AP 8th Class Biology Important Questions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

These AP 8th Class Biology Important Questions 7th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలు will help students prepare well for the exams.

AP Board 8th Class Biology 7th Lesson Important Questions and Answers వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 1.
ఆవరణ వ్యవస్థ అన్న పదాన్ని మొదట ఎవరు ఉపయోగించారు ? దాని అర్థం ఏమిటి ?
జవాబు:

  1. 1935 సంవత్సరంలో ఎ.జి. టాన్ ప్లే అనే బ్రిటిష్ వృక్ష, ఆవరణ శాస్త్రవేత్త ‘ఆవరణవ్యవస్థ’ ‘Eco system’ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించాడు.
  2. ప్రకృతి యొక్క మూలప్రమాణాన్ని ఆవరణ వ్యవస్థగా వర్ణించాడు.
  3. టాన్ ప్లే పర్యావరణ వ్యవస్థ (Ecological System) ను కుదించి ఆవరణ వ్యవస్థ ‘Eco System’ అని నామకరణం చేశాడు.
  4. అతని ప్రకారం ప్రకృతి ఒక వ్యవస్థలాగా పనిచేస్తుంది. అందులోని జీవులు వాటి జాతి సమూహాలు, అనేక నిర్జీవ, వాతావరణ కారకాలు ఒకదానినొకటి తీవ్రంగా ప్రభావితం చేసుకుంటాయి.

AP 8th Class Biology Important Questions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 2.
ఆవరణ వ్యవస్థలోని శక్తికి సూర్యుడు మూలమని ఎలా చెప్పగలవు ?
జవాబు:

  1. ఆవరణ వ్యవస్థలోని ఏ స్థాయి జీవులకైనా బతకడానికి ఆహారం ద్వారా వచ్చే శక్తి అవసరమవుతుంది.
  2. సజీవులన్నింటికీ సూర్యుని ద్వారా శక్తి లభిస్తుంది.
  3. ఆకుపచ్చని మొక్కలు సూర్యరశ్మిలోని శక్తిని కిరణజన్య సంయోగక్రియ ద్వారా నిక్షిప్తం చేసుకుంటాయి.
  4. అయితే జంతువులు మొక్కల మాదిరిగా సూర్యశక్తిని నేరుగా ఉపయోగించుకోలేవు.
  5. చాలా రకాల జంతువులు మొక్కలను ఆహారంగా తీసుకుంటాయి.
  6. అయితే మొక్కలు ఆహారం తయారుచేసుకోవటానికి సూర్యరశ్మిని ఉపయోగిస్తాయి కాబట్టి ఈ శక్తి మొక్కల నుండి జంతువులకు బదిలీ అవుతుంది.
  7. మొక్కలను తినని జంతువులు కూడా సూర్యరశ్మిలోని శక్తి పైనే ఆధారపడతాయి.
  8. అవి మొక్కలను తినే జంతువులను తింటాయి. కాబట్టి సూర్యశక్తి బదిలీ అయినట్లే.

ప్రశ్న 3.
ఆహారపు గొలుసు అనగానేమి ? దానిలోని స్థాయిలు ఏమిటి ?
జవాబు:
ఆవరణవ్యవస్థలోని జీవుల మధ్యగల ఆహార సంబంధాలను ఆహార గొలుసు అంటారు. ఆహారపు గొలుసులో మూడు స్థాయిలు ఉంటాయి.
ఉత్పత్తిదారులు : చాలా రకాల మొక్కలు, శైవలాలు మొదలైనవన్నీ సూర్యరశ్మిని ఉపయోగించి ఆహారం తయారు చేసుకుంటాయి. వాటిని ఉత్పత్తిదారులు (Producers) అంటారు.
వినియోగదారులు : ఉత్పత్తిదారులను తిని శక్తిని గ్రహించే జీవులను వినియోగదారులు (Consumers) అంటారు.
విచ్ఛిన్నకారులు : చివరిస్థాయిలో విచ్ఛిన్నకారులు (decomposers) ఉంటాయి. ఇవి మొక్కలు, జంతువులు విసర్జించిన వ్యర్థ పదార్థాల నుండి కాని లేదా వాటి నిర్జీవ పదార్థాల నుండి కానీ ఆహారపదార్థాలను సేకరిస్తాయి.

ప్రశ్న 4.
ఆవాసంలో ఒక జాతి సంఖ్యను మరొక జాతి ఎలా నియంత్రిస్తుంది ? ఉదాహరణతో వివరించండి.
జవాబు:

  1. ఆవాసంలో జీవుల మధ్య ఆహార సంబంధాలు ఉంటాయి.
  2. ఈ సంబంధాలు జీవుల సంఖ్యను నియంత్రించటంలో తోడ్పడతాయి.
  3. ఉదాహరణకి పక్షుల ఆవాసంలో చాలా రకాల కీటకాలు ఉంటాయి. పక్షులు కీటకాలను తినటం వలన కీటకాల సంఖ్య పెరగకుండా చేస్తాయి.
  4. దీని వలన పక్షుల ఆవాసం మరియు మొత్తం ఆవరణ వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉండి స్థిరంగా ఉంటుంది.
  5. కానీ కీటకాలు తినే పక్షుల సంఖ్య ఎక్కువ అయితే కీటకాల సంఖ్య తొందరగా తగ్గిపోతుంది తద్వారా పక్షులకు సరిపడే ఆహారం దొరకదు.
  6. ఇటువంటి సందర్భాలలో పక్షులు వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోతాయి లేదా చనిపోతాయి.
  7. వాటి స్థానంలో కొన్ని కొత్త ఆహారపు అలవాట్లు కలిగిన పక్షులు పుట్టడం వలన తిరిగి ఆవరణవ్యవస్థ సమతాస్థితిలోకి వస్తుంది.

AP 8th Class Biology Important Questions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 5.
మానవ ప్రమేయం ఆధారంగా ఆవరణవ్యవస్థల వర్గీకరణను ఫ్లోచార్టులో చూపండి.
జవాబు:
AP 8th Class Biology Important Questions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు 1

ప్రశ్న 6.
మాంగ్రూవ్ అడవుల గురించి రాయండి.
జవాబు:

  1. భూమిపైన విస్తరించిన ఆవరణ వ్యవస్థలో మాంగ్రూవ్స్ లేదా మడ అడవులు ప్రముఖమైనవి.
  2. ఇవి వెనుకకు తన్నిన సముద్రపు నీటితో నిండిన (Back water) లోతు తక్కువ ప్రాంతాలలోనూ, నదులు, సముద్ర జలాలు కలిసే చోట మడ అడవులు విస్తారంగా పెరుగుతాయి.
  3. వీటిని మంచి ఉత్పాదక ఆవరణవ్యవస్థగా పేర్కొనవచ్చు.
  4. ఈ రకమైన అడవులు తనకు కావల్సిన పోషకాలను భూమిపై పొరలలో ఉన్న మంచినీటి నుంచి, సముద్ర అలల ఉప్పునీటి నుండి గ్రహిస్తాయి.
  5. మాంగ్రూవ్స్ వాణిజ్యపరమైన ప్రాధాన్యత గల సముద్ర జీవులకు ముఖ్యమైన ఆహారంగా, నర్సరీలుగా, ప్రజనన స్థలంగా ఉపయోగపడతాయి.
  6. అంతే కాకుండా కనుమరుగయ్యే జాతులకు రక్షిత ప్రాంతాలుగా కూడా ఉపయోగపడతాయి.

ప్రశ్న 7.
కోరింగ మాంగ్రూవ్స్ అనగానేమి ? వాటికి ఆ పేరు ఎలా వచ్చింది ?
జవాబు:
కోరింగ మాంగ్రూవ్స్ (మడ అడవులు) కాకినాడ దక్షిణ సముద్రతీరంలో విశాఖపట్టణ దక్షిణ ప్రాంతం నుండి దాదాపుగా 150 కి.మీ. దూరం విస్తరించి ఉన్నాయి. కోరంగై నది పేరుమీద ఈ మాంగ్రూవకు కోరింగ అని పేరుపెట్టారు. కోరింగ మాంగ్రూవ్స్ గౌతమీ, గోదావరి ఉపనదులైన కోరింగ, గాడేరు నదుల నుండి మంచినీటిని తీసుకుంటాయి. అదేవిధంగా కాకినాడ సముద్రతీరం నుంచి ఉప్పునీటిని తీసుకుంటాయి. అనేక నదీ పాయలు, కాలువలు ఈ ఆవరణవ్యవస్థ గుండా ప్రవహిస్తాయి.

ప్రశ్న 8.
కోరింగ ఆవరణవ్యవస్థలో ఉండే సజీవ, నిర్జీవ అంశాలను తెలపండి.
AP 8th Class Biology Important Questions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు 2
జవాబు:
కోరింగ ఆవరణవ్యవస్థలో ఉండే సజీవ, నిర్జీవ అంశాలు :
జీవ అంశాలలో ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు ఉంటాయి.

  • ఉత్పత్తిదారులు : మడచెట్లు, స్పైరోగైరా, యూగ్లీనా, ఆసిల్లటోరియా, నీలిఆకుపచ్చ శైవలాలు, యూలోథిక్స్ మొదలైన ఉత్పత్తిదారులుంటాయి.
  • వినియోగదారులు : పీతలు, హైడ్రా, ప్రోటోజోవాలు, నత్తలు, తాబేళ్ళు, డాఫ్నియా, గొట్టం పురుగులు మొదలైనవి ఉంటాయి.
  • విచ్ఛిన్నకారులు : డెట్రిటస్ వంటి విచ్ఛిన్నకర బ్యాక్టీరియాలుంటాయి.
  • నిర్జీవ అంశాలు : ఉప్పునీరు, మంచినీరు, గాలి, సూర్యరశ్మి, మృత్తిక మొదలైనవి.

ప్రశ్న 9.
ఎడారి ఆవరణవ్యవస్థలో ఉత్పత్తిదారుల అనుకూలనాలు ఏమిటి ?
AP 8th Class Biology Important Questions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు 3
జవాబు:

  1. పొదలు, గడ్డిజాతులు, కొన్ని వృక్షాలు ఎడారిలో ఉత్పత్తిదారులుగా ఉంటాయి.
  2. ఇక్కడి పొదలు భూమి లోపలికి వ్యాపించిన శాఖాయుతమైన వేరు వ్యవస్థ కలిగి ఉంటాయి.
  3. కాండాలు, పత్రాలు రూపాంతరం చెంది ముళ్ళుగా లేదా మందంగా మారి ఉంటాయి.
  4. ఎడారుల్లో కనబడే కాక్టస్ (బ్రహ్మజెముడు) లాంటి మొక్కల కాండాలు రసభరితంగా మారి నీటిని నిలువ చేసుకొని ఉంటాయి.
  5. నీటికొరత ఉన్నప్పుడు ఆ నీటిని వినియోగించుకుంటాయి.
  6. కొన్ని నిమ్నశ్రేణి రకాలైన లైకెన్లు, ఎడారి మాన్లు, నీటి ఆకుపచ్చ శైవలాలు కూడా ఎడారులలో కనబడతాయి.

AP 8th Class Biology Important Questions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 10.
ఆవరణ వ్యవస్థలోని శక్తి ప్రవాహం గురించి రాయండి.
జవాబు:
ఆవరణ వ్యవస్థలోని శక్తి ప్రవాహం :

  1. సజీవ ప్రపంచ మనుగడ అనేది ఆవరణవ్యవస్థలో శక్తి ప్రవాహం , పదార్థాల ప్రసరణ పై ఆధారపడి ఉంటుంది.
  2. వివిధ రకాల జీవక్రియలు నిర్వహించడానికి శక్తి అవసరం.
  3. ఈ శక్తి సూర్యుని నుండి లభిస్తుంది. అంతరిక్షంలో సౌరశక్తి సూర్యకిరణాల రూపంలో ప్రసరిస్తుంది.
  4. సౌరశక్తిలో దాదాపు 57% వాతావరణంలో శోషించబడుతుంది మరియు అంతరిక్షంలో వెదజల్లబడుతుంది.
  5. 35% సౌరశక్తి భూమిని వేడిచేయడానికి, నీటిని ఆవిరిచేయడానికి ఉపయోగపడుతుంది.
  6. దాదాపు 8% సౌరశక్తి మొక్కలకు చేరుతుంది. దీని 80-85% సౌరశక్తిని మొక్కలు శోషిస్తాయి.
  7. శోషించిన దానిలో 50% మాత్రమే కిరణజన్య సంయోగక్రియలో వినియోగించబడుతుంది.

ప్రశ్న 11.
AP 8th Class Biology Important Questions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు 4
ఆకు గొంగళి పురుగు ఊసరవెల్లి పాము గ్రద్ద పైన ఇచ్చిన పటం ఆధారంగా, ఆహారపు గొలుసులోని జీవులను ఉత్పత్తిదారులు, ప్రాథమిక, ద్వితీయ, తృతీయ మరియు ఉన్నత స్థాయి వినియోగదారులుగా వర్గీకరించండి.
జవాబు:
పైన చూపబడిన ఆహారపు గొలుసులో

  1. ఆకు – ఉత్పత్తిదారుడు
  2. గొంగళిపురుగు – ప్రథమ వినియోగదారుడు
  3. ఊసరవెల్లి – ద్వితీయ వినియోగదారుడు
  4. పాము – తృతీయ వినియోగారుడు
  5. గ్రద్ద – ఉన్నత స్థాయి మాంసాహారి

ప్రశ్న 12.
ఆవరణ వ్యవస్థలోని రకాలను సూచించే ఫ్లోచార్టను గీయండి. ఆవరణవ్యవస్థ పేరు పెట్టినది ఎవరు ?
జవాబు:
AP 8th Class Biology Important Questions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు 5
“ఆవరణ వ్యవస్థ” అను పదాన్ని ప్రవేశపెట్టినది A.G. టాన్ ప్లే.”

AP 8th Class Biology Important Questions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 13.
కింది పేరాను చదవండి. కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
చాలారకాల మొక్కలు, శైవలాలు మొదలైనవన్నీ సూర్యరశ్మిని ఉపయోగించుకొని ఆహారం తయారుచేసుకుంటాయి. , వాటిని ‘ఉత్పత్తి దారులు’ అంటారు. వీటిని తిని శక్తిని గ్రహించే జీవులను వినియోగదారులు అంటారు. చివరిస్థాయిలో విచ్ఛిన్నకారులు ఉంటారు. ఇవి మొక్కలు, జంతువులు విసర్జించిన వ్యర్థ పదార్థాలనుండి కాని లేదా వాటి నిర్జీవ పదార్థాలనుండి కానీ ఆహారాన్ని సేకరిస్తాయి. వీటిని పునరుత్పత్తిదారులు అంటాం.
1. ఆహారజాలకంలోని ఉత్పత్తిదారులు ఏవి ? వాటిని ఎందుకు ఉత్పత్తిదారులు అంటారు ?
2. వినియోగదారులు అంటే ఏమి ? కొన్ని ఉదాహరణలు ఇవ్వండి.
3. పునరుత్పత్తిదారులు ఏవి ? ఎందుకు వాటిని అలా పిలుస్తారో ఉదాహరణతో వివరించండి.
4. ఆహారపు గొలుసులో ఎన్ని స్థాయిలు ఉంటాయి ? అవి ఏవి ?
జవాబు:
1. శైవలాలు, మొక్కలు ఆహార జాలకంలో ఉత్పత్తిదారులుగా ఉంటాయి. ఎందుకంటే అవి సూర్యరశ్మిని వినియోగించుకొని స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి.
2. ఉత్పత్తిదారులను ఆహారంగా స్వీకరించి శక్తిని గ్రహించే జీవులను వినియోగదారులు అంటారు. ఉదా : జింక, మిడత, కుందేలు
3. విచ్ఛిన్నకారులుగా పూతికాహార బాక్టీరియా శిలీంధ్రాలు ఉంటాయి. ఇవి మొక్కల జంతువుల నిర్జీవ పదార్థాల నుండి ఆహారాన్ని సేకరిస్తాయి. వాటిని మూలకాలుగా విడగొట్టి తిరిగి ఆవరణ వ్యవస్థలో ప్రవేశపెడతాయి. అందువల్ల వీటిని పునరుత్పత్తి. దారులు అంటారు.
4. ఆహారపు గొలుసులో 4 స్థాయిలు ఉంటాయి.
ఉత్పత్తిదారులు ప్రాథమిక వినియోగదారులు ద్వితీయ వినియోగదారులు తృతీయ వినియోగదారులు

ప్రశ్న 14.
క్రింది అంశంను చదివి ప్రశ్నలకు జవాబులిమ్ము.
భూభాగంలో దాదాపు 17% మేర ఎడారులు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఇసుకతో కూడిన నేల ఉండి సగటు వర్షపాతం 23 మి.మీల కన్నా తక్కువగా ఉంటుంది. ఇక్కడ పెరిగే మొక్కలు నీటిని నష్టపోకుండా అనుకూలనాలు కలిగి ఉంటాయి. అత్యధిక ఉష్ణోగ్రత వలన ఇక్కడ జీవజాతులు ప్రత్యేక లక్షణాలను కలిగి ఇక్కడి వాతావరణానికి అనుకూలనాలు పొంది ఉంటాయి.
1. ఎడారి జీవులు ఎలాంటి అనుకూలనాలను పొంది ఉండాలి ?
2. ఉత్పత్తిదారులైన ఎడారి మొక్కలు చూపే అనుకూలనాలేవి ?
3. ఒంటెను ఎడారి ఓడ అని ఎందుకు అంటారు ?
4. ఎడారుల్లో జంతువైవిధ్యం తక్కువగా ఉంటుంది. ఎందుకు ?
జవాబు:
1. అక్కడి అధిక ఉష్ణోగ్రతలకు నీరు నష్టపోకుండా అనుకూలనాలను కలిగి ఉంటుంది.
2. ఎడారి మొక్కలు పత్రరంధ్రాలను కలిగి ఉండవు. అందువల్ల భాష్పోత్సేకం ద్వారా నీటిని నష్టపోవు.
3. ఒంటె ఎడారి వాతావరణాన్ని ఎన్నో అనుకూలనాలను కల్గి ఎడారిలో ప్రయాణానికి ఎంతో అనువైన జంతువు. అందువల్ల ఒంటెను ఎడారి ఓడ అని అంటారు.
4. ఎడారిలో ఉండే అత్యధిక ఉష్ణోగ్రతలను నీటి ఎద్దడిని తట్టుకొని జీవించడం చాలా కష్టం. అందువలన అక్కడ జంతు వైవిధ్యం తక్కువ.

ప్రశ్న 15.
మీ పరిసరాలలో మీరు గమనించి ఉత్పత్తిదారులు, వినియోగదారుల జాబితాలను తయారు చేయండి.
జవాబు:
నా పరిసరాలలో నేను గమనించిన ఆహార జాలకం
AP 8th Class Biology Important Questions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు 6

1 మార్కు ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆహారపు గొలుసు అంటే ఏమిటి?
జవాబు:
ఉత్పత్తిదారుడు, ప్రథమ, ద్వితీయ, తృతీయ వినియోగదారులు ఉన్న గొలుసు లాంటి జంతువుల శక్తి మార్పిడి వ్యవస్థను ‘ఆహారపు గొలుసు’ అంటారు.

AP 8th Class Biology Important Questions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 2.
‘ఆహార జాలకం’ అంటే ఏమిటి?
జవాబు:
అనేక ‘ఆహారపు గొలుసులు’ ఒక దానిలో ఒకటి కలిసిపోయి ఒక సమూహంగా, ఆవరణ వ్యవస్థలో కొనసాగే క్రియాత్మక, వ్యవస్థను ‘ఆహార జాలకం’ అంటారు.

ప్రశ్న 3.
ఆహార జాలకంలోని మొక్కలు చనిపోతే ఏమవుతుంది ?
జవాబు:
1. ఆహార జాలకంలోని మొక్కలు చనిపోతే శక్తిని ఉత్పత్తిచేసే.అవకాశం పోతుంది.
2. దీనితో సూర్యరశ్మి నుంచి శక్తి బదలాయింపు ఆగిపోతుంది.
3. కొంత కాలం తర్వాత నెమ్మదిగా క్రింది స్థాయి నుంచి ఉన్నతస్థాయి జీవులన్నీ అంతరించిపోతాయి.

ప్రశ్న 4.
ఆహారం ఒక్కటే కాకుండా జంతువులు బ్రతకటానికి కావల్సిన ఇతర అంశాలు ఏమిటి ?
జవాబు:
జంతువులకు ఆహారంతో పాటు
1. నీరు
2. గాలి
3. ఆవాసం బతకటానికి కావాల్సి ఉంటుంది.

లక్ష్యాత్మక నియోజనము

ప్రశ్న 1.
గడ్డిని ……….. గా పిలవవచ్చు.
ఎ) వినియోగదారు
బి) ఉత్పత్తిదారు
బి) విచ్ఛిన్నకారి
డి) బాక్టీరియా
జవాబు:
బి) ఉత్పత్తిదారు

ప్రశ్న 2.
కొన్ని ఆహారపు గొలుసుల కలయిక వల్ల ……….. ఏర్పడును.
ఎ) ఆహార జాలకం
బి) ఆవాసం
సి) జీవావరణం
డి) ప్రకృతి
జవాబు:
ఎ) ఆహార జాలకం

AP 8th Class Biology Important Questions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 3.
నెమలికి ఇష్టమైన ఆహారం ………..
ఎ) బల్లులు
బి) పురుగులు
సి) పాములు
డి) కీటకాలు
జవాబు:
సి) పాములు

ప్రశ్న 4.
కోరింగ మడ అడవులు ………. పట్టణానికి సమీపంలో ఉన్నాయి.
ఎ) రాజమండ్రి
బి) కాకినాడ
సి) విజయవాడ
డి) హైదరాబాద్
జవాబు:
బి) కాకినాడ

ప్రశ్న 5.
భూభాగంలో ………. % మేరకు ఎడారి ఆవరణ వ్యవస్థలు ఉన్నాయి.
ఎ) 14
బి) 15
సి) 16
డి) 17
జవాబు:
డి) 17

ప్రశ్న 6.
ఇది గోదావరికి ఉపనది. ఆ
ఎ) పాములేరు
బి) గాడేరు
సి) బుడమేరు
డి) పాలవాగు
జవాబు:
డి) పాలవాగు

ప్రశ్న 7.
నిశాచరాలకు ఉదాహరణ ……….
ఎ) గేదె
బి) ఆవు
సి) గుడ్లగూబ
డి) మానవుడు
జవాబు:
ఎ) గేదె

AP 8th Class Biology Important Questions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 8.
ఒంటె శరీరంలోని ……….. భాగంలో నీరు దాచు కుంటుంది.
ఎ) నోరు
బి) చర్మం
సి) జీర్ణాశయం
డి) కాలేయం
జవాబు:
సి) జీర్ణాశయం

ప్రశ్న 9.
సూర్యకాంతి ………. చే శోషింపబడుతుంది.
ఎ) జంతువులు
బి) మొక్కలు
సి) సరీసృపాలు
డి) క్షీరదాలు
జవాబు:
బి) మొక్కలు

ప్రశ్న 10.
సింహం ………. శ్రేణి మాంసాహారి.
ఎ) ప్రాథమిక
బి) ద్వితీయ
సి) తృతీయ
డి) చతుర్ధ
జవాబు:
సి) తృతీయ

ప్రశ్న 11.
ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని 1935 సం||లో మొదటిసారిగా ఉపయోగించిన శాస్త్రవేత్త
ఎ) చార్లెస్ ఎల్టన్
బి) యూజీస్ పి.ఓడమ్
సి) A.C. టాన్స్లే
డి) చార్లెస్ డార్విన్
జవాబు:
సి) A.C. టాన్స్లే

ప్రశ్న 12.
ఆవరణ వ్యవస్థలోని అతిపెద్ద భాగం
ఎ) ఆవాసం
బి) పర్యావరణం
సి) జీవావరణం
డి) నివాసం
జవాబు:
ఎ) ఆవాసం

ప్రశ్న 13.
ఆవరణ వ్యవస్థలో శక్తికి మూలం
ఎ) ఆహారం
బి) ఆకుపచ్చని మొక్కలు
సి) సూర్యుడు
డి) భూమి
జవాబు:
సి) సూర్యుడు

ప్రశ్న 14.
ఆవరణ వ్యవస్థలో నిర్జీవ అంశం కానిది
ఎ) గాలి
బి) నీరు
సి) మృత్తిక
డి) సూక్ష్మజీవులు
జవాబు:
డి) సూక్ష్మజీవులు

ప్రశ్న 15.
ఆవరణ వ్యవస్థలో సూర్యరశ్మిని నేరుగా గ్రహించగలిగేవి
ఎ) ఉత్పత్తిదారులు
బి) ప్రాథమిక వినియోగదారులు
సి) ద్వితీయ వినియోగదారులు
డి) విచ్ఛిన్నకారులు
జవాబు:
ఎ) ఉత్పత్తిదారులు

AP 8th Class Biology Important Questions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 16.
ఆవరణ వ్యవస్థలో పునరుత్పత్తిదారులు అని వేనిని అంటారు?
ఎ) ఉత్పత్తిదారులు
బి) ప్రాథమిక వినియోగదారులు
సి) ద్వితీయ వినియోగదారులు
డి) విచ్చిన్నకారులు
జవాబు:
డి) విచ్చిన్నకారులు

ప్రశ్న 17.
ఆవరణ వ్యవస్థలో చివరి స్థాయి జీవులు
ఎ) విచ్ఛిన్నకారులు
బి) ప్రాథమిక వినియోగదారులు
సి) ద్వితీయ వినియోగదారులు
డి) తృతీయ వినియోగదారులు
జవాబు:
ఎ) విచ్ఛిన్నకారులు

ప్రశ్న 18.
ఆవరణ వ్యవస్థలో శక్తి బదిలీ విధానాన్ని వివరించడానికి ఉపయోగపడేది
ఎ) పోషకస్థాయి
బి) ఎకలాజికల్ నిచ్
సి) ఆహారపు గొలుసు
డి) ఆహారపు జాలకం
జవాబు:
సి) ఆహారపు గొలుసు

ప్రశ్న 19.
ఆవరణ వ్యవస్థను తొందరగా నాశనం చేసేవి
ఎ) బలమైన గాలులు
బి) భూకంపాలు
సి) సునామి
డి) పైవన్నీ
జవాబు:
డి) పైవన్నీ

ప్రశ్న 20.
భూమిపై ఉండే అతి పెద్ద ఆవరణ వ్యవస్థ
ఎ) జీవావరణం
బి) పర్యావరణం
సి) భౌమావరణం
డి) జలావరణం
జవాబు:
ఎ) జీవావరణం

ప్రశ్న 21.
మడ అడవులు యిక్కడ పెరుగుతాయి.
ఎ) నది ఒడ్డున
బి) సముద్రం ఒడ్డున
సి) నది, సముద్రం కలిసే చోట
డి) సముద్రం సముద్రం కలిసే చోట
జవాబు:
సి) నది, సముద్రం కలిసే చోట

ప్రశ్న 22.
ఆహారపు జాలకాన్ని ఏర్పరిచేవి
ఎ) ఉత్పత్తిదారులు
బి) వినియోగదారులు
సి) విచ్ఛిన్నకారులు
డి) ఆహారపు గొలుసులు
జవాబు:
డి) ఆహారపు గొలుసులు

ప్రశ్న 23.
ఈ క్రింది వానిలో కృత్రిమ ఆవరణ వ్యవస్థ
ఎ) గడ్డిభూమి
బి) అడవి
సి) ఎడారి
డి) కార్తీకవనాలు
జవాబు:
డి) కార్తీకవనాలు

ప్రశ్న 24.
కోరింగ వద్ద ఉన్న ఆవరణ వ్యవస్థ
ఎ) గడ్డిభూమి ఆవరణ వ్యవస్థ
బి) మాంగ్రూప్ ఆవరణ వ్యవస్థ
సి) అడవి ఆవరణ వ్యవస్థ
డి) ఎడారి ఆవరణ వ్యవస్థ
జవాబు:
బి) మాంగ్రూప్ ఆవరణ వ్యవస్థ

AP 8th Class Biology Important Questions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 25.
ఈ క్రింది వానిలో సహజ ఆవరణ వ్యవస్థ
ఎ) మామిడి తోట
బి) వరి చేను
సి) కార్తీకవనం
డి) ఎడారి
జవాబు:
డి) ఎడారి

ప్రశ్న 26.
ఇండో పసిఫిక్ సముద్రంలో ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఎన్ని జీవజాతులున్నాయి ?
ఎ) 10
బి) 100
సి) 1000
డి) 10,000
జవాబు:
సి) 1000

ప్రశ్న 27.
అత్యధిక జీవులు యిక్కడ ఉన్నాయి.
ఎ) నేల
బి) నది
సి) సముద్రం
డి) అడవి
జవాబు:
సి) సముద్రం

ప్రశ్న 28.
ఈ క్రింది వానిలో ఆవరణ వ్యవస్థ కానిది
ఎ) ఒక దుంగ
బి) ఒక గ్రామం
సి) ఒక అంతరిక్ష నౌక
డి) పైవేవీ కావు
జవాబు:
డి) పైవేవీ కావు

ప్రశ్న 29.
ప్రకృతి యొక్క క్రియాత్మక ప్రమాణం అని దీనిని అనవచ్చు.
ఎ) ఆవరణ వ్యవస్థ
బి) జీవావరణం
సి) పర్యావరణం
డి) ఆవాసం
జవాబు:
ఎ) ఆవరణ వ్యవస్థ

AP 8th Class Biology Important Questions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 30.
భూభాగంలో ఎంత శాతం ఎడారులు విస్తరించి ఉన్నాయి ?
ఎ) 7%
బి) 17%
సి) 27%
డి) 37%
జవాబు:
బి) 17%

ప్రశ్న 31.
ఎడారులలో వర్షపాతం ఇంతకన్నా తక్కువ.
ఎ) 10 మిల్లీ మీటర్లు
బి) 17 మిల్లీ మీటర్లు
సి) 20 మిల్లీ మీటర్లు
డి) 23 మిల్లీ మీటర్లు
జవాబు:
డి) 23 మిల్లీ మీటర్లు

ప్రశ్న 32.
నిశాచరులు యిక్కడ ఎక్కువగా ఉంటాయి
ఎ) గడ్డిభూమి ఆవరణ వ్యవస్థ
బి) మంచినీటి ఆవరణ వ్యవస్థ
సి) ఎడారి ఆవరణ వ్యవస్థ
డి) పైవేవీ కావు
జవాబు:
సి) ఎడారి ఆవరణ వ్యవస్థ

ప్రశ్న 33.
అటవీ పరిసరాలను ప్రభావితం చేసేవి
ఎ) శీతోష్ణస్థితి
బి) పోషకాల క్రియాశీలత
సి) నీటివనరులు
డి) పైవన్నీ
జవాబు:
డి) పైవన్నీ

ప్రశ్న 34.
మొత్తం సౌరశక్తిలో వాతావరణంలోకి శోషించబడే సౌరశక్తి, భూమిని వేదిచేయడానికి కావలసిన శక్తి, మొక్కలు గ్రహించే సౌరశక్తి వరుసగా
ఎ) 67%, 35%, 8%
బి) 8%, 35%, 57%
సి) 57%, 8%, 355
డి) 35%, 8%, 57%
జవాబు:
ఎ) 67%, 35%, 8%

ప్రశ్న 35.
సౌరశక్తి ఉత్పత్తిదారులలో ఈ రూపంలో నిల్వ ఉంటుంది.
ఎ) గతిశక్తి
బి) స్థితిశక్తి.
సి) ఉష్ణశక్తి
డి) అయానికశక్తి
జవాబు:
బి) స్థితిశక్తి.

ప్రశ్న 36.
ఆహారపు గొలుసులోని సరియైన వరుసక్రమాన్ని గుర్తించండి.
ఎ) ఉత్పత్తిదారులు → ప్రాథమిక వినియోగదారులు → ద్వితీయ వినియోగదారులు → విచ్ఛిన్నకారులు
బి) ప్రాథమిక వినియోగదారులు → ద్వితీయ వినియోగదారులు → ఉత్పత్తిదారులు → విచ్ఛిన్నకారులు
సి) విచ్ఛిన్నకారులు → ప్రాథమిక వినియోగదారులు → ద్వితీయ వినియోగదారులు → ఉత్పత్తిదారులు
డి) ఉత్పత్తిదారులు → విచ్ఛిన్నకారులు → ప్రాథమిక వినియోగదారులు → ద్వితీయ వినియోగదారులు
జవాబు:
ఎ) ఉత్పత్తిదారులు → ప్రాథమిక వినియోగదారులు → ద్వితీయ వినియోగదారులు → విచ్ఛిన్నకారులు

AP 8th Class Biology Important Questions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 37.
ఆహారపు గొలుసులో స్థాయిల సంఖ్య
ఎ) 1
బి) 2
సి) 3
డి) 4
జవాబు:
సి) 3

ప్రశ్న 38.
ఆవరణ వ్యవస్థలో మాంసాహారులు
ఎ) ఉత్పత్తిదారులు
బి) విచ్ఛిన్నకారులు
సి) ప్రాథమిక వినియోగదారులు
డి) ద్వితీయ వినియోగదారులు
జవాబు:
డి) ద్వితీయ వినియోగదారులు

ప్రశ్న 39.
ఉత్పత్తిదారులలో నిక్షిప్తమైన శక్తి
ఎ) మొత్తం ప్రాథమిక ఉత్పత్తి
బి) మిగిలిన ప్రాథమిక ఉత్పత్తి,
సి) వినియోగించబడని శక్తి
డి) వినియోగదారులచే శోషించబడని శక్తి
జవాబు:
ఎ) మొత్తం ప్రాథమిక ఉత్పత్తి

ప్రశ్న 40.
కాక్టస్ ఇక్కడ కనిపిస్తుంది.
ఎ) గడ్డిభూమి
బి) అడవి
సి) ఎడారి
డి) నది
జవాబు:
సి) ఎడారి

ప్రశ్న 41.
ఒంటె శరీరంలో నీటిని ఎక్కడ నిల్వ ఉంచుకుంటుంది ?
ఎ) మూపురం
బి) చర్మం క్రింద
సి) జీర్ణాశయం
డి) కాలేయం
జవాబు:
సి) జీర్ణాశయం

ప్రశ్న 42.
ఒక ఆవరణ వ్యవస్థలో కింది వాటిలోని ఏ జత జీవులు ఉత్పత్తిదారులుగా వుంటాయి ?
(A) ఎంప్, స్పైరోగైరా
(B) మస్సెల్, డాఫియా
(C) అసిల్లటోరియా, యులోత్రిక్స్
(D) యూగ్లీనా, బ్యాక్టీరియా
జవాబు:
(C) అసిల్లటోరియా, యులోత్రిక్స్

AP 8th Class Biology Important Questions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 43.
1. ఉత్పత్తిదారులకు ఉదాహరణ గడ్డిజాతులు
2. వినియోగదారులకు ఉదాహరణ గ్రద్దలు
(A) 1, 2 సరైనవి కావు
(B) 1 సరైనది, 2 కాదు
(C) 1, 2 సరైనవి
(D) 1 సరైనదికాదు 2 సరైనది
జవాబు:
(C) 1, 2 సరైనవి

ప్రశ్న 44.
ఎడారి ఓడ అని పిలవబడే జీవి
(A) ఏనుగు
(B) ఒంటె
(C) నిప్పు కోడి
(D) కంచర గాడిద
జవాబు:
(B) ఒంటె

ప్రశ్న 45
ఎడారి జంతువులు కలిగి ఉండేవి
(A) బాహ్య అనుకూలనాలు
(B) శరీరధర్మ అనుకూలనాలు
(C)ఏ అనుకూలనాలు ఉండవు
(D) బాహ్య మరియు శరీరధర్మ అనుకూలనాలు
జవాబు:
(D) బాహ్య మరియు శరీరధర్మ అనుకూలనాలు

ప్రశ్న 46.
ఒకేసారి అధిక సంఖ్యలో కుందేళ్ళను గడ్డిభూముల్లో ప్రవేశపెడితే జరిగేది
(A) అధిక సంఖ్యలో కుందేళ్ళు కనిపిస్తాయి
(B) కుందేళ్ళ మధ్య ఆహారం కోసం తీవ్రమైన పోటీ ఏర్పడుతుంది
(C) ఆవరణ వ్యవస్థలో ఎలాంటి మార్పు ఉండదు
(D) గడ్డి పెరగడంపై ఏ ప్రభావం ఉండదు
జవాబు:
(B) కుందేళ్ళ మధ్య ఆహారం కోసం తీవ్రమైన పోటీ ఏర్పడుతుంది

ప్రశ్న 47.
భౌమావరణ వ్యవస్థలోని మొక్కల్లో పత్రరంధ్రాలు లేకపోతే ఇరిగేది
(A) భాష్పోత్సేకం జరగదు
(B) వాయువినిమయం జరగదు ,
(C) మొక్కలపై ఏ ప్రభావం ఉండదు
(D) A మరియు B
జవాబు:
(D) A మరియు B

AP 8th Class Biology Important Questions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 48.
భూ ఆవరణ వ్యవస్థలో P, Q మరియు ఎడారి ఆవరణ వ్యవస్థలు ఉంటాయి. ఇందులో P,Qలు
(A) అడవి, గడ్డిభూమి
(B) గడ్డి భూమి, కొలను
(C) మంచినీరు, ఉప్పునీరు
(D) అడవి, ఉప్పునీరు
జవాబు:
(A) అడవి, గడ్డిభూమి

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం – సంరక్షణ

These AP 8th Class Biology Important Questions 6th Lesson జీవ వైవిధ్యం – సంరక్షణ will help students prepare well for the exams.

AP Board 8th Class Biology 6th Lesson Important Questions and Answers జీవ వైవిధ్యం – సంరక్షణ

ప్రశ్న 1.
70 సం||ల క్రితం ఉన్న జంతువులకు, ఇప్పుడు కనిపించే జంతువులలో భేదాలు ఏమిటి ? అవి కనిపించకుండా పోవటానికి కారణాలు ఏమిటి ?
జవాబు:
70 సం||రాల క్రితం ఉండే పులులు, చిరుతలు, కొండ్రిగాడు, ముళ్ళపందులు వంటి జంతువులు నేడు కనిపించటం కరువైపోయింది. వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. వీటికి ప్రధాన కారణం గతంలో ఉన్న దట్టమైన అడవులు.

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 2.
మీ ప్రాంతంలో ఏదైనా జాతి అంతరించి పోయిందా ? వాటి గురించి తెలుసుకొని రాయండి.
జవాబు:
మా ప్రాంతాలలో రాబందులు అంతరించిపోయాయి. ఒకప్పుడు మృతకళేబరాలను అనటానికి వచ్చే ఈ పెద్ద పక్షులు నేడు కనిపించటం లేదు. అదేవిధంగా పిచ్చుకల సంఖ్య కూడ గణనీయంగా తగ్గి కనిపించుట లేదు.

ప్రశ్న 3.
ఈ జీవులు అంతరించి పోవటానికి కారణాలు చర్చించండి.
జవాబు:
1. అధిక మోతాదులో వాడిన D.D.T. వలన రాబందుల గుడ్లు పెంకు పలచబడి వాటి ఉత్పత్తి సామర్థ్యం తగ్గిందని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు.
2. నేటి కాలంలో బాగా అభివృద్ధి చెందిన మొబైల్ వాడకం వలన సెల్ టవర్ రేడియేషన్ పిచ్చుకల ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీశాయని పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు.
3. వీటితోపాటుగా మారుతున్న జీవన విధానాల వలన, చెట్లు నరకటం, పూరి గుడిసెలు తగ్గటం వంటి చర్యలు కూడా పిచ్చుకలు అంతరించటానికి మరికొన్ని కారణాలు.

ప్రశ్న 4.
మన రాష్ట్రానికే పరిమితమైన ఒక ఎండమిక్ జాతిని పేర్కొనండి.
జవాబు:
‘జెర్డాన్స్ కర్’ ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఒక ఎండిమిక్ జాతి.

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 5.
క్రింది చిత్రాలలో ఏ జంతువు మన దేశానికి ఎండమిక్ జాతి అవుతుంది?
AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ 1
జవాబు:
పై చిత్రాలలో బెంగాల్ టైగర్ మన దేశానికి చెందిన ఎండమిక్ జాతి.

ప్రశ్న 6.
మీ తల్లిదండ్రులను అడిగి వారి బాల్యంలో గల వివిధ రకాల వరి రకాల గురించి తెలుసుకోండి.
జవాబు:
మా తల్లిదండ్రుల బాల్యంలో క్రింది వరి రకాలు కలవు.

  1. స్వర్ణ
  2. మసూరి
  3. నంబర్లు
  4. హంస
  5. పాల్గుణ

ప్రశ్న 7.
ఆపదలో ఉన్న ఈ క్రింది జంతు, వృక్ష జాతులను గుర్తించి పేర్లు రాయండి.
జవాబు:
AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ 2

ప్రశ్న 8.
ఆంధ్రప్రదేశ్ లోని అంతరించిపోతున్న రెండు జంతువులు ఏమిటి ? వాటి గురించి రాయండి.
జవాబు:
అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం (IUCN) మరియు జంతుశాస్త్ర సంఘం, లండన్ (ISL) విడుదల చేసిన జాబితా ప్రకారం ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, కర్నూల్ జిల్లాలోని నంధ్యాల, కొన్ని ప్రాంతాలలో ఉండే సాలీడు-గూటి టారంటలా (Gooty-tarantula) అలాగే కర్నూల్ లోని పుల్లెందు పక్షుల సంరక్షణ కేంద్రంలోని బట్టమేక పక్షి (Great indian bustard) అత్యంత ఆపదలో ఉన్న జీవులుగా పేర్కొన్నారు.

ఎ) గూటీ టారంటలా సాలీడు :
AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ 3
1) శాస్త్రీయంగా ఫిసిలో తీరియా మెటాలికా అని పిలువబడే గూటీ టారంటలా సాలీడు ఆన్ లైన్ ద్వారా అమెరికా, యూరప్ మార్కెట్లలో అమ్ముడవుతోంది.
2) ఆవాసాలను ధ్వంసం చేయడం, అడవులను నరికివేయడం, వంట చెరకు సేకరణ మొదలైన కార్యక్రమాలు ఈ సాలీళ్ల సంఖ్య తగ్గడానికి కారణమవుతున్నాయి.
3) ఆవాసాల సంరక్షణ, క్షేత్ర స్థాయిల్లో అవగాహన, జాతీయ అటవీ సంరక్షణ చట్టం, జాతీయ, అంతర్జాతీయ వ్యాపార చట్టాలు పటిష్టంగా అమలుచేయడం ద్వారా ఈ జాతుల సంరక్షణకు కృషి చేయాలని సూచిస్తున్నారు.

బి) బట్టమేక పిట్ట :
AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ 4
1) బట్టమేక పక్షులు రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించి ఉన్నప్పటికీ వీటి సంఖ్య కేవలం 50 నుండి 249 వరకు మాత్రమే ఉన్నట్లు అంచనా.
2) అడవులను నరికివేసి వ్యవసాయ భూములుగా మార్చటం వల్ల వీటికి ఆపద ఏర్పడింది.
3) సౌత్ కొరియాలోని ‘జేజూ’లో జరిగిన అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘ సమావేశంలో (ZSL మరియు IUCN) ప్రమాదం అంచున ఉన్న జీవజాతుల గురించిన జాబితాను విడుదల చేసింది.

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 9.
ప్రజల్లో జీవవైవిధ్యంపై అవగాహన కలిగించుటకు కొన్ని నినాదాలు లేదా ఒక కరపత్రం చేయండి.
జవాబు:
నినాదాలు :
జీవ హింస – మహాపాపం
జీవించు – అన్ని జీవులనూ జీవించనివ్వు
బ్రతికే హక్కు – అన్ని జీవులకూ ఉంది
జీవులను కాపాడుదాం – జీవవైవిధ్యాన్ని నిలబెడదాం
జీవులు లేని ప్రకృతి – జీవం లేని ప్రకృతి
కరపత్రం : నానాటికీ మన చుట్టూ ఉన్న చాలా రకాల జీవులు అంతరించిపోతున్నాయి. బాధాకరమైన విషయం ఏమిటంటే, ఇవి అంతరించటానికి ప్రధాన కారణం మానవ చర్యలే. ఈ ప్రకృతిలో మనతోపాటు ప్రతి జీవికీ జీవించే హక్కు ఉంది. దానిని మనం ధిక్కరించరాదు. భూమిపై అన్ని జీవరాశులు ఉన్నప్పుడే జీవుల మధ్య తులాస్థితి ఉంటుంది. మన జీవనం సక్రమంగా ఉంటుంది. కావున మనం జీవిద్దాం, ఇతర జీవులను జీవించనిద్దాం.

ప్రశ్న 10.
కంప్రెస్ట్ కార్డ్ బోర్డ్ ఎలా తయారవుతుంది ? దాని ప్రయోజనం ఏమిటి ?
జవాబు:
కంప్రెస్ట్ కార్డ్ బోర్డ్ :

  1. ఇది చెక్కపొట్టు, కర్రముక్కలతో కలిపి చేసిన గుజ్జుతో తయారవుతుంది.
  2. ఈ గుజ్జుకు రసాయన సల్ఫేట్లు కలిపి సెల్యులోజును తయారుచేస్తారు.
  3. గుజ్జును రెండు పొరలుగా పేర్చి వాటి మధ్యలో కర్రపొట్టును చేర్చుతారు.
  4. దీనిని గట్టిగా అదిమి (కంప్రెస్) పెట్టి ఆరబెడతారు.
  5. ఇలా తయారయిన కార్డ్ బోర్డ్ కర్రలా గట్టిగా బలంగా ఉంటుంది.

ప్రయోజనం :
1. ‘కంప్రెస్ట్ కార్డ్ బోర్డ్’ తయారీకి చెక్కముక్కలు, చెక్కపొట్టు అవసరం.
2. కాబట్టి చెట్టును నరకవలసిన అవసరం ఉండదు.
3. ఇది అడవుల నరికివేత తగ్గించటంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రశ్న 11.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని జాతీయ పార్కులు మరియు సంరక్షణ కేంద్రాల గురించి సమాచారం సేకరించండి.
జవాబు:
AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ 5
AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ 6

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 12.
రీసైకిల్డ్ కాగితాన్ని వృథా వార్తాపత్రికల నుంచి ఎలా తయారుచేస్తారు ? (లేదా) కాగితాన్ని పునఃచక్రీయ పద్ధతిలో తయారుచేసే విధానాన్ని రాయండి.
జవాబు:
రీసైకిల్డ్ కాగితాన్ని వృథా వార్తాపత్రికల నుంచి తయారుచేయడం
కావలసిన వస్తువులు : రెండు ప్లాస్టిక్ తొట్టెలు, కర్ర గరిటె, నీరు, శుభ్రమైన నూలు దుస్తులు, పాత వార్తా పత్రికలు, వైర్ స్క్రీన్, కొలపాత్ర, ప్లాస్టిక్ చుట్ట, బ్లెండర్ (mixer) బరువైన పుస్తకాలు, రోలర్.

తయారీ పద్ధతి :
1) కత్తిరించిన న్యూస్ పేపర్ ముక్కలను నీటితో నిండిన తొట్టెలో వేసి ఒక రోజు నానబెట్టాలి.
2) పిండి రుబ్బే దానిలో (బ్లెండర్) రెండు కప్పులు నానబెట్టిన కాగితం, ఆరు కప్పుల నీటిని చేర్చండి. మెత్తని గుజ్జు తయారయ్యేలా రుబ్బి శుభ్రమైన తొట్టెలో వేయాలి.
3) తొట్టెను 1/4వ వంతు నూరిన పేపర్ గుజ్జు మిశ్రమం (Paper pulp) తో నింపాలి.
4) పొడిగా, బల్లపరుపుగా ఉన్న తలంపై ఒక వస్త్రాన్ని పరచాలి. తడి పేపర్ గుజ్జు కింద వైర్ స్క్రీన్ ను ఉంచాలి. స్క్రీన్‌ను మెల్లగా బయటికి తీసి పేపర్ గుజ్జును ఒత్తుతూ అందులోని నీటిని తీసివేయాలి.
5) జాగ్రత్తగా వస్త్రం ఫైన స్క్రీన్ ను బోర్లించాలి. గట్టిగా క్రిందికీ ఒత్తి స్క్రీన్ ను తీసివేయాలి.
6) కాగితపు గుజ్జు మిశ్రమంపై మరో గుడ్డ , వస్త్రంను పరచాలి. గుడ్డపై ఒక ప్లాస్టిక్ షీట్ ను పరిచి దానిపై బరువు కోసం పుస్తకాలను పేర్చాలి.
7) కొన్ని గంటల తరువాత పుస్తకాలు, గుడ్డను తీసి పేపరును ఎండలో ఆరనివ్వాలి.
8). హెయిర్ డ్రయర్‌ను ఉపయోగించి కూడా పేపరును ఆరబెట్టవచ్చును.
9) రంగులు గల పేపర్‌ను తయారుచేయడానికి కాగితపు గుజ్జుకు వంటకాల్లో ఉపయోగించే రంగు చుక్కలను కలపాలి. ఏర్పడిన కాగితాన్ని ఇస్త్రీ చేసి కావలసిన పరిమాణంలో, ఆకారంలో కత్తిరించుకోవాలి.
10) అందమైన గ్రీటింగ్ కార్డులు, ఫైల్ కవర్లు, బ్యాగులు మొదలగునవి రీ సైకిల్డ్ పేపరను ఉపయోగించి తయారు చేయవచ్చును.

ప్రశ్న 13.
మీకు తెలిసిన ఏవైనా నాలుగు ఔషధ మొక్కల పేర్లు మరియు వాటి ఉపయోగాలు తెలపండి.
జవాబు:
మా ప్రాంతంలో నాకు తెలిసిన ఔషధ మొక్కలు

  1. తులసి – దగ్గును నివారిస్తుంది
  2. వేప – యాంటీ సెప్టిక్
  3. పసుపు – యాంటిసెప్టిక్ మరియు సౌందర్య లేపనాల తయారీ
  4. సర్పగంధి – పాము కాటు నివారణ మందుల తయారీలో ఉపయోగపడుతుంది.

ప్రశ్న 14.
జతపరచండి మరియు కింది ప్రశ్నకు జవాబివ్వండి.
AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ 8
జవాబు:
1 – డి, 2 – సి, 3 – ఎ, 4 – బి

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 15.
పక్షులు ఆహారం, నివాసం కొరకు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళే విధానాన్ని ఏమంటారు. ఇలా వెళ్ళే పక్షుల పేర్లు వ్రాయండి.
జవాబు:
పక్షులు ఆహారం, నివాసం మరియు సంతానోత్పత్తికి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడాన్ని వలసపోవడం అంటారు. ఉదా : సైబీరియన్ కొంగ, పెలికన్ పక్షులు.

ప్రశ్న 16.
మీ ప్రదేశంలోని జీవ వైవిధ్యాన్ని పరిరక్షణకై ఏవైనా 2 నినాదాలు రాయండి.
జవాబు:
1. ప్రకృతిలో జీవించు – జీవజాతులను పరిరక్షించు ,
2. వృక్షోరక్షతి రక్షితః –
3. ప్రకృతిలో ప్రతిజీవి అపురూపం – వాటిని సంరక్షించడం మన కర్తవ్యం.

ప్రశ్న 17.
కింది పేరాను చదవండి.
“ఒక్కోసారి రాత్రివేళల్లో కూడా కొన్ని పక్షులు ఆకాశంలో గుంపులుగా ఎగురుతూ కనిపిస్తాయి. కొన్ని పక్షులకు శాశ్వత నివాసం ఉండదు. ఇవి గుంపులు గుంపులుగా ఒక చోటు నుండి మరో చోటుకు ఆవాసం, ఆహారం కోసం వెళుతుంటాయి. దీనినే వలస అంటారు. ఈ పక్షులనే “వలసపక్షులు” అంటారు. ఈ వలస పక్షులు వర్షాకాలంలో మన రాష్ట్రంలోని కొల్లేరు, పులికాట్ సరస్సులకు వస్తాయి. ఈ సరస్సుల దగ్గరున్న గ్రామాలలోని చెట్లపై ఇవి నివసిస్తూ ఉంటాయి. ప్రస్తుతం చెట్లను నరికివేయడం వలన నివాసాలు అందుబాటులో లేకపోవడంతో వలస పక్షుల సంఖ్య తగ్గిపోయింది.
ఎ) వలస పక్షులు అని వేటిని అంటారు ? అవి ఎందుకు వలసపోతాయి ?
బి) మనదేశానికి పక్షుల వలస తగ్గిపోవడానికి కారణం ఏమి ?
జవాబు:
ఎ) ఆహారం కోసం ఆవాసం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళే పక్షులను వలస పక్షులు అంటారు.
బి) పక్షులు వలస వచ్చే ప్రాంతాల గ్రామాలలో చెట్లను కొట్టివేయడం వల్ల ఆవాసాలు తగ్గి పక్షుల వలస తగ్గిపోతున్నది.

ప్రశ్న 18.
కాగితాన్ని పొదుపుగా వాడుకొనేందుకు నీవు తీసుకొనే జాగ్రత్తలు ఏమిటి ?
జవాబు:
1. కాగితాలను అవసరమైతేనే వాడాలి. రీసైకిల్ చేయబడిన కాగితాన్ని వాడాలి.
2. ప్రభుత్వ లావాదేవీలన్నీ ఎలక్ట్రానిక్ పద్ధతిలోకి మారితే పేపర్ల వినియోగం చాలావరకు తగ్గుతుంది.

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 19.
కింది తెలిపిన సమాచారాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
ప్రతిరోజు ఒకేరకమైన పక్షులు కనిపిస్తున్నాయా ? ప్రత్యేకించి కొన్ని కాలాలలో హఠాత్తుగా ఏమైనా మార్పులు ఏర్పడినాయా? కొత్తరకం పక్షులు ఎక్కడి నుండి వచ్చాయి ? ఈ విధంగా కొత్త పక్షులు మన ప్రాంతానికి ఆహారం, నివాసం కొరకు వస్తుంటాయి. దీనినే ‘వలస’ అంటారు. ఇలాంటి పక్షులను వలస పక్షులు అంటారు. వర్షాకాలంలో ఎన్నో రకాల పక్షులు మనరాష్ట్రంలో కొల్లేరు, పులికాట్ సరస్సులకు వలస వస్తాయి. ఇవి సమీప గ్రామాలలోని చెట్లపై గూళ్లు కట్టుకొంటాయి. పూర్వపు రోజుల్లో పక్షుల రాకను శుభసూచకం అని నమ్మేవారు. కానీ ప్రస్తుతం చెట్లు నరికివేతకు గురవుతుండటం వల్ల పక్షులు గూళ్ళు కట్టుకోవడానికి అనువైన స్థలాలు లేక అవి తమ విడిదిని మార్చుకొంటున్నాయి.

1. పై సమాచారం ఏ అంశాన్ని తెలియజేస్తోంది ?
జవాబు:
పక్షుల వలసపై పర్యావరణ ప్రభావం

2. వేరే ప్రాంతం నుండి కొత్త పక్షులు మన ప్రాంతానికి రావడాన్ని ఏమంటారు ?
జవాబు:
పక్షుల వలస

3. పక్షుల వలస రావాలంటే ఏమి చేయాలి ?
జవాబు:
వాటికి ఆవాసాలైన చెట్లను నరకకుండా పరిరక్షించాలి. సరస్సుల పర్యావరణాన్ని మానవ కార్యకలాపాలు కలుషితం , కాకుండా చూడాలి.

4. నీకు తెలిసిన కొన్ని వలస పక్షుల పేర్లు రాయండి ?
జవాబు:
పెలికన్ పక్షులు, సైబీరియన్ కొంగ.

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

1 మార్కు ప్రశ్నలు

ప్రశ్న 1.
జీవవైవిధ్యం అంటే ఏమిటి ?
జవాబు:
జీవవైవిధ్యం : మొక్కలు, జంతువుల్లో కనపడే వైవిధ్యాలను జీవవైవిధ్యం అంటారు.

ప్రశ్న 2.
అంతరించిన జాతులు అంటే ఏమిటి?
జవాబు:
అంతరించిన జాతులు : భూమి పైనున్న ఆవరణ వ్యవస్థలలో పూర్తిగా కనబడకుండా అంతరించిపోయిన జాతులను అంతరించిన జాతులు అంటారు. ఉదా : డైనోసార్లు, హంసల్లాంటి తెల్ల కొంగలు మొదలయినవి. ఇక ఇలాంటి జీవులను మనం తిరిగి భూమిపై చూడలేము.

ప్రశ్న 3.
ఆపదలో ఉన్న జాతులు అని వేటిని అంటారు.
జవాబు:
భూమిపైనున్న ఆవరణ వ్యవస్థలలో సంఖ్యాపరంగా బాగా తక్కువగా ఉన్న జాతులను ఆపదలో ఉన్న జాతులు అంటారు. అవి నివసించే ప్రాంతాలు మానవుని వల్ల నాశనం చేయబడటం వల్ల అవి నివాసం కోల్పోయి ఆపదలో ఉన్నాయి.

ప్రశ్న 4.
ఎండమిక్ జాతులు అనగానేమి?
జవాబు:
భూమిపై ఒక ప్రత్యేక ఆవాసానికి పరిమితమైన జాతులను ఎండమిక్ జాతులు అంటారు.
ఉదా : 1. కంగారూలు ఆస్ట్రేలియాలోనే వుంటాయి.
2. కోపిష్టి మదపుటేనుగులు ఆఫ్రికా అడవులలోనే ఉంటాయి.
3. ఒంగోలు జాతి గిత్తలు మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటాయి. కానీ ఈ మధ్య వీటిని కృత్రిమ గర్భధారణ ద్వారా బ్రెజిల్ లో పెంచుతున్నారు)

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 5.
భూమిపై అధిక జీవవైవిధ్యం ఎక్కడ కనిపిస్తుంది ?
జవాబు:
భూమిపై అధిక జీవవైవిధ్యం అడవులలో మాత్రమే కనిపిస్తున్నది. అడవులలో ఒకే జాతి మొక్కలు, జంతువుల మధ్య వైవిధ్యం కనబడుతుంది.

ప్రశ్న 6.
వలస అనగానేమి?
జవాబు:
వాతావరణ ప్రతికూలతల వల్ల ప్రత్యుత్పత్తి జరుపుకొనటానికి పక్షులు వాటి సహజ నివాసం వీడి మరొక చోటుకు (మారటాన్ని) వెళ్ళటాన్ని ‘వలస’ అంటారు.

ప్రశ్న 7.
రామగుండంలో పులులు ఎందుకు అంతరించాయి ?
జవాబు:
1. ఇక్కడ థర్మల్ పవర్ కేంద్రం ఏర్పాటు వల్ల వేల ఎకరాల అటవీ భూమి తగ్గిపోయింది.
2. అందుకే పులుల సంఖ్య తగ్గింది.

ప్రశ్న 8.
మన దేశంలో పులులు ఎక్కడైనా కనిపిస్తున్నాయా ?
జవాబు:
అవును. శ్రీశైలం అడవులలో కనిపిస్తున్నాయి.

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 9.
అడవిని, అడవి జీవులను కాపాడటంలో టైగర్ ప్రాజెక్ట్ ఎలా ఉపయోగపడింది ?
జవాబు:
1. పులిని కాపాడాలంటే. అడవిని కాపాడాలి.
2. అడవిని కాపాడితే అది జీవవైవిధ్యపు నిల్వగా మారి ఎన్నో రకాల మొక్కలు, జంతువులు, పక్షులకు ఆవాసంగా మారుతుంది.
3. ఇలా అడవిని సంరక్షించటం అంటే పులుల సంరక్షణే !

ప్రశ్న 10.
ఇదివరకు పులులు ఉండి, ఇప్పుడు తగ్గితే అది జింకలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ?
జవాబు:
1. పులుల ఆహారం ఎక్కువగా జింకలే.
2. పులులు’ తగ్గితే జింకల జనాభా పెరుగుతుంది.

ప్రశ్న 11.
జింకల సంఖ్య పెరిగితే మొక్కల పరిస్థితి ఏమిటి ?
జవాబు:
1. జింకలు గడ్డిని, మొక్కలను, వేరుశనగ, కందిచెట్లను తింటాయి.
2. పులులు తగ్గి, జింకల సంఖ్య పెరగటం వల్ల, అవి మొక్కలను తింటాయి కాబట్టి మొక్కల సంఖ్య బాగా తగ్గుతుంది.

ప్రశ్న 12.
మన రాష్ట్రానికే పరిమితమైన ఒక ఎండమిక్ జాతిని పేర్కొనండి.
జవాబు:
‘జెర్డాన్స్ కర్’ ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఒక ఎండమిక్ జాతి.

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 13.
ప్రకృతిలో మిమ్మల్ని అధికంగా ఆకర్షించినదేది?
జవాబు:
ప్రకృతిలో మా ఊరి చెరువు, దాని ప్రక్కన ఉన్న దేవాలయం నన్ను అధికంగా ఆకర్షించాయి. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా, అందంగా, హాయిగా ఉంటుంది.

లక్ష్యాత్మక నియోజనము

ప్రశ్న 1.
ప్రపంచం అంతటా రోజుకు ………….. జాతులు అంతరించిపోతున్నాయి.
ఎ) 26
బి) 27
సి) 28
డి) 30
జవాబు:
బి) 27

ప్రశ్న 2.
నెమళ్ళకు ……………… ఆహారం అంటే ఎంతో ఇష్టం
ఎ) చీమలు
బి) సాలీడు
సి) పాములు
డి) పిల్ల నెమళ్ళు
జవాబు:
సి) పాములు

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 3.
‘పులుల లోయగా’ ఒకప్పుడు ఈ పట్టణం వద్ద నున్న అడవి పిలవబడింది.
ఎ) మంచిర్యాల
బి) కరీంనగర్
సి) అడ్డతీగల
డి) చిత్తూరు
జవాబు:
ఎ) మంచిర్యాల

ప్రశ్న 4.
ఏనుగుల బీభత్సం ఎక్కువగా ఏ జిల్లాలో ఉంటుంది? )
ఎ) చిత్తూరు
బి) ఖమ్మం
సి) వరంగల్
డి) రంగారెడ్డి
జవాబు:
ఎ) చిత్తూరు

ప్రశ్న 5.
కొల్లేరు సరస్సు ఏ జిల్లాలో ఉంది?
ఎ) పశ్చిమగోదావరి
బి) వరంగల్
సి) శ్రీకాకుళం
డి) విజయనగరం
జవాబు:
ఎ) పశ్చిమగోదావరి

ప్రశ్న 6.
పాండా సంరక్షణ బాధ్యతను తీసుకున్న సమాఖ్య
ఎ) IUWC
బి) NGC
సి) WWF
డి) ZSL
జవాబు:
సి) WWF

ప్రశ్న 7.
మన దేశంలో బిల్లులు ఎక్కువగా ……………. కనుమలలో ఉన్నాయి.
ఎ) తూర్పు
బి) పశ్చిమ
సి) ఉత్తర
డి) దక్షిణ
జవాబు:
బి) పశ్చిమ

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 8.
శ్రీశైల అభయారణ్యం ……………. సంరక్షణ కోసం కేటాయించారు.
ఎ) సింహాల
బి) జింకల
సి) పాముల
డి) పులుల
జవాబు:
డి) పులుల

ప్రశ్న 9.
రాబందుల ఆహారం ………………..
ఎ) మృత కళేబరాలు
బి) లేళ్ళు
సి) కుందేళ్ళు
డి) నక్కలు
జవాబు:
ఎ) మృత కళేబరాలు

ప్రశ్న 10.
టైగర్ ప్రాజెక్టు ………….. సం||లో ప్రారంభించారు.
ఎ) 1971
బి) 1972
సి) 1973
డి) 1974
జవాబు:
బి) 1972

ప్రశ్న 11.
హైదరాబాద్ లో ప్రపంచ జీవవైవిధ్య సదస్సు జరిగిన సంవత్సరం
ఎ) 2010
బి) 2012
సి) 2015
డి) 2011
జవాబు:
బి) 2012

ప్రశ్న 12.
ప్రపంచంలో అంతరించిపోతున్న 100 జంతువుల ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ కి చెందినవి
ఎ) 2
బి) 4
సి) 6
డి) 8
జవాబు:
ఎ) 2

ప్రశ్న 13.
గూటీ టారంటలా సాలీడు ఏ జిల్లాలో కన్పిస్తుంది ?
ఎ) కర్నూలు
బి) కడప
సి) అనంతపురం
డి) చిత్తూరు
జవాబు:
ఎ) కర్నూలు

ప్రశ్న 14.
బట్టమేక పక్షిని సంరక్షించే పుల్లెందు పక్షుల సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉన్నది ?
ఎ) కడప
బి) ప్రకాశం
సి) కర్నూలు
డి) అనంతపురం
జవాబు:
సి) కర్నూలు

ప్రశ్న 15.
జీవ వైవిధ్యానికి దారితీసేవి
ఎ) జీవుల మధ్య పోలికలు
బి) జీవుల మధ్య భేదాలు
సి) జీవుల మధ్య పోరాటాలు
డి) జీవుల అలవాట్లు
జవాబు:
బి) జీవుల మధ్య భేదాలు

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 16.
E.O. విల్సన్ అభిప్రాయం ప్రకారం ప్రపంచమంతటా సంవత్సరానికి ఎన్ని జాతులు అంతరించిపోతున్నాయి?
ఎ) 100
బి) 1000
సి) 10,000
డి) 1,00,000
జవాబు:
సి) 10,000

ప్రశ్న 17.
W.W.F ను విస్తరించి వ్రాయగా
ఎ) వరల్డ్ వైడ్ ఫండ్
బి) వరల్డ్ వైడ్ ఫెడరేషన్
సి) వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్
డి) వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్
జవాబు:
డి) వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్

ప్రశ్న 18.
I.U.W.C విస్తరించి వ్రాయగా
ఎ) ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్
బి) ఇండియన్ యూనియన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్
సి) ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వెల్త్ కన్జర్వేషన్
డి) ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వైల్డ్ లైఫ్ కమిటీ
జవాబు:
ఎ) ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్

ప్రశ్న 19.
అంతరించిపోతున్న మొక్కలు, జంతువుల సమాచారాన్ని తెల్పేది
ఎ) రెడ్ డేటా బుక్
బి) గ్రీన్ డేటా బుక్
సి) బ్లూడేటా బుక్
డి) బ్లాక్ డేటా బుక్
జవాబు:
ఎ) రెడ్ డేటా బుక్

ప్రశ్న 20.
ఎండమిక్ జాతులు అనగా
ఎ) అంతరించిపోతున్న జాతులు
బి) అరుదైన జాతులు
సి) ఒక ప్రాంతానికి పరిమితమైన జాతులు
డి) అంతరించిపోయిన జాతులు
జవాబు:
సి) ఒక ప్రాంతానికి పరిమితమైన జాతులు

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 21.
ఈ క్రింది వానిలో ఎండమిక్ జాతి
ఎ) ఏనుగు
బి) సింహం
సి) కంగారు
డి) పులి
జవాబు:
సి) కంగారు

ప్రశ్న 22.
ఈ క్రింది వానిలో విదేశీ ఆక్రమణ జాతికి ఉదాహరణ
ఎ) హైదరాబాదు కాకి
బి) హైదరాబాదు పావురం
సి) హైదరాబాదు పిచ్చుక
డి) హైదరాబాదు చిలుక
జవాబు:
బి) హైదరాబాదు పావురం

ప్రశ్న 23.
గుట్టపుడెక్క దేనికి ఉదాహరణ ?
ఎ) ఆపదలో ఉన్న జాతి
బి) అంతరించిపోతున్న జాతి
సి) విదేశీయ ఆక్రమణ జాతి
డి) అరుదైన జాతి
జవాబు:
సి) విదేశీయ ఆక్రమణ జాతి

ప్రశ్న 24.
పూర్వకాలంలో భారతదేశంలో ఎన్ని రకాల వరి వంగడాలు సాగులో ఉన్నాయి?
ఎ) 10,000
బి) 20,000
సి) 40,000
డి) 50,000
జవాబు:
డి) 50,000

ప్రశ్న 25.
పూర్వకాలంలో ఎన్ని రకాల మొక్కల జాతులను మానవుడు ఆహారంగా ఉపయోగించాడు?
ఎ) 5,000
బి) 10,000
సి) 15,000
డి) 20,000
జవాబు:
ఎ) 5,000

ప్రశ్న 26.
మనదేశంలో ఎన్ని పులి సంరక్షక కేంద్రాలున్నాయి ?
ఎ) 23
బి) 25
సి) 27
డి) 29
జవాబు:
సి) 27

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 27.
పులులను సంరక్షించుకోవటం ద్వారా వీనిని కాపాడుకోవచ్చు.
ఎ) అడవులు
బి) గడ్డిమైదానాలు
సి) పర్వత ప్రాంతాలు లోయలు
డి) ఆవరణ వ్యవస్థలు
జవాబు:
డి) ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 28.
జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ కలదు ?
ఎ) అస్సోం
బి) గౌహతి
సి) మేఘాలయ
డి) షిల్లాంగ్
జవాబు:
బి) గౌహతి

ప్రశ్న 29.
పాకాల వన్య సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో కలదు ?
ఎ) కరీంనగర్
బి) ఖమ్మం
సి) వరంగల్
డి) ఆదిలాబాదు
జవాబు:
సి) వరంగల్

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 30.
ఒకటన్ను పేపర్ తయారు చేయడానికి ఎన్ని వృక్షాలని నరికివేయవలసి ఉంటుంది ?
ఎ) 17
బి) 22
సి) 25
డి) 27
జవాబు:
ఎ) 17

ప్రశ్న 31.
మనదేశానికి పక్షులు యిక్కడ నుండి వలస వస్తాయి.
ఎ) సైబీరియా
బి) మంగోలియ
సి) చైనా
డి) కజకిస్థాన్
జవాబు:
ఎ) సైబీరియా

ప్రశ్న 32.
అడవుల నరికివేత తగ్గించుటలో ఉపయోగపడే కలప
ఎ) టేకు
బి) కంప్రెస్ట్ కార్డ్ బోర్డ్
సి) బైండింగ్ కార్డ్ బోర్డ్
డి) క్బార్డ్
జవాబు:
బి) కంప్రెస్ట్ కార్డ్ బోర్డ్

ప్రశ్న 33.
కోరింగ జంతు సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో కలదు ?
ఎ) తూర్పు గోదావరి
బి) పశ్చిమ గోదావరి
సి) కృష్ణా
డి) విజయనగరం
జవాబు:
ఎ) తూర్పు గోదావరి

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 34.
రేడియేషన్ వల్ల ప్రస్తుతం అంతరిస్తున్న పక్షి జాతి
ఎ) కాకి
బి) రాబందు
సి) పిచ్చుక
డి) కొంగలు
జవాబు:
సి) పిచ్చుక

ప్రశ్న 35.
ఇటీవల మనదేశంలో అంతరిస్తున్న పక్షి జాతి
ఎ) నెమళ్ళు
బి) రాబందులు
సి) కాకులు
డి) కొంగలు
జవాబు:
బి) రాబందులు

ప్రశ్న 36.
భారత ప్రభుత్వం టైగర్ ప్రాజెక్టును ప్రారంభించిన సంవత్సరం
A) 1978
B) 1979
C) 1988
D) 1972
జవాబు:
D) 1972

ప్రశ్న 37.
కింది వాటిలో జాతుల వైవిధ్యాన్ని వివరించునది.
A) ఇవ్వబడిన ప్రాంతంలో ఉండే ఆపదలో వున్న జాతుల జనాభా
B) ఇవ్వబడిన ప్రాంతంలో ఉండే వివిధ రకాల జాతులు
C) ఇచ్చిన ప్రాంతంలో అంతరించిపోయిన జాతులు లేకపోవటం
D) ఇవ్వబడిన ప్రాంతానికి స్థానికము కాని జాతుల సంఖ్య
జవాబు:
B) ఇవ్వబడిన ప్రాంతంలో ఉండే వివిధ రకాల జాతులు

ప్రశ్న 38.
భారతదేశంలో అధిక సంఖ్యలో ఎండమిక్ జాతులు వున్నాయి. ప్రపంచంలోని ఎండమిక్ జాతులైన ఉ భయచరాలలో దాదాపు 62%, బల్లుల్లో 50% భారతదేశంలో ఈ ప్రాంతంలో వున్నాయి.
A) హిమాలయాలు
B) పశ్చిమ కనుమలు
C) ఆరావళి
D) రాజస్థాన్ ఎడారి
జవాబు:
B) పశ్చిమ కనుమలు

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 39.
“జాతి భావం” (Species Concept) కు సంబంధించిన వాక్యం
A) అన్ని జీవులకు వర్తించదు
B) లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవులకు వర్తించును
C) ఆలైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవులకు వర్తించదు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

ప్రశ్న 40.
జాతీయపార్కు అనే దానికి సరియైన స్టేట్ మెంట్ గుర్తించండి.
1. ఒక విశాలమైన స్థలంలో వన్యజాతి జీవులను సహజమైన ఆవాసంలో సంరక్షించే ప్రదేశాలు
2. ఆయా జీవజాతుల ఆవాసాలపై ప్రభావం చూపకుండా ఉండేవిధంగా మానవ చర్యలను పరిమితంగా అనుమతించేవి
A) 1 మాత్రమే
B) 1 మరియు 2
C) 2 మాత్రమే
D) పై రెండు కాదు
జవాబు:
B) 1 మరియు 2

ప్రశ్న 41.
జతపరచుటలో సరైన సమాధానం గుర్తించండి.
AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ 7
A) 1-ఎ, 2-సి, 3-బి
B) 1-సి, 2-బి, 3-ఎ
C) 1 -బి, 2 – ఎ, 3-సి
D) 1-సి, 2-ఎ, 3-బి
జవాబు:
D) 1-సి, 2-ఎ, 3-బి

ప్రశ్న 42.
పర్యావరణ నిర్వహణ ఎందుకు అవసరం ?
A) మానవ మనుగడ కొనసాగింపు కొరకు
B) జంతువులు అంతరించకుండా
C) ప్రకృతి సమతుల్యత కొరకు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

ప్రశ్న 43.
రెడేటా పుస్తకం నందు కింది అంశాలు ఉంటాయి.
A) ఆపదలో ఉన్న అంతరించిపోతున్న జీవుల జాబితా ఉంటుంది
B) సాధారణ మరియు అపాయకరమైన జీవుల జాబితా ఉంటుంది
C) అరుదైన మరియు విదేశీ జాతులు ఉంటాయి
D) ఎండమిక్ జాతుల వివరాలు
జవాబు:
A) ఆపదలో ఉన్న అంతరించిపోతున్న జీవుల జాబితా ఉంటుంది

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 44.
కింది వానిలో వలస పక్షిని గుర్తించండి
A) కాకి
B) ఫ్లెమింగో
C) గ్రద్ద
D) చిలుక
జవాబు:
B) ఫ్లెమింగో

ప్రశ్న 45.
రెడ్ డేటా బుక్ అనేది దీనిని ఉద్దేశించిననది
A) అంతరించిపోతున్న జంతువుల సమాచారం తెలిపేది
B) వలస పక్షుల గురించి తెలిపేది
C) వివిధ ప్రాంతాలలో నివసించే జంతువులను గురించి తెలిపేది
D) విలుప్తమైన జీవుల గురించి తెలిపేది
జవాబు:
A) అంతరించిపోతున్న జంతువుల సమాచారం తెలిపేది

ప్రశ్న 46.
నీ మిత్రుడు తన ఇంటి మిద్దె మీద పక్షుల కొరకు గూళ్ళు ఏర్పాటు చేసి అవి తాగేందుకు నీటిని కూడా వుంచాడు. దీనిపై నీ ప్రతిస్పందన
A) ఇది ప్రోత్సహించవలసిన చర్య కాదు
B) ఇది చాలా గొప్ప చర్య అతన్ని నేను అభినందిస్తాను
C) ఈ చర్యవల్ల పక్షులు దూరమవుతాయి
D) ఈ చర్యను నేను వ్యతిరేకిస్తాను
జవాబు:
(B) ఇది చాలా గొప్ప చర్య అతన్ని నేను అభినందిస్తాను

ప్రశ్న 47.
చిత్రంలో ఉన్న జీవి ప్రత్యేకత ఏమిటి ?
AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ 9
1) అత్యంత ఆపదలో ఉన్న కీటకం
2) దీనిని ‘గూటి టరాంటులా’ అంటారు.
3) ఇది హిమాలయాలలో ఉంటుంది.
4) దీనిని ‘బట్ట మేక’ పక్షి అంటారు.
పై వాక్యా లలో సరైనవి
A) 1, 2 మాత్రమే
B) 3, 4 మాత్రమే
C) 1, 4 మాత్రమే
D) 2, 4 మాత్రమే
జవాబు:
A) 1, 2 మాత్రమే

AP 8th Class Biology Important Questions Chapter 5 కౌమార దశ

These AP 8th Class Biology Important Questions 5th Lesson కౌమార దశ will help students prepare well for the exams.

AP Board 8th Class Biology 5th Lesson Important Questions and Answers కౌమార దశ

ప్రశ్న 1.
కౌమారదశను ఒడిదుడుకులతో కూడిన దశ అని అంటారు ఎందుకు ?
జవాబు:

  1. కౌమారదశ ఒడిదుడుకులతో కూడిన దశ.
  2. ఎందుకంటే ఇప్పుడిప్పుడే పిల్లలు శైశవదశను దాటి కౌమారదశలో ప్రవేశిస్తుంటారు.
  3. ఈ దశలో వచ్చే శారీరక మార్పులు పిల్లల్ని ఒత్తిడికి గురిచేస్తాయి.
  4. తాము ‘పిల్లలా’ ‘పెద్దలా’ అనేది నిర్ణయించుకోలేరు.
  5. మనిషి జీవితంలో ఇది సంశయానికి, సందిగ్గానికి, మార్పుకు గురయ్యే దశ.

AP 8th Class Biology Important Questions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 2.
కౌమారదశలో బాలురు, బాలికల్లో వచ్చే శారీరక మార్పులు ఏమిటి ? (లేదా)
కౌమారదశలో మార్పులు అబ్బాయిలలో, అమ్మాయిలలో వేరువేరుగా ఉంటాయని ఎలా చెప్పగలవు ?
జవాబు:

  1. కౌమారదశలో శరీరంలో మార్పులు చాలా వేగంగా జరుగుతాయి.
  2. అమ్మాయిలలో కంటే అబ్బాయిలలో భుజాలు వెడల్పుగా మారడం గమనించే ఉంటారు.
  3. అలాగే అమ్మాయిలలో నడుము కింద భాగం వెడల్పుగా మారడం కూడా గమనించి ఉంటారు.
  4. అమ్మాయిలలో ఈ మార్పు తరువాతి కాలంలో బిడ్డలకు జన్మనివ్వడంలో తోడ్పడుతుంది.
  5. అబ్బాయిలలో కండరాలు గట్టిబడతాయి.
  6. అమ్మాయిలలో సుకుమారతనం పెరుగుతుంది.
  7. అంటే కౌమారదశలో జరిగే మార్పులు అబ్బాయిల్లో, అమ్మాయిల్లో వేరువేరుగా ఉంటాయన్నమాట.

ప్రశ్న 3.
ఋతుచక్రం గురించి రాయండి.
జవాబు:

  1. స్త్రీలలో ప్రత్యుత్పత్తి దశ సాధారణంగా 10-12 సంవత్సరాల వయస్సు మధ్యలో మొదలై సుమారుగా 45-50 సంవత్సరాల వరకు కొనసాగుతుంది.
  2. కౌమారదశలో ప్రవేశించగానే అండం పరిపక్వం చెంది విడుదల కావడం మొదలవుతుంది.
  3. ప్రతి బీజకోశం నుండి నెలకోసారి ఒక అండం విడుదలవుతుంది.
  4. ఒక నెలలో కుడి బీజకోశం నుండి అండం విడుదలైతే దాని తరువాత నెలలో ఎడమ బీజకోశం నుండి అండం విడుదలౌతుంది.
  5. ఇది శుక్రకణంతో కలిసినట్లయితే ఫలదీకరణం జరుగుతుంది.
  6. ఈ సమయంలో గర్భాశయ కుడ్యాలు ఫలదీకరణ చెందిన అండాన్ని స్వీకరించేందుకు వీలుగా మందంగా తయారవుతాయి.
  7. ఫలితంగా స్త్రీలు గర్భం ధరించగలుగుతారు.
  8. ఫలదీకరణ జరగకపోతే, అండం మరియు గర్భాశయ కుడ్యం పొరలు రక్తంతో కలిసి బయటకు విడుదల అవుతాయి.
  9. దీన్నే ఋతుచక్రం లేదా బహిష్టుకావడం (Menstruation) అని అంటారు. ఇది ఒక సహజమైన ప్రక్రియ.

ప్రశ్న 4.
ఋతుచక్రంపై సమాజంలో గల అపోహలు ఏమిటి ? వీటిని నీవు ఎలా ఖండిస్తావు ?
జవాబు:

  1. కొన్ని సమాజాలలో బహిష్టు సమయంలో స్త్రీలు ఇతరులను తాకడం పాపం అని భావిస్తారు.
  2. వాళ్ళని స్నానం చేయడానికి గాని, వంటచేయడానికి గాని అనుమతించరు.
  3. ఆ సమయంలో పాఠశాలకి కూడా అనుమతించకపోవడం వలన చదువులో కూడా వెనుకబడతారు.
  4. కొంతమంది వాళ్ళను ఇండ్లలోనికి కూడా అనుమతించరు.

ఇలాంటి వివక్ష స్త్రీలకు మేలు చేస్తుందా ?
1. దీనిపై చాలా పరిశోధనలు జరిపి, చివరికి పరిశోధకులు తేల్చింది ఏమిటంటే ఋతుచక్రం ఒక సహజ ప్రక్రియ. ఇలా స్త్రీల పట్ల వివక్షత చూపించడంలో మూఢనమ్మకం తప్ప ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఏ రక్తం అయితే బయటకు విడుదలవుతుందో అదే రక్తం ఒకవేళ ఫలదీకరణ జరిగినట్లయితే బిడ్డ పెరుగుదలకు తోడ్పడుతుంది.
2. మరి అదే రక్తం ఋతుచక్రం ద్వారా విడుదలయ్యేటప్పుడు మాత్రం ఎట్లా కలుషితం అవుతుంది.
3. ఇటువంటి మూఢనమ్మకాల వల్ల ప్రయోజనం కలుగకపోగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం వలన స్త్రీలలో అనేక రోగాలు వ్యాపించే అవకాశం ఉంది.

AP 8th Class Biology Important Questions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 5.
హార్మో న్స్ అనగా నేమి ? వాటి ప్రాధాన్యత ఏమిటి ?
జవాబు:

  1. అంతఃస్రావ గ్రంథులకు ప్రత్యేకమైన నాళాలు ఉండవు. కాబట్టి వీటిని వినాళగ్రంథులు అని కూడా అంటారు.
  2. ఈ గ్రంథుల నుండి స్రవించే రసాయన పదార్థాలను “హార్మోన్లు” అంటారు.
  3. ఈ హార్మోన్లు మానవ శరీరంలో కొన్ని జీవక్రియలను నియంత్రిస్తాయి.
  4. ఉదా : శరీరంలో చక్కెర, కాల్షియం, లవణాల వంటి పదార్థాల పరిమాణం నియంత్రించడం.
  5. ఇవి శరీరంలో నీటి పరిమాణాన్ని కూడా నియంత్రిస్తాయి.
  6. ప్రత్యుత్పత్తి అవయవాల పెరుగుదలలో ఇవి ప్రముఖ పాత్ర వహిస్తాయి.
  7. ఋతుచక్ర ప్రారంభం ఆగిపోవడం, గర్భధారణ, పాల ఉత్పత్తి మొదలగునవన్నీ వీటి నియంత్రణలోనే జరుగుతాయి.
  8. బాలబాలికలలో కనిపించే ద్వితీయ లైంగిక లక్షణాలన్నీ హార్మోన్ ప్రభావం వల్లనే కలుగుతాయి.

ప్రశ్న 6.
మన శరీరంలోని కొన్ని వినాళ గ్రంథులు, వాటి హార్మోన్స్, ప్రభావాన్ని తెలపండి.
జవాబు:
AP 8th Class Biology Important Questions Chapter 5 కౌమార దశ 1

ప్రశ్న 7.
కౌమార దశలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి ? (లేదా) కౌమార దశలో తీసుకోవలసిన సంతులిత ఆహారాన్ని గురించి వివరించండి.
జవాబు:
1) సంతులిత ఆహారంలో తగు పరిమాణంలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, క్రొవ్వు పదార్థాలు మరియు విటమిన్లు కలిగి ఉంటాయి.
2) మన దేశీయ ఆహారపదార్థాలైన, రోటి, అన్నం, పప్పు, తృణధాన్యాలు కాయగూరల్లో ఈ పదార్థాలు తగు మోతాదులో ఉంటాయి.
3) కనుక వీటిని తగు పరిమాణంలో తీసుకోవాలి. ఇనుము (Iron) రక్తకణాల తయారీలో తోడ్పడుతుంది.
4) కనుక ఐరన్ లభ్యమయ్యే పదార్థాలైన ఆకుకూరలు, బెల్లం, మాంసం, సిట్రస్ జాతికి చెందిన ఫలాలు, ఉసిరికాయలు వంటివి కూడా తీసుకోవడం ఈ దశలో అవసరం.

ప్రశ్న 8.
జంక్ ఫుడ్స్ ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయి ?
జవాబు:
1) కౌమార వయస్సులో ఆకలి తట్టుకోలేక రకరకాల ఐస్ క్రీమ్స్, జంక్ ఫుడ్స్, చిప్స్, స్నాక్స్ అంగడిలో అమ్మే ఆహార – పదార్థాలు తినడానికి ఇష్టపడతారు.
2) కానీ ఇవేవీ సరైన పోషకాలను అందించలేవు.
3) కాబట్టి ఇవేవీ సంతులిత ఆహారానికి ప్రత్యామ్నాయం కావు.
4) వీటిని రోజూ తీసుకొంటే శరీరబరువు పెరిగి స్థూలకాయానికి (Obesity) గురయ్యే అవకాశం ఉంది.
5) వీటిని ఎక్కువగా తింటే కడుపులో పుండ్లు, రక్తంలో చక్కెర శాతం పెరగడం, ఒత్తిడి, రక్తపోటు వంటివి కలుగుతాయి.
6) కాబట్టి కౌమారులు జంక్ ఫుడ్ తినేటప్పుడు ఒక నిమిషం ఆలోచించాలి. ‘వద్దని’ చెప్పాలి.

AP 8th Class Biology Important Questions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 9.
కౌమారదశలో వ్యక్తిగత పరిశుభ్రత యొక్క ఆవశ్యకత ఏమిటి ? (లేదా) కౌమార దశలో వున్న నీవు ఆరోగ్యంగా వుండుటకు పరిశుభ్రతను ఎలా పాటిస్తావు ?
జవాబు:
1) కౌమారదశలో స్వేదగ్రంథులు చురుకుగా పనిచేయటం వలన శరీరం నుండి ఘాటైన చెమట వాసన వస్తూ ఉంటుంది.
2) కాబట్టి ఈ దశలో ఉన్నవారు రోజుకి రెండుసార్లు శుభ్రంగా స్నానం చేయడం మంచిది.
3) ప్రతిరోజు అన్ని శరీర అవయవాలు జాగ్రత్తగా శుభ్రం చేసుకోవడం, ఉతికిన లోదుస్తులు ధరించడం మంచిది.
4) ఒక వేళ ఇలా చేయకపోతే రకరకాల శిలీంధ్రాల వలన, బ్యా క్టీరియాల వలన జబ్బులు వస్తాయి.
5) ఋతుచక్రం సమయంలో అమ్మాయిలు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం చాలా అవసరం.
6) వాడిపారేసే (Disposable) నాప్ కిన్లు వాడటం వలన చాలా రకాల రుతు సంబంధ వ్యాధులను దూరం చేయవచ్చు.

ప్రశ్న 10.
కౌమార దశలో శారీరక వ్యాయామం ప్రాధాన్యత ఏమిటి ?
జవాబు:
1) ఆరు బయట స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. అక్కడ నడవడం, ఆటలు ఆడుకోవటం వంటివి చేస్తే ఆరోగ్యంగా ఉండగలుగుతాం.
2) ఈ వయస్సులో ఉన్న అబ్బాయి, అమ్మాయిలందరూ నడకను అలవాటు చేసుకోవాలి.
3) తేలికపాటి వ్యాయామం చేయటంతో పాటు ఆరు బయట ఆటలు ఆడాలి.
4) ఇది ఆరోగ్యాన్ని చక్కగా ఉంచడమే కాకుండా మంచి నిద్రను కూడా ఇస్తుంది. మానసిక ఉల్లాసాన్ని కూడా ఇస్తుంది.
5) ఇది రోజువారీ కార్యక్రమాలను చురుకుగా చేయడానికి సహాయపడుతుంది.

ప్రశ్న 11.
అబ్బాయిల గొంతు అమ్మాయి గొంతుకన్నా ఎందుకు భిన్నంగా ఉంటుంది ?
జవాబు:

  1. కౌమారదశలో అబ్బాయిలలో ఆడమ్స్ యాపిల్ ఏర్పడుతుంది.
  2. ఇది గొంతు క్రింద స్వరపేటిక 9వ మృదులాస్థి వృద్ధి వలన ఏర్పడుతుంది.
  3. దీని వలన స్వరపేటిక పరిమాణం పెరిగి గొంతు గంభీరంగా మారుతుంది.
  4. ఆడపిల్లలలో స్వరపేటిక పరిమాణం పెరగదు కావున వారి గొంతు సాధారణంగా ఉంటుంది.
  5. ఆడమ్స్ యాపిల్ వలన అబ్బాయి గొంతు అమ్మాయి గొంతుకన్నా భిన్నంగా మారుతుంది.

ప్రశ్న 12.
కౌమారదశలో మొటిమల గురించి నీవు తీసుకొనే జాగ్రత్తలు ఏమిటి ?
జవాబు:
1) మొటిమలను గిల్లరాదు.
2) తక్కువ క్షారగుణం గల సబ్బుతో రోజుకు రెండు మూడు సార్లు ముఖం కడుగుతుండాలి.
3) గోరువెచ్చని నీళ్ళతో మొటిమలను కడుగుతూ ఉండాలి. అవసరమైతే వైద్యుడిని కలవాలి.
4) వాటి గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు. ఎందుకంటే ఒత్తిడి, ఆందోళనలు మొటిమలను ఇంకా ఎక్కువ వచ్చేలా చేస్తాయి.

ప్రశ్న 13.
ఎ) ఈ చిత్రంలో కనిపిస్తున్న భాగం పేరు ఏమిటి?
AP 8th Class Biology Important Questions Chapter 5 కౌమార దశ 2
బి) ఇది ఏ దశలో అభివృద్ధి చెందుతుంది ?
సి) పై అవయవము ఎవరిలో బాగా అభివృద్ధి చెందుతుంది ? దీనివల్ల ఏమౌతుంది ?
డి) ఏ మృదులాస్థి పెరగడం వల్ల ఇది ఏర్పడుతుంది ?
జవాబు:
ఎ) ఆడమ్స్ ఆపిల్
బి) కౌమార దశలో మగపిల్లలలో అభివృద్ధి చెందుతుంది
సి) కౌమార దశలోని బాలుర యందు అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల బాలుర కంఠస్వరం బొంగురుగా మారుతుంది.
డి) థైరాయిడ్ మృదులాస్థి పెరగడం వలన ఆడమ్స్ ఆపిల్ ఏర్పడుతుంది.

ప్రశ్న 14.
క్రింది పట్టికను చదవండి. అడిగిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
AP 8th Class Biology Important Questions Chapter 5 కౌమార దశ 3
ఎ) కోపమొచ్చినప్పుడు విడుదలయ్యే హార్మోన్ ఏది ?
బి) టెస్టోస్టిరాన్ హార్మోన్ ను విడుదల చేసే గ్రంథి ఏది ?
సి) ఏ హార్మోన్ ఇతర వినాళ గ్రంథులను నియంత్రిస్తుంది ?
డి) స్త్రీ, పురుషులలో ద్వితీయ లైంగిక లక్షణాలకు కారణమైన హార్మోన్లు ఏవి ?
జవాబు:
ఎ) అడ్రినలిన్
బి) ముష్కాలు
సి) పెరుగుదల హార్మోన్
డి) టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్

ప్రశ్న 15.
AP 8th Class Biology Important Questions Chapter 5 కౌమార దశ 4
చిత్రంలోని అవయవంను గూర్చి తెలుసుకోవడానికి మీ సైన్స్ టీచరు ఎలాంటి ప్రశ్నలు అడుగుతావు?
జవాబు:
1) పై పటంలో చూపబడిన భాగం పేరు ఏమిటి ?
2) ఇది ఎవరిలో అభివృద్ధి చెందుతుంది ?
3) ఇది అభివృద్ధి చెందడం వల్ల వారిలో కలిగే మార్పు ఏమిటి ?

ప్రశ్న 16.
క్రింది వాక్యాలను చదివి తప్పుగా ఉన్న వాటిని సవరించి రాయండి.
ఎ) కేంద్రకం, కణాంగాలు స్పష్టంగా చూడటానికి రంజనం చేయనవసరం లేదు.
బి) కణకవచం కణం యొక్క జీవక్రియలను నియంత్రిస్తుంది.
జవాబు:
ఎ) కేంద్రకం, కణాంగాలు స్పష్టంగా చూడటానికి రంజనం తప్పనిసరిగా చేయాలి.
బి) కణకవచం కణానికి బాహ్య, ఆఘాతాల నుండి రక్షణ కల్పిస్తుంది. యాంత్రిక బలాన్ని ఇస్తుంది.

AP 8th Class Biology Important Questions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 17.
ఈ కింది పట్టిక ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి.
AP 8th Class Biology Important Questions Chapter 5 కౌమార దశ 5
పట్టిక ఆధారంగా క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఎ) పురుషులలో శుక్రకణాల ఉత్పత్తి ఎక్కడ జరుగుతుంది ? ఇందుకు కారణమైన హార్మోను ఏది ?
బి) కోపం, బాధ వంటి ఉద్వేగాలను నియంత్రించే హార్మోన్ ఏది ?
సి) స్త్రీ బీజకోశాల నుండి విడుదలయ్యే హార్మోన్లు చేసే పనులు ఏవి ?
డి) కొన్ని గ్రంథులను అంతఃస్రావ గ్రంథులు అంటారు. ఎందుకు ?
జవాబు:
ఎ) ముష్కాల్ టెస్టోస్టిరాన్ హార్మోన్
బి) అడ్రినలిన్
సి) అండాల విడుదల, పిండ ప్రతిస్థాపన, ఋతుచక్రం నియంత్రణ
డి) ఈ గ్రంథులు తమ స్రావాలను నేరుగా రక్తంలోకి విడుదల చేస్తాయి. అందువల్ల వీటిని అంతస్రావీ గ్రంథులని, వినాళ గ్రంథులని అంటారు.

ప్రశ్న 18.
మల్లికకు 15 సంవత్సరాలకే వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయం తీసుకున్నారు. ఇది సరియైనదేనా ? ఎందుకు?
జవాబు:
1) ఈ నిర్ణయం సరియైనది కాదు.
2) ఎందుకంటే భారత వివాహ చట్టం ప్రకారం బాలికలకు 18 సం|| వయస్సు వివాహ వయస్సుగా నిర్ణయించడమైనది. మల్లికకు 15 సం||లకే వివాహం చేయాలనుకోవడం చటరిత్యా నేరం.
3) 15 సం|| వయస్సులో మల్లికకు శారీరక మానసిక స్థాయిలు సంపూర్ణంగా అభివృద్ధి చెందవు. ఈ వయసులో వివాహం ఆమె బంగారు భవిష్యత్తును అంధకారం చేస్తుంది.

ప్రశ్న 19.
బాల్యవివాహాలు సామాజిక దురాచారం అని నీకు తెలుసుకదా ? దీన్ని గురించి సమాజాన్ని చైతన్యపరుచుటకు మీ పాఠశాల విద్యార్థులు ఓ ర్యాలీని తలపెట్టారు. దీనిని ఉద్దేశించి కొన్ని నినాదాలను తయారు చేయండి ?
జవాబు:
బాల్య వివాహం ఒక సామాజిక దురాచారం
1) దీనిని సమాజంలో కొసాగించడం ప్రమాదకరం
2) బాలికల చదువు – భవితకు వెలుగు.
3) బాలికలకు కౌమారదశలో వివాహం వారి జీవితాలను అంధకారం చేస్తుంది.
4) బాల్యవివాహాలు – దేశ ప్రగతి నిరోధకాలు.

1 మార్కు ప్రశ్నలు

ప్రశ్న 1.
ఏ వయస్సుకు చేరుకున్న తర్వాత అబ్బాయిలలో ఎత్తు పెరుగుదల దాదాపుగా ఆగిపోతుంది?
జవాబు:
18 సం|| వయస్సు నాటికి అబ్బాయిలలో పెరుగుదల 100% పూర్తి అవుతుంది.

ప్రశ్న 2.
అమ్మాయిలలో పెరుగుదల ఏ వయస్సులో వేగంగా జరుగుతుంది?
జవాబు:
అమ్మాయిలలో పెరుగుదల 8 సంవత్సరాల నుండి వేగంగా ప్రారంభమై 16 సం|| పూర్తి అవుతుంది.

ప్రశ్న 3.
అమ్మాయిల్లో నిజంగా పెరుగుదల ఏ వయసులో ఎక్కువగా జరుగుతుంది ?
జవాబు:
అమ్మాయిల్లో పెరుగుదల ప్రధానంగా 11 సంవత్సరాల నుండి 13 సంవత్సరాల మధ్య ఎక్కువగా (4%) జరుగుతుంది.

ప్రశ్న 4.
అబ్బాయి, అమ్మాయిలలో ఎవరు వేగంగా పెరుగుతారు ? ఎట్లా చెప్పగలవు ?
జవాబు:
1. అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలలో పెరుగుదల రేటు అధికం అనిపిస్తుంది.
2. మొదట అమ్మాయిలు వేగంగా పెరిగినప్పటికీ 18 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇరువురిలో పెరుగుదల సమానంగా ఉంటుంది.

ప్రశ్న 5.
చిన్న పిల్లలు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు గొంతును బట్టి అమ్మాయా, అబ్బాయో చెప్పగలమా ?
జవాబు:
చిన్న పిల్లల గొంతును బట్టి అబ్బాయో, అమ్మాయో చెప్పలేము. ఇద్దరి గొంతు ఒకే విధంగా ఉంటుంది.

ప్రశ్న 6.
మాట్లాడేవారు అబ్బాయో, అమ్మాయో ఎప్పుడు ఎలా చెప్పగలుగుతాం ?
జవాబు:
యుక్త వయస్సు వచ్చిన తర్వాత అబ్బాయిల గొంతు గంభీరంగా మారి అమ్మాయిల కంటే విభిన్నంగా ఉంటుంది. అప్పుడు గొంతు ఆధారంగా, అబ్బాయో, అమ్మాయో చెప్పగలుగుతాం.

ప్రశ్న 7.
కౌమార దశలో సాధారణంగా మగపిల్లల కంఠస్వరంలో మార్పు ఎందుకు వస్తుంది ?
జవాబు:
కౌమార దశలో మగపిల్లల స్వరకోశం పరిమాణంలో పెద్దదిగా పెరుగుతుంది. దీనినే ఆడమ్స్ యాపిల్ అంటారు. దీని పరిమాణం పెరగటం వలన గొంతు గంభీరంగా ఏర్పడి ఆడవారి నుండి విభేదిస్తుంది.

ప్రశ్న 8.
స్త్రీలలో అండం విడుదల చాలా రోజుల వరకు కొనసాగుతుందా ?
జవాబు:
స్త్రీలలో అండం విడుదల దాదాపు 50 నుండి 55 సంవత్సరాలపాటు కొనసాగుతుంది.

ప్రశ్న 9.
ఒక వేళ అండం విడుదల ఆగిపోతే ఏం జరుగుతుంది ?
జవాబు:
1. అండం విడుదల కాకపోతే, ఫలదీకరణ జరగదు.
2. కావున కొత్త జీవులు ఏర్పడవు.

AP 8th Class Biology Important Questions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 10.
ఫలదీకరణ చెందిన అండాలు ఏమవుతాయి ?
జవాబు:
1. ఫలదీకరణ చెందిన అండాలు సంయుక్త బీజంగా మారతాయి.
2. సంయుక్త బీజం గర్భాశయంలో జీవిగా ఎదుగుతుంది.

ప్రశ్న 11.
ఫలదీకరణ జరగకపోతే ఏమవుతుంది ?
జవాబు:
1. ఫలదీకరణ జరగకపోతే జీవులు ఏర్పడవు.
2. జాతి అంతరించిపోతుంది.

ప్రశ్న 12.
అసలు అండమే విడుదల కాకపోతే ఏమవుతుంది ?
జవాబు:
లైంగిక ప్రత్యుత్పత్తికి అండము తప్పనిసరి. అసలు అండము విడుదల కాకపోతే లైంగిక ప్రత్యుత్పత్తి జరగదు. దానివలన కొత్త జీవులు రూపొందవు.

ప్రశ్న 13.
హార్మోన్లు అనగానేమి ?
జవాబు:
అంతఃస్రావ గ్రంథులకు ప్రత్యేకమైన నాళాలు ఉండవు. కాబట్టి వీటిని వినాళగ్రంథులు అని కూడా అంటారు. ఈ గ్రంథుల నుండి స్రవించే రసాయన పదార్థాలను “హార్మోన్లు” అంటారు.

లక్ష్యాత్మక నియోజనము

ప్రశ్న 1.
‘కౌమార విద్య’ కార్యక్రమాలు …………. క్లబ్ నిర్వహిస్తుంది.
ఎ) లయన్స్ క్లబ్
బి) రెడ్ రిబ్బన్ క్లబ్
సి) రోటరీ క్లబ్
డి) వాసవీ క్లబ్
జవాబు:
బి) రెడ్ రిబ్బన్ క్లబ్

ప్రశ్న 2.
ఋతుచక్రం ప్రతీ …….. రోజుల కొకసారి వస్తుంది.
ఎ) 20-30
బి) 25-30
సి) 28-30
డి) 30-32
జవాబు:
సి) 28-30

ప్రశ్న 3.
ముష్కాలు ……….ను విడుదల చేస్తాయి.
ఎ) టెస్టోస్టిరాన్
బి) ఈస్ట్రోజన్
సి) ప్రొజెస్టిరాన్
డి) F.S.H
జవాబు:
ఎ) టెస్టోస్టిరాన్

ప్రశ్న 4.
స్వేద గ్రంథులు ……. ను ఉత్పత్తి చేస్తాయి.
ఎ) హార్మోనులు
బి) చెమట
సి) విటమిన్లు
డి) తైలం
జవాబు:
బి) చెమట

ప్రశ్న 5.
అవసరానికి మించి ఎక్కువ ఆహారం తీసుకుంటే అది ……………. కు దారితీస్తుంది.
ఎ) పోషకాహారలోపం
బి) బలహీనత
సి) ఫ్లోరోసిస్
డి) స్థూలకాయం
జవాబు:
డి) స్థూలకాయం

ప్రశ్న 6.
NPEGEL ఎవరి కోసం నిర్వహించబడు కార్యక్రమం?
ఎ) బాలురు
బి) బాలికలు
సి) స్త్రీలు
డి) పురుషులు
జవాబు:
డి) పురుషులు

ప్రశ్న 7.
పురుషులలో కనీస వివాహ వయస్సు ……..
ఎ) 20 సం||
బి) 21 సం||
సి) 22 సం||
ది) 23 సం||
జవాబు:
ది) 23 సం||

AP 8th Class Biology Important Questions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 8.
స్త్రీల వ్యాధి నిపుణులను ………………. అంటారు.
ఎ) ఆంకాలజిస్ట్
బి) గైనకాలజిస్ట్
సి) కార్డియాలజిస్ట్
డి) నెఫ్రాలజిస్ట్
జవాబు:
బి) గైనకాలజిస్ట్

ప్రశ్న 9.
అబ్బాయిలలో గడ్డం, మీసాలు పెరగటం
ఎ) ప్రాథమిక లైంగిక లక్షణాలు
బి) ద్వితీయ లైంగిక లక్షణాలు
సి) తృతీయ లైంగిక లక్షణాలు
డి) పైవేవీ కావు
జవాబు:
బి) ద్వితీయ లైంగిక లక్షణాలు

ప్రశ్న 16.
పుట్టుకతో పిల్లల్ని ఆడ లేదా మగ గుర్తించటానికి సహాయపడేవి
ఎ) ప్రాథమిక లైంగిక లక్షణాలు
బి) ద్వితీయ లైంగిక లక్షణాలు
సి) తృతీయ లైంగిక లక్షణాలు
డి) పైవేవీ కావు
జవాబు:
సి) తృతీయ లైంగిక లక్షణాలు

ప్రశ్న 17.
సాధారణంగా ప్రత్యుత్పత్తి శీ ఈ కాలంలో మొదలవుతుంది.
ఎ) 9-13 సం||
బి) 11-15 సం||
సి) 14-18 సం||
డి) 13-19 సం||
జవాబు:
సి) 14-18 సం||

ప్రశ్న 18.
ఈ మధ్యకాలంలో అమ్మాయిలు త్వరగా కౌమార దశకు చేరుటకు కారణం
ఎ) రసాయనాలు కలిపిన పండ్లు తినడం
బి) కలుషిత ఆహారం, జంక్ ఫుడ్
సి) ఈస్ట్రోజన్ కలిపిన పాలు తాగడం
డి) పైవన్నీ
జవాబు:
సి) ఈస్ట్రోజన్ కలిపిన పాలు తాగడం

AP 8th Class Biology Important Questions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 19.
ఈ క్రింది వానిలో సరైన వరుస క్రమం
ఎ) మీనార్క్ – సుయేషన్ – మోనోపాజ్
బి) మెస్ట్రుయేషన్ – మోనోపాజ్ – మీనార్క్
సి) మోనోపాజ్ – మీనార్క్ – మెస్ట్రుయేషన్
డి) మెనోపాజ్ – మెనుస్టుయేషన్ – మీనార్క్
జవాబు:
ఎ) మీనార్క్ – సుయేషన్ – మోనోపాజ్

ప్రశ్న 20.
మన దేశంలో చట్టపరంగా స్త్రీ పురుషుల వివాహ వయస్సు
ఎ) 21 – 25 సం
బి) 18 – 21 సం||
సి) 16 – 18 సం||
డి) 25 – 28 సం||
జవాబు:
బి) 18 – 21 సం||

ప్రశ్న 21.
అంతస్రావికా గ్రంథులు స్రవించేది )
ఎ) ఎంజైములు
బి) హార్మోనులు
సి) స్రావాలు
డి) స్వేదం
జవాబు:
బి) హార్మోనులు

ప్రశ్న 22.
పురుషులలో స్రవించబడే హార్మోన్
ఎ) టెస్టోస్టిరాన్
బి) రుస్ట్రోజెన్
సి) ప్రొజెస్టిరాన్
డి) ఎడ్రినలిన్
జవాబు:
ఎ) టెస్టోస్టిరాన్

ప్రశ్న 23.
ఉద్వేగాలను నియంత్రించే హార్మోన్
ఎ) టెస్టోస్టిరాన్
బి) ఈస్ట్రోజెన్
సి) ప్రొజెస్టిరాన్
డి) ఎడ్రినలిన్
జవాబు:
డి) ఎడ్రినలిన్

ప్రశ్న 24.
ఎగ్రంధి హార్మోను మిగతా గ్రంథులను నియంత్రిస్తుంది?
ఎ) పీనియల్ గ్రంథి
బి) పీయూష గ్రంథి
సి) అధివృక్క గ్రంధి
డి) థైరాయిడ్ గ్రంథి
జవాబు:
బి) పీయూష గ్రంథి

AP 8th Class Biology Important Questions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 25.
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం జనాభాలో 15 సం|| కన్నా తక్కువ వయస్సు గలవారి జనాభా.
ఎ) 65%
బి) 6850
సి) 72
డి) 75%
జవాబు:
బి) 6850

ప్రశ్న 26.
స్టాన్లీహాల్ ఏ దశను ఒడిదుడుకులతో కూడిన దశ అన్నాడు?
ఎ) శైశవదశ
బి) కౌమారదశ
సి) యవ్వనదశ
డి) వృద్ధాప్యదశ
జవాబు:
బి) కౌమారదశ

ప్రశ్న 27.
మొటిమలను ఏర్పరచేవి
ఎ) స్వేద గ్రంథులు
బి) సెబేషియస్ గ్రంథులు
సి) ఎ మరియు బి
డి) లాలాజల గ్రంథులు
జవాబు:
సి) ఎ మరియు బి

ప్రశ్న 28.
స్త్రీ లైంగిక హార్మోన్
ఎ) టెస్టోస్టిరాన్
బి) ఎడ్రినలిన్
సి) ఈస్ట్రోజెన్
డి) ల్యూటినైజింగ్ హార్మోన్
జవాబు:
సి) ఈస్ట్రోజెన్

ప్రశ్న 29.
ఈ గ్రంథి యొక్క స్రావాలు భావోద్వేగాలను నియంత్రిస్తాయి.
A) క్లోమము
B) ముష్కాలు
C) వీబీజకోశము
D) అధివృక్క గ్రంధి
జవాబు:
D) అధివృక్క గ్రంధి

ప్రశ్న 30.
కౌమార దశ గురించి ఈ కింది వాటిలో నిజమైన వాక్యాన్ని గుర్తించండి.
A) మగ పిల్లల్లో ఆడమ్స్ ఆపిల్ స్పష్టంగా కనిపిస్తుంది.
B) మగ పిల్లల కంటే ఆడపిల్లల్లో భుజాలు వెడల్పుగా పెరుగుతాయి.
C) ఆడ పిల్లల్లో పోలిస్తే, మగ పిల్లల్లో స్వరంలో ఎలాంటి మార్పు ఉండదు.
D) కండరాల పెరుగుదల మగపిల్లల్లో కంటే ఆడపిల్లల్లో స్పష్టంగా వుంటుంది.
జవాబు:
A) మగ పిల్లల్లో ఆడమ్స్ ఆపిల్ స్పష్టంగా కనిపిస్తుంది.

ప్రశ్న 31.
కౌమార దశలో వచ్చే మార్పు కానిది.
A) మీసాలు రావడం
B) గొంతులో మార్పు రావడం
C) వెంట్రుకలు తెల్లబడడం
D) మొటిమలు కనపడటం
జవాబు:
C) వెంట్రుకలు తెల్లబడడం

ప్రశ్న 32.
స్వరపేటికలోని మృదులాస్థుల సంఖ్య
A) 3
B) 6
C) 9
D) 12
జవాబు:
C) 9

AP 8th Class Biology Important Questions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 33.
ఋతుచక్రం ఆగిపోయే వయస్సు
A) 35-45 సం||
B) 30-40 సం||
C) 40-45 సం||
D) 45-50 సం||
జవాబు:
D) 45-50 సం||

ప్రశ్న 34.
బాలుర కౌమార దశకు చేరుకొన్నారని చెప్పే లక్షణాలు
A) ముఖంపై మొటిమలు రావడం
B) మీసాలు, గడ్డాలు రావడం
C) ఆడమ్స్ ఆపిల్ ఏర్పడటం
D) ఇవన్నియు
జవాబు:
D) ఇవన్నియు

ప్రశ్న 35.
స్టాన్లీ హాల్ చెప్పినదేమిటంటే
A) కౌమారదశ ఒత్తిడి మరియు అలసటకు గురిఅయ్యే
B) కౌమారదశ అనేది ఆనందంగా గడిపేది
C) కౌమారదశ ఒత్తిడిలేని దశ,
D) కౌమారదశ విశ్రాంతితో కూడినది
జవాబు:
A) కౌమారదశ ఒత్తిడి మరియు అలసటకు గురిఅయ్యే

ప్రశ్న 36.
తప్పుగా ఉన్న వాక్యాలను గుర్తించండి.
P. పురుషుల్లో మాత్రమే ద్వితీయ లైంగిక లక్షణాలు కనిపిస్తాయి.
Q. ద్వితీయ లైంగిక లక్షణాలను హార్మోన్లు ప్రభావితం చేస్తాయి.
R. వినాళగ్రంథుల నుండి వచ్చే స్రావాన్ని మందులు అంటారు.
S. కౌమారదశ అనేది సమతుల్యంకాని భావోద్వేగాలతో కూడినది.
A) P మరియు Q
B) R మరియు S
C) P మరియు R
D) Q మరియు S
జవాబు:
C) P మరియు R

ప్రశ్న 37.
కౌమారదశలో ఉన్న ఒక బాధ్యత గల విద్యార్థిగా మీరు కల్గిఉండాల్సింది
A) మంచి అలవాట్లు
B) సరైన జీవననైపుణ్యాలు
C) మానవత్వాన్ని కల్గి ఉండడం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

AP 8th Class Biology Important Questions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 38.
కౌమారదశలో చెమట, మొటిమలకు సంబంధించి సరైన వాక్యం కానిది
A) ఇవి కౌమారదశలో కనపడతాయి.
B) చెమట గ్రంథులు, తైలగ్రంథులు చురుకుగా ఉంటాయి.
C) మొటిమలు కురుపులుగా మారే ప్రమాదం ఉంది.
D) మొటిమలు సాధారణ చర్మవ్యాధి.
జవాబు:
D) మొటిమలు సాధారణ చర్మవ్యాధి.

ప్రశ్న 39.
రాజు యొక్క కంఠస్వరంలో మార్పు కనబడినది అంటే అతను కింది దశలో ఉన్నాడు. ఈ
A) కౌమారదశ
B) పూర్వబాల్యదశ
C) వయోజన దశ
D) శిశుదశ
జవాబు:
A) కౌమారదశ

AP 8th Class Biology Important Questions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

These AP 8th Class Biology Important Questions 4th Lesson జంతువులలో ప్రత్యుత్పత్తి will help students prepare well for the exams.

AP Board 8th Class Biology 4th Lesson Important Questions and Answers జంతువులలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 1.
కొందరు పిల్లలలో వారి తల్లిదండ్రులు లక్షణాలు రెండూ కనిపిస్తాయి – అని అనిల్ కిషోర్ తో అన్నాడు. అనిల్ మాట నిజమేనా ?
జవాబు:
అవును నిజమే. దానికి శాస్త్రీయంగా అవకాశం ఉంది.
1) తల్లి గర్భం దాల్చాలంటే తల్లి నుండి అండం – (దాని కేంద్రకంలో సగం లక్షణాలు) తండ్రి నుండి శుక్రకణం (దీని కేంద్రకంలో సగం లక్షణాలు) ఫలదీకరణ చెంది ‘సంయుక్త బీజాన్ని’ ఏర్పరుస్తాయి.
శుక్రకణం (x) + అండం (x) → సంయుక్త బీజం (2x)
50% + 50% → 100% క్రోమోజోములు
ఏకస్థితిక + ఏకస్థితిక → (ద్వయ స్థితిక)
2) అంటే సగం తండ్రి క్రోమోజోములు, సగం తల్లి క్రోమోజోములు ఉన్నాయన్న మాట.
3) ఇవి కలసి, కలగలసి, సంయుక్త బీజంలో కేంద్రకం ఏర్పడుతుందని తెలుసుకున్నారు.
4) కాబట్టి కొన్ని తల్లి వైపు నుండి గానీ, తల్లి లక్షణాలు గానీ, కొన్ని తండ్రి వైపు నుండి గానీ, తండ్రి లక్షణాలు పోలికలు గానీ పిల్లలలో వస్తాయని అనిల్, కిషోర్లు వారి మిత్రుల పోలికలు చూసి తెలుసుకున్నారు.

ప్రశ్న 2.
క్రింద ఇవ్వబడిన పుష్పంలోని పురుష స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలలో ఉన్న భాగాలను గుర్తించుము.
AP 8th Class Biology Important Questions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 1
జవాబు:

పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగాలుస్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగాలు
1) 3వ వలయం1) 4వ వలయం
2) కేసరావళి2) అండాశయం
3) కేసరములు3) కీలము, కీలాగ్రం, అండాశయం
4) పుప్పొడి రేణువులు4) అండాలు

AP 8th Class Biology Important Questions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 3.
మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను వర్ణించండి.
జవాబు:

  • మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉదరం దిగువ భాగంలో అమరి ఉంటుంది.
  • పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత ముష్కాలు, ఒక జత శుక్రవాహికలు, ఒక పురుషాంగం ఉంటాయి.
  • ముష్కాలు అండాకారంలో ఉంటాయి. ఇవి మిలియన్ల కొద్దీ శుక్రకణాలను ముష్కాలు ఉత్పత్తి చేస్తాయి.
  • ప్రతి ముష్కం నుండి ఒక శుక్రవాహిక బయలుదేరుతుంది.
  • శుక్రకణాలు శుక్రవాహికల గుండా ప్రయాణించి పురుషాంగం ద్వారా బయటకు విడుదలవుతాయి.

AP 8th Class Biology Important Questions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 2

ప్రశ్న 4.
మానవ శుక్రకణాన్ని వర్ణించండి.
జవాబు:
AP 8th Class Biology Important Questions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 3

  • శుక్రకణాలు అతి సూక్ష్మ మైనవి.
  • శుక్రకణం తల, మధ్య భాగము, పొడవైన తోకను కలిగి ఉంటుంది.
  • తల భాగంలో కేంద్రకం ఉంటుంది.
  • మధ్య భాగంలో అనేక మైటోకాండ్రియాలు ఉంటాయి. ఇవి శుక్ర కణాలు చలించడానికి కావలసిన శక్తిని ఉత్పత్తి చేస్తాయి.
  • శుక్ర కణాలలో తోక చలనానికి తోడ్పడుతుంది.

ప్రశ్న 5.
మానవ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థను వర్ణించండి.
జవాబు:
AP 8th Class Biology Important Questions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 4

  • స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉదరం లోపల, నాభికి కొంచెం దిగువగా అమరి ఉంటుంది.
  • ఈ వ్యవస్థలో ఒక జత స్త్రీ బీజకోశాలు (Ovaries), ఒక జత ఫాలోపియన్ నాళాలు (fallopian tubes), ఒక గర్భాశయం (uterus), బాహ్య జననాంగం ఉంటాయి.
  • స్త్రీ బీజకోశాలు ఉదరం లోపల, కటి భాగంలో గర్భాశయానికి ఇరువైపులా అమరి ఉంటాయి.
  • ప్రతీ స్త్రీ బీజకోశం నుండి ఒక ఫాలోపియన్ నాళం బయలుదేరుతుంది.

AP 8th Class Biology Important Questions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 6.
మానవ అండాన్ని వర్ణించండి.
జవాబు:
AP 8th Class Biology Important Questions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 5

  • స్త్రీ బీజకోశాలు స్త్రీ బీజ కణాలను అంటే అండాలను ఉత్పత్తి చేస్తాయి.
  • సాధారణంగా మానవులలో స్త్రీ బీజకోశం నుండి ప్రతినెలా ఒక పరిపక్వమైన అండం విడుదలవుతుంది.
  • శుక్రకణం మాదిరిగా అండం కూడా ఏక స్థితిక దశలో (haploid) ఉంటుంది.
  • అండం ఒక పొరతో కప్పబడి ఉంటుంది.
  • అండం లోపల కణద్రవ్యంలో ఒక గుండ్రని కేంద్రకం తేలియాడుతూ ఉంటుంది.

ప్రశ్న 7.
పిండము అనగానేమి ? ఇది ఎక్కడ ఉంటుంది ?
జవాబు:

  • ఫలదీకరణలో సంయుక్తబీజం ఏర్పడుతుంది.
  • ఇది అనేక సార్లు విభజన చెంది అనేక కణాలను ఏర్పరుచుకుంటుంది.
  • ఆ కణాలన్నీ కలిసి బంతి ఆకారాన్ని పోలి ఉంటాయి.
  • ఈ కణాలే తరువాత వివిధ కణజాలాలు, అవయవాలుగా అభివృద్ధి చెందుతాయి.
  • ఈ విధంగా అభివృద్ధి చెందిన నిర్మాణాన్నే ‘పిండం’ (Embryo) అంటాం.
  • పిండం గర్భాశయ కుడ్యానికి అంటి పెట్టుకొని ఉంటుంది.
  • పిండం యొక్క తదుపరి అభివృద్ధి గర్భాశయంలో జరుగుతుంది.

ప్రశ్న 8.
IVF అనగానేమి ? ఎటువంటి వారికి ఇది అవసరమవుతుంది ?
జవాబు:

  • కొంతమంది స్త్రీలలో ఫాలోపియన్ నాళాలు మూసుకుపోయి ఉంటాయి.
  • ఫలదీకరణ జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది.
  • అలాగే కొందరు పురుషులలో శుక్రకణాల ఉత్పత్తి, వాటి సంఖ్యలో లోపాలుంటాయి.
  • కాబట్టి ఇటువంటి వ్యక్తులకు పిల్లలు పుట్టడం అరుదు.
  • ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్లు సదరు వ్యక్తుల నుండి లేదా దాతల నుండి అండం సంగ్రహించి పరీక్షనాళికలో ఫలదీకరణం చెందిస్తారు. దీనినే IVF అంటాం.
  • ఫలదీకరణ చెందిన సంయుక్త బీజాన్ని ఒక వారం రోజుల వరకు ప్రయోగశాలలో అభివృద్ధి చేసి తరువాత దానిని తల్లి గర్భాశయంలో ప్రవేశపెడతారు.

AP 8th Class Biology Important Questions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 9.
పవన్ పావురం పిల్లను వెంటిలేటర్ లో తిరిగి ఉంచటాన్ని ఎలా అభినందిస్తావు ? నీవు పవన్ స్థానంలో ఉంటే ఎలా ఆలోచిస్తావు ?
జవాబు:

  • పవన్ పావురం పిల్లను తిరిగి వెంటిలేటర్ లో ఉంచటాన్ని మనం తప్పక అభినందించాలి.
  • కారణం అతని భూతదయ మరియు జంతువుల, పక్షుల పట్ల ప్రేమ.
  • అవి చిన్న పక్షులు. ఎగరలేనివి. కొంతమంది కొంటె పిల్లలు దాని నిస్సహాయతను ఆసరా చేసుకుని దాంతో ఆటలాడతారు. అందువల్ల అది చనిపోయినాపోవచ్చు.
  • కానీ మన పవన్ పావురం పిల్లను చూసి, దాని లక్షణాలు గమనించి మరలా దాన్ని యథాస్థానంలో ఉంచి అభినందనీయుడయ్యాడు.
  • నేను పవన్ స్థానంలో ఉన్నా ఇలానే చేసేవాడిని.
  • ప్రకృతిపట్ల ప్రేమ, మన సహచర జంతు, పక్షి, వృక్షాలపట్ల భూతదయ కలిగి ఉండాలని మా సైన్స్ మాస్టారు చెప్పే మాటలను నేను తప్పక ఆచరిస్తాను.

ప్రశ్న 10.
కింది ఆధారాల సహాయంతో పదకేళిని పూర్తి చేయండి.
అడ్డం :
1. మానవునిలో జరిగే ఫలదీకరణం (9)
2. పిండం పెరుగుదల జరిగే చోటు (5)
3. అభివృద్ధి చెందిన సంయుక్త బీజం (3)
నిలువు :
1. అండం విడుదలయ్యే ప్రదేశం (5)
4. హైడ్రాలో ఉబ్బెత్తు భాగం (4)
5. అభివృద్ధి చెందిన పిండం (2)
AP 8th Class Biology Important Questions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 6
జవాబు:
AP 8th Class Biology Important Questions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 7

ప్రశ్న 11.
అండోత్పాదక, శిశూత్పాదక జీవులు అంటే ఏమిటి ? వాటి లక్షణాలను తెలపండి. ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
1) గుడ్లు పెట్టి పిల్లతరాన్ని అభివృద్ధి చేసే జీవులను అండోత్పాదకాలు అంటారు. వీనిలో అంతర ఫలదీకరణ జరుగును. ఉదా : పక్షులు, సరీసృపాలు.
2) పిల్లల్ని కని పెంచి తరువాత తరాన్ని అభివృద్ధి చేసే జీవులను శిశోత్పాదక జీవులు అంటారు. ఉదా : క్షీరదాలు, గబ్బిలం.

a) అండోత్పాదక జీవిలో i) చెవులు బయటకు కనిపించవు. ii) చర్మం పై రోమాలు ఉండవు. ఇలాంటి బాహ్య లక్షణాలు ఉన్న జీవులు గుడ్లు పెడతాయి. ఉదా : పక్షులు, మొసలి,తాబేలు, పాము.
b) శిశోత్పాదక జీవిలో 1) చెవులు బయటకు కనిపిస్తాయి. ii) చర్మంపై రోమాలు ఉంటాయి. ఇలాంటి బాహ్య లక్షణాలు ఉన్న జీవులు పిల్లల్ని కని పెంచుతాయి. ఉదా : క్షీరదాలు.

AP 8th Class Biology Important Questions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 12.
క్షితిజ చేపలాంటి లార్వాను చూసి చేప అనుకొని తెచ్చి అక్వేరియంలో ఉంచింది. కొద్దిరోజుల తర్వాత ఆమె ఏం చూసి ఉంటుంది?
జవాబు:

  • క్షితిజ తెచ్చిన లార్వా డిపోల్. ఇది కప్ప లార్వా.
  • టాడ్ పోల్ కొన్ని రోజుల తర్వాత రూపవిక్రియ చెంది కప్పగా మారుతుంది.
  • కాబట్టి క్షితిజ చేపలాంటి టాడ్ పోల్ స్థానంలో కప్పను చూసి ఉంటుంది.

ప్రశ్న 13.
టెస్ట్ ట్యూబ్ బేబీల గురించి నీకు వచ్చిన సందేహాలను తీర్చుకొనేందుకు డాక్టరును ఏమి ప్రశ్నలు అడుగుతావు ?
జవాబు:

  • టెస్ట్ ట్యూబ్ బేబీలు ఎక్కడ జన్మిస్తారు ?
  • టెస్ట్ ట్యూబ్ బేబీలకు సాధారణ శిశువులకు ఏ విధమైన తేడాలు ఉంటాయి ?
  • ప్రజలలో టెస్ట్ ట్యూబ్ బేబీలకు ఉన్న ప్రధానమైన అపోహలు ఏమిటి ?
  • టెస్ట్ ట్యూబ్ బేబీలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి ?

ప్రశ్న 14.
మానవ శుక్రకణం బొమ్మను గీసి భాగాలు గుర్తించండి. కింది పట్టిక నింపండి.

వ.సం.అవయవంవిధి
1.తోక
2.మైటోకాండ్రియా
3.తల
4.మధ్యభాగం

జవాబు:
AP 8th Class Biology Important Questions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 8

వ.సం.అవయవంవిధి
1.తోకశుక్రకణ చలనాలకు సహకరిస్తుంది.
2.మైటోకాండ్రియాశక్తి విడుదల చేసి శుక్రకణ కదలికలకు మరియు అండంలోకి చొచ్చుకు పోవడానికి అవసరమయ్యే శక్తిని అందిస్తుంది.
3.తలఫలదీకరణంలో సహాయపడును.
4.మధ్యభాగంఅనేక మైటోకాండ్రియాలకు స్థానం కల్పిస్తుంది.

ప్రశ్న 15.
లత మానవునిలో జరిగే ప్రత్యుత్పత్తి విధానమును తెలిపే స్లో చార్టును కింది విధంగా గీచింది. ఇది సరిఅయినదేనా ? కాకపోతే సరి చేసి రాయండి.
AP 8th Class Biology Important Questions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 9
జవాబు:
AP 8th Class Biology Important Questions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 10

AP 8th Class Biology Important Questions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 16.
అమీబాలో జరిగే ప్రత్యుత్పత్తి విధానం, కప్పలో జరిగే ప్రత్యుత్పత్తి విధానాల మధ్య భేదాలను రాయండి.
జవాబు:

అమీబాలో జరిగే ప్రత్యుత్పత్తికప్పలో జరిగే ప్రత్యుత్పతి
1. ఇది అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుతుంది.1. ఇది లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుతుంది.
2. సంయోగబీజాల కలయిక ఉండదు.2. సంయోగ బీజాల కలయిక ఉంటుంది.
3. ద్విధావిచ్చిత్తి లేదా బహుధా విచ్చితి జరిపి పిల్ల అమీబాలు ఏర్పడుతాయి.3. బాహ్య ఫలదీకరణ ప్రక్రియలో అనేక జీవులు జన్మిస్తాయి.
4. ఏర్పడిన పిల్ల అమీబాలు పూర్తిగా తల్లిని పోలి ఉంటాయి.4. ఏర్పడిన జీవులు రూపంలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి.
5. ప్రత్యుత్పత్తి తరువాత తల్లి జీవి అంతరించి పోతుంది.5. ప్రత్యుత్పత్తి అనంతరం తల్లి జీవి అంతరించదు.

ప్రశ్న 17.
కప్ప జీవితచరిత్రను పరిశీలించేందుకు చేసిన ప్రాజెక్టులో నీవు ఏయే పరికరాలను ఉపయోగించావు ?
జవాబు:
వెడల్పు మూతి గల తొట్టి లేక గాజు సీసా, పారదర్శక గ్లాస్, డ్రాపర్, పెట్రేడిష్, గులకరాళ్ళు, భూతద్దం, బీకరు.

ప్రశ్న 18.
కింది పేరా చదివి ఖాళీలను వివరించండి.
పురుషులలో వుండే ప్రధాన ప్రత్యుత్పత్తి అవయవాలు A మరియు స్త్రీలలో వుండే ప్రధాన ప్రత్యుత్పత్తి అవయవాలు B. A మరియు B లు C, D అనే బీజకణాలను విడుదల చేస్తాయి. C, D ల కలయికను E అంటారు. E ఫలితంగా F ఏర్పడుతుంది. F క్రమేపి పెరిగి G గా ఏర్పడి చివరకు H గా మారుతుంది.
AP 8th Class Biology Important Questions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 11

ప్రశ్న 19.
కింది పటాన్ని పరిశీలించండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
AP 8th Class Biology Important Questions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 12
1. ఈ పటం ఏ వ్యవస్థకు చెందినది.
జవాబు:
మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ

2. ఇందులో A, B, C భాగాలను గుర్తించండి.
జవాబు:
A – శుక్రవాహికలు
B – ముష్కాలు
C – పురుషాంగం

3. B భాగము నుండి ఏమి ఉత్పత్తి అవుతాయి ?
జవాబు:
శుక్రకణాలు

4. భాగము A యొక్క పని ఏమిటి ?
జవాబు:
శుక్రవాహికల గుండా శుక్రకణాలు ప్రయాణించి పురుషాంగం ద్వారా బయటకు విడుదల అవుతాయి.

AP 8th Class Biology Important Questions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 20.
కింది చిత్రాన్ని పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 8th Class Biology Important Questions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 13
1. ఇది ఏ వ్యవస్థకు చెందినది ?
జవాబు:
ఇది మానవ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ

2. A భాగం పేరేమి ఇక్కడ ఏమి ఉత్పత్తి అవుతాయి ?
జవాబు:
స్త్రీ బీజకోశం

3. B భాగం పేరేమి ?
జవాబు:
గర్భాశయం

4. ఫాలోపియన్ నాళాలు మూసుకొనిపోతే ఏమౌతుంది ?
జవాబు:
ఫలదీకరణం జరుగదు.

1 మార్కు ప్రశ్నలు

ప్రశ్న 1.
అన్ని జంతువులు గుడ్లు పెడతాయా ?
జవాబు:
లేదు. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు మాత్రమే గుడ్లు పెడతాయి. క్షీరదాలు గుడ్లు పెట్టవు. పిల్లల్ని కంటాయి.

ప్రశ్న 2.
ఏ ఏ జంతువులు పిల్లల్ని కంటాయి ?
జవాబు:
క్షీరదాలు అన్ని పిల్లల్ని కంటాయి. ఉదా : ఆవు, గేదె, గుర్రం, ఎలుక, పిల్లి, ఏనుగు, మనిషి.

ప్రశ్న 3.
ఏ ఏ జంతువులు గ్రుడ్లు పెడతాయో, ఏవి పిల్లల్ని కంటాయో తెలుసుకోవటం ఎలా ?
జవాబు:
పిల్లల్ని కనే జంతువులలో కొన్ని బాహ్య లక్షణాలు విభిన్నంగా ఉంటాయి. వీటి ఆధారంగా పిల్లల్ని కనే జంతువులను గుడ్లు పెట్టే వాటి నుండి వేరుగా తెలుసుకోవచ్చు.

AP 8th Class Biology Important Questions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 4.
పిల్లల్ని కనే జంతువుల బాహ్య లక్షణాలు తెలుసుకోవడానికి పద్ధతులేమైనా ఉన్నాయా ?
జవాబు:
పిల్లల్ని కనే జంతువులు బాహ్య చెవులను, చర్మం మీద రోమాలను కలిగి ఉంటాయి. వీటి ఆధారంగా పిల్లల్ని కనే జంతువులను గుర్తించవచ్చు.

ప్రశ్న 5.
శుక్రకణం అండంతో ఫలదీకరణ చెందకపోతే ఏమవుతుందో చెప్పగలరా ?
జవాబు:
శుక్రకణం అండంతో ఫలదీకరణ చెందకపోతే లైంగిక ప్రత్యుత్పత్తి జరగదు. వైవిధ్యం గల జీవులు ఏర్పడవు. క్రొత్త జాతులు అవతరించవు.

ప్రశ్న 6.
కొన్ని జంతువులు మాత్రమే పిల్లలకు ఎందుకు జన్మనిస్తాయో చెప్పగలరా ?
జవాబు:
పిల్లల్ని కనే స్త్రీ జంతువుల్లో గర్భాశయము, పిండాభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది. అందువలన పిండాలు గర్భాశయంలో ఎదిగి పిల్ల జీవులుగా పుడతాయి. గుడ్లు పెట్టే జంతువులలో ఈ అమరిక ఉండదు.

ప్రశ్న 7.
జంతువులన్నీ పిల్లలకు జన్మనివ్వడం ఆపివేస్తే ఏం జరుగుతుంది ?
జవాబు:
జంతువులన్నీ పిల్లలకు జన్మనివ్వడం ఆపివేస్తే, తదుపరి తరం జీవులు ఉత్పత్తి కావు. ఉన్న జీవులు కొంత కాలానికి మరణిస్తాయి. కావున భూమి మీద జీవరాశి అంతరించిపోతుంది.

ప్రశ్న 8.
టాడిపోల్ ఏ ఆకారాన్ని పోలి ఉంది ?
జవాబు:
టాడి పోల్ చేప ఆకారాన్ని పోలి ఉంది.

ప్రశ్న 9.
ఏ దశలో టాడ్ పోల్ లో మొప్పలు కనిపిస్తాయి ?
జవాబు:
గుడ్డు నుండి వచ్చిన టాడ్పేల్ బాహ్య మొప్పలు కలిగి ఉంది. మొదటి దశలో టాడ్ పోల్ లార్వా బాహ్య మొప్పలు కలిగి ఉంది.

AP 8th Class Biology Important Questions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

లక్ష్యాత్మక నియోజనము

సరియైన సమాధానమును గుర్తించుము.

ప్రశ్న 1.
పుష్పంలో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ
ఎ) కీలం
బి) కేసరావళి
సి) అండాశయం
డి) ఆకర్షక పత్రాలు
జవాబు:
బి) కేసరావళి

ప్రశ్న 2.
శుక్రకణం + అండం = ………….
ఎ) సంయుక్త బీజము
బి) కోరకం
సి) భ్రూణం
డి) పిల్లకణం
జవాబు:
ఎ) సంయుక్త బీజము

ప్రశ్న 3.
రూపవిక్రియ …………. లో జరుగును.
ఎ) మానవుడు
బి) ఒంటె
సి) కప్ప
డి) పాము
జవాబు:
సి) కప్ప

ప్రశ్న 4.
బాహ్య ఫలదీకరణం …….. లో జరుగును.
ఎ) చేప
బి) ఈగ
సి) పిల్లి
డి) ఎలుక
జవాబు:
ఎ) చేప

ప్రశ్న 5.
అంతర ఫలదీకరణ ……….. లో జరుగును.
ఎ) చేప
బి) కప్ప
సి) వానపాము
డి) మానవుడు
జవాబు:
డి) మానవుడు

AP 8th Class Biology Important Questions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 6.
శుక్రకణం జీవితకాలం …… గం॥
ఎ) 24
బి) 34
సి) 36
డి) 38
జవాబు:
ఎ) 24

ప్రశ్న 7.
గర్భాశయం …….. భాగంలో ఉంటుంది.
ఎ) పొట్ట
బి) పొత్తి కడుపు
సి) ఛాతి
డి) మెడ
జవాబు:
బి) పొత్తి కడుపు

ప్రశ్న 8.
పట్టు పురుగు ………. ఆకులను మాత్రమే తింటుంది.
ఎ) మందార
బి) మునగ
సి) మల్బరీ
డి) మామిడి
జవాబు:
సి) మల్బరీ

ప్రశ్న 9.
మానవునిలో గర్భావధి కాలం …… రోజులు.
ఎ) 270-280
బి) 280-290
సి) 290-300
డి) 300-310
జవాబు:
ఎ) 270-280

ప్రశ్న 10.
…….. కాలంలో కప్పలు ఫలదీకరణంలో పాల్గొంటాయి.
ఎ) ఎండాకాలం
బి) వర్షాకాలం
సి) శీతాకాలం
డి) వసంతకాలం
జవాబు:
బి) వర్షాకాలం

AP 8th Class Biology Important Questions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 11.
ఒక జంతువు గ్రుడ్డు పెడుతుందా, లేదా పిల్లల్ని కంటుందా అని దీనిని చూసి చెప్పవచ్చు.
ఎ) చెవి
బి) రోమాలు
సి) ఎ మరియు బి
డి) చెప్పలేము
జవాబు:
సి) ఎ మరియు బి

ప్రశ్న 12.
పిల్లల్ని కనే జంతువుల్ని ఏమంటారు ?
ఎ) అండోత్పాదకాలు
బి) శిశోత్పాదకాలు
సి) పిండోత్పాదకాలు
డి) పైవేవీ కావు
జవాబు:
బి) శిశోత్పాదకాలు

ప్రశ్న 13.
సంయోగబీజాలు ఏర్పడకుండా కొత్తతరాన్ని ఏర్పరిచే పద్దతి
ఎ) అలైంగిక ప్రత్యుత్పత్తి
బి) లైంగిక ప్రత్యుత్పత్తి
సి) భిన్నోత్పత్తి
డి) పిండోత్పత్తి
జవాబు:
ఎ) అలైంగిక ప్రత్యుత్పత్తి

ప్రశ్న 14.
అలైంగిక ప్రత్యుత్పత్తి జరపని జీవి
ఎ) అమీబా
బి) పేరమీషియం
సి) హైడ్రా
డి) వానపాము
జవాబు:
డి) వానపాము

ప్రశ్న 15.
హైడ్రాలో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి
ఎ) ద్విధావిచ్ఛిత్తి
బి) కోరకీభవనం
సి) బహుధా విచ్ఛిత్తి
డి) సిద్ధబీజాలు
జవాబు:
బి) కోరకీభవనం

AP 8th Class Biology Important Questions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 16.
అమీబాలో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి
ఎ) ద్విధావిచ్ఛిత్తి
బి) కోరకీభవనం
సి) బహుధావిచ్ఛిత్తి
డి) సిద్ధబీజాలు
జవాబు:
ఎ) ద్విధావిచ్ఛిత్తి

ప్రశ్న 17.
ద్విదావిచ్ఛిత్తిలో ఒక అమీబా నుండి ఎన్ని పిల్ల అమీబాలేర్పడతాయి ?
ఎ) 1
బి) 2
సి) 3
డి) 4
జవాబు:
బి) 2

ప్రశ్న 18.
స్త్రీ, పురుష సంయోగబీజాల కలయిక ద్వారా ఏర్పడేది
ఎ) అండం
బి) పిండం
సి) సంయుక్తబీజం
డి) సిద్ధబీజం
జవాబు:
సి) సంయుక్తబీజం

ప్రశ్న 19.
శుక్రకణం చలించటానికి కావలసిన శక్తి యిక్కడ ఉత్పత్తి అవుతుంది.
ఎ) తల
బి) మధ్యభాగం
సి) తోక
డి) శుక్రకణం మొత్తం
జవాబు:
బి) మధ్యభాగం

ప్రశ్న 20.
శుక్రకణంలో మైటోకాండ్రియాలు ఉండే ప్రదేశం
ఎ) తల
బి) మధ్యభాగం
సి) తోక
డి) ఎ మరియు బి
జవాబు:
బి) మధ్యభాగం

AP 8th Class Biology Important Questions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 21.
ముష్కాలుండునది
ఎ) పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ
బి) స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ
సి) స్త్రీ పిండాభివృద్ధి వ్యవస్థ
డి) గర్భాశయం
జవాబు:
ఎ) పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ

ప్రశ్న 22.
ఒక స్త్రీ బీజకోశం నుండి అండం విడుదలయ్యేది
ఎ) నెలకు ఒకటి
బి) నెలకు రెండు
సి) రెండు నెలలకి ఒకటి
డి) రెండు నెలలకు రెండు
జవాబు:
సి) రెండు నెలలకి ఒకటి

ప్రశ్న 23.
ఈ క్రింది వానిలో ద్వయ స్థితికంలో ఉండునది
ఎ) శుక్రకణం
బి) అండం
సి) సంయుక్తబీజం
డి) అంకురచ్ఛదం
జవాబు:
సి) సంయుక్తబీజం

ప్రశ్న 24.
ఈ క్రింది వానిలో బాహ్యఫలదీకరణం జరిగే జీవి
ఎ) కప్ప
బి) పాము
సి) బల్లి
డి) కోడి
జవాబు:
ఎ) కప్ప

ప్రశ్న 25.
సంయుక్తబీజం భ్రూణంగా మార్పుచెందే ప్రక్రియ నేమంటారు ?
ఎ) ఫలదీకరణం
బి) గర్భం దాల్చుట
సి) శిశు జననం డ
డి) గర్భావధి కాలం
జవాబు:
బి) గర్భం దాల్చుట

AP 8th Class Biology Important Questions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 26.
పూర్తిగా అభివృద్ధి చెందిన పిండాన్ని ఏమంటారు ?
ఎ) అండం
బి) పిండం
సి) భ్రూణం
డి) శిశువు
జవాబు:
సి) భ్రూణం

ప్రశ్న 27.
టెస్ట్యూబ్ బేబిలో పిండాభివృద్ధి యిక్కడ జరుగుతుంది.
ఎ) పరీక్షనాళిక
బి) తల్లి గర్భాశయం
సి) కృత్రిమ గర్భాశయం
డి) తండ్రిలో ప్రత్యేక సంచి
జవాబు:
బి) తల్లి గర్భాశయం

ప్రశ్న 28.
IVF అనగా
ఎ) ఇ విట్రో ఫెర్టిలైజేషన్
బి) ఇంట్రా వర్టికల్ ఫెర్టిలైజేషన్
సి) ఇన్వర్టికల్ ఫాలోపియస్ట్యూబ్
డి) ఇన్వర్టికల్ ఫెర్టిలైజేషన్
జవాబు:
ఎ) ఇ విట్రో ఫెర్టిలైజేషన్

ప్రశ్న 29.
రూపవిక్రియ చూపని జీవి
ఎ) వానపాము
బి) కప్ప
సి) పట్టుపురుగు
డి) సీతాకోకచిలుక
జవాబు:
ఎ) వానపాము

ప్రశ్న 30.
ఈ క్రింది వానిలో ఉభయ లైంగిక జీవి
ఎ) వానపాము
బి) కప్ప
సి) చేప
డి) బొద్దింక
జవాబు:
ఎ) వానపాము

AP 8th Class Biology Important Questions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 31.
కప్ప లార్వానేమంటారు ?
ఎ) రిగ్లర్
బి) టంబ్లర్
సి) టాడ్పేల్
డి) మాగట్
జవాబు:
సి) టాడ్పేల్

ప్రశ్న 32.
క్లోనింగ్ ప్రక్రియను మొదటిసారిగా నిర్వహించినది
ఎ) జూలీ రాబర్ట్
బి) ఇయాన్ విల్మట్
సి) ఆడమ్
డి) విల్సన్
జవాబు:
బి) ఇయాన్ విల్మట్

ప్రశ్న 33.
క్లోనింగ్ ప్రక్రియను ఈ జీవిపై చేశారు.
ఎ) ఎలుక
బి) కోతి
సి) కుందేలు
డి) గొర్రె
జవాబు:
డి) గొర్రె

ప్రశ్న 34.
క్లోనింగ్ ప్రక్రియలో జన్మించిన గొర్రె పేరు
ఎ) బాలి
బి) డాలి
సి) జూలి
డి) డోలి
జవాబు:
బి) డాలి

ప్రశ్న 35.
జంతువుల క్లోనింగను మొదటిసారిగా విజయవంతంగా జరిపిన శాస్త్రవేత్త
ఎ) బ్యారి మార్గాల్
బి) ఇయాన్ విల్మట్
సి) ఎ.జి.టాన్స్ లే
డి) ఎడ్వర్డ్ జెన్నర్
జవాబు:
బి) ఇయాన్ విల్మట్

AP 8th Class Biology Important Questions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 36.
మనదేశంలో చట్టపరంగా పురుష, స్త్రీ వివాహ వయసు
ఎ) 18, 21
బి) 19, 21
సి) 21, 19
డి) 21, 18
జవాబు:
డి) 21, 18

ప్రశ్న 37.
ఈ క్రింది ప్రత్యుత్పత్తి విధానంలో సంయోగబీజదాలు ఏర్పడవు. ఇందుకు ఉదాహరణ
ఎ) లైంగిక ప్రత్యుత్పత్తి-మానవుడు
బి) అలైంగిక ప్రత్యుత్పత్తి-హైడ్రా
సి) లైంగిక ప్రత్యుత్పత్తి-కప్ప
డి) లైంగిక ప్రత్యుత్పత్తి-కోడి
జవాబు:
బి) అలైంగిక ప్రత్యుత్పత్తి-హైడ్రా

ప్రశ్న 38.
సంయుక్తబీజం పదేపదే విభజనచెంది అభివృద్ధి చెందేది
ఎ) పిల్లలు
బి) పిండము
సి) భ్రూణము
డి) అండము
జవాబు:
బి) పిండము

ప్రశ్న 39.
సరికాని దానిని గుర్తించండి.
ఎ) హైడ్రా – ద్విధావిచ్ఛిత్తి
బి) మానవుడు – అంతర ఫలదీకరణ
సి) చేపలు – బాహ్య ఫలదీకరణ
డి) పక్షులు – అంతర ఫలదీకరణ
జవాబు:
ఎ) హైడ్రా – ద్విధావిచ్ఛిత్తి

ప్రశ్న 40.
సంయుక్త బీజం, భ్రూణముగా ఎదగడానికి పట్టే కాలాన్ని ‘గర్భావధి కాలం’ అంటారు. మానవులలో ఇది
ఎ) 120 – 180 రో॥
బి) 270 – 280 రో॥
సి) 310 – 320 రో॥
డి) 180 – 220 రో॥
జవాబు:
బి) 270 – 280 రో॥

AP 8th Class Biology Important Questions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 41.
కింది వానిలో బాహ్యఫలధీకరణం జరుపుకునే జీవులు
ఎ) చేప, కప్ప
బి) కాకి, కోడి
సి) గేదె, ఆవు
డి) పాము, ఉడుత
జవాబు:
ఎ) చేప, కప్ప

ప్రశ్న 42.
మగ పుష్పంలో లోపించిన భాగం
ఎ) రక్షక పత్రావళి
బి) ఆకర్షణ పత్రావళి
సి) కేసరం
డి) కీలాగ్రం
జవాబు:
డి) కీలాగ్రం

ప్రశ్న 43.
కింది వానిలో అండోత్పాదకాలను గుర్తించండి.
1) గేదె
2) చిలుక
3) చేప
4) ఆవు
5) కప్ప
6) జింక
ఎ) 1, 4, 6
బి) 1, 2, 6
సి) 2, 3, 5
డి) 5, 2, 1
జవాబు:
సి) 2, 3, 5

AP 8th Class Biology Important Questions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 1

These AP 8th Class Biology Important Questions 3rd Lesson సూక్ష్మజీవుల ప్రపంచం 1 will help students prepare well for the exams.

AP Board 8th Class Biology 3rd Lesson Important Questions and Answers సూక్ష్మజీవుల ప్రపంచం 1

1 మార్కు ప్రశ్నలు

ప్రశ్న 1.
కుంట నీటిలో ఏయే రకమైన సూక్ష్మజీవులు వుంటాయి ?
జవాబు:

  • కుంట నీరు అంటే ఎక్కువ కాలం నిల్వ ఉన్న నీరు.
  • అందువల్ల దీనిలో శైవలాలు, బాక్టీరియా, ప్రోటోజోవా వర్గానికి చెందిన ఏకకణజీవులు ఉంటాయి.

ప్రశ్న 2.
అపకారులైన సూక్ష్మజీవులకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
అపకారులైన సూక్ష్మజీవులకు ఉదాహరణ :

  • టైఫాయిడ్, క్షయ, కుష్టు, డయేరియా లాంటి జబ్బులు బాక్టీరియా వలన కలుగుతాయి.
  • మలేరియా, అమీబియాసిస్ లాంటి వ్యాధులు ప్రోటోజోవాల వల్ల కలుగుతాయి.
  • శిలీంధ్రాలు, బాక్టీరియా, మైక్రో ఆర్రోపోడాల వల్ల కొన్ని రకాల చర్మవ్యాధులు కలుగుతాయి.

3. ఉపకారులైన సూక్ష్మజీవులకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
ఉపకారులైన సూక్ష్మజీవులకు ఉదాహరణలు :

  • లాక్టోబాసిల్లస్ అనే బాక్టీరియా పాలను, పెరుగుగా మార్చుతుంది.
  • కిణ్వణప్రక్రియలో ఈస్ట్ ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియను పెద్ద మొత్తంలో ఆల్కహాల్, వైన్, బీరు, ఎసిటిక్ ఆమ్లాల తయారీలో ఉపయోగిస్తారు.
  • శిలీంధ్రాల నుండి సూక్ష్మజీవి నాశకాలు (antibiotics) ను తయారుచేస్తారు.

ప్రశ్న 4.
మానవ కార్యకలాపాల వల్ల సూక్ష్మజీవులకు హాని కలుగుతోంది. ఇది ఇలాగే కొనసాగితే ఏమవుతుంది ?
జవాబు:
మానవ కార్యకలాపాల వల్ల సూక్ష్మజీవులకు హాని కలుగుతుంది. ఈ హాని వలన అపాయకరమైన మరియు ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశిస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశిస్తాయి.

AP 8th Class Biology Important Questions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 1

ప్రశ్న 5.
సూక్ష్మజీవుల సమూహాల గురించి రాయండి.
జవాబు:
సూక్ష్మజీవులను 5 సమూహాలుగా విభజిస్తారు. అవి –

  • బాక్టీరియా
  • శైవలాలు
  • శిలీంధ్రాలు
  • ప్రోటోజోవన్స్ మరియు
  • సూక్ష్మ ఆర్రోపోడ్స్

ప్రశ్న 6.
సూక్ష్మ శైవలాల ప్రాధాన్యత ఏమిటి ?
జవాబు:
సూక్ష్మ శైవలాలు (మైక్రో ఆల్గే) జరిపే కిరణజన్యసంయోగక్రియ భూమి మీద జీవులకు చాలా ముఖ్యం. వాతావరణంలోని ప్రాణవాయువులో సగభాగం ఇవే ఉత్పత్తి చేస్తాయి.

ప్రశ్న 7.
‘పరాన్న జీవులు’ అనగానేమి ?
జవాబు:
కొన్ని సూక్ష్మజీవులు ఇతర జీవుల మీద ఆధారపడి జీవిస్తాయి. ఇలాంటి వాటిని ‘పరాన్న జీవులు’ అంటారు.

లక్ష్యాత్మక నియోజనము

సరియైన సమాధానమును గుర్తించుము.

ప్రశ్న 1.
‘జలుబు’ ………….. వల్ల వస్తుంది.
ఎ) బాక్టీరియా
బి) శైవలాలు
సి) శిలీంధ్రాలు
డి) వైరస్
జవాబు:
డి) వైరస్

ప్రశ్న 2.
చెట్ల కాండంపై తెల్లమచ్చలు …………. వల్ల వస్తాయి.
ఎ) శిలీంధ్రాలు
బి) శైవలాలు
సి) బాక్టీరియా
డి) ప్లాస్మోడియం
జవాబు:
ఎ) శిలీంధ్రాలు

AP 8th Class Biology Important Questions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 1

ప్రశ్న 3.
కుష్టువ్యాధి ………….. వల్ల వస్తుంది.
ఎ) శైవలం
బి) శిలీంధ్రం
సి) బాక్టీరియా
డి) వైరస్
జవాబు:
సి) బాక్టీరియా

ప్రశ్న 4.
అభిరంజనం చేయటానికి …………….. కావాలి.
ఎ) పాలు
బి) ఆహారం
సి) వర్ణదం
డి) రజను
జవాబు:
సి) వర్ణదం

ప్రశ్న 5.
బ్రెడ్ లో కనిపించే శిలీంధ్రం పేరు ………………
ఎ) ఆస్పర్జిల్లస్
బి) రైజోఫస్
సి) పెన్సిలియం
డి) నాస్టాక్
జవాబు:
బి) రైజోఫస్

ప్రశ్న 6.
సూక్ష్మజీవశాస్త్రం ఆవిర్భవించిన సంవత్సరం
ఎ) 1650
బి) 1674
సి) 1678
డి) 1680
జవాబు:
బి) 1674

ప్రశ్న 7.
మైక్రోస్కోప్ ను కనుగొని, సూక్ష్మజీవులను పరిశీలించి, సూక్ష్మజీవశాస్త్రానికి నాంది పలికినవాడు
ఎ) రాబర్ట్ హుక్
బి) లీవెన్‌హాక్
సి) మాల్పీజీ
డి) లూయీపాశ్చర్
జవాబు:
బి) లీవెన్‌హాక్

AP 8th Class Biology Important Questions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 1

ప్రశ్న 8.
ఏనిమల్ క్యూల్స్ అనగా
ఎ) శైవలాలు
బి) శిలీంధ్రాలు
సి) బాక్టీరియా
డి) వైరస్
జవాబు:
సి) బాక్టీరియా

ప్రశ్న 9.
క్రింది వానిలో ప్రొటోజోవన్
ఎ) వర్టిసెల్లా
బి) బ్రెడ్ మోల్డ్
సి) ఆస్పర్జిల్లస్
డి) రైజోపస్
జవాబు:
ఎ) వర్టిసెల్లా

ప్రశ్న 10.
క్రింది వానిలో శిలీంధ్రం
ఎ) అమీబా
బి) పారమీషియం
సి) పెన్సిలియం
డి) వర్టి సెల్లా
జవాబు:
సి) పెన్సిలియం

ప్రశ్న 11.
క్రిందివానిలో శైవలము కానిది
ఎ) క్లామిడోమోనాస్
బి) సైక్లాప్స్
సి) డయాటమ్
డి) సెరాటియం
జవాబు:
బి) సైక్లాప్స్

ప్రశ్న 12.
క్రిందివానిలో ఆర్థోపొడా జీవి
ఎ) స్పైరోగైరా
బి) ఈడోగోనియం
సి) స్పైరులినా
డి) డాప్నియా
జవాబు:
డి) డాప్నియా

AP 8th Class Biology Important Questions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 1

ప్రశ్న 13.
బాక్టీరియాను పరిశీలించడానికి సేకరించవలసినది
ఎ) పెరుగు
బి) మజ్జిగ
సి) నోటిలోని పాచి
డి) పైవన్నీ
జవాబు:
డి) పైవన్నీ

ప్రశ్న 14.
బాక్టీరియాను పరిశీలించడానికి వాడే రంజనం
ఎ) శాఫ్రనిన్
బి) మిథిలీన్ బ్లూ
సి) క్రిస్టల్ వయోలెట్
డి) గ్లిసరిన్
జవాబు:
సి) క్రిస్టల్ వయోలెట్

ప్రశ్న 15.
అతి పెద్ద బాక్టీరియా
ఎ) లాక్టోబాసిల్లస్
బి) థియోమార్గరీటా నమీబియన్సిస్
సి) థియోమార్గరీటా ఆఫ్రికానస్
డి) ఎశ్చరీషియా కోలై
జవాబు:
బి) థియోమార్గరీటా నమీబియన్సిస్

ప్రశ్న 16.
గాలిలోని ఆక్సిజన్లో సగభాగం ఇవి ఉత్పత్తి చేస్తాయి.
ఎ) శైవలాలు
బి) ఆకుపచ్చని మొక్కలు
సి) వృక్షాలు
డి) నాచుమొక్కలు
జవాబు:
ఎ) శైవలాలు

ప్రశ్న 17.
ఒక ఎకరం మృత్తికలో 8 అంగుళాల మందం ఉన్న పై పొరలో ఉండే బాక్టీరియా, శిలీంధ్రాల బరువు
ఎ) 1 కేజీ
బి) పావు టన్ను
సి) అర టన్ను
డి) 1 టన్ను
జవాబు:
సి) అర టన్ను

AP 8th Class Biology Important Questions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 1

ప్రశ్న 18.
వైరలకు అతిధేయ కణాలు
ఎ) బాక్టీరియా
బి) వృక్షకణాలు
సి) జంతుకణాలు
డి) పైవన్నీ
జవాబు:
డి) పైవన్నీ

ప్రశ్న 19.
క్రింది వానిలో వైరస్ వల్ల వచ్చే వ్యాధి
ఎ) కుష్టు
బి) క్షయ
సి) పోలియో
డి) టైఫాయిడ్
జవాబు:
సి) పోలియో

ప్రశ్న 20.
క్రింది వానిలో బాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి
ఎ) జలుబు
బి) స్వైన్ ఫ్లూ
సి) అమ్మవారు
డి) డయేరియా
జవాబు:
డి) డయేరియా

ప్రశ్న 21.
మలేరియా జ్వరానికి కారణం
ఎ) బాక్టీరియా
బి) వైరస్
సి) ప్రొటోజోవన్స్
డి) సూక్ష్మ ఆర్రోపోర్టు
జవాబు:
సి) ప్రొటోజోవన్స్

ప్రశ్న 22.
సజీవులకు, నిర్జీవులకు వారధి
ఎ) వైరస్లు
బి) బాక్టీరియా
సి) ప్రొటోజోవన్స్
డి) బ్లూగ్రీన్ ఆల్గే
జవాబు:
ఎ) వైరస్లు

ప్రశ్న 23.
క్రింది వానిలో సూక్ష్మజీవులకు చెందనిది
ఎ) బాక్టీరియా
బి) శిలీంధ్రాలు
సి) సూక్ష్మ ఆర్రోపోడ్లు
డి) ప్రోటోజోవన్స్
జవాబు:
సి) సూక్ష్మ ఆర్రోపోడ్లు

AP 8th Class Biology Important Questions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 1

ప్రశ్న 24.
సూక్ష్మజీవులను ఎన్ని ప్రధాన సమూహాలుగా విభజించారు?
ఎ) 1
బి) 2
సి) 3
డి) 4
జవాబు:
డి) 4

ప్రశ్న 25.
రొట్టెలో కనిపించే శిలీంధ్రం
ఎ) ఆస్పర్జిల్లస్
బి) రైజోపస్
సి) పెన్సీలియం
డి) అగారికస్
జవాబు:
బి) రైజోపస్

ప్రశ్న 26.
మనచుట్టూ ఉన్న గాలి, నీరు, నేల, అతితక్కువ మరియు ఎక్కువ ఉష్ణోగ్రతలలో కూడా నివసించగల్గేవి
ఎ) బాక్టీరియా
బి) శిలీంధ్రాలు
సి) వైరస్లు
డి) ప్రోటోజోవాలు
జవాబు:
ఎ) బాక్టీరియా

ప్రశ్న 27.
సుజాత కుంట నుండి ఆకుపచ్చని పదార్థాన్ని తీసుకొని సూక్ష్మదర్శిని క్రింద పరిశీలించింది. దాని పేరు ఏమి?
ఎ) శైవలం
బి) శిలీంధ్రం
సి) బాక్టీరియా
డి) ప్రోటోజోవా
జవాబు:
ఎ) శైవలం

ప్రశ్న 28.
బాక్టీరియాను పరిశీలించు ప్రయోగంలో వాడు ద్రావణం
ఎ) క్రిస్టల్ వైలెట్
బి) మిథైలేన్ బ్లూ
సి) జానస్ గ్రీన్
డి) పైవన్నీ
జవాబు:
ఎ) క్రిస్టల్ వైలెట్

AP 8th Class Biology Important Questions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 1

ప్రశ్న 29.
జతపరచండి
AP 8th Class Biology Important Questions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 1 1
ఎ) 1-b, 2-c, 3-d, 4-a
బి) 1-b, 2-d, 3-c, 4-a
సి) 1-c, 2-b, 3-d, 4-a
డి) 1-a, 2-b, 3-c, 4-d
జవాబు:
ఎ) 1-b, 2-c, 3-d, 4-a

AP 8th Class Biology Important Questions Chapter 2 కణం – జీవుల మౌళిక ప్రమాణం

These AP 8th Class Biology Important Questions 2nd Lesson కణం – జీవుల మౌళిక ప్రమాణం will help students prepare well for the exams.

AP Board 8th Class Biology 2nd Lesson Important Questions and Answers కణం – జీవుల మౌళిక ప్రమాణం

ప్రశ్న 1.
సూక్ష్మజీవి ప్రపంచంపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తల పేర్లు మీ పాఠం నుండి సంగ్రహించి రాయండి.
జవాబు:
సూక్ష్మజీవి ప్రపంచం గురించి మానవాళికి ఎన్నో విషయాలు కనిపెట్టి చెప్పిన శాస్త్రవేత్తలలో ముఖ్యులు.

  1. అథినాసియస్ కిర్చర్
  2. జాన్ స్వామ్మర్ డామ్
  3. ఆంథోనివార్ల్యూవెన్‌హాక్
  4. రాబర్ట్ హుక్
  5. రాబర్ట్ బ్రౌన్
  6. పెలిస్ పాంటానా
  7. జకారస్ జాన్సన్

ప్రశ్న 2.
‘రంజనం’ చేసే విధానాన్ని క్లుప్తంగా వివరింపుము.
జవాబు:
1. కణ అంతర్భాగాలకు కొన్ని రసాయన వర్ణదాలు (రంగులు) పీల్చుకునేలా చేసి వాటి నిర్మాణాన్ని అధ్యయనం చేయటానికి ఉపయోగపడే విధానమే ‘రంజనం’ చేయటం.
2. మొదట కణాన్ని స్లెడ్ పై తీసుకోవాలి.
3. కణం, కణాంగాల స్వభావాన్ని బట్టి

  • సాఫనిన్
  • మిథాలిన్ బ్లూ
  • అయొడిన్
  • ఎర్రసిరా మొదలైన వర్లదాలలో ఏదైనా ఒకదాన్ని ఎన్నుకొని స్లెడ్ పై వేయాలి.

4. అది బాగా పీల్చుకున్న తరువాత ఒక చుక్క నీరు వేసి జాగ్రత్తగా ఒక చుక్క గ్లిసరిన్ వేసి కవర్ స్లితో స్లెడ ను కప్పాలి.
5. తరువాత సూక్ష్మదర్శినితో పరిశీలించితే కణాంగాలు చక్కగా రంగులతో కనిపిస్తాయి.

AP 8th Class Biology Important Questions Chapter 2 కణం - జీవుల మౌళిక ప్రమాణం

ప్రశ్న 3.
మీ ప్రయోగశాలను సందర్శించి అందులో వున్న ఏవైనా మూడు సైడ్లను చూచి పరిశీలనలు నమోదు చేయండి.
జవాబు:
మా ప్రయోగశాలలో నాడీకణం నునుపు కండర కణం, ఎర్రరక్త కణంల స్లెలు నేను పరిశీలించి ఈ కింది విషయాలు తెలుసుకున్నాను.
1. నాడీకణం :
AP 8th Class Biology Important Questions Chapter 2 కణం - జీవుల మౌళిక ప్రమాణం 1

  • ఇది అతి పొడవైన కణం.
  • మధ్యలో నల్లని చుక్కలాగ, గుండ్రంగా ఒక భాగం కనిపించింది.
  • దీనిని కేంద్రకంగా గుర్తించాను.
  • జీవపదార్థం కూడా కనిపించింది.
  • ఒక పొడవైన శాఖను ఆక్సాన్‌గా గుర్తించాను.
  • పటం కూడా గీశాను.

2. నునుపు కండర కణం :
AP 8th Class Biology Important Questions Chapter 2 కణం - జీవుల మౌళిక ప్రమాణం 2

  • ఇది దోసగింజ లాగా ఉంది.
  • జీవపదార్థం మధ్యలో కేంద్రకం ఉంది.

3. ఎర్రరక్త కణం :
AP 8th Class Biology Important Questions Chapter 2 కణం - జీవుల మౌళిక ప్రమాణం 3

  • ఇది ద్విపుటాకారంగా ఉంది.
  • గుండ్రంగా ఉంది.
  • అంటే పార్లే పాపిన్స్ బిళ్ళలాగా ఉందన్న మాట.

ప్రశ్న 4.
అమీబా పటం గీసి, భాగాలు గుర్తించుము.
జవాబు:
AP 8th Class Biology Important Questions Chapter 2 కణం - జీవుల మౌళిక ప్రమాణం 4

AP 8th Class Biology Important Questions Chapter 2 కణం - జీవుల మౌళిక ప్రమాణం

ప్రశ్న 5.
గడ్డిచామంతి కాండం అడ్డుకోత పటం గీసి, భాగాలు గుర్తించండి.
జవాబు:
AP 8th Class Biology Important Questions Chapter 2 కణం - జీవుల మౌళిక ప్రమాణం 5

ప్రశ్న 6.
క్లామిడోమోనాస్ కణం పటం గీసి, భాగాలు గుర్తించుము.
జవాబు:
AP 8th Class Biology Important Questions Chapter 2 కణం - జీవుల మౌళిక ప్రమాణం 6

ప్రశ్న 7.
మొక్కలు క్షోభ్యత కలిగి ఉంటాయా ? అని రాహుల్ రవిని ప్రశ్నించాడు. నీవు వాటి పట్ల ఎలా సానుభూతిని ప్రదర్శిస్తావు ?
జవాబు:

  • రాహుల్ ప్రశ్నలో నిజం ఉంది.
  • ‘క్షోభ్యత’ అంటే జీవులు. అవి మొక్కలు గానీ, జంతువులు కానీ, వాటి పరిసరాలలో జరిగే మార్పులకు అనుగుణంగా ప్రతిస్పందిస్తాయి. దీనినే ‘క్షోభ్యత’ అంటారు.
  • అంటే బాధ, సంతోషం, చలి, ఎండ మొదలైన ప్రతిస్పందనలు అన్నమాట.
  • మొక్కకు నీళ్ళు పోయకపోతే ముందు వాడి పోతుంది. తరువాత చనిపోతుంది.
  • జగదీష్ చంద్రబోస్ ప్రెస్మోగ్రాఫ్ ద్వారా మొక్కలలో కూడా ప్రతిస్పందనలు ఉంటాయని నిరూపించాడు.
  • అంటే వాటికి నీళ్ళు పోస్తే సంతోషిస్తాయి. హాయిగా, ఆరోగ్యంగా పెరుగుతాయి.
  • వాటికి నరికేటప్పుడు వాటికైన గాయాలు మొక్కలను బాధ పెడతాయి.
  • అందుకే మన పూర్వీకులు మొక్కలను నరికే వాళ్ళు కాదు.
  • వాటి ఎండు భాగాలు మాత్రమే వంట చెరకుగా వాడేవారు.
  • అందువల్ల మనం కూడా మొక్కల పట్ల సానుభూతితో వుండి వాటిని రక్షిస్తే అవి మనకు ఆహారం, ఆక్సిజన్ ఇచ్చి రక్షిస్తాయి. ‘వృక్షో రక్షతి రక్షితః’

AP 8th Class Biology Important Questions Chapter 2 కణం - జీవుల మౌళిక ప్రమాణం

ప్రశ్న 8.
కణం, దాని కణాంగాల గురించి నీకు తెలిసిన శాస్త్రీయ పదజాలాన్ని ప్రవాహ పటం గీయుము.
జవాబు:
AP 8th Class Biology Important Questions Chapter 2 కణం - జీవుల మౌళిక ప్రమాణం 7

ప్రశ్న 9.
సంయుక్త సూక్ష్మదర్శిని పటం గీచి భాగాలు గీయండి.
జవాబు:
AP 8th Class Biology Important Questions Chapter 2 కణం - జీవుల మౌళిక ప్రమాణం 8

AP 8th Class Biology Important Questions Chapter 2 కణం - జీవుల మౌళిక ప్రమాణం

ప్రశ్న 10.
కణాంగాలు కణంలోని ఏ భాగంలో ఉంటాయి ?
జవాబు:

  • కణంలో జీవపదార్థం ఉంటుంది.
  • దీనిలో చిన్న చిన్న రేణువులు కలసిపోయి ఉంటాయి.
  • మిగిలిన కణాంగాలు అన్నీ ఈ జీవపదార్థంలోనే ఉంటాయి.
    (మైటోకాండ్రియా, గాల్టి సంక్లిష్టం, రిక్తికలు, రైబోసోమ్ లు, రైసోసోమ్ లు, ఆహార రిక్తికలు మొ॥నవి.)
  • ఇది జిగురు జిగురుగా ఉంటుంది.
  • ఈ జీవపదార్థం మధ్యలో గుండ్రంగా కేంద్రకం ఉంటుంది.

ప్రశ్న 11.
ఏకకణ జీవులకు, బహుకణ జీవులకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
ఏకకణ జీవులు : ఒకే ఒక కణంతో నిర్మితమైన జీవులను ఏకకణ జీవులు అంటారు.
ఉదా : అమీబా, క్లామిడోమోనాస్, పేరమీషియం , స్పెరోగైరా వర్సెస్ ఈ. కోలి బాక్టీరియా మొ॥నవి.
బహుకణ జీవులు : ఒకటి కన్నా ఎక్కువ కణాలతో నిర్మితమైన జీవులను బహుకణ జీవులు అంటారు.
ఉదా : హైడ్రా, వాల్ వాక్స్, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, క్షీరదాలు మొ॥నవి.

ప్రశ్న 12.
పొడవు ప్రమాణాలు, వాటి ప్రామాణికాలు తెలపండి.
జవాబు:
1 మీటరు = 100 సెం.మీ.
1 సెం.మీ = 10 మిల్లీమీటరు
1 మి.మీ = 1000 మైక్రాన్లు/ మైక్రోమీటరు
1 మైక్రాన్ = 1000 నానోమీటర్లు

AP 8th Class Biology Important Questions Chapter 2 కణం - జీవుల మౌళిక ప్రమాణం

ప్రశ్న 13.
మొక్కలకు నీరు ఎందుకు అవసరం ?
జవాబు:
1) కణాలలో అన్ని జీవక్రియల నిర్వహణకు
2) కిరణజన్య సంయోగక్రియ ద్వారా పిండి పదార్థాల తయారీకి నీరు అత్యవసరం.

ప్రశ్న 14.
చిత్రంలోని భాగాలను గుర్తించండి.
AP 8th Class Biology Important Questions Chapter 2 కణం - జీవుల మౌళిక ప్రమాణం 11
b) పట్టిక నింపండి.

విషయముసంబంధించిన భాగం
కణం చుట్టూ ఆవరించి ఉంటుంది
దాదాపు కణం మధ్యభాగంలో ఉంటుంది
కణమంతా ఆవరించివుండే ద్రవపదార్థం
కణానికి శక్తినిస్తుంది

జవాబు:

విషయముసంబంధించిన భాగం
కణం చుట్టూ ఆవరించి ఉంటుందికణత్వచం
దాదాపు కణం మధ్యభాగంలో ఉంటుందికణకేంద్రకం
కణమంతా ఆవరించివుండే ద్రవపదార్థంకణ ద్రవ్యం
కణానికి శక్తినిస్తుందిమైటోకాండ్రియా

ప్రశ్న 15.
కింది పేరాను చదివి వృక్షకణానికి, జంతుకణానికి భేదాలు రాయండి.
జీవులన్నీ కణాలతో ఏర్పడతాయి. అన్ని కణాలు ఒకే విధంగా వుండవు. అవి చేసే పనిని బట్టి వాటి నిర్మాణంలోను, ఆకారంలోను మార్పులు ఉంటాయి. వృక్షకణాలకు కణకవచం వుంటే జంతుకణాలకు వుండదు. జంతుకణాలలో రిక్తిక చిన్నదిగా వుంటే వృక్షకణాలలో రిక్తిక పెద్దదిగా వుంటుంది. వృక్షకణాలలో కనిపించినట్లుగా జంతుకణాలలో హరితరేణువులు వుండవు.

వృక్షకణముజంతుకణము
 

 

 

జవాబు:

వృక్షకణముజంతుకణము
1. కణ కవచం ఉంటుంది.1. కణ కవచం ఉండదు.
2. రిక్తిక పెద్దదిగా ఉంటుంది.2. రిక్తికలు చిన్నవిగా ఉంటాయి.
3. హరిత రేణువులు ఉంటాయి.3. హరిత రేణువులు ఉండవు.

ప్రశ్న 16.
కింది పటంను గుర్తించండి. దాని విధి ఏమిటి ?
AP 8th Class Biology Important Questions Chapter 2 కణం - జీవుల మౌళిక ప్రమాణం 12
జవాబు:
పటంలో చూపబడినది నాడీకణం అది మెదడు నుండి శరీర భాగాలకు, శరీర భాగాల నుండి మొదడుకు సమాచారాన్ని చేరవేస్తుంది.

AP 8th Class Biology Important Questions Chapter 2 కణం - జీవుల మౌళిక ప్రమాణం

1 మార్కు ప్రశ్నలు

ప్రశ్న 1.
కణం యొక్క ఆకారం ఏయే అంశాలపై ఆధారపడి ఉంటుంది ?
జవాబు:
కణం యొక్క ఆకారం మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది.

  • కణత్వచం
  • కణకవచం
  • కణం చేసే పని

ఉదా : నాడీకణం పొడవుగా ఉంటుంది. అది నాడులను ఏర్పరచటానికి పొడవుగా ఉండటం అవసరం.

ప్రశ్న 2.
ఏకకణ జీవులకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
ఏకకణ జీవులు : ఒకే ఒక కణంతో నిర్మితమైన జీవులను ఏకకణ జీవులు అంటారు.
ఉదా : అమీబా, క్లామిడోమోనాస్, పేరమీషియం, స్పెరోగైరా వర్సెస్ ఈ. కోలి బాక్టీరియా మొ॥నవి.

ప్రశ్న 3.
బహుకణ జీవులకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
బహుకణ జీవులు : ఒకటి కన్నా ఎక్కువ కణాలతో నిర్మితమైన జీవులను బహుకణ జీవులు అంటారు.
ఉదా : హైడ్రా, వాల్ వాక్స్, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, క్షీరదాలు మొ॥నవి.

AP 8th Class Biology Important Questions Chapter 2 కణం - జీవుల మౌళిక ప్రమాణం

ప్రశ్న 4.
కేంద్రక త్వచం విధులను వివరించండి.
జవాబు:
కేంద్రక త్వచం :

  • కేంద్రకం చుట్టూ ఉన్న పలుచని పొరను కేంద్రక త్వచం అంటారు.
  • ఇది కేంద్రకానికి నిర్దిష్టమైన ఆకారాన్ని ఇచ్చి, పటుత్వాన్ని కలుగచేస్తుంది.

ప్రశ్న 5.
ఏనుగులో ఉండే కణాలు, మనిషిలో ఉండే కణాల కంటే పెద్దవా ?
జవాబు:

  • ఏనుగు మరియు మనిషిలో ఉండే కణాలు ఒకే పరిమాణం కలిగి ఉంటాయి.
  • జీవి ఆకారం కణాల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది కాని కణాల పరిమాణంపై కాదు.
  • కావున ఏనుగులో మనిషి కన్నా ఎక్కువ కణాలు ఉంటాయి.

AP 8th Class Biology Important Questions Chapter 2 కణం - జీవుల మౌళిక ప్రమాణం

లక్ష్యాత్మక నియోజనము

సరియైన సమాధానమును గుర్తించుము.

ప్రశ్న 1.
రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని దీనిలో పరిశీలించాడు.
ఎ) విబ్రియో
బి) కప్పలు
సి) ఆర్కిలు
డి) స్పెరోగైరా
జవాబు:
సి) ఆర్కిలు

ప్రశ్న 2.
ఈ కింది వాటిలో కణం యొక్క విధులను నిర్థారించు నది
ఎ) కణం యొక్క పరిమాణం, ఆకారం
బి) కణం యొక్క పరిమాణం మాత్రమే
సి) కణం యొక్క ఆకారం మాత్రమే
డి) కణాంగాలు మాత్రమే
జవాబు:
ఎ) కణం యొక్క పరిమాణం, ఆకారం

ప్రశ్న 3.
క్రిందివాటిలో వృక్షకణంలో మాత్రమే ఉండేవి
ఎ) కణకవచము
బి) కణత్వచము
సి) హరితరేణువు
డి) A మరియు C
జవాబు:
డి) A మరియు C

ప్రశ్న 4.
ఎర్రరక్తకణపు ఆకారం
ఎ) గుండ్రము
బి) నక్షత్రాకారం
సి) కండె ఆకారం
డి) రిబ్బనువలె
జవాబు:
సి) కండె ఆకారం

ప్రశ్న 5.
మనం అన్ని కణాలను నేరుగా కంటితో చూడలేము. కారణం
ఎ) అతి పెద్దగా ఉంటాయి కాబట్టి
బి) చాలాచాలా చిన్నగా ఉంటాయి కాబట్టి
సి) అవి దాక్కొని ఉంటాయి కాబట్టి
డి) అవి కనిపించవు కాబట్టి
జవాబు:
బి) చాలాచాలా చిన్నగా ఉంటాయి కాబట్టి

AP 8th Class Biology Important Questions Chapter 2 కణం - జీవుల మౌళిక ప్రమాణం

ప్రశ్న 6.
ఈ కణం ఏమిటో గుర్తించండి.
AP 8th Class Biology Important Questions Chapter 2 కణం - జీవుల మౌళిక ప్రమాణం 9
ఎ) ఎర్ర రక్తకణం
బి) నాడీకణం
సి) తెల్ల రక్తకణాలు
డి) కండరకణం
జవాబు:
బి) నాడీకణం

ప్రశ్న 7.
రాబర్ట్ బ్రౌన్ కణంలో దీనిని గుర్తించినారు
ఎ) కణకవచము
బి) కేంద్రకము
సి) రిక్తిక
డి) మైటోకాండ్రియా
జవాబు:
బి) కేంద్రకము

ప్రశ్న 8.
మీ సైన్స్ టీచర్ ఒక కణం నిర్మాణంను వివరిస్తూ ఈ కణంలో కేంద్రకం, హరితరేణువు, కణత్వచం, రిక్తికలు కణ కవచం ఉంటాయని వివరించాడు. ఆ కణం కింది వాటిలో ఏదై ఉండవచ్చు ?
ఎ) కేంద్రక పూర్వకణం
బి) వృక్షకణం
సి) జంతుకణం
డి) పై సమాచారం సరిపోదు
జవాబు:
బి) వృక్షకణం

ప్రశ్న 9.
AP 8th Class Biology Important Questions Chapter 2 కణం - జీవుల మౌళిక ప్రమాణం 10
పై పటాలలో తెల్ల రక్త కణాన్ని గుర్తించండి.
ఎ) 1, 2
బి) 1 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) ఈ రెండూ కావు
జవాబు:
సి) 2 మాత్రమే

ప్రశ్న 10.
సూక్ష్మదర్శినిలో, పదార్థాన్ని పరిశీలించేందుకు దీనిపై గ్లిజరిన్ వేసి కవర్ తో కప్పుతారు. ఎందుకనగా
ఎ) అది ముడతలు లేకుండా స్పష్టంగా కనిపించేందుకు
బి) అది త్వరగా ఆరిపోకుండా వుండేందుకు
సి) నీరు సూక్ష్మదర్శిని కటకానికి అంటుకోకుండా వుండేందుకు
డి) పైవన్నీ
జవాబు:
డి) పైవన్నీ

AP 8th Class Biology Important Questions Chapter 2 కణం - జీవుల మౌళిక ప్రమాణం

ప్రశ్న 11.
రాబర్ట్ బ్రౌన్ …….. పత్రాలపై పరిశోధన చేశారు.
ఎ) ఓక్ పత్రాలు
బి) ఆర్కిడ్ పత్రాలు
సి) కొని ఫెర్ పత్రాలు
డి) మందార పత్రాలు
జవాబు:
బి) ఆర్కిడ్ పత్రాలు

ప్రశ్న 12.
………. కణంలో కశాభాలు ఉంటాయి.
ఎ) అమీబా
బి) పేరమీషియం
సి) క్లామిడోమోనాస్
డి) ప్లాస్మోడియం
జవాబు:
సి) క్లామిడోమోనాస్

ప్రశ్న 13.
కణద్రవ్యం ఒక …………. పదార్థం.
ఎ) సజాతీయ
బి) విజాతీయ
సి) సరళ
డి) నిర్జీవ
జవాబు:
బి) విజాతీయ

ప్రశ్న 14.
ఒక మైక్రాస్ అంటే …………. లో …….. వంతు.
ఎ) సెంటీమీటర్, మిలియన్
బి) మీటర్, మిలియన్
సి) డెసీమీటర్, మిలియన్
డి) కిలోమీటర్, మిలియన్
జవాబు:
బి) మీటర్, మిలియన్

ప్రశ్న 15.
…………… కణానికి, బలాన్ని గట్టిదనాన్ని ఇస్తుంది.
ఎ) కణకవచం
బి) కణత్వచం
సి) కణద్రవ్యం
డి) కేంద్రకం
జవాబు:
ఎ) కణకవచం

AP 8th Class Biology Important Questions Chapter 2 కణం - జీవుల మౌళిక ప్రమాణం

ప్రశ్న 16.
మొట్టమొదటిసారిగా మైక్రోస్కోప్ ను రూపొందించి బాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజోవా జీవులను పరిశీలించినది
ఎ) రాబర్ట్ హుక్
బి) రాబర్ట్ బ్రౌన్
సి) మార్సెల్లో మాల్ఫీజి
డి) ఆంటోనివాన్ లీవెన్‌హాక్
జవాబు:
డి) ఆంటోనివాన్ లీవెన్‌హాక్

ప్రశ్న 17.
లాటిన్ భాషలో సెల్ అనగా
ఎ) చిన్న గది
బి) చిన్న ప్రదేశం
సి) చిన్న స్థలం
డి) చిన్న కుహరం
జవాబు:
ఎ) చిన్న గది

ప్రశ్న 18.
రాబర్ట్ హుక్ కణాన్ని కనుగొన్న సంవత్సరం
ఎ) 1632
బి) 1665
సి) 1674
డి) 1723
జవాబు:
బి) 1665

ప్రశ్న 19.
ఈ క్రింది వానిలో సూక్ష్మజీవ ప్రపంచానికి చెందని శాస్త్రవేత్త
ఎ) అథినాసియస్ కిర్చర్
బి) జాన్ స్వామ్మర్ డామ్
సి) విలియంహార్వే
డి) లీవెన్‌హాక్
జవాబు:
సి) విలియంహార్వే

ప్రశ్న 20.
కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త
ఎ) పెలిస్ పాంటానా
బి) రాబర్ట్ హుక్
సి) రాబర్ట్ బ్రౌన్
డి) లీవెన్‌హాక్
జవాబు:
సి) రాబర్ట్ బ్రౌన్

AP 8th Class Biology Important Questions Chapter 2 కణం - జీవుల మౌళిక ప్రమాణం

ప్రశ్న 21.
ఈ క్రింది వానిలో ఏకకణజీవి కానిది
ఎ) పారమీషియం
బి) క్లామిడోమోనాస్
సి) బాక్టీరియా
డి) హైడ్రా
జవాబు:
డి) హైడ్రా

ప్రశ్న 22.
స్థిరమయిన ఆకారంలేని జీవి
ఎ) అమీబా
బి) పారమీషియం
సి) బాక్టీరియా
డి) క్లామిడోమోనాస్
జవాబు:
ఎ) అమీబా

ప్రశ్న 23.
అమీబాలో చలనానికి, ఆహార సేకరణకు ఉపయోగపడే నిర్మాణాలు
ఎ) శైలికలు
బి) కశాభాలు
సి) మిధ్యాపాదాలు
డి) సూక్ష్మచూషకాలు
జవాబు:
సి) మిధ్యాపాదాలు

ప్రశ్న 24.
ఒక మైక్రాన్ దీనికి సమానం.
ఎ) 10 నానోమీటర్లు
బి) 100 నానోమీటర్లు
సి) 1000 నానోమీటర్లు
డి) 10,000 నానోమీటర్లు
జవాబు:
సి) 1000 నానోమీటర్లు

ప్రశ్న 25.
మానవుని నాడీకణం పొడవు సుమారు
ఎ) 50-60 సెం.మీ.
బి) 60-80 సెం.మీ.
సి) 90-100 సెం.మీ.
డి) 80-90 సెం.మీ.
జవాబు:
సి) 90-100 సెం.మీ.

AP 8th Class Biology Important Questions Chapter 2 కణం - జీవుల మౌళిక ప్రమాణం

ప్రశ్న 26.
అన్నిటికంటే పెద్దకణం
ఎ) తిమింగలం శరీరకణం
బి) ఏనుగు శరీరకణం
సి) ఉష్ణపక్షి గుడ్డు
డి) పెంగ్విన్ గుడ్డు
జవాబు:
సి) ఉష్ణపక్షి గుడ్డు

ప్రశ్న 27.
రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని ఏ కణాల్లో కనుగొన్నాడు ?
ఎ) ఓక్ చెట్టు పత్రం
బి) ఆర్కిడ్ పత్రం
సి) గడ్డి ఆకు
డి) ఉల్లిపొర
జవాబు:
బి) ఆర్కిడ్ పత్రం

ప్రశ్న 28.
జంతుకణాలలో లేనిది
ఎ) కణకవచం
బి) కణత్వచం
సి) కణద్రవ్యం
డి) కేంద్రకం
జవాబు:
ఎ) కణకవచం

ప్రశ్న 29.
కణానికి ఆకారాన్నిచ్చేది
ఎ) కణకవచం
బి) కణత్వచం
సి) కణద్రవ్యం
డి) కేంద్రకత్వచం
జవాబు:
బి) కణత్వచం

ప్రశ్న 30.
మొట్టమొదట సంయుక్త సూక్ష్మదర్శినిని తయారుచేసినది
ఎ) లీవెన్‌హాక్
బి) జకారస్ జాన్సన్
సి) రాబర్ట్ హుక్
డి) రాబర్ట్ బ్రౌన్
జవాబు:
బి) జకారస్ జాన్సన్

AP 8th Class Biology Important Questions Chapter 2 కణం - జీవుల మౌళిక ప్రమాణం

ప్రశ్న 31.
అతిచిన్న సూక్ష్మజీవులను కూడా పరిశీలించడానికి ఉపయోగపడేది
ఎ) సరళ సూక్ష్మదర్శిని
బి) సంయుక్త సూక్ష్మదర్శిని
సి) ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని
డి) బైనాక్యులర్ సూక్ష్మదర్శిని
జవాబు:
సి) ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని

ప్రశ్న 32.
సంయుక్త సూక్ష్మదర్శినిలో ఉండే వస్తుకటక సామర్థ్యాలు
ఎ) 4 × 10 × 40 × 100
బి) 10 × 20 × 25 × 50
సి) 5 × 15 × 25 × 50
డి) 10 × 20 × 40 × 50
జవాబు:
ఎ) 4 × 10 × 40 × 100

AP Board 8th Class Biology Solutions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

SCERT AP 8th Class Biology Study Material Pdf 11th Lesson మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది? Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Biology 11th Lesson Questions and Answers మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

8th Class Biology 11th Lesson మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది? Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం

ప్రశ్న 1.
మీరు గత సంవత్సరం ఎన్నిసార్లు అస్వస్థతకు లోనైనారు ? మీరు ఏ ఏ వ్యాధులతో బాధపడ్డారు ?
(ఎ) పై వ్యాధులను నివారించడానికి మీరు రోజువారీగా ఏదైనా అలవాటును మార్చుకోగలరా ఆలోచించి రాయండి.
(బి) పై వ్యాధులు రాకుండా నివారించడానికి మీ పరిసరాలలో ఎటువంటి మార్పు తీసుకొని రావాలనుకుంటున్నారు ?
జవాబు:
నేను గత సంవత్సరం చాలాసార్లు అస్వస్థతకు లోనై విరేచనాలు, టైఫాయిడ్ జ్వరంతో బాధపడ్డాను.
(ఎ) ఆ వ్యాధులను నివారించడానికి నేను రోజూ ఒక గుడ్డు, ఆకుకూరలు తినుటకు అలవాటుపడ్డాను. అంతేకాక కాచి చల్లార్చిన నీటిని తాగుతున్నాను.
(బి) ఆ వ్యాధులు రాకుండా నివారించడానికి మా పరిసరాలలో ఈ కింది మార్పులు తీసుకురావాలని అనుకుంటున్నాను.
అవి :

  1. పరిసరాలు శుభ్రంగా ఉంచుట.
  2. ఆహార పదార్థాలపై ఎల్లప్పుడూ మూతలు ఉంచుట.
  3. వ్యర్థ పదార్థాలను చెత్తబుట్టలో వేయుట.
  4. రక్షిత మంచినీటి సౌకర్యం ఏర్పాటుచేయుట.

AP Board 8th Class Biology Solutions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

ప్రశ్న 2.
డాక్టర్/నర్స్ / ఆరోగ్య కార్యకర్తలు అస్వస్థతతో ఉన్న రోగులతో ఎక్కువగా గడుపుతుంటారు. అయినా వారు అస్వస్థతకు ” గురికారు ఎందుకు ? ఆలోచించి రాయండి.
జవాబు:
డాక్టర్ / నర్స్ / ఆరోగ్య కార్యకర్తలు అస్వస్థతతో ఉన్న రోగులతో ఎక్కువగా గడుపుతుంటారు. అయినా అస్వస్థతకు గురికారు. ఎందుకంటే వారు ఆరోగ్య నియమాలు చక్కగా పాటిస్తారు. దీనివలన వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది.

డాక్టర్ / నర్స్ / ఆరోగ్య కార్యకర్తలకు వ్యాధులు ఎలా వ్యాపిస్తాయో తెలుసు కాబట్టి వారు కచ్చితంగా పరిశుభ్రత నియమాలు పాటిస్తారు. అంతేకాక అంటువ్యాధులకు చికిత్స చేసేటప్పుడు సరైన ఆరోగ్య రక్షణ సూత్రాలు పాటిస్తారు. పోషక ఆహారం ఎక్కువగా తీసుకుంటారు.

ప్రశ్న 3.
సాంక్రమిక (అంటువ్యాధులు), అసాంక్రమిక వ్యాధులకు మధ్య గల భేదాలను రాయండి.
జవాబు:

సాంక్రమిక వ్యాధులుఅసాంక్రమిక వ్యాధులు
1. సూక్ష్మజీవుల వలన వచ్చే వ్యాధులను సాంక్రమిక వ్యాధులు అంటారు.1. శరీర అంతర్భాగాలలో మార్పు వలన వచ్చే వ్యాధులను అసాంక్రమిక వ్యాధులు అంటారు.
2. ఈ వ్యాధులు గుర్తించటం తేలిక.2. ఈ వ్యాధులు గుర్తించటం అంత తేలిక కాదు
3. శరీరంలో ఉన్న రోగనిరోధక శక్తి పై ఈ వ్యాధులు ఆధారపడును.3. తీసుకొనే ఆహారం, ఒత్తిడి మొదలైన అంశాలు ప్రభావంపై ఆధారపడును.
4. మలేరియా, టైఫాయిడ్, గవదబిళ్ళలు మొదలైన వ్యాధులు.4. అధిక రక్తపీడనం, స్థూలకాయత్వం, గుండెపోటు మొదలైన వ్యాధులు.

ప్రశ్న 4.
స్వల్పకాలిక వ్యాధులు ఎందుకు దీర్ఘకాలిక వ్యాధులుగా మారతాయి ?
జవాబు:
స్వల్పకాలిక వ్యాధులకు తరచు గురి అవుతూ ఉన్నప్పుడు, స్వల్పకాలిక వ్యాధులను సరిగా గుర్తించలేనప్పుడు, స్వల్పకాలిక వ్యాధులను నిర్లక్ష్యం చేసినపుడు, స్వల్పకాలికంగా ఉన్నప్పుడు సరిగా చికిత్స చేయకపోయినప్పుడు దీర్ఘకాలిక వ్యాధులుగా మారతాయి. ఉదా : ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు.

AP Board 8th Class Biology Solutions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

ప్రశ్న 5.
ఒక బాలుడికి నెలక్రితం మశూచి వచ్చింది. ఇప్పుడు తగ్గింది. అతను మశూచి వచ్చిన పిల్లలతో కలసి ఉంటున్నాడు. అతనికి మశూచి మరలా వస్తుందా ! రాదా ! ఎందుకు ?
జవాబు:
ఒక బాలుడికి నెలక్రితం మశూచి వచ్చింది. ఇప్పుడు తగ్గింది. అతను మశూచి వచ్చిన పిల్లలతో ‘కలిసి ఉన్నా అతనికి మశూచి మరలా రాదు. ఎందుకు అంటే మన శరీరంలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి వ్యాధి జనక జీవితో మొదటగా ప్రవేశించినప్పుడు ప్రత్యేకంగా పోరాడే శక్తిని కలిగి ఉంటుంది.

అది మొదటిగా వ్యాధి జనక క్రిములను గుర్తిస్తుంది. వాటిపై ప్రతిస్పందించి, జీవితాంతం వాటిని ప్రత్యేకంగా గుర్తు పెట్టుకుంటుంది. రెండవసారి అదే వ్యాధి జనక జీవి లేదా దానికి సంబంధించిన మరొక వ్యాధి జనక జీవి శరీరంలో ప్రవేశించినప్పుడు మన శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి చాలా బలంగా పోరాడి మొదటిసారి కంటే తొందరగా వ్యాధి జనక జీవులను శరీరం నుంచి తొలగిస్తుంది.

ప్రశ్న 6.
వ్యాధికి సంబంధించి సత్వర కారకాలు, దోహదపడే కారకాలు అంటే ఏమిటో వివరించండి.
జవాబు:
ఏదైనా వ్యాధిని ఒక సూక్ష్మజీవి కలుగచేయును. అది ఆ వ్యాధి కలుగజేయుటకు కారణం కాబట్టి దానిని సత్వర కారకం అంటారు. ఆ సూక్ష్మజీవి ఆ వ్యక్తి శరీరంలో వ్యాధి పెంచుటకు కొన్ని కారకాలు అనగా అతనికి ఉన్న ఇతర శారీరక సమస్యలు కారణం అవుతాయి. వీటిని వ్యాధి దోహద కారకాలు అంటారు.

ఉదా : ఒక వ్యక్తికి శరీరంలో వ్యాధి జనక జీవుల వలన అతనికి పుండ్లు వచ్చినాయి. కానీ అతనికి చక్కెర వ్యాధి ఉంది. అప్పుడు పుండ్లు ఇంకా ఎక్కువగా పెరుగుతాయి. పుండ్లు రావడానికి కారణమైన వ్యాధి జనకజీవులు సత్వర కారకాలు అయితే, చక్కెర వ్యాధి పుండ్లు పెరుగుటకు దోహద కారకాలు.

AP Board 8th Class Biology Solutions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

ప్రశ్న 7.
ఆరోగ్య కార్యకర్తను అడిగి వ్యాధి వ్యాప్తి గురించి తెలుసుకొనుటకు ప్రశ్నావళిని తయారుచేయండి.
జవాబు:
1. వ్యాధి వ్యాప్తి ఎన్ని రకాలుగా జరుగును ?
AP Board 8th Class Biology Solutions Chapter 11th Lesson మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది 1
2. గజ్జి అనేది ప్రత్యక్ష తాకిడి వలన వ్యాపించును. అవును / కాదు
3. కలరా వ్యాధిని ఈగలు వ్యాప్తి చేస్తాయి. అవును / కాదు
4. గాలి ద్వారా కొన్ని వ్యాధులు వ్యాప్తి చెందును. అవును / కాదు
5. నీటి ద్వారా కొన్ని వ్యాధులు వ్యాప్తి చెందును. అవును / కాదు
6. వ్యా ధి వ్యాప్తి తెలుసుకొంటే నివారణ తేలిక. అవును / కాదు.

ప్రశ్న 8.
లీష్మేనియా, ట్రిపానోజోమా బొమ్మలు గీసి, భాగాలు గుర్తించండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 11th Lesson మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది 2

ప్రశ్న 9.
రాము మశూచి వ్యాధితో బాధపడుతున్నాడు. ఇతరులకు వ్యాధి సోకకుండా ఉండటానికి రాముకు నీవిచ్చే సలహాలు ఏమిటి ?
జవాబు:
రాము మశూచి వ్యాధితో బాధపడుతున్నాడు. ఇతరులకు ఆ వ్యాధి సోకకుండా ఉండటానికి రాముకు నేను ఇచ్చే సలహాలు :
1. ఇతరులకు రామును ఆరు అడుగుల కంటే ఎక్కువ దూరంగా ఉంచుతాను. కారణం ఆరు అడుగుల లోపు ముఖాముఖిగా ఉంటే ఈ వ్యాధి వ్యాపించును.
2. శరీరం నుంచి విడుదల అయ్యే ద్రవాలు ఇతరులపై పడకుండా జాగ్రత్తగా ఉండమని సలహా ఇస్తాను.
3. అతను ఉపయోగించిన వస్తువులను, బట్టలను, మంచాన్ని ఇతరులతో కలవకుండా జాగ్రత్తగా ఉంచాలి.
4. మొదటి వారం రోజులు ఎక్కువగా వ్యాపించును కాబట్టి. అతనిని చాలా దూరంగా ఉంచాలి.
గమనిక : భారతదేశంలో ఉన్న రాము మశూచి వ్యాధితో బాధపడడు. కాబట్టి అతనికి నేను ఇచ్చే సలహాలు ఏమి ఉండవు. కారణం ప్రపంచం నుంచి ఈ వ్యాధి ఎప్పుడో సంపూర్ణంగా నిర్మూలించారు.

ప్రశ్న 10.
వ్యాధులను నిరోధించడంలో టీకాల పాత్రను ఎలా ప్రశంసిస్తావు ?
జవాబు:
వ్యాధులను నిరోధించడంలో టీకాల పాత్ర చాలా ఉంది. టీకాల వలన భారతదేశం నుండి మశూచి వ్యాధి పూర్తిగా నిర్మూలించాము. అదే విధంగా పిల్లలలో మరో భయంకరమైన వ్యాధి అయిన పోలియో వ్యాధి పూర్తిగా నిర్మూలించుటకు చర్యలు జరుగుతున్నాయి.

టీకాల వలన మాతా-శిశు రక్షణ జరుగుతున్నది. ఇటువంటి టీకాలను కనిపెట్టిన శాస్త్రవేత్త, జీవశాస్త్రం సాధించిన అభివృద్ధిని చూసి నేను చాలా సంతోషపడుతున్నాను. దీని గురించి ‘టీకాల డే’ అని ఒక రోజు నేను సెలబ్రేట్ చేసి జీవశాస్త్రమునకు కృతజ్ఞత తెలుపుకొంటాను.

AP Board 8th Class Biology Solutions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

ప్రశ్న 11.
మీ ప్రాంతంలో సాధారణంగా ఉండే వ్యాధులను తెలుసుకోవడానికి సర్వే నిర్వహించండి. ఈ వ్యాధులు ప్రబలడానికి గల కారణాలను తెలుసుకుని మీ గ్రామపంచాయతీ / మున్సిపాలిటి వారికి వ్యాధులను నివారించటానికి మీరు ఏ సూచనలు చేస్తారు?
జవాబు:
మా ప్రాంతంలో సాధారణంగా ఉండే వ్యాధులను తెలుసుకోవడానికి సర్వే నిర్వహించాను. సర్వేలో ఎక్కువ వచ్చే వ్యాధులు డయేరియా, మలేరియా, డెంగ్యూ.

ఈ వ్యాధులు నివారించటానికి మా మున్సిపాలిటీకి ఇచ్చే సూచనలు :

  1. రక్షిత మంచినీటి సరఫరా చేయాలి.
  2. ఆరోగ్య కార్యకర్తల ద్వారా వ్యాధులు వచ్చే కాలం గురించి ముందుగా వివరించాలి.
  3. ఆ వ్యాధులు రావడానికి గల కారణాలు వివరించాలి.
  4. కాచి చల్లార్చిన నీటిని త్రాగమని మీడియా ద్వారా ప్రజలకు తెలియచేయాలి.
  5. కలుషిత ఆహార పదార్థాలు తినవద్దని ప్రజలకు చెప్పాలి.
  6. చెత్తాచెదారాలను రోడ్డుపై వేయకుండా జాగ్రత్తగా వారు తీసుకువెళ్ళే బండిలో వేయాలని, దాని వలన కలుగు లాభాలు ముందుగా ప్రజలకు తెలియచేయాలి.
  7. దోమలు పెరగకుండా ఉండుటకు తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పాలి.
  8. దోమకాటు నుండి కాపాడుకొనుటకు దోమతెరలను ఉపయోగించమని తెలియచేయాలి.
  9. వ్యాధి వచ్చిన వెంటనే చికిత్స చేయుటకు వీలుగా ఆసుపత్రిలో సిబ్బంది మరియు మందులు ఏర్పాటుచేయాలి.
  10. పరిసరాలు శుభ్రంగా ఉంచాలి.
    గమనిక : గ్రామపంచాయతి అయితే ఆ పేరు రాయాలి.

8th Class Biology 11th Lesson మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది? InText Questions and Answers

కృత్యములు

1. పరిశుభ్రమైన త్రాగే మంచినీటి సరఫరా కొరకు మీ ప్రాంతంలో (గ్రామ పంచాయతీ పరిధిలో కాని / పురపాలక సంఘాలు, కార్పొరేషన్ కాని) కల్పించబడిన సౌకర్యాలను తెలుసుకోండి.
జవాబు:
పరిశుభ్రమైన. తాగే మంచినీటి సరఫరా కొరకు మా ప్రాంతంలో గ్రామ పంచాయతీ పరిధిలో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి వాటిని శుద్ధి చేసి రక్షిత మంచినీటిని పంపుల ద్వారా అన్ని ఇళ్లకు పంపులైన్ కనెక్షన్ల ద్వారా పంపిస్తారు. ఇంకా పంపు కనెక్షన్లు తీసుకోని వారి కొరకు గ్రామ పంచాయతి వీధి పంపులు ఏర్పాటుచేసింది.

AP Board 8th Class Biology Solutions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

2. మీ ప్రాంతంలోని ప్రజలందరికీ ఈ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా ? ఎందుకు లేవో చర్చించండి.
జవాబు:
మా ప్రాంతంలోని ప్రజలందరికి ఈ సౌకర్యాలు అందుబాటులో లేవు. కారణాలు :
1. ప్రజలకు రక్షిత మంచినీటి పై సరైన అవగాహన లేకపోవటం.
2. కొత్తగా ఏర్పడిన ఇళ్లకు ప్రభుత్వం వారు వెంటనే పంపులైన్ కనెక్షన్ ఇవ్వకపోవటం. ప్రజలు ఇంకా నదులు, చెరువులపై మంచినీటి కోసం ఆధారపడి ఉండటం వలన.

3. (a) మీ పరిసరాలలో ఏర్పడే ఘనరూప వ్యర్థ పదార్థాలను మీ గ్రామపంచాయతి / మున్సిపాలిటీవారు ఎలా నిర్వహిస్తారో, తెలుసుకోండి.
జవాబు:
మా గ్రామ పంచాయతివారు మా పరిసరాలలో ఏర్పడిన వ్యర్థ పదార్థాలను సేకరించుటకు కొంతమంది ఉద్యోగులను ఏర్పాటుచేసుకున్నారు. వారు ప్రతిరోజూ బండిలో ఘనరూప వ్యర్థ పదార్థాలను ఇంటికి వచ్చి తీసుకువెళ్తారు. రోడ్లపై చెత్త – కుండీలను ఏర్పాటుచేశారు.

(b) వారు తీసుకొనే చర్యలు సరిపోతాయా ?
జవాబు:
వారు తీసుకొనే చర్యలు సరిపోవు.

(c) వాటిని మెరుగుపరచటానికి మీరిచ్చే సూచనలేవి ?
జవాబు:
1. వాటిని మెరుగుపరచటానికి ప్రతిరోజూ ఇళ్లకు రెండుసార్లు వచ్చి చెత్తను తీసుకువెళ్లే ఏర్పాటుచేయాలి.
2. ప్రతిరోజూ చెత్త కుండీలలోని చెత్త తీసివేయాలి.
3. ఘనరూపంలో ఉన్న పొడి, తడి చెత్తను వేరు వేరుగా సేకరించే ఏర్పాటుచేయాలి.

(d) ఒక వారంలో ఏర్పడే ఘనరూప చెత్తను తగ్గించడానికి మీ కుటుంబ సభ్యులు ఎటువంటి కింది చర్యలు తీసుకుంటారు?
జవాబు:
ఒక వారంలో ఏర్పడే ఘనరూప చెత్తను తగ్గించడానికి మా కుటుంబ సభ్యులు ఈ కింది చర్యలు తీసుకుంటారు.

  1. పాలిథీన్ కవర్ల వాడకం తగ్గిస్తారు.
  2. కూరగాయలు, వాటి తొక్కులు, మినప పొట్టు మొ||నవి దగ్గరలో ఉన్న పశువులకు వేస్తారు.
  3. ఆహార పదార్థాలు ఎక్కువ వృథా చేయరు.
  4. పునర్వినియోగించే పదార్థాలను ప్రోత్సహిస్తారు.

AP Board 8th Class Biology Solutions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

4. ఐదుమంది చొప్పున జట్లుగా ఏర్పడండి. మీకు తెలిసిన వ్యాధుల జాబితా రాయండి. ఏ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో జట్లలో చర్చించి రాయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 11th Lesson మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది 3

5. మీ చుట్టుప్రక్కల ఉన్న కొన్ని కుటుంబాలను సర్వే చేసి ఈ కింది విషయాలను కనుక్కోండి.

(a) గత మూడు నెలల్లో ఎంతమంది స్వల్పకాలిక వ్యాధులకు లోనయ్యారు ?
జవాబు:
6 నుంచి 10 మంది.

(b) అదే కాలంలో ఎంతమంది దీర్ఘకాలిక వ్యాధికి గురయ్యారు ?
జవాబు:
ఒకరిద్దరు.

(c) మొత్తంగా ఎంతమంది ఈ వ్యాధులకు గురైనారు ?
జవాబు:
7 నుంచి 12 మంది వరకు

(d) aవ ప్రశ్న మరియు 6వ ప్రశ్న యొక్క జవాబులు ఒకేలా ఉన్నాయా ?
జవాబు:
లేవు.

(e) bవ ప్రశ్న మరియు Cవ ప్రశ్న యొక్క జవాబులు ఏ విధంగా వేరుగా ఉన్నాయి ?
జవాబు:
b ప్రశ్నకు జవాబు దీర్ఘకాలిక వ్యాధికి గురి అయిన వారి సంఖ్యను తెలియచేయును. c ప్రశ్నకు జవాబు స్వల్ప మరియు దీర్ఘకాలిక వ్యాధులకు గురైన వారి సంఖ్యను తెలియచేయును.

(f) జవాబులు వేరు వేరుగా ఎందుకున్నాయి ? ఈ విధమైన వ్యాధులు సాధారణ మానవునిపై ఎటువంటి ప్రభావం చూపుతాయి?
జవాబు:
కారణం ఇవ ప్రశ్న స్వల్పకాలిక వ్యాధులు, bవ ప్రశ్న దీర్ఘకాలిక వ్యాధులు. స్వల్పకాలిక వ్యాధుల వలన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినదు. తిరిగి కోలుకోవచ్చు. దీర్ఘకాలిక వ్యాధుల వలన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది.

AP Board 8th Class Biology Solutions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

6.

(a) మీ తరగతిలో ఎంతమంది జలుబు / దగ్గు / జ్వరంతో బాధపడుతున్నారో తెలుసుకోండి.
జవాబు:
20 నుంచి 30 మంది

(b) ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నారు.?
జవాబు:
3 నుంచి 4 రోజులు

(c) యాంటీబయోటిక్స్ ఎంతమంది తీసుకుంటున్నారు ? (మీ తల్లిదండ్రులను అడిగి తెలుసుకోండి.)
జవాబు:
ఒక 20 మంది.

(d) యాంటీబయోటిక్స్ తీసుకొన్న తరువాత కూడా ఎన్ని రోజులు అస్వస్థులుగా ఉన్నారు ?
జవాబు:
2 నుంచి 3 రోజులు.

(e) యాంటీబయోటిక్స్ తీసుకోని వారు ఎన్ని రోజులు జలుబుతో బాధపడ్డారు ?
జవాబు:
4 నుంచి 7 రోజులు.

(f) రెండు గ్రూక్స్ మధ్య తేడా ఏమిటి ?
జవాబు:
రెండు గ్రూప్ ల మధ్య తేడా లేదు.

(g) తేడా ఉంటే ఎందుకు ? లేకపోతే ఎందుకో చెప్పండి.
జవాబు:
జలుబు అనేది వైరసకు సంబంధించిన వ్యాధి. వైరస్ వ్యాధులకు యాంటీబయోటిక్స్ వేసుకున్నప్పటికీ అవి వ్యాధి. తీవ్రతను కాని, వ్యాధి వ్యవధిని కాని తగ్గించవు.

AP Board 8th Class Biology Solutions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

7. మీ పరిసరాలలో ఆర్థికంగా బాగా ఉన్న పది కుటుంబాలు మరియు ఆర్థికంగా వెనుకబడిన పది కుటుంబాలపై సర్వే నిర్వహించండి.
జవాబు:
ప్రతి కుటుంబంలో 5 సంవత్సరాలలోపు వయస్సు గల పిల్లలు ఉండేలా చూడండి. ఈ పిల్లల ఎత్తును కొలవండి. వయస్సుకు తగిన ఎత్తును సూచించే గ్రాఫ్ గీయండి.
AP Board 8th Class Biology Solutions Chapter 11th Lesson మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది 4

(a) రెండు గ్రూపులలో ఏమైనా తేడా ఉందా ? ఉంటే ఎందుకుంది ?
జవాబు:
రెండు గ్రూపులలో తేడా ఉంది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలలో పిల్లలు వయస్సుకు తగిన ఎత్తు లేరు. కారణం వారికి పోషకాహార లోపం, వ్యాధులు ఎక్కువగా రావటం, పరిశుభ్రత లోపం మొదలైనవి.

(b) తేడాలు ఏమీ లేవా ? దీనిని బట్టి ఆర్థికంగా బాగా ఉన్నవాళ్లకి, బీదవాళ్లకి ఆరోగ్యంలో వ్యత్యాసం లేదనుకుంటున్నారా?
జవాబు:
ఆర్థికంగా బాగా ఉన్నవాళ్ళకి, బీదవాళ్లకి ఆరోగ్యంలో వ్యత్యాసం పోషకాహార లోపం వలన ఉంటుంది.

8. పిచ్చి కుక్క లేదా ఇతర వ్యాధిగ్రస్థ జంతువులు కాటేసినప్పుడు ‘ర్యాబిస్’ వైరస్ వ్యాప్తి చెందుతుంది. జంతువులకు, మానవులకు యాంటి ర్యాబిస్ వ్యాక్సిన్ మందు అందుబాటులో ఉంది. మీ పరిసరాలలో ‘ర్యాబిస్’ వ్యాధిని నివారించడానికి గ్రామ పంచాయతి / మున్సిపాలిటీ వారు తీసుకున్న చర్యలు మరియు కార్యాచరణ ప్రణాళిక ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఈ చర్యలు సరిపోతాయా ? సరిపోకపోతే మెరుగుపరచే చర్యలకు మీరిచ్చే సూచనలేమిటి ?
జవాబు:
మా పరిసరాలలో ర్యాబిస్ వ్యాధిని నివారించడానికి మున్సిపాలిటీవారు తీసుకున్న చర్యలు మరియు కార్యాచరణ ప్రణాళిక.

  1. ఏ కుక్క కరిచినా ర్యాబిస్ వ్యాధి టీకాను వెంటనే తీసుకోమని ప్రచారం చేయుట.
  2. ర్యాబిస్ వ్యాధి వ్యాక్సిన్ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉంచుట.
  3. వీధి కుక్కల జనాభాను తగ్గించుట.
  4. కుక్కలకు ముందుగా ఇంజక్షన్లు చేయుట. పైన చెప్పిన చర్యలు సరిపోవు.

మెరుగుపరుచుటకు సూచనలు :

  1. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయుట.
  2. వీధి కుక్కలు అన్నింటికీ టీకాలు వేయించుట.
  3. పిచ్చి వచ్చిన కుక్కలను వెంటనే ప్రత్యేకమైన ప్రదేశాలలో ఉంచి మిగతా వాటికి వ్యాధి రాకుండా చూచుట.
  4. వ్యాధి వచ్చిన కుక్కలను దూరంగా ఉంచి చికిత్స చేయుట.
  5. వ్యాధితో చనిపోయిన కుక్కలను జాగ్రత్తగా ఎవరూ వెళ్లని ప్రదేశాలలో పాతి పెట్టుట.

AP Board 8th Class Biology Solutions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

పాఠ్యాంశములోని ప్రశ్నలు

1. మీ గ్రామపంచాయితీ కార్యాలయాన్ని సందర్శించి అక్కడ గోడల మీద రాసిన ఆరోగ్య సూత్రాలు తెలపండి. (పేజీ.నెం. 177)
జవాబు:

  1. కాచి చల్లార్చిన నీటిని త్రాగండి.
  2. ఆహార పదార్థాలపై ఈగలు వాలకుండా గిన్నెలపైన మూతలు పెట్టండి.
  3. దోమకాటు నుండి కాపాడుకోవడానికి దోమతెరలను ఉపయోగించండి.
  4. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి.
  5. చుట్టు ప్రక్కల నీరు నిల్వ ఉండకుండా చూడండి.
  6. వండే ముందు కూరగాయలను శుభ్రంగా కడగండి.
  7. ఆరుబయట మలవిసర్జన చేయకండి. టాయిలెట్లు ఉపయోగించండి.
  8. వేడిగా ఉన్న ఆహారం మాత్రమే తినండి.
  9. భోజనం మరియు టాయిలెట్‌కు ముందు, తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోండి.

2. ఆరోగ్య అలవాట్లు, జాగ్రత్తల సూచనల వలన మనకేమి తెలుస్తుంది ? (పేజీ.నెం. 177)
జవాబు:
ఆరోగ్య అలవాట్లు, జాగ్రత్తల సూచనల వలన మనం ఆరోగ్య నియమాలు, జాగ్రత్తలు పాటించాలని తెలుస్తుంది.

3. ఈ సూచనలు పాటించని వాళ్లకు ఏమవుతుంది ? (పేజీ.నెం. 177)
జవాబు:
అనారోగ్యం కలుగును.

4. మనకు దోమలు ఏ కాలంలో ఎక్కువగా కనబడతాయి ? మనపై అవి ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయి ? (పేజీ.నెం. 177)
జవాబు:
మనకు దోమలు ఎక్కువగా వర్షాకాలం, శీతాకాలంలో కనబడును. అవి మనపై చాలా రకాల వ్యాధులు కలుగచేయును.
ఉదా : మలేరియా, చికున్ గున్యా, డెంగ్యూ, ఫైలేరియా.

AP Board 8th Class Biology Solutions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

5. కాచి చల్లార్చిన నీరు త్రాగడం వలన, ఈగలు ఆహార పదార్థాల మీద వాలకుండా చూడటం, దోమకాటు బారిన పడకుండా నివారించగలిగితే మనము ఆరోగ్యంగా ఉంటాం. అసలు ఆరోగ్యం అంటే ఏమిటి ? మనమెందుకు అనారోగ్యం పాలవుతాం? (పేజీ.నెం. 177)
జవాబు:
శారీరకంగా, మానసికంగా, సామాజికంగా బాగా పనిచేయడమే ఆరోగ్యం అంటారు. మనమెందుకు అనారోగ్యం పాలవుతామంటే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోకపోవటం వలన, వ్యక్తిగత శుభ్రత పాటించకపోవటం వలన, ఆరోగ్య నియమాలు పాటించకపోవటం వలన, వ్యాధి నిరోధక శక్తి తగ్గటం వలన, ఒత్తిడి, మానసిక ఆందోళనల వలన.

6. మంచి ఆరోగ్యానికి కావల్సిన పరిస్థితులు, వ్యాధి రహితంగా ఉండటానికి కావల్సిన పరిస్థితులు ఒకే రకంగా సమాధానాలు . ఉంటాయా ? వేరు వేరుగా ఉంటాయా ? ఎందుకు ? (పేజీ.నెం. 179)
జవాబు:
మంచి ఆరోగ్యానికి కావల్సిన పరిస్థితులు, వ్యాధి రహితంగా ఉండటానికి కావల్సిన పరిస్థితులు వేరు వేరుగా ఉంటాయి. కారణం ఆరోగ్యం, వ్యాధి రహితం వేరు వేరు కాబట్టి.

ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు సమాజం గురించి, ప్రజల గురించి కూడా మాట్లాడతాం. వ్యాధి గురించి మాట్లాడేటప్పుడు వ్యక్తిగతంగా బాధపడే వ్యక్తులను గురించి మాత్రమే మాట్లాడతాం.

7. వ్యాధి రహితంగా ఉండటానికి కావల్సిన రెండు పరిస్థితులను వివరించండి. (పేజీ.నెం. 179)
జవాబు:
వ్యాధి రహితంగా ఉండటానికి కావల్సిన రెండు పరిస్థితులు :
1. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవటం : దీని వలన ఎటువంటి వ్యాధి జనక జీవులు పరిసరాలలో పెరగవు. అందువలన అందరూ వ్యాధి రహితంగా ఉంటారు.
2. వ్యాధిని సరిగా గుర్తించుట : వ్యాధిని సరిగా గుర్తించుట వలన సరైన చికిత్స చేసి వ్యాధి రహితంగా చేయవచ్చు మరియు టీకాలు వేసి వ్యాధిని నివారించవచ్చు.

8. అస్వస్థతకు గురైన వ్యక్తి నుండి అన్ని రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతాయా ? ఇలా వ్యాప్తి చెందని వ్యాధులేమైనా ఉన్నాయా ? అవి ఏమిటి ? (పేజీ.నెం. 181)
జవాబు:
అస్వస్థతకు గురైన వ్యక్తి నుండి అన్ని రకాలుగా వ్యాధులు వ్యాప్తి చెందవు. అస్వస్థతకు గురైన వ్యక్తి నుండి వ్యాప్తి చెందని వ్యాధులు ఉన్నాయి. అవి అసాంక్రమిక వ్యాధులు.
ఉదా : బి.పి., డయాబెటిస్, గుండెపోటు.

9. అస్వస్థతకు గురైన వ్యక్తిని తాకకున్నా కూడా వ్యాప్తి చెందే వ్యాధులు ఏవి ? (పేజీ.నెం. 181)
జవాబు:
అస్వస్థతకు గురైన వ్యక్తిని తాకకున్నా కూడా వ్యాప్తి చెందే వ్యాధులు : కలరా, టైఫాయిడ్, ధనుర్వాతం, క్షయ, మలేరియా.

10. సాంక్రమిక జీవుల నుండి వ్యాప్తి చెందని వ్యాధులు ఏవి ? (పేజీ.నెం. 181)
జవాబు:
సాంక్రమిక జీవుల నుండి వ్యాప్తి చెందని వ్యాధులు అసాంక్రమిక వ్యాధులు.

AP Board 8th Class Biology Solutions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

11. నీకు అస్వస్థతగా అనిపించి డాక్టర్ దగ్గరకు వెళ్ళాలనుకునే ఏవైనా-3 కారణాలు తెలపండి. నీవు తెలిపిన మూడు కారణాలలో ఏదో ఒక లక్షణం మాత్రమే నీలో కన్పిస్తే నీవు డాక్టరు వద్దకు వెళ్లాలనుకుంటావా ? ఎందుకు ? (పేజీ.నెం. 182)
జవాబు:
నాకు అస్వస్థతగా అనిపించి డాక్టరు దగ్గరకు వెళ్ళాలనుకునే 3 కారణాలు : (1) జలుబు (2) దగ్గు (3) జ్వరం వీటిలో ఏ ఒక్క కారణం కనిపించినా డాక్టరు వద్దకు వెళ్తాను. ఎందుకంటే – మందుల్ని మన ఇష్టం వచ్చినట్లు వేసుకుంటే స్వల్పకాలిక వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులుగా మారతాయి.

12. ఈ క్రింది వానిలో ఏ సందర్భం నీ ఆరోగ్యంపై దీర్ఘకాల ప్రభావం చూపే అవకాశముంది ?
1. కామెర్ల వ్యాధి సోకిన సందర్భంగా
2. నీ తలలో పేలు ఎక్కువగా ఉన్నప్పుడు
3. నీ ముఖంపై మచ్చలు ఏర్పడినపుడు (పేజీ.నెం.184)
జవాబు:
కామెర్ల వ్యాధి సోకిన సందర్భంగా ఆరోగ్యంపై దీర్ఘకాల ప్రభావం చూపే అవకాశముంది. ఈ వ్యాధిలో కాలేయం దెబ్బతినుట వలన జీర్ణశక్తి మందగించి, రోగి నీరసపడతాడు. కాలేయ, జీర్ణ వ్యవస్థలు పునరుద్ధరించబడటానికి సమయం పడుతుంది. ఒక్కొక్క మార్పు ఇది ప్రాణాంతకంగా కూడ పరిణమించవచ్చు.

13. వ్యాధి ఎలా వ్యాప్తి చెందును ? (పేజీ.నెం. 184)
జవాబు:
వ్యాధి జనక జీవులు వ్యాధిగ్రస్తుడైన వ్యక్తి నుండి ఇతర వ్యక్తులకు వివిధ మార్గాల ద్వారా వ్యాప్తి చెందును. అవి :

  1. ప్రత్యక్ష తాకిడి
  2. గాలి ద్వారా
  3. నీరు, ఆహారం ద్వారా
  4. జంతువుల ద్వారా

14. వాహకాలు అనగానేమి ? (పేజీ.నెం. 184)
జవాబు:
వ్యాధి జనక జీవులు ఉన్నప్పటికి వ్యాధికి గురికాని జీవులను వాహకాలు అంటారు. వ్యాధులను ఒకరి నుండి మరొకరి
వ్యాప్తి చేయు జీవులు.

15. వ్యాధులను నివారించే విధానాల గురించి వ్రాయుము. (పేజీ.నెం. 184)
జవాబు:
వ్యాధులను నివారించే విధానాలు రెండు.
1. సర్వసాధారణమైనది
2. ప్రతి వ్యాధికి ప్రత్యేకమైనది.
సాధారణ నివారణ సూత్రాన్ని పాటించి వ్యాధి వ్యాప్తిని నిరోధించడం సర్వసాధారణమైన అంశం.

దానికి ఈ కింది నియమాలు పాటించాలి.

  1. గాలి వలన వ్యాప్తి చెందే వ్యాధి జనకాల వ్యాప్తిని నిరోధించడానికి ఎక్కువ జనాభా లేని ప్రదేశాలలో గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే ప్రదేశాలలో నివసించే ఏర్పాటు చేయటం.
  2. నీటి ద్వారా వ్యాధులను నివారించుటకు రక్షిత మంచినీటి సౌకర్యం ఏర్పాటు.
  3. పరిశుభ్రమైన వాతావరణం కల్పించినట్లయితే వ్యాధి వాహకాల నుండి విముక్తి.
  4. వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచుకొనుట. ప్రత్యేకమైన నివారణ పద్ధతిలో వ్యాధి జనక జీవులతో పోరాడే వ్యాధి నిరోధక లక్షణాన్ని కలిగి ఉండటమే.

AP Board 8th Class Biology Solutions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

16. మనం అస్వస్టులుగా ఉన్నప్పుడు పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు ఎందుకు తీసుకుంటారు ? (పేజీ.నెం. 189)
జవాబు:
వ్యాధి నిరోధక శక్తి పెరుగుటకు.

17. వివిధ పద్ధతుల ద్వారా వ్యాధి వ్యాప్తి ఎలా జరుగుతుంది ? (పేజీ.నెం. 189)
జవాబు:
వ్యాధి జనక జీవులు వ్యాధిగ్రస్తుడైన వ్యక్తి నుండి ఇతర వ్యక్తులకు వివిధ మార్గాల ద్వారా వ్యాప్తి చెందును. అవి :

  1. ప్రత్యక్ష తాకిడి
  2. గాలి ద్వారా
  3. నీరు, ఆహారం ద్వారా
  4. జంతువుల ద్వారా

18. సాంక్రమిక వ్యాధులు ప్రబలకుండా మీ పాఠశాలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు ? (పేజీ.నెం. 189)
జవాబు:

  1. వ్యాధులు వచ్చిన పిల్లలను ఇంటివద్ద ఉండిపో అని చెబుతారు.
  2. తరగతి గదిలోకి గాలి, వెలుతురు వచ్చే ఏర్పాటు చేస్తారు.
  3. ఆరోగ్య నియమాల గురించి వివరిస్తారు.
  4. టీకాలు వేయించుకోమని చెబుతారు.
  5. పాఠశాల ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచటం.
  6. బోరింగ్ వద్ద నీరు నిల్వకుండా చూడటం.
  7. పరిసరాలలో మొక్కలు పెంచటం.
  8. ఆహార వ్యర్థాలను కంపోస్ట్ పిట్ కు చేర్చటం.
  9. కాగితాలు, కాయల వ్యర్థాలను కుళ్లబెట్టి మట్టిలో కలపడం ద్వారా పాఠశాలలో వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడతాం.

19. అసంక్రామ్యత అంటే ఏమిటి ? (పేజీ.నెం. 189)
జవాబు:
ఒక వ్యక్తి ఒక వ్యాధికి పలుసార్లు గురి అయినప్పుడు ఆ వ్యాధిని ఎదురుకొనే శక్తి అతనికి వస్తుంది. దీనిని అసంక్రామ్యత అంటారు.

AP Board 8th Class Biology Solutions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

20. మీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వ్యాధి నిరోధకత కార్యక్రమాలేవి ? మీ ప్రాంతంలో తరుచు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలేవి ? (పేజీ.నెం. 189)
జవాబు:
మా థమిక ఆరోగ్య కేంద్రాలలో వ్యాధి నిరోధకతకు ఈ కింది కార్యక్రమాలు ఉన్నాయి.

  1. పోషకాహారం యొక్క ఆవశ్యకతను తెలియచేయుట
  2. చిన్న చిన్న వ్యాధులకు చికిత్స
  3. రక్షిత మంచినీటి ఆవశ్యకత
  4. పరిసరాల శుభ్రత గురించి తెలియచేయుట
  5. వ్యాధి రాకుండా తల్లి పిల్లలకు టీకాలు వేయుట.
  6. ఏ కాలంలో ఏ వ్యాధులు వస్తాయో వాటిని ఎలా ఎదుర్కోవాలో ప్రజలకు తెలియచేయుట.
    మా ప్రాంతంలో తరుచూ ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు డయేరియా, మలేరియా, డెంగ్యూ మొదలైనవి.

21. ఈ పాఠం మీద వ్యాఖ్యానం రాయడానికి పై ప్రశ్నల గురించి మీ తరగతిలో చర్చించండి. మీ నోటు పుస్తకంలో వ్యాసంగా రాయండి. (పేజీ.నెం. 189)
జవాబు:
ఒక వ్యక్తి శారీరకంగాను, మానసికంగా, సామాజికంగా బాగా ఉంటే దానిని ఆరోగ్యం అంటారు. వ్యాధి జనక జీవులు శరీరంలోనికి ప్రవేశించటం వలన శరీర జీవక్రియలు సరిగా జరగవు. దీనిని వ్యాధి అంటాము. ఆరోగ్యంగా ఉండటానికి, వ్యాధి రహిత స్థితికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. వ్యాధిని కలుగచేయు కారకాలను వ్యాధి కారకాలు అంటారు. అవి సజీవ కారకాలు, నిర్జీవ కారకాలు.

వ్యాధులు రెండు రకాలుగా ఉంటాయి. అవి తీసుకొనే సమయాన్ని బట్టి (1) స్వల్పకాలిక వ్యాధులు (2) దీర్ఘకాలిక వ్యాధులు. స్వల్పకాలిక వ్యాధులను నిర్లక్ష్యం చేస్తే అవి దీర్ఘకాలిక వ్యాధులుగా మారే అవకాశం ఉంది. , వ్యాధి కలిగే విధానాన్ని బట్టి వ్యాధులు రెండు రకాలు. సాంక్రమిక వ్యాధులు, అసాంక్రమిక వ్యాధులు.

ముఖ్యంగా మానవునిలో వైరస్లు, బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోవాలు, కొన్ని క్రిమికీటకాలు వ్యాధి జనకాలుగా, వాహకాలుగా గుర్తించారు. వ్యాధి ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుటను వ్యాధి వ్యాప్తి అంటారు. వ్యాధి వ్యాప్తి .

  1. గాలి ద్వారా
  2. నీరు, ఆహారం ద్వారా
  3. ప్రత్యక్ష తాకిడి ద్వారా
  4. జంతువుల ద్వారా జరుగును.

వ్యాధులను నయం చేసే సూత్రాలు అమలు చేయాలి. అవసరమైన యాంటీబయోటిక్స్, ఇతర మందులు వాడాలి. వ్యాధి వచ్చిన తరువాత మందులు వాడటం కంటే నివారించుట మంచిది. వ్యాధి నివారణకు ఈ కింది నియమాలు పాటించాలి.

  1. ఇంట్లోకి, పాఠశాలలోకి గాలి, వెలుతురు ఉండే విధంగా చేయుట.
  2. రక్షిత మంచి నీటిని తాగుట.
  3. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొనుట
  4. పోషకాహారం తీసుకొనుట
  5. వ్యక్తిగత పరిశుభ్రత కలిగి ఉండటం
  6. సాంక్రమిక వ్యాధులు వచ్చిన పిల్లలను ఇంటి దగ్గర ఉంచుట
  7. పిల్లలకు టీకాలు ఇప్పించుట.
  8. వ్యాధి నిరోధక శక్తి అవసరం గురించి చెప్పుట

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

SCERT AP 8th Class Biology Study Material Pdf 8th Lesson మొక్కల నుండి ఆహారోత్పత్తి Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Biology 8th Lesson Questions and Answers మొక్కల నుండి ఆహారోత్పత్తి

8th Class Biology 8th Lesson మొక్కల నుండి ఆహారోత్పత్తి Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం

ప్రశ్న 1.
గోధుమ పంటను రబీలోనే ఎందుకు పండిస్తారో కారణాలు చెప్పండి.
జవాబు:

  1. చాలా మొక్కలు పుష్పించుటకు, రాత్రి సమయానికి దగ్గర సంబంధం ఉంటుంది.
  2. గోధుమ మొక్కలు పుష్పించుటకు రాత్రి సమయం సుమారుగా 12 గంటలు కావాలి.
  3. గోధుమపంట సాగు రబీలో అనగా (అక్టోబర్, నవంబర్ మధ్య) మొదలు పెడితే అవి పుష్పించుటకు 8-10 వారాలు పట్టును.
  4. జనవరి చివరి నుంచి ఫిబ్రవరి వరకు రాత్రి సమయం సుమారుగా 12 – గంటలు ఉంటుంది.
  5. కాబట్టి గోధుమపంటను రబీలోనే సాగుచేస్తారు.

ప్రశ్న 2.
రామయ్య తన పొలాన్ని చదునుగా దున్నాడు. సోమయ్య పొలం హెచ్చుతగ్గులు ఉంది. ఎవరు అధిక దిగుబడి సాధిస్తారు? ఎందుకు ?
జవాబు:
రామయ్య ఎక్కువ దిగుబడి సాధిస్తాడు. కారణం నేలను చదును చేయడం వలన పొలంలో నీరు అన్నివైపులకు సమానంగా ప్రసరించును. పొలంలో వేసిన పశువుల ఎరువు కూడా సమానంగా నేలలో కలిసి అన్ని మొక్కలకు అందును. విత్తనాలు వేయుటకు లేదా నారు మొక్కలు నాటడానికి వీలుగా ఉండును.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 3.
పొలాన్ని దున్నడం వల్ల ప్రయోజనాలేమిటి ?
జవాబు:
పొలాన్ని దున్నడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి :

  1. మట్టి మృదువుగా మారడం వల్ల నేల లోపల నీరు చాలాకాలం నిల్వ ఉంటుంది.
  2. వేళ్ళు నేలలోకి సులభంగా చొచ్చుకొని పోవడానికి వీలు అగును.
  3. వేళ్ళకు శోషించడానికి అవసరమైన గాలి, నీరు నేలలోకి సులభంగా చేరును.
  4. రైతులకు ఉపయోగపడే సూక్ష్మజీవులు, వానపాములు వంటివి మెత్తటి మృదువైన మట్టిలో బాగా పెరుగుతాయి.
  5. నేలను దున్నడం వల్ల నేల లోపల ఉన్న కొన్ని రకాల అపాయకరమైన సూక్ష్మజీవులు, క్రిమికీటకాల గ్రుడ్లు బయటికి వచ్చి సూర్యుని వేడికి నశించును.

ప్రశ్న 4.
నేనొక మొక్కను, నేను పంటపొలాల్లో పెరుగుతాను. రైతులు నన్ను చూస్తేనే పీకేస్తారు. కారణం ఎందుకో నాకు తెలియదు. నీవు చెప్పగలవా ? నేనెవరిని ?
జవాబు:
నీవు పొలాల్లో సాగు మొక్కలతో బాటు పెరిగే కలుపుమొక్కవి. రైతులు నిన్ను చూస్తేనే పీకేస్తారు. కారణం సాగు మొక్కలతో ఆశ్రయం కోసం, ఆహారం కోసం పోటీపడతావు. వాటికి చేరవలసిన పోషక పదార్థాలు నీవు గ్రహిస్తావు. అంతేకాకుండా వ్యాధుల వ్యాప్తిలో కూడా పాత్ర పోషిస్తావు.

ప్రశ్న 5.
రైతులు వరిపంటను కోసిన తర్వాత ఎండలో ఎందుకు ఆరబెడతారు. ఎందుకు ?
జవాబు:
రైతులు వరిపంటను కోసిన తర్వాత ఎండలో ఎందుకు ఆరబెడతారంటే దాని కాండంలోను, ఆకులలోను, కంకులలోను ఉన్న తేమ పోవటం కోసం. కాండంలోను, ఆకులలోను తేమ పోకపోతే కుప్పగా వేసిన తర్వాత వాటినుండి ఆవిరి వచ్చి కంకులలో ఉండే ధాన్యం రంగు మారుతుంది.
కంకులలో ఉండే తేమ పోకపోతే కంకులకు బూజు (శిలీంధ్రాలు) పడుతుంది.

ప్రశ్న 6.
వేసవి దుక్కులు అంటే ఏమిటి ? ఇవి పర్యావరణానికి ఏ విధంగా మేలుచేస్తాయో రాయండి.
జవాబు:
రైతులు వేసవికాలంలోనే తమ పొలాలను దున్నుతారు. వీటిని వేసవి దుక్కులు అంటారు. వాటివలన గాలి మట్టి రేణువుల మధ్య చేరును. అందువలన నేల గుల్లబడును. అంతేకాకుండా నేలలో క్రిములు, సూక్ష్మజీవులు కూడా నశించును. కాబట్టి పంటలు వేసినప్పుడు వ్యాధులు తక్కువగా వచ్చును. దీనివలన క్రిమిసంహారక మందులు తక్కువగా వాడుట జరుగును. ఈ విధంగా వేసవి దుక్కులు పర్యావరణానికి మేలు చేస్తున్నాయి.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 7.
గ్రామంలో రైతులందరూ ఒకే రకమైన పంట వేశారు. దీని వలన కలిగిన నష్టాలు ఏమిటో వివరించండి.
జవాబు:
గ్రామంలో రైతులందరూ ఒకే రకమైన పంటలు వేయడం వలన చాలా నష్టాలు కలుగుతాయి. అవి :

  1. అందరూ ఒకే పంటవేస్తే విత్తన కొరత వచ్చును.
  2. అందరూ వరి వేస్తే నీటి సమస్య వచ్చి జీవరాసులపై ప్రభావం చూపును.
  3. అందరికీ ఒకే ఎరువులు కావాలి. కాబట్టి వాటి ధర కూడా పెరుగును.
  4. ఒక పొలంలో వ్యాధులు సోకితే మిగతా పొలాలకు కూడా చాలా తొందరగా వ్యాధులు వ్యాపించును. దీనివలన జీవవైవిధ్యానికి ఆటంకం వచ్చును.
  5. ఒకవేళ, అందరికీ పొలాలు బాగా పండి పంట దిగుబడి ఎక్కువ వస్తే అమ్మకపు ధర పడిపోవును.
  6. అమ్మకపు ధర తగ్గితే రైతు నష్టపోవును.

ప్రశ్న 8.
రాత్రి కాలానికి, పంట దిగుబడికి సంబంధం ఏమిటి ?
జవాబు:
రాత్రి కాలానికి, పంట దిగుబడికి చాలా దగ్గర సంబంధం గలదు. మొక్క పుష్పించడం రాత్రికాల సమయం పై ఆధారపడి ఉంది. ఉదా : కొన్ని మొక్కలు రాత్రికాల సమయం 12 1/2 గంటలు ఉన్నప్పుడు మాత్రమే అధికంగా పుష్పించును. ఉదా: గోధుమ.
మరికొన్ని మొక్కలు రాత్రికాల సమయం 12 1/2 గంటలు కన్నా ఎక్కువ ఉన్నప్పుడే బాగా పుష్పిస్తాయి. ఉదా : జొన్న, ప్రత్తి.
పుష్పించిన తర్వాత పరాగ సంపర్కం జరుగును. పరాగ సంపర్కం జరిగిన తర్వాత ఫలదీకరణ జరుగును. ఫలదీకరణ తర్వాత పుష్పాలు కాయలుగా మారును. కాసిన దానిని బట్టే పంట దిగుబడి ఉండును.

ప్రశ్న 9.
విత్తనాలు నేలలో విత్తే ముందర శిలీంధ్ర నాశకాల వంటి రసాయనిక పదార్థాలతో శుద్ధి చేస్తారు. ఎందుకు ?
జవాబు:
విత్తనాలు నేలలో విత్తే ముందర శిలీంధ్ర నాశకాల వంటి రసాయనిక పదార్థాలతో శుద్ధి చేస్తారు. ఎందుకంటే నేలలో ఉన్న ఏవైనా శిలీంధ్రాలు, ఇతర సూక్ష్మజీవుల నుండి విత్తనాలను రక్షించుకొనుటకు రసాయనిక పదార్థాలతో శుద్ధి చేస్తారు.

ప్రశ్న 10.
నారు పోసి పెంచి వాటిని తిరిగి పొలాల్లో నాటే పద్ధతిలో పెంచే పంటలకు ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
1. వ్యవసాయంలో కొన్ని పంటలను నారు పోసి పెంచి తిరిగి పంట పొలాల్లో నాట్లు వేస్తారు.
2. ఈ పద్ధతిని ప్రధానంగా వరి పంటలో పాటిస్తారు.
3. వరితో పాటుగా, మిరప, వంగ, టమోటా, పొగాకు వంటి పంటలలోనూ నాట్లు వేస్తారు.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 11.
సత్యనారాయణ తన పొలంలో ప్రత్తి పంట పండించాడు. అతనికి సరైన దిగుబడి రాలేదు. పంట దిగుబడి సరిగా రాకపోవడానికి గల కారణాలు ఊహించి చెప్పగలరా ? (లేదా) ఒక రైతు తన పొలంలో పత్తి పంట పండించాడు. పత్తి దిగుబడి సరిగా రాలేదు. దీనికి ఏవైనా నాలుగు కారణాలు ఊహించి రాయండి.
జవాబు:

  1. అతను వేసిన నేల ప్రత్తి పంటకు అంత అనుకూలంగా లేకపోవచ్చు.
  2. అతను పంటను రబీ సీజన్లో వేసి ఉండవచ్చు. దీనివలన అది పుష్పించుటకు కావలసిన రాత్రి సమయం (12 1/2 గంటల కంటే ఎక్కువ) ఉండదు.
  3. పొలాన్ని సరిగా దున్ని, చదును చేయకపోవచ్చు.
  4. ప్రత్తి పంటకు సరైన నీటి పారుదల వసతి కల్పించకపోవచ్చు.
  5. ప్రత్తి విత్తనాల ఎంపిక సరిగా చేయకపోవచ్చు.
  6. కలుపు మొక్కలను పత్తి పంట నుంచి తొలగించకపోవచ్చు.
  7. ప్రత్తి పంటకు. వ్యాధులు సోకిన గమనించక పోవచ్చు.
  8. ప్రత్తి పంటకు సరైన కాలంలో శిలీంధ్ర నాశకాలు ఉపయోగించటం జరగకపోవచ్చు.

ప్రశ్న 12.
రహీం తన పంట పొలంలో కలుపు మొక్కలను తొలగించాడు. కాని డేవిడ్ కలుపు తీయలేదు. ఎవరు అధిక దిగుబడి సాధిస్తారో ఊహించండి ? ఎందుకు ?
జవాబు:
డేవిడ్ ఎక్కువ దిగుబడి సాధిస్తాడు. కారణం కలుపు మొక్కలను పొలంలో కలియదున్నాడు. అవి మడి ఉన్న నీటిలో కుళ్లి పోతాయి. అప్పుడు వాటిలోని పోషక పదార్థాలు నేలలోకి చేరతాయి. అది జీవ ఎరువు వలె పని చేయును.

ప్రశ్న 13.
పిడికెడు శెనగలను నీళ్ళలో వేయండి. మీరేమి పరిశీలించారో కింది ప్రశ్నల ఆధారంగా విశ్లేషించండి.
ఎ) రెండు రకాల విత్తనాల్లో మీరేమి తేడాను గమనించారు ?
బి) ఏ విత్తనాలు తక్కువ బరువు కలిగి ఉన్నాయి ? ఎందుకు ?
సి) ఏ విత్తనాలు బాగా మొలకెత్తాయి? ఎందుకు ?
డి) ఏ విత్తనాలు సరిగా మొలకెత్తవు ? ఎందుకు ?
జవాబు:
ఎ) కొన్ని విత్తనాలు నీటిపై తేలుతున్నాయి. కొన్ని విత్తనాలు నీటిలో మునిగిపోయాయి.
బి) కీటకాలు విత్తనం లోపల గల ఆహార పదార్థాలు తినుట వలన పుచ్చులు ఏర్పడి తక్కువ బరువు కలిగి ఉన్నాయి.
సి) నీటిలో మునిగి నీటిని బాగా పీల్చుకున్న విత్తనాలు బాగా మొలకెత్తాయి. కారణం పోషక పదార్థాలలో ఉన్న షుప్తావస్థ మేలుకోవడం వలన.
డి) నీటిపై తేలిన విత్తనాల లోపల పోషక పదార్థాలు తక్కువగా ఉండబట్టి సరిగా మొలకెత్తవు.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 14.
వరి (వడ్ల గింజలు) విత్తనాలు తీసుకొని ఒక రోజంతా నానబెట్టండి. వాటిని వాచ్ గ్లాస్ లో తీసుకొన్న మట్టిలో నాటండి. మొలకెత్తిన తర్వాత భూతద్దంలో పరిశీలించి ప్రథమమూలం, ప్రథమ కొండం మొదలైన భాగాలు గుర్తించి, పటం గీయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 1

ప్రశ్న 15.
మీ దగ్గరలోని ఎరువుల దుకాణానికి వెళ్ళి రసాయనిక ఎరువుల వివరాలు సేకరించి కింది పట్టికలో నింపండి.
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 2
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 3

ప్రశ్న 16.
వరి పంటలో నాటడం నుండి దాచడం వరకు ఉన్న వివిధ దశలను వివరించే ఫ్లోచార్టును తయారు చేయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 4
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 5

ప్రశ్న 17.
తక్కువ నీటి లభ్యత గల ప్రాంతాలలో అనుసరించే నీటిపారుదల పద్ధతులను నీవెలా ప్రశంసిస్తావు?
జవాబు:

  1. తక్కువ నీటి లభ్యత గల ప్రాంతాలలో నీటిని పొదుపుగా వాడుకోవటానికి బిందు సేద్యం, స్ప్రింక్లర్స్ వంటి పరికరాలు ఉపయోగిస్తారు.
  2. వీటి వలన చాలా తక్కువ నీటితో వ్యవసాయం చేయవచ్చును.
  3. శాస్త్ర విజ్ఞానం అందించిన ఈ పద్దతులు నాకు బాగా నచ్చాయి.
  4. ఈ పద్దతుల వినియోగం వలన నీటికొరత ప్రాంతాలు ఆర్థికంగా బలపడ్డాయి.
  5. వీటి వినియోగం వలన సహజవనరు అయిన నీరు ఆదా చేయబడుతుంది.
  6. ప్రజల జీవన విధానాన్ని మెరుగుపర్చే ఇటువంటి పద్ధతులు అభినందనీయమైనవి.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 18.
నరేంద్ర ప్రత్తిపంటపై అధిక మోతాదులో క్రిమిసంహారక మందులు చల్లాడు. ఇది జీవవైవిధ్యానికి, పంట దిగుబడికి ఎంతో హానికరం అని రమేష్ అన్నాడు. నీవు రమేష్ చెప్పిన దానితో ఏకీభవిస్తున్నావా ? ఎందుకు ?
జవాబు:
నేను రమేష్ చెప్పిన దానితో ఏకీభవిస్తాను. ఇది జీవవైవిధ్యానికి, పంట దిగుబడికి ఎంతో హానికరం. అధిక మొత్తంలో క్రిమిసంహారక మందుల వలన హానికరమైన కీటకాలతో బాటు పరాగ సంపర్కానికి సహాయపడు కీటకాలు మరణించును. పరాగ సంపర్కం జరగకపోతే ఫలదీకరణం జరగదు.

అప్పుడు పంట దిగుబడి తగ్గును. క్రిమిసంహారక మందుల వలన కొన్ని కీటక జాతులు అంతరించిపోవును. అప్పుడు ఆ కీటకాలను తిని బ్రతికే జీవులు అంతరించిపోవును. ఆ విధంగా జరిగితే ఆహారపు గొలుసు అస్తవ్యస్తం అగును. ఇది జీవవైవిధ్యంపై ప్రభావం చూపును.

ప్రశ్న 19.
వెంకటేష్ వరిపంటకు నీళ్లను పెట్టే పద్ధతిని చూశాడు. తాను కూడా మొక్కజొన్న పంటకు ఇలాగే నీళ్లను పెట్టాలనుకున్నాడు. నీవు అతనికి ఏ సూచనలు, సలహాలు ఇస్తావు ?
జవాబు:
వెంకటేష్ కు మొక్కజొన్న పంటకు, వరిపంటకు నీళ్ళు పెట్టే విధంగా పెట్టవద్దు అని నేను సూచన చేస్తాను. ఇంకా అతనికి మొక్కజొన్న అనేది. మెట్ట పంట మరియు వర్షాధారపు పంట అని, వరిపంటకు అవసరమైనంత నీళ్ళు మొక్కజొన్నకు అవసరం లేదు అని సలహా ఇస్తాను.

8th Class Biology 8th Lesson మొక్కల నుండి ఆహారోత్పత్తి InText Questions and Answers

కృత్యములు

ప్రశ్న 1.
భారతదేశ పటం చూడండి. మన దేశంలో ఏ ఏ పంటలు ఎక్కడెక్కడ పండిస్తున్నారో పరిశీలించి రాయండి. (అవసరమైతే అట్లాసును కూడా ఉపయోగించుకోండి.)
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 6
జవాబు:
వరి : అసోం, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పంజాబ్, హర్యానా, కాశ్మీర్
గోధుమ : ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర
మొక్కజొన్న : రాజస్థాన్, పంజాబ్, జమ్మూకాశ్మీర్, కర్ణాటక, గుజరాత్
జొన్న : రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్
పప్పుధాన్యాలు: మధ్యప్రదేశ్, బీహార్, పంజాబ్, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్
చెరకు : ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్
జనపనార : పశ్చిమబెంగాల్, బీహార్, ఒడిశా, అసోం
కొబ్బరి : కేరళ
ప్రత్తి : కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్
టీ : కర్ణాటక, అసోం, మణిపూర్

1. మన దేశంలోని అన్ని ప్రాంతాలలో పండే పంటలు ఏవి ?
జవాబు:
వరి, గోధుమ, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, ప్రత్తి.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

2. కొన్ని పంటలను అన్ని ప్రాంతాలలోనూ ఎందుకని పండించగలుగుతున్నారు ?
జవాబు:
సారవంతమైన భూమి, నీరు లభ్యత వలన.

3. పై పట్టికలో మీ ఊళ్ళో పండే పంటలు ఏవో గుర్తించి రాయండి.
జవాబు:
వరి, చెరకు, మొక్కజొన్న, పెసలు.

4. మీ సాంఘికశాస్త్ర పాఠ్యపుస్తకాన్ని గాని, గ్రంథాలయంలోని పుస్తకాలను గాని చూసి వివిధ ప్రదేశాలలో ప్రధానంగా పండే పంటలు జాబితా తయారుచేయండి.
జవాబు:
దేశం : వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న.
రాష్ట్రం : వరి, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, ప్రత్తి, చెరకు, జనపనార జిల్లా : వరి, చెరకు, మామిడి, అరటిపండు
మీ గ్రామం : వరి, చెరకు (గమనిక : ఏ గ్రామ విద్యార్థులు అక్కడ పండే పంటలు సేకరించి రాసుకోవాలి.)

ప్రశ్న 2.
మీ గ్రామంలోని రైతులను అడిగి ఏ పంటలు పండడానికి ఎంతకాలం పడుతుందో వివరాలు సేకరించండి. కింది పట్టికలో రాయండి.
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 7

1. పంటలు పండుటకు ఎంత కాలం పడుతుంది ?
జవాబు:
సుమారుగా 100 రోజుల లోపు నుంచి దాదాపుగా 365 రోజులు పడుతుంది.

2. అన్ని పంటలు పండడానికి పట్టేకాలం ఒక్కటేనా ?
జవాబు:
కాదు.

3. మీకు తెలిసిన పంటలలో ఏ పంట పండడానికి ఎక్కువ సమయం పడుతుంది ?
జవాబు:
చెరకు

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

3. పంటలను ఎప్పుడు పండిస్తారు ?

ప్రశ్న 1.
మనం రకరకాల పండ్లు, కూరగాయలు తింటుంటాం. సంవత్సరం పొడవునా అన్ని రకాల పండ్లు, కూరగాయలు మనకు లభిస్తాయా ? కొన్ని కాలాల్లో అధికంగాను, కొన్ని కాలాల్లో తక్కువగాను లభిస్తాయి. కొన్ని ఒక ప్రత్యేక రుతువులో తప్ప మిగిలిన సమయాల్లో అసలు లభించవు. జట్టులో చర్చించి ఏ కాలంలో ఏవి లభిస్తాయో కింది పట్టికలో రాయండి.
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 8

1. ఏ కాలంలో ఎక్కువ రకాల కూరగాయలు మనకు మార్కెట్లలో లభిస్తాయి ? ఎందుకు ?
జవాబు:
వర్షాకాలంలో వర్షపు నీరు వలన.

సాధారణంగా రైతులు వర్షాకాలంలోనే వివిధ రకాల కూరగాయలు పండిస్తారు. కారణమేమిటో ఊహించి చెప్పగలరా ?
జవాబు:
కావలసినంత నీరు లభిస్తుంది. కాబట్టి.

ప్రశ్న 4.
కింది ఫోను చూడండి. ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి.
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 9

1. రబీ సీజన్లోనే గోధుమ పంటను ఎందుకు సాగుచేస్తారు ?
జవాబు:
ఫిబ్రవరి నెలలో వాతావరణం వేడిగా ఉంటుంది. గింజ అభివృద్ధి చెందడానికి ఇది సరైన సమయం. గోధుమ పుష్పించడానికి రాత్రి కాల సమయం తక్కువగా ఉండటంతో పాటు విత్తనాలు ఏర్పడటానికి తగినంత వేడి కూడా వాతావరణంలో ఉండటం అవసరము. అందుకే గోధుమపంటను రబీ సీజన్ లోనే సాగుచేస్తారు.

2. సెప్టెంబరు నెలలో సాగుచేస్తే ఏం జరుగుతుంది ?
జవాబు:
సెప్టెంబరులో సాగుచేస్తే అవి పుష్పించుటకు 8 నుండి 10 వారాలు పట్టును. అనగా జనవరిలో పుష్పించుట జరుగును. రాత్రి సమయం ఎక్కువగా అనగా 12 1/2 గంటలు ఉంటుంది. కాబట్టి పుష్పాలు సరిగా రావు. పంట దిగుబడి తగ్గుతుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

3. ఎందుకు ఖరీఫ్ సీజన్లో గోధుమపంట సాగు చేయరు ?
జవాబు:
అవి పుష్పించుటకు కావల్సినంత రాత్రి సమయం ఉండదు కాబట్టి.

4. గోధుమ పంటను నవంబర్ లో సాగుచేస్తే ఏమవుతుంది ?
జవాబు:
గోధుమ పంటను నవంబర్ లో సాగుచేస్తే పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది. కారణం ఫిబ్రవరిలో రాత్రి కాల సమయం తక్కువగా ఉండి, విత్తనాలు ఏర్పడటానికి తగినంత వేడి కూడ వాతావరణంలో ఉండును.

5. గింజలు బలంగా పెరగడానికి తగినంత ఉష్ణోగ్రత అవసరం. మరి మనకు ఎప్పుడు వేడి అధికంగా ఉంటుంది ?
జవాబు:
రబీ సీజన్లో వేడిమి ఎక్కువగా ఉంటుంది.

5. వరిసాగు

ప్రశ్న 5.
మీ దగ్గరలోని రైతులను అడిగి వివరాలు సేకరించి కింది పట్టిక నింపండి.
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 10

1. ఏ కాలంలో రైతులు అధిక ఫలసాయం, ఆదాయం పొందుతున్నారు ?
జవాబు:
ఖరీఫ్ కాలంలో.

2. మంచి పరిమాణంలో ఉండే గింజలు ఏ కాలంలో వస్తాయి ? రబీలోనా ? ఖరీఫ్ లోనా ?
జవాబు:
ఖరీఫ్ లో.

3. మూడవ పంట గురించి తెలుసా ? మన రాష్ట్రంలో మూడవ పంటగా వేటిని పండిస్తారు ?
జవాబు:
తెలుసు. అపరాలను మన రా” లో 3వ పంటగా పండిస్తారు.

4. ఖరీఫ్, రబీ రెండు కాలాలలోనూ పండే పంటలు ఏమిటి ?
జవాబు:
వరి.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

5. రబీ సీజన్ కంటే ఖరీఫ్ సీజన్లో అధిక దిగుబడి ఎక్కువగా ఉంటుంది. దీన్ని మీరు అంగీకరిస్తారా ? అయితే కారణాలు చెప్పండి.
జవాబు:
అంగీకరిస్తాను. కారణాలు ఖరీఫ్ సీజన్ లో వరి మొక్కల పెరుగుదలకు అవసరమైనంత నీరు లభించును. వేడిమి తక్కువగా ఉండును

6. మంచి విత్తనాలను వేరు చేయడం, ఎంపిక చేయడం ఎలాగో మీకు తెలుసా ?

ప్రశ్న 6.
గుప్పెడు శనగ విత్తనాలను తీసుకొని బక్కెట్లోని నీళ్లలో వేయండి. కొన్ని విత్తనాలు నీళ్ళపై తేలుతాయి. నీళ్ళపై తేలిన విత్తనాలన్నింటిని తీసివేయండి. నీళ్ళలో మునిగిన వాటిని అలాగే ఒక రోజంతా ఉంచండి. మరుసటి రోజు వీటిని ఆరబెట్టి గిన్నెలోగాని, పాత్రలోగాని వేసి మూత పెట్టి తగినంత వేడిగా ఉండే చీకటి గదిలో ఉంచండి. 2 లేక 3 రోజుల తర్వాత విత్తనాలను పరిశీలించండి. ఏం జరిగినది ? నీవెప్పుడైనా మొలకెత్తిన గింజల్ని తిన్నావా ?
జవాబు:
శనగ విత్తనాల నుంచి మొలకలు రావడం జరిగినది. నేను చాలాసార్లు మొలకెత్తిన గింజలు తిన్నాను.

1. ఎందుకు కొన్ని విత్తనాలు నీళ్ళపై తేలాయి ?
జవాబు:
కొన్ని విత్తనాలు నీళ్ళపై తేలుతాయి. కారణం అవి పుచ్చు విత్తనాలు అయి ఉండటం వలన విత్తనం లోపల ఖాళీగా ఉండి నీటికన్న తక్కువ సాంద్రత ఉంటాయి. అందుకని నీటిపై తేలుతాయి.

2. తేలిన విత్తనాలను ఎందుకు తీసి వేయాలి ?
జవాబు:
తేలిన విత్తనాలకు మొలకెత్తే సామర్థ్యం ఉండదు కాబట్టి వాటిని తీసివేయాలి.

3. విత్తనాలను ఒక రోజంతా నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి ?
జవాబు:
విత్తనాలను ఒక రోజంతా నీళ్ళలో నానబెట్టడం వలన విత్తనం తేమగా అయ్యి విత్తనాలకు అంకురించే శక్తి వస్తుంది.

7. ఒక గ్లాసులో నీళ్ళు తీసుకోండి. ఒక పిడికెడు గింజల్ని నీళ్ళలో వేయండి. కొన్ని విత్తనాలు నీళ్ళపై తేలుతాయి. వాటిని వేరుచేసి భూతద్దంలో పరిశీలించండి. నీటమునిగిన గింజలకు, తేలిన గింజలకు గల పోలికలు, భేదాలను గుర్తించి మీ పరిశీలనలను కింది పట్టికలో ‘✓’ గుర్తు పెట్టండి.
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 11

1. పై రెండు రకాల గింజల్లో ఏవైనా తేడాలను మీరు గుర్తించారా ?
జవాబు:
పై రెండు రకాల గింజల్లో తేడాలను మేము గమనించాము.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

2. నీళ్ళపై తేలిన విత్తనాలు తక్కువ బరువు ఎందుకున్నాయో చెప్పగలరా ?
జవాబు:
లోపల పోషక పదార్థాలు లేక ఖాళీగా ఉండడం వలన.

8. ఎంపిక మరియు మొలకెత్తుట

నీళ్ళలో తేలిన విత్తనాలను, మునిగిన విత్తనాలను వేరువేరుగా కుండీల్లో నాటండి. రెండు కుండీల్లోనూ సమానంగా నీరు పోయండి. రెండు కుండీల్లోని మొక్కల పెరుగుదలను పరిశీలించండి. నివేదిక తయారుచేయండి.
తేలిన విత్తనాలు : ఇవి వేసిన కుండీలో మొక్కలు సరిగా రాలేదు. పెరుగుదల తక్కువగా ఉంది.
మునిగిన విత్తనాలు : ఇవి వేసిన కుండీలో మొక్కలు బాగా వచ్చాయి. పెరుగుదల కూడా చాలా బాగుంది.

1. ఏ గింజలు బాగా మొలకెత్తినాయి ? ఎందుకు ?
జవాబు:
నీటిలో మునిగిన విత్తనాలు. కారణం లోపల ఉన్న పోషక పదార్థాలు ఉత్తేజితం అయి విత్తనాలు మొలకెత్తుటకు కావలసిన
శక్తిని ఇస్తుంది.

2. ఏ గింజలు సరిగా మొలకెత్తలేదు ? ఎందుకు ?
జవాబు:
నీటిపై తేలిన గింజలు. కారణం పోషక పదార్థాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి విత్తనాలు మొలకెత్తుటకు కావలసిన శక్తి సరిగా రాదు.

3. అన్ని రకాల పంట గింజలను ఇలాగే పరీక్ష చేస్తారా ?
జవాబు:
అవును, ఇలాగే పరీక్ష చేస్తారు.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

9. ఏ విత్తనాలను ఏ ఏ పద్ధతుల్లో నాటుతారో రైతుల నుండి వివరాలు సేకరించి కింది పట్టికలో నింపండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 12

1. ఒక ఎకరా వరి పంట పండించడానికి ఎన్ని కిలోల వరి గింజలు అవసరమో నీకు తెలుసా ?
జవాబు:
సుమారు 25 కేజీలు.

2. అన్ని రకాల వరి పంటలకు ఇదే పరిమాణంలో అవసరమవుతాయా ?
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 13
జవాబు:
అన్ని రకాల వరి పంటలకు ఇదే పరిమాణంలో అవసరమవ్వవు.
ఉదా : నాటే పద్ధతి – 20 – 25 కేజీలు,
వెదజల్లటానికి – 24 – 30 కేజీలు
శ్రీ పద్ధతి – 2 కేజీలు

3. తక్కువ వితనాలు ఉపయోగించి వరిసాగు చేసే పదతులు ఏమైనా ఉన్నాయా ? విత్తనాలు చెత చల్లటం
జవాబు:
ఉన్నది. ఆ పద్ధతి శ్రీ పద్ధతి.

4. విత్తనాలను నేలలో విత్తిన తరువాత మట్టితో ఎందుకు కప్పుతారు ?
జవాబు:
విత్తనాలను నేలలో విత్తిన తరువాత మట్టితో కప్పుటకు కారణాలు మట్టి నుండి వాటికి కావలసిన తేమను, వేడిమిని పొందుటకు మరియు గుల్లగా ఉన్న నేల నుండి గాలిని తీసుకొనుటకు. మట్టిలో విత్తిన తర్వాత కప్పకపోతే పక్షులు, ఇతర జంతువులు ఆ విత్తనాలను తినేస్తాయి.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

10. నలుగురైదుగురు విద్యార్థులతో జట్లుగా ఏర్పడండి. మీ దగ్గరలోని పొలంలో మందులు ‘చల్లుతున్న రైతులను అడిగి ఏ ఏ పంటలకు ఏ ఏ వ్యాధులు ఎలా వస్తాయి ? వాటిని ఎలా అదుపు చేస్తారు ? ఏ మందులు చల్లుతారు ? వంటి వివరాలు సేకరించి కింది పట్టికలో నింపండి. వ్యాధి పేరు తెలియకపోతే దానిని స్థానికంగా ఏమంటారో రాయండి.
పంటలకు (వరి, వేరుశనగ, చెరకు, మినుము) ముఖ్యంగా అగ్గితెగులు, టిక్కా, ఆకుపచ్చ తెగులు, తుప్పు తెగులు బూడిద తెగులు.
ముఖ్యంగా వ్యాధులు బాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్లు కొన్ని రకాల కీటకాల వలన వచ్చును.
పంట పేరు, పరిశీలించిన వ్యాధులు, ఉపయోగించిన క్రిమిసంహారక మందులు, ఫలితాలు క్రింది పట్టికలో ఉన్నాయి.
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 14

1. అందరు రైతులు ఒకే రకమైన పంటపైన ఒకే రకమైన మందులే చల్లుతున్నారా ?
జవాబు:
చల్లరు. అది వాళ్ళ ఇష్టం. ఉదాహరణకు వరి అగ్గి తెగులుకు ట్రైసైక్లోజన్ 75% లేదా ఎడిఫెన్ పాస్ 1 మి.లీ. ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తారు.

2. అన్ని రకాల పంటల్లో సాధారణంగా కనిపించే వ్యాధి ఏదో గుర్తించావా ?
జవాబు:
రసంపీల్చే పురుగు వ్యాధి.

3. రైతులు క్రిమి సంహారక మందులను ఎక్కడ కొనుక్కుంటారు ?
జవాబు:
ఎరువులు మరియు క్రిమి సంహారక మందులు అమ్మే కొట్టులో కొనుక్కుంటారు.

4. మందులు చల్లడానికి వారు ఎలాంటి పనిముట్లను వాడుతున్నారు ?
జవాబు:
నాక సాక్ స్ప్లేయర్, గటార్ ప్రేయర్, తైవాన్ ప్రేయర్, పవర్ స్ప్లేయర్, రోటరీ డస్టర్.

5. క్రిమి సంహారక మందులు చల్లినప్పుడు క్రిమికీటకాలతో పాటు ఇంకా ఏవైనా చనిపోయినట్లు నీవు గుర్తించావా ? అయితే అవి ఏమిటి ?
జవాబు:
క్రిమిసంహారక మందులు చల్లినప్పుడు క్రిమికీటకాలతో పాటు పరాగ సంపర్కంకు సహాయపడు జీవులు చనిపోయినట్లు నేను గుర్తించితిని. అవి తూనీగలు, సీతాకోక చిలుకలు.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

11. మీ పాఠశాల తోటలోని మొక్కలను పరిశీలించండి. మొక్కల ఆకులు, కాండాలను జాగ్రత్తగా పరిశీలించి కింది వివరాలు సేకరించండి. లక్షణం ఉంటే “✓” లేకపోతే “×” పెట్టండి. లక్షణం
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 15
పంటపేరు /మొక్క పేరు : వేరుశనగ స్థలం : మొక్కలలోని ఆకులపైన

1. మొక్కలోని అన్ని ఆకులపైనా మచ్చలున్నాయా ?
జవాబు:
ఉన్నాయి.

2. మచ్చలతో ఉన్న ఆకు బొమ్మను మీ నోటు పుస్తకంలో గీయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 16

3. ఆకుల అంచులు కత్తిరించబడినట్లుగా ఉండడానికి కారణమేమి ?
జవాబు:
చీడల వలన ఆకులు అంచులు కత్తిరించబడినట్లు ఉండును.

4. కాండంపై ఉండే చారలు, ఆకులపై ఉండే మచ్చలు ఒకేలా ఉన్నాయా ?
జవాబు:
ఒకేలా ఉన్నాయి.

5. ముడుచుకొనిపోయిన ఆకుల్లో ఏవైనా కీటకాలను గుర్తించావా ? అయితే అవి ఏమిటి ?
జవాబు:
కీటకాలు ఉన్నాయి అవి రసం పీల్చే పురుగులు, రెక్కల పురుగులు.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

6. ఆకుల మచ్చలపై ఉన్న పొడిలాంటి పదార్థాన్ని సేకరించండి. దాన్ని సూక్ష్మదర్శిని కింద పరిశీలించండి. మీరేం గమనించారో మీ నోటుపుస్తకంలో రాయండి.
జవాబు:
ఆకుల మచ్చలపై ఉన్న పొడిలాంటి పదార్థాన్ని సేకరించితిని. దాన్ని సూక్ష్మదర్శిని కింద పరిశీలించితిని. అప్పుడు ఆ పొడిలో శిలీంధ్రం యొక్క తంతువులు, స్పోర్సు కనిపించాయి.

12. చీడ పీడల్ని నియంత్రించే పద్ధతులు

ప్రశ్న 1.
మీ గ్రామంలోని రైతులు వివిధ పంటల్లో వచ్చే క్రిమి కీటకాలను అదుపు చేయడానికి వివిధ రకాల కీటక నాశనులు ఉపయోగిస్తుంటారు. ఇందుకోసం రకరకాల పద్ధతులను ఉపయోగిస్తారు. మీ పెద్దలను కాని), రైతులను కాని అడిగి ఏ ఏ పురుగు మందులను కింది పద్ధతుల్లో ఉపయోగిస్తారో తెలుసుకొని రాయండి.
జవాబు:
1. స్పేయర్ తో చల్లడం : మోనోక్రోటోపాస్, ప్రొఫేనోపాస్, నూవాన్, స్పైనోఫాడ్
2. పొడి మందులు చల్లడం : మిథైల్ థెరాఫియాన్, ఫాలిడాల్
3. నేలలోపల ఉంచడం : కార్బొప్యూరాన్, కార్టాక్ హైడ్రోక్లోరైడ్
4. కాల్చడం, పీకివేయడం : వైరల్ కి సంబంధించిన వ్యాధులలో పొలాల నుంచి ,రోగకారక మొక్కలను కాల్చడం, పీకివేయడం చేస్తారు.
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 17

13. రైతులు పంటలకు నీళ్ళెప్పుడు పెడతారు ?

ప్రశ్న 1.
మీ దగ్గరలోని రైతులను అడిగి ఏ ఏ పంటలకు నీళ్ళను ఎప్పుడెప్పుడు పెడతారో తెలుసుకొని కింది పట్టిక నింపండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 18

ప్రశ్న 2.
అన్ని పంటలకు నీళ్ళు ఒకేసారి అందిస్తారా ?
జవాబు:
లేదు.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

14. మీ దగ్గరలోని తోటకు వెళ్ళి స్ప్రింక్లర్, డ్రిప్ ఇరిగేషన్ పద్ధతులను పరిశీలించండి. ఈ పద్ధతిలో ఉపయోగించే పరికరాలు పనిముట్లు వాటిని అమర్చిన విధానం, నీటిని పంపిణీ చేసే విధానం, ఈ పద్ధతి వల్ల కలిగే లాభాలు, నష్టాలు మొదలగు వివరాలతో నివేదిక తయారుచేయండి. ఇందుకోసం అక్కడి రైతులను కలిసి మాట్లాడండి. వివరాలు సేకరించండి.
జవాబు:
స్ప్రింక్లర్ పద్ధతి :
ఎ) పరికరాలు & పనిముట్లు : మోటారు, గొట్టాలు, గుండ్రంగా తిరిగే స్ప్రింక్లర్స్, కవాటాలు, నాజిల్స్.
బి) వాటిని అమర్చిన విధానం మరియు నీటిని పంపిణీ చేయు విధానం : నీరు ఉన్న ప్రాంతాలలో గొట్టాలు అమర్చి ఒక మోటారు సహాయంతో నీరు బయటకు తెచ్చి పొలంలో లంబంగా అమర్చబడిన గొట్టాలకు గుండ్రంగా తిరిగే స్ప్రింక్లిల్స్ ద్వారా నీటిని పొలంలో వెదజల్లుతారు.
డ్రిప్ ఇరిగేషన్ (బిందు సేద్యం) : నీరు ఉన్న ప్రాంతాలలో గొట్టాలు అమర్చి ఒక మోటారు సహాయంతో నీరు బయటకు తెచ్చి పొలంలో సమాంతరంగా నిర్ణీత ప్రదేశాలలో రంధ్రాలు (మొక్క వేరుకు దగ్గరగా) చేయబడిన గొట్టాలు అమర్చి నీటి బిందువుల రూపంలో మొక్క వేరుకు సరఫరా చేస్తారు.
లాభాలు :
1. నీరు ఎక్కువగా అందుబాటులేని చోట
2. ఎత్తు పల్లాలుగా ఉన్న భూమిలో
3. ఇసుక నేలలకు ఈ పద్దతి బాగా ఉపయోగపడును.

నష్టాలు :
1. ఖర్చుతో కూడి ఉన్నది.
2. అన్ని రకాల పంటలకు అనుకూలం కాదు.

15. కలుపు మొక్కల సమాచారం :

ప్రశ్న 1.
మీ దగ్గరలోని రైతులను అడిగి ఏ ఏ పంటలలో ఏ ఏ కలుపు మొక్కలు పెరుగుతాయో తెలుసుకుని ఒక నివేదిక తయారు చేయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 19

16. మీ గ్రామంలోని చుట్టుప్రక్కల గాని, వివిధ పంటలకు పంట నూర్పిడి చేసే పద్ధతుల వివరాలు సేకరించి పట్టిక నింపండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 20

ఆలోచించండి – చర్చించండి

ప్రశ్న 1.
జపాన్లో అధిక దిగుబడి సాధించడానికి గల కారణాలేవి ? (పేజీ.నెం.118)
జవాబు:
జపాన్ వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు ఉపయోగించటం. జపాన్ అత్యధిక దిగుబడి వచ్చే వరి విత్తనాలు ఉపయోగించటం.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 2.
భారతదేశంలో తక్కువ దిగుబడి సాధించడానికి గల కారణాలేవి ? (పేజీ.నెం. 118)
జవాబు:
భారతదేశం వ్యవసాయ రంగంలో ప్రాచీన పద్ధతులు ఉపయోగించుట. వ్యవసాయంలోనికి చదువుకున్న వాళ్ళు రాకపోవటం.

ప్రశ్న 3.
నాగలి కర్రు పొడవుకి, విత్తటానికి ఏమైనా సంబంధం ఉందా ? (పేజీ.నెం. 119)
జవాబు:
లేదు.

ప్రశ్న 4.
మెట్ట పొలాల్లో కూడా నేలను ఇలాగే తయారు చేస్తారా ? (పేజీ.నెం. 119)
జవాబు:
మెట్ట పొలాల్లో కూడా నేలను ఇలాగే తయారు చేస్తారు.

ప్రశ్న 5.
నేలను దున్నడం వల్ల కలిగే ప్రయోజనాలేవి ? (పేజీ.నెం. 119)
జవాబు:
నేలను దున్నడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి :
1) మట్టి మృదువుగా మారడం వల్ల నేల లోపల నీరు చాలా కాలం నిల్వ ఉంటుంది.
2) వేళ్ళు నేలలోకి సులభంగా చొచ్చుకొనిపోవడానికి వీలు అగును.
3) వేళ్ళకు శోషించడానికి అవసరమైన గాలి, నీరు నేలలోకి సులభంగా చేరును.
4) రైతులకు ఉపయోగపడే సూక్ష్మజీవులు, వానపాములు వంటివి మెత్తటి మృదువైన మట్టిలో బాగా పెరుగుతాయి.
5) నేలను దున్నడం వల్ల నేల లోపల ఉన్న కొన్ని రకాల అపాయకరమైన సూక్ష్మజీవులు, క్రిమికీటకాల గుడ్లు బయటికి వచ్చి సూర్యుని వేడికి నశించును.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 6.
ఎందుకు ఈ చాళ్లు “v” ఆకారంలో ఏర్పడతాయి? నేలలో “V” ఆకారంలో చాళ్లు ఏర్పడటం వల్ల చాళ్ల వెంట నీళ్ళను పాగించడమే కాక ఇంకా ఏ ఏ రకాలుగా ఉపయోగపడుతుందో చెప్పండి. (పేజీ.నెం. 120)
జవాబు:
నాగలి చివర పదునైన ఇనుపబద్ధ (కర్ర) ఉంటుంది. నాగలితో చాళ్ళను చేయునపుడు ఈ కర్ర నేలలోనికి చొచ్చుకొని పోతుంది. అందువలన ఆ ప్రదేశంలో ఉన్న మట్టి కర్రుకు ఇరువైపులా గట్టురూపంలో ఏర్పడుతుంది. కనుక వాళ్ళు v ఆకారంలో ఏర్పడతాయి.

v ఆకారం చాళ్ళు వల్ల ఉపయోగములు :

1) ఈ చాళ్ళ వలన గాలి నీరు లోపలి మట్టి కణాల మధ్యకు సులభంగా చేరతాయి.
2) విత్తనాలను ఒక వరుస తరువాత ఒక వరుస విత్తుతుంటారు. ఆ సమయంలో మొదటి వరుస మట్టితో రెండవ వరుస మూసుకొనుటకు ఈ v ఆకారపు చాళ్ళు ఉపయోగపడును.

ప్రశ్న 7.
ఎరువుల కోసం రైతులు పోట్లాడుకోవడం, ఉద్యమాలు చేయడం మీరెప్పుడైనా చూశారా లేదా పత్రికల్లో చదివారా ? ఎందుకు ఇలా జరుగుతోంది ? ఎందుకు రైతులు ఎక్కువ ఎరువుల బస్తాలు కావాలని కోరుకుంటారు ? దీనికి సంబంధించిన మీ ఆలోచనలు చార్టు మీద రాసి గోడ పత్రికలో ప్రదర్శించండి. (పేజీ.నెం. 130)
జవాబు:
చూశాను మరియు పత్రికల్లో చదివాను. ఇలా జరుగుటకు కారణం ఎరువుల కొరత. రైతులు ఎక్కువ ఎరువుల బస్తాలు కావాలని ఎందుకు కోరుకుంటారు అంటే పంట దిగుబడి పెంచుటకు. దానికి సంబంధించిన నా ఆలోచనలు
1. రసాయనిక (కృత్రిమ) ఎరువులు తక్కువగా వాడటం.
2. జీవ (సహజ) ఎరువుల వాడకాన్ని పెంచటం.

పాఠ్యాంశంలోని ప్రశ్నలు

ప్రశ్న 1.
మూడవ పంట అన్ని ప్రాంతాలలో పండించకపోవడానికి కారణాలు ఏమిటో మీ ఉపాధ్యాయుడితో చర్చించండి. (పేజీ.నెం. 117)
జవాబు:
నీటి పారుదల వసతి లేకపోవడం. నేల సారాన్ని కోల్పోవడం.

ప్రశ్న 2.
వరి పండించే పొలాన్ని చిన్న చిన్న మడులుగా ఎందుకు చేస్తారు ? (పేజీ.నెం. 118)
జవాబు:
పంటకు నీరు అందించుట సులభంగా ఉంటుంది. కాబట్టి వరి పండించే పొలాన్ని చిన్న చిన్న మడుగులుగా చేస్తారు.

ప్రశ్న 3.
వరిని ఎలా పండిస్తారు ? (పేజీ.నెం. 121)
జవాబు:
వరిని నారుపోసి, నాట్లు వేసి చిన్న చిన్న మడులలో పండిస్తారు.

ప్రశ్న 4.
మీ పెద్దలను గాని, రైతులను గాని అడిగి విత్తనాలు ఎక్కడ కొంటారో తెలుసుకోండి. (పేజీ.నెం. 121)
జవాబు:
విత్తనాలను అమ్ముటకు ధ్రువీకరించిన దుకాణాలలో కొంటారు.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 5.
ప్రస్తుతం సంప్రదాయంగా సాగుచేస్తున్న విత్తనాలు కనుమరుగవుతున్నాయి ? ఇలా ఎందుకు జరుగుతోంది ఆలోచించండి. (పేజీ.నెం. 122)
జవాబు:
ప్రస్తుతం సంప్రదాయంగా సాగుచేస్తున్న విత్తనాలు కనుమరుగవుతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే వాటి స్థానాన్ని సంకరణ జాతి విత్తనాలు ఆక్రమించటం వలన.

ప్రశ్న 6.
మొక్కలో ఏ భాగం వేరుగా మారుతుంది ? (పేజీ.నెం. 122)
జవాబు:
ప్రథమ మూలం మొక్కలో వేరు భాగంగా మారును.

ప్రశ్న 7.
ఏ భాగం కాండంగా మారుతుందో చెప్పగలరా ? (పేజీ.నెం. 122)
జవాబు:
ప్రథమ కాండం కాండంగా మారుతుంది.

ప్రశ్న 8.
ఏ ఏ పదార్థాలు ఉపయోగించి విత్తనశుద్ధి చేస్తారో జాబితా రాయండి. అదే విధంగా విత్తనాలు నాటే ముందు మీ ఊళ్ళో ఇంకా ఏ ఏ రకమైన పద్ధతులు అవలంభిస్తారో తెలుసుకొని మీ నోటు పుస్తకంలో రాయండి. (పేజీ.నెం. 123)
జవాబు:
విత్తనాలను ఈ కింది రసాయనిక పదార్థాలు ఉపయోగించి శుద్ధి చేస్తారు. అవి :
1. కార్బడిజ
2. మాంకో జాజ్
3. ఇమడోకోట్రిడ్

ప్రశ్న 9.
నారు నాటడం ద్వారా ఇంకా ఏ ఏ పంటలు పండిస్తారో మీ స్నేహితులతో చర్చించి రాయండి. (పేజీ.నెం. 123)
జవాబు:
మిరప, వంగ, టమోటా మొదలైనవి నారు నాటడం ద్వారా పంటలు పండిస్తారు.

ప్రశ్న 10.
ఎందుకు నారు మొక్కలను దూరం దూరంగా నాటుతారు ? (పేజీ.నెం. 125)
జవాబు:
నారు మొక్కలు దూరం దూరంగా నాటుటకు కారణం అవి పెరిగి పెద్దగా అయిన తర్వాత స్థలం కోసం, నీటి కోసం, ” ఆహార పదార్థాల కోసం పోటీ లేకుండా ఉండుటకు.

ప్రశ్న 11.
అన్ని రకాల పంటలను నారు మొక్కల్లాగానే పీకి మళ్ళీ నాటుతారా ? అలా ఎందుకు చేయరు ? (పేజీ.నెం. 125)
జవాబు:
అన్ని రకాల పంటలను నారు మొక్కల్లాగా మళ్ళీ పీకి నాటరు. కారణం వాటి విత్తనాలు పెద్దవిగా ఉండటం.

ప్రశ్న 12.
వ్యాధి సోకిన పంటలోని మొక్కలను రైతు ఏం చేస్తాడు ? (పేజీ.నెం. 127)
జవాబు:
వ్యాధి సోకిన పంటలోని మొక్కల ఆకులు, అవసరం అనుకొంటే మొక్కలను రైతు తొలగిస్తాడు. అవి అన్నీ ఒకచోట వేసి కాలుస్తాడు.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 13.
రామయ్య, అనే రైతు వ్యాధి సోకిన మొక్కలను పొలం నుండి పీకి కాల్చి వేశాడు. ఇది మంచిదా ? నీ స్నేహితులతో – చర్చించండి. (పేజీ.నెం. 127)
జవాబు:
రామయ్య అనే రైతు వ్యాధి సోకిన మొక్కలను పొలం నుండి పీకి కాల్చి వేశాడు. ఇది చాలా మంచిది. కారణం ఇతర , మొక్కలకు వ్యాధి కొంతమేర సోకదు.

ప్రశ్న 14.
రెండు రకాల కీటక నాశకాలను ఉపయోగిస్తే కీటక సంఖ్య మొదటి సంవత్సరం తగ్గింది కాని మరునాటి సంవత్సరం వాటి సంఖ్య పెరిగింది. కారణాలు తెలపండి. (పేజీ.నెం. 127)
జవాబు:
రెండు రకాల కీటక నాశకాలను ఒక్కసారి ఉపయోగించినపుడు మొదటి సంవత్సరం కీటకాల సంఖ్య తగ్గినది. రెండవ సంవత్సరం పెరిగాయి. కారణం ఆ మందులకు కీటకాలు నిరోధకతను ఏర్పరచుకున్నాయి.

ప్రశ్న 15.
రైతులు ఎరువులను ఎలా వేస్తారు ? (పేజీ.నెం.130)
జవాబు:
రైతులు ఎరువులను చేతితోగాని, కొన్ని పనిముట్లతో గాని వేస్తారు.

ప్రశ్న 16.
మీ పాఠశాలలో కంపోస్టు గుంత ఉందా ? అందులో ఏమేమి వేస్తుంటారు ? (పేజీ.నెం.130)
జవాబు:
మా పాఠశాలలో కంపోస్టు గుంత ఉంది. అందులో కూరగాయల తొక్కలు, మిగిలిన అన్నం, ఎండిన ఆకులు వేస్తారు.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 17.
కింది చిత్రాన్ని చూడండి. దీనిలో ఏ మూలకం ఏ పరిమాణంలో ఉందో చెప్పండి. (పేజీ.నెం. 130)
జవాబు:
నైట్రోజన్ 20%
ఫాస్ఫరస్ 5%
పొటాషియం 10%
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 21

ప్రశ్న 18.
ఏది మంచి ఎరువు ? రసాయనిక ఎరువులకు, సహజ ఎరువులకు మధ్యగల తేడాలు ఏవి (పేజీ.నెం. 131)
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 22
(i) పై రెండింటిని పోల్చి ఏది మనకు ప్రయోజనకరమో చెప్పండి.
జవాబు:
సహజ ఎరువు.

(ii) పై పట్టికను జాగ్రత్తగా పరిశీలించండి. ఏ ఎరువులు వాడితే రైతులకు ప్రయోజనమో మీ ఉపాధ్యాయునితో చర్చించి రాయండి.
జవాబు:
సహజ ఎరువులు వాడితే రైతులకు ప్రయోజనం. ఇవి వేస్తే నేలలో హ్యూమస్ చేరుతుంది. అదే విధంగా నేల ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి.

ప్రశ్న 19.
రైతులు వరి పొలాలకు నీళ్ళు ఎప్పుడు అందిస్తారు ? (పేజీ.నెం. 132)
జవాబు:
నాట్లు వేసేటప్పుడు, మూన తిరిగిన రోజు నుండి పైరు దబ్బు చేయుటకు 2-3 రోజులకు ఒక్కసారి.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 20.
మీ గ్రామంలో నీటి వనరులను వ్రాయండి. (పేజీ.నెం. 132)
జవాబు:
కాలువలు, చెరువులు, బావులు.

ప్రశ్న 21.
ఆ నీటి వనరులు రైతులకు ఉపయోగపడుతున్నాయా ? (పేజీ.నెం. 132)
జవాబు:
ఆ నీటి వనరులు రైతులకు ఉపయోగపడుతున్నాయి.

ప్రశ్న 22.
మీ గ్రామంలో రైతులు ఏ రకంగా పొలాలకు నీళ్ళు పెడుతున్నారు ? (పేజీ.నెం. 132)
జవాబు:
మా గ్రామంలో రైతులు ఎక్కువమంది ఆధునిక పద్ధతుల ద్వారా, కొంతమంది పురాతన పద్ధతుల ద్వారా పొలాలకు నీళ్ళు పెడుతున్నారు.

ప్రశ్న 23.
కలుపు మొక్కలను ఎందుకు తొలగించాలి ? (పేజీ.నెం. 134)
జవాబు:
కలుపు మొక్కలు పోషక పదార్థాలు, నీరు, వెలుతురు కోసం పంట మొక్కలతో పోటీపడతాయి. దీనివల్ల సాగు మొక్కలు పెరగవు. అందుకే కలుపు మొక్కలు తొలగించాలి.

AP Board 8th Class Biology Solutions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

SCERT AP 8th Class Biology Study Material Pdf 7th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Biology 7th Lesson Questions and Answers వివిధ ఆవరణ వ్యవస్థలు

8th Class Biology 7th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలు Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం

ప్రశ్న 1.
ఆవరణ వ్యవస్థను ఎలా నిర్వచిస్తావు ? సరైన ఉదాహరణతో వివరించండి.
జవాబు:
1. సజీవులు, నిర్జీవులు వాతావరణ కారకాలు పరస్పరం ప్రభావితం చేసుకుంటూ వున్న ప్రకృతి యొక్క మూల ప్రమాణం అని నేను నిర్వచిస్తాను.
2. ఎందుకంటే ‘ఆవరణ వ్యవస్థ’లో ఈ మూడు ముఖ్యమైనవి.
ఉదా : ఇల్లు ‘ఒక’ ఆవరణ వ్యవస్థగా తీసుకుంటే, ఇంటిలో మనుషులు, కీటకాలు, చీమలు, ఈగలు, బల్లులు, మొక్కలు, పక్షులు ఇవన్నీ సజీవులు. మట్టి, కుర్చీలు, కర్రలు, గ్యాస్, గ్యాస్ పొయ్యి, పాత్రలు, దుస్తులు, సైకిళ్ళు, కార్లు, పుస్తకాలు ఇవన్నీ నిర్జీవులు.
3. ఇంటిలోని వాతావరణం – గాలి, ఉష్ణోగ్రత, నీరు, గాలిలో తేమ ఇవన్నీ వాతావరణ కారకాలు. వీటి మధ్య బంధం ఉంటుంది. ఇది నిలకడగా కొనసాగుతుంది. అందువల్ల మన ఇంటిని ‘ఒక ఆవరణ వ్యవస్థగా’ చూడవచ్చు.

AP Board 8th Class Biology Solutions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 2.
జీవవైవిధ్యం ఆవరణవ్యవస్థను బలోపేతం చేయడానికి ఎలా దోహదపడుతుందో వివరించండి.
జవాబు:

  1. అనేక జాతులు, లక్షణాలు, భేదాలు గల జీవుల అభివృద్ధినే ‘జీవవైవిధ్యం’ అంటారు.
  2. ‘ఆవరణ వ్యవస్థ’ బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే దీనిలో జీవవైవిధ్యం ఉండాలి.
  3. ఒక ‘పార్కును’ తీసుకోండి. దీనిలో ఒక్క ‘గడ్డి’ (పచ్చిక) ఉంటే సరిపోతుందా ?
  4. లేదు. పార్కులో అనేక రకాల మొక్కలు, పూల మొక్కలు, తీగలు, పొదలు, గుల్మాలు, అలంకార మొక్కలు, చెట్లు ఇవన్నీ ఉన్నాయనుకోండి. అది చాలా ఆహ్లాదంగా ఉంటుంది.
  5. ఒకే జాతి కాకుండా, దీనిలోనే ఎన్నో ప్రజాతులు ఉండేలా చేస్తే ఎక్కువ జీవవైవిధ్యం ఉంటుంది.
  6. ఒక ఆవరణ వ్యవస్థలో జీవవైవిధ్యం ఎక్కువ ఉంటే అది మంచి ఆవరణ వ్యవస్థగా కొనసాగుతుంది.

ప్రశ్న 3.
ఆవరణ వ్యవస్థలో ఎలుకలు ఉన్నాయి. అందులో ఎక్కువ పిల్లులను ప్రవేశపెడితే ఏమవుతుంది ?
జవాబు:

  1. ఒక ఆవరణ వ్యవస్థలో ఎలుకలు ఉన్నాయి. వాటి సంఖ్య ఆ వ్యవస్థ శక్తి ప్రసరణకు అనుకూలంగా ఉంది.
  2. అక్కడి ఆహార గొలుసుకు అనుబంధంగా వాటి సంఖ్య ఉంది.
  3. మరి మనం కావాలని ఎక్కువ పిల్లులను ఈ ఆవరణ వ్యవస్థలోకి వదిలామనుకోండి.
  4. ఇవి (పిల్లులు) ఎక్కువ ఎలుకలను చంపివేస్తాయి. తద్వారా ఎలుకల సంఖ్య బాగా తగ్గి పిల్లుల సంఖ్య బాగా పెరిగి ఆవరణ వ్యవస్థ ‘సమతాస్థితి’ దెబ్బ తింటుంది.

ప్రశ్న 4.
ఈ క్రింది వాటిలో ఉత్పత్తిదారుడు ఏది ? ఎందుకు?
ఎ) నక్క
బి) శిలీంధ్రం
సి) కోడి
డి) గడ్డి
జవాబు:
పైన పేర్కొన్న నాలుగింటిలో ‘గడ్డి’ని ‘ఉత్పత్తిదారు’గా నేను భావిస్తాను. ఎందుకంటే
ఎ) నక్క – ఇది మాంసాహారి. తృతీయ వినియోగదారుని హోదాలో ఆహార జాలకంలో వుంది.
బి) శిలీంధ్రం – ఇది విచ్ఛిన్నకారి. కుళ్ళిన పదార్థాలపై నివసిస్తూ శక్తిని తీసుకుని, జీవిస్తూ ఆ పదార్థాలలో ఉన్న పోషకాలను తిరిగి మృత్తిక (భూమిపై పొర) లోనికి పంపుతుంది.
సి) కోడి – ఇది సర్వ భక్షకాహారి. ద్వితీయ వినియోగదారు హోదాలో ఉంది. పై మూడూ కాదు.
డి) గడ్డి – పచ్చిక – ఇది సూర్యరశ్మి సమక్షంలో కిరణజన్య సంయోగక్రియ జరిపి ఆహారాన్ని తయారు చేస్తుంది. కాబట్టి ఇది ‘ఉత్పత్తిదారుడు’.

AP Board 8th Class Biology Solutions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 5.
ఆవాసానికి, ఆవరణవ్యవస్థకు మధ్య తేడా ఏమిటి ?
జవాబు:

ఆవాసముఆవరణ వ్యవస్థ
1. ఇది నివసించే ప్రదేశాన్ని తెలియచెప్పే పదం.

2. మొక్కలు, జంతువులు పెరిగే చోటు.

3. దీనిలో నిర్జీవ అంశాల ప్రస్తావన ఉండదు.

4. వాతావరణ కారకాలు, వాటి ప్రభావం ఇక్కడ పట్టించుకోరు.

1. ఇది ఆ ప్రదేశంలోని సజీవ, నిర్జీవ, వాతావరణ కారకాల మధ్య సంబంధాన్ని వివరించే పదం.

2. మొక్కలు, జంతువుల మధ్య సంబంధాన్ని కొనసాగించే ఒక మూల ప్రమాణం.

3. నిర్జీవ అంశాలను పరిగణనలోనికి తీసుకోవాలి.

4. ఇక్కడ వాతావరణ కారకాల ప్రభావం కీలకం అని భావిస్తారు.

6. నేనెవరిని ?

ప్రశ్న (అ)
నేను ఆహారపు గొలుసులో ప్రధాన మూలం.
జవాబు:
గడ్డి – ఉత్పత్తిదారులు

ప్రశ్న (ఆ)
నేను ఆహారం కోసం ఇతరులపై ఆధారపడతాను.
జవాబు:
వినియోగదారులు – జంతువులు, క్షీరదాలు, మానవులు.

ప్రశ్న (ఇ)
నేను చనిపోయిన మొక్కల, జంతువుల శరీరాలను కుళ్ళింపచేస్తాను.
జవాబు:
విచ్ఛిన్నకారులు – బాక్టీరియా, శిలీంధ్రాలు.

ప్రశ్న 7.
మొక్క పులి, కుందేలు, నక్క, గ్రద్ద.
పై వాటిలో ఏదైనా సంబంధాన్ని తెలుసుకోగలరా ? పై జాబితా నుండి కుందేలును తీసివేస్తే ఏమి జరుగుతుంది ?
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 7th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలు 1

  1. ఈ జంతువులు, మొక్కలు ఒక ఆహార జాలకంలో భాగమై ఉన్నాయి.
  2. వేరు, వేరు ఆహార గొలుసులలో ఉన్నా ఒకే జాలకంలో ఉన్నాయి కాబట్టి వీటి మధ్య పరస్పర ‘సంబంధం’ ఉంది.
  3. ఇవి ఒక దానిపై మరొకటి ప్రభావం చూపుతాయి.
  4. మొక్క – ఉత్పత్తిదారు; కుందేలు – ప్రాథమిక వినియోగదారు. నక్క, పులి, గద్ద – తృతీయ వినియోగదారులు.
  5. పై జాబితా నుండి కుందేలును తీసివేస్తే, నక్కకు ఆహారం అందదు – నక్కల సంఖ్య తగ్గుతుంది.
  6. అలాగే గడ్డి తినే కుందేలు లేకపోవటం వల్ల ఆవరణ వ్యవస్థలో గడ్డి ఎక్కువ పెరుగుతుంది. దాంతో కీటకాల సంఖ్య, పురుగుల సంఖ్య పెరిగి ఆవరణ వ్యవస్థ ‘సమతాస్థితి’ లయ తప్పుతుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 8.
మీ దగ్గరలోని పార్ము/తోటను సందర్శించి అక్కడ మీరు పరిశీలించిన మొక్కల, జంతువుల వివరాలు సేకరించి పేజీ. నంబరు 110 లోని పట్టిక నింపి నివేదిక తయారుచేయండి.
జవాబు:
అడవి పేరు : నల్లమల
AP Board 8th Class Biology Solutions Chapter 7th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలు 2
నివేదిక :

  1. నేను శ్రీశైలంలోని నల్లమల అటవీ ప్రాంతాన్ని సందర్శించాను. అది అనేక వృక్ష, జంతు జాతులను కలిగి ఉంది.
  2. మద్ది, టేకు, వేప, రావి, మర్రి వంటి పెద్ద పెద్ద వృక్షాలు ఉండి అనేక పక్షులకు, జంతువులకు ఆవాసంగా ఉంటున్నాయి.
  3. రాగి, బలుసు, వెంపలి వంటి చిన్న మొక్కలు పొదలుగా ఏర్పడ్డాయి. వీటిలో కుందేలు వంటి చిన్న జంతువులు నివసిస్తున్నాయి.
  4. అడవిలో కుందేలు, జింకలు, దుప్పులు వంటి శాకాహార జంతువులు ఉన్నాయి.
  5. వీటిని ఆహారంగా తీసుకొంటూ, పులులు, సింహాలు, నక్కలు వంటి మాంసాహారులు ఉన్నాయి.
  6. పక్షులలో నెమలి, చిలుకలు, పిచ్చుకలు వంటి విభిన్న జీవులు ఉన్నాయి.
  7. అడవి మంచి జీవవైవిధ్యాన్ని కలిగి ఉంది.

ప్రశ్న 9.
మీ పొలంలో లేదా పాఠశాల తోటలో పరిశీలించి ఉత్పత్తిదారులు, వినియోగదారులు మరియు విచ్ఛిన్నకారుల జాబితాను తయారుచేయండి.
జవాబు:
మా పాఠశాల ఆవరణను పరిశీలించి ఈ కింది జాబితాను తయారు చేశాను.
1. ఉత్పత్తిదారులు : మొక్కలు, పచ్చిక, అశోక చెట్లు, బంతి చెట్లు, క్రోటన్లు, కాగితపు పూల చెట్లు, విప్ప చెట్టు, వేప చెట్టు, పాల చెట్టు, సపోటా చెట్టు, కొబ్బరి మొక్కలు.
2. వినియోగదారులు : విద్యార్థులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు (మానవులు), కప్పలు, వాన కోయిలలు, కీటకాలు, మేకలు, పశువులు, బల్లులు, తొండలు, పక్షులు, గబ్బిలం.
3. విచ్ఛిన్నకారులు : పుట్ట గొడుగులు, లైచెన్లు (కర్రలపై పెరిగే తెల్ల పెచ్చుల్లాంటి జీవులు).

AP Board 8th Class Biology Solutions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 10.
ఎడారి జంతువులు ఏ ఏ అనుకూలనాలను పొందినాయో మీ పాఠశాల గ్రంథాలయంలో పరిశీలించి పట్టిక తయారు చేయండి.
జవాబు:

  1. సగటు వర్షపాతం అతి తక్కువగా ఉండి, అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతాన్ని ‘ఎడారి’ అంటారు.
  2. ఇక్కడ పెరిగే మొక్కలు, జంతువులు తమకు తాము కొన్ని మార్పులు చేసుకుని అనుకూలనాలు పొంది జీవించటానికి పాటుపడుతుంటాయి.
  3. జంతువులలో కింది అనుకూలనాలను మనం గమనించవచ్చు.
    1. ఎడారిలో జంతువుల సంఖ్య తక్కువ.
    2. నీటి కొరత తట్టుకునే జాతులు ఇక్కడ పెరుగుతాయి.
    3. శరీరంపై పొలుసులు గల పాములు (సరీసృపాలు) ఎక్కువ.
    4. కొన్ని రకాల కీటకాలు పైన ఉన్న కైటిన్ పొరను మందంగా అభివృద్ధి చేసుకున్నాయి.
    5. ఒంటె నీటిని తనలో దాచుకోవటానికి మొక్కల లేత కాండాలు తింటుంది. నీటిని జీర్ణాశయంలో నిల్వచేసుకుంటుంది. అందుకే దీనిని ‘ఎడారి ఓడ’ అన్నారు.
    6. వీటి శరీరం భూమి ఉపరితలానికి తగలకుండా ఇవి మార్పులు చేసుకున్నాయి.
    7. పగటి పూట జంతువులు బయట తిరగవు. రాళ్ళ క్రింద, పొదలలో, చెట్ల పైకి ఎక్కి రాత్రిపూట ఆహార వేటకు ఉపక్రమిస్తాయి. అందుకే వీటిని ‘నిశాచరులు’ అంటారు.

ప్రశ్న 11.
‘ఆహార జాలకం’ అంటే మీరేమి అవగాహన చేసుకున్నారు ? ఆహార జాలకాన్ని మీ సొంత మాటలతో వర్ణించండి. రేఖాచిత్రం ద్వారా ఆహారజాలకం గురించి నీకేం అవగాహన అయింది. మీ సొంత ఆహారజాలకం చిత్రాన్ని గీయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 7th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలు 3
1. ఉత్పత్తిదారుడు, ప్రథమ, ద్వితీయ, తృతీయ వినియోగదారులు ఉన్న గొలుసు లాంటి జంతువుల శక్తి మార్పిడి వ్యవస్థను ‘ఆహారపు గొలుసు’ అంటారు.
2. అనేక ‘ఆహారపు గొలుసులు’ ఒక దానిలో ఒకటి కలిసిపోయి ఒక సమూహంగా, ఆవరణ వ్యవస్థలో కొనసాగే క్రియాత్మక వ్యవస్థను ‘ఆహార జాలకం’ అంటారు.
3. దీనిలో నీటిలో మొక్కలు, నేలపై మొక్కలు, నీటిలో కీటకాలు, నేలపై కీటకాలు, జలచరాలు, ఉభయచరాలు, సరీసృపాలు, క్షీరదాలు, పక్షులు, ప్రథమ, ద్వితీయ, తృతీయ వినియోగదారులు ఉంటాయి.
4. చివరగా అతిశక్తివంతమైన తృతీయ వినియోగదారు (సింహం, పులి, గద్ద మొదలగునవి) ఉంటుంది.

ప్రశ్న 12.
మొక్కలు, జంతువుల మధ్య పరస్పర సంబంధాలపై మీ అవగాహన ఏమిటి ? దీనిని మీరు ఎలా అభినందిస్తారు ?
జవాబు:

  1. మొక్కలు స్వయం పోషకాలు మరియు ఉత్పత్తిదారులు.
  2. ఇవి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. వివిధ భాగాలలో నిల్వ చేస్తాయి.
  3. జంతువులు వినియోగదారులు. ఇవి మొక్కల నుండి శక్తి బదలాయింపు జరుపుకుంటాయి.
  4. తద్వారా ఇవి ఆవరణ వ్యవస్థలో పరస్పరం ఆధారపడి జీవిస్తాయి అని పరిశీలించినపుడు – వీటిని అభినందించాల్సిన అవసరం ఉంది.
  5. జంతువుల నుండి వివిధ రూపాలలో పోషకాలు నేలకు చేరి మరలా వాటిని మొక్కలు ఉపయోగించుకునేలా మారతాయి.
  6. మొక్కల జనాభా పెరుగుదలను జంతువులు నియంత్రిస్తాయి. ఎలా అంటే మొక్కలు వాటి ఆహారం కనుక.
  7. జంతువుల సంఖ్య తగ్గించాలంటే మొక్కల సంఖ్య తగ్గిపోతుంది. తద్వారా ఆహార లభ్యత లేక జంతువుల సంఖ్య తగ్గుతుంది. ఇలాంటి విషయాలు ప్రకృతిలో సర్వ సామాన్యం. కాబట్టి నేను అభినందిస్తాను.

AP Board 8th Class Biology Solutions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 13.
గడ్డి – మొక్కలు – మిడత – కప్పు – పాము – గ్రద్ద – మేక – నక్క – పులి – తోడేలు – కుందేలు – వీటి సహాయంతో ఆహారజాలకం పటం గీయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 7th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలు 4

ప్రశ్న 14.
గట్టి నేల ఆవరణ వ్యవస్థలో కుందేలు మొక్కలను మాత్రమే తింటుంది. మొక్కలు పెరిగే లోపలనే అవి మొక్కలను తొందరగా తింటాయి. అలాంటప్పుడు ఆవరణ వ్యవస్థను సమతాస్థితికి తీసుకునిరావడానికి ఏమి జరగాల్సిన అవసరముంది?
జవాబు:

  1. కుందేలు మొక్కలను పెరిగే లోపల తినేస్తుంది.
  2. ఎక్కువ సంఖ్యలో మొక్కల సంఖ్య ఆవరణ వ్యవస్థలో ఉంటాయి. కాబట్టి కుందేలు పెరిగే లోపల మొక్కలను తిన్నా – పెద్దగా ప్రభావం ఉండదు. కానీ
  3. ఒక వేళ కుందేళ్ళ సంఖ్య, మొక్కలు కుందేళ్ళ నిష్పత్తి కన్నా ఎక్కువ ఉన్నట్లైతే ఆ ప్రభావం మొక్కలపై పడుతుంది.
  4. మొక్కల సంఖ్య తగ్గి, కుందేళ్ళ సంఖ్య పెరుగుతుంది.
  5. అప్పుడు వీటిపై ఆధారపడి జీవించే నక్కలు, కుక్కలు, తోడేళ్ళకు ఇవి అందుబాటులోకి వస్తాయి.
  6. లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల, వాతావరణ కారకాల వల్ల, తప్పనిసరిగా కుందేళ్ళ సంఖ్య మొక్కల నిష్పత్తికి తగినట్లుగా తగ్గించబడి, సమతాస్థితిని కొనసాగించటానికి వీలవుతుంది.

ప్రశ్న 15.
ఒకేరకమైన అలవాట్లు కలిగిన రెండు . జంతువులు ఒకే ఆవరణవ్యవస్థను ఎంచుకున్నప్పుడు ఏమి జరుగుతుంది ? ఈ వైవిధ్యాన్ని కాపాడటానికి నీవు ఏమి చేస్తావు ?
జవాబు:

  1. ఒకేరకమైన అలవాట్లు కలిగిన రెండు జంతువులు ఒకే ఆవరణ వ్యవస్థను ఎంచుకున్నప్పుడు వాటి మధ్య పోటీ ఏర్పడుతుంది.
  2. సాధారణంగా ఈ పోటీలో తట్టుకొన్న జీవులు మనుగడను సాగిస్తాయి. మిగిలిన జీవులు నశిస్తాయి.
  3. ఉదాహరణకు ఆవు, గుర్రం ఒకే ఆహారపు అలవాట్లు కలిగి ఉంటాయి. ఈ రెండు ఒకే ప్రదేశంలో ఉన్నప్పుడు – ఆహారం కొరకు వాటి మధ్య పోటీ ఏర్పడుతుంది. తగినంత ఆహారం లభించనపుడు బలమైన జీవి మాత్రమే ఆహారం సంపాదించుకొని జీవిస్తుంది.
  4. ప్రకృతి ధర్మాలలో జీవవైవిధ్యం ఒకటి. జీవవైవిధ్యం కాపాడటానికి ఆవాసంలోని జీవుల అవసరాలను తీర్చే మార్గాలను అన్వేషించాలి.
  5. ఎక్కువ ఆహార వసతి, ఆవాసాలు ఏర్పాటు చేయటం వలన జీవవైవిధ్యం కాపాడవచ్చును.
  6. పిల్ల జీవులను సంరక్షణ చర్యలు తీసుకోవటం వలన జీవవైవిధ్యాన్ని పెంచవచ్చు.

8th Class Biology 8th Lesson మొక్కల నుండి ఆహారోత్పత్తి InText Questions and Answers

కృత్యములు

ప్రశ్న 1.
ఆవరణ వ్యవస్థను అర్ధం చేసుకోవటానికి నీవు నిర్వహించే ప్రాజెక్ట్ వివరాలు తెలపండి. ( లేదా)
ఆవరణ వ్యవస్థ నిర్మాణాన్ని తెలుసుకొనుటకు చేయు ప్రయోగంలో మీరు ఉపయోగించిన పరికరాలను పేర్కొని, ప్రయోగ విధానాన్ని రాయండి.
జవాబు:
ఉద్దేశం : ఆవరణ వ్యవస్థ నిర్మాణాన్ని అవగాహన చేసుకోవడానికి పాఠశాల లేదా ఇంటి తోటను అధ్యయనం చేయడం.
కావల్సిన పదార్థాలు : కొలిచే టేపు, దారం, చిన్న చిన్న కట్టెపుల్లలు, భూతద్దం, గడ్డపార (hand towel).
విధానం : ఆవరణ వ్యవస్థ నిర్మాణాన్ని తెలుసుకోడానికి ఈ కింది విధానాన్ని అనుసరించాలి.
1. నలుగురు విద్యార్థుల చొప్పున జట్లుగా ఏర్పడండి. మీరు ఎంపిక చేసుకున్న ప్రదేశంలో టేపుతో కొలిచి ఒక మీటరు పొడవు, ఒక మీటరు వెడల్పు ఉండే చతురస్రాకారపు ప్రాంతాన్ని నిర్ణయించుకోండి. ఈ ప్రాంతంలో గడ్డి ఉండవచ్చు లేదా గడ్డి ఉండకపోవచ్చు (baredirt) లేదా కాలిబాట (side walk) కావచ్చు.
2. ఆ ప్రాంతానికి నాలుగు వైపులా చిన్న కర్ర ముక్కలు పాతి దారంతో చతురస్రం ఒక చదరపు మీటరు ప్రాంతం యొక్క అంచులను పటంలో చూపిన విధంగా గుర్తించండి. ఇదే మనం పరిశీలించవలసిన ప్రదేశం.
3. అధ్యయనం చేసే ప్రాంతాన్ని పరిశీలించండి. ఆ ప్రాంతంలో నివసించే మొక్కలు, జంతువులను అవసరమైతే భూతద్దంతో నిశితంగా పరిశీలించండి.
4. మీరు పరిశీలించిన జీవులన్నింటినీ మీ నోటు పుస్తకంలో నమోదు చేయండి. మీరు ఆ ప్రాంతంలోని మట్టిని తవ్వి అందులోని జీవులన్నింటిని కూడా పరిశీలించాలి. దేనినీ వదిలివేయకుండా జాగ్రత్తగా పరిశీలించాలి.

AP Board 8th Class Biology Solutions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

2. ప్రక్కపటంలోని ఆహార జాలకాన్ని పరిశీలించండి. ఈ కింది ప్రశ్నలకు జవాబులివ్వండి.
AP Board 8th Class Biology Solutions Chapter 7th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలు 5

ప్రశ్న (i)
ఆహార జాలకంలో ఉత్పత్తిదారులేవి ?
జవాబు:
నీటి మొక్కలు, నాచు, శైవలాలు, గడ్డి, మొక్కలు.

ప్రశ్న (ii)
వినియోగదారులేవి ?
జవాబు:
కీటకాలు, ఎలుకలు, సాలె పురుగులు, కుందేలు, జింక, పిల్లి, నక్క, కప్ప, చేప, పాము, తోడేలు, నెమలి, గుడ్లగూబ, రాబందు, గద్ద, కొంగ, పులి, సింహం.

ప్రశ్న (iii)
ఆహార జాలకం ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది ?
జవాబు:
ఆహార జాలకం ఉత్పత్తిదారుల నుంచి ప్రారంభమవుతుంది.

ప్రశ్న (iv)
ఆహార జాలకం ఎక్కడ ముగుస్తోంది ?
జవాబు:
నాల్గవ స్థాయి వినియోగదారు అయిన సింహం దగ్గర ముగుస్తోంది.

ప్రశ్న (v)
ఆహార జాలకంలోని మొక్కలు చనిపోతే ఏమవుతుంది ?
జవాబు:

  1. ఆహార జాలకంలో మొక్కలు చనిపోతే శక్తి ఉత్పత్తిచేసే అవకాశం పోతుంది.
  2. దీనితో సూర్యరశ్మి నుంచి శక్తి బదలాయింపు ఆగిపోతుంది.
  3. కొంత కాలం తర్వాత నెమ్మదిగా క్రింది స్థాయి నుంచి ఉన్నతస్థాయి జీవులన్నీ అంతరించిపోతాయి.

AP Board 8th Class Biology Solutions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

3. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ రకాల మొక్కలు, జంతు జాతుల పేర్లను పట్టికలో నింపి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
జవాబు:
అడవి పేరు : నల్లమల
ప్రదేశం : శ్రీశైలం
AP Board 8th Class Biology Solutions Chapter 7th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలు 6

ప్రశ్న (i)
అన్ని రకాల అడవులలో ఒకే రకమైన వృక్ష సంపద ఉందా ! (పేజీ నెం. 110)
జవాబు:
1. ఉండదు. ఎందుకంటే ఆవరణ వ్యవస్థ ప్రదేశం మారే కొద్దీ అక్కడ వాతావరణ కారకాలు మారతాయి.
2. సూక్ష్మ, స్థూల పోషకాల లభ్యత వేరుగా ఉంటుంది.
3. కాబట్టి వైవిధ్యం ఎక్కువ మార్పుతో ఉంటుంది.
AP Board 8th Class Biology Solutions Chapter 7th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలు 7

ప్రశ్న (ii)
అడవి ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు వినియోగదారుల కంటే ఎక్కువగా ఉన్నాయా ? ఎందుకు ?
జవాబు:
1. ఉత్పత్తిదారుల సంఖ్య ఎక్కువ ఉంది.
2. కారణం వినియోగదారులు తమ ఆహారం కోసం ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తిదారులను వినియోగించుకుని శక్తిని పొందుతాయి.
3. సుమారుగా 1 : 20 గా వినియోగదారు ఉత్పత్తిదారు నిష్పత్తి ఉంటుంది.
ఇవి కొన్ని సార్లు పెరగవచ్చు. తగ్గవచ్చు.

AP Board 8th Class Biology Solutions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న (iii)
అన్ని రకాల అడవులలో ఒకే రకమైన జంతువులు ఉన్నాయా ? ప్రత్యేకమైనవి ఏమైనా ఉన్నాయా ?
జవాబు:
1. అన్ని రకాల అడవులలో ఒకే రకమైన జంతువులు ఉండవు.
2. కొన్నిచోట్ల ప్రత్యేకమైన జంతువులు ఉంటాయి.
ఉదా : శ్రీశైలం, నల్లమల అడవులలో పులులుంటాయి. చిత్తూరు, శేషాచలం అడవులలో ఔషధ మొక్కలు ఎక్కువగా ఉంటాయి.

పాఠ్యాంశములోని ప్రశ్నలు

1. ఈ పటాన్ని పరిశీలించి ఈ కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (పేజీ. నెం. 105)

ప్రశ్న (ఎ)
బొమ్మలో బాణం గుర్తు ఏం సూచిస్తుంది ?
జవాబు:
బొమ్మలో బాణం గుర్తు జీవుల మధ్య ఆహార సంబంధాలను సూచిస్తున్నది.

ప్రశ్న (బి)
గడ్డి నుండి పులి వరకు ఉన్న మార్గాన్ని గుర్తించండి.
జవాబు:
గడ్డి → కుందేలు → పులి.

ప్రశ్న (సి)
కుందేలు ఎన్ని రకాల ఆహారాలపైన ఆధారపడుతుంది ? వాటి పేర్లు రాయండి.
జవాబు:
కుందేలు మూడు రకాల పదార్థాలపై ఆధారపడింది. అవి 1. క్యారెట్ 2. గడ్డి 3. గింజలు.

AP Board 8th Class Biology Solutions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న (డి)
కుందేలుపై ఆధారపడ్డ జీవులు ఎన్ని ? వాటి పేర్లు రాయండి.
జవాబు:
కుందేలుపై నాలుగు రకాల జీవులు ఆధారపడ్డాయి. అవి 1. కొండచిలువ 2. నక్క 3. గుడ్లగూబ 4. పులి.

ప్రశ్న 2.
మొక్కలు ఆహారాన్ని ఎక్కడ నుండి గ్రహిస్తాయి ? (పేజీ.నెం. 105)
జవాబు:
1. మొక్కలు స్వయం పోషకాలు.
2. ఇవి తమ ఆహారాన్ని తామే తయారుచేసుకొంటాయి.
3. సూర్యరశ్మి, కార్బన్ డై ఆక్సైడ్, నీరులతో పత్రాలు ఆహారం తయారుచేసే ఈ ప్రక్రియను ‘కిరణజన్య సంయోగక్రియ’ అంటారు.

ప్రశ్న 3.
ఆహారం ఒక్కటే కాకుండా జంతువులు బ్రతకటానికి కావల్సిన ఇతర అంశాలు ఏమిటి ? (పేజీ.నెం. 105)
జవాబు:
జంతువులకు ఆహారంతో పాటు,

  1. నీరు
  2. గాలి
  3. ఆవాసం బతకటానికి కావాల్సి ఉంటుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ

SCERT AP 8th Class Biology Study Material Pdf 5th Lesson కౌమార దశ Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Biology 5th Lesson Questions and Answers కౌమార దశ

8th Class Biology 5th Lesson కౌమార దశ Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం

ప్రశ్న 1.
బాల్యావస్థ కౌమార దశ కంటే ఏ విధంగా భిన్నమైనది ?
జవాబు:

  1. బాల్యావస్థలో శరీర అభివృద్ధి ఎక్కువగా జరుగుతుంది.
  2. కానీ కౌమార దశలో ఇది అత్యంత ఎక్కువ స్థాయికి వెళ్తుంది.
  3. అంతేకాక మానసిక ఎదుగుదల, భావోద్వేగాలు ఎక్కువగా వ్యక్తమవుతాయి.
  4. బాల్యావస్థలో ఉన్న ఆధారపడే మనస్తత్వం (తల్లి, తండ్రి, అక్క, అన్నల మీద) కౌమార దశలో తగ్గుతుంది.
  5. కౌమార దశలో వ్యక్తిగత శ్రద్ధ, స్వయంగా నా పనులు నేను చూసుకోగలననే అభిప్రాయం పిల్లలలో వ్యక్తమవుతుంది.
  6. ఇలా శారీరక, మానసిక, భావోద్వేగాల వ్యక్తీకరణలో బాల్యావస్థ కౌమార దశ కన్నా భిన్నమైనదని చెప్పవచ్చు.

AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 2.
క్లుప్తంగా రాయండి.
(i) ద్వితీయ లైంగిక లక్షణాలు
(ii) ఆడమ్స్ యాపిల్
జవాబు:
(i) ద్వితీయ లైంగిక లక్షణాలు:

  1. కౌమార దశలో, హార్మోనుల ప్రభావం వల్ల శరీరంలో వచ్చే ముఖ్య లక్షణాలను ద్వితీయ లైంగిక లక్షణాలు అంటారు.
  2. మగపిల్లలలో నూనుగు మీసాలు, గడ్డం రావటం, గొంతు బొంగురుగా మారటం.
  3. ఆడపిల్లలలో నాజూకుతనం మొదలైనవి.
  4. లైంగిక అవయవ వ్యవస్థలో పరిపక్వతకు వస్తాయి.
  5. బాహు మూలాల్లో వెంట్రుకలు పెరుగుతాయి.

(ii) ఆడమ్స్ యాపిల్ :

  1. గొంతు దగ్గర ముందుకు పొడుచుకు వచ్చినట్లుగా ఉన్న థైరాయిడ్ మృదులాస్థి ఎముకను ‘ఆడమ్స్ యాపిల్’ అంటారు.
  2. ఈ ‘ఆడమ్స్ యాపిల్’ మన స్వరపేటిక (Larynx) యొక్క పాక్షిక పెరుగుదల వలన పెరుగుతుంది.
  3. కౌమారదశలో థైరాయిడ్ మృదులాస్థి పెరగటం వల్ల ‘ఆడమ్స్ యాపిల్’ ఏర్పడుతుంది.
  4. ఇది మగపిల్లలలో ఒకానొక ద్వితీయ లైంగిక లక్షణం.

ప్రశ్న 3.
కౌమార దశలో మానవ శరీరంలో జరిగే మార్పుల జాబితా రాయండి.
జవాబు:
1. ‘కౌమార దశ’ ప్రతి మానవునిలో 13-19 సం||ల మధ్య వచ్చే ముఖ్యమైన దశ.
2. దీని వల్ల మానవ శరీరంలో
ఎ) కండరాలు, ఎముకల అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది.
బి) దీనివల్ల ఎత్తు, బరువు పెరుగుతారు.
సి) శరీరంలో జీవనక్రియ రేటు పెరుగుతుంది. దీనివల్ల శక్తి ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. (దీనిని + ‘tive గా మార్చుకోవాలి)
డి) ‘ఆడమ్స్ యాపిల్’ మగపిల్లలలో పెరుగుతుంది.
ఇ) ఆడపిల్లలలో స్థనాల పరిమాణం పెరుగుతుంది.
ఎఫ్) బాహు మూలాల్లో, ప్రత్యుత్పత్తి అంగాల దగ్గర వెంట్రుకలు పెరుగుతాయి.
జి) బాలికలలో ఋతుచక్రం మొదలవుతుంది.
హెచ్) మగపిల్లలలో వీర్యకణాల ఉత్పత్తి మొదలవుతుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 4.
జతపరచండి.
AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ 1
జవాబు:
1) C
2) B
3) D
4) A

ప్రశ్న 5.
కౌమార దశలో మొటిమలు, మచ్చలు ఎందుకు వస్తాయి ? వాటి పట్ల ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ?
జవాబు:
1. కౌమార దశలో శరీరంలో అభివృద్ధి ఎక్కువ స్థాయిలో జరుగుతుంది. ఈ
2. దీనివల్ల శరీరంలోని తైల గ్రంథులు, స్వేద గ్రంథులు కూడా ఎక్కువ స్థాయిలో స్పందించి తైలాన్ని, స్వేదాన్ని ఉత్పత్తి చేస్తాయి.
3. దీనివల్ల ముఖం జిడ్డుగా ఉండటం, తైల గ్రంథుల నాళాలలో బాక్టీరియా చేరి ఉబ్బుగా ఉండే బుడిపెలు (మొటిమలు) రావటం సాధారణ విషయం.
4. కొన్నిసార్లు చీము పట్టి ఇవి నొప్పిని కలుగచేస్తాయి.
5. వీటిని గిల్లినా, గోరు తగిలినా అది మచ్చగా మారుతుంది.
6. చెమట వల్ల శరీరం నుంచి ఒక రకమైన వాసన కూడా వస్తుంది.

తీసుకోవలసిన జాగ్రత్తలు :
ఎ) ముఖాన్ని చల్లని నీటితో రోజుకు 3, 4 సార్లు శుభ్రం చేసుకోవాలి.
బి) మాటిమాటికీ సబ్బుతో ముఖాన్ని కడగకూడదు.
సి) మొటిమలను గిల్లకూడదు. ఆహారంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా లేకుండా జాగ్రత్త పడాలి.
డి) వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.
ఇ) ఒత్తిడి, ఆందోళన లేకుండా మానసిక ఉల్లాసానికి సాధన చేయాలి.

ప్రశ్న 6.
కౌమారదశలో వ్యక్తిగత పరిశుభ్రత పాటించటానికి నువ్వు మీ స్నేహితుడికి ఏం సలహాలు ఇస్తావు?
జవాబు:
కౌమారదశలో వ్యక్తిగత పరిశుభ్రతకు, నా స్నేహితునికి కింది సలహాలు ఇస్తాను.

  1. ప్రతిరోజు రెండు పూటలా స్నానం చేయాలి.
  2. మర్మావయవాల శుభ్రత పట్ల శ్రద్ధ వహించాలి.
  3. ముఖాన్ని ఎక్కువసార్లు చల్లని నీటితో కడగాలి.
  4. మొటిమలను గిల్లటం కాని, వత్తటం కాని చేయరాదు.
  5. ముఖానికి లేపనాలు రాయరాదు.
  6. అవాంఛిత రోమాలను తొలగించుకోవాలి.
  7. నూనె, నెయ్యి తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
  8. తగినంత శారీరక శ్రమ కొరకు వ్యాయామం చేయాలి. ఆటలు ఆడాలి.

ప్రశ్న 7.
మీకు ఎప్పుడైనా మీ తల్లిదండ్రులపై కోపం వచ్చిందా ? మీ తల్లిదండ్రులు ఎలా ఉండాలని మీరు భావిస్తారు ?
జవాబు:
1. నాకు చిన్నప్పటి నుండి ఎప్పుడూ నా తల్లిదండ్రులపై కోపం రాలేదు.
2. కానీ ఈ మధ్య వారిచ్చే సూచనల పట్ల విసుగు వస్తోంది.
3. నాకు తెలిసిన విషయాలు కూడా వారు పదే పదే చిన్నపిల్లవాడికి చెప్పినట్లు చెప్పటం విసుగనిపిస్తోంది.
4. నా వయస్సు ఇప్పుడు 14 సం||లు.
5. ఎండలో స్నేహితులతో ఆటలకు వెళ్ళేద్దంటారు.
6. స్నేహితులను ఇంటికి రానివ్వరు. వచ్చినా బయట మాట్లాడమంటారు. కానీ నాకు వారితో గడపటం ఇష్టంగా ఉంటుంది. ఇలాంటప్పుడు కోపం వస్తుంది.
7. ఎక్కువగా ఈ మధ్య ఇది చెయ్యి. అది చేయకూడదు అన్న సలహాల ప్రక్రియ మొదలయ్యింది. ఇది నాకిష్టం లేదు.
8. నా తల్లిదండ్రులు
ఎ) నేను పెద్దవాణ్ణి అయ్యాను అని గుర్తించాలని కోరుకుంటాను.
బి) నాకు నచ్చిన, నాకిష్టమైన పనులు చేయవద్దని అనకుండా ఉంటే బాగుంటుంది.
సి) నేను పెద్దవాణ్ణి అని వారు గుర్తించాలనిపిస్తుంది.
డి) నేను కూడా స్వతంత్రంగా పనులు చేయగలనని వారు విశ్వసించాలని భావిస్తాము.

AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 8.
మీరు మీ తల్లిదండ్రుల కంటే స్నేహితులతో ఏ ఏ సమస్యలు, అభిప్రాయాలు పంచుకుంటారు ?
జవాబు:
నేను నా స్నేహితులతో ఈ కింది అభిప్రాయాలు పంచుకుంటాను.
1. నా శరీరంలో జరిగే మార్పులు – ఎత్తు, బరువు, మొటిమల గురించి వారి అనుభవాలను తెలుసుకోవాలని అనుకుంటాను.
2. చదువు విషయంలో ప్రగతి విషయమై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులిచ్చిన సూచనలపై వారి అభిప్రాయాలు తీసుకొని, వారి సలహాలను నిర్లక్ష్యం చేస్తాను. (చాలా కొద్దిమంది మాత్రమే ఈ విషయంలో వాస్తవానికి దగ్గరగా ఆలోచిస్తారు. )
3. సినిమాలు, హీరో, హీరోయిన్ల విషయాలు ‘స్నేహితులతో ఎక్కువగా పంచుకుంటాను.
4. వీడియో గేమ్ లు, సాంఘిక అంతర్జాల పట్టికల గురించి వారి సలహాలు, అనుభవాలు తెలుసుకోవటానికి ఉత్సాహం చూపుతాను.
5. భిన్నలింగ వర్గీయుల గురించి, కబుర్లు ఎక్కువగా స్నేహితులతో చర్చిస్తాను.
6. లైంగిక అవయవాల అభివృద్ధి గురించి కంగారు పడి స్నేహితుల సలహాల కోసం ఆత్రుతగా చూస్తాను. (ఇది కూడా 99% ఋణాత్మక ఫలితాన్ని ఇస్తుంది. సమ వయస్కులు కాబట్టి ఈ విషయంపై వారికి శాస్త్రీయ పరిజ్ఞానం ఉండదు. )

ప్రశ్న 9.
ఒకవేళ నీకు వైద్యుడ్ని సంప్రదించే అవకాశం వస్తే, కౌమార దశలో ఉద్వేగాల గురించి నీవు అడిగే ప్రశ్నలు ఏమిటి ?
జవాబు:
నాకు వైద్యుడ్ని కలిసి కౌమార దశలో నేను ఎదుర్కొనే ఉద్వేగాల గురించి ఈ కింది ప్రశ్నలు అడుగుతాను.

  1. నేను నా సౌందర్యంపై మునుపెన్నడూ లేనంత ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాను. ఎందుకని ?
  2. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇచ్చే సూచనలు సలహాలు నచ్చక వారితో విభేదిస్తున్నాను. కారణం ఏమిటి ?
  3. అందరి దృష్టిలో నేను ఎందుకు అగుపడాలి అని భావిస్తున్నాను.
  4. ఈ మధ్య నా ప్రవర్తనలో దూకుడు, దుందుడుకు మనస్తత్వం ఎందుకు వస్తున్నది ?
  5. ఎందుకు నాకు అవకాశమెచ్చినప్పుడు గట్టిగా అరచి గోల చేయాలనిపిస్తున్నది ?
  6. భిన్న లైంగిక వర్గీయుల పట్ల నేను ఎందుకు ఆకర్షణకు లోనవుతున్నాను ?
  7. నా లైంగిక అవయవాల దగ్గర, బాహు మూలాల్లో వెంట్రుకలు ఎందుకు పెరుగుతున్నాయి ? చెమట ఎక్కువ పోస్తున్నది. ఎందుకు ?
  8. ఋతుచక్రం, రజస్వల అవటం ఆడపిల్లలలో జరిగే మార్పులు. మరి మగవారిలో ఎలాంటి మార్పులు వస్తాయి ?
  9. అనవసరమైన సిగ్గు, అసహనం, అరచి గోల చేయాలనిపించటం – గొంతు బొంగురు పోవటం ఎందువల్ల నాలో కలుగుతున్నాయి ?
  10. ‘వ్యక్తిగత పరిశుభ్రత’ అంటే ఏమిటి ? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

ప్రశ్న 10.
కొన్ని మొబైల్ ఫోన్లలో ఉండే ఆడియో మీటరును ఉపయోగించి 6 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న కొందరి విద్యార్థుల స్వరాల పౌనఃపున్యాన్ని నమోదు చేసి మీ పరిశీలనలు రాయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ 2
పరిశీలనలు :
1. 6వ తరగతి పిల్లలలో స్వర పౌనఃపున్యం దాదాపు ఆడ, మగపిల్లల్లో ఒకే విధంగా ఉందని గమనించాను.
2. 7వ తరగతిలో కూడా స్వర పౌనఃపున్యం ఆడ, మగపిల్లల్లో ఒకే విధంగా ఉంది.
3. 8వ తరగతిలో మగపిల్లలలో పౌనఃపున్యం తగ్గింది. అంటే వారి స్వరం బొంగురుగా ఉంది. ఆడపిల్లల్లో మాత్రం సన్నగా ఉండి పౌనఃపున్యం 6, 7వ తరగతుల కంటే కొంచెం ఎక్కువగా ఉన్నట్లు పరిశీలనలో తేలింది. (కౌమార దశ ప్రారంభమైనదని సూచన)
4. 9,10 తరగతుల మగపిల్లల్లో బొంగురు గొంతు ఉంది. సాధారణంగా పురుషులలో ఉండాల్సిన పౌనఃపున్యం 120 Htz కు దగ్గరగా ఉన్నది. అమ్మాయిలలో సన్నని గొంతు ఇంకా సున్నితత్వంతో ఉందని మా పరిశీలనలో తేలింది.
5. టెస్టోస్టిరాన్, అడ్రినలిన్ల ప్రభావం వల్ల 13 నుండి 15 సం|| వయస్సుకు వచ్చిన పిల్లల గొంతు బొంగురుగా వుంటుంది.
6. ఈస్ట్రోజన్ ప్రభావం వల్ల ఆడపిల్లల గొంతులో సున్నితత్వం మొదలయిందని గమనించాము.

AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 11.
బాల్యవివాహాలు, బాలికల ఆరోగ్యంపై చూపే ప్రభావం గురించి సమాచారం సేకరించి నివేదిక తయారుచేయండి.
జవాబు:
బాల్యవివాహాలు ఒక సాంఘిక దురాచారం. చిన్న వయస్సులోనే వివాహం చేయటం వలన వారిలో గర్భధారణకు
కావలసిన శారీరక పరిణితి ఉండదు. అందువలన ప్రసవ సమయంలో తల్లి ప్రాణానికి ప్రమాదం ఉంటుంది. వీరికి కలిగే సంతానం కూడా సరైన ఎదుగుదల లేకపోవటం వంటి సమస్యలతో బాధపడతారు.

అంతేగాక వివాహ బంధాన్ని కొనసాగించటానికి కావలసిన మానసిక పరిణితి లోపించి వివాహాలు విఫలమవుతాయి. చిన్న వయస్సులోనే తల్లి కావటం వలన వారి గర్భాశయం సరిగా ఎదగక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందువలన భారత ప్రభుత్వం వివాహానికి కనీస వయస్సు పురుషులకు 21 సంవత్సరాలుగాను, స్త్రీలకు 18 సంవత్సరాలుగాను నిర్ణయించింది. బాధ్యత గల పౌరునిగా మనం వీటిని పాటించాలి.

ప్రశ్న 12.
పటంను పరిశీలించండి. మానవ శరీరంలో ఉండే అంతఃస్రావ గ్రంథులు, అవి ఉండే చోటును తెలిపే పటం గీయండి.
AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ 3
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ 10

ప్రశ్న 13.
ఆడమ్స్ యాపిల్ పటం గీయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ 4

ప్రశ్న 14.
కౌమార దశలో జరిగే మార్పులు, తీసుకోవలసిన జాగ్రత్తలను సూచిస్తూ ఒక ఉపన్యాస వ్యాసం తయారుచేయండి. (లేదా) ఏ లక్షణాలను బట్టి బాలబాలికలు కౌమారదశను చేరుకున్నారని తెలుసుకోవచ్చు.
జవాబు:
1. 13-19 సం|| మధ్య వయస్సు గల పిల్లలలో కనిపించే అతి సున్నితమైన, ముఖ్యమైన దశను కౌమార దశ అంటారు.
2. దీనినే టీనేజ్ అంటారు. ఇది శారీరక, మానసిక భావోద్వేగాల అభివృద్ధిని వేగవంతం చేసే వయస్సు.

మార్పులు :

(1) శారీరక మార్పులు :

  1. ఈ దశలో శరీరంలో అభివృద్ధి బాగా ఎక్కువ జరుగుతుంది.
  2. BMR (Basal Metabolic Rate) ఎక్కువగా ఉంటుంది.
  3. కండరాల అభివృద్ధి, ఎముకల పెరుగుదల ఎక్కువవటం వల్ల ఎత్తు, బరువు పెరుగుతారు.
  4. మగపిల్లల్లో గొంతు బొంగురుపోవటం, మీసాలు, గెడ్డాలు రావటం, జననాంగాల వద్ద వెంట్రుకలు రావటం ప్రారంభమవుతుంది.
  5. బాహు మూలాల్లో వెంట్రుకలు పెరిగి, శరీరంలో చెమట ఎక్కువ పోస్తుంది.
  6. ఆడపిల్లల్లో రజస్వల అయ్యి, ఋతుచక్రం ప్రారంభమవుతుంది.
  7. ముఖంపై మొటిమలు, మచ్చలు వస్తాయి.

(2) మానసిక మార్పులు :

  1. వీరిలో దేనిపైనా సరైనా ఆసక్తి ఉండదు.
  2. విసుగు ఎక్కువ.
  3. నిర్లక్ష్యంగా ఉంటూ, ఎక్కువ సార్లు అసహనం వ్యక్తపరుస్తారు.
  4. అరచి గోల చేయాలనిపిస్తుంది.
  5. అందరి దృష్టి తన పైనే ఉండాలని, తాను పెద్దవాడ్ని అయ్యాను కాబట్టి తన నిర్ణయాల పట్ల అందరూ సానుకూలంగా స్పందించాలని కోరుకుంటారు.
  6. భావోద్వేగాల స్థాయి ఎక్కువగా ఉంటుంది.
  7. ఎక్కువ సేపు అద్దం ముందు గడుపుతూ తమ సౌందర్యంపై ఎక్కువ మక్కువ చూపిస్తారు.
  8. సమ వయస్కులు, స్నేహితులతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు.
  9. కలల ప్రపంచంలో విహరిస్తూ, ఆ స్వప్నంలో తమ కోరికలు నెరవేరినట్లు హిస్తూ గడపటానికి ప్రాధాన్యం ఇస్తారు.
  10. భిన్న లింగ వర్గీయుల పట్ల ఆకర్షణకు లోనవుతారు.

తీసుకోవలసిన జాగ్రత్తలు :

  1. ఈ భావోద్వేగ మార్పులను తనలో సహజంగా హార్మోనుల వల్ల వచ్చే మార్పులని ముందుగా తనకు తాను చెప్పుకోవాలి.
  2. స్నేహితుల ప్రోదల్బంతో చెడు అలవాట్లకు దగ్గరవకుండా స్వీయ క్రమశిక్షణ పాటించాలి.
  3. తనలో జరిగే ఈ ‘సంక్లిష్ట సంఘర్షణ’ నుండి బయటపడడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సాయం, అవసరమైతే డాక్టర్ల సాయం తీసుకోవాలి.
  4. మానసిక ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేయాలి.
  5. ‘వ్యక్తిగత పరిశుభ్రత’ పాటిస్తూ వ్యాధుల నుండి కాపాడుకోవాలి.
  6. ‘తేలికపాటి వ్యాయామం’ ఆటల ద్వారా శరీరాన్ని అలసట చెందించటం ద్వారా మంచి నిద్రను ఆహ్వానించవచ్చు.
  7. టివిల ముందు వీడియో గేమ్ ల ముందు, చాటింగ్ (చరవాణి ద్వారా SMS) లను నివారించి, స్థూలకాయత్వం రాకుండా చూసుకొనవచ్చు.
  8. భిన్నలింగ వర్గీయుల పట్ల గౌరవ భావాన్ని పెంచుకోవాలి.
  9. ఇది ఇప్పటి సమాజ శ్రేయస్సుకు ఎంతో ముఖ్యమైనది.
  10. తల్లిదండ్రులు పిల్లల్ని ఈ దశలో నిశిత పరిశీలన చేస్తూ వారికి మానసికంగా కావలసిన అండదండలను అందించాలి.

AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 15.
ప్రత్యుత్పత్తిపరంగా మరొక తరం సంతతిని ఉత్పత్తి చేసే విధంగా ప్రకృతి మానవ శరీరాన్ని తయారుచేసింది. దీన్ని నువ్వెట్లా అభినందిస్తావు ?
జవాబు:

  1. ప్రత్యుత్పత్తిపరంగా మరొక తరం సంతతిని ఉత్పత్తి చేసే విధంగా ప్రకృతి మానవ శరీరంలో లింగ భేదం ఉన్న ప్రత్యుత్పత్తి వ్యవస్థలను తయారుచేసింది.
  2. పురుషులలో ఒక జత ముష్కాలతో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను, స్త్రీలలో ఒక జత స్త్రీ బీజకోశాలతో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థను, ప్రకృతి అభివృద్ధి చేసింది.
  3. పురుషుల నుండి శుక్రకణం స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో విడుదలైన అండంతో కలిసి సంయోగం చెంది సంయుక్త – బీజంగా అభివృద్ధి చెందుతుంది.
  4. దీనిని అంతర ఫలదీకరణ అంటారు.
  5. ఇది స్త్రీలలోని ఫాలోపియన్ నాళాలలో జరుగుతుంది.
  6. తరువాత పిండం ఏర్పడి గర్భాశయ గోడలకు అంటిపెట్టుకుని ‘భ్రూణం’గా అభివృద్ధి చెందుతుంది.
  7. ఈ భ్రూణం ‘గర్భావధి కాలం 270-280 రోజుల మధ్య ఉంటుంది. పూర్తిగా అభివృద్ధి చెంది శిశువుగా మారిన తరువాత తల్లి బిడ్డకు జన్మనిస్తుంది.
  8. ఇది సంక్లిష్టమైన ప్రక్రియ. దీనికి అవసరమైన ఏర్పాట్లు గర్భాశయంలోనే ప్రకృతి అభివృద్ధి చేసింది.
  9. ఇది ఎంతో అభినందించవలసిన విషయం.
  10. ఈ ఏర్పాట్ల వల్ల మానవ సంతతి తరం తర్వాత తరంలో అభివృద్ధి చెందే అవకాశం ఏర్పడింది.

ప్రశ్న 16.
బాల్యవివాహం ఒక సామాజిక దురాచారం అని మీకు తెలుసు. దీని నివారణకై కొన్ని నినాదాలు తయారుచేయండి.
జవాబు:
1. వివాహం మరొక తరాన్ని సృష్టించటంలో కీలకపాత్ర పోషించే ఒక సామాజిక, సాంస్కృతిక ప్రక్రియ.
2. దీనికి పురుషులలో 21 సంవత్సరాలు. స్త్రీలలో 18 సంవత్సరాల కనిష్ఠ వయస్సును మన దేశ రాజ్యాంగం చట్టంగా చేసింది. దీనిని మనందరం గౌరవించాలి.
నినాదాలు :

  1. బాల్య వివాహాలు చట్ట వ్యతిరేకం.
  2. బాల్య వివాహాలు నేరం.
  3. పిల్లల్ని ఎదగనీయండి. తరువాత వివాహం చేయండి. ఆరోగ్యమైన సంతతిని పొందండి.
  4. ఆడపిల్లల చదువు – ఆ ఇంటికి వెలుగు.
  5. బాల్య వివాహం – తల్లీ బిడ్డల ఆరోగ్యానికి హానికరం.
  6. బాల్య వివాహాలు – వారి జీవితాల్లో ఆటుపోటులకు ఆనవాలు.
  7. బాల్య వివాహాలు ఆపుదాం – ముందు తరాలను కాపాడదాం.
  8. బాల్య వివాహం – ఒక సామాజిక దురాచారం.

ప్రశ్న 17.
13 ఏళ్ళ స్వరూప్ తన ఎత్తు గురించి కలవరపడుతున్నాడు. అతడు ఎత్తు పెరుగుతాడా ? తనకి నువ్వు ఇచ్చే సలహా ఏమిటి ?
జవాబు:
1. స్వరూప్ ప్రస్తుత వయస్సు 13 సంవత్సరాలే.
2. పిల్లలు సాధారణంగా కౌమార దశ చివరి వరకు ఎత్తు బాగా పెరుగుతారు.
3. కౌమార దశ 13-19 సం|| వరకు, కాబట్టి స్వరూప్ ఇంకా కౌమార దశ మొదట్లోనే ఉన్నాడు. ఇంకా అతను 6 సం||ల వరకు ఎత్తు ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
4. 19 సం|| దాటిన తర్వాత కూడా 25 నుండి 30 సం|| వరకూ స్వల్పంగా ఎత్తు పెరిగే అవకాశం ఉన్నది.
5. కాబట్టి స్వరూప్ తన ఎత్తు గురించి కలవరపడే అవసరం లేదని నేను అతనికి సలహా .(శాస్త్రీయంగా) ఇస్తాను.

ప్రశ్న 18.
మీ పాఠశాలలో ఉన్న రెడ్ రిబ్బన్ క్లబ్ నిర్వహించే కార్యక్రమాలు మెరుగుపరచుకోవడానికి ఏవైనా ఐదు సలహాలు సూచించండి.
జవాబు:
1. మా పాఠశాలలో ‘కౌమార విద్య’ పై అవగాహన కల్పిస్తూ వాటి కార్యక్రమాల రూపకల్పన మరియు నిర్వహణ కోసం రూపొందించబడిన వాలంటరీ జట్టునే ‘రెడ్ రిబ్బన్ క్లబ్’ అంటారు.
2. చాలామంది దీనిని HIV / AIDS కార్యక్రమ ప్రచారం కోసమే అని భావిస్తారు. కానీ అది తప్పు.
3. ఇది కౌమార దశలో ఉన్న టీనేజర్లు చేసే తప్పులను చేయకూడదని చెప్తూ వారిని చైతన్యపరచి వారి భావోద్వేగాల నియంత్రణకు అవసరమైన కార్యక్రమాలను రూపకల్పన చేస్తుంది.

ఈ క్లబ్ నిర్వహణ మెరుగుపడడానికి కొన్ని సూచనలు :

  1. క్లబ్ నిర్మాణం పారదర్శకంగా ఉండాలి.
  2. సమూహాన్ని జట్లుగా విభజించి ప్రతి జట్టుకు నిర్దిష్టమైన బాధ్యతలను, విధులను కేటాయించాలి.
  3. వీరందరినీ సమన్వయపరచటానికి ఒక ఉపాధ్యాయినీ (బాలికలకు), ఒక ఉపాధ్యాయుడు (బాలురకు) విడిగా ఉండాలి.
  4. చేసిన కార్యక్రమ వివరాలు విధిగా ‘ఒక రిజిస్టరు నందు నమోదు చేయాలి.
  5. ఈ క్లబ్ నిర్వహణ ‘ఒక సామాజిక బాధ్యత’గా పాఠశాల ఉపాధ్యాయులు స్వీకరించాలి.

8th Class Biology 5th Lesson కౌమార దశ InText Questions and Answers

కృత్యములు

1. పట్టికను గమనించండి. క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.
జవాబు:
బాల బాలికల వయస్సు ఆధారంగా ఉండవలసిన సగటు ఎత్తు.
AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ 5
(a) ఏ వయస్సుకు చేరుకున్న తర్వాత అబ్బాయిలలో ఎత్తు పెరుగుదల దాదాపుగా ఆగిపోయింది?
జవాబు:
18 సం|| వయస్సు నాటికి అబ్బాయిలలో పెరుగుదల 100% పూర్తి అవుతుంది.

(b) అమ్మాయిలలో పెరుగుదల ఏ వయస్సులో వేగంగా జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు ?
జవాబు:
అమ్మాయిలలో పెరుగుదల 8 సంవత్సరాల నుండి వేగంగా ప్రారంభమై 16 సం|| పూర్తి అవుతుంది.

(c) అమ్మాయిల్లో పెరుగుదల ఏ వయసులో ఎక్కువగా జరుగుతుంది ?
జవాబు:
అమ్మాయిల్లో పెరుగుదల ప్రధానంగా 11 సంవత్సరాల నుండి 13 సంవత్సరాల మధ్య ఎక్కువగా (4%) జరుగుతుంది.

(d) అబ్బాయి, అమ్మాయిలలో ఎవరు వేగంగా పెరుగుతారు ? ఎట్లా చెప్పగలవు ?
జవాబు:
1. అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలలో పెరుగుదల రేటు అధికం అనిపిస్తుంది.
2. మొదట అమ్మాయిలు వేగంగా పెరిగినప్పటికీ 18 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇరువురిలో పెరుగుదల సమానంగా ఉంటుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ

(b) మీ సంపూర్ణ ఎత్తు ఎంతో ఎలా లెక్కకట్టగలవు ? (పేజీ నెం. 70)
జవాబు:
1. దీనికి నా ప్రస్తుత వయస్సు ఎంతో కావాలి.
2. తరువాత ఈ వయస్సులో ఎంత ఎత్తు ఉన్నానో తెలియాలి.
3. చివరగా ఎత్తు పెరుగుదల శాతం, ఈ వయస్సుకు ఎంతో తెలియాలి.
అంటే నా ప్రస్తుత వయస్సు = 14 సం||
నా ప్రస్తుత ఎత్తు = 130 సెం.మీ.
ఉండవలసిన పూర్తి ఎత్తు శాతం = 92
ఈ విషయాలను కింది సూత్రంలో ప్రతిక్షేపించాలి.
నా సంపూర్ణ ఎత్తు = ప్రస్తుత ఎత్తు / ఉండవలసిన పూర్తి ఎత్తు శాతం × 100 = \(\frac {130}{92}\) × 100 = 141.3 సెం.మీ.
నేను టీనేజ్ పూర్తయ్యే నాటికి 141.3 సెం.మీ. ఎత్తు పెరుగుతాను. అంటే ఇంకా 11.3 సెం.మీ. ఎత్తు పెరుగుతానన్న మాట!
(దీనికి అనుబంధంగా వయస్సు, పెరుగుదల శాతం గల పట్టిక సహాయం తీసుకోవాలి)

ఎత్తు అంచనావేద్దాం.

ప్రశ్న 2.
నీ స్నేహితులు ఆరుగురిని ఎంపిక చేసి వారి ప్రస్తుత ఎత్తు, భవిష్యత్ ఎత్తు ఎలాప్రశ్న అంచనా వేస్తావో చెప్పు. (పేజీ నెం. 71)
జవాబు:
సూత్రం : మీ సంపూర్ణ ఎత్తు = ప్రస్తుత ఎత్తు (సెం.మీ.లలో) / ఉండవలసిన పూర్తి ఎత్తు శాతం × 100
(పట్టిక – 1లోని సమాచారం ఉపయోగించుకున్నాను.)
AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ 6

మీ శరీరంలో మార్పులు పరిశీలిద్దాం.

3. మీ పాఠశాలలోని లేదా మీ తరగతిలోని స్నేహితుల ఆరోగ్య కార్డులను గమనించి కింది పట్టిక పూరించండి. మీ పరిశీలనలు రాయండి. (పేజీ నెం. 71)
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ 7
పరిశీలనలు :
1. కౌమార దశలో శారీరక మార్పులు వేగంగా జరుగుతాయి.
2. అమ్మాయిల కంటే అబ్బాయిల భుజాలు వెడల్పుగా మారాయి.
3. అమ్మాయిలలో నడుం కింద భాగం వెడల్పుగా మారడం గమనించాము. (ఈ మార్పు ముందు ముందు బిడ్డకు జన్మ నివ్వడంలో తోడ్పడుతుంది.)

AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ

4. మీ స్నేహితుని ప్రవర్తన మీ ప్రవర్తనలు కింది చెక్ లిస్ట్ తో సరిపోతాయో లేదో సరిచూసుకోండి. దానిని బట్టి నువ్వు ఏ ఏ విషయాలు గమనించావో తెలపండి.
జవాబు:
చెక్ లిస్ట్ :
AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ 8
పై చెక్ లిస్టు ఆధారంగా చేసుకుని ఈ కింది విషయాలు అర్థం చేసుకున్నాను.

  1. బాల్యంలో చేసే పనులకు, కౌమార దశలో చేసే పనులకు తేడా ఉంటుంది.
  2. ఈ దశలో బాలబాలికలు స్వతంత్రంగా వ్యవహరిస్తారు.
  3. శారీరక, మానసిక మార్పులు వస్తాయి.
  4. ఉద్వేగానికి, అయోమయానికి లోనయ్యే దశలో మేమున్నాం అని గుర్తించాం.
  5. కొత్త ఆలోచనల వెల్లువ మనసులో ఏర్పడుతుంది.
  6. కొత్త విషయాలు అన్నీ తెలుసుకోవాలన్న ఉత్సాహం ఉంటుంది.
  7. మానసిక ఒత్తిడి ఉంటుంది.
  8. అనుమానాలు, సంశయాలు తీర్చే ఉపాధ్యాయులన్నా, పెద్దలన్నా చాలా గౌరవభావం ఏర్పడుతుంది. (కౌమార దశలో ప్రకృతి సహజంగా ఉన్న రహస్యాల గురించి దాచి పెట్టకుండా అన్నింటినీ నివృత్తి చేయాలి.)

పాఠ్యాంశములోని ప్రశ్నలు

ప్రశ్న 1.
చిన్న పిల్లలు ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు గొంతును బట్టి అమ్మాయా, అబ్బాయో చెప్పగలమా ? (పేజి నెం. 72)
జవాబు:
చిన్న పిల్లల గొంతును బట్టి అబ్బాయో, అమ్మాయో చెప్పలేము. ఇద్దరి గొంతు ఒకే విధంగా ఉంటుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 2.
మాట్లాడేవారు అబ్బాయో, అమ్మాయో ఎప్పుడు ఎలా చెప్పగలుగుతాం ? (పేజి నెం. 72)
జవాబు:
యుక్త వయస్సు వచ్చిన తర్వాత అబ్బాయిల గొంతు గంభీరంగా మారి అమ్మాయిల కంటే విభిన్నంగా ఉంటుంది. అప్పుడు గొంతు ఆధారంగా అబ్బాయో, అమ్మాయో చెప్పలేము.

ప్రశ్న 3.
కౌమార దశలో సాధారణంగా మగపిల్లల కంఠస్వరంలో మార్పు ఎందుకు వస్తుంది ? (పేజి నెం. 72)
జవాబు:
కౌమార దశలో మగపిల్లల స్వరకోశం పరిమాణంలో పెద్దదిగా పెరుగుతుంది. దీనినే ఆడమ్స్ యాపిల్ అంటారు. దీని పరిమాణం పెరగటం వలన గొంతు గంభీరంగా ఏర్పడి ఆడవారి నుండి విభేదిస్తుంది.

ప్రశ్న 4.
ప్రత్యుత్పత్తి దశలను, ప్రత్యుత్పత్తి దశల క్రమాన్ని ఫ్లోచార్టు రూపంలో రాయండి. ఫ్లోచార్టు ఆధారంగా ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (పేజి నెం. 74)
AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ 9

(a) స్త్రీలలో అండం విడుదల చాలా రోజుల వరకు కొనసాగుతుందా ?
జవాబు:
స్త్రీలలో అండం విడుదల దాదాపు 50 నుండి 55 సంవత్సరాలపాటు కొనసాగుతుంది.

(b) ఒక వేళ అండం విడుదల ఆగిపోతే ఏం జరుగుతుంది ?
జవాబు:
1. అండం విడుదల కాకపోతే, ఫలదీకరణ జరగదు.
2. కావున కొత్త జీవులు ఏర్పడవు.

(c) ఫలదీకరణ చెందిన అండాలు ఏమవుతాయి ?
జవాబు:
1. ఫలదీకరణ చెందిన అండాలు సంయుక్త బీజంగా మారతాయి.
2. సంయుక్త బీజం గర్భాశయంలో జీవిగా ఎదుగుతుంది.

(d) ఫలదీకరణ జరగకపోతే ఏమౌతుంది ?
జవాబు:
1. ఫలదీకరణ జరగకపోతే జీవులు ఏర్పడవు.
2. జాతి అంతరించి పోతుంది.

(e) అసలు అండమే విడుదల కాకపోతే ఏమౌతుంది ?
జవాబు:
లైంగిక ప్రత్యుత్పత్తికి అండము తప్పనిసరి. అసలు అండము విడుదల కాకపోతే లైంగిక ప్రత్యుత్పత్తి జరగదు. దానివలన కొత్త జీవులు రూపొందవు.

AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 5.
NPEGEL కార్యక్రమం ద్వారా పాఠశాలలో అమ్మాయిలకు నాప్ కిన్లు అందజేస్తున్నారు. మీ పాఠశాలలో ఈ పథకంలో భాగంగా ఏ ఏ కార్యక్రమాలు చేస్తారో రాయండి. (పేజీ నెం. 79)
జవాబు:
NPEGEL కార్యక్రమం మా పాఠశాలలో

  1. ఆరోగ్య విద్య మీద చర్చ నిర్వహిస్తారు.
  2. కౌమార దశలో శారీరక శుభ్రత ప్రాధాన్యత వివరిస్తారు.
  3. ఉద్వేగ నియంత్రణ అంశంపై క్లాసులు నిర్వహిస్తాడు.
  4. మంచిగా ఆలోచించటం, కలిసి జీవించటం వంటి అంశాలపై అవగాహన ఏర్పరుస్తారు.

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

SCERT AP 8th Class Biology Study Material Pdf 4th Lesson జంతువులలో ప్రత్యుత్పత్తి Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Biology 4th Lesson Questions and Answers జంతువులలో ప్రత్యుత్పత్తి

8th Class Biology 4th Lesson జంతువులలో ప్రత్యుత్పత్తి Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం

ప్రశ్న 1.
ప్రకృతిలో అన్ని జీవులు ప్రత్యుత్పత్తిని ఆపివేస్తే ఏం జరుగుతుంది ?
జవాబు:

  • ప్రత్యుత్పత్తి అనేది సజీవులలో ఒక ముఖ్యమైన జీవనక్రియ.
  • దీనివల్ల ప్రౌఢ జీవులు, పిల్ల జీవులను ఉత్పత్తి చేసి తమ తమ జాతులను, వాటి జనాభాను పెంచుకుంటూ ఈ జీవావరణంలో తమ ప్రభావం కోల్పోకుండా చూసుకుంటాయి.
  • దీనివల్ల పాత తరం స్థానంలో కొత్త తరం వచ్చి ఆవరణ వ్యవస్థలో వాటి పాత్రను పూర్తిచేసి ప్రకృతి సమతుల్యతను కాపాడతాయి.
  • ప్రత్యుత్పత్తిని జీవులు ఆపివేస్తే, ఉన్న జీవులు ముసలివై కొంతకాలం తర్వాత చనిపోతాయి. తరువాత వాటి స్థానాన్ని భర్తీచేసే కొత్తతరం ఉండదు.
  • కాబట్టి ‘ప్రకృతిలో సమతుల్యత’ దెబ్బతిని సృష్టి అంతానికి కారణమవుతుంది.

ప్రశ్న 2.
ఈ కింది వాటిలో తేడాలను తెలపండి.
ఎ) లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి
జవాబు:

లైంగిక ప్రత్యుత్పత్తిఅలైంగిక ప్రత్యుత్పత్తి
1. ఒక జీవి లేదా స్త్రీ పురుష జీవులు అవసరం.1. ఒక జీవి మాత్రమే అవసరమవుతుంది.
2. స్త్రీ పురుష బీజకణాలు ఏర్పడతాయి.2. బీజ కణాలు ఏర్పడవు.
3. సంయుక్త బీజం ఏర్పడుతుంది.3. సంయుక్తబీజం ఏర్పడదు.
4. సగం తల్లి లక్షణాలు, సగం తండ్రి లక్షణాలు వస్తాయి.4. ఇవి తల్లి జీవి నకలు (జిరాక్స్) గా ఉంటాయి.

బి) సంయోగ బీజం, సంయుక్త బీజం
జవాబు:

సంయోగ బీజంసంయుక్త బీజం
1. ఇది స్త్రీ, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థల నుండి తయారవుతుంది.1. ఇది స్త్రీ, పురుష బీజకణాల కలయిక వల్ల ఏర్పడుతుంది.
2. ఇది ఏకస్థితికం.2. ఇది ద్వయ స్థితికం.
3. ఇది ఫలదీకరణలో పాల్గొంటుంది.3. ఫలదీకరణ తరువాత మాత్రమే ఇది ఏర్పడుతుంది. తద్వారా జీవి పెరుగుదల మొదలవుతుంది.

సి) బాహ్య ఫలదీకరణం, అంతర ఫలదీకరణ
జవాబు:

బాహ్య ఫలదీకరణఅంతర ఫలదీకరణ
1. శరీరం బయట జరుగు ఫలదీకరణను బాహ్య ఫలదీకరణ అంటారు.1. శరీరం లోపల (స్త్రీ జీవిలో) జరిగే ఫలదీకరణను అంతర ఫలదీకరణ అంటారు.
2. సంయుక్తబీజం బయట (గాలి, నీరు, నేల) అభివృద్ధి చెందుతుంది. ఉదా : కప్ప, చేప2. సంయుక్త బీజం స్త్రీ జీవి శరీరంలోపల అభివృద్ధి చెందుతుంది. ఉదా : క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు మొ॥నవి.

డి) అండోత్పాదకాలు, శిశోత్పాదకాలు
జవాబు:

అండోత్పాదకాలుశిశోత్పాదకాలు
1. గుడ్లు పెట్టి పిల్లతరాన్ని అభివృద్ధి చేసే జీవులను అండోత్పాదకాలు అంటారు.1. పిల్లల్ని కని, పెంచి తరువాతి తరాన్ని అభివృద్ధి చేసే వాటిని శిశోత్పాదకాలు అంటారు.
2. వీటిలో అంతర ఫలదీకరణ జరుగును.
ఉదా : పక్షులు, సరీసృపాలు
2. వీటిలో కూడా అంతర ఫలదీకరణ జరుగును.
ఉదా : క్షీరదాలు, గబ్బిలం (ఎగిరే క్షీరదం)

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 3.
హైడ్రా, అమీబాల్లో ప్రత్యుత్పత్తి ప్రక్రియను పోల్చండి.
జవాబు:

హైడ్రా ప్రత్యుత్పత్తిఅమీబాలో ప్రత్యుత్పత్తి
1. ఇది బహుకణ జీవి.1. ఇది ఏకకణ జీవి.
2. దీనిలో అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది.2. దీనిలో కూడా అలైంగిక పద్ధతిలోనే ప్రత్యుత్పత్తి జరుగుతుంది.
3. ఈ పద్ధతిని మొగ్గ తొడగడం లేదా ‘కోరకీ భవనం’ అంటారు.3. ఇది ద్విధావిచ్ఛిత్తి లేదా బహుధా విచ్ఛిత్తిల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతుంది.
4. ప్రత్యుత్పత్తి తరువాత తల్లిజీవి అంతరించిపోదు.4. కానీ దీనిలో మాత్రం ద్విధా లేదా బహుధా విచ్ఛిత్తి తల్లిజీవి, పిల్లజీవి రెండూ జీవనం కొనసాగిస్తాయి. తరువాత తల్లి కణం అంతర్ధానమయ్యి పిల్ల కణాలను ఏర్పరుస్తుంది.

ప్రశ్న 4.
సంయుక్తబీజం ఏర్పరచకుండానే జంతువులు వాటి సంతతిని ఉత్పత్తి చేయగలవా ? ఉదాహరణతో వివరించండి.
జవాబు:

  • లైంగిక ప్రత్యుత్పత్తిలో సంయుక్తబీజం ఏర్పడి, దాని నుండి జీవులు ఏర్పడతాయి.
  • కాని అన్ని జంతువులు లైంగిక ప్రత్యుత్పత్తిని అనుసరించవు.
  • కొన్ని జీవులు అలైంగిక ప్రత్యుత్పత్తిలో సంయుక్తబీజం ఏర్పడకుండానే సంతతిని ఉత్పత్తి చేస్తాయి.
  • ఉదా : అమీబా – ద్విదావిచ్ఛిత్తి
    హైడ్రా – మొగ్గతొడగటం

ప్రశ్న 5.
బాహ్య లక్షణాలు పరిశీలించి ఒక జీవి అండోత్పాదకమో, శిశోత్పాదకమో ఎలా గుర్తించగలవు ?
జవాబు:
1) అండోత్పాదక జీవిలో

  • చెవులు బయటకు కనిపించవు.
  • చర్మంపై రోమాలు ఉండవు. ఇలాంటి బాహ్య లక్షణాలు ఉన్న జీవులు గుడ్లు పెడతాయి.
  • ఉదా : పక్షులు, మొసలి,తాబేలు, పాము.

2) శిశోత్పాదక జీవిలో

  • చెవులు బయటకు కనిపిస్తాయి.
  • చర్మంపై రోమాలు ఉంటాయి. ఇలాంటి బాహ్య లక్షణాలు ఉన్న జీవులు పిల్లల్ని కని పెంచుతాయి.
  • ఉదా : క్షీరదాలు.

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 6.
నేను ఎవరిని ?
i) నేను పురుష, స్త్రీ సంయోగ బీజాల కలయిక వల్ల ఏర్పడతాను.
జవాబు:
సంయుక్త బీజము అంటారు.

ii) నాకు తోక ఉంటుంది. అండంతో సంయోగం చెందుతాను.
జవాబు:
శుక్రకణం అంటారు.

iii) తల్లి గర్భాశయంలో పూర్తిగా ఎదిగిన పిండాన్ని నేను.
జవాబు:
భ్రూణం అంటారు.

ప్రశ్న 7.
అనేక భూచరాలలో అంతర ఫలదీకరణ జరుగుటకు కారణాలు ఏమై ఉంటాయి?
జవాబు:

  • బాహ్య ఫలదీకరణలో నీరు మాధ్యమంగా పనిచేస్తుంది.
  • అందువలన సంయోగబీజాలు ఎండిపోయి చనిపోవటం జరగదు.
  • వీటి చలనానికి నీరు దోహదపడుతుంది.
  • భూచర జీవులు భూమిమీద నివశిస్తాయి.
  • నేలమీద సంయోగబీజాలు చలించలేవు.
  • వేడికి, గాలికి సంయోగబీజాలు చనిపోతాయి.
  • అందువలన భూచరజీవులు అంతర ఫలదీకరణను అవలంబిస్తాయి.

ప్రశ్న 8.
కింది పటం సహాయంతో అందులోని జీవి యొక్క జీవిత చరిత్రలో వివిధ దశలను గుర్తించండి. ఈ జీవిలో రూపవిక్రియ ఎలా జరుగుతుందో వివరించండి.
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 1
జవాబు:

  • ఈ పటంలో ఉన్నది ‘పట్టు పురుగు’ జీవిత చక్రంనకు సంబంధించినది.
  • దీనిలో ఎ) ప్రౌఢజీవి b) గుడ్ల దశ c) లార్వా దశ d) ప్యూపా దశలు ఉన్నాయి.
  • పట్టు పురుగు నందు అంతర ఫలదీకరణ జరిగి సంయుక్త బీలు – స్త్రీ జీవిలో ఏర్పడతాయి.
  • ఇది మల్బరీ ఆకుల వెనుకభాగాన గుడ్లు దశలు దశలుగా, గుంపులుగా పెడుతుంది.
  • ఇవి ‘సూర్యరశ్మి’ సమక్షంలో పొదగబడి లార్వా దశకు చేరుకుంటాయి.
  • ఇది ‘గొంగళి పురుగు’ మాదిరిగా ఉండి మల్బరీ ఆకులను తింటూ జీవిస్తుంది.
  • తరువాత ‘ప్యూపాదశ’లో ఈ డింభకం ఒక సంచి వంటి కోశాన్ని నిర్మించి దానిలో సుప్తావస్థలోకి వెళ్తుంది.
  • తరువాత అది కోశం నుండి ‘ప్రౌఢజీవి’ గా అభివృద్ధి చెందుతుంది.
  • ప్రౌఢజీవి లక్షణాలు లార్వా, ప్యూపా దశలలో లేనప్పటికీ చివరికి మరలా తల్లి లక్షణాలతో జీవి అభివృద్ధి చెందింది. దీనిని రూపవిక్రియ అంటారు.

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 9.
జతపరచండి.
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 2
జవాబు:
ఎ) 2
బి) 1
సి) 4
డి) 3

ప్రశ్న 10.
ఈ కింది ఖాళీలను పూరింపుము.
ఎ) పిల్లలను కనే జంతువులను ……………….. అంటాం.
బి) మానవులలో శిశువు పెరుగుదల …………………. లో జరుగుతుంది.
సి) అండాలు ……………………… నుండి విడుదలవుతాయి.
డి) టాడ్ పోల్ అనేది ……………………… యొక్క ప్రాథమిక రూపం.
ఇ) కోరకీభవనం, ద్విధా విచ్ఛిత్తి …………………… ప్రత్యుత్పత్తి విధానాలు.
జవాబు:
ఎ) శిశోత్పాదక జీవులు
బి) స్త్రీ జీవి గర్భాశయం
సి) స్త్రీ జీవి బీజకోశం
డి) కప్ప
ఇ) అలైంగిక

ప్రశ్న 11.
అమీర్ ఒక చెరువులో టాడ్ పోల్ ను చేపగా భావించి జాగ్రత్తగా అక్వేరియంలో ఉంచాడు. కొన్ని రోజుల తరువాత అమీర్ దానిలో ఏమేమి మార్పులు గమనిస్తాడో రాయండి.
జవాబు:

  • ‘టాడ్పేల్’ అచ్చం చేపపిల్ల లక్షణాలు కలిగిన ‘కప్ప డింభకం’.
  • పిల్లలు (అమీర్) దానిని చెరువులో చూసి చేపపిల్ల అనుకుని ఆక్వేరియంలో ఉంచాడు.
  • ముందు దీనికి జిగురు ముద్ద లాంటి మూతి ఉండటం గమనించాడు.
  • అది నీళ్ళలో నాచును, అక్వేరియంలో గోడలను అంటిపెట్టుకోవటానికి పనికి వస్తుందని గమనించాడు.
  • దీనికి ఉన్న తోక సాయంతో ఈదగలుగుతుందని గమనించాడు.
  • ఇది బాహ్య మొప్పల ద్వారా ‘జల శ్వాసక్రియ’ జరుపుతుందని తెలుసుకున్నాడు.
  • నెమ్మదిగా ముందున్న శ్లేష్మస్థర ముద్ద నోరుగా పై క్రింది పెదవులుగా విడిపోవటం చూసాడు.
  • తరువాత మొప్పలపై ఉపరికుల ఏర్పడింది.
  • తరువాత దీని తోక కొంచెం కొంచెం పొడవు తగ్గటాన్ని గమనించాడు.
  • ఉపరికుల, బాహ్య మొప్పల స్థానంలో ముందు కాళ్లు ఆవిర్భవిస్తున్నాయి.
  • తరువాత తోక మొదలైన స్థానం నుంచి ఇరుపక్కల వెనుక కాళ్లు ఆవిర్భవిస్తున్నాయి.
  • తల కింది భాగంలో ఇరువైపులా ఉన్న బాహ్య మొప్పలు అంతరించిపోయాయి.
  • తోక పూర్తిగా కుంచించుకుపోయింది.
  • ముందు, వెనుక కాళ్ళు పూర్తిగా అభివృద్ధి చెందాయి.
  • ఊపిరితిత్తులు ఏర్పడి ఇది నీటి పైకి మూతి పెట్టి బాహ్య నాసికా రంధ్రాల ద్వారా గాలి పీల్చుకోవటం గమనించాడు.
  • ఇది ఇప్పుడు పూర్తిగా రూపాంతరం చెంది కప్ప పిల్లగా మారిపోవడాన్ని పరిశీలించి ఆశ్చర్యపోయాడు.

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 12.
చేపలు, కప్పలు అధిక సంఖ్యలో అండాలను ఎందుకు విడుదల చేస్తాయి ? మానవుని వంటి క్షీరదాలు అధిక సంఖ్యలో అండాలు విడుదల చేయకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయో ఉపాధ్యాయునితో చర్చించి రాయండి.
జవాబు:

  • చేపలు, కప్పలలో బాహ్య ఫలదీకరణ జరుగుతుంది.
  • కావున ఇవి అండాలు, శుక్రకణాలను నీటిలోనికి విడుదల చేస్తాయి.
  • నీటి ప్రవాహానికి వర్షాలకు ఇతర జీవుల ఆహారంగా కొన్ని అండాలు నశిస్తాయి.
  • అందువలన అండాలలో ఫలదీకరణ అవకాశాలు తగ్గుతాయి. కావున ఈ జీవులు అధిక సంఖ్యలో అండాలను ఉత్పత్తి చేస్తాయి.
  • మానవుని వంటి క్షీరదాలలో అంతర ఫలదీకరణ జరుగుతుంది.
  • అండాలు నశించటం ఉండదు. ఫలదీకరణ అవకాశాలు అధికం.
  • కావున క్షీరదాలలో అండాలు తక్కువ సంఖ్యలో విడుదల అవుతాయి.

ప్రశ్న 13.
మీ గ్రంథాలయము నుండి గాని, ఇతర వనరుల నుండి గానీ తేనెటీగ యొక్క జీవిత చరిత్రను సేకరించి, పాఠశాల సింపోసియంలో ఆ అంశాలను చర్చించండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 3

  • తేనెటీగ ‘ఆర్థోపొడ’ వర్గానికి చెందిన జీవి.
  • ఇవి చాలా కష్టజీవులు. పువ్వుల నుండి మకరందం సేకరించి ‘తేనె’ తయారు చేస్తాయి.
  • క్రమ శిక్షణకు, నాయకత్వ విధేయతకు, మాతృసామ్య వ్యవస్థ మూలాలకు ఈ తేనెటీగలు మంచి ఉదాహరణ.
  • వీని జీవిత చరిత్రలో 4 దశలు ఉన్నాయి. a) గుడ్లు b) లార్వా c) ప్యూపా d) ప్రౌఢజీవి.
  • ఆడ ఈగలు ప్రత్యుత్పత్తి తర్వాత గుడ్లు పెడతాయి.
  • ఇవి పొదగబడిన తరువాత వాటి నుండి లార్వాలు వస్తాయి.
  • ఈ లార్వాలు తేనెటీగలు ఏర్పరచుకున్న తెట్టులోగానీ, పుట్టలోగానీ ఉంచబడతాయి.
  • ఇవి తరువాత పొదగబడి పౌడజీవులుగా ఏర్పడతాయని తెలుసుకున్నాను.

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 14.
కింది పటాలను గమనించి బొమ్మలు గీయండి. వాటి విధులు రాయండి.
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 4
జవాబు:
ముష్కము విధులు :
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 5

  • ముష్కము పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ముఖ్య భాగం.
  • ఇది శుక్రకణాలను ఉత్పత్తి చేస్తుంది.
  • పురుష లైంగిక హార్మోన్ టెస్టోస్టిరాన్ ను ఉత్పత్తి చేస్తుంది.
  • మగ పిల్లలలో యుక్తవయస్సుకు రాగానే “ద్వితీయ లైంగిక” లక్షణాలను అభివృద్ధి చేస్తుంది. ముష్కము
  • ఇది పీయూష గ్రంథి ఆజ్ఞల ప్రకారం పని చేస్తుంది.

స్త్రీ బీజకోశాలు-విధులు :
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 6

  • స్త్రీ బీజకోశాలు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ముఖ్య భాగాలు.
  • వీటిలో ‘అండ పుటికలు’ ఉంటాయి.
  • ఇవి యుక్త వయసు వచ్చిన తర్వాత నుండీ మోనోపాజ్ దశ వరకు ప్రతి 28 రోజులకొకసారి ఒక పుటిక పక్వానికి వచ్చి అండాన్ని విడుదల చేస్తుంది.
  • పగిలిన పుటిక స్త్రీ లైంగిక హార్మోన్లయిన 1) ఈస్ట్రోజన్ 2) ప్రొజెస్టిరాన్లను ఉత్పత్తి చేస్తుంది.

ఫాలోపియన్ నాళాలు-విధులు :

  • ఇవి ఆడపిల్లలలో ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధిని జరిపిస్తాయి.
  • తల్లుల ఆరోగ్యానికి, గర్భం దాల్చినప్పుడు మార్పులకు, బిడ్డకు పాలివ్వటానికి ప్రొజెస్టిరాన్ సహకరిస్తుంది.
  • అండం గర్భాశయానికి చేరటానికి సహకరిస్తాయి.
  • ఫలదీకరణకు అవకాశమిస్తాయి.

మానవ శుక్రకణం-విధులు :
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 7

  • ఇది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉన్న ‘ముష్కము’ నుండి విడుదల అవుతుంది.
  • ఇది ఏక స్థితికం.
  • కదలగలిగి ఉంటుంది. (దీని తోక సాయంతో)
  • అండాన్ని గర్భాశయంలో కనుగొని ఫలదీకరణ చెందించేందుకు పనిచేస్తుంది.
  • దీని జీవితకాలం 24-72 గంటలు.

అండం-విధులు :
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 8

  • ఇది స్త్రీ బీజకణం.
  • స్త్రీ బీజకోశాలలోని అండ పుటికలు దీనిని ఉత్పత్తి చేస్తాయి.
  • ఇది ఫాలోపియల్ నాళం గుండా ప్రయాణించే సమయంలోనే ఫలదీకరణ చెందేందుకు అవకాశం ఉంటుంది.
  • దీని జీవిత కాలం 24 గం॥ మాత్రమే.

ప్రశ్న 15.
మానవ పురుష, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ పటాన్ని గీయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 9

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 16.
కప్ప జీవిత చరిత్ర పటం గీచి దానిలో ఏవి శాఖాహార దశలో గుర్తించండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 10

  • కప్ప లార్వాను చిరుకప్ప లేదా టాడ్ పోల్ అంటారు.
  • ఈ దశలో కప్ప చేపను పోలి ఉండి శాకాహారిగా ఉంటుంది.

8th Class Biology 4th Lesson జంతువులలో ప్రత్యుత్పత్తి InText Questions and Answers

8th Class Biology Textbook Page No. 54

ప్రశ్న 1.
కింద కొన్ని జంతువుల పేర్లు ఇవ్వబడ్డాయి. వాటిని పరిశీలించి జ్ఞాపకం తెచ్చుకుని పట్టిక నింపండి.
(లేడి, చిరుత, పంది, చేప, గేదె, జిరాఫీ, కప్ప, బల్లి, కాకి, పాము, ఏనుగు, పిల్లి)
జవాబు:

క్ర.సం.చెవి బయటకు కనిపించే జీవులుచెవులు బయటకు కనిపించని జీవులు
1.లేడిచేప
2.చిరుతకప్ప
3.పందిబల్లి
4.గేదెకాకి
5.జిరాఫీపాము
6.ఏనుగు
7.పిల్లి
ఇవన్నీ శిశోత్పాదక జీవులుఇవన్నీ అండోత్పాదక జీవులు

a) చెవులు బయటకు కనిపించకపోయినా ఈ జీవులు ఎట్లా వినగల్గుతున్నాయి ?
జవాబు:

  • చెవి నిర్మాణంలో, వెలుపలి చెవి, మధ్య చెవి, లోపలి చెవి అనే మూడు నిర్మాణాలు ఉంటాయి.
  • వినటంలో కీలక పాత్ర వహించేది లోపలి చెవి.
  • గుడ్లు పెట్టే జంతువులలో బాహ్య చెవి మాత్రమే ఉండదు. మధ్య చెవి, లోపలి చెవి ఉంటుంది.
  • అందువలన ఇవి ధ్వని వినగల్గుతాయి.

8th Class Biology Textbook Page No. 54

ప్రశ్న 2.
కింద కొన్ని జంతువుల పేర్లు ఇవ్వబడ్డాయి. వాటిని జ్ఞాపకం చేసుకుని ఈ పట్టికను నింపండి.
(ఆవు, ఎలుక, కాకి, పంది, నక్క కోడి, ఒంటె, బాతు, కప్ప, ఏనుగు, గేదె, పావురం, పిల్లి, నెమలి, బల్లి )
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 11

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

8th Class Biology Textbook Page No. 57

ప్రశ్న 3.
ఈ క్రింది దానిమ్మ పుష్పాలు పరిశీలించి వాటి ప్రత్యుత్పత్తి భాగాలు రాయండి. (పేజీ నెం. 57)
ఎ) మొక్కలలో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 12
1) ………………….
2) ………………….
3) ………………….
4) ………………….
5) ………………….
6) ………………….
జవాబు:
వాటి భాగాలు
1) కేసరము
2) కేసర దండము
3) పరాగ కోశము
4) పరాగ రేణువులు
5) సంయోజకము
6) కేసరావళి

బి) మొక్కలలో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ వాటి భాగాలు
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 13
1) ………………….
2) ………………….
3) ………………….
4) ………………….
5) ………………….
6) ………………….
జవాబు:
వాటి భాగాలు
1) అండకోశము
2) అండాశయము
3) కీలము
4) కీలాగ్రము
5) అండన్యాస స్థానము
6) అండాలు

8th Class Biology Textbook Page No. 59

ప్రశ్న 4.
ఈ క్రింది స్లో చార్టును పూరించండి.
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 14
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 15

a) శుక్రకణం అండంతో ఫలదీకరణ చెందకపోతే ఏమవుతుందో చెప్పగలరా ?
జవాబు:
శుక్రకణం అండంతో ఫలదీకరణ చెందకపోతే లైంగిక ప్రత్యుత్పత్తి జరగదు. వైవిధ్యం గల జీవులు ఏర్పడవు. క్రొత్త జాతులు అవతరించవు.

b) కొన్ని జంతువులు మాత్రమే పిల్లలకు ఎందుకు జన్మనిస్తాయో చెప్పగలరా ?
జవాబు:
పిల్లల్ని కనే స్త్రీ జంతువుల్లో గర్భాశయము, పిండాభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది. అందువలన పిండాలు గర్భాశయంలో ఎదిగి పిల్ల జీవులుగా పుడతాయి. గుడ్లు పెట్టే జంతువులలో ఈ అమరిక ఉండదు.

c) జంతువులన్నీ పిల్లలకు జన్మనివ్వడం ఆపివేస్తే ఏం జరుగుతుంది ?
జవాబు:
జంతువులన్నీ పిల్లలకు జన్మనివ్వడం ఆపివేస్తే, తదుపరి తరం జీవులు ఉత్పత్తికావు. ఉన్న జీవులు కొంత కాలానికి మరణిస్తాయి. కావున భూమి మీద జీవరాశి అంతరించిపోతుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

8th Class Biology Textbook Page No. 61

ప్రశ్న 5.
టాడ్ పోల్ లార్వాలు ఏ ఏ ఋతువులలో కనిపిస్తాయో చెప్పండి.
జవాబు:

  • టాడ్ పోల్ లార్వాలు వర్షాకాలంలో బాగా కనిపిస్తాయి.
  • వర్షాకాలంలో కప్ప వర్షపు నీటిలో ప్రత్యుత్పత్తి జరుపుతుంది.
  • అందువలన కప్ప అండాలు బాహ్యఫలదీకరణం చెందుతాయి.
  • ఇవి సూర్యరశ్శికి పొదిగి టాడ్ పోల్ లార్వాలను ఉత్పత్తి చేస్తాయి..
  • ఇవి చేపల వలె నీటిలో ఈదుతూ రూపవిక్రియ చెంది కప్పలుగా మారతాయి.

ప్రశ్న 6.
వర్షాకాలంలో కప్పలు ఎందుకు బెక బెకమని శబ్దాలు చేస్తాయి ?
జవాబు:

  • వర్షాకాలం కప్పల ప్రత్యుత్పత్తికి అనుకూల సమయం.
  • ఈ కాలంలో మగకప్ప బెక బెకమని శబ్దాలు చేసి ఆడకప్పను ఆకర్షిస్తుంది.
  • ఆడ, మగ, కప్పలు కలిసి వర్షపు నీటిలో శుక్రకణాలు, అండాలను విడుదల చేస్తాయి.

8th Class Biology Textbook Page No. 62

ప్రశ్న 7.
కప్ప జీవిత చక్రాన్ని పరిశీలించటానికి నీవు చేయు ప్రాజెక్ట్ వివరాలు తెలపండి.
జవాబు:
ఉద్దేశం : కప్ప జీవిత చక్రం పరిశీలించుట.
పరికరాలు : వెడల్పు మూతిగల తొట్టి లేదా గాజుసీసా, పారదర్శక గ్లాసు, డ్రాపర్, పెట్రెడిష్, గులకరాళ్ళు, భూతద్దం, బీకరు.
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 16
విధానము :

  • వర్షాకాలంలో దగ్గర ఉన్న చెరువు వద్దకు వెళ్ళి నురగ వంటి కప్ప గుడ్లను పరిశీలించాను.
  • దానిని జాగ్రత్తగా వెడల్పు మూతిగల సీసాలోనికి తీసుకున్నాను.
  • ఇలా సేకరించిన అండాలను 15 సెం.మీ. లోతు, 8 – 10 సెం.మీ. వ్యాసార్ధం కలిగిన తొట్టిలోకి మార్చాను.
  • భూతద్దం సహాయంతో అండాలను పరిశీలించాను.
  • అండం మధ్య భాగంలో చుక్కవంటి నిర్మాణం గమనించాను. అదే కప్ప పిండం.
  • గుడ్లు పొదిగి కొన్ని రోజులకు, టాడ్ పోల్ లార్వాలు బయటకు వచ్చాయి.
  • ఈ లార్వాలు చేపను పోలి ఉన్నాయి.
  • వీటి తల భాగంలో మొప్పలు ఉన్నాయి.
  • ఇవి క్రమేణా అనేక శారీరక మార్పులు చెందాయి.
  • పరిమాణంలో పెరిగి కాళ్ళు, చేతులు ఏర్పరచుకున్నాయి.
  • తోక అంతరించిపోయింది.
  • మొప్పలు అదృశ్యమైపోయాయి. ఊపిరితిత్తులు ఏర్పడ్డాయి.
  • చివరికి అది తోక కలిగిన కప్ప ఆకారం నుండి కప్పగా మార్పు చెందింది.
  • ఈ ప్రక్రియనే రూపవిక్రియ అంటారు.

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 17

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 8.
a) గుడ్లు పొదగటానికి ఎన్ని రోజులు పట్టింది ?
జవాబు:
గుడ్లు పొదగటానికి వారం రోజులు పట్టింది. (7 నుండి 9 రోజులు)

b) టాడ్పల్ ఏ ఆకారాన్ని పోలి ఉంది ?
జవాబు:
టాడ్ పోల్ చేప ఆకారాన్ని పోలి ఉంది.

c) ఏ దశలో టాడ్ పోల్ లో మొప్పలు కనిపిస్తాయి ?
జవాబు:
గుడ్డు నుండి వచ్చిన టాడ్పేల్ బాహ్య మొప్పలు కల్గి ఉంది. మొదటి దశలో టాడ్ పోల్ లార్వా బాహ్య మొప్పలు కల్గి ఉంది.

d) సేకరించిన ఎన్ని రోజులకు టాడ్ పోల్ కు కింది అవయవాలు కనిపించాయి ?
జవాబు:
గుండె – 2వ వారము (14 రోజులు తరువాత)
ప్రేగులు – 3వ వారము (21 రోజులు)
ఎముకలు – 4వ వారము (28 రోజులు)
పురీషనాళం – 3వ వారము (21 రోజులు)
ముందు కాళ్ళు – 9వ వారము (63 రోజులు)
వెనుక కాళ్ళు – 10వ వారము (70 రోజులు)

e) టాడ్ పోల్ లార్వాలో మొప్ప చీలికలు ఎన్నవ రోజు నుండి కనిపించకుండాపోయాయి ?
జవాబు:
28 రోజులు (నాలుగు వారాలు) తరువాత మొప్ప చీలికలు అదృశ్యమైనాయి.

f) ఎన్నవ రోజు తోక పూర్తిగా కనిపించకుండా పోయింది ?
జవాబు:
84 రోజులు (12 వారాలు) తరువాత తోక కనిపించకుండా పోతుంది.

g) టాడ్ పోల్ లార్వా కప్పగా మారుటకు ఎన్ని రోజులు పట్టింది ?
జవాబు:
టాడిపోల్ లార్వా కప్పగా మారుటకు 48 రోజులు పట్టింది.

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ఆలోచించండి – చర్చించండి

ప్రశ్న 1.
అన్ని జంతువులు గుడ్లు పెడతాయా ?
జవాబు:
లేదు. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు మాత్రమే గుడ్లు పెడతాయి. క్షీరదాలు గుడ్లు పెట్టవు. పిల్లల్ని కంటాయి.

ప్రశ్న 2.
ఏ ఏ జంతువులు పిల్లల్నికంటాయి ?
జవాబు:
క్షీరదాలు అన్ని పిల్లల్ని కంటాయి. ఉదా : ఆవు, గేదె, గుర్రం, ఎలుక, పిల్లి, ఏనుగు, మనిషి.

ప్రశ్న 3.
ఏ ఏ జంతువులు గ్రుడ్లు పెడతాయో, ఏవి పిల్లల్ని కంటాయో తెలుసుకోవటం ఎలా ?
జవాబు:
పిల్లల్ని కనే జంతువులలో కొన్ని బాహ్య లక్షణాలు విభిన్నంగా ఉంటాయి. వీటి ఆధారంగా పిల్లల్ని కనే జంతువులను గుడ్లు పెట్టే వాటి నుండి వేరుగా తెలుసుకోవచ్చు.

ప్రశ్న 4.
అలా తెలుసుకోవడానికి పద్ధతులేమైనా ఉన్నాయా ?
జవాబు:
పిల్లల్ని కనే జంతువులు బాహ్య చెవులను, చర్మం మీద రోమాలను కలిగి ఉంటాయి. వీటి ఆధారంగా పిల్లల్ని కనే జంతువులను గుర్తించవచ్చు.

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

కృత్యములు

కృత్యం – 1

ప్రశ్న 1.
మీ ప్రయోగశాలలో ఉన్న హైడ్రా సైడ్ ను చూస్తే, దానిపై ఉబ్బెత్తు బుడిపెలు కనపడ్డాయా ? అవి ఏమిటి ? మీ పరిశీలన ఆ రాయండి.
జవాబు:
1) హైడ్రా సైడ్ ను పరిశీలిస్తున్నప్పుడు ఈ ఉబ్బెత్తు భాగాలను పరిశీలించాను.
2) మా టీచరు వాటిని ‘మొగ్గలు’ (కోరకాలు) అన్నారు.
3) అవి ఎలా ఏర్పడతాయి ?
4) లైబ్రరీ నందున్న జీవశాస్త్ర పుస్తకంలో ఈ కింది విధానం ఉంది. గమనించండి.

  • ముందుగా హైడ్రా శరీరంపై ఉన్న ఒక భాగం జీవ పదార్థ పీడనం వల్ల బయటకు నెట్టబడుతుంది.
  • తరువాత దీని లోపలి గోడలపై కొత్త కణాలు, కణ ద్రవ్యం ఏర్పడి దాని పరిమాణం పెరుగుతుంది.
  • తరువాత ఈ ఉబ్బెత్తు భాగం చివర కళాభాలు మొలుస్తాయి.
  • దానిని సంపూర్ణ పిల్ల హైడ్రాగా మనం చూడవచ్చు.
  • ఇది తల్లి నుండి వేరై, స్వతంత్రంగా జీవనం సాగిస్తుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 18

కృత్యం – 2

ప్రశ్న 2.
అమీబాలో ‘ద్విధావిచ్ఛిత్తి’ జరుగుతుందని చెప్పే బొమ్మలను పరిశీలించి మార్పులు పొందుపరచండి. (లేదా) అమీబాలో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం ఏమిటి ? దానిని పటం ద్వారా చూపుము.
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 19
జవాబు:
పటం – 1
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 20

  • అమీబా కేంద్రకం మామూలుగా ఉంది.
  • శరీరం (అంటే కణకవచం) సాధారణంగా ఉంది.

పటం – 2
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 21

  • అమీబా శరీరం గుండ్రని ఆకృతి పొందింది.
  • మిద్యాపాదాలు చాలా వరకు లేవు.
  • కేంద్రకం సాగి, మధ్యలో నొక్కు ఏర్పడింది.

పటం – 3
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 22

  • కేంద్రకం రెండుగా విడిపోయింది.
  • శరీరం మధ్యలో నొక్కు ఏర్పడి అది కణం మధ్య వైపునకు పెరుగుతుంది.
  • పెరుగుదల రెండు పక్కలా అంటే కింది నుంచి, పై నుంచి కూడా ఉంది.

పటం – 4
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 23

  • కణం మధ్యలో నొక్కు బాగా దగ్గర వచ్చింది.

పటం – 5
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 24

  • నొక్కు ఇంకా దగ్గరకు వచ్చింది.
  • అటు పక్క, ఇటు పక్క మిద్యాపాదాలు ఏర్పడటం గమనించాను.

పటం – 6
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 25

  • రెండుగా విడిపోయాయి.
  • తద్వారా తల్లి కణం అంతరించి రెండు పిల్లకణాలు ఉద్భవించాయి.

ఇలా అమీబాలో ద్విధావిచ్ఛిత్తి జరగటం నేను గమనించాను.

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

కృత్యం – 3

ప్రశ్న 3.
ఐదారుగురు విద్యార్థులతో జట్టుగా ఏర్పడండి. మీ జట్టు సభ్యుల తల్లిదండ్రుల ఫోటోలను సేకరించండి. ఆ ఫోటోలతో వారిని పోల్చండి. ఏ ఏ భాగాలు / అవయవాలు, తల్లి లేదా తండ్రిని పోలిఉన్నాయో పరిశీలించి, పట్టికలో నమోదు చేయండి. (పాఠ్యాంశంలోని ప్రశ్న పేజీ నెం. 60)
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 26
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 27

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2

SCERT AP 8th Class Biology Study Material Pdf 3rd Lesson సూక్ష్మజీవుల ప్రపంచం 2 Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Biology 3rd Lesson Questions and Answers సూక్ష్మజీవుల ప్రపంచం 2

8th Class Biology 3rd Lesson సూక్ష్మజీవుల ప్రపంచం 2 Textbook Questions and Answers

ప్రశ్న 1.
కవితకు తీవ్రమైన జబ్బు చేస్తే డాక్టరు దగ్గరకు వెళ్ళింది. డాక్టర్ 5 రోజులకు సూక్ష్మజీవ నాశకాలు (Antibiotics) వాడమని మందులు రాశాడు. మూడు రోజులు వాడిన తరువాత జబ్బు నయం అయింది. ఆమె యాంటిబయాటిక్ మందులు వాడటం మానివేసింది. ఆమె చేసింది సరైనదేనా ? కాదా ? ఎందుకు ? కారణాలు రాయండి.
జవాబు:

  • కవిత చేసింది సరైంది కాదు.
  • ఎందుకంటే డాక్టరు ఆమె జబ్బు నయం అయ్యేందుకు అవసరమైన మోతాదు ఐదు రోజులకు సూక్ష్మజీవ నాశకాలు వాడమని అన్నారు.
  • కానీ జబ్బు మూడవ రోజు తగ్గిందని ఆమె మందులు మానింది.
  • పైకి జబ్బు తగ్గినట్లుగా వున్న, శరీరం లోపల ఇంకా ఆ వ్యాధికారక సూక్ష్మజీవులు వుంటాయి.
  • అవి పూర్తిగా నిర్మూలించబడకుండా మందులు మానివేస్తే జబ్బు తిరగబెడుతుంది.
  • ఒకవేళ మందులు మానివేయాలి అంటే అది డాక్టరు సలహా పై జరగాలి తప్ప మనంతట మనం నిర్ణయించుకోవటం మంచిది కాదు.
  • ఉదా : పచ్చ కామెర్లు తగ్గినా, దీని వ్యాధికారక క్రిమి 6 నెలల వరకు పాక్షికంగా మన శరీరంలోనే వుంటుంది. అందుకే డాక్టరు ఇచ్చిన మోతాదు తప్పక వాడాలి.

ప్రశ్న 2.
టీకాలు మన శరీరంలో ఏ విధంగా పనిచేస్తాయి ?
జవాబు:
టీకాలు లేదా వ్యాక్సిన్లు మన శరీరంలో వ్యాధి రాకముందే ప్రవేశించి, రోగకారక క్రిమిని నశింపచేయటానికి తగిన రోగ నిరోధక శక్తిని కలిగిస్తాయి. ఉదా : ‘పోలియో చుక్కలు’. ఈ మందు చిన్నపిల్లలకు ఇచ్చినప్పుడు ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తరువాత పోలియో వైరస్ శరీరంలోకి ప్రవేశించినా అది పోలియోను కలుగచేయలేదు.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2

ప్రశ్న 3.
పాశ్చరైజేషన్ అంటే ఏమిటి ? అది ఎందుకు ఉపయోగపడుతుంది ?
జవాబు:

  • “లూయీపాశ్చర్” వైన్ చెడిపోవటానికి సూక్ష్మజీవులు కారణం అని గుర్తించాడు.
  • వైన్ ను వేడి చేయటం ద్వారా సూక్ష్మజీవులను చంపి, ఎక్కువ కాలం వైన్ ను నిల్వ చేయవచ్చని నిరూపించాడు. ఈ విధానాన్ని ‘పాశ్చరైజేషన్’ అంటారు.
  • ఇది పాలను పెరుగుగా మార్చటానికి, ద్రాక్ష రసాన్ని పులియబెట్టి వైన్ గా మార్చటానికి ఉపయోగపడుతుంది.

ప్రశ్న 4.
మలేరియా వ్యాధిని నిర్మూలించటానికి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ?
జవాబు:
1. ‘మలేరియా’ ఇది జ్వర రూపంలో వచ్చే వ్యాధి.
2. తీవ్రమైన చలితో కూడిన జ్వరం, ఒళ్ళు నొప్పులు, నీరసం దీని లక్షణాలు.
3. ఇది దోమల వల్ల వచ్చే వ్యాధి. కాబట్టి దోమల నివారణకు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎ) పరిసరాలలో మురుగు గుంటలు, కాలువలు లేకుండా చేయాలి.
బి) ఒకవేళ వున్నా ఆ మురికినీటిపై నూనె చుక్కలు వేస్తే అది నూనె తెట్టును ఏర్పరుస్తుంది. దీంతో ఆ నీటిలోవున్న లార్వాలు చనిపోతాయి.
సి) దోమ తెరలను వాడాలి.
డి) దోమలు ఇంట్లోకి రాకుండా కిటికీలు, తలుపులకు తెరలను పెట్టాలి.
ఇ) ఇల్లు, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా వుంచుకోవటం ముఖ్యమైన విషయం.

ప్రశ్న 5.
వ్యాక్సిన్ తీసుకోవటానికి, యాంటిబయాటిక్ తీసుకోవడానికి సరైన సమయం ఏది ? ఎందుకు ?
జవాబు:

  • వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తగా తీసుకునే మందును ‘వ్యాక్సిన్’ అంటారు.
  • వ్యాధి వచ్చిన తరువాత అది తగ్గటానికి తీసుకునే మందులే యాంటిబయాటిక్స్.
  • కాబట్టి చిన్న వయస్సులో పెద్దలు, డాక్టర్ల సూచనల ప్రకారం వ్యాక్సిన్ తీసుకోవాలి.
  • ఉదా : 1) ధనుర్వాతం, మశూచి మొ॥ రాకుండా చిన్నపిల్లలకు చిన్నప్పుడే టీకాలు వేస్తారు.
    2) పచ్చ కామెర్లు రాకుండా 10-15 సం॥ పిల్లలలో, పెద్దలకు కూడా Hepatitis – B వ్యాక్సిన్ ఇస్తారు.
  • ఇక యాంటిబయాటిక ను జబ్బు లక్షణాలు కనిపించిన తరువాత డాక్టరు నిర్ణయించిన మోతాదు ప్రకారం మాత్రమే మందులను వేసుకోవాలి.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2

ప్రశ్న 6.
వ్యాక్సిను, యాంటిబయాటిక్ తేడాలు ఏమిటి?
జవాబు:

వ్యాక్సిన్యాంటిబయాటిక్
1) చైతన్య రహిత సూక్ష్మజీవులను శరీరంలోనికి ఎక్కించే ప్రక్రియను వాక్సిన్ అంటారు.1) సూక్ష్మజీవులను చంపే రసాయన పదార్థాలను సూక్ష్మజీవ నాశకాలు లేదా యాంటిబయాటిక్స్ అంటారు.
2) వ్యాధినిరోధక వ్యవస్థను పెంచుతుంది.2) వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనపడినపుడు యాంటిబయాటిక్స్ వాడతారు.
3) ప్రతిరక్షకాలు తయారవుతాయి.3) ప్రతిరక్షకాలు తయారుకావు.
4) దీర్ఘకాలిక ప్రభావం ఉంటుంది.4) ప్రభావం తాత్కాలికంగా ఉంటుంది.
5) వ్యాధి రాకుండానే వాక్సిన్ ఇస్తారు.5) వ్యాధి వచ్చిన తరువాత యాంటిబయాటిక్స్ వాడతారు.
6) వ్యాక్సిన్స్ వ్యాధి రాకుండా ఉండటానికి తోడ్పడతాయి.6) యాంటిబయాటిక్స్ వ్యాధిని తగ్గించటానికి తోడ్పడతాయి.

ప్రశ్న 7.
‘పెన్సిలిన్ ఆవిష్కరణ ప్రపంచాన్ని మరణాల నుండి రక్షించింది’ దీనిని వివరించండి.
జవాబు:

  • ‘పెన్సిలిన్’ అంటే యాంటిబయాటిక్ మందు.
  • దీనిని సూక్ష్మజీవ నాశకం అని కూడా అంటారు.
  • దీనిని డా॥ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో కనిపెట్టాడు.
  • గాయపడిన సైనికులు సూక్ష్మజీవుల బారినపడి మరణిస్తుంటే, వీటిపై ప్రయోగాలు చేసి ఈ మందును కనిపెట్టాడు.
  • ఎందరో సైనికులను వ్యాధుల నుండి కాపాడాడు.
  • తరువాత కాలంలో ఇది మరెన్నో కోట్ల మందిని మరణం నుంచి, వ్యాధుల నుంచి కాపాడింది.
  • అందుకే పెన్సిలిన్ ఆవిష్కరణ ప్రపంచాన్ని మరణాల నుంచి రక్షించింది.

ప్రశ్న 8.
ప్రతిరక్షకాలు అంటే ఏమిటి ? ఎప్పుడు ఉత్పత్తి అవుతాయి ? ఎలా మనకు సహాయపడతాయి ?
జవాబు:

  • వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశిస్తే వాటి నుండి మనల్ని రక్షించేందుకు మన శరీరం కొన్ని రక్షకాలను ఉత్పత్తి చేస్తుంది.
  • వీటినే ప్రతిరక్షకాలు అంటారు.
  • ఇవి వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులతో పోరాటం చేస్తాయి.
  • ఇవి వ్యాధికారక క్రిమి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఎక్కువ ఉత్పత్తి అవుతాయి.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2

ప్రశ్న 9.
రాజీ తన పక్కింటి వారితో “మురుగునీరు నిల్వ ఉంటే వ్యాధులు ప్రబలుతాయి” అని చెప్పింది. ఈ సమయంలో ఆమె వ్యాధుల గురించి ఏమేమి వివరాలు చెప్పి ఉంటుందో ఊహించి రాయండి.
జవాబు:

  • మురుగునీరు నిల్వ ఉంటే దానిలో దోమలు, వాటి లార్వాలు పెరుగుతాయి.
  • వాటి ద్వారా వ్యాధులు ప్రబలుతాయి.
  • ఉదాహరణకు ‘మలేరియా’ జ్వరం దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది.
  • టైఫాయిడ్ కూడా క్యూలెక్స్ అనే దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది.
  • మలేరియా చలితో వచ్చే జ్వరం. కానీ టైఫాయిడ్ తక్కువ జ్వరంతో చాలా రోజులు బాధపెడు.
  • ఈ రెండు వ్యాధులకు మురుగునీరు ఒక రిజర్వాయర్ లాంటిది. దీనిలో వీటి లార్వాలు పెరిగి వ్యాధి వ్యాప్తికి కారణమవుతాయి.
  • ఇవి రెండు కాకుండా పోలియో, కలరా, డెంగ్యూ, చికున్ గున్యా, మెదడు వాపు వ్యాధి లాంటి వ్యాధులన్నింటికీ దోమలు వాహకాలు.
  • మురుగునీరు దోమలకు ఆవాసం. కాబట్టి మురుగునీరు నిల్వ ఉంటే వ్యాధులు ప్రబలుతాయి అని రాజీ చెప్పిన విషయం సరైనదే.

ప్రశ్న 10.
మూడు గిన్నెలు తీసుకుని A, B, C గా గుర్తించండి. వాటిలో గోరువెచ్చని పాలు, వేడి పాలు, చల్లని పాలు వరుసగా పోయండి. మూడింటిలో ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున పెరుగు తోడు వేయండి. కదపకుండా 5-6 గంటల సేపు ఉంచండి. తరువాత మూతలు తీసి పాలలో వచ్చిన మార్పులు గమనించండి.
1. గిన్నెలో పాలు పెరుగుగా మారాయి ?
2. ఏ రెండు గిన్నెలలో పాలు పెరుగుగా మారలేదు ?
జవాబు:

  • గోరువెచ్చని పాలు వున్న ‘A’ గిన్నెలో పెరుగు తయారయింది.
  • ‘B’ గిన్నెలో వేడి పాలు వున్నాయి. అంత ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద లాక్టోబాసిల్లస్’ బాక్టీరియా చనిపోతుంది. కాబట్టి కిణ్వనం జరపలేదు. అందుకే పెరుగు తయారవ్వలేదు. పాలు అడలి పోయినట్లు అయిపోతాయి.
  • ‘C’ గిన్నెలో చల్లని పాలు ఉన్నాయి. బాక్టీరియాకు అవసరమైన ఉష్ణోగ్రత కన్నా తక్కువ పాలలో వుంది. కాబట్టి బాక్టీరియా ఎదుగుదల అతి తక్కువ కాబట్టి పెరుగు తయారవ్వలేదు సరికదా పాలు విరిగిపోతాయి.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2

ప్రశ్న 11.
మైక్రోబయాలజీకి సంబంధించిన విషయాలు కనుగొన్న శాస్త్రవేత్తల గురించి సమాచారాన్ని సేకరించండి. ఈ ఆవిష్కరణలు మానవాళికి ఎలా ఉపయోగపడతాయో సూచించే చార్టును రూపొందించి తరగతి గదిలో ప్రదర్శించండి.
జవాబు:

వ.సం.శాస్త్రవేత్త పేరుకనుగొన్న అంశం
1.ఆంథోనివాన్ ల్యూవెన్ హాక్బాక్టీరియా
2.అలెగ్జాండర్ ఫ్లెమింగ్పెన్సిలిన్
3.డా॥ యల్లాప్రగడ సుబ్బారావుటెట్రాసైక్లిన్
4.డా॥ జోసన్ సాక్
డా॥ ఆల్బర్ట్ సాచిన్ పోలియో
పోలియో వ్యాక్సిన్
(చుక్కల మందు)
5.ఎడ్వర్డ్ జెన్నర్మశూచికి టీకా మందు
6.లూయీ పాశ్చర్కుక్క కాటుకి టీకా పాశ్చరైజేషన్
7.డా॥ రోనాల్డ్ రాస్మలేరియా దోమ ద్వారా వ్యాప్తి చెందుతుందని చెప్పాడు.

ప్రశ్న 12.
మైక్రోబయాలజీ (సూక్ష్మజీవుల శాస్త్రం) లో ఆవిష్కరణలు చేసిన శాస్త్రవేత్తల ఫోటోలతో ఆల్బమ్ తయారుచేయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2 1

ప్రశ్న 13.
మీ దగ్గరలో వున్న పాల డైరీని లేదా గ్రంథాలయాన్ని సందర్శించండి. పాశ్చరైజేషన్ జరిగే విధానాన్ని వివరించే ప్రాజెక్టు తయారుచేయండి.
జవాబు:
పాశ్చరైజేషన్ : నిర్వచనం : ఆహార పదార్థాలను వేడి చేయటం ద్వారా సూక్ష్మజీవులను తొలగించి వాటిని ఎక్కువ సమయం నిల్వ చేయటాన్ని పాశ్చరైజేషన్ అంటారు. దీనిని లూయీపాశ్చర్ కనిపెట్టారు.

విధానం : పాలను నిల్వ చేయటం : 1. మొదట పాలను 70°C వరకు 30 సెకన్ల పాటు వేడి చేస్తారు. 2. తరువాత పాలను చల్లార్చి నిల్వ చేస్తారు.

వైన్ ను నిల్వ చేయటం : 1. మొదట వైన్ ను వేడి చేసి తరువాత చల్లబరుస్తారు. 2. ఆపై దానిని నిల్వచేస్తారు.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2

ప్రశ్న 14.
మీ గ్రామంలోని పశువుల ఆసుపత్రిని సందర్శించి అక్కడి డాక్టర్ ని అడిగి పశువులు, గొర్రెలు మరియు మేకలలో వచ్చే జబ్బుల జాబితా తయారుచేయండి.
జవాబు:

జబ్బులు
1. పశువులుజబ్బులు గాలికుంటు వ్యాధి, నోటి వ్యాధులు, సెప్టిసీమియ
2. గొర్రెలుఆంధ్రాక్స్
3. మేకలుఆంధ్రాక్స్

ప్రశ్న 15.
“సూక్ష్మజీవులు లేకపోతే భూమి చెత్తాచెదారం, జంతువుల మృత కళేబరాలతో నిండిపోతుంది” అని సమీర్ వాళ్ళ నాన్నతో అన్నాడు. అతనితో నీవు ఏకీభవిస్తావా ? ఎందుకు ?
జవాబు:

  • సమీర్ తో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే సూక్ష్మజీవులు కొన్ని ఉపయోగకరమైనవి. మరికొన్ని అపాయకరమైనవి.
  • అపాయకరమైన సూక్ష్మజీవులు వ్యాధులు కలుగచేస్తాయి. ఆహారం తదితరాలను పాడుచేస్తాయి.
  • కానీ ఉపయోగకరమైన సూక్ష్మజీవులు ఇంటిలోను, పరిశ్రమలలోను, పరిసరాలలోని పర్యావరణాన్ని శుద్ధి చేయటానికి ఉపయోగపడతాయి.
  • భూమిపై నున్న చెత్తను కుళ్ళింపచేయటానికి సూక్ష్మజీవులే కారణం.
  • తద్వారా ఆ చెత్తను భూమి మృత్తికలో కలసి పోయేలా చేస్తాయి.
  • జంతువుల మృత కళేబరాలు కుళ్ళి భూమిలో (మృత్తికలో) కలసిపోవటానికి కూడా ఈ సూక్ష్మజీవులే కారణం.
  • ఇవే కనుక లేకపోతే భూమి అంతా చెత్తచెదారం జంతువుల మృత కళేబరాలతో నిండిపోతుంది.

ప్రశ్న 16.
ఎడ్వర్డ్ జెన్నర్ మశూచి వ్యాధికి టీకా కనుగొనే క్రమంలో కౌపాక్స్ సోకిన వ్యక్తి బొబ్బల నుండి ద్రవం తీసి 8 సంవత్సరాల బాలుడికి ఎక్కించాడు. తరువాత ఆ బాలునికి మశూచి రాదని ప్రయోగ పూర్వకంగా నిరూపించాడు. ఎడ్వర్డ్ జెన్నర్ ధైర్యంతో కూడిన నిశిత పరిశీలనలను ఎలా అభినందిస్తావు ?
జవాబు:

  • ఎడ్వర్డ్ జెన్నర ను ముందుగా అతని ధైర్యానికి అభినందించాలి.
  • అలాగే తన ప్రయోగాలు, పరికల్పనలపై ఆయనకున్న నమ్మకాన్ని మనం అభినందించాలి.
  • శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు, పరికల్పనలు చేస్తుంటారు.
  • జెన్నర్ లాంటి డాక్టర్ల ప్రయోగాలు ముందు జంతువుల పై, తరువాత అనుమతితో మనుషులపై చేస్తున్నప్పుడు ఎంతో ఉద్విగ్నత కలుగుతుంది.
  • 8 సం॥ బాలుడిపై ప్రయోగం కోసం అతను ఆ పిల్లాడి తల్లిదండ్రులను ఎలా ఒప్పించగలగాడో ? ఆ రోజుల్లో అదొక అద్భుతం. వారు ఒప్పుకుని జెన్నర్ విజయంలో భాగస్వాములయ్యారు. అందుకు వారు అభినందనీయులు.
  • కౌపాక్స్, చికెన్ పాక్స్ వచ్చిన ఇద్దరు వేరు వేరు రోగులను నిశితంగా పరిశీలించి, వాటి కారణాల కోసం ఎంతో ఉత్తమమైన పరికల్పనలు చేసిన జెన్నర్ నిశిత పరిశీలన ఈనాటి డాక్టర్లకు కావలసిన ముఖ్య లక్షణం. అందుకు డా॥ జెన్నర ను నేను ఎంతో అభినందిస్తాను.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2

ప్రశ్న 17.
‘చికిత్స కంటే నివారణే మేలు’ దీనిపై మీ అభిప్రాయం రాయండి.
జవాబు:

  • ‘చికిత్స’ అంటే జబ్బు వచ్చిన తర్వాత మనం తీసుకునే వైద్యం.
  • ‘నివారణ’ అంటే ఆ జబ్బు రాకుండా తీసుకునే ‘ముందు జాగ్రత్త’ కాబట్టి నివారణకే మనం ప్రాధాన్యత నివ్వాలి.
  • ప్రతి వ్యాధికి ఈ రోజున నివారణా పద్ధతులు వున్నాయి.
  • వ్యాధి బారిన పడి బాధపడే కంటే నివారణోపాయాలు తెలుసుకుని వ్యాక్సిన్లు, జాగ్రత్తలు పాటించి మనల్ని మనం ఆరోగ్యవంతులుగా ఉంచుకోవటం మంచిది అని నా అభిప్రాయం.

ప్రశ్న 18.
“చాక్లెట్స్, ఐస్ క్రీములు తిన్న తరువాత నోరు బాగా పుక్కిలించాలి” అని లత తన సోదరుడు రాజేష్ తో చెప్పింది. లత చెప్పింది నిజమేనా ? ఎందుకు ?
జవాబు:

  • లత రాజేష్ తో చెప్పింది నిజమే.
  • కారణం ఏమిటంటే – చాక్లెట్, ఐస్ క్రీమ్ లు తిన్నప్పుడు అవి దంతాల మధ్యలో, చిగుళ్ళలో ఇరుక్కుపోతాయి.
  • నోటిని పుక్కిలించి శుభ్రం చేసుకోవటం ద్వారా సూక్ష్మజీవులు చేరకుండా చూసుకోవచ్చు.
  • చాక్లెట్, ఐస్ క్రీమ్ లో చక్కెర శాతం ఎక్కువ మరియు రెండూ అతి మెత్తని ఆహార పదార్థాలు.
  • వీటిని తిన్నప్పుడు నోటిని పుక్కిలించి శుభ్రం చేసుకోవటం తప్పనిసరి.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2

8th Class Biology 3rd Lesson సూక్ష్మజీవుల ప్రపంచం 2 InText Questions and Answers

కృత్యములు

కృత్యం – 1

ప్రశ్న 1.
లాక్టోబాసిల్లస్ బాక్టీరియా పాలను పెరుగుగా మారుస్తుందని నీవు ఎలా చెప్పగలవు?
జవాబు:

  • పెరుగులో లాక్టోబాసిల్లస్ బాక్టీరియా ఉంటుంది.
  • ఈ పెరుగు గోరువెచ్చని పాలలో కలిసినప్పుడు ఈ బాక్టీరియా పాలలో పెరిగి పాలను పెరుగుగా మారుస్తుంది.
  • ఈ బాక్టీరియా లేకపోతే పాలు విరిగిపోతాయి తప్ప పెరుగు రాదు.

కృత్యం – 2

ప్రశ్న 2.
ఇడ్లీ, దోసెల పిండి ఉదయానికల్లా పొంగుతుంది ? ఎందువల్ల ?
జవాబు:

  • ఇడ్లీ, దోసెల పిండిలలో మినపపప్పు, బియ్యం, (ఉప్పుడు బియ్యపు రవ్వ) వేసి కలిపి అలా వుంచుతారు.
  • గాలిలో బాక్టీరియా వుంటుంది కదా ! ఆ బాక్టీరియాలో ‘ఈస్ట్’ వుంటుంది.
  • ఇది ఇడ్లీ, దోసెల పిండి పై చర్య (కిణ్వనం) జరిపి CO2 ను తయారుచేస్తుంది.
  • ఇది పిండితో కలసి ఆ పిండి పరిమాణం ఎక్కువయ్యేలా చేస్తుంది.
  • తద్వారా ఉదయానికల్లా ఇడ్లీ, దోసెల పిండి పొంగుతుంది.

కృత్యం – 3

ప్రశ్న 3.
సూక్ష్మజీవుల వాణిజ్యపరమైన ఉపయోగాలు.
AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2 2
కృత్యం : రెండు చిన్న గిన్నెలు లేదా బీకర్లు తీసుకోవలెను. రెండింటిలో సగం వరకు నీరు పోయవలెను. వాటికి 5 నుండి 10 చెంచాల చక్కెర కలపవలెను. ఒకదానికి 2 నుండి 3 చెంచాల ఈస్టును కలపవలెను. రెండు గిన్నెలపై మూతలు పెట్టి వెచ్చని ప్రదేశంలో ఉంచవలెను. 3 లేదా 4 గంటల తరువాత మూతలు తీసి వాసన చూడవలెను.

గమనించినది : ఈస్టు కలిపిన గిన్నె నుండి ఆల్కహాలు వాసన వచ్చింది. ఈస్టు కలపని గిన్నె నుండి ఎటువంటి వాసన లేదు.

కారణము : చక్కెరను ఈస్టులు ఆల్కహాలుగా మార్చుతాయి. కాబట్టి ఈస్టు కలిపిన చక్కెర నుండి ‘ఆల్కహాలు’ వాసన వస్తుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2

కృత్యం – 4

ప్రశ్న 4.
మీ దగ్గర ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆరోగ్య కార్యకర్తను లేదా డాక్టర్‌ను కలవండి. వివిధ వ్యాధుల రాకుండా ఏ వయస్సులో ఏ టీకాలు ఇస్తారో తెలుసుకోండి. మీరు సేకరించిన సమాచారాన్ని పట్టిక తయారుచేసి తరగతి గదిలో ప్రదర్శించండి.
జవాబు:

టీకానిరోధక వ్యాధివయస్సు
బిసిజిక్షయపుట్టినప్పుడు, 10 సం॥లకు
డిటిపిడిప్తీరియా
కోరింతదగ్గు
ధనుర్వాతము
6వ వారం, 10వ వారం,
14వ వారం , 18వ నెల
హెపాటిటిస్ – బిహెపాటిటిస్ – బిపుట్టినప్పుడు, 6వ వారం, 14వ వారం
ఒపివిపోలియోపుట్టినప్పుడు, 6వ వారం, 10వ వారం, 14వ వారం, 5వ సంవత్సరంలో బూస్టర్ డోస్
ఎంఎంఆర్తడపర, గవదబిళ్ళలు, రూబెల్లా9వ నెల, 15వ నెలలో బూస్టర్ డోస్
పిసివిన్యూమోనియా6వ వారం, 10వ వారం, 14వ వారం, 15వ నెలలో బూస్టర్ డోస్
టైఫాయిడ్టైఫాయిడ్2వ సంవత్సరం, 5వ సంవత్సరంలో బూస్టర్ డోస్
వరిసెల్లాఆటలమ్మమొదటి సంవత్సరం

కృత్యం – 5

ప్రశ్న 5.
నేల సారాన్ని సూక్ష్మజీవులు పెంచుతాయి. అని ఎలా చెప్పగలరు ?
జవాబు:

  • గాలిలో 78% నత్రజని వుంది.
  • మొక్కలు పోషకాలు తయారుచేయటానికి నత్రజని అవసరం.
  • కానీ మొక్కలు నేరుగా గాలిలో వున్న నత్రజనిని ఉపయోగించుకోలేవు.
  • దీనికి ‘రైజోబియం’ అనే బాక్టీరియా గాలిలో నత్రజనిని నైట్రేట్లుగా మార్చి భూసారాన్ని పెంచుతుంది.
  • రైజోబియం, నాస్టాక్, అనబినా, అజటోబాక్టర్ వంటి సూక్ష్మజీవులు గాలిలో నత్రజనిని, నత్రితా సమ్మేళనాలుగా మార్చి నేలకు పోషక పదార్థాలు అందచేస్తాయి.
  • చిక్కుడు జాతి మొక్కల వేర్లలో ‘వేరు బొడిపెలు’ వుంటాయి. వాటిలో ‘రైజోబియం’ బాక్టీరియా నత్రజని స్థాపన చేస్తుంది.
  • అందుకే రైతులు వీటి వేళ్ళను భూమిలోనే వుంచి దున్నుతాయి. అందువల్ల భూసారం పెరుగుతుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2

కృత్యం – 6

ప్రశ్న 6.
కంపోస్టు గుంట :
AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2 3
మీ పాఠశాల బడితోటలో ఒక మూలన లేదా మీ ఇంటిలో గల ఖాళీ స్థలములో రెండు గుంటలు తవ్వండి లేదా 2 ఖాళీ కుండలు తీసుకోండి. వీటిని సగం వరకు మట్టితో నింపండి. దీనిలో రాలిన ఆకులు, వృథా అయిన కూరగాయలు, కాగితం ముక్కలు, చెత్తాచెదారంతో నింపండి. రెండవ దానిలో వాడి పారేసిన ప్లాస్టిక్ సంచులు, వస్తువులను పాలిథీన్ సంచులను, గాజు ముక్కలతో నింపండి. ఇప్పుడు రెండు కుండలను లేదా గుంతలను మట్టితో కప్పండి. వాటిపై నీటిని చల్లండి. ఈ విధంగా ప్రతిరోజు నీరు చల్లండి. మూడు, నాలుగు వారాల తర్వాత గుంతల కుండలపై మట్టిని తొలగించండి.

గమనించినది : మొదటి కుండలోని పదార్థాలు కుళ్ళాయి. దీనిలో వేసిన ఆకులు, కాగితం ముక్కలు, కూరగాయలు మొదలైనవి నేలలో కలసిపోయే పదార్థాలు. ఇవి సూక్ష్మజీవులచే విచ్ఛిన్నం కాబడతాయి. రెండవ కుండలోని మార్పుచెందని లేదా కుళ్ళని పదార్థాల వలన నేల స్వభావం మారుతుంది. నేల ఆరోగ్యం క్షీణించి, నేల కాలుష్యానికి దారి తీస్తుంది.

కృత్యం – 7

ప్రశ్న 7.
మీకు దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని లేదా డాక్టరును సందర్శించి, సూక్ష్మజీవుల వలన వచ్చే వివిధ రకాల వ్యాధులను గురించి అడిగి తెలుసుకోండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2 4