AP 10th Class Maths Notes 1st Lesson వాస్తవ సంఖ్యలు

Students can go through AP Board 10th Class Maths Notes 1st Lesson వాస్తవ సంఖ్యలు to understand and remember the concept easily.

AP Board 10th Class Maths Notes 1st Lesson వాస్తవ సంఖ్యలు

→ యూక్లిడ్ (క్రీ.పూ. 330 – 275):

  • యూక్లిడ్ అలెగ్జాండ్రియా రాజు విశ్వవిద్యాలయంలో గణిత బోధకుడిగా పనిచేశాడు. యూక్లిడ్ ను “ఫాదర్ ఆఫ్ జామెట్రీగా” పిలుస్తారు.
  • ఇతను అందుబాటులోని గణితాంశాలన్నింటిని సేకరించి, నిర్వచనాలు, స్వీకృతాలు, సిద్ధాంతాలుగా వర్గీకరించి చరిత్ర ప్రసిద్ధి పొందిన గ్రంథం “ఎలిమెంట్స్”ను రచించాడు. ప్రపంచంలో బైబిల్ తర్వాత అత్యధికంగా అమ్ముడు పోయిన గ్రంథం ఇదే.
  • యూక్లిడ్ అల్గారిథమ్, సాపేక్ష ప్రధాన సంఖ్యలు, ఒకటి కన్నా పెద్దదైన ఏ పూర్ణ సంఖ్యనైనా ప్రధాన సంఖ్యల లబ్ధంగా ఏకైకం రాయవచ్చు.
  • కరణీయ సంఖ్యలు మొదలగునవి ఎలిమెంట్స్ గ్రంథంలోనివే. ఈ నాటికీ పాఠశాలల్లో గణితంగా బోధిస్తున్న దానిలో అధిక భాగం “ఎలిమెంట్స్” ను అనుసరించేవే. యూక్లిడ్ , క్రీ.పూ. 330 – 275

→ వస్తువులను లెక్కించుటకు (count చేయుటకు) అవసరమయ్యే సంఖ్యలను ‘సహజ సంఖ్యలు’ అంటారు. ఈ సంఖ్యా సమితిని N తో సూచిస్తారు. N = {1, 2, 3, ………}

→ గణిత అవసరాలను తీర్చుటకు సహజ సంఖ్య సమితి పూర్తి స్థాయిలో సరిపోవుటలేదనే విషయాన్ని గ్రహించుట ద్వారా “0” (సున్న) ను సహజ సంఖ్యా సమితికి చేర్చుట వల్ల నూతనంగా ఏర్పడే సంఖ్యా సమితిని పూర్ణాంకాలు అంటాం. దీనిని ‘W’ తో సూచిస్తాం. . పూర్ణాంకాలు W = {0, 1, 2, 3, ………….} గణితశాస్త్రానికి “0” సున్నాను పరిచయం చేసినది మన భారతీయులే.

→ సున్నా కంటే తక్కువ విలువ కలిగినవి ఋణపూర్ణాంకాలు. పూర్ణాంకాల సమితి (W) కు ఋణ పూర్ణాంకాలు చేర్చుట ద్వారా ఏర్పడిన సంఖ్యాసమితిని “పూర్ణ సంఖ్యలు” అంటాం. ‘Z’ తో సూచిస్తాం.
Z = {……… -4, -3, -2, -1, 0, 1, 2, 3, …………}

→ పూర్ణ సంఖ్యలు మరియు,” అంతమయ్యే దశాంశాలు, అంతంకాకపోయినా ఆవర్తనమయ్యే దశాంశాలు అన్నింటిని అకరణీయ సంఖ్యలు అంటారు. ఈ అకరణీయ సంఖ్యా సమితిని Q తో సూచిస్తాం. ఈ అకరణీయ సంఖ్యా సమితి పైన చెప్పిన అన్ని సంఖ్యాసమితులు (N, W, Z) కంటే కూడా పెద్ద సంఖ్యా సమితి. ఈ అకరణీయ సంఖ్యలను \(\frac{p}{q}\) రూపంలో వ్రాయగలుగుతాము. p, q లనేవి ‘Z’ కు చెంది ఉంటాయి. q ≠ 0 అవ్వాలి.
Q = {\(\frac{p}{q}\), q ≠ 0; p, q ∈ Z} * అంతములేని, ఆవర్తనముకాని (దశాంశ రూపంలో గల) సంఖ్యలను కరణీయ సంఖ్యలు అంటాం. వీటిని Q’ లేదా S తో సూచిస్తాం. ఉదా : √2, √3, √5, √7 ,………………..

→ కరణీయ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలను కలిపి వ్రాయగా ఏర్పడే సంఖ్యాసమితిని వాస్తవసంఖ్యలు అంటాం. దీనిని R తో సూచిస్తాం. R = Q ∪ Q’
AP 10th Class Maths Notes 1st Lesson వాస్తవ సంఖ్యలు 1

→ ప్రధాన సంఖ్యలు : 1 మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలుగా గల 1 కన్నా పెద్దవైన సహజసంఖ్యలు. ఉదా : 2, 3, 5, 7, ………….

→ ప్రధాన సంఖ్య నిర్ధారణ పరీక్ష : p ఒక సంఖ్య మరియు n2 > p అయ్యేటట్లు ఉండే కనిష్ఠ సంఖ్య n అయిన n కన్నా చిన్నది లేదా “సమానమైన ఏ ప్రధాన సంఖ్యతోను p భాగింపబడకపోతే p ఒక ప్రధాన సంఖ్య అవుతుంది. ఉదా : 1: 319

  • 182 > 319. 18 కన్నా తక్కువైన ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7, 11, 13, 17లలో ఏ సంఖ్యతోను 319 భాగింపబడదు. కావున 319 ప్రధాన సంఖ్య అవుతుంది. ఉదా : 2 : 253
  • 162 > 253. 16 కన్నా చిన్నవైన ప్రధాన సంఖ్యలలో ఒకటైన 11 తో 253 భాగింపబడుతుంది.
    ∴ 253 ప్రధానసంఖ్య కాదు.

→ సంయుక్త సంఖ్యలు : 1 మరియు అదే సంఖ్యతోపాటు ఇతర సంఖ్యలతో కూడా భాగింపబడే సహజ సంఖ్యలు.
ఉదా : 4, 6, 9, …………

AP 10th Class Maths Notes 1st Lesson వాస్తవ సంఖ్యలు

→ యూక్లిడ్ భాగహార న్యాయము : a = bq + r,0 ≤ r < b అయ్యే విధంగా a మరియు b ల జతకు అనుగుణంగా q మరియు r లు ఏకైక పూర్ణసంఖ్యలు వ్యవస్థితం అవుతాయి. అంకగణిత ప్రాథమిక సిద్ధాంతము : ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయవచ్చును మరియు ప్రధాన కారణాంకాల క్రమం ఏదైనప్పటికీ ఈ కారణాంకాల లబ్ధము ఏకైకము.

(i) గ.సా. కా లేదా గ.సా.భా : ఇచ్చిన సంఖ్యల యొక్క సామాన్య ప్రధాన కారణాంకాల యొక్క కనిష్ఠ ఘాతాల లబ్ధం వాని యొక్క గ.సా.5 అగును.
ఉదా : 60, 168 సంఖ్యలను కారణాంకాల లబ్దంగా వ్రాయగా
60 = 22 × 3 × 5; 168 = 22 × 3 × 7
60, 168 ల యందుగల సామాన్య కారణాంకాలు = 2, 3
వాని యొక్క కనిష్ఠ ఘాతాలు = 22, 31
∴ 60, 168 ల గ.సా. కా = వాని సామాన్య కారణాంకాల కనిష్ఠ ఘాతాల లబ్దం = 22 × 3 = 4 × 3 = 12

(ii) క.సా.గు : ఇచ్చిన సంఖ్యల యొక్క ప్రతీ ప్రధాన కారణాంకాల గరిష్ఠ ఘాతాల లబ్ధం వాని క.సా.గు (కనిష్ఠ సామాన్య గుణిజం) అగును.
ఉదా : 60, 168 సంఖ్యలను వాని కారణాంకాల లబ్దంగా వ్రాయగా
60 = 22 × 3 × 5; 168 = 22 × 3 × 7
60, 168 గల యొక్క అన్ని ప్రధాన కారణాంకాలు = 2, 3, 5, 7,
వాని యొక్క గరిష్ఠ ఘాతాలు = 22, 31, 51, 71
∴ 60, 168 ల క.సా.గు వాని గరిష్ఠ (ప్రతి కారణాంకం యొక్క ఘాతాల లబ్దం = 22 × 3 × 5 × 7 = 840.

→ ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో సున్న (0) ఉంటే ఆ సంఖ్య యొక్క ప్రధాన కారణాంకాల లబ్దంలో 2 మరియు 5 ఆ ఉంటాయి. దీని విపర్యయము కూడా నిజము.
ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 5 ఉంటే ఆ సంఖ్య యొక్క ప్రధాన కారణాంకాలలో 5 ఉంటుంది.

ఉదా :

  • 510 = 2 × 5 × 3 × 17;
  • 620 = 22 × 5 × 31;
  • 45 = 32 × 5;
  • 455 = 5 × 7 × 13

→ x అనేది ఒక అకరణీయ సంఖ్య మరియు దీని దశాంశ రూపం ఒక అంతమయ్యే దశాంశము అయినప్పుడు x ను p, q లు పరస్పర ప్రధానాంకాలు అయివున్న \(\frac{p}{q}\) రూపంలో వ్యక్తపరచవచ్చు మరియు q యొక్క ప్రధాన కారణాంకాల లబ్దం 20 5m అవుతుంది. ఇందులో n, m లు రుణేతర పూర్ణసంఖ్యలు. దీని విపర్యయము కూడా నిజము. విపర్యయము : ‘n, m లు రుణేతర పూర్ణసంఖ్యలు మరియు q యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధరూపం 215m కలిగినటువంటి అకరణీయ సంఖ్య x = \(\frac{p}{q}\) అయిన X యొక్క దశాంశ రూపం ఒక అంతమయ్యే దశాంశం అవుతుంది. (p, q లు సాపేక్ష ప్రధాన సంఖ్యలు)

→ x ఒక అకరణీయ సంఖ్య, p, q లు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అయి x = \(\frac{p}{q}\) అంతమవు దశాంశము అయితే q = 2ngm రూపంలో ఉంటుంది. ఈ దశాంశము n, m లలో పెద్దదైన సంఖ్యకు సమానమైన అంకెల వద్ద అంతం అవుతుంది.

ఉదా : \(\frac{13}{40}=\frac{13}{2^{3} \times 5}\) ; n = 3, m = 1 మరియు n > m.
\(\frac{13}{40}\) మూడు దశాంశాల తర్వాత అంతం అవుతుంది. ..
\(\frac{13}{40}\) = 0.325

→ n, m లు రుణేతర పూర్ణసంఖ్యలు మరియు q యొక్క ప్రధాన కారణాంకాల లబ్దము 2ngm రూపంలో లేకుంటే అకరణీయ సంఖ్య x = \(\frac{p}{q}\) యొక్క దశాంశ రూపం ఒక అంతంకాని.ఆవర్తన దశాంశము అవుతుంది.

AP 10th Class Maths Notes 1st Lesson వాస్తవ సంఖ్యలు

→ p అనేది ఒక ప్రధాన సంఖ్య మరియు a ఒక ధనపూర్ణ సంఖ్య అయితే a2 ను p నిశ్శేషంగా భాగిస్తే, a ను p నిశ్శేషంగా
భాగిస్తుంది. సంవర్గమానాలు : a మరియు N లు ధన పూర్ణసంఖ్యలై a > 1, N > 0 అవుతూ ax = N అయిన దీనిని సంవర్గమాన రూపంలో loga N = x అని వ్రాస్తాము. ఇచ్చట a, N ∈ R

గమనిక : ధన పూర్ణసంఖ్యలకు మాత్రమే సంవర్గమానాలు నిర్వచించబడ్డాయి.

  • loga 1 = 0 (ఏ ఆధారానికైనా 1 యొక్క సంవర్గమానం ‘0’.)
  • loga = 1

→ ఒక సంఖ్య యొక్క సంవర్గమానాలు విభిన్న భూములకు (ఆధారాలకు) వేర్వేరుగా ఉంటాయి.
ఉదా :

  • 64 = 82 యొక్క సంవర్గమాన రూపం log8 64 = 2
  • 64 = 43 యొక్క సంవర్గమాన రూపం log4 64 = 3
  • 64 = 26 యొక్క సంవర్గమాన రూపం log2 64 = 6

→ సంవర్గమాన న్యాయాలు : లబ్ధ సూత్రం

  • loga xy = logax + logay భాగఫల సూత్రం
  • loga \(\frac{x}{y}\) = logax – logay

→ ఘాత సూత్రాలు :

  • loga xm = m loga x,
  • logan n x = \(\frac{1}{n}\) loga x;
  • logan n xm = \(\frac{m}{n}\) loga x
  • a loga x = x

→ ఆధార మార్పిడి సూత్రాలు :

  • logax = logbx. logab;
  • logax = \(\frac{1}{\log _{x} a}\)

→ సంఖ్యల సంవర్గమానాలు పూర్ణాంక, దశాంశ భాగాలను కలిగి ఉంటాయి. పూర్ణాంక భాగాన్ని లాక్షణిక అని, దశాంశ భాగాన్ని మాంటిస్సా అని అంటారు.
ఒక అంకె సంఖ్య సంవర్గమానాల లాక్షణిక సున్న.
రెండు అంకెల సంఖ్య సంవర్గమానాల లాక్షణిక 1.
– మూడు అంకెల సంఖ్య సంవర్గమానాల లాక్షణిక 2.
AP 10th Class Maths Notes 1st Lesson వాస్తవ సంఖ్యలు 2

→ ఒక సంఖ్యలో n అంకెలుంటే ఆ సంఖ్య యొక్క లాక్షణికలో (n- 1) అంకెలుంటాయి. విపర్యయంగా, ఒక సంవర్గమాన లాక్షణిక n అయిన, ఆ సంఖ్యలో (n + 1) అంకెలుంటాయి.

ఉదా : ఒక తేనెటీగల గుంపు రెండు పువ్వులపై సమాన సంఖ్యలో వాలినపుడు ఒక తేనెటీగ మిగులుతుంది. అదే గుంపు మూడు పూవులపై సమాన సంఖ్యలో వాలినపుడు రెండు తేనెటీగలు మిగులుతాయి. అదే గుంపు నాలుగు పూవులపై సమాన సంఖ్యలో వాలినపుడు 3 మిగులుతాయి. అదే గుంపు ఐదు పూవులపై సమాన సంఖ్యలో వాలినపుడు మరి మిగలవు. ఆ గుంపులో గరిష్టంగా 50 వరకు తేనెటీగలు కలిగి ఉండవచ్చు. అయిన వాటి ఖచ్చిత సంఖ్య కనుగొనుము.

AP 10th Class Maths Notes 1st Lesson వాస్తవ సంఖ్యలు

→ సాధన. ఈ గుంపులో గల తేనెటీగలు = x అనుకుందాం
రెండు పూవులపై సమానంగా వాలిన 1 మిగులును

  • కావున x = 2a + 1 గా వ్రాయవచ్చును. ……………………….(1)
  • మూడు పూవులపై సమానంగా వాలిన 2 తేనెటీగలు మిగులును. కావున x = 3b + 2 ………………(2)
  • నాలుగు పూవులపై సమానంగా వాలిన 3 తేనెటీగలు మిగులును. కావున x = 4c + 3.0 ……………….(3)
  • ఐదు పూవులపై సమాన సంఖ్యలో వాలిన మరి మిగలవు. కావున x = 5d + 0 ……………..(4)

మరియు x ≤ 50 (ఎందుకనగా అవి గరిష్ఠంగా 50)
x అనునది 5 గుణజం అని 4వ సమీకరణం నుండి అర్థమగును కావున x యొక్క సాధ్య విలువలు = 5, 10, 15, 20, 25, 30, 35, 40 మరియు 45. మొదటి సమీకరణం నుండి x బేసి సంఖ్య అని అర్థమగును. కావున ఇపుడు ‘x’ యొక్క సాధ్య విలువలు = 5, 15, 25, 35, 45 (పై వాటి నుండి సరిసంఖ్యలు తొలగించాం). సమీకరణ (2) ప్రకారం 3చే భాగిస్తే శేషం 2 రావాలి.

కావున ఇపుడు ‘x’ యొక్క సాధ్య విలువలు = (5, 35). సమీకరణ (3) ప్రకారం 4చే భాగిస్తే శేషం 3 రావాలి. కావున 5, 35 లలో 35 మాత్రమే 4 చే భాగించినపుడు 3 శేషాన్ని ఇవ్వగలుగుతుంది.
∴ ఆ గుంపులో 35 తేనెటీగలు కలవని అర్థమవుచున్నది.

సరిచూచుట :

  • 35 తేనెటీగలు 5 పూవుల పై వాలిన \(\frac{35}{5}\) = 7 (శేషం – 0)
  • 35 తేనెటీగలు 4 పూవుల పై వాలిన \(\frac{35}{4}\) = 8 (శేషం – 3)
  • 35 తేనెటీగలు 3 పూవులపై వాలిన \(\frac{35}{3}\) =11 (శేషం – 2)
  • 35 తేనెటీగలు 2 పూవులపై వాలిన \(\frac{35}{2}\) =17 (శేషం – 1)

AP 10th Class Maths Notes 1st Lesson వాస్తవ సంఖ్యలు 3

AP 8th Class Maths Notes 15th Lesson సంఖ్యలతో ఆడుకుందాం

Students can go through AP Board 8th Class Maths Notes 15th Lesson సంఖ్యలతో ఆడుకుందాం to understand and remember the concept easily.

AP Board 8th Class Maths Notes 15th Lesson సంఖ్యలతో ఆడుకుందాం

→ ఒక సంఖ్య ‘a’ మరొక సంఖ్య ‘b’ను భాగించడం అంటే నిశ్శేషంగా భాగించుట అని అర్థం. దీనినే b, a చే భాగింపబడును అంటారు.

→ అంకెల స్థాన విలువ 12,34,56,789
AP 8th Class Maths Notes 15th Lesson సంఖ్యలతో ఆడుకుందాం 1

→ సంఖ్యలను విస్తరణ రూపంలో వ్రాయుట :
3456 = 3 × 1000 + 4 × 100 + 5 × 10 + 6 × 1
= 3 × 103 + 4 × 102 + 5 × 101 + 6 × 10°

→ 10 యొక్క భాజనీయతా నియమం : ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానమందు అంకె ‘0’ అయినచో అది ’10’ చే నిశ్శేషంగా భాగింపబడుతుంది.

→ 5 యొక్క భాజనీయతా నియమం : ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానమందు అంకె 0, 5 అయినచో ఆ సంఖ్య ‘5’చే నిశ్శేషంగా భాగింపబడుతుంది.

→ 2 యొక్క భాజనీయతా నియమం : ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానమందు గల అంకె 0, 2, 4, 6, 8 అయినచో అది ‘2’చే నిశ్శేషంగా భాగింపబడుతుంది.

→ ఒక సంఖ్య యొక్క అంకెల మొత్తం, 3 యొక్క గుణిజం అయిన ఆ సంఖ్య ‘3’చే నిశ్శేషంగా భాగింపబడుతుంది.

→ ఒక సంఖ్య యొక్క అంకెల మొత్తం, 9 యొక్క గుణిజం అయిన ఆ సంఖ్య ‘9’చే నిశ్శేషంగా భాగింపబడుతుంది.

AP 8th Class Maths Notes 15th Lesson సంఖ్యలతో ఆడుకుందాం

→ 2 మరియు 3చే భాగింపబడే అన్ని సంఖ్యలు ‘6’చే నిశ్శేషంగా భాగింపబడును.

→ ఒక సంఖ్య యొక్క చివరి రెండంకెలు 4చే భాగింపబడిన ఆ సంఖ్య 4చే నిశ్శేషంగా భాగింపబడును.

→ ఒక సంఖ్యలోని చివరి మూడంకెలు 8చే భాగింపబడిన ఆ సంఖ్య ‘8’చే నిశ్శేషంగా భాగింపబడును.

→ ఒక సంఖ్య 7చే నిశ్శేషంగా భాగించబడవలెనన్న, (2a + 3b + c) 7తో భాగింపబడవలెను. –
(ఇక్కడ a = వందల స్థానంలోని అంకె, b = పదుల స్థానంలోని అంకె, C = ఒకట్ల స్థానంలోని అంకె)

→ ఒక సంఖ్యలోని సరి స్థానములలోని అంకెల మొత్తం మరియు బేసి స్థానాలలోని అంకెల మొత్తముల భేదం 11 యొక్క గుణిజం లేక ‘0’ అయిన ఆ సంఖ్య ’11’చే నిశ్శేషంగా భాగింపబడును.

→ ప్రతి పాలిండ్రోమ్ సంఖ్య ’11’చే నిశ్శేషంగా భాగింపబడును.

AP 8th Class Maths Notes 14th Lesson ఉపరితల వైశాల్యము మరియు ఘనపరిమాణం (ఘనము-దీర్ఘఘనము)

Students can go through AP Board 8th Class Maths Notes 14th Lesson ఉపరితల వైశాల్యము మరియు ఘనపరిమాణం (ఘనము-దీర్ఘఘనము) to understand and remember the concept easily.

AP Board 8th Class Maths Notes 14th Lesson ఉపరితల వైశాల్యము మరియు ఘనపరిమాణం (ఘనము-దీర్ఘఘనము)

→ దీర్ఘఘనం యొక్క పొడవు, వెడల్పు, ఎత్తులు వరుసగా l, b, h లు అయిన
AP 8th Class Maths Notes 14th Lesson ఉపరితల వైశాల్యము మరియు ఘనపరిమాణం (ఘనము-దీర్ఘఘనము) 1
దీర్ఘఘనం యొక్క ప్రక్కతల వైశాల్యము = 2h (l + b)
దీర్ఘఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం = 2(lb + bh + lh)

→ ‘a’ భుజంగా గల సమఘనం యొక్క ప్రక్కతల వైశాల్యము = 4a2
AP 8th Class Maths Notes 14th Lesson ఉపరితల వైశాల్యము మరియు ఘనపరిమాణం (ఘనము-దీర్ఘఘనము) 2
సమఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యము = 6a2

→ దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం (V) = పొడవు × వెడల్పు × ఎత్తు = l × b × h = lbh
సమఘనం యొక్క ఘనపరిమాణం (V) = (s)3 = a3 (a = సమఘనం యొక్క భుజం)

→ 1 cm3 = 1 మిల్లీ లీటరు
1 లీటరు = 1000 ఘ. సెం.మీ.
1 మీ 3 = 1000000 ఘ. సెం.మీ. = 1000 లీటర్లు = 1 కిలోలీటరు

AP 8th Class Maths Notes 13th Lesson త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట

Students can go through AP Board 8th Class Maths Notes 13th Lesson త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట to understand and remember the concept easily.

AP Board 8th Class Maths Notes 13th Lesson త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట

→త్రిరిపరిమాణ వస్తువుల ఆకారములు సమాన మాపము గల చుక్కల కాగితముపై గీయు విధానము.

→ త్రిపరిమాణ వస్తువులను పై నుండి, ప్రక్క నుండి, ఎదుటి నుండి చూసినపుడు కనబడు వివిధ ఆకారములు.

→ బహుముఖి : సమతలములు కలిగిన వస్తువులు.

→ పట్టకము : బహుముఖి నందు సమాంతరముగా ఎదురెదురుగా గల రెండు తలములు సర్వసమానముగాను, మిగిలిన తలములు దీర్ఘచతురస్రములు (సమాంతర చతుర్భుజము)గా కలిగిన వస్తువులను పట్టకము అంటారు.

→ పిరమిడ్ : బహుముఖి నందు అడుగు భాగము యొక్క తలము బహుభుజిగాను, మిగిలిన ప్రక్కతలములు త్రిభుజములుగా కలిగిన వస్తువులను పిరమిడ్ అంటారు.

→ త్రిపరిమాణ వస్తువులు తయారుచేయుటకు ద్విమితీయ వల రూపములు ఉపయోగించుట.

AP 8th Class Maths Notes 13th Lesson త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట

→ బహుముఖిల కోసం ఆయిలర్ సూత్రము E + 2 = F + V

→ త్రిపరిమాణ వస్తువుల యొక్క తలములు, అంచులు, శీర్షములు : మనం నివసించే గది యొక్క గోడలు, కిటికీలు, తలుపులు, గది యొక్క పై భాగము, అడుగు తలము, మూలలు మొదలైనవి మరియు మన చుట్టూ గల వస్తువులు టేబుల్స్,
బాలు మొ||నవి గమనించండి. వాటి యొక్క తలములు సమతలములు. వాటి తలములు అంచుల వద్ద కలియుచున్నవి. రెండు లేక అంతకంటే ఎక్కువ అంచులు మూలల వద్ద కలియుచున్నవి. ఈ మూలను శీర్షము అంటారు. ఒక సమఘనము లేదా పిరమిడ్ ను గమనించండి.
AP 8th Class Maths Notes 13th Lesson త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట 1

→ ప్లేటోనిక్ వస్తువుల వలరూపాలు :

బహుముఖి పేరుబహుభుజి తలాలువలరూపము
చతుర్ముఖీయం4 త్రిభుజాలుAP 8th Class Maths Notes 13th Lesson త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట 2
అష్టముఖీయం8 త్రిభుజాలుAP 8th Class Maths Notes 13th Lesson త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట 3
షష్టిముఖీయం6 చతురస్రాలుAP 8th Class Maths Notes 13th Lesson త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట 4
ఇరవై ముఖాలు కలది20 త్రిభుజాలుAP 8th Class Maths Notes 13th Lesson త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట 5
ద్వాదశముఖీయం6 పంచభుజిలుAP 8th Class Maths Notes 13th Lesson త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట 6

→ బహుముఖి యొక్క అంచులు, తలములు, శీర్షముల సంఖ్య
ప్రక్క పటంలో బహుముఖి యొక్క అంచులు, తలములు, శీర్షములను లెక్కించెదము.
AP 8th Class Maths Notes 13th Lesson త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట 7
తలముల సంఖ్య – 5
అంచుల సంఖ్య – 9
శీర్షముల సంఖ్య – 6

AP 8th Class Maths Notes 13th Lesson త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట

→ కింది పట్టికను గమనించండి.
AP 8th Class Maths Notes 13th Lesson త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట 8
పై పట్టిక యొక్క చివరి రెండు నిలువు వరుసలు పరిశీలిస్తే అన్ని బహుముఖిలకు మనము F + V = E + 2 అని గమనించగలము.

AP 8th Class Maths Notes 12th Lesson కారణాంక విభజన

Students can go through AP Board 8th Class Maths Notes 12th Lesson కారణాంక విభజన to understand and remember the concept easily.

AP Board 8th Class Maths Notes 12th Lesson కారణాంక విభజన

→ ఒక సంఖ్యను ప్రధానసంఖ్యల లబ్ధంగా వ్యక్తపరిచే పద్ధతిని “ప్రధాన కారణాంక విభజన పద్ధతి” అంటారు.

→ ఇచ్చిన సమాసమును దాని కారణాంకాల లబ్ధంగా వ్రాయటాన్ని కారణాంక విభజన అందురు.

→ సూక్ష్మీకరణ సాధ్యం కాని కారణాంకమును అవిభాజ్య కారణాంకం అంటారు.

→ (a + b)2 = a2 + 2ab + b2
(a – b)2 = a2 – 2ab + b2
(a + b) (a – b) = a2 – b2

AP 8th Class Maths Notes 12th Lesson కారణాంక విభజన

→ (x + a) (x + b) = x2 + x(a + b) + ab

→ గోల్డ్ బాక్ ఊహ : ప్రతి బేసిసంఖ్య, ప్రధానసంఖ్యగానో లేదా కొన్ని ప్రధాన సంఖ్య మరియు వర్గ సంఖ్యకు రెట్టింపు సంఖ్యల మొత్తంగానే ఉంటుంది.
ఉదా : 21 (ఒక బేసి సంఖ్య); 21 = 19 + 2 (లేదా) 21 = 13 + 2(4) (లేదా) 21 = 3 + 2(9) గా వ్రాయవచ్చు

AP 8th Class Maths Notes 11th Lesson బీజీయ సమాసాలు

Students can go through AP Board 8th Class Maths Notes 11th Lesson బీజీయ సమాసాలు to understand and remember the concept easily.

AP Board 8th Class Maths Notes 11th Lesson బీజీయ సమాసాలు

→ ఒక ఏకపదిలోని చరరాశుల ఘాతాంకాల మొత్తాన్ని ఆ ఏకపది పరిమాణం అంటారు.

→ ఒక బీజీయ సమాసంలోని వివిధ పదాల పరిమాణాల్లో గరిష్ఠ పరిమాణాన్ని ఆ బీజీయ సమాస పరిమాణం అంటారు.

→ రెండు ఏకపదుల లబ్ధం ఒక ఏకపది అవుతుంది.

→ ఒక బహుపదిని ఏకపదిచే గుణించాలంటే బహుపదిలోని అన్ని పదాలను ఆ ఏకపదిచే గుణించాలి.

→ సర్వసమానం అనునది ఒక సమానత. సమీకరణంలోని సమానత్వం, చరరాశిలోని అన్ని విలువలకు సత్యమైనపుడు సర్వసమానత్వం అవుతుంది. ఇంకోవైపు సమీకరణం కొన్ని విలువలకే సత్యం అయితే సర్వసమానత్వంలో అన్ని విలువలకు సత్యం అవుతాయి.

AP 8th Class Maths Notes 11th Lesson బీజీయ సమాసాలు

→ కొన్ని సర్వసమీకరణాలు

  • (a + b)2 = a2 + 2ab + b2
  • (a – b)22 = a2 – 2ab + b2
  • (a + b) (a – b) = a2 – b2
  • (x + a) (x + b) = x2 + x(a + b) + ab .
  • (a + b)2 + (a – b)2 = 2(a2 + b2)
  • (a + b)2 – (a – b)2 = 4ab

గమనిక :

  • రెండు ధనసంఖ్యల లబ్ధము ధనసంఖ్య
  • రెండు ఋణ సంఖ్యల లబ్ధము ధనసంఖ్య
  • ఒక ధన మరియు ఒక ఋణ సంఖ్యల లబ్దము ఋణసంఖ్య

AP 8th Class Maths Notes 10th Lesson అనులోమ మరియు విలోమ అనుపాతములు

Students can go through AP Board 8th Class Maths Notes 10th Lesson అనులోమ మరియు విలోమ అనుపాతములు to understand and remember the concept easily.

AP Board 8th Class Maths Notes 10th Lesson అనులోమ మరియు విలోమ అనుపాతములు

→ ఒక రాశిలోని మార్పు వేరొక రాశిలోని పెరుగుదల / తగ్గుదల మార్పును కలిగి ఉంటే అవి అనుపాతంలో ఉన్నవని అంటారు.

→ x మరియు y అనే రెండు రాశులు అనులోమానుపాతంలోనున్న ఆ రెండు రాశులు ఒకే నిష్పత్తిలో మార్పుచెందును. అనగా \(\frac{x}{y}\) = k లేదా x = ky. దానిని మనం \(\frac{x_{1}}{y_{1}}=\frac{x_{2}}{y_{2}}\) లేదా x1, y2 = x2y1 గా వ్రాయవచ్చును. ( ఇక్కడ x1, x2, విలువలకు అనుగుణంగా వచ్చిన విలువలు వరుసగా y1, y2].

→ రెండు రాశులు x మరియు yలు విలోమానుపాతంలో వుంటే వాటి మధ్య xy = k (k స్థిరాంకము) వంటి సంబంధము ఏర్పడుతుంది. x1 , x2, విలువలకు అనుగుణంగా వచ్చిన విలువలు వరుసగా y1, y2 అయిన x1y1 = x2y2(=k), లేదా
\(\frac{x_{1}}{x_{2}}=\frac{y_{2}}{y_{1}}\)

AP 8th Class Maths Notes 10th Lesson అనులోమ మరియు విలోమ అనుపాతములు

→ ఒక రాశి పెరుగుదల (తగ్గుదల) రెండవరాశి తగ్గుదల (పెరుగుదల) ఒకే అనుపాతంలో వుంటే ఆ రెండు రాశులు విలోమానుపాతంలో వుంటాయి. అపుడు మొదటి రాశి నిష్పత్తి (x1 : x2) రెండవ రాశి నిష్పత్తి (y1 : y2) యొక్క విలోమ నిష్పత్తికి సమానంగా వుంటుంది. ఇక్కడ రెండు నిష్పత్తులు సమానం కావున ఈ విలోమ మార్పునే మనం విలోమానుపాతం అంటాము.

→ కొన్నిసార్లు ఒక రాశిలోని మార్పు, రెండు లేదా అంతకన్నా ఎక్కువ రాశులలో మార్పుకు కారణమవుతుంది. ఆ మార్పులు అనుపాతంలో వుంటే దానినే మనం మిశ్రమానుపాతం అంటాము. అప్పుడు మొదటి రాశి నిష్పత్తిని మిగిలిన రెండు రాశుల బహుళ నిష్పత్తికి సమానం చేస్తాము.

AP 8th Class Maths Notes 9th Lesson సమతల పటముల వైశాల్యములు

Students can go through AP Board 8th Class Maths Notes 9th Lesson సమతల పటముల వైశాల్యములు to understand and remember the concept easily.

AP Board 8th Class Maths Notes 9th Lesson సమతల పటముల వైశాల్యములు

→ త్రిభుజ వైశాల్యము = \(\frac{1}{2}\) × భూమి × ఎత్తు
= \(\frac{1}{2}\)bh

→ చతుర్భుజ వైశాల్యము = \(\frac{1}{2}\) × కర్ణం పొడవు × కర్ణంపై గీయబడిన లంబాల పొడవుల మొత్తం
= \(\frac{1}{2}\)h(h1 + h2)

→ సమలంబ చతుర్భుజ వైశాల్యం = \(\frac{1}{2}\) × సమాంతర భుజాల మధ్య దూరం × సమాంతర భుజాల పొడవుల మొత్తం
= \(\frac{1}{2}\)h(a + b).

→ సమచతుర్భుజం (రాంబస్) వైశాల్యం = కర్ణముల పొడవుల లబ్ధంలో సగం
= \(\frac{1}{2}\)d1d2

AP 8th Class Maths Notes 9th Lesson సమతల పటముల వైశాల్యములు

→ వృత్తం దాని కేంద్రం వద్ద చేయు కోణం 360°.
వృత్త వైశాల్యం = πr² (r – వృత్త వ్యాసార్ధం)

→ π విలువ = \(\frac{22}{7}\) (సుమారుగా 3.14)
వృత్త పరిధి = 2πr (r – వృత్త వ్యాసార్ధం)

→ కంకణాకార స్థల వైశాల్యం = π (R2 – r2) లేదాπ(R + r) (R – r)
ఇందులో R – బాహ్య వృత్త వ్యాసార్ధం,
I – అంతర వృత్త వ్యాసార్ధం.

→ కంకణాకార స్థల వెడల్పు, w = R – r
సెక్టారు వైశాల్యం, A = \(\frac{x^{\circ}}{360^{\circ}}\) × πr²
ఇందులో x° = సెక్టారు కోణం,
r = వృత్త వ్యాసార్ధం
(లేదా)
A = \(\frac{{lr}}{2}\)(l – సెక్టారు చాపం పొడవు, r – వృత్త వ్యాసార్ధం)

→ సెక్టారు చాపం పొడవు = \(\frac{x^{\circ}}{360^{\circ}}\) × 2πr
x° = సెక్టారు కోణం, r = వృత్త వ్యాసార్ధం.

AP 7th Class Social Notes 2nd Lesson Forests

Students can go through AP Board 7th Class Social Notes 2nd Lesson Forests to understand and remember the concept easily.

AP Board 7th Class Social Notes 2nd Lesson Forests

→ The world has several climatic zones.

→ Geographers defined the climatic region based on temperature and precipitation.

→ The tropical climatic region with dense forests are called “Selvas”.

→ Sahara desert is the biggest desert in the world.

→ The Tundra region stretch between the Arctic and Polar regions.

→ Large area covered with trees or shrubs in natural habitation in a particular place is called forest.

→ Forests are the places for survival for the tribals and variety of flora and fauna.

→ Forests are divided into five types based on climate, rainfall and types of soils.

AP 7th Class Social Notes 2nd Lesson Forests

→ According to the National Forest Policy -1952, forest should cover 33% of surface of total area.

→ Madhya Pradesh has the largest forest covei in the country

→ Haryana has the lowest forest cover in the country.

→ As per Indian State Forests Report 2019 Andhra Pradesh has a forest cover area of 37,392 sq kms, which amounts fo 22.94% of the total geographical area

→ In A.P, YSR Kadapa has highest forest area and Krishna has lowest forest area.

→ Deforestation is the cutting of trees in a large area, or the destruction of forest by people

→ Social forestry is a concept taken up for conservation of forests and afforestation in barren ‘ and deforested lands, forthe purpose of helping environment, social and rural development

Climatic Regions : Climatic region refers to a continuous geographic area in which similar climate characteristics are observed. Climatic region based on temperature and precipitation.

Concept of Forest : Large area covered with trees or shrubs in natural habitation in a particular place is called forest.

Types of Forests : Forests are divided into five types based on climate, rainfall and types of soils.

AP 7th Class Social Notes 2nd Lesson Forests

Uses of forests : Forests are useful for so many ways. We depend on forestsfor our survival, from the air we breathe to the wood we use. Forests are useful to us for Consumptive use, Marketing, & Balancing ecosystem, etc.

Issues and reasons for deforestation : Cutting of trees in a large area is called deforestation.
Reasons : 1) Industrial purpose
2) Construction of roads and dams etc.

Social forestry and conservation of forests : Social forestry is the management and protection of forests and afforestation of barren and deforested lands with fhe purpose of helping environmental social and rural development.

Conservation of forest is the practice of planting more trees and maintaining the forested areas for the sustaina-bility for future generations.

1. Flora : The plants of a particular region.

2. Fauna : The animals of a particular region.

3. Dense forest : The trees that grow close together.

4. Climate : The weather conditions prevailing in an area over a long period.

5. Transpiration : The exhalation of water vapour through the stomato.

6. Sundarbans : The dominant mangrove species in West Bengal.

AP 7th Class Social Notes 2nd Lesson Forests

7. Coniferous trees : Shrubs having needle shaped leaves.

8. Urbanisation : Population shift from rural to urban areas.

9. Aboriginal : Inhabiting in a land from the earliest times.

10. Global warming : Rapid increase in Earth’s average surface temperature.

11. Soil Erosion : Gradual removal of top layers of the earth.

1.
AP 7th Class Social Notes 2nd Lesson Forests 1

2.
AP 7th Class Social Notes 2nd Lesson Forests 2

3.
AP 7th Class Social Notes 2nd Lesson Forests 3

AP Board 1st Class Telugu Solutions 2nd Lesson మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్

Andhra Pradesh AP Board 1st Class Telugu Solutions 2nd Lesson మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్ Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 1st Class Telugu Solutions Chapter 2 మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్

Textbook Page No. 30

మేలుకొలుపు

గ, ౦

చిన్నారి పొన్నారి చిట్టి నా తల్లి!
చుక్కల్లో చంద్రుడూ చూడవచ్చాడు
తెల్లవారొచ్చింది కోడి కూసింది
చూచేటి అక్కల్లు చూడరారమ్మ
గంప కిందా కోడి గుడ్డు పెట్టింది
ఆడేటి పిల్లల్లు చూడరారమ్మ
ఆడేటి వారికి అచ్చావు పాలు
పాడేటి వారికి పాల మీగడలు
AP Board 1st Class Telugu Solutions 2nd Lesson మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్ 1

Textbook Page No. 31

వినండి- మాట్లాడండి.

అ) గేయం పాడండి. అభినయించండి.
జవాబు:
గేయాన్ని పాడుట, అభినయించుట.

AP Board 1st Class Telugu Solutions 2nd Lesson మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్

ఆ) పాఠం చిత్రంలో ఎవరేం చేస్తున్నారో చెప్ప౦డి.
జవాబు:

  1. తల్లి, పిల్లలు గంప కింద ఉన్న కోడిని చూస్తున్నారు. కోడి గుడ్డు పెట్టడం చూస్తున్నారు.
  2. కోడి కూస్తుంది.
  3. ఆవు, లేగ దూడను ముద్దు చేస్తుంది.
  4. కావడిలో రైతు వస్తువులు తీసుకువెళ్ళుతున్నాడు.
  5. పని వారలు స్త్రీలు తిరిగి చూస్తున్నారు.

ఇ) కింది చిత్రం ఆధారంగా మాట్లాడండి.
AP Board 1st Class Telugu Solutions 2nd Lesson మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్ 2
జవాబు:
కూరలమ్మే అతను బండి మీద తీసుకువస్తున్నారు. చిన్న పాపతో కూరలు బేరం చేస్తుంది. ఒకామె పండ్లు, కూరలు అమ్ముతుంది. వాళ్ళ పాప ఆమె వెంట వెళుతుంది. పల్లెటూరి చిత్రం కనపడుతుంది.

చదవండి.

అ) గేయంలోని వాక్యాలలో “గంప” పదానికి AP Board 1st Class Telugu Solutions 2nd Lesson మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్ 3 చుట్టండి.
జవాబు:
గేయంలో చూడాలి.

ఆ) కింది వాక్యాలలో “గంప” పదానికి AP Board 1st Class Telugu Solutions 2nd Lesson మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్ 3 చుట్టండి.

AP Board 1st Class Telugu Solutions 2nd Lesson మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్ 4
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 2nd Lesson మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్ 5

AP Board 1st Class Telugu Solutions 2nd Lesson మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్

Textbook Page No. 32

ఇ) చిత్రం చూడండి. పదం చదవండి. వర్ణమాలలో గుర్తించండి.

AP Board 1st Class Telugu Solutions 2nd Lesson మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్ 6

ఈ) కింది గళ్ళలో అక్షరాలు చెప్ప౦డి.
AP Board 1st Class Telugu Solutions 2nd Lesson మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్ 7
1వ అక్షరం ఏమిటి ?
జవాబు:
2వ అక్షరం ఏమిటి ?
జవాబు:
1, 2 అక్షరాలు కలిపి చదవండి
జవాబు: గ౦
1, 2, 3 అక్షరాలు కలిపి చదవండి.
జవాబు: గంప
1, 6, 3 అక్షరాలు కలిపి చదవండి.
జవాబు: గడప
3, 2, 6, 1 అక్షరాలు కలిపి చదవండి. పండగ

ఉ) కింది బొమ్మలు గం, ప అనే అక్షరాలతో మొదలవుతాయి. వాటి పేర్లు చెప్ప౦డి.
AP Board 1st Class Telugu Solutions 2nd Lesson మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్ 8

ఊ) పదాలను చదవండి. ‘గ’ అక్షరానికి AP Board 1st Class Telugu Solutions 2nd Lesson మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్ 9 చుట్టండి.
AP Board 1st Class Telugu Solutions 2nd Lesson మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్ 10
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 2nd Lesson మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్ 11

Textbook Page No. 33

రాయండి.

అ) గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయండి.
AP Board 1st Class Telugu Solutions 2nd Lesson మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్ 12

ఆ) చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి.
AP Board 1st Class Telugu Solutions 2nd Lesson మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్ 13
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 2nd Lesson మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్ 14

AP Board 1st Class Telugu Solutions 2nd Lesson మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్

ఉ) కింది అక్షరాలతో ఏర్పడే పదాలను రాయండి.
AP Board 1st Class Telugu Solutions 2nd Lesson మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్ 15
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 2nd Lesson మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్ 16

సృజనాత్మకత:

పిల్లలూ ! చుక్కలు కలుపుతూ చిత్రం గీయండి. రంగులు వేయండి. పేరు రాయండి.
AP Board 1st Class Telugu Solutions 2nd Lesson మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్ 17
జవాబు:
గంప

Textbook Page No. 34

ఉడత ! ఉడత ! హూచ్ !

ఉ, త

AP Board 1st Class Telugu Solutions 2nd Lesson మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్ 18
ఉడతఉడత… హూచ్
ఎక్కడికెళతావోచ్
సంతకు వెళతానోచ్
ఏమిటి తెస్తావోచ్
బెల్లం తెస్తానోచ్
నాకు ఇస్తావా ?
నేనివ్వను … పో … పో …
మా పాపకిస్తాను …

Textbook Page No. 35

వినండి- మాట్లాడండి.

అ) గేయం పాడండి. అభినయించండి.
జవాబు:
గేయాన్ని పాడుట, అభినయించుట.

ఆ) పాఠం చిత్రంలో ఎవరేం చేస్తున్నారో చెప్ప౦డి.
జవాబు:
1. ఉడత, ఉడత పిల్ల చెట్టు మీద ఉన్నాయి.
2. స్నేహితులు అందరూ ఆడుకుంటున్నారు.
3. ఉడుతను చూస్తున్నారు. ఉడుతతో మాట్లాడుతున్నారు. కుక్క పిల్ల ఉడుతను చూస్తుంది. టాటా చెపుతున్నారు.

AP Board 1st Class Telugu Solutions 2nd Lesson మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్

ఇ) కింది చిత్రం ఆధారంగా మాట్లాడండి.
AP Board 1st Class Telugu Solutions 2nd Lesson మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్ 19
జవాబు:
చెట్టు మీద, గోడ మీద ఉడతలు ఉన్నాయి. పిల్లలు బొంగరాలు ఆట ఆడుతున్నారు. కొందరు బొంగరాన్ని చూస్తున్నారు. బొంగరం ఆట భలే మజాగా ఉంటుంది.

చదవండి.

అ) గేయంలోని వాక్యాలలో “ఉడత” పదానికి AP Board 1st Class Telugu Solutions 2nd Lesson మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్ 20 చుట్టండి.
జవాబు:
గేయంలో చూడాలి

ఆ) కింది వాక్యాలలో “ఉడత” పదానికి AP Board 1st Class Telugu Solutions 2nd Lesson మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్ 20 చుట్టండి.
AP Board 1st Class Telugu Solutions 2nd Lesson మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్ 21
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 2nd Lesson మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్ 22

Textbook Page No. 36

ఇ) చిత్రం చూడండి. పదం చదవండి. వర్ణమాలలో గుర్తించండి.
AP Board 1st Class Telugu Solutions 2nd Lesson మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్ 23

ఈ) కింది గళ్ళలో అక్షరాలు చెప్ప౦డి.
AP Board 1st Class Telugu Solutions 2nd Lesson మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్ 24
1వ అక్షరం ఏమిటి ?
జవాబు:
2వ అక్షరం ఏమిటి ?
జవాబు:
3వ అక్షరం ఏమిటి ?
జవాబు:
1, 2, 3 అక్షరాలు కలిపి చదవండి.
జవాబు: ఉడత
4, 5, 6 అక్షరాలు కలిపి చదవండి.
పడవ

AP Board 1st Class Telugu Solutions 2nd Lesson మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్

ఉ) కింది బొమ్మలు ఉ, త అనే అక్షరాలతో మొదలవుతాయి. వాటి పేర్లు చెప్ప౦డి.

AP Board 1st Class Telugu Solutions 2nd Lesson మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్ 25

ఊ) పదాలను చదవండి. ‘త’ అక్షరానికి AP Board 1st Class Telugu Solutions 2nd Lesson మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్ 26 చుట్టండి.
AP Board 1st Class Telugu Solutions 2nd Lesson మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్ 27
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 2nd Lesson మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్ 28

Textbook Page No. 37

రాయండి.

అ) గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయండి.

AP Board 1st Class Telugu Solutions 2nd Lesson మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్ 29

ఆ) చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి.
AP Board 1st Class Telugu Solutions 2nd Lesson మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్ 30
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 2nd Lesson మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్ 31

ఇ) కింది గళ్ళలోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి.
AP Board 1st Class Telugu Solutions 2nd Lesson మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్ 32
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 2nd Lesson మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్ 33

AP Board 1st Class Telugu Solutions 2nd Lesson మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్

సృజనాత్మకత:

పిల్లలూ ! చుక్కలు కలుపుతూ చిత్రం గీయండి. రంగులు వేయండి. పేరు రాయండి.

AP Board 1st Class Telugu Solutions 2nd Lesson మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్ 34
జవాబు:
ఉడత

AP Board 3rd Class EVS Solutions 7th Lesson Shelter for All

Andhra Pradesh AP Board 3rd Class EVS Solutions 7th Lesson Shelter for All Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 3rd Class EVS Solutions Lesson 7 Shelter for All

I. Conceptual Understanding:

Question 1.
What is the difference between a Kutcha and Pucca house ?
Answer:
Differences between Kutcha and Pucca houses.

Kutcha housePucca house
1. The houses made of mud and straw are called ‘Kutcha houses’ 1. The houses made of bricks, sand and iron are called pucca houses.
2. They are not strong 2. They are strong
3. Examples are huts 3. Examples are buildings, Apartments

Question 2.
Why do we need a house ?
Answer:
House is a place in which we live. All living beings such as animals, birds, humans need a place to live. We need a house to protect ourselves from heat, cold, rain and enemies.

Question 3.
What help can be given to the people who live in tents and pipes ?
Answer:

  1. I can help the people who live in tents and pipes by donating Non-perishable items such as clothing, blankets, coats, books and small kitchen items.
  2. I can help them by showing some work if they are in need of money.

AP Board 3rd Class EVS Solutions 7th Lesson Shelter for All

II. Questioning and Hypothesis:

Question 4.
Deepthi observed a beehive on a tree. She wants to know about the beehive. What question would she ask her teacher ?
Answer:
Deepthi might have asked the following questions to her teacher.

  1. What is a beehive ?
  2. Will an empty beehive attract bees ?
  3. What plant is safe for beehives ?
  4. What does a beehive symbolize ?

III. Experiments & Field Observations:

Question 5.
Observe the different shelters of animals, birds and insects and name them.
Answer:

AnimalsShelters
1. DogKennel
2. Cows, BuffaloShed
3. PigSty
4. HorseStable
5. MonkeyTree
6. SnakesAnthill
7. LionDen
8. SheepFold

b) Bird Shelters :

BirdsShelters
1. SparrowNest
2. HenCoop
3. WoodpeckerHoles in the trunk

c) Insect Shelters :

InsectShelter
BeesBeehives
SpiderWeb
Silk wormSilk moth
AntsAnthill

AP Board 3rd Class EVS Solutions 7th Lesson Shelter for All

IV. Information Skills & Project Work:

Question 6.
Observe the roofs of houses in your surroundings and fill in the given table.

AP Board 3rd Class EVS Solutions 7th Lesson Shelter for All 1

Answer:
Student activity.

V. Appreciation, values and creating awareness towards bio-diversity:

Question 7.
Make a model of a hut with ice cream sticks or matchsticks.
Answer;
Student activity.

VI. Appreciation, values and creating awareness towards bio-diversity:

Question 8.
If you have a bird or a cat or a dog as a pet, how would you take care of it?
Answer:
If I have a pet either a bird, cat or a dog I will take care of it.

  1. I will feed my pet a good and high quality food.
  2. Take them for a walk every day (animal).
  3. Provide them with the needed vaccination on time.
  4. Keep a clean and hygeinic environment for them.
  5. Engage and do not leave them alone for a long time.

AP Board 3rd Class EVS Solutions 7th Lesson Shelter for All

Additional Questions:

I. Conceptual Understanding:

Question 1.
Draw a flow chart which shows evolution of houses from the beginning.
Answer:
Caves → Thatched house → Mud house → Tiled house → Pucca house → Apartments

AP Board 3rd Class EVS Solutions 7th Lesson Shelter for All 2

Question 2.
Building of houses depend on which factors ?
Answer:
People build houses depending on the following factors.

  1. Climate
  2. Economic condition
  3. Materials available
  4. Land availability.

AP Board 3rd Class EVS Solutions 7th Lesson Shelter for All

Question 3.
Mention the features of different types of houses in a table form.
Answer:

AP Board 3rd Class EVS Solutions 7th Lesson Shelter for All 3

Question 4.
Why do houses have sloped roof ?
Answer:
Most of the houses have sloped roofs in order to drain the rain water or snow falling on them.

Question 5.
How should we keep our houses clean and tidy ?
Answer:
Whatever the type of house we live in, a hut, tiled house or a pucca house, if we keep things properly in order, it will look neat and tidy. We should always throw the garbage and dirt away from our house. A clean house keeps us healthy.

AP Board 3rd Class EVS Solutions 7th Lesson Shelter for All

Question 6.
What happens if you leave garbage around your house ?
Answer:
When you leave garbage all arround without cleaning, foul smell comes out, mosquitoes and flies breed. We should always throw the garbage and dirt away from our houses (dust bins) to keep us healthy.

II. Information Skills & Project Work:

Question 7.
Draw a house that you like.
Answer:
Student activity.

III. Experiments & field Observations:

Question 8.
Visit your neighbour’s house and observe the facilities they have. A list of facilities is given in the table below. Put a tick mark (✓):

AP Board 3rd Class EVS Solutions 6th Lesson Water - The Gift from Nature 1

Answer:
Student activity.

AP Board 3rd Class EVS Solutions 7th Lesson Shelter for All

Multiple Choice Questions:

Question 1.
A ________ gives us shelter and protection.
a) tree
b) house
c) pets
d) none
Answer:
b) house

Question 2.
People who migrate live in ________.
a) Pucca houses
b) buildings
c) tents
d) none
Answer:
c) tents

Question 3.
________ is a house on wheels.
a) Tent
b) Caravan
c) Igloo
d) All
Answer:
b) Caravan

AP Board 3rd Class EVS Solutions 7th Lesson Shelter for All

Question 4.
Houses that keep changing locations are called ________.
a) temporary houses
b) permanent houses
c) a & b
d) none
Answer:
a) temporary houses

Question 5.
The top portion of a house is called the ________.
a) wall
b) floor
c) foundation
d) roof
Answer:
d) roof

Question 6.
Stone houses are found more in ________ range.
a) Andhra
b) Rayalaseema
c) Telangana
d) none
Answer:
b) Rayalaseema

AP Board 3rd Class EVS Solutions 7th Lesson Shelter for All

Question 7.
Rabbits and squirrels live in ________
a) nests
b) caves
c) burrows
d) none
Answer:
c) burrows

Question 8.
Lions and bears live in ________.
a) nests
b) caves
c) burrows
d )trees
Answer:
b) caves

Question 9.
________ are homeless animals.
a) Elephants
b) Monkeys
c) Giraffe
d) All
Answer:
d) All

AP Board 3rd Class EVS Solutions 7th Lesson Shelter for All

Question 10.
Temporary houses are set up at the time of ________.
a) floods
b) cyclones
c) a & b
d) none
Answer:
c) a & b

AP 7th Class Maths Notes 7th Lesson నిష్పత్తి మరియు అనుపాతం

Students can go through AP Board 7th Class Maths Notes 7th Lesson నిష్పత్తి మరియు అనుపాతం to understand and remember the concept easily.

AP Board 7th Class Maths Notes 7th Lesson నిష్పత్తి మరియు అనుపాతం

→ a : b మరియు c : d ల బహుళ నిష్పత్తి ac : bd.

→ a, b లు రెండు రాశులు అయిన, a పెరుగుతున్నపుడు b కూడా పెరుగుతూ లేదా a తగ్గుతున్నపుడు b కూడా తగ్గుతూ ఉంటే అప్పుడు a, b లు అనులోమానుపాతంలో ఉన్నాయి అని అంటాం.

→ a, b లు అనులోమానుపాతంలో ఉంటే \(\frac{a}{b}\) = k అవుతుంది. ఇక్కడ k ని అనుపాత స్థిరాంకం అంటారు.

→ a, b లు రెండు రాశులు అయిన, ‘a’ పెరుగుతున్నపుడు ‘b’ తగ్గుతుంటే లేదా ‘a’ తగ్గుతూ ఉన్నపుడు ‘b’ పెరుగుతూ ఉంటే a, b లు విలోమానుపాతంలో ఉన్నాయి అని అంటాం.

→ a, b లు విలోమానుపాతంలో ఉంటే a × b = k అవుతుంది. ఇక్కడ k ని అనుపాత స్థిరాంకం అంటారు.

→ కొన్నిసార్లు ఒక రాశిలో మార్పు రెండు లేదా అంతకంటే ఎక్కువ రాశులలో మార్పులపై ఆధారపడి ఉంటుంది. దీనినే మిశ్రమానుపాతం అంటాము.

→ 1% = 1/100 = 0.01 = 1: 100

→ లాభం = అమ్మిన వెల – కొన్న వెల

→ నష్టం = కొన్న వెల – అమ్మిన వెల
AP 7th Class Maths Notes 7th Lesson నిష్పత్తి మరియు అనుపాతం 1
→ రాయితీ ఎల్లప్పుడూ ప్రకటన వెలపై లెక్కిస్తారు.

→ రాయితీ = ప్రకటన వెల – అమ్మిన వేల

→ సాధారణ వడ్డీ = \(\frac{\mathrm{P} \times \mathrm{T} \times \mathrm{R}}{100}\)

AP 7th Class Maths Notes 7th Lesson నిష్పత్తి మరియు అనుపాతం

→ నిష్పత్తి : ఒకే రకమైన రెండు రాశులను భాగహారం ద్వారా పోల్చడాన్ని నిష్పత్తి అంటాం. a మరియు b రాశుల నిష్పత్తిని \(\frac{a}{b}\) లేదా a : b గా సూచిస్తాము.
ఈ రాశుల నిష్పత్తిని కనుగొనడానికి ఆ రాశులు ఎల్లప్పుడూ ఒకే ప్రమాణాలలో ఉండాలి.
& a : b లో ‘a’ ని పూర్వపదం అని, ‘b’ ని పరపదం అని అంటాము

→ అనుపాతం : రెండు నిష్పత్తుల సమానత్వాన్ని అనుపాతం అంటాము.

  • a : b మరియు C : d సమానమైతే వాటిని a : b = c : d లేదా a : b :: c: d గా రాస్తాము.
  • a : b = c : d అయితే a, b, c, d లు అనుపాతంలో ఉన్నాయి అని, a, d లను అంత్యములు అని, b, c లను మధ్యమములు అని అంటాం.
  • a, b, c, d లు అనుపాతంలో ఉంటే ad = bc అనగా
    అంత్యముల లబ్ధం = మధ్యమముల లబ్ధం

→ బహుళ నిష్పత్తి : a : bమరియు c : d లు ఏవేని రెండు నిష్పత్తులైన వీని బహుళ నిష్పత్తి a × c: b × d అవుతుంది. (అనగా పూర్వపదాల లబ్ధం : పరపదాల లబ్ధం)
ఉదా : 2 : 3 మరియు 5 : 2 ల బహుళ నిష్పత్తి
= 2 × 5 : 3 × 2 = 10 : 6

→ అనులోమానుపాతం : రెండు రాశులలో ఒక రాశి పెరిగినపుడు, రెండవ రాశి కూడా అదే అనుపాతంలో పెరిగినా లేదా ఒక రాశి తగ్గినపుడు రెండవ రాశి కూడా అదే అనుపాతంలో తగ్గితే, అప్పుడు ఆ రెండు రాశులు అనులోమానుపాతంలో కలవు అంటారు.
x మరియు y అనే రాశులు అనులోమానుపాతంలో ఉంటే x ∝ y తో సూచిస్తాము. మరియు x = ky ఇక్కడ kను అనుపాత స్థిరాంకం అంటారు.
x ∝ y అయితే x = ky.
∴ \(\frac{x}{y}\) = k
అనగా X మరియు y ల నిష్పత్తి ఒకే విలువను కలిగి ఉంటుంది.
ఉదా : పనివాళ్ళ సంఖ్య (x) మరియు వారికి చెల్లించేందుకు అవసరమైన వేతనం (y) అనులోమానుపాతంలో ఉంటాయి.

→ విలోమానుపాతం : రెండు రాశులలో ఒక రాశి పెరిగినపుడు, రెండవరాశి అదే అనుపాతంలో తగ్గితే లేదా ఒక రాశి తగ్గినపుడు రెండవ రాశి అదే అనుపాతంలో పెరిగితే. అపుడు ఆ రెండు రాశులు విలోమానుపాతంలో ఉన్నాయని అంటాం.
x, y లు విలోమానుపాతంలో ఉంటే x ∝\(\frac{1}{y}\) గా రాస్తాము మరియు x = k. \(\frac{1}{y}\)
ఇక్కడ k ను అనుపాత స్థిరాంకం అంటారు.
x \(\frac{1}{y}\) అయితే x = k. \(\frac{1}{y}\) మరియు x . y = k అవుతుంది.
ఉదా : పనివాళ్ళ సంఖ్య (x) మరియు వారు ఒక పనిని పూర్తి చేయడానికి పట్టే రోజుల సంఖ్య (y) విలోమానుపాతంలో ఉంటాయి.

→ మిశ్రమానుపాతం : ఒక రాశిలోని మార్పు, ఏవైనా మరొక రెండు లేదా అంతకన్నా ఎక్కువ రాశులలో మార్పులపై ఏదో – ఒక అనుపాతంలో ఆధారపడి ఉంటుంది. దీనినే మిశ్రమానుపాతం అంటారు. మిశ్రమానుపాతం క్రింది విధంగా ఉండవచ్చును.

  • ఒక రాశి మిగిలిన రెండు రాశులతో అనులోమానుపాతం కలిగి ఉండవచ్చు.
  • ఒక రాశి మిగిలిన రెండు రాశులతో విలోమానుపాతం కలిగి ఉండవచ్చు.
  • ఒక రాశి మిగిలిన రెండు రాశులలో ఒకదానితో అనులోమానుపాతం, మరొక దానితో విలోమానుపాతం కలిగి ఉండవచ్చు.

పై వానిలో

  • వ సందర్భంలో మొదటి రాశుల నిష్పత్తికి, మిగిలిన రాశుల నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తికి సమానం చేస్తాము.
  • వ సందర్భంలో మొదటి రాశుల నిష్పత్తికి, మిగిలిన రాశుల విలోమ నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తికి సమానం చేస్తాము.
  • సందర్భంలో మొదటి రాశుల నిష్పత్తికి, మిగిలిన రాశులలో అనులోమానుపాతంలో గల రాశుల యొక్క నిష్పత్తికి మరియు విలోమానుపాతంలో గల రాశుల యొక్క విలోమ నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తికి సమానము.

→ శాతాలు : శాతం అనగా వంద (100)కి అని అర్థం.
శాతాన్ని ‘%’ అనే గుర్తుతో సూచిస్తాము.
5% అనగా నూటికి 5 అని అర్థము.
5% = 5 × \(\frac{1}{100}=\frac{5}{100}\) = 5 : 100
శాతాలను వ్యాపారం, ప్రభుత్వ పాలన, విద్యావిషయాలు, వైద్యరంగం, మొదలగు వానిలో ఉపయోగిస్తారు.

→ లాభం లేదా నష్టం :

  • ఒక వస్తువును ఎంత ఖరీదుకు కొంటామో దానిని కొన్న వెల అని అంటాము. సూక్ష్మంగా కొ.వె. అని రాస్తాము.
  • ఒక వస్తువును ఎంత ఖరీదుకు అమ్ముతామో దానిని అమ్మిన వెల అని అంటాము. సూక్ష్మంగా అ.వె. అని రాస్తాము.
  • అమ్మిన వెల , కొన్న వెల కంటే ఎక్కువగా ఉంటే లాభం వస్తుంది.
    లాభం = అమ్మిన వెల – కొన్న వెల
    అమ్మిన వెల = కొన్న వెల + లాభం
  • కొన్న వెల, అమ్మిన వెల కంటే ఎక్కువగా ఉంటే నష్టం వస్తుంది.
    నష్టం = కొన్న వెల – అమ్మిన వెల
    కొన్న వెల = అమ్మిన వెల + నష్టం

AP 7th Class Maths Notes 7th Lesson నిష్పత్తి మరియు అనుపాతం

→ రాయితీ (ముదరా) : కొన్ని ప్రత్యేక సందర్భాలలో వ్యాపారులు తమ వద్ద గల సరుకులను వానిపై గల వెల కన్నా తగ్గించి అమ్ముతారు. ఇలా తగ్గించడాన్ని రాయితీ లేదా (ముదరా) అంటారు. వస్తువుపై చూపించే ధరను “ప్రకటన వెల” అంటారు.
రాయితీని సాధారణంగా ప్రకటన వెలపై లెక్కించి శాతంగా ప్రకటిస్తుంటారు. రాయితీ = ప్రకటన వెల – అమ్మిన వెల .
AP 7th Class Maths Notes 7th Lesson నిష్పత్తి మరియు అనుపాతం 2

→ సాధారణ వడ్డీ : తీసుకొన్న అప్పు మీద అదనంగా చెల్లించే సొమ్మును వడ్డీ అంటారు. తీసుకున్న అప్పును అసలు (P) అంటారు. వడ్డీని సాధారణంగా వంద (100) కు పరిమిత కాలానికి చెల్లిస్తారు.
ఇలా వందకు చెల్లించే సొమ్మును వడ్డీ రేటు (R) అని, పరిమిత కాలాన్ని కాలం (T) అని సూచిస్తాము. వడ్డీని I తో సూచిస్తాము.
సాధారణ వడ్డీ I = \(\frac{\text { PTR }}{100}\)
T కాలం తరువాత చెల్లించాల్సిన మొత్తం = అసలు + వడ్డీ = P + I
= P + \(\frac{\text { PTR }}{100}\) = P\(\left(1+\frac{\mathrm{TR}}{100}\right)\)
సాధారణంగా వడ్డీ శాతాన్ని సంవత్సరానికి తెలుపుతారు.