AP Inter 2nd Year Chemistry Notes Chapter 4 ఉపరితల రసాయనశాస్త్రం

Students can go through AP Inter 2nd Year Chemistry Notes 4th Lesson ఉపరితల రసాయనశాస్త్రం will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Chemistry Notes 4th Lesson ఉపరితల రసాయనశాస్త్రం

→ అధిశోషణం : “ఒక పదార్థం వేరొక ద్రవం లేదా ఘన పదార్థం ఉపరితలంపై గాఢత చెందడాన్ని ‘అధిశోషణం’ అంటారు. ఇది ఒక ఉపరితల దృగ్విషయము.

ఉదా :

  • CO2, SO2, Cl, లాంటి వాయువులను ఉత్తేజిత బొగ్గు అధిశోషించుకుంటుంది.
  • Pt లేక Ni లో హం, హైడ్రోజన్ వాయువుతో సంపర్కంలో ఉంటే ఆ వాయువును అధిశోషించుకుంటుంది.

→ అభిశోషణం : “ఏదైనా ఒక పదార్థపు అణువులు, ఇతర పదార్థపు ఉపరితలంపై మరియు అంతర్భాగంలో కూడా ఏకరీతిగా వ్యాప్తి చెందడాన్ని ‘అభిశోషణం’ అంటారు.
ఇది ఒక ఆయతన దృగ్విషయం.

ఉదా :

  • నీటిలో ముంచిన ‘స్పాంజ్’ నీటిని అభిశోషించుకుంటుంది.
  • రంగు సిరాలో ఉంచిన సుద్దముక్క సిరాను అభిశోషించుకుంటుంది.

→ ఒక ఉపరితలం నుండి దానిపై అధిశోషణం చెందిన పదార్థాన్ని తొలగించు ప్రక్రియను విశోషణం (డిసార్షన్) అంటారు.
కొన్ని సందర్భాలలో అధిశోషణం, అభిశోషణం రెండు ఒకేసారి జరుగుతాయి. ఈ ప్రక్రియను శోషణం (సార్షన్) అంటారు.

→ అధిశోషణం రెండు రకాలు.

  • భౌతిక అధిశోషణం (ఫిజిసార్షన్)
  • రసాయన అధిశోషణం (కెమిసారన్)

→ స్థిర ఉష్ణోగ్రత వద్ద ఏకాంక ద్రవ్యరాశిగల ఘనస్థితిలోని అధిశోషకంపై అధిశోషణం చెందే వాయువు పరిమాణానికి, వాయువు పీడనానికి మధ్యగల అనుభావిక సంబంధాన్ని తెలిపే రేఖలను అధిశోషణ సమోష్ణరేఖలు అంటారు.
ఫ్రాయిండ్లిష్ సమోష్ణరేఖ సమీకరణం \(\frac{x}{m}\) = k x P1/n
X = అధిశోషణం చెందిన వాయు పరిమాణం
P = పీడ
m = ద్రవ్యరాశి

→ ఒక చర్యలో క్రియాజనకాలు, ఉత్ప్రేరకం అన్నీ ఒకే ప్రావస్థలో ఉన్నట్లేతే ఆ చర్యను సజాతి ఉత్ప్రేరణం అంటారు. క్రియాజనకాలు ఉత్ప్రేరకం, భిన్న ప్రావస్థలలో ఉండే ఉత్ప్రేరక చర్యను విజాతి ఉత్ప్రేరణం అంటారు.

→ పెట్రోలియం పరిశ్రమలో ఉపయోగించే ముఖ్యమైన జియోలైట్ ఉత్ప్రేరకం ZSM – 5 ఇది ఆల్కహాల్ల అనార్థీకరణ చర్యకు గురిచేసే గాసోలిన్లుగా (పెట్రోల్) పిలిచే హైడ్రోకార్టన్ల మిశ్రమంగా మారుస్తుంది.

→ ప్రాణం గల మొక్కలు, జంతువులు ఉత్పత్తి చేసే సంక్లిష్ట నైట్రోజన్ కర్బన సమ్మేళనాలను ఎంజైమ్లు అంటారు.

→ ఎంజైమ్లు జీవ రసాయనిక ఉత్ప్రేరకాలుగా పని చేస్తాయి.

AP Inter 2nd Year Chemistry Notes Chapter 4 ఉపరితల రసాయనశాస్త్రం

→ ఆయుఃప్రక్రియ కొనసాగడానికి దోహదం చేసే జంతువులు మొక్కలలో జరిగే చాలా రసాయన చర్యలను ఇవి ఉత్ప్రేరణం చేస్తాయి.

→ ఒక పదార్థంలో పెద్దసైజు కణాలుగా వేరొక పదార్థం విక్షేపణం చెంది ఏర్పరచిన విజాతి వ్యవస్థను కొల్లాయిడ్ ద్రావణం అంటారు.

→ లయోఫిలిక్ కొల్లాయిడ్లు (ద్రవ ప్రియ కొల్లాయిడ్లు) : వీటిలో విక్షేపక యానకంకూ, విక్షిప్త ప్రావస్థకీ మధ్య ఎక్కువ ఆపేక్ష ఉంటుంది. ఉదా: స్టార్చ్ కొల్లాయిడ్ ద్రావణం లయోఫిలిక్.
లయోఫోబిక్ కొల్లాయిడ్లు (ద్రవ విరోధి కొల్లాయిడ్లు) : వీటిలో విక్షిప్త ప్రావస్థకూ, విక్షేపక యానకానికీ మధ్య ఆపేక్ష ఉండదు. ఉదా : గోల్డ్ కొల్లాయిడ్ ద్రావణం లయోఫోబిక్.

→ లయోఫిలిక్ సాల్లు ఉత్కమణీయమైనవి. ఇవి స్కందనం జరుగవు. స్థిరంగా ఉంటాయి. లయోఫోబిక్ సాల్లు అనుత్రమణీయమైనవి. వీటికి విద్యుద్విశ్లేష్యాలను కలిపినపుడు అస్థిరంగామారి స్కంధనం జరుగుతాయి. వీటిని స్థిరంగా మర్చుటకు లయోఫిలిక్ కొల్లాయిడ్లను కలుపవలెను.

→ పెష్టీకరణం : విక్షేపణ యానకంలో ఉన్న ఒక అవక్షేపానికి కొద్ది ప్రయాణంలో ఒక విద్యుద్విశ్లేష్యాన్ని కలిపి బాగా కుదపడం ద్వారా అవక్షేపాన్ని కొల్లాయిడల్ స్థితికి మార్చడాన్ని పెష్టీకరణం అంటారు.

→ డయాలిసిస్ : అనువైన పటలం లేదా పొరను ఉపయోగించి కరిగే స్థితిలో ఉండే పదార్థాలను కొల్లాయిడ్ ద్రావణం నుండి తొలగించే ప్రక్రియను డయాలిసిస్ అంటారు.

→ ఆల్కహాల్ – ఈథర్ 40% మిశ్రమంలో కరిగించిన నైట్రో సెల్యులోజ్ను కొల్లోడియన్ ద్రావణం అంటారు.

→ టిండాల్ ఫలితం: “కాంతి, కొల్లాయిడ్ ద్రావణం ద్వారా ప్రయాణించినప్పుడు, కాంతి మార్గాన్ని మనం ఒక కాంతివంతమైన పుంజంగా చూడవచ్చు. ఈ దృగ్విషయాన్నే “టిండాల్ ఫలితం” అంటారు.

→ బ్రౌనియన్ చలనం : “కొల్లాయిడ్ కణాలు, విక్షేపణ యానకంలో నిరంతరం వేగంగా మరియు అస్తవ్యస్తంగా చలించడాన్ని “బ్రౌనియన్ చలనం” అంటారు.

→ విరుద్ధ ఆవేశాలు గల స్థిర పటలం, విసరిత పటలం మధ్యగల పొటెన్షియల్ బేధాన్ని విద్యుత్ గతిక పొటెన్షియల్ (లేదా) జీటా పొటెన్షియల్ అంటారు. ఇది ధన లేదా ఋణ విలువలో ఉంటుంది.

→ అనువర్తిత emf ప్రభావంతో కొల్లాయిడ్ కణం చలనం చెందే ప్రక్రిను విద్యుదావేశిత కణచలనం (లేదా) ఎలక్ట్రోఫోరసిన్ అంటారు.

→ కొల్లాయిడ్ కణాల చలనాన్ని అనువైన పద్ధతిలో ఆడగల్మీ విక్షేపణ యానకం వ్యతిరేకదిశలో ప్రయాణిస్తుంది. దీనిని విద్యుత్ ద్రవాభిసరణం అంటారు.

→ సామాన్యంగా స్కంధన అయాన్ వేలన్సీ పెరిగిన కొలది దాని స్కంధన సామర్థ్యం పెరుగును. దీనినే హర్డీ – షూల్జ్ నియమం అంటారు.

AP Inter 2nd Year Chemistry Notes Chapter 4 ఉపరితల రసాయనశాస్త్రం

→ ఎమల్షన్ : “ద్రవ విక్షేపక యానకంలో, సూక్ష్మ విభాజిత ద్రవబిందు కణాలు విక్షిప్తం చెంది ఏర్పరిచే వ్యవస్థ ఎమల్షన్”. (లేదా) విక్షిప్త ప్రావస్థ మరియు విక్షేపక యానకం రెండూ ద్రవాలే అయిన కొల్లాయిడ్ వ్యవస్థను ‘ఎమల్షన్’ అంటారు. ఉదా : పాలు – ద్రవ క్రొవ్వు నీటిలో విక్షిప్తం చెంది ఉండే ఎమల్షన్.

→ ఒక ఎమల్షన్ స్థిరంగా ఉండేందుకు దానికి చేర్చే మూడో పదార్థమే ఎమల్సీకరణ కారకము. ఉదా : సబ్బులు – నీటిలో కిరోసిన్ ఎమల్షన న్ను స్థిరపరుస్తారు.

AP Inter 2nd Year Chemistry Notes Chapter 5 లోహనిష్కర్షణలో సాధారణ సూత్రాలు

Students can go through AP Inter 2nd Year Chemistry Notes 5th Lesson లోహనిష్కర్షణలో సాధారణ సూత్రాలు will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Chemistry Notes 5th Lesson లోహనిష్కర్షణలో సాధారణ సూత్రాలు

→ ప్రకృతిసిద్ధంగా భూమి పై పొరలలో లభించే లోహపు సమ్మేళనాలను ఖనిజాలు అంటారు.

→ లోహం పొందటానికి, అత్యంత అనుకూలమైన ఖనిజాన్ని ధాతువు అంటారు.

→ గాంగ్ : ధాతువు భూమి పై పొరలలోని అనవసరపు రసాయన పదార్థాలతో మరియు ఖనిజాలతో మాలిన్యమై ఉండును. ఈ అనవసరపు పదార్థాలను గాంగ్ అంటారు.

→ ఖనిజ ద్రవీభవనస్థానాన్ని తగ్గించుటకు ఖనిజాలకు బయటనుండి చేర్చిన పదార్థాలను ద్రవకారులు అంటారు.

→ లోహమలం : ద్రవకారీని గాంగ్తో చర్య జరిపినపుడు ఏర్పడే గలన పదార్థాన్ని లోహమలం అంటారు.’

→ ‘Al’ ముఖ్య ధాతువులు బాక్సైట్ (Al2O. 2H2O), క్రయోలైట్ (Na3AlF6).

→ ‘Fe’ ముఖ్య ధాతువులు హెమటైట్ (Fe2O3), మాగ్నటైట్ (Fe3O4)

→ ‘Cu’ ముఖ్య ధాతువు కాపర్ పైరైటిస్ (CuFeS2).

→ ‘Zn’ ముఖ్య ధాతువు జింక్ బ్లెండ్ (ZnS).

AP Inter 2nd Year Chemistry Notes Chapter 5 లోహనిష్కర్షణలో సాధారణ సూత్రాలు

→ ప్లవన ప్రక్రియ సల్ఫైడ్ ధాతువుల సాంద్రీకరణకు ఉపయోగపడును.

→ ఇవ్వబడిన ఉష్ణోగ్రత వద్ద చర్య పురోగమించుటకు గిబ్స్ శక్తి విలువ ఋణాత్మకం అయి ఉండాలి.

→ భర్జనం : ఖనిజాన్ని విడిగా గాని, ఇతర పదార్థాలతో కలిపిగాని గాలి సమక్షంలో అధిక ఉష్ణోగ్రతలకు వేడిచేయడాన్ని భర్జనం అంటారు.
భస్మీకరణం : ఖనిజం ద్రవీభవించకుండా దానిలో గల బాష్పశీల పదార్థాలను, గాలి తగలకుండా వేడిచేయటం ద్వారా తొలగించే పద్ధతిని భస్మీకరణం అంటారు.

→ లోహ శోధనకు మండల శోధనం, బాష్ప ప్రావస్థ శోధనం మొదలైన వాటిని ఉపయోగిస్తారు.

AP Inter 2nd Year Chemistry Notes Chapter 6 p-బ్లాకు మూలకాలు

Students can go through AP Inter 2nd Year Chemistry Notes 6th Lesson p-బ్లాకు మూలకాలు will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Chemistry Notes 6th Lesson p-బ్లాకు మూలకాలు

15వ గ్రూపు మూలకాలు :

→ N, P, As, Sb, Bi లు 15వ గ్రూపు మూలకాలు. వాటి బాహ్య కక్ష్య ఎలక్ట్రాన్ విన్యాసం nS2 nP3.

→ బేరియం జైన్ను ఉష్ణ వియోగ చర్యకు గురి చేయడం ద్వారా అత్యంత స్వచ్ఛమైన డైనైట్రోజన్ ను పొందవచ్చు.
Ba(N3)2 → Ba + 3N2

→ నైట్రోజన్ ద్విపరమాణుక అణువులో రెండు నైట్రోజన్ పరమాణువుల మధ్య త్రికబంధం ఉంటుంది. దీనిని విఘటనం చెందించుటకు అధిక శక్తి (941.4KJ/mole) అవసరం. కావున నైట్రోజన్ అణువు అధిక స్థిరత్వం కలిగి రసాయనికంగా జడత్వం ప్రదర్శిస్తుంది.

→ హేబర్ పద్ధతి ద్వారా అమ్మోనియా తయారీ :
AP Inter 2nd Year Chemistry Notes Chapter 6 p-బ్లాకు మూలకాలు 1

→ ఆస్వాల్డ్ పద్ధతి ద్వారా HNO3 తయారీ :
AP Inter 2nd Year Chemistry Notes Chapter 6 p-బ్లాకు మూలకాలు 2

→ PCl3, జల విశ్లేషణ చేయగా H3PO3, PCl5 ను చేయగా H3PO4 ఏర్పడతాయి.

16వ గ్రూపు మూలకాలు :

→ O, S, Se, Te, PO లు 16వ గ్రూపు మూలకాలు. వీటి బాహ్య కక్ష్య ఎలక్ట్రాన్ విన్యాసం ns2 np4.

→ ఆక్సిజన్ తయారీ :
AP Inter 2nd Year Chemistry Notes Chapter 6 p-బ్లాకు మూలకాలు 3

→ ఆక్సిజన్ ను నిశ్శబ్ద విద్యుత్ ఉత్సర్గానికి గురిచేసే ఓజోన్ ఏర్పడును.
3O2 → 2O3

→ SO2, లో ‘S’ సంకరీకరణం Sp2 ఆకృతి కోణీయ సమతల త్రిభుజాకారం.
SO3, లో ‘S’ సంకరీకరణం Sp2 ఆకృతి కోణీయ సమతల త్రిభుజాకారం.

→ సల్ఫర్ పెరాక్స్లో ఆమ్లాలు H2SO5, H2S2O8.

→ H2SO4 ను స్పర్శ పద్ధతి ద్వారా తయారుచేస్తారు.

AP Inter 2nd Year Chemistry Notes Chapter 6 p-బ్లాకు మూలకాలు

17వ గ్రూపు మూలకాలు :

→ F, Cl, Br, I, At లు 17వ గ్రూపు మూలకాలు. వీటి బాహ్య కక్ష్యవిన్యాసం

→ కాల్షియం ఫాస్ఫైడ్ భార జలంతో చర్య జరిపి డ్యుటిరోఫాసీన్ ఏర్పడును.
Ca3P2 + 6D2O → 3 Ca (OD)2 + 2PD3

→ క్లోరిన్ ఆక్సో ఆమ్లాలు HOCl, HClO2, HClO3, HClO4.

→ కాపర్ లోహం సజల HNO3, తో చర్య
3Cu + 8HNO3(సజల) → 3Cu(NO3)2 + 2NO2 + 4H2O

→ కాపర్ లోహం గాఢ HNO3, తో చర్య
Cu + 4HNO3(సజల) → Cu(NO3)2 + 2NO2 + 2H2O

18వ గ్రూపు మూలకాలు :

→ He, Ne, Ar, Kr, Xe Rnలు 18వ గ్రూపు మూలకాలు. వీటి ఎలక్ట్రాన్ విన్యాసం ns2 np6 (He తప్ప).

→ తెల్ల ఫాస్పరస్, ఎర్ర ఫాస్ఫరస్ ధర్మాల్లోని భేదాలు :

తెల్ల ‘P’ఎర్ర ‘P’
1. ఇది తెల్లటి మైనంలాంటి అర్థ పారదర్శక పదార్థం.1. ఇనుప బూడిదరంగు ద్యుతిని కలిగి ఉంటుంది.
2. నీటిలో కరుగదు. CS2 లో కరుగుతుంది.2. చల్లని నీటిలో, CS2 లో కరుగుతుంది.
3. అధిక చర్యాశీలత కలిగి ఉండును.3. తెల్ల ‘P’ కంటే తక్కువ చర్యాశీలత కలిగి ఉండును.
4. విషపూరితమైనది.4. విషపూరితమైనది కాదు.
సమ్మేళనం ఆకృతి
XeF2 రేఖీయం
XeF4  సమతల చతురస్రం
XeF6విరూపణ అష్టముఖీయం
XeO3పిరమిడల్
XeO4 టెట్రాహెడ్రల్
XeOF4 చతురస్ర పిరమిడల్

AP Inter 2nd Year Chemistry Notes Chapter 7 d,f – బ్లాక్ మూలకాలు & సమన్వయ సమ్మేళనాలు

Students can go through AP Inter 2nd Year Chemistry Notes 7th Lesson d,f – బ్లాక్ మూలకాలు & సమన్వయ సమ్మేళనాలు will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Chemistry Notes 7th Lesson d,f – బ్లాక్ మూలకాలు & సమన్వయ సమ్మేళనాలు

→ ఏ మూలకాలలో అయితే మూలక స్థితిలో కానీ, అయానిక స్థితిలో కానీ పాక్షికంగా నిండిన d-ఆర్బిటాళ్ళు కలిగి ఉంటాయో వాటిని పరివర్తన మూలకాలు అంటారు. ఉదా : Mn, Co, Ag మొదలైనవి.

→ పరివర్తన మూలకాల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం (n – 1)d1-10 ns1-2.

→ పాక్షికంగా నిండిన d-ఆర్బిటాళ్లు కలిగి ఉండుట వలన పరివర్తన మూలకాలు బహుళ ఆక్సీకరణ స్థితి, రంగు ధర్మం, అయస్కాంత ధర్మం, సంక్లిష్ట సమ్మేళనాలను ఏర్పరచే సామర్థ్యం వంటి అభిలాక్షణిక (లేదా) విలక్షణ ధర్మాలను ప్రదర్శిస్తాయి.

→ పరివర్తన మూలకాలు ఒకటి కంటే ఎక్కువ ఆక్సీకరణ స్థితులు ప్రదర్శిస్తాయి.
కారణం:
→ (n – 1) d ఆర్బిటాల్క ns ఆర్బిటాల్కు మధ్య శక్తి భేదం చాలా తక్కువగా ఉంటుంది. దీని వలన రెండు ఆర్బిటాళ్ళ నుండి ఎలక్ట్రాన్లు కోల్పోతాయి.

→ పరివర్తన లోహ అయాన్ల అయస్కాంత భ్రామకాలు లెక్కకట్టే భ్రమణ-ఆధారిత భ్రామకం
μ = \(\sqrt{n(n+2)}\) BM.

→ “ఒక లోహాన్ని ఇతర లోహాలతో గాని, అర్థ లోహాలతో గాని లేదా ఒక్కొక్కప్పుడు ఆ లోహాలతో బాగా సన్నిహితంగా, కలిపితే ఏర్పడిగాని లోహాల భౌతిక ధర్మాలున్న మిశ్రమ పదార్థాన్ని మిశ్రలోహం. అంటారు”..
ఉదా: ‘కంచు, దీని సంఘటనం 75 – 90% Cu; 10 – 25% Sn.

→ ‘లాంథనైడ్లలో పరమాణు వ్యాసార్థం లేదా పరమాణు పరిమాణం లేదా అయానిక వ్యాసార్థం పరమాణు సంఖ్య పెరిగే కొలది నెమ్మదిగా తగ్గును. దీనినే లాంథనైడ్ సంకోచం అంటారు.

→ మిష్ లోహం అనేది ఒక మిశ్రమ లోహం. దీనిలో లాంథనైడ్ (~95%) లోహం, ఐరన్ (~5%) మరియు S, C, Ca, Al తక్కువ పరిమాణంలో ఉంటాయి.

AP Inter 2nd Year Chemistry Notes Chapter 7 d,f - బ్లాక్ మూలకాలు & సమన్వయ సమ్మేళనాలు

→ మిష్ లోహాన్ని బుల్లెట్లు, తొడుగులు, తేలిక చకుముకిల తయారీకి ఉపయోగించే Mg- ఆధారిత మిశ్రమ లోహ ఉత్పత్తికి వాడుతారు.

→ సమన్వయ సమ్మేళనాలు పరివర్తన లోహ పరమాణువులు లేదా అయాన్లు అత్యధిక సంఖ్యలో సమ్మేళనాలను ఏర్పరుస్తాయి. వీటిలో ఆనయాన్లు లేదా తటస్థ గ్రూపులు సమన్వయ సంయోజనీయ బంధాల ద్వారా లోహ పరమాణువుకు అయాను బంధితమై ఉంటాయి. వీటిని సమన్వయ సమ్మేళనాలు అంటారు.
ఉదా : [Co(NH3)6]3+, [Fe(CN)6]4-

→ లైగాండ్ : సంక్లిష్టంలో కేంద్ర లోహ పరమాణువుకు లేదా అయాన్కు ఎలక్ట్రాన్ జంటలను దానం చేయడం. ద్వారా సమన్వయ బంధాలను ఏర్పరచే అయాన్ లేదా అణువును లైగాండ్ అంటారు.ఉదా :Cl, Br, SCN మొదలైనవి.

→ రెండు దాత పరమాణువుల గల ఏకదంత లైగాండ్ తనలోని రెండు పరమాణువులలో దేని ద్వారానైనా సమన్వయం చేయగలుగుతుంది. ఇటువంటి లైగాండ్లను ఉభయదంత (ఏంబిడెంటేడ్) లైగాండ్లు లేదా కీలేట్ లైగాండ్లు అంటారు.
ఉదా : C2O4-2, CO3-2 etc.

→ హోమోలిప్టిక్, హెటిరోలోప్టిక్ సంక్లిష్టాలు : ఒక సంక్లిష్టంలోని లోహంతో బంధితమైన లైగాండ్లు అన్నీ ఒకే రకం (సమానమైనవి) అయితే ఆ సంక్లిష్టాన్ని హోమోలెప్టిక్ సంక్లిష్టాలు అంటారు. ఉదాహరణకు (Co(NH3)6]3+. సంక్లిష్టంలో లోహంతో ఒకటి కంటే ఎక్కువ రకాల (భిన్న) లైగాండ్లు బంధితమై ఉంటే ఆ సంక్లిష్టాన్ని హెటిరోలెప్టిక్ సంక్లిష్టం అంటారు. ఉదాహరణకు [Co(NH3)4Cl2].

AP Inter 2nd Year Chemistry Notes Chapter 8 పాలిమర్ లు

Students can go through AP Inter 2nd Year Chemistry Notes 8th Lesson పాలిమర్ లు will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Chemistry Notes 8th Lesson పాలిమర్ లు

→ పాలిమర్ : నిర్మాణాత్మక యూనిట్ పునరావృతమవుతూ సంయోజనీయ బంధాల నేర్పరచుకుని సంయోగంచెంది నిర్మితమైన అతిపెద్ద అణువును పాలిమర్ అంటారు.

→ పాలిమర్ల లభ్య స్థానాల ఆధారంగా సహజ, అర్థకృత్రిమ, కృత్రిమ పాలిమర్లుగా వర్గీకరించారు.

→ పాలిమర్ల నిర్మాణం ఆధారంగా రేఖీయ, శాఖాయుత, వ్యత్యస్తబద్ధ పాలిమర్లుగా వర్గీకరించారు. పాలిమరీకణ విధానం ఆధారంగా సంకలన, సంఘనన పాలిమర్లగా వర్గీకరించారు.

→ అణుబలాల ఆధారంగా ఎలాస్టోమర్లు, పోగులు, ధర్మోప్లాస్టిక్ లు, ఉష్ణదృడ పాలిమర్లుగా వర్గీకరించారు.

→ సంకలన పాలిమర్ : ఒకే రకమైన (లేదా) విభిన్నమైన రకాలు అయిన ద్విబంధాలు గల మోనోమర్ అణువుల సంకలన చర్యవలన ఏర్పడిన పాలిమర్ను సంకలన పాలిమర్ అంటారు.

→ సంఘనన పాలీమర్ : పాలిమర్ను ఏర్పరచిన అన్ని మోనోమర్ యూనిట్లలోని మొత్తం పరమాణువుల సంఖ్య కంటే పాలిమర్లో పరమాణువుల సంఖ్య తక్కువగా ఉన్నపుడు ఆ పాలిమర్ను సంఘనన పాలిమర్ అంటారు.

→ సజాతీయ పాలిమర్ : ఏక మోనోమర్ జాతుల పొలిమరీకరణం ద్వారా ఏర్పడిన పాలిమర్లను సజాతీయ పాలిమర్లు అంటారు.

AP Inter 2nd Year Chemistry Notes Chapter 8 పాలిమర్ లు

→ ట్రై ఆల్కైల్ అల్యూమినియం మరియు టైటానియం క్లోరైడ్ల మిశ్రమాన్ని జీగ్లర్ – నట్టా ఉత్ప్రేరకం అంటారు.
ఉదా : (C2H5)3 Al + TiCl4.

→ పాలిమర్ల ముఖ్యమైన అణుద్రవ్యరాశులు:

  • సగటు సంఖ్య అణుద్రవ్యరాశి \(\left(\overline{\mathrm{M}}_{\mathrm{n}}\right)\).
  • సగటుభార అణుద్రవ్యరాశి \(\left(\bar{M}_w\right)\)

→ ఒక పాలిమర్ సగటు భార అణుద్రవ్యరాశి \(\left(\bar{M}_w\right)\), సగటు సంఖ్య అణుద్రవ్యరాశి \(\left(\bar{M}_n\right)\) మధ్య గల నిష్పత్తిని పాలి విక్షేపణ సూచిక (PDI) అంటారు.
PDI = \(\frac{\bar{M}_w}{\bar{M}_n}\)

→ రబ్బరు వల్కనైజేషన్ : ముడి (లేదా) సహజ రబ్బరును సల్ఫర్ (లేదా) సల్ఫర్ సమ్మేళనాలతో వేడిచేసి దాని భౌతిక ధర్మాలు మెరుగుపరచుటను రబ్బరు వల్కనైజేషన్ అంటారు.

→ జీవక్షయీకృత పాలిమర్లు : “ఎంజైమ్లతో ఆక్సీకరణం, జలవిశ్లేషణం వంటి రసాయన చర్యలు జరిపే లక్షణం కల్గి ఉండి, జీవ వ్యవస్థలలో తొందరగా క్షయకరణం చెందే మరియు మానవుడు నిరపాయకరంగా ఉపయోగించగలిగే పాలిమర్లను జీవ క్షయీకృత పాలిమర్లు అంటారు”.

AP Inter 2nd Year Chemistry Notes Chapter 9 జీవాణువులు

Students can go through AP Inter 2nd Year Chemistry Notes 9th Lesson జీవాణువులు will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Chemistry Notes 9th Lesson జీవాణువులు

→ మొక్కల నుండి లభ్యమయ్యే ప్రకృతిలో లభించే కర్ణన రసాయన పదార్థాలలో అతి పెద్దస్థానం గల సమ్మేళనాలను కార్బోహైడ్రేట్లు అంటారు.
ఉదా : గ్లూకోజ్, స్టార్చ్, ఫ్రక్టోజ్ మొదలగునవి.

→ కార్బోహైడ్రేట్లను బహుసంఖ్యలో హైడ్రాక్సీ ప్రమేయ సమూహాలున్న ఆల్డీహైడ్లు లేదా కీటోన్లుగా నిర్వచించవచ్చు.

→ జలవిశ్లేషణ చర్య ఆధారంగా కార్టోహైడ్రేట్లను ఈక్రింది విధంగా వర్గీకరించారు.

  • మోనోశాకరైడ్లు \(\stackrel{\mathrm{H}_2 \mathrm{O}}{\longrightarrow}\), శాకరైడ్లు ఏర్పడవు. ఉదా: గ్లూకోజ్, ఫ్రక్టోజ్
  • ఓలిగోశాకరైడ్లు \(\stackrel{\mathrm{H}_2 \mathrm{O}}{\longrightarrow}\) రెండు మోనోశాకరైడ్లు. ఉదా : సుక్రోజ్, మాల్టోజ్
  • పాలీశాకరైడ్లు \(\stackrel{\mathrm{H}_2 \mathrm{O}}{\longrightarrow}\) అధిక సంఖ్యలో మోనోశాకరైడ్లు. ఉదా : స్టార్చ్, సెల్యులోజ్

→ ఏ కార్బోహైడ్రేట్లు అయితే టోలెన్స్, ఫెయిలింగ్ కారకాలను క్షయకరణం చేస్తాయో వాటిని క్షయకరణ చక్కెరలు అంటారు. ఉదా : గ్లూకోజ్
ఏ కార్బోహైడ్రేట్లు అయితే టోలెన్స్, ఫెయిలింగ్ కారకాలను క్షయకరణం చేయనో వాటిని క్షయకరణం చేయని చక్కెరలు అంటారు. ఉదా : సుక్రోజ్

→ ఏనోమర్లు: రెండు సదృశక నిర్మాణాలలో విన్యాసం C-1 వద్ద విభిన్నంగా ఉంటే వాటిని ఏనోమర్లు అంటారు.

→ సుక్రోజ్’ జలవిశ్లేషణలో ధృవణ భ్రమణత గుర్తు కుడి (+) నుండి ఎడమ (-) కు మారడం వల్ల ఏర్పడే ఉత్పన్నాన్ని విలోమ చక్కెర ఉంటారు.

AP Inter 2nd Year Chemistry Notes Chapter 9 జీవాణువులు

→ ఎమినో ప్రమేయ సమూహం (-NH2) మరియు కార్టాక్సిలిక్ ఆమ్ల ప్రమేయ సమూహం (-COOH). కలిగియున్న కర్బన సమ్మేళనాలను ఎమినో ఆమ్లాలు అంటారు.
ఉదా : గ్లైసిన్, ఎలనైన్

→ ఆవశ్యక ఎమినో ఆమ్లాలు : “మన శరీరములో తయారుకాని ఎమినో ఆమ్లములను ఆహారము ద్వారా అందచేయవలెను: వీటిని ఆవశ్యక ఎమినో ఆమ్లాలు అందురు.”
ఉదా : లైసీన్ (Lys)

→ అనావశ్యక ఎమినో ఆమ్లాలు : “శరీరములో తయారగు ఎమినో ఆమ్లములను అనావశ్యక ఎమినో ఆమ్లాలు “అందురు.”
ఉదా : ఎలనైన్.

→ జ్విట్టర్ అయాన్ : ఎమినో ఆమ్ల జల ద్రావణంలో కార్టాక్సిల్ సమూహం నుంచి ఒక ప్రోటాన్ న్ను ఎమినో సమూహానికి మార్పిడి జరిగి ఒక ద్విధృవ అయాన్ ఏర్పడును. దీనినే జ్విట్టర్ అయాన్ అంటారు.

→ ప్రోటీన్ లు : వంద ఎమినో ఆమ్లాల అణువుల కంటే ఎక్కువ అణువులతో ఏర్పడిన పాలీపెప్టైడ్ను ప్రోటీన్ .అంటారు. ప్రోటీన్ లకు అణుభారం 10,000 U కంటే ఎక్కువగా ఉంటుంది.
ఉదా : కెరాటిన్, మెయోసిన్ మొదలగునవి.

→ రకాల RNA లు :

  • మెసెంజర్ RNA (m – RNA)
  • రైబోజోమల్ RNA (r – RNA)
  • ట్రాన్సఫర్ RNA (t – RNA)

→ పెప్టైడ్ బరథం : ఒక అణువులోని ఎమైన్ గ్రూపు ఇంకో అణువులోని కార్బాక్సిల్ గ్రూపుతో చర్య జరిపి ఎమైడ్ బంధం ఏర్పరచడం ద్వారా రెండు ఎమినో ఏసిడ్ అణువులు ఒక అణువుగా ఏర్పడతాయి. ఈ ఎమైడ్ బంధమే పెప్టైడ్ బంధం లేదా పెప్టైడ్ కలయిక. ఈ విధంగా ఏర్పడ్డ ఉత్పనాన్ని డైపెప్టైడ్ అంటారు. ఇది మూడు, నాలుగు అనేక ఎమినో ఆమ్ల అణువులకు పొడిగిస్తే ట్రై, టెట్రా… పాలీపెప్టైడ్లు వస్తాయి. పాలీపెప్టైడ్లో అనేక ఎమినో ఆమ్ల యూనిట్లు ఉంటాయి. పాలిపెప్టైడ్లను ప్రోటీన్లు అంటారు.

→ ప్రోటీన్ స్వభావ వికలత : “ప్రోటీన్ టెర్షియరీ నిర్మాణం ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది. దీనిని విచ్ఛిన్నం చెందించటాన్ని ప్రోటీన్ స్వభావ వికలత అంటారు.” త్రిమితీయ నిర్మాణాన్ని క్రమ పద్ధతిలో ఉంచే ప్రోటీన్లోని బంధాలు విచ్ఛిన్నం చేయడమే ప్రోటీన్ స్వభావ వికలత. ఈ బంధాలు సహజంగా బలహీనంగా ఉంటాయి. కాబట్టి ప్రోటీన్లు తేలికగా స్వభావ వికలత చెందుతాయి.

→ ప్రకృతిలో లభించే కర్బన రసాయన పదార్థాలు. ఇవి ఆహారంలో ముఖ్యమైన పదార్థాలు. జీవరాశులు ఆరోగ్యంగా ఉండటానికి ఇవి అల్ప పరిమాణాలలో అవసరమవుతాయి. ఇటువంటి పదార్థాలను విటమిన్లు అంటారు.

AP Inter 2nd Year Chemistry Notes Chapter 9 జీవాణువులు

→ మానవ శరీరంలో జీవ సంబంధ సమాచారాన్ని ఒక గ్రూపుకు చెందిన కణాల నుంచి దూరంగా ఉన్న కణజాలాలకు లేదా అవయవాలకు రవాణా చేసే కర్బన సమ్మేళనాల అణువులను హార్మోన్లు అంటారు. ఉదా : ఈస్ట్రోడయోల్, ఈస్ట్రోజన్ మొదలగునవి.

AP Inter 2nd Year Chemistry Notes Chapter 10 నిత్యజీవితంలో రసాయనశాస్త్రం

Students can go through AP Inter 2nd Year Chemistry Notes 10th Lesson నిత్యజీవితంలో రసాయనశాస్త్రం will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Chemistry Notes 10th Lesson నిత్యజీవితంలో రసాయనశాస్త్రం

→ అల్ప అణుద్రవ్యరాశులు (100 ~ 500 u) గల రసాయన పదార్థాలు మన శరీరంలోని బృహత్ అణువులతో చర్య జరిపి, జీవ సంబంధమైన స్పందన తెస్తాయి. వీటినే మందులు అంటారు.

→ వ్యాధి చికిత్సకు రసాయన పదార్థాలను ఉపయోగించే ప్రక్రియను కెమోథెరపీ (లేదా) రసాయనాల చికిత్స అంటారు.

→ ఆమ్ల విరోధులు : ఉదరంలో స్రవించిన అధిక ఆమ్లాన్ని తటస్థీకరించి సరైన pH కి తెచ్చే రసాయన పదార్థాలను ఆమ్ల విరోధులు (లేదా) యాంటాసిడ్లు అంటారు. ఉదా : NaHCO, AZ(OH), + Mg(OH), ఓమెప్రజోల్ మొదలగునవి.

→ యాంటీహిస్టమిన్లు : ఈ రసాయనాలు ఉదరంలో అధిక ఆమ్ల మోతాదులను పరోక్ష పద్ధతిలో నివారిస్తాయి. ఉదరగోడలలో ఉండే అభిగ్రాహకాల దగ్గరకు హిస్టమిన్ పోకుండా ఆపి తక్కువ ఆమ్లం ఉత్పన్నమయ్యేటట్లు చేయు రసాయనాలను యాంటీహిస్టమిన్లు అంటారు. ఉదా : డిమెటాప్, సెలెన్ మొదలగునవి.

→ ట్రాంక్విలైజర్లు : మానసిక ఒత్తిడిని, స్వల్ప లేదా తీవ్రమైన స్థాయిలలో ఉండే మనోవ్యాధుల నుంచి ఉపశమనం కొరకు ఉపయోగించే రసాయన పదార్థాలను ట్రాంక్విలైజర్లు అంటారు. ఉదా : లూమినాల్, సెకోనాల్ మొదలగునవి.

→ ఎనాల్జెసిక్: నొప్పి అనునది అనేక వ్యాధులలోను, ఆకస్మిక ప్రమాదాలలోనూ వుంటుంది. తలనొప్పి, చెవినొప్పి,, ఒంటి నొప్పి, కడుపునొప్పి, కీళ్ళ నొప్పులు మొదలైనవి సాధారణ నొప్పులు. శరీరంలో ఏ భాగము వాపుకు గురి అయిన నొప్పి కలుగుతుంది. ఈ నొప్పిని తగ్గించు ఔషధాలను ఎనాల్జెసిక్ అంటారు. ఉదా : ఆస్పిరిన్, ఐబుప్రొఫెన్ మొదలైనవి.

→ యాంటీమైక్రోబియల్ : బాక్టీరియా ద్వారా, ఫంగై ద్వారా, వైరస్ ద్వారా ఇతర పరాన్నజీవులు వరణాత్మకంగా కలగజేసే వ్యాధి కారక చర్యలను విధ్వంసం చేయడం, జరగకుండా నివారించే (లేదా) పూర్తిగా నివారించే మందులను యాంటీమైక్రోబియల్ అంటారు. ఉదా : లైసోజైమ్, లాక్టిక్ ఆమ్లం మొదలగునవి.

→ “యాంటీబయోటిక్లు బాక్టీరియా, ఫంగస్, బూజు లాంటి సూక్ష్మజీవుల నుంచి ఉత్పన్నమై ఇతర సూక్ష్మజీవుల పెరుగుదలను ఆపే లేదా వాటిని నాశనం చేసే రసాయన పదార్థాలు”.
(లేదా)
“యాంటీబయోటిక్ అనేది పూర్తిగా కాని, కొంత భాగంగా కాని రసాయన పద్ధతిలో తయారు చేయబడి తక్కువ గాఢతలో ఇతర సూక్ష్మజీవుల పెరుగుదలను ఆపే లేదా అంతం చేసే రసాయన పదార్థం”. ఉదా : పెనిసిలీన్, క్లోరామ్ఫనికోల్, సల్ఫాడయాజీన్ మొ||నవి.

AP Inter 2nd Year Chemistry Notes Chapter 10 నిత్యజీవితంలో రసాయనశాస్త్రం

→ యాంటీసెప్టిక్లు (చీము నిరోధులు) : యాంటీసెప్టిక్లు అనేవి సూక్ష్మక్రిముల పెరుగుదలను నిరోధించేవి (లేదా) వాటిని నాశనం చేసేవి. వీటిని గాయాలు, కోతలు, రణాలు, రోగానికి గురైన చర్మం ఉపరితలాలు అయినటువంటి జీవకణజాలాలకు పూస్తారు. ఉదా : డెట్టాల్, బితియనోల్

→ క్రిమిసంహారిణులు: సూక్ష్మక్రిముల పెరుగుదలను నిరోధించడానికి (లేదా) నాశనం చేయడానికి వాడే రసాయన పదార్థాలు క్రిమిసంహారక మందులను ఫ్లోర్లు, డ్రయొనే జిలులాంటి జీవరహిత వ్యవస్థలకు వాడతారు. ఉదా :

  • 4% ఫార్మాల్డిహైడ్ జలద్రావణాన్ని ఫార్మలిన్ అంటారు.
  • 0.3 ppm గాఢత గల క్లోరిన్ ద్రావణం క్రిమిసంహారిణిగా వాడతారు.

→ సహజ చక్కెరలు కాలరీలను పెంచుతాయి. అందువలన వాటి స్థానంలో కృత్రిమ చక్కెరలను వాడుతున్నారు. “ఆహార పదార్థాల్లో చక్కెరకు బదులుగా వాడే రసాయనాలను కృత్రిమ తీపికారుకాలు అంటారు. వీటిని వాడడం వల్ల కాలరీలను నియంత్రించ వచ్చు. అదే సమయంలో సుక్రోజ్ కంటే ఆహారానికి ఎంతో తీపినిస్తాయి. చక్కెర వ్యాధి ఉన్నవారికి ఇవి చాలా ఉపయోగకరం.
ఉదా :

  • ఆస్పార్టేమ్కు సుక్రోజ్ కంటే 100 రెట్లు తీపి ఎక్కువగా ఉంటుంది.
  • అలిటేమ్ మరియు సుక్రలోజ్ మరికొన్ని ఉదాహరణలు.

→ రసాయనికంగా సబ్బులు పొడవైన శృంఖలాలుగల కొవ్వు ఆమ్లాల సోడియమ్ (లేదా) పొటాషియం లవణాలు. (13 కొవ్వు పదార్థాన్ని సోడియమ్ హైడ్రాక్సైడ్ జల ద్రావణంతో కలిపి వేడిచేసి సోడియమ్ లవణాలు గల సబ్బులను తయారుచేస్తారు. దీనినే సబ్బు ఏర్పడే చర్య అంటారు.

→ సంక్లిష్ట డిటర్జెంట్లు : సబ్బు ధర్మాలన్నీ ఉండి, వాటిలో మాత్రం సబ్బులు లేని శుభ్రపరిచే కారకాలను సంక్లిష్ట లేదా కృత్రిమ డిటర్జెంట్లు అంటారు. వీటిని కఠినజలంలోను, మృదుజలంలోను కూడా ఉపయోగిస్తారు. ఉదా : సోడియమ్ డోడెకైల్ బెంజీన్ సల్ఫోనేట్.

AP Inter 2nd Year Chemistry Notes Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు

Students can go through AP Inter 2nd Year Chemistry Notes 11th Lesson హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Chemistry Notes 11th Lesson హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు

→ హైడ్రోకార్బన్లందు హైడ్రోజన్ పరమాణువులు, హాలోజన్లతో మార్పిడి వల్ల హాలోఆల్కేన్లు (లేదా) హాలో ఎరీన్లు ఏర్పడతాయి.

→ హాలోఆల్కేన్లలో హాలోజన్ sp3 – సంకరీకరణం కార్టన్కు బంధింపబడును.
హాలోఎరీన్లలో హాలోజన్ sp2 – సంకరీకరణం కార్జన్కు బంధింపబడును.

→ హాలోజన్ పరమాణువుల సంఖ్య ఆధారంగా హాలో ఆల్కేన్లు (లేదా) హాలో ఎరీన్లు మోనోహాలో ఆల్కేన్/ ఎరీన్, డైహాలో ఆల్కేన్ / ఎరీన్, ట్రై హాలో ఆల్కేన్ / ఎరీన్ లుగా విభజించారు.

→ sp3 C – X బంధాన్ని కలిగిన సమ్మేళనాలు ఎ) ఆల్కైల్ హాలైడ్లు, బి) ఎల్లైలిక్ హాలైడ్లు, సి) బెంజైలిక్ హాలైడ్లు.

→ sp2 C – X బంధాన్ని కలిగిన సమ్మేళనాలు ఎ) వినైలిక్ హాలైడ్లు, బి) ఎరైల్ హాలైడ్లు.

→ ఆల్కహాలు HX/ZnCl2, లేదా PX3, లేదా PX5 లేదా SOCl2, లతో చర్య జరిపి ఆల్కైల్ హాలైడ్లు ఏర్పరుచును.

→ ఆల్కెల్ హాలైడ్లు / ఎరైల్ హాలైడ్లు

  • స్వేచ్ఛా ప్రాతిపదిక హాలోజినేషన్,
  • ఎలక్ట్రో ఫిలిక్ ప్రతిక్షేపణ,
  • సాండేమేయర్ చర్య,
  • హైడ్రోజన్ హాలైడ్ లేదా హాలోజన్ను ఆల్కీను కలుపుట ద్వారా తయారు చేయవచ్చు. “

AP Inter 2nd Year Chemistry Notes Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు

→ ఆల్కైల్ హాలైడ్ల బాష్పీభవన స్థానం తగ్గు క్రమం RI > RBr > RCl > RF

→ C-X బంధం ధృవణత స్వభావం కలిగి ఉండుట వలన హాలోఆల్కేన్లు న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలలో పాల్గొంటాయి.

  • SN2. చర్యలు,
  • SN1 చర్యలు.

→ SN2 – చర్యలలో ఆల్కెల్ హాలైడ్లు చర్యాశీలత క్రమము 1°-ఆల్మెల్ హాలైడ్>2° ఆల్కెల్ హాలైడ్ > 3° – ఆల్కెల్ హాలైడ్

→ SN1 – చర్యలలో ఆల్కైల్ హాలైడ్ల చర్యాశీలత క్రమము. 3° – ఆల్మైల్ హాలైడ్ > 2° – ఆల్కైల్ హాలైడ్ > 1° – ఆల్కెల్ హాలైడ్.

→ SN2 – చర్యా విధానం వలన ఏర్పడు’ ఉత్పన్నం విలోమ విన్యాస ఉత్పన్నం.
SN1 చర్యా విధానం వలన ఏర్పడు ఉత్పన్నం రెసిమీకరణ విన్యాస ఉత్పన్నం.

→ ఆల్కైల్ హాలైడ్లు ఆల్కహాలిక్ KOH తో చర్య జరిపి ఆల్కీన్లను ఏర్పరచును. దీనినే డీహైడ్రో హాలోజనీకరణం అంటారు.

→ ఆల్కైల్ హాలైడ్లు కొన్ని లోహాలతో చర్య జరిపి C – లోహ బంధం ఉన్న సమ్మేళనాలను ఏర్పరచును. వీటినే కర్బన లోహ సమ్మేళనాలు అంటారు. ఉదా : గ్రిగా నార్డ్ కారకం (RMgX).

→ కర్బన లోహ సమ్మేళనాలు, కర్బన సమ్మేళనాల సంశ్లేషణలో అధిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.

→ ఆల్కైల్ హాలైడ్లు, ఎరైల్ హాలైడ్లు సోడియం లోహం మరియు పొడి ఈథర్ సమక్షంలో చర్య జరిపి ఆల్కైల్ ఎరీను ఏర్పరచును. దీనినే ఉర్జ్ – ఫిట్టింగ్ చర్య అంటారు. ఈ చర్యలో కేవలం ఎరైల్ హాలైడ్లు చర్య జరిపితే దానినే ఫిట్టింగ్ చర్య అంటారు.

AP Inter 2nd Year Chemistry Notes Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు

→ పాలీహాలోజన్ సమ్మేళనాలు పరిశ్రమలలో, వ్యవసాయ రంగంలో బాగా ఉపయోగకరంగా ఉంటాయి. ఉదా : CH2Cl2, CHCl3, CHI3, DDT, ఫ్రీయాన్లు, CCl4.

AP Inter 2nd Year History Notes Chapter 13 సమాకాలీన ప్రపంచ చరిత్ర

Students can go through AP Inter 2nd Year History Notes 13th Lesson సమాకాలీన ప్రపంచ చరిత్ర will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year History Notes 13th Lesson సమాకాలీన ప్రపంచ చరిత్ర

→ పారిశ్రామిక దేశాలు తమ ఉత్పత్తులు అమ్ముకోవడానికి ప్రారంభించిన విదేశీ మార్కెట్లు అన్వేషణ సామ్రాజ్యవాదానికి దారితీసింది.

→ పారిశ్రామిక దేశాలు తాము జయించిన దేశాల ఆర్థిక వ్యవస్థలను తమదేశ వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఉండేట్లు నియంత్రించడమే సామ్రాజ్యవాదం.

→ వలసల స్థాపనల మధ్య పోటీతో సామ్రాజ్యవాద దేశాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఈ విభేదాలు క్రమంగా రెండు ప్రపంచ యుద్ధాలకు దారితీశాయి.

→ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచ దేశాల మధ్య శాంతి నెలకొల్పడానికి స్థాపించబడింది ఐక్యరాజ్య సమితి.

→ 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి (U.N.O) ఏర్పడింది.

→ ఐక్యరాజ్య సమితిలో సాధారణ సభ, భద్రతామండలి, సచివాలయం, అంతర్జాతీయ న్యాయస్థానం, ధర్మకర్తృత్వ మండలి, ఆర్థిక సాంస్కృతిక మండలి అనే విభాగాలున్నాయి.

→ ఐ.రా.స అనేక దేశాల మధ్య ఉన్న విభేదాలు తొలగించడానికి కృషిచేసింది.

→ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, అమెరికా, రష్యాల నేతృత్వంలో ప్రపంచం రెండు కూటములుగా విడిపోయి ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితులు ఏర్పడ్డాయి.

→ యూరప్ ఖండంలో కమ్యూనిస్ట్ ప్రభావాన్ని అరికట్టడానికి అమెరికా ట్రూమన్ సిద్ధాంతాన్ని మార్షల్ ప్రణాళికను రూపొందించింది.

AP Inter 2nd Year History Notes Chapter 13 సమాకాలీన ప్రపంచ చరిత్ర

→ సోవియట్ రష్యా కూటమికి వ్యతిరేకంగా అమెరికా విభిన్న యూరప్ దేశాలతో ఏర్పరచుకున్న ఒప్పందమే నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్).

→ నాటో కూటమికి ప్రతిగా సోవియట్ యూనియన్ ‘వార్సా’ సంధితో కూటమిని ఏర్పాటు చేసింది.

→ సోవియట్ కూటమిలో గాని, అమెరికా కూటమిలో గాని చేరకుండా తటస్థంగా ఉండటాన్ని అలీనోద్యమం అంటారు.

→ ఒకప్పుడు ఆంగ్లేయుల పాలనలో ఉన్న వలస దేశాలు, స్వాతంత్ర్యాన్ని పొందిన పిదప వారందరూ కలిసి ఏర్పరచుకున్న కూటమి కామన్వెల్త్.

→ ఐరోపా దేశాల వారు తమ మధ్య పరస్పర రాజకీయ, సైనిక, ఆర్థిక సహకారానికై ఏర్పాటు చేసుకున్న సమాఖ్య యూరోపియన్ ఎకనామిక్ కన్ఫెడరేషన్.

→ పెట్రోలియం ఉత్పత్తి చేసే దేశాల వారు అందరూ కలిసి OPEC అనే కమిటి ఏర్పాటు చేసుకున్నారు.

→ SWAPO (స్వాపో) అనే సంస్థలను నమీబియా స్వాతంత్ర్యం కోసం ఏర్పాటు చేసారు.

→ దక్షిణ ఆసియా దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య సాంస్కృతిక సంబంధాల కొరకు ఏర్పడిన సంస్థ సార్మ్.

AP Inter 2nd Year History Notes Chapter 12 అధునికతకు మార్గాలు

Students can go through AP Inter 2nd Year History Notes  12th Lesson అధునికతకు మార్గాలు will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year History Notes 12th Lesson అధునికతకు మార్గాలు

→ 19వ శతాబ్దం ప్రారంభంలో తూర్పు ఆసియా ప్రాంతాన్ని చైనా ఎక్కువగా ప్రభావితం చేసింది.

→ ప్రత్యేక నాగరికత, సంస్కృతి, కళలు, తత్త్వం, సాహిత్యం, లిపి, సంపద కలిగిన చైనా ప్రపంచ దేశాలలో ఒకటి.

→ చైనా భౌగోళికంగా

  • తో యాంగ్తో నదిలోయ
  • యంగీ నదిలోయ
  • దక్షిణ చైనా అని మూడు ప్రధాన భాగాలుగా ఉంది.

→ లోయాంగ్ నదిని చైనా దుఃఖదాయిని అంటారు.

→ సుమారు 3000 సంవత్సరాల ఏకాంత విధానానికి యూరోపియన్ల రాకతో తెరపడింది.

→ చైనా దార్శనికులలో ముఖ్యులు లౌత్స కన్ఫూషియస్.

→ 1911 విప్లవం చైనాలో రాచరికం స్థానంలో రిపబ్లికన్ను ఏర్పరిచింది.

→ ఇంగ్లీషు వారికి, చైనా వారికి మధ్య జరిగిన యుద్ధాలను నల్లమందు యుద్ధాలని అంటారు.

→ పాశ్చాత్యులను అనుసరించడం ద్వారా బలమైన శక్తిగా ఎదగవచ్చని చైనా, జపాన్ దేశాల పెద్దలు భావించారు.

→ 1911లో ప్రజాతంత్ర విప్లవానికి నాయకుడు సనీటిసీన్:

→ సన్యెట్సోన్’ కృషి ఫలితంగా చైనా ఆధునీకరణ దిశగా సాగింది. సనోటీసేన్ ‘చైనా జాతిపిత’ గా ప్రసిద్ధికెళ్ళాడు.

→ 1949లో మాతోసేటుంగ్ నాయకత్వంలో కమ్యూనిస్ట్ విప్లవం ఏర్పడే దాకా చైనాలో అస్తవ్యస్త పరిస్థితి కొనసాగింది. మావోసేటుంగ్ అధ్యక్షుడిగా, చాల ప్రధానమంత్రిగా చైనాలో ప్రజా రిపబ్లిక్ ఏర్పడింది.

AP Inter 2nd Year History Notes Chapter 12 అధునికతకు మార్గాలు

→ చైనా కమ్యూనిస్ట్ పార్టీ శాస్త్ర విజ్ఞాన అభివృద్ధి, పారిశ్రామిక రంగం, వ్యవసాయం, రక్షణరంగం అనే అంశాలపై ఆధునికీకరణ లక్ష్యంగా పెట్టుకుంది.

→ క్రీశ. 1853లో అమెరికాకు చెందిన కమొడోర్ పెర్రీ యుద్ధ నౌకలతో జపాన్ ఓడరేవులోకి ప్రవేశించాడు. నాటి నుండి జపాన్ పాశ్చాత్యులతో సంబంధాలను పెంచుకోనారంభించింది.

→ జపాన్ ప్రజలు తమ చక్రవర్తిని దైవాంశ సంభూతునిగా, సూర్యదేవత వారసునిగాను భావించేవారు.

→ జపాన్ చక్రవర్తిగా మత్సుహిట్ సింహాసనం అధిష్టించటంతో జపాన్లో ప్రాచీనయుగం అంతమై, ఆధునిక యుగం ఆరంభమయింది.

→ జపాన్ దేశం ఆసియా ఆసియన్లదే అన్న నినాదం ఇచ్చింది. సామ్రాజ్యవాదంతో జపాన్, హాంకాంగ్, ఫిలిప్పీన్స్, ఇండోచైనా, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, బర్మాలను ఆక్రమించింది.

AP Inter 2nd Year History Notes Chapter 11 చెదిరిన స్థానిక ప్రజలు

Students can go through AP Inter 2nd Year History Notes 11th Lesson చెదిరిన స్థానిక ప్రజలు will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year History Notes 11th Lesson చెదిరిన స్థానిక ప్రజలు

→ 18వ శతాబ్దం నుండి, ఐరోపా నుండి ప్రజలు వలస వచ్చి దక్షిణ అమెరికా, మధ్య అమెరికా, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రాంతాలలో స్థిరపడ్డారు.

→ ఐరోపా దేశాల వారు స్థానికులను తరిమివేసి లేక చంపివేసి వారి నివాస ప్రాంతాలను ఆక్రమించుకొన్నారు. స్థానికులను సంఖ్యాపరంగా తక్కువవారిగా చేసారు.

→ బ్రిటన్, ఫ్రాన్స్, హాలెండ్ దేశాల వారు వ్యాపార వాణిజ్యాలను విస్తరిస్తూ ఉత్తర అమెరికా, ఆఫ్రికా, ఆసియా ఖండాలలో తమ వలసలు ఏర్పాటు చేసాయి.

→ తమ వలసల దేశాలలో బ్రిటీష్ వారు తమ వర్తక వాణిజ్యాభివృద్ధి కొరకు రైలు, రోడ్డు, రవాణా, సమాచార వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు.

→ 19వ శతాబ్దంలో వలస ప్రాంతాల ప్రజల ముఖ్య వ్యవహారిక భాష ‘ఆంగ్లం:

AP Inter 2nd Year History Notes Chapter 11 చెదిరిన స్థానిక ప్రజలు

→ 17వ శతాబ్దంలో ఐరోపా వర్తకులు ఉత్తర అమెరికా ఉత్తర తీరానికి చేరుకున్నారు.

→ 18వ శతాబ్దంలో నాగరికతకు’ సంబంధించిన నిర్వచనాన్ని పశ్చిమ ఐరోపావాసులు వారి దృక్కోణంలో తెలిపారు.

→ అక్షరాస్యత, మతం, సాంస్కృతిక కళలు, పట్టణీకరణ ఆధారంగా ప్రజల నాగరికతను తెలియజేయవచ్చు.

→ అమెరికాలోను, దక్షిణ అమెరికాలోను వ్యవసాయ యజమానులు తమ భూములలో పనిచేయడానికి కావలసిన కూలీలుగా ఆఫ్రికాలోని నల్ల జాతీయులను బానిసలుగా కొని తెచ్చేవారు.

→ అమెరికాలో స్థిరపడిన ఐరోపావాసులు స్థానికుల నుంచి మోసపూరిత ఒప్పందాల ద్వారా వారి భూముల నుంచి తరిమివేసారు.

→ 1840 ప్రాంతంలో కాలిఫోర్నియాలో బంగారపు నిధులను కనుగొనడం జరిగింది.

AP Inter 2nd Year History Notes Chapter 10 జర్మనీ, ఇటలీలలో విమోచన (ఏకీకరణ) ఉద్యమాలు మొదటి నెపోలియన్

Students can go through AP Inter 2nd Year History Notes 10th Lesson జర్మనీ, ఇటలీలలో విమోచన (ఏకీకరణ) ఉద్యమాలు మొదటి నెపోలియన్ will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year History Notes 10th Lesson జర్మనీ, ఇటలీలలో విమోచన (ఏకీకరణ) ఉద్యమాలు మొదటి నెపోలియన్

→ ఆధునిక చరిత్రలో ఇటలీ, జర్మనీలలో ఏకీకరణ ఉద్యమాలు జరగడం ఒక చర్రితాత్మక సంఘటన.

→ ఉత్తర ఇటలీ ఆస్ట్రియా ఆధీనంలోను, మధ్య ఇటలీ పోప్ ఆధీనంలో దక్షిణ ఇటలీలు బూరన్ ల ఆధిపత్యం క్రింద ఉంది.

→ జోసెఫ్ మాజిని 1831లో ‘యంగ్ ఇటలీ’ అనే సంస్థను స్థాపించాడు.

→ కౌంట్ కపూర్ లీడ్మాంట్ నాయకత్వంలో ఇటలీ ఏకీకరణ సాధ్యమవుతుందని బలంగా నమ్మి రాజ్యాంగబద్ధ రాజరికం స్థాపించాలని ఆశించాడు.

→ ఫ్రాన్స్, ఇంగ్లాండ్లకు ఇటలీ చేసిన సేవలకు గుర్తుగా 3వ నెపోలియన్, కవూర్ను ఫ్లాంబియర్స్కు ఆహ్వానించి ఆస్ట్రియాతో యుద్ధానికి కుట్ర పన్ని ఇటలీ నుండి తరిమివేయడానికి అంగీకరించాడు.

→ గారిబాల్డి రెడ్ఆర్ట్స్’ అనే స్వచ్ఛంద సైనిక దళాన్ని నిర్మించి సిసిలీ ప్రజలకు అండగా నిలిచాడు.

AP Inter 1st Year History Notes Chapter 10 జర్మనీ, ఇటలీలలో విమోచన (ఏకీకరణ) ఉద్యమాలు మొదటి నెపోలియన్

→ గారిబాల్డి ప్రజాస్వామిక వాది, అంతకు మించిన గొప్ప దేశభక్తుడు. జాతీయ సమైక్యత కోసం స్వప్రయోజనాన్ని ప్రక్కన పెట్టి సిసిలీ రాజ్యాన్ని విక్టర్ ఇమ్మాన్యుయేల్కు అప్పగించాడు.

→మొదటి నెపోలియన్ జర్మనీలో జాతీయతా భావం, ప్రజాస్వామ్యాలకు బీజం వేసాడు. జర్మనీలో పవిత్రరోమన్ సామ్రాజ్యాన్ని రద్దు చేసాడు.

→ 1830లో ఫ్రాన్స్ జరిగిన విప్లవం జర్మనీలకు ప్రేరణ కలిగించింది. జర్మనీ ఐకమత్యానికి జర్మన్లు వారి పాలకులపై తిరుగుబాట్లు చేసారు.

→ 1819లో 12 జర్మన్ రాష్ట్రాలతో ప్రష్యా ఏర్పరచిన వర్తక సుంకాల సంస్థ జోల్వెరిన్,

→ ప్రష్యారాజు ఫ్రెడరిక్ విలియం విప్లవకారులు కోరిన ప్రకారం ఉదార రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టారు.

→ 1848 సంవత్సరంలో ఎన్నుకున్న జర్మన్ జాతీయ అసెంబ్లీని ఫ్రాంక్ఫర్ట్ అసెంబ్లీ అంటారు.

→ కఠిన దండనీతి Policy of Blood and Iron మాత్రమే జర్మనీ ఏకీకరణకు పరిష్కారం అని బిస్మార్క్ భావించాడు. దీనినే రక్తపాత విధానం అన్నారు.