AP Inter 1st Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Economics Study Material 9th Lesson ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం Textbook Questions and Answers.

AP Inter 1st Year Economics Study Material 9th Lesson ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వస్తు మార్పిడి విధానాన్ని, అందులోని సమస్యలను వివరించండి.
జవాబు:
ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం వాడుకలోకి రాకముందు “వస్తు మార్పిడి విధానం” అమలులో ఉండేది. అప్పుడు జనాభా పరిమితంగా ఉండి, వ్యక్తుల కోరికలు సాధారణ స్థాయిలో ఉండేవి. ఈ విధానంలో వ్యక్తులు వస్తువులకు బదులుగా వస్తువులను వినిమయంగా పొందటాన్ని వస్తు మార్పిడి విధానం అంటారు. ఇలాంటి మార్పిడికి ప్రధాన కారణం మానవుల ‘అవసరాలు’. ఆర్థిక కార్యకలాపాలు పరిమితంగా ఉండి, వ్యక్తుల కోరికలు సాధారణంగా ఉన్నంత వరకు ఈ విధానం కొనసాగుతుంది. జనాభా పెరిగి, కోరికలలో మార్పులు సంభవించి, వర్తక వాణిజ్య వ్యవహారాలు పెరగడంతో ఈ విధానం అనేక ఇబ్బందులను ఎదుర్కొనవలసి వచ్చింది.

వస్తు మార్పిడి విధానంలోని సమస్యలు:
1) కోర్కెల సమన్వయము లోపించుట: వస్తు మార్పిడి విధానం సాఫీగా జరగాలంటే ఇరుపక్షాల వారి కోరికలలో సమన్వయం కుదరాలి. ఉదా: వరి పండించే వ్యక్తి వస్త్రం పట్ల అవసరం, వస్త్రం నేసే వ్యక్తికి వరి అవసరం ఏక కాలంలో కలగాలి. అలాగైతేనే వినిమయం లేదా మార్పిడికి అవకాశం ఏర్పడుతుంది. ఇరువురి కోరికలలో సమన్వయం కుదరకపోతే మార్పిడి అసాధ్యమవుతుంది.

2) సంపద నిల్వ చేయడంలో ఇబ్బంది: మార్పిడికి ఉపయోగించే అన్ని వస్తువులను ‘నిల్వ’ ఉంచే అవకాశం ఉండదు. కారణం కొన్ని రకాల వస్తువులను ‘నిల్వ’ ఉంచడం వల్ల అవి పాడైపోయే అవకాశం ఉంది. కాలం గడిచే కొద్ది ఇలాంటి వస్తువుల విలువ క్షీణించడం, కొన్నిసార్లు నశించడం జరగవచ్చు. ఉదా: పశువులు, కూరగాయలు, ఆహార ధాన్యాలు మొదలైనవి.

3) వస్తువుల అవిభాజ్యత: కొన్ని వస్తువులను విభజించడం వల్ల వాటి విలువ క్షీణించవచ్చు లేదా పూర్తిగా నశించవచ్చు. ఉదా: పశువులు, పనిముట్లు, యంత్రాలు. ఇలాంటి వాటి విషయంలో విభజించటానికి వీలుండదు. అందువల్ల మార్పిడి సాధ్యం కాదు.

4) విలువను నిర్ణయించే కొలమానం లేకపోవుట: వస్తు మార్పిడి విధానంలో వస్తువుల విలువలను ఇతర వస్తువుల విలువలో చెప్పవలసి వస్తుంది. అంటే వస్తువుల విలువలను ఖచ్చితంగా కొలిచే కొలమానం/సాధనం లేకపోవడం వల్ల ఈ విధానాన్ని అమలుచేయడం ఎంతో కష్టమౌతుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

5) వాయిదా చెల్లింపులలో ఇబ్బంది ఆర్థిక వ్యవస్థలో రుణాలు ఇవ్వడం, పుచ్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే వస్తు వినిమయంలో ఈ రకమైన చెల్లింపులు కష్టసాధ్యం.

6) సేవల మార్పిడి: సేవల మార్పిడికి అవకాశం లేదు. విలువలను కొలిచే సాధనం లేకపోవడం వల్ల “సేవల” విలువలను వస్తు రూపంలో చెప్పడానికి వీలుండదు. ఉదా: డాక్టర్లు, టీచర్లు, లాయర్ల సేవలు.

ప్రశ్న 2.
ద్రవ్యం విధులను వివరించండి.
జవాబు:
ద్రవ్యం నిర్వహించే విధులు చాలా ఉన్నాయి. వీటికి ప్రాథమిక విధులు, ద్వితీయ శ్రేణి విధులు, అనుషంగిక విధులు అని పలు రకాలుగా వర్గీకరిస్తారు.

ప్రాథమిక విధులు:
1) వినిమయ మాధ్యమం: ద్రవ్యం వినిమయ మాధ్యమంగా వ్యవహరిస్తుంది. ఏ వస్తువైనా ముందుగా ద్రవ్యంతో మార్పిడి చేసుకొని, ఆ తరువాత ఆ ద్రవ్యంలో మరి ఏ ఇతర వస్తువునైనా కొనుగోలు చేయవచ్చు. ఆ విధంగా ద్రవ్యం అనే వినిమయ మాధ్యమం ద్వారా ప్రజలు వస్తు సేవలను వినిమయం చేసుకోవచ్చు.

2) విలువల కొలమానం: వస్తు సేవల విలువ కొలమానంగా ద్రవ్యం వ్యవహరిస్తుంది. వ్యాపార వ్యవహారాలను సులువైనవిగా, సులభతరమైనవిగా మార్చింది. ప్రతి వస్తువు విలువను ద్రవ్య యూనిట్లో వ్యక్తపరచడం జరుగుతుంది. దీనిని ధర అంటారు. ద్రవ్యం యూనిట్ విలువ స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే అది సంతృప్తికరమైన కొలమానంగా పనిచేస్తుంది.

ద్వితీయ శ్రేణి విధులు:
1) విలువ నిధి: వస్తు సేవల విలువను ద్రవ్య రూపంలో నిల్వ చేయవచ్చు. కీన్స్ అభిప్రాయంలో, ద్రవ్యం నిర్వహించే విధులలో ఈ విధి అతి ముఖ్యమైనది. ద్రవ్యం వల్ల మాత్రమే, ప్రస్తుత ఆదాయంతో భవిష్యత్తులో వినియోగం సాధ్యపడుతుంది. అందువల్ల ద్రవ్యం భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాల మధ్య వారధిగా పనిచేస్తుంది.

2) వాయిదాల చెల్లింపుల ప్రామాణికం: ద్రవ్యం వాయిదా చెల్లింపుల ప్రమాణాలుగా వ్యవహరిస్తుంది. ఈ విధిని నిర్వర్తించడం వల్ల వ్యక్తులు వస్తువులను కొనుగోలు చేయడం, బ్యాంకులు, ఇతర ద్రవ్య సంస్థల నుంచి ఋణాలు పొందడం, షేర్లు, బాండ్లు అమ్మకాలు, కొనుగోలు మొ||నవి సులభతరమయ్యాయి.

3) విలువల బదిలీ: ఏ సమయంలోనైనా, ఏ ప్రదేశంలోనైనా ద్రవ్యాన్ని ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి బదిలీ చేయడం సాధ్యం అవుతుంది. ద్రవ్యం వల్ల విలువను బదిలీ చేయడం తేలికవుతుంది.

అనుషంగిక విధులు:
1) జాతీయాదాయ మదింపు, పంపిణీ: ఒక సం॥ కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేయబడిన వస్తు సేవల విలువలను అంచనా వేయవచ్చు. వివిధ ఉత్పత్తి కారకాలను ద్రవ్య రూపంలో చెల్లింపులు చేయడం జాతీయాదాయమును వాటి మధ్య పంపిణీ చేయవచ్చు.

2) ఉపాంత ప్రయోజనాలు/ఉత్పాదకతలు సమానీకరణ: వినియోగదారులు తాము కొనుగోలు చేసే వివిధ వస్తువుల నుంచి పొందే ఉపాంత ప్రయోజనాలను ద్రవ్యం ఆధారంగా సమానం చేయడం ద్వారా ప్రయోజనాలను గరిష్ఠం చేసుకోగలుగుతాడు. అదే విధంగా ఉత్పత్తిదారు వివిధ ఉత్పత్తి కారకాల ఉపాంత ఉత్పాదకతలను ద్రవ్యం సహాయంతో సమానం చేయడం ద్వారా లాభాలను గరిష్ఠం చేసుకోగలుగుతాడు.

3) పరపతి వ్యవస్థకు మూలం: అన్ని ఆర్థిక లావాదేవీలకు ద్రవ్యం ప్రాతిపదిక. ద్రవ్య రిజర్వు లేనిదే పరపతి సృష్టి జరగదు. పరపతి కార్యకలాపాలన్నింటికి ద్రవ్యం పూచీకత్తుగా వ్యవహరిస్తుంది.

4) ద్రవ్యత్వం: ద్రవ్యానికి అత్యధిక ద్రవ్యత్వం ఉంటుంది. ద్రవ్యత్వపరంగా ఆస్తులన్నింటిలోకి ఉత్తమమైనది. ద్రవ్యం నూరుశాతం ద్రవ్యత్వం కలిగి ఉంటుంది.

ప్రశ్న 3.
వివిధ రకాల ద్రవ్యాలను గురించి తెలపండి.
జవాబు:
ద్రవ్యానికి అనుబంధంగా కొన్ని భావనలను నిర్వచించారు. అవి కరెన్సీ, ద్రవ్యత్వం, సమీపద్రవ్యం (Near-Money)

కరెన్సీ: కేంద్ర ప్రభుత్వం, కేంద్రబ్యాంకులచే ముద్రించబడి ఆర్థిక వ్యవస్థలో చలామణిలోకి వచ్చిన నాణేలు, ‘పేపరు నోట్లను ‘కరెన్సీ’ అంటారు. ద్రవ్యంలో కరెన్సీ ఒక భాగం మాత్రమే. కరెన్సీతోపాటు డిమాండ్, టైమ్ డిపాజిట్లు మొదలైనవి కూడా ద్రవ్యం కిందకు వస్తాయి.

ద్రవ్యత్వం: ద్రవ్యానికి ద్రవత్వం ఉంటుంది. ద్రవత్వం అంటే వెంటనే ‘కొనుగోలు చేసే శక్తి’ (ready purchasing power) ఒక వస్తువును విలువ తగ్గకుండా సులభంగా తక్కువ కాలవ్యవధిలో ద్రవ్యంగా మార్చగల గుణాన్ని ‘ద్రవత్వం’ అంటారు. అందువల్లనే ద్రవ్యాన్ని ‘పరిపూర్ణ ద్రవత్వం’ గల ఆస్తి అంటారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

సమీప ద్రవ్యం: వివిధ రకాలైన ఆస్తుల ద్రవ్యత్వం వివిధ రకాలుగా ఉంటుంది. టైమ్ డిపాజిట్లు, పోస్ట్ ఆఫీస్ పొదుపు పత్రాలు, కంపెనీ స్టాక్స్, షేర్లు, ట్రెజరీ బిల్లులు, మొదలైనవి ద్రవ్యానికి చాలా దగ్గర ప్రత్యామ్నాయాలు. అంటే వీటి ద్రవ్యత్వం, ద్రవ్యం ద్రవత్వానికి చాలా దగ్గరలో ఉంటుంది. ఇలా ద్రవత్వంలో ద్రవ్యానికి దగ్గరలో ఉన్న వాటిని ‘సమీపద్రవ్యం’ అంటారు.

ద్రవ్యం రకాలు:
1) పూర్తి ప్రమాణం నాణేలు: ఈ నాణేల ముఖవిలువ, వాటిలోని (లోహపు విలువ) ‘అంతర్గత విలువ’ సమానంగా ఉంటుంది. ఉదా: మన దేశంలో ఒకప్పుడు పూర్తి ప్రమాణంగల వెండి నాణేలు చలామణిలో ఉండేవి.

2) తక్కువ ప్రమాణం నాణేలు: ఈ నాణేల ముఖవిలువ వీటి అంతర్గత విలువ కంటే తక్కువగా ఉంటుంది. 3) చిల్లర ద్రవ్యం: చిన్న చిన్న లావాదేవీలకు ఉపయోగించేందుకు వీలుగా ప్రమాణ ద్రవ్య యూనిట్ను విభజించి, చిల్లర ద్రవ్యాన్ని ప్రభుత్వం జారీ చేస్తుంది. ఉదా: ఉపయోగంలో వీలుగా ఉండేందుకు 25 పైసలు, 50 పైసల నాణేలు జారీ చేయడం జరిగింది.

4) కాగితపు ద్రవ్యం: వివిధ విలువలను సూచిస్తూ కేంద్ర ప్రభుత్వంగాని, కేంద్రబ్యాంకుగానీ జారీచేసే కరెన్సీ నోట్లు ‘కాగితపు ద్రవ్యం’ అని చెప్పవచ్చు. ఉదా: 1,000, 500, 100, 50, 20, 10 నోట్లు.

5) పరపతి ద్రవ్యం: వాణిజ్య బ్యాంకులలోని డిమాండ్ డిపాజిట్లు మొదలైన వాటిని చెక్కులు, డ్రాఫ్ట్ ద్వారా లావాదేవీలు జరపవచ్చు. ఆధునిక సమాజంలో ఇంచుమించు అన్ని వ్యవహారాలు వీటితో పరిష్కరించటం సాధ్యం. వీటినే ‘పరపతి ద్రవ్యం’గా చెప్పవచ్చు.

ప్రశ్న 4.
వాణిజ్య బ్యాంకుల విధులను వివరించండి.
జవాబు:
వాణిజ్య బ్యాంకులు దేశ బాంకింగ్ రంగంలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాయి. వాణిజ్య బ్యాంకులు ప్రజల నుంచి, సంస్థల నుంచి డిపాజిట్లను స్వీకరించి, ఆ సొమ్మును వ్యాపారస్థులకు, ఉత్పత్తిదారులకు ఋణాలను ఇస్తూ, అటు ఋణ గ్రహీతలకు, ఋణదాతలకు మధ్య అనుసంధాన కర్తగా వ్యవహరిస్తుంది.

సేయర్స్ అభిప్రాయంలో “బాంకులు వ్యక్తుల నుంచి డిపాజిట్లను స్వీకరించి, అవసరమైన వాళ్ళకు ఋణాలు మంజూరు చేసే సంస్థలు”.
క్రౌథర్ అభిప్రాయంలో “ఇతరుల ఋణాలు తీసుకొని, తన వద్దగల ద్రవ్యాన్ని ఇతరులకు ఇవ్వడం ద్వారా ద్రవ్యాన్ని సృష్టించడమే బ్యాంకుల వ్యాపారం”.
వాణిజ్య బ్యాంకుల విధులు: ఇవి దేశ ఆర్థికాభివృద్ధిలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకున్నాయి. వాణిజ్య బ్యాంకుల విధులు ముఖ్యంగా

  1. ప్రాథమిక విధులు.
  2. అనుషంగిక విధులు.
  3. సాధారణోపయోగ సేవలు.

1) ప్రాథమిక విధులు:

ఎ) డిపాజిట్లను స్వీకరించడం: ప్రజల వద్ద నుంచి పొదుపులను డిపాజిట్లగా స్వీకరించడం బ్యాంకుల ప్రాథమిక విధి. ప్రధానంగా వాణిజ్య బ్యాంకులు స్వీకరించే డిపాజిట్లు రెండు రకాలు, అవి: డిమాండ్ డిపాజిట్లు, కాలపరిమితి డిపాజిట్లు.

  • డిమాండ్ డిపాజిట్ల కింద సేవింగ్స్ డిపాజిట్లను, కరెంట్ డిపాజిట్లను సేకరిస్తుంది.
  • కాలపరిమితి డిపాజిట్ల కింద ఫిక్స్డ్

బి) రుణాలను మంజూరు చేయడం:
i) లాభాలను ఆర్జించటం వాణిజ్య బాంకుల ముఖ్యోద్దేశం. బాంకులు వ్యాపారస్తుల ద్రవ్య అవసరాల కోసం ఇచ్చే రుణాలను ‘నగదు పరపతి’ అంటారు. రుణాన్ని తీసుకొన్న ఖాతాదారు, ఆ ద్రవ్యాన్ని ‘చెక్కు’ ద్వారా తీసుకుంటాడు. ఈ ఋణాలపై బాంకులు వడ్డీ వసూలు చేస్తాయి.

AP Inter 1st Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ii) నమ్మకమైన ఖాతాదారులకు బాంకులు “ఓవర్ డ్రాఫ్ట్” పద్ధతి ద్వారా రుణాలిస్తాయి. ఖాతాదారుని కరెంట్ ఖాతాలో నిలువ ఉన్న మొత్తం కంటే, అధిక మొత్తాన్ని వాడుకొనే వసతిని ‘ఓవర్ డ్రాఫ్ట్’ అంటారు. వాడుకున్న సొమ్ముపై ఖాతాదారుని నుంచి వడ్డీని వసూలు చేస్తాయి.

iii) కేంద్ర బాంకు ఉత్తర్వుల మేరకు, స్టాక్ ఎక్స్ఛేంజ్ బ్రోకర్లకు వాణిజ్య బాంకులు అతి స్వల్పకాలిక రుణాలు ఇస్తుంది. వీటిని ‘కాల్మనీ లేదా కాల్ లోన్స్’ అంటారు. వీటి కాల పరిమితి 15 రోజులకు మించదు.

iv) ఖాతాదారుల వద్ద ఉన్న బిల్లులపై కాలపరిమితికి ముందుగానే వడ్డీ మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని చెల్లించే అవకాశం కల్పిస్తుంది. ఈ పద్ధతిని “బిల్లుల డిస్కౌంటింగ్” అంటారు.

సి) పరపతిని సృష్టించడం: బాంకులు స్వీకరించే డిపాజిట్లే అవి ఇచ్చే రుణాలకు ఆధారం. పరపతి సృష్టి అంటే బాంకు డిపాజిట్ల కంటే ఎన్నో రెట్లు రుణాలు పెంచడం. పరపతి ఇచ్చేటప్పుడు డిపాజిట్లు సృష్టించబడతాయి.

డి) క్రెడిట్ కార్డులు: ఆధునిక బాంకులు ఖాతాదారులకు ‘క్రెడిట్ కార్డులు’ ద్వారా కూడా మంజూరు చేయడం రుణాలను మంజూరు చేస్తున్నాయి. క్రెడిట్ కార్డు ఉన్న ఖాతాదారు వస్తు సేవలను కార్డపై కొనుగోలు చేసి, బాంకుకు అసలుతోపాటు వడ్డీ చెల్లించడం జరుగుతుంది.

2) అనుషంగిక విధులు: బాంకులు నిర్వహించే ప్రాథమిక విధుల ఫలితంగా ‘ప్రాతినిథ్య విధులు’ ఏర్పడతాయి.

  1. బాంకులు ఖాతాదారులు ప్రతినిధులుగా వారి తరపున బీమా ప్రీమియమ్లు, కరెంట్ బిల్లులు మొదలైన వాటిని ఖాతాదారుల ఆదేశానుసారం నిర్ణీత సమయాల్లో చెల్లించుట.
  2. బాంకులు ఖాతాదారులు ‘ఏజెంట్ ‘ కంపెనీల షేర్లను, రుణ పత్రాలను కొనిపెడతాయి.
  3. ఖాతాదారుల తరపున డ్రాఫ్టు ద్వారా, చెక్ల ద్వారా, తంతి తపాలా ద్వారా సొమ్ము బదిలీ చేస్తుంది.

3) సాధారణోపయోగ సేవలు:

  1. విదేశీ వ్యాపార క్రమంలో అత్యవసరమైన ‘పరపతి పత్రాలను’ జారీ చేస్తాయి.
  2. విదేశీ వర్తకం చేసేవారికి ‘విదేశీ ద్రవ్యం’లో విత్త సహాయం చేస్తుంది.
  3. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించటానికి ‘విద్యా రుణ’ సౌకర్యాన్ని కల్పిస్తుంది.
  4. బాంకింగ్ సేవలలో మరో విప్లవాత్మక సౌకర్యం ATM పద్ధతి ఖాతాదారులు తమకు సొమ్ము కావలసినపుడు బాంకుకు వెళ్ళకుండా, తమకు దగ్గరలో ఉన్న ATM నుంచి నగదు తీసుకొనే సౌకర్యం కల్పించింది.

ప్రశ్న 5.
కేంద్ర బ్యాంకు విధులను వివరించండి.
జవాబు:
దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థకు కేంద్ర బ్యాంకు శిఖరం. అది బ్యాంకింగ్ వ్యవస్థలోని బ్యాంకుల ఆర్థిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది, నియంత్రిస్తుంది, క్రమబద్దీకరిస్తుంది.

కేంద్ర బ్యాంకు విధులు:
1) కరెన్సీ నోట్ల జారీ: ఒక దేశంలో కరెన్సీ నోట్ల జారీలో కేంద్ర బ్యాంకు గుత్తాధిపత్యం కలిగి ఉంటుంది. దీనివల్ల నోట్ల జారీలో ఏకత్వం ఏర్పడుతుంది. కరెన్సీపై విశ్వసనీయత కలుగుతుంది. ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా ద్రవ్య సప్లయ్ నియంత్రించడానికి వీలుంటుంది.

2) ప్రభుత్వ బ్యాంకరు: కేంద్ర బ్యాంకు ప్రభుత్వ బ్యాంకరుగా, ఏజెంట్గా, సలహాదారుగా వ్యవహరిస్తుంది. ఇది ప్రభుత్వ ద్రవ్య నిధులకు సంబంధించిన లెక్కలు తయారుచేస్తుంది. ప్రభుత్వం తరుపున ద్రవ్యం స్వీకరిస్తూ, ప్రభుత్వం తరుపున ఋణాలు ఇస్తూ ప్రభుత్వ ఋణాన్ని స్వీకరిస్తుంది. ప్రభుత్వానికి ఋణాలను ఇస్తూ, అన్ని ఆర్థిక వ్యవహారాలలో ప్రభుత్వానికి సలహాలను అందిస్తుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

3) బ్యాంకుల బ్యాంకరు కేంద్ర బ్యాంకు ప్రభుత్వానికే కాకుండా బ్యాంకులకు కూడా బ్యాంకరుగా పనిచేస్తుంది. ప్రతి బ్యాంకు చట్ట ప్రకారం తను స్వీకరించిన డిపాజిట్లు మొత్తంలో కొంత శాతం నగదు నిల్వలుగా ఉంచాలి. ఆ నిల్వల నిష్పత్తిని కేంద్ర బ్యాంకు నిర్ణయిస్తుంది. వినిమయబిల్లుల రీడిస్కౌంట్ ద్వారా షెడ్యూల్డు బ్యాంకులకు విత్త సహాయం అందజేస్తుంది. ఇది వాణిజ్య బ్యాంకుల మధ్య ఏర్పడిన లావాదేవీలను పరిష్కరించడానికి క్లియరింగ్ హౌస్ పనిచేస్తుంది.

4) అంతిమ ఋణదాత: మార్కెట్లోని అన్నిరకాల పరపతి సౌకర్యాలు ఉపయోగించుకున్న తరువాత ఇంకా ద్రవ్యత్వ ఇబ్బందులున్నప్పుడు బ్యాంకులకు, డిస్కౌంట్ గృహాలకు, ఇతర పరపతి సంస్థలకు కేంద్ర బ్యాంకు అనేక రకాలుగా విత్త సహాయం అందిస్తూ అంతిమ ఋణదాతలుగా పనిచేస్తుంది.

5) పరపతి నియంత్రణ: ఆర్థిక వ్యవస్థలోని పరపతి పరిమాణాన్ని తగిన ద్రవ్య విధానం ద్వారా కేంద్ర బ్యాంకు నియంత్రిస్తుంది. ద్రవ్యోల్బణం సమయంలో పరపతి తగ్గిస్తుంది. ఆర్థిక వ్యవస్థ తిరోగమన పరిస్థితి ఎదుర్కొంటున్న సమయంలో పరపతి సప్లయ్ పెంచుతుంది.

6) పర్యవేక్షణ: దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థను పర్యవేక్షిస్తుంది. నూతన బ్యాంకుల ఏర్పాటు, బ్యాంకుల విస్తరణకు కేంద్ర బ్యాంకు అనుమతి అవసరం.

7) విదేశీమారక ద్రవ్య నిల్వల పరిరక్షణ: కేంద్ర బ్యాంకు విదేశీ మారక విలువలను పరిరక్షిస్తుంది. విదేశీ మారక నిల్వలను నిర్వహిస్తూ వాటి వినియోగాన్ని నియంత్రణ చేస్తుంది. విదేశీ ద్రవ్యాన్ని అమ్మడం, కొనడం ద్వారా మారక రేటు స్థిరత్వానికి కృషిచేస్తుంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలను పరిరక్షిస్తూ, విదేశీ మారక వ్యవహారాలను క్రమబద్ధం చేస్తుంది.

8) ద్రవ్య విధానాన్ని రూపొందించి అమలు జరుపుతుంది: కేంద్ర బ్యాంకు ఆర్థిక స్థిరీకరణకు కృషి చేస్తుంది. జాతీయ, అంతర్జాతీయ విత్తసంస్థల ఆర్థికపరమైన సంబంధాలను ఏర్పరచుకుంటూ ఆర్థికాభివృద్ధికి దోహదపడే వివిధ చర్యలను తీసుకుంటుంది.

కేంద్ర బ్యాంకు ఆశయాలు:

  1. కరెన్సీ నోట్ల జారీని క్రమబద్ధం చేస్తుంది.
  2. దేశంలో ద్రవ్య స్థిరత్వాన్ని సాధించటం.
  3. పరపతి వ్యవస్థను నియంత్రించటం.
  4. వాణిజ్య బ్యాంకులకు మార్గదర్శకత్వం వహించుట.
  5. దేశ వ్యాప్తంగా ఒకే పరపతి విధానాన్ని రూపొందించి, అమలుచేయుట.

దేశంలో ద్రవ్య సుస్థిరతను సాధించుట కేంద్ర బ్యాంకు ప్రధాన ధ్యేయం. దేశంలో ఆర్థికాభివృద్ధిని పెంపొందించే విధానాలను కేంద్ర బ్యాంకు చేపడుతుంది.

ప్రశ్న 6.
భారతీయ రిజర్వు బ్యాంకు పాత్రను వివరించండి.
జవాబు:
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మన దేశానికి కేంద్ర బ్యాంకు. దేశంలోని ద్రవ్య, కోశ విధానాలను రూపొందించడం లోను, అమలు పరచడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది. ఇది దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థ అభివృద్ధికి నాయకత్వం వహిస్తూ దేశ అవసరాలకు తగినట్లుగా బ్యాంకింగ్ కార్యకలాపాలను క్రమబద్దీకరిస్తుంది.

రాయల్ కమీషన్ ఆఫ్ ఇండియన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్ సూచన మేరకు 1935 ఏప్రిల్లో 5 కోట్ల వాటా మూలధనంతో రిజర్వు బ్యాంకు నెలకొల్పబడినది. మొదట ఇది ప్రైవేటు వాటాదారు యాజమాన్యం క్రింద ఏర్పడింది. దీనిని 1949లో భారత ప్రభుత్వం జాతీయం చేసింది. 1934 భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం ప్రకారం అన్ని ముఖ్యమైన కేంద్ర బ్యాంకు విధులను ఇది నిర్వహిస్తుంది.

దీని ప్రధాన కార్యాలయం ముంబాయిలో ఉంది. ఢిల్లీ, కోలకత్తా, చెన్నై, ముంబాయి మొదలైన నగరాలలో ప్రాంతీయ కార్యాలయాలు పనిచేస్తాయి. 20 మంది డైరెక్టర్లతో కూడిన కేంద్ర డైరెక్టర్ల బోర్డు నియంత్రణ క్రింద ఇది పనిచేస్తుంది. ఇందులో ఒక గవర్నరు, నలుగురికి మించకుండా డిప్యూటీ గవర్నర్లు, రిజర్వు బ్యాంకు నాలుగు స్థానిక డైరెక్టర్ల బోర్డుల నుంచి ఒక్కొక్కరు కేంద్ర ప్రభుత్వంచే నియమించబడే పదిమంది డైరెక్టర్లు, ఒక ప్రభుత్వ అధికారి, మొత్తం 20 మంది ఉంటారు. వీరందరినీ కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

భారతీయ రిజర్వు బ్యాంకు విధులు:
1) కరెన్సీ నోట్ల జారీ: మనదేశంలోని కరెన్సీ నోట్ల జారీపై గుత్తాధిపత్య అధికారం రిజర్వు బ్యాంకు కలిగి ఉంది. రిజర్వు బ్యాంకు 1,000, 500, 100, 50, 20, 10, 5, 2 రూపాయల కరెన్సీ నోట్లను జారీ చేస్తుంది. ఈ నోట్లపై భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ సంతకం ముద్రించబడతాయి. 2006 ఆగష్టు నాటికి దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ విలువ 23,936 కోట్లు.

2) ప్రభుత్వ బ్యాంకరు రిజర్వు బ్యాంకు కేంద్ర ప్రభుత్వానికీ, రాష్ట్ర ప్రభుత్వానికి బ్యాంకరుగా, ప్రతినిధిగా, ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వ బ్యాంకరుగా వివిధ ప్రభుత్వ విభాగాల అకౌంట్లను నిర్వహిస్తుంది. ప్రభుత్వం తరుపున ద్రవ్యాన్ని స్వీకరిస్తుంది, చెల్లింపులు చేస్తుంది. ప్రభుత్వాలకు తాత్కాలిక ఋణాలు అందిస్తుంది. అన్ని ఆర్థిక వ్యవహారాలలో ప్రభుత్వాలకు సలహాదారుగా కూడా పనిచేస్తుంది.

3) బ్యాంకుల బ్యాంకరు: దేశంలోని బ్యాంకులకు రిజర్వు బ్యాంకు బ్యాంకరుగా పనిచేస్తుంది. కొన్ని రకాల బిల్లులను రీడిస్కౌంట్ చేసుకునే సదుపాయం వాణిజ్య బ్యాంకులకు కలుగజేస్తుంది. వివిధ బ్యాంకుల మధ్య బ్యాంకింగ్ లావాదేవీలను పరిష్కరించడానికి క్లియరింగ్ హౌస్ గా పనిచేస్తుంది. అలాగే బ్యాంకుల కార్యకలాపాలు తీర్చిదిద్ది వాటికి నాయకత్వం వహిస్తుంది.

4) అంతిమ ఋణదాత: మార్కెట్లోని అన్నిరకాల పరపతి సౌకర్యాలు ఉపయోగించుకున్న తర్వాత ఇంకా ద్రవ్యత్వ ఇబ్బందులున్నప్పుడు రిజర్వు బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు, డిస్కౌంటు గృహాలకు, ఇతర పరపతి సంస్థలకు కొన్ని షరతులకు లోబడి వాటి వినిమయ బిల్లులను రీడిస్కౌంట్ చేయడం ద్వారా పరపతి అందిస్తూ అంతిమ ఋణదాతగా పనిచేస్తుంది.

5) క్లియరింగ్ హౌస్ల నిర్వహణ: వ్యాపార అవసరాల నిమిత్తం బ్యాంకు ఖాతాదార్లు చెక్కుల ద్వారా చెల్లింపులు చేస్తుంటాయి. వేరువేరు ఖాతాదార్లు వేరువేరు బ్యాంకులలో తమ ఖాతాలు కలిగి ఉండటం వల్ల వివిధ బ్యాంకుల మీద ఈ చెక్కులు జారీ అవుతూ ఉంటాయి. వివిధ బ్యాంకుల మధ్య ఖాతాదార్ల చెక్కులకు సంబంధించిన సొమ్ము వారి వారి ఖాతాలలో జమచేయడానికి రిజర్వు బ్యాంకు తమవద్ద ఉన్న వివిధ బ్యాంకుల ఖాతాలను సర్దుబాటు చేస్తూ వసూళ్ళ చెల్లింపులు సులభతరం చేయడానికి వివిధ నగరాలలో క్లియరింగ్ హౌస్లు నిర్వహిస్తుంది.

6) విదేశీ మారక ద్రవ్యం పరిరక్షణ: రిజర్వు బ్యాంకు విదేశీ మారక ద్రవ్యంను పరిరక్షిస్తుంది. విదేశీ మారక ద్రవ్యం మారకం రేటులను స్థిరంగా ఉంచవలసిన బాధ్యత రిజర్వు బ్యాంకుది. విదేశీ మారక నిల్వలను నిర్వహిస్తూ వాటి వినియోగాన్ని నియంత్రణ చేస్తుంది.

7) పరపతి నియంత్రణ: ఆర్థిక వ్యవస్థలోని పరపతి పరిమాణాన్ని తగిన ద్రవ్య విధానం ద్వారా కేంద్ర బ్యాంకు నియత్రిస్తుంది. ద్రవ్యోల్బణం సమయంలో పరపతి తగ్గిస్తుంది. ఆర్థిక వ్యవస్థ తిరోగమన పరిస్థితి ఎదుర్కొంటున్న సమయంలో పరపతి సప్లయ్ పంచుతుంది.

రిజర్వు బ్యాంకు ఆశయాలు:

  • కరెన్సీ నోట్ల జారీని క్రమబద్ధం చేయటం.
  • దేశంలో ద్రవ్య స్థిరత్వాన్ని సాధించటం.
  • వాణిజ్య బ్యాంకులకు మార్గదర్శకత్వం వహించటం.
  • దేశంలో పరపతి వ్యవస్థను నియంత్రించటం
  • దేశవ్యాప్తంగా ఒకే పరపతి విధానాన్ని రూపొందించి అమలు చేయడం.

ప్రశ్న 7.
ద్రవ్యోల్బణాన్ని నిర్వచించి, కారణాలను వివరించండి.
జవాబు:
సాధారణ ధరల స్థాయిలో స్థిరమైన, గ్రహించదగిన పెరుగుదల పరిస్థితిని ద్రవ్యోల్బణం అంటారు. ఇది అనేక విధాలుగా ప్రజల ఆర్థిక జీవితాన్ని, సంక్షేమాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది ఉత్పత్తి విలువ, పంపిణీ విలువ ప్రభావితం కలిగి ఉంటుంది.

ద్రవ్యోల్బణానికి కారణాలు: ద్రవ్యోల్బణం అధిక డిమాండు వల్లగాని, అల్ప సప్లయ్ వల్లగాని, ఉత్పత్తి వ్యయం పెరుగుదల వల్లగాని ఏర్పడుతుంది. ఈ పరిస్థితులకు దారితీసే పలు అంశాలు.
a) వస్తువుల సమిష్ఠి డిమాండ్ పెరుగుదల:

  1. అధిక జనాభా పెరుగుదల రేటు.
  2. ఆర్థికాభివృద్ధి వల్ల తలసరి ఆదాయాలు పెరగడం.
  3. ఉద్యోగిత కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వం అధికంగా ఖర్చుచేయడం.
  4. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లయ్ పెరగడం.
  5. ప్రత్యక్ష పన్నురేట్లు తగ్గించటం.
  6. లోటు బడ్జెట్ విధానాన్ని అనుసరించడం.

AP Inter 1st Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

b) అల్ప సప్లయ్ కారణాలు:

  1. వ్యవసాయ రంగంలో ఋతుపవనాలు విఫలం కావడం, వరదలు, పంటలకు తెగులు రావడం, కల్తీ విత్తనాల వాడకం మొదలైనవి.
  2. సంస్థాగత పరపతి తగినంత లభించనందువల్ల పెట్టుబడి కొరత ఏర్పడటం.
  3. ఉత్పాదకాలు, ముడిపదార్థాల సప్లయి లేకపోవడం లేదా కొరతగా ఉండటం.
  4. విద్యుత్ కొరత, కార్మికుల అశాంతి మొదలైన కారణాల వల్ల స్థాపిత శక్తి పూర్తిగా వినియోగించుకోలేకపోవటం.
  5. కొన్ని పరిశ్రమల దీర్ఘ ఫలనకాలం.
  6. దేశంలో వినియోగానికి సప్లయ్ తగ్గించి ఎగుమతులు చేయడం.

c) ఉత్పత్తి వ్యయం పెరుగుదలకు కారణాలు:

  1. ఉత్పత్తి కారకాల ధరలు పెరగడం.
  2. పన్నుల రేట్లు పెరగడం.
  3. ఆధునిక పద్ధతులు ఉపయోగించకుండా పాత పద్ధతులలో ఉత్పత్తి చేయడం.
  4. అధిక ధరలకు యంత్రాలను, పనిముట్లను దిగుమతి చేయడం.

ప్రశ్న 8.
ద్రవ్యోల్బణ కారణాలను పేర్కొని, దాని ప్రభావాన్ని తెలపండి.
జవాబు:
సాధారణ పరిభాషలో ద్రవ్యోల్బణమనగా ధరల పెరుగుదల. కేవలం ఒక్కసారి ధరలు పెరిగినంత మాత్రాన దానిని ద్రవ్యోల్బణం అని అనకూడదు. నిర్విరామంగా ధరలు పెరుగుతుంటే దానినే ద్రవ్యోల్బణం అంటారు. భారతదేశంలో ద్రవ్యోల్బణ సమస్య ఉంది.

ద్రవ్యోల్బణ నిర్వచనం: వివిధ ఆర్థిక శాస్త్రవేత్తలు ద్రవ్యోల్బణం గూర్చి వివిధ నిర్వచనాలు ఇచ్చారు.

  1. హాట్రే అను ఆర్థిక శాస్త్రవేత్త ప్రకారం, “కరెన్సీ నోట్లను అధికంగా జారీ చేయటాన్నే ద్రవ్యోల్బణమందురు”.
  2. డాల్టన్ అభిప్రాయం ప్రకారం, “ద్రవ్యోల్బణమనగా అధిక ద్రవ్యం తక్కువ వస్తువులను వెంటాడటం”.
  3. కిమ్మరర్ అను ఆర్థిక శాస్త్రవేత్త ప్రకారం, “వ్యాపార అవసరాలకు మించి కరెన్సీ ఉండటాన్నే ద్రవ్యోల్బణ మందురు”.
  4. క్రౌథర్ అను ఆర్థిక శాస్త్రవేత్త ప్రకారం, “ద్రవ్య విలువ పడిపోవడం అనగా ధరలు పెరగటాన్ని ద్రవ్యోల్బణమని చెప్పవచ్చు”.

వస్తువుల సప్లై, డిమాండ్లలో అసమతౌల్యం ఏర్పడటం వలన ధరల స్థాయిలో నిర్విరామంగా పెరుగుదల ఏర్పడును. అటువంటి ధరల పెరుగుదలనే ద్రవ్యోల్బణంగా చెప్పవచ్చు. ప్రతి ధర పెరుగుదలను ద్రవ్యోల్బణంగా చెప్పకూడదు. ధరల పెరుగుదల గణనీయమైందిగా, నిర్విరామంగా కొనసాగినపుడే ద్రవ్యోల్బణం ఏర్పడిందని చెప్పాలి. ద్రవ్యోల్బణ ప్రభావం లేదా ఫలితాలు: ధరల పెరుగుదల ముఖ్యంగా ఉత్పత్తి, పంపిణీలపై ఎటువంటి ప్రభావం కలిగించునో పరిశీలిద్దాం.

ఉత్పత్తిపై ప్రభావం: ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు ధరలు పెరుగుటచే ఉత్పత్తిదారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ధరలు పెరుగుట వల్ల లాభాలు పెరుగుతాయి. దీనివల్ల పెట్టుబడి పెరిగి ఉత్పత్తి పెరుగును. దీనివల్ల ఉద్యోగిత, ఆదాయాలు పెరిగి ఉత్పత్తి మరింతగా పెరుగుతుంది. ఇది సంపూర్ణ ఉద్యోగితకు దారితీస్తుంది. ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ ఉద్యోగితను చేరుకున్న తరువాత ధరలు పెరుగుదల ఉత్పత్తిని పెంచదు. ధరలు పెరుగుదల ఒక మోతాదు ఉన్నా ఇది ఉత్పత్తి పెరుగుదలకు దారితీస్తుంది.

ధరల పెరుగుదల విపరీతంగా ఉన్నా, అనగా అతి ద్రవ్యోల్బణం ఉన్నా వ్యాపార రంగంలో అస్థిర పరిస్థితులు ఏర్పడి ఉత్పత్తి మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అతి ద్రవ్యోల్బణం వల్ల ఆర్థిక స్థిరత్వం దెబ్బతిని ఆర్థిక వ్యవస్థలో సమస్యలేర్పడతాయి. దీనివల్ల రాజకీయ, ఆర్థిక అస్థిరత్వం ఏర్పడి ఉత్పత్తి, ఉద్యోగితా స్థాయిలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆర్థిక వ్యవస్థలో వస్తువుల కొరత, నల్ల బజారు కార్యకలాపాలు ఏర్పడి సామాన్య ప్రజలకు వస్తువులు అందుబాటులో ఉండక వారి జీవన ప్రమాణ స్థాయిని దెబ్బతీయును.

పంపిణీపై ప్రభావం: సమాజంలోని ప్రజలను మూడు విధాలుగా విభజించవచ్చు. అవి:

  1. నిశ్చిత ఆదాయం పొందేవారు.
  2. వ్యాపారస్తులు
  3. ఋణాలు ఇచ్చేవారు, పుచ్చుకొనేవారు, ద్రవ్యోల్బణ ప్రభావం ఈ వర్గాలవారిపై ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవచ్చు.

a) నిశ్చిత ఆదాయం పొందేవారు, శ్రామిక వర్గంవారు: ద్రవ్యోల్బణం ఏర్పడినపుడు ధరలు పెరుగుతాయేమో గాని నిశ్చితమైన ఆదాయం పొందేవారి ఆదాయం పెరగదు. కనుక ఈ వర్గం వారు ద్రవ్యోల్బణం ఏర్పడినపుడు నష్టపోతారు. ద్రవ్యోల్బణ సమయంలో వస్తు సేవలు, వస్తు సేవల ధరలు పెరిగినంతగా వారి వేతనాలు పెరగకపోవడం వల్ల శ్రామిక వర్గం వారు నష్టపోతారు. శ్రామిక సంఘాలు బలమైనవిగా ఉన్నా ధరలు పెరుగుదలకు అనుగుణంగా వేతనాలను పొందవచ్చు. అట్లా కాని పక్షంలో శ్రామిక వర్గం నష్టపోతుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

b) వ్యాపారస్తులు: ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు ధరలు పెరుగుతాయి, కనుక వ్యాపారస్తుల లాభాలు పెరుగుతాయి. వ్యాపారానికి అయ్యే వ్యయం మాత్రం ఒప్పందం ప్రకారం నిలకడగా ఉంటుంది. అందువల్ల ధరలు పెరిగితే వ్యాపారస్తులు లాభాన్ని పొందుతారు.

ఋణాలు ఇచ్చేవారు పుచ్చుకొనేవారు: ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు ఋణాలు ఇచ్చేవారు అనగా ఋణదాతలు నష్టపోతారు. ఈ సమయంలో ఋణాలు తీసుకొనేవారు లాభాన్ని పొందుతారు.

ద్రవ్యోల్బణం వల్ల ఉద్యోగితా స్థాయి పెరుగుతుంది. ధరలు పెరుగుదల వల్ల ఉత్పత్తి పెరిగి, ఉద్యోగితా స్థాయి పెరుగుతుంది. ద్రవ్యోల్బణం వల్ల ధరలు పెరిగి, ఎగుమతులు తగ్గి విదేశీ వ్యాపారంలో లోటు ఏర్పడుతుంది. ద్రవ్యోల్బణ పరిస్థితులు ధనవంతులను ధనవంతులుగా, పేదవారిని నిరు పేదలుగాను తయారుచేసి అసమానతలను పెంచుతుంది. అందువల్ల ద్రవ్యోల్బణాన్ని అరికట్టాలి.

ప్రశ్న 9.
ద్రవ్యోల్బణ నివారణ చర్యలు తెలపండి.
జవాబు:
దీర్ఘకాలంలో సాధారణ ధరల స్థాయిలో నిరంతరమైన పెరుగుదలను ద్రవ్యోల్బణం అని అంటారు. పరిమిత ద్రవ్యోల్బణం ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుంది. అతి ద్రవ్యోల్బణం ఆర్థికాభివృద్ధిని నిరోధిస్తుంది. ద్రవ్యోల్బణాన్ని నివారించడానికి ప్రభుత్వం అనేక చర్యలను చేపడుతుంది. అవి:

1) ద్రవ్యపరమైన చర్యలు: ద్రవ్యపరమైన చర్యలు ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లయ్న క్రమబద్ధం చేస్తాయి. బ్యాంకులు పరపతిని క్రమబద్ధం చేయటం ద్వారా ద్రవ్య సప్లయిని నియంత్రణ చేయటం జరుగుతుంది. కేంద్ర బ్యాంకు పరిమాణాత్మక, గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాల ద్వారా ద్రవ్యం సప్లయ్న నియంత్రణ చేయవచ్చు.

2) కోశ విధానాలు: ద్రవ్యోల్బణ కాలంలో ప్రభుత్వం మిగులు బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి పన్ను రేట్లను పెంచటం, కొత్తగా పన్నులను విధించడం మొదలగువాటిని కోశపరమైన చర్యలు అంటారు.

3) ద్రవ్యేతర అంశాలు:
a) ఉత్పత్తిని పెంచటం: వస్తుత్పత్తిని పెంచటం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అరికట్టవచ్చు. ఉత్పత్తిని పెంచటానికి ఈ క్రింది చర్యలు చేపట్టాలి.

  1. ఉత్పాదక వనరులను సక్రమంగా కేటాయించడం.
  2. దేశీయంగా ఉన్న వస్తూ కొరతను దిగుమతుల ద్వారా ద్రవ్యోల్బణాన్ని అరికట్టవచ్చు.

b) వేతనాలు: వేతనాల పెరుగుదలకు, వస్తు ధరల పెరుగుదలకు దగ్గర సంబంధం ఉంది. సక్రమమైన వేతన విధానాలను అమలు చేయాలి.

c) రేషనింగ్: ద్రవ్యోల్బణాన్ని నివారించే ప్రత్యక్ష చర్య వస్తువు ధరలను అమలు చేయటం, అదుపులో ఉంచటం. చట్టబద్ధంగా ప్రతి వస్తువుకు గరిష్ఠ ధరను నియంత్రించి ఆ ధర కంటే ఎక్కువ ధరకు అమ్మకుండా చర్యలు తీసుకోవాలి.

d) బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టుట: అక్రమ వస్తు నిల్వలను అదుపు చేయుట ద్వారా వస్తువుల ధరలను అదుపు చేయవచ్చు. ప్రభుత్వ నియమ, నిబంధనలకు వ్యతిరేకంగా నిల్వచేసే వ్యాపారస్తులను కఠినంగా శిక్షించాలి.

ప్రశ్న 10.
“ద్రవ్యోల్బణ విరామం” అనే భావనను పటం సహాయంతో వివరించండి.
జవాబు:
జె.యం. కీన్స్ “ద్రవ్యోల్బణ విరామం” అనే భావనను ప్రవేశపెట్టారు. కీన్స్ అభిప్రాయంలో ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లయ్ పెరుగుదల, నిరుపయోగ వనరులున్నంత కాలం ద్రవ్యోల్బణ పరిస్థితులకు దారితీయదు. కారణం ఇలాంటి పరిస్థితులలో ఉత్పత్తి పెరుగుతుందే తప్ప ధరలు పెరగవని కీన్స్ వాదన. ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ ఉద్యోగితా స్థాయిని చేరుకున్న తరువాత ద్రవ్య సప్లై పెరిగితే దాని ప్రభావం పూర్తిగా ధరలపై ఉంటుంది. దీనినే కీన్స్ నిజ ద్రవ్యోల్బణంగా ఉంటుంది. దీనిని ప్రక్క రేఖా పటం ద్వారా తెలియజేయవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం 1

పై రేఖా పటంలో C + I + G ఆర్థిక వ్యవస్థలోని మొత్తం వ్యయం, పెట్టుబడి, ప్రభుత్వ వ్యయం తెలుపు తుంది. O.S సమిష్టి సప్లయిని తెలియజేయును. P బిందువు వద్ద ‘N’ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ ఉద్యోగితా స్థాయిని చేరుకుంటుంది. ‘P’ బిందువు వరకు ద్రవ్యోల్బణం ఏర్పడదు. ‘P’ బిందువు తరువాత ప్రభుత్వ వ్యయం పెరగడం వల్ల ధరలు పెరుగుతాయి. పై రేఖా పటంలో ధరల పెరుగుదల P నుంచి P’ వరకు సూచించడమైంది. రేఖా పటంలోని P నుంచి P’ వరకు మధ్యగల తేడా ‘ద్రవ్యోల్బణ విరామం” తెలియజేయును.

AP Inter 1st Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వస్తు మార్పిడి విధానం
జవాబు:
ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం వాడుకలోకి రాకముందు “వస్తు మార్పిడి విధానం” అమలులో ఉండేది. అప్పుడు జనాభా పరిమితంగా ఉండి, వ్యక్తుల కోరికలు సాధారణ స్థాయిలో ఉండేవి. ఈ విధానంలో వ్యక్తులు వస్తువులకు బదులుగా వస్తువులను వినిమయంగా పొందటాన్ని వస్తు మార్పిడి విధానం అంటారు. ఇలాంటి మార్పిడికి ప్రధాన కారణం మానవుల ‘అవసరాలు’. ఆర్థిక కార్యకలాపాలు పరిమితంగా ఉండి, వ్యక్తుల కోరికలు సాధారణంగా ఉన్నంత వరకు ఈ విధానం కొనసాగుతుంది. జనాభా పెరిగి, కోరికలలో మార్పులు సంభవించి, వర్తక వాణిజ్య వ్యవహారాలు పెరగడంతో ఈ విధానం అనేక ఇబ్బందులను ఎదుర్కొనవలసి వచ్చింది.

వస్తు మార్పిడి విధానంలోని సమస్యలు:
1) కోర్కెల సమన్వయము లోపించుట: వస్తు మార్పిడి విధానం సాఫీగా జరగాలంటే ఇరుపక్షాల వారి కోరికలలో సమన్వయం కుదరాలి. ఉదా: వరి పండించే వ్యక్తి వస్త్రం పట్ల అవసరం, వస్త్రం నేసే వ్యక్తికి వరి అవసరం ఏక కాలంలో కలగాలి. అలాగైతేనే వినిమయం లేదా మార్పిడికి అవకాశం ఏర్పడుతుంది. ఇరువురి కోరికలలో సమన్వయం కుదరకపోతే మార్పిడి అసాధ్యమవుతుంది.

2) సంపద నిల్వ చేయడంలో ఇబ్బంది: మార్పిడికి ఉపయోగించే అన్ని వస్తువులను ‘నిల్వ’ ఉంచే అవకాశం ఉండదు. కారణం కొన్ని రకాల వస్తువులను ‘నిల్వ’ ఉంచడం వల్ల అవి పాడైపోయే అవకాశం ఉంది. కాలం గడిచే కొద్ది ఇలాంటి వస్తువుల విలువ క్షీణించడం, కొన్నిసార్లు నశించడం జరగవచ్చు. ఉదా: పశువులు, కూరగాయలు, ఆహార ధాన్యాలు మొదలైనవి.

3) వస్తువుల అవిభాజ్యత: కొన్ని వస్తువులను విభజించడం వల్ల వాటి విలువ క్షీణించవచ్చు లేదా పూర్తిగా నశించవచ్చు. ఉదా: పశువులు, పనిముట్లు, యంత్రాలు. ఇలాంటి వాటి విషయంలో విభజించటానికి వీలుండదు. అందువల్ల మార్పిడి సాధ్యం కాదు.

4) విలువను నిర్ణయించే కొలమానం లేకపోవుట: వస్తు మార్పిడి విధానంలో వస్తువుల విలువలను ఇతర వస్తువుల విలువలో చెప్పవలసి వస్తుంది. అంటే వస్తువుల విలువలను ఖచ్చితంగా కొలిచే కొలమానం / సాధనం లేకపోవడం వల్ల ఈ విధానాన్ని అమలుచేయడం ఎంతో కష్టమౌతుంది.

ప్రశ్న 2.
ద్రవ్య నిర్వచనాలు.
జవాబు:
ద్రవ్యమునకు పూర్వం వస్తు మార్పిడి విధానం అమలులో ఉండేది. వ్యక్తి తాను ఉత్పత్తి చేసిన వస్తువులను ఇతర వస్తువులతో మార్పిడి చేసుకొను విధానాన్నే వస్తు మార్పిడి విధానమంటారు. ఈ విధానంలో కొన్ని ఇబ్బందులు ఉండటం వల్ల దీనికి బదులు ద్రవ్యాన్ని ప్రవేశపెట్టడమైంది.

నిర్వచనాలు: వివిధ ఆర్థిక శాస్త్రవేత్తలు ద్రవ్యానికి సంబంధించి వివిధ నిర్వచనాలను ఇచ్చారు.

క్రౌధర్ అను ఆర్థిక శాస్త్రవేత్త ప్రకారం, “వినిమయ సాధనంగా అందరూ అంగీకరించేది, విలువల కొలమానంగా ఉపయోగించబడేదే ద్రవ్యం”.

రాబర్ట్సన్ ప్రకారం, “వస్తు క్రయ విక్రయ చెల్లింపులలో, ఇతర వ్యవహారాల పరిష్కారాలలో అధికంగా జనామోదం పొందింది”. ద్రవ్యంగా చెప్పవచ్చును.
సెలిగ్మన్ ‘ఏ వస్తువుకు అయితే సర్వజనాంగీకారం ఉంటుందో దానినే ద్రవ్యం’గా నిర్వచించాడు.

కొంతమంది అభిప్రాయం ప్రకారం చట్టం దేనిని ద్రవ్యమంటుందో అదే ద్రవ్యం అంటారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 3.
ద్రవ్యం
రకాలు.
జవాబు:
క్రౌధర్ అను ఆర్థిక శాస్త్రవేత్త ప్రకారం “వినిమయ సాధనంగా అందరూ అంగీకరించేది, విలువ కొలమానంగా ఉపయోగపడేదే ద్రవ్యం”.
ద్రవ్య రకాలు:
1) వస్తురూప ద్రవ్యం/ ప్రాతినిద్య ద్రవ్యం: ద్రవ్యం ప్రవేశపెట్టిన తొలిదశలో కొన్ని వస్తువులు ద్రవ్యంగా పరిగణించబడేవి. జంతువులు, బంగారు, వెండి మొదలగు వాటిని ద్రవ్యంగా ఉపయోగించారు. ఈ విధమైన ద్రవ్యాన్ని వస్తు రూప ద్రవ్యం లేదా పుల్ బాడీడ్ ద్రవ్యం అంటారు.
నాణేలు, కరెన్సీ నోట్లు ఈ రకానికి చెందుతాయి. ఇది ద్రవ్యానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. కాబట్టి వీటిని ప్రాతినిధ్య ద్రవ్యం అంటారు. వీటి ముఖ విలువ కంటే అంతర్గత విలువ తక్కువగా ఉంటుంది.

2) చట్టబద్ధ ద్రవ్యం, ఐచ్ఛిక ద్రవ్యం: చట్టబద్ధ ద్రవ్యం అనగా ప్రభుత్వంచే చట్టరీత్యా గుర్తింపు పొందిన ద్రవ్యాన్ని చట్టబద్ధ ద్రవ్యం అని అంటారు. ఈ ద్రవ్యానికి చట్టబద్ధత ఉన్నందువల్ల ప్రతి ఒక్కరూ వస్తుసేవల కొనుగోలుకు, అమ్మకానికి దీనిని వినిమయ మాధ్యమంగా తప్పనిసరిగా అంగీకరించాలి.

ద్రవ్యానికి ప్రత్యామ్నాయంగా వాడే ఏ పరపతి సాధనాన్ని అయినా ఐచ్ఛిక ద్రవ్యంగా పరిగణించవచ్చు. ఉదా: బిల్లులు, ప్రామిసరి నోట్లు, బాండ్లు, ట్రెజరీ బిల్లులు మొదలగు ద్రవ్యాన్ని అంగీకరించమని ఏ ఒక్కరిని బలవంతం చేయడానికి వీలుకాదు.

3) లోహ ద్రవ్యం, కాగితపు ద్రవ్యం: అన్ని రకాల నాణేలు లోహ ద్రవ్యం క్రిందికి వస్తాయి. నాణేల తయారీకి వెండి, నికెల్, స్టీల్ మొదలగు లోహాలను ఉపయోగిస్తారు.
కాగితంపై ముద్రించిన ద్రవ్యాన్ని కాగితపు ద్రవ్యం అని అంటారు. అన్ని కరెన్సీ నోట్లు కాగితం ద్రవ్యం క్రిందకు వస్తాయి.

4) ప్రామాణిక ద్రవ్యం, టోకెన్ ద్రవ్యం: ప్రామాణిక ద్రవ్యం ముఖ విలువ, అంతర్గత విలువ ఒకటిగానే ఉంటాయి. ప్రభుత్వం కరెన్సీని ముద్రించడానికి ఏదైనా ఒక లోహాన్ని ప్రమాణంగా తీసుకుంటుంది.

ద్రవ్యం అంతర్గత విలువ కంటే ముఖ విలువ ఎక్కువగా ఉంటే దీనిని టోకెన్ ద్రవ్యం అంటారు. ఇది పరివర్తనాత్మకం కాదు. దీనిని ప్రజలు అన్ని రకాల వ్యవహారాలలో వినిమయ మాధ్యమంగా మాత్రమే అంగీకరిస్తారు.

ప్రశ్న 4.
ద్రవ్యం ప్రాథమిక విధులు.
జవాబు:
ద్రవ్యం ప్రాథమిక విధులు:
1) వినిమయ మాధ్యమం: ద్రవ్యం వినిమయ మాధ్యమంగా వ్యవహరిస్తుంది. ఏ వస్తువైనా ముందుగా ద్రవ్యంతో మార్పిడి చేసుకొని, ఆ తరువాత ఆ ద్రవ్యంలో మరి ఏ ఇతర వస్తువునైనా కొనుగోలు చేయవచ్చు. ఆ విధంగా ద్రవ్యం |అనే వినిమయ మాధ్యమం ద్వారా ప్రజలు వస్తు సేవలను వినిమయం చేసుకోవచ్చు.

2) విలువల కొలమానం: వస్తు సేవల విలువ కొలమానంగా ద్రవ్యం వ్యవహరిస్తుంది. వ్యాపార వ్యవహారాలను సులువైనవిగా, సులభతరమైనవిగా మార్చింది. ప్రతి వస్తువు విలువను ద్రవ్య యూనిట్లో వ్యక్తపరచడం జరుగుతుంది. దీనిని ధర అంటారు. ద్రవ్యం యూనిట్ విలువ స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే అది సంతృప్తికరమైన కొలమానంగా పనిచేస్తుంది.

ప్రశ్న 5.
వాణిజ్య బ్యాంకు డిపాజిట్ల రకాలు.
జవాబు:
సంస్థాగత పరపతిని సమకూర్చే విషయంలో వాణిజ్య బ్యాంకుల ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది. దేశ ఆర్థిక కార్యకలాపాలలో వాణిజ్య బ్యాంకుల పాత్ర గణనీయమైంది. వాణిజ్య బ్యాంకులు ప్రజల వద్ద నుండి పొదుపు మొత్తాలను సమీకరించి వాటిని ఉత్పాదక కార్యకలాపాల కోసం పెట్టుబడిగా ఉపయోగించవచ్చు. పొదుపు, పెట్టుబడులను సమన్వయ పరచడానికి వాణిజ్య బ్యాంకులు తోడ్పడతాయి. వాణిజ్య బ్యాంకులు ద్రవ్యాన్ని సృష్టిస్తాయి. ఈ బ్యాంకులు ముఖ్యంగా ప్రజల దగ్గర నుండి డిపాజిట్లను సేకరించి ఋణాలు మంజూరు చేస్తాయి. డిపాజిట్ల మీద ఇచ్చే వడ్డీ కంటే ఋణాల మీద వసూలు చేసే వడ్డీ ఎక్కువగా ఉంటుంది. వాణిజ్య బ్యాంకులు కొన్ని ప్రయోజనాలకు మాత్రమే పరపతిని సమకూర్చడం ద్వారా ఆర్థిక కార్యకలాపాల స్వభావ, స్వరూపాలను నిర్ణయించగలవు.

వాణిజ్య బ్యాంకుల విధులు: వాణిజ్య బ్యాంకులు నిర్వహించే విధులను ముఖ్యంగా రెండు విధాలుగా విభజించవచ్చు. అవి: ప్రాథమిక విధులు, అనుషంగిక విధులు.

1) ప్రాథమిక విధులు: వాణిజ్య బ్యాంకుల యొక్క ప్రాథమిక విధులు ప్రజల దగ్గర నుండి డిపాజిట్లను సేకరించడం, ఖాతాదారులకు ఋణాలను మంజూరు చేయుట.
డిపాజిట్లను స్వీకరించుట: వాణిజ్య బ్యాంకులు ప్రజల నుండి డిపాజిట్లను స్వీకరిస్తాయి. ఖాతాదారులు బ్యాంకులో సొమ్మును డిపాజిట్ చేసినపుడు ఆ మొత్తం వారి ఖాతాలో జమ అవుతుంది. ఇటువంటి డిపాజిట్లను ప్రాథమిక డిపాజిట్లు లేదా సాధారణ డిపాజిట్టు అని అంటారు. వాణిజ్య బ్యాంకులు స్వీకరించే డిపాజిట్లు అనేక రకాలుగా
ఉంటాయి.

AP Inter 1st Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

a) కరెంట్ డిపాజిట్లు: కరెంట్ డిపాజిట్లలోని సొమ్మును ఖాతాదారుడు అడిగిన వెంటనే బ్యాంకు చెల్లిస్తుంది. ఖాతాదారుడు తన సొమ్మును తీసుకునేటప్పుడు ముందుగా బ్యాంకుకు తెలియపరచవలసిన అవసరం లేదు. కాని ఈ డిపాజిట్లకు బ్యాంకు వడ్డీ చెల్లించదు. సాధారణంగా వ్యాపారస్తులు తమ వ్యాపార వ్యవహారాల చెల్లింపు కోసం కరెంటు డిపాజిట్లను చేయుదురు.

b) ఫిక్స్డ్ డిపాజిట్లు: ఈ డిపాజిట్లు ఒక నిర్ణీత కాలానికి సంబంధించినవై ఉంటాయి. ఈ డిపాజిట్లు నిర్ణయించిన కాల వ్యవధి లోపల చెల్లించబడవు. వీటినే గడువు డిపాజిట్లు లేదా కాల పరిమితి డిపాజిట్లు అని కూడా అందురు. వీటిపై బ్యాంకులు ఎక్కువ వడ్డీని చెల్లిస్తాయి.

c) సేవింగ్ డిపాజిట్లు: ప్రజలు తమ వద్దనున్న చిన్నచిన్న పొదుపు మొత్తాలను బ్యాంకులలో సేవింగ్ డిపాజిట్లుగా దాచుకుంటారు. ఈ డిపాజిట్లను అవసరమయినప్పుడు తీసుకోవచ్చు. కానీ వీటిపై కొన్ని షరతులు ఉంటాయి. కొంత గరిష్ట మొత్తానికి మించి తీసుకోకూడదు. వీటిపై బ్యాంకులు స్వల్ప వడ్డీని చెల్లిస్తాయి.

d) రికరింగ్ డిపాజిట్లు: కాల పరిమితి డిపాజిట్లలో ఒక రకం రికరింగ్ డిపాజిట్లు ఒకేసారి పెద్ద మొత్తంలో పొదుపు చేయలేని వారికి ఈ డిపాజిట్లు సౌకర్యంగా ఉంటాయి. ప్రతి నెల 10 గాని అంతకన్నా కొన్ని రెట్లు అదనంగాగాని ఒక సంవత్సరం లేదా కొన్ని సంవత్సరాల వ్యవధికి ఈ ఖాతాలో జమ చేయవచ్చు. పై డిపాజిట్లేగాక రికరింగ్ డిపాజిట్లు, సీజనల్ డిపాజిట్లు, చిల్డ్రన్ బెనిఫిట్ డిపాజిట్లు మొదలైనవి కూడా ఉంటాయి. 2) అనుషంగిక విధులు: బాంకులు నిర్వహించే ప్రాథమిక విధుల ఫలితంగా ‘ప్రాతినిథ్య విధులు’ ఏర్పడతాయి.

  1. బాంకులు ఖాతాదారుల ప్రతినిధులుగా వారి తరపున బీమా ప్రీమియమ్లు, కరెంట్ బిల్లులు మొదలైన వాటిని ఖాతాదారుల ఆదేశానుసారం నిర్ణీత సమయాల్లో చెల్లించుట.
  2. బాంకులు ఖాతాదారులు ‘ఏజెంట్గా ‘ కంపెనీల షేర్లను, రుణ పత్రాలను కొనిపెడతాయి.
  3. ఖాతాదారుల తరపున డ్రాఫ్టు ద్వారా, చెక్ ల ద్వారా, తంతి తపాలా ద్వారా సొమ్ము బదిలీ చేస్తుంది.

ప్రశ్న 6.
వాణిజ్య బ్యాంకు – కేంద్ర బ్యాంకు.
జవాబు:
వాణిజ్య బ్యాంకు: ఇతరులకు ఇవ్వడానికి ద్రవ్యం కలిగిన వారి నుంచి లేదా తమ ఆదాయాల నుంచి పొదుపు చేసే వారి నుంచి బ్యాంకు ద్రవ్యం వసూలు చేసి దానిని అవసరమైన వారికి ఋణంగా ఇస్తుంది.

కేంద్ర బ్యాంకు: దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థకు కేంద్ర బ్యాంకు శిఖరం. ఇది బ్యాంకింగ్ వ్యవస్థలో బ్యాంకుల ఆర్థిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ, నియంత్రిస్తూ, క్రమబద్ధీకరిస్తుంది.

వాణిజ్య బ్యాంకు

  1. వాణిజ్య బ్యాంకుల ప్రాథమిక విధి డిపాజిట్ల సేకరణ, ఋణాల మంజూరు.
  2. వాణిజ్య బ్యాంకులు ఖాతాదారులకు ఏజెంట్, సలహా దారుగా వ్యవహరిస్తాయి.
  3. ప్రజల నుంచి స్వీకరించిన డిపాజిట్ల నుంచి పరపతిని సృష్టిస్తాయి.
  4. వాణిజ్య బ్యాంకులు కొనుగోలుదారుడు అమ్మకం దారునికి ఇచ్చిన వినిమయ బిల్లులు డిస్కౌంట్ చేసుకుంటాయి.
  5. ఇది విదేశీ మారక ద్రవ్యం విలువను, వాటి వినిమయాన్ని నిమిత్తం విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూరుస్తాయి.

కేంద్ర బ్యాంకు

  1. కేంద్ర బ్యాంకు ప్రాథమిక విధి కరెన్సీ నోట్ల జారీ.
  2. కేంద్ర బ్యాంకులు ప్రభుత్వానికి, వాణిజ్య బ్యాంకులకు ఏజెంటుగా, సలహాదారుగా వ్యవహరిస్తాయి.
  3. ఆర్థిక వ్యవస్థలోని పరపతిని ద్రవ్య విధానాల ద్వారా నియంత్రిస్తుంది.
  4. వాణిజ్య బ్యాంకుల డిస్కౌంట్ హౌస్ల, ఇతర పరపతి సంస్థల వినిమయ బిల్లులను రీడిస్కౌంట్ చేసుకుంటాయి.
  5. ఎగుమతిదారులకు, దిగుమతిదారులకు వ్యాపార నియంత్రణ చేస్తుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 7.
కేంద్ర బ్యాంకు ఏ విధంగా “అంతిమ ఋణదాత” ?
జవాబు:
కేంద్ర బ్యాంకు విధులలో వాణిజ్య బ్యాంకులకు అంతిమ ఋణదాతగా వ్యవహరించడం ఒకటి. అత్యవసర సమయాలలో వాణిజ్య బ్యాంకులకు సహాయం చేయుటకు కేంద్ర బ్యాంకు సిద్ధంగా ఉంటుంది. కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులకే కాకుండా డిస్కౌంట్ గృహాలకు, ఇతర పరపతి సంస్థలకు కొన్ని షరతులకు లోబడి వినిమయ బిల్లులను రీడిస్కౌంట్ చేయటం ద్వారా అంతిమ రుణదాతగా పనిచేస్తుంది. కొన్ని ఆస్తులను నగదుగా మార్చుకొని నగదు రిజర్వులను పెంచుకొనే అవకాశం వాణిజ్య బ్యాంకులకు, ఇతర బ్యాంకులకు, ఇతర ద్రవ్య సంస్థలకు అవకాశం ఏర్పడుతుంది. అంతిమ ఋణదాత అంటే అతిక్లిష్ట పరిస్థితులలో వాణిజ్య బ్యాంకులను, ఇతర ద్రవ్య సంస్థలను ఆదుకోవటము.

అత్యవసర పరిస్థితులలో వాణిజ్య బ్యాంకులను కేంద్ర బ్యాంకు ఆదుకుంటుంది. ఋణాలను మంజూరు చేయడానికి కేంద్ర బ్యాంకు వెనకాడదు. అదే సమయంలో పరపతి నియంత్రణ సాధనాల ద్వారా పరపతి ద్రవ్యాన్ని నియంత్రిస్తుంది. అత్యవసర సమయంలో కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకుల సెక్యూరిటీలను హామీగా ఉంచుకొనే ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కలుగజేస్తుంది. అందువలన కేంద్ర బ్యాంకును అంతిమ ఋణదాత అని పేర్కొందురు.

ప్రశ్న 8.
కేంద్ర బ్యాంకు లక్ష్యాలు. [Mar. ’17, ’16, ’15]
జవాబు:
దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థకు కేంద్ర బ్యాంకు అత్యున్నతమైనది. బ్యాంకింగ్ వ్యవస్థలో బ్యాంకుల ఆర్థిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది, నియంత్రిస్తుంది, క్రమబద్ధీకరిస్తుంది.
కేంద్ర బ్యాంకు లక్ష్యాలు:
1) కరెన్సీ నోట్ల జారీ: ఒక దేశంలో కరెన్సీ నోట్ల జారీలో కేంద్ర బ్యాంకు గుత్తాధిపత్యం కలిగి ఉంటుంది. దీనివల్ల నోట్ల జారీలో ఏకత్వం ఏర్పడుతుంది. కరెన్సీపై విశ్వసనీయత కలుగుతుంది. ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా ద్రవ్య సప్లయ్ నియంత్రించడానికి వీలుంటుంది.

2) ప్రభుత్వ బ్యాంకరు: కేంద్ర బ్యాంకు ప్రభుత్వ బ్యాంకరుగా, ఏజెంట్గా, సలహాదారుగా వ్యవహరిస్తుంది. ఇది ప్రభుత్వ ద్రవ్య నిధులకు సంబంధించిన లెక్కలు తయారుచేస్తుంది. ప్రభుత్వం తరుపున ద్రవ్యం స్వీకరిస్తూ, ప్రభుత్వం తరుపున ఋణాలు ఇస్తూ ప్రభుత్వ ఋణాన్ని స్వీకరిస్తుంది. ప్రభుత్వానికి ఋణాలను ఇస్తూ, అన్ని ఆర్థిక వ్యవహారాలలో ప్రభుత్వానికి సలహాలను అందిస్తుంది.

3) బ్యాంకుల బ్యాంకరు: కేంద్ర బ్యాంకు ప్రభుత్వానికే కాకుండా బ్యాంకులకు కూడా బ్యాంకరుగా పనిచేస్తుంది. ప్రతి బ్యాంకు చట్ట ప్రకారం తను స్వీకరించిన డిపాజిట్లు మొత్తంలో కొంత శాతం నగదు నిల్వలుగా ఉంచాలి. ఆ నిల్వల నిష్పత్తిని కేంద్ర బ్యాంకు నిర్ణయిస్తుంది. వినిమయబిల్లుల రీడిస్కౌంట్ ద్వారా షెడ్యూల్డు బ్యాంకులకు విత్త సహాయం అందజేస్తుంది. ఇది వాణిజ్య బ్యాంకుల మధ్య ఏర్పడిన లావాదేవీలను పరిష్కరించడానికి క్లియరింగ్ హౌస్ పనిచేస్తుంది.

4) అంతిమ ఋణదాత: మార్కెట్లోని అన్నిరకాల పరపతి సౌకర్యాలు ఉపయోగించుకున్న తరువాత ఇంకా ద్రవ్యత్వ ఇబ్బందులున్నప్పుడు బ్యాంకులకు, డిస్కౌంట్ గృహాలకు, ఇతర పరపతి సంస్థలకు కేంద్ర బ్యాంకు అనేక రకాలుగా విత్త సహాయం అందిస్తూ అంతిమ ఋణదాతలుగా పనిచేస్తుంది.

5) పరపతి నియంత్రణ: ఆర్థిక వ్యవస్థలోని పరపతి పరిమాణాన్ని తగిన ద్రవ్య విధానం ద్వారా కేంద్ర బ్యాంకు నియంత్రిస్తుంది. ద్రవ్యోల్బణం సమయంలో పరపతి తగ్గిస్తుంది. ఆర్థిక వ్యవస్థ తిరోగమన పరిస్థితి ఎదుర్కొంటున్న సమయంలో పరపతి సప్లయ్ పెంచుతుంది.

6) పర్యవేక్షణ: దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థను పర్యవేక్షిస్తుంది. నూతన బ్యాంకుల ఏర్పాటు, బ్యాంకుల విస్తరణకు కేంద్ర బ్యాంకు అనుమతి అవసరం.
దేశంలో ద్రవ్య సుస్థిరతను సాధించుట కేంద్ర బ్యాంకు ప్రధాన ధ్యేయం. దేశంలో ఆర్థికాభివృద్ధిని పెంపొందించే విధానాలను కేంద్ర బ్యాంకు చేపడుతుంది.

ప్రశ్న 9.
కేంద్ర బ్యాంకు / రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా. [Mar. ’16]
జవాబు:
భారతదేశపు కేంద్ర బ్యాంకు భారతీయ రిజర్వు బ్యాంకు. ఇది 1935 సం॥ ఏప్రిల్లో 5 కోట్ల వాటా మూలధనంతో నెలకొల్పబడినది. మొదట భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రైవేటు వాటాదారుల యాజమాన్యం క్రింద ఏర్పడినది. 1949 లో భారత ప్రభుత్వం దీనిని జాతీయం చేసింది. 1934 భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం ప్రకారం అన్ని ముఖ్యమైన కేంద్ర బ్యాంక్ విధులను నిర్వర్తిస్తుంది. దీని ప్రధాన కార్యాలయం ముంబాయిలో ఉంది. భారతీయ రిజర్వు బ్యాంకు కార్యనిర్వహణ అధికారి గవర్నర్. గవర్నర్కు సహాయంగా నలుగురు డిప్యూటీ గవర్నర్లు పనిచేస్తారు.

ఆర్థికాభివృద్ధికి కావలసిన ద్రవ్య వనరులను సమకూర్చుట. మరొకవైపు నుండి అభివృద్ధి వ్యయం వలన ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడుటకుండా చూడటం, ఆర్థికాభివృద్ధికవసరమైన ద్రవ్య సంస్థలను నెలకొల్పటం, దీర్ఘకాలిక ఋణాలు అందేలా చూడటం చాలా అవసరం ఇవన్ని కేంద్ర బ్యాంకు యొక్క బాధ్యతలుగా చెప్పవచ్చును. ద్రవ్య వ్యవస్థకు, అభివృద్ధికి కావలసిన ద్రవ్య వనరులను సప్లైని పెంచటం ద్వారా సమకూర్చాలి. మరొకవైపు ద్రవ్య సప్లై పెరగటం వలన ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడకుండా చూడటం దీని ప్రధాన విధి.

AP Inter 1st Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

భారతీయ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్ష్యాలు:
భారతీయ రిజర్వు బ్యాంకు విధులు:
1) కరెన్సీ నోట్ల జారీ: మనదేశంలోని కరెన్సీ నోట్ల జారీపై గుత్తాధిపత్య అధికారం రిజర్వు బ్యాంకు కలిగి ఉంది. రిజర్వు బ్యాంకు 1,000, 500, 100, 50, 20, 10, 5, 2 రూపాయల కరెన్సీ నోట్లను జారీ చేస్తుంది. ఈ నోట్లపై భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ సంతకం ముద్రించబడతాయి. 2006 ఆగష్టు నాటికి దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ విలువ 23,936 కోట్లు.

2) ప్రభుత్వ బ్యాంకరు: రిజర్వు బ్యాంకు కేంద్ర ప్రభుత్వానికీ, రాష్ట్ర ప్రభుత్వానికి బ్యాంకరుగా, ప్రతినిధిగా, ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వ బ్యాంకరుగా వివిధ ప్రభుత్వ విభాగాల అకౌంట్లను నిర్వహిస్తుంది. ప్రభుత్వం తరుపున ద్రవ్యాన్ని స్వీకరిస్తుంది, చెల్లింపులు చేస్తుంది. ప్రభుత్వాలకు తాత్కాలిక ఋణాలు అందిస్తుంది. అన్ని ఆర్థిక వ్యవహారాలలో ప్రభుత్వాలకు సలహాదారుగా కూడా పనిచేస్తుంది.

3) బ్యాంకుల బ్యాంకరు దేశంలోని బ్యాంకులకు రిజర్వు బ్యాంకు బ్యాంకరుగా పనిచేస్తుంది. కొన్ని రకాల బిల్లులను రీడిస్కౌంట్ చేసుకునే సదుపాయం వాణిజ్య బ్యాంకులకు కలుగజేస్తుంది. వివిధ బ్యాంకుల మధ్య బ్యాంకింగ్ లావాదేవీలను పరిష్కరించడానికి క్లియరింగ్ హౌస్ గా పనిచేస్తుంది. అలాగే బ్యాంకుల కార్యకలాపాలు తీర్చిదిద్ది వాటికి నాయకత్వం వహిస్తుంది.

4) అంతిమ ఋణదాత: మార్కెట్లోని అన్నిరకాల పరపతి సౌకర్యాలు ఉపయోగించుకున్న తర్వాత ఇంకా ద్రవ్యత్వ ఇబ్బందులున్నప్పుడు రిజర్వు బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు, డిస్కౌంటు గృహాలకు, ఇతర పరపతి సంస్థలకు కొన్ని షరతులకు లోబడి వాటి వినిమయ బిల్లులను రీడిస్కౌంట్ చేయడం ద్వారా పరపతి అందిస్తూ అంతిమ ఋణదాతగా పనిచేస్తుంది.

5) క్లియరింగ్ హౌస్ల నిర్వహణ: వ్యాపార అవసరాల నిమిత్తం బ్యాంకు ఖాతాదార్లు చెక్కుల ద్వారా చెల్లింపులు చేస్తుంటాయి. వేరువేరు ఖాతాదార్లు వేరువేరు బ్యాంకులలో తమ ఖాతాలు కలిగి ఉండటంవల్ల వివిధ బ్యాంకుల మీద ఈ చెక్కులు జారీ అవుతూ ఉంటాయి. వివిధ బ్యాంకుల మధ్య ఖాతాదార్ల చెక్కులకు సంబంధించిన సొమ్ము వారి వారి ఖాతాలలో జమచేయడానికి రిజర్వు బ్యాంకు తమవద్ద ఉన్న వివిధ బ్యాంకుల ఖాతాలను సర్దుబాటు చేస్తూ వసూళ్ళ చెల్లింపులు సులభతరం చేయడానికి వివిధ నగరాలలో క్లియరింగ్ హౌస్లు నిర్వహిస్తుంది.

ప్రశ్న 10.
ద్రవ్యోల్బణ నిర్వచనాలు.
జవాబు:
సాధారణ పరిభాషలో ద్రవ్యోల్బణమనగా ధరల పెరుగుదల కేవలం ఒకేసారి ధరలు పెరిగినంత మాత్రాన దానిని ద్రవ్యోల్బణం అనకూడదు. నిర్విరామంగా ధరలు పెరుగుతున్నా దీనినే ద్రవ్యోల్బణం అంటారు. భారతదేశంలో ద్రవ్యోల్బణ సమస్య ఉంది.

ద్రవ్యోల్బణ నిర్వచనాలు: వివిధ ఆర్థిక శాస్త్రవేత్తలు ద్రవ్యోల్బణం గూర్చి నిర్వచనాలను ఇచ్చారు.

  1. హాట్రే అను ఆర్థిక శాస్త్రవేత్త ప్రకారం “కరెన్సీ నోట్లను అధికంగా జారీ చేయటాన్నే ద్రవ్యోల్బణమందురు”.
  2. డాల్టన్ అభిప్రాయం ప్రకారం, “ద్రవ్యోల్బణమనగా అధిక ద్రవ్యం తక్కువ వస్తువులను వెంటాడటం”.
  3. కిమ్మరర్ అను ఆర్థిక శాస్త్రవేత్త ప్రకారం, “వ్యాపార అవసరాలకు మించి కరెన్సీ ఉంటే దాన్ని ద్రవ్యోల్బణం అందురు”.
  4. ఏసి. పిగూ ప్రకారం “వాస్తవిక ఆదాయం కన్నా ద్రవ్య ఆదాయం ఎక్కువగా ఉండటాన్నే ద్రవ్యోల్బణమందురు”.
  5. కేదర్ అను ఆర్థిక శాస్త్రవేత్త ప్రకారం, ‘ద్రవ్య విలువ పడిపోవడం అనగా ధరలు పెరగడాన్ని ద్రవ్యోల్బణమని చెప్పవచ్చు”. వస్తువుల సప్లై, డిమాండ్లలో అసమతౌల్యం ఏర్పడడం వల్ల ధరల స్థాయి నిర్విరామంగా పెరుగుదల ఏర్పడినా అటువంటి ధరల పెరుగుదలనే ద్రవ్యోల్బణంగా చెప్పవచ్చు. ప్రతి ధర పెరుగుదలను ద్రవ్యోల్బణంగా చెప్పకూడదు. ధరల పెరుగుదల గణనీయమైందిగా నిర్విరామంగా కొనసాగినపుడే ద్రవ్యోల్బణం ఏర్పడిందని చెప్పాలి”.

ప్రశ్న 11.
డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం.
జవాబు:
వస్తువు సప్లయికి, డిమాండ్కు మధ్య ఏర్పడే అసమతౌల్యం వల్ల వస్తువుల ధరలు నిర్విరామంగా పెరుగుతూ ఉన్న యెడల దానిని ద్రవ్యోల్బణమనవచ్చు. ధరల పెరుగుదల నిర్విరామంగా, గణనీయమైనదిగా ఉన్నప్పుడు మాత్రమే ద్రవ్యోల్బణం ఏర్పడిందని చెప్పాలి. ద్రవ్యోల్బణ భావాన్ని వివిధ రకాలుగా పరిశీలించవచ్చు.

డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం: సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై కన్నా ఎక్కువగా ఉన్నందువల్ల ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అని అంటారు. ద్రవ్యరాశి పెరుగుదల, పొదుపుకన్నా పెట్టుబడి అధికంగా ఉండటం వల్ల సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై కన్నా అధికంగా ఉండవచ్చు. ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ ఉద్యోగితా స్థాయికి చేరుకున్న తరువాత సమిష్టి డిమాండ్ పెరిగినట్లయినా ఉత్పత్తి పెరగక కేవలం ధరలు మాత్రమే పెరుగుతాయి. డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణాన్ని నివారించడానికి సమిష్ఠి డిమాండ్ను తగ్గించాలి.

AP Inter 1st Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 12.
సప్లయ్/వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం.
జవాబు:
వస్తువుల సప్లయికి, డిమాండుకు మధ్య ఏర్పడే అసమతౌల్యం వల్ల వస్తువుల ధరలు నిర్విరామంగా పెరుగుతూ ఉన్న యెడల దానిని ద్రవ్యోల్బణమనవచ్చు. ధరల పెరుగుదల నిర్విరామంగా, గణనీయమైనదిగా ఉన్నప్పుడు మాత్రమే ద్రవ్యోల్బణం ఏర్పడిందని చెప్పాలి. ద్రవ్యోల్బణ భావాన్ని వివిధ రకాలుగా పరిశీలించవచ్చు.

వ్యయ ప్రభావిత ద్రవ్యోల్బణం: ఉత్పత్తి వ్యయం పెరుగుదల వల్ల ధరల స్థాయి పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడినా దానిని వ్యయ ప్రేరిత లేదా వ్యయ ప్రభావిత ద్రవ్యోల్బణం అని అంటారు. కార్మిక సంఘాలు బలోపేతమై వేతనాలను పెంచుకొన్నప్పుడు లేదా ఇతర ఉత్పత్తి వ్యయాలు పెరిగినప్పుడు ఈ వ్యయ ప్రభావిత ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుట ద్వారా వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణాన్ని నివారించవచ్చు.

ప్రశ్న 13.
ద్రవ్యోల్బణంలో రకాలు. [Mar. ’17, ’15]
జవాబు:
వస్తువుల సప్లైకి, డిమాండుకు మధ్య ఏర్పడే అసమతౌల్యం వల్ల వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్న యెడల దానిని ద్రవ్యోల్బణమనవచ్చు. ధరల పెరుగుదల నిర్విరామంగా, గణనీయమైనదిగా ఉన్నపుడు మాత్రమే ద్రవ్యోల్బణం ఏర్పడిందని చెప్పాలి. ద్రవ్యోల్బణ భావాన్ని వివిధ రకాలుగా పరిశీలించవచ్చు.

డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం: సమిష్టి డిమాండ్, సమిష్ఠి సప్లై కన్నా ఎక్కువగా ఉన్నందువల్ల ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అని అంటారు.

ద్రవ్యరాశి పెరుగుదల, పొదుపు కన్నా పెట్టుబడి అధికంగా ఉండటం వల్ల సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై కన్నా అధికంగా ఉండవచ్చు. ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ ఉద్యోగితా స్థాయికి చేరుకున్న తరువాత సమిష్టి డిమాండ్ పెరిగినట్లయినా ఉత్పత్తి పెరగక కేవలం ధరలు మాత్రమే పెరుగుతాయి. డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణాన్ని నివారించడానికి సమిష్టి డిమాండ్ను తగ్గించాలి.

వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం: ఉత్పత్తి వ్యయం పెరుగుదల వల్ల ధరల స్థాయి పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడినా దానిని వ్యయప్రేరిత ద్రవ్యోల్బణం అని అంటారు. కార్మిక సంఘాలు బలోపేతమైన వేతనాలను పెంచుకొన్నప్పుడు లేదా ఇతర ఉత్పత్తి వ్యయాలు పెరిగినప్పుడు ఈ వ్యయ ప్రభావిత ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది.

వాస్తవిక ద్రవ్యోల్బణం: వస్తువుల ధరలు పెరిగి శ్రామికుల జీవన ప్రమాణ స్థాయి తగ్గినపుడు వాస్తవిక ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. వస్తువుల ధరల పెరుగుదల రేటులో శ్రామికుల వేతనాలు పెరగకపోయిన వాస్తవిక వేతనాలు తగ్గిపోతాయి. దీనివల్ల ఎక్కువ ప్రమాణంలో వస్తురాశిని కొనుగోలు చేయరాదు.

పాకుతున్న ద్రవ్యోల్బణం: ఈ ద్రవ్యోల్బణం స్వల్ప మోతాదులో ఉంటుంది. ఇందు ధరలు పెరుగుదల స్వల్పంగా ఉండును. ఈ రకమైన ద్రవ్యోల్బణంలో ధరల స్థాయిలో పెరుగుదల సంవత్సరానికి 3 శాతం లోపే ఉంటుంది. కొంతమంది ఆర్థికవేత్తల ప్రకారం ఈ రకమైన ద్రవ్యోల్బణం ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది.

నడుస్తున్న ద్రవ్యోల్బణం: ధరల స్థాయిలో పెరుగుదల కొంచెం ఎక్కువగా ఉండి ఇది మోతాదులో ఉంటే దీనిని నడుస్తున్న ద్రవ్యోల్బణమని అంటారు. ధరల పెరుగుదల రేటు సంవత్సరానికి 3 నుంచి 4 శాతం వరకు ఈ రకమైన ద్రవ్యోల్బణంలో జరుగును.

పరుగెడుతున్న ద్రవ్యోల్బణం: ఈ రకం ద్రవ్యోల్బణంలో ధరల పెరుగుదల విపరీతంగా ఉంటుంది. సుమారుగా ఇందు ధరల పెరుగుదల 10 శాతం వరకు ఉండవచ్చు. ఈ ద్రవ్యోల్బణం వల్ల ఆర్థిక వ్యవస్థలో అనేక చెడు ఫలితాలు ఏర్పడతాయి.

ఉధృతమైన లేదా అతి ద్రవ్యోల్బణం: ధరల పెరుగుదల విపరీతంగా, అతివేగంగా, నిరాటంకంగా జరుగుతున్న దానిని అతి ద్రవ్యోల్బణం అని అంటారు. దీనినే ఉదృతమైన ద్రవ్యోల్బణం అని కూడా అంటారు.

అణచిన ద్రవ్యోల్బణం: ద్రవ్యోల్బణాన్ని రేషనింగ్, ప్రభుత్వ కంట్రోళ్ళు, ఇతర నియంత్రణ సాధనాల ద్వారా అదుపు చేయబడిన ధరలు తగ్గి ద్రవ్యోల్బణం అదుపు చేయబడుతుంది. దీనినే అణచిన ద్రవ్యోల్బణం అంటారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 14.
ఉత్పత్తి, పంపిణీపై ద్రవ్యోల్బణ ప్రభావం.
జవాబు:
ద్రవ్యోల్బణ ప్రభావం అన్ని వర్గాల ప్రజల మీద ఒకే విధంగా ఉండదు. ద్రవ్యోల్బణం కొన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని వర్గాల ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.
1) స్థిర ఆదాయ వర్గాల వారి మీద: స్థిర ఆదాయ వర్గాలకు చెందిన వారి ఆదాయం, ధరల పెరుగుదలతోపాటు పెరగదు. కాబట్టి ద్రవ్యోల్బణం వల్ల వారు ఇబ్బందిపాలవుతారు. ఫించనుదార్లు, బ్యాంకులలో కాలపరిమితి డిపాజిట్ల ద్వారా వచ్చే ఆదాయం మీద ఆధారపడి జీవించేవారు.

2) శ్రామిక వర్గం: అసంఘటిత రంగాలలో పనిచేస్తూ వేతనధార జీవనం సాగించే శ్రామికులు సాధారణంగా తక్కువ ఆదాయం కలిగి ఉంటారు. సాధారణంగా ధరలు పెరిగినందువల్ల వీరి వేతనాలలో పెరుగుదల ఉండదు.

3) ఋణదాతలు, ఋణగ్రహీతలు: ద్రవ్యోల్బణం వల్ల ద్రవ్యం విలువ క్షీణిస్తుంది. కాబట్టి ఋణం ఇచ్చినప్పటికంటే, తిరిగి చెల్లించినప్పటికి ద్రవ్యోల్బణం వల్ల ద్రవ్యం విలువ తగ్గుతుంది. కాబట్టి ఋణదాతలు నష్టపోతారు, ఋణగ్రహీతలు లాభపడతారు.

4) వినియోగదారులు ఉద్యమదారులు: ద్రవ్యోల్బణం వల్ల వినియోగదారులు నష్టపోతారు. కాని ఉద్యమదారులకు లాభాలు పెరుగుతాయి.
ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థలో ఆదాయ అసమానతలను పెంచుతుంది.

ప్రశ్న 15.
ద్రవ్యోల్బణ నివారణ చర్యలు. [Mar. ’16]
జవాబు:
దీర్ఘకాలంలో సాధారణ ధరల స్థాయిలో నిరంతరమైన పెరుగుదలను ద్రవ్యోల్బణం అని అంటారు. పరిమిత ద్రవ్యోల్బణం ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుంది. అతి ద్రవ్యోల్బణం ఆర్థికాభివృద్ధిని నిరోధిస్తుంది. ద్రవ్యోల్బణాన్ని నివారించడానికి ప్రభుత్వం అనేక చర్యలను చేపడుతుంది. అవి:
1) ద్రవ్యపరమైన చర్యలు: ద్రవ్యపరమైన చర్యలు ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లయ్న క్రమబద్ధం చేస్తాయి. బ్యాంకులు పరపతిని క్రమబద్ధం చేయటం ద్వారా ద్రవ్య సప్లయిని నియంత్రణ చేయటం జరుగుతుంది. కేంద్ర బ్యాంకు పరిమాణాత్మక, గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాల ద్వారా ద్రవ్యం సప్లయ్న నియంత్రణ చేయవచ్చు.

2) కోశ విధానాలు: ద్రవ్యోల్బణ కాలంలో ప్రభుత్వం మిగులు బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి పన్ను రేట్లను పెంచటం, కొత్తగా పన్నులను విధించడం మొదలగువాటిని కోశపరమైన చర్యలు అంటారు.

3) ద్రవ్యేతర అంశాలు:
a) ఉత్పత్తిని పెంచటం: వస్తుత్పత్తిని పెంచటం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అరికట్టవచ్చు. ఉత్పత్తిని పెంచటానికి ఈ క్రింది చర్యలు చేపట్టాలి.

  1. ఉత్పాదక వనరులను సక్రమంగా కేటాయించడం.
  2. దేశీయంగా ఉన్న వస్తూ కొరతను దిగుమతుల ద్వారా ద్రవ్యోల్బణాన్ని అరికట్టవచ్చు.

b) వేతనాలు: వేతనాల పెరుగుదలకు, వస్తు ధరల పెరుగుదలకు దగ్గర సంబంధం ఉంది. సక్రమమైన వేతన విధానాలను అమలు చేయాలి.

c) రేషనింగ్: ద్రవ్యోల్బణాన్ని నివారించే ప్రత్యక్ష చర్య వస్తువు ధరలను అమలు చేయటం, అదుపులో ఉంచటం. చట్టబద్ధంగా ప్రతి వస్తువుకు గరిష్ఠ ధరను నియంత్రించి ఆ ధర కంటే ఎక్కువ ధరకు అమ్మకుండా చర్యలు తీసుకోవాలి.

d) బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టుట: అక్రమ వస్తు నిల్వలను అదుపు చేయుట ద్వారా వస్తువుల ధరలను అదుపు చేయవచ్చు. ప్రభుత్వ నియమ, నిబంధనలకు వ్యతిరేకంగా నిల్వచేసే వ్యాపారస్తులను కఠినంగా శిక్షించాలి.

AP Inter 1st Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కోరికల సమన్వయం.
జవాబు:
వస్తుమార్పిడి పద్ధతిలో అమ్మకందారుడు ఏ వస్తువునయితే మార్పిడి కింద ఇవ్వడానికి అంగీకరిస్తాడో ఆ వస్తువునే కొనుగోలుదారుడు అంగీకరించవలసి వచ్చేది. కొనుగోలుదారుడు, అమ్మకపుదారుల కోరికలు ఒకే విధంగా కలవవలసిన అవసరం ఉంటుంది. దీనినే కోరికల సమన్వయం అంటారు.

ప్రశ్న 2.
వాయిదాల చెల్లింపు.
జవాబు:
ఆధునిక ఆర్థిక వ్యవస్థలో వ్యవహారాలన్ని వాయిదా చెల్లింపుల పద్ధతిలోనే జరుగుతాయి. ద్రవ్యం ఈ విధిని నిర్వర్తించడం వల్ల వ్యక్తులు, వస్తువులను కొనుగోలు చేయడం, బాంకులు ఇతర ద్రవ్య సంస్థల నుంచి రుణాలు పొందడం, బాండ్లు, షేర్లు కొనుగోలు, అమ్మకాలు మొదలైనవి సులభతరమయ్యాయి.

ప్రశ్న 3.
విలువల నిధి.
జవాబు:
ద్రవ్యం ఉన్న వ్యక్తి దానిని ఏ సమయంలోనైనా, ఏ ప్రదేశంలోనైనా, ఎవరినైనా బదిలీ చేయవచ్చు. ద్రవ్యం వల్ల విలువను బదిలీ చేయడం తేలికవుతుంది.

ప్రశ్న 4.
ద్రవ్యత్వం. [Mar. ’17, ’16, ’15]
జవాబు:
అత్యధిక ద్రవ్యత్వం ఉన్న ఆస్తి ద్రవ్యం ద్రవ్యత్వపరంగా ఆస్తులన్నింటిలోకి ఉత్తమమైంది. ద్రవ్యం నూరు శాతం ద్రవ్యత్వం కలిగి ఉంటుంది.

ప్రశ్న 5.
సమీప ద్రవ్యం. [Mar. ’17, ’15]
జవాబు:
ద్రవ్యంగా అంగీకరించక వేగంగా ద్రవ్యంలోకి మార్చుకోవడానికి వీలైన ఎక్కువ ద్రవ్యత్వం కలిగిన ఆస్తులను సమీప ద్రవ్యం అంటారు. ఎటువంటి కాలయాపన లేకుండా వెనువెంటనే వినిమయ మాధ్యమంలోకి మార్చకోగలిగే, ద్రవ్య నిర్వచనంలోకి చేరని ఇతర విత్త సంబంధమైన ఆస్తులన్నింటిని సమీప ద్రవ్యం అంటారు.

ప్రశ్న 6.
కరెన్సీ. [Mar. ’17, ’15]
జవాబు:
ఆర్థిక వ్యవస్థలో చలామణీలో ఉన్న నాణేలు, కాగితపు నోట్లు. కాగితపు కరెన్సీని కేంద్ర బ్యాంకు జారీ చేస్తుంది. ఒక రూపాయి నోట్లను తప్ప మిగతా కరెన్సీ నోట్లను మనదేశంలో రిజర్వు బ్యాంకు జారీ చేస్తుంది. రూపాయి నోట్లను భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ముద్రిస్తుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 7.
M11, M2, M3, & M4
జవాబు:
M1 = ప్రజల వద్దనున్న కరెన్సీ + వాణిజ్య బ్యాంకుల వద్దనున్న డిపాజిట్లు + RBI వద్దనున్న డిపాజిట్లు.
M2 = M1 + వాణిజ్య, సహకార బ్యాంకుల వద్దనున్న టైమ్ డిపాజట్లు.
M3 = M1 + Post office లోని పొదుపు ఖాతాల లోని డిపాజిట్లు.
M4 = M1 + Post office savings బ్యాంకులో ఉన్న మొత్తం డిపాజిట్లు.

ప్రశ్న 8.
పరపతి ద్రవ్యం.
జవాబు:
దీనినే బాంకుమని అని కూడా అంటారు. ప్రాథమిక డిపాజిట్ల నుంచి వాణిజ్య బ్యాంకులు సృష్టించే బాంకు డిపాజిట్లను పరపతి ద్రవ్యం అంటారు. దీనిని చెక్కు ద్వారా ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేయవచ్చు.

ప్రశ్న 9.
ఓవర్ డ్రాఫ్ట్. [Mar. ’17, ’16]
జవాబు:
ఖాతాదారుని ఖాతాలో మొత్తం కంటే ఎక్కువగా తీసుకొనే సౌకర్యం. వాణిజ్య బ్యాంకులు తమ ఖాతాదార్లు సౌలభ్యార్థం కల్పించిన వసతి. ఈ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కరెంట్ ఖాతా మీద మాత్రమే ఉంటుంది. దీని మీద కొంత వడ్డీని కూడా వసూలు చేస్తుంది.

ప్రశ్న10.
పరపతి సృష్టి.
జవాబు:
పరపతి సృష్టి అంటే బ్యాంకు డిపాజిట్ల కంటే ఎన్నో రెట్లు రుణాలు పెంచడం. అనగా వాణిజ్య బ్యాంకు ఖాతాదారుడు రుణం మంజూరు చేసినప్పుడు నగదు చెల్లించకుండా వారి ఖాతాలో ఒక డిపాజిట్ గా రుణ మొత్తాన్ని జమ చేస్తాం. ఆ విధంగా సెకండరీ డిపాజిట్లు సృష్టించబడతాయి. దీనిని పరపతి సృష్టి అంటారు.

ప్రశ్న 11.
ద్రవ్యోల్బణం.
జవాబు:
దీర్ఘకాలంలో సాధారణ ధరల స్థాయిలో నిరంతరమైన పెరుగుదలను ద్రవ్యోల్బణంగా పేర్కొనవచ్చు. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యరాశి అతి ఎక్కువగాను, వస్తు సేవలు అతి తక్కువగాను ఉన్నప్పుడు ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది.

ప్రశ్న 12.
నిజ ద్రవ్యోల్బణం.
జవాబు:
ధరల పెరుగుదల రేటు సంవత్సరానికి దాదాపు 16% ఉంటుంది. దీనినే కీన్స్ నిజ ద్రవ్యోల్బణం అంటారు.

ప్రశ్న 13.
అతి తీవ్ర ద్రవ్యోల్బణం. [Mar 16th]
జవాబు:
ధరల పెరుగుదల విపరీతంగా, అతివేగంగా నిరాటంకంగా పెరుగుతుంటే దానిని అతి తీవ్ర ద్రవ్యోల్బణం అంటారు. ఈ రకమైన ద్రవ్యోల్బణంలో ధరల పెరుగుదలకు అవధులు ఉండవు. ద్రవ్యోల్బణం రేటు 100% చేరవచ్చు, దానిని దాటవచ్చు. ఇది ద్రవ్యోల్బణం యొక్క విపరీతమైన రూపం.

AP Inter 1st Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 14.
కేంద్ర బ్యాంకు.
జవాబు:
ప్రతి దేశపు బ్యాంకింగ్ వ్యవస్థలో అత్యున్నత స్థానంగా ఉండే బ్యాంకు కేంద్ర బ్యాంకు. భారతదేశంలో ఉన్న కేంద్ర బ్యాంకును ‘రిజర్వు బాంక్ ఆఫ్ ఇండియా’ అంటారు. ఇది 1935 ఏప్రిల్ 1వ తేదీన ఏర్పడింది. ఇది 5 కోట్ల ” రూపాయల మూలధనంతో స్థాపించబడింది.

ప్రశ్న 15.
ద్రవ్యోల్బణం – ద్రవ్యం విలువ.
జవాబు:
దీర్ఘకాలంలో సాధారణ ధరల స్థాయిలో నిరంతరమైన పెరుగుదలను ద్రవ్యోల్బణం అంటారు. ద్రవ్యం విలువ సాధారణ ధరల స్థాయికి విలోమంగా మారుతుంది. ధరలలోని మార్పులు ద్రవ్యం విలువలోని మార్పులను సూచిస్తాయి. ధరలు ఎంత అధికమైతే ద్రవ్యం విలువ అంత తక్కువగా ఉంటుంది.

ప్రశ్న 16.
సమిష్టి సప్లయి ధర.
జవాబు:
మొత్తం వస్తు సేవలను ఉత్పత్తి చేయటానికి పెట్టబోయే ధర.

ప్రశ్న 17.
సమిష్టి డిమాండ్ ధర.
జవాబు:
మొత్తం వస్తువులను అమ్మగా రాబోయే రాబడి ధర.

AP Inter 1st Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 18.
ప్రాథమిక డిపాజిట్.
జవాబు:
వాణిజ్య బ్యాంకులు వ్యక్తుల నుండి స్వీకరించిన డిపాజిట్లు. ఇవి పరపతి వల్ల ఏర్పడినవి కావు. పరపతి సృష్టికి మార్గం ఏర్పాటు చేసేవి.

AP Inter 1st Year Economics Study Material Chapter 8 స్థూల ఆర్థిక సిద్ధాంతం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Economics Study Material 8th Lesson స్థూల ఆర్థిక సిద్ధాంతం Textbook Questions and Answers.

AP Inter 1st Year Economics Study Material 8th Lesson స్థూల ఆర్థిక సిద్ధాంతం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సాంప్రదాయ ఉద్యోగితా సిద్దాంతం ప్రధానాంశాలు వివరించండి.
జవాబు:
ఆడమ్స్మిత్, రికార్డో, జె.బి.సే, జె.యస్. మిల్ మొదలగు వారిని సాంప్రదాయ ఆర్థికవేత్తలంటారు. వీరు ప్రతిపాదించిన ఉత్పత్తి, ఉద్యోగితా సిద్ధాంతాన్నే సాంప్రదాయ సిద్ధాంతం అని అంటారు. ఈ సిద్ధాంతం ప్రధానంగా జె.బి. సే మార్కెట్ సూత్రంపై ఆధారపడింది. జె.బి. సే అభిప్రాయంలో “సప్లై తనకు తానే డిమాండ్ సృష్టించుకుంటుంది”. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ కొరతగాని లేదా నిరుద్యోగితగాని ఏర్పడవు.

పరిపూర్ణ పోటీ పరిస్థితులలో దీర్ఘ కాలంలో ఒక పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ ఉద్యోగితా స్థాయి వద్ద స్థిర సమతౌల్యంలో ఉంటుందని సాంప్రదాయ ఆర్థికవేత్తలు భావించారు. సంపూర్ణ ఉద్యోగిత ఒక సాధారణ లక్షణం అని, ‘నిరుద్యోగిత ఒక అసాధారణ పరిస్థితి అని భావించారు. ప్రభుత్వ జోక్యం లేకపోతే మార్కెట్ శక్తుల స్వేచ్ఛా ప్రవర్తన ద్వారా ఆర్థిక వ్యవస్థలో స్వయం చాలకంగా సర్దుబాటు జరుగుతుంది. ఈ అభిప్రాయాలను స్థూలంగా సాంప్రదాయ ఉత్పత్తి, ఉద్యోగితా సిద్ధాంతం అంటారు.

సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం ఈ క్రింది అంశాల మీద ఆధారపడి ఉంటుంది.

  1. సే మార్కెట్ సూత్రం – ధరల సరళత్వం
  2. పొదుపు, పెట్టుబడుల సమానత్వం
  3. వేతనాల సరళత్వం

1. సే మార్కెట్ సూత్రం – ధరల సరళత్వం: ‘సే’ విశ్లేషణ ప్రకారం, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలలో “సప్లై తన డిమాండ్ను తానే సృష్టించుకుంటుంది” అంటే మార్కెట్లో ఎంత ఉత్పత్తి చేస్తే అంతకు డిమాండ్ ఏర్పడుతుంది. అందువల్ల అధికోత్పత్తి సమస్య ఉండదని ‘సే’ అభిప్రాయం. స్వల్పకాలంలో ఉత్పత్తిదార్లు డిమాండ్కు సంబంధించిన అంచనాలలో వచ్చే తప్పిదాల వల్ల అధికోత్పత్తి, అల్పోత్పత్తి సమస్యలు రావచ్చు. కాని దీర్ఘకాలంలో ఈ పొరపాట్లను ధరలో సరళత్వం ద్వారా సర్దుబాటు చేయడం వల్ల సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లైల మధ్య సమతౌల్యం సాధించవచ్చు.

AP Inter 1st Year Economics Study Material Chapter 8 స్థూల ఆర్థిక సిద్ధాంతం

2. పొదుపు, పెట్టుబడుల సమానత్వం దీర్ఘకాలంలో ‘సే’ ప్రకారం సమిష్టి పొదుపు, పెట్టుబడి సమానంగా ఉంటాయి. ఈ సమానత్వం ఉన్నంత వరకు ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగిత ఉండదు. ‘సే’ అభిప్రాయంలో పొదుపు, పెట్టుబడుల మధ్య అసమతౌల్యం ఏర్పడినట్లయితే వడ్డీరేటులో మార్పు చేయడం ద్వారా వాటి మధ్య శి శ్రీ సమానత్వం చేకూరి సమతౌల్య స్థితిలో సంపూర్ణ ఉద్యోగిత ‘ఆ సాధించవచ్చు. దీనిని ఈ క్రింది రేఖా పటం ద్వారా వివరించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 8 స్థూల ఆర్థిక సిద్ధాంతం 1
ప్రక్క రేఖాపటంలో ‘X’ అక్షం మీద పొదుపు, పెట్టుబడి, “Y” అక్షంపై వడ్డీ రేటు సూచించబడింది. ‘E’ బిందువు వద్ద పొదుపు, పెట్టుబడులు సమానం. పొదుపు ఎక్కువగా ఉంటే వడ్డీరేటు తగ్గుతుంది. పొదుపు తక్కువగా ఉండే వడ్డీరేటు పెరుగుతుంది.

3. వేతనాల సరళత్వం: పిగూ అభిప్రాయం ప్రకారం శ్రామిక సప్లై, డిమాండ్ నిజవేతనాలపై ఆధారపడి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగ సమస్య ఏర్పడినప్పుడు ద్రవ్య వేతనాలను తగ్గించడం ద్వారా సంపూర్ణ ఉద్యోగితను సాధించవచ్చని పిగూ వివరించారు. పిగూ సూచించిన విధానాన్నే “వేతన కోత విధానం” అంటారు.

సాంప్రదాయక ఆర్థికవేత్తల ప్రకారం సంపూర్ణోద్యోగిత అనేది, ఆర్థిక వ్యవస్థలో దీర్ఘకాలంలో తప్పనిసరిగా చేరుకొనే వాస్తవిక పరిస్థితి. స్వల్పకాలంలో నిరుద్యోగ సమస్య తలెత్తితే, అది కూడా తాత్కాలికమైంది. ఇలాంటి సంపూర్ణ ఉద్యోగిత ఆర్థిక వ్యవస్థలో ఐచ్ఛిక, సంఘృష్ట నిరుద్యోగిత ఉండే అవకాశం ఉంది.

ప్రమేయాలు: సాంప్రదాయ సిద్ధాంతం ఈ క్రింది ప్రమేయాలపై ఆధారపడి ఉంది.

  1. సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది.
  2. ఆర్థిక కార్యకలాపాలలో ప్రభుత్వ జోక్యం ఉండదు.
  3. ఆర్థిక వ్యవస్థలో పరిపూర్ణ పోటీ మార్కెట్ కలిగి ఉంటుంది.
  4. శ్రామికులు ఒకే రకమయిన సామర్థ్యం కలిగి ఉండాలి.
  5. వేతనాలు, ధరలు స్థిరంగా ఉండక మారుతూ ఉంటాయి.
  6. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం తటస్థంగా ఉంటుంది.
  7. ఆర్థిక వ్యవస్థలో పొదుపు, పెట్టుబడి వడ్డీరేటుపై ఆధారపడి ఉంటాయి.

ప్రశ్న 2.
కీన్స్ ఉద్యోగితా సిద్ధాంతాన్ని వివరించండి. [Mar. ’17, ’16, ’15]
జవాబు:
కీన్స్ ఉద్యోగితా సిద్ధాంతానికి డిమాండ్ ఒక ముఖ్య భావన. సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లయ్ సమానంగా ఉండే స్థితిలో సార్థక డిమాండ్ నిర్ణయమౌతుంది. వివిధ ఉద్యోగితా స్థాయిలలో సమిష్టి డిమాండ్ వివిధ రకాలుగా ఉంటుంది. ఏ ఉద్యోగితా స్థాయిలో సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లైతో సమానమౌతుందో అది ఆర్థిక వ్యవస్థ సమతౌల్యాన్ని సూచిస్తుంది. కాని అది స్వల్పకాలిక సమతౌల్యం. అది సార్థక డిమాండ్ని సూచిస్తుంది. ఆర్థిక వ్యవస్థలో సమిష్టి సప్లై, సమిష్టి డిమాండ్కు అనుగుణంగా మారుతుంది.

సమిష్టి సప్లై ధర: సమిష్టి సప్లై ధరను వివిధ ఉత్పత్తి రాశులను అమ్మటం వల్ల వ్యవస్థాపకుడు పొంది తీరవలసిన కనిష్ట ఆదాయంగా కీన్స్ వర్ణించాడు. సమిష్టి సప్లై పట్టిక వ్యవస్థాపకులు వివిధ ఉత్పత్తి రాశుల వద్ద పొందిన ఆదాయాన్ని కాకుండా పొంది తీరవలసిన వ్యయ, ఆదాయపు అంచనాలను మాత్రమే తెలియజేయును.

సమిష్టి డిమాండ్ ధర: సమిష్టి డిమాండ్ వివిధ ఉత్పత్తి స్థాయిల వద్ద వ్యయసంస్థలు వ్యయ సేవలపై ఖర్చు పెట్టడానికి సిద్ధపడే మొత్తాలను చూపుతుంది. వివిధ ఉత్పత్తి రాశులపై వ్యయ సంస్థలు ఖర్చు పెట్టే మొత్తాలను చూపే పట్టిక సమిష్టి డిమాండ్ పట్టిక. అనగా నిర్ధిష్ట పరిమాణంలో వస్తువును ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్మడం ద్వారా | భవిష్యత్తులో పొందగలిగే రాబడిని సమిష్టి డిమాండ్ ‘ ధర అంటారు.

సార్థక డిమాండ్: సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై రేఖలు ఒకదానినొకటి ఖండించుకున్న బిందువు సార్థక డిమాండ్ను సూచిస్తుంది. ఈ బిందువు వద్ద సమిష్టి డిమాండ్ ధర, సమిష్టి సప్లై ధరకు సమానమవటం వల్ల డిమాండ్ సార్థక డిమాండ్ అవుతుంది. ఆ స్థాయిలో జాతీయాదాయపు ఉద్యోగితాస్థాయిలు సమతౌల్య స్థితికి చేరుకుంటాయి. ఈ సార్థక డిమాండ్ వ్యవస్థలో ఉద్యోగితా స్థాయిని నిర్ణయిస్తుందని కీన్స్ పేర్కొన్నాడు.

సార్థక డిమాండు ఈ క్రింది పట్టిక ద్వారా వివరించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 8 స్థూల ఆర్థిక సిద్ధాంతం 2

పై పట్టికలో 14 లక్షల మందిని నియమించి ఉత్పత్తి చేస్తున్న స్థాయి వద్ద సమిష్టి డిమాండ్ ధర, సమిష్టి సప్లై ధర, కౌ 700 కోట్లు వద్ద రెండు సమానమై సమతౌల్యం ఏర్పడింది. అంతకంటే తక్కువ ఉద్యోగితా స్థాయి వద్ద సమిష్టి సప్లై ధర కంటే సమిష్టి డిమాండ్ ధర అధికం. అదే విధంగా అధిక ఉద్యోగితాస్థాయి వద్ద సమిష్టి డిమాండ్ ధర కంటే సమిష్టి సప్లై ధర అధికంగా ఉంటుంది. దీనిని ఈ క్రింది రేఖాపటం ద్వారా వివరించవచ్చు.

AP Inter 1st Year Economics Study Material Chapter 8 స్థూల ఆర్థిక సిద్ధాంతం
AP Inter 1st Year Economics Study Material Chapter 8 స్థూల ఆర్థిక సిద్ధాంతం 3

పై రేఖాపటంలో ‘E’ బిందువు వద్ద AS మరియు AD రేఖలు సమానమై సార్థక డిమాండ్ను తెలియజేయును. ఈ బిందువు వద్ద 14 లక్షల సమతౌల్య ఉద్యోగితా పరిమాణం తెలుపుచున్నది. అందువల్ల 14 లక్షల మంది శ్రామికుల నియామకం వద్ద ఆర్థిక వ్యవస్థ సమతౌల్య స్థితిని చేరుకుంది. ఆర్థిక వ్యవస్థలో 16 లక్షల మందిని నియమించినట్లయితే సమిష్టి సప్లై, సమిష్టి డిమాండ్ కంటే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించవచ్చు. ఈ స్థితిని కీన్స్ “అల్ప ఉద్యోగితా సమతౌల్య స్థితి” గా పేర్కొనెను.

ప్రశ్న 3.
నిరుద్యోగితను తగ్గించడానికి ప్రభుత్వ వ్యయం ఏవిధంగా దోహదపడుతుందని కీన్స్ పేర్కొన్నారో వివరించండి.
జవాబు:
ప్రభుత్వ విత్తంలోని ముఖ్యమైన భాగాలలో ప్రభుత్వ వ్యయం ఒకటి. ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలు నిరంతరం పెరుగుతూ ఉండటంతో అన్ని దేశాలలోను ప్రభుత్వ వ్యయం పెరిగింది. ప్రభుత్వ వ్యయ పరిమాణం ఆయా ప్రభుత్వాల రాజకీయ ఆర్థిక విధానాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఈ క్రింది అంశాలపై ఖర్చు చేస్తుంది.
1. దేశ రక్షణ: అంతర్గత, బహిర్గత ఒడిదుడుకుల నుండి దేశాన్ని రక్షించుకోవడానికి జాతీయాదాయంలో కొంత భాగాన్ని దేశ రక్షణకై ఖర్చు చేయవలసి ఉంటుంది.

2. ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణ: ప్రజా శ్రేయస్సు పెంపొందే విషయంలో ప్రభుత్వ రంగంలో కొన్ని వస్తూత్పత్తి సంస్థలను ప్రారంభించి నిర్వహించాల్సి వస్తోంది. ప్రభుత్వం విస్తరించిన కొద్దీ వ్యయం పెరుగుతుంది.

3. ప్రజాస్వామ్య సంస్థలు: పార్లమెంటు, అసెంబ్లీ మొదలైన ప్రజాస్వామ్య సంస్థల పట్ల ప్రభుత్వానికి నిర్వహణ వ్యయం పెరుగుతుంది. భూములు, భవనాలు కొనుగోలు చేస్తుంది.

4. పాలనా వ్యయం: ప్రభుత్వ కార్యకలాపాలు పెరుగుతున్నప్పుడు వాటిని నిర్వహించవలసిన సిబ్బందిని పెంచాల్సి ఉంటుంది.

5. వృద్ధాప్యపు భృతి, నిరుద్యోగ భృతి వృద్ధాప్యపు భృతి, నిరుద్యోగ భృతి మొదలైన బదిలీ చెల్లింపులను సాంఘిక భద్రతల కల్పన దృష్ట్యా చెల్లించవలసి ఉంటుంది.

6. వడ్డీ చెల్లింపులు: ప్రభుత్వ స్వదేశీ, విదేశీ ఋణాలపై వడ్డీలు చెల్లించాలి.

7. ప్రజోపయోగ కార్యక్రమాలు: ప్రజోపయోగ కార్యకలాపాల కోసం ఆధునిక ప్రభుత్వాలు ఎక్కువగా ఖర్చు చేస్తున్నాయి. త్రాగు నీరు, రవాణా మొదలైన వాటిపై ప్రభుత్వం ఖర్చు చేస్తుంది.

8. అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి: ఆర్థికాభివృద్ధిని సాధించటానికి అవసరమైన అవస్థాపనా సౌకర్యాలను ప్రభుత్వం అభివృద్ధి పరచవలసి ఉంటుంది.

ప్రశ్న 4.
కీన్స్ ఉద్యోగితా సిద్ధాంతం, సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం కంటే ఏవిధంగా మెరుగైందో వివరించండి.
జవాబు:
సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం జె.బి. సే మార్కెట్ సూత్రంపై ఆధారపడింది. జె.బి. సే అనే ఆర్థికవేత్త ప్రకారం “సప్లై దానికి తగిన డిమాండ్ను తానే సృష్టించుకుంటుంది.” ఉత్పత్తి విలువకు సరిపడ ఆదాయం ఏర్పడును. కనుక ఉత్పత్తి అంతటికి డిమాండ్ ఏర్పడుతుంది.

సాంప్రదాయ సిద్ధాంతం ప్రకారం సప్లై పెరిగినంత మేరకు డిమాండ్ కూడా పెరుగుతుంది. అందువల్ల మార్కెట్ విస్తరణకు పరిమితి ఉండదు. కనుక సార్వత్రిక నిరుద్యోగిత ఉండదు. వేతనాల రేటులో మార్పులు సప్లై డిమాండ్లను సమానం చేస్తుంది. సాంప్రదాయ సిద్ధాంతం ప్రకారం వేతనాలు తగ్గింపు వల్ల ఉద్యోగితా స్థాయి పెరుగుతుంది. కీన్స్ అనే ఆర్థికవేత్త సాంప్రదాయ సిద్ధాంతాన్ని ఈ క్రింది విధంగా విమర్శించాడు.

1. సంపూర్ణ ఉద్యోగిత సాధారణ లక్షణము కాదు: ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగిత ఉండుననే ప్రమేయాన్ని సాంప్రదాయ ఆర్థికవేత్తలు తీసుకున్నారు. కానీ వాస్తవానికి ఏ ఆర్థిక వ్యవస్థలోను సంపూర్ణ ఉద్యోగిత ఉండదు.

2. వేతనాల తగ్గుదల ఉండదు: వేతనాలను తగ్గించడం ద్వారా ఉద్యోగితను పెంచవచ్చన్న పిగూ వాదనను కీన్స్ తీవ్రంగా విమర్శించాడు. కాని వాస్తవానికి కార్మిక సంఘాలు వేతనాల తగ్గుదలను ప్రతిఘటిస్తాయి. కీన్స్ అభిప్రాయంలో వేతనాల స్థాయి తగ్గిస్తే, ఉద్యోగిత పెరగడానికి బదులు ఉత్పత్తి, ఉద్యోగిత తగ్గుతాయి.

3. పొదుపు – పెట్టుబడులు సమానంగా ఉండవు: కీన్స్ అభిప్రాయంలో పొదుపు, పరిమాణం ఆదాయంపై ఆధారపడుతుందేకాని, వడ్డీరేట్లలోని మార్పులకు ప్రభావితం కాదు. అందువల్ల వడ్డీరేటులో మార్పుల ద్వారా పొదుపు, పెట్టుబడుల మధ్య సమానత్వాన్ని సాధించలేం.

AP Inter 1st Year Economics Study Material Chapter 8 స్థూల ఆర్థిక సిద్ధాంతం

4. ద్రవ్య భ్రాంతి: శ్రామికుల సప్లై సాంప్రదాయ ఆర్థికవేత్తలు భావించినట్లు వాస్తవిక వేతనంపై కాకుండా, ద్రవ్య వేతనంపై ఆధారపడి ఉంటుంది. ఈ కారణం వల్ల శ్రామికులు ద్రవ్య భ్రాంతికి లోనవుతారు.

5. స్వల్పకాలానికి అన్వయించబడదు: దీర్ఘకాలంలో సాంప్రదాయ ఆర్థికవేత్తలు చెప్పిన ప్రకారం సప్లై, డిమాండ్లో సమానం కావచ్చు. కాని స్వల్పకాలంలో సప్లై, డిమాండ్లు సమానం కావు. అందువల్ల సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం స్వల్పకాలానికి అన్వయించబడదు. కీన్స్ తన సమగ్ర సిద్దాంతంలో దీర్ఘకాలంలో “మనం అందరం చనిపోతాం” అని పేర్కొన్నారు.

6. ద్రవ్యం కేవలం వ్యాపార వ్యవహారాల నిమిత్తం మాత్రమే ఉపయోగపడదని, నిలువ నిధిగా కూడా తన విధిని నిర్వర్తిస్తుందని కీన్స్ తన “ద్రవ్యత్వాభిరుచి” సిద్ధాంతం ద్వారా వివరించారు.

ప్రశ్న 5.
‘అల్ప ఉద్యోగితా సమతౌల్య’ భావనను పటం సహాయంతో వివరించండి.
జవాబు:
కీన్స్ సాంప్రదాయ ఉత్పత్తి, ఉద్యోగితా సిద్ధాంతాన్ని విమర్శించాడు. కీన్స్ ప్రకారం సాంప్రదాయ ఆర్థికవేత్తలు సంపూర్ణ ఉద్యోగిత ఆర్థిక వ్యవస్థ యొక్క సాధారణ లక్షణం కాదు. ఇతని అభిప్రాయం ప్రకారం సప్లై దానికి తగిన డిమాండ్ను సృష్టించుకొనదు. సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం వాస్తవానికి దూరంగా ఉంది. మొట్ట మొదటిసారిగా కీన్స్ శాస్త్రీయ పద్ధతిలో ఆదాయ, ఉద్యోగితా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దీనిని కీన్స్ ఆదాయ ఉద్యోగితా సిద్ధాంతం అని అంటారు. కీన్స్ తన సిద్ధాంతాన్ని “General Theory of Employment, Interest and Money” అను గ్రంథంలో వివరించాడు.

కీన్స్ ప్రకారం ఉద్యోగితా స్థాయి ఉత్పత్తి పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. ఇతని ప్రకారం ఉద్యోగితా స్థాయికి, ఉత్పత్తికి, ఆదాయ స్థాయికి సార్థక డిమాండ్కు దగ్గర ప్రత్యక్ష సంబంధము ఉంటుంది. కనుక ఒక వ్యవస్థలో ఉండే ఉద్యోగితా స్థాయి సార్థక డిమాండ్పై ఆధారపడి ఉంటుంది. సమిష్టి సప్లై, సమిష్టి డిమాండ్ల సమానతనే “సార్థక డిమాండ్” అని అంటారు.
AP Inter 1st Year Economics Study Material Chapter 8 స్థూల ఆర్థిక సిద్ధాంతం 4

సమిష్టి సప్లై ధర: నిర్ణీత స్థాయిలో శ్రామికులను నియమించి, నిర్దిష్ట పరిమాణంలో వస్తువును ఉత్పత్తి చేయాలంటే ఉద్యమదారులు కనీసం పొందాలని ఆశించే రాబడిని ‘సమిష్టి సప్లై ధర’ అంటారు.

సమిష్టి డిమాండ్ ధర: ఒక నిర్ణీత సంఖ్యలో శ్రామికులను నియమించి, నిర్దిష్టమైన పరిమాణంలో వస్తువును ఉత్పత్తి చేసి, మార్కెట్లో అమ్మడం ద్వారా భవిష్యత్తులో పొందగలిగే రాబడిని “సమిష్టి డిమాండ్ ధర” అంటారు. సమిష్టి సప్లై, సమిష్టి డిమాండ్లు సమానమయిన దగ్గర ఉద్యోగితా స్థాయి నిర్ణయించబడుతుంది. ఈ రెండూ సమానమయిన దగ్గరే సమతౌల్య ఉద్యోగితా స్థాయిని సాధించవచ్చు.

దీనిని ఈ క్రింది రేఖాపటం ద్వారా వివరించవచ్చు.

పై రేఖాపటంలో ‘X’ అక్షం మీద ఉద్యోగితా స్థాయిని, ‘Y’ అక్షంపై సమిష్టి డిమాండ్ /సప్లైని తీసుకున్నాము. ‘E’ బిందువువద్ద AS = AD అయినది. అందువల్ల ON ఉద్యోగితాస్థాయి వద్ద ఆర్థిక వ్యవస్థ సమతౌల్య స్థితికి చేరుకుంది. ON1 వద్ద ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగిత ఉన్నట్లు కీన్స్ గుర్తించాడు. ఈ స్థితిని కీన్స్ “అల్ప ఉద్యోగితా సమతౌల్య స్థితి” అని పేర్కొన్నాడు.

ప్రశ్న 6.
వివిధ రుణ విమోచన పద్ధతులను వివరించండి.
జవాబు:
ప్రభుత్వం చేసిన రుణాన్ని తిరిగి చెల్లించటాన్ని రుణవిమోచన/విముక్తి అంటారు.

పద్ధతులు:
1. మిగులు బడ్జెట్: ప్రభుత్వాలు ఆదాయ వనరులు ప్రభుత్వ వ్యయం కంటే ఎక్కువ ఉండేటట్లు చేసుకోగలిగితే, పెరిగిన ఆదాయ వనరుల/మిగులు నుంచి రుణాలను తిరిగి చెల్లించడం.

AP Inter 1st Year Economics Study Material Chapter 8 స్థూల ఆర్థిక సిద్ధాంతం

2. రుణ పరివర్తనం: పాత రుణాన్ని చెల్లించటానికి మరలా కొత్త రుణం చేయటం – కానీ ఈ పద్ధతి ద్వారా రుణవిమోచన జరగదు.

3. రుణ విమోచన నిధి: ప్రభుత్వం అనుసరించే వివిధ పద్ధతులలో ఇది మంచి పద్ధతి అని చెప్పబడింది. ప్రభుత్వం ప్రతి సంవత్సరం తన రెవిన్యూ బడ్జెట్ నుంచీ కొంత మొత్తాన్ని ఈ నిధికి బదిలీ చేస్తుంది. ఈ నిధిలో జమచేసిన మొత్తంపై వచ్చే వడ్డీని కూడా రుణాలు తిరిగి చెల్లించడానికి ఉపయోగించడం జరుగుతుంది.

4. రుణ నిరాకరణ: వడ్డీనికాని, అసలు కాని లేదా రెండూ కలిపి చెల్లించడానికి నిరాకరించడం. ఏ ప్రభుత్వం కూడా ఈ పద్ధతిని అనుసరించదు. ప్రభుత్వ పరపతి దెబ్బతినే ప్రమాదం ఉండటం వల్ల, సాధారణంగా ఈ పద్ధతిని అనుసరించదు.

5. మూలధనంపై పన్ను: ఈ పద్ధతిలో ప్రజల వద్ద ఉన్న మూలధనంపై ఒకసారి పన్ను విధిస్తారు. అందువల్ల ఇది ఉత్తమమైనదిగా డాల్టన్ భావించాడు.

6. మిగులు వ్యాపార చెల్లింపుల శేషం: మిగులు వ్యాపార చెల్లింపుల శేషం ఏర్పడగలిగితే వాటిలో కొంతవరకు విదేశీ రుణాల నుంచి విముక్తి కలగడానికి అవకాశం ఉంటుంది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సప్లై తన డిమాండ్ను తానే సృష్టించుకుంటుంది. వివరించండి. [Mar. ’17, ’15]
జవాబు:
సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం ‘సే’ మార్కెట్ సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. మార్కెట్ సూత్రాన్ని జె.బి. సే ప్రతిపాదించాడు. అతని అభిప్రాయం ప్రకారం, “సప్లై తన డిమాండ్ను తానే సృష్టించుకుంటుంది.”

S = D లేదా సప్లై ఎప్పుడు డిమాండ్కు సమానంగా ఉంటుందని ఈ సూత్రాన్ని సాధారణంగా వివరిస్తారు. ఆర్థికవ్యవస్థలో ఎప్పుడు అదనపు ఉత్పత్తి ఏర్పడినా, ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్న ఉత్పత్తి కారకాలు భాటకం, వేతనం, వడ్డీ లాభం ప్రకారం రూపంలో ఆదాయాలను ఆర్జిస్తాయి. ఆ విధంగా పెరిగిన ఆదాయం మొత్తం అదుపులో ఉంచడానికి అదనపు ఉత్పత్తి కారకాల విలువకు సమానంగా ఉంటుంది. ఆ ఆదాయం అదనపు ఉత్పత్తి అమ్మకానికి అవసరమైన అదనపు డిమాండ్ను సృష్టిస్తుంది. మొత్తం ఆదాయం వస్తువుల కొనుగోలు మీద వ్యయం చేయబడుతుందని భావించడమైంది. అలాంటి వ్యయం కొంతవరకు వినియోగ వస్తువుల మీద కొంతవరకు మూలధన వస్తువుల మీద వ్యయం చేయబడుతుంది.

ముఖ్యాంశాలు: ‘సే’ మార్కెట్ సూత్రంలోని ముఖ్యాంశాలను క్రింది విధంగా చెప్పవచ్చు.

  1. సాధారణ అత్యుత్పత్తి, సాధారణ నిరుద్యోగం ఉండవు.
  2. ప్రభుత్వ జోక్యం అవసరం లేదు.
  3. ఆదాయం మొత్తం ఖర్చు చేయబడుతుంది. ఒకవేళ కొంత పొదుపు చేసినప్పటికీ ఆ పొదుపు మూలధన వస్తువులపై వ్యయం చేయటం జరుగుతుంది. అంటే పొదుపు, పెట్టుబడి సమానం.
  4. ఆర్థిక వ్యవస్థలో ఉపయోగంలో లేని వనరులు ఉన్నంతవరకు ఉత్పత్తి, ఉద్యోగితలను పెంచటం సాధ్యం అవుతుంది.
  5. వస్తువులు, వస్తువులతో వినిమయం చేయటం జరుగుతుంది. ఆ విధమైన వస్తు వినిమయానికి ద్రవ్యం ఉపయోగపడుతుంది.
  6. శ్రామిక మార్కెట్లో సరళ వేతన రేటువల్ల సమతౌల్యం ఏర్పడుతుంది.
  7. సరళ వడ్డీరేటు ద్వారా పొదుపు, పెట్టుబడి సమతౌల్యం చేరుకుంటాయి.

ప్రశ్న 2.
సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంత ప్రమేయాలను పేర్కొనండి.
జవాబు:
సాంప్రదాయ అర్థశాస్త్రం అనే పదాన్ని మొదట కార్ల్ మార్క్స్ ఉపయోగించారు. ఆడమ్స్మిత్, డేవిడ్ రికార్డో, రాబర్ట్ మాల్టస్, జె. ఎస్. మిల్ మొదలైనవారి సిద్ధాంతాలను సాంప్రదాయ అర్థశాస్త్రంగా పేర్కొన్నారు. ప్రమేయాలు:

  1. స్వేచ్ఛాపూరిత పెట్టుబడి ద్వారా ఆర్థిక కార్యకలాపాలలో మార్కెట్ శక్తులకు పూర్తి స్వేచ్ఛ.
  2. పరిపూర్ణ పోటీ పరిస్థితులు
  3. ఆర్థిక కార్యకలాపాలలో ప్రభుత్వ జోక్యం ఉండదు
  4. దీర్ఘకాలిక విశ్లేషణ
  5. సంపూర్ణ ఉద్యోగిత
  6. పొదుపులన్నీ నేరుగా పెట్టుబడిగా మారడం S = I, వడ్డీరేటు ద్వారా
  7. వడ్డీ సరళత్వం
  8. వేతనాల సరళత్వం
  9. అపరిమిత మార్కెట్ల పరిధి
  10. ద్రవ్యం వినిమయ మాధ్యమం అనే విధిని మాత్రమే నిర్వర్తిస్తుంది. ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో ద్రవ్యం తటస్థంగా వ్యవహరిస్తుంది.
  11. స్వయంచాలక సర్దుబాటు: ఆర్థిక వ్యవస్థలో ఉండే స్వయంచాలక సర్దుబాటు మూలంగా మొత్తం సప్లై, మొత్తం డిమాండ్ సమానమౌతాయి.
  12. శ్రామిక సప్లయి, డిమాండ్ నిజవేతనాలపై ఆధారపడి ఉంటుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 8 స్థూల ఆర్థిక సిద్ధాంతం

ప్రశ్న 3.
సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతంపై కీన్స్ విమర్శలు వివరించండి.
జవాబు:
సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం జె.బి.సి మార్కెట్ సూత్రంపై ఆధారపడింది. జె.బి.సి అనే ఆర్థిక శాస్త్రవేత్త ప్రకారం ‘సప్లై దానికి తగిన డిమాండ్ను తానే సృష్టించుకొంటుంది.’ ఉత్పత్తి విలువకు సరిపడ ఆదాయం ఏర్పడును. కనుక ఉత్పత్తి అంతటికీ డిమాండ్ ఏర్పడుతుంది. అందువల్ల అత్యుత్పత్తి ఏర్పడక సప్లై అంతటికీ డిమాండ్ ఏర్పడుతుంది.

సాంప్రదాయ సిద్ధాంతం ప్రకారం సప్లై పెరిగినంతమేరకు డిమాండ్ కూడా పెరుగుతుంది. అందువల్ల మార్కెట్ విస్తరణకు పరిమితి ఉండదు. ఈ సిద్ధాంతం ప్రకారం సార్వత్రిక అత్యుత్పత్తి ఉండదు. కనుక సార్వత్రిక నిరుద్యోగిత కూడా ఉండదు. వేతనాల రేటులో మార్పులు సప్లై, డిమాండ్లను సమానం చేస్తుంది. సాంప్రదాయ సిద్ధాంతం ప్రకారం వేతనాల తగ్గింపు వల్ల ఉద్యోగితాస్థాయి పెరుగుతుంది.

విమర్శలు: కీన్స్ అను ఆర్థిక శాస్త్రవేత్త సాంప్రదాయ సిద్ధాంతాన్ని ఈ క్రింది విధంగా విమర్శించాడు.
1. సప్లై దానికి తగిన డిమాండ్ను సృష్టించదు: సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం ప్రకారము పొదుపు, పెట్టుబడి సమానంగా ఉండుట వలన సప్లయ్ దానికి తగిన డిమాండ్ను సృష్టించును, కాని వాస్తవానికి పొదుపు, పెట్టుబడులు సమానంగా ఉండవు. అందువలన సప్లై దానికి తగిన డిమాండ్ను సృష్టించదు.

2. వేతనాల తగ్గుదల ఉండదు: సాంప్రదాయ ఉత్పత్తి ఉద్యోగితా సిద్ధాంతం ప్రకారం సప్లై కన్నా డిమాండ్ తక్కువైనపుడు వేతనాలు, ధరలు తగ్గును. కానీ వాస్తవానికి కార్మిక సంఘాలు వేతనాలు తగ్గుదలను ప్రతిఘటిస్తాయి.

3. పరిపూర్ణ పోటీ ప్రమేయం వాస్తవం కాదు: సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతంలో పరిపూర్ణ పోటీ మార్కెట్ ఉండుననే ప్రమేయం తీసుకొనడమైనది. కాని వాస్తవానికి పరిపూర్ణ పోటీ ఎక్కడా ఉండదు.

4. స్వల్ప కాలానికి అన్వయించబడదు దీర్ఘకాలంలో సాంప్రదాయక ఆర్థికవేత్తలు చెప్పిన ప్రకారము సప్లై, డిమాండ్లు సమానము కావచ్చు. కాని స్వల్పకాలంలో సప్లై, డిమాండ్లు సమానము కావు. అందువలన సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతము స్వల్పకాలానికి అన్వయించబడదు.

5. ఉత్పత్తి, వినియోగం సమానంగా ఉండవు: సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం ప్రకారం ఉత్పత్తి, ఆదాయం, వినియోగం సమానంగా ఉంటాయి. కాని ధనవంతుల విషయంలో వినియోగం కంటే ఆదాయం ఎక్కువగా ఉండును. పేదవారి విషయంలో ఆదాయం తక్కువగా ఉండును. అందువలన ఉత్పత్తి, వినియోగము సమానంగా ఉండవు.

ప్రశ్న 4.
పిగూ వేతన కోతవిధానం
జవాబు:
సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం ప్రకారం ద్రవ్య వేతనాలను తగ్గించటం ద్వారా ఉద్యోగ అవకాశాలను పెంచి నిరుద్యోగ సమస్యను పరిష్కరించవచ్చు. దీనినే ‘వేతన కోత విధానం’ W అని అంటారు. ఈ విషయాన్ని ఎ.సి.పిగూ అనే ఆర్థికవేత్త తెలిపాడు. ఇతని అభిప్రాయం ప్రకారం వేతనాలు ఎక్కువగా ఉన్నందువల్ల w. నిరుద్యోగిత ఏర్పడునని వేతనాలు తగ్గించడం ద్వారా సంపూర్ణ ఉద్యోగితా స్థాయిని సాధించవచ్చు. సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారం వేతనాలను తగ్గించడం వల్ల ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది, దీనివల్ల ధరలు తగ్గుతాయి. ధరలు తగ్గడం వల్ల డిమాండ్ పెరిగి, వస్తూత్పత్తి పెరుగుతుంది. కనుక ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వేతనాల కోత వలన ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయో ఈ క్రింది రేఖాపటం ద్వారా చూపవచ్చు.

ప్రక్క రేఖాపటంలో X-అక్షంపై శ్రామికుల సంఖ్యను, Y-అక్షంపై వేతనాల రేటును గుర్తించడమైంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 8 స్థూల ఆర్థిక సిద్ధాంతం 5

OW ఉన్నప్పుడు OM పరిమాణంలో శ్రామికుల డిమాండ్ ఉంది. కనుక OM పరిమాణంలో శ్రామికులను నియమించడమైనది. వేతనాల రేటు OW నుండి OW1 కు తగ్గినప్పుడు శ్రామికుల డిమాండ్ OM నుండి OM కు పెరిగింది. కనుక వేతనాలను తగ్గించటం వల్ల ఉద్యోగితా స్థాయి OM నుండి OM1 పెరిగింది. అందువల్ల సాంప్రదాయ ఆర్థిక శాస్త్రవేత్తల ప్రకారం వేతనాల కోతవల్ల ఉద్యోగితా స్థాయి పెరుగుతుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 8 స్థూల ఆర్థిక సిద్ధాంతం

ప్రశ్న 5.
సమిష్టి సప్లై, సమిష్టి డిమాండ్ భావనలను వివరించండి.
జవాబు:
ఆర్థిక వ్యవస్థలో మొత్తం వస్తురాశికి ఉండే డిమాండ్ను సమిష్టి డిమాండ్ తెలియజేస్తుంది. వివిధ ఉత్పత్తులు రాశుల వద్ద సమాజంలో ప్రజలు ఎంత మొత్తంలో వ్యయం చేయటానికి సిద్ధపడతారో దానిని సమిష్టి డిమాండ్ పట్టిక తెలియజేస్తుంది. వస్తు సేవలపై సమాజం ఖర్చు చేసిన ఆదాయం ఉత్పాదక సంస్థలకు ఆదాయం అవుతుంది. నిర్ణీత సంఖ్యలో శ్రామికులను నియమించి నిర్ణీత స్థాయిలో ఉత్పత్తి కొనసాగించి మార్కెట్లో విక్రయించగా వాస్తవంగా తమకు ఆదాయం వస్తుందని ఉద్యమదారులు ఆశించే ఆదాయాన్ని సమిష్టి డిమాండ్ ధర అంటారు. వివిధ ఉద్యోగితా స్థాయిలకు ఆ స్థాయిల వద్ద ఉత్పాదక సంస్థలు వాస్తవంగా పొందగలమని ఆశించే ఆదాయ ప్రవాహానికి మధ్య ఉండే సంబంధాన్ని సమిష్టి డిమాండ్ ధర పట్టిక తెలియజేస్తుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 8 స్థూల ఆర్థిక సిద్ధాంతం 6

పై పట్టికననుసరించి సమిష్టి డిమాండ్కు, ఉద్యోగితా స్థాయికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంటుందని తెలుసుకోవచ్చును. ఉద్యోగితా స్థాయి పెరిగినప్పటికి సమిష్టి డిమాండ్ కూడా పెరుగుతుంది.

ఆర్థిక వ్యవస్థలోని మొత్తం వస్తురాశి సప్లైని తెలియజేస్తుంది. సమిష్టి సప్లై పట్టిక వివిధ రకాల ధరల వద్ద ఎంత వస్తురాశి ఉత్పత్తి అవుతుందో తెలియజేస్తుంది. ఉత్పత్తి పెరిగిన కొద్దీ ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఉత్పత్తి వ్యయానికి సమానమైన ధరను ఉత్పాదక సంస్థలు పొంది తీరవలెను. వివిధ ఉత్పత్తి రాశులకు ఉత్పాదక సంస్థలు పొంది తీరవలసిన కనీస ఆదాయాన్ని సమిష్టి సప్లై ధర అంటారు. వివిధ ఉద్యోగితా స్థాయిలకు ఆ ఉద్యోగితా స్థాయిల వద్ద ఉద్యమదారులు పొందాలని ఆశించే కనీస ఆదాయాలకు ఉన్న సంబంధాన్ని సమిష్టి సప్లై ధర పట్టిక తెలియజేస్తుంది. సమిష్టి సప్లై పట్టికని ఈ క్రింద పరిశీలింపవచ్చును.
AP Inter 1st Year Economics Study Material Chapter 8 స్థూల ఆర్థిక సిద్ధాంతం 7

పై పట్టికననుసరించి సమిష్టి సప్లై ధరకు, ఉద్యోగితా స్థాయికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని తెలుస్తుంది. ఉద్యోగితా స్థాయి సమిష్టి సప్లై కూడా పెరుగుతుంది.

ప్రశ్న 6.
సార్థక డిమాండ్ భావనను వివరించండి.
జవాబు:
కీన్స్ ఉద్యోగితా సిద్ధాంతానికి డిమాండ్ భావన ఆయువు పట్టు. సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై సమానంగా ఉండే స్థితిలో సార్థక డిమాండ్ నిర్ణయమౌతుంది. వివిధ ఉద్యోగితా స్థాయిలలో సమిష్టి డిమాండ్ వివిధ రకాలుగా ఉంటుంది. ఏ ఉద్యోగితా స్థాయిలో సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లైతో సమానమౌతుందో అది ఆర్థిక వ్యవస్థ సమతౌల్యాన్ని సూచిస్తుంది. కానీ అది స్వల్పకాల సమతౌల్యం. అది సార్థక డిమాండ్ని సూచిస్తుంది. ఆర్థిక వ్యవస్థలో సమిష్టి సప్లై సమిష్టి డిమాండ్కు అనుగుణంగా మారుతుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 8 స్థూల ఆర్థిక సిద్ధాంతం

సార్థక డిమాండ్: సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై రేఖలు ఒకదానికొకటి ఖండించుకున్న బిందువు సార్థక డిమాండ్ను సూచిస్తుంది. ఈ బిందువు వద్ద సమిష్టి డిమాండ్ ధర, సమిష్టి సప్లై ధరకు సమానమవటం వల్ల ఆ డిమాండ్ సార్థక డిమాండ్ అవుతుంది.

సమతౌల్య స్థాయి వద్ద ఉత్పత్తైన వస్తురాశిని కొనడానికైన మొత్తం వ్యయం సార్థకమైన డిమాండ్ అవుతుంది. సార్థకమైన డిమాండ్ ఉత్పతైన వస్తురాశి విలువకు సమానం. వస్తురాశి విలువ జాతీయాదాయానికి సమానం. ఆదాయం మొత్తం వ్యయానికి సమానమౌతుంది. దీనిని ఈ క్రింది విధంగా చెప్పవచ్చు.

సార్థకమైన డిమాండ్ = జాతీయ ఆదాయం = వినియోగ వ్యయం + పెట్టుబడి వ్యయం

ఈ విధంగా సార్థకమైన డిమాండ్ వినియోగ వ్యయం, పెట్టుబడికి సమానం. ఆదాయము మొత్తం వ్యయానికి సమానం.

Y = C + I

విదేశీ వ్యాపారం ఉన్న ఆర్ధిక వ్యవస్థలో నికర ఎగుమతులు (X-M) కు సమిష్టి డిమాండ్లో చేరి ఉంటుంది.
Y = C + I + G + (X – M)
Y = జాతీయోత్పత్తి
I = పెట్టుబడి
C = వినియోగ వ్యయం
G = ప్రభుత్వ వ్యయం
X = ఎగుమతి విలువ
M = దిగుమతి విలువ

సార్థక డిమాండు ఈ క్రింది పట్టిక పటముల సహాయంతో వివరించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 8 స్థూల ఆర్థిక సిద్ధాంతం 8

పై పటములో X అక్షంపై ఉద్యోగిత, Y అక్షంపై సమిష్టి డిమాండ్ ధర, సమిష్టి సప్లై ధర చూపాం. AS సమిష్టి సప్లై రేఖ, AD సమిష్టి డిమాండ్ రేఖ. ఇది ‘E’ బిందువు వద్ద ఖండించుకుంటున్నాయి. కనుక ‘E’ బిందువు సార్థక డిమాండున్ను తెలియజేయును.

ప్రశ్న 7.
వివిధ ప్రభుత్వ రాబడి మార్గాలు. [Mar. ’17, ’16, ’15]
జవాబు:
ఆధునిక ప్రభుత్వాలు అనేక విధులను నిర్వహించడమే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రభుత్వ వ్యయం క్రమంగా పెరుగుతోంది. ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని సేకరిస్తుంది. పన్నులు, ఫీజులు, ప్రత్యేక విధింపులు, గ్రాంట్లు, వాణిజ్య ఆదాయాలు, రుణ సేకరణ, కరెన్సీనోట్ల ముద్రణ మొదలైన మార్గాల ద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. వాటిలో పన్నులు ప్రధానమైనవి.

1. పన్నులు: వ్యక్తులు, సంస్థలు ప్రభుత్వానికి నిర్బంధంగా చెల్లించేవి ‘పన్నులు’ ఇవి రెండు రకాలు.

  1. ప్రత్యక్ష పన్నులు: ఉదా: వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేటు పన్ను.
  2. పరోక్ష పన్నులు: వస్తువు, సేవలపై విధించే పన్నులు, ఎక్సైజ్ డ్యూటీ.

2. పన్నేతర రాబడులు: ప్రభుత్వానికి పన్నులు కాకుండా ఇతర మార్గాల ద్వారా లభించే ఆదాయాలను ‘పన్నేతర రాబడులు’ అంటారు.
ఎ. పాలనా రాబడులు: కొన్ని సేవలను అందించడం ద్వారా ఇలాంటి రాబడి ప్రభుత్వానికి లభిస్తుంది. ఉదా: లైసెన్స్ ఫీజు, ట్యూషన్ ఫీజు, జరిమానాలు, పెనాల్టీలు.
బి. వాణిజ్య రాబడులు: ప్రభుత్వ సంస్థల్లో ఉత్పత్తి అయిన వస్తు సేవలను విక్రయించగా వచ్చిన ఆదాయాలను ‘వాణిజ్య రాబడులు’ అంటారు.
ఉదా: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బి.ఎస్.ఎన్.ఎల్, రైల్వేలు, స్టేట్ రోడ్డు రవాణా, ఇండియన్ ఎయిర్లైన్స్.
సి. రుణాలు: స్వదేశీ, విదేశీ రుణాలు, అంతర్గత, బహిర్గత రుణాలు.
డి. గ్రాంట్లు: ఒక ప్రభుత్వం మరొక ప్రభుత్వానికి చేసే ద్రవ్య సహాయాన్నే ‘గ్రాంట్లు’ అంటారు.
ఉదా: కేంద్రం రాష్ట్రానికి, రాష్ట్రాలు స్థానిక ప్రభుత్వాలకు ఇచ్చే గ్రాంట్లు. ఇవి రెండు రకాలు.

  1. సాధారణ గ్రాంట్లు: ఎలాంటి ప్రత్యేక అంశాలకు కాకుండా సాధారణ ఆర్థిక వనరుల కొరత ఏర్పడినప్పుడు ఇచ్చే గ్రాంట్లు.
  2. ప్రత్యేక గ్రాంట్లు: ఒక ప్రతేక పనికి నిర్దేశించి ఇచ్చే గ్రాంట్లు.
    ఉదా: విద్య, ఆరోగ్యం, ప్రజాసంక్షేమ కార్యక్రమాల కోసం ఇచ్చే గ్రాంటు.

AP Inter 1st Year Economics Study Material Chapter 8 స్థూల ఆర్థిక సిద్ధాంతం

ప్రశ్న 8.
ప్రభుత్వ వ్యయ వర్గీకరణ [Mar. ’16]
జవాబు:
ప్రభుత్వ విత్తంలోని ముఖ్యమైన భాగాలలో ప్రభుత్వ వ్యయం ఒకటి. ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలు నిరంతరం పెరుగుతూ ఉండటంతో అన్ని దేశాలలోను ప్రభుత్వ వ్యయం పెరిగింది. ప్రభుత్వ వ్యయంలో రెండు ముఖ్య భాగాలుంటాయి. 1. రెవిన్యూ వ్యయం, 2. మూలధన వ్యయం. రెవిన్యూ వ్యయం వల్ల నూతన ఆస్తుల సృష్టి జరగదు. మూలధన వ్యయం వల్ల నూతన ఆస్తుల సృష్టి జరుగుతుంది. ప్రభుత్వం సాధారణంగా ఈ క్రింది అంశాలపై ఖర్చు చేస్తుంది.

  1. దేశరక్షణ
  2. అంతర్గత భద్రత
  3. ఆర్థిక సేవలు
  4. జీతాలు
  5. సాంఘిక సేవలు
  6. పింఛన్లు
  7. గ్రాంట్స్
  8. సబ్సిడీలు
  9. బీమా చెల్లింపులు
  10. రుణాలు
  11. అనుకోని ప్రమాదాలు మొదలగు వాటి కోసం.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
స్థూల అర్థశాస్త్రం
జవాబు:
స్థూల అర్థశాస్త్రం ఆర్థిక వ్యవస్థ మొత్తం గూర్చి అధ్యయనం చేస్తుంది.
ఉదా: సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై మొదలగునవి. దీనిని అభివృద్ధిపరిచినది J.M. కీన్స్.

ప్రశ్న 2.
సంప్రదాయ ఆర్థికశాస్త్రం
జవాబు:
18వ శతాబ్దము నుంచి 20వ శతాబ్దపు తొలిదశ వరకు అనుసరించిన ఆర్థిక సూత్రాల కూర్పును సాంప్రదాయ అర్థశాస్త్రం అంటారు. వ్యక్తి స్వేచ్ఛ, ప్రైవేటు ఆస్తి హక్కు, ప్రైవేటు వ్యాపార స్వేచ్ఛ అనేవి సాంప్రదాయ అర్థశాస్త్రం అనుసరించే అతి ప్రధానమైన సూత్రాలు.

ప్రశ్న 3.
Laissez Faire / స్వేచ్ఛా వ్యాపార విధానం. [Mar 15]
జవాబు:
సాంప్రదాయ ఆర్థిక శాస్త్రవేత్తలు స్వేచ్ఛా వ్యాపార ఆర్థిక విధానాన్ని సమర్ధించారు. స్వేచ్ఛా వ్యాపార ఆర్థిక విధానంలో ప్రభుత్వ జోక్యం అంతగా ఉండదు. వినియోగదారులకు, ఉత్పత్తిదారులకు స్వేచ్ఛ ఉంటుంది. నాణ్యమైన ఉత్పత్తి జరగటానికి, సగటు వ్యయం తగ్గటానికి, వస్తు ధరలు తగ్గటానికి అవకాశం ఉంటుంది. ఉత్పత్తిదారులు ఏ వస్తువైన ఉత్పత్తి చేయటానికి, వినియోగదారులు, తమకిష్టమైన వస్తువుల కొనుగోలు చేయటానికి అవకాశం ఉంటుంది.

ప్రశ్న 4.
‘సే’ మార్కెట్ సూత్రం [Mar. ’16]
జవాబు:
సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం ప్రధానంగా జె.బి. సే మార్కెట్ సూత్రంపై ఆధారపడింది. జె.బి.సే. అను ఆర్థిక శాస్త్రవేత్త ప్రకారం సప్లై తనకు తగిన డిమాండ్ను తానే సృష్టించుకొంటుంది. ఈ సిద్ధాంతం ప్రకారం ఉత్పత్తికి సమానంగా ప్రజలకు ఆదాయం వస్తుంది. దీనికి సమానంగా ప్రజలకు కొనుగోలు శక్తి ఏర్పడుతుంది. దీని వలన వస్తువులకు సరిపడా డిమాండ్ ఏర్పడుతుంది. ఈ విధంగా ఎవరి ప్రమేయం లేకుండా సప్లయ్ మేరకు డిమాండ్ దానంతట అదే ఏర్పడుతుంది. దీనినే ‘సే’ మార్కెట్ సూత్రం అంటారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 8 స్థూల ఆర్థిక సిద్ధాంతం

ప్రశ్న 5.
సంపూర్ణ ఉద్యోగిత [Mar. ’17, ’15]
జవాబు:
ఇవ్వబడిన వేతనం దగ్గర పనిచేసే శక్తి, ఆసక్తి ఉన్న శ్రామికులందరికి ఉపాధి అవకాశాలు కల్పించగలిగే స్థితిని సంపూర్ణ ఉద్యోగిత అని అంటారు. సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతంలో సంపూర్ణ ఉద్యోగితా భావం ప్రాముఖ్యాన్ని వహించింది. సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారం దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగిత సమతౌల్యం ఏర్పడుతుంది. కీన్స్ అభిప్రాయం ప్రకారం సమిష్టి డిమాండ్ను పెంచుట ద్వారా సంపూర్ణ ఉద్యోగితా సమతౌల్యం ఏర్పడును.

ప్రశ్న 6.
సమిష్టి డిమాండ్ ఫలం
జవాబు:
సమిష్టి డిమాండ్ రాగల ఊహించే ఆదాయాన్ని తెలుపుతుంది. వినియోగ వస్తువులు, పెట్టుబడి వస్తువులపై చేసిన మొత్తం వ్యయం సమిష్టి డిమాండ్. ఉత్పత్తి విలువ ప్రజల ఆదాయానికి సమానం. ఉత్పత్తి పెరిగితే ఆదాయం కూడా పెరుగుతుంది. కనుక వస్తువుల డిమాండ్ కూడా పెరుగుతుంది. వివిధ ఉద్యోగితా స్థాయిల వద్ద చేసిన ఉత్పత్తిని అమ్మినందువల్ల ఉత్పత్తిదారులు రాగలదని ఊహించే ఆదాయాన్ని సమిష్టి డిమాండ్ అని అంటారు. ఆర్థిక వ్యవస్థలో వివిధ ఉద్యోగితా స్థాయిల వద్ద ఏర్పడే సమిష్టి డిమాండ్ ధరను చూపించే పట్టికను సమిష్టి డిమాండ్ ఫలం అంటారు.

ప్రశ్న 7.
సమిష్టి సప్లై ఫలం
జవాబు:
ఒక వస్తువు సప్లైకి కాకుండా అన్ని వస్తువుల మొత్తం సప్లైకి ఎంత ఉందో తెలియజేయునది సమిష్టి సప్లై. |ఉద్యమదారుడు కనీసం పొందాలని ఆశించే ఆదాయాన్ని సమిష్టి సప్లై ధర అంటారు. వివిధ ఉద్యోగితా స్థాయిలో ఆఉద్యోగితా స్థాయిల వద్ద ఉద్యమదారులు పొందాలని ఆశించే కనీస ఆదాయాల మధ్య ఉన్న సంబంధాన్ని సమిష్టి సప్లై ధర పట్టిక తెలియజేయును.

ప్రశ్న 8.
సార్థక డిమాండ్ [Mar. ’16]
జవాబు:
కీన్స్ ఉద్యోగితా సిద్ధాంతానికి సార్థక డిమాండ్ భావన ముఖ్యమైనది. సమిష్టి డిమాండ్ ధర, సమిష్టి సప్లై ధర సమానంగా ఉండే స్థితిని సార్థక డిమాండ్ అంటారు. అనగా సమిష్టి డిమాండ్ రేఖ, సమిష్టి సప్లై ధర రేఖ ఖండించుకున్న బిందువు వద్ద సార్థక డిమాండ్ నిర్ణయమవుతుంది.

ప్రశ్న 9.
ప్రభుత్వ రాబడి
జవాబు:
ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని సేకరిస్తుంది. పన్నులు ఫీజులు, ప్రత్యేక విధింపులు, గ్రాంట్లు మొదలగునవి అన్నింటిని ప్రభుత్వ రాబడి ఉంటారు.

ప్రశ్న 10.
బడ్జెట్
జవాబు:
ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వ రాబడి అంచనాలు, ప్రభుత్వ వ్యయ అంచనాలకు చూపించే వార్షిక నివేదికను బడ్జెట్ అంటారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 8 స్థూల ఆర్థిక సిద్ధాంతం

ప్రశ్న 11.
ప్రభుత్వ ఋణం
జవాబు:
ప్రభుత్వం వ్యయానికి సేకరించిన ఆదాయ వనరులు చాలనప్పుడు రుణాలు చేస్తుంది. ఈ రుణాలు రెండు రకాలు. 1. అంతర్గత ఋణాలు, 2. బహిర్గత ఋణాలు.

ప్రశ్న 12.
కోశపరమైన లోటు
జవాబు:
కోశపరమైన లోటు = ద్రవ్యలోటు + మార్కెట్ రుణాలు, ఇతర అప్పులు.

అదనపు ప్రశ్నలు

ప్రశ్న 13.
వేతన కోత విధానం [Mar. ’17]
జవాబు:
దీనిని A.C. పిగూ ప్రతిపాదించారు. నిరుద్యోగితను తగ్గించడానికి వేతనంలో కోత విధించిన నిరుపయోగ శ్రామికులకు ఉపాధి కల్పించుట.

ప్రశ్న 14.
ఓట్ ఆన్ అకౌంట్
జవాబు:
పూర్తి బడ్జెట్ను ప్రతిపాదించలేని పరిస్థితులలో తాత్కాలికంగా కొన్ని నెలల కోసం ప్రతిపాదించినది బడ్జెట్.

ప్రశ్న 15.
సంతులిత బడ్జెట్
జవాబు:
మొత్తం రాబడులు, వ్యయాలు సమానంగా ఉండటాన్ని సంతులిత బడ్జెట్ అంటారు.

ప్రశ్న 16.
మిగులు బడ్జెట్
జవాబు:
మొత్తం రాబడులు మొత్తం వ్యయం కంటే ఎక్కువగా ఉన్నట్లయితే దానిని మిగులు బడ్జెట్గా పేర్కొంటారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 8 స్థూల ఆర్థిక సిద్ధాంతం

ప్రశ్న 17.
లోటు బడ్జెట్
జవాబు:
మొత్తం వ్యయాలు, మొత్తం రాబడుల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే దానిని లోటు బడ్జెట్ అంటారు.

ప్రశ్న 18.
ఋణ విమోచన
జవాబు:
ప్రభుత్వం చేసిన రుణాన్ని తిరిగి చెల్లించటాన్ని రుణ విమోచన అంటారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Economics Study Material 6th Lesson పంపిణీ సిద్ధాంతం Textbook Questions and Answers.

AP Inter 1st Year Economics Study Material 6th Lesson పంపిణీ సిద్ధాంతం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భాటకాన్ని నిర్వచించి, రికార్డో భాటక సిద్ధాంతాన్ని వివరించండి.
జవాబు:
ఉత్పత్తి కారకంగా భూమి వస్తూత్పత్తి ప్రక్రియలో అందించే సేవలకు లభించే ప్రతిఫలం భాటకము. డేవిడ్ రికార్డో భాటకాన్ని ఈ విధంగా నిర్వచించారు. “భూమికి ఉన్న సహజమైన, నశింపు కాని ఉత్పాదక శక్తులను ఉపయోగించుకొన్నందుకు పొందే ఫలసాయంలో భూస్వామికి చెల్లించే భాగమే భాటకము”.

రికార్డో భాటక సిద్ధాంతము: డేవిడ్ రికార్డో భాటకాన్ని వైవిధ్యం వల్ల ఏర్పడే మిగులుగా భావించాడు. భూసారాలలోని వైవిధ్యం వల్ల భాటకం జనిస్తుంది. ఈ భాటకం ఏ విధంగా ఉత్పన్నమవుతుందో రికార్డో ఈ విధంగా వివరించాడు. ఒక ఆర్థిక వ్యవస్థలోని భూములను వాటి సారాన్నిబట్టి 3 రకాలైన భూములున్నాయి అనుకుంటే భాటకం లేదా వైవిధ్యం మిగులు ఏ విధంగా ఏర్పడుతుందో ఈ విధంగా వివరించాడు.

ఒక కొత్త దేశానికి కొంతమంది వలస వెళ్లారనుకుందాం. వాళ్లు అతిసారవంతమైన భూములను సాగు చేస్తారనుకుంటే ముందుగా ‘A’ గ్రేడ్ భూములను సాగుచేస్తారు. ఈ భూమిపై 20 క్వింటాళ్ళు పండించటానికి ఉత్పత్తి వ్యయం 300 అనుకుందాం. అంటే యూనిట్ వ్యయం కౌ 15. ప్రతి వ్యవసాయదారుడు కనీసం ఉత్పత్తి వ్యయాన్ని రాబట్టుకోవటానికి యూనిట్ ధరను కూడా 15గా నిర్ణయించాల్సి ఉంటుంది. అప్పుడు ‘A’ గ్రేడ్ భూములపై మిగులు ఉండదు. కాని ఇంకా కొంతమంది ఆ దేశానికి వలస వస్తే లేదా ఆ దేశ జనాభా పెరిగి ధాన్యానికి డిమాండ్ పెరుగుతుంది. ‘A’ గ్రేడ్ భూములన్నీ సాగు చేశారనుకుంటే ‘B’ గ్రేడ్ కౌ 300 ఖర్చు చేస్తే 15 క్వింటాళ్ళ ధాన్యాన్ని మాత్రమే పండించగలుగుతారు. ‘B’ గ్రేడ్ భూమిపై చేసిన వ్యయాన్ని రాబట్టటానికి ధాన్యం యూనిట్ ధరను Rs. 20గా నిర్ణయించాల్సి ఉంటుంది. ఇప్పుడు ‘B’ గ్రేడ్ భూమిపై మిగులుండదు. కాని ‘A’ గ్రేడ్ భూమిపై భౌతిక రూపంలో భాటకం 5 క్వింటాళ్ళు. విలువ రూపంలో కౌ 100 ఇంకా జనాభా పెరిగితే ఆహారధాన్యాలకు డిమాండ్ పెరిగి ‘C’ గ్రేడ్ భూములను కూడా సాగుచేయవలసి ఉంటుంది. ‘C’ గ్రేడ్ భూములు, ‘B’ గ్రేడ్ భూముల కంటే ఇంకా తక్కువ సారవంతమైనవి కనుక Rs. 300 ‘C’ గ్రేడ్ భూములపై వ్యయం చేస్తే 10 క్వింటాళ్ళు మాత్రమే పండించటం జరుగుతుంది. వ్యయాన్ని రాబట్టుకోవటానికి యూనిట్ ధాన్యం ధరను గౌ 30గా నిర్ణయించాలి. అప్పుడు ‘C’ గ్రేడ్ భూమిపై మిగులు ఉండదు. ‘B’ గ్రేడ్ భూమిపై భౌతికంగా 5 క్వింటాళ్ళు మిగులుంటుంది. దాని విలువ Rs. 150. ‘A’ గ్రేడ్ భూమిపై భాటకం పెరుగుతుంది. ‘A’ గ్రేడ్ భూమిపై భౌతికంగా భాటకం 10 క్వింటాళ్ళు దాని విలువ Rs. 300. దీనిని ఈ క్రింది పట్టిక ద్వారా పరిశీలించవచ్చును.
AP Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతం 1

AP Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతం

పై పట్టికలో భాటకం లేని భూమిని ఉపాంత భూమి అంటారు. భాటకం భూసారంలోని వైవిధ్యం వల్ల ఏర్పడుతుంది. అన్ని ‘A’ గ్రేడ్ భూములైతే భాటకం ఉండదు. ‘B’ గ్రేడ్ భూములను సాగుచేస్తే ‘A’ గ్రేడ్ భూమిపై భాటకం ఏర్పడుతుంది. ‘C’ గ్రేడ్ భూములను సాగుచేస్తే ‘B’ గ్రేడ్ భూములపై భాటకం ఏర్పడుతుంది. అందువల్ల వ్యవసాయ ఉత్పత్తిలో క్షీణప్రతిఫలాలు ఏర్పడతాయి.
AP Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతం 2

పై రేఖాపటంలో షేడెడ్ ఏరియా వివిధ గ్రేడు భూములలో భాటకం లేదా మిగులును తెలియజేస్తుంది. ‘C’ గ్రేడ్ భూమి ఉపాంత భూమి. కాబట్టి ఈ భూమిలో భాటకం లేదు.

ప్రశ్న 2.
ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతాన్ని వివరించండి.
జవాబు:
ఉత్పత్తి కారకాలకు చెల్లించే ప్రతిఫలాలు ఏ విధంగా నిర్ణయించబడతాయో ఉపాంత ఉత్పాదకతా సిద్ధాంతం తెలియజేయును.

ఒక ఉత్పత్తి కారకం అదనపు యూనిట్ ఉత్పత్తిలో పాల్గొన్నప్పుడు మొత్తం ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను ఆ కారకం యొక్క ఉపాంత ఉత్పాదకత అంటారు. దీనిని అనుసరించి ఉత్పత్తిదారుడు కారకానికి ఇచ్చే ప్రతిఫలాన్ని నిర్ణయిస్తాడు. డేవిడ్ రికార్డో ఈ సిద్ధాంతాన్ని భూమికి మాత్రమే అన్వయించాడు. జె.బి. క్లార్క్ ఈ సిద్ధాంతానికి ఒక రూపాన్ని కల్పించి దానిని అభివృద్ధిపరిచారు. ఉపాంత ఉత్పాదకతను వస్తురూపంలో గాని, ద్రవ్యరూపంలో గాని లెక్కించవచ్చు.

ఒక కారకం యొక్క ఉపాంత ఉత్పాదకతను ఈ క్రింది విధంగా వివరించవచ్చు. ఉదా: నలుగురు టైలర్లు రోజుకు పది చొక్కాలు కుట్టగలరని అనుకుందాం. అదే ఐదుగురు టైలర్లు 13 చొక్కాలు కుట్టగలరు. 5వ టైలర్ ఉపాంత భౌతిక ఉత్పత్తి మూడు చొక్కాలు. ఒక్క చొక్కా కుట్టినందుకు వేతనం Rs. 100/- అనుకుంటే 5వ శ్రామికునికి 3. చొక్కాలు కుట్టినందుకు Rs. 300/- వేతనం ఇవ్వవలసి వస్తుంది. ఈ Rs. 300/-ను ఉపాంత ఉత్పత్తి రాబడి అంటారు.

ఉపాంత భౌతిక ఉత్పత్తి సిద్ధాంతం సంపూర్ణ పోటీ మార్కెట్ ప్రమేయంపై ఆధారపడటం వల్ల ఒక ఉత్పత్తి కారకం సగటు వ్యయం దాని ఉపాంత వ్యయంకు సమానంగా ఉంటుంది. ఉత్పత్తి మొదటి దశలో శ్రామికుల సంఖ్య పెంచుతూపోతే తరహాననుసరించి పెరుగుతున్న ప్రతిఫలాల వల్ల అదనపు ఉత్పత్తి రాబడి పెరుగుతుంది. తరువాత ఇంకా శ్రామికులను పెంచితే క్షీణ ప్రతిఫలాలు వస్తాయి. అందువల్ల ఉపాంత ఉత్పత్తి రాబడి, సగటు ఉత్పత్తి రాబడి ఒక స్థాయి వరకు పెరిగి క్షీణిస్తాయి.

దీనిని ఈ క్రింది రేఖాపటం ద్వారా వివరించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతం 3

పై రేఖాపటంలో ‘E’ బిందువు వద్ద ఉపాంత కారక వ్యయం (MFC), ఉపాంత కారక రాబడి (MFC) సమానంగా ఉండి సంస్థ సమతౌల్యంలో ఉంటుంది. AFC, ARP ఇక్కడ సమానంగా ఉండటం వల్ల సాధారణ లాభాలు పొందుతుంది. శ్రామికులను OL1, యూనిట్లకు తగ్గిస్తే ‘E1‘ బిందువు వద్ద MFC, MRP సమానమైనాయి. ఈ బిందువు వద్ద ARP కంటే AFC తక్కువగా ఉండటం వల్ల లాభాలు వస్తాయి. అందువల్ల శ్రామికులను OL పెంచవచ్చు. కాని శ్రామికులను OL2 కు పెంచితే ‘E2‘ బిందువు వద్ద MFC, MRP సమానమైనాయి. ARP కంటే AFC ఎక్కువగా ఉండటం వల్ల సంస్థకు నష్టాలు వస్తాయి. అందువల్ల శ్రామికులను OL యూనిట్లకు తగ్గింటం జరిగింది. ఇక్కడ శ్రామికుల ఉపాంత ఉత్పత్తికి సమానంగా వేతనం ఉంటుంది.

ప్రమేయాలు :

  1. ఉత్పత్తి కారకాల మార్కెట్ పరిపూర్ణ పోటీ ఉంటుంది.
  2. ఉత్పత్తి కారకాలు అన్ని సజాతీయాలు.
  3. ఉత్పత్తి కారకాలకు పూర్తి గమనశీలత ఉంటుంది.
  4. సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది.
  5. ఒక ఉత్పత్తి కారకం ఉపాంత ఉత్పత్తిని కొలవవచ్చు.

ప్రశ్న 3.
వాస్తవిక వేతనం అంటే ఏమిటి ? వాస్తవిక నేతనాన్ని నిర్ణయించు అంశాలను పేర్కొనుము.
జవాబు:
శ్రామికులు వివిధ రంగాలలో వస్తూత్పత్తి ప్రక్రియలో తన సేవలను అందించారు. అందుకు ప్రతిఫల ఉత్పత్తిదారులిచ్చే ప్రతిఫలం లేదా ధరను వేతనం అంటారు. శ్రామికులకు ప్రతిఫలం లేదా ధరను ద్రవ్య రూపం చెల్లిస్తారు. ద్రవ్య రూపంలో ఇచ్చిన వేతనం కొనుగోలు శక్తిని వాస్తవిక వేతనం అంటారు. ఇది ద్రవ్యం కొనుగోలు ఆధారపడుతుంది. ఈ కొనుగోలు శక్తి సాధారణ ధర సూచికపై ఆధారపడి ఉంటుంది. ధరల స్థాయి మారుతున్నప్పుడు ద్రవ్యవేతనంలో మార్పులు లేకపోయినా వాస్తవిక వేతనంలో మార్పు వస్తుంది. వాస్తవిక వేతనమే శ్రామికుని ఓ ప్రమాణస్థాయిని నిర్ణయిస్తుంది. ప్రజలు వినియోగిస్తున్న వస్తువులు, వాటి పరిమాణాలు, నాణ్యతను అనుసరించి బాట జీవన ప్రమాణాలు నిర్ణయించబడతాయి.

వాస్తవిక వేతనాన్ని నిర్ణయించే అంశాలు:
1) ద్రవ్యం కొనుగోలు శక్తి: సాధారణంగా ద్రవ్యానికుండే కొనుగోలు శక్తిపై వాస్తవిక వేతనాలు ఆధారపడి ఉంటాయి. ద్రవ్యానికి కొనుగోలు శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు శ్రామికులు తమ వేతనంలో ఎక్కువ సౌకర్యాలను సమకూర్చుకోగలరు. ద్రవ్యం కొనుగోలు శక్తి తగ్గినప్పుడు శ్రామికుల వాస్తవిక వేతనం తగ్గుతుంది.

2) వేతనమిచ్చే విధానము: శ్రామికులకు ఇచ్చే ద్రవ్య వేతనంతోపాటు యాజమాన్యం కొన్ని సదుపాయాలను కూడా కల్పిస్తుంది. ఉదా: ఉచిత వసతి సౌకర్యాలు, వైద్య సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు మొదలైనవాటివల్ల వారి వాస్తవిక వేతనాలు అధికమవుతాయి.

3) ఉద్యోగ స్వభావము: చేసే పని స్వభావం మీద కూడా వాస్తవిక వేతనాలు ఆధారపడతాయి. కొన్ని వృత్తులలో పని దుర్భరంగా ఉంటుంది. కొన్ని వృత్తులు ఆపదతో కూడినవిగా ఉంటాయి. అటువంటి వృత్తులలో ద్రవ్యవేతనాలు ఎక్కువగా ఉన్నా వాస్తవిక వేతనాలు తక్కువ. ఆహ్లాదకరమైన వృత్తులలో ద్రవ్యవేతనాలు తక్కువైనా వాస్తవిక వేతనాలు ఎక్కువని ఉద్యోగ స్వభావాన్నిబట్టి చెప్పవచ్చును. ఉదా: గనులలో పనిచేసేవారి వృత్తి దుర్భరంగా ఉంటుంది. కనుక ద్రవ్య వేతనాలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాస్తవిక వేతనం తక్కువగా ఉంటుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతం

4) పనిచేసే పరిస్థితులు: అనారోగ్యకరమైన పరిసరాలలో పనిచేసే శ్రామికుల వేతనం ఎక్కువగా ఉన్నా వారి వాస్తవిక వేతనం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ గంటలు పనిచేసేవారి ద్రవ్యవేతనం ఎక్కువగా ఉన్నా వారి వాస్తవిక వేతనం రేటు తక్కువగా ఉంటుంది.

5) ఆకస్మిక లాభాలు: యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలు, పోటీ సంస్థలు మూతపడుట మొదలైన కారణాల వల్ల ధరలు పెరిగి లభించే ఆకస్మిక లాభాలు నికరలాభంలో అంతర్భాగంగా ఉంటాయి.

ప్రశ్న 4.
స్థూల లాభం, నికరలాభంలో ఉన్న అంశాలను వ్రాయండి.
జవాబు:
మొత్తం రాబడి నుండి మొత్తం వ్యయం తీసివేయగా మిగిలినదానిని స్థూలలాభం అని అంటారు. స్థూలలాభంలో ఉన్న అంశాలు:
1) ఉద్యమదారుని సొంత మూలధనం మీద వడ్డీ: వ్యవస్థాపకుడు ఉత్పత్తి ప్రక్రియలో సొంత మూలధనం ఉపయోగిస్తే దానిమీద చెల్లించే వడ్డీని లెక్కలోకి తీసుకోవాలి.

2) సొంత భూమి మీద భాటకం: ఉత్పత్తి ప్రక్రియలో తన సొంత భూమిని ఉపయోగిస్తే దానికి భాటకం లెక్కగట్టాలి. దానిని లాభంగా అన్వయించకూడదు.

3) నిర్వహణ వేతనాలు: వ్యవస్థాపకుడే వ్యాపారాన్ని నిర్వహించి, అజమాయిషీ చేస్తే అతని సేవలకు వేతనం ఇవ్వాలి. అది స్థూలలాభంలో తీసివేయాలి.

4) బీమా ఖర్చులు: యంత్రాల తరుగుదల, బీమా వ్యయాలు మొదలైనవాటిని స్థూలలాభాల నుండి తీసివేయాలి.

5) నికరలాభం: వ్యవస్థాపనకు ఉత్పత్తికరమైన సేవలకు మాత్రమే వచ్చే ప్రతిఫలం నికరలాభం.

6) భవిష్యదవకాశాలు: భవిష్యత్తులో పదోన్నతి జరిగి ఎక్కువ సంపాదించుకునే అవకాశమున్న వృత్తులలో ద్రవ్యవేతనం తక్కువగా ఉన్నప్పటికీ, వాస్తవిక వేతనం ఎక్కువగా ఉంటుంది.

7) వృత్తి స్థిరత్వం: ప్రతి శ్రామికుడు ద్రవ్యవేతనం తక్కువగా ఉన్నప్పటికీ శాశ్వతమైన ఉద్యోగం కోరుకుంటాడు. కాని తాత్కాలికమైన ఉద్యోగంలో ద్రవ్యవేతనం ఎక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో నిరుద్యోగిగా ఉండిపోవలసి వస్తుంది. కనుక వాస్తవిక వేతనం తక్కువగా ఉంటుంది.

8) అదనపు రాబడి: అదనపు రాబడి ఆర్జించటానికి అవకాశమున్న వృత్తులలో ద్రవ్యవేతనం తక్కువగా ఉన్నప్పటికీ వారి వాస్తవిక వేతనం ఎక్కువగా ఉంటుంది. ఉదా: అధ్యాపకులు, టైపిస్టులు మొదలైనవారు అదనపు రాబడిని ఆర్జించగలరు.

నికరలాభంలో ఉన్న అంశాలు: స్థూలలాభంలో అంతర్భాగంగా ఉన్న వ్యవస్థాపక సేవలకు వచ్చే ప్రతిఫలాన్ని మాత్రమే నికర లాభం అంటారు.
ఎ) నష్టభయాన్ని భరించడం: వ్యాపారంలో బీమా చేయలేని నష్టభయాలను, అనిశ్చితాలను భరించినందుకు వచ్చే ప్రతిఫలం నికర లాభంలో అంతర్భాగంగా ఉంటుంది.

బి) ఉత్పత్తి కారకాల సమన్వయం: ఉత్పత్తి కారకాలను ఒకచోట చేర్చి అభిలషణీయ అనుపాతంలో కూర్చి, సమన్వయపరిచినందుకు వచ్చే ప్రతిఫలాలు నికరలాభంలో ఇమిడి ఉంటాయి.

సి) మార్కెటింగ్ సేవలు: ఉత్పత్తి కారకాలను కొనుగోలుచేసి తయారైన వస్తువులను విక్రయించటంలో వ్యవస్థాపకుని మార్కెటింగ్ సమర్థతకు ప్రతిఫలం నికరలాభంలో అంతర్భాగం.

డి) నవకల్పనలు ప్రవేశపెట్టడం: నూతన ఉత్పత్తి పద్ధతులు ప్రవేశపెట్టడం, నూతన మార్కెట్లు కనుక్కోవడం, నూతన వస్తువులను తయారుచేయడంలాంటి నవకల్పనలు ప్రవేశపెట్టినందుకు చెల్లించే పారితోషికం నికరలాభంలో అంతర్భాగం.

AP Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతం

ప్రశ్న 5.
వేతనం అంటే ఏమిటి ? వేతన సిద్ధాంతాలను వివరించండి.
జవాబు:
వేతనం – సిద్ధాంతాలు – భావనలు: శ్రామికులు ఉత్పత్తి కార్యక్రమంలో పాల్గొని ప్రతిఫలాన్ని ఆశించి చేసే పనిని శ్రమ అంటారు. ఈ శ్రమ శారీరకమైనదైనా లేదా మానసికమైనదైనా కావచ్చు. అంటే శ్రామికులు ఉత్పత్తికి అందించిన సేవలకు చెల్లించే ధరను వేతనం అంటారు.

ఆర్థికవేత్తలు అనేక వేతనసిద్ధాంతాలను రూపొందించారు.
1) జీవనాధార వేతన సిద్ధాంతం: ఈ సిద్ధాంతాన్ని ఫ్రాన్స్ దేశానికి చెందిన ప్రకృతి ధర్మవాదులు రూపొందించారు. అయితే డేవిడ్ కార్డో ఈ సిద్ధాంతానికి ఒక స్పష్టమైన రూపాన్నిచ్చారు. ఈ సిద్ధాంతం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవించడానికి కొన్ని కనీస అవసరాలుంటాయి. కాబట్టి శ్రామికుని శ్రమని చెల్లించే వేతనం అతని కనీస అవసరాలు తీర్చుకోగలిగిన జీవన వ్యయానికి సరిపోయేటట్లు ఉండాలి. అయితే శ్రామికుని శ్రమకు ప్రతిఫలంగా చెల్లించే వేతనం అతనికి, అతని కుటుంబ పోషణకు సరిపడేటట్లుగా ఉండాలి. దీనినే జీవనాధార వేతన సిద్ధాంతం అంటారు.

2) వేతన నిధి సిద్ధాంతం: J.S. మిల్ తన గ్రంథమైన “The Principles of Political Economy” లో వేతన నిధి సిద్ధాంతాన్ని వివరించారు. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రతి ఉద్యమదారుడు శ్రామికులకు వేతనాలు చెల్లించడానికి తన చర మూలధనంలో కొంత భాగాన్ని కేటాయిస్తాడు. ఉద్యమదారులందరూ ఈ విధంగా కేటాయించిన నిధిని వేతన
నిధి అంటారు.

3) వేతన పరిశిష్ట యోగ్యతా సిద్ధాంతం: వాకర్ అనే అమెరికా అర్థశాస్త్రవేత్త ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారం ఉత్పత్తి ప్రక్రియలో భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన అనే ఉత్పత్తి కారకాలనుపయోగించి చేసిన ఉత్పత్తిని అమ్మగా వచ్చిన రాబడిని భూమికి భాటకం, మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపకునికి లాభం చెల్లించిన తరువాత మిగిలిన భాగాన్ని శ్రమకు వేతనంగా చెల్లించవలసి ఉంటుంది.

4) టాసిగ్ వేతన సిద్ధాంతం: టాసిక్ వేతన సిద్ధాంతం అభివృద్ధిపరచబడిన ఉపాంత ఉత్పాదకత వేతన సిద్ధాంతం, ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభమైన తరువాత అంతిమ వస్తువులు రావడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి శ్రామికులకు ముందుగానే వేతనాలు చెల్లించాలి.

5) ఆధునిక వేతనాల సిద్ధాంతం: ఆధునిక వేతనాల సిద్ధాంతాన్ని ఆల్ఫ్రెడ్ మార్షల్, J.R. హిక్స్లు ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారం శ్రామికుల వేతనరేటు శ్రామిక మార్కెట్లో శ్రామికులకున్న డిమాండ్, సప్లయ్ల సమానత్వం వల్ల నిర్ణయించబడుతుంది. కాబట్టి శ్రామికుల డిమాండ్, సప్లయ్లు ఏ వేతనరేటు వద్ద సమానంగా ఉంటాయో అక్కడ సమతౌల్యం ఏర్పడి వేతనం నిర్ణయించబడుతుంది.

ప్రశ్న 6.
వివిధ లాభ సిద్ధాంతాలను తెల్పండి.
జవాబు:
వ్యవస్థాపకుడు చేసే ఉత్పత్తి నిర్వహణ కృషికి ఇచ్చే ప్రతిఫలమే లాభం.
లాభ సిద్ధాంతాలు:
1) చలన లాభ సిద్ధాంతం: J.R. క్లార్క్ ఈ సిద్ధాంతాన్ని రూపొందించారు. ఈ సిద్ధాంతం ప్రకారం వస్తూత్పత్తి వ్యయం కంటే ధర ఎక్కువగా ఉంటే లాభం వస్తుంది. నిశ్చల ఆర్థిక వ్యవస్థలో పోటీ పరిస్థితుల వల్ల ఉత్పత్తి కారకం తన ఉత్పాదక శక్తికి సమానంగా వేతనం పొందుతుంది. అందువల్ల ఉద్యమదారులు లాభాలు పొందలేరు. కాని వేతనాలు
పొందుతారు.

2) నవకల్పన సిద్ధాంతం: ఈ సిద్ధాంతాన్ని షుంపీటర్ అనే ఆర్థికవేత్త ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారం ఉద్యమదారుని నవకల్పనా నైపుణ్యాలకు పారితోషికంగా లాభం చెల్లించబడుతుంది. ఉద్యమదారుడు ఉత్పత్తి కార్యక్రమంలో ప్రవేశపెట్టే నవకల్పన వల్ల ఉత్పత్తి వ్యయం ధరకంటే తక్కువగా ఉండి లాభం వస్తుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతం

3) హాలే నష్టభయ లాభ సిద్ధాంతం: హాలే ఈ సిద్ధాంతాన్ని రూపొందించారు. ఉత్పత్తి కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యమదారుడు తప్ప మిగిలిన ఏ ఉత్పత్తి కారకం నష్టభయాన్ని భరించడు. అందువల్ల ఇతర ఉత్పత్తి కారకాలకు పంచగా మిగిలిన ఆదాయం ఉద్యమదారునికి చెందుతుంది.

4) అనిశ్చితత్వ లాభ సిద్ధాంతం: నైట్ ఈ సిద్ధాంతాన్ని రూపొందించారు. ఇది మెరుగుపరచబడిన నష్టభయ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొన్నందుకు ఉద్యమదారునికి చెల్లించే ప్రతిఫలమే లాభం.

5) వాకర్ సిద్ధాంతం: వాకర్ తన సిద్దాంతంలో ఉద్యమదారుని, పెట్టుబడిదారుని వేరుచేసి చూపాడు. వాకర్ ప్రకారం ఉద్యమదారుల సామర్థ్యానికి చెల్లించే ప్రతిఫలం లాభం. వాకర్ లాభ సిద్ధాంతం రికార్డో భాటక సిద్ధాంతాన్ని పోలి ఉంది.

ప్రశ్న 7.
వడ్డీ అంటే ఏమిటి ? వడ్డీ సిద్ధాంతాలను వివరించండి.
జవాబు:
అర్థశాస్త్రంలో మూలధనానికి చెల్లించే ధరని వడ్డీ అంటారు. రుణగ్రహీత మూలధన సేవలను ఉపయోగించు కున్నందుకు రుణదాతకు చెల్లించే ధరే వడ్డీ.
ఈ వడ్డీ భావనలు రెండు రకాలు 1. స్థూల వడ్డీ 2. నికర వడ్డీ

1) నిరీక్షణ వడ్డీ సిద్ధాంతం లేదా పరిత్యాగ వడ్డీ సిద్దాంతం ఈ సిద్దాంతాన్ని నాసా సీనియర్ ప్రతిపాదించారు. వ్యక్తులు తమ వినియోగాన్ని పరిత్యజించి, ఆదాయాన్ని పొదుపు చేసి మూలధన నిధులను సమకూర్చుతారు. ఈ విధంగా వ్యక్తులకు తమ ప్రస్తుత వినియోగాన్ని పొదుపు కోసం వాయిదా వేసిన త్యాగానికి ప్రతిఫలంగా కొంత పారితోషికం ఇవ్వాలి. ఈ పారితోషికం లేకపోతే వ్యక్తులు తమ ఆదాయాన్ని పొదుపుచేయరు. అందువల్ల నాసా సీనియర్ వడ్డీని త్యాగానికి ఇచ్చే ప్రతిఫలంగా భావించారు.

2) బోమ్బావర్క్ సిద్ధాంతం: ఆస్ట్రియన్ ఆర్థికవేత్త బోమ్బవర్క్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీన్ని మానసిక వడ్డీ సిద్ధాంతం అని కూడా అంటారు. ప్రజలు తమ ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపుచేస్తే భవిష్యత్ వినియోగం కోసం వర్తమాన వినియోగం వాయిదా వేయాల్సి ఉంటుంది. ప్రజలు భవిష్యత్ వినియోగం కంటే వర్తమాన వినియోగంలో ఎక్కువ సంతృప్తి లభిస్తుంది అని భావిస్తారు. అంటే భవిష్యత్ సంతృప్తి వర్తమానంతో పోల్చితే డిస్కౌంట్ చేయబడుతుంది. అందువల్ల వర్తమాన వినియోగాన్ని వాయిదా వేసి పొదుపు చేసిన మొత్తాన్ని అప్పుగా ఇచ్చేటట్లు ప్రోత్సహించడానికి వడ్డీ చెల్లించాలి.

3) కాలాభిరుచి వడ్డీ సిద్ధాంతం: అమెరికన్ ఆర్థికవేత్త ఇర్వింగ్ ఫిషర్ కాలాభిరుచి వడ్డీ సిద్ధాంతాన్ని రూపొందించారు. ఈయన వడ్డీని నిర్ణయించడంలో కాలాభిరుచిని పరిగణనలోకి తీసుకున్నాడు. దీనిని బట్టి భవిష్యత్లో ఆదాయం నిశ్చితంగా ఉంటుందని భావిస్తే, వర్తమాన కాలాభిరుచి తక్కువగా ఉండి వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్లో ఆదాయం అనిశ్చితంగా ఉంటుందని భావిస్తే వర్తమాన కాలాభిరుచి ఎక్కువగా ఉండి వడ్డీరేటు తక్కువగా ఉంటుంది.

4) కీన్స్ ద్రవ్యత్వాభిరుచి వడ్డీ సిద్ధాంతం: కీన్స్ తన గ్రంథమైన The General Theory of Employment, Interest and Money ద్రవ్యత్వాభిరుచి వడ్డీ సిద్ధాంతాన్ని వివరించారు. ద్రవ్యాన్ని ద్రవ్యరూపంలో తమ వద్ద ఉంచుకోవాలనే ప్రజల కోర్కెను “ద్రవ్యత్వాభిరుచి” అంటారు. ద్రవ్యానికి మాత్రమే అన్నిటికంటే ద్రవ్యత్వం ఎక్కువగా
ఉంటుంది.

ద్రవ్య డిమాండ్: ద్రవ్యత్వాభిరుచినే ద్రవ్యానికి గల డిమాండ్ అంటారు. ద్రవ్యానికి డిమాండ్ కింది అంశాలపై ఆధారపడి ఉంటుంది.

  1. వ్యాపార వ్యవహారాల కోసం
  2. ముందు జాగ్రత్త కోసం
  3. అంచనా వ్యాపారం కోసం
  4. రుణాత్మక నిధుల సిద్ధాంతం

ఈ సిద్ధాంతాన్ని నట్విక్సెల్ అనే ఆర్థికవేత్త ముందుగా ప్రతిపాదించారు. దీనినే నవ్య సాంప్రదాయ సిద్ధాంతం అని కూడా అంటారు. ఈ సిద్ధాంతం ప్రకారం రుణాత్మక నిధుల డిమాండ్, సప్లయ్లు సమతౌల్యం వడ్డీ రేటును నిర్ణయిస్తాయి.

5) ఉపాంత ఉత్పాదకత సిద్ధాంతం ఈ సిద్ధాంతం ప్రకారం వడ్డీరేటు మూలధన ఉపాంత ఉత్పాదకతకు తక్కువ సమానంగా ఉండాలి. మూలధనానికి డిమాండ్ పెరిగే కొద్దీ దాని ఉపాంత ఉత్పాదకత క్షీణిస్తుంది. కాబట్టి తక్కువ వడ్డీరేటు చెల్లించబడుతుంది. కాబట్టి మూలధనానికున్న డిమాండ్, వడ్డీరేటు విలోమ సంబంధం కలిగి ఉంటాయి.

AP Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతం

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పంపిణీ భావనలను వివరించండి.
జవాబు:
అర్థశాస్త్రంలో పంపిణీ భావనను రెండు అర్థాలలో ఉపయోగించడం జరుగుతుంది. అంటే జాతీయాదాయ పంపిణీని రెండు విధాలుగా పరిశీలించవచ్చు.

  1. విధులననుసరించి పంపిణీ.
  2. వైయక్తిక పంపిణీ

1) విధులననుసరించి పంపిణీ: ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్న ఉత్పత్తి కారకాలైన భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనలు సేవలందించినందుకు గాను, అవి ప్రతిఫలాలుగా భాటకం, వేతనం, వడ్డీ, లాభాల రూపంలో పొందుతాయి. ఒక ఉత్పత్తి కారకం ఏవిధంగా ఎంత మొత్తంలో ప్రతిఫలం పొందుతుందో విధులననుసరించి పంపిణీ తెలియజేస్తుంది. కొంతమంది. ఒకటికంటే ఎక్కువ ఉత్పత్తి కారకాలకు యజమానులుగా ప్రతిఫలాలను పొందవచ్చు. ఒక ఉత్పత్తి కారకం ఏవిధంగా ఎంత మొత్తంలో ప్రతిఫలం పొందుతుందో విధులననుసరించి పంపిణీ తెలుపుతుంది. విధులననుసరించి జరిగే పంపిణీని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.

a) సూక్ష్మ పంపిణీ: సూక్ష్మ పంపిణీ ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నందుకు ఒక ఉత్పత్తి కారకం ధర ఏవిధంగా ఎంత నిర్ణయించబడుతుందో వివరిస్తుంది.
ఉదా: శ్రామికుల వేతన రేటు నిర్ణయం.

b) స్థూల పంపిణీ: జాతీయాదాయంలో వివిధ ఉత్పత్తి కారకాల వాటా ఎంత ఉందో పంపిణీ స్థూల వివరిస్తుంది.
ఉదా: మొత్తం జాతీయాదాయంలో వేతనాల వాటా ఎంత ఉంది అనే విషయాన్ని స్థూల పంపిణీ తెలియజేస్తుంది.

2) వైయక్తిక పంపిణీ: దేశంలోని వ్యక్తుల మధ్య జాతీయాదాయాన్ని పంపిణీ చేయడాన్ని వైయక్తిక పంపిణీ అంటారు. ఇక్కడ వ్యక్తులు ఎంత ఆదాయం పొందుతున్నారు అనే విషయాన్ని పరిశీలిస్తారు. అంతేగాని ఏవిధంగా లేదా ఎన్ని విధాలుగా పొందారు అనే విషయ పరిశీలన ప్రధానం కాదు. వైయక్తిక పంపిణీ పరిశీలన ద్వారా ఆదాయ అసమానతలను అందుకు గల కారణాలను తెలుసుకోవచ్చు.

ప్రశ్న 2.
ఉత్పత్తి కారకాల ధరను నిర్ణయించే అంశాలను పేర్కొనండి. [Mar 16]
జవాబు:
ఉత్పత్తి కారకాల ధరలను వాటి డిమాండ్, సప్లయ్ లు కలసి నిర్ణయిస్తాయి. ఉత్పత్తి కారకాల డిమాండ్ను నిర్ణయించే అంశాలు:

  1. ఉత్పత్తి కారకాల డిమాండ్ ఉత్పన్న డిమాండ్ లేదా పరోక్ష డిమాండ్ అంటే ఉత్పత్తి కారకం డిమాండ్ అది ఉత్పత్తి చేసే వస్తువు డిమాండ్పై ఆధారపడి ఉంటుంది.
  2. ఒక ఉత్పత్తి కారకం డిమాండ్ దాని ధరపై ఆధారపడి ఉంటుంది.
  3. ఒక ఉత్పత్తి కారకం డిమాండ్ ఉత్పత్తి తనకు సహకరించే ఇతర ఉత్పత్తి కారకాల ధరలపై ఆధారపడి ఉంటుంది.
  4. సాంకేతిక విజ్ఞానం ఉత్పత్తి కారకాల డిమాండ్ను నిర్ణయిస్తుంది.
    ఉదా: కంప్యూటరీకరణ వల్ల శ్రామికుల డిమాండ్ గణనీయంగా తగ్గింది.
  5. తరహాననుసరించి ప్రతిఫలాలు ఉత్పత్తి కారకం డిమాండ్ను నిర్ణయిస్తాయి. ఉత్పత్తిలో పెరుగుతున్న ప్రతిఫలాలు వస్తుంటే ఉత్పత్తి కారకాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
  6. ఉత్పత్తి కారకాల సప్లయ్ని నిర్ణయించే అంశాలు.
    ఉదా: శ్రామికుల సప్లయ్

AP Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతం

ప్రశ్న 3.
కొరత భాటకం అనే భావనను వివరించండి.
జవాబు:
కొరత భాటకం: కొరత భాటకం అనే భావనను మార్షల్ భూమి, సప్లయ్, డిమాండ్ ప్రాతిపదికగా వివరించాడు. భూమి, సప్లయ్ స్థిరంగా ఉంటుంది. కాని డిమాండ్ పెరుగుతుంది. అటువంటప్పుడు భూమి కొరత వల్ల దానికి మామూలు ధర కంటే ఎక్కువ ధరను ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా కొరత వల్ల భూమికి వచ్చే అధిక లేక అదనపు ధరను కొరత భాటకం అంటారు. భూమి, సప్లయ్ అవ్యాకోచంగా ఉండటం వల్ల ఈ కొరత భాటకం ఏర్పడుతుంది. ఇది డిమాండ్ పెరుగుతూ ఉంటే భాటకం పెరుగుతూ ఉంటుంది.

పై రేఖాపటంలో SL రేఖ భూమి అవ్యాకోచ సప్లయ్న సూచించును. DD రేఖ డిమాండ్ రేఖను, SL రేఖ E బిందువు వద్ద ఖండించుకున్నప్పుడు ధర ‘OR’ గా ఉంది. డిమాండ్ పెరగడం వల్ల నూతన డిమాండ్ రేఖ D D సప్లయ్ రేఖ SL ను E బిందువు వద్ద ఖండిస్తుంది. ఇక్కడ భూమి యొక్క ధర OR, గా ఉంది. ఈ విధంగా డిమాండ్ పెరిగే కొద్ది భూమి ధర OR నుంచి OR, కు, OR, నుంచి OR కు పెరిగింది.

ప్రశ్న 4.
కృత్రిమ భాటకం అనే భావనను వివరించండి.
జవాబు:
కృత్రిమ భాటకం అనే భావనను మార్షల్ ప్రవేశపెట్టాడు. స్వల్ప కాలంలో మానవ నిర్మితాలైన యంత్ర సామాగ్రి, భవనాలకు సప్లయ్ అవ్యాకోచంగా ఉంటుంది. వీటికి డిమాండ్ పెరిగితే ధర సగటు వ్యయం కంటే ఎక్కువగా ఉంటుంది. ఆ అదనపు ధర లేదా వాటి నుండి వచ్చిన అదనపు రాబడినే కృత్రిమ భాటకమని మార్షల్ పేర్కొన్నాడు. స్వల్ప కాలంలో కొన్ని వస్తువులకు డిమాండ్ పెరిగినప్పటికి సప్లయ్ పెంచడానికి అవకాశం ఉండదు. కనుక ఆ వస్తువులకు కృత్రిమ భాటకం ఏర్పడుతుంది. సగటు చర వ్యయం కంటే అధికంగా వచ్చే ధర లేదా అదనపు రాబడినే కృత్రిమ భాటకం అంటారు. దీర్ఘకాల వ్యవధిలో వీటి డిమాండు అనుగుణంగా సప్లయ్న మార్చడానికి వీలుంటుంది. కనుక దీర్ఘ కాలంలో ఈ భాటకం ఉండదు.
AP Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతం 4

పై రేఖాపటంలో ‘X’ అక్షంపై డిమాండ్, సప్లయ్లాను, OY అక్షంపై భాటకాన్ని తీసుకున్నాం. SPS స్వల్పకాలిక సప్లయ్ అవ్యాకోచరేఖ. LPS దీర్ఘకాలిక సప్లయ్ వ్యాకోచరేఖ. స్వల్పకాలంలో RR, మిగులు లేదా భాటకం లభ్యమవుతుంది. కాని దీర్ఘకాలంలో భాటకం అదృశ్యమవుతుంది.

స్థూలవడ్డీ, నికర వడ్డీ ఖాతలను వివిరిస్తూ, స్థూల వడ్డీలోని అంతర్భాగాలను పేర్కొనుము. అర్థశాస్త్రంలో మూలధనానికి చెల్లించే ధరే వడ్డీ అని పిలుస్తారు.
వడ్డీ భావనలు రెండు రకాలు:

  1. స్థూలవడ్డీ
  2. నికరవడ్డీ

1) స్థూలవడ్డీ: రుణం తీసుకొన్న వ్యక్తి తాను తీసుకొన్న మొత్తంతో పాటు ఎంత అదనంగా రుణదాతకు స్తున్నాడో ఆ మొత్తాన్ని స్థూలవడ్డీ అంటారు. స్థూలవడ్డీలో అనేక అంశాలు కలిసి ఉంటాయి.

2) నికరవడ్డీ: నికరవడ్డీ అంటే కేవలం మూలధన సేవలకు మాత్రమే ఇచ్చే ప్రతిఫలం. ఆర్థిక పరిభాషలో వడ్డీ వాస్తవికమైంది. ఉదా: ప్రభుత్వ బాండ్లు, ప్రభుత్వ రుణాల మీద చెల్లించే వడ్డీ.

స్థూలవడ్డీలోని అంతర్భాగాలు:
1) నష్టభయానికి చెల్లించే మూల్యం: రుణదాత రుణమివ్వటంలో రెండు రకాలైన నష్టభయాలను ఎదుర్కోవాలి. వ్యక్తిగత నష్టభయం, వ్యాపారరీత్యా నష్టభయం రుణం తీసుకొన్న వ్యక్తి సకాలంలో తిరిగి చెల్లించకపోవచ్చు. ఈ భయాలను తొలగించుకోవడానికి కొంత అదనంగా వడ్డీ రూపంలో వసూలు చేస్తాడు.

2) అసౌకర్యానికి చెల్లింపు: అప్పు ఇచ్చే వ్యక్తి ఆ డబ్బును తాత్కాలికంగా వదులుకోవడం వల్ల కొంత అసౌకర్యానికి అవుతాడు. రుణదాత తాను ఇచ్చిన రుణాన్ని సకాలంలో పొందలేకపోవచ్చు. ఇచ్చిన రుణం తిరిగి పొందేలోపు అవసరాలను వాయిదా వేసుకోవాలి. రుణమిచ్చిన కారణంగా ద్రవ్యం తన చేతిలో లేనందువల్ల ధరలు తగ్గి ద్రవ్యం గోలు శక్తి పెరగడం లాంటి అవకాశాలు వస్తే వదులుకోవాలి. రుణదాత ఈ అసౌకర్యాలను భరించినందుకు …గ్రస్తుని నుంచి కొంత అదనంగా వడ్డీ రూపంలో తీసుకుంటాడు.

3) నిర్వహణావ్యయం: రుణదాత తన విధులు నిర్వహించడానికి కొంత ఖర్చు చేయాలి. రుణగ్రస్తుల ఖాతాలు చాలి. అందుకుగాను సిబ్బంది జీతాలను, అకౌంటు పుస్తకాల ఖర్చులను భరించాలి. అప్పు ఇచ్చేందుకు వీలుగా ఒకప్సు పొందాలి. కొన్నిసార్లు రుణాలను వసూలు చేసుకునేందుకుగాను సిబ్బందిని నియమించుకోవాల్సి రావడంతోపాటు సుస్థానాలకు కూడా వెళ్ళాల్సివస్తుంది. ఈ నిర్వహణా ఖర్చులను భరించినందుకుగాను అదనంగా కొంత మొత్తాన్ని రూపంలో తీసుకుంటాడు.
స్థూలవడ్డీ = నికరవడ్డీ + (నష్టభయానికి మూల్యం + అసౌకర్యానికి చెల్లింపు + నిర్వహణావ్యయం)

AP Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతం

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఒప్పంద భాటకం [Mar. ’16, ’15]
జవాబు:
ఒప్పంద భాటకం అంటే నిర్ణీతకాలానికి భూమి సేవలకు, గృహాలకు ముందుగా నిర్ణయించిన ఒప్పందం ప్రకారం చే ప్రతిఫలం.

ప్రశ్న 2.
ఆర్థిక భాటకం
జవాబు:
ఆర్థిక భాటకం కేవలం భూమికే పరిమితం కాకుండా మిగతా మూడు ఉత్పత్తి కారకాలైన శ్రమ, మూలధనం, వ్యవస్థాపనకు వర్తిస్తుంది. ఇది మూడు రకాలు

  1. కొరత భాటకం
  2. కృత్రిమ భాటకం
  3. బదిలీ సంపాదన

ప్రశ్న 3.
కొరత భాటకం [Mar. ’17]
జవాబు:
కొరత భాటం అనే భావనను అభివృద్ధి చేసింది మార్షల్. కొరత భాటకం అంటే అవ్యాకోచ సప్లయ్ ఉన్న భూమికి చెల్లించే ధర.

ప్రశ్న 4.
కృత్రిమ భాటకం
జవాబు:
కృత్రిమ భాటకం అను భావనను ప్రవేశపెట్టింది మార్షల్. కృత్రిమ భాటకం అంటే మానవ నిర్మిత యంత్రాలు, యంత్ర పరికరాలు అతి స్వల్ప కాలంలో ఆర్జించే మిగులు ధర.

ప్రశ్న 5.
బదిలీ సంపాదన
జవాబు:
ఒక ఉత్పత్తి కారకం తన అత్యుత్తమ ప్రత్యామ్నాయ ఉపయోగంలో ఆర్జించే మిగులు.

ప్రశ్న 6.
ద్రవ్య వేతనం
జవాబు:
ద్రవ్య వేతనం అంటే శ్రామికుని శ్రమకు నగదు రూపంలో చెల్లించే ధర లేదా ప్రతిఫలం.

AP Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతం

ప్రశ్న 7.
వాస్తవిక వేతనం [Mar, ’16]
జవాబు:
వాస్తవిక వేతనాన్ని అభివృద్ధి పరిచినది ఆడమస్మిత్. వాస్తవిక వేతనం అంటే శ్రామికుడి శ్రమకు ప్రతిఫలంగా పొందిన ద్రవ్యవేతనం కొనుగోలుశక్తి.

ప్రశ్న 8.
కాలాన్ని బట్టి వేతనం
జవాబు:
కాలాన్ని బట్టి వేతనం అంటే శ్రామికుల ఉత్పాదకతతో సంబంధం లేకుండా నిర్ణీత కాలానికి ఒక వృత్తిలో | పనిచేసే వారందరికి ఒకే వేతనం చెల్లించడం.

ప్రశ్న 9.
పనిని బట్టి వేతనం
జవాబు:
శ్రామికుల ఉత్పాదకత, నైపుణ్యం బట్టి చెల్లించే వేతనంను పనిని బట్టి వేతనం అంటారు.

ప్రశ్న 10.
స్థూల వడ్డీ
జవాబు:
రుణం తీసుకున్న వ్యక్తి తాను తీసుకొన్న మొత్తంతో పాటు అదనంగా ఋణదాతకు ఎంత చెల్లిస్తున్నాడో, మొత్తాన్ని స్థూల వడ్డీ అంటారు.

ప్రశ్న 11.
నికర వడ్డీ
జవాబు:
మూలధన సేవలకు మాత్రమే ఇచ్చే ప్రతిఫలం.
ఉదా: ప్రభుత్వ బాండ్లు, ప్రభుత్వ ఋణాలపై వడ్డీ.

ప్రశ్న 12.
స్థూల లాభం [Mar. ’15]
జవాబు:
రాబడి నుండి ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలు, తరుగుదల తీసివేయగా మిగిలినది స్థూల లాభం.
స్థూల లాభం = నికర లాభం + అప్రకటిత భాటకం + అప్రకటిత వేతనం+ అప్రకటిత వడ్డీ + తరుగుదల + భీమా చెల్లింపులు.

AP Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతం

ప్రశ్న 13.
నికర లాభం [Mar. ’17]
జవాబు:
వ్యవస్థాపకుని సేవలకు మాత్రమే వచ్చే ప్రతిఫలం నికర లాభం.
నికర లాభం = స్థూల లాభం – అప్రకటిత భాటకం + అప్రకటిత వేతనం + అప్రకటిత వడ్డీ + తరుగుదల + భీమా చెల్లింపులు.

AP Inter 1st Year Economics Study Material Chapter 5 విలువ సిద్ధాంతం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Economics Study Material 5th Lesson విలువ సిద్ధాంతం Textbook Questions and Answers.

AP Inter 1st Year Economics Study Material 5th Lesson విలువ సిద్ధాంతం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మార్కెట్ వర్గీకరణను తెలపండి. [Mar. ’17, ’16, ’15]
జవాబు:
వాడుక భాషలో మార్కెట్ అంటే వస్తువుల అమ్మకాలు, కొనుగోళ్ళు జరిపే ఒక ప్రత్యేక స్థలం. మూడు అంశాల |ఆధారంగా మార్కెట్ వర్గీకరణ జరుగుతుంది.

  1. కాలానుసారం మార్కెట్లు లేదా కాలవ్యవధి మార్కెట్లు
  2. స్థలానుసారం మార్కెట్లు
  3. పోటీ ఆధార మార్కెట్లు

దీనిని ఈ క్రింది పట్టిక ద్వారా చూపించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 5 విలువ సిద్ధాంతం 1

I. కాలానుసారం మార్కెట్లు: కాలవ్యవధి ఆధారంగా మార్కెట్లు మూడు రకాలుగా విభజించవచ్చు.
1. అతిస్వల్పకాలం: ఉత్పత్తిదారుడు అతిస్వల్పకాలంలో ఉత్పత్తిలో ఎలాంటి మార్పుచేయలేడు. సప్లయ్ మార్పులు తేవడానికి ఉత్పాదకాలను మార్చవలసి ఉంటుంది. ఉత్పాదకాలను అతిస్వల్పకాలంలో మార్చడం సాధ్యం కాదు. అందువల్ల సప్లయ్ స్థిరంగా ఉంటుంది.
ఉదా: నశ్వర వస్తువులయిన పూలు, పాలు మొదలగునవి.

AP Inter 1st Year Economics Study Material Chapter 5 విలువ సిద్ధాంతం

2. స్వల్పకాలం: స్వల్ప కాలంలో సప్లయ్న కొంతమేరకు మార్చవచ్చు. కొన్ని ఉత్పాదకాలను మార్చడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. చర ఉత్పాదకాలను మార్చడం వల్ల ఇది సాధ్యం.

3. దీర్ఘకాలం: మార్కెట్లో వస్తువులుండే డిమాండ్ను బట్టి ఉత్పత్తిదారుడు దీర్ఘకాలంలో అన్ని ఉత్పాదకాల్లో మార్పులు చేస్తాడు. దీర్ఘకాలంలో సప్లయ్లో కావలసిన మార్పులు చేయవచ్చు.

II. స్థలానుసారం మార్కెట్లు: స్థలాన్ని బట్టి స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లుగా వర్గీకరించబడ్డాయి.
1. స్థానిక మార్కెట్: ఒక వస్తువు అమ్మకాలు అది ఉత్పత్తి అయిన ప్రాంతంలోనే జరిగితే దానిని స్థానిక మార్కెట్ అంటారు. ఉదా: కూరగాయలు, పండ్లు మొదలగునవి.

2. జాతీయ మార్కెట్లు: ఒక వస్తువుకు దేశంలోని వివిధ ప్రాంతాలలో డిమాండ్ సప్లయి ఉన్నట్లయితే వస్తువుకు జాతీయ మార్కెట్ ఉన్నట్లుగా చెప్పవచ్చు.
ఉదా: గోధుమ, పంచదార, పత్తి మొదలగునవి.

3. అంతర్జాతీయ మార్కెట్లు: ఒక వస్తువును దేశాల్లో అమ్మకాలు, కొనుగోళ్ళు జరిపినట్లయితే ఆ వస్తువుకు అంతర్జాతీయ మార్కెట్ ఉంటుంది.
ఉదా: బంగారం, వెండి, పెట్రోలు మొదలగునవి.

III. పోటీని బట్టి మార్కెట్లు: పోటీని బట్టి మార్కెట్లు రెండు రకాలు 1. సంపూర్ణ పోటీ మార్కెట్, 2. అసంపూర్ణ పోటీ మార్కెట్.
1. సంపూర్ణ పోటీ మార్కెట్ అధిక సంఖ్యలో కొనుగోలుదార్లు, అమ్మకందార్లు ఉండేదే సంపూర్ణ పోటీ మార్కెట్. కృత్రిమ అడ్డంకులు లేకుండా అందరు సజాతీయ వస్తువునే కొనడం, అమ్మడం జరుగుతుంది.

2. అసంపూర్ణ పోటీ మార్కెట్ కొనుగోలుదార్ల మధ్యకాని, అమ్మకందార్ల మధ్యకాని సంపూర్ణ పోటీ లేనటువంటి దానిని అసంపూర్ణ పోటీ మార్కెట్ అంటారు. అందువల్ల వస్తువుకు వేరువేరు ధరలు ఉంటాయి. ఈ అసంపూర్ణ పోటీ మార్కెట్లు నాలుగు రకాలు.

  1. ఏకస్వామ్యం
  2. ద్విస్వామ్యం
  3. పరిమితస్వామ్యం
  4. ఏకస్వామ్య పోటీ మార్కెట్

ప్రశ్న 2.
సంపూర్ణ పోటీని వివరించండి.
జవాబు:
అత్యధిక సంఖ్యలో ఉత్పత్తిదార్లు, వినియోగదార్లుండే మార్కెట్ను సంపూర్ణ పోటీ మార్కెట్ అంటారు. మార్కెట్ | అంతట ఒకే ధర ఉంటుంది.
1. అధిక సంఖ్యలో కొనుగోలుదార్లు, అమ్మకందార్లు ఈ మార్కెట్లో అధిక సంఖ్యలో కొనుగోలుదార్లు, అమ్మకందార్లు ఉంటారు. ఏ ఒక్క అమ్మకందారుడు కాని, కొనుగోలుదారుడు కాని మార్కెట్ ధరను ప్రభావితం చేయలేడు. ఒక వస్తువు ధర దానికుండే డిమాండ్, సప్లయ్లు నిర్ణయిస్తాయి. ఈ ధరను కొనుగోలుదారుడు, అమ్మకందారుడు అంగీకరించాలి. సంస్థ మార్కెట్ ధరను అనుసరించాలి.

2. సజాతీయ వస్తువులు: ఈ మార్కెట్లో వస్తువులన్నీ సజాతీయంగా ఉంటాయి. ఈ వస్తువులకుండే జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం సంపూర్ణం. అందువల్ల మార్కెట్ అంతటా ఒకే ధర ఉంటుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 5 విలువ సిద్ధాంతం

3. ప్రవేశించడానికి, నిష్క్రమించడానికి స్వేచ్ఛ: ఈ మార్కెట్లో నూతన పరిశ్రమలు ప్రవేశించడానికి, నిష్క్రమించడానికి స్వేచ్ఛ ఉంటుంది. సంస్థ గరిష్ట లాభాలు పొందుతున్నప్పుడు నూతన సంస్థలు ప్రవేశించుటకు, నష్టాలు వచ్చేటప్పుడు నిష్క్రమించుటకు స్వేచ్ఛ కలదు.

4. సంస్థ, పరిశ్రమ వేరువేరు: ఈ మార్కెట్లో సంస్థ, పరిశ్రమ వేరువేరుగా ఉంటాయి. సంస్థ అంటే వస్తువులను ఉత్పత్తి చేసే యూనిట్. పరిశ్రమ అనగా సంస్థల సముదాయం.

5. రవాణా ఖర్చులు ఉండవు: రవాణా ఖర్చు ఉండనందువల్ల మార్కెట్ అంతటా వస్తువుకు ఒకే ధర ఉంటుంది.

6. ఉత్పత్తి కారకాలకు, వస్తువులకు సంపూర్ణ గమనశీలత: ఈ మార్కెట్లో ఉత్పత్తి కారకాలు ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు వెళ్ళవచ్చు. అదే విధంగా వస్తు మార్కెట్లో పూర్తి గమనశీలత ఉంటుంది.

7. మార్కెట్ సంపూర్ణ పరిజ్ఞానం: ఈ మార్కెట్లో మార్కెట్ను గురించి సంపూర్ణ పరిజ్ఞానం కొనుగోలుదార్లకు, అమ్మకందార్లకు ఉంటుంది. ప్రతి కొనుగోలుదారుకు, అమ్మకందారుకు ధర తెలుస్తుంది.

ధర నిర్ణయం: మార్కెట్లో సప్లయ్, డిమాండ్ ను బట్టి వస్తువు ధరను నిర్ణయిస్తారు. మార్కెట్లోనికి అమ్మకానికి వచ్చే వస్తువులకు, కొనుగోలుదార్లు డిమాండ్ చేసే వస్తువులకు మధ్య సమతౌల్యాన్ని తెస్తుంది. సప్లయ్, డిమాండ్ సమానంగా ఉన్నచోట మార్కెట్ సమతౌల్యధరను నిర్ణయిస్తుంది. మార్కెట్ నిర్ణయించిన ధరను ఉత్పత్తిదారులు అనుసరిస్తారు.
AP Inter 1st Year Economics Study Material Chapter 5 విలువ సిద్ధాంతం 2

పై పట్టికలో ధరలో మార్పులు జరిగినప్పుడు వస్తువు సప్లయ్, డిమాండ్లో కూడా మార్పులు జరిగాయి. వస్తువు ధర పెరిగినప్పుడు డిమాండ్ పరిమాణం తగ్గింది. అంటే ధరకు, డిమాండ్కు విలోమ సంబంధం ఉంది. అయితే ధర పెరిగితే సప్లయ్ పరిమాణం పెరిగింది. అనగా సపయ్కి, ధరకు ప్రత్యక్ష సంబంధం ఉంది. 3/- వద్ద సప్లయ్ డిమాండ్ సమానం అయినాయి. దీనిని సమతౌల్య ధర అంటారు. దీనిని ఈ క్రింది రేఖాపటం ద్వారా తెలియజేయవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 5 విలువ సిద్ధాంతం 3

పై రేఖాపటంలో DD డిమాండ్ రేఖ, SS సప్లయేఖలు. ఈ రెండు ‘e’ బిందువు ఖండించుకున్నప్పుడు ధర OP గా, సప్లయ్, డిమాండ్ 0Q గా ఉన్నాయి. అందువల్ల OP సమతౌల్యపు ధర.

ప్రశ్న 3.
ఏకస్వామ్య పోటీలో ధర నిర్ణయాన్ని వివరించండి.
జవాబు:
ఈ. హెచ్. బాంబర్లిన్, జోన్ రాబిన్సన్ ఈ రకమైన మార్కెట్ విశ్లేషణను ప్రతిపాదించారు. ఈ మార్కెట్లో ఒక వస్తువుకు అనేకమంది అమ్మకందార్లు ఉంటారు. కాని కొన్ని అంశాలలో వస్తువుల మధ్య స్వల్పమైన తేడాలుంటాయి. ఏకస్వామ్యం, పరిపూర్ణ పోటీ లక్షణాలు ఈ మార్కెట్లో కలిసి ఉంటాయి. అందువల్ల దీనిని ఏకస్వామ్య పోటీ అంటారు.

లక్షణాలు:
1. తక్కువ సంఖ్యలో సంస్థలు: సంపూర్ణ పోటీలోని సంస్థల కంటే ఏకస్వామ్య పోటీలో సంస్థల సంఖ్య తక్కువ. సంస్థకు కొంత మేరకు ఏకస్వామ్య అధికారం ఉంటుంది.

2. వస్తు వైవిధ్యం: ఈ సంస్థ ఉత్పత్తి చేసిన వస్తువు ఇతర సంస్థల వస్తువులతో పోల్చినప్పుడు కొన్ని తేడాలుంటాయి. కొన్నిసార్లు ఈ తేడాలు అతిస్వల్పమైనవి అయినప్పటికి వినియోగదారులు వాటి మధ్య తేడా ఉన్నట్లుగా భావిస్తారు. ఈ తేడా రంగు, బ్రాండ్ నేమ్, ట్రేడ్మార్క్ వల్ల ఏర్పడవచ్చు. ఈ కారణం వల్ల ప్రతి వస్తువు మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు కలిగి ఉంటుంది.

3. ప్రవేశం, నిష్క్రమణ: ప్రతి సంస్థ తన వస్తు ఉత్పత్తిలో ఏకస్వామ్య అధికారాన్ని కలిగి ఉంటుంది. లాభాలు వచ్చినప్పుడు సంస్థలోకి ప్రవేశించుటకు, నష్టాలు వచ్చినప్పుడు సంస్థ నుండి నిష్క్రమించుటకు స్వేచ్ఛ కలదు.

AP Inter 1st Year Economics Study Material Chapter 5 విలువ సిద్ధాంతం

4. అమ్మకం వ్యయాలు: ఏకస్వామ్య పోటీ మార్కెట్లో వస్తు భిన్నత్వం ఉంటుంది. అందువల్ల ధర ప్రాతిపదికగానే పోటీ ఉండదు. ప్రతి సంస్థ తమ వస్తువుల అమ్మకాలను ప్రకటనల ద్వారా, సేల్స్మెన్ నియామకం వంటి చర్యల ద్వారా పెంచుకొనడానికి ప్రయత్నిస్తుంది. వీటికి అయ్యే ఖర్చులను అమ్మకం వ్యయాలు అంటారు.

5. సంస్థ పరిశ్రమ: ఏకస్వామ్య పోటీలో సంస్థ వేరు, పరిశ్రమ వేరు. పరిశ్రమ అనగా కొన్ని సంస్థల సముదాయం.

6. అధిక డిమాండ్ వ్యాకోచత్వం: ఏకస్వామ్య పోటీలోని సంస్థకుండే డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి కిందకు వాలుతుంది. ఈ డిమాండ్ రేఖ అధిక వ్యాకోచత్వాన్ని కలిగి ఉంటుంది.

ధర నిర్ణయం: ఏకస్వామ్య పోటీలో ధర నిర్ణయం స్వల్పకాలంలోను, దీర్ఘకాలంలోను జరుగుతుంది. ఈ మార్కెట్లో స్వల్పకాలంలో సంస్థకు లాభాలు రావచ్చు, నష్టాలు రావచ్చు. కాని దీర్ఘకాలంలో సామాన్య లాభాలు మాత్రమే వస్తాయి. స్వల్పకాలంలో ఏకస్వామ్య పోటీలో ధర నిర్ణయం ఏకస్వామ్యంలో మాదిరిగా జరుగును. ‘ఏకస్వామ్యదారుడు వస్తు సప్లయ్ పై పూర్తి నియంత్రణ కలిగి ఉంటాడు. అంతేకాకుండా గరిష్ట లాభం వచ్చే విధంగా ధరను నిర్ణయించగలడు. దీనిని ఈ క్రింది రేఖాపటం ద్వారా వివరించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 5 విలువ సిద్ధాంతం 4

పై రేఖాపటంలో ‘X’ అక్షంపై వస్తురాశిని, Y అక్షంపై ధరను చూపాము. AR సగటు రాబడి రేఖ, MR ఉపాంత రాబడిరేఖ. AC సగటు వ్యయరేఖ, MC ఉపాంత వ్యయరేఖ. MR రేఖ MC ని ‘E’ బిందువువద్ద ఖండించడం వల్ల, MC = MR అవుతుంది. కనుక OM ఉత్పత్తి వద్ద సంస్థ సమతౌల్యంలో ఉంది. E నుండి గీయబడిన లంబరేఖ ‘X’ అక్షంపైన వస్తురాశిని, AR రేఖపై వస్తువు ధరను తెలియజేయును. AR, ACల మధ్య తేడా సంస్థ లాభనష్టాలను సూచించును. AC కంటే AR ఎక్కువగా ఉంటే అసాధారణ లాభాలు వచ్చును. పై రేఖాపటంలో OM వస్తురాశిని ఉత్పత్తి చేయడానికి అయ్యే వ్యయం OSRM వచ్చే ఆదాయం OPQM.
మొత్తం లాభం = మొత్తం రాబడి – మొత్తం వ్యయం
= OPQM – OSRM
= PQRS

PQRS పై రేఖాపటంలో సంస్థ ఆర్జించే లాభాలు.

ప్రశ్న 4.
ఏకస్వామ్య మార్కెట్ను నిర్వచించి, ఏకస్వామ్యంలో ఉత్పత్తిదారుడు ధరను ఏ విధంగా నిర్ణయిస్తాడు ?
జవాబు:
అసంపూర్ణ పోటీ మార్కెట్లో ఏకస్వామ్యం ఒకటి. దీనినే గుత్తాధిపత్యం అంటారు. ఒక వస్తువుకు ఒకే అమ్మకందారుడుండి, ఆ వస్తువుకు సన్నిహిత ప్రత్యామ్నాయాలు లేని మార్కెట్ను ఏకస్వామ్య మార్కెట్ అంటారు. కనుక ఏకస్వామ్యదారుడు వస్తువు సప్లెని, వస్తువు ధరను నియంత్రించగలడు. కాని రెండింటినీ ఒకే సమయంలో నియంత్రించలేడు. ఉత్పత్తిని నియంత్రిస్తే మార్కెట్ ధరను స్వీకరిస్తాడు. మార్కెట్ ధరను నిర్ణయిస్తే ఉత్పత్తిని మార్కెట్కు వదిలివేస్తాడు.

లక్షణాలు:

  1. మార్కెట్లో ఒక సంస్థ మాత్రమే వస్తూత్పత్తిని చేస్తుంది.
  2. ఈ మార్కెట్లో వస్తువులకు సమీప ప్రత్యామ్నాయాలుండవు.
  3. ఈ మార్కెట్లో సంస్థ, పరిశ్రమ ఒక్కటే.
  4. మార్కెట్లోనికి నూతన సంస్థలు ప్రవేశించడానికి వీలులేని నిబంధనలుంటాయి.
  5. ఏకస్వామ్యదారుడే వస్తుధరను, వస్తు సప్లయ్న నియంత్రిస్తాడు.

AP Inter 1st Year Economics Study Material Chapter 5 విలువ సిద్ధాంతం

ధర నిర్ణయం: గరిష్ట లాభాలను ఆర్జించటం ఏకస్వామ్య సంస్థ ధ్యేయం. ఏకస్వామ్యంలో ఉత్పత్తిదారుడు వస్తూత్పత్తిని తగ్గిస్తూ ధరను పెంచగలడు. వస్తూత్పత్తిని పెంచుతూ ధరను తగ్గించగలడు. ఈ విధమైన ధర నిర్ణయం వల్ల ఏకస్వామ్యదారుడు గరిష్ట లాభాలను ఆర్జిస్తాడు. ఏకస్వామ్యంలో కూడా ఉపాంత వ్యయం, ఉపాంత రాబడికి సమానమైన పరిస్థితిలో ఏకస్వామ్య సంస్థ సమతౌల్యంలో ఉంటుంది. ఏకస్వామ్యంలో ధర నిర్ణయాలు క్రింది రేఖాపటం ద్వారా తెలుసుకోవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 5 విలువ సిద్ధాంతం 5

పై రేఖాపటంలో ‘X’ అక్షంపై ఉత్పత్తి పరిమాణంను, Y అక్షంపై వ్యయం రాబడిని చూపాము. AR సగటు రాబడి రేఖ, MR ఉపాంత రాబడిరేఖ, AC సగటు వ్యయరేఖ, MC ఉపాంత వ్యయరేఖ. MR రేఖ MC ని ‘E’ బిందువు వద్ద ఖండించడం వల్ల, MC = MR అవుతుంది. కనుక OM ఉత్పత్తి వద్ద సంస్థ సమతౌల్యంలో ఉంది. E నుండి గీయబడిన రేఖ ‘X’ అక్షంపైన ఉత్పత్తి పరిమాణంను, AR రేఖపై వస్తువు ధరను తెలియజేయును. AR, ACల మధ్య తేడా సంస్థ లాభనష్టాలను సూచించును. AC కంటే AR ఎక్కువగా ఉంటే అసాధారణ లాభాలు వచ్చును. పై రేఖాపటంలో OM వస్తురాశిని ఉత్పత్తి చేయడానికి అయ్యే వ్యయం OCBM వచ్చే ఆదాయం OPAM.
మొత్తం లాభం = మొత్తం రాబడి – మొత్తం వ్యయం
= OCBM – OPAM
= CPAB
CPAB పై రేఖాపటంలో సంస్థ ఆర్జించే లాభాలు.

ప్రశ్న 5.
సంపూర్ణ పోటీలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక సమతుల్య స్థితిని పటం సహాయంతో వివరించండి.
జవాబు:
సంస్థ సమతౌల్యం: సంపూర్ణ పోటీలో వస్తువు ధరను మార్కెట్ను నిర్ణయిస్తుంది. ఉత్పత్తిదారుడు ఈ ధరను స్వీకరించి తన ఉత్పత్తిని నిర్ణయించుకుంటాడు. ఒక సంస్థ అధిక లాభాలను పొందాలనుకుంటుంది. కాబట్టి ఎక్కువ లాభాలనిచ్చే ఉత్పత్తిని ఎంపిక చేస్తుంది. అధిక లాభాలనిచ్చే ఉత్పత్తిని చేసినప్పుడు సంస్థ సమతౌల్య స్థితిలో ఉంటుంది. సమతౌల్య ఉత్పత్తి చేసే సంస్థ తన ఉత్పత్తిని మార్చుకోవడానికి ఇష్టపడడు. ఈ స్థితి నుంచి ఉత్పత్తిని పెంచుకోవడానికి, తగ్గించడానికి ఇష్టపడదు. సంస్థ సమతౌల్య స్థితిని రెండు కాలాల్లో వివరిస్తారు.

అవి

  1. స్వల్పకాలం,
  2. దీర్ఘకాలం

స్వల్పకాల సమతౌల్యం: స్వల్పకాలంలో సంస్థ స్థిర ఉత్పత్తి కారకాలు అంటే యంత్రాలు, భవనాలు మొదలగునవి మార్చలేదు. చరకారకాలు మాత్రమే మార్చి ఉత్పత్తిని పెంచుకుంటుంది. స్వల్పకాలంలో ఉపాంత వ్యయం, ఉపాంత రాబడికి సమానమైనప్పుడు స్వల్పకాలిక సమతౌల్య ఉత్పత్తి జరుగుతుంది. స్వల్పకాలంలో సంస్థ గరిష్ట లాభాన్ని లేదా సాధారణ లాభాన్ని లేదా నష్టాన్ని పొందుతుంది. దీనిని ఈ క్రింది రేఖా పటాల ద్వారా తెలియజేయవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 5 విలువ సిద్ధాంతం 6

A రేఖాపటంలో ‘OX’ అక్షంమీద ఉత్పత్తి పరిమాణంను, ‘OY’ అక్షం మీద ధరను చూపినాము.

B రేఖాపటంలో OX అక్షంపై ఉత్పత్తి పరిమాణాన్ని, OY పై వ్యయం, రాబడిని కొలుస్తాం. A రేఖాపటంలో ‘E’ బిందువు వద్ద డిమాండ్, సప్లయ్ సమానమయినాయి. అందువల్ల పరిశ్రమలో OP సమతౌల్యపు ధర నిర్ణయించబడుతుంది. ఇదే ధరను సంస్థ అంగీకరిస్తుంది. దీనిని సమతౌల్య ధర నిర్ణయించబడుతుంది. ఇదే ధరను సంస్థ అంగీకరిస్తుంది. దీనిని సంస్థలో క్షితిజ రేఖ ద్వారా చూపించడం జరిగింది. దీనినే ‘ధర రేఖ’ అంటారు.

సంస్థలో ఉపాంత వ్యయం = ఉపాంత రాబడి అయినప్పుడు ఉండే ఉత్పత్తి వల్ల లాభాలు గరిష్టంగా ఉంటాయి. రేఖాపటంలో 0Q ఉత్పత్తి దగ్గర లాభాలు గరిష్టంగా ఉంటాయి. సమతౌల్య బిందువు ‘E’ దగ్గర ధర P; సగటు వ్యయం; QB సగటు లాభం BA.

మొత్తం లాభం PABC కి సమానం. అనగా OQ వస్తుపరిమాణంను ఉత్పత్తి చేయటానికి అయిన వ్యయం OCBQ; రాబడి OPAQ.

AP Inter 1st Year Economics Study Material Chapter 5 విలువ సిద్ధాంతం

దీర్ఘకాలిక సమతౌల్యం: దీర్ఘకాలంలో సంస్థ ఉత్పాదకాలన్నింటికి మార్చడం ద్వారా ఉత్పత్తిలో మార్పులు చేస్తుంది. సంస్థ దీర్ఘకాలంలో కూడా ఉపాంత వ్యయం, ఉపాంత రాబడికి సమానమైనచోట సమతౌల్యం ఉత్పత్తి చేస్తుంది. దీర్ఘకాలంలో ఒక ముఖ్యమైన అంశం సంస్థల ప్రవేశం, నిష్క్రమణ ఈ కాలంలో జరుగుతుంది. ఈ కారణం వల్ల ప్రతి సంస్థ దీర్ఘకాలంలో సాధారణ లాభాలు మాత్రమే పొందుతుంది. దీర్ఘకాలిక సమతౌల్యాన్ని ఈ క్రింది రేఖా పటం ద్వారా వివరించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 5 విలువ సిద్ధాంతం 7

పై రేఖాపటంలో ‘OX’ అక్షంపై వస్తుపరిమాణాన్ని, ‘OY’ అక్షంపై ధర వ్యయం, రాబడులను కొలుస్తాము. పై రేఖాపటంలో ‘E’ బిందువు వద్ద AR = MR = LMC = LACగా ఉంది. అప్పుడు ధర OPగా పరిమాణం Q గా ఉండును.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సంపూర్ణ పోటీ లక్షణాలు ఏమిటి ?
జవాబు:
అత్యధిక సంఖ్యలో ఉత్పత్తిదార్లు, వినియోదార్లుండే మార్కెట్ను సంపూర్ణ పోటీ మార్కెట్ అంటారు. మార్కెట్ అంతటా ఒకే ధర ఉంటుంది.

సంపూర్ణ పోటీ లక్షణాలు:
1. అధిక సంఖ్యలో కొనుగోలుదార్లు, అమ్మకందార్లు: ఈ మార్కెట్లో అధిక సంఖ్యలో కొనుగోలుదార్లు, అమ్మకందార్లు ఉంటారు. ఏ ఒక్క అమ్మకందారుడు కాని, కొనుగోలుదారుడు కాని మార్కెట్ ధరను ప్రభావితం చేయలేడు. ఒక వస్తువు ధర దానికుండే డిమాండ్, సప్లయ్లు నిర్ణయిస్తాయి. ఈ ధరను కొనుగోలుదారుడు, అమ్మకందారుడు అంగీకరించాలి. సంస్థ మార్కెట్ ధరను అనుసరించాలి.

2. సజాతీయ వస్తువులు: ఈ మార్కెట్లో వస్తువులన్నీ సజాతీయంగా ఉంటాయి. ఈ వస్తువులకుండే జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం సంపూర్ణం. అందువల్ల మార్కెట్ అంతటా ఒకే ధర ఉంటుంది.

3. ప్రవేశించడానికి, నిష్క్రమించడానికి స్వేచ్ఛ ఈ మార్కెట్లో నూతన పరిశ్రమలు ప్రవేశించడానికి, నిష్క్రమించడానికి స్వేచ్ఛ ఉంటుంది. సంస్థ గరిష్ట లాభాలు పొందుతున్నప్పుడు నూతన సంస్థలు ప్రవేశించుటకు, నష్టాలు వచ్చేటప్పుడు నిష్క్రమించుటకు స్వేచ్చ కలదు.

4. సంస్థ, పరిశ్రమ వేరు వేరు: ఈ మార్కెట్లో సంస్థ, పరిశ్రమ వేరువేరుగా ఉంటాయి. సంస్థ అంటే వస్తువులను ఉత్పత్తి చేసే యూనిట్. పరిశ్రమ అనగా సంస్థల సముదాయం.

5. రవాణా ఖర్చులు ఉండవు: రవాణా ఖర్చు ఉండనందువల్ల మార్కెట్ అంతటా వస్తువుకు ఒకే ధర ఉంటుంది.

6. ఉత్పత్తి కారకాలకు, వస్తువులకు సంపూర్ణ గమనశీలత ఈ మార్కెట్లో ఉత్పత్తి కారకాలు ఒక సంస్థనుంచి మరొక సంస్థకు వెళ్ళవచ్చు. అదే విధంగా వస్తు మార్కెట్లో పూర్తి గమనశీలత ఉంటుంది.

7. మార్కెట్ సంపూర్ణ పరిజ్ఞానం ఈ మార్కెట్లో మార్కెట్ను గురించి సంపూర్ణ పరిజ్ఞానం కొనుగోలుదార్లకు, అమ్మకందార్లకు ఉంటుంది. ప్రతి కొనుగోలుదారుకు, అమ్మకందారుకు ధర తెలుస్తుంది.

ప్రశ్న 2.
ధర విచక్షణ అంటే ఏమిటి ? ధర విచక్షణలోని వివిధ రకాలను తెలపండి ?
జవాబు:
ఒకే రకమైన వస్తువులను వివిధ ధరలకు, వివిధ వినియోగదారులకు విక్రయించడమే ధర విచక్షణ. ఏకస్వామ్య దారుడు మాత్రమే విచక్షణ చేయగలుగుతాడు.

“సాంకేతికంగా ఒకే రకమైన వస్తువులను వాటి ఉపాంత వ్యయాలకు అనుపాతం కాని ధరలకు అమ్మడాన్ని ధర విచక్షణ” అని స్పిగ్లర్ నిర్వచించాడు. జోన్ రాబిన్సన్ అభిప్రాయంలో “ఒకే నియంత్రణ క్రింద తయారైన ఒకే రకం వస్తువులను వివిధ కొనుగోలుదార్లకు వివిధ ధరలకు అమ్మే చర్యే ధర విచక్షణ. ఏ.సి. పిగూ ధర విచక్షణను 1వ డిగ్రీ, 2వ డిగ్రీ, 3వ డిగ్రీ అని వర్గీకరించాడు. ఈ ధర విచక్షణ మూడు రకాలుగా ఉంటుంది. అవి.

AP Inter 1st Year Economics Study Material Chapter 5 విలువ సిద్ధాంతం

1. వ్యక్తిగత విచక్షణ: వినియోగదారుల వినిమయ సామర్థ్యాన్ని బట్టి ధరలను విధిస్తే దానిని వ్యక్తిగత విచక్షణఅని అంటారు.
ఉదా: ఒక పుస్తకాన్ని ఒక వ్యక్తికి 20/-కు అమ్మితే, అదే పుస్తకాన్ని మరో వ్యక్తికి కౌ 15/- కు అమ్ముతాడు.

2. ఉపయోగాన్ని బట్టి విచక్షణ: వస్తువు ఉపయోగాన్ని బట్టి ఒకే వస్తువుకు వేరువేరు ధరలను విధిస్తారు. ఈ రకమైన విచక్షణ ఎక్కువగా ప్రభుత్వ రంగ సంస్థలో చూడవచ్చు.

ఉదా: విద్యుచ్ఛక్తి పరిశ్రమలకు, ఒక రకమైన రేటును, గృహవసరాలకు తక్కువ ఛార్జీలను విధిస్తుంది. 3. మార్కెట్ల మధ్య విచక్షణ: మార్కెట్ల మధ్య దూరం ఎక్కువగా ఉండి, వస్తువు డిమాండ్లో తేడాలు ఉన్నప్పుడు మార్కెట్ల మధ్య విచక్షణ పాటించడం జరుగుతుంది.
ఉదా: వస్తువుల ధరలను స్వదేశీ మార్కెట్లో ఎక్కువగాను, విదేశీ మార్కెట్లో తక్కువగా విధించడం జరుగుతుంది.

ప్రశ్న 3.
పరిమిత స్వామ్యాన్ని నిర్వచించండి.
జవాబు:
Oligopoly అనే పదం గ్రీకు పదాలయిన ‘Oligos’, ‘Pollein’ అనే పదాల నుండి గ్రహించడమైంది. ‘Oligos’ అంటే కొద్దిమంది అని, Pollein అంటే అమ్మడం అని అర్థం. పరిమిత స్వామ్యంలో కొద్దిమంది అమ్మకందార్లు ఉండి వారు సజాతీయమైన వస్తూత్పత్తినిగాని లేదా వైవిధ్యం ఉన్న వస్తూత్పత్తిని గాని చేస్తూ ఉంటారు. ఈ కొద్దిమంది అమ్మకందారుల మధ్య పోటీ ఉంటుంది. పరిశ్రమలోని ఇతర సంస్థలపై ప్రతి సంస్థ ప్రత్యక్షంగా చెప్పుకోదగ్గ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

లక్షణాలు:

  1. వస్తువును అమ్మే సంస్థలు చాలా కొద్ది సంఖ్యలో ఉంటాయి.
  2. దీనిలో డిమాండ్ రేఖ అనిశ్చితత్వంగా ఉంటుంది.
  3. ధరల దృఢత్వం ఉంటుంది.
  4. ప్రకటనలపై అధిక వ్యయాన్ని చేస్తారు.
  5. సంస్థల మధ్య పరస్పర ఆధార సంబంధం ఉంటుంది.

ప్రశ్న 4.
సంపూర్ణ పోటీని, ఏకస్వామ్యాన్ని పోల్చండి.
జవాబు:
సంపూర్ణ పోటీలో అనేకమంది అమ్మకందారులు, కొనుగోలుదారులు ఉండి సజాతీయమైన వస్తువుల ఉత్పత్తి జరుగుతుంది. మార్కెట్లో నిర్ణయమైన ధరను సంస్థ అంగీకరిస్తుంది. కాని సంస్థకు ధర నిర్ణయంలో ప్రాధాన్యత ఉండదు. సంస్థ గరిష్ట లాభాలనైతే గరిష్ట స్థాయికి పెంచటానికి, నష్టాలనైతే కనిష్ట స్థాయికి తగ్గించటానికి ప్రయత్నిస్తుంది. అందువల్ల ఉపాంత వ్యయం, ఉపాంత రాబడికి సమానమయ్యేట్లు సంస్థ ప్రయత్నిస్తుంది. ఏకస్వామ్యంలో ఒక వస్తువుకు ఒకే ఉత్పత్తిదారుడుంటాడు. మార్కెట్లో తన వస్తువుకు ఎటువంటి సన్నిహిత ప్రత్యామ్నాయాలు లభించవు. సంస్థ వస్తువు ధరను, వస్తురాశిని నిర్ణయించగలదు. కాని ఒకే సమయంలో రెండు నిర్ణయాలను చేయలేదు. సంస్థ సమతౌల్యంలో ఉండటానికి ఉపాంత వ్యయం, ఉపాంత రాబడికి సమానం అవ్వాలి.

AP Inter 1st Year Economics Study Material Chapter 5 విలువ సిద్ధాంతం

ప్రశ్న 4.
సంపూర్ణ పోటీని, ఏకస్వామ్యాన్ని పోల్చండి.
జవాబు:
సంపూర్ణ పోటీ, ఏకస్వామ్యాల మధ్య పోలిక:

సంపూర్ణ పోటీ

  1. అత్యధిక సంఖ్యలో అమ్మకందార్లు ఉంటారు.
  2. సంస్థలకు ప్రవేశానికి, నిష్క్రమించటానికి స్వేచ్ఛ ఉంటుంది.
  3. ఇక్కడ వస్తువులన్నీ సజాతీయాలు.
  4. ఈ మార్కెట్లో సంస్థ, పరిశ్రమకు తేడా ఉంది.
  5. మార్కెట్ వస్తువు ధరను నిర్ణయిస్తుంది. ఉత్పత్తి దారుడు ధరను స్వీకరిస్తాడు.
  6. మార్కెట్లో ఒకే ధర ఉంటుంది.
  7. సగటు, ఉపాంత రాబడులు సమానం. ఇవి ‘X’ అక్షంకు సమాంతరంగా ఉంటాయి.

ఏకస్వామ్యం

  1. ఒకే ఒక్క ఉత్పత్తిదారుడు ఉంటాడు.
  2. నూతన సంస్థల ప్రవేశాలకు స్వేచ్ఛ ఉండదు.
  3. ఇక్కడ సజాతీయత ఉండదు. ఉత్పత్తికి సమీప ప్రత్యామ్నాయాలు ఉండవు.
  4. ఈ మార్కెట్లో సంస్థ, పరిశ్రమ రెండు ఒక్కటే.
  5. ఉత్పత్తిదారుడే ధరను నిర్ణయిస్తాడు.
  6. మార్కెట్లో ధర విచక్షణ చేస్తాడు.
  7. సగటు రాబడి, ఉపాంత రాబడి కంటే ఎక్కువగా ఉంటుంది.

ఈ రెండు రేఖలు ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటాయి.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మార్కెట్
జవాబు:
సాధారణంగా మార్కెట్ అంటే వస్తువుల క్రయ, విక్రయాలు జరిగే ప్రదేశం అని భావిస్తాం. కాని అర్థశాస్త్రంలో మార్కెట్ అంటే అమ్మకందార్లు, కొనుగోలుదార్లు కలిసి ధరలు నిర్ణయించుకోవటానికి ఉపయోగపడే యంత్రాంగం.

ప్రశ్న 2.
స్థానిక మార్కెట్
జవాబు:
ఒక వస్తువు సప్లై, డిమాండ్ కేవలం ఒక ప్రదేశానికి లేదా ఒక ప్రాంతానికి పరిమితమై ఉండే దానిని స్థానిక మార్కెట్ అంటారు. ఏ ప్రాంతంలో అవి లభిస్తాయో వాటి డిమాండ్, సప్లయ్లు అవి లభించే ప్రాంతానికే పరిమితమై ఉంటాయి.
ఉదా: పాలు, పూలు మొదలగునవి.

ప్రశ్న 3.
జాతీయ మార్కెట్
జవాబు:
వస్తువుకు దేశ వ్యాప్తంగా సప్లై, డిమాండ్ ఉంటే దానికి జాతీయ మార్కెట్ ఉందంటారు. స్థానిక మార్కెట్లో లభించే వస్తువులకు కూడా జాతీయ మార్కెట్ ఉండవచ్చు.
ఉదా: గోధుమలు, పత్తి మొదలగునవి.

AP Inter 1st Year Economics Study Material Chapter 5 విలువ సిద్ధాంతం

ప్రశ్న 4.
ఏకస్వామ్యం [Mar. ’16]
జవాబు:
అసంపూర్ణ పోటీలో ఏకస్వామ్యం ఒకటి. దీనినే గుత్తాధిపత్యం అంటారు. మార్కెట్లో ఒకే ఒక అమ్మకందారుడుండి, సమీప ప్రత్యామ్నాయ వస్తువులు లభ్యంకాని మార్కెట్ని ఏకస్వామ్యం అంటారు. ఈ మార్కెట్లో ధర విచక్షణకు అవకాశం ఉంటుంది.

ప్రశ్న 5.
ఏకస్వామ్య పోటీ
జవాబు:
ఈ మార్కెట్లో వస్తు వైవిధ్యం ఉంటుంది. అనగా అనేక సంస్థలు కొంత భేదంతో ఒకే రకమైన వస్తువులను ఉత్పత్తి చేస్తాయి. అవన్నీ సన్నిహిత ప్రత్యామ్నాయాలు.
ఉదా: బూస్ట్, బోర్నవిటా మొదలగునవి.

ప్రశ్న 6.
పరిమిత స్వామ్యం
జవాబు:
ఈ మార్కెట్లో ఉత్పత్తిదారులు పరిమితంగా ఉంటారు. సంస్థలు స్వతంత్రంగా లేదా ఉమ్మడి అంగీకారంతో సంస్థలు వస్తువుల ధరలను నిర్ణయిస్తాయి.

ప్రశ్న 7.
ద్విదాధిపత్యం
జవాబు:
ఈ మార్కెట్లో ఉత్పత్తిదారులు ఇద్దరుంటారు. వీరి మధ్య పోటీ అధికంగా ఉంటుంది. ఒక సంస్థ తన మార్కెట్ విధాన రూపకల్పనలో తనకు పోటీగా ఉన్న సంస్థ ప్రవర్తనను కూడా పరిగణనలోనికి తీసుకోవలసి ఉంది.

ప్రశ్న 8.
సమతౌల్యపు ధర [Mar. ’15]
జవాబు:
ఒక సంస్థ తన తరహాని లేదా పరిమాణాన్ని ఏవిధంగాను మార్చటానికి ఇష్టపడని పరిస్థితిని సమతౌల్యస్థితి అంటారు. ఏ ధర వద్ద సప్లయ్, డిమాండ్ సమానంగా ఉంటాయో దానిని సమతౌల్యపు ధర అని అంటారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 5 విలువ సిద్ధాంతం

ప్రశ్న 9.
ధర విచక్షణ [Mar ’17, 16, ’15]
జవాబు:
ఒకే రకమైన వస్తువులను వివిధ ధరలకు, వివిధ వినియోగదారులకు విక్రయించడాన్ని ధర విచక్షణ అంటారు. ఏకస్వామ్యదారుడు ధర విచక్షణ చేయగలుగుతాడు. ఆ వస్తువు మార్కెట్ని వివిధ మార్కెట్లుగా విభజించి, ఆ మార్కెట్లో తన వస్తువుకున్న డిమాండ్ వ్యాకోచత్వాలను పరిశీలించి ధర విచక్షణ చేస్తాడు.

ప్రశ్న 10.
అమ్మకపు వ్యయాలు [Mar 17]
జవాబు:
సంస్థలు ఉత్పత్తి చేసిన వస్తువుల అమ్మకాలను మార్కెట్లో పెంచుకోవడానికి చేసే ఖర్చులను అమ్మకపు వ్యయాలు అని అంటారు. పత్రికలు, టెలివిజన్, ప్రదర్శనలు మొదలగునవి వాటి కోసం సంస్థ అధిక మొత్తంలో అమ్మకాల అభివృద్ధికి ఖర్చు చేస్తుంది.

అదనపు ప్రశ్నలు

ప్రశ్న 11.
సంస్థ యొక్క సమతౌల్యం
జవాబు:
ఒక సంస్థ ఉత్పత్తి పరిమాణాన్ని పెంచుటకుగాని, తగ్గించుటకుగాని ఇష్టపడని స్థితిని సమతౌల్య స్థితి అంటారు. ఒక సంస్థలో ఉపాంత వ్యయం, ఉపాంత రాబడులు సమానమైతే సంస్థ సమతౌల్యంలో ఉంటుంది.

ప్రశ్న 12.
వస్తు వైవిధ్యం
జవాబు:
ఒక సంస్థ ఉత్పత్తి చేసిన వస్తువును ఇతర సంస్థలకు చేసిన వస్తువులతో పోల్చితే స్వల్ప తేడాలు ఉంటాయి. జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్యం అధికంగా ఉంటుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 5 విలువ సిద్ధాంతం

ప్రశ్న 13.
కార్టెల్స్
జవాబు:
సంస్థలు తమ మధ్య పోటీని తగ్గించుకోవడానికి, సంస్థలన్నీ కలిసి ఒక అంగీకారంతో ఉత్పత్తిని, ధరను నిర్ణయించుకోనే వ్యవస్థ.

AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి సిద్ధాంతం Textbook Questions and Answers.

AP Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి సిద్ధాంతం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
చరానుపాతాల సూత్రాన్ని వివరించండి. [Mar. ’17, ’16, ’15]
జవాబు:
చరానుపాత సూత్రం స్వల్పకాలానికి చెందినది. ఈ సూత్రాన్ని రికార్డో, మాల్టస్, మార్షల్ వంటి సంప్రదాయ ఆర్థికవేత్తలు విశేష ప్రాముఖ్యమిచ్చారు. సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఈ సూత్రాన్ని వ్యవసాయ రంగానికే పరిమితం చేశారు. స్పిగర్ అనే ఆర్థికవేత్త ఒక ఉత్పాదకాన్ని సమాన పరిమాణంలో పెంచుతూ మిగతా కారకాలను స్థిరంగా ఉంచితే ఒక స్థాయి తరువాత ఉపాంత ఉత్పాదకత క్షీణిస్తుంది.

ఈ సిద్ధాంతం కొన్ని ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి, ఒక ఉత్పత్తి సాధనం పరిమాణంలో మార్పులు చేస్తూ ఉన్నప్పుడు ఏ అనుపాతంలో మారుతుందో తెలియజేయును.

చరానుపాత సూత్రం ప్రకారం మొత్తం ఉత్పత్తి, సగటు ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తులు ప్రారంభంలో పెరిగి తరువాత అవి వివిధ ఉత్పత్తి స్థాయిల వద్ద గరిష్ట స్థాయికి చేరతాయి. మొదటగా ఉపాంత ఉత్పత్తి తరువాత సగటు ఉత్పత్తి, ఆ తరువాత మొత్తం ఉత్పత్తి క్షీణిస్తాయి.

ప్రమేయాలు:

  1. ఈ సూత్రం స్వల్పకాలానికి వర్తిస్తుంది.
  2. సాంకేతిక విజ్ఞానంలో మార్పు ఉండదు.
  3. ఉత్పత్తి కారకాల సమ్మేళనం మార్చడం సాధ్యమవుతుంది.
  4. శ్రమ మాత్రమే చరఉత్పత్తి కారకం మిగతా ఉత్పత్తి కారకాలన్నీ స్థిరం.
  5. ఉత్పత్తిని భౌతిక యూనిట్ల రూపంలో కొలవవచ్చు.
  6. శ్రమ సజాతీయంగా ఉంటుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం

క్షీణ ప్రతిఫల` సూత్రాన్ని ఈ క్రింది ఉదాహరణ ద్వారా వివరించవచ్చు. భూమిని స్థిరంగా ఉంచి మరొక సాధనం (శ్రమ)ను పెంచుకుంటూ పోతే, ఉత్పత్తిలో వచ్చే మార్పును మూడు దశలుగా వర్గీకరించవచ్చు. ఈ మూడు దశలలో మొత్తం ఉత్పత్తి, ఉపాంత, సగటు ఉత్పత్తుల మార్పులను పరిశీలించవచ్చు. దీనిని ఈ క్రింది పట్టిక ద్వారా వివరించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం 1

పై పట్టికలో మొత్తం ఉత్పత్తి ప్రారంభంలో పెరుగుతున్న రేటులో, తరువాత తగ్గుతున్న రేటులో పెరుగుతుంది. 7వ శ్రామికుని ఉపయోగించినప్పుడు మొత్తం ఉత్పత్తి గరిష్టమై తరువాత క్షీణిస్తుంది. సగటు ఉత్పత్తి 3వ శ్రామికుడు వరకు పెరిగి 4వ శ్రామికుని దగ్గర గరిష్ట స్థాయికి చేరి తరువాత క్షీణిస్తుంది. 7వ శ్రామికుని దగ్గర మొత్తం ఉత్పత్తి గరిష్టమైనప్పుడు ఉపాంత ఉత్పత్తి శూన్యమైంది. 8వ శ్రామికుని వద్ద మొత్తం ఉత్పత్తి క్షీణించగా ఉపాంత ఉత్పత్తి ఋణాత్మకమైంది. దీనిని ఈ ప్రక్క రేఖా పటం ద్వారా వివరించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం 2

రేఖాపటంలో TP రేఖ A బిందువు వరకు వేగంగా పెరుగుతూ C బిందువు వద్ద గరిష్టమై తరువాత క్షీణిస్తుంది. “E” బిందువు వద్ద AP, MP రేఖలు ఖండించుకోవడం జరిగింది. మొత్తం ఉత్పత్తి C వద్ద గరిష్టంకాగా AP క్షీణించగా, MP శూన్యమైనది. TP క్షీణించగా, MP ఋణాత్మకమైంది. చరానుపాత సూత్రంలోని ఉత్పత్తి దశలను మూడు దశలుగా విభజించవచ్చు.

  1. పెరుగుతున్న ప్రతిఫలాలు
  2. క్షీణ ప్రతిఫలాలు
  3. రుణాత్మక ప్రతిఫలాలు

ప్రమేయాలు :

  1. పెరుగుతున్న ప్రతిఫలాలు: ఈ దశలో మొత్తం ఉత్పత్తి ఉపాంత ఉత్పత్తి కంటే అధికంగాను, ఉపాంత ఉత్పత్తి సగటు కంటే ఎక్కువగాను ఉండును.
  2. క్షీణ ప్రతిఫలాలు: ఈ దశలో మొత్తం ఉత్పత్తి తగ్గుతున్న రేటులో పెరుగుతుంది. సగటు, ఉపాంత ఉత్పత్తులు క్షీణిస్తాయి.
  3. రుణాత్మక ప్రతిఫలాలు: ఈ దశలో మొత్తం, సగటు ఉత్పత్తులు క్షీణించగా ఉపాంత ఉత్పత్తి ఋణాత్మకం అవుతుంది.

ప్రశ్న 2.
తరహాననుసరించిన ప్రతిఫలాల సూత్రాన్ని వివరించండి.
జవాబు:
దీర్ఘకాలంలో అన్ని ఉత్పత్తి సాధనాలను ఒక అనుపాతంలో మార్చినప్పుడు ఉత్పత్తి ఏ అనుపాతంలో మార్పు చెందుతుందో తెలియజేసే దానిని తరహాననుసరించి ప్రతిఫలాలు అంటారు. మొత్తం ఉత్పత్తి కారకాలను మారిస్తే ఉత్పత్తిలో మూడు దశలు కనిపిస్తాయి.

  1. తరహాననుసరించి పెరుగుతున్న ప్రతిఫలాలు
  2. తరహాననుసరించి స్థిర ప్రతిఫలాలు
  3. తరహాననుసరించి క్షీణ ప్రతిఫలాలు

ప్రమేయాలు:

  1. ఉత్పత్తి కారకాలన్నీ చరం.
  2. సాంకేతిక పరిజ్ఞానం స్థిరం.
  3. ఉత్పత్తిని భౌతికరూపంలో కొలవవచ్చు.
  4. సంపూర్ణ పోటీ ఉంటుంది.
  5. శ్రామికులకు లభించే పనిముట్లు, సాధనాలు ఇవ్వబడ్డాయి.

AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం

పై ప్రమేయాలకు లోబడి అన్ని ఉత్పత్తి కారకాలను ఒకే నిష్పత్తిలో పెంచినప్పుడు ఉత్పత్తి తరహా విస్తరిస్తుంది. దీనిని ఈ క్రింది పట్టిక ద్వారా వివరించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం 3

పట్టికలో 1, 2వ శ్రామికులను వాడినప్పుడు మొత్తం ప్రతిఫలాలు రెండు రెట్లకంటే ఎక్కువగా ఉన్నాయి. ఇది పెరుగుతున్న ప్రతిఫలాలను తెలుపును. అంటే ఉత్పత్తిలో పెరుగుదల కన్నా ఉత్పాదకతలో పెరుగుదల ఎక్కువ. 3, 4 శ్రామికులను వినియోగిస్తే ఉపాంత ఉత్పత్తి 11 యూనిట్లుగా ఉంది. దీనిని స్థిర ప్రతిఫలాల దశ అంటారు. అంటే ఉత్పత్తిలో పెరుగుదల, ఉత్పాదకత పెరుగుదల రెండు సమానం. ఇక 5, 6 శ్రామికులను వాడినప్పుడు మొత్తం ప్రతిఫలాలు తగ్గగా ఉపాంత ప్రతిఫలాలు క్షీణించాయి. దీనిని క్షీణ ప్రతిఫలాల దశ అంటారు. అనగా ఉత్పత్తిలో పెరుగుదల రేటు ఉత్పాదకత పెరుగుదల రేటు కన్నా తక్కువ.
AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం 4

పై రేఖాపటంలో AD రేఖ తరహాననుసరించిన ప్రతిఫలాలు A నుండి B వరకు పెరుగుతున్న ప్రతిఫలాలు, B నుంచి C కి స్థిర ప్రతిఫలాలు, C నుంచి D కి క్షీణ ప్రతిఫలాలు ఉన్నాయి.

ఉత్పత్తిదారుడు వివిధ ప్రతిఫలాలు పొందడానికి కారణాలు

  1. శ్రమ విభజన, ప్రత్యేకీకరణ వల్ల పెరుగుతున్న ప్రతిఫలాలు ఏర్పడతాయి.
  2. సంస్థ విస్తరించడం వల్ల ఉత్పత్తి కారకాల అసమర్థత, అజమాయిషీ లోపం వల్ల క్షీణ ప్రతిఫలాలు ఏర్పడతాయి.

ప్రశ్న 3.
అంతర్గత ఆదాలు – బహిర్గత ఆదాలకు ఉన్న తేడాలను వ్రాయండి.
జవాబు:
పరిశ్రమ విస్తరణ వల్ల పరిశ్రమలో ఉత్పత్తి పరిమాణం పెరిగి ఈ ఆదాలు సంస్థలకు లభిస్తాయి. పరిశ్రమలో ఉత్పత్తి తరహా పెరిగినప్పుడు ఏర్పడే ఆదాలను బహిర్గత ఆదాలంటారు.

1. సాంకేతిక ఆదాలు: మూలధన పరికరాలు ఇవ్వబడినవిగా భావిస్తే స్వల్పకాలంలో సాంకేతిక ఆదాలను పొందవచ్చు. సంస్థ ఎక్కువ సామర్థ్యం కలిగిన మంచి, పెద్ద యంత్రాలను, అధునాతన ఉత్పత్తి పద్ధతులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల ఉత్పత్తి బాగా పెరుగుతుంది.

2. మార్కెటింగ్ ఆదాలు: పెద్ద సంస్థలు అధిక మొత్తంలో ముడిపదార్థాలు కొనడం వల్ల తమకు అనుకూల షరతుల ప్రకారం నాణ్యతగల ముడిసరుకులను సమయానికి పొందడం, తక్కువ రవాణా ఖర్చులు లాంటి ప్రయోజనాలు ఏర్పడతాయి.

3. నిర్వహణ ఆదాలు: పెద్ద సంస్థలు ప్రత్యేక నైపుణ్యం కలిగిన వ్యక్తులను నియమించుకుంటున్నందువల్ల విధి సంబంధిత ప్రత్యేకీకరణ పెరిగి సంస్థలో ఉత్పాదక సామర్థ్యం పెరిగి, ఉత్పత్తి పెరిగి సగటు యాజమాన్యపు వ్యయం తగ్గుతుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం

4. విత్తపరమైన ఆదాలు: పెద్ద సంస్థకు ఉన్న మంచి పేరు, అధిక ఆస్తులవల్ల రుణాలను, సులభంగా తక్కువ వడ్డీ రేటుకు సకాలంలో పొందుతుంది. సంస్థ మూలధనాన్ని మార్కెట్లో షేర్లు, డిబెంచర్లు అమ్మడం వల్ల కూడా సేకరిస్తుంది.

5. నష్టాన్ని భరించే ఆదాలు: పెద్ద సంస్థలు చిన్న సంస్థల కంటే సులభంగా నష్టాన్ని విస్తరించుకోగలవు. ఒకరకం వస్తూత్పత్తిలో వచ్చిన నష్టాన్ని ఇతర రకాల వస్తూత్పత్తిలో వచ్చే లాభాలతో భర్తీ చేసుకోవచ్చు. మార్కెట్లను విస్తరించుకోవడం వల్ల ఒక మార్కెట్లో ఉన్న తక్కువ డిమాండ్ను ఇతర మార్కెట్లో ఉన్న అధిక డిమాండ్ తో భర్తీ చేసుకోవచ్చు.

6. పరిశోధన ఆదాలు: చిన్న సంస్థ కంటే పెద్ద సంస్థకు అధిక వనరులుంటాయి. అందువల్ల స్వంతంగా పరిశోధన ప్రయోగశాలను కలిగి శిక్షణ పొందిన పరిశోధకులను నియమించుకుంటుంది. వారు కనుగొనే కొత్త విషయాలు సంస్థ ఆస్తి. సంస్థ వీటిని ఉపయోగించుకొని వ్యయాన్ని తగ్గించుకొని ఉత్పత్తిని పెంచుకుంటుంది.

7. సంక్షేమ ఆదాలు: సంస్థలు శ్రామికులకు సంక్షేమ సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. పెద్ద సంస్థలు పనిచేయడానికి మంచి పరిస్థితులను, సంస్థ లోపల, బయట కల్పిస్తాయి. సంక్షేమ సౌకర్యాలకయ్యే వ్యయం ఎక్కువగా ఉన్నా దానివల్ల శ్రామికుల సామర్థ్యం పెరిగి, మొత్తం ఉత్పత్తి పెరగడానికి, ఉత్పత్తి వ్యయం తగ్గడానికి అవకాశం ఉంది.

బహిర్గత ఆదాలు: పరిశ్రమను ఒక ప్రాంతంలో స్థాపించినప్పుడు నవకల్పనలను ప్రవేశపెట్టడం వల్ల, ప్రత్యేకీకరణను ప్రవేశపెట్టడం వల్ల ఏర్పడే ఆదాలే బహిర్గత ఆదాలు. వీటిని పరిశ్రమలోని సంస్థలన్నీ అనుభవిస్తాయి.

1) కేంద్రీకరణ ఆదాలు: ఒక పరిశ్రమ ఒక ప్రాంతంలో కేంద్రీకరణ జరిగితే కొన్ని సౌకర్యాలు ఏర్పడతాయి. వీటిని సంస్థలన్నీ అనుభవిస్తాయి. నైపుణ్యం కలిగిన శ్రామికులు లభించటం, రవాణా, సమాచార సౌకర్యాలు ఏర్పరచడం, మెరుగుపరచటం, బ్యాంకులు, విత్త సంస్థలు, బీమా సంస్థలు తమ శాఖలను ఏర్పాటు చేసి సకాలంలో ఋణాలను తక్కువ వడ్డీ రేటుకు అందించడం, బీమా సౌకర్యాన్ని ఏర్పరచడం, సంస్థలకు విద్యుచ్ఛక్తిని సరిపడే పరిమాణంలో తక్కువ రేట్లకు సరఫరా చేయడం, ఇతర అవస్థాపనా సౌకర్యాలు ఏర్పరచడం, అనుషంగిక పరిశ్రమలు ఏర్పడి, కేంద్రీకృతమై పరిశ్రమకు కావలసిన వస్తువులను సరఫరా చేస్తాయి.

2) సమాచార ఆదాలు: ఒక సంస్థ కంటే పరిశ్రమలో ఎక్కువ వనరులు ఉన్నందువల్ల పరిశోధనా ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తుంది. పరిశ్రమకు చెందిన సమాచార కేంద్రం తమ ప్రచురణ ద్వారా ముడి సరుకుల లభ్యత, ఆధునిక యంత్రాలు, ఎగుమతి అవకాశాలు మొదలైన ఇతర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సంస్థలకు అందిస్తుంది.

3) ప్రత్యేకీకరణ ఆదాలు: పరిశ్రమ పరిమాణం పెరిగితే సంస్థలు వివిధ ప్రక్రియలలో ప్రత్యేకీకరణను సాధిస్తాయి. ఫలితంగా పరిశ్రమ మొత్తానికి లాభం చేకూరుతుంది. ఉత్పత్తి పెరిగి, ఉత్పత్తి వ్యయాలు తగ్గుతాయి.

4) సంక్షేమ ఆదాలు: సంస్థ కంటే పరిశ్రమే శ్రామికులకు, సంక్షేమ సౌకర్యాలు కల్పించడంలో ముందు ఉంటుంది. ఫలితంగా శ్రామికుల సామర్థ్యం పెరిగి, పరిశ్రమలో ఉత్పత్తి పరిమాణాన్ని, నాణ్యతను పెంచవచ్చు. వీటివల్ల సంస్థ ఉత్పాదక సామర్థ్యం పెరిగి సగటు ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది.

ప్రశ్న 4.
సంస్థలోని స్వల్పకాలిక వ్యయాలను గురించి వ్రాయండి.
జవాబు:
ఒక ఉత్పత్తిదారుడు ఉత్పత్తికి సంబంధించిన నిర్ణయాలు రెండు కాలాల ఆధారంగా చేస్తాడు.

అవి 1. స్వల్పకాలం 2. దీర్ఘకాలం. స్వల్పకాలంలో కొన్ని ఉత్పత్తి కారకాలు అనగా శ్రామికులు,ముడిపదార్థాలను మార్చవచ్చు. అందువల్ల ఉత్పత్తిదారునికి స్వల్పకాలంలో స్థిర వ్యయాలు, చర వ్యయాలు ఉంటాయి.

1. స్థిర వ్యయాలు: ఉత్పత్తిదారుడు భవనాలు, యంత్రాలు, శాశ్వత కార్మికుల జీతాలు, బీమా మొదలైన వాటిపై చేసే వ్యయాలను స్థిర వ్యయాలు అంటారు. వస్తూత్పత్తిని పెంచినా, తగ్గించినా ఈ వ్యయాలు మారవు. వీటిని అనుబంధ వ్యయాలని, వ్యవస్థాపరమైన వ్యయాలని అంటారు.

2. చర వ్యయాలు: శ్రామికులు, ముడి పదార్థాలు మొదలైన వాటిపై చేసే వ్యయాలను చర వ్యయాలు అంటారు. ఈ వ్యయాలు ఉత్పత్తితో పాటు మారతాయి. దీనిలో ముడి పదార్థాలకు చెల్లించే ధర, శ్రామికుల వేతనాలు, రవాణా మొదలైన చెల్లింపులు ఉంటాయి. వీటిని ప్రత్యక్ష వ్యయాలని లేదా ప్రధాన వ్యయాలని అంటారు.
మొత్తం వ్యయం: స్వల్పకాలంలో స్థిర మరియు చర వ్యయాలను కలుపగా మొత్తం వ్యయం వస్తుంది.
మొత్తం వ్యయం = స్థిర వ్యయం + చర వ్యయం
TC = FC + VC
వాటిని ఈ క్రింది పట్టిక ద్వారా చూపవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం 5

AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం

పై పట్టికలో ఉత్పత్తిని క్రమంగా పెంచుతూ పోయినపుడు స్థిర వ్యయాలు మారకుండా ఉన్నాయి. చర వ్యయాలు ఉత్పత్తితో పాటు మారుతున్నాయి. స్థిర, చర వ్యయాలను కలుపగా మొత్తం వ్యయం వస్తుంది. దీనిని క్రింది రేఖాపటం ద్వారా వివరించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం 6

పై రేఖాపటంలో ‘X’ అక్షంపై ఉత్పత్తి యూనిట్లని, ‘Y’ అక్షంపై వ్యయాన్ని తీసుకోవడం జరిగింది. వివిధ వ్యయ రేఖల ఆకారం ఉత్పత్తికి, వివిధ వ్యయాలకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేయును. స్థిర వ్యయరేఖ (TFC) ‘X’అక్షానికి సమాంతరంగా ఉంది. స్వల్పకాలంలో ఉత్పత్తి పెరగటం వల్ల స్థిర వ్యయంలో ఎలాంటి మార్పు ఉండదు. చర వ్యయరేఖ మూలబిందువు దగ్గర మొదలవుతుంది. దీనికి కారణం ఉత్పత్తి శూన్యమయితే చర వ్యయం కూడా శూన్యమౌతుంది. ఉత్పత్తి పెరిగేకొద్ది చర వ్యయం కూడా పెరుగుతుంది.

సగటు వ్యయం: మొత్తం వ్యయాన్ని మొత్తం ఉత్పత్తితో భాగిస్తే వచ్చేది సగటు వ్యయం.
AC = TC/Q

ఉపాంత వ్యయం: ఉత్పత్తి ప్రక్రియలో అదనంగా ఒక యూనిట్ని పెంచినప్పుడు ఆ అదనపు యూనిట్ వల్ల మొత్తం వ్యయంలో వచ్చే మార్పు.
MC = ΔTC/ΔQ

ఈ క్రింది రేఖాపటం ద్వారా MC మరియు AC సంబంధాన్ని తెలియజేయవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం 7

పై రేఖాపటంలో ‘X’ అక్షంపైన ఉత్పత్తిని, Y అక్షంపైన వ్యయాన్ని చూపినాము. SAC స్వల్పకాలిక వ్యయరేఖ, యూనిట్లు SMC స్వల్పకాలిక ఉపాంత వ్యయరేఖ. ఉత్పత్తి పెరుగుతుంటే మొదట సగటు వ్యయం తగ్గుతుంది. సగటు వ్యయం తగ్గుతున్నంత వరకు ఉపాంత వ్యయం, సగటు వ్యయంకన్నా తక్కువగా ఉంటుంది. ఉత్పత్తిని కొనసాగిస్తే సగటు వ్యయం కనిష్ట స్థాయికి వస్తుంది. ఉపాంత వ్యయం, సగటు వ్యయంతో సమానమౌతుంది. SAC మరియు SMC ఖండించుకున్న ‘A’ బిందువు వద్ద ఉత్పత్తి వ్యయం కనిష్టంగా ఉంటుంది.

అదనపు ప్రశ్నలు

ప్రశ్న 1.
సప్లయ్ సూత్రాన్ని వివరించండి.
జవాబు:
ఒక నిర్ణీత ధర వద్ద, నిర్ణీతకాలంలో మార్కెట్లో విక్రయదారుడు అమ్మడానికి ఇష్టపడే వస్తురాశిని సప్లయ్ అంటారు. సప్లయ్ సూత్రం వస్తు ధరకు, వస్తు సప్లయ్కి గల సంబంధాన్ని తెలియజేయును. ఇతర అంశాలు అన్ని స్థిరంగా ఉన్నప్పుడు వస్తుధర పెరిగితే సప్లయ్ పెరుగుతుంది. ధర తగ్గితే సప్లయ్ తగ్గుతుంది. ధరకి సప్లయి ్క అనులోమ సంబంధం ఉంటుంది. ఈ సప్లయ్ సూత్రాన్ని సప్లయ్ పట్టిక, సప్లయ్ రేఖ ద్వారా వివరించవచ్చు.

AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం

సప్లయ్ పట్టిక: ఒక నిర్ణీత సమయంలో వివిధ ధరలకు ఉత్పత్తిదార్లు ఎంతెంత వస్తు సరఫరా చేస్తారో సప్లయ్ పట్టిక తెలియజేయును.
AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం 8

ధర పెరుగుతుంటే వస్తు సప్లయ్ పెరుగుతుంది.
ధర తగ్గితే వస్తు సప్లయ్ తగ్గుతుంది. దీనిని ప్రక్క రేఖా పటం ద్వారా వివరించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం 9

రేఖాపటంలో ‘X’ అక్షం మీద వస్తు సప్లయ్ పరిమాణాన్ని, ‘Y’ అక్షంపై వస్తు ధరను కొలుస్తాము. సప్లయ్ రేఖ ఎడమ నుంచి కుడికి పైకి వాలుతుంది. ప్రారంభంలో ధర 7 4 ఉంటే సప్లయ్ పరిమాణం 2000గా ఉంటుంది. ఇది SS సప్లయ్ రేఖపై ‘B’ బిందువు దగ్గర ఉంది. ధర గౌ 5 పెరిగితే సప్లయ్ పరిమాణం 3000 గా ఉంది. సప్లయేఖపై ‘B’ బిందువు నుండి C బిందువుకు కదలిక ఏర్పడింది. దీనినే సప్లయ్ విస్తరణ అంటారు. ఒకవేళ ధర ఔ 3 తగ్గితే సప్లయ్ పరిమాణం 1000గా ఉంది. సప్లయ్ రేఖపై ‘B’ బిందువు నుంచి ‘A’ బిందువుకు కదలిక ఏర్పడింది. దానిని సంకోచం అంటారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం

ప్రశ్న 2.
సగటు, ఉపాంత వ్యయరేఖల మధ్య ఉన్న సంబంధాన్ని వివరించండి.
జవాబు:
వస్తువు ఉత్పత్తి కై ప్రక్రియలో చేసే వ్యయాన్ని ఉత్పత్తి వ్యయం అంటారు. ఉత్పత్తి మొత్తం మీద జరిగే వ్యయం మొత్తం వ్యయము. ఉత్పత్తి పెరిగితే మొత్తం వ్యయం పెరుగుతుంది. ఉత్పత్తి తగ్గితే మొత్తం వ్యయం తగ్గుతుంది.

సగటు వ్యయము: మొత్తం వ్యయాన్ని మొత్తం వస్తురాశితో భాగిస్తే సగటు వ్యయం వస్తుంది. ఇది వస్తువు ఒక యూనిట్కి అయ్యే వ్యయాన్ని తెలియజేస్తుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం 10

ఉపాంత వ్యయము: మొత్తం వ్యయము (TC) నుండి ఉపాంత వ్యయం (MC) లభిస్తుంది. మొత్తం వ్యయంలో తేడాను, వస్తు పరిమాణంలో వచ్చే తేడాతో భాగిస్తే ఉపాంత వ్యయం వస్తుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం 11

ఈ క్రింది రేఖాపటం ద్వారా సగటు, ఉపాంత వ్యయాల సంబంధాన్ని పరిశీలించవచ్చు. రేఖాపటములో X – అక్షముపై ఉత్పత్తి యూనిట్లని, Y – అక్షముపై వ్యయాన్ని చూపాము. AC సగటు వ్యయరేఖ, MC ఉపాంత వ్యయరేఖ.

SAC స్వల్పకాలిక వ్యయరేఖ, SMC స్వల్పకాలిక ఉపాంత రేఖ. ఉత్పత్తి పెరుగుతుంటే మొదట సగటు వ్యయం తగ్గుతుంది. సగటు వ్యయం తగ్గుతున్నంత వరకు ఉపాంత వ్యయం, సగటు వ్యయంకన్నా తక్కువగా ఉంటుంది. ఉత్పత్తిని కొనసాగిస్తే సగటు వ్యయం కనిష్ట స్థాయికి వస్తుంది. ఉపాంత వ్యయం, సగటు వ్యయంతో సమానమౌతుంది. SAC మరియు SMC ఖండించుకున్న ‘A’ బిందువు వద్ద ఉత్పత్తి వ్యయం కనిష్టంగా ఉంటుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం 12

  1. సగటు వ్యయం తగ్గుతూ ఉంటే ఉపాంత వ్యయం, సగటు వ్యయం కంటే ఎక్కువ తగ్గుతుంది. అందువల్ల సగటు వ్యయరేఖకు క్రిందివైపు ఉపాంత వ్యయరేఖ ఉంది.
  2. సగటు వ్యయం కనిష్టంగా ఉన్నప్పుడు ఉపాంత వ్యయం సగటు వ్యయానికి సమానమైంది. కనుక సగటు వ్యయరేఖ కనిష్ట బిందువు వద్ద ఉపాంత వ్యయరేఖ క్రింద నుండి ‘N’ బిందువు వద్ద ఖండించింది.
  3. సగటు వ్యయం పెరుగుతూ ఉంటే ఉపాంత వ్యయం, సగటు వ్యయం కంటే ఎక్కువగా పెరుగుతోంది. అందువల్ల ఉపాంత వ్యయరేఖ సగటు వ్యయరేఖకు పైన ఉంది. ఈ విషయాలను పట్టిక, పటములో పరిశీలించవచ్చును. చరానుపాత సూత్రాల ప్రభావం, తరహాననుసరించి ప్రతిఫలాల ప్రభావము వలననే వ్యయరేఖలు ‘U’ ఆకారంలో ఉన్నాయి.

ప్రశ్న 3.
సప్లయ్ని నిర్ణయించే అంశాలు ఏవి ?
జవాబు:
1. వస్తుధర: ఉత్పత్తిదారుడు వస్తుసప్లయ్న నిర్ణయించడంలో ఆ వస్తువు ధరే ప్రధాన పాత్రను పోషిస్తుంది. వస్తుధర వల్ల సంస్థ లాభం నిర్ణయమవుతుంది. వస్తుధర పెరిగితే వస్తువుల పరిమాణాన్ని ఎక్కువగా సప్లయ్ చేస్తాడు. వస్తుధర తగ్గితే వస్తు సప్లయ్ తగ్గుతుంది.

2. ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలు: ప్రత్యామ్నాయ వస్తుధరలు ఎక్కువగా ఉంటే వాటిని ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తిదారుడు ప్రయత్నం చేయవచ్చు. అందువల్ల ఉత్పత్తిదారుడు తాను ఉత్పత్తి చేస్తున్న దాని సప్లయ్ పెంచవచ్చు. అలాగే పూరక వస్తువుల ధరలు వాటికి ఉండే డిమాండ్ ఆధారంగా కూడా ఉత్పత్తిదారుడు తాను చేసే వస్తు సప్లయ్న నిర్ణయించుకుంటాడు.

AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం

3. ఉత్పత్తి కారకాల ధరలు: ఉత్పత్తి కారకాల ధరలు ఎక్కువగా ఉంటే ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. అదే కారకాల ధరలు తక్కువగా ఉంటే ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది.

4. సాంకేతిక స్థాయి: సాంకేతిక పరిజ్ఞానం ఉత్పత్తి పద్ధతుల్లో మార్పులు వస్తే వస్తు సప్లయ్ మార్పులుంటాయి.

5. సంస్థ లక్ష్యం: సంస్థ లక్ష్యం ఆధారంగా కూడా వస్తు సప్లయ్ మారుతుంది.

6. ప్రభుత్వ విధానాలు: ప్రభుత్వం అధిక పన్నులను వస్తువులపై విధిస్తే వస్తు సప్లయ్ తక్కువగా ఉంటుంది. తక్కువగా పన్నులు విధిస్తే వస్తు సప్లయ్ ఎక్కువగా ఉంటుంది. వస్తూత్పత్తి రాయితీలను ఇస్తే వస్తువుల సప్లయ్ ఎక్కువగా ఉంటుంది.

ప్రశ్న 4.
స్వల్ప కాలంలో స్థిర, చర వ్యయాలను వివరించండి.
జవాబు:
స్వల్ప కాలంలో ఉత్పత్తి వ్యయాన్ని రెండు రకాలుగా చెప్పవచ్చు. అవి స్థిర వ్యయాలు మరియు చర వ్యయాలు.

1. స్థిర వ్యయాలు: ఉత్పత్తిలో వచ్చే మార్పుల వల్ల మారని వ్యయాలను స్థిర వ్యయాలు అంటారు. స్వల్పకాలంలో సంస్థ పెంచినా, తగ్గించినా, ఉత్పత్తి జరగకపోయినా ఈ వ్యయాలలో మార్పు ఉండదు.
ఉదా: శాశ్వత ఉద్యోగుల జీతాలు, బీమా, వడ్డీ మొదలగునవి. ఇవి స్థిరమైనవి. కనుక వీటి మీద చేసే వ్యయాలను స్థిర వ్యయాలు అంటారు.

2. చర వ్యయాలు: ఉత్పత్తితో పాటు మారే వ్యయాలను చర వ్యయాలు అంటారు. ఉత్పత్తిని పెంచితే వ్యయం పెరుగుతుంది. ఉత్పత్తిని తగ్గిస్తే చర వ్యయం తగ్గుతుంది.
ఉదా: ముడి పదార్థాల కొనుగోలు, ఇంధనం, విద్యుచ్ఛక్తి మొదలగునవి వాటి మీద చేసే వ్యయం చర వ్యయంగా చెప్పవచ్చు.

ప్రశ్న 5.
ఒక సంస్థ యొక్క మొత్తం సగటు, ఉపాంత రాబడులను నిర్వచించండి.
జవాబు:
రాబడి అనేది ఉత్పత్తిదారునికి ఉత్పత్తిని నిర్ణయించటంలోను, లాభనష్టాలను తెలపటంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. రాబడులలో మొత్తం, సగటు, ఉపాంత రాబడులుంటాయి.

మొత్తం రాబడి: మొత్తం ఉత్పత్తిని మార్కెట్లో ఒక ధర వద్ద విక్రయించగా వచ్చేది ఉత్పత్తిదారునికి రాబడి అవుతుంది. మొత్తం రాబడి మార్కెట్లో వస్తువు ధర మీద, విక్రయించిన వస్తురాశిమీద ఆధారపడి ఉంటుంది.

మొత్తం రాబడి = P x Q
సగటు రాబడి: మొత్తం రాబడిని విక్రయించిన వస్తురాశితో భాగిస్తే సగటు రాబడి వస్తుంది.

సగటు రాబడి = మొత్తం రాబడి / విక్రయించిన వస్తురాశి
ఉపాంత రాబడి: ఒక వస్తువును అదనంగా విక్రయిస్తే వచ్చే రాబడి ఉపాంత రాబడి.
AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం 13

ప్రశ్న 6.
సంపూర్ణపోటీలో, రాబడి రేఖల యొక్క స్వభావాన్ని వివరించండి.
(లేదా)
పరిపూర్ణ పోటీ మార్కెట్లో రాబడి రేఖల స్వభావాన్ని వివరించండి.
జవాబు:
పరిపూర్ణ పోటీ మార్కెట్లో అనేకమంది అమ్మకందార్లు, కొనుగోలుదార్లు ఉంటారు. ఈ మార్కెట్లో వస్తువులు సజాతీయాలు. రవాణా ఛార్జీలు, అమ్మకపు వ్యయాలు ఉండవు. కాబట్టి మార్కెట్ అంతటా ఒకే ధర ఉంటుంది. ఈ మార్కెట్లో రాబడుల యొక్క స్వభావాన్ని ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం 14

AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం

పై పట్టికలో ఉత్పత్తి పరిమాణం ఎంత ఉన్నా ఒకే ధరకు గౌ 10 అమ్మటం జరిగింది. ఉత్పత్తి ధరతో గుణించగా మొత్తం రాబడి వస్తుంది. మొత్తం రాబడి ఒకే మొత్తంలో పెరుగుతూ ఉంది. పట్టికలో సగటు, ఉపాంత రాబడి ఒకే సంఖ్యను కలిగి ఉన్నాయి. ఈ మార్కెట్లో వస్తువు ధర, సగటు, ఉపాంత రాబడులు ఒకటిగానే ఉన్నాయి. దీనిని ఈ క్రింది రేఖాపటాల ద్వారా చెప్పవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం 15

పటంలో (A), (B) లో X- అక్షంపైన వస్తు పరిమాణాన్ని, Y-అక్షంపైన ధరను, రాబడులను కొలుస్తున్నాం. పటం (A) లో DD-డిమాండ్ రేఖ, SS-సప్లయ్ రేఖ రెండు E దగ్గర ఖండించుకున్నప్పుడు పరిశ్రమలో సమలతౌల్యం ఏర్పడి OP ధర నిర్ణయించడింది. ఈ OP ధరకే సంస్థ వస్తువులను అమ్ముతుంది. అందుకే పటం (B) లో OP ధర ఉన్నప్పుడు AR రేఖ MR రేఖ కలిసిపోయి X అక్షానికి సమాంతరంగా రేఖ ఉంది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఉత్పత్తి ఫలం
జవాబు:
ఉత్పాదకాలకు, ఉత్పత్తికి మధ్య ఉండే భౌతిక సంబంధాన్ని తెలుపుతుంది. ఉత్పత్తి కారకాలు రేటుకు, ఉత్పత్తి రేటుకు మధ్య ఉండే సంబంధాన్ని ఉత్పత్తి ఫలంగా స్పిగ్లర్ వర్ణించాడు. దీనిని ఈ క్రింది సమీకరణం ద్వారా తెలియజేయవచ్చు.
Q = f (N, I, C. O, T)
ఇక్కడ Q = ఉత్పత్తి; N, L, C, O, T వరుసగా భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, సాంకేతిక ప్రగతి

ప్రశ్న 2.
సప్లయ్ సూత్రం [Mar. ’16, ’15]
జవాబు:
ఇది వస్తువు ధరకు, వస్తు సప్లయ్కి గల సంబంధాన్ని తెలియజేయును. ఇతర అంశాలు మారకుండా ఉంటే వస్తుధర పెరిగితే వస్తు సప్లయ్ పెరుగును. ధర తగ్గితే వస్తు సప్లయ్ తగ్గుతుందని సప్లయ్ సూత్రం తెలియజేయును. అనగా సప్లయ్కి, ధరకు మధ్య అనులోమ సంబంధం ఉంటుంది.

ప్రశ్న 3.
ఉత్పత్తి కారకాలు
జవాబు:
ఉత్పత్తికి దోహదపడే కారకాలను ఉత్పత్తి కారకాలు అంటారు. అవి

  1. భూమి
  2. శ్రమ
  3. మూలధనం
  4. వ్యవస్థాపన.

AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం

ప్రశ్న 4.
సగటు వ్యయం
జవాబు:
మొత్తం వ్యయాన్ని వస్తురాశితో భాగిస్తే సగటు వ్యయం వస్తుంది.
సగటు వ్యయం = మొత్తం వ్యయం / వస్తురాశి

ప్రశ్న 5.
ఉపాంత వ్యయం [Mar. ’17]
జవాబు:
ఒక వస్తువు అదనపు యూనిట్ను తయారు చేయడానికి అదనంగా అయిన వ్యయాన్ని ఉపాంత వ్యయం అంటారు.
AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం 16

ప్రశ్న 6.
ఉత్పత్తి
జవాబు:
ఉత్పత్తి కారకాలను, ఉత్పాదకాలను వినియోగించి వస్తువులుగా మార్చే ప్రక్రియను ఉత్పత్తి అంటారు. ఈ ప్రక్రియలో వనరులను ఉపయోగించి వినియోగ వస్తువులను లేదా మూలధన వస్తువులను తయారు చేస్తారు.

ప్రశ్న 7.
స్వల్ప కాలం
జవాబు:
సంస్థ, భూమి, మూలధనాన్ని, వ్యవస్థాపనను మార్పు చేయలేనటువంటి కాలాన్ని స్వల్ప కాలం అంటారు. శ్రమను మాత్రమే మార్చుటకు వీలుంది.

ప్రశ్న 8.
దీర్ఘకాలం
జవాబు:
సంస్థ నాలుగు ఉత్పత్తి కారకాలను మార్పుచేయగల కాలం.

AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం

ప్రశ్న 9.
సగటు ఉత్పత్తి
జవాబు:
మొత్తం ఉత్పత్తిని శ్రామికుల సంఖ్యతో భాగిస్తే వచ్చే విలువను సగటు ఉత్పత్తి అంటారు.
AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం 17

ప్రశ్న 10.
ఉపాంత ఉత్పత్తి
జవాబు:
ఉత్పత్తి ప్రక్రియలో అదనపు శ్రామికుని నియమించడం వల్ల మొత్తం ఉత్పత్తిలో ఏర్పడిన మార్పు.

ప్రశ్న 11.
స్థిర కారకాలు
జవాబు: స్వల్ప కాలంలో భూమి, మూలధనం, ఉద్యమిత్వం, స్థిర కారకాలు. వీటిని మార్చటానికి వీలు ఉండదు.

ప్రశ్న 12.
చర కారకాలు
జవాబు:
మార్చటానికి వీలు ఉన్న కారకాలు స్వల్పకాలంలో శ్రమ, చరకాలం, దీర్ఘకాలంలో అన్ని కారకాలు చర కారకాలే.

AP Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి సిద్ధాంతం

ప్రశ్న 13.
ఉత్పత్తి తరహా
జవాబు:
దీర్ఘకాలంలో ఉత్పత్తి కారకాల సమ్మేళనాన్ని మార్చడం ద్వారా ఉత్పత్తిలో వచ్చే మార్పులను ఉత్పత్తి తరహా అంటారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 7 జాతీయాదాయం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Economics Study Material 7th Lesson డిమాండ్ సిద్ధాంతాలు Textbook Questions and Answers.

AP Inter 1st Year Economics Study Material 7th Lesson డిమాండ్ సిద్ధాంతాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జాతీయాదాయాన్ని నిర్వచించి, వివిధ జాతీయాదాయ భావనలను వివరించండి.
జవాబు:
ఒక సంవత్సర కాలంలో ఆర్థిక కార్యకలాపాల వలన దేశంలో ఉత్పత్తయ్యే వస్తుసేవల ద్రవ్యరూపం జాతీయాదాయంగా భావించవచ్చు. ఆధునిక అర్థశాస్త్రంలో ‘జాతీయాదాయం’ అనే అంశానికి చాలా ప్రాధాన్యత ఉంది.

జాతీయాదాయ భావనలు:
1) స్థూల జాతీయోత్పత్తి: ఒక సంవత్సర కాలంలో దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తుసేవల ద్రవ్యరూపాన్ని స్థూల జాతీయోత్పత్తి అంటారు. దీనికి విదేశీ వ్యాపారం వలన లభించే ఆదాయం కలపాలి. స్థూల జాతీయోత్పత్తిని అంచనా వేయడంలో (i) ప్రతి అంతిమ వస్తువు లేదా సేవల విలువలను ద్రవ్యరూపంలో చెప్పాలి. (ii) ఏ వస్తువు ‘విలువను రెండుసార్లు లెక్కపెట్టకుండా జాగ్రత్తపడాలి. (iii) ముడిపదార్థాలను పూర్తిగా తయారు కాని వస్తువుల విలువను జాతీయోత్పత్తిలో కలపాలి. వీటిని ఇన్వంటరీస్ అంటారు. వీటిలో తరుగుదల ఉంటే ఆ సంవత్సరపు జాతీయోత్పత్తి నుండి తీసివేయాలి.

AP Inter 1st Year Economics Study Material Chapter 7 జాతీయాదాయం

స్థూల జాతీయోత్పత్తిని ఈ క్రింది విధముగా చెప్పవచ్చు.

GNP లేదా GNI = C + I + G + (X – M)

2) స్థూల దేశీయోత్పత్తి: ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల ద్రవ్యరూపం మొత్తాన్ని స్థూల దేశీయోత్పత్తి అంటారు. స్థూల జాతీయోత్పత్తిలో వినియోగము, స్థూల దేశీయ పెట్టుబడి, ప్రభుత్వ వ్యయము, నికర విదేశీ ఆదాయం కలిసి ఉంటాయి. స్థూల దేశీయోత్పత్తిలో వినియోగం, స్థూల దేశీయ పెట్టుబడి, |ప్రభుత్వ వ్యయం మాత్రమే ఉంటాయి.

స్థూల దేశీయోత్పత్తి లేదా GDP = C + I + G

3) నికర జాతీయోత్పత్తి – నికర దేశీయోత్పత్తి: వస్తూత్పత్తిలో ఉత్పత్తి సంస్థలు, యంత్రాలు, భవనాలు, యంత్ర పరికరాలను ఇతర సామాగ్రి వినియోగిస్తాయి. వీటిని అవిచ్ఛిన్నంగా ఉపయోగించడం వలన అవి తరుగుదలకు లోనవుతాయి. దీనినే మూలధనం తరుగుదల అంటారు. ఈ తరుగుదలను స్థూల జాతీయోత్పత్తి లేదా స్థూల దేశీయోత్పత్తి నుండి తీసివేస్తే వచ్చేదే నికర జాతీయోత్పత్తి లేదా నికర దేశీయోత్పత్తి. నికర జాతీయోత్పత్తినే మార్కెట్ ధరలలో జాతీయాదాయం అని కూడా అంటారు. నికర జాతీయాదాయాన్ని అర్థశాస్త్ర పరిభాషలో ‘జాతీయాదాయం’ అంటారు.
నికర జాతీయోత్పత్తి = స్థూల జాతీయోత్పత్తి – మూలధనం పెరుగుదల
NNP = GNP – Depreciation
నికర దేశీయోత్పత్తి = స్థూలదేశీయోత్పత్తి – మూలధనం తరుగుదల
NDP = GDP – Depreciation
నికర జాతీయాదాయాన్ని మదింపు చేయటంలో ఈ క్రింది అంశాలను దృష్టిలో ఉంచుకొనవలెను.

a) అంతర్జాతీయ వ్యాపారం వలన సంభవించే లాభనష్టాలను పరిగణనలోకి తీసుకోవాలి.
b) ప్రభుత్వ సంస్థలో ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవలను స్థూల, నికర జాతీయోత్పత్తులలోను, స్థూల, నికర దేశీయోత్పత్తులలోను భాగంగా పరిగణించాలి. సిబ్బందికి ప్రభుత్వం చేసే వ్యయం కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

4) వ్యష్టి ఆదాయం: ఒక సంవత్సర కాలంలో దేశంలోని వివిధ వ్యక్తులకు, సంస్థలకు లభించే ఆదాయం మొత్తము వ్యష్టి ఆదాయము. వ్యష్టి ఆదాయం, నికర జాతీయోత్పత్తి సమానం కాదు. సంస్థలు తమ లాభంలో కొంత భాగాన్ని ఆదాయ పన్నుగా ప్రభుత్వానికి చెల్లిస్తాయి. కొంత భాగాన్ని పంపిణీ కాని లాభాల రూపంలో “రిజర్వ్ ఫండ్”గా ఉంచుతారు. మిగిలిన భాగాన్ని డివిడెండ్గా వాటాదార్లకు పంపిణీ చేస్తారు. డివిడెండ్లు మాత్రమే వ్యక్తిగత ఆదాయంలో చేరతాయి. కనుక సాంఘిక భద్రతా విరాళాలు, కార్పొరేట్ పన్నులు, పంపిణీ కాని లాభాలు నికర జాతీయోత్పత్తి నుండి మినహాయించాలి. కొంతమంది వ్యక్తులు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనకపోయినప్పటికి ఆదాయం లభిస్తుంది. వీటిని జాతీయాదాయంలో చేర్చరాదు. వృద్ధాప్యపు పింఛనులు నిరుద్యోగ భృతి, వడ్డీలు మొదలైనవాటిని బదిలీ చెల్లింపులంటారు. ఇవి వ్యక్తిగత ఆదాయంలో చేరతాయి. ఈ బదిలీ చెల్లింపులను జాతీయాదాయంలో చేర్చరాదు.
వ్యష్టి ఆదాయం = జాతీయాదాయం – పంపిణీ కాని సంస్థల లాభాలు + బదిలీ చెల్లింపులు – సాంఘిక భద్రతా విరాళాలు కార్పొరేట్ పన్నులు

5) వ్యయార్హ ఆదాయం: వ్యక్తుల వినియోగానికి అందుబాటులో ఉండే ఆదాయాన్ని వ్యయార్హ ఆదాయం అంటారు. వ్యక్తులకు వివిధ రూపాలలో లభించే ఆదాయాలన్నింటిని ఖర్చు చేయడానికి వీలుండదు. ప్రభుత్వానికి వ్యక్తులు ప్రత్యక్ష పన్నులను చెల్లించవలసి ఉంటుంది. కనుక వ్యష్టి ఆదాయం నుండి ప్రత్యక్ష పన్నులను తీసివేస్తే వ్యయార్హ ఆదాయం వస్తుంది. వ్యయార్హ ఆదాయంలో కొంత భాగాన్ని మిగుల్చుకుంటే దానిని పొదుపు అంటారు. దీనిని ఈ క్రింది విధంగా చూపవచ్చును.
వ్యయార్హ ఆదాయం = వ్యష్టి ఆదాయం వ్యష్టి పన్నులు వ్యయార్హ ఆదాయం = వినియోగము + పొదుపు

AP Inter 1st Year Economics Study Material Chapter 7 జాతీయాదాయం

6) ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయం: వస్తూత్పత్తి ప్రక్రియలో వినియోగించిన ఉత్పత్తి సాధనాలకు ప్రతిఫలాలను చెల్లిస్తారు. వాటి మొత్తాన్ని ఉత్పత్తి వ్యయం అంటారు. దీనినే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయం అని అంటారు. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయోత్పత్తికి, నికర జాతీయోత్పత్తికి తేడా ఉంది. నికర జాతీయోత్పత్తి మొత్తం ఉత్పత్తి కారకాల మధ్య పంపిణీ కాదు. నికర జాతీయోత్పత్తి నుండి పన్నులను తీసివేస్తే మిగిలేదే ఉత్పత్తి కారకాల మధ్య పంపిణీ అయ్యేది. ప్రభుత్వం కొన్ని వస్తువుల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఉత్పత్తి సంస్థలకు సబ్సిడీలు ఇస్తుంది. అప్పుడు వస్తువుల ధరలు సబ్సిడీల మేరకు తగ్గుతాయి. కనుక సబ్సిడీలను నికర జాతీయోత్పత్తికి కలపాలి. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయము = నికర జాతీయోత్పత్తి + సబ్సిడీలు – పరోక్ష పన్నులు –
National Income at Factor Cost Net National Income + Subsidies – Indirect Taxes

7) తలసరి ఆదాయం: జాతీయాదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది.
తలసరి ఆదాయం = జాతీయాదాయం / దేశ జనాభా
ఒక దేశ ప్రజల సగటు జీవన ప్రమాణాన్ని తలసరి ఆదాయం నిర్ణయిస్తుంది.

ప్రశ్న 2.
జాతీయాదాయాన్ని గణించే వివిధ పద్ధతులను వివరించండి. [Mar. ’17, ’16, ’15]
జవాబు:
ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తు, సేవల మొత్తం విలువను జాతీయాదాయం అంటారు.
జాతీయాదాయాన్ని గణించడానికి మూడు పద్ధతులు అమలులో ఉన్నాయి. అవి:

  1. ఉత్పత్తి పద్ధతి లేదా ఉత్పాదిత పద్ధతి
  2. వ్యయాల పద్ధతి
  3. ఆదాయాల పద్ధతి

కైరన్ క్రాస్ అభిప్రాయం ప్రకారం “జాతీయాదాయాన్ని మూడు పద్ధతులలో ఏ పద్ధతి ద్వారానైనా తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరి ఆదాయాలను కలపడం వల్ల, ప్రతి ఒక్క ఉత్పత్తిని కలపటం వల్ల, ప్రజలు కొనుగోలు చేసే అన్ని వస్తువుల | విలువలను వారి పొదుపులను కలపటం ద్వారా జాతీయాదాయాన్ని గణన చేయవచ్చు”.

1) ఉత్పత్తి మదింపు పద్ధతి: దీనిని ఇన్వెంటరీ పద్ధతి లేదా వస్తుసేవా పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో స్థూల జాతీయోత్పత్తి గణించడానికి ఒక సంవత్సర కాలంలో వివిధ రంగాలలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తుసేవల పరిమాణాన్ని వాటి మార్కెట్ ధరలతో గుణించి వాటి విలువను నిర్ణయిస్తారు.
మార్కెట్ ధరలలో నికర దేశీయోత్పత్తి = (P1Q1 + P2Q2 + …….PnQ2)
P = ధర
Q = పరిమాణం
1, 2, ……., n = వివిధ రంగాలు ఉత్పత్తి చేసిన వస్తువులు, సేవలు

జాతీయాదాయం: ఈ పద్ధతిలో కేవలం అంతిమ వస్తువుల విలువలను మాత్రమే లెక్కించాలి. ముడిసరుకులు, | మాధ్యమిక వస్తువులు మొదలైనవాటి విలువలను లెక్కించకూడదు.

దీనిలో మదింపు చేసిన విలువలను వివిధ రంగాలైన వ్యవసాయం, పరిశ్రమ, సేవా రంగాలకు ఆపాదిస్తారు. అందువల్ల దీన్ని మదింపు చేసిన విలువ లేదా వాల్యుయాడెడ్ పద్ధతి అని కూడా అంటారు.

2) వ్యయాల మదింపు పద్ధతి: ఈ పద్ధతిలో ఒక సంవత్సర కాలంలో వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వం వస్తు సేవలపై చేసిన ఖర్చు మొత్తాలను, నికర ఎగుమతులు, విదేశీ నికర ఆదాయం కూడితే జాతీయాదాయం తెలుస్తుంది.
NI = EH + EF + EG + Net exports + Net income from abroad
ఇచ్చట,
EH = గృహరంగం చేసిన ఖర్చు
EF = సంస్థల వ్యయం
EG = ప్రభుత్వం వస్తు సేవలపై చేసిన ఖర్చు మొత్తం

జాతీయాదాయం = ప్రైవేటు అంతిమ వినియోగ వ్యయం + ప్రభుత్వం అంతిమ వినియోగ వ్యయం + నికర దేశీయ మూలధన సంచయనం + నికర వినిమయం + నికర విదేశీ ఆదాయం

AP Inter 1st Year Economics Study Material Chapter 7 జాతీయాదాయం

కేవలం అంతిమ వస్తుసేవలపై వ్యయాన్ని మాత్రమే గణనలో చేర్చే విధంగా జాగ్రత్త వహించాలి.

3) ఆదాయ మదింపు పద్ధతి: ఈ పద్ధతిలో దేశంలో వివిధ ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలంగా లభించే భాటకం, వేతనం, వడ్డీ, లాభం, సంస్థలకు వచ్చిన ఆదాయాన్ని కలిపితే జాతీయాదాయం తెలుస్తుంది. ఈ పద్ధతిలో స్వయం ఉపాధి వల్ల ఆర్జించే ఆదాయాలను కలపాలి. బదిలీ చెల్లింపులను కలపకూడదు. ఇదియే ఉత్పత్తి కారకాల ఖరీదు | దృష్ట్యా జాతీయాదాయం,
జాతీయాదాయం = భాటకం + వేతనం + వడ్డీ + లాభం + నికర విదేశీ ఆదాయం

ఉద్యోగిత ఆదాయం:
– స్వయం ఉద్యోగిత ఆదాయం
+ కంపెనీల స్థూల వ్యాపార లాభాలు
+ జాతీయం చేయబడిన పరిశ్రమల స్థూల వ్యాపారం మిగుళ్ళు
+ సాధారణ ప్రభుత్వ సంస్థల స్థూల వ్యాపారం మిగుళ్ళు
+ భాటకం
+ వ్యాపారంలో ఉపయోగించని మూలధన వినియోగానికి ఆపాదించిన ఛార్జీ
= మొత్తం గృహరంగ ఆదాయం
– స్టాక్ ఆప్రిసియేషన్
+ శేషించిన పొరపాటు
= ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తి

ఈ పద్ధతిలో జాతీయాదాయం గణించడానికి వివిధ ఆధారాల నుంచి వేల సంస్థలో దత్తాంశ సేకరణ అవసరం. ఆచరణలో ఆదాయానికి సంబంధించిన అన్ని వివరాలు ఖచ్చితంగా తెలియకపోవచ్చు.

ప్రశ్న 3.
జాతీయాదాయ భాగాలను వివరించండి.
జవాబు:
జాతీయాదాయం అనగా ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయ్యే వస్తు సేవల నికర విలువను |జాతీయాదాయం అంటారు.
జాతీయాదాయం –భాగాలు: జాతీయాదాయంలో 5 ప్రధాన భాగాలున్నాయి. అవి:
ఎ) వినియోగం – C
బి) స్థూల దేశీయ పెట్టుబడి – I
సి) ప్రభుత్వ వ్యయం – G
డి) నికర విదేశీ పెట్టుబడి – (X-M)
ఇ) నికర విదేశీ ఆదాయం

ఎ) వినియోగం (C): మానవుని కోరికలను ప్రత్యక్షంగా సంతృప్తిపరచే వస్తుసేవలపై గృహరంగం చేసే మొత్తం ఖర్చును వినియోగం అంటారు. వినియోగ వస్తువులలో నశ్వర, అనశ్వర వస్తువులు ఉంటాయి. ఉదా: ఆహారధాన్యాలు, వస్త్రాలు, వైద్యసేవలు మొ||నవి. ఇది వ్యక్తుల ఆదాయ స్థాయిపై ఆధారపడి ఉంటుంది.

బి) పెట్టుబడి (I): ప్రస్తుత వినియోగానికి వీలుకాని వస్తువులను, సేవలను ఉత్పత్తి చేయడానికి ఉత్పాదక లేదా మూలధన వస్తువులపై సంస్థలు చేసే ఖర్చును పెట్టుబడి అంటారు. దీనిలో భవిష్యత్లో వినియోగ వస్తువుల ఉత్పత్తికి తోడ్పడే మూలధన వస్తువులపై చేసే ఖర్చు కలిసి ఉంటుంది.

సి) ప్రభుత్వ వ్యయం (G): ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం వస్తుసేవలను ఉత్పత్తి చేస్తుంది. అవస్థాపనా సౌకర్యాలకు, విద్యా, వైద్య సౌకర్యాలు, నీటిపారుదల మొ॥వాటికి ప్రభుత్వం చేసే ఖర్చును ప్రభుత్వ వ్యయం అంటారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 7 జాతీయాదాయం

డి) నికర విదేశీ పెట్టుబడి (X – M) (ఎగుమతులు దిగుమతులు): అంతర్జాతీయ వ్యాపారం ద్వారా ఒక దేశం ఆర్జించిన ఆదాయం నికర విదేశీ పెట్టుబడి. ప్రతి దేశం తాను ఉత్పత్తి చేసిన వస్తువులలో కొంత పరిమాణం ఎగుమతి చేస్తుంది. చౌకగా ఉన్న వస్తువులను ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల ఒక దేశ జాతీయాదాయం గణనలో ఎగుమతుల విలువ, దిగుమతుల విలువల మధ్య వ్యత్యాసాన్ని పరిగణించాల్సి ఉంటుంది. విదేశీ వ్యాపారం వల్ల ఏర్పడిన మిగులును స్థూల జాతీయోత్పత్తికి కలుపుతారు. లోటు ఉంటే జాతీయాదాయంలో కొంత భాగాన్ని ఖర్చు పెడతారు.

ఇ) నికర విదేశీ ఆదాయం: ఒక దేశ ప్రజలు విదేశాలలో సంపాదించి స్వదేశానికి ఆదాయాలను పంపిస్తుంటారు. అదేవిధంగా ఒక దేశంలోని విదేశీయులు తమ దేశీయ ఆదాయాలను పంపిస్తారు. రాబడులు, చెల్లింపుల వ్యత్యాసాన్ని నికర విదేశీ ఆదాయం అంటారు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జాతీయాదాయాన్ని నిర్ణయించే అంశాలు ఏవి ? [Mar. ’17, ’15]
జవాబు:
ఒక దేశ జాతీయాదాయ పరిమాణం అనేక అంశాలలో ప్రభావితమై నిర్ణయింపబడుతుంది. జాతీయాదాయ పరిమాణాన్ని నిర్ణయించే అంశాలలో ముఖ్యమైనవి.
ఎ) సహజ వనరులు: సహజ వనరులు, భౌగోళిక అంశాలు, సారవంతమైన నేలలు మొ||నవి అధికంగా, అనుకూలంగాను లభ్యమై దేశాలలో అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి జాతీయాదాయంను పెంచుకోవచ్చు.

బి) ఉత్పత్తి కారకాల నాణ్యత, లభ్యత: ఒక దేశంలో అధిక శక్తి సామర్థ్యం గల శ్రామికుల లభ్యత, చొరవ, సామర్థ్యం గల సమర్థవంతమైన వ్యవస్థాపకులు, మూలధనం పెరుగుదల రేటు జాతీయాదాయ పరిమాణాన్ని నిర్ణయిస్తాయి.

సి) సాంకేతిక విజ్ఞాన ప్రగతి: ఒక దేశ సాంకేతిక ప్రగతి ఉత్పత్తి, జాతీయాదాయమును నిర్ణయిస్తుంది. ప్రకృతి వనరులను పూర్తిగా వినియోగించుకొనుటకు ఆధునిక సాంకేతిక పద్ధతులు ఉపకరిస్తాయి.

డి) రాజకీయ నిర్ణయాలు, స్థిరత్వం: ఆర్థికాభివృద్ధికి, జాతీయాదాయ వృద్ధిరేటు పెంపుకు రాజకీయ నిర్ణయాలు, స్థిరత్వం దోహదం చేస్తాయి. ప్రభుత్వ విధానాలు, ఎగుమతి, దిగుమతి విధానాలు, పరిశోధనలపై పెట్టుబడులు మొదలైన అంశాలు కూడా జాతీయాదాయాన్ని నిర్ణయిస్తాయి.

ప్రశ్న 2.
ఉత్పత్తికారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయం అంటే ఏమిటి ? [Mar. ’16]
జవాబు:
ఒక ఆర్థిక వ్యవస్థలో నిర్ణీత సమయంలో ఉత్పత్తి కారకాలైన భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన పొందే ద్రవ్యరూప ప్రతిఫలాలైన భాటకం, వేతనం, వడ్డీ, లాభం కలిపితే వచ్చే మొత్తాన్ని ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయోత్పత్తి లేదా జాతీయాదాయం అంటారు. దీనినే వస్తూత్పత్తిలో సేవలు లేదా వనరులు సప్లై చేసిన వ్యక్తులు పొందే ఆదాయాలుగా పేర్కొనవచ్చు. దీనిలో ఉద్యోగులు పొందే వేతనాలు, ప్రైవేటు వ్యక్తులకు చెల్లించిన వడ్డీ, భూస్వాములు పొందిన నికర భాటకం అన్ని రకాల వ్యాపార లాభాలు ఇమిడి ఉంటాయి.

AP Inter 1st Year Economics Study Material Chapter 7 జాతీయాదాయం

నికర జాతీయోత్పత్తి మొత్తం ఉత్పత్తి కారకాల మధ్య పంపిణీ కాదు. ఎందుకంటే సంస్థలు ప్రభుత్వానికి పరోక్ష పన్నులు. ఉదా: ఎక్సైజ్ సుంకం, అమ్మకం పన్ను చెల్లిస్తారు. కాని ఉత్పత్తికారకాలకు కాదు. అదేమాదిరిగా ప్రభుత్వం కొన్ని రకాల వస్తుసేవలకు సబ్సిడీ చెల్లిస్తుంది. అంటే వస్తు ఉత్పత్తి కారకాలకు కాదు. అందువల్ల వాస్తవ ఉత్పత్తి
వ్యయాల కంటే తక్కువ ధరకే మార్కెట్లో వస్తువులు విక్రయింపబడతాయి. అందువల్ల సబ్సిడీల విలువను నికర జాతీయాదాయానికి కలపాలి. ఈ రోజులలో ప్రభుత్వ రంగం విస్తరించుటయే కాకుండా అనేక పరిశ్రమలను, సంస్థలను నిర్వహిస్తున్నందువల్ల అది పొందుతున్న లాభాలు ఉత్పత్తి కారకాలకు పంపిణీ కావు. అందువల్ల ప్రభుత్వ సంస్థల లాభాలను నికర జాతీయాదాయం నుంచి తీసివేయాలి.

ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి లేదా జాతీయాదాయం = మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి – పరోక్ష పన్నులు + సబ్సిడీలు – ప్రభుత్వ సంస్థల లాభాలు

ప్రశ్న 3.
ఏవేని మూడు జాతీయాదాయ నిర్వచనాలను తెలపండి.
జవాబు:
ఒక ఆర్థిక వ్యవస్థలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తుసేవల మొత్తం నికర విలువను జాతీయాదాయంగా భావించవచ్చు. జాతీయాదాయం ఆ దేశంలోని ప్రజల జీవన స్థితిగతులకు, ప్రజల సంక్షేమానికి మధ్య ఉండే సంబంధాన్ని వివరిస్తుంది.

  1. పిగూ నిర్వచనం: ఆచార్య పీగూ నిర్వచనం ప్రకారం ద్రవ్యంలో కొలవదగిన ఆర్థిక వ్యవస్థ యొక్క నిరపేక్ష ఆదాయాన్ని విదేశాల నుంచి లభించే నికర ఆదాయాన్ని జాతీయోత్పత్తి అనవచ్చు.
  2. ఫిషర్ నిర్వచనం: తుది వినియోగదారులు భౌతిక లేదా మానవ పరిసరాల నుంచి పొందే సేవల సముదాయమే జాతీయాదాయం.
  3. మార్షల్ నిర్వచనం: ఒక దేశంలోని శ్రమ, మూలధనం, సహజ వనరుల సహాయంతో ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసే భౌతిక, అభౌతిక వస్తుసేవలతో కూడుకున్న నికర వస్తుసేవల మొత్తమే ఆ దేశ వాస్తవిక నికర వార్షిక ఆదాయం”.

ప్రశ్న 4.
జనాభా, తలసరి ఆదాయం మధ్యగల సంబంధం ఏమిటి ?
జవాబు:
జాతీయాదాయానికి, జనాభాకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఈ రెండూ కలిసి తలసరి ఆదాయాన్ని నిర్ణయిస్తాయి. ఒకవేళ జాతీయాదాయం వృద్ధిరేటు 6%, జనాభా వృద్ధిరేటు 3%గా ఉన్నప్పుడు తలసరి ఆదాయం వృద్ధిరేటు 3% గా ఉంటుంది. దీన్ని ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు.
QPC = P-QP
ఇక్కడ QPC = తలసరి ఆదాయం వృద్ధిరేటు
Q = జాతీయాదాయ వృద్ధిరేటు
QP = జనాభా వృద్ధిరేటు

తలసరి ఆదాయ వృద్ధిరేటు = జాతీయాదాయ వృద్ధిరేటు – జనాభా వృద్ధిరేటు

తలసరి ఆదాయంలో పెరుగుదల జీవన ప్రమాణంలో పెరుగుదలను సూచిస్తుంది. జాతీయాదాయ వృద్ధిరేటు, పెరుగుదల కంటే జనాభా వృద్ధిరేటు తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే తలసరి ఆదాయంలో పెరుగుదల సాధ్యమవుతుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 7 జాతీయాదాయం

ప్రశ్న 5.
భారతదేశంలో జాతీయాదాయ మదింపులతో సమస్యలు ఏవి ?
జవాబు:
1) ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలకు సంబంధించిన ఆదాయం లేదా ఉత్పత్తి లేదా వ్యయ రూపకంగా లభ్యమయ్యే గణాంక వివరాలు సమగ్రంగాను, విశ్వసనీయంగాను ఉండవు. ఇందుకు కారణాలు ప్రత్యేకించి శిక్షితులైన గణాంక సిబ్బంది కొరత, ప్రజల నిరక్షరాస్యత వల్ల అకౌంట్స్ను సరిగా నిర్వహించలేకపోవటం.

2) భారతదేశంలో ద్రవ్యేతర రంగం అధికంగా ఉంది. ద్రవ్య చెల్లింపులు లేని వస్తు సేవలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జాతీయాదాయ లెక్కలలో చేర్చబడనందున ఉత్పత్తి అయిన వస్తువులలో చాలాభాగం జాతీయాదాయ లెక్కల్లోకి రాకపోవచ్చు.
ఉదా: తల్లి తన కుటుంబానికి చేసే సేవలు.

3) వృత్తి ప్రత్యేకీకరణ తక్కువగా ఉంది. ఒక వ్యక్తికి ఆదాయం అనేక వృత్తుల నుండి లభిస్తుంది. అందుచేత ఆదాయ సమాచార వివరాలు సేకరించడం కష్టంగా మారుతుంది.

4) మార్కెట్ ధరలలో మార్పుల వల్ల జాతీయాదాయ మదింపులో సమస్యలు ఏర్పడతాయి.

5) జాతీయాదాయ లెక్కలలో చేర్చబడిన ప్రభుత్వ సేవల విలువ ఖచ్చితంగా లెక్కకట్టుట సాధ్యం కాదు.

ప్రశ్న 6.
జాతీయాదాయ అంచనాల ప్రాముఖ్యత తెలియజేయండి.
జవాబు:
జాతీయాదాయ అంచనాల ప్రాముఖ్యత: అనేక కారణాల వల్ల జాతీయాదాయ అంచనాల ప్రాముఖ్యత పెరుగుతుంది.

  1. ఆర్థిక ప్రణాళికల రచనకు జాతీయాదాయ అంచనాలు లేదా గణాంకాలు చాలా ముఖ్యమైనవి.
  2. దేశ ఆర్థిక విధానాలు రూపొందించడానికి ఇవి ఉపయోగపడతాయి.
  3. ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాల పనితీరును అంచనా వేయడానికి ఇవి వీలు కల్పిస్తాయి.
  4. దేశ బడ్జెట్ తయారీ: బడ్జెట్ కేటాయింపులలో ఇవి అత్యంత ఉపయోగకరమైనవి.
  5. దేశంలో జీవన ప్రమాణస్థాయి వివరాలు తెలియజేస్తాయి.
  6. మనకు ఇతర దేశాల ఆర్థికవృద్ధిని పోల్చడంలో దోహదం చేస్తాయి.
  7. స్థూల ఆర్థిక విధానాల రూపకల్పనలో ప్రభుత్వాలకు సహాయం చేస్తాయి. 8) భారతదేశంలోని జాతీయాదాయ అకౌంట్స్ను వివరిస్తాయి.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
స్థూల జాతీయోత్పత్తి (GNP)
జవాబు:
ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేసిన వస్తుసేవల మొత్తం విలువను స్థూల జాతీయోత్పత్తి అంటారు. మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి
(GNP) = C + I + G + (X – M).

ప్రశ్న 2.
తలసరి ఆదాయం [Mar. ’17, ’16, ’15]
జవాబు:
జాతీయాదాయాన్ని దేశంలో ఉన్న జనాభాతో భాగిస్తే వచ్చేది “తలసరి ఆదాయం”.
తలసరి ఆదాయం = జాతీయాదాయం / దేశ జనాభా
తలసరి ఆదాయం దేశ ప్రజల జీవన ప్రమాణాన్ని సూచిస్తుంది. ఆర్థికాభివృద్ధికి తలసరి ఆదాయమే ప్రధాన సూచిక.

AP Inter 1st Year Economics Study Material Chapter 7 జాతీయాదాయం

ప్రశ్న 3.
తరుగుదల
జవాబు:
యంత్రాలు నిరంతరం ఉపయోగించినప్పుడు అవి అరిగిపోయే అవకాశం ఉంది. వాటికయ్యే మరమ్మత్తు ఖర్చును తరుగుదల అంటారు.

ప్రశ్న 4.
వ్యయార్హ ఆదాయం
జవాబు:
వ్యక్తులకు, సంస్థలకు వచ్చే ఆదాయాన్ని వ్యష్టి ఆదాయం అంటారు. అయితే వ్యక్తులకు, ఈ మొత్తాన్ని ఖర్చు చేసే అవకాశం ఉండదు. ఇందులోనుంచి ప్రత్యక్ష పన్ను, ఆస్తి పన్ను, ఆదాయ పన్ను చెల్లించవలసి ఉంటుంది. ఆదాయం నుంచి ఈ మొత్తాన్ని తీసివేస్తే మిగిలేదే వ్యయార్హ ఆదాయం.
వ్యయార్హ ఆదాయం = వినియోగం + పొదుపు

ప్రశ్న 5.
చక్రీయ ఆదాయ ప్రవాహం
జవాబు:
ఒక ఆర్థిక వ్యవస్థలో సంస్థల నుంచి గృహ రంగానికి, గృహ రంగం నుంచి సంస్థలకు నిరంతరం ఆదాయం ప్రవహించడాన్ని చక్రీయ ఆదాయ ప్రవాహం అంటారు.

ప్రశ్న 6.
బదిలీ చెల్లింపులు
జవాబు:
కొందరు వ్యక్తులు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనకపోయినా ఆదాయంలో కొంత భాగాన్ని చెల్లించవలసి ఉంటుంది. అవి పెన్షన్లు, నిరుద్యోగభృతి, ప్రభుత్వ బాండ్లపై వడ్డీ మొదలగునవి. వీటిని బదిలీ చెల్లింపులు అంటారు.

ప్రశ్న 7.
జాతీయాదాయం
జవాబు:
ఒక దేశంలో నిర్ణీతకాలంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తుసేవల నికర మార్కెట్ విలువను జాతీయాదాయం అంటారు. జాతీయాదాయం వ్యాపార కుటుంబ రంగాల మధ్య జరిగే చక్రరూప ఆదాయ ప్రవాహాన్ని వివరిస్తుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 7 జాతీయాదాయం

ప్రశ్న 8.
నికర జాతీయోత్పత్తి
జవాబు:
వస్తుసేవల ఉత్పత్తిలో వినియోగించబడే యంత్రాలు, యంత్ర పరికరాలు కొంతకాలం తరువాత కొంత తరుగుదలకు, అరుగుదలకు గురికావచ్చు. అందువల్ల స్థూలజాతీయోత్పత్తి నుంచి తరుగుదలను తీసివేయగా నికర జాతీయోత్పత్తి వస్తుంది. నికర జాతీయోత్పత్తి = స్థూల జాతీయోత్పత్తి – తరుగుదల.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ సిద్ధాంతాలు Textbook Questions and Answers.

AP Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ సిద్ధాంతాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
డిమాండ్ సూత్రాన్ని వివరించి, దాని మినహాయింపులను వ్రాయండి.
జవాబు:
అర్ధశాస్త్రంలో డిమాండ్ భావనకు చాలా ప్రాధాన్యత ఉన్నది. ఒక వస్తువును కొనాలనే కోరికతోపాటు కొనే శక్తి, కొనాలన్న ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే వస్తువుకు డిమాండ్ ఏర్పడుతుంది. కనుక డిమాండ్ను ఈ క్రింది విధముగా నిర్వచించవచ్చు. “ఒక నిర్ణీత కాలంలో, నిర్ణీతమైన ధర వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తు పరిమాణాన్ని ఆ వస్తువుకు లేదా సేవకు ఉన్న డిమాండ్” అని బెన్హామ్ పేర్కొన్నాడు.

ఒక వస్తువుకున్న డిమాండ్ ముఖ్యంగా ఈ క్రింది అంశాలపై ఆధారపడి ఉండును.

  1. వినియోగదారుల అభిరుచులు, అలవాట్లు
  2. వస్తువుల ధరలు
  3. వినియోగదారుల ఆదాయాలు
  4. ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలు మొదలైనవి.

డిమాండ్ సూత్రము: డిమాండ్ సూత్రం వస్తువు ధరకు, డిమాండ్కుగల సంబంధాన్ని తెలియజేస్తుంది. “ఇతర అంశాలు స్థిరంగా ఉంటే, వస్తువు ధర పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది. ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది” అని మార్షల్ డిమాండ్ సూత్రాన్ని నిర్వచించెను. డిమాండ్ సూత్రాన్ని ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చును.

Dn = f

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

డిమాండ్ పట్టిక
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 1

వినియోగదారుడు లేదా వినియోగదారులు ఒక వస్తువును వివిధ ధరల వద్ద ఏ పరిమాణంలో కొనుగోలు చేస్తారో తెలియజేస్తుంది డిమాండ్ పట్టిక.

పట్టికననుసరించి వస్తువు ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుందని, ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుందని తెలుస్తుంది. దీనిని ఆధారంగా చేసుకొని డిమాండ్ రేఖను గీయవచ్చును.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 2

పై రేఖాపటంలో ‘X’ అక్షముపై వస్తువు డిమాండ్ పరిమాణం, ‘Y’ అక్షముపై వస్తువు ధరను చూపినాము. ‘DD’ డిమాండ్ రేఖ. డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి క్రింది వైపుకు వాలి ఉంది. ఇది ఋణాత్మకమైన వాలు. వస్తువు ధరకు, డిమాండ్కు మధ్య విలోమ సంబంధమున్నదని ఋణాత్మకమైన వాలు తెలియజేస్తుంది.

మినహాయింపులు: డిమాండ్ సూత్రానికి కొన్ని మినహాయింపులున్నాయి. అవి:
1. గిఫెన్ వైపరీత్యం: పేద కార్మికులు రొట్టె ధర పెరిగితే మాంసముపై వెచ్చించే డబ్బును కూడా రొట్టెపై ఖర్చు చేస్తారు. అనగా రొట్టె ధర పెరిగినా డిమాండ్ తగ్గదు. ఇది పేదవాళ్ళ ఆహారం కావటమే ఇందుకు కారణము. ఈ సత్యాన్ని సర్ రాబర్ట్ గిఫెన్ అనే ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఆర్థికవేత్త 19వ శతాబ్దం మధ్య భాగంలో పరిశీలించాడు. కనుక దీనిని గిఫెన్ వైపరీత్యం అంటారు. పేదవారు ముఖ్యంగా నిత్యావసర వస్తువులలో తక్కువ ధర గల వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ ప్రత్యేకమైన వస్తువులనే గిఫెన్ వస్తువులంటారు. ఉదా: రాగులు, జొన్నలు మొదలైనవి.

2. గౌరవ సూచిక వస్తువులు: గౌరవ సూచిక వస్తువుల ధర పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. వీటిని కొనుగోలు చేయటం వలన సమాజంలో గౌరవము, ప్రతిష్ఠ పెరుగుతాయని భావిస్తారు. వీటి ధర తగ్గితే గౌరవం, ప్రతిష్ఠ తగ్గుతాయని భావిస్తారు. ఉదా: విలువ గల వజ్రాలు, ఆభరణాలు మొదలైనవి. ఇది డిమాండ్ సూత్రానికి వ్యతిరేకము. ఈ విషయాన్ని వెబ్లెన్ అనే అమెరికా ఆర్థికవేత్త తెలియజేసెను. అందువల్ల ఇటువంటి వస్తువులను వెబ్లెన్ వస్తువులంటారు.

3. అంచనా వ్యాపారం: ఒక వస్తువు ధర మరింత పెరగడానికి వ్యాపారస్తులు, కొనుగోలుదారులు ఆ వస్తువును ఎక్కువగా డిమాండ్ చేస్తారు. అదేవిధంగా ధర తగ్గినప్పుడు ఇంకా తగ్గుతుందని భావిస్తే కొనుగోలు తగ్గిస్తారు. దీనినే సట్టా వ్యాపారం అని కూడా అంటారు. ఉదా: షేర్లు, బాండ్లు.

4. భ్రాంతి: కొంతమంది వినియోగదారులు కొన్నిసార్లు ఎక్కువ ధర కలిగి ఉన్న వస్తువులు ఎక్కువ నాణ్యతతో కూడి ఉంటాయన్న భ్రాంతిలో ఉంటారు. అందువల్ల ధర ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఇటువంటి వాటి విషయంలో డిమాండ్ సూత్రం వర్తించదు.

ప్రశ్న 2.
డిమాండ్ ఫలం అంటే ఏమిటి ? డిమాండ్ను నిర్ణయించే అంశాలను వివరించండి.
జవాబు:
“ఒక నిర్ణీతమైన కాలంలో, నిర్ణీతమైన ధర వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తు పరిమాణాన్ని ఆ వస్తువుకు లేదా సేవకు ఉన్న డిమాండ్” అంటారు.

ఒక వస్తువు డిమాండ్ దాని ధరపైనే కాకుండా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా వస్తువు డిమాండ్ను ప్రభావితము చేసే అంశాలు; ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలు, వినియోగదారుల ఆదాయం, వినియోగదారుల అభిరుచులు, అలవాట్లు మొదలైనవి. కనుక ఒక వస్తువు డిమాండ్ పరిమాణానికి, దీనిని నిర్ణయించే కారకాలకు మధ్యగల సంబంధాన్ని తెలియజేసేదే డిమాండ్ ఫలము. దీనిని ఈ క్రింది సమీకరణం ద్వారా చూపవచ్చు.
Dn = f (Pn, P1, P2, …. Pn-1, y, T)
Dn = n వస్తువుల డిమాండ్ పరిమాణం
Pn = n వస్తువు ధర
Pn, P1, P2, …. Pn-1 = ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలు
y = వినియోగదారుని ఆదాయం
T = వినియోగదారుని అభిరుచులు, అలవాట్లు మొదలైనవి.
f = ప్రమేయ సంబంధము

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

డిమాండ్ను నిర్ణయించే కారకాలు లేదా అంశాలు:

  1. ఆదాయంలో మార్పు: ప్రజల ఆదాయాల మార్పును బట్టి వస్తువుల డిమాండ్లో మార్పు ఏర్పడుతుంది. ప్రజల ఆదాయం పెరిగితే వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. ఆదాయాలు తగ్గితే వస్తువుల డిమాండ్ తగ్గుతుంది.
  2. అభిరుచులు, అలవాట్లలో మార్పులు: ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో వచ్చే మార్పుల వలన వస్తువు డిమాండ్లో మార్పు వస్తుంది.
  3. ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో మార్పులు: ప్రజల అభిరుచులలో అలవాట్లలో మార్పులవల్ల వస్తువు డిమాండ్ లో మార్పులు వస్తాయి.
  4. జనాభాలో మార్పు: జనాభా పెరుగుదల, తగ్గుదలను అనుసరించి కూడా వస్తువుల డిమాండ్లో మార్పులు వస్తాయి.
  5. వాతావరణంలో మార్పులు: వాతావరణంలో మార్పులు కూడా డిమాండ్లో మార్పులను తీసుకొని వస్తాయి. ఉదా: వేసవికాలంలో చల్లని పానీయాలకు డిమాండ్ పెరుగుతుంది.
  6. సాంకేతికాభివృద్ధి: సాంకేతికాభివృద్ధి వలన వస్తూత్పత్తి వ్యయం తగ్గి, వస్తు ధరలు తగ్గుతాయి. అందువల్ల పూర్వం కొనుగోలు చేయడానికి ఉపయోగించిన ద్రవ్య పరిమాణంలో వస్తువులను ఎక్కువగా డిమాండ్ చేయటానికి అవకాశం ఉంటుంది.
  7. ఆర్థిక స్థితిగతులు: వాణిజ్య విజృంభణ కాలంలో అన్ని వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. కానీ, ఆర్థిక మాంద్య పరిస్థితులలో అన్ని వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది.
  8. ప్రభుత్వ విధానము: ప్రభుత్వ పన్నుల విధానం, రాయితీ విధానము మొదలైనవి వస్తువు ధర తగ్గితే డిమాండ్ ప్రభావితం చేయును.
  9. వస్తువు ధర: ఒక వస్తువు ధరకు, డిమాండ్కు విలోమ సంబంధం ఉన్నది. కనుక వస్తువు ధర తగ్గితే, డిమాండ్ పెరుగుతుంది. వస్తువు ధర పెరుగుటచే డిమాండ్ తగ్గుతుంది.

ప్రశ్న 3.
డిమాండ్ అంటే ఏమిటి ? వివిధ రకాల డిమాండ్లను తెలియజేయండి.
జవాబు:
అర్ధశాస్త్రంలో డిమాండ్ భావనకు చాలా ప్రాధాన్యత ఉంది. ఒక వస్తువును కొనాలనే కోరిక దానితోపాటు కొనే శక్తి ఈ రెండూ జతకూడినప్పుడే ఆ వస్తువుకు డిమాండ్ ఏర్పడుతుంది. అందువల్ల “ఒక నిర్ణీత కాలంలో, నిర్ణీతమైన ధర వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తు పరిమాణాన్ని ఆ వస్తువుకు ఉన్న డిమాండ్” అంటారు.
డిమాండ్ను నిర్ణయించే కారకాలను బట్టి డిమాండ్ను మూడు రకములుగా విభజించవచ్చు.

  1. ధర డిమాండ్
  2. ఆదాయ డిమాండ్
  3. జాత్యంతర డిమాండ్.

1. ధర డిమాండ్: ఒక వస్తువు ధరకు, దాని డిమాండ్ పరిమాణానికి గల సంబంధాన్ని తెలియజేయునది ధర డిమాండ్. డిమాండ్ను ప్రభావితంచేసే ఇతర అంశాలలో మార్పులేదనే ప్రమేయంపై ఆధారపడి ధర డిమాండ్ నిర్వచించబడుతుంది. దీనిని ఈ విధంగా చూపవచ్చు.
D1 = f(Px)
డిమాండ్ పట్టిక: ఒక వస్తువును వివిధ ధరల వద్ద కొనుగోలు చేసే వస్తువు పరిమాణాలను తెలియజేయును. ఈ డిమాండ్ పట్టిక రెండు రకాలు.

  1. వైయుక్తిక డిమాండ్ పట్టిక
  2. మార్కెట్ డిమాండ్ పట్టిక

డిమాండ్ పట్టిక:
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 3AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 4
పై రేఖాపటంలో ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది. కనుక DD రేఖ ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంది. దీనిని ఋణాత్మక వాలు అంటారు. ఇది వస్తువు ధరకు, డిమాండ్కు మధ్య ఉన్న విలోమ సంబంధాన్ని తెలియజేయును.

2. ఆదాయ డిమాండ్: వినియోగదారుని ఆదాయానికి, వస్తువు డిమాండ్కు మధ్యనున్న సంబంధాన్ని ఆదాయ డిమాండ్ అంటారు. వివిధ ఆదాయాల వద్ద వస్తువు డిమాండ్ పరిమాణం ఏ విధంగా ఉందో ఆదాయ డిమాండ్ తెలియజేస్తుంది.
Dx = f(y)

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

ఇతర అంశాలు మారకుండా స్థిరంగా ఉన్నప్పుడు ఆదాయం పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. ధరకు, ఆదాయంకు ధనాత్మక సంబంధం ఉంది. ఆదాయ డిమాండ్ను అనుసరించి వస్తువులలో మేలురకం లేదా నాసిరకం వస్తువులుగా గుర్తించవచ్చు.

మేలురకం వస్తువులు / సాధారణ వస్తువులు:
ఆదాయం పెరిగితే మేలురకం వస్తువులు లేదా సాధారణ వస్తువుల డిమాండ్ పెరుగుతుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 5

పై రేఖాపటంలో ‘OX’ అక్షంపై డిమాండ్ పరిమాణంను, ‘OY’ అక్షంపై ఆదాయంను తీసుకొన్నాం. ఆదాయం ‘OY’ ఉన్నప్పుడు ‘OQ’ వస్తు పరిమాణం డిమాండ్ చేయబడింది. ఆదాయం ‘OY’ నుంచి ‘OY1‘ కు పెరిగినప్పుడు మేలురకం వస్తువుల డిమాండ్ ‘OQ’ నుంచి ‘OQ1‘ కు పెరిగింది. ‘YD’ రేఖ ధనాత్మక వాలు కలిగి ఉంటుంది.

నాసిరకం వస్తువులు: మేలురకం వస్తువులకు భిన్నంగా వినియోగదార్ల ఆదాయం పెరిగితే నాసిరకం వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 6

పై రేఖాపటంలో ‘OX’ అక్షం మీద డిమాండ్ పరిమాణాన్ని, ‘OY’ అక్షం మీద ఆదాయంను తీసుకొన్నాం. ఆదాయం ‘OY1‘ నుంచి ‘OY’ కు పెరిగినప్పుడు డిమాండ్ పరిమాణం ‘OQ’ నుంచి ‘OQ1‘ కు తగ్గును. ‘YD’ రేఖ ఎడమ నుండి కుడికి వాలి ఉంది.

3. జాత్యంతర డిమాండ్: ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలకు, ఒక వస్తువు డిమాండ్కు మధ్య ఉన్న సంబంధాన్ని జాత్యంతర డిమాండ్ అంటారు. ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో వచ్చిన మార్పుల వల్ల ఒక వస్తువు డిమాండ్లో వచ్చే మార్పులను జాత్యంతర డిమాండ్ తెలియజేయును.
జాత్యంతర డిమాండ్ను ఈ విధంగా వ్రాయవచ్చు.
Dx = f(Py).

ప్రత్యామ్నాయ వస్తువులు: ఒక కోర్కెను తీర్చగల వివిధ వస్తువులను ప్రత్యామ్నాయ వస్తువులు అంటారు.

ఉదా: కాఫీ, టీ. ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ ధనాత్మక సంబంధాన్ని తెలియజేయును. దీనిని ఈ క్రింది రేఖాపటం ద్వారా చూపవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 7
పై రేఖాపటంలో కాఫీ ధర ‘OY’ నుంచి ‘OY2‘ కు పెరిగినప్పుడు టీ, డిమాండ్ ‘OQ’ నుండి ‘OQ2‘ కు పెరిగింది. ‘CD’ రేఖ ధనాత్మక వాలును కలిగి ఉంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

పూరక వస్తువులు: ఒకే కోరికను తీర్చగల సమిష్టి వస్తువులు.
ఉదా: కారు, పెట్రోలు, వీటి విషయంలో డిమాండ్ విలోమ సంబంధాన్ని తెలియజేయును.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 8

పై రేఖాపటంలో డిమాండ్ ‘OQ’ నుండి ‘OQ2‘ కు పెరిగింది. ధర ‘OP’ నుండి ‘OP’ కు తగ్గినప్పుడు ‘CD’ రేఖ ఋణాత్మక వాలు కలిగి ఉంది.

ప్రశ్న 5.
డిమాండ్ వ్యాకోచత్వ భావనను నిర్వచించి, ధర, ఆదాయ, జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వాలను వివరించండి.
జవాబు:
ఆర్థికశాస్త్రంలో “డిమాండ్ వ్యాకోచత్వం” అనే భావనకు అధిక ప్రాధాన్యత ఉంది. ధరలో వచ్చిన మార్పుకు అనుగుణంగా డిమాండ్ ఎంత మేరకు మార్పు వస్తుందో డిమాండ్ వ్యాకోచత్వ భావన తెలుపుతుంది.

శ్రీమతి జోన్ రాబిన్సన్ అభిప్రాయంలో “ధరలో వచ్చిన అనుపాతపు మార్పు స్పందనకు బదులుగా డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాత మార్పు ప్రతిస్పందన ఏ మేరకు ఉంటుందో తెలియజేసే భావన డిమాండ్ వ్యాకోచత్వం”. డిమాండ్లో వచ్చిన అనుపాతపు మార్పు డిమాండ్ వ్యాకోచత్వం.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 9

ఈ వ్యాకోచత్వ భావన మూడు రకాలు.

  1. ధర డిమాండ్ వ్యాకోచత్వం
  2. ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం
  3. జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం

1. ధర డిమాండ్ వ్యాకోచత్వం: ఈ భావనను మార్షల్ అభివృద్ధిపరిచారు. ధర డిమాండ్ వ్యాకోచత్వం అనగా ధరలో వచ్చే అనుపాతపు మార్పు వల్ల డిమాండ్లో వచ్చే అనుపాతపు మార్పు ఎంత ఉంటుందో తెలియజేస్తుంది. వస్తువు ధరకు, డిమాండ్కు విలోమ సంబంధం ఉంటుంది. అందువల్ల ధర డిమాండ్ వ్యాకోచత్వం రుణాత్మకంగా ఉంటుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 10

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

2. ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం : ఆదాయంలో వచ్చే మార్పు వల్ల డిమాండ్ పరిమాణంలో ఏ మేరకు స్పందన వస్తుందో ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం తెలుపుతుంది. వినియోగదారుని ఆదాయం కొంత శాతం మార్పు చెందినప్పుడు, వస్తువు డిమాండ్ పరిమాణం ఎంత శాతం మార్పు చెందుతుందో ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం తెలియజేయును. ఈ ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం మేలు రకం వస్తువుల విషయంలో ధనాత్మకంగా, నాసిరకం వస్తువుల విషయంలో రుణాత్మకంగా ఉంటుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 11

3. జాత్యంతర వ్యాకోచ డిమాండ్: ఒక వస్తువుకున్న డిమాండ్ దాని ధరపైనే కాకుండా, దానికున్న ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరపైన కూడా ఆధారపడి ఉంటుంది. ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరల్లో వచ్చే అనుపాతపు మార్పు లేదా శాతం మార్పు ఆ వస్తు డిమాండ్లో ఎంత అనుపాత మార్పు కల్గిస్తుందో జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం తెలియజేయును. ప్రత్యామ్నాయ వస్తువులైన టీ, కాఫీల విషయంలో ధనాత్మక సంబంధాన్ని, పూరక వస్తువుల విషయాలలో రుణాత్మక సంబంధాన్ని కలిగి ఉంటాయి.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 12

ప్రశ్న 6.
ధర డిమాండ్ వ్యాకోచత్వం అంటే ఏమిటి ? ధర డిమాండ్ వ్యాకోచత్వంలోని రకాలను వివరించండి. Mar, ’15
జవాబు:
ధర డిమాండ్ వ్యాకోచత్వం అనే భావనను ఆల్ఫ్రెడ్ మార్షల్ అభివృద్ధిపరిచారు. ధర డిమాండ్ వ్యాకోచత్వం అనగా ధరలో వచ్చే అనుపాతపు మార్పువల్ల డిమాండ్లో వచ్చే అనుపాత మార్పు ఎంత ఉంటుందో తెలియజేస్తుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 13

వ్యాకోచత్వ విలువ ఆధారంగా ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని ఐదు రకాలుగా చెప్పవచ్చు.

  1. పూర్తి వ్యాకోచ డిమాండ్ (Ep = o)
  2. పూర్తి అవ్యాకోచ డిమాండ్ (Ep = 0)
  3. ఏకత్వ వ్యాకోచ డిమాండ్ (Ep = 1)
  4. సాపేక్ష వ్యాకోచ డిమాండ్ (Ep = >1)
  5. సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ (Ep = <1)

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

1. పూర్తి వ్యాకోచ డిమాండ్: ధరలో స్వల్ప మార్పు వచ్చినా లేదా రాకపోయినా డిమాండ్లో ఊహించలేనంతగా మార్పు కలిగితే దానిని పూర్తి వ్యాకోచ డిమాండ్ అంటారు. దీని వ్యాకోచ విలువ అనంతంగా ఉంటుంది. ఇక్కడ ‘ డిమాండ్ రేఖ ‘X’ అక్షంకు సమాంతరంగా ఉంటుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 13

పై రేఖాపటంలో డిమాండ్ రేఖ ‘X’ అక్షానికి సమాంతరంగా ఉంటుంది.
Ed = ∞

2. పూర్తి అవ్యాకోచ డిమాండ్: ధర పెరిగినా లేదా తగ్గినా డిమాండ్లో ఎలాంటి మార్పు రాకుంటే దానిని పూర్తి అవ్యాకోచ డిమాండ్ అంటారు. దీని విషయంలో వ్యాకోచత్వ విలువ ‘0’ గా ఉంటుంది. డిమాండ్ రేఖ ‘y’ అక్షానికి సమాంతరంగా ఉంటుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 15

‘DD’ రేఖ ‘Y’ అక్షానికి సమాంతరంగా ఉంది. పూర్తి అవ్యాకోచ డిమాండ్ ఉన్నప్పుడు వ్యాకోచత్వం విలువ ‘0’ కు సమానం.
∴ Ed = 0

3. ఏకత్వ వ్యాకోచ డిమాండ్: వస్తువు ధరలో వచ్చే అనుపాతపు మార్పుకు, డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాతపు మార్పుకు సమానమైతే దానిని ఏకత్వ వ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ డిమాండ్ వ్యాకోచత్వం విలువ ‘1’ కి సమానంగా ఉంటుంది. ఈ డిమాండ్ రేఖ “లంబ అతిపరావలయంగా” ఉంటుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 16
పై రేఖాపటంలో OQ1 = PP1 కి సమానం. అందువల్ల Ed = 1.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

4. సాపేక్ష వ్యాకోచ డిమాండ్: వస్తువు ధరలో వచ్చే అనుపాతపు మార్పు కంటే డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాతపు మార్పు ఎక్కువగా ఉంటే దానిని సాపేక్ష వ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ వ్యాకోచత్వం విలువ ‘1’ కంటే ఎక్కువగా ఉంటుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 17
పై రేఖాపటంలో ‘DD’ రేఖ సాపేక్ష వ్యాకోచ డిమాండ్ను సూచించును. OQ1 > PP1 గా ఉంది. ఇక్కడ వ్యాకోచత్వ విలువ 1 కంటే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ΔP కంటే ΔQ ఎక్కువగా ఉంటుంది.

5. సాపేక్ష అవ్యాకోచ డిమాండ్: వస్తువు ధరలో వచ్చిన అనుపాతపు మార్పు కంటే డిమాండ్ పరిమాణంలో వచ్చిన అనుపాత మార్పు తక్కువగా ఉంటుంది. దానిని సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ డిమాండ్ వ్యాకోచ విలువ ‘1’ కంటే తక్కువగా ఉంటుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 18

‘DD’ రేఖ సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ను సూచిస్తుంది. ఇక్కడ వ్యాకోచత్వ విలువ ‘1’ కంటే తక్కువగా ఉంటుంది.

ప్రశ్న 7.
ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలిచే మూడు పద్ధతులను వివరించండి.
జవాబు:
డిమాండ్ సూత్రం కేవలం ధర మార్పు వల్ల డిమాండ్ దిశను తెలియజేస్తుందిగాని, డిమాండ్లో వచ్చే పరిమాణాత్మకమైన మార్పును తెలియజేయదు. ఈ మార్పును తెలియజేయటానికి “మార్షల్ డిమాండ్ వ్యాకోచత్వ భావనను అర్ధశాస్త్రంలో ప్రవేశపెట్టెను. వస్తువు ధరలో వచ్చిన మార్పు వలన డిమాండ్లో వచ్చే పరిమాణాత్మకమైన లేదా సంఖ్యాత్మకమైన మార్పును తెలియజేయునది డిమాండ్ వ్యాకోచత్వ భావన.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

ధరలో వచ్చిన అనుపాతం మార్పుకు, డిమాండ్లో వచ్చిన అనుపాతం మార్పుకు మధ్యగల సంబంధాన్ని ధర డిమాండ్ వ్యాకోచత్వం అని అంటారు. వ్యాకోచత్వాన్ని ఈ క్రింది విధంగా కొలవటం జరుగుతుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 19

డిమాండ్ వ్యాకోచత్వము కొలిచే పద్ధతులు:
1. మొత్తం ఖర్చు పద్ధతి: వ్యాకోచత్వాన్ని కొలవటానికి మార్షల్ మొత్తం ఖర్చు పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఒక వస్తువు ధరలో మార్పు వల్ల మొత్తము ఖర్చు ఏ విధంగా మారుతుందో తెలుసుకోవటం వల్ల వ్యాకోచత్వాన్ని కొలవడం జరిగింది. వస్తువు పరిమాణాన్ని ధరతో గుణిస్తే మొత్తం ఖర్చు వస్తుంది. వస్తువు ధరకు, మొత్తం ఖర్చుకు విలోమ సంబంధం ఉంటే డిమాండ్ వ్యాకోచత్వం 1 కంటే ఎక్కువ, (వ్యాకోచ డిమాండ్); అనులోమ సంబంధం ఉంటే 1 కంటే తక్కువ (అవ్యాకోచ డిమాండ్) ధర మారినప్పటికీ మొత్తం ఖర్చులో మార్పు లేకపోయినట్లయితే 1 కి సమానం (ఏకత్వ వ్యాకోచ డిమాండ్). ఈ విషయాన్ని ఈ క్రింది ఊహాజనితమైన డిమాండ్ పట్టిక ద్వారా గ్రహించవచ్చును.

డిమాండ్ పట్టిక:
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 20

2. బిందు వ్యాకోచ పద్ధతి: మార్షల్ రేఖాగణిత పద్ధతిలో డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలిచే పద్ధతిని తెలియచేసాడు. బిందు వ్యాకోచ పద్ధతిలో సరళంగా ఉన్న డిమాండ్ రేఖ రెండు చివరలు X మరియు Y అక్షాలను తాకునట్లుగా పొడిగించి, ఆ రేఖపై ఒక బిందువు వద్ద డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలవటం బిందు వ్యాకోచపద్ధతిలో వ్యాకోచత్వాన్ని కొలవటమంటారు. పటములో AB సరళరేఖగా ఉంది. డిమాండ్ రేఖ X, Y అక్షాలను తాకుతుంది. AB డిమాండ్ రేఖపై గల ‘P’ అనే బిందువు వద్ద వ్యాకోచత్వాన్ని ఈ క్రింద ఇవ్వబడిన సూత్రం ద్వారా గణన చేయవచ్చును.
AB డిమాండ్ రేఖపై ‘P’ బిందువు వద్ద వ్యాకోచము.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 21

ఈ పద్దతిలో డిమాండ్ రేఖ పొడవును బట్టి ఆ రేఖపై ఉన్న వివిధ బిందువుల వద్ద డిమాండ్ వ్యాకోచత్వాన్ని గణన చేయవచ్చును.

డిమాండ్ రేఖ సరళరేఖ అయినప్పుడు డిమాండ్ వ్యాకోచత్వం: సరళరేఖగా ఉన్న డిమాండ్ రేఖపై ఏ బిందువు వద్దనైనా బిందు వ్యాకోచ పద్దతిని ఉపయోగించి వ్యాకోచత్వాన్ని కొలవవచ్చు.
ఉదా: AE డిమాండ్ రేఖ పొడవు 4 Cm పొడవని ఊహిద్దాం.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

క్రింది రేఖాపటంలో డిమాండ్ వ్యాకోచత్వం ఈ క్రింది విధంగా ఉంటుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 22

డిమాండ్ రేఖ వక్ర రేఖ అయితే: డిమాండ్ రేఖ వక్రరేఖ అయితే పై సూత్రాన్ని ఉపయోగించి ఏ బిందువు వద్దనైనా స్పర్శరేఖ సహాయంతో వ్యాకోచత్వాన్ని కొలవవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 23
పై రేఖాపటంలో DD డిమాండ్ రేఖ. AB రేఖ DD రేఖను ‘C’ బిందువు వద్ద తాకింది.
‘C’ బిందువు వద్ద వ్యాకోచం = CB/CA = 1

3. ఆర్క్ పద్ధతి: డిమాండ్ రేఖపై రెండు బిందువుల మధ్య దూరాన్ని ఆర్క్ అంటారు. డిమాండ్ రేఖపై ఏదో ఒక బిందువు వద్ద కాకుండా రెండు బిందువుల మధ్య భాగంలో ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలవడానికి ‘ఆర్క్’ పద్ధతిని ఉపయోగిస్తారు.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 24

ఉదా: ఒక వస్తువు ధర 4/- ఉన్నప్పుడు 300 యూనిట్లు కొనుగోలు చేయబడ్డాయి. అదే ధర 3/- తగ్గినప్పుడు 400 యూనిట్లు కొనుగోలు చేయబడ్డాయి. అప్పుడు వ్యాకోచాన్ని ఈ విధంగా కొలవవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 25AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 26

దీనిని ఈ క్రింది పటం ద్వారా చూపవచ్చు.

ప్రశ్న 8.
ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని నిర్ణయించే అంశాలు ఏవి?
జవాబు:
ఒక వస్తువు ధరలో మార్పు కలిగినప్పుడు ఏ మేరకు డిమాండ్లో ప్రతిస్పందన వస్తుందో తెలియచేసేదే డిమాండ్ వ్యాకోచత్వము. ధర మార్పు శాతానికి, డిమాండ్లో వచ్చే మార్పు శాతానికి మధ్యగల నిష్పత్తినే వ్యాకోచత్వంగా నిర్వచించవచ్చును. డిమాండ్ వ్యాకోచత్వము అన్ని వస్తువులకు ఒకే విధంగా ఉండదు. ధర డిమాండ్ వ్యాకోచత్వ స్వభావాన్ని లేదా స్థాయిని ఈ క్రింది అంశాలు నిర్ణయిస్తాయి.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

డిమాండ్ వ్యాకోచత్వాన్ని నిర్ణయించే కారకాలు:
1. వస్తువు స్వభావము: వస్తువులలో కొన్ని అవసరాలు, మరికొన్ని సౌకర్యాలు, ఇంకొన్ని విలాసాలు ఉంటాయి. నిత్యావసర వస్తువులకు ధర పెరిగినా, డిమాండ్ తగ్గదు. కనుక వాటికి అవ్యాకోచ డిమాండ్ ఉంటుంది. ఇవి లేకపోతే మానవ మనుగడ కష్టం. సౌకర్యాలు, విలాసాలకు డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఇవి లేకపోయినా ప్రజలు బ్రతకగలరు. కనుక వీటి ధర మార్పు కంటే డిమాండ్లో వచ్చే మార్పు అధికంగా ఉంటుంది.

2. ప్రత్యామ్నాయ వస్తువులు: ప్రత్యామ్నాయ వస్తువులు అధిక సంఖ్యలో ఉన్న వస్తువులకు డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ప్రత్యామ్నాయ వస్తువులు లేనప్పుడు డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది.

3. కొనుగోలు వాయిదా వేయటానికి అవకాశం: కొనుగోలును వాయిదా వేయటానికి అవకాశం ఉన్న వస్తువుల విషయంలో ధర డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. కొనుగోలును వాయిదా వేయటానికి వీలులేని వస్తువులకు డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది.

4. బహుళ ప్రయోజనాలున్న వస్తువులు: బొగ్గు, విద్యుచ్ఛక్తి మొదలగు బహుళ ప్రయోజనాలు గల వస్తువులకు డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఒకే ప్రయోజనం లేక ఉపయోగం గల వస్తువులకు డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది.

5. కాలము: స్వల్ప కాలంలో డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది. దీర్ఘ కాలంలో వ్యాకోచత్వం ఎక్కువగా ఉంటుంది.

6. పూరక వస్తువులు: పూరక వస్తువుల విషయంలో డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది.

7. ధరస్థాయి: ధర స్థాయి ఎక్కువగా ఉంటే వ్యాకోచమైన డిమాండ్ ఉంటుంది. ధర స్థాయి తక్కువగా ఉంటే అవ్యాకోచమైన డిమాండ్ ఉంటుంది.

8. వినియోగదారుని బడ్జెట్లో వస్తువుకు గల ప్రాధాన్యం: వినియోగదారుని ఆదాయంలో ఒక వస్తువుపై చేసే ఖర్చు శాతం తక్కువగా ఉంటే డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఆదాయంలో హెచ్చు శాతం ఖర్చు చేసే వస్తువుల విషయంలో డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది.

9. వస్తువు మన్నికపై ఆధారపడును: మన్నికగల, నిల్వ చేయటానికి వీలైన అనశ్వర వస్తువులపై చేసే డిమాండ్ అవ్యాకోచంగాను, నశ్వర వస్తువులకు డిమాండ్ వ్యాకోచంగాను ఉంటుంది.

10. పేదవారి వస్తువులు: పేదవారు వినియోగించే వస్తువులకు డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఈ వస్తువుల ధరలు తగ్గినపుడు వాటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.

ప్రశ్న 9.
ధర డిమాండ్ ‘వ్యాకోచత్వం ప్రాముఖ్యాన్ని వివరించండి.
జవాబు:
1. ఉత్పత్తిదార్లకు: ఉత్పత్తిదార్లు వస్తువులకున్న డిమాండ్ వ్యాకోచత్వాన్ని అనుసరించి ఉత్పత్తి చేస్తారు. ఏ వస్తువులకైతే డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుందో ఆ వస్తువులను ఉత్పత్తి చేస్తారు. ఎందుకంటే అటువంటి వస్తువుల ధరను పెంచి లాభం పొందగలుగుతారు.

2. సమిష్టి వస్తువుల ధర నిర్ణయం: జంటగా కొన్ని వస్తువులు ఉత్పత్తి చేయబడతాయి. ఉదా: పంచదార, మొలాసిన్, ఈ వస్తువుల విషయంలో ఒక్కొక్క వస్తువు ఉత్పత్తి వ్యయాన్ని విడదీసి చెప్పడానికి వీలుండదు. అందువల్ల ఈ వస్తువుల ధర నిర్ణయంలో డిమాండ్ వ్యాకోచంగా ఉన్న వాటికి తక్కువ ధరను, అవ్యాకోచంగా ఉన్న వాటికి ఎక్కువ ధర నిర్ణయించడం జరుగుతుంది.

3. ఏకస్వామ్యదార్లు: ఏకస్వామ్యదార్లు వస్తువుకున్న డిమాండ్ వ్యాకోచత్వం ఆధారంగా ధర నిర్ణయిస్తారు. అవ్యాకోచత్వం ఉన్న వస్తువులకు ఎక్కువ ధరను, వ్యాకోచత్వం ఎక్కువ ఉన్న వస్తువులకు తక్కువ ధరను నిర్ణయిస్తారు.

4. ప్రభుత్వం: కొన్ని వస్తువులు ప్రజాసంక్షేమాన్ని పెంపొందిస్తాయి. అందువల్ల ఈ వస్తువులకు డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది. ఉదా: మందులు, రైలు ప్రయాణం మొదలైనవి.

5. ఆర్థిక మంత్రికి పన్నులు విధించేటప్పుడు ఆర్థిక మంత్రికి వస్తువులకున్న డిమాండ్ వ్యాకోచత్వం ఉపయోగపడుతుంది. అంతేకాక ఆర్థిక మంత్రికి కోశ విధాన రూపకల్పనలో డిమాండ్ వ్యాకోచత్వ భావన తోడ్పడుతుంది.

6. అంతర్జాతీయ వ్యాపారం అంతర్జాతీయ వ్యాపారంలో వివిధ దేశాల మధ్య వస్తువుల మారకపు రేటును నిర్ధారించేటప్పుడు వస్తువులకున్న డిమాండ్ వ్యాకోచత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఉదా: ఏ దేశమైనా మూల్యహీనీకరణ ద్వారా ప్రయోజనం పొందాలనుకుంటే ఎగుమతి చేసే వస్తువులకు దిగుమతి చేసుకొంటున్న వస్తువులకు ధర డిమాండ్ వ్యాకోచత్వం ‘1’ కంటే ఎక్కువగా ఉండాలి.

7. పేదరికం: సంపద మాటున దాగిఉన్న పేదరికంను అర్థం చేసుకోవడానికి డిమాండ్ వ్యాకోచత్వ భావన ఉపయోగపడుతుంది.

8. వేతనాలు: శ్రామికులకున్న డిమాండ్ వ్యాకోచత్వం వారి వేతనాలను ప్రభావితం చేస్తుంది. అందువల్ల యాజమాన్యం వేతనాలను నిర్ణయించేటప్పుడు శ్రామికులకున్న డిమాండ్ వ్యాకోచత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
డిమాండ్ సూత్రాన్ని లేదా ధర-డిమాండ్ భావనను వివరించండి.
జవాబు:
అర్థశాస్త్రంలో డిమాండ్ భావనకు చాలా ప్రాధాన్యత ఉన్నది. ఒక వస్తువును కొనాలనే కోరికతోపాటు కొనేశక్తి, కొనాలన్న ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే వస్తువుకు డిమాండ్ ఏర్పడుతుంది. కనుక డిమాండ్ను ఈ క్రింది విధముగా నిర్వచించవచ్చు. “ఒక నిర్ణీత కాలంలో, నిర్ణీతమైన ధరవద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తువు పరిమాణాన్ని ఆ వస్తువుకు లేదా సేవకు ఉన్న డిమాండ్” అని బెన్హమ్ పేర్కొన్నాడు.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

ధర డిమాండ్-డిమాండ్ సూత్రము: డిమాండ్ సూత్రం వస్తువు ధరకు, డిమాండ్కు గల సంబంధాన్ని తెలియజేస్తుంది. “ఇతర అంశాలు స్థిరముగా ఉంటే, వస్తువు ధర పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది. ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది.” అని మార్షల్ డిమాండ్ సూత్రాన్ని నిర్వచించెను. డిమాండ్ సూత్రాన్ని ఈ విధంగా పేర్కొనవచ్చును.
Dn = f[Pn]

డిమాండ్ పట్టిక:
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 27AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 28

వినియోగదారుడు లేదా వినియోగదారులు ఒక వస్తువును వివిధ ధరల వద్ద ఏ పరిమాణంలో కొనుగోలు చేస్తారో తెలియజేస్తుంది డిమాండ్ పట్టిక. పట్టిక నుంచి వస్తువు ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుందని ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుందని తెలుస్తుంది. దీనిని ఆధారంగా చేసుకొని డిమాండ్ రేఖను గీయవచ్చును.

డిమాండ్ రేఖ: పటములో X – అక్షముపై వస్తువు డిమాండ్ పరిమాణం, Y – అక్షముపై వస్తువు ధరను చూపినాము. DD డిమాండ్ రేఖ. డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి క్రిందివైపుకు వాలి ఉంది. ఇది ఋణాత్మకమైన వాలు. వస్తువు ధరకు, డిమాండ్కు మధ్య విలోమ సంబంధమున్నదని ఋణాత్మకమైన వాలు తెలియజేస్తుంది.

ప్రశ్న 2.
డిమాండ్ సూత్రం మినహాయింపులను వివరించండి.
జవాబు:
డిమాండ్ సూత్రం ప్రకారం వస్తు ధరకు, డిమాండ్కు విలోమ సంబంధాన్ని కలిగి ఉంటాయి. కాని కొన్ని పరిస్థితులలో ధర, డిమాండ్ అనులోమ సంబంధాన్ని కలిగి ఉంటాయి. అంటే ధర పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. ధర తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. ఈ పరిస్థితి డిమాండ్ సూత్రానికి మినహాయింపు.

ధర ‘OP’ ఉన్నప్పుడు ‘OQ’ వస్తు పరిమాణం డిమాండ్ చేయబడింది. ధర ‘OP’ నుంచి OP1 కు పెరగగా డిమాండ్ OQ నుంచి OQ1 కు పెరిగింది. ఈ పరిస్థితి డిమాండ్ సూత్రానికి విరుద్ధం.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 29

మినహాయింపులు:
1. గిఫెన్ వైపరీత్యం: పేద కార్మికులు రొట్టె ధర పెరిగితే మాంసముపై వెచ్చించే డబ్బును కూడా రొట్టెపై ఖర్చు చేస్తారు. అనగా రొట్టె ధర పెరిగినా డిమాండ్ తగ్గదు. ఇది పేదవాళ్ళ ఆహారం కావటమే ఇందుకు కారణము. ఈ సత్యాన్ని సర్ రాబర్ట్ గిఫెన్ అనే ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఆర్థికవేత్త 19వ శతాబ్దం మధ్య భాగంలో పరిశీలించాడు. కనుక దీనిని గిఫెన్ వైపరీత్యం అంటారు. పేదవారు ముఖ్యంగా నిత్యావసర వస్తువులలో తక్కువ ధర గల వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ ప్రత్యేకమైన వస్తువులనే గిఫెన్ వస్తువులంటారు. ఉదా: రాగులు, జొన్నలు మొదలైనవి.

2. గౌరవ సూచిక వస్తువులు: గౌరవ సూచిక వస్తువుల ధర పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. వీటిని కొనుగోలు చేయటం వలన సమాజంలో గౌరవము, ప్రతిష్ఠ పెరుగుతాయని భావిస్తారు. వీటి ధర తగ్గితే గౌరవం, ప్రతిష్ఠ తగ్గుతాయని భావిస్తారు. ఉదా: విలువ గల వజ్రాలు, ఆభరణాలు మొదలైనవి. ఇది డిమాండ్ సూత్రానికి వ్యతిరేకము. ఈ విషయాన్ని వెబెన్ అనే అమెరికా ఆర్థికవేత్త తెలియజేసెను. అందువల్ల ఇటువంటి వస్తువులను వెబ్లెన్ వస్తువులంటారు.

3. అంచనా వ్యాపారం: ఒక వస్తువు ధర మరింత పెరగడానికి వ్యాపారస్తులు, కొనుగోలుదారులు ఆ వస్తువును ఎక్కువగా డిమాండ్ చేస్తారు. అదే విధంగా ధర తగ్గినప్పుడు ఇంకా తగ్గుతుందని భావిస్తే కొనుగోలు తగ్గిస్తారు. దీనినే సట్టా వ్యాపారం అని కూడా అంటారు. ఉదా: షేర్లు, బాండ్లు మొదలైనవి.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

4. భ్రాంతి: కొంతమంది వినియోగదారులు కొన్నిసార్లు ఎక్కువ ధర కలిగి ఉన్న వస్తువులు ఎక్కువ నాణ్యతతో కూడి ఉంటాయన్న భ్రాంతిలో ఉంటారు. అందువల్ల ధర ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఇటువంటి వాటి విషయంలో డిమాండ్ సూత్రం వర్తించదు.

ప్రశ్న 3.
డిమాండ్ రేఖ ఎందుకని రుణాత్మక వాలు కలిగి ఉంటుంది. లేదా ఎందుకని ఎడమ నుంచి కుడికి కిందికి వాలుతుంది ?
జవాబు:
ఒక నిర్ణీత కాలంలో, నిర్ణీతమైన ధర వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తువు పరిమాణాన్ని డిమాండ్ అంటారు. “ఇతర పరిస్థితులు మారకుండా స్థిరంగా ఉన్నప్పుడు ఒక నిర్ణీత కాలంలో ఒక వస్తువు ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది.” అని డిమాండ్ సూత్రం తెలియజేస్తుంది. దీనిని బట్టి వస్తువు థరకు, డిమాండ్కు విలోమ సంబంధం ఉందని తెలుస్తుంది. కనుక డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి క్రిందివైపుకు వాలి ఉంటుంది. దీనికి అనేక కారణాలున్నాయి. అవి:

1. క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం: క్షీణోపాంత ప్రయోజనాన్ని ఆధారంగా చేసుకొని డిమాండ్ సూత్రం చెప్పబడినది. వస్తువు పరిమాణం ఎక్కువైతే ఉపాంత ప్రయోజనం తగ్గుతుంది. ఉపాంత ప్రయోజనం తక్కువగా ఉంటే వినియోగదారుడు ఆ వస్తువుకు ధర చెల్లించాలనుకున్నాడు. అందువల్ల ధర తక్కువగా ఉంటే ఎక్కువగానూ, ధర ఎక్కువగా ఉంటే తక్కువగాను వస్తు పరిమాణాన్ని బట్టి డిమాండ్ చేస్తాడు.

2. ఆదాయ ప్రభావము: ఒక వస్తువు ధర పెరిగితే వినియోగదారుని వాస్తవిక ఆదాయం ధర పెరిగిన మేరకు తగ్గుతుంది. అందువల్ల వాస్తవిక ఆదాయం తగ్గినమేరకు ఆ వస్తువును తక్కువ పరిమాణంలో డిమాండ్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఒక వస్తువు ధర తగ్గితే ధర తగ్గిన మేరకు వాస్తవిక ఆదాయం పెరిగినట్లే అవుతుంది. కనుక ఆ మేరకు డిమాండ్ పెరుగుతుంది. దీనినే డిమాండ్పై ఆదాయ ప్రభావం అంటారు. ఉదా: ఒక వస్తువుకు వినియోగదారుడు 5 రూపాయలు కేటాయిస్తే వస్తువు ధర ఒక రూపాయిగా ఉంటే 5 యూనిట్లు కొనుగోలు చేస్తాడు. వస్తువు ధర అర్థ రూపాయికి తగ్గితే 10 యూనిట్లను కొనుగోలు చేస్తారు.

3. ప్రత్యామ్నాయాల ప్రభావం రెండు వస్తువులు ప్రత్యామ్నాయ వస్తువులు అయితే ఒక వస్తువు ధర తగ్గి మరొక వస్తువు ధర స్థిరంగా ఉంటే ధర తగ్గిన వస్తువుకు ధర స్థిరంగా ఉన్న వస్తువుకు బదులుగా ప్రత్యామ్నాయం చేస్తారు. ఉదా: పెప్సి, థమ్సప్ శీతల పానీయాలు. పెప్సి ధర పెరిగితే వినియోగదార్లు దానికి ప్రత్యామ్నాయంగా థమ్సప్ కొనుగోలు చేస్తారు.

4. పాత, నూతన కొనుగోలుదార్లు: ఒక వస్తువు ధర తగ్గగానే ముందు నుంచి ఆ వస్తువును కొనుగోలు చేస్తున్న పాత వినియోగదారుల వాస్తవిక ఆదాయం పెరిగి ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా ఒక వస్తువు ధర తగ్గినప్పుడు ఆకర్షితులైన కొత్త వినియోగదార్లు ఆ వస్తువును ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అందువల్ల ధర తగ్గినప్పుడు వస్తువుకు డిమాండ్ పెరుగుతుంది.

5. వస్తువుకున్న బహుళ ఉపయోగాలు: కొన్ని వస్తువులకు బహుళ ఉపయోగాలుంటాయి. మరికొన్ని వస్తువులు ఒక ప్రత్యేకమైన ఉపయోగానికి మాత్రమే వినియోగించబడతాయి. అనేక ఉపయోగాలున్న వస్తువులకు ధర తగ్గితే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఉదా: పాలు, బొగ్గు, విద్యుచ్ఛక్తి మొదలైనవి.

ప్రశ్న 4.
ఆదాయ డిమాండ్ భావనను వివరించండి.
జవాబు:
వినియోగదారుని ఆదాయానికి, వస్తువు డిమాండ్కు మధ్యనున్న సంబంధాన్ని ఆదాయ డిమాండ్ అంటారు. వివిధ ఆదాయాల వద్ద వస్తువు డిమాండ్ పరిమాణం ఏవిధంగా ఉందో ఆదాయ డిమాండ్ తెలియజేస్తుంది.
D1 = f(y)

ఇతర అంశాలు మారకుండా స్థిరంగా ఉంటే ఆదాయం పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. ధరకు, ఆదాయంకు ధనాత్మక సంబంధం ఉంది. ఆదాయ డిమాండ్ను అనుసరించి వస్తువులలో మేలురకం లేదా నాసిరకం వస్తువులుగా గుర్తించవచ్చు.

మేలురకం వస్తువులు / సాధారణ వస్తువులు: ఆదాయం పెరిగితే మేలురకం వస్తువులు లేదా సాధారణ వస్తువుల డిమాండ్ పెరుగుతుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 30

ప్రక్క రేఖాపటంలో ‘OX’ అక్షంపై డిమాండ్ పరిమాణంను, ‘OY అక్షంపై ఆదాయంను తీసుకొన్నాం. ఆదాయం ‘OY’ ఉన్నప్పుడు ‘OQ’ వస్తు పరిమాణం డిమాండ్ చేయబడింది. ఆదాయం ‘OY’ నుంచి ‘OY1‘ కు పెరిగినప్పుడు మేలురకం వస్తువుల డిమాండ్ ‘OQ’ నుంచి ‘OQ1‘ కు పెరిగింది. ‘YD’ రేఖ ధనాత్మక వాలు కలిగి ఉంటుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

నాసిరకం వస్తువులు: మేలురకం వస్తువులకు భిన్నంగా వినియోగదార్ల ఆదాయం పెరిగితే నాసిరకం వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది. ప్రక్క రేఖాపటంలో ‘OX’ అక్షం మీద డిమాండ్ పరిమాణాన్ని, ‘OY’ అక్షం మీద ఆదాయంను తీసుకొన్నాం. ఆదాయం ‘OY’ నుంచి ‘OY1‘ కు పెరిగినప్పుడు డిమాండ్ ‘OQ’ నుంచి ‘OQ1‘ కు తగ్గును. ‘YD’ రేఖ ఎడమ నుండి కుడికి వాలి ఉంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 31

ప్రశ్న 5.
జాత్యంతర డిమాండ్ భావనను వివరించండి.
జవాబు:
ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలకు, ఒక వస్తువు డిమాండ్కు మధ్య ఉన్న సంబంధాన్ని జాత్యంతర డిమాండ్ అంటారు. ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో వచ్చిన మార్పుల వల్ల ఒక వస్తువు డిమాండ్లో వచ్చే మార్పులను జాత్యంతర డిమాండ్ తెలియజేయును.

జాత్యంతర డిమాండ్ను ఈ విధంగా వ్రాయవచ్చు.
Dx = f(Py).

ప్రత్యామ్నాయ వస్తువులు: ఒక కోర్కెను తీర్చగల వివిధ వస్తువులను ప్రత్యామ్నాయ వస్తువులు అంటారు. ఉదా: కాఫీ, టీ. ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ ధనాత్మక సంబంధాన్ని తెలియజేయును. దీనిని రేఖాపటం ద్వారా చూపవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 32

పై రేఖాపటంలో కాఫీ ధర ‘OY’ నుంచి ‘OY2‘ కు పెరిగినప్పుడు టీ డిమాండ్ ‘OQ’ నుండి ‘OQ2‘ కు పెరిగింది. ‘CD’ రేఖ ధనాత్మక వాలును కలిగి ఉంది.

పూరక వస్తువులు: ఒకే కోరికను తీర్చగల సమిష్టి వస్తువులు. ఉదా: కారు, పెట్రోలు, వీటి విషయంలో డిమాండ్ విలోమ సంబంధాన్ని తెలియజేయును.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 33

పై రేఖాపటంలో డిమాండ్ ‘OQ’ నుండి ‘OQ2‘ కు పెరిగింది. ధర ‘OP’ నుండి ‘OP2‘ కు తగ్గినప్పుడు ‘CD’ రేఖ ఋణాత్మక వాలు కలిగి ఉంది.

ప్రశ్న 6.
డిమాండ్ నిర్ణయించే అంశాలను వివరించండి. [Mar. ’17, ’16]
జవాబు:
“ఒక నిర్ణీతమైన కాలంలో, నిర్ణీతమైన ధర వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తు పరిమాణాన్ని ఆ వస్తువుకు లేదా సేవకు ఉన్న డిమాండ్” అంటారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

డిమాండ్ను నిర్ణయించే కారకాలు లేదా అంశాలు:
1. ఆధాయంలో మార్పు: ప్రజల ఆదాయాల మార్పును బట్టి పస్తువుల డిమాండ్లో మార్పు ఏర్పడుతుంది. ప్రజల ఆదాయం పెరిగితే వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. ఆదాయాలు తగ్గితే వస్తువుల డిమాండ్ తగ్గుతుంది.

2. అభిరుచులు, అలవాట్లలో మార్పులు: ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో వచ్చే మార్పుల వలన వస్తువు డిమాండ్ లో మార్పు వస్తుంది.

3. ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో మార్పులు: ప్రజల అభిరుచులలో అలవాట్లలో మార్పుల వల్ల వస్తువు డిమాండ్లో మార్పులు వస్తాయి.

4. జనాభాలో మార్పు: జనాభా పెరుగుదల, తగ్గుదలను అనుసరించి కూడా వస్తువుల డిమాండ్లో మార్పులు వస్తాయి.

5. వాతావరణంలో మార్పులు: వాతావరణంలో మార్పులు కూడా డిమాండ్లో మార్పులను తీసుకొని వస్తాయి. ఉదా: వేసవికాలంలో చల్లని పానీయాలకు డిమాండ్ పెరుగుతుంది.

6. సాంకేతికాభివృద్ధి: సాంకేతికాభివృద్ధి వలన వస్తూత్పత్తి వ్యయం తగ్గి, వస్తు ధరలు తగ్గుతాయి. అందువల్ల పూర్వం కొనుగోలు చేయడానికి ఉపయోగించిన ద్రవ్య పరిమాణంలో వస్తువులను ఎక్కువగా డిమాండ్ చేయటానికి అవకాశం ఉంటుంది.

7. ఆర్థిక స్థితిగతులు: వాణిజ్య విజృంభణ కాలంలో అన్ని వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. కానీ, ఆర్థిక మాంద్య పరిస్థితులలో అన్ని వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది.

8. ప్రభుత్వ విధానము: ప్రభుత్వ పన్నుల విధానం, రాయితీ విధానము మొదలైనవి వస్తువు ధర తగ్గితే డిమాండ్ ప్రభావితం చేయును.

9. వస్తువు ధర: ఒక వస్తువు ధరకు, డిమాండ్కు విలోమ సంబంధం ఉన్నది. కనుక వస్తువు ధర తగ్గితే, డిమాండ్ పెరుగుతుంది. వస్తువు ధర పెరుగుటచే డిమాండ్ తగ్గుతుంది.

ప్రశ్న 7.
డిమాండ్ వ్యాకోచత్వం అర్థాన్ని తెలిపి, నిర్వచించండి.
జవాబు:
అర్థశాస్త్రంలో డిమాండ్ వ్యాకోచత్వం అనే భావనకు విశేష ప్రాధాన్యత ఉంది. ధరలో వచ్చిన మార్పు స్పందనకు ప్రతిస్పందనగా డిమాండ్లో ఎంత మేరకు మార్పు వస్తుందో డిమాండ్ వ్యాకోచత్వ భావన తెలుపుతుంది. ఒక వస్తువు ధరలో వచ్చిన అనుపాతపు మార్పు వల్ల డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాతపు మార్పు ఎంత ఉంటుందో డిమాండ్ వ్యాకోచత్వ భావన తెలియజేయును. అంటే ధరలో వచ్చే శాతం మార్పుకు, డిమాండ్లో వచ్చే శాతం మార్పుకు మధ్య ఉన్న సంఖ్యాత్మక సంబంధాన్ని డిమాండ్ వ్యాకోచత్వం తెలుపుతుంది. డిమాండ్ వ్యాకోచత్వం అనే భావనను కీరనీట్, మిల్ రూపొందించినప్పటికీ, మార్షల్ అభివృద్ధిపరిచారు.

మార్షల్ అభిప్రాయంలో “ధర తగ్గినప్పుడు డిమాండ్ ఎక్కువ పెరిగిందా లేదా తక్కువ పెరిగిందా, ధర పెరిగినప్పుడు డిమాండ్ తక్కువ తగ్గిందా లేదా ఎక్కువ తగ్గిందా అనే దాని ఆధారంగా మార్కెట్ డిమాండ్ వ్యాకోచత్వం ఎక్కువగాని, తక్కువగాని ఉంటుంది.”

శ్రీమతి జోన్ రాబిన్సన్ అభిప్రాయంలో “ధరలో వచ్చే అనుపాత మార్పు స్పందనకు బదులుగా డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాతపు మార్పుకు ప్రతిస్పందన ఏ మేరకు ఉంటుందో తెలియజేసే భావన డిమాండ్ వ్యాకోచత్వం”.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 34

ప్రశ్న 8.
మొత్తం ఖర్చు పద్దతి ద్వారా ధర డిమాండ్ వ్యాకోచత్వాలను ఎలా కొలుస్తారు ?
జవాబు:
ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలిచే పద్ధతులలో మొత్తం ఖర్చు పద్ధతి ఒకటి. ఈ పద్ధతిలో వస్తువు ధర మార్పు వల్ల ఆ వస్తువుపై వినియోగదారుని మొత్తం ఖర్చులో వచ్చిన మార్పులను పరిశీలించడం ద్వారా డిమాండ్ వ్యాకోచత్వం కొలవబడుతుంది. వస్తువు ధరకు, మొత్తం ఖర్చుకు విలోమ సంబంధం ఉంటే డిమాండ్ వ్యాకోచత్వం ఒకటికన్నా ఎక్కువగా ఉంటే దానిని వ్యాకోచిత డిమాండ్ అంటారు. వస్తువు ధరకు, మొత్తం ఖర్చుకు అనులోమ సంబంధం ఉంటే డిమాండ్ వ్యాకోచత్వం ఒకటి కన్నా తక్కువగా ఉంటే దానిని అవ్యాకోచిత డిమాండ్ అంటారు. వస్తువు ధర మారినప్పటికీ మొత్తం ఖర్చులో మార్పు లేకపోతే డిమాండ్ వ్యాకోచత్వం ఒకటికి సమానముగా ఉంటే దానిని ఏకత్వ వ్యాకోచ డిమాండ్ అంటారు. ఈ విషయాన్ని ఈ క్రింది ఊహాజనిత డిమాండ్ పట్టిక ద్వారా గ్రహించవచ్చును.

డిమాండ్ పట్టిక:
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 35

పట్టికలోని విషయాన్ని క్రింది రేఖాపటం ద్వారా పరిశీలించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 36

పటములో Y – అక్షముపై వస్తువు ధరను, X – అక్షముపై మొత్తం ఖర్చును చూపటం జరిగింది. OP1 (60) ధర పెరిగినప్పుడు మొత్తం ఖర్చు తగ్గింది. కనుక డిమాండ్ వ్యాకోచితంగా ఉన్నది. అనగా Ep > 1. ధర OP (50) నుండి OP2 (40) కు తగ్గినపుడు మొత్తం ఖర్చులో మార్పు రాలేదు. కనుక ఏకత్వ వ్యాకోచ డిమాండ్ను సూచిస్తుంది. అనగా Ep = 1. ధర OP2(40) నుండి OP3 (30) కి తగ్గినపుడు మొత్తం ఖర్చు కూడా తగ్గింది. కనుక అవ్యాకోచ డిమాండ్ను సూచిస్తుంది. అనగా Ep < 1. డిమాండ్ రేఖ ABCD లో A నుండి B వరకు వ్యాకోచిత డిమాండ్, B నుండి C వరకు ఏకత్వ వ్యాకోచ డిమాండ్, C నుండి D వరకు అవ్యాకోచ డిమాండ్.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
డిమాండ్
జవాబు:
ఒక వస్తువును కొనాలనే కోరికతో పాటు కొనేశక్తి, ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే వస్తువుకు డిమాండ్ ఏర్పడుతుంది. బెన్హామ్ అభిప్రాయంలో ఒక నిర్ణీతకాలంలో, నిర్ణీతమైన ధర వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తు పరిమాణాన్ని డిమాండ్గా పేర్కొనెను.

ప్రశ్న 2.
డిమాండ్ పట్టిక [Mar. ’17]
జవాబు:
వస్తువు ధరకు, వస్తువు డిమాండ్కు మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపే పట్టికను డిమాండ్ పట్టిక అంటారు. ఈ డిమాండ్ పట్టిక రెండు రకాలు. 1) వైయుక్తిక డిమాండ్ పట్టిక, 2) మార్కెట్ డిమాండ్ పట్టిక.

ప్రశ్న 3.
వైయుక్తిక డిమాండ్ పట్టిక.
జవాబు:
ఒక వినియోగదారుడు ఒక వస్తువును వివిధ ధరల వద్ద ఎంతెంత పరిమాణంలో కొనుగోలు చేస్తాడో తెలియజేయునది వైయుక్తిక డిమాండ్. దానిని పట్టిక రూపంలో తెలియజేస్తే అది వైయుక్తిక డిమాండ్ పట్టిక.

ప్రశ్న 4.
మార్కెట్ డిమాండ్ పట్టిక
జవాబు:
మార్కెట్లో అనేక మంది వినియోగదారులు ఉంటారు. వారందరి డిమాండ్ పట్టికలను కలిపితే మార్కెట్ డిమాండ్ పట్టిక వస్తుంది. మార్కెట్ డిమాండ్ వివిధ వినియోగదార్లు వస్తువులను వివిధ ధరల వద్ద ఒక వస్తువును ఎంతెంత పరిమాణంలో కొనుగోలు చేస్తారో తెలియజేస్తుంది.

ప్రశ్న 5.
డిమాండ్ ఫలం [Mar. ’15]
జవాబు:
ఒక వస్తువు డిమాండ్ పరిమాణానికి, దానిని నిర్ణయించే కారకాలకు మధ్యగల సంబంధాన్ని డిమాండ్ ఫలం తెలియజేయును. డిమాండ్ ఫలాన్ని సమీకరణం ద్వారా తెలియజేయవచ్చు. Dx = f(Px, Py, Y, T).

ప్రశ్న 6.
గిఫెన్ వైపరీత్యం లేదా గిఫెన్ వస్తువులు [Mar. ’16]
జవాబు:
ధర పెరిగినప్పటికి డిమాండ్ తగ్గకపోగా, పెరగటం లేదా అదే విధంగా డిమాండ్ను కలిగి ఉండే వస్తువులను గిఫెన్ వస్తువులంటారు. నాసిరకపు వస్తువులను గిఫెన్ వస్తువులంటారు. వాటి ధర పెరిగితే ఇతర వస్తువులపై ఖర్చు తగ్గించి ఈ వస్తువులను కొనుగోలు చేస్తారు. దీనిని సర్ రాబర్ట్ గిఫెన్ అనే ఆర్థికవేత్త పరిశీలించడం వల్ల దీనిని “గిఫెన్ వైపరీత్యం” అంటారు.

ప్రశ్న 7.
అంచనా వ్యాపారం
జవాబు:
ఒక వస్తువు ధర పెరిగినప్పుడు, ఆ వస్తువు ధర భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందని వ్యాపారస్తులు, కొనుగోలుదార్లు భావించినప్పుడు ఆ వస్తువును ఎక్కువగా డిమాండ్ చేస్తారు. అదే విధంగా ధర తగ్గినప్పుడు ఇంకా తగ్గుతుందని భావిస్తే కొనుగోలు తగ్గిస్తారు. దీనినే అంచనా వ్యాపారం అంటారు. ఉదా: స్టాక్ మార్కెట్లో షేర్లు.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

ప్రశ్న 8.
వెబ్లెన్ వస్తువులు లేదా గౌరవ సూచిక వస్తువులు
జవాబు:
దీనిని గూర్చి చెప్పిన ఆర్థికవేత్త వెబ్లెన్. గౌరవ సూచిక వస్తువులయిన వజ్రాలు, బంగారు నగలు మొదలైనవి. కలిగి ఉండటం సమాజంలో ప్రతిష్టగా భావిస్తారు ధనికులు. వీటి ధర తగ్గితే వారి గౌరవం, ప్రతిష్ట తగ్గుతాయని కొనుగోలు తగ్గిస్తారు. కనుక ఈ వస్తువుల విషయంలో ధర తగ్గితే డిమాండ్ కూడా తగ్గును.

ప్రశ్న 9.
ధర డిమాండ్
జవాబు:
ఒక వస్తువు ధరకు, దాని డిమాండ్ పరిమాణానికి గల సంబంధాన్ని ధర డిమాండ్ అంటారు. దీనిని ఈ విధంగా తెలియజేయవచ్చు. Dn = f(Pn).

ప్రశ్న 10.
ఆదాయ డిమాండ్ [Mar. ’17]
జవాబు:
ఆదాయానికి, కొనుగోలు చేసే వస్తు పరిమాణానికి ఉన్న సంబంధాన్ని ఆదాయ డిమాండ్ పరిశీలిస్తుంది. సాధారణంగా ఆదాయం పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. ఆదాయ డిమాండ్ను బట్టి వస్తువులను మేలురకం అని, నాసిరకమని విభజించవచ్చు. ఆదాయ డిమాండ్ Dn = f(y)

ప్రశ్న 11.
జాత్యంతర డిమాండ్ [Mar. ’15]
జవాబు:
ప్రత్యామ్నాయ, పూరక వస్తువు ధరలకు, ఒక వస్తువు డిమాండ్కు ఉన్న సంబంధాన్ని జాత్యంతర డిమాండ్ అంటారు. ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో వచ్చిన మార్పుల వల్ల ఒక వస్తువు డిమాండ్లో వచ్చే మార్పులను జాత్యంతర డిమాండ్ తెలియజేయును. Dx = f(Py).

ప్రశ్న 12.
ప్రత్యామ్నాయాలు
జవాబు:
సన్నిహిత సంబంధం ఉన్న వివిధ వస్తువులను ప్రత్యామ్నాయ వస్తువులంటారు. ఉదా: కాఫీ, టీ. ఈ వస్తువుల విషయంలో ప్రత్యామ్నాయ వస్తువు ధరలో మార్పు వస్తే, మరో వస్తువు డిమాండ్లో మార్పు వస్తుంది. కనుక ఈ వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి పైకి వాలి ఉంటుంది.

ప్రశ్న 13.
పూరకాలు
జవాబు:
సంయుక్త వస్తువులను పూరక వస్తువులంటారు. ఉదా: కారు, పెట్రోలు. వీటిలో ఒకటి లేకపోయినా మరొకటి ఉపయోగపడదు. పూరక సంబంధం ఉన్న వస్తువు ధర పెరిగితే, ఇతర వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది. ధర తగ్గితే ఇతర వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. పూరక సంబంధం ఉన్న వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ క్రిందికి వాలి
ఉంటుంది.

ప్రశ్న 14.
నాసిరకం వస్తువులు
జవాబు:
ఆదాయం పెరిగేకొలది కొన్ని రకాల వస్తువులకు డిమాండ్ తగ్గును. ఆదాయం తగ్గితే డిమాండ్ పెరుగును. ఇటువంటి వస్తువులను నాసిరకం వస్తువులంటారు. ఈ వస్తువుల విషయంలో ఆదాయానికి, వస్తువు డిమాండ్కు విలోమ సంబంధం ఉంటుంది. ఉదా: సజ్జలు, రాగులు.

ప్రశ్న 15.
డిమాండ్ వ్యాకోచత్వం
జవాబు:
ఒక వస్తువు ధరలోని మార్పులు, ఆ వస్తువు కొనుగోలు పరిమాణంలో మార్పు ఏ విధంగా ఉంటుందో తెలియజేసే దానిని డిమాండ్ వ్యాకోచత్వం అంటారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

ప్రశ్న 16.
ధర డిమాండ్ వ్యాకోచత్వం
జవాబు:
ఒక వస్తువు ధరలోని శాతం మార్పుకు, వస్తు డిమాండ్లో కలిగే శాతం మార్పుకు మధ్య ఉన్న నిష్పత్తిని “ధర డిమాండ్ వ్యాకోచత్వం” అంటారు.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 37

ప్రశ్న 17.
ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం
జవాబు:
వినియోగదారుని ఆదాయంలో వచ్చిన మార్పు శాతంకు, అతని డిమాండ్లో వచ్చిన శాతం మార్పును “ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం” అంటారు.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 38

ప్రశ్న 18.
జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం
జవాబు:
ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో వచ్చిన శాతం మార్పుకు, డిమాండ్లో కలిగే శాతం మార్పును “జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం” అంటారు.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 39

ప్రశ్న 19.
పూర్తి వ్యాకోచ డిమాండ్
జవాబు:
ధరలో ఏ మార్పు వచ్చినా లేకున్నా డిమాండ్లో అనంతంగా మార్పు వస్తే దానిని పూర్తి వ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ డిమాండ్ రేఖ ‘X’ అక్షానికి సమాంతరంగా ఉంటుంది. దీని సంఖ్యాత్మక విలువ Ep = ∞

ప్రశ్న 20.
పూర్తి అవ్యాకోచ డిమాండ్ [Mar. ’16]
జవాబు:
ధరలో ఎంత మార్పు వచ్చినా డిమాండ్లో ఏ మాత్రము మార్పు ఉండదు. దీనినే పూర్తి అవ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ డిమాండ్ రేఖ Y- అక్షానికి సమాంతరంగా ఉంటుంది. దీని సంఖ్యాత్మక విలువ Ep = 0

ప్రశ్న 21.
ఏకత్వ వ్యాకోచ డిమాండ్
జవాబు:
ఒక వస్తువు ధరలో వచ్చిన అనుపాతపు మార్పు డిమాండ్ లో వచ్చిన అనుపాతపు మార్పుకు సమానమైతే దానిని ఏకత్వ వ్యాకోచ డిమాండ్ అంటారు. దీని విలువ ఒకటికి సమానము.
Ep = 1
ఇక్కడ డిమాండ్ రేఖ లంబ అతిపరావలయ ఆకారంలో ఉంటుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

ప్రశ్న 22.
సాపేక్ష వ్యాకోచ డిమాండ్
జవాబు:
ఒక వస్తువు ధరలో వచ్చే అనుపాతపు మార్పు కంటే డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాతపు మార్పు ఎక్కువగా ఉంటే దానిని సాపేక్ష వ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ వ్యాకోచత్వం విలువ ‘1’ కంటే ఎక్కువగా ఉంటుంది.

ప్రశ్న 23.
సాపేక్ష అవ్యాకోచ డిమాండ్
జవాబు:
వస్తువు ధరలో వచ్చిన అనుపాతపు మార్పు కంటే డిమాండ్ పరిమాణంలో వచ్చిన అనుపాతపు మార్పు తక్కువగా ఉన్నట్లయితే దీనిని సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ డిమాండ్ వ్యాకోచత్వం విలువ ‘1’ కంటే తక్కువగా ఉంటుంది.

ప్రశ్న 24.
ఆర్క్ పద్ధతిని ఎప్పుడు ఉపయోగిస్తారు ?
జవాబు:
డిమాండ్ రేఖపై రెండు బిందువుల మధ్య దూరాన్ని ఆర్క్ అంటారు. డిమాండ్ రేఖపై ఏదో ఒక బిందువు వద్ద కాకుండా రెండు బిందువుల మధ్య భాగంలో ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలవడానికి ‘ఆర్క్’ పద్ధతిని ఉపయోగిస్తారు.

ప్రశ్న 25.
డిమాండ్ వ్యాకోచత్వం ఉపయోగాలు
జవాబు:
అర్థశాస్త్రంలో డిమాండ్ వ్యాకోచత్వానికి అధిక ప్రాధాన్యత ఉంది.

  1. వ్యాపారస్తులు దీని ఆధారంగా ధర నిర్ణయం చేయడం జరుగుతుంది.
  2. కోశ విధానాన్ని రూపొందించడానికి, ఉత్పత్తి వ్యయాన్ని తెలుసుకోడానికి ఇది ఉపయోగపడుతుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Economics Study Material 2nd Lesson వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు Textbook Questions and Answers.

AP Inter 1st Year Economics Study Material 2nd Lesson వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని వివరించి, పరిమితులను పరిశీలించండి. [Mar. ’17, ’16, ’15]
జవాబు:
క్రమ క్షీణోపాంత ప్రయోజన సూత్రం మానవుని దైనందిన అనుభవం మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి కోరికను ఒక కాల వ్యవధిలో పూర్తిగా సంతృప్తిపరచవచ్చుననే ప్రాతిపదికపై ఈ సూత్రం ఆధారపడి ఉంది. ఈ సూత్రాన్ని ప్రథమంగా 1854వ సంవత్సరంలో హెచ్. హెచ్. గాసెన్ ప్రతిపాదించాడు. దీనిని గాసెన్ ప్రథమ సూత్రంగా జీవన్స్ పేర్కొన్నాడు. మార్షల్ దీనిని అభివృద్ధిపరిచాడు.

“ఒక వ్యక్తి తనవద్దనున్న వస్తు రాశిని పెంచుతూ పోతే అదనంగా చేర్చిన యూనిట్ల నుండి లభించే అదనపు ప్రయోజనం క్రమంగా క్షీణిస్తుంది” అని క్షీణోపాంత ప్రయోజనాన్ని మార్షల్ నిర్వచించెను.

ఈ సూత్రాన్ని కొన్ని ప్రమేయాలపై ఆధారపడి రూపొందించడం జరిగింది.
ప్రమేయాలు:

  1. సిద్ధాంతం కార్డినల్ ప్రయోజన విశ్లేషణపై ఆధారపడింది. అంటే ప్రయోజనాన్ని కొలవవచ్చును, పోల్చవచ్చును.
  2. వస్తువు యూనిట్లు తగుమాత్రంగా ఉండి, మరీ చిన్న యూనిట్లుగాను, మరీ పెద్ద యూనిట్లుగాను ఉండరాదు.
  3. వినియోగించే వస్తువు వివిధ యూనిట్లు సజాతీయంగా ఉండాలి. అనగా పరిమాణం, నాణ్యత, రుచి మొదలైన విషయాలలో ఏ వ్యత్యాసం ఉండరాదు.
  4. ఒక యూనిట్ వినియోగానికి, మరొక యూనిట్ వినియోగానికి మధ్య కాలవ్యవధి ఉండకూడదు.
  5. వినియోగదారుల అభిరుచులు, అలవాట్లలో మార్పు ఉండరాదు.
  6. వినియోగదారుల ఆదాయాలు మారకూడదు.

క్షీణోపాంత ప్రయోజన సూత్ర వివరణ: ఈ సూత్రం వస్తురాశి పరిమాణానికి తృప్తి లేదా ప్రయోజనానికి మధ్యగల సంబంధాన్ని వివరిస్తుంది. ఈ సూత్రం ప్రకారం ఒక వినియోగదారుడు తన వద్ద ఉన్న వస్తురాశిని పెంచుతూ పోతుంటే అదనపు యూనిట్వల్ల లభించే అదనపు లేదా ఉపాంత ప్రయోజనం క్షీణిస్తుంది. ఈ సూత్రాన్ని ఈ క్రింది పట్టిక ద్వారా చూపించటం జరిగింది.

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 1

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

పట్టిక ప్రకారం ప్రతి అదనపు ఆపిల్ వల్ల లభించే ఉపాంత ప్రయోజనం క్షీణిస్తుంది. అంటే మొత్తం ప్రయోజనం తగ్గుతున్న రేటులో పెరగటం గమనించవచ్చు. 6వ ఆపిల్ వల్ల మొత్తం ప్రయోజనం 82 యుటిల్స్, ఉపాంత ప్రయోజనం 2 యుటిల్స్, 7వ ఆపిల్ వినియోగం వల్ల మొత్తం ప్రయోజనంలో మార్పు లేదు. అంటే మొత్తం ప్రయోజనం గరిష్టంగా ఉంది. ఉపాంత ప్రయోజనం శూన్యం 7, 8 ఆపిల్ పండ్ల నుండి మొత్తం ప్రయోజనం క్షీణించి, ఉపాంత ప్రయోజనం ఋణాత్మకమైనది. మొత్తం ప్రయోజనానికి, ఉపాంత ప్రయోజనానికి మధ్య సంబంధం ఈ క్రింది విధంగా ఉంటుంది.

  1. మొత్తం ప్రయోజనం తగ్గుతున్న రేటులో పెరిగినప్పుడు ఉపాంత ప్రయోజనం తగ్గుతుంది.
  2. మొత్తం ప్రయోజనం గరిష్టమైనపుడు ఉపాంత ప్రయోజనం శూన్యమవుతుంది.
  3. మొత్తం ప్రయోజనం తగ్గితే ఉపాంత ప్రయోజనం ఋణాత్మకమవుతుంది. దీనిని ఈ క్రింది రేఖాపటం ద్వారా వివరించవచ్చు.
    AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 2

పట్టికను రేఖాపటంలో T.U.C. మొత్తం ప్రయోజన రేఖ M.U.C. ఉపాంత ప్రయోజన రేఖ. X – అక్షముపై ఆపిల్ పండ్ల సంఖ్యను, Y – అక్షముపై మొత్తం ప్రయోజనం, ఉపాంత ప్రయోజనం చూపించాము. వినియోగదారునికి ‘O’ యూనిట్ వద్ద మొత్తం ప్రయోజనం ‘0’ ఆపిల్స్ వినియోగం పెంచుతూ పోయిన కొద్దీ మొత్తం ప్రయోజనం తగ్గుతున్న రేటులో పెరిగింది. T.U.C. ఇదే అంశాన్ని స్పష్టం చేస్తోంది. M.U.C. క్రిందికి వాలుతున్నది. T.U.C. 7వ పండు వద్ద గరిష్టంగా ఉంది. M.U.C. X – అక్షాన్ని తాకి శూన్యమైంది. వినియోగదారుడు 7వ, 8వ పండ్లను వినియోగించటం వల్ల మొత్తం ప్రయోజనం క్షీణించింది. ఉపాంత ప్రయోజనం ఋణాత్మకమైంది.

క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం, మినహాయింపులు: కొన్ని పరిస్థితులలో అదనపు యూనిట్ల నుంచి వచ్చే ప్రయోజనం క్రమంగా క్షీణించకపోవచ్చు. వీటినే ఈ సూత్రానికి మినహాయింపులుగా చెప్పటం జరుగుతుంది. అవి:

  1. అపూర్వ వస్తువుల విషయంలో ఈ సూత్రం వర్తించదు. ఉదా: నాణేలు, కళాత్మక వస్తువులు, తపాలా బిళ్ళలు.
  2. సామాజిక వస్తువుల వినియోగంలో ఈ సూత్రం వర్తించదు. ఉదా: ఒక పట్టణంలో టెలిఫోన్ల సంఖ్య పెరిగితే, టెలిఫోను ఉపయోగించటం వల్ల కలిగే ప్రయోజనం కూడా పెరుగుతుంది.
  3. మత్తు పదార్థాల విషయంలో ఈ సూత్రం వర్తించదు.
  4. ద్రవ్యం విషయంలో ఈ సూత్రం వర్తించదని కొందరి అభిప్రాయం.

క్షీణోపాంత ప్రయోజన సిద్దాంతం – ప్రాముఖ్యం:

  1. డిమాండ్ సూత్రానికి ఈ సూత్రం మూలాధారం.
  2. విలువ సిద్ధాంతానికి కూడా ఈ సూత్రం మూలాధారం. ఉదా: నీళ్ళకు ప్రాముఖ్యం ఎక్కువగా ఉంటుంది. నీటికి వినిమయ విలువ లేదు. వజ్రాలకు ఉపయోగితా విలువ ఏమీలేదు. కాని వాటి వినిమయ విలువ ఎక్కువగా ఉంటుంది. వీటికి సమాధానం ఈ సూత్రంలో లభ్యమవుతుంది.
  3. ఆర్థికమంత్రి పన్నుల విధానాన్ని నిర్ణయించటంలో ఈ సూత్రం చాలా ఉపయోగకారిగా ఉంటుంది. పురోగామి పన్నుల విధానానికి ఈ సూత్రం ఆధారం.
  4. వినియోగదారుని మిగులు భావన ఈ సూత్రంపైననే ఆధారపడి ఉంది.
  5. సంపద పంపిణీకి క్షీణోపాంత ప్రయోజన సూత్రం ఆధారమని చెప్పవచ్చు.
  6. వినియోగదారు, తన పరిమితమైన ఆదాయం ద్వారా ఏ విధంగా ప్రయోజనాన్ని గరిష్టం చేసుకోవచ్చునో తెలుపుతుంది.

ప్రశ్న 2.
సమోపాంత ప్రయోజన సూత్రం ప్రాముఖ్యాన్ని వివరించండి.
జవాబు:
సమోపాంత ప్రయోజనానికి చాలా ఆచరణీయమైన ప్రాధాన్యత ఉంది. ఆర్థిక జీవనంలో ఈ సూత్రం అనేక విధాలుగా ఉపకరిస్తుంది.
1) వినియోగం: ప్రతి వ్యక్తి తనకున్న పరిమిత ఆదాయాన్ని వివిధ వస్తువులపై ఖర్చు చేయటం ద్వారా గరిష్ట ప్రయోజనాన్ని పొందటానికి ప్రయత్నిస్తాడు. వినియోగదారుడు తక్కువ ప్రయోజనం లభించే వస్తువుకు బదులు అధిక ప్రయోజనం లభించే వస్తువును ప్రతిస్థాపన చేసుకుంటూ తన పరిమిత ఆదాయాన్ని ఖర్చు చేస్తాడు. కనుక ఈ సూత్రం వినియోగదారుని గరిష్ట సంతృప్తి విశ్లేషణకు తోడ్పడుతుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

2) ఉత్పత్తి: ఉత్పత్తిదారుడు అనేక ఉత్పత్తి కారకాలను ఉత్పత్తి ప్రక్రియలో వినియోగించడం ద్వారా లాభం, గరిష్ట ప్రయోజనాన్ని పొందటానికి ప్రయత్నిస్తాడు. వివిధ ఉత్పత్తి కారకాల నుండి గరిష్ట లాభాలను పొందటానికి ఏ విధంగా ఉత్పత్తి కారకాలను ప్రతిస్థాపన చేస్తాడో ఈ సూత్రం విశ్లేషణ చేస్తుంది.

3) వినిమయం: ఒక వస్తువుకు బదులుగా మరో వస్తువు ద్రవ్యము ద్వారా వినిమయం చేయడంలో ఈ సూత్రం ఉపయోగపడుతుంది. వినిమయానికి ప్రాతిపదిక ప్రతిస్థాపన సిద్ధాంతము.

4) పంపిణీ: వివిధ ఉత్పత్తుల ఉత్పత్తి కారకాలకు వాటి ప్రతిఫలాలను పంపిణీ చేయటాన్ని వివరించే ‘ఉపాంత ఉత్పాదకతా సిద్ధాంతానికి’ ఈ సూత్రం ప్రాతిపదిక.

5) ప్రభుత్వ విత్తము: ప్రభుత్వం వివిధ కార్యక్రమాలపై ఖర్చు చేసేటప్పుడు సమాజపు ప్రయోజనం గరిష్టంగా ఉండాలని భావిస్తుంది. అందువల్ల అధిక ప్రయోజనం కోసం వృధా వ్యయాలను తగ్గించి ప్రభుత్వం వ్యయం చేస్తుంది.

ఇంతేకాకుండా ఆదాయ పునఃపంపిణీకి ఒక వ్యక్తి తన పొదుపు లేదా పెట్టుబడి వివిధ రకాల ఆస్తుల మధ్య విభజించటానికి ఒక వ్యక్తి తన కాలాన్ని పని, విశ్రాంతి మధ్య కేటాయించడానికి మొదలైన అంశాల విశ్లేషణకు ఈ సూత్రం తోడ్పడుతుంది. పన్నుల విధానానికి ఈ సూత్రం సహాయపడుతుంది.

6) ఆదాయ పునఃపంపిణీ, వ్యయ విధానం: సంపన్నులపై ఎక్కువ స్థాయిలో పన్నులు విధించి, పేదవారికి ఎక్కువ ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రభుత్వం వ్యయ విధానాన్ని అనుసరిస్తోంది. సంపన్నుల ఖర్చు విధానానికి, పేదవారికి ఖర్చు విధానానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గురించి ఆదాయ పునఃపంపిణీ జరిగే విధానాన్ని, అందువలన కలిగే ఆదాయాన్ని వ్యయం చేసే పద్ధతిని ఈ సూత్రం ఆధారంగా ప్రభుత్వం తన విధానాన్ని నిర్ణయించుకొని సమాజ శ్రేయస్సును పెంపొందిస్తుంది.

7) ధరలపై ప్రభావం: ఈ సూత్రం వస్తువు ధరలపై ప్రభావం చూపుతుంది. వస్తువు కొరతగా ఉంటే ఎక్కువగా ఉంటుంది. దీనికి బదులుగా కొరతలేని వస్తువును ప్రతిస్థాపన చేయటం ద్వారా ఉపాంత ప్రయోగం- తగ్గకుండా ప్రయత్నించటం జరుగుతుంది. అందువల్ల కొరత వస్తువు ధర తగ్గుతుంది.

సమోపాంత ప్రయోజన సూత్ర ప్రాముఖ్యం:

  1. ఉద్యమదారు వివిధ ఉత్పత్తి సాధనాలకు నియమించేటప్పుడు, అన్ని ఉత్పత్తి సాధనాల నుంచి వచ్చే ఉపా ఉత్పాదకత సమానంగా ఉన్నప్పుడు మొత్తం ఉత్పత్తిని గరిష్టం చేసుకుంటాడు. అంటే కనిష్ట వ సముదాయాన్ని నిర్ణయించుకోవడానికి ఈ సూత్రం ఉపకరిస్తుంది.
  2. పంపిణీ విషయంలో కూడా ఈ సూత్రం ప్రాధాన్యం కలిగి ఉంటుంది. ఒక రకమైన వస్తువును ని వ్యక్తుల మధ్య పంపిణీ చేసినప్పుడు, అందరికీ కలిగే ఉపాంత ప్రయోజనంగా ఉంటే, పం సక్రమంగా జరిగిందని చెప్పవచ్చు.
  3. ఆదాయాన్ని వినియోగం, పొదుపు మధ్యన కేటాయించడంలో కూడా ఈత్రం ఉపకరిస్తుంది.
  4. వ్యక్తులు తమ పొదుపును లేదా సంపదను వివిధ రకాల ఆస్తుల రూపంలో ఎంతెంత ఉంచుకో నిర్ణయించుకోవడానికి ఈ సూత్రం ఉపయోగకరంగా ఉంటుంది.
  5. కుటుంబాలు తమ పరిమిత ఆదాయాన్ని వివిధ రకాల వస్తువులపై కేటాయించడం ద్వారా, తమ సంక్షేమాన్ని ఎలా గరిష్టం చేసుకుంటారో ఈ సూత్రం ద్వారా తెలుసుకోవచ్చు.

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

ప్రశ్న 3.
సమోపాంత ప్రయోజన సూత్రం సహాయంతో వినియోగదారుని సమతౌల్యాన్ని వివరించండి.
జవాబు:
వినియోగదారుని సమతౌల్యాన్ని వివరించే సూత్రమే సమోపాంత ప్రయోజన మాత్రము. వినియోగదార గరిష్ట సంతృప్తిని పొందడానికి తన దగ్గర ఉన్న పరిమిత ఆదాయాన్ని వివిధ వస్తువులపై ఏ విధంగా ఉపయోగిస్తాని సూత్రం వివరిస్తుంది. సమోపాంత ప్రయోజన సూత్రం ప్రకారం ఒక వినియోగదారుడు తన దగ్గరున్న ద్రవ్యాన్ని . వస్తువులపై వాటి ఉపాంత ప్రయోజనాలు సమానమయ్యే వరకు ఒకదానికి బదులుగా మరొకటి ప్రతిస్థాపన చేస్తా ఈ ప్రతిస్థాపన గరిష్ట సంతృప్తిని సాధించేవరకు సాగుతుంది. ఉపాంత ప్రయోజనాలు సమానమైనప్పుడు ప్రయోజనం గరిష్టంగా ఉంటుంది. మొత్తం ప్రయోజనం గరిష్టంగా ఉన్నప్పుడు వినియోగదారుడు సమతౌల్య ఉంటాడు.

ఈ సూత్రాన్ని ప్రప్రధమంగా 1854వ సంవత్సరంలో హెచ్. హెచ్. గాసెన్ ప్రతిపాదించాడు. దీనిని గా ద్వితీయ సూత్రంగా జీవన్స్ పేర్నొన్నాడు. దీనిని మార్షల్ అభివృద్ధిపరిచాడు.

“ఒక వ్యక్తి దగ్గర ఉన్న ఒక వస్తువుకు అనేక ఉపయోగాలున్నప్పుడు అతడు ప్రతి ఉపయోగం నుండి ఉపాంత ప్రయోజనం సమానంగా ఉండేటట్లు ఆ వస్తువును వినియోగించడం జరుగుతుంది” అని మార్షల్ ఈ సూ నిర్వచించెను.

సూత్రం వివరణ:
ఉదా: ఒక వ్యక్తి వద్ద ఉన్న వస్తువు పరిమిత ద్రవ్యం ఐదు రూపాయలు అనుకుందాం. ఆ పరిమిత ప్ర X – y అనే వస్తువులపై ఖర్చు చేయటం ద్వారా ఏ విధంగా సమతౌల్యంలో ఉన్నాడో ఈ క్రింది పట్టిక పరిశీలించవచ్చును.
x − y ధరలు ఒక యూనిట్ వస్తువు ఒక రూపాయిగా భావించాలి. ప్రతి రూపాయికి లభించే ఉపాంత ప్రయోజనాలను పట్టికలో పరిశీలించవచ్చును.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 3

బ్రాకెట్లలో చూపిన అంకెలు వినియోగదారుడు 5 రూపాయలను ఏ విధంగా ఖర్చు చేశాడో తెలియజేయును. పట్టికననుసరించి x, y వస్తువుల ఉపాంత ప్రయోజన వస్తు వినియోగం పెరుగుతున్న కొద్దీ క్షీణిస్తుంది. ఒకటో రూపాయి వల్ల వచ్చే ఉపాంత ప్రయోజనం y వస్తువు కంటే x వస్తువు వల్ల ఎక్కువగా ఉంది. అందువల్ల మొదటి రూపాయితో X వస్తువును కొనుగోలు చేస్తాడు. అదే విధంగా 2వ రూపాయిని x మీద వినియోగిస్తే ఉపాంత ప్రయోజనం 20 యుటిల్స్. అదే 2వ రూపాయిని y మీద వినియోగిస్తే ఉపాంత ప్రయోజనం 21 యుటిల్స్. కనుక 2వ రూపాయిని y వస్తువుపై ఖర్చు చేస్తాడు. 3వ రూపాయిని y వస్తువు మీద ఖర్చు చేస్తే, 15 యుటిల్స్ ఉపాంత ప్రయోజనము. అదే 3వ రూపాయిని X వస్తువుపై ఖర్చు చేస్తే ఉపాంత ప్రయోజనం 20 యుటిల్స్ కనుక 3వ రూపాయితో X వస్తువు 2వ యూనిట్ను కొనుగోలు చేస్తాడు. 4వ రూపాయితో y ని కొనుగోలు చేసినా ఉపాంత ప్రయోజనం 15 యుటిల్స్. 5వ | రూపాయిని X వస్తువు 3వ యూనిట్పై ఖర్చు చేస్తే ఉపాంత ప్రయోజనం 15 యుటిల్స్. 5 రూపాయలను X వస్తువుపై ఖర్చు చేస్తే 75 యుటిల్స్ ప్రయోజనం వస్తుంది. 5 రూపాయలను y వస్తువుపై ఖర్చు చేస్తే మొత్తం ప్రయోజనం 52 యుటిల్స్. కాని పైన పేర్కొన్న విధంగా ఖర్చు చేస్తే మొత్తం ప్రయోజనం 96 యుటిల్స్ [25 + 21 + 20 + 15 + 15 = 96]. వినియోగదారుడు ఈ విధంగా 3 యూనిట్ల xని, 2 యూనిట్ల yని కొనుగోలు చేసినప్పుడు మాత్రమే వినియోగదారునికి గరిష్ట సంతృప్తి వస్తుంది. అప్పుడే తాను ఖర్చు చేసిన చివరి రూపాయివల్ల రెండు వస్తువులకు ఒకే ప్రయోజనం ద్వారా తెలియజేయవచ్చు. వస్తుంది. మరే రకంగా ఖర్చు చేసినా ప్రయోజనం గరిష్టంగా ఉండదు. దీనిని పటము ద్వారా తెలియజేయవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 4

పై రేఖాపటములో X – అక్షముపై ద్రవ్య పరిమాణము, Y – అక్షముపై ఒక రూపాయి వల్ల వచ్చే X, Y ల ఉపాంత ప్రయోజనం సూచించటం జరిగింది. XY రేఖ X వస్తువు ప్రయోజన రేఖ (MUC], YY రేఖ Y వస్తువు ఉపాంత ప్రయోజన రేఖ [MUC]. X వస్తువుపై 3వ రూపాయి 15 యుటిల్స్ ప్రయోజనం ఇస్తుంది. Y వస్తువుపై 2వ రూపాయి 15 యుటిల్స్ ప్రయోజనం ఇస్తుంది.

వినియోగదారుడు సమతౌల్య స్థితిని నిర్ణయించుటకు ఈ క్రింది నిబంధనను సంతృప్తిపరచవలెను.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 5

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

ప్రశ్న 4.
ఉదాసీనత వక్రరేఖల పద్ధతి ద్వారా వినియోగదారుని సమతౌల్యాన్ని వివరించండి.
జవాబు:
ఒక వినియోగదారుని అభిరుచులు, అలవాట్లు రెండు వస్తువుల ధరలు నిలకడగా ఉండి పరిమిత ఆదాయ వనరులతో వీలైనంతగా రెండు వస్తువులను గరిష్టంగా కొనుగోలు చేయగలిగినట్లయితే వినియోగదారుడు సమతౌల్యస్థితికి చేరుకున్నాడని చెప్పవచ్చు.

ఈ క్రింది ప్రమేయాలను ఆధారంగా చేసుకొని ఉదాసీనత వక్రరేఖల సహాయంతో వినియోగదారుని సమతౌల్య స్థితిని వివరించవచ్చు.

  1. వినియోగదారుడు హేతుబద్ధంగా వ్యవహరిస్తాడు.
  2. వినియోగదారుని ద్రవ్య ఆదాయంలో ఎలాంటి మార్పులు ఉండవు.
  3. వినియోగదారుడు కొనుగోలు చేయాలనుకునే వస్తువుల ధరలు మారవు.
  4. వినియోగదారుని అభిరుచులు ఉదాసీనత వక్రరేఖలు తెలుపుతాయి.

వినియోగదారుని సమతౌల్యం: వినియోగదారు పొందగోరే వస్తు సముదాయాలు, పొందగలిగిన వస్తు సముదాయాలు సమానంగా ఉన్నప్పుడు సమతౌల్యంలో ఉంటాడు. అంటే ఉదాసీనతా వక్రరేఖ, బడ్జెట్ రేఖకు స్పర్శ రేఖగా ఉన్నప్పుడు వినియోగదారు గరిష్ట సంతృప్తిని పొందుతూ సమతౌల్యంలో ఉంటాడు. ఇలాంటి పరిస్థితులలో ఉదాసీనత వక్రరేఖ వాలు, బడ్జెట్ఖ వాలు సమానంగా ఉంటాయి. వినియోగదారుని సమతౌల్యానికి ముఖ్యమైన నిబంధన MRSxy = Px/Py

వినియోగదారు సమతౌల్యాన్ని ఈ క్రింది రేఖాపటం ద్వారా వివరించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 6

పై రేఖాపటంలో AB బడ్జెట్ ఖ. IC0, IC1, IC2, వివిధ ఉదాసీనత వక్రరేఖలు. IC0, రేఖ AB బడ్జెట్ రేఖను C, ఎదువుల వద్ద ఖండిస్తుంది. అందువల్ల వినియోగదారు C వద్ద లేదా D వద్ద సమతౌల్యంలో ఉండడు. AB బడ్జెట్ IC0 రేఖను ఖండిస్తుంది. అంటే ఇంకా వినియోగదారుడు అధిక సంతృప్తి స్థాయిని పొందటానికి వీలు ఉంటుంది. పొందువు వద్ద IC1, రేఖ, AB బడ్జెట్ రేఖకు స్పర్శరేఖగా ఉంది. అందువల్ల ‘E’ బిందువు వద్ద IC, రేఖవాలు, రేఖ వాలు సమానం. ఈ పరిస్థితిలో MRSxy = Px/Py. అందువల్ల వినియోగదారుడు ‘E’ బిందువు వద్ద OQ -వస్తువును, OP పరిమాణంలో ‘Y’ వస్తువును కొనుగోలు చేస్తూ IC1, పై గరిష్ట సంతృప్తిని పొందుతూ సమతౌల్యంలో డు. IC1, అతని ఆదాయం కన్నా ఎక్కువ రేఖ. అందువల్ల వినియోగదారుడు IC2 రేఖ పైననే ‘E’ బిందువు వద్ద శౌల్యంలో ఉంటాడు.

ధర లేదా బడ్జెట్ రేఖను నిర్వచించండి. బడ్జెట్ రేఖలోని కదలికలను వివరించండి. వినియోగదారుని కొనుగోలు ముఖ్యంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి:

  1. వినియోగదారుని ద్రవ్య ఆదాయం
  2. కొనుగోలు చేయాలనుకుంటున్న రెండు వస్తువుల ధరలు.

ఒక వినియోగదారుడు కొనుగోలు చేసే రెండు వస్తువుల ధరలు, ఆదాయాలు స్థిరంగా ఉండి, ఏ సముదాయాలలో ఎ వస్తువులను కొనుగోలు చేయగలుగుతాడో తెలియజేసే రేఖని బడ్జెట్ రేఖ లేదా ధర రేఖ అంటారు. దీనిని ఈ ఉదాహరణ ద్వారా వివరించవచ్చు. వినియోగదారుని ఆదాయం గౌ 5/-, X, Y వస్తువుల ధరలు వరుసగా కే 10.50 పై. కుందాం. దీంతో వినియోగదారుడు కొనుగోలు చేయగలిగిన రెండు వస్తువుల వివిధ సముదాయాలు ఈ క్రింది గా ఉంటాయి.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 7

వినియోగదారుడు మొత్తం ఆదాయాన్ని ‘X’ పైనే ఖర్చు చేస్తే 5X వస్తువులను మాత్రమే కొనుగోలు చేయగలుగుతాడు, స్తువులను కొనుగోలు చేయలేడు. Y వస్తువు మీద పూర్తిగా ఖర్చు చేస్తే 10 ‘Y’ లను, ‘0’ ‘X’ లను పొందగలుగుతాడు. విధంగా రెండు వస్తువుల ధరలు స్థిరంగా ఉన్నప్పుడు తాను స్థిరమైన ఆదాయంతో కొనుగోలు చేయగలిగిన రెండు వుల వివిధ సముదాయాలకు సంబంధించిన బిందువులను కలిపినట్లయితే బడ్జెట్ రేఖ వస్తుంది. ఈ రేఖ వాలు వస్తువుల ధరల నిష్పత్తిని తెలుపుతుంది. దీనిని క్రింది రేఖాపటం ద్వారా చూపించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 8

పై రేఖాపటంలో ‘X’ వస్తువు X అక్షంపై, ‘Y’ వస్తువు Y – అక్షంపై చూపించటం జరిగింది. PL అనేది బడ్జెట్ రేఖ. ఈ రేఖ వాలు XY వస్తువుల సాపేక్ష ధరల నిష్పత్తిని తెలియజేయును. ఏ ఆదాయ పరిమితికి లోబడి వినియోగదారుడు XY లను కొనుగోలు చేస్తున్నాడో బడ్జెట్ ఖ తెలియజేయును.

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

1) రెండు వస్తువుల ధరలు స్థిరంగా ఉండి, వినియోగదారుని ఆదాయం మార్పు చెందితే బడ్జెట్ రేఖ స్థితిలో మార్పు వస్తుంది. ఆదాయం పెరిగితే బడ్జెట్ రేఖ పైకి కదులుతుంది. అదే విధంగా ఆదాయం తగ్గితే, బడ్జెట్ రేఖ క్రిందికి కదులుతుంది. దీనిని క్రింది రేఖాపటం ద్వారా వివరించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 9

పై రేఖాపటంలో A1B1 బడ్జెట్ఖ అనుకుందాం. రెండు వస్తువుల ధరలు స్థిరంగా ఉండి ఆదాయం పెరిగితే బడ్జెట్ రేఖ A2B2 పైకి కదులుతుంది. ఆదాయం తగ్గితే బడ్జెట్ రేఖ A0B0 కిందికి కదులుతుంది.

2) ఆదాయం స్థిరంగా ఉండి X వస్తువు లేదా Y వస్తువు ధరలోగాని మార్పు వస్తే బడ్జెట్లేఖ వాలులో మార్పు వస్తుంది. దీనిని ఈ రేఖాపటాల ద్వారా వివరించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 10
A రేఖాపటంలో వినియోగదారుని ఆదాయం, Y వస్తువు ధర స్థిరంగా ఉండి X వస్తువు ధరలో మార్పు వస్తే బడ్జెట్ రేఖలో వచ్చే మార్పులను చూపించటం జరిగింది. X వస్తువు ధర తగ్గితే బడ్జెట్ రేఖ AB గాను, X వస్తువు ధర పెరిగితే బడ్జెట్ రేఖ AB0 గాను ఉంటుంది.

B రేఖాపటంలో వినియోగదారుని ఆదాయం, X వస్తువు ధర స్థిరంగా ఉండి, Y వస్తువు ధరలో మార్పు వస్తే బడ్జెట్ రేఖలో వచ్చే మార్పులను చూపటం జరిగింది. Y వస్తువు ధర తగ్గితే బడ్జెట్ రేఖ LP1 గాను, Y వస్తువు ధర పెరిగితే బడ్జెట్ రేఖ LP2 గాను ఉంటుంది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కార్డినల్, ఆర్డినల్ ప్రయోజనాలను విభేదించండి.
జవాబు:
కార్డినల్ ప్రయోజన విశ్లేషణ: 18వ శతాబ్దంలో జీవాన్స్, వాల్రాస్ మొదలగువారు ప్రయోజన విశ్లేషణను అభివృద్ధిపరిచారు. ఆ తరువాత మార్షల్, క్లార్క్ మొదలగువారు దీనిని అభివృద్ధిపరిచారు. వినియోగదారుని ప్రవర్తనను అధ్యయనం చేయటానికి కార్డినల్ ప్రయోజన విశ్లేషణను రూపొందించారు. వీరు ప్రయోజనాన్ని కొలవటానికి యుటిల్స్ అనే ఊహాత్మక కొలమానాన్ని ఉపయోగించారు. వీటి ద్వారా వివిధ వస్తువుల నుండి పొందగలిగే ప్రయోజనాన్ని కొలవవచ్చు, పోల్చవచ్చును అని నవ్య సంప్రదాయ ఆర్థికవేత్తలు భావించారు. 1, 2, 3 ……అనేవి కార్డినల్ సంఖ్యలు. ఈ విధమైన విశ్లేషణ కేవలం ఒక మానసిక భావన మాత్రమే.

ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ: జె.ఆర్. హిక్స్, అలెన్ అనే ఆర్థికవేత్తలు వినియోగదారుని ప్రవర్తనను అధ్యయనం చేయుటలో ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణను రూపొందించారు. ఈ విశ్లేషణ ద్వారా ప్రయోజనాన్ని సంఖ్యా రూపంలో చెప్పటం సాధ్యం కాదు. వివిధ సముదాయాల నుంచి పొందే వివిధ సంతృప్తి స్థాయిలతో పోల్చి చెప్పడం జరుగుతుంది. అనగా ఒక వస్తు సముదాయం, మరొక వస్తు సముదాయం కంటే ఎంత ఎక్కువ లేదా ఎంత తక్కువ సంతృప్తి ఇస్తుందో చెప్పటానికి వీలు ఉన్నదనే అంశంపై ఉదాసీనత వక్రరేఖలు ప్రతిపాదించటం జరిగింది. 1వ, 2వ, 3వ ఆర్డినల్ సంఖ్యలు. వీరి ఉద్దేశ్యంలో ప్రయోజనం అనేది ఒక మానసిక భావన. దానిని కొలవలేము. కేవలం దేన్ని ఎంత కావాలో, ఎంత ఇష్టపడుతున్నారో మాత్రమే చెప్పగలం. దీనిని ఆర్డినల్ ప్రయోజనం అంటారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

ప్రశ్న 2.
ఉదాసీనత వక్రరేఖల లక్షణాలు. [Mar. ’17, ’16, ’15]
జవాబు:
వినియోగదారుడు కొనుగోలు చేసే రెండు వస్తువుల వివిధ సమ్మేళనాలను తెలియజేసే బిందువులను కలుపగా ఏర్పడే రేఖను “ఉదాసీనత వక్రరేఖ” అని అంటారు.
లక్షణాలు / ధర్మాలు:

  1. ఉదాసీనత వక్రరేఖలు ఋణాత్మక వాలు కలిగి ఉంటాయి. అనగా ఎడమ నుండి కుడికి దిగువకు వాలుతాయి.
  2. ఉదాసీనత వక్రరేఖలు X- అక్షమునుగాని, Y – అక్షమునుగాని తాకవు.
  3. ఉదాసీనత వక్రరేఖలు పరస్పరం ఖండించుకొనవు.
  4. ఇవి మూలబిందువుకు కుంభాకారంలో ఉంటాయి. దీనికి కారణం ప్రతిస్థాపనోపాంత రేటు క్షీణించటం.
  5. ఎక్కువ స్థాయిలో ఉన్న ఉదాసీనత రేఖ ఎక్కువ సంతృప్తి, తక్కువ స్థాయిలో ఉన్న రేఖ తక్కువ సంతృప్తి స్థాయిని సూచిస్తాయి.
  6. పూర్తి ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో సరళరేఖలుగానూ, పూరక వస్తువుల విషయంలో ‘L’ ఆకారంలో ఉదాసీనత వక్రరేఖలు ఉంటాయి.

ప్రశ్న 3.
ఉపాంత ప్రత్యామ్నాయ రేటు
జవాబు:
ఉదాసీనతా వక్రరేఖ విశ్లేషణలో ప్రతిస్థాపనోపాంత రేటు అత్యంత ముఖ్యమైనది. అన్ని సముదాయాలు ఒకే స్థాయిలో సంతృప్తిని ఇవ్వడం వల్ల వినియోగదారుడు ఒక వస్తువు స్థానంలో మరొక వస్తువును ఏ రేటులో ప్రతిస్థాపన చేస్తున్నాడో దానిని ప్రతిస్థాపనోపాంత రేటు అంటారు.

ఉదా: వినియోగదారుడు X, Y వస్తువులను వినియోగిస్తాడు అనుకుందాం. ఈ రెండు వస్తువులు ఒకదానికి బదులు, మరో దానికి ప్రత్యామ్నాయం చేయటానికి వీలు ఉంటుంది. దీనిని ఈ క్రింది పట్టిక ద్వారా వివరించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 11

పై పట్టికలో వినియోగదారునికి అందుబాటులో ఉన్న వివిధ సముదాయాలలో A నుండి F వరకు పరిశీలించగా సముదాయం Aలో వినియోగదారునికి X తక్కువగా పొందే అవకాశం ఉంది. X పరిమాణం తక్కువగా ఉండటం వల్ల వినియోగదారుడు X కోసం Y ని వదులుకోవటానికి సిద్ధంగా ఉంటాడు. ఈ విధంగా అదనంగా 1 యూనిట్ X పరిమాణం పొందటానికి 5 యూనిట్ల Y ని వదులుకోవాలి. దీనినే ఉపాంత ప్రత్యామ్నాయ రేటు అంటారు.

ప్రశ్న 4.
ఉదాసీనత పటం
జవాబు:
వివిధ సంతృప్తి స్థాయిలను తెలిపే ఉదాసీనత వక్రరేఖల సముదాయాన్ని ఉదాసీనత పటం అందురు. ‘X’ వస్తువు, ‘Y’ వస్తువు వివిధ సముదాయాలను తెలియజేసే ఉదాసీనత రేఖల సముదాయమే ఉదాసీనత పటం. ఇందులో ఒక్కొక్క IC ఒక్కొక్క రకమైన సముదాయాన్ని తెలియజేయును.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 12

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

పై రేఖాపటంలో ‘X’ అక్షంపై X వస్తువును, Y అక్షంపై Y వస్తువును చూపటం జరిగింది. IC,, IC2, IC3 అనేవి మూడు వేరువేరు ఉదాసీనత వక్రరేఖలు. ఈ రేఖలు వివిధ ఆదాయ స్థాయిల వద్ద పొందగలిగే సంతృప్తి స్థాయిలను తెలియజేస్తాయి. ఉదాసీనత వక్రరేఖలు కుడివైపుకు జరిగే కొద్ది సంతృప్తి స్థాయిలలో పెరుగుదల సూచిస్తుంది. IC, రేఖ, అన్ని రేఖల కంటే తక్కువ స్థాయి సంతృప్తిని తెలియజేయును.

ప్రశ్న 5.
ధర రేఖ
జవాబు:
వినియోగదారుని కొనుగోలు ముఖ్యంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి:

  1. వినియోగదారుని ద్రవ్య ఆదాయం.
  2. కొనుగోలు చేయాలనుకుంటున్న రెండు వస్తువుల ధరలు.

ఒక వినియోగదారుడు కొనుగోలు చేసే రెండు వస్తువుల ధరలు, ఆదాయాలు స్థిరంగా ఉండి, ఏ సముదాయాలలో రెండు వస్తువులను కొనుగోలు చేయగలుగుతాడో తెలియజేసే రేఖని బడ్జెట్ రేఖ లేదా ధర రేఖ అంటారు. దీనిని ఈ క్రింది ఉదాహరణ ద్వారా వివరించవచ్చు. వినియోగదారుని ఆదాయం 5/-, X, Y వస్తువుల ధరలు వరుసగా * 10.50 పై. అనుకుందాం. దీంతో వినియోగదారుడు కొనుగోలు చేయగలిగిన రెండు వస్తువుల వివిధ సముదాయాలు ఈ క్రింది విధంగా ఉంటాయి.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 13

వినియోగదారుడు మొత్తం ఆదాయాన్ని ‘X’ పైనే ఖర్చు చేస్తే 5X వస్తువులను మాత్రమే కొనుగోలు చేయగలుగుతాడు, Y వస్తువులను కొనుగోలు చేయలేడు. Y వస్తువు మీద పూర్తిగా ఖర్చు చేస్తే 10 Y లను, ‘0’ ‘X’ లను పొందగలుగుతాడు. ఈ విధంగా రెండు వస్తువుల ధరలు స్థిరంగా ఉన్నప్పుడు తాను స్థిరమైన ఆదాయంతో కొనుగోలు చేయగలిగిన రెండు వస్తువుల వివిధ సముదాయాలకు సంబంధించిన బిందువులను కలిపినట్లయితే బడ్జెట్ రేఖ వస్తుంది. ఈ రేఖ వాలు రెండు వస్తువుల ధరల నిష్పత్తిని తెలుపుతుంది. దీనిని క్రింది రేఖాపటం ద్వారా చూపించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 14

పై రేఖాపటంలో ‘X’ వస్తువు X – అక్షంపై, ‘Y’ వస్తువు Y – అక్షంపై చూపించటం జరిగింది. PL అనేది బడ్జెట్ రేఖ. ఈ రేఖ వాలు XY వస్తువుల సాపేక్ష ధరల నిష్పత్తిని తెలియజేయును. ఏ ఆదాయ పరిమితికి లోబడి వినియోగదారుడు XY లను కొనుగోలు చేస్తున్నాడో బడ్జెట్ రేఖ తెలియజేయును. వినియోగదారునికి ఈ క్రింది అవకాశాలు ఉన్నాయి.

  1. వినియోగదారుడు తన వద్దనున్న 5/- ను ‘X’ వస్తువుపై ఖర్చు చేసినట్లయితే ‘5’ X వస్తువులను మాత్రమే కొనుగోలు చేయగలడు. కాని Y వస్తువును కొనలేడు.
  2. వినియోగదారుడు తన వద్ద ఉన్న 5/- లను ‘Y’ వస్తువుపై ఖర్చు చేసినట్లయితే 10 ‘Y’ వస్తువును మాత్రమే కొనుగోలు చేయగలడు. కాని ‘X’ వస్తువును కొనలేడు.
  3. వాస్తవంగా వినియోగదారుడు రెండు వస్తువులను కోరుకుంటాడు కావున రేఖాపటంలో OPL అనేది అతనికి ఉండే అవకాశం తెలియజేయును.
  4. ‘PL’ బడ్జెట్ రేఖను దాటి వినియోగదారుడు ఒక్క వస్తువును కూడా కొనుగోలు చేయలేడు.

ప్రశ్న 6.
ఉదాసీనత వక్రరేఖల ప్రమేయాలు తెల్పండి.
జవాబు:

  1. వినియోగదారుడు హేతుబద్ధంగా వ్యవహరిస్తాడు. తన పరిమిత ఆదాయంతో గరిష్ట సంతృప్తి పొందటానికి ప్రయత్నిస్తాడు.
  2. ప్రతి వినియోగదారునికి అభిరుచి తరహా ఉంటుంది.
  3. ఉపాంత ప్రతిస్థాపన రేటు క్షీణించును.
  4. ఇది ఆర్డినల్ ప్రయోజన భావన మీద ఆధారపడి ఉంది.
  5. వినియోగదారుడు మార్కెట్ ధరతో సంబంధం లేకుండా తన అభిరుచి తరహా రూపొందించుకుంటాడు. అంటే ఒకదానికంటే మరియొకటి మెరుగైన ఎంపిక.
  6. వినియోగదారుని అభిరుచులు, ప్రవర్తన స్థిరంగా ఉంటాయి.
  7. వినియోగదారుడు వివిధ వస్తు సముదాయాల మధ్య ఉదాసీనంగా ఉంటాడు.

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

ప్రశ్న 7.
ఉదాసీన వక్రరేఖల విశ్లేషణ ఆవశ్యకతను వివరించండి.
జవాబు:

  1. ఇది బహుళ వస్తువుల విశ్లేషణ.
  2. ఇది ఆదాయ ప్రభావం, ధర ప్రభావం, ప్రత్యామ్నాయ ప్రభావాలని విశ్లేషించును.
  3. ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణ అస్థిర వాస్తవికతను కలిగి ఉండును.
  4. ద్రవ్య ఉపాంత ప్రయోజనం స్థిరం అనే ప్రమేయం లేకపోవడం వల్ల ధరలో మార్పులను పరిగణిస్తుంది.

ప్రశ్న 8.
సమోపాంత ప్రయోజన సూత్ర పరిమితులను తెల్పండి.
జవాబు:

  1. ఈ సూత్రం మన్నిక కల్గిన వస్తువుల విషయంలో వర్తించదు.
  2. విభజించుటకు వీలుకాని వస్తువుల విషయంలో ఈ సిద్ధాంతం వర్తించదు.
  3. వినియోగదారుడు ఇష్టపడే వస్తువులను మార్కెట్లో లభ్యం కాని పరిస్థితిలో ఈ సూత్రం పనిచేయదు.
  4. వ్యక్తులు సంప్రదాయాలను నెరవేర్చటానికి వ్యయం చేస్తూ ఉంటారు.
    ఉదా: వివాహం, కర్మకాండ మొదలగునవి. అటువంటి వాటి విషయాలలో ఈ సూత్రం వర్తించదు.
  5. వినియోగదారుని ఆదాయం, వస్తువుల ధరలు స్థిరంగా ఉన్నప్పుడే ఈ సూత్రం వర్తిస్తుంది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కార్డినల్ ప్రయోజనం [Mar. ’17, ’15]
జవాబు:
ఆల్ఫ్రెడ్ మార్షల్ కార్డినల్ సంఖ్యా పద్ధతి ద్వారా ప్రయోజన విశ్లేషణ చేసాడు. వివిధ వస్తువుల నుంచి పొందే ప్రయోజనాలను యుటిల్స్ అనే ఊహాత్మక యూనిట్స్ ద్వారా కొలవడానికి వీలుంది అని నవ్య సంప్రదాయ ఆర్థిక వేత్తలు భావించారు. 1, 2, 3 వంటి సంఖ్యలు కార్డినల్ సంఖ్యలు.

ప్రశ్న 2.
ఉపాంత ప్రయోజనం
జవాబు:
ఒక వినియోగదారుడు అదనంగా ఒక వస్తువు యూనిట్ని వినియోగించినప్పుడు మొత్తం ప్రయోజనంలో వచ్చే మార్పును ఉపాంత ప్రయోజనం అంటారు. దీనిని ఈ క్రింది విధంగా కొలవవచ్చు.
MU = ΔTU/ΔQ
ΔTU = మొత్తం ప్రయోజనంలో మార్పు
ΔQ = వస్తు పరిమాణంలో మార్పు.

ప్రశ్న 3.
వినియోగదారుని సమతౌల్యం
జవాబు:
సమతౌల్యం అనగా ఒక నిశ్చల స్థితి. వినియోగదారుడు తన వద్దనున్న పరిమిత ద్రవ్యంతో ఎక్కువ తృప్తిని పొందటానికి ప్రయత్నిస్తాడు. ఉపయోగించే వస్తువు ఉపాంత ప్రయోజనాలు సమానమైనప్పుడు మొత్తం ప్రయోజనం గరిష్టమవుతుంది. మొత్తం ప్రయోజనం గరిష్టమైనప్పుడు వినియోగదారుడు సమతౌల్యంలో ఉంటాడు.

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

ప్రశ్న 4.
బడ్జెట్ రేఖ [Mar 16]
జవాబు:
ఒక వినియోగదారుడు కొనుగోలుచేసే రెండు వస్తువుల ధరలు, ఆదాయాలు స్థిరంగా ఉండి ఏ సముదాయాలలో రెండు వస్తువులను కొనుగోలు చేయగలుగుతాడో తెలియజేసే దానిని బడ్జెట్ రేఖ లేదా ధర రేఖ అని అంటారు.

ప్రశ్న 5.
సమోపాంత ప్రయోజనం
జవాబు:
వినియోగదారుడు తన దగ్గర ఉన్న పరిమిత ద్రవ్యాన్ని వివిధ వస్తువుల మీద ఖర్చు చేసినప్పుడు ప్రతి చివరి రూపాయి నుంచి అతను పొందే ఉపాంత ప్రయోజనం సమానం అయ్యేటట్లు చూసుకోవాలి. అప్పుడు వినియోగదారుడు గరిష్ట సంతృప్తి పొందుతాడు. దీనినే సమోపాంత ప్రయోజన సూత్రం అంటారు.

ప్రశ్న 6.
ఉదాసీనత వక్రరేఖ
జవాబు:
వినియోగదారుడు కొనుగోలుచేసే రెండు వస్తువుల వివిధ సమ్మేళనాలను తెలియజేసే బిందువులను కలుపగా ఏర్పడే రేఖను “ఉదాసీనత వక్రరేఖ” అని అంటారు. దీనిని ఆర్డినల్ భావనపై ప్రతిపాదించటమైనది.

ప్రశ్న 7.
ప్రతిస్థాపనోపాంత రేటు
జవాబు:
అన్ని సముదాయాలు ఒకే స్థాయిలో సంతృప్తిని ఇవ్వటం వల్ల వినియోగదారుడు ఒక వస్తువు స్థానంలో మరొక వస్తువును ఏ రేటులో ప్రతిస్థాపన చేస్తున్నాడో దానిని ప్రతిస్థాపనోపాంత రేటు అంటారు. ఈ ప్రతిస్థాపనోపాంత రేటు ఉదాసీనత రేఖ స్వభావాన్ని, వాలును నిర్ణయించును.

అదనపు ప్రశ్నలు

ప్రశ్న 8.
ఉదాసీనత వక్రరేఖ పటం
జవాబు:
వినియోగదారుని అభిరుచి తరహాను తెలియజేసే అనేక ఉదాసీనతా వక్రరేఖల సముదాయం.
AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు 15

ప్రశ్న 9.
ఉదాసీనత పట్టిక
జవాబు:
వినియోగదారుడు ఉదాసీనంగా ఉండే వివిధ వస్తు సముదాయాలను తెలియజేయునది.

ప్రశ్న 10.
ఆర్డినల్ ప్రయోజనం
జవాబు:
హిక్స్, అలెస్ అనేవారు వినియోగదారుని ప్రవర్తనను అధ్యయనం చేయుటలో ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణను సమర్థించారు. ఈ విశ్లేషణ ద్వారా ప్రయోజనాన్ని సంఖ్యారూపంలో ఖచ్చితంగా చెప్పటం సాధ్యం కాదు. అయితే వివిధ సముదాయాల నుంచి పొందే వివిధ సంతృప్తి స్థాయిలతో పోల్చి చెప్పటం జరుగుతుంది. 1, 2, 3 అనేవి ఆర్డినల్ సంఖ్యలు.

ప్రశ్న 11.
ప్రయోజనం
జవాబు:
ఒక వస్తువుకు ఉండే మానవుని కోరికను తీర్చగలిగే శక్తి. ఇది నాలుగు రకాలు.

  1. ఆకార ప్రయోజనం
  2. స్థల ప్రయోజనం
  3. కాల ప్రయోజనం
  4. సేవా ప్రయోజనం

AP Inter 1st Year Economics Study Material Chapter 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు

ప్రశ్న 12.
మొత్తం ప్రయోజనం
జవాబు:
ఒక వినియోగదారుడు ఒక వస్తువును వినియోగం చేసేటప్పుడు లభించే మొత్తం తృప్తిని మొత్తం ప్రయోజనం అంటారు. ఉదా: ఒక యూనిట్ వినియోగం చేసే 20 యుటిల్స్ ప్రయోజనం వచ్చింది, రెండు యూనిట్లు ఉపయోగిస్తే, 35 యుటిల్స్ వస్తే వచ్చే మొత్తం ప్రయోజనం 55 యుటిల్స్ (1 + 2 Utils).
∴ TUx = f(Qx)

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Economics Study Material 1st Lesson పరిచయం Textbook Questions and Answers.

AP Inter 1st Year Economics Study Material 1st Lesson పరిచయం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సంపద నిర్వచనం గురించి చర్చించండి.
జవాబు:
అర్థశాస్త్రానికి సంపద నిర్వచనాన్ని ఆడమస్మిత్ అనే ఆర్థికవేత్త తెలియజేసారు. ఆడమ్స్మత్ను అర్థశాస్త్ర ” పితామహుడుగా చెప్పవచ్చు. ఇతని ఉద్దేశ్యంలో అర్థశాస్త్రం సంపదను గురించి వివరించే శాస్త్రం. ఆడమస్మిత్ తన ప్రఖ్యాతి పొందిన “రాజ్యాల సంపద” అనే గ్రంథంలో అర్థశాస్త్రాన్ని “రాజ్యాల సంపద స్వభావం, కారణాల పరిశీలన” అని నిర్వచించాడు. ఆడమస్మిత్ ఉద్దేశ్యంలో మానవుని ప్రధాన కార్యకలాపము సంపదను ఆర్జించడం. అతని అనుచరులయిన జె.బి. సే, జె. యస్, సాజ్ మొదలగువారు సంపద నిర్వచనాన్ని సమర్థించారు.

సంపద నిర్వచనములోని ప్రధానాంశాలు:
ఆడమస్మిత్ సంపద నిర్వచనంలోని ప్రధానాంశాలు క్రింది విధంగా పేర్కొన్నారు.

  1. మానవుని ఆర్థిక కార్యకలాపాల ముఖ్యోద్దేశం సంపదను ఆర్జించడం.
  2. సంపద అంటే ఉత్పత్తి చేయబడిన వస్తువులు.
  3. మానవుని స్వార్థపరమైన ఆలోచన సంపదను ఎక్కువగా ఆర్జించడం.

విమర్శ: అర్థశాస్త్రం సంపదను గురించి వివరించే శాస్త్రమనే సంకుచిత భావన వల్ల ఈ నిర్వచనం విమర్శలకు గురి అయింది.
1) కార్లెల్, రస్కిన్ అర్థశాస్త్రం నిర్వరహన్ని విమర్శించాడు. వారి ఉద్దేశ్యంలో ఈ నిర్వచనం సామాన్య మానవుని కార్యకలాపాలను గురించి అధ్యయనం చేయాలిగాని, ఆర్థిక మానవుని గురించికాదు అని విమర్శించారు. దానివల్ల వారు దీనిని “దయనీయమైన” శాస్త్రంగా వర్ణించారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

2) ఆడమస్మిత్ తన నిర్వచనంలో సంపదకు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చినాడు. కాని సంపద అనేది కేవలం మానవుని కోరికను తీర్చే ఒక సాధనం మాత్రమేనని మార్షల్ విమర్శించాడు.

3) కేవలం భౌతిక వస్తువులను మాత్రమే ఆడమ్స్మిత్ సంపదగా పరిగణించారు. అభౌతిక కార్యకలాపాలైన ఉపాధ్యాయుల, వైద్యుల సేవలను పరిగణనలోనికి తీసుకోలేదు. అందువల్ల అర్థశాస్త్ర పరిధి పరిమితమై పోతుంది.

4) సంపద నిర్వచనం కేవలం ఉత్పత్తి వైపు మాత్రమే దృష్టిని కేంద్రీకరిస్తోంది. పంపిణీని నిర్లక్ష్యం చేస్తుంది.

5) స్వార్థాన్ని పెంచును: సంపద నిర్వచనంలో సంపదకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మానవుడు స్వార్థపరుడు, కనుక స్వప్రయోజనం కోసం పనిచేస్తాడు. స్మిత్ దృష్టిలో స్వప్రయోజనానికి, సామాజిక ప్రయోజనానికి తేడా లేదు. ఈ నిర్వచనం వల్ల ఆర్థిక వ్యక్తి ఏర్పడతాడు. ఈ ఆర్థిక వ్యక్తి పూర్తిగా స్వార్థపూరితమైనవాడు.

6) ధన దేవత ఉద్భోద (Gosfel of Mammon): ఈ నిర్వచనం సంపద సృష్టికి ప్రాధాన్యతనిస్తుంది. అందువల్ల దీనిని థామస్, కార్లెల్ “ధన దేవత”గా పేర్కొన్నారు.

7) లోపభూయిష్టమైనది: వాల్రాస్ కూడా సంపద నిర్వచనాన్ని పరిశీలించి అది లోపభూయిష్టమైనదని, అశాస్త్రీయమైనదని, అసంపూర్ణమైనదని పేర్కొనెను.

8) సంకుచితమైనది ఆడమస్మిత్ తన నిర్వచనంలో సంపదకు ప్రాధాన్యత ఇచ్చాడు. కాని సంపద మానవుని కోర్కెలను సంతృప్తిపరచటానికి ఒక సాధనంగా ఉండాలి. అనగా వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వాలి కాని, సంపదకు కాదు. ఈ విషయంలో సంపద నిర్వచనం అర్థశాస్త్రాన్ని సంకుచిత దృష్టిలో వివరించింది.

ఇన్ని లోపాలున్న కారణంగానే ఎక్కువమంది ఆర్థికవేత్తలు ఈ నిర్వచనాన్ని తిరస్కరించారు.

ప్రశ్న 2.
సంక్షేమం నిర్వచనం గురించి వివరించండి.
జవాబు:
మార్షల్ అర్థశాస్త్రాన్ని “మానవుడు అతని శ్రేయస్సు గురించి చర్చించే శాస్త్రంగా” నిర్వచించారు. ఆయన నిర్వచనంలో మానవుడికి ప్రథమ స్థానాన్ని, సంపదకు ద్వితీయ స్థానాన్ని ఇచ్చారు. మార్షల్ ఉద్దేశ్యం ప్రకారం “దైనందిన కార్యకలాపాల్లో మానవ ప్రవర్తన గురించి అధ్యయనం చేసేది రాజకీయ అర్థశాస్త్రం. శ్రేయస్సును సాధించడం కోసం వ్యక్తి, సమాజం

ప్రవర్తనను గురించి అధ్యయనం చేస్తుంది. ఈ విధంగా ఒకవైపు సంపదను గురించి అధ్యయనం చేస్తూ, మరొకవైపు అధిక ప్రాధాన్యమైన మానవుని గురించి అధ్యయనం చేస్తుంది.” మార్షల్ అనుచరులైన ఏ.సి. పిగూ, ఎడ్విన్ కానస్ వంటి వారు మార్షల్ నిర్వచనాన్ని సమర్థించారు.

ముఖ్య లక్షణాలు:

  1. సంక్షేమాన్ని పెంపొందింపజేసే మానవ కార్యకలాపాలను గురించి మాత్రమే మార్షల్ నిర్వచనం పరిగణిస్తోంది.
  2. మానవునికి, మానవ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తూ సంపద అనేది మానవ సంక్షేమాన్ని పెంపొందింపజేసే సాధనంగా పేర్కొన్నాడు.
  3. ఇది కేవలం మానవుని ఆర్థిక విషయాలనే అధ్యయనం చేస్తుంది. రాజకీయ, సామాజిక, మత సంబంధమైన విషయాలతో దీనికి సంబంధం లేదు.
  4. మానవ సంక్షేమాన్ని పెంపొందింపజేయడానికి అవసరమైన భౌతిక సంపదను సముపార్జించడంలో వ్యక్తి, సమాజం ప్రవర్తనను అధ్యయనం చేస్తుంది.

విమర్శ: మార్షల్ నిర్వచనం కూడా అనేక విమర్శలకు గురైంది. ముఖ్యంగా రాబిన్స్, మార్షల్ యొక్క “శ్రేయస్సు” అనే భావనను విమర్శించాడు.

  1. అర్థశాస్త్రం సామాజిక శాస్త్రంగాని, మానవశాస్త్రం కాదు. అర్థశాస్త్ర మౌలిక సూత్రాలు మానవులందరికి వర్తిస్తాయి. అందువల్ల అర్థశాస్త్రాన్ని మానవ శాస్త్రంగానే తప్ప సామాజిక శాస్త్రంగా పరిగణించరాదు.
  2. మార్షల్ వస్తువులను భౌతిక మరియు అభౌతికమైనవిగా విభజించడం జరిగింది. కాని, తన నిర్వచనంలో అభౌతిక వస్తువులకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు.
  3. శ్రేయస్సును కొలవవచ్చు అనేది తీవ్రమైన అభ్యంతరంగా రాబిన్స్ విమర్శించారు. శ్రేయస్సు అనేది వ్యక్తిని బట్టి, కాలాన్ని బట్టి మారుతుంది.
  4. మానవ శ్రేయస్సును పెంపొందించే కార్యకలాపాలను మాత్రమే మార్షల్ పరిగణించాడు. అయితే మద్యం, విషంలాంటివి కూడా శ్రేయస్సును కలుగజేస్తాయి. మార్షల్ వీటిని విస్మరించాడు.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

ప్రశ్న 3.
సంక్షేమ నిర్వచనం కంటే రాబిన్స్ నిర్వచనం ఏ విధంగా మెరుగైనది ?
జవాబు:
శ్రేయస్సు నిర్వచనం: ఆడమస్మిత్ నిర్వచనంలోని లోపాలను మార్షల్ సరిదిద్దడానికి ప్రయత్నించాడు. మానవుడికి సంపదను ఆర్జించటమే అంతిమ ధ్యేయం కాదని, ఒక లక్ష్యాన్ని సాధించడానికి సంపద ఒక సాధనం మాత్రమేనని అన్నాడు. ఆ ఉద్దేశ్యంతో మార్షల్ మానవునికి ప్రథమ స్థానం, సంపదకు ద్వితీయ స్థానం ఇచ్చాడు. మార్షల్ ప్రకారం అర్థశాస్త్రం అనగా ఒకవైపు సంపద గురించిన చర్చ అని అంతకంటే ముఖ్యంగా మరొకవైపు మానవుని గురించిన పరిశీలనలో ఒక భాగం. అర్థశాస్త్రాన్ని మానవుని శ్రేయస్సుపై దృష్టిని కేంద్రీకరించే శాస్త్రంగా నిర్వచించెను. మార్షల్ పాటు పిగూ, ఎడ్విన్ కానన్, బెవరిడ్జి మొదలైనవారు కూడా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అర్థశాస్త్రాన్ని నిర్వచించారు.

శ్రేయస్సు నిర్వచనంలోని లోపాలు:

  1. అర్థశాస్త్రం సాధారణ మానవుని దైనందిన కార్యకలాపాలను పరిశీలిస్తుంది.
  2. సంఘటిత సమాజంలోని మానవుని ఆర్థిక కార్యకలాపాలను మాత్రమే అర్థశాస్త్రం పరిశీలిస్తుంది.
  3. శ్రేయస్సుకు ప్రథమ స్థానం, సంపదకు ద్వితీయ స్థానం ఇవ్వటం జరిగింది. సంపద మానవ శ్రేయస్సుకు సాధనం మాత్రమే.
  4. భౌతిక వస్తువుల ఆర్జన వినియోగాలను మాత్రమే అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది. ఆర్థికేతర కార్యకలాపాలను అర్థశాస్త్రం అధ్యయనం చేయదు.

కొరత నిర్వచనం: మార్షల్ నిర్వచనాన్ని విమర్శించి రాబిన్స్ అర్థశాస్త్రానికి విశ్లేషణాత్మక నిర్వచనాన్ని ఇచ్చారు. ‘యాన్ ఎస్సే ఆన్ ది నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎకనామిక్ సైన్స్’ అనే గ్రంథంలో రాబిన్స్ తన నిర్వచనాన్ని తెలియజేసెను. మానవుని అపరిమితమైన కోరికలను ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న పరిమిత సాధనాలకు ఉండే సంబంధం పట్ల మానవ ప్రవర్తన అధ్యయనమే అర్థశాస్త్రం” అని నిర్వచించెను. ఈ నిర్వచనంలో మానవ జీవితానికి సంబంధించిన కొన్ని నిత్య సత్యాలు ఉన్నాయి.

1) అపరిమిత కోరికలు: మానవుని కోరికలు అపరిమితం. ఒక కోరిక తీరగానే మరొక కోరిక ఉద్భవిస్తుంది. వాటిని తీర్చుకోవడానికి మానవుడు నిరంతరం కృషి జరపటం వల్ల ఆర్ధిక కార్యకలాపాలు కొనసాగుతాయి.

2) వనరులు పరిమితం: మానవుని కోర్కెలు సంతృప్తిపరిచే సాధనాలు లేదా వనరులు పరిమితమైనవి. సాధనాలు పరిమితంగా ఉండటం వల్ల కొరత మరియు ఆర్థిక సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి.

3) ప్రత్యామ్నాయ ప్రయోజనాలు: వనరులు పరిమితంగా ఉండటమే కాకుండా వాటికి ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉన్నాయి. అనగా ఒక సాధనానికి అనేక ఉపయోగాలు ఉంటాయి.

4) ఎంపిక: సాధనాల కొరత, అపరిమితమైన కోరికల వల్ల ఎంపిక అంశం అతి ముఖ్యమైనదిగా ఉంటుంది. సాధనాల కేటాయింపులోను, కోరికల ప్రాధాన్యతను అనుసరించి సంతృప్తిపరిచే విషయంలోను ఎంపిక సమస్య ఉత్పన్నమవుతుంది.

రాబిన్స్ నిర్వచనం మార్షల్ నిర్వచనం కంటే శాస్త్రీయమైనది:
1) కార్యకలాపాలను విభజించలేదు మార్షల్ అర్థశాస్త్రంలో భౌతిక అంశాలను గూర్చి మాత్రమే వివరించాడు. కాని రాబిన్స్ భౌతిక, అభౌతిక అంశాలను రెండింటిని గూర్చి అర్థశాస్త్రంలో చర్చించాడు.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

2) శ్రేయస్సును విమర్శించుట మార్షల్ శ్రేయస్సు అనే పదానికి, అర్థశాస్త్రానికి ముడిపెట్టాడు. కాని రాబిన్స్ ప్రకారం, అర్థశాస్త్రానికి శ్రేయస్సుతో ఏ మాత్రం సంబంధం లేదు. కారణం అర్థశాస్త్రంలో శ్రేయస్సుకు దోహదపడని వస్తువులు ఉదాహరణకి మత్తు పానీయాలు, సిగరెట్లు, విషం మొదలగు వాటిని గూర్చి కూడా చర్చిస్తాం.

3) లక్ష్యాల మధ్య తటస్థంగా ఉండుట: రాబిన్స్ ప్రకారం అర్థశాస్త్రం లక్ష్యాల మధ్య తటస్థంగా ఉంటుంది. ఏది మంచి, ఏది చెడు అనే నిర్ణయాలను చేయదు. అందువల్ల ఇది వాస్తవిక శాస్త్రం.

4) శాస్త్రీయమైనది: రాబిన్స్ నిర్వచనం వల్ల ఆర్థిక సమస్య ఏ విధంగా ఏర్పడుతుందో తెలుసుకోవడానికి వీలైనది. రాబిన్స్ అర్థశాస్త్రాన్ని శాస్త్రీయ స్థాయికి చేర్చి, ఎంపిక శాస్త్రంగా మలిచాడు.

5) పరిధిని విస్తృతపరిచింది: ఈ నిర్వచనం అన్ని రకాల ఆర్థిక వ్యవస్థలకు వర్తిస్తుంది. “వనరుల కొరత” అనేది ఒక సార్వత్రిక సమస్య. కనుక ఈ నిర్వచనం వల్ల అర్థశాస్త్ర పరిధి కూడా విస్తరించింది.
రాబిన్స్ నిర్వచనం మార్షల్ నిర్వచనం కంటే మెరుగైనప్పటికి కొన్ని విమర్శలకు గురైనది.

విమర్శ:
1) ఈ నిర్వచనం కొరతగా ఉన్న వనరులను ఉపయోగించి గరిష్ట స్థాయిలో కోరికలను ఏ విధంగా సంతృప్తి పరుచుకోవాలో అనే విషయం మీద దృష్టి సారించలేదు. విమర్శకుల అభిప్రాయం ప్రకారం ఈ నిర్వచనంలో శ్రేయస్సు అనే భావన అంతర్గతంగా ఇమిడి ఉంది.

2) రాబిన్స్ నిర్వచనానికి మరొక విమర్శ, ఇది మారుతున్న సమాజానికి వర్తించదు. కాలం మారుతున్న కొద్ది అనేక మార్పులు వస్తాయి. కాబట్టి వనరుల కొరత అనే సమస్యను అధిగమించవచ్చు.

3) ఆధునిక అర్థశాస్త్రంలో చాలా ముఖ్యమైన జాతీయ ఆదాయం, ఉద్యోగిత వంటి స్థూల ఆర్థిక విశ్లేషణను రాబిన్స్ నిర్వచనం విస్మరించింది.

4) ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి వంటి ఆధునిక అర్థశాస్త్రానికి సంబంధించిన ముఖ్యాంశాలను కొరత నిర్వచనంలో చర్చించలేదు.

5) శ్రీమతి జాన్ రాబిన్సన్ ఈ నిర్వచనాన్ని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థలో ఉపయోగించని వనరులు ఎక్కువగా ఉన్నప్పుడు ముఖ్య సమస్య వనరుల కొరత మాత్రమే కాదని, ఉన్న వనరులను ఏ విధంగా ఉపయోగించుకోవాలనేదే ముఖ్యమని ఆమె అభిప్రాయము.

ప్రశ్న 4.
ఆచార్య సామ్యూల్సన్ వృద్ధి నిర్వచనాన్ని తెలియజేయండి.
జవాబు:
రాబిన్స్, నిర్వచనంలో నిశ్చల దృక్పధం ఉన్నదని, కాలానుగుణంగా కోరికలు, లక్ష్యాలు, వనరులు, ఎంపికలు మారుతూ ఉంటాయని సామ్యూల్సన్ అభిప్రాయం. అందువల్ల రాబిన్స్ నిర్వచనంలో ఇమిడి ఉన్న నిశ్చలత్వాన్ని తొలగించి చలనత్వాన్ని కల్పిస్తూ సామ్యూల్సన్ కొత్త నిర్వచనం ఇచ్చాడు.

నిర్వచనం: “ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న పరిమితమైన ఉత్పాదక వనరులను ప్రజలు, సమాజం ద్రవ్యంతోగాని, ద్రవ్యం లేకుండాగాని ఎంపిక చేసుకొని ఉపయోగించుకోవడం ద్వారా వస్తూత్పత్తి చేపట్టి దానిని సమాజంలోని వివిధ వర్గాల ప్రజల మధ్య వర్తమాన లేదా భవిష్యత్కాలంలో ఏ విధంగా పంపిణీ చేసుకోవడం జరుగుతుందనే విషయ పరిశీలనే అర్థశాస్త్రము.”

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

నిర్వచనంలోని ముఖ్యాంశాలు:
1) వనరుల కొరత: రాబిన్స్ నిర్వచనంలో వలెనే సామ్యూల్సన్ కూడా వనరుల కొరత, అపరిమితమైన కోరికలు, ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న వనరులు అనే వాటినే బలపరచాడు.

2) ఆర్థిక వృద్ధి: సామ్యూల్సన్ తన నిర్వచనంలో ఆర్థికవృద్ధికి ప్రాధాన్యతయిచ్చాడు. కాలానుగుణంగా వివిధ వస్తువులను ఉత్పత్తి చేయడం, వస్తువులను వర్తమాన, భవిష్యత్కాలంలో పంపిణీ చేయడం అనే పదాలు కాల ప్రాముఖ్యాన్ని తెలుపుతాయి. ఆర్థిక వృద్ధి ప్రాముఖ్యాన్ని తెలియజేసే ప్రస్తుత వినియోగము, భవిష్యత్ వినియోగము కూడా ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి.

3) చలన స్వభావం: సామ్యూల్సన్ నిర్వచనం చలనత్వం కలిగి ఉండటమే కాక విస్తృత పరిధి కలిగి ఉంది. ఎంపిక సమస్య ద్రవ్య ఆర్థిక వ్యవస్థలోనే కాకుండా వస్తుమార్పిడి సమస్యలో కూడా ఉంది.

4) ఎంపిక సమస్య: ఎంపిక సమస్య సామ్యూల్సన్ చలన దృష్టిలో పరిగణిస్తాడు. ఎంపిక వర్తమానానికే కాకుండా భవిష్యత్కాలానికి కూడా సంబంధించినది. మానవుని కోరికలు స్థిరంగా ఉండవు. అవి కాలంతోపాటు పెరుగుతూ, మారుతూ ఉంటాయి. ఈ మార్పులకు అనుగుణంగా వనరులను పెంచాలి, మార్పులను తీసుకొని రావాలి. కనుక అర్థశాస్త్రానికి చలనత్వ స్వభావం ఉంటుంది.

కనుక ఈ నిర్వచనం అధిక ప్రజాదరణ పొందింది. మిగిలిన నిర్వచనాల కంటే ఈ నిర్వచనం సమగ్రమైనది. 5. ‘సూక్ష్మ’, ‘స్థూల’ అర్థశాస్త్రాల మధ్య తేడాలను తెలియజేయండి.
జవాబు: ఆర్థిక సమస్యల విశ్లేషణకు ఆధునిక ఆర్థికవేత్తలు రెండు మార్గాలను అవలంబించారు. అవి:

  1. సూక్ష్మ అర్థశాస్త్రం
  2. స్థూల అర్థశాస్త్రం

రాగ్నార్ష్ మొదటిసారిగా 1933లో సూక్ష్మ, స్థూల అనే పదాలను అర్థశాస్త్రములో ప్రవేశపెట్టారు.
1. సూక్ష్మ అర్థశాస్త్రం: సూక్ష్మ అర్థశాస్త్రం అనేది ‘Micros’ అనే గ్రీకు పదం నుండి పుట్టింది. ‘Micro’ అంటే చిన్న అని అర్థం. సూక్ష్మ అర్థశాస్త్రం ఒక వైయుక్తిక ఆర్థిక యూనిట్ను పరిగణనలోనికి తీసుకొని దాని ప్రవర్తనను సమగ్రంగా అధ్యయనం చేస్తుంది. సూక్ష్మ అర్థశాస్త్రము ఆర్థిక వ్యవస్థలోని చిన్న చిన్న భాగాలను గూర్చి అధ్యయనం చేస్తుంది. వైయుక్తిక యూనిట్లను గూర్చి వివరంగా పరిశీలిస్తుంది. ఇవి జాతీయ ఆర్థిక వ్యవస్థలో చిన్న చిన్న భాగాలు లేదా వైయుక్తిక యూనిట్లు మాత్రమే. ఒక వినియోగదారుడు తన ప్రయోజనాన్ని ఏ విధంగా గరిష్టం చేసుకుంటాడో, ఒక సంస్థ గరిష్ట లాభాలను ఏ విధంగా పొందుతుందో సూక్ష్మ అర్థశాస్త్రము మనకు తెలుపుతుంది. వస్తువుల ఉత్పత్తి కారకాల ధరలు ఏ విధంగా నిర్ణయించబడతాయో సూక్ష్మ అర్థశాస్త్రము పరిశీలిస్తుంది. అందువలననే దీనిని ధరల సిద్ధాంతము అని కూడా పిలుస్తారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

2. స్థూల అర్థశాస్త్రం: స్థూల అర్థశాస్త్రం అనేది ‘Macros’ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. ‘Macros’ అంటే పెద్ద అని అర్థం. స్థూల అర్థశాస్త్రం మొత్తం ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేస్తుంది. జాతీయాదాయం, మొత్తం వినియోగం, మొత్తం పొదుపు, మొత్తం ఉద్యోగిత మొదలైన సమిష్టి అంశాలను స్థూల అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది..

J.M. కీన్స్ స్థూల అర్థశాస్త్రానికి ఎక్కువ ప్రాచుర్యాన్ని కల్పించారు. ఆర్థికమాంద్యం కాలంలో ఆయన రాసిన | పుస్తకం ఉద్యోగిత, వడ్డీ, ద్రవ్య సాధారణ సిద్ధాంతం ప్రచురణ తరువాత స్థూల ఆర్థిక సిద్ధాంతానికి ఎక్కువ ప్రాచుర్యం లభించింది.

స్థూల అర్థశాస్త్రాన్ని “ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం” అని కూడా అంటారు. ఎందుకంటే ముఖ్యంగా ఆదాయం, ఉత్పత్తి, ఉద్యోగితా సిద్ధాంతాలను పరిగణనలోకి తీసుకొని వివరిస్తుంది.

సూక్ష్మ, స్థూల అర్థశాస్త్రాల మధ్య తేడాలు:
సూక్ష్మ అర్థశాస్త్రం

  1. సూక్ష్మ అర్థశాస్త్రం అనేది Micros అనే గ్రీకు పదం నుంచి ఉద్భవించింది. Micro అనగా చిన్న అని అర్థం.
  2. ఆర్థిక వ్యవస్థలో వ్యక్తిగత భాగాలను గురించి అధ్యయనం చేస్తుంది.
  3. దీనిని ధరల సిద్ధాంతం అని కూడా అంటారు.
  4. వస్తు, కారకాల మార్కెట్ ధర నిర్ణయం గురించి వివరిస్తుంది.
  5. డిమాండ్, సప్లయ్పై ఆధారపడి ధరల యంత్రాంగం ఉంటుంది.

స్థూల అర్థశాస్త్రం

  1. స్థూల అర్థశాస్త్రం అనేది Macros అనే గ్రీకు పదం నుంచి జనించింది. Macro అనగా పెద్ద అని అర్థం.
  2. ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని అధ్యయనం చేస్తుంది.
  3. ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని కూడా అంటారు.
  4. జాతీయాదాయం, సమిష్టి ఉద్యోగిత, సమిష్టి పొదుపు, పెట్టుబడి సాధారణ ధరలస్థాయి, ఆర్థికాభివృద్ధి మొదలైన అంశాలను చర్చిస్తుంది.
  5. సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లయ్ ప్రాతిపదికగా ఉంటుంది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఉచిత వస్తువులు, ఆర్థిక వస్తువుల మధ్య తేడాలు.
జవాబు:
మానవుని కోర్కెలను సంతృప్తిపరచగలిగే ఏ పదార్థాన్నైనా అర్థశాస్త్రంలో “వస్తువు” అంటారు. వస్తువులు ప్రాథమికంగా రెండు రకములు. అవి: 1) ఉచిత వస్తువులు 2) ఆర్థిక వస్తువులు
1. ఉచిత వస్తువులు: డిమాండ్ కంటే సప్లై శాశ్వతంగా ఎక్కువగా ఉండి, ధరలేని వస్తువులను ఉచిత వస్తువులంటారు. ఇవి మానవ నిర్మితాలు కాదు, ప్రకృతి ప్రసాదించినవి. వీటికి ఉపయోగిత విలువ మాత్రమే ఉంటుంది. ఉదా: గాలి, నీరు.

2. ఆర్థిక వస్తువులు: డిమాండ్ కంటే సప్లై తక్కువగా అనగా కొరతగా ఉండి ధర కలిగిన వస్తువులను ఆర్థిక వస్తువులు అంటారు. ఇవి మానవ నిర్మితాలు. వీటికి ఉత్పత్తి వ్యయం ఉంటుంది. వీటికి ఉపయోగిత విలువ, వినిమయ విలువలు ఉంటాయి.
ఉదా: ఆహారము, వస్త్రాలు, యంత్రాలు మొదలైనవి. ఇవి ఉచితంగా అనుభవించడానికి వీలుండదు.

1. ఉచిత వస్తువులు, ఆర్థిక వస్తువుల మధ్య తేడాలు.
ఉచిత వస్తువులు

  1. ఇవి ప్రకృతి బహుకరించినవి.
  2. వీటి సప్లై సమృద్ధిగా ఉంటుంది.
  3. వీటికి ధర ఉండదు.
  4. వీటికి ఉత్పత్తి వ్యయం ఉండదు.
  5. ఉపయోగిత విలువ ఉంటుంది.
  6. ఇవి జాతీయాదాయంలో చేర్చబడవు.

ఆర్థిక వస్తువులు

  1. ఇవి మానవుడిచే తయారుచేయబడినవి..
  2. డిమాండ్ కంటే సప్లై ఎప్పుడు తక్కువగా ఉంటుంది.
  3. వీటికి ధర ఉంటుంది.
  4. వీటికి ఉత్పత్తి వ్యయం ఉంటుంది.
  5. ఉపయోగిత విలువ, వినిమయ విలువ రెండూ ఉంటాయి.
  6. ఇవి జాతీయాదాయంలో చేర్చబడతాయి.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

ప్రశ్న 2.
కోరికల లక్షణాలు. [Mar. ’17, ‚ ’16, ’15]
జవాబు:
మానవుని కోరికలు, ఆర్థిక కార్యకలాపాలు పురోగతికి దోహదం చేస్తాయి. కోరికలు లేనిదే వినియోగం ఉండదు. ఉత్పత్తి ఉండదు, పంపిణి ఉండదు, వినిమయం ఉండదు..
కోరికలు లక్షణాలు:
1. కోరికలు అనంతాలు: మానవుల కోరికలకు ఒక పరిమితి అంటూ ఉండదు. ఒక కోరిక తీరగానే మరొక కోరిక పుట్టుకొస్తుంది. ఇవి వ్యక్తులనుబట్టి, కాలాన్నిబట్టి, నివసించే ప్రదేశాన్నిబట్టి మారుతూ ఉంటాయి.

2. ఒక కోరికను పూర్తిగా తృప్తిపరచగలగటం: మానవుడు తన కోరికలన్నింటిని పూర్తిగా సంతృప్తిపరచడం సాధ్యం కానప్పటికీ, ఒక కోరికను పూర్తిగా తృప్తి పరచటం సాధ్యమవుతుంది.
ఉదా: ఆకలిగా ఉన్న వ్యక్తి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆకలిని పూర్తిగా తీర్చుకోవచ్చు. అదే విధంగా ఒక కారును కొనుగోలు చేయడం ద్వారా, కారు కావాలనే కోరికను సంతృప్తిపరచవచ్చు.

3. కోరికలు పరస్పరం పోటీపడడం: కోరికలు అపరిమితంగా ఉంటాయి. కాని వాటిని తీర్చుకొనే సాధనాలు మాత్రం పరిమితంగా ఉంటాయి. అందువల్ల కోరికలను సంతృప్తిపరచుకునే ప్రాధాన్యత క్రియవలె అది పరస్పరం పోటీపడతాయి.

4. కోరికలు – పూరకాలు: ఒక కోరికను సంతృప్తిపరచుకోవడానికి అనేక వస్తువులు అవసరమవుతాయి. ఉదా: ఏదైనా మనం రాయాలి అనుకున్నప్పుడు పెన్ను, కాగితం, ఇంకు ఉన్నప్పుడే ఆ కోరిక తీరుతుంది.

5. ప్రత్యామ్నాయాలైన కోరికలు: ఒక కోరికను అనేక రకాలుగా తృప్తిపరచుకోవచ్చు.
ఉదా: ఆకలిగా ఉన్నప్పుడు భోజనం లేదా బ్రెడ్ లేదా పాలు, పండ్లు తీసుకోవడం ద్వారా ఈ కోరికను తృప్తిపరచుకోవచ్చు.

6. పునరావృత్తం: అనేక కోరికలు, ఒక సమయంలో వాటిని తృప్తిపరచినప్పుడు మళ్ళీ, మళ్ళీ పుట్టుకొస్తాయి. సాధారణంగా ఇవి కనీస అవసరాలైనా ఆహారం, నిద్ర మొదలైన కోరికల విషయంలో గమనించవచ్చు.

7. కోరికలు అలవాటుగా మారడం: ఒక కోరికను క్రమం తప్పకుండా సంతృప్తిపరచినప్పుడు అది అలవాటుగా మారుతుంది. ఈ అలవాటును మార్చుకోవడం తొందరగా సాధ్యం కాదు.

8. కోరికల ప్రాముఖ్యంలో తేడా: అన్ని కోరికల తీవ్రత ఒకే విధంగా ఉండదు. కొన్ని కోరికలను వాటి ప్రాముఖ్యతను బట్టి వెంటనే తీర్చుకోవాలని ఉంటుంది. మరికొన్నింటిని వాయిదా వేయడానికి అవకాశం ఉంటుంది.

ప్రశ్న 3.
ప్రయోజన రకాలు [Mar. ’15]
జవాబు:
మానవుల కోరికలను సంతృప్తిపరచగలిగే వస్తుసేవల శక్తిని ప్రయోజనం అంటారు. అర్థశాస్త్రంలో ప్రయోజనం అనే భావనకు చాలా ప్రాధాన్యత ఉంది.
ప్రయోజనం – రకాలు:
1. రూప ప్రయోజనం: ఒక వస్తువు ఆకారం, రంగు, పరిమాణం మొదలైనవి మార్చడం ద్వారా ఆ వస్తువుకు మానవుని కోరికను తీర్చగలిగే శక్తి పెరిగినట్లయితే దానిని రూప ప్రయోజనం అంటారు.

2. స్థల ప్రయోజనం: స్థలాన్ని మార్చడం ద్వారా కొన్ని వస్తువులకు అదనపు ప్రయోజనం చేకూరుతుంది. వస్తువులను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి మార్చడం వల్ల ఆ వస్తువుకు స్థల ప్రయోజనం చేకూరుతుంది. ఉదా: సముద్రతీరంలో ఇసుకకు ప్రయోజనం ఉండదు. దీనిని బయటకు తీసి మార్కెట్లకు రవాణా చేయడం వల్ల స్థల ప్రయోజనం చేకూరుతుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

3. కాల ప్రయోజనం: కాలాన్ని బట్టి కూడా వస్తువులకు ప్రయోజనం చేకూరుతుంది.
ఉదా: పంట చేతికి వచ్చిన కాలంలో ఆహార ధాన్యాలు ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉంటాయి. వ్యాపారస్తులు వీటిని నిలువచేసి, కొంతకాలం తరువాత ఈ వస్తువులను మార్కెట్లలో అమ్ముతారు. ఈ విధంగా వస్తువులను నిలవ చేయడం ద్వారా వ్యాపారస్తులు పొందే అదనపు ప్రయోజనాన్నే కాల ప్రయోజనంగా చెప్పవచ్చు.

4. సేవల ప్రయోజనం: సేవకు కూడా మానవుని కోరికలను తీర్చగలిగే శక్తి ఉంటుంది.
ఉదా: టీచర్లు, లాయర్లు, డాక్టర్లు సేవలు మొదలైన సేవలు కూడా మానవులు కోరికలను ప్రత్యక్షంగా తీర్చగలుగుతారు. అందువల్ల వీటిని సేవ ప్రయోజనాలుగా చెప్పవచ్చు.

ప్రశ్న 4.
జేకబ్ వైనర్ నిర్వచనం [Mar. ’17, ’16]
జవాబు:
అవసరాల ప్రాముఖ్యాన్ని లేదా ఆర్థిక కార్యకలాపాల ప్రాముఖ్యాన్ని ఆధారంగా చేసుకొని వ్యక్తులుగాని, సంస్థలుగాని, ప్రభుత్వన్యాయంగాని, ఆర్థిక వ్యవస్థగాని కొరతగా ఉండి ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న వనరులను పొదుపు లేదా ఆదా చేయటం ద్వారా అపరిమితమైన కోర్కెలను సంతృప్తిపరచటానికి ఎట్లా ఉపయోగించాలి అనేదే ఆర్థిక సమస్య. ఆర్థికవేత్తలు లేవనెత్తిన ప్రశ్నలను, వివిధ అంశాలను విశ్లేషణ చేయటం ద్వారా అర్థశాస్త్రాన్ని మెరుగైన విధంగా అధ్యయనం చేయటానికి వీలుంటుందని వీరి అభిప్రాయం. ఈ అభిప్రాయాలను సమర్థిస్తూ జేకబ్ వైనర్ ఈ నిర్వచనాన్ని ఇచ్చారు. జేకబ్ వైనర్ ఉద్దేశ్యం ప్రకారం “ఆర్థికవేత్తలు ప్రతిపాదించేది అర్థశాస్త్రం”.
లక్షణాలు ఏవైనా వివిధ ఆర్థిక వ్యవస్థల్లో ఆర్థికవేత్తలు కొన్ని మౌలికమైన సమస్యలను గురించి ఆందోళన కలిగి ఉంటారు.

  1. ఏ రకమైన వస్తువులను ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి ?
  2. వస్తువులను ఏ విధంగా ఉత్పత్తి చేయాలి ?
  3. వస్తుసేవలను ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి ?
  4. ఉత్పాదక వనరులను సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలి ?
  5. అందుబాటులో ఉన్న వనరులన్ని ఉపయోగించబడుతున్నాయా ?
  6. ఒక కాలవ్యవధిలో ఆర్థిక వ్యవస్థ వృద్ధిచెందుతుందా లేదా స్థిరంగా ఉందా ?

ప్రశ్న 5.
వివిధ ఆర్థిక విచారణలను గురించి వివరించండి.
జవాబు:
ఆర్థిక సూత్రాలు, సిద్ధాంతాలు రూపొందించడంలో ఒక నిర్థిష్టమైన పద్ధతి అవలంబించబడుతుంది. పీటర్సన్ అభిప్రాయంలో “ఆర్థిక సూత్రాలను నిర్మించడంలో పరిశీలించడంలో ఉపయోగించే పద్ధతులు, మౌలికాల ప్రక్రియను పద్ధతి (Method) అని అంటారు. ఆర్థిక సంబంధమైన విచారణ చేయడానికి ఆర్థికవేత్తలు సాధారణంగా రెండు రకాలైన పద్ధతులను అవలంబిస్తారు.

  1. నిగమన పద్ధతి
  2. ఆగమన పద్ధతి

1. నిగమన పద్ధతి: సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఈ పద్ధతిని ఎక్కువగా ఉపయోగించారు. దీనిని ‘పరికల్పన’ | (Hypothetical) లేదా అనిర్థిష్టక (Abstract) పద్ధతి అని కూడా అంటారు. ఇది వాస్తవాలపై కాకుండా ఒక మానసిక అభ్యాసం, తర్కం మీద ఆధారపడి ఉంటుంది. ఒక తరం నుంచి మరొక తరానికి కొన్ని నిర్థిష్టమైన ప్రమాణాలు అంగీకరించబడ్డ సూత్రాలు లేదా వాస్తవాల నుంచి తర్కం ద్వారా ఆర్థిక సిద్ధాంతాలను రూపొందించడం జరుగుతుంది. ఇందులో సాధారణ విషయాల నుంచి ఒక నిర్ధిష్ట విషయాన్ని రాబట్టడం జరుగుతుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

ఉదా: హేతుబద్ధంగా ఆలోచిస్తే ఒక వ్యక్తి సాధారణంగా తక్కువ ధర గల వస్తువుని కొంటాడు. ఎక్కువ ధరగల వస్తువును విక్రయిస్తాడు. అయితే మార్కెట్ను గురించి సరైన పరిజ్ఞానం కలిగి ఉండాలి. నిగమన పద్ధతిలో నిర్ణయాలు చేసేటప్పుడు నాలుగు దశలు ఉంటాయి.

  1. ఒక సమస్యను ఎన్నుకోవడం
  2. ప్రమేయాలను రూపొందించడం
  3. ఒక పరికల్పనను రూపొందించడం (Hypothesis)
  4. పరికల్పన ప్రతిపాదనను పరిశీలించడం

క్షీణోపాంత ప్రయోజన సూత్రం నిగమన పద్ధతికి ఒక ఉదాహరణ.

2. ఆగమన పద్ధతి: దీనిని చారిత్రక లేదా గుణాత్మక లేదా అనుభవిక, వాస్తవ, నిర్థిష్ట పద్ధతి అని పిలుస్తారు. జర్మనీ ఆర్థికవేత్తలు దీనిని అభివృద్ధి పరిచారు. ఇది ఒక నిర్దిష్ట లేదా ప్రత్యేక అంశం నుంచి విశ్వజనీనతకు పయనిస్తుంది. ” ఇందులో వాస్తవాల వివరాల సేకరణ చేసి సమకూర్చి నేల నిర్ణయాలు చేయబడతాయి. ఉదా: మార్థస్ సిద్ధాంతం.
ఈ పద్ధతిలో నాలుగు దశలు ఉంటాయి.

  1. సమస్యను ఎన్నుకోవడం
  2. దత్తాంశాన్ని సేకరించడం
  3. పరిశీలించడం
  4. సాధారణీకరించటం

విషయాలను ఉన్నవి ఉన్నట్టుగానే వివరించడం వల్ల ఈ పద్ధతి దిగా భావించబడుతుంది.

ప్రశ్న 6.
స్థూల అర్థశాస్త్రానికి అర్థాన్ని తెలిపి, దాని పరిధి, ప్రాధాన్యతను వివరించండి ?
జవాబు:
అర్థశాస్త్రాన్ని సూక్ష్మ అర్థశాస్త్రం, స్థూల అర్థశాస్త్రమని రెండు విధాలుగా రాగ్నా 1933 సం॥లో విభజించారు. అప్పటి నుండి ఈ విభజన ప్రచారంలోకి వచ్చింది.

స్థూల అర్థశాస్త్రం వైయుక్తిక యూనిట్లను కాకుండా మొత్తం లేదా సమిష్టి యూనిట్లను మొత్తంగా పరిశీలిస్తుంది. యూనిట్ల మొత్తాన్ని స్పష్టంగా నిర్వచించి వాటి మధ్య ఉండే పరస్పర సంబంధాలను పరిశీలించడం ఈ విశ్లేషణ ముఖ్యోద్దేశము. గార్డెనర్ ఆక్లే ప్రకారం స్థూల అర్థశాస్త్రం ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన మొత్తం ఉత్పత్తి వనరుల నియామకం, జాతీయాదాయ పరిమాణం, సాధారణ ధరల స్థాయి మొదలైన వాటిని పరిశీలిస్తుంది. స్థూల అర్థశాస్త్రాన్ని ” ఆదాయ ఉద్యోగితా సిద్ధాంతము” అని కూడా ఆన్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు.

స్థూల అర్థశాస్త్ర పరిధి:
AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం 1

స్థూల అర్థశాస్త్రం – ప్రాధాన్యత:

  1. ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నుల పరిశీలనకు తోడ్పడుతుంది. ఆర్థిక సమస్యలకు మూలకారణాలను కనుగొని, వాటి పరిష్కారానికి మార్గాలను సూచిస్తుంది.
  2. జాతీయోత్పత్తి స్థాయి, దాని కూర్పులను గురించి తెలుపుతుంది. తలసరి ఆదాయాలు, జీవన ప్రమాణాలు మొదలైన వాటిని విశ్లేషిస్తుంది.
  3. ఆర్థికవ్యవస్థ వృద్ధి, స్థిరత్వాల చర్చలకు తోడ్పడుతుంది. వ్యాపార చక్రాల విశ్లేషణకు సహకరిస్తుంది.
  4. పేదరికం, నిరుద్యోగితలకు కారణాలను కనుగొని వాటి పరిష్కారానికి తోడ్పడే ఆర్థికాభివృద్ధి విధానాల రూపకల్పనలో సహాయపడుతుంది.
  5. ఆర్థిక వ్యవస్థలో పొదుపు, పెట్టుబడుల ప్రాధాన్యాన్ని వివరిస్తుంది.
  6. ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం కారణాలను స్పష్ట పరచటానికి సహాయపడుతుంది. అంతర్జాతీయ, జాతీయ సమస్యల పరిష్కారానికి ఈ శాస్త్రం తోడ్పడుతుంది.
  7. ఆర్థిక విధానాల కల్పనకు, ఆచరణకు ఉపయోగపడుతుంది.

ప్రశ్న 7.
సూక్ష్మ అర్థశాస్త్రం అంటే ఏమిటి ? దాని పరిధి, ప్రాధాన్యాన్ని వివరించండి.
జవాబు:
అర్థశాస్త్రాన్ని సూక్ష్మ అర్థశాస్త్రమని, స్థూల అర్థశాస్త్రమని 1933 సం॥లో రాగ్నార్ ఫ్రిష్ ప్రతిపాదించెను. సూక్ష్మ అర్థశాస్త్రం అనేది ‘Micros’ అనే గ్రీకు పదం నుండి పుట్టింది. ‘Micro’ అంటే చిన్న అని అర్థం. సూక్ష్మ అర్థశాస్త్రం ఒక వైయుక్తిక ఆర్థిక యూనిట్ను పరిగణనలోనికి తీసుకొని దాని ప్రవర్తనను సమగ్రంగా అధ్యయనం చేస్తుంది. ఇది ఆర్థిక వ్యవస్థలోని చిన్నచిన్న భాగాలను గూర్చి అధ్యయనం చేస్తుంది. వైయుక్తిక యూనిట్లను గూర్చి వివరంగా పరిశీలిస్తుంది. ఒక వినియోగదారుడు తన ప్రయోజనాన్ని ఏ విధంగా గరిష్టం చేసుకుంటాడో ? ఒక సంస్థ గరిష్ట లాభాలు ఏ విధంగా పొందుతుందో ? సూక్ష్మ అర్థశాస్త్రం తెలుపుతుంది. వస్తువుల ఉత్పత్తి కారకాల ధరలు ఏ విధంగా నిర్ణయించబడతాయో సూక్ష్మ అర్థశాస్త్రం పరిశీలిస్తుంది. అందువలనే దీనిని ధరల సిద్ధాంతం అని కూడా పిలుస్తారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

పరిధి: వైయుక్తిక యూనిట్ల పరిశీలనయే సూక్ష్మ అర్థశాస్త్రం. “సంపూర్ణ ఉద్యోగిత” అనే ప్రమేయముపై సూక్ష్మ అర్థశాస్త్ర విశ్లేషణ జరుగుతుంది. ఇది వినియోగదారులను ఉత్పత్తిదారులను విడివిడిగా వారి ప్రవర్తనను విశ్లేషించును. సూక్ష్మ అర్థశాస్త్రం ముఖ్యంగా ఏమిటి ? ఎలా ? ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి ? అనే అంశాలను అధ్యయనం చేస్తుంది. వస్తువుల మార్కెట్లలో ధర నిర్ణయం, కారకాల మార్కెట్లో ధర నిర్ణయం అధ్యయనం చేస్తుంది. ఈ క్రింది చార్టు సూక్ష్మ అర్థశాస్త్ర పరిధిని వివరిస్తుంది.

సూక్ష్మ అర్థశాస్త్ర పరిధి:
AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం 2

ప్రాధాన్యత:

  1. స్వేచ్ఛా మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో అపరిమిత సంఖ్యలో ఉన్న వినియోగదారులు, ఉత్పత్తిదారులు మధ్య వనరులు అభిలషణీయంగా ఏ విధంగా కేటాయింపులు జరుగుతాయో సూక్ష్మ అర్థశాస్త్రం వివరిస్తుంది.
  2. ఇది వ్యక్తుల, సంస్థల సమతౌల్యాన్ని వివరిస్తుంది.
  3. ప్రభుత్వ ఆర్థిక విధానాల రూపకల్పనలో ఉపకరిస్తుంది. ఉదాహరణకు ఏకస్వామ్యాల నియంత్రణ, పరిశ్రమల సబ్సిడీ మొదలైనవి.
  4. ఆర్థిక మంత్రికి పన్ను భారంను ఏ విధంగా వినియోగదారులకు, ఉత్పత్తిదారులకు అమ్మకందారులకు పంపిణీ చేయాలో వివరిస్తుంది.
  5. ఉత్పత్తి వ్యయాలు, డిమాండ్ను అంచనా వేయడం వంటి వ్యాపార సంబంధ విషయాలను అధ్యయనం చేస్తుంది.
  6. పరిమిత సాధనాల నుండి గరిష్ట ప్రయోజనం పొందడానికి సహకరిస్తుంది.
  7. ఇది స్థూల అర్థశాస్త్రానికి ప్రతిపాదిక.

ప్రశ్న 8.
చక్రీయ ఆదాయ ప్రవాహాన్ని పటం సహాయంతో వివరించండి.
జవాబు:
ఆదాయానికి మూలం సంపద. ఆదాయం ఒక ప్రవాహం వంటిది. ఈ ప్రవాహం ఆది, అంతములేని చక్రంలాగా ఉంటుంది. చక్రం ఏ విధంగా భ్రమణం చెందుతుందో అదే విధంగా ఆదాయం కూడా భ్రమణం చెందుతుంది. చక్రీయ ఆదాయ ప్రవాహ (Circular flow of Income) స్వరూపాన్ని క్రింది పటం సహాయంతో అవగాహన చేసుకోవచ్చు.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం 3
ద్రవ్యరూపంలో ఆదాయం (వేతనాలు, భాటకం, వడ్డీ, లాభాలు)

పైన చూపిన పటం ప్రకారం ఉత్పత్తి కారకాల మార్కెట్కు, వస్తుసేవల మార్కెట్కు మధ్య సన్నిహిత సంబంధమున్నట్లుగా అర్థమవుతుంది. కుటుంబాలు ఉత్పత్తి కారకాలను, మార్కెట్లో విక్రయిస్తాయి. వ్యాపార సంస్థలు ఉత్పత్తి కారకాలను కొనుగోలు చేస్తాయి. అందువల్ల ఉత్పత్తి కారకాలను ప్రతిఫలాలను వ్యాపార సంస్థలు ద్రవ్యరూపంలో చెల్లిస్తాయి. అనగా ఆదాయం వ్యాపార సంస్థల నుండి కుటుంబాలకు ప్రవహిస్తుంది. వ్యాపార సంస్థలు వినియోగ వస్తువులను ఉత్పత్తి చేస్తాయి. ఈ వస్తువులను కుటుంబాలు కొనుగోలు చేస్తాయి. ఈ కారణంగా కుటుంబాలు వ్యాపార సంస్థలకు ద్రవ్యరూపంలో చెల్లింపులు చేస్తాయి. అంటే ఆదాయం ఒకసారి వ్యాపార సంస్థల నుండి కుటుంబాలకు, మరొకసారి కుటుంబాల నుండి వ్యాపార సంస్థలకు ప్రవహిస్తుంది. దీనినే చక్రీయ ఆదాయ ప్రవాహం అంటారు.

ప్రశ్న 9.
వినియోగ, ఉత్పాదక వస్తువుల మధ్య ఉన్న తేడాను వివరించండి.
జవాబు:
మానవ కోరికలను సంతృప్తిపరచగలిగే ఏ పదార్థాన్నైనా అర్థశాస్త్రంలో “వస్తువు” అంటారు.
వస్తువులను రెండు రకాలుగా విభజిస్తారు. 1) ఉచిత వస్తువులు, 2) ఆర్థిక వస్తువులు.

ఆర్థిక వస్తువులను తిరిగి వినియోగ వస్తువులు, ఉత్పాదక వస్తువులని విభజిస్తారు.
1. వినియోగ వస్తువులు: మానవ కోరికలను ప్రత్యక్షంగా సంతృప్తిపరచే వస్తువులను వినియోగ వస్తువులంటారు. వీటినే ప్రథమశ్రేణి వస్తువులని కూడా అంటారు. వీటికి ప్రత్యక్ష డిమాండ్ ఉంటుంది. ఉదా: ఆహారం, వస్త్రాలు, నివసించే ఇల్లు మొదలైనవి. వినియోగ వస్తువులను రెండు రకములుగా విభజించవచ్చును. అవి,

  1. ఒకసారి ఉపయోగంతో నశించేవి
  2. కొంత కాలంపాటు ఉపయోగంలో ఉండేవి.

i) ఒకసారి ఉపయోగంతో నశించేవి: మనం తినే ఆహారం, త్రాగునీరు లేదా పానీయాలు ఒకసారి ఉపయోగంతోనే వాటి నుండి పొందే ప్రయోజనం నశిస్తుంది. సేవలన్నీ ఒకసారి ఉపయోగంతో ప్రయోజనాన్ని కోల్పోతాయి. ఉదా: విత్తనాలు, ముడిపదార్థాలు, బొగ్గు, విద్యుత్ మొదలగునవి.

ii) కొంత కాలంపాటు ఉపయోగంలో ఉండేవి: ఒకసారితోనే ప్రయోజనాన్ని పోగొట్టుకోకుండా కొంత కాలంపాటు ఉపయోగంలో ఉండి, వాటిని వినియోగించే వారికి ప్రయోజనాన్ని కలుగజేస్తాయి. ఈ వస్తువులు కొంత కాలంపాటు మన్నికను కలిగి ఉండి వినియోగదారులకు ప్రయోజనాన్ని ఇస్తాయి. వీటిని మన్నికగల వినియోగ వస్తువులంటారు. ఉదా: బల్ల, కుర్చీ, పుస్తకము, టీ.వి. మొదలైనవి.

2. ఉత్పాదక వస్తువులు: వీటినే మూలధన వస్తువులు అని కూడా అంటారు. అనగా ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తి సాధనాలు. ఏ వస్తువులైతే ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని, ఇతర వస్తువుల ఉత్పత్తికి తోడ్పడతాయో, అటువంటి వస్తువులను ఉత్పాదక లేదా మూలధన వస్తువులంటారు. ఇవి పరోక్షంగా మానవుని కోరికలను సంతృప్తిపరుస్తాయి. వీటినే ద్వితీయ శ్రేణి వస్తువులంటారు. వీటికి ఉత్పన్న లేదా పరోక్ష డిమాండ్ ఉంటుంది. ఇవి రెండు రకములు.

  1. ఒకసారి ఉపయోగంతో నశించేవి
  2. కొంత కాలంపాటు ఉపయోగంలో ఉండేవి

i) ఒకసారి ఉపయోగంతో నశించేవి: ఒకసారి వినియోగించగానే వాటి ప్రయోజనం నశిస్తుంది.
ఉదా: విత్తనాలు, ముడి పదార్థాలు, బొగ్గు, విద్యుత్ మొదలగునవి.

ii) కొంత కాలంపాటు ఉపయోగంలో ఉండేవి: కొన్ని వస్తువులు కొంత కాలం పాటు వినియోగంలో ఉంటాయి. అనగా కొంతకాలంపాటు ప్రయోజనాన్ని ఇవ్వగలుగుతాయి. వీటిని మన్నిక గల ఉత్పాదక వస్తువులు అంటారు. ఉదా: యంత్రాలు, ట్రాక్టర్, కర్మాగార భవనాలు మొదలగునవి.

వినియోగ వస్తువులకు, ఉత్పాదక వస్తువులకు మధ్యగల భేదములు:
వినియోగ వస్తువులు

  1. ఇవి ప్రత్యక్షంగా మానవ కోరికలను సంతృప్తిపరచును.
  2. వీటికి ప్రత్యక్ష డిమాండ్ ఉంటుంది.
  3. ఇవి ప్రథమశ్రేణి వస్తువులు.
  4. ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనవు.
  5. వస్తువులను కలిగిన యజమానులకు ఆదాయాన్నివ్వవు.

ఉత్పాదక వస్తువులు

  1. ఇవి పరోక్షంగా మానవ కోరికలను సంతృప్తిపరచును.
  2. వీటికి పరోక్ష లేదా ఉత్పన్న డిమాండ్ ఉంటుంది.
  3. ఇవి ద్వితీయ శ్రేణి వస్తువులు.
  4. ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటాయి.
  5. వస్తువులను కలిగిన యజమానులకు ఆదాయాన్ని చేకూర్చి పెడతాయి.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆర్థిక వస్తువులు [Mar. ’15]
జవాబు:
డిమాండ్ కంటే సప్లై తక్కువగా అనగా కొరతగా ఉండి ధర కలిగిన వస్తువులను ఆర్థిక వస్తువులంటారు. ఉదా: ఆహారం, వస్త్రాలు, యంత్రాలు మొదలైనవి. అవకాశం ఉంటే వీటిని వ్యక్తులు ఎక్కువగా కావాలనుకుంటారు. వీటికి ఉపయోగిత విలువ, వినిమయ విలువ ఉంటాయి. ఇది మానవ నిర్మితాలు. కనుక వీటికి ఉత్పత్తి వ్యయం ఉంటుంది.

ప్రశ్న 2.
ఉత్పాదక వస్తువులు
జవాబు:
ఉత్పాదక వస్తువులనే మూలధన వస్తువులు అని కూడా అంటారు. ఇవి ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తి సాధనాలు. ఏ వస్తువులైతే ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని ఇతర వస్తువుల ఉత్పత్తికి తోడ్పడతాయో అటువంటి వస్తువులను ఉత్పాదక వస్తువులు లేదా మూలధన వస్తువులు అంటారు. ఇవి పరోక్షంగా మానవుని కోరికలను సంతృప్తిపరచును. వీటిని ద్వితీయ శ్రేణి వస్తువులంటారు.

వీటికి పరోక్ష లేదా ఉత్పన్న డిమాండ్ ఉంటుంది. ఇవి ఒకసారి ఉపయోగంలో నశించేవి, కొంతకాలంపాటు వినియోగంలో ఉండేవి అని రెండు రకములు. ఉదా: యంత్ర పరికరాలు, కర్మాగార భవనాలు మొదలైనవి.

ప్రశ్న 3.
మధ్యంతర వస్తువులు [Mar. ’17]
జవాబు:
పూర్తిగా తయారు కాకుండా ఇంకా తయారీలో ఉన్న వస్తువుల ముడిసరుకులను, అంతిమ వినియోగ వస్తువులకు మధ్యలో వివిధ దశలలో ఉన్న వస్తువులను మధ్యంతర వస్తువులు అంటారు. అంతిమ వినియోగానికి కాకుండా ఇతర వస్తువుల ఉత్పత్తి ప్రక్రియలో ఏదో ఒక దశలో, ఎక్కడో ఒకచోట ఉపయోగించే వస్తువులు మాధ్యమిక వస్తువులు. ఉదా: సిమెంటు, ఇటుకలు, స్టీలు మొదలైనవి నిర్మాణ రంగంలో మధ్యంతర వస్తువులు.

ప్రశ్న 4.
సంపద [Mar. ’16]
జవాబు:
సాధారణ పరిభాషలో సంపద అనగా కేవలం ప్రజల వద్దనున్న ద్రవ్యం. కాని అర్థశాస్త్రంలో సంపద అనగా ద్రవ్యము మాత్రమే కాకుండా ప్రయోజనం, కొరత బదిలీ చేయటానికి అవకాశం ఉండటము అనే లక్షణాలుగల ఏ వస్తువులైనా సంపదగా పరిగణిస్తారు. ఉదా: భూములు, భవనాలు మొదలైనవి.

ప్రశ్న 5.
ఆదాయం
జవాబు:
ఆదాయానికి మూలం సంపద. ఆదాయం ఒక ప్రవాహం వంటిది. ఆదాయం ఒకసారి వ్యాపార సంస్థల నుండి ఉత్పత్తి కారకాల ప్రతిఫలాల రూపంలో కుటుంబాలకు, మరొకసారి కుటుంబాల నుండి వస్తు సేవలపై వ్యయ రూపంలో వ్యాపార సంస్థలకు ప్రవహిస్తుంది. దీనిని చక్రరూప ఆదాయ ప్రవాహం అంటారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

ప్రశ్న 6.
ప్రయోజనం [Mar. ’16]
జవాబు:
వస్తుసేవలకుండే మానవ కోరికలను సంతృప్తిపరచగలిగే శక్తిని అర్థశాస్త్రంలో ప్రయోజనం అంటారు. వస్తువు అన్ని యూనిట్ల నుండి పొందే ప్రయోజనం మొత్తాన్ని మొత్తం ప్రయోజనమని, వస్తువు అదనపు యూనిట్ వలన మొత్తం ప్రయోజనానికి కలుపబడే లేదా తీసివేయబడే ప్రయోజనమును ఉపాంత ప్రయోజనమని అంటారు. ఈ భావన అర్థశాస్త్రంలో చాలా ప్రధానమైనది.

ప్రశ్న 7.
వినిమయ విలువ
జవాబు:
ఒక వస్తువును వినిమయం చేసినప్పుడు దాని బదులుగా పొందగలిగే ఇతర వస్తువులను లేదా సాధారణ ద్రవ్యాన్ని వినిమయ విలువ అని అంటారు. ఉచిత వస్తువులకు మారకం విలువ ఉండదు లేదా తక్కువగా ఉంటుంది. కొన్ని రకాల వస్తువులకు మారకం విలువ అధికంగా ఉంటుంది.

ప్రశ్న 8.
ధర
జవాబు:
ఒక వస్తువు విలువను ద్రవ్య రూపంలో చెప్పినట్లయితే దానిని ధర అంటారు.
ఉదా: ‘X’ వస్తువు 10/- వినిమయం చెందుతుంది.

ప్రశ్న 9.
ఎంపిక సమస్య
జవాబు:
సాధనాల కొరత వల్ల మానవుడు అపరిమితమైన కోరికలలో వేటిని సంతృప్తిపరుచుకోవాలి, సాధనాలను ఎట్లా కేటాయించుకోవాలి అని ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. ఎంపిక సమస్యను అతి ముఖ్యమైన అర్థశాస్త్ర సమస్యగా రాబిన్స్ వివరించాడు.

ప్రశ్న 10.
ఆర్థిక కార్యకలాపాలు
జవాబు:
ఆదాయ ఆర్జన, వ్యయానికి సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలు.

ప్రశ్న 11.
సూక్ష్మ అర్థశాస్త్రం
జవాబు:
సూక్ష్మ అర్థశాస్త్రం అనేది మైక్రోస్ అనే గ్రీకు పదం నుండి పుట్టింది. సూక్ష్మ అర్థశాస్త్రం ఒక వైయుక్తిక ఆర్థిక యూనిట్ను పరిగణనలోకి తీసుకొని దాని ప్రవర్తనను సమగ్రంగా అధ్యయనం చేస్తుంది. ఉత్పత్తి కారకాల ధర నిర్ణయం గురించి వివరిస్తుంది, కాబట్టి దీనిని ధరల సిద్ధాంతం అంటారు.

ప్రశ్న 12.
స్థూల అర్థశాస్త్రం
జవాబు:
స్థూల అర్థశాస్త్రం అనేది మాక్రోస్ అనే గ్రీకు పదం నుండి పుట్టింది. ఆర్థిక వ్యవస్థ మొత్తానికి సంబంధించిన అంశాలను అంటే మొత్తం ఉద్యోగిత, మొత్తం ఆదాయం మొదలగు వాటిని గూర్చి అధ్యయనం చేస్తుంది. అందుచే స్థూల అర్థశాస్త్రాన్ని ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని కూడా అంటారు.

ప్రశ్న 13.
నిశ్చల ఆర్థిక విశ్లేషణ
జవాబు:
ఒకే సమయంలో లేదా ఒకే కాలానికి సంబంధించిన విలువలను తెలియజేసే రెండు చలాంకాల మధ్య ఉన్న ప్రమేయ సంబంధాన్ని నిర్ధారించడానికి చేసే విశ్లేషణ. ఉదా: సంపూర్ణ పోటీలోని సమతౌల్య ధర నిర్ణయం.

AP Inter 1st Year Economics Study Material Chapter 1 పరిచయం

ప్రశ్న 14.
చలన ఆర్థిక విశ్లేషణ
జవాబు:
ఆర్థిక చలనత్వం వేరువేరు సమయాలకు చెందిన విలువలను తెలియజేసే సంబంధిత చలాంకాల మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది.

ప్రశ్న 15.
నిగమన పద్ధతి
జవాబు:
తార్కిక విశ్లేషణ ద్వారా సార్వజనీనమైన ఫలితాలను వ్యక్తిగత అంశాలకు వర్తింపచేయడం.
ఉదా: క్షీణోపాంత ప్రయోజన సూత్రం.

ప్రశ్న 16.
ఆగమన పద్ధతి
జవాబు:
తార్కిక విశ్లేషణ చేయడం ద్వారా ప్రత్యేక అంశాల పరిశీలన వల్ల వచ్చిన ఫలితాలు మొత్తం అంశాలకు వర్తింప చేయడం. ఉదా: క్షీణ ప్రతిఫల సూత్రం.

AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Economics Study Material 10th Lesson అర్థగణాంక శాస్త్రం Textbook Questions and Answers.

AP Inter 2nd Year Economics Study Material 9th Lesson అర్థగణాంక శాస్త్రం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
విస్తరణ ప్రయోజనాలు ఏమిటి ?
జవాబు:
శ్రేణుల యొక్క పంపిణీని తెలియజేసేది విస్తరణ.
బౌలే అభిప్రాయం ప్రకారం “అంశాల విచరణ మానమే విస్తరణ”. బ్రూక్స్ మరియు డిక్ అభిప్రాయం ప్రకారం “సగటు చుట్టూ సంఖ్య దత్తాంశపు విలువలు ఏ స్థాయిలో వ్యాపింపబడి ఉంటాయో దానిని “దత్తాంశ విస్తరణ” అంటారు.

విస్తరణ లక్షణాలు :

  1. విస్తరణ మానం సూక్ష్మంగా గుణించడానికి వీలుగా ఉండవలెను.
  2. విస్తరణ మానం నిర్దిష్టంగా నిర్వచింపబడి ఉండాలి.
  3. విస్తరణ మానం శ్రేణి పంపిణీలో ప్రతి అంశంపై ఆధారపడినదై ఉండాలి.
  4. బీజీయ ప్రస్తావనకు తగినదిగా ఉండవలెను.
  5. విస్తరణ మానంకు ప్రతిచయన సుస్థిరత్వం ఉండవలెను.
  6. విస్తరణ మానం అంత్య అంశాల ద్వారా ప్రభావితం కాకూడదు.

ప్రాముఖ్యత :

  1. సగటు విశ్వసనీయతను నిర్ధారించవచ్చును.
  2. విస్తరణ స్వభావాన్ని, కారణాలను విశ్లేషించడం.
  3. అధ్యయనం చేసిన చలరాశులలో గల విచరణత్వాన్ని అదుపులో, నియంత్రణ చేయడంలో తోడ్పడటం.
  4. ఇతర గణాంక మానాలను కొలవడానికి కొలబద్దగా సహకరించడం.

AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం

ప్రశ్న 2.
విస్తరణ అనగానేమి ? వివిధ విస్తరణ మానాల పద్ధతుల గురించి వివరించండి.
జవాబు:
కేంద్రస్థానపు కొలతలైన అంకమధ్యమం, మధ్యగతం, బాహుళకం మొదలగునవి దత్తాంశానికి ప్రాతినిధ్యం వహించే అంకెలను తెలియజేస్తాయి. శ్రేణుల పంపిణీని తెలియజేసేది విస్తరణ.

బౌలే అభిప్రాయం ప్రకారం “అంశాల విచరణ మానమే విస్తరణ”.

బ్రూక్స్ మరియు డిక్ అభిప్రాయంలో “సగటు చుట్టూ సంఖ్యా దత్తాంశపు విలువలు ఏ స్థాయిలో వ్యాపింపబడి ఉంటాయో దానిని దత్తాంశ విస్తరణ” అంటారు.
విస్తరణ మానాలను ఈ క్రింది పద్ధతుల ద్వారా కొలవవచ్చు.

  1. వ్యాప్తి
  2. చతుర్థాంశపు విచలనం
  3. మధ్యమ లేదా సగటు విచలనం
  4. ప్రామాణిక విచలనం
  5. లారెంజ్ వక్రరేఖ

1) వ్యాప్తి : విస్తరణను అధ్యయనం చేయడంలో అతి సులభమైన పద్ధతి వ్యాప్తి. కెండాల్ ప్రకారం “అత్యధిక, అత్యల్ప విలువల తేడాను వ్యాప్తి” గా చెప్పవచ్చు.
ఇందులో
R = L – S
R = వ్యాప్తి
L = అత్యధిక విలువ
S = అత్యల్ప విలువ

2) చతుర్ధాంశ విచలనం : ఇచ్చిన పౌనఃపున్యం విభాజనం ఎగువ, దిగువ చతుర్థాంశాల సగటు పరమ వ్యత్యాసాన్ని చతుర్థాంశ విచలనమని అంటారు. ఈ చతుర్థాంశ విచలనము మధ్య గతమునకు అటూ, ఇటూ గల వివిధ అంశాలను అధ్యయనం చేస్తుంది. దీనిలో మొత్తం దత్తాంశాన్ని నాలుగు సమాన భాగాలుగా విభజించినట్లయితే ప్రతి భాగం 25 శాతం విలువను కల్గి ఉంటుంది, దీనితో మనం చతుర్థాంశ విచలనం మరియు మధ్యగతం విలువలను పొందవచ్చును.
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 1

Q.D = చతుర్థాంశ విచలనం
Q3 = ఎగువ చతుర్థాంశం
Q1 = దిగువ చతుర్థాంశం

3) మధ్యమ విచలనం : క్లార్క్ అభిప్రాయంలో “విచలనం గుర్తుల్ని విస్మరిస్తూ అంక మధ్యమం నుండి గాని, మధ్యగతం నుంచి గాని, బాహుళకం నుంచి గాని విభాజనంలో వ్యాపించిన అంశాల సగటు మొత్తాన్ని సగటు విచలనం లేదా మధ్యమ విచలనం అంటారు.
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 2
M.D = మధ్యమ విచలనం
f = పౌనఃపున్యం
N = అంశాల సంఖ్య
|D| = మాడ్యులస్

4) ప్రామాణిక విచలనం : విస్తరణ కొలమానాలలో ముఖ్యమైనది ప్రామాణిక విచలనం. దీనిని 1893వ సం॥లో కారల్ పియర్సన్ అభివృద్ధిపరిచారు. దీనిని “విచలనాల వర్గముల సగటు యొక్క వర్గమూలం” అనవచ్చు. విచలనాలను అంక మధ్యమము నుండి తీసుకొనవలసి ఉంటుంది. దీనిని గ్రీక్ అక్షరం (సిగ్మా) తో తెలియజేస్తారు.
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 3

5) లారెంజ్ వక్రరేఖ : విస్తరణ రేఖా పద్ధతిలో అధ్యయనం చేయడాన్ని లారెంజ్ రేఖాపద్ధతి అంటారు. ఈ పద్ధతి ఆర్థిక అసమానతలను కొలవడానికి, లాభాల పంపిణీ, వేతనాల పంపిణీ మొదలైన అంశాలను అధ్యయనం చేయడానికి ఉపయోగిస్తారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం

ప్రశ్న 3.
చతుర్థాంశ విచలన గుణకం గణన చేయండి.
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 4
జవాబు:
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 5
దిగువ చతుర్థాంశ గణన = n/4 వ అంశం
= 40/4 = 10వ అంశం
ఇది సంచిత పౌనఃపున్యంలో 13 కంటే తక్కువగా ఉంది. కనుక తరగతి అంతరం 10-20
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 6
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 7

ప్రశ్న 4.
కార్ల్ పియర్సన్ సహ సంబంధ గుణకంను గణన చేయండి.
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 8
జవాబు:
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 9
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 10

AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం

అదనపు ప్రశ్నలు

ప్రశ్న 1.
ఈ క్రింది దత్తాంశాన్ని కోటి సహసంబంధంను గణన చేయండి.
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 11
జవాబు:
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 12

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మధ్యమ విచలనము, ప్రామాణిక విచలనము మరియు చతుర్థాంశ విచలనము మధ్య సంబంధాన్ని నిర్వచింపుము.
జవాబు:
ఇచ్చిన పౌనఃపున్యం విభాజనం ఎగువ, దిగువ చతుర్థాంశాల సగటు పరమ వ్యత్యాసాన్ని చతుర్థాంశ విచలనమని అంటారు. ఈ పరిస్థితులలో మొత్తం దత్తాంశాన్ని నాలుగు సమాన భాగాలుగా విభజించినట్లయితే ప్రతి భాగం 25 శాతం విలువను కల్గి ఉంటూ, చతుర్థాంశ విచలనం మరియు మధ్యగతం విలువలను పొందగలము.

మధ్యమ విచలనము : విచలనం గుర్తుల్ని విస్మరిస్తూ అంక మధ్యమం నుంచి గాని, మధ్యగతం నుంచి గాని, బాహుళకం నుంచి గాని విభాజనంలో వ్యాపించిన అంశాల సగటు మొత్తాన్ని సగటు విచలనం అని అంటారు. ప్రామాణిక విచలనం : ప్రామాణిక విచలనాన్ని విచలనాల వర్గముల సగటు యొక్క వర్గమూలమని అనవచ్చును. విచలనాలను అంక మధ్యమం నుండి తీసుకొనవలసి ఉంటుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం

ప్రశ్న 2.
క్రింది అంశాలకు ప్రామాణిక విచలనమును లెక్కకట్టండి.
5, 10, 25, 30, 50.
జవాబు:
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 13
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 14

ప్రశ్న 3.
లారెంజ్ వక్రరేఖను నిర్వచిస్తూ ఉపయోగించే పద్ధతిని వివరించండి.
జవాబు:
విస్తరణను రేఖాపద్ధతి ద్వారా అధ్యయనం చేయడాన్ని లారెంజ్ వక్రరేఖా పద్ధతి అంటారు. ఈ పద్ధతి ఆర్థిక అసమానతలను కొలవడానికి, లాభాల పంపిణీ, వేతనాల పంపిణీ మొదలైన అంశాలను అధ్యయనం చేయడానికి ఉపయోగిస్తారు.

ఈ క్రింది వివరాల ఆధారంగా ఒక కంపెనీలో పనిచేస్తున్న ఏ ఉద్యోగస్తుల ఆదాయంతో విచరణత్వం తక్కువగా ఉందో లారెంజ్ వక్రరేఖా పద్ధతి ఉపయోగించి తెలుసుకోవచ్చు. ఉదాహరణకు
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 15

AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం

లారెంజ్ వక్రరేఖ నిర్మాణాలకు ఈ క్రింది నియమాలు పాటించాలి.

  1. దత్తాంశంలోని చలనరాశుల విలువలను, వాటి పౌనఃపున్యాలను సంచితం చేయాలి.
  2. సంచితం చేసిన ఈ రెండు విలువలకు శాతాలను వేర్వేరుగా లెక్కించాలి.
  3. ‘X’ అక్షంపై సంచిత చేసిన పౌనఃపున్యాల సంచిత శాతాలను, Y అక్షంపై సంచితం చేసిన చలనరాశుల శాతాలను చూపాలి.
  4. చలనరాశుల సంచిత శాతాలను వ్యతిరేకంగా, పౌనఃపున్యాల సంచిత శాతాలను గుర్తించి, ఆ బిందువులను కలుపుతూ వక్రరేఖ గీయండి. ఆ రేఖను లారెంజ్ వక్రరేఖ అంటారు.
    AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 16

పై రేఖాపటంలో సమ విభజన రేఖకు (0) లారెంజ్ వక్రరేఖ దూరం ఎక్కువగా ఉంటే విచరణత్వం ఎక్కువగా ఉందని, ఆ రెండు రేఖలు చాలా సమీపంలో ఉండే విచరణత్వం చాలా తక్కువగా ఉందని చెప్పవచ్చును.

ప్రశ్న 4.
సహ సంబంధం అనగానేమి ? సహ సంబంధం ప్రాముఖ్యత తెలియజేయండి. [Mar ’16]
జవాబు:
ఒక చలరాశిలో వచ్చిన మార్పులు వేరొక చలరాశిలో ఎలాంటి మార్పులను ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి సహ సంబంధం ఉపయోగపడుతుంది.

A.M. ట్యిటల్ ప్రకారం “రెండు లేదా అంతకంటే ఎక్కువ చలరాశుల మధ్యగల విచరణాన్ని అధ్యయం చేయడానికి ఉపయోగపడే గణాంక పద్ధతి.

సిమ్సన్ మరియు కబ్కా ప్రకారం “రెండు లేదా అంతకంటే ఎక్కువ చలరాశుల మధ్యగల సంబంధ స్థాయిని నిర్ణయించడానికి ఉపయోగపడే గణాంక పద్ధతి సహ సంబంధం.

  1. రెండు లేదా అంతకంటే ఎక్కువ సంబంధిత అంశాలను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది.
  2. వ్యాపార ఆర్థిక రంగాలకు సంబంధించిన సహ సంబంధం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది.
  3. ఒక చలనరాశి విలువ ఆధారంగా వేరొక చలనరాశి విలువను అంచనా వేయవచ్చును.
  4. సహ సంబంధం ద్వారా ప్రతిచయన దోషాలను కూడా కొలవవచ్చును.
  5. వ్యాపారవేత్తలకు వ్యయాలను, అమ్మకాలను, ధరను, ఇతర సంబంధిత అంశాలను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది.

ప్రశ్న 5.
సూచీ సంఖ్యల రకాలు ఎన్ని ?
జవాబు:
క్రీ.శ. 1764లో మొదటిసారిగా సూచీ సంఖ్యలను ఉపయోగించారు. ధరలలో మార్పులు అధ్యయనం చేయడం |కోసం ఉపయోగించిన సూచీసంఖ్యలు దేశంలోని ఆర్థిక పరిస్థితులు, ఉత్పత్తి కార్యకలాపాలను ప్రస్తుతం ఎక్కువగా వాడుతున్నారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం

క్రోటాన్ మరియు కౌటన్ ప్రకారం “పరస్పర సంబంధం కలిగి ఉన్న చలరాశుల సముదాయ పరిమాణంలోని వ్యత్యాసాలను కొలవడానికి ఉపయోగపడే సాధనాలే సూచీ సంఖ్యలు”.

సూచీ సంఖ్యల వర్గీకరణ : ఆర్థిక వ్యాపార రంగాలలో ఉపయోగించే సూచీ సంఖ్యలను ఈ క్రింది రకాలుగా వర్గీకరించవచ్చును. అవి :

  1. ధరల సూచీ సంఖ్యలు
  2. పరిమాణ సూచీ సంఖ్యలు
  3. విలువ సూచీ సంఖ్యలు
  4. ప్రత్యేక అవసర సూచీ సంఖ్యలు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వ్యాప్తి. [Mar ’17, ’16]
జవాబు:
విస్తరణను అధ్యయనం చేయడంలో అతి సులభమైన పద్దతి వ్యాప్తి. కెండాల్ ప్రకారం “అత్యధిక, అత్యల్ప విలువల తేడాను వ్యాప్తి” గా పరిగణించవచ్చును.
R=L-S

ప్రశ్న 2.
మధ్యమ విచలనము.
జవాబు:
కేంద్రస్థానపు కొలతల నుంచి తీసుకున్న విచలనాల పరమ సగటుగా మధ్యమ విచలనాన్ని చెప్పవచ్చును. క్లార్క్ అభిప్రాయం ప్రకారం “విచలనం గుర్తుల్ని విస్మరిస్తూ అంక మధ్యమం నుంచి గాని, మధ్యగతం నుంచి గాని, బాహుళకం నుంచి గాని విభాజనంలో వ్యాపించిన అంశాల సగటు మొత్తాన్ని సగటు విచలనం లేదా మధ్యమ విచలనం” అంటారు.
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 17

ప్రశ్న 3.
సహ సంబంధం. [Mar ’17]
జవాబు:
ఒక చలనరాశిలో వచ్చిన మార్పులు వేరొక చలనరాశిలో ఎలాంటి మార్పులను ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి ఈ సహ సంబంధం ఉపయోగపడుతుంది. ఇది మూడు రకాలు.

  1. వ్యాపనపటం పద్ధతి
  2. కార్ల్ పియర్సన్ పద్దతి
  3. స్పియర్మన్ కోటి సహ సంబంధ గుణకం.

ప్రశ్న 4.
కోటి సహ సంబంధం.
జవాబు:
1904వ సంవత్సరంలో చార్లెస్ ఎడ్వర్డ్ స్పియర్ మన్ దీనిని ప్రతిపాదించాడు. గుణాత్మక దత్తాంశంలో అంశాలను క్రమ పద్ధతిలో కోడీకృతం చేసి, ఆ చలనరాశుల మధ్య సహ సంబంధ గుణకంను కోటి సహ సంబంధ గుణకం అంటారు.

ప్రశ్న 5.
సూచీ సంఖ్యలు.
జవాబు:
1764వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా సూచీ సంఖ్యలను ఉపయోగించారు. పరస్పర సంబంధం కలిగి ఉన్న చలరాశుల సముదాయ పరిమాణంలోని వ్యత్యాసాలను కొలవడానికి ఉపయోగపడే సాధనాలే సూచీ సంఖ్యలు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం

ప్రశ్న 6.
లాస్పెయిర్ సూచీ సంఖ్య సూత్రం.
జవాబు:
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 18

ప్రశ్న 7.
పాషి సూచీ సంఖ్య సూత్రం.
జవాబు:
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 19

ప్రశ్న 8.
ఫిషర్ సూచీ సంఖ్య సూత్రం.
జవాబు:
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 20

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Economics Study Material 9th Lesson ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ Textbook Questions and Answers.

AP Inter 2nd Year Economics Study Material 9th Lesson ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థపై ఒక వ్యాసాన్ని వ్రాయండి.
జవాబు:
నైసర్గిక స్వరూపము: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 12°41′ మరియు 22° ల ఉత్తర అక్షాంశ రేఖలకు మరియు 77°, 80°40′ తూర్పు రేఖాంశాల మధ్య ఏర్పడి ఉత్తరాన మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, తెలంగాణ మరియు ఒడిషా, తూర్పున బంగాళాఖాతము, దక్షిణాన తమిళనాడు, పడమర కర్ణాటక రాష్ట్రాలను సరిహద్దులుగా కలిగి ఉంది. గోదావరి, కృష్ణా మరియు తుంగభద్ర వంటి ప్రధాన నదులు ఈ రాష్ట్రం గుండా ప్రవహిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సహజ మరియు మానవ వనరులను సమృద్ధిగా కలిగి, పోటీ తత్వానికి కావల్సిన సామాజిక ఆర్థిక పరిపుష్టులను కలిగివుంది. మొత్తం 1,60,20,400 హెక్టార్ల భౌగోళిక భూభాగాన్ని కల్గిన భారతదేశంలోని 8వ పెద్ద రాష్ట్రంగా నిల్చింది. గుజరాత్ తర్వాత దేశంలో 974 కి.మీ. తీరప్రాంతము కల్గిన 2వ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. మొత్తం భూభాగంలో 21.81 శాతము అంటే 34,93,475 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని కలిగివుంది. ఆంధ్రప్రదేశ్ ఒకవైపు ఎత్తైన పర్వత ప్రాంతాలు, మైదానాలు, మరొకవైపు తీరప్రాంతము మరియు పీఠభూములతో కూడిన బహువిధ భౌతిక లక్షణాలు కల్గి ఉంది.

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ – లక్షణాలు: భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ వైశాల్యము మరియు జనాభా దృష్ట్యా పెద్ద రాష్ట్రాల్లో ఒకటిగా నిల్చింది. దేశ భూభాగములో 4.96 శాతం భూమిని కల్గిన 8వ పెద్ద రాష్ట్రంగా ఉన్నది. రాష్ట్రము 4.6 కోట్ల జనాభాతో దేశ జనాభాలో 4.10 శాతం కల్గి ఉండి, జనాభా దృష్ట్యా 10వ అతిపెద్ద రాష్ట్రంగా ఉన్నది. మొత్తం భూభాగంలో 40.95% వ్యవసాయ యోగ్య భూమి, 21.81% అడవులను కల్గివున్నది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

1) రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (GSDP): రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి మరియు భారతదేశ స్థూల దేశీయోత్పత్తి, వాటి వృద్ధి రేటులతోపాటు రాష్ట్ర, దేశ స్థూల ఉత్పత్తి విలువ 2004 – 05 మరియు 2013-14ల మధ్య దాదాపు రెట్టింపు అయినట్లుగా విశదమవుతున్నది. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో నిరంతర పెరుగుదల ధోరణి కనిపిస్తున్నది. 2004 – 05 లో R 1,34,767 కోట్లుగా ఉన్న రాష్ట్ర ఉత్పత్తి విలువ 2013 – 14 నాటికి 2,50,282 కోట్లుగా చేరుకొన్నది. 2011-12 తర్వాత రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి జాతీయ సగటు GDP పెరుగుదల కన్నా అధికంగా నమోదయినది. రాష్ట్ర GSDP భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో 4.36 శాతాన్ని కల్గివుంది.

2) తలసరి ఆదాయము: రాష్ట్ర తలసరి ఆదాయం, దేశ సగటు తలసరి ఆదాయం కన్నా 2, 3 సం॥లలో తప్ప మిగిలిన సంవత్సరాలలో అధికంగా నమోదు అయ్యింది. దీనిని రాష్ట్రంలో పెరుగుతున్న ప్రజల జీవన ప్రమాణానికి సూచికగా పరిగణింపవచ్చును. 2013-14 సం॥లో రాష్ట్ర, దేశ తలసరి ఆదాయాల మధ్య తేడా ? 11,417 లుగా ఉంది.

3) జనాభా వృద్ధిరేటులో పోకడలు: 2011 జనాభా లెక్కల ప్రకారం 13 జిల్లాలలోని మరియు 4.96 కోట్ల జనాభాతో ఆంధ్రప్రదేశ్ దేశంలో పదవస్థానంలో నిల్చింది. మొదటి నుండి భారతదేశ జనాభా వృద్ధి రేటు కన్నా, రాష్ట్ర జనాభా దశాబ్ద వృద్ధి రేటు తక్కువగానే నమోదవుతున్నది.
మొదటిసారి 2011 దశకంలో రాష్ట్ర వార్షిక జనాభా వృద్ధిరేటు 1% కన్నా తక్కువ (0.921)గా నమోదయింది.

4) రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో రంగాల వాటా: దీనిలో వివిధ రంగాల వాటా వర్తమాన సంవత్సర ధరల ప్రకారం కాని, ఆధార సంవత్సర (2004-05) ధరల ప్రకారం కాని అనేక మార్పులకు గురవుతూ, వాటా ఆధిపత్యం వ్యవసాయం నుండి క్రమంగా సేవారంగానికి మారుతూ వస్తున్నది.

రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి 2004-05 ఆర్థిక సంవత్సరంలో కౌ 1,36,767 కోట్లుగా ఉంది. ఇందులో వ్యవసాయ రంగం R 40,232 కోట్లు సమకూర్చగా, గనులు, వస్తు తయారీ, విద్యుత్, గ్యాస్, నీటి సప్లయి మొదలగు ఉపరంగాలు కలిగిన పారిశ్రామిక రంగం 29,124 కోట్లు మరియు సేవారంగం 65,411 కోట్లను సమకూర్చడం జరిగింది. | 2013 – 14 సంవత్సర తాత్కాలిక అంచనాల ప్రకారం మొత్తం రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో 2004 – 05 ఆధార సంవత్సరం ధరలలో 58,390 కోట్లు, పారిశ్రామిక రంగం కౌ 51,838 కోట్లు మరియు సేవారంగము శౌ 1,40,054 కోట్లు సమకూర్చడం జరిగింది.

5) నిరుద్యోగిత రేటు: నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ (NSS) అనే సంస్థ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి దేశంలో ఉద్యోగిత, నిరుద్యోగితలను అంచనా వేస్తుంది. ఇటీవలి (2011-12) సర్వే ప్రకారం నిరుద్యోగుల రేటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో, దేశ సగటు కన్నా ఎక్కువగా నమోదయింది. రాష్ట్రంలో ఈ రేటు 2004 – 05 వరకు పెరిగి ఆ తర్వాత మొత్తం దేశంలో లాగానే గ్రామీణ, పట్టణ ప్రాంతంలో తగ్గుతూ వస్తున్నది.

ప్రతి వెయ్యిమంది శ్రామిక శక్తిలో నిరుద్యోగులుగా ఉన్న వారి సంఖ్యను “నిరుద్యోగిత రేటు” అంటారు. 2011 – 12 సంవత్సరానికి NSS వారు వేసిన 68వ రౌండు అంచనాల ప్రకారం గ్రామీణ ప్రాంత నిరుద్యోగిత రేటు (12%), భారత గ్రామీణ నిరుద్యోగిత రేటు (17%) కన్నా తక్కువగా ఉంది. కాని పట్టణ నిరుద్యోగితా రేటు విషయంలో రాష్ట్ర నిరుద్యోగిత రేటు (43%), దేశ సగటు కన్నా (34%) ఎక్కువగా నమోదయ్యింది.

6) పేదరికము: ఆంధ్రప్రదేశ్ వివిధ నూతన పేదరిక నిర్మూలనా పథకాలకు రూపొందించడంలో అగ్రగామిగా ఉంది. సబ్సిడీలు, మహిళా సాధికారత కోసం ఇందిర క్రాంతి పథం (IKP), పేదలకు గృహ నిర్మాణం కోసం రాజీవ్ స్వగృహ పథకం, వృద్ధాప్య పింఛన్లు, ఆరోగ్యశ్రీ వంటి వైద్య పథకాలు మొదలైనవి రాష్ట్రంలో అమలవుతున్నాయి.

ప్రశ్న 2.
రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (GSDP) అనగానేమి ? ఆంధ్రప్రదేశ్ (SGDP) సరళిని పరిశీలించండి.
జవాబు:
భారతదేశములో ఆంధ్రప్రదేశ్ వైశాల్యము మరియు జనాభా దృష్ట్యా రాష్ట్రాల్లో ఒకటిగా నిల్చింది. దేశ భూభాగంలో 4.96 శాతం భూమిని కల్గిన 8వ పెద్ద రాష్ట్రంగా ఉన్నది. రాష్ట్రము 4.6 కోట్ల జనాభాతో దేశ జనాభాలో 4.10 శాతం కల్గివుండి జనాభా దృష్ట్యా 10వ అతిపెద్ద రాష్ట్రముగాను ఉన్నది. మొత్తం భూభాగములో 40.95 శాతం వ్యవసాయ యోగ్య భూమి, 21.81 శాతం అడవులను కల్గివున్నది.

రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (GSDP): రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి మరియు భారతదేశ స్థూల దేశీయోత్పత్తి, వాటి వృద్ధి రేటులతోపాటు రాష్ట్ర, దేశ స్థూల ఉత్పత్తి విలువ 2004-05 మరియు 2013-14ల మధ్య దాదాపు రెట్టింపు అయినట్లుగా విశదమవుతున్నది. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో నిరంతర పెరుగుదల ధోరణి కన్పిస్తున్నది. 2004-05లో 3 1,34,767 కోట్లుగా ఉన్న రాష్ట్ర ఉత్పత్తి విలువ 2013-14 నాటికి 2,50,282 కోట్లకు చేరుకొన్నది. – 2011 – 12 తర్వాత రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి జాతీయ సగటు GDP పెరుగుదల కన్నా అధికంగా నమోదు అయినది. రాష్ట్ర GSDP భారతదేశ స్థూల దేశీయ ఉత్పత్తిలో 4.36 శాతాన్ని కల్గివున్నది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి మరియు భారతదేశ స్థూల దేశీయ ఉత్పత్తి నిలకడ (2004 – 05) ధరలలో
AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 1

ప్రశ్న 3.
ఆంధ్రప్రదేశ్లో జనాభా మరియు తలసరి ఆదా మీ వృజ్ఞ పోకడలను తెలపండి.
జవాబు:
రాష్ట్ర తలసరి ఆదాయం. దేశ సగటు తలసరి ఆదాయం కన్నా 2, 3 సం॥లలో తప్ప మిగతా సం॥లలో అధికంగా నమోదు అయింది. దీనిని రాష్ట్రంలో పెరుగుతున్న ప్రజల జీవన ప్రమాణ సూచికగా చెప్పవచ్చు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం మరియు భారతదేశ తలసరి ఆదాయం (ప్రస్తుత ధరలలో) రూ.లలో
AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 2

2013 – 14 సం||లో రాష్ట్ర, దేశ తలసరి ఆదాయాల మధ్య తేడా కౌ 11,417 లుగా ఉంది. జనాభా: 2011 జనాభా లెక్కల ప్రకారం 13 జిల్లాలలోని మరియు 4.96 కోట్ల జనాభాతో ఆంధ్రప్రదేశ్ దేశంలో 10వ స్థానంలో నిలిచింది.

ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశంలో దశాబ్ద జనాభా వృద్ధిరేటు (శాతంలో)
AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 3

ప్రశ్న 4.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం ప్రాధాన్యత.
జవాబు:
వ్యవసాయ రంగం: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తున్నది. మన రాష్ట్రం “Bejeweled rice bowl of India” గా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ దాదాపు 60 శాతం జనాభా వ్యవసాయాన్నే తమ ప్రధాన వృత్తిగా భావిస్తున్నారు. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో కూడా వ్యవసాయరంగ వాటా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది.

1) రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (GSDP) లో వాటా: భారత ఆర్థిక వ్యవస్థలో మాదిరే రాష్ట్ర GSDPలో కూడా వ్యవసాయరంగ వాటా క్రమంగా తగ్గుతున్నప్పటికీ దాని ప్రాధాన్యత నిరర్ధకమైనదిగా భావించరాదు. 2004 – 05 మరియు 2013 – 14 సం||లలో రాష్ట్ర GSDPలో వ్యవసాయ మరియు దాని అనుబంధ రంగాల వాటాను ఇతర రంగాల వాటాను ఈ క్రింది పట్టికలో చూపబడినది.

రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం, మిగతా రంగాల వాటా (%)
AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 4
మూలం: ఆంధ్రప్రదేశ్ గణాంక సూచిక 2014, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పేజీ నెం. 233 మరియు 234.
గమనిక: సంఖ్యలు 2004-05 నిలకడ ధరలలో

పై పట్టిక మరియు చిత్రమును గమనిస్తే రాష్ట్ర GSDPలో వ్యవసాయరంగ వాటా క్రమంగా తగ్గుతూ, ఆ మేరకు సేవారంగం వాటా పెరుగుతున్నట్లు అర్థం అవుతున్నది. పారిశ్రామికరంగ వాటా, పరిశీలనలోని కాలాలలో దాదాపు స్థిరంగా కొనసాగుతున్నది. 2007వ సంవత్సరం నాటికి సేవారంగం వాటా 50 శాతం స్థాయిని దాటితే 2010-11 నాటికి వ్యవసాయరంగ వాటా 25 శాతం కన్నా దిగువకు పడిపోయింది. అయితే ఇప్పటికీ రాష్ట్ర వ్యవసాయరంగ వాటా జాతీయ వ్యవసాయం వాటా కన్నా ఎక్కువ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పటికీ కూడా రాష్ట్ర GSDPలో వ్యవసాయ రంగం 1/5 వంతు వాటాను సమకూరుస్తుంది.

2) ఉపాధి కల్పన: రాష్ట్రంలోని అత్యధిక జనాభాకు వ్యవసాయమే ప్రధాన ఉపాధి మార్గము. సగాని కన్నా ఎక్కువమంది ప్రజలు ఈ రంగంపైనే ఆధారపడి పనిచేస్తున్నారు. పారిశ్రామిక, సేవారంగాలు ఎంతగా అభివృద్ధి జరిగినా, ఉపాధి కల్పనలోను, ప్రధాన ఆదాయ వనరుగా వ్యవసాయం తన ప్రాధాన్యతను కొనసాగిస్తూ ఉన్నది.

2011 జనాభా లెక్కల ప్రకారం వ్యవసాయ రంగం అటు వ్యవసాయదారులకు, ఇటు వ్యవసాయ కూలీలకు కలిపి మొత్తం 62.36 శాతం మందికి ఉపాధి కల్పిస్తున్నది. ఇప్పటికినీ దేశం మరియు రాష్ట్రాలలో 50 శాతం కన్నా ఎక్కువ మందికి వ్యవసాయమే ప్రధాన ఉపాధి మూలం.

3) భూమిని ఉపయోగించే తీరు: ఆంధ్రప్రదేశ్ 160.20 లక్షల హెక్టార్ల మొత్తం భూభాగంతో భారతదేశంలో ఎనిమిదవ అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. రాష్ట్రంలో భూమిని ఉపయోగిస్తున్న తీరు స్వల్ప మార్పులతో చాలాకాలంగా దాదాపు యధాతథంగా కొనసాగుతూ ఉంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

4) ఆహార మరియు ఆహారేతర పంటల క్రింద ఉన్న భూమి: రాష్ట్రంలో పండే పంటలను స్థూలంగా ఆహార మరియు ఆహారేతర పంటలుగా విభజించవచ్చు. అన్ని తృణధాన్యాలు, పప్పుదినుసులు, వంటనూనెలు మొదలైనవి ఆహారపంటల క్రిందకు వస్తే, పసుపు, ప్రత్తి, చెరకు మొదలైనవి ఆహారేతర లేక వాణిజ్య పంటల క్రిందకు వస్తాయి. మొత్తం భూభాగాన్ని ఆహార, ఆహారేతర పంటల కోసం కేటాయించిన తీరునుబట్టి ఈ ప్రాంతంలో వ్యవసాయ వాణిజ్యీకరణ ఏ మేరకు జరిగిందో అంచనా వేయవచ్చు. 2013-14 సం॥లో మొత్తం 81.28 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమిలో 54. 92 లక్షల హెక్టార్లు అంటే 67.57 శాతం భూమిని ఆహారపంటల ఉత్పత్తికి కేటాయించడం జరిగింది.
వాణిజ్య పంటలను 32 శాతం వ్యవసాయ భూమిలో పండించడం జరుగుతున్నది. 2013-14లో ఆహారేతర పంటలను 32.43 లక్షల హెక్టార్లలో పండించడం జరుగుతుంది.

5) ప్రధాన పంటల ఉత్పాదకత: సగటున ఒక హెక్టారు భూమిలో పండిన పంటను ఉత్పాదకత అంటారు. ప్రధాన పంటల ఉత్పాదకత 2010-11 మరియు 2013-14 సం॥లలో మిశ్రమ సరళిని కలిగివున్నది.
వరి ఉత్పాదకత ఒక హెక్టారుకో గరిష్టంగా నెల్లూరులోను (4,051) మరియు కర్నూలులో (3,670) ఉంది. గోధుమ ఉత్పత్తి రాష్ట్రంలో అత్యల్పంగా ఉంది.

6) నీటిపారుదల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి, కృష్ణ, తుంగభద్ర, పెన్న మరియు వంశధార వంటి ముఖ్యమైన నదులను ప్రసాదింపబడింది. రాష్ట్రంలో అన్ని రకాల ప్రవాహాలు, నదులు, వంకలు కలిపివున్న మొత్తం నీటి పరిమాణం | 2,746 TMC లు. కాని ఇప్పటివరకు ఉపయోగించుకుంటున్న నీరు కేవలం 1,753 TMC లు. నదులే కాకుండా రాష్ట్రంలో ఇతర కృత్రిమ సరస్సులు, రిజర్వాయర్లు కూడా త్రాగునీరు, సాగునీటి అవసరాలు తీరుస్తున్నాయి.

2013 – 14 సం||నికి మొత్తం వ్యవసాయ యోగ్యమైన భూమిలో నీటిపారుదల కలిగిన నికర భూమి 46 శాతం, 65.61 లక్షల సాగుభూమిలో 30.14 లక్షల హెక్టార్లు నీటిపారుదలను కలిగివున్నాయి. నీటిపారుదల కలిగిన నికర సాగుభూమిలో 48 శాతం కాలువలు (canals), చెరువుల ద్వారా 9 శాతం మరియు అన్ని రకాల బావుల ద్వారా 40 శాతం భూమి నీటిపారుదలను పొందినది.

ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల మూలాలు (హెక్టార్లలో)
AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 5
జిల్లాలను పరిశీలిస్తే 4.38 లక్షల హెక్టార్ల నీటిపారుదల గల సాగుభూమితో అంటే మొత్తం జిల్లా భూభాగంలో 14.5 శాతంతో గుంటూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. 3.83 లక్షల హెక్టార్ల నీటిపారుదల సాగుభూమితో పశ్చిమ గోదావరి రెండవ స్థానంలో కొనసాగుతుంది. 2013-14 సం॥కి విజయనగరం మరియు అనంతపురంలు రాష్ట్రం మొత్తం మీద అతితక్కువ నీటిపారుదల భూమిని కలిగివున్నాయి.

ఇతర అంశాలు:
రాష్ట్రంలో సగటు భూకమతము 1.6 హెక్టార్లు. మొత్తం రైతుల సంఖ్యలో ఉపాంత రైతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. పెద్ద రైతుల విషయంలో సగటు కమత పరిమాణం ఎక్కువగా ఉంది.

సంస్థాగత పరపతిలో 70 శాతం వాణిజ్య బ్యాంకులు, 20 శాతం సహకార బ్యాంకులు మరియు 11 శాతం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పరపతిని అందిస్తున్నాయి.
వ్యవసాయ మార్కెటింగ్లోని లోపాలను సరిచేయడానికి “రైతుబంధు పథకం”, DAATT సెంటర్లు, కంప్యూటరీకరణ, సహకార మార్కెటింగ్ మొదలైన అనేక చర్యలు చేపట్టడం జరిగింది.

రాష్ట్రం సముద్ర ఉత్పత్తులైన చేపలు, రొయ్యలు మొదలైనవాటి ఉత్పత్తి ద్వారా 3,000 కోట్లు అంటే భారతదేశ మొత్తం సముద్ర ఉత్పత్తి విలువలో 50 శాతం ఆర్జించి పెడుతున్నది.
పట్టు పరిశ్రమలోను, పట్టు ఉత్పత్తిలోను రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానంలో ఉంది.

ప్రశ్న 5.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక రంగం ప్రాధాన్యత.
జవాబు:
పారిశ్రామిక రంగం: ఏ ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగాన్నైనా పారిశ్రామిక పాత్రనే నిర్ణయిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ రకాలైన సహజవనరులు, దక్షిణ భారతదేశంలోనే పొడవైన సముద్ర తీర ప్రాంతము, అవస్థాపన సౌకర్యాలు, కమ్యూనికేషన్లు, సాంకేతిక నిపుణులు మరియు విస్తృత మార్కెట్ అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయి.

ఎ) రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో పారిశ్రామికరంగ వాటా: రాష్ట్ర (GSDP) లో ఆధార సం||పు 2004 – 05 ధరల ప్రకారం వివిధ సంవత్సరాలలో పారిశ్రామికరంగ వాటాను క్రింది పట్టిక తెలుపుతుంది.

రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో పరిశ్రమరంగ వాటా
AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 6

నిరపేక్షికంగా రాష్ట్ర GSDPలో పారిశ్రామిక రంగ వాటా క్రమంగా పెరుగుతున్నది. 2004 – 05 ఆధార సం॥లో ఈ రంగ మొత్తం విలువ 7 29,124 కోట్లు మాత్రమే ఉండగా, ఒక్క 2008-09 సంవత్సరాన్ని మినహాయిస్తే 2013 – 14 వరకు నిరంతరంగా పెరిగి ఔ 51,838 కోట్లకు చేరుకుంది. 2007-08లో 23.7 శాతం ఉన్న ఈ రంగ వాటా 2013-14 నాటికి 20.7 శాతానికి తగ్గిపోయింది.

బి) ఉపాధి అవకాశాల కల్పన: ఏ ఆర్థిక వ్యవస్థలోనైనా ఒక రంగం యొక్క వాటాను ఆ రంగంపై ఆధారపడి పనిచేస్తున్న శ్రామికుల సంఖ్యను ఒక సూచికగా భావించి చెప్పవచ్చు. దేశంలోను, రాష్ట్రంలోను మొదటి నుండి పారిశ్రామిక రంగం కల్పిస్తున్న ఉపాధి శాతములో చెప్పుకోదగ్గ మార్పులు జరగలేదు. 2011 నాటికి రాష్ట్ర, జాతీయ స్థాయిలలో పారిశ్రామిక రంగం దాదాపు 21 శాతము మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నది.

సి) పరిశ్రమలకు ప్రణాళికా కేటాయింపులు: రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికై ప్రణాళికలలో చెప్పుకోదగ్గ కేటాయింపులే జరిగాయి. 12వ ప్రణాళికలోని మొదటి వార్షిక ప్రణాళిక 2012-13లో మొత్తం ప్రణాళిక వ్యయం 48,935 కోట్ల రూపాయలలో 784 కోట్ల రూపాయలు పరిశ్రమలు మరియు ఖనిజ రంగానికి కేటాయించారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

డి) పారిశ్రామిక ఉత్పత్తి సూచిక: పారిశ్రామిక ప్రగతిని కొలిచే ఒక సాధనమే పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (IIP). ఒక కాలంలో జరిగిన భౌతిక పారిశ్రామిక ఉత్పత్తి, అంతకుముందు కాలం కన్నా సాపేక్షికంగా ఎంత మార్పు జరిగిందో ఇది తెలుపుతుంది. రాష్ట్ర IIP విలువ 2004-05 ఆధార సంవత్సర ఉత్పత్తి ప్రకారం ముదింపు చేయబడుతుంది. ఇ) రిజిస్టరు అయిన ఫ్యాక్టరీల సంఖ్య: వివిధ సెకన్ల ప్రకారం రిజిస్టరు అయిన పనిచేసే ఫ్యాక్టరీల సంఖ్యను చూపడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్లో పని చేయుచున్న ఫ్యాక్టరీల సంఖ్య
AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 7
పట్టిక ప్రకారం 2m(i), 2m (ii) సెక్షన్ల ప్రకారం నమోదు అయిన ఫ్యాక్టరీల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. 2008 – 09లో 9,972 గా ఉన్నా ఈ ఫ్యాక్టరీల సంఖ్య 2011 – 12 నాటికి 11,195కు పెరిగాయి. 2010 – 11 మరియు 2011 – 12 మధ్య ఒక సంవత్సర కాలంలో కొత్తగా 837 ఫ్యాక్టరీలు స్థాపించబడ్డాయి.

ఎఫ్) ఇతర ముఖ్యాంశాలు:

  • రాష్ట్రం నుండి వెళ్ళే పారిశ్రామిక ఎగుమతుల విలువ క్రమంగా పెరుగుతున్నది. 2012-13 సంవత్సరంలో దీని విలువ 1,29,001 కోట్ల రూపాయలు.
  • దేశంలోని మొత్తం ఖాయిలా పడ్డ పరిశ్రమలో, రాష్ట్రంలోని ఖాయిలా పరిశ్రమలు 10.2 శాతం మరియు వీటి విషయంలో రాష్ట్రం నాల్గవ స్థానంలో ఉంది.
  • ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అవస్థాపనా కార్పొరేషన్ (APIIC) రాష్ట్రంలోని స్పెషల్ ఎకనామిక్ జోన్ (SEZ) లకు నోడల్ ఏజెన్సీగా పనిచేస్తున్నది. పూర్తిస్థాయి SEZ విధానాన్ని ప్రకటించిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.
  • మార్చి, 2014 నాటికి రాష్ట్రంలో 32 SEZలు ఉండగా అందులో 10IT రంగానికి, 6 విభిన్న వస్తువులకు, 4 ఔషధాలకు, 2 బయోటిక్, 10 రంగ ప్రాధాన్యత గల SEZలు ఉన్నాయి.

ప్రశ్న 6.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో సేవారంగం ప్రాధాన్యత.
జవాబు:
సేవా మరియు అవస్థాపన రంగాలు: భారతదేశంలో వలే రాష్ట్రంలో కూడా సేవారంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది. పారిశ్రామిక రంగం స్థిరంగా ఉండడం వల్ల వ్యవసాయ రంగం కోల్పోతున్న రేటులో, సేవా రంగం అభివృద్ధి సాధిస్తున్నది.

ఎ) రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో వాటా: 2004-05 సంవత్సరంలో రాష్ట్ర (GSDP)లో 48.54 శాతం తోను, 2013 -14లో ఇంకా పెరిగి 55.99 శాతంలో సేవా రంగం అతి ప్రధాన వాటాదారుగా కొనసాగుతున్నది. 2004 -05 సంవత్సరంలో 3 64,411 కోట్లు, రాష్ట్ర GSDPకి సమకూర్చినది ఈ రంగమే. ఈ రంగం 2013-14 నాటికి ఏకంగా కౌ 1,40,054 కోట్లు ఆర్జించి పెట్టింది. అంటే రాష్ట్ర GSDPలో సగ భాగానికన్నా ఎక్కువ ఒక సేవారంగమే సమకూరుస్తుంది.

బి) ఉపాధి కల్పన: రాష్ట్రంలో సేవారంగం ఉపాధి కల్పనలో మూడు రంగాలలో రెండవ స్థానంలో ఉండి, దాదాపు 1/4 వంతు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నది. రాష్ట్రంలో 24.5 శాతం శ్రామిక శక్తికి ఉపాధిని కల్పిస్తున్నది. ఇది జాతీయ సగటున 25.4 శాతానికి దాదాపు సమానము.

సి) నీటిపారుదల: ప్రస్తుత రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా సాగునీటి అభివృద్ధి, నిర్వహణ అత్యంత ప్రాధాన్యతను కలిగివుంది. రాష్ట్రం ప్రధాన నదీ వనరులైన గోదావరి, కృష్ణ, తుంగభద్ర, వంశధార వంటి ప్రముఖ నదులను కలిగి “నదుల రాష్ట్రం” గా ‘గా పిలువబడుటకు అన్ని విధాల అర్హతలు కలిగి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో జలయజ్ఞంలో భాగంగా 52 లక్షల ఎకరాలకు నీరు అందించే లక్ష్యంతో 54 భారీ, మధ్యతరహా, ఇతర ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నాయి.

పోలవరం ప్రాజెక్ట్ ఒక బహుళార్థక సాగునీటి ప్రాజెక్ట్ గా చేపట్టబడి ఇటీవల కేంద్ర ప్రభుత్వంచే “జాతీయ ప్రాజెక్ట్ హోదా” ను పొందినది.

పట్టిసీమ ప్రాజెక్ట్ చాలా కీలకమైనది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయ్యేవరకు గోదావరి నదిలోని మిగులు జలాలు 80 (tmcft) లు దాకా, పట్టిసీమ ద్వారా శ్రీశైలం నుండి రాయలసీమలోని కరువు పీడిత ప్రాంతాలకు తరలించే యోచనతో రూపొందించబడినది.

ప్రభుత్వం రాష్ట్రంలో బిందుసేద్య విధానాన్ని కూడా ప్రోత్సహిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రైతులకు బిందు సేద్య పరికరాలను సబ్సిడీ రేట్లకే అందిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సూక్ష్మ నీటిపారుదల పద్దతి విషయంలో దేశంలోనే ప్రథమస్థానంలో ఉండి, ప్రస్తుతం 5.63 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

డి) విద్యుచ్ఛక్తి: 2015-16 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం విద్యుత్ సప్లయిని ప్రకటించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 16,717 MWల విద్యుత్ ఉత్పాదక సామర్థ్యాన్ని కలిగివుంది. ఇందులో 70 శాతం థర్మల్ మరియు 21 శాతం జలవనరుల ద్వారా సాధిస్తున్నది.

సింహాద్రి STPS, దామోదరం సంజీవయ్య TPS, రాయలసీమ TPS మొదలైనవి రాష్ట్రంలోని ప్రధాన థర్మల్ విద్యుత్ కేంద్రాలు, లాంకో కొండపల్లి, స్పెక్ట్రం, కోనసీమ కంబైన్డ్ సైకిల్ విద్యుత్ సంస్థ మొదలైనవి గ్యాస్ ఇంధన ఆధారిత విద్యుత్ ప్లాంట్లు, అలాగే శ్రీశైలం, టిబి డ్యామ్, పోలవరం, పెన్నహోబిలం, సీలేరు మొదలైనవి ప్రధాన హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు.

ఇవేకాకుండా అనంతపురం జిల్లాలోని కదిరి వద్ద అమృత్ సౌర విద్యుత్ ప్లాంట్లు, అనంతపురం జిల్లాలోనే స్థాపించబడిన రామగిరి, నర్మద పవన విద్యుత్ ప్లాంట్లు మరియు పుత్లూరు ప్లాంట్లు పవన ఆధారిత విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నాయి.

ప్రశ్న 7.
ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల వసతులను తెలపండి.
జవాబు:
నీటిపారుదల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి, కృష్ణ, తుంగభద్ర, పెన్న మరియు వంశధార వంటి ముఖ్యమైన నదులను ప్రసాదింపబడింది. రాష్ట్రంలో అన్ని రకాల ప్రవాహాలు, నదులు, వంకలు కలిపి మొత్తం నీటి పరిమాణం 2,746 TMC లు. కాని ఇప్పటివరకు ఉపయోగించుకుంటున్న నీరు కేవలం 1,753 TMC లు. నదులే కాకుండా రాష్ట్రంలో ఇతర కృత్రిమ సరస్సులు, రిజర్వాయర్లు కూడా త్రాగునీరు, సాగునీటి అవసరాలు తీరుస్తాయి.

2013 – 14 సంవత్సరానికి మొత్తం వ్యవసాయ యోగ్యమైన భూమిలో నీటిపారుదల కలిగిన నికర భూమి 46 శాతం. 65.61 లక్షల సాగుభూమిలో 30.14 లక్షల హెక్టార్లు నీటిపారుదలను కలిగి ఉన్నాయి. నీటిపారుదల కలిగిన నికర సాగుభూమిలో 48 శాతం కాలువలు (canals), చెరువులు ద్వారా 9 శాతం మరియు అన్ని రకాల బావుల ద్వారా 40 శాతం భూమి నీటిపారుదలను పొందినది.

ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల మూలాలు (హెక్టార్లలో)
AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 8

జిల్లాలను పరిశీలిస్తే, 4.38 లక్షల హెక్టార్ల నీటిపారుదల గల సాగుభూమితో అంటే మొత్తం జిల్లా భూభాగంలో 14.5 శాతంతో గుంటూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. 3.83 లక్షల హెక్టార్ల నీటిపారుదల సాగుభూమితో పశ్చిమ గోదావరి రెండవ స్థానంలో కొనసాగుతుంది. 2013-14 సం||కి విజయనగరం మరియు అనంతపురంలు రాష్ట్రం మొత్తం మీద అతితక్కువ నీటిపారుదల భూమిని కలిగివున్నాయి.

ఇతర అంశాలు:
రాష్ట్రంలో సగటు భూకమతము 1.6 హెక్టార్లు. మొత్తం రైతుల సంఖ్యలో ఉపాంత రైతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. పెద్ద రైతుల విషయంలో సగటు కమత పరిమాణం ఎక్కువగా ఉంది.

సంస్థాగత పరపతిలో 70 శాతం వాణిజ్య బ్యాంకులు. 20 శాతం సహకార బ్యాంకులు మరియు 11 శాతం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు పరపతిని అందిస్తున్నాయి.
వ్యవసాయ మార్కెటింగ్ లోని లోపాలను సరిచేయడానికి “రైతుబంధు పథకం”, DAATT సెంటర్లు, కంప్యూటరీకరణ, సహకార మార్కెటింగ్ మొదలైన అనేక చర్యలు చేపట్టడం జరిగింది.

రాష్ట్రం సముద్ర ఉత్పత్తులైన చేపలు, రొయ్యలు మొదలైనవాటి ఉత్పత్తి ద్వారా 73,000 కోట్లు అంటే భారతదేశ మొత్తం సముద్ర ఉత్పత్తి విలువలో 50 శాతం ఆర్జించి పెడుతున్నది.

పట్టు పరిశ్రమలోను, పట్టు ఉత్పత్తిలోను రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానంలో ఉంది.

ప్రశ్న 8.
ఆంధ్రప్రదేశ్లోని రవాణా సౌకర్యాలను వివరింపుము.
జవాబు:
1) రైల్వేలు: ఇవి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదం చేస్తూనే, మరో ప్రక్క రాష్ట్రంలో పారిశ్రామిక మరియు పర్యాటక రంగ వృద్ధికి తోడ్పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా దక్షిణమధ్య రైల్వే, దక్షిణ రైల్వే, తూర్పు తీర రైల్వే |అనే మూడు రైల్వే జోన్ల సేవలను పొందుతున్నది. రాష్ట్రంలో మొత్తం 444 రైల్వేస్టేషన్లు మరియు 3,355 కి.మీ. మేర నెట్వర్క్ కలిగివుంది. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ మనవి, కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ వద్ద పరిశీలనలో ఉంది.

ప్రపంచంలోనే అత్యధిక బ్రాడ్ గేజ్ ట్రాకులు విశాఖపట్టణం నుండి అనంతగిరిని కలుపుతూ తూర్పు కనుమల గుండా సాగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ రైల్వే స్టేషన్ ప్రఖ్యాతమైనదే కాక అత్యంత రద్దీ కలిగిన రైల్వే జంక్షన్గా దేశంలోనే గుర్తింపు పొందింది.

2) రోడ్డు మార్గాలు: రోడ్లు ప్రాథమిక రవాణా వ్యవస్థలో ముఖ్యమైనవే కాకుండా అత్యంత కీలకమైన అవస్థాపన సౌకర్యము కూడా. ఆర్థిక వ్యవస్థలో రోడ్ల శాస్త్రీయమైన అభివృద్ధి అనునది ఆర్థికవృద్ధికి ఒక ప్రాథమిక అవసరమేకాక, ఆర్థిక వృద్ధిని వేగవంతం కూడా చేయగలదు. దేశంలోని వివిధ రవాణా వ్యవస్థలన్నింటిలో ఒక్క రోడ్డు మార్గాలే 80 |శాతం ప్రయాణికుల, వస్తు రవాణా అవసరాలు తీరుస్తున్నాయి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

ఆంధ్రప్రదేశ్ 42,511 కి.మీ.ల రాష్ట్ర రహదారులు, 3,144 కి.మీ.ల జాతీయ రహదార్లు, 1,01,484 కి.మీ. జిల్లా రోడ్లను కలుపుకొని మొత్తం 1,46,954 కి.మీ. విస్తారమైన నెట్వర్క్ కలిగివుంది. రాష్ట్రంలోని రోడ్లను 1998లో స్థాపించబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా అభివృద్ధి సంస్థ (APRDC) నే నిర్వహణ బాధ్యత కలిగివుంది.

3) పౌర విమానయానము: రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ, తిరుపతి, కడప మరియు రాజమండ్రి ఎయిర్పోర్టను మెట్రోయేతర ఎయిర్పోర్టుగా ఆధునీకరించుటకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) తో అవగాహన తాఖీదు (MOU) కుదుర్చుకున్నది. తిరుపతి ఎయిర్పోర్ట్ను అంతర్జాతీయ ప్రమాణాల అనుసారం ఆధునీకరించుటకు ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా (AAI) ప్రతిపాదించినది. అలాగే రాజమండ్రి ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కూడా (AAI) ఒక బృహత్ ప్రణాళికను సిద్ధం చేసింది.

4) సముద్ర ఓడరేవులు: భారతదేశంలో గుజరాత్ తర్వాత 972 కి.మీ.ల సముద్రతీర ప్రాంతంతో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది. రేవులు ఎగుమతులు, దిగుమతులు, అంతర్జాతీయ వ్యాపారం, ఓడల రిపేర్లు, పర్యాటకం, చేపల వేట మరియు జల క్రీడల వంటి సముద్ర కార్యకలాపాల వృద్ధికి దోహదం చేస్తాయి. రేవులు వాణిజ్యానికి సింహద్వారము వంటివి. విశాఖపట్టణం ఓడరేవు రాష్ట్రంలో అతిపెద్దదే కాకుండా, దేశంలోనే సరుకు రవాణా విషయంలో అతిపెద్ద రేవులలో ఒకటి. విశాఖపట్టణం నుండి అండమాన్ నికోబార్ దీవులలోని పోర్ట్ బ్లెయిర్కి ప్రయాణికుల సముద్ర యాత్రా వసతి కూడా కలదు.

ప్రశ్న 9.
ఆంధ్రప్రదేశ్లోని ఆర్థిక అభివృద్ధిలో ఐ.టి. (IT) రంగ ప్రాధాన్యతను తెలుపుము.
జవాబు:
IT/సాఫ్ట్వేర్ పరిశ్రమ: సాఫ్ట్వేర్ పరిశ్రమ సమాచార సాంకేతిక రంగంలోని ప్రధాన అంశము. సాఫ్ట్వేర్ పరిశ్రమలో కంప్యూటర్ సాఫ్ట్వేరు సంబంధించిన అభివృద్ధి చేయబడే వ్యాపారం, నిర్వహణ మరియు ముద్రణ అనే అంశాలు కలిసి ఇవి ఏ వ్యాపార రూపంలోనైనా ఉండవచ్చు. ఈ రంగం 1960 మొదట్లో మొదలై 1970 దశకంలో బాగా విస్తరించింది. ఈ పరిశ్రమలో ముఖ్యంగా 5 రంగాలు ఉన్నాయి. అవి:
1. సాఫ్ట్వేర్ అవస్థాపన రంగం 2. ఉద్యమిత్వ సాఫ్ట్వేర్ 3. రక్షణాత్మక సాఫ్ట్వేర్ 4. పరిశ్రమ పరిమిత సాఫ్ట్వేర్ 5.ప్రత్యేక కంపెనీ క్లయింట్గా గల సాఫ్ట్వేర్

రాష్ట్ర విభజన తర్వాత 2014, జూన్ 2న నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్ర ఐ.టి. టర్నోవర్లో 2 శాతం మరియు కేవలము 1.8 శాతం ఉద్యోగ అవకాశాలను మాత్రమే కలిగివుంది.

ఆంధ్రప్రదేశ్ భారతదేశ హైటెక్ రాజధాని, భారత సిలికాన్ లోయగా గుర్తింపు పొందినది. కాని విభజనానంతరం వైజాగ్ నగరం ఐ.టి. సెంటర్ గా అభివృద్ధి చెందుటకు అన్ని అనుకూల అంశాలు ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. విశాఖపట్టణం రాష్ట్ర నూతన ఐ.టి. రాజధాని అవుతుంది.

  • ప్రతి జిల్లా కేంద్రము ఒక ఐ.టి. పార్కును కలిగివుంటుంది.
  • రాష్ట్రం మొత్తం ఎగుమతుల్లో ఐ.టి. రంగం 38.22 శాతం వాటా కలిగివుంది (ఉమ్మడి రాష్ట్రం).
  • 2013 నాటికి ఐ.టి. రంగం రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది.
  • 2013లో ఈ రంగం మొత్తం ఎగుమతుల విలువ సుమారు 36 వేల కోట్ల రూపాయలు.
  • ఐ.టి. రంగం ప్రస్తుతం ఉన్న 36,000 కోట్ల రూపాయల స్థితి నుండి 2017 నాటికి 1,50,000 కోట్ల స్థాయికి చేరగలదని అంచనా.
  • రాష్ట్ర ప్రభుత్వం ఐ.టి. మరియు బి.టి. (IT & BT)లను సమన్వయం చేసే యోచనలో ఉంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 10.
ఆంధ్రప్రదేశ్లోని వివిధ సంక్షేమ పథకాలను పరిశీలింపుము.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ – సంక్షేమ పథకాలు/కార్యక్రమాలు: ఏ సంక్షేమ రాజ్య లక్ష్యమైన తన ప్రజల జీవన ప్రమాణాన్ని కొనసాగించడం లేదా ఇంకా మెరుగుపరచడమే. చాలాకాలం వరకు ఆర్థికాభివృద్ధికి వ్యవసాయ, పరిశ్రమలు ప్రధాన వాహకాలుగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం మానవ వనరుల అభివృద్ధికి ఉన్న ప్రాధాన్యత వల్ల సామాజిక రంగ అవస్థాపన సౌకర్యాలైన విద్య, ఆరోగ్య సంరక్షణ, పౌష్టికాహారం, నీటి సప్లయి, గృహవసతి, సామాజిక రక్షణ వంటి వాటిని మెరుగుపరచడము ద్వారానే సాధ్యం అవుతుంది. సమాజంలో సామాజిక న్యాయం, సామాజిక సమానత్వాలు సాధించాలంటే ఈ సాంఘిక అంశాలపై ప్రభుత్వం పెట్టుబడులు పెరగాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సాంఘిక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఈ క్రింది పట్టికలో పొందుపరచడమైనది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలుపరుస్తున్న వివిధ వర్గాల వారి సంక్షేమ పథకాలు
AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 9

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (GSDP).
జవాబు:
భారతదేశములో ఆంధ్రప్రదేశ్ వైశాల్యము మరియు జనాభా దృష్ట్యా రాష్ట్రాల్లో ఒకటిగా నిల్చింది. దేశ భూభాగంలో 4.96 శాతం భూమిని కల్గిన 8వ పెద్ద రాష్ట్రంగా ఉన్నది. రాష్ట్రము 4.6 కోట్ల జనాభాతో దేశ జనాభాలో 4.10 శాతం కల్గివుండి జనాభా దృష్ట్యా 10వ అతిపెద్ద రాష్ట్రముగాను ఉన్నది. మొత్తం భూభాగములో 40.95 శాతం వ్యవసాయ యోగ్య భూమి, 21.81 శాతం అడవులను కల్గివున్నది.

రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (GSDP): రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి మరియు భారతదేశ స్థూల దేశీయోత్పత్తి, వాటి వృద్ధి రేటులతోపాటు రాష్ట్ర, దేశ స్థూల ఉత్పత్తి విలువ 2004-05 మరియు 2013 – 14ల మధ్య దాదాపు రెట్టింపు అయినట్లుగా విశదమవుతున్నది. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో నిరంతర పెరుగుదల ధోరణి కన్పిస్తున్నది. 2004-05లో ఔ 1,34,767 కోట్లుగా ఉన్న రాష్ట్ర ఉత్పత్తి విలువ 2013-14 నాటికి 2,50,282 కోట్లకు చేరుకొన్నది. 2011 – 12 తర్వాత రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి జాతీయ సగటు GDP పెరుగుదల కన్నా అధికంగా నమోదు అయినది. రాష్ట్ర GSDP భారతదేశ స్థూల దేశీయ ఉత్పత్తిలో 4.36 శాతాన్ని కల్గివున్నది.

ప్రశ్న 2.
రాష్ట్ర తలసరి ఆదాయం.
జవాబు:
రాష్ట్ర తలసరి ఆదాయం, దేశ సగటు తలసరి ఆదాయం కన్నా 2, 3 సం॥లలో తప్ప మిగతా సం॥లలో అధికంగా నమోదు అయింది. దీనిని రాష్ట్రంలో పెరుగుతున్న ప్రజల జీవన ప్రమాణ సూచికగా చెప్పవచ్చు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం మరియు భారతదేశ తలసరి ఆదాయం (ప్రస్తుత ధరలలో) రూ.లలో
AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 10

2013 – 14 సం||లో రాష్ట్ర, దేశ తలసరి ఆదాయాల మధ్య తేడా కౌ 11,417లుగా ఉంది.
జనాభా: 2011 జనాభా లెక్కల ప్రకారం 13 జిల్లాలలోని మరియు 4.96 కోట్ల జనాభాతో ఆంధ్రప్రదేశ్
దేశంలో 10వ స్థానంలో నిలిచింది.

ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశంలో దశాబ్ద జనాభా వృద్ధిరేటు (శాతంలో)
AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 11

ప్రశ్న 3.
ఆంధ్రప్రదేశ్లో వృత్తివారీ శ్రమ విభజన. [Mar ’17]
జవాబు:
ఏ ఆర్థిక వ్యవస్థలోనైనా ఆర్థికాభివృద్ధి స్థాయిని ఆ ఆర్థిక వ్యవస్థలోని వృత్తివారి శ్రమ విభజన తీరు నిర్ణయిస్తుంది. ఏ ఆర్థిక వ్యవస్థనైనా వ్యవసాయ, పారిశ్రామిక మరియు సేవా రంగాలుగా విభజించవచ్చు. జనాభాను, వారు చేసే వృత్తులు లేక పనులు ఆధారంగా విభజించడాన్ని వృత్తివారీ శ్రమ విభజన లేక వృత్తివారీ జనాభా విభజన అంటారు. వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు కలిసి మొత్తంగా 1,43,92,736 మంది అనగా 62.36 శాతము వ్యవసాయ రంగాలలో ఉపాధి పొందుతున్నారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

అదే విధంగా గృహ పరిశ్రమలలో పనిచేసే శ్రామికులు 6,62,608 మంది అంటే మొత్తం శ్రామిక సంఖ్యలో కేవలం 2.87 శాతము ఉన్నారు. పారిశ్రామిక మరియు సేవా రంగాల కార్యకలాపాలు పరస్పరం పూరకంగా ఉంటాయి కాబట్టి ఈ రెండు రంగాలలో మొత్తం 80,25,620 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అంటే మొత్తం కార్మిక సంఖ్యలో
ఇది 34.77 శాతము.

ఇప్పటికీ వ్యవసాయ రంగంపై ఆధారపడుతున్న కార్మిక సంఖ్య ఎక్కువగా ఉంది. సేవారంగం రెండవ స్థానాన్ని కలిగి, వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది. ద్వితీయ లేక పారిశ్రామికరంగ వాటా రాష్ట్రంలో సంవత్సరాలుగా స్థిరంగా కొనసాగుతున్నది.

ప్రశ్న 4.
రాష్ట్రంలోని పర్యావరణ పరిరక్షణ అంశాలు. [Mar ’17]
జవాబు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంచి పర్యావరణ పరిస్థితులను కలిగి ఉంది. దీని కోస్తా తీర ప్రాంతము పొడవు దృష్ట్యా భారతదేశంలోనే రెండవది మరియు దక్షిణ భారత రాష్ట్రాలలో మొదటిది. ఇందులోని జీవ వైవిధ్యం, విభిన్నమైన జీవ జాతులను కలిగి దేశంలోనే ఒక ప్రత్యేకతను సంపాదించుకొన్నది. ఈ అమూల్య పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు:
1) పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు: సామాజిక అటవీ నిర్వహణ (CFM), జాతీయ నదుల పరిరక్షణ ప్రణాళికా కార్యక్రమం (NRCP) మరియు జాతీయ వృక్ష సంరక్షణ కార్యక్రమము (NAP) మొదలైన కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది.

2) చెట్టు – నీరు కార్యక్రమము: 2015లో రాష్ట్ర ప్రభుత్వం వృక్ష సంరక్షణ మరియు నీటి పరిరక్షణ కోసం ‘నీరు – చెట్టు’ పథకాన్ని అన్ని జిల్లాలో ఆరంభించెను. ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి, కనీసం 90 శాతం మొక్కలు బ్రతికేటట్లు పలు చర్యలను తీసుకోవడం జరుగుతుంది.

3) సాంప్రదాయేతర శక్తి: ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ వారు రాష్ట్రంలో సోలార్ మరియు పవన విద్యుత్ శక్తి మూలాలను వృద్ధి చెయ్యడం ద్వారా దేశంలోనే రాష్ట్రాన్ని ఒక పెద్ద “గ్రీన్ ఎనర్జి కారిడార్” గా మార్చుటకు నిర్ణయించిరి.

4) వన మహోత్సవం: 2013లో అటవీశాఖ వారు “రెండు మిలియన్ల మొక్కలను నాటే ఉద్దేశ్యంతో 64వ వన మహోత్సవాలను నిర్వహించారు. ఈ ఉత్సవములు అదే సమయంలో జిల్లా కేంద్రాలలోను జరుపుకున్నారు. సామాజిక అటవీ కార్యక్రమంలో ఇది ఒక భాగము.

5) వన్యమృగ సంరక్షణ: మొక్కలు, వృక్షాలు, జంతువులు మరియు పర్యావరణ వ్యవస్థలతో కూడిన జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుటకు ప్రభుత్వం 13 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు మరియు 3 జాతీయ పార్కులతో సహా 16 ప్రాంతాలను వన్యప్రాణి రక్షిత ప్రాంతాలుగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య సంరక్షణ సొసైటి (BIOSAP)ని ఏర్పాటు చేసి రాష్ట్రంలోని అన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల బాగోగులు చూసే బాధ్యతను అప్పగించారు. శ్రీశైలం జీవావరణ రిజర్వుని గుర్తించి నిర్వహిస్తున్నారు. స్థానిక కమిటీలతో పాటు ప్రభుత్వ కమిటీలు కూడా జీవావరణ నిర్వహణ ప్రణాళిక అంతిమ ఆమోదం కోసం కృషి చేస్తున్నాయి.

6) ప్రాజెక్ట్ టైగర్: మన జాతీయ జంతువు అయిన పులుల సంఖ్య పెంచే లక్ష్యంతో ప్రాజెక్ట్ టైగర్ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. కర్నూలు, ప్రకాశం మరియు గుంటూరు జిల్లాలో విస్తరింపబడిన నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు (NSTR) 50 కన్నా ఎక్కువ పులులకు నివాస స్థానంగా ఉంది.

7) పర్యావరణ విద్య: ప్రజలను ప్రకృతి పరిరక్షణపై జాగృతం చేయడానికి రాష్ట్రంలోని చాలా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, నేషనల్ పార్కుల వద్ద ప్రదర్శనశాలలు, వ్రాయబడిన బోర్డుల ప్రదర్శన, మిని ఆడిటోరియంలు మరియు లైబ్రరీల ద్వారా పర్యావరణ విద్యపై అవగాహన పెంచుతున్నారు.

ప్రశ్న 5.
ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ ప్రాధాన్యత. [Mar ’16]
జవాబు:
ఆంధ్రప్రదేశ్ “భారతదేశ కోహినూర్” గా మరియు పర్యాటకం విషయంలో దేశంలోనే గమ్యస్థాన రాష్ట్రంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గొప్ప రాజవంశాలకు, పవిత్ర దేవాలయాలకు, లోహపూత బొమ్మలు, నేతపని వస్తువులు, అమూల్య పాండిత్యము, కూచిపూడి నాట్యం వంటి మహోన్నత కళలకు గుర్తింపు పొందినది. రాష్ట్రం దాదాపు 300 పర్యాటక ప్రాంతాలలో అసంఖ్యాకంగా దేశీయ, విదేశీ పర్యాటకులను ఆదర్శిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDC) అనునది రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి తోడ్పడుతున్న ప్రభుత్వ ఏజెన్సీ సంస్థ. ఇది పర్యాటకంలో అవస్థాపనా సౌకర్యాల కల్పన మరియు వస్తువులను సృష్టిస్తుంది. ఈ డిపార్ట్మెంట్ రాష్ట్ర ఘన చరిత్ర మరియు గత స్మృతులను సూచించే విధంగా సాంస్కృతిక, వారసత్వ, ప్రకృతి, సాహస, ఆరోగ్య మరియు గ్రామీణ పర్యాటకాల ప్రత్యేక ప్యాకేజీలను రూపొందిస్తుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

పర్యాటకాన్ని ఆర్థికాభివృద్ధి ఇంజనుగా, ఆంధ్రప్రదేశ్ విజన్ -2020 భావిస్తున్నది. “ప్రపంచాన్ని ఆంధ్రప్రదేశ్కు తీసుకురావటం, ఆంధ్రప్రదేశ్ను ప్రపంచానికి తీసుకుపోవడం” అనే లక్ష్యాన్ని పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు మొదలు పెట్టింది. 2010లో నూతన పర్యాటక విధానాన్ని ప్రకటించింది. రాష్ట్రాన్ని పర్యాటక హిత గమ్యస్థానంగా మార్చుటకు చర్యలు మొదలు పెట్టిరి.

  1. తీర్ధయాత్ర పర్యాటకం
  2. వైద్య పర్యాటకం
  3. బుద్ధిస్ట్ పర్యాటకం
  4. సముద్ర తీర పర్యాటకం
  5. వ్యవసాయ పర్యాటకం
  6. పర్యావరణ పర్యాటకం
  7. విశ్రాంత పర్యాటకం.

రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాలు దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. అత్యధిక మంది దేశీయ, విదేశీ పర్యాటకులను ఏడుకొండలపై వెలసిన ప్రసిద్ధ వైష్ణవాలయం తిరుమలను కలిగి ఉన్న చిత్తూరు జిల్లా ఆకర్షించగలిగింది. దీని తర్వాత స్థానంలో ప్రసిద్ధ జ్యోతిర్లింగముతో పాటు, ఒకానొక శక్తి పీఠము కూడా అయిన శ్రీశైలం కారణంగా కర్నూలు జిల్లాను పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం, తిరుపతిలు ప్రధాన మరియు కర్నూలు, విజయవాడలు ద్వితీయ పర్యాటక గమ్యాలుగా గుర్తింపబడినవి.
అలాగే రాష్ట్రం నదీపర్యాటక కేంద్రాలను కూడా అభివృద్ధి చేస్తున్నది. ఉదాహరణకు గోదావరి నుండి పాపికొండల వరకు గోదావరి నదిపై నౌకా విహార కేంద్రం అయిన హరిత. ప్రస్తుతం ఐ.టి. రంగం మాదిరే పర్యాటక రంగం కూడా రాష్ట్ర ఖజానాకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది.

ప్రశ్న 6.
ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా లక్షణాలు. [Mar ’16]
జవాబు:
జనాభా: ఆంధ్రప్రదేశ్ 4.96 కోట్ల మొత్తం జనాభాతో, దేశ జనాభాలో 4.1 శాతంగా ఉండి జనాభా రీత్యా 10వ అత్యధిక జనాభా కల్గిన రాష్ట్రంగా ఉంది.
2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో జనాభా వృద్ధిరేటు 2011 నాటికి 11.89 శాతం నుండి 9.21 శాతానికి తగ్గినది.
మరో వైపు అదే కాలానికి దేశ జనాభా 4.3 రెట్లు పెరిగింది. దీనిని బట్టి దేశంలో కన్నా రాష్ట్రంలో జనాభా వృద్ధి వేగంగా తగ్గుతున్నట్లు అర్థం అవుతున్నది.

జనసాంద్రత: ఒక చదరపు కిలోమీటరు భూభాగంలో నివసించే సగటు ప్రజల సంఖ్యను జనసాంద్రత అనవచ్చు. జనసాంద్రత = ఆ ప్రాంత జనాభా / ప్రాంత భూభాగం చదరపు కిలోమీటర్లలో.

కాబట్టి రాష్ట్ర సౌభాగ్యం లేక పేదరికానికి జనసాంద్రత ఒక సూచికగా పనిచేస్తుంది.

కాని 1971 తర్వాత జాతీయ సగటు జనసాంద్రత కన్నా తక్కువ స్థాయిని రాష్ట్రం నమోదు చేస్తున్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనసాంద్రత 1 చ.కిమీ. కు 304 మంది ఉండగా, దేశం మొత్తంలో 382 చ.కి.మీ.కు జనసాంద్రత ఉంది.

రాష్ట్రంలోని జిల్లాలను పరిశీలిస్తే కృష్ణాజిల్లా అత్యధికంగా 518 మందితోను, పశ్చిమ గోదావరి 470 మందితోను మొదటి రెండు స్థానాలలో నిలిచాయి.

పురుష నిష్పత్తి: భారతదేశంలో లాగానే ఆంధ్రప్రదేశ్లో కూడా జనాభా సరళి పురుష జనాభాకు అనుకూలంగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ప్రతి 1000 మంది పురుషులకు 997 మంది స్త్రీలు ఉన్నారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి మరియు కృష్ణా జిల్లాలలో పురుషుల సంఖ్య కన్నా స్త్రీల సంఖ్య ఎక్కువ. విజయనగరం జిల్లాలో ప్రతి 1000 పురుషులకు అత్యధికంగా 1019 మంది స్త్రీలు ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద 13 జిల్లాలలో అనంతపురం జిల్లాలో అతి తక్కువ స్త్రీ, పురుష నిష్పత్తి ప్రతి 1000 పురుషులకు కేవలం 977 మంది స్త్రీలు ఉన్నారు.

వయసు ఆధారిత జనాభా: ఒక దేశంలో కాని, ప్రాంతంలో కాని మొత్తం జనాభాలో పనిచేయగల శ్రామిక శక్తిని ఇది తెలియజేస్తుంది. వయస్సు ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభాను మూడు తరగతులగా విభజించవచ్చు. అవి 0-14, 15-59 మరియు 60 సంవత్సరాలు మరియు ఆపైన వయస్సు ఉన్న వారి తరగతి. జననరేట్లు అధికంగా ఉండడం, శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గడం వల్ల బాలల శాతం ఎక్కువగా ఉంటుంది.

గ్రామీణ – పట్టణ జనాభా: గ్రామీణ పట్టణ జనాభా అధ్యయనము జనాభా యొక్క జీవన సరళిని ప్రతిబింబిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా భారతదేశంలో మాదిరి అధిక జనాభా గ్రామాలలోనే నివసిస్తున్నది.

2011 అంచనాల ప్రకారం విశాఖపట్నం అత్యధిక పట్టణ జనాభా 47.45 శాతము కలిగి ఉంది. కృష్ణాజిల్లా 40.81 శాతంతో రెండవ స్థానంలో ఉంది.

అక్షరాస్యత: అక్షరాస్యత ప్రజల యొక్క చదవగల, వ్రాయగల నైపుణ్యం. ఇది ఒక మంచి విద్యా వ్యవస్థకు కావలసిన కనీస అవసరం. ఒక ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి వేగానికి, అక్షరాస్యత స్థాయికి ధనాత్మక సంబంధం ఉన్నట్లు గుర్తింపబడినది.

ఆంధ్రప్రదేశ్ అటు స్త్రీ అక్షరాస్యతలోను, పురుష అక్షరాస్యతలోను, ఇటు మొత్తం అక్షరాస్యత రేటులో భారత అక్షరాస్యత రేటు కన్నా వెనుకబడి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర అక్షరాస్యత రేటు 67.41. ఇందులో 74.83 శాతం పురుష అక్షరాస్యత కాగా, 60.01 శాతం స్త్రీ అక్షరాస్యత. అంటే జాతీయ అక్షరాస్యత రేటుకన్నా రాష్ట్ర అక్షరాస్యత 5.58 శాతం ఎక్కువ.

ప్రశ్న 7.
రాష్ట్రంలోని వివిధ వర్గాల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలు/కార్యక్రమాలు: ఏ సంక్షేమ రాజ్య లక్ష్యమైన తన ప్రజల జీవన ప్రమాణాన్ని కొనసాగించడం లేదా ఇంకా మెరుగుపరచడమే. చాలాకాలం వరకు ఆర్థికాభివృద్ధికి వ్యవసాయ, పరిశ్రమలు ప్రధాన వాహకాలుగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం మానవ వనరుల అభివృద్ధికి ఉన్న ప్రాధాన్యత వల్ల సామాజిక రంగ అవస్థాపన సౌకర్యాలైన విద్య, ఆరోగ్య సంరక్షణ, పౌష్టికాహారం, నీటి సప్లయి, గృహవసతి, సామాజిక రక్షణ వంటి వాటిని మెరుగుపరచడము ద్వారానే సాధ్యం అవుతుంది. సమాజంలో సామాజిక న్యాయం, సామాజిక సమానత్వాలు సాధించాలంటే ఈ సాంఘిక అంశాలపై ప్రభుత్వం పెట్టుబడులు పెరగాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సాంఘిక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
SGDP
జవాబు:
ఒక సంవత్సర కాలంలో రాష్ట్ర భౌగోళిక ఎల్లల్లో ఆర్థిక కార్యకలాపాల వల్ల ఉత్పత్తి అయిన మొత్తం వస్తు సేవల అంతిమ విలువను రాష్ట్ర స్థూల అంతర్గత ఆదాయం అంటారు. రాష్ట్ర స్థూల అంతర్గత ఆదాయాన్ని ‘రాష్ట్ర ఆదాయం’ గా కూడా పేర్కొనవచ్చు. దీనిని రాష్ట్ర ఆర్థిక గణాంకశాఖ అంచనా వేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలోని

  1. ప్రాథమిక రంగం.
  2. పారిశ్రామిక రంగం.
  3. సేవారంగం నుంచి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి లభిస్తుంది.

ప్రశ్న 2.
ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత.
జవాబు:
ఒక చదరపు కిలోమీటరు భూభాగంలో నివసించే సగటు ప్రజల సంఖ్యను జనసాంద్రత అనవచ్చు. జనసాంద్రత = ఆ ప్రాంత జనాభా / ప్రాంత భూభాగం చ.కిమీ.లలో.
రాష్ట్ర సౌభాగ్యం లేక పేదరికానికి జనసాంద్రత ఒక సూచికగా పనిచేయును.

ప్రశ్న 3.
ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత.
జవాబు:
అక్షరాస్యత అనగా ప్రజల యొక్క చదవగల, వ్రాయగల నైపుణ్యం. ఒక ఆర్థికవ్యవస్థ అభివృద్ధి వేగానికి, అక్షరాస్యత స్థాయికి ధనాత్మక సంబంధం ఉన్నట్లు గుర్తింపబడింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర అక్షరాస్యత 67.11%. ఇందులో పురుష అక్షరాస్యత 74.83% మరియు స్త్రీ అక్షరాస్యత 60.01%.

ప్రశ్న 4.
ప్రాజెక్ట్ టైగర్. [Mar ’16]
జవాబు:
మన జాతీయ జంతువు అయిన పులుల సంఖ్య పెంచే లక్ష్యంతో ప్రాజెక్ట్ టైగర్ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. కర్నూలు, ప్రకాశం మరియు గుంటూరు జిల్లాలలో విస్తరింపబడిన నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు (NSTR) 50 కన్నా ఎక్కువ పులులకు నివాస స్థానంగా ఉంది.

ప్రశ్న 5.
సర్వశిక్ష అభియాన్.
జవాబు:
రాష్ట్రంలో 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు అందరికీ ఉపయోగపడే విధంగా ప్రాథమిక విద్యను కల్పించడానికి 2001-02లో సర్వశిక్ష అభియాన్ పధకాన్ని ప్రవేశపెట్టారు. సామాజిక నిర్వహణ పాఠశాలల ద్వారా సాంఘీక ప్రాంతీయ లింగపరమైన వ్యత్యాసాన్ని తగ్గించడం కోసం సర్వశిక్ష అభియాన్ కృషి చేస్తుంది. ప్రస్తుతం దీని పేరు “రాజీవ్ విద్యామిషన్” గా మార్చారు.

ప్రశ్న 6.
ఏదేని సంక్షేమ పథకం.
జవాబు:
A.P. ప్రభుత్వం అనేక సాంఘిక సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నది. అవి: మహిళల కోసం జననీ సురక్ష యోజన, వెనుకబడిన తరగతులకు బి.సి. వసతి గృహాలు, మైనారిటీలకు ఉర్దూ అకాడమీ, గిరిజనులకు ఐ.టి.డి.ఎ., యువతకు TRYSEM పథకం మొదలగునవి.

ప్రశ్న 7.
పర్యావరణ పర్యాటకం. [Mar ’17]
జవాబు:
ఆంధ్రప్రదేశ్ ప్రధాన పర్యావరణ పర్యాటక బిందువుగా కూడా ఉంది. మారేడుమిల్లు; నేలపట్టు; మాయందూర్; తలకోన, ఎత్తిపోతలు మొదలగునవి ప్రముఖ పర్యావరణ పర్యాటక కేంద్రాలు.

ప్రశ్న 8.
ఆంధ్రప్రదేశ్లో పౌర విమానయానం.
జవాబు:
రాష్ట్రంలో ప్రాంతాల మధ్య మెరుగైన అనుసంధానం కోసం మరియు ఆర్థికాభివృద్ధిని వేగతరం చేసే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం “ప్రాంతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు ప్రతిపాదన తయారు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ, తిరుపతి, కడప మరియు రాజమండ్రి ఎయిర్పోర్టులను మెట్రోయేతర ఎయిర్పోర్టులుగా ఆధునికరించుటలో ఎయిర్పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా (AAI) తో తాఖీదు కుదుర్చుకుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 9.
ఆంధ్రప్రదేశ్లో రోడ్డుమార్గాలు.
జవాబు:
రోడ్లు ప్రాథమిక రవాణా వ్యవస్థలో ముఖ్యమైనవే కాకుండా అత్యంత కీలకమైన అవస్థాపనా సౌకర్యం ఆంధ్రప్రదేశ్లో 42,511 కి.మీ.లలో రాష్ట్ర రహదార్లు 3,144 కి.మీ.ల, జాతీయ రహదార్లు 1,01,484 కి.మీ.లలో జిల్లాలను కలుపుకొని 1,46,954 కి.మీ. విస్తారమైన నెట్వర్క్ కలిగి ఉంది. దీనిని రాష్ట్ర రోడ్డు రవాణా అభివృద్ధి సంస్థనే నిర్వహణ బాధ్యత కల్గి ఉంటుంది.

ప్రశ్న 10.
ఆంధ్రప్రదేశ్లో నౌకా కేంద్రాలు. [Mar ’17, ’16]
జవాబు:
సముద్ర తీర ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది. విశాఖ ఓడరేవు రాష్ట్రంలో అతిపెద్దదే కాకుండా | అండమాన్ నికోబార్ దీవులలోని పోర్టబ్లెయిర్కు ప్రయాణికుల సముద్ర యాత్రా వసతి కూడా కలదు. కృష్ణపట్నం, గంగవరం, కాకినాడ రేవులు రాష్ట్రంలోని ప్రధాన ఓడరేవులు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Economics Study Material 8th Lesson పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి Textbook Questions and Answers.

AP Inter 2nd Year Economics Study Material 8th Lesson పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
‘పర్యావరణం’ అంటే ఏమిటో నిర్వచించి, పర్యావరణం యొక్క అనుఘటకాలను గురించి వివరించండి.
జవాబు:
ఎన్విరాన్మెంట్ (పర్యావరణం) అన్న ఆంగ్లపదాన్ని “ఎన్విరానర్” అనే ఫ్రెంచిపదం నుంచి గ్రహించడం జరిగింది. “ఎన్విరాన్” అంటే “చుట్టూ ఉన్న” అని అర్థం. మన చుట్టూ ఆవరించి ఉన్న ప్రతి విషయాన్ని సమిష్టిగా పర్యావరణం (ఎన్విరాన్మెంట్) అని పిలువవచ్చు.

జీవరాశిని ప్రభావితం చేస్తూ వున్న సజీవ, భౌతిక మూలపదార్థాల కలయికనే ‘పర్యావరణం’ అని చెప్పవచ్చు. పర్యావరణం-భావనలు:1969లో అమెరికా జాతీయ పర్యావరణ విధాన చట్టం (National Einvironmental Policy Act (NEPA) ప్రకారం పర్యావరణం భౌతిక, సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక మరియు సౌందర్యపరమైన పర్యావరణాలుగా విభజింపబడి ఉంటుంది. రావ్ మరియు ఊటెన్లు పర్యావరణాన్ని నాలుగు విధాలుగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పారు.

1) భౌతిక పర్యావరణం:ఇది భౌతిక, రసాయన మరియు జీవ అంశాలైన భూమి, వాతావరణం, వృక్షసంపద, వన్యమృగాలు, చుట్టుప్రక్కల ఉన్న భూమి మరియు దాని స్వభావము, అవస్థాపనా సౌకర్యాలు, గాలి మరియు శబ్ద కాలుష్యస్థాయి మొదలైన వాటిని కలిగి ఉంటుంది.

2) సాంఘీక పర్యావరణం: ఇందులో జనాభా మరియు జనసాంద్రత, సామాజిక కూర్పు, మతపరమైన, విద్యాపరమైన, సామాజిక సౌకర్యాలు అంటే పాఠశాలలు, ఉద్యానవనాలు, వైద్యశాలలు, వినోదాత్మక మరియు సాంస్కృతిక సౌకర్యాలు వంటి అనేక అంశాలు అంతర్భాగమై ఉంటాయి.

3) ఆర్థిక పర్యావరణం:ఆర్థికాంశాలైన ఉద్యోగిత, నిరుద్యోగం, ఆదాయవనరులు, ఉత్పత్తి కారకాల లభ్యత, డిమాండులో మార్పులు, పేదరిక స్థాయి మొదలైనవి ఇందులో ఉంటాయి.

4) మనోహరమైన పర్యావరణం: ఇందులో చారిత్రాత్మక, పురావస్తు, శిల్పసంపదకు సంబంధించిన ప్రదేశాలు, ప్రకృతి దృశ్యాలు, సుందర ప్రదేశాలు ఉంటాయి. ప్రజలు వీటిని చూసి ఆహ్లాదం పొందుతారు.

పర్యావరణంలో అనుఘటకాలు వైవిధ్యమైనవే గాక ఒకదాని మీద మరొకటి ఆధారపడి పరస్పరం ప్రభావితం చేస్తూ, ప్రభావితమవుతూ ఉంటాయి. కాబట్టి పర్యావరణం అనేది ఒక సంపూర్ణమైన అన్ని శాఖలు కలిసిన విజ్ఞానశాస్త్ర అధ్యయనమని చెప్పవచ్చు.

పర్యావరణం – అనుఘటాలు:మన చుట్టూ పర్యావరణం జీవ, నిర్జీవ అనుఘటాలను, వాటి పరస్పర ఆధారిత పరస్పర ప్రభావితాలను కలిగి ఉంది. ఈ విషయాలన్నింటి అధ్యయనాన్నే ‘జీవావరణ శాస్త్రం’ అంటారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

1) జీవావరణ వ్యవస్థ (Eco system):ఇంగ్లాడుకు చెందిన ఎ.జి. ట్రాన్సీ అనే జీవావరణ శాస్త్రవేత్త 1935లో మొదటిసారి ‘జీవావరణం’ అనే పదాన్ని ఉపయోగించెను. జీవావరణం అనునది ఒక నిర్ధిష్ట మరియు గుర్తించదగిన భూమి యొక్క భాగము అంటే అడవులు, గడ్డిమైదానాలు, ఎడారులు, తీరప్రాంతాలు మొదలైనవి అని అర్థం. పర్యావరణంలోని వృక్షాలు మరియు జంతువులతో కూడిన జీవపర భాగాలతో పాటు నిర్జీవ భాగాలన్నింటినీ కలిపి ‘జీవావరణం’ అనవచ్చు. ఇది ఆ ప్రాంతంలోని మొక్కలు, వృక్షాలు, జంతువులు, చేపలు, సూక్ష్మజీవులు, నీరు, నేల మరియు మానవులందరి కలయిక, ఇటువంటి జీవావరణంలో కూడా ‘వృద్ధి-క్షయం’ అనే సూత్రం వర్తించి జీవ, నిర్జీవకాలు సృష్టింపబడి తిరిగి నశింపజేయబడుతూ ఒక విధమైన సంతులిత స్థితి నిర్వహింపబడుతుంది. దీనినే ‘జీవావరణ స్థిరత్వం’ అని అంటారు.

2) జీవ వైవిధ్యం (Biodiversity):జీవవైవిధ్యం అన్న పదం 1986లో అమెరికా శాస్త్రవేత వాల్టర్ రోసెన్ ప్రతిపాదించారు. భూమి జీవరాశులకు నిలయం. జీవరాశులు రకరకాల రంగులు, ఆకారాలు, ఆకృతులు, నిర్మాణాలను కలిగి ఉంటాయి. జన్యువులు, పర్యావరణం మరియు ఆవరణ వ్యవస్థలు కలిసి జీవరాశుల్లో ఉండే వైవిధ్యానికి, సంక్లిష్టతకు కారణమవుతున్నాయి.

జీవవైవిధ్యానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగాను అనేక ప్రయోజనాలుంటాయి. ప్రత్యక్షంగా ‘జీవ వైవిధ్యం’ మనకు ప్రాణాన్ని కాపాడే మందులు, ఆహారం, హార్మోన్లు, ఎంజైములు, పరిశ్రమలకు కావలసిన ముడి పదార్థాలు, అలంకరణకు పనికి వచ్చే తీగలు, మొక్కలు, మొదలైన వాటిని అందిస్తుంది.

జీవ వైవిధ్యం పరోక్షంగా కూడా ప్రయోజనాలను కలిగిస్తుంది. కర్బన స్థాయిని స్థిరపరచడం పరపరాగ సంపర్కం, జన్యు ప్రవాహం, నీటి వలయాలను నిర్వహించడం, భూగర్భజలాలను తిరిగి నింపడం, నేలను రూపొందించడం, పోషక వలయాలను స్థిరీకరించడం, కాలుష్యాలను విలీనం చేసుకోవడం, వాతావరణాన్ని క్రమపరచడం, సహజ పర్యావరణం అందించే రససౌందర్య, మానసోల్లాసాన్ని సంరక్షించడం మొదలయిన ఎన్నో రకాల పరోక్ష ప్రయోజనాలు మనకు జీవ వైవిధ్యం వల్ల లభిస్తాయి.

3) గ్రీన్ హౌస్ ప్రభావం:భూగ్రహంపై ఉన్న వాతావరణం కార్బన్ డై ఆక్సైడ్, నీటి ఆవిరి మరియు మీథైన్ వంటి కొన్ని రకాల వాయువులు ఎక్కువైన కారణంగా సూర్యుని నుండి విడుదల అయ్యే రేడియేషన్ని తమ ద్వారా లోపలికి రానిస్తాయి. కాని తిరిగి ఆ రేడియేటడ్ ఉష్ణాన్ని అట్టి పెట్టుకొని భూ ఉపరితలం నుండి బయటికి పోనివ్వవు. ఈ ప్రక్రియ వల్ల భూ ఉపరితలము ఉష్ణవికిరణాన్ని గ్రీన్ హౌస్ వాయువుల సహాయంతో గ్రహించి అన్ని’ దిశలకు వ్యాపింపచేస్తుంది. అలా కొంతభాగం తిరిగి భూమి వైపుకు, వాతావరణ దిగువ పొరలకు చేర్చబడి ఫలితంగా సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఇటువంటి గ్రీన్ హౌస్ వల్ల ఉష్ణపెరగడం, వాతావరణం మార్పులు, ఋతుపవన గమనం మరియు వాటి సామర్థ్యం మొదలైనవి జరుగుతాయి.

4) భూమి వేడెక్కుట (Global Warming):హరితగృహ వాయులైన కార్బన్ డై ఆక్సైడ్ వాటి వల్ల భూ ఉపరితల ఉష్ణోగ్రత రోజురోజుకి పెరుగుతుంది. ఈ కార్బన్ డై ఆక్సైడ్ ముఖ్యంగా శిలాజ ఇంధనాలు మండించుట ద్వారా, అడవుల నరికివేత వల్ల ఎక్కువగా వెలువడుతుంది. దీని ప్రభావంతో ఉష్ణం గ్రహింపబడి తిరిగి భూమి నుండి పరావర్తనం చెందకుండా భూమిపైనే ఉండిపోతుంది. దీని వల్ల గత శతాబ్దం నుంచి భూ వాతావరణ ఉష్ణోగ్రత 1.1°F పెరిగింది మరియు సముద్ర మట్టము కూడా కొన్ని ఇంచుల దాకా పెరిగింది. భూమి వేడెక్కడం వల్ల వచ్చే దీర్ఘకాల ఫలితాల్లో ముఖ్యమైనవి ధృవ ప్రాంతపు మంచు కరగడం, తద్వారా సముద్ర మట్టాలు పెరిగి, తీర ప్రాంతాలు ముంపుకు గురికావడం, కొన్ని రకాల జీవులు నశించి జీవ సమతుల్యం దెబ్బతినడం, ఉష్ణ ప్రాంతాలకు తుఫాన్లు రావడం మొదలగునవి జరుగుతాయి.

5) ఆమ్ల వర్షాలు (Acid Rain):ఆమ్ల వర్షం అనగా వాతావరణంలోని నైట్రిక్, సల్ఫ్యూరికామ్లాలు ఉండవల్సిన స్థాయి కంటే ఎక్కువగా ఉండి తద్వారా పడే రసాయనిక వర్షాలే. ఇవి వృక్షజాలము తగ్గిపోవుటచే సహజ కారణాల వల్ల మరియు సల్ఫ్యూరిక్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లను ఎక్కువగా విడుదల చేసే వాహనాలు వాడటం వంటి మానవ చర్యల వల్ల ఏర్పడుతాయి. ఆమ్ల వర్షాలు మొక్కల పెరుగుదలను అడ్డుకొని అవి చనిపోయేలా చేస్తాయి. కాబట్టి ఆమ్ల వర్షాల వల్ల వ్యవసాయం, అడవులు దెబ్బతింటాయి. అంతేగాక నీటిలో జీవించే జీవరాశులకు హానికరంగా మారుతాయి. శిల్పాలు, భవనాలు, వాహనాలు, పైపులు, కేబుల్ వైర్లు కూడా దీనికి ప్రభావితమవుతాయి. ఆమ్ల వర్షాల వల్ల సున్నితంగా వుండే సున్నపురాయి, ఇసుకరాయి కట్టడాలు తీవ్రంగా దెబ్బతింటాయి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

6) ఓజోన్ పొర క్షీణత:స్ట్రాటో ఆవరణంలో ఓజోన్ 03 తగ్గిపోవుటను ఓజోన్ క్షీణత అంటారు. ఈ ప్రాంతంలో హానికర క్లోరైన్ మరియు బ్రోమైన్ సంబంధ మూలాలు పెరగడం వల్ల ఓజోన్ క్షీణించడం లేక మందం తగ్గడం లేక రంధ్రాలు ఏర్పడడం జరగుతుంది. పర్యావరణ కాలుష్యం వల్ల ఓజోన్ పొర కృశించి, రంధ్రాలు ఏర్పడతాయి.

ప్రశ్న 2.
ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణానికి మధ్యగల సంబంధాన్ని వివరించండి.
జవాబు:
జీవరాశిని ప్రభావితం చేస్తూ, ఉన్న సజీవ, భౌతిక మూల పదార్థాల కలయికనే పర్యావరణం అని చెప్పవచ్చు. పర్యావరణం ఆర్థిక వ్యవస్థకు అవసరమైన ముడిసరుకులను సరఫరా చేయడమే కాక ఆర్థిక వ్యవస్థనుండి ఉత్పన్నమయ్యే వ్యర్థపదార్థాలను తనలో విలీనం చేసుకుంటుంది.

ఆర్థిక వ్యవస్థ అనగా నిరంతరం పెరిగిపోయే కోర్కెలను సంతృప్తి పరచడానికి అవసరమయ్యే వస్తు సముదాయాన్ని అందుబాటులో ఉన్న పరిమిత వనరుల సహాయంతో ఉత్పత్తి చేయటానికి రూపొందించుకున్న సముచితమైన సంవిధానాన్ని ఆర్థిక వ్యవస్థగా చెప్పవచ్చు.

పర్యావరణం ఒక వైపు ఆర్థిక వ్యవస్థకు అవసరమైన ముడి పదార్థాలు సప్లయి చేయడమే కాకుండా మరో వైపు ఆర్థిక వ్యవస్థ విడుదల చేసే వ్యర్థాలను సంగ్రహిస్తుంది. ఆధునిక కాలంలో ఆర్థిక కార్యకలాపాలు నిర్లక్ష్యంగా దోపిడి తత్వంతో పెరిగిపోయి పర్యావరణ సామర్థ్యాన్ని, అది సప్లయి చేయగల వనరులను ప్రభాతం చేయును. అలాగే వ్యర్థాలను సంగ్రహించగల పర్యావరణ సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తుంది. 1966లో బ్రిటీష్ ఆర్థికవేత్త ఇ. బిల్లింగ్ పర్యావరణ వనరులను విపరీతంగా వాడుకోవడం ఎంతో ప్రమాదకరమని హెచ్చరించారు.

ఆయన ఉద్దేశ్యంలో “ఈ ప్రపంచం పరిమిత జీవనాధార వనరులు కల్గిన ఒక పాత్ర వంటిది. కాబట్టి మానవాళి వనరుల వినియోగాన్ని గరిష్టంకాకుండా ఎంత కనిష్టం చేసుకుంటే అంత మంచిది. ఆర్థిక కార్యాకలాపాలు పర్యావరణంపై ఒత్తిడి ఎలా కలిగిస్తాయో ఈ క్రింది పటం తెలియజేయును.

పర్యావరణం మరియు ఆర్థిక కార్యకలాపాలు
AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి 1
పై పటంలో పర్యావరణ సహజ వనరులను వివిధ ఆర్థిక రంగాలైన వ్యవసాయ పారిశ్రామిక మరియు సేవారంగాలకు వనరులను ముడి పదార్థాల రూపంలో పంపిణీ చేస్తుంది. ఈ రంగాలు వనరులు ఉపయోగించుకొని వస్తు సేవలను ఉత్పత్తి చేస్తున్నాయి. వస్తు సేవల ఉత్పత్తి పర్యావరణ పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఉత్పత్తి పెరిగినప్పుడు పర్యావరణ భౌతిక ఉపయోగం పెరిగి, పర్యావరణ పరిమాణం తగ్గుతూ వస్తుంది. మరోవైపు ఆర్థిక కార్యకాలాపాలు పర్యావరణంలోకి వ్యర్థ పదార్థాలను మరియు వివిధ రూపాలలోని కాలుష్యాన్ని వదలుతున్నాయి. ఇది పర్యావరణ నాణ్యతను దెబ్బతీస్తుంది. ఇది పర్యావరణం యొక్క కాలుష్యాన్ని గ్రహించే శక్తిని కోల్పోయేలా చేస్తుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

ప్రశ్న 3.
గాలి కాలుష్యం అంటే ఏమిటి ? అందుకు గల కారణాలు, ఫలితాలు తెల్పండి.
జవాబు:
కాలుష్యం – రకాలు:పర్యావరణానికున్న స్వాభావిక లక్షణాల్లో భౌతికంగా, రసాయనికంగా లేదా జీవపరమైన అవాంఛనీయ పరిమాణాలు కలిగితే దాన్ని కాలుష్యం అంటారు. పర్యావరణంలోని కాలుష్యం వివిధ రకాలుగా ఉంటుంది. వాటిలో వాయు, జల, నేల, శబ్ద, ఘనవ్యర్థ పదార్థాల, ఉష్ణకాలుష్యాలు ప్రధానమైనవి.

గాలిలో ఇతర కాలుష్యకారక పదార్థాల గాఢత ఎక్కువైపోయి మానవుని శ్రేయస్సును, జీవకోటికి మరియు వివిధ రూపాలలో వున్న ఆస్తులపై ప్రతికూల ప్రభావం చూపడాన్ని ‘వాయు లేక గాలి కాలుష్యం’ అంటారు.

1) వాయు కాలుష్యం:మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఎన్నో రకాలైన వాయువులు ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్ డై ఆక్సైడ్, నైట్రోజన్ మొదలయినవి ఆవరించి ఉంటాయి. భూమి చుట్టూ ఉన్న వాతావరణం ఇలాంటి వాయువుల కలయికతో ఏర్పడి, ఉమ్మడిగా వీటన్నంటిని కలిపి ‘వాయువు’ (గాలి) అని సామాన్య అర్థంగా పిలుస్తుంటారు. బరువు దృష్ట్యా చూస్తే మానవుడు రోజు తీసుకొనే పదార్థాల్లో 80% వరకు గాలి ఉంటుంది. మనుషులు సగటున ఒకరోజుకు 2200 సార్లు శ్వాసిస్తూ ఒక రోజులో సుమారు 16 నుంచి 20 కి.గ్రాల గాలిని పీల్చుకుంటూ ఉంటారు. అన్ని జీవరాశుల శ్వాసక్రియ ఈ వాయువు మీదనే ఆధారపడి ఉంటుంది. కాని మానవుని వివిధ కార్యకాలాపాల వల్ల గాలి కాలుష్యం కాబడి, అందులోని వివిధ వాయువుల సహజసిద్ధమైన కూర్పు భంగము చేయడుతుంది. కాలుష్యం వల్ల ప్రాణికోటికి అవసరమైన ప్రాణవాయువు తగ్గిపోయి, హానికారక బొగ్గుపులుసు వాయువు (కార్బన్ డై ఆక్సైడ్) మరియు నత్రజని (నైట్రోజన్) స్థాయిలు పెరిగిపోతాయి.

వాయు కాలుష్యం కారణాలు:ప్రస్తుత అంచనాల ప్రకారం సగటున ఒక సంవత్సరానికి 2 బిలియన్ టన్నుల వాయు కాలుష్య కారకాలు విడుదలవుతున్నాయి.
1) వాయు కాలుష్యం సహజమైన, మానవ నిర్మితమైన ఆధారాల వల్ల జరుగుతూ ఉంటుంది.

2) వంట చెరుకును కాల్చడం, శిలాజ ఇంధనాలను వాడడం, పారిశ్రామికీకరణ, పంటలసాగు, వాహన విసర్జకాలు, న్యూక్లియర్ పరీక్షలు, అడవులు నాశనమైపోవడం, గనుల తవ్వకం, విద్యుత్పత్తి, శీతలీకరణ పరిశ్రమలు మొదలగునవి వాయు కాలుష్యానికి ముఖ్య కారణాలు.

వాయు కాలుష్యం ప్రభావాలు:వాయు కాలుష్యం ప్రజలను, మొక్కలను, జంతువులను, జలచరాలను, ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. మానవుల ఆరోగ్యాన్ని తారుమారు చేస్తుంది. చెట్ల, మొక్కల ఆకులను పాడుచేస్తుంది. కిరణజన్య సంయోగక్రియ సరిగ్గా జరగనీయదు. మొక్క వృద్ధిని అడ్డుకుంటుంది. చారిత్రాత్మక కట్టడాలను వర్ణవిహీనం చేస్తుంది. ఇండ్లు, కార్లులాంటి వాటికుండే వెలుపలి రంగులు పేలవంగా తయారుచేస్తుంది. సహజమైన అందాలను కలిగిన ప్రదేశాల స్వచ్ఛతను, నాణ్యతను క్షీణింపచేస్తుంది.

ఉదా:ప్రసిద్ధ కట్టడం తాజ్మహల్ తెల్లటి పాలరాయి 1998లో పసుపు రంగులోకి మారడం ప్రారంభించింది. ఈ మార్పు ప్రమాదస్థాయిని కూడా మించిపోయింది. వాయుకాలుష్యం స్ట్రాటోస్పియరు, శీతోష్ణస్థితిని తారుమారు చేసి భూతాపానికి ఆమ్ల వర్షాలకు, ఓజోన్ పొర క్షీణతకు, ఉష్ణోగ్రతలు పెరుగుదలకు కరువులు రావడానికి, మొక్కల, పంటల క్రిమికీటకాల, పశువుల స్వాభావిక లక్షణాలు మారిపోవడానికి, అతినీలలోహిత కిరణ ధార్మికతకు కారణమవుతూ ఉంటుంది.

ప్రశ్న 4.
నీటి కాలుష్యానికి కారణాలు, దాని ప్రభావాలను తెలపండి.
జవాబు:
నీటి కాలుష్యం:నీటిని ‘నీలి బంగారం’ అంటారు. జీవరాశులకు గాలి, ఎండ, ఎంత అత్యవసరమో నీరు కూడా అంతే అవసరం. మానవుని శరీర బరువులో 70 శాతం నీరు ఉంటుంది. భూమి ఉపరితంలో 80 శాతం వరకు నీరు ఆక్రమించి ఉంది. భూమి మీద ఉండే నీటిలో 97 శాతం “కు సముద్రాల్లో ఉంటుంది. మిగతా 3 శాతం మాత్రమే స్వచ్ఛమైన నీరు. అందులో 2.997 శాతం మంచు డ్డ డ లో ఉంది. మిగతా 0.003 శాతం చాలా కొద్ది పరిమాణంలో మాత్రమే మానవాళి ఉపయోగానికి లభిస్తోంది. కాబట్టి నీరు అత్యంత విలువైన వనరుగా పరిగణించబడుతోంది. నీరు లేకపోతే ఈ భూమి మీద అసలు జీవమే ఉండదు. సెలయేళ్ళు, సరస్సులు, చెరువులు, నదులు, సముద్రాలు, ఆనకట్టలు, జలధారల్లో నిల్వచేసిన నీరు మొదలైనవి ఉపరితల నీటి వనరులు. భూమి లోపల ఇంకిపోయిన బావులు, గొట్టపు బావుల ద్వారా లభించే నీటిని భూగర్భజలం అంటారు. ఆర్థిక కార్యకలాపాల్లోని ప్రతిదశలో నీరు చాలా అవసరం.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

కొన్ని పదార్థాలు గాని, కారకాలు గాని, నీటిలో ఎక్కువగా చేరిపోయి, నీటి యొక్క స్వచ్ఛతను తగ్గించివేసి దానిని ఆరోగ్యానికి హానికరంగాను, వాడుకోవడానికి కూడా పనికి రాకుండా మార్చివేస్తాయి. దానినే నీటి కాలుష్యంగా చెప్పవచ్చు. మానవ ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతుండటంతో, నీరు వినియోగానికి కూడా పనికిరానంతగా కలుషితమవుతుంది. నీరు నాణ్యతను కోల్పోయి, వ్యవసాయానికేకాక, త్రాగటానికి కూడా పనికిరాకుండా పోతుంది. ఆర్థిక కార్యకాలాపాలు విస్తరించడంతో ఉపరితంలో ఉన్న నీరే కాకుండా భూగర్భ జలం కూడా కలుషితమౌతుంది.

నీటి కాలుష్యం – కారణాలు:గృహాలలో వ్యర్థాలు, మానవ వ్యర్థాలు, మేటవేయడం, పారిశ్రామిక వ్యర్థాలు, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారకాలు, ప్రమాదవశాత్తు సముద్రంలో చిందిపోయే నూనెలు, విషపూరితమైన లోహాల మూలకాలు, గనుల తవ్వకం వల్ల వచ్చే వ్యర్థాలు, మొదలగు వాటి వల్ల నీరు కలుషితమవుతుంది.

నీటి కాలుష్యం – ప్రభావాలు :

  1. నీటి నుంచి పుట్టే వ్యాధులను వ్యాపింపచేస్తుంది. తద్వారా వైద్యఖర్చుల రూపంలో అధిక ఆర్థిక భారం మోపుతుంది.
  2. త్రాగు నీటి స్వచ్ఛతను క్షీణింపచేస్తుంది. ఆర్థిక కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా ఉపయోగించడానికి కూడా పనికిరాకుండా పోతుంది.
  3. సముద్ర ఉత్పత్తులు కలుషితమై తినడానికి వీలులేని ప్రమాదకరమైనవిగా మార్చేస్తుంది. తద్వారా ఎగుమతులు తగ్గి, విదేశీ మారక ద్రవ్యం కూడా తగ్గుతుంది.
  4. నీటిలోని ఆక్సిజన్ని తగ్గిస్తుంది. అది సముద్ర వాతావరణంలోని ఉష్ణోగ్రత మార్పునకు దారి తీసి, నీటిలో జీవించే జీవుల పునరుత్పత్తి తద్వారా దేశ సముద్ర ఉత్పాదక విలువను ప్రభావితం చేస్తుంది.
  5. మానవులు పనిచేసే రోజులు అనారోగ్యం వల్ల తగ్గిపోతాయి. తద్వారా ఉత్పత్తి కార్యక్రమాలు తగ్గిపోతాయి.

ప్రశ్న 5.
‘ధ్వని కాలుష్యం’ అంటే ఏమిటో నిర్వచించి, అది పర్యావరణ స్వచ్ఛతను ఎలా కలుషితం చేస్తుందో వివరించండి.
జవాబు:
ధ్వని కాలుష్యం కారకాలు:ధ్వని కాలుష్యం (ఇంట, బయటా) ఉంటుంది. గృహోపకరణాల వాడకం వల్ల, లౌడ్ స్పీకర్ల వాడకం, గడియారం అలారం, శబ్దాల వల్ల ఊపిరి పీల్చడం, మాట్లాడటం, శబ్దాలు మొదలైనవి ఇంటిలోపల ధ్వనులకు ఆధారాలు. బయటి ధ్వని కాలుష్యం ముఖ్యంగా థర్మల్ ప్లాంటు, గనుల త్రవ్వకం, విమానాశ్రయాలు, వివిధ రవాణా సాధనాల ద్వారా ఏర్పడుతుంది.

ధ్వని కాలుష్యం – ప్రభావాలు:ధ్వని కాలుష్యం పర్యావరణ స్వచ్చతను భూమిమీద జీవించే ప్రాణులను ప్రభావితం చేస్తుంది. ధ్వని కాలుష్యం అనేక ప్రభావాలకు దారితీస్తుంది. అందులో ముఖ్యమైనవి.

  1. సంగీతం, భాషణల యొక్క తియ్యదనం, ఇంపు నశించిపోతుంది.
  2. వార్తా ప్రసార శ్రవణాన్ని అడ్డుకుంటుంది.
  3. తాత్కాలికంగా కాని, శాశ్వతంగా కాని వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం వుంది.
  4. మానవుని శరీరంలోని వివిధ వ్యవస్థలు చేసే పనులకు అడ్డుపడుతుంది. నరాలపై ఒత్తిడి పెరగడం, నిద్రలేకుండా పోవడం, జీర్ణక్రియలు సరిగా లేకపోడం, రక్తపోటులాంటి అనారోగ్య పరిస్థితులు ధ్వని కాలుష్యం వల్ల కలుగుతాయి.
  5. నాడి సక్రమంగా కొట్టుకోకపోవడానికి లేదా వేగంగా కొట్టుకోవడానికి, రక్తంలో కొవ్వు శాతం పెరగడానికి కారణమవుతుంది.
  6. గర్భస్థ శిశువులకు సరిచేయలేనటువంటి ప్రమాదాలను కలుగచేస్తుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

ప్రశ్న 6.
పర్యావరణ క్షీణతకు గల ఆర్థిక కారణాలు ఏవి ?
జవాబు:
ఆర్థికాభివృద్ధి, పర్యావరణ క్షీణత లేదా కాలుష్యం ఒకే దిశలో పయనిస్తాయి. విచక్షణారహితంగా, సహజ వనరులను అతిగా ఉపయోగించడం వల్ల భౌతిక పర్యావరణం క్షీణిస్తుంది. పర్యావరణ క్షీణత ప్రభావాలను మనం అనేక విధాలుగా చూడవచ్చు. కాలష్యాల దుష్ఫలితాలను క్రింద వివరించడం జరిగింది.

1) మానవ ఆరోగ్యంపై ప్రభావాలు:పర్యావరణ క్షీణత, మానవ ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నందున, శ్రామికలు తమ పనులకు హాజరు కాలేకపోతున్నారు. అనారోగ్య కారణాలు, శ్రామికుల సామర్థ్యాన్ని తగ్గించగా అది | అల్ప ఉత్పాదకతకు దారితీస్తుంది.

ఎ) వాయు కాలుష్యం:వాయు కాలుష్యకారకాలైన కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, హైడ్రోకార్బన్లు, కణరూపద్రవ్యం మొదలైనవి శ్వాసకోశం ద్వారా మానవశరీరంలోకి నేరుగా ప్రవేశించి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఉబ్బసం, ఊపిరితిత్తుల క్యాన్సర్, చర్మానికి చిరాకును కలిగించి బాధపెట్టే అలర్జీ మొదలైన వ్యాధులకు వాయు కాలుష్యమే
కారణం.

బి) నీటి కాలుష్యం:వ్యాధులను వ్యాపింపచేసే సాధనాలలో అతి ముఖ్యమైనది నీరు. వివిధ వ్యాధులను కలిగించే వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవాలాంటి సూక్ష్మక్రిములు నీటి ద్వారానే వ్యాపిస్తాయి. ఈ సూక్ష్మక్రిముల వల్ల విరోచనాలు, టైఫాయిడ్, కలరా, కామెర్లులాంటి వ్యాధులు సంక్రమిస్తాయి.

సి) ధ్వని కాలుష్యం:ధ్వని కాలుష్యం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. పెద్దశబ్దాలు నిద్రాభంగాన్ని కలిగించి, ఆరోగ్యం మీద ప్రభావాలను కలిగిస్తాయి. ధ్వని కాలుష్యం వల్ల వినికిడి దెబ్బ తినడం, పనిపాటల్లో, సంభాషణలో అంతరాయాన్ని, ఏకాంతానికి భంగం, నిద్రాభంగాన్ని బాధను లేదా చిరాకును కలిగిస్తుంది. అలాగే ఏకాగ్రతకు భంగం కలిగించడం, రక్తపోటు, గుండెవేగం పెరగడంలను కలుగ చేస్తుంది.

2) వ్యవసాయంపై ప్రభావం:పర్యావరణ క్షీణత వల్ల వ్యవసాయరంగం దెబ్బతింటుంది. వ్యవసాయ ఉత్పాదకత, వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత తగ్గిపోతాయి.

ఎ) వాయు కాలుష్యం:వాయు కాలుష్యకారకాలైన సల్ఫర్-డై-ఆక్సైడ్ వదిలే పొగలు మొక్కలను దెబ్బతీస్తాయి. ముఖ్యంగా మొక్కలలోని లెట్యూస్, బార్లీ, వైట్ – ఫైన్ మొదలైనవి ఈ పొగల వల్ల తీవ్రంగా ప్రభావితం అవుతాయి. సాధారణంగా వాయుకాలుష్యం మొక్కల ఆకులను దెబ్బతీస్తుంది. మొక్కల ఆకులలోని పత్రహరితాన్ని కోల్పోయి అవి పసుపు పచ్చగా మారతాయి. ఈ విధంగా వ్యవసాయ ఉత్పత్తిని వాయుకాలుష్యం తగ్గిస్తుంది. వాతావరణంలో మార్పులకు వాయుకాలుష్యం కారణమని అనేక సూచికలు తెలియచేస్తున్నాయి. ఆమ్లవర్షాలకు కారణం వాయు కాలుష్యమే. వాతావరణంలో మార్పులు, ఆమ్ల వర్షాలు వ్యవసాయ ఉత్పత్తిని తగ్గిస్తాయి.

బి) నీటి కాలుష్యం:నీటి కాలుష్యం వ్యవసాయభూముల ఉత్పాదకతను అధికంగా దెబ్బతీస్తుంది. కలుషిత నీటిలో నిర్జీవ లవణాలు, ముఖ్యంగా క్లోరైడ్ ఉంటుంది. ఈ నీరు పంట పొలాలలోకి ఇంకి ఆవిరైపోతే లవణాలు మాగాణి భూమిలో కేంద్రీకృతం అవుతాయి. ఈ విధంగా లవణాలు భూమిలో పేరుకుపోయి కేంద్రీకృతమై, భూసారం తగ్గి, సాగుభూమి బీడుబారిపోతుంది.

సి) నేల కాలుష్యం:నేలకోత, లవణీకరణ, ఎడారీకరణ మొదలైనవి భూమి నాణ్యత, సాగుభూమి పరిమాణాన్ని తగ్గిస్తాయి. గనుల నిర్వహణ కూడా పంటపొలాలను తగ్గించి భూమికోతకు కారణమవుతున్నది. కావున భూకాలుష్యం పంటపొలాల విస్తీర్ణాన్ని తగ్గించడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తిని తగ్గిస్తుంది.

3) పరిశ్రమలపై ప్రభావాలు:పర్యావరణ కాలుష్యం పారిశ్రామిక ఉత్తత్త్పిని తగ్గిస్తుంది. పారిశ్రామిక ఉత్పత్తుల నాణ్యత కూడా దీని వల్ల క్షీణిస్తుంది.

ఎ) వాయు కాలుష్యం:భవనాలు, కార్లు, వస్త్రాలు, మొదలైనవి గాలిలోని వ్యర్థపరమాణువుల వల్ల ప్రభావితం అవుతున్నాయి. సల్ఫర్ ఆక్సైడ్లు భవనాల తయారీలో ఉపయోగపడు పాలరాయి, సున్నపురాళ్ల క్షీణతకు కారణం అవుతున్నాయి. సల్ఫర్ ఆక్సైడ్ ప్రభావం వల్ల వస్త్రాలు, తోళ్లు, స్టీలు మొదలైనవి దెబ్బతింటున్నాయి. నైట్రోజన్ ఆక్సైడ్ సున్నితమైన రంగులను వెలసిపోయేటట్లు చేస్తుంది. వాయు కాలుష్యం పరిశ్రమల, యంత్రాల తరుగుదలకు కారణమవటంతో పాటు, పారిశ్రామిక ఉత్పత్తుల నాణ్యతను తగ్గిస్తుంది.

బి) నీటి కాలుష్యం:కలుషితమైన నీరు, పరిశ్రమలకు తక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది. భిన్న పరిశ్రమలలో ఉపయోగపడే నీటి నాణ్యత భిన్నరకాలుగా ఉంటుంది. చల్లటి నీటిలో సాధారణంగా తక్కువ శుభ్రత కలిగి ఉంటాయి. అవసరం లేని వేడిమి, పదార్థాలని తీసివేసే గుణం వున్న నీరు పరిశ్రమలకు ఉపయుక్తం కాదు. కలుషిత నీటి వల్ల పరిశ్రమలలో వ్యయాలు ఎక్కువగా అవుతాయి. నీటిని శుద్ధిచేయటం, దెబ్బతిన్న యంత్ర సామాగ్రిని బాగుచేయటం, పారిశ్రామిక ప్రక్రియలో సర్దుబాటు వల్ల పరిశ్రమల వ్యయాలు పెరుగుతాయి.

సి) నేల కాలుష్యం:ఖనిజాలు, ఖనిజనూనెలు భూమిలో అంతర్భాగాలు. వీటిని ఉపయోగిస్తే అవి శాశ్వతంగా కోల్పోవడం జరుగుతుంది. శక్తిని ఉత్పత్తి చేయటానికి బొగ్గు, పెట్రోలియం ఉత్పత్తులను ఉపయోగిస్తారు. వివిధ ఖనిజాలను పరిశ్రమల్లో ముడి పదార్థాలుగా ఉపయోగించటం జరుగుతుంది. విచక్షణా రహితంగా ఈ వనరులను ఉపయోగిస్తే, ఇవి హరించుకుపోయి పారిశ్రామిక అభివృద్ధిని తగ్గిస్తాయి.

4) పశుసంపదపై ప్రభావాలు:పర్యావరణ కాలుష్యం పశు పక్ష్యాదుల ఆరోగ్యంపై దుష్ప్రభావాలను కల్గిస్తుంది. పశుపక్ష్య సంబంధమైన ఉత్పత్తులు కూడా తగ్గుతాయి. పశు ఆరోగ్యానికి అతి ప్రమాదకరమైన కాలుష్యకం ఫ్లోరైడ్ పాడి పశువులు ఫ్లోరైడ్ వల్ల అతిగా ప్రభావితమై, పాల ఉత్పత్తులు తగ్గిస్తాయి. ఫ్లోరైడ్ వల్ల వచ్చే ‘ఫ్లోరోసిస్’ అనే వ్యాధి వల్ల పళ్లు, ఎముకలు ప్రభావితమై అవిటి అవడం జరుగుతుంది.

5) సముద్ర ఆహార పదార్థాలపై ప్రభావం:నీటి కాలుష్యం మత్స్యవనరుల మీద వ్యతిరేక ప్రభావం చూపుతుంది. నీటిని కలుషితం చేసే విషపదార్థాలు నీటిలో ఆక్సిజన్ పరిమాణం తగ్గించడం వల్ల నీటి ఉష్ణోగ్రతలో మార్పులు వచ్చి చేపల పునరుత్పత్తిని దెబ్బతీయటమే కాకుండా అవి కలుషితమై భుజించడానికి కూడా పనికిరాకుండా చేస్తుంది.

6) ఇతర ప్రభావాలు:పై ఆర్థిక ప్రభావాలే కాకుండా, ఇతర పదార్థాలు కూడా పర్యావరణ క్షీణత వల్ల ఏర్పడతాయి. ఇది జీవవైవిధ్యాన్ని తగ్గిస్తుంది. జీవవైవిధ్యంలోని విభిన్న జంతువులు జీవరాశులు, మొక్కలు ప్రభావితం చేయబడి, వాటి మధ్య అంతర్గత సంబంధాలు దెబ్బతింటాయి. ఈ కారణాల వల్ల పరస్పర ఆధారమైన, సున్నితమైన ఆహార గొలుసులోని బంధం తెగిపోవచ్చు లేదా బలహీనం కావచ్చు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

ప్రశ్న 7.
పర్యావరణ కాలుష్యానికి దారితీసిన కారకాలు ఏమిటి ?
జవాబు:
పర్యావరణ క్షీణత, వాతావరణం కాలుష్యం కన్నా కొద్దిగా భిన్నమైనవి. పర్యావరణ నాణ్యత తగ్గడాన్ని క్షీణత అంటాము. కాని ప్రకృతి కొన్ని హానికారక మూలకాలతో కాలుష్యం అవడాన్ని కాలుష్యం అనవచ్చు. పర్యావరణ మార్పులు ఆర్థికాభివృద్ధి, జనాభా వృద్ధి, నగరీకరణ, సాంద్ర వ్యవసాయం పద్ధతులు, విద్యుత్ వాడకం పెరగడం మరియు రవాణా వంటి అనేక కారణాల వల్ల ఏర్పడవచ్చు. పర్యావరణ క్షీణతకు ప్రాధమిక కారకాలను క్రింది విధంగా చర్చించవచ్చు.

1) సాంఘీక కారణాలు:పర్యావరణ క్షీణతకు కారణమైన సాంఘిక కారణాలను సంక్షిప్తంగా క్రింద వివరించడం జరిగింది.

ఎ) జనాభా:ఆర్థికాభివృద్ధి జరగాలంలే జనాభాయే మూలం. అయితే, ఒక హద్దు దాటి పెరిగితే పర్యావరణ క్షీణతకు కూడా జనాభాయే ముఖ్య కారణమవుతుంది. కాబట్టి పెరుగుతున్న జనాభా జీవ సహాయం వ్యవస్థల మధ్య సంబంధాన్ని స్థిరీకరించాలి. లేకుంటే అభివృద్ధి కార్యక్రమాలు, నవకల్పనలు, సత్ఫలితాలను ఇవ్వలేవు.
ప్రపంచ భూభాగంలో 2.4% ఉన్న భారతదేశం ప్రపంచ జనాభాలో 17% జనాభాను పోషిస్తుంది. ప్రస్తుత భారత జనాభా పెరుగుదల రేటు 1.77 (2011 జనగణన). ఈ రేటు భారతదేశం ఎదుర్కొనే జనాభా సమస్యను సూచిస్తుంది. కాబట్టి జనాభా, పర్యావరణ సంబంధాలను దృష్టిలో ఉంచుకొని జనాభా నియంత్రణకు ఉధృత చర్యలను (Vigourous Drive) చేపట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

బి) పేదరికం:పర్యావరణ క్షీణతకు పేదరికం కారణం మరియు ఫలితం కూడా అని చెప్పవచ్చు. పేదరికానికి, పర్యావరణానికి ఉన్న చక్రరూప సంబంధం అతి క్లిష్టమైన దృగ్విషయం. అసమానతలు, వనరుల క్షీణతని పెంపొందిస్తాయి. ఎందుకంటే ధనికుల కంటే పేదలు ఎక్కువగా సహజ వనరులపై ఆధారపడతారు. కాబట్టి సహజ వనరలు తగ్గుతాయి. పేదవారికి ఇతర వనరుల ద్వారా సరైన ఫలితాలు పొందే అవకాశం లేదు. దేశంలో రంగరాజన్ కమిటీ ప్రకారం 29.5 శాతం మరియు సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారం 21.9% (2011-12)గా పేదరిక శాతాన్ని అంచనా వేశారు. కానీ నిరపేక్ష పేదరిక పరిమాణం అంటే దారిద్య్ర రేఖకు దిగువన నివసించే వారి మొత్తం సంఖ్య నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది.

2) నగరీకరణ (Urbanization):గ్రామాలలో లాభసాటి ఉద్యోగవకాశాలు లేనందువల్ల పేదకుటుంబాలు పట్టణాలకు తరలి వెళ్ళడం జరుగుతోంది. అందువల్ల జీవావరణంపై ఒత్తిడి పెరుగుతుంది. మెగా సిటీలు లేదా పెద్ద నగరాలు పెరగటంతో పాటు మురికివాడలు కూడా విస్తృతమవుతాయి. 2001 జనగణన ప్రకారం 28.6 కోట్ల ప్రజలు నగరాల్లో నివసిస్తున్నారు. శాతంలో చెప్పాలంటే 27.8% మంది అన్నమాట. అదే 2011 జనగణన ప్రకారం 37.7 కోట్లకు (30%) పెరిగారు. ఈ విధమైన శీఘ్ర ప్రణాళికా రహిత పట్టణాలు పెరుగుదల, పట్టణాల పర్యావరణ ల క్షీణతకు దారితీస్తుంది.

3) ఆర్థిక అంశాలు (Economic Factors):పర్యావరణ క్షీణతకు చాలా వరకు మార్కెట్ వైఫల్యమే కారణం, అంటే పర్యావరణ వస్తు, సేవలకు సంబంధించి మార్కెట్ లేకపోవటమే లేదా మార్కెట్ సమర్థవంతంగా పనిచేయలేకపోవటమే కారణంగా చెప్పవచ్చు. ప్రైవేటు, సాంఘిక వ్యయాల (Social costs or benefits) వల్ల వినియోగం, ఉత్పత్తుల్లో బహిర్గత ప్రభావాలు ఏర్పడి పర్యావరణ క్షీణతకు కారణమవుతున్నాయి. మార్కెట్ వైఫల్యానికి స్పష్టంగా నిర్వచించని ఆస్తి హక్కు ఒక కారణం. అంతేకాకుండా ధరల నియంత్రణ, సబ్సిడీల వల్ల మార్కెట్ వక్రీకరణ ఫలితంగా సాధించవలసిన పర్యావరణ లక్ష్యాలను పెంచుతున్నాయి.

తత్ఫలితంగా సహజ వనరులు (ఖనిజ నూనెలు, ఖనిజాలు) తగ్గిపోవడం, నీరు, గాలి, భూమి, కలుషితమవటం ఫలితంగా ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు జీవావరణ వ్యవస్థ నాణ్యత తగ్గిపోతుంది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వివిధ పర్యావరణ భావనలను వివరించండి.
జవాబు:
1969లో అమెరికా జాతీయ పర్యావరణ విధాన చట్టం (National Environmental Policy Act (NEPA) ప్రకారం పర్యావరణ భౌతిక, సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక మరియు సౌందర్యపరమైన పర్యావరణాలుగా విభజింపబడి ఉంటుంది. రావ్’ మరియు ఊటెన్లు పర్యావరణాన్ని నాలుగు విధాలుగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పారు.

1) భౌతిక పర్యావరణం:ఇది భౌతిక, రసాయన మరియు జీవ అంశాలైన భూమి, వాతావరణము, వృక్షసంపద, వన్యమృగాలు, చుట్టప్రక్కల వున్న భూమి మరియు దాని స్వభావము, అవస్థాపనా సౌకర్యాలు, గాలి మరియు శబ్ద కాలుష్య స్థాయి మొదలైన వాటిని కలిగి ఉంటుంది.

2) సాంఘిక పర్యావరణము:ఇందులో జనాభా మరియు జనసాంద్రత, సామాజిక కూర్పు, మతపరమైన, విద్యాపరమైన, సామాజిక సౌకర్యాలు అంటే పాఠశాలలు, ఉద్యానవనాలు, వైద్యశాలలు, వినోదాత్మక మరియు సాంస్కృతిక సౌకర్యాలు వంటి అనేక అంశాలు అంతర్భాగమై అంటాయి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

3) ఆర్థిక పర్యావరణం:ఆర్థికాంశాలైన ఉద్యోగిత, నిరుద్యోగం, ఆదాయవనరులు, ఉత్పత్తి కారకాల లభ్యత, డిమాండులో మార్పులు, పేదరికస్థాయి మొదలైన అంశాలు ఇందులో ఉంటాయి.

4) మనోహరమైన పర్యావరణం:ఇందులో చారిత్రాత్మక, పురావస్తు, శిల్ప సంపదకు సంబంధించిన ప్రదేశాలు, ప్రకృతి దృశ్యాలు, సుందర ప్రదేశాలు ఉంటాయి. ప్రజలు వీటిని చూసి ఆహ్లాదం పొందుతారు.

పర్యావరణంలో అనుఘటకాలు వైవిధ్యమానమై గాక ఒకదాని మీద మరొకటి ఆధారపడి పరస్పరం ప్రభావితం చేస్తూ, ప్రభావితమవుతూ ఉంటాయి. కాబట్టి పర్యావరణం అనేది ఒక సంపూర్ణమైన అన్ని శాఖలు కలిసిన విజ్ఞానశాస్త్ర అధ్యయనమని చెప్పవచ్చు.

ప్రశ్న 2.
నేల లేక భూమి కాలుష్యం.
జవాబు:
భూపటలంలోని పై పొరలను ‘నేల’ లేదా ‘మృత్తిక’ అంటారు. రాళ్ళు నిరంతరం భౌతిక, రసాయనిక, జీవ శైధిల్యానికి గురవుతూ ఉండడం వల్ల నేల ఏర్పడింది. ప్రకృతి మానవునికిచ్చిన వరమే నేల నేల ప్రాణంతో ఉన్న (సజీవ) వనరు.

నేల నాణ్యత కొన్ని ప్రతికూల మార్పులకు గురి అయి అందులోని సహజ మూలకాల కూర్పు తారుమారు కావడం తద్వారా భూమి ఉత్పాదకత తగ్గడమే “నేల కాలుష్యమని” నిర్వచించవచ్చు.

నేల కాలుష్యానికి కారణాలు:నేల కాలుష్యం అనేది మృత్తికా క్రమక్షయ వల్ల ఏర్పడుతుంది. మృత్తికా క్రమక్షయం అనేది నేల ఉపరితలంలోని సారవంతమైన పొరలు కోతకు గురిచేసి, భూమి నిస్సారంగా మార్చడం వల్ల జరుగుతుంది. ఇది అడవుల నరికివేత, విస్తృత వ్యవసాయం వల్ల, గనుల త్రవ్వకం మొదలగు వాటి వల్ల ఏర్పడుతుంది. అదే విధంగా నేల కోతకు ఎడారీకరణ కూడా కారణమే. దీని వల్ల నేల జీవంలేకుండా ఇసుక సముద్రంగా తయారవుతుంది. ఎడారీకరణ అనేది పశువులను ఎక్కువగా మేపడం వల్ల తక్కువ సారం కలిగిన నేలలనే ఎక్కువగా ఉపయోగించడం వల్ల, క్షారీకరణ, లవణీకరణ మొదలగు వాటి వల్ల ఏర్పడుతుంది.

అధికంగా రసాయనిక ఎరువుల, క్రిమిసంహారక మందుల వాడకం వల్ల వివిధ రసాయనాలు, ఆమ్లాలు, క్షారాలు, భూమిలోకి చొచ్చుకుపోయి భూమికి ఉండే సహజ రసాయనిక ధర్మాలు మార్పుచెంది మొక్కలు, పంటల నాశనానికి దారితీస్తుంది. వ్యర్థపదార్థాలతో భూమిని నింపటం వల్ల కూడా నేల క్షీణతకు ..రవుతుంది.

ప్రశ్న 3.
సహజ వనరుల రకాలు, ఉదాహరణలతో వ్రాయుము. [Mar ’16]
జవాబు:
భూమి వనరుల నిలయం. వనరులు ప్రకృతి ప్రసాదిం వరాలు. వనరులను మనం ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించుకుంటాం.

సహజ వనరుల విభజన:సహజ వనరులను వాటి పరిమాణాన్ని బట్టి, నూర్పుచెందే గుణాలను బట్టి, వాటిని తిరిగి వాడుకొనే విధానాన్ని బట్టి విభజించవచ్చు. కాని సాధారణంగా రెండు రకాలుగా విభజించి పరిశీలించడం సౌకర్యంగా ఉంటుంది.
AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి 2

1) పునరావృతం అయ్యే వనరులు:ఎలాంటి తరుగుదల లేకుండా ఎన్నిసార్లు ఉపయోగించుకున్నా క్షీణించని వనరులను పునరావృతమయ్యే వనరులు అంటారు. అవి తరిగిపోవు. స్వల్పకాలంలోనే ఆ వనరులు తమంతట తామే పునరుత్పత్తి చేసుకొనే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వాటి నిల్వలు స్థిరంగా ఉండక పెరుగుతూ, తరుగుతూ ఉంటాయి. వీటినే “సాంప్రదాయేతర వనరులు” అని కూడా అంటారు. ఉదాహరణకు గాలి, సౌరశక్తి, సముద్రపు అలలు, భూగర్భ ఉష్ణవనరులు (Geo-Thermal) మొదలగునవి.

2) పునరావృతం కాని వనరులు:వాడుకొంటూ పోతే తరిగిపోయేటటువంటి సహజ వనరులను ‘పునరావృతం కాని వనరులు అంటారు. వీటిని సాంప్రదాయ వనరులు అంటారు. ఈ వనరులను మనం పునరుత్పత్తి చేయలేము. ఒక్కసారి ఈ వనరులు తరిగిపోతే, అవి వాడుకోవడానికి అందుబాటులో ఉండవు. ఇటువంటి వనరులను ఎంతగా వినియోగిస్తూపోతామో, రాబోయే తరాల వారికి ఇది అంత కొరతగా మారిపోతుంది.
ఉదాహరణకు బంగారం, వెండి, రాగి, శిలాజ ఇంధనాలు, నూనెలు మొదలైనవి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

ప్రశ్న 4.
కాలుష్యం అంటే ఏమిటి ? కాలుష్యాన్ని ఎన్ని తరగతులుగా విభజించవచ్చో వ్రాయండి.
జవాబు:
పర్యావరణానికున్న స్వాభావిక లక్షణాలల్లో భౌతికంగా, రసాయనికంగా లేదా జీవపరమైన అవాంఛనీయ పరిణామాలు కలిగితే దాన్ని కాలుష్యం అంటారు. కాలుష్యం వల్ల ఘన, ద్రవ, వాయు పదార్థాల్లో స్వచ్ఛత తగ్గిపోయి ఉపయోగించుకోవడానికి పనికిరాకుండా పోతాయి. పర్యావరణంలోని కాలుష్యం వివిధ రకాలుగా ఉంటుంది. వాటిలో వాయు, జల, నేల, శబ్ద, ఘన వ్యర్థ పదార్థాల, ఉష్ణ కాలుష్యాలు ప్రధానమైనవి. ఇతర కాలుష్యకారకాలు ధర్మల్ కాలుష్యం, రేడియో ఆక్టివ్ కాలుష్యం మొదలగునవి.

1) వాయు కాలుష్యం:గాలిలో ఇతర కాలుష్య కారక పదార్థాల గాఢత ఎక్కువైపోయి మానవుని శ్రేయస్సును, జీవకోటికి మరియు వివిధ రూపాలలో ఉన్న ఆస్తులపై ప్రతికూల ప్రభావం చూపడాన్ని వాయు లేక గాలి కాలుష్యం అంటారు. వాయు కాలుష్యం సహజమైన, మానవ నిర్మితమైన ఆధారాల వల్ల జరగుతూ ఉంటుంది. వంటచెరకు కాల్చడం, పారిశ్రామీకరణ, న్యూక్లియర్ పరీక్షలు, అడవులు నరికి వేయడం మొదలగునవి గాలి కాలుష్యానికి ముఖ్యకారణాలు.

2) నీటి కాలుష్యం:కొన్ని పదార్థాలుగాని, కారకాలుగాని నీటిలో ఎక్కువగా చేరిపోయి నీటి యొక్క స్వచ్ఛతను తగ్గించివేసి దానిని ఆరోగ్యానికి హానికరంగాను, వాడుకోవడానికి కూడా పనికి రాకుండా మార్చివేస్తాయి. దానినే నీటి కాలుష్యంగా చెప్పవచ్చు. గృహాల్లోని వ్యర్థాలు, మానవ వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాలు, మొదలైనవి నీటి కాలుష్యంకు
కారణాలు.

3) నేల కాలుష్యం:నేల నాణ్యత కొన్ని ప్రతికూల మార్పులకు గురి అయి అందులోని సహజ మూలకాల కూర్పు తారుమారు కావడం ద్వారా భూమి ఉత్పాదకత తగ్గడమే నేల కాలుష్యం. రసాయనిక ఎరువుల వాడకం, ఆమ్లాలు, క్షారాలు భూమిలోనికి చొచ్చుకొనిపోవడం, మొదలైనవి నేలకాలుష్యానికి కారకాలు.

4) శబ్ద కాలుష్యం:ఏ ధ్వనులైతే 125 డెసిబెల్స్ పీడనం కంటే ఎక్కువగా ఉండి పర్యావరణంలో హానికరమైన ప్రభావాలను ఉత్పన్నం చేసి, మానవుల ఆరోగ్యానికి ప్రమాదకరంగా పరిణమిస్తాయో వాటిని ‘ధ్వని కాలుష్యం’ అంటారు. గృహోపకరణాల వాడకం, లౌడ్ స్పీకర్ల వాడకం, థర్మల్ పవర్ ప్లాంటు, గనుల త్రవ్వకం మొదలగునవి కారకాలు.

5) ఘన వ్యర్థ పదార్థాల కాలుష్యం:ఘన వ్యర్థ పదార్థాల్లో గృహ సంబంధింత వ్యర్థాలు, జంతువుల మృతకళేబరాలు, పరిశ్రమలు, వ్యవసాయ సంబంధిత వ్యర్థాలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, వైద్య సంబంధ వ్యర్థాలు ఉంటాయి. ప్లాస్టిక్ ఘన వ్యర్థ పదార్థాల కంటే ఎలక్ట్రానిక్ వ్యర్థ పదార్థాలు చాలా ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి.

6) ఉష్ణ కాలుష్యం:సమీపంలో ఉన్న కాలువలు, సరస్సులు, చెరువులు, నదుల్లోకి వేడి నీటిని విడుదల చేసిన ఫలితంగా వచ్చే కాలుష్యాన్ని ఉష్ణ కాలుష్యంగా చెప్పవచ్చు. న్యూక్లియర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, శుద్ధి కర్మాగారాలు, కాగితం పరిశ్రమలు, సిమెంట్ పరిశ్రమలు మొదలగునవి ఉష్ణ కాలుష్యానికి కారణమవుతున్నాయి.

ప్రశ్న 5.
‘సుస్థిరత్వం’ అంటే అర్థం ఏమిటి ? సుస్థిరమైన అభివృద్ధిలోని అనుఘటకాలను గురించి వివరించండి.
జవాబు:
సుస్థిరత్వం భాగాలు:“సుస్థిరమైన అభివృద్ధి” అన్న భావనలో మూడు ముఖ్యమైన భాగాలుంటాయి. అవి ఆర్థిక, సాంఘిక, పర్యావరణమనే మూడు భాగాలు. ఇవన్నీ ఒక దానితో ఒకటి సంబంధం కలిగిన స్వతంత్రమైన అనుఘటకాలు. సుస్థిరమైన అభివృద్ధిని సాధించాలంటే ఈ మూడు అనుఘటకాల మధ్య సమతూకాన్ని సాధించవలసి వుంటుంది. ఇలాంటి సమతూకాన్ని సాధించడం ఎలాగో పటంలో చూపడం జరిగింది.
AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి 3

ఆర్థిక సంబంధమైన అంశాలు:మానవ నిర్మితమైన మూలధనం, మానవ మూలధనం, సహజ మూలధనం వంటి మౌలికమైన విలువలను సమాజాలు రక్షించుకుంటూ, అభిలషనీయ పరిమాణంలో ఆదాయ ప్రవాహాన్ని పెంపొందిచుకోవలసి వుంటుందని ఆర్ధికభావనలో కొనసాగించగలిగే అభివృద్ధి తెలియజేస్తుంది.

సామాజిక సంబంధమైన అంశాలు:సామాజిక పరమైన సుస్థిరత న్యాయం, సమానత్వం అనే రెండు సూత్రాలపై నిర్మితమైంది. అభివృద్ధిపథం కొనసాగాలంటే సంపద, వనరులు అవకాశాలు సమానంగా పంపిణీ జరగాలి. పౌరులందరికీ ! కనీస ప్రమాణంలో భద్రత, మానవ హక్కులు, సామాజిక ప్రయోజనాలైన ఆహారం, ఆరోగ్యం, విద్య, స్వయం అభివృద్ధికి అవకాశాలు చేకు చాలి.

పర్యావరణ సంబంధమైన అంశాలు:పర్యావరణ భావనలో కొనసాగించగలగడం అనేది వనరులను సుస్థిరంగా ఉపయోగించడం, సమర్థవంతంగా వృథాలను ఇముడ్చుకునే విధిని నిర్వర్తించడం, సహజ మూలధనాన్ని రక్షించుకోవడం, ఈ మూడు విధులను సమర్ధవంతంగా అంతరాయం లేకుండా నిర్వహించగలిగితే జీవావరణ వ్యవస్థలో స్థిరత్వం సాధించవచ్చు.

ప్రశ్న 6.
మానవ ఆరోగ్యంపై కాలుష్య ప్రభావాన్ని చర్చించండి.
జవాబు:
1) మానవ ఆరోగ్యంపై ప్రభావాలు:పర్యావరణ క్షీణత, మానవ ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నందున, శ్రామికులు తమ పనులకు హాజరు కాలేకపోతున్నారు. అనారోగ్య కారణాలు, శ్రామికుల సామర్థ్యాన్ని తగ్గించగా, అది అల్ప ఉత్పాదకతకు దారి తీస్తుంది.

ఎ) వాయు కాలుష్యం (Air Pollution):వాయు కాలుష్యకారకాలైన కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, హైడ్రోకార్బన్లు, కణరూపద్రవ్యం మొదలైనవి శ్వాసకోశం ద్వారా మానవ శరీరంలోకి నేరుగా ప్రవేశించి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఉబ్బసం (Bronchitis), ఊపిరితిత్తుల క్యాన్సర్, కళ్ళకి, చర్యానికి చిరాకును కలిగించే బాధపెట్టే అలర్జీ (Eye Irritation, Skin Irritation) మొదలైన వ్యాధులకు వాయు కాలుష్యమే కారణం.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

బి) నీటి కాలుష్యం (Water Pollution):వ్యాధులను వ్యాపింపచేసే (transmission) సాధనాలలో అతి ముఖ్యమైనది నీరు, వివిధ వ్యాధులను కలిగించే వైరస్, బాక్టీరియా, ప్రోటోజోవాలాంటి సూక్ష్మక్రిములు, నీటి ద్వారానే వ్యాపిస్తాయి. ఈ సూక్ష్మక్రిముల వల్ల విరోచనాలు, టైఫాయిడ్, కలరా, కామెర్లు వంటి వ్యాధులు సంక్రమిస్తాయి. –

సి) ధ్వని కాలుష్యం (Sound Pollution):ధ్వని కాలుష్యం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. పెద్ద శబ్దాలు నిద్రాభంగాన్ని కలిగించి, ఆరోగ్యం మీద ప్రభావాలను కలిగిస్తాయి. ధ్వని కాలుష్యం వల్ల వినికిడి దెబ్బతినడం, పనిపాటల్లో, సంభాషణలో అంతరాయాన్ని, ఏకాంతానికి భంగం, నిద్రాభంగాన్ని బాధను లేదా చిరాకును కలిగిస్తుంది. అలాగే ఏకాగ్రతకు భంగం కలిగించడం, రక్తపోటు, గుండె వేగం పెరగడంలను కలుగచేస్తుంది.

ప్రశ్న 7.
అడవుల పరిరక్షణకు కావలసిన జాగ్రత్తలు. [Mar ’17]
జవాబు:
అడవులను ‘కర్బన శోషణాగారాలని’ (carbon sinks), ‘ప్రకృతి సౌందర్యాల ఖజానాలని’ అంటారు. వాటికున్న ప్రాధాన్యాన్ని గమనించి, వాటిని సంరక్షించుకోవడం అత్యంత ఆవశ్యకం, అడవులను క్రింది చర్యల ద్వారా సంరక్షించుకోవచ్చు.

  1. పేదల ఇళ్ళు కట్టుకోవడానికిగాను అటవీ భూములను కేటాయించడం మానుకోవాలి.
  2. సామాజిక అటవీ కార్యక్రమాల క్రింద కొన్ని ప్రత్యేక ప్రాంతాలను అభివృద్ధి చేయాలి.
  3. వృథాగా ఉన్న భూముల్లో మొక్కలు నాటడం జరగాలి.
  4. అడవులు మంటలపాలు కాకుండా (ముఖ్యంగా వేసవి కాలంలో) సంరక్షించుకోవాలి.
  5. అడవులు తరిగిపోయిన ప్రదేశాలను గుర్తించి, ఆ ప్రాంతాల్లో చెట్లను నాటి తరిగిపోయిన అడవిని చేయాలి.
  6. సంయుక్త అటవీ యాజమాన్య, సంఘాలను స్థాపించడం చాలా అవసరం.
  7. పశువులను మేపడం, చట్టవిరుద్ధంగా చెట్లను నరికివేయడం మొదలైనవి అనుమతించకూడదు.
  8. అటవీ సంరక్షణ చర్యల్లో స్థానిక ప్రజలను కలుపుకొని, వారిని భాగస్వామ్యులను చేయాలి.

ప్రశ్న 8.
పర్యావరణాన్ని పరిరక్షించవలసిన ఆవశ్యకత.
జవాబు:
పర్యావరణం అనేది ఉమ్మడి ఆస్తి. పర్యావరణాన్ని మానవులు, జంతువులు, మొక్కలు మరియు చెట్లు, పక్షులు, చేపలు ఇలా ప్రపంచంలోని అన్ని జీవరాశులు ఉపయోగించుకుంటున్నాయి, అనుభవిస్తున్నాయి. ప్రత్యేకంగా మానవులు తమ అత్యాశతో ఈ ఉమ్మడి వనరులను అధికంగా ఉపయోగిస్తున్నారు. తత్ఫలితంగా, పర్యావరణం బలహీనమై, తన సహజ విధులను కూడా నిర్వహించలేకపోతుంది.

కావున దాదాపు ఆర్థికవేత్తలందరూ, ఆర్థికాభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. కానీ మనం వారి హెచ్చరికలను ప్రక్కకు పెడుతూ, పర్యావరణం దోపిడీని కొనసాగిస్తూనే ఉన్నాము. పర్యావరణాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఎందుకంటే

  1. ప్రస్తుత తరానికి మరియు రాబోయే తరాల అవసరాలు తీరేందుకు.
  2. సమాన పంపిణీ జరుగుటకు (పర్యావరణ మరియు ఆర్థిక కార్యకలాపాలు).
  3. మానవ, భౌతిక మరియు సహజ మూలధనాలను కాపాడుటకు.
  4. జీవ వైవిధ్యాన్ని మరియు దాని అంతర్భాగాలైన, జంతు, వృక్ష జాతుల నాశనాన్ని నిరోధించుటకు.
  5. సున్నితమైన జీవవ్యవస్థలు మరింత క్షీణించకుండా నిరోధించుటకు పర్యావరణ పరిరక్షణకు భారత ప్రభుత్వం, ఎన్నో న్యాయబద్ధమైన, చట్టబద్ధమైన మరియు పరిపాలనా సంబంధ ప్రయత్నాలు చేస్తోంది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పర్యావరణం.
జవాబు:
పర్యావరణం “Environment” అనే ఆంగ్ల పదము ప్రాచీన ఫ్రెంచి పదము “Environ” నుండి రూపొందించబడింది. ఎన్విరాన్ అంటే ‘చుట్టూ ఉన్న’ జీవరాశిని ప్రభావితం చేస్తూ ఉన్న సజీవ, భౌతిక మూల పదార్థాల కలయికనే పర్యావరణం అంటారు. దీనిలో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ మరియు మేధోపరమైన
అంశాలు ఉంటాయి.

వాతావరణం:భూమి మొత్తాన్ని అవరించిన ఉన్న వాయువుల సమూహం. దీనిలో నాలుగు పొరలు ఉంటాయి.

  1. ట్రోపోస్పియర్,
  2. స్ట్రాటో స్పియర్,
  3. ఐనోస్పియర్,
  4. ధర్మోస్పియర్

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

ప్రశ్న 2.
ఆవరణ వ్యవస్థ. [Mar ’16]
జవాబు:
అవరణ వ్యవస్థ అనే పదాన్ని 1935 సంవత్సరములో ‘విట్రాన్ల’ ప్రతిపాదించాడు. ఒక నిర్ణీత భౌగోళిక ప్రదేశంలో ఉన్నటువంటి స్వాభావిక, భౌతికమైన పర్యావరణ కలయికను వాటి మధ్య జరిగే చర్య, ప్రతిచర్యలను కలిపి ”ఆవరణ వ్యవస్థ’ గా చెప్పవచ్చు. ఆవరణ వ్యవస్థ స్థూలంగా రెండు రకాలు 1. సహజ ఆవరణ వ్యవస్థ, 2. కృత్రిమ ఆవరణ వ్యవస్థ.

ప్రశ్న 3.
గ్రీన్ హౌస్ ప్రభావం. [Mar ’17]
జవాబు:
భూగ్రహంపై ఉన్న వాతావరణం కార్బన్ డై ఆక్సైడ్, నీటి ఆవిరి మరియు మీధైన్ వంటి కొన్ని రకాల వాయువులు ఎక్కువైన కారణంగా సూర్యుని నుండి విడుదల అయ్యే రేడియేషన్ని తమ ద్వారా లోపలికి రానిస్తాయి. కాని తిరిగి ఆ రేడియేటెడ్ ఉష్ణాన్ని అట్టిపెట్టుకొని భూ ఉపరితలం నుండి బయటకు పోనివ్వవు. దీనినే గ్రీన్ హౌస్ ప్రభావం అంటారు.

ప్రశ్న 4.
గాలి కాలుష్యం.
జవాబు:
గాలిలో ఇతర కాలుష్యకారక పదార్థాల గాఢత ఎక్కువైపోయి, మానవుని శ్రేయస్సును, జీవకోటికి మరియు వివిధ రూపాలలో ఉన్న ఆస్తులపై ప్రతికూల ప్రభావం చూపడాన్ని వాయు లేక గాలి కాలుష్యం అంటారు. ఇవి సహజమైన, మానవ నిర్మితమైన ఆధారాల వల్ల జరుగుతుంది. వంటచెరకు కాల్చడం, పారిశ్రామికీకరణ, పంటల సాగు, అడవులు నరికివేయడం మొదలగునవి వాయు కాలుష్యానికి ముఖ్య కారణాలు.

ప్రశ్న 5.
నీటి కాలుష్యం. [Mar ’17]
జవాబు:
కొన్ని పదార్థాలు గాని, కారకాలు గాని నీటిలో ఎక్కువగా చేరిపోయి నీటి యొక్క స్వచ్ఛతను తగ్గించి వేసి దానిని అరోగ్యానికి హానికరంగానూ, వాడుకోవడానికి కూడా పనికి రాకుండా మార్చి వేస్తాయి. దానినే నీటి కాలుష్యం అంటారు. |గృహాల్లోని వ్యర్థాలు, మానవ వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాలు మొదలైనవి నీరు కలుషితంకు కారణాలు.

ప్రశ్న 6.
ఓజోన్ పొర. [Mar ’17, ’16]
జవాబు:
సూర్యుని రేడియేషన్ వల్ల వచ్చే అతినీలలోహిత కిరణాలను అడ్డుకొని భూమి మీద మానవుని జీవనానికి అవసరమైన శక్తిని ప్రసాదించే రక్షక కవచాన్ని ఓజోన్ పొర అంటారు. క్లోరోఫ్లోరోకార్బన్స్, హాలోజన్స్ అణువులు స్టోటోస్పియర్ను చేరి ఓజోన్ ను నాశనం చేస్తాయి.

ప్రశ్న 7.
భూగోళం వేడెక్కడం (Global Warming).
జవాబు:
హరితగృహ వాయువులైన CO2, మొదలైన వాటి వల్ల భూఉపరితల ఉష్ణోగ్రత రోజురోజుకి పెరుగుతూ ఉంది.. CO2 ముఖ్యంగా శిలాజ ఇంధనాలు మండించుట ద్వారా, అడవుల నరికివేత వల్ల ఎక్కువగా వెలువడుతుంది. దీని ప్రభావంతో ఉష్ణం గ్రహింపబడి, తిరిగి భూమి నుండి పరావర్తనం చెందకుండా భూమిపైన ఉండిపోతుంది. దీనిని భూమి వేడెక్కుట అంటారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

ప్రశ్న 8.
సుస్థిరమైన అభివృద్ధి.
జవాబు:
సుస్థిరమైన అభివృద్ధి అనగా మనం వారసత్వంగా పొందిన నాణ్యమైన జీవనాన్ని, ఆస్తులను ఏ మాత్రం తగ్గకుండా భవిష్యత్ తరాల వారికి అందించుట. సుస్థిరమైన అభివృద్ధిలో మూడు ముఖ్యమైన అనుఘటకాలున్నాయి. అవి ఆర్థిక, సాంఘిక, పర్యావరణం అనేవి.

ప్రశ్న 9.
వ్యయ – ప్రయోజన విశ్లేషణ.
జవాబు:
పర్యావరణ వ్యయ ప్రయోజనాలు అంచనా వేయడంలో ఒక ప్రాజెక్టు యొక్క మూలధన మూల్యాంకనము మరియు తులనాత్మకత జరగాలి. ప్రతి ఆర్థిక కార్యకలాపం ప్రయోజనాలను, నష్టాలను కల్గి ఉంటుంది. ఏదైనా ప్రాజెక్టును మూల్యాంకనం చేసేటప్పుడు ఆర్థిక ప్రయోజనలతో పాటు పర్యావరణ నష్టాలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి.

ప్రశ్న 10.
అటవి నాశనానికి గల కారణాలు.
జవాబు:
అడవులు ఎన్నో కారణాల వల్ల తొలగించబడుతున్నాయి. అందులో ముఖ్యమైనవి జనాభా పెరుగుదల, పేదరికం, నిరుద్యోగం, భూమి డిమాండ్ పెరగటం (ఇల్లు, వ్యవసాయం, కలపకోసం) పశువులను ఎక్కువగా మేపడం వల్ల అడవులపై ఒత్తిడి పెరుగుతుంది. ఆనకట్టల నిర్మాణం, రోడ్లు, రైల్వేల నిర్మాణం అడవుల నరికివేతకు అతి ముఖ్య కారణాలు. అడవులలో మంటలు వ్యాపించుట, పోడు వ్యవసాయం మొదలగునవి ఇతర కారణాలు.

ప్రశ్న 11.
జీవవైవిధ్యం. [Mar ’17, ’16]
జవాబు:
‘జీవవైవిధ్యం’ అనే పదాన్ని 1986 సంవత్సరంలో అమెరికా శాస్త్రవేత్త వాల్టర్ రోసెన్ మొదటిసారిగా ప్రతిపాదించాడు. జీవవైవిధ్యం ప్రత్యక్షంగాను, పరోక్షంగాను అనేక ప్రయోజనాలను కల్పిస్తుంది. జన్యుపరమైన తేడాలు, జాతులలోని వైవిధ్యం ఆవరణ వ్యవస్థలోని విచ్ఛిన్న గుణాలను అన్నింటిని కలిపి జీవవైవిధ్యం అంటారు.

ప్రశ్న 12.
ధ్వని అంటే ఏమిటి ?
జవాబు:
నియమానుసారంగా, చెవులకు ఇంపైన తియ్యనైన, వినడానికి సౌకర్యంగా ఉండే శబ్దాన్ని ‘ధ్వని’ అని అంటారు. శబ్దము, ధ్వని అని రెండు పదాలలో ఒకే అర్థంలో వాడుతున్నా శబ్దం వేరు, ధ్వని వేరు. శబ్దాలన్ని ధ్వనులు కావు. గాఢమైన, తీవ్రమైన, గట్టిదైన శబ్దాన్నే ‘ధ్వని’ అంటారు. 50 నుండి 90 డెసిబెల్స్ మధ్య గల శబ్దాన్ని ‘ధ్వని’ అంటారు. 120 డెసిబెల్స్ స్థాయిని కలిగిన ధ్వని పీడనాన్ని మానవులు సురక్షితంగా వినగలుగుతారు.

ప్రశ్న 13.
భూమి విచ్ఛేదనం.
జవాబు:
ఎప్పుడైతే భూమి భౌతికస్థితి, స్వచ్ఛత, ఉత్పాదక శక్తిలో మార్పులు సంభవిస్తాయో అప్పుడు భూమి విచ్ఛేదనానికి గురైందని చెప్పవచ్చును. అడవులు అంతరించిపోవటం, పశువులు ఎక్కువగా మేయటం పంటలను సాగుచేయటం, పారిశ్రామికీకరణ, గాలి వికోషీకరణ, నీటి వల్ల వికోషీకరణం, నీరు ఎక్కువగా నిలబడిపోవడం, భూమి క్షారవంతమైపోవడం జనాభా వత్తిడి వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తిని ఎక్కువ చేయడం మొదలైనవి భూమి విచ్ఛేదనానికి కారణమయ్యే కాలుష్య జనకాలు. భూమి ఇలా విచ్ఛేదనకు గురైతే భూమి ఉత్పాదకశక్తి, స్వచ్ఛత క్షీణించిపోతుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

ప్రశ్న 14.
పర్యావరణ బహిర్గతాలు.
జవాబు:
ఒక ఆర్థిక కార్యకలాపం వల్ల ఏ మాత్రం సంబంధం లేని మూడవ వర్గం ప్రభావితం కావడాన్ని బహిర్గతాలు అంటారు. ఇటువంటి బహిర్గతాలు అనుకూలం గాని ప్రతికూలంగా కాని ఉండవచ్చు. ఉదా:ఒక ఫ్యాక్టరీ నుండి వెలువడే కాలుష్యం పరిసర పర్యావరణాన్ని దగ్గరలోని నివాసమున్న ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీయడం ప్రతికూల బహిర్గతంగా చెప్పవచ్చు. బాగా విద్యావంతులైన ప్రజలు ఉన్న ప్రాంతంలో ఫ్యాక్టరీని మొదలు పెట్టినపుడు ఉత్పాదకత పెరగడం అనుకూల బహిర్గత.

ప్రశ్న 15.
స్వచ్ఛ భారత్ అభియాన్.
జవాబు:
భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడి 2014 అక్టోబరులో 2న స్వచ్చ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ఇందుకోసం ఒక బహిరంగ వెబ్సైట్ను మొదలు పెట్టారు. ఈ కార్యక్రమం లక్ష్యం వచ్చే 5 సంవత్సరాలలో భారత్న పరిశుభ్ర దేశంగా మార్చడమే తద్వారా గాంధీజీ 150వ జన్మదినోత్సవాన్ని పరిశుభ్ర భారతదేశంలో ఘనంగా జరుపుకోవడం. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం సక్రమంగా అమలు చేయగలిగితే అనేక పర్యావరణ సమస్యలను పరిష్కరించగలదు.