రం” గా ‘గా పిలువబడుటకు అన్ని విధాల అర్హతలు కలిగి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో జలయజ్ఞంలో భాగంగా 52 లక్షల ఎకరాలకు నీరు అందించే లక్ష్యంతో 54 భారీ, మధ్యతరహా, ఇతర ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నాయి.

పోలవరం ప్రాజెక్ట్ ఒక బహుళార్థక సాగునీటి ప్రాజెక్ట్ గా చేపట్టబడి ఇటీవల కేంద్ర ప్రభుత్వంచే “జాతీయ ప్రాజెక్ట్ హోదా” ను పొందినది.

పట్టిసీమ ప్రాజెక్ట్ చాలా కీలకమైనది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయ్యేవరకు గోదావరి నదిలోని మిగులు జలాలు 80 (tmcft) లు దాకా, పట్టిసీమ ద్వారా శ్రీశైలం నుండి రాయలసీమలోని కరువు పీడిత ప్రాంతాలకు తరలించే యోచనతో రూపొందించబడినది.

ప్రభుత్వం రాష్ట్రంలో బిందుసేద్య విధానాన్ని కూడా ప్రోత్సహిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రైతులకు బిందు సేద్య పరికరాలను సబ్సిడీ రేట్లకే అందిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సూక్ష్మ నీటిపారుదల పద్దతి విషయంలో దేశంలోనే ప్రథమస్థానంలో ఉండి, ప్రస్తుతం 5.63 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

డి) విద్యుచ్ఛక్తి: 2015-16 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం విద్యుత్ సప్లయిని ప్రకటించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 16,717 MWల విద్యుత్ ఉత్పాదక సామర్థ్యాన్ని కలిగివుంది. ఇందులో 70 శాతం థర్మల్ మరియు 21 శాతం జలవనరుల ద్వారా సాధిస్తున్నది.

సింహాద్రి STPS, దామోదరం సంజీవయ్య TPS, రాయలసీమ TPS మొదలైనవి రాష్ట్రంలోని ప్రధాన థర్మల్ విద్యుత్ కేంద్రాలు, లాంకో కొండపల్లి, స్పెక్ట్రం, కోనసీమ కంబైన్డ్ సైకిల్ విద్యుత్ సంస్థ మొదలైనవి గ్యాస్ ఇంధన ఆధారిత విద్యుత్ ప్లాంట్లు, అలాగే శ్రీశైలం, టిబి డ్యామ్, పోలవరం, పెన్నహోబిలం, సీలేరు మొదలైనవి ప్రధాన హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు.

ఇవేకాకుండా అనంతపురం జిల్లాలోని కదిరి వద్ద అమృత్ సౌర విద్యుత్ ప్లాంట్లు, అనంతపురం జిల్లాలోనే స్థాపించబడిన రామగిరి, నర్మద పవన విద్యుత్ ప్లాంట్లు మరియు పుత్లూరు ప్లాంట్లు పవన ఆధారిత విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నాయి.

ప్రశ్న 7.
ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల వసతులను తెలపండి.
జవాబు:
నీటిపారుదల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి, కృష్ణ, తుంగభద్ర, పెన్న మరియు వంశధార వంటి ముఖ్యమైన నదులను ప్రసాదింపబడింది. రాష్ట్రంలో అన్ని రకాల ప్రవాహాలు, నదులు, వంకలు కలిపి మొత్తం నీటి పరిమాణం 2,746 TMC లు. కాని ఇప్పటివరకు ఉపయోగించుకుంటున్న నీరు కేవలం 1,753 TMC లు. నదులే కాకుండా రాష్ట్రంలో ఇతర కృత్రిమ సరస్సులు, రిజర్వాయర్లు కూడా త్రాగునీరు, సాగునీటి అవసరాలు తీరుస్తాయి.

2013 – 14 సంవత్సరానికి మొత్తం వ్యవసాయ యోగ్యమైన భూమిలో నీటిపారుదల కలిగిన నికర భూమి 46 శాతం. 65.61 లక్షల సాగుభూమిలో 30.14 లక్షల హెక్టార్లు నీటిపారుదలను కలిగి ఉన్నాయి. నీటిపారుదల కలిగిన నికర సాగుభూమిలో 48 శాతం కాలువలు (canals), చెరువులు ద్వారా 9 శాతం మరియు అన్ని రకాల బావుల ద్వారా 40 శాతం భూమి నీటిపారుదలను పొందినది.

ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల మూలాలు (హెక్టార్లలో)
AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 8

జిల్లాలను పరిశీలిస్తే, 4.38 లక్షల హెక్టార్ల నీటిపారుదల గల సాగుభూమితో అంటే మొత్తం జిల్లా భూభాగంలో 14.5 శాతంతో గుంటూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. 3.83 లక్షల హెక్టార్ల నీటిపారుదల సాగుభూమితో పశ్చిమ గోదావరి రెండవ స్థానంలో కొనసాగుతుంది. 2013-14 సం||కి విజయనగరం మరియు అనంతపురంలు రాష్ట్రం మొత్తం మీద అతితక్కువ నీటిపారుదల భూమిని కలిగివున్నాయి.

ఇతర అంశాలు:
రాష్ట్రంలో సగటు భూకమతము 1.6 హెక్టార్లు. మొత్తం రైతుల సంఖ్యలో ఉపాంత రైతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. పెద్ద రైతుల విషయంలో సగటు కమత పరిమాణం ఎక్కువగా ఉంది.

సంస్థాగత పరపతిలో 70 శాతం వాణిజ్య బ్యాంకులు. 20 శాతం సహకార బ్యాంకులు మరియు 11 శాతం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు పరపతిని అందిస్తున్నాయి.
వ్యవసాయ మార్కెటింగ్ లోని లోపాలను సరిచేయడానికి “రైతుబంధు పథకం”, DAATT సెంటర్లు, కంప్యూటరీకరణ, సహకార మార్కెటింగ్ మొదలైన అనేక చర్యలు చేపట్టడం జరిగింది.

రాష్ట్రం సముద్ర ఉత్పత్తులైన చేపలు, రొయ్యలు మొదలైనవాటి ఉత్పత్తి ద్వారా 73,000 కోట్లు అంటే భారతదేశ మొత్తం సముద్ర ఉత్పత్తి విలువలో 50 శాతం ఆర్జించి పెడుతున్నది.

పట్టు పరిశ్రమలోను, పట్టు ఉత్పత్తిలోను రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానంలో ఉంది.

ప్రశ్న 8.
ఆంధ్రప్రదేశ్లోని రవాణా సౌకర్యాలను వివరింపుము.
జవాబు:
1) రైల్వేలు: ఇవి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదం చేస్తూనే, మరో ప్రక్క రాష్ట్రంలో పారిశ్రామిక మరియు పర్యాటక రంగ వృద్ధికి తోడ్పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా దక్షిణమధ్య రైల్వే, దక్షిణ రైల్వే, తూర్పు తీర రైల్వే |అనే మూడు రైల్వే జోన్ల సేవలను పొందుతున్నది. రాష్ట్రంలో మొత్తం 444 రైల్వేస్టేషన్లు మరియు 3,355 కి.మీ. మేర నెట్వర్క్ కలిగివుంది. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ మనవి, కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ వద్ద పరిశీలనలో ఉంది.

ప్రపంచంలోనే అత్యధిక బ్రాడ్ గేజ్ ట్రాకులు విశాఖపట్టణం నుండి అనంతగిరిని కలుపుతూ తూర్పు కనుమల గుండా సాగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ రైల్వే స్టేషన్ ప్రఖ్యాతమైనదే కాక అత్యంత రద్దీ కలిగిన రైల్వే జంక్షన్గా దేశంలోనే గుర్తింపు పొందింది.

2) రోడ్డు మార్గాలు: రోడ్లు ప్రాథమిక రవాణా వ్యవస్థలో ముఖ్యమైనవే కాకుండా అత్యంత కీలకమైన అవస్థాపన సౌకర్యము కూడా. ఆర్థిక వ్యవస్థలో రోడ్ల శాస్త్రీయమైన అభివృద్ధి అనునది ఆర్థికవృద్ధికి ఒక ప్రాథమిక అవసరమేకాక, ఆర్థిక వృద్ధిని వేగవంతం కూడా చేయగలదు. దేశంలోని వివిధ రవాణా వ్యవస్థలన్నింటిలో ఒక్క రోడ్డు మార్గాలే 80 |శాతం ప్రయాణికుల, వస్తు రవాణా అవసరాలు తీరుస్తున్నాయి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

ఆంధ్రప్రదేశ్ 42,511 కి.మీ.ల రాష్ట్ర రహదారులు, 3,144 కి.మీ.ల జాతీయ రహదార్లు, 1,01,484 కి.మీ. జిల్లా రోడ్లను కలుపుకొని మొత్తం 1,46,954 కి.మీ. విస్తారమైన నెట్వర్క్ కలిగివుంది. రాష్ట్రంలోని రోడ్లను 1998లో స్థాపించబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా అభివృద్ధి సంస్థ (APRDC) నే నిర్వహణ బాధ్యత కలిగివుంది.

3) పౌర విమానయానము: రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ, తిరుపతి, కడప మరియు రాజమండ్రి ఎయిర్పోర్టను మెట్రోయేతర ఎయిర్పోర్టుగా ఆధునీకరించుటకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) తో అవగాహన తాఖీదు (MOU) కుదుర్చుకున్నది. తిరుపతి ఎయిర్పోర్ట్ను అంతర్జాతీయ ప్రమాణాల అనుసారం ఆధునీకరించుటకు ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా (AAI) ప్రతిపాదించినది. అలాగే రాజమండ్రి ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కూడా (AAI) ఒక బృహత్ ప్రణాళికను సిద్ధం చేసింది.

4) సముద్ర ఓడరేవులు: భారతదేశంలో గుజరాత్ తర్వాత 972 కి.మీ.ల సముద్రతీర ప్రాంతంతో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది. రేవులు ఎగుమతులు, దిగుమతులు, అంతర్జాతీయ వ్యాపారం, ఓడల రిపేర్లు, పర్యాటకం, చేపల వేట మరియు జల క్రీడల వంటి సముద్ర కార్యకలాపాల వృద్ధికి దోహదం చేస్తాయి. రేవులు వాణిజ్యానికి సింహద్వారము వంటివి. విశాఖపట్టణం ఓడరేవు రాష్ట్రంలో అతిపెద్దదే కాకుండా, దేశంలోనే సరుకు రవాణా విషయంలో అతిపెద్ద రేవులలో ఒకటి. విశాఖపట్టణం నుండి అండమాన్ నికోబార్ దీవులలోని పోర్ట్ బ్లెయిర్కి ప్రయాణికుల సముద్ర యాత్రా వసతి కూడా కలదు.

ప్రశ్న 9.
ఆంధ్రప్రదేశ్లోని ఆర్థిక అభివృద్ధిలో ఐ.టి. (IT) రంగ ప్రాధాన్యతను తెలుపుము.
జవాబు:
IT/సాఫ్ట్వేర్ పరిశ్రమ: సాఫ్ట్వేర్ పరిశ్రమ సమాచార సాంకేతిక రంగంలోని ప్రధాన అంశము. సాఫ్ట్వేర్ పరిశ్రమలో కంప్యూటర్ సాఫ్ట్వేరు సంబంధించిన అభివృద్ధి చేయబడే వ్యాపారం, నిర్వహణ మరియు ముద్రణ అనే అంశాలు కలిసి ఇవి ఏ వ్యాపార రూపంలోనైనా ఉండవచ్చు. ఈ రంగం 1960 మొదట్లో మొదలై 1970 దశకంలో బాగా విస్తరించింది. ఈ పరిశ్రమలో ముఖ్యంగా 5 రంగాలు ఉన్నాయి. అవి:
1. సాఫ్ట్వేర్ అవస్థాపన రంగం 2. ఉద్యమిత్వ సాఫ్ట్వేర్ 3. రక్షణాత్మక సాఫ్ట్వేర్ 4. పరిశ్రమ పరిమిత సాఫ్ట్వేర్ 5.ప్రత్యేక కంపెనీ క్లయింట్గా గల సాఫ్ట్వేర్

రాష్ట్ర విభజన తర్వాత 2014, జూన్ 2న నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్ర ఐ.టి. టర్నోవర్లో 2 శాతం మరియు కేవలము 1.8 శాతం ఉద్యోగ అవకాశాలను మాత్రమే కలిగివుంది.

ఆంధ్రప్రదేశ్ భారతదేశ హైటెక్ రాజధాని, భారత సిలికాన్ లోయగా గుర్తింపు పొందినది. కాని విభజనానంతరం వైజాగ్ నగరం ఐ.టి. సెంటర్ గా అభివృద్ధి చెందుటకు అన్ని అనుకూల అంశాలు ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. విశాఖపట్టణం రాష్ట్ర నూతన ఐ.టి. రాజధాని అవుతుంది.

  • ప్రతి జిల్లా కేంద్రము ఒక ఐ.టి. పార్కును కలిగివుంటుంది.
  • రాష్ట్రం మొత్తం ఎగుమతుల్లో ఐ.టి. రంగం 38.22 శాతం వాటా కలిగివుంది (ఉమ్మడి రాష్ట్రం).
  • 2013 నాటికి ఐ.టి. రంగం రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది.
  • 2013లో ఈ రంగం మొత్తం ఎగుమతుల విలువ సుమారు 36 వేల కోట్ల రూపాయలు.
  • ఐ.టి. రంగం ప్రస్తుతం ఉన్న 36,000 కోట్ల రూపాయల స్థితి నుండి 2017 నాటికి 1,50,000 కోట్ల స్థాయికి చేరగలదని అంచనా.
  • రాష్ట్ర ప్రభుత్వం ఐ.టి. మరియు బి.టి. (IT & BT)లను సమన్వయం చేసే యోచనలో ఉంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 10.
ఆంధ్రప్రదేశ్లోని వివిధ సంక్షేమ పథకాలను పరిశీలింపుము.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ – సంక్షేమ పథకాలు/కార్యక్రమాలు: ఏ సంక్షేమ రాజ్య లక్ష్యమైన తన ప్రజల జీవన ప్రమాణాన్ని కొనసాగించడం లేదా ఇంకా మెరుగుపరచడమే. చాలాకాలం వరకు ఆర్థికాభివృద్ధికి వ్యవసాయ, పరిశ్రమలు ప్రధాన వాహకాలుగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం మానవ వనరుల అభివృద్ధికి ఉన్న ప్రాధాన్యత వల్ల సామాజిక రంగ అవస్థాపన సౌకర్యాలైన విద్య, ఆరోగ్య సంరక్షణ, పౌష్టికాహారం, నీటి సప్లయి, గృహవసతి, సామాజిక రక్షణ వంటి వాటిని మెరుగుపరచడము ద్వారానే సాధ్యం అవుతుంది. సమాజంలో సామాజిక న్యాయం, సామాజిక సమానత్వాలు సాధించాలంటే ఈ సాంఘిక అంశాలపై ప్రభుత్వం పెట్టుబడులు పెరగాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సాంఘిక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఈ క్రింది పట్టికలో పొందుపరచడమైనది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలుపరుస్తున్న వివిధ వర్గాల వారి సంక్షేమ పథకాలు
AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 9

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (GSDP).
జవాబు:
భారతదేశములో ఆంధ్రప్రదేశ్ వైశాల్యము మరియు జనాభా దృష్ట్యా రాష్ట్రాల్లో ఒకటిగా నిల్చింది. దేశ భూభాగంలో 4.96 శాతం భూమిని కల్గిన 8వ పెద్ద రాష్ట్రంగా ఉన్నది. రాష్ట్రము 4.6 కోట్ల జనాభాతో దేశ జనాభాలో 4.10 శాతం కల్గివుండి జనాభా దృష్ట్యా 10వ అతిపెద్ద రాష్ట్రముగాను ఉన్నది. మొత్తం భూభాగములో 40.95 శాతం వ్యవసాయ యోగ్య భూమి, 21.81 శాతం అడవులను కల్గివున్నది.

రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (GSDP): రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి మరియు భారతదేశ స్థూల దేశీయోత్పత్తి, వాటి వృద్ధి రేటులతోపాటు రాష్ట్ర, దేశ స్థూల ఉత్పత్తి విలువ 2004-05 మరియు 2013 – 14ల మధ్య దాదాపు రెట్టింపు అయినట్లుగా విశదమవుతున్నది. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో నిరంతర పెరుగుదల ధోరణి కన్పిస్తున్నది. 2004-05లో ఔ 1,34,767 కోట్లుగా ఉన్న రాష్ట్ర ఉత్పత్తి విలువ 2013-14 నాటికి 2,50,282 కోట్లకు చేరుకొన్నది. 2011 – 12 తర్వాత రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి జాతీయ సగటు GDP పెరుగుదల కన్నా అధికంగా నమోదు అయినది. రాష్ట్ర GSDP భారతదేశ స్థూల దేశీయ ఉత్పత్తిలో 4.36 శాతాన్ని కల్గివున్నది.

ప్రశ్న 2.
రాష్ట్ర తలసరి ఆదాయం.
జవాబు:
రాష్ట్ర తలసరి ఆదాయం, దేశ సగటు తలసరి ఆదాయం కన్నా 2, 3 సం॥లలో తప్ప మిగతా సం॥లలో అధికంగా నమోదు అయింది. దీనిని రాష్ట్రంలో పెరుగుతున్న ప్రజల జీవన ప్రమాణ సూచికగా చెప్పవచ్చు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం మరియు భారతదేశ తలసరి ఆదాయం (ప్రస్తుత ధరలలో) రూ.లలో
AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 10

2013 – 14 సం||లో రాష్ట్ర, దేశ తలసరి ఆదాయాల మధ్య తేడా కౌ 11,417లుగా ఉంది.
జనాభా: 2011 జనాభా లెక్కల ప్రకారం 13 జిల్లాలలోని మరియు 4.96 కోట్ల జనాభాతో ఆంధ్రప్రదేశ్
దేశంలో 10వ స్థానంలో నిలిచింది.

ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశంలో దశాబ్ద జనాభా వృద్ధిరేటు (శాతంలో)
AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 11

ప్రశ్న 3.
ఆంధ్రప్రదేశ్లో వృత్తివారీ శ్రమ విభజన. [Mar ’17]
జవాబు:
ఏ ఆర్థిక వ్యవస్థలోనైనా ఆర్థికాభివృద్ధి స్థాయిని ఆ ఆర్థిక వ్యవస్థలోని వృత్తివారి శ్రమ విభజన తీరు నిర్ణయిస్తుంది. ఏ ఆర్థిక వ్యవస్థనైనా వ్యవసాయ, పారిశ్రామిక మరియు సేవా రంగాలుగా విభజించవచ్చు. జనాభాను, వారు చేసే వృత్తులు లేక పనులు ఆధారంగా విభజించడాన్ని వృత్తివారీ శ్రమ విభజన లేక వృత్తివారీ జనాభా విభజన అంటారు. వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు కలిసి మొత్తంగా 1,43,92,736 మంది అనగా 62.36 శాతము వ్యవసాయ రంగాలలో ఉపాధి పొందుతున్నారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

అదే విధంగా గృహ పరిశ్రమలలో పనిచేసే శ్రామికులు 6,62,608 మంది అంటే మొత్తం శ్రామిక సంఖ్యలో కేవలం 2.87 శాతము ఉన్నారు. పారిశ్రామిక మరియు సేవా రంగాల కార్యకలాపాలు పరస్పరం పూరకంగా ఉంటాయి కాబట్టి ఈ రెండు రంగాలలో మొత్తం 80,25,620 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అంటే మొత్తం కార్మిక సంఖ్యలో
ఇది 34.77 శాతము.

ఇప్పటికీ వ్యవసాయ రంగంపై ఆధారపడుతున్న కార్మిక సంఖ్య ఎక్కువగా ఉంది. సేవారంగం రెండవ స్థానాన్ని కలిగి, వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది. ద్వితీయ లేక పారిశ్రామికరంగ వాటా రాష్ట్రంలో సంవత్సరాలుగా స్థిరంగా కొనసాగుతున్నది.

ప్రశ్న 4.
రాష్ట్రంలోని పర్యావరణ పరిరక్షణ అంశాలు. [Mar ’17]
జవాబు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంచి పర్యావరణ పరిస్థితులను కలిగి ఉంది. దీని కోస్తా తీర ప్రాంతము పొడవు దృష్ట్యా భారతదేశంలోనే రెండవది మరియు దక్షిణ భారత రాష్ట్రాలలో మొదటిది. ఇందులోని జీవ వైవిధ్యం, విభిన్నమైన జీవ జాతులను కలిగి దేశంలోనే ఒక ప్రత్యేకతను సంపాదించుకొన్నది. ఈ అమూల్య పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు:
1) పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు: సామాజిక అటవీ నిర్వహణ (CFM), జాతీయ నదుల పరిరక్షణ ప్రణాళికా కార్యక్రమం (NRCP) మరియు జాతీయ వృక్ష సంరక్షణ కార్యక్రమము (NAP) మొదలైన కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది.

2) చెట్టు – నీరు కార్యక్రమము: 2015లో రాష్ట్ర ప్రభుత్వం వృక్ష సంరక్షణ మరియు నీటి పరిరక్షణ కోసం ‘నీరు – చెట్టు’ పథకాన్ని అన్ని జిల్లాలో ఆరంభించెను. ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి, కనీసం 90 శాతం మొక్కలు బ్రతికేటట్లు పలు చర్యలను తీసుకోవడం జరుగుతుంది.

3) సాంప్రదాయేతర శక్తి: ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ వారు రాష్ట్రంలో సోలార్ మరియు పవన విద్యుత్ శక్తి మూలాలను వృద్ధి చెయ్యడం ద్వారా దేశంలోనే రాష్ట్రాన్ని ఒక పెద్ద “గ్రీన్ ఎనర్జి కారిడార్” గా మార్చుటకు నిర్ణయించిరి.

4) వన మహోత్సవం: 2013లో అటవీశాఖ వారు “రెండు మిలియన్ల మొక్కలను నాటే ఉద్దేశ్యంతో 64వ వన మహోత్సవాలను నిర్వహించారు. ఈ ఉత్సవములు అదే సమయంలో జిల్లా కేంద్రాలలోను జరుపుకున్నారు. సామాజిక అటవీ కార్యక్రమంలో ఇది ఒక భాగము.

5) వన్యమృగ సంరక్షణ: మొక్కలు, వృక్షాలు, జంతువులు మరియు పర్యావరణ వ్యవస్థలతో కూడిన జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుటకు ప్రభుత్వం 13 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు మరియు 3 జాతీయ పార్కులతో సహా 16 ప్రాంతాలను వన్యప్రాణి రక్షిత ప్రాంతాలుగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య సంరక్షణ సొసైటి (BIOSAP)ని ఏర్పాటు చేసి రాష్ట్రంలోని అన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల బాగోగులు చూసే బాధ్యతను అప్పగించారు. శ్రీశైలం జీవావరణ రిజర్వుని గుర్తించి నిర్వహిస్తున్నారు. స్థానిక కమిటీలతో పాటు ప్రభుత్వ కమిటీలు కూడా జీవావరణ నిర్వహణ ప్రణాళిక అంతిమ ఆమోదం కోసం కృషి చేస్తున్నాయి.

6) ప్రాజెక్ట్ టైగర్: మన జాతీయ జంతువు అయిన పులుల సంఖ్య పెంచే లక్ష్యంతో ప్రాజెక్ట్ టైగర్ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. కర్నూలు, ప్రకాశం మరియు గుంటూరు జిల్లాలో విస్తరింపబడిన నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు (NSTR) 50 కన్నా ఎక్కువ పులులకు నివాస స్థానంగా ఉంది.

7) పర్యావరణ విద్య: ప్రజలను ప్రకృతి పరిరక్షణపై జాగృతం చేయడానికి రాష్ట్రంలోని చాలా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, నేషనల్ పార్కుల వద్ద ప్రదర్శనశాలలు, వ్రాయబడిన బోర్డుల ప్రదర్శన, మిని ఆడిటోరియంలు మరియు లైబ్రరీల ద్వారా పర్యావరణ విద్యపై అవగాహన పెంచుతున్నారు.

ప్రశ్న 5.
ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ ప్రాధాన్యత. [Mar ’16]
జవాబు:
ఆంధ్రప్రదేశ్ “భారతదేశ కోహినూర్” గా మరియు పర్యాటకం విషయంలో దేశంలోనే గమ్యస్థాన రాష్ట్రంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గొప్ప రాజవంశాలకు, పవిత్ర దేవాలయాలకు, లోహపూత బొమ్మలు, నేతపని వస్తువులు, అమూల్య పాండిత్యము, కూచిపూడి నాట్యం వంటి మహోన్నత కళలకు గుర్తింపు పొందినది. రాష్ట్రం దాదాపు 300 పర్యాటక ప్రాంతాలలో అసంఖ్యాకంగా దేశీయ, విదేశీ పర్యాటకులను ఆదర్శిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDC) అనునది రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి తోడ్పడుతున్న ప్రభుత్వ ఏజెన్సీ సంస్థ. ఇది పర్యాటకంలో అవస్థాపనా సౌకర్యాల కల్పన మరియు వస్తువులను సృష్టిస్తుంది. ఈ డిపార్ట్మెంట్ రాష్ట్ర ఘన చరిత్ర మరియు గత స్మృతులను సూచించే విధంగా సాంస్కృతిక, వారసత్వ, ప్రకృతి, సాహస, ఆరోగ్య మరియు గ్రామీణ పర్యాటకాల ప్రత్యేక ప్యాకేజీలను రూపొందిస్తుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

పర్యాటకాన్ని ఆర్థికాభివృద్ధి ఇంజనుగా, ఆంధ్రప్రదేశ్ విజన్ -2020 భావిస్తున్నది. “ప్రపంచాన్ని ఆంధ్రప్రదేశ్కు తీసుకురావటం, ఆంధ్రప్రదేశ్ను ప్రపంచానికి తీసుకుపోవడం” అనే లక్ష్యాన్ని పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు మొదలు పెట్టింది. 2010లో నూతన పర్యాటక విధానాన్ని ప్రకటించింది. రాష్ట్రాన్ని పర్యాటక హిత గమ్యస్థానంగా మార్చుటకు చర్యలు మొదలు పెట్టిరి.

  1. తీర్ధయాత్ర పర్యాటకం
  2. వైద్య పర్యాటకం
  3. బుద్ధిస్ట్ పర్యాటకం
  4. సముద్ర తీర పర్యాటకం
  5. వ్యవసాయ పర్యాటకం
  6. పర్యావరణ పర్యాటకం
  7. విశ్రాంత పర్యాటకం.

రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాలు దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. అత్యధిక మంది దేశీయ, విదేశీ పర్యాటకులను ఏడుకొండలపై వెలసిన ప్రసిద్ధ వైష్ణవాలయం తిరుమలను కలిగి ఉన్న చిత్తూరు జిల్లా ఆకర్షించగలిగింది. దీని తర్వాత స్థానంలో ప్రసిద్ధ జ్యోతిర్లింగముతో పాటు, ఒకానొక శక్తి పీఠము కూడా అయిన శ్రీశైలం కారణంగా కర్నూలు జిల్లాను పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం, తిరుపతిలు ప్రధాన మరియు కర్నూలు, విజయవాడలు ద్వితీయ పర్యాటక గమ్యాలుగా గుర్తింపబడినవి.
అలాగే రాష్ట్రం నదీపర్యాటక కేంద్రాలను కూడా అభివృద్ధి చేస్తున్నది. ఉదాహరణకు గోదావరి నుండి పాపికొండల వరకు గోదావరి నదిపై నౌకా విహార కేంద్రం అయిన హరిత. ప్రస్తుతం ఐ.టి. రంగం మాదిరే పర్యాటక రంగం కూడా రాష్ట్ర ఖజానాకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది.

ప్రశ్న 6.
ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా లక్షణాలు. [Mar ’16]
జవాబు:
జనాభా: ఆంధ్రప్రదేశ్ 4.96 కోట్ల మొత్తం జనాభాతో, దేశ జనాభాలో 4.1 శాతంగా ఉండి జనాభా రీత్యా 10వ అత్యధిక జనాభా కల్గిన రాష్ట్రంగా ఉంది.
2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో జనాభా వృద్ధిరేటు 2011 నాటికి 11.89 శాతం నుండి 9.21 శాతానికి తగ్గినది.
మరో వైపు అదే కాలానికి దేశ జనాభా 4.3 రెట్లు పెరిగింది. దీనిని బట్టి దేశంలో కన్నా రాష్ట్రంలో జనాభా వృద్ధి వేగంగా తగ్గుతున్నట్లు అర్థం అవుతున్నది.

జనసాంద్రత: ఒక చదరపు కిలోమీటరు భూభాగంలో నివసించే సగటు ప్రజల సంఖ్యను జనసాంద్రత అనవచ్చు. జనసాంద్రత = ఆ ప్రాంత జనాభా / ప్రాంత భూభాగం చదరపు కిలోమీటర్లలో.

కాబట్టి రాష్ట్ర సౌభాగ్యం లేక పేదరికానికి జనసాంద్రత ఒక సూచికగా పనిచేస్తుంది.

కాని 1971 తర్వాత జాతీయ సగటు జనసాంద్రత కన్నా తక్కువ స్థాయిని రాష్ట్రం నమోదు చేస్తున్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనసాంద్రత 1 చ.కిమీ. కు 304 మంది ఉండగా, దేశం మొత్తంలో 382 చ.కి.మీ.కు జనసాంద్రత ఉంది.

రాష్ట్రంలోని జిల్లాలను పరిశీలిస్తే కృష్ణాజిల్లా అత్యధికంగా 518 మందితోను, పశ్చిమ గోదావరి 470 మందితోను మొదటి రెండు స్థానాలలో నిలిచాయి.

పురుష నిష్పత్తి: భారతదేశంలో లాగానే ఆంధ్రప్రదేశ్లో కూడా జనాభా సరళి పురుష జనాభాకు అనుకూలంగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ప్రతి 1000 మంది పురుషులకు 997 మంది స్త్రీలు ఉన్నారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి మరియు కృష్ణా జిల్లాలలో పురుషుల సంఖ్య కన్నా స్త్రీల సంఖ్య ఎక్కువ. విజయనగరం జిల్లాలో ప్రతి 1000 పురుషులకు అత్యధికంగా 1019 మంది స్త్రీలు ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద 13 జిల్లాలలో అనంతపురం జిల్లాలో అతి తక్కువ స్త్రీ, పురుష నిష్పత్తి ప్రతి 1000 పురుషులకు కేవలం 977 మంది స్త్రీలు ఉన్నారు.

వయసు ఆధారిత జనాభా: ఒక దేశంలో కాని, ప్రాంతంలో కాని మొత్తం జనాభాలో పనిచేయగల శ్రామిక శక్తిని ఇది తెలియజేస్తుంది. వయస్సు ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభాను మూడు తరగతులగా విభజించవచ్చు. అవి 0-14, 15-59 మరియు 60 సంవత్సరాలు మరియు ఆపైన వయస్సు ఉన్న వారి తరగతి. జననరేట్లు అధికంగా ఉండడం, శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గడం వల్ల బాలల శాతం ఎక్కువగా ఉంటుంది.

గ్రామీణ – పట్టణ జనాభా: గ్రామీణ పట్టణ జనాభా అధ్యయనము జనాభా యొక్క జీవన సరళిని ప్రతిబింబిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా భారతదేశంలో మాదిరి అధిక జనాభా గ్రామాలలోనే నివసిస్తున్నది.

2011 అంచనాల ప్రకారం విశాఖపట్నం అత్యధిక పట్టణ జనాభా 47.45 శాతము కలిగి ఉంది. కృష్ణాజిల్లా 40.81 శాతంతో రెండవ స్థానంలో ఉంది.

అక్షరాస్యత: అక్షరాస్యత ప్రజల యొక్క చదవగల, వ్రాయగల నైపుణ్యం. ఇది ఒక మంచి విద్యా వ్యవస్థకు కావలసిన కనీస అవసరం. ఒక ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి వేగానికి, అక్షరాస్యత స్థాయికి ధనాత్మక సంబంధం ఉన్నట్లు గుర్తింపబడినది.

ఆంధ్రప్రదేశ్ అటు స్త్రీ అక్షరాస్యతలోను, పురుష అక్షరాస్యతలోను, ఇటు మొత్తం అక్షరాస్యత రేటులో భారత అక్షరాస్యత రేటు కన్నా వెనుకబడి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర అక్షరాస్యత రేటు 67.41. ఇందులో 74.83 శాతం పురుష అక్షరాస్యత కాగా, 60.01 శాతం స్త్రీ అక్షరాస్యత. అంటే జాతీయ అక్షరాస్యత రేటుకన్నా రాష్ట్ర అక్షరాస్యత 5.58 శాతం ఎక్కువ.

ప్రశ్న 7.
రాష్ట్రంలోని వివిధ వర్గాల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలు/కార్యక్రమాలు: ఏ సంక్షేమ రాజ్య లక్ష్యమైన తన ప్రజల జీవన ప్రమాణాన్ని కొనసాగించడం లేదా ఇంకా మెరుగుపరచడమే. చాలాకాలం వరకు ఆర్థికాభివృద్ధికి వ్యవసాయ, పరిశ్రమలు ప్రధాన వాహకాలుగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం మానవ వనరుల అభివృద్ధికి ఉన్న ప్రాధాన్యత వల్ల సామాజిక రంగ అవస్థాపన సౌకర్యాలైన విద్య, ఆరోగ్య సంరక్షణ, పౌష్టికాహారం, నీటి సప్లయి, గృహవసతి, సామాజిక రక్షణ వంటి వాటిని మెరుగుపరచడము ద్వారానే సాధ్యం అవుతుంది. సమాజంలో సామాజిక న్యాయం, సామాజిక సమానత్వాలు సాధించాలంటే ఈ సాంఘిక అంశాలపై ప్రభుత్వం పెట్టుబడులు పెరగాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సాంఘిక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
SGDP
జవాబు:
ఒక సంవత్సర కాలంలో రాష్ట్ర భౌగోళిక ఎల్లల్లో ఆర్థిక కార్యకలాపాల వల్ల ఉత్పత్తి అయిన మొత్తం వస్తు సేవల అంతిమ విలువను రాష్ట్ర స్థూల అంతర్గత ఆదాయం అంటారు. రాష్ట్ర స్థూల అంతర్గత ఆదాయాన్ని ‘రాష్ట్ర ఆదాయం’ గా కూడా పేర్కొనవచ్చు. దీనిని రాష్ట్ర ఆర్థిక గణాంకశాఖ అంచనా వేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలోని

  1. ప్రాథమిక రంగం.
  2. పారిశ్రామిక రంగం.
  3. సేవారంగం నుంచి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి లభిస్తుంది.

ప్రశ్న 2.
ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత.
జవాబు:
ఒక చదరపు కిలోమీటరు భూభాగంలో నివసించే సగటు ప్రజల సంఖ్యను జనసాంద్రత అనవచ్చు. జనసాంద్రత = ఆ ప్రాంత జనాభా / ప్రాంత భూభాగం చ.కిమీ.లలో.
రాష్ట్ర సౌభాగ్యం లేక పేదరికానికి జనసాంద్రత ఒక సూచికగా పనిచేయును.

ప్రశ్న 3.
ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత.
జవాబు:
అక్షరాస్యత అనగా ప్రజల యొక్క చదవగల, వ్రాయగల నైపుణ్యం. ఒక ఆర్థికవ్యవస్థ అభివృద్ధి వేగానికి, అక్షరాస్యత స్థాయికి ధనాత్మక సంబంధం ఉన్నట్లు గుర్తింపబడింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర అక్షరాస్యత 67.11%. ఇందులో పురుష అక్షరాస్యత 74.83% మరియు స్త్రీ అక్షరాస్యత 60.01%.

ప్రశ్న 4.
ప్రాజెక్ట్ టైగర్. [Mar ’16]
జవాబు:
మన జాతీయ జంతువు అయిన పులుల సంఖ్య పెంచే లక్ష్యంతో ప్రాజెక్ట్ టైగర్ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. కర్నూలు, ప్రకాశం మరియు గుంటూరు జిల్లాలలో విస్తరింపబడిన నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు (NSTR) 50 కన్నా ఎక్కువ పులులకు నివాస స్థానంగా ఉంది.

ప్రశ్న 5.
సర్వశిక్ష అభియాన్.
జవాబు:
రాష్ట్రంలో 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు అందరికీ ఉపయోగపడే విధంగా ప్రాథమిక విద్యను కల్పించడానికి 2001-02లో సర్వశిక్ష అభియాన్ పధకాన్ని ప్రవేశపెట్టారు. సామాజిక నిర్వహణ పాఠశాలల ద్వారా సాంఘీక ప్రాంతీయ లింగపరమైన వ్యత్యాసాన్ని తగ్గించడం కోసం సర్వశిక్ష అభియాన్ కృషి చేస్తుంది. ప్రస్తుతం దీని పేరు “రాజీవ్ విద్యామిషన్” గా మార్చారు.

ప్రశ్న 6.
ఏదేని సంక్షేమ పథకం.
జవాబు:
A.P. ప్రభుత్వం అనేక సాంఘిక సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నది. అవి: మహిళల కోసం జననీ సురక్ష యోజన, వెనుకబడిన తరగతులకు బి.సి. వసతి గృహాలు, మైనారిటీలకు ఉర్దూ అకాడమీ, గిరిజనులకు ఐ.టి.డి.ఎ., యువతకు TRYSEM పథకం మొదలగునవి.

ప్రశ్న 7.
పర్యావరణ పర్యాటకం. [Mar ’17]
జవాబు:
ఆంధ్రప్రదేశ్ ప్రధాన పర్యావరణ పర్యాటక బిందువుగా కూడా ఉంది. మారేడుమిల్లు; నేలపట్టు; మాయందూర్; తలకోన, ఎత్తిపోతలు మొదలగునవి ప్రముఖ పర్యావరణ పర్యాటక కేంద్రాలు.

ప్రశ్న 8.
ఆంధ్రప్రదేశ్లో పౌర విమానయానం.
జవాబు:
రాష్ట్రంలో ప్రాంతాల మధ్య మెరుగైన అనుసంధానం కోసం మరియు ఆర్థికాభివృద్ధిని వేగతరం చేసే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం “ప్రాంతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు ప్రతిపాదన తయారు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ, తిరుపతి, కడప మరియు రాజమండ్రి ఎయిర్పోర్టులను మెట్రోయేతర ఎయిర్పోర్టులుగా ఆధునికరించుటలో ఎయిర్పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా (AAI) తో తాఖీదు కుదుర్చుకుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 9.
ఆంధ్రప్రదేశ్లో రోడ్డుమార్గాలు.
జవాబు:
రోడ్లు ప్రాథమిక రవాణా వ్యవస్థలో ముఖ్యమైనవే కాకుండా అత్యంత కీలకమైన అవస్థాపనా సౌకర్యం ఆంధ్రప్రదేశ్లో 42,511 కి.మీ.లలో రాష్ట్ర రహదార్లు 3,144 కి.మీ.ల, జాతీయ రహదార్లు 1,01,484 కి.మీ.లలో జిల్లాలను కలుపుకొని 1,46,954 కి.మీ. విస్తారమైన నెట్వర్క్ కలిగి ఉంది. దీనిని రాష్ట్ర రోడ్డు రవాణా అభివృద్ధి సంస్థనే నిర్వహణ బాధ్యత కల్గి ఉంటుంది.

ప్రశ్న 10.
ఆంధ్రప్రదేశ్లో నౌకా కేంద్రాలు. [Mar ’17, ’16]
జవాబు:
సముద్ర తీర ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది. విశాఖ ఓడరేవు రాష్ట్రంలో అతిపెద్దదే కాకుండా | అండమాన్ నికోబార్ దీవులలోని పోర్టబ్లెయిర్కు ప్రయాణికుల సముద్ర యాత్రా వసతి కూడా కలదు. కృష్ణపట్నం, గంగవరం, కాకినాడ రేవులు రాష్ట్రంలోని ప్రధాన ఓడరేవులు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Economics Study Material 8th Lesson పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి Textbook Questions and Answers.

AP Inter 2nd Year Economics Study Material 8th Lesson పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
‘పర్యావరణం’ అంటే ఏమిటో నిర్వచించి, పర్యావరణం యొక్క అనుఘటకాలను గురించి వివరించండి.
జవాబు:
ఎన్విరాన్మెంట్ (పర్యావరణం) అన్న ఆంగ్లపదాన్ని “ఎన్విరానర్” అనే ఫ్రెంచిపదం నుంచి గ్రహించడం జరిగింది. “ఎన్విరాన్” అంటే “చుట్టూ ఉన్న” అని అర్థం. మన చుట్టూ ఆవరించి ఉన్న ప్రతి విషయాన్ని సమిష్టిగా పర్యావరణం (ఎన్విరాన్మెంట్) అని పిలువవచ్చు.

జీవరాశిని ప్రభావితం చేస్తూ వున్న సజీవ, భౌతిక మూలపదార్థాల కలయికనే ‘పర్యావరణం’ అని చెప్పవచ్చు. పర్యావరణం-భావనలు:1969లో అమెరికా జాతీయ పర్యావరణ విధాన చట్టం (National Einvironmental Policy Act (NEPA) ప్రకారం పర్యావరణం భౌతిక, సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక మరియు సౌందర్యపరమైన పర్యావరణాలుగా విభజింపబడి ఉంటుంది. రావ్ మరియు ఊటెన్లు పర్యావరణాన్ని నాలుగు విధాలుగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పారు.

1) భౌతిక పర్యావరణం:ఇది భౌతిక, రసాయన మరియు జీవ అంశాలైన భూమి, వాతావరణం, వృక్షసంపద, వన్యమృగాలు, చుట్టుప్రక్కల ఉన్న భూమి మరియు దాని స్వభావము, అవస్థాపనా సౌకర్యాలు, గాలి మరియు శబ్ద కాలుష్యస్థాయి మొదలైన వాటిని కలిగి ఉంటుంది.

2) సాంఘీక పర్యావరణం: ఇందులో జనాభా మరియు జనసాంద్రత, సామాజిక కూర్పు, మతపరమైన, విద్యాపరమైన, సామాజిక సౌకర్యాలు అంటే పాఠశాలలు, ఉద్యానవనాలు, వైద్యశాలలు, వినోదాత్మక మరియు సాంస్కృతిక సౌకర్యాలు వంటి అనేక అంశాలు అంతర్భాగమై ఉంటాయి.

3) ఆర్థిక పర్యావరణం:ఆర్థికాంశాలైన ఉద్యోగిత, నిరుద్యోగం, ఆదాయవనరులు, ఉత్పత్తి కారకాల లభ్యత, డిమాండులో మార్పులు, పేదరిక స్థాయి మొదలైనవి ఇందులో ఉంటాయి.

4) మనోహరమైన పర్యావరణం: ఇందులో చారిత్రాత్మక, పురావస్తు, శిల్పసంపదకు సంబంధించిన ప్రదేశాలు, ప్రకృతి దృశ్యాలు, సుందర ప్రదేశాలు ఉంటాయి. ప్రజలు వీటిని చూసి ఆహ్లాదం పొందుతారు.

పర్యావరణంలో అనుఘటకాలు వైవిధ్యమైనవే గాక ఒకదాని మీద మరొకటి ఆధారపడి పరస్పరం ప్రభావితం చేస్తూ, ప్రభావితమవుతూ ఉంటాయి. కాబట్టి పర్యావరణం అనేది ఒక సంపూర్ణమైన అన్ని శాఖలు కలిసిన విజ్ఞానశాస్త్ర అధ్యయనమని చెప్పవచ్చు.

పర్యావరణం – అనుఘటాలు:మన చుట్టూ పర్యావరణం జీవ, నిర్జీవ అనుఘటాలను, వాటి పరస్పర ఆధారిత పరస్పర ప్రభావితాలను కలిగి ఉంది. ఈ విషయాలన్నింటి అధ్యయనాన్నే ‘జీవావరణ శాస్త్రం’ అంటారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

1) జీవావరణ వ్యవస్థ (Eco system):ఇంగ్లాడుకు చెందిన ఎ.జి. ట్రాన్సీ అనే జీవావరణ శాస్త్రవేత్త 1935లో మొదటిసారి ‘జీవావరణం’ అనే పదాన్ని ఉపయోగించెను. జీవావరణం అనునది ఒక నిర్ధిష్ట మరియు గుర్తించదగిన భూమి యొక్క భాగము అంటే అడవులు, గడ్డిమైదానాలు, ఎడారులు, తీరప్రాంతాలు మొదలైనవి అని అర్థం. పర్యావరణంలోని వృక్షాలు మరియు జంతువులతో కూడిన జీవపర భాగాలతో పాటు నిర్జీవ భాగాలన్నింటినీ కలిపి ‘జీవావరణం’ అనవచ్చు. ఇది ఆ ప్రాంతంలోని మొక్కలు, వృక్షాలు, జంతువులు, చేపలు, సూక్ష్మజీవులు, నీరు, నేల మరియు మానవులందరి కలయిక, ఇటువంటి జీవావరణంలో కూడా ‘వృద్ధి-క్షయం’ అనే సూత్రం వర్తించి జీవ, నిర్జీవకాలు సృష్టింపబడి తిరిగి నశింపజేయబడుతూ ఒక విధమైన సంతులిత స్థితి నిర్వహింపబడుతుంది. దీనినే ‘జీవావరణ స్థిరత్వం’ అని అంటారు.

2) జీవ వైవిధ్యం (Biodiversity):జీవవైవిధ్యం అన్న పదం 1986లో అమెరికా శాస్త్రవేత వాల్టర్ రోసెన్ ప్రతిపాదించారు. భూమి జీవరాశులకు నిలయం. జీవరాశులు రకరకాల రంగులు, ఆకారాలు, ఆకృతులు, నిర్మాణాలను కలిగి ఉంటాయి. జన్యువులు, పర్యావరణం మరియు ఆవరణ వ్యవస్థలు కలిసి జీవరాశుల్లో ఉండే వైవిధ్యానికి, సంక్లిష్టతకు కారణమవుతున్నాయి.

జీవవైవిధ్యానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగాను అనేక ప్రయోజనాలుంటాయి. ప్రత్యక్షంగా ‘జీవ వైవిధ్యం’ మనకు ప్రాణాన్ని కాపాడే మందులు, ఆహారం, హార్మోన్లు, ఎంజైములు, పరిశ్రమలకు కావలసిన ముడి పదార్థాలు, అలంకరణకు పనికి వచ్చే తీగలు, మొక్కలు, మొదలైన వాటిని అందిస్తుంది.

జీవ వైవిధ్యం పరోక్షంగా కూడా ప్రయోజనాలను కలిగిస్తుంది. కర్బన స్థాయిని స్థిరపరచడం పరపరాగ సంపర్కం, జన్యు ప్రవాహం, నీటి వలయాలను నిర్వహించడం, భూగర్భజలాలను తిరిగి నింపడం, నేలను రూపొందించడం, పోషక వలయాలను స్థిరీకరించడం, కాలుష్యాలను విలీనం చేసుకోవడం, వాతావరణాన్ని క్రమపరచడం, సహజ పర్యావరణం అందించే రససౌందర్య, మానసోల్లాసాన్ని సంరక్షించడం మొదలయిన ఎన్నో రకాల పరోక్ష ప్రయోజనాలు మనకు జీవ వైవిధ్యం వల్ల లభిస్తాయి.

3) గ్రీన్ హౌస్ ప్రభావం:భూగ్రహంపై ఉన్న వాతావరణం కార్బన్ డై ఆక్సైడ్, నీటి ఆవిరి మరియు మీథైన్ వంటి కొన్ని రకాల వాయువులు ఎక్కువైన కారణంగా సూర్యుని నుండి విడుదల అయ్యే రేడియేషన్ని తమ ద్వారా లోపలికి రానిస్తాయి. కాని తిరిగి ఆ రేడియేటడ్ ఉష్ణాన్ని అట్టి పెట్టుకొని భూ ఉపరితలం నుండి బయటికి పోనివ్వవు. ఈ ప్రక్రియ వల్ల భూ ఉపరితలము ఉష్ణవికిరణాన్ని గ్రీన్ హౌస్ వాయువుల సహాయంతో గ్రహించి అన్ని’ దిశలకు వ్యాపింపచేస్తుంది. అలా కొంతభాగం తిరిగి భూమి వైపుకు, వాతావరణ దిగువ పొరలకు చేర్చబడి ఫలితంగా సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఇటువంటి గ్రీన్ హౌస్ వల్ల ఉష్ణపెరగడం, వాతావరణం మార్పులు, ఋతుపవన గమనం మరియు వాటి సామర్థ్యం మొదలైనవి జరుగుతాయి.

4) భూమి వేడెక్కుట (Global Warming):హరితగృహ వాయులైన కార్బన్ డై ఆక్సైడ్ వాటి వల్ల భూ ఉపరితల ఉష్ణోగ్రత రోజురోజుకి పెరుగుతుంది. ఈ కార్బన్ డై ఆక్సైడ్ ముఖ్యంగా శిలాజ ఇంధనాలు మండించుట ద్వారా, అడవుల నరికివేత వల్ల ఎక్కువగా వెలువడుతుంది. దీని ప్రభావంతో ఉష్ణం గ్రహింపబడి తిరిగి భూమి నుండి పరావర్తనం చెందకుండా భూమిపైనే ఉండిపోతుంది. దీని వల్ల గత శతాబ్దం నుంచి భూ వాతావరణ ఉష్ణోగ్రత 1.1°F పెరిగింది మరియు సముద్ర మట్టము కూడా కొన్ని ఇంచుల దాకా పెరిగింది. భూమి వేడెక్కడం వల్ల వచ్చే దీర్ఘకాల ఫలితాల్లో ముఖ్యమైనవి ధృవ ప్రాంతపు మంచు కరగడం, తద్వారా సముద్ర మట్టాలు పెరిగి, తీర ప్రాంతాలు ముంపుకు గురికావడం, కొన్ని రకాల జీవులు నశించి జీవ సమతుల్యం దెబ్బతినడం, ఉష్ణ ప్రాంతాలకు తుఫాన్లు రావడం మొదలగునవి జరుగుతాయి.

5) ఆమ్ల వర్షాలు (Acid Rain):ఆమ్ల వర్షం అనగా వాతావరణంలోని నైట్రిక్, సల్ఫ్యూరికామ్లాలు ఉండవల్సిన స్థాయి కంటే ఎక్కువగా ఉండి తద్వారా పడే రసాయనిక వర్షాలే. ఇవి వృక్షజాలము తగ్గిపోవుటచే సహజ కారణాల వల్ల మరియు సల్ఫ్యూరిక్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లను ఎక్కువగా విడుదల చేసే వాహనాలు వాడటం వంటి మానవ చర్యల వల్ల ఏర్పడుతాయి. ఆమ్ల వర్షాలు మొక్కల పెరుగుదలను అడ్డుకొని అవి చనిపోయేలా చేస్తాయి. కాబట్టి ఆమ్ల వర్షాల వల్ల వ్యవసాయం, అడవులు దెబ్బతింటాయి. అంతేగాక నీటిలో జీవించే జీవరాశులకు హానికరంగా మారుతాయి. శిల్పాలు, భవనాలు, వాహనాలు, పైపులు, కేబుల్ వైర్లు కూడా దీనికి ప్రభావితమవుతాయి. ఆమ్ల వర్షాల వల్ల సున్నితంగా వుండే సున్నపురాయి, ఇసుకరాయి కట్టడాలు తీవ్రంగా దెబ్బతింటాయి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

6) ఓజోన్ పొర క్షీణత:స్ట్రాటో ఆవరణంలో ఓజోన్ 03 తగ్గిపోవుటను ఓజోన్ క్షీణత అంటారు. ఈ ప్రాంతంలో హానికర క్లోరైన్ మరియు బ్రోమైన్ సంబంధ మూలాలు పెరగడం వల్ల ఓజోన్ క్షీణించడం లేక మందం తగ్గడం లేక రంధ్రాలు ఏర్పడడం జరగుతుంది. పర్యావరణ కాలుష్యం వల్ల ఓజోన్ పొర కృశించి, రంధ్రాలు ఏర్పడతాయి.

ప్రశ్న 2.
ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణానికి మధ్యగల సంబంధాన్ని వివరించండి.
జవాబు:
జీవరాశిని ప్రభావితం చేస్తూ, ఉన్న సజీవ, భౌతిక మూల పదార్థాల కలయికనే పర్యావరణం అని చెప్పవచ్చు. పర్యావరణం ఆర్థిక వ్యవస్థకు అవసరమైన ముడిసరుకులను సరఫరా చేయడమే కాక ఆర్థిక వ్యవస్థనుండి ఉత్పన్నమయ్యే వ్యర్థపదార్థాలను తనలో విలీనం చేసుకుంటుంది.

ఆర్థిక వ్యవస్థ అనగా నిరంతరం పెరిగిపోయే కోర్కెలను సంతృప్తి పరచడానికి అవసరమయ్యే వస్తు సముదాయాన్ని అందుబాటులో ఉన్న పరిమిత వనరుల సహాయంతో ఉత్పత్తి చేయటానికి రూపొందించుకున్న సముచితమైన సంవిధానాన్ని ఆర్థిక వ్యవస్థగా చెప్పవచ్చు.

పర్యావరణం ఒక వైపు ఆర్థిక వ్యవస్థకు అవసరమైన ముడి పదార్థాలు సప్లయి చేయడమే కాకుండా మరో వైపు ఆర్థిక వ్యవస్థ విడుదల చేసే వ్యర్థాలను సంగ్రహిస్తుంది. ఆధునిక కాలంలో ఆర్థిక కార్యకలాపాలు నిర్లక్ష్యంగా దోపిడి తత్వంతో పెరిగిపోయి పర్యావరణ సామర్థ్యాన్ని, అది సప్లయి చేయగల వనరులను ప్రభాతం చేయును. అలాగే వ్యర్థాలను సంగ్రహించగల పర్యావరణ సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తుంది. 1966లో బ్రిటీష్ ఆర్థికవేత్త ఇ. బిల్లింగ్ పర్యావరణ వనరులను విపరీతంగా వాడుకోవడం ఎంతో ప్రమాదకరమని హెచ్చరించారు.

ఆయన ఉద్దేశ్యంలో “ఈ ప్రపంచం పరిమిత జీవనాధార వనరులు కల్గిన ఒక పాత్ర వంటిది. కాబట్టి మానవాళి వనరుల వినియోగాన్ని గరిష్టంకాకుండా ఎంత కనిష్టం చేసుకుంటే అంత మంచిది. ఆర్థిక కార్యాకలాపాలు పర్యావరణంపై ఒత్తిడి ఎలా కలిగిస్తాయో ఈ క్రింది పటం తెలియజేయును.

పర్యావరణం మరియు ఆర్థిక కార్యకలాపాలు
AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి 1
పై పటంలో పర్యావరణ సహజ వనరులను వివిధ ఆర్థిక రంగాలైన వ్యవసాయ పారిశ్రామిక మరియు సేవారంగాలకు వనరులను ముడి పదార్థాల రూపంలో పంపిణీ చేస్తుంది. ఈ రంగాలు వనరులు ఉపయోగించుకొని వస్తు సేవలను ఉత్పత్తి చేస్తున్నాయి. వస్తు సేవల ఉత్పత్తి పర్యావరణ పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఉత్పత్తి పెరిగినప్పుడు పర్యావరణ భౌతిక ఉపయోగం పెరిగి, పర్యావరణ పరిమాణం తగ్గుతూ వస్తుంది. మరోవైపు ఆర్థిక కార్యకాలాపాలు పర్యావరణంలోకి వ్యర్థ పదార్థాలను మరియు వివిధ రూపాలలోని కాలుష్యాన్ని వదలుతున్నాయి. ఇది పర్యావరణ నాణ్యతను దెబ్బతీస్తుంది. ఇది పర్యావరణం యొక్క కాలుష్యాన్ని గ్రహించే శక్తిని కోల్పోయేలా చేస్తుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

ప్రశ్న 3.
గాలి కాలుష్యం అంటే ఏమిటి ? అందుకు గల కారణాలు, ఫలితాలు తెల్పండి.
జవాబు:
కాలుష్యం – రకాలు:పర్యావరణానికున్న స్వాభావిక లక్షణాల్లో భౌతికంగా, రసాయనికంగా లేదా జీవపరమైన అవాంఛనీయ పరిమాణాలు కలిగితే దాన్ని కాలుష్యం అంటారు. పర్యావరణంలోని కాలుష్యం వివిధ రకాలుగా ఉంటుంది. వాటిలో వాయు, జల, నేల, శబ్ద, ఘనవ్యర్థ పదార్థాల, ఉష్ణకాలుష్యాలు ప్రధానమైనవి.

గాలిలో ఇతర కాలుష్యకారక పదార్థాల గాఢత ఎక్కువైపోయి మానవుని శ్రేయస్సును, జీవకోటికి మరియు వివిధ రూపాలలో వున్న ఆస్తులపై ప్రతికూల ప్రభావం చూపడాన్ని ‘వాయు లేక గాలి కాలుష్యం’ అంటారు.

1) వాయు కాలుష్యం:మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఎన్నో రకాలైన వాయువులు ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్ డై ఆక్సైడ్, నైట్రోజన్ మొదలయినవి ఆవరించి ఉంటాయి. భూమి చుట్టూ ఉన్న వాతావరణం ఇలాంటి వాయువుల కలయికతో ఏర్పడి, ఉమ్మడిగా వీటన్నంటిని కలిపి ‘వాయువు’ (గాలి) అని సామాన్య అర్థంగా పిలుస్తుంటారు. బరువు దృష్ట్యా చూస్తే మానవుడు రోజు తీసుకొనే పదార్థాల్లో 80% వరకు గాలి ఉంటుంది. మనుషులు సగటున ఒకరోజుకు 2200 సార్లు శ్వాసిస్తూ ఒక రోజులో సుమారు 16 నుంచి 20 కి.గ్రాల గాలిని పీల్చుకుంటూ ఉంటారు. అన్ని జీవరాశుల శ్వాసక్రియ ఈ వాయువు మీదనే ఆధారపడి ఉంటుంది. కాని మానవుని వివిధ కార్యకాలాపాల వల్ల గాలి కాలుష్యం కాబడి, అందులోని వివిధ వాయువుల సహజసిద్ధమైన కూర్పు భంగము చేయడుతుంది. కాలుష్యం వల్ల ప్రాణికోటికి అవసరమైన ప్రాణవాయువు తగ్గిపోయి, హానికారక బొగ్గుపులుసు వాయువు (కార్బన్ డై ఆక్సైడ్) మరియు నత్రజని (నైట్రోజన్) స్థాయిలు పెరిగిపోతాయి.

వాయు కాలుష్యం కారణాలు:ప్రస్తుత అంచనాల ప్రకారం సగటున ఒక సంవత్సరానికి 2 బిలియన్ టన్నుల వాయు కాలుష్య కారకాలు విడుదలవుతున్నాయి.
1) వాయు కాలుష్యం సహజమైన, మానవ నిర్మితమైన ఆధారాల వల్ల జరుగుతూ ఉంటుంది.

2) వంట చెరుకును కాల్చడం, శిలాజ ఇంధనాలను వాడడం, పారిశ్రామికీకరణ, పంటలసాగు, వాహన విసర్జకాలు, న్యూక్లియర్ పరీక్షలు, అడవులు నాశనమైపోవడం, గనుల తవ్వకం, విద్యుత్పత్తి, శీతలీకరణ పరిశ్రమలు మొదలగునవి వాయు కాలుష్యానికి ముఖ్య కారణాలు.

వాయు కాలుష్యం ప్రభావాలు:వాయు కాలుష్యం ప్రజలను, మొక్కలను, జంతువులను, జలచరాలను, ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. మానవుల ఆరోగ్యాన్ని తారుమారు చేస్తుంది. చెట్ల, మొక్కల ఆకులను పాడుచేస్తుంది. కిరణజన్య సంయోగక్రియ సరిగ్గా జరగనీయదు. మొక్క వృద్ధిని అడ్డుకుంటుంది. చారిత్రాత్మక కట్టడాలను వర్ణవిహీనం చేస్తుంది. ఇండ్లు, కార్లులాంటి వాటికుండే వెలుపలి రంగులు పేలవంగా తయారుచేస్తుంది. సహజమైన అందాలను కలిగిన ప్రదేశాల స్వచ్ఛతను, నాణ్యతను క్షీణింపచేస్తుంది.

ఉదా:ప్రసిద్ధ కట్టడం తాజ్మహల్ తెల్లటి పాలరాయి 1998లో పసుపు రంగులోకి మారడం ప్రారంభించింది. ఈ మార్పు ప్రమాదస్థాయిని కూడా మించిపోయింది. వాయుకాలుష్యం స్ట్రాటోస్పియరు, శీతోష్ణస్థితిని తారుమారు చేసి భూతాపానికి ఆమ్ల వర్షాలకు, ఓజోన్ పొర క్షీణతకు, ఉష్ణోగ్రతలు పెరుగుదలకు కరువులు రావడానికి, మొక్కల, పంటల క్రిమికీటకాల, పశువుల స్వాభావిక లక్షణాలు మారిపోవడానికి, అతినీలలోహిత కిరణ ధార్మికతకు కారణమవుతూ ఉంటుంది.

ప్రశ్న 4.
నీటి కాలుష్యానికి కారణాలు, దాని ప్రభావాలను తెలపండి.
జవాబు:
నీటి కాలుష్యం:నీటిని ‘నీలి బంగారం’ అంటారు. జీవరాశులకు గాలి, ఎండ, ఎంత అత్యవసరమో నీరు కూడా అంతే అవసరం. మానవుని శరీర బరువులో 70 శాతం నీరు ఉంటుంది. భూమి ఉపరితంలో 80 శాతం వరకు నీరు ఆక్రమించి ఉంది. భూమి మీద ఉండే నీటిలో 97 శాతం “కు సముద్రాల్లో ఉంటుంది. మిగతా 3 శాతం మాత్రమే స్వచ్ఛమైన నీరు. అందులో 2.997 శాతం మంచు డ్డ డ లో ఉంది. మిగతా 0.003 శాతం చాలా కొద్ది పరిమాణంలో మాత్రమే మానవాళి ఉపయోగానికి లభిస్తోంది. కాబట్టి నీరు అత్యంత విలువైన వనరుగా పరిగణించబడుతోంది. నీరు లేకపోతే ఈ భూమి మీద అసలు జీవమే ఉండదు. సెలయేళ్ళు, సరస్సులు, చెరువులు, నదులు, సముద్రాలు, ఆనకట్టలు, జలధారల్లో నిల్వచేసిన నీరు మొదలైనవి ఉపరితల నీటి వనరులు. భూమి లోపల ఇంకిపోయిన బావులు, గొట్టపు బావుల ద్వారా లభించే నీటిని భూగర్భజలం అంటారు. ఆర్థిక కార్యకలాపాల్లోని ప్రతిదశలో నీరు చాలా అవసరం.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

కొన్ని పదార్థాలు గాని, కారకాలు గాని, నీటిలో ఎక్కువగా చేరిపోయి, నీటి యొక్క స్వచ్ఛతను తగ్గించివేసి దానిని ఆరోగ్యానికి హానికరంగాను, వాడుకోవడానికి కూడా పనికి రాకుండా మార్చివేస్తాయి. దానినే నీటి కాలుష్యంగా చెప్పవచ్చు. మానవ ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతుండటంతో, నీరు వినియోగానికి కూడా పనికిరానంతగా కలుషితమవుతుంది. నీరు నాణ్యతను కోల్పోయి, వ్యవసాయానికేకాక, త్రాగటానికి కూడా పనికిరాకుండా పోతుంది. ఆర్థిక కార్యకాలాపాలు విస్తరించడంతో ఉపరితంలో ఉన్న నీరే కాకుండా భూగర్భ జలం కూడా కలుషితమౌతుంది.

నీటి కాలుష్యం – కారణాలు:గృహాలలో వ్యర్థాలు, మానవ వ్యర్థాలు, మేటవేయడం, పారిశ్రామిక వ్యర్థాలు, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారకాలు, ప్రమాదవశాత్తు సముద్రంలో చిందిపోయే నూనెలు, విషపూరితమైన లోహాల మూలకాలు, గనుల తవ్వకం వల్ల వచ్చే వ్యర్థాలు, మొదలగు వాటి వల్ల నీరు కలుషితమవుతుంది.

నీటి కాలుష్యం – ప్రభావాలు :

  1. నీటి నుంచి పుట్టే వ్యాధులను వ్యాపింపచేస్తుంది. తద్వారా వైద్యఖర్చుల రూపంలో అధిక ఆర్థిక భారం మోపుతుంది.
  2. త్రాగు నీటి స్వచ్ఛతను క్షీణింపచేస్తుంది. ఆర్థిక కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా ఉపయోగించడానికి కూడా పనికిరాకుండా పోతుంది.
  3. సముద్ర ఉత్పత్తులు కలుషితమై తినడానికి వీలులేని ప్రమాదకరమైనవిగా మార్చేస్తుంది. తద్వారా ఎగుమతులు తగ్గి, విదేశీ మారక ద్రవ్యం కూడా తగ్గుతుంది.
  4. నీటిలోని ఆక్సిజన్ని తగ్గిస్తుంది. అది సముద్ర వాతావరణంలోని ఉష్ణోగ్రత మార్పునకు దారి తీసి, నీటిలో జీవించే జీవుల పునరుత్పత్తి తద్వారా దేశ సముద్ర ఉత్పాదక విలువను ప్రభావితం చేస్తుంది.
  5. మానవులు పనిచేసే రోజులు అనారోగ్యం వల్ల తగ్గిపోతాయి. తద్వారా ఉత్పత్తి కార్యక్రమాలు తగ్గిపోతాయి.

ప్రశ్న 5.
‘ధ్వని కాలుష్యం’ అంటే ఏమిటో నిర్వచించి, అది పర్యావరణ స్వచ్ఛతను ఎలా కలుషితం చేస్తుందో వివరించండి.
జవాబు:
ధ్వని కాలుష్యం కారకాలు:ధ్వని కాలుష్యం (ఇంట, బయటా) ఉంటుంది. గృహోపకరణాల వాడకం వల్ల, లౌడ్ స్పీకర్ల వాడకం, గడియారం అలారం, శబ్దాల వల్ల ఊపిరి పీల్చడం, మాట్లాడటం, శబ్దాలు మొదలైనవి ఇంటిలోపల ధ్వనులకు ఆధారాలు. బయటి ధ్వని కాలుష్యం ముఖ్యంగా థర్మల్ ప్లాంటు, గనుల త్రవ్వకం, విమానాశ్రయాలు, వివిధ రవాణా సాధనాల ద్వారా ఏర్పడుతుంది.

ధ్వని కాలుష్యం – ప్రభావాలు:ధ్వని కాలుష్యం పర్యావరణ స్వచ్చతను భూమిమీద జీవించే ప్రాణులను ప్రభావితం చేస్తుంది. ధ్వని కాలుష్యం అనేక ప్రభావాలకు దారితీస్తుంది. అందులో ముఖ్యమైనవి.

  1. సంగీతం, భాషణల యొక్క తియ్యదనం, ఇంపు నశించిపోతుంది.
  2. వార్తా ప్రసార శ్రవణాన్ని అడ్డుకుంటుంది.
  3. తాత్కాలికంగా కాని, శాశ్వతంగా కాని వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం వుంది.
  4. మానవుని శరీరంలోని వివిధ వ్యవస్థలు చేసే పనులకు అడ్డుపడుతుంది. నరాలపై ఒత్తిడి పెరగడం, నిద్రలేకుండా పోవడం, జీర్ణక్రియలు సరిగా లేకపోడం, రక్తపోటులాంటి అనారోగ్య పరిస్థితులు ధ్వని కాలుష్యం వల్ల కలుగుతాయి.
  5. నాడి సక్రమంగా కొట్టుకోకపోవడానికి లేదా వేగంగా కొట్టుకోవడానికి, రక్తంలో కొవ్వు శాతం పెరగడానికి కారణమవుతుంది.
  6. గర్భస్థ శిశువులకు సరిచేయలేనటువంటి ప్రమాదాలను కలుగచేస్తుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

ప్రశ్న 6.
పర్యావరణ క్షీణతకు గల ఆర్థిక కారణాలు ఏవి ?
జవాబు:
ఆర్థికాభివృద్ధి, పర్యావరణ క్షీణత లేదా కాలుష్యం ఒకే దిశలో పయనిస్తాయి. విచక్షణారహితంగా, సహజ వనరులను అతిగా ఉపయోగించడం వల్ల భౌతిక పర్యావరణం క్షీణిస్తుంది. పర్యావరణ క్షీణత ప్రభావాలను మనం అనేక విధాలుగా చూడవచ్చు. కాలష్యాల దుష్ఫలితాలను క్రింద వివరించడం జరిగింది.

1) మానవ ఆరోగ్యంపై ప్రభావాలు:పర్యావరణ క్షీణత, మానవ ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నందున, శ్రామికలు తమ పనులకు హాజరు కాలేకపోతున్నారు. అనారోగ్య కారణాలు, శ్రామికుల సామర్థ్యాన్ని తగ్గించగా అది | అల్ప ఉత్పాదకతకు దారితీస్తుంది.

ఎ) వాయు కాలుష్యం:వాయు కాలుష్యకారకాలైన కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, హైడ్రోకార్బన్లు, కణరూపద్రవ్యం మొదలైనవి శ్వాసకోశం ద్వారా మానవశరీరంలోకి నేరుగా ప్రవేశించి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఉబ్బసం, ఊపిరితిత్తుల క్యాన్సర్, చర్మానికి చిరాకును కలిగించి బాధపెట్టే అలర్జీ మొదలైన వ్యాధులకు వాయు కాలుష్యమే
కారణం.

బి) నీటి కాలుష్యం:వ్యాధులను వ్యాపింపచేసే సాధనాలలో అతి ముఖ్యమైనది నీరు. వివిధ వ్యాధులను కలిగించే వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవాలాంటి సూక్ష్మక్రిములు నీటి ద్వారానే వ్యాపిస్తాయి. ఈ సూక్ష్మక్రిముల వల్ల విరోచనాలు, టైఫాయిడ్, కలరా, కామెర్లులాంటి వ్యాధులు సంక్రమిస్తాయి.

సి) ధ్వని కాలుష్యం:ధ్వని కాలుష్యం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. పెద్దశబ్దాలు నిద్రాభంగాన్ని కలిగించి, ఆరోగ్యం మీద ప్రభావాలను కలిగిస్తాయి. ధ్వని కాలుష్యం వల్ల వినికిడి దెబ్బ తినడం, పనిపాటల్లో, సంభాషణలో అంతరాయాన్ని, ఏకాంతానికి భంగం, నిద్రాభంగాన్ని బాధను లేదా చిరాకును కలిగిస్తుంది. అలాగే ఏకాగ్రతకు భంగం కలిగించడం, రక్తపోటు, గుండెవేగం పెరగడంలను కలుగ చేస్తుంది.

2) వ్యవసాయంపై ప్రభావం:పర్యావరణ క్షీణత వల్ల వ్యవసాయరంగం దెబ్బతింటుంది. వ్యవసాయ ఉత్పాదకత, వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత తగ్గిపోతాయి.

ఎ) వాయు కాలుష్యం:వాయు కాలుష్యకారకాలైన సల్ఫర్-డై-ఆక్సైడ్ వదిలే పొగలు మొక్కలను దెబ్బతీస్తాయి. ముఖ్యంగా మొక్కలలోని లెట్యూస్, బార్లీ, వైట్ – ఫైన్ మొదలైనవి ఈ పొగల వల్ల తీవ్రంగా ప్రభావితం అవుతాయి. సాధారణంగా వాయుకాలుష్యం మొక్కల ఆకులను దెబ్బతీస్తుంది. మొక్కల ఆకులలోని పత్రహరితాన్ని కోల్పోయి అవి పసుపు పచ్చగా మారతాయి. ఈ విధంగా వ్యవసాయ ఉత్పత్తిని వాయుకాలుష్యం తగ్గిస్తుంది. వాతావరణంలో మార్పులకు వాయుకాలుష్యం కారణమని అనేక సూచికలు తెలియచేస్తున్నాయి. ఆమ్లవర్షాలకు కారణం వాయు కాలుష్యమే. వాతావరణంలో మార్పులు, ఆమ్ల వర్షాలు వ్యవసాయ ఉత్పత్తిని తగ్గిస్తాయి.

బి) నీటి కాలుష్యం:నీటి కాలుష్యం వ్యవసాయభూముల ఉత్పాదకతను అధికంగా దెబ్బతీస్తుంది. కలుషిత నీటిలో నిర్జీవ లవణాలు, ముఖ్యంగా క్లోరైడ్ ఉంటుంది. ఈ నీరు పంట పొలాలలోకి ఇంకి ఆవిరైపోతే లవణాలు మాగాణి భూమిలో కేంద్రీకృతం అవుతాయి. ఈ విధంగా లవణాలు భూమిలో పేరుకుపోయి కేంద్రీకృతమై, భూసారం తగ్గి, సాగుభూమి బీడుబారిపోతుంది.

సి) నేల కాలుష్యం:నేలకోత, లవణీకరణ, ఎడారీకరణ మొదలైనవి భూమి నాణ్యత, సాగుభూమి పరిమాణాన్ని తగ్గిస్తాయి. గనుల నిర్వహణ కూడా పంటపొలాలను తగ్గించి భూమికోతకు కారణమవుతున్నది. కావున భూకాలుష్యం పంటపొలాల విస్తీర్ణాన్ని తగ్గించడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తిని తగ్గిస్తుంది.

3) పరిశ్రమలపై ప్రభావాలు:పర్యావరణ కాలుష్యం పారిశ్రామిక ఉత్తత్త్పిని తగ్గిస్తుంది. పారిశ్రామిక ఉత్పత్తుల నాణ్యత కూడా దీని వల్ల క్షీణిస్తుంది.

ఎ) వాయు కాలుష్యం:భవనాలు, కార్లు, వస్త్రాలు, మొదలైనవి గాలిలోని వ్యర్థపరమాణువుల వల్ల ప్రభావితం అవుతున్నాయి. సల్ఫర్ ఆక్సైడ్లు భవనాల తయారీలో ఉపయోగపడు పాలరాయి, సున్నపురాళ్ల క్షీణతకు కారణం అవుతున్నాయి. సల్ఫర్ ఆక్సైడ్ ప్రభావం వల్ల వస్త్రాలు, తోళ్లు, స్టీలు మొదలైనవి దెబ్బతింటున్నాయి. నైట్రోజన్ ఆక్సైడ్ సున్నితమైన రంగులను వెలసిపోయేటట్లు చేస్తుంది. వాయు కాలుష్యం పరిశ్రమల, యంత్రాల తరుగుదలకు కారణమవటంతో పాటు, పారిశ్రామిక ఉత్పత్తుల నాణ్యతను తగ్గిస్తుంది.

బి) నీటి కాలుష్యం:కలుషితమైన నీరు, పరిశ్రమలకు తక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది. భిన్న పరిశ్రమలలో ఉపయోగపడే నీటి నాణ్యత భిన్నరకాలుగా ఉంటుంది. చల్లటి నీటిలో సాధారణంగా తక్కువ శుభ్రత కలిగి ఉంటాయి. అవసరం లేని వేడిమి, పదార్థాలని తీసివేసే గుణం వున్న నీరు పరిశ్రమలకు ఉపయుక్తం కాదు. కలుషిత నీటి వల్ల పరిశ్రమలలో వ్యయాలు ఎక్కువగా అవుతాయి. నీటిని శుద్ధిచేయటం, దెబ్బతిన్న యంత్ర సామాగ్రిని బాగుచేయటం, పారిశ్రామిక ప్రక్రియలో సర్దుబాటు వల్ల పరిశ్రమల వ్యయాలు పెరుగుతాయి.

సి) నేల కాలుష్యం:ఖనిజాలు, ఖనిజనూనెలు భూమిలో అంతర్భాగాలు. వీటిని ఉపయోగిస్తే అవి శాశ్వతంగా కోల్పోవడం జరుగుతుంది. శక్తిని ఉత్పత్తి చేయటానికి బొగ్గు, పెట్రోలియం ఉత్పత్తులను ఉపయోగిస్తారు. వివిధ ఖనిజాలను పరిశ్రమల్లో ముడి పదార్థాలుగా ఉపయోగించటం జరుగుతుంది. విచక్షణా రహితంగా ఈ వనరులను ఉపయోగిస్తే, ఇవి హరించుకుపోయి పారిశ్రామిక అభివృద్ధిని తగ్గిస్తాయి.

4) పశుసంపదపై ప్రభావాలు:పర్యావరణ కాలుష్యం పశు పక్ష్యాదుల ఆరోగ్యంపై దుష్ప్రభావాలను కల్గిస్తుంది. పశుపక్ష్య సంబంధమైన ఉత్పత్తులు కూడా తగ్గుతాయి. పశు ఆరోగ్యానికి అతి ప్రమాదకరమైన కాలుష్యకం ఫ్లోరైడ్ పాడి పశువులు ఫ్లోరైడ్ వల్ల అతిగా ప్రభావితమై, పాల ఉత్పత్తులు తగ్గిస్తాయి. ఫ్లోరైడ్ వల్ల వచ్చే ‘ఫ్లోరోసిస్’ అనే వ్యాధి వల్ల పళ్లు, ఎముకలు ప్రభావితమై అవిటి అవడం జరుగుతుంది.

5) సముద్ర ఆహార పదార్థాలపై ప్రభావం:నీటి కాలుష్యం మత్స్యవనరుల మీద వ్యతిరేక ప్రభావం చూపుతుంది. నీటిని కలుషితం చేసే విషపదార్థాలు నీటిలో ఆక్సిజన్ పరిమాణం తగ్గించడం వల్ల నీటి ఉష్ణోగ్రతలో మార్పులు వచ్చి చేపల పునరుత్పత్తిని దెబ్బతీయటమే కాకుండా అవి కలుషితమై భుజించడానికి కూడా పనికిరాకుండా చేస్తుంది.

6) ఇతర ప్రభావాలు:పై ఆర్థిక ప్రభావాలే కాకుండా, ఇతర పదార్థాలు కూడా పర్యావరణ క్షీణత వల్ల ఏర్పడతాయి. ఇది జీవవైవిధ్యాన్ని తగ్గిస్తుంది. జీవవైవిధ్యంలోని విభిన్న జంతువులు జీవరాశులు, మొక్కలు ప్రభావితం చేయబడి, వాటి మధ్య అంతర్గత సంబంధాలు దెబ్బతింటాయి. ఈ కారణాల వల్ల పరస్పర ఆధారమైన, సున్నితమైన ఆహార గొలుసులోని బంధం తెగిపోవచ్చు లేదా బలహీనం కావచ్చు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

ప్రశ్న 7.
పర్యావరణ కాలుష్యానికి దారితీసిన కారకాలు ఏమిటి ?
జవాబు:
పర్యావరణ క్షీణత, వాతావరణం కాలుష్యం కన్నా కొద్దిగా భిన్నమైనవి. పర్యావరణ నాణ్యత తగ్గడాన్ని క్షీణత అంటాము. కాని ప్రకృతి కొన్ని హానికారక మూలకాలతో కాలుష్యం అవడాన్ని కాలుష్యం అనవచ్చు. పర్యావరణ మార్పులు ఆర్థికాభివృద్ధి, జనాభా వృద్ధి, నగరీకరణ, సాంద్ర వ్యవసాయం పద్ధతులు, విద్యుత్ వాడకం పెరగడం మరియు రవాణా వంటి అనేక కారణాల వల్ల ఏర్పడవచ్చు. పర్యావరణ క్షీణతకు ప్రాధమిక కారకాలను క్రింది విధంగా చర్చించవచ్చు.

1) సాంఘీక కారణాలు:పర్యావరణ క్షీణతకు కారణమైన సాంఘిక కారణాలను సంక్షిప్తంగా క్రింద వివరించడం జరిగింది.

ఎ) జనాభా:ఆర్థికాభివృద్ధి జరగాలంలే జనాభాయే మూలం. అయితే, ఒక హద్దు దాటి పెరిగితే పర్యావరణ క్షీణతకు కూడా జనాభాయే ముఖ్య కారణమవుతుంది. కాబట్టి పెరుగుతున్న జనాభా జీవ సహాయం వ్యవస్థల మధ్య సంబంధాన్ని స్థిరీకరించాలి. లేకుంటే అభివృద్ధి కార్యక్రమాలు, నవకల్పనలు, సత్ఫలితాలను ఇవ్వలేవు.
ప్రపంచ భూభాగంలో 2.4% ఉన్న భారతదేశం ప్రపంచ జనాభాలో 17% జనాభాను పోషిస్తుంది. ప్రస్తుత భారత జనాభా పెరుగుదల రేటు 1.77 (2011 జనగణన). ఈ రేటు భారతదేశం ఎదుర్కొనే జనాభా సమస్యను సూచిస్తుంది. కాబట్టి జనాభా, పర్యావరణ సంబంధాలను దృష్టిలో ఉంచుకొని జనాభా నియంత్రణకు ఉధృత చర్యలను (Vigourous Drive) చేపట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

బి) పేదరికం:పర్యావరణ క్షీణతకు పేదరికం కారణం మరియు ఫలితం కూడా అని చెప్పవచ్చు. పేదరికానికి, పర్యావరణానికి ఉన్న చక్రరూప సంబంధం అతి క్లిష్టమైన దృగ్విషయం. అసమానతలు, వనరుల క్షీణతని పెంపొందిస్తాయి. ఎందుకంటే ధనికుల కంటే పేదలు ఎక్కువగా సహజ వనరులపై ఆధారపడతారు. కాబట్టి సహజ వనరలు తగ్గుతాయి. పేదవారికి ఇతర వనరుల ద్వారా సరైన ఫలితాలు పొందే అవకాశం లేదు. దేశంలో రంగరాజన్ కమిటీ ప్రకారం 29.5 శాతం మరియు సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారం 21.9% (2011-12)గా పేదరిక శాతాన్ని అంచనా వేశారు. కానీ నిరపేక్ష పేదరిక పరిమాణం అంటే దారిద్య్ర రేఖకు దిగువన నివసించే వారి మొత్తం సంఖ్య నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది.

2) నగరీకరణ (Urbanization):గ్రామాలలో లాభసాటి ఉద్యోగవకాశాలు లేనందువల్ల పేదకుటుంబాలు పట్టణాలకు తరలి వెళ్ళడం జరుగుతోంది. అందువల్ల జీవావరణంపై ఒత్తిడి పెరుగుతుంది. మెగా సిటీలు లేదా పెద్ద నగరాలు పెరగటంతో పాటు మురికివాడలు కూడా విస్తృతమవుతాయి. 2001 జనగణన ప్రకారం 28.6 కోట్ల ప్రజలు నగరాల్లో నివసిస్తున్నారు. శాతంలో చెప్పాలంటే 27.8% మంది అన్నమాట. అదే 2011 జనగణన ప్రకారం 37.7 కోట్లకు (30%) పెరిగారు. ఈ విధమైన శీఘ్ర ప్రణాళికా రహిత పట్టణాలు పెరుగుదల, పట్టణాల పర్యావరణ ల క్షీణతకు దారితీస్తుంది.

3) ఆర్థిక అంశాలు (Economic Factors):పర్యావరణ క్షీణతకు చాలా వరకు మార్కెట్ వైఫల్యమే కారణం, అంటే పర్యావరణ వస్తు, సేవలకు సంబంధించి మార్కెట్ లేకపోవటమే లేదా మార్కెట్ సమర్థవంతంగా పనిచేయలేకపోవటమే కారణంగా చెప్పవచ్చు. ప్రైవేటు, సాంఘిక వ్యయాల (Social costs or benefits) వల్ల వినియోగం, ఉత్పత్తుల్లో బహిర్గత ప్రభావాలు ఏర్పడి పర్యావరణ క్షీణతకు కారణమవుతున్నాయి. మార్కెట్ వైఫల్యానికి స్పష్టంగా నిర్వచించని ఆస్తి హక్కు ఒక కారణం. అంతేకాకుండా ధరల నియంత్రణ, సబ్సిడీల వల్ల మార్కెట్ వక్రీకరణ ఫలితంగా సాధించవలసిన పర్యావరణ లక్ష్యాలను పెంచుతున్నాయి.

తత్ఫలితంగా సహజ వనరులు (ఖనిజ నూనెలు, ఖనిజాలు) తగ్గిపోవడం, నీరు, గాలి, భూమి, కలుషితమవటం ఫలితంగా ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు జీవావరణ వ్యవస్థ నాణ్యత తగ్గిపోతుంది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వివిధ పర్యావరణ భావనలను వివరించండి.
జవాబు:
1969లో అమెరికా జాతీయ పర్యావరణ విధాన చట్టం (National Environmental Policy Act (NEPA) ప్రకారం పర్యావరణ భౌతిక, సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక మరియు సౌందర్యపరమైన పర్యావరణాలుగా విభజింపబడి ఉంటుంది. రావ్’ మరియు ఊటెన్లు పర్యావరణాన్ని నాలుగు విధాలుగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పారు.

1) భౌతిక పర్యావరణం:ఇది భౌతిక, రసాయన మరియు జీవ అంశాలైన భూమి, వాతావరణము, వృక్షసంపద, వన్యమృగాలు, చుట్టప్రక్కల వున్న భూమి మరియు దాని స్వభావము, అవస్థాపనా సౌకర్యాలు, గాలి మరియు శబ్ద కాలుష్య స్థాయి మొదలైన వాటిని కలిగి ఉంటుంది.

2) సాంఘిక పర్యావరణము:ఇందులో జనాభా మరియు జనసాంద్రత, సామాజిక కూర్పు, మతపరమైన, విద్యాపరమైన, సామాజిక సౌకర్యాలు అంటే పాఠశాలలు, ఉద్యానవనాలు, వైద్యశాలలు, వినోదాత్మక మరియు సాంస్కృతిక సౌకర్యాలు వంటి అనేక అంశాలు అంతర్భాగమై అంటాయి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

3) ఆర్థిక పర్యావరణం:ఆర్థికాంశాలైన ఉద్యోగిత, నిరుద్యోగం, ఆదాయవనరులు, ఉత్పత్తి కారకాల లభ్యత, డిమాండులో మార్పులు, పేదరికస్థాయి మొదలైన అంశాలు ఇందులో ఉంటాయి.

4) మనోహరమైన పర్యావరణం:ఇందులో చారిత్రాత్మక, పురావస్తు, శిల్ప సంపదకు సంబంధించిన ప్రదేశాలు, ప్రకృతి దృశ్యాలు, సుందర ప్రదేశాలు ఉంటాయి. ప్రజలు వీటిని చూసి ఆహ్లాదం పొందుతారు.

పర్యావరణంలో అనుఘటకాలు వైవిధ్యమానమై గాక ఒకదాని మీద మరొకటి ఆధారపడి పరస్పరం ప్రభావితం చేస్తూ, ప్రభావితమవుతూ ఉంటాయి. కాబట్టి పర్యావరణం అనేది ఒక సంపూర్ణమైన అన్ని శాఖలు కలిసిన విజ్ఞానశాస్త్ర అధ్యయనమని చెప్పవచ్చు.

ప్రశ్న 2.
నేల లేక భూమి కాలుష్యం.
జవాబు:
భూపటలంలోని పై పొరలను ‘నేల’ లేదా ‘మృత్తిక’ అంటారు. రాళ్ళు నిరంతరం భౌతిక, రసాయనిక, జీవ శైధిల్యానికి గురవుతూ ఉండడం వల్ల నేల ఏర్పడింది. ప్రకృతి మానవునికిచ్చిన వరమే నేల నేల ప్రాణంతో ఉన్న (సజీవ) వనరు.

నేల నాణ్యత కొన్ని ప్రతికూల మార్పులకు గురి అయి అందులోని సహజ మూలకాల కూర్పు తారుమారు కావడం తద్వారా భూమి ఉత్పాదకత తగ్గడమే “నేల కాలుష్యమని” నిర్వచించవచ్చు.

నేల కాలుష్యానికి కారణాలు:నేల కాలుష్యం అనేది మృత్తికా క్రమక్షయ వల్ల ఏర్పడుతుంది. మృత్తికా క్రమక్షయం అనేది నేల ఉపరితలంలోని సారవంతమైన పొరలు కోతకు గురిచేసి, భూమి నిస్సారంగా మార్చడం వల్ల జరుగుతుంది. ఇది అడవుల నరికివేత, విస్తృత వ్యవసాయం వల్ల, గనుల త్రవ్వకం మొదలగు వాటి వల్ల ఏర్పడుతుంది. అదే విధంగా నేల కోతకు ఎడారీకరణ కూడా కారణమే. దీని వల్ల నేల జీవంలేకుండా ఇసుక సముద్రంగా తయారవుతుంది. ఎడారీకరణ అనేది పశువులను ఎక్కువగా మేపడం వల్ల తక్కువ సారం కలిగిన నేలలనే ఎక్కువగా ఉపయోగించడం వల్ల, క్షారీకరణ, లవణీకరణ మొదలగు వాటి వల్ల ఏర్పడుతుంది.

అధికంగా రసాయనిక ఎరువుల, క్రిమిసంహారక మందుల వాడకం వల్ల వివిధ రసాయనాలు, ఆమ్లాలు, క్షారాలు, భూమిలోకి చొచ్చుకుపోయి భూమికి ఉండే సహజ రసాయనిక ధర్మాలు మార్పుచెంది మొక్కలు, పంటల నాశనానికి దారితీస్తుంది. వ్యర్థపదార్థాలతో భూమిని నింపటం వల్ల కూడా నేల క్షీణతకు ..రవుతుంది.

ప్రశ్న 3.
సహజ వనరుల రకాలు, ఉదాహరణలతో వ్రాయుము. [Mar ’16]
జవాబు:
భూమి వనరుల నిలయం. వనరులు ప్రకృతి ప్రసాదిం వరాలు. వనరులను మనం ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించుకుంటాం.

సహజ వనరుల విభజన:సహజ వనరులను వాటి పరిమాణాన్ని బట్టి, నూర్పుచెందే గుణాలను బట్టి, వాటిని తిరిగి వాడుకొనే విధానాన్ని బట్టి విభజించవచ్చు. కాని సాధారణంగా రెండు రకాలుగా విభజించి పరిశీలించడం సౌకర్యంగా ఉంటుంది.
AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి 2

1) పునరావృతం అయ్యే వనరులు:ఎలాంటి తరుగుదల లేకుండా ఎన్నిసార్లు ఉపయోగించుకున్నా క్షీణించని వనరులను పునరావృతమయ్యే వనరులు అంటారు. అవి తరిగిపోవు. స్వల్పకాలంలోనే ఆ వనరులు తమంతట తామే పునరుత్పత్తి చేసుకొనే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వాటి నిల్వలు స్థిరంగా ఉండక పెరుగుతూ, తరుగుతూ ఉంటాయి. వీటినే “సాంప్రదాయేతర వనరులు” అని కూడా అంటారు. ఉదాహరణకు గాలి, సౌరశక్తి, సముద్రపు అలలు, భూగర్భ ఉష్ణవనరులు (Geo-Thermal) మొదలగునవి.

2) పునరావృతం కాని వనరులు:వాడుకొంటూ పోతే తరిగిపోయేటటువంటి సహజ వనరులను ‘పునరావృతం కాని వనరులు అంటారు. వీటిని సాంప్రదాయ వనరులు అంటారు. ఈ వనరులను మనం పునరుత్పత్తి చేయలేము. ఒక్కసారి ఈ వనరులు తరిగిపోతే, అవి వాడుకోవడానికి అందుబాటులో ఉండవు. ఇటువంటి వనరులను ఎంతగా వినియోగిస్తూపోతామో, రాబోయే తరాల వారికి ఇది అంత కొరతగా మారిపోతుంది.
ఉదాహరణకు బంగారం, వెండి, రాగి, శిలాజ ఇంధనాలు, నూనెలు మొదలైనవి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

ప్రశ్న 4.
కాలుష్యం అంటే ఏమిటి ? కాలుష్యాన్ని ఎన్ని తరగతులుగా విభజించవచ్చో వ్రాయండి.
జవాబు:
పర్యావరణానికున్న స్వాభావిక లక్షణాలల్లో భౌతికంగా, రసాయనికంగా లేదా జీవపరమైన అవాంఛనీయ పరిణామాలు కలిగితే దాన్ని కాలుష్యం అంటారు. కాలుష్యం వల్ల ఘన, ద్రవ, వాయు పదార్థాల్లో స్వచ్ఛత తగ్గిపోయి ఉపయోగించుకోవడానికి పనికిరాకుండా పోతాయి. పర్యావరణంలోని కాలుష్యం వివిధ రకాలుగా ఉంటుంది. వాటిలో వాయు, జల, నేల, శబ్ద, ఘన వ్యర్థ పదార్థాల, ఉష్ణ కాలుష్యాలు ప్రధానమైనవి. ఇతర కాలుష్యకారకాలు ధర్మల్ కాలుష్యం, రేడియో ఆక్టివ్ కాలుష్యం మొదలగునవి.

1) వాయు కాలుష్యం:గాలిలో ఇతర కాలుష్య కారక పదార్థాల గాఢత ఎక్కువైపోయి మానవుని శ్రేయస్సును, జీవకోటికి మరియు వివిధ రూపాలలో ఉన్న ఆస్తులపై ప్రతికూల ప్రభావం చూపడాన్ని వాయు లేక గాలి కాలుష్యం అంటారు. వాయు కాలుష్యం సహజమైన, మానవ నిర్మితమైన ఆధారాల వల్ల జరగుతూ ఉంటుంది. వంటచెరకు కాల్చడం, పారిశ్రామీకరణ, న్యూక్లియర్ పరీక్షలు, అడవులు నరికి వేయడం మొదలగునవి గాలి కాలుష్యానికి ముఖ్యకారణాలు.

2) నీటి కాలుష్యం:కొన్ని పదార్థాలుగాని, కారకాలుగాని నీటిలో ఎక్కువగా చేరిపోయి నీటి యొక్క స్వచ్ఛతను తగ్గించివేసి దానిని ఆరోగ్యానికి హానికరంగాను, వాడుకోవడానికి కూడా పనికి రాకుండా మార్చివేస్తాయి. దానినే నీటి కాలుష్యంగా చెప్పవచ్చు. గృహాల్లోని వ్యర్థాలు, మానవ వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాలు, మొదలైనవి నీటి కాలుష్యంకు
కారణాలు.

3) నేల కాలుష్యం:నేల నాణ్యత కొన్ని ప్రతికూల మార్పులకు గురి అయి అందులోని సహజ మూలకాల కూర్పు తారుమారు కావడం ద్వారా భూమి ఉత్పాదకత తగ్గడమే నేల కాలుష్యం. రసాయనిక ఎరువుల వాడకం, ఆమ్లాలు, క్షారాలు భూమిలోనికి చొచ్చుకొనిపోవడం, మొదలైనవి నేలకాలుష్యానికి కారకాలు.

4) శబ్ద కాలుష్యం:ఏ ధ్వనులైతే 125 డెసిబెల్స్ పీడనం కంటే ఎక్కువగా ఉండి పర్యావరణంలో హానికరమైన ప్రభావాలను ఉత్పన్నం చేసి, మానవుల ఆరోగ్యానికి ప్రమాదకరంగా పరిణమిస్తాయో వాటిని ‘ధ్వని కాలుష్యం’ అంటారు. గృహోపకరణాల వాడకం, లౌడ్ స్పీకర్ల వాడకం, థర్మల్ పవర్ ప్లాంటు, గనుల త్రవ్వకం మొదలగునవి కారకాలు.

5) ఘన వ్యర్థ పదార్థాల కాలుష్యం:ఘన వ్యర్థ పదార్థాల్లో గృహ సంబంధింత వ్యర్థాలు, జంతువుల మృతకళేబరాలు, పరిశ్రమలు, వ్యవసాయ సంబంధిత వ్యర్థాలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, వైద్య సంబంధ వ్యర్థాలు ఉంటాయి. ప్లాస్టిక్ ఘన వ్యర్థ పదార్థాల కంటే ఎలక్ట్రానిక్ వ్యర్థ పదార్థాలు చాలా ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి.

6) ఉష్ణ కాలుష్యం:సమీపంలో ఉన్న కాలువలు, సరస్సులు, చెరువులు, నదుల్లోకి వేడి నీటిని విడుదల చేసిన ఫలితంగా వచ్చే కాలుష్యాన్ని ఉష్ణ కాలుష్యంగా చెప్పవచ్చు. న్యూక్లియర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, శుద్ధి కర్మాగారాలు, కాగితం పరిశ్రమలు, సిమెంట్ పరిశ్రమలు మొదలగునవి ఉష్ణ కాలుష్యానికి కారణమవుతున్నాయి.

ప్రశ్న 5.
‘సుస్థిరత్వం’ అంటే అర్థం ఏమిటి ? సుస్థిరమైన అభివృద్ధిలోని అనుఘటకాలను గురించి వివరించండి.
జవాబు:
సుస్థిరత్వం భాగాలు:“సుస్థిరమైన అభివృద్ధి” అన్న భావనలో మూడు ముఖ్యమైన భాగాలుంటాయి. అవి ఆర్థిక, సాంఘిక, పర్యావరణమనే మూడు భాగాలు. ఇవన్నీ ఒక దానితో ఒకటి సంబంధం కలిగిన స్వతంత్రమైన అనుఘటకాలు. సుస్థిరమైన అభివృద్ధిని సాధించాలంటే ఈ మూడు అనుఘటకాల మధ్య సమతూకాన్ని సాధించవలసి వుంటుంది. ఇలాంటి సమతూకాన్ని సాధించడం ఎలాగో పటంలో చూపడం జరిగింది.
AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి 3

ఆర్థిక సంబంధమైన అంశాలు:మానవ నిర్మితమైన మూలధనం, మానవ మూలధనం, సహజ మూలధనం వంటి మౌలికమైన విలువలను సమాజాలు రక్షించుకుంటూ, అభిలషనీయ పరిమాణంలో ఆదాయ ప్రవాహాన్ని పెంపొందిచుకోవలసి వుంటుందని ఆర్ధికభావనలో కొనసాగించగలిగే అభివృద్ధి తెలియజేస్తుంది.

సామాజిక సంబంధమైన అంశాలు:సామాజిక పరమైన సుస్థిరత న్యాయం, సమానత్వం అనే రెండు సూత్రాలపై నిర్మితమైంది. అభివృద్ధిపథం కొనసాగాలంటే సంపద, వనరులు అవకాశాలు సమానంగా పంపిణీ జరగాలి. పౌరులందరికీ ! కనీస ప్రమాణంలో భద్రత, మానవ హక్కులు, సామాజిక ప్రయోజనాలైన ఆహారం, ఆరోగ్యం, విద్య, స్వయం అభివృద్ధికి అవకాశాలు చేకు చాలి.

పర్యావరణ సంబంధమైన అంశాలు:పర్యావరణ భావనలో కొనసాగించగలగడం అనేది వనరులను సుస్థిరంగా ఉపయోగించడం, సమర్థవంతంగా వృథాలను ఇముడ్చుకునే విధిని నిర్వర్తించడం, సహజ మూలధనాన్ని రక్షించుకోవడం, ఈ మూడు విధులను సమర్ధవంతంగా అంతరాయం లేకుండా నిర్వహించగలిగితే జీవావరణ వ్యవస్థలో స్థిరత్వం సాధించవచ్చు.

ప్రశ్న 6.
మానవ ఆరోగ్యంపై కాలుష్య ప్రభావాన్ని చర్చించండి.
జవాబు:
1) మానవ ఆరోగ్యంపై ప్రభావాలు:పర్యావరణ క్షీణత, మానవ ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నందున, శ్రామికులు తమ పనులకు హాజరు కాలేకపోతున్నారు. అనారోగ్య కారణాలు, శ్రామికుల సామర్థ్యాన్ని తగ్గించగా, అది అల్ప ఉత్పాదకతకు దారి తీస్తుంది.

ఎ) వాయు కాలుష్యం (Air Pollution):వాయు కాలుష్యకారకాలైన కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, హైడ్రోకార్బన్లు, కణరూపద్రవ్యం మొదలైనవి శ్వాసకోశం ద్వారా మానవ శరీరంలోకి నేరుగా ప్రవేశించి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఉబ్బసం (Bronchitis), ఊపిరితిత్తుల క్యాన్సర్, కళ్ళకి, చర్యానికి చిరాకును కలిగించే బాధపెట్టే అలర్జీ (Eye Irritation, Skin Irritation) మొదలైన వ్యాధులకు వాయు కాలుష్యమే కారణం.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

బి) నీటి కాలుష్యం (Water Pollution):వ్యాధులను వ్యాపింపచేసే (transmission) సాధనాలలో అతి ముఖ్యమైనది నీరు, వివిధ వ్యాధులను కలిగించే వైరస్, బాక్టీరియా, ప్రోటోజోవాలాంటి సూక్ష్మక్రిములు, నీటి ద్వారానే వ్యాపిస్తాయి. ఈ సూక్ష్మక్రిముల వల్ల విరోచనాలు, టైఫాయిడ్, కలరా, కామెర్లు వంటి వ్యాధులు సంక్రమిస్తాయి. –

సి) ధ్వని కాలుష్యం (Sound Pollution):ధ్వని కాలుష్యం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. పెద్ద శబ్దాలు నిద్రాభంగాన్ని కలిగించి, ఆరోగ్యం మీద ప్రభావాలను కలిగిస్తాయి. ధ్వని కాలుష్యం వల్ల వినికిడి దెబ్బతినడం, పనిపాటల్లో, సంభాషణలో అంతరాయాన్ని, ఏకాంతానికి భంగం, నిద్రాభంగాన్ని బాధను లేదా చిరాకును కలిగిస్తుంది. అలాగే ఏకాగ్రతకు భంగం కలిగించడం, రక్తపోటు, గుండె వేగం పెరగడంలను కలుగచేస్తుంది.

ప్రశ్న 7.
అడవుల పరిరక్షణకు కావలసిన జాగ్రత్తలు. [Mar ’17]
జవాబు:
అడవులను ‘కర్బన శోషణాగారాలని’ (carbon sinks), ‘ప్రకృతి సౌందర్యాల ఖజానాలని’ అంటారు. వాటికున్న ప్రాధాన్యాన్ని గమనించి, వాటిని సంరక్షించుకోవడం అత్యంత ఆవశ్యకం, అడవులను క్రింది చర్యల ద్వారా సంరక్షించుకోవచ్చు.

  1. పేదల ఇళ్ళు కట్టుకోవడానికిగాను అటవీ భూములను కేటాయించడం మానుకోవాలి.
  2. సామాజిక అటవీ కార్యక్రమాల క్రింద కొన్ని ప్రత్యేక ప్రాంతాలను అభివృద్ధి చేయాలి.
  3. వృథాగా ఉన్న భూముల్లో మొక్కలు నాటడం జరగాలి.
  4. అడవులు మంటలపాలు కాకుండా (ముఖ్యంగా వేసవి కాలంలో) సంరక్షించుకోవాలి.
  5. అడవులు తరిగిపోయిన ప్రదేశాలను గుర్తించి, ఆ ప్రాంతాల్లో చెట్లను నాటి తరిగిపోయిన అడవిని చేయాలి.
  6. సంయుక్త అటవీ యాజమాన్య, సంఘాలను స్థాపించడం చాలా అవసరం.
  7. పశువులను మేపడం, చట్టవిరుద్ధంగా చెట్లను నరికివేయడం మొదలైనవి అనుమతించకూడదు.
  8. అటవీ సంరక్షణ చర్యల్లో స్థానిక ప్రజలను కలుపుకొని, వారిని భాగస్వామ్యులను చేయాలి.

ప్రశ్న 8.
పర్యావరణాన్ని పరిరక్షించవలసిన ఆవశ్యకత.
జవాబు:
పర్యావరణం అనేది ఉమ్మడి ఆస్తి. పర్యావరణాన్ని మానవులు, జంతువులు, మొక్కలు మరియు చెట్లు, పక్షులు, చేపలు ఇలా ప్రపంచంలోని అన్ని జీవరాశులు ఉపయోగించుకుంటున్నాయి, అనుభవిస్తున్నాయి. ప్రత్యేకంగా మానవులు తమ అత్యాశతో ఈ ఉమ్మడి వనరులను అధికంగా ఉపయోగిస్తున్నారు. తత్ఫలితంగా, పర్యావరణం బలహీనమై, తన సహజ విధులను కూడా నిర్వహించలేకపోతుంది.

కావున దాదాపు ఆర్థికవేత్తలందరూ, ఆర్థికాభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. కానీ మనం వారి హెచ్చరికలను ప్రక్కకు పెడుతూ, పర్యావరణం దోపిడీని కొనసాగిస్తూనే ఉన్నాము. పర్యావరణాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఎందుకంటే

  1. ప్రస్తుత తరానికి మరియు రాబోయే తరాల అవసరాలు తీరేందుకు.
  2. సమాన పంపిణీ జరుగుటకు (పర్యావరణ మరియు ఆర్థిక కార్యకలాపాలు).
  3. మానవ, భౌతిక మరియు సహజ మూలధనాలను కాపాడుటకు.
  4. జీవ వైవిధ్యాన్ని మరియు దాని అంతర్భాగాలైన, జంతు, వృక్ష జాతుల నాశనాన్ని నిరోధించుటకు.
  5. సున్నితమైన జీవవ్యవస్థలు మరింత క్షీణించకుండా నిరోధించుటకు పర్యావరణ పరిరక్షణకు భారత ప్రభుత్వం, ఎన్నో న్యాయబద్ధమైన, చట్టబద్ధమైన మరియు పరిపాలనా సంబంధ ప్రయత్నాలు చేస్తోంది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పర్యావరణం.
జవాబు:
పర్యావరణం “Environment” అనే ఆంగ్ల పదము ప్రాచీన ఫ్రెంచి పదము “Environ” నుండి రూపొందించబడింది. ఎన్విరాన్ అంటే ‘చుట్టూ ఉన్న’ జీవరాశిని ప్రభావితం చేస్తూ ఉన్న సజీవ, భౌతిక మూల పదార్థాల కలయికనే పర్యావరణం అంటారు. దీనిలో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ మరియు మేధోపరమైన
అంశాలు ఉంటాయి.

వాతావరణం:భూమి మొత్తాన్ని అవరించిన ఉన్న వాయువుల సమూహం. దీనిలో నాలుగు పొరలు ఉంటాయి.

  1. ట్రోపోస్పియర్,
  2. స్ట్రాటో స్పియర్,
  3. ఐనోస్పియర్,
  4. ధర్మోస్పియర్

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

ప్రశ్న 2.
ఆవరణ వ్యవస్థ. [Mar ’16]
జవాబు:
అవరణ వ్యవస్థ అనే పదాన్ని 1935 సంవత్సరములో ‘విట్రాన్ల’ ప్రతిపాదించాడు. ఒక నిర్ణీత భౌగోళిక ప్రదేశంలో ఉన్నటువంటి స్వాభావిక, భౌతికమైన పర్యావరణ కలయికను వాటి మధ్య జరిగే చర్య, ప్రతిచర్యలను కలిపి ”ఆవరణ వ్యవస్థ’ గా చెప్పవచ్చు. ఆవరణ వ్యవస్థ స్థూలంగా రెండు రకాలు 1. సహజ ఆవరణ వ్యవస్థ, 2. కృత్రిమ ఆవరణ వ్యవస్థ.

ప్రశ్న 3.
గ్రీన్ హౌస్ ప్రభావం. [Mar ’17]
జవాబు:
భూగ్రహంపై ఉన్న వాతావరణం కార్బన్ డై ఆక్సైడ్, నీటి ఆవిరి మరియు మీధైన్ వంటి కొన్ని రకాల వాయువులు ఎక్కువైన కారణంగా సూర్యుని నుండి విడుదల అయ్యే రేడియేషన్ని తమ ద్వారా లోపలికి రానిస్తాయి. కాని తిరిగి ఆ రేడియేటెడ్ ఉష్ణాన్ని అట్టిపెట్టుకొని భూ ఉపరితలం నుండి బయటకు పోనివ్వవు. దీనినే గ్రీన్ హౌస్ ప్రభావం అంటారు.

ప్రశ్న 4.
గాలి కాలుష్యం.
జవాబు:
గాలిలో ఇతర కాలుష్యకారక పదార్థాల గాఢత ఎక్కువైపోయి, మానవుని శ్రేయస్సును, జీవకోటికి మరియు వివిధ రూపాలలో ఉన్న ఆస్తులపై ప్రతికూల ప్రభావం చూపడాన్ని వాయు లేక గాలి కాలుష్యం అంటారు. ఇవి సహజమైన, మానవ నిర్మితమైన ఆధారాల వల్ల జరుగుతుంది. వంటచెరకు కాల్చడం, పారిశ్రామికీకరణ, పంటల సాగు, అడవులు నరికివేయడం మొదలగునవి వాయు కాలుష్యానికి ముఖ్య కారణాలు.

ప్రశ్న 5.
నీటి కాలుష్యం. [Mar ’17]
జవాబు:
కొన్ని పదార్థాలు గాని, కారకాలు గాని నీటిలో ఎక్కువగా చేరిపోయి నీటి యొక్క స్వచ్ఛతను తగ్గించి వేసి దానిని అరోగ్యానికి హానికరంగానూ, వాడుకోవడానికి కూడా పనికి రాకుండా మార్చి వేస్తాయి. దానినే నీటి కాలుష్యం అంటారు. |గృహాల్లోని వ్యర్థాలు, మానవ వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాలు మొదలైనవి నీరు కలుషితంకు కారణాలు.

ప్రశ్న 6.
ఓజోన్ పొర. [Mar ’17, ’16]
జవాబు:
సూర్యుని రేడియేషన్ వల్ల వచ్చే అతినీలలోహిత కిరణాలను అడ్డుకొని భూమి మీద మానవుని జీవనానికి అవసరమైన శక్తిని ప్రసాదించే రక్షక కవచాన్ని ఓజోన్ పొర అంటారు. క్లోరోఫ్లోరోకార్బన్స్, హాలోజన్స్ అణువులు స్టోటోస్పియర్ను చేరి ఓజోన్ ను నాశనం చేస్తాయి.

ప్రశ్న 7.
భూగోళం వేడెక్కడం (Global Warming).
జవాబు:
హరితగృహ వాయువులైన CO2, మొదలైన వాటి వల్ల భూఉపరితల ఉష్ణోగ్రత రోజురోజుకి పెరుగుతూ ఉంది.. CO2 ముఖ్యంగా శిలాజ ఇంధనాలు మండించుట ద్వారా, అడవుల నరికివేత వల్ల ఎక్కువగా వెలువడుతుంది. దీని ప్రభావంతో ఉష్ణం గ్రహింపబడి, తిరిగి భూమి నుండి పరావర్తనం చెందకుండా భూమిపైన ఉండిపోతుంది. దీనిని భూమి వేడెక్కుట అంటారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

ప్రశ్న 8.
సుస్థిరమైన అభివృద్ధి.
జవాబు:
సుస్థిరమైన అభివృద్ధి అనగా మనం వారసత్వంగా పొందిన నాణ్యమైన జీవనాన్ని, ఆస్తులను ఏ మాత్రం తగ్గకుండా భవిష్యత్ తరాల వారికి అందించుట. సుస్థిరమైన అభివృద్ధిలో మూడు ముఖ్యమైన అనుఘటకాలున్నాయి. అవి ఆర్థిక, సాంఘిక, పర్యావరణం అనేవి.

ప్రశ్న 9.
వ్యయ – ప్రయోజన విశ్లేషణ.
జవాబు:
పర్యావరణ వ్యయ ప్రయోజనాలు అంచనా వేయడంలో ఒక ప్రాజెక్టు యొక్క మూలధన మూల్యాంకనము మరియు తులనాత్మకత జరగాలి. ప్రతి ఆర్థిక కార్యకలాపం ప్రయోజనాలను, నష్టాలను కల్గి ఉంటుంది. ఏదైనా ప్రాజెక్టును మూల్యాంకనం చేసేటప్పుడు ఆర్థిక ప్రయోజనలతో పాటు పర్యావరణ నష్టాలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి.

ప్రశ్న 10.
అటవి నాశనానికి గల కారణాలు.
జవాబు:
అడవులు ఎన్నో కారణాల వల్ల తొలగించబడుతున్నాయి. అందులో ముఖ్యమైనవి జనాభా పెరుగుదల, పేదరికం, నిరుద్యోగం, భూమి డిమాండ్ పెరగటం (ఇల్లు, వ్యవసాయం, కలపకోసం) పశువులను ఎక్కువగా మేపడం వల్ల అడవులపై ఒత్తిడి పెరుగుతుంది. ఆనకట్టల నిర్మాణం, రోడ్లు, రైల్వేల నిర్మాణం అడవుల నరికివేతకు అతి ముఖ్య కారణాలు. అడవులలో మంటలు వ్యాపించుట, పోడు వ్యవసాయం మొదలగునవి ఇతర కారణాలు.

ప్రశ్న 11.
జీవవైవిధ్యం. [Mar ’17, ’16]
జవాబు:
‘జీవవైవిధ్యం’ అనే పదాన్ని 1986 సంవత్సరంలో అమెరికా శాస్త్రవేత్త వాల్టర్ రోసెన్ మొదటిసారిగా ప్రతిపాదించాడు. జీవవైవిధ్యం ప్రత్యక్షంగాను, పరోక్షంగాను అనేక ప్రయోజనాలను కల్పిస్తుంది. జన్యుపరమైన తేడాలు, జాతులలోని వైవిధ్యం ఆవరణ వ్యవస్థలోని విచ్ఛిన్న గుణాలను అన్నింటిని కలిపి జీవవైవిధ్యం అంటారు.

ప్రశ్న 12.
ధ్వని అంటే ఏమిటి ?
జవాబు:
నియమానుసారంగా, చెవులకు ఇంపైన తియ్యనైన, వినడానికి సౌకర్యంగా ఉండే శబ్దాన్ని ‘ధ్వని’ అని అంటారు. శబ్దము, ధ్వని అని రెండు పదాలలో ఒకే అర్థంలో వాడుతున్నా శబ్దం వేరు, ధ్వని వేరు. శబ్దాలన్ని ధ్వనులు కావు. గాఢమైన, తీవ్రమైన, గట్టిదైన శబ్దాన్నే ‘ధ్వని’ అంటారు. 50 నుండి 90 డెసిబెల్స్ మధ్య గల శబ్దాన్ని ‘ధ్వని’ అంటారు. 120 డెసిబెల్స్ స్థాయిని కలిగిన ధ్వని పీడనాన్ని మానవులు సురక్షితంగా వినగలుగుతారు.

ప్రశ్న 13.
భూమి విచ్ఛేదనం.
జవాబు:
ఎప్పుడైతే భూమి భౌతికస్థితి, స్వచ్ఛత, ఉత్పాదక శక్తిలో మార్పులు సంభవిస్తాయో అప్పుడు భూమి విచ్ఛేదనానికి గురైందని చెప్పవచ్చును. అడవులు అంతరించిపోవటం, పశువులు ఎక్కువగా మేయటం పంటలను సాగుచేయటం, పారిశ్రామికీకరణ, గాలి వికోషీకరణ, నీటి వల్ల వికోషీకరణం, నీరు ఎక్కువగా నిలబడిపోవడం, భూమి క్షారవంతమైపోవడం జనాభా వత్తిడి వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తిని ఎక్కువ చేయడం మొదలైనవి భూమి విచ్ఛేదనానికి కారణమయ్యే కాలుష్య జనకాలు. భూమి ఇలా విచ్ఛేదనకు గురైతే భూమి ఉత్పాదకశక్తి, స్వచ్ఛత క్షీణించిపోతుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

ప్రశ్న 14.
పర్యావరణ బహిర్గతాలు.
జవాబు:
ఒక ఆర్థిక కార్యకలాపం వల్ల ఏ మాత్రం సంబంధం లేని మూడవ వర్గం ప్రభావితం కావడాన్ని బహిర్గతాలు అంటారు. ఇటువంటి బహిర్గతాలు అనుకూలం గాని ప్రతికూలంగా కాని ఉండవచ్చు. ఉదా:ఒక ఫ్యాక్టరీ నుండి వెలువడే కాలుష్యం పరిసర పర్యావరణాన్ని దగ్గరలోని నివాసమున్న ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీయడం ప్రతికూల బహిర్గతంగా చెప్పవచ్చు. బాగా విద్యావంతులైన ప్రజలు ఉన్న ప్రాంతంలో ఫ్యాక్టరీని మొదలు పెట్టినపుడు ఉత్పాదకత పెరగడం అనుకూల బహిర్గత.

ప్రశ్న 15.
స్వచ్ఛ భారత్ అభియాన్.
జవాబు:
భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడి 2014 అక్టోబరులో 2న స్వచ్చ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ఇందుకోసం ఒక బహిరంగ వెబ్సైట్ను మొదలు పెట్టారు. ఈ కార్యక్రమం లక్ష్యం వచ్చే 5 సంవత్సరాలలో భారత్న పరిశుభ్ర దేశంగా మార్చడమే తద్వారా గాంధీజీ 150వ జన్మదినోత్సవాన్ని పరిశుభ్ర భారతదేశంలో ఘనంగా జరుపుకోవడం. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం సక్రమంగా అమలు చేయగలిగితే అనేక పర్యావరణ సమస్యలను పరిష్కరించగలదు.