AP 10th Class Social Notes Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

Students can go through AP Board 10th Class Social Notes 17th Lesson స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం to understand and remember the concept easily.

AP Board 10th Class Social Notes 17th Lesson స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

→ నేపాల్, జపాన్, భారత రాజ్యాంగాలు మూడు కూడా ప్రజాక్షేమాన్ని, వ్యక్తి యొక్క సర్వతోముఖాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చాయని తెలుస్తుంది.

→ నేపాల్ లో 2007లో రాచరికం రద్దు అయింది. రాజ్యాంగాన్ని రూపొందించే ప్రక్రియ 2007లో ప్రారంభమై ఇంతవరకు (2014) కూడా పూర్తి కాలేదు.

→ భారతదేశంలో రాజ్యాంగసభకు 1946లో ఎన్నికలు జరిగినాయి. బ్రిటిష్ రాష్ట్రాల నుండి, సంస్థానాల నుండి సభ్యులను ఎన్నుకొనుట జరిగింది.

→ 1947 ఆగష్టు 14న పాకిస్తాన్ ఏర్పడింది. 1947 ఆగష్టు 15న భారతదేశం ఏర్పడింది. దీనివలన రాజ్యాంగసభ పాకిస్థాన్ రాజ్యాంగసభగా, భారత రాజ్యాంగసభగా విడిపోయింది.

→ ముసాయిదా సంఘం 1947లో డా|| బి.ఆర్. అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పడింది.

→ ముసాయిదా సంఘం, రాజ్యాంగాన్ని రూపొందించింది. చివరిగా 1949 నవంబరు 26న రాజ్యాంగాన్ని రాజ్యాంగసభ ఆమోదించింది.

→ రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది.

→ ముసాయిదా రాజ్యాంగంలో 315 అధికరణాలు, 8 షెడ్యూళ్ళు ఉన్నాయి.

→ ముసాయిదా, రాజ్యాంగంపై ప్రజాస్పందనల కోసం 8 నెలల పాటు రాజ్యాంగాన్ని ప్రజల ముందు ఉంచింది.

→ మన రాజ్యాంగం ప్రకారం మనది పార్లమెంటరీ, సమాఖ్య వ్యవస్థ అని చెప్పవచ్చు.

→ పార్లమెంటరీ విధానంలో నామమాత్ర అధ్యక్షుడు ఉంటాడు. వాస్తవాధికారాలు ప్రధానమంత్రి మరియు అతని మంత్రులు నిర్వర్తిస్తారు.

AP 10th Class Social Notes Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

→ అమెరికా అధ్యక్ష విధానంలో అధ్యక్షుడే సర్వాధికారి. అన్ని అధికారాలను అధ్యక్షుడే నిర్వర్తిస్తాడు. అతని కింద వివిధ శాఖలకు సెక్రటరీలు బాధ్యత వహిస్తారు.

→ భారత అధ్యక్షుడికి మంత్రులకు పార్లమెంటులో మద్దతు ఉన్నంతవరకు మంత్రులను తొలగించే అధికారం లేదు.

→ రాజ్యాంగ రూపాలు రెండు రకాలు – 1) ఏకీకృత రాజ్యాంగం 2) సమాఖ్య విధానం.

→ మనది సమాఖ్య విధానం. దీని ప్రకారం కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలుంటాయి. అవి సర్వసత్తాకమైనవి. కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజన కూడా జరిగింది.

→ మన సమాఖ్య విధానంలో ఏకపౌరసత్వం ఉంది. ఏకీకృత, అత్యున్నత న్యాయస్థానం ఉంది. దేశం మొత్తానికి వర్తించే అఖిల భారత సర్వీసులను కూడా కేంద్రమే నియమిస్తుంది.

→ కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాలను కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలుగా విభజించుట జరిగింది.

→ కొంతమంది రాజ్యాంగాన్ని “1935 భారత చట్టానికి నకలు” అని విమర్శించినారు.

→ షెడ్యూల్డ్ తరగతులు, షెడ్యూల్డ్ తెగలకు రాజ్యాంగంలో రిజర్వేషన్లను కల్పించినారు.

→ “లౌకిక, సామ్యవాదం” అనే పదాలను 1976లో 42వ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో చేర్చారు.

→ ముసాయిదా సంఘం : రాజ్యాంగం జాతి ప్రాణమే కాక ఆ జాతి ప్రజల ఆశయాలను ప్రతిబింబిస్తుంది. రాజ్యాంగ సభ, రాజ్యాంగాన్ని రూపొందించటానికి ముందుగా రాజ్యాంగ ప్రతిని’ రూపొందించుట కొరకు ఈ “ముసాయిదా సంఘం” ను 1947, ఆగస్టు 29న డా॥ బి. ఆర్. అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది.

→ రాజ్యాంగ సభ : రాజ్యాంగ సభ అంటే దేశ రాజ్యాంగం రూపొందించే చర్చా వేదిక. దేశ ప్రాథమిక చట్టాన్ని రూపొందించే వ్యవస్థగా రాజ్యాంగ సభకు ప్రత్యేక హోదా ఉంటుంది.
1) మన దేశ రాజ్యాంగాన్ని నిర్మించుకొనుటకు రాజ్యాంగ సభ, 1946, డిసెంబరు 9న మొదటి సమావేశం జరిపింది.
2) రాజ్యాంగ సభకు 1946 జూలైలో ఎన్నికలు జరిగాయి. 1947 ఆగష్టులో దేశ విభజనతో రాజ్యాంగ సభను కూడా భారత్, పాక్ రాజ్యాంగ సభలుగా విభజించారు.

AP 10th Class Social Notes Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

→ ప్రవేశిక : రాజ్యాంగ మూలతత్వాన్ని సంగ్రహంగా తెల్పే ఈ ప్రవేశిక “ఉపోద్ఘాతం” వంటిది. రాజ్యాంగంలో పొందుపరచిన సిద్ధాంతాలు, భావనలు, రాజ్యాంగ లక్ష్యాలు, ప్రయోజనాలు ఈ ప్రవేశిక ద్వారా తెలుసుకోవచ్చు.

→ ఉభయపద్దు : సమాఖ్య ప్రభుత్వ విధానం యొక్క ముఖ్య లక్షణం “అధికారాల విభజన.” రాజ్యాంగం అధికారాలను కేంద్ర, రాష్ట్రాల మధ్యనే కాకుండా ‘ఉభయపద్దు’ గా విభజించింది. ఈ ఉభయపద్దును “ఉమ్మడి జాబితా” అంటాము. ఇందులో 47 అంశాలుంటాయి. ఈ అంశాల మీద కేంద్రం, రాష్ట్రం రెండూ చట్టాలు చేయవచ్చు. అయితే కేంద్రం చేసే చట్టానికి విరుద్ధంగా రాష్ట్రం చట్టం చేస్తే కేంద్రం చేసిన చట్టమే చెల్లుబాటవుతుంది.

→ ఏకీకృత, సమాఖ్య సిద్ధాంతాలు: 1) ప్రభుత్వంలో ప్రభుత్వాధికారమంతా కేంద్ర ప్రభుత్వానికే ఉంటే అది “ఏకీకృత సిద్ధాంత” మని అంటాం.
2) ప్రభుత్వాధికారాలు కేంద్ర, రాష్ట్రాల మధ్య రాజ్యాంగబద్ధంగా పంపిణీ అయితే దానిని “సమాఖ్య సిద్ధాంత”మని అంటాం.

→ పౌరసత్వం : ఆధునిక రాజ్యాలలో రెండు విధాలైన ప్రజలున్నారు. వారు దేశీయులు మరియు విదేశీయులు. “ఏ ప్రజలు దేశంలో పౌర, రాజకీయ హక్కులను అనుభవిస్తుంటారో వారిని ఆ దేశ పౌరులని” అంటారు. విదేశీయులకు మానవతా దృష్ట్యా పౌరహక్కులను మాత్రమే కల్పిస్తారు. కాబట్టి ‘పౌరసత్వం’ అనే హోదాను రాజ్యం పౌరునికి కల్పించుటచే అతను పౌర, రాజకీయ హక్కులు అనుభవించగలడు. భారతదేశంలో ఏక పౌరసత్వం (భారత పౌరసత్వం ) ఉంది.

→ అధ్యక్ష, పార్లమెంటరీ తరహా వ్యవస్థ :
1) అధ్యక్ష విధానం : ఈ విధానంలో శాసనసభ, కార్యనిర్వాహక వర్గాలు రెండూ స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. కార్యనిర్వాహక వర్గం శాసనసభలో భాగం కాదు. అధ్యక్షుడే ప్రధాన కార్యనిర్వాహణాధికారి. అతడే వాస్తవ అధికారి. అధ్యక్షుడే అన్ని అధికారాలను స్వయంగా కాని, మంత్రుల ద్వారా కాని చెలాయిస్తాడు.

2) పార్లమెంటరీ వ్యవస్థ : ఈ విధానంలో కార్యనిర్వాహక శాఖకు, శాసనశాఖకు సన్నిహిత సంబంధం ఉంటుంది. శాసనశాఖ నుంచే కార్యనిర్వాహక శాఖ ఏర్పడుతుంది. శాసన శాఖకు బాధ్యత వహిస్తుంది. అధ్యక్షుడు నామమాత్రంగా ఉంటాడు. వాస్తవాధికారాలు ప్రధానమంత్రి మరియు ఇతర మంత్రులు నిర్వర్తిస్తారు.

AP 10th Class Social Notes Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

→ సవరణ : చట్టాలను అప్పుడప్పుడు సవరించాల్సిన అవసరం ఏర్పడుతుందని రాజ్యాంగ నిర్మాతలు గుర్తించి, రాజ్యాంగంలోని అధికరణాలను సవరించటానికి అవకాశం కల్పించింది. ఈ సవరణలను పార్లమెంటు 2/3 వంతు మెజారిటీతో ఆమోదించాలి. సవరణలను దేశ అధ్యక్షుడు ఆమోదించాలి.

→ కేంద్ర జాబితా : సమాఖ్య విధానంలో అధికారాలు కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి అధికారాలుగా విభజింపబడినాయి. కేంద్ర జాబితాలో 97 అంశాలున్నాయి. ఈ అంశాలపై కేంద్రమే చట్టాలు చేస్తుంది. అవి దేశానికంతటికి వర్తిస్తాయి.
ఉదా : రక్షణ, రైల్వేలు, తంతి తపాలా వంటివి.

→ రాష్ట్ర జాబితా : రాష్ట్ర జాబితాలో 60 అంశాలున్నాయి. వాటి మీద రాష్ట్ర ప్రభుత్వమే చట్టాలు చేయగలదు.
ఉదా : పోలీసు, ప్రజా ఆరోగ్యం , జైళ్ళు మొదలైనవి.

AP 10th Class Social Notes Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

AP 10th Class Social Notes Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

Students can go through AP Board 10th Class Social Notes 16th Lesson భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947 to understand and remember the concept easily.

AP Board 10th Class Social Notes 16th Lesson భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

→ రెండవ ప్రపంచయుద్ధం 1939లో ప్రారంభమైనది. ఈ సమయంలో అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పాలిస్తున్నాయి.

→ 1935లో బ్రిటిషు భారత ప్రభుత్వ చట్టాన్ని ఆమోదించింది.

→ 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఓటువేసే అధికారాన్ని చాలా కొద్దిమందికే ఇచ్చారు. రాష్ట్ర శాసనసభలకు 12%, కేంద్రసభకు 1% ప్రజలకే ఓటు హక్కు లభించింది.

→ 1937లో ఎన్నికలు నిర్వహించినపుడు 8 రాష్ట్రాలలో కాంగ్రెస్, ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.

→ అనేకమంది కాంగ్రెస్ నాయకులు హిట్లర్, ముస్సోలినిని, ఫాసిజాన్ని వ్యతిరేకించారు.

→ రెండవ ప్రపంచయుద్ధ సమయంలో బ్రిటన్ లో “కన్సర్వేటివ్” పార్టీకి చెందిన విస్టన్ చర్చిల్ ప్రధానమంత్రిగా ఉన్నాడు.

→ 1937లో జరిగిన ఎన్నికలలో అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.

→ 1939లో రెండవ ప్రపంచయుద్ధం ప్రారంభమైంది.

→ భారతీయులతో సంప్రదించకుండా భారత ప్రజలు యుద్ధంలో ఇంగ్లాండుకు సహాయం చేయాలనే వైస్రాయి ప్రకటనకు నిరసనగా కాంగ్రెస్ ప్రభుత్వాలు 1939లో రాజీనామా చేశాయి.

AP 10th Class Social Notes Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

→ బ్రిటిష్ ‘విభజించి పాలించు’ అన్న సిద్ధాంతాన్ని పాటించింది.

→ ‘విభజించి పాలించు’ సూత్ర ప్రాతిపదికగా ముస్లిం లీగును ప్రోత్సహించి కాంగ్రెస్ ప్రాముఖ్యాన్ని తగ్గించసాగింది.

→ 1906 లో ముస్లింలీగు ఏర్పడింది.

→ 1909 నుంచి ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను బ్రిటిష్ ఏర్పాటు చేసింది.

→ కులం, వర్గ భేదాలను అధిగమించి హిందువులనందరినీ ఏకం చేయడానికి కృషి చేసినవి, హిందూ మహాసభ, ఆర్.ఎస్.ఎస్‌లు.

→ “సారే జహాసే అచ్ఛా హిందూస్తాన్ హమారా” అన్న కవిత రాసిన ఉర్దూ కవి “మహ్మద్ ఇక్బాల్” 1930లో వాయవ్య ముస్లిం రాష్ట్ర ఆవశ్యకత గురించి మాట్లాడినాడు.

→ పాకిస్తాన్ లేదా పాకిస్తాన్ (పంజాబ్, ఆఫ్ఘన్, కాశ్మీరు, సింద్, బెలుచిస్తాన్ ఇంగ్లీష్ అక్షరాల నుంచి ఏర్పడింది) అన్న ఆ పేరును పంజాబీ ముస్లిం చౌదరి రెహ్మత్ ఆలి రూపొందించాడు.

→ 1942 లో క్రిప్స్ భారతదేశం వచ్చి, కొన్ని ప్రతిపాదనలు చేసాడు.

→ 1942 ఆగష్టులో “క్విట్ ఇండియా” ఉద్యమాన్ని గాంధీజీ ప్రారంభించారు.

→ సుభాష్ చంద్రబోస్ 1942లో జపానులో భారతీయ సైనికులతో ఒక సైన్యాన్ని తయారుచేశాడు.

→ 1946 ఫిబ్రవరి 16న బొంబాయి రేవులోని రాయల్ నౌకాదళంలోని భారత సైనికులు బ్రిటిష్ అధికారుల ప్రవర్తన పట్ల నిరసనగా నిరాహారదీక్ష చేపట్టారు.

→ హైదరాబాదులో కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ ప్రాంత రైతుల ఉద్యమానికి నాయకత్వం వహించింది.

AP 10th Class Social Notes Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

→ 1946 లో జరిగిన రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలలో కేంద్రంలో రిజర్వు చేసిన 30 స్థానాలనూ, రాష్ట్రంలో 442 స్థానాలను ముస్లిం లీగు గెలుచుకుంది.

→ 1946 లో సాధారణ నియోజక వర్గాలలో కాంగ్రెస్ పార్టీ ముస్లిమేతర ఓట్లలో 91 శాతంతో విజయం సాధించింది.

→ 1946 మార్చిలో కాబినెట్ మిషన్ భారతదేశం వచ్చింది.

→ ముస్లిం లీగు 1946 ఆగష్టు 16ను ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ప్రకటించింది.

→ 1947 ఫిబ్రవరిలో మౌంట్ బాటెన్ వైస్రాయిగా వచ్చాడు.

→ మౌంట్ బాటెన్ ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న పంజాబు, బెలూచిస్తాన్, తూర్పు బెంగాల్ లను పాకిస్తాన్ గా విభజించి, 1947 ఆగష్టు 14న పాకిస్తాన్ కు, భారతదేశానికి ఆగష్టు 15న స్వాతంత్ర్యాన్ని ప్రకటించడం జరిగింది.

→ భారతదేశం ప్రజాస్వామిక లౌకికరాజ్యంగా ఆవిర్భవించింది.

→ దేశ విభజన మూలంగా వలసలు జరిగి 1.5 కోట్ల హిందూ, ముస్లింలు నిర్వాసితులయ్యారు.

→ 1948 జనవరి 30న “నాథూరాం గాడ్సే” గాంధీజీని హత్య చేసినాడు.

→ బ్రిటిష్ ఇండియాలో ఉన్న 550 స్వదేశీ సంస్థానాలను స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో విలీనం చేసే కార్యక్రమానికి “సర్దార్ పటేల్” నాయకత్వం వహించాడు.

→ 1971లో భారత ప్రభుత్వం రాజ భరణాలను, బిరుదులను రద్దు చేసింది.

→ రాజ్య ( డొమీనియన్) ప్రతిపత్తి : జామీనియన్ ప్రతిపత్తి” అనే అంశం 1942లో భారతదేశానికి వచ్చిన “సర్ స్టాఫర్డ్ క్రిప్స్” రాయబారంలోని ముఖ్య అంశం. దీని ప్రకారం రెండవ ప్రపంచ యుద్ధం ముగియగానే భారతదేశానికి “సార్వభౌమాధికారం కలిగిన రాజ్య ప్రతిపత్తి” ఇస్తామని చెప్పారు. డొమీనియన్ ప్రతిపత్తికి అనుగుణంగా ఒక రాజ్యాంగ నిర్మాణసభ సమావేశమై రాజ్యాంగాన్ని రూపొందిస్తుంది. కాని ఈ రాజ్యాంగాన్ని బ్రిటిష్ అమలుచేస్తుంది. దీని ప్రకారం ఏదైనా రాష్ట్రం కాని, ప్రాంతం కాని, సంస్థానాలు కాని తమకు ఇష్టం అయితే ఇందులో చేరవచ్చు లేదా స్వతంత్ర రాజ్యాలుగా ఉండవచ్చు. ఈ సూచనలు భారతదేశాన్ని ముక్కలుగా విభజిస్తాయని కాంగ్రెస్, ముస్లిం లీగులు భావించి, వీటిని తిరస్కరించినారు.

→ విభజించి పాలించు : శీఘ్రంగా పెరిగిపోతున్న జాతీయోద్యమాన్ని ఎదుర్కోవడానికి, దానిని నిలువరించడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఈ “విభజించి పాలించు” అనే విధానాన్ని అవలంభించింది. ఈ బ్రిటిష్ విధానాన్ని పాటించి, కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమాలను ప్రోత్సహించింది. హిందూ-ముస్లిం మధ్య మత వైరుధ్యాన్ని పోషించింది. కమ్యూనల్ ఎలక్టరేట్లను ప్రవేశపెట్టడం ద్వారా విద్యావంతులు మరియు సాధారణ ప్రజానీకం మధ్య శత్రుత్వాన్ని పెంచి పోషించారు. అతివాదులకు వ్యతిరేకంగా మితవాదులను ప్రోత్సహించారు. ఇటువంటి విభజించే విధానాలను బ్రిటిష్ వారు పాటించినారు.

AP 10th Class Social Notes Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

→ ప్రత్యేక నియోజకవర్గం : 1906లో ప్రత్యేక ముస్లిం లీగు ఏర్పాటు జరిగింది. బ్రిటిష్ వారు ముస్లింలకు “ప్రత్యేక సదుపాయాలు చేస్తూ ప్రత్యేక ముస్లిం నియోజక వర్గాలను 1909 మింటో మార్లే సంస్కరణలలో” భాగంగా చేశారు. దీని ప్రకారం ముస్లింలు ఎన్నుకోబడి, శాసనసభలలోకి వెళ్ళడానికి అవకాశం కలిగింది.

→ ద్విజాతి సిద్ధాంతం : భారతదేశంలోని ప్రజలందరూ హిందూ, ముస్లిం జాతులుగా విభజింపబడుటను “ద్విజాతి సిద్ధాంతం” అంటారు. హిందువులు ప్రత్యేక జాతి, ముస్లింలు ప్రత్యేక జాతి అని వీరిద్దరి ఆశయాలు వేరని చెప్పడమే ద్విజాతి సిద్ధాంతం.

→ కమ్యూనల్ అవార్డు : దళిత కులాలకు ప్రత్యేక ఎలక్టోరేట్లను ఏర్పాటు చేయుటనే “కమ్యూనల్ అవార్డు” అంటారు. దీని ప్రకారం దళితవర్గాలు స్వయంగా ఎంపిక చేసుకొన్న పేర్ల జాబితా నుంచి కామన్ జాయింట్ నియోజక వర్గాల ద్వారా భర్తీ చేయవలసి ఉంది. రిజర్వ్ చేసిన స్థానాల సంఖ్య దాదాపు రెట్టింపు అయింది.

AP 10th Class Social Notes Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం 1939-1947 1
AP 10th Class Social Notes Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం 1939-1947 2

AP 10th Class Social Notes Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

Students can go through AP Board 10th Class Social Notes 15th Lesson వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు to understand and remember the concept easily.

AP Board 10th Class Social Notes 15th Lesson వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

→ సంప్రదాయ పాలకులు : రాజులు, చక్రవర్తులు.

→ యూరపులో కొత్త భావనలు : జాతీయతావాదం, ప్రజాస్వామ్యం, సోషలిజం.

→ ప్రాభవ ప్రాంతాలు : చట్టాలు వర్తించక, పన్ను చెల్లించక, సైనిక దళాలను కలిగి ఉండడం.

→ సన్, మిన్, చుయి : జాతీయతావాదం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం.

→ మే నాలుగు ఉద్యమం : వర్సయిల్స్ శాంతి సమావేశం నిర్ణయాలను నిరసిస్తూ బీజింగ్ లో నిరసన ప్రదర్శన (1919 మే 4)

→ ఆడపిల్లల పాదాలు కట్టివెయ్యటం : ఆడపిల్లల పాదాలు పూర్తిగా పెరగకుండా నిరోధించే క్రూరమైన సంప్రదాయం

→ చైనా రెండు సంక్షోభాలు : 1. నేలలు నిస్సారం, అడవుల నరికివేత
2. దోపిడీపూరిత కౌలు, రుణభారం.

→ గ్రామీణ మహిళా సంఘాలు : గ్రామీణ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే కమిటీలు.

→ రైతాంగ సైన్యం : భూస్వామ్యాన్ని అంతం చెయ్యడానికి పోరాడే రైతుల సమ్మేళనం.

→ రైతాంగ పాఠశాలలు : రాజకీయ విద్య, అక్షరాస్యతను వ్యాప్తి చేసే రైతుల పాఠశాలలు.

→ నాపాలం : మనుషులకు తీవ్ర నష్టం కలిగించే ప్రమాదకరమైన బాంబు.

→ భూసంస్కరణలు : భూ పంపిణీలో ఉన్న అసమానతలు తొలగించి, భూమిలేని పారికి భూమిని పంచి పెట్టడం.

→ భూస్వామ్యవాదం : భూమి అంతా కొంతమంది వ్యక్తుల అధీనంలో కేంద్రీకరింపబడడం.

AP 10th Class Social Notes Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

→ నూతన ప్రజాస్వామ్యం : భూస్వామ్యవాదానికి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అన్ని వర్గాలతో కలిపి ఏర్పడినది.

→ వెట్టి కార్మికులు : తక్కువ వేతనంతో పని చేయించడం గాని, ప్రతిఫలం ఏమీ ఇవ్వకుండా బానిసలుగా గాని పని చేయించడం.

→ రసాయనిక ఆయుధాలు : విషపూరిత మందులు, ఒకేసారి వేలమందిని చంపే అత్యంత విషపూరిత పదార్ధం కలిగిన ఆయుధాలు ఈ బలహీన ప్రజాస్వామ్యం : అవినీతి, మానవహక్కుల ఉల్లంఘన, సైనిక పాలన గల దానిని బలహీన ప్రజాస్వామ్యం అంటాం.

→ ఖండాంతర ఆఫ్రికావాదం : దేశ, తెగ తేడాలు లేకుండా ఆఫ్రికా ప్రజలందరినీ ఏకం చేయడం.

→ 1902 : పెకింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు

→ 1918 : లెనిన్ కొమిటర్న్ ఏర్పాటు

→ 1919 : మే నాలుగు ఉద్యమం (బీజింగ్)

→ 1919 : చైనాలో 5 లక్షల మందితో పారిశ్రామిక కార్మికవర్గం ఏర్పాటు

→ 1921 : చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు

→ 1923 : నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీ ఆవిర్భావం

→ 1931 : వియత్నాం ప్రపంచంలో మూడవ అతి పెద్ద బియ్యం ఎగుమతి

→ 1937 : చైనా పై జపాన్ దండెత్తడం

AP 10th Class Social Notes Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

→ 1940 : జపాన్ వియత్నాం ఆక్రమణ

→ 1945 : అమెరికాకి జపాన్ దాసోహం

→ 1945 : వియత్నాంలో జాతీయవాద కార్మికసంఘం జాతీయ సమ్మె

→ 1949 : చైనా ప్రజల గణతంత్రం ఏర్పాటు

→ 1950 : చైనాలో భూసంస్కరణలు అమలు

→ 1963 : నైజీరియా స్వాతంత్ర్యం

→ 1974 : పారిస్‌లో శాంతి ఒప్పందంపై సంతకాలు

→ 1999 : నైజీరియాలో ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పాటు

AP 10th Class Social Notes Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

Students can go through AP Board 10th Class Social Notes 14th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II to understand and remember the concept easily.

AP Board 10th Class Social Notes 14th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

→ రష్యాలో ప్రణాళికలు : స్టాలిన్

→ రష్యా విప్లవం : బోల్షివిక్

→ రష్యా పాలకులు : జార్

→ రష్యాలో రాజీ ధోరణి అవలంబించేవారు : మెన్షివిక్‌లు

→ రష్యా పార్లమెంట్ : డ్యూమా

→ రష్యన్ విప్లవం : మార్చి విప్లవం

AP 10th Class Social Notes Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

→ రష్యన్ సమాజంలో మార్పు కోరే సంఘాలు : సోవియట్‌లు

→ రష్యన్ మహిళా విప్లవ నాయకురాలు : మార్ఫావాసిలేవా

→ రష్యాలో 3 సం||లలో ఉక్కు కర్మాగారం నెలకొల్పిన ప్రదేశం : మాగ్నిటౌగోర్క్స్

→ ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు విప్లవాన్ని ప్రోత్సహించటానికి ఏర్పడినది : కొమిటర్న్

→ రష్యన్ విప్లవంలోని ఆదర్శాలను విమర్శించినవాడు : జార్జ్ ఆర్వెల్

→ సోషలిజం : స్వేచ్ఛ, సమానత్వం, ప్రకృతి వనరులు, సామాజిక నియంత్రణలో ఉండాలనే సిద్ధాంతం సోషలిజం.

→ కమ్యూనిజం : ఉత్పత్తి పంపిణీ, వినియోగాలలో కార్మికులను భాగస్వాములను చేస్తూ లాభ, నష్టాలలో కార్మికులకు ప్రాధాన్యత ఇచ్చే సిద్ధాంతం.

→ విప్లవం : మార్పు, ప్రగతి కొరకు నిరసనలు, ఆందోళనలు చేస్తూ ఉద్యమాలు చేరుకునే అత్యున్నత దశ విప్లవం.

→ అధికార కేంద్రీకరణ : అధికారం కొద్దిమంది చేతులలో కాకుండా అనేకులను భాగస్వామ్మును చేస్తూ చేసే అధికారాల పంపిణీ.

AP 10th Class Social Notes Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

→ బోల్షివిక్ : రష్యా విప్లవాన్ని “బోల్షివిక్” అంటారు. రష్యాలో శాంతిని వెళతొల్పి, సంక్షేమాన్ని అమలుచేసి, లెనిన్ చే స్థాపించబడిన రష్యా కమ్యూనిస్టు పార్టీలో ఒక బృందం.

→ భూముల ఏకీకరణ : భూములు, పరికరాలు, యంత్రాలు, పశువులను ఉమ్మడి సొత్తుగా భావించి చిన్న, పెద్ద రైతుల భూములను కలిపి చేసే ఉమ్మడి వ్యవసాయ విధానం.

→ పునరావాసం : తమ సొంత నివాసాలను, ఆస్తులను ఆక్రమించి, వాటికి బదులుగా వేరే ప్రాంతంలో ఆశ్రయం కల్పించడం.

→ సంస్కరణ – స్వాధీనత : ప్రస్తుతమున్న విధానాలను మార్పుచేసి, తమకు అనుకూలమైన విధంగా అమలుచేసి, తమ అధీనంలో ఉంచుకోవడం.

→ సంక్షేమ రాజ్యం : ప్రజల ఇక్కట్లు, బాధలు తొలిగించి, వారు ఆనందంగా, సంతోషంగా ఉపాధి అవకాశాలతో జీవించేందుకు పథకాలు అమలుచేసి, ప్రజలను సుఖశాంతులతో ఉంచేదాన్ని “సంక్షేమరాజ్యం” అంటాం.

→ సిద్ధాంత బోధన : ఇప్పుడున్న కార్యక్రమాలకు అదనంగా జీవన విధానంలో మార్పు తెచ్చేందుకు, తమ సంఘం(సంస్థ ద్వారా అమలుచేసే కార్యాచరణను వివరించి, ప్రజలలో మార్పు తీసుకురావడం.

→ ప్రచారం : ప్రజా సంక్షేమానికి తదుపరి చేపట్టబోయే పథకాలు లేదా ప్రస్తుతం తాము చేస్తున్న కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్లి, అవగాహన కలిగించడం.

→ జాతి ఆధిపత్యం : అన్ని దేశాలకంటే తమ దేశమే గొప్పదని, తామే అందరికీ ఆదర్శమని, తామే విశ్వ విజేతలమని తమకు తాము అహంకారంతో మెలిగే విధానం.

AP 10th Class Social Notes Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

→ రష్యాలో సోషలిజంపై చర్చలు : 1850 – 1880

→ రష్యా సోషల్ ప్రజాస్వామిక కార్మికుల పార్టీ ఏర్పాటు : 1898

→ రక్తసిక్త ఆదివారం విప్లవం : 1905

→ మార్చి 2 – జార్ చక్రవర్తి పరారీ
అక్టోబర్ 24 – పెట్రోగ్రాలో బోల్షివిల తిరుగుబాటు : 1917

→ పౌరయుద్ధం : 1918-20

→ కొమ్మిర్న్ ఏర్పాటు : 1919

→ లెనిన్ వారసుడిగా స్టాలిన్ అధికారానికి వచ్చుట, లెనిన్ మరణం : 1924

→ రష్యాలో మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రారంభం : 1928

→ భూముల ఏకీకరణ ప్రారంభం : 1929

AP 10th Class Social Notes Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-II 1
AP 10th Class Social Notes Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-II 2

AP 10th Class Social Notes Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

Students can go through AP Board 10th Class Social Notes 13th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I to understand and remember the concept easily.

AP Board 10th Class Social Notes 13th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

→ బ్రిటన్ : పారిశ్రామికంగా అగ్రదేశం.

→ ఎరిక్ హాబ్స్ బామ్ : 20వ శతాబ్దాన్ని “తీవ్ర సంచలనాల యుగం” గా పేర్కొన్నవాడు.

→ ఫాసిజం : ముస్సోలినిచే స్థాపన

→ నాజీయిజం : హిట్లర్ చే ప్రారంభం

→ ఆర్థికమాంద్యం : ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నం

→ నాగసాకి, హిరోషిమా : అమెరికా అణుబాంబులకు అతలాకుతలమైన నగరాలు (జపాన్ నగరాలు)

AP 10th Class Social Notes Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

→ కేంద్రరాజ్యాల కూటమి : జర్మనీ, ఇటలీ, జపాన్

→ మిత్రరాజ్యా ల కూటమి : అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా

→ నానాజాతి సమితి : మొదటి ప్రపంచయుద్ధం అనంతరం ఏర్పడ్డ శాంతి సంస్థ

→ ఐక్యరాజ్య సమితి : రెండో ప్రపంచయుద్ధం అనంతరం ఏర్పడ్డ ప్రపంచశాంతి సంస్థ

→ రహస్య ఒప్పందాలు : ఇతర దేశాల సహకారంతో శత్రుదేశాలను ఓడించడానికి ఆయా దేశాలతో చేసుకునే తెరవెనుక ఒప్పందాలు

→ పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం : పరిశ్రమలను స్థాపించి, వస్తువుల ఉత్పత్తిని, సరఫరాను, సేవలను అధికలాభాల ధ్యేయంతో నిర్వహించడం.

→ మైత్రీ ఒప్పందాలు : యుద్ధ వాతావరణాన్ని తగ్గించి, స్నేహపూర్వక సంబంధాలతో అవగాహన కుదుర్చుకోవడం.

→ దురహంకారపూరిత జాతీయతావాదం: నూతనంగా బలీయమైన రాజ్యా లుగా ఎదిగిన దేశాలు తమ ప్రజలలో తీవ్రమైన, దురాక్రమణపూర్వకమైన జాతీయవాదాన్ని ప్రేరేపించడం.

→ సైనికవాదం : భద్రతకు, సమస్యల పరిష్కారానికి యుద్ధమే సరైన విధానమని నమ్మటమే సైనికవాదం. సైనిక నియంత్రణలో, సైనిక ప్రభుత్వ ఆధీనంలో పరిపాలన కొనసాగింపు, నిర్భంధ సైనిక శిక్షణ.

AP 10th Class Social Notes Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

→ ఫాసిజం : ఫాసియో అనే రోమన్ పదం నుండి ఉద్భవించింది. “కడ్డీల కట్ట” అని అర్థం. ముస్సోలినిచే స్థాపించబడింది.

→ సామ్రాజ్యవాదం : వలసరాజ్య విస్తరణలో ఏర్పడ్డ శత్రుత్వమే సామ్రాజ్యవాదం.

వర్సయిల్స్ సంధి

నాజీలు : మొదటి ప్రపంచయుద్ధం అనంతరం ఏర్పడ్డ శాంతి ఒప్పందం. హిట్లర్ ప్రారంభించిన నాజీయిజాన్ని అనుసరించేవారు. నేషనల్ సోషలిస్టు పార్టీకి చెందినవారు.

ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I కాలపట్టిక

→ మొదటి ప్రపంచయుద్ధం ప్రారంభం : 1914

→ రష్యా విప్లవం : 1917

→ మొదటి ప్రపంచయుద్ధం ముగింపు : 1918

→ వర్సయిల్స్ ఒప్పందం : 1919

→ పారిస్ శాంతి సదస్సు : 1919

→ ముస్సోలినిచే ఫాసిస్టు పార్టీ స్థాపన : 1919

→ నానాజాతి సమితి ఏర్పాటు : 1919

AP 10th Class Social Notes Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

→ ప్రపంచ ఆర్థికమాంద్యం : 1929-30

→ జర్మనీలో హిట్లర్ ప్రాభవం : 1933

→ రెండవ ప్రపంచయుద్ధం ప్రారంభం : 1939

→ రష్యాపై జర్మనీ దండెత్తడం : 1942

→ రెండవ ప్రపంచయుద్ధం ముగింపు : 1945

→ ఐక్యరాజ్యసమితి ఏర్పాటు : 1945

AP 10th Class Social Notes Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I

AP 9th Class Social Notes Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

Students can go through AP Board 9th Class Social Notes 19th Lesson విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం to understand and remember the concept easily.

AP Board 9th Class Social Notes 19th Lesson విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

AP 9th Class Social Notes Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం 1
ఉత్తర ఆఫ్రికాలో లిబియా ఒక పేద దేశం. 1951లో స్వాతంత్ర్యం పొందింది. స్వాతంత్ర్యం అనంతరం అధికారాన్ని రాజు ఇద్రిస్ వశమైంది. విస్తారమైన ముడిచమురు నిధులకు లిబియా ప్రసిద్ది. లిబియా ప్రజలు వ్యవసాయం, ఎడారులలో పశువుల పాలనపై ఆధారపడినారు. సైనిక నియంత్రణలో 1969లో మువమ్మర్ గఢాఫి నియంత్రృత్వపాలన పిదప 2012 లిబియా పటం నవంబర్ 14న కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసింది.

AP 9th Class Social Notes Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం 2
ప్రపంచ వాణిజ్యకేంద్రంగా, టేకు, కలప, బియ్యం వంటి ఆహారధాన్యాలు, తగరం వంటి ఖనిజాలు, కెంపులు, నీలాలు వంటి విలువైన రాళ్ళకు బర్మా ప్రసిద్ధి. మనకు స్వాతంత్ర్యం వచ్చిన అయిదు నెలలకు బర్మాకు స్వాతంత్ర్యం వచ్చింది. బర్మన్ జాతి నాయకుడైన ఆంగ్ సాన్ (ఆంగ్ సాన్ సూకి తండ్రి) దేశానికి స్వాతంత్ర్యం సంపాదించాడు. తదుపరి సైన్యాధిపతి జనరల్ నేవిన్ దేశ అధికార ఆక్రమణ. ప్రజాస్వామ్య పునరుద్ధరణ. 1988 నుండి ఆంగ్ సాన్ సూకి ప్రజా ఉద్యమం. ఇంకా ప్రజాస్వామ్య ప్రభుత్వ సాధన కొరకు ఉద్యమాలు మయన్మార్ (బర్మా) కొనసాగుతూ ఉన్నాయి.

AP 9th Class Social Notes Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

→ సంచార పశు పోషకులు : వివిధ ప్రాంతాలు తిరుగుతూ పశువుల్ని జీవనాధారంగా చేసుకొని జీవించేవాళ్ళు.

→ పట్టణీకరణ : గ్రామీణ ప్రాంత ప్రజలు వివిధ వృత్తుల రీత్యా పట్టణాలకు వచ్చి స్థిరపడడాన్ని పట్టణీకరణ అంటారు.

→ రాజకీయ అవినీతి : బంధుప్రీతి, కులరాజకీయాలు, వంశపారంపర్య రాజకీయాలు చేస్తూ, నీతి నియమాలు లేని పాలన.

→ గృహ నిర్బంధం : ఇంటినే జైలుగా చేసి బయట ప్రపంచాన్ని చూపించకపోవడం.

→ నియంతృత్వం : ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా పాలకుల స్వప్రయోజనాలే ధ్యేయంగా గల పాలన.

→ రాచరికం : వంశపారంపర్యం గల రాజుల ఆధ్వర్యంలో జరిగే పరిపాలన.

→ భూస్వామ్యం : అధిక భూములు కలిగి నిరంకుశత్వంతో సమాజానికి ప్రాతినిధ్యం వహించే దోపిడీ స్వభావం గలవారు.

→ కలహాలు : తగవులు.

→ చరమగీతం : అంతం చేయడం.

→ ఆంక్షలు : కట్టుబాట్లు.

AP 9th Class Social Notes Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

→ ఊడిగం : బానిస పనులు, వెట్టిచాకిరి పనులు.

AP 9th Class Social Notes Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం 3

AP 9th Class Social Notes Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

Students can go through AP Board 9th Class Social Notes 18th Lesson భారతదేశంపై వలసవాద ప్రభావం to understand and remember the concept easily.

AP Board 9th Class Social Notes 18th Lesson భారతదేశంపై వలసవాద ప్రభావం

→ ప్రభుత్వం మొదటి కర్మాగారాల చట్టాన్ని 1881 లో చేసింది. దాని ద్వారా ప్రత్యేకించి పనిచేసే పిల్లల సంక్షేమం కోసం ఈ దిగువ పేర్కొన్న నియమాలు చేసింది.
* ఏడు సంవత్సరాల లోపు పిల్లలను కర్మాగారాలలో నియమించకూడదు. 7-12 సంవత్సరాల పిల్లలతో రోజుకి 9 గంటల కంటే ఎక్కువ పనిచేయించకూడదు. రోజులో ఒక గంట విరామం ఇవ్వాలి. వాళ్ళకి నెలలో 4 రోజులు సెలవులు ఇవ్వాలి.

→ 1891 మహిళా కార్మికుల సంక్షేమం కోసం చట్టాలు చేశారు. వాటి ప్రకారం –

  • మహిళా కార్మికులతో రోజుకి 11 గంటలకు మించి పని చేయించకూడదు.
  • మహిళా కార్మికులకు రోజుకి గంటన్నర విరామం ఇవ్వాలి.
  • పిల్లల పని గంటలను రోజుకి 9 నుంచి 7కి తగ్గించారు. తొమ్మిది సంవత్సరాలలోపు పిల్లలను కర్మాగార యజమానులు పనిలో పెట్టుకోకుండా నిషేధించారు.

AP 9th Class Social Notes Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

→ పరిశ్రమలలో పురుషులు అధిక సంఖ్యలో పనిచేస్తున్నారు. అయితే వాళ్ళ సంక్షేమం కోసం 1911 వరకు ఎటువంటి చట్టాలూ చేయలేదు. 1911 కర్మాగారాల చట్టం ప్రకారం –

  • వయోజన పురుష కార్మికులతో రోజుకి 12 గంటల కంటే ఎక్కువ పని చేయించకూడదు.
  • ఆరు గంటలు పని తర్వాత అరగంట విరామం ఉండాలి.

→ ఆదివాసీ తిరుగుబాటు : అడవి హక్కుల నుండి దూరం చేశాక అటవీ గిరిజనులు, ఆదివాసీలు తమ ఫల సాయాలకై ప్రభుత్వంపై చేసిన తిరుగుబాటు.

→ రిజర్వ్ అడవి : ప్రభుత్వ అధీనంలో, అటవీశాఖి నియంత్రణలో గలది.

→ రక్షిత అడవులు : కలప, విలువైన జంతు చర్మాలు, దంతాలు అపహరించకుండా అటవీశాఖ పర్యవేక్షణలో ఉన్నవి.

→ వేలం వేయడం : ప్రభుత్వం ఆదాయం పొందుటకుగాను ఎక్కువ మొత్తంలో నిధులు రాబట్టడానికి నిర్వహించు విధానం.

→ సామాజిక కార్యకర్త : సమాజాన్ని, ప్రజలను చైతన్యపరుస్తూ, ప్రజల బాగు కొరకు పాటుపడేవాడు.

→ పారిశ్రామికవేత్త : పరిశ్రమలను స్థాపించి వస్తూత్పత్తి విధానంలో నియంత్రణ గలవాడు, ధనవంతుడు.

→ మార్వాడి వ్యాపారులు : ఇతర ప్రాంతాల నుంచి వచ్చి లాభార్జన ధ్యేయంతో వ్యాపారం చేసేవారు.

→ సమ్మె : కార్మికులు పని చేయకుండా, వస్తువుల ఉత్పత్తి జరపకుండా నిరసన తెలియచేసి పనిని స్తంభింపచేయడం.

AP 9th Class Social Notes Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

→ కార్మిక సంఘాలు : కార్మికుల సంక్షేమం కోసం పాటుపడే సంఘాలు.

→ పారిశ్రామిక పట్టణాలు : పరిశ్రమలు ఎక్కువగా నెలకొల్పబడే పట్టణాలు.

→ కార్మిక వాడలు పు : కార్మికులు నివసించే ప్రదేశాలు.

→ కార్మిక ఒప్పందాలు : పరిశ్రమల యాజమాన్యం లేదా ప్రభుత్వం కార్మికులతో చేసుకొనే ఒప్పందాలు.

AP 9th Class Social Notes Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం 1

AP 9th Class Social Notes Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

Students can go through AP Board 9th Class Social Notes 17th Lesson లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం to understand and remember the concept easily.

AP Board 9th Class Social Notes 17th Lesson లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

→ డచ్‌వారు : హాలెండ్ దేశప్రజలను డచ్ వారంటారు. నేడు దాని అధికారిక నామం నెదర్లాండ్స్

→ ఆఫ్రికాకై ఉరుకులాట : ఆఫ్రికా ప్రాంతాలపై తమ ఆధిపత్యం కోసం యూరప్ దేశాలు చేసిన ప్రయత్నాలు.

→ దక్షిణాఫ్రికా సమాఖ్య : ప్రస్తుతం దక్షిణ ఆఫ్రికాగా పిలువబడుతున్న అధిక ప్రాంతంపై నియంత్రణ సాధించటానికి ఇంగ్లాండ్ రెండు యుద్ధాలు చేసింది. ఈ యుద్ధాలు ముగిసిన దక్షిణ ఆఫ్రికాలోని అన్ని ప్రాంతాలను దక్షిణ ఆఫ్రికా సమాఖ్యగా బ్రిటిషు ఏకీకరణ చేసింది.

→ లాటిన్ అమెరికన్ దేశాలు : మధ్య, దక్షిణ అమెరికాలలో అధిక భాగం స్పెయిన్, పోర్చుగీసు ఆధీనంలోకి వచ్చింది. స్పెయిన్, పోర్చుగీసు భాషలు లాటిన్ నుండి పుట్టాయి కాబట్టి ఈ దేశాలు లాటిన్ అమెరికా దేశాలు.

AP 9th Class Social Notes Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

→ వలసవాదం : ధనార్జన, సామ్రాజ్య విస్తరణలో భాగంగా ఇతర ఖండాల నూతన ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం.

→ లాటిన్ అమెరికా స్పెయిన్, పోర్చుగీసు భాషలు లాటిన్ నుంచి పుట్టాయి కాబట్టి ఆ దేశాలే లాటిన్ అమెరికా దేశాలు.

→ ఒట్టోమన్ సామ్రాజ్యం : యూరప్, ఆసియాల మధ్య చాలావరకు వ్యాపార మార్గాలను ముస్లిం రాజ్యాలు నియంత్రించసాగాయి. ప్రత్యేకించి ఒట్టోమన్ సామ్రాజ్యం యూరప్ క్రైస్తవ శక్తులతో నిరంతరం యుద్ధాలు చేస్తుండేది.

→ అన్వేషణలు : వలసవాదం వ్యాప్తి చేయడానికి నూతన ప్రదేశాలు, దేశాలలో వర్తక వాణిజ్యాలు అభివృద్ధి చేయడానికి వివిధ దేశాలకు చెందిన నావికులు, ఓడలు, పడవలు ద్వారా కొత్త ప్రదేశాలు కనుగొనుట.

→ జాతి వివక్షత : పౌరహక్కులు, స్వేచ్ఛగా సంచరించే హక్కు, సంఘాలుగా ఏర్పడే హక్కులేని అధికశాతంపై చూపే ఈ వివక్షతే జాతి వివక్షత.

→ హసియండాలు : విశాలమైన భూభాగాలు వేల కొలది ఎకరాలలో విస్తరించినవి. స్పెయిన్ నుంచి వచ్చి స్థిరపడిన భూస్వాములవి.

→ మన్రో సిద్ధాంతం : అమెరికా అధ్యక్షుడు జేమ్స్ మన్రో రూపొందించిన పథకం. ఇతర ఖండాలవారు తమ ఖండంలో వలస ప్రాంతాలు స్థాపించబడకుండుట, దానికి ప్రతిగా యూరప్లో తమఖండం వలసవాదం స్థాపించదని తెలిపే విధానం.

→ నల్లమందు యుద్ధాలు : ఇంగ్లాండు, చైనాల మధ్య 1840 – 42 ల మధ్య జరిగింది.

→ నావికులు : సముద్ర ప్రయాణం చేసేవారు.

→ సహృదయులు : మంచి మనస్సు, దయగల హృదయం గలవారు.

→ హతమార్చుట : చంపుట.

AP 9th Class Social Notes Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

→ వ్యవసాయ క్షేత్రం : పంటలు పండించే భూములు.

→ మైత్రి : స్నేహం.

→ పశుపోషకులు ఆవు, గేదెలు, మేకలు మేపుతూ వాటి ఆదాయంపై జీవించేవారు.

→ అమానవీయ : మానవత్వం, సంస్కారం లేకపోవడం.

AP 9th Class Social Notes Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం 1

AP 9th Class Social Notes Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు

Students can go through AP Board 9th Class Social Notes 16th Lesson సామాజిక నిరసనోద్యమాలు to understand and remember the concept easily.

AP Board 9th Class Social Notes 16th Lesson సామాజిక నిరసనోద్యమాలు

→ కారల్ మార్క్స్ : సామ్యవాదానికి కొత్త సిద్ధాంతాన్ని అందించారు. ఫ్యూడల్ శక్తులను, రాజులను తరిమి వేసినట్లే కార్మికులు సంఘటితమై, పెట్టుబడిదారులు లేకుండా చేయాలని మార్క్స్ వాదించాడు. కర్మాగారాలలో, ఉత్పత్తి చేసే కార్మికులకు ఎటువంటి ఆస్తి లేదు. కాని ఉత్పత్తి జరగడానికి వాళ్ళు కీలకం.

→ ఫ్రెడరిక్ ఏంగెల్స్ : పెట్టుబడిదారీ విధానం చరిత్రలో ప్రగతిశీల అంశమని, అదే సమయంలో ఇది పెట్టుబడిదారులను, కార్మికులను తమ నిజమైన మానవత్వం నుండి దూరం చేసే దోపిడీపూరిత విధానమని వాదించెను.

→ సేంట్ సైమన్ : తొలి సామ్యవాద మేధావులలో ఫ్రాన్స్ కి చెందిన సేంట్ సైమన్ ఒకరు. సామాజిక అవసరాలను శాస్త్రజ్ఞులు, పారిశ్రామికవేత్తలు, ఇంజనీర్లు అంచనా వేసి వాటిని తీర్చేలా, ఆస్తుల నియంత్రణ సమాజం చేతిలో ఉండాలని ప్రతిపాదించెను.

AP 9th Class Social Notes Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు

→ ఓవెన్ : కార్మికుల దుర్భర పరిస్థితులు, పెట్టుబడిదారుల సంపద చూసిన ఓవెన్ చిన్న పారిశ్రామికవేత్త. సహకార గ్రామాలు నిర్మించాలని పిలుపునిచ్చారు.

→ జనరల్ నెడ్‌లుద్ద్ : జనాకర్షక నాయకుడు. యంత్రాలపై దాడితో నిరసనలు, కార్మికులకు కనీస వేతనం, మహిళల, పిల్లల పనిభారం తగ్గించాలన్నవాడు. కార్మిక సంఘాల ద్వారా కోర్కెలు నెరవేరతాయన్న తీవ్రవాద నాయకుడు.

→ ప్లాటో : సామ్యవాద భావనలు విరివిగా ప్రచారం చేసిన రాజకీయ శాస్త్రవేత్త, ఫ్రెంచి విప్లవాలతో ఏకీభవించినవాడు. గణతంత్ర, పార్లమెంటరీ ఏర్పాటు ముఖ్యమన్నవాడు.

→ బాబెఫ్ : స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్న ఆదర్శాలను ఫ్రెంచి విప్లవం సాధించలేక పోయిందని భావించారు. “విలువైన సమానత్వం” అన్న సిద్ధాంతాన్ని సాధించాలంటే వ్యక్తిగత ఆస్తిని రద్దు చేసి భూమి, దాని ఫలాలు ఉమ్మడిగా అనుభవించాలని బాబెఫ్ వాదించెను.

→ సామ్యవాదం : ఉత్పత్తి సాధనాలు, ప్రకృతి వనరులు ప్రజల ఆధీనంలో ఉండాలనే సిద్ధాంతం

→ లుద్దిజం : జనరల్ నెల్లుడ్జ్ ఆధీనంలో గల యజమానులపై నిరసనోద్యమం.

→ ప్రాచ్య పండితులు : తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా దేశాలకు చెందిన భాషలు, సంస్కృతులను అధ్యయనం చేయు మేధావులు.

→ స్త్రీ వాదం : స్త్రీలు అన్ని రంగాలలో ముందుండాలనే వాదం.

→ పెట్టుబడిదారీ విధానం : సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమై, లాభాపేక్ష గల విధానం.

→ విప్లవకారులు : ప్రజా సమస్యలను సాధించడానికి, అనుకున్న లక్ష్యాలను సాధించడానికి, ఎంచుకొనే విప్లవ మార్గం గలవారు.

→ అణచివేత : ఆపడం

→ నిత్యావసరాలు : రోజూ ఉపయోగించేవి

→ నిస్పృహ : ఏమీ చేయలేకపోవడం

AP 9th Class Social Notes Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు

→ ఉత్పత్తి సాధకాలు : వస్తు ఉత్పత్తికి దోహదపడేవి.

→ వర్ధిల్లడం : వృద్ధి చెందడం, ప్రకాశించడం

→ సమసమాజం : పేద, ధనిక భేదం లేకుండా అందరూ సమానంగా ఉండాలనే నైజం

→ సంఘటితం : ఐక్యం

→ స్వేచ్ఛా జీవులు : స్వతంత్రులు

AP 9th Class Social Notes Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు 1

AP 9th Class Social Notes Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

Students can go through AP Board 9th Class Social Notes 15th Lesson పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు to understand and remember the concept easily.

AP Board 9th Class Social Notes 15th Lesson పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

AP 9th Class Social Notes Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు 1
→ జేమ్స్ వాట్ : 1769లో ఆవిరి యంత్రంను కనిపెట్టెను. దీనివలన వస్తూత్పత్తి రంగంలో విప్లవాత్మక మార్పులు సంభవించెను.

AP 9th Class Social Notes Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు 2
→ జేమ్స్ హా గ్రీవ్స్ : 1770లో “స్పిన్నింగ్ జెన్ని” నూలు వడికే యంత్రంను కనిపెట్టెను.

AP 9th Class Social Notes Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు 3
→ ఎడ్మండ్ కార్డ్ రైట్ : 1785లో నీటి సహాయంతో నడిచే మర మగ్గాన్ని కనిపెట్టెను.

AP 9th Class Social Notes Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

AP 9th Class Social Notes Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు 4
→ జార్జ్ స్టీఫెన్సన్ : 1814లో బొగ్గును గనుల నుండి రేవు పట్టణాలకు చేర్చుటకు, ఆవిరిశక్తితో నడిచే శకటాన్ని ఉపయోగించెను. ఇది ఈనాటి రైలుబండికి మార్గదర్శకం.

AP 9th Class Social Notes Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు 5
→ మొదటి అబ్రహాం డర్బీ (1677 – 1717) : 1709లో మొదటి అబ్రహాం డర్బీ బట్టీ (కొలిమి) కనుగొనెను. కోక్ (బొగ్గు నుంచి గంధకం, ఇతర కలుషితాలు తొలగించగా ఏర్పడేది) ని ఉపయోగించి, అధిక ఉష్ణోగ్రతలు సాధించ గలిగారు.

AP 9th Class Social Notes Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు 6
→ 2వ డర్బీ (1711 – 1768) : ముడి ఇనుము నుండి (తేలికగా విరిగిపోని) దుక్క ఇనుమును తయారుచేశాడు.

AP 9th Class Social Notes Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు 7
→ హెన్రీ కోర్ట్ (1740 – 1828). : కలబోత బట్టీని (దీంతో కరిగిన ఇనుములోని కలుషితాలు తొలగించవచ్చు), రోలింగ్ మిల్లుని (శుద్ధి చేసిన ఇనుముని ఆవిరితో నడిచే యంత్రంతో కడ్డీలుగా పోతపోయవచ్చు) కనుగొన్నాడు.

→ పారిశ్రామికీకరణ : పరిశ్రమలను ఎక్కువగా స్థాపించుట

→ స్మెల్టింగ్ : లోహాన్ని ఉత్పత్తి చేయడానికి ముతక ఖనిజంలోని మన్ను మొ॥నవి వేరుచేసి శుభ్రపరచుటకు కరిగించుట, మలినాలున్న లోహాన్ని కరిగించడం ద్వారా శుభ్రపరచుట

→ పారిశ్రామిక విప్లవం : వస్తూత్పత్తిలో విప్లవాత్మక మార్పులు

→ ఆవిరి శక్తి : ఆవిరి యంత్రం ద్వారా ఉత్పత్తిలో పెరుగుదల

→ జలశక్తి, : నీటి ద్వారా ఉత్పత్తిలో పెరుగుదల

→ యాంత్రీకరణ : పరిశ్రమలలో అధిక ఉత్పత్తి మరియు లాభాల కొరకు శ్రామిక శక్తిని తగ్గించి యంత్రాలను ప్రవేశపెట్టుట

→ మార్పు : ఒక స్థితి నుండి మరొక స్థితికి చేరడం

→ ఉత్పత్తిదారులు : వస్తువులను ఉత్పత్తి చేసేవారు

→ దీర్ఘకాలిక సమయం : ఎక్కువ కాలం

→ అనతి కాలం : తక్కువ కాలం

→ కర్మాగారాలు : పరిశ్రమలు

AP 9th Class Social Notes Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

→ వలసపాలిత దేశాలు : పరిపాలనలో తమ అధీనంలోని దేశాలు

→ అల్లకల్లోలం : అనేక చిక్కులు / కష్టాలు

→ విచ్ఛిన్నమైన కుటుంబాలు : బ్రతకలేని కుటుంబాలు

AP 9th Class Social Notes Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు 8

AP 9th Class Social Notes Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

Students can go through AP Board 9th Class Social Notes 14th Lesson 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు to understand and remember the concept easily.

AP Board 9th Class Social Notes 14th Lesson 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

→ జాతీయతావాదం : యూరప్ సామ్రాజ్యాలుగా, చిన్న చిన్న రాజ్యాలుగా విభజింపబడి, ఉమ్మడి చరిత్ర, సంస్కృతి, ఆర్థిక జీవనంపై బలమైన దేశాలు ఏర్పాటు చేయడానికి ఏర్పడినది జాతీయతావాదం.

→ జాకోబిన్ రాజ్యాంగం : ప్రజలందరికీ ఓటు హక్కు, తిరుగుబాటు హక్కు కల్పించేది. ప్రజలకు పని లేదా జీవనోపాధి కల్పించాలని చూసే మేధావులతో కూడినది.

AP 9th Class Social Notes Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

→ సెర్ఫ్‌లు : ఒక భూస్వామి భూములకు కట్టుబడి ఉన్నవాళ్ళు. అతడి అనుమతి లేకుండా వేరే చోటుకి వెళ్ళటానికి వీలులేని వారు.

→ సఫ్రేజ్ : సర్వజనీన ఓటు హక్కు.

→ యంగ్ ఇటలీ : ఇటలీ ఏకీకరణలో భాగంగా గిస్సెప్పి మాజిని దీనిని ఏర్పరిచాడు.

→ తిరుగుబాట్లు : యూరప్లో ఒక సంప్రదాయవాదులు, మరో ప్రక్క ఉదారవాద ప్రజాస్వామ్య వాదులతో జరిగిన తిరుగుబాట్లు, తమ హక్కుల సంక్షేమానికై జరిగినవి.

→ నిరంకుశత్వం : ప్రజాసంక్షేమాన్ని విస్మరించి, స్వప్రయోజనానికి ప్రాధాన్యతనిచ్చే రాచరికపు పాలన

→ జాతీయతావాదం : తమ దేశ సంస్కృతి, చరిత్ర ఆర్థిక ప్రయోజనాలను కాపాడుతూ దేశ ఐక్యతకు పాటుపడటం.

→ ఉదారవాదం : నిరంకుశత్వానికి, రాచరికానికి, చర్చి ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఏర్పడిన ప్రజాస్వామ్య విధానం.

→ పాలనా యంత్రాంగం : ప్రజాసంక్షేమానికి వివిధ స్థాయిలలో పాటు పడే ప్రభుత్వ అధికారులతో పరిపాలన జరిపేది.

→ కాల్పనికవాదం : సాంస్కృతిక ఉద్యమం, ఉద్వేగాలు, సహజక జ్ఞానం, మహిమలు వంటి భావనలపై దృష్టి కేంద్రీకరించారు.

AP 9th Class Social Notes Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

→ కొత్త మధ్యతరగతి : వ్యాపార వాణిజ్యాలలో ముందున్నవారు. ఆచార్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, గుమాస్తాలు, న్యాయవాదులు ఉన్నారు.

→ వ్యక్తీకరణ : చెప్పడం

AP 9th Class Social Notes Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు 1

AP 9th Class Social Notes Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

Students can go through AP Board 9th Class Social Notes 13th Lesson 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు to understand and remember the concept easily.

AP Board 9th Class Social Notes 13th Lesson 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

AP 9th Class Social Notes Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు 1
→ లివర్లు : ఫ్రాన్స్ లో ద్రవ్య కొలమానం (కరెన్సీ) 1794 నుండి నిలిపివేయబడింది.

→ మతాధిపతులు : చర్చిలో ప్రత్యేక విధులతో సంబంధం ఉన్న వ్యక్తుల బృందం.

→ టిధే : చర్చి విధించిన పన్ను. దీని ప్రకారం వ్యవసాయ ఉత్పత్తిలో పదవ వంతు చర్చికి చెల్లించాలి.

→ టెయిలే : ప్రభుత్వానికి నేరుగా కట్టే పన్ను.

→ మానర్ : ప్రభువు భూములు, అతడి ఇల్లు ఉన్న ప్రాంతం.

AP 9th Class Social Notes Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

→ ఛాటూ : రాజు లేదా కులీన వ్యక్తికి చెందిన కోట లేదా ప్రాసాదం.

మానవ పౌర హక్కుల ప్రకటన

→ మానవులు స్వేచ్ఛా జీవులుగా పుట్టారు. అలాగే ఉంటారు. హక్కులు అందరికీ సమానంగా వర్తిస్తాయి.

→ మనిషి సహజ, విడదీయరాని హక్కులైన స్వేచ్ఛ, ఆస్తి, భద్రత, అణిచివేతలకు ప్రతిఘటన ప్రతి రాజకీయ సంఘ ఉద్దేశం కావాలి.

→ సార్వభౌమత్వ మూలాలు దేశంలో ఉంటాయి. ప్రజల నుంచి సంక్రమించని అధికారాన్ని ఏ వ్యక్తి, బృందం కలిగి ఉండకూడదు.

→ స్వేచ్ఛ అంటే ఇతరులకు లేని హాని కలిగించని ఏదైనా చేసే అధికారం.

→ సమాజానికి హాని కలిగించే చర్యలను మాత్రమే నిషేధించే అధికారం చట్టానికి ఉంటుంది.

→ చట్టం ప్రజల అభీష్టాన్ని వ్యక్తపరుస్తుంది. దాని తయారీలో పౌరులందరూ ప్రత్యక్షంగా కానీ, లేదా తమ ప్రతినిధుల ద్వారాగాని పాల్గొనవచ్చు. దానిముందు పౌరులందరూ సమానమే.

→ ప్రతి పౌరునికి స్వేచ్ఛగా మాట్లాడే, రాసే, ప్రచురించే హక్కు ఉంది. చట్టం నిర్ణయించిన ప్రకారం ఇటువంటి స్వేచ్ఛను దుర్వినియోగ పరిచినందుకు అతడు బాధ్యత వహించాలి.

→ పరిపాలన వ్యవస్థ ఖర్చులకు, ప్రజాసైన్యాన్ని నిర్వహించడానికి అందరికీ వర్తించే పన్నులు విధించడం తప్పనిసరి. వాళ్ళకున్న ఆస్తుల నిష్పత్తిలో వాటిని పౌరులందరికీ వర్తింపచేయాలి.

AP 9th Class Social Notes Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

→ ఆస్తి పవిత్రమైన, ఉల్లంఘించగూడని హక్కు కాబట్టి చట్టబద్ధంగా నిర్ణయించిన ప్రజా ప్రయోజనాలకు అవసరమైనప్పుడు తప్పించి దానిని తీసుకోకూడదు. అటువంటి సందర్భాలలో న్యాయమైన నష్ట పరిహారాన్ని ముందుగా చెల్లించాలి.

→ మహోన్నత విప్లవం : తుపాకీ గుండు పేలకుండా, ఒక రక్తం బొట్టు చిందకుండా అధికారం అప్పగించడం.

→ దైవదత్త హక్కు : దేవుని ద్వారా సంక్రమించిన హక్కు.

→ కులీన వర్గ పాలన : రాచరికం ద్వారా రాజు ఆధీనంలోని పాలన.

→ రాచరికం : రాజు ప్రభువుగా, వంశ పారంపర్యంగా పాలించే విధానం.

→ డైరెక్టరీ : ఫ్రాన్స్ లో అయిదుగురు, సభ్యులు గల కార్యనిర్వాహక వర్గం

→ సౌభ్రాతృత్వం : సోదర భావం.

→ జాతీయ శాసన సభ : 1789, జూన్ 20న జాతీయ శాసనసభ ప్రకటించబడింది. ఇందులో శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ అనే మూడు విభాగాలు ఉన్నాయి.

→ అభీష్టం : కోరిక.

→ ఛాటూ : రాజు కోట లేదా ప్రసాదం.

AP 9th Class Social Notes Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

→ అంతర్యుద్ధం : ఒక దేశంలోని వివిధ వర్గాల మధ్య జరిగే యుద్ధం.

AP 9th Class Social Notes Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు 2