AP 6th Class Social Notes Chapter 9 ప్రభుత్వం

Students can go through AP Board 6th Class Social Notes 9th Lesson ప్రభుత్వం to understand and remember the concept easily.

AP Board 6th Class Social Notes 9th Lesson ప్రభుత్వం

→ ఒక దేశాన్ని లేదా ఒక రాష్ట్రాన్ని నియంత్రిస్తూ, వాటి కొరకు నిర్ణయాలను తీసుకునే ప్రజల సమూహాన్ని ‘ప్రభుత్వం’ అంటారు.

→ సాధారణంగా ప్రభుత్వం మూడు విభాగాలను కలిగి ఉంటుంది. అవి :

  1. శాసన నిర్మాణ శాఖ
  2. కార్యనిర్వాహక శాఖ
  3. న్యాయశాఖ

→ ప్రభుత్వాలు రాచరికం, ప్రజాస్వామ్యం అని రెండు రకాలు.

→ ఒక రాజు లేదా రాణి చేసే పాలనను ‘రాచరికం’ అంటారు.

→ రాచరికంలో రాజు లేదా రాణి వారసత్వంగా అధికారంలోకి వస్తారు.

→ “ప్రజల యొక్క ప్రజలచేత, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ప్రజాస్వామ్యం” – అబ్రహం లింకన్.

→ ప్రజాస్వామ్యం ప్రజలు నడుపుతున్న ప్రభుత్వ రూపం. ఇక్కడ ప్రతి పౌరుడికి ఓటు వేయటానికి అనుమతి ఉంటుంది.

→ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు రెండు రకాలు అవి :

  1. ప్రత్యక్ష ప్రజాస్వామ్యము
  2. పరోక్ష ప్రజాస్వామ్యము

→ ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో పౌరులు మాత్రమే చట్టాలు చేయగలరు.

→ స్విట్జర్లాండ్ కు విజయవంతమైన ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి సుదీర్ఘ చరిత్ర ఉంది.

→ ప్రతినిధిని ఎన్నుకునే విధానాన్ని ఎన్నికలు’ అంటారు.

→ పరోక్ష ప్రజాస్వామ్య విజయం ఎన్నికలపై ఆధారపడి ఉంటుంది.

AP 6th Class Social Notes Chapter 9 ప్రభుత్వం

→ ప్రాతినిధ్య సూత్రంతోపాటు, ప్రజాస్వామ్యంలోని ప్రధాన సూత్రాలలో ‘మెజారిటీ పాలన’ ఒకటి.

→ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం ఒక నిర్దిష్ట (ప్రస్తుతం 18 సం||రాలు) పొందిన అందరికి ఓటుహక్కు ఉంది.

→ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు మెజారిటీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తున్నాయి.

→ శాసన నిర్మాణశాఖ, కార్యనిర్వాహక శాఖల మధ్య సంబంధం ఆధారంగా పరోక్ష (ప్రాతినిధ్య) ప్రజాస్వామ్యం రెండు రకాలు. పార్లమెంటరీ వ్యవస్థ, అధ్యక్ష తరహా వ్యవస్థ.

→ పార్లమెంటరీ వ్యవస్థలో శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వాహకశాఖ ఏర్పడుతుంది.

→ పార్లమెంటరీ వ్యవస్థలో కార్యనిర్వాహక శాఖ, శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహిస్తుంది.

→ అధ్యక్ష తరహా వ్యవస్థలో శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వాహక శాఖ ఏర్పడదు, కార్యనిర్వాహక శాఖ శాసనశాఖకు బాధ్యత వహించదు.

→ పార్లమెంటరీ వ్యవస్థ కల్గిన దేశాలకు ఉదాహరణ – భారత్, బ్రిటన్.

→ అధ్యక్ష తరహా వ్యవస్థ కల్గిన దేశాలకు ఉదాహరణ – అమెరికా, బ్రెజిల్.

→ దేశ వ్యాప్తంగా వివిధ సమస్యలను పరిష్కరించడానికి వివిధ స్థాయిలలో ప్రభుత్వం పనిచేస్తుంది.

→ జాతీయ స్థాయి – కేంద్ర ప్రభుత్వం

→ రాష్ట్ర స్థాయి – రాష్ట్ర ప్రభుత్వం

→ స్థానిక స్థాయి – స్థానిక ప్రభుత్వం

→ ఒక దేశం యొక్క చట్టాలు మరియు మౌలిక సూత్రాలను కలిగి ఉన్న పత్రంను రాజ్యాంగం అంటారు.

AP 6th Class Social Notes Chapter 9 ప్రభుత్వం

→ ప్రభుత్వం : ఒక దేశాన్ని పరిపాలించే అధికారం ఉన్న వ్యక్తుల సమూహం.

→ ప్రజాస్వామ్యం : ప్రజలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.

→ రాజరికం : ఒక చక్రవర్తి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వ రూపం.

→ ఎన్నికలు : ప్రతినిధిని ఎన్నుకునే ప్రక్రియ.

→ నిర్ణయం తీసుకోవడం: నిర్ణయాలు తీసుకునే విధానం.

→ ప్రతినిధులు : ఒకరి తరపున పనిచేయడానికి లేదా మాట్లాడటానికి ఎన్నుకోబడిన లేదా నియమించబడిన వ్యక్తులు

→ రాజ్యాంగం : ఒక దేశం యొక్క చట్టాలు మరియు మౌలిక సూత్రాలను కలిగి ఉన్న పత్రం.

→ రాష్ట్ర ప్రభుత్వం : రాష్ట్ర స్థాయిలో పనిచేసే ప్రభుత్వం.

→ కేంద్ర ప్రభుత్వం : జాతీయ స్థాయిలో దేశం మొత్తానికి పనిచేసే ప్రభుత్వం.

→ శాసననిర్మాణ శాఖ : ఇది నిర్ణయాలను లేదా చట్టాలు చేసే (ప్రభుత్వ) విభాగం.

→ కార్యనిర్వాహక శాఖ : ఇది నిర్ణయాలను లేదా చట్టాలను అమలుపరిచే విభాగం.

→ న్యాయశాఖ : ఇది చట్టాలను వ్యాఖ్యానించే న్యాయస్థానాలతో కూడిన వ్యవస్థ.

→ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం : ప్రజలు నేరుగా నిర్ణయం తీసుకోవడంలో పాల్గొంటారు.
ఉదా : స్విట్జర్లాండ్.

→ పరోక్ష ప్రజాస్వామ్యం : ప్రజలు తమ ప్రతినిధుల ద్వారా పరోక్షంగా నిర్ణయం తీసుకోవడంలో పాల్గొంటారు.
ఉదా : భారతదేశంలో

→ సార్వజనీన వయోజన ఓటు హక్కు : ఒక నిర్దిష్ట వయస్సు (ప్రస్తుతం 18 సం||రాలు) పొందిన అందరికీ ఓటుహక్కు ఉంది. దీనినే సార్వజనీన వయోజన ఓటుహక్కు అంటారు.

AP 6th Class Social Notes Chapter 9 ప్రభుత్వం

→ పార్లమెంటరీ వ్యవస్థ : శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వాహకశాఖ ఏర్పడే వ్యవస్థ.

→ అధ్యక్ష తరహా వ్యవస్థ : కార్యనిర్వాహక శాసనశాఖకు బాధ్యత వహించదు.

→ స్థానిక ప్రభుత్వం : స్థానిక (జిల్లా, మండల, గ్రామ, పట్టణ) స్థాయిలో పనిచేసే ప్రభుత్వం స్థానిక ప్రభుత్వం.

→ మెజారిటీ పాలన : ప్రజాస్వామ్యంలోని ప్రధాన సూత్రాలలో ఇది ఒకటి. ఎన్నికైన ప్రజాప్రతినిధులు (కూడా) నిర్ణయాలు తీసుకునేటప్పుడు మెజారిటీ విధానాన్ని అమలుపరుస్తారు.

AP 6th Class Social Notes Chapter 9 ప్రభుత్వం 1

AP 6th Class Social Notes Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

Students can go through AP Board 6th Class Social Notes 8th Lesson రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు to understand and remember the concept easily.

AP Board 6th Class Social Notes 8th Lesson రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

→ షోడశ మహాజన పదాలలో మగధ శక్తివంతమైన రాజ్యంగా ఆవిర్భవించింది.

→ ఒకరాజు పరిపాలించబడే భూభాగాన్ని ‘రాజ్యం’ అంటారు.

→ సువిశాలమైన రాజ్యాలను ‘సామ్రాజ్యాలు’ అంటారు.

→ మౌర్య చంద్రగుప్తుడు కౌటిల్యుని సహాయంతో మగధ రాజ్యానికి రాజయి, మౌర్య (వంశ) సామ్రాజ్యాన్ని స్థాపించాడు. వీరి రాజధాని పాటలీపుత్రం.

→ మెగస్తనీస్ ఒక గ్రీకు రాయబారి. ఇతను ‘ఇండికా’ అనే గ్రంథాన్ని రచించాడు.

→ కౌటిల్యుడిని విష్ణుగుప్తుడు మరియు చాణుక్యుడు అని కూడా పిలుస్తారు. ఇతను ‘అర్థశాస్త్రము’ అనే గ్రంథంను రచించినాడు.

→ అశోకుడు భారతదేశానికి తూర్పు తీరంలోని ‘కళింగ’ రాజ్యంపై యుద్ధం చేసాడు.

AP 6th Class Social Notes Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

→ 13వ నంబరు రాతిశాసనంలో అశోకుడు కళింగ యుద్ధం గురించి ప్రస్తావించడం జరిగింది.

→ అశోకుని శాసనాలు ప్రాకృత భాషలో, బ్రహ్మి లిపిలో ఉన్నాయి.

→ ధర్మము అనే పదాన్ని ప్రాకృత భాషలో దమ్మము అని పిలుస్తారు.

→ నాలుగు సింహాల గుర్తు భారతదేశ జాతీయ చిహ్నం. దీనిని సారనాథ్ లోని అశోకుని శిలా స్తంభంలో నుండి స్వీకరించారు.

→ 1950 జనవరి 26 నుండి దీనిని అధికార చిహ్నంగా గుర్తించారు.

→ ‘సత్యమేవ జయతే’ అనే పదాన్ని ‘మండూకోపనిషత్’ నుండి గ్రహించబడింది.

→ గుప్తవంశ రాజులలో మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు ప్రసిద్ధి చెందిన రాజులు.

→ సముద్ర గుప్తుడు దక్షిణాధిన 12మంది రాజులను ఓడించాడు.

→ రెండవ చంద్రగుప్తుని కాలంలో తొమ్మిది మంది గొప్ప పండితులు ఉండేవారు. వీరినే నవరత్నాలు అంటారు.

→ నవరత్నాలలో ‘కాళిదాసు’ ప్రసిద్ధ కవి.

→ గుప్తుల వాస్తు శిల్ప కళా నైపుణ్యానికి అజంతా, ఎల్లోరా గుహలు గొప్ప ఉదాహరణలు.

→ భారతీయ శాస్త్రవేత్తలు ‘సున్నా’ భావనను అభివృద్ధి చేశారు.

AP 6th Class Social Notes Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

→ బ్రహ్మగుప్తుడు గుప్తుల కాలంలో ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. ఇతను పౌర సంవత్సరాన్ని దాదాపు ఖచ్చితంగా లెక్కించగల్గినాడు.

→ భారతదేశంలో మొట్టమొదటి ఉపగ్రహం పేరు ‘ఆర్యభట్ట’. దీనిని 1975లో అంతరిక్షంలోకి ప్రయోగించారు.

→ చరకుడు మరియు సుశ్రుతుడు గుప్తుల కాలంలో గొప్ప వైద్య పరిజ్ఞానం గల నిపుణులు.

→ గాయపడిన ముక్కులకు ‘ప్లాస్టిక్ సర్జరీ’ చేసిన మొట్టమొదటి భారతీయ శస్త్రచికిత్స నిపుణుడు సుశ్రుతుడు.

→ గుప్తుల కాలంలో శాస్త్రవేత్తలు లోహశాస్త్ర పరిజ్ఞానంలో నిపుణులు.

→ హుణుల దండయాత్ర వలన భారతదేశంలో గుప్త సామ్రాజ్యం అంతరించింది.

→ గుంటూరు జిల్లాలోని అమరావతి సమీపంలోని ధాన్యకటకం నుండి శాతవాహనులు పరిపాలించేవారు.

→ గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహన రాజులందరిలో గొప్పవాడు.

→ గౌతమీపుత్ర శాతకర్ణికి త్రిసముద్రాధీశ్వర’ అనే బిరుదు కలదు.

→ శాతవాహన కాలంలో ఉన్న ఓడ నాణేలు ప్రసిద్ధి చెందినవి.

→ రోమ్ దేశాలతో శాతవాహనులకు మంచి వ్యాపార సంబంధాలు కలవు.

→ ప్రముఖ బౌద్ధ వేదాంతి ఆచార్య నాగార్జునుడు. శాతవాహనుల కాలంలో నివసించాడు.

→ ఇక్ష్వాకులు ‘విజయపురి’ ప్రధాన కేంద్రంగా పరిపాలించారు.

→ ఇక్ష్వాకులు శ్రీరాముని వారసులుగా చెప్పుకుంటారు.

→ పల్లవులు క్రీ.శ. 300 నుండి 900 సం||రాల మధ్య దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు.

AP 6th Class Social Notes Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

→ తమిళనాడులో కాంచీపురం పల్లవుల రాజధాని.

→ వీరికాలంలో వాస్తుశిల్పకళ రాతిని తొలిచి నిర్మించే ఆలయాల నుంచి రాతితో నిర్మించే ఆలయాల స్థాయికి మారినది.

→ మొదటి నరసింహవర్మ మహాబలిపురంలో అయిదు రథాలు నిర్మించాడు. ఇవి పంచ పాండవ రథాలుగా పేరొందాయి. వీటిని ఏకశిలారథాలు అంటారు.

→ కాంచీపురంలోని ప్రసిద్ధ కైలాసనాథ దేవాలయం రాజసింహుని (రెండవ నరసింహ వర్మ) వాస్తు శిల్పకళారీతికి చక్కటి ఉదాహరణ.

→ కర్ణాటకలోని బాదామిని రాజధానిగా చేసుకుని చాళుక్యులు పరిపాలించారు.

→ తొలి చాళుక్య రాజులలో రెండవ పులకేశి ప్రసిద్ధ రాజు.

→ హర్ష చక్రవర్తి రెండవ పులకేశిని ఓడించాడు. ఈ విషయాన్ని ‘ఐహోలు’ శిలాశాసనంలో పేర్కొనబడినది.

→ రెండవ పులకేశి కొలువులోని రవికీర్తి ఐహోలు శాసనాన్ని తయారు చేశాడు.

→ ‘వేశారా’ అను నూతన వాస్తు శిల్ప కళారీతి (చాళుక్యుల కాలంలో) అభివృద్ధి చెందింది.

→ దక్షిణ భారతదేశములోని ద్రవిడ’ మరియు ఉత్తర భారతదేశంలోని ‘నగారా’ వాస్తు శిల్ప కళాకృతుల మేలి కలయికే ‘వెశారా’.

→ స్వదేశీ తయారీ : స్వదేశీ వస్తువులు

→ తెగ : ఒకే జాతికి చెందిన వ్యక్తులు

→ సామ్రాజ్యం : ఒకే కుటుంబానికి చెందిన రాజుల క్రమం

→ వంశం : పెద్ద రాజ్యము

→ శిలా శాసనాలు : రాళ్ళపై చెక్కబడిన సందేశాలు

→ ఖగోళ శాస్త్రం : అంతరిక్ష అధ్యయన శాస్త్రము

→ రాజ్యం : ఒక రాజుచే పరిపాలించబడే భూభాగాన్ని రాజ్యం అంటారు.

→ సామ్రాజ్యం : సువిశాలమైన రాజ్యాలను సామ్రాజ్యాలు అంటారు.

→ మెగస్తనీసు : గ్రీకు రాయబారి, చంద్రగుప్త మౌర్యుని కొలువులో ఉండేవాడు. ఇండికా అను గ్రంథాన్ని రచించాడు.

→ కౌటిల్యుడు : ఇతనినే విష్ణుగుప్తుడు మరియు చాణుక్యుడు అని కూడా పిలుస్తారు. చంద్రగుప్త మౌర్యుని ప్రధానమంత్రి “అర్థశాస్త్రము” అనే గ్రంథాన్ని రచించాడు.

→ కళింగ : భారతదేశ తూర్పు తీరంలోని ప్రస్తుత ఒడిషాలో ‘కళింగ’ రాజ్యం ఉంది.

→ ప్రాకృతం : అశోకుని కాలంలోని శాసనాలు ఈ భాష (లిపి) లోనే ఉన్నాయి.

→ దమ్మము : ధర్మము అనే పదాన్ని ప్రాకృత భాషలో దమ్మము అని పిలుస్తారు.

→ జాతీయ చిహ్నం : ఒక దేశం యొక్క అధికారిక చిహ్నం. ఇది దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని తెలియజేస్తుంది. నాలుగు సింహాల గుర్తును భారత ప్రభుత్వం అధికార జాతీయ చిహ్నం.

AP 6th Class Social Notes Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

→ నవరత్నాలు : రెండవ చంద్రగుప్తుని కొలువులోని తొమ్మిది మంది గొప్ప పండితులు.

→ ఆర్యభట్ట : గుప్తుల కాలంలో ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త, ఇతని పేరు మీదనే 1975లో భారతదేశ మొట్టమొదటి ఉపగ్రహంకు ఆర్యభట్ట అని పేరు పెట్టారు.

→ “త్రిసముద్రాధీశ్వర” : గౌతమీపుత్ర శాతకర్ణి బిరుదు.

→ ఆచార్య నాగార్జునుడు : ప్రముఖ బౌద్ధ వేదాంతి, శాతవాహనుల కాలం నాటి వాడు.

→ మహేంద్రుని రీతి శిల్పకళ : పల్లవ మొదటి మహేంద్రవర్మ ప్రవేశపెట్టిన నూతన ద్రవిడ వాస్తు శిల్పకళ.

→ మహామల్లుని వాస్తు శిల్పకళా రీతి : పల్లవ మొదటి నరసింహ వర్మ ప్రవేశపెట్టిన నూతన ద్రవిడ వాస్తు శిల్పకళ.

→ రాజసింహుని వాస్తు శిల్పకళారీతి : పల్లవ రెండవ నరసింహ వర్మ ప్రవేశపెట్టిన నూతన ద్రవిడ వాస్తు శిల్పకళ.

→ ద్రవిడ నిర్మా ణ శైలి : దక్షిణ భారతదేశములోని వాస్తు శిల్పకళ.

→ నగారా నిర్మాణ శైలి : ఉత్తర భారతదేశములోని వాస్తు శిల్పకళ.

AP 6th Class Social Notes Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

→ వెశారా : చాళుక్యుల కాలంలోని ద్రవిడ, నగారా శిల్పాకృతల మెలుకలయికే ఈ వెశారా నిర్మాణ (శిల్ప) శైలి.

→ మౌర్యవంశం (322-187 B.C.E.) : చంద్రగుప్త మౌర్యుడు → బిందుసారుడు → అశోకుడు

→ శాసనాలు : రాతిపై, రాగిరేకులపై చెక్కబడిన రాజు ఆజ్ఞలు మరియు సందేశాలు.

→ ఐహోలు శాసనం : రెండవ పులకేశి విజయాలను (హర్పునిపై) తెల్పుతుంది. దీనిని రవికీర్తి వేసాడు. ఇది ప్రస్తుతం కర్ణాటకలోని బాగల్ కోట్ జిల్లాలో ఉంది.

AP 6th Class Social Notes Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు 1

AP 8th Class Social Notes Chapter 5 అడవులు – వినియోగం, సంరక్షణ

Students can go through AP Board 8th Class Social Notes 5th Lesson అడవులు – వినియోగం, సంరక్షణ to understand and remember the concept easily.

AP Board 8th Class Social Notes 5th Lesson అడవులు – వినియోగం, సంరక్షణ

→ వేర్వేరు ప్రజలు అడవులను వేర్వేరుగా ఉపయోగించుకుంటారు.

→ అడవులను మనుషులే కాక చెట్లు, మొక్కలు, గడ్డిజాతులు, పక్షులు, పురుగులు, జంతువులు, చేపలు వంటి అసంఖ్యాక జీవులు అడవులలో ఉంటూ వాటిని ఉపయోగించుకుంటాయి.

→ చెట్లతో ఉన్న విశాలమైన భూభాగం అన్నది అడవికి నిర్వచనం.

→ కొన్ని వేల సం||రాల క్రితం మట్టి, సూర్యరశ్మి, వర్షపాతం ఉన్న ప్రతి చోటా అడవులు పెరిగేవి.

→ రకరకాల సూచికల ఆధారంగా అడవులను వర్గీకరించవచ్చు.

→ అడవులలో అనేక రకాలు ఉన్నాయి.

AP 8th Class Social Notes Chapter 5 అడవులు – వినియోగం, సంరక్షణ

→ మన రాష్ట్రంలో 64,000 చ|| కి||మి|| మేర అడవులున్నాయని ప్రభుత్వం ప్రకటించింది.

→ మన రాష్ట్రంలో ప్రతి సం||రం 100 చ|| కి||మీ మేర అడవి తగ్గిపోతూ ఉంది.

→ జీవనోపాధి కోసం అడవులపై ఆధారపడిన వాళ్ళలో గిరిజనులు ముఖ్యులు.

→ గిరిజన ప్రజలకు భూమి సమష్టి ఆస్తి.

→ 200 సం||రాల క్రితం బ్రిటిషు పాలనలో గిరిజనులు అడవులపై తమ హక్కులను, అధికారాన్ని కోల్పోయారు.

→ అడవుల రక్షణ, పునరుద్ధరణ, అభివృద్ధిలలో గిరిజన ప్రజలను భాగస్వామ్యం చేయడం ప్రధాన కర్తవ్యంగా జాతీయ అటవీ విధానం భావించింది.

→ 1988లో J.M.F. ఆచరణలోనికి వచ్చింది. ఇది రాష్ట్రంలో C.M.F. గా మారింది. (ఉమ్మడి అటవీ యాజమాన్యం)

→ 2006లో పార్లమెంటు అటవీ హక్కుల చట్టాన్ని చేసింది.

→ అడవుల పునరుద్ధరణ : అనేక కారణాల వలన నరకబడిన చెట్ల స్థానంలో తిరిగి చెట్లను నాటడం. లేదా చెట్లు నాటి కొత్త అడవులను తయారు చేయడం.

→ అడవులు నరికి వేయటం : గృహవినియోగానికి, వ్యవసాయానికి ఇంకా ఇతర కారణాల రీత్యా అడవులను నరికి వేస్తారు.

→ అటవీ యాజమాన్యం : అడవులనేవి ప్రకృతి సంపదలు. పూర్వం వీటి యాజమాన్యం గిరిజనుల చేతుల్లో ఉండేవి. తరువాత వాటిని ప్రభుత్వం తీసుకుంది.

→ అటవీ హక్కుల చట్టం : అడవి హక్కు అడవిలో పుట్టిన వారికే ఉంటుంది.

→ రిజర్వు అడవులు : బ్రిటిషు వారి కాలంలో అడవుల నుండి గిరిజనులను తొలగించి ‘రిజర్వు’, ‘రక్షిత’ అడవుల కింద వర్గీకరించారు. రిజర్వు అడవులలో ఎవరూ ప్రవేశించరాదు.

AP 8th Class Social Notes Chapter 5 అడవులు – వినియోగం, సంరక్షణ

→ సతత హరిత అడవులు : ఉష్ణోగ్రత ఎక్కువ ఉండే ప్రాంతాలలోనూ, హిమాలయాల్లోనూ ఉంటాయి.

→ ముళ్ళ అడవులు : అతి తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతల దగ్గర ఉండే అడవులు.

→ మడ అడవులు : సముద్ర తీర ప్రాంతంలో ఉండే అడవులు.

→ ఆకురాల్చే అడవులు : సంవత్సరంలో అధికంగా పొడి, వేడి ఉండే ప్రాంతాలలో ఉంటాయి.

AP 8th Class Social Notes Chapter 5 అడవులు – వినియోగం, సంరక్షణ 1

AP 8th Class Social Notes Chapter 4 ధృవ ప్రాంతాలు

Students can go through AP Board 8th Class Social Notes 4th Lesson ధృవ ప్రాంతాలు to understand and remember the concept easily.

AP Board 8th Class Social Notes 4th Lesson ధృవ ప్రాంతాలు

→ ధృవాల దగ్గర ఉండే ప్రాంతాన్ని ‘ధృవ ప్రాంతం’ అంటారు.

→ ధృవ ప్రాంత సరిహద్దును ‘ఆర్కిటిక్ వృత్తం’ అని అంటారు.

→ టండ్రాలో తక్కువ సూర్యకాంతి పడుతుంది. చాలా చలిగా ఉంటుంది.

→ ఇక్కడ మే నుండి జులై వరకు సూర్యుడు అస్తమించడు.

→ సముద్రంలో (వేసవిలో) తేలుతూ ప్రవహించే పెద్దపెద్ద మంచు గడ్డలను ‘ఐర్స్’ అని అంటారు.

→ ఇక్కడ అధిక భాగం ఎటువంటి చెట్లు ఉండవు.

→ ఎస్కిమో అంటే ‘మంచు బూట్ల వ్యక్తి’ అని అర్థము. వీరు ఎక్కువగా సంచారజీవనం గడుపుతారు.

→ వేట, చేపలు పట్టడం వీరి ప్రధాన వృత్తులు.

→ అక్కడి ప్రకృతికి అనుగుణంగా వీరి ఆహారం ఉంటుంది.

AP 8th Class Social Notes Chapter 4 ధృవ ప్రాంతాలు

→ వీరి నివాసాలని ‘ఇగ్లూలు’ అని అంటారు.

→ వీరికి మతపరమైన ఆసక్తులు, అతీత శక్తుల పట్ల నమ్మకాలు ఉంటాయి.

→ చాలా కాలం వీరికి బయట ప్రపంచంతో సంబంధాలు లేవు.

→ ఆర్కిటిక్ మండలం : భూమిపై ఉత్తరాన 66½° ఉ|| అక్షాంశం నుండి 90° ఉ|| అక్షాంశం వరకూ వ్యాపించి ఉన్న భూభాగము.
AP 8th Class Social Notes Chapter 4 ధృవ ప్రాంతాలు 1

→ టండ్రా వృక్షజాలం : టండ్రా ప్రాంతంలో ప్రత్యేక రకాల చిన్న చిన్న మొక్కలు మాత్రమే పెరుగుతాయి. పెద్ద మొక్కలు పెరిగినా ఇక్కడి తుపానులు, గాలుల వల్ల దెబ్బతింటాయి.

→ ఐర్ట్స్ : ధృవ ప్రాంతంలో ఉన్న మంచు గడ్డలు వేసవికాలంలో కరిగి పెద్ద పెద్ద ముక్కలుగా మారి నీటిలో తేలుతూ, సముద్రంలోకి ప్రవేశిస్తాయి. వీటిని ఐర్స్ అంటారు.

→ ఎస్కిమోలు : ధృవ ప్రాంతానికి సైబీరియా నుంచి వచ్చిన వారి వారసులను ఎస్కిమోలు అని అంటారు.

→ కయాక్ : చెక్క చట్రం మీద జంతువుల చర్మం కప్పి తయారు చేసిన పడవ.

→ ఇగ్లూ : ‘ఎస్కిమో’ భాషలో ఇడ్లు అంటే ఇల్లు అని అర్థము.

AP 8th Class Social Notes Chapter 4 ధృవ ప్రాంతాలు 2

AP 8th Class Social Notes Chapter 3 భూ చలనాలు – రుతువులు

Students can go through AP Board 8th Class Social Notes 3rd Lesson భూ చలనాలు – రుతువులు to understand and remember the concept easily.

AP Board 8th Class Social Notes 3rd Lesson భూ చలనాలు – రుతువులు

→ కాలాన్ని బట్టి పరిసరాల్లో నిరంతరం మార్పులు వస్తాయి.

→ ఉత్తర ప్రాంతపు దేశాలలో శీతాకాలంలో మంచు బాగా కురుస్తుంది.

→ ఉత్తర ధృవ ప్రాంతంలో అర్ధరాత్రి కూడా సూర్యుడు కనపడతాడు.

→ ఉత్తర, దక్షిణార్ధ గోళంలో కాలాలు వ్యతిరేకంగా ఉంటాయి.

→ సూర్యుడు ఎల్లవేళలా భూమిలో సగభాగాన్నే ప్రకాశవంతం చేస్తుంటాడు.

→ భూ భ్రమణం ఆగిపోతే భూమిపై జీవం ఉండదు.

→ సూర్యుడు చుట్టూ భూమి ఒకే తలంలో, ఒకే దారిలో తిరుగుతుంటుంది. దీన్నే కక్ష్యతలం అంటారు.

→ భూమిపై ఉష్ణోగ్రతా మండలాలు 3. ఉష్ణ , సమశీతోష్ణ, ధృవ మండలాలు.

AP 8th Class Social Notes Chapter 3 భూ చలనాలు – రుతువులు

→ ధృవాల వద్ద 6 నెలల పాటు పగలు, 6 నెలల పాటు రాత్రి ఉంటాయి.

→ ధృవాల వద్ద సూర్యోదయం అయ్యే ప్రదేశానికి కొంచెం ఎత్తులోనే ఉంటుంది. దీనినే దిగ్మండలం అంటారు.

→ ఈ ధృవ ప్రాంతాన్ని ‘అర్ధరాత్రి సూర్యుడుదయించే భూమి’ అని అంటారు.

→ భూమి యొక్క అక్షం ఒంగి ఉండి ధృవనక్షత్రం వైపు చూపిస్తూ ఉంటుంది. దీనినే ‘అక్ష ధృవత్వం’ అని అంటారు.

→ కాలాలు : భూమిపై ఉష్ణోగ్రతలలో మార్పుల వలన కాలాలు ఏర్పడతాయి.

→ మంచు కురవటం : ఉత్తర ప్రాంతపు ప్రాంతాలలోను, అతి ఎత్తైన ప్రాంతాలలోనూ వర్షానికి బదులు మంచు కురుస్తుంది.

→ ఉష్ణోగ్రతా మండలాలు : ఉష్ణమండలం, సమశీతోష్ణ మండలం, ధృవ మండలం.

→ దిగ్మండలం : ధృవాల దగ్గర సూర్యోదయం అయ్యే ప్రదేశానికి కొంచెం ఎత్తులోనే ఉంటుంది. దీనినే క్షితిజ రేఖ లేక దిగ్మండలం అంటారు.
AP 8th Class Social Notes Chapter 3 భూ చలనాలు – రుతువులు 1 AP 8th Class Social Notes Chapter 3 భూ చలనాలు – రుతువులు 2

AP 8th Class Social Notes Chapter 2 సూర్యుడు – శక్తి వనరు

Students can go through AP Board 8th Class Social Notes 2nd Lesson సూర్యుడు – శక్తి వనరు to understand and remember the concept easily.

AP Board 8th Class Social Notes 2nd Lesson సూర్యుడు – శక్తి వనరు

→ భూమిపై ఎంతో వైవిధ్యత ఉంది.

→ రెండు ప్రదేశాల మధ్య గల ఉష్ణోగ్రతలలోని తేడాలు గాలులు, వానలను ప్రభావితం చేస్తాయి.

→ మొక్కలకు అనువైన వాతావరణాన్ని కల్పించడానికి హరితగృహాలు ఏర్పరుస్తారు.

→ సూర్యకిరణాలు భూమిపై ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పడతాయి.

→ భూమిపై, నేల మీద, సముద్రాల మీద ఉష్ణోగ్రతలలో తేడా ఉంటుంది.

→ సూర్యుని నుండి భూమి పొందే వేడి వివిధ పద్ధతులలో వికిరణం చెందుతుంది. (భూవికిరణం)

→ అత్యధిక ఉష్ణోగ్రత లిబియాలోని అజీజియాలో 1992లో 57.8°C గా నమోదు అయ్యింది.

→ అత్యల్ప ఉష్ణోగ్రత అంటార్కిటికాలోని వ్లాడివోస్టోక్ కేంద్రంలో 1983 జులైలో – 89.2 °C గా నమోదు అయ్యింది.

→ ఉష్ణోగ్రతలను సిక్స్ గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణమాపకంతో కొలుస్తారు.

→ ఉష్ణోగ్రతలలోని తేడాలను ఉష్ణోగ్రతా పటాల ద్వారా తెలుసుకోవచ్చు.

→ భూమధ్యరేఖ నుండి ధృవాల వైపుకి వెళ్ళే కొలదీ ఉష్ణోగ్రత తగ్గుతుంది.

→ వాతావరణం : భూమిని ఆవరించియున్న వాయువుల పొరను వాతావరణం అంటారు.

→ భూమధ్యరేఖా ప్రాంతం : భూమధ్యరేఖకు దగ్గరగా ఇరువైపులా ఉన్న ప్రాంతం.

→ ఘనీభవనం : చల్లని ప్రదేశంలో వాతావరణంలోని గాలిలో ఉన్న నీరు గడ్డ కట్టడం.

→ సౌరవికిరణం : సూర్యుని నుండి విద్యుదయస్కాంత తరంగాలుగా విడుదలయ్యే శక్తి.

AP 8th Class Social Notes Chapter 2 సూర్యుడు – శక్తి వనరు

→ సూర్యపుటం : సూర్యుని నుండి విడుదల అయ్యే శక్తి కొంత భూమి వైపుకి ప్రసరిస్తుంది. అలా ప్రసరించినదానిలో భూమి స్వీకరించే దానిని ‘సూర్యపుటం’ అంటారు.

→ పతనకోణం : సూర్యకిరణాలు భూమిపై భూమధ్యరేఖా ప్రాంతం మీద 90° కోణంలో పడతాయి. ధృవాల వద్దకు పోయే కొద్దీ ఇవి ఏటవాలుగా పడతాయి. ఇలా కోణం పతనం చెందటం మూలంగా దీనిని పతన కోణం అంటారు.

→ ఉష్ణ సమతుల్యం : భూమి తను గ్రహించిన ఉష్ణరాశిలో కొంత వెనక్కి తిప్పి పంపుతుంది. దీని వలన వాతావరణం వేడెక్కుతుంది. ఇది భూమిపైన ఉష్ణాన్ని సమతుల్యం చేస్తుంది.

→ గరిష్ఠ ఉష్ణోగ్రత : ఏదేని ఒక రోజు ఒక ప్రదేశంలో ఉండే అధిక ఉష్ణోగ్రత.

→ కనిష్ఠ ఉష్ణోగ్రత : ఏదేని ఒక రోజు ఒక ప్రదేశంలో ఉండే అల్ప ఉష్ణోగ్రత.

→ ఉష్ణ విలోమనం : ఉష్ణోగ్రతా విస్తరణ కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది. కొన్నిచోట్ల దానికి వ్యతిరేకంగా జరుగుతుంది దానినే ఉష్ణోగ్రతా విలోమనం అంటారు.

→ భూగోళం వేడెక్కటం : వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ పెరగడం మూలంగా భూమిపై ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీనినే ‘భూగోళం వేడెక్కడం’ అంటారు.

AP 8th Class Social Notes Chapter 2 సూర్యుడు – శక్తి వనరు 1

AP 8th Class Social Notes Chapter 1 పటాల అధ్యయనం – విశ్లేషణ

Students can go through AP Board 8th Class Social Notes 1st Lesson పటాల అధ్యయనం – విశ్లేషణ to understand and remember the concept easily.

AP Board 8th Class Social Notes 1st Lesson పటాల అధ్యయనం – విశ్లేషణ

→ ముఖ్యమని భావించే అంశాలను చూపించటానికి భౌగోళిక శాస్త్రజ్ఞులు పటాలను ఉపయోగిస్తారు.

→ పటాలకు ఎంతో చరిత్ర కలదు.

→ సుమేరియన్లు, బాబిలోనియన్లు, గ్రీకులు, అరబ్బులు మరియు చైనీయులు పూర్వకాలంలో పటాలను తయారుచేశారు.

→ పటాలు తయారుచేసే శాస్త్రాన్ని ‘కార్టోగ్రఫీ’ అంటారు.

→ అల్ ఇద్రిసి, టాలమీ, అనాక్సిమాండర్, హెకేటియస్ మరియు హెరిడోటస్ మొదలైన వారు ప్రపంచ ప్రఖ్యాత భూగోళ శాస్త్రవేత్తలు మరియు కార్టోగ్రాఫర్లు.

→ దూరాలలో వక్రీకరణలు ఉన్నప్పటికీ ఖండాల ఆకారం, దిశలు సరిగా చూపించే విధానాన్ని ‘గెరార్డస్ మెర్కేటర్’ రూపొందించారు. దీనినే మెర్కేటర్ ప్రక్షేపణం అని అంటారు.

→ ఐరోపా వలస పాలకులు శాస్త్రీయ బృందాలను, పటాలు తయారుచేయువారిని కలిపి వారి వలసలకు పంపారు.

→ సర్ జార్జ్ ఎవరెస్ట్ పేరు మీదుగా ‘ఎవరెస్టు శిఖరానికి ఆ పేరు వచ్చింది.

→ యుద్ధ సమయంలో పటాల విలువ, ఉపయోగం పెరుగుతాయి.

→ పటాలు అనేక రకాల అవసరాల కోసం తయారుచేయబడతాయి.

AP 8th Class Social Notes Chapter 1 పటాల అధ్యయనం – విశ్లేషణ

→ థీమాటిక్ లేదా నిర్దేశిత పటాలు ప్రత్యేకించి ఒక అంశంపై మాత్రమే కేంద్రీకృతమై ఉంటాయి.

→ ప్రతి పటంపై దానికి సంబంధించిన గుర్తులు, రంగులు, సంకేతాలు ఉపయోగించాలి.

→ జనాభా పటాలను రంగుల ఛాయా క్రమశ్రేణి ద్వారా తయారుచేయవచ్చు.

→ ఒకే రకమైన ఎత్తు కలిగిన ప్రదేశాలను కలుపు రేఖలను ఐసోలైన్స్ అంటారు.

→ పటాల సంకలనాన్ని అట్లాస్ అని అంటారు.

→ ప్రక్షేపణ : ఖండాల పరిమాణం, దూరాలలో వక్రీకరణలు ఉన్నప్పటికీ ఖండాల ఆకారం, దిశలు సరిగా చూపించే విధానాన్ని ‘ప్రక్షేపణ’ అని అంటారు.

→ సంకేతాలు : ఏదేని ఒక దానికి గుర్తుగా సూచించబడేది.

→ భూగోళ శాస్త్రవేత్త : భూగోళాన్ని గురించి, దానికి సంబంధించినంత వరకు మానవుల గురించి చదివిన వ్యక్తి.

→ కాంటూర్ : సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలన్నింటినీ కలిపే వాటిని “కాంటూరు రేఖలు” అంటారు.

→ కార్టోగ్రఫీ : పటాలను తయారు చేసే శాస్త్రీయ విధానాన్ని “కార్టోగ్రఫీ” అంటారు.
AP 8th Class Social Notes Chapter 2 సూర్యుడు – శక్తి వనరు 2

AP 8th Class Social Notes Chapter 1 పటాల అధ్యయనం – విశ్లేషణ 1

AP 10th Class Social Notes Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

Students can go through AP Board 10th Class Social Notes 22nd Lesson పౌరులు, ప్రభుత్వాలు to understand and remember the concept easily.

AP Board 10th Class Social Notes 22nd Lesson పౌరులు, ప్రభుత్వాలు

→ సమాచార హక్కు చట్టం, 2005 లో ప్రభుత్వం ఆమోదించింది.

→ అయితే ఈ సమాచార హక్కు ప్రయోజనకారిగా ఉండాలంటే ఇందులో ప్రభుత్వ శాఖలు, హక్కులు సక్రమంగా పనిచేయాలి.

→ ప్రజాస్వామిక ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉంటాయి.

→ ఇంతకుముందు ప్రభుత్వ శాఖలు, వాటి సిబ్బంది జవాబుదారీతనం ప్రధానంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు పరిమితమై ఉండేది.

→ ప్రతి ప్రభుత్వశాఖ కొన్ని నియమ, నిబంధనల ఆధారంగా పనిచేస్తుంది.

→ ప్రతి ప్రభుత్వశాఖ కొన్ని రికార్డులను నిర్వహించాలి. తీసుకున్న నిర్ణయాల వివరణ ఉండాలి. వీటి మూలంగా అనేక రికార్డులు, డాక్యుమెంట్లు, మెమోలు, ఈ – మెయిల్స్, సర్క్యులర్లు, ఆదేశాలు, లాగ్ పుస్తకాలవంటివి తయారుచేయవలసి వస్తుంది.

→ సమాచార హక్కు చట్టం వల్ల ఇప్పుడు ప్రతి ప్రభుత్వశాఖ రికార్డులను నిర్వహించి, వాటిని అడిగిన పౌరులకు అందుబాటులో ఉంచాలి.

AP 10th Class Social Notes Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

→ ప్రతి ప్రభుత్వ శాఖలో ఒక పౌర సమాచార, ఒక అప్పిలేట్ అధికారి ఉంటారు.

→ ఆయా శాఖల పనిలో చట్టాలను ఉల్లంఘిస్తే చర్య తీసుకునే బాధ్యత సమాచార అధికారులకు ఉండదు. న్యాయస్థానాలకు ఉంటుంది.

→ ఈ సమాచార హక్కు చట్టం కొన్ని అంశాలను గోప్యంగా ఉంచుతుంది. ఉదా : దేశ సార్వభౌమత్వం, సైనిక దళాలు, భద్రతా సంస్థలు.

→ సమాచారం కొరకు చేతితో రాసిన ఉత్తరం కాని, ఎలక్ట్రానిక్ మెయిల్ రూపంలో కాని అడగవచ్చు.

→ సమాచారం కొరకు నామమాత్ర రుసుం 5-10 రూపాయల వరకు చెల్లించాలి. దారిద్ర్యరేఖకు దిగువన ఉంటే ఈ రుసుము చెల్లించనవసరం లేదు.

→ ప్రజలకు ఉచిత న్యాయ సేవలను అందించుటకు న్యాయసేవల ప్రాధికార చట్టం, 2002 ప్రకారం న్యాయ పీఠాలను ఏర్పాటు చేశారు.

→ దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసులను ఎటువంటి ఖర్చు లేకుండా వెంటనే పరిష్కరించుకోవటానికి లోక్అదాలత్ మదులను ఏర్పాటు చేశారు.

→ న్యాయ సేవల ప్రాధికార సంస్థ, దేశంలోని బలహీన వర్గాలకు, స్త్రీలు, పిల్లలు మరియు అన్ని రకాల నష్టాలకు గురి అయిన వారికి ఉచిత న్యాయ సేవలను అందిస్తుంది.

→ లోక్ అదాలత్, సివిల్, క్రిమినల్, గృహహింస, భరణాలు వంటి అనేక కేసులను పరిష్కరిస్తుంది.

→ సమాచారం : ప్రతి వ్యక్తికి, ప్రభుత్వ సంస్థల నుండి ఏ విషయం గురించైనా సమాచారం సేకరించుకొనే అధికారం ఉంటుంది. సమాచార హక్కు చట్టంను 2005 లో కేంద్రప్రభుత్వం ఆమోదించింది.

AP 10th Class Social Notes Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

→ అప్పిలేట్ అధికారి : ప్రతి ప్రభుత్వ శాఖలో ఒక అప్పిలేట్ అధికారి ఉంటారు. ఈయన రాష్ట్ర పౌర సమాచార కార్యాలయానికి జవాబుదారీగా ఉంటారు.

→ రికార్డు ప్రభుత్వ అధికారి : సమాచార హక్కు చట్టం వల్ల ఇప్పుడు ప్రతి ప్రభుత్వశాఖ రికార్డులను నిర్వహించి, వాటిని అడిగిన పౌరులకు అందుబాటులో ఉంచాలి. కావున ఈ రికార్డులను నిర్వహించడానికి
ఒక ప్రభుత్వ అధికారి ఉంటాడు.

→ పారదర్శకత : పౌరులు అడగకుండానే ప్రతి శాఖ తమకు సంబంధించిన కొన్ని వివరాలను స్వచ్చందంగా ప్రజలకు బహిర్గతం చెయ్యాలి. దీనివల్ల ఆ శాఖ పని పారదర్శకత ఏర్పడి అవినీతిని అరికడుతుంది.

→ న్యాయసేవ : ప్రజలకు అనగా బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సేవలు అందించటమే న్యాయసేవ. న్యాయ సేవల ప్రాధికార చట్టం 2002 ప్రకారం ‘న్యాయ సేవా పీఠాలను ఏర్పాటు చేశారు.

→ లోక్ అదాలత్ : కోర్టులలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసులను ఎటువంటి ఖర్చు లేకుండా వెంటనే పరిష్కరించుట కొరకు ఈ లోక్ ఆదాలను ఏర్పాటుచేశారు. ‘న్యాయ సేవల పీఠాల చట్టం 19879 1994 లోనూ, 2002 లోనూ సవరించి, దాని ప్రకారం లోక్ అదాలతను ఏర్పాటుచేశారు.

→ గృహ హింస : మహిళలకి గృహ హింసకు సంబంధించిన కేసులను లోక్ అదాలత్ చేపట్టి త్వరితంగా పరిష్కరిస్తుంది. ఎటువంటి రుసుమును లోక్ అదాలత్ తీసుకోదు.

AP 10th Class Social Notes Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

→ సివిల్ కేసులు : అన్ని రకాల ఆస్తి పాస్తులకు సంబంధించిన సివిల్ కేసులను లోక్ ఆదాలత్ పరిష్కరిస్తుంది. ఈ కేసులకు కూడా లోక్ అదాలత్ ఎటువంటి రుసుము తీసుకోకుండానే పరిష్కరిస్తుంది.

→ బాల నేరస్తుల గృహం : బాల నేరస్తుల న్యాయచట్టం, 1986లోని సెక్షన్ 2, క్లాజు (జె) ప్రకారం బాలనేరస్తుల గృహం వంటి కేసులకు సంబంధించిన న్యాయసేవల సంస్థ ద్వారా ఉచిత న్యాయసేవలను అందిస్తుంది.

→ ప్రభుత్వ అధికారి : ప్రతి ప్రభుత్వశాఖలో ఒక ప్రభుత్వాధికారి సమాచారాన్ని అందించడానికి ఉంటాడు. అతనినే పౌర సమాచార అధికారి అంటాము.

AP 10th Class Social Notes Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

AP 10th Class Social Notes Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

Students can go through AP Board 10th Class Social Notes 21st Lesson సమకాలీన సామాజిక ఉద్యమాలు to understand and remember the concept easily.

AP Board 10th Class Social Notes 21st Lesson సమకాలీన సామాజిక ఉద్యమాలు

→ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత చాలా దేశాలలోని కొంతమంది ప్రజలు సమాన హక్కులకు నోచుకోని వారు , ఉన్నారు. వీరు తమ హక్కులు కోరుతూ ముందుకు రావడంతో అనేక దేశాలలో ఉద్యమాలు ఆవిర్భవించాయి.

→ 1960 ప్రాంతంలో అమెరికాలోని నల్లవారు పౌరహక్కుల కొరకు డా॥ మార్టిన్ లూథర్ కింగ్ ఆధ్వర్యంలో ఉద్యమం జరిపినారు.

→ చాలా కాలం పోరాటం తరువాత అమెరికా ఈ జాతి వివక్షతను రద్దు చేస్తూ పౌరహక్కుల చట్టాలు చేసింది. ఇప్పుడు నల్లవారికి తెల్లవారితో సమాన హక్కులు ఉన్నాయి.

→ USSR లోని ప్రజలు సోషలిస్ట్ ప్రభుత్వాలను వ్యతిరేకిస్తూ స్వేచ్ఛను కోరుతూ మానవహక్కుల ఉద్యమం లేవదీశారు. తూర్పు యూరపులోని చాలా ప్రాంతాలలో ఇటువంటి ఉద్యమాలు చేయుట జరిగింది.

→ USSR అధ్యక్షుడు ‘గోర్బచేవ్’ ప్రజలకు మరింత స్వేచ్ఛను కల్పిస్తూ ‘గ్లాస్ నోస్త్’ అనే సంస్కరణలను చేసినారు.

→ 1970 – 1980 ల మధ్య యుద్ధాలకు, అణ్వాయుధాలకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు జరిగాయి.

AP 10th Class Social Notes Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

→ అమెరికా 1945 ఆగస్టులో జపాన్లోని హిరోషిమా, నాగసాకి లపై అణుబాంబులు వేసింది. దీని మూలంగా జరిగిన దారుణాన్ని ప్రపంచం అంతా చూసింది. అయినప్పటికి అమెరికా, USSR, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు ఆయుధాలను పెంచుకుంటూనే పోయారు.

→ అమెరికా వియత్నాంతో చేస్తున్న యుద్ధాన్ని అమెరికా సైనికులు నిరసించినారు. సైన్యంలో చేరే వయసున్న యువకులు “మేము సైన్యంలోకి వెళ్లం” అని వ్యతిరేకించారు. వియత్నాం ప్రజలు ఉద్యమాలు చేశారు. అమెరికా చివరకు 1975లో వియత్నాంతో యుద్ధాన్ని విరమించింది.

→ అణ్వాయుధ పోటీ మూలంగా ప్రపంచమంతా యుద్ధభీతితో వణికిపోయింది. అమెరికా, USSR ల మీద ఆయుధ నియంత్రణ కొరకు ఒత్తిడి పెరిగింది.

→ ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపుగా 1991లో START ఒప్పందం చేసుకుని ఆయుధాలను నియంత్రించారు.

→ 1991లో USSR రద్దు అయ్యి రష్యా ఆవిర్భవించింది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిపోయింది.

→ USSR లోని చెర్నోబిల్ లో అణుకర్మాగారంలో జరిగిన ప్రమాదం మూలంగా చాలా ప్రాంతాలు కాలుష్యానికి గురి అయ్యాయి.

→ 1990 నుంచి ‘ప్రపంచీకరణ’, ‘నయా ఉదారవాదం’ అన్న పేర్లతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, రాజకీయ మార్పుల వల్ల రైతులు, గిరిజనులు, పేదవారు, భూమి లేనివారు తీవ్ర ప్రభావితమయ్యారు.

→ 1971లో అమెరికా చేసిన అణు పరీక్షకు వ్యతిరేకంగా గ్రీన్ పీస్ ఉద్యమం ఆవిర్భవించింది.

→ వాతావరణ కాలుష్యం వల్ల ఓజోను పొర దెబ్బతిని భూమి వేడెక్కుతుంది. దీని మూలంగా ధృవాల వద్ద ఉన్న మంచు టోపీలు కరిగి ప్రపంచంలోని సముద్రాలలో నీటి మట్టాలు పెరుగుతాయి. తద్వారా తీరప్రాంతాలు ముంపుకు గురికావచ్చు.

→ 1984లో భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులకు ఇప్పటికీ సరైన నష్టపరిహారం లభించలేదు. బాధితులు ఇంకా ఉద్యమం చేస్తూనే ఉన్నారు.

→ ‘నర్మదా బచావో’ ఉద్యమ నాయకులు ఆనకట్టల నిర్మాణాన్నే వ్యతిరేకిస్తున్నారు.

→ ఆనకట్టల నిర్మాణంలో నిర్వాసితులైన ప్రజలకు సరైన పునరావాసం కల్పించబడలేదు. ఆ ప్రజలను ఎవరూ పట్టించుకోలేదు. ఈ కారణంగానే అనేక పర్యావరణ ఉద్యమాలు ఆవిర్భవించాయి.

→ 1980లో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ స్థాపించబడింది.

AP 10th Class Social Notes Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

→ మానవ హక్కులు, సామాజిక న్యాయం కొరకు మహిళలు ఉద్యమాలు చేశారు.

→ ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా దూబగుంట గ్రామ మహిళలు సారాను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేసి 1993లో సారాపై నిషేధాన్ని విధించుటకు కారణమైనారు.

→ మణిపూర్ మహిళలు మానవ హక్కుల కొరకు చేస్తున్న ‘మైరా పై బీ’ ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంది.

→ పౌరహక్కులు : దీర్ఘకాలంగా సమాన హక్కులకు నోచనివాళ్లు తమ హక్కులు కోరుటనే పౌరహక్కులు అంటారు.
ఉదా : ఓటు హక్కు, అమెరికాలోని పౌరహక్కుల ఉద్యమం, నల్లజాతి వారు వివక్షతతో కూడిన చట్టాలను శాంతియుతంగా ఉల్లంఘించటం.

→ సహాయనిరాకరణ : అమెరికాలోని పౌరహక్కుల పోరాటం 1960 లలో తీవ్రదశకు చేరుకుంది. పెద్ద ఎత్తున ప్రదర్శనలు, ఊరేగింపులతో పాటు సహాయనిరాకరణ అనగా వివక్షతతో కూడిన చట్టాలను శాంతియుతంగా ఉల్లంఘించటం. వివక్షతతో కూడిన సేవలు అంటే శ్వేతజాతి, నల్లజాతి వాళ్లకి వేరువేరుగా సీట్లు ఉన్న బస్సులను బహిష్కరించటం.

→ ప్రజలను వేరు చెయ్యటం : ప్రజలను వేరుచెయ్యటం అంటే పాఠశాలల్లో, బస్సులలో బహిరంగ ప్రదేశాలలో, ఉద్యోగాలలో, గృహ వసతిలో, ఓటు హక్కులో సైతం వివక్షత చూపటం.
ఉదా : అమెరికాలో నల్లజాతి వారిని శ్వేతజాతి వారి నుండి వేరుచేసి చూసారు.

→ అస్థిర పరచటం : కాలుష్య పరిశ్రమలను స్థాపించుట మూలంగా, గనుల త్రవ్వకం మూలంగా ఆనకట్టలను నిర్మించడం మూలంగా ఆ ప్రాంతాలలో ఉన్న ప్రజలు, జంతువులు, అడవులు అన్ని కూడా అస్థిరపరచబడుతున్నాయి. ప్రజలు నిర్వాసితులవుతున్నారు.

→ యుద్ధ వ్యతిరేకత : అమెరికా, వియత్నాంతో చేసిన యుద్ధంలో 8 లక్షల సైనికులు, 30,00,000 పౌరులు చనిపోయారు. అమెరికాకు ఎటువంటి నష్టం జరుగలేదు. అమెరికాకు ఏ మాత్రం ప్రమాదకరం కానీ అమాయకమైన ప్రజలపై బాంబులు వెయ్యడం అటు సైనికులకు, ఇటు సైనికుల తల్లిదండ్రులకు అయిష్టంగా ఉంటూ, వారిలో యుద్ధ వ్యతిరేకత ఏర్పడింది. అమెరికా అంతా యుద్ధ వ్యతిరేక నిరసనలు ఉప్పొంగాయి.

→ సైన్యంలో చేరే వయస్సు : అమెరికాలో దృఢకాయులైన అందరూ తప్పనిసరిగా కొంతకాలం పాటు సైన్యంలో పనిచెయ్యాలనే చట్టం ఉంది. అయితే అమెరికా వియత్నాంతో యుద్ధం కొనసాగిస్తున్నంత వరకు “సైన్యంలో చేరే వయసున్న యువకులమైన మేము” సైన్యములో చేరం అని సైన్యంలో చేరే వయసున్న వారు తిరస్కరించినారు.

→ సాయుధీకరణ : వియత్నాం యుద్ధం ముగిసిన తరువాత మరిన్ని దేశాలు అణ్వాయుధాల నిల్వలలో ఒకదానితో ఒకటి పోటీ పడటంతో ఆయుధ పోటీ పెరిగింది.

AP 10th Class Social Notes Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

→ పునరావాసం : ఆనకట్టలు కట్టే పథకాల వల్ల నిర్వాసితులయ్యే ప్రజలకు సరైన పునరావాసం కల్పించాలని కోరసాగారు.

→ నష్టపరిహారం : ఆనకట్టలు కట్టే పథకాలలో నిర్వాసితులయ్యే ప్రజలు కేవలం భూములున్న వాళ్లకే కాకుండా, అక్కడ ఉంటున్న వాళ్లందరికీ న్యాయమైన నష్టపరిహారం చెల్లించాలని కోరసాగారు.

→ సారా వ్యతిరేకత : ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లా దూబగుంట గ్రామంలోని మహిళలు, వారి భర్తలు సారా తాగి సొమ్మంతా ఖర్చు చేస్తున్నారని సారాకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీసుకువచ్చారు. సారా వేలం పాటలను ఆపించారు. సారాని నిషేధించేలా చేసారు.

→ ప్రజాస్వా మిక : ప్రపంచంలోని చాలా దేశాలు ప్రజాస్వామ్య దేశాలే. సామాజిక ఉద్యమాలు సాధారణంగా రాజకీయ పార్టీలకు దూరంగా ఉండి ఒక ఆశయం కోసం కలిసి పనిచేస్తాయి. తరచు ఈ సామాజిక ఉద్యమాల కార్యక్రమాలను భూస్వామ్య, ప్రజాస్వామిక పద్ధతుల్లో రూపొందిస్తారు.

భాగస్వామ్యం : సామాజిక ఉద్యమాలనేవి ఒక ప్రత్యేక ఆశయం కోసం ఆవిర్భవిస్తాయి. అయితే ఈ సామాజిక ఉద్యమాలలో సామాన్య ప్రజల సహకారం, భాగస్వామ్యం లేనిదే ఉద్యమాలు విజయం సాధించలేవు.

AP 10th Class Social Notes Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

AP 10th Class Social Notes Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

Students can go through AP Board 10th Class Social Notes 20th Lesson ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం to understand and remember the concept easily.

AP Board 10th Class Social Notes 20th Lesson ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

→ రెండవ ప్రపంచయుద్ధం తరువాత ప్రపంచం రెండు శిబిరాలుగా విడిపోయింది.
1) యుఎస్ఎస్ఆర్ కూటమి (కమ్యూనిస్ట్ వర్గం).
2) అమెరికా కూటమి (పెట్టుబడిదారి వర్గం).

→ రెండవ ప్రపంచయుద్ధం మూలంగా అమెరికా శక్తిమంతమైన దేశంగా ఆవిర్భవించిందని అమెరికా అధ్యక్షుడు “హారీట్రూమన్” అన్నాడు.

→ రెండవ ప్రపంచయుద్ధ వినాశనం, ఒక అంతర్జాతీయ శాంతి సంస్థ స్థాపనకు మూలమైంది.

→ ఐక్యరాజ్య సమితి ప్రపంచ శాంతి స్థాపన కొరకు 1945లో ఏర్పడింది.

→ రెండవ ప్రపంచయుద్ధం తరువాత అనేక ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నాయి.

→ ఐక్యరాజ్యసమితిలో శాశ్వత దేశాలైన చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా, అమెరికాలకు ‘వీటో’ అధికారం ఉంది.

→ రెండవ ప్రపంచయుద్ధం తరువాత ప్రపంచం రెండు కూటాలుగా విడిపోయింది (అమెరికా-రష్యా). ఈ రెండు దేశాలు మధ్య చాలాకాలం ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగింది.

AP 10th Class Social Notes Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

→ ప్రచ్ఛన్న యుద్ధంలో భాగంగా అమెరికా, రష్యాలు ఆయుధాలను సమకూర్చుకున్నారు. పరోక్ష యుద్ధాలు చేశారు. ఉపగ్రహాలను అంతరిక్షంలోనికి పంపించారు. సైనిక ఒప్పందాలు చేసుకున్నారు.
ఉదా : నాటో, వార్సా..

→ ప్రచ్ఛన్న యుద్ధకాలంలో ప్రపంచం అణ్వాయుధ యుద్ధ విధ్వంస నీడలో బితుకు బితుకుమంటూ ఉంది.

→ ప్రచ్ఛన్న యుద్ధ నేపథ్యంలో భారతదేశం ఈ రెండు అగ్రరాజ్య కూటాలలో చేరకుండా ప్రత్యేకంగా అలీనోద్యమాన్ని రూపొందించుకున్నది.

→ 1964లో జోర్డాన్లో పాలస్తీనా విముక్తి సంఘం PLO ఆవిర్భవించింది.

→ ప్రచ్ఛన్న యుద్ధం ముగింపుగా యుఎస్ఎస్ఆర్ 1991లో రద్దు అయి, ప్రపంచం ఏకధృవ ప్రపంచంగా మారిపోయింది.

→ భారతదేశం పొరుగున ఉన్న దేశాల పట్ల ‘పెద్దన్న’ పాత్ర వహిస్తుందని చిన్న దేశాల ఆరోపణ.

→ సైనిక ఒప్పందాలు : రెండవ ప్రపంచయుద్ధం తరువాత ప్రపంచం, యుఎస్ఎస్ఆర్ (రష్యా) మరియు అమెరికా శిబిరాలుగా విడిపోయింది. ఈ రెండు వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఏర్పడింది. ఈ ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో రష్యా, అమెరికా వర్గాలు అనేక సైనిక ఒప్పందాలు చేసుకొని, చాలా దేశాలను వారి వారి కూటములలో చేర్చుకున్నారు.
ఉదా : నాటో (NATO), వార్సా (WARSA).

AP 10th Class Social Notes Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

→ పరోక్ష యుద్ధం : ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అమెరికా, రష్యాలు ప్రత్యక్ష యుద్దాలు చేసుకోలేదు. స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న దేశాలలో రెండు విరోధ బృందాలకు ఈ రెండు శిబిరాలలో చేరాక శిబిరం మద్దతు ఇవ్వసాగింది. దీంతో ఆయా యుద్ధాలలో ఈ రెండు శిబిరాలు పరోక్ష యుద్ధాలు చేస్తున్నాయి.

→ ఆయుధ పోటీ : ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో, ఆయుధ పరిశోధనల పైనా, ఖండాంతర క్షిపణులు, విధ్వంసకర అణ్వాయుధాల నిల్వల పైనా అమెరికా, రష్యాలు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేశాయి. ఈ రెండు దేశాలలో ఒక్కొక్క దాని దగ్గర ప్రపంచాన్ని పలుమార్లు మట్టుపెట్టుగల అణ్వాయుధాలు ఉన్నాయి.

→ ఏకధృవ ప్రపంచం : ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపుగా 1991లో, యుఎస్ఎస్ఆర్ అధ్యక్షుడు మిహాయిల్ గోర్బచేవ్ యుఎస్ఎస్ఆర్‌ను రద్దుపరచినాడు. అందులోని రాజ్యాలు స్వతంత్ర దేశాలు అయ్యాయి. యుఎస్ఎస్ఆర్ కుప్పకూలటంతో ప్రపంచ రాజకీయాలలో కొత్త యుగం ఆరంభమయ్యింది. అది ఏక ధృవ ప్రపంచంగా మారింది.

→ ద్విధృవ ప్రపంచం : రెండవ ప్రపంచయుద్ధం తరువాత రెండు ప్రధాన సైద్ధాంతిక రాజకీయ శిబిరాలు ఏర్పడ్డాయి. యుఎస్ఎస్ఆర్ నేతృత్వంలో కమ్యూనిస్టు శిబిరం, అమెరికా నేతృత్వంలో ప్రజాస్వామిక – పెట్టుబడిదారి శిబిరం. ఈ రెండు శిబిరాలు ప్రపంచంలోని దేశాలను వారి వారి శిబిరాలలో చేర్చుకొనుటకు అనేక ప్రయత్నాలు చేశాయి. చివరికి ప్రపంచమంతా రెండు ధృవాలుగా విడిపోయింది.

→ వలసపాలిత దేశాల విముక్తి : సామ్రాజ్య కాంక్షతో బలమైన దేశాలు వెనుకబడిన ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల మీద ఆధిపత్యం చెలాయించాయి. ఈ దేశాలలోని ప్రజలు అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసి ఈ ఆధిపత్య దేశాల నుండి స్వాతంత్ర్యం సంపాదించుటనే వలసపాలిత దేశాల విముక్తి అంటారు.

→ వీటో : ఐక్యరాజ్య సమితిలోని భద్రతా సమితిలో శాశ్వత సభ్యులైన చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, యుఎస్ఎస్ఆర్ (ఇప్పుడు రష్యా), అమెరికాలకు వీటో పవర్ ఉంది. అంటే ఐక్యరాజ్య సమితి తీర్మానాలను తిరస్కరించే అధికారాన్నే వీటో అధికారం అంటారు.

→ జాతి వైరుధ్యాలు : శ్రీలంకలో ప్రధానంగా రెండు జాతుల ప్రజలున్నారు.

  1. సింహళం మాట్లాడే ప్రజలు
  2. తమిళం మాట్లాడే ప్రజలు. ఈ రెండు వర్గాల మధ్య అపనమ్మకం కారణంగా ఘర్షణలు తీవ్రమయ్యాయి. ఈ రెండు వర్గాల మధ్య వైరుధ్యాలనే జాతి వైరుధ్యాలని అంటారు.

AP 10th Class Social Notes Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

→ పంచశీల : శాంతి, అహింస, సహజీవనం అనేవి మన విదేశాంగ నీతి సూత్రాలు. 1954లో టిబెట్టు విషయమై భారతదేశం, చైనాలు చేసుకొన్న ఒడంబడికలో శాంతియుత సహజీవన సూత్రం వివరించబడింది. దీన్నే పంచశీల అంటారు. ఇవి ఐదు సూత్రాలు.

  1. ఒకరి సర్వసత్తాకతని, భౌగోళిక సమగ్రతను మరొకరు గౌరవించటం.
  2. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం.
  3. దాడులకు దిగకపోవటం, వివాదాలను పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవటం.
  4. అంతర్జాతీయ సంబంధాలలో పరస్పర గౌరవం, సహకారాల కోసం కృషి చేయటం.
  5. శాంతియుత సహజీవనాన్ని ప్రోత్సహించటం.

శాంతి : యుద్ధాలు, యుద్ధభయం లేని ప్రపంచంలో శాంతి ఉంటుంది.

AP 10th Class Social Notes Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

AP 10th Class Social Notes Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

Students can go through AP Board 10th Class Social Notes 19th Lesson రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000 to understand and remember the concept easily.

AP Board 10th Class Social Notes 19th Lesson రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

→ 1975-86 మధ్య కాలం భారతదేశ ప్రజాస్వామ్యానికి పరీక్షాకాలం వంటిది.

→ 1975-85 మధ్య కాలం భారతదేశం ఏకపార్టీ ప్రజాస్వామ్యంలోకి జారిపోకుండా సమర్థవంతంగా నివారించింది.

→ 1975-85 మధ్య కాలంలో పర్యావరణ ఉద్యమం, స్త్రీవాద ఉద్యమం, పౌరహక్కుల ఉద్యమం, సాహిత్య ఉద్యమం వంటి ఉద్యమాలు మొదలై సామాజిక మార్పునకు బలమైన చోదకశక్తులుగా మారాయి.

→ భారతదేశంలో అత్యవసర పరిస్థితికి ముగింపు పలికిన ఎన్నికలు 1977 సాధారణ ఎన్నికలు.

→ 1977 సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కలిసి పోటీచేయాలని నిర్ణయించాయి.

→ కాంగ్రెస్ (ఓ), స్వతంత్ర పార్టీ, భారతీయ జనసంఘ్, భారతీయ లోక్ దళ్, సోషలిస్టు పార్టీలు విలీనమై జనతాపార్టీగా ఏర్పడాలని నిర్ణయించాయి.

→ కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలు అన్నీ ఒక తాటి కిందకు వచ్చి ఎన్నికలలో పోటీ చేయటంలో జయప్రకాష్ నారాయణ్, ఆచార్య జె.బి. కృపలాని వంటి సీనియర్ నాయకులు ముఖ్యపాత్ర పోషించారు.

→ మొదటిసారి జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఓటమిని చవిచూసిన ఎన్నికలు 1977 సాధారణ ఎన్నికలు.

AP 10th Class Social Notes Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000

→ 1977 సాధారణ ఎన్నికలలో గెలిచిన జనతాపార్టీ 9 రాష్ట్రాలలోని కాంగ్రెస్ ప్రభుత్వాలను తొలగించింది.

→ 1977 సాధారణ ఎన్నికల తరువాత అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికలలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాలలో జనతాపార్టీ, పశ్చిమ బెంగాల్ లో సిపిఐ(ఎం), తమిళనాడులో డి.ఎం.కె. గెలిచింది.

→ ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛని పునరుద్ధరిస్తామన్న వాగ్దానంతో జనతాపార్టీ అధికారంలోకి వచ్చింది.

→ జనతాపార్టీ తరపున భారత ప్రధానమంత్రి పదవిని చేపట్టింది మొరార్జీ దేశాయి.

→ 1980లో జరిగిన సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది.

→ భారతీయ రైతులపై ప్రత్యేక శ్రద్ధ అవసరం అన్న సోషలిస్టులతో ఏర్పడిన పార్టీ – భారతీయ లోక్ దళ్.

→ ఇందిరాగాంధీ విధానాలను వ్యతిరేకించి కాంగ్రెస్లోని సంప్రదాయవాద వర్గం ఏర్పరచిన పార్టీ – కాంగ్రెస్ (ఓ).

→ పెను భూసంస్కరణలకు, కార్మిక సంఘాలు, సోషలిస్టు విధానాలకు కృషిచేస్తున్న పార్టీ సి.పి.ఐ (ఎం).

→ తమిళనాడులో ఉన్న పార్టీ – ద్రవిడ మున్నేట్ర కజగం (డి.ఎం.కె).

→ హిందూ జాతీయతావాద పార్టీ – జనసంఘ్.

→ సిక్కుల కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న పార్టీ – శిరోమణి అకాలీ దళ్.

→ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించటానికి ఉపయోగించే ఆర్టికల్ – 356.

→ ఎన్.టి. రామారావు 1982లో తన 60వ పుట్టినరోజునాడు తెలుగుదేశం పార్టీ (తె.దే.పా) ని స్థాపించారు.

AP 10th Class Social Notes Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000

→ పేదలకు రెండు రూపాయలకు కిలో బియ్యం, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, మద్యపాన నిషేధం వంటి పేదల సంక్షేమ పథకాలను ఎన్.టి. రామారావు ప్రకటించారు.

→ రాజకీయ అస్థిరత, బయటివారి రాకతో తమ సంఖ్య తగ్గుతుందనీ భయం కారణంగా, అస్సోం ప్రజలలో ఏర్పడిన అసంతృప్తి 1970 లో సామాజిక ఉద్యమంగా మారింది.

→ 1984లో రాజీవ్ గాంధీ చొరవతో కేంద్రప్రభుత్వం అఖిల అసోం విద్యార్థి సంఘం ఒక ఒప్పందంపై సంతకాలు చేశారు.

→ బెంగాలీలు, అస్సోమీయుల మధ్య మొదలైన సమస్య ఒక సున్నిత అంశంగా తయారై, సంక్లిష్ట అంతర్గత జాతిఘర్షణలకు దారితీసింది.

→ కేంద్రంలో జనతాపార్టీ ప్రభుత్వం ఉండగా 1978లో అకాలీ దళ్ కొన్ని తీర్మానాలు చేసి వాటిని అమలు చెయ్యాలని కేంద్రప్రభుత్వాన్ని కోరింది.

→ 1984లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యకు గురయ్యింది.

→ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీకి ఎస్.ఎ.డి నాయకుడైన సంత్ లాంగోవాల్ కి మధ్య ఒక ఒప్పందం కుదిరింది.

→ 1986 ఏప్రిల్ లో అకల్ తఖ్ వద్ద సమావేశంలో ఖలిస్తాను స్వతంత్ర దేశంగా ప్రకటించారు.

→ 1984లో రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ అంతకుముందెన్నడు లేనంతగా ఎన్నికలలో ఘనవిజయం సాధించింది.

→ రాజీవ్ గాంధీ భారతదేశంలో ‘టెలికం విప్లవం’ను ఆరంభించారు.

→ భర్త నుంచి విడాకులు పొందిన షా బానో అన్న మహిళ వేసిన కేసులో 1985లో సుప్రీంకోర్టు ఆమె మాజీ భర్త ఆమెకు భరణం చెల్లించాలని తీర్పు ఇచ్చింది.

AP 10th Class Social Notes Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000

→ రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం ఏమనగా అది రాముని జన్మస్థలం అని, అంతకు ముందు అక్కడ ఉన్న గుడిని పడగొట్టి మసీదు కట్టారని హిందువులు భావించగా, అది నిజం కాదని, అది తమ ప్రార్థనాస్థలమని ముస్లిములు పేర్కొంటున్నారు.

→ ఉత్తరప్రదేశ్, హర్యానాలోని రైతులు మహేంద్రసింగ్ తికాయత్ నేతృత్వంలోనూ, మహారాష్ట్రలోని రైతులు శరద్ జోషీ నాయకత్వంలోనూ పోరాడసాగారు.

→ 1989లో జరిగిన ఎన్నికలలో ‘కాంగ్రెసేతర రాజకీయ శక్తులకు పరిపాలన, రాజకీయ రంగాలలో అవినీతి ప్రధాన ప్రచార అంశం.

→ 1989లో వి.పి.సింగ్ నేతృత్వంలో జనతాదళ్ తో మొదటి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది.

→ 1977లో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికలలో సి.పి.ఎం.కి చెందిన జ్యోతిబసు గెలిచి వామపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. ఆపరేషన్ బర్గా అనగా కౌలుదార్లను భూస్వాములు బలవంతంగా ‘తొలగించటానికి వీలు లేకుండా పోవడం.

→ మండల్ కమిషన్ నివేదికను అనుసరించి, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 27% రిజర్వేషన్లు కల్పించింది వి.పి.సింగ్ ప్రభుత్వం.

→ స్థానిక స్వపరిపాలనకు రాజ్యాంగ గుర్తింపునిస్తూ 1992వ సంవత్సరంలో పి.వి. నరసింహారావు నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసింది.

→ 73వ రాజ్యాంగ సవరణతో గ్రామస్థాయిలో, 74వ రాజ్యాంగ సవరణతో పట్టణ మరియు నగరాల స్థాయిలో ప్రభుత్వాలను సార్వత్రిక వయోజన ఓటింగ్ ద్వారా మొట్టమొదటిసారి ఎన్నుకున్నారు.

→ బి.జె.పి నాయకుడైన ఎల్.కె. అద్వానీ 1990లో సోమనాథ్ నుంచి అయోధ్య వరకు రథయాత్ర చేపట్టాడు.

→ 1991లో వి.పి.సింగ్ ప్రభుత్వం పడిపోయినప్పుడు భారతదేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంది.

→ 1992లో పి.వి. నరసింహారావు నేతృత్వంలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.

→ ప్రాంతీయ ఆకాంక్షలు : ప్రాంతాలకు సంబంధించిన కోరికలు, స్వయం ప్రతిపత్తితో ప్రాంతీయ ప్రయోజనాలు కాపాడుకోవడం, స్థానిక ప్రయోజనాలకు చెందిన కోరికలు.

AP 10th Class Social Notes Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000

→ సంకీర్ణ ప్రభుత్వాలు : 2 లేదా అంతకు మించి జాతీయ మరియు ప్రాంతీయ పార్టీలు ఒక సమూహంగా ఏర్పడి, ఏర్పాటుచేసిన ప్రభుత్వాలు.

→ మతతత్వ వాదం : తమ మతమే గొప్పది అని నమ్మే భావన. తమ మత అస్తిత్వం ఆధారంగా దేశాన్ని నిర్మించాలనే భావన. అన్ని మతాలకు తమ మతమే మార్గదర్శకం అనే భావన.

→ అధిక సంఖ్యాక వర్గం : అత్యధిక సంఖ్యలో ఉన్న ఒకే వర్గానికి చెందిన ప్రజలు; ఒకే మతం, ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తున్న ప్రజలు ఎక్కువగా ఉండటం.

→ అల్ప సంఖ్యాక వర్గం : తక్కువ సంఖ్యలో ఒకే వర్గానికి చెందిన ప్రజలు; ఒకే మతం, ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తున్న ప్రజలు తక్కువగా ఉండటం.

→ అత్యవసర పరిస్థితి : సాధారణ పాలనలో వైఫల్యం చెందినప్పుడు విధించే పరిస్థితి.

→ ఏకపార్టీ ప్రజాస్వామ్యం : ప్రజలు ఎల్లప్పుడు ఒకే పార్టీకి అధికారాన్ని అప్పగించటం.

→ సోషలిస్టులు : సమాజంలోని పౌరులందరు సమానమేనని, పేద, ధనికవర్గాల మధ్య ఆర్థిక వ్యత్యాసాలు ఉండరాదని తెలియజేసేవారు.

→ హిందూ జాతీయవాదులు : హిందూ జాతీయతను పరిరక్షించాలి అని భావించేవారు.

→ కమ్యూనిస్టులు : శ్రమ చేసేవానికే శ్రమ యొక్క ఫలితం అందాలి అని భావించేవారు

→ బి.ఎల్.డి. : భారతీయ లోకదళ్

→ ఈ సి.పి.ఐ (ఎం) : భారతీయ కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

→ డి.ఎం.కె : ద్రవిడ మున్నేట్ర కజగం

→ ఎస్.ఎ.డి : శిరోమణి అకాలీ దళ్

→ ఎ.ఎ.ఎయు : అఖిల అస్సోం విద్యార్థి సంఘం

→ ఎ.జి.పి : అస్సోం గణపరిషత్

→ రాష్ట్రపతి పాలన : రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాన్ని పాలించలేకపోతోందని గవర్నర్ అభిప్రాయపడితే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి సలహాతో రాష్ట్రపతి తొలగించి పాలనా బాధ్యతను చేపట్టమని గవర్నర్‌ను కోరి పరిపాలన సాగించడం.

→ అంతర్గత వలస ప్రాంతం : ఒక ప్రాంతం వారు మరొక ప్రాంతంపై అధికారాన్ని చెలాయించటం.
ఉదా : బెంగాల్ ప్రాంతం వారు. అసోం ప్రాంతంపై అధికారాన్ని చెలాయించుట.

AP 10th Class Social Notes Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000

→ టెలికం విప్లవం : ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానంతో దేశంలో టెలిఫోనిక్ నెట్వర్క్ వేగంగా విస్తరించడం.

→ విధాన పక్షపాతం : ప్రభుత్వం తీసుకునే కొన్ని విధానాల వల్ల కొద్దిమంది ప్రజలకు మేలు జరిగి, మిగతా వారికి ఏ విధమైన మేలు జరగకపోగా, ఒక్కోసారి కీడు జరిగే పరిస్థితి.

→ వామపక్ష పార్టీలు : బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయ అంశాలను అత్యధికంగా అమలుచేయాలనే ప్రధాన ఉద్దేశం గల పార్టీలు.

→ ఆపరేషన్ బర్గా : కౌలుదార్లను భూస్వాములు బలవంతంగా తొలగించటానికి వీలులేకుండా చేసిన చర్య.

→ మండల్ కమిషన్ : సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 27% రిజర్వేషన్ కల్పించాలని నివేదించిన కమిటీ.

→ లౌకికరాజ్యం : రాజ్యపాలన నిర్వహణలో మతం ప్రమేయం లేకుండుట.

→ సరళీకృత ఆర్థిక విధానం : ప్రభుత్వ ఖర్చును తగ్గించుకొని, విదేశీ సరకులపై పరిమితులను తగ్గించి, ప్రైవేటు రంగానికి ప్రాధాన్యత ఇవ్వటం.

→ బహుళ పార్టీ వ్యవస్థ : రెండు లేదా అంతకన్నా ఎక్కువ పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే వ్యవస్థ.

→ ప్రజాస్వామ్యం : ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వ వ్యవస్థ ఉండడం.

→ దేశ ఐక్యత : దేశంలోని ప్రజలందరూ కలసిమెలసి జీవించడం.

→ పర్యావరణ ఉద్యమం : పర్యావరణ సమతుల్యతను కాపాడడానికి జరిపే ఉద్యమం.

AP 10th Class Social Notes Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000

→ స్త్రీవాద ఉద్యమం : స్త్రీలకు అన్ని విషయాలలో సమాన హోదా కోసం పోరాడడం.

→ పౌరహక్కుల ఉద్యమం : ప్రజల ప్రాథమిక హక్కులను పరిరక్షించుట కొరకు జరిగేది.

→ సాహిత్య ఉద్యమం : మంచి రచనలతో ప్రజలను ముందుకు నడిపించడం.

→ రామ జన్మభూమి – బాబ్రీ మసీదు వివాదం : అది రాముని జన్మస్థలం అని, అంతకు ముందు అక్కడ ఉన్న గుడిని పడగొట్టి మసీదు కట్టారని హిందువుల వాదన కాగా, అది నిజం కాదని, ఇది తమ ప్రార్థనా స్థలమని ముస్లింల వాదన.

→ వామపక్ష ప్రభుత్వం : అణగారిన వర్గాలకు ప్రభుత్వాధికారం సంక్రమించాలనే ప్రభుత్వం.

AP 10th Class Social Notes Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000 1
AP 10th Class Social Notes Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000 2

AP 10th Class Social Notes Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

Students can go through AP Board 10th Class Social Notes 18th Lesson స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977) to understand and remember the concept easily.

AP Board 10th Class Social Notes 18th Lesson స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

→ రాజకీయాలలో ఒక వ్యక్తి – ఒక ఓటు – ఒకే విలువ అని అంబేద్కర్ అన్నారు.

→ మొదటి సాధారణ ఎన్నికలు నిరక్షరాస్యత మూలంగా సవాలుగా నిలిచాయి.

→ రోజువారీ జీవితం నుంచి కొన్ని గుర్తులను ఉపయోగించి మొదటి ఎన్నికలను నిర్వహించారు.

→ 1952, 1957, 1967లలో జరిగిన మొదటి మూడు సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ ఘన విజయం సాధించగా, ఇతర పార్టీలు కాంగ్రెస్ కి సమీపంలోకి కూడా రాలేదు.

→ అనేక రాష్ట్రాలలో వివిధ భాషలు మాట్లాడే ప్రజలు నివసించేవారు. అదే విధంగా ఒకే భాషను మాట్లాడేవారు వివిధ రాష్ట్రాలలో నివసించేవారు.

→ తెలుగు మాట్లాడే ప్రజలు అందరికంటే తీవ్ర ఉద్యమాన్ని చేపట్టారు.

→ బ్రిటిష్ పాలనలో ఆంధ్రమహాసభ క్రియాశీలంగా పనిచేసింది.

AP 10th Class Social Notes Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

→ 1953లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘాన్ని (SRC) వేశారు. దీనిలో ఫజల్ ఆలి, కె.ఎం. పణిక్కర్, హృదయనాథ్ కుంజులు సభ్యులుగా ఉన్నారు.

→ 1956లో పార్లమెంటు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదించబడింది.

→ స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భూసంస్కరణలను అమలు చేశారు. కానీ ఇవి దేశమంతా మనస్ఫూర్తిగా అమలు జరగలేదు.

→ ప్రణాళికాబద్ధ అభివృద్ధి ద్వారా కులం, మతం, ప్రాంతం వంటి విభజన ధోరణులు తగ్గి భారతదేశం బలమైన, ఆధునిక దేశంగా ఎదుగుతుందని నెహ్రూ ఆశించాడు.

→ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ప్రచ్ఛన్న యుద్ధం మొదలై ప్రపంచమంతా రష్యా కూటమి (USSR) లేదా అమెరికా (USA) గా విడిపోయింది.

→ భారతదేశం, ఇండోనేషియా, ఈజిప్టు, యుగోస్లేవియా మొదలైన దేశాలు కలసి ‘అలీన విధానాన్ని నిర్మించారు.

→ పంచశీల సూత్రాలను నెహ్రూ రూపొందించాడు.

→ 1962 లో చైనాతో, 1965 లో పాకిస్థాన్, 1971లో మళ్ళీ పాకిస్థాన్‌తో భారతదేశం యుద్ధం చేయవలసి వచ్చింది.

→ 1964 లో నెహ్రూ చనిపోయిన తరువాత లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యాడు. 1965 లో శాస్త్రి అకాల మరణం తరువాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యింది.

→ తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం తీవ్రంగా పరిణమించినపుడు శాస్త్రి గారు ఉద్యమాన్ని శాంతి పరచటానికి అనేక మినహాయింపులు ప్రకటించారు.

AP 10th Class Social Notes Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

→ 1967లో అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ ఓడిపోగా వివిధ ప్రతిపక్ష పార్టీలు అధికారంలోకి వచ్చాయి.

→ ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం ప్రారంభమయ్యింది.

→ భారతదేశంలో జమ్ము-కాశ్మీరు ప్రత్యేక ప్రతిపత్తి ఉంది.

→ భారత్ 1971లో బంగ్లాదేశ్ కు సహకరిస్తూ పాక్ తో యుద్ధం చేసింది. బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం సంపాదించుకుంది.

→ “గరీబీ హటావో” అనే నినాదంతో ఇందిరాగాంధీ 1971 సార్వత్రిక ఎన్నికలలో రికార్డుస్థాయిలో విజయం సాధించింది. ప్రతిపక్షమే లేకుండా పోయింది.

→ ఇందిరాగాంధీ అనేక ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేసింది. రాజ భరణాలను రద్దు చేసింది. చమురు ధరలు, ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ఆహార కొరత, నిరుద్యోగం వంటి సమస్యలను ఎదుర్కొంది.

→ జయప్రకాశ్ నారాయణ్ ఆధ్వర్యంలో అనేక ప్రతిపక్షాలు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉద్యమించాయి.

→ ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించి అనేక సమస్యలను ఎదుర్కొన్నది.

→ రాజ్యాంగానికి 42 వ సవరణ చేయుట జరిగింది.

→ మనం స్థిరమైన ప్రజాస్వామ్యాన్ని సాధించామని చెప్పవచ్చు. అయితే ఇప్పటికీ కుల వివక్ష, లింగ వివక్ష కొనసాగుతున్నాయి.

AP 10th Class Social Notes Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

→ రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ : రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ కంటే ముందు ప్రత్యేక తెలుగురాష్ట్రం కోరుతూ 58 రోజులు నిరాహారదీక్ష చేసిన పొట్టి శ్రీరాములు 1952 అక్టోబరులో చనిపోవడంతో 1953 ఆగష్టులో రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ సంఘాన్ని (ఎస్.ఆర్.సి) వేశారు. దీనిలో ఫజల్ ఆలి, కె.ఎం. పణిక్కర్, హృదయనాథ్ కుంజులు సభ్యులుగా ఉన్నారు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటును సిఫారసు చేసింది. ఈ సంఘ సిఫారసుల మేరకు భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ జరిగింది.

→ ఒక పార్టీ ఆధిపత్యం : స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1952, 1957, 1962లలో జరిగిన మూడు సార్వత్రిక ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ అఖండ విజయాలు సాధించింది. 70% పైగా స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ విభిన్న దృక్పథాలు, ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇతర పార్టీలు ఉన్నాయి. ఎన్నికలలో పోటీ చేశాయి. కానీ కాంగ్రెస్ ని సవాలు చేయగలిగే సంఖ్యలో స్థానాలను గెలుచుకోలేక పోవడంతో ఒక పార్టీ ఆధిపత్యం ఏర్పడింది.

→ అత్యవసర పరిస్థితి :
అత్యవసర పరిస్థితులు మూడు రకాలు :

  1. జాతీయ అత్యవసర పరిస్థితి
  2. రాష్ట్రస్థాయిలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినప్పుడు విధించే రాష్ట్రపతి పాలన
  3. ఆర్థిక అత్యవసర పరిస్థితి

అత్యవసర పరిస్థితి ప్రభావం :

  1. ప్రాథమిక హక్కులను నిలిపివేయవచ్చు.
  2. కేంద్ర కార్యనిర్వాహక వర్గం సలహామేరకు రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం పాలనను కొనసాగించవలసి ఉంటుంది. పార్లమెంటు రాష్ట్ర జాబితాలోని అంశంపై అయినా శాసనం చేయవచ్చు. ఎటువంటి మార్పులనైనా రాష్ట్రపతి చేయవచ్చు.

AP 10th Class Social Notes Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

→ ప్రాంతీయ ఉద్యమాలు : ఇందిరాగాంధీ పరిపాలన కాలంలో దేశంలో వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ భావాలు తిరిగి ఊపందుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక తెలంగాణ కొరకు ఉద్యమాలు చేయసాగారు. 1969 డిసెంబరులో అసోంలోని ఖాసి, జైంతియా, గారో గిరిజన ప్రాంతాలలో ఉద్యమ ఫలితంగా మేఘాలయ ఏర్పడింది. 1966లలో ఉమ్మడి రాజధాని అయిన చండీఘర్ తమకు ఇమ్మని పంజాబ్ కోరింది. మహారాష్ట్రలోని బొంబాయి మహారాష్ట్ర వాసులకే చెందాలని శివసేన ఉద్యమం ప్రారంభించింది. కాశ్మీరు, నాగాలాండులలో కూడా ఉద్యమాలు జరిగాయి.

→ జాతీయీకరణ : సామాజిక, ఆర్థిక మార్పు సాధించాలన్న లక్ష్యంతో అనేక ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేస్తూ ఇందిరాగాంధీ ప్రకటన చేసింది. దీని మూలంగా సామాన్య ప్రజలందరూ ఈ || బ్యాంకుల సేవలను ఉపయోగించుకోవచ్చు.

AP 10th Class Social Notes Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977) 1
AP 10th Class Social Notes Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977) 2