AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం

These AP 9th Biology Important Questions and Answers 2nd Lesson వృక్ష కణజాలం will help students prepare well for the exams.

AP Board 9th Class Biology 2nd Lesson Important Questions and Answers వృక్ష కణజాలం

9th Class Biology 2nd Lesson వృక్ష కణజాలం 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
కణజాలాలు అనగానేమి?
జవాబు:
ఒకే విధమైన నిర్మాణం కలిగి ఒకే విధమైన విధుల్ని నిర్వర్తించే కణాల సమూహాలను కణజాలాలు అంటారు.

ప్రశ్న 2.
మొక్కలలో కణజాలాలు ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
మొక్కలలో కణజాలాలు నాలుగు రకాలు. అవి : 1. విభాజ్య కణజాలాలు 2. త్వచ కణజాలాలు 3. సంధాయక కణజాలాలు 4. ప్రసరణ కణజాలాలు

ప్రశ్న 3.
విభాజ్య కణజాలం మొక్కలలో ఏయే ప్రదేశాలలో ఉంటుంది?
జవాబు:
కాండం కొనభాగాల్లోను, పార్శ్వ భాగాల్లోను, ఇతర కణజాలాల పొరల మధ్యలోను విభాజ్య కణజాలం ఉంటుంది.

ప్రశ్న 4.
అగ్ర విభాజ్య కణజాలాలు అనగానేమి?
జవాబు:
మొక్కలలో పెరుగుదలను కలిగించే విభాజ్య కణజాలాలను అగ్ర విభాజ్య కణజాలాలు అంటారు.

ప్రశ్న 5.
పార్శ్వ విభాజ్య కణజాలాలు అనగానేమి?
జవాబు:
కాండంలో పార్శ్వపు అంచుల చుట్టూ వర్తులంగా పెరుగుదలను కలిగించే కణజాలాన్ని పార్శ్వ విభాజ్య కణజాలాలు అంటారు.

ప్రశ్న 6.
మధ్యస్థ విభాజ్య కణజాలం మొక్కలో ఎక్కడ ఉంటుంది?
జవాబు:
కాండం మీద శాఖలు ఏర్పడేచోట, ఆకులు, పుష్ప వృంతం పెరిగేచోట మధ్యస్థ విభాజ్య కణజాలం ఉంటుంది.

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం

ప్రశ్న 7.
విభాజ్య కణజాలంలోని కణాలు ఏ విధంగా ఉంటాయి?
జవాబు:
కణాలు చిన్నవిగా పలుచని కణ కవచమును, స్పష్టమైన కేంద్రకమును, కణముల మధ్య ఖాళీ లేకుండా ఉంటాయి.

ప్రశ్న 8.
మొక్క దేహ ఉపరితలమంతా ఉండే కణజాలం?
జవాబు:
త్వచ కణజాలం

ప్రశ్న 9.
త్వచ కణజాలం ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
త్వచ కణజాలంలోని కణాల విధులను బట్టి మరియు స్థానాన్ని బట్టి త్వచ కణజాలం మూడు రకాలు. అవి :

  1. బాహ్యచర్మం లేక బహిస్త్వచం
  2. మధ్యస్వచం లేక మధ్యపొర
  3. అంతస్త్వచం లేక లోపలిపొర

ప్రశ్న 10.
ఎడారి మొక్కల్లో త్వచ కణజాలపు కణాలు ఏవిధంగా ఉంటాయి?
జవాబు:
ఎడారి మొక్కల్లో త్వచ కణజాలపు కణాలు బాగా దళసరిగా ఉండి మైనపు పూతను కలిగి ఉంటాయి.

ప్రశ్న 11.
వేరులో పొడవైన వెంట్రుక వంటి మూలకేశాలు ఏ కణజాలం నుండి ఏర్పడతాయి?
జవాబు:
వేరులో పొడవైన వెంట్రుక వంటి మూలకేశాలు త్వచ కణజాలం నుండి ఏర్పడతాయి.

ప్రశ్న 12.
చెట్ల నుండి జిగురు ఏ విధంగా స్రవించబడుతుంది?
జవాబు:
జిగురునిచ్చే చెట్ల యొక్క త్వచ కణజాలం నుండి జిగురు స్రవించబడుతుంది. ఉదా : తుమ్మ, వేప

ప్రశ్న 13.
త్వచ కణజాలము విధి ఏది?
జవాబు:
నీటి ఎద్దడి, కొమ్మలు విరగడం, చీలడం వంటి యాంత్రికంగా కలిగే నష్టాలు, పరాన్నజీవులు, రోగకారక జీవుల దాడి మొదలైన వాటి నుండి మొక్కలను త్వచ కణజాలం కాపాడుతుంది.

ప్రశ్న 14.
బెరడు అనగానేమి?
జవాబు:
పెద్ద చెట్లలో త్వచ కణజాలం బాహ్య చర్మంపైన అనేక పొరలను ఏర్పరుస్తుంది. దానిని బెరడు అంటారు.

ప్రశ్న 15.
త్వచ కణజాలం నుండి ఏర్పడేవి?
జవాబు:
త్వచ కణజాలం నుండి ఏర్పడేవి పత్రరంధ్రాలు మరియు మూలకేశాలు.

ప్రశ్న 16.
మొక్క దేహంలో ఎక్కువ భాగం ఏ కణజాలంతో ఏర్పడుతుంది?
జవాబు:
మొక్క దేహంలో ఎక్కువ భాగం సంధాయక కణజాలంతో ఏర్పడుతుంది.

ప్రశ్న 17.
సంధాయక కణజాలం ఉపయోగం ఏమిటి?
జవాబు:
ఆహారం నిల్వచేయడానికి, మొక్కకు యాంత్రికంగా బలాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది.

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం

ప్రశ్న 18.
సంధాయక కణజాలంలోని రకాలు ఏవి?
జవాబు:
సంధాయక కణజాలంలో ముఖ్యంగా మూడు రకాలు కలవు. అవి :

  1. మృదు కణజాలం
  2. స్థూలకోణ కణజాలం
  3. దృఢ కణజాలం

ప్రశ్న 19.
మృదు కణముల నిర్మాణం వివరించండి.
జవాబు:
మృదు కణజాలంలోని కణాలు మృదువుగా, పలుచని గోడలు కలిగి వదులుగా సంధించబడి ఉంటాయి.

ప్రశ్న 20.
మృదు కణజాలము నందలి రకములు ఏవి?
జవాబు:
మృదు కణజాలము నందలి రకములు హరిత కణజాలం, వాయుగత కణజాలం మరియు నిల్వచేసే కణజాలం.

ప్రశ్న 21.
దవ్వ భాగానికి మృదు కణజాలమని పేరు పెట్టినవాడు?
జవాబు:
దవ్వ భాగానికి మృదు కణజాలమని పేరు పెట్టినవాడు నెహేమియా గ్రూ.

ప్రశ్న 22.
“అనాటమీ ఆఫ్ ప్లాంట్స్” గ్రంథాన్ని ప్రచురించినవాడు?
జవాబు:
“అనాటమీ ఆఫ్ ప్లాంట్స్” గ్రంథాన్ని ప్రచురించినవాడు నెహేమియా గ్రూ (1682).

ప్రశ్న 23.
కణాల మధ్య ఖాళీలు లేకుండా దగ్గర దగ్గరగా అమరి ఉండు కణజాలం?
జవాబు:
కణాల మధ్య ఖాళీలు లేకుండా దగ్గర దగ్గరగా అమరి ఉండు కణజాలం దృఢ కణజాలం.

ప్రశ్న 24.
ప్రసరణ కణజాలాలు అని వేటిని అంటారు?
జవాబు:
ప్రసరణ కణజాలాలు అని దారువు, పోషక కణజాలములను అంటారు.

ప్రశ్న 25.
వేర్ల నుండి సేకరించిన నీరు, పోషక పదార్థాలు వేటి ద్వారా మొక్క భాగాలకు సరఫరా అవుతాయి?
జవాబు:
వేర్ల నుండి సేకరించిన నీరు, పోషక పదార్థాలు దారువు ద్వారా మొక్క భాగాలకు సరఫరా అవుతాయి.

ప్రశ్న 26.
ఆకులో తయారయిన ఆహారపదార్థములను మొక్క ఇతర భాగాలకు సరఫరా చేసే కణజాలం ఏది?
జవాబు:
ఆకులో తయారయిన ఆహారపదార్ధములను మొక్క ఇతర భాగాలకు సరఫరా చేసే కణజాలం పోషక కణజాలం.

ప్రశ్న 27.
దారువు, ప్రసరణ కణజాలాలను రెండింటిని కలిపి ఏమంటారు?
జవాబు:
దారువు, ప్రసరణ కణజాలాలను రెండింటిని కలిపి నాళికాపుంజాలు అంటారు.

ప్రశ్న 28.
దారువు నందలి వివిధ రకముల కణములను వ్రాయుము.
జవాబు:
దారువు నందలి వివిధ రకముల కణములు : దారుకణాలు, దారునాళాలు, తంతువులు, మృదు కణజాలం

ప్రశ్న 29.
పోషక కణజాలము నందలి వివిధ రకముల కణములను వ్రాయుము.
జవాబు:
పోషక కణజాలము నందలి వివిధ రకముల కణములు: చాలనీ నాళాలు, చాలనీ కణాలు, సహకణాలు, తంతువులు, మృదు కణజాలం

ప్రశ్న 30.
యూకలిప్టస్ చెట్లలో దారువు ఎన్ని అడుగుల ఎత్తు వరకు నీటిని సరఫరా చేస్తుంది?
జవాబు:
యూకలిప్టస్ చెట్లలో దారువు 200 అడుగులు ఎత్తు వరకు నీటిని సరఫరా చేస్తుంది.

ప్రశ్న 31.
రెడ్ వుడ్ చెట్లలో దారువు ఎన్ని అడుగుల ఎత్తు వరకు నీటిని సరఫరా చేస్తుంది?
జవాబు:
రెడ్ వుడ్ చెట్లలో దారువు 330 అడుగులు ఎత్తు వరకు నీటిని సరఫరా చేస్తుంది.

ప్రశ్న 32.
సాధారణంగా త్వచ కణజాలం ఎన్ని పొరలుగా అమరి యుంటుంది?
జవాబు:
సాధారణంగా త్వచ కణజాలం ఒక వరుస కణాలను కలిగి ఉంటుంది.

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం

ప్రశ్న 33.
ఆకు బాహ్య చర్మంలో కన్పించే చిన్న రంధ్రాలను ఏమంటారు?
జవాబు:
ఆకు బాహ్య చర్మంలో కన్పించే చిన్న రంధ్రాలను పత్ర రంధ్రాలు అంటారు.

ప్రశ్న 34.
పత్రరంధ్రాలు మరియు మూలకేశాల ఉపయోగం ఏమిటి?
జవాబు:
పత్రరంధ్రాలు వాయు మార్పిడికి మరియు బాష్పోత్సేకానికి, నేల నుండి నీరు లవణాల సంగ్రహణకు మూలకేశాలు ఉపయోగపడతాయి.

ప్రశ్న 35.
హరితరేణువుల్ని కలిగి ఉండే మృదు కణజాలం?
జవాబు:
హరితరేణువుల్ని కలిగి ఉండే మృదు కణజాలం హరిత కణజాలం.

ప్రశ్న 36.
పెద్ద గాలి గదుల్ని కలిగి ఉండే మృదు కణజాలం?
జవాబు:
పెద్ద గాలి గదుల్ని కలిగి ఉండే మృదు కణజాలం వాతయుత కణజాలం.

ప్రశ్న 37.
నీరు, ఆహారం, వ్యర్థ పదార్థాలను నిల్వ చేసే మృదు కణజాలం?
జవాబు:
నీరు, ఆహారం, వ్యర్థ పదార్థాలను నిల్వ చేసే మృదు కణజాలం నిల్వచేసే కణజాలం.

ప్రశ్న 38.
నెహేమియా గ్రూ ప్రకారం మొక్కలోని ప్రతి భాగం కలిగి ఉండే రెండు రకాల విభాగాలు?
జవాబు:
నెహేమియా గ్రూ ప్రకారం మొక్కలోని ప్రతి భాగం కలిగి ఉండే రెండు రకాల విభాగాలు 1. దవ్వ 2. గట్టిభాగం

ప్రశ్న 39.
మొక్కలలో హరిత కణజాలం యొక్క పాత్రను ఏ విధంగా అభినందిస్తావు?
జవాబు:
హరితరేణువులను కలిగి ఉండే హరితకణజాలం ఆకులలో ఉండుట వలన మొక్కలు ఆహారపదార్థములను తయారు చేయగలుగుతున్నాయి.

ప్రశ్న 40.
మొక్కలలో ఉండే వాతయుత కణజాలము యొక్క పాత్రను ఏ విధంగా అభినందిస్తావు?
జవాబు:
మొక్కలు నీటిలో తేలియాడుటకు గాలి గదులు కలిగిన వాతయుత కణజాలం సహాయపడుతుంది.

ప్రశ్న 41.
మొక్కలలో ఆహారపదార్ధములను నిల్వయుంచుటలో పాత్ర వహించు మృదు కణజాలం?
జవాబు:
మొక్కలలో ఆహారపదార్ధములను నిల్వయుంచుటలో పాత్ర వహించు మృదు కణజాలం నిల్వచేసే కణజాలం.

ప్రశ్న 42.
రెడ్ వుడ్, యూకలిప్టస్ చెట్లలో ఎక్కువ ఎత్తు వరకు నీటిని సరఫరా చేయుటలో ఏ కణజాలం పాత్రను నీవు అభినందిస్తావు?
జవాబు:
రెడ్ వుడ్, యూకలిప్టస్ చెట్లలో ఎక్కువ ఎత్తు వరకు నీటిని సరఫరా చేయుటలో దారువు కణజాలం పాత్రను నేను అభినందిస్తాను.

ప్రశ్న 43.
ఆకులలో తయారయ్యే ఆహారపదార్థాలు మొక్కలోని ఇతర భాగాలకు రవాణా చేయుటలో ఏ కణజాలం పాత్రని నీవు అభినందిస్తావు?
జవాబు:
ఆకులలో తయారయ్యే ఆహారపదార్థాలు మొక్కలోని ఇతర భాగాలకు రవాణా చేయుటలో పోషక కణజాలము పాత్రను నేను అభినందిస్తాను.

ప్రశ్న 44.
యాంత్రికంగా కలిగే నష్టాలు, పరాన్న జీవులు, రోగ కారక జీవుల దాడి నుండి మొక్కలను రక్షించడంలో ఏ కణజాలపు పాత్రను నీవు అభినందిస్తావు?
జవాబు:
యాంత్రికంగా కలిగే నష్టాలు, పరాన్న జీవులు, రోగ కారక జీవుల దాడి నుండి మొక్కలను రక్షించడంలో త్వచ కణజాలము పాత్రను నేను అభినందిస్తాను.

ప్రశ్న 45.
మధ్యస్థ విభాజ్య కణజాలాన్ని మొక్కలో నీవు ఎక్కడ గమనిస్తావు?
జవాబు:
కాండం మీద శాఖలు ఏర్పడే చోట, ఆకులు, పుష్పవృంతం పెరిగేచోట మధ్యస్థ విభాజ్య కణజాలం ఉంటుంది.

ప్రశ్న 46.
మొక్క దేహ ఉపరితలమంతా మనకు కనబడే కణజాలం?
జవాబు:
మొక్క దేహ ఉపరితలమంతా మనకు కనబడే కణజాలం త్వచ కణజాలం.

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం

ప్రశ్న 47.
త్వచ కణజాలం నుండి విడుదలయ్యే స్రావము ఏమిటి?
జవాబు:
త్వచ కణజాలం నుండి విడుదలయ్యే స్రావము జిగురు.

ప్రశ్న 48.
మొక్కలలో వైవిధ్యమైన కణజాలాలు ఉండడానికి కారణమేమిటి?
జవాబు:
ఒక్కొక్క రకమైన కణజాలం ఒక ప్రత్యేకమైన పనిని నిర్వహించడానికి అనువుగా నిర్మితమై ఉంటుంది.

ప్రశ్న 49.
మొక్కలలో బాష్పోత్సేకానికి ఉపయోగపడే త్వచ కణజాలపు నిర్మాణాలు ఏవి?
జవాబు:
మొక్కలలో బాష్పోత్సేకానికి ఉపయోగపడే త్వచ కణజాలపు నిర్మాణాలు పత్రరంధ్రాలు.

ప్రశ్న 50.
చెట్ల యొక్క బెరడు భాగము ఏ విధముగా ఉపయోగపడుతుంది?
జవాబు:
చెట్ల యొక్క బెరడు భాగము ఆహార పదార్థముగాను, మందుల తయారీలోను ఉపయోగపడుతుంది.

9th Class Biology 2nd Lesson వృక్ష కణజాలం 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
సరళ కణజాలంనకు మరియు సంక్లిష్ట కణజాలంనకు గల భేదములు ఏవి?
జవాబు:
1) నిర్మాణంలోనూ, విధులలోనూ ఒకే రకంగా ఉన్న కణాల సమూహమును సరళ కణజాలం అంటారు.
ఉదా : మృదు కణజాలం, స్థూలకోణ కణజాలం మరియు దృఢ కణజాలం.

2) ఒక విశిష్టమైన పనిని నిర్వహించడం కోసం భిన్న రకాలకు చెందిన కణాలు సమూహంగా ఏర్పడిన నిర్మాణాన్ని సంక్లిష్ట కణజాలం అంటారు.
ఉదా : దారువు, పోషక కణజాలం.

ప్రశ్న 2.
విభాజ్య కణజాలం నందలి కణముల లక్షణములేవి?
జవాబు:
విభాజ్య కణజాలంలోని కణాలు :

  1. కణాలు చిన్నవిగా ఉంటాయి. పలుచటి కణకవచాన్ని కలిగి ఉంటాయి.
  2. ఇవి స్పష్టమైన కేంద్రకాన్ని తగినంత జీవపదారమును కలిగి ఉండే కణజాలం.
  3. కణాల మధ్య ఖాళీ ప్రదేశాలు లేకుండా దగ్గరగా అమరి ఉంటాయి.
  4. ఎప్పుడూ విభజన చెందగలిగే శక్తి కలిగి ఉంటాయి.

ప్రశ్న 3.
కణకవచము ఆధారముగా మృదు కణజాలం, స్థూలకోణ కణజాలం మరియు దృఢ కణజాలాల మధ్య గల భేదమేది?
జవాబు:

మృదు కణజాలంస్థూలకోణ కణజాలందృఢ కణజాలం
కణకవచములు పలుచగా ఉండి సెల్యులోజ్ తో నిర్మితమై ఉంటాయి.కణకవచముల గోడలందు పెక్టిన్ మరియు సెల్యులోజ్ లు అక్కడక్కడ అవక్షేపితం కావడం వల్ల మందంగా ఉంటాయి.కణకవచపు గోడలందు పెక్టిన్ ఉండుట వలన మందంగా ఉంటాయి.

ప్రశ్న 4.
పత్రరంధ్రము యొక్క విధులేవి?
జవాబు:

  1. వాతావరణములో వాయువుల మార్పిడికి పత్రరంధ్రములు అవసరం.
  2. బాష్పోత్సేక ప్రక్రియనందు నీరు నీటి ఆవిరి రూపంలో బయటకు పోవడానికి పత్రరంధ్రములు అవసరం.

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం

ప్రశ్న 5.
దారువు ఎన్ని అంశముల కలయికచే ఏర్పడింది?
జవాబు:
దారువు నాలుగు అంశముల కలయికచే ఏర్పడింది. అవి :

  1. దారు కణములు
  2. దారు నాళాలు
  3. దారు మృదుకణజాలం
  4. దారు నారలు.

ప్రశ్న 6.
పోషక కణజాలం నందలి అంశములేవి?
జవాబు:
పోషక కణజాలం ఐదు రకముల అంశముల కలయికచే ఏర్పడింది. అవి చాలనీ కణములు, చాలనీ నాళములు, సహ ‘ కణములు, పోషక కణజాల నారలు మరియు పోషక కణజాల మృదు కణజాలం.

9th Class Biology 2nd Lesson వృక్ష కణజాలం 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
దారువునందలి వివిధ అంశముల పేర్లను తెలుపుము. అంశములు చేయు పనుల గురించిన సమాచారమును సేకరించుము.
జవాబు:
దారువు నందు ఉండే అంశములు :

  1. దారుకణములు, దారునాళములు, దారు మృదుకణజాలం మరియు దారునారలు.
  2. దారు కణములు, దాగునాళములు పొడవుగా ఉండే కండె లేదా స్థూపాకార కణములు. అందువలన ఇవి నీటిని పోషక పదార్థములను నిలువుగా ప్రసరణ చేయగలవు.
  3. దారు మృదు కణజాలం ఆహారమును నిల్వ చేస్తుంది మరియు పార్శ్వభాగాలకు నీటిని సరఫరా చేస్తుంది.
  4. దారునారలు, నాళికాపుంజానికి యాంత్రిక బలాన్ని ఇస్తాయి.

ప్రశ్న 2.
మొక్క కణజాలములకు సంబంధించి ప్రవాహపటము (ఫ్లోచార్టు) ను గీయుము.
జవాబు:
AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం 1

ప్రశ్న 3.
మృదు కణజాలం, స్థూలకోణ కణజాలం మరల దృఢ కణజాలం బొమ్మలను గీయుము.
జవాబు:
AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం 2 AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం 3 AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం 4

ప్రశ్న 4.
విభాజ్య కణజాలం అనగానేమి? విభాజ్య కణజాలం రకములను తెలుపుము.
జవాబు:

  1. మొక్క భాగాలన్నింటిలో పెరుగుదలను, మరమ్మతులను నిర్వహించే కణజాలమును విభాజ్య కణజాలం అంటారు.
  2. విభాజ్య కణజాలాలు మూడు రకములు. అవి :
    1) అగ్రవిభాజ్య కణజాలం,
    2) పార్శ్వ విభాజ్య కణజాలం,
    3) మధ్యస్థ విభాజ్య కణజాలం.
  3. వేరు, కాండపు కొనల వద్ద ఉండే పెరుగుదలను కలిగించే కణజాలము అగ్రవిభాజ్య కణజాలం.
  4. కాండంలో పార్శ్వపు అంచుల చుట్టూ వర్తులంగా పెరుగుదలను కలిగించే కణజాలం పార్శ్వ విభాజ్య కణజాలం.
  5. కాండం మీద శాఖలు ఏర్పడేచోట, ఆకులు, పుష్పవృంతం పెరిగే చోట ఉండే కణజాలం మధ్యస్థ విభాజ్య కణజాలం.

ప్రశ్న 5.
మొక్క కణజాలములు, జంతు కణజాలముల మధ్య గల భేదాలేవి?
జవాబు:

మొక్క కణజాలాలుజంతు కణజాలాలు
1) మొక్క కణజాలాలు ఎక్కువగా నిర్జీవమైనవి.1) జంతు కణజాలాలు ఎక్కువగా సజీవమైనవి.
2) మొక్కల జీవక్రియ నిర్వహణకు తక్కువ శక్తి అవసరము.2) జంతువుల జీవక్రియ నిర్వహణకు ఎక్కువశక్తి అవసరం.
3) కణజాలాల వ్యవస్థీకరణ స్థిర నివాసమునకు ఆధారాన్నిస్తుంది.3) కణజాల వ్యవస్థీకరణ జీవి కదలడానికి సహాయపడుతుంది.

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం

ప్రశ్న 6.
పట సహాయముతో మృదు కణజాలంను, స్థూలకోణ కణజాలంను, దృఢ కణజాలంను వివరింపుము.
జవాబు:
AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం 2
1. మృదు కణజాలం :

  1. మృదు కణజాలంలోని కణాలు మృదువుగా పలుచని గోడలు గలిగి, వదులుగా అమరి ఉంటాయి.
  2. ఇందులో మూడురకాల కణజాలాలున్నాయి. హరిత కణజాలం, వాయుగత కణజాలం, నిల్వచేసే కణజాలం, మృదు కణజాలం

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం 3
2. స్థూలకోణ కణజాలం :

  1. స్థూలకోణ కణజాలంలోని కణాలు దళసరి గోడలను కలిగి కొంచెం పొడవైన కణాలుగా ఉంటాయి.
  2. మొక్కకు ఆధారాన్ని, యాంత్రిక బలాన్ని ఇస్తుంది.
  3. కణాల మధ్య ఖాళీ ప్రదేశాలు ఉంటాయి.

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం 4
3. దృఢ కణజాలం :

  1. దృఢ కణజాలంలోని కణాలు దళసరి గోడలు కలిగి ఉంటాయి.
  2. కణాల మధ్య ఖాళీ లేకుండా దగ్గర దగ్గరగా అమరియుంటాయి.
  3. మొక్కకు యాంత్రికబలాన్ని ఇస్తుంది.

9th Class Biology 2nd Lesson వృక్ష కణజాలం Important Questions and Answers

ప్రశ్న 1.
దారువు, పోషకా కణజాలాల్లో వుండే వివిధ రకాల కణాల పటాలను గీయండి.
జవాబు:
AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం 6

ప్రశ్న 2.
మొక్కలలో వుండే సంధాయక కణజాలంలోని రకాలను తెలపండి.
జవాబు:
మృదుకణజాలము, స్థూలకోణ కణజాలము, ధృడకణజాలము.

ప్రశ్న 3.
క్రింది వాటికి కారణాలు రాయండి.
a) దారువు ప్రసరణ కణజాలంగా పనిచేస్తుంది
b) క్రొవ్వు కణాలు ఉష్ణనిరోధకంగా పనిచేస్తాయి
c) హృదయకండరం నిరంతరం పనిచేస్తుంది
d) బాహ్యచర్మం రక్షణనిస్తుంది
జవాబు:
a) 1) దారువు వేర్ల నుండి నీటిని పోషక పదార్ధములను మొక్క అగ్రభాగాలకు సరఫరా చేస్తుంది.
2) వేర్ల నుండి పదార్ధములను దూరభాగములకు రవాణా చేస్తుంది. 3) వేర్ల నుండి మొక్క అగ్రభాగాలకు నీటి సరఫరా ఏకమార్గములో జరుగుతుంది.

b) క్రొవ్వు మనశరీరంలో చర్మం క్రింద ఉండే ఎడిపోజ్ కణజాలంలో నిల్వ ఉంచబడుతుంది. ఈ ఎడిపోజ్ కణజాలం చర్మం క్రింద మందంగా ఉండి ఉష్ణనిరోధకంగా పనిచేస్తాయి. అందుకనే స్థూలకాయులను చలికాలంలో చలి అంతగా బాధించదు.

c) హృదయకండరం హృదయాన్ని ఆవరించి ఉండి, హృదయ సంకోచ వ్యాకోచాలను నిరంతరం జరుపుతాయి. ఈ కండరాలు అన్నీ చారలను కలిగి ఉండి శాఖలుగా ఉంటాయి. వీటి చర్యలు మన ఆధీనంలో ఉండవు. ఇది అనియంత్రిత చర్యలను చూపిస్తుంది.

d) 1) బాహ్యచర్మము నందలి కణములు సాధారణముగా ఒక పొరయందు ఉంటాయి.
2) బాహ్యచర్మము నందలి కణముల గోడలు దళసరిగా ఉంటాయి.
3) నీటి ఎద్దడి, కొమ్మలు విరగడం, చీలడం వంటి యాంత్రికంగా కలిగే నష్టాలు పరాన్న జీవులు, రోగకారక జీవులు దాడి మొదలైన వాటి నుండి మొక్కలను బాహ్యచర్మం రక్షిస్తుంది.

4. a) వృక్షకణం బొమ్మను గీచి, భాగాలను గుర్తించండి.
b) అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క విధులను తెల్పండి.
జవాబు:
a)
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 2

b) 1) కణంలో ఒక భాగం నుండి మరియొక భాగానికి పదార్థాల రవాణా,
2) జీవ రసాయనిక చర్యలకు వేదిక
3) అనేక విషపదార్థాలను నిర్వీర్యం చేస్తుంది.
4) ప్రోటీన్లు, లిపిడ్ల సంశ్లేషణకు తోడ్పడుతుంది.

9th Class Biology 2nd Lesson వృక్ష కణజాలం 1 Mark Bits Questions and Answers

లక్ష్యాత్మక నియోజనము

1. మొక్క భాగాలన్నింటిలో పెరుగుదలను, మరమ్మతులను నిర్వహించే కణజాలం
A) విభాజ్య కణజాలం
B) త్వచ కణజాలం
C) సంధాయక కణజాలం
D) ప్రసరణ కణజాలం
జవాబు:
A) విభాజ్య కణజాలం

2. మొక్క బయటి పై పొరలను ఏర్పరచే కణజాలం
A) విభాజ్య కణజాలం
B) త్వచ కణజాలం
C) సంధాయక కణజాలం
D) ప్రసరణ కణజాలం
జవాబు:
B) త్వచ కణజాలం

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం

3. వృక్ష దేహాన్ని ఏర్పాటు చేస్తూ ఇతర కణజాలాలు సరియైన స్థితిలో ఉండేలా చేసే కణజాలం
A) విభాజ్య కణజాలం
B) త్వచ కణజాలం
C) అంతస్త్వచం
D) పైవి అన్నియు
జవాబు:
C) అంతస్త్వచం

4. పదార్థాల రవాణాకు సహాయపడే కణజాలం
A) విభాజ్య కణజాలం
B) త్వచ కణజాలం
C) సంధాయక కణజాలం
D) ప్రసరణ కణజాలం
జవాబు:
D) ప్రసరణ కణజాలం

5. పెరుగుదల చూపించు కాండం, వేరు కొనభాగాల్లో ఉండే విభాజ్య కణజాలం
A) అగ్ర విభాజ్య కణజాలం
B) పార్శ్వ విభాజ్య కణజాలం
C) మధ్యస్థ విభాజ్య కణజాలం
D) త్వచ కణజాలం
జవాబు:
A) అగ్ర విభాజ్య కణజాలం

6. త్వచ కణజాలం ఏర్పరచేది.
A) బాహ్యస్త్వచం
B) మధ్యస్త్వచం
C) సంధాయక కణజాలం
D) ప్రసరణ కణజాలం
జవాబు:
D) ప్రసరణ కణజాలం

7. పత్రరంధ్రములు ఈ పొరనందు ఉంటాయి.
A) బాహ్యస్వచం
B) మధ్యస్వచం
C) అంతస్త్వచం
D) పైవి అన్నియు
జవాబు:
A) బాహ్యస్వచం

8. పత్రరంధ్రము ఈ కణములచే ఆవరించబడి ఉంటుంది.
A) దారు కణాలు
B) సహ కణాలు
C) గ్రంథి కణాలు
D) మృదు కణాలు
జవాబు:
B) సహ కణాలు

9. జిగురును స్రవించునది
A) త్వచ కణజాలం
B) విభాజ్య కణజాలం
C) దారువు
D) పోషక కణజాలం
జవాబు:
A) త్వచ కణజాలం

10. పత్రరంధ్రాలు మరియు మూలకేశాలు దీనికి సహాయపడతాయి.
A) వాయువుల మార్పిడి
B) బాష్పోత్సేకము
C) నీరు, లవణాల సంగ్రహణ
D) పైవి అన్నియు
జవాబు:
D) పైవి అన్నియు

11. దవ్వభాగానికి మృదుకణజాలమని పేరు పెట్టినవాడు
A) బిచాట్
B) నెహేమియా గ్రూ
C) రాబర్ట్ బ్రౌన్
D) అరిస్టాటిల్
జవాబు:
B) నెహేమియా గ్రూ

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం

12. ప్రసరణ కణజాలంను గుర్తించండి.
A) దారువు
B) పోషక కణజాలం
C) దారువు మరియు పోషక కణజాలం
D) దృఢ కణజాలం
జవాబు:
C) దారువు మరియు పోషక కణజాలం

13. దారువు కలిగియుండు అంశములు
A) దారుకణాలు, దారు నాళాలు
B) దారునాళాలు
C) దారు మృదుకణజాలం
D) పైవి అన్నియు
జవాబు:
D) పైవి అన్నియు

14. పోషక కణజాలము నందు ఉండు అంశములు
A) చాలనీ కణాలు, చాలనీ నాళాలు
B) పోషక మృదుకణజాలం
C) సహ కణాలు, పోషక కణజాలం, మృదుకణజాలం
D) పైవి అన్నియు
జవాబు:
D) పైవి అన్నియు

15. రోజ్ వుడ్ వృక్షమునందు దారువు ఎన్ని అడుగుల ఎత్తు వరకు నీటిని మోస్తుంది?
A) 220 అడుగులు
B) 230 అడుగులు
C) 330 అడుగులు
D) 430 అడుగులు
జవాబు:
C) 330 అడుగులు

16. హరితరేణువులు కలిగిన మృదు కణజాలం పేరు
A) హరిత కణజాలం
B) వాయుగత కణజాలం
C) నిల్వచేసే కణజాలం
D) దృఢ కణజాలం
జవాబు:
A) హరిత కణజాలం

17. వీటి పెరుగుదల కొనభాగాలలో విభాజ్య కణజాలం ఉంటుంది.
A) వేరు
B) కాండం
C) వేరు మరియు కాండం
D) పార్శ్వ విభాజ్య కణజాలం
జవాబు:
C) వేరు మరియు కాండం

18. దారువు నందలి అంశములను గుర్తించుము.
A)దారు కణాలు
B) చాలనీ కణాలు
C) చాలనీ నాళాలు
D) సహ కణాలు
జవాబు:
A)దారు కణాలు

19. పోషక కణజాలంనందలి అంశములను గుర్తించుము.
A) స్రావ కణాలు
B) రక్షణ కణాలు
C) చాలనీ కణాలు
D) సహ కణాలు, చాలనీ కణాలు
జవాబు:
D) సహ కణాలు, చాలనీ కణాలు

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం

20. కణజాలం అనగా ఈ కణాల సమూహం.
A) ఒకే నిర్మాణం కలిగి ఒకే విధమైన విధుల్ని నిర్వర్తిస్తాయి.
B) ఒకే నిర్మాణం కలిగి వేరు వేరు విధుల్ని నిర్వర్తిస్తాయి.
C) వేరు వేరు నిర్మాణం కలిగి ఒకే విధులను నిర్వర్తిస్తాయి.
D) వేరు వేరు నిర్మాణం కలిగి వేరు వేరు విధులను నిర్వర్తిస్తాయి.
జవాబు:
A) ఒకే నిర్మాణం కలిగి ఒకే విధమైన విధుల్ని నిర్వర్తిస్తాయి.

21. కాండం కొన భాగంలో ఉండి పెరుగుదలకు కారణమయ్యేది
A) త్వచ కణజాలం
B) విభాజ్య కణజాలం
C) సంధాయక కణజాలం
D) ప్రసరణ కణజాలం
జవాబు:
B) విభాజ్య కణజాలం

22. కాండం లావుగా పెరగటానికి కారణం
A) అగ్ర విభాజ్య కణజాలం
B) పార్శ్వ విభాజ్య కణజాలం
C) మధ్యస్థ విభాజ్య కణజాలం
D) సంధాయక కణజాలం
జవాబు:
B) పార్శ్వ విభాజ్య కణజాలం

23. పత్ర రంధ్రాన్ని ఆవరించి ఉండే రక్షక కణాల సంఖ్య
A) 1
B) 2
C) 3
D) 5
జవాబు:
B) 2

24. ఈ క్రింది వానిలో త్వచ కణజాలానికి సంబంధించినది
A) జిగురు
B) బెరడు
C) మూలకేశాలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

25. మొక్క దేహంలో ఎక్కువ భాగం దీనితో నిర్మించబడి ఉంటుంది.
A) త్వచ కణజాలం
B) సంధాయక కణజాలం
C) ప్రసరణ కణజాలం
D) విభాజ్య కణజాలం
జవాబు:
B) సంధాయక కణజాలం

26. నిల్వచేసే కణజాలం దీనిని నిల్వ చేయదు.
A) నీరు
B) గాలి
C) ఆహారం
D) వ్యర్థ పదార్థాలు
జవాబు:
B) గాలి

27. గాలి నిల్వ ఉండే కణజాలం
A) హరిత మృదు కణజాలం
B) నిల్వచేసే కణజాలం
C) వాతయుత కణజాలం
D) దృఢ కణజాలం
జవాబు:
C) వాతయుత కణజాలం

28. నీటి మొక్కలు కలి ఉండే కణజాలం
A) స్థూలకోణ కణజాలం
B) హరిత కణజాలం
C) వాతయుత కణజాలం
D) నిల్వచేసే కణజాలం
జవాబు:
C) వాతయుత కణజాలం

29. “అనాటమీ ఆఫ్ ప్లాంట్స్” అనే గ్రంథాన్ని రచించిన శాస్త్రవేత్త
A) రాబర్ట్ హుక్
B) మార్సెల్లో మాల్ఫీజి
C) నెహేమియా గ్రూ
D) రుడాల్ఫ్ విర్కోవ్
జవాబు:
C) నెహేమియా గ్రూ

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం

30. నెహేమియా గ్రూ మొక్కలోని ఏ భాగానికి మృదు కణజాలం అని పేరు పెట్టారు?
A) దారువు
B) దవ్వ
C) పోషక కణజాలం
D) నాళికాపుంజం
జవాబు:
B) దవ్వ

31. నీరు, పోషక పదార్థాలు దీని ద్వారా సరఫరా అవుతాయి.
A) దారువు
B) పోషక కణజాలం
C) పై రెండూ
D) స్థూలకోణ కణజాలం
జవాబు:
A) దారువు

32. పోషక కణజాలం ద్వారా సరఫరా అయ్యేది
A) నీరు
B) పోషక పదార్థాలు
C) ఆహార పదార్థాలు
D) గాలి
జవాబు:
C) ఆహార పదార్థాలు

33. దారువులోను, పోషక కణజాలంలోను రెండింటిలో ఉండే కణాలు
A) తంతువులు
B) మృదు కణజాలం
C) పై రెండూ
D) సహకణాలు
జవాబు:
C) పై రెండూ

34. రెడ్ ఉడ్ చెట్లలో ప్రసరణ కణజాలం ఎంత ఎత్తుకు పోషకాలను సరఫరా చేస్తాయి?
A) 220 అడుగులు
B) 330 అడుగులు
C) 250 అడుగులు
D) 350 అడుగులు
జవాబు:
B) 330 అడుగులు

35. మొక్క దేహానికి రక్షణనిచ్చే కణజాలం
A) త్వచ కణజాలం
B) సంధాయక కణజాలం
C) దృఢ కణజాలం
D) మృదు కణజాలం
జవాబు:
A) త్వచ కణజాలం

36. మొక్క భాగాలన్నింటిలో పెరుగుదలను, మరమ్మతులను నిర్వహించే కణజాలం
A) విభాజ్య కణజాలం
B) త్వచ కణజాలం
C) సంధాయక కణజాలం
D) ప్రసరణ కణజాలం
జవాబు:
A) విభాజ్య కణజాలం

37. ఈ క్రింది వానిలో సంక్లిష్ట కణజాలం
A) మృదు కణజాలం
B) స్థూలకోణ కణజాలం
C) దృఢ కణజాలం
D) దారువు
జవాబు:
D) దారువు

38. ఈ క్రిందివానిలో నిర్జీవ కణజాలం
A) మృదు కణజాలం
B) స్థూలకోణ కణజాలం
C) దృఢ కణజాలం
D) పోషక కణజాలం
జవాబు:
C) దృఢ కణజాలం

39. మొక్కల యొక్క వంగగలిగే భాగాలలో ఉండే కణజాలం
A) మృదు కణజాలం
B) స్తూలకోణ కణజాలం
C) దృఢ కణజాలం
D) పోషక కణజాలం
జవాబు:
B) స్తూలకోణ కణజాలం

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం

40. సజీవ, నిర్జీవ రెండు రకాల కణాలను కలిగి ఉండేది
A) దారువు
B) పోషక కణజాలం
C) మృదు కణజాలం
D) స్థూలకోణ కణజాలం
జవాబు:
A) దారువు

41. క్రింది వాక్యాలను చదవండి.
a) వేరుకొన అగ్రభాగంలో విభాజ్య కణజాలం ఉంటుంది.
b) కొబ్బరి టెంకలలో దృఢ కణజాలం ఉంటుంది.
A) a మరియు b లు రెండూ సరైనవి కావు
B) a సరైనది, b సరైనది కాదు
C) b సరైనది, a సరైనది కాదు
D) a మరియు b లు రెండూ సరైనవి
జవాబు:
D) a మరియు b లు రెండూ సరైనవి

42. ఒక మొక్క కొమ్మలు విరగడం, చీలడం వంటి యాంత్రికంగా కలిగే నష్టాల నుండి రక్షించు కోలేకపోతుంది. ఇందుకు కారణాలు ఏమై ఉండవచ్చు?
i) మొక్కలో విభాజ్య కణజాలం నశించి ఉండవచ్చు
ii) మొక్కలో త్వచ కణజాలం నశించి ఉండవచ్చు
iii) మొక్కలో సంధాయక కణజాలం నశించి ఉండవచ్చు
iv)మొక్కలో బహిస్త్వచం ఏర్పడకపోయి ఉండవచ్చు
పై వాటిలో సరైన కారణాలు
A) i, iv
B) i, iii, iv
C) i, ii
D) పైవన్నియూ
జవాబు:
A) i, iv

43. ఉల్లిపొర కణాలను మైక్రోస్కోపు క్రింద పరీక్షించునపుడు ఈ క్రింది వానిలో అసత్యమైనది
A) అన్ని కణాలు ఒకే ఆకారంలో ఉన్నాయి.
B) కణాలు వృత్తాకారంగా అమరి ఉన్నాయి.
C) కణాంతర్గత ఖాళీలు ఉన్నాయి.
D) ప్రతి కణము కణకవచాన్ని కలిగి ఉంది.
జవాబు:
B) కణాలు వృత్తాకారంగా అమరి ఉన్నాయి.

44. ఉల్లిపొర కణాలను, బుగ్గ కణాలను మైక్రోస్కోపు క్రింద పరీక్షించునపుడు ఈ క్రింది వానిలో సత్యమైన ప్రవచనం ఏది?
A) ఉల్లి కణాలు కణకవచాన్ని, కణత్వచాన్ని కలిగి ఉన్నాయి.
B) బుగ్గ కణాలు కణకవచాన్ని, కణత్వచాన్ని కలిగి ఉన్నాయి.
C) ఉల్లి కణాలు కణత్వచాన్ని మాత్రమే కలిగి ఉన్నాయి.
D) బుగ్గ కణాలు కణత్వచాన్ని మాత్రమే కలిగి ఉన్నాయి.
జవాబు:
A) ఉల్లి కణాలు కణకవచాన్ని, కణత్వచాన్ని కలిగి ఉన్నాయి.

→ క్రింది పేరాను చదివి ఇవ్వబడిన ప్రశ్నలకు సరియైన సమాధానాన్ని గుర్తించండి.

సాధారణంగా త్వచ కణజాలం ఒక వరుస కణాలను కలిగి ఉండి, కణాల విభిన్నత చూపిస్తుంది. వాటి విధుల్ని బట్టి స్థానాన్ని బట్టి ఈ కణజాలం మూడు రకాలుగా విభజించబడింది. అవి – బాహ్యచర్మం లేక బహిత్వచం (వెలుపలి పొర) (Epidermis), మధ్యత్వచం (మధ్యపొర) (Mesodermis), అంతఃత్వచం (లోపలి పొర) (Endodermis).

ఆకు బాహ్యచర్మంలో చిన్న రంధ్రాలు కన్పిస్తాయి. వాటిని పత్రరంధ్రాలు (Stomata) అంటారు. వేరులో అయితే బాహ్యచర్మం కణాలు పొడవైన వెంట్రుకల వంటి మూలకేశాలను కలిగి ఉంటాయి.

45. పత్రరంధ్రాలు మనకు ఎక్కడ కనపడతాయి?
A) వృక్షాల త్వచ కణజాలాలలో
B) జిగురునిచ్చే చెట్ల బాహ్యచర్మం లేక బాహ్యత్వచంలో
C) ఆకు యొక్క బాహ్యచర్మం లేక బాహ్యత్వచంలో
D) కాండ కణాల బాహ్యచర్మం లేదా బాహ్యత్వచంలో
జవాబు:
C) ఆకు యొక్క బాహ్యచర్మం లేక బాహ్యత్వచంలో

46. ఈ క్రింది వానిలో సరిగా జతపరచబడని జత ఏది?
a) మధ్యత్వచం – వెలుపలి పొర
b) బాహ్యత్వచం – మధ్య పొర
c) అంతఃత్వచం – లోపలి పొర
A) a, b, c
B) a, b
C) a, c
D) b, c
జవాబు:
B) a, b

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం

47. ప్రసరణ కణజాలంలో ఈ భాగాన్ని గుర్తించండి.
AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం 7
A) తంతువు
B) దారుకణం
C) దారునాళం
D) చాలనీ కణాలు
జవాబు:
B) దారుకణం

48. ప్రసరణ కణజాలంలో ఈ భాగాన్ని గుర్తించండి.
AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం 8
A) చాలనీ నాళాలు
B) దారుకణం
C) దారునాళం
D) ఏదీకాదు
జవాబు:
C) దారునాళం

49. ప్రసరణ కణజాలంలో ఈ భాగాన్ని గుర్తించండి.
AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం 9
A) సహకణాలు
B) దారునాళాలు
C) దారుకణాలు
D) చాలనీ కణాలు
జవాబు:
D) చాలనీ కణాలు

50. ఈ క్రింది స్లో చార్టును సరియైన క్రమంలో అమర్చండి.
AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం 10
A) 3, 4, 2, 1, 5
B) 1, 2, 3, 4, 5
C) 3, 4, 5, 2, 1
D) 3, 4, 1, 2, 5
జవాబు:
D) 3, 4, 1, 2, 5

51. పత్ర రంధ్రాలను కలిగి వుండునది
A) ప్రసరణ కణజాలం
B) విభాజ్య కణజాలం
C) సంధాయక కణజాలం
D) త్వచకణజాలం
జవాబు:
D) త్వచకణజాలం

52. మొక్క భాగాలన్నింటిలో పెరుగుదలను, మరమ్మత్తులను నిర్వహించే కణజాలం
A) విభాజ్య కణజాలం
B) త్వచ కణజాలం
C) సంధాయక కణజాలం
D) ప్రసరణ కణజాలం
జవాబు:
A) విభాజ్య కణజాలం

53. నీటి మొక్కలు తేలుటకు కారణమైనది.
A) మృధుకణజాలం
B) వాయుగత కణజాలం
C) స్థూలకోణ కణజాలం
D) దృఢ కణజాలం
జవాబు:
B) వాయుగత కణజాలం

54. కింది i, ii వాక్యాలను చూడండి.
i) ప్రసరణ కణజాలం కేవలం దారువుతో ఏర్పడుతుంది.
ii) నాళికాపుంజం, దారువు ప్రసరణ కణజాలంను ఏర్పరుస్తాయి.
A) i, ii సత్యాలు
B) i సత్యం, ii అసత్యం
C) i అసత్యం, ii సత్యం
D) i, ii అసత్యాలు
జవాబు:
C) i అసత్యం, ii సత్యం

మీకు తెలుసా?

విసర్జక పదార్థాలు, అధికంగా ఉన్న ఆహారపదార్థాలు, స్రావక పదార్థాలు వంటి కొన్ని రకాల పదార్థాలను విభిన్న రూపాలలో నిల్వచేసుకోగలిగే సామర్థ్యం మొక్కలకు ఉంది. జిగురునిచ్చే చెట్ల యొక్క త్వచకణజాలం నుండి జిగురు స్రవించబడుతుంది.

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం 11
నెహేమియా గ్రూ (Nehemiah Grew) (1641-1712) ఒక వైద్యుడు. లండన్లోని రాయల్ సొసైటీకి కార్యదర్శిగా పనిచేశాడు. 1664వ సంవత్సరంలో మొక్కల అంతర్నిర్మాణం మీద అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు.

మొక్కలోని ప్రతి భాగం రెండు రకాల విభాగాలను కలిగి ఉంటుంది. అవి ఒకటి దవ్వ (Pith) మరొకటి గట్టి భాగం (Ligneous part) అని అతడు భావించాడు. ఇది అతని ప్రాథమిక భావన.
దవ్వ భాగానికి ‘గ్రూ’ మృదుకణజాలం అని పేరుపెట్టాడు. ‘గ్రూ’ మొక్కల దేహాల్లోని కణజాలాలపై అధ్యయనం చేసి, 1682వ సంవత్సరంలో “అనాటమీ ఆఫ్ ప్లాంట్స్” అనే గ్రంథాన్ని ప్రచురించాడు.

పునరాలోచన

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం 5

అనుబంధం

మీరు ప్రయోగశాలలో వివిధ వృక్ష కణజాలాలు పరిశీలించాలంటే వాటి స్లెడులను తయారుచేయడం నిపుణత సాధించడం అవసరం.

  • పరిచ్ఛేదాలను (సెక్షన్స్) పొందడానికి బెండును ఆధారంగా తీసుకోవాలి. బెండులో నిలువుగా ఒక చీలికను చేయాలి. పరిచ్ఛేదం తీయవలసిన పదార్థాన్ని (వేరు లేక కాండం లేక ఆకు లేక మొగ్గ) ఆ చీలికలోకి చొప్పించాలి.
  • నిలువుకోత కావాలంటే పదార్థాన్ని బెండులో అడ్డంగా చొప్పించాలి.
  • అడుకోత కావాలంటే పదార్థాన్ని బెండులో నిలువుగా చొప్పించాలి.
  • బ్లేడును ఉపయోగించి పలుచని పరిచ్ఛేదాలను ఉంచాలి.
  • వాచ్ గ్లాస్ లో ఉన్న నీటిలో పరిచ్ఛేదాలను ఉంచాలి.
  • ఒక పలుచటి పరిచ్చేదాన్ని ఎంపికచేసుకొని, చిన్న బ్రష్ సహాయంతో గాజు పలక పైన ఉంచాలి.
  • దానిపై ఒక చుక్క గ్లిజరిన్ వేయాలి.
  • ఒకచుక్క శాస్రనితో దానిని రంజనం చేయాలి.
  • నీడిల్ ను ఉపయోగించి, కవర్ స్లిప్ తో జాగ్రత్తగా మూయాలి.
  • అధికంగా ఉన్న నీటిని లేక గ్లిజరినను లేక వర్ణద్రవ్యాన్ని అద్దుడు కాగితంతో తొలగించాలి.
  • అప్పుడు సూక్ష్మదర్శినితో పరిశీలించాలి.

AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు

These AP 9th Biology Important Questions and Answers 1st Lesson కణ నిర్మాణం – విధులు will help students prepare well for the exams.

AP Board 9th Class Biology 1st Lesson Important Questions and Answers కణ నిర్మాణం – విధులు

9th Class Biology 1st Lesson కణ నిర్మాణం – విధులు 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
ఉల్లిపొరలో కణాల ఆకారం?
జవాబు:
ఉల్లిపొరలో కణాల ఆకారం దీర్ఘచతురస్రాకారం.

ప్రశ్న 2.
మానవుల బుగ్గనందలి కణముల ఆకారం?
జవాబు:
మానవుల బుగ్గనందలి కణముల ఆకారం గుండ్రం.

ప్రశ్న 3.
శాస్త్ర పరిశోధన తొలినాళ్ళలో కణాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగించిన సూక్ష్మదర్శిని?
జవాబు:
శాస్త్ర పరిశోధన తొలినాళ్ళలో కణాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగించిన సూక్ష్మదర్శిని సరళ సూక్ష్మదర్శిని.

ప్రశ్న 4.
వృక్ష నమూనా కణంలో తప్పనిసరిగా చూపించవలసిన కణాంగం?
జవాబు:
వృక్ష నమూనా కణంలో తప్పనిసరిగా చూపించవలసిన కణాంగం హరితరేణువు.

ప్రశ్న 5.
వృక్ష కణంలో కణత్వచమునకు బయట ఉండే పొర?
జవాబు:
వృక్ష కణంలో కణత్వచమునకు బయట ఉండే పొర కణకవచము.

AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు

ప్రశ్న 6.
హరిత రేణువులు ఉండే మొక్క భాగాలు?
జవాబు:
హరిత రేణువులు ఉండే మొక్క భాగాలు పత్రాలు, లేత కాండాలు.

ప్రశ్న 7.
ప్లాస్మాపొర దేనితో నిర్మితమయినది?
జవాబు:
ప్లాస్మాపొర ప్రొటీన్లు, లిపిడ్లతో నిర్మితమయినది.

ప్రశ్న 8.
కణంలోని కణద్రవ్యాన్ని బాహ్య పరిసరాలతో వేరు చేసేది?
జవాబు:
కణంలోని కణద్రవ్యాన్ని బాహ్య పరిసరాలతో వేరు చేసేది ప్లాస్మాపొర.

ప్రశ్న 9.
కణం లోపల సమతాస్థితి నిర్వహణలో ప్రధాన పాత్ర వహించేది?
జవాబు:
కణం లోపల సమతాస్థితి నిర్వహణలో ప్రధాన పాత్ర వహించేది ప్లాస్నాపొర లేదా కణత్వచం.

ప్రశ్న 10.
ప్లాస్మాపొర యొక్క ప్రత్యేక లక్షణం?
జవాబు:
అన్ని పదార్థాలను తన గుండా ప్రసరింపనీయకపోవడం.

ప్రశ్న 11.
ప్లాస్మాపొరని విచక్షణ త్వచం అని ఎందుకు అంటారు?
జవాబు:
కొన్ని ప్రత్యేకమైన పదార్థాల వినిమయం మాత్రమే ప్లాస్మాపొర ద్వారా జరుగుతుంది. కాబట్టి ప్లాస్మా పొరను విచక్షణ త్వచం అంటారు.

ప్రశ్న 12.
వృక్ష కణాలలో మాత్రమే కనబడే ప్రత్యేకమైన భాగం?
జవాబు:
వృక్ష కణాలలో మాత్రమే కనబడే ప్రత్యేకమైన భాగం కణకవచం.

ప్రశ్న 13.
కణకవచం ఏ పదార్థంతో తయారవుతుంది?
జవాబు:
కణకవచం సెల్యులోజ్ అనే పదార్థంతో తయారవుతుంది.

ప్రశ్న 14.
కణంలో పెరుగుదల మరియు అభివృద్ధి జరిగేటప్పుడు ఇతర కణాలకు నిరంతరంగా సమాచార మార్పిడి చేసేది?
జవాబు:
కణంలో పెరుగుదల మరియు అభివృద్ధి జరిగేటప్పుడు ఇతర కణాలకు నిరంతరంగా సమాచార మార్పిడి చేసేది కణకవచం.

ప్రశ్న 15.
వృక్ష కణాలలో కణకవచం యొక్క ఆవశ్యకత ఏమిటి?
జవాబు:
కణరసం ద్వారా ఏర్పడే బాహ్యపీడనాన్ని నిరోధించడానికి కణకవచం అంతర పీడనాన్ని కలుగచేస్తుంది.

ప్రశ్న 16.
కేంద్రకాన్ని ఎవరు, ఎప్పుడు కనుగొన్నారు?
జవాబు:
కేంద్రకాన్ని 1831లో రాబర్ట్ బ్రౌన్ కనుగొన్నారు.

ప్రశ్న 17.
కేంద్రకమునకు గల మరియొక పేరు?
జవాబు:
కేంద్రకమునకు గల మరియొక పేరు కణనియంత్రణ గది.

AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు

ప్రశ్న 18.
కణాంగాలలో అన్నింటికంటే పెద్ద కణాంగం?
జవాబు:
కణాంగాలలో అన్నింటికంటే పెద్ద కణాంగం కేంద్రకం.

ప్రశ్న 19.
కొత్త కణాలు కేంద్రకం నుండి ఉద్భవిస్తాయని భావించి ఫ్రీడన్ కేంద్రకమును ఏమని పిలిచాడు?
జవాబు:
కొత్త కణాలు కేంద్రకం నుండి ఉద్భవిస్తాయని భావించి ప్లీడన్ కేంద్రకమును సైటోబ్లాస్ట్ అని పిలిచాడు.

ప్రశ్న 20.
కణంలో కేంద్రకం ఉందని జీవులు?
జవాబు:
కణంలో కేంద్రకం ఉండని జీవులు క్షీరదాల ఎర్రరక్త కణాలు మరియు పోషక కణజాలంలోని చాలనీ నాళాలు.

ప్రశ్న 21.
కేంద్రకం నిర్వహించు విధులు?
జవాబు:
కణ విధులన్నింటిని నియంత్రించడం, జన్యు సమాచారం కలిగి, జీవుల లక్షణాలను నిర్ధారించడం, కణవిభజనలో కూడా కేంద్రకం ప్రధాన పాత్ర వహిస్తుంది.

ప్రశ్న 22.
కేంద్రకమును ఆవరించి యుండే పొర పేరు?
జవాబు:
కేంద్రకమును ఆవరించి యుండే పొర పేరు కేంద్రక త్వచం.

ప్రశ్న 23.
కేంద్రక త్వచం ఆధారంగా కణములు ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
కేంద్రక త్వచం ఆధారంగా కణాలు రెండు రకాలు. అవి – కేంద్రకపూర్వకణం మరియు నిజకేంద్రక కణం.

ప్రశ్న 24.
కేంద్రక పూర్వకణాలు అనగానేమి?
జవాబు:
కేంద్రక త్వచం లేని కణాలను కేంద్రక పూర్వకణాలు అంటారు.
ఉదా : బాక్టీరియా, సయానోబాక్టీరియా

ప్రశ్న 25.
కణద్రవ్యము అనగానేమి?
జవాబు:
కణద్రవ్యము అనగా ప్లాస్మా పొరచే ఆవరించియున్న జిగురు పదార్థము.

ప్రశ్న 26.
కేంద్రకంలోని పదార్ధమును ఏమంటారు?
జవాబు:
కేంద్రకంలోని పదార్ధమును కేంద్రక రసం లేదా కేంద్రక ద్రవ్యం అంటారు.

ప్రశ్న 27.
కణంలోని ముఖ్యమైన కణాంగాలేవి?
జవాబు:
కణంలోని ముఖ్యమైన కణాంగాలు :
అంతర్జీవ ద్రవ్యజాలం, గాల్టి సంక్లిష్టాలు, లైసోజోములు, మైటోకాండ్రియా, ప్లాస్టిడ్లు మరియు రిక్తికలు కణంలోని ముఖ్య కణాంగాలు.

ప్రశ్న 28.
అంతర్జీవ ద్రవ్యజాలము ఉపయోగమేమి?
జవాబు:
అంతర్జీవ ద్రవ్యజాలము ద్వారా కణంలో ఒక భాగం నుండి మరియొక భాగానికి ప్రోటీన్లు మరియు కొన్ని పదార్థాల రవాణా జరుగుతుంది మరియు కణంలో జరిగే కొన్ని జీవరసాయన చర్యలకు వేదికగా పనిచేస్తుంది.

ప్రశ్న 29.
అంతర్జీవ ద్రవ్యజాలం ఉపరితలంపై రేణువుల వంటి నిర్మాణాలను ఏమంటారు?
జవాబు:
అంతర్జీవ ద్రవ్యజాలం ఉపరితలంపై రేణువుల వంటి నిర్మాణాలను రైబోజోములు అంటారు.

ప్రశ్న 30.
గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము అనగానేమి?
జవాబు:
రైబోజోములు కలిగిన అంతర్జీవ ద్రవ్యజాలంను గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు.

ప్రశ్న 31.
నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము అనగానేమి?
జవాబు:
రైబోజోములు లేని అంతర్జీవ ద్రవ్యజాలం నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము.

ప్రశ్న 32.
గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ఉపయోగం?
జవాబు:
గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ప్రోటీన్లను సంశ్లేషణ చేస్తుంది.

ప్రశ్న 38.
నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము ఉపయోగం?
జవాబు:
నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము లిపిడ్ల సంశ్లేషణ చేస్తుంది.

ప్రశ్న 34.
సకశేరుక కాలేయ కణాలలోని నునుపుతల అంతర్జీవ ద్రవ్యజాలం విధి?
జవాబు:
అనేక విష పదార్థాలు, మత్తు పదార్థాలను నిర్వీర్యం చేస్తుంది.

AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు

ప్రశ్న 35.
1898 వ సంవత్సరంలో కణము నందు గాల్టి సంక్లిష్టాన్ని పరిశీలించినవాడు?
జవాబు:
1898 వ సంవత్సరంలో కణము నందు గాలి సంక్లిష్టాన్ని పరిశీలించినవాడు కామిల్లో గాల్లి.

ప్రశ్న 36.
గాల్జిసంక్లిష్టం విధి ఏమిటి?
జవాబు:
గాల్జి సంక్లిష్టాలు వివిధ రకాల పదార్థాలను కణంలోని ఇతర భాగాలకు రవాణా చేసే ముందు తమలో నిల్వ చేసుకొని కొంత మార్పు చెందిస్తాయి.

ప్రశ్న 37.
గాల్జి సంక్లిష్టాలు ఎక్కువ సంఖ్యలో ఉండే కణాలు?
జవాబు:
గాల్జి సంక్లిష్టాలు ఎక్కువ సంఖ్యలో ఉండే కణాలు ఎంజైమ్ లేదా హార్మోన్లను స్రవించే కణాలు.

ప్రశ్న 38.
లైసోజోమ్ లను స్వయం విచ్ఛిత్తి సంచులు అని ఎందుకు అంటారు?
జవాబు:
వినాశనం కావలసిన పదార్థాలు లైసోజోమ్స్ కు రవాణా చేయబడతాయి. లైసోజోమ్స్ పగిలి అందులోని ఎంజైమ్స్ విడుదలై వాటిని నాశనం చేస్తాయి. అందువలన లైసోజోమ్ లను స్వయం విచ్చిత్తి సంచులు అంటారు.

ప్రశ్న 39.
జానస్ గ్రీన్-బి ద్రావణంతో రంజనం చేసినపుదు కనబడే కణాంగం?
జవాబు:
జానస్ గ్రీన్-బి ద్రావణంతో రంజనం చేసినపుడు కనబడే కణాంగం మైటోకాండ్రియా.

ప్రశ్న 40.
మైటోకాండ్రియా పొడవు, వ్యాసం ఎంత ఉంటాయి?
జవాబు:
మైటోకాండ్రియా పొడవు 2-8 మైక్రాన్లు మరియు 0.5 మైక్రాన్ల వ్యాసం కలిగి ఉంటాయి.

ప్రశ్న 41.
కేంద్రకం కంటే 150 రెట్లు చిన్నదైన కణాంగం?
జవాబు:
కేంద్రకం కంటే 150 రెట్లు చిన్నదైన కణాంగం మైటోకాండ్రియా.

ప్రశ్న 42.
ప్రతి కణంలో ఉండే మైటోకాండ్రియాల సంఖ్య?
జవాబు:
ప్రతి కణంలో 100-150 మైటోకాండ్రియాలు ఉంటాయి.

ప్రశ్న 43.
క్రిస్టే అనగానేమి?
జవాబు:
మైటోకాండ్రియా అంతరత్వచం లోపలికి చొచ్చుకొని ముడతలు పడిన నిర్మాణాలను ఏర్పరుస్తుంది. ఈ నిర్మాణాలను క్రిస్టే అంటారు.

ప్రశ్న 44.
మైటోకాండ్రియా క్రిస్టే మధ్య గల ఖాళీ ప్రదేశాన్ని ఏమంటారు?
జవాబు:
మైటోకాండ్రియా క్రిస్టే మధ్య గల ఖాళీ ప్రదేశాన్ని మాత్రిక అంటారు.

ప్రశ్న 45.
మైటోకాండ్రియాలను కణ శక్త్యాగారాలు అని ఎందుకు అంటారు?
జవాబు:
కణానికి కావల్సిన శక్తిని ఉత్పత్తి చేసే కణ శ్వాసక్రియ మైటోకాండ్రియాలో జరుగుతుంది. కాబట్టి మైటోకాండ్రియాలను ‘కణ శక్త్యాగారాలు’ అంటారు.

ప్రశ్న 46.
హరితరేణువులు ఆకుపచ్చగా ఎందుకు ఉంటాయి?
జవాబు:
పత్రహరితం ఉండుట వలన హరితరేణువులు ఆకుపచ్చగా ఉంటాయి.

ప్రశ్న 47.
ప్లాస్టిడ్లు ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
ప్లాస్టిడ్లు రెండు రకాలు. అవి : 1. క్రోమోప్లాన్లు మరియు 2. ల్యూకోప్లాస్టు

ప్రశ్న 48.
మొక్కలలో హరితరేణువుల వ్యాసం ఎంత?
జవాబు:
మొక్కలలో హరితరేణువుల వ్యాసం 4-10 మైక్రాన్లు.

ప్రశ్న 49.
క్లోరోప్లాస్ట్ ముఖ్యమైన విధి ఏది?
జవాబు:
కిరణజన్య సంయోగక్రియలో సూర్యకాంతిలోని సౌరశక్తిని గ్రహించి రసాయనిక శక్తిగా క్లోరోప్లాస్ట్ మార్చుతుంది.

ప్రశ్న 50.
కిరణజన్య సంయోగక్రియలో పాల్గొనే కణాలలో క్లోరోప్లాన్ల సంఖ్య?
జవాబు:
కిరణజన్య సంయోగక్రియలో పాల్గొనే కణాలలో క్లోరోప్లాస్ట సంఖ్య 50-200.

ప్రశ్న 51.
కణసిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు?
జవాబు:
కణసిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు మాధియస్ జాకబ్ ప్లీడన్ మరియు థియోడర్ ష్వాన్.

ప్రశ్న 52.
కణాలు విభజన చెంది కొత్త కణాలు ఏర్పడతాయని 1855వ సంవత్సరంలో వివరించినవాడు?
జవాబు:
కణాలు విభజన చెంది కొత్త కణాలు ఏర్పడతాయని 1855వ సంవత్సరంలో వివరించినవాడు రోడాల్ఫ్ విర్కో

ప్రశ్న 53.
ఆధునీకరించిన కణసిద్ధాంతంలోని అంశాలు?
జవాబు:
ఆధునీకరించిన కణసిద్ధాంతంలోని అంశాలు :
1. జీవరాసులన్నీ కణాలు, వాటి ఉత్పన్నాలతో నిర్మించబడి ఉంటాయి.
2. కణాలన్నీ ముందుతరం కణాల నుండి ఏర్పడతాయి.

ప్రశ్న 54.
కణవ్యవస్థీకరణను ఎలా అభినందిస్తావు?
జవాబు:
జీవులలో కణము చక్కగా వ్యవస్థీకృతమైనది. కణము కణజాలముగాను, కణజాలములు అవయవముగాను, అవయవములు కలిసి అవయవ వ్యవస్థలుగాను, అవయవ వ్యవస్థలు జీవిగాను రూపొందినాయి.

ప్రశ్న 55.
భౌతిక మరియు రసాయనిక చర్యల వలన కణ వ్యవస్థీకరణం నాశనమైతే ఏమి జరుగుతుంది?
జవాబు:
భౌతిక మరియు రసాయనిక చర్యల వలన కణ వ్యవస్థ నాశనమైతే జీవక్రియల నిర్వహణ అనగా శ్వాసక్రియ, పోషణ, విసర్జన మొదలగు క్రియల నిర్వహణకు కణ సామర్థ్యము సక్రమముగా ఉండదు.

ప్రశ్న 56.
అతి సూక్ష్మకణం విధిని అతి పెద్దగా ఉండే జీవిలో ఏ విధంగా అభినందిస్తావు?
జవాబు:
జీవి యొక్క జీవక్రియలు ఆ జీవిలోని కణములు నిర్వహించే విధుల మీద ఆధారపడి ఉంటాయి. కనుక అతిపెద్ద జీవి సక్రమముగా విధులను నిర్వహించుటకు కారణము ఆ జీవిలోని అతిచిన్న కణములు సక్రమముగా విధులు నిర్వహించడమే.

ప్రశ్న 57.
మొక్క కణము నందు ఉండే హరితరేణువు యొక్క పాత్రను ఏ విధంగా అభినందిస్తావు?
జవాబు:
హరితరేణువు లేకపోతే మొక్క ఆకులలో ఆహారము తయారు కాదు. తద్వారా సమస్త జీవులకు ఆహారం లభ్యమయ్యేది కాదు.

ప్రశ్న 58.
కొత్త కణాలు పాత కణాల నుండి ఏర్పడతాయన్న భావననను నీకు ఏ విధంగా అన్వయించుకుంటావు?
జవాబు:
కొత్త కణాలు పాత కణాల నుండి ఏర్పడడం వలనే పెరుగుదల, అభివృద్ధి జరుగుతుంది.

AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు

ప్రశ్న 59.
రంగు రంగుల పండ్లు, పూలకు కారణము ఏమిటి?
జవాబు:
రంగు రంగుల పండ్లు, పూలకు మొక్కలలో మాత్రమే ఉండు క్రోమోప్లాస్టులు కారణం.

ప్రశ్న 60.
కణము నందు లైసోజోములు లేకపోయినట్లయితే ఏమి జరుగును?
జవాబు:
వ్యర్థ పదార్థములు కణమునందు ఎక్కువ మొత్తంలో నిల్వ ఉంటాయి. కణము నందు లైసోజోములు లేకపోయినట్లయితే తద్వారా కణము తన విధిని సక్రమముగా నిర్వహించలేదు.

9th Class Biology 1st Lesson కణ నిర్మాణం – విధులు 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
టమాటాలో కింది రంగు మారడానికి కారణము ఏమనుకుంటున్నారు?
పచ్చని రంగు – తెలుపు – పసుపు – ఎరుపు
జవాబు:

  1. టమాటా నందు రంగు మారటానికి ప్లాస్టిడ్లు కారణం.
  2. ప్లాస్టిడ్లు ప్రధానంగా రెండు రకాలు. అవి : 1) క్రోమోప్లాస్టులు (రంగు గలవి) 2) ల్యూకోప్లాస్టులు (రంగులేనివి).
  3. క్లోరోప్లాస్టులు ఆకుపచ్చ రంగు గల క్రోమోప్లాస్టులు.
  4. క్రోమోప్లాస్టులు, క్లోరోప్లాస్టులు, ల్యూకోప్లాస్టులు ఒక రంగు నుండి మరియొక రంగునకు మారగల శక్తి కలిగి ఉంటాయి.
  5. లేత టమాటా పరిపక్వం చెందే క్రమంలో మనము ఆకుపచ్చ, తెలుపు, పసుపుపచ్చ మరియు ఎరుపురంగు గల టమాటాలను చూస్తాము.

ప్రశ్న 2.
సూక్ష్మదర్శిని సహాయముతో కింద ఇవ్వబడిన సైడులను పరిశీలించి బొమ్మలు గీయండి. వాటిలో గల వివిధ కణాంగములను రాయండి.
జవాబు:
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 1
A) పారమీసియమ్ నందుగల కణాంగములు :
పూర్వ మరియు పర సంకోచ రిక్తికలు, సూక్ష్మ కేంద్రకము, స్థూలకేంద్రకము, సైటోసోమ్, సైటో పైజ్, ఆహారరిక్తిక మొదలగునవి.

B) అమీబాలోని కణాంగములు :
కేంద్రకము, సంకోచరిక్తికలు, ఆహారరిక్తికలు.

C) యూగ్లీనాలోని కణాంగములు :
కేంద్రకము, క్లోరోప్లాస్టులు, సంకోచరిక్తికలు, రిజర్వాయర్, పారప్లాజెల్లార్ దేహము, ఎండోసోమ్ మొదలగునవి.

ప్రశ్న 3.
నమూనా వృక్ష కణం పటము గీచి, భాగములను గుర్తించుము.
జవాబు:
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 2

ప్రశ్న 4.
రైబోజోమ్స్ గురించి రాయండి.
జవాబు:

  1. కణంలోని కణద్రవ్యంలో చిన్నవిగా రేణువుల రూపంలో కనబడే నిర్మాణాలను రైబోజోమ్స్ అంటారు.
  2. ఇవి ఆర్.ఎన్.ఎ. మరియు ప్రోటీన్లతో ఏర్పడతాయి.
  3. ఇవి రెండు రకాలు. కొన్ని కణద్రవ్యంలో స్వేచ్ఛగా చలించే రేణువుల రూపంలో ఉంటాయి.
  4. రైబోజోములలో ప్రోటీన్ సంశ్లేషణ జరుగుతుంది.

9th Class Biology 1st Lesson కణ నిర్మాణం – విధులు 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
కణజీవశాస్త్ర అభివృద్ధికి కృషి చేసిన శాస్త్రవేత్తల చిత్రములను సేకరించుము. వారిని గురించి సంక్షిప్తముగా వివరింపుము.
జవాబు:
1) ఆ వాన్ లీవెన్‌హక్ 2) రాబర్ట్ హుక్ 3) రాబర్ట్ బ్రౌన్ 4) రుడాల్ఫ్ విర్కొన్ 5) బ్లేడన్ 6) ష్వాన్ 7) ఎర్నెస్ట్ రుస్కా 8) వాట్సన్ మరియు క్రిక్ 9) లిన్ మారులిస్ 10) ఆల్బర్ట్ క్లాడె
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 3

  1. 1632-1723. ఆస్టవాన్ లీవెన్‌హక్ సాధారణ సూక్ష్మదర్శినిని నిర్మించి దాని సహాయముతో నీటిలో ఉండే ప్రోటోజోవా, వర్టిసెల్లా మరియు నోటిలో ఉండే బాక్టీరియా బొమ్మలను గీచెను.
  2. 1665-ప్రాథమిక సంయుక్త సూక్ష్మదర్శినిని ఉపయోగించి బెండు ముక్కనందు సజీవ మొక్క కణజాలమునందలి కణములను కనుగొనెను.
  3. 1831-రాబర్ట్ బ్రౌన్ కేంద్రకమును కనుగొనెను.
  4. 1838-39-థియొడర్ ష్వాన్ మరియు M.J. ఫ్రీడన్ కణసిద్ధాంతమును ప్రతిపాదించిరి.
  5. 1885 రుడాల్స్ విర్కొవ్ కణవిభజనను కనుగొనెను.
  6. 1931-ఎర్నెస్ రుస్కా మొట్టమొదటి ఎలక్ట్రాను మైక్రోస్కోపును నిర్మించెను.
  7. 1953-వాట్సన్ మరియు క్రిస్టు DNA ద్వికుండలి నిర్మాణమును ప్రకటించెను.
  8. 1974-కణజీవశాస్త్ర పితామహుడైన ఆల్బర్ట్ క్లాడెనకు శరీర ధర్మశాస్త్రము (మెడిసిన్) నందు నోబెల్ బహుమతి వచ్చినది.
  9. 1981- కణపరిణామము నందు ఎండోసింబయాటిక్ సిద్ధాంతమును లిన్ మారులిస్ ప్రచురించెను.

ప్రశ్న 2.
ప్లాస్టిడ్ల గురించి రాయండి.
జవాబు:

  1. ప్లాస్టిడ్లు మొక్క కణములలో మాత్రమే ఉంటాయి.
  2. ప్లాస్టిడ్లు ప్రధానంగా రెండు రకములు. 1) క్రోమోప్లాస్టులు (రంగు గలవి) మరియు 2) ల్యూకోప్లాస్టులు (రంగులేనివి).
  3. హరిత రేణువులు (క్లోరోప్లాస్టులు) ఒక రకమైన ఆకుపచ్చ రంగులో ఉండే ప్లాస్టిడ్లు.
  4. కిరణజన్య సంయోగక్రియలో సూర్యకాంతిలోని సౌరశక్తిని గ్రహించి రసాయనశక్తిగా మార్చడమే క్లోరోప్లాస్టుల ముఖ్య విధి
  5. క్రోమోప్లాస్టులు రకరకాల పూలు మరియు పండ్ల రంగులకు కారణము.
  6. ల్యూకోప్లాస్టులు పిండిపదార్థాలను, నూనెలను మరియు ప్రోటీనులను నిల్వ చేస్తాయి.

ప్రశ్న 3.
అంతర్జీవ ద్రవ్యజాలము గురించి వివరించండి.
జవాబు:

  1. కణద్రవ్యంలో వ్యాపించి ఉన్న వల వంటి నిర్మాణము అంతర్జీవ ద్రవ్యజాలము.
  2. దీని ద్వారా కణములో ఒక భాగం నుండి మరియొక భాగానికి పదార్థాల రవాణా జరుగుతుంది.
  3. అంతర్జీవ ద్రవ్యజాలం రెండు రకములు.
    1) గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం 2) నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం.
  4. రైబోజోములు కలిగిన గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ప్రోటీనుల సంశ్లేషణకు సహాయపడుతుంది.
  5. రైబోజోములు లేని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం లిపిడ్ల సంశ్లేషణకు ఉపయోగపడుతుంది.
  6. కణంలో జరిగే కొన్ని జీవ రసాయన చర్యలకు అంతర్జీవ ద్రవ్యజాలం వేదికగా పనిచేస్తుంది.

ప్రశ్న 4.
ప్లాస్మాపొరకు, కణత్వచమునకు మధ్యగల భేదాలు రాయండి.
జవాబు:

ప్లాస్మా పొరకణత్వచము
1. ప్రోటీనులు మరియు లిపితో తయారయినది.1. సెల్యులోజ్ తో తయారయినది.
2. సజీవమైనది.2. నిర్జీవమైనది.
3. మొక్క మరియు జంతు కణములలో ఉండును.3. కేవలం మొక్క కణములలో ఉంటుంది.
4. విచక్షణ త్వచంగా పనిచేస్తుంది.4. విచక్షణ త్వచంగా పనిచేయదు.

5. ఈ క్రింది పటములు గీచి, భాగములను గుర్తించండి.
1) కేంద్రకం :
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 4
2) అంతర్జీవ ద్రవ్యజాలం :
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 5
3) మైటోకాండ్రియా :
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 6
4) హరితరేణువు :
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 7

9th Class Biology 1st Lesson కణ నిర్మాణం – విధులు Important Questions and Answers

ప్రశ్న 1.
నిజకేంద్రక కణాలలో మైటోకాండ్రియా లేకపోతే ఏమవుతుంది?
జవాబు:
కణంలో జరిగే జీవక్రియలకు కావలసిన శక్తి విడుదల జరగదు. అందువల్ల జీవక్రియలు ఆగిపోతాయి కణం మరణిస్తుంది.

ప్రశ్న 2.
జీవపదార్థం, కణ ద్రవ్యముల మధ్య భేదం ఏమిటి?
జవాబు:
చాలాకాలం వరకు కణంలో ఉండే ద్రవ్యం జీవాన్ని కలిగి ఉంటుందని నమ్మేవారు తరువాత జీవపదార్థం అనేది ఒక మాధ్యమం అని దానిలో కణాంగాలు, రేణువులు ఉంటాయని కనుగొన్నారు.

కేంద్రకత్వచం బయట ఉన్న జీవ పదార్థాన్ని కణద్రవ్యం అని, కేంద్రకంలోని జీవపదార్థాన్ని కేంద్రక రసం లేక ద్రవ్యమని అంటున్నారు.

ప్రశ్న 3.
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 9
ఎ) పై పటంను గుర్తించి భాగమలు రాయుము.
బి) పై పటంను గురించి క్లుప్తంగా వివరించుము.
జవాబు:
ఎ) 1) మాత్రిక,
2) క్రిస్టే,
3) లోపలిపొర,
4) బయటి పొర

బి) 1) పై పటం చూపబడిన కణాంగము మైటోకాండ్రియా
2) ఇది కణశ్వాసక్రియలోను నిర్వహించి శక్తి విడుదలకు తోడ్పడుతుంది.
3) వీటిని కణశక్యాగారాలు అంటారు.
4) ఇది వెలుపలి త్వచం మరియు లోపలి త్వచయులచే కప్పబడి ఉంటుంది. లోపల అనేక ముడుతలతో కూడిన నిర్మాణం ఉంటుంది. దీనిని మాత్రిక అంటారు. మాత్రికలో వేళ్ళ వంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిని క్రిస్టే అంటారు.

ప్రశ్న 4.
కింది కణాంగాలు నిర్వహించే విధులు రాయండి.
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 10
జవాబు:

  1. మైటోకాండ్రియా – కణ శ్వాసక్రియలో పాల్గొంటుంది. శక్తి విడుదలకు తోడ్పడుతుంది.
  2. హరితరేణువు – సూర్యకాంతిని గ్రహించి కిరణజన్యసంయోగక్రియ జరిపి మొక్కలలో ఆహారాన్ని తయారుచేస్తుంది.

9th Class Biology 1st Lesson కణ నిర్మాణం – విధులు 1 Mark Bits Questions and Answers

లక్ష్యాత్మక నియోజనము

1. కణములను ప్రథమముగా దీనితో పరిశీలిస్తారు.
A) ఆప్టికల్ మైక్రోస్కోపు
B) సంయుక్త సూక్ష్మదర్శిని
C) ఎలక్ట్రాను మైక్రోస్కోపు
D) ఏదీకాదు
జవాబు:
A) ఆప్టికల్ మైక్రోస్కోపు

2. జంతుకణము వెలుపల ఉన్న పొర
A) కణకవచము
B) కణత్వచం
C) కేంద్రకత్వచము
D) కేంద్రకాంశత్వచము
జవాబు:
B) కణత్వచం

AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు

3. ప్లాస్మాపొర లేదా కణత్వచం దేనితో నిర్మితమైంది?
A) లిపిడ్లు
B) ప్రోటీనులు
C) లిపిడ్లు మరియు ప్రోటీనులు
D) సెల్యులోజ్
జవాబు:
C) లిపిడ్లు మరియు ప్రోటీనులు

4. విచక్షణ త్వచంను గుర్తించండి.
A) కణకవచము
B) కణత్వచము
C) టోనోప్లాస్ట్
D) కేంద్రక త్వచము
జవాబు:
B) కణత్వచము

5. కణకవచము వీటిలో ఉంటుంది.
A) జంతువులు
B) మనుష్యులు
C) మొక్కలు
D) జంతుప్లవకాలు
జవాబు:
C) మొక్కలు

6. న్యూక్లియసను కనుగొన్నది
A) రాబర్ట్ హుక్
B) రాబర్ట్ బ్రౌన్
C) రుడాల్ఫ్ విర్కొవ్
D) ష్వాన్
జవాబు:
B) రాబర్ట్ బ్రౌన్

7. కణము నియంత్రణ గదిగా పనిచేయునది
A) కణత్వచము
B) కేంద్రకము
C) మైటోకాండ్రియా
D) కేంద్రకాంశము
జవాబు:
B) కేంద్రకము

8. కణములో ఈ భాగము జన్యుసమాచారము కలిగి ఉంటుంది.
A) కేంద్రకము
B) కేంద్రకాంశము
C) రైబోజోములు
D) గాల్టీ సంక్లిష్టము
జవాబు:
A) కేంద్రకము

9. కేంద్రక పూర్వ కణమును గుర్తించుము.
A) బాక్టీరియమ్
B) సయానో బాక్టీరియా
C) పారమీసియమ్
D) బాక్టీరియమ్ మరియు సయానో బాక్టీరియా
జవాబు:
A) బాక్టీరియమ్

10. కణాంతర రవాణాలో పాల్గొనునది
A) అంతర్జీవ ద్రవ్యజాలం
B) లైసోజోమ్ లు
C) గాల్జీ సంక్లిష్టము
D) రైబోజోములు
జవాబు:
A) అంతర్జీవ ద్రవ్యజాలం

11. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము వీటి తయారీకి సహాయపడుతుంది.
A) ప్రోటీనులు
B) లిపిడ్లు
C) పిండిపదార్థములు
D) విటమినులు
జవాబు:
B) లిపిడ్లు

12. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము వీటి తయారీకి సహాయపడుతుంది.
A) ప్రోటీనులు
B) పిండిపదార్థాలు
C) లిపిడ్లు
D) విటమినులు
జవాబు:
C) లిపిడ్లు

13. సకశేరుక కాలేయ కణములందు విషములను మరియు మందులను విషరహితముగా చేయు కణాంగము
A) నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము
B) గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము
C) లైసోజోములు
D) రిక్తికలు
జవాబు:
A) నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము

14. స్వయం విచ్ఛిత్తి సంచులని వీటిని అంటారు.
A) లైసోజోములు
B) రైబోజోములు
C) న్యూక్లియోజోమ్
D) గాల్టీ సంక్లిష్టము
జవాబు:
A) లైసోజోములు

15. ప్రతి కణమునందు ఉండు మైటోకాండ్రియాల సంఖ్య
A) 100 – 200
B) 150 – 300
C) 100 – 150
D) 100 – 300
జవాబు:
C) 100 – 150

16. కణ శక్త్యాగారాలు అని వీటిని అంటారు.
A) లెసోజోములు
B) మెటోకాండియా
C) రైబోజోములు
D) రిక్తికలు
జవాబు:
B) మెటోకాండియా

17. క్లోరోప్లాస్టులు పాల్గొను జీవక్రియ
A) శ్వాసక్రియ
B) కిరణజన్య సంయోగక్రియ
C) పోషణ
D) రవాణా
జవాబు:
B) కిరణజన్య సంయోగక్రియ

18. కణసిద్ధాంతమును ప్రతిపాదించినవారు
A) ప్లీడన్
B) ష్వాన్
C) ప్లీడన్ మరియు ష్వాన్
D) రుడాల్ఫ్ విర్కొవ్
జవాబు:
C) ప్లీడన్ మరియు ష్వాన్

19. కణవిభజనను మొదటగా గుర్తించినవాడు
A) రుడాల్ఫ్ విర్కొవ్
B) రాబర్ట్ హుక్
C) హూగో డివైస్
D) రాబర్ట్ బ్రౌన్
జవాబు:
A) రుడాల్ఫ్ విర్కొవ్

20. కేంద్రకము లోపల ఉన్న ద్రవపదార్ధము
A) కేంద్రకాంశ పదార్థము
B) కణద్రవ్యము
C) జీవపదార్ధము
D) జర్మ్ ప్లాన్స్
జవాబు:
A) కేంద్రకాంశ పదార్థము

21. జంతు కణంలో కనిపించే కణాంగం
A) హరితరేణువులు
B) రిక్తికలు
C) కణకవచం
D) మైటోకాండ్రియా
జవాబు:
D) మైటోకాండ్రియా

22. కణం యొక్క సమతాస్థితి నిర్వహణలో ప్రధాన పాత్ర నిర్వహించునది
A) కణకవచం
B) ప్లాస్మాపొర
C) కణద్రవ్యం
D) కేంద్రకం
జవాబు:
B) ప్లాస్మాపొర

23. ప్లాస్మాపొర ద్వారా
A) అన్ని పదార్థాల ప్రసరణ జరుగుతుంది.
B) ద్రవ పదార్థాల ప్రసరణ మాత్రమే జరుగుతుంది.
C) కొన్ని పదార్థాల ప్రసరణ మాత్రమే జరుగుతుంది.
D) గ్లూకోజ్ ప్రసరణ మాత్రమే జరుగుతుంది.
జవాబు:
C) కొన్ని పదార్థాల ప్రసరణ మాత్రమే జరుగుతుంది.

24. ప్లాస్మాపొర ………..
A) ఒక విచక్షణా త్వచం
B) భేదక పారగమ్య త్వచం
C) పారగమ్య త్వచం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

25. కణకవచం కల్గించే పీడనం
A) బాహ్యపీడనం
B) అంతరపీడనం
C) స్ఫీతపీడనం
D) పైవేవీ కావు
జవాబు:
B) అంతరపీడనం

26. కేంద్రకాన్ని కనుగొన్నది
A) రాబర్ట్ హుక్
B) రాబర్ట్ బ్రౌన్
C) ప్లీడన్
D) ష్వాన్
జవాబు:
B) రాబర్ట్ బ్రౌన్

27. ప్లీషన్ కేంద్రకానికి ఈ విధంగా పేరు పెట్టాడు.
A) సైటోబ్లాస్ట్
B) ఫైటోబ్లాస్ట్
C) క్లోరోప్లాస్ట్
D) న్యూక్లియోబ్లాస్ట్
జవాబు:
A) సైటోబ్లాస్ట్

AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు

28. అభివృద్ధి చెందిన ఈ కణాలలో కేంద్రకం ఉండదు.
A) చాలనీకణాలు
B) చాలనీనాళాలు
C) సహకణాలు
D) తంతువులు
జవాబు:
B) చాలనీనాళాలు

29. క్షీరదాలలో ఈ కణాలలో కేంద్రకం కనిపించదు.
A) కండరకణం
B) నాడీకణం
C) తెల్లరక్త కణం
D) ఎర్రరక్త కణం
జవాబు:
D) ఎర్రరక్త కణం

30. కణాలను దేనిని ఆధారం చేసుకుని విభజించారు?
A) కణకవచం
B) కణత్వచం
C) కేంద్రకత్వచం
D) మైటోకాండ్రియా
జవాబు:
C) కేంద్రకత్వచం

31. ఈ క్రింది వానిలో కేంద్రక పూర్వ కణం
A) రక్తకణం
B) బాక్టీరియాకణం
C) సయానోబాక్టీరియా
D) B & C
జవాబు:
D) B & C

32. కేంద్రక పూర్వ కణంలో
A) కేంద్రకం ఉండదు
B) కేంద్రకత్వచం ఉండదు
C) త్వచం కల్గిన కణాంగాలుండవు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

33. రైబోజోమ్ లు ఎక్కడ ఉంటాయి?
A) గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం
B) నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం
C) గాల్జీ సంక్లిష్టం
D) మైటోకాండ్రియా
జవాబు:
A) గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం

34. ఈ క్రింది వానిలో అసత్య వాక్యం
A) గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం కార్బోహైడ్రేట్లను సంశ్లేషణం చేస్తుంది.
B) నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం లిపిడ్లను సంశ్లేషణం చేస్తుంది.
C) అంతర్జీవ ద్రవ్యజాలం రవాణా మార్గంగా పనిచేస్తుంది.
D) సకశేరుకాల కాలేయ కణాల నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేక విషపదార్థాలను నిర్వీర్యం చేస్తుంది.
జవాబు:
A) గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం కార్బోహైడ్రేట్లను సంశ్లేషణం చేస్తుంది.

35. ఈ క్రింది వానిలో గాల్జీ సంక్లిష్టానికి సంబంధించిన అసత్య వాక్యం
A) 1898వ సం||లో కెమిల్లో గాల్టీ గాల్టీ సంక్లిష్టాన్ని కనుగొన్నాడు.
B) ఈ కణాంగాలు త్వచాలతో నిర్మితమవుతాయి.
C) పదార్థాలను రవాణా చేసేముందు తమలో నిల్వ చేసుకుంటాయి.
D) ఎంజైము, హార్మోనులను స్రవించే కణాలలో ఇవి తక్కువ సంఖ్యలో ఉంటాయి.
జవాబు:
D) ఎంజైము, హార్మోనులను స్రవించే కణాలలో ఇవి తక్కువ సంఖ్యలో ఉంటాయి.

AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు

36. ఈ క్రింది వానిలో రెండు త్వచాలు కల్గిన కణాంగం
A) గాల్జీ సంక్లిష్టం
B) అంతర్జీవ ద్రవ్యజాలం
C) మైటోకాండ్రియా
D) లైసోజోమ్ లు
జవాబు:
C) మైటోకాండ్రియా

37. ఈ క్రింది వానిలో త్వచం లేని కణాంగం
A) రైబోజోమ్ లు
B) లైసోజోమ్ లు
C) అంతర్జీవ ద్రవ్యజాలం
D) గాల్జీ సంక్లిష్టం
జవాబు:
A) రైబోజోమ్ లు

38. ఈ క్రింది వానిలో DNAను కల్గి ఉండునది
A) కేంద్రకం
B) హరితరేణువులు
C) మైటోకాండ్రియా
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

39. ఈ క్రింది వానిలో ఒకే త్వచం కల్గిన కణాంగం
A) లైసోజోమ్ లు
B) అంతర్జీవ ద్రవ్యజాలం
C) గాల్జీ సంక్లిష్టం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

40. మైటోకాండ్రియాలో మధ్యగల ఖాళీ ప్రదేశాన్నేమంటారు?
A) కణాంతర ప్రదేశం
B) కణ మధ్య ప్రదేశం
C) క్రిస్టే
D) మాత్రిక
జవాబు:
D) మాత్రిక

41. రైబోజోములు వీటితో నిర్మించబడతాయి.
A) RNA మరియు ప్రోటీన్లు
B) DNA మరియు ప్రోటీన్లు
C) RNA మరియు DNA
D) ప్రోటీన్లు మరియు లిపిడ్లు
జవాబు:
A) RNA మరియు ప్రోటీన్లు

42. పూలల్లో ఇవి ఉంటాయి.
A) క్లోరోప్లాస్టు
B) ల్యూకోప్లాస్టు
C) క్రోమోప్లాన్లు
D) అల్యూరో ప్లాస్టు
జవాబు:
C) క్రోమోప్లాన్లు

49. ఈ క్రింది వానిలో సౌరశక్తిని గ్రహించి రసాయన శక్తిగా మార్చేది
A) మైటోకాండ్రియా
B) హరితరేణువు
C) గాల్టీ సంక్లిష్టం
D) రైబోజోమ్ లు
జవాబు:
B) హరితరేణువు

44. కిరణజన్య సంయోగక్రియ జరిగే కణాలలో క్లోరోప్లాస్ట్‌ల సంఖ్య సుమారు
A) 50 – 100
B) 50 – 150
C) 50 – 200
D) 50 – 250
జవాబు:
C) 50 – 200

45. కణంలో కుడ్యపీడనాన్ని నియంత్రించి వ్యర్థాలను బయటకు పంపే నిర్మాణాలు
A) ప్లాస్టిడ్లు
B) లైసోజోమ్ లు
C) గాల్జీ సంక్లిష్టం
D) రిక్తిక
జవాబు:
D) రిక్తిక

46. టోనోప్లాస్ట్ దీనిని కప్పి ఉంచే పొర.
A) కేంద్రకం
B) రైబోజోమ్ లు
C) రిక్తిక
D) మైటోకాండ్రియా
జవాబు:
C) రిక్తిక

47. కణాన్ని మొట్ట మొదటిసారిగా పరిశీలించినది
A) రాబర్ట్ హుక్
B) రాబర్ట్ బ్రౌన్
C) రుడాల్ఫ్ విర్కోవ్
D) మార్సెల్లో మాల్ఫీజి
జవాబు:
A) రాబర్ట్ హుక్

48. దీనిని జీవుల యొక్క క్రియాత్మక, నిర్మాణాత్మక ప్రమాణమంటారు.
A) కణజాలం
B) కణం
C) కండరం
D) ఎముక
జవాబు:
B) కణం

AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు

49. ఈ క్రింది ప్రవచనాలను చదవండి.
a) ప్లాస్టిర్లు వృక్షములలో మాత్రమే ఉంటాయి.
b) లైసోజోమ్స్ లో వినాశకరంకాని ఎంజైమ్స్ ఉంటాయి.
A) a మరియు b లు రెండూ సత్యమే
B) a సత్యము మరియు b అసత్యము
C) b సత్యము మరియు a అసత్యము
D) a మరియు b లు రెండూ అసత్యమే
జవాబు:
A) a మరియు b లు రెండూ సత్యమే

50. క్రింది ప్రవచనాలను చదవండి.
a) గరుకుతలం గల అంతర్జీవ ద్రవ్యజాలం ప్రోటీన్ల సంశ్లేషణకు తోడ్పడుతుంది.
b) రాబర్ట్ బ్రౌన్ 1835లో కేంద్రకాన్ని కనుగొన్నాడు.
A) a మరియు b లు రెండూ సత్యమే
B) a సత్యము మరియు b అసత్యము
C) b సత్యము మరియు a అసత్యము
D) a మరియు bలు రెండూ అసత్యమే
జవాబు:
B) a సత్యము మరియు b అసత్యము

51. సరిగా జతపరచబడిన జతను కనుగొనండి.
a) పత్రరంధ్రాలు – వాయువుల మార్పిడి
b) ల్యూకోప్లాస్టు – పిండి పదార్థాల నిల్వ
c) గాల్జీ సంక్లిష్ట పదార్థం – ప్రొటీన్ల నిల్వ
A) a మరియు b
B) b మరియు c
C) a మాత్రమే
D) b మాత్రమే
జవాబు:
D) b మాత్రమే

52. క్రింది ప్రవచనాలను చదవండి.
a) కణ కవచము సెల్యులోజ్ తో నిర్మితమై, నిష్క్రియాత్మకంగా ఉంటుంది.
b) ప్లాస్మాపొర ప్రొటీన్లు, లిపిడ్లతో నిర్మితమై యుండి, క్రియాత్మకంగా ఉంటుంది.
A) a, bలు రెండూ సత్యమే
B) a, b లు రెండూ అసత్యము
C) a అసత్యము b సత్యము
D) b అసత్యము a సత్యము
జవాబు:
C) a అసత్యము b సత్యము

53. క్లోరోప్లాస్లు ఎక్కువగా కలిగిన మొక్కలు
A) ఆల్గే
B) ఫంగి
C) బాక్టీరియా
D) ఏదీకాదు
జవాబు:
A) ఆల్గే

54. రియోపత్రంలోని కణాల అమరిక
A) వృత్తాకారంగా
B) వరుసలలో
C) క్రమరహితంగా
D) లంబాకారంగా
జవాబు:
A) వృత్తాకారంగా

55. బుగ్గ కణాల మధ్య భాగంలో కనబడే భాగం
A) మైటోకాండ్రియా
B) గాల్టీ
C) కేంద్రకం
D) రైబోజోములు
జవాబు:
C) కేంద్రకం

56. బుగ్గ కణాలలో కేంద్రకాన్ని పరిశీలించడానికి ఉపయోగించే రంజకము
A) సాఫనిన్
B) మిథైల్ బ్లూ
C) నల్ల రంజకం
D) పైవన్నియూ
జవాబు:
D) పైవన్నియూ

AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు

57. మైటోకాండ్రియాను, సూక్ష్మదర్శిని క్రింద పరిశీలించునపుడు ఉపయోగించే ద్రావణం
A) జానస్ గ్రీన్-బి
B) సాఫ్రనిన్
C) గ్లిజరిన్
D) మిథైల్ బ్లూ
జవాబు:
A) జానస్ గ్రీన్-బి

58. కేంద్రకాన్ని పరిశీలించడానికి మీ తరగతి గదిలో వాడేరంజకము
A) ఫినాఫ్తలీన్
B) మిథైల్ బ్లూ
C) ఆల్కహాల్
D) గ్లిజరిన్
జవాబు:
B) మిథైల్ బ్లూ

59. ఎర్ర రక్తకణాల జీవిత కాలం తక్కువగా ఉండటానికి గల కారణం
A) హిమోగ్లోబిన్ ఉండటం వలన
B) కేంద్రకం ఉండటం వలన
C) కేంద్రకం లేకపోవటం వలన
D) కేంద్రకాంశం ఉండటం వలన
D) పైవేవీ కావు
జవాబు:
C) కేంద్రకం లేకపోవటం వలన

60. వివిధ రకాల పదార్థాలు కణం యొక్క ఈ భాగంలో నిల్వ ఉంటాయి.
A) కేంద్రకం
B) మైటోకాండ్రియా
C) గాల్జీ సంక్లిష్టం
D) ప్లాస్టిట్లు
జవాబు:
C) గాల్జీ సంక్లిష్టం

61. శక్తిని ఉత్పత్తి చేసి, నిల్వచేసే కణాంగము
A) గాల్టీ సంక్లిష్టం
B) మైటోకాండ్రియా
C) కేంద్రకం
D) ప్లాస్టిడ్లు
జవాబు:
B) మైటోకాండ్రియా

62. టమోటాలలో రంగు మార్పులకు (ఆకుపచ్చ – తెలుపు – పసుపు – ఎరుపు) కారణమైనది
A) అంతర్జీవ ద్రవ్యజాలం
B) ప్లాస్టిడ్లు
C) కేంద్రకము
D) కణత్వచము
జవాబు:
B) ప్లాస్టిడ్లు

63. కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు
a) మాథియస్ జాకబ్ ప్లీడన్
b) థియోడర్ ష్వాన్
c) రూడాల్ఫ్ విర్కోవ్
A) a మరియు b
B) b మరియు c
C) a మరియు c
D) a, b మరియు c
జవాబు:
A) a మరియు b

64. పటంలో గుర్తించిన భాగం
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 11
A) హరితరేణువు
B) రంధ్రము
C) కేంద్రకము
D) రక్షక కణం
జవాబు:
D) రక్షక కణం

65. ఇచ్చిన చిత్రం పేరు
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 12
A) జంతు కణం
B) వృక్ష కణం
C) హరితరేణువు
D) అంతర్జీవ ద్రవ్యజాలం
జవాబు:
A) జంతు కణం

66. పటంలో సూచించిన కణాంగము పేరు
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 13
A) మైటోకాండ్రియా
B) కేంద్రకం
C) గాల్టీ
D) హరితరేణువు
జవాబు:
D) హరితరేణువు

67. చిత్రంలో గుర్తించిన భాగం
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 14
A) కేంద్రకం
B) కేంద్రకాంశం
C) DNA
D) RNA
జవాబు:
B) కేంద్రకాంశం

68. పటంలో సూచించిన కణాంగం పేరు
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 15
A) హరితరేణువు
B) గాల్జీ సంక్లిష్టం
C) అంతర్జీవ ద్రవ్యజాలం
D) మైటోకాండ్రియా
జవాబు:
D) మైటోకాండ్రియా

69. ఈ కణాంగాన్ని గుర్తించండి.
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 16
A) గాల్జీ సంక్లిష్టం
B) అంతర్జీవ ద్రవ్యజాలం
C) లైసోసోమ్లు
D) కేంద్రకం
జవాబు:
A) గాల్జీ సంక్లిష్టం

70. ఈ కణాంగాన్ని గుర్తించండి.
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 17
A) గాలీ సంక్లిష్టం
B) అంతర్జీవ ద్రవ్యజాలం
C) లైసోసోమ్లు
D) కేంద్రకం
జవాబు:
B) అంతర్జీవ ద్రవ్యజాలం

71. సరియైన క్రమంలో అమర్చండి.
A) కణజాలం – జీవులు – అవయవము – అవయవ వ్యవస్థ – కణములు
B) జీవులు – అవయవము – అవయవ వ్యవస్థ – కణజాలం – కణములు
C) కణములు – కణజాలం – అవయవాలు – అవయవ వ్యవస్థ – జీవులు
D) పైవేవీ కావు
జవాబు:
C) కణములు – కణజాలం – అవయవాలు – అవయవ వ్యవస్థ – జీవులు

AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు

72. జీవులలో కణం ఒక
A) క్రియాత్మక ప్రమాణం
B) నిర్మాణాత్మక ప్రమాణం
C) స్వతంత్రంగా పనిచేసే నిర్మాణం
D) పైవన్నియూ
జవాబు:
D) పైవన్నియూ

73. నేను పత్రరంధ్రాలను అభినందిస్తాను. ఎందుకంటే అవి ఈ క్రియకు సహాయపడతాయి.
A) కిరణజన్య సంయోగక్రియ
B) శ్వాసక్రియ
C) బాష్పోత్సేకం
D) పైవన్నియూ
జవాబు:
D) పైవన్నియూ

74. వృక్షాలలో కణకవచం యొక్క విధి
A) క్రియాత్మకంగా ఉంటుంది
B) రక్షిస్తుంది
C) పీడనాన్ని కలిగిస్తుంది.
D) B మరియు C
జవాబు:
D) B మరియు C

75. శక్తిని విడుదల చేయు కణాంగం
A) లైసోజోమ్ లు
B) గాల్జి సంక్లిష్టం
C) అంతర్జీవ ద్రవ్యజాలకం
D) మైటోకాండ్రియా
జవాబు:
D) మైటోకాండ్రియా

76. మైక్రోస్కోప్ ని ఉపయోగించి వృక్ష కణంలో రిక్తికను పరిశీలించాలంటే నీవు చేసే పనులు క్రమాన్ని గుర్తించండి.
1) గాజు స్లెడ్ పై వుంచుట
2) రసభరితమైన మొక్క కాండమును సేకరించుట
3) సజల సాఫ్టనిస్ ద్రావణంతో రంజనం చేయుట
4) సన్నని పొరలుగా చేయుట
A) 2, 4, 3, 1
B) 1, 2, 3, 4
C) 2, 3, 4, 1
D) 4, 3, 1, 2
జవాబు:
A) 2, 4, 3, 1

77. కింది వాటిలో ఏ కణాంగంపై, జీవులన్నీ ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఆహారం కొరకు ఆధారపడుతాయి.
A) లైసోజోమ్స్
B) మైటోకాండ్రియా
C) రైబోజోమ్స్
D) హరితరేణువులు
జవాబు:
D) హరితరేణువులు

78. క్రింది వానిలో తప్పును గుర్తించండి.
i) ప్రతికణం అదే కణం నుంచి ఏర్పడును.
ii) రిక్తికలు కణశక్త్యాగారాలు
iii) కేంద్రక పూర్వక కణాలలో కేంద్రక త్వచం ఉంటుంది.
A) i, ii
B) ii, iii
C) i, ii, iii
D) i, iii
జవాబు:
B) ii, iii

79. స్వయంపోషకాల విషయంలో సరియైనది
A) సూర్యకాంతిని ఉపయోగించి యాంత్రిక శక్తిని పొందుతాయి
B) ఇతర జీవులలోని గ్లెకోజనను పోషకంగా తీసుకుంటాయి
C) సూర్యకాంతిని రసాయన శక్తిగా మార్చి ఆహారం పొందుతాయి
D) అన్నీ సరైనవే
జవాబు:
C) సూర్యకాంతిని రసాయన శక్తిగా మార్చి ఆహారం పొందుతాయి

AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు

80. మైటోకాండ్రియా పరిశీలనకు వాడే రంజకం పేరు
A) సఫ్రానిన్
B) జానస్ గ్రీన్-బి
C) జానస్ గ్రీన్-ఎ
D) క్రిస్టల్ వైలెట్
జవాబు:
B) జానస్ గ్రీన్-బి

మీకు తెలుసా?

కణాలలో కొన్ని కణాంగాలు అధిక సంఖ్యలో ఉంటాయి. ఉదాహరణకి కిరణజన్య సంయోగక్రియలో పాల్గొనే కణాలలో 50-200 క్లోరోప్లాస్ట్‌లు ఉంటాయి.

పునరాలోచన
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 8

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

These AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు will help students prepare well for the exams.

AP Board 10th Class Biology 8th lesson Important Questions and Answers అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

10th Class Biology 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
ఫ్లోచార్టును పరిశీలించి, క్రింది ప్రశ్నకు సమాధానము ఇవ్వండి. శిశువు యొక్క లింగ నిర్ధారణ చేసేది తల్లా? తండ్రా? ఏ విధంగానో వివరించండి.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 1
జవాబు:

  1. శిశువు యొక్క లింగ నిర్ధారణ చేసే తండ్రి.
  2. తల్లిలో XX క్రోమోజోములు ఉంటాయి.
  3. తండ్రిలో XY క్రోమోజోములు ఉంటాయి
  4. Y క్రోమోజోమ్ లింగ నిర్ధారణ చేస్తుంది. కాబట్టి తండ్రి లింగ నిర్ధారణ కారణం.

ప్రశ్న 2.
ఈ క్రింది పట్టికను పరిశీలించి, దృశ్యరూప, జన్యురూప నిష్పత్తిని వ్రాయండి.
(లేదా)
మెండల్ తన సంకరణ ప్రయోగాలలో విషమయుగ్మజ పసుపురంగు (YY) విత్తనాలు గల బఠాణీ మొక్కను, అదే రకపు మొక్కతో సంకరణం జరిపినపుడు వచ్చిన ఫలితాలను దృశ్యరూప మరియు జన్యురూప నిష్పత్తులలో తెలపండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 2
దృశ్యరూపం – 3 : 1; జన్యురూపం – 1 : 2 : 1

ప్రశ్న 3.
దృశ్యరూపం, జన్యురూపంలను నిర్వచించండి. .
జవాబు:
దృశ్యరూపం :
కంటికి కనిపించే జీవుల యొక్క బాహ్య లక్షణాలను దృశ్యరూపం అంటారు. ఉదా : పొడవు, పొట్టి

జన్యురూపం :
దృశ్యరూపాన్ని నిర్ణయించే జన్యుస్థితిని జన్యురూపం అంటారు.
ఉదా : TT, tt

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

ప్రశ్న 4.
నీవు సేకరించిన సమాచారం ఆధారంగా కార్బన్ డేటింగ్ పద్దతి గురించి వివరింపుము.
జవాబు:

  1. శిలాజాలు, ఖనిజ లవణాలు మరియు రాళ్ళ యొక్క వయస్సును నిర్ణయించుటకు కార్బన్ డేటింగ్ పద్ధతిని ఉపయోగిస్తారు.
  2. ఇందుకు రేడియో ధార్మిక పదార్థాలైన కార్బన్, యురేనియం, పొటాషియం యొక్క ఐసోటోపులను ఉపయోగిస్తారు.
  3. పురాజీవ శాస్త్రవేత్తలు C14 విచ్చిన్నాన్ని ఉపయోగించి శిలాజాల మరియు శిలల వయస్సును నిర్ధారిస్తారు.
  4. భూ వాతావరణంలో C12 మరియు C14 ఐసోటోపులు ఉంటాయి.
  5. ఒక జీవి జీవించి ఉన్నప్పుడు దానిలో C14 మరియు C12 లు స్థిర నిష్పత్తిలో ఉంటాయి.
  6. కాని, జీవి మరణించినప్పుడు దానిలో గల C14 విచ్చిన్నం చెందడం ప్రారంభమై దాని పరిమాణం ఒక స్థిరరేటుతో తగ్గుతుంది.
  7. C14 సగభాగం విచ్చిన్నమవటానికి పట్టే కాలాన్ని అర్థ జీవిత కాలం అంటారు. ఇది 5730 సంవత్సరాలు.
  8. C14 డేటింగ్ ద్వారా ఒక నమూనా శిలాజిం లేదా రాయి వయస్సు కనుగొనుటకు ఈ క్రింది సూత్రమును ఉపయోగిస్తారు.

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 3

ప్రశ్న 5.
మీ అమ్మమ్మ తాతయ్యల నుండి, మీ అమ్మా నాన్నల నుండి లక్షణాలు నీకు ఎలా సంక్రమించాయి?
జవాబు:
జన్యువుల ద్వారా

ప్రశ్న 6.
లామార్క్ వాదం తప్పు అని నిరూపించుటకు అవసరమైన ఉదాహరణలు వ్రాయండి.
జవాబు:

  1. ఆగస్టస్ వీస్మాన్ లామార్క్ “ఆర్జిత గుణాల అనువంశికత” సిద్ధాంతాన్ని ఎలుకలపై ప్రయోగించాడు.
  2. అతడు 22 తరాల వరకు ఎలుకల తోకలను తొలగించుకుంటూ ప్రయోగాలు చేశాడు. అయితే ప్రతిసారి ఎలుకలు తోకలతోనే పుట్టాయి.
  3. శారీరకమైన మార్పులు పరిసరాల కారణంగా ఏర్పడినా సరే అది తమ సంతతికి అందించబడవని లామార్క్ వాదం తప్పు అని నిర్ధారించాడు.

ప్రశ్న 7.
మానవులలో లింగ నిర్ధారణ చేసే క్రోమోసోములేవి?
జవాబు:
అల్లోజోములు (లేదా) లైంగిక క్రోమోజోములు. అవి XX (బాలికలు), Xy (బాలురు).

ప్రశ్న 8.
మానవుడిని నడిచే అవశేషావయవాల మ్యూజియం అంటారు. ఎందుకు ?
జవాబు:
మానవునిలో దాదాపు 180 వరకు అవశేషావయవాలు ఉన్నాయి. కావున మానవుడిని నడిచే అవశేషావయవాల మ్యూజియం అంటారు.

ప్రశ్న 9.
ఉండుకమును అవశేషావయవం అని ఎందుకు అంటారు?
జవాబు:

  1. మానవ జీర్ణవ్యవస్థలో ఉండే ఉండుకము జీర్ణక్రియలో ఏవిధంగానూ తోడ్పడదు.
  2. పరిణామ క్రమంలో భాగంగా అవసరం లేని అవయవాలు క్షీణించి పోకుండా నిరుపయోగంగా మిగిలిపోతాయి.

ప్రశ్న 10.
ఏ ప్రత్యుత్పత్తి విధానంలో వైవిధ్యాలకు అధిక అవకాశం ఉంటుంది? ఎందుకు?
జవాబు:
లైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో వైవిధ్యాలకు అవకాశం అధికం. ఈ ప్రక్రియలో స్త్రీ, పురుష సంయోగ బీజాలు కలిసిపోతాయి వాటిలోని జన్యుపదార్థం మధ్య వినిమయం జరగటం వలన సంతతిలో కొత్త లక్షణాలు (వైవిధ్యాలు) ఏర్పడతాలు.

ప్రశ్న 11.
వైవిధ్యాల ప్రాముఖ్యత ఏమిటి? జీవులకు వైవిధ్యాలు ఏ విధంగా ఉపయోగపడతాయి?
జవాబు:
జీవుల మధ్యగల భేదాలను వైవిధ్యాలు అంటారు. ఇవి జీవులను గుర్తించటానికి, మనుగడకు, ప్రకృతి వరణానికి తోడ్పడతాయి.

ప్రశ్న 12.
జనక మొక్కలు తమ లక్షణాంశాలను విత్తనాలకు ఏ విధంగా పంపిస్తాయి?
జవాబు:
జనక మొక్కలలోని లక్షణాంశాలు కణ విభజన వలన సంయోగబీజాలలో చేరతాయి. సంయోగబీజాలు కలిసి విత్తనాలు ఏర్పడతాయి. కావున జనక మొక్కల లక్షణాంశాలు సంయోగబీజాల ద్వారా విత్తనాలలోనికి చేరతాయి.

ప్రశ్న 13.
పొడవైన మొక్కలు ఎల్లప్పుడు పొడవు మొక్కలనే ఉత్పత్తి చేస్తాయా?
జవాబు:
సాధారణంగా పొడవు మొక్కల నుండి పొడవు మొక్కలే ఏర్పడతాయి. కానీ పొట్టి మొక్కతో పరపరాగ సంపర్కం వలన పొట్టి మొక్కలు ఏర్పడే అవకాశం ఉంది.

ప్రశ్న 14.
అనువంశికత అనగానేమి?
జవాబు:
అనువంశికత :
జనకుల లక్షణాలు తరువాత తరానికి అందించే ప్రక్రియను “అనువంశికత” అంటారు.

ప్రశ్న 15.
వైవిధ్యాలు అనగానేమి?
జవాబు:
వైవిధ్యాలు :
జీవుల మధ్య ఉండే భేదాలను “వైవిధ్యాలు” అంటారు.

ప్రశ్న 16.
పరిణామం అనగానేమి?
జవాబు:
పరిణామం : మార్పుచెందే ప్రక్రియను “పరిణామం” అంటారు.

ప్రశ్న 17.
అనుకూలనాలు అనగానేమి?
జవాబు:
అనుకూలనాలు:
జీవి మనుగడ సాగించటానికి ఉపయోగపడే లక్షణాలను “అనుకూలనాలు” అంటారు.

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

ప్రశ్న 18.
మెండల్ తన ప్రయోగానికి ఎన్నుకున్న మొక్క ఏమిటీ?
జవాబు:
మెండల్ తన ప్రయోగానికి బరానీ మొక్క (ఫైసమ్ సటైవమ్) ను ఎన్నుకున్నాడు.

ప్రశ్న 19.
మెండల్ బఠానీ మొక్కలో ఎన్నుకున్న వ్యతిరేక లక్షణాల సంఖ్య ఎంత?
జవాబు:
మెండల్ బఠానీ మొక్కలో 7 జతల వ్యతిరేక లక్షణాలను ఎన్నుకున్నాడు.

ప్రశ్న 20.
లక్షణాంశాలు అనగానేమి?
జవాబు:
లక్షణాంశాలు :
జీవి లక్షణాలను నిర్ణయించే కారకాలను లక్షణాంశాలు (Traits) అంటారు . వీటినే నేడు జన్యువులు (Genes) అని అంటాం.

ప్రశ్న 21.
ప్రతి లక్షణానికి ఎన్ని లక్షణాంశాలు ఉంటాయి?
జవాబు:
ప్రతి లక్షణానికి ఒక జత లక్షణాంశాలు ఉంటాయి.

ప్రశ్న 22.
జన్యువు అనగానేమి?
జవాబు:
జన్యువు :
ప్రతి లక్షణానికి కారణమైన లేదా నియంత్రించే ఒక జత కారకాలుంటాయని మెండల్ భావించాడు. ప్రస్తుతం ఆ కారకాలనే మనం జన్యువులు (Genes) అంటాం.

ప్రశ్న 23.
యుగ్మ వికల్పకాలు అనగానేమి?
జవాబు:
ముగ్మవికల్పకాలు :
ప్రతి లక్షణానికి కారణమైన ఒక జత జన్యువులను “యుగ్మవికల్పకాలు” (Allele) అంటారు.

ప్రశ్న 24.
సమయుగ్మజం అనగానేమి?
జవాబు:
సమయుగ్మజం :
ఒక లక్షణానికి రెండూ ఒకేరకమైన కారకాలుంటే దానిని “సమయుగ్మజం” (Homozygous) అంటారు.

ప్రశ్న 25.
విషమయుగ్మజం అనగానేమి?
జవాబు:
విషమయుగ్మజం :
ఒక లక్షణానికి వ్యతిరేక లక్షణాలున్న జన్యువులు జతగా ఉంటే దానిని “విషమయుగ్మజం” (Heterozygous) అని అంటారు.

ప్రశ్న 26.
మెండల్ ప్రయోగాలలో జనకతరం యొక్క స్థితి ఏమిటీ?
జవాబు:
మెండల్ (శుద్ధ జాతులను) సమయుగ్మజ స్థితిలో ఉన్న మొక్కలను ప్రయోగానికి ఎన్నుకున్నాడు.

ప్రశ్న 27.
జనకతరం మొక్కల సంకరణం వలన ఏర్పడిన సంతతిని ఏమంటారు?
జవాబు:
జనకతరం మొక్కల సంకరణం వలన ఏర్పడిన సంతతిని F1 తరం అంటారు.

ప్రశ్న 28.
F1 తరపు మొక్కల జన్యుస్థితి ఏమిటి?
జవాబు:
F1 తరపు మొక్కలు విషమయుగ్మజ స్థితిలో ఉంటాయి.

ప్రశ్న 29.
F1 తరపు మొక్కల సామాన్య లక్షణం ఏమిటి?
జవాబు:
F1 తరపు మొక్కలన్నీ ఒకే దృశ్యరూపం మరియు జన్యురూపం కలిగి ఉంటాయి. ఇవి విషమయుగ్మజ స్థితిలో ఉండి, బహిర్గత లక్షణాలను ప్రదర్శిస్తాయి.

ప్రశ్న 30.
F2 తరం ఎలా ఏర్పడుతుంది?
జవాబు:
F2 తరం మొక్కలలో ఆత్మపరాగసంపర్కం జరపగా F2 తరం ఏర్పడుతుంది.

ప్రశ్న 31.
ఏక సంకరణ ప్రయోగంలో F1 తరం యొక్క దృశ్య, జన్యురూప నిష్పత్తులు ఏమిటి?
జవాబు:
F2 తరం యొక్క దృశ్యరూప నిష్పత్తి : 3 : 1
F2 తరం యొక్క జన్యురూప నిష్పత్తి : 1 : 2 : 1

ప్రశ్న 32.
బహిర్గత సూత్రంను తెలపండి.
జవాబు:
బహిర్గత సూత్రం :
విషమయుగ్మజ స్థితిలో ఏదో ఒక లక్షణం మాత్రమే బహిర్గతమౌవుతుంది. దీనినే “బహిర్గత సూత్రం” అంటారు.

ప్రశ్న 33.
పృథక్కరణ సూత్రం తెలపండి.
జవాబు:
పృథక్కరణ సూత్రం :
జనకుల యుగ్మవికల్పకాలలో ఏదో ఒక కారకం యథేచ్చగా సంతతికి అందించబడుతుంది. దీనినే ‘పృథక్కరణ’ లేదా ‘అలీనత సూత్రం’ అంటారు.

ప్రశ్న 34.
అనువంశిక లక్షణాలు అనగానేమి?
జవాబు:
అనువంశిక లక్షణాలు :
తల్లిదండ్రుల నుండి పిల్లలకు సంక్రమించే లక్షణాలను “అనువంశిక లక్షణాలు” అంటారు.

ప్రశ్న 35.
‘వంశపారంపర్యం’ అనగానేమి?
జవాబు:
వంశపారంపర్యం:
అనువంశికత వలన ఒక తరం నుండి మరొక తరానికి లక్షణాలు అందించడాన్ని “వంశపారంపర్యం” అంటారు.

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

ప్రశ్న 36.
జన్యువు అనగానేమి?
జవాబు:
జన్యువు :
లక్షణాలు నిర్ణయించే కారకాలను జన్యువులు అంటారు. జన్యువు అనేది న్యూక్లియిక్ ఆమ్లం. అంటే DNA యొక్క కొంత భాగం.

ప్రశ్న 37.
DNA అనగా నేమి? దాని ఆకారం ఏమిటి?
జవాబు:
డీ ఆక్సీరిబో న్యూక్లిక్ ఆమ్లాన్ని సంక్షిప్తంగా DNA అంటారు. ఇది సర్పిలాకారంగా ఉండే మెట్ల మాదిరిగా (మెలితిరిగిన నిచ్చెన) ఉంటుంది. ఈ ఆకారాన్నే ద్వంద్వకుండలి (Double helix) అని కూడా అంటారు.

ప్రశ్న 38.
‘న్యూక్లియోటైడ్’ అనగానేమి?
జవాబు:
న్యూక్లియోటైడ్
DNA అణువులోని ఒక పోచను న్యూక్లియోటైడ్ అంటారు. రెండు న్యూక్లియోటైడ్స్ కలయిక వలన DNA ఏర్పడుతుంది.

ప్రశ్న 39.
న్యూక్లియోటైడ్ లోని అణువులు ఏమిటి?
జవాబు:
న్యూక్లియోటైడ్ లో చక్కెర అణువు, ఫాస్ఫేట్ అణువు మరియు నత్రజని క్షారము ఉంటాయి.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 4

ప్రశ్న 40.
DNA లోని నత్రజని క్షారాలు ఏమిటి?
జవాబు:
DNA లో నాలుగు రకాల నత్రజని క్షారాలు ఉంటాయి. అవి:
1. అడినిన్ – (A) 2. గ్వా నిన్ – (G) – 3. థైమిన్ – (T) 4. సైటోసిన్ – (C).

ప్రశ్న 41.
ఆటోసోమ్స్ అనగానేమి?
జవాబు:
ఆటోసోమ్స్ :
శారీరక లక్షణాలను నిర్ణయించే క్రోమోజోమ్స్ ను ‘శారీరక క్రోమోజోమ్స్’ లేదా ‘ఆటోసోమ్స్’ అంటారు. మానవునిలో వీటి సంఖ్య 22 జతలు.

ప్రశ్న 42.
ఎల్లోసోమ్స్ అనగానేమి?
జవాబు:
ఎల్లోసోమ్స్ :
లైంగికతను నిర్ణయించే క్రోమోజోమ్ లను ‘లైంగిక క్రోమోజోమ్ లు లేదా ఎల్లోసోమ్స్’ అంటారు. మానవునిలో వీటి సంఖ్య ఒక జత.

ప్రశ్న 43.
ప్రకృతి వరణం అనగా నేమి?
జవాబు:
ప్రకృతి వరణం :
అనుకూలతలు కలిగిన జీవులు మాత్రమే ప్రకృతిలో జీవించగలిగి తదుపరి తరాన్ని ఉత్పత్తి చేస్తాయి. మిగిలిన జీవులు నశిస్తాయి. ప్రకృతి చేసే ఈ ఎంపికను “ప్రకృతి వరణం” అంటారు.

ప్రశ్న 44.
జన్యువిస్థాపనం (Genetic drift) అనగానేమి?
జవాబు:
జన్యువిస్థాపనం :
జనాభాలో ఆకస్మికంగా లేదా హఠాత్తుగా సంభవించే సంఘటనల వలన జన్యువుల పౌనఃపున్యంలో మార్పులు వస్తాయి. దీనినే “జన్యువిస్థాపనం” అంటారు.

ప్రశ్న 45.
ఆర్జిత గుణాలు అనగానేమి?
జవాబు:
ఆర్జిత గుణాలు :
జీవి తన మనుగడ కోసం, అవసరం కొద్దీ అభివృద్ధి చేసుకున్న లక్షణాలను “ఆర్జిత గుణాలు” అంటారు.

ప్రశ్న 46.
ఆర్జిత గుణాల అనువంశికత అనగానేమి?
జవాబు:
ఆర్జిత గుణాల అనువంశికత :
లామార్క్ అభిప్రాయం ప్రకారం- ఆర్జించిన గుణాలు తమ సంతతికి అందించబడుతూ ఉంటాయి. దీనినే ‘ఆర్జిత గుణాల అనువంశికత’ అంటారు.
ఉదా : జిరాఫీ మెడ.

ప్రశ్న 47.
సూక్ష్మ పరిణామం అనగానేమి?
జవాబు:
సూక్ష్మపరిణామం : జాతిలోని చిన్న చిన్న మార్పులను “సూక్ష్మపరిణామం” అంటారు.

ప్రశ్న 48.
స్థూలపరిణామం అనగానేమి?
జవాబు:
స్థూలపరిణామం :
కొత్త జాతులు ఏర్పడే ప్రక్రియను జాతుల ఉత్పత్తి లేదా “స్థూలపరిణామం” అంటారు.

ప్రశ్న 49.
సమజాత అవయవాలు అనగానేమి?
జవాబు:
సమజాత అవయవాలు:
ఒకే నిర్మాణం కలిగి విభిన్న జీవులలో వేరు వేరు పనులను నిర్వహించే అవయవాలను “సమజాత అవయవాలు” అంటారు.
ఉదా : తిమింగలం చెయ్యి, గబ్బిలం చెయ్యి.

ప్రశ్న 50.
సమానమైన అవయవాలు అనగానేమి?
జవాబు:
సమానమైన అవయవాలు :
విభిన్న నిర్మాణం కలిగిన, వేరు వేరు జీవులలో ఒకే పనిని నిర్వహించే అవయవాలను సమానమైన అవయవాలు అంటారు.
ఉదా : పక్షి రెక్క, గబ్బిలం రెక్క ఎగరటానికి తోడ్పడతాయి.

ప్రశ్న 51.
పిండాభివృద్ధిశాస్త్రం అనగానేమి?
జవాబు:
పిండాభివృద్ధిశాస్త్రం :
ఒక జీవి అండం మొదలుకొని, సంపూర్తిగా ఎదగడం వరకు గల వివిధ అభివృద్ధి దశలను గురించి అధ్యయనం చేయడాన్ని “పిండాభివృద్ధిశాస్త్రం” అంటారు.

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

ప్రశ్న 52.
శిలాజాలు అనగానేమి?
జవాబు:
శిలాజాలు :
ప్రాచీన జీవ యుగాల్లో నివసించిన జీవుల ఉనికిని తెలియజేసే నిర్జీవ పదార్థాలను “శిలాజాలు” అంటారు.

ప్రశ్న 53.
శిలాజాల వయస్సును ఎలా నిర్ణయిస్తారు?
జవాబు:
కార్బన్ డేటింగ్ పద్ధతి ఆధారంగా శిలాజాల వయస్సును నిర్ణయిస్తారు.

ప్రశ్న 54.
అవశేష అవయవాలు అనగానేమి?
జవాబు:
అవశేష అవయవాలు :
పరిణామ క్రమంలో భాగంగా అవసరంలేని అవయవాలు క్రమంగా క్షీణించిపోతాయి. కానీ అలా క్షీణించిపోకుండా నిరుపయోగంగా మిగిలిపోయిన అవయవాలనే “అవశేషావయవాలు” (Vestigial organs) అంటారు.

ప్రశ్న 55.
జన్యుశాస్త్ర పిత అని ఎవరిని పిలుస్తారు?
జవాబు:
“గ్రెగర్ జోహాన్ మెండల్” ను జన్యుశాస్త్ర పిత అంటారు.

ప్రశ్న 56.
లింగ సహలగ్నత పైన పరిశోధన చేసినవారు ఎవరు?
జవాబు:
వాల్టర్ స్టటన్, థామస్ హంట్ మోర్గాలు లింగ సహలగ్నతపై పరిశోధన చేశారు.

ప్రశ్న 57.
వాల్టర్, మోర్గాన్లు ఏ జీవిపై ప్రయోగాలు చేశారు?
జవాబు:
వాల్టర్, మోర్గాన్లు చిన్న పండ్ల ఈగ ( సోఫిలా మెలనోగాసర్) పై పరిశోధనలు చేశారు.

ప్రశ్న 58.
లామార్కిజాన్ని ఖండించిన శాస్త్రవేత్త ఎవరు?
జవాబు:
ఆగస్టస్ వీస్మస్ లామార్కిజాన్ని తప్పు అని నిరూపించాడు. అతను ఎలుక తోకను 22 తరాల వరకూ కత్తిరించి, ఆ లక్షణం తరువాత తరానికి రావటం లేదని నిరూపించాడు.

ప్రశ్న 59.
ప్రకృతివరణం సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు?
జవాబు:
చార్లెస్ డార్విన్ “ప్రకృతివరణం” సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.

ప్రశ్న 60.
డార్విన్ రచించిన గ్రంథం పేరు ఏమిటి?
జవాబు:
డార్విన్ రచించిన ప్రముఖ గ్రంథం పేరు, జాతుల ఉత్పత్తి (The origin of species).

ప్రశ్న 61.
మానవునిలో క్రోమోజోమ్ ల సంఖ్య ఎంత?
జవాబు:
మానవునిలో 23 జతలు లేదా 46 క్రోమోజోమ్లు ఉంటాయి.

ప్రశ్న 62.
ఆడవారిలోని లైంగిక క్రోమోజోమ్స్ ఏమిటి?
జవాబు:
ఆడవారిలో ‘XX’ అనే లైంగిక క్రోమోజోమ్స్ ఉంటాయి.

ప్రశ్న 63.
పురుషులలోని లైంగిక క్రోమోజోమ్స్ ఏమిటి?
జవాబు:
పురుషులలో ‘XY’ అనే లైంగిక క్రోమోజోమ్స్ ఉంటాయి.

ప్రశ్న 64.
మానవుడిని ‘నడిచే అవశేషావయవాల మ్యూజియం’ అంటారు. ఎందుకు?
జవాబు:
మానవునిలో దాదాపు 180 అవశేష అవయవాలు ఉన్నాయి. ఉదాహణకు చెవితమ్మె, చర్మంపై కేశాలు, మగవారిలో క్షీరగ్రంథులు మొదలగునవి. అందుచేతనే మానవుడిని “నడిచే అవశేషాయవాల మ్యూజియం” అంటారు.

ప్రశ్న 65.
మానవులనందరినీ ఏ ఖండం నుండి వలస చెందినవారుగా భావిస్తున్నారు?
జవాబు:
మానవుల అతిపురాతనజీవి హోమోసెఫియన్స్. దీనిని ఆఫ్రికాలో కనుగొన్నారు. కావున మనుషులందరూ ఆఫ్రికా ఖండం నుండి వచ్చిన వారుగా భావిస్తున్నారు.

10th Class Biology 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
బిడ్డ యొక్క లింగ నిర్ధారణ ఎవరి వల్ల జరుగుతుంది ? తండ్రి వల్లనా, తల్లి వల్లనా? శిశువులలో లింగ నిర్ధారణను ప్లోచార్టు రూపంలో వివరించండి.
జవాబు:
లింగ నిర్ధారణ తండ్రి వలన జరుగును.
AP Board 10th Class Biology Solutions 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 6

ప్రశ్న 2.
శిలాజాల గురించి తెలుసుకొనుటకు పురాజీవ శాస్త్రవేత్తను మీరు ఏ ప్రశ్నలు అడుగుతారు?
జవాబు:

  1. శిలాజాల వయస్సును ఏవిధంగా కనుగొంటారు?
  2. శిలాజాలు ఎక్కువగా ఎక్కడ లభ్యమవుతాయి?
  3. శిలాజాలలో ఏ మూలకాలు ఎక్కువగా ఉంటాయి?
  4. పరిణామక్రమం తెలుసుకోవడానికి శిలాజాలు ఏవిధంగా ఉపయోగపడతాయి?

ప్రశ్న 3.
క్రింది గళ్ళ చదరమును పరిశీలించి దిగువనీయబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
i) ఏక సంకరణం యొక్క దృశ్యరూప నిష్పత్తిని వ్రాయుము.
ii) పై చదరంలో ఎన్ని విషమయుగ్మజ మొక్కలు కలవు?
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 2
జవాబు:
i) 3 : 1
ii) రెండు విషమయుగ్మజ మొక్కలు (YY) మరియు (YY)

ప్రశ్న 4.
జీవ పరిణామం జరిగినదనడానికి పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాలు ఏ విధంగా తోడ్పడుతున్నాయి?
జవాబు:
నిదర్శనాలు :

  1. చేప నుండి మానవుని వరకు గల వివిధ జీవుల పిండాలలో గుర్తించతగిన పోలికలు వుంటాయి.
  2. కప్ప డింభకము, కప్ప కన్నా చేపను పోలివుండును.
  3. ప్రతి జీవి జీవిత చరిత్ర, పూర్వీకుల నిర్మాణాత్మక లక్షణాలను ప్రదర్శిస్తుంది.
  4. తొలిదశలో వున్న పిండాన్ని వేరొక దాని నుండి వేరుగా గుర్తించటము కష్టము.

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

ప్రశ్న 5.
జీవ పరిణామం జరగకపోతే ఏం జరగొచ్చు?
జవాబు:

  1. క్రొత్త జాతులు ఏర్పడవు / జాతుల ఉత్పత్తి ఉండదు
  2. జీవుల మనుగడ ఉండదు.
  3. వైవిధ్యాలు ఉండవు.
  4. అనుకూలనాలు ఉండవు.
  5. నిదర్శనాలు ఉండవు.

ప్రశ్న 6.
F1 తరం అనగానేమి? దాని లక్షణాలు ఏమిటి?
జవాబు:
మెండల్ సంకరీకరణ ప్రయోగంలో, రెండు శుద్ధ జాతుల మధ్య పరపరాగ సంపర్కం జరపగా ఏర్పడిన మొదటి తరాన్ని ‘F1 తరం’ అంటారు.

లక్షణాలు:

  1. ఇవన్నీ దృశ్యరూపం పరంగా ఒకే విధంగా ఉంటాయి.
  2. బహిర్గత లక్షణాలు ప్రదర్శిస్తాయి.
  3. కానీ జన్యురూపం పరంగా విషమయుగ్మజ స్థితిలో ఉంటాయి.

ప్రశ్న 7.
పరిణామం అనగానేమి? అందలి రకాలు తెలపండి.
జవాబు:
మార్పు చెందే ప్రక్రియను పరిణామం (Evolution) అంటారు. Evolution అనే పదానికి ‘మడత విప్పుట’ అని అర్ధం (పెద్దదిగా మారటం). సరళంగా, సూక్ష్మంగా ఉండే జీవులు స్థూల, సంక్లిష్టంగా మారే ప్రక్రియ పరిణామం. దీనిలో రెండు రకాలు కలవు. అవి:
1. సూక్ష్మపరిణామం :
జాతులలోని చిన్న చిన్న మార్పులను “సూక్ష్మపరిణామం” అంటారు.
ఉదా : జీవులలోని రంగుల లక్షణం.

2. స్టూలపరిణామం :
కొత్త జాతులు ఏర్పడటాన్ని జాతుల “ఉత్పత్తి లేదా స్థూలపరిణామం” అంటారు.

ప్రశ్న 8.
లామార్క్ సిద్ధాంతం తప్పు అని ‘వీస్మస్’ ఎలా నిరూపించాడు?
జవాబు:
ఆగస్టస్ వీస్మస్ లామార్క్ సిద్ధాంతాన్ని ఎలుకలపై ప్రయోగాలు చేసి పరీక్షించాడు. అతడు ఎలుకల తోకలు తొలగించాడు. కానీ సంతతి మామూలుగానే తోకలతో జన్మించాయి. తరువాత తరం ఎలుకల తోకలు కూడా తొలగించుకుంటూ అలా 22 తరాల వరకు చేశాడు. అయితే ప్రతిసారి ఎలుకలు తోకలతోనే పుట్టాయి. శారీరకమైన మార్పులు పరిసరాల కారణంగా ఏర్పడినా సరే అది తమ సంతతికి అందించవని వీస్మస్ నిర్ధారించాడు.

ప్రశ్న 9.
జీవ పరిణామానికి ఏ ఏ శాస్త్రాల నుండి నిదర్శనాలు లభిస్తున్నాయి?
జవాబు:
జీవ పరిణామానికి క్రింది శాస్త్రాల నుండి మద్దతు లభిస్తుంది.

  1. శరీరధర్మ శాస్త్రము – సహజాత అవయవాలు, సమానమైన అవయవాలు
  2. పిండోత్పత్తి శాస్త్రము – పిండాభివృద్ధిలో పూర్వజీవుల లక్షణాలు
  3. పురాజీవ శాస్త్రం – శిలాజాలు

వీటి నుండే కాకుండా, వర్గీకరణ శాస్త్రం, జన్యుశాస్త్రం, శరీర నిర్మాణ శాస్త్రం నుండి అనేక నిదర్శనాలు జీవ పరిణామాన్ని సమర్థిస్తున్నాయి.

ప్రశ్న 10.
శిలాజాలు అనగానేమి? అవి ఎలా ఏర్పడతాయి?
జవాబు:
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 5

  1. ప్రాచీన జీవయుగాల్లో నివసించిన జీవుల ఉనికిని తెలియజేసే నిర్జీవ పదార్థాలనే “శిలాజాలు” అంటారు.
  2. పురాతన జీవులు లేదా వృక్షాల ఏ భాగమైనా శిలాజాలుగా ఏర్పడవచ్చు.
  3. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో జీవులలోని కర్బన పదార్థాలు క్షీణించి, పూర్తి నిర్మూలన చెందకుండా ఉండటం వల్ల శిలాజాలు ఏర్పడతాయి.
  4. శిలాజాలు భూమి లోపలి పొరల్లో, నీటి లోపలి నిక్షేప శిలల్లో (Sediments) లభించవచ్చు.

ప్రశ్న 11.
శిలాజాలు ఏర్పడే విధానం వివరించండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 6
ప్రాచీన జీవుల పూర్తి దేహం కాకుండా ఏవేని భాగాలు – ఎముకలు, దంతాలు, – కొమ్ములు, విత్తనాలు, పత్రాలు లేదా ముద్రలు శిలాజాలుగా లభిస్తాయి. డైనోసార్ల పాదాల శరీరం కుళ్ళి నశించిపోతుంది. ఆ తరువాత కనిపించదు. కానీ కొన్నిసార్లు శరీరం మొత్తం లేదా ఏవైనా కొన్ని భాగాలు సహజంగా నశించిపోకుండా ఉండి శిలాజాలుగా మిగిలిపోతాయి. ఉదాహరణకు ఏదేని చనిపోయిన కీటకం బురదలో చిక్కుకుపోయిందనుకుంటే, అది అంత సులువుగా నశించదు. బురద క్రమంగా ఎండి, గట్టిపడే పరిస్థితులుంటే ఆ మట్టి లోపలి కీటకం దేహం, భాగాలు, ముద్రలుగా ఉండిసోతాయి. ఇలా చెడిపోకుండా ఉండిపోయిన ముద్రలను కూడా శిలాజాలే అంటారు.

ప్రశ్న 12.
శిలాజ వయస్సును ఎలా నిర్ణయిస్తారు?
జవాబు:
భూగర్భ శాస్త్రవేత్తలు (Geologists) ఒక శిలాజ కాలాన్ని చెప్పగలరు. శిలాజాలను గురించిన అధ్యయనాన్ని పురాజీవశాస్త్రం (Palaeontology) అని అంటారు. పురాజీవ శాస్త్రవేత్తలు కార్బన్ డేటింగ్ పద్దతిని ఉపయోగించి శిలాజాల వయస్సును లేదా అవి నివసించిన కాలాన్ని కనుగొంటారు. అందుకు రేడియోధార్మిక పదార్థాలైన కార్బన్, యురేనియం మరియు పొటాషియం యొక్క ఐసోటోప్లను ఉపయోగిస్తారు. శిలాజాల లోపలి ఖనిజ లవణాల లేదా శిలాజాలున్న శిలలలోని ఐసోటోప్ల అర్ధజీవిత కాలాన్ని లెక్కించడం ద్వారా శిలాజాల కాలాన్ని అంచనా వేస్తారు.

ప్రశ్న 13.
అవశేష అవయవాలు అనగానేమి? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
అవశేష అవయవాలు :
పరిణామక్రమంలో భాగంగా అవసరంలేని అవయవాలు క్రమంగా క్షీణించిపోతాయి. కానీ అలా క్షీణించి పోకుండా, నిరుపయోగంగా మిగిలిపోయిన అవయవాలనే అవశేషావయవాలు (Vestigial organs) అంటారు.
ఉదా :
మన జీర్ణవ్యవస్థ ‘ఉండుకం’ (Appendix) లోని జీర్ణక్రియలో అది ఏ విధంగానూ తోడ్పడదు. కానీ కుందేలు వంటి శాకాహారులలో మాత్రం జీర్ణక్రియలో ముఖ్యమైన విధినే నిర్వర్తిస్తుంది. అలా నిరుపయోగంగా మానవునిలో దాదాపు 180 అవశేషావయవాలున్నాయి. ఉదాహరణకు చెవితమ్మె, చర్మంపై కేశాలు, మగవారిలో క్షీరగ్రంథులు మొదలగునవి. అందుచేతనే మానవుడిని “నడిచే అవశేషావయవాల మ్యూజియం” అని అంటారు.

ప్రశ్న 14.
ప్రక్క పటాన్ని పరిశీలించి నీవు గమనించిన తేడాలు తెలపండి.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 8
జవాబు:
ప్రక్క పటంలో అన్ని గులాబి పూలు ఉన్నప్పటికి వాటి మధ్య తేడాలు ఉన్నాయి. కొన్ని ఎరుపు, పసుపు, తెలుపు, నీలం రంగులలో ఉన్నాయి. పుష్పాల పరిమాణంలో కూడా వ్యత్యాసం ఉంది. కొన్ని పెద్దవిగా ఉంటే, మరి కొన్ని చిన్నవిగా ఉన్నాయి. వాటితో పాటు ఆకర్షక పత్రదళాల సంఖ్య, ఆకుపరిమాణం, కాండం, ముళ్లు మొదలైన లక్షణాలలో కూడా భేదాలు గమనించవచ్చు.

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

ప్రశ్న 15.
‘జీవులలో భిన్న లక్షణాలు ఏర్పడటానికి జన్యువులు కారణం’ దీనిని సమర్థిస్తూ చిన్న వ్యాసం రాయండి.
జవాబు:
క్రోమోజోమునందలి DNA లో ఒక భాగమైన జన్యువు జీవులలో ఒక నిర్దిష్టమైన లక్షణమును నియంత్రిస్తుంది. DNA ఒక ప్రోటీనును ఉత్పత్తి చేయుట ద్వారా లక్షణమును నియంత్రిస్తుంది. క్రోమోజోమునందు వేల సంఖ్యలో ఉండు జన్యువులు రకరకాల లక్షణములను నియంత్రిస్తాయి.

జన్యువులు ఒక తరం నుండి మరియొక తరానికి లక్షణాలను అందించడానికి ఉపయోగపడే అనువంశికత ప్రమాణాలు, జన్యువులు జతలుగా పనిచేస్తాయి. ఒకే విధమైన లక్షణాలను నియంత్రించే జన్యువులకు ఒక ఇంగ్లీషు అక్షరము ఇవ్వబడింది. ఉదాహరణకు ఎత్తును నియత్రించే జన్యువు ‘T’ గాను, పొట్టిని నియంత్రించే జన్యువు ‘t’ గాను సూచించబడుతుంది.

ప్రతి లక్షణానికి కారణమైన ఒక జత జన్యువులను యుగ్మ వికల్పకాలు అంటారు. ఒక లక్షణానికి కారణమైన రెండు కారకాలు ఉన్నా, వాటిలో ఒకటి మాత్రమే సంతతిలో బహిర్గతమవుతుంది. అటువంటి జన్యువును బహిర్గత జన్యువు అంటారు. రెండవ జన్యువు బహిర్గతం కాకుండా అంతర్గతంగా ఉంటుంది.

10th Class Biology 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
పురాతన జీవుల సమాచారం మనకు తెలుపుటకు ప్రకృతి భద్రపరిచిన విలువైన ఆధారాలు శిలాజాలు. శిలాజాల గూర్చి నీవు సేకరించిన సమాచారం తెలుపుము.
జవాబు:

  1. ప్రాచీన జీవ యుగాలలో నివశించిన జీవుల ఉనికిని తెలియజేసే, ప్రకృతిసిద్ధంగా భద్రపరిచిన నిర్జీవ పదార్థాలనే శిలాజాలు అంటారు.
  2. పురాజీవశాస్త్రం ప్రాచీనయుగాలలో జీవించిన జీవుల సమాచారాన్ని తెలియజేస్తుంది.
  3. కార్బన్ రేటింగ్ పద్దతినుపయోగించి జీవులు, జీవించిన కాలాన్ని భూగర్భశాస్త్రవేత్తలు కనుగొంటారు.
  4. శిలాజాల యందు లభించే క్రోమోజోమ్ సమాచారం ద్వారా వంశపారంపర్య లక్షణాలు లభిస్తాయి.
  5. ఆహారపు అలవాట్లు, జీవనవిధానాలు – శరీర నిర్మాణం గురించి తెలుస్తుంది.
  6. కాలగమనంలో జీవులు పొందిన వివిధ రూపాంతరాలు, క్రొత్తజీవులు ఏర్పడిన విధానం గురించిన సమాచారం లభిస్తుంది.

ప్రశ్న 2.
మనతో పాటు భూమి మీద జీవించే హక్కు జీవులన్నిటికీ కలదు. జీవ వైవిధ్య పరిరక్షణపై ప్రజలలో చైతన్యం కలిగించే నినాదాలను వ్రాయండి.
జవాబు:

  1. జీవించు – జీవించనివ్వు
  2. ప్రకృతిని ప్రేమించు – జీవవైవిధ్యాన్ని సంరక్షించు
  3. జీవకారుణ్యాన్ని చూపించు – జీవ వైవిధ్యాన్ని విస్తరించు
  4. తోటి జీవరాశిని కాపాడు – అందమైన ప్రకృతిని చూడు
  5. అన్ని జీవులను ఆదరించు – వైవిధ్యాన్ని సంరక్షించు
  6. పలు కాలుష్యాలను తగ్గించండి – జీవ వైవిధ్యాన్ని కాపాడండి

ప్రశ్న 3.
మెండల్ తన ప్రయోగాల కోసం బఠాణీ మొక్కను ఎంచుకోవడానికి గల కారణాలు ఏమిటి?
జవాబు:
మెండల్ తన ప్రయోగాల కోసం బఠాణీ మొక్కను ఎంచుకోవటానికి గల కారణాలు :
1. ‘బఠాణీ అధిక వైవిధ్యాలు కలిగిన మొక్క :
మెండల్ తన ప్రయోగాల కోసం దాదాపు ఏడు విభిన్న లక్షణాలను ఎన్నుకున్నాడు. ఇవన్నీ స్పష్టంగా ఉండి పరిశీలించటానికి అనువుగా ఉన్నాయి.
ఉదా : పువ్వురంగు, పువ్వుస్థానం.

2. బఠాణీ ద్విలింగ పుష్పం కలిగిన మొక్క :
కావున ఇది పరపరాగ సంపర్కం, ఆత్మపరాగ సంపర్కం జరపటానికి వీలుగా ఉంటుంది.

3. పుష్ప నిర్మాణం :
పుష్పంలో కేసరావళి, అండకోశం పెద్దవిగా ఉండుట వలన పరాగ సంపర్కం సులభం.

4. బఠాణీ మొక్క ఏకవార్షికం :
కావున ప్రయోగ ఫలితాలు త్వరగా తెలుస్తాయి. తక్కువ కాలంలో ఎక్కువ ప్రయోగాలు నిర్వహించవచ్చు.

ప్రశ్న 4.
మానవులలో లింగ నిర్ధారణను ఫ్లో చార్టు గీసి, వివరించండి.
(లేదా)
మానవునిలో లింగ నిర్ధారణ తెలియజేయు ఫ్లో చార్టు గీయుము.
జవాబు:
AP Board 10th Class Biology Solutions 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 17AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 10

  1. ఆడవారిలో రెండు X క్రోమోజోములు, మగవారిలో X, Y క్రోమోజోమ్ లు ఉంటాయి.
  2. స్త్రీ సంయోగ బీజాలలో ఒకే రకమైన X క్రోమోజోమ్లు , పురుష సంయోగ బీజాలలో X మరియు Y క్రోమోజోమ్లు ఉంటాయి.
  3. Y క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం, X క్రోమోజోమ్ ఉన్న అండంతో కలిస్తే ఫలదీకరణ జరి X, Y క్రోమోజోమ్ తో ఏర్పడే శిశువు అబ్బాయి అవుతుంది.
  4. అదే X క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం, X క్రోమోజోమ్ ఉన్న అండంతో కలిస్తే ఏర్పడే శిశువు అమ్మాయి అవుతుంది.

ప్రశ్న 5.
జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి నీ వంతుగా నీవు చేస్తున్న ప్రయత్నాలేవి?
జవాబు:

  1. భూమిపై నివసిస్తున్న జీవులలో గల వైవిధ్యమే జీవ వైవిధ్యం.
  2. జీవ వైవిధ్యాన్ని సంరక్షించడానికి, వేటాడటాన్ని నిషేధించాలి.
  3. సుస్థిర అడవుల సంరక్షణా పద్ధతులను అవలంబించాలి.
  4. నేను నావంతుగా వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాను.
  5. ప్రజలను చైతన్య పరుస్తూ వారిని వివిధ జీవ వైవిధ్య సంరక్షణా కార్యక్రమాలలో పాల్గొనేలా ప్రోత్సహిస్తాను.
  6. పాఠశాల పరిసర ప్రాంతాలలో చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తాను.
  7. జీవ వైవిధ్యానికి సంబంధించిన నినాదాలు, గోడ పత్రికలు ముద్రిస్తాము.
  8. విద్యుత్తును సాధ్యమైనంత వరకు పొదుపుగా వినియోగిస్తాను.
  9. ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించుకుంటాము.
  10. ఆవాస ప్రాంతాలలో చెట్లను నరికివేస్తే మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతాను.
  11. సామాజిక అడవుల పెంపకాన్ని ప్రోత్సహిస్తాను.

ప్రశ్న 6.
AP Board 10th Class Biology Solutions 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 17AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 10
i) ఈ షో చార్డ్ ఏమి తెలియజేస్తుంది?
జవాబు:
మానవునిలో లింగ నిర్ధారణ తెలియజేయును.

ii) ‘X’ క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం అండంతో కలిసి ఫలదీకరణ జరిగితే ఏమి జరుగుతుంది?
జవాబు:
ఆడపిల్ల పుడుతుంది.

iii) శిశువు లింగ నిర్ధారణ చేసేది అమ్మా, నాన్నలలో ఎవరు?
జవాబు:
తండ్రి

iv) సంతతిలో ఎన్ని క్రోమోజోమ్ జతలు ఉంటాయి?
జవాబు:
23 జతలు

ప్రశ్న 7.
ఈ చిత్రాన్ని పరిశీలించండి. సమాధానములు రాయండి.
వంశీ, ప్రియలు నూతన దంపతులు. వారు మగపిల్లవానిని కనాలనుకొంటున్నారు.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 11
a) మగ పిల్లవాడు జన్మించాలంటే జరుగవలసిన క్రోమోజోముల బదిలీని తెలిపే సంభావ్యతా చిత్రాన్ని గీయండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 12

b) శిశువు లింగ నిర్ధారణలో ఎవరు పాత్ర పోషిస్తారు? ఎలా చెప్పగలవు?
జవాబు:
శిశువు లింగ నిర్ధారణలో తండ్రి పాత్ర పోషిస్తారు. ఎందుకనగా మగశిశువును నిర్థారించే “Y” క్రోమోసోమ్ తండ్రిలోనే ఉత్పత్తి అవుతుంది.

ప్రశ్న 8.
దృశ్యరూపం మరియు జన్యురూపం అనగానేమి? మెండల్ ఏకసంకరణ పద్ధతి ద్వారా వీటిని వివరించండి.
జవాబు:
దృశ్యరూపం :
జీవులలో బయటకు కన్పించే (బహిర్గతం) అయ్యే లక్షణాన్ని దృశ్యరూపంగా గుర్తిస్తాం.

జన్యురూపం :
జీవులు ప్రదర్శించే స్వరూప స్వభావాల సంభావ్యత క్రమాన్ని జన్యురూపంగా గుర్తిస్తాం.

పసుపు (YY) ఆకుపచ్చ (YY), విత్తనాలు ఉన్న శుద్ధజాతుల బఠాణీల మొక్కల మధ్య పరపరాగ సంపర్కం చేయగా F1 తరంలో మొక్కలన్నీ పసుపు రంగు విత్తనాలు కల్గి ఉన్నాయి. అంటే F1 తరంలో పసుపు రంగు దృశ్యరూపంగా గుర్తించటం జరిగింది.

ఈ F1 తరంలో ఏర్పడే విత్తనాల జన్యురూపం ‘Yy’
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 13

F2 తరం : F1 తరం మొక్కల మధ్య (YY) స్వపరాగ
సంపర్కం చేయగా F2 తరం మొక్కలు ఏర్పడ్డాయి.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 2

దృశ్యరూప నిష్పత్తి : 3 : 1; జన్యురూప నిష్పత్తి : 1 : 2 : 1

ప్రశ్న 9.
మెండల్ అనువంశికతా సూత్రాలను తెలుపుము. మెండల్ తన ప్రయోగాలకు ఐరాణీ మొక్కను ఎంచుకోవడానికి గల కారణాలు రాయండి.
జవాబు:
మెండల్ అనువంశికతా సూత్రాలు:

  1. బహిర్గతత్వ సూత్రం,
  2. పృథక్కరణ సూత్రం,
  3. స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం.

మెండల్ తన ప్రయోగానికి బఠానీ మొక్కను ఎంపిక చేసుకోవడానికి కారణాలు :

  1. స్పష్టమైన లక్షణాలు కల్గి ఉండటం
  2. ద్విలింగ పుష్పాలు కల్గి ఉండటం
  3. ఆత్మ పరాగసంపర్కం జరపడం
  4. సంకరీకరణానికి అనువుగా ఉండటం
  5. బఠానీ ఏకవార్షిక మొక్క

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

ప్రశ్న 10.
ప్రక్కన ఉన్న ఫ్లోచార్టు గమనించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 14
i) ఈ ఫ్లోచార్టు దేనిని తెలియచేస్తుంది?
జవాబు:
శుద్ధ పొడవు మరియు పొట్టి మొక్కల మధ్య మెండల్ ఏక సంకరీకరణము.

ii) F1 తరపు మొక్కల దృశ్యరూపం ఏమిటి?
జవాబు:
అన్నీ మొక్కలూ పొడవైనవి.

iii) తరం యొక్క దృశ్యరూప మరియు జన్యురూప నిష్పత్తులు తెల్పండి.
జవాబు:
దృశ్యరూప నిష్పత్తి 3 : 1
జన్యురూప నిష్పత్తి 1 : 2 : 1

iv) ఈ ఫ్లోచార్టు ద్వారా నీవు ఏ అనువంశిక సూత్రాలను అర్థం చేసుకుంటావు?
జవాబు:
బహిర్గతత్వ సూత్రము మరియు పృథక్కరణ సూత్రము

ప్రశ్న 11.
జీవ పరిణామం గురించి డార్విన్ ప్రతిపాదించిన సిద్ధాంతం నందలి ముఖ్యాంశాలను రాయంది.
జవాబు:
డార్విన్ సిద్ధాంతము నందలి ముఖ్యాంశాలు :

  1. పరిణామం అనేది నెమ్మదిగా నిరంతరాయంగా జరుగుతుంది.
  2. ఒక జనాభాలోని ఏదేని సమూహం వైవిధ్యాలను సంతరించుకోవచ్చు.
  3. వైవిధ్యాలు జనకుల నుండి సంతతికి అనువంశికంగా అందించబడతాయి.
  4. సంతతి అధిక సంఖ్యలో వుంటే అది మనుగడ కోసం పోరాటానికి దారితీస్తుంది.
  5. ఉపయుక్తమైన లక్షణాలు గల జీవులు మనుగడ కోసం జరిగే పోరాటంలో విజయం సాధిస్తాయి.
  6. పర్యావరణంలో మార్పులు వస్తే జీవులు వాటికి అనుగుణంగా మార్పులు లేదా అనుకూలనాలను సంతరించుకొని కొత్త పరిస్థితులలో జీవించగల్గుతాయి.
  7. ప్రతి జీవజాతిలో సుదీర్ఘకాలం మార్పులు చోటుచేసుకుంటూ వుంటే అది ఒక కొత్త జాతి ఏర్పడటానికి దారితీస్తుంది.

ప్రశ్న 12.
జీవ పరిణామంను నిరూపించే ఏవైనా రెండు ఆధారాలను గురించి వివరించండి.
జవాబు:
1. నిర్మాణ సామ్య అవయవాలు :
తిమింగలాల్లో వాజాలు (ఈదడానికి), గబ్బిలాల్లో రెక్కలు (ఎగరడానికి), చిరుతల్లో కాళ్ళు (పరిగెత్తడానికి), మనుషుల్లో చేతులు (పట్టుకోవడానికి), చుంచు ఎలుకల్లో కాళ్ళు (తవ్వడానికి) ఇలా వివిధ రకాలుగా ఉపయోగపడే ముందరి చలనాంగాల అంతర్నిర్మాణము ఒకేలా ఉంటుంది. వీటన్నింటి ఎముకల అమరిక ఒకేలా ఉంటాయి. సకశేరుకాలన్నీ ఒకే పూర్వీకుల నుండి పరిణామం ఫలితంగా ఏర్పడినవేనని ఈ రుజువులు తెలుపుతున్నాయి. ఈ అవయవాలనే నిర్మాణసామ్య అవయవాలు’ అంటారు. ఈ విధమైన పరిణామాన్ని (అపసారి పరిణామం) అందురు.

2. క్రియాసామ్య అవయవాలు :
పక్షులు, గబ్బిలాల రెక్కలు గురించి పరిశీలిస్తే, గబ్బిలం రెక్కలలో పొడవుగా ఉన్న వేళ్ళ మధ్యలో సాగడానికి, ముడుచుకోవడానికి వీలుగా ఉన్న చర్మపంకం కనిపిస్తుంది. కానీ పక్షులలో రెక్కలు ఈకలతో కప్పబడిన ముందరి చలనాంగాలు. ఈ రెండింటిలో నిర్మాణం, అవయవాలు వేరువేరుగా ఉన్నప్పటికీ అవి నిర్వర్తించే విధి మాత్రం ఒక్కటే. నిర్మాణం వేరువేరుగా ఉన్నప్పటికీ ఒకేరకమైన పనిని నిర్వర్తించే వాటిని క్రియాసామ్య అవయవాలు అంటారు. ఈ విధమైన పరిణామాన్ని (అభిసారి పరిణామం) అంటారు.

3. పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాలు :
చేప నుండి మానవుని వరకు గల వివిధ జీవుల పిండాలలో గుర్తించదగిన పోలికలు ఉంటాయి. ప్రతి జీవి జీవిత చరిత్ర పూర్వీకుల నిర్మాణాత్మక లక్షణాలను ప్రదర్శించును. జీవులన్నింటికీ ఒకే సామాన్య పూర్వీకులు ఉన్నారని, దాని నుండే జీవులన్నీ పరిణామం చెందాయనే భావనకు బలం చేకూరుతుంది.

4. శిలాజ నిదర్శనాలు :
ప్రాచీన జీవ యుగాల్లో నివసించిన జీవుల ఉనికిని తెలియజేసే ప్రకృతి సిద్ధంగా భద్రపరచబడిన నిర్జీవ పదార్థాలను శిలాజాలు అంటారు. శిలాజాలను గురించిన అధ్యయనాన్ని పురాజీవ శాస్త్రం అని అంటారు. భూగర్భ శాస్త్రవేత్త శిలాజకాలాన్ని లెక్కించి చెప్పగలుగుతారు. కార్బన్ డేటింగ్ పద్దతిని ఉపయోగించి శిలాజాల వయస్సును, అవి నివసించిన కాలాన్ని కనుగొందురు.
ఉదా : రాక్షస బల్లులు (డైనోసారస్) కీటోసారస్ ప్రస్తుతం మనకు లభించిన శిలాజ నిదర్శనాలు.

ప్రశ్న 13.
బఠానీ మొక్కలలో బహిర్గత, అంతర్గత లక్షణాలను బట్టి F2 తరంలో వాటి నిష్పత్తిని తెలపండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 15

ప్రశ్న 14.
ఈ క్రింది పదాలను వివరించండి.
ఎ) యుగ్మవికల్పకాలు బి) సమయుగ్మజ స్థితి సి) విషమయుగ్మజ స్థితి డి) F1 తరం ఈ) F1 తరం ఎఫ్) దృశ్యరూపం జి) జన్యురూపం హెచ్) బహిర్గతం ఐ) స్వతంత్ర జన్యువ్యూహనం
జవాబు:
ఎ) యుగువికల్పకాలు :
ప్రతి లక్షణాన్ని నియంత్రించే ఒక జత కారకాలను యుగ్మ వికల్పకాలు అంటారు. ప్రస్తుతం ఈ కారకాలనే ‘జన్యువులు’ అంటారు.
ఉదా : పొడవు (TT), పొట్టి (tt).

బి) సమయుగ్మజ స్థితి :
ఒక లక్షణానికి రెండూ ఒకే రకమైన కారకాలుంటే దానిని ‘సమయుగ్మజం’ (Homozygous) అంటారు.
ఉదా : పసుపురంగు (YY), గుండ్రని విత్తనం (RR),

సి) విషమయుగ్మజ స్థితి :
ఒక లక్షణానికి వ్యతిరేక లక్షణాలున్న జన్యువులు జతగా ఉంటే దానిని “విషమయుగ్మజం” అంటారు. (Heterozygous) అంటారు.
ఉదా: పసుపురంగు (YY), గుండ్రం (Rr),

డి) F1 తరం :
సంకరణ ప్రయోగంలో, సమయుగ్మజ మొక్కల మధ్య పరపరాగ సంపర్కం జరపగా ఏర్పడిన మొదటి తరాన్ని “F1 తరం” అంటారు. ఇవి దృశ్యరూపం పరంగా ఒకే విధంగా ఉండి జన్యురూపంగా విషమయుగ్మజ స్థితిలో ఉంటాయి.

ఈ) F2 తరం :
F1 తరం మొక్కల మధ్య ఆత్మపరాగ సంపర్కం జరపగా ఏర్పడిన సంతతిని “F2 తరం” అంటారు. ఇవి దృశ్యరూపంగా 3:1 నిష్పత్తిని, జన్యుపరంగా 1 : 2 : 1 నిష్పత్తిని కలిగి ఉంటాయి.

ఎఫ్) దృశ్యరూపం :
ఒక జీవిలో బయటకు కనిపించే లక్షణాలను “దృశ్యరూపం” అంటారు.
ఉదా : పొడవు, పొట్టి.

జి) జన్యురూపం :
జీవి ప్రదర్శించే లక్షణాలకు కారణమైన జన్యుస్థితిని “జన్యురూపం” అంటారు.
ఉదా : పొడవు (TT లేదా TI).

హెచ్) బహిర్గతం :
విషమయుగ్మజ స్థితిలో జీవి ఏదో ఒక లక్షణం మాత్రమే ప్రదర్శింపబడుతుంది. ఈ ధర్మాన్ని బహిర్గతం అని, అటువంటి లక్షణాన్ని బహిర్గత లక్షణం అంటారు.
ఉదా : విషమయుగ్మజ పొడవు మొక్క (TV) పొడవు మరియు పొట్టి లక్షణాల కారకాలను కలిగి ఉన్నప్పటికి అది పొడవు మొక్కగా ఉంటుంది. ఇక్కడ పొడవు బహిర్గత లక్షణం. పొట్టి అంతర్గత లక్షణం.

ఐ) స్వతంత్ర జన్యువ్యూహనం :
యుగ్మవికల్పకాలలో రెండు కారకాలు ఉన్నప్పటికీ, సంయోగ బీజాలు ఏర్పడేటప్పుడు ఒక్కో కారకం విడిపోయి ప్రవేశిస్తాయి. ఈ సందర్భంలో ప్రతి కారకం స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. ఈ జన్యు ధర్మాన్ని పృధక్కరణ లేదా వేరుపడే సూత్రం లేదా స్వతంత్ర జన్యువ్యూహనం (Law of Segregation) అంటారు.
ఉదా: విషమయుగ్మజ పొడవు మొక్క (T) నుండి, రెండు రకాల సంయోగబీజాలు (T) (1) ఏర్పడతాయి. ఇవి ఏర్పడేటప్పుడు ఒక కారకం, మరొక కారకంపై ప్రభావాన్ని చూపుతుంది.

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

ప్రశ్న 15.
మెండల్ సిద్ధాంతాన్ని వివరించండి.
జవాబు:
వైవిధ్యాలు గురించి అవి అనువంశికంగా సంక్రమించే విధానం గురించి 1857లో గ్రెగర్ జోహాన్ మెండల్ పరిశోధన చేశాడు. ఇతను బఠానీ మొక్కలపై సంకరణ ప్రయోగాలు చేసి అనువంశికతను వివరించాడు. ఇతని సిద్ధాంతంలో మూడు పరికల్పనలు, రెండు సూత్రాలు ఉన్నాయి.

పరికల్పనలు :
మొదటి పరికల్పన :
జీవిలోని ప్రతి ప్రత్యేక లక్షణానికి రెండు కారకాలు ఉంటాయి. (వీటిని నేడు మనం జన్యువులు అంటున్నాము. ఈ జన్యువుల జతను యుగ్మవికల్పకం అంటారు.)

రెండవ పరికల్పన :
సంతతిలోని రెండు కారకాలు ఒక్కో జనకుని నుండి ఒక్కొక్కటి పొందును.

వివరణ :
సంయోగబీజాల కలయిక వలన జీవి ఏర్పడుతుంది. సంయోగబీజం ఒకటి తల్లి నుండి మరొకటి తండ్రి నుండి వస్తాయి. కావున సంతతిలోని యుగువికల్పకంలో ఒకటి తల్లి మరొకటి తండ్రికి చెంది ఉంటాయి.

మూడవ పరికల్పన :
సంతతికి లభించిన రెండు భిన్న కారకాలలో ఒక కారకం మాత్రమే బహిర్గతమవుతుంది.

వివరణ :
సంతతి విషమయుగ్మజ స్థితిలో ఉంటే ఒక లక్షణం మాత్రమే ప్రదర్శిస్తుంది. ఈ ధర్మాన్ని బహిర్గతం అంటారు.

సిద్ధాంతాలు :
తన పరికల్పనల ఆధారంగా మెండల్ రెండు సిద్ధాంతాలను సూత్రీకరించాడు. అవి

1. బహిర్గత సిద్ధాంతం :
జీవి విషమయుగ్మజ స్థితిలో ఉన్నప్పుడు ఒక లక్షణం మాత్రమే ప్రదర్శింపబడుతుంది. మరొకటి అంతర్గతంగా ఉండిపోతుంది.
ఉదా : విషమయుగ్మజ పొడవు (Tt) మొక్కలో పొడవు లక్షణం ప్రదర్శింపబడి పొట్టి లక్షణం అంతర్గతంగా ఉంటుంది.

2. వేరుపడే సూత్రం :
యుగ్మవికల్పకాలలో ఒక్కొక్కటి ఒక్కో జనకుడి నుండి సంతతికి లభిస్తాయి. అయితే జనకుల యుగ్నవిక్సలకాలలో ఏదో ఒక కారకం యథేచ్చగా (Random) సంతతికి అందించటం జరుగుతుంది.
ఉదా :
విషమయుగ్మజ పొడవు మొక్క (Tt) నుండి రెండు రకాల సంయోగబీజాలు (T), (t) సమ సంఖ్యలో ఏర్పడతాయి.

ప్రశ్న 16.
దార్విన్ సిద్ధాంతాన్ని వివరించండి.
జవాబు:
చార్లెస్ రాబర్ట్ డార్విన్ (1809-1882)
ప్రకృతి వరణం (natural selection) అనే ప్రఖ్యాత సిద్ధాంతాన్ని డార్విన్ ప్రతిపాదించాడు. డార్విన్ తన 22వ యేట HMS బీగిల్ అనే నౌకలో ప్రపంచ సర్వే కోసం బయలుదేరి 5 సంవత్సరాలు ప్రయాణించాడు. గాలాపాగస్ దీవులతో సహా ఎన్నెన్నో ప్రదేశాలను అతడు సందర్శించాడు. ఆయా ప్రదేశాలలోని మొక్కలు, జంతువుల గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. అలాగే ఎంతో సమాచారాన్ని, ఋజువులను కూడా సేకరించాడు.

డార్విన్ సిద్ధాంతంలో ప్రధానంగా మూడు సత్యాలు (పరిశీలనలు), రెండు సూత్రీకరణలు (సిద్ధాంతాలు) ఉంటాయి. అవి

1. అత్యుత్పత్తి :
(మొదటి సత్యం) జీవులు తమ సంతతిని అధికసంఖ్యలో ఉత్పత్తి చేస్తాయి. ఒక ఆవాలు చెట్టు, తన జీవితకాలంలో 10 వేల విత్తనాలు ఉత్పత్తి చేస్తుంది. ఇవన్నీ మొక్కలుగా మారితే భూమి అంతా ఆవాల మొక్కలతో నిండిపోతుంది.

2. జనాభా నిర్ణీత సంఖ్య :
(రెండవ సత్యం) జీవులు తమ సంతతిని అధికంగా ఉత్పత్తి చేసినా, ఏ జీవి భూమి అంతటినీ ఆక్రమించలేదు. ప్రతి జాతి సంఖ్య నిర్దిష్టంగా నియంత్రించబడుతుంది. జనాభా నిర్ణీత సంఖ్యలో ఎందుకు ఉంటుందని డార్విన్ ఆలోచించాడు.

3. మనుగడ కోసం పోరాటం :
(మొదటి సిద్ధాంతం) జీవులు అధిక సంఖ్యలో ఏర్పడిన్పటికి, అవి జీవించటంలో అధికమైన పోటీని ఎదుర్కొంటున్నాయి. వాటి అవసరాలు ఒకే విధంగా ఉండుట వలన తీవ్రమైన పోటీ ఉంటుంది. దీనినే ‘మనుగడ కోసం పోరాటం’ అంటారు. మరి ఈ పోరాటంలో ఏ జీవులు గెలుస్తాయి? ఏవి మరణిస్తాయి? అని ఆలోచించాడు.

4. వైవిధ్యాలు :
(మూడవ సత్యం) జీవులన్నీ ఒకే విధమైన లక్షణాలలో లేవు. జీవుల మధ్య ఉండే ఈ వ్యత్యాసాలను వైవిధ్యాలు అంటారు. పించ్ పక్షుల ముక్కుల ఆకారం వాటి ఆహార అలవాట్లకు గల సంబంధాన్ని పరిశీలించి, డార్విన్ వైవిధ్యాలు మనుగడకోసం పోరాటానికి తోడ్పడతాయని భావించాడు.

5. యోగ్యతను సార్థక జీవనం :
(రెండవ సిద్ధాంతం) మనుగడ కోసం జరిగే పోరాటంలో వైవిధ్యాలు తోడ్పడితే అవి సమర్థవంతంగా జీవించగలుగుతాయి. మనుగడకు తోడ్పడే ఇటువంటి లక్షణాలను అనుకూలనాలు అంటారు. అనుకూలనాలు లేని జీవులు నశించి ప్రకృతి నుండి తొలగించబడతాయి. ప్రకృతిచే ఎన్నుకొనబడే ఈ ప్రక్రియను ‘ప్రకృతి వరణం’ అంటారు.
1. అత్యుత్పత్తి 2. జనాభా నిర్ణీత సంఖ్య – మనుగడ కోసం పోరాటం 3. వైవిధ్యాలు యోగ్యతమ సార్థక జీవనం
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 16

ప్రశ్న 17.
మెండల్ స్వతంత్ర జన్యువ్యూహన సిద్ధాంతంను వివరించండి.
జవాబు:
మెండల్ స్వతంత్ర వ్యూహన సిద్దాంతం :
బఠానీ మొక్కలలో పై విధంగా ద్విసంకర సంకరణం జరపగా, సంతతిలో పసుపు (Yy), గుండ్రని (RR) మరియు ముడతలు (rr), ఆకుపచ్చ (yy) లక్షణాలు కనిపించాయి. F1 తరం మొక్కల మధ్య స్వపరాగ సంపర్కం జరిపినపుడు ఆయా లక్షణాలు, ఇతర లక్షణాలతో స్వతంత్రంగా కలిసిపోయి F2 తరం ఏర్పడింది.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 17

– (1) RRYY (2) RRYy (3) RrYY (4) RrYy (5) RRYy (6) RrYY (7) RrYy (8) RrYy (9) RrYy అనేవి గుండ్రని మరియు పసుపు విత్తనాలనిచ్చేవి.
– (1) RRyy(2) Rryy (3) Rryy అనేవి గుండ్రని మరియు ఆకుపచ్చనివి.
– (1) rr Yy(2) rr Yy (3) Ir YY అనేవి ముడతలు మరియు పసుపువి.
– rryy అనేవి ముడతలు మరియు ఆకుపచ్చనివి.

పై ఫలితాలను బట్టి ప్రతి లక్షణానికి కారణమైన కారకం స్వతంత్రంగా ఉంటూ సంయోజబీజాలలో మనగలిగనట్లు నిర్ధారణకు రావచ్చు. అంటే కారకాలనేవి (factors) స్వతంత్రమైనవి మరియు సంయోగబీజాల ద్వారా అనువంశికంగా సంతతికి అందించబడతాయి. ఈ ఒక జతకన్నా ఎక్కువ లక్షణాల యొక్క అనువంశికతను గమనిస్తే, ఆ జత లక్షణాలకు కారణమైన కారకాలు చేరే లక్షణాలపై ఆధారపడకుండా స్వతంత్రంగా సంతతికి లభించుటనే లేదా అందించుటనే “స్వతంత్ర వ్యూహన సిద్ధాంతమని” అంటారు.

ప్రశ్న 18.
లామార్క్ సిద్ధాంతాన్ని వివరించండి. (లేదా) ఆర్తిత గుణాల అనువంశికత అనగానేమి?
జవాబు:
ఒక జీవి తన మనుగడ కోసం అవసరం కొద్ది అభివృద్ధి చేసుకొన్న లక్షణాలను ఆర్జిత గుణాలు (Acquired characters) అంటారు. లామార్క్ అభిప్రాయం ప్రకారం- ఇలా ఆర్జించిన గుణాలు తమ సంతతికి అందించబడతాయి. దీనిని ఆర్జిత గుణాల అనువంశికత అంటారు.

ఉదా :
జీన్ బాప్టిస్ట్ లామార్క్ జీవపరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మొదటి వ్యక్తి. కొన్ని వేల సంవత్సరాల క్రితం జిరాఫీలు జింకల వలెనే ఉండేవని లామార్క్ భావించాడు. ఆహార కొరత కారణంగా నేలపైన మరియు చెట్ల యొక్క కింది శాఖలు లేకుండా పోయాక జిరాఫీలు మెడసాచి పైన ఉన్న శాఖలను అందుకోవాల్సిన అవసరం ఏర్పడి ఉండవచ్చు. కనుక మెడనిసాచి పై శాఖలను అందుకోవడం వలన మెడ నెమ్మదిగా సాగడం మొదలై ఉండవచ్చు.

ఎందుకంటే ఎల్లప్పుడూ మెడను సాచి ఉపయోగించడం మూలంగా కొన్ని తరాల తరవాత జిరాఫీల మెడ సాగిపోయి ఇప్పుడు ఉన్నట్లు సాగిన మెడ గల జిరాఫీల ఆవిర్భావం జరిగి ఉంటుంది. ఇలా ఒక జీవి తన మనుగడ కోసం అవసరం కొద్దీ అభివృద్ధి చేసుకున్న లక్షణాలను లేదా గుణాలను ఆర్జిత గుణాలు (Acquired characters) అంటారు. లామార్క్ అభిప్రాయం ప్రకారం ఈ విధంగా ఆర్జించిన గుణాలు తమ సంతతికి అందించబడుతూ ఉంటాయి. దీనినే ‘ఆర్జిత గుణాల అనువంశికత’ అంటారు. ఉదా : సాగిన మెడ మరియు పొడవు ఎదిగిన ముందుకాళ్ల జిరాఫీ.

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

ప్రశ్న 19.
DNA గురించి తెలపండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 18

  1. DNA అనగా డీ ఆక్సీరిబో న్యూక్లిక్ ఆమ్లం. ఇది కేంద్రకంలో ఉండే ఒక ఆమ్లం.
  2. జేమ్స్ వాట్సన్ మరియు ఫ్రాన్సిస్ క్రిక్ అనే శాస్త్రవేత్తలు 1953లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నందు DNA యొక్క పూర్తి నిర్మాణాన్ని కనుగొన్నారు.
  3. మీరు DNA అణువు సర్పిలంగా ఉండే మెట్ల మాదిరిగా ఉంటుందని వాట్సన కనుగొన్నారు. ఈ ఆకారాన్నే ద్వంద్వ కుండలి (Double helix) అని అంటారు.
  4. ఇది ఏకాంతరంగా అమర్చబడిన చక్కెరలు మరియు ఫాస్పేట నిర్మితం.
  5. దీనిలో మెట్ల వలె ఉండేవి నత్రజని క్షారాలు. అవి అడినిన్, గ్వానిస్, థైమిన్ మరియు సైటోసిన్.
  6. ఫ్రాంక్లిన్ మరియు మౌరిస్ విల్కిన్స్ తో పాటుగా వాట్సన్ మరియు క్రికు నోబెల్ బహుమతి వచ్చింది.
  7. జుట్టు యొక్క రంగు, చర్మం మొదలగు లక్షణాలు దీనికి ఉదాహరణలు.
  8. DNA యొక్క రసాయనిక నిర్మాణంలో ఏ చిన్న మార్పు కలిగినా అది సంతతి యొక్క లక్షణాలలో మార్పునకు కారణమవుతుంది. ఆ మార్పులే వైవిధ్యాలకు దారితీస్తాయి.

ప్రశ్న 20.
దార్విన్ సిద్ధాంత సారాంశం తెలపండి.
జవాబు:
డార్విన్ సిద్ధాంత సారాంశం :

  1. ఒక జీవి జనాభాలోని ఏదేని సమూహం వైవిధ్యాలను సంతరించుకోవచ్చు. కానీ సమూహంలోని అన్ని జీవులూ ఒకే రకంగా కాదు.
  2. వైవిధ్యాలు జనకుల నుండి సంతతికి అనువంశికంగా అందించబడతాయి.
  3. అధిక సంఖ్యలో సంతతి ఉంటే అది మనుగడ కోసం పోరాటానికి దారితీస్తుంది.
  4. తగిన ఉపయుక్త లక్షణాలు లేని జీవులకన్నా, ఉన్నవి మనుగడ కొనసాగించడానికి, ప్రత్యుత్పత్తి ద్వారా అధిక సంతానం ఉత్పన్నం చేస్తుంది.
  5. ఉపయుక్త వైవిధ్యాలుండి, మనుగడ సాగిస్తున్న జీవులు అనువంశికంగా సంతతికి వాటిని అందజేస్తాయి. అలాగే ప్రతి తరంలోనూ జరగడం వలన ఆ వైవిధ్యాలు సర్వసాధారణ లక్షణాలవుతాయి.
  6. పర్యావరణంలో మార్పులు వస్తే జీవులు వాటికి అనుగుణంగా మార్పులు లేదా అనుకూలనాలను సంతరించుకుని కొత్త పరిస్థితులలో జీవించగలుగుతాయి.
  7. ప్రతి జీవజాతిలో సుదీర్ఘకాలం మార్పులు చోటుచేసుకుంటూ ఉంటే, అది ఒక కొత్త జాతి ఏర్పడటానికి దారితీస్తుంది. కొత్త జాతి, నిజమైన జాతికి భిన్నంగా ఉంటుంది.
  8. భూమిపైన అన్ని జాతులు ఈ విధంగా ఏర్పడినవే.

ప్రశ్న 21.
కొత్త జాతులు ఏర్పడే విధానాన్ని ఉదాహరణతో వివరించండి.
జవాబు:
కొత్త జాతులు ఏర్పడటాన్ని జాతుల ఉత్పత్తి (Speciation) అని లేదా స్థూలపరిణామం (Macro evolution) అనీ అంటారు.

ఉదా : ఎర్ర, ఆకుపచ్చ కుమ్మరి పురుగులు లైంగికంగా కలిసి సంతతిని పొందగలవని మనకు తెలుసు. కానీ ఎర్ర, ఆకుపచ్చ కుమ్మరి పురుగులు ఏవేని కారణాలచేత చాలా కాలం వేరైపోయాయని ఊహించుకోండి (ఉదాహరణకు కాయలు తినడానికై నోట కరచుకొని తీసుకెళ్ళి దూరంగా ఎక్కడో జారవిడిచాయనుకోండి).

కొన్ని సంవత్సరాలలో రెండు రకాల కుమ్మరి పురుగులలోనూ ఎంతో వైవిధ్యం ఏర్పడుతుంది. ఆ తరువాత అవి అనుకోకుండా కలిసినప్పటికీ ప్రత్యుత్పత్తి జరపలేవు. సంతతిని ఉత్పత్తి చేయలేవు. ఏదైనా జీవులు వాటి జాతి జీవులతోనే కలవడం, సంతానాన్ని పొందడం జరుగుతుంది. ఈ విధంగా కొత్త జాతులు ఏర్పడుతుంటాయి.

ప్రశ్న 22.
మానవ పరిణామక్రమం తెలపండి.
జవాబు:
ఆధునిక మానవుడి రూపు సంతరించుకొనే వరకు జరుగుతూ ఉన్న పరిణామ ప్రక్రియనే మానవ పరిణామం అంటారు. ఇతర మొక్కలు, జంతువులన్నింటి వలెనే మనకు కూడా పరిణామ చరిత్ర ఉంది. ఆదిమానవుని వలె కనిపించే జీవులు 7 లక్షల 50 వేల సంవత్సరాలకు పూర్వమే ఉండేవారు. మానవులకు (హోమో సెపియన్స్) చెందిన అతి పురాతన శిలాజం భూమిపై మానవుల ఉనికి 2 లక్షల 50 వేల సంవత్సరాలకు పూర్వమే ఉన్నట్లు తెలుపుతున్నది.

మానవ పరిణామ క్రమం :
హోమో హెబిలస్ – 1.6 – 2.5 మిలియన్ సంవత్సరాల పూర్వం నివసించేవారు.
హోమో ఎరెక్షన్ – 1-1.8 మిలియన్ సంవత్సరాల పూర్వం నివసించేవారు.
హోమో సెపియన్స్ నియండర్తలెన్సిస్ – 2.3-3 లక్షల సంవత్సరాల క్రితం నివసించేవారు.
హోమో సియన్స్ (ప్రస్తుత మానవులు) – 40 వేల సంవత్సరాల పూర్వం నుండే నివసిస్తున్నారని తెలియుచున్నది.

ప్రశ్న 23.
పరిణామక్రమంలో మానవ వలస ప్రయాణం తెలపండి. (లేదా) మానవులలోని వేరు వేరు జాతులు ఒకే జాతి నుండి పరిణామం చెందాయని ఎలా చెప్పగలవు?
జవాబు:

  1. మానవులంతా ఆఫ్రికా నుండి వచ్చినవారే! మానవుల అతిపురాతన జీవులు హెమో సెపియన్స్ అక్కడే కనుగొనబడ్డారు.
  2. మన జన్యు సమాచారం కూడా ఆఫ్రికన్ మూలాలనే సూచిస్తోంది.
  3. అంటే రెండు మిలియన్ సంవత్సరాల పూర్వం అక్కడే మానవులుండేవారు. తర్వాతే వివిధ కారణాలతో మన పూర్వీకులు ఆఫ్రికాను వదిలి బయటకు వచ్చారు. కొందరేమో అక్కడే ఉండిపోయారు.
  4. వలసకు బయలుదేరిన వారు ఆఫ్రికా నుండి ఆసియా, తరవాత ఆసియా మధ్యభాగం, యురేషియా, దక్షిణ ఆసియా, తూర్పు ఆసియా అలా చేరుకున్నారు.
  5. వారిలో కొందరు ఇండోనేషియా దీవుల నుండి ప్రయాణిస్తూ ఫిలిప్పైన్స్ మీదుగా ఆస్ట్రేలియా చేరారు.
  6. అలాగే బేరింగ్ జలసంధి దాటి అమెరికా చేరుకున్నారు.
  7. వారంతా ఒకే దారిలో లేదా ఒకే కాలంలో పయనించలేదు. కేవలం ప్రయాణించాలనే ప్రయాణించలేదు. అప్పటి అవసరాలు, కారణాలు వారు ప్రయాణించేలా పురికొల్పి ఉంటాయి.
  8. ముఖ్యంగా ముందుకు, వెనుకకు, గుంపులుగా, ఒకసారి కొంత కొంత మంది వేరవుతూ, ఒకరికొకరు విడిపోతూ ఆఫ్రికా నుండి దూరంగా, ఆఫ్రికాలోనికి అలా ప్రయాణించారు.

ప్రశ్న 24.
ఒక ప్రయోగంలో F1 తరంలో అన్ని గుండ్రని పసుపు విత్తనాలు ఏర్పడినాయి (Yy Rr). F2 తరంలో గుండ్రని పసుపు (YYRr లేదా YY RR), గుండ్రని ఆకుపచ్చ (vy RRor YyRr), ముడతలు పడిన పసుపు (Yyrr లేదా YYrr) ముడతలు పడిన ఆకుపచ్చ (vy rr) గింజలు వచ్చాయి.
జవాబు:
1. ఒక్కొక్క రకం మొక్కలు ఎంతెంత శాతం ఏర్పడినవి?
గుండ్రని పసుపు గింజల మొక్కలు : 9 %
ముడతలు పడిన పసుపు గింజల మొక్కలు : 3%
గుండ్రని ఆకుపచ్చ గింజల మొక్కలు : 3%
ముడతలు పడిన ఆకుపచ్చ గింజల మొక్కలు : 1% గా ఏర్పడినవి.
అంటే వీటి జన్యురూప నిష్పత్తి 9 : 3 : 3 : 1 గా ఉంది.

2. ఏ మొక్కలు ఏర్పడటానికి ఎంత సంభావ్యత ఉందో కనుగొనగలరా?
ఔను. నాలుగు రకాల మొక్కలు 9:3:3:1 నిష్పత్తిలో ఏర్పడ్డాయి.

3. మెండల్ పరిశోధనలతో మీరు ఏకీభవిస్తున్నారా?
ఔను, మెండల్ పరిశోధనల ఫలితాలు కూడా ఇదే విధంగా ఉన్నాయి.

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

ప్రశ్న 25.
‘మానవుడు ఆఫ్రికా ఖండంలోనే మొదట జన్మించాడు’ అన్న అంశంపై మీ అనుమానాల నివృత్తి కొరకు మీరు ఒక చరిత్రకారుడిని కలిసినపుడు మీరు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు?
జవాబు:

  1. మానవ పరిణామము అనగానేమి?
  2. మానవుని పోలివుండే ఆదిమానవుడు ఎప్పుడు భూమిపై కనిపించడం జరిగినది?
  3. ఆదిమానవుడు ఎక్కడ జీవించాడు?
  4. ప్రస్తుత మానవ సమాజాలు ఎక్కడ నివసిస్తున్నప్పటికి వారి మూలాలు ఎక్కడ ఉన్నాయి?
  5. మానవులకు చెందిన అతిపురాతన శిలాజం భూమిపై మానవుల ఉనికి ఎప్పటి నుండి ఉందని చెపుతుంది?
  6. మానవజాతి అయిన ‘హోమోసెపియన్సు’ ఎన్ని సంవత్సరాల క్రితం నుండి నివసిస్తున్నారని తెలుస్తోంది?
  7. ఆఫ్రికా నుండి కొన్ని మానవ సమాజాలు ఎప్పుడు అక్కడ నుండి బయలుదేరినాయి?
  8. మానవులందరూ ఒకే మానవుని నుండి ఉద్భవించినారా?

ప్రశ్న 26.
మానవ పరిమాణ క్రమాన్ని ఫ్లోచార్ట్ ద్వారా చూపండి.
జవాబు:
మానవ పరిణామక్రమం (Human evolution) :
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 19

10th Class Biology 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు ½ Mark Important Questions and Answers

ఫ్లో చార్టులు

1.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 20
జవాబు:
పృథక్కరణ సూత్రం

2.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 21
జవాబు:
సూక్ష్మ పరిణామం

3.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 22
జవాబు:
అనువంశిక లక్షణాలు

4.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 23
జవాబు:
మనుగడ కోసం పోరాటం

5.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 24
జవాబు:
ఆహారం మరియు ఆశ్రయం కోసం వివిధ జాతుల మధ్య పోరాటం

6.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 25
జవాబు:
పురాజీవ శాస్త్ర నిదర్శనాలు

7.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 26
జవాబు:
అవశేషావయవాలు

8.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 27
జవాబు:
Tt

9.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 28
జవాబు:
బీజ ద్రవ్య సిద్ధాంతం

10.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 29
జవాబు:
Tt

11.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 30
జవాబు:
పసుపు, ముడతలు

సరైన గ్రూపును గుర్తించండి

12. మెండల్ ప్రయోగాల సంఘటనలు ఏవి వరుస క్రమంలో ఉన్నాయి?
A. స్వచ్ఛమైన జాతి ఎంపిక – స్వచ్చమైన మొక్కలను సంకరణం – F1 మొక్కలు స్వయం ఫలదీకరణం
B. F1 మొక్కలు స్వయం ఫలదీకరణం – F1 మొక్కలను సంకరణం చేయడం – మొత్తం F2 మొక్కలు శుద్ధ జాతీ
జవాబు:
గ్రూపు – A

13. మెండల్ ఏక సంకర సంకరణంలో ఏ గ్రూపు లక్షణాలు సరైనవి?
A. F1 లక్షణాలు : సమయుగ్మజ పొడవు, విషమ యుగ్మజ పొడవు
B. F2 లక్షణాలు : సమయుగ్మజ పొడవు, విషమ యుగ్మజ పొడవు, సమయుగ్మజ పొట్టి
జవాబు:
F2 లక్షణాలు

14. క్రింది వానిలో మెండల్ ప్రయోగానికి అనువైన బఠానీ మొక్కల లక్షణాలు ఏవి?
A. ఏక వార్షిక మొక్క ద్విలింగ పుష్పాలు, ఎక్కువ మొత్తంలో విత్తనాలు ఉత్పత్తి చేయడం.
B. ద్వివార్షిక మొక్క ఏకలింగ పుష్పాలు, తక్కువ మొత్తంలో విత్తనాలు ఉత్పత్తి చేయడం.
జవాబు:
గ్రూపు – A

15. బఠాణీ మొక్కల్లో మెండల్ అధ్యయనం చేసిన పరస్పర విరుద్ధ లక్షణాలు ఏవి ?
A. కాండం పొడవు – పొడవు & పొట్టి
పూల రంగు – ఎరుపు & నీలం
కాయ రంగు – ఆకుపచ్చ & పసుపు
B. కాండం పొడవు – పొడవు & పొట్టి
పూల రంగు – ఊదారంగు & తెలుపు
విత్తనం రంగు – పసుపు & ఆకుపచ్చ
జవాబు:
గ్రూపు – B

16. బరాణీ మొక్కల్లో దిగువ పేర్కొన్న ఏ గ్రూపు బహిర్గత లక్షణాలు?
A. పొడవైన, ఊదారంగు, గ్రీవ, గుండ్రని
B. పొట్టి, తెలుపు, శిఖరపు, ముడతలు
జవాబు:
గ్రూపు – A

17. ఈ దిగువ పేర్కొన్న ఏ సముదాయం అభిసారి పరిణామాన్ని సూచిస్తున్నాయి?
A. గబ్బిలం రెక్క – మానవుని చేయి
B. గబ్బిలం రెక్క – సీతాకోకచిలుక రెక్క
జవాబు:
గ్రూపు – B

18. దిగువ పేర్కొన్న ఏ మొక్క భాగాలు నిర్మాణ సామ్య అవయవాలు?
A. ముళ్ళు – నులి తీగలు & కొక్కేలు – ముళ్ళు
B. క్యారెట్ – బంగాళదుంప & మొక్క యొక్క ఆకు – ఒపర్షియా యొక్క కాండం
జవాబు:
గ్రూపు – A

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

19. దిగువ పేర్కొన్న ఏ జీవులు లామార్క్ వాదానికి చెందినవి?
A. ఫించ్ పక్షులు, సాల్మన్ చేపలు
B. జిరాఫీ, పాములోని చలనాంగాలు
జవాబు:
గ్రూపు – B

20. దిగువ పేర్కొన్న ఏ సముదాయం పరిణామానికి సంబంధించిన స్వరూప శాస్త్ర నిదర్శనాలు కావు?
A. నిర్మాణసామ్య అవయవాలు, క్రియాసామ్య అవయవాలు
B. శిలాజాలు, పిండ దశలు
జవాబు:
గ్రూపు – B

21. దిగువ పేర్కొన్న ఏ గ్రూపు మానవ పరిణామం సరైన క్రమంలో ఉన్నది?
A. హోమో హెబిలిస్ – హోమో ఎరెక్టస్ – హోమో సెపియన్స్ నియాండర్తాలెన్సిస్ – హోమో సెపియన్స్
B. హోమో ఎరెక్టస్ – హోమో హెబిలిస్ – హోమో సెపియన్స్ – హోమో సెపియన్స్ నియాండర్తాలెన్సిస్
జవాబు:
గ్రూపు – A

22. దిగువ పేర్కొన్న ఏ పరిస్థితి వారసత్వంగా సంక్రమిస్తుంది?
A. రెక్కల పురుగు జనాభాలో బరువు తగ్గడం
B. ఎర్ర రెక్కల పురుగు నుండి ఉత్పరివర్తన ఆకుపచ్చ రెక్కల పురుగు ఉద్భవం
జవాబు:
B

23. దిగువ పేర్కొన్న ఏ వైవిధ్యం ప్రకృతి వరణానికి దారి తీస్తుంది?
A. బీజకణ వైవిధ్యం
B. శారీరక కణాల వైవిధ్యం
జవాబు:
A

24. దిగువ పేర్కొన్న ఏ గ్రూపు అవశేష అవయవాలు?
A. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, చర్మం
B. జ్ఞాన దంతాలు, ఉండుకం, బాహ్య చెవి కండరాలు, పురుషుల శరీరం మీద వెంట్రుకలు
జవాబు:
గ్రూపు – B

25. దిగువ పేర్కొన్న వాటిలో ఏవి శిలాజాలుగా సంరక్షించ బడుతున్నాయి?
A. బాహ్య అస్థిపంజరం, ఎముకలు, దంతాలు, వెంట్రుకలు
B. కండరాలు, నాలుక, చర్మం, గోళ్లు
జవాబు:
గ్రూపు – A

26. శిలాజాల వయస్సును లెక్కించడానికి ఏ సమూహ ఐసోటోపులను ఉపయోగిస్తారు?
A. ఆక్సిజన్, హైడ్రోజన్, సల్ఫర్
B. కార్బన్, యురేనియం, పొటాషియం
జవాబు:
గ్రూపు – B

ఉదాహరణలు ఇవ్వండి

27. సమయుగ్మజ పొడవు యొక్క జన్యురూపం TT. పొట్టి మొక్క యొక్క జన్యు రూపం ఏమిటి ?
జవాబు:
tt

28. పొడవు బఠాణి మొక్క యొక్క ఒక లక్షణం. దీనికి విరుద్ధమైన లక్షణం ఏమిటి?
జవాబు:
పొట్టి

29. సీతాకోకచిలుక మరియు దోమ యొక్క ముఖ భాగాలు నిర్మాణ సామ్య అవయవాలకు ఉదాహరణ. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
చిరుత మరియు మానవుడు యొక్క పూర్వాంగాలు

30. కీటకాల రెక్కలు మరియు పక్షి రెక్కలు క్రియాసామ్య అవయవాలకు ఉదాహరణ. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
సీతాకోకచిలుక రెక్కలు మరియు గబ్బిలం యొక్క రెక్కలు.

31. పెరిపీటస్, ఎకిడ్నా సంధాన సేతువులకు ఉదాహరణలు. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఆర్కియోటెరిక్స్

32. ‘X’ స్త్రీ బీజం యొక్క లైంగిక క్రోమోజోము. పురుష లైంగిక క్రోమోజోముకు ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
X మరియు Y

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

33. డార్వినిజం అనేది పరిణామ సిద్దాంతాలలో ఒకటి. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
లామార్కిజం

34. 3: 1 ఏక సంకర సంకరణం యొక్క దృశ్యరూప నిష్పత్తి. ఏక సంకర సంకరణం యొక్క జన్యురూప నిష్పత్తి ఏమిటి?
జవాబు:
1 : 2 : 1

35. డోడో విలుప్త జీవికి ఉదాహరణ. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
డైనోసార్లు

36. స్వరూప శాస్త్రం, అంతర నిర్మాణ శాస్త్రం, పిండోత్పత్తి శాస్త్రం అనేవి పరిణామ సిద్ధాంతానికి సాక్ష్యాలను అందించే విజ్ఞానశాస్త్ర శాఖలు. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
పురాజీవశాస్త్రం

పోలికను గుర్తించుట

37. 44 : మానవులలో శారీరక క్రోమోజోములు : : ? : మానవులలో లైంగిక క్రోమోజోములు
జవాబు:
2

38. XX; స్త్రీలలో లైంగిక క్రోమోజోములు : : ? : పురుషులలో లైంగిక క్రోమోజోములు
జవాబు:
XY

39. X, Y : శుక్రకణాలు : : ? : అండం
జవాబు:
X

40. Tt : F1 తరం : : TT, Tt, tt 😕
జవాబు:
F2 తరం

41. ఎలుకలు : వీస్మన్ : : ఫించ్ పక్షులు 😕
జవాబు:
డార్విన్

42. ఉండుకం : అవశేష అవయవం : : తోకతో ఉన్న బేబీ 😕
జవాబు:
అటావిస్టిక్ అవయవం

43. TT: సమయుగ్మజ పొడవు : : ? : సమయుగ్మజ పొట్టి
జవాబు:
tt

44. యోగ్యతముల సార్లక జీవనం :: డార్విన్ : : ఆర్జిత లక్షణాల అనువంశికత 😕
జవాబు:
లామార్క్

45. బీజద్రవ్య సిద్ధాంతం : వీసమన్ : : An essay on the principles of population.
జవాబు:
మాల్టస్

46. నిటారైన మనిషి : నియాండర్తలెన్సిస్ : : ఆధునిక మానవుడు 😕
జవాబు:
హోమో సెపియన్స్

శాస్త్రవేత్తను గుర్తించండి

47. ఈయన ఆస్ట్రియా దేశానికి చెందిన మతగురువు. ఆయన దాదాపు 34 రకాలకు చెందిన 10000 బఠాణీ మొక్కలపై అధ్యయనం చేశారు. ఆయన ‘జన్యు శాస్త్ర పితామహుడు’ గా పేరొందాడు.
జవాబు:
గ్రెగర్ జోహన్ మెండల్

48. DNA అణువు సర్పిలంగా ఉండే మెట్ల మాదిరి ద్వంద్వ కుండలి ఆకారాన్ని కలిగి ఉంటుంది అని వీరు ఇరువురు కనుగొన్నారు.
జవాబు:
ఫ్రాన్సిస్ క్రీక్ & జేమ్స్ వాట్సన్

49. డ్రోసోఫిలాలో లింగ సహలగ్న లక్షణాలను వారు కనిపెట్టారు. డ్రోసోఫిలాలో వంశపారంపర్యత గురించి అధ్యయనం చేశారు.
జవాబు:
వాల్టర్ సటన్ & థామస్ హంట్ మోర్గాన్

50. పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించే మొదటి వ్యక్తి ఆయన. ఆర్జిత గుణాల అనువంశికత అనే పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
జవాబు:
జీన్ బాప్టిస్ట్ లామార్క్

51. ఆయన ‘ప్రకృతి వరణం’ అనే ప్రసిద్ధ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. HMS బీగిల్ అనే నౌకలో గాలాపాగస్ దీవులను సందర్శించి, ఫించ్ పక్షులలో వైవిధ్యాలను గమనించాడు.
జవాబు:
చార్లెస్ డార్విన్

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

52. ఆయన రాసిన పుస్తకం ‘Principles of geology’. భౌగోళిక మార్పులు క్రమబద్ధంగా జరుగుతాయి అని ప్రతిపాదించారు.
జవాబు:
చార్లెస్ లైల్

53. జనాభా గుణ శ్రేణిలో పెరుగుతుంటే (1, 2, 4, 8, …..) వాటి ఆహార అవసరాలు అంక శ్రేడి పద్దతిలో పెరుగుతున్నాయి. (1, 2, 3, 4, …..) అని వివరించాడు.
జవాబు:
మాల్టస్

54. ప్రకృతి వరణం కొత్త జాతుల పుట్టుకకు దోహద పడిందని స్వతంత్రంగా ప్రకృతి వరణం సిద్ధాంతాన్ని నిర్ధారించింది.
జవాబు:
ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెస్

నేను ఎవరు?

55. నేను ఒక రకమైన పరిణామం, పెద్ద ఎత్తున మార్పులు సంభవించడం వలన కొత్త జాతులు ఏర్పడతాయి.
జవాబు:
స్థూల పరిణామం

56. ఆర్జిత గుణాలు దాని సంతానానికి అందజేయబడతాయి అని వివరించే లామార్క్ ప్రతిపాదించిన పరిణామ సిద్ధాంతాన్ని.
జవాబు:
ఆర్జిత గుణాల అనువంశికత

57. ఈ పరిణామ సిద్ధాంతం ప్రకారం సొమాటో ప్లాస్మాలో సంభవించే మార్పులు తరువాతి తరానికి సంక్రమించవు. కానీ బీజద్రవ్యంలో సంభవించే మార్పులు తరువాతి తరానికి సంక్రమిస్తాయి.
జవాబు:
బీజద్రవ్య సిద్ధాంతం

58. అవయవాలు ఒకే విధమైన నిర్మాణాన్ని కలిగి ఉండి, భిన్నమైన విధిని కలిగి ఉండటం అనే స్వరూప శాస్త్ర నిదర్శనాన్ని నేను.
జవాబు:
నిర్మాణ సామ్య అవయవాలు

59. మానవ శరీరంలోని కొన్ని అవయవాలు జీవక్రియల్లో ఎటువంటి పాత్ర కలిగి ఉండవు. పరిణామ క్రమంలో ఈ అవయవాలు పనిచేయకుండా పోయాయి.
జవాబు:
అవశేషావయవాలు

60. నేను శిలాజాలను అధ్యయనం చేసే విజ్ఞానశాస్త్ర విభాగాన్ని.
జవాబు:
పురాజీవశాస్త్రం

61. ఐసోటోపులు , కలిగియున్న రాయి లేదా మూలకాల వయసును ఈ పద్ధతి ద్వారా గణించవచ్చు.
జవాబు:
కార్బన్ డేటింగ్ పద్ధతి

62. నేను శీతాకాలం పంటను. లక్షణాలు వారసత్వంగా ఎలా వస్తాయో నిరూపించడానికి మెండల్ నన్ను తన ప్రయోగాలకు ఉపయోగించాడు. నా శాస్త్రీయ నామం ఏమిటి?
జవాబు:
పైసం సెటైవం

63. నేను అనువంశికత ప్రమాణాన్ని. మెండల్ నన్ను కారకంగా పిలిచాడు.
జవాబు:
జన్యువులు

64. జన్యువుల యొక్క అన్ని సంభావ్యతలను లెక్కించడానికి సహాయపడే ఒక రేఖాత్మక చిత్రరూపాన్ని?
జవాబు:
పన్నేట్ స్క్వేర్

దోషాన్ని గుర్తించి, సరిచేసి రాయండి

65. విభిన్న లక్షణాలు తల్లిదండ్రుల నుండి సంతతి పొందే ప్రక్రియను వంశపారంపర్యం అంటారు.
జవాబు:
విభిన్న లక్షణాలు తల్లిదండ్రుల నుండి సంతతి పొందే ప్రక్రియను అనువంశికత అంటారు.

67. ఒక జత విభిన్న లక్షణాలు గల రెండు బఠాణీ మొక్కల మధ్య సంకరణం చేయడాన్ని ద్విసంకర సంకరణం అని అంటారు.
జవాబు:
ఒక జత విభిన్న లక్షణాలు గల రెండు బఠాణీ మొక్కల మధ్య సంకరణం చేయడాన్ని ఏకసంకర సంకరణం అని అంటారు.

68. ఒక వ్యక్తి యొక్క లింగ నిర్ధారణలో సహాయపడే క్రోమో జోమ్ జతను శారీరక క్రోమోజోములు అని అంటారు.
జవాబు:
ఒక వ్యక్తి యొక్క లింగ నిర్ధారణలో సహాయపడే క్రోమోజోమ్ జతను లైంగిక క్రోమోజోములు అని అంటారు.

69. ఆర్తిత లక్షణాలు అనేవి ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమించే లక్షణాలు.
జవాబు:
అనువంశికత లక్షణాలు అనేవి ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమించే లక్షణాలు.

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

70. నిర్మాణ సామ్య అవయవాలు విభిన్న నిర్మాణం కలిగి మరియు ఒకే విధిని కలిగి ఉంటాయి.
జవాబు:
క్రియాసామ్య అవయవాలు విభిన్న నిర్మాణం కలిగి మరియు ఒకే విధిని కలిగి ఉంటాయి.

71. మానవులలో శిశువు యొక్క లింగ నిర్ధారణ అనేది స్త్రీ బీజము యొక్క రక్తాన్ని బట్టి నిర్ణయింపబడుతుంది.
జవాబు:
మానవులలో శిశువు యొక్క లింగ నిర్ధారణ అనేది పురుష బీజము యొక్క రక్తాన్ని బట్టి నిర్ణయింపబడుతుంది.

72. బీజ కణాలు ఏర్పడేటప్పుడు ఒక జత లక్షణాలకు కారణమైన కారకాలు వేరే లక్షణాలపై ఆధారపడకుండా స్వతంత్రంగా సంతతికి లభించడాన్ని బహిర్గతత్వ సూత్రం అంటారు.
జవాబు:
బీజ కణాలు ఏర్పడేటప్పుడు ఒక జత లక్షణాలకు కారణమైన కారకాలు వేరే లక్షణాలపై ఆధారపడకుండా స్వతంత్రంగా సంతతికి లభించడాన్ని స్వతంత్ర జన్యు
వ్యూహన సిద్దాంతం అంటారు.

73. ఒక జీవి అండం మొదలుకొని సంపూర్ణంగా ఎదగడం వరకు గల వివిధ అభివృద్ధి దశలను గురించిన అధ్యయనం చేయడాన్ని పురాజీవశాస్త్రం అంటారు.
జవాబు:
ఒక జీవి అండం మొదలుకొని సంపూర్ణంగా ఎదగడం వరకు గల వివిధ అభివృద్ధి దశలను గురించిన అధ్యయనం చేయడాన్ని పిండోత్పత్తి శాస్త్రం అంటారు. 66. మొక్కల పెంపకం, సంకరణం గురించి డార్విన్ తన ప్రయోగాల్లో ఇలా పేర్కొన్నాడు. అనువంశికత సూత్రాలను ఆయన ప్రతిపాదించారు. జ. మొక్కల పెంపకం, సంకరణం గురించి మెండల్ తన – ప్రయోగాల్లో ఇలా పేర్కొన్నాడు. అనువంశికత సూత్రాలను ఆయన ప్రతిపాదించారు.

74. ఒక జీవి యొక్క జీవిత కాలంలో అభివృద్ధి చేసుకున్న లక్షణాలను వంశపారంపర్య లక్షణాలుగా పిలుస్తారు.
జవాబు:
ఒక జీవి యొక్క జీవిత కాలంలో అభివృద్ధి చేసుకున్న లక్షణాలను ఆర్జిత లక్షణాలుగా పిలుస్తారు.

జతపరచుట

75. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
లామర్కిజం – లామార్క్
బీజద్రవ్య సిద్ధాంతం – మెండల్
డార్వినిజం – డార్విన్
జవాబు:
బీజద్రవ్య సిద్ధాంతం – మెండల్

76. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
ఉపయుక్త నిరుపయుక్త అవయవాలు – వీస్మన్
ఎలుకలపై ప్రయోగాలు – లామార్క్
ఫించ్ పక్షులలో వైవిధ్యం – డార్విన్
జవాబు:
ఫించ్ పక్షులలో వైవిధ్యం – డార్విన్

77. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
ముళ్ళు మరియు నులి తీగలు – క్రియాసామ్య అవయవాలు
క్యారెట్ మరియు అల్లం – నిర్మాణసామ్య అవయవాలు
ఆర్కియోటెరిక్స్ – సంధాన సేతువు
జవాబు:
ఆర్కియోటెరిక్స్ – సంధాన సేతువు

78. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
కార్బన్ డేటింగ్ – హైడ్రోజన్
జన్యుపదార్థం – DNA
కెటోసారస్ – శిలాజం
జవాబు:
కార్బన్ డేటింగ్ – హైడ్రోజన్

79. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
F1 తరం – TT, Tt, it
జనక తరం – Tr, it
F2 తరం – It
జవాబు:
జనక తరం – TT, tt

80. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
విషమయుగ్మజం – YY
సమయుగ్మజం – Yy
YY, Yy- యుగ్మ వికల్పాలు
జవాబు:
YYYy – యుగ్మ వికల్పాలు

81. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
దృశ్యరూపం – 3 : 1
జన్యురూపం – 1 : 2 : 1
పన్నేట్ స్క్వేర్ – డార్విన్
జవాబు:
పన్నేట్ స్క్వేర్ – డార్విన్

82. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
లైంగిక క్రోమోజోములు – 44
పురుష లైంగిక క్రోమోజోములు – X,Y
స్త్రీ లైంగిక క్రోమోజోములు – Y
జవాబు:
స్త్రీ లైంగిక క్రోమోజోములు – Y

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

83. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
పూల రంగు – నీలం
విత్తనం రంగు – పసుపు
కాయ రంగు – ఎరుపు
జవాబు:
విత్తనం రంగు – పసుపు

బొమ్మలపై ప్రశ్నలు

84.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 31
ఈ పటాలు దేనిని సూచిస్తున్నాయి?
జవాబు:
చెవి తమ్మెలలో వైవిధ్యాన్ని సూచిస్తున్నాయి.

85.
AP Board 10th Class Biology Solutions 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 13
ఈ కాయ సహాయంతో మొక్కను గుర్తించండి.
జవాబు:
బఠానీ మొక్క

86.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 2
ఈ చతురస్రము అభివృద్ధి చేసినది ఎవరు?
జవాబు:
ఆర్.సి. పన్నెట్

87.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 32
ఈ జన్యుపదార్థం యొక్క నిర్మాణం పేరేమిటి?
జవాబు:
ద్వికుండలిని నిర్మాణం

88.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 33
ఏరకమైన పరిణామ సిద్ధాంతాన్ని ఈ చిత్రం సూచిస్తుంది?
జవాబు:
బీజ ద్రవ్య సిద్ధాంతం

89.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 34
ఏ వర్గాలకు ఈ జీవి సంధాన సేతువుగా ఉంటుంది?
జవాబు:
సరీసృపాలు మరియు పక్షులు

90.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 6
తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రదేశంలో ఈ శిలాజాన్ని భద్రపరచారు?
జవాబు:
BM బిర్లా సైన్స్ సెంటర్, హైదరాబాదు

91.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 35
లాగూర్క్ ప్రతిపాదించిన సూత్రం ఏమిటి?
జవాబు:
కణాల అనువంశికత

92.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 37
ఈయన ప్రతిపాదించిన పరిణామ సిద్ధాంతం పేరు?
జవాబు:
ప్రకృతివరణం

93.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 36
ఈయన ఏ శాస్త్రానికి పితామహుడు?
జవాబు:
పురాజీవశాస్త్రం

ఖాళీలను పూరించండి

94. జీవుల మధ్య గల స్యల ను…………
జవాబు:
వైవిధ్యం

95. జీవుల లక్షణాలు తరువాతి తరానికి సంక్రమించడాన్ని ……….. అంటారు.
జవాబు:
అనువంశికత

96. జన్యుశాస్త్ర పితామహుడు ……………
జవాబు:
మెండల్

97. బఠానీ మొక్క శాస్త్రీయ నామం ………..
జవాబు:
పైసమ్ సటైవమ్

98. ఏక సంకరణ ప్రయోగ దృశ్యరూప నిష్పత్తి
జవాబు:
3 : 1

99. ………. శాస్త్రం శిలాజాలను అధ్యయనం చేస్తుంది.
జవాబు:
జన్యుశాస్త్రం

10th Class Biology 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 1 Mark Bits Questions and Answers

1. గాలాపాగన్ దీవులలోని ఈ జీవుల నిర్మాణంలోని వైవిధ్యాలను డార్విన్ గుర్తించాడు
A) ఏనుగులు
B) జిరాఫీలు
C) ఎలుకలు
D) ఫించ్ పక్షులు
జవాబు:
D) ఫించ్ పక్షులు

2. క్రింది పటంలోని జీవుల శరీర భాగాలు ……… కు ఉదాహరణ.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 41
A) నిర్మాణ సామ్య అవయవాలు
B) క్రియాసామ్య అవయవాలు
C) సహజాత అవయవాలు
D) పైవేవీ కావు
జవాబు:
A) నిర్మాణ సామ్య అవయవాలు

3. జాతుల ఉత్పత్తి (The Origin of Species) రచయిత ………
A) ఛార్లెస్ డార్విన్
B) బాప్టిస్ట్ లామార్క్
C) ఛార్లెస్ లైల్
D) గ్రిగర్ జోహాన్ మెండల్
జవాబు:
A) ఛార్లెస్ డార్విన్

4. జెనిటిక్స్ పితామహుడు ….
(లేదా)
జన్యుశాస్త్ర పిత ఎవరు?
A) మెండల్
B) డార్విన్
C) వాట్సన్
D) లామార్క్
జవాబు:
A) మెండల్

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

5. DNA నిర్మాణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త
A) వాట్సన్
B) క్రిక్
C) పై ఇద్దరూ
D) వీరిద్దరూ కాదు
జవాబు:
A) వాట్సన్

6. పురా జీవశాస్త్రం దీని గురించి తెల్పుతుంది …………
A) ?
B) శిలాజాలు
C) విత్తనాలు
D) ఫలాలు
జవాబు:
B) శిలాజాలు

7. క్రింది వ్యాఖ్యలలో సరికానిది.
A) మాలాస్ సిద్ధాంతము ‘An Essay on the Principles of Population’ లో ఉంది.
B) జీవ పరిణామ సిద్ధాంతమును చార్లెస్ ఎల్ వ్రాశాడు.
C) ప్రకృతి వరణము అనే ప్రఖ్యాత సిద్ధాంతమును
D) “ఆర్జిత గుణాల అనువంశికత” అనే సిద్ధాంతాన్ని లామార్క్ ప్రతిపాదించాడు.
జవాబు:
B) జీవ పరిణామ సిద్ధాంతమును చార్లెస్ ఎల్ వ్రాశాడు.

8. ఒక సమయుగ్మజ పొడవు మొక్కను, ఒక సమయుగ్మజ పొట్టి మొక్కతో సంకరీకరణం జరిపినప్పుడు F1 తరంలో జన్యురూప నిష్పత్తి
A) 2 : 1 : 1
B) 1 : 1 : 2
C) 1 : 2: 1
D) 2 : 2 : 2
జవాబు:
C) 1 : 2: 1

9. క్రింది వాటిని జతపరుచుము.
1. DNA ( ) a. జన్యుశాస్త్ర పిత
2. మెండల్ ( ) b. ప్రకృతి వరణం
3. డార్విన్ ( ) c. ద్వికుండలి
A) 1 – a, 2 – b, 3 – c
B) 1 – b, 2 – c, 3 – a
C) 1 – c, 2 – b, 3 – a
D) 1 – c, 2 – a, 3 – b
జవాబు:
D) 1 – c, 2 – a, 3 – b

10. క్రింది వాటిలో మెండల్ తన ప్రయోగాలకు బరానీ
A) స్పష్టమైన లక్షణాలు కలిగి ఉండడం
B) ద్విలింగ పుష్పాలు కలిగి ఉండడం
C) ఆత్మపరాగ సంపర్కం జరపడం
D) తక్కువ ఖరీదు
జవాబు:
D) తక్కువ ఖరీదు

11. కింది వానిలో డార్విన్ సిద్ధాంతంకు సంబంధించనిది.
A) ఒక సమూహంలోని అన్ని జీవులు ఒకే రకంగా ఉండవు.
B) వైవిధ్యాలు జనకుల నుండి సంతతికి అందవచ్చు.
C) పరిణామం నెమ్మదిగా, నిరంతరాయంగా జరుగుతుంది.
D) జనాభా గుణ శ్రేణిలో పెరగదు.
జవాబు:
D) జనాభా గుణ శ్రేణిలో పెరగదు.

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

12. క్రియాసామ్య అవయవాలు
A) మేక పూర్వాంగం మరియు పక్షి రెక్క
B) తిమింగలం వాజం మరియు పక్షి రెక్క
C) మనిషి చేయి మరియు పక్షి రెక్క
D) గబ్బిలం రెక్క మరియు పక్షి రెక్క
జవాబు:
D) గబ్బిలం రెక్క మరియు పక్షి రెక్క

13. i) చాలా దగ్గర సంబంధం గల జీవులలో వైవిధ్యాలు కనిపిస్తాయి.
ii) జనకులు తమ యుగ్మ వికల్పాలలోని ఏదో ఒక యుగ్మ వికల్పాన్ని యధేచ్చగా సంతతికి అందిస్తారు. చార్లెస్ డార్విన్ ప్రతిపాదించాడు.
A) (i) సరైనది; (ii) సరైనది.
B) (i) సరికాదు; (ii) సరికాదు.
C) (i) సరైనది; (ii) సరికాదు.
D) (i) సరికాదు; (ii) సరైనది.
జవాబు:
A) (i) సరైనది; (ii) సరైనది.

14. బరానీ మొక్క నందు కింది ఏ లక్షణాన్ని మెండల్ ఎంపిక చేయలేదు?
A) విత్తనం రంగు
B) పుష్పం ఉన్న స్థానం
C) విత్తన బరువు
D) కాండం పొడవు
జవాబు:
C) విత్తన బరువు

15. ప్రకృతి వరణం అనగా ………..
A) ప్రకృతి యోగ్యత కలిగిన లక్షణాలను ఎంపిక చేయడం
B) ఉపయోగం లేని లక్షణాలను ప్రకృతి ఎంపిక మొక్కను ఎంపిక చేసుకోవడానికి కారణం కానిది చేయడం
C) ప్రకృతి యోగ్యత కల్గిన లక్షణాలను వ్యతిరేకించడం
D) పైవేవి కావు
జవాబు:
A) ప్రకృతి యోగ్యత కలిగిన లక్షణాలను ఎంపిక చేయడం

16. మెండల్ ఏక సంకరణ ప్రయోగాలలో F2 తరంలో దృశ్యరూప నిష్పత్తి
A) 2: 1 : 1
B) 1 : 2 : 1
C) 3 : 1
D) 9 : 3 : 3 : 1
జవాబు:
C) 3 : 1

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

17. కింది వాటిలో సరయిన జతను గుర్తించండి.
A) గ్రిగర్ జోహన్ మెండల్ – పృథక్కరణ సూత్రం
B) జీన్ బాప్టిస్ట్ లామార్క్ – ప్రకృతి వరణం
C) చార్లెస్ డార్విన్ – ఆర్జిత గుణాల అనువంశికత
D) అగస్ట్ వీస్మాన్ – జనాభా సిద్ధాంతం
జవాబు:
A) గ్రిగర్ జోహన్ మెండల్ – పృథక్కరణ సూత్రం

మీకు తెలుసా?

• మెండల్ చేసిన ప్రయోగాలకు ఉదాహరణలు

మెండల్ ఏ ప్రయోగం చేసినా దానికి సంబంధించిన అంశాలన్నింటినీ ఎప్పటికప్పుడు రాసిపెట్టుకునేవాడు. కింది అంశాలను పరిశీలిస్తే మెండల్ ఎన్ని ప్రయోగాలు నిర్వహించాడో, ఎన్ని ఫలదీకరణలు జరిపాడో, ఎన్ని మొక్కలపై ప్రయోగాలు చేశాడో మనం తెలుసుకోవచ్చు.

  1. మొదటి ప్రయోగం 15 మొక్కలపై 60 ఫలదీకరణలు.
  2. రెండవ ప్రయోగం 10 మొక్కలపై 58 ఫలదీకరణలు
  3. మూడవ ప్రయోగం 10 మొక్కలపై 35 ఫలదీకరణలు
  4. నాల్గవ ప్రయోగం 10 మొక్కలపై 40 ఫలదీకరణలు.
  5. ఐదవ ప్రయోగం 5 మొక్కలపై 23 ఫలదీకరణలు
  6. ఆరవ ప్రయోగం 10 మొక్కలపై 34 ఫలదీకరణలు
  7. ఏడవ ప్రయోగం 10 మొక్కలపై 37 ఫలదీకరణలు.

AP Board 10th Class Biology Solutions 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 13
మెండల్ ఎన్నో రకాలుగా ప్రయోగాలు నిర్వహించినప్పటికి వాటినన్నిటిని క్రోడీకరించి ఒక సాధారణ రూపంలోనికి మార్చడాన్ని మనం గమనించవచ్చు.

• బఠానీ ఏకవార్షిక మొక్క. ఇది తన జీవిత చక్రాన్ని ఒక సంవత్సరంలో పూర్తి చేస్తుంది. ప్రపంచంలో అనేక ప్రాంతాలలో బఠానీ సులభంగా పెరగగలుగుతుంది. క్రీ.పూ. 2000 సం॥లో ఆఫ్ఘనిస్తాన్లో బఠానీ ఉన్నట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. క్రీ.పూ. 2250 – 1750 కాలంలో హరప్ప ప్రస్తుత పాకిస్తాన్ వాయవ్య భారతదేశ ప్రాంతంలో బఠానీని పండించినట్లుగా రుజువులున్నాయి. అలాగే గంగానదీ పరివాహక ప్రాంతంలోని దక్షిణ భారతదేశంలోని బఠానీ పంట పండించేవారు. దీనిలో విటమిన్ ‘ఎ, సి, ఇ, కె మరియు బి కాంప్లెక్స్’లు Ca, Fe, Mg, Mn, P, S మరియు Zn లవణాలు కూడా ఉన్నాయి.

• జేమ్స్ వాట్సన్ మరియు ఫ్రాన్సిస్ క్రిక్ అనే శాస్త్రవేత్తలు 1953లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చేసిన పరిశోధనల్లో DNA యొక్క పూర్తి నిర్మాణాన్ని కనుగొన్నారు. DNA అణువు సర్పిలంగా ఉండే మెట్ల మాదిరిగా ఉంటుందని గుర్తించారు.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 18

ఈ ఆకారాన్నే ద్వంద్వ కుండలి (Double helix) అని అంటారు. ఇది ఏకాంతరంగా అమర్చబడిన చక్కెరలు మరియు ఫాస్ఫేట్లతో నిర్మితమై ఉంటుంది. దీనిలో అడినిన్, గ్వానిస్, థైమిన్ మరియు సైటోసిన్ అనే నత్రజని క్షారాలు మెట్లవలె అమరి ఉంటాయి. ఫ్రాంక్లిన్ మరియు మౌరిస్ విల్కిన్లు కూడా DNA ఆవిష్కరణలో వాట్సన్, లతో కలిసి పనిచేశారు. జన్యుశాస్త్రంలో నూతన ప్రయోగాలకు దారితీసిన ఈ అద్భుత ఆవిష్కరణకు గాను వాట్సన్ మరియు క్రిక్స్ బృందానికి నోబెల్ బహుమతి వచ్చింది. DNA యొక్క రసాయనిక స్వభావం జీవులలో లక్షణాలను నిర్ధారిస్తుంది. జుట్టు, చర్మపు రంగు మొదలైనవి ఇలాంటి లక్షణాలకు ఉదాహరణలు. DNA యొక్క రసాయనిక నిర్మాణంలో ఏ చిన్న మార్పు కలిగినా అది సంతతి యొక్క లక్షణాలలో మార్పుకు కారణమవుతుంది. ఆ మార్పులే వైవిధ్యాలకు దారితీస్తాయి.

• లైంగిక క్రోమోజోమ్ ఆవిష్కరణ :
వాల్టర్ స్టటన్ మరియు థామస్ హంట్ మోర్గాన్లు 1956వ సంవత్సరంలో చిన్న పండ్ల ఈగ –సోఫిలా మెలనోగాస్టర్) గురించి కొలంబియా యూనివర్సిటీలో అధ్యయనం చేశారు. గ్రాసోఫిలాలో లింగ సహలగ్నత లక్షణాలను కనుగొనేటప్పుడు లక్షణాలకు కారణమయ్యే జన్యువులు క్రోమోజోమ్ లో ఉన్నట్లు నిర్ధారించబడినది. డ్రాసోఫిలాలలోని వంశపారంపర్యత గురించి వాళ్ళు పూర్తిగా అధ్యయనం చేశారు.

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 38
• చారెస్ డార్విన్, ఆల్బెడ్ రస్పెల్ వాలెట్ల ఆలోచనలు ఒకేలా ఉండేవి. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని రూపొందిస్తున్న సమయంలో వాలెస్ రాసిన ఉత్తరాన్ని అందుకున్నాడు. వాలెస్ ఇండోనేషియా దీవులలో తన పరిశోధనల గురించి, ప్రకృతి వరణం గురించి రాశాడు. తాను ఆలోచించినట్లుగానే వాలెస్ సిద్ధాంతం కూడా ఉండటం డార్విన్‌ను చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. తరవాత డార్విన్, వాలెస్ కలిసి Journal of Linnaean Society పత్రికలో ప్రకృతి వరణం గురించి ఒక వ్యాసాన్ని ప్రచురించారు.
దాని తరవాతే డార్విన్ తన ప్రముఖమైన గ్రంథం ‘జాతుల | ఆల్ఫ్రెడ్ రస్సెల్ ఉత్పత్తి (The Origin of Species)’ ప్రచురించి, ప్రకృతి వరణం గురించి వివరించాడు.

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 40
• ఆర్కియోప్టెరిక్స్ అనే సంధాన సేతువు దేనిని పోలి ఉంటుంది. పక్షులనా? సరీసృపాలనా? లేదా రెండింటినా? రెండు విభిన్న సమూహాలకు చెందిన లక్షణాలను కలిగి ఉండే జీవులను సంధాన సేతువులు అంటారు. ఆర్కియోప్టెరిక్స్ యొక్క శిలాజం పక్షులు, సరీసృపాల నుండి పరిణామ క్రమంలో ఉద్భవించాయని తెలియజేస్తుంది. అందువల్ల దీనిని పక్షులకు, సరీసృపాలకు మధ్య సంధానంగా భావిస్తారు.

పునశ్చరణ

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 39

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

These AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం will help students prepare well for the exams.

AP Board 10th Class Biology 7th lesson Important Questions and Answers జీవక్రియలలో సమన్వయం

10th Class Biology 7th lesson జీవక్రియలలో సమన్వయం 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
ఆవు వంటి జంతువులలో వ్యతిరేక దిశలో పెరిస్టాలిసిస్ జరగకపోతే ఏమవుతుంది?
జవాబు:
ఆవులు ఆహారాన్ని త్వరగా నమిలి మ్రింగి తీరిక సమయంలో తిరిగి నోటిలోనికి తెచ్చుకొని నెమరువేస్తాయి. వ్యతిరేక పెరిస్టాలిసిస్ జరగకపోతే ఈ నెమరువేయు ప్రక్రియ జరగదు.

ప్రశ్న 2.
ఆహారవాహికలో శ్లేష్మం లేకపోతే ఏం జరుగుతుంది?
జవాబు:
ఆహారవాహికలో శ్లేష్మం లేకపోతే :

  1. పెరిస్టాలిటిక్ చలనముకు అవరోధం ఏర్పడును.
  2. ఆహారపు బోలస్, జారడంకు కష్టమగును.
  3. ఆహారం మ్రింగడం కష్టతరమగును.
  4. ఆహారవాహిక గోడలు దెబ్బతినును.
  5. వివిధ గాడతలు గల ఆహార పదార్థాల నుండి ఆహారవాహిక రక్షించబడదు.

ప్రశ్న 3.
క్రింది పట్టికను పూరించండి.
జవాబు:

జీర్ణాశయంలో స్రవించబడే హార్మోనులువిధులు
గ్రీలిన్ఆకలి కోరికలు ప్రేరేపించుట
లెఫ్టిన్ఆకలి కోరికను తగ్గించుట

ప్రశ్న 4.
జీర్ణమైన ఆహారాన్ని శోషించుకునే చిన్న ప్రేగు యొక్క భాగమేది?
జవాబు:
సూక్ష్మచూషకాలు (విల్లి)

ప్రశ్న 5.
పిండిపై లాలాజలం యొక్క చర్యలో ఉపయోగించు రసాయనం ఏది?
జవాబు:
అయోడిన్ ద్రావణం

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

ప్రశ్న 6.
మీ తరగతి గదిలో ఆహార వాహిక నందు జరిగే పెరిస్టాలిటిక్ చలనంను అర్థం చేసుకోవడానికి నిర్వహించిన కృత్యంలో ఉపయోగించిన పరికరాలు ఏవి?
జవాబు:
పెరిస్టాలిటిక్ చలన కృత్యంలో ఉపయోగించిన పరికరాలు : సైకిల్ ట్యూబ్, బంగాళదుంప, నూనె.

ప్రశ్న 7.
ఆహారవాహికలో పెరిస్టాల్టిక్ చలనం లేకపోతే ఏం జరగవచ్చు?
జవాబు:
1. ఆహారమును మింగలేము
(లేదా)
2. ఆహారము జీర్ణాశయమునకు చేరదు.

ప్రశ్న 8.
జీర్ణక్రియ అనగానేమి?
జవాబు:
జీర్ణక్రియ:
సంక్లిష్ట ఆహారపదార్థాలను, రక్తంలో శోషణ చెందే సరళ పదార్థాలుగా మార్చే ప్రక్రియను “జీర్ణక్రియ” అంటారు.

ప్రశ్న 9.
జీర్ణక్రియలో ఏ ఏ జీవక్రియల సమన్వయం పరిశీలించవచ్చు?
జవాబు:
మన శరీరంలో అనేక జీవక్రియలు పరస్పరం సమన్వయంతో పనిచేస్తాయి.
ఉదా : జీర్ణక్రియ జరగటానికి నాడీవ్యవస్థ, అంతస్రావీ వ్యవస్థ, రక్తప్రసరణ వ్యవస్థ, కండర వ్యవస్థలు సమన్వయంగా పనిచేస్తాయి.

ప్రశ్న 10.
ఆకలి సంకేతాలు మెదడులోని ఏ భాగాన్ని చేరతాయి?
జవాబు:
జీర్ణాశయంలో ఉత్పత్తి అయిన ఆకలి సంకేతాలు, పదవ కపాలనాడి ‘వేగస్ నాడి’ ద్వారా మెదడులోని ‘డైయన్ సెఫలాన్’ను చేరతాయి.

ప్రశ్న 11.
రుచులలో భేదం ఎలా కల్గుతుంది?
జవాబు:
ఆహారపదార్ధాలలోని రసాయన స్వభావాన్ని బట్టి వివిధ రుచులు ఏర్పడతాయి. తీపి, ఉప్పు, పులుపు, చేదు వంటి రుచులు ఆహారపదార్థంలోని రసాయన భేదాలను బట్టి ఏర్పడతాయి.

ప్రశ్న 12.
ఆహారం రుచిని కనుగొనటంలో అంగిలి పాత్ర ఏమిటి?
జవాబు:
ఆహారం లాలాజలంలో కరిగినపుడు ద్రవస్థితికి మారుతుంది. నాలుక అంగిలిని నొక్కినపుడు ఆహారపదార్థం రుచి మొగ్గ యొక్క ద్వారాన్ని నొక్కి రుచిగుళికలలోనికి ప్రవేశిస్తాయి.

ప్రశ్న 13.
మానవ నోటిలో దంతాలు ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
మానవ నోటిలో నాలుగు రకాల దంతాలు ఉంటాయి.
అవి 1. కుంతకాలు 2. రదనికలు 3. చర్వణకాలు 4. అగ్రచర్వణకాలు

ప్రశ్న 14.
చూర్ణం చేయటం అనగానేమి?
జవాబు:
చూర్ణం చేయటం :
నోటిలో దంతాలు ఆహారాన్ని విసరి, నమిలి, చిన్న ముక్కలుగా విచ్ఛిన్నం చేస్తాయి. ఈ విధానాన్ని “నమలడం లేదా చూర్ణం చేయటం” (Mastication) అంటారు.

ప్రశ్న 15.
బోలస్ అనగా నేమి?
జవాబు:
బోలస్ :
నోటిలో ఆహారం ముక్కలు కాబడి, లాలాజలంతో కలసి మింగటానికి అనుకూలంగా జిగురు ముద్దలా మారుతుంది. దీనిని “బోలస్” (Bolus) అంటారు.

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

ప్రశ్న 16.
ఆహారంపై లాలాజలం చర్య ఏమిటి?
జవాబు:
లాలాజలంలో ‘ఏమైలేజ్ ‘ అనే ఎంజైమ్ పిండి పదార్థాన్ని చక్కెరగా మార్చుతుంది. పిండిపదార్ధం → చక్కెర

ప్రశ్న 17.
లాలాజలం యొక్క స్వభావం ఏమిటి?
జవాబు:
లాలాజలం క్షార స్వభావాన్ని కల్గి ఉంటుంది.

ప్రశ్న 18.
ఆహారవాహిక పని ఏమిటి?
జవాబు:
ఆహారవాహిక నోటిలోని ఆహారాన్ని జీర్ణాశయంలో చేర్చటానికి తోడ్పడుతుంది.

ప్రశ్న 19.
ఆహారవాహికలోని కదలికలను ఏమంటారు? (లేదా) పెరిస్టాలిసిస్ అనగానేమి?
జవాబు:
ఆహారం ప్రయాణించేటప్పుడు ఆహారవాహికలో అలల వంటి కదలికలు ఏర్పడతాయి. వీటినే ‘పెరిస్టాల్ చలనాలు’ అంటారు. ఈ ప్రక్రియను ‘పెరిస్టాల్‌ సిస్’ అంటారు.

ప్రశ్న 20.
జీర్ణాశయం రసాయనికంగా ఏ స్వభావం కల్గి ఉంటుంది?
జవాబు:
జీర్ణాశయ గోడలు జఠర రసాన్ని స్రవిస్తాయి. ఇది హైడ్రోక్లోరిక్ ఆమ్లం (HCI) కలిగి ఉండుట వలన జీర్ణాశయం రసాయనికంగా ఆమ్ల స్వభావాన్ని కల్గి ఉంటుంది.

ప్రశ్న 21.
కైమ్ (Chyme) అనగానేమి?
జవాబు:
క్రైమ్ :
జీర్ణాశయంలో ఆహారం పాక్షికంగా జీర్ణమై ద్రవంలా మారుతుంది. పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని “క్రైమ్” (Chyme) అంటారు.

ప్రశ్న 22.
సంవరిణి కండరం (Pyloric sphincter) ఎక్కడ ఉంటుంది? దాని పని ఏమిటి?
జవాబు:
జీర్ణాశయం నుండి ఆంత్రమూలం ప్రారంభమయ్యే ప్రాంతంలో సంవరిణీ కండరం ఉంటుంది. ఇది ఆంత్రమూలంలోనికి ప్రవేశించే ఆహారాన్ని నియంత్రిస్తుంది.

ప్రశ్న 23.
ఆహారవాహికలో వ్యతిరేక పెరిస్టాలిసిస్ ఎప్పుడు జరుగుతుంది?
జవాబు:

  1. నెమరు వేయు జంతువులలో వ్యతిరేక పెరిస్టాల్సస్ వలన ఆహారం జీర్ణాశయం నుండి నోటిలోనికి వచ్చి నెమరు వేయటం జరుగుతుంది.
  2. మానవులలో ఈ క్రియ ఆహారనాళానికి సరిపడని వ్యర్థ పదార్థాలను బయటకు పంపే రక్షణ ప్రతిచర్యగా ఉపయోగపడుతుంది.

ప్రశ్న 24.
జీర్ణక్రియలో పాల్గొనే కొన్ని హార్మోన్స్ పేర్లు తెలపండి.
జవాబు:
సెక్రిటిన్, కొలిసిస్టోకైనిన్ అనే హార్మోన్స్ జీర్ణక్రియలో పాల్గొంటాయి.

ప్రశ్న 25.
ఆంత్రచూషకాలు (Villi) అనగానేమి? వాటి పని ఏమిటి?
జవాబు:
చిన్న ప్రేగు గోడల లోపలి తలంలో వేల సంఖ్యలో వేళ్ళ వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని ఆంత్ర చూషకాలు (Villi) అంటారు. ఇవి శోషణ తల వైశాల్యం పెంచి, జీర్ణమైన ఆహారాన్ని శోషించుకొంటాయి.

ప్రశ్న 26.
శోషణ అనగానేమి?
జవాబు:
శోషణ :
జీర్ణమైన ఆహారం రక్తంలోనికి పీల్చుకోబడటాన్ని “శోషణ” అంటారు. ఇది చిన్నప్రేగులలో జరుగుతుంది.

ప్రశ్న 27.
రెండవ మెదడుగా దేనిని పరిగణిస్తున్నారు?
జవాబు:
ఆహారవాహిక నుండి పాయువు వరకు 9 మీటర్ల పొడవునా, జీర్ణవ్యవస్థకు అనుబంధంగా నాడీవ్యవస్థ వ్యాపించి ఉంది. దీనిని రెండవ మెదడుగా పరిగణిస్తున్నారు.

ప్రశ్న 28.
మలం అనగానేమి?
జవాబు:
మలం :
జీర్ణవ్యవస్థలో ఏర్పడిన వ్యర్థ పదార్థాలను “మలం” అంటారు. ఇది పాయువు ద్వారా విసర్జింపబడుతుంది.

ప్రశ్న 29.
కణాలకు శక్తి ఎలా లభిస్తుంది?
జవాబు:
జీర్ణక్రియ ద్వారా శోషించబడిన పోషకాలు కణాలలో ఆక్సీకరణం చెంది శక్తిని ఇస్తాయి.

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

ప్రశ్న 30.
అనియంత్రిత చర్యలు మెదడు ఏ భాగంలో నియంత్రించబడతాయి?
జవాబు:
శ్వాసక్రియ, హృదయస్పందన వంటి అనియంత్రిత చర్యలు స్వయంచోదిత నాడీవ్యవస్థ ద్వారా మెదడులోని మజ్జి ముఖం నియంత్రిస్తుంది.

ప్రశ్న 31.
‘ఆకలి కోరికలు’ ఎలా ఏర్పడతాయి?
జవాబు:
రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గినపుడు, జీర్ణాశయ గోడలు ‘గ్రీలిన్’ అనే హార్మోన్‌ను స్రవిస్తాయి. ఈ హార్మోన్ జీర్ణకోశంలో ఆకలి సంకేతాలను ఉత్పత్తి చేస్తుంది.

ప్రశ్న 32.
ఆకలి కోరికలు ఎలా నియంత్రించబడతాయి?
జవాబు:
మనకు కడుపు నిండుగా ఉండి ఇక ఎలాంటి ఆహారం అవసరం లేదు అనిపించినపుడు లెఫ్టిన్ అనే మరో హార్మోన్ స్రవించబడి ఆకలిని అణిచి వేస్తుంది.

ప్రశ్న 33.
మనం వాసన, రుచిని ఎలా గుర్తించగల్గుతాము?
జవాబు:
ముక్కులోని శ్లేష్మసరం ఓ పలుచని నీటిపొర కలిగి ఉంటుంది. మనం వాసన చూసినపుడు గాలిలో తేలియాడే వాసన పదార్ద అణువులు ఈ పొరలో కరుగుతాయి. ముక్కు మరియు నాలుకపై గల రసాయన గ్రాహకాలు లేదా ఘ్రాణ గ్రాహికలు (Olfactory receptors) సంకేతాలను నాడీ ప్రచోదాల రూపంలో మెదడుకు పంపుతాయి. మెదడు ఈ సంకేతాలను విశ్లేషించి వాసన మరియు రుచిని గుర్తిస్తుంది.

ప్రశ్న 34.
నిబంధిత, ఉద్దీపన, ప్రతిస్పందనలపై ప్రయోగాలు జరిపిన శాస్త్రవేత్తలు ఎవరు?
జవాబు:
రష్యాకు చెందిన ఇవాన్ పావ్లోవ్ నిబంధిత, ఉద్దీపన, ప్రతిస్పందనలపై ప్రయోగాలు చేశాడు. ఆహారం గురించి ఆలోచన వచ్చిన వెంటనే లాలాజలం ఊరటం ఒక నిబంధిత ఉద్దీపనకు ప్రతిస్పందన అని చెప్పాడు.

ప్రశ్న 35.
మనకు రోజూ నిర్దిష్ట సమయంలోనే ఎందుకు ఆకలి వేస్తుంది?
జవాబు:
మనం రోజూ నిరిష సమయానికి ఆహారం తీసుకోవటం వలన శరీర జీవక్రియలు దానికి అలవాటు పడిపోతాయి. ఇది ఒక నిబంధన సహిత ప్రతిచర్యగా మారి రోజూ అదే సమయానికి ఆకలివేస్తుంది.

ప్రశ్న 36.
మనకు జలుబు చేసినపుడు ఆహార రుచిని సరిగా గుర్తించలేము. ఎందుకు?
జవాబు:
రుచి జనం వాసనతో ముడిపడి ఉంది. జలుబు చేసినపుడు, శ్లేష్మసరంలోని అధిక శ్లేష్మం వలన వాసనను గుర్తించలేము. కావున రుచిని కూడ సరిగా ఆస్వాదించలేము.

ప్రశ్న 37.
మనం తినే ఆహారాన్ని, రుచిని ప్రభావితం చేయు అంశాలు ఏమిటి?
జవాబు:

  1. నోటిలోని తేమ
  2. అంగిలి నొక్కబడటం
  3. పదార్థ ఉష్ణోగ్రత
  4. పదార్థం యొక్క వాసన
  5. పదార్ధ రసాయన స్వభావం మొదలగు అంశాలు ఆహార రుచిని ప్రభావితం చేస్తాయి.

10th Class Biology 7th lesson జీవక్రియలలో సమన్వయం 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
రెండు ఆకుపచ్చని పత్రాలలో ఒక దానికి గ్రీజు రాసి ఉంచి, మరొకటి అలాగే వదిలేసి, ఆ రెండు ఆకులపై రెండు చుక్కల ఆమ్లం వేసిన ప్రయోగములో నీవు ఏమి గమనించెదవు?
జవాబు:

  1. గ్రీజు రాసిన ఆకు పై భాగం ఆమ్లం వలన దెబ్బతినలేదు. ఆమ్ల ప్రభావాన్ని గ్రీజు ఒక పొరలా ఉండి నిరోధించింది.
  2. గ్రీజు రాయని ఆకు ఆమ్ల ప్రభావం వలన దెబ్బతిని పాడైపోయింది.

ప్రశ్న 2.
మానవులలో ఉపజిహ్విక లేకపోతే ఏమి జరగవచ్చు?
జవాబు:

  1. కంఠబిలం ద్వారా స్వర పేటికలోనికి ఆహారం ప్రవేశిస్తుంది.
  2. ఊపిరితిత్తులలోనికి ఆహారం ప్రవేశిస్తుంది. దాని వల్ల ప్రాణాపాయం కలుగుతుంది.
  3. సరిగ్గా మాట్లాడలేము.
  4. గాలి, ఆహార మార్గాల నియంత్రణ సరిగ్గా జరగదు.

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

ప్రశ్న 3.
జీర్ణ వ్యవస్థలో ఏర్పడే సమస్యలను తెలుసుకొనుటకు గాస్ట్రో ఎంటరాలజిస్టు అడిగే ప్రశ్నలు నాలుగింటిని రాయండి.
జవాబు:

  1. మనకు ఆజీర్ణము ఎందుకు కలుగును?
  2. మనకు వాంతులు ఎందుకు కలుగుతాయి?
  3. మనకు త్రేన్పులు ఎందుకు కలుగుతాయి?
  4. మనకు అల్సర్స్ ఎందుకు కలుగుతాయి?
  5. మనకు కడుపులో మంట ఎలా కలుగుతుంది?

ప్రశ్న 4.
నోటిలో జరిగే జీర్ణక్రియలో కండరాల పాత్రను తెలపండి.
జవాబు:

  1. నోటిలో ఉండే వలయ కండరాలు ఆహారాన్ని నోటి కుహరంలో నెట్టడంలోనూ మరియు నోటిలో చుట్టూ కదిలించటంలోనూ సహాయపడతాయి.
  2. దవడలోని ఉపరితల కండరాలు ఆహారాన్ని దంతాల క్రిందకు నెట్టి, కొరకటం మరియు నమలటం వంటి క్రియలకు తోడ్పడతాయి.
  3. దవడలోని అంతర కండరాలు ఆహారం నమిలేటప్పుడు దవడను పైకి, క్రిందకు, ముందుకు, వెనుకకు కదిలించటంలో తోడ్పడతాయి.

ప్రశ్న 5.
నోటి జీర్ణక్రియలో పాల్గొనే వివిధ భాగాలు తెలపండి.
జవాబు:
దంతాలు ఆహారాన్ని నమలడం, విసరడంలో తోడ్పడితే నాలుక కదలికలు ఆహారాన్ని లాలాజలంతో కలుపుతూ నోటి కుహరంలో సమంగా విస్తరించడంలో తోడ్పడుతుంది. నోటి కండరాలు ఆహారాన్ని ఆస్యకుహరంలోకి నెట్టడానికి సహాయపడతాయి. 5వ కపాలనాడి దవడలోని అంతర కండరాల కదలికలను నియంత్రిస్తుంది.

ప్రశ్న 6.
పగలు నిద్రించినపుడు సొంగ (లాలాజలం) ఎందుకు కారుతుంది?
జవాబు:
నిశాచర జీవుల (Nocturnals) గురించి మీరు వినే ఉంటారు కదా! ఇవి రాత్రివేళలో చురుకుగా ఉంటాయి. అయితే మనం పగటివేళలో చురుకుగా ఉండి, రాత్రివేళలో విశ్రాంతి తీసుకుంటాం. శరీరంలోని వ్యవస్థలన్నీ మనం పని చేస్తున్నప్పుడు చురుకుగా ఉంటాయి. అందుకే మనిషిని దివాచరులు (Diurnal animals) అంటారు.

మన జీర్ణవ్యవస్థ పగటివేళలో చురుకుగా ఉండడం వలన అది ఆహారాన్ని స్వీకరించి జీర్ణక్రియ జరపడానికి సిద్ధంగా ఉంటుంది. అందుకే పగటివేళలో నిద్రిస్తే నోటి ద్వారా స్రవించే లాలాజలం తలదిండును తడుపుతుంది. కానీ రాత్రివేళలో ఇలా జరగదు. సాధారణంగా ఒక రోజులో మనం 1-1.5 లీటర్ల లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాం.

ప్రశ్న 7.
ఆహారవాహికలో ఆహారం జారటానికి లాలాజలం ఎలా తోడ్పడుతుంది?
జవాబు:

  1. ఆహారనాళపు గోడలు జారుడు గుణంగల జిగురు పదార్థాన్ని స్రవిస్తాయి. దీనిని ‘శ్లేష్మం’ (Mucus) అంటారు.
  2. శ్లేష్మం చమురులా పనిచేస్తూ ఆహారవాహిక గోడలకు హాని జరగకుండా కాపాడుతుంది.
  3. దీని వలన ఆహార బోలస్ నూనెపూసిన బంగాళదుంపల్లా ఆహారవాహికలో సులభంగా కదులుతూ కిందికి జారుతుంది.
  4. దీనికి తోడుగా ఆహార బోలలోని లాలాజలం సులభంగా దానిని జీర్ణాశయంలోకి చేరవేయడంలో ఉపయోగకడుతుంది.

ప్రశ్న 8.
జీర్ణాశయంలో ఆహారం పొందే మార్పులు ఏమిటి?
జవాబు:
జీర్ణాశయంలో ఆహారం పొందే మార్పులు

  1. జఠర రసంతో చిలకబడి, ఆమ్ల స్వభావంగా మారుతుంది.
  2. జఠర రసంలోని రెనిన్ పాలపదార్థంపై పనిచేస్తుంది.
  3. లైపేజ్ క్రొవ్వులను జీర్ణం చేసి క్రొవ్వు ఆమ్లాలుగా మార్చుతుంది.
  4. పెప్సిన్ ప్రోటీన్స్ పైన పనిచేసి వాటిని పెప్టైడ్, పాలిపెప్టెడ్ గా మార్చుతాయి.

ప్రశ్న 9.
ఆంత్రమూలంలోనికి ప్రవేశించే ఆహారం ఎలా నియంత్రించబడుతుంది?
జవాబు:
జీర్ణాశయంలో జీర్ణక్రియ ముగింపు దశకు చేరుకునే సరికి జీర్ణాశయ గోడల సంకోచాలు తగ్గుముఖం పడతాయి. ఫలితంగా జీరాశయం చిన్న ప్రేగులోకి తెరుచుకునే భాగంలో గల సంవరిణీ కండరాన్ని (Pyloric sphincter) సంకోచం చెందిస్తుంది. అందువల్ల ఆంత్రమూలం లోపలికి దారి ఏర్పడి అసంపూర్ణంగా జీర్ణమైన ఆహారం కొద్దికొద్ది మోతాదుల్లో ఆంత్రమూలంలోకి విడుదలవుతుంది.

ప్రశ్న 10.
నెమరు వేయటం అనగానేమి? ఇది ఎలా జరుగుతుంది?
జవాబు:
కొన్ని శాఖాహార జంతువులు, విరామ సమయంలో, జీర్ణాశయం నుండి ఆహారాన్ని నోటిలోనికి తెచ్చుకొని తీరుబడిగా నమలుతాయి. ఈ ప్రక్రియను ‘నెమరు వేయుట’ అంటారు. ఆహారం దొరికినపుడు, నెమరువేయు జంతువులు ఆహారాన్ని పూర్తిగా నమలకుండా గబగబా మింగుతాయి. విరామ సమయంలో ఇవి ఆహారాన్ని నోటిలోనికి తెచ్చుకొంటాయి. ఈ ప్రక్రియలో ఆహారవాహికలోని కండరాలు వ్యతిరేక పెరిస్టాల్సినను జరుపుతాయి. అందువలన ఆహారం జీర్ణాశయం నుండి నోటిలోనికి వస్తుంది.

ప్రశ్న 11.
మానవ ఆహారనాళంలో వ్యతిరేక చలనం ఎప్పుడు జరుగుతుంది?
జవాబు:

  1. ఒకవేళ మనం చెడిపోయిన లేదా శరీరానికి సరిపడని ఆహారపదార్థాలు తిన్నప్పుడు జీర్ణక్రియా యంత్రాంగం దాన్ని గుర్తుపట్టి జీర్ణం చేయడానికి నిరాకరిస్తుంది.
  2. అనియంత్రిత నాడీవ్యవస్థ అధీనంలో పనిచేసే జీర్ణాశయ గోడలలో అలజడి ఏర్పడి, జీర్ణం కాని ఆహారంతోపాటు ‘క్రైమ్’ను కూడా బయటకు నెట్టివేస్తుంది.
  3. దీనినే మనం వాంతులుగా పరిగణిస్తాం. ఒక్కోసారి హఠాత్తుగా త్రేన్పులు కూడా (belching) వస్తుంటాయి.

ప్రశ్న 12.
పెద్దప్రేగులో మలం ఎలా ఏర్పడుతుంది?
జవాబు:

  1. అవసరమైన వ్యర్థ పదార్థాలు పెద్దప్రేగును చేరినపుడు దానిలోని నీటిని పెద్దప్రేగు గోడలు శోషిస్తాయి.
  2. పెరిస్టాలిసిస్ తరంగాలు వ్యర్థ పదార్థాలను పెద్ద ప్రేగు నుండి పురీషనాళంలోకి కదిలిస్తాయి.
  3. పెద్ద ప్రేగులోని కొలాన్ ఎడమ భాగం మలాన్ని నిలువ చేసే ట్యాంలా పనిచేస్తుంది. నీటిని పునఃశోషణం చెందుతుంది.
  4. మిగిలిన వ్యర్థాలు పెద్ద ప్రేగులోని చివరి భాగమైన పురీషనాళంలో నిలువ చేయబడతాయి.
  5. దుర్గంధంతో కూడిన ఈ పసుపు రంగులోని వ్యర్థాన్నే సాధారణంగా ‘మలం’ (Faecal matter) అంటాం.
  6. తదుపరి ఇది శరీరం నుండి పాయువు (Anus) ద్వారా బయటకు విసర్జింపబడుతుంది.

ప్రశ్న 13.
గుప్పెడు మిగిలిపోయిన తడి టీ పొడిని ఒక అద్దుడు కాగితంలో తీసుకొని ఒక ముద్దలా చేయండి. తరవాత దానిని సున్నితంగా ఒత్తి తెరిచి చూడండి. ‘ఏం గమనించారు? అద్దుడు కాగితం టీ పొడిలోని నీటిని పీల్చుకుంది కదా! ఈ ప్రక్రియను జీర్ణవ్యవస్థలోని ఏ భాగంతో పోల్చవచ్చు?
జవాబు:
తడి టీ పొడిలోని నీటిని అద్దుడు కాగితం పీల్చుకొన్నట్లు మన జీర్ణవ్యవస్థలోని జీర్ణమైన ఆహారం నుండి పెద్ద ప్రేగు నీటిని పీల్చుకొంటుంది. ఈ ప్రక్రియలో జీర్ణమైన ఆహారాన్ని టీ పొడితోనూ, పెద్ద ప్రేగును అద్దుడు కాగితంతోనూ పోల్చవచ్చు.

ప్రశ్న 14.
మలవిసర్జన ఎలా నియంత్రించబడుతుంది?
జవాబు:
పెద్ద ప్రేగు చివరి భాగంలో ఉండే రెండు కండర పొరలు పాయువు యొక్క సంవరణి కండరాలుగా (Anal sphincter)ఏర్పడతాయి. లోపలి సంవరిణీ కండరం అనియంత్రితంగాను, బాహ్య సంవరిణీ కండరం నియంత్రితంగా పనిచేస్తుంది. ఇవి మలవిసర్జన మార్గాన్ని నియంత్రిస్తాయి.

ప్రశ్న 15.
కణాలలో శక్తి ఎలా వెలువడుతుంది?
జవాబు:

  1. ఉచ్చ్వాస క్రియలో ఆక్సిజన్ వాయుగోణుల గోడల ద్వారా రక్తంలోకి చేరుతుంది.
  2. ఇక్కడ నుండి ఎర్రరక్త కణాల్లోకి ప్రవేశించి శరీరంలోని అన్ని కణాలకు సరఫరా చేయబడుతుంది.
  3. అదే సమయంలో రక్తంలోని కార్బన్ డై ఆక్సైడ్ ఊపిరితిత్తులోని వాయుగోణులలోనికి చేరుతుంది.
  4. నిశ్వాస క్రియలో అది బయటకు పంపబడుతుంది. కణాల్లోకి పోషకాలు ఆక్సీకరణం చెంది శక్తి విడుదలవుతుంది.

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

ప్రశ్న 16.
మన శరీరంలోని వివిధ వ్యవస్థలు సమన్వయంగా పని చేస్తున్నాయని ఎలా చెప్పగలవు?
జవాబు:

  1. సంక్లిష్టమైన ఈ జీర్ణక్రియా విధానంలో అనేక రకాల అవయవాలు, అవయవ వ్యవస్థలు సమన్వయంతో పనిచేస్తాయి.
  2. జీర్ణక్రియ నోటినుండి పాయువు వరకు వ్యాపించి ఉన్న ఆహారనాళంలో జీర్ణక్రియ జరుగుతున్నప్పటికీ దీనికి శ్వాసవ్యవస్థ, రక్తప్రసరణ వ్యవస్థ, నాడీవ్యవస్థలతో సమన్వయం ఎంతో అవసరం.
  3. లేకపోతే ఆహారం ఆక్సీకరణం చెందడం పదార్థాల రవాణా, శక్తి ఉత్పాదకత మొదలైన ప్రక్రియలు చోటుచేసుకోలేవు. అలా జరగనట్లయితే ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్న జీవ వ్యవస్థలన్నీ నిలిచిపోతాయి.

10th Class Biology 7th lesson జీవక్రియలలో సమన్వయం 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
ఆహార వాహికలో ఆహారం పెరిస్టాలిక్ చలనాల ద్వారా ముందుకు నెట్టబడి, జీర్ణాశయాన్ని చేరుతుంది. దీన్ని పటము. ద్వారా చూపండి. బోలస్ అనగానేమి?
జవాబు:
AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 6
బోలస్ :
నోటిలో ఆహారం నమలబడి లాలాజలంతో కలిసి ఏర్పడే ముద్దను బోలస్ అంటారు. ఇది ఆస్యకుహరంలో ఏర్పడుతుంది.

ప్రశ్న 2.
పెరిస్టాల్టిక్ చలనం అంటే ఏమిటి? ఆహారవాహికలో ఆహార చలనాన్ని, మీరు పాఠశాలలో చేసిన సైకిలు ట్యూబ్ లో ఆలుగడ్డ (బంగాళదుంప) కదలిక ప్రయోగంతో పోల్చి వివరించండి.
జవాబు:
ఆహారం మ్రింగినపుడు ఆహారవాహికలో ఏర్పడే అని యాంత్రిత క్రమబద్ద చలనాన్ని పెరిస్టాల్టిక్ చలనం అంటారు. దీని వలన ఆహారం నోటి నుండి జీర్ణాశయం చేరుతుంది.

మేము నిర్వహించిన సైకిల్ ట్యూబ్ ప్రయోగంలో
సైకిల్ ట్యూబ్ – ఆహారవాహిక
బంగాళదుంప – ఆహారపు
నూనె పూత – లాలాజలం
కదలిక – పెరిస్టాలిటిక్ చలనంతో పోల్చవచ్చు.

ప్రశ్న 3.
జీర్ణాశయం సొంత ఆమ్లాల స్రావాల నుండి తనను తాను ఎలా రక్షించుకుంటుందో అర్థం చేసుకొనుటకు నిర్వహించిన ఆమ్లం మరియు పత్ర ప్రయోగం విధానాన్ని రాయండి. ఫలితాలను మానవ జీర్ణ వ్యవస్థలో జరిగే అంశాలతో పోల్చండి.
జవాబు:
కావలసిన పరికరాలు :
రెండు ఆకులు, పెట్రోలియం జెల్లీ / వాజ్ లీన్, బలహీన ఆమ్లం, రెండు పెట్రెడిషన్లు, డ్రాపర్.

ప్రయోగ విధానం :

  1. రెండు ఆకుపచ్చని పత్రాలు సేకరించాలి. ఒక పత్రానికి పెట్రోలియం జెల్లీ లేదా వాజ్ లీన్ పూయాలి. మరొక దానిని అలాగే వదిలేయాలి.
  2. రెండు ఆకులను పెట్రెడిష్ లో ఉంచి 1 లేదా 2 చుక్కల బలహీన ఆమ్లాన్ని రెండు పత్రాలపై డ్రాపర్ సహాయంతో వేయాలి.
  3. అరగంట తరువాత పత్రాలను పరిశీలించాలి. వాజ్ లీన్ పూసిన ఆకులో ఏ మార్పు ఉండదు.
  4. వాజ్ లీన్ పూయని ఆకు ఆమ్లం ప్రభావం నుండి రక్షించబడలేదు. (కాలినట్లుగా మారింది).

పోలిక :

  1. శ్లేష్మ పదార్థం జీర్ణాశయపు గోడలపై ఒక పలుచని పొరలా ఏర్పడుతుంది. ఇది ఆమ్ల ప్రభావం నుండి జీర్ణాశయాన్ని రక్షిస్తుంది.
  2. పెట్రోలియం జెల్లీ చేసే పనిని జీర్ణాశయపు గోడలలోని శ్లేష్మం చేసే పనితో పోల్చవచ్చు.

ప్రశ్న 4.
క్రింది వాటికి కారణాలు తెలపండి.
a) జీర్ణాశయం ఖాళీ అయినపుడు ఆకలి సంకేతాలు మెదడుకు చేరతాయి.
b) జీర్ణాశయం ఆహారంతో నిండినపుడు ఇంక ఆహారం అవసరం లేదనిపిస్తుంది.
c) జలుబు చేసినపుడు ఆహారం రుచిగా ఉండదు.
d) ఒక ద్రాక్షపండును నాలుకపై ఉంచినపుడు దాని రుచి మనకు తెలియదు.
జవాబు:
a) జీర్ణకోశ గోడల నుండి ‘గ్రీలిన్’ హార్మోన్ స్రవించుట వలన ఆకలి సంకేతాలు మెదడుకు చేరతాయి.
b) జీర్ణాశయం ఆహారంతో నిండినపుడు లెప్టిన్ అనే హార్మోన్ స్రవించబడి ఆకలిని అణచివేస్తుంది.
c) ఋణ గ్రాహికలు మూసుకుపోవటం వలన జలుబు చేసినపుడు ఆహారం రుచిగా ఉండదు.
d) ఆహారపదార్థం రుచి కళికలలోనికి ప్రవేశించినపుడు మాత్రమే రుచి తెలుస్తుంది. ద్రాక్షపండు ద్రవరూపంలో లేకపోవటం వలన పదార్ధం రుచి కళికలలోనికి ప్రవేశించలేదు.

ప్రశ్న 5.
మానవ జీర్ణ వ్యవస్థలోని క్రింది భాగాలలో పెరిస్టాలిసిస్ విధులు తెల్పండి.
a) ఆహారవాహిక
b) జీర్ణాశయం
c) చిన్న ప్రేగు
d) పెద్ద ప్రేగు
జవాబు:
a) ఆహారవాహిక :
ఆహారవాహికలో పెరిస్టాలిసిస్ బోలను జీర్ణాశయంలోనికి నెడుతుంది.

b) జీర్ణాశయం :
జీర్ణాశయంలో పెరిస్టాలిసిస్ ఆహారాన్ని నిల్వ చేయుటలోనూ, ముక్కలు చేయుటలోనూ, జఠర రసంలో కలుపుటలోనూ తోడ్పడుతుంది.

c) చిన్న ప్రేగు :
జీర్ణ రసాలతో క్రైమ్ ను కలుపుతుంది.

d) పెద్ద ప్రేగు :
జీర్ణం కాని వ్యర్థ పదార్థాలు పురీష నాళం ద్వారా బయటకు పంపుటలో సహాయపడుతుంది.

ప్రశ్న 6.
పిండిపై లాలాజలం యొక్క చర్యను వివరించడానికి నీవు చేసిన ప్రయోగమును వివరించుము.
(లేదా)
పిండి పదార్థాలపై లాలాజలం యొక్క చర్యను తెలుసుకొనుటకు నీవు నిర్వహించిన ప్రయోగం తెలపండి. లాలాజలము యొక్క pH ను ఏ విధంగా గుర్తించారు?
జవాబు:
కావాల్సిన పరికరాలు :
1) పరీక్షనాళిక, 2) పిండి, 3) లాలాజలం, 4) అయోడిన్ ద్రావణం, 5) డ్రాపర్, 6) pH కాగితం.

ప్రయోగ విధానం :

  1. ఒక పరీక్షనాళిక తీసుకుని సగం వరకు నీటితో నింపి చిటికెడు పిండి కల్పి బాగా కదిలించండి.
  2. మిశ్రమాన్ని రెండు సమాన భాగాలుగా రెండు పరీక్షనాళికల్లో తీసుకోండి.
  3. టీస్పూన్ లాలాజలంను ఒక పరీక్షనాళికలో కలపండి. రెండో పరీక్షనాళికలో కలపవద్దు.
  4. 45 ని|| తరువాత ఒక చుక్క అయోడిన్ ద్రావణం రెండు పరీక్షనాళికలలో కలపండి.

పరీశీలన మరియు నిర్ధారణ :
లాలాజలం కలిపిన ద్రావణం నీలిరంగులోకి మారలేదు. లాలాజలం కలపని ద్రావణం నీలిరంగులోకి మారింది.

గుర్తించుట :
ఒక చిన్న pH కాగితం ముక్కను తీసుకుని నాలుకపై తాకించండి. దానిపై ఏర్పడిన రంగును రంగు పట్టికతో జత చేసి చూడండి pH విలువను గుర్తించవలెను.

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

ప్రశ్న 7.
రుచి నాలుక మరియు అంగిలికి సంబంధించిన విషయం – దీనిని నిరూపించే ఒక కృత్యాన్ని రాయండి.
జవాబు:

  1. కొంచెం చక్కెరను నాలుకపై వేసుకొని, నాలుకను అంగిలికి తగలకుండా నోటిని తెరిచి ఉంచాలి.
  2. కొద్ది సేపటికి రుచి గుర్తించబడుతుంది.
  3. స్టాప్ క్లాక్ ను ఉపయోగించి నాలుకపై చక్కెర ఉంచినప్పటి నుండి రుచి గుర్తించినప్పటి వరకు పట్టిన సమయాన్ని గుర్తించాలి.
  4. ఇప్పుడు ఇదే ప్రయోగాన్ని నాలుకపై చక్కెర వేసుకొని దానిని అంగిలితో నొక్కి ఉంచి చేయాలి.
  5. ఇప్పుడు రుచి చాలా కొద్ది సమయంలోనే తెలుస్తుంది.
  6. దీనిని బట్టి రుచి నాలుక మరియు అంగిలికి సంబంధించిన విషయం అని తెలుస్తుంది.

ప్రశ్న 8.
క్రింది పటాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 18
i) ఆహారవాహికలో గల కండరాలు తరంగం లాగా జరిపే కదలికలను ఏమంటారు?
జవాబు:
ఆహారవాహికలో గల కండరాలు తరంగం లాగా జరిపే కదలికలను పెరిస్టాలిటిక్ చలనము అంటారు.

ii) ఆహారవాహిక ఏ విధమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది?
జవాబు:
ఆహారవాహిక పొడవాటి గొట్టము వంటి నిర్మాణము కలిగి ఉంటుంది.

iii) ఆహారవాహికలో ఆహారం ప్రయాణించడానికి శ్లేషస్తరం ఎలా ఉపయోగపడుతుంది?
జవాబు:
శ్లేష్మము, ఆహారము సులభంగా క్రిందికి జారుటకు తోడ్పడుతుంది.

iv) ఆహార నాళంలోని ఏఏ భాగాలు ఆహారవాహిక ద్వారా కలుపబడుతూ ఉంటాయి?
జవాబు:
ఆహార నాళంలోని గ్రసని మరియు జీర్ణాశయము ఆహారవాహిక ద్వారా కలుపబడుతూ ఉంటాయి.

ప్రశ్న 9.
నోటి జీర్ణక్రియలో లాలాజల పాత్ర ఏమిటి?
జవాబు:

  1. అనియంత్రిత నాడీవ్యవస్థ చర్య వలన లాలాజల గ్రంథులు లాలాజలాన్ని స్రవిస్తాయి.
  2. ఇది ఆహారాన్ని తేమగా చేసి నమిలి మింగడానికి అనుకూలంగా తయారుచేస్తుంది. అపుడు ఆహారం జిగురు ముద్దలా మారుతుంది. దీనిని “బోలస్” (Bolus) అంటారు.
  3. నాలుక సహాయంతో మింగడం వలన ఇది ఆహారవాహికలోనికి చేరుతుంది.
  4. లాలాజలంలో ఉండే ‘లాలాజల ఎమైలేజ్’ అనే ఎంజైమ్ పెద్ద పెద్ద పిండిపదార్థ అణువులను చిన్న చిన్న అణువులుగా మారుస్తుంది. సాధారణంగా చక్కెరలుగా మారుస్తుంది.
  5. మింగే క్రియాయంత్రాంగం కూడా నాడీ సమన్వయంతో పనిచేస్తుంది. మెదడు కాండం దగ్గరలోని మజ్జిముఖంలో ఈ నియంత్రణ కేంద్రం ఉంటుంది.
  6. దంతాలు, నాలుక సహాయంతో ఆహారాన్ని నమిలి చూర్ణం చేయడం వల్ల ఆహార పదార్థాల పరిమాణం మింగడానికి అనువుగా మారుతుంది.

ప్రశ్న 10.
ఆహారవాహికలో ‘బోలస్’ ఎలా క్రిందకు కదులుతుంది?
జవాబు:

  1. ఆహారవాహిక గోడలు రెండు రకాలైన మెత్తని నునుపు కండరాలను కలిగి ఉంటాయి.
  2. లోపలి పొరలో వలయాకార కండరాలు వెలుపలి పొరలో సంభాకార కండరాలు ఉంటాయి.
  3. వలయాకార కండరాలు సంకోచించినపుడు ఆహారపు ముద్దకు వెనుక ఉండే ఆహారవాహిక భాగం ముడుచుకుని ఆహార ముద్దను కిందికి జరిగేలా ఒత్తిడి కలిగిస్తుంది.
  4. స్తంభాకార కండరాల వలన ఆహారవాహికలోని బోలస్ ముందు భాగం పొడవు తగ్గి గొట్టం వెడల్పవుతుంది. బోలస్ ముందుకు కదులుతుంది.
  5. ఇలా కండరాల సంకోచ వ్యాకోచ కదలికల వలన ఒక తరంగం లాంటి చలనం ఏర్పడి ఆహార బోలను జీర్ణాశయం లోనికి నెడుతుంది. ఈ ప్రక్రియను ‘పెరిస్టాల్ సిస్’ (Peristalsis) అంటారు.
  6. ఇది అనియంత్రితమైనది, మరియు అనియంత్రిత నాడీవ్యవస్థ అధీనంలో నియంత్రించబడుతుంది.

ప్రశ్న 11.
చిన్నప్రేగుల అంతర నిర్మాణం వర్ణించండి.
జవాబు:

  1. చిన్నప్రేగుల లోపలి గోడలు అనేక ముడతలు పడి ఉంటాయి. వీటిని ఆంత్రచూషకాలు అంటారు.
  2. ఆంత్రచూషకాలు రక్తనాళాలు మరియు శోషరసనాళాలను కలిగి ఉంటుంది.
  3. జీర్ణమైన ఆహారం రక్తంలోనికి పీల్చుకొనబడుతుంది. ఈ ప్రక్రియను శోషణ అంటారు.
  4. శోషణ చిన్నప్రేగుల ప్రధానవిధి. శోషణాతల వైశాల్యం పెంచటానికి ఆంత్రచూషకాలు తోడ్పడతాయి.
  5. గ్లూకోజ్ రక్తనాళంలోనికి, ఎమైనోఆమ్లాలు, గ్లిజరాల్ శోషరస నాళంలోనికి శోషణ చెంది శరీర కణజాలానికి రవాణా కాబడతాయి.

ప్రశ్న 12.
రెండవ మెదడు అనగానేమి? దాని ప్రాధాన్యత ఏమిటి?
జవాబు:

  1. జీర్ణనాళంలోని నాడీవ్యవస్థ నాడీ కణాలతో కూడిన ఎంతో సంక్లిష్టమైన నాడీ వలయాన్ని కలిగి ఉంటుంది. శాస్త్రవేత్తలు ఈ వ్యవస్థను రెండవ మెదడుగా పిలుస్తారు.
  2. దాదాపు 100 మిలియన్ల నాడీకణాలు ఈ రెండవ మెదడులో ఇమిడి ఉంటాయి. ఇది వెన్నుపాము లేదా పరిధీయ నాడీవ్యవస్థలోని నాడీ కణాల సంఖ్యను మించి ఉంటుంది.
  3. జీర్ణనాడీవ్యవస్థలోని ఈ మహా నాడీకణాల సముదాయం జీర్ణవ్యవస్థ యొక్క అంతర ప్రపంచం, అందులో గల పదార్థాల గురించి తెలుసుకోవడానికి, అనుభూతి చెందడానికి తోడ్పడుతుంది.
  4. ఆహారాన్ని చిన్నచిన్న రేణువులుగా విచ్ఛిన్నం చేయడం, పోషకాలను గ్రహించడం మరియు వ్యర్థాలను విసర్జించడం లాంటి జీవక్రియలను ఉత్తేజపరచడం మరియు సమన్వయం చేయడానికి అనేక రసాయనిక పద్ధతులు, యాంత్రిక మిశ్రణీకరణ విధానాలు, లయబద్దమైన కండర సంకోచాలు ఒకదానివెంట ఒకటిగా జీర్ణక్రియా చర్యలన్నీ జరుగుతూ ఉంటాయి.
  5. రెండవ మెదడు తనదైన స్వీయ ప్రతిస్పందనలను, జ్ఞానేంద్రియ శక్తిని కలిగి ఉండడంవల్ల జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఎన్నో పనుల నిర్వహణను మెదడుతో సంబంధం లేకుండా స్వతంత్రంగా నియంత్రిస్తుంది.
  6. జీర్ణవ్యవస్థలో పదార్థాలు సజావుగా లోనికి రావడానికి, బయటకు వెళ్ళడానికి వీలుగా ఈ వ్యవస్థ ఇంత సంక్లిష్టతతో ఏర్పడి ఉండవచ్చునని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ప్రశ్న 13.
జీర్ణాశయంలో పెరిస్టాల్టిక్ చలనాన్ని చూపే బొమ్మను గీయండి. జీర్ణాశయంలో ఆహార కదలికలు వివరించండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 1

  1. పెరిస్టాల్టిక్ చలనాలు ఆహారాన్ని ఒక చోట నుండి మరియొక చోటుకి కదిలిస్తాయి.
  2. జీర్ణాశయంలో పెరిస్టాల్టిక్ కదలికలు, కండరాల కదలికలు వేగంగా ఉండడం వల్ల ఆహారం మెత్తగా నూరబడుతుంది.
  3. జీర్ణాశయ కండరాలలో కలిగే సంకోచ సడలికలు ఆహారాన్ని ఆమ్లాలు మరియు ఇతర జీర్ణరసాలతో కలిపి చిలుకుతాయి. జీర్ణరసాలు ఆహారాన్ని మెత్తటి జావలాంటి ద్రవంలా మారుస్తాయి. దీనిని క్రైమ్ అంటారు.
  4. జీర్ణాశయంలో జీర్ణక్రియ ముగింపు దశకు చేరుకునే సరికి జీర్ణాశయ గోడల సంకోచాలు తగ్గుముఖం పడతాయి.

10th Class Biology 7th lesson జీవక్రియలలో సమన్వయం ½ Mark Important Questions and Answers

ఫ్లో బారులు

1.
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 2
జవాబు:
నాడీ వ్యవస్థ

2.
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 3
జవాబు:
లెఫ్టిన్

3.
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 4
జవాబు:
ద్వారగొర్ధం

4.
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 5
జవాబు:
పులుపు

5.
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 6
జవాబు:
పొలియెట్

6.
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 7
జవాబు:
ఋణ గ్రాహకాలు / వాసన గ్రాహకాలు

7.
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 8
జవాబు:
రదనికలు

సరైన గ్రూపును గుర్తించండి

8. ఏ గ్రూపు సంఘటనలు సరైన క్రమంలో ఉన్నాయి?
A. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గడం – గ్రీలిన్ జీర్ణాశయ గోడల నుండి స్రవించడం – జీర్ణాశయంలో ఆకలి కోరికలు
B. గ్రీలిన్ జీర్ణాశయ గోడల నుండి స్రవించడం – రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గడం – జీర్ణాశయంలో ఆకలి కోరికలు
జవాబు:
గ్రూపు – A

9. మెదడు వాసనను గుర్తించే సరైన క్రమాన్ని కనుగొనండి.
A. మెదడులో ఘోణ గ్రాహకాలు-ముక్కులో ఋణ గ్రాహకాలు – వాసన గుర్తించబడటం
B. ముక్కులో మాణ గ్రాహకాలు-మెదడులో ఘ్రాణ గ్రాహకాలు – వాసన గుర్తించబడటం
జవాబు:
గ్రూపు – B

10. ఏ గ్రూపు సంఘటనలు ఆహారం యొక్క రుచిని గుర్తించడంలో చోటు చేసుకుంటాయి?
A. నాలుక మీద ఉంచిన ఆహారం – లాలాజలంలో కరగడం – నాలుకతో అంగిలిని నొక్కడం.
B. నాలుక మీద ఉంచిన ఆహారం – నోరు తెరచి ఉంచడం – నాలుక అంగిలిని తాకరాదు.
జవాబు:
గ్రూపు – A

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

11. ఏ గ్రూపు దంత అమరిక సరైన క్రమంలో అమరి ఉన్నాయి?
A. కుంతకాలు – రదనికలు – చర్వణకాలు – అగ్ర చర్వణకాలు
B. కుంతకాలు – రదనికలు – అగ్ర చర్వణకాలు – చర్వణకాలు
జవాబు:
గ్రూపు – B

12. క్రింది వానిలో పాలపళ్ళు దంత సూత్రాన్ని సూచించేది ఏమిటి?
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 9
జవాబు:
గ్రూపు – B

13. ఆహార వాహిక యొక్క పెరిస్టాలసిస్ సమయంలో ఏ గ్రూపు సంఘటనలు చోటు చేసుకుంటాయి?
A. వలయ కండరాల సంకోచం – ఆహార వాహిక విశాలం – స్తంభాకార కండరాల సంకోచం – ఆహారవాహిక ముడుచుకుపోవడం
B. వలయ కండరాల సంకోచం – ఆహారవాహిక ముడుచుకుపోవడం-స్తంభాకార కండరాల సంకోచం – బోలస్ ముందు ఉన్న ఆహారవాహిక విశాలం.
జవాబు:
గ్రూపు – B

14. ఏ గ్రూపు ప్రక్రియలు జీర్ణాశయంకు సంబంధించినవి?
A. నూరడం, ప్రొపల్టన్, రెట్రోపర్టైన్
B. నమలడం, మాస్టికేషన్, శోషణం
జవాబు:
గ్రూపు – A

15. ఏ గ్రూపు సంఘటనలు స్వయంచోదిత నాడీవ్యవస్థ నియంత్రణలో ఉంటాయి?
A. మింగడం, హార్మోన్ స్రావం, మాస్టికేషన్
B. లాలాజలం స్రావం, పెరిస్టాలసిస్, రివర్స్ పెరిస్టాలసిస్
జవాబు:
గ్రూపు – B

నేను ఎవరు?

16. నేనొక హార్మోన్‌ని. ఆకలి అనే అనుభూతిని కల్గించి, ఆహారం తీసుకొనే విధంగా ప్రేరణను కల్గిస్తాను.
జవాబు:
గ్రీలిన్

17. నాలుక మీద ఇమిడి మరియు రుచిని గ్రహించడం నా బాధ్య త.
జవాబు:
రుచి మొగ్గ

18. నోటి కుహరం మరియు నాసికా కుహరాల మధ్య అమరియున్న అస్థి పలకను నేను. ఆహారం నాకు వ్యతిరేకంగా నొక్కినప్పుడు మాత్రమే మీరు ఆహారం
జవాబు:
అంగిలి

19. నేను మెదడులో ఒక బాగం. మింగుట అనే ప్రక్రియ నా అధీనంలో జరుగుతుంది.
జవాబు:
మజ్జిముఖం

20. నేనొక జిగురు లాంటి పదార్థాన్ని మరియు ఆహారవాహిక గోడలు దెబ్బతినకుండా కందెన వలె పనిచేస్తూ కాపాడతాను.
జవాబు:
శ్లేష్మం

21. ఆహారనాళంలో కనపడే తరంగాకార కదలికను. ఆహారం ఆహారనాళంలో ముందుకు కదలడానికి తోడ్పడతాను.
జవాబు:
పెరిస్టాలసిస్

22. జీర్ణనాళపు గోడలలో ఆహారవాహిక నుండి పాయువు వరకు ఏర్పడిన సంక్లిష్ట నాడీ కణాలతో ఏర్పడిన నాడీ యంత్రాంగాన్ని.
జవాబు:
జీర్ణ సాడీ వ్యవస్థ / రెండవ మెదడు

23. నేను లాలాజలంలో ఉండే ఒక ఎంజైమ్ ను మరియు కార్బోహైడ్రేట్ పై చర్య జరుపుతాను.
జవాబు:
టయలిన్ / లాలాజల అమైలేజ్

24. ఆహారనాళంలో పొడవైన భాగాన్ని నేను. నా పూర్వ భాగము గ్రసనితోను మరియు నా పరభాగము జీర్ణాశయంతోను ‘కలపబడి ఉంటుంది.
జవాబు:
ఆహార వాహిక

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

25. నేను అమెరికన్ శాస్త్రవేత్తని. నా ప్రయోగాలు జీర్ణక్రియ భావనలు విప్లవంగా మారాయి.
జవాబు:
డా॥ బ్యూమాంట్ దోషాన్ని గుర్తించి, సరిచేసి వ్రాయండి

26. కడుపు నిండినప్పుడు గ్రీలిన్ స్రవించడం వల్ల ఆకలి అణచివేయబడుతుంది.
జవాబు:
కడుపు నిండినప్పుడు లెఫ్టిన్ స్రవించడం వల్ల ఆకలి అణచివేయబడుతుంది.

27. ఆహారాన్ని విసిరి, నమిలి, చిన్న ముక్కలుగా విచ్ఛిన్నం చేయడాన్ని రిట్రో పల్టన్ అంటారు.
జవాబు:
ఆహారాన్ని విసిరి, నమిలి, చిన్న ముక్కలుగా విచ్ఛిన్నం చేయడాన్ని మాస్టికేషన్ / నమలడం అంటారు.

28. 10వ కపాలనాడి దవడ భాగంలోని కండరాల కదలికను నియంత్రిస్తుంది.
జవాబు:
5వ కపాలనాడి దవడ భాగంలోని కండరాల కదలికను నియంత్రిస్తుంది.

29. మనం లాలాజలాన్ని స్టార్చ్ ద్రావణానికి జోడించినప్పుడు, లాలాజలంలోని పెప్సిన్ ఎంజైమ్ యొక్క చర్య వలన నీలం నలుపు రంగు అదృశ్యం అవుతుంది. యొక్క రుచిని గుర్తించగలరు.
జవాబు:
మనం లాలాజలాన్ని స్టార్చ్ ద్రావణానికి జోడించినప్పుడు, లాలాజలంలోని టయలిన్/ అమైలేజ్ ఎంజైమ్ యొక్క చర్య వలన నీలం సలుపు రంగు అదృశ్యం అవుతుంది.

30. మింగడం అనేది మెదడు కాండం అనగా ద్వారగోర్లం నియంత్రణలో ఉంటుంది.
జవాబు:
మింగడం అనేది మెదడు కాండం అనగా మజ్జిముఖం నియంత్రణలో ఉంటుంది.

31. పెరిస్టాలిసిస్ అనేది అసంకల్పిత చర్య మరియు ఎంటరిక్ నాడీవ్యవస్థ నియంత్రణలో ఉంటుంది.
జవాబు:
పెరిస్టాలిసిస్ అనేది అసంకల్పిత చర్య మరియు స్వయంచోదిత నాడీవ్యవస్థ నియంత్రణలో ఉంటుంది.

32. చిన్న ప్రేగులో నీరు పునఃశోషణం చెందుతుంది మరియు మిగిలిన వ్యర్థాలు పురీషనాళంలో నిల్వ చేయబడతాయి.
జవాబు:
పెద్ద ప్రేగు లో నీరు పునఃశోషణం చెందుతుంది మరియు మిగిలిన వ్యర్థాలు పురీషనాళంలో నిల్వ చేయబడతాయి.

33. మలద్వార రంధ్రం తెరుచుకోవడం మరియు మూయడంలో జఠర నిర్గమ సంవరిణి దోహదపడుతుంది.
జవాబు:
మలద్వార రంధ్రం తెరుచుకోవడం మరియు మూయడంలో పాయువు సంవరిణి కందరం దోహదపడుతుంది.

34. జఠర రసంలో ఎక్కువ మొత్తంలో సల్స్యురిక్ ఆమ్లం ఉంటుంది మరియు రసాయన చర్యలలో పాల్గొనే రసాయన కారకంగా పనిచేస్తుంది.
జవాబు:
జఠర రసంలో ఎక్కువ మొత్తంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది మరియు రసాయన చర్యలలో పాల్గొనే రసాయన కారకంగా పనిచేస్తుంది.

35. రివర్స్ పెరిస్టాలసిస్లో కండర సంకోచాలు స్వయం చోదిత నాడీవ్యవస్థ నియంత్రణలో 5వ కపాలనాడి ద్వారా నియంత్రించబడతాయి.
జవాబు:
రివర్స్ పెరిస్టాలసిలో కండర సంకోచాలు స్వయం చోదిత నాడీవ్యవస్థ నియంత్రణలో 10వ కపాలనాడి ద్వారా నియంత్రించబడతాయి.

జతపరచుట

36. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
పాల దంతాలు – 20
జ్ఞాన దంతాలు – 8
శాశ్వత దంతాలు – 32
జవాబు:
జ్ఞాన దంతాలు

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

37. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
కుంతకాలు – విసరడం
రదనికలు – చీల్చడం
అగ్ర చర్వణకాలు – కొరకడం
జవాబు:
రదనికలు – చీల్చడం

38. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
ఆకలి కోరికలు – 30-45 నిమిషాలు
లాలాజలం pH – 6.4-7.2
కడుపు ఖాళీ చేసే సమయం – 10 గంటలు
జవాబు:
కడుపు ఖాళీ చేసే సమయం – 10 గంటలు

39. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
నాలుక – ఝణ గ్రాహకాలు
ఆకలి కోరికలు – వేగస్ నాడి
ముక్కు – రుచి గ్రాహకాలు
జవాబు:
ఆకలి కోరికలు – వేగస్ నాడి

40. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
మాస్టికేషన్ – 5వ కపాలనాడి
హార్మోన్ల స్రావం – హైపోథాలమస్
రివర్స్ పెరిస్టాలసిస్ – 7వ కపాలనాడి
జవాబు:
రివర్స్ పెరిస్టాలసిస్ – 7వ కపాలనాడి

41. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
మలము – జీర్ణం కాని వ్యర్థ పదార్థం
బోలస్ – పాక్షికంగా జీర్ణమైన ఆహారం
క్రైమ్ – మెత్తగా చేయబడిన ఆహారపు ముద్ద
జవాబు:
మలము – జీర్ణం కాని వ్యర్థ పదార్థం

42. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
రెండవ మెదడు – జీర్ణనాళం
జఠర నిర్గమ సంవరిణి – జీర్ణాశయం
పాయు సంవరిణి కండరం – పెద్ద ప్రేగు
జవాబు:
పాయు సంవరిణి కండరం – పెద్ద ప్రేగు

ఉదాహరణలు ఇవ్వండి

43. వాంతులు రివర్స్ పెరిస్టాలసిస్కు ఉదాహరణ. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
త్రేనుపు

44. నెమరువేయడం అనేది రివర్స్ పెరిస్టాలసిస్ ప్రక్రియ. నెమరువేయు జీవికి ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఆవు/గేదె

45. గబ్బిలం నిశాచర జంతువుకు ఉదాహరణ. దిశాచర జీవికి ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
మానవుడు

46. గ్రీలిన్ అనే హార్మోన్ ఆకలి కోరికలను ప్రేరేపిస్తుంది. కాలేయం, క్లోమం మొదలైన వాటి నుంచి జీర్ణ రసాలను స్రవించడాన్ని ప్రేరేపించే హార్మోన్‌కు మరో ఉదాహరణ. ఇవ్వండి.
జవాబు:
సెక్రెటిన్ / కోల్ సెప్టోకైనిన్

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

47. జీర్ణాశయం దగ్గరలో జఠర నిర్గమ సంవరిణి కండరం ఉంటుంది. మలద్వారం వద్ద ఉండే నంవరిణి కండరానికి మరో ఉదాహరణను ఇవ్వండి.
జవాబు:
పాయు సంవరిణి కండరం

విస్తరించుము

48. ENSని విస్తరించుము.
జవాబు:
Enteric Nervous System/ జీర్ణనాడీవ్యవస్థ

49. ANSని విస్తరించుము.
జవాబు:
Autonomous Nervous System/స్వయంచోదిత నాడీవ్యవస్థ

50. pH ని విస్తరించుము.
జవాబు:
Potential of Hydrogen

పోలికను గుర్తించుట

51. ఆహారవాహిక : బోలస్ : : జీర్ణాశయం 😕
జవాబు:
క్రైమ్

52. కుంతకాలు: 2::?: 1
జవాబు:
రదనికలు

53. ముక్కు : ఘోణ గ్రాహకాలు : : ? : రుచి గ్రాహకాలు
జవాబు:
నాలుక

54. పెరిస్టాలసిస్ : ఆహార వాహిక :: రెట్రోపర్టన్ : ?
జవాబు:
జీర్ణాశయం

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

55. జీర్ణాశయం : చిలకడం :: సూక్ష్మ చూషకాలు 😕
జవాబు:
శోషణం

బొమ్మలపై ప్రశ్నలు

56.
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 10
దీనికి ఏ హార్మోన్ బాధ్యత వహిస్తుంది?
జవాబు:
గ్రీలిన్

57.
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 11
ఈ చిత్రం దేనిని సూచిస్తుంది?
జవాబు:
నాలుక చూషకాలు

58.
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 12
ఈ పటం దేనిని సూచిస్తుంది?
జవాబు:
pH స్కేలు

59.
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 13
ఈ ప్రయోగంలో ఏ పదార్థాన్ని మీరు శ్లేష్మం పొరగా ఉపయోగిస్తారు?
జవాబు:
రదనిక

60.
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 14
‘X’ అనే భాగాన్ని గుర్తించండి.
జవాబు:
లాక్టియేల్స్

ఖాళీలను పూరించండి

61. జీర్ణవ్యవస్థలో సంచి వంటి నిర్మాణం …………….
జవాబు:
జీర్ణాశయం

62. ఆహారం ఆహారవాహికలో జారటానికి ………… తోడ్పడుతుంది.
జవాబు:
శ్లేష్మం

63. ఆహారవాహికలోని చలనం …………
జవాబు:
పెరిస్టాలిటిక్ చలనం

64. చెరకును చీల్చటానికి ఉపయోగించే దంతము ………..
జవాబు:

65. పాయు సంవరణి కండరాల సంఖ్య …………
జవాబు:
2

66. లాలాజల స్వభావం ………..
జవాబు:
క్షార స్వభావం

67. జీర్ణవ్యవస్థలో ఆమ్ల స్వభావం కలిగిన భాగం ………
జవాబు:
జీర్ణాశయం

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

68. లాలాజలంలోని ఎంజైమ్ ………
జవాబు:
టయలిన్

69. అయోడిన్ పిండిపదార్థాన్ని …………… రంగుకు మారుస్తుంది.
జవాబు:
నూనె

10th Class Biology 7th lesson జీవక్రియలలో సమన్వయం 1 Mark Bits Questions and Answers

1. వ్యతిరేక దిశలో జరిగే పెరిస్టాలిసిస్ దీనిలో చూడవచ్చు.
A) పులి
B) ఉడుత
C) ఆవు
D) పిల్లి
జవాబు:
C) ఆవు

2. మానవుని దంతసూత్రం \(\frac{2}{2}, \frac{1}{1}, \frac{2}{2}, \frac{3}{3}\) ఇందులో \(\frac{1}{1}\) సూచించేది ………..
A) కుంతకాలు
B) రదనికలు
C) అగ్రచర్వణకాలు
D) చర్వణకాలు
జవాబు:
B) రదనికలు

3. నీవు చెఱకును చీల్చడానికి ఉపయోగించే దంతాలు ……….
A) రదనికలు
B) కుంతకాలు
C) చర్వణకాలు
D) అగ్రచర్వణకాలు
జవాబు:
A) రదనికలు

4. మన దంతాల అమరిక నిష్పత్తి 3: 2:1: 2 అయితే దీనిలో 3 దేనిని సూచిస్తుంది?
A) రదనికలు
B) చర్వణకాలు
C) అగ్రచర్వణకాలు
D) కుంతకాలు
జవాబు:
B) చర్వణకాలు

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

5. పటంలో బాణం గుర్తుగల భాగం పేరేమిటి?
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 15
A) ఆహారవాహిక
B) జీర్ణాశయము
C) ఆంత్రమూలము
D) ఉండుకము
జవాబు:
C) ఆంత్రమూలము

6. శ్రీరాశయపు ప్రతిచర్యకు ఉదాహరణ
A) పెరిస్టాల్టిక్ చలనం
B) శోషణం
C) వాంతి
D) జీర్ణమవడం
జవాబు:
C) వాంతి

7. బొమ్మలో సూచించిన చోట ఉండే కవాటం
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 16
A) ద్విపత్ర కవాటం
B) పైలోరిక్ కవాటం
C) విల్లె
D) త్రిపత్ర కవాటం
జవాబు:
B) పైలోరిక్ కవాటం

8. పాక్షికముగా జీర్ణమైన ఆహారము …………
A) టైమ్
B) బోలస్
C) ఎముక
D) కండరము
జవాబు:
A or B

9. నాలుక రుచి గ్రాహకం, కనుక రుచిని గ్రహించుటలో ఏ నాడి ముఖ్య మైనది?
A) 6వ కపాలనాడి
B) 5వ కపాలనాడి
C) 10వ కపాలనాడి
D) దృక్ నాడి
జవాబు:
C) 10వ కపాలనాడి

10. నోటిలో ఆహారం ఉన్నప్పుడు లాలాజలం పరిమాణం
A) మారదు
B) తగ్గుతుంది
C) పెరుగుతుంది
D) పైవేవీ కాదు
జవాబు:
C) పెరుగుతుంది

11. జఠర రసములో ఉన్న ఆమ్లము
A) సల్ఫ్యూరిక్ ఆమ్లము
B) హైడ్రోక్లోరిక్ ఆమ్లము
C) నైట్రస్ ఆమ్లము
D) ఫాస్ఫారిక్ ఆమ్లము
జవాబు:
B) హైడ్రోక్లోరిక్ ఆమ్లము

12. pH విలువ 7 కన్నా తక్కువైతే ఆ పదార్థం
A) ఆమ్లం
B) క్షారం
C) తటస్థం
D) హార్మోన్
జవాబు:
A) ఆమ్లం

13. మానవునిలో దంత విన్యాసం
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 20
జవాబు:
A

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

14. మనకు కడుపు నిండుగా ఉండి, ఇంక ఎలాంటి ఆహారం స్రవించబడి ఆకలిని అణిచివేస్తుంది. ఆ హార్మోన్ పేరేమిటి?
A) గ్రీలిన్
B) వాసోప్రెస్సిన్
C) లెఫ్టిన్
D) ఇన్సులిన్
జవాబు:
C) లెఫ్టిన్

15. మానవునిలో జీర్ణక్రియను ప్రారంభించు ఎంజైమ్
A) లాలాజల అమైలేజ్
B) పెప్సిన్ అవంతి
C) ట్రిప్సిన్
D) లైపేజ్
జవాబు:
A) లాలాజల అమైలేజ్

16. పిండి పదార్థాల పై లాలాజలం యొక్క చర్యను నిరూపించుటకు నీవు ఏ కారకాన్ని వాడతావు?
A) KOH
B) ఆల్కహాల్
C) అయోడిన్
D) సున్నపునీరు
జవాబు:
C) అయోడిన్

17.
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 18
A) థ్రాంబోలైనేజ్
B) థ్రాంబిన్
C) ఫ్రాంఛాంబిన్
D) ఎంటిరోకైనేజ్
జవాబు:
B) థ్రాంబిన్

18. రెండవ మెదడు అనగా ………..
A) మస్తిష్కం
B) అనుమస్తిష్కం
C) జీర్ణ నాడీవ్యవస్థ
D) వెనుక మెదడు
జవాబు:
C) జీర్ణ నాడీవ్యవస్థ

19. ఆకలితో రజిని ఏడుస్తోంది. ఆమె జీర్ణాశయంలో ఆకలి ప్రచోదనాలకు కారణమైన హార్మోను ఏది?
A) లెఫ్టిన్
B) గ్రీలిన్
C) వాసోప్రెస్సిన్
D) థైరాక్సిన్
జవాబు:
B) గ్రీలిన్

20. జీర్ణాశయం, ఆంత్రమూలంలోకి తెరుచుకునే చోట ఉండే సంపరిణీ కండరం
A) కార్డియాక్
B) పైలోరిక్
C) ఆనల్
D) గాస్టిక్
జవాబు:
B) పైలోరిక్

21. ఆకలి కోరికలు ఎంత సమయం కొనసాగుతాయి?
A) 10-15 నిముషాలు
B) 1-2 గంటలు
C) 15-20 నిముషాలు
D) 30-45 నిముషాలు
జవాబు:
D) 30-45 నిముషాలు

22. మనకు కడుపు నిండుగా ఉండి, ఎలాంటి ఆహారం అవసరం లేదు అనిపించినప్పుడు స్రవించబడే హార్మోన్
A) సెక్రిటిన్
B) గ్లూకోగాన్
C) లెఫ్టిన్
D) గ్రీలిన్
జవాబు:
C) లెఫ్టిన్

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

23. కింది బొమ్మను గుర్తించండి. అవసరం లేదు అనిపించినపుడు ఒక హార్మోన్
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 17
A) ధమని రక్తనాళం
B) చాలకనాడీ కణం
C) శ్వాసగోణి
D) ఆంత్రచూషకం
జవాబు:
D) ఆంత్రచూషకం

మీకు తెలుసా?

* పగలు నిద్రించినపుడు సొంగ (లాలాజలం) ఎందుకు కారుతుంది?
నిశాచర జీవుల (Nocturnals) గురించి మీరు వినే ఉంటారు కదా! ఇవి రాత్రివేళలో చురుకుగా ఉంటాయి. అయితే మనం పగటివేళలో చురుకుగా ఉండి, రాత్రివేళలో విశ్రాంతి తీసుకుంటాం. శరీరంలోని వ్యవస్థలన్నీ మనం పనిచేస్తున్నప్పుడు చురుకుగా ఉంటాయి. అందుకే మనిషిని దివాచరులు (Diurnal animals) అంటారు. మన జీర్ణ వ్యవస్థ పగటివేళలో చురుకుగా ఉండడం వలన అది ఆహారాన్ని స్వీకరించి జీర్ణక్రియ జరపడానికి సిద్ధంగా ఉంటుంది. అందుకే పగటివేళలో నిద్రిస్తే నోటి ద్వారా స్రవించే లాలాజలం తలదిండును తడుపుతుంది. కానీ రాత్రివేళలో ఇలా జరగదు. సాధారణంగా ఒక రోజులో మనం 1- 1.5 లీటర్ల లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాం.

పునశ్చరణం

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 19

AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

These AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ will help students prepare well for the exams.

AP Board 10th Class Biology 4th lesson Important Questions and Answers విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

10th Class Biology 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
ప్రాథమిక ఉత్పన్నాలు అనగానేమి?
జవాబు:
ప్రాథమిక ఉత్పన్నాలు : పిండిపదార్థాలు, మాంసకృత్తులు మరియు కొవ్వులు వంటి పదార్థాలను “థమిక జీవక్రియా ఉత్పన్నాలు” అంటారు.

ప్రశ్న 2.
ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు అనగానేమి?
జవాబు:
ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు :
మొక్కల పెరుగుదలకు మరియు అభివృద్ధికి కాకుండా ఇతర విధులకు ఉపయోగపడే వాటిని “ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు” అంటారు.
ఉదా : ఆల్కలాయిడ్, రెసిన్లు.

ప్రశ్న 3.
మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. ఎందుకు?
జవాబు:
మూత్రంలో ‘యూరోక్రోమ్’ అనే పదార్థం ఉంటుంది. ఆ పదార్ధం వలన మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది.

ప్రశ్న 4.
అవయవదానంపై అవగాహన పెంచేందుకు రెండు నినాదాలు రాయండి.
జవాబు:
అవయవదానం – మహాదానం
అవయవాలు దానం చెయ్యండి – మరణం తరువాత కూడా జీవించండి.

ప్రశ్న 5.
మానవునిలో ఏవైనా రెండు విసర్జకావయవాల పేర్లు రాయండి.
జవాబు:
1) మూత్రపిండాలు, 2) చర్మం, 3) ఊపిరితిత్తులు, 4) కాలేయం, 5) పెద్ద ప్రేగు

AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

ప్రశ్న 6.
రక్తం మరియు మూత్రం రెండింటిలోను వున్న రెండు పదార్థాలు ఏవి?
జవాబు:
గ్లూకోజ్, సోడియం, పొటాషియం, క్లోరైడ్స్, యూరియా, క్రియాటిన్, యూరిక్ ఆమ్లము, కాల్షియం, ఫాస్ఫరస్.

ప్రశ్న 7.
మీ క్షేత్ర పర్యటనలో మీరు కొన్ని ఆల్కలాయిడ్స్ కలిగిన మొక్కలను సేకరించారు. వాటిలో మనకు హాని కలిగించే ఆల్కలాయిడ్స్ పేర్లు వ్రాయండి.
జవాబు:
నికోటిన్, మార్ఫీన్, కొకైన్

ప్రశ్న 8.
మీ పరిసరాలలో నీవు పరిశీలించిన ఏయే మొక్కలు ఔషధాల తయారీలో ఉపయోగపడతాయి?
జవాబు:
వేప, తులసి, జిల్లేడు, తంగేడు, చామంతి

ప్రశ్న 9.
మొక్కల్లో తయారయ్యే పదార్థాలను ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు మరియు ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు అని వర్గీకరిస్తారు. ఈ రెండు రకాలకూ ఒక్కొక్క ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు : ఉదా : పిండి పదార్థములు (కార్బోహైడ్రేటులు), మాంసకృత్తులు (ప్రోటీనులు), కొవ్వులు

ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు : ఉదా : ఆల్కలాయిడ్లు, రెసిన్లు, టానిన్లు, జిగురులు, మరియు లేటెక్స్.

ప్రశ్న 10.
మూత్రపిండాలు వ్యాధి బారిన పడకుండా ఉండుటకు నీవు. పాటించే రెండు ఆరోగ్యకర అలవాట్లు రాయండి.
జవాబు:

  1. తగినంత నీటిని త్రాగటం
  2. ఆహార పదార్థాలలో ఉప్పు వాడకాన్ని తగ్గించటం
  3. పండ్ల రసాలను ఎక్కువగా తాగటం

ప్రశ్న 11.
క్షీరదాల మూత్రపిండ అంతర్నిర్మాణమును పరిశీలించే ప్రయోగంలో నీవు తీసుకున్న జాగ్రత్తలేవి?
జవాబు:

  1. గొర్రె మూత్రపిండమును సేకరించిన తర్వాత రక్తమంతా పోయేలా నీటిలో శుభ్రంగా కడగాలి.
  2. పూర్తిగా ఆరిన తర్వాత దానిని ట్రేలో పెట్టి పరిశీలించాలి.
  3. పరిశీలన పూర్తయిన తర్వాత యాంటీ బాక్టీరియల్ లోషన్ తో చేతులు కడుక్కోవాలి.

ప్రశ్న 12.
ఒక వ్యక్తి శరీరం నీరు, వ్యర్థ పదార్థాలతో నిండి ఉంది. అతని కాళ్ళు, చేతులు ఉబ్బి ఉన్నాయి. ఈ స్థితిని ఏమంటాము? ఏ వ్యవస్థ సక్రమంగా పనిచేయక పోవడం వల్ల ఈ స్థితి కలుగుతుంది?
జవాబు:

  1. కాళ్ళు, చేతులు ఉబ్బి ఉన్న స్థితిని యురేమియా అంటారు.
  2. విసర్జక వ్యవస్థ (మూత్రపిండాలు) సక్రమంగా పనిచేయకపోవడం వల్ల ఈ స్థితి కలుగుతుంది.

ప్రశ్న 13.
మీ దైనందిన జీవితంలో ఉపయోగించుకొంటున్న రెండు ద్వితీయ జీవక్రియా ఉత్పన్నకాల పేర్లను రాయండి.
జవాబు:
1) ఆల్కలాయిడ్లు 2) టానిన్లు 3) రెసిన్లు 4) జిగుర్లు 5) లేటెక్స్

ప్రశ్న 14.
జీవక్రియలు అనగానేమి? అందలి రకాలు ఏమిటి?
జవాబు:
జీవ కణంలో జరిగే రసాయనిక చర్యలను జీవక్రియలు అంటారు.
ఇవి రెండు రకాలు. అవి : 1) నిర్మాణాత్మక క్రియలు, 2) విచ్ఛిన్న క్రియలు.

1) నిర్మాణాత్మక క్రియలు :
పదార్థాలు తయారుచేయబడతాయి. ఉదా : కిరణజన్యసంయోగక్రియ.

2) విచ్చిన్న క్రియలు :
పదార్థాలు విడగొట్టబడతాయి. ఉదా : జీర్ణక్రియ, శ్వాసక్రియ.

ప్రశ్న 15.
సమతుల్యత అనగా నేమి?
జవాబు:
దేహంలోని వివిధ భాగాలలోని ద్రవాల గాఢతను స్థిరంగా ఉంచడాన్ని “సమతుల్యత” అంటారు. సమతుల్యత దెబ్బతింటే జీవక్రియలలో ఆటంకం ఏర్పడుతుంది.

ప్రశ్న 16.
హైలస్ అనగా నేమి?
జవాబు:
హైలస్ :
మూత్రపిండం లోపలి తలంలో ఉండే పుటాకార నొక్కును “హైలస్” అంటారు. దీని నుండి వృక్పధమని లోపలికి ప్రవేశించగా, వృక్కసిర, మూత్రనాళం బయటకు వస్తాయి.

ప్రశ్న 17.
మూత్రపిండం అడ్డుకోతలో కనిపించే భాగాలు ఏమిటి?
జవాబు:
మూత్రపిండం అడ్డుకోతలో కనిపించే వెలుపలి ముదురు రంగు ప్రాంతాన్ని ‘వల్కలం’ అని, లోపలి లేత రంగు ప్రాంతాన్ని ‘దవ్వ’ అని అంటారు.

AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

ప్రశ్న 18.
మూత్రపిందం యొక్క నిర్మాణాత్మక ప్రమాణం ఏమిటి?
జవాబు:
మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక ప్రమాణం “నెఫ్రాన్”. దీనినే “వృక్కనాళాలు” అంటారు.

ప్రశ్న 19.
నెఫ్రాలోని ప్రధాన భాగాలు ఏమిటి?
జవాబు:
నెఫ్రాన్లోని ప్రధాన భాగాలు :
నెఫ్రాలో ప్రధానంగా 1) మాల్ఫీజియన్ దేహం 2) వృక్కనాళిక అనే ప్రధాన భాగాలు ఉంటాయి.

ప్రశ్న 20.
రక్తకేశనాళికాగుచ్ఛం (గ్లోమరులస్) అనగా నేమి?
జవాబు:
రక్తకేశనాళికాగుచ్ఛం :
బొమన్ గుళికలో అభివాహ రక్తనాళం అనేక రక్తకేశనాళికలుగా విడిపోతుంది. దీనిని “గ్లోమరులస్” లేదా “రక్తకేశనాళికా గుచ్ఛం” అంటారు.

ప్రశ్న 21.
మాల్ఫీజియన్ దేహంలో ఏ ఏ భాగాలు ఉంటాయి?
జవాబు:
మాల్ఫీజియన్ దేహంలో 1) బొమన గుళిక 2) రక్తకేశనాళికా గుచ్ఛం (గ్లోమరులస్) అనే భాగాలు ఉంటాయి.

ప్రశ్న 22.
పోదోసైట్స్ అనగా నేమి?
జవాబు:
పోదోసెట్ :
భౌమన్ గుళిక గోడలలోని కణాలు ఉపకళాకణజాలంతో ఏర్పడతాయి. వీటిని “పోడోసైట్లు” అంటారు. పదార్థాల వడపోతకు వీలుకలిగించేలా పోడోసైట్ కణాల మధ్య సూక్ష్మరంధ్రాలు ఉంటాయి.

ప్రశ్న 23.
వృక్కనాళికలోని భాగాలు ఏమిటి?
జవాబు:
వృక్కనాళికలో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి. అవి :

  1. సమీపస్థ సంవళితనాళం
  2. హెన్లీశిక్యం
  3. దూరస్థ సంవళితనాళం.

ప్రశ్న 24.
పార్టీనీయం మొక్క వలన మనకు కలిగే నష్టం ఏమిటి?
జవాబు:
పార్టీనీయం మొక్క పుప్పొడి రేణువులు, మనకు ఎలర్జీని కలిగిస్తాయి. వాటిలో ఉండే నత్రజనియుత పదార్థాలు ఎలర్జీని, ఆస్తమాను కలిగిస్తాయి.

AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

ప్రశ్న 25.
నెఫ్రా లో పునఃశోషణ ఎక్కడ జరుగుతుంది?
జవాబు:
సమీప సంవళితనాళంలో పునఃశోషణ జరుగుతుంది.

ప్రశ్న 26.
నెఫ్రాన్ యొక్క ఏ ప్రాంతంలో మూత్రం యొక్క pH విలువ నియంత్రించబడుతుంది?
జవాబు:
నెఫ్రాన్లోని దూరస్థ సంవళితనాళంలో నాళికాస్రావం వలన మూత్రం యొక్క pH విలువ నియంత్రించబడుతుంది.

ప్రశ్న 27.
నెఫ్రాల్లో నీటి పునః శోషణకు తోడ్పడే హార్మోన్ ఏమిటి? .
జవాబు:
నీటి పునఃశోషణకు వాసోప్రెస్సిన్ హార్మోన్ తోడ్పడుతుంది.

ప్రశ్న 28.
ఆళిందం (Vestibule) అనగా నేమి?
జవాబు:
మూత్రాశయం చివరి నాళాన్ని ప్రసేకం అంటారు. ఇది స్త్రీలలో 4 సెం.మీల పొడవు ఉంటుంది. దీనిని ‘ఆళిందం’ (Vestibule) అని కూడా అంటారు. అయితే ప్రసేకం పురుషులలో 20 సెం.మీ.ల పొడవు ఉండి ఉంటుంది. ఇది జననేంద్రియ నాళంగా పిలువబడుతుంది.

ప్రశ్న 29.
మూత్ర విసర్జన అనగా నేమి?
జవాబు:
మూత్ర విసర్జన :
మూత్రాశయం సంకోచం చెంది మూత్రాన్ని బయటకు పంపే ప్రక్రియను “మూత్ర విసర్జన” అంటారు.

ప్రశ్న 30.
మూత్రానికి రంగును కలిగించే పదార్థం ఏమిటి?
జవాబు:
యూరోక్రోమ్ అనే పదార్థం మూత్రానికి రంగుని కలిగిస్తుంది.

ప్రశ్న 31.
మూత్రంలో ఉండే పదార్థాలు ఏమిటి?
జవాబు:
మూత్రంలో ఉండే పదార్థాలు :
మూత్రంలో 96% నీరు, 25% కర్బన పదార్థాలు, 1.5% అకర్బన పదార్థాలు ఉంటాయి.

ప్రశ్న 32.
సెబం అనగానేమి?
జవాబు:
సెబం :
చర్మంలోని సెబేషియస్ గ్రంథులు స్రవించే పదార్థాన్ని “సెబం” అంటారు. ఇది రోమాలను మృదువుగా ఉంచటంతోపాటు చర్మతేమను రక్షిస్తుంది.

ప్రశ్న 33.
శీలాజకణాలు అనగానేమి?
జవాబు:
శిలాజకణాలు :
మొక్కల పండ్లలో వ్యర్థాలను నిల్వ చేసే కణాలను “శిలాజకణాలు” అంటారు.

AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

ప్రశ్న 34.
ఆల్కలాయిడ్స్ అనగా నేమి?
జవాబు:
ఆల్కలాయిడ్స్ :
మొక్కలలో ఏర్పడే నత్రజని ఉత్పన్నాలను “ఆల్కలాయిడ్స్” అంటారు. ఇవి మొక్కల వివిధ భాగాలలో నిల్వ చేయబడతాయి.
ఉదా : క్వినైన్, నికోటిన్.

ప్రశ్న 35.
మొదటిసారిగా మూత్రపిండ మార్పిడి ఆపరేషన్ చేసిన వ్యక్తి ఎవరు?
జవాబు:
“డా|| చార్లెస్ హఫ్ నగెల్” 1954లో సమరూప కవలలకు, మొట్టమొదట మూత్రపిండ మార్పిడి చేశాడు.

ప్రశ్న 36.
సంకోచరిక్తికలు ఏ జీవిలో ఉన్నాయి?
జవాబు:
అమీబా, పారమీషియం వంటి ఏకకణజీవులలో సంకోచరిక్తికలు విసర్జనను, ద్రవాభిసరణను నియంత్రిస్తాయి.

ప్రశ్న 37.
ఏ వర్గపు జీవులలో విసర్జక అవయవాలు లేవు?
జవాబు:
స్పంజికలు, సీలెంటిరేటా వర్గపు జీవులలో విసర్జక అవయవాలు లేవు.

ప్రశ్న 38.
మొక్కలు అధికంగా ఉన్న నీటిని ఎలా కోల్పోతాయి?
జవాబు:
మొక్కలు బాష్పోత్సేకం, మరియు బిందుస్రావం ప్రక్రియల ద్వారా అధికంగా ఉన్న నీటిని కోల్పోతాయి.

ప్రశ్న 39.
రబ్బరును ఏ మొక్క నుండి తయారు చేస్తారు?
జవాబు:
హీవియా బ్రెజీలియన్సిస్ మొక్క లేటెక్స్ నుండి రబ్బరు తయారు చేస్తారు.

ప్రశ్న 40.
మానవ శరీరంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థాలు ఏమిటి?
జవాబు:
మానవ శరీరంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థాలు CO2, నీరు, నత్రజని సంబంధిత వ్యర్థాలైన అమ్మోనియా, యూరియా, యూరికామ్లం , పైత్యరస వర్ణకాలు, లవణాలు మొదలైనవి.

ప్రశ్న 41.
శరీర వ్యర్థాలలో ప్రమాదకరమైనది ఏమిటి?
జవాబు:
శరీర వ్యర్థాలన్నింటిలోనూ అమ్మోనియా విషతుల్యమైనది.

ప్రశ్న 42.
వాసోప్రెస్సిన్ లోపం వలన కలిగే వ్యాధి ఏమిటి?
జవాబు:
వాసోప్రెస్సిన్ లోపం వలన తక్కువ గాఢత గల మూత్రం విసర్జించబడుతుంది. దీనిని “అతిమూత్ర వ్యాధి” లేదా “డయాబెటిస్ ఇన్సిపిడస్” అంటారు.

ప్రశ్న 43.
‘యురేమియ’ అనగా నేమి?
జవాబు:
యురేమియ:
మూత్ర పిండాలు పనిచేయటం ఆగిపోతే, శరీరంలో నీరు, వ్యర్థ పదార్థాలు నిండిపోతాయి. ఈ దశను ‘యురేమియ’ అంటారు. ఈ దశలో కాళ్లు, చేతులు ఉబ్బిపోతాయి.

ప్రశ్న 44.
హీమోడయాలసిస్ అనగా నేమి?
జవాబు:
హీమోడయాలసిస్ :
కృత్రిమంగా రక్తాన్ని వడగట్టే ప్రక్రియను ‘హీమోడయాలసిస్’ అంటారు.

ప్రశ్న 45.
టానిన్ల ప్రయోజనం ఏమిటి?
జవాబు:
టానిన్లను తోళ్ళను పదును చేయటానికి, మందులలో ఉపయోగిస్తారు.

ప్రశ్న 46.
రైసిన్ల ప్రయోజనం ఏమిటి?
జవాబు:
వార్నిష్ తయారీలో రెసిన్లు వాడతారు.

AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

ప్రశ్న 47.
జిగురుల ఉపయోగం ఏమిటి?
జవాబు:
అతికించుటకు, బైండింగ్ వర్కులలోను, ఆహారపదార్థాలలోనూ జిగురులు ఉపయోగిస్తారు.

ప్రశ్న 48.
బయోడీజిల్ తయారీకి ఏ మొక్కను ఉపయోగిస్తారు?
జవాబు:
జట్రోపా, కానుగ మొక్కలను బయోడీజిల్ తయారీకి వాడతారు.

10th Class Biology 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
విసర్జక వ్యవస్థలో కలిగే అవరోధాలకు గల కారణాలు తెలుసుకొనేందుకు నాలుగు ప్రశ్నలు తయారు చేయండి.
జవాబు:

  1. విసర్జక వ్యవస్థలో అవరోధాలు ఎలా ఏర్పడతాయి?
  2. అవరోధాలు ఏర్పడటానికి దారితీసే పరిస్థితులు ఏమిటి?
  3. ఆహారపదార్థాలకు, అవరోధాలకు ఉన్న సంబంధం ఏమిటి?
  4. అవరోధాల వలన సంభవించే పరిస్థితులు ఏమిటి?

ప్రశ్న 2.
క్షేత్ర పర్యటనలో మీరు పరిశీలించిన అంశాల సహాయంతో ఈ క్రింది పట్టికను పూరించండి.
జవాబు:

మొక్క పేరుమొక్క నుండి లభించే జీవక్రియోత్పన్నంఉపయోగం
ఎ) వేపనింబిన్యాంటీ సెప్టిక్
బి) ఉమ్మెత్తస్కోపోలమైన్మత్తుమందు

ప్రశ్న 3.
ప్రతి మానవునిలోని రెండు మూత్రపిండాలు ప్రధాన విసర్జక అవయవములు. హరిత 23 సంవత్సరాల వయస్సులో ఒక మూత్రపిండాన్ని ఆమె తండ్రికి దానం చేసింది. ప్రస్తుతం ఆమెకు ఒక మూత్రపిండం మాత్రమే ఉంది. పెళ్ళి చేసుకుని ఒక పాపకు జన్మనిచ్చింది.
ఎ) హరిత కూతురుకు ఎన్ని మూత్రపిండాలు ఉంటాయి?
జవాబు:
హరిత కూతురుకు రెండు మూత్రపిండాలు ఉంటాయి.

బి) మీ సమాధానమును సమర్థించండి.
జవాబు:
శారీరక మార్పులు అనువంశికంగా సంక్రమించవు. కావున హరిత కూతురుకు రెండు మూత్రపిండాలు ఉంటాయి.

ప్రశ్న 4.
మూత్రపిండాలు సక్రమంగా పనిచేయడానికి నీవు నీ ఆహారపు అలవాట్లలో ఎటువంటి మార్పులు చేయాలను కుంటున్నావు?
జవాబు:

  1. నీరు ఎక్కువగా త్రాగాలి.
  2. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
  3. నియమానుసార వ్యాయామం.
  4. కూల్ డ్రింక్స్ బదులుగా కొబ్బరినీళ్ళు ఎక్కువగా త్రాగాలి.
  5. ద్రాక్ష, పుచ్చకాయ, కమలా వంటి నీరు అధికంగా ఉన్న పండ్లను తీసుకోవాలి.
  6. వేపుడు కూరలను తినకూడదు.

AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

ప్రశ్న 5.
మూత్రపిండ సంబంధిత వ్యాధుల గురించి తెలుసుకోవడానికి నెఫ్రాలజిస్టు ఎటువంటి ప్రశ్నలు అడుగుతావు?
జవాబు:

  1. మూత్రపిండాలలో రాళ్లు ఎలా ఏర్పడతాయా?
  2. డయాలసిస్ అనగానేమి?
  3. ధూమపానం, ఆల్కహాలు వలన మూత్రపిండాలపై ఎటువంటి ప్రభావం ఉంటుంది?
  4. ESRD అనగానేమి?

ప్రశ్న 6.
రబ్బరు మరియు తోళ్ళ పరిశ్రమలలో వాడే ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు ఏవి? ఏవి ఏ మొక్క నుండి లభిస్తాయి?
జవాబు:

  1. రబ్బరు, తోళ్ళ పరిశ్రమలో వాడే ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు లేటెక్స్ మరియు టానిన్స్
  2. లేటెక్స్ – హేవియా బ్రెజిలియన్సిస్ (రబ్బరు మొక్క) టానిన్ – తుమ్మ, తంగేడు

ప్రశ్న 7.
మూత్రపిండాలు పనిచేయక పోవటం గూర్చి నెఫ్రాలజిస్టును అడిగే నాలుగు ప్రశ్నలు రాయండి.
జవాబు:

  1. మూత్రపిండాలు ఎప్పుడు పనిచేయడం మానేస్తాయి?
  2. మూత్రపిండాలు పనిచేయకపోవటం వలన కలిగే లక్షణాలు ఏవి?
  3. ఏ రకమైన నివారణోపాయాలను తీసుకోవటం ద్వారా మూత్రపిండాల వ్యాధిని నివారించవచ్చు?
  4. ఒకవేళ మూత్రపిండం పనిచేయుట మానేస్తే ఎటువంటి ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి?

ప్రశ్న 8.
కింది పట్టికను పరిశీలించండి.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 4

పట్టిక ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
i) పై పట్టికలో మానవుల మాదిరిగా విసర్జక వ్యవస్థ ఉన్న జీవులేవి?
జవాబు:
సరీసృపాలు / పక్షులు / క్షీరదాలు (లేదా) సరీసృపాలు / పక్షులు / క్షీరదాలకు సంబంధించిన ఉదాహరణలు.

ii) వానపాములో మరియు బొద్దింకలో ఉండే విసర్జకావయవాలేవి?
జవాబు:
ఎ) వానపాములో నెఫ్రీడియా (వృక్కము)
బి) బొద్దింకలో మాల్ఫీజియన్ నాళికలు / హరిత గ్రంథులు

ప్రశ్న 9.
మూత్రం ఏర్పడే విధానంలోని దశలు ఏవి?
జవాబు:
మూత్రం ఏర్పడే విధానంలో 4 దశలుంటాయి.

  1. గుచ్ఛగాలనం (Glomerular filtration),
  2. వరణాత్మక పునఃశోషణం (Tubular reabsorption),
  3. నాళికాస్రావం (Tubular secretion),
  4. అధిక గాఢత గల మూత్రం ఏర్పడడం (Formation of hypertonic urine).

ప్రశ్న 10.
ప్రాథమిక మూత్రం అనగా నేమి? అది ఎలా ఏర్పడుతుంది?
జవాబు:
గుచ్చగాలనం ద్వారా ఏర్పడిన మూత్రాన్ని ప్రాథమిక మూత్రం (Primary urine) అంటాం. ఇది రసాయనికంగా రక్తంతో సమానంగా ఉంటుంది. ప్రాథమిక మూత్రంలో రక్తకణాలు ఉండవు. ఇది సమీపస్థ సంవళిత నాళంలోనికి వెళుతుంది. ప్రాథమిక మూత్రంలో నుండి శరీరానికి ఉపయోగపడే పదార్థాలు బాహ్యకేశనాళికా వల (Peritubular network) లోనికి పునఃశోషణం అవుతాయి.

ప్రశ్న 11.
గుచ్ఛగాలనం గురించి రాయండి.
జవాబు:
గుచ్ఛగాలనం :
అభివాహి ధమనిక కలిగించే పీడనం వల్ల రక్తకేశనాళికాగుచ్ఛం గుండా’ రక్తం ప్రవహిస్తుంది. ఈ పీడనం ఫలితంగా రక్తం వడపోయబడుతుంది. వ్యర్థపదార్థ అణువులు, పోషక పదార్థ అణువులు, నీరు వడపోయబడి బొమన్ గుళికకు చేరుతాయి.

ప్రశ్న 12.
వరణాత్మక పునఃశోషణలో ఏ ఏ పదార్థాలు శోషించబడతాయి?
జవాబు:
వరణాత్మక పునఃశోషణం :
ప్రాథమిక మూత్రంలో ఉండే ఉపయుక్త పదార్థాలను పరికేశనాళికా వల తిరిగి శోషిస్తుంది. గ్లూకోజ్, ఆమైనో ఆమ్లాలు, విటమిన్ ‘సి’, పొటాషియం , కాల్షియం, సోడియంల క్లోరైలు, 75% నీరు పునః శోషించబడతాయి.

ప్రశ్న 13.
నాళికాస్రావంలో స్రవించబడే పదార్థాలు ఏమిటి?
జవాబు:
నాళికాస్రావం :
రక్తకేశనాళికల నుండి మూత్రనాళికలోనికి వ్యర్థపదార్థాలు స్రవించబడతాయి. రక్తంలో ఉండే యూరియా, యూరికామ్లం, క్రియాటినిన్, సోడియం, పొటాషియం, హైడ్రోజన్ అయాన్లు స్రవించబడతాయి. ఇవి మూత్రం యొక్క గాఢతను, pH ని నియంత్రిస్తాయి.

ప్రశ్న 14.
మూత్రం ఎలా గాఢత చెందుతుంది?
(లేదా)
మూత్రం ఏర్పడే విధానం తెలపండి.
జవాబు:
నెఫ్రాన్ వడగట్టిన మూత్రంలో 75% నీరు సమీపస్థ సంవళిత భాగంలోనే పునఃశోషణ చెందుతుంది. హెస్లీ శిక్యం ప్రాంతంలో ఉన్న మూత్రం నుండి 10% నీరు ద్రవాభిసరణం ద్వారా దానిని ఆవరించియున్న కణజాలంలోనికి శోషించబడుతుంది. తరువాత సంగ్రహణ నాళంలో వాసోప్రెస్సిన్ (ADH) అనే హార్మోన్ సమక్షంలో నీటి పునఃశోషణ జరిగి మూత్రం అతిగాఢతను పొందుతుంది. గాఢతలో గరిష్టస్థాయికి చేరిన ఈ ద్రవాన్ని మూత్రం (Urine) అంటారు. ఇది రక్తం కన్నా అధిక గాఢతతో ఉంటుంది.

AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

ప్రశ్న 15.
అతిమూత్ర వ్యాధి అనగానేమి ? దాని లక్షణాలు ఏమిటి?
జవాబు:
వాసోప్రెస్సిన్ హార్మోన్ స్రావం తగ్గిపోతే అల్పగాఢతగల మూత్రాన్నే విసర్జించవలసి ఉంటుంది. శరీర ద్రవాల ద్రవాభిసరణ క్రమతను హార్మోన్ చర్య క్రమబద్దీకరిస్తుంది. వాసోప్రెస్సిన్ లోపం వలన అధిక మూత్ర విసర్జన మరియు తక్కువ గాఢత గల మూత్రవిసర్జన చేయవలసి ఉంటుంది. దీనినే ‘డయాబెటిస్ ఇన్సిపిడస్’ లేదా ‘అతిమూత్ర వ్యాధి’ అంటారు.

ప్రశ్న 16.
మూత్రనాళికలు గురించి వ్రాయండి.
జవాబు:
మూత్రనాళికలు ప్రతి మూత్రపిండం యొక్క నొక్కు లేదా హైలస్ నుండి ఒక జత తెల్లని, కండరయుతమైన సన్నని మూత్రనాళాలు బయటికి వస్తాయి. ఇవి దాదాపు 30 సెం.మీ. పొడవు ఉంటాయి. పరభాగానికి ప్రయాణించి మూత్రాశయంలోనికి తెరచుకుంటాయి. మూత్రం, మూత్రపిండాల నుండి మూత్రాశయంలోనికి మూత్రనాళాల ద్వారానే పెరిస్టాలిసిస్ కదలికలతో ప్రయాణిస్తుంది.

ప్రశ్న 17.
మూత్రాశయం గురించి రాయండి.
జవాబు:
మూత్రాశయం పలుచని గోడలు కలిగి, బేరిపండు ఆకారంలో ఉండే సంచి వంటి నిర్మాణం. ఇది ద్రోణి (కటివలయ) భాగంలో పురీషనాళానికి ఉదరతలాన ఉంటుంది. మూత్రనాళాల ద్వారా చేరిన దాదాపు 300-800 మి.లీ.ల మూత్రాన్ని ఇది తాత్కాలికంగా నిల్వ చేస్తుంది.

ప్రశ్న 18.
ప్రసేకం గురించి రాయండి.
జవాబు:
ప్రసేకం, మూత్రాశయం నుండి మూత్రాన్ని బయటికి విసర్జించే నాళం. మూత్రాశయం చివర ప్రసేకంలో తెరచుకునే – చోట సంవరణీ (Sphincter) కండరం ఉండి కదలికల నియంత్రణకు తోడ్పడుతుంది. ప్రసేకం స్త్రీలలో 4 సెం.మీ.ల పొడవు ఉంటుంది. దానిని ఆళిందం (Vestibule) అంటారు. అయితే పురుషులలో 20 సెం.మీ. పొడవుండి మూత్ర జననేంద్రియనాళంగా ప్రసేకం (Uretra) పిలవబడుతుంది.

ప్రశ్న 19.
మూత్ర విసర్జన ప్రక్రియను వర్ణించండి.
జవాబు:
మూత్రాశయంలో గరిష్టంగా 700-800 మి.లీ. మూత్రం నిల్వ ఉంటుంది. అయితే దాదాపు 300-400 మి.లీ. మూత్రం చేరినప్పుడు మూత్రాశయం ఉబ్బి, దాని గోడలలోని స్ట్రెచ్ గ్రాహకాలు ఉత్తేజితమై మెదడుకు ప్రచోదనాలను పంపుతాయి. ఫలితంగా మూత్రం విసర్జించాలనే కోరిక కలుగుతుంది. మూత్రాశయం సంకోచించడం మూలంగా మూత్రం బయటకు పోతుంది. ఈ ప్రక్రియనే మూత్ర విసర్జన (Micturition) అంటారు.

మానవుడు రోజుకు దాదాపు 1.6-1.8 లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తాడు. అయితే అధికంగా నీరు, పండ్లరసాలు, ద్రవాలు ఎక్కువ తీసుకొనేవారు ఎక్కువగానూ, తక్కువ తీసుకునే వారు తక్కువగానూ మూత్రాన్ని విసర్జించటం సాధారణంగా జరుగుతుంది.

ప్రశ్న 20.
మూత్ర విసర్జనను ఎలా నియంత్రించగలం?
జవాబు:
మూత్రాశయంలో మూత్రం తాత్కాలికంగా నిల్వ ఉంటుంది. మూత్రం బయటకు వచ్చే మార్గాన్ని ఆవరించి రెండు జతల వర్తుల సంవరిణీ కండరాలు ఉంటాయి. మూత్రాశయం నిండేంత వరకు ఈ రెండు కండరాలు సంకోచస్థితిలో ఉంటాయి. దీనివలన రంధ్రం మూసుకొని ఉంటుంది. మూత్రం చేరేకొద్ది అది కలుగజేసే ఒత్తిడి వలన మూత్రాశయం గోడల మీద పీడనం అధికమవుతుంది. దీనివలన అసంకల్పితంగా పై వర్తుల సంవరిణీ కండరం సడలుతుంది. కానీ కింది సంవరిణీ కండరం మన అధీనంలో ఉండి మూత్రవిసర్జనను నియంత్రించగలం. కానీ చిన్నపిల్లలలో ఈ విధమైన నియంత్రణ సాధ్యం కాదు. కాలక్రమేణా వారు మూత్రవిసర్జనను నియంత్రించగలుగుతారు.

ప్రశ్న 21.
మూత్ర సంఘటనమును తెలపండి.
జవాబు:
మూత్రంలో 96% నీరు, 25% కర్బన పదార్థాలు (యూరియా, యూరికామ్లం, క్రియాటినిన్, నీటిలో కరిగే విటమిన్లు, హార్మోన్లు మరియు ఆక్సలేట్లు మొదలైనవి) మరియు 1.5% అకర్బన పదార్థాలు (సోడియం, క్లోరైడ్, ఫాస్పేట్, సల్ఫేట్, మెగ్నీషియం, కాల్షియం, అయోడిన్ మొదలైనవి) ఉంటాయి. మూత్రం మొదట ఆమ్లయుతంగా (pH = 6.0) గా ఉన్నా క్రమంగా క్షారయుతంగా మారుతుంది. ఎందుకంటే యూరియా విచ్ఛిన్నం జరిగి అమ్మోనియా ఏర్పడుతుంది.

ప్రశ్న 22.
మూత్రపిండ మార్పిడి అనగానేమి? దీనిలో ఉన్న సమస్య ఏమిటి?
జవాబు:
మూత్రపిండాలు పనిచేయని వారికి దీర్ఘకాలిక పరిష్కారం చూపే ప్రక్రియనే మూత్రపిండ మార్పిడి అంటారు. మూత్రపిండాలు పనిచేయని వారికి వారి దగ్గర బంధువు (దాత) నుండి బాగా పనిచేస్తున్న మూత్రపిండాన్ని వేరుచేసి అమర్చుతారు. రోగికి అమర్చిన మూత్రపిండం సరిగ్గా సరిపోయేలా అసంక్రామ్యత వ్యవస్థ ఆ మూత్రపిండాన్ని తిరస్కరించకుండా ఉండాలంటే అతి సమీప బంధువు మూత్రపిండాన్ని దానం చేయాల్సి ఉంటుంది. అయితే ఆధునిక వైద్య విద్య వైజ్ఞానిక కృషి ఇలాంటి ప్రక్రియల సమర్థతను పెంచాయి.

ప్రశ్న 23.
అవయవదానం అనగానేమి? మన శరీరంలోని ఏ ఏ అవయవాలు దానం చేయవచ్చు?
జవాబు:
వైద్య పరంగా మరణించారని నిర్ధారించిన వ్యక్తి నుండి అవయవాలను సేకరించి అవసరమైన వారికి అమరుస్తారు. దీనిని “అవయవదానం” అంటారు. దాత శరీరం నుండి రెండు మూత్రపిండాలు, గుండె, వాలు, కాలేయం, ఊపిరితిత్తులు, ప్లీహం, క్లోమం, చర్మం, ఎముకలు, జీర్ణాశయం కళ్లు (కార్నియా) లాంటి అవయవాలు గ్రహిస్తారు.

ప్రశ్న 24.
చర్మాన్ని విసర్జక అవయవంగా ఎందుకు పరిగణిస్తారు?
జవాబు:
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 1
చర్మం అసంఖ్యాకమైన స్వేదగ్రంథులను కలిగి ఉంటుంది. వాటి చుట్టూ అనేక రక్తకేశ నాళికలుంటాయి. స్వేదగ్రంథులు రక్తం నుండి నీరు మరియు జీవక్రియా ఉత్పన్నాల వ్యర్థాలను సంగ్రహిస్తాయి. అలా శరీరంలో అధికంగా ఉన్న నీటిని మరియు అతి తక్కువ మోతాదులో లవణాలను చెమట రూపంలో బయటకు పంపుతూ చర్మం ఒక అదనపు విసర్జకాంగంగా పరిగణించబడుతోంది. చర్మంలోని సెబేషియస్ గ్రంథులు సెబం అనే పదార్థాన్ని స్రవిస్తాయి. దీనిలో సెబం, మైనం, స్టిరాల్స్, కర్బన పదార్థాలు మరియు ఫాటీ ఆమ్లాలు ఉంటాయి.

ప్రశ్న 25.
విసర్జక క్రియలో కాలేయం పాత్ర ఏమిటి?
జవాబు:
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 2
కాలేయం రక్తంలోని చనిపోయిన ఎర్రరక్తకణాలలోని హిమోగ్లోబినను విచ్ఛిన్నం చేసేటపుడు బైలురూబిన్, బైలువర్దిన్, యూరోక్రోమ్’ మూత్రం ద్వారా విసర్జించబడుతుంది. పిత్తాశయంలో పైత్యరస వ్యర్థాలు నిలవవుండి తర్వాత పైత్యరసంతోపాటు కొలెస్ట్రాల్ మరియు స్టిరాయిడ్ హార్మోన్లు, మందులు, విటమిన్లు, క్షారలవణాలు మొదలైన వాటితో పాటు మూత్రం ద్వారా బయటకు విసర్జింపబడతాయి. యూరియా తయారీలోను కాలేయం ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

ప్రశ్న 26.
పెద్ద ప్రేగులో తొలగించబడే లవణాలు ఏమిటి?
జవాబు:
పెద్దప్రేగు (Large intestine) :
అధికంగానున్న కాల్షియం, మెగ్నీషియం మరియు ఐరన్ యొక్క లవణాలు పెద్ద ప్రేగు యొక్క ఉపకళాకణజాలం (Epithelial) చేత వేరుచేయబడి మలంతోబాటు బయటికి విసర్జింపబడతాయి.

ప్రశ్న 27.
అమీబా, పారమీషియం వంటి ఏకకణ జీవులలో విసర్జన విధానం తెలపండి.
జవాబు:
మంచి నీటిలో నివసించే అమీబా, పారమీషియం మొదలైనవి సంకోచరిక్తికల ద్వారా ద్రవాభిసరణ క్రమత చూపుతాయి. సంకోచరిక్తికలు కణంలోని అధికంగా ఉన్న నీటిని మరియు వ్యర్థ పదార్థాలను సేకరిస్తాయి. సంకోచరిక్తికలు (Contraltile vacuole) కణద్రవ్యంలో కొద్దికొద్దిగా జరుగుతూ కణ పరిధిని చేరి పగిలిపోవుట ద్వారా సేకరించిన వ్యర్థాలను బయటకు పంపిస్తాయి. ప్రధానమైన విసర్జన కణద్రవాభిసరణ (Osmosis) ద్వారా జరుగుతుంది.

AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

ప్రశ్న 28.
మొక్కలు వ్యర్థాలను విషపూరితాలుగా మార్చి ఎందుకు నిల్వ చేసుకొంటాయి?
జవాబు:
కొన్ని మొక్కలు వ్యర్థ పదార్థాలను వేర్లు, ఆకులు, విత్తనాలలో విషపూరిత పదార్థాలుగా మార్చుకొని శాకాహార జంతువుల నుండి రక్షించుకోవడానికి ఉపయోగించుకుంటాయి. వీటిలో ఉండే రసాయనాల వలన మొక్కల భాగాలు తినడానికి వీలుకాని రుచితో ఉంటాయి. అందువల్ల ఆ మొక్కలను జంతువులు తినలేవు. కొన్ని రసాయనాలు ఎక్కువగా విషపూరితంగా ఉండి వీటిని తిన్న జంతువులు చనిపోతాయి.

ప్రశ్న 29.
మొక్క తమ వ్యర్థాలను ఎలా ఉపయోగించుకొంటుంది?
జవాబు:

  1. కొన్ని రకాల మొక్కలలో మొక్క భాగాలకు గాయమైనపుడు కొన్ని రసాయనాలను స్రవిస్తాయి. అలా స్రవించిన రసాయనాలు గాయాన్ని మాన్పుటలో మొక్కకు సహాయపడతాయి.
  2. కొన్ని మొక్కలు ఆకర్షణీయమైన పదార్థాలను వెదజల్లి తమకు ఉపయుక్తంగా మార్చుకొంటాయి. పరాగసంపర్కానికి, విత్తన వ్యాప్తికి, పోషణకు కూడా ఉపయోగపడేలా చేసుకోగలుగుతాయి.
  3. వేరు బుడిపెలను కలిగి ఉన్న మొక్కలు కొన్ని రసాయనిక స్రావాలచేత రైజోబియం బాక్టీరియాలను ఆకర్షించి, ఆశ్రయం కల్పించి సహజీవనం చేస్తుంటాయి.

ప్రశ్న 30.
టానిన్లు, రెసిన్లు గురించి వర్ణించండి.
జవాబు:
టానిన్లు :
టానిన్లు కర్బన సంయోగపదార్థాలు. ఇవి మొక్కల వివిధ భాగాలలో నిల్వ చేయబడి ఉంటాయి. ముదురు గోధుమవర్ణం కలిగి ఉంటాయి. టానిన్లు టానింగ్ లేదా తోళ్ళను పదునుచేయడానికి మరియు మందులలోను ఉపయోగిస్తారు.
ఉదా : తుమ్మ, తంగేడు.

రెసిన్లు :
రెసిన్ నాళాలను కలిగి ఉండటం అత్యధిక వివృత బీల ప్రత్యేకత. రెసిన్లను వార్నిష్ లో ఉపయోగిస్తారు.
ఉదా : పైనస్.

ప్రశ్న 31.
జిగురులు గురించి తెలపండి.
జవాబు:
జిగురులు :
వేప, తుమ్మ మొదలైన చెట్లు శాఖలు, కాండంపై గాయాలైనపుడు అవి జిగురు వంటి పదార్థాన్ని స్రవిస్తాయి. జిగురు నీటిని పీల్చుకొని ఉబ్బుతుంది. ఇది మొక్క గాయాన్ని మాన్పుటకు దోహదం చేస్తుంది. ఆర్థికంగా చూస్తే జిగురులు చాలా విలువైనవి. వాటిని అతికించుటకు మరియు బైండింగ్ కారకంగా మందుల తయారీలోను, ఆహార పదార్థాలలోను ఉపయోగిస్తుంటారు.

ప్రశ్న 32.
లేటెక్స్ గురించి రాయండి.
జవాబు:
లేటెక్స్ :
లేటెక్స్ జిగురుగా తెల్లగా పాలవలే ఉండే ద్రవపదార్థం, ఇది మొక్కలోకి లేటెక్స్ కణాల్లో లేదా లేటెక్స్ నాళాల్లో నిల్వ ఉంటుంది. హీవియా బ్రెజీలియన్సిస్ (రబ్బరు మొక్క) మొక్క లేటెక్స్ నుండి రబ్బరు తయారుచేస్తారు. జట్రోపా మొక్క నుండి బయోడీజిలను తయారుచేస్తారు.

ప్రశ్న 33.
చూయింగ్ గమ్ ను ఎలా తయారు చేస్తారు?
జవాబు:
చూయింగ్ గమ్ అనేది నమలడం కోసం తయారుచేసే ఒక రకమైన జిగురు పదార్థం. 5000 సంవత్సరాలకు పూర్వమే దీనిని తయారుచేసేవారని చారిత్రక ఆధారాలున్నాయి. ప్రస్తుతం చూయింగ్ గమ్ ను చికిల్ మొక్క యొక్క సహజసిద్ధమైన లేటెక్స్ నుండి తయారుచేస్తున్నారు.

ప్రశ్న 34.
రెండు మూత్రపిండాలు పూర్తిగా పనిచేయకపోతే, ఏమి జరుగుతుంది?
జవాబు:
మూత్రపిండాలు పనిచేయకపోవడాన్ని (End Stage Renal Disease – ESRD) అంటారు. మూత్రపిండాలు పనిచేయడం ఆగిపోయే శరీరంలో నీరు, వ్యర్థ పదార్థాలు నిండిపోతాయి. ఈ దశను ‘యూరేమియ’ అంటారు. కాళ్లు, చేతులు ఉబ్బిపోత రక్తం శుద్ధికాకపోవడం వలన నీరసం, అలసట వస్తాయి.

ప్రశ్న 35.
మూత్రపిండాలు పనిచేయనప్పుడు, పరిష్కారం ఏమిటి?
జవాబు:
మూత్రపిండాలు పనిచేయని వారికి కృత్రిమ మూత్రపిండాల ద్వారా రక్తాన్ని శుభ్రం చేస్తారు. ఈ ప్రక్రియను ‘హీమోడయాలసిస్’ అంటారు. ఈ ప్రక్రియలో రక్తాన్ని డయలైజర్ లోనికి పంపి మలినాన్ని తొలగిస్తారు.

AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

ప్రశ్న 36.
మనకు ఉపయోగపడే ఆల్కలాయిడ్లను తెలపండి.
జవాబు:
క్వినైన్ – మలేరియా నివారణకు
నికోటిన్ – క్రిమి సంహారిణిగా
రిసర్ఫిన్ – పాముకాటుకు
నింబిన్ – యాంటీ సెప్టిక్ గా ఉపయోగిస్తారు.

10th Class Biology 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
మానవుని రక్తము నుండి జీవ వ్యర్థములను తొలగించడానికి మూత్రపిండము ఎలా అనుకూలంగా ఉన్నది?
(లేదా)
మూత్రం ఏర్పడడంలోని వివిధ దశలేవి? ఆయా దశలలో ఏం జరుగుతుందో వివరించండి.
జవాబు:
మూత్రపిండాల నిర్మాణం :

  1. మానవునిలో విసర్జన వ్యవస్థలో ఉండే భాగాలు ఎ) ఒక జత మూత్రపిండాలు, బి) ఒక జత మూత్రనాళాలు సి) మూత్రాశయం మరియు డి) ప్రసేకం.
  2. మూత్రపిండాల లోపలి తలం మధ్యలో గల పల్లాన్ని హైలస్ అంటారు. ఈ హైలస్ ద్వారా వృక్పధమని మూత్రపిండం లోనికి ప్రవేశిస్తుంది. వృక్కసిర మూత్రనాళం వెలుపలికి వస్తుంది.
  3. శరీరంలోని వివిధ అవయవాలలో ఉత్పత్తి అయిన వ్యర్థాలు ఆమ్లజని సహిత రక్తంతో కూడి వృక్పధమని ద్వారా మూత్రపిండాన్ని చేరుతాయి. ఆమ్లజని రహిత రక్తాన్ని వృక్కసిర మూత్రపిండం నుండి బయటికి పంపుతుంది.
  4. మూత్రపిండంలో రక్తం వడకట్టబడుతుంది. ఫలితంగా వేరుచేయబడిన వ్యర్థాలు మూత్రంగా బయటికి విసర్జించబడతాయి. దీనిలో నెఫ్రాన్ ప్రముఖ పాత్ర వహిస్తుంది.

మూత్రం ఏర్పడే విధానం :
మూత్రం ఏర్పడే విధానంలో 4 దశలుంటాయి.

  1. గుచ్చగాలనం
  2. వరణాత్మక పునఃశోషణం
  3. నాభికాస్రావం
  4. అధిక గాఢత గల మూత్రం ఏర్పడడం.

1) గుచ్చగాలనం :
వృక్క ధమని శాఖ అయిన అభివాహి ధమని నుండి రక్తం, రక్తకేశ నాళికా గుచ్చం లోనికి ప్రవేశిస్తుంది. ఈ ధమని కలిగించే పీడనం వల్ల రక్తం వడపోయబడుతుంది. వ్యర్థ పదార్థాల అణువులు, పోషక పదార్థాల అణువులు, నీరు వడపోయబడి బొమన్స్ గుళికకు చేరతాయి.

2) వరణాత్మక పునఃశోషణం :
వరణాత్మక పునః శోషణం ప్రాథమిక మూత్రంలో ఉండే ఉపయుక్త పదార్థాలను బాహ్య రక్తకేశనాళికా వల తిరిగి శోషిస్తుంది. గ్లూకోజు, అమైనో ఆమ్లాలు, విటమిన్ ‘సి’, పొటాషియం , కాల్షియం, సోడియం

3) నాళికాస్రావం :
సమీపస్థ సంవళితనాళంలో పునఃశోషణం తరువాత మూత్రం హెగ్లీశక్యం ద్వారా దూరస్థ సంవళితనాళంలోనికి చేరుతుంది. ఇక్కడ అధికంగా ఉన్న పొటాషియం, సోడియం,. హైడ్రోజన్ అయానులు బాహ్యరక్తకేశనాళికా వల నుండి దూరస్థ సంవళిత నాళంలోకి స్రవించబడతాయి. దీనివల్ల మూత్రం యొక్క pH సమతుల్యమవుతుంది.

4) అతిగాఢత గల మూత్రం ఏర్పడటం :
నెఫ్రాన్ వడగట్టిన మూత్రంలో 75% నీరు సమీపస్థ సంవళిత భాగంలోనే పునఃశోషణమవుతుంది. హెన్లీశిక్యం ప్రాంతంలో ఉన్న మూత్రం నుండి 10% నీరు ద్రవాభిసరణం ద్వారా దానిని ఆవరించి ఉన్న కణజాలంలోనికి శోషించబడుతుంది. తరువాత సంగ్రహణ నాళంలో వాసోప్రెసిన్ అనే హార్మోన్ సమక్షంలో నీటి పునఃశోషణ జరిగి మూత్రం అతి గాఢతను పొందుతుంది.

మూత్రంలో 96% నీరు, 2.5% కర్బన పదార్థాలు (యూరియా, యూరికామ్లం, క్రియాటిన్, క్రియాటినైన్, నీటిలో కరిగే విటమిన్లు, హార్మోన్లు మరియు ఆక్సలేట్లు మొదలైనవి) మరియు 1.5% అకర్బన పదార్థాలు (సోడియం, క్లోరైడ్, ఫాస్ఫేట్, సల్ఫేట్, మెగ్నీషియం , కాల్షియం, అయోడిన్ మొదలైనవి) ఉంటాయి.

ప్రశ్న 2.
కింది పట్టికను విశ్లేషించి ప్రశ్నలకు సమాధానం రాయండి.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 3
A) బైలురూబిన్ తెలుసుకోవాలంటే ఏ పరీక్ష అవసరం?
జవాబు:
బైలురూబిన్ పరీక్ష

B) చక్కర వ్యాధిని ఎలా నిర్ధారించవచ్చు?
జవాబు:
అన్నం తినకముందు, తిన్న తరువాత నిర్వహించిన చక్కెర పరీక్ష ద్వారా చక్కెర వ్యాధిని నిర్ధారించవచ్చు.

C) పై నివేదిక పరిశీలించిన తర్వాత ఆ వ్యాధిగ్రస్థ వ్యక్తి ఏ ఇతర సమస్యలు ఎదుర్కొనుండవచ్చును?
జవాబు:
రోగి అధిక రక్తపీడనం కల్గి ఉన్నాడు. రక్తంలో చక్కెర స్థాయి అధికంగా ఉంది. ఇది చక్కెర వ్యాధిని సూచిస్తుంది.

D) ఆ సమస్యలు ఏయే భాగాలపై ప్రభావం చూపుతాయి?
జవాబు:
ఈ సమస్యలు రోగి హృదయం మరియు క్లోమంపై ప్రభావం చూపుతాయి.

ప్రశ్న 3.
కింది సమాచారాన్ని విశ్లేషించండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ఆల్కలాయిడ్మొక్కలోని భాగంఉపయోగం
క్వినైన్బెరడుమలేరియా నివారణ
నికోటిన్ఆకులుక్రిమి సంహారిణి
మార్ఫిన్ఫలంమత్తుమందు, నొప్పి నివారిణి
కెఫెన్విత్తనాలునాడీవ్యవస్థ ఉత్తేజ కారకం
పైరిత్రాయిడ్స్పుష్పాలుకీటక నాశనులు
స్కోపోలమైన్పండ్లు, పూలుమత్తుమందు

i) మొక్కల యొక్క ఏ భాగాలు ఆల్కలాయిడ్లుగా ఉపయోగపడతాయి?
జవాబు:
బెరడు, ఆకులు, ఫలం, విత్తనాలు, పుష్పాలు.

ii) మొక్కలకు వచ్చే వ్యాధుల నివారణకు ఉపయోగించే ఆల్కలాయిడ్ లేవి?
జవాబు:
నికోటిన్, పైరిత్రాయిడ్స్

iii) మత్తుమందుగా ఉపయోగించే ఆల్కలాయిడ్లు మొక్క ఏ భాగాల నుండి తయారవుతాయి?
జవాబు:
పండ్లు, పూలు

iv) మలేరియా జ్వరం వస్తే ఏ ఆల్కలాయిడ్ వాడతారు?
జవాబు:
క్వి నైన్

AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

ప్రశ్న 4.
మానవ విసర్జక వ్యవస్థ పటం గీచి భాగాలు గుర్తించండి.
(లేదా)
కింది భాగాలతో కూడిన పటం ఏ వ్యవస్థకు చెందినది? దాని పటం గీచి, భాగాలను గుర్తించండి.
a) మూత్రపిండాలు b) మూత్రనాళాలు c) మూత్రాశయము
జవాబు:
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 5

ప్రశ్న 5.
సలోని సమాచారమును విశ్లేషించి, ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.

ఆల్కలాయిడ్మొక్కలోని భాగంఉపయోగాలు
క్వినైన్బెరడుమలేరియా నివారణ
పైరిత్రాయిడ్స్ఆకులుక్రిమి సంహారిణి
రిసర్సెన్వేరుపాముకాటు నుండి రక్షణ
కెఫీన్విత్తనాలునాడీ వ్యవస్థ ఉత్తేజకారకం
నింబిన్విత్తనాలు, బెరడు, ఆకులుయాంటీ సెప్టిక్

i) మలేరియా చికిత్సకు ఉపయోగపడే ఆల్కలాయిడ్ ఏది?
జవాబు:
క్వినైన్

iii) క్రిమి సంహారిణిగా ఏ ఆల్కలాయిడ్ ఉపయోగపడుతుంది?
జవాబు:
పైరిత్రాయిడ్స్

iii) కెఫీన్ వల్ల మానవ శరీరంలోని ఏ వ్యవస్థ ఉత్తేజం చెందుతుంది?
జవాబు:
నాడీ వ్యవస్థ

iv) పాముకాటు నుండి రక్షణనిచ్చే ఆల్కలాయిడ్ ఏ మొక్క భాగము నుండి లభిస్తుంది?
జవాబు:
రావుల్ఫియా సర్పెస్ టైనా లేక సర్పగంథి మొక్క వేరు.

ప్రశ్న 6.
విసర్జక వ్యవస్థలో నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణమని దేనిని పేర్కొంటారు? దాని బొమ్మ గీసి, భాగాలు గుర్తించండి. అభివాహ ధమనిక వ్యాసం, అపవాహి ధమనిక వ్యాసం కంటే ఎక్కువగా ఉండడానికి కారణం ఏమిటి?
(లేదా)
వృక్కనాళీక నిర్మాణాన్ని పటం సహాయంతో వివరించండి.
(లేదా)
ఈ క్రింది భాగాలను గుర్తించటానికి నీవు ఏ పటంను గీస్తావు ? ఆ పటంను గీసి క్రింది భాగాలను గుర్తించండి.
1) భౌమన్ గుళిక 2) వృక్క నాళిక 3) సంగ్రహణ నాళం
(లేదా)
హె శిక్యము, బొమన్ గుళిక గల విసర్జక అవయవము యొక్క పటం గీచి, భాగాలను గుర్తించండి.
జవాబు:

విసర్జక వ్యవస్థలో నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణమని నెఫ్రాన ను పేర్కొంటారు.

AP Board 10th Class Biology Solutions 4th Lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 3
రక్తకేశనాళికాగుచ్ఛంలో పీడనం పెరిగి, దానిలోని పదార్థాలు వడపోతకు గురికావడానికి అభివాహి ధమనిక వ్యాసం, అపవాహి ధమనిక వ్యాసం కంటే ఎక్కువగా ఉంటుంది.
1. వృక్క నాళిక (నెఫ్రాన్)లో 2 భాగాలుంటాయి.
1 మాల్ఫీజియన్ దేహం,
2. వృక్క నాళిక

2. మాల్వీజియన్ దేహం :
నెఫ్రాలో ఒక చివర వెడల్పైన కప్పు ఆకారంలో ఉండే నిర్మాణాన్ని బొమన్ గుళిక అంటారు. అందులోని రక్తకేశ నాళికా గుచ్ఛం మరియు బౌమన్ గుళికను కలిపి మాల్ఫీజియన్ దేహం అంటారు.

3. రక్తకేశ నాళికాగుచ్చం అభివాహిధమనిక నుండి ఏర్పడుతుంది. దాని నుండి అపవాహిధమనిక ఏర్పడుతుంది.

4. వృక్క నాళిక : దీనిలో మూడు భాగాలుంటాయి.
1) సమీపస్థ సంవళిత నాళం (PCT), 2) హెన్లీశిక్యం, 3) దూరస్థసంవళిత నాళం (DCT)

ప్రశ్న 7.
మానవునిలో కల అనుబంధ విసర్జకావయవాలేవి? అవి ఉత్పత్తి చేయు విసర్జక పదార్థాలు ఏమిటి?
జవాబు:
అనుబంధ విసర్జక అవయవాలు – విసర్జక పదార్థాలు
1. ఊపిరితిత్తులు ……. CO2 మరియు నీరు.
2. చర్మం ……… – స్వేదం మరియు జీవక్రియ ఉత్పన్నాల వ్యర్థ పదార్థాలు (సెబం).
3. కాలేయం …… బైలురూబిన్, బైలువర్డిన్, యూరోక్రోం.
4. పెద్ద ప్రేగు ……. అధికంగా ఉన్న కాల్షియం, మెగ్నీషియం .మరియు ఐరన్ యొక్క లవణాలు మలపదార్ధంతో పాటు విసర్జించబడును.

ప్రశ్న 8.
మూత్రపిండాలు పనిచేయని వ్యక్తి (ESRD) పాటించవలసిన తాత్కాలిక మరియు శాశ్వత పరిష్కార పద్ధతులను వివరించండి.
జవాబు:
వివరణ :
ESRD వ్యక్తికి తాత్కాలిక పరిష్కార పద్ధతి – డయాలసిస్ (లేదా) కృత్రిమ మూత్రపిండము మరియు శాశ్వత పరిష్కార పద్ధతి మూత్రపిండ మార్పిడి.

డయాలసిస్ :

  1. ఈ ప్రక్రియలో రక్తాన్ని ఒక ముఖ్యమైన ధమని ద్వారా బయటకు తెచ్చి రక్తస్కంధనాన్ని నిరోధించే కారకాలను కలిపి డయలైజర్ యంత్రంలోకి పంపిస్తారు.
  2. డయలైజర్ యంత్రంలో రక్తం గొట్టాల వంటి సెల్లో ఫేన్ తో తయారైన నాళికల ద్వారా ప్రవహించును. ఈ నాళికలు డయలైజింగ్ ద్రావణంలో మునిగి వుంటాయి.
  3. డయలైజింగ్ ద్రావణంలో నత్రజని వ్యర్థాలు వుండవు కనుక డయలైజర్ లో రక్తం ప్రవహించేటప్పుడు నత్రజని వ్యర్థాలు వేరై రక్తం శుద్ధి చేయబడుతుంది.

మూత్రపిండ మార్పిడి :

  1. మూత్రపిండాలు పనిచేయని వారికి వారి దగ్గర బంధువు (దాత) నుండి బాగా పనిచేస్తున్న మూత్రపిండాన్ని వేరుచేసి అమర్చుతారు.
  2. రోగికి అమర్చిన మూత్రపిండము సరిగ్గా సరిపోయేలా అసంక్రామ్యత వ్యవస్థ ఆ మూత్రపిండాన్ని తిరస్కరించకుండా వుండాలంటే అతి సమీప బంధువు మూత్రపిండాన్ని దానం చేయాల్సి వుంటుంది.
  3. ఈ మధ్య కాలంలో దాతల నుండి మూత్రపిండాలు మరియు ఇతర అవయవాలు సేకరించి మూత్రపిండాలు పాడైపోయిన వారికి అమరుస్తున్నారు.

AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

ప్రశ్న 9.
మూత్రపిండం అంతర్నిర్మాణాన్ని పరిశీలించిన ప్రయోగ విధానాన్ని, పరిశీలనలను రాయండి.
జవాబు:
ఉద్దేశ్యం : మూత్రపిండము అంతర లక్షణాలను అధ్యయనం చేయుట.

పరికరాలు :
1. మేక / గొర్రె మూత్రపిండము, 2. పదునైన బ్లేడు / స్కాల్ పల్, 3. ట్రే, 4. నీరు, 5. గ్లోస్

ప్రయోగ విధానము :
1. మూత్రపిండమును రక్తమంతా పోయేలా నీటిలో కడగాలి.
2. ఒక పదునైన బ్లేడు లేదా స్కాల్ పల్ సహాయంతో మూత్రపిండాన్ని నిలువుగా, జాగ్రత్తగా కోసి అంతర్గత నిర్మాణాన్ని పరిశీలించాలి.

పరిశీలన :

  1. మూత్ర పిండము బయటవైపు ముదురు ఎరుపు రంగులోనూ, లోపలి వైపు లేత గులాబి రంగులోనూ కనబడుతుంది.
  2. పుటాకారంగా ఉన్న లోపలి తలంలో మధ్యలో ఉన్న పల్లాన్ని హైలస్ అంటారు. ఈ హైలస్ ద్వారా వృక్కమని మూత్ర పిండములోనికి, వృక్కసిర మూత్రనాళంలోకి వస్తాయి.
  3. ముదురు గోధుమ వర్ణంలో ఉన్న వెలుపలి భాగమును వల్కలము అని, లేత ‘వర్ణములో ఉన్న లోపలి భాగమును దవ్వ అని అంటారు.
  4. ప్రతి మూత్రపిండములోనూ సూక్ష్మ వృక్క నాళాలు / నెఫ్రాన్లు ఉంటాయి.

ప్రశ్న 10.
మానవ విసర్జన వ్యవస్థను వర్ణించండి.
జవాబు:
మానవ విసర్జన వ్యవస్థలో ప్రధానంగా 1) ఒక జత మూత్రపిండాలు 2) ఒక జత మూత్రనాళాలు 3) ఒక మూత్రాశయం 4) ప్రసేకం అనే భాగాలు ఉంటాయి.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 5

1. మూత్రపిండాలు :

  1. ఇవి చిక్కుడు గింజ ఆకారంలో ముదురు ఎరుపు రంగులో, పృష్ఠకుడ్యానికి అంటుకొని ఒక జత ఉంటాయి.
  2. దీని వెలుపలి భాగం కుంభాకారంగాను, లోపలి భాగం పుటాకారంగాను ఉంటుంది.
  3. పుటాకార భాగంలో ఉండే నొక్కును నాభి అంటారు. దీని ద్వారా వృక్కమని లోపలికి ప్రవేశించగా, వృక్క సిర, మూత్రనాళం బయటకు వస్తాయి.
  4. ప్రతి మూత్రపిండం దాదాపు ఒక మిలియన్ నెఫ్రాన్లచే నిర్మించబడి ఉంటుంది.

2. మూత్రనాళాలు :
ఒక జత మూత్రనాళాలు మూత్రపిండం నుండి బయలుదేరి మూత్రాశయంలోనికి తెరచుకుంటాయి. ఇవి దాదాపు 30 సెం.మీ పొడవు ఉంటాయి.

3. మూత్రాశయం :
ఇది బేరిపండు ఆకారంలో ఉండే సంచి వంటి నిర్మాణం. 300-800 మి.లీ. మూత్రాన్ని తాత్కాలికంగా నిల్వచేస్తుంది.

4. ప్రసేకం :
మూత్రాశయం నుండి మూత్రాన్ని విసర్జించే నాళం. ఇది సంవరణి కండరాన్ని కలిగి ఉండి స్త్రీ, పురుషులలో వేరువేరు పొడవులతో ఉంటుంది.

ప్రశ్న 11.
మానవ మూత్రపిండం అంతర్నిర్మాణాన్ని వర్ణించండి.
జవాబు:
AP Board 10th Class Biology Solutions 4th Lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 2
మూత్రపిండం-అంతర్నిర్మాణం :
మూత్ర పిండం అంతర్నిర్మాణాన్ని తెలుసుకోవడానికి మూత్రపిండ నిలువు కోతను పరిశీలిద్దాం. మూత్రపిండం లోపల రెండు భాగాలుగా కనిపిస్తుంది. ముదురు గోధుమ వర్ణంలోనున్న వృక్క ధమని – వెలుపలి భాగాన్ని వల్కలం (Cortex) అనీ, లేత వర్ణంలోనున్న లోపలి భాగాన్ని దవ్వ (Medulla) అనీ అంటారు. ప్రతీ మూత్రపిండంలోనూ సుమారు ఒక మిలియన్ కంటే ఎక్కువ (1.3 నుండి 1.8 మిలియన్) సూక్ష్మ వృక్కనాళాలు ఉంటాయి. వాటినే వృక్క ప్రమాణాలు లేదా నెఫ్రాన్ (Nephron) లని అంటారు.

ప్రశ్న 12.
మూత్ర సంఘటనము ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది?
జవాబు:
మూత్రం లేత పసుపురంగు ద్రవం. రక్తంలోని హిమోగ్లోబిన్ విచ్ఛిన్నమైనప్పుడు ఏర్పడే యూరోక్రోమ్ అనే పదార్థం ఈ రంగుకి కారణమవుతుంది. మూత్ర సంఘటనం అనేది అనేక కారణాలపైన ఆధారపడి ఉంటుంది.

ఉదాహరణకు మాంసకృత్తులు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకొన్న వ్యక్తి మూత్రంలో యూరియా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రోటీన్ల జీర్ణక్రియలో భాగంగా కాలేయంలో జరిగే డీఅమినేషన్ ఫలితంగా ఎక్కువ పరిమాణంలో యూరియా ఏర్పడుతుంది.

పిండిపదార్థాలు అధికంగా తీసుకొన్నవారి మూత్రంలో అధిక చక్కెర కనిపించవచ్చు. ద్రవపదార్థాలు లేదా నీరు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకొన్నవారి రక్తంలోనికి అధికంగా నీరు చేరటం ఫలితంగా పలుమార్లు వారు మూత్రానికి వెళ్ళవలసి వస్తుంది.

ప్రశ్న 13.
వివిధ జీవులలోని విసర్జన వ్యవస్థలు తెలపండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 4

ప్రశ్న 14.
మొక్కలలో విసర్జన జంతువుల కంటే ఎలా విభిన్నంగా ఉంటుంది?
జవాబు:

  1. తయారైన వ్యర్థాలను విసర్జించడానికి మొక్కల్లో ప్రత్యేకంగా అవయవాలు ఉండవు.
  2. మొక్కల్లో వ్యర్థ పదార్థాలు విచ్ఛిన్నం కావడమనే ప్రక్రియ జంతువులతో పోల్చినపుడు అతి నెమ్మదిగా జరుగుతుంది.
  3. అంటే మొక్కల్లో వ్యర్థ పదార్థాల తయారీ కూడా అతి నెమ్మదిగా జరుగుతుందన్నమాట.
  4. అవి మొక్క దేహంలో పోగవడం కూడా నెమ్మదిగానే జరుగుతుంది.
  5. ఆకుపచ్చని మొక్కలు రాత్రిపూట, హరిత పదార్థం లేని భాగాలలో మొక్కలు శ్వాసక్రియలో కార్బన్ డై ఆక్సైడ్ మరియు నీటిని వ్యర్థ పదార్థాలుగా విడుదల చేస్తాయి.
  6. కిరణజన్యసంయోగక్రియలో ఆక్సిజన్ వ్యర్థ పదార్థంగా ఉత్పత్తి చేయబడి ఆకుల్లోని పత్రరంధ్రాల ద్వారా, కాండంలోని లెంటి సెల్స్ ద్వారా వాతావరణంలోనికి విడుదల చేయబడుతుంది.

ప్రశ్న 15.
మొక్కలలో ఉత్పత్తి అయ్యే, జీవరసాయన పదార్థాలు ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
మొక్కల్లో ఉత్పత్తయ్యే వరసాయనిక పదార్థాలు రెండు రకాలు. అవి :
1) ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు
2) ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు.

1) ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు :
పిండిపదార్థాలు, మాంసకృత్తులు మరియు కొవ్వులు వంటి వాటిని ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు అంటారు.

2) ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు :
మొక్కల సాధారణ పెరుగుదలకు మరియు అభివృద్ధికి కాకుండా ఇతరమైన విధులకు ఉపయోగపడే వాటిని ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలంటారు.
ఉదా : ఆల్కలాయిడ్స్, టానిన్లు, రెసిన్లు, జిగురులు మరియు లేటెక్సులు అయితే మొక్కలు వాటిని తమకోసం ఉత్పత్తి చేసుకోగా, మనం ఆయా రసాయనాలను అనేక రకాలుగా ఉపయోగించుకుంటున్నాం.

ప్రశ్న 16.
మొక్కలలోని ఆల్కలాయిడ్స్, వాటి ఉపయోగాలు, ఉత్పత్తి అయ్యే భాగాలు తెలుపుతూ పట్టిక రూపొందించండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 6

ప్రశ్న 17.
విసర్జించడం, స్రవించటం మధ్యగల పోలికలు ఏమిటి? అవి ఒకదాని కంటే మరొకటి ఎలా భిన్నమైనవి?
జవాబు:
విసర్జన మరియు స్రావం రెండూ ఒక రకమైనవే. రెండింటిలోను వ్యర్ధమైన లేదా అవసరం లేని పదార్థాలను తరలించడం లేదా బయటికి పంపించటం జరుగుతుంది. విసర్జన అనేది జీవులలోని వ్యర్థ పదార్థాల తొలగింపు కాగా, స్రావం అనేది ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వ్యర్థ పదార్థాలను కదలించడం. అందుకే స్రావం క్రియాత్మకమైనది అనీ, విసర్జన క్రియాత్మకం కానిదనీ అంటారు. ఉదాహరణకు మానవునిలో – కన్నీళ్ళు, చెమట, మూత్రం, కార్బన్ డై ఆక్సెడ్ మొదలైనవన్నీ విసర్జితాలు, ఎంజైములు, హార్మోన్లు, లాలాజలం అనేవి స్రావాలుగా చెప్పుకుంటాం.

మొక్కలు వ్యర్థాలను వేర్ల ద్వారా చుట్టూ పరిసరాల్లోకి విసర్జిస్తాయి. కాగా ఆకులు, బెరడు, పండ్లు రాలడం ద్వారా మొక్కలు వ్యర్థాలను తొలగించుకుంటాయి. వివిధ రూపాలలో స్రావాలను విడుదల చేస్తాయి.

విసర్జన, స్రావం :

విసర్జనస్రావం
1) వ్యర్థ పదార్థాలను శరీరం నుండి బయటకు పంపే ప్రక్రియ.1) పదార్థాలను ఒక చోట నుండి మరొక చోటుకు రవాణా చేసే ప్రక్రియ.
2) క్రియాత్మకం కాని ప్రక్రియ.2) క్రియాత్మక ప్రక్రియ.
3) మానవునిలో యూరియా, యూరికామ్లం, అమ్మోనియా విసర్జన పదార్థాలు.3) ఎంజైమ్లు, హార్మోన్లు, లాలాజలం స్రావాలు.
4) మొక్కలలో ఆల్కలాయిడ్లు, రెసిన్ మొదలైనవి విసర్జితాలు.4) జిగురులు, లేటెక్స్ వంటివి స్రావితాలు.

ప్రశ్న 18.
ప్రక్క పటాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP Board 10th Class Biology Solutions 4th Lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 2
a) మూత్రపిండం నిలువుకోతలో నీవు గమనించే భాగాలు ఏమిటి?
b) మూత్రపిండం వెలుపలి భాగం ఎరుపు రంగులో ఎందుకు ఉంటుంది?
c) మూత్రపిండంలో కనిపించే సన్నని నాళాలు ఏమిటి?
d) మూత్రపిండ నాభి నుండి వెలుపలికి వచ్చే నాళాలు ఏమిటి?
జవాబు:
a) మూత్రపిండం నిలువుకోతలో వల్కలం, దవ్వ, వృక్కద్రోణి అనే భాగాలు ఉంటాయి.
b) మూత్రపిండ వెలుపలి భాగం వల్కలం. దీనిలో మూత్ర నాళికల యొక్క బొమన్ గుళికలు అమరి ఉండుట వలన ఎరుపుగా కనిపిస్తుంది.
c) మూత్రపిండం మూత్రనాళికలు అనే సన్నని నాళాలు కల్గి ఉంటుంది.
d) మూత్రపిండ నాభి నుండి వృక్క సిర, మూత్రనాళం బయటకు వస్తాయి.

ప్రశ్న 19.
ప్రక్క పటాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 5
a) పటంలో విసర్జక వ్యవస్థకు సంబంధించని భాగము ఏమిటి?
b) కుడి మూత్రపిండం కొంచెం దిగువగా ఉంటుంది ఎందుకు?
c) ఒక మూత్రపిండం పనిచేయకపోతే, రెండవ మూత్రపిండంలో ఏమైనా మార్పులు వస్తాయా?
d) మూత్రాశయం బయటకు తెరుచుకొనే నాళం పేరు ఏమిటి?
జవాబు:
a) మూత్రపిండం మీద టోపీలా ఉండే వినాళగ్రంథికి విసర్జన వృక్క సిర క్రియతో సంబంధం లేదు.
b) ఉదర కుహరంలో కాలేయ కుడివైపున స్థలం ఆక్రమించటం వలన కుడి మూత్రపిండం కొంచెం దిగువగా ఉంటుంది.
c) ఒక మూత్రపిండం పనిచేయకపోతే, రెండవ మూత్రపిండం పరిమాణంలో కొంచెం పెరిగి, విధి నిర్వహణా సామర్ధ్యం పెంచుకొంటుంది.
d) మూత్రాశయం బయటకు తెరుచుకొనే నాళాన్ని ప్రసేకం అంటారు.

ప్రశ్న 20.
ప్రక్క పటం పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 7
a) ప్రక్క పటము దేనిని సూచిస్తుంది?
b) దీని నిర్మాణంలోని రెండు ప్రధాన భాగాలు ఏమిటి?
c) నాళికా స్రావం ఏ ప్రాంతంలో జరుగుతుంది?
d) వరణాత్మక శోషణం జరిగే ప్రాంతాలు ఏమిటి?
జవాబు:
a) ఈ పటం మూత్రనాళిక నిర్మాణాన్ని సూచిస్తుంది.
b) మూత్రనాళికా నిర్మాణంలో రెండు ప్రధాన భాగాలు ఉంటాయి.
అవి 1. బొమన్ గుళిక, 2) మాల్పీజియన్ దేహం.
c) నాళికాస్రావం దూరస్థ సంగ్రహనాళంలో జరుగును (DCT).
d) వరణాత్మక శోషణం, సమీప సంవళిత నాళం (PCT) మరియు హెన్లీశిక్యంలో జరుగును.

ప్రశ్న 21.
మానవ శరీరంలో వ్యర్థాల విసర్జనలో మూత్రపిండాలే కాకుండా ఇతర అవయవాలు కూడా తోడ్పడుతాయనడాన్ని నీవెలా సమర్ధిస్తావు?
జవాబు:

  1. మానవ శరీరంలో మూత్రపిండాలే కాకుండా ఇతర అవయవాలు కూడా వ్యర్థాల విసర్జనకు తోడ్పడతాయి.
  2. మూత్రపిండాలు రక్తాన్ని వడపోసి నత్రజని సంబంధిత వ్యర్థాలైన యూరియా మరియు యూరికామ్లాన్ని మరియు ఇతర వ్యర్థాలను విసర్జిస్తాయి.
  3. మూత్రపిండాలతోపాటు ఊపిరితిత్తులు, చర్మము, కాలేయము, ప్రేవులు, లాలాజల గ్రంథులు మరియు లాక్రిమల్ గ్రంథులు కూడా కొన్ని రకాల వ్యర్థాలను విడుదల చేస్తాయి.
  4. ఊపిరితిత్తులు కార్బన్ డై ఆక్సెడ్ మరియు నీటిని శరీరం నుండి తొలగిస్తాయి.
  5. చర్మము చెమట రూపంలో నీరు మరియు లవణములను విసర్షిస్తుంది.
  6. కాలేయము మూత్రము ద్వారా పైత్యరస లవణాలు అయిన బైలిరూబిన్ మరియు బైలివర్జిన్లను విసర్జిస్తుంది.
  7. శరీరములో అధిక మొత్తంలో నిల్వ ఉన్న కాల్షియం , మెగ్నీషియం మరియు ఇనుము లవణాలను పెద్ద ప్రేగు ఉపకళా కణజాలాలు మలముతో బాటు బయటకు విసర్జిస్తాయి.
  8. లాలాజల గ్రంథులు మరియు లాక్రిమల్ గ్రంథులు అతిస్వల్ప పరిమాణంలో నత్రజని సంబంధిత పదార్థాలను లాలాజలము మరియు కన్నీరు ద్వారా విసర్జిస్తాయి.

ఇన్ని రకాలుగా శరీరము నందలి వివిధ అవయవములు మరియు గ్రంథులు శరీరములో నిల్వ ఉండే వ్యర్ధ పదార్ధములను బయటకు పంపుటలో అవి నిర్వహించు పాత్రను నేను అభినందిస్తాను.

AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

ప్రశ్న 22.
కింది స్లో చార్టును గమనించండి. ఖాళీ గడులు నింపండి. ఇది ఏ వ్యవస్థకు చెందినదో వివరించండి.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 8
జవాబు:
1) మూత్రపిండం 2) హెన్లీ శిక్యం 3) వృక్కద్రోణి 4) ప్రసేకం

ఈ ఫ్లోచార్టు విసర్జన వ్యవస్థకు సంబంధించినది. రక్తం ఏ విధముగా మూత్రపిండం నందు ప్రయాణిస్తుందో తెలుపుతుంది మరియు మూత్రము ఏర్పడే విధము మరియు బయటకు విసర్జించబడే విధానము గురించి వివరిస్తుంది.

మూత్రపిండమునకు వృక్కధమని రక్తమును సరఫరా చేస్తుంది. వృక్కడమని శాఖ అయిన అభివాహి ధమని నుండి రక్తం, రక్తకేశనాళికాగుచ్ఛంలోనికి ప్రవహిస్తుంది. గుచ్ఛగాలనం ద్వారా ఏర్పడిన మూత్రాన్ని ప్రాథమిక మూత్రం అంటారు. ఇది సమీపస్థ సంవళిత నాళంలోనికి వెళుతుంది. సమీపస్థ సంవళిత నాళంలో పునఃశోషణ తరువాత మూత్రం హెస్లీ శిక్యం ద్వారా దూరస్థ సంవళిత నాళంలోనికి చేరుతుంది. సమీపస్థ సంవళిత నాళంలో కూడా నాళికా స్రావం కొద్ది పరిమాణంలో జరుగుతుంది.

నెఫ్రాన్ వడగట్టిన మూత్రంలో 75% నీరు సమీపస్థ సంవళిత భాగంలోనే పునఃశోషణ చెందుతుంది. తరువాత సంగ్రహనాళంలో వాసోప్రెస్సిన్ అనే హార్మోను సమక్షంలో నీటి పునఃశోషణ జరిగి మూత్రం అతిగాఢతను పొందుతుంది. గాఢతలో గరిష్టస్థాయికి చేరిన ద్రవాన్ని మూత్రం అంటారు.

సంగ్రహనాళం నుండి మూత్రం వృక్మద్రోణిలోకి అక్కడ నుండి మూత్రనాళం, మూత్రాశయం మరియు ప్రసేకం ద్వారా బయటకు విసర్జించబడుతుంది.

ప్రశ్న 23.
రంగయ్యకు ఆరోగ్యం సరిగా లేదు. డాక్టర్ నిర్వహించిన పరీక్షల్లో క్రింది ఫలితాలు వచ్చాయి. పట్టికను విశ్లేషించండి. కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 9
అ) రంగయ్యకు చక్కెర వ్యాధి ఉన్నది అని ఎలా చెప్పవచ్చు?
ఆ) బైలిరూబిన్ గురించి తెలుసుకోవడానికి ఏ పరీక్షలు నిర్వహించాలి?
ఇ) పై నివేదిక ఆధారంగా నీవేం గ్రహించావు?
ఈ) పై నివేదిక ఆధారంగా డాక్టరును నీవు ఏ ఏ ప్రశ్నలు అడుగుతావు?
జవాబు:
అ) ఆహారం తినకముందు సాధారణ చక్కెర స్థాయి (గ్లూకోజ్) 60 – 100 మధ్య ఉండాలి. కాని రంగయ్యకు చక్కెర స్థాయి ఆహారం తినకముందు 120 ఉన్నది. ఆహారం తిన్న తర్వాత గ్లూకోజు సాధారణ స్థాయి 160 – 180 మధ్య ఉండాలి. కాని రంగయ్యకు 220గా ఉన్నది. రెండు సందర్భాలలోను గ్లూకోజు స్థాయిలు రక్తం నందు ఎక్కువగా ఉండుట వలన రంగయ్యకు చక్కెర వ్యాధి ఉన్నట్లు చెప్పవచ్చు.

ఆ) బైలిరూబిన్ గురించి తెలుసుకోవడానికి రక్తపరీక్ష చేయాలి.

ఇ) పై నివేదిక ఆధారంగా రంగయ్యకు అధిక రక్త పీడనము, చక్కెర వ్యాధి ఉన్నదని, రక్తం నందు 24 గంటల ప్రోటీను స్థాయి కూడా ఎక్కువగా ఉన్నదని తెలియుచున్నది. మూత్రం నందు సోడియం స్థాయి సాధారణముగానే ఉన్నదని తెలియుచున్నది. రక్తం నందు పరిమాణం సాధారణ స్థాయి కంటే హెచ్చుగా నున్నది.

ఈ)

  1. చక్కెర వ్యా ధి వలన కలిగే నష్టాలు ఏమిటి?
  2. చక్కెర వ్యాధి కలుగుటకు కారణమేది?
  3. రక్తంలో గ్లూకోజు స్థాయిలను నియంత్రించు హార్మోను ఏది?
  4. అధిక రక్త పీడనము ఎందువలన కలుగుతుంది?
  5. అధిక రక్త పీడనము వలన కలిగే అనర్థాలు ఏమిటి?
  6. మూత్రం నందు 24 గంటల ప్రోటీను ఎక్కువైతే ఏం జరుగుతుంది?
  7. మన శరీరానికి సోడియం ఏ విధంగా అవసరం అవుతుంది?
  8. బైలిరూబిన్ వర్ణక స్థాయి రక్తమునందు ఎక్కువ అయితే కలిగే అనర్థాలు ఏమిటి?

ప్రశ్న 24.
రక్తం మూత్రపిండాలలో శుభ్రపడుతుంది. మూత్రపిండాలలోని నెఫ్రాన్లో రక్తం నుండి అనేక వ్యర్థ పదార్థాలు తొలగించబడతాయి. విసర్జన వ్యవస్థలో నిన్ను అత్యంత ఆశ్చర్యానికి గురిచేసిన అంశాలు ఏమిటి?
జవాబు:

  1. మూత్రపిండాలు మన శరీరం నుండి వ్యర్థాలను విసర్జిస్తాయి. అవి శరీరంలో విటమినులు, ఖనిజలవణాలు, కొవ్వులు సమతుల్యత కలిగి ఉండేలా చూస్తాయి.
  2. ప్రతిరోజు మన శరీరం నుండి 1.6 లీ నుండి 1.8 లీటర్ల వరకు మూత్రము విసర్జించబడుతుంది. దీనిలో మన శరీరానికి ఉపయోగపడని ఖనిజ లవణములు, విటమినులు ఉంటాయి.
  3. మానవ మూత్రాశయము మానవ మెదడు పరిమాణం కలిగి ఉండడం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం.
  4. అతిచిన్నవైన మూత్రపిండాలు మానవ జీవిత కాలంలో రమారమి 7,850, 000, 000 గాలనుల ద్రవపదార్థాలను విసర్జించుటకు కారణమవుతాయి.
  5. మానవ మూత్రాశయము సుమారు 400 మి.లీ. పరిమాణంలో మూత్రమును నిలువచేయగలుగుతుంది.
  6. మానవ మూత్రములో ఉండే యూరియా మొక్కల పెరుగుదలకు ఉపయోగపడుతుంది.
  7. ఒక్కొక్క మూత్రపిండము అతి సూక్ష్మమైన రక్తాన్ని వడకట్టే సుమారు 10 లక్షల కంటే ఎక్కువ ఉండే నెఫ్రాన్లను
    (లేదా)
    మూత్రనాళికలను కలిగియుండటం నన్ను ఎంతో ఆశ్చర్యపరుస్తుంది.

ప్రశ్న 25.
మీ గ్రామంలో ఏయే మొక్కలు లభిస్తాయి ? వీటిలో ఏయే మొక్కల ఉప ఉత్పన్నాలు మీరు నిజజీవితంలో ఉపయోగించుకుంటున్నారు?
జవాబు:
1) మా గ్రామంలో లభ్యమయ్యే మొక్కల వివరాలు :
సపోట, కొబ్బరి, తుమ్మ, మామిడి, జామ, తాటి, అరటి, పొగాకు, సర్పగంధి, కాఫీ, వేప, ఉమ్మెత్త, గడ్డి చామంతి, తంగేడు, పైనస్, వాలిస్ నేరియా, టేకు మొదలైన మొక్కలు పెరుగుతాయి.

2) పై మొక్కలందు ఆల్కలాయిడ్లను ఉత్పత్తి చేయు మొక్కలు :
పొగాకు, సర్పగంధి, కాఫీ, వేప, ఉమ్మెత్త మరియు చామంతి. ఈ మొక్కల ఉప ఉత్పన్నాలు నిత్యజీవితములో ఎంతో ఉపయోగపడతాయి.

మొక్కఆల్కలాయిడ్ఉపయోగం
పొగాకునికోటిన్క్రిమిసంహారిణి
సర్పగంధిరిసర్ఫిన్పాముకాటు నుండి రక్షణ
కాఫీకెఫెన్నాడీ వ్యవస్థ ఉత్తేజకారకం
వేపనింబిన్యాంటిసెప్టిక్
ఉమ్మెత్తస్కోపోలమైన్మత్తుమందు
గడ్డిచామంతిపైరిత్రాయిడ్స్కీటకనాశనులు

3) తుమ్మ, తంగేడు నుండి లభ్యమయ్యే టానిన్లను తోళ్ళను శుభ్రం చేయడానికి వినియోగిస్తాము.

4) వేప, తుమ్మ చెట్ల నుండి లభ్యమయ్యే జిగురును అతికించుటకు మరియు బైండింగ్ కారకంగా ఉపయోగిస్తాం.

5) పైనస్ నుండి లభ్యమయ్యే రెసిన్లను వార్ని ఉపయోగిస్తాం.

10th Class Biology 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ ½ Mark Important Questions and Answers

ఫ్లో చార్టులు

1.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 10
జవాబు:
మూత్రాశయం

2.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 11
జవాబు:
వృక్క ద్రోణి

3.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 12
జవాబు:
గ్లోమరులస్

4.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 13
జవాబు:
హెన్లీ శిక్యం

5.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 14
జవాబు:
ఎంజైమ్స్

6.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 15
జవాబు:
స్రావాలు

7.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 16
జవాబు:
రెసిన్

8.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 17
జవాబు:
హెస్లీ శిక్యం

9.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 18
జవాబు:
కాలేయం

10.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 19
జవాబు:
వరణాత్మక పునఃశోషణం

సరైన గ్రూపును గుర్తించండి

11. ఏ గ్రూపు సమ్మేళనాలు నత్రజని సంబంధిత వ్యర్థాలు?
A. అమ్మోనియా, యూరియా, యూరిక్ ఆమ్లం
B. గ్లూకోజ్, అమైనో ఆమ్లం, కొవ్వు ఆమ్లం
జవాబు:
గ్రూపు A

12. ఏ రక్తనాళాల సమూహం ఆమ్లజనిసహిత రక్తాన్ని తీసుకెళతాయి?
A. వృక్కసిర, వృక్క ధమని, వృక్క నాళిక
B. వృక్క ధమని, అభివాహి ధమనిక, అపవాహి ధమనిక
జవాబు:
గ్రూపు B

13. ఏ గ్రూపు సరైన క్రమంలో అమరి ఉంది?
A. అభివాహి ధమనిక, గ్లోమరులస్, అపవాహి ధమనిక
B. గ్లోమరులస్, అభివాహి ధమనిక, అపవాహి ధమనిక
జవాబు:
గ్రూపు A

14. అల్పగాఢత గల మూత్రం మరియు అధిక మూత్ర విసర్జన లక్షణాలు ఉన్న వ్యాధిని గుర్తించండి.
A. డయాబెటిస్ ఇన్సిపిడస్
B. డయాబెటిస్ మెల్లిటస్
జవాబు:
డయాబెటిస్ ఇన్సిపిడస్

AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

15. ఏ గ్రూపు సరైన క్రమంలో అమరి ఉంది?
A. సంగ్రహణ నాళం-కేలిసిస్-పిరమిడ్-ద్రోణి మూత్రనాళం
B. సంగ్రహణ నాళం-పిరమిడ్-కేలిసిస్-ద్రోణి – మూత్రనాళం
జవాబు:
గ్రూపు B

16. ఈ క్రింది ఏ సమూహం మానవునిలోని అనుబంధ విసర్జక అవయవాలు?
A. ఊపిరితిత్తులు, కాలేయం, చర్మం
B. గుండె, కళ్ళు, క్లోమం
జవాబు:
గ్రూపు A

17. ఏ గ్రూపు సమ్మేళనాలు ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు కావు?
A. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు
B. ఆల్కలాయిడ్స్, రెసిన్, లేటెక్స్
జవాబు:
గ్రూపు B

18. ఏ గ్రూపు పండ్ల నుంచి ద్వితీయ జీవక్రియోత్పన్నాలు వెలికితీస్తారు?
A. మార్ఫిన్, కొకైన్, స్కోపాలమైన్
B. కెఫిన్, నింబిన్, రిసర్ఫిన్
జవాబు:
గ్రూపు A

19. ఏ గ్రూపులోని సమ్మేళనాలు మొక్కల్లోని నత్రజని సంబంధిత ద్వితీయ జీవక్రియోత్పన్నాలు కావు?
A. క్వినైన్, పైరిథ్రాయిడ్స్, నికోటిన్
B. రెసిన్, లేటెక్స్, టానిన్స్
జవాబు:
గ్రూపు B

20. ఏ గ్రూపు మొక్కల స్రావాలకు సంబంధించినవి?
A. లేటెక్స్, రెసిన్లు, జిగురులు
B. ఎంజైములు, హార్మోన్లు, లాలాజలం
జవాబు:
గ్రూపు A

విస్తరించుము

21. LS – Longitudinal Section
22. PCT – Proximal Convoluted Tubule/ సమీపస్త సంవళిత నాళము
23. DCT – Distal Convoluted Tubule / దూరస్థ సంవళిత నాళము
24. ESRD – End Stage Renal Diseas

ఉదాహరణలు ఇవ్వండి

25. జలచర జంతువులు అమ్మోనియాను నత్రజని వ్యర్థాలుగా విసర్జిస్తాయి. యూరిక్ ఆమ్లంను విసర్జించే జంతువుకు ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
కీటకాలు మరియు పక్షులు

26. పక్షులు యూరిక్ ఆమ్లం అనే నత్రజని వ్యర్థాలను విసర్జిస్తాయి. యూరియాను విసర్జించే జీవికి ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
మానవుడు

27. రక్తస్కందన నిరోధక పదార్థానికి హెపారిన్ ఒక ఉదాహరణ. కృత్రిమ రక్తస్కందన నిరోధక పదార్థానికి మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
సోడియం ఆక్సలేట్ / సోడియం సిట్రేట్

28. సేబాషియస్ గ్రంథులు చర్మం ద్వారా సెబమ్ ను విసర్జిస్తాయి. అధికంగా తీసుకున్న ఔషధాలను తొలగించడంలో సహాయపడే అనుబంధ విసర్జక అవయవానికి ఉదాహరణను ఇవ్వండి.
జవాబు:
కాలేయం

29. అమీబా సంకోచ రిక్తికల ద్వారా ద్రవాభిసరణ క్రమతను చూపుతాయి. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
పారామీషియం

30. పొరిఫెరా వర్గ జీవులలో విసర్జన కొరకు ప్రత్యేకమైన విసర్జకావయవాలు లేవు. జీవుల ప్రతి కణంలోకి నీటి ప్రసరణ జరుగుతూనే ఉంటుంది. ఈ విధంగా విసర్జ కావయవాలు లేని వర్గానికి మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
సీలెంటరేటా

AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

31. క్వినైన్ అనేది బెరడు నుండి సేకరించిన ఆల్కలాయిడ్ మరో ఉగా హరణ ఇవ్వండి.
జవాబు:
రిసర్ఫిన్ మరియు నింబిన్

32. స్కోపాలమైన్ అనేది పుష్పం నుండి సేకరించిన ఆల్కలాయిడ్. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
పైరిత్రాయిడ్లు

33. ఆల్కలాయిడ్స్ అనేవి నైట్రోజన్ ను కలిగి ఉండే ద్వితీయ జీవక్రియోత్పన్నాలు. కార్బన్ ని కలిగి ఉన్న ద్వితీయ జీవక్రియోత్పన్నానికి ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
టానిన్లు

34. నింబిన్ అనేది యాంటీ సెప్టిక్ గా ఉపయోగించే ఆల్కలాయిడ్. కీటకనాశనిగా వాడే ఆల్కలాయిడు ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
నికోటిన్ / పైరిత్రాయిడ్లు

35. హీవియా మొక్క నుండి లభించే లేటెస్ట్ ను రబ్బరు తయారీలో వాడతారు. లేటెక్స్ ను స్రవించే మొక్కకు మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
జ ట్రోపా

36. మానవులలో స్రావాలకు ఉదాహరణలు హార్మోన్లు. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
లాలాజలం/ఎంజైములు

నేను ఎవరు?

37. నేను వృక్షశాస్త్రవేత్తను. మొక్కలు నేల నుండి కొన్ని ద్రవాలను నీటిని పీల్చుకోవడమే కాకుండా కొన్ని స్రావాలను నేలలోకి స్రవిస్తాయి అని నా ప్రయోగాల ద్వారా తెలియజేశాను.
జవాబు:
బ్రుగ్ మన్

38. నేనొక మొక్కను. రబ్బరును తయారు చేయడానికి ఉపయోగించే జిగటగా ఉండే పాలపదార్థాన్ని నేను స్రవిస్తాను.
జవాబు:
హీవియా బ్రెజిలియన్సిస్

39. నేను ద్వితీయ జీవక్రియోత్పన్నాన్ని. నేను ఎక్కువగా వివృతబీజ మొక్కలలో ఉంటాను. మరియు నన్ను వార్నిష్‌లలో ఉపయోగిస్తారు.
జవాబు:
రెసిన్

40. నన్ను సర్పగంధి మొక్క అని పిలుస్తారు. నేను స్రవించే ఆల్కలాయిడు పాముకాటుకు మందుగా ఉపయోగిస్తారు.
జవాబు:
రావుల్ఫియా సర్పెంటైనా

41. నేనొక విత్తనాన్ని, కేంద్రనాడీ వ్యవస్థను ఉత్తేజితం చేసే ఆల్కలాయిడ్ ను కలిగి ఉంటాను.
జవాబు:
కాఫీ విత్తనం

42. ఎకైనోడర్మటా జీవులలో చలనానికి, పోషక మరియు వర్థపదార్థాల రవాణా కొరకు ఏర్పడిన అవయవవ్యవస్థను.
జవాబు:
జలప్రసరణ వ్యవస్థ

43. నేనొక వర్గాన్ని. ఈ వర్గంలో మొదటిసారిగా విసర్జక నిర్మాణాలు ఏర్పడ్డాయి.
జవాబు:
ప్లాటీ హెల్మింథిస్

44. ఏకకణ జీవులలో ద్రవాభిసరణ క్రమతను నియంత్రించే కణాంగాన్ని,
జవాబు:
సంకోచరిక్తిక

45. ఎర్రరక్తకణాలు చనిపోవడం వలన హీమోగ్లోబిన్ విచ్ఛిన్నం అయినప్పుడు ఏర్పడే వ్యర్థాన్ని మరియు మూత్రం యొక్క రంగుకి కారణమైన వర్ణక పదార్థాన్ని.
జవాబు:
యూరోక్రోమ్

46. నేనొక వాషింగ్టన్ కి చెందిన సర్టైన్ ని. 1954లో మొదటి సారిగా మూత్రపిండ ఆపరేషన్ చేసిన ఘనత నాదే.
జవాబు:
డా|| చార్లెస్ హఫ్ నగెల్

జతపరచుట

47. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
మూత్రం – యూరోక్రోమ్
రక్తం – పత్రహరితం
పత్రం – హీమోగ్లోబిన్
జవాబు:
మూత్రం – యూరోక్రోమ్

48. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
అమ్మోనియా – చేప
యూరియా – మానవులు
యూరిక్ ఆమ్లం – ఎలుక
జవాబు:
యూరిక్ ఆమ్లం – ఎలుక

AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

49. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
మూత్రాశయం సామర్థ్యం – 1.6 – 1.81 లీటర్లు
రోజుకు విసర్జించే మూత్ర
పరిమాణం – 700-800 మి.లీ.
డయాలిసిసికి పట్టే సమయం – 3-6 గంటలు
జవాబు:
డయాలిసిస్ కి పట్టే సమయం – 3-6 గంటలు

50. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
ఊపిరితిత్తులు – CO2 & నీరు
కాలేయం – అదనపు మందులు
చర్మం – బిలిరుబిన్
జవాబు:
చర్మం – బిలిరుబిన్

51. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
అనెలిడా – మాల్ఫీజియన్ నాళికలు
నెమటోడా – రెనెట్ కణాలు
ఆరోపోడా – నెఫ్రీడియా
జవాబు:
నెమటోడా – రెనెట్ కణాలు

52. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
మానవుడు – మూత్రపిండం
పక్షులు – హరితగ్రంథులు
మొలస్కా – మెటా నెఫ్రీడియా
జవాబు:
పక్షులు – హరిత గ్రంథులు

53. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు – కార్బోహైడ్రేట్
ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు – ప్రొటీన్లు
మొక్కలలో కాల్షియం ఆక్సలేట్ స్ఫటికాలు – రాఫైడ్లు
జవాబు:
ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు – ప్రొటీన్లు

54. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
నికోటిన్ – బెరడు
క్వి నైన్ – ఆకు
స్కోపాలమైన్ – పుష్పం
జవాబు:
స్కోపాలమైన్ – పుష్పం

55. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
నల్లమందు – నొప్పి నివారిణి
నింబిన్ – మత్తుమందు
పైరిత్రాయిడ్ – కీటకనాశిని
జవాబు:
నింబిన్ – మత్తుమందు

56. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
జిగురు – తుమ్మ
అలర్జిన్ – పార్టీనియం
టానిన్ – జట్రోపా
జవాబు:
టానిన్ – జట్రోపా

పోలికను గుర్తించుట

57. గడ్డి చామంతి : పువ్వు :: సింకోనా 😕
జవాబు:
బెరడు

58. వేప : అజాడిరక్త ఇండికా :: ? : నికోటియాన టొబాకం
జవాబు:
పొగాకు

59. స్కోపాలమైన్ : మత్తుమందు :: కొకైన్ 😕
జవాబు:
నొప్పి నివారిణి

60. చూయింగ్ గమ్ : చికిల్ :: బయోడీజిల్ 😕
జవాబు:
జట్రోపా

61. రెసిన్ : మొక్క స్రావం :: లాలాజలం 😕
జవాబు:
మానవ స్రావం

62. శ్వాసక్రియ : CO2 :: బాష్పోత్సేకం 😕
జవాబు:
నీరు

AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

63. వృక్క ధమని : ? :: వృక్క సిర : ఆమ్లజనిరహిత రక్తం
జవాబు:
ఆమ్లజనిసహిత రక్తం

64. గుచ్చగాలనం : బౌమన్ గుళిక :: నాళికా స్రావం 😕
జవాబు:
దూరస్థ సంవళిత నాళము

65. సజల మూత్రం : వాసోప్రెస్సిన్ :: ? : రక్తస్కందన నిరోధకం
జవాబు:
హెపారిన్

66. డయాలసిస్ : కృత్రిమ మూత్రపిండం :: జీవన్ దాన్ పథకం 😕
జవాబు:
అవయవ దానం

దోషాన్ని గుర్తించి, సరిచేసి రాయండి

67. జీవక్రియలోని వ్యర్థ పదార్థ ఉత్పత్తుల్లో అత్యంత విషతుల్యం యూరియా.
జవాబు:
జీవక్రియలోని వ్యర్థ పదార్థ ఉత్పత్తుల్లో అత్యంత విషతుల్యం అమ్మోనియా.

68. ప్రతీ మూత్రపిండంలో, సూక్ష్మమైన మరియు నాళికా రూప క్రియాత్మక ప్రమాణాలను న్యూరాన్లు లేదా వృక్క ప్రమాణాలు అంటారు.
జవాబు:
ప్రతీ మూత్రపిండంలో, సూక్ష్మమైన మరియు నాళికా రూప క్రియాత్మక ప్రమాణాలను నెఫ్రాన్లు లేదా వృక్క ప్రమాణాలు అంటారు.

69. దూరస్థ సంవళిత నాళము చుట్టూ అమరి ఉన్న బాహ్య కేశ నాళికావల ప్రాథమిక మూత్రంలోని శరీరానికి ఉపయోగపడే పదార్థాలను పునఃశోషణం చేసుకుంటుంది.
జవాబు:
సమీపస్థ సంవళిత నాళము చుట్టూ అమరి ఉన్న బాహ్యకేశ నాళికావల ప్రాథమిక మూత్రంలోని శరీరానికి ఉపయోగపడే పదార్థాలను పునఃశోషణం చేసుకుంటుంది.

70. వరణాత్మక పునఃశోషణం అనేది మూత్రం యొక్క పిహెచ్ యొక్క సరైన గాఢతను క్రమబద్ధం చేస్తుంది.
జవాబు:
నాళికా స్రావం అనేది మూత్రం యొక్క పిహెచ్ యొక్క సరైన గాఢతను క్రమబద్ధం చేస్తుంది.

71. వాసోప్రెస్సిన్ లోపం వలన అధిక మూత్ర విసర్జన మరియు తక్కువ గాఢత గల మూత్రవిసర్జన జరుగుతుంది. దీనినే డయాబెటిస్ మెల్లిటస్ అంటారు.
జవాబు:
వాసోప్రెస్సిన్ లోపం వలన అధిక మూత్ర విసర్జన మరియు తక్కువ గాఢత గల మూత్రవిసర్జన జరుగుతుంది. దీనినే డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటారు.

72. ఒకవేళ మూత్రపిండాలు విఫలం అయితే, శరీరం నీరు మరియు వ్యర్థ ఉత్పత్తులతో నిండి ఉంటుంది. ఈ స్థితిని ఎడిమ అంటారు.
జవాబు:
ఒకవేళ మూత్రపిండాలు విఫలం అయితే, శరీరం నీరు మరియు వ్యర్థ ఉత్పత్తులతో నిండి ఉంటుంది. ఈ స్థితిని యూరేమియా అంటారు.

AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

73. ఆల్కలాయిడ్స్ కర్బన సమ్మేళనాలు మరియు విష పూరితం.
జవాబు:
ఆల్కలాయిడ్స్ నత్రజని సమ్మేళనాలు మరియు విష పూరితం.

బొమ్మలపై ప్రశ్నలు

74.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 20
ఈ పరికరంలో ఉపయోగించిన ద్రవం పేరేమిటి?
జవాబు:
డయలైజింగ్ ద్రావణం

75.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 21
ఈ పటం దేనిని సూచిస్తుంది?
జవాబు:
మూత్రపిండ మార్పిడి

76.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 22
ఈ మొక్కల్లో ఉండే ఆల్కలాయిడ్ పేరేమిటి?
జవాబు:
స్కోపోలమైన్

77.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 23
ఈ మొక్క నుండి స్రవించే పదార్థం ఏమిటి?
జవాబు:
లేటెక్స్

78.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 24
ఈ పటంలో U ఆకారంలో ఉన్న భాగం పేరు ఏమిటి?
జవాబు:
హె శిక్యం

79.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 25
ఈ పటంలో తప్పుగా గుర్తించిన భాగం పేరేమిటి?
జవాబు:
వృక్క సిర (మూత్రనాళం)

80.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 26
మానవునిలో అనుబంధ విసర్జక అవయ వంగా పనిచేసే ఈ పటాన్ని గుర్తించండి.
జవాబు:
కాలేయం

ఖాళీలను పూరించండి

81. విసర్జన ప్రధాన లక్ష్యము
జవాబు:
శరీర అయాన్ సమతా స్థితి

82. మూత్రపిండ లోపలి తల నొక్కును ఏమంటారు?
జవాబు:
హైలమ్

83. మూత్రపిండం లోనికి ………. ప్రవేశించగా, వృక్క సిర, మూత్రనాళం బయటకు వస్తాయి.
జవాబు:
వృక్క ధమని

84. మూత్రపిండం యొక్క వెలుపలి వలయాన్ని ………. అంటారు.
జవాబు:
వల్కలము

85. మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక ప్రమాణం ………….. నెఫ్రాన్
జవాబు:
వృక్క నాళిక

86. మూత్రనాళికలోని తలపిన్ను వంటి నిర్మాణం …………
జవాబు:
హె శిక్యం

87. కృత్రిమ మూత్రపిండాన్ని …….. అంటారు.
జవాబు:
డయాలసిస్

88. ………… మూత్రపిండం కొంచెం దిగువగా ఉంటుంది.
జవాబు:
కుడి

AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

89. మొక్కలలోని విసర్జక పదార్థాలను ……. అంటారు.
జవాబు:
ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు

90. ఆల్కలాయిడ్స్ …….. ఉత్పన్నాలు.
జవాబు:
కర్బన

91. తోళ్ళ పరిశ్రమలో ఉపయోగించే వృక్ష వ్యర్థాలు ………..
జవాబు:
టానిన్లు

92. రబ్బరు మొక్క ………… నుండి రబ్బరు తయారు చేస్తారు.
జవాబు:
లేటెక్స్

93. మొక్కల వేర్ల నుండి వ్యర్థాల విసర్జనను ఏమంటారు?
జవాబు:
అయాన్ నిశ్రావణం

94. ఏ మొక్క ఆల్కలాయిడ్ ను యాంటీ బయాటిక్ గా ఆవాడతారు?
జవాబు:
వేప

95. రెసిన్లను ఏ పరిశ్రమలలో వాడతారు?
జవాబు:
రంగుల పరిశ్రమలో

10th Class Biology 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 1 Mark Bits Questions and Answers

1. పాముకాటు నుండి రక్షణ పొందడానికి ఈ క్రింది ఆల్కలాయిడను ఉపయోగిస్తారు.
A) క్వి నైన్
B) రిసర్ఫిన్
C) కెఫెన్
D) నింబిన్
జవాబు:
B) రిసర్ఫిన్

2. ఈ కింది వానిలో విసర్జక అవయవము లేని జంతువును గుర్తించండి.
A) పక్షి
B) అమీబా
C) స్పంజికలు
D) B మరియు C
జవాబు:
D) B మరియు C

3. ఒక వ్యక్తికి కాళ్ళు, చేతులు ఉబ్బిపోయాయి. నీరసం అలసట వస్తుంది. అతనిలో ఈ అవయవం పాడై ఉండవచ్చు.
A) మూత్రపిండం
B) మెదడు
C) గుండె
D) కాలేయం
జవాబు:
A) మూత్రపిండం

AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

4. క్రింది వాటిలో సరిగ్గా లేని జత ఏది?
A) ప్లాటి హెల్మింథిస్ – జ్వాలకణాలు
B) ఆగ్రోపొడ – మాల్ఫీజియన్ నాళికలు
C) మొలస్కా – మెటానెఫ్రీడియా
D) ప్రోటోజోవా – జల ప్రసరణ వ్యవస్థ
జవాబు:
D) ప్రోటోజోవా – జల ప్రసరణ వ్యవస్థ

5. ఈ క్రింది పటములో ‘X’ ను గుర్తించుము.
A) బౌమన్ గుళిక
B) సిర
C) నాళము
D) కప్పు
జవాబు:
A) బౌమన్ గుళిక

6. మాల్ఫీజియన్ నాళికలు విసర్జకావయవములుగా గల జీవి ………
A) వానపాము
B) బొద్దింక
C) ఏలికపాము
D) ప్లనేరియా
జవాబు:
B) బొద్దింక

7. రక్తంలోని వ్యర్థ పదార్థాలను ఏ విధంగా గుర్తిస్తారు?
A) స్కానింగ్ ద్వారా
B) మూత్ర పరీక్ష ద్వారా
C) థర్మామీటర్ తో
D) రక్తపరీక్ష ద్వారా
జవాబు:
B) మూత్ర పరీక్ష ద్వారా

8. మన శరీరంలో మూత్రం ప్రయాణించే సరైన మార్గం
A) మూత్ర పిండాలు → మూత్ర నాళాలు → మూత్రాశయం → ప్రసేకం
B) మూత్రనాళాలు → మూత్రాశయం → ప్రసేకం → మూత్రపిండాలు
C) మూత్రాశయం → ప్రసేకం → మూత్రపిండాలు → మూత్రనాళాలు
D) ప్రసేకం → మూత్రపిండాలు → మూత్రనాళాలు → మూత్రాశయం
జవాబు:
A) మూత్ర పిండాలు → మూత్ర నాళాలు → మూత్రాశయం → ప్రసేకం

9. క్రింది స్లో చార్టును పూర్తి చేయుము.
వరణాత్మక . . అతిగా ఢత గల గుచ్చ గాలనం మూత్రం ఏర్పడడం
A) నాళికా స్రావం
B) నాళికా వడబోత
C) నాళికా విసర్జన
D) మూత్రం ఏర్పడటం
జవాబు:
A) నాళికా స్రావం

10. నేను ఒక మొక్కను. నా విత్తనాల నుండి జీవ ఇంధనం ఉత్పత్తి అవుతుంది. నేనెవరిని?
A) రబ్బరు మొక్క
B) వేప మొక్క
C) కాక్టస్ మొక్క
D) జట్రోపా మొక్క
జవాబు:
D) జట్రోపా మొక్క

11. మొలస్కాలో విసర్జక అవయవాలు ఏవి?
A) రెనెట్ కణాలు
B) హరిత గ్రంథులు
C) మెటా నెఫ్రీడియా
D) మూత్రపిండాలు
జవాబు:
C) మెటా నెఫ్రీడియా

12. మూత్రము ఏర్పడే విధానంలో ఈ క్రింది నాలుగు దశలు ఉన్నవి. వాటిని క్రమ పద్ధతిలో అమర్చండి.
i) వరణాత్మక పునఃశోషణ
ii) గుచ్చగాలనం
iii) అతిగాఢత గల మూత్రం ఏర్పడటం
iv) నాళికా స్రావం
A) (i), (ii), (iii), (iv)
B) (iv), (iii), (ii), (i)
C) (iii), (ii), (i), (iv)
D) (ii), (i), (iv), (iii)
జవాబు:
D) (ii), (i), (iv), (iii)

AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

13. సరైన జతను గుర్తించండి.
A) ప్రోటోజోవా – జ్వాలాకణాలు
B) అనెలిడా – మూత్రపిండాలు
C) ఇఖైనోడర్మేటా – నెఫ్రీడియా
D) ఆర్రోపోడా – హరితగ్రంథులు
జవాబు:
D) ఆర్రోపోడా – హరితగ్రంథులు

14. మూత్రం పసుపు రంగులో ఉండుటకు కారణము
A) బైలిరూబిన్
B) యూరోక్రోమ్
C) క్లోరైడ్లు
D) క్రియాటినిన్
జవాబు:
B) యూరోక్రోమ్

15. గ్రూపు — A గ్రూపు – B
i) ప్లాటి హెల్మింథస్ ( ) a) నెఫ్రిడియ
ii) అనెలిడ ( ) b) జ్వాలా కణాలు
iii) ఆర్రోపోడా ( ) మాల్ఫీజియన్ నాళికలు
A) i – b, ii – a, iii – c
B) i – b, ii – c, iii – a
C) i – a, ii – c, iii – b
D) i – c, ii – b, iii – a
జవాబు:
A) i – b, ii – a, iii – c

16. చర్మము : చెమట : : ఊపిరితిత్తులు : ………….
A) కార్బన్-డై-ఆక్సెడ్
B) మలం
C) యూరియా
D) లాలాజలం
జవాబు:
A) కార్బన్-డై-ఆక్సెడ్

17. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకొనుటకు నీవిచ్చే సలహాలేవి?
A) రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడం
B) పొగ తాగడం, మద్యం సేవించడం మానివేయడం
C) రక్తపీడనంను అదుపులో ఉంచుకోవడం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

18. ప్లాటి హెల్మింథిస్ వర్గ జీవుల్లో విసర్జకావయవాలు
A) నెఫ్రిడియా
B) జ్వాలాకణాలు
C) హరిత గ్రంథులు
D) మూత్ర పిండాలు
జవాబు:
B) జ్వాలాకణాలు

AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

19. కింది వాటిలో తప్పు వాక్యాన్ని గుర్తించండి.
A) మాంసకృత్తులు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకున్న వ్యక్తి మూత్రంలో యూరికామ్లం ఎక్కువగా ఉంటుంది.
B) మధుమేహం ఉన్నవారి మూత్రంలో చక్కెర ఉంటుంది.
C) మూత్రం లేత పసుపురంగులో ఉండడానికి యూరోక్రోమ్ కారణం.
D) ద్రవ పదార్థాలు లేదా నీరు ఎక్కువగా తీసుకునేవారు ఎక్కువసార్లు మూత్రానికి వెళతారు.
జవాబు:
A) మాంసకృత్తులు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకున్న వ్యక్తి మూత్రంలో యూరికామ్లం ఎక్కువగా ఉంటుంది.

మీకు తెలుసా?

* 40 సంవత్సరాల వయసు దాటిన తరువాత దాదాపుగా అందరిలోను ప్రతి 10 సంవత్సరాలకు 10% నెఫ్రాన్ల క్రియాశీలత తగ్గుతుంది.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 28

* మొట్టమొదట మూత్రపిండ మార్పిడి ఆపరేషన్ 1954లో సమరూప కవలలకు చేసిన ఘనత డా. చార్లెస్ హఫ్ నగెల్ అనే వాషింగ్టన్‌కు చెందిన సర్జనకు చెందుతుంది. మన దేశంలో మొదటిసారి డిసెంబర్ 1వ తేదీ 1971న క్రిస్టియన్ మెడికల్ కాలేజీ వెల్లూర్ లో మూత్రపిండ మార్పిడి ఆపరేషన్ జరిగింది.

* చూయింగ్ గమ్ అనేది నమలడం కోసం తయారుచేయబడిన ఒక రకమైన జిగురు పదార్థం. దీనిని 5000 సంవత్సరాలకు పూర్వమే దీనిని తయారుచేసేవారని చారిత్రక ఆధారాలున్నాయి. ప్రస్తుతం చూయింగ్ గమ్ చికిల్ మొక్క యొక్క సహజసిద్ధమైన లేటెక్స్ నుండి తయారుచేస్తున్నారు. పార్టీనియం వంటి మొక్కల పుప్పొడి రేణువులు మనకు ఎలర్జీని కలుగజేస్తాయి. వాటిలో ఉండే నత్రజనియుత పదార్థాలు చర్మ సంబంధమైన ఎలర్జీ, ఆస్తమా కలిగిస్తాయి.

పునశ్చరణ
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 27

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

These AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ will help students prepare well for the exams.

AP Board 10th Class Biology 3rd lesson Important Questions and Answers ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

10th Class Biology 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
రక్తంలో రక్తఫలకికలు లేకపోతే ఏమి జరుగుతుంది?
జవాబు:
రక్తఫలకికలు రక్త స్కందనంలో పాల్గొంటాయి. రక్తఫలకికలు లేకపోతే ప్రమాదం జరిగినపుడు రక్తం గడ్డకట్టదు. అందువలన అధిక రక్తస్రావం జరిగి వ్యక్తి మరణిస్తాడు.

ప్రశ్న 2.
ఇద్దరు వ్యక్తుల రక్తపీడనం ఇలా ఉంది.

రామయ్య140 / 807
రంగయ్య110 / 90

ఎవరి రక్తపీడనం ఎక్కువ ? అది దేనిని సూచిస్తుంది?
జవాబు:
రామయ్య రక్తపీడనం ఎక్కువ. దీనిలో 140 సిస్టోలిక్ పీడనం, 80 డయాస్టోలిక్ పీడనాన్ని సూచిస్తుంది.

ప్రశ్న 3.
మన నాడీస్పందన ఎప్పుడు అధికమౌతుంది?
జవాబు:
పరిగెత్తుట, వ్యాయామము, భయం, ఉద్వేగం, ఎత్తైన ప్రదేశాలకు ఎక్కుతున్నప్పుడు అధికమౌతుంది.

ప్రశ్న 4.
శోషరసం రక్తం కన్నా ఏ విధంగా భిన్నంగా ఉంటుంది?
జవాబు:

  1. రక్తంలో ఎర్ర రక్తకణాలు ఉంటాయి, కానీ శోషరసంలో ఉండవు.
  2. రక్తం ఎరుపు రంగులో ఉంటుంది, కానీ శోషరసం వర్ణరహితంగా ఉండును.

ప్రశ్న 5.
ఏ జీవులలో రక్తం ఆక్సిజన్‌ను సరఫరా చేయదు?
జవాబు:
ఆర్థోపొడా జీవులు లేదా కీటకాలు (లేదా) వాయునాళ శ్వాసవ్యవస్థ కలిగిన జీవులు.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

ప్రశ్న 6.
మేక గుండె పరిశీలించుటకు ప్రయోగశాలలో మీరు ఉపయోగించిన పరికరాలను తెలుపండి.
జవాబు:
కావలసిన పరికరాలు :
1. మేక తాజా గుండె, 2. సోడాస్త్రాలు, 3. ఉపయోగించిన పెన్ను, రీఫిల్స్, 4. పదునైన బ్లేడు, (లేదా) స్కాల్ పెల్, 5. డిసెక్షన్ ట్రే, 6. ఒక మగ్గు నీరు, 7. డిసెక్షన్ కత్తెర, 8. ఫోర్సెప్స్.

ప్రశ్న 7.
ప్రయోగశాలలో వేరుపీడన ప్రయోగంను నిరూపించుటకు కావలసిన పరికరాల జాబితాను తెల్పండి.
జవాబు:
వేరుపీడన ప్రయోగంను నిరూపించుటకు కావలసిన పరికరాలు : క్లాంప్, గాజు గొట్టం, గట్టి రబ్బరు గొట్టం, కుండీలో పెరుగుతున్న మొక్క.

ప్రశ్న 8.
శరీరంలో అతి పెద్ద ధమని పేరు రాయండి.
జవాబు:
శరీరంలో అతి పెద్ద ధమని : బృహద్ధమని

ప్రశ్న 9.
పటంలో చూపిన పరికరాన్ని గుర్తించి, దాని పేరు రాయండి.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 1
జవాబు:
స్పిగ్మోమానోమీటర్.

ప్రశ్న 10.
అధిక రక్తపోటు గురించి మరిన్ని వివరాలు తెలుసుకొనుటకు డాక్టర్‌ను మీరు అడిగే రెండు ప్రశ్నలు రాయండి.
జవాబు:

  1. అధిక రక్తపోటు వలన కలిగే పరిణామాలు ఏమిటి?
  2. అధిక రక్తపోటును ఎలా నివారించవచ్చు?

ప్రశ్న 11.
నిమ్నస్థాయి జీవులలో జీవక్రియలు ఎలా జరుగుతాయి?
జవాబు:
అమీబా, హైడ్రా. వంటి నిమ్నస్థాయి జీవులలో పదార్థాలన్నీ వ్యాపనం (Diffusion), ద్రవాభిసరణ (Osmosis) వంటి సరళమైన పద్ధతుల ద్వారా జరుగుతాయి.

ప్రశ్న 12.
నాడీస్పందన అనగానేమి?
జవాబు:
నాడీస్పందన :
హృదయ స్పందన వలన మణికట్టు వద్ద రక్తనాళాలలో లయ కదలికను నాడీ స్పందన (Pulse) అంటారు. నాడీ స్పందన రేటు హృదయస్పందన రేటుకు సమానం.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

ప్రశ్న 13.
ఎడిమా అనగానేమి?
జవాబు:
ఎడిమా :
కాళ్ళలోని కణజాల ద్రవం పైకి ప్రసరించక కాళ్ళలో నిల్వ ఉండుటవలన వాపు కనిపిస్తుంది. ఈ స్థితిని “ఎడిమా” అంటారు. ప్రధానంగా ఎక్కువ సేపు కూర్చొని ప్రయాణించినపుడు ఈ స్థితిని గమనించవచ్చు.

ప్రశ్న 14.
కణజాల ద్రవం అనగానేమి?
జవాబు:
కణజాల ద్రవం :
హృదయస్పందన వలన రక్తం రక్తనాళాలలో ప్రవహిస్తుందని మనకు తెలుసు. గుండె నుండి ప్రవహించే రక్తం, రక్తనాళాల ద్వారా ప్రవహిస్తూ చివరకు రక్తకేశనాళికలను చేరుతుంది. పోషకాలతో కూడిన రక్తంలోని ద్రవం రక్తకేశనాళికల ద్వారా కణజాలాలలోనికి చేరుతుంది. కణజాలాలలోనికి చేరిన రక్తంలోని ద్రవభాగాన్ని “కణజాల ద్రవం” (Tissue fluid) అంటారు.

ప్రశ్న 15.
అమీబా వంటి ఏకకణ జీవులలో ప్రసరణ ఎలా జరుగుతుంది?
జవాబు:
అమీబా, హైడ్రా, వంటి నిమ్నస్థాయి జీవులలో పదార్థాలన్నీ వ్యాపనం, ద్రవాభిసరణ వంటి సరళమైన పద్ధతుల ద్వారా జరుగుతుంది.

ప్రశ్న 16.
ప్రసరణ వ్యవస్థ అనగానేమి?
జవాబు:
ప్రసరణ వ్యవస్థ:
జీవులలో కణజాలానికి కావలసిన పదార్థాలను రవాణా చేయు వ్యవస్థను “ప్రసరణ వ్యవస్థ” అంటారు.

ప్రశ్న 17.
గుండెకు రక్షణను కల్పించే నిర్మాణం ఏమిటి?
జవాబు:
ప్రక్కటెముకలు, హృదయావరణత్వచం గుండెకు రక్షణ కల్పిస్తాయి.

ప్రశ్న 18.
గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే నాళం ఏమిటి?
జవాబు:
కరోనరి ధమని గుండె కండరాలకు రక్తాన్ని అందిస్తుంది.

ప్రశ్న 19.
గుండెలోని గదులు ఏమిటి?
జవాబు:
గుండెలో నాలుగు గదులు ఉంటాయి. పై రెండు గదులను “కర్ణికలు” అని, క్రింది రెండు గదులను “జఠరికలు” అని అంటారు.

ప్రశ్న 20.
గుండెకు రక్తాన్ని తెచ్చే రక్తనాళాలు ఏమిటి?
జవాబు:
గుండెకు రక్తాన్ని తెచ్చే రక్తనాళాలను “ధమనులు” అంటారు.

ప్రశ్న 21.
పుపుస ధమని పని ఏది?
జవాబు:
పుపుస ధమని గుండె నుండి రక్తాన్ని ఊపిరితిత్తులకు తీసుకెళుతుంది.

ప్రశ్న 22.
ఊర్ధ్వబృహత్ సిర పని ఏమిటి?
జవాబు:
ఊర్ధ్వబృహత్ సిర తలపైన ఉన్న భాగాల నుండి రక్తాన్ని సేకరించి గుండెకు చేర్చుతుంది.

ప్రశ్న 23.
అథోబృహత్ సిర పని ఏమిటి?
జవాబు:
అథోబ్మహత్ సిర శరీరం క్రింద భాగాల నుండి, రక్తాన్ని సేకరించి గుండెకు చేర్చుతుంది.

ప్రశ్న 24.
ధమనీ ఛాపం (Arota)అనగానేమి?
జవాబు:
ధమనీ ఛాపం :
శరీరంలోని అతి పెద్ద ధమనిని ధమనీ చాపం అంటారు. ఇది ఎడమ జఠరిక నుండి ప్రారంభమై శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది.

ప్రశ్న 25.
ద్వివలయ ప్రసరణ అనగానేమి?
జవాబు:
ద్వివలయ ప్రసరణ :
దేహభాగాలకు రక్తాన్ని రెండు వలయాలలో పంపే హృదయాన్ని “ద్వివలయ ప్రసరణ” అంటారు.

ప్రశ్న 26.
సూక్ష్మ కేశనాళికలు అనగానేమి?
జవాబు:
సూక్ష్మకేశనాళికలు :
శరీరంలో రక్తనాళాలు సన్నని నాళాలుగా విడిపోతాయి. వీటిని సూక్ష్మనాళికలు (Capillaries) అంటారు. లాటిన్ భాషలో capillaries అంటే కేశం అని అర్థం. ఈ నాళాలు వెంట్రుకలవలె సన్నగా ఉంటాయి.

ప్రశ్న 27.
హార్దిక వలయం అనగానేమి?
జవాబు:
కర్ణికలు, జఠరికలు ఒకసారి సంకోచించి తరువాత యథాస్థితికి వస్తే దానిని “హృదయస్పందన లేదా హార్దిక వలయం” (Cardiac cycle) అంటారు.

ప్రశ్న 28.
హార్దిక వలయంలోని ప్రక్రియలు ఏమిటి?
జవాబు:
హర్దిక వలయంలో ఒక సంకోచదశ (సిస్టోల్), ఒక సడలింపు దశ (డయాస్టోల్) ఉంటాయి.

ప్రశ్న 29.
హార్దిక వలయానికి పట్టే సమయం ఎంత?
జవాబు:
హార్దిక వలయం సుమారుగా 0.8 సెకన్లలో పూర్తి అవుతుంది. ఈ ప్రక్రియలో కర్ణికల సంకోచానికి 0.11-0. 14 సెకన్లు, జఠరికా సంకోచానికి 0.27-0. 35 సెకన్ల సమయం పడుతుంది.

ప్రశ్న 30.
ఏకవలయ ప్రసరణ అనగానేమి?
జవాబు:
ఏకవలయ ప్రసరణ :
రక్తప్రసరణ ఒకే వలయం ద్వారా జరిపే వ్యవస్థను “ఏకవలయ ప్రసరణ” అంటారు.

ప్రశ్న 31.
కణజాల ద్రవం అనగానేమి?
జవాబు:
కణజాల ద్రవం :
కణజాలాలలోనికి చేరిన రక్తంలోని ద్రవ భాగాన్ని కణజాల ద్రవం (Tissue fluid) అంటారు.

ప్రశ్న 32.
శోషరసం, కణజాలద్రవం మధ్యగల భేదమేమి?
జవాబు:
ఘనపదార్థాలు లేని రక్తాన్ని “శోషరసం” అంటారు. కణజాలలో ఉన్న శోషరసాన్ని “కణజాలద్రవం” అంటారు.

ప్రశ్న 33.
సీరం అనగానేమి?
జవాబు:
సీరం :
రక్తం గడ్డకట్టిన తరువాత మిగిలిన ద్రవాన్ని “సీరం” అంటారు.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

ప్రశ్న 34.
బ్రౌనియన్ చలనం అనగానేమి?
జవాబు:
బ్రౌనియన్ చలనం : కణజీవపదార్థంలో ఉండే సహజ కదలికలను “బ్రేనియన్ చలనం” అంటారు.

ప్రశ్న 35.
వివృత రక్తప్రసరణ వ్యవస్థ అనగానేమి?
జవాబు:
వివృత రక్తప్రసరణ వ్యవస్థ :
రక్తం రక్తనాళాలలో కాకుండా శరీర కుహరాల ద్వారా ప్రసరించే వ్యవస్థను “వివృత రక్తప్రసరణ వ్యవస్థ” అంటారు.
ఉదా : బొద్దింక

ప్రశ్న 36.
సంవృత రక్తప్రసరణ వ్యవస్థ అనగానేమి?
జవాబు:
సంవృత రక్తప్రసరణ వ్యవస్థ :
రక్తం రక్తనాళాలలో ప్రసరించే వ్యవస్థను “సంవృత ‘రక్తప్రసరణ వ్యవస్థ” అంటారు
ఉదా : మానవుడు.

ప్రశ్న 37.
రక్తపీడనం అనగానేమి? దాని విలువ ఎంత?
జవాబు:
రక్తం రక్తనాళాలలో ప్రవహించేటప్పుడు కలిగించే పీడనాన్ని “రక్తపీడనం” అంటారు. దీని విలువ 120/80.

ప్రశ్న 38.
120/80 దేనిని తెలియజేస్తుంది?
జవాబు:
120/80 లో 120 సిస్టోలిక్ పీడనాన్ని, 80 డయాస్టోలిక్ పీడనాన్ని తెలియజేస్తుంది.

ప్రశ్న 39.
రక్తస్కందనంలో పాల్గొనే ఎంజైమ్ ఏమిటి?
జవాబు:
రక్తస్కందనంలో థ్రాంబోకైనేజ్ ఎంజైమ్ పాల్గొంటుంది. ఇది రక్తఫలకికల నుండి విడుదల చేయబడుతుంది.

ప్రశ్న 40.
మొక్కలలోని పోషక కణజాలం పని ఏమిటి?
జవాబు:
మొక్కలలోని పోషక కణజాలం ఆహార రవాణాలో పాల్గొంటుంది.

ప్రశ్న 41.
నాళికాపుంజం దేనితో నిర్మితమౌతుంది?
జవాబు:
దారువు, పోషకకణజాలం వలన నాళికాపుంజం నిర్మితమవుతుంది.

ప్రశ్న 42.
వేరు పీడనం అనగానేమి?
జవాబు:
వేరు పీడనం :
వేరు, నీటిని పీల్చుకొన్నప్పుడు కలిగించే పీడనాన్ని “వేరు పీడనం” అంటారు.

ప్రశ్న 43.
బాష్పోత్సేకం అనగానేమి?
జవాబు:
బాష్పోత్సేకం :
మొక్క దేహభాగాల నుండి నీరు ఆవిరై పోవడాన్ని “బాష్పోత్సేకం” అంటారు.

ప్రశ్న 44.
జఠర ప్రసరణ కుహరం ఏ జీవులలో ఉంటుంది?
జవాబు:
స్పంజికలు, హైడ్రా, జెల్లీ చేప వంటి నిడేరియా జీవులలో జఠర ప్రసరణ కుహరం ఉంటుంది.

ప్రశ్న 45.
శరీరంలో పెద్ద ధమని ఏమిటి?
జవాబు:
బృహత్ ధమని శరీరంలోని పెద్ద ధమని. ఇది శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది.

ప్రశ్న 46.
అతి పెద్ద గుండె గల జంతువు ఏమిటి?
జవాబు:
నీటి తిమింగలం 750 కేజీల బరువు కలిగిన పెద్ద గుండె కలిగి ఉంటుంది.

ప్రశ్న 47.
రక్తపోటు అనగానేమి?
జవాబు:
రక్తపోటు :
రక్తపీడనం 120/80 కంటే అధికంగా ఉంటే దానిని “రక్తపోటు” అంటారు.

ప్రశ్న 48.
నీరు మూలకేశాలలోనికి ఏ ప్రక్రియ ద్వారా చేరుతుంది?
జవాబు:
మూలకేశాలలోనికి నీరు ద్రవాభిసరణ ప్రక్రియ ద్వారా చేరుతుంది.

10th Class Biology 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
నీలిమ తన మిత్రులతో ఒక కృత్యం నిర్వహించింది. దాని ఫలితాలను కింది పట్టికలో నమోదుచేసింది. పట్టికను పరిశీలించి ప్రశ్నలకు జవాబులు రాయండి.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 2
i) నాడీ స్పందనకు, హృదయ స్పందనకు మధ్య ఏ విధమైన సంబంధాన్ని గుర్తించారు?
ii) జాగింగ్ చేసిన తర్వాత హృదయ స్పందన రేటు ఎక్కువగా ఉండడానికి కారణం ఏమిటి?
జవాబు:
i) నాడీ స్పందనకు, హృదయ స్పందనకు మధ్య ఏ విధమైన సంబంధాన్ని గుర్తించారు?
జవాబు:
నాడీ స్పందన రేటు హృదయ స్పందన రేటుకు సమానంగా ఉంటుంది.

ii) జాగింగ్ చేసిన తర్వాత హృదయ స్పందన రేటు ఎక్కువగా ఉండడానికి కారణం ఏమిటి?
జవాబు:
జాగింగ్ లో ఎక్కువ శక్తి వినియోగించబడి శ్వాసక్రియరేటు పెరుగుతుంది. కణజాలానికి అధిక ), అందించుటకు హృదయస్పందన రేటు పెరుగును.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

ప్రశ్న 2.
ఒక విద్యార్థి ఆడుకుంటున్నప్పుడు గాయపడ్డాడు. అయితే రక్తం కారడం ఎంత సేపటికీ ఆగలేదు. దీనికి కారణాలు ఏమై ఉండవచ్చో, రాయండి.
జవాబు:
రక్తస్కందనం జరగకపోవటానికి

  1. రక్త ఫలకిలకలు తక్కువగా ఉండవచ్చు.
  2. విటమిన్ K లోపించి ఉండవచ్చు.
  3. హీమోఫీలియా వ్యాధి కల్గి ఉండవచ్చు.
  4. రక్త స్కందన ప్రోటీన్స్ లోపించి ఉండవచ్చు.

ప్రశ్న 3.
మీ ఉపాధ్యాయుడి నుండి “రక్త స్కందన” గురించి తెలుసుకొనుటకు ఏ ప్రశ్నలను వేస్తావు?
జవాబు:

  1. రక్తస్కందనం అనగానేమి?
  2. రక్తం ఏ విధంగా గడ్డ కడుతుంది?
  3. రక్తం గడ్డ కట్టడానికి కారణమేమిటి?
  4. రక్తం గడ్డ కట్టుటలో జరిగే ప్రక్రియ ఏమిటి?
  5. ఏ పదార్థము రక్తనాళములలో రక్తము గడ్డకట్టకుండా నివారిస్తుంది?
  6. రక్తం గడ్డ కట్టడానికి కావలసిన విటమిన్ ఏది?
  7. ప్రమాదాలు జరిగినపుడు రక్తం గడ్డ కట్టకపోతే ఏమి జరుగుతుంది?
  8. రక్తములో ఉన్న ఏ కణాలు రక్తం గడ్డకట్టడానికి సహాయం చేస్తాయి?

ప్రశ్న 4.
మానవ హృదయంలో కవాటాలు ఎక్కడెక్కడ ఉంటాయి? వాటి పేర్లు రాయండి.
జవాబు:

కవాటం పేరుకవాట స్థానం
1) కుడి కర్ణికా జఠరిక కవాటం / త్రిపత్ర కవాటం / అగ్రత్రయ కవాటం.1) కుడి కర్ణిక, కుడి జఠరిక మధ్యలో
2) ద్విపత్ర కవాటం / మిట్రల్ కవాటం / అగ్రద్వయ కవాటం.2) ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక మధ్యలో
3) పుపుస కవాటం / అర్ధ చంద్రాకార కవాటం3) పుపుస ధమని బయలుదేరే వద్ద
4) దైహిక కవాటం4) బృహద్ధమని బయలుదేరే వద్ద

ప్రశ్న 5.
మీ పాఠశాలలో పని చేయుచున్న ఉపాధ్యాయుల రక్త పీడనముల సమాచారం సేకరించారు కదా. వారు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల గురించి నివేదిక వ్రాయండి.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 3
జవాబు:

  1. శ్రీ విజయ్ రక్తపీడనం సాధారణ స్థాయిలో ఉన్నది.
  2. శ్రీమతి ఉమాదేవి అధిక రక్తపీడనం కలిగి ఉన్నది. ఈమెలో చికాకు, ఆందోళన లక్షణాలు ఉన్నాయి.
  3. శ్రీ నాగేశ్వరరావు అధిక రక్తపోటును కలిగి ఉన్నాడు. ఈయన భయం, తొందరగా కోపాన్ని ప్రదర్శించడం మొదలగు లక్షణాలతో బాధపడుచున్నారు.
  4. శ్రీమతి శాంత అల్ప రక్తపీడనం (Low B.P) తో బాధపడుచున్నది. ఈమె అలసట, కళ్ళు తిరగడం, మగతగా ఉండటం వంటి లక్షణాలను కలిగి ఉన్నది.

ప్రశ్న 6.
శోషరస వ్యవస్థ విధుల గురించి తెలుసుకున్న తరువాత మీ పెద్దలకు నీవు ఎడిమా గురించి ఎటువంటి సలహాలిస్తావు?
జవాబు:

  1. వీలైనంతవరకు ఒకే చోట స్థిరముగా కూర్చోకూడదు.
  2. కాళ్ళను కదుపుతూ ఉండాలి.
  3. వీలైనంతవరకు వెన్నెముక నిటారుగా ఉండేలా కూర్చోవాలి.
  4. ఉప్పు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
  5. నిరంతర వ్యాయామం చెయ్యాలి.
  6. ఉష్ణోగ్రతలలో సంభవించే అధిక తేడాల నుంచి తమను తాము రక్షించుకోవాలి.

ప్రశ్న 7.
సిరలలో కవాటాలు లేకపోతే ఏమవుతుంది?
జవాబు:

  1. సిరలలో రక్తం ఒకే మార్గంలోనే ముందుకే కాకుండా, వెనుక ప్రయాణిస్తుంది.
  2. గుండెకు రక్తం చేరడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది.
  3. సిరలు ఉబ్బే అవకాశం ఉంది.

ప్రశ్న 8.
పుప్పుస సిరను తాడుతో బంధిస్తే ఏమి జరుగుతుందో ఊహించండి.
జవాబు:

  1. పుపుస సిరను తాడుతో బంధించుట వలన ఊపిరితిత్తుల నుంచి గుండెకు సరఫరా అయ్యే ఆమ్లజని సహిత రక్తం సరఫరా అవ్వదు.
  2. దీని వలన శరీరానికి ఆమ్లజని సహిత రక్తం అందక జీవి మరణించును.

ప్రశ్న 9.
హృదయ సంబంధ సమస్యలు రాకుండా ఉండటానికి నీవు ఇచ్చే సూచనలు ఏమిటి?
జవాబు:

  1. సక్రమమైన ఆహార నియమాలు పాటించాలి.
  2. తక్కువ కొవ్వులు కల్గిన ఆహారాన్ని తీసుకోవాలి.
  3. క్రమబద్ధమైన వ్యాయామం చేయాలి.
  4. ఆల్కహాలు, ధూమపానం చేయకూడదు.
  5. శారీరక, మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.

ప్రశ్న 10.
క్రింది పట్టికను పరిశీలించి, ప్రశ్నలకు సమాధానాలు వ్రాయుము.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 4
a) హృదయ స్పందన అనగా నేమి?
జవాబు:
హృదయ స్పందన :
కర్ణికలు, జఠరికలు ఒకసారి సంకోచించి తరువాత యథాస్థితికి వస్తే దానిని ఒక హృదయ స్పందన అంటారు.
(లేదా)
ఒక సిస్టోల్ మరియు డయాస్టోలను కలిపి హృదయ స్పందన అంటారు.

b) గుండె బరువుకు, హృదయ స్పందనకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి?
జవాబు:
గుండె బరువు పెరిగే కొద్దీ ఒక నిమిషానికి జరిగే హృదయ స్పందనలు తగ్గుతాయి.

ప్రశ్న 11.
ప్రసరణ వ్యవస్థ యొక్క ఆవశ్యకత ఏమిటి?
జవాబు:
ట్రిలియన్ల సంఖ్యలో కణాలు కలిగిన ఉన్నతస్థాయి జీవులు వ్యాపనం, ద్రవాభిసరణ వంటి పద్ధతుల ద్వారా ఎక్కువ పరిమాణంలో పదార్థాలు రవాణా చేయడానికి సంవత్సరాల కొద్దీ సమయం అవసరమవుతుంది.

ఈ అనవసరపు ఆలస్యాన్ని నివారించడానికి జీవులన్నింటికి ప్రత్యేకమైన, వేగవంతమైన, సమర్థవంతమైన వ్యవస్థ యొక్క అవసరం ఏర్పడింది. జీవులు ప్రత్యేకంగా ఏర్పరచుకునే ఈ వ్యవస్థనే ‘ప్రసరణ వ్యవస్థ’ (Circulatory system) అంటారు.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

ప్రశ్న 12.
స్టెతస్కోపు ఆవిష్కరణను తెలపండి.
జవాబు:
“రెని లెన్నెక్” (Rene Laennec) అనే శాస్త్రవేత్త 1816 సం||లో స్టెతస్కోపును కనుగొన్నాడు. స్టెతస్కోపు కనుగొనక పూర్వం వైద్యులు రోగి రొమ్ముపై చెవి ఆనించి హృదయస్పందన వినేవారు. రోగి హృదయస్పందన వినటానికి వెన్నెక్ మొదటిసారి కాగితపు గొట్టాన్ని ఉపయోగించాడు. గొట్టం ఒక చివరను రోగి రొమ్ముకు ఆనించి, రెండవ చివర చెవి ఉంచి వినేవాడు. కాగితపు గొట్టం ద్వారా శబ్దం స్పష్టంగా వినిపించడాన్ని ఆయన గమనించాడు. తర్వాత కాలంలో కాగితపు గొట్టం స్థానంలో వెదురు గొట్టాన్ని వాడేవారు. లెన్నెక్ దీనికి స్టెతస్కోపు అని పేరు పెట్టాడు.

ప్రశ్న 13.
హృదయం ఎలా రక్షించబడుతుంది?
జవాబు:

  1. హృదయం చుట్టూ రెండు పొరలు గల హృదయావరణం ఉంటుంది.
  2. ఈ రెండు పొరల మధ్య వుండే కుహరాన్ని ‘హృదయావరణ కుహరం’ అంటారు.
  3. దీనిలో హృదయావరణ ద్రవం ఉంటుంది.
  4. హృదయావరణం, హృదయావరణ ద్రవం హృదయాన్ని షాకుల నుండి, దెబ్బల నుండి రక్షిస్తాయి.
  5. హృదయాన్ని కాపాడుతూ అన్నివైపుల నుండి ప్రక్కటెముకలు వెనుకవైపు నుండి వెన్నుముక రక్షణ ఇస్తుంది.

ప్రశ్న 14.
సిరా వ్యవస్థ గురించి రాయండి.
జవాబు:

  1. మానవ శరీరంలో మూడు మహాసిరలు ఉన్నాయి. అవి :
    1) పూర్వమహాసిర 2) పరమహాసిర 3) పుపుససిర.
  2. పూర్వమహాసిర తల, మెడవంటి శరీర పైభాగాల నుండి ఆమ్లజని రహిత రక్తాన్ని హృదయానికి తెస్తుంది.
  3. అథోమహాసిర శరీర దిగువ భాగాల నుండి (ఉదరం, కాళ్ళు, చేతులు) ఆమ్లజని రహిత రక్తాన్ని హృదయానికి తెస్తుంది.
  4. పుపుససిర ఊపిరితిత్తుల నుండి ఆమ్లజని సహిత రక్తాన్ని హృదయానికి తెస్తుంది.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 5

ప్రశ్న 15.
రక్తప్రసరణ వ్యవస్థ గురించిన ప్రాచీన తప్పుడు భావనలను విలియం హార్వే ఎలా ఖండించాడు?
జవాబు:
గుండె నుండి శరీరానికి చేరిన రక్తం వినియోగించబడి మరలా కొత్త రక్తం ఏర్పడుతుందనే భావన తప్పని హార్వే నిరూపించాడు. గుండె ఒక సంకోచంలో ఎంత రక్తాన్ని పంపిణీ చేస్తుందో అలాగే ఒక నిమిషానికి ఎన్ని స్పందనలు చోటు చేసుకుంటాయో లెక్కించాడు.

ఒక గంటలో గుండె మనిషి బరువుకు మూడురెట్ల రక్తం పంపిణీ చేస్తుందని హార్వే కనుగొన్నాడు. అంటే అంత రక్తం, ఇంత తక్కువ సమయంలో ఉత్పత్తి కాదు. దీనిని బట్టి రక్తం గుండె నుండి శరీరానికి, శరీరం నుండి గుండెకు మరల మరలా ప్రవహిస్తుందని చెప్పవచ్చు అని గుర్తించాడు.

ప్రశ్న 16.
రక్తకేశనాళికలను ఎలా గుర్తించారు? వాటి అర్థం ఏమిటి?
జవాబు:
హార్వే మరణించిన 4 సంవత్సరాల తర్వాత 1661 సంవత్సరంలో మాల్ఫీజి గబ్బిలం రెక్కలపై అధ్యయనం చేశాడు. గబ్బిలం రెక్కలో ఉండే అతి పలుచని పొరలోని (పెటాజియం ) రక్తనాళాలను సూక్ష్మదర్శిని సాయంతో పరిశీలించాడు. అప్పుడే ధమనులు మరియు సిరల మధ్యనుండే అతి సన్నని, చిన్నవైన రక్తనాళాలను చూడగలిగాడు.

ఆ సన్నని రక్తనాళాలకు సూక్ష్మ కేశనాళికలు (capillaries) అని పేరు పెట్టాడు. లాటిన్ భాషలో Capillaries అంటే కేశం అని అర్థం. ఎందుకంటే ఆ నాళాలు కూడా వెంట్రుకల వలె సన్నగా ఉంటాయి.

రక్తకేశనాళికలను కనుగొనడం ద్వారా రక్త ప్రసరణ విధానం గూర్చి, పూర్తిగా అర్థం అయ్యింది.

ప్రశ్న 17.
హార్దిక వలయానికి ఎంత సమయం పడుతుంది?
జవాబు:
హారిక వలయంలో గుండె కండరాలు చురుకుగా పాల్గొనే సంకోచక్రియ (systole), విశ్రాంతి తీసుకునే యథాపూర్వస్థితు (diastole) లు ఒకదానివెంట ఒకటి ఏర్పడుతూ ఉంటాయి. ఈ మొత్తం ప్రక్రియ సుమారుగా 0.8 సెకన్లలో పూర్తవుతుంది. కర్ణికల సంకోచానికి పట్టే సమయం 0.11-0. 14 సెకన్లు కాగా జఠరికల సంకోచానికి 0.27-0.35 సెకన్ల సమయం పడుతుంది.

ప్రశ్న 18.
శోషరస వ్యవస్థ అనగానేమి? దాని విధులు ఏమిటి?
జవాబు:
కణజాలంలో మిగిలిపోయిన ఈ కణజాల ద్రవాన్ని ప్రధాన రక్తప్రసరణ వ్యవస్థలోకి చేర్చడానికి మరొక సమాంతర వ్యవస్థ ఏర్పాటయింది. దానినే శోషరస వ్యవస్థ అంటారు. లాటిన్ భాషలో లింఫ్ అంటే నీరు అని అర్థం.
రక్తాన్ని, కణాలను జోడించే ప్రధానమైన పదార్థం శోషరసం. రక్తం నుండి పోషకాలను గ్రహించి కణాలకు అందించడం, కణాల నుండి వృథా పదార్థాలను సేకరించి రక్తంలోనికి చేర్చడం. శోషరసం నిర్వహించే విధులు.

సిరా వ్యవస్థకు సమాంతరమైన ఈ వ్యవస్థ కణజాలద్రవాన్ని సిరా వ్యవస్థలోకి చేర్చటానికి తోడ్పడుతోందన్నమాట.

ప్రశ్న 19.
వివిధ జంతువుల శరీరం బరువు, గుండె బరువు, హృదయస్పందన గురించిన సమాచారం సేకరించండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 6

ప్రశ్న 20.
సంవృత రక్తప్రసరణ వ్యవస్థ (Closed Circulatory System) అనగానేమి?
జవాబు:
స్వేచ్ఛాయుత రక్తప్రసరణ వ్యవస్థ :

  1. కీటకములు, మొలస్కా జీవులలో రక్తనాళాలు లేవు.
  2. ఈ జంతువులలో హృదయం శరీరంలో పెద్ద కాలువల్లా వుండే ప్రదేశాల్లోకి రక్తాన్ని పంపు చేస్తుంది. వీటిని ‘కోటరాలు’ అంటారు.
  3. ఈ విధమైన రక్తప్రసరణ వ్యవస్థని “స్వేచ్ఛాయుత రక్తప్రసరణ వ్యవస్థ” అంటారు.

ప్రశ్న 21.
వివృత రక్తప్రసరణ వ్యవస్థ (Open Circulatory System) అనగానేమి?
జవాబు:
వివృత రక్తప్రసరణ వ్యవస్థ :

  1. చాలా జంతువులలో రక్తనాళాలు ఉంటాయి.
  2. హృదయం రక్తాన్ని వీటిలోకి పంపు చేస్తుంది. ఈ విధమైన రక్తప్రసరణ వ్యవస్థను “బంధిత రక్తప్రసరణ వ్యవస్థ” అంటారు.
  3. కప్పల వంటి ఉన్నతస్థాయి జీవులలో రక్తం హృదయం నుండి ధమనులలోకి, ధమనుల నుండి సిరల ద్వారా మళ్లీ గుండెకు చేరుతుంది. దీనిని ‘ద్వివలయ రక్తప్రసరణ’ అంటారు.
  4. చేపలలో రక్తం హృదయం ద్వారా ప్రసరిస్తుంది. దీనిని ‘ఏకవలయ రక్తప్రసరణ’ అంటారు.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

ప్రశ్న 22.
హీమోఫీలియా అనగానేమి?
జవాబు:
రక్తం గడ్డకట్టడానికి సాధారణంగా సుమారు 3 నుండి 6 నిముషాల సమయం పడుతుంది. కాని కొందరు వ్యక్తులలో ‘K’ విటమిన్ లోపం వలన గడ్డకట్టడానికి చాలా ఎక్కువ సమయం పట్టవచ్చు. జన్యులోపం వలన కొందరిలో రక్తం గడ్డకట్టడం జరగదు. ఈ లోపాన్ని ‘హీమోఫీలియా’ (Haemophilia) అంటారు. దగ్గరి సంబంధీకుల మధ్య పెళ్ళిళ్ళు జరగడం వలన కలిగే పిల్లల్లో ఈ వ్యాధిగ్రస్థులు ఎక్కువ.

ప్రశ్న 23.
మైదాన ప్రాంతాలకంటే అటవీ ప్రాంతాలలో వర్షపాతం ఎక్కువ. ఎందుచేత?
జవాబు:
మొక్కలలో ఎల్లప్పుడు తగినంత నీరు నిరంతరంగా ప్రసరిస్తుంటుంది. ఉదాహరణకి ఒక పెద్ద వృక్షం ప్రతిరోజు 900 లీటర్ల నీటిని బాష్పోత్సేకం ద్వారా ఆవిరి రూపంలో వెలుపలికి పంపుతుంది. వీటి వలననే అడవులలో గాలి ఎక్కువగా నీటి ఆవిరితో సంతృప్తం చెందుతుంది. నీటి ఆవిరితో నిండి పవనాలు ఇటువైపుగా వీచేటప్పుడు అక్కడి వాతావరణంలో నీటి ఆవిరితో మరింతగా సంతృప్తం చెందుతాయి. కాబట్టి వర్షం కురుస్తుంది.

అందుకే మైదాన ప్రాంతాల కంటే కూడా అటవీ ప్రాంతాలలో ఎక్కువ వర్షపాతం ఉంటుంది.

ప్రశ్న 24.
తయారైన ఆహారం మొక్కలలో ఎలా రవాణా చేయబడుతుంది?
జవాబు:
ఆకుపచ్చటి మొక్కలలో ఆకులలో తయారైన ఆహారం చక్కెర రూపంలో మిగిలిన ‘కణాలకు రవాణా చేయబడుతుంది. ముఖ్యంగా చురుకుగా పెరిగే భాగాలు మరియు నిల్వచేసే భాగాలకు రవాణా చేయబడుతుంది.

ఆకులలోని ఈనెలలో దారువు మరియు పోషక కణజాలాలు ఉంటాయని మనకు తెలుసు. ఇవి కాండంలోని కణజాలంతో అనుసంధానమై ఉంటాయి.

ప్రశ్న 25.
ఎఫిడ్స్ ఉన్న మొక్కల కాండాలు జిగటగా ఉంటాయి. ఎందుకు?
జవాబు:
ఎఫిడ్స్ (Aphids) పోషక కణజాలం నుండి ఎక్కువ మొత్తంలో చక్కెరను గ్రహించినప్పటికీ మొత్తాన్నీ శోషించలేవు. మిగిలిన చక్కెర చిక్కటి ద్రవరూపంలో పాయువు నుండి వెలుపలికి వస్తుంది. దీనిని తేనె (honey – dew) అంటారు. అందువల్లనే ఎఫిడ్స్ ఉన్న మొక్కల కాండం, ఆకులు చేతితో తాకితే అంటుకున్నట్లుగా ఉంటాయి.

ప్రశ్న 26.
క్షీరదాలు చెట్లకు ఎలా హాని కల్గిస్తాయి? దీని నివారణ మార్గం ఏమిటి?
జవాబు:
కొన్ని క్షీరదాలు పోషక కణజాలంలో ఉండే ఆహారం కోసం చెట్టు బెరడును తొలుస్తాయి.

సాధారణంగా పోషక కణజాలంలోని చక్కెర కొరకు శీతాకాలంలో ఆహారపు కొరత ఉన్నప్పుడు ఇలా చేస్తుంటాయి. చిట్టెలుకల వంటి కొన్ని జంతువులు చిన్న చిన్న మొక్కలకు హాని చేస్తుంటే కుందేళ్ళ వంటి జంతువులు పెద్ద పెద్ద చెట్లను నాశనం చేస్తుంటాయి. కుందేళ్ళ వంటి జంతువుల వల్ల చెట్లకు హాని కలగకుండా అటవీ సంరక్షణకు ఇనుప తీగ వలను అమరుస్తారు. అయితే ఇది ఖర్చుతో కూడినది. అందుకోసం అటవీశాఖ అధికారులు అడవులలో కుందేళ్ళ బారి నుండి వృక్షాలను కాపాడడానికి మాంస భక్షకులైన నక్కలు, గుడ్లగూబలు, బాడ్జర్లను (Badger) పెంచుతుంటారు.

ప్రశ్న 27.
రీసస్ కారకం గురించి రాయండి.
జవాబు:
రీసస్ కారకం :
రక్తంలో ఉండే మరొక ప్రతిదేహమే రీసస్ కారకం. బ్రిటన్ దేశ జనాభాలో 85 శాతం మందిలో ఈ రకమైన ప్రతిదేహాలున్నట్లు గమనించారు. దీనిని మొట్టమొదటిసారిగా (మకాక్) రీసస్ అనే జాతి కోతులలో గుర్తించారు. అందువల్ల ఈ ప్రతిదేహాలకు రీసస్ కారకం అని పేరు వచ్చింది. రక్తంలో ఈ ప్రతిదేహాలు కలిగిన వారిని Rh+ గానూ, లేని వారిని Rh గానూ గుర్తిస్తారు.

సాధారణంగా Rh వ్యక్తుల ప్లాస్మాలో దీనికి సంబంధించిన ప్రతిరక్షకాలు ఉండవు. ఒకవేళ Rh+ వ్యక్తి రక్తాన్ని Rhకు ఎక్కించినట్లయితే అతనిలో Rh ప్రతిరక్షకాలు ఏర్పడి Rh+ రక్తకణాలను నాశనం చేస్తాయి. ఇది
శిశువులలో తీవ్రమైన ఆటంకంగా పరిణమిస్తుంది.

ప్రశ్న 28.
Rh+ వ్యక్తి Rh స్త్రీని వివాహం చేసుకొన్నప్పుడు పుట్టే పిల్లలలో ఎటువంటి ప్రభావం చూపుతుంది?
జవాబు:
ఒకవేళ Rh+ వ్యక్తి Rh స్త్రీని వివాహం చేసుకొన్నపుడు పుట్టే పిల్లల్లో కొందరు Rh+ గానే ఉంటారు. గర్భంలో ఉన్నపుడు తల్లి నుండి పిండానికి నిరంతరం రక్తం సరఫరా కావలసిన పరిస్థితి ఉంటుంది. బిడ్డ రక్తం తల్లి రక్తంతో కలిసిపోతుంది. అప్పుడు ఆమెలో ప్రతిరక్షకాలు ఏర్పడతాయి. తరువాత పుట్టే పిల్లలు కూడా Rh+ అవుతున్నట్లయితే తల్లిలో ప్రతిదేహాల పరిమాణం పెరుగుతూపోతుంది. ఈ ప్రతిదేహాలు రక్తం ద్వారా బిడ్డకు చేరినట్లయితే వారు తీవ్రమైన రక్తహీనతకు గురవుతారు. కొన్నిసార్లు గర్భస్రావం, ప్రాణాపాయం కూడా జరగవచ్చు.

ఇలాంటి సందర్భాలలో ప్రతిరక్షకాలు లేకుండా శిశువులో మొత్తం రక్త మార్పిడి చేయాల్సి ఉంటుంది. Rh+ కారకం కలిగిన మొదటి శిశువు పుట్టగానే ప్రత్యేకమైన సూదిమందు ఇవ్వడం ద్వారా తరువాత పుట్టే పిల్లలకు హాని జరగకుండా వైద్యసదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి.

ప్రశ్న 29.
మీ దగ్గరలో ఉన్న డాక్టరు దగ్గరకు వెళ్ళి శోషరస వ్యవస్థ గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు. ఇందుకు నీవు ఏ ప్రశ్నలు వేస్తావు?
జవాబు:

  1. శోషరసము అనగానేమి?
  2. శోషరస వ్యవస్థనందలి భాగములు ఏవి?
  3. శోషరస వ్యవస్థ నిర్వహించు విధులేవి?
  4. శోషరస వ్యవస్థకు, రక్త ప్రసరణ వ్యవస్థకు మధ్యగల భేదములు ఏవి?
  5. శోషరస వ్యవస్థకు, సిరల వ్యవస్థకు మధ్యగల పోలికలు ఏవి?
  6. కణజాల ద్రవం అనగానేమి?
  7. కణజాలాలలోనికి చేరిన రక్తంలోని ద్రవభాగాన్ని ఏమంటారు?
  8. కణజాలాలలో మిగిలిపోయిన కణజాల ద్రవాన్ని తిరిగి ప్రధాన రక్త వ్యవస్థలోనికి చేర్చే ప్రసరణ వ్యవస్థ ఏది?

ప్రశ్న 30.
రక్త ప్రసరణ వ్యవస్థలో హృదయం పంపుచేసే విధానం గురించి తెలుసుకున్నప్పుడు నీవు ప్రత్యేకంగా గుర్తుంచుకున్న అంశాలు ఏమిటి? అందుకు కారణం ఏమిటి?
జవాబు:
శారీరక కసరత్తులు చేసిన తరువాత హృదయం వేగంగా కొట్టుకోవడంను నేను’ ప్రత్యేకంగా గుర్తించాను. కసరత్తులు చేసినప్పుడు కణజాలాలలో ఉన్న శక్తి నిల్వలు ఖర్చు అయిపోతాయి. అందువలన గుండె వేగంగా కొట్టుకొని ఎక్కువ మొత్తంలో ఆమ్లజనిని కణాలకు సరఫరా చేస్తుంది. ఆమ్లజని ఆహార పదార్థాలపై చర్య జరిపి శక్తిని ఎక్కువగా విడుదల చేస్తుంది. కొంత సేపటి తరువాత గుండె సాధారణ వేగంతో పనిచేస్తుంది.

గుండె కొట్టుకోవడంలో లయబద్దంగా లబ్ డబ్, లబ్ డబ్ శబ్దం రావడం కూడా నేను ప్రత్యేకంగా గుర్తించుకున్నాను. చిన్నదైన పిడికెడు పరిమాణంలో ఉండే గుండె పంపు చేసే విధానాన్ని అర్థం చేసుకున్నాక దానిని అభినందించకుండా ఉండలేకపోతాము.

10th Class Biology 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
రక్తస్కందనం అనగానేమి? ఇది ఎలా జరుగుతుంది?
(లేదా)
కబాడీ ఆడుతూ గాయపడ్డ రాముకు 6 నిమిషాలలోనే రక్తస్రావం ఆగిపోయింది. ఈ ప్రక్రియ జరిగే విధానంను వివరించండి.
జవాబు:
శరీరానికి గాయం తగిలినపుడు రక్తం కొంచెం సేపు మాత్రమే కారుతుంది. తర్వాత రక్తం గడ్డకట్టి తెగినచోట ఒక ఎర్రని గడ్డలా ఏర్పడుతుంది. ఈ ఎర్రని గడ్డనే ‘స్కందనం’ అంటారు. రక్తం గడ్డకట్టకపోతే శరీరంపై చిన్న గాయం తగిలినా విపరీతమైన రక్తస్రావం జరుగుతుంది.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 7

  1. గాయం నుండి రక్తం స్రవించినపుడు రక్తఫలకికలు థ్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్ ను స్రవిస్తాయి.
  2. ఈ థ్రాంబోకైనేజ్ రక్తంలో ఉన్న ప్రోత్రాంబినను త్రాంబిన్ గా మారుస్తుంది.
  3. త్రాంబిన్ రక్తంలోని ద్రవరూపంలో ఉన్న ఫైబ్రినోజనను ఘనరూపంలో ఉండే ఫైబ్రిన్ తంతువులుగా మారుస్తుంది.
  4. ఈ తంతువులలో రక్తకణాలు చిక్కుకుని స్కందనం ఏర్పడుతుంది.
  5. ఫైబ్రిన్ దారాలు దెబ్బతిన్న రక్తనాళపు అంచులకు అతుక్కొని సంకోచించడం వలన వాటి అంచులు దగ్గరకు లాగబడతాయి.
  6. రక్తం గడ్డకట్టిన తర్వాత మిగిలిన గడ్డి పసుపు రంగు ద్రవాన్ని ‘సీరం’ (Serum) అంటారు.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 8

ప్రశ్న 2.
పంపింగ్ పరికరము అని మానవ శరీరములో దేనిని అంటారు? దాని నిర్మాణాన్ని పటం ద్వారా వివరించండి.
జవాబు:
మానవ శరీరంలోని హృదయము లేదా గుండెను పంపింగ్ పరికరము అంటారు.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 9

హృదయము – బాహ్య నిర్మాణము :

  1. హృదయం, ఉరః పంజరంలో ఊపిరితిత్తుల మధ్యలో అమరి ఉంటుంది. మీ గుండె పరిమాణం సుమారుగా మీ పిడికిలి అంత ఉంటుంది.
  2. ఇది కార్డియాక్ కండరంతో. చేయబడి ఉంది.
  3. గుండె బేరీ పండు ఆకారంలో ఉండి, త్రికోణాకారంగా ఉంటుంది. పై వైపున వెడల్పుగాను, క్రింది వైపున సన్నగాను, కొద్దిగా ఎడమ వైపుకు వంగి ఉంటుంది.
  4. గుండెను ఆవరించి రెండు పొరలుంటాయి. వీనిని “హృదయావరణ త్వచాలు” అంటారు. ఈ రెండు పొరల మధ్య భాగం హృదయావరణ ద్రవంతో నిండి ఉంటుంది.

అంతర్నిర్మాణం :

  1. గుండె లోపల ఉండే ఉబ్బెత్తు నిర్మాణాలు గుండెను నాలుగు గదులుగా విభజిస్తాయి.
  2. పై రెండు గదులను ‘కర్ణికలు’ అని, క్రింద రెండు గదులను ‘జఠరికలు’ అని అంటారు.
  3. గుండె గోడలకు అంటిపెట్టుకొన్న రక్తనాళాలను ‘కరోనరీ’ రక్తనాళాలంటారు.
  4. ఇవి గుండె కండరాలకు రకాన్ని సరఫరా చేస్తాయి.
  5. పై వైపున ఉన్న కర్ణికల గోడలు పలుచగాను, కిందివైపు ఉన్న జఠరికల గోడలు మందంగాను ఉంటాయి.
  6. దృఢంగా ఉన్న రక్తనాళాలను ‘ధమనులు’ అంటారు. ‘బృహద్ధమని’ హృదయం నుండి బయలుదేరి శరీర భాగాలన్నింటికి మంచి రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఇది అతి పెద్ద ధమని.
  7. చిన్న ధమని, “పుపుస ధమని”. ఇది రక్తాన్ని హృదయం నుండి ఊపిరితిత్తులకు తీసికుపోతుంది.
  8. గుండె పై భాగంలో కుడివైపున ఉండే పెద్ద సిరను “ఊర్ధ్వ బృహత్సిర” అంటారు.
  9. ఇది శరీరం పై భాగాల నుండి రక్తాన్ని సేకరించి కుడి కర్ణికలోకి తెరుచుకుంటుంది.
  10. గుండె కుడివైపు దిగువ భాగంలో కనిపించే సిరను “అధోబృహత్సర” అంటారు.
  11. ఇది శరీరం దిగువ భాగాల నుండి రక్తాన్ని సేకరించి కుడి కర్ణికలోకి తెరుచుకుంటుంది.
  12. ఎడమ కర్ణికలో ఊపిరితిత్తుల నుండి రక్తాన్ని తీసుకువచ్చే ‘పుపుస సిరలు’ తెరుచుకొనే రంధ్రాలుంటాయి.
  13. కుడి జఠరిక నుండి బయలుదేరే రక్తనాళము పుపుస ధమని ఆమ్లజని రహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు సరఫరా చేస్తుంది.
  14. ఎడమ జఠరిక నుండి “బృహద్ధమని” శరీర భాగాలకు ఆమ్లజనితో కూడిన రక్తాన్ని సరఫరా చేస్తుంది.
  15. కుడి కర్ణికకు, కుడి జఠరికకు మధ్యగల కుడికర్ణిక జఠరికాంతర విభాజకముపై గల కవాటాన్ని “అగ్రత్రయ కవాటం” అని అంటారు.
  16. ఎడమ కర్ణిక, ఎడమ జఠరికకు మధ్యగల ఎడమ కర్ణిక జఠరికాంతర విభాజకము పైగల కవాటాన్ని “అగ్రద్వయ కవాటం” అని అంటారు.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

ప్రశ్న 3.
క్షీరదాల గుండె అంతర నిర్మాణం పరిశీలించడానికి నీవు గొర్రె గుండె నిలువుకోతను ప్రయోగశాలలో పరిశీలించావు కదా ! దాని ఆధారంగా క్రింది ప్రశ్నలకు జవాబు ఇమ్ము.
a) గుండె గోడలు అంతటా ఒకే మందంతో ఉన్నాయా? ఎందుకు?
జవాబు:
గుండె గోడలు అంతటా ఒకే మందంతో ఉండవు. జఠరికలు ఎక్కువ ఒత్తిడితో రక్తాన్ని పంపుచేయాలి. కనుక జఠరికల గోడలు కర్ణికల గోడల కంటే మందంగా ఉంటాయి.

b) గుండెలోని గదులు ఎన్ని? అవి ఏవి?
జవాబు:
గుండెలో నాలుగు గదులు కలవు. అవి రెండు కర్ణికలు మరియు రెండు జఠరికలు.

c) గుండెలోని గదులు ఒకదానితో ఒకటి ఎలా వేరు చేయబడ్డాయి? ఎలా కలుపబడ్డాయి?
జవాబు:
గుండెలోని గదులు ఒకదానితో ఒకటి విభాజకాల చేత వేరుచేయబడ్డాయి. కవాటాల ద్వారా కలపబడ్డాయి.

d) హృదయం అఘాతాల నుండి ఎలా రక్షింపబడుతుంది?
జవాబు:
హృదయం, హృదయావరణ త్వచం, హృదయావరణ ద్రవంచే అఘాతాల నుండి రక్షించబడుతుంది.

ప్రశ్న 4.
ఈ క్రింది పట్టికను విశ్లేషించి దిగువ నీయబడిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.

వర్గం పేరుప్రసరణ వ్యవస్థ రకం
1. నిడేరియాజఠర ప్రసరణ కుహరం
2. ప్లాటీ హెల్మింథస్జీర్ణవ్యవస్థ
3. నిమాటీహెల్మింథస్మిథ్యాశరీర కుహరం
4. అనెలిడారక్త నాళాలు
5. ఆర్రోపోడావివృత రక్తప్రసరణ వ్యవస్థ

i) రక్తనాళాలు మొట్టమొదటగా ఏ వర్గంలో ఏర్పడ్డాయి?
ii) రక్తంలో హీమోగ్లోబిన్ కల జీవులేవి?
iii) ఏ జీవులలో జీర్ణవ్యవస్థ ప్రసరణకు ఉపయోగపడుతుంది?
iv) ఆర్రోపోడా జీవులు వివృత రక్తప్రసరణ వ్యవస్థను కలిగి ఉండడానికి కారణమేమిటి?
జవాబు:
i) రక్తనాళాలు మొట్టమొదటగా అనెలిడా వర్గజీవులలో ఏర్పడ్డాయి.
ii) అనెలిడా వర్గ జీవులలో రక్తం యందలి ప్లాస్మాలో హి మోగ్లోబిన్ ఉండును.
iii)నిడేరియా వర్గజీవులలో జీర్ణవ్యవస్థ ప్రసరణకు ఉపయోగపడును.
iv) ఆర్రోపోడా వర్గ జీవులలో రక్తనాళాలు లేకపోవడం చేత, కోటరాలు ఏర్పడి వివృత రక్తప్రసరణ వ్యవస్థ ఏర్పడింది.

ప్రశ్న 5.
మానవ హృదయంలోని కవాటాలు, అతుకబడి ఉన్న రక్తనాళాల స్థానాలు మరియు విధులను గురించి వివరించండి.
జవాబు:
మానవ హృదయంలోని కవాటాలు :

  1. కుడికర్ణిక, కుడి జఠరికకు మధ్య గల కవాటం – అగ్రత్రయ కవాటం
  2. ఎడమ కర్ణిక, ఎడమ జఠరికకు మధ్య గల కవాటం – అగ్రద్వయ కవాటం
  3. పుపుస ధమని పూర్వభాగంలో గల కవాటం – పుపుస ధమని కవాటం
  4. బృహద్ధమని పూర్వభాగంలో గల కవాటం – మహాధమని కవాటం

గుండెకు అతుకబడి ఉన్న రక్తనాళాల స్థానాలు మరియు విధులు :

  1. గుండే గోడలకు అంటి పెట్టుకుని కరోనరె రక్తనాళాలు ఉంటాయి. ఇవి గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి.
  2. ఎడమ జఠరిక పై భాగం నుండి బృహద్ధమని బయలుదేరుతుంది. ఇది శరీర భాగాలకు ఆమ్లజనితో కూడిన రక్తాన్ని సరఫరా చేస్తుంది.
  3. కుడి జఠరిక పై భాగం నుండి పుపుస ధమని బయలుదేరుతుంది. ఇది ఆమ్లజనిరహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు సరఫరా చేస్తుంది.
  4. గుండె పై భాగంలో కుడివైపున ఊర్ధ్వ బృహత్సిర ఉంటుంది. శరీరంపై భాగం నుండి రక్తాన్ని సేకరిస్తుంది.
  5. గుండె కుడివైపు దిగువ భాగంలో అధోబృహత్సిర ఉంటుంది. ఇది శరీర దిగువ భాగాల నుండి రక్తాన్ని సేకరించి హృదయానికి చేరవేస్తుంది.

ప్రశ్న 6.
మానవుని శోషరస వ్యవస్థ గురించి క్లుప్తంగా వివరిస్తూ, విధులను తెలియచేయండి.
జవాబు:

  1. కణజాలంలో మిగిలిపోయిన కణజాల ద్రవాన్ని ప్రధాన రక్త ప్రసరణ వ్యవస్థలోనికి చేర్చడానికి మరొక సమాంతర వ్యవస్థ ఏర్పాటయింది. దీనినే శోషరస వ్యవస్థ అంటారు.
  2. కణజాలాలలో ఉన్న శోషరసమే కణజాల ద్రవం.
  3. రక్తాన్ని కణాలను జోడించే ప్రధానమైన పదార్థం శోషరసం. రక్తం నుండి పోషకాలను గ్రహించి కణాలకు అందించడం, . కణాల నుండి వృధా పదార్థాలను సేకరించి రక్తంలోకి చేర్చడం.
  4. రక్తం ఘన మరియు ద్రవ పదార్థాల మిశ్రమం. ఘన పదార్థాలు లేని రక్తమే శోషరసం.
  5. సిరావ్యవస్థకు సమాంతరమైన వ్యవస్థ కణజాల ద్రవాన్ని సిరావ్యవస్థలోకి చేర్చుటకు తోడ్పడును.
  6. అస్తికండరాల సంకోచము వలన సిరలపైన, శోషరసనాళాలపైన ఒత్తిడి పెరిగి రక్తము, శోషరసం గుండెవైపు నెట్టబడును.

ప్రశ్న 7.
రక్తస్కందన ప్రక్రియలోని వివిధ దశలను వివరించండి.
జవాబు:

  1. రక్తంలో ఉండే రక్త ఫలకికలు రక్తస్కందన ప్రక్రియను ప్రారంభిస్తాయి.
  2. గాయం నుండి రక్తం స్రవించినప్పుడు రక్త ఫలకికల నుండి థ్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్ విడుదల అవుతుంది.
  3. ఈ థ్రాంబోకైనేజ్ రక్తంలో ఉన్న ప్రోత్రాంబినను త్రాంబిన్‌గా మారుస్తుంది.
  4. త్రాంబిన్ రక్తంలోని ద్రవరూపంలో ఉన్న ఫైబ్రినోజనను ఘనరూపంలో ఉండే ఫైబ్రిన్ తంతువులుగా మారుస్తుంది. ఈ పోగులలో రక్త కణాలు చిక్కుకుని స్కందనము ఏర్పడుతుంది. ఫైబ్రిన్ దారాలు దెబ్బతిన్న రక్తనాళపు అంచులకు అతుక్కుని సంకోచించడం వలన వాటి అంచులు దగ్గరకు లాగబడతాయి. రక్తం గడ్డకట్టిన తర్వాత మిగిలిన గడ్డి పసుపురంగు ద్రవాన్ని ‘సీరం’ అంటారు.
    AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 10

ప్రశ్న 8.
లలిత తన తాతగారిని డాక్టరుగారి దగ్గరకు తీసుకొని వెళ్లినపుడు అతనికి అధిక రక్తపోటు ఉన్నట్లు డాక్టరు చెప్పారు.
i) అధిక రక్తపోటు అనగా నేమి?
జవాబు:
అధిక రక్తపోటు :
విశ్రాంతి సమయంలో ఒక వ్యక్తికి రక్తపీడనం 120/80 mmHg కంటే ఎక్కువ వుంటే దానిని అధిక రక్తపోటు అంటారు.

ii) అధిక రక్తపోటుకు కారణాలు ఏవి?
జవాబు:
అధిక రక్తపోటుకు కారణాలు :
అధిక బరువు, ఒత్తిడితో కూడిన జీవనం మరియు జన్యుసంబంధ కారణాలు.

iii) అధిక రక్తపోటును నియంత్రించుటకు కొన్ని సూచనలు తెల్పండి.
జవాబు:
అధిక రక్తపోటును నియంత్రించుటకు కొన్ని సూచనలు :

  1. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
  2. కొవ్వు పదార్థాలు తక్కువ తీసుకోవాలి.
  3. ఒత్తిడి తగ్గించుకోవడము అవసరము.
  4. ధూమపానం, మద్యపానం చేయకుండా వుండాలి.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

ప్రశ్న 9.
కర్ణికల మధ్య గల భేదాలు తెలపండి.
జవాబు:

కుడి కర్ణికఎడమ కర్ణిక
1. పెద్దదిగా ఉంటుంది.1. చిన్నదిగా ఉంటుంది.
2. పూర్వ, పర మహాసిరల ద్వారా రక్తాన్ని గ్రహిస్తుంది.2. పుపుస సిరల ద్వారా రక్తాన్ని గ్రహిస్తుంది.
3. ఊపిరితిత్తుల నుండి తప్ప, మిగిలిన అన్ని శరీర భాగాల నుండి ఆమ్లజని రహిత రక్తాన్ని గ్రహిస్తుంది.3. ఊపిరితిత్తుల నుండి ఆమ్లజని సహిత రక్తాన్ని గ్రహిస్తుంది.
4. ఇందులో ఆమ్లజని రహిత రక్తం ఉంటుంది.4. ఇందులో ఆమ్లజని సహిత రక్తం ఉంటుంది.
5. రక్తాన్ని కుడి జఠరికలోనికి పంపుతుంది.5. రకాన్ని ఎడమ జఠరికలోనికి పంపుతుంది.

ప్రశ్న 10.
జఠరికల మధ్య గల భేదాలు తెలపండి.
జవాబు:

కుడి జఠరికఎడమ జఠరిక
1. చిన్నదిగా ఉంటుంది.1. పెద్దదిగా ఉంటుంది.
2. దీని నుండి పుపుస మహాధమని బయలుదేరుతుంది.2. దీని నుండి దైహిక మహాధమని బయలుదేరుతుంది.
3. కుడికర్ణిక నుండి ఆమ్లజని రహిత రక్తాన్ని గ్రహిస్తుంది.3. ఎడమ కర్ణిక నుండి ఆమ్లజని సహిత రక్తాన్ని గ్రహిస్తుంది.
4. దీనిలో ఆమ్లజని రహిత రక్తం ఉంటుంది.4. దీనిలో ఆమ్లజని సహిత రక్తం ఉంటుంది.
5. ఊపిరితిత్తులకు ఆమ్లజని రహిత రక్తాన్ని పంపు చేస్తుంది.5. ఊపిరితిత్తులకు తప్ప మిగతా శరీర భాగాలన్నింటికి ఆమ్లజని సహిత రక్తాన్ని పంపు చేస్తుంది.
6. కుడి కర్ణికా జఠరికా రంధ్రాన్ని అగ్రత్రయ కవాటం రక్షిస్తుంది.6. ఎడమ కర్ణికా జఠరికా రంధ్రాన్ని అగ్రద్వయ కవాటం రక్షిస్తుంది.

ప్రశ్న 11.
మానవ హృదయాన్నుండి రక్తాన్ని తీసుకొని పోయే రక్తనాళాలను వర్ణించండి.
జవాబు:
మానవ హృదయాన్నుండి రక్తాన్ని తీసుకొని పోవు రక్తనాళాలను మహా ధమనులు అంటారు.
అవి (1) పుపుస మహాధమని (2) దైహిక మహాధమని (3) హృదయ ధమనులు

1) పుపుస మహాధమని :
ఇది హృదయంలోని కుడి జఠరికలో ఉన్న ఆమ్లజని రహిత రక్తాన్ని కుడి, ఎడమ పుపుస ధమనులుగా చీలిపోయి కుడి, ఎడమ ఊపిరితిత్తులకు అందజేస్తాయి.

2) దైహిక మహాధమని :
ఇది శాఖోపశాఖలుగా చీలి హృదయంలోని ఎడమ జఠరిక నుండి ఆమ్లజని సహిత రక్తాన్ని శరీరంలోని అన్ని అవయవాలకు సరఫరా చేస్తుంది.

3) హృదయ ధమనులు :
ఇవి ఆమ్లజని సహిత రక్తాన్ని హృదయ కండరాలకి తీసుకుపోతాయి.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 11

ప్రశ్న 12.
ఏకవలయ, ద్వివలయ ప్రసరణ అనగానేమి?
జవాబు:
ఏకవలయ ప్రసరణ :

  1. చేపలలో గుండె ద్వారా రక్తం ఒకసారే ప్రవహిస్తుంది.
  2. ఈ విధమైన రక్తప్రసరణని ఏకవలయ ప్రసరణము అంటారు.
  3. ఈ వ్యవస్థను ఏకవలయ ప్రసరణ వ్యవస్థ అంటారు.
  4. ఇందు మొప్పలకు రక్తాన్ని పంపే హృదయాన్ని జలశ్వాస హృదయం అంటారు.

ద్వివలయ ప్రసరణ :

  1. కప్ప, ఇతర ఉన్నత జంతువులలో రక్తం ‘హృదయం ద్వారా రెండు సార్లు ప్రయాణిస్తుంది.
  2. ఒకసారి హృదయం ఊపిరితిత్తుల మధ్య, రెండవసారి హృదయం శరీర భాగాల మధ్య ప్రయాణిస్తుంది.
  3. ఇటువంటి ప్రసరణని ద్వివలయ ప్రసరణము అంటారు.
  4. ఇట్టి హృదయాన్ని ద్వివలయ ప్రసరణ హృదయం అంటారు.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 12

ప్రశ్న 13.
సిరలలో రక్తకదలికలను నిరూపించటానికి హార్వే నిర్వహించిన ప్రయోగం ఏమిటి?
జవాబు:
ఆ రోజుల్లో సంయుక్త సూక్ష్మదర్శిని కాని, ఈనాటి ఆధునిక వైజ్ఞానిక పరికరాలు కాని లేవు. 17 వ శతాబ్దంలో సిరలలో రక్తం యొక్క కదలికలను నిరూపించడానికి విలియం హార్వే చేసిన ప్రయోగాన్ని పరిశీలిద్దాం.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 13

  1. రక్తనాళాలు బాగా కనిపించే వ్యక్తి యొక్క దండ చేయి (మోచేతి పై భాగంలో పటంలో చూపిన విధంగా) గుడ్డతో గట్టిగా కట్టాలి. (ఒక వేలుదూరేంత స్థలం ఉండాలి.)
  2. మరొక గుడ్డను చాపచుట్టలా మడిచి దానిని పిడికిలితో గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు చర్మం కింది రక్తనాళాలు ప్రస్ఫుటంగా కన్పిస్తాయి.
  3. బాగా లావుగా ఉబ్బినట్లున్న, శాఖలుగా విడిపోని రక్తనాళాన్ని గుర్తించండి.
  4. ఆ రక్తనాళంపై దండచేయి వైపు వేలు ఉంచి, మెల్లిగా, రక్తనాళంలో రక్త ప్రవాహం ఆగిపోయేవరకు ఒత్తిడి కలుగచేయండి. (బొమ్మ సహాయం తీసుకోండి)
  5. ఇప్పుడు వేలిని ఒత్తుతూ మోచేతి నుండి అరచేతి వరకు కదిలించండి. ఈ రక్త నాళంలో రక్తం నిలువ ఉండి ఉబ్బి స్పష్టంగా బయటకు కనిపిస్తాయి. వీటినే సిరలు అంటారు.
  6. సిరలలో రక్త ప్రసరణ గుండె వైపుకు ఉంటుంది. ఈ ప్రసరణను నిరోధించుట వలన రక్తం పోగై స్పష్టంగా బయటకు కనిపించాయి.

ప్రశ్న 14.
హృదయం పనిచేయు విధానంలోని దశలను తెలపండి. లేదా హార్దిక వలయాన్ని వివరించండి.
జవాబు:
కర్ణికలు, జఠరికలు ఒకసారి సంకోచించి తరువాత యథాస్థితికి వస్తే దానిని ఒక హృదయస్పందన వలయం లేదా హార్దిక వలయం (Cardiac cycle) అంటారు. దీనిలోని దశలను పరిశీలిద్దాం.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 14
1) గుండెలోని నాలుగు గదులు ఖాళీగా విశ్రాంతి (సడలింపు) స్థితిలో ఉన్నాయనుకొనే ఊహతో హార్దిక వలయం జరిగే విధానాన్ని పరిశీలిద్దాం.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 15
2) పూర్వపర మహాసిరల నుండి రక్తం కుడికర్ణికలోనికి, పుపుస గల నుండి ఎడమ కర్ణికలోనికి రక్తం ప్రవేశిస్తుంది.
3) ఇప్పుడు కర్ణికలు సంకోచిస్తాయి. కర్ణికల సంకోచం వలన రక్తం కర్ణిక, జఠరికల మధ్య ఉన్న కవాటాలను తోసుకుని జఠరికలోనికి ప్రవేశిస్తుంది.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 16
4) జఠరికలు రక్తంతో నిండగానే సంకోచిస్తాయి. అదే సమయంలో (సడలింపు), కర్ణికలు యథాస్థితికి చేరుకుంటాయి.
5) జఠరికల సంకోచం వలన రక్తం దైహిక చాపంలోనికి, పుపుస ధమనిలోనికి, వానిలో ఉన్న కవాటాలు తెరచుకుని ప్రవహిస్తుంది. అదే సమయంలో కర్ణికలు, జఠరికల మధ్య ఉన్న కవాటాలు రక్తం ఒత్తిడికి మూసుకుంటాయి. కవాటాలు మూసుకోవటం వలన మొదటి ‘లబ్’ అనే శబ్దం పెద్దగా మనకు వినిపిస్తుంది.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 17
6) జఠరికలు యథాస్థితికి చేరుకునే సమయంలో, జఠరికలలోని పీడనం తగ్గిపోతుంది. దీనివలన రక్తనాళాలలోనికి ప్రవేశించిన రక్తం వెనుకకు రావటానికి ప్రయత్నిస్తుంది. రక్తనాళాలలోని కవాటాలు మూసుకొని రక్తం వెనుకకు జఠరికలలోనికి రావటాన్ని నిరోధిస్తాయి. ఈ కవాటాలు మూసుకొన్నప్పుడు రెండవ ‘డబ్’ అనే శబ్దం చిన్నగా వినిపిస్తుంది.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 18
7) ఇదే సమయానికి కర్ణికలు రక్తంతో నిండి మరలా సంకోచానికి సిద్ధ పడతాయి.

హృదయస్పందనలో క్రమానుగతంగా జరిగే ఈ ప్రక్రియలన్నింటినీ కలిపి ‘హార్దిక వలయం ‘ (Cardiac cycle) అంటారు.

ప్రశ్న 15.
ప్రసరణ వ్యవస్థ పరిణామ క్రమం తెలపండి.
జవాబు:
ప్రొటోజోవన్స్ :
అమీబా వంటి ఏకకణజీవుల పదార్థంలో సహజసిద్ధమైన కదలికలుంటాయి. ఈ కదలికలను ‘బ్రేనియన్ చలనం’ అంటారు. ఈ చలనం వలన కణంలోని అన్ని భాగాలకు పోషకపదార్థాలు ఆమ్లజని సమానంగా సరఫరా అవుతాయి.

ఏకకణజీవుల మాదిరిగానే మానవునితో సహా అన్ని బహుకణ జీవులూ తమ కణాలలో కణాంతర ప్రసరణ వ్యవస్థ (intercellular transport system) ను కలిగి ఉంటాయి. నాడీ కణాలతో సహా మన శరీరంలోని అన్ని కణాలలోని జీవదార్థం ఈ బ్రౌనియన్ చలనాన్ని ప్రదర్శిస్తుంది.

పారాజోవన్స్ :
స్పంజికల వంటి పారాజోవన్లు సముద్రపు నీటినే ప్రసరణకు వాడుకుంటాయి. సహజసిద్ధమైన నీటి ప్రవాహాలు నియమబద్దంగా ఉండవు. కాబట్టి, స్పంజికలు శరీరం లోపల ఉండే కశాభాల కదలికల (fiagella) వలన తమ ప్రవాహలను తామే సృష్టించుకుంటాయి.

స్పంజికలకంటే అభివృద్ధి చెందిన హైడ్రా, జెల్లీ చేప వంటి నిడేరియా జీవులు తమ శరీరంలో జఠరప్రసరణ కుహరమనే (gretro vascular cavity) ఒక సంచి వంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. జఠర ప్రసరణకుహరం ఆహారాన్ని ఓం యులంతో పాటుగా పోషకాలను అన్ని కణాలకు అందించే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తుంది.

ప్లాటి హెల్మెంథిస్ :
ఫాసియోలా హెపాటికా వంటి ప్లాటి హెల్మెంథిస్ వర్గానికి చెందిన జీవులలో జీర్ణవ్యవస్థ శాఖోపశాఖలుగా , విస్తరించి ఉంటుంది. వీనిలో కూడా జీర్ణక్రియ, ప్రసరణలు రెండింటినీ ఒకే వ్యవస్థ నిర్వహిస్తుంది. ఈ జీవులలో ప్రతి కణం నుండి వ్యర్థ పదార్థాలను ప్రత్యేక విసర్జక వ్యవస్థ గ్రహిస్తుంది. ఈ జీవుల శరీరంలో ఎక్కువ భాగాన్ని జీర్ణ, విసర్జక వ్యవస్థలే ఆక్రమించాయి.

నిమాటిహెల్మెంథిస్ :
ఏలికపాముల (నట్టలు) వంటి నిమాటి హెల్మెంథిన్ల శరీరంలో ఉండే విధ్యాశరీర కుహరం , పదార్థాల (Pseudocoeloem) సేకరణ, వితరణను నిర్వహిస్తుంది.

అనిలెడ్లు :
నిజశరీరకుహర జీవులైన వానపాముల వంటి అనిలెడ్లు ద్రవాల కదలిక కోసం సంకోచించే ఒక నాళాన్ని మొదటిసారిగా ఏర్పాటు చేసుకున్నాయి. వీనిలో మొట్ట మొదటిసారిగా ప్రసరణ మాధ్యమంగా రక్తం పనిచేయడాన్ని గుర్తించవచ్చు.

ఆరోపొడ :
బొద్దింక వంటి ఆరోపొడ వర్గపు జీవులలో సంకోచించే నాళం వంటి గుండె ఉన్నప్పటికీ, రక్తనాళాలు లేకపోవటం వలన, రక్తం పెద్ద పెద్ద కోటరాల (ఖాళీ ప్రదేశాలు)లోనికి ప్రవహిస్తుంది. కణజాలాలకు పోషకాలను సరఫరా చేస్తుంది. అలాగే శ్వాసవ్యవస్థ కూడా నేరుగా కణజాలాలకు ఆక్సిజన్ ను సరఫరా చేస్తుంది. రక్తనాళాలు లేని ప్రసరణ వ్యవస్థను వివృత రక్తప్రసరణ వ్యవస్థ (Open Circulatory System) అంటారు.

ఆరోపొడతో పాటుగా, చాలా మొలస్కా :
జీవులు, కింది స్థాయి కార్డేటాజీవులలో వివృత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది.

మొలస్కాన్స్, కార్డేట్స్ :
పదార్థాల రవాణా బాధ్యతను రక్తమే పూర్తిగా నిర్వహిస్తూ, రక్తం రక్తనాళాలలో ప్రవహించే వ్యవస్థను సంవృత రక్తప్రసరణ వ్యవస్థ (Closed Circulatory System) అంటారు. అనిలెడా, ఇఖైనోడెర్మటా, ఆక్టోపస్ వంటి సెఫలోపొడ మొలస్కా జీవులలోను, అన్ని పై స్థాయి కార్డేటా జీవులలోను ఈ రకమైన రక్తప్రసరణ వ్యవస్థ ఉంటుంది.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

ప్రశ్న 16.
వేరు పీడనం అనగానేమి? దానిని ఎలా నిరూపిస్తావు?
జవాబు:
వేరు పీడనం :
వేరు నీటిని పీల్చుకొన్నప్పుడు వెలువర్చే పీడనాన్ని వేరు పీడనం అంటారు. దీనివలన నీరు వేరు నుండి కాండములోనికి చేరుతుంది. వేరు పీడనాన్ని మానోమీటరు సహాయంతో కొలుస్తారు.

ప్రయోగం :
ఉద్దేశం : వేరు పీడనం నిరూపించుట.

పరికరాలు :
కుండీలో పెరుగుతున్న మొక్క, గాజు గొట్టం, రబ్బరు గొట్టం.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 19

విధానం :

  1. కుండీలో పెరుగుతున్న మొక్కను తీసుకొని, భూమి ఉపరితలం కంటే 1 సెం.మీ పైన ఉండే విధంగా కాండం భాగాన్ని కోయాలి.
  2. గాజు గొట్టాన్ని కోసిన కాండ భాగానికి, రబ్బరుగొట్టం రబ్బరు గొట్టంతో కట్టాలి.
  3. గాజు గొట్టంలో నీరు పోసి నీటి మట్టాన్ని (M1) కొలిచి నమోదు చేయాలి.
  4. 2-3 గంటల పాటు, ప్రయోగ అమరికను కదపకుండా ఒకచోట ఉంచాలి.

పరిశీలన : రెండు గంటల తరువాత గాజు గొట్టంలో నీటి మట్టం పెరుగుదల (M2) ను గుర్తించాను.

వివరణ :
గాజు గొట్టంలో నీటి మట్టం పెరుగుదల, వేరు నీరు పీల్చడం వలన జరిగింది. వేరు నీటిని పీల్చి గాజు గొట్టంలోని నీటిని పైకి నెట్టింది. నీటిని పైకి నెట్టిన ఈ బలాన్ని వేరు పీడనం అంటారు.

నిరూపణ :
మొక్కలలో వేరు పీడనం ఉంటుందని నిరూపించటమైనది.

ప్రశ్న 17.
బాష్పోత్సేకం అనగానేమి? దానిని ఎలా నిరూపిస్తావు?
జవాబు:
బాష్పోత్సేకం :
మొక్క దేహ భాగాల నుండి నీరు ఆవిరైపోవడాన్ని బాష్పోత్సేకం అంటారు.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 20

నిరూపణ :

  1. కుండీలో పెరుగుతున్న ఆరోగ్యవంతమైన మొక్కను ఎన్నుకొని దానికి నీరు పోశాను.
  2. ఒక పాలిథిన్ కవర్ తీసుకొని మొక్క కొమ్మకు కట్టి సూర్యరశ్మిలో ఉంచాను.
  3. కొంత సేపటి తరువాత పాలిథిన్ కవర్‌లో నీటి తుంపరలు గమనించాను.
  4. ఇది మొక్క పత్రాల నుండి వెలువడి పాలిథిన్ కవర్‌లో చేరింది.
  5. ఇలా మొక్క దేహ భాగాల నుండి నీరు ఆవిరై పోవడాన్ని ‘బాష్పోత్సేకం’

ప్రశ్న 18.
మొక్కలలో ఖనిజ లవణాల రవాణాను వివరించండి.
జవాబు:
ఖనిజ లవణాల రవాణా :

  1. మొక్కల పోషణకు ఖనిజ లవణాలు (స్థూల, సూక్ష్మపోషకాలు) అవసరం.
  2. మృత్తిక ద్రావణం నుండి మూలకేశాల ద్వారా ఖనిజ లవణాలు గ్రహించబడతాయి.
  3. ఈ లవణాలన్నీ విద్యుదావేశ అయాన్ల రూపంలో ఉంటాయి. ఉదాహరణకు సోడియం క్లోరైడ్ Na+, Cl అయాన్లు రూపంలోనూ, మెగ్నీషియం సల్ఫేట్ Mg2+, So42- అయాన్ల రూపంలో ఉంటాయి.
  4. ఇవి మూలకేశాల ద్వారా వ్యాపనం పద్దతిలో కాకుండా కణద్రవ్య శక్తిని వినియోగించి శోషించబడతాయి.
  5. ఆయాన్లు శోషించబడిన తరువాత నీటి ద్వారా దారునాళాలలోకి చేరుకుని అక్కడ నుండి పెరుగుదల స్థానాలకు వెళ్ళి పెరుగుదలకు వినియోగించబడతాయి.
  6. కొన్ని సందర్భాలలో దారువు నుండి పోషక కణజాలానికి పార్శ్వంగా కూడా ప్రసరిస్తాయి. మొక్కల పెరుగుదలలో ఖనిజ లవణాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి.

ప్రశ్న 19.
దారువు ద్వారా మొక్కలలో నీటి రవాణా జరుగుతుందని తెలుపడానికి నీవు ఏ ప్రయోగాన్ని చేస్తావు? ఎలా చేస్తావో వివరించండి.
జవాబు:
ఉద్దేశం :
దారువు ద్వారా మొక్కలలో నీటి రవాణా జరుగుతుందని తెలుపుట.

కావలసిన పరికరాలు :
రెండు గాజు సీసాలు, ఎరుపు రంగు ద్రవం, నీలి రంగు ద్రవం, తెల్ల పుష్పం కలిగిన కాండం.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 21

విధానం :

  1. రెండు గాజు గ్లాసులు తీసుకొని ఒక దానిలో ఎరుపు రంగు నీరు మరొక దానిలో నీలిరంగు నీరు పోసాను.
  2. తెల్లపుష్పం కలిగిన కాండం తీసుకొని దానిని సగం వరకు రెండుగా చీల్చాను.
  3. చీల్చిన రెండు భాగాలను రెండు గ్లాసులలో ఉంచి, రెండు గంటల తరువాత పరిశీలించాను.

పరిశీలన :
రెండు గంటల తరువాత తెలుపురంగు పుష్పంలో కొంతభాగం ఎరుపు చారలను, మరికొంత నీలి చారలను కలిగి ఉంది.

వివరణ :
పువ్వులలోని ఈ రంగు చారలు గ్లాసులోని నీటివలన ఏర్పడింది. గ్లాసులలోని నీరు కాండం ద్వారా పుష్పంలోనికి ప్రయాణించుట వలన రంగు చారలు ఏర్పడ్డాయి. కాండంలో నీరు ప్రయాణించిన ఈ నాళాలను అడ్డుకోతలో పరిశీలించవచ్చు. ఈ నాళాలనే దారువు అంటారు.

నిరూపణ :
మొక్కలలో నీరు దారువు ద్వారా రవాణా అవుతుందని నిరూపించటమైనది.

ప్రశ్న 20.
పోషక కణజాలం ద్వారా ఆహార పదార్థాలు రవాణా అవుతాయని నీవు ఎలా నిరూపిస్తావు?
జవాబు:

  1. పోషక కణజాలం ద్వారా చక్కెరలు రవాణా చేయబడతాయిని తెలుసుకోవడానికి మరొక ప్రయోగం ద్వారా కూడా నిరూపించవచ్చు.
  2. దారువు కనబడే విధంగా దాని చుట్టూ ఉన్న బెరడును తొలగించాలి. మధ్యభాగం మాత్రం ఉంచి మిగిలిన మొత్తం కణజాలాన్ని పోషక కణజాలంతో సహా తొలగించాలి.
  3. కొన్ని రోజుల తరువాత తొలగించిన బెరడు పై భాగాన్ని, కింది భాగాన్ని కణజాలాన్ని విశ్లేషించినప్పుడు మనకు ఆహార పదార్థ నిలువలు వలయంగా ఏర్పడిన పై భాగంలో మాత్రమే కనబడుతుంది. కింది భాగంలో కనబడదు.
  4. కొన్ని రోజుల తరువాత మనం అలాగే వదిలి పెడితే రింగుపై భాగంలో కాండ మందం పెరుగుతుంది. కాని కింది భాగంలో పెరుగుదల జరగదు.
  5. అందువలన కాండం చుట్టూ ఉన్న కణజాలానికి ఎటువంటి నష్టం కలిగించినా వేరుకు ఆహార సరఫరా ఆగిపోతుంది. తద్వారా చెట్టు మరణిస్తుంది.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

ప్రశ్న 21.
అధిక రక్తపీడనం అనగానేమి? దాని లక్షణాల నివారణ ఏమిటి?
జవాబు:
1) సామాన్యంగా మానవునిలో రక్తపీడనం 120/80 ఉంటుంది.
2) కొంతమందిలో సామాన్యంగా ఉండే రక్తపీడనం కంటే చాలా ఎక్కువ ఉంటుంది. దీనినే హైపర్ టెన్షన్ లేక హై బి.పి. అని అంటారు.

కారణాలు:
3) రక్తంలో కొలెస్టరాల్ (కొవ్వు) శాతము ఎక్కువైనచో, అది ధమనుల గోడలలో చేరుతుంది. అప్పుడు ధమనుల గోడలు దళసరిగా తయారవుతాయి. అప్పుడు ధమనుల లోపలి కుహరం చిన్నదవుతుంది. తర్వాత రక్తం అధిక పీడనంతో ప్రవహించును.
4) దీర్ఘకాలపు ఒత్తిడి, శ్రమ, ధూమపానము, మద్యపానము వల్ల కూడా అధిక పీడనం కలుగును.
5) మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవటం వల్ల కూడా అధిక రక్తపీడనానికి కారణం కావచ్చు.

తీసుకోవలసిన జాగ్రత్తలు :
6) ఆహార నియమాలు పాటించాలి.
7) తగుమాత్రం వ్యాయామం చేయాలి.
8) అదనపు ఒత్తిడి, శ్రమకు లోనుగాకుండా చూసుకోవాలి.
9) ధూమపానం, మద్యపానం సేవించకుండా ఉండాలి.
10) 45 సం||లు పైబడిన వారు కనీసం ఏడాదికి రెండుసార్లైనా రక్తపీడనం పరీక్షని చేయించుకోవాలి.

ప్రశ్న 22.
తలసేమియా వ్యాధిని గూర్చి రాయండి.
జవాబు:

  1. తలసేమియా అనేది వంశపారంపర్యంగా వచ్చే రక్తసంబంధ వ్యాధి.
  2. ఎర్రరక్త కణాలలో హిమోగ్లోబిన్ లోపించి రక్తహీనతకు దారితీస్తుంది.
  3. తలసేమియాతో బాధపడేవారిలో ఆక్సిజనను రవాణా చేసే హిమోగ్లోబిన్ తక్కువగా ఉత్పత్తి అవుతుంది.
  4. ఈ వ్యాధి ఆల్ఫా మరియు బీటా అనే రెండు రకాలు.
  5. హిమోగ్లోబిన్ ప్రోటీన్లో వివిధ భాగాలలో వచ్చే లోపాలవల్ల ఈ రెండు రకాల తలసేమియా వ్యాధులు వస్తాయి.
  6. తక్కువస్థాయి తలసేమియా వ్యాధిగ్రస్తులలో రక్తహీనత, కాలేయం, పిత్తాశయం పరిమాణం పెరగడం, వ్యాధినిరోధక శక్తి తగ్గడం, పెరుగుదల నెమ్మదిగా ఉండడం, ఎముకలు సన్నబడి పెళుసుగా మారడం, గుండెపోటు మొదలైన లక్షణాలు కనిపిస్తాయి.

ప్రశ్న 23.
తలసేమియా చికిత్స విధానం తెలపండి.
జవాబు:
తలసేమియా మేజర్ :
పెరుగుదల తక్కువగా ఉండడం, పెళుసు బారిన ఎముకలు, తొందరగా వ్యాధులకు గురికావడం వంటి లక్షణాలను మొదటి ఏడాదిలోనే గుర్తించినట్లయితే ఈ వ్యాధిని తగ్గించడం తేలికవుతుంది. మొదటి సంవత్సరంలోనే శిశువులలో హిమోగ్లోబిన్ స్థాయిని, పెరుగుదలను జాగ్రత్తగా గమనిస్తుండాలి. హిమోగ్లోబిన్ పరిమాణం 70% కన్నా తగ్గినపుడు పిల్లల్లో పెరుగుదల లోపిస్తుంది. వారు క్రమం తప్పకుండా రక్త మార్పిడి చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది.

ప్రపంచ ఆరోగ్య సమస్యల లెక్కల ప్రకారం హి మోగ్లోబిన్ స్థాయి 115-120 గ్రా./లీ. గా ఉండేలా చూడడం. ఈ చికిత్సలో ముఖ్యమైన అంశం ప్రతిమూడు నాలుగు వారాలకొకసారి గాఢత కలిగిన ఎర్రరక్త కణాలను ప్రవేశపెట్టడం ద్వారా చికిత్స చేస్తారు. మూలకణాల మార్పిడి ద్వారా తలసేమియా మేజర్ వ్యాధిని నయం చేయవచ్చు. ఈ వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు వారి కణజాలాలకు సమానమైన కణజాలం కలిగిన వారి సోదర/సోదరిల నుండి సేకరించిన ఎముక మజ్జలో ఉండే ఎర్రరక్త కణాల మూలకణాల (ఎముక మజ్జ) మార్పిడి ద్వారా చికిత్స చేయవచ్చు.

ప్రశ్న 24.
ఈ క్రింది పట్టికను పూరించండి.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 22
జవాబు:
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 23

ప్రశ్న 25.
ప్రక్క పటాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 19
a) ఈ ప్రయోగ ఉద్దేశం ఏమిటి?
b) ఈ ప్రయోగంలో ఉపయోగించిన పరికరం పేరు ఏమిటి?
c) కుండీలో నీరు పొయ్యకుండా ప్రయోగం నిర్వహిస్తే ఏం జరుగుతుంది?
d) ఈ ప్రయోగానికి నీవు ఉపయోగించే ప్రత్యామ్నాయ పరికరాలు ఏమిటి?
జవాబు:
a) వేరు పీడనం నిరూపించటం ఈ ప్రయోగ ముఖ్య ఉద్దేశం.
b) వేరు పీడనం కొలవటానికి ఉపయోగించే పరికరం పేరు మానోమీటరు.
c) కుండీలో నీరు పోయకపోతే, వేరుపీడనం ఏర్పడదు. కావున నీటిమట్టంలో మార్పు రాదు.
d) గాజునాళం బదులు లెవల్ పైపు వాడి ప్రయోగం నిర్వహించవచ్చు.

ప్రశ్న 26.
క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
a) గుండెలో ఏ వైపున ఆమ్లజని రహిత రక్తం ఉంటుంది?
b) ఆమ్లజని రహిత రక్తం ఏ ధమని ద్వారా ఊపిరితిత్తులకు చేరును?
c) మహాధమని గుండె ఏ గది నుండి బయలుదేరును?
d) గుండెలో రక్త ప్రవాహాన్ని నియంత్రించే నిర్మాణాలు ఏమిటి?
జవాబు:
a) గుండెలో కుడివైపున ఆమ్లజని రహిత రక్తం ఉంటుంది.
b) ఆమ్లజని రహిత రక్తం పుపుస ధమని ద్వారా ఊపిరితిత్తులకు చేరును.
c) మహాధమని ఎడమ జఠరిక నుండి బయలుదేరును.
d) గుండెలో రక్త ప్రవాహాన్ని నియంత్రిస్తూ కవాటాలు ఉంటాయి.

ప్రశ్న 27.
ప్రక్క పటం గమనించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 13
a) ఈ ప్రయోగం నిర్వహించిన శాస్త్రవేత్త ఎవరు?
b) ఈ ప్రయోగంలో పరిశీలించిన రక్తనాళాలు ఏమిటి?
c) ప్రయోగంలో మోచేతికి పైగా కట్టు ఎందుకు కట్టారు?
d) సిరలలో రక్తం వెనుకకు ఎందుకు రాదు?
జవాబు:
a) ఈ ప్రయోగం నిర్వహించిన శాస్త్రవేత్త విలియం హార్వే.
b) ఈ ప్రయోగం ద్వారా సిరలను పరిశీలించవచ్చును.
c) మోచేతికి పైన కట్టు కట్టటం వలన రక్తం ప్రవాహం ఆగి సిరలు ఉబ్బి కనిపిస్తాయి.
d) సిరలలో రక్తం వెనుకకు రాకుండా కవాటాలు నిరోధిస్తాయి.

ప్రశ్న 28.
ప్రక్క పటాన్ని పరిశీలించండి. ఇది ఏ రకమైన హార్దిక వలయాన్ని సూచిస్తుంది? ఇక్కడ జరిగే విధానాన్ని వివరించండి.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 24
జవాబు:

  1. ఇవ్వబడిన పటం ద్వివలయ ప్రసరణ వ్యవస్థను సూచిస్తుంది.
  2. ఉన్నత జంతువుల్లో రక్తం హృదయం ద్వారా రెండుసార్లు ప్రయాణం చేస్తుంది. ఒకసారి హృదయం, ఊపిరితిత్తుల మధ్య, రెండవసారి హృదయం, శరీర భాగాల మధ్య.
  3. ఇటువంటి ప్రసరణను ద్వివలయ ప్రసరణమని, హృదయాన్ని ద్వివలయ ప్రసరణ హృదయం అని అంటారు. ఈ వ్యవస్థని ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు.
  4. ఊపిరితిత్తులకు, గుండెకు మధ్య జరిగే ప్రసరణ వలయాన్ని పుపుస వలయం అని, హృదయానికి, శరీర అవయవాలకు మధ్య జరిగే ప్రసరణ వలయాన్ని దైహిక వలయం అని అంటారు.
  5. పుపుస వలయం లేదా ప్రసరణ నందు శరీర అవయవాల నుండి సేకరించబడిన రక్తం హృదయం కుడి కర్ణికకు చేరి అక్కడ నుండి కుడి జఠరికకు పోతుంది. కుడి జఠరిక నుండి ఊపిరితిత్తులకు చేరి ఆమ్లజనీకరణం అవుతుంది. ఆమ్లజని సహితరక్తం పుపుస సిరల ద్వారా ఎడమ కర్ణికకు, ఇక్కడ నుండి ఎడమ జఠరికకు చేరుతుంది.
  6. దైహిక వలయం నందు ఎడమ కర్ణిక నుండి, రక్తం ఎడమ జఠరికలోకి చేరుతుంది. ఇక్కడ నుండి దైహిక మహాధమని ద్వారా శరీర వివిధ భాగాలకు చేరుతుంది. శరీర భాగాల నుండి పూర్వపరమహాసిరల ద్వారా కుడి కర్ణికను చేరుతుంది.

ప్రశ్న 29.
ఈ క్రింది పట్టికను పరిశీలించి క్రింది ప్రశ్నలను విశ్లేషించండి.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 25
ఎ) ఏ వయస్సు వారిలో హృదయస్పందన ఎక్కువగా ఉంది?
జవాబు:
నవజాత శిశువు

బి) ఏ వయస్సు వారిలో హృదయస్పందన తక్కువగా ఉంది?
జవాబు:
సుశిక్షితులైన క్రీడాకారులు

సి) క్రీడాకారులలో హృదయస్పందన తక్కువగా ఎందుకు ఉంది?
జవాబు:
క్రీడాకారుల హృదయం ఒక హృదయస్పందన ద్వారా ఎక్కువ మొత్తంలో రక్తమును శరీర భాగాలకు సరఫరా చేస్తుంది. హృదయము నందలి గోడలు మందముగా ఉండుట వలన హృదయం ఎక్కువ మొత్తంలో రక్తమును పంపు చేస్తుంది.

డి) నవజాత శిశువుకి, పిల్లల మధ్య హృదయస్పందనలో ఎక్కువగా తేడాలు ఉండటానికి కారణమేమిటి?
జవాబు:

  1. థైరాయిడ్ మరియు మధుమేహ వ్యాధిగ్రస్తులైన తల్లులు జన్మనిచ్చిన పిల్లలలో హార్మోన్ ,మార్పుల వలన మరియు గ్లూకోజు స్థాయిలను అనుసరించి గుండె వేగంగా కొట్టుకుంటుంది.
  2. కొంతమంది నవజాత శిశువుల్లో గుండెనందు ప్రత్యేక కణజాలమైన అనుబంధ విద్యుత్ కణజాలంతో పుడతారు. ఈ కణజాలం ఎక్కువ హృదయస్పందనకు కారణమవుతుంది.
  3. ఉల్ఫ్ పార్కిన్సన్ సిండ్రోమ్ మరియు వైట్ సిండ్రోమ్ నందు అదనపు కణములు ఉండుట వలన మరియు అనుబంధ మార్గము వలన అదనముగా గుండె కొట్టుకోవడం జరుగుతుంది.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

ప్రశ్న 30.
మానవులలో గల రక్తనాళాలను దేని ఆధారంగా వర్గీకరిస్తావు? వాటి మధ్య గల తేడాలను పట్టికలో వ్రాయండి.
జవాబు:
మానవులలో గల రక్తనాళాలను అవి తీసుకుని పోయే రక్తం ఆధారంగా ప్రధానంగా మూడు రకాలు. అవి :
ధమనులు, సిరలు, రక్తకేశనాళికలు. ధమనులు గుండె నుండి ఆక్సిజన్ సహిత రక్తాన్ని శరీర భాగాలకు అందిస్తాయి. సిరలు శరీర భాగాల నుండి ఆక్సిజన్ రహిత రక్తాన్ని గుండెకు తీసుకొని వస్తాయి. ధమనులు మరియు సిరల మధ్యన ఉండే అతి సన్నని, చిన్నవైన రక్తనాళాలను సూక్ష్మకేశ నాళికలు అంటారు.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 26

ప్రశ్న 31.
ధమనులు సిరలలో జరిగే రక్త ప్రవాహాన్ని, వాటి అడ్డుకోత బొమ్మను గీయండి. వాటి ద్వారా రక్త ప్రవాహం ఎలా జరుగుతుందో రాయండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 27

  1. ధమనులందు ఆమ్లజనిసహిత రక్తం ప్రవహిస్తుంది. ధమనులు ఆమ్లజనిసహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు తప్ప శరీర అన్ని భాగాలకు సరఫరా చేస్తాయి. పుపుస ధమని ఆమ్లజని రహితరక్తాన్ని ఊపిరితిత్తులకు గుండె నుండి సరఫరా చేస్తుంది.
  2. శరీర అన్ని భాగముల నుండి సిరలు ఆమ్లజనిరహిత రక్తాన్ని సేకరించి గుండెనందలి కుడి కర్ణికకు చేరుస్తాయి. పుపుస సిర ఊపిరితిత్తుల నుండి ఆమ్లజనిసహిత రక్తాన్ని గుండెకు సరఫరా చేస్తుంది.
  3. అతి చిన్నవైన ధమనికలను మరియు సిరలను రక్తకేశనాళికలు కలుపుతాయి.

ప్రశ్న 32.
ఈ క్రింది పట్టికను పరిశీలించి ప్రశ్నలను విశ్లేషించండి.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 28
ఎ) అధిక బరువు కల్గిన జంతువులలో హృదయస్పందన ఎందుకు తక్కువగా ఉంది?
జవాబు:
ఎక్కువ బరువు కలిగిన జంతువులలో ఎక్కువ బరువు కలిగిన హృదయం ఉంటుంది. ఒక హృదయస్పందనలో పెద్దదైన హృదయం ఎక్కువ మొత్తంలో శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. తిరిగి హృదయం పూర్తిగా నిండడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందువలన అధిక బరువు కలిగిన జంతువులలో హృదయస్పందనలు చాలా తక్కువగా ఉంటాయి. హృదయం పూర్తిగా ఖాళీ కావటం అనేది అధిక బరువు కలిగిన జీవులలో అసంభవం.

బి) తక్కువ బరువు కల్గిన జంతువులలో హృదయస్పందన ఎక్కువగా ఎందుకు ఉంది?
జవాబు:
తక్కువ శరీర బరువు కలిగిన జంతువులలో హృదయం కూడా తక్కువ బరువు ఉంటుంది. రక్తాన్ని శరీర భాగాలకు పంపించడానికి సంకోచించినపుడు అతి తక్కువ పరిమాణంలో రక్తం శరీర భాగాలకు సరఫరా చేయబడుతుంది. అందువలన ఎక్కువ మొత్తం రక్తం శరీర భాగాలకు సరఫరా చేయడానికి గుండె ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది.

సి) శరీర బరువుకు హృదయస్పందనానికి గల సంబంధమేమి?
జవాబు:
శరీర బరువు పెరిగితే హృదయస్పందనలు తక్కువగా ఉంటాయి. శరీర బరువు తక్కువగా ఉంటే హృదయస్పందనలు ఎక్కువ.

డి) శరీర బరువుతో పోలిస్తే, గుండె బరువు తక్కువగా ఉండటానికి కారణాలు ఏమై ఉండవచ్చు?
జవాబు:
జీవి అనేక అవయవాలు మరియు అవయవ వ్యవస్థలతో నిర్మితమై ఉంటుంది. హృదయం జీవి శరీరములో ఒక భాగమైనందున సాధారణముగా శరీర బరువు కంటే హృదయం బరువు తక్కువగా ఉంటుంది.

10th Class Biology 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ ½ Mark Important Questions and Answers

1. బి.పి.ని విస్తరించుము.
జవాబు:
Blood Pressure / రక్త పీడనం

శాస్త్రవేత్తను గుర్తించండి

2. రోగి హృదయ స్పందన వినడానికి మొదటిసారి కాగితపు గొట్టాన్ని ఉపయోగించాడు. కాగితపు గొట్టం స్థానంలో వెదురు గొట్టాన్ని వాడేవారు. దానికి స్టెతస్కోప్ అని పేరు పెట్టారు.
జవాబు:
రెని లెన్నేక్

3. ఇతను ఇటాలియన్ వైద్యుడు. కాలిలోని సిరలను అధ్యయనం చేస్తుండగా వాటిలో చిన్న చిన్న కవాటాలు ఉండటం గుర్తించాడు.
జవాబు:
గైరోలమా ఫ్యాబ్రిసి

4. ఇతనొక బ్రిటీష్ వైద్యుడు. గుండెలో ఒకే దిశలో రక్త ప్రసరణకు తోడ్పడే కవాటాలను గుర్తించాడు. ఇవి రక్తాన్ని కర్ణికల నుండి జఠరికలకు ప్రవహింపజేస్తాయి అని కనుగొన్నాడు.
జవాబు:
విలియం హార్వే

5. ఆయన సూక్ష్మజీవ శాస్త్రవేత్త. చిన్న ధమనులు మరియు సిరలు అతిసన్నని, చిన్నవైన రక్తనాళాల ద్వారా అనుసంధానించబడి ఉన్నట్లు కనుగొన్నాడు. వాటికి సూక్ష్మ కేశనాళికలు అని పేరు పెట్టాడు.
జవాబు:
మార్సెల్లో మాల్ఫీజి

ఫ్లో చార్టులు

6. చేపలోని ఏకవలయ రక్తప్రసరణ వ్యవస్థలో ఖాళీని పూరించండి.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 29
జవాబు:
మొప్పలు

7.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 30
జవాబు:
రక్త కేశనాళికలు

8.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 31
జవాబు:
ప్లాస్మా

9.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 32
జవాబు:
ఎడమ జఠరిక

10.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 33
జవాబు:
ప్రసరణ కణజాలం

11.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 34
జవాబు:
పుపుస మహాధమని

12.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 35
జవాబు:
త్రాంబోకైనేజ్

13.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 39
జవాబు:
ఫైబ్రినోజెన్

14.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 36
జవాబు:
వల్కల కణాలు / వల్కలం

15.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 37
జవాబు:
పత్రరంధ్రాలు

సరైన గ్రూపును గుర్తించండి

16. ఏ గ్రూపు కణాలు మొక్కలకు సంబంధించినవి?
A. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు
B. దారువు పోషక కణజాలం, పత్రాంతర కణాలు
జవాబు:
సమూహం B

17. రక్తం గడ్డ కట్టడానికి సంబంధం లేని సమూహాన్ని గుర్తించండి.
A. త్రాంబిన్, ఫైబ్రినోజెన్, త్రాంబోకైనేజ్
B. హెపారిన్, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు
జవాబు:
సమూహం B

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

18. ఏ గ్రూపుకు సంబంధించిన రక్త నాళాలలో ఆమ్లజని సహిత రక్తం ప్రవహించదు?
A. దైహిక మహాధమని, కరోనరీ ధమని, పుపుస మహాసిర
B. పుపుస మహాధమని, కరోనరీ సిర, పర మహాసిర
జవాబు:
సమూహం B

19. ఏ గ్రూపు జీవులు వివృత రక్త ప్రసరణ వ్యవస్థను చూపిస్తాయి?
A. కీటకం, రొయ్య, సాలీడు
B. వానపాము, ఆక్టోపస్, మానవుడు
జవాబు:
సమూహం A

20. మొక్కలలో రవాణా కొరకు ఏ ప్రక్రియలు సహాయ పడతాయి?
A. కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ, ద్రవాభిసరణ
B. వేరు పీడనం, బాష్పోత్సేకం, సంసంజన మరియు అసంజన బలాలు
జవాబు:
సమూహం B

21. ఏ గ్రూపులోని కణాలు కణికారహిత కణాలు కావు ? జ.
A. ఇసినోఫిల్స్, బాసోఫిల్స్, న్యూట్రోఫిల్స్ సరైన గ్రూపును గుర్తించండి
B. మోనోసైట్లు, లింఫోసైట్లు, రక్తఫలకికలు
జవాబు:
సమూహం A

22. ఏ గ్రూపు లక్షణాలు ధమనులకు సంబంధించినవి?
A. పలుచని గోడలు, మిడిమిడి కవాటాలు
B. మందపాటి గోడలు, అంతర్గతం, కవాటాలు లేవు
జవాబు:
సమూహం B

23. రక్త ప్రసరణ యొక్క సరైన క్రమాన్ని కనుగొనండి.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 38
జవాబు:
సమూహం B

24. రక్త ప్రసరణ జరిగే విధానం యొక్క సరైన క్రమాన్ని గుర్తించండి.
A. ఊపిరితిత్తులు → ఎడమ కర్ణిక → ఎడమ జఠరిక → కరోనరీ ధమనులు → హృదయ కండరం
B. హృదయ కండరం → కరోనరీ ధమనులు ఎడమ కర్ణిక → ఎడమ జఠరిక → ఊపిరితిత్తులు
జవాబు:
సమూహం A

25. ఇవ్వబడ్డ టేబుల్ లో ఖాళీని పూరించండి.

వర్గమురవాణా వ్యవస్థ
కార్డేటాసంవృత ప్రసరణ వ్యవస్థ
?వివృత ప్రసరణ వ్యవస్థ

జవాబు:
ఆర్రోపోడా

ఉదాహరణలు ఇవ్వండి

26. బహుకణ జంతువులు శరీరంలో ఉన్న పదార్థాలను రవాణా చేయడానికి రక్తం అనే ప్రత్యేక ద్రవాన్ని అభివృద్ధి చేసుకున్నాయి. మీ శరీరంలో పదార్థాలను రవాణా చేసే మరొక ద్రవానికి ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
లింఫ్ / శోషరసం

27. గొల్లభామ అనే కీటకంలో రక్తం వర్ణరహితం. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
బొద్దింక

28. వివృత రక్తప్రసరణ వ్యవస్థ కీటకాలలో కనిపిస్తుంది. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
మలస్కా జీవులు

29. హైడ్రా వంటి నిడేరియా జీవులు పదార్థాల రవాణా కొరకు శరీరంలో జఠర ప్రసరణ కుహరం అనే నిర్మాణాన్ని అభివృద్ధి చేసుకున్నాయి. దీనికి మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
జెల్లీ ఫిష్

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

30. పూర్వ మహాసిర శరీరంలోని వివిధ భాగాల నుండి ఆమ్లజనిరహిత రక్తాన్ని సేకరిస్తుంది. మరొక మహాసిర కు ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
పర మహాసిర

పోలికను గుర్తించుట

31. అమీబా : ట్రేనియన్ చలనం :: స్పంజికలు 😕
జవాబు:
నీటి ప్రవాహాలు

32. సిరలు : ఆమ్లజనిరహిత రక్తం :: ? : ఆమ్లజనిసహిత రక్తం
జవాబు:
ధమనులు

33. ఆమ్లజనిసహిత రక్తం : పుపుస మహాసిర :: ఆమ్లజని రహిత రక్తం 😕
జవాబు:
పుపుస మహాధమని

34. ఆమ్లజనిసహిత రక్తం : మహాధమని :: ఆమ్లజని రహిత రక్తం 😕
జవాబు:
పుపుస మహాధమని

35. ఆమ్లజనిసహిత రక్తం : శరీర భాగాలు :: ? : ఊపిరితిత్తులు
జవాబు:
ఆమ్లజని రహిత రక్తం

36. హృదయ స్పందన : స్టెతస్కోప్ :: రక్తపీడనం 😕
జవాబు:
స్పిగ్మో మానోమీటర్

37. కవాటాలు : ఫాబ్రిసి :: రక్త కేశనాళికలు 😕
జవాబు:
మార్సెల్లో మాల్ఫీజి

38. రక్తం : రక్తనాళాలు :: శోషరసం 😕
జవాబు:
శోషరస నాళాలు

39. రక్త స్కందన ఎంజైము : త్రాంబోకైనేజ్ :: రక్త స్కందన విటమిన్ 😕
జవాబు:
విటమిన్ K

40. పత్రాలు : పత్రరంధ్రాలు :: కాండం 😕
జవాబు:
లెంటిసెల్స్

41. దారువు : నీరు :: ? : పోషకాలు
జవాబు:
పోషక కణజాలం

42. RBC యొక్క లోపం : అనీమియా :: జన్యు రుగ్మత 😕
జవాబు:
తలసేమియా

దోషాన్ని గుర్తించి, సరిచేసీ రాయండి

43. గాయం ద్వారా రక్తం బయటకు ప్రవహించినప్పుడు, రక్త ఫలకికలు టయలిన్ అనే ఎంజైమ్ ను విడుదల చేస్తాయి.
జవాబు:
గాయం ద్వారా రక్తం బయటకు ప్రవహించినప్పుడు, రక్త ఫలకికలు త్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్ ను విడుదల చేస్తాయి.

44. రక్తం గడ్డకట్టిన తర్వాత పసుపుపచ్చ గడ్డి రంగులో ఏర్పడే ద్రవ భాగాన్నే ప్లాస్మా అంటారు.
జవాబు:
రక్తం గడ్డకట్టిన తర్వాత పసుపుపచ్చ గడ్డి రంగులో ఏర్పడే ద్రవ భాగాన్నే సీరం అంటారు. పోలికను గుర్తించుట

45. ధమనీ వ్యవస్థకు సమాంతరమైన శోషరస వ్యవస్థ కణజాల ద్రవాన్ని సిరా వ్యవస్థలోకి చేర్చడానికి తోడ్పడుతుంది.
జవాబు:
సిరా వ్యవస్థకు సమాంతరమైన శోషరస వ్యవస్థ కణజాల ద్రవాన్ని సిరా వ్యవస్థలోకి చేర్చడానికి తోడ్పడుతుంది.

46. ఎడమ కర్ణికా – జఠరిక రంధ్రం వద్ద గల కవాటాన్ని అగ్రత్రయ కవాటం లేదా మిట్రల్ కవాటం అంటారు.
జవాబు:
ఎడమ కర్ణికా – జఠరిక రంధ్రం వద్ద గల కవాటాన్ని అగ్రద్వయ కవాటం లేదా మిట్రల్ కవాటం అంటారు.

47. మూలకేశాలలోని రిక్తికలోకి నీరు విసరణ ప్రక్రియ ద్వారా ప్రవేశిస్తుంది.
జవాబు:
మూలకేశాలలోని రిక్తికలోకి నీరు ద్రవాభిసరణ ప్రక్రియ ద్వారా ప్రవేశిస్తుంది.

48. ఫ్లూరల్ ఫ్లూయిడ్ గుండెను అఘాతాల నుండి కాపాడుతుంది.
జవాబు:
హృదయావరణ కుహరద్రవం గుండెను అఘాతాల నుండి కాపాడుతుంది.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

49. వేర్లు గ్రహించిన నీటిని మరియు పత్రాల ద్వారా తయారుచేసిన ఆహారాన్ని మొక్క యొక్క వివిధ భాగాలకు దారువు మరియు పోషక కణజాలం గల యాంత్రిక కణజాలం ద్వారా సరఫరా చేయబడతాయి.
జవాబు:
వేర్లు గ్రహించిన నీటిని మరియు పత్రాల ద్వారా తయారు చేసిన ఆహారాన్ని మొక్క యొక్క వివిధ భాగాలకు దారువు మరియు పోషక కణజాలం గల నాళికా పుంజం / ప్రసరణ కణజాలం ద్వారా సరఫరా చేయబడతాయి.

జతపరచుట

50. సరిగ్గా జతపరిచిన దానిని గుర్తించండి.
సిస్టోలిక్ పీడనం – 80
సాధారణ రక్తపీడనం – 120/80
డయాస్టోలిక్ పీడనం – 120
జవాబు:
సాధారణ రక్తపీడనం – 120/80

51. తప్పుగా జత చేయబడ్డ దానిని గుర్తించండి.
హార్దిక వలయం – 0.1
సెకను కర్ణికా సంకోచం – 0.11-0.14 సెకన్లు
జఠరిక సంకోచం – 0.27-0.35 సెకన్లు
జవాబు:
హార్దిక వలయం – 0.1 సెకను

52. తప్పుగా జతచేయబడ్డ దానిని గుర్తించండి.
అగ్రత్రయ కవాటం – కుడి కర్ణికా – జఠరికా రంధ్రం
అగ్రద్వయ కవాటం – ఎడమ కర్ణికా – జఠరికా రంధ్రం
పుపుస కవాటాలు – ఎడమ జఠరిక మొదలయ్యే స్థానం
జవాబు:
పుపుస కవాటాలు – ఎడమ జఠరిక మొదలయ్యే స్థానం

53. సరిగ్గా జతపరిచిన దానిని గుర్తించండి.
కర్ణికల సిస్టోల్ – కర్ణికలు మరియు జఠరికలు విశ్రాంతి
జఠరికల సిస్టోల్ – జఠరిక సంకోచం
జఠరికల డయాస్టోల్ – కర్ణికలు మరియు జఠరికల సంకోచం
జవాబు:
జఠరికల సిస్టోల్ – జఠరిక సంకోచం

54. తప్పుగా జతచేయబడ్డ దానిని గుర్తించండి.
కణజాల ద్రవం – శోషరసం
సీరం – రక్త మాతృక
శోషరసం – రక్తం మరియు కణజాలం మధ్య కనెక్షన్
జవాబు:
సీరం – రక్త మాతృక

55. సరిగ్గా జతపరిచిన దానిని గుర్తించండి.
సాధారణ రక్తపీడనం – <120/80 అల్ప రక్తపీడనం – 120/80 అధిక రక్తపీడనం – > 120/80
జవాబు:
అధిక రక్తపీడనం – > 120/80

56. తప్పుగా జతచేయబడ్డ దానిని గుర్తించండి.
ఎఫిడ్స్ – తొండము
Rh కారకం – WBC యొక్క యాంటీజెన్
వేరు – ద్రవాభిసరణ పీడనం
జవాబు:
Rh కారకం – WBC యొక్క యాంటీజెన్

నేను ఎవరు?

57. నేను ఛాతీ కుహరంలో అమరియున్న పియర్ ఆకారంలో ఉన్న అవయవాన్ని. నేను పిండాభివృద్ధి దశలో 21వ రోజు స్పందించడం ప్రారంభిస్తాను.
జవాబు:
హృదయం

58. నేను చేపలలో కనపడే రక్త ప్రసరణను, శరీర భాగాల నుంచి గుండెకు, అక్కడి నుంచి శ్వాసకోశ అవయ వాలకు రక్తం ప్రవహిస్తుంది.
జవాబు:
ఏకవలయ ప్రసరణం

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

59. నేను సిరా వ్యవస్థకు సమాంతరంగా ఏర్పడిన రవాణా వ్యవస్థను. టాన్సిల్స్, అడినాయిడ్స్, ప్లీహం, థైమస్ అనేవి ఆ వ్యవస్థలో భాగాలు.
జవాబు:
శోషరస వ్యవస్థ

60. మొక్కల్లో ఉండే జీవన ప్రక్రియను నేను. ఈ ప్రక్రియలో పత్రాలలో ఉండే పత్రరంధ్రాల ద్వారా మరియు కాండం యొక్క లెంటి సెల్స్ ద్వారా నీరు ఆవిరైపోతుంది.
జవాబు:
బాష్పోత్సేకం

61. రక్తం గడ్డ కట్టడానికి రక్తంలోని రక్తఫలకికలు మరియు ఇతర కారకాలతో పాటుగా అవసరమయ్యే విటమిన్ ని.
జవాబు:
విటమిన్ K

62. నేనొక వర్ణద్రవ్యాన్ని, రక్త వర్ణానికి మరియు శ్వాస వాయువుల రవాణాకు సహాయపడతాను.
జవాబు:
హీమోగ్లోబిన్

63. నేను ఒక కవాటాన్ని. ఎడమ జఠరిక నుండి రక్తాన్ని మహాధమనిలోనికి రక్తం ప్రవేశించడానికి అనుమతిస్తాను.
జవాబు:
మహాధమని కవాటం

64. నేనొక విభాజకాన్ని, కుడి కర్ణిక మరియు ఎడమ కర్ణికను వేరు చేస్తాను.
జవాబు:
కర్ణికాంతర విభాజకం

బొమ్మలపై ప్రశ్నలు

65.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 40
ఈ పరికరం యొక్క ఉద్దేశ్యం ఏమిటి?
జవాబు:
రక్తపోటును కొలవడానికి

66.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 41
ఈ చర్యకు కారణమైన ఎంజైమ్ పేరేమిటి?
జవాబు:
త్రాంబోకైనేజ్

67.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 42
సిరల మధ్య కలుపుతూ ఉన్న రక్తనాళాన్ని గుర్తించండి.
జవాబు:
రక్త కేశనాళికలు

68.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 43
ఈ పటంలోని ఎగువ గదులను ఏమంటారు?
జవాబు:
కర్ణికలు

69.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 44
పటంలో చూపిన వ్యవస్థ ఏమిటి?
జవాబు:
శోషరస వ్యవస్థ

70.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 19
ఈ పటం ఏ ప్రయోగాన్ని సూచిస్తుంది?
జవాబు:
వేరుపీడన ప్రయోగం

ఖాళీలను పూరించండి

71. మానవ శరీరంలో రవాణా ద్రవాలు …………
జవాబు:
రక్తం, శోషరసం

72. రక్తాన్ని పంపు చేయు సాధనం ……..
జవాబు:
గుండె

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

73. ఆమ్లజనిరహిత రక్తం కలిగిన ధమని …..
జవాబు:
పుప్పుస ధమని

74. శరీర భాగాలకు గుండెకు మధ్య జరిగే వలయం …………..
జవాబు:
దైహిక వలయం

75. గుండెలోని కవాటాల సంఖ్య
జవాబు:
4

76. గుండెను చుట్టి ఉండు పొర ………….
జవాబు:
హృదయావరణ త్వచం

77. గుండె ఎడమ వైపు ఉండే రక్తం …..
జవాబు:
ఆమ్లజనిసహిత రక్తం

78. ద్విపత్ర కవాట స్థానము ………
జవాబు:
ఎడమ కర్ణిక జఠరిక రంధ్రము

79. స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ కలిగిన జీవి ……..
జవాబు:
బొద్దింక

80. మొదటిసారిగా రక్తనాళాలు కలిగిన జీవుల వర్గం ……….
జవాబు:
అనిలెడా

81. మొక్కలలో నీటి రవాణా చేయు కణజాలం ……….
జవాబు:
దారువు

82. పోషక కణజాలం పని …………
జవాబు:
ఆహార రవాణా

83. వేరులో నీటిని పీల్చుకొనే నిర్మాణాలు …………
జవాబు:
మూలకేశాలు

84. కాండంలోనికి నీరు ప్రవేశించటానికి తోడ్పడే వత్తిడి …………….
జవాబు:
వేరు పీడనం

85. కీటకాలు ఆహారం సంపాదించటానికి ………… ను దారువులోనికి చొప్పిస్తాయి.జవాబు:
ప్రోబోసిస్

86. రక్తాన్ని గడ్డ కట్టించే విటమిన్ ………..
జవాబు:
విటమిన్ K

87. రక్తాన్ని గడ్డ కట్టించే ప్రోటీన్స్ ………
జవాబు:
తాంబ్రిన్, ప్రోత్రాంబిన్

88. రక్తాన్ని గడ్డ కట్టించే రక్త కణాలు …………
జవాబు:
రక్త ఫలకికలు

89. ఊపిరితిత్తుల నుండి ………… రక్తం గుండెకు చేరుతుంది.
జవాబు:
ఆమ్లజనిసహిత రక్తం

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

90. మానవ శరీరంలో పెద్ద దమని ….
జవాబు:
మహా ధమని

10th Class Biology 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 1 Mark Bits Questions and Answers

1. ఊపిరితిత్తులపై ఉన్న పొరను ప్లూరా అంటారు. అలాగే గుండెపై ఉన్న పొరను ఏమంటారు?
A) హైపర్ కార్డియం
B) పెరికార్డియం
C) ఎపికార్డియం
D) అప్పర్ కార్డియం
జవాబు:
B) పెరికార్డియం

2. మానవుని గుండెలో గదులు
A) 1 కర్ణిక, 1 జఠరిక
B) 2 కర్ణికలు, 1 జఠరిక
C) 1 కర్ణిక, 3 జఠరికలు
D) 2 కర్ణికలు, 2 జఠరికలు
జవాబు:
D) 2 కర్ణికలు, 2 జఠరికలు

3. మొక్కల్లో బాష్పోత్సేకం జరగకపోతే ……….. జరగదు.
A) కిరణజన్య సంయోగక్రియ
B) శ్వాసక్రియ
C) నీటి రవాణా
D) ప్రత్యుత్పత్తి
జవాబు:
C) నీటి రవాణా

4. సామాన్య రక్త పీడనము కొలవడానికి డాక్టరు ఉపయోగించే పరికరం
రక్త పీడనం కొలుచుటకు వాడే పరికరం
A) స్పిగ్మోమానోమీటరు
B) మానోమీటర్
C) హైగ్రోమీటర్
D) బారోమీటర్
జవాబు:
A) స్పిగ్మోమానోమీటరు

5. రక్తనాళాల అడ్డుకోతలో కండర పొర మందంగా క్రింది వానిలో కన్పిస్తుంది ……
a) స్టెతస్కోపు – రెనె లెన్నెక్
b) రక్త పీడనం – థర్మో మీటర్
c) అమీబా – బ్రౌనియన్ చలనం
A) a
B) b
C) c
D) పైవేవీకాదు
జవాబు:
a) స్టెతస్కోపు – రెనె లెన్నెక్

6. మొక్కలలో నీటి రవాణాకు తోడ్పడేది
A) దారు కణజాలం
B) ఉపకళా కణజాలం
C) పోషక కణజాలం
D) స్తంభ కణజాలం
జవాబు:
A) దారు కణజాలం

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

7. ఇచ్చిన ప్రయోగం కింది వానిలో దేనిని గురించి తెలుసుకొనుటకు నిర్వహిస్తారు?
A) వేరు పీడనం
B) కిరణజన్య సంయోగక్రియ
C) శ్వాసక్రియ
D) బాష్పోత్సేకం
జవాబు:
D) బాష్పోత్సేకం

8. నడవడం, పరిగెత్తడం వంటి సమయాలలో రక్త పీడనం ఏ విధంగా ఉంటుంది?
A) సాధారణంగా
B) తక్కువగా
C) ఎక్కువగా
D) పైవేవీ కాదు
జవాబు:
C) ఎక్కువగా

9. గుండెలో ఏ భాగంలో ఉండే రక్తంలో తక్కువ ఆక్సిజన్ ఉంటుంది?
A) కుడి కర్ణిక, కుడి జఠరిక
B) ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక
C) కుడి కర్ణిక, ఎడమ జఠరిక
D) ఎడమ కర్ణిక, కుడి జఠరిక
జవాబు:
A) కుడి కర్ణిక, కుడి జఠరిక

10. పటంలో చూపిన రక్తనాళం రక్తాన్ని శరీర భాగాల నుండి హృదయానికి తీసుకువెళుతుంది. దీని పేరేమి?
A) ధమని
B) రక్తకేశ నాళిక
C) సిర
D) కండర తంతువు
జవాబు:
C) సిర

11. క్రింది వానిలో సరికాని జత ఏది?
i) పుపుస ధమని
ii) పుపుస సిర
iii) బృహద్ధమని
iv) బృహత్సిర
A) i, iii
B) ii, iv
C) i, ii
D) iii, iv
జవాబు:
B) ii, iv

12. ఈ చిత్రంలో చూపబడిన క్రియ
A) బాష్పోత్సేకము
B) కిరణజన్య సంయోగక్రియ
C) శ్వాసక్రియ
D) పోషణ
జవాబు:
A) బాష్పోత్సేకము

13. జతపరచండి.
జాబితా -1 జాబితా – 2
1) కర్ణికల సిస్టోలు ఎ) 0.27 – 0.35 సె.
2) జఠరికల సిస్టోలు బి) 0.8 సె.
3) హార్దిక వలయం సి) 0.11 – 0. 14 సె.
A) 1-బి, 2-ఎ, 3-సి
B) 1-బి, 2-సి, 3-ఎ
C) 1-సి, 2-ఎ, 3-బి
D) 1-సి, 2-బి, 3-ఎ
జవాబు:
C) 1-సి, 2-ఎ, 3-బి

14. క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి.
i) ధమనుల గోడలు మందంగా ఉంటాయి.
ii) ధమనులు గుండె నుండి శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి.
iii) ధమనుల్లో రక్త పీడనం తక్కువ.
iv) పుపుస ధమనిలో ఆమ్లజని సహిత రక్తం ఉంటుంది.
A) (i), (iii)
B) (i), (iv)
C) (ii), (iv)
D) (i), (ii)
జవాబు:
D) (i), (ii)

15. ఏకవలయ రక్తప్రసరణ వ్యవస్థ కల జీవి
A) కప్ప
B) నత్త
C) కోడి
D) చేప
జవాబు:
D) చేప

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

16. ఈ బొమ్మను గుర్తించుము.
A) సిర అడ్డుకోత
B) సిరిక అడ్డుకోత
C) ధమని అడ్డుకోత
D) రక్తకేశ నాళిక అడ్డుకోత
జవాబు:
C) ధమని అడ్డుకోత

17. మొక్కలలో నీటి ప్రసరణకు ఉపయోగపడునది
A) పోషక కణజాలం
B) బాహ్య చర్మం
C) దారువు
D) విభాజ్య కణజాలం
జవాబు:
C) దారువు

18. వేరు పీడనం ప్రయోగం చేసేటప్పుడు నీవు తీసుకునే జాగ్రత్త ఏది?
A) మొక్క కొమ్మలను కలిగి ఉండాలి.
B) మొక్కను చీకటిలో ఉంచాలి.
C) గాజు గొట్టం పరిమాణం, కాండ పరిమాణం ఒకే విధంగా ఉండాలి.
D) గాజు గొట్టం పరిమాణం, కాండం పరిమాణం కన్నా పెద్దదిగా ఉండాలి.
జవాబు:
C) గాజు గొట్టం పరిమాణం, కాండ పరిమాణం ఒకే విధంగా ఉండాలి.

19. రాము యొక్క హృదయ స్పందన రేటు 72/ని. అయిన అతని నాడీ స్పందన రేటు ………..
A) 72/ని. కన్నా ఎక్కువ
B) 72/ని. కన్నా తక్కువ
C) 72/ ని. కు సమానం
D) అంచనా వేయలేం
జవాబు:
C) 72/ ని. కు సమానం

20. సరియైన వాక్యమును గుర్తించుము.
A) అవకాశిక (lumen) ఎక్కువ.
B) ధమనులలో రక్తపీడనం ఎక్కువ.
C) సిరల గోడల మందం ఎక్కువ.
D) ధమనుల్లో కవాటాలుంటాయి.
జవాబు:
B) ధమనులలో రక్తపీడనం ఎక్కువ.

21. సరియైన జతను గుర్తించండి.
i) పుపుస సిర a) ఆమ్లజని రహిత రక్తం
ii) పుపుస ధమని b) కుడి కర్ణిక, కుడి
iii)కరోనరి రక్తనాళాలు c) ఆమ్లజని సహిత రక్తం
iv)అగ్రత్రయ కవాటం d) గుండెకు రక్తం
A) (i) – c, (ii) – a, (iii) – d, (iv) – b
B) (i) – a, (ii) – b, (iii) – c, (iv) – d
C) (i) – c, (ii) – b, (iii) – d, (iv) – a
D) (i) – c, (ii) – a, (iii) – b, (iv) -d
జవాబు:
A) (i) – c, (ii) – a, (iii) – d, (iv) – b

22. కింది బొమ్మను పరిశీలించి అది ఏ వ్యవస్థకు సంబంధించినదో గుర్తించండి.
A) విసర్జక వ్యవస్థ
B) నాడీ వ్యవస్థ
C) శోషరస వ్యవస్థ
D) కండర వ్యవస్థ
జవాబు:
C) శోషరస వ్యవస్థ

23.

జాబితా – Aజాబితా – B
i) రెండు గదుల హృదయంa) కప్ప
ii) మూడు గదుల హృదయంb) ఆవు
iii) నాలుగు గదుల హృదయంc) చేప

A) i – a, ii – c, iii – b
B) i – a, ii – b, iii – c
C) i – c, ii – a, iii – b
D) i – c, ii – b, iii – a
జవాబు:
C) i- c, ii – a, iii – b

24. నాడీ స్పందనను కనుగొనడానికి నీవు తయారుచేసిన పరికరంలో ఉపయోగించిన వస్తువులు
A) దారం మరియు అగ్గిపుల్ల
B) దారం మరియు చొక్కా గుండీ
C) అగ్గిపుల్ల మరియు నాణెం
D) అగ్గిపుల్ల మరియు చొక్కా గుండీ జఠరిక మధ్య
జవాబు:
D) అగ్గిపుల్ల మరియు చొక్కా గుండీ జఠరిక మధ్య

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

25. క్రింది వానిలో రక్తం గడ్డ కట్టుటలో పాత్ర లేనిది
A) ఫిల్లో క్వినోన్
B) ఫైబ్రిన్ అందించడం
C) థ్రాంబిన్
D) థైమిన్
జవాబు:
D) థైమిన్

మీకు తెలుసా?

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 25 AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 28
• మానవునిలో ఒక మిల్లీలీటరు రక్తం గుండె నుండి కాలి చివరి వరకు వెళ్ళి తిరిగి గుండెకు చేరడానికి అంటే సుమారు 2 మీటర్ల దూరం ప్రయాణించడానికి సుమారుగా 60 సెకన్ల సమయం పడుతుంది. ఇదే రక్తాన్ని వ్యాపన పద్దతిలో ఇంతదూరం ప్రయాణించటానికి సుమారుగా 60 సంవత్సరాల కాలం పడుతుంది.

మొక్కల ద్వారా ఎంత నీరు బాష్పోత్సేకం చెందుతుంది? ఏపుగా పెరిగిన ఒక మొక్కజొన్న మొక్క వారానికి 15 లీటర్ల నీరు బాష్పోత్సేకం ద్వారా వాతావరణంలోకి పంపుతుంది. ఒక ఎకరం విస్తీర్ణంలోని మొక్కజొన్న తోట నుండి 13,25,000 లీటర్ల నీరు ఆవిరి అవుతుంది. ఒక పెద్ద మామిడి చెట్టు వసంతకాలంలో రోజుకు 750 నుండి 3,500 లీటర్ల నీటిని బాష్పోత్సేకం ద్వారా బయటకు పంపుతుంది.

పునశ్చరణ
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 45

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

These AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ will help students prepare well for the exams.

AP Board 10th Class Biology 2nd lesson Important Questions and Answers శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

10th Class Biology 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
పులిసిన ఇడ్లీ, దోసె నుండి వాసన వస్తుంది. అందుకు కారణమైన సూక్ష్మజీవి ఏది?
జవాబు:
పులిసిన ఇడ్లీ, దోసె నుండి వాసన వస్తుంది. దీనికి కారణమైన సూక్ష్మజీవి – ఈస్ట్.

ప్రశ్న 2.
గ్లూకోజ్ విచ్ఛిన్నం చెందడం వలన విడుదలయిన శక్తి ఏ పదార్ధ రూపంలో నిల్వ ఉంటుంది?
జవాబు:
“ATP” (అడినోసిన్ టైఫాస్ఫేట్).

ప్రశ్న 3.
క్రింది పటంలో a, b లను గుర్తించండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 1
(a) మాత్రిక (b) క్రిస్టే

ప్రశ్న 4.
అవాయు మరియు వాయు సహిత శ్వాసక్రియలలో ఏర్పడే అంత్య ఉత్పన్నాలు ఏవి?
జవాబు:
వాయు సహిత శ్వాసక్రియలో ఏర్పడే అంత్య ఉత్పన్నాలు : కార్బన్ డై ఆక్సైడ్ (CO2), నీరు, శక్తి

అవాయు సహిత శ్వాసక్రియలో ఏర్పడే అంత్య ఉత్పన్నాలు : ఇథనాల్ / లాక్టిక్ ఆమ్లం, కార్బన్ డై ఆక్సైడ్, శక్తి

ప్రశ్న 5.
మానవ కండరాలలో అవాయు శ్వాసక్రియ వల్ల ఏ రసాయనం ఏర్పడుతుంది?
జవాబు:
మానవ కండరాలలో అవాయు శ్వాసక్రియ వల్ల ఏర్పడే రసాయనం : లాక్టిక్ ఆమ్లం

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

ప్రశ్న 6.
అవాయు శ్వాసక్రియ ప్రయోగంలో గ్లూకోజ్ ద్రావణానికి డయాజీన్ గ్రీన్ ద్రావణాన్ని ఎందుకు కలుపుతారు?
జవాబు:
గ్లూకోజ్ ద్రావణములో ఆక్సిజన్ వుందో, లేదో తెలుసుకొనుటకు ఉపయోగిస్తారు.

ప్రశ్న 7.
బొమ్మ దేనిని గురించి తెలుపుతుంది?
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 2
జవాబు:
వాయుగత వేళ్ళు / శ్వాస వేళ్ళు / నిమాటోపోర్స్ / మడ చెట్టు వేళ్ళు / మాంగ్రూవ్ చెట్టు వేళ్ళు

ప్రశ్న 8.
శ్వాసక్రియ అనగానేమి?
జవాబు:
ఆహార పదార్థాలను ఆక్సీకరణం చెందించి శక్తిని వెలువరించే ప్రక్రియను శ్వాసక్రియ అంటారు.

శ్వాసక్రియ Respiration అనే పదం Respire అనే లాటిన్ పదం నుండి ఏర్పడింది. దీని అర్థం ‘పీల్చడం’ అయితే , శ్వాసక్రియ ఉచ్ఛ్వాస, నిశ్వాసలనే కాకుండా కణాలలో ఆక్సిజన్ వినియోగించబడటం వరకు ఉండే అన్ని దశలను కలిపి సూచిస్తుంది.
C6H12O6 + 6O2 → 6CO2 + 6H2O + 686 K.Cal

ప్రశ్న 9.
ఊపిరితిత్తులలోని శ్వాస కదలికకు తోడ్పడే నిర్మాణాలు ఏమిటి?
జవాబు:
ఊపిరితిత్తులు తమంతటతాముగా గాలిని లోపలకు తీసుకోవడంగాని, బయటకు పంపడంగాని చేయలేవు. ఛాతీ కండరాలు మరియు ఉరఃకుహరాన్ని, ఉదరకుహరాన్ని వేరుచేసే కండరయుతమైన ఉదరవితానం (diaphragm) అనే పొర ఊపిరితిత్తులలోనికి గాలి రావడానికి, బయటకు పోవడానికి సహాయపడతాయి.

ప్రశ్న 10.
మానవ ఊపిరితిత్తుల సామర్థ్యం ఎంత?
జవాబు:
మానవుని ఊపిరితిత్తుల సామర్థ్యం 5800 మిల్లీ లీటర్లు. విశ్రాంతి దశలో మనం సుమారుగా 500 మి.లీ గాలిని లోపలకు తీసుకుని బయటకు వదులుతాం. మనం పూర్తిగా ఊపిరితిత్తులలోని గాలిని బయటకు పంపినప్పటికీ ఇంకా 1200 మి.లీ. వాయువు ఊపిరితిత్తులలో మిగిలే ఉంటుంది.

ప్రశ్న 11.
కణశ్వాసక్రియ అనగానేమి?
జవాబు:
శరీరంలోని జరిగే వివిధ జీవక్రియలకు అవసరమైన శక్తిని ఆహార పదార్థాలలో గల రసాయన బంధాలను విడగొట్టడం ద్వారా విడుదల చేసే వివిధ రసాయన చర్యల సమాహారాన్ని కణశాస్వక్రియ (Cellular respiration) అంటారు. ఇది కణస్థాయిలో జరుగుతుంది.

ప్రశ్న 12.
చర్మీయ శ్వాసక్రియ అనగానేమి? అది ఏ జీవులలో జరుగుతుంది?
జవాబు:
చర్మం ద్వారా జరిగే వాయు మార్పిడిని చర్మీయ శ్వాసక్రియ అంటారు. ఉదా : కప్ప, వానపాము, జలగ

ప్రశ్న 13.
స్థిరమైన వాయువు అని దేనికి పేరు? దీనిని ఎలా గుర్తిస్తారు?
జవాబు:
స్థిరవాయువు :
కార్బన్ డై ఆక్సైడ్ ను స్థిరమైన వాయువు లేదా బొగ్గుపులుసు వాయువు అంటారు. సున్నపు తేటను తెల్లగా మార్చే గుణం ఆధారంగా CO2 ను గుర్తిస్తారు.

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

ప్రశ్న 14.
ఖర్చు అయ్యే వాయువు అని దేనికి పేరు?
జవాబు:
పదార్థాలు మండించినపుడు, జీవులు శ్వాసించినపుడు ఈ వాయువు ఖర్చు అయ్యేది. కనుక ఆక్సిజన్ ను ఖర్చు అయ్యే వాయువు (Vitiated air) అని భావించారు.

ప్రశ్న 15.
శ్వాసక్రియలోని రకాలు ఏమిటి?
జవాబు:
శ్వాసక్రియలోని రకాలు : శ్వాసక్రియ ప్రధానంగా రెండు రకాలు. అవి:

  1. అవాయు శ్వాసక్రియ
  2. వాయుసహిత శ్వాసక్రియ.

ప్రశ్న 16.
శ్వాసక్రియలోని దశలు ఏమిటి?
జవాబు:
శ్వాసక్రియ దశలను రెండు రకాలుగా విభజిస్తారు. అవి:

  1. బాహ్య శ్వాసక్రియ
  2. అంతర శ్వాసక్రియ.

బాహ్య శ్వాసక్రియలో ఎ) ఉచ్ఛ్వాసం బి) నిశ్వాసం అనే దశలు ఉంటాయి. అంతర శ్వాసక్రియలో ఎ) గ్లైకాలసిస్ బి) క్రెట్స్ వలయం/కిణ్వణం అనే దశలు ఉంటాయి.

ప్రశ్న 17.
మానవుని శ్వాసవ్యవస్థలో గాలి ప్రసరణ మార్గాన్ని చూపించండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 3

ప్రశ్న 18.
ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక ప్రమాణాలు ఏమిటి?
జవాబు:
వాయుగోణులు ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక ప్రమాణాలు.

ప్రశ్న 19.
ఊపిరితిత్తుల యొక్క ప్రత్యేకత ఏమిటి?
జవాబు:
మన శరీర అవయవాలలో నీటిపైన తేలే ఒక అవయవం ఊపిరితిత్తులు. ఇవి బెలూన్ లాగా వ్యాకోచించే సామర్థ్యంతో 1200 మి.లీ వాయువును ఎప్పుడూ కలిగి ఉంటాయి. వీటి పూర్తి సామర్థ్యం 5900 మి.లీ.

ప్రశ్న 20.
శ్వాస కదలికలో తోడ్పడే నిర్మాణాలు ఏమిటి?
జవాబు:
పురుషుల శ్వాసకదలికలో ఉదరవితానం, స్త్రీల శ్వాసకదలికలో ప్రక్కటెముకలు ప్రముఖపాత్రను వహిస్తాయి.

ప్రశ్న 21.
ఊపిరితిత్తులు ఎలా రక్షించబడతాయి?
జవాబు:
ఊపిరితిత్తులకు చుట్టూ ప్లూరా అనే రెండు పొరలు ఉంటాయి. ఈ రెండు పొరల మధ్య ఉన్న ద్రవం ఊపిరితిత్తులను అఘాతాల నుండి కాపాడుతుంది.

ప్రశ్న 22.
కణ శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది?
జవాబు:
కేంద్రక పూర్వజీవులైన బాక్టీరియాలలో కణ శ్వాసక్రియ కణద్రవ్యం (Cytoplasm) లో జరుగుతుంది. నిజకేంద్రక జీవులలో శ్వాసక్రియలోని కొంతభాగం (గ్లైకాలసిస్) కణద్రవ్యంలోనూ, మరికొంతభాగం (క్రెట్స్ వలయం) మైటోకాండ్రియాలో జరుగుతుంది.

ప్రశ్న 23.
కణశక్త్యాగారాలు అని వేటికి పేరు?
జవాబు:
శ్వాసక్రియలో శక్తి మైటోకాండ్రియాలలో వెలువడుతుంది. అందువలన మైటోకాండ్రియాలను “కణశక్త్యాగారాలు” అంటారు.

ప్రశ్న 24.
అవాయు శ్వాసక్రియ అంత్య ఉత్పన్నాలు ఏమిటి?
జవాబు:
అవాయు శ్వాసక్రియలో లాక్టిక్ ఆమ్లం / ఇథనాల్, CO2, శక్తి వెలువడతాయి.

ప్రశ్న 25.
శ్వాసక్రియకు, దహన క్రియకు గల పోలికలు ఏమిటి?
జవాబు:

  1. శ్వాసక్రియ మరియు దహనక్రియ రెండూ ఆక్సీకరణ చర్యలు.
  2. ఈ రెండు క్రియలలో శక్తి వెలువడుతుంది.

ప్రశ్న 26.
వాయునాళ శ్వాసక్రియ ఏ జీవులలో ఉంటుంది?
జవాబు:
ఆర్రోపొడ వర్గానికి చెందిన కీటకాలు వాయునాళ వ్యవస్థ ద్వారా శోషిస్తాయి.
ఉదా : బొద్దింక, మిడతలు

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

ప్రశ్న 27.
జల శ్వాసక్రియ అనగానేమి?
జవాబు:
కొన్ని జలచర జీవులు మొప్పల ద్వారా శోషిస్తాయి. ఈ శ్వాసక్రియను “మొప్పల శ్వాసక్రియ లేదా జలశ్వాసక్రియ” అంటారు.
ఉదా : చేప

ప్రశ్న 28.
చర్మీయ శ్వాసక్రియ అనగానేమి?
జవాబు:
చర్మం ద్వారా జరిగే శ్వాసక్రియను “చర్మీయ శ్వాసక్రియ” అంటారు.
ఉదా : వానపాము, జలగ

ప్రశ్న 29.
శ్వాసవేర్లు ఏ మొక్కలలో ఉంటాయి?
జవాబు:
బురద నేలలలో పెరిగే మొక్కలు, మాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థలోని మొక్కలు శ్వాసవేర్లు కలిగి ఉంటాయి.

ప్రశ్న 30.
లెంటిసెల్స్ అనగానేమి?
జవాబు:
కాండం మీద ఉన్న పత్రరంధ్రాలను “లెంటిసెల్స్” అంటారు. ఇవి వాయు వినిమయానికి తోడ్పడతాయి.

ప్రశ్న 31.
జీవక్రియలు అనగానేమి?
జవాబు:
జీవ కణాలలో జరిగే రసాయనిక చర్యలను “జీవక్రియలు” అంటారు.
ఉదా : శ్వాసక్రియ, జీర్ణక్రియ.

ప్రశ్న 32.
ఆక్సిజన్ సహిత రక్తం, ఆక్సిజన్ రహిత రక్తం కంటే ఎలా భిన్నంగా ఉంటుంది?
జవాబు:
ఆక్సిజన్ సహిత రక్తం, ప్రకాశవంతమైన ఎరుపురంగులో ఉండి ఆక్సిజన్ రహిత రక్తం కంటే భిన్నంగా ఉంటుంది.

ప్రశ్న 33.
రక్తంలోని ఏ పదార్థం వాయు రవాణాలో పాల్గొంటుంది?
జవాబు:
రక్తంలోని ‘హిమోగ్లోబిన్’ O2 ను CO2 ను రవాణా చేస్తుంది. ఆక్సిజన్ తో కలిసినపుడు ఆక్సీహిమోగ్లోబినను, CO2 తో కలిసినపుడు కార్బాక్సీహిమోగ్లోబిన్ ను ఏర్పరుస్తుంది.

ప్రశ్న 34.
శ్వాసక్రియలో ఏర్పడే పదార్థాలు ఏమిటి?
జవాబు:
శ్వాసక్రియలో ఏర్పడే పదార్థాలు :
శ్వాసక్రియలో CO2 నీరు, శక్తి విడుదల అవుతాయి.

ప్రశ్న 35.
క్రీడాకారులు ఎక్కువ దూరం ఎలా పరిగెత్తగల్గుతారు?
జవాబు:
ఎక్కువ దూరం పరిగెత్తే క్రీడాకారులు నిరంతరం శ్వాసిస్తూ ఉండటం వలన వీరు పరిగెత్తే సమయంలోనే కొంత లాక్టిక్ ఆమ్లం తొలగించబడటం వలన ఎక్కువ సమయం అలసిపోకుండా పరిగెత్తగల్గుతారు.

ప్రశ్న 36.
ఎక్కువ శ్రమచేసినపుడు కండరాలు ఎందుకు నొప్పి పెడతాయి?
జవాబు:
శారీరక శ్రమ సమయంలో తగినంత ఆక్సిజన్’ లభ్యత లేనప్పుడు కండరాలు అవాయు పద్దతిలో శ్వాసిస్తాయి. అందువలన కండరాలలో లాక్టిక్ ఆమ్లం ఏర్పడి నొప్పి కలుగుతుంది.

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

ప్రశ్న 37.
దహనం, శ్వాసక్రియ దాదాపుగా ఒకే విధమైన చర్యలు అనవచ్చా? దీనికి నీకున్న ఆధారాలు ఏమిటి?
జవాబు:

  1. దహనం మరియు శ్వాసక్రియనందు చక్కెర అయిన గ్లూకోజు కార్బన్ డై ఆక్సైడ్ మరియు నీరుగా మారుతుంది.
  2. రెండు క్రియలకు ఆక్సిజన్ తప్పనిసరిగా అవసరం.
  3. శ్వాసక్రియ, దహనం రెండూ శక్తిని విడుదల చేసే ప్రక్రియలు.

10th Class Biology 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
a) ఈ ప్రయోగంలో సున్నపుతేటను పాలవలె మార్చే వాయువు ఏది ?
జవాబు:
బొగ్గుపులుసు వాయువు లేదా CO2.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 4

b) మన చుట్టూ ఉన్న గాలితో పోల్చినపుడు మనం బయటకు వదిలే గాలిలో ఏ వాయువు తక్కువ పరిమాణంలో ఉంది?
జవాబు:
ఆక్సిజన్ లేదా ఆమ్లజని లేదా O2.

ప్రశ్న 2.
మానవులలో ఉపజిహ్విక లేకపోతే ఏమి జరగవచ్చు?
జవాబు:

  1. కంఠబిలం ద్వారా స్వర పేటికలోనికి ఆహారం ప్రవేశిస్తుంది.
  2. ఊపిరితిత్తులలోనికి ఆహారం ప్రవేశిస్తుంది. దాని వల్ల ప్రాణాపాయం కలుగుతుంది. 3) సరిగ్గా మాట్లాడలేము.
  3. గాలి, ఆహార మార్గాల నియంత్రణ సరిగ్గా జరగదు.

ప్రశ్న 3.
మొక్కలు పగలు కిరణజన్య సంయోగక్రియను జరుపుతాయి. రాత్రి శ్వాసక్రియను జరుపుతాయి అని బాలు చెప్పాడు. అతనితో నీవు ఏకీభవిస్తావా, లేదా ? ఎందుకు ?
జవాబు:

  1. నేను, బాలు అభిప్రాయంతో ఏకీభవించటం లేదు.
  2. ఎందుకంటే కిరణజన్య సంయోగక్రియ జరుగుటకు కాంతిశక్తి అవసరం అవుతుంది. కాని, శ్వాసక్రియ కాంతి మీద ఆధారపడదు.
  3. కావున కిరణజన్య సంయోగక్రియ పగటిపూట మాత్రమే జరుగుతుంది. శ్వాసక్రియ పగలు, రాత్రి కూడా జరుగుతుంది.

ప్రశ్న 4.
నీవు ఊపిరితిత్తుల వ్యాధుల నిపుణుడిని కలిసినప్పుడు శ్వాస సంబంధ వ్యాధుల గురించి ఎటువంటి ప్రశ్నలు అడుగుతావు?
జవాబు:

  1. శ్వాస సంబంధ వ్యాధుల లక్షణాలను తెల్పండి.
  2. శ్వాస సంబంధ వ్యాధుల నుండి రక్షించుకొనుటకు నేను ఏ జాగ్రత్తలు పాటించాలి?
  3. పొగత్రాగడం ఊపిరితిత్తులకు ఏ విధంగా హానిచేస్తుంది?
  4. సాధారణంగా మానవులకు కలిగే శ్వాససంబంధిత వ్యాధులు ఏవి?

ప్రశ్న 5.
అవాయు శ్వాసక్రియలో ఉష్ణం, కార్బన్ డై ఆక్సైడ్ వెలువడునని నిరూపించే ప్రయోగానికి అవసరమైన రెండు రసాయనాలు, రెండు పరికరాలను రాయండి.
జవాబు:
రసాయనాలు :
1. గ్లూకోజ్ ద్రావణం, 2. పారాఫిన్ ద్రావణం, 3. డయాజీన్ గ్రీన్ (జానస్ గ్రీన్ బి), 4. సున్నపు నీరు/ బైకార్బొనేట్ ద్రావణం / సూచికా ద్రావణం

పరికరాలు :
1. థర్మామీటర్, 2. ప్లాస్క్ (సీసా), 3. పరీక్ష నాళిక, 4. రబ్బరు బిరడాలు, 5. డెలివరీ గొట్టము

ప్రశ్న 6.
ఊపిరితిత్తులలోని వాయుగోణుల పరిమాణం ఎంత?
జవాబు:
ఊపిరితిత్తుల లోపలి భాగం లక్షల సంఖ్యలో ఉండే వాయుకోశ గోణులను కలిగి ఉండి, వాయుమార్పిడి జరిగే వైశాల్యాన్ని పెంచుతుంది. ఊపిరితిత్తులలోని లోపలి పొర ఎక్కువగా ముడుతలుపడి ఉండడం వలన వాటి వైశాల్యం చాలా ఎక్కువగా ఉంటుంది. మన ఊపిరితిత్తులలోని వాయుకోశ గోణులన్నింటినీ విడదీసి పరిస్తే దాదాపు 160 చదరపు మీటర్లు (ఒక టెన్నిస్ కోర్టు) వైశాల్యాన్ని ఆక్రమిస్తాయి.

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

ప్రశ్న 7.
ఉపజిహ్విక అనగానేమి? దాని ప్రాధాన్యత ఏమిటి?
జవాబు:

  1. గ్రసనిలో కంఠబిలంపై ఉండే మూత వంటి నిర్మాణాన్ని ఉపజిహ్విక అంటారు. ఇది గ్రసనిలో ఉంటుంది.
  2. స్వరపేటికలోనికి ఆహారం పోకుండా ఉపజిహ్విక ఆహారం వాయువుల కదలికను క్రమబద్ధీకరిస్తుంది.
  3. ఉపజిహ్విక అనే కవాటం మనం ఆహారాన్ని మ్రింగే సమయంలో పాక్షికంగా కంఠబిలాన్ని’ మూసి ఉంచి ఆహారం శ్వాసవ్యవస్థలోనికి ప్రవేశించకుండా గొంతులోనికి పోయే విధంగా దారి మళ్ళిస్తుంది.
  4. మనం శ్వాసించే సమయంలో ఉపజిహ్విక పూర్తిగా తెరుచుకొని గాలి శ్వాసమార్గం ద్వారా ఊపిరితిత్తులలోనికి ప్రవేశిస్తుంది.
  5. ఉపజిహ్విక సక్రమంగా పనిచేస్తూ వాయు, ఆహార మార్గాల ద్వారా గాలి ఆహార కదలికను సక్రమంగా అమలు చేయడానికి నాడీ నియంత్రణ చాలా అవసరం.

ప్రశ్న 8.
ఉచ్ఛ్వాసం, నిశ్వాసంలలో ఉదరవితానం పాత్ర ఏమిటి?
జవాబు:
ఉరఃకుహరాన్ని ఒక గదిగా ఊహించుకుంటే ఉదరవితానం ఆ గది కింది భాగం అవుతుంది. ఉదరవితానం విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు గొడుగు ఆకారంలో ఉంటుంది. గొడుగు ఉబ్బెత్తు భాగం ఉరఃకుహరం వైపునకు ఉంటుంది. ఉదరవితాన కండరాలు సంకోచించినపుడు అది చదునుగా తయారై ఉబ్బెత్తు భాగం కిందకు వస్తుంది. దీని వలన ఉరఃకుహర ఘనపరిమాణం పెరుగుతుంది.

ఉరఃకుహరం ఘనపరిమాణం పెరిగినపుడు, దాని లోపలి పీడనం తగ్గి గాలి బయటి నుండి నాసికారంధ్రాల ద్వారా ఊపిరితిత్తులలోనికి ప్రవేశిస్తుంది. దీనినే “ఉచ్ఛ్వాసం” అంటారు.

తరువాత దీనికి విపర్యం (వ్యతిరేకంగా) జరుగుతుంది. ఛాతి యథాస్థానానికి చేరుకుంటుంది. ఉదరవితాన కండరాలు విశ్రాంతి దశకు చేరుకోవడం వల్ల తిరిగి గొడుగు ఆకారానికి వస్తుంది. ఉరఃకుహరంలో ఒత్తిడి పెరుగుతుంది. ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరగడం వలన లోపలి గాలి వాయుమార్గం ద్వారా బయటకు వెళుతుంది. దీనినే “నిశ్వాసం” అంటారు.

ప్రశ్న 9.
ఊపిరితిత్తుల గురించి రాయండి.
జవాబు:
మన ఊపిరితిత్తులు ‘స్పాంజి’లాగా ఉంటాయి. ఇవి రెండూ ఒకే పరిమాణంలో ఉండవు. ఉరఃకుహరంలో ఎడమవైపు గుండె ఉండటం వలన ఆ వైపున ఉన్న ఊపిరితిత్తి కొంచెం చిన్నదిగా ఉంటుంది. ఊపిరితిత్తులను కప్పుతూ ‘ఫ్లూరా’ అనే రెండు పొరలుంటాయి. ఈ పొరల మధ్యలో ద్రవం ఉండి ఊపిరితిత్తులను ఆఘాతాల నుండి కాపాడుతుంది. ఊపిరితిత్తులు గాలితో నిండేటప్పుడు, యథాస్థితికి వచ్చేటప్పుడు జరిగే ఘర్షణ నుండి కాపాడుతుంది.

ప్రశ్న 10.
శ్వాసక్రియ రేటును ప్రభావితం చేసే కారకాలు ఏమిటి?
జవాబు:
మనం విశ్రాంతి తీసుకునే సమయంలో మన శ్వాస నెమ్మదిగాను, తక్కువ (Shallow) ఒత్తిడితోను జరుగుతుంది. పరిగెత్తడం, వ్యాయామం చేయడం వంటి పనులుచేసే సమయంలో వేగంగాను, గాఢంగాను (ఎక్కువ ఒత్తిడితో) జరుగుతుంది. నిజానికి ఉచ్ఛ్వాస, నిశ్వాస పద్ధతులు విస్తృతమైన తారతమ్యాన్ని చూపుతాయి. భయపడినపుడు, ఆందోళనగా ఉన్నప్పుడు శ్వాసక్రియ రేటు పెరగటం మనకు అనుభవమే.

ప్రశ్న 11.
మైటోకాండ్రియాను కణశక్త్యాగారాలు అంటారు. ఎందుకు?
జవాబు:

  1. కేంద్రక పూర్వజీవులైన బాక్టీరియాలలో కణ శ్వాసక్రియ కణ ద్రవ్యం (cytoplasm) లో జరుగుతుంది.
  2. నిజకేంద్రక జీవులలో శ్వాసక్రియలోని కొంత భాగం కణద్రవ్యంలోను, మరికొంత భాగం మైటోకాండ్రియాలోను జరుగుతుంది.
  3. ఈ చర్యలో విడుదలైన శక్తి ఎ.టి.పి రూపంలో నిల్వ ఉంటుంది.
  4. అందువల్ల మైటోకాండ్రియాలను కణశక్యాగారాలు (Power houses of energy) అంటారు.

ప్రశ్న 12.
ఎనర్జీ కరెన్సీ అనగానేమి? దాని శక్తి విలువ ఎంత?
జవాబు:
1) ఎనర్జీ కరెన్సీ :
గ్లూకోజ్ విచ్ఛిన్నం చెందడం వల్ల విడుదలైన శక్తి అడినోసిన్ ట్రై ఫాస్ఫేట్ (ATP) అనే ప్రత్యేక పదార్థ రూపంలో నిల్వ ఉంటుంది. ఇది చిన్న మొత్తాల్లో ఉండే రసాయన శక్తి. దీనికి కణం యొక్క ‘ఎనర్జీ కరెన్సీ’ అంటారు.

2) ఇలా నిల్వ ఉన్న శక్తి కణంలో అవసరమైన చోటికి రవాణా అవుతుంది. ప్రతి ATPలో 67200 కాలరీల శక్తి నిల్వ ఉంటుంది. ఈ శక్తి ఫాస్ఫేట్ బంధాల రూపంలో నిల్వ ఉంటుంది. ఈ బంధాలు విడిపోయినపుడు శక్తి విడుదలవుతుంది.

ప్రశ్న 13.
గ్లూకోజ్ నుండి శక్తి ఎలా విడుదలవుతుంది?
జవాబు:
మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులన్నింటిలో శక్తి విడుదల కొరకు సాధారణంగా వినియోగించబడే పదార్థం గ్లూకోజ్. అన్ని జీవులలోను గ్లూకోజ్ రెండు దశలలో ఆక్సీకరింపబడుతుంది. మొదటి దశలో గ్లూకోజ్ రెండు పైరూవిక్ ఆమ్ల అణువులుగా విడగొట్టబడుతుంది. రెండవ దశలో ఆక్సిజన్ లభ్యమైనట్లయితే పైరూవిక్ ఆమ్లం కార్బన్ డై ఆక్సైడ్, నీరుగా ఆక్సీకరింపబడుతుంది. దీనితో పాటు ఎక్కువ పరిమాణంలో శక్తి విడుదలవుతుంది.

ప్రశ్న 14.
ఆక్సిజన్ లోటు అనగానేమి? అది ఎలా ఏర్పడుతుంది?
జవాబు:
మనం శారీరక శ్రమ ఎక్కువగా చేసినపుడు కణాలలో శక్తి కొరకు అవాయు శ్వాసక్రియ రేటు పెరుగుతుంది. ఫలితంగా కండరాలలో లాక్టిక్ ఆమ్లం పేరుకుపోయి కండరాలు అలసటకు లోనౌతాయి. తిరిగి కండరాలు సాధారణ స్థితికి రావటానికి లాక్టిక్ ఆమ్లం తొలిగించవలసిన అవసరం ఉంది. దీని కొరకు కండరాలకు ఆక్సిజన్ కావాలి. కండరాలు ఆక్సిజనన్ను కోరుకునే ఈ స్థితిని ‘ఆక్సిజన్ లోటు’ అంటారు.

ప్రశ్న 15.
చక్కెర ద్రావణం నుండి ఇథనాల్ ఎలా తయారుచేస్తారు?
జవాబు:
చక్కెర ద్రావణం, ఈ మిశ్రమాన్ని కదిలించకుండా, ఆక్సిజన్ లభ్యం కాకుండా ఉంచితే, కొంచెం సేపటి తరువాత దాని నుండి ఒక ప్రత్యేకమైన వాసన వస్తుంది. దీనికి కారణం ఈస్ట్ చక్కెర ద్రావణాన్ని ఉపయోగించుకొని తయారుచేసిన ఇథనాల్ అనే కొత్త పదార్థం. చక్కెర ఈస్ట్ ద్రావణం నుండి అంశిక స్వేదనం (Fractional distillation) అనే ప్రక్రియ ద్వారా ఇథనాలను వేరుచేయవచ్చు. చక్కెర ద్రావణం కంటే ఇథనాల్ తక్కువ ఉష్ణోగ్రత (70°C) వద్దనే మరగడం వలన ఇది సాధ్యమవుతుంది.

ప్రశ్న 16.
ఎక్కువ శారీరక శ్రమ చేసినపుడు, మనం అలసిపోతాం. ఎందుకు?
జవాబు:
పరుగెత్తడం వంటి ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పనులు చేయడానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. కాబట్టి శ్వాసక్రియరేటు కూడా పెరుగుతుంది. అయితే వెలువడే ఉష్ణం పరిమాణం కూడా పెరుగుతుందన్నమాట. అందువలననే మనకు శరీరం నుండి ఆవిరి వస్తున్న భావన కలుగుతుంది.

శారీరక శ్రమ సమయంలో తగినంత ఆక్సిజన్ లభ్యత లేనపుడు కండరాలు అవాయు పద్ధతిలో శ్వాసిస్తాయి. అందువలన ‘లాక్టిక్ ఆమ్లం’ విడుదలవుతుంది. ఇలా ఏర్పడిన లాక్టిక్ ఆమ్లం కండరంలో పేరుకొనిపోయినపుడు కండరాలలో నొప్పి కలుగుతుంది. ఈ నొప్పి మనకు అలసిన అనుభూతిని కలిగిస్తుంది. కొంత విశ్రాంతి తరువాత తిరిగి మనం సాధారణ స్థితికి వస్తాం.

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

ప్రశ్న 17.
శరీర కుడ్యం ద్వారా శ్వాసించే జీవులు ఏవి?
జవాబు:
అమీబా వంటి ఏక కణజీవులు, హైడ్రా, ప్లనేరియన్లు, గుండ్రటి పురుగులు, వానపాములు వంటి బహుకణ జీవులు శరీర కుడ్యం ద్వారా వ్యాపన పద్ధతిలో ఆక్సిజన్‌ను గ్రహించడం, కార్బన్ డై ఆక్సైడ్ ను విడుదల చేయడం నిర్వహిస్తాయి.

ప్రశ్న 18.
వాయునాళ వ్యవస్థ గురించి రాయండి.
జవాబు:
బొద్దింక, మిడతల వంటి కీటకాల్లో వాయునాళ వ్యవస్థ ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. వాయునాళ వ్యవస్థలో వాయునాళాలు అనే గొట్టాలు శరీరమంతటా అమర్చబడి ఉంటాయి. వాయునాళాలు, వాయునాళికలుగా చీలి కణాలకు ఆక్సిజన్‌ను నేరుగా అందిస్తాయి.

ప్రశ్న 19.
మొసలి, డాల్ఫిన్ వంటి జలచరాలు ఏ విధంగా శ్వాసిస్తాయి?
జవాబు:
మొసలి, డాల్సిన్ వంటి జలచరాలు ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తాయి. కావున ఇవి గాలి కోసం తరచుగా నీటి నుండి బయటకు వస్తుంటాయి. మొసలి, డాల్ఫిన్స్ ఒకప్పుడు భూచర జీవనం గడిపి, తిరిగి నీటి ఆవాసాలలోనికి వెళ్ళటం వలన అనుకూలనాలను అభివృద్ధి చేసుకొన్నాయి. భూచర జీవులు కొన్ని తిరిగి జలావాసాలలోనికి ప్రవేశించాయనటానికి ఈ జీవులు నిదర్శనాలు.

ప్రశ్న 20.
మొక్కలలో శ్వాసక్రియకు తోడ్పడే నిర్మాణాలు ఏమిటి?
జవాబు:

  1. మొక్కలలో పత్రాలలో ఉండే పత్రరంధ్రాల ద్వారా వాయు వినిమయం జరుగుతుంది.
  2. పత్రరంధ్రాలతోపాటుగా ఇంకా కొన్ని భాగాలు వాయు వినిమయం జరుపుతాయి.
  3. వేర్ల ఉపరితలం కాండం మీద ఉండే ‘లెంటిసెల్స్’ కణవాయు వినిమయంలో పాల్గొంటాయి.
  4. మడ అడవులుగా పిలువబడే మాంగ్రూవ్ మొక్కలలో శ్వాసక్రియ కోసం ‘శ్వాసవేళ్ళు’ (Aerial roots) అనే ప్రత్యేక నిర్మాణాలు ఉంటాయి. ఆర్కిడ్ జాతి మొక్కలలో శ్వాసక్రియ కోసం ప్రత్యేక కణజాలం ఉంటుంది.

ప్రశ్న 21.
శ్వాసక్రియలోని రకాలు ఏమిటి?
జవాబు:
ఆక్సిజన్ ప్రమేయం బట్టి శ్వాసక్రియ రెండు రకాలు. అవి:
1. వాయుసహిత శ్వాసక్రియ :
పెద్దజీవులలో జరుగుతుంది. అధిక శక్తి వెలువడును. గ్లైకాలసిస్, క్రెట్స్ వలయం అనే దశలు ఉంటాయి.

2. అవాయు శ్వాసక్రియ :
ఆక్సిజన్ అవసరం ఉండదు. తక్కువ శక్తి వెలువడుతుంది. గ్లైకాలసిస్, కిణ్వణం అనే దశలు ఉంటాయి.

ప్రశ్న 22.
ప్రక్క పటాన్ని పరిశీలించండి.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 5
అ) ఈ పటం ఏ జీవ వ్యవస్థకు సంబంధించినది?
ఆ) A, B భాగాల పేర్లు రాయండి.
ఇ) అవి ఏయే వ్యవస్థలతో అనుసంధానమై ఉంటాయి?
ఈ) ఇక్కడ జరిగే ప్రక్రియ ఏమిటి? దాని ఫలితంగా ఏమి జరుగుతుంది?
జవాబు:
అ) శ్వా సవ్యవస్థ
ఆ) A. వాయుగోణి B. రక్తకేశనాళికల వల
ఇ) శ్వాసవ్యవస్థ, ప్రసరణ వ్యవస్థ
ఈ) ఇక్కడ జరిగే ప్రక్రియ వాయు వినిమయం. ఊపిరితిత్తులందలి వాయుగోణులు మరియు రక్తకేశనాళికల మధ్య వాయు వినిమయం జరుగుతుంది. దీనివలన రక్తకేశనాళికలందలి కార్బన్ డై ఆక్సెడ్ వాయుగోణిలోనికి, వాయుగోణి నందలి ఆక్సిజన్ రక్తకేశనాళికలలోనికి ప్రవేశించును.

ప్రశ్న 23.
నాసికా రంధ్రాల నుండి వాయుగోణుల వరకు ఉండే మార్గం వెచ్చగా, తేమగా ఉండడం వల్ల ప్రయోజనమేమి?
జవాబు:
నాసికా కుహరము నందు వాయువు వడపోయబడుతుంది. నాసికా కుహరంలోని తేమగా ఉండే పొర, రోమాలు గాలిలో ఉండే దుమ్ము ధూళి కణాలను చాలావరకు ఆపేస్తాయి. అంతేకాకుండా నాసికా కుహరము ద్వారా ప్రయాణించే సమయంలో గాలి ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రతకు దాదాపు సమానమవుతుంది. గాలిలోనికి నాసికా కుహరంలోని తేమ చేరడం వలన గాలి అంతకు ముందు కంటే తేమగా తయారవుతుంది. గాలిని వెచ్చచేయడం, గాలికి తేమను చేర్చడం వంటి కార్యక్రమాలు శ్వాస జీర్ణవ్యవస్థలు రెండింటికీ సంబంధించిన గ్రసనిభాగంలో కొనసాగుతాయి. ఇదే ప్రక్రియ వాయుగోణుల వరకు కొనసాగుతుంది.

ప్రశ్న 24.
రక్తంలోని హిమోగ్లోబిన్ ఏయే పనులు నిర్వర్తిస్తుంది? రక్తంలో హిమోగ్లోబిన్ లేని జీవుల్లో శ్వాసక్రియలో రక్తం పాత్ర ఏమిటి?
జవాబు:
హిమోగ్లోబిన్ నిర్వహించే విధులు : ఊపిరితిత్తుల నుండి శరీరంలోని అన్ని కణజాలములకు హిమోగ్లోబిన్ రక్తాన్ని తీసుకొని వెళుతుంది. ఇది కార్బన్ డై ఆక్సైడు కణజాలముల నుండి ఊపిరితిత్తులకు మోసుకువస్తుంది. కణాలకు నైట్రిక్ఆక్సెడ్ను కూడా రవాణా చేస్తుంది.

రక్తంలో హిమోగ్లోబిన్ లేని జీవులలో రక్తం కేవలం జీర్ణమైన ఆహార పదార్థములను కణజాలములకు సరఫరా చేయును. మరియు కణాలలో శ్వాసక్రియవలన తయారయిన వ్యర్థ పదార్థములను విసర్జన వ్యవస్థకు సరఫరా చేయును.

ప్రశ్న 25.
క్రింది పట్టికను చూడండి. దీని నుండి మీరేమి గ్రహించారో రాయండి.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 24
జవాబు:
ఈ పట్టిక ఉచ్ఛ్వాస, నిశ్వాసంలో గాలిలో ఉండే వాయువుల శాతాన్ని తెలుపుతుంది. ఉచ్ఛ్వాసంలో 21 శాతం ఉన్న ఆక్సిజన్ నిశ్వాసంలో 16 శాతానికి తగ్గుతుంది. దీనికి కారణం ఆక్సిజన్ కణ శ్వాసక్రియలో వినియోగించబడుతుంది. కార్బన్ డయాక్సెడ్ ఉచ్ఛ్వాసంలో 0.03 శాతం ఉంటుంది. నిశ్వాసంలో అది 4 శాతానికి పెరగడానికి కారణం కణశ్వాసక్రియ వలన కార్బన్ డయాక్సెడ్ ఉత్పత్తి కావడమే. నైట్రోజన్ యొక్క శాతం ఉచ్ఛ్వాసంలోను నిశ్వాసంలోను ఒకే విధంగా (78%) ఉండుటకు కారణము దానికి శ్వాసక్రియలో పాత్ర లేకపోవడము.

10th Class Biology 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
చిత్తడి ప్రదేశాలలో పెరిగే మాంగ్రూవ్ మొక్కలు జరిపే శ్వాసక్రియ గురించి వ్రాయండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 6

  1. చిత్తడి ప్రదేశాలలో పెరిగే మాంగ్రూవ్ మొక్కలు వేర్ల ద్వారా శ్వాసక్రియను జరుపుకుంటాయి.
  2. మొక్కల వేర్లలో ఉండే మూలకేశాలు పలుచని ఉపరితలం ద్వారా వాయు మార్పిడి చేస్తాయి.
  3. ఇవి మట్టి అణువుల మధ్య ఉండే ఆక్సిజన్‌ను పీల్చుకుంటాయి.
  4. చిత్తడి ప్రదేశాలలో పెరిగే మొక్కలలో వేర్లు భూమి ఉపరితలంలో పైకి చొచ్చుకుని వచ్చి అనుకూలనాన్ని ప్రదర్శిస్తాయి. వీటి ద్వారా వాయు వ్యాపనం సమర్థవంతంగా జరుగుతుంది.

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

ప్రశ్న 2.
శ్వాసక్రియలో ఉష్ణం వెలువడునని నిరూపించే ప్రయోగాన్ని మీ పాఠశాలలో నిర్వహించిన విధానాన్ని రాయండి. ఇదే ప్రయోగం పొడి విత్తనాలతో చేస్తే ఫలితం ఎలా ఉండవచ్చు?
లేదా
ప్రయోగశాలలో శ్వాసక్రియలో ఉష్ణం వెలువడునని నిరూపించుటకు మీరు నిర్వహించిన ప్రయోగం యొక్క విధానం మరియు తీసుకొనిన జాగ్రత్తలు వివరించండి.
జవాబు:
పరికరాలు :
మొలకెత్తిన గింజలు, ధర్మాస్ ప్లాస్కు, థర్మామీటరు, బిరడా.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 7

ప్రయోగ విధానం :

  1. మొలకెత్తిన గింజలను ఒక ధర్మాస్ ప్లాస్కులో తీసుకోవాలి.
  2. బిరడాను తీసుకొని రంధ్రం చేసి దాని గుండా థర్మామీటరును అమర్చాలి. థర్మామీటరు. నొక్కు మొలకెత్తిన గింజలలో మునిగి ఉండేలా జాగ్రత్తపడాలి.
  3. థర్మాస్ ప్లాను బిరడాతో బిగుతుగా బిగించాలి.
  4. ప్రతి రెండు గంటలకు థర్మామీటరులో ఉష్ణోగ్రత నమోదు చేయాలి.
  5. మంచి ఫలితాల కొరకు 24 గంటలు పరిశీలించాలి.

పరిశీలన :
ప్రతి రెండు గంటలకు నమోదు చేసిన ఉష్ణోగ్రతలో పెరుగుదల కన్పించింది.

పరికల్పన :
ఈ ప్రయోగం పొడి విత్తనాలలో నిర్వహిస్తే ఉష్ణోగ్రతలో ఎటువంటి మార్పు ఉండకపోవచ్చు.

జాగ్రత్తలు :

  1. థర్మామీటరు బల్బు మొలకెత్తిన గింజలలో మునిగి ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
  2. ప్లాస్కులోనికి గాలి చొరబడకుండా చూడాలి.

ప్రశ్న 3.
A) క్రింది పటమును పరిశీలించి, ఈ ప్రశ్నలకు సమాధానములు రాయండి.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 8
1) పై పటం దేనిని సూచించును?
జవాబు:
అవాయు శ్వాసక్రియ, లేదా అవాయు శ్వాసక్రియలో వెలువడిన ఉష్ణం, కార్బన్ డై ఆక్సైడ్ నిర్ధారణ పరీక్ష.

2) పై ప్రయోగంలో వేడి చేసి, చల్లార్చిన గ్లూకోజ్ పై పారాఫిన్ ద్రవాన్ని పొరగా ఎందుకు పోస్తారు?
జవాబు:
ప్రయోగంలో బయటి నుండి గ్లూకోజ్ ద్రావణానికి ఆక్సిజన్ సరఫరా కాకుండా నిరోధించవచ్చు.

3) గ్లూకోజు ఎందుకు డయాజిన్ గ్రీన్ ద్రవాన్ని కలుపుతారు? కలిపిన తరువాత ఏ మార్పును గమనించావు?
జవాబు:
గ్లూకోజ్ ద్రావణంలో ఇంకా ఆక్సిజన్ ఉన్నదో లేదో తెలుసుకొనుటకు డయాజిన్ గ్రీన్ ద్రవాన్ని కలుపుతారు. కలిపిన తరువాత నీలిరంగు ద్రావణం ఆక్సిజన్ లభ్యత తక్కువైనప్పుడు గులాబి రంగులో మారటం గమనిస్తాము.

4) ఈ ప్రయోగంలో సున్నపు నీరును ఎందుకు ఉపయోగించారు?
జవాబు:
సున్నపు నీరు ఉపయోగించడం వలన అవాయు శ్వాసక్రియలో వెలువడిన CO2 ను నిర్ధారించవచ్చు. (CO2 సున్నపుతేటను ఆ పాలవలె మారుస్తుంది.)

5) థర్మామీటర్ యొక్క బల్బ్ గ్లూకోజ్ నీటిలో ఎందుకు మునిగి ఉండాలి?
జవాబు:
అవాయు శ్వాసక్రియలో వెలువడే ఉష్ణోగ్రతలను థర్మామీటరు ద్వారా నమోదుచేసి నిర్ధారించటానికి.

B) తరగతి గదిలో అవాయు శ్వాసక్రియ ప్రయోగం నిర్వహించావు కదా ! కింది ప్రశ్నలకు సమాధానమిమ్ము.
a) ఈ ప్రయోగం నిర్వహించడం ద్వారా నీవు ఏ ఏ విషయాలు నిరూపించగలవు?
జవాబు:
అవాయు శ్వాసక్రియలో ఉష్ణం మరియు కార్బన్ డై ఆక్సైడ్ విడుదల అగునని నిరూపించగలను.

b) ఈ ప్రయోగంలో గ్లూకోజ్ ద్రావణాన్ని నీవు ఎందుకు వేడిచేశావు?
జవాబు:
గ్లూకోజ్ ద్రావణంలో కరిగి ఉన్న ఆక్సిజన్‌ను తొలగించడానికి.

c) వేడిచేసిన తర్వాత గ్లూకోజ్ ద్రావణంలో ఆక్సిజన్ లేదు అని ఎలా నిర్ధారించుకుంటావు?
జవాబు:
గ్లూకోజ్ ద్రావణానికి డయజిన్ గ్రీన్ (లేదా జానస్ గ్రీన్ బి) ద్రావణాన్ని కలిపినపుడు ఆక్సిజన్ లభ్యత తక్కువగా ఉంటే గులాబీ రంగులోకి మారుతుంది.

d) సున్నపుతేటలో నీవు గమనించిన మార్పులు ఏమి? ఎందుకు?
జవాబు:
ఈ ప్రయోగంలో ఉత్పత్తి అయిన కార్బన్ డై ఆక్సైడ్ సున్నపు తేటను పాలవలె తెల్లగా మారుస్తుంది.

ప్రశ్న 4.
మానవునిలో వాయు ప్రసార మార్గపు క్రమాన్ని ప్లో చార్టు ద్వారా వివరించండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 9
నాసికా రంధ్రాల ద్వారా వాయువు శరీరంలోకి ప్రవేశిస్తుంది. నాసికా కుహరంలో గాలిలోని దుమ్ము, ధూళికణాలు తొలగించబడతాయి. గాలి ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రత దాదాపు సమానమవుతుంది. ఉప జిహ్విక అనే కండరపు కవాటం ఆహారపు, వాయు మార్గాలను నియంత్రిస్తూ తమ తమ వ్యవస్థల లోనికి సరిగ్గా ప్రవేశించునట్లు చేస్తుంది. ఊపిరితిత్తుల నుండి నిశ్వాసంలో బయటకు వచ్చే గాలి స్వరతంత్రుల గుండా ప్రయాణించేటప్పుడు వాటిని కంపించేలా చేస్తుంది. వాయునాళం ఊపిరితిత్తుల వరకు గాలిని తీసుకెళ్ళే నిర్మాణం. వాయునాళం ఉరః కుహరం మధ్య భాగంలో రెండు శ్వాసనాళాలుగా చీలి ఒక్కొక్క ఊపిరితిత్తిలోకి చేరుతుంది. శ్వాసనాళాలు అనేకసార్లు చీలుతూపోయి చివరకు శ్వాసనాళికలుగా అంతమవుతాయి. శ్వాసనాళికలు వాయుగోణులలో అంతమవుతాయి. రక్త కేశనాళికలు వాయుకోశగోణుల గోడలలో అధిక సంఖ్యలో ఉండడం వలన వాయు వినిమయం జరుగుతుంది. రక్తం ఆక్సిజన్ ని శరీరంలోని ప్రతి కణానికి అందజేస్తుంది.

ప్రశ్న 5.
A) ఈ ప్రయోగం యొక్క ఉద్దేశ్యం ఏమిటి?
B) థర్మామీటర్ రీడింగ్ లో ఏ విధమైన మార్పు ఉంటుంది?
(లేదా)
ఈ ప్రయోగం నిర్వహించేటపుడు థర్మామీటరులో మార్పును గమనించారా?
C) ఈ ఉష్ణం ఎక్కడి నుండి వచ్చిందని మీరు భావిస్తున్నారు?
D) ప్రయోగం చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి?
E) ఈ ప్రయోగాన్ని పొడి విత్తనాలతో నిర్వహిస్తే ఎటువంటి ఫలితం వస్తుంది?
F) ఈ ప్రయోగంలో నీవు ఉపయోగించిన పరికరములు ఏవి?
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 7
జవాబు:
A) శ్వాసక్రియలో ఉష్ణం వెలువడుతుందని నిరూపించడం.
B) థర్మామీటరులో రీడింగ్ పెరుగుతుంది.
C) మొలకెత్తుతున్న విత్తనాలు శ్వాసించడం వలన కొంత శక్తి ఉష్ణం రూపంలో వెలువడింది. (లేదా) మొలకెత్తుతున్న విత్తనాల నుండి ఉష్ణం వెలువడింది.
D) థర్మామీటరు యొక్క బల్బు విత్తనాల మధ్యలో ఉండేలా జాగ్రత్తపడాలి.
E) థర్మామీటరులోని ఉష్ణోగ్రతలో ఎటువంటి మార్పు ఉండదు.
F) గాజు జాడీ, మొలకెత్తిన విత్తనాలు, రబ్బరు బిరడా, థర్మామీటరు.

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

ప్రశ్న 6.
“శ్వాసక్రియలో కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది” అని నిరూపించుటకు మీ పాఠశాల ప్రయోగశాలలో ఒక ప్రయోగాన్ని నిర్వహించారు కదా ! కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
i) ఈ ప్రయోగంలో ఉపయోగించిన పరికరాల జాబితా రాయండి.
జవాబు:
పరికరాలు :
1. మొలకెత్తు విత్తనాలు / మొలకలు, 2. ప్లాస్టిక్ బాటిల్, 3. చిన్న బీకరు, 4. సున్నపుతేట

ii) ఈ ప్రయోగాన్ని నిర్వహించు విధానము వివరించండి.
జవాబు:
ప్రయోగ విధానము :

  1. వెడల్పాటి మూత కలిగిన ప్లాస్టిక్ బాటిల్ నందు మొలకెత్తు విత్తనాలను తీసుకోవాలి.
  2. ఒక చిన్న బీకర్ నందు మూడు వంతుల వరకు సున్నపుతేట తీసుకోవాలి.
  3. ఈ బీకర్‌ను బాటిల్ నందు ఉంచాలి.
  4. బాటిల్ ను మూతతో గాలి జొరబడకుండా గట్టిగా బిగించాలి.
  5. ఇలాంటి అమరికనే మరొకదానిని పొడి విత్తనాలతో తయారుచేసుకోవాలి.
  6. ఈ అమరికలను ఒకటి నుండి రెండు రోజులు కదపకుండా ఉంచాలి.

ప్రశ్న 7.
శ్వాసక్రియలో కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతుందని నిరూపించడానికి అనుసరించవలసిన ప్రయోగ విధానం రాయండి. దాని పటం గీయండి.
(లేదా)
శ్వాసక్రియలో కార్బన్ డై ఆక్సైడ్ వెలువడునని అర్థము చేసుకొనుటకు నీవు ప్రయోగశాలలో నిర్వహించిన ప్రయోగ విధానమును తెలుపుము.
జవాబు:
ఉద్దేశం : శ్వాసక్రియలో CO2 వెలువడుతుందని నిరూపించుట.

పరికరాలు :
వెడల్పు మూతిగల రెండు గాజు సీసాలు, మొలకెత్తుతున్న శనగగింజలు, పొడి శనగగింజలు, సున్నపునీరు ఉన్న బీకర్లు.

ప్రయోగ విధానం :
1) వెడల్పు మూతిగల రెండు గాజుసీసాలు తీసుకోవాలి. ఒకదానిలో మొలకెత్తుతున్న శనగగింజలు ఉంచాలి. రెండవ దానిలో పొడి శనగగింజలు ఉంచవలెను.

2) రెండు గాజుసీసాలలో సున్నపుతేటతో నింపిన బీకర్లు ఉంచాలి. తరువాత రెండు సీసాల రబ్బరు బిరడాలను గట్టిగా బిగించాలి.

3) సీసామూతి చుట్టూ గాలి చొరబడకుండా వేజిలైన్ పూయవలెను. సీసాలను కదపకుండా రెండు రోజులు ఉంచవలెను.

AP Board 10th Class Biology Solutions 2nd Lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 7
పరిశీలన :
4) ఒకటి రెండు రోజులు గమనించినట్లయితే మొలకెత్తుతున్న థి తనలు ఎం సి ఏరులో ఉన్న సున్నపు టు ఎక్కువగా తెల్లటి పాలవలె మారుతుంది.

5) దీనికి కారణము మొలకెత్తే విత్తనాలు శ్వాసక్రియ జరపడం వల్ల వెలువడిన కార్బన్ డై ఆక్సైడ్ వల్లనే సున్నపు తేట పాల వలె మారిందని చెప్పవచ్చు.

6) పొడిగింజలు గల సీసాలోని సున్నపు తేట తెల్లగా పాలవలె అంతగా మారదు.

విడుదల ఫలితం :
7) కనుక శ్వాసక్రియలో కార్బన్ డై ఆక్సైడ్ విడుదల అవుతుందని నిరూపించడమైనది.

ప్రశ్న 8.
క్రింది ను పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 17
i) ప్రయోగ ప్రారంభంలో లాక్టిక్ ఆమ్ల గాఢత ఎంత ఉంది?
ii) ప్రయోగం ఏ దశలో లాక్టిక్ ఆమ్ల గాఢత అత్యధిక స్థాయికి చేరింది?
iii) లాక్టిక్ ఆమ్ల గాఢత 25 నిముషాల తర్వాత ఎంత ఉంది?
iv) లాక్టిక్ ఆమ్ల గాఢతకు, కండరాల నొప్పికి మధ్య గల సంబంధమేమిటి?
జవాబు:
1) 20 మి.గ్రా / ఘ. సెం.మీ.
2) “B” స్థానం (లేదా) 20 నిమిషాలు దగ్గర
3) 101 మి.గ్రా / ఘ. సెం.మీ.
4) లాక్టిక్ ఆమ్లం గాఢత పెరిగితే కండరాల నొప్పి కూడా పెరుగుతుంది.

ప్రశ్న 9.
కింద ఇచ్చిన పరికరాల అమరికను గమనించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 11
i) ఈ ప్రయోగం ద్వారా ఏ ప్రక్రియ గురించి తెలుసుకుంటాం?
జవాబు:
ఈ ప్రయోగం ద్వారా దహన ప్రక్రియ గురించి తెలుసుకుంటాం.

ii) ఈ ప్రక్రియ శ్వాసక్రియతో ఎలా విభేదిస్తుంది?
జవాబు:
శ్వాసక్రియ నీటి సమక్షంలో జరుగుతుంది. దహన ప్రక్రియ నీరు లేనప్పుడు జరుగును.

iii) ఈ ప్రయోగంకు శ్వాసక్రియతో ఉన్న పోలికలు ఏవి?
జవాబు:
ఈ రెండు ప్రక్రియలలో శక్తి విడుదల అగును.

iv) ఏ వాయువు సున్నపుతేటను పాలవలె మారుస్తుంది?
జవాబు:
కార్బన్ డై ఆక్సైడ్ వాయువు సున్నపుతేటను పాలవలె మారుస్తుంది.

ప్రశ్న 10.
కింది అంశాన్ని పరిశీలించండి.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 12
పై అంశాల ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
i) గ్లూకోజ్ ఎన్ని పైరువిక్ ఆమ్ల అణువులుగా మారుతుంది?
ii) పైరువిక్ ఆమ్లం వాయుసహిత లేదా అవాయు శ్వాసక్రియలలో పాల్గొనడం దేనిపై ఆధారపడి ఉంటుంది?
iii) వాయుసహిత, అవాయు శ్వాసక్రియలు రెండింటిలో దేంట్లో ఎక్కువ శక్తి విడుదలవుతుంది?
iv) మానవ కండరాలలో అవాయు శ్వాసక్రియ జరిగినప్పుడు ఏర్పడే రసాయన పదార్ధమేది?
జవాబు:
i) 2 పైరువిక్ ఆమ్ల అణువులు
ii) ఆక్సిజన్ లభ్యత
iii) వాయుసహిత శ్వాసక్రియ
iv) లాక్టిక్ ఆమ్లము

ప్రశ్న 11.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 13
a) ప్రక్క పటం దేనిని తెలియచేస్తుంది?
జవాబు:
మైటోకాండ్రియా

b) పటంలో చూపిన ‘X’ భాగాన్ని గుర్తించండి.
జవాబు:
మాత్రిక

c) ప్రక్కన చూపిన పటము యొక్క విధులను తెల్పండి.
జవాబు:
కణ శ్వాసక్రియలో పాల్గొని శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

d) ప్రక్కన చూపిన పటము ఏ వ్యవస్థకు సంబంధించినది?
జవాబు:
శ్వాసవ్యవస్థకు సంబంధించినది.

ప్రశ్న 12.
మనం విడిచేగాలిలో CO2 ఉంటుందని ఎలా నిరూపిస్తావు?
జవాబు:
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 4
ఉద్దేశం :
మనం విడిచే గాలిలో CO2 ఉంటుందని నిరూపించుట.

పరికరాలు :
రెండు పరీక్షనాళికలు, సున్నపుతేట, గాజునాళాలు, సిరంజి

విధానం :
రెండు పరీక్షనాళికలు తీసుకొని ఒకదానిలో సున్నపుతేట, మరొక దానిలో నీటిని తీసుకోవాలి. రెండింటిలోనికి గాజు నాళాలు అమర్చి గాలి ఊదాలి.

పరిశీలన :
గాలి ఊదినపుడు పరీక్షనాళికలోని సున్నపుతేట తెల్లగా పాలవలె మారింది.

నిర్ధారణ :
మరొక సున్నపుతేట ఉన్న పరీక్షనాళికలోనికి సిరంజి ద్వారా గాలి ఊదినపుడు అది రంగు మారలేదు. అంటే మనం విడిచే గాలిలో ఉన్న వాయువు సున్నపుతేటను పాలవలె మార్చింది. సున్నపునీటిని పాలవలె మార్చే వాయువు CO2.

నిరూపణ :
మనం విడిచే గాలిలో CO2 ఉండి సున్నపుతేటను పాలవలె మార్చుతుందని నిరూపించటమైనది.

ప్రశ్న 13.
వాయుగోణులలో జరిగే వాయుమార్పిడి గురించి రాయండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 14

  1. ఊపిరితిత్తుల లోపల వ్యాపన పద్ధతిలో వాయుగోణుల నుండి రక్తకేశనాళిలోనికి, రక్తకేశనాళికల నుండి వాయుగోణులలోనికి వాయువుల మార్పిడి జరుగుతుంది. అంటే రక్తంలోని కార్బన్ డై ఆక్సైడ్, ‘వాయుగోణులలోని ఆక్సిజన్లు పరస్పరం మార్పిడి జరుగుతాయన్నమాట.
  2. అతిసూక్ష్మమైన వాయుగోణులు ఒకే కణం మందంతో అసంఖ్యాకంగా ఉంటాయి. ఈ వాయుగోణుల చుట్టూ ఒకే కణం మందంతో ఉండే రక్త కేశనాళికలు ఉంటాయి.
  3. గుండె నుండి ఊపిరితిత్తులకు ప్రవహించే ముదురు ఎరుపు రంగులో ఉండే ఆక్సిజన్ రహిత రక్తం ఈ రక్త కేశ నాళికలలోనికి ప్రవహించి, వాయుగోణుల నుండి ఆక్సిజన్‌ను గ్రహిస్తుంది.
  4. అదే సమయంలో రక్తంలోని కార్బన్ డై ఆక్సైడ్ రక్త కేశనాళికల నుండి వాయుగోణులలోకి వ్యాపన పద్ధతిలో ప్రవేశిస్తుంది. మనం నిశ్వాసించినపుడు కార్బన్ డై ఆక్సైడ్ బయటకు వెళుతుంది.
  5. ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉండే ఆక్సిజన్ సహిత రక్తం గుండెకు చేరి, అక్కడ నుండి శరీర భాగాలకు సరఫరా చేయబడుతుంది.

ప్రశ్న 14.
శరీరంలో జరిగే వాయువుల రవాణా విధానాన్ని వివరించండి.
జవాబు:
వాతావరణంలో ఆక్సిజన్ సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు (సుమారు 21%) మొత్తం రక్తంలోని ఎర్రరక్త కణాలలో ఉన్న హిమోగ్లోబిన్ వర్ణదం దాదాపుగా ఆక్సిజన్తో సంతృప్తం చెంది, రవాణా చేయబడుతుంది. హిమోగ్లోబిన్ కూడా క్లోరోఫిల్ మాదిరిగా ఒక వర్ణ పదార్థం. రెండింటికీ ఉన్న ప్రధానమైన తేడా ఏమిటంటే క్లోరోఫిల్ లో మెగ్నీషియం అణువు ఉంటుంది. హిమోగ్లోబిన్ మధ్యలో ఇనుము (Fe) అణువు ఉంటుంది.

ఆక్సిజన్ రక్తంలోకి వ్యాపన పద్ధతి ద్వారా ప్రవేశించగానే అది వెంటనే హిమోగ్లోబిన్తో బంధాన్ని ఏర్పరచుకొని ఆక్సీ హిమోగ్లోబిన్ ఏర్పడుతుంది. ఈ రక్తం కణజాలాలకు చేరినపుడు ఆక్సిజన్
హిమోగ్లోబిన్ నుండి విడిపోయి కణజాలాలలోనికి ప్రవేశిస్తుంది. కార్బన్ డై ఆక్సైడ్ సాధారణంగా బై కార్బొనేట్స్ రూపంలో రవాణా చేయబడుతుంది. కొంత భాగం హిమోగ్లోబిన్ తో కలుస్తుంది. మరికొంత ప్లాస్మాలో కరుగుతుంది.
Hb + O2 → HbO2 (ఊపిరితిత్తులలో)
HbO2 → Hb + O2 (కణజాలాలలో)

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

ప్రశ్న 15.
పర్వతారోహకులు తమ వెంట ఆక్సిజన్ సిలిండర్ తీసుకెళతారు. ఎందుకు?
జవాబు:
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 15
సముద్రమట్టం దగ్గర హిమోగ్లోబిన్ ఆక్సిజన్ తో పూర్తిగా సంతృప్తం చెందుతుంది. దాదాపు ప్రతి హిమోగ్లోబిన్ ( ణువు ఆక్సిజన్ తో బంధాన్ని ఏర్పరచి ఆక్సీ హిమోగ్లోబిన్ గా మారుతుంది. సముద్రమట్టానికి 13 కిలోమీటర్లపైన (8 మైళ్ళు) ఆక్సిజన్ లభ్యత చాలా తక్కువగా ఉంటుంది. సముద్రమట్టంతో పోలిస్తే కేవలం ఐదవ వంతు ఆక్సిజన్ మాత్రమే లభ్యమవుతుంది. ఈ పరిస్థితులలో లభ్యమయ్యే ఆక్సిజన్ సగం హిమోగ్లోబిన్ అణువులను మాత్రమే సంతృప్తం చేయగలుగుతుంది.

హిమోగ్లోబిన్ తక్కువ ఆక్సిజన్ అణువులతో కలిసినట్లయితే, రక్తం కణజాలాలకు అవసరమైన రక్తాన్ని సరఫరా చేయలేదు. కృత్రిమమైన పద్ధతిలో ఆక్సిజన్ సరఫరా (ఆక్సిజన్ సిలిండర్లతో) లేకుండా అంత ఎత్తులో జీవించడం అసాధ్యం. అందువలన పర్వాతారోహకులు తమ వెంట ఆక్సిజన్ సిలెండర్లు తీసుకెళతారు.

ప్రశ్న 16.
శ్వాసక్రియ దశలను ఫ్లోచార్టు రూపంలో రాయండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 16

ప్రశ్న 17.
మైటోకాండ్రియా నిర్మాణాన్ని పటం సహాయంతో వివరించండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 18

  1. మైటోకాండ్రియాలు పొడవుగా, దండాకారముగా మరికొన్ని గోళాకారంలో లేక టెన్నిస్ రాకెట్ ఆకారంలో ఉంటాయి.
  2. ఇది రెండు భాగాలను కలిగి ఉంటుంది. లోపలి భాగంలో మాత్రిక ఉండును.
  3. మాత్రిక చుట్టూ మైటోకాండ్రియా లోపలి త్వచము కప్పబడి యుండును.
  4. దీని లోపలి త్వచం ముడతలుపడి ఉంటుంది. వీటిని క్రిస్టే అంటారు. ఇవి మాత్రికలో వ్యాపించి ఉంటాయి.
  5. ముడతల మధ్య ఉండే స్థలం మైటోకాండ్రియా వెలుపలి భాగంతో కలిసి ఉంటుంది.
  6. మాత్రికలలోకి చొచ్చుకుంటూ, లోపలి త్వచం నుండి ఎక్కువ సంఖ్యలో ప్రాథమిక రేణువులుంటాయి. ఈ రేణువులకు గోళాకారపు అగ్రభాగం, వృంతం ఉంటాయి. వాటి వృంతాలు లోపలి త్వచానికి చేర్చబడి అగ్రభాగం మాత్రికలోకి ఉంటాయి.
  7. మైటోకాండ్రియా వెలుపలి భాగం బాహ్యత్వచంతో కప్పబడి ఉంటుంది. ఇది ముడతలు లేకుండా నునుపుగా ఉంటుంది.
  8. మైటోకాండ్రియాలో. శ్వాసక్రియకు సంబంధించిన ఎంజైములు ఉండును.
  9. మైటోకాండ్రియాలో శక్తి ATP రూపంలో నిలువచేయబడి ఉండుట వల్ల వీనిని శక్తి ఉత్పాదక కేంద్రములందురు.

ప్రశ్న 18.
గ్రాఫ్ ను పరిశీలించండి. కండరాలలో లాక్టిక్ ఆమ్లం ఏ విధంగా పేరుకుంటున్నదో పరిశీలించి కింది ప్రశ్నలకు సమాధానాల్వివండి.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 17
నిరంతర వ్యాయామం రక్తంలోని లాక్టికామ్లం గాఢతను ప్రభావితం చేసే అంశాన్ని చూపే గ్రాఫ్
అ) ప్రయోగ ప్రారంభంలో లాక్టిక్ ఆమ్ల గాఢత ఎంత ఉన్నది?
జవాబు:
ప్రయోగ ప్రారంభంలో లాక్టిక్ ఆమ్ల గాఢత 20మి.గ్రా/ఘ. సెం.మీ ఉంది.

ఆ) ప్రయోగం ఏ దశలో లాక్టిక్ ఆమ్ల గాఢత అత్యధిక స్థాయికి చేరింది?
జవాబు:
9 నిమిషాలకు లాక్టిక్ ఆమ్లం గాఢత అత్యధిక స్థాయికి చేరింది.

ఇ) C మరియు D స్థానముల మధ్య లాక్టిక్ ఆమ్ల గాఢత ఒకే స్థాయిలో కొనసాగుతూ ఉన్నట్లయితే లాక్టిక్ ఆమ్లం సాధారణ స్థాయి చేరడానికి ఎంత సమయం పట్టవచ్చు?
జవాబు:
లాక్టిక్ ఆమ్లం సాధారణ స్థాయికి చేరటానికి 100 నిమిషాలు పడుతుంది. అంటే గంటా నలభై నిమిషాలు.

ప్రశ్న 19.
చేపలో జరిగే శ్వాసక్రియను వివరించండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 19

  1. చేప నోటిని తెరచి ఆస్యకుహరం నేల భాగాన్ని కిందకు దించుతుంది.
  2. దీనివల్ల ఆక్సిజన్ కరిగి ఉన్న బయటి నీరు ఆస్యకుహరంలోకి తీసుకోబడుతుంది.
  3. ఇపుడు నోటిని మూసి ఆస్యకుహరం నేలను పైకి నెట్టుతుంది.
  4. నీరు ఆస్యకుహరం నుండి గ్రసనిలోనికి నెట్టబడుతుంది.
  5. గ్రసని నుండి అంతర జలశ్వాసరంధ్రాల ద్వారా చేపలో జరిగే శ్వాసక్రియ మొప్ప కోష్టాలలోకి చేరి మొప్ప పటలికలను తడుపుతుంది.
  6. నీటిలోని ఆక్సిజన్ మొప్ప పటలికల్లోని రక్తాన్ని చేరుతుంది.
  7. రక్తంలోని కార్బన్ డై ఆక్సైడ్ నీటిలోకి చేరుతుంది. నీరు బాహ్య జల శ్వాసరంధ్రాల ద్వారా బయటకుపోతుంది.
  8. ఈ విధంగా చేపలో మొప్పల ద్వారా జరుగు శ్వాసక్రియను జలశ్వాసక్రియ అంటారు.

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

ప్రశ్న 20.
మొక్కలలో జరిగే వాయు రవాణాను వివరించండి.
జవాబు:

  1. పత్రరంధ్రాలు, లెంటి సెల్స్ మొక్క లోపలికి తెరుచుకొని ఉంటాయి. కణాలలో ఉండే ఖాళీలు (గాలి గదులు) వల మాదిరిగా మొక్క అంతా విస్తరించి ఉంటాయి.
  2. ఈ ఖాళీ ప్రదేశాలు పత్రాలలో పెద్ద పరిమాణంలోనూ మిగిలిన మొక్క భాగాలలో చిన్నవిగానూ ఉంటాయి. ఈ గాలి గదుల గోడలు నీటి పొర కలిగి ఉండి తేమగా ఉంటాయి.
  3. పత్రరంధ్రాల ద్వారా లోనికి ప్రవేశించిన గాలిలోని ఆక్సిజన్ నీటిపొరలో కరుగుతుంది. కణకవచం గుండా కణ పదార్థాన్ని చేరుతుంది. కణంలోని చక్కెరలతో చర్య జరిపి శక్తిని విడుదల చేస్తుంది.
  4. దీనితోపాటు నీరు, కార్బన్ డై ఆక్సైడ్ కూడా వెలువడతాయి. ఇలా విడుదలైన శక్తి జీవక్రియ నిర్వహణ కోసం కణంలోని మైటోకాండ్రియాలో ఎ.టి.పి రూపంలో నిల్వ ఉంటుంది. ఏర్పడిన కార్బన్ డై ఆక్సైడ్ ఇదే మార్గంలో గాలి గదుల నుండి బయటకు వెలువడుతుంది.
  5. ఈ చర్య వ్యాపన పద్దతిలో జరుగుతుంది. కణంలో ఆక్సిజన్ వినియోగింపబడగానే కణాలకు, గాలి గదులకు మధ్య వాయు సాంద్రతలో తేడా ఏర్పడుతుంది.
  6. అదే సమయంలో గాలి గదులలో పత్రరంధ్రాలు, లెంటిసెల్స్ వెలుపల కూడా వాయు సాంద్రతలో తేడా వస్తుంది.
  7. అందువల్ల వెలుపలి గాలి పత్రరంధ్రాలగుండా లోపలికి ప్రవేశిస్తుంది.
  8. అదే విధంగా కార్బన్ డై ఆక్సైడ్లో ఏర్పడిన సాంద్రత వ్యత్యాసం వల్ల పై చర్యకు వ్యతిరేక దిశలో వెలుపలికి వస్తుంది.

ప్రశ్న 21.
ప్రక్క పటాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 5
a) పటంలో చూపబడిన భాగము పేరు ఏమిటి?
b) ఈ భాగము ఏ అవయవంలో ఉంటుంది?
c) ఈ భాగము నిర్వహించు క్రియ ఏమిటి?
d) వాయుమార్పిడిలో ఇమిడి ఉన్న సూత్రము ఏమిటి?
జవాబు:
a) పటంలో చూపబడిన భాగము వాయుగోణి.
b) వాయుగోణులు ఊపిరితిత్తులలో ఉంటాయి.
c) వాయుగోణులలో వాయుమార్పిడి జరుగుతుంది.
d) వాయుమార్పిడి వినిమయం లేదా విసరణ సూత్రం ఆధారంగా జరుగుతుంది.

ప్రశ్న 22.
ప్రక్క పటాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 13
a) పటంలో చూపబడిన కణాంగము ఏమిటి?
b) ఈ కణాంగము ఏ క్రియను నిర్వహిస్తుంది?
c) క్రిస్టే అనగానేమి?
d) ఈ కణాంగానికి గల మరొక పేరు ఏమిటి?
జవాబు:
a) పటంలో చూపబడిన కణాంగము మైటోకాండ్రియా.
b) కణాంగము శ్వాసక్రియను నిర్వహిస్తుంది.
c) మైటోకాండ్రియా లోపలి త్వచం ముడుతలను క్రిస్టే అంటారు.
d) మైటోకాండ్రియాలను కణ శక్త్యాగారాలు అని పిలుస్తారు.

ప్రశ్న 23.
ప్రక్కపటం పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 20
a) ఈ ప్రయోగం యొక్క ఉద్దేశం ఏమిటి?
b) ఈ ప్రయోగంలో వాడిన పరికరాలు తెలపండి.
c) ప్రయోగ నిర్వహణ అనంతరం నీవు గమనించే మార్పు ఏమిటి?
d) శ్వాసక్రియలో ఉష్ణోగ్రత పెరుగుతుందని నిరూపించటానికి నీవు ఏ మార్పులు చేస్తావు?
జవాబు:
a) శ్వాసక్రియలో CO2 వెలువడుతుందని నిరూపించుట ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశం.
b) ప్రయోగంలో గాజుసీసా, మొలకెత్తిన గింజలు, సున్నపునీటి బీకరు, సీసా మూత ఉపయోగించారు.
c) ప్రయోగ నిర్వహణ అనంతరం బీకరులోని సున్నపునీరు తెల్లగా మారటం గమనించాను.
d) సీసా మూత ద్వారా థర్మామీటరును శనగగింజల మధ్య అమర్చి, శ్వాసక్రియలో ఉష్ణోగ్రత పెరుగుతుందని నిరూపించవచ్చు.

ప్రశ్న 24.
ప్రక్క పటం పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 21
a) ఈ ప్రయోగంలో మండించిన పదార్థం ఏమిటి?
b) క్రింద ఉన్న పరీక్షనాళికలో తీసుకొన్న ద్రవము ఏమిటి?
c) ఈ ప్రయోగం ద్వారా ఏ క్రియను నిరూపిస్తావు?
d) ప్రయోగం ద్వారా నిరూపించబడిన భౌతికక్రియ ఏ జీవక్రియను పోలి ఉంటుంది?
జవాబు:
a) ప్రయోగంలో మండించిన పదార్థం – గ్లూకోజ్
b) క్రింద ఉన్న పరీక్షనాళికలో తీసుకొన్న ద్రవము – సున్నపునీరు
c) ఈ ప్రయోగం ద్వారా దహనక్రియను నిరూపిస్తారు.
d) దహనము అనే భౌతికచర్య, శ్వాసక్రియ అనే జీవక్రియను పోలి ఉంటుంది.

ప్రశ్న 25.
మానవుని శ్వాసవ్యవస్థ పటం గీచి, భాగాలు గుర్తించండి. మానవ ఊపిరితిత్తులు దేనితో నిర్మితమౌతాయి?
జవాబు:
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 22
మానవ ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం వాయుగోణులు.

ప్రశ్న 26.
ఊపిరితిత్తులు మరియు రక్తకేశ నాళికల మధ్య జరిగే వాయు మార్పిడిని చూపు పటం గీయండి. ఏ పద్దతిలో ఈ వాయు మార్పిడి జరుగుతుందో తెలపండి.
జవాబు:

ఊపిరితిత్తులలో వాయు మార్పిడి జరిగే ప్రక్రియను వినిమయం లేదా వ్యాపనం అంటారు.

ప్రశ్న 27.
శ్వాసక్రియలో పాల్గొనే కణాంగం యొక్క పటం గీచి, భాగాలు గుర్తించండి. దీనిలో క్రిస్టే ఎలా రూపొందుతుంది?
(లేదా)
కణశక్యాగారముగా పిలువబడే కణాంగం పటం గీచి, భాగాలు గుర్తించండి. క్రిస్టే అనగానేమి?
జవాబు:
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 18
మైటోకాండ్రియా మైటోకాండ్రియా లోపలి త్వచం ముడతలను క్రిస్టే అంటారు. దీనిమీద ప్రాథమిక రేణువులు ఉంటాయి.

10th Class Biology 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ ½ Mark Important Questions and Answers

ఫ్లో చార్పులు

1.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 25
జవాబు:
ఊపిరితిత్తులలో వాయుమార్పిడి

2.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 26
జవాబు:
మైటోకాండ్రియా

3.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 27
జవాబు:
కిణ్వనం

4.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 28
జవాబు:
నాసికా కుహరాలు

5.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 29
జవాబు:
వాయునాళం

6.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 30
జవాబు:
ఇథైల్ ఆల్కహాల్

7.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 31
జవాబు:
చర్మ శ్వాసక్రియ

8.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 32
జవాబు:
వాయునాళం

9.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 33
జవాబు:
గ్రసని

10.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 34
జవాబు:
లెంటిసెల్స్

సరైన గ్రూపును గుర్తించండి

11. ఏ గ్రూపు శ్వాసక్రియ భాగాలు సరియైన క్రమంలో అమరి ఉన్నాయి?
A. నాసిక – స్వరపేటిక – గ్రసని – వాయునాళం
B. నాసిక – గ్రసని – స్వరపేటిక – వాయునాళం
జవాబు:
సమూహం B

12. ఏ గ్రూపు శ్వాసక్రియ భాగాలు సరియైన క్రమంలో అమరి ఉన్నాయి?
A. వాయునాళం – శ్వాసనాళం – శ్వాసనాళికలు – వాయుగోణులు
B. వాయునాళం – శ్వాసనాళికలు – శ్వాసనాళం – వాయుగోణులు
జవాబు:
సమూహం A

13. ఏ గ్రూపు సంఘటనలు నిశ్వాసక్రియకు సంబంధించినవి?
A. డయాఫ్రమ్ సంకోచించడం – ఉరఃకుహరం పరిమాణం పెరగడం – అంతర్గత పీడనం తగ్గడం – గాలి ఊపిరితిత్తుల్లోకి చేరడం
B. డయాఫ్రమ్ యథాస్థితికి చేరడం – ఉరఃకుహరం పరిమాణం తగ్గడం – అంతర్గత పీడనం పెరగడం – ముక్కు ద్వారా గాలి బయటకు వెళ్ళడం
జవాబు:
సమూహం A

14. “కణజాలాలలో వాయు మార్పిడి” దశకు సంబంధించి ఈ క్రింది ఏ గ్రూపు ఘటనలున్నాయి?
A. వాయుగోణులలో O2 – వ్యాపనం – O2 రక్త కేశనాళికలోకి చేరడం
B. రక్త కేశనాళికలలోని O2 – వ్యాపనం – O2 కణంలోకి చేరడం
జవాబు:
సమూహం B

15. ఊపిరితిత్తుల నుండి రక్తానికి చేరడం క్రింది ఏ చర్యను సూచిస్తుంది?
A. Hb + O2 → HbO2
B. HbO2 → Hb + O2
జవాబు:
చర్య A

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

16. వాయురహిత శ్వాసక్రియతో సంబంధం లేని దశలు ఏవి?
A. గైకాలసిస్, క్రెబ్స్ వలయం, ఎలక్ట్రాన్ రవాణా
B. గైకాలసిస్, ఎలక్ట్రాన్ రవాణా, కిణ్వనం
జవాబు:
సమూహం A

17. ఏ గ్రూపు సమ్మేళనాలు వాయుసహిత శ్వాసక్రియలో ఏర్పడతాయి?
A. పైరువిక్ ఆమ్లం, లాక్టిక్ ఆమ్లం, ఇథైల్ ఆల్కహాల్
B. పైరువిక్ ఆమ్లం, కార్బన్ డై ఆక్సైడ్, నీరు
జవాబు:
సమూహం B

18. ఏ సమీకరణం వాయుసహిత శ్వాసక్రియకు సంబంధించినది?
A. C6H12O6 + 6O2 → 6CO2 + 6H2O + 686 K.Call
B. C6H12O6 → 2C2H5OH + 2 CO2 + 56 K.Call
జవాబు:
సమూహం B

19. ఏ సమూహంలోని జీవులు జల శ్వాసక్రియకు ఉదాహరణలు?
A. చేప, పీత, టాడ్ పోల్
B. వానపాము, కీటకం, పక్షి
జవాబు:
సమూహం A

20. ఏ భేదమును తప్పుగా పేర్కొన్నారు?

కిరణజన్య సంయోగక్రియశ్వాసక్రియ
1. ఇది అనబాలిక్ ప్రక్రియ.1. ఇది కాటబాలిక్ ప్రక్రియ.
2. O2 ఉపయోగించబడుతుంది మరియు CO2 విడుదల అవుతుంది.2. CO2 వినియోగించబడుతుంది మరియు O2 విడుదల అవుతుంది.

జవాబు:
2వ భేదం

ఉదాహరణలు ఇవ్వండి

21. మొక్కలలో శ్వాసక్రియ పత్రరంధ్రాల ద్వారా జరుగును. మొక్కలలో శ్వాసక్రియ జరిగే మరో భాగానికి ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
లెంటిసెల్స్

22. మాంగ్రూవ్ మొక్క శ్వాసక్రియ కొరకు శ్వాసించే వేర్లను కలిగి ఉంటుంది. శ్వాసించడానికి ప్రత్యేకమైన కణజాలం ఉండే మొక్కలకు మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఆర్కిడ్

23. గ్లూకోజ్ శ్వాసక్రియ ఆధారానికి ఒక ఉదాహరణ. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఫ్యాటీ ఆమ్లాలు

24. కేంద్రకపూర్వ కణాలలో కణశ్వాసక్రియ కణద్రవ్యంలో జరుగుతుంది. నిజకేంద్రక జీవులలో కణద్రవ్యంతోపాటు కణ శ్వాసక్రియలో పాల్గొనే మరొక భాగాన్ని పేర్కొనండి.
జవాబు:
మైటోకాండ్రియా

25. బాక్టీరియాలో లాక్టిక్ ఆమ్లం అనేది వాయురహిత శ్వాసక్రియ యొక్క తుది ఉత్పత్తి. మన శరీరంలో లాక్టిక్ ఆమ్లం ఏర్పడే భాగానికి మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
కండరాలు

26. కిణ్వన ప్రక్రియలో ఇథనాల్ ఏర్పడుతుంది. ఈ ప్రక్రియలో మరో ఉత్పత్తి ఏమిటి?
జవాబు:
CO2

27. కిణ్వ ప్రక్రియను ఆల్కహాల్ తయారీలో ఉపయోగిస్తారు. దీనిని ఉపయోగించే మరో సందర్భానికి ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
దోస పిండి, ఇడ్లీ పిండి తయారీలో

28. ‘గ్లూకోజ్ ద్రావణం మరియు బైకార్బోనేట్ ద్రావణం అనేవి వాయురహిత శ్వాసక్రియ జరిపే ప్రయోగాల్లో ఉపయోగించే రసాయనాలు. ఈ ప్రయోగంలో ఉపయోగించే రసాయనానికి మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
లిక్విడ్ పారాఫిన్

29. అమీబా వంటి ఏకకణ జీవులు వ్యాపనం ద్వారా శ్వాసక్రియ జరుపుతాయి. వ్యాపనం ద్వారా శ్వాసక్రియ జరిగే బహుకణ జీవికి ఉదాహరణను ఇవ్వండి.
జవాబు:
హైడ్రా

30. చర్మ శ్వాసక్రియ జరిపే జీవికి ఉదాహరణ వానపాము. చర్మం మరియు ఊపిరితిత్తుల ద్వారా శ్వాసించగల జీవికి ఉదాహరణను ఇవ్వండి:
జవాబు:
కప్ప

శాస్త్రవేత్తను గుర్తించండి

31. ఆక్సిజన్ మరియు ఇతర వాయువులను కనుగొన్నాడు.
జవాబు:
జోసెఫ్ ప్రీస్ట్లీ

32. మనం పీల్చేగాలి మన చుట్టూ ఉన్న గాలిలో ఉంటూ వస్తువులను మండించడానికి సహాయపడుతుంది. గాలిలో స్థిరమైన వాయువు లేదా బొగ్గుపులుసు వాయువు 1/6 వ వంతు పరిమాణంలో ఉంటుందని తన ప్రయోగాల ద్వారా గుర్తించాడు.
జవాబు:
లావోయిజర్

33. జీవులు గ్రహించే పదార్థాలలో దహనం చెందడానికి వీలైన వాటిలో నీరు, ఆక్సిజన్ ప్రధానంగా ఉంటాయి. ఇవన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి జరిపే చర్యల వల్ల భౌతికంగా జీవక్రియలు జరుగుతాయి. శరీరం నుండి విడుదలయ్యే విసర్జితాలలో నీరు, కార్బన్ డై ఆక్సైడ్, ఫాస్ఫరస్, సల్ఫర్, కొన్ని ఇతర పదార్థాలు ఉంటాయి.
జవాబు:
జాన్ డాపర్

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

34. “శ్వాసక్రియ అనేది ఒక విధమైన దహనక్రియ. దీని వలననే జీవుల శరీరానికి ఉష్ణం లభిస్తుంది” అని పేర్కొన్నాడు.
జవాబు:
రాబిన్సన్

35. యోగాభ్యాస అనే శాస్త్రీయ శ్వాస పద్ధతిని అభివృద్ధి చేశాడు. ఎనిమిది విభాగాలలో 195 యోగశాస్త్ర నియమాలను ప్రవేశపెట్టాడు.
జవాబు:
మహర్షి పతంజలి

నేను ఎవరు?

36. నేను వాతావరణములో ఉన్నటువంటి వాయువు మరియు నన్ను స్థిర గాలి అని పిలిచేవారు. నేను సున్నపు నీటిని పాలవలే తెల్లగా మార్చుతాను.
జవాబు:
CO2

37. నాసికా కుహరం నుండి నోటి కుహరాన్ని వేరు చేసే ఒక అస్తి పలక
జవాబు:
అంగిలి

38. C ఆకారంలో ఉన్న మృదులాస్థి ఉంగరాల ద్వారా ఆవరించబడి ఉంటాను. నన్ను గాలిగొట్టం అని కూడా పిలుస్తారు.
జవాబు:
వాయునాళం

39. నన్ను ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాలుగా పిలుస్తారు.
జవాబు:
వాయుగోణులు

40. బాక్టీరియా మరియు ఈస్ట్ లో కనపడే వాయురహిత శ్వాసక్రియ నేను.
జవాబు:
కిణ్వనం

41. కణ శ్వాసక్రియలో పాల్గొనే కణాంగాన్ని నేను మరియు నన్ను కణ శక్త్యాగారము అని కూడా పిలుస్తారు.
జవాబు:
మైటోకాండ్రియా

42. నేనొక భౌతిక, అనియంత్రిత ప్రక్రియ. ఈ ప్రక్రియలో పదార్థాన్ని మండించడం కొరకు ఉష్ణాన్ని బయటి నుండి అందించడం జరుగుతుంది.
జవాబు:
దహనం

43. నేనొక జీవిని. శ్వాసకోశ వాయువుల రవాణాకు తోడ్పడే శ్వాసవర్ణకం నాలో లేదు. తద్వారా వాయునాళాల ద్వారా గాలి నేరుగా కణజాలానికి చేరుకుంటుంది.
జవాబు:
బొద్దింక

44. నేనొక ఉభయచర జీవిని. నేను చర్మం, ఊపిరితిత్తులు మరియు ఆస్యగ్రసని కుహరం ద్వారా శ్వాసిస్తాను.
జవాబు:
కప్ప

జతపరచుట

45. సరిగా జతపరిచిన దానిని గుర్తించండి.
ఆకులు – లెంటిసెల్స్
కాండం – పత్రరంధ్రము
వాయుగత వేర్లు – న్యుమాటోఫోర్స్
జవాబు:
వాయుగత వేర్లు – న్యుమాటోఫోర్స్

46. సరిగా జతపరిచిన దానిని గుర్తించండి.
ఊపిరితిత్తుల సామర్థ్యం – 5800 m.l
నిశ్వాస వాయువులోని CO2 – 0.03%
ఉచ్ఛ్వాస వాయువులోని O2 – 16%
జవాబు:
ఊపిరితిత్తుల సామర్థ్యం – 5800 m.l

47. సరిగా జతచేయబడని దానిని గుర్తించండి.
బాక్టీరియా – కిణ్వనం
కండరాలు – వాయురహిత శ్వాసక్రియ
ఈస్ట్ – వాయుసహిత శ్వాసక్రియ
జవాబు:
ఈస్ట్ – వాయుసహిత శ్వాసక్రియ

48. సరిగా జతచేయబడని దానిని గుర్తించండి.
ATP – ఎనర్జీ కరెన్సీ
మైటోకాండ్రియా – కణ శక్త్యాగారము
కణ ద్రవ్యం – క్రెబ్స్ వలయం
జవాబు:
కణ ద్రవ్యం – క్రెబ్స్ వలయం

49. సరిగా జతపరిచిన దానిని గుర్తించండి.
కండరాలు – లాక్టిక్ ఆమ్లం
బాక్టీరియా – ఇథైల్ ఆల్కహాల్
ఈస్ట్ – CO2 + లాక్టిక్ ఆమ్లం
జవాబు:
కండరాలు – లాక్టిక్ ఆమ్లం

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

50. సరిగా జతపరిచిన దానిని గుర్తించండి.
పుపుస శ్వాసక్రియ – ఊపిరితిత్తులు
జల శ్వాసక్రియ – వాయునాళం
చర్మ శ్వాసక్రియ – మొప్పలు
జవాబు:
పుపుస శ్వాసక్రియ – ఊపిరితిత్తులు

51. సరిగా జతచేయబడని దానిని గుర్తించండి.
పక్షులు – పుపుస శ్వాసక్రియ
టాడ్ పోల్ – జల శ్వాసక్రియ
సీతాకోక చిలుక – చర్మ శ్వాసక్రియ
జవాబు:
సీతాకోక చిలుక – చర్మ శ్వాసక్రియ

52. సరిగా జతచేయబడని దానిని గుర్తించండి.
బొద్దింక – వాయునాళం
వానపాము – చర్మం
బల్లి – మొప్పలు
జవాబు:
బల్లి – మొప్పలు

53. సరిగా జతచేయబడని దానిని గుర్తించండి.
స్థిరమైన గాలి – CO2
బొగ్గుపులుసు వాయువు – H2
ఖర్చయ్యే వాయువు – O2
జవాబు:
బొగ్గుపులుసు వాయువు – H2

54. సరిగా జతపరిచిన దానిని గుర్తించండి.
స్వరపేటిక – శబ్దపేటిక
వాయునాళం – ఆహార గొట్టం
ఆహారవాహిక – గాలిగొట్టం
జవాబు:
స్వర పేటిక – శబ్ద పేటిక

దోషాన్ని గుర్తించి, సరిచేసి రాయండి.

55. ఆహార పదార్థాలు ముఖ్యంగా గ్లూకోజ్, కొవ్వు ఆమ్లాలు క్షయకరణం చెంది కార్బన్ డై ఆక్సైడ్, నీరు ఏర్పడటాన్ని కణ శ్వాసక్రియ అంటారు.
జవాబు:
ఆహార పదార్థాలు ముఖ్యంగా గ్లూకోజ్, కొవ్వు ఆమ్లాలు ఆక్సీకరణం చెంది కార్బన్ డై ఆక్సైడ్, నీరు ఏర్పడటాన్ని కణ శ్వాసక్రియ అంటారు.

56. కంఠబిలం మీద మృదులాస్థితో ఏర్పడిన గ్రసని అనే పోలికను గుర్తించుట భాగం మూత వలె పనిచేస్తూ మరియు ఆహారాన్ని స్వరపేటిక ప్రవేశించకుండా నిరోధిస్తుంది.
జవాబు:
కంఠబిలం మీద మృదులాస్థితో ఏర్పడిన ఉపజిహ్విక అనే భాగం మూత వలె పనిచేస్తూ మరియు ఆహారాన్ని స్వరపేటికలోనికి ప్రవేశించకుండా నిరోధిస్తుంది.

57. వాయునాళంలో స్వరతంత్రులు నిశ్వాస సమయంలో కంపిస్తూ ధ్వనులను ఉత్పత్తి చేస్తాయి.
జవాబు:
స్వరపేటిక లో స్వరతంత్రులు నిశ్వాస సమయంలో కంపిస్తూ ధ్వనులను ఉత్పత్తి చేస్తాయి.

58. పుపుస ధమని గుండె నుంచి ఊపిరితిత్తులకు ఆమ్లజని సహిత రక్తాన్ని తీసుకొస్తుంది.
జవాబు:
పుపుస ధమని గుండె నుంచి ఊపిరితిత్తులకు ఆమ్లజని రహిత రక్తం తీసుకొస్తుంది.

59. కార్బన్ డై ఆక్సైడ్ సాధారణంగా కార్బోనేట్స్ రూపంలో రవాణా చేయబడుతుంది. కొంతభాగం హీమోగ్లోబిన్ తో కలుస్తుంది.
జవాబు:
కార్బన్ డై ఆక్సైడ్ సాధారణంగా బైకార్బోనేట్స్ రూపంలో రవాణా చేయబడుతుంది. కొంతభాగం హీమోగ్లోబిన్ తో కలుస్తుంది.

60. నిజకేంద్రక కణాలలో కణద్రవ్యం మరియు హరితరేణువు కణ శ్వాసక్రియ జరిగే ప్రదేశాలు.
జవాబు:
నిజకేంద్రక కణాలలో కణద్రవ్యం మరియు మైటో కాండ్రియా కణ శ్వాసక్రియ జరిగే ప్రదేశాలు.

61. మైటోకాండ్రియాలోని లోపలి విభాగములోని పదార్థాన్ని అవర్ణిక అంటారు.
జవాబు:
మైటోకాండ్రియాలోని లోపలి విభాగములోని పదార్థాన్ని మాత్రిక అంటారు.

62. ATP అణువులో శక్తి హైడ్రోజన్ బంధాల రూపంలో నిలువ ఉంటుంది.
జవాబు:
ATP అణువులో శక్తి ఫాస్ఫేట్ బంధాల రూపంలో నిలువ ఉంటుంది.

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

63. కండరాలలో పైరువిక్ ఆమ్లం చేరడం వల్ల నొప్పి వస్తుంది.
జవాబు:
కండరాలలో లాక్టిక్ ఆమ్లం చేరడం వల్ల నొప్పి వస్తుంది.

64. వాయునాళాల ద్వారా జరిగే శ్వాసక్రియను చర్మ శ్వాసక్రియ అంటారు.
జవాబు:
చర్మం ద్వారా జరిగే శ్వాసక్రియను చర్మ శ్వాసక్రియ అంటారు.

పోలికను గుర్తించుట

65. ఉచ్ఛ్వాస O2 : 21% :: నిశ్వాస O2😕
జవాబు:
16%

66. నిశ్వాస CO2: 44% :: ఉచ్ఛ్వాస CO2😕
జవాబు:
0.03%

67. ఉచ్చ్వాస O2 : 21% :: ? : 44%
జవాబు:
నిశ్వాస CO2

68. బ్యా క్టీరియా : లాక్టిక్ ఆమ్లం :: ? : ఇథైల్ ఆల్కహాల్
జవాబు:
ఈస్ట్

69. పీత : మొప్పలు :: ? : వాయునాళం
జవాబు:
కీటకాలు

70. కప్ప : చర్మం :: ? : టాడ్ పోల్
జవాబు:
మొప్పలు

71. CO2 : స్థిరమైన వాయువు :: ? : ఖర్చయ్యే వాయువు
జవాబు:
ఆక్సిజన్

72. గాలిగొట్టం : ? :: శబ్దపేటిక : స్వరపేటిక
జవాబు:
వాయునాళం

బొమ్మలపై ప్రశ్నలు

73.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 35
గాలిని బైటకి వదిలినప్పుడుఅద్దంపై ఉండే ఆవిరికి ఏ ప్రక్రియ కారణమవుతుంది?
జవాబు:
శ్వాసక్రియ

74.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 36
ఈ చిత్రంలోని పార్ట్ X ను గుర్తించండి.
జవాబు:
గ్రసని

75.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 37
వాయునాళాన్ని ముడుచుకుపోకుండా, మూసుకుపోకుండా నిరోధించే భాగాలు ఏవి?
జవాబు:
O ఆకారంలో ఉన్న మృదులాస్థి ఉంగరాలు

76.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 38
ఊపిరితిత్తులకు గాయం కాకుండా కాపాడే త్వచపు నిర్మాణం ఏది?
జవాబు:
ఫ్లూరా

77.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 39
ఈ ప్రక్రియ శ్వాసక్రియలోని ఏ దశను తెలుపుతుంది?
జవాబు:
ఉచ్చ్వా సం

78.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 40
ఏ భౌతిక ప్రక్రియ వాయుగోణులు మరియు రక్త కేశనాళికల మధ్య వాయువుల మార్పిడిని అనుమతిస్తుంది?
జవాబు:
వ్యాపనం / విసరణ

79.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 41
ఈ ప్రయోగం నుండి విడుదలయ్యే ఏ వాయువు సున్నపు నీటిని పాల వలె తెల్లగా మారుస్తుంది?
జవాబు:
కార్బన్ డై ఆక్సెడ్

80.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 42
పటంలో చూపిన ఈ నిర్మాణాలు మొక్క యొక్క ఏ భాగంలో ఉంటాయి?
జవాబు:
కాండం

ఖాళీలను పూరించండి

81. శ్వాసక్రియ ప్రధాన లక్ష్యం …………
జవాబు:
శక్తి విడుదల

82. శ్వాసక్రియ నిర్వహించు కణాంగం ……….
జవాబు:
మైటోకాండ్రియా

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

83. ఆక్సిజన్ ప్రమేయం లేని శ్వాసక్రియ …….
జవాబు:
అవాయు శ్వాసక్రియ

84. శ్వాసక్రియ అంత్య ఉత్పన్నాలు ………….
జవాబు:
CO2, నీటిఆవిరి, ఉష్ణం మరియు శక్తి

85. కిణ్వనం అంత్య ఉత్పనము …………
జవాబు:
ఆల్కహాల్

86. అవాయు శ్వాసక్రియ జరుపు జీవులు ……….
జవాబు:
ఈస్ట్, బాక్టీరియా

87. సున్నపు తేటను పాల వలె మార్చు వాయువు. ………
జవాబు:
CO2

88. ఊపిరితిత్తుల నిర్మాణాత్మక ప్రమాణం …………
జవాబు:
వాయుగోణులు

89. ఊపిరితిత్తులలో వాయు వినిమయం జరిగే ప్రాంతం ………..
జవాబు:
వాయుగోణులు

90. ఊపిరితిత్తులను కప్పి ఉంచు పొర ……..
జవాబు:
ఫ్లూరా

91. శ్వాస కదలికలలో ప్రముఖ పాత్ర వహించునది ………
జవాబు:
ఉదర వితానం

92. కాండంపై శ్వాసక్రియకు తోడ్పడు నిర్మాణం ……….
జవాబు:
లెంటి సెల్స్

93. మడ అడవులలోని మొక్కలలో శ్వాసక్రియకు తోడ్పడు నిర్మాణాలు …..
జవాబు:
వాయుగత వేర్లు

94. జలచర జీవులలో శ్వాస అవయవాలు …………..
జవాబు:
మొప్పలు

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

95. చర్మం ద్వారా శ్వాసక్రియ జరిపే జీవి …………..
జవాబు:
వానపాము, కప్ప

10th Class Biology 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 1 Mark Bits Questions and Answers

1. కణం యొక్క ‘ఎనర్జీ కరెన్సీ’ అని దీనికి పేరు.
A) ADP
B) మైటోకాండ్రియా
C) ATP
D) క్లోరోప్లాస్టు
జవాబు:
C) ATP

2. అవాయు శ్వాసక్రియకు సంబంధించి నిర్వహించే ప్రయోగంలో ఆక్సిజన్ ఉనికిని తెలుసుకోవడానికి
A) డయాబీన్ గ్రీన్
B) పొటాషియం హైడ్రాక్సైడ్
C) బెటాడిన్
D) సల్ఫర్ తో ఉన్న కడ్డీ
జవాబు:
A) డయాబీన్ గ్రీన్

3. మనము విడిచే గాలిలోని అంశాలు ……..
A) కార్బన్ డై ఆక్సైడ్ మరియు ఆక్సిజన్
B) ఆక్సిజన్ మరియు నీటి ఆవిరి ఉపయోగించే ద్రావణం
C) కార్బన్ డై ఆక్సైడ్ మరియు నీటి ఆవిరి
D) నీటి ఆవిరి మాత్రమే
జవాబు:
C) కార్బన్ డై ఆక్సైడ్ మరియు నీటి ఆవిరి

4. భూమిపై ఆకుపచ్చని మొక్కలు లేకపోతే ఏమౌతుంది?
A) ప్రాణికోటికి O2 అందదు
B) ప్రాణికోటికి CO2 అందదు
C) ప్రాణికోటికి N2 అందదు
D) పైవన్నీ
జవాబు:
A) ప్రాణికోటికి O2 అందదు

5. మనము CO2 ని గుర్తించే పరీక్షలో సున్నపు నీటిని తరచుగా ఈ క్రింది మార్పును గమనించటానికి ఉపయోగిస్తాం.
A) రంగులోని మార్పు
B) వాసనలోని మార్పు
C) స్థితిలోని మార్పు
D) ఆకారంలోని మార్పు
జవాబు:
A) రంగులోని మార్పు

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

6. కాంతి చర్యలో కాంతి శక్తి రసాయన శక్తిగా మారడం, నీటి అణువు విచ్ఛిన్నమవడం, CO2 అణువు గ్లూకోజ్ గా సంశ్లేషించబడటం – ఈ చర్యలు ఎక్కడ జరుగుతాయి? A) మైటోకాండ్రియా
B) రైబోజోములు
C) హరితరేణువు
D) లైసోజోములు
జవాబు:
C) హరితరేణువు

7. వంశీ నిర్వహించిన ప్రయోగంలో ఉష్ణమాపకంలో ఉష్ణోగ్రత పెరిగింది. ఈ ప్రయోగ ఉద్దేశ్యం ….
A) విత్తనాలు మొలకెత్తడం వల్ల CO2 విడుదలగును
B) శ్వాసక్రియలో ఉష్ణము విడుదలగును
C) శ్వాసక్రియలో ఆల్కహాల్ విడుదలగును
D) శ్వాసక్రియలో CO2 విడుదలగును
జవాబు:
B) శ్వాసక్రియలో ఉష్ణము విడుదలగును

8. నిశ్వాసించే వాయువులలో కార్బన్ డై ఆక్సైడ్ శాతం ఎంత?
A) 44
B) 4.4
C) 0.4
D) 0.04
జవాబు:
B) 4.4

9. హీమోగ్లోబిను ఈ క్రింది వానిలో దేనిని బంధించే శక్తి ఉంది?
A) O2
B) SO2
C) NO2
D) PO4
జవాబు:
A) O2

10. ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం
A) శ్వా సనాళిక
B) వాయుగోణులు
C) క్రిస్టే
D) నెఫ్రాన్
జవాబు:
A) శ్వా సనాళిక

11. శ్వాసక్రియలోని వివిధ దశల సరయిన క్రమాన్ని గుర్తించండి.
A) ఉఛ్వాస నిశ్వాసాలు → రక్తం → ఊపిరితిత్తులు → కణశ్వాసక్రియ
B) ఉఛ్వాస నిశ్వాసాలు → ఊపిరితిత్తులు → రక్తం – కణశ్వాసక్రియ
C) ఉఛ్వాస నిశ్వాసాలు – ఊపిరితిత్తులు → కణశ్వాసక్రియ → రక్తం
D) ఊపిరితిత్తులు → కణజాలాలు → రక్తం → కణశ్వాసక్రియ
జవాబు:
B) ఉఛ్వాస నిశ్వాసాలు → ఊపిరితిత్తులు → రక్తం – కణశ్వాసక్రియ

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

12. స్వరతంత్రులను ఇక్కడ గమనించవచ్చు.
A) స్వర పేటిక
B) గ్రసని
C) నాశికా కుహరం
D) వాయు నాళం
జవాబు:
A) స్వర పేటిక

మీకు తెలుసా?

→ ఊపిరితిత్తుల లోపలి భాగం లక్షల సంఖ్యలో ఉండే వాయుకోశ గోణులను కలిగి ఉండి, వాయుమార్పిడి జరిగే వైశాల్యాన్ని పెంచుతుంది. ఊపిరితిత్తులలోని లోపలి పొర ఎక్కువగా ముడతలుపడి ఉండడం వలన వాటి వైశాల్యం చాలా ఎక్కువగా ఉంటుంది. మన ఊపిరితిత్తులలోని వాయుకోశ గోణులన్నింటినీ విడదీసి పరిస్తే దాదాపు 160 చదరపు మీటర్లు (ఒక టెన్నిస్ కోర్టు) వైశాల్యాన్ని ఆక్రమిస్తాయి.

→ మన ఊపిరితిత్తులు (స్పాంజి’లాగా ఉంటాయి. ఇవి రెండూ ఒకే పరిమాణంలో ఉండవు. ఉరఃకుహరంలో ఎడమవైపు గుండె ఉండటం వలన ఆ వైపున ఉన్న ఊపిరితిత్తి కొంచెం చిన్నదిగా ఉంటుంది. ఊపిరితిత్తులను కప్పుతూ ‘ఫ్లూరా’ అనే రెండు పొరలుంటాయి. ఈ పొరల మధ్యలో ద్రవం ఉండి ఊపిరితిత్తులను అఘాతాల నుండి కాపాడుతుంది. ఊపిరితిత్తులు గాలితో నిండేటప్పుడు, యథాస్థితికి వచ్చేటప్పుడు జరిగే ఘర్షణ నుండి కాపాడుతుంది.

→ మానవుని ఊపిరితిత్తుల సామర్థ్యం 5800 మిల్లీ లీటర్లు. విశ్రాంతి దశలో మనం సుమారుగా 500 మి.లీ గాలిని లోపలకు తీసుకుని బయటకు వదులుతాం. మనం పూర్తిగా ఊపిరితిత్తులలోని గాలిని బయటకు పంపినప్పటికీ ఇంకా 1200 మి.లీ వాయువు ఊపిరితిత్తులలో మిగిలే ఉంటుంది.

→ సముద్రమట్టం దగ్గర హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో పూర్తిగా సంతృప్తం చెందుతుంది. దాదాపు ప్రతి హిమోగ్లోబిన్ అణువు ఆక్సిజన్ తో బంధాన్ని ఏర్పరచి ఆక్సీ హిమోగ్లోబిన్ గా మారుతుంది. సముద్ర మట్టానికి 13 కిలోమీటర్ల పైన (8 మైళ్ళు) ఆక్సీజన్ లభ్యత చాలా తక్కువగా ఉంటుంది. సముద్రమట్టంతో పోలిస్తే కేవలం ఐదవ వంతు ఆక్సిజన్ మాత్రమే లభ్యమవుతుంది. ఈ పరిస్థితులలో లభ్యమయ్యే ఆక్సిజన్ సగం హిమోగ్లోబిన్ అణువులను మాత్రమే సంతృప్తం చేయగలుగుతుంది.

హిమోగ్లోబిన్ తక్కువ ఆక్సిజన్ అణువులతో కలిసినట్లయితే, రక్తం కణజాలాలకు అవసరమైన రక్తాన్ని సరఫరా చేయలేదు. కృత్రిమమైన పద్దతిలో ఆక్సిజన్ సరఫరా (ఆక్సిజన్ సిలిండర్లతో) లేకుండా అంత ఎత్తులో జీవించడం అసాధ్యం. ఆధునిక విమానాలలో ఆక్సిజన్‌ను సరిపడినంత ఒత్తిడిలో ప్రయాణికులకు అందేలా ఏర్పాటు ఉంటుంది. సముద్రపు లోతుల్లోకి వెళ్ళే గజ ఈతగాళ్ళ సమస్యలు వేరేవిధంగా ఉంటాయి.

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

* మొక్కలు, జంతువులు, సూక్ష్మ జీవులన్నింటిలో శక్తి విడుదల కొరకు సాధారణంగా వినియోగించబడే పదార్థం గ్లూకోజ్. అన్ని జీవులలోను గ్లూకోజ్ రెండు దశలలో ఆక్సీకరింపబడుతుంది. మొదటి దశలో గ్లూకోజ్ రెండు పై రూబిక్ ఆమ్ల అణువులుగా విడగొట్టబడుతుంది. రెండవ దశలో ఆక్సిజన్ లభ్యమైనట్లయితే పైరూవిక్ ఆమ్లం కార్బన్ డై ఆక్సైడ్, నీరుగా ఆక్సీకరింపబడుతుంది. దీనితోపాటు ఎక్కువ పరిమాణంలో శక్తి విడుదలవుతుంది. ఆక్సిజన్ లభ్యం కాని పక్షంలో పైరువిక్ ఆమ్లం ఇథనాల్ గా కాని, లాక్టిక్ ఆమ్లంగా కాని మార్చబడి ఆక్సిజన్ సమక్షంలో జరిగే చర్యలలో కంటే పదవ వంతు శక్తి మాత్రమే విడుదలవుతుంది.

పునశ్చరణ

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 43

AP 10th Class Physical Science Important Questions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం

These AP 10th Class Physical Science Important Questions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం will help students prepare well for the exams.

AP Board 10th Class Physical Science 11th Lesson Important Questions and Answers లోహ సంగ్రహణ శాస్త్రం

10th Class Physics 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
సల్ఫైడ్ ధాతువును సాంద్రీకరణం చెందించడానికి ఏ పద్ధతిని అవలంబిస్తారు?
జవాబు:
ప్లవన ప్రక్రియ పద్ధతిని అవలంబించుట ద్వారా సల్ఫైడ్ ధాతువులను సాంద్రీకరణం చెందించవచ్చును.

ప్రశ్న 2.
ధాతువు నుండి ముడి లోహాన్ని పొందడం కోసం భర్జనం, భస్మీకరణం అను పద్ధతులు వాడుకలో ఉన్నాయి. ఈ రెండు పద్ధతుల మధ్య తేడా ఏమి?
(లేదా)
భర్జనం, భస్మీకరణం మధ్య భేదాలు రాయండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం 1

ప్రశ్న 3.
Fe, Na, Ag మరియు Zn లోహాలను వాటి రసాయన చర్యాశీలత పెరిగే క్రమంలో రాయండి.
జవాబు:
Ag < Fe < Zn < Na (లేదా) Ag, Fe, Zn, Na

ప్రశ్న 4.
ఇనుముతో తయారైన వస్తువులు క్షయం చెందకుండా ఉండడానికి ఎలాంటి చర్యలను తీసుకుంటారో రాయండి.
జవాబు:
ఇనుముతో తయారైన వస్తువులు క్షయం చెందకుండా ఉండడానికి

  1. ఆ వస్తువులకు రంగు (పెయింట్) చేయవచ్చు.
  2. ఆ వస్తువుల ఉపరితల వాతావరణంతో స్పర్శ లేకుండా నివారించడం.
  3. ఆ వస్తువులపై క్షయం కాని లోహాలతో ఎలక్ట్రోప్లేటింగ్ పద్ధతిలో పూతను ఏర్పాటు చేయవచ్చు.
  4. వస్తువుకు నూనె పూసి భద్రపరచడం.

AP 10th Class Physical Science Important Questions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం

ప్రశ్న 5.
లోహ సంగ్రహణ అనగానేమి?
జవాబు:
ధాతువుల నుండి లోహాలను సంగ్రహించుట, వాటిని శుద్ధి చేయుట మరియు మిశ్రమ లోహాలను తయారు చేయుటకు సంబంధించిన శాస్త్రాన్ని లోహ సంగ్రహణశాస్త్రం అంటారు.

ప్రశ్న 6.
ఖనిజం అనగానేమి?
జవాబు:
భూమి పై పటలంలో దొరికే లోహం యొక్క సమ్మేళనం.

ప్రశ్న 7.
ధాతువు అనగానేమి?
జవాబు:
లాభసాటిగా లోహాన్ని సంగ్రహించుటకు వీలైన ఖనిజం.

ప్రశ్న 8.
గాంగ్ అనగానేమి?
జవాబు:
ఖనిజంతోపాటు మండే మలినాలు – మన్ను, రాళ్లు మొదలైనవి.

ప్రశ్న 9.
ద్రవకారి అనగానేమి?
జవాబు:
సులభంగా ద్రవంగా మారని మలినాలను ద్రవంగా మార్చుటకు కలుపబడు పదార్థం.

ప్రశ్న 10.
ఆమ్ల ద్రవకారులకు ఉదాహరణలివ్వండి.
జవాబు:
SiO2, P2O5.

ప్రశ్న 11.
క్షార ద్రవకారులకు ఉదాహరణ లివ్వండి.
జవాబు:
CaO, MgO, FeO.

ప్రశ్న 12.
‘నీటితో కడగటం’ ప్రక్రియను ముడి ఖనిజ సాంద్రీకరణకు ఎలా వాడతారు?
జవాబు:
ధాతువుకు, మలినాలకు సాంద్రతలో గల తేడా ఆధారంగా, నీటి ప్రవాహంలో కడుగుట ద్వారా థాతువు నుండి మలినాలను వేరు చేస్తారు.

ప్రశ్న 13.
‘గలనం చేయడం’ అనగానేమి?
జవాబు:

  1. ధాతువు ద్రవీభవన స్థానం ‘మలినాల కన్నా తక్కువయితే ఈ పద్ధతి ఉపయోగిస్తారు.
  2. ఏటవాలుగా నున్న హార్త్ పై ధాతువును వేడిచేయగా అది కరిగి క్రిందకు ప్రవహిస్తుంది. మలినాలు అక్కడే మిగిలిపోతాయి.

ప్రశ్న 14.
‘కొలుములు’ గురించి రాయుము.
జవాబు:

  1. లోహశాస్త్రంలోని వివిధ ప్రక్రియలను జరుపుటకు వేరువేరు ఆకారాలు గల కొలుములు ఉంటాయి.
  2. వీటిలో బ్లాస్ట్ కొలిమి, రివర్బరేటరీ కొలిమి, ఓపెనర్త్ కొలిమి, బెస్సిమర్ కన్వర్టర్ ముఖ్యమైనవి.

AP 10th Class Physical Science Important Questions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం

ప్రశ్న 15.
‘ఛార్జి’ అనగానేమి?
జవాబు:

  1. ధాతువు మరియు దానితో పాటుగా కలుపబడే ద్రవకారి, క్షయకరణి మొదలగు పదార్థాల మిశ్రమం.
  2. కొలిమిలోకి ఛార్జిని హూపర్ ద్వారా ప్రవేశపెడతారు.

ప్రశ్న 16.
‘క్షయకరణం’ అనగానేమి?
జవాబు:

  1. ధాతువు నుండి లోహాన్ని పొందుట క్షయకరణమే.
  2. ఇందుకు ఉపయోగించే క్షయకరణులు : హైడ్రోజన్, కార్బన్, CO, వాటర్‌ గ్యాస్, Mg, Al, విద్యుత్ మొదలైనవి.

ప్రశ్న 17.
కొన్ని శుద్ధి చేయు పద్ధతులు రాయుము.
జవాబు:
శుద్ధిచేయు పద్ధతులు :
ద్రవ ప్రవాహం, స్వేదనం, ఆక్సీకరణం, పోలింగ్, మూసవిధి, విద్యుత్ శోధనం.

ప్రశ్న 18.
‘మిశ్రమ లోహం ‘ అనగానేమి?
జవాబు:

  1. లోహ ధర్మం గల రెండు లేదా అంతకన్నా ఎక్కువ మూలకాల సజాతీయ మిశ్రమం.
  2. సుమారు ఒకే పరమాణు సైజు గల లోహాలు మిశ్రమ లోహాలను సులభంగా ఏర్పరుస్తాయి.

ప్రశ్న 19.
కాపర్, తగరం లోహాలు, కలిస్తే ఏర్పడే మిశ్రమ లోహాలు రాయండి.
జవాబు:
బ్రాంజ్ (కంచు).

ప్రశ్న 20.
సల్ఫైడ్ ధాతువును శుద్ధిచేయు ప్లవన ప్రక్రియలో కలుపబడు పదార్థాలు ఏవి?
జవాబు:
పైన్ నూనె లేక యూకలిప్టస్ నూనె, పొటాషియం ఇథైల్ గ్రాంథేట్ లేక పొటాషియం అమైల్ గ్జాంథేట్, కొద్దిగా సున్నం లేక Na2 CO3.

ప్రశ్న 21.
‘Al’ తో క్షయకరణం చేయు ప్రక్రియను ఏమని పిలుస్తారు?
జవాబు:
థర్నెట్ చర్య.

ప్రశ్న 22.
‘స్పెల్టర్’ అనగానేమి?
జవాబు:
ముడి జింక్ (97-98%) ను స్పెల్టర్ అంటారు.

ప్రశ్న 23.
ఫెర్రస్ మిశ్రమ లోహాలు అనగానేమి?
జవాబు:
లోహ ధర్మాలను కలిగి ఉండే రెండు లేదా అంతకన్నా ఎక్కువ మూలకాల సజాతీయ మిశ్రమం.

ప్రశ్న 24.
ఎమాలం అని దేనిని అంటారు?
జవాబు:
పాదరసాన్ని కలిగి ఉన్న మిశ్రమ లోహాన్ని ఎమాణం అంటారు.

ప్రశ్న 25.
బ్రాస్ (ఇత్తడి) సంఘటనాన్ని తెలపండి.
జవాబు:
Cu : 60-80%, Zn : 20-40%.

AP 10th Class Physical Science Important Questions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం

ప్రశ్న 26.
బ్రాంజ్ (కంచు) సంఘటనాన్ని తెల్పండి.
జవాబు:
Cu : 75-90%, Zn : 10-25%.

ప్రశ్న 27.
జర్మన్ సిల్వర్ సంఘటనాన్ని తెల్పండి.
జవాబు:
Cu : 25-50%, Zn : 25-35%, Ni : 10-20%.

ప్రశ్న 28.
క్రింది లోహాలను వాటి చర్యాశీలత యొక్క అవరోహణ క్రమంలో అమర్చండి.
K, Zn, Ag, Fe, Ca, Au, Na, Ph.
జవాబు:
అధిక చర్యాశీలత గల లోహాలు : K, Na, Ca
సాధారణ చర్యాశీలత గల లోహాలు : Zn, Fe, Pb
తక్కువ చర్యాశీలత గల లోహాలు : Ag, Au
అవరోహణ క్రమం : K, Na, Ca, Zn, Fe, Pb, Ag, Au

ప్రశ్న 29.
ఒక లోహాన్ని దాని ,ధాతువు నుండి సంగ్రహించే విధానంలోని దశలేవి?
జవాబు:

  1. ముడి ఖనిజ సాంద్రీకరణ,
  2. ముడి లోహ నిష్కర్షణ,
  3. లోహాన్ని కుద్ధి చేయడం

ప్రశ్న 30.
ముడి ఖనిజ సాంద్రీకరణ అనగానేమి?
జవాబు:
ఖనిజమాలిన్యం అధిక పరిమాణంలోనున్న ధాతువు నుండి వీలైనంత ఖనిజ మాలిన్యంను తక్కువ ఖర్చుతో కొన్ని భౌతిక పద్ధతుల ద్వారా వేరుచేసే ప్రక్రియను ధాతు సాంద్రీకరణ అంటారు.

ప్రశ్న 31.
ధాతువును సాంద్రీకరణం చేయడానికి వాడే భౌతిక పద్ధతిని ఎలా ఎంచుకుంటారు?
జవాబు:
ధాతువు, ఖనిజ మాలిన్యంల మధ్య భౌతిక ధర్మాలలో గల భేదంపై ఆధారపడి కొన్ని భౌతిక పద్ధతులను ధాతువు సాంద్రీకరణ చేయడానికి అవలంబిస్తారు.

ప్రశ్న 32.
కార్బతో లోహ ఆక్సైడ్ల క్షయకరణానికి ఒక ఉదాహరణనిమ్ము.
జవాబు:
లోహ ఆక్సైడ్ లను, మూసి ఉన్న కొలిమిలో తీసుకున్న కోక్ తో వేడిచేసి క్షయకరణం గావిస్తే లోహం, కార్బన్ మోనాక్సైడ్ ఏర్పడతాయి.
AP 10th Class Physical Science Important Questions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం 2

ప్రశ్న 33.
లోహశుద్ధి అనగానేమి?
జవాబు:
అపరిశుద్ధ లోహం నుండి శుద్ద లోహంను పొందే ప్రక్రియను లోహశుద్ధి అంటారు.

ప్రశ్న 34.
లోహశుద్ధిలోని వివిధ పద్ధతులేవి?
జవాబు:
స్వేదనం, పోలింగ్, గలనం చేయడం, విద్యుత్ విశ్లేషణం.

AP 10th Class Physical Science Important Questions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం

ప్రశ్న 35.
ద్రవకారి (flux) అనగానేమి?
జవాబు:
ధాతువులోని మలినాలను తొలగించడానికి ధాతువుకు బయటినుండి కలిపిన పదార్థాన్ని ‘ద్రవకారి’ అంటారు.

ప్రశ్న 36.
లోహ సంగ్రహణంలో కొలిమి పాత్ర ఏమిటి?
జవాబు:
లోహ నిష్కర్షణలో ఉష్ణరసాయన ప్రక్రియలను చేయడానికి వాడేదే కొలిమి.

ప్రశ్న 37.
చర్యాశీలత శ్రేణి అనగానేమి?
జవాబు:
లోహాలను వాటి చర్యాశీలతల అవరోహణ క్రమంలో అమర్చితే వచ్చే శ్రేణిని “చర్యాశీలత శ్రేణి” అంటారు.

ప్రశ్న 38.
మిశ్రమ లోహం సజాతీయమా? విజాతీయమా?
జవాబు:
మిశ్రమ లోహం సజాతీయం

10th Class Physics 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
ఖనిజాన్ని నిర్వచించండి. ఏవైనా రెండు మెగ్నీషియం ధాతువులను రాయండి.
జవాబు:
ఖనిజం :
ప్రకృతిలో లభించే లోహ మూలకాలు లేదా సమ్మేళనాలను “ఖనిజం” అంటారు.
(లేదా)
భూమిపై పటలంలో దొరికే లోహం యొక్క సమ్మేళనాలను “ఖనిజం” అంటారు.

మెగ్నీషియం ధాతువులు :

  1. మాగ్నసైట్ (MgCO3),
  2. కార్నలైట్ (KCl.MgCl2.6H2O)

ప్రశ్న 2.
పొటాషియం, సోడియం, మెగ్నీషియం ఎక్కువ చర్యాశీలత కలవి మరియు క్లోరైడ్ల రూపంలో ప్రకృతిలో లభిస్తున్నాయి. వీటి లోహ సంగ్రహణానికి అనుకూలమైన పద్ధతిని సూచించి వివరించండి.
జవాబు:

  1. ఎక్కువ చర్యాశీలత గల లోహాలను వాటి క్లోరైడ్ నుండి సంగ్రహణం చేయడానికి వాటి ద్రవరూప సమ్మేళనాలను విద్యుద్విశ్లేషణ చేయడం అనువైన పద్ధతి.
  2. వీటి సంగ్రహణకు క్షయకరణ పద్ధతి, వాటి జల ద్రావణాల విద్యుద్విశ్లేషణ పద్దతులు సులభంగా సాధ్యం కావు.

ప్రశ్న 3.
అధిక చర్యాశీలత గల లోహాలు అల్ప చర్యాశీలత గల లోహాలను వాటి సంయోగ పదార్థాల నుండి స్థానభ్రంశం చెందిస్తాయని తెలుపడానికి మీరు ఏ ప్రయోగాన్ని నిర్వహిస్తారో వివరించండి.
జవాబు:
ఈ ప్రయోగ నిర్వహణకు ఏదైనా ఒక లోహం యొక్క సల్ఫేట్, క్లోరైడ్, నైట్రేట్స్ వంటి సంయోగ పదార్థాన్ని మరియు ఆ లోహం కన్నా ఎక్కువ చర్యాశీలత కలిగిన మరొక లోహాన్ని పెంచుకోవాలి.

  • మనం తీసుకున్న లోహం యొక్క సంయోగ పదార్థాన్ని నీటిలో కలిపి ద్రావణం తయారుచేయాలి.
  • ఆ ద్రావణాన్ని ఒక పరీక్షనాళికలో తీసుకొని అందులో మనం ఎంచుకొన్న లోహపు ముక్కను ఉంచి కొంత సమయం తర్వాత ద్రావణాన్ని, లోహపు ముక్కని పరిశీలించాలి.
  • ద్రావణంలో ఉంచిన లోహపు ముక్కపై, సంయోగ పదార్థంలోని లోహం యొక్క పూత ఏర్పడితే, అధిక చర్యాశీలత గల లోహాలు అల్ప చర్యాశీలత గల లోహాలను వాటి సంయోగ పదార్థాల నుండి స్థానభ్రంశం చెందిస్తాయని చెప్పవచ్చు.

ప్రశ్న 4.
మిశ్రమ లోహాలు కనిపెట్టబడి ఉండకపోతే గృహోపకరణాల వినియోగ విషయంలో ఏం జరిగి ఉండేది?
జవాబు:

  1. మిశ్రమ లోహాలైన స్టెయిన్లెస్ స్టీల్ లేకపోతే ధృఢత్వం, మెరుపు మొదలైన లక్షణాలు లేని సాధారణ లోహాలతో తయారైన వంటపాత్రలు వినియోగించవలసి వచ్చేది.
  2. సాధారణంగా ఇనుము, రాగి లాంటి లోహాలతో చేయబడిన వంట పాత్రలు ఉపయోగించడం వలన ఆక్సీకరణ చర్యల కారణంగా తుప్పుపట్టడం, చిలుము పట్టడం లాంటి సమస్యలు ఎదురవుతాయి.
  3. ఆహార పదార్థాలను భద్రపరచడానికి స్టెయిన్లెస్ స్టీల్ అందుబాటులో లేకపోవడం వలన ప్లాస్టిక్, కుండ పాత్రలు మాత్రమే వినియోగించవలసి వచ్చేది. కాని వాటి మన్నిక తక్కువ.
  4. అల్యూమినియం సామాగ్రి మన్నిక కూడా తక్కువ.
  5. కొన్ని అవసరాలకి ఇత్తడి మిశ్రమలోహం బదులు రాగి, వెండి పాత్రలు వినియోగించడం వలన అధిక ఖర్చు భరించవలసి వచ్చేది.
  6. కుక్కర్లు, ఇస్త్రీ పెట్టెలు, ఫ్రిజ్ లు ఇతర గృహోపకరణాలలో వినియోగించే మిశ్రమ లోహాలు బదులు శుద్దలోహాలు వాడడం వలన విద్యుత్ ఖర్చు పెరుగుతుంది.
  7. మిశ్రమ లోహాలు లేకపోవుట వలన ఫర్నిచర్‌ను ప్లాస్టిక్, సాధారణ లోహాలు, చెక్కతో చేసినవి వినియోగించవలసివచ్చేది. దాని వలన ఖర్చు పెరుగుతుంది. పర్యావరణ సమస్యలు ఎక్కువ అవుతాయి.

ప్రశ్న 5.
అధిక చర్యాశీలత గల లోహాలతో ధాతువులను క్షయకరణం చేసే చర్యకు ఒక ఉదాహరణనిచ్చి, సమీకరణంను వ్రాయండి.
జవాబు:
ఐరన్ ఆక్సైడ్ ను అల్యూమినియంతో క్షయకరణం చేయడం. Fe2O2 + 2Al → 2Fe + Al2O2 + ఉష్ణశక్తి (లేదా)
టైటానియం క్లోరైడ్ ను మెగ్నీషియంతో క్షయకరణం చేయడం. TiCl4 + 2Mg → Ti + 2MgCl2 (లేదా)
టైటానియం క్లోరైడ్ ను సోడియంతో క్షయకరణం చేయడం. TiCl4 + 4Na → Ti + 4Nacl (లేదా)
క్రోమియం ఆక్సైడ్ ను అల్యూమినియంతో క్షయకరణం చేయడం. Cr2O3 + 2Al → 2Cr + Al2O3 + ఉష్ణశక్తి

ప్రశ్న 6.
నిత్య జీవితంలో లోహక్షయాన్ని నివారించుటకు మీరు తీసుకునే రెండు జాగ్రత్తలు రాయండి.
జవాబు:
లోహక్షయాన్ని నివారించుటకు తీసుకునే జాగ్రత్తలు :

  1. లోహాలకు రంగులు వేయడం.
  2. లోహాలను తేమ తగలని ప్రదేశాలలో ఉంచడం.
  3. లోహాల పై క్షయంకాని లోహాలతో పూతపూయడం.
  4. మిశ్రమ లోహాలను తయారుచేయడం.
  5. లోహాలకు నూనె/గ్రీజ్ వంటి పదార్థాలను పూయడం.

ప్రశ్న 7.
సిలికాన్ (Si) ఒక అర్ధలోహం (Metalloid). దీనిని నీవు ఎలా సమర్థిస్తావు?
జవాబు:
సిలికాన్ కు క్రింది ధర్మాలుండుట వలన అది ఒక అర్ధలోహంగా సమర్థించగలను.

  1. ఇది లోహధృతి స్వభావంను కలిగి ఉండును.
  2. ఇది అనేక లోహాత్మక మరియు అలోహాత్మక సమ్మేళనాలను ప్రదర్శించును.
  3. ఇది స్వతహాగా పెళుసుదనంను కలిగి ఉండును.
  4. ఇది లోహస్థితిలోను మరియు అలోహస్థితులలోనూ తటస్థించును.

ప్రశ్న 8.
రాగి, వెండి వస్తువులకు చిలుము ఏర్పడకుండా మీరు ఏమి చేస్తారు?
జవాబు:
రాగి, వెండి వస్తువులకు చిలుము ఏర్పడకుండాఉండుటకు పాటించు పద్ధతులు :

  1. వస్తువుల లోహతలంపై ఒక పొరను ఏర్పరచి దాని ద్వారా ఆక్సిజన్ మరియు తేమ తగలకుండా చేయుట.
  2. లోహతలంపై రంగు వేయడం, నూనె, గ్రీజు, లేదా క్రోమియం పూతలను పూయటం.
  3. మిశ్రమ లోహాలను తయారుచేయడం ద్వారా.

AP 10th Class Physical Science Important Questions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం

ప్రశ్న 9.
సల్ఫైడ్ ధాతువుల స్వయం క్షయకరణానికి ఒక ఉదాహరణనిమ్ము.
జవాబు:
సల్ఫైడ్ ధాతువుల నుండి రాగిని సంగ్రహించేటప్పుడు ఆ ధాతువును గాలిలో పాక్షిక భర్జనం చేసి ఆక్సైడ్ గా మారుస్తారు.
2Cu2S + 3O2 → 2Cu2O + 2SO2

గాలిని అందజేయడం ఆపివేసి, ఉష్ణోగ్రత పెంచినపుడు ఇంకా మిగిలి ఉన్న లోహసల్ఫైడ్, లోహ ఆక్సైడ్ తో చర్య పొంది లోహాన్ని మరియు SO, ను ఏర్పరుస్తుంది.
2Cu2O + Cu2S → 6Cu + 2SO2

ప్రశ్న 10.
లోహాలను మిశ్రమలోహాలుగా మార్చడం వల్ల ఉపయోగమేమి?
జవాబు:

  1. ఒక లోహం యొక్క ధర్మాలను పెంపొందించడానికి దానిని మిశ్రమ లోహం (Alloy) గా మార్చడం మంచి పద్దతి.
  2. ఉదా : ఇనుము శుద్ధస్థితిలో చాలా మృదువుగాను మరియు వేడి చేసినపుడు సులువుగా సాగిపోతుంది.
  3. దీనికి చాలా తక్కువ మొత్తంలో కార్బనను మిశ్రమం చెందించినపుడు అది గట్టిగాను, దృఢంగాను మారుతుంది.
  4. ఇనుమును నికెల్, క్రోమియంతో మిశ్రమం చెందిస్తే స్టెయిన్లెస్ స్టీల్ ఏర్పడుతుంది. ఇది తుప్పు పట్టదు.

ప్రశ్న 11.
22 కారట్ బంగారం అనగానేమి? ఇది ఆభరణాల తయారీలో ఎలా ఉపయోగపడుతుంది?
జవాబు:

  1. 24 కారట్ల బంగారంగా పిలువబడుతున్న శుద్ధమైన బంగారం చాలా మృదువుగా ఉంటుంది. అందుచే ఇది ఆభరణాల తయారీకి అంత అనువుగా ఉండదు.
  2. వెండి లేదా రాగి కలిసియున్న 22 కారట్ల బంగారాన్ని ఆభరణాల తయారీకి వాడుతారు.

10th Class Physics 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
A, B, C, D అనే నాలుగు లోహాలు వివిధ ద్రావణాలతో కలిసినప్పుడు జరిగే చర్యలను కింది పట్టికలో ఇవ్వడం జరిగింది.
AP 10th Class Physical Science Important Questions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం 3
పై సమాచారం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
i) అధిక చర్యాశీలత గల లోహం ఏది? ఎలా చెప్పగలవు?
ii) కాపర్ (II) సల్ఫేట్ ద్రావణంతో B లోహం కలిసినప్పుడు ఏం జరుగుతుంది?
iii) A, B, C, D లోహాలను చర్యాశీలత పెరిగే క్రమంలో అమర్చండి.
iv) పై ద్రావణాలన్నింటిని సురక్షితంగా నిల్వచేయడానికి ఉపయోగపడే లోహపు పాత్రలను పైన ఇచ్చిన ఏ లోహంతో చేయవచ్చు?
జవాబు:
i) అధిక చర్యాశీలత గల లోహం – B
కారణం :
B అనే లోహం ఐరన్ సల్ఫేట్ నుండి ఐరన్ ను స్థానభ్రంశం చెందించగలిగింది.

ii) స్థానభ్రంశ చర్య జరుగుతుంది. (లేదా) కాపర్ సల్ఫేట్ నుండి కాపర్ స్థానభ్రంశం చెందుతుంది.
కారణం :
A లోహం కాపర్ సల్ఫేట్ నుండి కాపర్‌ను స్థానభ్రంశం చెందించింది.
B లోహం ఐరన్ సల్ఫేట్ నుండి ఐరన్ ను స్థానభ్రంశం చెందించింది.
C లోహం సిల్వర్ నైట్రేట్ నుండి సిల్వర్‌ ను స్థానభ్రంశం చెందించింది.
B లోహం కాపర్ కంటే అధిక చర్యాశీలత గల లోహమైన ఇనుమును ఐరన్ సల్ఫేట్ నుండి స్థానభ్రంశం చెందించింది. కావున అది కాపర్ సల్ఫేట్ నుండి కూడా కాపర్‌ను స్థానభ్రంశం చెందించగలదు.

iii) D, C, A, B (or) D < C < A < B.

iv) D లోహంతో తయారుచేయవచ్చు.

ప్రశ్న 2.
లోహాలను శుద్ధి చేసే విధానాలను తెలిపి, ఆ పద్ధతులను ఏ ఏ సందర్భాలలో ఉపయోగిస్తారో వివరించండి.
జవాబు:
ఆయా లోహాలలో ఉన్న మలినాలను బట్టి శుద్ధి చేసే పద్దతులు వేరుగా ఉంటాయి. వీటిలో కొన్ని (i) స్వేదనం, (ii) పోలింగ్, (iii) గలనం చేయడం, (iv) విద్యుత్ విశ్లేషణం.

i) స్వేదనం :
a) అల్ప బాష్పశీల లోహాలు, అధిక బాష్పశీల లోహాలను మలినాలుగా కలిగి ఉన్నపుడు ,ఈ పద్ధతిని వాడతారు.
b) ఈ పద్ధతిలో ద్రవస్థితిలో ఉన్న నిష్కర్షించబడిన లోహాలను స్వేదనం చేసి శుద్ధలోహాన్ని పొందుతారు.

ii) పోలింగ్ :
a) ఈ పద్దతిలో ద్రవస్థితిలో వున్న లోహాన్ని పచ్చి కర్రలతో బాగా కలుపుతారు.
b) ఈ విధంగా చేయుట ద్వారా మలినాలు వాయువు రూపంలో వేరుపడడం గాని లేదా నురగలా ద్రవరూప లోహ ఉపరితలంపై ఏర్పడడం జరుగును.
c) ఈ పద్ధతిలో కాపర్‌ను శుద్ధి చేస్తారు.

iii) గలనం చేయడం :
a) ఈ పద్ధతిలో అల్ప ద్రవీభవన స్థానాలున్న లోహాలను వేడి చేసి వాలుగా ఉన్న తలంపై జారునట్లు చేస్తారు.
b) ఈ స్థితిలో లోహం కరిగి కిందకు జారడం ద్వారా అధిక ద్రవీభవన స్థానాలున్న మలినాలు వేరు చేయబడును.

iv) విద్యుత్ విశ్లేషణం :
a) ఈ పద్ధతిలో అపరిశుద్ధ లోహంను ఆనోడ్ గా ఉపయోగిస్తారు.
b) అదే శుద్ధలోహపు ముక్కను కాథోడ్ గా వాడతారు.
c) విద్యుద్విశ్లేషణ తొట్టెలో అదే లోహానికి చెందిన ద్రవస్థితి గల లోహ లవణాన్ని విద్యుద్విశ్లేషణంగా తీసుకుంటారు.
d) అవసరమైన లోహం కాథోడ్ వద్ద శుద్ధ స్థితిలో నిక్షిప్తమగును.
e) మలినాలు “ఆనోడ్ మడ్”గా ఆనోడ్ వద్ద’ అడుగుకు చేరును.

ఆనోడ్, కాథోడ్ వద్ద జరుగు చర్యలు :

ఆనోడ్ వద్ద : M → M+n + ne కాథోడ్ వద్ద : M+n + ne → M
ఇక్కడ M = శుద్ధలోహం
n = 1, 2, 3, ………

ప్రశ్న 3.
ఇనుప వస్తువు క్షయం జరగడానికి గాలి, నీరు అవసరమని నిరూపించు ప్రయోగ విధానం వ్రాయుము.
(లేదా)
ఇనుముతో తయారు చేసిన వస్తువులు తుప్పు పట్టడానికి గాలి, నీరు అవసరం అని చూపు ప్రయోగంలో తీసుకోవలసిన జాగ్రత్తలను తెలిపి, ప్రయోగ విధానమును రాయండి.
జవాబు:
ప్రయోగం :
లక్ష్యం : ఇనుప వస్తువులు క్షయం చెందడానికి గాలి, నీరు అవసరం అని నిరూపించుట.

కావలసిన వస్తువులు : 3 పరీక్షనాళికలు, 9 ఇనుప మేకులు, నూనె, నీరు, రబ్బరు కార్కులు, అనార్థ కాల్షియం క్లోరైడ్
AP Board 10th Class Physical Science Solutions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం 4

ప్రయోగ పద్ధతి :

  1. మూడు పరీక్షనాళికలు తీసుకుని, వాటిని A, B, C లు గా గుర్తించండి. ఒక్కొక్క దానిలో శుభ్రంగా ఉన్న మూడేసి ఇనుప మేకులను వేయండి.
  2. పరీక్షనాళిక A లో కొంత నీటిని తీసుకొని, దానిని రబ్బరు బిరడాతో బిగించండి.
  3. పరీక్షనాళిక B లో మరిగించిన స్వేదన జలాల్ని ఇనుప మేకు మునిగేంత వరకు తీసుకొని, దానికి 1 మి.లీ. నూనెను కలిపి, రబ్బరు బిరడాతో బిగించండి.
  4. పరీక్ష నాళిక ‘C’ లో కొంచెం అనార్థ కాల్షియం క్లోరైడ్ ను తీసుకొని, రబ్బరు బిరడాను బిగించండి.
  5. అనార్థ కాల్షియం క్లోరైడ్ గాలిలో తేమను గ్రహించును.
  6. పై పరీక్షనాళికలను కొన్ని రోజుల వరకూ అలా ఉంచేసి తర్వాత వచ్చిన మార్పులను పరిశీలించండి.

పరిశీలనలు :

  1. పరీక్షనాళిక A లో మేకు తుప్పు పట్టును.
  2. కానీ B మరియు C పరీక్షనాళికలోని మేకులు తుప్పు పట్టవు.

కారణం :

  1. పరీక్షనాళిక ‘A’ లోని మేకులు గాలి, నీరు ఉన్న వాతావరణంలో ఉంచబడ్డాయి. అందుకే తుప్పుపట్టాయి.
  2. ‘B’ పరీక్ష నాళికలోని మేకులు కేవలం నీటిలోను, ‘C’ పరీక్షనాళికలోని మేకులు పొడి గాలిలో ఉంచబడ్డాయి. తుప్పు పట్టలేదు.

నిర్ధారణ :
కనుక ఈ ప్రయోగం ద్వారా లోహక్షయానికి గాలి, నీరు అవసరం అని నిర్ధారించవచ్చును.

ప్రశ్న 4.
ప్లవన ప్రక్రియ ద్వారా సల్ఫైడు ధాతువు సాంద్రీకరణను చూపు పటం గీచి, భాగాలను గుర్తించండి.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం 1

ప్రశ్న 5.
ముడిఖనిజం గానీ లేదా ఖనిజ మాలిన్యం గానీ ఏదో ఒకటి అయస్కాంత పదార్థం అయివుంటే వాటిని వేరుచేసే పద్ధతి పేరు తెల్పండి. ఆ పద్ధతిని సూచించే చక్కని పటాన్ని గీయండి.
జవాబు:
ముడిఖనిజం గానీ లేదా ఖనిజ మాలిన్యం గానీ ఏదో ఒకటి అయస్కాంత పదార్థం అయి ఉంటే వాటిని వేరు చేసే పద్ధతి అయస్కాంత వేర్పాటు పద్ధతి.
AP Board 10th Class Physical Science Solutions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం 5

ప్రశ్న 6.
A, B, C, D, E అనే లోహాలు వివిధ ద్రావణాలతో చర్య జరిపినపుడు వచ్చిన ఫలితాలు క్రింది పట్టికలో ఉన్నాయి. పట్టికను పరిశీలించండి. సమాధానాలు రాయండి.
AP 10th Class Physical Science Important Questions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం 4
అ) అధిక చర్యాశీలత గల లోహం ఏది? ఎందుకు?
ఆ) అల్ప చర్యాశీలత గల లోహం ఏది? ఎందుకు?
ఇ) గోధుమరంగు పూత ఏర్పరచే లోహాలు ఏవి?
ఈ) A, B, C, D, E లోహాలను చర్యాశీలతల ఆరోహణక్రమంలో అమర్చండి.
జవాబు:
అ) ‘E’ అను లోహము మిగిలిన వాటన్నింటికంటే అధిక చర్యాశీలత కలది. ఎందుకనగా ఇది అన్ని ద్రావణాలతో అవక్షేపాలను ఏర్పరచుచున్నది కాబట్టి.
ఆ) ‘C’ అను లోహము మిగిలిన వాటన్నింటికంటే అల్ప చర్యాశీలత కలది. ఎందుకనగా ఇది ఏ ద్రావణంతోను చర్య జరిపి అవక్షేపమును ఏర్పరచలేదు కాబట్టి.
ఇ) B మరియు E అను లోహములు గోధుమరంగు పూతను ఏర్పరచుచున్నవి.
ఈ) ఇచ్చిన లోహాల చర్యాశీలత యొక్క ఆరోహణ క్రమము C

AP 10th Class Physical Science Important Questions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం

ప్రశ్న 7.
కింద ఇవ్వబడిన ఉత్పన్నాలలో ఉన్న అతిముఖ్యమైన లోహ మరియు అలోహాలను తెల్పండి.
అ) అన్నపూర్ణ ఉప్పు
జవాబు:
అన్నపూర్ణ ఉప్పు — అయోడిన్, క్లోరిన్ – అలోహము

ఆ) థర్మామీటరులో వాడే ద్రవం
జవాబు:
థర్మామీటరులో వాడు ద్రవము — మెర్క్యురీ (పాదరసము) – ద్రవలోహము

ఇ) పెన్సిల్ ములుకు
జవాబు:
పెన్సిల్ ములుకు – గ్రాఫైట్ – అలోహము

ఈ) క్లోరోఫిల్
జవాబు:
క్లోరోఫిల్ – మెగ్నీషియం — లోహము

ఉ) విద్యుత్ బల్బ్ లోని ఫిలమెంట్
జవాబు:
ఫిలమెంట్ – టంగ్స్టన్ – లోహము

ఊ) దంతాలపైనున్న ఎనామిల్ (enamel) పూత
జవాబు:
దంతాలపైనున్న ఎనామిల్ పూత – కాల్షియం ఫాస్ఫేట్ – అలోహము

ప్రశ్న 8.
లోహాలను వాటి ధాతువుల నుండి సంగ్రహించుటలోని వివిధ దశలను ఫ్లోచార్టు రూపంలో తెలుపుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం 8

ప్రశ్న 9.
లోహాలు ఆక్సిజన్ తో, నీటితో, నీటి ఆవిరితో, బలమైన విలీన ఆమ్లాలతో, క్లోరిన్ తో జరిపే చర్యలను పట్టిక రూపంలో చూపుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం 7

ప్రశ్న 10.
ధాతువు నుండి ముడిలోహ సంగ్రహణ గురించి రాయుము.
జవాబు:
భూమి నుండి లభించిన ధాతువును సాంద్రీకరించిన తరువాత శుద్ధిచేసిన ధాతువును పొందుతాం. ఈ ధాతువు నుండి లోహాన్ని సంగ్రహించడానికి క్షయకరణ చర్య ద్వారా దీనిని లోహ ఆక్సైడ్ గా మారుస్తారు. ఈ లోహ ఆక్సైడ్ ను మరలా క్షయకరణమునకు గురిచేయటం ద్వారా కొన్ని మలినాలతో కూడిన లోహాన్ని పొందగలం. ఒక లోహాన్ని దాని ధాతువుల నుండి సంగ్రహించటం, ఆ లోహం యొక్క చర్యాశీలతపై ఆధారపడి ఉంటుంది.

1) చర్యాశీలత శ్రేణిలో ఎగువభాగంలో ఉన్న లోహాల సంగ్రహణం :
ఈ లోహాలను సంగ్రహణం చేయడానికి అనువైన పద్ధతి విద్యుద్విశ్లేషణ.
ఉదా : Nacl నుండి సోడియం (Na) పొందడానికి ద్రవరూప Nacl ను స్టీల్ కాథోడ్, గ్రాఫైట్ ఆనోడ్ సహాయంతో విద్యుద్విశ్లేషణ చేస్తారు. కాథోడ్ వద్ద సోడియం లోహం నిక్షిప్తమై ఆనోడ్ వద్ద క్లోరిన్ వెలువడుతుంది.
కాథోడ్ వద్ద : 2Na+ + 2e → 2Na
ఆనోడ్ వద్ద : 2Cl → Cl2 + 2e

2) చర్యాశీలత మధ్యలోనున్న లోహాల సంగ్రహణం :
ఈ లోహ ధాతువులు సాధారణంగా సల్ఫైడ్లు కార్బొనేట్ల రూపంలో వుంటాయి. ఈ ధాతువులను ముందు ఆక్సైడ్లుగా మారుస్తారు. భర్జనం ద్వారా సల్ఫైడ్ ధాతువులను ఆక్సైడ్లుగా మార్చి తరువాత క్షయకరణం ద్వారా లోహాన్ని పొందుతారు. సరైన ఓయీకరణ కారకాన్నుపయోగించి కార్బన్ వంటి లోహ ఆక్సైడ్లను లోహాలుగా క్షయకరణం చెందిస్తారు.

3) చర్యాశీలత శ్రేణిలో దిగువననున్న లోహాల సంగ్రహణం :
ఇలాంటి లోహాలను వేడిమిచర్యతో క్షయీకరింపజేయడం ద్వారా లేదా కొన్నిసార్లు వీని జలద్రావణాల నుండి స్థానభ్రంశం చెందించడం ద్వారా పొందవచ్చు.

ప్రశ్న 11.
రాగిని విద్యుత్ శోధనం ద్వారా పొందే విధానమును వివరింపుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం 9
కాపర్ యొక్క విద్యుత్ శోధన కొరకు పరికరాల అమరిక

  1. అపరిశుద్ధ కాపర్‌ను ఆనోడ్ గాను, స్వచ్ఛమైన పలుచటి కాపర్ రేకులను కాథోడ్ గాను తీసుకుంటారు.
  2. విద్యుద్విశ్లేషకంగా ఆమీకృత కాపర్‌సల్ఫేట్ ద్రావణాన్ని విద్యుద్విశ్లేషణ తొట్టెలో తీసుకొని అందులో కాథోడ్, ఆనోట్లను వ్రేలాడదీస్తారు.
  3. విద్యుద్విశ్లేషణ ప్రక్రియ చేసినపుడు శుద్ధ స్థితిలో కాపర్, కాథోడ్ వద్ద నిక్షిప్తమవుతుంది.
    కాథోడ్ వద్ద : Cu → Cu2+ + 2e
    ఆనోడ్ వద్ద : Cu2+ + 2e → Cu

ద్రావణంలో కరగగలిగే మలినాలు ద్రావణంలోనే ఉండిపోతాయి. బ్లిస్టర్ కాపర్ నుండి వచ్చిన కరగని మలినాలు ఆనోడ్ మడ్ గా అడుగుభాగానికి చేరిపోతాయి.

ప్రశ్న 12.
లోహక్షయం అనగానేమి? అది ఎలా జరుగుతుంది?
జవాబు:
లోహక్షయం :
ఒక లోహం, దానిచుట్టూ ఉన్న పరిసరాలతో చర్య జరపడం ద్వారా తుప్పు పట్టుట, నల్లని పూత ఏర్పడుట వంటి మార్పులకు లోనగుటను లోహక్షయం అంటారు.

లోహక్షయం జరిగే విధానం :
1) ఇది ఒక విద్యుత్ రసాయన దృగ్విషయం.

2) ఇనుప వస్తువుల ఉపరితలంపై నిర్దిష్ట ప్రాంతంలో క్షయం జరిగేటప్పుడు అక్కడ ఆక్సీకరణం జరిగి, ఆ ప్రాంతం ఆనోడ్ గా ప్రవర్తిస్తుంది.
2Fe → 2Fe2+ + 4e a

3) ఈ ఆనోడ్ వద్ద విడుదలైన ఎలక్ట్రాన్లు లోహం గుండా వేరే ప్రాంతం వద్దకు పోయి హైడ్రోజన్ అయాన్ (H+) సమక్షంలో ఆక్సిజన్‌ను క్షయీకరిస్తాయి. ఈ ప్రాంతం కాథోడ్ గా వ్యవహరిస్తుంది.
O2 +4H+ + 4e → 2H2O
మొత్తం చర్య : 2 Fle + O2 + 4H+ → 2 Fe2+ + 2H2O
వాతావరణంలోని ఆక్సిజన్ చే ఫెర్రస్ (Fe2+) అయాన్లు ఆక్సీకరణం చెంది ఫెర్రిక్ అయాన్లు (Fe3+) గా మారి హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్ (Fe2O3 . XH2O) రూపంలో తుప్పుగా మారతాయి.

ప్రశ్న 13.
లోహక్షయాన్ని ఎలా నివారిస్తారు?
జవాబు:

  1. లోహ ఉపరితలాన్ని పెయింట్ తో గాని, కొన్ని రసాయనాలతోగాని కప్పి ఉంచడం వల్ల లోహక్షయాన్ని నివారించవచ్చు.
  2. అల్ప చర్యాశీలత కలిగి ఉండి వాతావరణంలో తామే ముందుగా చర్య జరిపి, వస్తువును రక్షించగలిగే లోహాలైన Sn, Zn వంటి వాటిలో లోహ వస్తువును కప్పి ఉంచడం.
  3. విద్యుత్ రసాయన పద్దతిలో Zn, Mg వంటి లోహ ఎలక్ట్రోడ్లు తమకు తామే క్షయం చెంది వస్తువును క్షయం కాకుండా రక్షిస్తాయి.

ప్రశ్న 14.
బ్లాస్ట్ కొలిమి పటం గీచి, భాగములు గుర్తించుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం 10

10th Class Physics 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం ½ Mark Important Questions and Answers

1. ప్రకృతిలో లభించే ధాతువుల నుండి లోహాలను సంగ్రహించే వివిధ పద్ధతులను వివరించే శాస్త్రాన్ని ఏమంటారు?
జవాబు:
లోహ సంగ్రహణ శాస్త్రం

2. ‘కంచు’ అనగానేమి?
జవాబు:
రాగి మరియు తగరంతో తయారైన మిశ్రమ లోహం

3. ప్రస్తుతం లభ్యమయ్యే మూలకాలలో లోహాలు ఎంత శాతం ఉంటాయి?
జవాబు:
75% కన్నా ఎక్కువ

4. భూ పొరలలో లోహాలు లభించే పొర ఏమిటి?
జవాబు:
భూ పటలం

5. సాధారణంగా సముద్రంలో లభించే లవణాల పేర్లు రాయుము.
జవాబు:
సోడియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్

6. A : ప్రకృతిలో బంగారం, వెండి వంటి లోహాలు స్వేచ్చా స్థితిలో లభ్యమవుతాయి.
R: బంగారం, వెండి లోహాలకు చర్యాశీలత తక్కువ.
A) A, Rలు సరియైనవి. R, A ను సమర్థించును.
B) A, R లు సరియైనవి. R, A ను సమర్థించదు.
C) A సరియైనది కాదు. R సరియైనది.
D) A సరియైనది. R సరియైనది కాదు.
జవాబు:
A) A, Rలు సరియైనవి. R, A ను సమర్థించును.

AP 10th Class Physical Science Important Questions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం

7. ప్రకృతిలో లభించే లోహమూలకాలు లేదా సమ్మేళనాలను ఏమని పిలుస్తారు?
జవాబు:
లోహ ఖనిజాలు

8. లోహాలను పొందడానికి అత్యంత అనుకూలత గలిగినవి?
A) ఖనిజాలు
B) ధాతువులు
C) పై రెండూ
D) రెండూ కావు
జవాబు:
B) ధాతువులు

9. భూ పటలంలో లభించే అతిసాధారణ మూలకం
A) Mg
B) Zn
C) Al
D) Ca
జవాబు:
C) Al

10. అల్యూమినియంను సంగ్రహించడానికి అనువైన ధాతువు పేరు ఏమిటి?
జవాబు:
బాక్సైట్ (Al2O3, 2H2O)

11. బాక్సైట్లో అల్యూమినియం శాతం
A) 50 – 70%
B) 80 – 90%
C) 30 – 40%
D) 20 – 30%
జవాబు:
A) 50 – 70%

12. అన్ని ఖనిజాలు ధాతువులే. కానీ అన్ని ధాతువులు ఖనిజాలు కానక్కరలేదు.
ఈ వాక్యాన్ని మీరు సమర్థిస్తున్నారా?
జవాబు:
సమర్థించను.

13. బాక్సైట్లో లభించే లోహం ఏది?
జవాబు:
అల్యూమినియం

14. సల్పెడ్ ధాతువులకు కొన్ని ఉదాహరణలిమ్ము.
జవాబు:
Zns (జింక్ బ్లెండ్), HgS (సిన్నబార్).

15. పాదరసం (Hg)ను కలిగియుండే ధాతువు ఏది?
జవాబు:
సిన్నబార్ (Hgs)

16. Ca లభించే ధాతువుల పేర్లు రాయండి.
జవాబు:
జిప్సం (CaSO4.2H2O); సున్నపురాయి (CaCO3)

17. ఇనుము ఏఏ ధాతువుల నుండి సంగ్రహిస్తారు?
జవాబు:
హెమటైట్ (Fe2O3); మాగ్న టైట్ (Fe3O4)

18. ఎప్సం లవణంలో ఎన్ని నీటి అణువులు ఉంటాయి?
జవాబు:
‘7’ (MgSO4.7H2O)

19. మాగ్నసైట్ మరియు ఎప్సం లవణాలలో లభించే లోహం ఏమిటి?
జవాబు:
Mg

20. హార్న్ సిల్వర్ యొక్క రసాయన సంకేతం ఏమిటి?
జవాబు:
AgCl (Ag లోహం)

21. జతపర్చుము :
1) CuFeS2, Hgs, PbS ( ) a) క్లోరైడ్ ధాతువులు .
2) NaCl, AgCl ( ) b) సల్ఫేట్ ధాతువులు జ. ‘B’
3) MgCO3, CaCO3 ( ) c) కార్బొనేట్ ధాతువులు
4) Fe3O4, MnO2 ( ) d) ఆక్సైడ్ ధాతువులు
జవాబు:
1 – b; 2 – a; 3 – c; 4 – d

22. చాల్కోజన్ కి అర్థం ఏమిటి?
జవాబు:
చాల్కో = ధాతువు, జీనస్ = పుట్టింది.

23. క్రియాశీలత ఎక్కువ గల మూలకాలు ఏవి?
జవాబు:
K, Na, Ca, Mg, AL

24. జతపరుచుము
a) Ca ( ) i) ప్రకృతిలో స్వేచ్ఛాస్థితిలో లభించవు
b) Fe ( ) ii) భూ పటలంపై లభిస్తాయి.
c) Ag ( ) iii) స్వేచ్ఛా స్థితిలో లభిస్తాయి.
జవాబు:
(a) – i (b) – ii (c) – iii

25. లోహాల నుండి వాటి దాతువును వేరు చేయడానికి అవలంబించే దశలను ఒక క్రమపద్ధతిలో రాయండి.
1) ముడి ఖనిజ సాంద్రీకరణ
2) లోహాన్ని శుద్ధి చేయడం
3) ముడి లోహ నిష్కర్షణ
జవాబు:
1 → 3 → 2

26. చల్లని నీటితో చర్య జరిపే కొన్ని లోహాలు రాయుము.
జవాబు:
K, Na

27. Fe, K, Mg, Pb లోహాలు బలమైన విలీన ఆమ్లాలతో చర్య జరిపి H2 వాయువును విడుదల చేస్తాయి. అయితే వీటి చర్యాశీలతను ఆరోహణ క్రమంలో రాయండి.
జవాబు:
Pb < Fe < Mg < K

28. సాధారణంగా అన్ని లోహాలు క్రింది వానిలో దేనితో చర్య జరుపును?
A) ఆక్సిజన్
B) చల్లని నీరు
C) విలీన ఆమ్లం
D) క్లోరిన్
జవాబు:
D) క్లోరిన్

AP 10th Class Physical Science Important Questions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం

29. క్రింది వానిలో వేరుగా గల పద్ధతి
A) చేతితో ఏరడం
B) ప్లవన ప్రక్రియ
C) స్వేదనం
D) అయస్కాంత వేర్పాటు పద్ధతి
జవాబు:
C) స్వేదనం

30. ఖనిజాలలో మట్టి, ఇసుక వంటి మలినాలను ఏమంటారు?
జవాబు:
ఖనిజ మాలిన్యం

31. పాక్షికంగా ఖనిజ మాలిన్యాన్ని ధాతువు నుండి భౌతికంగా వేరు చేసే ప్రక్రియను ఏమందురు?
జవాబు:
ధాతు సాంద్రీకరణ

32. రంగు, పరిమాణం వంటి ధర్మాలలో ధాతువుకి, మలినాలకి మధ్య వ్యత్యాసం ఉంటే వినియోగించే ముడిఖనిజ సాంద్రీకరణ పద్ధతి పేరు రాయుము.
జవాబు:
చేతితో ఏరివేత

33. సల్ఫైడ్ ధాతువుని సాంద్రీకరించే పద్ధతిని రాయుము.
జవాబు:
ప్లవన ప్రక్రియ

34. ప్లవన ప్రక్రియలో కలిపే నూనె పేరు ఏమిటి?
జవాబు:
పైన్ ఆయిల్

35. ప్లవన ప్రక్రియలో మాలిన్య ఖనిజాలు ఎక్కడికి చేరుతాయి?
A) తొట్టె అడుగుకి
B) నురుగుపై
C) గాలిలోకి
D) వేరే పాత్రలోకి
జవాబు:
A) తొట్టె అడుగుకి

36. ముడిఖనిజం గానీ, ఖనిజమాలిన్యం గానీ ఏదో ఒకటి అయస్కాంత పదార్థం అయి ఉంటే వినియోగించు ఖనిజ సాంద్రీకరణ పద్ధతిని రాయుము.
జవాబు:
అయస్కాంత వేర్పాటు పద్ధతి.

37. సంపీడ్యత చెందిన గాలిని ఏ సాంద్రీకరణ పద్ధతిలో వినియోగిస్తారు?
జవాబు:
ప్లవన ప్రక్రియ

38. a) అధిక క్రియాశీలత గల ఆక్సైడ్ ధాతువు ( ) i) భర్జనం
b) మధ్యస్థ క్రియాశీలత గల కార్బొనేట్ ధాతువు ( ) ii) విద్యుత్ విశ్లేషణ
c) అల్ప క్రియాశీలత గల సల్సైడ్ ధాతువు ( ) iii) భస్మీకరణ
జవాబు:
a – ii, b – iii, c – i

39. గెలీనా నుండి లభించే లోహం
A) Pb
B) A
C) Hg
D) Mg
జవాబు:
A) Pb

40. కాల్సియం ధాతువులు రెండింటిని రాయుము.
జవాబు:
జిప్సం, సున్నపురాయి

41. రాక్ సాల్ట్ (రాతి ఉప్పు) ఫార్ములా రాయండి.
జవాబు:
Nacl

42. a) పాదరసం ( ) x) మేగ్నటైట్
b) సీసం ( ) y) గెలీవా
c) ఇనుము ( ) z) సిన్నబార్
జవాబు:
a – z, b – y, c – x

43. ఆవర్తన పట్టికలో చాల్క్కోన్ కుటుంబం ఎన్నవ గ్రూపునకు చెందినవి?
జవాబు:
16 (VIA)

44. మధ్యస్థ చర్యాశీలత గల లోహాలు రాయుము.
జవాబు:
Zn, Fe, Pb, Cu

45. అల్ప చర్యాశీలత గల లోహాలు రాయుము.
జవాబు:
Hg, Ag, Pt, Au

46. చాల్కో అనగానేమి?
జవాబు:
చాల్కో = ధాతువు

47. Mg, Pb, Ag లను వాటి చర్యాశీలత క్రమంలో రాయండి.
జవాబు:
Mg > Ag > Pb

48. ప్లవన ప్రక్రియలో పైన్ ఆయిల్ కలుపుట వలన ఉపయోగమేమి?
జవాబు:
ఎక్కువ నురగ కొఱకు.

49. చర్యా శీలత శ్రేణి (activity series) అనగానేమి?
జవాబు:
లోహాలను వాటి చర్యాశీలతల అవరోహణ క్రమం.

50. ఒక లోహ ధాతువును క్షయకరణం చేసి లోహంగా లోహాలు. మార్చడానికి ఉపయోగించే పద్ధతిని దేనినాధారంగా నిర్ణయిస్తారు?
జవాబు:
చర్యాశీలతలో ఆ లోహ స్థానంపై ఆధారపడి

AP 10th Class Physical Science Important Questions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం

51. చర్యాశీలత శ్రేణి ఎగువన గల లోహాలను వాటి ధాతువును వేరు చేయు పద్ధతిని రాయండి.
జవాబు:
విద్యుత్ విశ్లేషణ

52. సోడియం క్లోరైడ్ (NaCl) నుండి Na ను పొందడానికి ఉపయోగించే విద్యుత్ విశ్లేషణం ఏమిటి?
జవాబు:
ద్రవరూప NaCl

53. విద్యుద్విశ్లేషణ చేసినపుడు మలినాలను కలుపుతారు. ఎందుకు?
జవాబు:
ధాతువు యొక్క ద్రవీభవన స్థానం తగ్గించడానికి

54. అధిక పరిమాణం గల గాలిలో సల్సైడ్ ధాతువులను బాగా వేడి చేయు పద్ధతిని ఏమంటారు?
జవాబు:
భర్జనం

55. భర్తనం వలన ధాతువు ఇలా మారుతుంది.
A) కార్బో నేట్
B) సల్ఫైడ్
C) ఆక్సైడ్
D) క్లోరైడ్
జవాబు:
C) ఆక్సైడ్

56. 2PbS + 3O2 → 2PbO + 2SO2. ఈ ఆక్సీకరణ ప్రక్రియను ఏమందురు?
జవాబు:
భర్జనం

57. ఆక్సైడ్ ధాతువులను క్షయకరణం చెందించడానికి ఏ పరికరాలను వినియోగిస్తారు?
జవాబు:
కొలిమి

58. స్వయం క్షయకరణం చెందే ధాతువుకి ఉదాహరణనిమ్ము.
జవాబు:
Cu2S

59. Fe2O3 + 3CO + 2 Fe + 3CO2 ఈ క్షయకరణంను ఏ కొలిమిలో చేస్తారు?
జవాబు:
బ్లాస్ట్ కొలిమి

60. PbO ను క్షయకరణం చెందించడానికి వినియోగించే పదార్థం ఏమిటి?
జవాబు:
కోక్ (C)

61. ధర్మైట్ చర్యలు
A) ఉష్ణగ్రాహక చర్యలు
B) ఉష్ణమోచక చర్యలు
C) A లేదా B
D) చెప్పలేం
జవాబు:
B) ఉష్ణమోచక చర్యలు

62. థర్మైట్ చర్య యొక్క ఒక ఉపయోగం / అనువర్తనం రాయండి.
జవాబు:
విరిగిన రైలుపట్టాలను అతికించడానికి.

63. సాధారణంగా థర్మైట్ ప్రక్రియ వేటి మధ్య జరుగును?
జవాబు:
లోహ ఆక్సైడ్లు మరియు అధిక చర్యాశీలత గల

64. థర్మైట్ ప్రక్రియలో లభించే లోహం ఎలా వుంటుంది?
జవాబు:
కరిగిన ద్రవ స్థితిలో

65. థర్మైట్ ప్రక్రియకు ఒక ఉదాహరణనిమ్ము.
జవాబు:
Fe2O3 + 2Al → 2Fe + Al2O3 + ఉష్ణశక్తి

66. థర్మైట్ ప్రక్రియలో లభించే లోహాలు
A) అధిక చర్యా శీలత గలవి.
B) అల్ప చర్యాశీలత గలవి.
జవాబు:
B) అల్ప చర్యాశీలత గలవి.

67. 2PbS + 3O2 → 2pbO + 2SO2
• pb ఏ చర్యాశీలత శ్రేణికి చెందినది?
జవాబు:
మధ్యస్థ చర్యాశీలత శ్రేణి

• గాలి లేకుండా చేసే ఉష్ణ రసాయన ప్రక్రియను ఏమందురు?
జవాబు:
భస్మీకరణం

• పై ఉదాహరణ భస్మీకరణం అవుతుందా?
జవాబు:
అవ్వదు.

68. సిన్నబార్ నుండి పాదరసంను పొందడానికి ఏ ప్రక్రియను వినియోగిస్తారు?
జవాబు:
భరనం

69. [Ag(CN)2] ఈ అయాన్ పేరు ఏమిటి?
జవాబు:
డై సై నార్జియేట్ (I) అయాన్.

70. డై సై నార్జియేట్ నుండి పాదరసం పొందుటకు ……. చూర్ణం కలుపుతారు.
A) Mg
B) Fe
C) Zn
D) Si
జవాబు:
C) Zn

71. అపరిశుద్ధ లోహం నుండి శుద్ధ లోహాన్ని పొందే ప్రక్రియను ఏమంటారు?
జవాబు:
లోహ శుద్ధి (లోహ శోధనం).

72. లోహాన్ని శుద్ధి చేసే రెండు పద్ధతులు రాయండి.
జవాబు:
స్వేదనం, పోలింగ్, గలనం చేయడం, విద్యుత్ శోధనం

73. అల్ప బాష్పశీల లోహాలు – అధిక భాష్పశీల లోహాలను మలినాలుగా కలిగి వుంటే వినియోగించే లోహ శుద్ది పద్దతి.
A) స్వేదనం
B) పోలింగ్
C) గలనం చేయడం
D) విద్యుత్ శోధనం .
జవాబు:
A) స్వేదనం

74. పచ్చికర్రలను ఏ ‘లోహపు శుది’ ప్రక్రియలో వినియోగిస్తారు?
జవాబు:
పోలింగ్

75. బిసర్ కాపరను ఏ పద్ధతిలో శుది చేసారు?
జవాబు:
పోలింగ్

76. పోలింగ్ లో కాపర్ ఆక్సీకరణం చెందకుండా నిరోధించేవి ఏవి?
జవాబు:
పచ్చికర్రల నుండి వెలువడిన క్షయకరణ వాయువులు

77. పోలింగ్ లో మలినాలు ఎలా బయటకు వస్తాయి?
జవాబు:
1) లోహ ఉపరితలంపై నురగ ద్వారా,
2) వాయు రూపంలో గాని.

78. a) ద్రవీభవన స్థానాలు ( ) i) స్వేదనం
b) బాష్పీభవన స్థానాలు ( ) ii) గలనం
iii) శోధనం
జవాబు:
a – ii, b – i

AP 10th Class Physical Science Important Questions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం

79. విద్యుత్ శోధనం (ఎలక్ట్రోలిటిక్ రిఫైన్)లో అపరిశుద్ధ లోహంను ఏ ఎలక్ట్రోయ్ వినియోగిస్తారు?
జవాబు:
కాథోడ్

80. విద్యుత్ విశ్లేషణలో లోహం ఏ ఎలక్ట్రోడ్ వద్దకు చేరును?
జవాబు:
కాథోడ్

81. స్టర్ కాపర్‌ను విద్యుత్ విశ్లేషణ చేసినపుడు వచ్చే కరగని మలినాలను ఏమంటారు?
జవాబు:
ఆనోడ్ మడ్

82.

లోహంలోహక్షయం
1) ఇనుముa) కాపర్ కార్బొ నేట్
2) వెండిb) ఐరన్ ఆక్సైడ్
3) రాగిc) సిల్వర్ సల్ఫైడ్

పై వానిని జతపరుచుము.
జవాబు:
1 – b, 2 – c, 3 – a

83. ఒక్కొక్కసారి ఇంట్లో రాగి వస్తువులపై ఆకుపచ్చని పొర ఏర్పడుతుంది? ఇది ఏమిటి?
జవాబు:
లోహ క్షయం (కాపర్ కార్బొనేట్)

84. వెండి వస్తువులు గాలిలో ఉంచినపుడు కాంతి దీనికి కారణం ఏమిటి?
జవాబు:
సిల్వర్ సల్సైడ్

85. ఇనుము తుప్పు పట్టడానికి కావలసిన పరిస్థితులు ఏమిటి?
జవాబు:
నీరు, గాలి ఉండాలి.

86. గాలిలో తేమను తీసివేయడానికి వినియోగించే రసాయనం ఏమిటి?
జవాబు:
అనార్థ కాల్షియం క్లోరైడ్

87. ‘ఇనుము తుప్పు పట్టుట’ ఏ దృగ్విషయం?
జవాబు:
విద్యుత్ రసాయన దృగ్విషయం

88. ఇసుము తుప్పు పట్టుటకు కారణమవు ఫెర్రస్ నియాను ఎలా ఏర్పడుతాయో సమీకరణం రాయుము
జవాబు:
2Fe + O2 + 4H+ → 2 Fe+2 + 2H2O

89. తుప్పు రసాయన నామం ఏమిటి?
జవాబు:
Fe2O3 × H2O (హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్)

90. లోహక్షయం యొక్క ఒక నష్టం రాయుము.
జవాబు:

  1. లోహపు వంతెనలు కూలిపోవుట
  2. యంత్రాలు మొరాయించుట.

91. లోహక్షయం నివారణకు ఒక పద్ధతి రాయుము.
జవాబు:

  1. పెయింట్
  2. ఎలక్ట్రో ప్లేటింగ్

92. పెయింట్ ఎలా లోహక్షయాన్ని నివారిస్తుంది?
జవాబు:
లోహ ఉపరితలం వాతావరణంతో స్పర్శ లేకుండా కప్పి ఉంచుతుంది.

93. ధాతువును ద్రవకారితో కలిపి, ఇంధనంతో వేడి చేసే ఉష్ణ రసాయన ప్రక్రియను ఏమంటారు?
జవాబు:
ప్రగలనం

94. ప్రగలనంలో మలినాలు ఏ రూపంలో వేరు చేయబడతాయి?
జవాబు:
లోహ మలం (slag) గా.

95. హెమటైట్ ను ప్రగలనం చేసేటప్పుడు ఇంధనం మరియు ద్రవకారులు ఏవి ఉపయోగిస్తారు?
జవాబు:
కోక్ (ఇంధనం), సున్నపురాయి (ద్రవకారి).

96. సాధారణంగా ప్రగలన ప్రక్రియను ఏ కొలిమిలో చేస్తారు?
జవాబు:
బ్లాస్ట్ కొలిమి

97. భర్జనంలో పొందే ఉత్పన్నాలు ఏ స్థితిలో ఉంటాయి?
జవాబు:
ఘనస్థితి

98. భర్జన ప్రక్రియకు వినియోగించే కొలిమి ఏమిటి?
జవాబు:
రివర్బరేటరీ

99. భర్జన ప్రక్రియకు ఒక ఉదాహరణ ఇమ్ము.
జవాబు:
2Zns + 3O2 → 2ZnO + 2SO2

100. ఏ ప్రక్రియలో ధాతువును గాలి లేదా ఆక్సిజన్ అందుబాటు లేకుండా వేడి చేస్తారు?
జవాబు:
భస్మీకరణం విహీనమవుతాయి.

101. భస్మీకరణానికి ఉదాహరణనిమ్ము.
జవాబు:
MgCO3 → MgO + CO2

102. ధాతువులోని మలినాలను ఏమంటారు?
జవాబు:
గాంగ్

103. గాంగ్ ను తొలగించుటకు ధాతువుకు బయట నుండి కలిపే పదార్థాన్ని ఏమంటారు?
జవాబు:
ద్రవకారి (flux)

104. ఒకవేళ గాంగ్ SiO2 అయితే ద్రవకారిగా దీనిని కలపవచ్చును?
జవాబు:
CaO

105.
AP 10th Class Physical Science Important Questions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం 11
వీనిలో 1, 2, 3 లు ద్రవకారి, లోహమలం, గాంగ్ లో వేనిని సూచించును?
జవాబు:
1-ద్రవకారి, 2-గాంగ్, 3-లోహమలం.

106. Feo + ……..?…….. → FeSiO3
జవాబు:
SiO2

107. లోహ నిష్కర్షణలో కొలిమి ఎలా సహాయపడుతుంది?
జవాబు:
అధిక ఉష్ణోగ్రతలు అందించును.

108. లోహ నిష్కర్షణలో ఉష్ణ రసాయన ప్రక్రియలు చేయడానికి దేనిని వినియోగిస్తారు?
జవాబు:
కొలిమి

AP 10th Class Physical Science Important Questions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం

109. కొలిమిలో గల ప్రధాన భాగాలు ఏవి?
జవాబు:
హార్త్, చిమ్నీ, అగ్గి గది

110. కొలిమిలో ధాతువును ఉంచే ప్రాంతాన్ని ఏమంటారు?
జవాబు:
హార్త్

111. కొలిమిలో చిన్ని పాత్ర ఏమిటి?
జవాబు:
వ్యర్ధ వాయువులను బయటకు పంపుట.

112. కొలిమిలో ఇంధనం మండే ప్రాంతాన్ని ఏమంటారు?
జవాబు:
అగ్గి గది

113. అగ్గి గది, హాలు ఒకే ఛాంబర్ లో ఉండే కొలిమి ఏమిటి?
జవాబు:
బ్లాస్ట్ కొలిమి

114. అగ్గి గది, హాలు విడిగా ఉండే కొలిమి ఏది?
జవాబు:
రివర్బరేటరీ కొలిమి.

115. హార్త్ మరియు అగ్గిగదికి ప్రత్యక్షంగా సంబంధం లేని కొలిమి ఏమిటి?
జవాబు:
రిటార్ట్ కొలిమి

116. రివర్బరేటరీ కొలిమిని దేనిలో వాడుతారు?
A) భస్మీకరణం
B) భర్జనం
C) రెండూ
D) రెండూ కావు
జవాబు:
C) రెండూ

117. ప్రగలనంలో ధాతువును ఏమి చేస్తారు?
A) ఆక్సీకరణం
B) క్షయకరణం
C) విద్యుత్ విశ్లేషణ
D) తటస్థీకరణం
జవాబు:
A) ఆక్సీకరణం

118. క్రింది ఏ ప్రక్రియలో O2 అవసరం లేదు?
A) ప్రగలనం
B) భర్జనం
C) భస్మీకరణం
D) A మరియు C
జవాబు:
C) భస్మీకరణం

119. జతపర్చుము
1) MgCO3 → MgO + CO2 ( ) a) భర్జనం
2) 2PbS + 3O2 → 2PbO + 2SO2 ( ) b) భస్మీకరణం
జవాబు:
1 – b, 2 – a

10th Class Physics 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం 1 Mark Bits Questions and Answers

సరియైన సమాధానమును గుర్తించండి.

1. ప్లవన ప్రక్రియ పద్ధతిలో ఉపయోగించేవి …..
A) కిరోసిన్
B) పైన్ ఆయిల్
C) కొబ్బరినూనె
D) ఆలివ్ నూనె
జవాబు:
B) పైన్ ఆయిల్

2. ముడి ధాతువుతో కలిసి ఉన్న మలినాలను అంటాం.
A) గాంగ్
B) ద్రవరారి
C) లోహమలం
D) ఖనిజం
జవాబు:
A) గాంగ్

AP 10th Class Physical Science Important Questions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం

3. Na, Mg, Zn, Fe, Ag మరియు Au లు లోహాల క్రియాశీల శ్రేణిలోని కొన్ని మూలకాలు.
రాము : Fe ఒక మధ్యస్థ క్రియాశీలత మూలకం.
రాజు : Mg ఒక మధ్యస్థ క్రియాశీలత మూలకం కాదు.
A) రాము ఒప్పు, రాజు తప్పు
B) రాము తప్పు, రాజు ఒప్పు
C) రాము, రాజు ఇద్దరూ ఒప్పు
D) రాము, రాజు ఇద్దరూ తప్పు
జవాబు:
C) రాము, రాజు ఇద్దరూ ఒప్పు

4. కింది పట్టికను గమనించండి.

లోహముధాతువు
Pబాక్సైట్
పాదరసంQ
Rహెమటైట్

PQR స్థానాలలో ఉండవలసిన వాటిని గుర్తించండి.
A) అల్యూమినియం, సిన్నబార్, ఇనుము
B) సోడియం, గెలీనా, మెగ్నీషియం
C) సోడియం, సిన్నబార్, ఇనుము
D) మెగ్నీషియం , గెలీనా, ఇనుము
జవాబు:
A) అల్యూమినియం, సిన్నబార్, ఇనుము

5. పటంలో చూపిన విధంగా జింక్ సల్ఫేట్ ద్రావణం గల పరీక్షనాళికలో శుభ్రమైన ఇనుప ముక్కలను ఉంచి నప్పుడు ఏం జరుగుతుంది?
AP 10th Class Physical Science Important Questions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం 12
A) ద్రావణం రంగును కోల్పోయి, ఇనుప ముక్కలపై జింక్ పూత ఏర్పడుతుంది.
B) ద్రావణం ఆకుపచ్చ రంగులోకి మారి, ఇనుప ముక్కలపై జింక్ పూత ఏర్పడుతుంది.
C) ద్రావణాన్ని ఆకుపచ్చ రంగులోకి మార్చుతూ, ఇనుప ముక్కలు ద్రావణంలో కరుగుతాయి.
D) ఎటువంటి చర్య జరుగదు.
జవాబు:
D) ఎటువంటి చర్య జరుగదు.

6. క్రింది వానిలో కాల్షియం లోహ ధాతువు
A) బాక్సైట్
B) సున్నపురాయి (లైమ్ స్టోన్)
C) రాక్ సాల్ట్
D) హెమటైట్
జవాబు:
B) సున్నపురాయి (లైమ్ స్టోన్)

7. క్రింది మూలకాలలో అర్ధ లోహము ఏది?
A) సిలికాన్
B) సోడియమ్
C) క్లోరిన్
D) అల్యూమినియమ్
జవాబు:
A) సిలికాన్

AP 10th Class Physical Science Important Questions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం

8. ప్లవన ప్రక్రియ ఏ రకపు ధాతువు సాంద్రీకరణలో ఎక్కువగా ఉపయోగిస్తారు?
A) సల్ఫైడ్
B) ఆక్సైడ్
C) కార్బొనేట్
D) నైట్రేట్
జవాబు:
A) సల్ఫైడ్

మీకు తెలుసా?

ఒక లోహం యొక్క ధర్మాలను పెంపొదించడానికి దానిని మిశ్రమలోహం (alloys) గా మార్చడం ఒక మంచి పద్దతి. ఈ పద్ధతిలో మనకు కావలసిన ధర్మాలు గల మిశ్రమ పదార్థాన్ని పొందవచ్చు. ఉదాహరణకు ఇనుము మనం విరివిగా వాడే లోహం. కానీ శుద్ధస్థితిలో ఇనుము ఎప్పుడూ వాడం. దీనికి కారణం శుద్ద ఇనుము చాలా మృదువుగా మరియు వేడిచేసినపుడు సులువుగా సాగిపోతుంది. చాలా తక్కువ మొత్తంలో కార్బన్ ను ఇనుముతో మిశ్రమం చెందించినపుడు, అది గట్టిగాను, దృఢంగాను మారుతుంది. ఇనుమును నికెల్, క్రోమియంతో మిశ్రమం చెందిస్తే స్టెయిన్లెస్ స్టీల్ (Stainless Steel) ఏర్పడుతుంది. ఇది త్రుప్పు పట్టదు.

AP 10th Class Physical Science Important Questions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం

24 కారట్ గోల్డ్ గా పిలువబడుతున్న శుద్ధమైన బంగారం చాలా మృదువుగా ఉంటుంది. అందుచే ఇది ఆభరణాల తయారీకి అంత అనువుగా ఉండదు. వెండి లేదా రాగి కలసి ఉన్న 22 కారట్ల బంగారాన్ని ఆభరణాల తయారీకి వాడతారు. “22 కారట్ బంగారం అనగా – 22 భాగాల శుద్ద బంగారం, 2 భాగాల వెండి లేదా రాగిల మిశ్రమ పదార్థం” అని అర్థం.

AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం

These AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం will help students prepare well for the exams.

AP Board 10th Class Physical Science 8th Lesson Important Questions and Answers రసాయన బంధం

10th Class Physics 8th Lesson రసాయన బంధం 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
“రసాయన బంధం” అనగానేమి?
జవాబు:
అణువులోని పరమాణువుల మధ్యగల ఆకర్షణ శక్తిని “రసాయన బంధం” అంటారు.

ప్రశ్న 2.
అయానిక బంధం గల రెండు సంయోగ పదార్థాల పేర్లు రాయండి.
జవాబు:
అయానిక బంధం గల సంయోగ పదార్థాలు

  1. Nacl
  2. MgCl2

ప్రశ్న 3.
వేలన్సీ స్థాయి ఎలక్ట్రాన్ జంట వికర్షణ సిద్ధాంతం ఆధారంగా అమ్మోనియా అణువు నిర్మాణాన్ని గీయండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 1

ప్రశ్న 4.
కింద ఇచ్చిన లూయిస్ చుక్కల నిర్మాణాలను గమనించి, HCl అణువు ఏర్పడే విధానాన్ని లూయిస్ చుక్కల నిర్మాణంతో చూపండి.
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 2
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 3

ప్రశ్న 5.
A, B లు రెండు మూలకాలు, వాటి సంయోగ పదార్థం A,B అయిన A, B ల వేలన్సీలు ఏమై ఉండవచ్చునో తెల్పండి.
జవాబు:
‘A యొక్క వేలన్సీ -1 ; B యొక్క వేలన్సీ -2.

AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం

ప్రశ్న 6.
సాధారణంగా తక్కువ అయనీకరణ శక్మం, తక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటి మరియు ఎక్కువ పరమాణు పరిమాణం గల ఒక మూలక పరమాణువు ఏ రకమైన అయానను ఏర్పరచగలదో ఊహించి వ్రాయండి.
జవాబు:
కాటయాన్ (లేదా) ధనాత్మక అయానను ఏర్పరుస్తుంది.

ప్రశ్న 7.
నీటి అణువులో బంధకోణం 109° 28′ కాకుండా 104°31′ గా ఎందుకు ఉంటుందో వివరించండి.
జవాబు:
నీటి అణువులోని ఆక్సిజన్ పరమాణువులో ఉండే “బంధంలో పాల్గొనని ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు” ఆక్సిజన్, హైడ్రోజన్ల మధ్య, “బంధంలో పాల్గొన్న ఎలక్ట్రాన్ జంటల” మధ్య వికర్షణ వల్ల నీటి అణువులో బంధ కోణం 109° 28′ కాక 104°31′ గా ఉంటుంది.

ప్రశ్న 8.
“అష్టక నియమం” అంటే ఏమిటి?
జవాబు:
పరమాణువులు ఎలక్ట్రాన్లను కోల్పోవడం, స్వీకరించడం లేదా పంచుకోవడం ద్వారా వాటి వేలన్సీ కర్పరంలో ఎనిమిది ఎలక్ట్రాన్లను పొందటానికి ప్రయత్నిస్తాయి. దీనినే అష్టక నియమం అంటారు.

ప్రశ్న 9.
“అష్టక నియమం”ను ఎవరు ప్రవేశపెట్టారు?
జవాబు:
కొసెల్, లూయీలు అష్టక సిద్ధాంతమును కనిపెట్టారు.

ప్రశ్న 10.
s, s2- లకు లూయీ ఎలక్ట్రాన్ చుక్కల సంకేతాలు వ్రాయండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 4

ప్రశ్న 11.
‘ఎలక్ట్రోవేలన్సీ’ మరియు ‘కోవేలన్సీ’ అనగానేమి?
జవాబు:

  1. ఎలక్ట్రాన్ల స్థానాంతర గమనం వల్ల ఏర్పడే వేలన్సీని “ఎలక్ట్రో వేలన్సీ” అని అంటారు.
  2. ఎలక్ట్రాన్లను సమిష్టిగా పంచుకోవడం వల్ల ఏర్పడే వేలన్సీని “కోవేలన్సీ” అని అంటారు.

ప్రశ్న 12.
‘అయానిక బంధం’ లేదా ‘ఎలక్ట్రోవేలంట్ బంధం’ అనగానేమి? ఉదాహరణలిమ్ము.
జవాబు:
ఎలక్ట్రాన్ల స్థానాంతర గమనం వల్ల ఏర్పడ్డ విరుద్ధ ఆవేశాలు గల అయాన్ల మధ్య గల స్థిర విద్యుదాకర్షణ బలాలను ‘అయానిక బంధం’ లేక ‘ఎలక్ట్రోవేలంట్ బంధం’ అంటారు.
ఉదా : NaCl, MgCl2, Na2O, AlCl3

ప్రశ్న 13.
లాటిస్ శక్తి అనగానేమి?
జవాబు:
అనంత దూరంలో ఉన్న విరుద్ధ ఆవేశాలు గల అయాన్లను దగ్గరకు చేర్చినపుడు ఒక మోల్ అయానిక స్ఫటికం ఏర్పడుతుంది. అప్పుడు విడుదలయ్యే శక్తిని లాటిస్ శక్తి అంటారు.

ప్రశ్న 14.
సమయోజనీయ బంధం అనగానేమి? ఉదాహరణలిమ్ము.
జవాబు:
ఎలక్ట్రాన్లను సమిష్టిగా పంచుకోవడం వల్ల ఏర్పడే బంధాన్ని సమయోజనీయ బంధం అంటారు. దీనిని ఎలక్ట్రాన్ జంట బంధం అని కూడా అంటారు.
ఉదా : F2, O2, N2, CH4, NH3, H2O

AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం

ప్రశ్న 15.
VSEPRT సిద్ధాంతం దేనిని వివరిస్తుంది?
జవాబు:
VSEPRT సిద్ధాంతం అణువుల ఆకృతులను మరియు బంధ కోణాలను వివరిస్తుంది.

ప్రశ్న 16.
VSEPRT ని విస్తరింపుము.
జవాబు:
వేలన్సీ షెల్ ఎలక్ట్రాన్ పెయిర్ రిపల్టన్ థియరీ (Valency Shell Electron Pair Repulsion Theory).

ప్రశ్న 17.
“బంధదైర్ఘ్యం” అనగానేమి?
జవాబు:
బంధింపబడి ఉన్న పరమాణువుల మధ్య గల సరాసరి అంతర్ కేంద్ర దూరాన్ని “బంధదైర్ఘ్యం” అంటారు.

ప్రశ్న 18.
“బంధశక్తి” అనగానేమి?
జవాబు:
ఒక మోల్ సమయోజనీయ బంధాన్ని దాని అనుఘటక పరమాణువులుగా విడగొట్టడానికి కావలసిన శక్తిని “బంధశక్తి” అంటారు.

ప్రశ్న 19.
‘ధృవాత్మక బంధం’ అనగానేమి?
జవాబు:
రెండు పరమాణువుల మధ్య ఎలక్ట్రానులు ఎప్పుడూ కూడా సమానంగా పంచుకోబడకపోవచ్చు. దీనినే ‘ధృవాత్మక బంధం’ అంటాం.

ప్రశ్న 20.
కర్పూరం కిరోసిన్లో కరుగుతుంది. కానీ నీటిలో కరగదు. ఎందువల్ల?
జవాబు:
సమయోజనీయ సమ్మేళనాలు అధృవ ద్రావణాలలో కరుగుతాయి. కాని ధృవ ద్రావణులలో కరగవు. కర్పూరం సమయోజనీయ సమ్మేళనం. కనుక ఇది అధృవ ద్రావణి అయిన కిరోసిన్లో కరుగుతుంది. కానీ ధృవ ద్రావణి అయిన నీటిలో కరగదు.

ప్రశ్న 21.
ఆల్కహాల్ లేదా ఈథర్ మొదలయిన కర్బన ద్రావణాలలో Lice కరుగుతుందా? ఎందుకు?
జవాబు:
Lice కోవలెంట్ స్వభావం గల పదార్థం. అందువల్ల అది అధృవ ద్రావణులైన ఆల్కహాల్, ఈథర్ లో కరుగుతుంది.

ప్రశ్న 22.
జడ వాయువుల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఏది?
జవాబు:
ns² np6 (హీలియం తప్ప మిగిలిన జడవాయువులకు) మరియు He ఎలక్ట్రాన్ విన్యాసం 1s².

ప్రశ్న 23.
అయాన్ యొక్క సమన్వయ సంఖ్య అనగానేమి?
జవాబు:
ఒక నిర్దిష్ట ఆవేశం గల అయాన్ చుట్టూ ఎన్ని వ్యతిరేక ఆవేశం గల అయానులు అమరి ఉన్నాయో తెలిపే సంఖ్యను ఆ అయాన్ యొక్క సమన్వయ సంఖ్య (Coordination number) అంటారు.

ప్రశ్న 24.
‘ఋణ విద్యుదాత్మకత’ అనగానేమి?
జవాబు:
ఋణ విద్యుదాత్మకత : బంధంలో పాల్గొన్న ఎలక్ట్రాన్ జంటను తమ వైపుగా ఆకర్షించే స్వభావాన్ని ‘ఋణ విద్యుదాత్మకత’ అంటారు.

ప్రశ్న 25.
‘సంయోజనీయత’ అనగానేమి?
జవాబు:
ఒక మూలక పరమాణువు ఎన్ని సంయోజనీయ బంధాలను ఏర్పరచగలదో తెలిపే సంఖ్యనే ఆ మూలకం యొక్క “సంయోజనీయత” అంటారు.

ప్రశ్న 26.

‘బంధ దూరం’ లేదా ‘బంధదైర్ఘ్యం’ అనగానేమి?
జవాబు:
సంయోజనీయ బంధంతో కలుపబడిన రెండు పరమాణువుల కేంద్రకాల మధ్య సమతాస్థితి వద్ద గల దూరాన్నే ‘బంధదూరం’ లేదా ‘బంధదైర్ఘ్యం’ అంటారు.

ప్రశ్న 26.
బంధదూరం ప్రమాణాలు ఏమిటి?
జవాబు:
బంధదూరం ప్రమాణాలు నానోమీటర్ (nm) గానీ, ఆంగ్ స్ట్రామ్ (A°) యూనిట్ లో గానీ తెలియజేస్తారు.

ప్రశ్న 27.
నీటి అణువు ఆకృతి ఏమి?
జవాబు:
నీటి అణువు ‘V’ ఆకృతిని కలిగి ఉండును.

ప్రశ్న 28.
NH3, PCl3 మరియు PH3 అణువుల ఆకృతి ఏమి?
జవాబు:
NH3, PCl3 మరియు PH3 అణువుల ఆకృతి ‘పిరమిడల్ ఆకృతి’.

AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం

ప్రశ్న 29.
PCl5 ఆకృతి ఏమి?
జవాబు:
PCl5 అణువు, ట్రైగోనల్ బై-పిరమిడ్ ఆకృతిని కలిగి ఉండును.

ప్రశ్న 30.
‘σ’ మరియు ‘π’ బంధములు ఎలా ఏర్పడును?
జవాబు:
ఆర్బిటాళ్ళ అంత్యాతిపాతం (End – on) వలన సిగ్మా (σ) బంధం మరియు ఆర్బిటాళ్ళ పార్శ్వ (partial) అతిపాతం వల్ల పై (π) బంధం ఏర్పడును.

ప్రశ్న 31.
ద్విబంధము ఏర్పరచే అణువులకు ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
O2

ప్రశ్న 32.
త్రికబంధం ఏర్పరచే అణువులకు ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
N2

ప్రశ్న 33.
సమయోజనీయ బంధం ఏ విధంగా ఏర్పడును?
జవాబు:
రెండు పరమాణువులు ఒకదానికొకటి దగ్గరగా వచ్చినప్పుడు అవి ఎలక్ట్రాన్లను పరస్పరం పంచుకోవడం వల్ల ఏర్పడే బంధమే “సమయోజనీయ బంధం”.
ఉదా : H2, O2, N2 అణువులు ఏర్పడుట.

ప్రశ్న 34.

సిగ్మా (σ) మరియు పై (π) బంధాలను పోల్చుము.
జవాబు:

సిగ్మా (σ) బంధంపై (π) బంధం
1. ఇది పరమాణు ఆర్బిటాళ్ళ అంత అతిపాతం వల్ల వల్ల ఏర్పడును.1. ఇది పరమాణు ఆర్బిటాళ్ళ పార్శ్వ అతిపాతం ఏర్పడును.
2. ఇది స్వతంత్రంగా ఏర్పడగలదు.2. ఇది స్వతంత్రంగా ఏర్పడలేదు.
3. ఇది బలమైన బంధం.3. ఇది బలహీన బంధం.
4. అణువులో ఒకే ఒక సిగ్మా (σ) బంధం ఉండును.4. రెండు పరమాణువుల మధ్య ఒకటి లేదా రెండు పై (π) బంధాలుంటాయి.

ప్రశ్న 35.
కాటయాన్ ఎలా ఏర్పడును?
జవాబు:
ఒక పరమాణువు ఎలక్ట్రాన్ కోల్పోయినపుడు కాటయాన్ ఏర్పడుతుంది.

ప్రశ్న 36.
ఆనయాన్ ఎలా ఏర్పడుతుంది?
జవాబు:
ఒక పరమాణువు ఎలక్ట్రాన్ ను గ్రహించినపుడు ఆనయాన్ ఏర్పడుతుంది.

ప్రశ్న 37.
అయానిక బంధంలోనున్న బలాలు ఏవి?
జవాబు:
అయానిక బంధంలో స్థిర విద్యుత్ ఆకర్షణ బలాలు వున్నాయి.

ప్రశ్న 38.
ఎటువంటి సమ్మేళనాలు ధృవ ద్రావణిలలో కరుగుతాయి?
జవాబు:
అయానిక పదార్థాలు ధృవ ద్రావణిలలో ఎక్కువగా కరుగుతాయి.

ప్రశ్న 39.
అధిక ద్రవీభవన మరియు బాష్పీభవన స్థానాలు గల సమ్మేళనాలు ఏవి?
జవాబు:
అయానిక సమ్మేళనాలు అధిక ద్రవీభవన మరియు బాష్పీభవన స్థానాలు కలిగి ఉంటాయి.

ప్రశ్న 40.
ఒక అలోహం యొక్క వేలన్సీని ఎలా తెలుసుకుంటారు?
జవాబు:
ఒక అలోహ పరమాణువు, అణువుగా ఏర్పడటానికి పొందే ఎలక్ట్రానుల సంఖ్యను దాని వేలన్సీ అంటారు.
వేలన్సీ = (8 – ఆ అలోహపు గ్రూపు సంఖ్య)
ఉదా : క్లోరిన్ వేలన్సీ = (8 – 7) = 1

ప్రశ్న 41.
పరమాణువులు సంయోగం చెంది అణువుగా ఎందుకు మారతాయి?
జవాబు:
ఒక అణువు శక్తి, దానిలోనున్న పరమాణువుల మొత్తం శక్తికన్నా తక్కువగా ఉంటుంది. అందువల్ల అది సంయోగం చెంది స్థిరత్వాన్ని పొందుతుంది.

ప్రశ్న 42.
అయానిక పదార్థాలు మంచి విద్యుద్విశ్లేషకాలు ఎందుకు?
జవాబు:
అయానిక పదార్థాల జలద్రావణాలలో స్వేచ్ఛగా చలించే అయానులు ఉంటాయి. కావున ఇవి విద్యుద్విశ్లేషకాలు.

ప్రశ్న 43.
పరమాణువుల మధ్య అయానిక బంధం ఎప్పుడు ఏర్పడుతుంది?
జవాబు:
స్వల్ప అయనీకరణ శక్మము గల పరమాణువులు మరియు అత్యధిక ఋణ విద్యుదాత్మకత గల పరమాణువుల మధ్య అయానిక బంధం ఏర్పడును.
(లేదా)
రెండు మూలకాల ఋణ విద్యుదాత్మకతల మధ్య తేడా 1.9 గానీ అంతకన్నా ఎక్కువ గానీ ఉంటే ఆ మూలకం పరమాణువుల మధ్య అయానిక బంధం ఏర్పడుతుంది.

AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం

ప్రశ్న 44.
బంధకోణం అనగానేమి?
జవాబు:
మధ్య పరమాణువు, సమయోజనీయ బంధంలో పాల్గొనే మిగతా పరమాణువుల కేంద్రకాల గుండా వెళ్ళే ఊహా రేఖలు, మధ్య పరమాణువు కేంద్రం వద్ద చేయు కోణాన్ని ‘బంధకోణం’ అంటారు.

ప్రశ్న 45.
NaCl నీటిలో కరుగును కాని బెంజీన్లో కరుగదు. ఎందుకు?
జవాబు:
నీరు ధృవద్రావణి. NaClలో Na+ మరియు Cl అయానులు ఉంటాయి. కావున ఇది అయానిక పదార్థం. అయానిక పదార్థాలు ధృవద్రావణిలలో కరుగుతాయి. కాని అధృవ ద్రావణులలో కరుగవు. కావున NaCl నీటిలో కరుగుతుంది కాని బెంజీన్లో కరుగదు.

ప్రశ్న 46.
సంకరీకరణము అనగానేమి?
జవాబు:
పరమాణువుల చివరి కక్ష్యలో ఉండి దాదాపు సమానశక్తి కలిగిన పరమాణు ఆర్బిటాళ్ళు పరస్పరం కలిసిపోయి, పునర్వ్యవస్థీకరించబడడం ద్వారా అదే సంఖ్యలో బంధశక్తి, ఆకారం వంటి ధర్మాలు ఒకే విధంగా ఉండే సర్వసమాన ఆర్బిటాళ్ళను ఏర్పరచే దృగ్విషయాన్ని సంకరీకరణము అంటారు.

ప్రశ్న 47.
H2O మరియు NH3 లలోని బంధకోణాలు ఎంత?
జవాబు:
H2O అణువులో బంధకోణం 104°.31′
NH3 అణువులో బంధకోణం 107°.48′

10th Class Physics 8th Lesson రసాయన బంధం 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
కింద తెలిపిన పదార్థాలు ఏర్పడే క్రమాన్ని లూయీస్ నిర్మాణంలో సాంకేతాలతో చూపండి.
(i) కాల్షియం, క్లోరిన్ కలిసి కాల్షియం క్లోరైడ్ ఏర్పడడం.
(ii) ఆక్సిజన్ అణువు ఏర్పడడం.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 5

ప్రశ్న 2.
ఒక తటస్థ పరమాణువు, దాని ధన అయాన్లలో దేని పరిమాణం ఎక్కువ? ఎందుకు?
జవాబు:

  1. తటస్థ పరమాణువు కన్నా దాని ధన అయాన్ పరిమాణం తక్కువ ఉంటుంది.
  2. ఎలక్ట్రాన్లు కోల్పోయిన పరమాణువు కేంద్రక ఆవేశ ప్రభావం ఎక్కువగా ఉండి, చిట్ట చివరి కక్ష్యలోని ఎలక్ట్రాన్లను మరింత బలంగా ఆకర్షిస్తుంది.
  3. ఈ ఆకర్షణ కారణంగా అయాన్ పరిమాణం తగ్గిపోతుంది.
  4. కాబట్టి పరమాణువుకన్నా దాని ధన అయాన్ పరిమాణం తక్కువగా ఉంటుంది.

ప్రశ్న 3.
అష్టక నియమంను రాయండి. ఈ నియమం ప్రకారం మెగ్నీషియం (Z = 12) క్లోరితో చర్య జరిపేటప్పుడు ఎలా స్థిరత్వం పొందుతుందో తెల్పండి.
జవాబు:
అష్టక నియమం :
మూలకాలకు చెందిన పరమాణువులు తమ బాహ్య కక్షలో ఎనిమిది ఎలక్ట్రాన్లు మిగిలి ఉండేలా రసాయన మార్పు చెందడానికి ప్రయత్నిస్తాయి. దీనిని అష్టక నియమం అంటాం.

మెగ్నీషియం రెండు ఎలక్ట్రాన్లను కోల్పోయి చివరి కక్ష్యలో 8 ఎలక్ట్రాన్లు మిగుల్చుకొని నియాన్ విన్యాసాన్ని పొంది స్థిరత్వాన్ని పొందుతుంది.

ప్రశ్న 4.
ఆక్సిజన్ అణువు ఏర్పడే విధానాన్ని వేలన్సీ బంధ సిద్ధాంతం ప్రకారం పటం గీచి చూపండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 6

ప్రశ్న 5.
అయానిక బంధంను ఒక ఉదాహరణతో వివరించండి. ..
జవాబు:

  1. సోడియం (Na) పరమాణువు ఒక ఎలక్ట్రాన్ ను కోల్పోయి సోడియం ధన అయాన్ గా మారుతుంది. (Na+)
    Na → Na+ + le
  2. క్లోరిన్ (Cl) పరమాణువు ఒక ఎలక్ట్రాన ను గ్రహించి క్లోరిన్ ఋణ అయాన్ గా మారుతుంది. (Cl )
    Cl + le → Cl
  3. సోడియం ధన అయాన్, క్లోరిన్ ఋణ అయాన్ల మధ్య స్థిర విద్యుత్ ఆకర్షణ వలన అయానిక బంధం ఏర్పడి సోడియం క్లోరైడ్ (NACl) ఏర్పడుతుంది.
    Na+ + Cl → NaCl

ప్రశ్న 6.
VSEPRT సిద్ధాంతం అనగానేమి?
జవాబు:
మూడు, అంతకంటే ఎక్కువ పరమాణువుల కలయిక వలన ఏర్పడిన అణువులలో అన్ని పరమాణువులు ఒక కేంద్రక పరమాణువులతో సమయోజనీయ బంధంతో బంధింపబడి ఉన్నప్పుడు, వాని మధ్య బంధకోణాలు వివరించడానికి ఒక సిద్ధాంతాన్ని అభివృద్ధిపరచారు. దీనినే VSEPRT సిద్ధాంతం అంటారు.

ప్రశ్న 7.
సంకరీకరణం (Hybridization) అనగానేమి?
జవాబు:
పరమాణువుల చివరి కక్ష్యలో ఉండే దాదాపు సమానశక్తి కలిగిన పరమాణు ఆర్బిటాళ్ళు పరస్పరం కలిసిపోయి, పునర్వ్యవస్థీకరించబడటం ద్వారా అదే సంఖ్యలో బంధశక్తి, ఆకారం వంటి ధర్మాలు ఒకే విధంగా ఉండే సర్వసమాన ఆర్బిటాళ్ళను ఏర్పరచే దృగ్విషయాన్ని సంకరీకరణం అంటారు.

ప్రశ్న 8.
Cl అయాను, Cl పరమాణువు కంటే స్థిరమైనది. ఎందువల్ల?
జవాబు:
ns²np6 ఎలక్ట్రాన్ విన్యాసం గల పరమాణువు లేదా అయాను స్థిరమైనది. Cl కు స్థిర ఎలక్ట్రాను విన్యాసం కలదు.
Cl (Z = 17) ఎలక్ట్రాన్ విన్యాసం : 1s² 2s² 2p63s² 3p5
Cl ఎలక్ట్రాన్ విన్యాసం : 1s² 2s² 2p6 3s² 3p6
అందువల్ల Cl కన్నా Cl అయాను స్థిరమైనది.

ప్రశ్న 9.
‘లోహధర్మం ‘ లేదా ‘ధన విద్యుదాత్మకత’ అనగానేమి?
జవాబు:
లోహ మూలకాలు తమ బాహ్య కక్ష్య నుండి ఎలక్ట్రాన్లను కోల్పోయి, అష్టక విన్యాసం పొందటానికి ప్రయత్నిస్తాయి. ఈ విధమైన స్వభావాన్నే ‘లోహధర్మం’ లేదా ‘ధన విద్యుదాత్మకత’ అంటారు.

ప్రశ్న 10.
VSEPRT సిద్ధాంతం ప్రకారం, బంధ ఎలక్ట్రాన్ జంటల సంఖ్య, అణువు ఆకృతి గురించి వివరించండి.
జవాబు:

బంధ ఎలక్ట్రాన్ జంటల సంఖ్యఅణువు ఆకృతి
2రేఖీయం
3సమతల త్రిభుజం
4టెట్రా హైడ్రల్
5ట్రైగోనల్ బై పిరమిడల్
6ఆక్టా హైడ్రల్
7పెంటాగోనల్ బై పిరమిడల్

ప్రశ్న 11.
లూయిస్ చుక్కల నిర్మాణం అనగానేమి?
జవాబు:
పరమాణు కేంద్రకాన్ని లోపలి కక్ష్యలోని ఎలక్ట్రాన్లను ఆ మూలకం యొక్క గుర్తు ద్వారా మరియు పరమాణు బాహ్య కక్ష్యలోని ఎలక్ట్రాన్లను చుక్కలు (⋅) లేదా గుణకారపు గుర్తు (×)తో సూచిస్తారు. దీనినే లూయిస్ చుక్కల నిర్మాణం అంటాం.
ఉదా : Nax
దీనిలో Na అనేది సోడియం పరమాణు కేంద్రకం మరియు దాని పైనున్న గుణకారపు గుర్తు (×), సోడియం యొక్క వేలన్సీలోనున్న ఎలక్ట్రానుల సంఖ్యను తెలియజేస్తుంది.

ప్రశ్న 12.
అయనీకరణము అనగానేమి? ఒక ఉదాహరణనిమ్ము.
జవాబు:

  1. ఒక పరమాణువు నుండి ఎలక్ట్రాన్ (ల)ను తొలగించు ప్రక్రియను అయనీకరణము అందురు.
    ఉదా : Na → Na+ + e
  2. ఒక అయానిక పదార్థం సరియైన ద్రావణిలో, దాని అంశీభూత అణువులుగా విడిపోయే ప్రక్రియను అయనీకరణము అంటారు.
    ఉదా : NaCl(జ.ద్రా.) → Na+ + Cl

ప్రశ్న 13.
HCl అణువు ఎలా ఏర్పడుతుంది?
జవాబు:
H పరమాణువులో ఒంటరి ఎలక్ట్రాన్ ను కలిగి ఉన్న ‘1s’ ఆర్బిటాల్, క్లోరిన్ పరమాణువులో వ్యతిరేక స్పినను కలిగి ఉన్న ఒంటరి ఎలక్ట్రాన్ ను కలిగి ఉన్న ‘3p’ ఆర్బిటాల్ తో అతిపాతం చెంది HCl అణువును ఏర్పరుస్తాయి.
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 7

ప్రశ్న 14.
కొన్ని అణువులు వాటి బంధకోణాలు, ఆకృతులు పట్టిక రూపంలో రాయండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 8

10th Class Physics 8th Lesson రసాయన బంధం 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
త్రిబంధం గురించి వివరించండి.
(లేదా)
వేలన్సీ బంధ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు ? ఈ సిద్ధాంత ఆధారంగా N, అణువు ఏర్పడు విధానం వివరించండి.
జవాబు:
వేలన్సీ బంధ సిద్ధాంతాన్ని “లైనస్ పౌలింగ్” ప్రతిపాదించారు.

N2 అణువు ఏర్పడుట :

  1. 7N యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం (z = 7) = 1s²2s² 2px¹2py¹ 2pz¹
  2. ఒక నైట్రోజన్ పరమాణువులోని ‘Px‘ ఆర్బిటాల్, వేరొక నైట్రోజన్ పరమాణువులోని ‘Px‘ ఆర్బిటాల్ తో అతిపాతం చెందటం ద్వారా సిగ్మా (σ) px – px బంధం ఏర్పడుతుంది.
  3. నైట్రోజన్ పరమాణువులో మిగిలిన py మరియు pz ఆర్బిటాళ్ళు వేరొక నైట్రోజన్ పరమాణువులోని py, pz ఆర్బిటాళ్ళతో పార్శ్వ అతిపాతం చెంది రెండు పై (π) (py – pz మరియు pz – pz) బంధాలను ఏర్పరుస్తాయి.
  4. ఈ విధంగా N2 అణువులోని రెండు నైట్రోజన్ పరమాణువుల మధ్య ఒకటి సిగ్మా(σ), రెండు పై (π) బంధాలు ఏర్పడుతాయి. మొత్తం 3 బంధాలు ఏర్పడుట వలన N2 అణువులో “త్రి బంధం” ఏర్పడుతుంది.

AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 9

ప్రశ్న 2.
వేలన్సీ బంధ సిద్ధాంతం ద్వారా BF3 అణువు ఏర్పడు విధానాన్ని వివరించండి.
జవాబు:

  1. బోరాన్ పరమాణుసంఖ్య 5. ఎలక్ట్రాన్ విన్యాసం 1s² 2s² 2p¹.
  2. ఉత్తేజ స్థితిలో బోరాన్ ఎలక్ట్రాన్ విన్యాసం 1s² 2s¹ 2px¹ 2py¹.
  3. బోరాన్లోని 2s, 2px, 2py, ఆర్బిటాళ్ళు కలిసి మూడు sp² సంకర ఆర్బిటాళ్ళను ఏర్పరచును. ఇవి బంధంలో పాల్గొంటాయి.
  4. ఫ్లోరిన్ పరమాణు సంఖ్య 9. ఎలక్ట్రాన్ విన్యాసం 1s² 2s² 2p5.
  5. ఫ్లోరిన్ లోని 2pz ఆర్బిటాల్ లోని ఎలక్ట్రాన్ బంధంలో పాల్గొంటుంది.
  6. బోరాన్ లోని మూడు sp² సంకర ఆర్బిటాళ్ళతో మూడు ఫ్లోరిన్ పరమాణువులలోని 2p, ఆర్బిటాల్ లోని ఒంటరి ఎలక్ట్రాన్లు జతకూడి మూడు సిగ్మా బంధాలు ఏర్పరుస్తాయి. ఈ విధంగా మూడు (σsp²-p) బంధాలతో BF3 అణువు ఏర్పడుతుంది.

ప్రశ్న 3.
“నైట్రోజన్, హైడ్రోజన్ చర్యనొంది, అమ్మోనియా (NH3) అణువును ఏర్పరుస్తాయి. కార్బన్, హైడ్రోజన్ తో చర్యనొంది మీథేన్ (CH4) అణువును ఏర్పరచును.
పై వాటిలో ప్రతీ చర్యకి సంబంధించి
A) చర్యలో పాల్గొన్న ప్రతి పరమాణువు వేలెన్సీ ఎంత?
B) చర్యలో ఏర్పడిన సమ్మేళనాల యొక్క చుక్కల నిర్మాణం తెల్పండి.
జవాబు:
A) అమ్మోనియాలో : నైట్రోజన్ వేలెన్సీ 3, హైడ్రోజన్ వేలెన్సీ 1
మీథేన్ లో : కార్బన్ వేలెన్సీ 4, హైడ్రోజన్ వేలెన్సీ 1
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 10

ప్రశ్న 4.
అ) సోడియం, ఆక్సిజన్ మరియు మెగ్నీషియంలకు ఎలక్ట్రాన్ బిందు నిర్మాణాలను చూపే పటాలను గీయండి.
జవాబు:
1) సోడియం పరమాణువులో ఒక వేలన్సీ ఎలక్ట్రాన్ ఉన్నది కావున సోడియం యొక్క ఎలక్ట్రాన్ బిందు నిర్మాణం Na x లేక Na⋅
2) ఆక్సిజన్ పరమాణువులో రెండు వేలన్సీ ఎలక్ట్రాన్లు ఉంటాయి కావున ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రాన్ బిందు నిర్మాణం Oxx లేక O:
3) మెగ్నీషియం పరమాణువులో కూడా రెండు వేలన్సీ ఎలక్ట్రాన్లుంటాయి కావున మెగ్నీషియం యొక్క ఎలక్ట్రాన్ బిందు
నిర్మాణం Mgxx లేక Mg:

ఆ) Na2O మరియు MgO ల ఏర్పాటును గురించి పటం రూపంలో చూపండి.
జవాబు:
Na2O
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 11

ప్రశ్న 5.
నీటి యొక్క సాంకేతికం H2O గానే రాస్తాం. HO2 గా ఎందుకు రాయకూడదో తెల్పండి.
జవాబు:

  1. నీటి అణువులో ఆక్సిజన్ పరమాణువు తనకు దగ్గరి జడవాయువైన నియాన్ విన్యాసం పొందుటకు రెండు ఎలక్ట్రానులు అవసరము.
  2. హైడ్రోజన్ పరమాణువు తన దగ్గరి జడవాయువైన హీలియం విన్యాసం పొందుటకు ఒక ఎలక్ట్రాను అవసరం.
  3. ఈ విధంగా రెండు హైడ్రోజన్ (H) పరమాణువులతో, ఒక ఆక్సిజన్ (O) చర్య జరిపి రెండు ఏక సమయోజనీయ బంధాలను ఏర్పరచును. కనుక నీటి యొక్క రసాయన సాంకేతికం H2O గానే వ్రాస్తాము.

AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం

ప్రశ్న 6.
A మరియు B అనే పరమాణువుల ఎలక్ట్రాన్ విన్యాసాలు వరుసగా :
1s²2s²2p63s²3p¹; 1s²2s²2p4 అయితే
జవాబు:
పరమాణువు – A యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము – 1s²2s²2p63s²3p¹
పరమాణువు – B యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము – 1s²2s²2p4

అ) ఏ పరమాణువు ఋణ అయానును ఏర్పరుస్తుంది?
జవాబు:
‘A’ పరమాణువు ఎలక్ట్రాన్లను కోల్పోయే అవకాశం కలదు, ‘B’ పరమాణువు ‘2’ ఎలక్ట్రాన్లను స్వీకరించే అవకాశం కలదు. కనుక ‘B’ పరమాణువు ఋణ అయానును ఏర్పరుస్తుంది.

ఆ) ఏ పరమాణువు ధన అయానును ఏర్పరుస్తుంది?
జవాబు:
‘A’ పరమాణువు మూడు ఎలక్ట్రానులను కోల్పోవుట వలన ధన అయానుగా మారును.

ఇ) పరమాణువు A వేలెన్సీ ఎంత?
జవాబు:
పరమాణువు ‘A’ యొక్క వేలన్సీ – 3

ఈ) A మరియు B అనే పరమాణువులచే ఏర్పడే సంయోగపదార్థం యొక్క అణుఫార్ములా ఏమిటి?
జవాబు:
క్రిస్ క్రాస్ పద్ధతిన A మరియు B పరమాణువులచే ఏర్పడు సంయోగ పదార్థం యొక్క అణుఫార్ములా – A3B2
ఈ అణుఫార్ములా గల పదార్థం – Al3O2

ప్రశ్న 7.
అయానిక మరియు సమయోజనీయ బంధాల మధ్య భేదాలను రాయుము.
జవాబు:

అయానిక బంధంసమయోజనీయ బంధం
1. ఒక పరమాణువు నుండి మరొక పరమాణువుకు ఎలక్ట్రాన్ల బదిలీ వల్ల అయానిక బంధం ఏర్పడును.1. పరమాణువుల మధ్య ఎలక్ట్రాన్ల పంపిణీ వల్ల సమయోజనీయ బంధం ఏర్పడును.
2. స్థిరవిద్యుత్ ఆకర్షణ బలం ఉంటుంది.2. స్థిర విద్యుదాకర్షణ బలం ఉండదు.
3. అయానిక బంధం వల్ల అయానిక పదార్థాలు ఏర్పడుతాయి.3. సమయోజనీయ బంధం వల్ల సమయోజనీయ పదార్థాలు ఏర్పడుతాయి.
4. దిశా ధర్మం లేదు.4. దిశా ధర్మం పాటిస్తుంది.

ప్రశ్న 8.
ద్విబంధం గురించి వివరించండి.
(లేదా)
వేలన్సీ బంధ సిద్ధాంతం ఆధారంగా O2 అణువు ఏర్పడు విధానం వివరించండి.
జవాబు:
ఆక్సిజన్ అణువు (O2) ఏర్పడుట :

  1. 80 యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం (z = 8) = 1s²2s²2px²2py¹2pz¹
  2. ఆక్సిజన్ పరమాణువులో ‘py‘ ఆర్బిటాల్, మరొక ఆక్సిజన్ పరమాణువులోని ‘py‘ ఆర్బిటాల్ లో అతిపాతం చెందడం వలన py – py మధ్య సిగ్మా బంధం (σ) ఏర్పడుతుంది.
  3. ఒక ఆక్సిజన్ పరమాణువులో ఉండే pz ఆర్బిటాల్, వేరొక ఆక్సిజన్ పరమాణువులో ఉండే pz ఆర్బిటాల్లో పార్శ్వ అతిపాతం చెందడం వలన pz – pz మధ్య పై (π) బంధం ఏర్పడుతుంది.
  4. ఈ విధంగా O2 అణువులో ఒక సిగ్మా బంధం, ఒక పై బంధం ఏర్పడుతాయి. మొత్తం 2 బంధాలు ఏర్పడుట వలన O2అణువులో ద్విబంధం ఏర్పడును.

AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 12

ప్రశ్న 9.
A మరియు B అనే పరమాణువుల ఎలక్ట్రాన్ విన్యాసాలు వరుసగా :
1s²2s²2p63s²3p¹ ; 1s²2s²2p4 అయితే
అ) ఏ పరమాణువు ఋణ అయానును ఏర్పరుస్తుంది?
ఆ) ఏ పరమాణువు ధన అయానును ఏర్పరుస్తుంది?
ఇ) పరమాణువు A వేలెన్సీ ఎంత?
ఈ) A మరియు B అనే పరమాణువులచే ఏర్పడే సంయోగపదార్థం యొక్క అణుఫార్ములా ఏమిటి?
జవాబు:
పరమాణువు – A యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము – 1s²2s²2p63s²3p¹
పరమాణువు – B యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము – 1s²2s²2p4

అ) ‘A’ పరమాణువు ఎలక్ట్రాన్లను కోల్పోయే అవకాశం కలదు, ‘B’ పరమాణువు ‘2’ ఎలక్ట్రాన్లను స్వీకరించే అవకాశం కలదు. కనుక ‘B’ పరమాణువు ఋణ అయానును ఏర్పరుస్తుంది.

ఆ) ‘A’ పరమాణువు మూడు ఎలక్ట్రానులను కోల్పోవుట వలన ధన అయానుగా మారును.

ఇ) పరమాణువు ‘A’ యొక్క వేలన్సీ – 3

ఈ) క్రిస్ క్రాస్ పద్ధతిన A మరియు B పరమాణువులచే ఏర్పడు సంయోగ పదార్థం యొక్క అణుఫార్ములా – A3B2
ఈ అణుఫార్ములా గల పదార్థం – Al3O2

10th Class Physics 8th Lesson రసాయన బంధం ½ Mark Important Questions and Answers

1. క్రింది అణువులలో దేనికి sp³ సంకరీకరణం ఉండదు?
(CH4, BF3, NH3, H2O)
జవాబు:
BF3

2. రెండు పరమాణువుల మధ్య బంధం ఏర్పడుటకు కారణమైనవి ఏమిటి?
జవాబు:
వేలన్సీ ఎలక్ట్రానులు

3. చర్యాశీలత లేని మూలకాలు గల గ్రూపు ఏది?
జవాబు:
18 (VIIIA)

4. He కి తప్ప, మిగిలిన జడవాయువుల బాహ్య కక్ష్యలో ఎలక్ట్రానుల సంఖ్య ఎంత?
జవాబు:
ఎనిమిది

5.
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 13
1) హీలియం వాయువు యొక్క వేలన్సీ ఎంత?
జవాబు:
‘O’ (సున్న)

2) ఆర్గాన్ యొక్క వేలన్సీ కర్పరం ఏమిటి?
జవాబు:
‘M’

3) పైన ఇచ్చిన మూలకాలలో ఏది అష్టక నియమాన్ని పాటించదు? (హీలియం తప్ప).
జవాబు:
ఏదీ లేదు.

4) నియాన్ ఎటువంటి చర్యలలో పాల్గొనును?
జవాబు:
అసలు పాల్గొనదు.

6. లూయిస్ గుర్తుల ప్రకారం ఎలక్ట్రానులను ఎలా సూచిస్తారు?
జవాబు:
చుక్క (⋅) లేదా క్రాస్ గుర్తు (×).

7. ‘X’ అనే పరమాణువుకి ‘స’ వేలన్నీ ఎలక్ట్రానులు కలవు. దీనిని లూయిస్ గుర్తు ప్రకారం ఎలా సూచిస్తారు?
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 14

8. AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 15 ఇచ్చిన లూయిస్ చుక్క పటం ప్రకారం Mg యొక్క వేలన్సీని కనుగొనుము.
జవాబు:
‘2’

9. AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 16 ఆర్గాన్ యొక్క వేలన్సీ ఎంత?
జవాబు:
‘0’ (సున్న)

10. గ్రూపు – I మూలకం ‘X’ అయిన, దానిని లూయీస్ చుక్క పటం ద్వారా చూపుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 17

11. ‘వేలన్సీ ఎలక్ట్రాన్ సిద్ధాంతం’ను ప్రతిపాదించిన వారెవ్వరు?
జవాబు:
లూయీస్ మరియు కొస్సెల్

12. “మూలకాలకు చెందిన పరమాణువులు తమ బాహ్య కక్ష్యలో ఎనిమిది ఎలక్ట్రాన్లను మిగిలి ఉండేలా రసాయనిక మార్పు చెందడానికి ప్రయత్నిస్తాయి.” ఈ నియమం పేరు ఏమిటి?
జవాబు:
అష్టక నియమం

13. 11Na+ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం రాయుము.
జవాబు:
2, 8 (లేదా) 1s² 2s² 2p6.

14. Mg2+ యొక్క వేలన్సీ ఎంత?
జవాబు:
‘0’

AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం

15. జతపరుచుము :
a) 8O ( ) i) ఎలక్ట్రాన్లను కోల్పోవును
b) 12Mg ( ) ii) ఎలక్ట్రాన్లను పొందదు, కోల్పోదు
c) 10Ne ( ) iii) ఎలక్ట్రాన్లను పొందును
జవాబు:
a – iii, b-i, c – ii

16. ఏ గ్రూపు మూలకాలు ద్విఋణాత్మక అయాన్లను ప్రదర్శించును?
జవాబు:
VI A

17.
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 18
1) ఏకాత్మక ఆనయాన్లను ఇవ్వగల గ్రూపు ఏది?
జవాబు:
VIIA

2) చాల్కోజన్ కుటుంబం ఎన్ని ఎలక్ట్రాన్లను పొందగలదు?
జవాబు:
‘2’

18. వేలన్సీ కర్పరంలో 2 ఎలక్ట్రానులను కలిగి యుండి, అధిక స్థిరత్వం కలిగిన మూలకం ఏది?
జవాబు:
He

19. అయానిక బంధాన్ని ప్రతిపాదించినవారెవరు?
జవాబు:
కొసెల్

20. IA మరియు VIIA గ్రూపు మూలకాల మధ్య ఏర్పడే బంధం ఏ రకమైనది?
జవాబు:
అయానిక బంధం

21. IIA గ్రూపు మూలకాలు ఎటువంటి బంధాలను సులువుగా ఏర్పరచగలవు?
జవాబు:
అయానిక బంధం

22. అయానిక బంధం ఎప్పుడూ వీటి మధ్య ఏర్పడును.
a) రెండు ఒకే పరమాణువుల మధ్య
b) రెండు వేరు వేరు పరమాణువుల మధ్య
c) ‘a’ మరియు ‘b’
d) రెండూ కావు
జవాబు:
b) రెండు వేరు వేరు పరమాణువుల మధ్య

23. అయానిక బంధానికి గల మరొక పేరు రాయుము.
జవాబు:
స్థిర విద్యుత్ బంధం (లేదా) ఎలక్ట్రోవాలెంట్ బంధం.

24. కాటయాన్లు అనగానేమి?
జవాబు:
ధనాత్మక అయాన్లు

25. కాటయాన్లకు ఉదాహరణిమ్ము.
జవాబు:
Na+, Mg2+, Al3+

26. ఋణాత్మక అయాన్లను ఏమందురు?
జవాబు:
ఆనయాన్లు

27. ఆనయాన్లకు ఉదాహరణిమ్ము.
జవాబు:
P3- ; S2- ; Cl

28. ఎలక్ట్రాన్ల బదిలీ వలన ఏర్పడే బంధం ఏది?
జవాబు:
అయానిక బంధం

29. సోడియం క్లోరైడ్ అణువు ఏర్పడు సమీకరణం
జవాబు:
Na(s) + ½ Cl2(g) → NaCl(s)

30. సోడియం కాటయాన్ ఏర్పడు విధం రాయుము.
జవాబు:
11Na → Na+ + e

31. సోడియం క్లోరైడ్ ఏర్పడు విధానాన్ని లూయీస్ చుక్క పటం ద్వారా చూపుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 19

32. మెగ్నీషియం క్లోరైడ్ ఏర్పడునపుడు ఏర్పడే కాటయాన్, ఆనయాన్లు ఏవి?
జవాబు:
Mg2+ (కాటయాన్); Cl(ఆనయాన్)

33. MgCl2 ఏర్పడు విధానాన్ని సూచించు సమీకరణం రాయుము.
జవాబు:
Mg2+ + 2Cl → MgCl2

34. AlCl3 ఏర్పాటులో గల రసాయన బంధం పేరేమిటి?
జవాబు:
అయానిక బంధం

35. MgCl2 ఏర్పాటును సూచించు లూయీస్ చుక్కపటం రాయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 20

36. సోడియం క్లోరైడ్ స్ఫటికంలో ఒక సోడియం చుట్టూ ఎన్ని క్లోరిన్ అయాన్లు ఉంటాయి?
జవాబు:
‘6’

37. NaCl అణు ఆకృతి ఏమిటి?
జవాబు:
ముఖ కేంద్రక స్ఫటిక నిర్మాణం

38. ఒక నిర్దిష్ట ఆవేశం గల అయాన్ చుట్టూ ఎన్ని వ్యతిరేక ఆవేశం గల అయాన్లు అమరి ఉన్నాయో తెలిపే సంఖ్యను ఏమంటారు?
జవాబు:
సమన్వయ సంఖ్య

39. Nacl లో Na+ యొక్క సమన్వయ సంఖ్య ఎంత?
జవాబు:
‘6’

40. Nacl లో Cl యొక్క సమన్వయ సంఖ్య ఎంత?
జవాబు:
‘6’

41. సాధారణంగా ఎలక్ట్రాన్లను కోల్పోయే లక్షణాన్నీ ఏమందురు?
a) లోహ ధర్మం
b) ధన విద్యుదాత్మకత
c) a లేదా b
d) అలోహ ధర్మం
జవాబు:
c) a లేదా b

AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం

42. ధన విద్యుదాత్మకత ధర్మం గల మూలకాలు ఏర్పరచేది?
a) ఆనయాన్
b) కాటయాన్
c) a లేదా b
d) రెండూ కాదు రాయుము.
జవాబు:
b) కాటయాన్

43. ఋణ విద్యుదాత్మకత స్వభావాన్ని ప్రదర్శించే కొన్ని మూలకాలను రాయుము.
జవాబు:
ఆక్సిజన్, ఫ్లోరిన్, క్లోరిన్

44. అష్టక విన్యాసం కొరకు ఒక మూలకం ఎలక్ట్రాన్లను గ్రహించే స్వభావాన్ని ఏమంటారు?
జవాబు:
ఋణ విద్యుదాత్మకత

45. రెండు మూలకాలకు చెందిన పరమాణువులు అయానిక బంధంలో పాల్గొనాలంటే వాటి మధ్య ఋణ విద్యుదాత్మకతల మధ్య తేడా ఎంత వుండాలి?
a) 1.9
b) > 1.9
c) a లేదా b
d) <1.9
జవాబు:
c) a లేదా b

46. అయానిక బంధంలో పాల్గొనే పరమాణువులు
a) ఎలక్ట్రాన్లను గ్రహిస్తాయి
b) ఎలక్ట్రాన్లను కోల్పోతాయి
c) a లేదా b
d) ఎలక్ట్రాన్లను పంచుకుంటాయి.
జవాబు:
c) a లేదా b

47. ఒక మూలకం ఎలక్ట్రాన్లను కోల్పోవడం గానీ, గ్రహించడం గానీ ఈ క్రింది ఏ అంశంపై ఆధారపడదు?
a) పరమాణు పరిమాణం
b) అయనీకరణ శక్మం
c) ఎలక్ట్రాన్ విన్యాసం
d) ఏదీ లేదు
జవాబు:
d) ఏదీ లేదు

48. తక్కువ అయనీకరణ శక్మం, తక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ మరియు ఎక్కువ పరమాణు పరిమాణం గల మూలకాలు వీటిని ఏర్పరుస్తాయి?
a) కాటయాన్లు
b) ఆనయాన్లు
c) a లేదా b
d) రెండూ కావు
జవాబు:
a) కాటయాన్లు

49. అధిక అయనీకరణ శక్మం గల మూలకాలు ఏర్పరచే అయాన్లు ఎటువంటివి?
జవాబు:
ఆనయాన్లు

50. మూలకం X కు తక్కువ అయనీకరణ శక్మం కలదు.
జవాబు:
కాటయాన్

51. సమయోజనీయ బంధాన్ని ప్రతిపాదించిన వారెవరు?
జవాబు:
జి.యన్. లూయీస్ (G.N. Lewis)

52. పరమాణువులు ఒకటి గాని, అంతకన్నా ఎక్కువగాని వాటి వేలన్సీ ఎలక్ట్రానులను మరొక పరమాణువుతో పంచుకొని ఏర్పరచే బంధం ఏమిటి?
జవాబు:
సమయోజనీయ బంధం

53. జతపరుచుము :
a) సమయోజనీయ బంధం ( ) i) ఎలక్ట్రాన్ల పంపకం
b) అయానిక బంధం ( ) ii) ఎలక్ట్రాన్ల పంపిణీ
జవాబు:
a – i, b – ii

54. సమయోజనీయ బంధాలకి ఉదాహరణిమ్ము.
జవాబు:
F2, Cl2, HCl మొదలగునవి.

55. ఫ్లోరిన్ అణువు ఏర్పాటును సూచించు చుక్క పటం గీయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 21

56. ఆక్సిజన్ అణువు ఏర్పాటును సూచించు చుక్క పటం గీయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 22

57. AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 23
1) F చుట్టూ గల చుక్కలు వేటిని సూచిస్తాయి?
జవాబు:
వేలన్సీ ఎలక్ట్రానులను

2) ఫ్లోరిన్ ఏర్పరచగల ఒక సమయోజనీయ అణువుని రాయుము.
జవాబు:
F2; HF

58. ఆక్సిజన్ అణువులో ఎన్ని బంధాలు కలవు?
జవాబు:
రెండు

59. త్రిబంధం గల ఒక అణువు పేరు రాయుము.
జవాబు:
N2 (N ≡ N)

AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం

60. CH4 లో ఎన్ని సమయోజనీయ బంధాలు గలవు ?
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 24

61. CH4 అణు ఆకృతిని యుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 25

62. అమ్మోనియా అణు ఆకృతిని గీయుము. అయిన అది ఏర్పరచు అయాన్ ఏది?
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 26

63. అమ్మోనియా అణువులో
a) ఎన్ని ఏకబంధాలు కలవు?
జవాబు:
‘3’

b) ఎన్ని ఒంటరి జత ఎలక్ట్రాన్లు కలవు?
జవాబు:
‘1’

c) H\(\hat{\mathbf{N}}\)H బంధకోణం ఎంత?
జవాబు:
107°48′

64. రెండు ఒంటరి జత ఎలక్ట్రాన్లను కలిగియున్న అణువుకి ఉదాహరణనిమ్ము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 27

65. H2O అణువు లూయీస్ చుక్క పటం గీయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 28

66. ఒక అణువులో ఒక పరమాణువులు ఏర్పరచు సమయోజనీయ బంధాల సంఖ్యను ఏమంటారు?
జవాబు:
‘కో-వేలన్సీ’

67. సమయోజనీయ బంధం ఏర్పరచు రెండు పరమాణువుల మధ్య దూరంను ఏమంటారు?
జవాబు:
బంధ దూరం / బంధదైర్ఘ్యం

68. బంధదూరం యొక్క ప్రమాణం ఏమిటి?
జవాబు:
nm (నానోమీటర్) (లేదా) A° (ఆంగ్ స్టాం)

69. రెండు పరమాణువులు గల ఒక అణువులో ఆ పరమాణువులను విడదీయడానికి కావలసిన శక్తిని ఏమందురు?
జవాబు:
బంధ శక్తి (లేదా) బంధవిచ్ఛేదక శక్తి

70. 1 నానోమీటర్
a) 10-8 మీ.
b) 10-9మీ.
c) 10-10మీ.
జవాబు:
b) 10-9మీ.

71. 1 ఆంగ్ సాం
a) 10-9మీ.
b) 10-10మీ.
c) 10-8మీ.
జవాబు:
b) 10-10మీ.

72. Cl\(\hat{\mathbf{Be}}\)Cl లో బంధకోణం ఎంత?
జవాబు:
180°

73. CH4 లో H\(\hat{\mathbf{C}}\)H బంధకోణం ఎంత?
జవాబు:
109°28¹

74. క్రింది వానిని జతపరుచుము.
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 29
జవాబు:
a – iii, b – i, c – ii

75. అణు ఆకృతులను వివరించలేకపోయిన సిద్ధాంతం.
a) VSEPRT
b) ఎలక్ట్రాన్ వేలన్సీ సిద్ధాంతం
c) వేలన్సీ బంధ సిద్ధాంతం
జవాబు:
b) ఎలక్ట్రాన్ వేలన్సీ సిద్ధాంతం

76. VSEPRT ని విస్తరించుము.
జవాబు:
Valency – Shell – Electron – Pair – Repulsion – Theory.
(వేలన్సీ- షెల్ – ఎలక్ట్రాన్ – పెయిర్ – రిపల్టన్ – థియరీ)

77. VSEPRT ని ప్రతిపాదించినది ఎవరు?
జవాబు:
సిధ్ధ విక్ మరియు పావెల్ (Sidgwick & Powell)

78. VSEPRT ని అభివృద్ధి చేసినది ఎవరు?
జవాబు:
గిలెస్పీ మరియు నైహామ్ (Gillespie & Nyholm)

79. బంధ జతలు, ఒంటరి జతలు అనే దృగ్విషయం గల సిద్ధాంతం
A) వేలన్సీ ఎలక్ట్రాన్ సిద్ధాంతం
B) ఎలక్ట్రాన్ బంధ సిద్ధాంతం
C) VSEPRT
D) పైవన్నియు
జవాబు:
C) VSEPRT

AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం

80. a) బంధ జంట ఎలక్ట్రాన్లు, ఒంటరి జంట ఎలక్ట్రాన్ల మధ్య వికర్షణ వలన అణువులు ఆకృతులు పొందుతాయి.
b) మధ్య పరమాణువు చుట్టూ బంధ జంటల కంటే ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు ఎక్కువ ఖాళీని ఆక్రమిస్తాయి.
పై వాక్యాలలో ఏ వాక్యం సరైనది?
A) a
B) b
C) a మరియు b
D) రెండూ కావు
జవాబు:
C) a మరియు b

81. జతపరచుము :

ఒంటరి జత ఎలక్ట్రాన్లు లేకుండాబంధకోణం
a) రెండు బంధ జంటలుi) 120°
b) మూడు బంధజంటలుii) 180°
c) నాలుగు బంధ జంటలుiii) 109°28′

జవాబు:
a – ii, b-i, c – iii

82. CH4 లో బంధకోణం 109°28¹ అయిన ఎన్ని ఒంటరి జత ఎలక్ట్రాన్లు కలవు ?
జవాబు:
సున్న (0)

83. NH3 అణువు ఆకృతి ఏమిటి?
జవాబు:
త్రికోణీయ పిరమిడల్

84.
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 30
1) ఇచ్చిన అణువు ఆకృతి ఏమిటి?
జవాబు:
‘V’ లేదా కో ణీయ ఆకృతి

2) ఎన్ని ఒంటరి జంటలు కలవు?
జవాబు:
‘2’

85. VSEPRT యొక్క ఒక పరిమితిని రాయుము.
జవాబు:
బంధశక్తులను వివరించలేదు.

86. వేలన్సీ బంధ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు?
జవాబు:
లైనస్ పౌలింగ్

87. పరమాణువుల కేంద్రకాలను కలిపే అంతర కేంద్రక అక్షం వెంబడి ఆర్బిటాళ్ళు అతిపాతం చెందితే ఏర్పడే బంధం
a) సిగ్మా (σ)
b) పై (π)
c) రెండూ
జవాబు:
a) సిగ్మా (σ)

88. ఆర్బిటాళ్ళ పార్శ్వ అతిపాతం వలన ఏర్పడే బంధం ఏది?
జవాబు:
పై (π)

89. A : ‘σ’ బంధం, ‘π’ బంధం కన్నా బలమైనది.
R: ‘σ’ బంధం పార్శ్వ అతిపాతం వలన ఏర్పడును.
a) A మరియు Rలు సరియైనవి
b) A మరియు R లు తప్పు
c) A మాత్రమే ఒప్పు
d) R మాత్రమే ఒప్పు
జవాబు:
c) A మాత్రమే ఒప్పు

90. i) σ బంధం ఏర్పడిన తర్వాత π బంధం ఏర్పడును.
ii) σ బంధం ఉంది అని అంటే π కూడా ఉందని అర్థం సరియైన వాక్యం ఏది?
జవాబు:
(i)

91. H2 అణువులో s – ఆర్బిటాళ్ళ అతిపాతం పటం గీయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 31

92. Cl2 లో p- ఆర్బిటాళ్ళ అతిపాతం పటం గీయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 32

93. HCl లో ఆర్బిటాళ్ల అతిపాతం పటం గీయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 33

94. πpz – pz, πpy – py లు N2 లో కలవు. మరియొక బంధం ఏమి ఉండును?
జవాబు:
σpx – px

95. 4Be లో భూస్థాయిలో ఎన్ని జతకూడని ఎలక్ట్రాన్లు కలవు?
జవాబు:
సున్న (లేవు)

96. సంకర ఆర్బిటాళ్ళలో ఇవి సమానం లేదా ఒకే విధంగా ఉంటాయి.
a) శక్తి
b) ఆకృతి
c) రెండూ
d) రెండూ కావు
జవాబు:
c) రెండూ

97. BeCl2 లో ఎటువంటి సంకరీకరణం జరుగును?
జవాబు:
sp

AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం

98. BeCl2 లో Be మరియు CI ల మధ్య ఎటువంటి సంకరీకరణ బంధం కలదు?
జవాబు:
σsp – p

99. BF3 లో సంకరీకరణం పేరు ఏమిటి ? ఏది?
జవాబు:
sp²

100. NH3 లో ఒంటరి జత ఎలక్ట్రాన్లు లేకుంటే HNH ఎంత ఉంటుంది?
జవాబు:
109°28¹

101. జతపరుచుము.

ఒంటరి జతలుఅణువులు
i) 1a) BF3
ii) 2b) NH3
iii) 0c) H2O

జవాబు:
i – b, ii – c, iii – a

102. H2O లో బంధ కోణాన్ని ప్రభావితం చేసేది
a) ఒంటరి జత – ఒంటరి జత వికర్షణ
b) బంధ జత – బంధ జత వికర్షణ
c) పై రెండూ
d) పై రెండూ కావు
జవాబు:
c) పై రెండూ

103. అయానిక పదార్థానికి ఒక ఉదాహరణనిమ్ము.
జవాబు:
NaCl

104. సమయోజనీయ పదార్థానికి ఒక ఉదాహరణనిమ్ము.
జవాబు:
C2H6

105. ధృవశీల సమయోజనీయ పదార్థానికి ఒక
ఉదాహరణనిమ్ము.
జవాబు:
HCl

106. A : NaCl నీటిలో కరుగును.
R : ధృవ పదార్థాలు, ధృవ పదార్థాలలో మాత్రమే కరుగును.
A ని R సమర్ధిస్తుందా?
జవాబు:
అవును

107. ‘అయానిక పదార్థాలకి అధిక ద్రవీభవన, బాష్పీభవన స్థానాలు ఉంటాయి’.
పై సమాచారం ఆధారంగా క్రింది వానిలో ఏది అధిక ద్రవీభవన స్థానం కలిగి ఉంటుంది?
a) NaCl
b) HCl
c) C2H6
జవాబు:
a) NaCl

108. 1123X అను మూలకం ‘Y’ అను మూలకంతో అయానిక బంధాన్ని ఏర్పరచగలదు. అయితే Y ఎటువంటి అయాను ఏర్పరుచును?
జవాబు:
ఆనయాన్ (ఋణాత్మక)

109. ‘A’ అనే మూలకం ‘ACl4‘ అనే అణువును ఏర్పరచగలదు. A లో వేలన్సీ ఎలక్ట్రాన్లు ఎన్ని వుండవచ్చును?
జవాబు:
1 లేదా 7

110. ‘X’ అనే వాయువు తప్ప మిగిలిన వాటి వేలన్సీ షెల్ లో అష్టకం ఉంది. కాని ‘X’ స్థిరమైనది. అయిన ‘X’ ఏమిటో ఊహించండి.
జవాబు:
He

111. చివరి కక్ష్యలో ఎలక్ట్రానులు : వేలన్సీ ఎలక్ట్రానులు : : సమయోజనీయ బంధాల సంఖ్య : ?
జవాబు:
కో వేలన్సీ

112. AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 34 ఈ అణువు ఏమిటో ఊహించుము.
జవాబు:
H2O.

113. మీథేన్ అణువులో బంధ కోణం ఎంత?
జవాబు:
109°28¹

114. అమ్మోనియా అణువులో బంధకోణం ఎంత?
జవాబు:
107°48¹

115. సంకరీకరణ ద్వారా ఏర్పడిన బోరాన్ ట్రై ఫ్లోరైడ్ లో ఎటువంటి బంధాలు ఉంటాయి?
జవాబు:
మూడు σsp² – p బంధాలు

116. ఒంటరి జత ఎలక్ట్రాన్లు లేని అణువు ఏది?
A) NH3
B) H2O
C) BF3
D) ఏదీకాదు
జవాబు:
C) BF3

AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం

117. క్రింది వానిలో సమయోజనీయ బంధం గల అణువు ఏది?
A) NaCl
B) MgCl2
C) BeCl2
D) ఏదీకాదు
జవాబు:
C) BeCl2

118. అతి తక్కువ బంధ దూరం గల అణువు
A) H – H
B ) F – F
C) Br – Br
D) H – Cl
జవాబు:
A) H – H

119. అతి ఎక్కువ బంధశక్తి గల బంధం
A) I – I
B) H -H
C) Cl – Cl
D) H – F
జవాబు:
D) H – F

అదనపు ప్రాక్టీస్ ప్రశ్నలు

ప్రశ్న 1.
19వ శతాబ్ది చివరిలో లేదా 20వ శతాబ్ది మొదట్లో శాస్త్రవేత్తలు, బంధం ఏర్పడడానికి ఏ బలం అవసరమైనదని భావించారు? దీని ఆధారంగా పరమాణువుల మధ్య బంధం ఏర్పడడాన్ని ఎలా వివరించారు?
జవాబు:
విద్యుదాకర్షణ బలం వల్లనే పరమాణువుల మధ్య బంధం ఏర్పడుతుందని 19వ శతాబ్దం చివరలో మరియు 20వ శతాబ్ది మొదట్లో శాస్త్రవేత్తలు నమ్మేవారు.

  1. పరమాణువులు సాధ్యమైనంత దగ్గరగా వచ్చినపుడు ఒక పరమాణువులోని ఎలక్ట్రాన్లు రెండవ పరమాణువులో గల కేంద్రకం యొక్క ఆకర్షణకు లోనవుతాయి.
  2. అదే సమయంలో ఒకే ఆవేశం గల ఎలక్ట్రాన్లు పరస్పర వికర్షణకు, ఒకే ఆవేశం గల కేంద్రకాలు కూడా ‘పరస్పర వికర్షణకు లోనవుతాయి.
  3. పరమాణువుల మధ్య వుండే వికర్షణ / ఆకర్షణ బలాల తీవ్రత బంధం ఏర్పాటును నిర్ణయిస్తుంది.
  4. ఆకర్షణ బలం కన్నా వికర్షణ బలం ఎక్కువైతే ఆ పరమాణువులు సంయోగం చెందవు.
  5. రెండు పరమాణువులు సంయోగం చెందేటప్పుడు కేంద్రకం గాని, అంతరకక్ష్యలో వుండే ఎలక్ట్రానులు గాని ప్రభావానికి గురికావు. కేవలం బాహ్యకక్ష్యలో ఉండే ఎలక్ట్రానులు మాత్రమే ప్రభావితమవుతాయి.
  6. కాబట్టి వేలన్సీ ఎలక్ట్రాన్లు రెండు పరమాణువుల మధ్య బంధం ఏర్పడడానికి కారణమౌతాయి.

ప్రశ్న 2.
జడవాయువుల లక్షణాలేవి?
జవాబు:

  1. జడవాయువులు ‘O’ గ్రూపుకు చెందుతాయి. (18 వ గ్రూపు / VIIIA)
  2. హీలియం తప్ప మిగిలిన జడవాయువుల ఎలక్ట్రాన్ విన్యాసం ns² np6.
  3. వీటి బాహ్య కక్ష్య పూర్తిగా నిండి యుండడం వల్ల, మిగిలిన మూలకాలతో పోల్చుకుంటే వీటి చర్యాశీలత శూన్యం.
  4. ఇవి చాలా స్థిరమైనవి. ఇవి ఇతర మూలకాలతో కలిసి గాని వాటితో అవి కలిసిగాని ఇతర సంయోగ పదార్థాలను ఏర్పరచలేవు.

ప్రశ్న 3.
ఏకమాత్ర ధనాత్మక అయాన్, ద్విమాత్ర ధనాత్మక అయాన్, త్రిమాత్రక ధనాత్మక అయాన్లు ఏర్పడే విధానాన్ని ఉదాహరణలతో వివరించుము.
జవాబు:
ఏకమాత్ర ధనాత్మక అయాన్ ఏర్పడుట :
IA గ్రూపు మూలకాలు (Li నుండి CS వరకు) వాని పరమాణు బాహ్యకక్ష్య నుండి ఒక ఎలక్ట్రాన్‌ను కోల్పోయి దానికి సంబంధించిన ఏకమాత్ర ధన్మాతక అయాను ఏర్పరచడం ద్వారా అష్టక విన్యాసాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తుంది.
ఉదా : 11Na → 2, 8, 1; 11Na+ → 2, 8.

ద్విమాత్ర ధనాత్మక అయాన్ ఏర్పడుట :
IIA గ్రూపు మూలకాలు (Mg నుండి Ba వరకు) పరమాణువులు రసాయనిక చర్యలలో పాల్గొనేటప్పుడు తమ బాహ్య కక్ష్య నుండి రెండు వేలన్సీ ఎలక్ట్రాన్లను కోల్పోవడం ద్వారా ద్విమాత్రక ధనాత్మక అయాన్ గా మారి అష్టక విన్యాసాన్ని పొందుతాయి.
ఉదా : 12Mg → 2, 8, 2 ; 12Mg+2 → 2, 8.

త్రిమాత్ర ధనాత్మక అయాన్ ఏర్పడుట :
IIIA గ్రూపు మూలకాలు మూడు వేలన్సీ ఎలక్ట్రాన్లను కోల్పోయి త్రిమాత్రక ధనాత్మక అయాన్లుగా ఏర్పడటం ద్వారా అష్టక విన్యాసాన్ని పొందుతాయి.
ఉదా : 13Al → 2, 8, 3 ; 13Al3+ → 2, 8.

AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం

ప్రశ్న 4.
త్రిమాత్ర, ద్విమాత్ర, ఏకమాత్ర ఆనయాన్లు (ఋణాత్మక అయాన్లు) ఏర్పడే విధానాన్ని వివరించుము.
జవాబు:
ఏకమాత్ర ఆనయాన్లు ఏర్పడుట :
VII A గ్రూపు మూలకాల పరమాణువులు రసాయన మార్పుకు లోనయ్యేటప్పుడు ఒక ఎలక్ట్రాన్ ను గ్రహించి, ఏకమాత్ర ఆనయాన్ గా మారి అష్టక విన్యాసాన్ని పొందుతాయి.
ఉదా : 9F → 2, 7 ; 9F3- → 2, 8.

ద్విమాత్ర ధనాత్మక అయాన్ ఏర్పడుట :
VI A గ్రూపు మూలకాలు పరమాణువులు రసాయన మార్పుకు లోనయ్యేటప్పుడు రెండు ఎలక్ట్రాన్లను గ్రహించి – ద్విమాత్ర ఆనయాన్లుగా మారి అష్టక విన్యాసాన్ని పొందుతాయి.
ఉదా : 8O → 2, 6 ; 8O2- → 2, 8.

త్రిమాత్ర ధనాత్మక అయాన్లు ఏర్పడుట :
V A గ్రూపు మూలకాల పరమాణువులు రసాయన మార్పులకు లోనయ్యేటప్పుడు మూడు ఎలక్ట్రాన్లను గ్రహించి త్రిమాత్రక ఆనయాన్లుగా మారి అష్టక విన్యాసాన్ని పొందుతాయి. .
ఉదా : 7N → 2, 5; 7N3- → 2, 8.

ప్రశ్న 5.
లూయిస్ ప్రకారం కెర్నెల్ అనగానేమి?
జవాబు:
కెర్నెల్ అనగా అంతర కక్ష్యలోని ఎలక్ట్రాన్లను కలిగియున్న కేంద్రకం.

ప్రశ్న 6.
అయానిక బంధాన్ని ఎలక్ట్రోవేలెంట్ బంధం అని ఎందుకంటారు?
జవాబు:
అయానిక బంధం రెండు ఆవేశపూరిత కణాలయిన అయాన్ల మధ్య ఏర్పడడం చేత దీనిని ‘అయానిక బంధం’ అంటారు. ఆనయాన్ల మధ్య పనిచేస్తున్న బలాలు, స్థిర విద్యుదాకర్షణ బలాలు కావడం చేత ఈ బంధాన్ని స్థిర విద్యుత్ బంధం అంటారు. వేలన్సీ భావనను ఎలక్ట్రాన్స్ పరంగా వివరిస్తాం కాబట్టి దీనిని ఎలక్ట్రోవేలెంట్ బంధం అంటారు.

ప్రశ్న 7.
వేలన్సీ ఎలక్ట్రాన్ సిద్ధాంతంలోని లోపాలేవి?
జవాబు:
ప్రయోగాత్మకంగా కనుగొనబడిన బంధ దూరాలు, బంధ శక్తులు, విలువలు, పరమాణువులు జంటలుగా మారినపుడు వేరువేరుగా ఉంటాయి. ఈ వివిధ అణువులలో బంధకోణాలు వేరువేరుగా వుండడాన్ని వివరించలేకపోయింది.

10th Class Physics 8th Lesson రసాయన బంధం 1 Mark Bits Questions and Answers

సరియైన సమాధానమును గుర్తించండి.

1. CH4 అణువులో గల σ – బంధాల సంఖ్య …….
A) 2
B) 3
C) 4
D) 1
జవాబు:
C) 4

2. H2O అణువు ఆకృతి …………..
A) రేఖీయం
B) V – ఆకృతి
C) త్రికోణీయ ద్వి పిరమిడ్
D) త్రికోణీయ పిరమిడ్
జవాబు:
B) V – ఆకృతి

3. క్రింది వానిలో అష్టక నియమం పాటింపబడని అణువు.
A) O2
B) F2
C) BCl3
D) N2
జవాబు:
C) BCl3

AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం

4. HCl అణువులో ఉండే బంధం ఏది?
A) అయానిక బంధం
B) ధృవ సమయోజనీయ బంధం
C) అధృవ సమయోజనీయ బంధం
D) ఏదీకాదు
జవాబు:
B) ధృవ సమయోజనీయ బంధం

5. అమ్మోనియా అణువు ఆకృతి
A) రేఖీయం
B) రేఖీయ త్రిభుజం
C) చతుర్ముఖీయ
D) త్రికోణీయ పిరమిడ్
జవాబు:
D) త్రికోణీయ పిరమిడ్

6. కింది వాటిలో అయానిక పదార్థం
A) C2H6
B) HCl
C) NaCl
D) H2
జవాబు:
C) NaCl

7. ‘A’ అనే మూలకం హైడ్రోజన్‌ సంయోగం చెంది AH2 అను పదార్థం ఏర్పడింది. అయిన ‘A’ వేలన్సీ కక్ష్యలోని ఎలక్ట్రాన్ల సంఖ్య సాధారణంగా
A) 2
B) 3
C) 5
D) 8
జవాబు:
A) 2

8. VESPRT సిద్ధాంతం ప్రకారం NH3లో బంధకోణం 107°48′ ఉండడానికి గల కారణం
A) బంధ ఎలక్ట్రాన్ జంట, ఒంటరి ఎలక్ట్రాన్ జంటల ఆకర్షణ
B) బంధ ఎలక్ట్రాన్ జంట, ఒంటరి ఎలక్ట్రాన్ జంటల వికర్షణ
C) బంధ ఎలక్ట్రాన్ జంట, ఒంటరి ఎలక్ట్రాన్ జంటల ఆకర్షణ సమానంగా ఉండడం
D) బంధ ఎలక్ట్రాన్ జంటల వికర్షణ అధికంగా ఉండడం వలన
జవాబు:
B) బంధ ఎలక్ట్రాన్ జంట, ఒంటరి ఎలక్ట్రాన్ జంటల వికర్షణ

9. ‘X’ అను సమ్మేళనం యొక్క ఆక్సెడ్ XO. క్రింది వాటిలో ‘X’ ఏ సమ్మేళనాన్ని ఏర్పరచదు?
A) X(NO3)2
B) X(SO4)8
C) XCl2
D) X3N2
జవాబు:
B) X(SO4)8

10. క్రింది వానిలో అధిక స్థిరత్వం కలది.
A) Li
B) Be
C) F
D) Ne
జవాబు:
D) Ne

11. వాక్యం 1 : VSEPR సిద్ధాంతాన్ని సిద్ధివిక్, పావెల్ ప్రతిపాదించారు.
వాక్యం 2 : VSEPR సిద్ధాంతాన్ని సివిక్, గిలెస్పీ అభివృద్ధి పరచారు.
A) 1, 2 రెండూ సరియైన వాక్యములు.
B) వాక్యం 1 మాత్రమే సరియైనది.
C) వాక్యం 2 మాత్రమే సరియైనది.
D) రెండు వాక్యములు సరియైనవి కావు.
జవాబు:
B) వాక్యం 1 మాత్రమే సరియైనది.

12. క్రింది వానిలో సరియగు జత ………..
A) BeCl2 – బంధకోణం 120°
B) BF3 – బంధకోణం 180°
C) NH3 – బంధకోణం 104°27′
D) CH4 – బంధకోణం 109°28′
జవాబు:
D) CH4 – బంధకోణం 109°28′

13. C2H4 అణువులోని ‘π’ బంధాల సంఖ్య
A) 1
B) 2
C) 3
D) 4
జవాబు:
A) 1

AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం

14. క్రింది వాటిలో అయానిక బంధం గల సంయోగ పదార్థం
A) H2O
B) NH
C) MgO
D) HCl
జవాబు:
B) NH

మీకు తెలుసా?

డేవి ప్రయోగం :
లండన్ లోని రాయల్ ఇనిస్టిట్యూట్ లో హంఫ్రిడేవి (1778-1819) అనే రసాయన శాస్త్రవేత్త, 250 లోహపు పలకలతో ఒక బ్యాటరీని నిర్మించాడు. బ్యాటరీ నుండి ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను ఉపయోగించి లవణ ద్రావణాల నుండి విద్యుత్ విశ్లేషణ ప్రక్రియ ద్వారా అధిక చర్యాశీలత గల మూలకాలైన పొటాషియం, సోడియంలను ఇతను రాబట్టాడు.
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 35 AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 36

ఈ ప్రయోగంలో సంయోగ పదార్థం (లవణ ద్రావణం) లోని లోహ భాగం ఋణధృవం వైపు, ఆలోహభాగం ధనధృవంవైపు కదలడాన్ని గమనించాడు. దీని ఆధారంగా లోహాలు ధనాత్మకమైనవని, లోహలు ఋణాత్మకమైనవని ఈ రెండు కూడా సంయోగ పదార్థంలో విద్యుదాకర్షణ బలంచే బంధించబడి ఉంటాయని అతను ప్రతిపాదించాడు.

ఈ వివరణల ఆధారంగా NaCl, KCI వంటి సంయోగపదార్థాలలోని రసాయనబంధాలను కొంతవరకూ వివరించగలిగినప్పటికీ, కర్బన సమ్మేళనాలలో, ద్విపరమాణుక అణువులలో ఉండే బంధాలను వివరించలేకపోయాడు.

ఒక లోహ పరమాణువు దాని వాలన్సీ కక్ష్యనుండి కోల్పోయే ఎలక్ట్రాన్ల సంఖ్య దాని గ్రూప్ సంఖ్యకు సమానం.
ఉదా : సోడియం మరియు మెగ్నీషియం వేలన్సీలు వరుసగా 1 మరియు 2. ఇవి వాటి గ్రూప్ సంఖ్యలకు సమానం.

అలోహ మూలకం దాని పరమాణువు కోసం గ్రహించే ఎలక్ట్రాన్ల సంఖ్యనే దాని ‘వేలన్సీ’ అంటాం. ఇది (8 – ఆ మూలకం యొక్క గ్రూపు సంఖ్య)కు సమానం అవుతుంది.
ఉదా : క్లోరిన్ వేలెన్సీ (8-7) = 1.

  • 1 ఆంగ్ స్ట్రామ్ 10-10 మీ.లకు సమానం ఆంగ్ స్ట్రామ్ అనేది పొడవుకు ప్రమాణం. దీని విలువ 0.1 నానోమీటర్లకు లేదా 100 పికోమీటర్లకు సమానం.
  • 1 నానోమీటర్ 10-9 మీటర్లకు సమానం.

AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం

These AP 10th Class Physical Science Chapter Wise Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం will help students prepare well for the exams.

AP Board 10th Class Physical Science 6th Lesson Important Questions and Answers పరమాణు నిర్మాణం

10th Class Physics 6th Lesson పరమాణు నిర్మాణం 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
క్రోమియం ఎలక్ట్రాన్ విన్యాసాన్ని వ్రాయండి.
జవాబు:
క్రోమియం ఎలక్ట్రాన్ విన్యాసము : 1s²2s²2p63s²2p64s¹3d5 or [Ar] 4s¹3d5.

ప్రశ్న 2.
ఇనుప కడ్డీని క్రమంగా అధిక ఉష్ణోగ్రతలకు వేడి చేయటాన్ని పరిశీలించినప్పుడు ఏ ఏ రంగులు కనబడుతాయి?
జవాబు:
ఉష్ణోగ్రత పెరుగుతున్న కొలదీ ఇనుప కడ్డీపై ఎరుపు, నారింజ, పసుపు, నీలము లేక తెల్లని రంగులు ఏర్పడును.

ప్రశ్న 3.
1s² 2s¹ 2p4 అనే ఎలక్ట్రాన్ విన్యాసం రాయడంలో ఏ నియమం ఉల్లంఘించబడింది ? కారణాలు తెల్పండి.
జవాబు:
1s² 2s¹ 2p4 అనే ఎలక్ట్రాన్ విన్యాసం రాయడంలో ఆఫ్ భౌ నియమం ఉల్లంఘించబడినది.
కారణం : ఈ నియమం ప్రకారం 25 నిండిన తరువాతనే 22 కి నింపాలి.

ప్రశ్న 4.
మెగ్నీషియం (Z = 12) మూలక పరమాణువులో బాహ్య కర్పరం యొక్క సంకేతం (Bymbol)ను వ్రాయండి. మెగ్నీషియం బాహ్య కర్పరంలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి?
జవాబు:
మెగ్నీషియంలో బాహ్య కర్పరం (3వ కర్పరం) సంకేతం M మెగ్నీషియం బాహ్య కర్పరంలోని ఎలక్ట్రాన్ల సంఖ్య = 2

AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం

ప్రశ్న 5.
స్కాండియమ్ (Sc) పరమాణువులో 21వ ఎలక్ట్రాన్ యొక్క 4 క్వాంటమ్ సంఖ్యల విలువలు కింది పట్టికలో ఇవ్వబడినాయి. అయితే స్కాండియమ్ పరమాణువులోని 20వ ఎలక్ట్రాన్ యొక్క 4 క్వాంటమ్ సంఖ్యల విలువలను పట్టిక రూపంలో వ్రాయండి.
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 1
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 2

ప్రశ్న 6.
n = 3 అయినపుడు కర్పరంలో ఉండే ఆర్బిటాళ్ళను తెల్పి, ఆ కర్పరంలో ఉండే గరిష్ఠ ఎలక్ట్రాన్ల సంఖ్యను రాయండి.
జవాబు:
n = 3 అయినప్పుడు కర్పరంలో ఉండే ఆర్బిటాళ్ళు s, p, d. ఆ కర్పరంలో ఉండే గరిష్ఠ ఎలక్ట్రాన్ల సంఖ్య 18.

ప్రశ్న 7.
ఎలక్ట్రాన్ ను కనుగొన్నదెవరు? ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం, ద్రవ్యరాశులను తెల్పండి.
జవాబు:
ఎలక్ట్రాన్ ను కనుగొన్నది J.J. థామ్సన్. దీని సంకేతం 0-1e.
ఎలక్ట్రాన్ ఆవేశం ఋణావేశం. ఆవేశ పరిమాణం – 1.602 × 10-19 కూలుంట్లు. ద్రవ్యరాశి 9.1 × 10-31kg.

ప్రశ్న 8.
ప్రోటాన్ ను కనుగొన్నది ఎవరు? ప్రోటాన్ యొక్క ఆవేశం, ద్రవ్యరాశులను తెల్పండి.
జవాబు:
ప్రోటాన్ ను కనుగొన్నది “గోల్డ్ స్టీన్.” దీని సంకేతం 1+1P. ప్రోటాన్ ధనావేశం కలిగి ఉండును. దీని ఆవేశ పరిమాణం +1.602 × 10-19 కూలుంట్లు. ద్రవ్యరాశి 1.675 × 10-27kg.

ప్రశ్న 9.
న్యూట్రాన్ ను కనుగొన్నది ఎవరు? న్యూట్రాన్ యొక్క ఆవేశం, ద్రవ్యరాశులను తెల్పండి.
జవాబు:
న్యూట్రాన్ ను కనుగొన్నది చాడ్విక్. దీని సంకేతం 10n.
ఆవేశం లేదు. ద్రవ్యరాశి 1.675 × 10-27 kg.

ప్రశ్న 10.
పరమాణు నమూనా అనగానేమి?
జవాబు:
పరమాణువులో ధనావేశాలు, ఋణావేశాలు ఏ విధంగా పంపిణీ జరిగినవో తెలియజేసే దానిని “పరమాణు నమూనా” అంటారు.

ప్రశ్న 11.
మొట్టమొదటి పరమాణు నమూనాను ఏమని పిలుస్తారు?
జవాబు:
మొట్టమొదటి థామ్సన్ పరమాణు నమూనాను “పుచ్చకాయ నమూనా” అని పిలుస్తారు.

ప్రశ్న 12.
రూథర్ ఫోర్డ్ పరమాణు నమూనాను ఏమని పిలుస్తారు?
జవాబు:
రూథర్‌ఫోర్డ్ పరమాణు నమూనాను “గ్రహమండల నమూనా” అని పిలుస్తారు.

ప్రశ్న 13.
బోర్ పరమాణు నమూనా ఏ సూత్రం ఆధారంగా నిర్ధారించబడినది?
జవాబు:
బోర్ పరమాణు నమూనా “మ్యాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం” ఆధారంగా నిర్ధారించబడినది.

ప్రశ్న 14.
స్థిర కక్ష్యలను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు?
జవాబు:
స్థిర కక్ష్యలను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త “నీల్స్ బోర్”.

ప్రశ్న 15.
ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం అనగానేమి?
జవాబు:
ఎలక్ట్రాన్ అధిక శక్తి గల కక్ష్య నుండి తక్కువ శక్తి గల కక్ష్యలోకి దూకినపుడు విడుదలయ్యే వికిరణపు శక్తి (E), వికిరణపు పౌనఃపున్యానికి (υ) అనులోమానుపాతంలో ఉంటుంది. E ∝ υ (E = hυ)

ప్రశ్న 16.
ప్లాంక్ స్థిరాంకం విలువ మరియు ప్రమాణాలు వ్రాయుము.
జవాబు:
ప్లాంక్ స్థిరాంకం విలువ h = 6.626 x 10-34 బౌల్. సెకను లేదా h = 6.626 x 10-27 ఎర్గ్. సెకన్.

ప్రశ్న 17.
దృగ్గోచర వర్ణపటం అనగానేమి?
జవాబు:
మానవుని కంటితో నేరుగా చూడగల రంగుల సమూహాన్ని దృగ్గోచర వర్ణపటం అంటారు. దీనిని VIBGYOR తో తెలియజేస్తారు.

AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం

ప్రశ్న 18.
దృగ్గోచర వర్ణపటంలో ఎక్కువ శక్తి గల రంగు ఏది?
జవాబు:
ఏ తరంగానికైనా శక్తి అనేది పౌనఃపున్యంపై ఆధారపడును. ఊదా రంగు అధిక పౌనఃపున్యం కలిగి ఉండుట వలన, ఎక్కువ శక్తిని కలిగి ఉండును.

ప్రశ్న 19.
దృగ్గోచర వర్ణపటంలో ఎక్కువ తరంగదైర్ఘ్యం గల తరంగాలేవి?
జవాబు:
దృగ్గోచర వర్ణపటంలో అధిక తరంగదైర్ఘ్యం గల తరంగాలు ఎరుపురంగు తరంగాలు. ఇవి అధిక దూరం ప్రయాణించగలవు.

ప్రశ్న 20.
విద్యుదయస్కాంత వర్ణపటంలో ఎక్కువ పౌనఃపున్యం కలిగిన శక్తివంతమైన వికిరణాలేవి?
జవాబు:
విద్యుదయస్కాంత వర్ణపటంలో ఎక్కువ పౌనఃపున్యం కలిగినవి కాస్మిక్ వికిరణాలు. వీటి తర్వాత Y – వికిరణాలు. వీటికి అత్యధిక శక్తి ఉండును. ఇవి ప్రమాదకరమైన వికిరణాలు.

ప్రశ్న 21.
విద్యుదయస్కాంత వికిరణాలలో ఎక్కువ తరంగదైర్ఘ్యం గల వికిరణాలేవి?
జవాబు:
విద్యుదయస్కాంత వర్ణపటంలో ఎక్కువ తరంగదైర్ఘ్యం గల తరంగాలు ప్రసార పట్టీలు. వాటి తర్వాత రేడియో తరంగాలు. ఇవి తక్కువ శక్తి గలవి. విశ్వంలో ఏ ప్రదేశానికైనా వెళ్ళిరాగలవు.

ప్రశ్న 22.
విద్యుదయస్కాంత వర్ణపటంలోని వికిరణాల వేగాలను తెల్పుము.
జవాబు:
c = υλ; c = కాంతి వేగం, υ = పౌనఃపున్యం, λ = తరంగదైర్ఘ్యం. ఇవి 3 × 108 మీ/సె వేగంతో ప్రయాణిస్తాయి.

ప్రశ్న 23.
నీబోర్ పరమాణు నమూనా వివరించి హైడ్రోజన్ వర్ణపటాన్ని వివరించటాన్ని నీవు ఎలా అభినందిస్తావు?
జవాబు:
నీల్స్ బోర్ పరమాణు నమూనా, వివరించడంలో విజయం సాధించడమే కాకుండా, హైడ్రోజన్ వర్ణపటాన్ని చక్కగా వివరించగలిగాడు. కావున నీల్స్ బోర్ చేసిన కృషిని ప్రశంసించవలసియున్నది.

ప్రశ్న 24.
పదార్థం విభజింప శక్యం కాదు అనే భావన నుండి పరమాణు నమూనాలను వివరించే స్థాయికి శాస్త్రాన్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తల కృషిని ఏ విధంగా అభినందిస్తావు?
జవాబు:
పదార్థం విభజింప శక్యం కాని కణాలతో నిర్మితమైందనే డాల్టన్ భావన నుండి J.J. థామ్సన్, రూథర్‌ఫోర్డ్, నీల్స్ బోర్, సోమర్ ఫెల్డ్, జోడింగర్ మొదలైన అనేకమంది కృషి ఫలితంగా సైన్స్ విజ్ఞానం క్రొత్త పుంతలు తొక్కింది. వారి కృషిని మిక్కిలి ప్రశంసించవలసియున్నది.

ప్రశ్న 25.
మాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం యొక్క అనేక రంగాలలోని ఉపయోగాలను ఎలా అభినందిస్తావు?
జవాబు:
ఆధునిక భౌతికశాస్త్ర పితామహుడిగా గుర్తించబడిన మాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం ఆధారంగా అనేక వస్తువులు పనిచేస్తున్నాయి. వాటిలో α, β, γ వికిరణాలను అర్థం చేసుకోవడానికి, లేజర్లు, కంప్యూటర్లు, సి.డి.లు, రసాయన బంధాల (D.N.A.) గురించి తెలుసుకోవడానికి క్వాంటం సిద్ధాంతం ఉపయోగపడినది. కాబట్టి మా ప్లాంక్ చేసిన కృషిని అభినందించవలసి ఉన్నది.

ప్రశ్న 26.
దీపావళి పండుగ నాడు నీవు కాల్చిన టపాసుల నుండి రంగురంగుల కాంతి వెలువడటానికి కారణం ఏమిటి?
జవాబు:
దీపావళి పండుగనాడు కాల్చిన టపాసుల నుండి రంగురంగుల కాంతి వెలువడటానికి కారణం వాటిలో ఒక్కొక్క పరమాణువు ఒక్కొక్క కాంతిని వెదజల్లుతుంది.

ప్రశ్న 27.
పసుపు వర్ణంలో కాంతిని వెదజల్లే పరమాణువులేవి?
జవాబు:
సోడియం మూలకాన్ని వేడిచేసినపుడు పసుపు వర్ణంలో కాంతిని ఉద్గారించును.

ప్రశ్న 28.
ట్రాఫిక్ సిగ్నల్, సెల్ టవర్లు, వాహనాల వెనుక ఎర్రని లైట్ ను ఎందుకు అమర్చుతారు?
జవాబు:
దృగ్గోచర వర్ణపటంలో ఎక్కువ తరంగదైర్ఘ్యం గల కాంతి ఎరుపు. ఎక్కువ తరంగదైర్ఘ్యం ఉన్న కాంతి ఎక్కువ దూరం ప్రయాణించును. కాబట్టి ఎక్కువ దూరంలో ఉన్న వ్యక్తి కూడా స్పష్టంగా చూడగలడు.

ప్రశ్న 29.
γ – వికిరణాలను వైద్యరంగంలో ఎందుకు వాడతారు?
జవాబు:
γ- వికిరణాలను కేన్సర్ కణుతులను నిర్మూలించటానికి కీమోథెరపి చికిత్సలో వాడతారు.

ప్రశ్న 30.
X – కిరణాలను వైద్యరంగంలో ఎందుకు వాడతారు?
జవాబు:

  1. X – కిరణాలు రెండు రకాలు. 1) కఠిన X – కిరణాలు 2) మృదు X – కిరణాలు.
  2. మృదు X – కిరణాలను వైద్యరంగంలో రోగాన్ని నిర్ధారించడానికి, రోగచికిత్సకు వాడతారు.

ప్రశ్న 31.
మైక్రో తరంగాల ఉపయోగాలేవి?
జవాబు:
సెల్ ఫోన్, రాడార్లు, మైక్రో ఓవెన్లు మైక్రో తరంగాల ఆధారంగా పనిచేస్తాయి.

ప్రశ్న 32.
ఎలక్ట్రాన్ విన్యాసం రాయటానికి ఉపయోగపడే నియమాలేవి?
జవాబు:
ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాయటానికి ఉపయోగపడే నియమాలు మూడు :

  1. ఆఫ్ బౌ నియమం
  2. హుండ్ నియమం
  3. పౌలీవర్జన నియమం

ప్రశ్న 33.
ఎలక్ట్రాన్ విన్యాసం రాయటానికి మాదిరి పటం లాగా ఉపయోగపడేది ఏది?
జవాబు:
ఎలక్ట్రాన్ విన్యాసాన్ని సులువుగా రాయటానికి ఉపయోగపడేది మాయిలర్ పటము.

ప్రశ్న 34.
సమశక్తి గల ఆర్బిటాల్ లో ఎలక్ట్రాన్లు నింపవలసి వచ్చినపుడు ఉపయోగపడే నియమం ఏది?
జవాబు:
హుండ్ నియమం

AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం

ప్రశ్న 35.
వర్ణపటంలోని సూక్ష్మరేఖలను పరిశీలించటానికి ఉపయోగపడే పరికరం ఏది?
జవాబు:
అధికశక్తి గల వర్ణపట దర్శిని (Spectroscope).

ప్రశ్న 36.
రేఖా వర్ణపటంలో ఉపరేఖలుగా విడిపోవటాన్ని బోర్ నమూనా వివరించగలిగినదా?
జవాబు:
రేఖా వర్ణపటంలో ఉపరేఖలుగా విడిపోవటాన్ని బోర్ నమూనా వివరించలేదు. సోమర్ ఫెల్డ్ నమూనా వివరించగలిగినది.

ప్రశ్న 37.
తరంగదైర్ఘ్యము అనగానేమి?
జవాబు:
ఒక తరంగంలో రెండు వరుస శృంగాల మధ్య దూరం లేదా రెండు వరుస ద్రోణుల మధ్య దూరంను ఆ తరంగం యొక్క తరంగదైర్ఘ్యం (λ) అంటాం.

ప్రశ్న 38.
విద్యుదయస్కాంత తరంగం యొక్క పటం గీయుము. (లేదా) విద్యుత్ మరియు అయస్కాంత తరంగాలు ఒకదానికొకటి లంబంగా ఉండి, తరంగ వ్యాప్తి దిశకు లంబంగా కంపిస్తూ ఉంటాయి. దీనిని పటరూపంలో చూపించండి. .
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 3

ప్రశ్న 39.
పౌనఃపున్యం అనగానేమి?
జవాబు:
ఒక సెకను కాలంలో ఒక బిందువు నుండి ప్రయాణించిన తరంగాల సంఖ్యను పౌనఃపున్యం (υ) అంటారు.

ప్రశ్న 40.
విద్యుదయస్కాంత వర్ణపటం అనగానేమి?
జవాబు:
విద్యుదయస్కాంత తరంగాలు విస్తృత వైవిధ్యం గల పౌనఃపున్యాల సముదాయం. విద్యుదయస్కాంత తరంగాల మొత్తం పౌనఃపున్యాల సముదాయాన్నే విద్యుదయస్కాంత వర్ణపటం అంటారు.

ప్రశ్న 41.
ప్లాంక్ సిద్ధాంత ప్రతిపాదనలోని విశిష్టత ఏమిటి?
జవాబు:
విద్యుదయస్కాంత శక్తి శోషణం లేదా ఉద్గారం అనేది అవిచ్ఛిన్న రూపంలో కాకుండా, నిర్దిష్ట విలువలు గల భాగాలుగా ఉంటుంది.

ప్రశ్న 42.
పరమాణు వర్ణపటాలలోని రేఖల ఉపయోగమేమిటి?
జవాబు:
వేలిముద్రలను బట్టి మనుషులను గుర్తించినట్లుగానే పరమాణు వర్ణపటాల్లోని రేఖలను బట్టి ఆయా పరమాణువులను తేలికగా గుర్తించవచ్చు.

ప్రశ్న 43.
భూ స్థాయి అనగానేమి?
జవాబు:
ఎలక్ట్రాన్ యొక్క ప్రాథమిక శక్తి స్థాయిని భూస్థాయి అంటారు.

AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం

ప్రశ్న 44.
ఎలక్ట్రాన్ శక్తిని గ్రహించినపుడు ఏమి జరుగుతుంది?
జవాబు:
ఎలక్ట్రాన్ శక్తిని గ్రహించినపుడు అది ఎక్కువ శక్తి స్థాయికి చేరుతుంది. అప్పుడు ఎలక్ట్రాన్ ఉత్తేజిత స్థాయిలో ఉన్నదని అంటారు.

ప్రశ్న 45.
బోర్ పరమాణు నమూనాలోని లోపాలేవి?
జవాబు:

  1. బోర్ పరమాణు నమూనా, రేఖా వర్ణపటంలోని రేఖలు కొన్ని ఉపరేఖలుగా విడిపోవడాన్ని వివరించలేకపోయింది.
  2. ఒకటికన్నా ఎక్కువ ఎలక్ట్రాన్లు గల పరమాణువుల వర్ణపటాన్ని వివరించలేకపోయింది.

ప్రశ్న 46.
పరమాణు నిర్మాణంలో సోమర్ ఫెల్డ్ పాత్ర ఏమిటి?
జవాబు:
రేఖా వర్ణపటంలోని రేఖలు ఉపరేఖలుగా విడిపోవడాన్ని వివరించేందుకు సోమర్ ఫెల్డ్ బోర్ నమూనాని స్వల్పంగా ఆధునీకరించాడు. అతను దీర్ఘవృత్తాకార కక్ష్య అనే భావనను ప్రవేశపెట్టినాడు.

ప్రశ్న 47.
‘ఆర్బిటాల్’ అనగానేమి?
జవాబు:
పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ కనుగొనగలిగే సంభావ్యత ఏ ప్రాంతంలో అయితే అధికంగా ఉంటుందో ఆ ప్రాంతాన్ని ఆర్బిటాల్ అంటారు.

ప్రశ్న 48.
క్వాంటం సంఖ్యలు అనగానేమి?
జవాబు:
పరమాణువులోని ప్రతి ఎలక్ట్రాన్ ను n, l, ml అనే మూడు సంఖ్యల సమితులతో సూచిస్తారు. ఈ సంఖ్యలనే క్వాంటం సంఖ్యలు అంటారు.

ప్రశ్న 49.
క్రింది పట్టికను పూరించి, ఏ నియమం ప్రకారం పూరించావో రాయుము.
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 4
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 5
పై పట్టికను పూరించడానికి నేను ఉపయోగించిన సూత్రం (2l + l).

ప్రశ్న 50.
ఎలక్ట్రాన్ విన్యాసం అనగానేమి?
జవాబు:
పరమాణువులోని కర్పరాలు, ఉపకర్పరాలు మరియు ఆర్బిటాళ్ళలో ఎలక్ట్రాన్ల పంపిణీని ఎలక్ట్రాన్ విన్యాసం అంటారు.

ప్రశ్న 51.
పౌలీవర్జన నియమాన్ని రాయుము.
జవాబు:
ఒకే పరమాణువుకి చెందిన ఏ రెండు ఎలక్ట్రాన్లకి నాలుగు క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండవు.

ప్రశ్న 52.
ఆఫ్ బౌ నియమాన్ని రాయుము.
జవాబు:
పరమాణువు భూస్థాయిలో ఉన్నపుడు ఎలక్ట్రానులు అతి తక్కువ శక్తి కలిగిన ఆర్బిటాల్ లో చేరుతూ, అలా మొత్తం ఎలక్ట్రానుల సంఖ్య పరమాణు సంఖ్యకి సమానం అయ్యేవరకు నిండేలా దాని ఎలక్ట్రాన్ విన్యాసం నిర్మించబడుతుంది.

ప్రశ్న 53.
హుండ్ నియమం రాయుము.
జవాబు:
ఈ నియమం ప్రకారం సమానశక్తి కలిగిన అన్ని ఖాళీ ఆర్బిటాళ్ళు ఒక్కొక్క ఎలక్ట్రాన్ చే ఆక్రమించబడిన తరువాతనే ఎలక్ట్రాన్లు జతగూడడం ప్రారంభిస్తాయి.

ప్రశ్న 54.
3s, ap, 28, 4s, 3p, 1s మరియు 3d ఆర్బిటాళ్ళను వాటి ఆరోహణ క్రమంలో వ్రాయండి.
జవాబు:
1s < 2s < 3s, 3p < 4s < 3d
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 6

ప్రశ్న 55.
K, L, M మరియు N శక్తి స్థాయిలను వాటి శక్తి విలువల ఆరోహణ క్రమంలో రాయండి.
జవాబు:
K

ప్రశ్న 56.
ఒక ఎలక్ట్రాన్ శక్తిని గ్రహిస్తే ఏం జరుగుతుంది?
జవాబు:
ఒక ఎలక్ట్రాన్ శక్తిని గ్రహిస్తే అది అధిక శక్తి స్థాయికి లేదా ఉత్తేజిత స్థాయికి చేరును.

10th Class Physics 6th Lesson పరమాణు నిర్మాణం 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
సోడియం మూలక పరమాణు ఎలక్ట్రాన్ విన్యాసం 1s²2s²2p63s¹. ఇది ఇచ్చే సమాచారం ఏమి?
జవాబు:

  1. దీని పరమాణు సంఖ్య – 11
  2. ఇది S – బ్లాకు మూలకం
  3. ఇది 3వ పీరియడకు చెందినది
  4. ఇది 1వ గ్రూపునకు చెందినది.
  5. ఇది ఒక లోహం
  6. దీని వేలన్సీ (సంయోజకత) – 1
  7. ఇది ఏక ధనాత్మక అయానను ఏర్పరుస్తుంది.

AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం

ప్రశ్న 2.
3d మరియు 4s లలో దేనికి (n+1) విలువ ఎక్కువ ? వివరింపుము.
జవాబు:

  1. 3d మరియు 4s లలో 3d యొక్క (n+1) విలువ ఎక్కువ.
  2. 3d యొక్క n + 1 విలువ = 3 + 2 = 5
    4s యొక్క n+1 విలువ = 4 + 0 = 4
    కావున 4s కన్నా 3d యొక్క శక్తి ఎక్కువ.

ప్రశ్న 3.
ఒక ఆర్బిటాల్ లో 2 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉండగలవు అని తెలిపే నియమం పేరు తెలిపి, వివరించండి.
జవాబు:
పౌలీవర్జన నియమం

ఒక ఆర్బిటాల్ లోని ఏ రెండు ఎలక్ట్రాన్లకు నాలుగు క్వాంటం సంఖ్యలు సమానం కావు.

ప్రశ్న 4.
ఒక పరమాణువు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం గురించి వివరించడానికి ఉపాధ్యాయుడు నల్లబల్లపై nlx అని రాశాడు. దానిని చూసినప్పుడు విద్యార్థి మదిలో ఏ ఏ ప్రశ్నలు ఉదయించే అవకాశం ఉంది ? ఏవైనా రెండు ప్రశ్నలను రాయండి.
జవాబు:

  1. n, l, x అక్షరాలు పరమాణువు ఎలక్ట్రాన్ విన్యాసానికి సంబంధించిన ఏ ఏ అంశాలను సూచిస్తాయి?
  2. nlx ఆధారంగా పరమాణువులోని ఎలక్ట్రాన్ స్థానాన్ని తెలుసుకోవచ్చా?

ప్రశ్న 5.
పరమాణు సంఖ్య 11 గల మూలక పరమాణువు ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాయండి. ఈ ఎలక్ట్రాన్ విన్యాసం రాయడంలో మీరు. పాటించిన సూత్రాలు, నియమాల పేర్లను తెల్పండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 7
పాటించిన నియమాలు :
ఆఫ్భౌ నియమం, హుండ్ నియమం, పౌలీవర్జన నియమం

ప్రశ్న 6.
“ఎలక్ట్రాన్ ‘3p’ ఆర్బిటాల్ నిండిన తర్వాత ‘3d’ లోకి కాకుండా ‘4s’ లోకి వెళ్తుంది.” దీనికి గల కారణం వివరించండి.
జవాబు:
(n+ l) విలువల ఆధారంగా 3d ఆర్బిటాల్ శక్తి విలువ 3 + 2 = 5. 4s ఆర్బిటాల్ శక్తి విలువ 4 + 0 = 4. 3d ఆర్బిటాల్ కన్నా 4వ ఆర్బిటాల్ శక్తి తక్కువ. ఆఫ్ భౌ నియమం ప్రకారం ఎలక్ట్రాన్ తక్కువ శక్తి గల ఆర్బిటాల్ లోకి ముందుగా చేరుతుంది. కనుక 3p ఆర్బిటాల్ నిండిన తర్వాత ఎలక్ట్రాన్ ‘3d’ లోకి కాకుండా 48 లోకి వెళ్తుంది.

ప్రశ్న 7.
“సమశక్తి ఆర్బిటాళ్ళలో ఎలక్ట్రాన్ల అమరిక” ను తెలియజేసే నియమాన్ని వివరించండి.
జవాబు:
హుండ్ నియమం ప్రకారం సమశక్తి ఆర్బిటాళ్ళలో ఒక్కొక్క ఎలక్ట్రాన్ చేరిన తర్వాతే జతగూడడం జరుగుతుంది.
ఉదా : కార్బన్ ఎలక్ట్రాన్ విన్యాసము 1s² 2s² 2p²
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 8

చివరి రెండు ఎలక్ట్రాన్లు వేరు వేరు p ఆర్బిటాళ్ళని ఆక్రమిస్తాయి.

ప్రశ్న 8.
Na+, Cl-1 ల యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాలను రాయండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 9

ప్రశ్న 9.
పరమాణువుకు, వర్ణపటానికి సంబంధమేమి?
జవాబు:
మూలకాలను వేడిచేసినపుడు అవి శక్తిని కాంతి రూపంలో విడుదల చేస్తాయి. ఈ శక్తిని పట్టకంపై పడేలా చేస్తే తెరపై రంగు గీతలతో వర్ణపటం ఏర్పడును. ప్రతి మూలకం ఒక్కొక్క ప్రత్యేక రంగులు గల గీతలను తెరపై ఏర్పరచును. ఈ రంగుల గీతలను మానవుని వేలి ముద్రలతో పోల్చవచ్చు. ఏ ఇద్దరి మానవుల వేలి ముద్రలూ ఒకేలా ఉండవు, అలానే ఏ రెండు మూలకాల రేఖావర్ణపటంలో ఒకే రంగుల గీతలు ఉండవు.
ఉదా : హైడ్రోజన్ – పింక్ రంగు గీతలు
క్యూప్రిక్ క్లోరైడ్ – ఆకుపచ్చ రంగు
స్ట్రాన్షియం రైడ్ – ఎరుపు రంగు
ఈ రంగులనుబట్టి పదార్థంలోని పరమాణువుల ఉనికిని తెలుసుకొంటారు.

ప్రశ్న 10.
కాపర్, క్రోమియం, ఎలక్ట్రాన్ విన్యాసం రాయండి.
జవాబు:
1) క్రోమియం 24Cr యొక్క పరమాణు సంఖ్య = 24
ఎలక్ట్రాన్ విన్యాసం [Ar] 4s¹ 3d5

2) కాపర్ యొక్క 29Cu యొక్క పరమాణు సంఖ్య = 29
ఎలక్ట్రాన్ విన్యాసం [Ar] 4s¹ 3d10

AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం

ప్రశ్న 11.
సమశక్తి గల ఆర్బిటాళ్ళు అనగానేమి?
జవాబు:
ఏ పరమాణు ఆర్బిటాళ్ళు సమాన శక్తి కలిగి ఉండునో ఆ ఆర్బిటాళ్లను సమశక్తి గల ఆర్బిటాళ్ళు అంటారు.
ఉదా 1 : p – ఆర్బిటాళ్లు

p – ఆర్బిటాళ్ళలోని px, py, pz. మూడింటికి సమాన శక్తి ఉండును.
ఉదా 2 : d – ఆర్బిటాళ్ళు
d ఉపస్థాయిలోని ఐదు ఆర్బిటాళ్ళు ఒకే శక్తిని కలిగి ఉండును.

10th Class Physics 6th Lesson పరమాణు నిర్మాణం 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
హుండ్ నియమాన్ని ఒక ఉదాహరణతో వివరించండి.
జవాబు:
హుండ్ నియమం :
ఈ నియమం ప్రకారం సమాన శక్తి కలిగిన అన్ని ఖాళీ ఆర్బిటాళ్ళు ఒక్కొక్క ఎలక్ట్రాన్ చే ఆక్రమింపబడిన తర్వాతనే ఎలక్ట్రాన్లు జతగూడడం ప్రారంభిస్తాయి.

కార్బన్ పరమాణు సంఖ్య Z = 6. ఎలక్ట్రాన్ విన్యాసం 1s²2s²2p² ఇందులో మొదటి నాలుగు ఎలక్ట్రాన్లు 1s మరియు 2వ ఆర్బిటాళ్ళలోకి చేరతాయి. తరువాత రెండు ఎలక్ట్రానులు వేరు వేరు 22 ఆర్బిటాళ్ళని ఆక్రమిస్తాయి. ఆ రెండు ఎలక్ట్రానుల స్పిన్ ఒకేవిధంగా ఉంటుంది.
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 10

ప్రశ్న 2.
పట్టికలో ఇచ్చిన సమాచారం ఆధారంగా క్రింది ప్రశ్నలకు సమాధానం వ్రాయుము.
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 11
i) 4వ ప్రధాన కక్ష్యలో గల m, కు ఎన్ని విలువలు కలవు? అవి ఏవి?
జవాబు:
1) 4వ ప్రధాన కక్ష్యలో గల m, కు గల విలువలు = 16 అవి
4వ ఆర్బిటాల్ కి m, విలువల సంఖ్య = 1 [0]
4p ఆర్బిటాల్ కి m విలువల సంఖ్య = 3 [-1, 0, 1]
4d ఆర్బిటాల్ కి m, విలువల సంఖ్య = 5 [-2, -1, 0, 1, 2]
4f ఆర్బిటాల్ కి m, విలువల సంఖ్య =76-3, -2, -1, 0, 1, 2, 3]
మొత్తం m, విలువల సంఖ్య = 16

ii) n = 3, l = 1 అయిన ఉపకక్ష్యలో గల ఎలక్ట్రాన్ ml విలువలు రాయుము.
జవాబు:
n = 3, l = 1 అయిన ఉపకక్ష్యలో గల ఎలక్ట్రాన్ ml విలువలు = -1, 0, 1.

iii) ‘N’ కర్పరం, ప్రధాన క్వాంటం సంఖ్య విలువ వ్రాసి, ఈ కర్పరంలో గల ఉపకర్పరాలను వ్రాయుము.
జవాబు:
‘N’ కర్పరం ప్రధాన క్వాంటం సంఖ్య విలువ = 4 ‘N’ కర్పరంలో ఉపకర్పరాలు = 4s, 4p, 4d, 4f.

iv) పై పట్టికలోని ml విలువలను పరిశీలించి ml మరియు l మధ్యగల సంబంధాన్ని తెలిపే ఫార్ములా వ్రాయుము.
జవాబు:
ml మరియు l మధ్య సంబంధం ⇒ m = 2l + 1.

ప్రశ్న 3.
క్రింది క్వాంటం సంఖ్యల విలువల పట్టికను పరిశీలించి ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 12
i) గోళాకృతి కల్గిన ఉపకర్పరాన్ని సూచించు ‘l’ విలువ ఎంత ? ఆ ఉపకర్పరం సంకేతం రాయండి.
ii) l = 2 కు ఎన్ని ‘ml‘ విలువలు ఉంటాయి ? అవి ఏవి?
iii) l = 1 ఉపకర్పరంలోని ఆర్బిటాళ్ళ సంకేతాలు రాయండి.
iv) l = 2 ఉపకర్పరం ఏ ఆకృతిని కల్గి ఉంటుంది? ఈ ఉపకర్పరంలో గరిష్ఠంగా ఎన్ని ఎలక్ట్రాన్లు ఉండగలవు?
జవాబు:
i) l = 0, ఉపకర్పరం – ‘S’.
ii) l = 2 కు m, విలువలు 5 ఉంటాయి. అవి : -2, -1, 0, 1, 2.
iii) l = 1 అయిన ఉప కర్పరాల సంకేతాలు px, py, pz.
iv) l = 2 ఉప కర్పరం డబుల్ డంబెల్ ఆకృతి కల్గి ఉంటుంది. ఈ ఉపకర్పరంలో గరిష్ఠంగా 10 ఎలక్ట్రాన్లు ఉంటాయి.

ప్రశ్న 4.
ఆర్బిటాళ్ల శక్తి క్రమాలను చూపి, మాయిలర్ పటం గీయుము. (లేదా) ఆర్బిటాళ్ళ (n+1) విలువ పెరిగే క్రమాన్ని సూచించే పటాన్ని గీయండి.
(లేదా)
ఆరోహణక్రమంలో పరమాణు ఆర్బిటాళ్ళ వివిధ శక్తి స్థాయిలను చూపే మాయిలర్ పటాన్ని గీయుము.
జవాబు:
ఆర్బిటాళ్ల శక్తి క్రమాలు :
1s < 2s < 2p < 3s < 3p < 4s < 3d< 4p< 5s < 4d < 5p < 6s < 4f < 5d < 6p <7s < 5f < 6d <7p < 8s.
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 13

ప్రశ్న 5.
బోర్ హైడ్రోజన్ పరమాణు నమూనాను, దాని పరిమితులను వ్రాయండి.
(లేదా)
బోర్ హైడ్రోజన్ పరమాణు నమూనాలోని ప్రతిపాదనలు మరియు పరిమితులు రాయండి.
జవాబు:
బోర్ హైడ్రోజన్ పరమాణు నమూనా :

  1. పరమాణువులో ఎలక్ట్రానులు, కేంద్రకం నుండి నిర్దిష్ట దూరాలలో ఉన్న నియమిత శక్తి స్థాయిలలో లేదా స్థిర కర్పరాలలో వుంటాయి.
  2. ఎలక్ట్రాన్ తక్కువ శక్తి స్థాయి (భూస్థాయి) నుండి ఎక్కువ శక్తిస్థాయి (ఉత్తేజిత స్థాయి) లోకి చేరినపుడు శక్తిని గ్రహిస్తుంది. అదేవిధంగా ఎక్కువ శక్తి స్థాయి నుండి తక్కువ శక్తి స్థాయికి దూకినప్పుడు శక్తిని విడుదల చేస్తుంది.
  3. పరమాణువులో గల ఎలక్ట్రానులకు నిర్దిష్టమైన శక్తి విలువలు ఉంటాయి. అవి E1, E2, E3 ……. అంటే ఎలక్ట్రానుల శక్తి క్వాంటీకరణం చెందుతుంది. ఈ శక్తులకు సంబంధించిన స్థాయిలను స్థిర స్థాయిలు అని, వీటికుండే శక్తి విలువలను శక్తి స్థాయిలు అని అంటారు.

పరిమితులు :
బోర్ పరమాణు నమూనా, రేఖా వర్ణపటంలోని రేఖలు కొన్ని ఉపరేఖలుగా విడిపోవటాన్ని వివరించలేకపోయింది.

ప్రశ్న 6.
ఒక పరమాణువు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము ఈ విధంగా ఉంది. 1s² 2s² 2p²
అ) ఇది ఏ మూలక పరమాణువును సూచిస్తున్నది?
ఆ) చిట్టచివరి ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటాల్ లో ఉన్నది?
ఇ) చివరి ఎలక్ట్రాన్ యొక్క 4 క్వాంటం సంఖ్యలు రాయండి.
ఈ) మొదటి డబ్బాలోని రెండు ఎలక్ట్రాన్ ప్రధాన క్వాంటం సంఖ్య విలువ ఎంత?
జవాబు:
ఇచ్చిన పరమాణువు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s² 2s² 2p²
అ) ఇది “కార్బన్” మూలక పరమాణువును సూచిస్తున్నది.
ఆ) చిట్టచివరి ఎలక్ట్రాన్ 22 ఆర్బిటాల్ నందు కలదు.
ఇ) చివరి ఎలక్ట్రాన్ యొక్క 4 క్వాంటం సంఖ్యలు n = 2, l = 1, ml = 0, ms = + ½
ఈ) మొదటి డబ్బాలోని ఎలక్ట్రానుల యొక్క ప్రధాన క్వాంటం సంఖ్య విలువ 1.

ప్రశ్న 7.
బోర్ పరమాణు నమూనాలోని ప్రతిపాదనలు మరియు లోపాలేవి?
జవాబు:
ప్రతిపాదనలు :

  1. పరమాణువులో ఎలక్ట్రానులు అత్యధిక వేగంతో నిర్దిష్ట మార్గాలలో తిరుగుతాయి. వీటిని “కక్ష్యలు” అంటారు.
  2. ఈ కక్ష్యలలో ఎలక్ట్రాన్లు తిరుగుతున్నంత సేపూ శక్తి గ్రహించటంగానీ, కోల్పోవటంగానీ జరగదు. వీటిని ‘స్థిర కక్ష్యలు” అంటారు.
  3. వీటిని K, L, M, N లతో సూచిస్తారు. వీటికి నిర్దిష్ట శక్తులు కలవు.
  4. ఎలక్ట్రాన్ పై కక్ష్య నుండి లోపలి కక్ష్యకు దూకినపుడు శక్తి వికిరణ రూపంలో విడుదలగును. E2 – E1 = hυ.
  5. ఎలక్ట్రాన్ కోణీయ ద్రవ్యవేగం : mvr = \(\frac{\mathrm{nh}}{2 \pi}\)
  6. కోణీయ ద్రవ్యవేగం క్వాంటీకరణం చెందినది.

లోపాలు :

  1. He, Li, Be, B వంటి బహు ఎలక్ట్రాన్ల వర్ణపటాలను వివరించలేదు.
  2. రేఖా వర్ణపటంలోని రేఖలు ఉపరేఖలుగా విడిపోవడాన్ని వివరించలేదు.
  3. కోణీయ ద్రవ్యవేగం ఎందుకు క్వాంటీకరణం చెందినదో వివరించలేదు.
  4. రసాయన బంధాల గురించి వివరించలేదు.

AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం

ప్రశ్న 8.
హుండ్ నియమాన్ని రాసి, ఉదాహరణలతో వివరించండి.
జవాబు:
నియమం : సమశక్తి గల ఆర్బిటాళ్ళలో ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాతనే జతకూడటం జరుగుతుంది.
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 14
1) కార్బన్లో మొదటి, రెండవ ఎలక్ట్రానులు 1s లోనికి, మూడవ, నాలుగవ ఎలక్ట్రానులు 28 లోనికి ప్రవేశించును.
2) ఐదవ ఎలక్ట్రాన్ 2p సమశక్తి గల ఆర్బిటాల్ కాబట్టి 2px లోనికి ప్రవేశించును.
3) ఆరవ ఎలక్ట్రాన్ హుండ్ నియమాన్ని పాటిస్తూ 2py లోనికి ప్రవేశించును.
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 15
4) నైట్రోజన్లో మొదటి, రెండవ, మూడవ, నాలుగవ ఎలక్ట్రాన్లు కార్బన్ ఎలక్ట్రాన్ విన్యాసం వలె 1s, 2s లోనికి ప్రవేశించును.
5) ఐదవ ఎలక్ట్రాన్ 2px లోనికి ప్రవేశించును.
6) ఆరవ ఎలక్ట్రాన్ 2py లోనికి ప్రవేశించును.
7) ఏడవ ఎలక్ట్రాన్ 2pz లోనికి ప్రవేశించును.
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 16
ఆక్సిజన్ పరమాణువులో ఎలక్ట్రాన్ విన్యాసం 7 ఎలక్ట్రాన్ల వరకు నైట్రోజన్ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పోలి ఉండును.

8) 8వ ఎలక్ట్రాన్ 2px లోనికి ప్రవేశించి ఎలక్ట్రాన్ తో జతకూడును.

ప్రశ్న 9.
ఆఫ్ బౌ నియమం లేదా ఊర్ద్వ నిర్మాణ నియమాన్ని రాసి, ఉదాహరణలతో వివరించండి.
జవాబు:
నియమం : ఎలక్ట్రాను తక్కువ శక్తి గల ఆర్బిటాల్ లోనికి ముందు ప్రవేశించును.
(లేదా)
ఎలక్ట్రాను ఏ ఆర్బిటాల్ యొక్క (n + l) విలువ కనిష్ఠమో దానిలోనికి ముందు ప్రవేశించును.
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 17
పొటాషియంలో చిట్టచివరి ఎలక్ట్రాన్ 3d లోనికి ప్రవేశించకుండా, 4s లోనికి ప్రవేశించింది. కారణం 4s యొక్క n + l విలువ తక్కువ.

AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 18
ఉదా 3 : స్కాండియం 21Sc. 1s² 2s 2p6 3s² 3p6 4s² 3d¹
స్కాండియంలో చిట్టచివరి 21వ ఎలక్ట్రాన్ 4p లోనికి ప్రవేశించకుండా 3d లోనికి ప్రవేశించింది. దీనికి కారణం 4p, 3dల n + l విలువలు సమానం అయినప్పటికీ n విలువ 3d ఆర్బిటాల్ కు కనిష్టం కాబట్టి ఎలక్ట్రాన్ 3d లోనికి ప్రవేశించింది.
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 19

ప్రశ్న 10.
బోర్ – సోమర్ ఫెల్డ్ పరమాణు నమూనాను వివరించుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 20

  1. రేఖా వర్ణపటంలోని రేఖలు ఉపరేఖలుగా విడిపోవడాన్ని విశదీకరించేందుకు, సోమర్ ఫెల్డ్ దీర్ఘవృత్తాకార కక్ష్య అనే భావనను ప్రవేశపెట్టాడు.
  2. బోర్ ప్రతిపాదించిన వృత్తాకార కక్ష్యలను అలాగే ఉంచుతూ, ఇతను రెండవ కక్ష్యకి ఒక దీర్ఘవృత్తాకార కక్ష్యని, మూడవ కక్ష్యను రెండు దీర్ఘవృత్తాకార కక్ష్యలను కలుపుతూ, పరమాణు కేంద్రకం, ఈ దీర్ఘవృత్తాకార కక్ష్య యొక్క రెండు ప్రధాన నాభులలో ఒకదానిపై ఉంటుందని ప్రతిపాదించాడు.
  3. ఒక కేంద్ర బలం యొక్క ప్రభావానికి లోనై ఆవర్తన చలనంలో ఉన్న కణం ధీర్ఘవృత్తాకార కక్ష్యల ఏర్పాటుకు దారి తీస్తుందనే విషయం అతను ఈ ప్రతిపాదన చేయడానికి దారితీసింది.

లోపాలు :
ఒకటికన్నా ఎక్కువ ఎలక్ట్రాన్లున్న పరమాణువుల యొక్క పరమాణు వర్ణపటాలను వివరించడంలో ఈ నమూనా విఫలమైంది.

ప్రశ్న 11.
క్వాంటం యాంత్రిక పరమాణు నమూనాను వివరించుము.
జవాబు:

  1. ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ నిర్దిష్టమైన మార్గాలను అనుసరించవు కాబట్టి, పరమాణువుకు నిర్ణీతమైన సరిహద్దు అంటూ ఏమీ ఉండదు. కాబట్టి పరమాణువులో ఎలక్ట్రాన్ కచ్చితంగా ఎక్కడ ఉంటుందో చెప్పడం కష్టం.
  2. ఈ పరిస్థితులలో పరమాణువులోని ఎలక్ట్రానుల ధర్మాలను అర్థం చేసుకోవడానికి ఇర్విన్ ప్రోడింగర్ క్వాంటం యాంత్రిక పరమాణు నమూనాను ప్రతిపాదించాడు.
  3. ఈ నమూనా ప్రకారం, ఒక నిర్దిష్ట సమయంలో ఎలక్ట్రానులు, పరమాణువులో కేంద్రకం చుట్టూ నిర్ణీత ప్రాంతంలో అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ ప్రాంతాలనే ఆర్బిటాళ్ళు అంటారు.
  4. ఒకే శక్తి స్థాయిలకు చెందిన ఆర్బిటాళ్ళు గురించి క్వాంటం సంఖ్యల ఆధారంగా తెలుసుకోవచ్చు.

ప్రశ్న 12.
పౌలీవర్జన నియమమును ఒక ఉదాహరణతో వివరించుము.
జవాబు:
పౌలీవర్జన నియమం :
ఒకే పరమాణువుకి చెందిన ఏ రెండు ఎలక్ట్రాన్లకి నాలుగు క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండవు.
ఉదా : He, Z = 2
ఎలక్ట్రాన్ విన్యాసం : 1s²

నాలుగు క్వాంటం సంఖ్యలు :
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 21

ప్రశ్న 13.
p – ఆర్బిటాల్ పటాలను గీయుము.
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 22
జవాబు:
p యొక్క కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య విలువ l = 1.
వీటి అయస్కాంత క్వాంటం సంఖ్య విలువలు ml = – 1, 0, + 1.
p ఆర్బిటాల్ యొక్క ఆకృతి డంబెల్ ఆకారంలో ఉండును.
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 23

ప్రశ్న 14.
d – ఆర్బిటాళ్ల ఆకృతులు గీయుము.
జవాబు:
d ఉపస్థాయి యొక్క కోణీయ ద్రవ్యవేగం క్వాంటం సంఖ్య విలువ l = 2.
d ఉపస్థాయి యొక్క అయస్కాంత క్వాంటం సంఖ్య విలువలు ml = – 2 – 1, 0, 1, 2.
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 24

ప్రశ్న 15.
విద్యుదయస్కాంత వర్ణపటం గీచి, వివిధ వికిరణాల తరంగదైర్ఘ్యాలను చూపుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 25

ప్రశ్న 16.
“ఆక్సిజన్ కన్నా నైట్రోజన్ స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది”. ఈ వాక్యాన్ని సమర్థిస్తావా?
జవాబు:
అవును. నేను సమర్థిస్తాను.
నైట్రోజన్లో ఉన్న మూడు p – ఆర్బిటాళ్ళు ఒక్కొక్క ఎలక్ట్రాన్ తో సగం నిండి ఉంటాయి.
“సమశక్తి ఆర్బిటాళ్ళు సగం నిండినా లేదా పూర్తిగా నిండిన దానికి స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది.
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 26
కనుక ఆక్సిజన్ కన్నా నైట్రోజన్ కు స్థిరత్వం ఎక్కువ.

10th Class Physics 6th Lesson పరమాణు నిర్మాణం ½ Mark Important Questions and Answers

1. పరమాణువులోని ఉపకణాల పేర్లు రాయుము.
జవాబు:
ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్

2. దృగొగోచర కాంతి వడి ఎంత?
జవాబు:
3 × 108 ms-1

3. తరంగంలో రెండు వరుస శృంగాల మధ్య దూరాన్ని ఏమంటారు?
జవాబు:
తరంగదైర్యం (λ)

AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం

4. ఒక సెకనులో ఒక బిందువును దాటే తరంగాల సంఖ్యను ఏమంటారు?
జవాబు:
పౌనఃపున్యం (υ)

5. పౌనఃపున్యం యొక్క ప్రమాణం ఏమిటి?
జవాబు:
హెర్ట్జ్ (లేదా) \(\frac{1}{s}\) (లేదా) s-1,

6. \(\frac{\text { c }}{\lambda}\) దేనిని సూచించును?
జవాబు:
పౌనఃపున్యం

7. తరంగదైర్ఘ్యం (λ), పౌనఃపున్యం (υ) మరియు కాంతి తరంగ వేగం (c) ల మధ్య సంబంధమేమిటి?
జవాబు:
c = υλ

8. c = υλ. లో υ పెరిగితే? ఎలా మారుతుంది?
జవాబు:
తగ్గుతుంది

9. విద్యుదయస్కాంత తరంగాల వివిధ తరంగదైర్ఘ్యాల సముదాయాన్ని ఏమంటారు?
జవాబు:
విద్యుదయస్కాంత వర్ణపటం

10. సహజంగా ఏర్పడే వర్ణపటంనకు ఉదాహరణనిమ్ము.
జవాబు:
ఇంద్రధనుస్సు

11. క్రింది ఇవ్వబడిన కిరణాలను వాటి తరంగదైర్ఘ్యం ఆధారంగా ఆరోహణ క్రమంలో రాయండి.
γ (గామా) కిరణాలు, అతినీలలోహిత కిరణాలు, పరారుణ కిరణాలు, దృగ్గోచర కాంతి.
జవాబు:
γ కిరణాలు < అతినీలలోహిత కిరణాలు < దృగ్గోచర కాంతి < పరారుణ కిరణాలు

12. దృగ్గోచర కాంతి తరంగదైర్ఘ్యం ఎంత?
జవాబు:
400 nm నుండి 700 nm

13. క్రింది వానిలో దేనికి తక్కువ తరంగదైర్ఘ్యం కలదు?
A) కాస్మిక్ కిరణాలు
B) γ – కిరణాలు
C) మైక్రో కిరణాలు
జవాబు:
A) కాస్మిక్ కిరణాలు

14. విద్యుదయస్కాంత శక్తి గ్రహించినా, విడుదలయినా ఇలా ఉంటుంది.
a) అవిచ్ఛిన్నంగా
b) విచ్ఛిన్నంగా
జవాబు:
b) విచ్ఛిన్నంగా

15. ప్లాంక్ స్థిరాంకం విలువ ఎంత?
జవాబు:
6.626 × 10-34 J

16. ‘υ’ పౌనఃపున్యం గల విద్యుదయస్కాంత తరంగం ఎంత శక్తి (E) ని విడుదల చేయగలదు?
జవాబు:
E = hυ

17. ఒక విద్యుదయస్కాంత తరంగం యొక్క తరంగదైర్ఘ్యం తగ్గించినా లేదా పౌనఃపున్యం పెంచినా తరంగ శక్తి ఎలా మారుతుంది?
జవాబు:
తగ్గును

18. క్యూప్రిక్ క్లోరైడ్ ను మండించినపుడు ఏ రంగును పరిశీలిస్తావు?
జవాబు:
ఆకుపచ్చ రంగు

19. స్ట్రాన్షియం క్లోరైడ్ ను సన్నని జ్వాలపై మండించినప్పుడు ఏ రంగులో మండుతుంది?
జవాబు:
క్రిమ్సన్ ఎరుపు

20. రమేష్ కు వీథి దీపాలు కొన్ని పసుపురంగులో వెలుగుతూ కనిపించాయి. ఆ పసుపురంగుకి కారణం ఏమిటో ఊహించుము.
జవాబు:
సోడియం ఆవిరి

21. రేఖావర్ణపటం ఉపయోగం ఏమిటి?
జవాబు:
తెలియని పరమాణువులను గుర్తించుటకు

22. ఒక పరమాణువులోని ఎలక్ట్రాన్ శక్తిని గ్రహించి ఉత్తేజ స్థితికి వెళ్తుంది. ఉత్తేజ స్థితిలో ఎప్పటికీ ఉండగలుగుతుందా?
జవాబు:
ఉండలేదు.

23. జతపర్చుము.
a) ఎలక్ట్రాన్ భూస్థాయి నుండి ఉత్తేజిత స్థాయికి వెళ్ళినపుడు ( ) i) శోషణ వర్ణపటం
b) ఎలక్ట్రాన్ ఉత్తేజిత స్థాయి నుండి భూస్థాయికి వెళ్ళినపుడు ( ) ii) ఉద్గార వర్ణపటం
జవాబు:
a – i, b – ii

24. రేఖావర్ణపటంలోని రేఖలు కొన్ని ఉపరేఖలుగా విడిపోవడాన్ని వివరించలేని పరమాణు నమూనా ఏది?
జవాబు:
బోర్ పరమాణు నమూనా

25. దీర్ఘ వృత్తాకార కక్ష్యలను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు?
జవాబు:
సోమర్ ఫెల్డ్

26. బోర్ మొదటి వృత్తాకార కక్ష్యకు, సోమర్ ఫెల్డ్ ఎన్ని దీర్ఘవృత్తాకార కక్ష్యలను జోడించాడు?
జవాబు:
సున్న

27. హైడ్రోజన్ పరమాణు వర్ణపటంలోని సూక్ష్మరేఖలను గూర్చి వివరించిన పరమాణు నమూనా ఏది?
జవాబు:
బోర్ – సోమర్ ఫెల్డ్

28. ఒకటి కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్లున్న పరమాణువుల యొక్క వర్ణపటాలను వివరించడంలో విఫలమైన నమూనా
A) బోర్
B) బోర్-సోమర్ ఫెల్డ్
C) A మరియు B
D) రెండూ కావు.
జవాబు:
C) A మరియు B

29. క్వాంటం సిద్ధాంత రూపకర్త ఎవరు?
జవాబు:
మ్యాక్స్ ప్లాంక్

AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం

30. క్వాంటం యాంత్రిక పరమాణు నమూనా ప్రతిపాదించిన వారు ఎవరు?
జవాబు:
ఇర్విన్ జోడింగర్

31. పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ ను కనుగొనగలిగే సంభావ్యత ఏ ప్రాంతంలో అయితే అధికంగా వుంటుందో ఆ ప్రాంతాన్ని ఏమంటారు?
జవాబు:
ఆర్బిటాల్

32. పరమాణువులో ఎలక్ట్రాన్లు ఎక్కడ కనిపిస్తాయి?
జవాబు:
ఆర్బిటాళ్ళలో

33. పరమాణువులో, కేంద్రకం చుట్టూ ఉండే ప్రదేశంలో ఎలక్ట్రాన్ కనుగొనే సంభావ్యతను సూచించే సంఖ్యలను ఏమంటారు?
జవాబు:
క్వాంటం సంఖ్యలు

34. ప్రధాన కర్పర పరిమాణం, దాని శక్తిని గూర్చి తెలుపు క్వాంటం సంఖ్య ఏది?
జవాబు:
ప్రధాన క్వాంటం సంఖ్య (n)

35. ప్రధాన క్వాంటం సంఖ్య (n) విలువలు రాయుము.
జవాబు:
n = 1, 2, 3, ……..

36. క్రింది. ఏ ఆర్బిట్ పరిమాణం ఎక్కువ? జ.
A) n = 1
B) n = 3
C) n = 2
D) ఏదీకాదు
జవాబు:
B) n = 3

37. కర్సరాలు K,L,M,N లకు సరిపోవు…’n’ విలువలను రాయుము.
జవాబు:
n = 1, 2, 3, 4

38.
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 27
• ఏ కర్పరం కేంద్రకానికి దగ్గరగా ఉంటుంది?
జవాబు:
K (లేదా) n = 1

• ఏ కర్పరం శక్తి స్థాయి ఎక్కువగా ఉంటుంది?
జవాబు:
N (లేదా) n = 4

• పై పట్టికలోని విలువలు ఏ క్వాంటం సంఖ్యను సూచిస్తాయి?
జవాబు:
ప్రధాన క్వాంటం సంఖ్య

39. ప్రతి n విలువకు ‘1’ విలువలు రాయండి.
జవాబు:
0 నుండి n – 1

40. ఏ క్వాంటం సంఖ్య ఉపకర్పరాన్ని సూచించును?
జవాబు:
‘l’ కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య).

41. ఉపకర్పరం యొక్క ఆకృతిని తెలియజేయు క్వాంటం సంఖ్య ఏది?
జవాబు:
‘l’ (కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య)

42. l = 2 అయిన ఉపకర్పరం ఏది?
జవాబు:
‘d’

43. 1 = 0 అయిన ఉపకర్పరం దేనిని సూచించును?
జవాబు:
‘s’

44. n = 1 మరియు 1 = 0 అయిన ఆర్బిటాల్ పేరు రాయండి.
జవాబు:
‘1s’

45. n = 2 ప్రధాన కర్పరంలో ఉండే ఉపకర్పరాల పేర్లు రాయండి.
జవాబు:
2s, 2p

46. f-ఆర్బిటాల్ యొక్క కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య ఎంత?
జవాబు:
3 ( l = 3)

47. n = 4 అయిన ‘l’ యొక్క గరిష్ఠ విలువ ఎంత?
జవాబు:
3

48. n = 4 అయిన ‘I’ యొక్క విలువలు రాయండి. రాయుము.
జవాబు:
l = 0, 1, 2, 3

49. ‘n’ కి గరిష్ట ‘l’ విలువ ఎంత?
జవాబు:
(n – 1)

50. ‘l’ విలువకు ఎన్ని అయస్కాంత క్వాంటం సంఖ్య విలువలు వుంటాయి?
జవాబు:
(2l + 1) (-l, (-l + 1), -0, 1, (+l -l), + l]

51. l విలువకు అయస్కాంత క్వాంటం సంఖ్య ఏఏ విలువలను కలిగి ఉంటుంది?
జవాబు:
-l, 0, +l

52. పరమాణువులో గల ఆర్బిటాళ్ళ ప్రాదేశిక దిగ్విన్యాసాన్ని ఏ క్వాంటం సంఖ్య సూచిస్తుంది?
జవాబు:
అయస్కాంత క్వాంటం సంఖ్య

53. l = 0 అయితే m, విలువలు ఎన్ని ఉంటాయి?
జవాబు:
ఒకటి (0)

54. l = 0 అయితే ఏ ఆర్బిటాల్ ను సూచిస్తుంది?
జవాబు:
‘s’

AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం

55. l = 1 అయితే m, విలువలు ఎన్ని వుంటాయి?
జవాబు:
3 [ ∵ (px, py, pz); (-1, 0, +1)]

56. ఒక ఉపకర్సరంలో ఉండే ఆర్బిటాళ్ళను ఏమంటారు?
జవాబు:
సమశక్తి ఆర్బిటాళ్ళు

57. క్రింది ఇచ్చిన l విలువలకు సమశక్తి ఆర్బిటాళ్ళ సంఖ్యను రాయండి.
l = 0, l = 1, l = 2, l = 3
జవాబు:
l = 0 — సమశక్తి ఆర్బిటాళ్ళ సంఖ్య = 1 (0)
l = 1 — సమశక్తి ఆర్బిటాళ్ళ సంఖ్య = 3 (-1, 0, +1)
l = 2 — సమశక్తి ఆర్బిటాళ్ళ సంఖ్య = 5 (-2, -1, 0 + 1, +2)
l = 3 — సమశక్తి ఆర్బిటాళ్ళ సంఖ్య = 7 (-3, -2, -1, 0, +1, +2, +3)

58. S ఆర్బిటాల్ కి ml విలువ ఎంత?
జవాబు:
‘0’

59. 1=1 అయిన డీ జనరేటెడ్ ఆర్బిటాళ్ళ సంఖ్య ఎంత? అవి ఏవి?
జవాబు:
3; px, py, pz.

60. ఇచ్చిన ‘1’ విలువకి ఉపకర్పరంలో ఉండే ఆర్బిటాళ్ల సంఖ్యను తెలుసుకొనుటకు ఉపయోగపడు సూత్రం
జవాబు:
21 + 1

61. ప్రతి ఉపకర్పరంలో గరిష్ఠంగా ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి?
జవాబు:
ఉపకర్పరంలో ఉండే ఆర్బిటాళ్ళ సంఖ్యకు రెట్టింపు.

62. s,p,d,f ఉపకర్పరాలలో ఉండే గరిష్ఠ ఎలక్ట్రానుల సంఖ్యను రాయుము.
జవాబు:
2, 6, 10, 14

63. S ఉపకర్పరంలో ఉండే ఆర్బిటాళ్ళ సంఖ్య ఎంత?
జవాబు:
1

64. p ఉపకర్పరంలో ఉండే ఆర్బిటాళ్ళ సంఖ్య ఎంత?
జవాబు:
3

65. గరిష్ఠంగా 5 ఆర్బిటాళ్లు గల ఉపకర్పరం పేరు ఏమిటి?
జవాబు:
‘d’

66. l = 3 ఉపకర్పరంలో ఆర్బిటాళ్ళ సంఖ్య ఎంత?
జవాబు:
‘7’

67. l = 3 కి m, విలువలు రాయుము.
జవాబు:
-3, -2, -1, 0, + 1, +2, +3

68. ఆర్బిటాళ్ళ ప్రాదేశిక దిగ్విన్యాసాన్ని సూచించు క్వాంటం సంఖ్య ఏది?
జవాబు:
అయస్కాంత క్వాంటం సంఖ్య

69. S – ఆర్బిటాల్ ఆకృతి ఏమిటి?
జవాబు:
గోళాకారం

70. p- ఆర్బిటాల్ ఆకృతి ఏమిటి?
జవాబు:
డంబెల్

71. d – ఆర్బిటాల్ ఆకృతి ఏమిటి?
జవాబు:
డబుల్ డంబెల్

72. AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 28   ఈ ఆర్బిటాల్ పేరు ఏమిటి?
జవాబు:
S – ఆర్బిటాల్

73. AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 29 ఈ ఆర్బిటాల్ పేరు రాయుము.
జవాబు:
py – ఆర్బిటాల్

74. AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 30 ఈ ఆర్బిటాల్ పేరు రాయుము.
జవాబు:
dxy– ఆర్బిటాల్

75. d-ఆర్బిటాళ్ళ జ్యామితీయ ఆకృతుల పేర్లు రాయుము.
జవాబు:
dxy, dyz dzx dx²-y² d

76. 5-డీజనరేటెడ్ ఆర్బిటాళ్ళు గల ఉపకర్పరం ఏది?
జవాబు:
‘d’

77. ఉపకర్పరం (1) కి, గరిష్ఠ ఎలక్ట్రానికి మధ్య సంబంధం ఏమిటి?
జవాబు:
2(2l + l)

78. ఒక ఆర్బిటాల్ లో గల గరిష్ఠ ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత?
జవాబు:
‘2’

79. జతపరుచుము.
a) ఆర్బిటాల్ పరిమాణం ( ) i) l
b) ఆకారం ( ) ii) ml
c) ప్రాదేశిక దిగ్విన్యాసం ( ) iii) n
జవాబు:
a – iii, b – i, c-ii

AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం

80. ‘ms‘ యొక్క విలువలు రాయండి.
జవాబు:
+ ½ మరియు – ½

81. ఎలక్ట్రాన్ యొక్క అభిలక్షణాలను వివరించే క్వాంటం సంఖ్య ఏది?
జవాబు:
స్పిన్ క్వాంటం సంఖ్య (ms)

82. ఎలక్ట్రాన్స్ రెండు రకాల స్పిన్ విలువలు ధనాత్మకం అయితే ఆ స్పిన్లు ఎలా ఉంటాయి?
జవాబు:
సమాంతరంగా (↓↓) లేదా (↑↑)

83. ఎలక్ట్రాన్స్ దిగ్విన్యాసాలను వివరించే క్వాంటం సంఖ్య ఏది?
జవాబు:
స్పిన్

84. పరమాణువులోని కర్పరాలు, ఉపకర్పరాలు మరియు ఆర్బిటాళ్ళలో ఎలక్ట్రాన్ల పంపిణీని ఏమంటారు?
జవాబు:
ఎలక్ట్రాన్ విన్యాసం

85. సాధారణంగా సవ్యదిశలో ఉన్న స్పిన్ ను ఎలా సూచిస్తారు?
జవాబు:
↑ లేదా + ½

86. ఎలక్ట్రాన్ విన్యాసాన్ని సూచించే సంక్షిప్త సంకేతాన్ని రాయండి.
జవాబు:
nlx

87. nlx లో n, 1, x లు వేటిని సూచిస్తాయి?
జవాబు:
n = ప్రధాన శక్తి స్థాయి
1 = ఉపశక్తి స్థాయి
X = ఎలక్ట్రాన్ల సంఖ్య

88. nlx పద్ధతిలో ఎన్ని క్వాంటం సంఖ్యలు వున్నాయి?
జవాబు:
‘2’ (n, l)

89. 1s’ లో ఉన్న ఎలక్ట్రాన్ యొక్క అన్ని క్వాంటం సంఖ్యలు రాయండి.
జవాబు:
n = 1, l = 0, ml = 0, ms = + ½ (లేదా) – ½

90. హీలియం పరమాణువులో గల రెండు ఎలక్ట్రాన్ల యొక్క క్వాంటం సంఖ్యలలో వేరుగా గలది ఏది?
జవాబు:
స్పిన్ క్వాంటం సంఖ్య

91. a) ఒక ఆర్బిటాల్ లో గరిష్ఠంగా రెండు ఎలక్ట్రాన్లు ఉంటాయి.
b) ఒక ఆర్బిటాల్ లో గల రెండు ఎలక్ట్రాన్లు కచ్చితంగా వ్యతిరేక స్పినను కలిగి ఉంటాయి.
పై వాక్యా లలో ఏది సరైనది?
జవాబు:
రెండూ సరియైనవే

92. ఊర్ధ్వ నిర్మాణ నియమం అని దేనికి పేరు?
జవాబు:
ఆబౌ నియమానికి

93. పౌలీవర్జన నియమం రాయుము.
జవాబు:
ఒకే పరమాణువుకి చెందిన ఏ రెండు ఎలక్ట్రాన్లకి నాలుగు క్వాంటం సంఖ్యలు సమానం కావు.

94. జంట స్పిన్లు గల ఎలక్ట్రాన్లను ఎలా సూచిస్తారు?
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 31

95. ఒకే ఆర్బిటాల్ లో గల రెండు ఎలక్ట్రాన్ స్పి న్లు ఎలా ఉంటాయి?
A) ఒకే దిశలో
B) వ్యతిరేక దిశలో
C) A లేదా B
జవాబు:
B) వ్యతిరేక దిశలో

96. ఒక ఆర్బిటాల్ లో గరిష్ఠంగా ఉంచగలిగే ఎలక్ట్రాన్స్ సంఖ్యను తెలియజేయు నియమం ఏమిటి?
జవాబు:
పౌలీవర్జన నియమం

97. ఒక ఆర్బిటాల్ కి ఎన్ని m విలువలు ఉంటాయి?
జవాబు:
2

98. హీలియం పరమాణువు ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 32

99. ఒక కర్పరం (n) లో ఉండే గరిష్ఠ ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత?
జవాబు:
2n²

100. ఒక ఉపకర్పరం (!) లో ఉండే గరిష్ఠ ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత?
జవాబు:
2(2l + l)

AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం

101. ఆఫ్ బౌ అనగా అర్థం ఏమిటి?
జవాబు:
ఆఫ్ బౌ అనగా ఊర్ధ్వ నిర్మాణం

102. ఆర్బిటాళ్ళలోని ఎలక్ట్రాన్లు నిండే క్రమం ఎలా ఉంటుందని ఆఫ్ బౌ నియమం చెప్పింది?
జవాబు:
ఆర్బిటాళ్ళ ఆరోహణ శక్తి క్రమం

103. 4s, 3d లలో ఎలక్ట్రాన్ దేనిని ముందుగా చేరును?
జవాబు:
4s

104. 1s, 2s, 2p, 3s, 3p, 3d, 4s, 4p, 4d, 5s, 5p, 4f, 6s, 5d లను వాటి శక్తి క్రమంలో రాయుము.
జవాబు:
1s < 2s < 2p < 3s < 3p < 4s < 3d <4p < 5s < 4d < 5p < 6s < 4f < 5d

105. 4s, 4p, 4d, 3d లలో ఏది తక్కువ శక్తి గలది?
జవాబు:
4s

106. మాయిలర్ చిత్రం దేనిని సూచిస్తుంది?
A) పౌలీవర్జన నియమం
B) ఆఫ్ బౌ నియమం
C) హుండ్ నియమం
జవాబు:
B) ఆఫ్ బౌ నియమం

107. ‘సమశక్తి గల ఆర్బిటాళ్ళలో ఒక్కొక్క ఎలక్ట్రాతో నిండిన తర్వాతే జతకూడడం జరుగును”. ఈ నియమం పేరేమిటి?
జవాబు:
హుండ్ నియమం

108. కార్బన్ పరమాణువులో భూస్థాయిలో p ఆర్బిటాళ్ళలో ఒకే స్పిన్ గల ఎలక్ట్రాన్లు ఎన్ని కలవు?
జవాబు:
2

109. నిర్దిష్ట పౌనఃపున్యాలు గల కాంతి శక్తి మాత్రమే శోషణం లేదా ఉద్గారం చెందడం వలన ఏర్పడే పటాన్ని ఏమంటారు?
జవాబు:
పరమాణు రేఖా వర్ణపటం

110. పరమాణువు వికిరణ శక్తి నిర్దిష్ట విలువ ప్రమాణాన్ని ఏమంటారు?
జవాబు:
క్వాంటం

111. అనేక తరంగదైర్యాల లేదా పౌనఃపున్యాల సముదాయాన్ని ఏమందురు?
జవాబు:
వర్ణపటం

112. 1s² 2s² 2px² ఏ నియమాన్ని ఉల్లంఘించింది?
జవాబు:
హుండ్ నియమం

113. He : ↑↑ ఏ నియమాన్ని ఉల్లంఘించింది?
జవాబు:
పౌలీవర్జన నియమం

114. 1s² 2s² 2p6 3s² 3p6 3d10 ఏ నియమాన్ని ఉల్లంఘించింది?
జవాబు:
ఆఫ్ బౌనియమం

115. క్రోమియం ఎలక్ట్రాన్ విన్యాసం రాయుము.
జవాబు:
1s² 2s² 2p6 3s² 3p6 4s¹ 3d5

116. రాగి (కాపర్) ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాయుము.
జవాబు:
1s² 2s² 2p6 3s² 3p6 4s¹ 3d10

117.
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 33
ఇది ఏ నియమాన్ని ఉల్లంఘించింది?
జవాబు:
హుండ్ నియమం

118. 1s°2s² 2p4 లో ఏ నియమం ఉల్లంఘింపబడింది?
జవాబు:
ఆబౌ నియమం

119. సోడియం పరమాణువులో చివరిగా చేరే ఎలక్ట్రాన్ యొక్క అన్ని క్వాంటం సంఖ్యలు రాయండి.
జవాబు:
n = 2, l = 1, ml = +1, ms = +½ (లేదా) -½

120. ‘K’ మరియు ‘I’ కక్ష్యలలో దేనికి ఎక్కువ శక్తి గలదు?
జవాబు:
‘L’

AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం

121. M – కర్పరంలో ఉండగల గరిష్ఠ ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత?
జవాబు:
18

122. ఒక విద్యుదయస్కాంత తరంగదైర్ఘ్యం 1మీ. దాని పౌనఃపున్యం ఎంత?
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 34

అదనపు ప్రాక్టీస్ ప్రశ్నలు

ప్రశ్న 1.
“ప్రతి మూలకం, తనదైన ఒక విలక్షణమైన రంగును ఉద్గారం చేస్తుంది”. దీనిని నిరూపించే ప్రయోగాన్ని వివరించండి.
జవాబు:

  • చిటికెడు క్యూప్రిక్ క్లోరైడ్ ను వాచ్ గ్లాసులో తీసుకొని, గాఢ హైడ్రోక్లోరికామ్లం కలిపి ముద్దలా చేయండి.
  • ఒక ప్లాటినం తీగ చివరను రింగులా మడచి లూప్ లాగా చేసి దానిపై ముద్దను తీసుకొని సన్నని జ్వాలపై పెట్టండి.
  • ఇది ఆకుపచ్చ రంగు మంటని ఇస్తుంది.
  • ఇదే ప్రయోగాన్ని ఫ్రాన్షియం క్లోరైడ్ తో చేయండి.
  • ఇది ఎరుపు రంగు మంటను ఇస్తుంది.
    పై ప్రయోగాల ద్వారా ప్రతి మూలకం తనదైన ఒక విలక్షణమైన రంగును ఉద్గారం చేస్తుందని ఋజువౌతుంది.

ప్రశ్న 2.
వివిధ మూలకాలను ఒకే జ్వాలపై వేడిచేసినపుడు వేరు వేరు రంగులు గల మంటలను ఎందుకు ఏర్పరుస్తాయి?
జవాబు:
వివిధ మూలకాలు ఒకే జ్వాలపై వేడిచేసినపుడు వేరు వేరు రంగులు గల మంటలను ఏర్పరచుటకు కారణం ఆయా మూలకాలలోని ఎలక్ట్రాన్లు వెలువరించే విద్యుదయస్కాంత తరంగాల వైవిధ్యభరితమైన పౌనఃపున్యాలు.

ప్రశ్న 3.
ఒక పరమాణువులో ఎలక్ట్రాన్లు నిర్దిష్టమైన మార్గంలో తిరగవు అని ఎలా చెప్పగలవు?
జవాబు:
ఎలక్ట్రాన్లు కంటికి కనిపించని కణాలు. కాబట్టి ఆ ఎలక్ట్రాన్ల వేగాన్ని, స్థానాన్ని కనుగొనడానికి కూడా తగిన కాంతి సహాయాన్ని తీసుకుంటాము. ఎలక్ట్రానులు అత్యంత సూక్ష్మమైనవి. కాబట్టి అతి తక్కువ తరంగదైర్ఘ్యం గల కాంతినే ఈ పనికి వాడుకోవలసి ఉంటుంది. ఈ తక్కువ తరంగదైర్ఘ్యం గల కాంతి ఎలక్ట్రాన్ ను తాకినపుడు అది ఎలక్ట్రాన్ చలనాన్ని ప్రభావితం చేసి దాని చలనంలో మార్పుని కలుగజేస్తుంది. అందువల్ల ఎలక్ట్రాన్ స్థానాన్ని గాని, వేగాన్ని గాని కచ్చితంగా ఒకేసారి కనుక్కోలేం. దీనిని బట్టి ఎలక్ట్రాన్ ఒక నిర్దిష్టమైన మార్గాన్ని అనుసరించదని తెలుస్తుంది.

ప్రశ్న 4.
బోర్ పరమాణు నమూనా యొక్క ముఖ్యమైన లోపమేమిటి?
జవాబు:
బోర్ పరమూణు నమూనా, రేఖా వర్ణపటంలోని రేఖలు కొన్ని ఉపరేఖలుగా విడిపోవడాన్ని వివరించలేకపోయింది.

ప్రశ్న 5.
సోమర్ ఫెల్డ్ ప్రతిపాదించిన దీర్ఘవృత్తాకార కక్ష్యలు అనగానేమి?
జవాబు:

  • రేఖా వర్ణ పటంలోని రేఖలు ఉపరేఖలుగా విడిపోవడాన్ని విశదీకరించేందుకు సోమర్ ఫెల్డ్ బోర్ నమూనాని స్వల్పంగా ఆధునీకరించినాడు. అతడు దీర్ఘ వృత్తాకార కక్ష్య అనే భావనను ప్రవేశపెట్టాడు.
  • బోర్ ప్రతిపాదించిన వృత్తాకార కక్ష్యను అలాగే వుంచుతూ ఇతను రెండవ కక్ష్యకి ఒక దీర్ఘవృత్తాకార కక్ష్యను, మూడవ కక్ష్యకు రెండు దీర్ఘవృత్తాకార కక్ష్యలను కలుపుతూ, పరమాణువు కేంద్రకం ఈ దీర్ఘ వృత్తాకార కక్ష్య యొక్క రెండు ప్రధాన నాభిలలో ఒకదానిపై ఉంటుందని ప్రతిపాదించాడు.
  • ఒక కేంద్ర బలం యొక్క ప్రభావానికి లోనై ఆవర్తన చలనంలో ఉన్న కణం దీర్ఘవృత్తాకార కక్ష్యలు ఏర్పడుటకు దారి తీస్తుందనే విషయం అతను ఈ ప్రతిపాదన చేయడానికి దారితీసింది.

ప్రశ్న 6.
బోర్ – సోమర్ ఫెల్డ్ నమూనాలో ప్రధాన లోపం ఏమిటి?
జవాబు:
ఒకటికన్నా ఎక్కువ ఎలక్ట్రాన్లు గల మూలకాల యొక్క పరమాణు వర్ణపటాన్ని ఈ నమూనా వివరించలేకపోయింది.

AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం

ప్రశ్న 7.
క్వాంటం సంఖ్యల ఉపయోగమేమిటి?
జవాబు:
కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ యొక్క కచ్చితమైన స్థానాన్ని కనుగొనడానికి క్వాంటం సంఖ్యలు ఉపయోగపడతాయి.

ప్రశ్న 8.
ఎలక్ట్రాన్ విన్యాసము అనగానేమి?
జవాబు:
ఒక పరమాణువు లోపల ఎలక్ట్రాన్లు కర్పరాలు, ఉపకర్షరాలు, ఆర్బిటాళ్ళలో అమరివుండే అమరికను తెలిపేదే ఎలక్ట్రాన్ విన్యాసము.

ప్రశ్న 9.
ఒక ఆర్బిటాల్ కేవలం రెండు ఎలక్ట్రాన్లను మాత్రమే ఎందుకు ఉంచుకోగలదు?
జవాబు:
పౌలీవర్జన సూత్రం ప్రకారం రెండు ms విలువలు మాత్రమే కలవు. ఈ రెండు విలువలు రెండు వేరు వేరు ఎలక్ట్రాన్ల వ్యతిరేక స్పినను తెలుపుతుంది. కావున ఒక ఆర్బిటాల్ లో 2 ఎలక్ట్రాన్లను మాత్రమే ఉంచగలం.

ప్రశ్న 10.
‘N’ కర్పరంలో ఉంచగలిగిన గరిష్ఠ ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? అది ఏ నియమాన్ని అనుసరించింది?
జవాబు:
‘N’ కర్పరంలో ఉంచగలిగిన గరిష్ఠ ఎలక్ట్రాన్ల సంఖ్య 32.
ఇది 2n² అనే నియమాన్ని అనుసరిస్తుంది.
‘N’ కర్పరానికి ‘n’ విలువ 4
∴ 2n² = 2 × 4² = 2 x 16 = 32

ప్రశ్న 11.
ఒక దృగ్గోచర వర్ణపటం యొక్క తరంగదైర్ఘ్యం విలువలు ఊదా (400 nm) నుండి ఎరుపు (750 nm) వరకు విస్తరించి ఉన్నాయి. ఈ విలువలను పౌనఃపున్యం రూపంలో తెలపండి. (lnm = 10-9 m)
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 35

ప్రశ్న 12.
పసుపు రంగు ఉద్గారము యొక్క తరంగదైర్ఘ్యం 580 A అయిన దీని పౌనఃపున్యాన్ని లెక్కించండి. (1Å = 10-10m)
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 36

ప్రశ్న 13.
ఒక కక్ష్య యొక్క ‘n’ విలువ 2. అయిన సాధ్యమయ్యే ” మరియు ml విలువలు ఏవి?
జవాబు:
n = 2 l = 0 అయిన ml = 0
l యొక్క విలువలు 0, 1. l = 1 అయిన ml = – 1, 0, + 1.

AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం

ప్రశ్న 14.
కొన్ని ఎలక్ట్రాన్ల క్వాంటం సంఖ్యల సమితులు ఇవ్వబడ్డాయి. వీటిని వాటి శక్తిని బట్టి ఆరోహణ క్రమంలో అమర్చుము.
a) n = 5, 1 = 1, m, = 1, m, = + 1/2
b) n = 4, 1 = 0, m, = 0, m, = – 1/2
c) n = 4, 1 = 1, m, = + 1, m, = – 1/2
d) n = 5, 1 = 0, m, = 0, m, = + 1/2
జవాబు:
ఇచ్చిన క్వాంటం సంఖ్యలను బట్టి a) 5p b) 4s c) 4p d) 5s
ఆరోహణ క్రమం 4s, Ap, 53, 5p అనగా b, c, d, a.

పట్టికలు

పట్టిక – 1
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 37

పట్టిక – 2
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 38 AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 39

పట్టిక – 3
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 40
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 41
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 42

10th Class Physics 6th Lesson పరమాణు నిర్మాణం 1 Mark Bits Questions and Answers

సరియైన సమాధానమును గుర్తించండి.

1. p ఆర్బిటాల్ ఆకృతి ……….
A) గోళం
B) రేఖీయం
C) డంబెల్
D) డబుల్ డంబెల్
జవాబు:
C) డంబెల్

2. K కర్పరంలో గల గరిష్ఠ ఎలక్ట్రానుల సంఖ్య ………
A) 2
B) 4
C) 6
D) 8
జవాబు:
A) 2

3. ప్లాంక్ స్థిరాంకం విలువ ……..
A) 6.023 × 10-34 JS
B) 6.626 × 1034 JS
C) 6.626 × 10-36 Js
D) ఏదీ కాదు
జవాబు:
D) ఏదీ కాదు

4. 3d ఆర్బిటాల్ నిండిన తర్వాత ఎలక్ట్రాన్ ………. లోనికి ప్రవేశించును.
A) 4s
B) ap
C) 5s
D) 4p
జవాబు:
D) 4p

AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం

5. 1s²2s°2p² అనే ఎలక్ట్రాన్ విన్యాసంలో ఏ నియమం ఉల్లంఘించబడినది?
A) ఆఫ్ బౌ నియమం
B) హుండ్ నియమం
C) పౌలీవర్జన నియమం
D) అష్టక నియమం
జవాబు:
A) ఆఫ్ బౌ నియమం

6. n = 2 అయిన దాని కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య l విలువలు = ……….
A) 0, 1
B) 0, 1, 2
C) 0
D) 1, 2
జవాబు:
A) 0, 1

7. l = 3 విలువ గల ఆర్బిటాళ్ళలో నిండగల గరిష్ఠ ఎలక్ట్రాన్ల సంఖ్య
A) 6
B) 10
C) 14
D) 18
జవాబు:
C) 14

8. ఒకే పరమాణువుకి చెందిన ఏ రెండు ఎలక్ట్రానులకు నాలుగు క్వాంటమ్ సంఖ్యల విలువలు సమానంగా ఉండవని తెలియజేసినది
A) పౌలీ వర్జన సూత్రం
B) ఆఫ్ బౌ సూత్రం
C) హుండ్ సూత్రం
D) ఫ్లెమింగ్ ఎడమచేయి సూత్రం
జవాబు:
A) పౌలీ వర్జన సూత్రం

9. ప్రధాన క్వాంటం సంఖ్య 3 కింది వాటిలో దేనిని తెలియజేస్తుంది?
A) M – ప్రధాన కర్పరం
B) f – ఉప కర్పరం
C) N – ప్రధాన కర్పరం
D) d – ఉప కర్పరం
జవాబు:
A) M – ప్రధాన కర్పరం

10. కింది వాటిలో ఏ పరమాణువు నిర్మాణంను ‘నీల్స్ బోర్’ సిద్ధాంతం సరిగ్గా వివరించింది?
A) హైడ్రోజన్ పరమాణువు
B) హీలియం పరమాణువు
C) కార్బన్ పరమాణువు
D) అన్ని పరమాణువులు
జవాబు:
A) హైడ్రోజన్ పరమాణువు

11. ఒక ప్రధాన కర్పరం (n) లో ఉండగల గరిష్ఠ ఎలక్ట్రాన్ల సంఖ్య ……
A) 2n
B) 2n²
C) n²
D) n
జవాబు:
B) 2n²

12. ప్లాంక్ స్థిరాంకం విలువ …….. .
A) 6.626 × 10-27 J.sec
B) 6.626 × 10-34 J.sec
C) 6.626 × 1027 J.sec.
D) 6.626 × 1034 J.sec
జవాబు:
B) 6.626 × 10-34 J.sec

AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం

13. n = 4; l = 2 అయిన ఆ ఆర్బిటాల్……..
A) 4s
B) 4p
C) 4d
D) 4f
జవాబు:
C) 4d

14. క్రింది వాటిని జతపరుచుము.

AB
1) కర్పర పరిమాణం, శక్తిP) కోణీయ ద్రవ్యవేగ క్వాంటమ్ సంఖ్య
ii) ఉప కర్పరం ఆకృతిQ) అయస్కాంత క్వాంటమ్ సంఖ్య
iii) ఆర్బిటాల్ ప్రాదేశిక దృగ్విన్యాసంR) ప్రధాన క్వాంటమ్ సంఖ్య

A) (i) – P, (ii) – Q, (iii) – R
B) (i) – R, (ii) – P, (iii) – Q
C) (i) – R, (ii) – Q, (iii) – P
D) (i) – Q, (ii) – R, (iii) – P
జవాబు:
B) (i) – R, (ii) – P, (iii) – Q

15. రేఖా వర్ణపటంలోని రేఖలు ఉపరేఖలుగా విడిపోవటాన్ని విశదీకరించిన శాస్త్రవేత్త ………
A) మాక్స్ ప్లాంక్
B) సోమర్ ఫెల్డ్
C) మోస్లీ
D) లూయిస్
జవాబు:
B) సోమర్ ఫెల్డ్

16. పరమాణువు అయాన్ గా మారుటకు దోహదపడునది ఏది?
A) కేంద్రక ఆవేశం
B) ద్రవ్యరాశి సంఖ్య
C) న్యూట్రాన్ల సంఖ్య
D) ఎలక్ట్రాన్ల సంఖ్య
జవాబు:
D) ఎలక్ట్రాన్ల సంఖ్య

17. ఆఫ్ బౌ నియమం ప్రకారం క్రింది వాటిలో ఏ ఆర్బిటాల్ లోకి ఎలక్ట్రాన్లు ముందుగా ప్రవేశించును?
A) 4s
B) 4p
C) 3d
D) 4f
జవాబు:
A) 4s

AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం

18. గరిష్ఠంగా 32 ఎలక్ట్రాన్లు ఉండగల కర్పరం
A) N
B) M
C) L
D) K
జవాబు:
A) N

AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

These AP 10th Class Physical Science Chapter Wise Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు will help students prepare well for the exams.

AP Board 10th Class Physical Science 2nd Lesson Important Questions and Answers ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

10th Class Physics 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
పరీక్షనాళికలో నీరు తీసుకొని కొద్దిగా గాఢ H2SO4) ను కలిపి కదపండి. పరీక్షనాళిక అడుగుభాగం వేడిగా ఉంటుంది. H2SO4 కి బదులుగా NaOH బిళ్ళలు నీటికి కలిపితే పరీక్షనాళిక అడుగు భాగం ఏ విధంగా ఉంటుంది?
జవాబు:
పరీక్షనాళిక అడుగుభాగం వేడిగా ఉండును. దీనికి కారణము ఆమ్లాలు, క్షారాలు నీటితో చర్య జరుపుట అనునది ఒక ఉష్ణమోచక చర్య.

ప్రశ్న 2.
కాపర్ సల్ఫేట్ స్ఫటికాలను పొడి పరీక్షనాళికలో తీసుకొని వేడి చేస్తే ఏం జరుగుతుందో రాయండి.
జవాబు:

  1. కాపర్ సల్ఫేటు స్పటికాలను పొడి పరీక్షనాళికలో తీసుకొని వేడి చేస్తే, పరీక్షనాళీక గోడలపై నీటి బిందువులు ఏర్పడతాయి.
  2. అంతేకాకుండా, నీలి రంగులో ఉన్న స్పటికాలు తెలుపు రంగులోకి మారుతాయి.
  3. దీనికి కారణం, నీలిరంగు CuSO4 5H2O లో గల 5 నీటి అణువులు బాష్పీభవనం చెంది తెలుపు రంగు CuSO4 ఏర్పడటమే.

ప్రశ్న 3.
వ్యవసాయ భూములలో మట్టి యొక్క pH విలువను ఎందుకు పరీక్షిస్తారు?
జవాబు:

  1. మొక్కలు ఆరోగ్యవంతంగా పెరగడానికి నిర్దిష్ట పరిమితిలో pH విలువ కలిగియున్న మట్టి అవసరం.
  2. వ్యవసాయ భూములలో మట్టి యొక్క pH విలువను పరీక్షించటం ద్వారా మట్టి యొక్క ఆమ్ల లేదా క్షారపు స్వభావాన్ని కనుగొని, ఆ స్వభావానికనుగుణంగా కావలసిన లవణాలను కలిపి కావలసిన pH విలువను పొందడం కొరకు వ్యవసాయ భూములలో మట్టి యొక్క pH విలువను పరీక్షిస్తారు.

ప్రశ్న 4.
ఇంటిలో ఎక్కువగా ఉపయోగించే ఉప్పు, వంటసోడాల అణుఫార్ములాను రాయండి.
జవాబు:
సాధారణ ఉప్పు : NaCl
వంటసోడా : NaHCO3

AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

ప్రశ్న 5.
“ఆమ్లాలు జల ద్రావణంలో మాత్రమే అయాన్లను ఏర్పరుస్తాయి” అని చూపే ప్రయోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు రాయండి.
జవాబు:

  1. ప్రయోగంలో వెలువడిన వాయు రూపంలోని ఆమ్లాన్ని మొదట ‘పొడి’ లిట్మస్ కాగితంతో పరీక్షించాలి. తర్వాత ‘తడి’ లిట్మస్ కాగితంతో పరీక్షించాలి.
  2. అనార్థ CaCl2 గల గార్డ్ ట్యూబ్ ను ఉపయోగించాలి.

ప్రశ్న 6.
సహజ సూచికలకు ఉదాహరణలివ్వండి.
జవాబు:
లిట్మస్, రెడ్ క్యాబేజి రసం, పసుపు కలిపిన జల ద్రావణం, పుష్పాల ఆకర్షక పత్రాలు, బీట్ రూట్ రసం.

ప్రశ్న 7.
కృత్రిమ రసాయన సూచికలకు ఉదాహరణలివ్వండి.
జవాబు:
మిథైల్ ఆరెంజ్, ఫినాఫ్తలీన్ మొదలైనవి.

ప్రశ్న 8.
సార్వత్రిక ఆమ్ల – క్షార సూచికలు అనగానేమి?
జవాబు:
సేంద్రియ రంజనాల మిశ్రమాలను లేదా సూచికల మిశ్రమాలను సార్వత్రిక ఆమ్ల – క్షార సూచికలు అంటారు. ఇవి ఆమ్ల, క్షార బలాలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి.
ఉదా : pH పేపరు

ప్రశ్న 9.
బలమైన ఆమ్లాలు అనగానేమి ? ఉదాహరణలివ్వండి.
జవాబు:
జల ద్రావణంలో పూర్తిగా అయనీకరణం చెంది అధిక H3O+ అయాన్లు ఇచ్చే వాటిని బలమైన ఆమ్లాలు అంటారు.
ఉదా : HCl, H2SO4, HNO3.

ప్రశ్న 10.
బలహీన ఆమ్లాలు అనగానేమి? ఉదాహరణలివ్వండి.
జవాబు:
జల ద్రావణంలో పూర్తిగా అయనీకరణం చెందిన ఆమ్లాలను బలహీన ఆమ్లాలు అంటారు.
ఉదా : CH3COOH, H2CO3, H3PO4.

ప్రశ్న 11.
ఓల్ ఫ్యాక్టరీ సూచికలు అనగానేమి?
జవాబు:
కొన్ని పదార్థాలు ఆమ్ల, క్షార మాధ్యమంలో వేర్వేరు వాసనలను ప్రదర్శిస్తాయి. వీటిని ఓల్ ఫ్యాక్టరీ సూచికలు అంటారు.

ప్రశ్న 12.
విలీనత అనగానేమి?
జవాబు:
విలీనత :
ఆమ్లానికి లేదా క్షారానికి నీటిని కలుపుట వలన ప్రమాణ ఘనపరిమాణం గల ద్రావణం యొక్క గాఢత తగ్గే దృగ్విషయాన్ని విలీనత అంటారు.

ప్రశ్న 13.
బలమైన క్షారాలు అనగానేమి? ఉదాహరణలివ్వండి.
జవాబు:
జల ద్రావణంలో పూర్తిగా అయనీకరణం చెంది ఎక్కువ OH- అయాన్లు ఇచ్చే వాటిని బలమైన క్షారాలు అంటారు.
ఉదా : NaOH, KOH.

ప్రశ్న 14.
బలహీన క్షారాలు అనగానేమి? ఉదాహరణలివ్వండి.
జవాబు:
జల ద్రావణంలో పూర్తిగా అయనీకరణం చెందని క్షారాలను బలహీన క్షారాలంటారు.
ఉదా : NH4OH, Ca(OH)2, Mg(OH)2.

ప్రశ్న 15.
pH స్కేలు అనగానేమి?
జవాబు:
హైడ్రోజన్ గాఢత యొక్క ఋణ సంవర్గమానాన్ని pH స్కేలు అంటారు. దీనిని సొరెన్సన్ కనుగొన్నాడు.
pH = – log [H+]

ప్రశ్న 16.
ఏంటాసిడ్ అనగానేమి? ఉదాహరణలివ్వండి.
జవాబు:
ఒక బలహీన క్షారం జీర్ణాశయంలో తయారైన అధిక పరిమాణంలోని ఆమ్లాలను తటస్థీకరించి ఉపశమనం కలుగజేయును. దీనినే ఏంటాసిడ్ అంటాం.
ఉదా : జెలూసిల్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా.

ప్రశ్న 17.
తటస్థీకరణం అనగానేమి?
జవాబు:
ఒక ఆమ్లం, క్షారంతో చర్య జరిపి లవణాన్ని, నీటిని ఏర్పరచే చర్యను తటస్థీకరణ చర్య అంటారు.

ప్రశ్న 18.
అలోహ ఆక్సెలు అనగానేమి? ఇవి ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి?
జవాబు:
అలోహాలు ఆక్సిజన్ తో కలిసి ఏర్పరచే ఆక్సెను అలోహ ఆక్సెలు అంటారు. ఇవి ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి.
ఉదా : CO2, NO2, SO2

ప్రశ్న 19.
క్షార ఆక్సెన్లు అనగానేమి? ఇవి ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి?
జవాబు:
లోహాలు ఆక్సిజన్ తో కలిపి ఏర్పరచే ఆక్సెలను క్షార ఆక్సెన్లు అంటారు. వీటికి క్షార స్వభావం ఉండును. వీటిని లోహ ఆక్సెట్లు లేదా క్షార ఆక్సెలు అంటాం.
ఉదా : Na2O, MgO, CaO.

AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

ప్రశ్న 20.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అగానేమి?
జవాబు:
కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ CaSO4. ½H2O ను ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అంటారు.

ప్రశ్న 21.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఉపయోగమేమి?
జవాబు:
విరిగిన ఎముకలకు కట్లు కట్టడానికి, బొమ్మల తయారీలోనూ, సీలింగ్ చేయడానికి, వాటర్ ఫిల్టర్ లో క్యాండిల్స్ గాను వాడతారు.

ప్రశ్న 22.
సోడియం క్లోరైడ్ నుండి తయారు చేసే పదార్థాలేవి?
జవాబు:
సోడియం క్లోరైడ్ నుండి 1) NaOH క్షారం 2) బ్లీచింగ్ పౌడర్ 3) బేకింగ్ పౌడర్ 4) బట్టల సోడాలను తయారు చేస్తారు.

ప్రశ్న 23.
బ్లీచింగ్ పౌడరును ఎలా తయారు చేస్తారు?
జవాబు:
తేమ లేని కాల్షియం హైడ్రాక్సైడ్ ను Ca(OH), పై క్లోరిన్ వాయువు చర్య వలన బ్లీచింగ్ పౌడర్ ఏర్పడును.
Ca(OH)2 + Cl2 → CaOCl2 + H2O

ప్రశ్న 24.
జిప్సం అనగానేమి? ఉపయోగాలేవి?
జవాబు:
CaSO4 2H2O ను జిప్పం అంటారు.

  1. దీనిని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తయారీలో ఉపయోగిస్తారు.
  2. పొలాలలో ఆమ్లత్వాన్ని తటస్థీకరించడానికి జిప్సం చల్లుతారు.
  3. ఇళ్లకు, షాపులకు సీలింగ్ చెయ్యటానికి జిప్సం షీట్ లను విరివిగా వాడుచున్నారు.

ప్రశ్న 25.
వివిధ అణువులలోని స్ఫటిక జలం అణువుల సంఖ్యను తెలపండి.
జవాబు:
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ లో ½ నీటి అణువు, జిప్సంలో 2 నీటి అణువులు, కాపర్ సల్ఫేట్ లో 5 నీటి అణువులు, వాషింగ్ సోడాలో 10 నీటి, అణువులు కలవు.

ప్రశ్న 26.
pH స్కేలును తయారు చేసిన సొరెన్సన్ కృషిని ఏ విధంగా అభినందిస్తావు?
జవాబు:
ద్రావణాలలో హైడ్రోజన్ అయాను గాఢతల ఋణాత్మక విలువలను గుర్తుపెట్టుకోవడం కష్టంగా మారిన తరుణంలో pH స్కేలును కనిపెట్టిన సొరెన్సన్ అభినందనీయుడు. ఈయన కనిపెట్టిన pH స్కేలు వ్యవసాయంలో, వైద్యరంగంలోను ఆహారపదార్థాల తయారీలో విరివిగా వాడుచున్నారు. ఈయన చేసిన కృషిని అభినందించవలసి యున్నది.

ప్రశ్న 27.
NaCl ఆహారానికి మంచి రుచిని తీసుకురావడమే కాకుండా అనేక రసాయనాల తయారీకి ఉపయోగపడును. NaCl పట్ల ఎటువంటి సానుభూతిని కలిగి ఉంటావు?
జవాబు:
సాధారణ లవణం లేదా సోడియం క్లోరైడ్ ఆహారపదార్థాలకు మంచి రుచిని ఇస్తుంది. అంతేకాకుండా బ్లీచింగ్ పౌడర్, బేకింగ్ సోడా, బట్టల సోడా తయారీలో ముడిపదార్థంగా ఉపయోగపడును. కావున NaClను ప్రత్యేక పదార్థంగా చూడవలసిన అవసరం ఉన్నది.

ప్రశ్న 28.
సల్ఫర్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సెడ్ లాంటి అలోహ ఆక్సెలు తాజ్ మహల్ లాంటి గొప్ప నిర్మాణాలను పాడుచేస్తున్నాయి. దీనిని ఏ విధంగా అరికడతావు?
జవాబు:
తాజ్ మహల్ వంటి మహాకట్టడంను మార్బుల్ తో నిర్మించడం జరిగినది. మార్బుల్ అనగా కాల్షియం కార్బోట్ (CaCO3). ఇది గాలిలోని SO2తో చర్య జరుపుట వలన పసుపురంగులోకి మారి రోజురోజుకు తాజ్ మహల్ అందం తగ్గుచున్నది. కాబట్టి వాతావరణంలో SO2 వాయువు కలవకుండా జాగ్రత్తపడవలసి ఉన్నది.

ప్రశ్న 29.
రాగి పాత్రలు వాడుకలో తమ మెరుపును కోల్పోతాయి. కాని చింతపండుతో రుద్దితే తళతళ మెరుస్తాయి. ఎందుకు?
జవాబు:
రాగి పాత్రలు ఎల్లప్పుడు వాతావరణంలోని ఆక్సిజన్, CO2లతో చర్య జరిపి క్షార స్వభావం గల కాపర్ ఆక్సెడ్, కాపర్ కార్బోనేట్ గా మారి పాత్రలపై చిలుము పొరలుగా ఏర్పడతాయి. అందువలన పాత్రల మెరుపు తగ్గుతుంది.

మనం చింతపండుతో పాత్రలను రుద్దితే చింతపండులోని టార్టారిక్ ఆమ్లం కాపర్ ఆక్సెడ్, CuCO3 లతో తటస్థీకరణ చర్యజరిపి కాపర్ టార్టారే గా మారి నీటితో కలిసి బయటకు పోవును. కావున పాత్రలు తళతళ మెరుస్తాయి.

ప్రశ్న 30.
తడి సున్నం, తడి చాపీతో వ్రాసిన కొంతసేపటి తర్వాత తెల్లగా, స్పష్టంగా కన్పించును. ఎందుకు?
జవాబు:
తడిసున్నం లేదా తడి చాక్ పీ లో Ca(OH)2 అనే బలహీన క్షారం ఉండును. దీనిని గోడలపై సున్నం కొట్టినా లేదా బోర్డుపై రాసినా వాతావరణంలోని CO2 తో చర్య జరిపి కాల్షియం కార్బోనేట్ ను ఏర్పరచును.
Ca(OH)2 + CO2 → ↓CaCO3 + H2O
కాల్షియం కార్బోనేట్ తెల్లగా, స్పష్టంగా కనిపించును.

ప్రశ్న 31.
NaOH యొక్క పారిశ్రామిక ఉపయోగాలేవి?
జవాబు:
NaOH ను కాస్టిక్ సోడా అంటారు. దీనిని సబ్బులు, పేపర్, కృత్రిమ దారాలు, మందుల తయారీలో వాడతారు.

ప్రశ్న 32.
KOH యొక్క పారిశ్రామిక ఉపయోగాలేవి?
జవాబు:
KOHను ఒంటి సబ్బుల తయారీలో విరివిగా వాడుచున్నారు.

AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

ప్రశ్న 33.
మానవ లేదా జంతువుల ఎముకలలో ఎటువంటి లవణాలు ఉండును?
జవాబు:
మానవ లేదా జంతువుల ఎముకలలో కాల్షియం ఫాస్ఫేటు (Ca3(PO4)2) లాంటి లవణాలు ఉండును.

ప్రశ్న 34.
బోరిక్ ఆమ్లాన్ని ఎందుకు వాడతారు?
జవాబు:
బోరిక్ ఆమ్లాన్ని కళ్లను శుభ్రం చెయ్యటానికి వాడతారు.

ప్రశ్న 35.
బట్టలపై మరకలను శుభ్రం చెయ్యటానికి వాడే ఆమ్లమేది?
జవాబు:
ఆక్జాలిక్ ఆమ్లం.

ప్రశ్న 36.
కూల్ డ్రింకులు, సోడాలలో వాడే ఆమ్లం ఏది?
జవాబు:
కార్బోనిక్ ఆమ్లం (H2CO3).

ప్రశ్న 37.
ఏంటాసిడ్ గా వాడే క్షారం ఏది?
జవాబు:
మెగ్నీషియం హైడ్రాక్సైడ్.

ప్రశ్న 38.
బట్టల పైన అంట్టిన గ్రీజు మరకలను తొలగించడానికి వాడే క్షాతం ఏది?
జవాబు:
అమ్మోనియం హైడ్రాక్సైడ్ (NH4OH).

ప్రశ్న 39.
ఆమ్ల సమక్షంలో లిట్మస్ కాగితం ఏవిధంగా మారుతుంది?
జవాబు:
ఆమ్ల సమక్షంలో నీలి లిట్మస్ ఎర్రగా మారుతుంది. కానీ ఎర్ర లిట్మస్ రంగు మారదు.

ప్రశ్న 40.
లిట్మస్ ద్రావణం అనగానేమి?
జవాబు:
లిట్మస్ అనేది ఒక రంజనము. దీనిని థాలోఫైటా వర్గానికి చెందిన ‘లైకెన్’ అనే మొక్క నుండి సేకరిస్తారు.

ప్రశ్న 41.
క్షార సమక్షంలో లిట్మస్ కాగితం ఏవిధంగా మారుతుంది?
జవాబు:
క్షార సమక్షంలో ఎర్రలిట్మస్ నీలిగా మారుతుంది. నీలి లిట్మస్ తన రంగును మార్చుకోదు.

ప్రశ్న 42.
లోహాలతో ఆమ్ల, క్షార చర్యలకు రెండు ఉదాహరణలిమ్ము.
జవాబు:
లోహాలు, ఆమ్లాలు, లేదా క్షారాలతో చర్య పొందినపుడు H2 వాయువును విడుదల చేయును.
ఉదా : 1) 2HCl + Zn → ZnCl2 + H2
2) 2NaOH + Zn → Na2ZnO2 + H2

ప్రశ్న 43.
కార్బొనేట్లు మరియు లోహ హైడ్రోజన్ కార్బొనేట్లతో ఆమ్లాల చర్యలను వ్రాయుము.
జవాబు:
ఆమ్లాలు కార్బొనేట్లు, లోహ హైడ్రోజన్ కార్బొనేట్లతో చర్య పొందినపుడు CO2 వాయువు వెలువడును.
ఉదా : 1) Na2CO3 + 2HCl → 2NaCl + H2O + CO2
2) NaHCO3 + HCl → NaCl + H2O + CO2

ప్రశ్న 44.
ఆల్కలీ అనగానేమి?
జవాబు:
నీటిలో కరిగే క్షారాలను ‘ఆల్కలీ’ అంటారు.

ప్రశ్న 45.
ఆమ్ల, క్షార బలాలను ఎలా నిర్ణయిస్తారు?
జవాబు:
ఒక ద్రావణంలోని H3O+ అయానుల సంఖ్య లేదా OH అయానుల సంఖ్య ఆధారంగా ఆమ్ల, క్షారాల బలాలను నిర్ణయిస్తారు.

ప్రశ్న 46.
ఒక ద్రావణం యొక్క ‘pH’ అనగానేమి?
జవాబు:
ఒక ద్రావణం ఆమ్లమా, క్షారమా అని నిర్ణయించే ఒక సంఖ్యాత్మక విలువ, ఆ ద్రావణం యొక్క pH.

ప్రశ్న 47.
ఒక ఆమ్లం, క్షారం మధ్య తటస్థీకరణ చర్య జరిగి ఏర్పడిన లవణం యొక్క లక్షణాన్ని ఎలా నిర్ణయిస్తారు?
జవాబు:
తటస్థీకరణ చర్యలో ఏర్పడిన లవణం యొక్క స్వభావం ఆ చర్యలో పాల్గొన్న ఆమ్ల, క్షార బలాలపై ఆధారపడి ఉంటుంది.
ఉదా : బలమైన ఆమ్లం + బలమైన క్షారం → తటస్థ లవణం
బలమైన ఆమ్లం + బలహీన క్షారం → ఆమ్ల లవణం
బలహీన ఆమ్లం + బలమైన క్షారం → క్షార లవణం
బలహీన ఆమ్లం + బలహీన క్షారం → ఆమ్ల-క్షారాల సాపేక్ష బలంపై ఆధారపడి ఉంటుంది.

ప్రశ్న 48.
స్ఫటికీకరణ జలం అనగానేమి?
జవాబు:
ఒక లవణం యొక్క ఫార్ములా యూనిట్‌లో నిర్దిష్ట సంఖ్యలో ఉండే నీటి అణువులను స్ఫటికీకరణ జలం అంటారు.

ప్రశ్న 49.
జిప్సం నుండి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ను ఎలా తయారుచేస్తారు?
జవాబు:
జిప్సంను 373 K ఉష్ణోగ్రత వద్ద నెమ్మదిగాను, అతి జాగ్రత్తగాను వేడి చేస్తే, పాక్షికంగా నీటి అణువులను కోల్పోయి కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ గా మారుతుంది. దీనినే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (CaSO4.½H2O) అంటారు.

ప్రశ్న 50
సాధారణ ఉప్పు నుండి లభించే ఇతర లవణాలు ఏవి?
జవాబు:
సాధారణ ఉప్పు నుండి సోడియం హైడ్రాక్సైడ్ (NaOH), వంటసోడా (NaHCO3), ఉతికే సోడా (Na2CO3), బ్లీచింగ్ పౌడర్ (CaOCl3) వంటి లవణాలు ఏర్పడుతాయి.

ప్రశ్న 51.
హైడ్రోక్లోరికామ్లం యొక్క ఉపయోగాలు తెలుపుము.
జవాబు:
స్టీలు వస్తువులు, గచ్చు మరియు టాయిలెట్లు శుభ్రపరిచే ద్రవాలలో హైడ్రోక్లోరికామ్లాలు వాడతారు. అంతేగాక మందులు, సౌందర్య సాధనాల తయారీలో కూడా హైడ్రోక్లోరికామ్లాన్ని వాడతారు.

AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

ప్రశ్న 52.
రాతి ఉప్పు అనగానేమి?
జవాబు:
ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఘన సోడియం క్లోరైడ్ నిక్షేపాలు ఉన్నాయి. ఈ నిక్షేపాలలో ఉండే సోడియం క్లోరైడ్ స్పటికాలు మలినాలతో కలిసి ఉండడం వలన ముదురు గోధుమ రంగులో ఉంటాయి. దీనినే రాతి ఉప్పు (Rock Salt) అంటారు.

ప్రశ్న 53.
Na2CO3 . 10H2O అనే ఫార్ములాలో 10H2O అనగానేమి?
జవాబు:
Na2CO3 . 10H2O అనే ఫార్ములాలో, 10H2O అనేది Na2CO,3 యొక్క ఒక ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశిలో 10 నీటి అణువులు ఉన్నాయని సూచిస్తుంది. కాని Na2CO3 తడిగా వుండదు.

ప్రశ్న 54.
ఎసిటిక్ ఆమ్లము నీలిలిట్మస్ కాగితంను ఎరుపుగా మార్చదు. ఎందుకు?
జవాబు:
ఎసిటిక్ ఆమ్లము బలహీన ఆమ్లం కాబట్టి నీలి లిట్మసను ఎరుపుగా మార్చదు.

ప్రశ్న 55.
బ్లీచింగ్ పౌడర్ యొక్క రెండు ఉపయోగాలు తెల్పుము.
జవాబు:

  1. దీనిని విరంజనకారిణిగా ఉపయోగిస్తారు.
  2. రసాయన పరిశ్రమలలో ఆక్సీకరణిగా ఉపయోగిస్తారు.

ప్రశ్న 56.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్, జిప్సంల ఫార్ములాలు వ్రాయుము.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ – CaSO4 . ½H2O
జిప్సం – CaSO4 . 2H2O

ప్రశ్న 57.
ఏవేని రెండు ఆమ్ల-క్షార సూచికలను తెల్పుము.
జవాబు:
మిథైల్ ఆరెంజ్, లిట్మస్, ఫినాఫ్తలీన్.

ప్రశ్న 58.
బోరాక్స్ తయారీలో ఉపయోగించు లవణం ఏది?
జవాబు:
వాషింగ్ సోడా (Na2CO3 . 10H2O)

ప్రశ్న 59.
మానవ శరీరంలోని రసాయనాల pH విలువ తగ్గితే ఏమవుతుంది?
జవాబు:
పుల్లని పదార్థాలు అధికంగా తినడం వల్ల మానవ జీర్ణాశయంలోని pH తగ్గుతుంది. కాబట్టి అజీర్తికి గురి అవుతారు.

ప్రశ్న 60.
తటస్థ, ఆమ్ల, క్షార పదార్థాల PH విలువలు తెల్పుము.
జవాబు:
తటస్థ పదార్థ pH విలువ 7. ఆమ్ల పదార్థాల PH 7 కంటే తక్కువ. క్షార పదార్థాల PH 7 కంటే ఎక్కువ.

10th Class Physics 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
రెండు పరీక్షనాళికలు X, Y లలో ఒకే పరిమాణంలో మెగ్నీషియం రిబ్బన్ ను తీసుకోవడం జరిగింది. X పరీక్షనాళికలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం, Y పరీక్షనాళికలో ఎసిటికామ్లాన్ని పోస్తే, ఏ పరీక్షనాళికలో రసాయన చర్య వేగంగా జరుగుతుంది? ఎందుకు?
జవాబు:
X పరీక్షనాళికలో రసాయన చర్య వేగంగా జరుగుతుంది.

కారణం :
హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఎసిటికామ్లం కన్నా బలమైన ఆమ్లం. కావున ఎసిటికామ్లం కంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం, మెగ్నీషియం రిబ్బన్లో వేగంగా చర్య జరుగుతుంది.

ప్రశ్న 2.
సాధారణ ఉప్పు నుండి తయారుచేయగల రసాయనాలకు 4 ఉదాహరణలు ఇవ్వండి. వాటి సాంకేతికాలను రాయండి.
జవాబు:
సాధారణ ఉప్పు నుండి తయారు చేయగల రసాయనాలు :

  1. సోడియం హైడ్రాక్సైడ్ – NaOH
  2. బేకింగ్ సోడా / వంట సోడా / సోడియం బైకార్బొనేట్ / సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ – NaHCO3
  3. బట్టల సోడా / వాషింగ్ సోడా / సోడియం కార్బొనేట్ – Na2CO3. 10H2O
  4. బ్లీచింగ్ పౌడర్ / కాల్షియం ఆక్సీక్లోరైడ్ – CaOCl2

ప్రశ్న 3.
కింది పట్టికలో ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించి, పట్టిక కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

పదార్థం (జల ద్రావణంలో)నీలి లిట్మ తో సూచించే రంగు మార్పురెడ్ లిట్మతో సూచించే రంగు మార్పు
Aఎరుపుమార్పు లేదు
Bమార్పు లేదునీలం
Cమార్పు లేదుమార్పు లేదు

i) A, B, C పదార్థాలలో తటస్థ లవణం ఏది?
ii) B పదార్థానికి కొన్ని చుక్కల ఫినాఫ్తలీన్ కలిపితే ఏం జరుగుతుంది?
జవాబు:
(i) C
(ii) పింక్ (గులాబి) రంగులోకి మారుతుంది.

AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

ప్రశ్న 4.
ఆంటాసిడ్ ఎందుకు ఉపయోగిస్తారో తెల్పి, దాని స్వభావమును రాయండి.
జవాబు:

  1. ఎసిడిటి సమస్య ఉన్నప్పుడు / అజీర్తి సమస్య ఉన్నప్పుడు జీర్ణాశయంలో / కడుపులో మంట, అసహనం కలుగుతాయి.
  2. జీర్ణాశయంలో అధికమైన ఆమ్లాన్ని తటస్థీకరించి ఉపశమనం కలగడానికి ఆంటాసిడ్ ఉపయోగిస్తారు.
  3. ఆంటాసిడ్ క్షారస్వభావాన్ని కలిగి యుంటుంది.

ప్రశ్న 5.
CaO ను నీటిలో కరిగించిన ఏర్పడు పదార్థం ఏది? దాని స్వభావాన్ని ఎలా నిర్ధారిస్తారు?
జవాబు:

  1. CaO నీటితో చర్య జరిపినప్పుడు ఏర్పడే పదార్థం కాల్షియం హైడ్రాక్సైడ్ Ca(OH)2
  2. కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణం స్వభావాన్ని సాధారణంగా ఎరుపు లిట్మస్ కాగితం లేదా pH కాగితంతో నిర్ధారిస్తారు.
  3. Ca(OH)2 ఎరుపు లిట్మసు నీలిరంగుకు మారుస్తుంది. కనుక దానికి క్షార స్వభావం ఉందని చెప్పవచ్చు.

(లేదా)
Ca(OH)2 ను pH కాగితంతో పరీక్షింపగా దాని pH విలువ 7 కన్నా ఎక్కువ అని తెలుస్తుంది. కనుక అది క్షార స్వభావాన్ని కలిగి ఉందని చెప్పవచ్చు.

ప్రశ్న 6.
వాషింగ్ సోడా యొక్క ఏవేని నాలుగు ఉపయోగాలు రాయండి.
జవాబు:
వాషింగ్ సోడా ఉపయోగాలు :

  1. గాజు, సబ్బులు, కాగితం పరిశ్రమలలో ఉపయోగిస్తారు.
  2. బోరాక్స్ వంటి సోడియం సమ్మేళనాల తయారీకి ఉపయోగిస్తారు.
  3. గృహావసరాలలో వస్తువులను శుభ్రపరచడానికి ఉపయోగిస్తారు.
  4. నీటి యొక్క శాశ్వత కాఠిన్యతను తొలగించడానికి ఉపయోగిస్తారు.

ప్రశ్న 7.
ఆమ్ల, క్షార మాధ్యమాలలో సూచిక రంగులు ఏ విధంగా మారతాయో తెల్పండి.
జవాబు:

సూచికఆమ్ల మాధ్యమంక్షార మాధ్యమం
1. లిట్మస్నీలి లిట్మ స్
ఎరుపురంగులోకి మారును
ఎర్రలిట్మస్
నీలిరంగులోకి మారును
2. ఫినాఫ్తలీన్రంగు లేదుపింక్ రంగులోకి మారును
3. మిథైల్ ఆరెంజ్ఎరుపు రంగులోకి మారునుపసుపు రంగులోకి మారును
4. పసుపు రసంపసుపురంగులోనే ఉండునుముదురు ఎరుపు రంగులోకి మారును

ప్రశ్న 8.
pH మానముపై లఘు వ్యాఖ్య వ్రాయుము.
జవాబు:

  1. ఒక ద్రావణంలోని హైడ్రోజన్ అయానుల గాఢతను లెక్కించడానికి వాడే మానమే pH మానము.
  2. ఒక ద్రావణం ఆమ్లమా, క్షారమా అని నిర్ణయించే ఒక సంఖ్యాత్మక విలువే pH.
  3. pH విలువ 0 నుండి 14 వరకు వుంటుంది.
  4. pH = 7 అయిన ఆ ద్రావణం తటస్థ ద్రావణం
    pH < 7 అయిన ఆ ద్రావణం ఆమ్ల ద్రావణం
    pH > 7 అయిన ఆ ద్రావణం క్షార ద్రావణం
  5. pH విలువ 7 నుండి 14కు పెరుగుతూ ఉంటే, ఆ ద్రావణంలో H3O+ అయానుల గాఢత తగ్గి, OH అయానుల గాఢత పెరుగుతూ ఉన్నదని అర్థం.

ప్రశ్న 9.
మన జీర్ణక్రియలో pH పాత్ర ఏమిటి?
జవాబు:

  1. జీర్ణక్రియలో మన జీర్ణాశయం హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని విడుదల చేస్తుంది. ఇది జీర్ణాశయానికి నష్టం కలుగకుండా మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఉపయోగపడుతుంది.
  2. అజీర్తి సందర్భంలో మన జీర్ణాశయం అధిక పరిమాణంలో ఆమ్లాన్ని ఉత్పత్తి చేయడం వలన కడుపులో మంట, అసహనం కలుగుతాయి.
  3. ఈ దుష్ప్రభావం నుండి విముక్తి పొందడానికి మనం ఏంటాసిడ్లుగా పిలువబడే క్షారాలను తీసుకుంటాం.
  4. ఏంటాసిడ్ లు కడుపులో అధికమైన ఆమ్లాన్ని తటస్థీకరిస్తాయి.

ప్రశ్న 10.
సాధారణ ఉప్పు నుండి సోడియం హైడ్రాక్సైడ్ ను పొందే విధానాన్ని వివరించుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 1

  1. సోడియం క్లోరైడ్ జలద్రావణం (జైన్ ద్రావణం) గుండా విద్యుత్ ను ప్రసరింపజేస్తే అది వియోగం చెంది సోడియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది.
  2. ఈ ప్రక్రియను క్లోరో – ఆల్కలీ ప్రక్రియ అంటాం.
    Nacl + 2 H2O → 2NaOH + Cl2 + H2
  3. క్లోరిన్ వాయువు ఆనోడ్ వద్ద, హైడ్రోజన్ వాయువు కాథోడ్ వద్ద విడుదలవుతాయి.
  4. కాథోడ్ వద్ద సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం ఏర్పడుతుంది. ఈ చర్యలో ఏర్పడే ఉత్పన్నాలు అనేక రకాలుగా – ఉపయోగపడుతున్నాయి.

ప్రశ్న 11.
సార్వత్రిక ఆమ్ల, క్షార సూచిక అనగానేమి?
జవాబు:

  1. సార్వత్రిక ఆమ్ల, క్షార సూచికనుపయోగించి ఆమ్లాల, క్షారాల బలాలను నిర్ణయించవచ్చు.
  2. ఇది అనేక సూచికల మిశ్రమం.
  3. ఇది ద్రావణంలో ఉండే వేర్వేరు హైడ్రోజన్ అయాన్ల గాఢతలను బట్టి వేర్వేరు రంగులను చూపుతుంది.

ప్రశ్న 12.
స్వీయ రక్షణ కోసం, మొక్కలు, కీటకాలు, జంతువులు రసాయనాలను ఉపయోగించుకొనే సందర్భాలను రాయుము.
జవాబు:

  1. తేనెటీగ కుట్టినప్పుడు, దాని కొండి ద్వారా మిథనోయిక్ ఆమ్లం చర్మం క్రిందకు చేరి తీవ్రమైన నొప్పి, మంట, దురద కలుగుతాయి.
  2. బేకింగ్ సోడా వంటి బలహీనమైన క్షారంను, కుట్టిన ప్రదేశంలో రుద్దితే నొప్పి తీవ్రత తగ్గుతుంది.
  3. ఆకులపై ముండ్లు ఉండే ‘దూలగొండి’ మొక్క మనకు గుచ్చుకున్నప్పుడు, అవి మిథనోయిక్ ఆమ్లాన్ని శరీరంలోనికి ప్రవేశ పెట్టడం వలన తీవ్రమైన మంట కలుగుతుంది.
  4. ‘దుష్టపాకు’ ఆకులతో, కుట్టిన ప్రదేశంలో రుద్దితే ఉపశమనం ఉంటుంది.

ప్రశ్న 13.
ఆమ్ల, క్షార ధర్మాలను పోల్చుము.
జవాబు:

ఆమ్ల ధర్మాలుక్షార ధర్మాలు
1) ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయి.1) క్షారాలు జారుడు స్వభావం కలిగి ఉంటాయి.
2) లోహాలతో చర్య జరిపినపుడు H2 వాయువులు విడుదల చేయును.2) లోహాలతో చర్య జరిపినపుడు H2 వాయువును విడుదల చేయును.
3) నీలి లిట్మసను ఎర్రగా మార్చును.3) ఎర్ర లిట్మసను నీలంగా మార్చును.
4) ఆమ్లాలన్నింటిలో H3O+ అయాన్ వుండును.4) క్షారాలన్నింటిలో OH అయాన్ వుండును.

ప్రశ్న 14.
క్రింద ఇవ్వబడిన పదార్థాలను ఆమ్లాలు, క్షారాలు లేదా లవణాలుగా వర్గీకరించండి.
AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 2
జవాబు:
ఆమ్లాలు : నిమ్మరసం, చింతపండు రసం
క్షారాలు : సర్ఫ్ నీరు, సున్నపు నీరు, సబ్బు నీరు.
లవణాలు : ఉప్పు నీరు

ప్రశ్న 15.
పసుపు సూచికను ఎలా తయారుచేస్తావు? దాని ఉపయోగమేమి?
జవాబు:
పసుపు కొమ్ములను ఎండబెట్టి దానిని చూర్ణం చేస్తారు. ఈ పసుపు పొడికి నీటిని కలిపితే ఏర్పడే పసుపు ద్రావణం సూచికగా పనిచేస్తుంది. ఈ పసుపు ద్రావణానికి క్షార ద్రావణం కలిపితే ఎరుపురంగులో మారుతుంది. కాబట్టి క్షార ద్రావణాలను పసుపు సూచిక ద్వారా గుర్తించవచ్చు.

AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

ప్రశ్న 16.
స్ఫటిక జలాన్ని కలిగి ఉన్న ఏవైనా రెండు లవణాల పేర్లు మరియు వాటి ఫార్ములాలను వ్రాయండి.
జవాబు:

  1. ఆర్థ కాపర్ సల్ఫేట్ – CuSO4 . 5H2O
  2. ఎప్సం లవణం – MgSO4 . 7H2O

ప్రశ్న 17.
తటస్థీకరణం అనగానేమి? తటస్థీకరణానికి రెండు ఉదాహరణలిమ్ము.
జవాబు:
ఆమ్లము క్షారానికి కలిపినపుడు లవణము, నీరు ఏర్పడే ప్రక్రియను తటస్థీకరణం అంటారు.
NaOH+ HCl → NaCl + H2O

ప్రశ్న 18.
ఆమ్లము, లోహంతో చర్య జరిపినపుడు విడుదలయ్యే వాయువు ఏది? రెండు ఉదాహరణలిమ్ము,
జవాబు:
ఆమ్లము, లోహంతో చర్య జరిపితే హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది.
Zn+ 2HCl → ZnCl2 + H2
Mg+ H2SO4 → MgSO4 + H2

ప్రశ్న 19.
పెరుగు మరియు పుల్లని పదార్థాలను రాగి మరియు కంచు పాత్రలలో నిల్వ చేయకూడదు. ఎందుకు?
జవాబు:

  1. పెరుగు మరియు పుల్లని పదార్థాలు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి.
  2. ఇవి రాగి మరియు కంచు వంటి లోహాలతో చర్యజరిపి విష స్వభావం ఉన్న లవణాలను ఏర్పరుస్తాయి.
  3. కనుక పెరుగు మరియు పుల్లని పదార్థాలను రాగి మరియు కంచు పాత్రలలో నిల్వ చేయరాదు.

ప్రశ్న 20.
గాఢ సల్ఫ్యూరికామ్లాన్ని (గాఢ H2SO4) విలీనం చేయడానికి దానికి నీటిని కలుపవచ్చా తెలుపుము.
జవాబు:

  1. గాఢ సల్ఫ్యూరికామ్లాన్ని విలీనం చేయడానికి నీటిని కలపరాదు.
  2. విలీనం చేయడానికి నీటికి ఆమ్లాన్ని చుక్కలు, చుక్కలుగా కలపాలి.
  3. కాని ఆమ్లానికి నీటిని కలపకూడదు.

ప్రశ్న 21.
కుళాయి నీరు విద్యుత్ వాహకం, స్వేదన జలం విద్యుత్ అవాహకం (విద్యుత్ ప్రవహించదు). ఎందుకు?
జవాబు:

  1. కుళాయి నీరు కొన్ని లవణాలను కలిగి ఉంటుంది. లవణాలు ఉండటం వలన కుళాయి నీరు నుండి విద్యుత్ ప్రవహిస్తుంది.
  2. స్వేదన జలంలో లవణాలు ఉండవు కనుక స్వేదన జలంలో విద్యుత్ ప్రవహించదు.

ప్రశ్న 22.
వంటసోడా తయారీని సూచించే రసాయన సమీకరణం రాయండి.
జవాబు:
వంటసోడా తయారీ :

  1. వంటసోడా రసాయననామం సోడియం హైడ్రోజన్ కార్బొనేట్. దీని ఫార్ములా NaHCO3.
  2. దీని తయారీని సూచించే సమీకరణం
    NaCl + H2O + CO2 + NH3 → NH4Cl + NaHCO3

ప్రశ్న 23.
ఉతికే సోడా Na2CO3 ని ఎలా తయారుచేస్తారు?
జవాబు:
1) బట్టల సోడా (ఉతికే సోడా) ను సోడియం క్లోరైడ్ నుండి తయారుచేస్తారు.
2) NaCl + H2O + CO2 + NH3 → NH3Cl + NaHCO3
పై చర్యలో ఏర్పడిన వంటసోడా (NaHCO3) ని వేడిచేస్తే బట్టల సోడా ఏర్పడుతుంది.
AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 3
3) సోడియం కార్బొనేట్ ను ఘనఃస్ఫటికీకరణం చేస్తే ఉతికేసోడా లభిస్తుంది.
Na2CO3 + 10H2O → Na2CO3 . 10H2O.

10th Class Physics 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
CuSO4 • 5H2O లో స్ఫటిక జలంను గూర్చి తెలిపే ఒక కృత్యాన్ని వివరించండి.
జవాబు:
CuSO4 • 5H2O లో స్ఫటిక జలంను గూర్చి తెలిపే కృత్యం :

  1. కొన్ని కాపర్ సల్ఫేట్ స్ఫటికాలను పొడిగానున్న పరీక్ష నాళికలో ఉంచి వేడి చేయాలి.
  2. నీలిరంగు కాపర్ స్ఫటికాలు తమ రంగును కోల్పోవును.
  3. పరీక్షనాళిక లోపలి గోడలపై నీటి బిందువులు ఏర్పడినాయి.
  4. వేడి చేయగా లభించిన కాపర్ సల్ఫేటకు 2-3 చుక్కలు నీటిని కలిపిన నీలిరంగు తిరిగి వచ్చును.

ప్రశ్న 2.
పట్టికలో ఇవ్వబడిన సమాచారం ఆధారంగా కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 4
a) పై పట్టికలో ఇచ్చిన ఆమ్లాలను తెల్పండి.
b) ఫినాఫ్తలీన్ ద్రావణంతో చర్యజరిపి ఎరుపు రంగును ఇచ్చే ద్రావణాల స్వభావాన్ని తెల్పండి.
c) పై పట్టికలో ఇచ్చిన తటస్థ ద్రావణాలను తెల్పండి.
d) ఇచ్చిన ద్రావణాలలో అత్యంత బలమైన ఆమ్లాన్ని, అత్యంత బలమైన క్షారాన్ని తెల్పండి.
జవాబు:
a) పై పట్టికలోని ఆమ్లాలు HCl, నిమ్మరసం.
b) క్షారాలు
c) స్వేదన జలం
d) అత్యంత బలమైన
ఆమ్లం : HCL, అత్యంత బలమైన క్షారం : NaOH

ప్రశ్న 3.
ఈ క్రింది పట్టికలో సమాన గాఢతలు గల వివిధ పదార్థాల జల ద్రావణాల యొక్క pH విలువలు ఇవ్వబడినాయి. పట్టిక క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 5
i) పై పట్టికలోని ఆమ్లాలలో అత్యంత బలహీన ఆమ్లం ఏది? ఎందువల్ల?
జవాబు:
బలహీనమైన ఆమ్లం ‘C’ – ఎందుకనగా దీని pH విలువ 7 కన్నా తక్కువగా ఉండి, 7 కి దగ్గరగా ఉంది.

ii) పై ద్రావణాలలో అత్యంత బలమైన క్షారం ఏది? ఎందువల్ల?
జవాబు:
బలహీనమైన క్షారం ‘D’ – ఎందుకనగా దీని pH విలువ 14 కి దగ్గరగా ఉంది.

iii) పట్టికలోని ఏ రెండు పదార్థాల జలద్రావణాల మధ్య రసాయనిక చర్య వలన ఎక్కువ ఉష్ణం విడుదల అవుతుంది? ఈ ఉష్ణమును ఏమంటారు?
జవాబు:
“B” మరియు “D” ల మధ్య రసాయన చర్య వలన అధిక ఉష్ణం వెలువడును. ఈ వెలువడిన ఉష్ణాన్ని తటస్థీకరజోష్ణం అంటారు.

iv) పట్టికలోని ద్రావణాలలో స్వేదనజలం యొక్క pH విలువను కలిగిన ద్రావణం ఏది? ఈ pH విలువను కలిగిన ద్రావణాలను ఏమంటారు?
జవాబు:
స్వేదన జలము యొక్క pH విలువను కలిగియున్న పదార్థం G. ఈ pH విలువలు కలిగిన ద్రావణాలను తటస్థ పదార్థాలు అంటారు.

AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

ప్రశ్న 4.
ఆమ్ల, క్షార ద్రావణాలు అయాన్లను కలిగియున్నాయా, లేదా తెలుసుకొనుటకు నిర్వహించే ప్రయోగానికి కావలసిన పరికరాల జాబితా రాయండి. ప్రయోగ విధానాన్ని వివరించండి.
జవాబు:
కావలసిన పరికరాలు :
బీకరు, బల్బు, గ్రాఫైట్ కడ్డీలు, విద్యుత్ వాహక తీగలు, 230 V AC కరెంటు, నీరు, వివిధ ఆమ్లాలు, క్షారాలు.

ప్రయోగ విధానము :
రెండు విద్యుత్ వాహక తీగలకు గ్రాఫైట్ కడ్డీలు కలపాలి. ఈ గ్రాఫైట్ కడ్డీలను ఒక గాజు బీకరులో ఒకదానికొకటి తగలకుండా అమర్చాలి. వలయంలో, విద్యుత్ బల్బు అమర్చాలి. బీకరులో సజల ఆమ్లాన్ని పోయాలి. విద్యుత్ వాహక తీగల రెండవ చివరలను 230 V AC కి కలిపి వలయంలో విద్యుత్ ప్రసరింపజేయాలి. ఈ విధముగా వివిధ ఆమ్లాలు, క్షారాలను మార్చుతూ ప్రయోగాన్ని చేయాలి. ఆమ్లాలు, క్షారాలతో ప్రయోగాన్ని చేసిన ప్రతి సందర్భంలోనూ బల్బు వెలుగుతుంది. అనగా ఆమ్లాలు, క్షారాలు అయానులను కలిగి ఉన్నాయని చెప్పవచ్చు.

ప్రశ్న 5.
హైడ్రోక్లోరికామ్లంతో NaHCO3 చర్య వలన CO2 విడుదల అగునని చూపు ప్రయోగానికి కావలసిన పరికరాల జాబితాను రాసి, ప్రయోగ విధానమును వివరించండి.
జవాబు:
కావలసిన పదార్థాలు : స్టాండు, పరీక్ష నాళికలు, వాయు వాహక నాళము, థిసిల్ గరాటు, రెండు రంధ్రములు గల రబ్బరు బిరడా, Ca(OH)2, NaHCO3, HCl.

ప్రయోగ విధానము :

  1. ఒక పరీక్ష నాళికలో NaHCO3 తీసుకొని దానికి రెండు రంధ్రాల రబ్బరు బిరడాని బిగించవలెను.
  2. ఒక రంధ్రం గుండా థిసిల్ గరాటును, రెండవ రంధ్రం గుండా వాయు వాహక నాళం ఒక కొనను అమర్చాలి. వాయు వాహక నాళం రెండవ చివరను Ca(OH)2 గల మరొక పరీక్షనాళికలో ఉంచాలి.
  3. థిసిల్ గరాటు గుండా సజల HCl ఆమ్లంను పోయాలి. NaHCO3, HCl ల మధ్య చర్య జరగడం ప్రారంభమవుతుంది.
  4. చర్యలో విడుదలైన వాయువు వాయు వాహక నాళం గుండా ప్రయాణించి Ca(OH)2 ని తెల్లని పాలవలె మార్చును. ఇది CO2 వాయువు అని నిర్ధారించవచ్చును.

ప్రశ్న 6.
X, Y, Z అనే ద్రావణాల pH విలువలు వరుసగా 13, 6, 2 అయిన
అ) ఏ ద్రావణం బలమైన ఆమ్లము? ఎందుకు?
జవాబు:
Z అను ద్రావణము యొక్క pH విలువ ‘2’, ఈ విలువ మిగిలిన ద్రావణాల కన్నా తక్కువ కనుకనే ‘Z’ ద్రావణము బలమైన ఆమ్లము అగును.

ఆ) ఏ ద్రావణంలో ద్రావితపు అణువులతోపాటు అయానులు కూడా ఉంటాయి?
జవాబు:
బలహీన ఆమ్లంకు ద్రావితపు అణువులతోపాటు అయానులు కూడా ఉంటాయి. ఇచ్చిన ద్రావణాలలో ‘X’ బలహీన ఆమ్లం కనుక దీనికి ద్రావితపు అణువులతో పాటు అయానులు కూడా ఉంటాయి.

ఇ) ఏ ద్రావణం బలమైన క్షారం? ఎందుకు?
జవాబు:
ఏ ద్రావణపు pH విలువ ఎక్కువగా ఉండునో అది బలమైన క్షార స్వభావంను ప్రదర్శించును. కనుక ఇచ్చిన ద్రావణాలలో ‘X’ బలమైన క్షారంగా ప్రవర్తించును.

ఈ) ఒక ద్రావణానికి క్షారాన్ని కలిపినపుడు దాని pH విలువ పెరుగుతుందా? తగ్గుతుందా? ఎందుకు?
జవాబు:
ఏదైనా ఒక ద్రావణంకు క్షారంను కలిపిన ఆ ద్రావణంలోని OH అయానుల గాఢత పెరిగి pH విలువ పెరుగును.

ప్రశ్న 7.
X అనే ద్రావణం నీలిలిట్మస్ ను ఎరుపు రంగులోకి, Y అనే ద్రావణం ఎరుపు లిట్మసను నీలిరంగులోకి మార్చినాయి.
అ) X, Y ద్రావణాలను రెండింటినీ కలిపినపుడు ఏ ఏ ఉత్పన్నాలు ఏర్పడవచ్చు?
జవాబు:
X మరియు Yలను కలుపుట అనగా అమ్లంతో క్షారంను కలిపినా వాటి మధ్య రసాయనిక చర్య జరిగి లవణము మరియు నీరు ఏర్పడును.

ఆ) X ద్రావణంలో మెగ్నీషియం ముక్కలు వేసినపుడు ఏ వాయువు విడుదలౌతుంది?
జవాబు:
X ద్రావణం అనగా ఆమ్లంలో మెగ్నీషియం ముక్కలు వేసినపుడు H2 వాయువు విడుదలగును. అనగా అమ్లంలు, అలోహాలతో చర్య జరిపి H2 వాయువును విడుదల చేయును.

ఇ) Y ద్రావణంలో జింకు ముక్కలు వేసినపుడు రసాయనిక చర్య జరుగుతుందా? ఎందుకు?
జవాబు:
Y ద్రావణం అనగా క్షారంలో జింకు ముక్కలు వేసినపుడు అవి రసాయన చర్యలో పాల్గొని, H2 వాయువును విడుదల చేయును.

అనగా క్షారాలు, లోహాలతో చర్య జరిపి H2 వాయువును విడుదల చేయును.

ఈ) పై రెండింటిలో హైడ్రోజన్ అయానులు ఎక్కువగా ఉండే ద్రావణం ఏది?
జవాబు:
ఆమ్లాలలో H+ అయానులు ఎక్కువగా ఉండును. అనగా ఇచ్చిన వాటిలో X ద్రావణం నందు ఎక్కువగా హైడ్రోజన్ అయానులుండును.

ప్రశ్న 8.
నిత్యజీవితంలో pH యొక్క ప్రాముఖ్యతను తెలుపు కొన్ని ఉదాహరణలను క్లుప్తంగా చర్చించండి.
జవాబు:

  1. జీవ సంబంధ ప్రాణులన్నీ pH విలువలలోని అతిస్వల్ప మార్పులకు లోబడి మాత్రమే జీవించగలవు.
    ఉదా : తక్కువ pH విలువలు గల నదీజలాలలో ఉండే జలచరాల జీవనం సంక్లిష్టస్థితిలో ఉండును.
  2. pH లోని మార్పు దంతక్షయానికి కారణమగును.
  3. జీర్ణవ్యవస్థలో జీర్ణక్రియ జరుగుటకు విడుదలగు ఆమ్లాల pH ముఖ్యపాత్ర వహించును.
  4. మొక్కలు ఆరోగ్యవంతంగా. పెరుగుటకు నిర్దిష్ట పరిమితిలో pH గల మట్టి అవసరం.
  5. స్వీయరక్షణ కొరకు మొక్కలు, కీటకాలు, జంతువులు కొంత pH గల రసాయనాలను ఉపయోగించుకుంటాయి.

ప్రశ్న 9.
బలమైన ఆమ్లము, క్షారం, బలహీనమైన ఆమ్లం, క్షారం అనగానేమి? ఉదాహరణలతో వివరించండి.
జవాబు:
బలమైన ఆమ్లము :
ఏ ఆమ్లాలైతే 100% అయనీకరణం చెందుతాయో ఆ ఆమ్లాలను బలమైన ఆమ్లాలు అంటారు.
ఉదా : HCl, H2SO4, HNO3.

బలహీనమైన ఆమ్లం :
ఏ ఆమ్లాలైతే 100% అయనీకరణం చెందవో ఆ ఆమ్లాలను బలహీన ఆమ్లాలు అంటారు.
ఉదా : CH3COOH, H2CO3, H3PO4.

బలమైన క్షారం :
ఏ క్షారాలైతే 100% అయనీకరణం చెందుతాయో వాటిని బలమైన క్షారాలంటారు.
ఉదా : NaOH, KOH.

బలహీన క్షారం :
ఏ క్షారాలైతే 100% అయనీకరణం చెందవో వాటిని బలహీన క్షారాలంటారు.
ఉదా : NH4OH, Ca(OH)2, Mg(OH)2.

ప్రశ్న 10.
బ్లీచింగ్ పౌడరును పారిశ్రామికంగా ఏ విధంగా ఉత్పత్తి చేస్తారు? దాని ఉపయోగాలేవి?
జవాబు:
తేమలేని కాల్షియం హైడ్రాక్సైడ్ పై క్లోరిన్ వాయువు చర్య వలన బ్లీచింగ్ పౌడర్ తయారగును.
Ca(OH)2 + Cl2 → CaOCl2 + H2O

ఉపయోగాలు :

  1. వస్త్ర పరిశ్రమలలో కాటన్ మరియు కాగితాలను విరంజనం చెయ్యటానికి వాడతారు.
  2. అనేక రసాయన పరిశ్రమలలో దీనిని ఆక్సీకరణిగా వాడతారు.
  3. తాగే నీటిలోని క్రిములను సంహరించటానికి క్రిమిసంహారిణిగా వాడతారు.
  4. క్లోరోఫాం తయారీలో కారకంగా ఉపయోగిస్తారు.

ప్రశ్న 11.
కొన్ని రసాయనాల సాంకేతిక నామాలను తెల్పుము.
జవాబు:

సాధారణ నామం సాంకేతికం
1. బ్రైన్ ద్రావణంNacl ద్రావణం
2. కాస్టిక్ సోడాNaOH
3. కాస్టిక్ పొటాష్KOH
4. క్విక్ లైమ్CaO
5. స్లేక్ డ్ లైమ్Ca(OH)2
6. ప్లాస్టర్ ఆఫ్ పారిస్CaSO4 ½H2O
7. జిప్సంCa SO4.2H2O
8. బేకింగ్ సోడాNaHCO3
9. వాషింగ్ సోడాNa2CO310H2O
10. సోడాయాష్Na2CO3
11. మార్బుల్CaCO3
12. వెనిగర్CH3COOH
13. బ్లీచింగ్ పౌడర్CaOCl2

ప్రశ్న 12.
ఆమ్లాల యొక్క రసాయన ధర్మాలను ఏవేని నాలిగింటిని తెల్పండి.
జవాబు:
ఆమ్ల ధర్మాలు :
1) ఆమ్లాలు చర్యాశీలత కల లోహాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి.
Mg + 2HCl → MgCl2 + H2

2) ఆమ్లాలు, క్షారాలతో చర్య జరిపి లవణము మరియు నీటిని ఏర్పరుస్తాయి.
HCI+ NaOH — Nacl + H2O

3) ఆమ్లాలు కార్బొనేట్లు మరియు హైడ్రోజన్ కార్బొనేట్లతో చర్య జరిపి లవణము, నీరు మరియు కార్బన్ డై ఆక్సెలను ఏర్పరుస్తాయి.
CaCO3 + 2HCl → CaCl2 + H2O + CO2
NaHCO3 + HCl → NaCl + H2O + CO2

4) ఆమ్లాలు, లోహ ఆక్సెతో చర్య జరిపి లవణము మరియు నీటిని ఏర్పరుస్తాయి.
2HCl + Ca0 → CaCl2 + H2O

AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

ప్రశ్న 13.
క్రింద తెలుపబడిన లవణాల ఫార్ములాలను వ్రాయండి. – ఎ) సోడియం సల్ఫేట్
బి) అమ్మోనియం క్లోరైడ్ పైన సూచించిన లవణాలు ఏ ఏ ఆమ్లముల మరియు క్షారాల మధ్య జరిగే చర్యల వలన ఏర్పడతాయో తెల్పండి. సంబంధిత రసాయన చర్యల సమీకరణాలను వ్రాయండి. అవి ఏ రకపు రసాయన చర్యలో పేర్కొనండి.
జవాబు:
సోడియం సల్ఫేట్ ఫార్ములా – Na2SO4
అమ్మోనియం క్లోరైడ్ ఫార్ములా – NH4Cl

1) సోడియం హైడ్రాక్సైడ్, సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరిపినపుడు సోడియం సల్ఫేట్ ఏర్పడుతుంది.
2NaOH + H2SO4 → Na2SO4 + 2H2O

2) అమ్మోనియం హైడ్రాక్సైడ్, హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపినపుడు అమ్మోనియం క్లోరైడ్ ఏర్పడుతుంది.
NH4OH + HCl → NH4Cl + H2O
ఈ రెండు తటస్థీకరణ చర్యలు.

ప్రశ్న 14.
కొన్ని పదార్థాల (ఆమ్ల / క్షార / తటస్థ)కు మరియు సూచికలకు మధ్య జరిగే చర్యల ఫలితాలకు సంబంధించి క్రింద ఇవ్వబడిన పట్టికను పూర్తిచేయండి.
AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 6
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 7

ప్రశ్న 15.
A, B, C, D&E అనే ద్రావణాల pH విలువలు సార్వత్రిక సూచిక ద్వారా పరీక్షించినపుడు అవి వరుసగా 5,2,13,7 &9 గా గుర్తించబడినాయి. వీటిలో ఏది?
ఎ) తటస్థ ద్రావణం బి) బలమైన క్షారం సి) బలమైన ఆమ్లం డి) బలహీన ఆమ్లం ఇ) బిలహీన క్షారం –
వీటిలో H+ అయాన్ల సంఖ్య యొక్క పెరిగే దిశలో ఆరోహణ క్రమంలో రాయండి.
జవాబు:
ఎ) E ద్రావణం బి) C ద్రావణం సి) B ద్రావణం డి) A ద్రావణం ఇ) E ద్రావణం
H+ అయాన్ల సంఖ్య పెరిగే దిశలో ఆరోహణక్రమం : E, B, A, E, C.

ప్రశ్న 16.
తినేసోడా (బేకింగ్ సోడా), ఉతికేసోడా (వాషింగ్ సోడా)ల యొక్క ఏవేని నాలుగు ఉపయోగాలు వ్రాయుము.
జవాబు:
తినేసోడా ఉపయోగాలు : .

  1. బేకింగ్ పౌడర్ తయారీలో ఉపయోగిస్తారు.
  2. యాంటాసిడ్ లో ఉపయోగిస్తారు.
  3. అగ్నిమాపక యంత్రాలలో సోడా ఆమ్లంగా ఉపయోగిస్తారు.
  4. యాంటీ సెప్టిక్ గా కూడా ఉపయోగపడుతుంది.

ఉతికే సోడా ఉపయోగాలు :

  1. గాజు, సబ్బులు, కాగితం పరిశ్రమలలో ఉపయోగిస్తారు.
  2. బోరాక్స్ తయారీలో ఉపయోగిస్తారు.
  3. వస్తువులను శుభ్రపరచడానికి ఉపయోగిస్తారు.
  4. నీటి యొక్క శాశ్వత కాఠిన్యతను తొలగించడానికి కూడా దీనిని ఉపయోగిస్తారు.

10th Class Physics 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు Important Questions and Answers

ప్రశ్న 1.
ఒక లవణం అర్ధ లవణమా? అనార్థ లవణమా? నిర్ణయించుటకు నిర్వహించే పరీక్ష ఏది?
జవాబు:
లవణమును ఒక పరీక్ష నాళికలో ఉంచినపుడు,

  1. ఒకవేళ అది ఆర్ధ లవణమైనట్లయితే పరీక్ష నాళికను వేడి చేసినపుడు దాని గోడలపై తేమను గమనించవచ్చును.
  2. అదే అనార్ధ లవణమైనట్లయితే పరీక్ష నాళికను వేడి చేసినపుడు దాని గోడలపై ఎట్టి తేమ ఏర్పడదు.

ప్రశ్న 2.
నీకివ్వబడిన అర్ధ స్పటికంలోని నీటిని తొలగించుటకు నీవు అనుసరించు విధానమును తెలుపుము.
జవాబు:
నాకివ్వబడిన ఆర్ధ స్ఫటికం ‘తడిగా లేకున్నప్పటికి వాటిలో స్పటిక జలం ఉండును. వాటిని వేడి చేసినపుడు ఈ స్పటిక జలం ఆవిరగును.

ప్రశ్న 3.
P.O.P (Plaster of Parts) సిమెంటు, కాల్షియం క్లోరైడ్ లాంటి వాటిని గాలి సోకని, తేమ లేని విధంగా సీలు చేసి ఉంచుతారు. కారణమేమి?
జవాబు:

  1. సాధారణ ఉష్ణోగ్రత వద్ద వీటిలో అనగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మరియు కాల్షియం క్లోరైడ్ లో నీటి అణువులుండును కనుక, ఇవి
  2. మొదటగా తడిగా మారి, వాటి స్ఫటిక లక్షణం కోల్పోయి చివరకు గ్రహించిన తేమ నీటిలో కరిగి ద్రావణంను ఏర్పరచును.
  3. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మాత్రము జిప్సంను ఏర్పరచును.
  4. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, CaCl, 6H,Oలు ఆర్థ లవణాలు కనుక.

ప్రశ్న 4.
ఆర్థ, అనార్థ లవణాలకు కొన్ని ఉదాహరణలివ్వండి.
జవాబు:
అనార్ధ లవణములు :
i) కోబాల్ట్ (ii) క్లోరైడ్ – COCl2
ii) కాపర్ (ii) సల్ఫేట్ – Cu2SO4
iii) కాల్షియం క్లోరైడ్ – CaCl2

ఆర్ధ లవణములు :
i) సోడియం కార్బోనేట్ – Na2CO3.10H2O
ii) మెగ్నీషియం సల్ఫేట్ – MgSO4.7H2O
iii) కాల్షియం సల్ఫేట్ – CaSO4.2H2O
iv) కాపర్ సల్ఫేట్ – CuSO4.5H2O
v) ఫెర్రస్ సల్ఫేట్ – FeSO4.7H2O\

AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

ప్రశ్న 5.
ఇచ్చిన పదార్థం (లవణం) ఆర్థ, అనార్థ పదార్థమా నిర్ధారించుటకు నీవు అనుసరించు పద్ధతిని వివరించుము.
జవాబు:

  1. మనకు ఇచ్చిన పదార్ధమును కొంతసేపు ఆరుబయట ఉంచిన, దానిలోని నీటి లవణాలు కోల్పోయి, రంగులో మార్పు ఏర్పడినట్లయితే అది ఒక ఆర్ధ లవణంగా భావిస్తాము.
  2. అదే విధముగా మనకు ఇచ్చిన పదార్ధంను వేడి చేసినపుడు అది దాని రంగును కోల్పోయినట్లయితే ఆ పదార్థము అనార్ధ లవణం అగును. “అదే అనార్ధ లవణంకు నీటిని కలిపిన అది ఆర్ధ లవణంగా మారును.

ప్రశ్న 6.
అనార్థ లవణం, అర్థ లషణాలను వేడి చేసినపుడు నీ పరిశీలనలు ఏవి?
జవాబు:

  1. ఉదాహరణకు కోబాల్డ్ క్లోరైడ్ (COCl2) ను బీకరులో తీసుకున్నపుడు దాని రంగు పింకు గాను, గది ఉష్ణోగ్రత వద్ద
    ముదురు వంకాయ రంగులోను, వేడి చేయగా నీలంగా మారును. అనగా COCl2 అనునది ఒక అనార్థ లవణం కనుక దానిని వేడి చేయగా రంగులో మార్పు ఏర్పడును.
  2. అర్ధ లవణంను వేడి చేయగా అది కూడా దానిలో ఉండు నీటిని కోల్పోయి రంగు మారును.
  3.  రెండు రకాల లవణాల యొక్క ద్రవ్యరాశులలో మార్పు జరుగును.

ప్రశ్న 7.
నీ దైనందిన జీవితంలో అర్థ, అనార్ధ స్ఫటికాలను ఉపయోగించే సందర్భాలను రెండింటిని పేర్కొనండి.
జవాబు:
అనార్థ లవణాల నిత్య జీవిత ఉపయోగాలు :

  1. ప్రయోగాలలో, ప్రయోగ సమయములో ఏర్పడు ఆవిరులను, తుంపరలను తొలగించుటకు.
  2. వేసవి కాలంలో రహదారులను సరైన కండిషన్లో ఉంచుటకు తరచుగా అనార్ధ లవణాలను వాడతారు.
  3. గాజు, పేపరు మరియు రసాయనాల తయారీ పరిశ్రమలలో వీటిని తరచుగా వాడతారు.
  4. తోళ్ళ పరిశ్రమలలో విరివిగా వాడతారు.

ఆర్ద్ర లవణాల ఉపయోగాలు :

  1. వాషింగ్ సోడా తయారీలో.
  2. నీటిని శుద్ధి చేయటకు వాడు పట్టిక తయారీలో.
  3. రక్తం కారుచున్న చిన్న గాయాలను అదుపులోనికి తెచ్చుటకు పట్టికను వాడతారు.
  4. ఇంకుల తయారీలో.

ప్రశ్న 8.
అర్ధ లవణం నుండి జలాణువులను తొలగించుటను సూచించు పటంలో లోపాన్ని గుర్తించండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 8

  1. నీటిఆవిరులు ఏర్పడటం కన్పించుట లేదు.
  2. CuSO4 స్ఫటికాలను సరైన ప్రాంతంలో వేడి చేయుట లేదు. అనగా బున్ సైన్ దీపంపై సరైన రీతిలో ఉంచకపోవటం.
  3. పరీక్షనాళిక గట్టి గాజుతో తయారైనది కాదు.

ప్రశ్న 9.
Na2CO3, Nacl, NaHCO3, CUSO4, Na2S2O3, MgSO4, CaCO3, ZNCO3, CuCO3 ఈ లవణాలలో ఏవి – ఆర్థ, అనార్థ లవణాలో పట్టికలో పొందుపరచండి.
జవాబు:

ఆర్ధ లవణంఅనార్థ లవణం
Na2CO3, NaHCO3, CuSO4Na2S2O3, Ag SO4 Nacl, ZnCO3, CaCO3

10th Class Physics 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 1/2 Mark Important Questions and Answers

1. ఒక పరీక్ష నాళికలో 2 మి.లీ. NaOH ను తీసుకొని దానికి 2 చుక్కల ఫినాఫ్తలీన్ ద్రావణాన్ని కలుపుము. నీవు పరిశీలించే రంగు ఏమిటి?
జవాబు:
పింక్ (గులాబి)

2. ఏదేని ఒక సహజ సూచికను రాయుము.
జవాబు:
లిట్మస్ / బీట్ రూట్ / ఎర్ర క్యాబేజీ / పసుపు ద్రావణం.

3. ఆమ్లానికి ఉదాహరణ రాయుము.
జవాబు:
HCl/H2SO4/HNO3/CH3COOH, మొ॥.

4. క్షారానికి ఒక ఉదాహరణనిమ్ము.
జవాబు:
NaOH/Ca(OH)2/Mg(OH)2/ KOH, మొ||.

5.
AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 9
పై ఏ ద్రావణం ఫినాఫ్తలీన్ ద్రావణాన్ని ‘పింక్ రంగులోకి మార్చగలదు?
జవాబు:
ద్రావణం ‘A’

6. సువాసన సూచికకు ఉదాహరణనిమ్ము.
జవాబు:
ఉల్లి | వెనిల్లా ఎసెన్స్ / లవంగ నూనె మొ||

7. ఒక ద్రావణం ఎర్రలిట్మసను నీలి రంగులోకి మార్చింది. అయిన ఆ ద్రావణం మిథైల్ ఆరెంజ్ సూచికను ఏ రంగులోకి మార్చును?
జవాబు:
పసుపు రంగు

8. నిజ జీవితంలో సువాసన సూచికనొకదానిని రాయుము. ఏది?
జవాబు:
వెనిల్లా ఎసెన్స్

9. ప్రవచనం (A) : ఊరగాయ మరియు పుల్లని పదార్థాలను ఇత్తడి, రాగి వంటి పాత్రలలో నిల్వ చేయరాదు.
కారణం (R) : ఆమ్లాలు లోహాలతో చర్య జరుపును.
A) A, Rలు సరైనవి మరియు A ను R సమర్థిస్తుంది.
B) A, Rలు సరైనవి మరియు A ను R సమర్ధించదు.
C) A సరియైనది, B సరైనది కాదు.
D) A సరియైనది కాదు. B సరియైనది.
జవాబు:
A) A, Rలు సరైనవి మరియు A ను R సమర్థిస్తుంది.

10. ఆమ్లంతో ఒక లోహం చర్య జరిపితే ఏ వాయువు విడుదలగును?
జవాబు:
హైడ్రోజన్

11. a) లోహాలు అన్ని ఆమ్లాలతో హైడ్రోజన్ ను ఇస్తాయి.
b) లోహాలు అన్ని క్షారాలతో హైడ్రోజన్ ను ఇస్తాయి.
A) a మరియు b లు సరియైనవి.
B) ‘a’ మాత్రమే సరియైనది.
C) ‘b’ మాత్రమే సరియైనది.
D) a, b లు సరియైనవి కావు
జవాబు:
B) ‘a’ మాత్రమే సరియైనది.

12. హైడ్రోజన్ వాయువును పరిశీలించుటకు నీవు వినియోగించు పరికరం ఏది?
జవాబు:
మండుతున్న క్రొవ్వొత్తి / మండుతున్న అగ్గిపుల్ల.

13. మండుతున్న క్రొవ్వొత్తిని హైడ్రోజన్ వాయువు వద్దకు తీసుకువచ్చినపుడు ఏమి జరుగును?
జవాబు:
‘టప్’ మనే శబ్దంతో వాయువు మండును.

14. ప్రయోగశాలలో హైడ్రోజన్ పొందుటకు కావల్సిన రెండు పదార్థాలను రాయుము.
జవాబు:
HCl, Zn.

15. క్రింది రసాయనిక చర్యలో లభించే పదార్థాలు ఏవి?
ఆమ్లం + లోహం →
జవాబు:
లవణం + హైడ్రోజన్

16. NaOH, Zn తో చర్య జరిపినపుడు ఏర్పడు లవణం ఏమిటి?
జవాబు:
Na2ZnO2 (సోడియం జింకేట్).

17. కార్బొనేట్ తో ఆమ్లం చర్య జరిపిన వెలువడు వాయువు
జవాబు:
CO2 వాయువు

18. CO2 వాయువును పరీక్షించుటకు వినియోగించు రసాయన పదార్థం ఏమిటి?
జవాబు:
Ca(OH)2 ద్రావణం/ కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణం.

AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

19. క్రింది చర్యలలో ఏది / ఏవి CO, ను ఇచ్చును?
A) Na2CO, + HCl →
B) NaHCO3 + HCl →
C) Zn + HCl →
జవాబు:
A, B

20. క్రింది సమీకరణంలో చర్యను ఏమని పిలుస్తారు?
క్షారం + ఆమ్లం – నీరు + లవణం
జవాబు:
తటస్థీకరణ చర్య

21. ఆంటాసిడ్ గుళికను తీసుకొన్నప్పుడు కడుపులో జరుగు చర్య ఏమిటి?
జవాబు:
తటస్థీకరణ చర్య

22. లోహ ఆక్సైడ్ లు ఆమ్లంతో చర్యను ఏ చర్య అంటారు?
జవాబు:
తటస్థీకరణ చర్య

23. లోహ ఆక్సైడ్ లు ఎటువంటి స్వభావాన్ని కలిగి యుంటాయి?
జవాబు:
క్షార స్వభావం

24. అలోహ ఆక్సైడ్లు ఎటువంటి స్వభావాన్ని కలిగి యుంటాయి?
జవాబు:
ఆమ్ల స్వభావం

25. బీకరులో గల HCl ద్రావణానికి కాపర్ ఆక్సైడ్ కలిపిన, ద్రావణం ఏ రంగులోకి మారును?
జవాబు:
నీలి-ఆకుపచ్చ

26. వాక్యం – a : అన్ని అలోహ ఆక్సైడ్ లు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి.
వాక్యం – b: అన్ని లోహ ఆక్సైడ్లు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి.
పై వానిలో ఏది సరియైన వాక్యం?
జవాబు:
రెండూ కావు.

27. ఆమ్లాల సాధారణ ధర్మం ఏమిటి?
జవాబు:
జలద్రావణంలో H+/H3O+ అయాన్లు ఇచ్చును.

28. క్షారాల సాధారణ ధర్మం ఏమిటి?
జవాబు:
జలద్రావణంలో OH- అయాన్లు ఇచ్చును.

29. క్రింది వానిలో సరికాని వాక్యం / వాక్యాలు ఏవి?
A) హైడ్రోజన్ ను కలిగి వున్న అన్ని సమ్మేళనాలు ఆమ్లాలే.
B) హైడ్రోజనను కలిగి వున్న అన్ని సమ్మేళనాలు క్షారాలే.
C) హైడ్రోజన్ ను కలిగి ఉన్న అన్ని సమ్మేళనాలు ఆమ్లాలు కావు.
జవాబు:
A మరియు B.

30.
AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 10
పై పటంలో చూపిన ప్రయోగంలో ఏయే ద్రావణాలకి బల్బ్ వెలుగుతుంది?
1) ఆల్కహాల్
2) గ్లూకోజ్
3) హైడ్రోక్లోరికామ్లం
4) సల్ఫ్యూరికామ్లం
జవాబు:
3, 4

31. జలద్రావణంలో H+ అయాన్లు ఇచ్చు పదార్థం ఒక దానిని రాయుము.
జవాబు:
HCl

32. తడిగాలిని పొడిగాలిగా చేయుటకు నీవు వినియోగించే పదార్థం ఏమిటి?
జవాబు:
కాల్షియం క్లోరైడ్

33. హైడ్రోనియం అయాను అనగానేమి?
జవాబు:
H3O<+

34. ఆల్కలీ అని వేటినందురు?
జవాబు:
నీటిలో కరిగే క్షారాలను ఆల్కలీ అందురు.

35. పొడి నీలి లిట్మస్ కాగితాన్ని పొడి HCl లో ముంచినపుడు ఏమి జరుగునో ఊహించుము.
జవాబు:
లిట్మస్ కాగితం రంగు మారదు.

36. క్రింది వానిలో నీవు అవలంబించే సరియైన పద్దతి ఏమిటి?
a) ఆమ్లాన్ని నీటికి నెమ్మదిగా కలపాలి.
b) నీటిని ఆమ్లానికి నెమ్మదిగా కలపాలి.
జవాబు:
‘a’

37. ‘ఆమ్ల, క్షార బలాలను కనుగొనుటకు వినియోగించు ఒక సూచికను రాయుము.
జవాబు:
సార్వత్రిక సూచిక. (యూనివర్శల్ ఇండికేటర్)

38. ద్రావణంలో హైడ్రోజన్ అయాన్ గాఢతను తెలుసుకొనే స్కేలు ఏమిటి?
జవాబు:
pH స్కేలు

39. తటస్థ ద్రావణం pH విలువ ఎంత?
జవాబు:
‘7’

40. సరియైన జతలు రాయుము.
a) ఆమ్లం pH – 1) <7
b) cho pH – 2) = 7
c) తటస్థ ద్రావణం pH – 3) > 7
జవాబు:
a – 1, b – 3, c – 2.

41. pH విలువల వ్యాప్తి ఎంత?
జవాబు:
0-14

42. నోటిలో దంతక్షయం ఎప్పుడు ప్రారంభమవుతుంది?
జవాబు:
నోటిలో pH విలువ 5.5 కన్నా తగ్గినప్పుడు

43. ఆంటాసిడ్ కి ఒక ఉదాహరణనిమ్ము.
జవాబు:
మెగ్నీషియం హైడ్రాక్సైడ్ (మిల్క్ ఆఫ్ మెగ్నీషియా)

AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

44. ఒక పరీక్ష నాళికలో ఆంటాసిడ్ మాత్రను పొడి చేసి వేయుము. దానికి మిథైల్ ఆరెంజ్ సూచికను కలుపుము. నీవు గమనించు రంగు ఏమిటి?
జవాబు:
పసుపు

45. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, కడుపులో గల ఆమ్లంతో జరిపే చర్యా సమీకరణం రాయుము.
జవాబు:
Mg(OH)2 + 2HCl → 2H2O + MgCl2

46. ఒక రైతు తన పొలాన్ని కాల్షియం కార్బొనేట్ తో తటస్థీకరిస్తున్నాడు. ఆ నేల స్వభావాన్ని ఊహించుము.
జవాబు:
ఆమ్ల స్వభావం.

47. తేనెటీగలు కుట్టినప్పుడు వంటగదిలో వినియోగించే ఏ పదార్థాన్ని వినియోగించవచ్చును?
జవాబు:
బేకింగ్ సోడా

48. దురదగొండి ఆకు ఏ ఆమ్లం ఉత్పత్తి చేయును?
జవాబు:
మిథనోయికామ్లం / ఫార్మికామ్లం

49. బలమైన ఆమ్ల, క్షారాల చర్య వలన ఏర్పడే లవణం pH ఎంత వుంటుంది?
జవాబు:
pH = 7

50. టేబుల్ సాల్ట్ రసాయన నామం ఏమిటి?
జవాబు:
సోడియం క్లోరైడ్ (NaCl)

51. క్లోరో-ఆల్కలీ పద్ధతిలో మూల పదార్థం ఏమిటి?
జవాబు:
Nacl

52. క్లోరో – ఆల్కలీ పద్ధతిలో ఏర్పడే ఆల్కలీ ఏమిటి?
జవాబు:
సోడియం హైడ్రాక్సైడ్

53. క్లోరో – ఆల్కలీ పద్ధతిలో లభించే పదార్థాలు ఏవి?
జవాబు:
NaOH, CL, H,

54. పొడిసున్నంతో క్లోరిన్ చర్య వలన ఏర్పడే పదార్థం ఏమిటి?
జవాబు:
బ్లీచింగ్ పౌడర్

55. క్రింది వానిని జతపరుచుము
a) బ్లీచింగ్ పౌడర్ – 1) Na2CO3.10 H2O
b) బేకింగ్ సోడా – 2) NaHCO3
c) వాషింగ్ సోడా – 3) CaoCl2
జవాబు:
a – 3; b – 2; c -1

56. బేకింగ్ సోడా రసాయన నామం ఏమిటి?
జవాబు:
సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ (NaHCO3).

57. బేకింగ్ సోడాను వేడి చేసిన విడుదలయ్యే వాయువేది?
జవాబు:
CO2

58. అగ్నిమాపక పరికరాలలో వినియోగించే లవణం ఏమిటి?
జవాబు:
NaHCO3.

59. వాషింగ్ సోడా అణువులో ఎన్ని నీటి అణువులు ఉంటాయి?
జవాబు:
10[Na2CO3.10H30]

60. CuSO4. 5H2O రంగు ఏమిటి?
జవాబు:
నీలం.

61. జిప్సం అణువులో ఉండే నీటి అణువుల సంఖ్య ఎంత?
జవాబు:
‘2’ [CaSO4.2H2O]

62. క్రింది వానిని జతపరుచుము.
a) ప్లాస్టర్ ఆఫ్ పారిస్ 1) CaSO4.½H2O
b) జిప్సం 2) Na2CO3.10H2O
c) వాషింగ్ సోడా – 3) CaSO4.2H2O
జవాబు:
a) – 1, b) – 3, c) – 2

63. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ రసాయనిక నామం ఏమిటి?
జవాబు:
కాల్షియం సల్ఫేట్ హెమి హైడ్రేట్ (CaSO4.½H20).

64. P.O.P. కి తడి తగిలిన ఏమవుతుంది?
జవాబు:
జిప్సం ఏర్పడును

AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

65. క్రింది వానిలో దేనిని గాలి చొరబడని పాత్రలలో ఉంచాలి?
A) CaoCl2
B) CaSO4. ½H2O
C) CaSO4.2H2O
D) పైవన్నియు
జవాబు:
B) CaSO4. ½H2O

66. CaSO4. ½H2O ను గాలి తగిలే చోట ఉంచితే ఏమగును?
జవాబు:
గట్టిగా మారును / జిప్సంగా మారును.

67. క్షార ద్రావణాన్ని పరీక్షించడానికి వినియోగించే పరికరం పదార్థం ఏమిటి?
జవాబు:
ఎర్రలిట్మ స్ పేపర్

68.
AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 11
• ఏ పదార్థం ఆమ్లం?
జవాబు:
‘A’.

• ఏ పదార్థం లిట్మస్ పేపర్ రంగు మార్చలేదు?
జవాబు:
‘A’.

69.
AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 12
పటంలో చూపిన ప్రయోగంలో ఏ వాయువు విడుదలగును?
జవాబు:
CO2

70. ఒక పదార్థం ఫినాఫ్తలీన్ సూచికను పింక్ రంగులోకి మార్చింది. ఆ పదార్థం మిథైల్ ఆరెంజ్ సూచికలో ఏ రంగు ఇచ్చును?
జవాబు:
పసుపు

71. కాల్షియం హైడ్రాక్సైడ్ ను ఏ వాయువును పరీక్షించడానికి వినియోగించవచ్చును?
జవాబు:
CO2

72. 10 మి.లీ. నీటిని పరీక్ష నాళికలో తీసుకొని, దానికి కొన్ని సోడియం హైడ్రాక్సైడ్ గుళికలను కలిపి పరీక్ష నాళిక అడుగున పట్టుకుంటే ఎలా అనిపిస్తుందో రాయుము.
జవాబు:
చల్లగా ఉంటుంది.

73. pH – పదార్థం
1) 12 – A) టమాట రసం
2) 4 – B) నీరు
3) 7 – C) వంట సోడా
జతచేసి రాయుము.
జవాబు:
1 – C; 2 – A; 3 – B.

74. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అణువులో ఉండే నీటి అణువులు ఎన్ని?
జవాబు:
½

75. ఒక యూనిట్ ఫార్ములా లవణంలో ఉండే నీటి అణువులను ఏమంటారు?
జవాబు:
స్ఫటిక జలం

76. కార్బన్ డయాక్సైడ్
a) అలోహ ఆక్సైడ్ మరియు ఆమ్లం
b) అలోహ ఆక్సైడ్ మరియు క్షారం
c) లోహ ఆక్సైడ్ మరియు ఆమ్లం
d) ఏదీకాదు.
జవాబు:
a) అలోహ ఆక్సైడ్ మరియు ఆమ్లం

77. వ్యక్తి (A) : అన్ని ఆమ్లాలు లోహాలతో చర్య జరిపి CO2 వాయువునిచ్చును.
వ్యక్తి (B) : కొన్ని క్షారాలు లోహాలతో చర్య జరిపి H2 వాయువునిచ్చును.
ఏ వ్యక్తిది సరియైన ప్రవచనం?
జవాబు:
వ్యక్తి ‘B’.

78. క్రింది వానిలో క్షారం
a) లోహ ఆక్సైడ్
b) లోహ హైడ్రాక్సైడ్
c) పై రెండూ
జవాబు:
c) పై రెండూ

79. NaCl కి H2SO4 కలిపిన విడుదలయ్యే వాయువు ఏది?
జవాబు:
పొడి HCl

80. pH ను ప్రవేశపెట్టిన వారు ఎవరు?
జవాబు:
సోరెన్స న్

AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

81. గృహంలో వినియోగించే వెనిగర్ లో వుండే ఆమ్లం ఏమిటి?
జవాబు:
ఎసిటికామ్లం

82. సున్నపు నీటి గుండా CO2 ను పంపినపుడు ఏర్పడు తెల్లని అవక్షేపం ఏమిటి?
జవాబు:
CaCO3

పట్టికలు

1. pH స్కేలు పట్టిక :
AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 13

2. పటం pH విలువలను వివిధ రంగులలో చూపు సార్వత్రిక సూచిక :
AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 14

10th Class Physics 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 1 Mark Bits Questions and Answers

సరియైన సమాధానమును గుర్తించండి.

1. ఒక ద్రావణం ఎర్ర లిట్మసు నీలిరంగులోనికి మార్చింది. దాని pH విలువ
A) 1
B) 4
C) 5
D) 10
జవాబు:
D) 10

2. రవి లోహ హైడ్రోజన్ కార్బొనేట్ కు ఆమ్లాన్ని కలిపినపుడు ఒక వాయువు వెలువడుటను గమనించాడు. ఆ వెలువడిన వాయువు …………
A) O2
B) N2
C) H2
D) CO2
జవాబు:
D) CO2

3. ఒక విద్యార్థి తనకిచ్చిన రంగులేని ద్రావణానికి కొన్ని చుక్కల సార్వత్రిక సూచికను కలిపాడు. ఆ ద్రావణం ఎరుపు రంగును పొందితే ఆ ద్రావణపు స్వభావం.
A) తటస్థ ద్రావణం
B) ఆమ్లం
C) క్షారం
D) ఆమ్లం కాని క్షారం కాని కావచ్చు
జవాబు:
B) ఆమ్లం

4. అజీర్తికి ఎంటాసిడ్ మందును ఉపయోగిస్తాం. ఎందుకంటే
A) ఎక్కువగా ఉత్పన్నమయిన ఆమ్లాన్ని తటస్థీకరిస్తుంది.
B) జీర్ణమైన ఆహారాన్ని తటస్థీకరిస్తుంది.
C) ఆహారాన్ని ఆక్సీకరణం చేస్తుంది.
D) జీర్ణరసాల ఉత్పత్తిలో సహకరిస్తుంది.
జవాబు:
A) ఎక్కువగా ఉత్పన్నమయిన ఆమ్లాన్ని తటస్థీకరిస్తుంది.

AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

5. X అనే పదార్థ ద్రావణానికి ఇథనోయిక్ ఆమ్లాన్ని కలిపినపుడు రంగులేని, వాసనలేని వాయువు Y వెలువడింది. Y వాయువు సున్నపుతేటను పాలవలె మార్చినచో X పదార్థాన్ని గుర్తించండి.
A) NaHCO3
B) NaOH
C) CH3COONa
D) NaCl
జవాబు:
A) NaHCO3

6. క్రింద ఇవ్వబడిన ఒక లోహం ఆమ్లాలతోనూ, క్షారాలతోనూ చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేయును. అయిన ఆ లోహం ………..
A) Na
B) Fe
C) Cu
D) Zn
జవాబు:
D) Zn

7. అసిడిటీతో బాధపడే వ్యక్తికి ఉపశమనానికి ఈ క్రింది వానిలో దేనిని ఇస్తారు?
A) సోడానీరు
B) వంటసోడా
C) వినిగర్
D) నిమ్మకాయరసం
జవాబు:
B) వంటసోడా

8. ఒక కార్బొనేట్ జల ద్రావణం ఈ క్రింద తెలిపిన ఏ ద్రావణంతో చర్య జరిపిన CO2 ను వెలువరించును?
A) Na2CO3
B) CuSO4
C) HCl
D) KMnO4
జవాబు:
C) HCl

9. ‘యాంటాసిడ్’ లను దేనికొరకు ఉపయోగిస్తారు?
A) జీర్ణాశయంలో ఆమ్లాన్ని ఉత్పత్తి చేయడం కోసం
B) జీర్ణాశయంలో నీటిని ఉత్పత్తి చేయడం కోసం
C) జీర్ణాశయంలో అధికంగా ఉన్న క్షారాన్ని తటస్థీకరించడం కోసం
D) జీర్ణాశయంలో అధికంగా ఉన్న ఆమ్లాన్ని తటస్థీకరించడం కోసం
జవాబు:
D) జీర్ణాశయంలో అధికంగా ఉన్న ఆమ్లాన్ని తటస్థీకరించడం కోసం

10. ఒక ద్రావణానికి ఫినాఫ్తలీన్ సూచిక కలిపితే ఆ ద్రావణం గులాబీ రంగుకి మారింది. అయిన ఆ ద్రావణం pH విలువ ………
A) 5
B) 6
C) 7
D) 10
జవాబు:
D) 10

11. బేకింగ్ పౌడరు తయారీలో ఉపయోగించే పదార్థం
A) Na2CO3
B) NaHCO3
C) NaOH
D) Nacl
జవాబు:
B) NaHCO3

12. క్రింది వానిలో ఓల్ ఫ్యాక్టరీ సూచిక కానిది …….
A) ఉల్లిపాయ
B) వెనీలా ఎసెన్స్
C) శనగకాయ
D) లవంగ నూనె
జవాబు:
C) శనగకాయ

13. కాపర్ సల్ఫేట్, ఐరన్ సల్ఫేట్, సోడియం సల్ఫేట్ ద్రావణాలు వరుసగా X, Y, Z అని గుర్తించబడినవి. ప్రతిదానికి కొన్ని అల్యూమినియం ముక్కలు కలిపినట్లయితే ఏఏ ద్రావణాలలో మార్పు కనిపించును?
A) సోడియం క్లోరైడ్
B) బ్లీచింగ్ పౌడర్
C) సోడియం బైకార్బోనేట్
D) ప్లాస్టర్ ఆఫ్ పారిస్
జవాబు:
A) సోడియం క్లోరైడ్

AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

14. 2 మి.లీ. సల్ఫ్యూరిక్ ఆమ్లం, 10 మి.లీ. నీటికి కలిపితే కింది పరిశీలనలో ఏది నిజం?
A) ఒక పారదర్శక ద్రావణం ఏర్పడును.
B) కలిపిన వెంటనే తెల్లని అవక్షేపం ఏర్పడును.
C) రెండు వేర్వేరు పొరలుగా కనిపించును.
D) రంగు, వాసనలేని వాయువు వెలువడును.
జవాబు:
A) ఒక పారదర్శక ద్రావణం ఏర్పడును.

15. క్రింది వానిలో త్రాగు నీటిని శుభ్రపరచడానికి ఉపయోగించునది.
A) ప్లాస్టర్ ఆఫ్ పారిస్
B) వాషింగ్ సోడా
C) వంటసోడా
D) బ్లీచింగ్ పౌడర్
జవాబు:
D) బ్లీచింగ్ పౌడర్

16. అగ్నిమాపక యంత్రాలలో ఉపయోగించు రసాయనం
A) X మరియు Y
B) Y మరియు Z
C) X మరియు Z
D) X, Y మరియు Z
జవాబు:
C) X మరియు Z

మీకు తెలుసా?

లైకెన్ అనే (Lichen) మొక్క థాలో ఫైటా వర్గానికి చెందినది. దీని నుండి సేకరించిన రంజనమే (dye) లిట్మస్. ‘తటస్థ ద్రావణంలో దీని రంగు ముదురు ఊదా (Purple). హైడ్రాంజియా (Hydrangea), పిటూనియా(Petunia) మరియు జెరేనియం(Geranium) వంటి మొక్కల యొక్క రంగుపూల ఆకర్షక పత్రాలు కూడా సూచికలుగా ఉపయోగపడతాయి.

AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 15

సజల ఆమ్లాలు, క్షారాలలో H+ అయాన్ల గాఢతలో ఋణఘాతాన్ని తొలగించేందుకు సోరెన్ సెన్ pH విలువలను ప్రవేశపెట్టాడు.

1 మోల్ కంటే తక్కువ H+ అయాన్ల గాఢత గల ద్రావణాలకు ఈ pH స్కేలు పరిమితమవుతుంది.

pH వ్యాప్తి ఎలా చదవాలి?
pH స్కేలు సాధారణంగా 0 నుండి 14 వరకు వ్యాప్తి , చెంది ఉంటుంది. ఈ pH విలువ H+ అయానుల గాఢతను సూచిస్తుంది. ఉదాహరణకు pH విలువ సున్న వద్ద, హైడ్రోనియం అయాన్ గాఢత ఒక మోలార్ ఉంటుంది. నీటిలో చాలా ద్రావణాల H+ అయాన్ల గాఢత 1 M (DH = 0) నుండి 10-14 M (pH = 14) వరకు విస్తరించి ఉంటుంది.

pH స్కేలులో కొన్ని సాధారణ ద్రావణాల స్థానాలు పక్కనున్న పటంలో చూపబడినాయి.

AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 16
pH మీటర్ :
pH మీటర్ అనునది జల ద్రావణాలలో హైడ్రోజన్ అయాన్ల చర్యాశీలత ఆధారంగా ఆమ్లత్వం లేదా క్షారత్వాన్ని pH రూపంలో తెలియచేయు సాధనం. దీనిని ప్రయోగశాల స్థాయి నుండి పరిశ్రమల స్థాయి వరకు ఉపయోగిస్తున్నారు.

AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 17
ఉప్పు స్వాతంత్ర్య పోరాటానికి ఒక సంకేతం
మనం తినే ఆహారపదార్థాలకు రుచిని కలిగించే పదార్థంగా సామాన్య ఉప్పు మీకు పరిచయం. కానీ ఇది స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రజలను ప్రేరేపించడంలో ఒక గొప్ప పాత్రను పోషించింది. ఆ సామాన్య ఉప్పుపై బ్రిటిష్ ప్రభుత్వం విధించిన పన్ను ధనికులు, పేదవారు అనే భేదం లేకుండా అందరినీ ఏకం చేసి స్వాతంత్ర్య పోరాటానికి కార్యోన్ముఖులను చేసింది.

AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

మహాత్మాగాంధీ నిర్వహించిన “దండి సత్యాగ్రహ కవాతు” గురించి వినే ఉంటారు. ఇది ఉప్పు సత్యాగ్రహంగా పిలవబడుతూ స్వాతంత్ర్య సంగ్రామంలో ఒక ముఖ్య ఘట్టంగా నిలిచింది.

AP 10th Class Physical Science Important Questions 10th Lesson విద్యుదయస్కాంతత్వం

These AP 10th Class Physics Chapter Wise Important Questions 10th Lesson విద్యుదయస్కాంతత్వం will help students prepare well for the exams.

AP Board 10th Class Physical Science 10th Lesson Important Questions and Answers విద్యుదయస్కాంతత్వం

10th Class Physics 10th Lesson విద్యుదయస్కాంతత్వం 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
విద్యుత్ ప్రవాహం గల తీగను అయస్కాంత క్షేత్రంలో ఉంచినపుడు ఏం జరుగుతుంది?
జవాబు:
సందర్భం – 1 :
విద్యుత్ ప్రవాహం గల తీగను క్షేత్ర దిశకు లంబంగా గాని, కొంత కోణంతో గాని ఉంచినపుడు :
విద్యుత్ ప్రవాహం గల తీగపై అయస్కాంత క్షేత్రం బలాన్ని ప్రయోగిస్తుంది. (లేక) విద్యుత్ ప్రవాహం గల తీగపై అయస్కాంత క్షేత్రం బలాన్ని ప్రయోగించడం వలన ఆ తీగ బల దిశలో వంగుతుంది.

సందర్భం – 2 :
విద్యుత్ ప్రవాహం గల తీగను క్షేత్రదిశకు సమాంతరంగా ఉంచినపుడు :
తీగపై ఎటువంటి బలమూ ప్రయోగింపబడదు.

ప్రశ్న 2.
దండాయస్కాంత క్షేత్ర బలరేఖలను చూపు పటం గీయుము.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 1

ప్రశ్న 3.
ఇచ్చిన పటాన్ని లెంజ్ నియమానికి అనుగుణంగా సరిచేసి గీయండి.
AP 10th Class Physical Science Important Questions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 1
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 2

ప్రశ్న 4.
విద్యుత్, అయస్కాంతత్వం మధ్య సంబంధం ఉందని తెలిపే ఆయిర్ స్టెడ్ ప్రయోగాన్ని వివరించుము.
జవాబు:
అయస్కాంత దిక్సూచిని ఒక తీగ కింద ఉంచి, ఆ తీగ గుండా విద్యుత్ ప్రవాహాన్ని పంపితే, అయస్కాంత దిక్సూచిలోని సూచిక కదలడం గమనించవచ్చు. ఈ దృగ్విషయం ద్వారా విద్యుత్, అయస్కాంతత్వం మధ్య పరస్పర సంబంధం ఉందని గమనించవచ్చు.

ప్రశ్న 5.
AC విద్యుత్ మోటార్ లో స్లిప్-రింగ్ ఉపయోగం ఏమిటి?
జవాబు:
తీగ చుట్టలో విద్యుత్ ప్రవాహ దిశను నిరంతరంగా మార్చుటకు స్లిప్ – రింగ్లు ఉపయోగపడతాయి.

AP 10th Class Physical Science Important Questions 10th Lesson విద్యుదయస్కాంతత్వం

ప్రశ్న 6.
క్షేత్రం అనగానేమి?
జవాబు:
ఒక పదార్థం దాని చుట్టూ ఎంత ప్రదేశం మేరకు ఉన్న ఇతర పదార్థాలపై బలాన్ని ప్రయోగించగలదో ఆ ప్రదేశాన్ని ఆ పదార్థం యొక్క ‘క్షేత్రం’ అంటాం.

ప్రశ్న 7.
క్షేత్రానికి గల లక్షణాలేమిటి?
జవాబు:
క్షేత్రానికి రెండు లక్షణాలు కలవు. అవి :
i) క్షేత్రదిశ
ii) క్షేత్రబలం.

ప్రశ్న 8.
అసమక్షేత్రం అంటే ఏమిటి?
జవాబు:
ఏ క్షేత్రం యొక్క బలం, దిశలలో ఏదైనా ఒకటి బిందువు, బిందువుకు మారుతుందో దానిని అసమక్షేత్రం అంటారు.

ప్రశ్న 9.
సమక్షేత్రం అంటే ఏమిటి?
జవాబు:
ఏ క్షేత్రం యొక్క క్షేత్ర బలం, దిశ రెండూ స్థిరంగా ఉంటాయో దానిని సమక్షేత్రం అంటారు.

ప్రశ్న 10.
బలరేఖలంటే ఏమిటి?
జవాబు:
ఒక దండాయస్కాంతానికి బాహ్యంగా ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువానికి వెళ్ళునట్లుగా కన్పించే ఊహాత్మక రేఖలను బలరేఖలంటారు.

ప్రశ్న 11.
అయస్కాంత అభివాహం అంటే ఏమిటి?
జవాబు:
క్షేత్రానికి లంబంగా A వైశాల్యం గల తలం గుండా వెళ్ళే బలరేఖల సంఖ్యను అయస్కాంత అభివాహం అంటారు. దీనిని ‘Φ’ తో సూచిస్తాము.

ప్రశ్న 12.
అయస్కాంత అభివాహసాంద్రత అంటే ఏమిటి? (లేదా) అయస్కాంత క్షేత్ర ప్రేరణను నిర్వచించుము.
జవాబు:
క్షేత్రానికి లంబంగా ఉన్న ప్రమాణ వైశాల్యం గల తలం గుండా వెళ్ళే అయస్కాంత అభివాహాన్ని అయస్కాంత అభివాహ సాంద్రత లేదా క్షేత్రప్రేరణ అంటారు. దీనిని ‘B’ తో సూచిస్తారు.

ప్రశ్న 13.
అయస్కాంత అభివాహానికి, అభివాహ సాంద్రతకు గల ప్రమాణాలను రాయుము.
జవాబు:
S.I. పద్ధతిలో అయస్కాంత అభివాహానికి ప్రమాణం వెబర్. అభివాహ’ సాంద్రతకు ప్రమాణం వెబర్ / మీటర్². దీనినే టెస్లా అని పిలుస్తారు.

ప్రశ్న 14.
కుడిచేతి బొటనవేలు నిబంధనను రాయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 3
విద్యుత్ ప్రవహించే తీగను మీ కుడిచేతితో పట్టుకున్నట్లుగా భావించిన, బొటనవేలు దిశలో విద్యుత్ ప్రవాహదిశ ఉంటే తీగచుట్టూ ఉన్న మిగతా వేళ్లు అయస్కాంత క్షేత్ర దిశను సూచిస్తాయి.

ప్రశ్న 15.
అయస్కాంత క్షేత్ర దిశకు సమాంతరంగా కదిలే ఆవేశంపై పనిచేసే అయస్కాంత బలం ఎంత?
జవాబు:
అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా ఒక ఆవేశం కదిలితే అయస్కాంత బలం విలువ శూన్యమగును.

ప్రశ్న 16.
విద్యుత్ ప్రవహించే తీగను అయస్కాంత క్షేత్రంలో ఉంచిన ఏం జరుగును?
జవాబు:
అయస్కాంత క్షేత్రంలో ఉంచిన విద్యుత్ ప్రవాహ తీగ, అయస్కాంత బలానికి లోనవుతుంది.

AP 10th Class Physical Science Important Questions 10th Lesson విద్యుదయస్కాంతత్వం

ప్రశ్న 17.
విద్యుదయస్కాంత ప్రేరణ అనగానేమి?
జవాబు:
వలయంలో విద్యుత్ జనకం లేకుండా మారుతున్న అయస్కాంత క్షేత్రం నుండి విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేసే ప్రక్రియను విద్యుదయస్కాంత ప్రేరణ అంటారు.

ప్రశ్న 18.
ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ నియమాన్ని తెల్పుము.
జవాబు:
ఒక సంవృత వలయంలో ఏర్పడ్డ విద్యుచ్ఛాలక బలం యొక్క విలువ దాని గుండా పోయే అయస్కాంత అభివాహపు మార్పు రేటుకు సమానం.

ప్రశ్న 19.
ఒక వాహకం ద్వారా కరెంటును ప్రవహింపజేసిన అది ఎలా పనిచేస్తుంది?
జవాబు:
ఒక వాహకం ద్వారా కరెంటును ప్రవహింపజేసిన అది అయస్కాంతము వలె పనిచేస్తుంది.

ప్రశ్న 20.
లెంజ్ నియమమును రాయుము.
జవాబు:
వలయంలో ప్రేరిత విద్యుత్ ప్రవాహము దానిని ఉత్పత్తి చేయడానికి అవసరమైన మార్పుని వ్యతిరేకించే దిశలో కన్పిస్తుంది.

ప్రశ్న 21.
ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ షరతును రాయుము.
జవాబు:
విద్యుత్ వాహకము సమ అయస్కాంత క్షేత్రంలో కదిలినపుడే ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ నియమం వర్తిస్తుంది.

ప్రశ్న 22.
విద్యుత్ ప్రవాహం గల రాగి తీగలో అయస్కాంత క్షేత్రముంటుందని ప్రతిపాదించినది ఎవరు?
జవాబు:
విద్యుత్ ప్రవాహం గల రాగి తీగలో అయస్కాంత క్షేత్రముంటుందని ‘హేన్స్ క్రిస్టియన్ ఆయిర్ స్టెడ్’ ప్రతిపాదించాడు.

ప్రశ్న 23.
‘విద్యుత్ ప్రవాహం గల తీగ వద్ద అయస్కాంత సూచిని ఉంచినపుడు ఏం జరుగుతుంది? ఎందుకు?
జవాబు:
విద్యుత్ ప్రవాహం గల తీగ వద్ద అయస్కాంత సూచిని ఉంచినపుడు, ఆ తీగచుట్టూ వున్న అయస్కాంత క్షేత్ర ప్రభావం వలన సూచి అపవర్తనం చెందుతుంది.

ప్రశ్న 24.
అయస్కాంత బలరేఖల దిశ ఏది?
జవాబు:
అయస్కాంత బలరేఖలు అయస్కాంత ఉత్తర ధృవం వద్ద బయలుదేరి దక్షిణ దృవం ద్వారా అయస్కాంతంలోకి ప్రవేశించే ఆ ఊహాత్మక రేఖలు.

AP 10th Class Physical Science Important Questions 10th Lesson విద్యుదయస్కాంతత్వం

ప్రశ్న 25.
అయస్కాంత బలరేఖల ఉపయోగమేమి?
జవాబు:
అయస్కాంత బలరేఖల వల్ల రెండు ఉపయోగాలు ఉన్నాయి. అవి :

  1. అయస్కాంత క్షేత్ర స్వభావం తెలుసుకోవచ్చు.
  2. బలరేఖకు ఏదైనా బిందువు వద్ద గీయబడిన స్పర్శరేఖ, ఆ బిందువు వద్ద అయస్కాంత క్షేత్ర దిశను తెలియజేస్తుంది.

ప్రశ్న 26.
A వైశాల్యం గల తలం గుండా ‘θ’ కోణం చేస్తూ వెళ్ళే అయస్కాంత అభివాహమునకు సూత్రం రాయుము.
జవాబు:
Φ = BA cos θ.

ప్రశ్న 27.
క్షేత్రానికి లంబంగా ఉన్న ఏకాంక వైశాల్యం గుండా అభివాహం ఎంత?
జవాబు:
\(B=\frac{\phi}{A}\)

ప్రశ్న 28.
కరెంటు ప్రవహించే తీగచుట్ట లేదా సోలినాయిడ్ వల్ల ఏర్పడిన అయస్కాంత క్షేత్ర దిశను ఎలా కనుగొంటారు?
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 4
కుడిచేతి బొటనవేలి నియమం :
విద్యుత్ ప్రవాహదిశలో మీ చేతివేళ్ళను ముడిస్తే బొటనవేలు దిశ అయస్కాంత క్షేత్ర దిశను సూచిస్తుంది.

ప్రశ్న 29.
అయస్కాంత క్షేత్రానికి కొంత కోణం (θ) చేస్తూ ‘V’ వేగంతో కదిలే ఆవేశంపై పనిచేసే అయస్కాంత బలం ఎంత?
జవాబు:
F = qVB sin θ.

ప్రశ్న 30.
అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా కదిలే ఆవేశంపై పనిచేసే అయస్కాంత బలం ఎంత?
జవాబు:
ఏ బలమూ పనిచేయదు.

ప్రశ్న 31.
కదిలే ఆవేశంపై పనిచేసే అయస్కాంత క్షేత్ర దిశను ఎలా కనుగొంటారు?
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 5
పటంలో చూపిన విధంగా కుడిచేతి చూపుడువేలు, బొటనవేలు, మధ్య వేలు, ఒకదానికొకటి పరస్పరం లంబంగా వుంచితే, చూపుడువేలు ఆవేశ వేగదిశను, మధ్య వేలు క్షేత్రం (B) దిశను సూచిస్తే బొటనవేలు బలం (F) దిశను సూచిస్తుంది.

ప్రశ్న 32.
విద్యుత్ ప్రవాహం కలిగిన తీగను అయస్కాంత క్షేత్రంలో క్షేత్ర దిశకు లంబంగా ఉంచితే ఏం జరుగుతుంది?
జవాబు:
అయస్కాంత క్షేత్ర దిశకు లంబంగా అయస్కాంత క్షేత్రంలో విద్యుత్ ప్రవాహం కలిగిన తీగను ఉంచితే అది F= IlB కి సమానమైన అయస్కాంత బలానికి లోనౌతుంది.

ప్రశ్న 33.
విద్యుత్ మోటారు పని చేసే నియమం ఏమిటి?
జవాబు:
అయస్కాంత క్షేత్రంలో ఉంచబడిన విద్యుత్ ప్రవాహం గల తీగచుట్టపై ప్రయోగించబడిన బలం ఆధారంగా విద్యుత్ మోటారు పని చేస్తుంది. మోటారు విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది.

ప్రశ్న 34.
ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ నియమం రాయుము.
జవాబు:
తీగ చుట్టలో అయస్కాంత అభివాహాన్ని నిరంతరంగా మారుస్తూ ఉంటే ఆ తీగ చుట్టలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది.

ప్రశ్న 35.
అయస్కాంత అభివాహంలో మార్పుకు, ప్రేరిత విద్యుచ్ఛాలక బలానికి మధ్య సంబంధమేమిటి?
జవాబు:
ఒక సంవృత ఉచ్చులో ఏర్పడ్డ విద్యుచ్ఛాలక బలం యొక్క విలువ దాని గుండా పోయే అయస్కాంత అభివాహ మార్పురేటుకు సమానం.

ప్రశ్న 36.
మెటల్ డిటెక్టర్ ఎలా పనిచేస్తుంది?
జవాబు:

  1. సెక్యూరిటీ చెకింగ్ కోసం ఏర్పాటు చేసే పెద్ద ద్వారంలో ఒక పెద్ద తీగ చుట్టను ఉంచుతారు. అది బలహీనమైన, సహజ అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది.
  2. మనం ఏదైనా ఇనుములాంటి అయస్కాంత క్షేత్ర ప్రభావిత వస్తువును ఆ ద్వారం గుండా తీసుకొని వెళితే తీగచుట్ట యొక్క అయస్కాంత క్షేత్ర అభివాహంలో మార్పు ఏర్పడి, విద్యుత్ ప్రవాహం ఉద్భవించడం వల్ల అలారం మోగుతూ హెచ్చరిస్తుంది.

ప్రశ్న 37.
విద్యుచ్ఛక్తికి, అయస్కాంతతత్వానికి మధ్య గల సంబంధాన్ని మొదట ప్రదర్శించిన శాస్త్రవేత్త ఎవరు?
జవాబు:
H.C. ఆయిర్ స్టెడ్

ప్రశ్న 38.
అయస్కాంత క్షేత్రము దేనిపై ఆధారపడును?
జవాబు:
అయస్కాంత క్షేత్రము దాని గుండా ప్రవహించే విద్యుత్ పై ఆధారపడును.

AP 10th Class Physical Science Important Questions 10th Lesson విద్యుదయస్కాంతత్వం

ప్రశ్న 39.
సరిత ఒక పుస్తకంలో ఈ క్రింది విషయాన్ని చదివింది.
“ఒక తీగచుట్టలో జనించే ప్రేరిత విద్యుచ్ఛాలక బలం ఆ తీగచుట్ట నిరోధంపై ఆధారపడదు”.
పై సమాచారం సరైనదని నీవెలా విశ్లేషిస్తూ, నిరూపిస్తావు?
జవాబు:
తీగచుట్టలో ఏర్పడు ప్రేరిత విద్యుచ్ఛాలక బలం, అభివాహంలో మార్పుకు అనులోమానుపాతంలో ఉండును. కాని నిరోధంపై ఆధారపడదు. కనుక సరిత చదివిన ప్రవచనము సరైనదే.

10th Class Physics 10th Lesson విద్యుదయస్కాంతత్వం 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
జనరేటర్ తయారీ వెనుక వాడిన నియమాన్ని ఆనంద్ ప్రశంసించాడు. ఆ నియమం పేరేమిటి? ఆ నియమాన్ని తెల్పండి.
జవాబు:

  1. జనరేటర్ తయారీలో ఇమిడియున్న సూత్రాన్ని ఆనంద్ అభినందించాడు.
  2. దీనిలో ఇమిడియున్న సూత్రం : ఫారడే నియమం
  3. ఫారడే నియమం : తీగ చుట్టలో అయస్కాంత అభివాహాన్ని నిరంతరంగా మారుస్తూ ఉంటే ఆ తీగచుట్టలో విద్యుత్ – ప్రవాహం ఏర్పడుతుంది.

ప్రశ్న 2.
కింది పటం సహాయంతో ఉపాధ్యాయుడు అయస్కాంత బలరేఖలు వివృతాలు కావు సంవృతాలు అని వివరించాడు. ఇది సరైనదో కాదో నిర్ధారించుకోవడానికి మీరు అడిగే ప్రశ్నలకు రాయండి.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 1
a) అయస్కాంతానికి లోపల ఏదైనా అయస్కాంత బలరేఖలు ఉన్నాయా?
b) దండాయస్కాంతం లోపల బలరేఖలున్నా, వాటిదిశ ఏమిటి?
c) అయస్కాంతముకు బాహ్యముగా బలరేఖల దిశ ఏమిటి?
d) బలరేఖల మధ్య ఖాళీస్థలం సమానముగా ఉన్నదా?
e) ధృవాల వద్ద బలరేఖలు దగ్గరగా ఉండుట వలన ఫలితమేమి?

ప్రశ్న 3.
ఉష్ణ బంధక పొర కలిగిన రాగితీగ చుట్ట గాల్వనా మీటరుతో వలయంలో కలుపబడి ఉంది. కింది సందర్భాలలో ఏం జరుగుతుందో వివరించండి.
i) ఆ తీగచుట్టలోకి ఒక దండాయస్కాంతాన్ని నెట్టినప్పుడు.
ii) ఆ తీగచుట్ట నుండి దండాయస్కాంతాన్ని బయటికి లాగినప్పుడు.
iii) దండాయస్కాంతాన్ని తీగచుట్టలో స్థిరంగా ఉంచినప్పుడు.
జవాబు:
i) గాల్వనోమీటరులో సూచిక అపవర్తనం చెందుతుంది. (లేదా) తీగచుట్టలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది.
ii) గాల్వనోమీటరులో సూచిక అపవర్తనం చెందుతుంది. (లేదా) తీగచుట్టలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది.
iii) గాల్వనోమీటరులో సూచిక అపవర్తనం చెందదు. (లేదా) తీగచుట్టలో విద్యుత్ ప్రవాహం ఏర్పడదు.

ప్రశ్న 4.
విద్యుత్ ప్రవహిస్తున్న సొలినాయిడ్ చుట్టూ ఏర్పడే అయస్కాంత క్షేత్ర బలరేఖలను, దండాయస్కాంతం చుట్టూ ఏర్పడే అయస్కాంత క్షేత్ర బలరేఖలతో పోల్చండి.
జవాబు:

దండాయస్కాంతం వలన ఏర్పడిన అయస్కాంత క్షేత్ర బలరేఖలుసొలినాయిడ్ వలన ఏర్పడిన అయస్కాంత క్షేత్ర బలరేఖలు
AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 1AP 10th Class Physical Science Important Questions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 6
2) దండాయస్కాంతం బయట బలరేఖలు దిశ ఉత్తరం నుండి దక్షిణం వైపు ఉంటుంది.2) సొలినాయిడ్ బయట బలరేఖలు దిశ ఉత్తరం నుండి దక్షిణం వైపు ఉంటుంది.
3) దండాయస్కాంతం లోపలి బలరేఖలు దిశ దక్షిణం నుండి ఉత్తరం వైపు ఉంటుంది.3) సొలినాయిడ్ లోపలి బలరేఖలు దిశ దక్షిణం నుండి ఉత్తరం వైపు ఉంటుంది.
4) దండాయస్కాంతం లోపల బలరేఖలను గుర్తించలేము.4) సొలినాయిడ్ లోపల బలరేఖలను గుర్తించగలము.
5) బలరేఖలు సంవృత వలయాలు.5) బలరేఖలు సంవృత వలయాలు.
6) దృవాల వద్ద ఎక్కువ బలరేఖలు ఉండటం వలన అయస్కాంత క్షేత్ర తీవ్రత ఎక్కువగా ఉంటుంది.6) ధృవాల వద్ద ఎక్కువ బలరేఖలు ఉండటం వలన అయస్కాంత క్షేతీవ్రత ఎక్కువగా ఉంటుంది.
7) ఈ అయస్కాంత బల రేఖలు సాలినాయిడ్ వలన ఏర్పడిన అయస్కాంత బలరేఖలను పోలి ఉంటాయి.7) ఈ అయస్కాంత బల రేఖలు దండాయస్కాంతం వలన ఏర్పడిన అయస్కాంత బలరేఖలను పోలి ఉంటాయి.

ప్రశ్న 5.
ఆయిర్ స్టెడ్ ప్రయోగం నిర్వహించుటకు కావలసిన పరికరాల జాబితా రాసి, ప్రయోగంలో తీసుకోవలసిన జాగ్రత్తలు రాయండి.
జవాబు:
ఆయిర్ స్టెడ్ ప్రయోగం కొరకు కావలసిన పరికరాలు :
బ్యాటరీ, వాహక తీగలు, స్విచ్, అయస్కాంత దిక్సూచి.

జాగ్రత్తలు :

  1. ప్రయోగ పరికరాలకు దగ్గరలో ఏ ఇతర అయస్కాంతాలు (లేదా) పనిచేస్తున్న విద్యుత్ సాధనాలను ఉంచరాదు.
  2. ప్రయోగంలోని వాహక తీగకు తగినంత దగ్గరగా దిక్సూచిని ఉంచాలి.
  3. దిక్సూచి నిశ్చలంగా ఉన్నప్పుడు మాత్రమే వలయంలో విద్యుత్ ను ప్రసరింపజేయాలి.

ప్రశ్న 6.
పటంలో చూపిన విధంగా ఒక స్ప్రింగ్ ను వ్రేలాడదీసారు. స్ప్రింగ్ రెండు చివరల మధ్య పటంలో చూపిన విధంగా బ్యాటరీ స్విచ్ ను కలిపారు. స్విచ్ ను మూసినపుడు బ్యాటరీ ఏమి జరుగుతుంది. ఊహించండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 7

  1. స్ప్రింగులో అయస్కాంత ప్రేరణ రేఖలు ఏర్పడును.
  2. ఇది సోలినాయిడ్ ను పోలి ఉన్నది.
  3. సోలినాయిడ్, దండయస్కాంతంగా ప్రవర్తించును.

ప్రశ్న 7.
ఒక పొడుగాటి కాపర్ స్థూపాకార గొట్టాన్ని తీసుకోండి. దానిని క్షితిజానికి లంబంగా ఉండేట్లు పట్టుకోండి. ఒక రాయిని, దండయస్కాంతాన్ని పటంలో చూపిన విధంగా రాయిని గొట్టం బయట, అయస్కాంతాన్ని గొట్టంగుండా చలించేట్లు రెంటిని జారవిడిచారు. రెంటిలో ఏది త్వరగా భూఉపరితలాన్ని తాకుతుంది? ఎందుకో ఊహించి చెప్పండి. సహేతుకమైన కారణాలివ్వండి.
AP 10th Class Physical Science Important Questions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 8
జవాబు:

  1. ముందుగా రాయి భూమిని చేరును.
  2. రాగి గొట్టం గుండా దండాయస్కాంతం ప్రయాణించున్నప్పుడు విద్యుదయస్కాంత ప్రేరణ ఏర్పడును. ఇది అయస్కాంత చలనంను నిరోధించును.
  3. ఇక్కడ లెంజ్ నియమమును పాటించుచున్నది.

ప్రశ్న 8.
పటంలో చూపిన విధంగా దండయస్కాంతాన్ని తీగ చుట్టవైపు కదుపుతుంటే తీగచుట్టలో ప్రేరిత విద్యుత్ జనిస్తుంది.
AP 10th Class Physical Science Important Questions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 9
a) ఆ ప్రేరిత విద్యుత్ దిశ ఎటు ఉంటుంది?
b) తీగచుట్ట వద్ద దండాయస్కాంతం వల్ల ఉండే అయస్కాంత క్షేత్రాన్ని ; ప్రేరిత విద్యుత్ వల్ల వచ్చే అయస్కాంత క్షేత్ర దిశలను గీయండి.
జవాబు:
a) ప్రేరిత, విద్యుత్ ప్రవాహదిశ దండయస్కాంత ఉత్తర ధృవంతో పోల్చినప్పుడు అపసవ్య దిశలో ఉండును.
b)
AP 10th Class Physical Science Important Questions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 10

ప్రశ్న 9.
A.C., D.C. ల మధ్య భేదాలను రెండింటిని రాయుము.
జవాబు:

ఏకాంతర విద్యుత్ (A.C.)ఏకముఖ విద్యుత్ (D.C.)
1) ఇది ప్రతి క్షణానికి తన ప్రవాహదిశను మార్చుకొను విద్యుత్.1) ఇది ప్రతి క్షణానికి తన ప్రవాహదిశను మార్చుకొనని విద్యుత్.
2) దీనిని దూరప్రాంతాలకు విద్యుత్ ను సరఫరా చేయుటకు ఉపయోగిస్తారు.2) దీనిని చిన్న చిన్న వలయాలలో విద్యుత్ ను సరఫరా చేయుటకు ఉపయోగిస్తారు.

ప్రశ్న 10.
విద్యుత్ మోటర్, జనరేటర్ మధ్య భేదాన్ని వ్రాయుము.
జవాబు:

విద్యుత్ మోటర్జనరేటర్
ఇది విద్యుత్ శక్తిని యాంత్రికశక్తిగా మార్చును.ఇది యాంత్రికశక్తిని విద్యుత్ శక్తిగా మార్చును.

ప్రశ్న 11.
A.C. జనరేటర్, D.C. జనరేటర్ మధ్య భేదాన్ని వ్రాయుము.
జవాబు:

A.C. జనరేటర్D.C. జనరేటర్
ఇది ఏకాంతర విద్యుత్ ను జనకంగా చేసుకొని పనిచేస్తుంది.ఇది ఏకముఖ విద్యుత్ ను జనకంగా చేసుకొని పనిచేస్తుంది.

AP 10th Class Physical Science Important Questions 10th Lesson విద్యుదయస్కాంతత్వం

ప్రశ్న 12.
ఉష్ణ బంధక పొర కలిగిన రాగి తీగ చుట్ట గాల్వనా మీటరుతో వలయంలో కలుపబడి ఉంది. కింది సందర్భాలలో ఏం జరుగుతుందో వివరించండి.
i) ఆ తీగచుట్టలోకి ఒక దండాయస్కాంతాన్ని నెట్టినప్పుడు.
ii) ఆ తీగచుట్ట నుండి దండాయస్కాంతాన్ని బయటికి లాగినప్పుడు.
iii) దండాయస్కాంతాన్ని తీగచుట్టలో స్థిరంగా ఉంచినప్పుడు.
జవాబు:
i) గాల్వనోమీటరులో సూచిక అపవర్తనం చెందుతుంది. (లేదా) తీగచుట్టలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది.
ii) గాల్వనోమీటరులో సూచిక అపవర్తనం చెందుతుంది. (లేదా) తీగచుట్టలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది.
iii) గాల్వనోమీటరులో సూచిక అపవర్తనం చెందదు. (లేదా) తీగచుట్టలో విద్యుత్ ప్రవాహం ఏర్పడదు.

ప్రశ్న 13.
అయస్కాంత క్షేత్రాలను ఏర్పరచు మూడు పద్ధతులను రాయండి.
జవాబు:

  1. విద్యుత్ ప్రవహిస్తున్న తిన్నని తీగ
  2. సంవృత, వృత్తాకార తీగ గుండా విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు
  3. సోలినాయిడ్ గుండా విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు.

ప్రశ్న 14.
2M పొడవు ఉన్న ఒక తీగను 1.8 T ప్రేరణ అయస్కాంత క్షేత్రంలో క్షేత్ర దిశకు లంబంగా ఉంచారు. దాని గుండా 4 ఆంపియర్ల విద్యుత్ ప్రవహిస్తుంటే దానిపై పనిచేసే బలాన్ని లెక్కించండి.
జవాబు:
తీగ పొడవు l = 2m
అయస్కాంత ప్రేరణ B = 1.8 T
విద్యుత్ ప్రవాహం I = 4 ఆంపియర్లు
పనిచేసే బలం F = Bil = 1.8 × 4 × 2 = 14.4 N ∴ F = 14.4N

ప్రశ్న 15.
పటంలో చూపినట్లు దండాయస్కాంతం, తీగచుట్ట ఒకే దిశలో కదులుతూ ఉంటే ఏమి జరుగుతుందో రాయండి.
AP 10th Class Physical Science Important Questions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 11
జవాబు:

  1. ఫారడే నియమం ప్రకారం, తీగచుట్ట మరియు అయస్కాంతాల మధ్య సాపేక్ష చలనం కారణంగా తీగచుట్టలో అయస్కాంత అభివాహాన్ని నిరంతరం మారుస్తూ ఉంటే ఆ తీగచుట్టలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది.
  2. ఇక్కడ, పటంలో చూపినట్లు, తీగచుట్ట మరియు దండాయస్కాంతం రెండూ ఒకే దిశలో కదులుతున్నాయి. కనుక, వాటి వేగాలు సమానమయితే తీగచుట్టలో అయస్కాంత అభివాహంలో మార్పు లేనందువల్ల తీగచుట్టలో విద్యుత్ ప్రవాహం ఏర్పడదు.
  3. అయస్కాంతం, తీగచుట్ట వేగాలు సమానం కాకపోతే తీగచుట్ట అయస్కాంతం యొక్క క్షేత్రంలో ఉన్నంతవరకు తీగచుట్టలోని అభివాహంలో మార్పు ఉంటుంది. కనుక తీగచుట్టలో విద్యుత్ ప్రేరేపింపబడుతుంది.

10th Class Physics 10th Lesson విద్యుదయస్కాంతత్వం 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
a) కుడిచేతి సూత్రాన్ని పటం గీసి, వివరించండి.
b) ఉష్ణ బంధక పొర కలిగిన రాగి తీగ చుట్ట గాల్వనా మీటరుతో వలయంలో కలుపబడి ఉంది. కింది సందర్భాలలో ఏం జరుగుతుందో వివరించండి.
i) ఆ తీగచుట్టలోకి. ఒక దండాయస్కాంతాన్ని నెట్టినప్పుడు.
ii) ఆ తీగచుట్ట నుండి దండాయస్కాంతాన్ని బయటికి లాగినప్పుడు.
iii) దండాయస్కాంతాన్ని తీగచుట్టలో స్థిరంగా ఉంచినప్పుడు.
జవాబు:
a) కదిలే ఆవేశంపై అయస్కాంత బలదిశ ఏ విధంగా ఉంటుందో కుడిచేతి నిబంధన తెలియజేస్తుంది.
AP 10th Class Physical Science Important Questions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 5 AP 10th Class Physical Science Important Questions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 12

కుడిచేతి బొటనవేలు, చూపుడు వేలు, మధ్యవేలును ఒకదానికొకటి పరస్పరం లంబంగా ఉంచితే… చూపుడు వేలు ఆవేశవేగదిశ లేదా విద్యుత్ ప్రవాహం (i) దిశను మధ్యవేలు క్షేత్రం (B) దిశను, బొటనవేలు బలం (F) దిశను సంబంధించిన కుడిచేతి నియమం సూచిస్తుంది.

b) i) గాల్వనోమీటరులో సూచిక అపవర్తనం చెందుతుంది. (లేదా) తీగచుట్టలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది.
ii) గాల్వనోమీటరులో సూచిక అపవర్తనం చెందుతుంది. (లేదా) తీగచుట్టలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది.
iii) గాల్వనోమీటరులో సూచిక అపవర్తనం చెందదు. (లేదా) తీగచుట్టలో విద్యుత్ ప్రవాహం ఏర్పడదు.

ప్రశ్న 2.
విద్యుదయస్కాంతత్వంనకు సంబంధించిన ఆయిర్ స్టడ్ ప్రయోగానికి కావలసిన పరికరాల జాబితా రాయండి. ప్రయోగ విధానాన్ని తెల్పండి. ఈ ప్రయోగం ద్వారా మీరు ఏం అవగాహన చేసుకున్నారు?
జవాబు:
ఆయిర్ స్టెడ్ ప్రయోగానికి కావలసిన పరికరముల జాబితా :
బ్యాటరీలు (2), స్విచ్, 24 గేజ్ రాగి తీగ, థర్మాకోల్ షీట్, కర్రముక్కలు 2, అయస్కాంత సూచి.

ప్రయోగ విధానం :
ఒక థర్మాకోల్ షీట్ పై 1 సెం.మీ. ఎత్తున్న రెండు సన్నని కర్ర ముక్కల్ని అమర్చి, ఆ కర్రముక్కల . , గుండా 24 గేజ్ రాగి తీగను పంపి, ఆ తీగకు బ్యాటరీలు, స్విచ్ అమర్చాలి. కర్రముక్కలపై గల రాగితీగ క్రింద ఒక అయస్కాంత సూచిని ఉంచాలి.

ఇప్పుడు స్విచ్ సహాయంతో వలయంలో విద్యుత్ ను ప్రవహింపజేసి అయస్కాంత సూచిలో అపవర్తనాన్ని గమనించాలి. వలయంలో విద్యుత్ ప్రవాహ దిశను మార్చి, అయస్కాంత సూచిలో అపవర్తనాన్ని గమనించాలి.

నిర్ధారణ :

  1. విద్యుత్ ప్రవహిస్తున్న తీగ చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని అర్థం చేసుకున్నాను. (అయస్కాంత సూచి అపవర్తనం వల్ల)
  2. విద్యుత్ ప్రవాహదిశను మార్చినప్పుడు అయస్కాంత సూచి అపవర్తన దిశలో కూడా మార్పు వస్తుంది.

ప్రశ్న 3.
సోలినాయిడ్ లో అయస్కాంత క్షేత్రం ఏర్పరచుటకు చేయు ప్రయోగ విధానం, పరిశీలనలు రాయుము.
జవాబు:

  • ఒక చెక్క పీటను తీసుకొని దానికి ఒక తెల్ల కాగితమును అంటించాలి.
  • ఆ చెక్క పీటపై కొంత దూరంలో రెండు రంధ్రాలు చేయాలి.
  • వీటికి సమాంతరంగా సమాన దూరంలో మరికొన్ని రంధ్రాలు చేయాలి.
  • ఆ రంధ్రాల గుండా రాగి తీగను పంపాలి.
  • ఇది ఒక తీగచుట్ట వలే ఉంటుంది. తీగచుట్ట చివరలను స్విచ్, బ్యాటరీలతో వలయంలో శ్రేణిలో కలపాలి.
  • స్విచ్ వేయగానే తీగ గుండా విద్యుత్ ప్రవహిస్తుంది. ఆ తీగ చుట్టూ కొంత ఇనుప రజను చల్లి చక్కపీటను మెల్లగా తట్టాలి.

పరిశీలన :
ఇనుప రజను ఒక క్రమ పద్ధతిలో అమరుతుంది. ఇది దండయస్కాంత బలరేఖలను పోలి ఉంటుంది.

ప్రశ్న 4.
ఒక ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో క్షేత్రదిశకు లంబంగా ఉంచిన విద్యుత్ ప్రవాహం గల తీగ పక్కకు వంగుటకు కారణాన్ని ఆ తీగపై పనిచేసే బలాల దిశలను చూపే పటంతో వివరించండి.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 12

వివరణ :
రెండు అయస్కాంత క్షేత్రాల ఫలితంగా ఏర్పడిన అయస్కాంత క్షేత్రంలో ఒక వైపున బలరేఖలు దట్టంగానూ, మరోవైపు పలుచగానూ ఉంటాయి. బలరేఖలు దట్టంగా ఉన్నవైపు నుండి పలుచగా ఉన్న వైపుకు బలం ప్రయోగింపబడు తుంది. కనుక విద్యుత్ ప్రవాహ తీగ ఒకవైపుగా నెట్టబడుతుంది.

ప్రశ్న 5.
ఇచ్చిన పటమును పరిశీలించి, క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 8
1) ఇచ్చిన పట సమాచారము ఏ సాధనము పని తీరును తెలియజేస్తుంది?
జవాబు:
విద్యుత్ మోటార్. 2) అయస్కాంత క్షేత్రంలో AB మరియు CD లు చేసే కోణం?
జవాబు:
AB, CD లు అయస్కాంత క్షేత్ర దిశకు లంబంగా ఉన్నాయి / 90° కోణం చేస్తున్నాయి.

3) AB మరియు CD భుజాలపై పనిచేసే అయస్కాంత బల దిశ ఏ విధంగా ఉంటుంది?
జవాబు:
AB భుజంపై బలం అయస్కాంతబల రేఖలకు లంబంగా పేజీ లోపలికి పని చేస్తుంది.
CD భుజంపై బలం అయస్కాంత బలరేఖలకు లంబంగా పేజీకి వెలుపలికి పనిచేస్తుంది.

4) దీర్ఘ చతురస్రాకార తీగచుట్టపై పనిచేసే ఫలిత బలం ఎంత?
జవాబు:
ఫలిత బలం శూన్యం.

ప్రశ్న 6.
ఏ పరికరంతో గతిజశక్తిని విద్యుత్ శక్తిగా మార్చవచ్చును? ఆ పరికరం యొక్క చక్కని పటాన్ని గీయండి. భాగాలు గుర్తించండి.
జవాబు:
AC జనరేటర్ (లేదా) DC జనరేటర్ తో గతిజ శక్తిని, విద్యుత్ శక్తిగా మార్చవచ్చును.
AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 14 (లేదా) AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 16

ప్రశ్న 7.
ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో ఉంచబడిన విద్యుత్ ప్రవహిస్తున్న తీగపై కలగజేయబడే బలాన్ని గమనించుటకు అవసరమయ్యే ప్రయోగంలో వాడే పరికరాలను తెలిపి, ప్రయోగ విధానం వివరించండి.
జవాబు:
కావలసిన పరికరాలు :
1) గుర్రపునాడా అయస్కాంతం,
2) వాహక తీగ,
3) బ్యాటరీ, స్విచ్

ప్రయోగ విధానం :
1) ఒక చెక్కదిమ్మెపై చీలికలుగల రెండు కర్రపుల్లలను బిగుతుగా నిలబెట్టి వాటి ద్వారా వాహక తీగను పంపుతూ బ్యాటరీ, స్విచ్ తో వలయాన్ని ఏర్పాటు చేయాలి.

2) కర్రపుల్లల మధ్య గల వాహక తీగ గుర్రపునాడా అయస్కాంతపు రెండు ధృవాల మధ్య ఉండేటట్లుగా గుర్రపునాడా అయస్కాంతాన్ని స్థిరంగా అమర్చాలి.

3) వలయంలో విద్యుత్ ను ప్రవహింపజేస్తే వాహక తీగ పైకి లేదా కిందికి కదలడం గమనించవచ్చు.
4)
AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 11

ప్రశ్న 8.
ఇండక్షన్ స్టా పనిచేయు విధానమును వివరించండి.
జవాబు:

  1. ఇండక్షన్ స్టవ్ విద్యుదయస్కాంత ప్రేరణ నియమంపై ఆధారపడి పనిచేయును.
  2. స్టవ్ ఉపరితలానికి కింద దానికి ఆనుకొని ఒక లోహపు చుట్ట ఉంటుంది.
  3. దీనిలో AC విద్యుత్ ప్రవహింపజేస్తే దాని చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది.
  4. ఒక లోహపాత్రలో నీరు పోసి స్టవ్ పై ఉంచితే దాని అడుగుభాగంలో ఉన్న అయాస్కాంత క్షేత్రం పాత్ర అడుగు భాగాన్ని దాటడం వల్ల పాత్రపై విద్యుచ్చాలక బలం ప్రేరితమవుతుంది.
  5. పాత్ర లోహంతో తయారు చేసినది కావడం వలన ప్రేరిత EMF పాత్రలో ప్రేరిత విద్యుత్ ను జనింపజేస్తుంది.
  6. పాత్రకు నియమిత నిరోధం ఉంటుంది.
  7. అందువలన ప్రవహిస్తున్న విద్యుత్ వల్ల ఉష్ణం జనిస్తుంది.
  8. ఆ జనించిన ఉష్ణం నీటికి అందజేయబడుతుంది. పాత్రలో పదార్థం వేడి అగును. ఈ విధంగా ఇండక్షన్ స్టా పనిచేయును.

AP 10th Class Physical Science Important Questions 10th Lesson విద్యుదయస్కాంతత్వం

ప్రశ్న 9.
పటంలో చూపిన విధంగా ఒక వృత్తాకార తీగచుట్టను వ్రేలాడదీసారు. ఒక దండాయస్కాంతాన్ని తీగచుట్ట తలానికి లంబంగా, తీగచుట్టవైపు దాని ఉత్తర ధృవం కదిలిస్తున్నారు.
AP 10th Class Physical Science Important Questions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 13
a) తీగచుట్ట గుండా పోయే అభివాహంలో మార్పు ఏ విధంగా ఉంటుంది?
b) తీగచుట్టలో ప్రేరితమయ్యే విద్యుత్ ప్రవాహ దిశ దండాయస్కాంత పరంగా ఏ దిశలో ఉంటుందో తెల్పండి?
c) తీగచుట్ట తలం వద్ద దండాయస్కాంతం వల్ల ఏర్పడే అయస్కాంత క్షేత్రం, ప్రేరిత విద్యుత్ వల్ల ఏర్పడే అయస్కాంత క్షేత్రాలను చూపే పటాన్ని గీయండి.
d) ప్రేరిత విద్యుత్ కు కారణాన్ని వివరించండి.
జవాబు:
a) ఒక దండాయస్కాంతాన్ని తీగచుట్ట తలానికి లంబంగా తీగచుట్ట వైపు దాని ఉత్తర ధృవం కదిలించిన, చుట్టలో ఏర్పడిన అభివాహం విలువ పెరుగును.
b) తీగచుట్టలో ప్రేరితమయ్యే విద్యుత్ ప్రవాహ దిశ, దండాయస్కాంత పరంగా అపసవ్య దిశలో ఉంటుంది. దీనికి కారణం ఉత్తర ధృవ ఫలితమే.
AP 10th Class Physical Science Important Questions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 14
d) తీగచుట్టలో ప్రేరిత విద్యుత్ కు కారణం దాని గుండా ప్రయాణించే అభివాహం మారడమే.

ప్రశ్న 10.
పటంలో చూపిన విధంగా ” పొడవు గల వాహకం దాని పొడవుకు లంబంగా v అనే వడితో చలిస్తుంది. వాహకం అయస్కాంత క్షేత్రం B కు లంబంగా వాహక పొడవు వుంది. వాహకంలో ఎలక్ట్రానులు స్వేచ్ఛగా చలించగలవని భావిద్దాం. ఎలక్ట్రాను ఆవేశం ‘e’ అనుకుందాం.
AP 10th Class Physical Science Important Questions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 15
a) వాహకంలో గల ఎలక్ట్రాన్ పై పని చేసే అయస్కాంతబలం ఎంత?
b) పై బలం ఏ దిశలో పనిచేస్తుంది?
c) ఈ బలం ఎలక్ట్రాన్ల చలనంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది?
జవాబు:
a) వాహకంలో గల ఎలక్ట్రాన్ పై పని చేయు అయస్కాంత బలము = \(\mathrm{F}_{\mathrm{m}}=\mathrm{e}(\overline{\mathrm{V}} \times \overline{\mathrm{B}})=\mathrm{BeV}\)
ఈ బలం పై నుండి క్రిందికి పనిచేయును.
AP 10th Class Physical Science Important Questions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 16
b) వాహకపు కొనలు P మరియు Qగా ఊహించుము. ‘Q’ ఋణాత్మక కొనగా మరియు ‘P’ ధనాత్మక కొనగా లెక్కించిన, ఆవేశము P నుండి Q కు క్రిందకు ప్రవహించును.
c) ఈ అయస్కాంత బలం ఎలక్ట్రాన్ చలనంపై విద్యుచ్ఛాలక బలంను వాహకం యొక్క కొనల వద్ద ఏర్పరచును.
∴ BeV = eE= E = BV

ప్రశ్న 11.
అయస్కాంతబలరేఖలు సంవృత వలయాలవలే ఉంటాయని ప్రయోగపూర్వకంగా నిరూపించాలంటే ఏ ఏ పరికరాలు కావాలి? ఈ సమయంలో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి?
జవాబు:
ఉద్దేశం :
అయస్కాంత బలరేఖలు సంవృత వలయాలు అని చూపడం.

పరికరాలు :
ఒక చదునైన బల్ల, తెల్లని కాగితం, దండాయస్కాంతం, అయస్కాంత సూచిక.
AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 1

విధానం :

  1. ఒక తెల్ల కాగితాన్ని బల్లపై ఉంచండి. ఆ కాగితం మధ్యలో ఒక అయస్కాంత దిక్సూచిని ఉంచి, సూచిక రెండు కొనలను సూచించే రెండు బిందువులను గుర్తించండి.
  2. ఇప్పుడు ఆ దిక్సూచిని తీసి, గుర్తించిన రెండు బిందువులను కలుపుతూ ఒక సరళరేఖను గీయండి.
  3. అది ఉత్తర-దక్షిణ దిక్కులను సూచిస్తుంది. ఆ రేఖ పై ఒక దండాయస్కాంతాన్ని దాని ఉత్తర ధృవం భూమి ఉత్తర దిక్కువైపు అయస్కాంత బలరేఖలు సూచించేటట్లు అమర్చండి.
  4. ఇప్పుడు దండాయస్కాంత ఉత్తర ధృవానికి దగ్గరగా అయస్కాంత దిక్సూచిని ఉంచండి.
  5. సూచిక నిలకడగా ఉన్న తరువాత దాని ఉత్తర దిశను సూచించే విధంగా కాగితంపై ఒక బిందువును గుర్తించండి.
  6. దిక్సూచిని అక్కడి నుండి తీసి గుర్తించిన బిందువు వద్ద ఉంచండి. సూచిక మరో దిశను సూచిస్తుంది.
  7. మరలా సూచిక ఉత్తర దిశను సూచించే విధంగా వేరొక బిందువును గుర్తించండి.
  8. ఇదే విధంగా దిక్సూచి దండాయస్కాంత దక్షిణ ధృవానికి చేరే వరకు చేయండి.
  9. ఇప్పుడు దండాయస్కాంత ఉత్తర ధృవం నుంచి దక్షిణ ధృవం వరకు మీరు గుర్తించిన బిందువులన్నీ కలపండి. అలా కలపగా ఒక వక్రరేఖ ఏర్పడుతుంది.
  10. ఇప్పుడు దండాయస్కాంత ఉత్తర ధృవం వద్ద మరో బిందువును ఎంచుకోండి.
  11. ఈ విధంగా దండాయస్కాంత ఉత్తర ధృవం వద్ద వివిధ బిందువులతో ఆరంభించి పైన చెప్పిన విధంగా రేఖలు గీయండి. పటంలో చూపిన విధంగా అనేక వక్రాలు ఏర్పడడం గుర్తించవచ్చు.

ప్రశ్న 12.
విద్యుదయస్కాంత ప్రేరణకు శక్తి నిత్యత్వ నియమాన్ని ఎలా అన్వయిస్తారు?
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 10

  1. ఒక దండయస్కాంత ఉత్తరధృవం, తీగచుట్టకు అభిముఖంగా ఉండేటట్లుగా కదిపితే, ఆ తీగచుట్టలో ప్రేరిత విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది.
  2. అయస్కాంత ఉత్తరధృవం, తీగచుట్టలో ఉత్తర ధృవాన్ని ప్రేరేపించడం వలన, తీగ చుట్టకు, అయస్కాంతానికి మధ్య వికర్షణ బలం ఏర్పడుతుంది.
  3. దీనిని అధిగమించడానికి మనం కొంత పనిచేయాలి.
  4. అయస్కాంతంపై మనం చేసిన పని విద్యుచ్ఛక్తిగా మారుతుంది. ఫలితంగా, అయస్కాంత ఉత్తర ధృవానికి అపసవ్య దిశలో విద్యుత్తు ప్రేరేపించబడుతుంది.
  5. ఈ విధంగా విద్యుదయస్కాంత ప్రేరణలో శక్తి నిత్యత్వం జరుగుతుంది.

ప్రశ్న 13.
ఇండక్షన్ స్టవ్ పనిచేసే విధానాన్ని వివరించుము.
జవాబు:

  1. ఇండక్షన్ స్టవ్ విద్యుదయస్కాంత ప్రేరణ నియమంపై ఆధారపడి పనిచేస్తుంది.
  2. స్టవ్ ఉపరితలానికి కింద దానిని ఆనుకొని ఒక లోహపు చుట్ట వుంటుంది. దీనిలో AC విద్యుతను ప్రవహింపజేస్తే దానిచుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది.
  3. ఒక లోహపాత్రలో నీరుపోసి స్టవ్ పై ఉంచితే దాని అడుగుభాగంలోనున్న అయస్కాంత క్షేత్రం పాత్ర అడుగుభాగాన్ని దాటడం వల్ల పాత్రపై విద్యుచ్ఛాలక బలం ప్రేరేపితమౌతుంది.
  4. పాత్ర లోహంతో తయారైనది కావడం వల్ల ప్రేరిత emf పాత్రలో ప్రేరిత విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.
  5. పాత్రకు నియమిత నిరోధం ఉండడం వల్ల ప్రవహిస్తున్న విద్యుత్ వల్ల ఉష్ణం జనించి ఆ ఉష్ణం నీటికి అందజేయబడుతుంది.

ప్రశ్న 14.
టేప్ రికార్డర్ ధ్వనిని ఎలా పునరుత్పాదించగలుగుతుంది?
జవాబు:

  1. టేప్ రికార్డర్ విద్యుదయస్కాంత ప్రేరణ నియమంపై ఆధారపడి పనిచేస్తుంది.
  2. దీనిలో ఉపయోగించే క్యాసెట్ నందు పలుచని ప్లాస్టిక్ టేప్ ఉంటుంది. ఈ టేప్ పై ఐరన్ ఆక్సైడ్ పూత పూయబడి ఉంటుంది.
  3. ఈ టేప్ పై వివిధ ప్రదేశాలు వివిధ తీవ్రతలతో అయస్కాంతీకరింపబడి ఉంటాయి.
  4. టేప్ రికార్డర్ లో గల చిన్న తీగ చుట్టను ఈ టేప్ తాకుతూ, కదులుతూ ఉన్నప్పుడు దాని అయస్కాంత క్షేత్రంలో కలిగే మార్పుల వల్ల ఆ చిన్న తీగచుట్టలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది.
  5. ఈ విద్యుత్ ప్రవాహం ధ్వనిగా మార్చబడి స్పీకర్ గుండా బయటకు వస్తుంది.

భౌతిక రాశులు మరియు వాటి ప్రమాణాలు భౌతికరాశి
AP 10th Class Physical Science Important Questions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 17

10th Class Physics 10th Lesson విద్యుదయస్కాంతత్వం ½ Mark Important Questions and Answers

1. జతపరుచుము.
i) విద్యుత్ ప్రవాహం వలన అయస్కాంతత్వం a) మోటారు
ii) అయస్కాంతం వలన విద్యుత్ ఫలితం b) జనరేటర్
జవాబు:
i – a, ii – b

2. ఆయిర్ స్టెడ్ ప్రయోగాన్ని నిరూపించుటకు కావలసిన పరికరాలు ఏమిటి?
జవాబు:
1) అయస్కాంత దిక్సూచి,
2) బ్యాటరీ,
3) రాగి తీగ,
4) స్విచ్

3.AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 18
1) పై పటంలో చూపిన ప్రయోగం పేరేమిటి?
జవాబు:
ఆయిర్ స్టెడ్ ప్రయోగం

2) ఈ ప్రయోగంలో ఒక పరిశీలన రాయుము.
జవాబు:
విద్యుత్ తీగలో ప్రవహించునపుడు దిక్సూచి అపవర్తనం.

3) ప్రయోగంలో ఏమి ఉత్పత్తి అగుతుంది?
జవాబు:
అయస్కాంత క్షేత్రం

4) పై ప్రయోగంలో దిక్సూచిలో కదలికకు కారణం ఏమిటి?
జవాబు:
అయస్కాంత క్షేత్రం

4. i) దండాయస్కాంత క్షేత్రం త్రిమితీయం.
ii) దండాయస్కాంత క్షేత్రానికి దిశ ఉండదు.
iii) దండాయస్కాంత క్షేత్రం అంతటా సమానంగా ఉంటుంది. పై వాక్యా లలో సరియైనది ఏది?
జవాబు:
(i)

AP 10th Class Physical Science Important Questions 10th Lesson విద్యుదయస్కాంతత్వం

5. దండాయస్కాంత క్షేత్రానికి …………….. లు కలవు.
జవాబు:
దిశ మరియు పరిమాణం

6. అయస్కాంత క్షేత్ర దిశను కనుగొనుటకు నీవు ఉపయోగించే పరికరం ఏమిటి?
జవాబు:
దిక్సూచి

7.
AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 1
అయస్కాంతం చుట్టూ ఉన్న వక్రరేఖలు ఏమిటి?
జవాబు:
అయస్కాంత క్షేత్ర బలరేఖలు

8. అయస్కాంత బలరేఖకు ఒక బిందువు వద్ద గీసిన స్పర్శరేఖ దిశ ఆ బిందువు వద్ద ….. ను తెలుపుతుంది.
జవాబు:
క్షేత్రదిశను

9. i) అయస్కాంత బలరేఖలు సంవృత వక్రాలు.
ii) దండాయస్కాంత బలరేఖలు ధృవాల వద్ద ఎక్కువగా ఉంటాయి.
పై వానిలో సరియైనది ఏది?
జవాబు:
రెండూ

10. ఒక దండాయస్కాంతం యొక్క క్షేత్రం బలంగా ఉన్న చోటుని ఎలా గుర్తిస్తావు?
జవాబు:
బలరేఖలు ఎక్కువగా దట్టమైన సమూహంగా ఉన్న చోట.

11. అయస్కాంత అసమక్షేత్రం లక్షణం
A) బలం వివిధ స్థానాల వద్ద మారుట
B) దిశ వివిధ స్థానాల వద్ద మారుట
C) A మరియు B
D) A లేదా B
జవాబు:
D) A లేదా B

12. అయస్కాంత సమక్షేత్రంలో ఏవి స్థిరంగా ఉంటాయి?
జవాబు:
క్షేత్రబలం మరియు దిశ

13. సమక్షేత్రం ఏర్పరచడానికి నీకు కావలసిన పరికరం ఏమిటి?
జవాబు:
గుర్రపునాడాయస్కాంతం

14. క్షేత్రానికి లంబంగా A వైశాల్యం గల తలం గుండా వెళ్ళే బలరేఖల సంఖ్యను ఏమంటారు?
జవాబు:
అయస్కాంత అభివాహం

15. అయస్కాంత అభివాహాన్ని ఏ గుర్తుతో సూచిస్తారు?
జవాబు:

16. అయస్కాంత అభివాహానికి S.I ప్రమాణం ఏమిటి?
జవాబు:
వెబర్

17. ప్రమాణ వైశాల్యం గుండా వెళ్ళే అయస్కాంత అభివాహాన్ని ఏమంటారు?
జవాబు:
అభివాహ సాంద్రత (B)

18. అయస్కాంత క్షేత్ర ప్రేరణ (లేదా) అభివాహ సాంద్రతను ఏ గుర్తుతో సూచిస్తారు?
జవాబు:
‘B’

19. అయస్కాంత క్షేత్ర ప్రేరణ (B) కి సూత్రం రాయుము.
జవాబు:
B = Φ/A

20. అభివాహ సాంద్రతకు ప్రమాణాలు రాయండి.
జవాబు:
\(\frac{w b}{m^{2}}\) (లేదా) టెస్లా.

21. టెస్లా ఏ భౌతికరాశికి ప్రమాణం?
జవాబు:
అయస్కాంత క్షేత్ర ప్రేరణ (లేదా) అభివాహ సాంద్రత

22. అయస్కాంత క్షేత్రం B కి A వైశాల్యం గల తలం యొక్క లంబానికి మధ్య కోణం ‘8’ అనుకుంటే, క్షేత్రానికి లంబంగా ప్రభావం చూపే తలం వైశాల్యం ఎంత?
జవాబు:
A cos θ

23. కొంత కోణంతో తలం గుండా వెళ్ళే అయస్కాంత అభివాహంనకు సూత్రం రాయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 18

24. Φ (అభివాహం)కి ఒక సూత్రం రాయుము.
జవాబు:
Φ = BA cos θ

25. సరళరేఖలా ఉన్న విద్యుత్ ప్రవాహం గల తీగ వల్ల ఏర్పడే అయస్కాంత క్షేత్రం ఆకారం ఎలా ఉంటుంది?
జవాబు:
వృత్తాకారం

26.
AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 2
పై పటంలో చూపిన విధంగా అయస్కాంత బలరేఖలు ఏర్పడాలంటే తీగలో విద్యుత్ ఏ దిశలో ప్రయాణించాలి?
జవాబు:
పేపర్ తలానికి లంబంగా బయటకు వచ్చేలా

27. పేపర్ తలానికి లంబంగా లోపలికి పోయేటట్టు విద్యుత్ ప్రవహిస్తున్న తీగ చుట్టూ ఏర్పడిన అయస్కాంత క్షేత్రం దిశ ఎలా ఉంటుంది?
జవాబు:
సవ్యదిశలో

28. అయస్కాంత బలరేఖల దిశను ఏ నిబంధన ప్రకారం గుర్తిస్తాం?
జవాబు:
కుడిచేతి బొటనవేలు నిబంధన

29. కుడిచేతి బొటనవేలు నిబంధన ప్రకారం విద్యుత్ ప్రవాహ దిశను ఏ వేలితో సూచిస్తారు?
జవాబు:
కుడిచేతి బొటనవేలు

30.
AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 25
తీగచుట్టలో విద్యుత్ ప్రవహించినపుడు అయస్కాంత క్షేత్ర దిశ ఎలా ఉంటుంది?
జవాబు:
తీగచుట్ట తలానికి లంబంగా

31. సోలినాయిడ్ అనగానేమి?
జవాబు:
సమసర్పిలంగా, దగ్గరగా చుట్టబడిన తీగచుట్ట

32. సోలినాయిడ్ వలన ఏర్పడిన బలరేఖలు క్రింది వాని బలరేఖల వలె ఉంటాయి.
A) దండాయస్కాంతం
B) గుర్రపునాడాయస్కాంతం
C) రింగు అయస్కాంతం
D) పైవేవైనా
జవాబు:
A) దండాయస్కాంతం

33. కుడిచేతి నిబంధన ప్రకారం దీని వలన ఏర్పడిన అయస్కాంత క్షేత్ర దిశను తెలుసుకోగలము.
A) తిన్నని తీగలో విద్యుత్ ప్రవాహం
B) తీగచుట్టలో విద్యుత్ ప్రవాహం
C) సోలినాయిలో విద్యుత్ ప్రవాహం
D) ఏదీ లేదు
జవాబు:
C) సోలినాయిలో విద్యుత్ ప్రవాహం

34. సోలినాయిలో ఏర్పడిన అయస్కాంత బలరేఖలు దండాయస్కాంతం వలన ఏర్పడిన బలరేఖలు
A) వేరువేరుగా ఉంటాయి.
B) ఒకేలా ఉంటాయి.
C) A లేదా BC
D) పోల్చలేము.
జవాబు:
B) ఒకేలా ఉంటాయి.

35.
AP 10th Class Physical Science Important Questions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 6
పై పటం ప్రకారం
• విద్యుత్ దేని గుండా ప్రవహిస్తుంది?
జవాబు:
సోలినాయిడ్ గుండా

• విద్యుత్ ప్రవహించే దిశకు, అయస్కాంత బలరేఖల దిశ సమానంగా ఎక్కడ వుంది?
జవాబు:
సోలినాయిడ్ లోపల

• సోలినాయిలో విద్యుత్ ప్రవేశించే కొస వైపు ఎటువంటి అయస్కాంత ధృవం ఏర్పడింది?
జవాబు:
దక్షిణ ధృవం

36. ఒక దండాయస్కాంతాన్ని TV తెర (CRT TV) కు దగ్గరగా తీసుకుని వస్తే నీవేమి గమనిస్తావు?
జవాబు:
TV తెర మీది చిత్రం ఆకారం మారడాన్ని.

37. q ఆవేశం, v వేగంతో అయస్కాంత క్షేత్రం B కు లంబంగా కదిలేటప్పుడు, ఆ ఆవేశంపై పని చేసే అయస్కాంత బలం ఎంత?
జవాబు:
F = qvB

38. అయస్కాంత క్షేత్రం ‘B’ దిశకు ఆవేశం q, వేగం v, దిశ మధ్య కోణం ‘θ’ అయితే అయస్కాంత బలం ‘F’ కి సమీకరణాన్ని రాయండి.
జవాబు:
F = qvB sin θ

39. అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా ఒకే ఆవేశం కదిలితే అయస్కాంత బలం
A) కనిష్ఠం
B) గరిష్ఠం
C) శూన్యం
D) పైవేవీ కాదు
జవాబు:
C) శూన్యం

40. కుడిచేతి నియమం ప్రకారం ఆవేశ వేగ దిశ, అయస్కాంత క్షేత్రదిశ తెలిస్తే …….. దిశను తెలుసుకోవచ్చును.
జవాబు:
అయస్కాంత బలం

41.
AP 10th Class Physical Science Important Questions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 5
ఈ నిబంధన పేరేమిటి?
జవాబు:
కుడిచేతి నిబంధన

42. తీగలో ప్రతీ ఆవేశం క్షేత్రానికి సమాంతర దిశలో కదులుతూ ఉండడం వలన వాటిపై ఎంత అయస్కాంత బలం పని చేయును?
జవాబు:
ఉండదు

43. అయస్కాంత క్షేత్రం (B) కి లంబంగా ‘L’ పొడవు నిరూపించవచ్చును? గల తీగలో ‘T’ విద్యుత్ ప్రవహిస్తే దానిపై పనిచేసే అయస్కాంత బలం ఎంత వుంటుంది?
జవాబు:
F = ILB

44. పై సందర్భంలో లంబంగా కాకుండా ‘θ’ కోణంతో విద్యుత్ తీగ ఉంటే దానిపై పనిచేసే బలం ఎంత?
జవాబు:
F = ILB sin θ

45. సాధారణంగా కుడిచేతి నిబంధన ఏ ఆవేశానికి సంబంధించినది?
జవాబు:
ధనావేశం

46. సమఅయస్కాంత క్షేత్రంలో, విద్యుత్ ప్రవహిస్తున్న తీగచుట్టను ఉంచినప్పుడు అది నిరంతరంగా ఒకే దిశలో, ఆగకుండా తిరగాలంటే ఏమి చేయాలి?
జవాబు:
ప్రతి అర్ధభ్రమణానికి తీగచుట్టలో విద్యుత్ ప్రవాహ దిశను మార్చాలి.

AP 10th Class Physical Science Important Questions 10th Lesson విద్యుదయస్కాంతత్వం

47. విద్యుత్ మోటారులో విద్యుత్ ప్రవాహదిశను మార్చడానికి సహాయపడే పరికరాలేవి?
జవాబు:
స్లిప్ రింగ్ కమ్యూటేటర్ (బ్రషన్లు, స్లిప్ రింగులు)

48. విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే పరికరం పేరేమిటి?
జవాబు:
విద్యుత్ మోటారు

49. విద్యుత్ మోటారు పనిచేసే సూత్రం ఏమిటి?
జవాబు:
విద్యుత్ శక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది.

50. విద్యుత్ ప్రవాహం లేని తీగచుట్టను అయస్కాంత క్షేత్రంలో తిరిగేటట్లు చేస్తే ఏం జరుగుతుందో ఊహించుము.
జవాబు:
తీగచుట్టలో ప్రేరిత విద్యుత్ జనియించును.

51.
AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 31
• పై పటంలో చూపిన పరికరంలో ACని పంపితే ఏమవుతుందో ఊహించుము.
జవాబు:
లోహపు రింగు తేలియాడుతుంది.

• DC ని వినియోగిస్తే ఏమవుతుంది?
జవాబు:
రింగు ఒక్కసారి పైకి కదిలి తిరిగి కిందికి వస్తుంది.

• రింగ్ లో అభివాహం నిరంతరంగా మారాలంటే తీగచుట్టలో ఎటువంటి విద్యుత్ ను పంపాలి?
జవాబు:
AC

52.
AP Board 10th Class Physical Science Solutions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 13
పై పటంలో చూపిన ప్రయోగం ద్వారా ఏ నియమాన్ని
జవాబు:
ఫారడే నియమం

53. ‘ఫారడే నియమం’ నిరూపించడానికి కావలసిన పరికరాలేవి?
జవాబు:
తీగ చుట్ట, గాల్వనో మీటరు, దండాయస్కాంతం

54. ఒక తీగచుట్టలో విద్యుత్ ప్రవాహం ఏర్పడాలంటే దానిలో దేనిని నిరంతరంగా మార్చవలసి ఉంటుంది?
జవాబు:
అయస్కాంత అభివాహం

55. తీగచుట్టలో ప్రేరిత విద్యుత్ ప్రవాహాన్ని పొందే దృగ్విషయాన్ని ఏమంటారు?
జవాబు:
విద్యుదయస్కాంత ప్రేరణ

56. తీగచుట్టలో ప్రేరిత విద్యుత్ ప్రవాహం ఏర్పరచడానికి కావలసిన పరికరం ఏమిటి?
జవాబు:
దండాయస్కాంతం

57. తీగచుట్టలో అభివాహ మార్పుకి, ప్రేరిత విద్యుత్ ప్రవాహానికి మధ్య సంబంధం ఏమిటి?
జవాబు:
అనులోమానుపాతం

58. పారడే విద్యుదయస్కాంత పేరణ నియమానికి ఒక సూత్రం రాయుము.
జవాబు:
\(\varepsilon=\frac{\Delta \phi}{\Delta \mathrm{t}}\)

59. లెంజ్ నియమాన్ని రాయండి.
జవాబు:
తీగచుట్టలో అభివాహ మార్పును వ్యతిరేకించే దిశలో ప్రేరణ విద్యుత్ ప్రవాహం ఉంటుంది.

60. లెంజ్ నియమం ద్వారా ఏమి తెలుసుకోవచ్చును?
జవాబు:
తీగచుట్టలో ప్రేరిత విద్యుత్ ప్రవాహ దిశ

61. విద్యుత్ సామర్థ్యంను ‘E’ మరియు ‘I’ లలో తెలుపుము.
జవాబు:
P = εI

62. ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణకు ఒక అనువర్తనాన్ని రాయండి.
జవాబు:
ATM కార్డు (అయస్కాంత పట్టీ గలది) (లేదా) ఇండక్షన్ స్టవ్.

63. సెక్యూరిటీ అలారంలు ఏ నియమం ప్రకారం పని చేస్తాయి?
జవాబు:
ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ

64. AC (ఏకాంతర విద్యుత్) అనగానేమి?
జవాబు:
నిర్దిష్ట కాలవ్యవధిలో విద్యుత్ ప్రవాహదిశ మారుతూ ఉంటుంది.

65. AC జనరేటర్ నియమం ఏమిటి?
జవాబు:
యాంత్రిక శక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చుట

66. ఏకాంతర విద్యుత్ యొక్క ఒక లక్షణం రాయండి.
జవాబు:
కచ్చితమైన పౌనఃపున్యం కలిగి ఉండటం

AP 10th Class Physical Science Important Questions 10th Lesson విద్యుదయస్కాంతత్వం

67. AC జనరేటర్‌ను DC జనరేటర్ గా మార్చడానికి ఏమి ఉపయోగించాలి?
జవాబు:
రెండు స్లిప్ రింగులు (కమ్యూటేటర్)

68. ప్రవాహ దిశను మార్చుకోని విద్యుత్ జనకం ఏమిటి?
జవాబు:
బ్యాటరీ

69. ‘I’ పొడవు గల వాహకం ‘B’ అయస్కాంత క్షేత్రానికి లంబంగా ‘V’ వేగంతో కదులుతుంటే, ఆ వాహక కొనల మధ్య ఏర్పడే విద్యుచ్ఛాలక బలం ఎంత ఉంటుంది?
జవాబు:
Blv (గమన విద్యుచ్ఛాలక బలం)

70. జతపరుచుము :
a) ప్రేరిత విద్యుత్ ( ) i) లెంజ్
b) విద్యుదయస్కాంతం ( ) ii) ఫారడే
c) ప్రేరిత విద్యుత్ దిశ ( ) iii) ఆయిర్ స్టెడ్
జవాబు:
a – ii, b – iii, c – i

10th Class Physics 10th Lesson విద్యుదయస్కాంతత్వం 1 Mark Bits Questions and Answers

సరియైన సమాధానమును గుర్తించండి.

1. అయస్కాంత క్షేత్ర ప్రేరణ యొక్క S.I. ప్రమాణం
A) టెస్లా
B) వెబర్
C) వెబర్/మీ
D) వెబర్.మీ
జవాబు:
A) టెస్లా

2. జనరేటరులోని తీగచుట్ట ఏ కోణంలో తిరిగినపుడు గరిష్ట ప్రేరిత విద్యుచ్ఛాలక బలం ఏర్పడుతుంది?
A) 180°
B) 90°
C) 2800
D) B మరియు C
జవాబు:
D) B మరియు C

3. విద్యుదయస్కాంత వర్ణపటంలో దృశ్యకాంతితో పాటు అదృశ్యకాంతి అయిన X – కిరణాలు, γ – కిరణాలు, I.R, U.V కిరణాలు, మైక్రోతరంగాలు మరియు రేడియో తరంగాలుంటాయి. వీటిలో తరంగదైర్ఘ్యం అధికంగా గల తరంగాలు ….
A) γ – కిరణాలు
B) U.V. కిరణాలు
C) I.R
D) రేడియో తరంగాలు
జవాబు:
D) రేడియో తరంగాలు

4. విద్యుత్ ను ఉత్పత్తి చేసే సాధనము
A) అమ్మీటర్
B) ఓల్ట్ మీటర్
C) జనరేటర్
D) గాల్వనోమీటర్
జవాబు:
C) జనరేటర్

AP 10th Class Physical Science Important Questions 10th Lesson విద్యుదయస్కాంతత్వం

5. క్రింది వానిలో యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చు పరికరం …….
A) జనరేటర్
B) ఫ్యాన్
C) మిక్సర్ గైండర్
D) బల్బు
జవాబు:
A) జనరేటర్
(OR)
యాంత్రికశక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది
A) విద్యుత్ జనరేటర్
B) విద్యుత్ మోటరు
C) బ్యాటరీ
D) ఎలక్ట్రిక్ స్విచ్
జవాబు:
A) విద్యుత్ జనరేటర్

6. కిందివాటిలో విద్యుత్ అయస్కాంత ప్రేరణ నియమంపై ఆధారపడి పనిచేసే విద్యుత్ సాధనం
A) విద్యుత్ ఫ్యాన్
B) విద్యుత్ బల్బ్
C) విద్యుత్ కుక్కర్
D) L.E.D.
జవాబు:
A) విద్యుత్ ఫ్యాన్

7. విద్యుత్ ఘటం యొక్క (EMF) ను గుర్తించుటకు వాడే పరికరం
A) ఓల్ట్ మీటర్
B) అమ్మీటర్
C) గాల్వనోమీటర్
D) టెస్టర్
జవాబు:
A) ఓల్ట్ మీటర్

8. నిత్యజీవితంలో విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే సాధనం
A) విద్యుత్ బల్బ్
B) విద్యుత్ మోటర్
C) జనరేటర్
D) ఇండక్షన్ స్టవ్
జవాబు:

9. క్రింది వానిలో ఫారడే విద్యుత్ అయస్కాంత ప్రేరణ నియమాన్ని అనుసరించనిది ……..
A) ATM కార్డు
B) ఇండక్షన్ స్టవ్
C) టేప్ రికార్డర్
D) ఇస్త్రీ పెట్టె
జవాబు:
B) ఇండక్షన్ స్టవ్

10. ఎలక్ట్రిక్ జనరేటర్ …….. శక్తిని …….. శక్తిగా మారుస్తుంది.
A) యాంత్రిక, విద్యుత్
B) విద్యుత్, యాంత్రిక
C) కాంతి, విద్యుత్
D) విద్యుత్, కాంతి
జవాబు:
A) యాంత్రిక, విద్యుత్

11. “తీగచుట్టల అభివాహ మార్పు వ్యతిరేక దిశలో ప్రేరణ విద్యుత్ ప్రవాహం ఉంటుంది.” దీనినే …. అంటాం.
A) VSEPR సిద్ధాంతం
B) లెంజ్ నియమం
C) ఫారడే నియమం
D) ఓమ్ నియమం
జవాబు:
B) లెంజ్ నియమం

12. అయస్కాంత అభివాహానికి SI ప్రమాణం
A) వెబర్
B) వోల్ట్
C) ఆంపియర్
D) కూలుంట్
జవాబు:
A) వెబర్

AP 10th Class Physical Science Important Questions 10th Lesson విద్యుదయస్కాంతత్వం

13. “a” ఆవేశం గల ఒక ఆవేశిత కణం “V” వేగంతో, “B” అయస్కాంత క్షేత్రంలోకి అయస్కాంత క్షేత్ర దిశలో 30° కోణం చేస్తూ ప్రవేశించింది. అయిన దానిపై కలగజేయబడు బలం (sin 30° = ½)
AP 10th Class Physical Science Important Questions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 19
జవాబు:
A

14. క్రింది వాటిలో ఏ సందర్భంలో విద్యుత్ ప్రేరిత మవుతుంది?
AP 10th Class Physical Science Important Questions 10th Lesson విద్యుదయస్కాంతత్వం 20
జవాబు:
(A or D)