AP Inter 2nd Year Civics Study Material Chapter 2 ప్రాథమిక హక్కులు – ఆదేశక సూత్రాలు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 2nd Lesson ప్రాథమిక హక్కులు – ఆదేశక సూత్రాలు Textbook Questions and Answers.

AP Inter 2nd Year Civics Study Material 2nd Lesson ప్రాథమిక హక్కులు – ఆదేశక సూత్రాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రాథమిక హక్కుల రకాలను వివరింపుము.
జవాబు:
భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి. 12వ అధికరణం నుండి 35వ అధికరణం వరకు గల అంశాలు ప్రాథమిక హక్కులను వివరిస్తాయి. ప్రాథమిక హక్కులు ప్రజల స్వేచ్ఛకు, సర్వతోముఖ వికాసానికి అవసరం. ఇవి ప్రజాస్వామ్యాన్ని సార్ధకం చేస్తాయి. ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులున్నాయి. వీటిని కోర్టు ద్వారా రక్షించుకోవచ్చు.

వీటిని గురించి విపులంగా చర్చిద్దాం
1) సమానత్వపు హక్కు (14 నుండి 18 వరకు గల ప్రకరణలు): ప్రాథమిక హక్కులలో సమానత్వపు హక్కు భారత పౌరులందరికి ‘చట్ట సమానత్వాన్ని కల్పించింది. రాజ్యాంగంలోని 14వ ప్రకరణ భారతదేశంలో నివసించే వ్యక్తులందరికి చట్టం ముందు సమానత్వాన్ని, చట్టం ద్వారా సమానమైన రక్షణ, సదుపాయాలను కల్పించింది.
పౌరుల మధ్య మతం, తెగ, కులం, లింగ, జన్మస్థల సంబంధమైన వివక్షతలను రాజ్యం పాటించరాదని 15వ ప్రకరణ స్పష్టం చేసింది. అలాగే బహిరంగ ప్రదేశాలు సందర్శించే విషయంలో పౌరుల మధ్య ఎలాంటి వివక్షత చూపించకూడదని పేర్కొంది.

16వ ప్రకరణ ప్రకారం రాజ్యానికి సంబంధించిన ఏ ఉద్యోగం లేదా నియామకానికైనా పౌరలందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. ఉద్యోగపరమైన విషయాలలో మతం, తెగ, కులం, లింగం, పుట్టుక వంటి అంశాలేవి ప్రధానమైనవి కావని ఆ ప్రకరణ పేర్కొంది.

17వ ప్రకరణ అస్పృశ్యత లేదా అంటరానితనం పాటించడాన్ని నేరంగా పేర్కొంది. ఈ విషయంలో 1955లో పార్లమెంటు అస్పృశ్యత నివారణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టాన్ని 1976 నుంచి పౌరహక్కుల పరిరక్షణ చట్టంగా వ్యవహరించడమైంది.

18వ ప్రకరణ ప్రకారం పౌరలకు సైనిక లేదా విద్యా విషయం బిరుదులు మినహా ఇతర బిరుదులను రాజ్యం ప్రసాదించకూడదు. భారత రాష్ట్రపతి అనుమతి లేకుండా విదేశాలు ప్రకటించే బిరుదులను పౌరులు స్వీకరించరాదు.

2) స్వేచ్ఛా హక్కు (19 నుండి 22 వరకు గల ప్రకరణలు): 19వ రాజ్యాంగ ప్రకరణ భారత పౌరులకు 7 రకాల స్వాతంత్ర్యాలను ప్రసాదించింది. అవి

  1. వాక్ స్వాతంత్య్రం, భావప్రకటనా స్వాతంత్య్రం.
  2. శాంతియుతంగా సమావేశమయ్యే స్వాతంత్య్రం.
  3. సంఘాలు, యూనియన్లు ఏర్పాటు చేసుకొనే స్వాతంత్య్రం.
  4. దేశమంతటా స్వేచ్ఛగా సంచరించే స్వాతంత్య్రం.
  5. దేశంలో ఎక్కడైనా నివసించడానికి, స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి స్వాతంత్ర్యం.
  6. ఆస్తిని సంపాదించుకొనుటకు, ఆర్జించుటకు, దానధర్మాలు, విక్రయాలు చేసుకొనే స్వాతంత్య్రం.
  7. ఏ వృతినైనా, వ్యాపారాన్నైనా చేసుకొనే స్వాతంత్య్రం.

20వ ప్రకరణ వ్యక్తులు నేరాలకు పాల్పడిన సందర్భాలలో శిక్ష విధించే విషయంలో రక్షణలను పేర్కొంది. ఈ ప్రకరణ అమలులో ఉన్న చట్టాన్ని అతిక్రమించనిదే ఏ వ్యక్తిని దోషిగా పరిగణించకూడదని పేర్కొంటుంది.

21వ అధికరణం ఏ ఒక్క వ్యక్తిని చట్టం పేర్కొన్న పద్ధతి ప్రకారం తప్ప మరో విధంగా అతని జీవనానికి, వ్యక్తి స్వాతంత్ర్యానికి భంగం కల్గించరాదని స్పష్టం చేసింది. ఈ ప్రకరణలను అత్యవసర పరిస్థితుల కాలంలో కూడా రద్దుచేయరు.

22వ ప్రకరణ ప్రకారం ఏ ఒక్క వ్యక్తిని కారణం లేకుండా నిర్భంధంలోకి తీసుకోకూడదు. నిర్భంధంలోకి తీసుకున్న వ్యక్తికి అందుకు కారణాలు తెలపటంతోపాటు న్యాయ సహాయం పొందటానికి వీలు కల్పించాలి. ఉదా: నిర్భంధంలోకి తీసుకున్న వ్యక్తిని 24 గం||లలోగా సమీప న్యాయమూర్తి ఎదుట హాజరుపరచాలి.

3) పీడనను నిరోధించే హక్కు (23 మరియు 24 ప్రకరణలు): 23వ ప్రకరణ ప్రకారం రాజ్యంగాని, సంపన్న వర్గాలు కాని వ్యక్తులను దోపిడీకి గురిచేయకూడదు. మనషుల క్రయ విక్రయాలు జరపటం, ప్రతిఫలం చెల్లించకుండా బలవంతంగా వెట్టిచాకిరీ చేయించుకోవటం నిషేధం.

24వ ప్రకరణ ప్రకారం 14 సంవత్సరాలలోపు పిల్లలను కర్మాగారాలు, గనులు వంటి ప్రమాదకరమైన, ఆరోగ్యానికి హాని కల్గించే పనులలో నియమించకూడదు. బాల కార్మికత్వం చేయించుకొనుట చట్టవిరుద్ధం.

4) మత స్వాతంత్ర్యపు హక్కు (25 నుండి 28 ప్రకరణలు): 25వ ప్రకరణ ప్రకారం ప్రతి వ్యక్తి ప్రజా భద్రత, నైతికతకు లోబడి తన అంతరాత్మకు అనుగుణమైన మతాన్ని అవలంబించటానికి, ప్రచారం చేసుకొనటానికి హక్కుంది. 26వ ప్రకరణ ప్రతి వ్యక్తికి ఈ క్రింది హక్కులను ప్రసాదించింది.

  1. మతపరమైన ధార్మిక సంస్థలను ఏర్పాటు చేసుకోవడానికి
  2. స్వీయ మత వ్యవహారాలను నిర్వహించుకోవడానికి
  3. స్థిర, చరాస్థులపై యాజమాన్య హక్కు పొందడానికి, వాటిని కొనుగోలు చేయడానికి
  4. చట్టప్రకారం ఆస్తిపాస్తులను నిర్వహించుకోవడానికి

27వ ప్రకరణ మతం ఆధారంగా రాజ్యం ఏ వ్యక్తిపై, ఏ విధమైన పన్ను విధించడానికి, వసూలు చేయడానికి వీలులేదని పేర్కొంది. ఏదో ఒక మత ప్రయోజనాలకై రాజ్యం వ్యక్తుల నుంచి పన్నుల రూపంలో ఎలాంటి మొత్తాలను వసూలు చేయకూడదని నిర్దేశించింది.

28వ ప్రకరణ రాజ్యం నుంచి సంపూర్ణంగానో, పాక్షికంగానో ఆర్థిక సహాయాన్ని పొందే విద్యాసంస్థలలో మతపరమైన బోధనలు విషేధించడమైంది.

5) సాంస్కృతిక మరియు విద్యా హక్కు (29 మరియు 30 ప్రకరణలు): భారతపౌరులకు సాంస్కృతిక, విద్యాపరమైన అవకాశాలను రాజ్యాంగము ఈ హక్కుల ద్వారా ప్రసాదించింది. 29వ ప్రకరణ ప్రకారం ప్రతి పౌరుడూ స్వంతభాష, సంస్కృతులను పరిరక్షించుకోవచ్చు. ఈ విషయంలో మత, భాష, ప్రాంతీయ అంశాలేవీ ఆటంకంగా ఉండవు. అల్పసంఖ్యాకులు వారి భాష, సంస్కృతులను పరిరక్షించుకోవచ్చని ఈ హక్కు పేర్కొంది.

30వ ప్రకరణం ప్రకారం ప్రభుత్వం నుంచి సంపూర్ణంగా గానీ, పాక్షికంగాగానీ ఆర్థిక సహాయం పొందే విద్యార్థులలో కులం, నుతం, ప్రాంతం, వర్ణం, భాష లేదా లింగపరమైన అంశాల ప్రాతిపదికపై పౌరులకు ప్రవేశాన్ని నిరాకరించకూడదు.

6) రాజ్యాంగ పరిహారపు హక్కు (32వ ప్రకరణ): ఈ హక్కు ప్రాథమిక హక్కులన్నింటిలోకి అత్యంత ప్రధానమైంది. ఈ హక్కును ప్రాథమిక హక్కులకు రక్షణ వలయంగాను, కంచెగాను, భద్రతా కవచంగాను పరిగణించటమైంది. 32వ ప్రకరణ ప్రకారం భారత పౌరల ప్రాథమిక హక్కుల పునరుద్ధరణకు, రక్షణకు సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టులు హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్షియరీ, కోవారంటో మొ॥ రిట్లను జారీచేసే అధికారాన్ని కల్గి ఉన్నాయి.

ప్రశ్న 2.
భారత రాజ్యాంగంలో పొందుపరచిన వివిధ రకాల ఆదేశక సూత్రాలను వివరింపుము. [Mar. ’17]
జవాబు:
భారత రాజ్యాంగంలోని 4వ భాగం ఆదేశక సూత్రాలకు సంబంధించినది. రాజ్యాంగంలోని 36వ అధికరణం నుండి 51వ అధికరణం వరకు అదేశక సూత్రాలకు సంబంధించినవి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం ఇచ్చిన ఆదేశాలే ఈ సూత్రాలు. ఇవి ప్రభుత్వానికి ప్రజలపట్ల గల బాధ్యతలను వివరిస్తాయి. ప్రభుత్వం తన విధానాలను రూపొందించుకునేటప్పుడు వీటికి అనుగుణంగా రూపొందించుకోవాలి. వీటిని ఐరిష్ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది.

ఆదేశక సూత్రాల వర్గీకరణ: మన రాజ్యాంగంలో అదేశక సూత్రాలను ప్రత్యేకంగా వర్గీకరణ లేనప్పటికి ప్రభుత్వ పాలనా శాస్త్రవేత్తలు పతనాసౌలభ్యం కొరకు ఆదేశ సూత్రాలను మూడు రకాలుగా వర్గీకరించారు. అవి: 1. సామ్యవాద సూత్రాలు, 2. ఉదారవాద సూత్రాలు, 3. గాంధేయ సూత్రాలు. వీటిని గురించి క్రింది విధంగా వివరించవచ్చును.

1. సామ్యవాద సూత్రాలు: ఈ సూత్రాలు సామ్యవాద, శ్రేయోరాజ్య సిద్ధాంత స్థాపన లక్ష్యంగా సామాజిక ఆర్థిక న్యాయాన్ని అందించే ఉద్దేశ్యంతో అదేశక సూత్రాల జాబితాలో చేర్చారు. రాజ్యాంగంలోని 38, 39, 41, 42, 43, 46, 47 ప్రకరణలు ఆదేశక సూత్రాలలోని సామ్యవాద ఆదర్శాల గురించి వివరించాయి.
1. 38వ ప్రకరణ ప్రకారం రాజ్యం ప్రజలందరికీ న్యాయంతో కూడిన సామాజిక వ్యవస్థను సాధించి పెంపొందించడానికి కృషి చేయాలి. రాజ్యంలో ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక న్యాయాలు దక్కేటట్లుగా చూడాలి.

2. 39వ ప్రకరణ ప్రకారం రాజ్యం క్రింద పేర్కొన్న చర్యలను అమలులో ఉంచడానికి కృషి చేయాలి.

  1. తగినంత జీవనోపాధి అవకాశాలను కల్పించడం.
  2. సమిష్టి సంక్షేమానికి దోహదపడే భౌతిక వనరులను సంపదను పంపిణీ చేయడం.
  3. స్త్రీ, పురుషులందరికీ సమాన వేతనాన్ని అందించడం.
  4. బాలకార్మికుల రక్షణ.
  5. జాతీయ సంపదను వికేంద్రీకరించడం.
  6. కార్మికుల ఆరోగ్యం, శక్తి దుర్వినియోగం కాకుండా చూడడం.
  7. బాలబాలికలను, యువకులను దోపిడీకి గురికాకుండా రక్షణ.

3. 41వ ప్రకరణ ప్రకారం నిరుద్యోగం, వృద్ధాప్యం, అస్వస్థత, అంగవైకల్యం వంటి ప్రమాదాల బారిన పడిన వారికి పనిహక్కు, విద్య, ప్రభుత్వ సహాయం అందే విధంగా చూడాలి.

4. 42వ ప్రకరణ ప్రకారం కార్మికులకు న్యాయబద్ధమైన మానవతా పరిస్థితులతో కూడిన పనిని కల్పించడం, స్త్రీలకు ప్రసూతి వైద్య సదుపాయాలను రాజ్యం కల్పించాలి.

5. 43వ ప్రకరణ ప్రకారం రాజ్యం వ్యవసాయ, పారిశ్రామిక కార్మికులందరికీ తగిన పనిని కల్పించడం. మంచి ప్రమాణంతో కూడిన జీవనాన్ని గడపడానికి అవసరమైన పరిస్థితులను, విరామాన్ని, సాంఘిక, సాంస్కృతిక అవకాశాలను కల్పించడానికి కృషిచేయాలి.

6. 47వ ప్రకరణ ప్రకారం ప్రజల పోషకాహార స్థాయిని, జీవన ప్రమాణాన్ని పెంపొందించడానికి, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కృషి చేయాలి.

2. ఉదారవాద సూత్రాలు: ప్రాథమిక విద్య, ఉమ్మడి పౌరస్మృతి, స్వతంత్ర న్యాయశాఖ, అంతర్జాతీయ శాంతి వంటి ఆశయాల సాధన కోసం ఉదారవాద సూత్రాలను చేర్చారు. వాటిని రాజ్యాంగంలోని 44, 45, 50, 51 ప్రకరణలలో పేర్కొనడమైంది.
1. 44వ ప్రకరణ ప్రకారం దేశంలో నివసించే పౌరులందరికీ వర్తించే విధంగా ఉమ్మడి పౌరస్మృతి (Common civil code) ని రాజ్యం రూపొందించాలి.

2. 45వ ప్రకరణ ప్రకారం 14సంవత్సరాలోపు పిల్లలందరికీ ఉచిత, నిర్భంద విద్యను అందించడానికి రాజ్యం ప్రయత్నించాలి. ఈ చర్యకు బదులుగా బాలబాలికలు 6సంవత్సరాల వయస్సు పూర్తయ్యే వరకు వారికి శిశుసంరక్షణ, విద్యలను సమకూర్చడానికి రాజ్యం చర్యలు తీసుకోవాలని రాజ్యాంగం (86వ రాజ్యాంగ సవరణ) చట్టం 2002 సూచించింది.

3. 48వ ప్రకరణ ప్రకారం వ్యవసాయం, పశుపోషణలను ఆధునిక, శాస్త్రీయ పద్ధతులలో నిర్వహించడానికి రాజ్యం చర్యలు తీసుకోవాలి.

4. 49వ ప్రకరణ ప్రకారం జాతీయ ప్రాధాన్యం ఉన్న కళాత్మకమైన లేదా చారిత్రక చిహ్నాలు, ప్రదేశాలు, వస్తువులను రాజ్యం సంరక్షించాలి.

5. 48ఎ ప్రకరణ అనుసరించి పర్యావరణాన్ని పరిరక్షించడానికి, అడవులు, వన్యప్రాణులను కాపాడటానికి రాజ్యం కృషిచేయాలి.

6. 50వ ప్రకరణ ప్రకారం ప్రజా సేవల విషయంలో కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరుచేయడానికి రాజ్యం చర్యలు తీసుకోవాలి.

7. 51వ ప్రకరణ ప్రకారం రాజ్యం (ఎ) అంతర్జాతీయ శాంతిని, న్యాయాన్ని, భద్రతను పెంపొందించడం, (బి) దేశాల మధ్య న్యాయపరమైన, గౌరవప్రదమైన, దౌత్య సంబంధాలను నిర్వహించడం, సి) చారిత్రక కట్టడాలను, సంస్కృతిని పరిరక్ష కల్పించటం, ఇ) అంతర్జాతీయ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రోత్సహించడం వంటి చర్యల అమలుకోసం కృషిచేయాలి.

3. గాంధేయ వాద సూత్రాలు: భారతదేశంలో ఆదర్శపాలనను అందించడానికి గాంధేయ సూత్రాలు దోహదపడతాయి. గాంధీజీ ప్రవచించిన ఆదర్శాలను ఆదేశక సూత్రాలలోని 40, 43, 46, 47, 48ఎ, 49 ప్రకరణలలో ప్రస్తావించడం జరిగింది. వాటిని ఈ క్రింది వివరింపబడినవి.

  1. 40వ ప్రకరణ ప్రకారం రాజ్యం పంచాయితీరాజ్ సంస్థలను నిర్వహించి, అవి స్వయంపాలన సంస్థలుగా ఏర్పడటానికి తగిన అధికారాలు ఇవ్వాలి.
  2. 43వ ప్రకరణ ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో వ్యక్తిగత లేదా సహకార ప్రాతిపదికపై కుటీర పరిశ్రమల స్థాపనకు రాజ్యం తోడ్పడాలి.
  3. 46వ ప్రకరణ ప్రకారం షెడ్యూల్డు కులాల, తరగతుల, బలహీన వర్గాల ప్రజల విద్యా, సామాజిక ప్రగతికి రాజ్యం ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
  4. 47వ ప్రకరణ ప్రకారం ఆరోగ్యానికి హాని కల్గించే మత్తుపానీయాలు, మాదక ద్రవ్యాల నిషేధానికి చర్యలు తీసుకోవాలి.

అదనపు సూత్రాలు: భారత రాజ్యాంగానికి 42 రాజ్యాంగ సవరణ చట్టం, 1976, 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978 ద్వారా ఈ క్రింది వాటిని ఆదేశ సూత్రాల జాబితాలో అదనపు సూత్రాలుగా చేర్చాయి. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 390, 430, 48ఎ ప్రకరణలను, 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 38వ ప్రకరణ క్లాజ్ 2ను ఆదేశ సూత్రాల జాబితాలో పేర్కొనడం జరిగింది. ఈ సవరణల వల్ల ఆదేశక సూత్రాల సంఖ్య ఘననీయంగా పెరిగింది. వీటిలో క్రింది అంశాలు ఉన్నాయి.

  1. పిల్లల ఆరోగ్యం, ప్రగతి పరిరక్షణకు తగిన అవకాశాలు కల్పించడం.
  2. పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించడం.
  3. కర్మాగార నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించడం.
  4. పర్యావరణం, అడవులు, వన్యమృగాల పరిరక్షణకు కృషి చేయటం.

ప్రశ్న 3.
భారత రాజ్యాంగంలో పొందుపరచిన ప్రాథమిక విధులను వర్ణించుము. [Mar. ’16]
జవాబు:
భారత రాజ్యాంగ లక్షణాలలో ప్రాథమిక విధులు అత్యంత విశిష్టమైనవి. అవి పూర్వపు సోవియట్ రష్యా రాజ్యాంగం చేత ప్రేరితమైనవి. భారత రాజ్యాంగం రూపకల్పన కాలం నందు వీటిని రాజ్యాంగం నందు చేర్చలేదు. అయితే శ్రీమన్నారాయణ అగర్వాల్ రచించిన గాంధియన్ కాన్స్టిట్యూషన్ ఫర్ ఫ్రీ ఇండియా (1946) అనే గ్రంథంలో వీటిని
గురించి పేర్కొన్నారు. భారత స్వాతంత్య్రానంతరము భారతదేశంలో రాజకీయపరంగాను, రాజ్యాంగపరంగాను అనేక మార్పులు చోటు చేసుకున్నవి. 1975 – 1977 సంవత్సరాల మధ్య కాలమందు రాజ్యాంగంలో ప్రాథమిక విధులను చేర్చవలెననే భావన కేంద్ర ప్రభుత్వమునకు వచ్చినది.

ఐక్యరాజ్యసమితి విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన (Universal Declaration of Human Rights), 1948 సోవియట్ యూనియన్ తరహాలోని ప్రాథమిక విధులను, పరిగణలోనికి తీసుకొని భారత రాజ్యాంగంలో చేర్చాలని భావించి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకొని సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీని 1976లో నియమించింది. ప్రపంచంలోని వివిధ రాజ్యాంగాలలో పొందుపర్చిన ప్రాథమిక విధులను పరిశీలించిన పిదప ఈ కమిటీ ఎనిమిది ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పొందుపరచుటకు సూచనలను చేసింది. అందుకు అనుగుణంగా అప్పటి అధికార పార్టీ పార్లమెంట్లో 42వ రాజ్యాంగ సవరణ బిల్లు 1976ను ప్రవేశపెట్టింది. పార్లమెంట్ ఆ రాజ్యాంగంలో 10 ప్రాథమిక విధులు చేర్చడం జరిగింది. వాటిని రాజ్యాంగం iv ఎ భాగంలో 51ఎ అనే ప్రకరణంలో ప్రస్తావించడమైనది. తరువాత 2002లో రాజ్యాంగం 86వ సవరణ చట్టం ద్వారా మరొక అంశం ప్రాథమిక విధుల జాబితాలో చేర్చడమైంది. దాంతో అప్పటి నుంచి భారత పౌరులకు మొత్తం 11 ప్రాథమిక విధులను సూచించడమైంది. వాటిని క్రింది విధంగా పేర్కొనవచ్చు.

భారత రాజ్యాంగంలోని 51-ఎ ప్రకరణ ప్రకారం ప్రతి ఒక్క భారత పౌరుడు తప్పనిసరిగా ఈ క్రింది విధులను నిర్వర్తించవలసి ఉన్నది.

  1. భారత రాజ్యాంగం పట్ల, రాజ్యాంగ ఆదర్శాల పట్ల, సంస్థల పట్ల, జాతీయ పతాకం, జాతీయ గీతం పట్ల విధేయతను చూపటం.
  2. స్వాతంత్ర్యం సాధనకై జరిగిన జాతీయోద్యమ ఉదాత్త ఆశయాలను గౌరవించి అనుసరించడం.
  3. భారతదేశ సార్వభౌమత్వం, సమైక్యత, సమగ్రతలను సమర్థించి సంరక్షించుకోవడం.
  4. దేశాన్ని రక్షించుకోవడం, అవసరమయినపుడు జాతీయ సేవలో పాల్గొనడం.
  5. మత, భాషా, ప్రాంతీయ, వర్గ సంబంధమైన వైవిధ్యాలను అధిగమించి భారత ప్రజలందరిలో సమైక్యతను, ఉమ్మడి సౌభ్రాతృత్వ భావాలను పెంపొందించుకోవడం, మహిళల గౌరవానికి విరుద్ధమైన పద్ధతులను పరిత్యజించడం.
  6. సుసంపన్నమైన వారసత్వాన్ని, వైవిధ్యంతో కూడుకున్న సంస్కృతిని సంరక్షించుకోవడం.
  7. అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో కూడిన సహజ వాతావరణాన్ని సంరక్షించుకొని పెంపొందించు కోవడం, ప్రాణికోటి పట్ల కారుణ్యాన్ని చూపించడం.
  8. శాస్త్రీయ వైఖరి, మానవతావాదం, సమతా సంస్కరణ దృక్పథాన్ని కలిగి ఉండటం.
  9. ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడం, హింసను విడనాడటం.
  10. జాతి ఉన్నత స్థాయిల్లోకి ఎదగడానికి వ్యక్తి పరంగానూ, సామూహికంగానూ సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడం.
  11. ఆరు నుంచి పద్నాలుగు ఏళ్ళ వయస్సు ఉన్న బాలబాలికలకు వారి తల్లిదండ్రులు, సంరక్షకులు తగిన విద్యా సదుపాయాలు కల్పించడం.

పైన పేర్కొన్న వాటిలో మొదటి పది ప్రాథమిక విధులు 1977 జనవరి మూడో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. పదకొండో ప్రాథమిక విధి 2002 డిసెంబర్ పన్నెండో తేది నుంచి అమల్లోకి వచ్చింది.

ప్రశ్న 4.
ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాల మధ్య గల వ్యత్యాసాలను వివరింపుము.
జవాబు:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం ఇచ్చిన ఆదేశాలే ఈ సూత్రాలు. ప్రభుత్వం తన విధానాలను రూపొందించుకొనేటప్పుడు వీటికి అనుగుణంగా రూపొందించుకోవాలి. శాసన సభ్యులకు, పాలకులకు ఈ సూత్రాలు ఒక ప్రవర్తనా నియమావళి. భారతదేశంలో సాంఘిక, ఆర్థిక ప్రజాస్వామ్య స్థాపనకు ఇవి మూలము. ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా దేశంలో “సంక్షేమ రాజ్యాన్ని” స్థాపించుటే వీటి ఉద్దేశ్యము.

భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆదేశక సూత్రాలు ఉన్నాయి. అవి రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను, ఆదర్శాలను ప్రతిబింబిస్తాయి. ఇవి ప్రభుత్వానికి ప్రజల పట్ల గల బాధ్యతలను వివరిస్తాయి. భారతదేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగానూ, వర్గరహిత రాజ్యంగానూ ఏర్పరచటమే ఈ నియమాల లక్ష్యం.

ఈ ఆదేశక సూత్రాలను న్యాయస్థానాల ద్వారా రక్షించుకోవటానికి వీలులేదు. ప్రభుత్వం విధానాలు రూపొందించుకొనేటప్పుడు వీటికి అనుగుణంగా రూపొందించుకోవాలి.
భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రాథమిక హక్కులు 12వ అధికరణం నుండి 35వ అధికరణం వరకు ప్రస్తావించబడ్డాయి. ప్రాథమిక హక్కులు ప్రజల స్వేచ్ఛకు, సర్వతోముఖ వికాసానికి అవసరం. ఇవి ప్రజాస్వామ్యాన్ని సార్థకం చేస్తాయి. వీటిని కోర్టు ద్వారా రక్షించుకోవచ్చు.

ప్రాథమిక హక్కులకు, ఆదేశక సూత్రాలకు మధ్యగల తేడాలు:

ప్రాథమిక హక్కులు

  1. రాజ్యాంగం 3వ భాగంలో పొందుపరచబడ్డాయి.
  2. వ్యక్తికి స్వేచ్ఛనిచ్చి, సమగ్రాభివృద్ధికి, వికాసానికి తోడ్పడతాయి. ఇవి ప్రజాస్వామ్యాన్ని సార్థకం చేస్తాయి.
  3. ప్రాథమిక హక్కులకు ఆజ్ఞాపించే స్వభావం ఉంది. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే న్యాయస్థానాల ద్వారా రక్షించుకోవచ్చు.
  4. ప్రాథమిక హక్కులు పౌరుడు అనుభవించడానికి ఉద్దేశించబడినవి.
  5. ప్రాథమిక హక్కులు వ్యక్తికి ఇవ్వబడ్డాయి. ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ఇవి అరికడతాయి.
  6. ప్రాథమిక హక్కుల సంఖ్య, పరిధి తగ్గుచున్నది.
  7. ఇవి రాజకీయ ప్రజాస్వామ్య స్థాపనకు ఉద్దేశింపబడ్డాయి.
  8. వీటిని అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించారు.
  9. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే శాసనాన్ని ‘చెల్లనేరదని’ కోర్టులు కొట్టివేస్తాయి.
  10. ప్రాథమిక హక్కులు ప్రభుత్వాన్ని కొన్ని పనులు చేయవద్దని శాసిస్తాయి.

ఆదేశక సూత్రాలు

  1. రాజ్యాంగం 4వ భాగంలో పొందుపరచబడ్డాయి.
  2. ఇవి సమాజ సంక్షేమానికి తోడ్పడతాయి. ఇవి ప్రజల ప్రయోజనాలకు, వారి నైతిక, భౌతిక, ఆర్థిక, సాంఘిక ప్రగతికి మూలము.
  3. ఆదేశక సూత్రాలకు ఆజ్ఞాపించే స్వభావం లేదు. వీటి అమలు రాష్ట్రాల ఆర్థిక వనరులపై ఆధారపడినాయి. వీటికి న్యాయస్థానాల రక్షణ లేదు.
  4. ఆదేశక సూత్రాలు రాజ్యాంగం ప్రభుత్వాలకు నిర్దేశించిన బాధ్యతలు.
  5. ఇవి సమాజ సంక్షేమానికై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పాటించవలసిన నియమాలు.
  6. ఆదేశక సూత్రాల సంఖ్య, పరిధి విస్తృతమగుచున్నది.
  7. ఇవి సాంఘిక, ఆర్థిక ప్రజాస్వామ్య స్థాపనకు ఉద్దేశింపబడ్డాయి.
  8. వీటిని ఐర్లాండ్ రాజ్యాంగం నుండి గ్రహించారు.
  9. ఆదేశక సూత్రాలకు భంగం కల్గించే శాసనం ‘చెల్లనేరదని’ కోర్టులు కొట్టివేయలేవు.
  10. ఆదేశక సూత్రాలు ప్రభుత్వం చేయవలసిన పనుల గురించి ఆదేశిస్తాయి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాలు మధ్య మారుతున్న సంబంధాలను వివరింపుము.
జవాబు:
ప్రాథమిక హక్కులు, అదేశక సూత్రాల మధ్య చట్టబద్ధమైనవి మరియు చట్టబద్ధము కానివి అనే వర్గీకరణ ఉన్నప్పటికీ, ఆదేశక సూత్రాలు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకొన్నవి. ఎన్నో సంవత్సరముల నుండి ఈ రెండింటి మధ్య అనేక మార్పులు చోటుచేసుకొన్నాయి. అవి
1. వ్యక్తి ప్రయోజనాలను కాంక్షిస్తున్న ప్రాథమిక హక్కులకూ, సమాజ శ్రేయస్సు కాంక్షిస్తున్న ఆదేశక సూత్రాల మధ్య అమలు విషయంలో ప్రతిష్టంబన ఏర్పడినపుడు ఏమి జరుగుతుందనే విషయంలో దేశంలో ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఈ వివాదాంశం రాజకీయాంశంగా రూపుదిద్దుకుంది.

2. ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాల అమలుకు సంబంధించి అనేక వివాదాంశాలలో సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో ఆదేశక సూత్రాలే ప్రాథమిక హక్కులకు లొంగి ఉండాలనే అభిప్రాయాన్ని వెలిబుచ్చినది.

3. బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు లాంటి చట్టాలు రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానాల తీర్పుల ఫలితంగానే 1971లో 25వ రాజ్యాంగసవరణ చట్టంను పార్లమెంట్ రూపొందించింది. ఈ సవరణ చట్టంను అనుసరించి ఆదేశక సూత్రాలు అమలును ఉద్దేశించి చేసిన ఏ చట్టాలైనను ప్రాథమిక హక్కులలోని 14వ ప్రకరణ, 19వ ప్రకరణ మరియు 31వ ప్రకరణలు అతిక్రమించుతున్నవనీ, ఆ చట్టాలు రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానాలు ప్రకటించరాదని సవరణ చట్టంలో పేర్కొనబడినది.

4. 1976లో పార్లమెంట్ 42వ రాజ్యాంగ సవరణ చట్టంను రూపొందించింది. ఆదేశక సూత్రాలలో కొన్ని గాని లేదా అన్ని సూత్రాలు గాని అమలుపరచుటకు పార్లమెంట్ రూపొందించే చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నవని న్యాయస్థానాలు భావించరాదని ఈ రాజ్యాంగ సవరణ చట్టం నందు పేర్కొనబడినది.

5. కేశవానంద భారతి Vs కేరళ ప్రభుత్వం కేసు విషయంలో భారత రాజ్యాంగ మౌలిక అంశాలను సవరణ చేయు అధికారం పార్లమెంట్కు లేదని సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించినది. సుప్రీంకోర్టు తీర్పు అర్థాన్ని అనుసరించి ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో మౌలిక లక్షణంగా భావించబడుచున్నవి.

ప్రశ్న 2.
పౌరునికి గల ఏవైనా మూడు ప్రాథమిక హక్కులను వివరింపుము.
జవాబు:
భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి. 12వ అధికరణం నుండి 35వ అధికరణం వరకు గల అంశాలు ప్రాథమిక హక్కులను వివరిస్తాయి. ప్రాథమిక హక్కులు ప్రజల స్వేచ్ఛకు, సర్వతోముఖ వికాసానికి అవసరం. ఇవి ప్రజాస్వామ్యాన్ని సార్థకం చేస్తాయి. ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులున్నాయి. వీటిని కోర్టు ద్వారా రక్షించుకోవచ్చు.

వీటిని గురించి విపులంగా చర్చిద్దాం.
1) సమానత్వపు హక్కు (14 నుండి 18 వరకు గల ప్రకరణలు): ప్రాథమిక హక్కులలో సమానత్వపు హక్కు భారత పౌరులందరికి ‘చట్ట సమానత్వాన్ని కల్పించింది. రాజ్యాంగంలోని 14వ ప్రకరణ భారతదేశంలో నివసించే వ్యక్తులందరికి చట్టం ముందు సమానత్వాన్ని, చట్టం ద్వారా సమానమైన రక్షణ, సదుపాయాలను కల్పించింది.

పౌరుల మధ్య మతం, తెగ, కులం, లింగ, జన్మస్థల సంబంధమైన వివక్షతలను రాజ్యం పాటించరాదని 15వ ప్రకరణ స్పష్టం చేసింది. అలాగే బహిరంగ ప్రదేశాలు సందర్శించే విషయంలో పౌరుల మధ్య ఎలాంటి వివక్షత చూపించకూడదని పేర్కొంది.

16వ ప్రకరణ ప్రకారం రాజ్యాంగా సంబంధించిన ఏ ఉద్యోగం లేదా నియామకానికైనా పౌరులందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. ఉద్యోగపరమైన విషయాలలో మతం, తెగ, కులం, లింగం, పుట్టుక వంటి అంశాలేవి ప్రధానమైనవి కావని ఆ ప్రకరణ పేర్కొంది.

17వ ప్రకరణ అస్పృశ్యత లేదా అంటరానితనం పాటించడాన్ని నేరంగా పేర్కొంది. ఈ విషయంలో 1955లో పార్లమెంటు అస్పృశ్యత నివారణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టాన్ని 1976 నుంచి పౌరహక్కుల పరిరక్షణ చట్టంగా వ్యవహరించడమైంది.

18వ ప్రకరణ ప్రకారం పౌరులకు సైనిక లేదా విద్యా విషయం బిరుదులు మినహా ఇతర బిరుదులను రాజ్యం ప్రసాదించకూడదు. భారత రాష్ట్రపతి అనుమతి లేకుండా విదేశాలు ప్రకటించే బిరుదులను పౌరులు స్వీకరించరాదు.

2) స్వేచ్ఛా హక్కు (19 నుండి 22 వరకు గల ప్రకరణలు): 19వ రాజ్యాంగ ప్రకరణ భారత పౌరులకు 7 రకాల స్వాతంత్య్రాలను ప్రసాదించింది. అవి

  1. వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వాతంత్ర్యం.
  2. శాంతియుతంగా సమావేశమయ్యే స్వాతంత్ర్యం.
  3. సంఘాలు, యూనియన్లు ఏర్పాటు చేసుకొనే స్వాతంత్య్రం.
  4. దేశమంతటా స్వేచ్ఛగా సంచరించే స్వాతంత్ర్యం.
  5. దేశంలో ఎక్కడైనా నివసించడానికి, స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి స్వాతంత్ర్యం.
  6. ఆస్తిని సంపాదించుకొనుటకు, ఆర్జించుటకు, దానధర్మాలు, విక్రయాలు చేసుకొనే స్వాతంత్ర్యం.
  7. ఏ వృత్తినైనా, వ్యాపారాన్నైనా చేసుకొనే స్వాతంత్య్రం.

20వ ప్రకరణ వ్యక్తులు నేరాలకు పాల్పడిన సందర్భాలలో శిక్ష విధించే విషయంలో రక్షణలను పేర్కొంది. ఈ ప్రకరణ అమలులో ఉన్న చట్టాన్ని అతిక్రమించనిదే ఏ వ్యక్తిని దోషిగా పరిగణించకూడదని పేర్కొంటుంది.

21వ అధికరణం ఏ ఒక్క వ్యక్తిని చట్టం పేర్కొన్న పద్ధతి ప్రకారం తప్ప మరో విధంగా అతని జీవనానికి, వ్యక్తి స్వాతంత్ర్యానికి భంగం కల్గించరాదని స్పష్టం చేసింది. ఈ ప్రకరణలను అత్యవసర పరిస్థితుల కాలంలో కూడా రద్దు చేయరు.

22వ ప్రకరణ ప్రకారం ఏ ఒక్క వ్యక్తిని కారణం లేకుండా నిర్భంధంలోకి తీసుకోకూడదు. నిర్బంధంలోకి తీసుకున్న వ్యక్తికి అందుకు కారణాలు తెలపటంతోపాటు న్యాయ సహాయం పొందటానికి వీలు కల్పించాలి. ఉదా: నిర్బంధంలోకి తీసుకున్న వ్యక్తిని 24 గం॥లలోగా సమీప న్యాయమూర్తి ఎదుట హాజరుపరచాలి.

3) పీడనను నిరోధించే హక్కు (23 మరియు 24 ప్రకరణలు):
23వ ప్రకరణ ప్రకారం రాజ్యంగాని, సంపన్న వర్గాలు కాని వ్యక్తులను దోపిడీకి గురిచేయకూడదు. మనుషుల క్రయ విక్రయాలు జరపటం, ప్రతిఫలం చెల్లించకుండా బలవంతంగా వెట్టిచాకిరీ పనులు చేయించుకోవటం నిషేధం. 24వ ప్రకరణ ప్రకారం 14 సంవత్సరాలలోపు పిల్లలను కర్మాగారాలు, గనులు వంటి ప్రమాదకరమైన, ఆరోగ్యానికి హాని కల్గించే పనులలో నియమించకూడదు. బాల కార్మికత్వం చేయించుకొనుట చట్టవిరుద్ధం.

ప్రశ్న 3.
పౌరులకు గల ఆరు స్వాతంత్య్రాలను పేర్కొనుము. [Mar. ’17]
జవాబు:
ప్రాథమిక హక్కులలో సమానత్వపు హక్కు భారత పౌరులందరికి ‘చట్ట సమానత్వాన్ని కల్పించింది. రాజ్యాంగంలోని 14వ ప్రకరణ భారతదేశంలో నివసించే వ్యక్తులందరికి చట్టం ముందు సమానత్వాన్ని, చట్టం ద్వారా సమానమైన రక్షణ, సదుపాయాలను కల్పించింది.

  • వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వాతంత్య్రం.
  • శాంతియుతంగా సమావేశమయ్యే స్వాతంత్య్రం.
  • సంఘాలు, యూనియన్లు ఏర్పాటు చేసుకొనే స్వాతంత్య్రం.
  • దేశమంతటా స్వేచ్ఛగా సంచరించే స్వాతంత్ర్యం.
  • దేశంలో ఎక్కడైనా నివసించడానికి, స్థిరనివాసం ఏర్పాటుచేసుకోవడానికి స్వాతంత్ర్యం.
  • ఆస్తిని సంపాదించుకొనుటకు, ఆర్జించుటకు, దానధర్మాలు, విక్రయాలు చేసుకొనే స్వాతంత్ర్యం.
  • ఏ వృత్తినైనా, వ్యాపారాన్నైనా చేసుకొనే స్వాతంత్య్రం.

అయితే ప్రకరణ 19(1) (f) సబ్ క్లాజులో చెప్పబడిన ఆస్తి హక్కును 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978 ద్వారా తొలగించబడినది. ఇప్పుడు ఆరు ప్రాథమిక స్వాతంత్ర్యాలు మాత్రమే కలవు.

ప్రశ్న 4.
రాజ్యాంగ పరిహారపు హక్కును గూర్చి క్లుప్తంగా వ్రాయుము.
జవాబు:
రాజ్యాంగ పరిహార హక్కు ప్రాథమిక హక్కులన్నింటిలో అత్యంత ప్రధానమైంది. ఈ హక్కును ప్రాథమిక హక్కులకు రక్షణ వలయంగానూ, కంచెగానూ, భద్రతాకవచంగాను పరిగణించడమైంది. పౌరుల ప్రాథమిక హక్కులను ప్రభుత్వంతో సహా ఎవరైనా లేదా ఏ సంస్థ అయినా హరించడానికి లేదా కుదించడానికి ప్రయత్నిస్తే, బాధిత పౌరులు తగిన ఉపశమనాన్ని పొందడానికి ఈ హక్కు వీలు కల్పిస్తుంది. ప్రాథమిక హక్కుల విషయంలో తోటి పౌరులు, ప్రైవేట్ లేదా ప్రభుత్వ సంస్థల నుంచి పౌరులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే, వారు సముచిత న్యాయస్థానం ద్వారా రక్షణ పొందవచ్చు. ఈ సందర్భంలో రాజ్యాంగం 32 మరియు 226వ అధికరణం ప్రకారం సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టులు దురాక్రమణ దారుల చర్యలను క్రమబద్ధం చేయడానికి లేదా అడ్డుకోవడానికి బాధితుల ప్రాథమిక హక్కుల పునరుద్ధరణ కోసం హెబియస్ కార్పస్, ప్రొహిబిషన్, సెర్షియరీ, కోవారెంటో, మాండమస్ వంటి రెట్లును మంజూరు చేస్తాయి. డాక్టరు బి.ఆర్ అంబేద్కర్ ఈ హక్కును రాజ్యాంగానికి హృదయం, ఆత్మవంటిదని వర్ణించాడు.

ప్రశ్న 5.
ప్రాథమిక హక్కులకు ఆదేశక సూత్రాల మధ్య గల ఐదు వ్యత్యాసాలను వివరింపుము. [Mar. ’16]
జవాబు:
ప్రాథమిక హక్కులు

  1. రాజ్యాంగం 3వ భాగంలో పొందుపరచబడ్డాయి.
  2. వ్యక్తికి స్వేచ్ఛనిచ్చి, సమగ్రాభివృద్ధికి, వికాసానికి తోడ్పడతాయి. ఇవి ప్రజాస్వామ్యాన్ని సార్థకం చేస్తాయి.
  3. ప్రాథమిక హక్కులకు ఆజ్ఞాపించే స్వభావం ఉంది. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే న్యాయస్థానాల ద్వారా రక్షించుకోవచ్చు.
  4. ప్రాథమిక హక్కులు పౌరుడు అనుభవించడానికి ఉద్దేశించబడినవి.
  5. ప్రాథమిక హక్కులు వ్యక్తికి ఇవ్వబడ్డాయి. ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ఇవి అరికడతాయి.

ఆదేశక సూత్రాలు

  1. రాజ్యాంగం 4వ భాగంలో పొందుపరచబడ్డాయి.
  2. ఇవి సమాజ సంక్షేమానికి తోడ్పడతాయి. ఇవి ప్రజల ప్రయోజనాలకు, వారి నైతిక, భౌతిక, ఆర్థిక, సాంఘిక ప్రగతికి మూలము. ఆదేశక సూత్రాలకు ఆజ్ఞాపించే స్వభావం లేదు.
  3. వీటి అమలు రాష్ట్రాల ఆర్థిక వనరులపై ఆధారపడినాయి. వీటికి న్యాయస్థానాల రక్షణ లేదు.
  4. ఆదేశక సూత్రాలు రాజ్యాంగం ప్రభుత్వాలకు నిర్దేశించిన బాధ్యతలు.
  5. ఇవి సమాజ సంక్షేమానికై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పాటించవలసిన నియమాలు.

ప్రశ్న 6.
ఆదేశక సూత్రాల లక్షణాలను వివరింపుము.
జవాబు:

  1. ఆదేశక సూత్రాలు అనేవి భారతదేశంలో వివిధ ప్రభుత్వాలకు ఇచ్చిన ఆజ్ఞలు.
  2. ఇవి సంవర్ధక స్వభావాన్ని కలిగి ఉంటాయి. అంటే వివిధ స్థాయిలలో ఉన్న ప్రభుత్వాల అధికార, విధుల పరిధిని విస్తృత పరుస్తాయి.
  3. వీటిని వివిధ ప్రభుత్వాలు ఆర్థిక వనరుల లభ్యత మేరకే అమలుపరుస్తాయి.
  4. ఇవి ప్రజల సమ్మతిని కలిగి ఉంటాయి. సమసమాజ స్థాపనే వీటి లక్ష్యం.
  5. వివిధ స్థాయిలలో గల ప్రభుత్వాలలో అధికార బాధ్యతలు చేపట్టే ఏ పార్టీ అయినా స్వీయ రాజకీయ సిద్దాంతాలతో నిమిత్తం లేకుండా వీటిని అమలుచేయాల్సి ఉంటుంది.
  6. ఈ సూత్రాలను అమలు చేయకపోవడాన్ని ఎటువంటి చట్టధిక్కారమైన చర్యగా పరిగణించరు.
  7. వీటికి శిక్షాత్మక స్వభావం లేదు. వీటిని వెంటనే అమలుచేయాల్సిందిగా ఎవరూ నిర్బంధించరు. వీటి అమలులో ప్రభుత్వాలకు విచక్షణాత్మక అధికారాలు ఉంటాయి.
  8. భారతదేశంలో రాజకీయ ప్రజాస్వామ్యం, ఆర్థిక సమానత్వాలను సాధించి సామాజిక సుహృద్భావాన్ని పెంపొందించటమే వీటి ఆశయం.
  9. వ్యక్తి ప్రగతి కంటే సామాజిక సంక్షేమాన్ని పెంపొందించడమే వీటి అసలు లక్ష్యం.

ప్రశ్న 7.
ఆదేశక సూత్రాల అమలును పరిశీలింపుము.
జవాబు:
వాస్తవంగా దేశపాలనలో ఆదేశక సూత్రాల అమలు చాలా ముఖ్యమైనది. 1950 నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదేశక సూత్రాల అమలులో కాలానుగుణంగా అనేక చర్యలను తీసుకుంటున్నది. ఇవి క్రింద వివరించబడినవి.

  1. జమీందార్, జాగీర్దారి, ఇనాందారి వ్యవస్థలు రద్దు.
  2. భూసంస్కరణ చట్టాల రూపకల్పన.
  3. రాజభరణాల రద్దు.
  4. 14 వాణిజ్యబ్యాంకుల జాతీయకరణ.
  5. ఖాదీ, గ్రామీణ పరిశ్రమ బోర్డుల నిర్మాణం.
  6. గ్రామ పంచాయితీ వ్యవస్థలను ఏర్పాటు చేయడం.
  7. ప్రజా ప్రాతినిధ్య సంస్థల మరియు విద్యాసంస్థల్లో, షెడ్యూల్డు కులాల, తెగల వారికి కొన్ని స్థానాలను కేటాయించడం.
  8. జాతీయ ప్రాధాన్యం ఉన్న కళాత్మకమైన లేదా చారిత్రక స్మారక చిహ్నాలు, ప్రదేశాలు, వస్తువుల పరిరక్షణ చట్టం 1951 రూపకల్పన.
  9. భారత శిక్షాస్మృతి రూపకల్పన.
  10. గోవులు, దూడలు, ఇతర పాడిపశువులు, లాగుడు బండ్లకు కట్టే పశువుల వధను కొన్ని రాష్ట్రాలలో నిషేధం.

ప్రశ్న 8.
ఆదేశక సూత్రాల ప్రాముఖ్యతను వివరింపుము.
జవాబు:
ఆదేశ సూత్రాలు భారతరాజ్యాంగ లక్షణాలలో ముఖ్యమైనవిగా పరిగణించబడినవి. ఈ సూత్రాల అమలు బాధ్యతను విష్యత్తులో అధికారంలోకి వచ్చు ప్రభుత్వాలకు రాజ్యాంగ నిర్మాతలు అప్పగించారు. ఆదేశక సూత్రాలు, ప్రాథమిక హక్కులు రాజ్యాంగానికి అంతరాత్మగా గ్రావెల్లి ఆస్టిన్ అభివర్ణించాడు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఈ సూత్రాలను రాజ్యాంగ )న్నూత లక్షణాలుగా పేర్కొన్నాడు. రాజ్యాంగంలోని ఈ విభాగం ప్రాథమిక హక్కుల భాగానికి సన్నిహితంగా, అనుబంధంగా ఉంటాయి. అందువలననే రాజ్యాంగంలోని మూడవ భాగం మరియు నాల్గవ భాగం పరస్పర సంబంధం కలిగి ఉన్నవి.

ఆదేశక సూత్రాలను అధికారంలో ఉన్న ఏ పార్టీ అయిన ఈ సూత్రాలను అమలు చేయవచ్చు. ఆ సూత్రాలు ప్రభుత్వంలోని శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహణ శాఖకు మార్గదర్శకాలుగా దోహదపడతాయి. ప్రజలు వారి హక్కులను అనుభవించడానికి అనుకూలమైన వాతావరణాన్ని ఆదేశక సూత్రాలు కల్పిస్తాయి. ప్రభుత్వ వివిధ సంస్కరణలకు అవి సూచికలుగా ఉపయోగపడతాయి. రాబోయే ప్రభుత్వ విధానాల స్థిరత్వానికి, కొనసాగింపుకూ అవి హామీ ఇస్తాయి.

ఐవర్ జెన్నింగ్స్, ఆచార్య శ్రీనివాసన్, జి.యన్. జోషి, ఆచార్య కె.టి.షా, కె.సి.వేర్, టి.టి కృష్ణమాచారి, నసీరుద్దీన్ ఆహ్మద్ వంటి ప్రముఖ రాజ్యాంగవేత్తలు ఆదేశక సూత్రాలను శుష్క వాగ్దానాలుగాను, అందంగాను అమర్చిన వస్తువులు గాను, పవిత్ర సంకల్పాలుగాను, అలంకార ప్రాయ సూత్రాలుగా పరిగణించారు. ఆదేశ సూత్రాలకు ఒక ఉమ్మడి సిద్ధాంతమంటూ ఏదీ లేదని ఐవర్ జెన్నింగ్స్ భావించారు. ఆదేశక సూత్రాలనేవి బ్యాంకుల సౌకర్యార్థం డబ్బు చెల్లించడానికి ఇచ్చే చెక్కులుగా ఆచార్య కె.టి.షా వర్ణించాడు.

ఆదేశక సూత్రాలను మరుసటిరోజే మరచిపోయే నూతన సంవత్సర శుభాకాంక్షలుగా నసీరుద్దీన్ అహ్మద్ విమర్శించాడు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రాథమిక హక్కులు.
జవాబు:
ప్రథమంగా భారత రాజ్యాంగం భారత పౌరులకు ఏడు ప్రాథమిక హక్కులను ప్రసాదించింది. ఈ హక్కులను రాజ్యాంగంలో మూడవ భాగంలో 12 నుంచి 35 వరకు గల ప్రకరణలలో పొందపరచడం జరిగింది. ప్రాథమిక ” హక్కులు అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించబడినాయి. ప్రాథమిక హక్కులు

  1. సమానత్వపు హక్కు
  2. స్వేచ్ఛా హక్కు
  3. పీడనను నిరోధించే హక్కు
  4. మత స్వాతంత్ర్య హక్కు
  5. విద్యా, సాంస్కృతిక హక్కు
  6. ఆస్తి హక్కు
  7. రాజ్యాంగ పరిహార హక్కు, 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978 ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా, నుండి తొలగించటం జరిగింది.

ప్రశ్న 2.
ఆదేశక సూత్రాల విశ్లేషణ.
జవాబు:
భారతరాజ్యాంగంలో నాల్గవ భాగంలో 36 నుండి 51వ ప్రకరణలు ఆదేశక సూత్రాలను గురించి వివరిస్తున్నాయి.
ఇవి మూడు రకాలు.

  1. సామ్యవాద సూత్రాలు
  2. ఉదారవాద సూత్రాలు
  3. గాంధేయవాద సూత్రాలు

ప్రశ్న 3.
హెబియస్ కార్పస్. [Mar. ’16]
జవాబు:
ఒక వ్యక్తిని నిర్బంధించిన వ్యక్తిపై గాని, అధికారిపై గాని ఈ రిట్జజారీ చేయబడుతుంది. ఈ ఆజ్ఞ ప్రకారం నిర్భంధంలో వున్న వ్యక్తిని కోర్టులో హాజరుపరచవలె. హాజరుపరచిన తరువాత విచారణ జరుగుతుంది. ఇది సాధారణంగా వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన రిట్.

ప్రశ్న 4.
మాండమస్.
జవాబు:
ఈ ఆజ్ఞను న్యాయస్థానాలు ఒక అధికారిపై లేదా ఒక సంస్థపై జారీ చేస్తాయి. దాని ప్రకారం ఆ అధికారి లేదా సంస్థ తాను నెరవేర్చవలసిన విధులు పాటించవలసి ఉంటుంది.

ప్రశ్న 5.
సాంస్కృతిక విద్యా హక్కులు.
జవాబు:
భారత పౌరులకు సాంస్కృతిక, విద్యాపరమైన అవకాశాలను రాజ్యాంగం ఈ హక్కుల ద్వారా ప్రసాదించింది. | 29వ ప్రకరణ ప్రకారం ప్రతి పౌరుడు స్వంత భాష, సంస్కృతులను పరిరక్షించుకొనవచ్చు. 30వ ప్రకరణ ప్రకారం ప్రభుత్వం నుండి సంపూర్ణంగా కాని, పాక్షికంగా కాని ఆర్థిక సహాయం పొందే విద్యా సంస్థలలో కులం, మతం, ప్రాంతం, వర్ణం, భాష, లింగపరమైన అంశాల ప్రాతిపదికగా విద్యార్థులకు ప్రవేశాన్ని నిరాకరించకూడదు.

ప్రశ్న 6.
గాంధేయ వాద సూత్రాలు.
జవాబు:
మహాత్మాగాంధీ ప్రవచించిన ఆదర్శాలను ఆదేశక సూత్రాలలో 40, 43, 46, 47, 48ఎ, 49 ప్రకరణలలో ప్రస్తావించటం జరిగింది. భారతదేశంలో ఆదర్శపాలనను నెలకొల్పటానికి ఈ సూత్రాలు తోడ్పడతాయి. పంచాయితీరాజ్ సంస్థలను నెలకొల్పటం, గ్రామీణ ప్రాంతాలలో కుటీర పరిశ్రమలను ప్రోత్సహించటం, మత్తుపానీయాలు, మాదక ద్రవ్యాలను నిషేధించటం, షెడ్యూల్డు కులాలు, తరగతులు, బలహీన వర్గాల ప్రజల విద్యా, సామాజిక ప్రగతికి రాజ్యం ప్రత్యేక శ్రద్ధ వహించటం మొదలైన వాటిని గాంధేయవాద సూత్రాలకు ఉదాహరణలుగా పేర్కొనవచ్చు.

ప్రశ్న 7.
ప్రాథమిక విధుల ప్రాముఖ్యత. [Mar. ’17]
జవాబు:
రాజ్యాంగంలో మొదట ‘విధులు’ చేర్చబడలేదు. కాని 1976లో చేయబడిన 42వ రాజ్యాంగ సవరణ ప్రకారం 10 ప్రాథమిక విధులు చేర్చబడ్డాయి. స్వరణ్ సింగ్ అధ్యక్షతన ఏర్పడిన ఒక సంఘం ఈ విధులను సూచించింది. అయితే వీటిని న్యాయస్థానాల ద్వారా అమలు చేయడానికి అవకాశం లేదు. ఇవి ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు తెస్తాయని, విజ్ఞానదాయకమైన మానసిక అభ్యున్నతికి తోడ్పడతాయని భావింపబడింది. రాజ్యాంగంలోని నాలుగో భాగం ‘ఏ’ లోని 51(ఎ) అధికరణం వీనిని తెలుపుతుంది.

రాజ్యం ప్రజల వద్ద నుంచి ఆశించే సామాజిక చైతన్యం, ప్రవర్తనా నియమావళే ప్రాథమిక విధులు.

ప్రాముఖ్యత:

  1. ప్రాథమిక విధులు భారత పౌరులలో సామాజిక స్పృహను పెంపొందించి, బాధ్యతాయుత ప్రవర్తనను అలవరుస్తాయి.
  2. ఈ విధులు 1948లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ఆమెదించిన విశ్వమానవ హక్కుల ప్రకటన తీర్మానానికి అనుగుణంగా ఉన్నాయి.
  3. ప్రాథమిక విధులు రాజ్యాంగ ఆశయాలను, రాజ్యాంగ చట్టాన్ని, ప్రభుత్వ వ్యవస్థలను గౌరవిస్తాయి.
  4. ప్రాథమిక విధులు ప్రజల మధ్య సౌభ్రాతృత్వం, సహకారాన్ని పెంపొందిస్తాయి.
  5. భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించుట.

ప్రశ్న 8.
ఏవైనా మూడు ఉదార సూత్రాలు.
జవాబు:
ఆదేశక సూత్రాలలోని ఉదారవాద సూత్రాలు:

  1. 44వ అధికరణం ప్రకారం దేశంలో నివసించే పౌరలందరికీ వర్తించే విధంగా ఉమ్మడి పౌరస్మృతిని రాజ్యం
    రూపొందించాలి.
  2. 45వ అధికరణం ప్రకారం 14 ఏళ్ళలోపు పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను అందించడానికి రాజ్యం ప్రయత్నించాలి.
  3. 50వ అధికరణం ప్రకారం పబ్లిక్ సర్వీసుల విషయంలో కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరుచేయడానికి రాజ్యం చర్యలు తీసుకోవాలి.
  4. 51వ అధికరణం ప్రకారం రాజ్యం (అ) అంతర్జాతీయ శాంతి భద్రతలను పెంపొందించుకోవడం
    (ఆ) దేశాల మధ్య న్యాయపరమైన, గౌరవప్రదమైన దౌత్య సంబంధాలను నిర్వహించుకోవడం.

ప్రశ్న 9.
కోవారెంటో.
జవాబు:
సక్రమమైన అధికారం లేకుండా ప్రజా సంస్థలో అధికారం నడిపించే వ్యక్తులను అధికారాన్ని నిర్వహించకుండా ఈ ఆజ్ఞ నిరోధిస్తుంది.

ప్రశ్న 10.
మత స్వాతంత్ర్యపు హక్కు.
జవాబు:
మత స్వాతంత్ర్య హక్కు భారత రాజకీయ వ్యవస్థ లౌకిక స్వభావానికి ప్రతీక. 25వ అధికరణం ప్రకారం ప్రతి వ్యక్తికీ ప్రజాభద్రత, నైతికత, ఆరోగ్యాలకు లోబడి తన అంతరాత్మకు అనుగుణమైన మతాన్ని అవలంభించడానికి, ప్రచారం చేసుకోవడానికి హక్కు ఉంది. మత ప్రభావానికి సంబంధించిన ఏ కార్యక్రమాలనైనా క్రమబద్ధం చేసే చట్టాన్ని రాజ్యం రూపొందించవచ్చు.

26వ అధికరణం ప్రకారం ఏ మతానికి చెందినవారైనా

  1. మతపరమైన ధార్మిక సంస్థలను ఏర్పాటు చేసుకోవడానికి
  2. స్వీయ మత వ్యవహారాలను నిర్వహించుకోవడానికి
  3. స్థిర, చరాస్తులపై యాజమాన్య హక్కు పొందడానికి, వాటిని కొనుగోలు చేయడానికి చట్ట ప్రకారం ఆస్తిపాస్తులను నిర్వహించుకోవచ్చు.

27వ అధికరణం మతం ఆధారంగా రాజ్యం ఏ వ్యక్తిపై, ఏ విధమైన పన్ను విధించడానికి, వసూలు చేయడానికి వీలులేదని పేర్కొంది. 28వ అధికరణం ప్రకారం రాజ్యం నుంచి సంపూర్ణంగానో, పాక్షికంగానో ఆర్థిక సహాయాన్ని పొందే విద్యా సంస్థలలో మతపరమైన బోధనలు నిషేధించడం జరిగింది.

ప్రశ్న 11.
పీడనను నిరోధించే హక్కు,
జవాబు:
భారతదేశంలో నివసించే అసంఖ్యాక ప్రజల ఆత్మగౌరవాన్ని, హుందాతనాన్ని గుర్తించి, పరిరక్షించి, పెంపొందించటానికి ఈ హక్కును ప్రసాదించటమైంది. రాజ్యం కాని, సంపన్న వర్గాలు కాని వ్యక్తులను దోపిడీకి గురిచేయకుండా నివారించటానికి ఈ హక్కు తోడ్పడుతుంది. మన రాజ్యాంగంలో 23 మరియు 24 ప్రకరణలు ఈ హక్కును వివరిస్తున్నాయి. 23వ ప్రకరణ ప్రకారం మనుషుల క్రయ విక్రయాలు, బలవంతంగా వెట్టిచాకిరీ చేయించుకోవటం నేరం. 24వ ప్రకరణ ప్రకారం 14 సంవత్సరాలలోపు పిల్లలను గనులు, కర్మాగారాలు మొదలైన ప్రమాదకర పనులలో నియమించదారు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 1 భారత రాజ్యాంగం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 1st Lesson భారత రాజ్యాంగం Textbook Questions and Answers.

AP Inter 2nd Year Civics Study Material 1st Lesson భారత రాజ్యాంగం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాజ్యాంగం అంటే ఏమిటి ? భారత రాజ్యాంగం చారిత్రక నేపథ్యాన్ని వివరించండి.
జవాబు:
పరిచయం : ఆధునిక కాలంలో ప్రతి రాజ్యానికి ఒక రాజ్యాంగముంటుంది. రాజ్యాంగంలో రాజ్యానికి సంబంధించిన అన్ని వ్యవస్థల అధికారాలు, విధులు మొదలైన విషయాలను స్పష్టంగా, నిర్ధిష్టంగా, క్లుప్తంగా తెలియజేయడం జరుగుతుంది. రాజ్యానికి సంబంధించిన వ్యవహారాలు క్రమబద్ధంగా జరగడానికి రాజ్యాంగం చాలా ముఖ్యం.

అర్థం : Constitution అనే ఇంగ్లీషు పదం “Constitutio” అనే లాటిన్పదం నుండి ఉద్భవించింది. లాటిన్ భాషలో కాన్స్టిట్యూషియో అంటే “స్థాపించు” అని అర్థం.
నిర్వచనాలు :

  1. అరిస్టాటిల్ : “రాజ్యంలో అత్యున్నతమైన పదవులతో సహా అన్నింటిని క్రమబద్ధంగా ఏర్పాటు చేసేదే రాజ్యాంగం”.
  2. లార్డ్ బ్రైస్ : “ప్రభుత్వం పనిచేసే విధానాన్ని తెలిపే నిర్దిష్ట నియమాల సముదాయమే రాజ్యాంగం”.
  3. స్టీఫెన్ లీకాక్ : “రాజ్యాంగం అంటే ప్రభుత్వరూపం”.

సాధారణంగా రాజ్యాంగాన్ని రాజ్యంలోని ప్రముఖ వ్యక్తులు, ప్రజాప్రతినిధులు, విషయ నిపుణులు మొదలైనవారు రూపొందిస్తారు. 385 మందితో కూడిన రాజ్యాంగ పరిషత్ రెండు సంవత్సరాల 11 నెలల 17 రోజుల పాటు నిర్విరామంగా కృషి చేసి భారత రాజ్యాంగాన్ని రూపొందించింది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 1 భారత రాజ్యాంగం

భారత రాజ్యాంగ నిర్మాణ చారిత్రక నేపథ్యం: భారత రాజ్యాంగం ప్రపంచ రాజ్యాల రాజ్యాంగాలన్నింటి కంటే మిక్కిలి శ్రేష్టమైంది. దీనిని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆధ్వర్యంలోని రాజ్యాంగ ముసాయిదా కమిటీ రూపొందించగా, డాక్టర్ రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన గల భారత రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది. అంతకుపూర్వం భారతీయులకు ప్రత్యేకంగా ఒక రాజ్యాంగం అవసరమని జాతీయోద్యమ నాయకులు పలుమార్లు డిమాండ్ చేశారు. 1922లో ఏర్పడిన స్వరాజ్యపార్టీ నాయకులు భారతీయులకు శాసనమండళ్ళలో ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా రాజ్యాంగపరమైన ఏర్పాట్లు జరగవలసి ఉంటుందని పేర్కొన్నారు. తరువాత 1924 ఫిబ్రవరిలో కేంద్ర శాసన మండలి సమావేశంలో మోతీలాల్ నెహ్రూ ఒక తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ భారత రాజ్యాంగాన్ని వెంటనే రూపొందించుకోవడానికి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఉందన్నారు. ఆ తీర్మానాన్ని కేంద్ర శాసనసభ్యులు అత్యధిక

మెజారిటీతో ఆమోదించారు. 1928 మేలో మొతీలాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటుచేసి, భారత ప్రజలకు తగిన రాజ్యాంగాన్ని ఏర్పరచడానికి కొన్ని నియమ నిబంధనలను రూపొందించవలసిందిగా కోరడం జరిగింది. తరువాత మోతీలాల్ నెహ్రూ కమిటీ తన నివేదికను 1928 ఆగస్టులో రూపొందించింది. ఆ కమిటీ సూచనలలో అధికభాగం స్వతంత్ర భారత రాజ్యాంగంలో పొందుపరచడమైంది.

1936-1937 కాలంలో భారతదేశంలో ప్రాంతీయ శాసనమండళ్ళకు జరిగిన ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ తన ఎజెండాలో రాజ్యాంగ పరిషత్తు నిర్మాణాన్ని ప్రధాన అంశంగా పేర్కొంది. ఆ తరువాత 1937 ఫిబ్రవరిలో వార్ధాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో భారతీయ శాసనసభ్యులు ప్రాంతీయ ప్రభుత్వాలలో చేరడానికి ఆమోదం తెలిపారు. నూతన ప్రాంతీయ మండళ్ళ సమావేశంలో రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు డిమాండు ప్రస్తావించవలసిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు.

1940 ఏప్రిల్లో వార్దాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూల మధ్య రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి ఆసక్తికరమైన చర్చలు జరిగాయి.

1940లో వైస్రాయ్ లిన్లిత్ ఆగస్టు ప్రతిపాదన (August offer) ద్వారా భారతీయులు రెండో ప్రపంచ ‘యుద్ధంలో బ్రిటన్కు సహకరించాలనీ, భారత రాజ్యాంగాన్ని రూపొందించుకొనే బాధ్యత ప్రధానంగా భారతీయులకే ఉంటుందనీ మొట్టమొదటి సారిగా ప్రకటించాడు. భారత జాతీయ స్రవంతిలో పాల్గొనే వారికి ప్రాతినిధ్యం వహించే సంస్థయే నూతన రాజ్యాంగ రూపకల్పనలో పాలుపంచుకోవలసి ఉంటుందని పై ప్రతిపాదన పేర్కొంది. 1942లో బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ యుద్ధకాలపు మంత్రిమండలిలో లేబర్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న స్టాఫర్డ్ క్రిప్స్న భారతదేశంలో నెలకొన్న రాజ్యాంగ సంక్షోభాన్ని పరిష్కరించడానికి సమాయత్తం గావించాడు. నెహ్రూకు సన్నిహితుడైన క్రిప్స్ తన ప్రతిపాదనలలో మొట్టమొదటిసారిగా రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు ప్రక్రియ గురించి పేర్కొన్నాడు.

భారత రాజ్యాంగ పరిషత్తుకు 1946 జూలై – ఆగస్టులలో ఎన్నికలు జరిగాయి.

భారత రాజ్యాంగ పరిషత్తు తొలి సమావేశం గవర్నర్ జనరల్ లార్డ్ వేవెల్ ఆదేశాలమేరకు 1946 డిసెంబర్ 9న జరిగింది. నెహ్రూ సూచనమేరకు అందరికంటే ఎక్కువ వయస్సు, అనుభవం ఉన్న సచ్చిదానంద సిన్హా రాజ్యాంగ పరిషత్తు తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించాడు. మొట్టమొదటి సమావేశంలో 207 మంది సభ్యులు పాల్గొన్నారు. 1946 డిసెంబర్ 11న రాజేంద్రప్రసాద్ను రాజ్యాంగ పరిషత్తు శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడమైంది. 1946 డిసెంబర్ 13న జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగపరిషత్తు సమావేశంలో చారిత్రాత్మకమైన రాజ్యాంగ లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానం భారతదేశాన్ని సర్వసత్తాక, స్వతంత్ర్య ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా వర్ణించారు. రాజేంద్రప్రసాద్ తన తొలి అధ్యక్షోపన్యాసంలో భారతదేశం కామన్వెల్త్ రాజ్యంగా కొనసాగుతుందనీ, కుల, మత, వర్గాలతో సంబంధం లేని దిశగా భారతదేశం పయనిస్తుందనే ఆకాంక్షను వెల్లడించారు.

భారతదేశం 1947 ఆగస్టు 15వ తేదీన స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. అంతకుపూర్వం భారత రాజ్యాంగ పరిషత్తు నాలుగు పర్యాయాలు సమావేశమైంది. మొదటి సమావేశం 1946 డిసెంబర్ 9-13 మధ్య, రెండో సమావేశం 1947 జనవరి 20-22 మధ్య, మూడో సమావేశం 1947 ఏప్రిల్ 28, మే 2 మధ్య, నాలుగో సమావేశం 1947 జూలైలో జరిగాయి. మొదటి సమావేశంలో రాజ్యాంగ లక్ష్యాల తీర్మానంపై చర్చ జరిగింది. రెండో సమావేశంలో రాజ్యాంగ రూపకల్పనకు దోహదపడే అల్పసంఖ్యాకుల కమిటీ, ప్రాథమిక హక్కుల కమిటీ, సభావ్యవహారాల కమిటీ వంటి అనేక కమిటీలు ఏర్పడ్డాయి. మూడో సమావేశంలో కేంద్రప్రభుత్వ అధికారాల కమిటీ వంటి వివిధ సభా సంఘాల నివేదికలపై చర్చ జరిగింది. నాలుగో సమావేశంలో భావిభారత రాజ్యాంగనమూనా, కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగం వంటి విషయాలపై కూలంకషంగా చర్చించడం జరిగింది. 1947 జూన్ 3న మౌంట్ బాటన్ చేసిన దేశ విభజన ప్రకటనతో రాజ్యాంగ పరిషత్తు స్వరూపమే మారిపోయింది. దేశ విభజన తరువాత భారత రాజ్యాంగ పరిషత్తు నుంచి ముస్లిం లీగ్ వేరయిపోవడంతో దాని సభ్యత్వ సంఖ్య తగ్గిపోయింది. అలాగే దేశ విభజన దరిమిలా రాజ్యాంగ పరిషత్తు ఒకవైపు రాజ్యాంగ నిర్మాణసంస్థగానూ, వేరొకవైపు జాతీయస్థాయిలో అత్యున్నత శాసన నిర్మాణ సంస్థగా వ్యవహరించింది.

రాజ్యాంగ పరిషత్తుకు కార్యదర్శిగా హెచ్. వి. ఆర్. అయ్యంగార్, రాజ్యాంగ పరిషత్తుకు ముఖ్య సలహాదారుగా డాక్టర్ బెనగళ్ నర్సింగరావు వ్యవహరించారు.

రాజ్యాంగ ముసాయిదా కమిటీ (Drafting Committee)
భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీని భారత రాజ్యాంగ పరిషత్తు 1947 ఆగస్టు 29న ఏర్పరచింది. ఆ కమిటీలో చైర్మన్, ఆరుగురు సభ్యులు (మొత్తం ఏడుగురు) ఉన్నారు. డాక్టర్.బి.ఆర్. అంబేద్కర్ ఆ కమిటీ చైర్మన్ వ్యవహరించారు.

ముసాయిదా కమిటీ అనేక దఫాలు సమావేశమై రాజ్యాంగ ముసాయిదాను రూపొందించి 1947 నవంబర్ 5న రాజ్యాంగ పరిషత్తుకు సమర్పించింది. రాజ్యాంగ ముసాయిదా ప్రతి 1948 ఫిబ్రవరి 21న ముద్రితమైంది. రాజ్యాంగ ముసాయిదాలోని అంశాలను రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు, ప్రజలు, పత్రికలలో చర్చలు జరిగి అభిప్రాయాల వ్యక్తీకరణకోసం ముసాయిదా ప్రతులను పంచడమైంది.

మొత్తం మీద రాజ్యాంగ ముసాయిదా పై 7635 సవరణలు పరిశీలనకు వచ్చాయి. వాటిలో 2473 సవరణలను రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది. రాజ్యాంగ ముసాయిదా ప్రతిపై తృతీయ పఠనం 1949 నవంబర్ 14-26ల మధ్య జరిగింది. చివరిగా రాజ్యాంగ పరిషత్తు భారత రాజ్యాంగ ముసాయిదాను నవంబర్ 26న ఆమోదించింది. భారత రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదించడానికి రాజ్యాంగ పరిషత్తుకు 2 ‘సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. భారత రాజ్యాంగ పరిషత్తు చివర సమావేశం 1950 జనవరి 24న జరిగింది. ఆ సమావేశంలో సభ్యులు డాక్టర్ రాజేంద్రప్రసాద్ ను భారతదేశ తొలి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది.

భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది. నాటి నుండి ప్రతి ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా జరుపుకొంటున్నాము.

AP Inter 2nd Year Civics Study Material Chapter 1 భారత రాజ్యాంగం

ప్రశ్న 2.
భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలను వివరించండి. [Mar. ’17, ’16]
జవాబు:
భారత రాజ్యాంగం జనవరి 26, 1950వ సంవత్సరంలో అమలులోకి వచ్చింది. సుమారు రెండు శతాబ్దాల పరాయి పాలన తరువాత 1946లో ఏర్పడిన రాజ్యాంగ నిర్మాణ సభ రాజ్యాంగాన్ని రూపొందించింది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలంలో క్రొత్త రాజ్యాంగ నిర్మాణం చేయబడింది. మేధావులు, పరిపాలనావేత్తలు, న్యాయశాస్త్ర నిపుణులు, రాజనీతివేత్తలు కలసి ప్రపంచంలోని ముఖ్య రాజ్యాంగాలు, 1935 భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా క్రొత్త రాజ్యాంగ రచన చేశారు.

లక్షణాలు :
1. సుదీర్ఘమైన రాత పూర్వక ప్రతి : భారత రాజ్యాంగం లిఖిత రాజ్యాంగం. భారత రాజ్యాంగము ప్రపంచ రాజ్యాంగాలన్నింటిలోకి అతిపెద్ద రాజ్యాంగము. ఇందులో ప్రస్తుతం 444 అధికరణాలు, 12 ప్రకరణాలు ఉన్నాయి. రాజ్యాంగంలో 22 భాగాలున్నాయి. ఇప్పటి వరకు 100 సార్లు పైగా రాజ్యాంగం సవరించబడింది. ఇవన్నీ రాజ్యాంగంలో భాగమయ్యాయి. అన్ని వివరాలు పొందుపరచడం వలన రాజ్యాంగం పెద్దదిగా తయారైంది. ఐవర్ జెన్నింగ్స్ అనే రచయిత “భారత రాజ్యాంగం ప్రపంచంలో అతిదీర్ఘము, వివరణాత్మక రాజ్యాంగం” అని వర్ణించారు. కొన్ని అలిఖిత నియమాలు కూడా ఉన్నాయి. ఉదా : రాష్ట్రపతి పదవికి ఒక వ్యక్తి రెండు పర్యాయాలకు మించి పోటీ చేయరాదు. లోక్సభలో మెజారిటీ పార్టీ నాయకుని మాత్రమే ప్రధానిగా నియమించడం మొదలగునవి.

2. దృఢ, సరళ రాజ్యాంగాల సమ్మేళనం భారత రాజ్యాంగ నిర్మాతలు సమయం, సందర్భాలను బట్టి దృఢ, సరళ లక్షణాలు గల రాజ్యాంగాన్ని భారత ప్రజలకు అందించారు. భారత రాజ్యాంగం 368వ ప్రకరణ రాజ్యాంగ సవరణ విధానాన్ని సూచిస్తుంది.

  1. నూతన రాష్ట్రాల ఏర్పాటు (ఉదా : తెలంగాణ) భారత పౌరసత్వం, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలు వంటి అంశాల సవరణకు సరళమైన పద్ధతి పేర్కొన్నది.
  2. రాష్ట్రపతి ఎన్నిక కేంద్రప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాలు, కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలలోని అంశాలు మొదలగు వాటిని సవరించేందుకు పార్లమెంటు ఉభయసభలలో 2/3వ వంతు సభ్యుల ఆమోదంతోబాటు సగానికిపైగా రాష్ట్ర శాసనసభల ఆమోదం అవసరం. ఈ సందర్భంలో మన రాజ్యాంగం పాక్షిక, సరళ, పాక్షిక దృఢమైన పద్ధతిని అనుసరించాల్సి ఉంటుంది.
  3. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు వంటి కొన్ని అంశాలను సవరించేందుకు పార్లమెంటులో ప్రత్యేక మెజారిటీ సభ్యుల ఆమోదం అవరమవుతుంది.

3. అర్ధ సమాఖ్య రాజ్యం : భారత రాజ్యాంగంలో కొన్ని సమాఖ్య లక్షణాలు, కొన్ని ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయి. ఉదా : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుండటం, వాటి మధ్య అధికారాల విభజన, సుప్రీంకోర్టు, లిఖిత రాజ్యాంగం, దృఢ రాజ్యాంగం వంటి సమాఖ్య లక్షణాలు ఉన్నాయి. అట్లాగే ఒకే రాజ్యాంగం, ఒకే ఎన్నికల సంఘం, ఒకే పౌరసత్వం, ఏకీకృత న్యాయవ్యవస్థ, రాష్ట్రాల కంటే కేంద్రానికే ఎక్కువ అధికారాలు వంటి ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయి. భారతదేశంలో విచ్ఛిన్నకర ధోరణులను అరికట్టేందుకు రాజ్యాంగ నిర్మాతలు దృఢమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. పండితుడు కె.సి.వేర్ భారతదేశాన్ని అర్ధ సమాఖ్యగా వర్ణించడమైనది.

4. గణతంత్ర ప్రభుత్వం : పూర్వపు, వలస సౌర్వభౌమత్వ రాజ్యం ఇంగ్లండ్ వలె కాకుండా భారత రాజ్యాంగ నిర్మాతలు భారత గణతంత్ర ప్రభుత్వాన్ని సూచించారు. అటువంటి సంవిధానంలో అన్ని ప్రభుత్వ పదవులు అర్హతగల పౌరులకు అందుబాటులో ఉంటాయి. వంశపారంపర్య సూత్రానికి ఎటువంటి అవకాశం లేదు. ఎందుకంటే రాచరికం అనేది అప్రజాస్వామికమైంది.

5. పార్లమెంటరీ ప్రభుత్వం : భారత రాజ్యాంగం పార్లమెంటరీ ప్రభుత్వ పద్ధతిని కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో ప్రవేశపెట్టింది. రాజ్యాంగ నిర్మాతలు ఐర్లాండ్ తరహాలో ఎన్నికైన దేశాధ్యక్షుడు ఉన్న పద్ధతిని సూచించారు. బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థలో మిగిలిన లక్షణాలైన రెండు రకాల కార్య వర్గాధిపతులు, ప్రధానమంత్రి నాయకత్వం, సమిష్టి బాధ్యత, పార్లమెంటుకు కార్యవర్గంపై నియంత్రణ, రాజ్యాధినేతకు నామమాత్ర కార్యనిర్వాహక వర్గ హోదా వంటి అంశాలను భారత రాజకీయ వ్యవస్థలో ఆమోదించడం జరిగింది. రాష్ట్రాలలో కూడా పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్నే సూచించడం జరిగింది.

6. ప్రాథమిక హక్కులు – ప్రాథమిక బాధ్యతలు : భారత రాజ్యాంగం మూడో భాగంలో 12 నుంచి 25 వరకు గల ప్రకరణలు పౌరులందరికీ ప్రధానమైన మానవ హక్కులను అందించాయి. అటువంటి హక్కులు న్యాయబద్ధమైనవిగా ఉంటూ మౌలికస్వాతంత్ర్యాలను పౌరులను ప్రసాదిస్తాయి. అధికార దుర్వినియోగాన్ని నివారిస్తాయి. ఇక రాజ్యాంగం (42వ సవరణ) చట్టం రాజ్యాంగం నాలుగో భాగంలో 51 A నిబంధనలో ప్రాథమిక విధులను చేర్చింది. ప్రాథమిక విధులన్నీ న్యాయబద్ధమైనప్పటకీ పౌరులు కొన్ని బాధ్యతలకు నిర్వర్తించాల్సిన ఆవశ్యకతను అవి పేర్కొంటాయి.

7. ఏక పౌరసత్వం : భారత రాజ్యాంగం సమాఖ్య పద్ధతి ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని కలిగి ఉన్నప్పటికీ పౌరులందరికీ ఒకే పౌరుసత్వాన్ని ప్రసాదించింది. అమెరికాలాంటి దేశాలలో పౌరులు కేంద్రం, రాష్ట్రాలలో రెండింటిలో పౌరసత్వాన్ని కలిగి ఉంటారు. కానీ భారతదేశంలో పౌరులు ఏ రాష్ట్రంలో జన్మించినప్పటికీ దేశవ్యాప్తంగా ఒకేరకమైన హక్కులను అనుభవిస్తారు. జమ్మూకాశ్మీర్, గిరిజన ప్రాంతాలలో నివసించే వారిని మినహాయిస్తే మిగతా ప్రజల మధ్య ఎటువంటి విచక్షణ పాటించబడదు.

8. వయోజన ఓటుహక్కు: పార్లమెంటు, రాష్ట్ర శాసన సభలకు జరిగే ఎన్నికలలో ప్రతినిధులను ఎన్నుకొనేందుకు భారత రాజ్యాంగం 18 ఏండ్లు నిండిన పౌరులందరికీ ఓటుహక్కును ప్రసాదించింది. దాని ప్రకారం వయోజన పౌరులందరికీ కులం, తెగ, మతం, లింగం, అక్షరాస్యతలతో సంబంధం లేకుండా ఓటుహక్కు ఇచ్చింది. అటువంటి ఏర్పాటు భారత ప్రజాస్వామ్యానికి విశేషమైన ప్రాముఖ్యతనిచ్చి సామాన్యప్రజల ఆత్మగౌరవం, ప్రతిష్టలను పెంపొందిస్తుంది. సమానత్వ సూత్రాన్ని సమర్థించి, మైనారిటీల ప్రయోజనాలను కాపాడుకొనేందుకు, సమాజంలోని బలహీనవర్గాలలో నూతన ఉత్తేజాలకు వీలు కల్పిస్తుంది.

9. లౌకిక రాజ్యం : భారత రాజ్యాంగం లౌకిక రాజ్యానికి ప్రతీకగా ఉంటుంది. మన రాజ్యాంగం భారతదేశంలో ఏ ఒక్కమతాన్ని అధికార మతంగా గుర్తించదు. మతప్రాతిపదికపై కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేసింది. అయితే తాత్కాలిక ప్రాతిపదికపై షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి శాసననిర్మాణంలో తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకై రిజర్వేషన్ సౌకర్యాలను కల్పించింది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 1 భారత రాజ్యాంగం

10. స్వతంత్ర న్యాయశాఖ : సమాఖ్య వ్యవస్థలో రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేందుకు స్వతంత్ర న్యాయశాఖ అనేది అత్యంత ఆవశ్యకమైంది. శాసన నిర్మాణ, కార్యనిర్వహక శాఖల అధికారాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అది అవసరమవుతుంది. భారత సుప్రీంకోర్టు క్రమేణా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైందిగా ఆవిర్భవించింది. స్వతంత్ర హోదా ఉండుటచేత, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు దేశంలో శాసన నిర్మాణ, కార్యనిర్వాహక సంస్థల చర్యలను విధానాలలోని ఔచిత్యాన్ని నిర్ణయించగలుగుతారు.

11. ఆదేశక నియమాలు: భారత రాజ్యాంగం నాలుగో భాగంలో 36 నుంచి 51 వరకు గల ప్రకరణలు ఆదేశక నియమాలను ప్రస్తావించాయి. భారత రాజ్యాంగ నిర్మాతలు వాటిని ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. ఆ నియమాలు సమాఖ్య రాజ్య భావనను ప్రతిబింబిస్తాయి. అవి ప్రభుత్వాలకు ఇవ్వబడిన ఆజ్ఞలు. సమానమైన పనికి సమాన వేతనం, ఉపాధి అవకాశాల కల్పన, సంపద న్యాయమైన రీతిలో పంపిణీ, వృద్ధాప్య పించన్లు, అస్వస్థత నుంచి కాపాడడం, శ్రామికులకు విశ్రాంతి, వన్యప్రాణుల సంరక్షణ, మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులను కాపాడడం వంటివి ఆదేశక నియమాలకు కొన్ని ఉదాహరణలు. ఆదేశక సూత్రాలకు న్యాయ స్వభావం లేకపోయినప్పటికీ వాటిని ఏ బాధ్యతాయుత ప్రభుత్వము విస్మరించరాదు.

12. ద్విసభా విధానం : భారత రాజ్యాంగం జాతీయ స్థాయిలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టింది. దానికి అనుగుణంగా భారత పార్లమెంటులో లోక్సభ (దిగువ సభ), రాజ్యసభ (ఎగువ సభ) అనే రెండు సభలు ఉంటాయి. లోక్సభ దేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహించగా, రాజ్యసభ రాష్ట్రాల ప్రయోజనాల పరిరక్షణకు ఉద్దేశించింది. భారత రాజ్యాంగ నిర్మాతలు బ్రిటన్, అమెరికాలు అనుసరిస్తున్న ద్విసభావిధానాన్ని మన దేశానికి సూచించడమైంది.

13. పంచాయితీరాజ్, మునిసిపాలిటి చట్టాలు : ఇతర సమాఖ్య రాజ్యాంగాల వలె, భారత రాజ్యాంగం ప్రారంభంలో కేంద్రం, రాష్ట్రాలతో కూడిన రెండు ప్రభుత్వాలతో కూడిన రాజకీయ సంవిధానాన్ని ఏర్పరచింది. తరువాత రాజ్యాంగం (73వ, 74వ సవరణలు) చట్టాల ద్వారా పంచాయితీలు, మునిసిపాలిటీలకు రాజ్యాంగపరమైన గుర్తింపుకు ఏర్పాట్లు గావించింది. అటువంటి ఏర్పాట్లు ప్రపంచంలోని ఏ ఇతర రాజ్యాంగాలలోను లేకపోవడం ఒకే విశేషంగా ఈ సందర్భంలో పేర్కొనవచ్చు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాజ్యాంగం ముఖ్యాంశాలను క్లుప్తంగా వివరించండి.
జవాబు:
ప్రజలు, ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధాన్ని సూచించే కొన్ని నిర్దిష్ట నియమాల సముదాయాన్ని రాజ్యాంగం అని అంటారు. రాజ్యం, ప్రభుత్వాల అధికారాలు, విధులకు రాజ్యాంగం ముఖ్య ప్రాతిపదికగా ఉంటుంది. అదేవిధంగా పౌరుల హక్కులు, బాధ్యతలకు సంబంధించిన ప్రధాన ప్రామాణికతకు నిదర్శనం రాజ్యాంగమే. అందుకనే “ప్రభుత్వం పనిచేసే విధానాన్ని తెలిపే నిర్ధిష్ట నియమాల సముదాయమే రాజ్యాంగం” అని లార్డ్ బ్రైస్ పేర్కొన్నాడు.

రాజ్యాంగం – ముఖ్యాంశాలు :
1) సంఘంలో సభ్యులు, సముదాయాల మధ్య సమన్వయాన్ని చేకూర్చేందుకై అవసరమైన ప్రాథమిక నియమాలను రాజ్యాంగం సూచిస్తుంది. సంఘంలో శక్తి (power) పంపిణీ (distribution) గురించి అది ప్రత్యేకంగా పేర్కొంటుంది. చట్టాలను ఎవరు రూపొందిస్తారు ? అనే అంశాన్ని నిర్ణయిస్తుంది. ఉదాహరణకు భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులు చట్టాలను రూపొందిస్తారు. అందుకు భిన్నంగా ప్రజా గణతంత్ర చైనా దేశంలో కమ్యూనిస్టుపార్టీ సర్వాధికారాలు చెలాయిస్తూ, చట్టాలను రూపొందిస్తుంది. సౌదీ అరేబియా వంటి రాజరికం అమల్లో ఉన్న రాజ్యంలో చట్ట స్వభావాన్ని రాజు నిర్ణయిస్తాడు. మొత్తంమీద భారతదేశంలో పార్లమెంటు లేదా రాష్ట్ర శాసన సభలు చట్టాల రూపకల్పనకు రాజ్యాంగం వీలు కల్పించింది.

2) రాజ్యాంగం ప్రభుత్వ నిర్మితిని నిర్దేశిస్తుంది. ఆధునిక ప్రభుత్వాలు i) శాసన నిర్మాణ శాఖ ii) కార్యనిర్వాహక శాఖ iii) న్యాయశాఖ అనే మూడు అంశాలతో కూడి ఉంటాయి. రాజ్యాంగం నిర్దేశించిన పరిమితులకు లోబడి శాసన నిర్మాణశాఖ చట్టాలను రూపొందించగా, దేశాధ్యక్షుడు లేదా రాష్ట్ర గవర్నర్, ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రితో కూడిన మంత్రివర్గాలు పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలు సమకూర్చిన మార్గదర్శకాలకు లోబడి, విధాన నిర్ణయాలను
తీసుకొంటారు.

3) రాజ్యాంగం పాలితులు, ప్రభుత్వానికి మధ్య సంబంధాన్ని పేర్కొంటుంది. ప్రాథమిక హక్కులు, ప్రాథమిక బాధ్యతలు అనేవి పౌరుల హక్కులు. ప్రభుత్వ కర్తవ్యాల గురించి సంపూర్ణంగా ప్రస్తావించాయి. భారత రాజ్యాంగం మూడో భాగం, నాల్గో భాగం (ఎ) లు రాజ్యం, పౌరుల మధ్య పరస్పర సంబంధాన్ని సూచిస్తాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 1 భారత రాజ్యాంగం

4) ప్రతి సంఘానికి (society) కొన్ని నిర్దిష్టమైన ఆకాంక్షలు, ఆశయాలు ఉంటాయి. రాజ్యం అనేది ప్రజల కనీస అవసరాలను సంతృప్తిపరచేందుకై, ప్రజలందరికి మంచి జీవనాన్ని అందించేందుకై ఆవిర్భవించింది. ప్రజల శ్రేయస్సుకై రాజ్యం (ప్రభుత్వం ద్వారా) కృషిచేయాల్సి ఉంటుందని రాజ్యాంగం పేర్కొంటుంది.

5) వర్తమాన, భావితరాలలో సంభవించే అస్థిర పరిస్థితులను నివారించేందుకు సర్వోన్నత ప్రతి అయిన రాజ్యాంగం దోహదపడుతుంది. ఎటువంటి మార్పులనైనా ఆమోదించేందుకు, అలాగే ఏవిధమైన ఒడిదుడుకులను తట్టుకొనే విధంగా రాజ్యాంగం రూపొందుతుంది. రాజ్యాంగం అనేది సజీవ ప్రతిగా ఉంటుంది. అది భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలలో రాజ్యానికి సంబంధించిన విషయాలను జతపరుస్తుంది.

ప్రశ్న 2.
భారత రాజ్యాంగం నిర్మాణం గురించి తెలపండి.
జవాబు:
ఒకవైపు భారత్, పాకిస్తాన్ల మధ్య అధికారాల మార్పిడికి సంబంధించిన కసరత్తు జరుగుతుండగా వేరొకవైపు భారతదేశానికి ప్రత్యేక రాజ్యాంగాన్ని రూపొందించేందుకై రాజ్యాంగపరిషత్తు అనే సంస్థను ఏర్పాటు చేయడమైంది. 1946లో రాజ్యాంగ పరిషత్తు నిర్మాణం విషయంలో ముగ్గురు మంత్రుల బృందం, ప్రధాన రాజకీయ పార్టీల మధ్య అవగాహన కుదిరింది. రాజ్యాంగ పరిషత్తుకు పరోక్ష ఎన్నికలు నిర్వహించాలనీ, సభ్యులను రాష్ట్ర శాసనసభలలోని ఎన్నికైన సభ్యులు ఎన్నుకోవాలని సూచించడమైంది. రాజ్యాంగ పరిషత్తు మొత్తం సభ్యత్వ సంఖ్య 385కాగా అందులో 292 స్థానాలు బ్రిటీష్ ఇండియా పాలిత రాష్ట్రాలకు, 93 స్థానాలు స్వదేశీ సంస్థానాలకు కేటాయించడమైంది. 1946 డిసెంబరు 9వ తేదీన రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశం జరిగింది. ఆ సమావేశాన్ని అఖిల భారత ముస్లిం లీగ్ సభ్యులు బహిష్కరించడమైంది. మొత్తం మీద భారత రాజ్యాంగాన్ని ఖరారు చేసేందుకై భారత రాజ్యాంగ పరిషత్తుకు రెండు సంవత్సరాల 11 నెలల 17 రోజులు సమయం పట్టింది. రాజ్యాంగ పరిషత్తు సభ్యులు కేవలం పార్టీ ప్రాతిపదికపై ఎన్నుకోబడి, భారతీయ ప్రజానీకానికి చెందిన దాదాపు ప్రతి వర్గానికి ప్రాతినిధ్యం వహించారని చెప్పవచ్చు. రాజ్యాంగ పరిషత్తులో స్ఫూర్తిదాయకంగా వ్యవహరించిన వారిలో జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ రాజేంద్రప్రసాద్, సర్దార్ వల్లబాయ్ పటేల్ వంటి ప్రముఖుల పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి ఉంటుంది. పైన పేర్కొన్న ముగ్గురు నాయకులు రాజ్యాంగ ప్రధాన సూత్రాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. అయితే భారత రాజ్యాంగానికి జవసత్త్వాలను అందించినవాడిగా భారత రాజ్యాంగ ముసాయిదా సంఘం అధ్యక్షుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ను పేర్కొనవచ్చు. భారత రాజ్యాంగ ముసాయిదా రచనలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్కు సహాయ సహకారాలను అందించిన ప్రముఖ న్యాయవేత్తలలో అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్. గోపాలస్వామి అయ్యంగార్, ఎమ్.మునీ, టి.టి కృష్ణమాచారి వంటి వారు ఉన్నారు. ఇక రాజ్యాంగానికి పునాదుల ఏర్పాటుకు సంబంధించిన నివేదికలను అందించిన కమిటీలలో కేంద్ర ప్రభుత్వ అధికారాల కమిటీ, కేంద్రప్రభుత్వ నిర్మాణపు కమిటీ, ప్రాథమిక హక్కులు, మైనారిటీ హక్కుల కమిటీ వంటివి ఉన్నాయి. అంతిమంగా భారతరాజ్యాంగ పరిషత్తు భారత రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26వ తేదీన ఆమోదించింది. భారత రాజ్యాంగం అధీకృత ప్రతిపై రాజ్యాంగ పరిషత్తు సభ్యులు సంతకం చేసిన తరువాత అది 1950 జనవరి 26వ తేదీనాడు అమల్లోకి వచ్చింది.

ప్రశ్న 3.
భారత రాజ్యాంగం ఆధారాలను వర్ణించండి. [Mar. ’17, ’16]
జవాబు:
భారత రాజ్యాంగం అనేక అనుభవాల ఆధారంగా రూపొందించి, ప్రపంచంలోని అనేక రాజ్యాంగాలలోని ఉత్తమ లక్షణాలను భారత రాజ్యాంగంలో పొందుపరచడమైంది. అలాగే భారతదేశంలోని రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను, రాజకీయ వారసత్వాన్ని దృష్టిలో ఉంచుకొని భారత రాజ్యాంగాన్ని రచించడమైంది.
మొత్తం మీద భారత రాజ్యాంగ రచన సమయంలో క్రింది ఆధారాలను రాజ్యాంగ నిర్మాతలు స్వీకరించారు.
1. భారత రాజ్యాంగంలోని అనేక అంశాలు బ్రిటిష్ రాజ్యాంగానికి ప్రాతిపదికగా ఉన్న ‘వెస్ట్ మినిస్టర్ తరహా పద్దతి నుండి గ్రహించడం జరిగింది. పార్లమెంటరీ సంప్రదాయాలు, సమన్యాయపాలన, కేబినెట్ ప్రభుత్వం, శాసన నిర్మాణ – కార్యనిర్వాహక శాఖల మధ్య సంబంధం, ఏక పౌరసత్వం, నామమాత్ర కార్యనిర్వాహక అధిపతి వంటివి అందుకు ఉదాహరణలు.

2. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, న్యాయ సమీక్ష, సమాఖ్య విధానం, రాష్ట్రపతి ఎన్నిక, రాష్ట్రపతిపై మహాభియోగ తీర్మాన ప్రతిపాదన వంటి అంశాలు అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది.

3. రాజ్య విధాన ఆదేశక సూత్రాలను రాజ్యాంగ నిర్మాతలు ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి స్వీకరించారు.

4. జర్మనీ వైమర్ రాజ్యాంగం నుంచి భారత రాష్ట్రపతికి సంబంధించిన అత్యవసర అధికారాలను రాజ్యాంగ నిర్మాతలు గ్రహించారు.

5. ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి ఉమ్మడి జాబితా, వర్తకం, వాణిజ్యం, అంతర్రాష్ట్ర రవాణా, పార్లమెంటు, శాసనసభల సభ్యుల ప్రత్యేక హక్కులు వంటి విషయాలను భారత రాజ్యాంగంలో చేర్చడమైంది.

6. భారత రాజ్యాంగంలోని కేంద్ర, రాష్ట్ర సంబంధాల శీర్షికను కెనడా రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది.

7. దక్షిణాఫ్రికా నుంచి రాజ్యాంగ సవరణకు సంబంధించిన అధికరణాలను భారత రాజ్యాంగంలో పొందుపరచడమైంది.

8. గణతంత్ర రాజ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలకు సంబంధించిన అంశాలు ఫ్రాన్స్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది.

9. భారత రాజ్యాంగంలోని అత్యధిక అంశాలు భారత ప్రభుత్వ చట్టం, 1935 నుంచి గ్రహించడమైంది. పైన పేర్కొన్న రాజ్యాంగాల నుంచి అనేక అంశాలను గ్రహించడం వల్ల భారత రాజ్యాంగం అధిక పరిమాణంతో కూడిన సుదీర్ఘమైన రాజ్యాంగంగా గుర్తింపు పొందింది.
దానితో భారత్ రాజ్యాంగాన్ని కొందరు ఐరావతంతో పోల్చారు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 1 భారత రాజ్యాంగం

ప్రశ్న 4.
భారత రాజ్యాంగంలోని ఏవైనా మూడు ముఖ్య లక్షణాలను వివరించండి.
జవాబు:
1) గణతంత్ర ప్రభుత్వం : పూర్వపు, వలస సౌర్వభౌమత్వ రాజ్యం ఇంగ్లండ్ వలె కాకుండా భారత రాజ్యాంగ నిర్మాతలు భారత గణతంత్ర ప్రభుత్వాన్ని సూచించారు. అటువంటి సంవిధానంలో అన్ని ప్రభుత్వ పదవులు అర్హతగల పౌరులకు అందుబాటులో ఉంటాయి. వంశపారంపర్య సూత్రానికి ఎటువంటి అవకాశం లేదు. ఎందుకంటే రాచరికం అనేది అప్రజాస్వామికమైంది.

2) లౌకిక రాజ్యం : భారత రాజ్యాంగం లౌకిక రాజ్యానికి ప్రతీకగా ఉంటుంది. మన రాజ్యాంగం భారతదేశంలో ఏ ఒక్కమతాన్ని అధికార మతంగా గుర్తించదు. మతప్రాతిపదికపై కల్పించిన రిజర్వేషన్లను రద్దుచేసింది. అయితే తాత్కాలిక ప్రాతిపదికపై షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి శాసననిర్మాణంలో తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకై రిజర్వేషన్ సౌకర్యాలను కల్పించింది.

3) స్వతంత్ర న్యాయశాఖ : సమాఖ్య వ్యవస్థలో రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేందుకు స్వతంత్ర న్యాయ శాఖ అనేది అత్యంత ఆవశ్యకమైంది. శాసన నిర్మాణ, కార్యనిర్వహక శాఖల అధికారాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అది అవసరమవుతుంది. భారత సుప్రీంకోర్టు క్రమేణా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైందిగా ఆవిర్భవించింది. స్వతంత్ర హోదా ఉండుటచేత, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు దేశంలో శాసన నిర్మాణ, కార్యనిర్వాహక సంస్థల చర్యలను విధానాలలోని ఔచిత్యాన్ని నిర్ణయించగలుగుతారు.

ప్రశ్న 5.
“భారత రాజ్యాంగం ఆత్మయే ప్రవేశిక” వ్యాఖ్యానించండి.
జవాబు:
భారత రాజ్యాంగ లక్షణాలలో ప్రవేశిక అత్యంత ముఖ్యమైంది. అది భారత రాజ్యాంగ మూలతత్త్వాన్ని సూచిస్తుంది. రాజ్యాంగ నిర్మాతల ఆశయాలు, ఆకాంక్షలు, లక్ష్యాలను ప్రతిబింబిస్తుంది. జవహర్లాల్నెహ్రూ ప్రవేశికను ఒక నిశ్చయాత్మక తీర్మానం ప్రమాణం, హామీగా వర్ణించారు. ప్రవేశిక ‘భారతీయులమైన మేము, మా కోసం రాజ్యాంగాన్ని ‘సమర్పించుకుంటున్నాం’ అనే భావాన్ని వ్యక్తీకరించింది. భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించింది. భారతీయులకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయాలను ప్రసాదిస్తున్నట్లు వెల్లడించింది. భారతదేశంలో సర్వసత్తాధికారం అంతిమంగా భారత ప్రజలకే చెందుతుందనీ స్పష్టీకరించింది. ప్రవేశికను సుప్రీంకోర్టు న్యాయమూర్తి మధోల్కర్ రాజ్యాంగ ప్రధాన లక్షణాల సారం’ అని వర్ణిస్తే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిదయతుల్లా రాజ్యాంగపు ఆత్మగా ప్రస్తుతించారు.

1976లో భారత రాజ్యాంగపు 42వ సవరణ చట్టం తరువాత ప్రవేశిక క్రింది విధంగా ఉంది.

“భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి; పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వాతంత్ర్యాన్ని, అంతస్తుల్లోనూ, అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికీ, వారందరిలో వ్యక్తి గౌరవాన్నీ, జాతీయ సమైక్యతను, సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికీ; ఈ 1949 నవంబర్ 26వ తేదీన మా రాజ్యాంగ పరిషత్తులో ఆమోదించి, శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం”.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
లిఖిత పూర్వక రాజ్యాంగం.
జవాబు:
పెద్ద లిఖిత రాజ్యాంగం: భారత రాజ్యాంగం లిఖిత రాజ్యాంగం. భారత రాజ్యాంగము ప్రపంచ రాజ్యాంగాలన్నింటిలోకి అతిపెద్ద రాజ్యాంగము. ఇందులో ప్రస్తుతం 444 అధికరణాలు, 12 ప్రకరణాలు ఉన్నాయి. రాజ్యాంగంలో 22 భాగాలున్నాయి. ఇప్పటి వరకు 100 సార్లు పైగా రాజ్యాంగం సవరించబడింది. ఇవన్నీ రాజ్యాంగంలో భాగమయ్యాయి. అన్ని వివరాలు పొందుపరచడం వలన రాజ్యాంగం పెద్దదిగా తయారైంది. ఐవర్ జెన్నింగ్స్ అనే రచయిత “భారత రాజ్యాంగం ప్రపంచంలో అతిదీర్ఘము, వివరణాత్మక రాజ్యాంగం” అని వర్ణించాడు. కొన్ని అలిఖిత నియమాలు కూడా ఉన్నాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 1 భారత రాజ్యాంగం

ప్రశ్న 2.
దృఢ రాజ్యాంగం.
జవాబు:
రాజ్యాంగంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను అత్యంత కఠినమైన రీతిలో సవరించడానికి వీలుంటే, మరికొన్ని అంశాలను సరళమైన రీతిలో మార్పు చేయవచ్చు. ఇంకొన్ని అంశాలను సగం కఠినమైన, సగం సరళమైన రీతిలో మార్పు చేయవచ్చు. భారత రాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టుల అధికారాలు, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు వంటి అంశాలను సవరించడానికి రాజ్యాంగ నిర్మాతలు పరుషమైన పద్ధతిని సూచించారు. రాష్ట్రాల పేర్లు, సరిహద్దులు, విస్తీర్ణం, విలీనం లేదా విభజన, రాష్ట్ర శాసనమండళ్ళ ఏర్పాటు లేదా రద్దువంటి అంశాలను సులభమైన రీతిలో సవరించడానికి వీలుకల్పించారు. ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాలు వంటి అంశాలను మార్పు చేయడానికి | పాక్షిక కఠిన, పాక్షిక సరళ పద్ధతికి అవకాశం ఇచ్చారు.

ప్రశ్న 3.
పార్లమెంటరీ ప్రభుత్వం.
జవాబు:
భారత రాజ్యాంగం పార్లమెంటరీ ప్రభుత్వ పద్ధతిని కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో ప్రవేశపెట్టింది. రాజ్యాంగ నిర్మాతలు | ఐర్లాండ్ తరహాలో ఎన్నికైన దేశాధ్యక్షుడు ఉన్న పద్ధతిని సూచించారు. బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థలో మిగిలిన లక్షణాలైన రెండు రకాల కార్య వర్గాధిపతులు, ప్రధానమంత్రి నాయకత్వం, సమిష్టి బాధ్యత, పార్లమెంటుకు కార్యవర్గంపై నియంత్రణ, రాజ్యాధినేతకు నామమాత్ర కార్యనిర్వాహక వర్గ హోదా వంటి అంశాలను భారత రాజకీయ వ్యవస్థలో ఆమోదించడం జరిగింది. రాష్ట్రాలలో కూడా పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్నే సూచించడం జరిగింది.

ప్రశ్న 4.
ప్రాథమిక హక్కులు.
జవాబు:
రాజ్యాంగంలోని 3వ భాగంలో 12వ అధికరణం నుండి 35వ అధికరణం వరకు ప్రాథమిక హక్కులను ప్రస్తావించారు. ఈ ప్రాథమిక హక్కులను 7 రకాలుగా విభజించవచ్చును. ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులే ఉన్నాయి. ఆస్తి హక్కును 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు. ఇవి ప్రజలకు స్వేచ్ఛనిస్తాయి. వీటికి భంగం కలిగితే పౌరులు న్యాయస్థానాల ద్వారా రక్షించుకోవచ్చు. స్వేచ్ఛ హక్కు, సమానత్వపు ” హక్కు, మత స్వాతంత్య్రపు హక్కు మొదలగునవి ప్రాథమిక హక్కులు. అత్యవసర పరిస్థితిలో రాష్ట్రపతి వీటిని తాత్కాలికంగా రద్దు చేయవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాథమిక హక్కులు చాలా అవసరము. ప్రాథమిక హక్కులు న్యాయసమ్మతమైనవి. ఇవి నిరపేక్షమైనవి కావు.

ప్రశ్న 5.
లౌకిక రాజ్యం.
జవాబు:
భారత రాజ్యాంగం లౌకిక రాజ్యానికి ప్రతీకగా ఉంటుంది. మన రాజ్యాంగం భారతదేశంలో ఏ ఒక్క మతాన్ని |అధికార మతంగా గుర్తించదు. మతప్రాతిపదికపై కల్పించిన రిజర్వేషన్లను రద్దుచేసింది. అయితే తాత్కాలిక ప్రాతిపదికపై షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి శాసన నిర్మాణంలో తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకై రిజర్వేషన్ సౌకర్యాలను కల్పించింది.

ప్రశ్న 6.
వయోజన ఓటుహక్కు.
జవాబు:
పార్లమెంటు, రాష్ట్రశాసన సభలకు ఎన్నికలలో ప్రతినిధులను ఎన్నుకొనేందుకు భారత రాజ్యాంగం 18 ఏండ్లు నిండిన పౌరులందరికీ ఓటుహక్కును ప్రసాదించింది. దాని ప్రకారం వయోజన పౌరులందరికీ కులం, తెగ, మతం, లింగం, అక్షరాస్యతలతో సంబంధం లేకుండా ఓటుహక్కు ఇచ్చింది. అటువంటి ఏర్పాటు భారత ప్రజాస్వామ్యానికి విశేషమైన ప్రాముఖ్యతనిచ్చి సామాన్య ప్రజల ఆత్మగౌరవం, ప్రతిష్టలను పెంపొందిస్తుంది. సమానత్వ సూత్రాన్ని సమర్థించి, మైనారిటీల ప్రయోజనాలను కాపాడుకొనేందుకు, సమాజంలోని బలహీనవర్గాలలో నూతన ఉత్తేజాలకు వీలు కల్పిస్తుంది.

ప్రశ్న 7.
ద్విసభా విధానం.
జవాబు:
భారత రాజ్యాంగం జాతీయ స్థాయిలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టింది. దానిని అనుగుణంగా భారత పార్లమెంటులో లోక్సభ (దిగువ సభ), రాజ్యసభ (ఎగువ సభ), అనే రెండు సభలు ఉంటాయి. లోక్సభ దేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహించగా, రాజ్యసభ రాష్ట్రాల ప్రయోజనాలు పరిరక్షణకు ఉద్దేశించింది. భారత రాజ్యాంగ నిర్మాతలు బ్రిటన్, అమెరికాలు అనుసరిస్తున్న ద్విసభావిధానాన్ని మన దేశానికి సూచించడమైంది.

ప్రశ్న 8.
ఆదేశిక నియమాలు.
జవాబు:
భారత రాజ్యాంగం నాలుగో భాగంలో 36 నుంచి 51 వరకు గల ప్రకరణలు ఆదేశిక నియమాలు ప్రస్తావించాయి. భారత రాజ్యాంగ నిర్మాతలు వాటిని ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. ఆ నియమాలు సమాఖ్య రాజ్య భావనను ప్రతిబింబిస్తాయి. అవి ప్రభుత్వాలకు ఇవ్వబడిన ఆజ్ఞలు. సమానమైన పనికి సమాన వేతనం, ఉపాధి అవకాశాల కల్పన, సంపద న్యాయమైన రీతిలో పంపిణీ, వృద్ధాప్య పించన్లు, అస్వస్థత నుంచి కాపాడటం, శ్రామికులకు విశ్రాంతి, వన్య ప్రాణుల సంరక్షణ, మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులను కాపాడడం వంటివి ఆదేశిక నియయాలకు కొన్ని ఉదాహరణలు. ఆదేశిక సూత్రాలను న్యాయ స్వభావం లేకపోయినప్పటికీ వాటిని ఏ బాధ్యతాయుత ప్రభుత్వము విస్మరించరాదు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 1 భారత రాజ్యాంగం

ప్రశ్న 9.
న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తి.
జవాబు:
సమాఖ్య వ్యవస్థలో రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేందుకు స్వతంత్ర న్యాయశాఖ అనేది అత్యంత ఆవశ్యకమైంది. శాసన నిర్మాణ, కార్యనిర్వాహక శాఖల అధికారాలు దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అది అవసరమవుతుంది. భారత సుప్రీంకోర్టు క్రమేణా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైందిగా ఆవిర్భివించింది. స్వతంత్ర హోదా ఉండుట చేత, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు దేశంలో శాసన నిర్మాణ, కార్యనిర్వాహక సంస్థల చర్యలను విధానాలలోని జౌచిత్యాన్ని నిర్ణయించగలుగుతారు.

ప్రశ్న 10.
ప్రవేశిక. [Mar. ’17, ’16]
జవాబు:
రాజ్యాంగ నిర్మాతల ఆశయాలు, ఆకాంక్షలు, లక్ష్యాలను ప్రతిబింబిస్తుంది. జవహర్లాల్నెహ్రూ ప్రవేశికను ఒక నిశ్చయాత్మక తీర్మానం ప్రమాణం, హామీగా వర్ణించారు. ప్రవేశిక భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించింది. భారతీయులకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయాలను ప్రసాదిస్తున్నట్లు వెల్లడించింది. భారతదేశంలోని సర్వసత్తాధికారం అంతిమంగా భారత ప్రజలకే చెందుతుందని స్పష్టీకరించింది. ప్రవేశికను సుప్రీంకోర్టు న్యాయమూర్తి మధోల్కర్ రాజ్యాంగ ప్రధాన లక్షణాల సారం అని వర్ణిస్తే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిదయతుల్లా రాజ్యాంగపు ఆత్మగా ప్రస్తుతించారు.

AP Inter 2nd Year History Study Material Chapter 13 సమాకాలీన ప్రపంచ చరిత్ర

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 13th Lesson సమాకాలీన ప్రపంచ చరిత్ర Textbook Questions and Answers.

AP Inter 2nd Year History Study Material 13th Lesson సమాకాలీన ప్రపంచ చరిత్ర

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఐక్యరాజ్య సమితి ముఖ్య అంగాలను, దాని విధులను గూర్చి రాయండి.
జవాబు:
1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించింది. ఐ.రా.స లక్ష్యాలైన భద్రత, న్యాయం, సంక్షేమం, మానవ హక్కులు అనే లక్ష్యాలను సాధించడానికి అనేక విభాగాలున్నాయి.

ఐక్యరాజ్య సమితి ముఖ్య అంగాలు:
సాధారణ సభ (జనరల్ అసెంబ్లీ): ఐ.రా.సలోని ప్రతి సభ్య దేశము సాధారణ సభలో సభ్యులే. సాధారణ సభ ప్రతి సంవత్సరానికొకసారి సమావేశమౌతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో సాధారణ సభ ప్రత్యేక సమావేశాలు జరుగుతాయి.

సాధారణ సభ ఐ.రా.స. పనితీరుని వివరిస్తుంది, సమీక్షిస్తుంది, పర్యవేక్షిస్తుంది. అంతర్జాతీయ శాంతి భద్రతలు నెలకొల్పుటకు చర్చలు, సూచనలు చేస్తుంది. ఐ.రా.స. లోని వివిధ సంస్థలలో నియామకాలు చేపడుతుంది. ఐ.రా.స విత్త వ్యవహారాలను నియంత్రిస్తుంది.

భద్రతామండలి: ఇది ఐ.రా.స కార్యనిర్వాహక అంగం. దీనిలో 5 శాశ్వత సభ్యదేశాలు మరియు 10 తాత్కాలిక దేశాలు ఉంటాయి. అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ మరియు చైనాలు సభ్యదేశాలు. మిగిలిన 10 తాత్కాలిక సభ్యదేశాలు రెండు సంవత్సరాల కాలపరిమితి కొరకు సాధారణ సభ రొటేషన్ పద్ధతిలో ఎన్నుకుంటుంది.

AP Inter 2nd Year History Study Material Chapter 13 సమాకాలీన ప్రపంచ చరిత్ర

సాధారణ విషయాలలో భద్రతామండలి సభ్యదేశాలు 15 ఓట్లలో 9 ఓట్లు వస్తే మెజారిటీగా పరిగణించబడతాయి. కానీ ముఖ్యమైన అంశాలలో చర్చ జరిగేటపుడు తొమ్మిది ఓట్లలో ఐదు శాశ్వత సభ్యదేశాల ఓట్లు ఖచ్చితంగా తీర్మానానికి అనుకూలంగా ఉండాలి. శాశ్వత సభ్యదేశాలకు వీటో హక్కు ఉంటుంది. భద్రతామండలి అవసరమైనప్పుడల్లా సమావేశమవుతుంది. భద్రతామండలి సభ్యదేశాల ప్రతినిధులు న్యూయార్క్ లో ఉంటారు.

ఆర్థిక మరియు సాంఘిక మండలి: ఈ మండలిలో 54 మంది విభిన్న దేశాలకు చెందిన సభ్యులు ఉంటారు. వీరు సాధారణ సభచే ఎంపిక చేయబడతారు. వీరి కాలపరిమితి 3 సంవత్సరాలు. ప్రతి మూడు సంవత్సరాలకు మూడవ వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు. కొత్త సభ్యులు వారి స్థానాలలో ఎన్నిక అవుతారు. ఆర్థిక మరియు సాంఘిక మండలి సంవత్సరానికి రెండు సమావేశాలు నిర్వహిస్తుంది. ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక సమస్యలను పరిష్కరించడమే దీని ముఖ్య విధి.

ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం, మానవ హక్కులకు హామీ ఇవ్వడం, నిరుద్యోగాన్ని నిర్మూలించడం. వివిధ దేశాల సాంఘిక, ఆర్థిక అభివృద్ధి కొరకు ఈ మండలి కృషి చేస్తుంది. ఈ మండలి యునెస్కో, I.M.F, W.H.O. I.C.O, వంటి ఇతర సంస్థల సహకారంతో పనిచేస్తోంది.

ధర్మకర్తృత్వ మండలి: ఇది వలస దేశాల ప్రతినిధులతో, సాధారణ సభచే ఎన్నుకొనబడిన ప్రతినిధులతో కూడి ఉంటుంది. ఈ మండలి ముఖ్య విధి తనకు అప్పగించబడిన ప్రాంతాల అభీష్టాలను నెరవేర్చడం మరియు ఐ.రా.స. ధర్మకర్తృత్వంలో ఉన్న దేశాల పాలనలో జనరల్ అసెంబ్లీకి సహాయపడటం దీని ముఖ్య విధి.

అంతర్జాతీయ న్యాయస్థానం ఐ.రా.స యొక్క న్యాయమూర్తుల పదవీకాలం 9 సంవత్సరాలు. దేశాల మధ్య వచ్చే న్యాయ వివాదాలను పరిష్కరించడం దీని ముఖ్య విధి. భద్రతామండలి, జనరల్ అసెంబ్లీలకు అవసరమైనపుడు న్యాయ సలహాలను ఇస్తుంది.

సచివాలయం (సెక్రటేరియట్): ఐ.రా.స. రోజువారీ కార్యక్రమాలను సమితి సచివాలయం నిర్వహిస్తుంది. సచివాలయం ముఖ్య పాలనాధికారి సెక్రటరీ జనరల్ పదవీకాలం ఐదు సంవత్సరాలు. భద్రతామండలి ప్రతిపాదనతో సెక్రటరీ జనరల్ నియమింపబడతాడు. వివిధ దేశాలకు చెందిన అనేకమంది అధికారులు సెక్రటరీ జనరల్ పర్యవేక్షణలో పనిచేస్తారు. సచివాలయం ఐ.రా.స.కు చెందిన అన్ని రంగాలు రికార్డులను భద్రపరుస్తుంది. ఐ.రా.స. వివిధ రంగాల వార్షిక నివేదికలను జనరల్ అసెంబ్లీకి సమర్పిస్తాడు.

ప్రశ్న 2.
ఐక్యరాజ్య సమితి సాధించిన విజయాలను తెలపండి.
జవాబు:
ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించిన తొలినాళ్ళలో అనేక సమస్యలను పరిష్కరించడానికి కృషి చేసింది. కానీ అనేక సందర్భాలలో రష్యా వీటో హక్కును ఉపయోగించడం వలన కొన్ని సమస్యల పరిష్కారంలో ఆటంకాలు ఎదురయ్యాయి. అయినా ఐ.రా.స. స్థాపించబడిన కొద్ది కాలంలోనే అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేసింది. 1946లో రష్యా, ఇరాన్ ల మధ్య సమస్యను పరిష్కరించింది. ఫ్రాన్స్కు వ్యతిరేకంగా సిరియా, లెబనాన్ల వివాదం, డచ్-ఇండోనేషియా సమస్య, పాలస్తీనా సమస్య, కొరియా వివాదం, కాశ్మీర్ సమస్య పరిష్కారానికి చొరవ చూపింది.

రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఇండోనేషియా ప్రజలు హాలెండ్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి తమ దేశాన్ని స్వతంత్రంగా, రిపబ్లిక్ దేశంగా ప్రకటించుకున్నారు. హాలెండ్, ఇండోనేషియా స్వాతంత్య్రాన్ని తిరస్కరించడంతో ఇరు దేశాల మధ్య సాయుధ పోరాటం మొదలయ్యింది. భద్రతామండలి జోక్యం చేసుకుని ఇరు దేశాలను యుద్ధ విరమణకు అంగీకరింపజేసింది. ఇండోనేషియాకు స్వాతంత్య్రం ఇప్పించడంలో సాయపడింది.

పాలస్తీనా విషయంలో అరబ్లకు, బ్రిటన్కు మధ్య విభేదాలు రూపుమాపడానికి ఐ.రా.స. 1948 ఏప్రిల్లో ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదికను అనుసరించి పాలస్తీనా నుండి సాయుధ బలగాలను తొలగించి దాని అంతర్గత విషయంలో జోక్యం చేసుకోవద్దని బ్రిటన్ ను ఐ.రా.స. ఆదేశించింది.

ఇజ్రాయేల్ మీద అరబ్లు దాడి చేసినపుడు ఐ.రా.స. జోక్యం చేసుకొని ఆయుధ పోరాటాన్ని నివారించి వాటి మధ్య యుద్ధ విరమణ ఒప్పందాన్ని కుదిర్చింది. పాలస్తీనా కాందిశీకుల కొరకు సహాయ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి వారిని ఆదుకున్నది.

AP Inter 2nd Year History Study Material Chapter 13 సమాకాలీన ప్రపంచ చరిత్ర

రెండవ ప్రపంచ యుద్ధానంతరం కొరియా స్వాతంత్ర్యాన్ని పొందింది. కానీ, అది రెండుగా విభజింపబడింది. ఉత్తర కొరియా అప్పటి యు.ఎస్.ఎస్.ఆర్ ‘ నియంత్రణలోకి, దక్షిణ కొరియా అమెరికా, బ్రిటన్, చైనాల ఉమ్మడి నియంత్రణలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా, దక్షిణ కొరియాపై దాడిచేసింది. ఈ అంశంలో ఐ.రా.స. నిర్మాణాత్మక పాత్ర పోషించింది. జనరల్ మెక్ ఆర్థర్ నాయకత్వంలో దళాలను పంపి ఉత్తర కొరియా ఆగడాలను నియంత్రించింది. 1953లో ఇరుదేశాల మధ్య సంధి కుదిర్చి శాంతిని నెలకొల్పి యుద్ధాన్ని నివారించింది. 1966లో సూయజ్ కెనాల్ విషయంలో నెలకొన్న సంక్షోభాన్ని ఐ.రా.స. సమర్థవంతంగా పరిష్కరించింది.

ప్రశ్న 3.
ప్రచ్ఛన్న యుద్ధమనగానేమి ? అందులో భాగంగా ఏర్పడ్డ ఒడంబడికలు మరియు ప్రణాళికలను గురించి రాయండి.
జవాబు:
రెండవ ప్రపంచ యుద్ధకాలంలో రష్యా మరియు అమెరికాలు దగ్గరయ్యాయి. కానీ యుద్ధం అంతమైన తరువాత వారి సంబంధాలు కొంతమేర దెబ్బతిన్నాయి. వారి మధ్య శత్రుభావం ఏర్పడింది. ఈ వైరం యావత్ ప్రపంచాన్ని మూడవ ప్రపంచయుద్ధ అంచుల వరకు తీసుకొనిపోయింది. ఈ రెండు వ్యతిరేకశక్తుల మధ్య ఆయుధాలతో నిజమైన | పోరాటం జరగలేదు.

ప్రపంచంలోని రెండు అగ్రరాజ్యాల మధ్య ఉన్న సిద్దాంతపరమైన విభేదాలే ఈ ప్రచ్ఛన్న యుద్ధానికి కారణం. అమెరికా నాయకత్వంలోని పెట్టుబడిదారీ పాశ్చాత్యశక్తి, కమ్యూనిజంపై దాడి చేస్తుందేమోనని రష్యా భావించింది. అందువల్ల రష్యా తూర్పు యూరప్లో ఒక సోవియట్ కూటమిని ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించింది. యూరప్లో కమ్యూనిజం వ్యాప్తి, సోవియట్ యూనియన్ కూటమి అనేది పాశ్చాత్యదేశాలు, ప్రపంచంలో కమ్యూనిజం వ్యాప్తిని వ్యతిరేకించడానికి దారితీసాయి. ఈ దేశాలు మరో సైనికశక్తి కూటమిగా ఏర్పడ్డాయి. ఈ విధంగా ప్రపంచం రెండు విరుద్ధ శక్తి కూటములుగా విడిపోయింది. వీటిలో ఒకటి అమెరికా నాయకత్వంలోని పాశ్చాత్య శక్తి కూటమి కాగా మరొకటి యు.ఎస్.ఎస్.ఆర్. నాయకత్వంలోని ప్రాచ్యశక్తి కూటమి అయింది.

యు.ఎస్.ఎ. మరియు రష్యా దేశాల మధ్య మొదటగా విభేదాలు రావడానికి కారణం పోలెండ్, యుగోస్లేవియాల నాజీ వ్యతిరేక ప్రతిఘటన, సైనిక వ్యూహానికి యుద్ధానంతర పునర్నిర్మాణానికి సంబంధించిన సమన్వయం వంటి అంశాలలో ఇరుదేశాల మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయి.

రెండవ ప్రపంచ యుద్ధానికి ముందునుండే యూరప్ దేశాలైన పోలెండ్, బల్గేరియా, రుమేనియా, హంగరీ, యుగోస్లేవియా దేశాలలో రష్యా కమ్యూనిస్ట్ పాలన విధించింది. ఆ తరువాత సోవియట్ యూనియన్ తన దృష్టిని పశ్చిమ యూరప్ వైపునకు మళ్ళించింది. రాయితీలు పొందడానికి ఇది టర్కీ మీద, ఇరాక్ మీద ఒత్తిడి చేసింది. గ్రీసు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ విప్లవం తీసుకురావడానికి పథకం వేసింది. ఇటలీలో తన ప్రభావాన్ని విస్తరించింది. సోవియట్ రష్యాలో చేపట్టిన ఈ చర్యలను పాశ్చాత్య దేశాలు గొప్ప ఆందోళనతో గమనించాయి.

కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టే బాధ్యతను అమెరికా చేపట్టింది. యూరప్ ఖండంలో కమ్యూనిస్ట్ ప్రభావం పెరగడాన్ని అరికట్టడానికి ట్రూమన్ సిద్ధాంతాన్ని, మార్షల్ ప్రణాళికను ప్రతిపాదించింది. ఈ చర్యలు, ప్రతిచర్యలే ప్రచ్ఛన్న యుద్ధానికి నాంది పలికాయి.

ట్రూమన్ సిద్ధాంతము: గ్రీస్, టర్కీలకు సైనిక ఆర్థిక సహాయం అందించడానికి సంబంధించిన ప్రతిపాదనే ట్రూమన్ సిద్ధాంతం. సాయుధ తిరుగుబాట్లు లేదా విదేశీ ఒత్తిడి ద్వారా స్థానికులను అణచడానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రతిఘటించే ప్రజలకు సహాయం అందించే అమెరికా విధానాన్ని ట్యూమన్ సిద్ధాంతం అన్నారు. ఈ సిద్ధాంతం ఈ రెండు దేశాలలో విజయవంతమైంది.

మార్షల్ ప్రణాళిక: యూరప్లో కమ్యూనిజం పెరుగుదలను నివారించడానికి అమెరికా ఒక యూరప్ ఆర్థిక పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అమెరికా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ‘మార్షల్ ప్రణాళిక’ గా పేర్కొనడం జరిగింది. అమెరికా రాజ్య కార్యదర్శి అయిన మార్షల్ పేరునే దీనికి పెట్టడం జరిగింది.

ట్రూమన్ సిద్ధాంతానికి పొడిగింపే మార్షల్ ప్రణాళిక. ఈ ప్రణాళిక సర్వ సాధారణంగా యూరప్్కంతా వర్తిస్తుంది. ఇది ఒక ప్రత్యేక రాజ్యానికి పరిమితమైనది కాదు. ఇది నాలుగు సంవత్సరాల పాటు కొనసాగింది కాబట్టి విస్తృతమైన కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహించింది. రెండవ ప్రపంచ యుద్ధం వల్ల తలెత్తిన ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి దీన్ని ఉద్దేశించడమైనది. కమ్యూనిజంకు వ్యతిరేకంగా పోరాటం చేయాలనే అమెరికా దృఢ నిశ్చయాన్ని కూడా ఇది స్పష్టం చేసింది. ఈ ప్రణాళిక ప్రకారం యూరప్ లోని అనేక దేశాలు రెండవ ప్రపంచ యుద్ధానికి ముందున్న పటిష్ట స్థితికి చేరాయి. ఈ నేపథ్యంలో అమెరికా, సోవియట్ యూనియన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగి అనేక ఒప్పందాలు,
సంధులకు దారితీసాయి.

బ్రస్సెల్స్ సంధి: రష్యా ఆధిపత్యాన్ని నివారించడానికి బ్రిటన్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, లగ్జంబర్గ్ మొదలైన దేశాలు 1948 మార్చిలో బ్రస్సెల్స్ సంధి మీద సంతకాలు చేసాయి. ఈ సంధి పరస్పర సైనిక, ఆర్థిక, రాజకీయ సహకారాన్ని సమకూర్చింది.

నాటో: 1949 ఏప్రియల్ 4న సోవియట్ కూటమికి వ్యతిరేకంగా అమెరికా, కెనడా, బెల్జియం, డెన్మార్క్, ఫ్రాన్స్, ఇటలీ, ఇంగ్లాడ్, లగ్జంబర్గ్, నెదర్లాండ్, నార్వే, పోర్చుగల్, గ్రీస్, టర్కీ దేశాలతో కలిసి నాటో ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇది సోవియట్ కూటమికి వ్యతిరేకంగా ఏర్పాటయిన రక్షణాత్మక వ్యవస్థ. నాటో సభ్యులు విదేశీ దురాక్రమణకు వ్యతిరేకంగా వ్యష్టిగాకాని, సమిష్టిగా కాని పోరాడటానికి సంయుక్తంగా ప్రతిఘటించడానికి అంగీకరించారు. నాటో ఒప్పందం తర్వాత పశ్చిమ యూరప్ లో యుద్ధం జరగలేదు.

మాల్తోవ్ ప్రణాళిక: దీనిని రష్యా విదేశాంగ మంత్రి మాల్తోవ్ ప్రతిపాదించాడు. ఈ ప్రణాళికలో కమ్యూనిస్టు దేశాలన్నింటికి సభ్యత్వం ఉండేది. దీనిలో రష్యా, బల్గేరియా, పోలెండ్, రుమేనియా, తూర్పు యూరప్, మంగోలియా సభ్యులుగా ఉన్నారు. మార్షల్ ప్రణాళికకు ప్రతిచర్యగా రష్యా ప్రారంభించింది.

AP Inter 2nd Year History Study Material Chapter 13 సమాకాలీన ప్రపంచ చరిత్ర

వార్సా సంధి: అమెరికా ఏర్పాటు చేసిన నాటోకు వ్యతిరేకంగా 1955 మేలో రష్యా కమ్యూనిస్టు దేశంతో ఈ ఒప్పందాన్ని ప్రతిపాదించింది. అల్బేనియా, రష్యా, బల్గేరియా, హంగేరీ, తూర్పు జర్మనీ, జెకోస్లోవేకియా, రుమేనియా, పోలెండ్ దేశాలు ఆ ఒప్పందంపై సంతకం చేసారు. సంధి ప్రకారం ఏ సభ్యదేశమయినా విదేశీ ముట్టడికి గురైతే ఇతర సభ్యదేశాలన్ని ఆ ముట్టడిదారుడిని సమిష్టిగా ప్రతిఘటించాలి.

ఈ రెండు కూటముల విభజన 1991 డిసెంబర్ లో సోవియట్ సమాఖ్య పతనానంతరం గొప్ప మార్పులకు లోనయింది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అలీనోద్యమ ఆవిర్భావం గురించి వ్రాయండి.
జవాబు:
అమెరికా, రష్యాలు రెండు కూటములుగా ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న రోజులలో అలీనోద్యమం 1961లో ప్రారంభమయింది. కొత్తగా స్వాతంత్రాన్ని పొందిన ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాలలోని కొన్ని వారు కలిసి ఈ అలీనోద్యమాన్ని ప్రారంభించారు.

అలీనోద్యమం 1955 బాండుంగ్ సదస్సులో అంకురార్పణ జరిగింది. 23 ఆసియా దేశాల, 6 ఆఫ్రికా దేశాల ప్రతినిధులు ఇండోనేషియాలో సదస్సులో పాల్గొన్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు సుకార్నో, భారతదేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ,ఈజిప్ట్కు చెందిన నాజర్ అలీనోద్యమంలో కీలక పాత్ర వహించారు. చైనా ప్రధాని చౌ-ఎన్-లై కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. అలీనోద్యమ ముఖ్య ఉద్దేశాలను పంచశీల అంటారు. అవి:

  1. సభ్యదేశాల సార్వభౌమాధికారాన్ని, వారి సహజ సరిహద్దులను గౌరవించుట.
  2. సభ్యదేశాలు పరస్పరం యుద్ధానికి దిగరాదు..
  3. ఒకరి ఆంతరంగిక విషయాలలో మరొకరు జోక్యం చేసుకోరాదు.
  4. పరస్పర లాభాల కోసం సహకారాన్ని పెంచుకోవాలి.
  5. శాంతియుతంగా సభ్యదేశాలతో మెలగుట.

అలీనోద్యమాన్ని బలపరచిన దేశాలు ప్రచ్ఛన్న యుద్ధంలో భాగమైన అమెరికా కూటమిలోగాని, సోవియట్ కూటమిలోగాని చేరడానికి ఇష్టపడలేదు. ఆ విధంగా అలీనోద్యమం కొత్తగా స్వాతంత్రాన్ని పొందిన దేశాలు వారి స్వాతంత్రాన్ని కాపాడుకొంటూ అంతర్జాతీయ సమస్యలందు తటస్థంగా ఉండటానికి ఉద్దేశించబడింది.

ప్రశ్న 2.
నమీబియా ఎదుర్కొన్న సమస్యను గురించి SWAPO ఏవిధంగా పరిష్కరించిందో తెలపండి.
జవాబు:
దక్షిణ పశ్చిమ ఆఫ్రికా ప్రజల సమాఖ్య (SWAPO) ప్రస్తుతం నమీబియాగా ఏర్పడింది. ఈ ప్రాంతం జర్మనీ దేశానికి వలసగా మారింది. అక్కడి ఆఫ్రికా ప్రజలు జర్మనీ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించారు. జర్మనీ వారు కౄరంగా 80 వేల మంది నమీబియన్లను చంపివేశారు.

మొదట ప్రపంచ యుద్ధంలో జర్మనీ దక్షిణాఫ్రికా చేతిలో ఓడటంతో నానాజాతి సమితి నమీబియాను పశ్చిమ |ఆఫ్రికా పాలనతో ఉండేట్లు ఏర్పాటు చేసింది. కానీ దక్షిణాఫ్రికా వారు నమీబియాను ఆక్రమించుకున్నారు. 1968లో దక్షిణ పశ్చిమ ఆఫ్రికాకు నమీబియా అని నామకరణం చేసారు. భద్రతా మండలి వారు దక్షిణాఫ్రికాను నమీబియాపై ఆధిపత్యాన్ని వదలమని వత్తిడి చేసారు.

దక్షిణాఫ్రికా పాలనకు వ్యతిరేకంగా స్థానిక నమీబియాన్లను ఐక్యం చేయడానికి SWAPO (సౌత్ వెస్ట్ ఆఫ్రికా పీపుల్స్ ఆర్గనైజేషన్) ఏర్పడింది. వీరి ముఖ్య ఆశయం సంపూర్ణ స్వాతంత్రం. SWAPO గెరిల్లా యుద్ధం ముమ్మరంగా సాగించింది. 74 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత నమీబియా స్వాతంత్రాన్ని సాధించారు. SWAPO నాయకుడైన సామ్ నుజోమ్ స్వతంత్ర నమీబియాకు తొలి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు.

AP Inter 2nd Year History Study Material Chapter 13 సమాకాలీన ప్రపంచ చరిత్ర

ప్రశ్న 3.
ఐరోపా ఆర్థికమండలి వెనుక లక్ష్యాలను తెలుపండి.
జవాబు:
రెండు ప్రపంచ యుద్ధాల అనంతరం ప్రతి ఐరోపా దేశం వారు రెండు పెద్ద అగ్రరాజ్యాలతో పోలిస్తే చాలా చిన్న దేశాలుగా ఉన్నామని, బలహీనంగా ఉన్నామని భావించారు. అందువలన ఐరోపా దేశాల వారు పరస్పర స్నేహాన్ని, సహకారాన్ని పెంపొందించుకోవాలని అందరూ కలిసి సమిష్టి రాజకీయ, ఆర్థిక, సైనిక కృషి చేయాలని నిర్ణయించారు.

1947లో 16 ఐరోపా దేశాలవారు కలిసి అమెరికా వారి మార్షల్ పథకం ద్వారా లభించే సహాయాన్ని పంచుకోవడానికి ఒక సమాఖ్యగా ఏర్పడ్డారు. 1949లో నాటో ఏర్పడింది. 1951లో ఆరు పశ్చిమ ఐరోపా దేశాలు బొగ్గు, ఉక్కు ఖనిజాలకు సంబంధించి సంయుక్త వాణిజ్యాన్ని నిర్వహించుకోవడానికి సమాఖ్యగా ఏర్పడ్డారు.

ఐరోపా ఆర్థిక సమాఖ్య ‘రోమ్ ఒప్పందం’ ద్వారా 1957లో ఏర్పడింది. యూరప్ లోని అనేక దేశాల వారు దీనిలో సభ్యులు. వీరు వెనుకబడిన దేశాల వారి వస్తువులను దిగుమతి చేసుకునేది మరియు వాణిజ్యాన్ని ఐరోపా ఆర్థిక సమాఖ్య వారే నిర్వహించేవారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం బ్రెసెల్స్ లో ఉంది. సభ్య దేశాల మధ్య ఏర్పడే ఆర్థికపరమైన వివాదాలను పరిష్కరిస్తూ, స్నేహపూరిత వాతావరణం నెలకొల్పటానికి కృషి చేస్తుంది. చివరగా ఈ యూనియన్ ‘యూరో’ అనే ఒక సంయుక్త ద్రవ్య చలామణి ఏర్పాటు చేసింది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
OPEC సంస్థలో సభ్యులు ఎవరు ?
జవాబు:
చమురు ఉత్పత్తిచేసే దేశాల వారు 1962లో బాగ్దాద్ నగరంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశంలో చమురు ఉత్పత్తి చేసే దేశాల వారు ఒక సమాఖ్యగా ఏర్పడ్డారు. దీనిని OPEC (ఆయిల్ ప్రొడ్యూసింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్) అంటారు. ఈ సమావేశానికి ఇరాన్, కువైట్, సౌదీ అరేబియా, వెనిజులా దేశాల వారు హాజరయ్యారు. కాలక్రమేణా ఆసియా, ఆఫ్రికా ఖండాలలోని అనేక చమురు ఉత్పత్తి దేశాల వారు ఇందులో చేరారు. OPEC ప్రధాన కార్యాలయం ఆస్ట్రియాలోని వియన్నాలో నెలకొల్పారు.

ప్రశ్న 2.
సార్క్ సంస్థ సభ్యదేశాలు ఏవి ?
జవాబు:
దక్షిణాసియాలో ఆర్థికాభివృద్ధి, సామాజిక ప్రగతి, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించుట, స్వావలంబన లక్ష్యంలో సార్క్న ఏర్పాటు చేయడం జరిగింది. SAARC (సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోపరేషన్)ను దక్షిణాసియా ప్రాంత దేశాలు 1985లో ఢాకా నగరంలో జరిపిన శిఖరాగ్ర సమావేశంలో స్థాపించారు. భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్, మాల్దీవులు ఇందులో సభ్యదేశాలు.

AP Inter 2nd Year History Study Material Chapter 13 సమాకాలీన ప్రపంచ చరిత్ర

ప్రశ్న 3.
అట్లాంటిక్ చార్టర్.
జవాబు:
ఆగస్ట్ 1944న అమెరికా అధ్యక్షుడు F.D. రూజ్వెల్ట్, బ్రిటన్ ప్రధానమంత్రి అట్లాంటిక్ సముద్రం మీద సమావేశమై ఒక తీర్మానాన్ని రూపొందించారు. దానిని అట్లాంటిక్ చార్టర్ అంటారు.

దాని లక్ష్యాలు: అంతర్జాతీయ శాంతి భద్రతలు పెంచడం, దేశాల మధ్య స్నేహాన్ని పెంచడం, ప్రజల ప్రాథమిక హక్కులను గుర్తించడం. చార్టర్ సుత్రాల ప్రకారం సభ్యదేశాల మధ్య సమానత్వాన్ని అంగీకరించాలి. తమలోని విభేదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. ఏదైనా దేశం ఐక్యరాజ్య సమితి తీర్మానాలను ఉల్లంఘిస్తే ఐక్యరాజ్య సమితి తీసుకునే చర్యలకు అండగా ఉండాలి.

AP Inter 2nd Year History Study Material Chapter 12 ఆధునికతకు మార్గాలు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 12th Lesson ఆధునికతకు మార్గాలు Textbook Questions and Answers.

AP Inter 2nd Year History Study Material 12th Lesson ఆధునికతకు మార్గాలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
చైనాలో జరిగిన నల్లమందు యుద్ధాలకు గల కారణాలు, యుద్ధ ఫలితాలు ఏవి ?
జవాబు:
బ్రిటన్ ఉత్పత్తులకు చైనాలో గిరాకీ లేదు. కానీ చైనా పింగాణి, తేయాకు, పట్టు వస్త్రాలకు యూరప్ లో డిమాండ్ ఉండేది. అందువల్ల బ్రిటీష్వారు వారి వ్యాపార వస్తువులలో నల్లమందును కూడా చేర్చారు. భారతదేశంలో పండించే నల్లమందును రహస్యంగా బ్రిటీష్వారు ఇంగ్లాండ్కు ఎగుమతి చేసి విపరీతమైన లాభాలు పొందారు. చైనాలో నల్లమందు నిషిద్ధం. ఫలితంగా రెండు దేశాల మధ్య మొదటి నల్లమందు యుద్ధం క్రీ.శ. 1839 నవంబర్ లో ప్రారంభమై మూడు సంవత్సరాలు జరిగింది. ఈ యుద్ధంలో చైనా ఓడిపోయింది. 1842లో నాన్ కింగ్ ఒప్పందం యూరోపియన్ల వ్యాపారానికి చైనా ద్వారాలు తెరుచుకున్నట్లయింది.

నౌకలలో దొంగ రవాణా జరుగుతోందన్న ఆరోపణలపై 12 మంది బ్రిటీష్ వారిని చైనా నిర్బంధించింది. ‘అగస్టీ చాప్ కులీన్’ అనే మత ప్రచారకుడిని తిరుగుబాటుదారుడనే అనుమానంతో చైనా ప్రభుత్వం మరణశిక్ష విధించింది. ఈ రెండు సంఘటనలు రెండవ నల్లమందు’ యుద్ధానికి దారితీసాయి. పెకింగ్ సంధితో ఆ యుద్ధం ముగిసింది. యుద్ధ

ఫలితాలు: ఈ రెండు నల్లమందు యుద్ధాల ఫలితంగా చైనీయులు పాశ్చాత్య దృక్పథానికి దగ్గరయ్యారు.

  • పాశ్చాత్యులను అనుకరించడం ద్వారా బలమైన శక్తిగా ఎదగవచ్చని చైనీయులు భావించారు.
  • చైనాలోని సంస్కర్తల కృషి మూలంగా చైనీయులు యూరోపియన్ల భాషలు, ఇంజనీరింగ్ విద్య, సైనిక పద్ధతులను నేర్చుకున్నారు.
  • చైనాలో పారిశ్రామికీకరణ, బొగ్గు గనుల త్రవ్వకం ప్రారంభమైనాయి.
  • చైనాలో ‘కాంగ్యువై “శతదిన సంస్కరణలు” ప్రారంభించాడు. పాఠశాలలో పాశ్చాత్య విద్యా విధానం, పోటీ పరీక్షల విధానం ప్రవేశపెట్టారు.
  • పెకింగ్ విశ్వ విద్యాలయం స్థాపన, విదేశీ గ్రంథాల అనువాదం మొదలైన వాటి ఫలితంగా 1911లో చైనాలో విప్లవం వచ్చింది.

AP Inter 2nd Year History Study Material Chapter 12 ఆధునికతకు మార్గాలు

ప్రశ్న 2.
సన్ట్సేన్ భావాలు ఏవి ? అతడు ఆ భావాలను చైనాలో అమలుపరచిన తీరును వివరింపుము.
జవాబు:
చైనాలో 1911వ సంవత్సరంలో వచ్చిన ప్రజాతంత్ర విప్లవానికి నాయకుడు ‘సన్మెట్సేన్’. ఇతడు క్రీ.శ. |1866వ సంవత్సరంలో కాంటన్ గ్రామంలో ఒక కర్షక కుటుంబంలో జన్మించాడు. చైనా తత్త్వవేత్త కన్ఫూషియస్ సిద్ధాంతాలకు ప్రభావితుడై చైనాలో జాతీయభావం, ప్రజాస్వామ్య భావజాలం, ఆధునిక దృక్పథాన్ని పెంపొందించి రిపబ్లిక్ స్థాపన ఆశయంతో చైనాలో ‘సన్ట్సేన్’ ‘తుంగ్మెంగ్ హూయి’ అనే విప్లవ సంస్థను స్థాపించాడు. పార్లమెంటరీ ప్రభుత్వ స్థాపనే తన ధ్యేయం అని ప్రకటించాడు. విద్యార్థులు, యువకులు దీనిలో సభ్యులయ్యారు. చైనా ప్రజలను ఇసుక రేణువులతో పోల్చుతూ వాటిని అనుసంధానం చేయడానికి దృఢతరం చేసే జాతీయభావం అనే సిమెంట్ అవసరం అన్నాడు. ప్రజలకు జీవనోపాధి కల్పించే బాధ్యతను ప్రభుత్వమే స్వీకరించాలన్నాడు. పెట్టుబడిని క్రమబద్దీకరించి, భూమిని సమానంగా పంచాలని ప్రబోధించాడు.

సనీయెట్సేన్ తను స్థాపించిన ‘తుంగ్మెంగ్ హూయి’ ని రద్దుచేసి జాతీయ లక్ష్యాలతో కొమిన్టింగ్ అనే జాతీయ రాజకీయ పార్టీని స్థాపించాడు. కొమిన్టింగ్ అంటే జాతీయ పక్షం అని అర్థం. క్రమంగా కొమిన్హాంగ్ పార్టీ బలపడింది. మేధావి వర్గం అభివృద్ధి చెందింది, పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. పట్టణాలు, నగరాలు విస్తరించాయి. ఆధునిక విజ్ఞానం, ప్రజా ప్రభుత్వం, జాతీయవాదం మొదలైన వాటి ద్వారా చైనాను అభివృద్ధి పథంలో నడిపించాలని కొమిన్టంగ్ ఆకాంక్ష. కొమిన్లాంగ్ పట్టణీకరణ, పారిశ్రామికాభివృద్ధి కేంద్రంగా షాంగై నగరాన్ని వృద్ధి చేశారు. నౌకా నిర్మాణం అభివృద్ధి చెందింది. ఆధునిక పరిశ్రమలు ఏర్పాటు చేయబడ్డాయి. వీటి ద్వారా ఉద్యోగ, వర్తక, వ్యాపార, ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. స్త్రీలు కూడా భాగస్వాములయ్యారు. ఉత్తర, దక్షిణ చైనాల ఏకీకరణకు కృషి చేసాడు. ‘సన్యాట్సన్’ చైనా జాతిపితగా ప్రసిద్ధికెక్కాడు.

ప్రశ్న 3.
మేజి పునః ప్రతిష్టకు దారితీసిన సంఘటనలను తెలపండి.
జవాబు:
టోకుగవా పాలన పట్ల సమాజంలోని అన్ని వర్గాలలో అసంతృప్తి ప్రారంభమైంది. 1866లో దైమ్యోలు కూడా తిరుగుబాటు చేసారు. 1868లో చక్రవర్తి, సైన్యాలు, దైమ్యోలు కలిసి టోకుగవా సైన్యాలను ఓడించాయి. ఆఖరి షోగున్ ‘హితోతిసుబాషి’ లొంగిపోయాడు. టోకుగవా షోగునెట్ అంతమైంది. చక్రవర్తి మత్సుహిటో సర్వాధికారాలతో ‘మెడో’ లో సింహాసనం అధిష్టించాడు.

టోకుగవా షోగునెట్ పతనమై, చక్రవర్తి తిరిగి అధికారంలోకి రావడంతో జపాన్లో మొయిజీ ప్రభుత్వ స్థాపన జరిగింది. ‘మెయిజీ’ అనగా ‘విజ్ఞతతో వ్యవహరించడం’ అని అర్థం. క్రీ.శ. 1868లో అధికారం చేపట్టిన ‘మత్సుహిటో’ రాజ్యాంగబద్ధ రాజరికాన్ని రూపొందించి, భూస్వామ్య వ్యవస్థను రద్దుచేసి, సాంప్రదాయ వ్యవస్థలకు స్వస్తిచెప్పి జపాన్ను పాశ్చాత్యీకరిస్తూ మొయిజీ పాలన సాగించాడు. మారుతున్న పరిస్థితులకనుగుణంగా ప్రభుత్వం, ప్రజలు ఇచ్చిపుచ్చుకునే తోడ్పాటు ఫలితంగా జపాన్ స్వల్పకాల వ్యవధిలో అద్భుత ప్రగతిని సాధించింది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కన్ఫూషియస్
జవాబు:
ప్రపంచంలోని అత్యుత్తమ దార్శనికులలో కన్ఫూషియస్ ఒకడు. ఇతడు క్రీ.పూ. 551లో జన్మించాడు. క్రీ.పూ. 479లో మరణించాడు. కన్ఫూషియస్ అనే పేరు కుంగ్ – ఫూట్జ్ అనే యూరోపియన్ పద రూపం. కుంగ్ అనగా గురువు అని అర్థం. ఇతని శిష్యులు ఇతనిని “కుంగ్-దీ-పూ” అని పిలిచేవారు. 22 సంవత్సరాల వయసులో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి చరిత్రను, కవిత్వాన్ని, మర్యాదలను గురించిన అంశాలను బోధించాడు. ఇతడు “పంబ్లింగ్” అనే ఐదు గ్రంథాలను వ్రాశాడు. అవి.

  1. లీ – ఛీ: ప్రాచీన శాస్త్ర విధులను తెలియజేస్తుంది.
  2. ఈ-జింగ్: ఆత్మతత్త్వ విద్యలకు చెందినది.
  3. జింగ్: మానవుని నైతిక విలువలను వివరిస్తుంది.
  4. చూన్ చ్యూ: ఇది ‘లూ’ రాష్ట్ర చరిత్రను వివరిస్తుంది.
  5. ఘాజింగ్: చైనా ప్రాచీన చరిత్రను తెలియజేస్తుంది.

ప్రశ్న 2.
మావోజెడాంగ్
జవాబు:
ఆధునిక చైనా నిర్మాత మావోసెటుంగ్ (మావోజెడాంగ్) 1893 డిసెంబర్ 26న హూనాన్ రాష్ట్రంలోని ఒక సంపన్న కర్షక కుటుంబంలో జన్మించాడు. విద్యాభ్యాసం అనంతరం 1918లో పెకింగ్ గ్రంథాలయ ఉద్యోగిగా కొంతకాలం పనిచేసాడు. అక్కడ మార్కిస్ట్ సిద్ధాంతాలను బాగా ఆకళింపు చేసుకున్నాడు. మావో 1911 విప్లవం వలన ప్రభావితుడయ్యాడు. పెకింగ్ యూనివర్సిటీలో ఉన్న కాలంలో మావో మార్కిస్టు లెనినిస్ట్ భావాలకు ఆకర్షితుడయ్యాడు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా స్థాపించడంలో కీలకపాత్ర వహించాడు. రష్యాలో ఏర్పడిన కర్షక సోవియట్ల స్ఫూర్తితో కియాంగీని రాష్ట్రాన్ని ఎంపిక చేసుకొని చైనా సోవియట్లను ఏర్పరచాడు. భూమి మొత్తం కమ్యూనిస్ట్ల వశమైంది. తరువాత కాలంలో 1949 అక్టోబర్ లో జరిగిన కమ్యూనిస్ట్ విప్లవం విజయవంతమై మావోజెడాంగ్ అధ్యక్షుడిగా, చౌఎన్ ప్రధానిగా చైనాలో ప్రజా రిపబ్లిక్ ఏర్పడింది.

AP Inter 2nd Year History Study Material Chapter 12 ఆధునికతకు మార్గాలు

ప్రశ్న 3.
టోకుగవా షోగునెట్
జవాబు:
1603లో టోకుగవా వంశీయులు షోగున న్ను చేజిక్కించుకుని 1868 వరకు పాలించాయి. ఈ కాలాన్ని ‘టోకుగవా ‘షోగునెట్’ అంటారు. 265 సంవత్సరాల వీరి పాలనలో భూస్వామ్య వ్యవస్థను, దైమ్యోలను అదుపులో ఉంచింది. సైనిక శక్తి మీద ఆధారపడి టోకుగవా అధికారాన్ని చెలాయించింది. పరిపాలన కోసం ఉద్యోగస్వామ్యాన్ని ఏర్పరిచింది. టోకుగవా పాలనలో శాంతి, సుస్థిరత ఉన్నా క్రమంగా సమాజంలోని అన్ని వర్గాలలో అసంతృప్తి ఏర్పడింది. టోకుగవా రాజధాని ‘యెడో’ కాగా చక్రవర్తి ‘క్యోటో’ లో నివసించాడు. ఇంగ్లండ్, రష్యాలతో కుదుర్చుకున్న ఒప్పందంతో టోకుగవా అప్రదిష్టపాలైంది. 1866లో దైమ్యోలు తిరుగుబాటు చేసారు. 1868లో చక్రవర్తి సైన్యాలు, దైమ్యోలు కలిసి టోకుగవా సైన్యాలను ఓడించాయి. ఆఖరి షోగున్ ‘హితోతి సుబాషి’ లొంగిపోయాడు. టోకుగవా షోగునెట్ అంతమైంది.

AP Inter 2nd Year History Study Material Chapter 11 చెదిరిన స్థానిక ప్రజలు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 11th Lesson చెదిరిన స్థానిక ప్రజలు Textbook Questions and Answers.

AP Inter 2nd Year History Study Material 11th Lesson చెదిరిన స్థానిక ప్రజలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఐరోపా సామ్రాజ్యవాదం గూర్చి వ్రాయుము.
జవాబు:
17వ శతాబ్దం వరకు స్పెయిన్, పోర్చుగల్ దేశాల వ్యాపార, వాణిజ్య కార్యక్రమాలు అంతగా విస్తరించలేదు. కాని బ్రిటన్, ఫ్రాన్స్, హాలెండ్ దేశాలు తమ వ్యాపార, వాణిజ్య కార్యక్రమాలను విస్తరిస్తూ ఉత్తర అమెరికా, ఆఫ్రికా, ఆసియా ప్రాంతాలలో వలసలు ఏర్పాటును ప్రారంభించాయి. ఐర్లాండ్, బ్రిటన్ వలస ప్రాంతం. ఐర్లాండ్లోని భూ యజమానులందరూ బ్రిటన్ నుండి వచ్చి స్థిరపడినవారు. 18వ శతాబ్దంలో దక్షిణ ఆసియా, ఆఫ్రికాలలోని వర్తకులు, స్థానికులు, ప్రజలలో జోక్యం చేసుకొని వలసలలో వచ్చిన సమస్యలను పరిష్కరిస్తుండేవారు.

బ్రిటిష్ వర్తక సంఘం ఈస్టిండియా కంపెనీ స్థానికులను వంచించి, నమ్మకద్రోహం చేసో, ఓడించో, వారి పాలకులను ప్రలోభపెట్టి వారి ప్రాంతాలను ఆక్రమించడం ప్రారంభించారు. వారి నుండి పన్నులు వసూలు చేసి స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. తర్వాత బ్రిటిషు వారు తమ వర్తక వాణిజ్యాభివృద్ధి కొరకు రైలు, రోడ్డు రవాణా మార్గాలను, సమాచార వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు. ఆఫ్రికా రాజ్యాలను జయించి వాటిని తమ వ్యాపార కేంద్రాలుగా, వలస ప్రాంతాలుగా మార్చివేసారు. 19వ శతాబ్దంలో వలస ప్రాంతాల ప్రజల ముఖ్య వ్యవహారిక భాష ఆంగ్లం.

AP Inter 2nd Year History Study Material Chapter 10 జర్మనీ, ఇటలీలలో విమోచన (ఏకీకరణ) ఉద్యమాలు మొదటి నెపోలియన్

ప్రశ్న 2.
17వ శతాబ్దంలో అమెరికాలో స్థిరపడ్డ ఐరోపావాసులు గురించి వివరించుము.
జవాబు:
మతపరమైన అంశాలపై స్థానిక ప్రొటెస్టెంట్ క్రైస్తవులకు, ఐరోపా క్యాథలిక్ లకు మధ్య కొన్ని వైవిధ్యాలు ఉండేవి. అలాంటి భావాలు గల ఐరోపావాసులలో చాలామంది అమెరికాకు వలస వచ్చి నూతన జీవితాన్ని ప్రారంభించారు. వారు అడవులను నరికి వ్యవసాయ భూములను ఏర్పాటు చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు థామస్ జఫర్సన్ అభిప్రాయం ప్రకారం “ఐరోపా ప్రజలచే ఏర్పాటు చేయబడిన చిన్న భూ కమతాలలో స్థానిక ప్రజల అవసరాలకు మాత్రమే పంటలు పండించారు కానీ లాభం కోసం కాదు. స్థానికులు భూమిని సొంతం చేసుకోకపోవడమే వారు అనాగరికులుగా మారడానికి కారణం” అని పేర్కొన్నాడు.

తరువాత 18వ శతాబ్దంలో అమెరికా, కెనడాలు తమ సుస్థిరత్వాన్ని నిలబెట్టుకొని క్రమంగా ఒక శతాబ్దం కాలానికి అనేక భూములను ఆక్రమించుకున్నాయి. అమెరికా, ఫ్రాన్స్ల నుండి విశాలమైన భూభాగాన్ని కొనుగోలు చేసి ‘దానికి ‘లూసియానా’ అని పేరు పెట్టింది. రష్యా నుండి ‘అలాస్కా’, దక్షిణ మెక్సికో నుండి కొన్ని ప్రాంతాలను పొందింది. దీనితో అమెరికా భౌగోళిక పరిస్థితి అనూహ్యంగా మారిపోయింది. ఇంగ్లండ్, ఫ్రాన్స్ల నుండి వచ్చిన వలస ప్రజలు అమెరికాలో స్థిరపడాలని కోరుకున్నారు. అదే విధంగా జర్మనీ, స్వీడన్, ఇటలీల నుండి వచ్చిన ప్రజలు కూడా భూములను స్వాధీనం చేసుకొని వాటిని వ్యవసాయ క్షేత్రాలుగా మార్చివేసారు. పోలెండ్ ప్రజలు ‘స్టెప్పీలు’ అనేవారి నుండి గడ్డిభూములు, ఇతర వ్యవసాయ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసారు. వాటిలో వ్యవసాయం చేయనారంభించారు.

అమెరికా దక్షిణ ప్రాంతం వేడి వాతావరణంతో కూడుకొని ఉంటుంది. దక్షిణ అమెరికాలోను, ఉత్తర అమెరికాలోను తమ వలసలలోని వ్యవసాయ భూములలో కూలీలుగా ఆఫ్రికా నుంచి నల్లజాతివారిని బానిసలుగా తెచ్చుకొనేవారు. వీరు చాలా దయనీయ స్థితిలో ఉండేవారు. ఉత్తర అమెరికాలోని కొందరు ఉదారవాదులు ఈ బానిస వ్యవస్థను ఖండించారు. 1864-65 మధ్య బానిస వ్యవస్థ అనుకూల, ప్రతికూలవాదుల మధ్య అంతర్యుద్ధం జరిగింది. తరువాత బానిస వ్యవస్థ రద్దు చేయబడింది. 20వ శతాబ్దానికి ముందు నల్ల జాతీయులు తెల్ల జాతీయులతో పాటు సమానంగా అమెరికాలో పౌరహక్కులు పొందారు.

స్థానికత కోల్పోయిన స్థానికులు అమెరికాలో స్థిరపడిన ఐరోపావాసులు స్థానికులైన అమెరికన్లను వారి ప్రదేశాల నుండి బలవంతంగా ఖాళీ చేయించాలనుకున్నారు. వారి మధ్య అనేకసార్లు సంప్రదింపులు జరిగాయి. ఐరోపావాసులు చాలా తక్కువ ధర చెల్లించి స్థానికుల నుండి భూమిని పొందారు. భూమి, పొందే విషయంలో జరిగే ఒప్పంద పత్రాలలోని మోసాన్ని స్థానికులు గ్రహించలేకపోయారు. అందువలన స్థానిక ప్రజలు వారి హక్కులను కోల్పోయి, చివరకు పరదేశీయులుగా మిగిలిపోయారు.

జార్జియా రాష్ట్రంలోని ‘చెరోకీ’ అనే గిరిజన తెగవారికి ప్రభుత్వం నుండి ఎలాంటి హక్కులు లేవు. 1832లో అమెరికా ప్రధాన న్యాయమూర్తి జాన్మార్షల్ చెరోకీ ప్రజలకు సర్వ హక్కులను కల్పించాడు. అదే విధంగా అమెరికా అధ్యక్షుడైన ఆండ్రూజాన్సన్ గిరిజన తెగల ఆర్థిక, రాజకీయ అవకాశాల కొరకు పోరాడాడు. అమెరికా నుండి వారిని బయటకు పంపే ఎలాంటి చట్టాలకు అనుమతివ్వలేదు. స్థానికులు పశ్చిమ ప్రాంతానికి నెట్టివేయబడ్డారు. అక్కడ వారికివ్వబడిన భూములలో సీసం, బంగారం, ఇతర ఖనిజ సంపద అపారంగా లభించింది. ఎంతో మారణకాండతో, మోసంతో, ఆయుధబలంతో అమెరికాలోని స్థానికులను ఐరోపావాసులు వారిని మైనారిటీలుగా మార్చివేసారు.

ప్రశ్న 3.
అమెరికాలో 19వ శతాబ్దంలో జరిగిన పారిశ్రామికాభివృద్ధిని గురించి రాయుము.
జవాబు:
1840 ప్రాంతంలో కాలిఫోర్నియాలో బంగారపు నిధులను కనుగొనడం జరిగింది. ఈ విషయం తెలిసిన ఐరోపా వ్యాపారులు అమెరికాకు వలస వచ్చారు. దీని వలన బంగారపు గనులలో వేలాదిమందికి ఉపాధి లభించింది. రెండు ఖండాల మధ్య 1870 ప్రాంతంలో రైలు మార్గాల నిర్మాణం జరిగింది. “ఆండ్రూకర్నేగి” అనే వలస కూలి కొద్ది కాలంలోనే ధనవంతుడిగా మారిపోయాడు.

AP Inter 2nd Year History Study Material Chapter 10 జర్మనీ, ఇటలీలలో విమోచన (ఏకీకరణ) ఉద్యమాలు మొదటి నెపోలియన్

ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవ ప్రారంభదశలో అనేకమంది రైతులు, పెద్ద భూస్వాములకు తమ భూములు ఇచ్చి ఫ్యాక్టరీలలో, పరిశ్రమలలో ఉపాధి పొందారు. అదే విధంగా ఉత్తర అమెరికాలో కూడా పారిశ్రామిక, రవాణా రంగాలలో గొప్ప మార్పులు వచ్చాయి. అమెరికా, కెనడాలలో పట్టణాలు, నగరాలు పెరిగాయి. ఈ పరిణామాలన్నీ త్వరితగతిన ఆర్థికాభివృద్ధి సాధించడానికి దోహదపడ్డాయి. వ్యవసాయ భూమి విస్తరించబడి వ్యవసాయాభివృద్ధి జరిగింది. ఈ అభివృద్ధి ద్వారా హవాయ్, ఫిలిప్పీన్స్ మొదలైనచోట్ల వలసలు స్థాపించి క్రమంగా అమెరికా ఒక బలమైన దేశంగా ఆవిర్భవించింది.

AP Inter 2nd Year History Study Material Chapter 10 జర్మనీ, ఇటలీలలో విమోచన (ఏకీకరణ) ఉద్యమాలు మొదటి నెపోలియన్

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 10th Lesson జర్మనీ, ఇటలీలలో విమోచన (ఏకీకరణ) ఉద్యమాలు మొదటి నెపోలియన్ Textbook Questions and Answers.

AP Inter 2nd Year History Study Material 10th Lesson జర్మనీ, ఇటలీలలో విమోచన (ఏకీకరణ) ఉద్యమాలు మొదటి నెపోలియన్

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కౌంట్్కవూర్ జీవితం, ఇటలీ ఏకీకరణలో అతని పాత్ర ఎట్టిది ?
జవాబు:
ఇటలీ ఏకీకరణ కోసం పోరాడిన ముఖ్య నాయకుడు కౌంట్-కామిలో-డి-కవూర్’. ఇతడు 1810 సంవత్సరంలో పీడ్మాంట్లో భూస్వామ్య కుటుంబంలో జన్మించాడు. యుక్తవయస్సులో సార్టీనియా సైన్యంలో ఇంజనీర్గా పనిచేసాడు. ఇతడు ప్రజాస్వామ్య, పార్లమెంటరీ విధానాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. పీడ్మాంట్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 1850లో ఇతనిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 1852లో సార్జీనియా ప్రధానమంత్రి అయ్యాడు. ఆంగ్ల రచయితల ప్రభావం వల్ల కవూర్ వివిధ రంగాలలో ఆరితేరాడు. ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాలకు వెళ్ళి సమగ్రమైన, విశాలమైన భావాలను అవగాహన చేసుకున్నాడు. పీడ్మాంట్ నాయకత్వంలో ఇటలీ ఏకీకరణ సాధ్యమవుతుందని బలంగా నమ్మి రాజ్యాంగబద్ద రాజరికం స్థాపించాలని ఆశించాడు.

క్రిమియా యుద్ధం – ఫ్రాన్స్లో సంధి: కవూర్ ఇటలీ ఏకీకరణ కోసం ఇంగ్లాండ్, ఫ్రాన్స్లతో సంధి కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంగ్లాండు పెద్ద సైన్యం లేకపోయినా యుద్ధాలలో మునిగి ఉంది. కాని ఫ్రాన్స్కు మంచి సైన్యం ఉంది. 3వ నెపోలియన్ ఆశాపరుడు, సాహసికుడు. కవూర్ 3వ నెపోలియన్కు దగ్గరయ్యాడు. అప్పుడు క్రిమియా యుద్ధం కవూర్కు మంచి అవకాశం కలిగించింది. ఫ్రాన్స్, ఇంగ్లాండ్లతో పొత్తు కుదుర్చుకుని రష్యాతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. రెండు సంవత్సరాల తర్వాత క్రిమియా యుద్ధంలో ఫ్రాన్స్, ఇంగ్లాండ్లకు ఇటలీ చేసిన సేవలకు గుర్తుగా మూడవ నెపోలియన్ కవూర్ను ప్లాంబియర్స్కు ఆహ్వానించి ఆస్ట్రియాతో యుద్ధానికి కుట్ర పన్ని ఇటలీ నుంచి తరిమివేయడానికి అంగీకరించాడు.

ఫ్రాన్స్లో సంధి, ఆస్ట్రియాతో యుద్ధం: ఆస్ట్రియాను ఇటలీ నుండి పారద్రోలుటకు కవూర్కు ఫ్రెంచి సహాయం అవసరం. దీనికోసం 1858 జూలైలో ఫ్రెంచి రాజు 3వ నెపోలియన్, కవూర్ల మధ్య ఒప్పందం కుదిరింది. ఆస్ట్రియాను లంబార్డీ, వెనీషియాల నుంచి పారద్రోలటానికి ఫ్రాన్స్ అంగీకరించింది. దీని ద్వారా సార్డీనియాతో అవి విలీనమౌతాయి. అందుకు ప్రతిఫలంగా పీడ్మాంట్ ఆధీనంలోని నైస్, సెవాయ్లను ఫ్రాన్స్ పొందుతుంది. ఆ తర్వాత 1859 ఏప్రిల్లో ఆస్ట్రియా సార్టీనియా సైన్యాన్ని తగ్గించమని హెచ్చరిక చేసింది. సార్డీనియా తిరస్కరించగా పార్టీనియా, ఆస్ట్రియా, ఫ్రాన్స్ల మధ్య యుద్ధం మొదలైంది.

AP Inter 2nd Year History Study Material Chapter 10 జర్మనీ, ఇటలీలలో విమోచన (ఏకీకరణ) ఉద్యమాలు మొదటి నెపోలియన్

యుద్ధం 1859 ఏప్రిల్ నుండి జూలై వరకు జరిగింది. మిత్రరాజ్యాలు మాజెంటా, సల్ఫరినోలలో విజయాన్ని సాధించాయి. అయితే యుద్ధం మధ్యలో ఫ్రెంచి రాజు హఠాత్తుగా యుద్ధం నుంచి విరమించుకొని ఆస్ట్రియాతో జూలై 11, 1859లో విల్లా ఫ్రాంకా సంధి చేసుకున్నాడు. ఆ సమయంలో లంబార్డ్ పీడ్మాంట్ ఆధీనంలోను, వెనీషియా ఆస్ట్రియా ఆధీనంలోను ఉన్నాయి.

ఈ సంఘటనతో కవూర్ అసంతృప్తి చెంది తన పదవికి రాజీనామా చేసాడు. అయితే రాజు రాజీనామాను అంగీకరించలేదు. తరువాత జరిగిన పరిణామాల వల్ల మొడీనా, ఫార్మా, టస్కనీ, పోప్ రాష్ట్రాల రాజులు కవూర్ ప్రోద్భలంతో సార్టీనియా, పీడ్మాంట్లతో కలిసిపోవుటకు ముందుకొచ్చారు. విక్టర్ ఇమ్మాన్యుయేల్, కవూర్లు ప్రజాభిప్రాయ సేకరణ జరిపి ఈ రాజ్యాలను సార్డీనియా, పీడ్మాంట్లలో 1860 మార్చి నెలలో ఏకం చేసారు. విక్టర్ ఇమ్మాన్యుయేల్ను ఇటలీ రాజుగా చేసి 2 ఏప్రియల్ 1860లో మొదటి పార్లమెంట్ సమావేశాన్ని ట్యురిన్లో ఏర్పాటు చేశారు. కవూర్ ప్రోద్భలం వల్ల చివరకు మూడవ నెపోలియన్ మనసు మార్చుకొని సెవాయ్, నైస్లను తీసుకొని ఇటలీ రిపబ్లికన్ను గుర్తించాడు.

ప్రశ్న 2.
జర్మనీ ఏకీకరణలో బిస్మార్క్ పాత్ర ఎటువంటిది ?
జవాబు:
బిస్మార్క్ 1815 సంవత్సరంలో బ్రాండెన్ బర్గ్ లోని ప్రభువుల కుటుంబంలో జన్మించాడు. ఇతడు గోటింజెన్, బెర్లిన్ విశ్వవిద్యాలయాలలో విద్యను అభ్యసించి సివిల్ సర్వీస్లోకి వచ్చాడు. అయితే క్రమశిక్షణా రహిత్యం వల్ల బర్తరఫ్ అయ్యాడు. 1849 99 విప్లవ కాలంలో ఉదారవాదుల నుండి ప్రష్యా రాష్ట్రాన్ని కాపాడాడు. 1851లో బిస్మార్క్ రాజకీయ తత్వవేత్తగా చేరాడు. 1851 నాటికి బిస్మార్క్ రాజీలేని పోరాట యోధుడుగా, నాయకత్వ ప్రతిభ కలిగిన వాడుగా గణుతికెక్కాడు. విలియం బిస్మార్క్ పట్ల విశ్వాసంతో అతని మనస్తత్వాన్ని ఫ్రాంక్ఫర్డ్ జర్మనీ డైట్ లో ప్రష్యా ప్రతినిధిగా నియమించాడు. 1862లో రాజు విలియం బిస్మార్క్న ప్రధానమంత్రిగా నియమించాడు. అదే రోజు బిస్మార్క్ చేసిన నిర్ణయాలను పార్లమెంట్ తిరస్కరించగా, బిస్మార్క్ ఖచ్చితంగా తన నిర్ణయాలను పార్లమెంట్ ఆమోదం ఉన్నా లేకున్నా అమలు చేస్తానని చెప్పాడు. బిస్మార్క్ ధైర్యం వల్ల మొదటి విలియం జర్మనీ ఏకీకరణకు పార్లమెంట్తో పోరాడటానికి సిద్ధమయ్యాడు.

రక్తపాత విధానం: బిస్మార్క్ ముఖ్య ధ్యేయం జర్మనీ ఏకీకరణ ప్రష్యా ఆధీనంలో జరగాలని భావించడం. యుద్ధాల వల్ల జర్మనీ ఏకీకరణ సాధ్యము కాదని అతని అభిప్రాయం. “సమస్యలు, ఉపన్యాసాల వల్ల కాని, చర్చలు, సమావేశాలు, పార్లమెంట్ తీర్మానాల వల్లగాని పరిష్కరింపబడజాలవు. కఠిన దండనీతే దీనికి పరిష్కారం” అని పేర్కొన్నాడు. దీనినే ‘రక్తపాత విధానం’ అంటారు. బిస్మార్క్ జర్మనీ ఏకీకరణకు ఈ ‘రక్తపాత విధానం’నే అనుసరించాడు. తరువాత జర్మనీ ఏకీకరణ కోసం ప్రష్యా డెన్మార్క్ ను, ఆస్ట్రియాతోను, ఫ్రాన్స్ ను మూడు యుద్ధాలు చేసింది.

డెన్మార్క్తో యుద్ధం 1864: ఆస్ట్రియాతో యుద్ధం కోసం ఎదురు చూస్తున్న బిస్మార్క్కు ఫ్లెష్వగ్, హాల్టిస్టీన్ సమస్య అవకాశం కలిగించింది. ఈ రెండు సంస్థానాలు డెన్మార్క్ రాజు ఆధీనంలో ఉండేవి. ఇవి రెండు డెన్మార్క్ రాజు ఆధీనంలో ఉన్న వాటిని కలుపుకునే హక్కు అతనికి లేదు. 1863లో 9వ క్రిష్టియన్ సింహాసనం అధిష్టించి డేనిష్ ప్రజలు కోరిక మేరకు రెండు సంస్థానాలను విలీనం చేయడంలో ఆ సంస్థానాల్లో ఉన్న జర్మన్లు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకించి తిరుగుబాటు చేసారు.

ఆస్ట్రియాతో సంధి: బిస్మార్క్ ఫ్లెష్వగ్, హాల్టిన్ సమస్య పరిష్కరించుటకు ఆస్ట్రియాతో సంధి కుదుర్చుకున్నాడు. 1864లో ప్రష్యా, ఆస్ట్రియా దేశాలు డెన్మార్క్ మీద యుద్ధం ప్రకటించి డెన్మార్క్న ఓడించాయి. డెన్మార్క్ రాజు ఆ ప్రాంతాలను ఆస్ట్రియా, ప్రష్యాలకు అప్పగించాడు.

ఆస్ట్రియాతో యుద్ధం: తరువాత కాలంలో బిస్మార్క్ ఆస్ట్రియాపై యుద్ధం చేయడానికి పన్నాగం పన్నాడు. తన దౌత్యనీతితో యూరప్ దేశాలు ఆస్ట్రియాకు అండగా నిలబడకుండా చేసాడు. రష్యా, ఫ్రాన్స్, సార్డీనియాలతో, ఇతర దేశాలతో ప్రత్యేక సంధులను చేసుకున్నాడు. చివరకు 1866 లో ప్రష్యా, ఆస్ట్రియాల మధ్య యుద్ధం జరిగింది. దీనిని AP ఏడు వారాల యుద్ధం అన్నారు. యుద్ధంలో ఓడిన ఆస్ట్రియా ‘ప్రేగ్సంధి’కి ఒప్పుకుంది. దీని ప్రకారం ప్రష్యాకు ‘హాల్టిన్’ ను ఇచ్చింది. ఉత్తర జర్మన్ రాష్ట్రాలు ప్రష్యా ఆధీనంలోకి వచ్చాయి.

దక్షిణ జర్మన్ రాజ్యాలు ఉత్తర జర్మన్ సమాఖ్యలో చేరుట: దక్షిణ జర్మన్ రాష్ట్రాలైన బవేరియా, వర్టంబర్గ్, బెడెన్, హెస్పె ఉత్తర జర్మన్ సమాఖ్యకు వెలుపల ఉన్నాయి. బిస్మార్క్ వీటి ఐక్యత కొరకు జర్మన్లలో ఫ్రెంచివారి పట్ల విముఖత కలిగేటట్లు చేసాడు. ఫ్రాన్స్లో చివరకు 1870లో ప్రష్యాకు యుద్ధం జరిగింది. బిస్మార్క్ తన కుటిలనీతితో ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగేలా చూసాడు. ఈ యుద్ధంలో ఫ్రాన్స్ ప్రష్యాకు లొంగిపోయింది.

ఫ్రాంకో-ప్రష్యా యుద్ధం తర్వాత జర్మనీ ఏకీకరణకు దక్షిణ జర్మన్ రాజ్యాలు ప్రష్యాలో విలీనానికి అంగీకరించాయి. జనవరి 18, 1871న మొదటి విలియం జర్మనీ చక్రవర్తిగా ‘వర్సే’ రాజప్రసాదంలో పట్టాభిషేకం జరుపుకున్నాడు. బెర్లిన్ జర్మనీ రాజధానిగా ప్రకటించబడింది.

తన యొక్క దండనీతి రక్తపాత విధానంతోపాటు సామ, దాన, దండ, భేదోప్రాయాలతో జర్మన్ ఏకీకరణ చేసి ‘ఐరన్ మ్యాన్’ అని కీర్తినిపొందాడు.

ప్రశ్న 3.
1866 ఆస్ట్రియా – ప్రష్యాల యుద్ధ వివరాలు తెలపండి.
జవాబు:
సమాఖ్య రాజ్యాల సేవలు ఆస్ట్రియాతో కలసి ప్రష్యామీద దాడి చేయడంతో ఆత్మరక్షణ కోసం తమకు యుద్ధం అనివార్యమైందని ప్రష్యా యుద్ధంలోకి దిగింది. కానీ యుద్ధానికి సిద్ధంగా లేని ఆస్ట్రియా ‘గాస్టిన్ ఒప్పందాన్ని’ 1865 ఆగస్ట్లో చేసుకుంది. దీని ప్రకారం ప్లేష్వగ్ ప్రష్యా ఆధీనంలోను, హాల్టిన్ ఆస్ట్రియా ఆధీనంలో ఉంటాయి. మరోవైపు ఆస్ట్రియాపై యుద్ధం ప్రకటించడానికి బిస్మార్క్ పన్నాగం పన్నాడు.

సంస్థానాల పంపకాన్ని నిరసించిన ఆస్ట్రియా ప్రాంక్ఫర్టోని జర్మనీ సమాఖ్య పార్లమెంట్కు ఫిర్యాదు చేసింది. ఆస్ట్రియా గాస్టిన్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని బిస్మార్క్ ఆరోపించాడు. బిస్మార్క్ భవిష్యత్తులో జరిగే ఆస్ట్రియా ప్రష్యా యుద్ధంలో ఐరోపా రాజ్యాలు ఆస్ట్రియావైపు వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. తన దౌత్యనీతితో ఐరోపా రాజ్యాలు జోక్యం చేసుకోకుండా ఆస్ట్రియాను ఏకాకిని చేసాడు. రష్యా ఫ్రాన్స్, సార్డీనియా ఇతర దేశాలతో ప్రత్యేక సంధులను చేసుకున్నాడు. చివరకు ప్రష్యా, ఆస్ట్రియాల మధ్య జూన్ 1866లో యుద్ధం మొదలైంది.

AP Inter 2nd Year History Study Material Chapter 10 జర్మనీ, ఇటలీలలో విమోచన (ఏకీకరణ) ఉద్యమాలు మొదటి నెపోలియన్

ప్రష్యా – ఆస్ట్రియాల మధ్య యుద్ధం ఏడువారాలు జరిగింది. అందువలన దీనిని ఏడువారాల యుద్ధమని కూడా అంటారు. సైనిక పాటవానికి పేరుగాంచిన ప్రష్యా సైన్యం ఆస్ట్రియాను సెడోవా వద్ద ఓడించింది. ఆస్ట్రియా సంధికై వేడుకొంది. ఫలితంగా ఇరువురికి మధ్య ప్రేగ్ సంధి జరిగింది.

ప్రేగ్ సంధి షరతులు: దీని ప్రకారం

  1. ఆస్ట్రియా, ప్రష్యాకు హాల్షన్ను, ఇటలీకి వెనీషియాను ఇచ్చింది.
  2. యుద్ధ నష్టపరిహారం చెల్లించటానికి ఒప్పుకున్నది.
  3. జర్మన్ రాష్ట్రాలతో ఉత్తర జర్మన్ సమాఖ్య ప్రష్యా నాయకత్వంలో ఏర్పడి ఫ్లెష్వగ్, హాల్టిన్, హోనోవర్, హెస్సే – కాస్సెల్, నాసా, ఫ్రాంక్ఫర్ట్లు ప్రష్యా ఆధీనంలో వచ్చాయి.
  4. జర్మన్ రాష్ట్రాలపై ప్రష్యా ఆధిపత్యాన్ని బిస్మార్క్ తొలగించాడు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఇటలీ ఏకీకరణకు గారిబాల్డి చేసిన సేవ ఎటువంటిది ?
జవాబు:
మాజినీ, కవుర్ వలె ఇటలీ ఏకీకరణకు పోరాడిన మరో నాయకుడు గారిబాల్డి. ఇతడు 1807లో ‘నైస్’లో జన్మించాడు. యంగ్ ఇటలీలో చేరాడు. 1834లో సెనాయ్ మాజనీ పన్నిన కుట్రలో పాల్గొని, విఫలమై మరణ శిక్షకు గురయ్యాడు తప్పించుకుని దక్షిణ అమెరికాకు పారిపోయి 14 సంవత్సరాలు ప్రవాస జీవితం గడిపాడు. తరువాతి కాలంలో గారిబాల్డి ‘రెడ్ షర్ట్స్’ అనే స్వచ్ఛంద సైనిక దళాన్ని నిర్మించి సిసిలీ ప్రజలకు అండగా నిలిచాడు.

గారిబాల్డి ప్రజాస్వామిక వాది. అంతకుమించిన గొప్ప దేశభక్తిపరుడు. జాతీయ సమైక్యత కోసం తన స్వప్రయోజనాన్ని ప్రక్కన పెట్టి సిసిలీ రాజ్యాన్ని విక్టర్ ఇమ్మాన్యుయేల్కు అప్పగించాడు. ప్రజాభిప్రాయంలో గారిబాల్డి రెండవ ఫ్రాన్సిస్లు నేపుల్స్, సిసిలీలను సార్డీనియాలో విలీనం చేసాడు.

ప్రశ్న 2.
మొదట నెపోలియన్ జర్మనీ ఏకీకరణకు చేసిన సేవ ఎటువంటిది ?
జవాబు:
మొదటి నెపోలియన్ జర్మనీలో జాతీయతా భావం, ప్రజాస్వామ్యాలకు బీజం వేసాడు. జర్మనీలో పవిత్ర రోమన్ సామ్రాజ్యాన్ని రద్దుచేసాడు. క్రీ.శ. 1806లో ప్రష్యా, ఆస్ట్రియాలు లేకుండా జర్మనీ రాష్ట్రాలతో రైన్ కూటమిని లేక సమాఖ్యతను ఏర్పాటు చేసాడు. జర్మనీ ప్రజల్లో స్వేచ్ఛ, జాతీయతా భావం, దేశభక్తి, సౌభ్రాతృత్వాలను రగుల్కొలిపాడు. మరోవైపు ఆస్ట్రియా, మెటర్నిక్ తో తమ పెత్తనంతో జర్మనీ పరిపాలకులకు చక్రవర్తి వంటి బిరుదులు ఇవ్వలేదు. జర్మన్లకు ఒక జాతీయ పతాకం ఇవ్వలేదు. కనీసం వారిని జర్మనీ ప్రజలుగా గుర్తించలేదు. ఇంగ్లాండ్, లగ్జంబర్గ్, డెన్మార్క్, ఆస్ట్రియా, సార్జనీ, జర్మనీ రాష్ట్రాలపై పెత్తనం వహించేవి.

ప్రశ్న 3.
జోల్వెరిన్ ప్రాముఖ్యత తెలపండి.
జవాబు:
1819లో 12 జర్మన్ రాష్ట్రాలతో ప్రష్యా ఏర్పరిచిన వర్తక సుంకాల సంస్థ జోల్వెరిన్. అంతకు మునుపు ప్రష్యాలో ఆర్థికవ్యవస్థ సక్రమంగా లేక వ్యాపారస్థులను మరియు వినియోగదారులను అణచివేసేవారు. సుంకాల పద్ధతి, అధిక ధరలతో వారి దోపిడీ చేసేవారు. ప్రష్యా 28 మే, 1818 సంవత్సరంలో వ్యాపారస్థులకు మరియు వినియోగదారులకు అనుకూలంగా ఒకే విధమైన సుంకాల చట్టాలను తయారుచేసింది. ఈ చట్టం ప్రకారం ప్రష్యాలో దిగుమతి సుంకాలను తొలగించారు. తయారైన వస్తువులపై 10% మించి సుంకం విధించరాదు. దీని ఫలితంగా ప్రష్యా సరళ వాణిజ్య కేంద్రమైంది. ఈ సంస్థ చెకోపోస్ట్లు, ఆంతరంగిక సుంకాలను ఎత్తివేసి సరళవ్యాపార విధానాన్ని ఏర్పాటు చేసింది. దీని వలన జర్మన్ రాష్ట్రాల మధ్య వ్యాపార సంబంధాలు పటిష్టమయ్యాయి. 1834 నాటికి అన్ని జర్మన్ రాష్ట్రాలు ఇందులో సభ్యులయ్యారు. దీని ద్వారా జర్మన్లలో జాతీయతా భావం పెరిగి, రాజకీయ ఏకత్వానికి దారి ఏర్పడింది.

ప్రశ్న 4.
1870 – 71 ఫ్రాన్స్ – ప్రష్యా యుద్ధాన్ని గురించి వివరించండి.
జవాబు:
మూడవ నెపోలియన్ ప్రష్యారాజుతో ప్రష్యా వంశం వారెవ్వరూ కూడా స్పెయిన్ సింహాసనాన్ని అధిష్టించడానికి వీలులేదు అనే షరతు విధించాడు. ఈ సమస్యపై చర్చించడానికి ప్రష్యారాజు, ఫ్రాన్స్ రాయబారుల మధ్య ‘ఎమ్స్’ అనే చోట చర్చలు జరిగాయి. ప్రష్యారాజు మొదటి విలియం చర్చల సారాంశాన్ని ‘ఎమ్స్ టెలిగ్రామ్’ ద్వారా బిస్మార్క్క పంపాడు. బిస్మార్క్ దీనిని ఇరుదేశాలలో ఆగ్రహం కలిగేటట్లు చేసాడు. ఫలితంగా ప్రష్యారాజు తమ రాయబారిని అవమానవపరచాడని ఫ్రెంచి ప్రజలు భావించారు. దీనితో ఫ్రాన్స్ ప్రష్యాపై యుద్ధం ప్రకటించింది.

AP Inter 2nd Year History Study Material Chapter 10 జర్మనీ, ఇటలీలలో విమోచన (ఏకీకరణ) ఉద్యమాలు మొదటి నెపోలియన్

ఈ ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధం 1870 నుండి 1871 వరకు జరిగింది. 1870లో జరిగిన సెడాన్ యుద్ధంలో ఫ్రాన్స్ ఘోరపరాజయం పొందింది. మూడవ నెపోలియన్ ప్రష్యాకు లొంగిపోయాడు. యుద్ధఖైదీగా పట్టుబడ్డాడు. తరువాత ఫ్రెంచి రిపబ్లిక్ యుద్ధాన్ని కొనసాగించింది. జర్మన్ సేవలు 1871లో పారిస్ను ముట్టడించాయి. చివరికి 1871లో పారిస్ ప్రష్యాకు లొంగిపోయింది. ఫ్రాంక్ఫర్ట్ సంధికి అంగీకరించింది. దీని ప్రకారం ఫ్రెంచి వారి ఆల్సెన్, లో రైన్లను వదులుకున్నారు. యుద్ధనష్టపరిహారం కింది ఐదువేల మిలియన్ ఫ్రాంకులు చెల్లించింది. ఈ యుద్ధం తర్వాత జర్మన్ రాజు వర్సైల్స్ రాజ ప్రాసాదంలో చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకున్నాడు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
యంగ్ ఇటలీ,
జవాబు:
జోసఫ్ మాజినీ 1831లో ‘యంగ్ ఇటలీ’ అనే సంస్థను స్థాపించాడు. దీనిలోని సభ్యులు చదువుకున్నవారై, నీతితో, వైజ్ఞానికంగా ఇటలీ ప్రజలను ప్రోత్సాహపరుస్తూ, ఆదర్శమైన జీవితం గడుపుతూ ఉండాలి. ప్రాణత్యాగానికైనా సంసిద్ధులను చేయడమే దీని ముఖ్య ఉద్దేశము. 40 సంవత్సరాలలోపు ఉన్నవారు దీనిలో సభ్యులు. యుద్ధం చేసి ఇటలీ నుంచి ఆస్ట్రియాను తొలగించడం, ఇటలీ స్వయం సమృద్ధిగా ఎదగడం, రిపబ్లిక్ గా ఏర్పడటం ఈ సంస్థ ప్రధాన
ఆశయాలు.

ప్రశ్న 2.
క్రిమియా యుద్ధం.
జవాబు:
కవూర్ ఇటలీ ఏకీకరణకు ఇంగ్లాండ్, ఫ్రాన్స్లతో సంధి కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంగ్లాండుకు పెద్ద సైన్యం లేక యుద్ధాలలో మునిగి ఉంది. ఫ్రాన్స్కు మంచిసైన్యం ఉంది. కవూర్ మూడవ నెపోలియన్కు దగ్గరయ్యాడు. క్రిమియా యుద్ధం కవూర్కు మంచి అవకాశం కలిగించింది. ఫ్రాన్స్, ఇంగ్లాండ్లతో పొత్తు కుదుర్చుకుని రష్యాతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. రెండు సంవత్సరాల తర్వాత క్రిమియా యుద్ధంలో ఫ్రాన్స్, ఇంగ్లాండ్లకు ఇటలీ చేసిన సేవలకు గుర్తుగా మూడవ నెపోలియన్ కపూర్ను ఆహ్వానించి అతనికి సహాయం చేయడానికి అంగీకరించాడు. ఈ విధంగా క్రిమియా యుద్ధాన్ని కవూర్ ఇటలీ ఏకీకరణకు అనుకూలంగా మలచుకున్నాడు.

ప్రశ్న 3.
కారలా బాడ్ ఉత్తర్వులు, 1819.
జవాబు:
మెటర్నిక్ ప్రష్యా రాజైన మూడవ విలియం సహాయంతో జర్మనీలో జాతీయతా భావాన్ని, విప్లవ భావాలను అణచివేయడానికి కారల్స్బాడ్ ఆజ్ఞలు 1819లో జారీచేసాడు. వీటి ప్రకారం

  1. ఉపాధ్యాయుల, విద్యార్థుల కార్యక్రమాలను గమనించడానికి యూనివర్సిటీ ప్రతినిధులు నియమించబడ్డారు.
  2. ఉపాధ్యాయులు మతవిస్తరణ, ప్రభుత్వ విరుద్ధ కార్యకలాపాలు చేయరాదు.
  3. ఏ ఉపాధ్యాయుడైన మెటర్నిక్ ఆదేశాలు పాటించని ఎడల అతనిని ఉద్యోగం నుండి తీసివేస్తారు. తిరిగి ఏ విశ్వవిద్యాలయంలో చేర్చుకోరు.
  4. విద్యార్థులను ఒక యూనివర్సిటీ నుంచి తొలగిస్తే తర్వాత ఏ యూనివర్సిటీ తీసుకోదు.
  5. పత్రికలపై ఆంక్షలు విధించారు. బుర్సెన్ షాఫ్ట్ అనే సంఘాన్ని రద్దుచేసారు.
  6. కారలా ్బడ్ ఆజ్ఞలను ప్రష్యాలో కఠినంగా అమలుచేసి ఉద్యమాన్ని జర్మనీలో అణచివేసారు.

AP Inter 2nd Year History Study Material Chapter 10 జర్మనీ, ఇటలీలలో విమోచన (ఏకీకరణ) ఉద్యమాలు మొదటి నెపోలియన్

ప్రశ్న 4.
ఆయుధము – రక్తపాత విధానము
జవాబు:
బిస్మార్క్ ముఖ్యధ్యేయము జర్మనీ ఏకీకరణ ప్రష్యా ఆధీనంలో జరగాలని భావించడం. యుద్ధాల వలన జర్మనీ ఏకీకరణ సాధ్యంకాదని అతని అభిప్రాయం. సమస్యలు, ఉపన్యాసాలవల్లకాని, చర్చలు, సమావేశాలు, పార్లమెంట్ తీర్మానాలతో పరిష్కరించబడదు” కఠిన దండనీతే Policy of Blood and Iron దీనికి పరిష్కారం అని పేర్కొన్నాడు. దీనినే ‘రక్తపాత విధానం’ అంటారు. బిస్మార్క్ జర్మనీ ఏకీకరణకు ఈ రక్తపాత విధానాన్ని అనుసరించాడు. ఆ తరువాత జర్మనీ ఏకీకరణ కోసం ప్రష్యా, డెన్మార్క్, ఆస్ట్రియా, ఫ్రాన్స్లో మూడు యుద్ధాలు చేసింది.

AP Inter 2nd Year History Study Material Chapter 9 పారిశ్రామిక విప్లవం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 9th Lesson పారిశ్రామిక విప్లవం Textbook Questions and Answers.

AP Inter 2nd Year History Study Material 9th Lesson పారిశ్రామిక విప్లవం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బ్రిటన్ దేశములో మొదటిగా పారిశ్రామిక విప్లవం జరగడానికి దోహదపడిన అంశాలను వివరించండి.
జవాబు:
పారిశ్రామిక విప్లవం ఇంగ్లాండ్లోను, ఇతర పాశ్చాత్య ప్రపంచంలోనూ సంభవించడానికి కారణం అక్కడ శాస్త్ర విజ్ఞానం సమాజంతో జతకట్టి ఉండటమే. తత్త్వవేత్త, చేతివృత్తి నిపుణుడు సన్నిహితంగా సహజీవనం చేసిన పాశ్చాత్య సమాజాలలో అభివృద్ధి అనూహ్యంగా జరిగింది.

మానవ జాతికి ఆవశ్యకమైన కొన్ని వస్తువుల ఉత్పత్తి విధానంలో 18, 19 శతాబ్దాలలో ఇంగ్లాండ్లో పూర్తి మార్పు వచ్చింది. మానవ శ్రమ ద్వారా వస్తువుల ఉత్పత్తి విధానాన్ని మొదట యంత్రాల ద్వారా, తర్వాత భారీ యంత్రాల ద్వారా ఉత్పత్తి చేసే విధానాలు వచ్చాయి. ఈ మార్పులు అనేక ఇతర రంగాలలో మార్పులకు కారణభూతమయ్యాయి. ఉత్పత్తి పద్ధతుల్లో మార్పునకు స్థావరం కావటంతో, ఆ మార్పు ఫలితాలను అనుభవించటంలోను, ఐరోపా దేశాలలో ఇంగ్లాండ్ మార్గదర్శకమైంది. ‘ప్రపంచ కర్మాగారం’గా పరిగణించబడింది. లాభదాయకమైన యంత్రాగారాల స్థాపనకు దారితీసిన అనుకూల పరిస్థితులు, అవసరమైన రంగం ఇంగ్లాండ్లో సిద్ధంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం.

పాలనా పరిస్థితులు: ఆధునిక పరిశ్రమలను ఏర్పాటు చేసిన మొదటి దేశం బ్రిటన్. 17వ శతాబ్ది నుండి ఇంగ్లాండ్ ఒకే రాచరిక ఏలుబడిలో రాజకీయంగా స్థిరత్వం పొందింది. దేశమంతా ఒకే పాలనా చట్టం, ఒకే ద్రవ్యం చలామణిలోకి వచ్చాయి. బ్రిటన్ మినహా ఇతర ఐరోపా దేశాలలో స్థానిక అధికారుల ప్రాబల్యం ఉండటం వలన, వారు తమ ప్రాంతాల గుండా ప్రయాణించే వస్తువులపై పన్నులు వసూలు చేస్తూ ఉండటం వలన వస్తువుల ధరలు పెరిగినవి. కానీ ఇంగ్లాండ్లో ఇటువంటి పరిస్థితులు లేకపోవడం వల్ల వస్తువుల ధరలు చౌకగా అందుబాటులో ఉండేవి.

AP Inter 2nd Year History Study Material Chapter 9 పారిశ్రామిక విప్లవం

అనుకూల పరిస్థితులు: 17వ శతాబ్దం చివరి నాటికి వస్తు మారకంగా ద్రవ్యం విరివిగా వాడుకలోకి వచ్చింది. వస్త్ర పరిశ్రమకు కావలసిన పత్తి పరిశ్రమకు అనుకూలమైన తేమతో కూడిన వాతావరణం ఇంగ్లాండ్లో ఉండేది. ఇంగ్లాండ్కు నీరు, ముడిసరుకుల కొరత లేదు. బొగ్గు, ఇనుము పుష్కలంగా లభించేవి. ఫ్రాన్స్, జర్మనీ వంటి ఏ ఇతర యూరోపియన్ దేశంలో కూడా ఇంగ్లాండ్లో ఉన్నట్లు బొగ్గుగనులు, ముఖ్యమైన ఓడరేవులు సమీపంలో లేవు. ఇది జల రవాణాకు చాలా అనుకూలం. “ఇనుము, బొగ్గు, వస్త్రాల ఆధారంగా ప్రపంచం అంతా అనుకరించిన ఒక కొత్త నాగరికతను ఇంగ్లాండ్ రూపొందించింది” అని ఫిషర్ కొనియాడాడు.

పెట్టుబడి వ్యవస్థ: మూలధనం ఇంగ్లాండ్లో పెద్ద మొత్తంలో పోగుపడి ఉంది. ఈ సంపదకు అనేక కారణాలున్నాయి. 17వ శతాబ్దం ప్రారంభం నుండి బ్రిటన్ విదేశాలతో సమర్థవంతమైన వాణిజ్య విధానాలను అనుసరించి అత్యధికంగా లాభాలను గడించింది. మూలధనం ఉన్నా సరైన విధానంలో పెట్టుబడి పెట్టకపోతే ఉపయోగం ఉండదు. ‘ఇంగ్లాండ్ బ్యాంక్’ స్థాపన, ‘లండన్ ద్రవ్య మార్కెట్’, ‘జాయింట్ స్టాక్ బ్యాంక్’, ‘జాయింట్ స్టాక్ కార్పొరేషన్’ ఏర్పాటుతో ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం తేలికయింది. మెథడిజం, పూరిటానిజం వంటి మత శాఖల ప్రభావం వలన ప్రజలు వ్యసనాలు మానుకుని నిరాడంబరంగా జీవిస్తూ ఉండటం వలన కూడా ధనం పొదుపు చేయబడి పెట్టుబడిగా మారింది. ఋణాలివ్వటంలోను బ్యాంకులు అవలంబించిన పటిష్టమైన విధానం నిధుల వినియోగ యంత్రాంగాన్ని ప్రభావితం చేసిందని ఫిషర్ పేర్కొన్నాడు.

సామాజిక పరిస్థితులు: పురాతన లాభసాటికాని, వ్యవసాయ పద్ధతులకు బదులుగా నూతన వ్యవసాయ పద్ధతులైన పంటల ఆవర్తన పద్ధతి, వ్యవసాయంలో యంత్రాల వాడకం పెరగటంతో ఆహార సరఫరా పెరిగింది. ఫలితంగా జనాభా కూడా పెరిగింది. 18వ శతాబ్దం నాటికి అనేక రాజకీయ, మత కారణాల వలన ఐరోపా దేశాల నుండి ఇంగ్లాండ్కు జనాభా వలసలు పెరిగాయి. కంచెలు వేసే ఉద్యమం వల్ల భూములు కోల్పోయిన చిన్న రైతులు, బానిస వ్యవస్థ నిషేధం వల్ల రోడ్డున పడ్డ పనివారు నూతనంగా ఏర్పాటైన పరిశ్రమలలో శ్రామికులుగా చేరారు. ఇది కూడా కొత్తగా ఏర్పడిన భారీ పరిశ్రమలకు అనుకూలమయింది.

రవాణా సౌకర్యాలు: 18వ శతాబ్దం నాటికి ఇంగ్లాండ్ సముద్ర వర్తకంలో ఆధిక్యత నెలకొల్పింది. ఇంగ్లాండ్లో ఎన్నో రేవులున్నాయి. ఆధునిక రోడ్లు, కాలువల నిర్మాణంతో దేశంలో కూడా రవాణా మెరుగుపడింది.

శాస్త్రీయ ఆవిష్కరణలు: ఇంగ్లాండ్, స్కాట్లాండ్ ప్రజలు అనేక నూతన యంత్రాలను ఆవిష్కరించటంలోను, వాటిని ఉపయోగించి వస్తూత్పత్తి చేపట్టడంలోనూ ముందున్నారు.
ఈ కారణాలన్నింటి వలన ఇంగ్లాండ్లో ప్రారంభమైన పారిశ్రామిక విప్లవం ఐరోపా ఖండమంతా వ్యాపించింది.

ప్రశ్న 2.
వస్త్ర పరిశ్రమలో పారిశ్రామిక కాలంలో జరిగిన నూతన యంత్రాల ఆవిష్కరణలను వివరించండి.
జవాబు:
పారిశ్రామిక విప్లవానికి ఆధారం ఆవిరి శక్తిని యంత్రాలకు, ఆ పైన మొదటగా వస్తూత్పత్తికి తర్వాత రవాణాకు ఉపయోగించడమేనని థాంప్సన్ అన్నాడు.

ఆవిరి యంత్రం: ఆవిరి శక్తి అందుబాటులోకి రావడం వల్లనే గణనీయమైన పారిశ్రామికీకరణ సాధ్యపడింది. ఆవిరి అధిక ఉష్ణోగ్రతల వద్ద అధిక పీడనాన్ని కలిగి ఉండి యంత్రాలు పనిచేయడానికి శక్తి వనరుగా ఉపయోగపడటంతో యంత్రాలు బహుళ వాడుకలోనికి వచ్చాయి

18వ శతాబ్ది ప్రారంభంలో ‘న్యూకామెన్’ అనే మెకానిక్ ఇంగ్లాండ్లోని గనుల నుంచి నీరు తోడటానికి ఆవిరి యంత్రాన్ని కనుగొన్నాడు. దానిలో కొన్ని లోపాలున్నాయి. తరువాత కాలంలో జేమ్స్ వాట్ ఒక ప్రత్యేక కండెన్సర్ తయారు చేయడం ద్వారా ఆవిరి యంత్రంలోని లోపాలను తొలగించాడు. వాట్ తయారుచేసిన ఆవిరి యంత్రం, ఆవిరి యుగాన్ని ఆరంభించింది. గ్రేట్ బ్రిటన్లోని పరిశ్రమలను విప్లవాత్మకంగా మార్చివేసింది. అంతకు ముందు కేవలం గనులకు మాత్రమే పరిమితమై ఉన్న ఆవిరి యంత్రం బండ్లను, యంత్రాలను ముందుకు కదిలించే సామర్థ్యం గల ఇంజన్ మారింది. గనుల నుండి నీరు తోడటానికి, క్రేన్ల ద్వారా బరువులెత్తడానికి, యంత్రాల రవాణాకు, రైలు రవాణాకు, ఆవిరి నౌకలు నడపడానికి ఈ ఆవిరి యంత్రం ఉపయోగపడింది. జలచక్రం కదలికను అనుసరించి రోటరీ మిషన్ ను కనిపెట్టడంతో 1781లో ఆవిరి యంత్రం ప్రతి కర్మాగారాలలో ప్రవేశించింది.

ప్రత్తి – వస్త్ర పరిశ్రమ: 1780 నుండి వస్త్ర పరిశ్రమ బ్రిటిష్ పారిశ్రామికీకరణకు చిహ్నంగా మారింది. వస్త్రోత్పత్తిలో రెండు ప్రధాన ప్రక్రియలున్నాయి. ఒకటి ముడిసరుకు, పత్తి, ఉన్ని, పట్టు నుంచి దారం తీయటం, రెండు దారాలను వస్త్రంగా నేయడం. ఈ ప్రక్రియలో అనేక కొత్త విషయాలు కనుగొన్నారు. ఫలితంగా ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ దారాలను తీయడం సాధ్యమైంది.

1) జానకే 17వ శతాబ్దంలో ఫ్లయింగ్ షటిల్ను కనిపెట్టాడు. నేతపనివాడు చేతితో దారాన్ని ముందుకు, వెనుకకు పంపే బదులు తీగలను లాగడం ద్వారా యంత్రాన్ని పనిచేయించవచ్చు. దీనివలన ఇద్దరికి బదులు ఒక పనివాడు పెద్ద మొత్తంలో వస్త్రాన్ని నేయడం సాధ్యపడింది.

2) 1765లో జేమ్స్ హర్ గ్రీవ్స్ ‘స్పిన్నింగ్ జెన్నీ’ ని అభివృద్ధిపరిచాడు. ఇది పదకొండు కుదుళ్ళను ఒకేసారి తిప్పగల సామర్థ్యం కలిగి ఉంది. దీనితో తయారుచేసిన దారం పురి తక్కువ ఉండి, వస్త్రం నేయడానికి దృఢంగా ఉండేది కాదు.

3) రిచర్డ్ ఆర్క్ రైట్ 1769లో కొత్త సూత్రాన్ని ఆధారం చేసుకొని ‘వాటర్ ఫ్రేమ్’ ను రూపొందించాడు. దీనితో చేసిన దారం దృఢంగా, ముతకగా ఉండి నేయడానికి అనుకూలంగా ఉండేది.

4) 1779లో శామ్యూల్ క్రాంప్టన్ మ్యూల్ తన పేరున ‘మ్యూల్ యంత్రాన్ని’ నిర్మించాడు. ఇది స్పిన్నింగ్ జెన్నీ, వాటర్ ఫ్రేమ్లలోని మేలైన లక్షణాలను కలిపి సన్నగా, దృఢంగా ఉండే దారాన్ని తీయగలిగింది. ఫలితంగా పలుచని ‘మస్లిన్’ వస్త్రాలు తయారు చేయగలిగారు.

5) ఎడ్వర్డ్ కార్టైరైట్ 1787లో ‘పవర్లూమ్’ కనుగొనడంతో సులభంగా పనిచేయడానికి, దారం తెగినా ఇబ్బంది లేకుండా, ఎటువంటి వస్త్రాన్నయినా నేయడానికి అవకాశం ఏర్పడింది.

బొగ్గు మరియు ఇనుము ఉక్కు కర్మాగారాలు: ఆవిరి యంత్రం, ఇతర యంత్రాల వాడకం, ఇనుము, బొగ్గుల అవసరాన్ని సృష్టించింది. యంత్రాల తయారీకి ఇనుము, ఆవిరి యంత్రాన్ని నడపడానికి కావలసిన ఆవిరి కోసం బొగ్గు అవసరమైనాయి. 18వ శతాబ్దం నుండి ప్రధాన ఇంధన వనరుగా బొగ్గు గుర్తించబడింది.

18వ శతాబ్దానికి ముందు ముడి ఇనుమును కరిగించి ఇనుప వస్తువులు తయారు చేయడానికి వంట చెరుకును ఉపయోగించేవారు. తరువాత రాతిబొగ్గును ఉపయోగించారు. 18వ శతాబ్దం ప్రథమార్థంలో బొగ్గును కోక్గా మార్చే ప్రయత్నంలో ముడి ఇనుమును కరిగించి శుద్ధి చేయడంలోను, బలమైన గాలి పేలుళ్ళ ద్వారా ‘డర్బీలు’ సఫలమయ్యారు. డార్బ ‘కోక్ బ్లాస్ట్’ ఇనుము ఉత్పత్తిని పెంచింది. ఈ ఆవిష్కరణతో మునుపటి కంటే పెద్ద నాణ్యమైన పోతలు పోయడం సాధ్యపడింది.

AP Inter 2nd Year History Study Material Chapter 9 పారిశ్రామిక విప్లవం

జేమ్స్ వాట్, స్టీమ్ హేమర్, హంట్స్మన్ యొక్క ‘స్టీల్ ప్రాసెస్’, జాన్ స్మిటస్ యొక్క గాలింపు, హెన్రీకార్ట్, పీటర్, ఓనియమ్ల రివర్బరేటరీ ఫర్నేస్, రోలింగ్ మిల్లులు నికొల్సన్ యొక్క మాట్లా బ్లాస్ట్ మొదలైనవి 19వ శతాబ్దపు తొలి దశలో ఇనుము ఉత్పత్తి బహుళంగా వేగంగా సాగడానికి తోడ్పడిన ఆవిష్కరణలు. 1815లో ‘హంఫ్రీ డేవిస్’ కనుగొన్న ‘సేఫ్టీలాంప్’ గనుల నుండి బొగ్గు ఉత్పత్తి అధికమవడానికి దోహదమైంది.

రవాణా సౌకర్యాలు: పారిశ్రామికీకరణ, నూతన యంత్రాలతో రవాణా రంగంలో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. ప్రయాణ సాధనాలకు ఆవిరి యంత్రాన్ని ఉపయోగించడంతో ఇంగ్లాండ్లో రవాణా సమస్య పరిష్కారానికి దోహదమయింది. స్టీఫెన్సన్ మొదటి రైల్వే ఆవిరి ఇంజన్ ‘రాకెట్’ను 1814లో తయారు చేశాడు. 1825లో స్టాక్టన్, డార్లింగ్టన్ పట్టణాల మధ్య రైలు నడిచింది. వీటి మధ్య ఉన్న 9 మైళ్ళ దూరాన్ని 5 మైళ్ళ వేగంతో సుమారు రెండు గంటలలో అధిగమించారు. 20 సంవత్సరాల కాలంలోనే గంటకు 30 నుండి 50 మైళ్ళ వేగం సాధారణ విషయంగా మారిపోయింది.

విస్తృతంగా తవ్విన జలమార్గాలలో ఆవిరి పడవలు తిరగడం మరొక ముఖ్య పరిణామం. ఆవిరి ఓడల నిర్మాణంలో రాబర్ట్ పుల్టన్, నికొలస్ రూజ్వెల్ట్లు ముఖ్యపాత్ర పోషించారు. ఈ స్టీమర్ల ద్వారా అధిక మోతాదుల్లో సరుకులు, పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు తక్కువ ఖర్చుతో వేగంగా ప్రయాణించడం సాధ్యపడింది.

ప్రశ్న 3.
పారిశ్రామిక విప్లవం వలన కలిగిన లాభనష్టాలను వివరించండి.
జవాబు:
పారిశ్రామిక విప్లవం ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ, తాత్త్విక రంగాలలో ఊహించని ఫలితాలను, మార్పులను తీసుకువచ్చింది.

ఆర్థిక రంగం: యంత్రాగార వ్యవస్థ, పారిశ్రామిక పెట్టుబడిదారీ వ్యవస్థలు ఒక దానితో ఒకటి ముడిపడ్డాయి. కొత్త యంత్రాలు భారీవి, ఖరీదైనవి. అందువలన ధనవంతులు వాటి యజమానులైనారు. ఈ భారీ యంత్రాలను ప్రత్యేక భవనాలు, కర్మాగారాలలో స్థాపించి నడపటం ప్రారంభించారు. భారీ పరిశ్రమలకు పెద్ద పెద్ద పెట్టుబడులు కావాల్సి వచ్చాయి. అది కొత్తరకమైన పెట్టుబడిదారీ వ్యవస్థకు దారితీసింది. యాంత్రిక శక్తి వలన ఎంతోమంది చేతివృత్తుల వారు కార్మికులుగా మారారు. ఇంగ్లాండ్లో వస్తూత్పత్తి అధికమై ‘ప్రపంచ కర్మాగారం’ గా మారింది. పెద్ద పారిశ్రామిక వ్యవస్థలు రైలు మార్గాల వంటి జాయింట్ స్టాక్ కంపెనీలు కార్పొరేషన్లుగా తలెత్తాయి. ఇవి వేతనంపై ఉద్యోగస్తులను పనిచేయించుకోవడం ప్రారంభించాయి.

సంపద పెంపు: యాంత్రిక శక్తి ఉపయోగంతో పెట్టుబడి అనూహ్యంగా పెరిగింది. 1870 తరువాత కొత్త పరిశ్రమలు తలెత్తటం, పాత పరిశ్రమల అధిక విస్తరణలు భారీ పెట్టుబడులకు అవకాశాన్ని కల్పించాయి. ఎంతోమంది పారిశ్రామిక పెట్టుబడిదారులు, వ్యక్తిగత సామర్థ్యంతో పైకొచ్చినవారు ప్రపంచ పారిశ్రామిక నాయకులుగా ప్రసిద్ధికెక్కారు.
ప్రజా సౌకర్యాలు: 1870 నుంచి విద్యుచ్ఛక్తి ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇది క్రమంగా పరిశ్రమలకు, గృహాలకు వ్యాపించింది. ఐస్ తయారీ, నిల్వ ఉంచడానికి రిఫ్రిజిరేటర్ తయారీ, ‘సింగర్’ కనిపెట్టిన కుట్టుమిషన్, రెమింగ్టన్ ఆవిష్కరించిన టైప్ రైటర్, శీఘ్ర చలనానికి ఆవిష్కరింపబడిన సైకిల్ వంటివి ప్రజా జీవితంలో ఎన్నో సౌఖ్యాలను, విలాసాలను సృష్టించింది.

పారిశ్రామిక విప్లవం మానవ జీవితాన్ని అనేక విధాలుగా మార్చివేసింది. ఎంతో సాంకేతిక అభివృద్ధితో పాటు ఎన్నో సామాజిక, ఆర్థిక సమస్యలను సృష్టించింది.
సామ్రాజ్యవాదం: పారిశ్రామిక విప్లవం వలన వస్తువుల అధికోత్పత్తి జరిగి వాటి ధరలు తగ్గిపోయాయి. తమ అధికోత్పత్తులు అమ్ముకోవడం కోసం అంతర్జాతీయ మార్కెట్ల కొరకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాలు వలస వాదానికి, క్రమేణా సామ్రాజ్యవాదానికి దారితీసి వలసల కొరకు యుద్ధాలు జరిగాయి. వీటి కోసం ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి. ఆసియా, ఆఫ్రికా ఖండాలలోని ఎన్నో దేశాలను వీరు ఆక్రమించి ఆయా దేశాలను దోపిడీ చేసారు.

నగరీకరణ: పారిశ్రామిక విప్లవం ఫలితంగా భారీ పరిశ్రమలు స్థాపించబడ్డాయి. ఈ పరిశ్రమల చుట్టూ పెద్ద పట్టణాలు అభివృద్ధి చెందాయి. 1750 నాటికి యాభైవేలు, అంతకన్నా ఎక్కువ జనాభా ఉన్న పట్టణాలు 29కి పెరిగాయి. పట్టణాలలో రెండు సాంఘిక వర్గాలు ఏర్పడ్డాయి. మధ్య తరగతి ప్రజలు ఒక వర్గంగా, పనిచేసే శ్రామికులు ఒక వర్గంగా ఏర్పడ్డారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా గృహాలు, త్రాగునీరు. ప్రజారోగ్య వసతులు పెరగలేదు. కొత్తగా నగరానికి వచ్చినవారు అప్పటికే కిక్కిరిసిన మురికివాడల్లో నివసించారు. సగర కాలుష్యం నుండి తప్పించుకోవడానికి ధనికులు నగరపు శివార్లకు చేరారు. నగరాలలో టైఫాయిడ్, కలరా. కాలుష్యంతో వేలాదిమంది ప్రజలు మరణించారు.
సామాజిక పరిణామాలు: పారిశ్రామిక విప్లనం వలన అనేక సామాజిక పరిణామాలు సంభవించాయి. ఆర్థిక వ్యవస్థలో నూతన మార్పులు ప్రజలకు కష్టాలను, అసంతృప్తిని మిగిల్చాయి. పట్టణ పేదలు, పారిశ్రామిక కార్మికులలో అకస్మాత్తుగా తలెత్తిన పరిణామాలు 1848 విప్లవానికి, ఇంగ్లాండ్లో చార్టిస్ట్ ఉద్యమానికి దారితీసాయి. శాఖోపశాఖలుగా విస్తరించిన పారిశ్రామిక విప్లవ ప్రభావాన్ని తట్టుకొనే పరిజ్ఞానం లేని చిన్న వ్యాపారులు, మధ్య తరగతి పెట్టుబడిదారులు అసంతృప్తికి గురయ్యారు. గమ్యం తోచని శ్రామికులు యంత్రాలు తమ జీవితాన్ని నాశనం చేస్తున్నాయని భావించి వాటిని ధ్వంసం చేసారు. పెట్టుబడిదారులు కార్మికుల శ్రమను దోచుకొని ఆదాయాలను విపరీతంగా పెంచుకున్నారు. ఆ ధనాన్ని తిరిగి పరిశ్రమలలో పెట్టుబడి పెట్టారు. వారి ధనదాహం కార్మికులను తిరగబడేటట్లు చేసింది.

స్త్రీలు – బాలకార్మికులు: పారిశ్రామిక విప్లవం స్త్రీలు – పిల్లలు పనిచేసే విధానంలో మార్పు తెచ్చింది. లాంకై షైర్, యార్కైర్ నూలు మిల్లు కర్మాగారాలలో స్త్రీలు, పిల్లలు ఎక్కువగా పనిచేసేవారు. పెద్ద పెద్ద యంత్రాల మధ్య ఎందరో బాల కార్మికులు గాయాల పాలవడం లేదా సురణించడం జరిగేది. స్త్రీలు కూడా దుర్భర పరిస్థితులలో పనిచేసేవారు.

కార్మిక చట్టాలు: ఫలితంగా కార్మికులలో పెరిగిన నిరసనలు తొలగించడానికి కార్మిక చట్టాలు తయారయ్యాయి.

బాల కార్మిక వ్యవస్థను నిషేధించారు. కానీ ఆ చట్టాలు సక్రమంగా అమలవ్వలేదు.

సామ్యవాద ప్రభావం: ఐరోపాలో నాటి పరిస్థితుల నుంచి సాన్యువాద భావం ఊపందుకుంది. కార్ల్ మార్క్స్ తన మిత్రుడు ఏంగిల్స్తో కలిసి కమ్యూనిస్ట్ మానిఫెస్టో గ్రంథాన్ని రచించాడు. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని పిలుపునిచ్చాడు. ఇతను ‘దాస్ కాపిటల్’ అనే గ్రంథం రచించాడు.

AP Inter 2nd Year History Study Material Chapter 9 పారిశ్రామిక విప్లవం

మానవ చరిత్రలో ఏ విప్లవం కూడా పారిశ్రామిక విప్లవం ప్రభావితం చేసినట్లుగా మానవ జీవితాన్ని ప్రభావితం చేయలేదు. ఈ విప్లవ ఫలితంగా ఇంగ్లండ్ తదితర ఐరోపా దేశాలు ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాలలో ప్రజలను దోపిడీకి గురిచేసి చెప్పలేని కడగండ్లకు గురిచేసాయి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
టి. హర్ గ్రీవ్స్.
జవాబు:
హవ్స్ 1720లో ఇంగ్లాండ్ నందు జన్మించాడు. ఇతడు చేనేత కార్మికుడుగా ఉండేవాడు. నిరక్షరాస్యుడు. | 1765లో హర్ గ్రీవ్స్ స్పిన్నింగ్ జెన్నీని అభివృద్ధి చేసాడు. ఇది పదకొండు కుదుళ్ళను ఒక్కసారే తిప్పగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఆ విధంగా 8 లేక 10 మంది పనిని చేయగలిగింది. దీని సహాయంతో తీసిన దారం పురి తక్కువగా ఉండి దారం తెగిపోయి వస్త్రం నేయడానికి దృఢంగా ఉండేది కాదు.

ప్రశ్న 2.
ఆవిరి యంత్రం.
జవాబు:
1698లో థామస్ సావొరి గనుల నుండి తోడటానికి ‘ద మైనర్ ఫ్రెండ్స్’ అనే నమూనా ఆవిరి యంత్రాన్ని రూపొందించాడు. ఈ ఇంజన్ నిదానంగా పనిచేసేది. 1712లో న్యూకామెన్ మరొక ఆవిరి యంత్రాన్ని తయారు చేసాడు. ఈ ఇంజన్ కండెన్సింగ్ సిలిండర్ను నిరంతరం చల్లబరుస్తూ ఉండటం వలన శక్తిని కోల్పోతూ సరిగా పనిచేసేది కాదు. 1769లో జేమ్స్వట్ తన యంత్రాన్ని రూపొందించే వరకు ఆవిరి యంత్రం గనులకే పరిమితమయింది.

జేమ్స్వాట్ ఆవిరి యంత్రాన్ని వాయువులను, నీరు వంటి ద్రవాలను వేగంగా ముందుకు తీయడంతో పాటు, బండ్లను, యంత్రాలను కదిలించే సామర్థ్యం గల ఇంజన్ గా మార్పు చేసాడు. మథ్యూ బౌల్డన్ అనే సంపన్న వ్యాపారవేత్త సహాయంతో బర్మింగ్రమ్ నందు జేమ్స్వట్ సోహా అనే కార్ఖానా స్థాపించాడు. గనుల నుండి నీరు తోడడానికి, క్రేన్లను ఉపయోగించి బరువులు ఎత్తడానికి, యంత్రాల రవాణాకు, రోడు, రైలు, జల రవాణాకు ఆవిరి యంత్రం (స్టీమ్ ఇంజన్) ఉపయోగపడింది.

ప్రశ్న 3.
లూధిజమ్.
జవాబు:
‘జనరల్ లూడ్’ అనే జనాకర్షక నాయకుడు మరొక నూతన నిరసన ఉద్యమాన్ని చేపట్టాడు. దీనినే లుద్దిజం అంటారు. లుద్దిజం కేవలం యంత్రాలపై దాడిచేసే తిరోగమన విధానాన్ని అనుసరించలేదు. కనీస వేతనాలు, స్త్రీలు, పిల్లలపై పనిభారం తగ్గించడం, యంత్రాల రాకతో పని కోల్పోయిన వారికి ఉపాధి కల్పించడం, తమ కోర్కెలను చట్టబద్ధంగా తెలియజేయడానికి కార్మిక సంఘాలుగా ఏర్పడే హక్కును ప్రబోధించింది. పారిశ్రామిక విప్లవం సంభవించిన తొలినాళ్ళలో కార్మికుల జీవితాలు దుర్భరమయ్యాయి. వారికి నిరసన తెలియజేయడానికి కాని, ఓటు హక్కు గాని లేవు. లుద్దిజం ఈ లోపాలను తొలగించడానికి కృషి చేసింది.

ప్రశ్న 4.
బాల కార్మికులు.
జవాబు:
పారిశ్రామిక విప్లవ కాలంలో ఏర్పడిన అనేక పరిశ్రమలలో ఎంతోమంది బాల కార్మికులుగా పనిచేసేవారు. లాంకైర్, యార్కైర్ నూలు మిల్లు కర్మాగారాలలో ఎందరో బాల కార్మికులు పనిచేసేవారు. నూలువడికి జెన్నీ వంటి యంత్రాలను బాల కార్మికులు చిన్న శరీరాలతో, చేతి వేళ్ళతో వేగంగా పనిచేయడానికి అనువుగా తయారు చేసారు. బాల కార్మికుల శరీరాలు ఇరుకైన యంత్రాల మధ్య అటూ ఇటూ తిరుగుతూ పని చేయడానికి అనుకూలంగా ఉంటుంది. సుదీర్ఘ పనిగంటలు, ఆదివారాలు యంత్రాలను శుభ్రం చేయడం వంటి పనుల వల్ల వారికి కొద్ది సమయమైనా స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి, వ్యాయామానికి కాని అవకాశం ఉండేది కాదు. వారి జుట్టు యంత్రాలలో ఇరుక్కుపోవడం, చేతులు యంత్రాలలో పడి నలిగిపోవడం, అధిక శ్రమవల్ల అలసటకు గురై నిద్రలోకి జారుకొని యంత్రాలలో పడి చనిపోవడం వంటి ప్రమాదాలకు గురయ్యేవారు. చిన్న వయసులో బాలురతో పని చేయించడం భవిష్యత్తులో కర్మాగారాలలో వారు చేసే పనులకు శిక్షణగా భావించేవారు. బాల కార్మికుల పరిస్థితులు మెరుగుపరచడానికి ఎన్నో చట్టాలు చేసినా, ఆ చట్టాలు సరిగా అమలు కాలేదు.

AP Inter 2nd Year History Study Material Chapter 9 పారిశ్రామిక విప్లవం

ప్రశ్న 5.
జాన్ మెక్ మ్.
జవాబు:
పురాతన కాలం నుండి ఇంగ్లీషు రోడ్లు, వస్తువులు, మానవుల రవాణాకు అనుకూలంగా ఉండేవి కావు. రవాణా చాలా వ్యయప్రయాసలతో కూడి నిదానంగా జరిగేది. ఈ సమస్య పరిష్కారానికి జాన్మెక్మ్ అనే స్కాట్లండు చెందిన ఇంజనీర్ కంకరరోడ్డు నిర్మించే పద్ధతి కనుగొన్నాడు. రహదారి ఉపరితలం మీద చిన్న చిన్న రాళ్ళను పరచి, చదును చేసి, బంకమట్టితో అతికాడు. ఈ విధానం ‘మెకాడమైజేషన్’ అనే పేరు పొందింది. తరువాత కాలంలో వీరెందరో కాంక్రీట్, తారు ఉపయోగించి మరిన్ని మంచి ఫలితాలు సాధించారు. మెకాడమ్ కనిపెట్టిన ఈ విధానంతో రవాణా రంగం సులభంగా, వేగంగా జరిగింది.

ప్రశ్న 6.
రైల్వేల ప్రయోజనాలు.
జవాబు:
మొదటి రైల్వే ఆవిరి ఇంజన్ ‘రాకెట్’ ను స్టీఫెన్ సన్ 1814లో తయారు చేసాడు. సంవత్సరం పొడవునా రవాణా చేయడానికి అనుకూలమైన సాధనంగా రైల్వేలు ఆవిర్భవించాయి. ఇవి ప్రయాణీకులను, సరుకులను వేగంగా తక్కువ ఖర్చుతో రవాణా చేయసాగాయి. 1760 నాటికి కలప పట్టాలకు బదులు, ఇనుప పట్టాలు కనిపెట్టడంతో ఆవిరి యంత్రంతో పెట్టెలు లాగడం వలన ఇది సాధ్యపడింది.

రైలు మార్గాలలో పారిశ్రామికీకరణ రెండవ దశకు చేరుకుంది. రైల్వేలు అత్యంత సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయ రవాణా మార్గాలుగా ఆవిర్భవించాయి. బ్రిటన్లో 1850 నాటికి అత్యధిక భాగం రైల్వేలైన్లు అందుబాటులోకి వచ్చాయి. దీనికొరకు పెద్ద మొత్తంలో బొగ్గు, ఇనుము ఉపయోగించబడ్డాయి. ఇందువల్ల ప్రజా పనులు, నిర్మాణ రంగానికి ప్రోత్సాహం చేకూరి అనేకమంది కార్మికులకు ఉపాధి లభించింది.

AP Inter 1st Year History Study Material Chapter 9 భక్తి, సూఫీ సంప్రదాయాలు (క్రీ.శ. 8 – 16 శతాబ్ధాలు)

Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 9th Lesson భక్తి, సూఫీ సంప్రదాయాలు (క్రీ.శ. 8 – 16 శతాబ్ధాలు) Textbook Questions and Answers.

AP Inter 1st Year History Study Material 9th Lesson భక్తి, సూఫీ సంప్రదాయాలు (క్రీ.శ. 8 – 16 శతాబ్ధాలు)

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భక్తి ప్రబోధకుల ప్రధాన లక్షణాలను తెలపండి.
జవాబు:
ప్రాచీన కాలం నుంచి మధ్యయుగం వరకు నడిచిన భక్తి ఉద్యమంలో క్రింది ప్రధాన లక్షణాలను గమనించవచ్చు.
1) ఈశ్వరుని ఏకత్వంపై గాఢానురక్తి ప్రధాన లక్షణం. ఇందులో ముక్తి సాధనకై భగవంతుడి కృపను పొందడమే భక్తుడి లక్ష్యంగా భావించబడింది.

2) పూజా పునస్కారాలు, కర్మకాండలను వ్యతిరేకించిన భక్తి ఉద్యమకారులు పవిత్రమైన మనస్సు, జీవనం, మానవత్వం, భక్తి వంటివి అనుసరించడం ద్వారా భగవంతుడి కృపను పొందవచ్చు అని బోధించారు.

3) భక్తి ఉద్యమకారులు ఏకేశ్వరోపాసనను బోధించారు. కొందరు సగుణోపాసనను, మరికొందరు నిర్గుణోపాసనను ప్రోత్సహించారు. వైష్ణవుల్లో సగుణోపాసన ప్రసిద్ధమైంది. వారు శ్రీమహావిష్ణువు అవతారాలైన రాముడు లేదా కృష్ణుడిని తమ దేవుడిగా భావించారు. కాగా నిర్గుణోపాసన విగ్రహారాధనను వ్యతిరేకించింది. దేవుడు సర్వాంతర్యామి, మానవుల హృదయాల్లోనే భగవంతుడు ఉన్నాడు అని వారు ప్రచారం చేశారు. సగుణోపాసన, నిర్గుణోపాసనలను రెండింటినీ చిన్న మార్పులతో శంకరాచార్యుడి అద్వైత సిద్ధాంతములో చెప్పబడ్డాయి.

4) ఉత్తర, దక్షిణ భారతదేశ భక్తి ఉద్యమకారులు జ్ఞానం పొందడం ‘భక్తి’లో భాగంగా చెప్పారు. నిజమైన జ్ఞానాన్ని పొందేందుకు గురువు అవసరమని వారు బోధించారు.

5) భక్తి ఉద్యమకారులందరూ కుల వ్యవస్థను వ్యతిరేకించారు. అందువల్ల తక్కువ కులాలవారికి వారు ఆశాజ్యోతి అయ్యారు. భక్తి ఉద్యమకారుల్లో అధికమంది తక్కువ వర్గాల నుంచి వచ్చిన వారు కావడం విశేషం. నామదేవుడు (1270-1350), దర్జీ కుటుంబం, తుకారామ్ (1601-1649) శూద్ర కుటుంబం, కబీర్ దాస్ ముస్లిం మతంలోని నేతకుటుంబం నుంచి వచ్చారు.

6) భక్తి ఉద్యమకారులు పూజారులు పెత్తనాన్ని, సంస్కృత భాషను వ్యతిరేకించారు. ప్రజల భాషలోనే తమ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. అందువల్ల బెంగాలీ, గుజరాతీ, మరాఠి, హిందీ వంటి ప్రాంతీయ భాషలకు స్వర్ణయుగం ప్రారంభమై అభివృద్ధి చెందాయి.

ప్రశ్న 2.
రామానందుడు, కబీర్లు భక్తి ఉద్యమానికి చేసిన సేవను వివరించండి.
జవాబు:
రామానందుడు : భక్తి ఉద్యమ ప్రవక్తలలో మొదటివాడు రామానందుడు. తమ సొంత బ్రాహ్మణ కులానికి చెందినవారి ఆధిపత్యాన్ని తిరస్కరించాడు. గంగాతీర ప్రాంతంలో తన సిద్ధాంత ప్రచారానికి హిందీ భాషను ఉపయోగించారు. రామానుజాచార్యుల విశిష్టాద్వైత మతాన్ని స్వీకరించి మరింత ప్రచారం కల్పించాడు. సాంఘిక దురాచారాలను, కర్మకాండలను తిరస్కరించిన రామానందుడు సంస్కృతం, హిందీ భాషకు ప్రాధాన్యం ఇచ్చాడు. తన రచన ‘ఆనంద భాష్యం’లో శూద్రులు వేదాలను అధ్యయనం చేయడాన్ని గుర్తించలేదు. తక్కువకులం వారిని శిష్యులుగా స్వీకరించాడు. ఇతని శిష్యుల్లో ధర్మాజాట్, సేనానాయి బ్రాహ్మణుడు, రవిదాస్ చర్మకారుడు, కబీర్ మహ్మదీయుడు, మహిళలు కూడా తన శిష్యులయ్యారు. వారిలో పద్మావతి, సురస్త్రీలు.

కబీర్ (1440–1510) : కబీర్ మధ్యయుగంలోని ప్రముఖ సంఘ, మతసంస్కర్త. రామానందుడి శిష్యుల్లో కబీర్ విప్లవ భావాలు కలవాడు. తన గురువు సాంఘిక సిద్ధాంతానికి అచరణాత్మక రూపును ప్రసాదించాడు. కబీర్ కులవ్యవస్థను ఖండించాడు. ఇతడు విగ్రహారాధనను, కర్మకాండలను ఖండించాడు. తీర్థయాత్రలను చేయడాన్ని వ్యతిరేకించాడు. మహిళల పరదా పద్ధతిని తిరస్కరించాడు. కబీర్ సాధారణ జీవనాన్ని విశ్వసించాడు. కబీర్ స్వయంగా బట్టలు కుట్టి వాటిని మార్కెట్లో విక్రయించాడు. ఆయనకు ‘లోయ్’ అనే మహిళతో వివాహం అయ్యింది. ఆయన కుమారుడు కమల్. ఆలోచనా పరుడు, భక్తుడు, దేవుడు ఒక్కడే అని కబీర్ విశ్వాసం. రాముడు, రహీం ఒక్కరే అని ప్రచారం చేశాడు. హిందూ-ముస్లింల మధ్య మైత్రి సాధించడానికి కబీర్ తీవ్రంగా కృషి చేశాడు. “హిందూ, ముస్లింలు ఇద్దరూ సర్వోన్నతమైన భగవంతుడి బిడ్డలు అని స్పష్టంగా అనేకసార్లు గట్టిగా చెప్పిన మొట్టమొదటి సాంఘిక, మతసంస్కర్త కబీర్” అని కె.ఎస్. లాల్ అనే పండితుడు పేర్కొన్నాడు. కబీర్ శిష్యులను “కబీర్ పంథీస్” అని అంటారు. కబీర్ రచించిన దోహాలకు ‘బీజక్’ అని పేరు. వీరు ఇరువురు ఒకే మట్టితో చేసిన రెండు కుండల వంటి వారని కబీర్ పేర్కొన్నాడు. ‘పవిత్రమైన హృదయం లేకుండా విగ్రహాన్ని ఆరాధించడం వల్ల, గంగానదిలో స్నానమాచరించడం వల్ల ప్రయోజనం ఏముంది ? మక్కాకు యాత్ర చేయడం వల్ల ప్రయోజనం ఏముంది ? అని కబీర్ ప్రశ్నించాడు.

ప్రశ్న 3.
సూఫీ మతాన్ని నిర్వచించి, దాని లక్షణాలను వివరించండి.
జవాబు:
మధ్యయుగ భారతదేశంలో భక్తి ఉద్యమం లాగానే సూఫీ ఉద్యమం కూడా హిందూ ముస్లింలను ఒకే వేదికపైకి తేవటానికి ప్రయత్నించింది. ముస్లిం మత విశ్వాసానికి మరొక పేరే సూఫీమతం. అరేబీయాలో సూఫీ మతం ప్రారంభమై తరువాత భారతదేశానికి వ్యాప్తి చెందింది. సూఫీమతాన్ని భారతదేశానికి తెచ్చిన ఘనత అరబ్బులకే దక్కుతుంది.
క్రీ.శ 19వ శతాబ్దంలో ‘సూఫీఇజం’ అనే ఆంగ్లపదం వాడుకలోని వచ్చింది. సూఫీ అనే పదం ‘తసావూఫ్’ అనే ఇస్లాం గ్రంథాల్లో ఉంది. ‘సపా’ అనే పదం నుంచి సూఫీ ఆవిర్భవించిందని కొందరు పండితులు అభిప్రాయపడ్డారు. మరికొందరు ‘సుఫా’ అనే పదం నుంచి ఆవిర్భవించిందని పేర్కొన్నారు. ‘సుఫా’ అంటే మహ్మద్ మసీదు వెలుపల ఆయన శిష్యులు మత సమావేశాలను జరిపే ‘అరుగు’ అని అర్థం. బస్రాకు చెందిన జహీజ్ మొదటిసారిగా సూఫీ అనే పదాన్ని ఉపయోగించాడు. క్రీ.శ 10వ శతాబ్దం కంటే పూర్వం సూఫీ మతం అరేబియా, పర్షియా ప్రజల సాంఘిక, మత జీవనాన్ని ప్రభావితం చేసింది. భగవంతుడిని ప్రేమించడమే అతన్ని చేరే ప్రధాన మార్గమని సూఫీ బోధకుల దృఢ నమ్మకం. ఎక్కువ మంది సూఫీ బోధకులు సమాజానికి దూరంగా ఏకాంతంగా గడిపి మోక్ష సాధనకై ప్రయత్నించారు. ఉలేమాల ఆధిపత్యాన్ని వారి ఖురాన్ వర్గీకరణను సూఫీ బోధకులు వ్యతిరేకించారు. ఉలేమాలు ఖురాన్ వాస్తవ స్ఫూర్తి అయిన ప్రజాస్వామ్య సమానత్వ భావాలకు వ్యతిరేకంగా వ్యవహరించేవారు. సూఫీ బోధకులు హిందూ, జైన, బౌద్ధ, క్రైస్తవ, జొరాస్ట్రియన్ మతాల వల్ల ప్రభావితులయ్యాయి.

హిజ్రా యుగానికి చెందిన మొదటి రెండు శతాబ్దాల్లో సూఫీ బోధకులు పశ్చాత్తాపం, దేవుడిపై విశ్వాసం వంటి ప్రాథమిక సూత్రాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వారు కఠిన నియమాలను పాటించారు. మంచి ప్రవర్తన, స్వయంకృషి, సమానత్వాన్ని బోధించారు. వారు గురువులను ‘పీర్ ‘గా గౌరవంగా పిలిచేవారు. వారు బహుమతులను స్వీకరించక దయ, నిరాడంబరత, సహనం, దైవంపై అపార విశ్వాసం, మోక్షాలను విశ్వసించారు.

ప్రశ్న 4.
చిట్టీ, సూఫీ బోధకుల విజయాలను చర్చించండి.
జవాబు:
భారతదేశంలోని చిట్టీ, సూఫీ బోధకుల్లో ఖ్వాజా మొయినుద్దీన్ శిష్యులైన షేక్ హమీదుద్దీన్, షేక్ కుతుబుద్దీన్ భక్తియార్ కాకిలు ప్రధానమైనవారు. వారు సమానత్వాన్ని బోధిస్తూ సామాన్య జీవితాన్ని గడిపారు. శాకాహారులైన వారు స్థానిక హిందువులతో సన్నిహితంగా మెలిగారు. రాజపోషణ, దానాలు తీసుకోవడాన్ని వారు వ్యతిరేకించారు. గాత్ర, వాయిద్య సంగీతాలలో గొప్ప ఆధ్యాత్మికత ఉన్నట్లువారు పేర్కొన్నారు. భక్తియార్ కాకికి ఆధ్యాత్మిక సంగీతం అంటే ఇష్టం. సూఫీ బోధకులు తమ ఆశ్రమాల్లో ఏర్పాటు చేసిన హిందూ, ముస్లిం సంగీత విభావరులు అశేష ప్రజానీకాన్ని ఆకట్టుకొన్నాయి.

షేక్ ఫరీద్ లేదా బబాఫరీద్ ఢిల్లీ సుల్తానుల కాలానికి చెందిన మరొక సూఫీ బోధకుడు. అతడు అతి సామాన్య జీవితాన్ని గడిపాడు. భక్తి బోధకుల సంగీతాన్ని ఇష్టపడేవాడు. ఆయన శిష్యుల్లో నిజాముద్దీన్ అలియా ముఖ్యుడు. ఢిల్లీలోని ఘజియాపూర్లో తన కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు.

హజరత్ నిజాముద్దీన్ వినయశీలి. ఇతడు అత్యంత సామాన్య జీవితాన్ని గడిపాడు. పేదవారిని ప్రేమించాడు. ఢిల్లీ సుల్తానుల బహుమానాలను ఆయన తిరస్కరించాడు. నసీరుద్దీన్ చిరాగ్, షేక్ సలీం చిష్టిలు ఆయన ప్రధాన శిష్యులు. షేక్ సలీమ్ చిష్టీ అక్బర్ సమకాలీకుడు. ఇతని సిద్ధాంతాలు, జీవనవిధానం అక్బర్ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. అక్బర్ స్వయంగా ఫతేపూర్ సిక్రిని సందర్శించి చిష్టీ ఆశీస్సులను పొందాడు. తనకు కుమారుడు జన్మించాక అతనికి సలీమ్ అని అక్బర్ నామకరణం చేశాడు. చిష్తీ సమాధిపై అక్బర్ నిర్మించిన దర్గా ఉరుసు సందర్భంగా అన్ని ప్రాంతాల, అన్ని మతాల ప్రజలను విశేషంగా ఆకర్షిస్తూ ఉంది.

ప్రశ్న 5.
సుహ్రవర్థీ సిల్సిలా గురించి వ్రాయండి.
జవాబు:
సుహ్రవర్థి సిల్సిలా రెండవ ప్రసిద్ధ శాఖ. ఈశాన్య వాయువ్య భారతదేశంలో విలసిల్లింది. ముల్తాన్ దీవి ప్రధాన కేంద్రమైన తరువాత కాలంలో ‘సింధు’కు విస్తరించింది. భారతదేశంలో దీన్ని ముల్తాన్కు చెందిన షేక్ బహఉద్దీన్ స్థాపించాడు. ఆయన ముస్లిం విజ్ఞాన కేంద్రాలతో పాటు మక్కా – మదీనా, సమర్ఖండ్, బాగ్దాద్లను సందర్శించి ప్రజలు వారి సంస్కృతిని గురించి అనేక విషయాలను తెలుసుకొని తన గురువు షేక్ షహబుద్దీన్ సుహ్రవర్థీ (బాగ్దాద్)ని అనుకరించాడు. పేదరికంలో జీవించడాన్ని వ్యతిరేకించటంతో పాటు కఠిన ఉపవాసాన్ని తిరస్కరించాడు. ఆయన క్రీ.శ 1262లో మరణించాడు. షేక్ బహానంద్ దీన్ జకారియా సుహ్రవర్దీ మరణానంతరం ఈ సిల్సిలా రెండు భాగాలుగా చీలిపోయింది. అతని కుమారుడు బదర్ ఉద్దీన్ ఆరిఫ్ నాయకత్వంలో ముల్తాన్ శాఖ, సయ్యద్ జలాలుద్దీన్ సురఖ్ బుఖారి నాయకత్వంలో ఉచ్ శాఖలుగా విడిపోయాయి. సుహ్రవర్థీ సిల్సిలా చాలా విషయాల్లో చిష్టీ సిల్సిలాను వ్యతిరేకించింది. సుహ్రవర్ధలు పాలకుల మన్నన పొంది వారిచే కానుకలను స్వీకరించడం వంటివి చేశారు. వారు పేద, సామాన్య ప్రజలను గురించి పట్టించుకోలేదు.

సుహ్రవర్దీ సిల్సిలా తమ దర్గాలలో కేవలం సంపన్నులు, ఉన్నత వర్గాల సందర్శకులనే అనుమతించారు. మూడవ ప్రధానమైన సిల్సిలా ‘నక్షాబందీ సిల్సిలా’ దీన్ని ఖ్వాజాపీర్ మహ్మద్ స్థాపించాడు. ఇతడి శిష్యుడైన ఖ్వాజా బాకీభిల్లా భారతదేశం అంతటా దీన్ని వ్యాప్తి చేశాడు. పరిషత్ న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చిన వీరు చిష్టీ సిల్సిలాలు, ఇతర సిల్సిలాలు ముస్లింలలో ప్రవేశపెట్టిన మార్పులను వ్యతిరేకించారు. ఈ సిల్సిలాతో పాటు ఖాద్రీ, ఫిరదౌసియా సిల్సిలాలు కూడా సమాజంలోని కొన్ని వర్గాల్లో ప్రత్యేక స్థానాన్ని పొందాయి.

ప్రశ్న 6.
భక్తి, సూఫీ ఉద్యమాలు సమాజంపై ఎటువంటి ప్రభావాన్ని చూపాయో వివరించండి.
జవాబు:
భక్తి, సూఫీ ఉద్యమకారుల బోధనలు భారతీయులకు కొత్త వేదికను సమకూర్చాయి. వీరి ఉదార, మానవతావాద బోధనలు అనేకమంది సామాన్యులను ఆకర్షించాయి. వీరి భావనలు బ్రాహ్మణుల, పూజారుల మౌల్వీల ఆధిపత్యాన్ని ప్రశ్నించాయి. ప్రజల భాషల్లో బోధన చేసి వీరు సామాన్యులను ఆకట్టుకున్నారు. కబీర్, నానక్ వంటి భక్తి ఉద్యమకారుల ముస్లింల మధ్య ఉన్న విభేదాలను తగ్గించాయి. అన్ని వర్గాల ప్రజలకు నీతితో కూడిన ఆత్మ విశ్వాసంతో జీవించాలని పిలుపునివ్వడంతో పాటు కుల వ్యవస్థను వ్యతిరేకించారు. వీరి విధానాల సమానత్వాన్ని బోధించి మత మార్పిడులను నిరోధించాయి. భక్తి, సూఫీ సన్యాసులు తమ నిరాడంబర జీవితం, పవిత్రమైన వ్యక్తిత్వం ద్వారా పరస్పరం ప్రభావితులయ్యారని ప్రముఖ చరిత్రకారుల యూసఫ్ హుస్సేన్ ఎ.ఎల్. శ్రీవాత్సవ, ఆర్.సి. మంజూందార్, జె.ఎన్. సర్కార్ వంటి వారు అభిప్రాయపడ్డారు. వారిరువురూ హిందూ ముస్లింల మధ్య పెరుగుతున్న స్పర్ధను తగ్గించేందుకు కృషి చేశారు. ఈ ఉద్యమాల వల్ల ప్రాంతీయ భాషలు అభివృద్ధి చెందడంతోపాటు సమాజానికి కొత్త ఆశలు, రూపం ప్రసాదించబడ్డాయి.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆళ్వారులు, నాయనార్లు
జవాబు:
క్రీ.శ. 6వ శతాబ్ద కాలంలో తమిళదేశంలో ఆళ్వారులు (వైష్ణవాచార్యులు), నాయనార్ల (శైవాచార్యులు) నాయకత్వంలో వాస్తవంగా భక్తి ఉద్యమం ప్రారంభమైంది. వారు వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ వారి దేవతలను గురించి పాటలు పాడుతూ భక్తిని ప్రచారం చేశారు.

ఆళ్వార్లు, నాయనార్లు కులవ్యవస్థను బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించినట్లు కొందరు పండితులు అభిప్రాయపడ్డారు. తొండరిప్పొడి ఆళ్వారు, అప్పార్ అనే నాయనార్లు కులవ్యవస్థను వ్యతిరేకించడంతోపాటు ఉపయోగంలేని గోత్రాలు, శాస్త్రాలను తిరస్కరించారు. స్త్రీ అయిన ఆండాళ్ (ఆళ్వారు) తన రచనల్లో విష్ణువును ప్రస్తుతించింది. కరైకాల్ అమ్మయార్ (నాయనారు) మోక్ష సాధనకు కఠినమైన సన్యాసాన్ని అనుసరించింది. వీరిద్దరూ తమ రచనల్లో సనాతన సాంఘిక కట్టుబాట్లను వ్యతిరేకించారు.

ప్రశ్న 2.
శంకరాచార్యుడు
జవాబు:
భక్తి ఉద్యమ ప్రబోధకుల్లో శ్రీ శంకరాచార్యులను ఆద్యులుగా చెప్పవచ్చు. శంకరాచార్యుడు బోధించిన సిద్ధాంతం అద్వైత సిద్ధాంతంగా ప్రసిద్ధిచెందింది. బెనారస్క చెందిన గోవిందయోగి బోధనలు శంకరాచార్యుడిని ప్రభావితం చేశాయి. శంకరాచార్యుడు హిందూమతానికి నూతన తాత్వికతను జోడించాడు. శంకరాచార్యుడు చేసిన ప్రయత్నాలు హిందూ మతస్తులకు నమ్మకాన్ని కల్పించడంతోపాటు మతాన్ని వదిలి వెళ్ళినవారు తిరిగివచ్చేలా చేశాయి. ఈ విధంగా శంకరాచార్యుడు భక్తి ఉద్యమానికి పునాదులువేసి నూతన హిందూమత రక్షకుడుగా పేరుపొందారు. మోక్షం పొందేందుకు జ్ఞాన మార్గాన్ని శంకరాచార్యులు బోధించాడు. అయితే శంకరాచార్యుల బోధనలు, సిద్ధాంతాలు సామాన్యుడికి అర్థమయ్యేలా లేకపోవడంతో తర్వాత భక్తి ప్రబోధకులు ప్రజలకు అర్థమయ్యే మార్గాన్ని బోధించేందుకు పూనుకొన్నారు.

ప్రశ్న 3.
రామానుజాచార్యుడు
జవాబు:
భక్తి ఉద్యమకారుల్లో శంకరాచార్యుని తరవాత రామానుజాచార్యుడు ప్రధానమైనవారు. మోక్షం సాధించేందుకు శంకరాచార్యుని జ్ఞాన మార్గాన్ని కాదని మోక్ష మార్గాన్ని బోధించాడు. తన గురువు యాదవ్ ప్రకాశ్ బోధించిన ఈ ప్రపంచమంతా మాయ, సంపూర్ణ ఏకేశ్వరోపాసన వంటి సిద్ధాంతాలను రామానుజాచార్యుడు వ్యతిరేకించాడు.
భగవంతుడిని చేరుకొనేందుకు ‘భక్తి’ ప్రధానమైన మార్గం. అన్ని కులాల వారు వారికి ఇష్టమైన దేవుడిని ఆరాధించేందుకు అర్హులేనని రామానుజాచార్యుడు బోధించాడు. ఈయన 120 సంవత్సరాల వయస్సులో సమాధి అయ్యారు.

ప్రశ్న 4.
గురునానక్
జవాబు:
కాలూరామ్, తృష్ణాదేవి దంపతులకు క్రీ.శ 1469 లో తల్వాండిలో గురునానక్ జన్మించాడు. ఆయన భార్య సులాఖని. వారికి శ్రీచంద్, లక్ష్మీచంద్ అనే కుమారులు కలిగారు. ఢిల్లీ సుల్తానుల పాలనలోని సుల్తాన్పూర్ రాష్ట్ర ధాన్యాగారంలో గురునానక్ పనిచేశాడు. క్రీ.శ. 1494 సంవత్సరంలో గురునానక్కు జ్ఞానోదయం అయ్యింది.
గురునానక్ పండితుడు, పర్షియా, హిందీ, పంజాబీ భాషలను అధ్యయనం చేశాడు. గురునానక్ బోధనలన్నీ ‘ఆదిగ్రంథ్’ అనే పుస్తక రూపంలో వెలువడ్డాయి. హిందూ, ముస్లింల ఐక్యతను ప్రచారం చేసిన గురునానక్ పేద ప్రజల కోసం ఆశ్రమాలను ఏర్పాటు చేశాడు. గురునానక్ అనుచరులు ఈ ఆశ్రమాలను నిర్వహించి పేదవారికి ఆహారాన్ని | సమకూర్చారు. చివరకు గురునానక్ అనుచరులు సిక్కు అనే మతాన్ని ఏర్పాటుచేశారు.

ప్రశ్న 5.
చైతన్యుడు.
జవాబు:
‘శ్రీ గౌరంగ’ అనే పేరుతో కూడా ప్రసిద్ధికెక్కిన చైతన్యుడు బెంగాలుకు చెందిన వైష్ణవ ఉద్యమకారుడు, సంఘసంస్కర్త. 25 సంవత్సరాల వయస్సులో కేశవభారతి నుంచి సన్యాసం స్వీకరించిన చైతన్యుడు పూరి, సోమనాథ్, ద్వారక, పండరీపురం, మధుర, బృందావనంలో పర్యటించి అక్కడ ప్రజల సంప్రదాయాలను పరిశీలించాడు. చివరకు ఒరిస్సాలోని పూరిలో స్థిరపడ్డాడు. సర్వాంతర్యామి ఒక్కడేనని అతడే శ్రీకృష్ణుడు లేదా హరి అని చైతన్యుడు బోధించాడు. ప్రేమ, భక్తి, గానం, నృత్యాల ద్వారా భగవంతుడిని చేరుకోవచ్చు అని ప్రబోధించాడు. కుల వ్యవస్థను వ్యతిరేకించి విశ్వమానవ సోదర ప్రేమచాటాడు. ఇతడు బెంగాలీ భాషలో ‘శిక్ష అస్తక్’ రచించాడు. బ్రహ్మచర్యాన్ని ‘సన్యాసులు’ అనుసరించాలని, సంకీర్తనలను గానం చేయాలనే అంశాలను అనుచరులచేత ఆచరింపచేశాడు.

ప్రశ్న 6.
మీరాబాయి
జవాబు:
క్రీ.శ. 16వ శతాబ్ద ప్రారంభంలో ఆవిర్భవించిన మహిళా భక్తిబోధకురాలు మీరాబాయి. మేర్తా పాలకుడు రతన్ సింగ్ రాథోడ్ ఏకైక కుమార్తె అయిన మీరాబాయి 18 సంవత్సరాల వయస్సులో 1516 సంవత్సరంలో మేవాడ్ రాజైన రాణాసంగా కుమారుడు భోజోజ్ని వివాహం చేసుకొంది. చిన్నతనం నుంచే మత విశ్వాసాన్ని కలిగిన ఆమె తన పూర్వీకుల లాగానే కృష్ణుడిని ఆరాధించింది. భర్త మరణానంతరం మామగారి నుంచి కష్టాలను ఎదుర్కొన్న ఆమె చివరకు తన జీవితాన్ని కృష్ణుడి ఆరాధనకు అంకితం చేసి పాటలు పాడటం ప్రారంభించింది. బృందావనంలో స్థిరపడి మరణించేవరకు అక్కడే ఉంది.

ప్రశ్న 7.
షేక్ ఫరీద్
జవాబు:
షేక్ ఫరీద్ లేదా బాబా ఫరీద్ (క్రీ.శ 1175 – 1265) ఢిల్లీ సుల్తానుల కాలానికి చెందిన మరొక సూఫీ బోధకుడు. అతడు అతి సామాన్య జీవితాన్ని గడిపాడు. భక్తి బోధకుల సంగీతాన్ని ఇష్టపడేవాడు. ఆయన శిష్యుల్లో నిజాముద్దీన్ అలియా ముఖ్యుడు. ఢిల్లీలోని ఘజియాపూర్లో తన కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు.

ప్రశ్న 8.
షేక్ సలీం చిష్టీ
జవాబు:
షేక్ సలీం చిష్టీ అక్బర్ చక్రవర్తి సమకాలికుడు. సలీం చిష్టీ సిద్ధాంతాలు, జీవన విధానం అక్బర్ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. అక్బర్ స్వయంగా ఫతేపూర్ సిక్రీని సందర్శించి చిష్టీ ఆశీస్సులను పొందాడు. తనకు కుమారుడు జన్మించాక అతనికి సలీం అని అక్బర్ నామకరణం చేశాడు. చిట్టీ సమాధిపై అక్బర్ నిర్మించిన దర్గా ఉరుసు సందర్భంగా అన్ని ప్రాంతాల, అన్ని మతాల ప్రజలను విశేషంగా ఆకర్షిస్తూ ఉంది.

ప్రశ్న 9.
భక్తి సాహిత్యం
జవాబు:
భారతీయ సమాజంలోని అన్ని వర్గాలను భక్తి ఉద్యమం ఆకర్షించింది. ఈ ఉద్యమం ప్రజలకు ఒక నూతన మార్గాన్ని చూపింది. భక్తి ఉద్యమకారులు పూజారుల పెత్తనాన్ని, సంస్కృత భాషను వ్యతిరేకించారు. ప్రజల భాషలోనే తమ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. అందువల్ల బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, హిందీ వంటి ప్రాంతీయ భాషలకు స్వర్ణయుగం ప్రారంభమై అభివృద్ధి చెందింది.

AP Inter 1st Year History Study Material Chapter 7 ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 – 1526)

Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 7th Lesson ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 – 1526) Textbook Questions and Answers.

AP Inter 1st Year History Study Material 7th Lesson ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 – 1526)

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
తురుష్కుల దండయాత్రల ఫలితాలు.
జవాబు:
భారతదేశ చరిత్రలో అరబ్బుల సింధు విజయము “సత్ఫలితాలివ్వని ఘన విజయము” అని స్టాన్లీ లేనప్పూల్ వర్ణించాడు.
1) అరబ్బులు విశాల భారతదేశమున అత్యల్ప భాగమును మాత్రమే జయించుట వలన అది పెద్దగా గుర్తించబడలేదు.

2) పటిష్టమైన వర్ణవ్యవస్థ గల హిందువులు, అరబ్బుల సాంగత్యమును పరిహసించారు.

3) అరబ్బులు ఎంత ప్రయత్నించినను ఇస్లాంను ఇండియాలో వ్యాప్తి చేయలేకపోయారు. కాని తరువాత ముస్లిం విజేతలకు మార్గదర్శకులయ్యారు.

4) హిందువుల కంటే సాంస్కృతికంగా వెనుకబడి వున్న అరబ్బులు హిందూవేదాంతం, ఖగోళ శాస్త్రము, గణితము, వైద్యము మొదలగు శాస్త్రాలను వారి నుండి అభ్యసించారు. బ్రహ్మసిద్ధాంతము, పంచతంత్రము, చరకసంహిత వంటి గ్రంథాలు అరబ్బీ భాషలోకి అనువదించబడ్డాయి. అరబ్బులు భారతీయ చిత్రకారులను, శిల్పులను, పండితులను ఆదరించారు. మొత్తము మీద కొన్ని ప్రాచీన కట్టడాలు తప్ప అరబ్బుల దండయాత్ర భారతదేశమున మిగిల్చినదేమీ లేదు. కాని అరబ్బుల విజయం నుంచి హిందువులు మాత్రం ఎటువంటి గుణపాఠాన్ని గ్రహించలేకపోయారు. మహమ్మదీయులలోని సమతాభావాన్ని గాని, ఐకమత్యాన్నిగాని, వారి యుద్ధతంత్రాన్నిగాని నేర్చుకోలేకపోవటం వల్ల తరువాత కాలంలో తురుష్కుల దండయాత్రలను తిప్పికొట్టలేకపోయారు.

ప్రశ్న 2.
రజియా సుల్తానా.
జవాబు:
ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన ఏకైక మహారాణి సుల్తానా రజియా. ఇలుట్మిష్ కొడుకులు సమర్థులు కానందువల్ల తన వారసురాలిగా తన కుమార్తె రజియాను సుల్తానుగా ప్రకటించాడు. కాని ఇల్లుట్మిష్ మరణానంతరం ఢిల్లీ. సర్దారులు ఇల్టుట్మిష్ కొడుకుల్లో పెద్దవాడైన ఫిరోజ్ షాను ఢిల్లీ సుల్తాన్ గా ప్రకటించారు. అయితే అతడు వ్యసనపరుడు కావటంచేత అతడి తల్లి షా తుర్కాన్ పాలించసాగింది. కాని ఆమె అవినీతిపరురాలవటం చేత రజియా సైనికదళ సానుభూతితో ఫిరోజ్న వధించి, ఢిల్లీ సింహాసనాన్ని (క్రీ.శ. 1236-1240) అధిష్టించింది. ఈమె గొప్ప ధైర్యసాహసాలున్న స్త్రీ, సైన్యాలను నడపటంలోను, ప్రభుత్వ నిర్వహణలోను కడు సమర్థురాలు. కాని ఒక స్త్రీ సుల్తాను కావటం తురుష్క సర్దారులు అవమానంగా భావించారు. ఇల్ల్యుట్మిష్ కాలంలో బానిసలుగా చేరిన వీరు క్రమంగా అమీరులై తమ ప్రాబల్యమును పెంచుకొని ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఈ కూటమినే చిహల్గనీ అంటారు. ఈ కూటమి రజియాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నసాగింది. చిహల్గానీ నిరంకుశాధికారాలను నిర్మూలించి, సుల్తాన్ అధికారమును పెంపొందించటానికి రజియా కొన్ని చర్యలు చేపట్టింది. తురుష్కులు కాని వారికి అనేక ఉన్నతోద్యోగములలో నియమించింది. రాష్ట్ర గవర్నర్లుగా కొత్త వారిని ఎంపిక చేసింది. మాలిక్ యాకూబ్ అనే అబిసీనియా బానిసను అత్యంత గౌరవప్రదమైన అశ్వదళాధిపతిగా నియమించి అతని పట్ల ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శించింది. రజియా యాకూబ్పై అభిమానము చూపటాన్ని సహించలేని ఢిల్లీ సర్దారులు రజియాను పదవీచ్యుతురాలిగా చేయుటకు భటిండా రాష్ట్ర పాలకుడైన కబీర్ ఖాన్ చేతులు కలిపి రజియాపై కుట్రచేసి ఆమెను అంతము చేయదలచారు. ఈ విషయము తెలిసిన రజియా అపార సైనిక బలముతో బయలుదేరి మొదట లాహోర్ పాలకుడైన కబీర్ ఖాన్ తిరుగుబాటును అణచివేసింది. కాని అల్ తునియా చేతిలో ఓటమి పొంది బందీగా చిక్కుకుంది. ఢిల్లీ సర్దారులు యాకూబ్ను వధించారు. అంతట రజియా ఢిల్లీ నుంచి పారిపోయి అజ్ఞునియాను వివాహం చేసుకొని పెద్ద సైన్యాన్ని సమకూర్చుకొని ఢిల్లీపై దండెత్తింది. కాని మార్గమధ్యంలోనే రజియా, అల్ తునియాలు హత్యకు (క్రీ.శ 1240) – గురయ్యారు.

AP Inter 1st Year History Study Material Chapter 7 ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 - 1526)

ప్రశ్న 3.
బాల్బన్ రాజధర్మ స్వరూపం.
జవాబు:
ఢిల్లీ సుల్తాన్ హోదాను, అధికారాన్ని, సార్వభౌమత్వాన్ని పరిరక్షించడానికి ఇనుమడింపచేయడానికి బాల్బన్ తన రాజకీయ అభిప్రాయాలను ఆచరణలో పెట్టి విజయం సాధించాడు. బాల్బన్ ‘రాజరికం దైవదత్తం’ అని ప్రగాఢంగా విశ్వసించాడు. ‘నియాబత్-ఇ-ఖుదాయి’ (కింగ్ ఈజ్ వైస్ రిజెన్సీ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్) ‘రాజు భూమండలంపై భగవంతుని ప్రతినిధి, నీడ అని అతని భావం’, సుల్తాన్ హోదాకు గౌరవస్థానం కల్పించి, ప్రజల్లో, సర్దారుల్లో, ఉన్నతాధికారుల్లో అతనంటే ప్రత్యేక గౌరవభావన పెంపొందించి బాల్బన్ అనేక కొత్త ఆచారాలు, సంప్రదాయాలు, నియమ నిబంధనలు ప్రవేశపెట్టాడు. రాజరికం ‘నిరంకుశత్వానికి ప్రతిబింబం’ అని తన కుమారుడైన బుఖాన్కు బోధించాడు. తాను ‘జిల్లీ ఇల్హా’ (భగవంతుని నీడ) అని ప్రకటించాడు. సుల్తాన్ పట్ల గౌరవాన్ని పెంపొందించాలన్న లక్ష్యంతో పర్షియన్ సుల్తానుల దర్బారులో ఆచరణలో ఉన్న ‘జమిన్ బోస్’, ‘పాయిబోస్’ సుల్తాన్కు సాష్టాంగ నమస్కారం చేయడం లేదా సుల్తాన్ పాదాలను గాని సింహాసనాన్ని గాని ముద్దుపెట్టుకోవడం వంటి పద్ధతులు ప్రవేశపెట్టాడు. సుల్తాన్ అన్ని వేళలా రాజదర్పం ఉట్టిపడేలా రాజదుస్తుల్లో కనబడాలని కోరుకొన్నాడు. తాను సుల్తాన్ గా పదవి చేపట్టిన తరువాత తన హోదాకు తగిన అధికారులతోనే మాట్లాడేవాడు. బహిరంగంగా సమావేశాల్లో నవ్వేవాడు కాదు. దర్బారులో మద్యం సేవన, జూదం ఆడటం నిషేధించాడు. క్రమశిక్షణకు ప్రాధాన్యత కల్పించాడు. తాను ముద్రించిన నాణాలపై ఖలీఫా పేరును ముద్రించాడు. సుల్తాన్ పట్ల ప్రజలు, అధికారులు గౌరవంతో ప్రేమతో వ్యవహరించాలనీ, అదే విధంగా సుల్తాన్ ప్రజలను తన కన్నబిడ్డల్లా భావించి వారి సంక్షేమానికి సర్వవేళలా శ్రమించాలని పేర్కొన్నాడు. పటిష్టమైన క్రమశిక్షణ కలిగిన సైన్యం రాజ్య రక్షణకు అత్యావశ్యకమని గుర్తించి అనేక సైనిక సంస్కరణలు చేశాడు. ‘దివాన్-ఇ-ఆరీజ్’ (సైన్య వ్యవహారాలు) శాఖాధిపతులుగా తనకు విశ్వాసపాత్రుడైన ఇమాద్-ఉల్-ముల్క్న నియమించాడు. సైనికులకు జీతభత్యాల ఏర్పాటు చేశాడు. జాగీరులను రద్దుచేయించాడు. ప్రతి సైనికుడికి శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యత దివాన్-ఇ-అరీజ్ శాఖకు, ఉన్నత సైనికాధికారులకు అప్పగించాడు. కోటలను నిర్మించారు. పాత కోటలకు మరమ్మత్తులు చేయించాడు.

ప్రశ్న 4.
అల్లావుద్దీన్ – ఖిల్జీ మార్కెటింగ్ సంస్కరణలు.
జవాబు:
అల్లావుద్దీన్ సంస్కరణలన్నింటిలో అత్యంత ఉత్తమమైనవి, ప్రశంసలందుకొన్నవి, అతను ప్రవేశపెట్టిన మార్కెట్ సంస్కరణలు. ఇందుకు ముఖ్యకారణం, ప్రభుత్వం చెల్లించే జీతంలో ఒక సాధారణ సైనికుడు సుఖంగా జీవించడానికి వీలుగా నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో పెట్టాలని నిర్ణయించాడు. వస్తువుల ధరలను నిర్ణయించడమే కాకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే వ్యాపారులు సరుకులను అమ్మాలని అల్లావుద్దీన్ నిర్దేశించాడు. ఈ నియమాలను ఉల్లంఘించిన వారిని, తప్పుడు తూకాలు, కొలతలు వాడిన వారిని ఇతడు అతి కఠినంగా శిక్షించేవాడు. వ్యాపారస్థులు వారు అమ్మే వ్యాపార వస్తువులను ముందుగా ప్రకటించి, వారి పేర్లతో ప్రభుత్వం దగ్గర రిజిష్టర్ చేసుకోవాలని ఆదేశించాడు. వ్యాపారస్థులపై అజమాయిషీకి “దివానీ రియాసత్’, ‘షహనాయి మండి’ అను ఇద్దరు అధికారులను నియమించాడు. ఘనత : పరిపాలనలో మొట్టమొదటిసారిగా ఖచ్చితమైన సంస్కరణలు ప్రవేశపెట్టినవాడు అల్లావుద్దీన్. తన పాలనా సంస్కరణల ద్వారా అల్లావుద్దీన్ భారతదేశంలో తురుష్క సామ్రాజ్య పునాదులను పటిష్టపరిచాడు.

ప్రశ్న 5.
మహ్మద్ – బీన్ – తుగ్లక్ సంస్కరణలు.
జవాబు:
జునాఖాన్ మహమ్మద్ బీన్ తుగ్లక్ అనే బిరుదుతో క్రీ.శ. 1325లో ఢిల్లీ సింహాసనమధిష్టించి 1351 వరకు రాజ్యమేలాడు. ఢిల్లీ సుల్తానులలోనే గాక, మధ్యయుగ చక్రవర్తులందరిలో ప్రత్యేకమయిన వ్యక్తిత్వము ఉన్నవాడు తుగ్లక్.
పరిపాలనా సంస్కరణలు :
1) అంతర్వేది ప్రాంతంపై పన్నుల హెచ్చింపు: మహమ్మద్ బీన్ తుగ్లక్ తన రాజ్య ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచుటకై గంగా, యమునా, అంతర్వేది ప్రాంతంలో పన్నులను విపరీతముగా పెంచాడు. పుల్లరి, ఇంటిపన్ను, భూమిశిస్తు అమితముగా విధించుటయే గాక క్రూరముగా వసూలు చేశాడు. అసలే కరువుతో కటకటలాడుతున్న ప్రజలు ఈ పన్నుల భారము భరించలేక భూములు వదిలివెళ్ళారు. ఆ తరువాత సుల్తాన్ వారికి సహాయ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ అవి ఫలించలేదు. ప్రజలలో సుల్తాన్ పట్ల విరక్తి కలిగింది.

2) వ్యవసాయ శాఖ ఏర్పాటు: మహమ్మద్ బీన్ తుగ్లక్ బంజరు భూములను సాగులోకి తెచ్చుట కొరకు వ్యవసాయ శాఖను ఏర్పరచాడు. ఇందుకుగాను ప్రభుత్వము 60 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. కాని ఉద్యోగుల అవినీతి వలన ఈ పథకం విఫలమైంది.

3) రాజధానిని మార్చుట : మంగోలుల దండయాత్రలకు దూరముగా దేశమునకు మధ్యభాగంలో రాజధాని వుండటం మంచిదని తుగ్లక్ తలచి తన రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి మార్చాడు. ఢిల్లీ పౌరులందరు తమ వస్తు, వాహనాలతో దేవగిరికి తరలివెళ్ళాలని ఆజ్ఞ జారీ చేశాడు. 700 కిలోమీటర్ల ప్రయాణంలో ప్రజలు అనేక కష్టనష్టాలు అనుభవించారు. అనేకమంది మార్గమధ్యంలో మరణించారు. దేవగిరికి దౌలతాబాద్ అని నామకరణం చేశాడు. కాని మహమ్మదీయులు ఎవ్వరూ చిరకాలము అచ్చట వుండటానికి ఇష్టపడకపోవటం వలన ఈ పథకం కూడా విఫలమైంది. పైపెచ్చు ఢిల్లీలో సైనిక దళాలు లేవని తెలిసి మంగోలుల దండయాత్రలు పెరిగాయి. సుల్తాన్కు కూడా దౌలతాబాద్ వాతావరణం సరిపడలేదు. అందువలన పౌరులందరు మరల ఢిల్లీకి పోవాలని శాసించాడు. సుల్తాన్ చర్య వృథా ప్రయాసకు చిహ్నమని నిశితంగా విమర్శించారు.

AP Inter 1st Year History Study Material Chapter 7 ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 - 1526)

4) రాగి నాణేల ముద్రణ : నాణేల సంస్కరణలో సుల్తాన్కు ఆసక్తి ఎక్కువ. అతడు విభిన్నమైన నాణేలను ముద్రించి, వాని విలువలు భిన్నంగా నిర్ణయించాడు. రాగి నాణేలను ముద్రించి వాని విలువలను వెండి, బంగారు నాణెములతో సమానం చేశాడు. ఫలితంగా స్వార్థపరులైన ప్రజలంతా సొంతంగా నాణెములు ముద్రించుట మొదలుపెట్టారు. వారు బంగారం, వెండి దాచి, రాగి నాణెములు తయారుచేయుట ప్రారంభించారు. దీని ఫలితంగా డబ్బు విలువ పడిపోయి వస్తువుల ధరలు పెరిగాయి. వీరి చర్యలను సుల్తాన్ అరికట్టలేకపోయాడు. విదేశీ వర్తకులు ఈ నాణెములు నిరాకరించుటచేత, వర్తక వాణిజ్యాలు స్తంభించాయి. అరాచక పరిస్థితులేర్పడటం చేత రాగి నాణేలను ఉపసంహరించవలసి వచ్చింది. రాగి నాణేలకు బంగారు, వెండి నాణెములు ఇచ్చుటచే ప్రభుత్వ ధానాగారం ఖాళీ అయింది.

5) న్యాయపాలన: మహమ్మద్ బీన్ తుగ్లక్ మత విధానమునందు సామరస్య ధోరణి ప్రదర్శించాడు. మత సిద్ధాంతాలను పట్టించుకోక లౌకిక సూత్రాలపై పాలన సాగించాడు. మహమ్మదీయేతరుల పట్ల మత సహనం పాటించిన తొలి ముస్లిం పాలకుడు ఇతడే.

విదేశాంగ విధానము : దురదృష్టవశాత్తు ఇతని విదేశాంగ విధానం కూడా ఘోరంగా విఫలమైంది.
1) ఖురాసాన్ దండయాత్ర : ఖురాసాన్ ప్రముఖులచే ప్రేరేపింపబడి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఖురాసాన్, ఇరాన్ ట్రాన్-ఆగ్జియానా ప్రాంతాలను జయించదలచాడు. అందుకు పెద్ద సైన్యమును సిద్ధపరచి ఒక ఏడాది జీతాన్ని ముందుగానే చెల్లించాడు. కాని తగిన నిధులు లేకపోవుటచే ఈ ప్రయత్నం నుండి విరమించవలసి వచ్చింది.

2) నాగర్ కోట, కారాజాల్ విషయములు : పంజాబులోని భాంగ్రా జిల్లాయందలి నాగర్ కోటను తుగ్లక్ జయించాడు. హిమాలయ ప్రాంతంలోని కారాజాల్ను ఆక్రమించుటకు పెద్ద సైన్యాన్ని పంపాడు. విపరీతమైన జన, ధన నష్టములకు ఓర్చి, ఢిల్లీ సైన్యం కారజాల్ను ఆక్రమించింది.

3) మంగోలులకు లంచములు ఇచ్చుట : మహమ్మద్ బిన్ తుగ్లక్ మంగోలులను ఎదిరించలేక వారికి లంచములు ఇచ్చి, శాంతింపచేయుటకు ప్రయత్నించాడు. సుల్తాన్ బలహీనతను గమనించిన మంగోలులు వారి దాడులను అధికం చేశారు.
తిరుగుబాట్లు : సుల్తాను చేపట్టిన పాలనా సంస్కరణల వల్ల, క్రూరమైన శిక్షల వల్ల విసుగు చెందిన గవర్నర్లు తిరుగుబాట్లు చేయసాగారు. మొత్తం మీద 22 తిరుగుబాట్లు జరిగాయి. మాబార్, వరంగల్, బెంగాల్ స్వాతంత్ర్యం పొందాయి. విజయనగర, బహమనీ రాజ్యాలు దక్షిణాపథంలో స్థాపించబడ్డాయి. సింధు ప్రాంతంలో జరిగిన తిరుగుబాటును అణచుటకు వెళ్ళిన మహమ్మద్ క్రీ.శ. 1351 లో థట్టా సమీపంలో మరణించాడు. అంతటితో “ప్రజలకు అతని పీడ, అతనికి ప్రజల పీడ” తొలగింది.

ప్రశ్న 6.
ఢిల్లీ సుల్తానుల కాలంలో ఆర్థిక పరిస్థితులు.
జవాబు:
భారతదేశం ముస్లిం దాడులకు ముందు అపార సిరిసంపదలతో తులతూగుతుండేది. కాని వీరి అధికార స్థాపన అనంతరం ఆర్థికంగా చాలా నష్టపోయింది. అల్బెరూనీ, ఇబన్ బటూటా, మార్కోపోలో మొదలైన వారి వర్ణనలు ఆనాటి పట్టణ ఆర్థిక వ్యవస్థ విశేషాలను తెలియజేస్తున్నాయి. ఆధునిక చరిత్రకారులైన ఆచార్య ఇర్ఫాన్హాబీబ్, ఆచార్య యూసుఫ్ హుస్సేన్, డా॥ సతీష్ చంద్రల రచనలు ఢిల్లీ సుల్తానుల కాలం నాటి గ్రామీణ జీవనాన్ని, ఆర్థిక స్థితిగతులను వివరిస్తున్నాయి. వ్యవసాయమే ఆనాటి ప్రధాన వృత్తి. చేతివృత్తులు, కుల వృత్తులు ఆదరణ పొందాయి. అనేక కొత్త పట్టణాలు, నిర్మించబడ్డాయి. వర్తక వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. ఆహార ధాన్యాలు, పండ్లు, పూలు పుష్కలంగా పండించారు. పత్తి పంట ఉత్తర భారతదేశంలో ప్రధానంగా పండించారు. ఇబన్ బటూటా నీరు పుష్కలంగా ఉండి, సారవంతమైన ప్రాంతాల్లో రైతులు ఏడాదికి మూడు పంటలు కూడా పండించారని పేర్కొన్నాడు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థ వీరి కాలంలో విచ్ఛిన్నమైంది. నిరంతర దాడులు, అధిక పన్నుల భారం ప్రజలను పీడించింది. వస్త్రాల ఉత్పత్తి కొంత మందికి జీవనభృతి కల్పించింది. సామాన్య ప్రజానీకం దుర్లభజీవనఁ గడిపారు. ప్రజలపై ఢిల్లీ సుల్తానులు విపరీత పన్నులు విధించారు. కొన్ని ప్రాంతాల్లో లోహ పరిశ్రమ కొనసాగింది. అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెటింగ్ సంస్కరణలు కొంతమేరకు సైనికుల సంక్షేమానికి ఉపయోగపడ్డాయి. మహ్మద్-బీన్-తుగ్లక్ భూమిశిస్తు, టోకెన్ కరెన్సీ సంస్కరణలు విఫలమయ్యాయి. స్వదేశీ, విదేశీ వ్యాపారం భారీ ఎత్తున కొనసాగింది. బెంగాల్ నుంచి మేలురకం బియ్యం మలబార్, గుజరాతు సరఫరా చేయడమైంది. గోధుమలు, అవధ్, కారా, అలహాబాద్లలో భారీగా పండించేవారు. రవాణా వ్యవస్థ అంతగా అభివృద్ధిచెందలేదు. ఎడ్లబండ్లపై, గుర్రాలపై సరుకుల రవాణా జరిగేది. ముల్తాన్, లాహోర్, దేవగిరి, ఢిల్లీ, సింధ్ ముఖ్య వర్తక కేంద్రాలు. తూర్పు ఆసియా దేశాలతో చైనాతో విదేశీ వర్తకం కొనసాగేది. జిటాల్, టంకా ప్రధాన నాణాలు. దేవాలయాలు, మసీదులు కూడా సొంత మాణ్యాలు, స్థిరాస్తులు కలిగి ఉండేవి. ముస్లిందాడుల వల్ల హిందూ మతసంస్థల ఆర్థిక స్థితి క్షీణించింది.

ప్రశ్న 7.
ఫిరోజ్ షా – తుగ్లక్ ఆంతరంగిక విధానం.
జవాబు:
మహమ్మద్ బీన్ తుగ్లక్ మరణానంతరం అతని పినతండ్రి కుమారుడు ఫిరోజ్ తుగ్లక్ ఢిల్లీ సింహాసనాన్ని (క్రీ.శ. 1351-1388) అధిష్టించాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే మహమ్మద్ బీన్ తుగ్లక్ వైఫల్యానికి దారితీసిన కారణాలను గుర్తించి వాటిని సరిదిద్దటానికి పూనుకున్నాడు.
1) యమునా నది నుంచి హిస్సార్ వరకు, సట్లేజ్ నుండి గాగ్రా వరకు, సిరూర్ పరిసర ప్రాంతాల నుంచి హన్సీ వరకు, గాగ్రా నుంచి ఫిరోజాబాద్ వరకు, యమునా నది నుంచి ఫిరోజాబాద్ వరకు మొత్తం ఐదు కాలువలను త్రవ్వించి నీటి వనరులను కల్పించి, బంజరు భూములను సాగులోనికి తీసుకువచ్చి వ్యవసాయమును అభివృద్ధి చేశాడు. దీనివల్ల నీటి పారుదల పన్ను రూపంలో చాలా ఆదాయం రావటమే కాక బంజరు భూములు సాగువల్ల భూమి శిస్తు కూడా గణనీయంగా పెరిగింది.

2) ఫతేబాద్, హిస్సార్, ఫిరోజాబాద్, జౌన్పూర్ మొదలగు నగరాలను నిర్మించాడు. ఢిల్లీ చుట్టూ 1200 ఉద్యానవనాలను వేయించాడు. మహమ్మదీయ పకీర్లకు, హిందూ సన్యాసులకు ఎంతో ధనాన్ని విరాళాలుగా ఇచ్చాడు. దివానీ ఖైరత్ అనే పేర ఒక భవనాన్ని నిర్మించి దానిలో పేద మహమ్మదీయ బాలికలకు వివాహాలు జరిపించేవాడు.

AP Inter 1st Year History Study Material Chapter 7 ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 - 1526)

3) సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేయక సామంతరాజులు సరఫరా చేసే సైన్యం మీదనే ఆధారపడ్డాడు.

4) సైనికులకు జాగీర్లను ఇచ్చే పద్దతిని తిరిగి ప్రవేశపెట్టాడు. దీనివల్ల ప్రతిభ ఆధారంగా సైనికులను నియమించే పద్ధతి అంతమొంది అదీ సుల్తానత్ పతనానికి ఒక కారణమైంది.

5) బానిసల అవసరాల కోసం ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశాడు. ఈ శాఖ కింద 1,80,000 మంది బానిసలుండేవారు. వీరి నిర్వహణ ఖజానాకు చాలా భారమైంది. పైగా బానిసలు రాజ్య వ్యవహారాల్లో జోక్యం చేసుకొని అనేక కుట్రలు చేసి సుల్తానత్ పతనానికి కారకులయ్యారు.

6) శిస్తును వసూలు చేసుకొనే అధికారాన్ని సర్దారులకు ఇచ్చి వారి అభిమానాన్ని పొందాడు.

7) కఠిన శిక్షలను రద్దు చేశాడు.

8) రాజ్య వ్యవహారాలలో ఉలేమాల జోక్యాన్ని అనుమతించాడు. మత మౌఢ్యంతో హిందువుల పట్ల అసహనవైఖరిని అవలంబించాడు. వారి నుంచి జిజియా పన్నును వసూలు చేశాడు. ఒరిస్సాలో వున్న భువనేశ్వర ఆలయం, మాళ్వా, నాగర్కోటలలోని దేవాలయాలను ధ్వంసం చేశాడు. ఇతడు సున్నీ మతస్థుడైనందువల్ల షియాల పట్ల కూడా కఠినవైఖరి అవలంబించాడు. ఈ మతవిధానం ప్రజల్లో ఇతని పట్ల వ్యతిరేకత పెరగడానికి కారణమైంది.

ప్రశ్న 8.
ఢిల్లీ సుల్తానుల కాలంలో వాస్తు – శిల్పకళ.
జవాబు:
ఢిల్లీ సుల్తానుల యుగంలో భారతదేశంలో ఒక కొత్తతరహా వాస్తు శిల్పకళ రూపుదిద్దుకొంది. ఢిల్లీలో, అజ్మీర్, లాహోర్, దౌలతాబాద్, ఫిరోజాబాద్ లో ఢిల్లీ సుల్తానులు వారి అధికారులు అనేక మసీదులు, కోటలు, రాజభవనాలు, కార్యాలయాలు నిర్మించారు. ఇస్లామిక్ వాస్తుకళ ముఖ్య లక్షణాలు 1. ఆర్చ్ & డోమ్ 2. సున్నపు మట్టిని గచ్చుగా వాడటం, 3. రాతిని, జిప్సంని వాడటం, 4. అలంకరణ అరేబియా, మధ్య ఆసియా, పర్షియా మొదలైన దేశాల నుంచి మేస్త్రీలు, వాస్తు శిల్పులు భారతదేశానికి ఆహ్వానించబడ్డారు. ఢిల్లీలో కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించిన కువ్వత్-ఉల్-ఇస్లాం-మసీద్ ఒక గొప్ప కట్టడం.

కుతుబ్మనార్ ఒక మహోన్నత కట్టడం. దీని నిర్మాణ లక్ష్య నమాజ్ కోసం, ఇరుగుపొరుగు ముస్లింలను ఆహ్వానించడానికి ఉద్దేశించింది. సుప్రసిద్ధ వాస్తు మేధావి పెర్గూసన్ దీని నిర్మాణ కౌశల్యాన్ని ఎంతో ప్రశంసించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ, అలియా దర్వాజాను, ఢిల్లీలో నిజాముద్దీన్ ఔలియా మసీదు నిర్మించాడు. సిరి పట్టణాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ కట్టించాడు. ఇబన్ బటూటా ఇక్కడి రాజప్రాసాద సౌందర్యాన్ని ఎంతో పొగిడాడు. నసీముద్దీన్ లాల్గుంబద్ అనే భవనాన్ని కట్టించాడు. ఢిల్లీలోని మోతీమసీదు సికిందర్ లోడీ వజీరైన ముబారక్షా కట్టించాడు. ఈ విధంగా ఢిల్లీ సుల్తానుల కాలంలో ఇండో- ఇస్లామిక్ అనే కొత్త శైలి వాస్తుకళ రూపుదిద్దుకొంది.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అరబ్ సింధ్ ఆక్రమణ.
జవాబు:
అరబ్బుల దండయాత్ర నాటికి సింధు ప్రాంతమును దాహిర్ పాలించుచున్నాడు. అతడు అసమర్ధుడు, బలహీనుడు కావటం చేత అతని పాలన ప్రజారంజకముగా లేదు.
సింధూను జయించుటకు రెండుసార్లు బలీయమైన సైన్యదళములను హజాజ్ పంపాడు. కాని అరబ్బు సేనాపతులు రెండుసార్లు ఓడిపోయారు. తుదకు హజాజ్ తన అల్లుడైన మహమ్మద్ బీన్ ఖాసిం అనువానిని అపారసైన్యంతో పంపాడు. ఖాసిమ్ యువకుడు, శక్తిశాలియైన సేనాధిపతి.

ఖాసిం 25,000 అరబ్బు సైన్యముతో దేబాల్ను ఆక్రమించి దారుణ రక్తపాతానికి తలపడ్డాడు. ఇస్లాంమతము స్వీకరించని వారిని కత్తికి బలి ఇచ్చాడు. నెరూన్, శ్వాన్, శీలమ్ ప్రాంతములు తేలికగా ఆక్రమించుకున్నాడు. తుదకు క్రీ.శ. 712లో రోర్ యుద్ధరంగంలో దాహిర్ మరణించాడు. ఆ తరువాత బ్రాహ్మణాబాదు, సింధూ రాజధానియైన ఆలోర్ను ఖాసిం వశపరచుకున్నాడు. ఇట్లు సింధూ ప్రాంతాన్ని ఆక్రమించి, ముల్తాన్ను కూడా జయించాడు. కనోజ్పై దండెత్తుటకు ప్రయత్నములు చేయుచున్నప్పుడు ఖాసింను ఖలీఫా వెనుకకు పిలిపించి క్రూరముగా చంపాడు.

ప్రశ్న 2.
మహమ్మద్ ఘోరీ.
జవాబు:
ఘజనీ వంశ పరిపాలన తరువాత ఘోరీ వంశం సుల్తానులు అధికారంలోకి వచ్చారు. హీరాట్-ఘజనీ రాజ్యాల మధ్య పర్వత పంక్తుల్లో కేంద్రీకృతమై ఉన్న చిన్న రాజ్యంపై ఘోరీలు అధికారం నెలకొల్పారు. ఘోరీ వంశ మూల పురుషుడు ఘియాజుద్దీన్ మహ్మద్. ఇతడు కడపటి ఘజనీల నుంచి ఘజనీ రాజ్యాన్ని ఆక్రమించాడు. దాని రాష్ట్రపాలకుడిగా తన సోదరుడైన ముయిజుద్దీన్ ను నియమించాడు. చరిత్రలో ఇతడే మహ్మద్ ఘోరీగా కీర్తి గడించాడు. క్రీ.శ. 1173వ సం॥లో ఇతడు ఘోరీ రాజ్య సింహాసనం అధిష్టించాడు. మహ్మద్ ఘోరీ సమర్థ నాయకుడు, గొప్ప సేనాధిపతి.

AP Inter 1st Year History Study Material Chapter 7 ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 - 1526)

ప్రశ్న 3.
ఆల్బెరూనీ.
జవాబు:
ఆల్బెరూనీ మహమ్మద్ గజనీ ఆస్థానకవి, పర్షియా దేశస్థుడు. సంస్కృత పండితుడు. మహమ్మద్ వెంట భారతదేశానికి వచ్చాడు. తారిఖ్-ఉల్-హింద్ అనే గ్రంథాన్ని రచించాడు.

ప్రశ్న 4.
జియాఉద్దీన్ – బరనీ
జవాబు:
తారీఖ్-ఇ-ఫిరోజ్ షాహి గ్రంథ రచయిత జియా-ఉద్దీన్-బరౌనీ. ఉన్నత విద్యావంతులైన కుటుంబానికి చెందిన బరౌనీ, తండ్రి ముయిద్-ఉల్-ముల్క్, మామయ్య అలా-ఉల్-ముల్క్లు, బాల్బన్, జలాలుద్దీన్ ఖిల్జీ, అల్లావుద్దీన్ ఖిల్జీ మొదలైన సుల్తానుల సేవలో వివిధ పదవులు నిర్వహించినందువల్ల బరేనీకి సుల్తానులతో సన్నిహిత సంబంధాలుండేవి. ఇతడి రచన 14వ శతాబ్దం నాటి రాజకీయ వ్యవస్థ, ఆర్థిక విధానాలు, సాంఘిక స్థితిగతులు, న్యాయ విధానం మొదలైన అంశాల గురించి విలువైన సమాచారం అందిస్తుంది. బానిస, ఖిల్జీ, తుగ్లక్ వంశ సుల్తానుల వివిధ విధానాలను వివరించే గొప్ప రచనే తారీఖ్-ఇ-ఫిరోజ్-షాహి.

ప్రశ్న 5.
కుతుబ్మనార్.
జవాబు:
కుతుబుద్దీన్ ఐబక్ దీనిని భక్తియార్ ఖాదిర్ అను సూఫీ సన్యాసి గౌరవార్ధం దీనిని ప్రారంభించగా ఇల్లుట్మిష్ దీనిని పూర్తి చేశాడు. ఇది ఢిల్లీలోని మొహరేవి వద్ద కలదు. దీని ఎత్తు 71.4 మీటర్లు. భారత్ పశ్చిమాసియా భవన నిర్మాణ సాంప్రదాయాలు అన్నీ దీనిలో ఉన్నాయి.

ప్రశ్న 6.
మంగోల్ దాడుల ప్రభావం.
జవాబు:
మంగోలులు ఒక సంచార జాతి. వారు ప్రథమం నుండి ఢిల్లీపై దాడులు జరిపి, తీవ్రనష్టం కలిగించారు. ముఖ్యముగా ఇల్టుట్మిష్ వీరి దాడి నుంచి తన రాజనీతిజ్ఞతతో ఢిల్లీని కాపాడెను. బాల్బన్ వీరి దాడుల నుంచి ఢిల్లీని కాపాడుటకు గట్టి ప్రయత్నం చేసెను. అయితే తన కుమారుడిని మంగోలాడుల వల్ల కోల్పోయెను. అల్లావుద్దీన్ ఖిల్జీ | కాలములో కూడా వీరు దాడులు జరిపి, ఢిల్లీకి తీవ్రనష్టము కల్గించారు.

ప్రశ్న 7.
టోకెన్ కరెన్సీ సంస్కరణలు.
జవాబు:
మహ్మద్-బీన్-తుగ్లక్ ఢిల్లీ సింహాసనము అధిష్టించేనాటికి అతని సామ్రాజ్యంలో వెండి, బంగారు లోహాలతో చేసిన టంకా, జిటాల్ వంటి నాణాలు వాడుకలో ఉన్నాయి. కాని అదేకాలంలో బంగారం, వెండి లోహాల తీవ్రకొరత ఏర్పడింది. ఈ సమస్యను అధిగమించడానికై సుల్తాన్ కొత్త పథకం రూపొందించాడు. కాని స్పష్టమైన మార్గ నిర్దేశనాలు లేనందువల్ల రాగి, ఇత్తడి నాణాలు ప్రతి కంసాలి ఇంట్లో ముద్రించబడ్డాయి. ద్రవ్యం విలువ గణనీయంగా పడిపోయింది. తప్పును గ్రహించిన సుల్తాన్ టోకెన్ కరెన్సీని రద్దు చేశాడు. అప్పటికే చాలా నకిలీ నాణాలు మార్కెట్లో చెలామణి అయ్యాయి. చివరకు ఈ పథకాన్ని సుల్తాన్ రద్దు చేశాడు.

ప్రశ్న 8.
మొదటి పానిపట్ యుద్దం.
జవాబు:
బాబర్ భారతదేశ ఆక్రమణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకొన్నాడు. 1525లో దౌలతాన్ను తరిమివేసి పంజాబ్ను స్వాధీనపరచుకున్నాడు. ఆ తరువాత తన సైన్యాన్ని ఢిల్లీ వైపుకు నడిపించాడు. ఢిల్లీ పాలకుడైన ఇబ్రహీంలోడీ ఒక లక్ష సైన్యంతో పానిపట్టు వద్ద బాబర్కు ఎదురునిలిచాడు. 1526 ఏప్రియల్ 21న ఈ ప్రదేశం వద్ద జరిగిన మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీంలోడీ వధించబడ్డాడు. ఢిల్లీ, ఆగ్రాలు బాబర్ వశమయ్యాయి. మొదటి పానిపట్టు యుద్ధం చారిత్రాత్మకమైనది. లోడీ సైనిక పాటవం సర్వనాశనమైంది. భారతదేశంలో మొగల్ సామ్రాజ్య స్థాపన జరిగింది. హిందూస్థాన్ సార్వభౌమత్వం ఆఫ్ఘనుల నుంచి మొగలుల చేతిలోకి పోయింది. మొగలుల వారసత్వం భారతదేశంలో 200 సంవత్సరాలు కొనసాగింది. మొగల్ పరిపాలనవల్ల భారతదేశంలో హిందూ, ముస్లిం సంస్కృతులు సంగమం చెంది మిశ్రమ సంస్కృతి విరాజిల్లింది.

మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్ విజయానికి అనేక పరిస్థితులు దోహదం చేశాయి. ఇబ్రహీంలోడీ అనుసరించిన అనుచిత రాజకీయ విధానం బాబర్కు సహకరించింది. బాబర్ యుద్ధ వ్యూహం, శతఘ్ని దళం, సుశిక్షితులైన సైనికులు బాబర్ విజయానికి దోహదపడ్డారు.

AP Inter 1st Year History Study Material Chapter 7 ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 - 1526)

ప్రశ్న 9.
ఢిల్లీ సుల్తానుల కాలంలో సాహిత్య వికాసం.
జవాబు:
ఢిల్లీ సుల్తానుల అధికార స్థాపనతో భారతదేశంలో స్వదేశీ భాషలకు ఆదరణ కరువైంది. పర్షియన్, అరబిక్ భాషలు సుల్తానుల ఆదరణ, పోషణ పొందాయి. ఈ భాషలో అనేక గొప్ప రచనలు జరిగాయి. ఉర్దూ అవతరించింది. స్వదేశీ పదాల కలయికతో ఉర్దూ బాగా ఆదరణ పొందింది. భక్తి-సూఫీ ఉద్యమకారులు స్థానిక భాషల్లో వారి బోధనలు కొనసాగించారు. దీంతో హిందీ, అవధ్, మరాఠి, కన్నడ, తమిళ, మైథిలీ, బెంగాలీ భాషలు అభివృద్ధి సాధించాయి. సామాన్య ప్రజలు వారు మాట్లాడుకొనే భాషలోనే భక్తి ప్రబోధకులు భక్తి మార్గాన్ని, ఐక్యత, మానవతా విలువలను, ప్రబోధించారు. దీంతో వారిలో సోదరభావం పెంపొందింది.

ప్రశ్న 10.
ఢిల్లీ సుల్తాన్ల పతనం.
జవాబు:
క్రీ.శ. 1206లో కుతుబుద్దీన్ ఐబక్ తో ప్రారంభమైన ఢిల్లీ సుల్తానుల పాలన సుమారు మూడువందల ఇరవై ఏళ్ళపాటు కొనసాగి ఇబ్రహీం లోడీతో క్రీ.శ. 1526లో ముగిసింది. ఈ సుదీర్ఘ కాలంలో దేశంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఐదు వంశాల పాలన కొనసాగింది. సుల్తాన్ల పతనానికి అనేక కారణాలు దోహదం చేశాయి.

  1. సామ్రాజ్య విస్తీర్ణం గణనీయంగా పెరిగినప్పటికీ, సుల్తానులు అన్ని ప్రాంతాలపై కేంద్ర అధికారాన్ని సమర్ధంగా చెలాయించలేకపోవటం.
  2. సుల్తాన్ స్వార్ధపూరిత విధానాలు, సర్దారుల తిరుగుబాట్లు.
  3. స్థానిక ప్రజల అభిమానం పొందలేకపోవడం, హిందూమత వ్యతిరేక విధానాలు.
  4. రాష్ట్రాల పాలకుల తిరుగుబాట్లు.
  5. సైన్యంలో క్షీణించిన పట్టుదల.
  6. మహ్మద్-బీన్-తుగ్లక్ విధానాల వైఫల్యం.
  7. తైమూర్ దండయాత్ర.
  8. దక్షిణాపథంలో వెలమ, రెడ్డి, విజయనగర, బహమనీ రాజ్యాల
  9. మితిమీరిన పన్నుల భారం.
  10. ముస్లిం వర్గాల్లో ఉన్న విభేదాలు మొదలైనవి.

AP Inter 1st Year History Study Material Chapter 6 దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 6th Lesson దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు Textbook Questions and Answers.

AP Inter 1st Year History Study Material 6th Lesson దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
క్రీ.శ. 8వ శతాబ్దం వరకు గల దక్కన్ చరిత్రను అధ్యయనం చేయడానికి సహకరించే ముఖ్య ఆధారాలను చర్చించండి.
జవాబు:
దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్రను అధ్యయనం చేసేందుకు అనేక సాహిత్య ఆధారాలతోపాటు శాసనాలు దోహదపడుతున్నాయి సంగం యుగంలోని తమిళ రచనల్లో తోలకప్పియార్ రచించిన ‘తోలకప్పియం’ అనే వ్యాకరణ గ్రంథం సంగం యుగం నాటి సామాజిక, సాంస్కృతిక స్థితులను గురించి విలువైన సమాచారం అందిస్తోంది. ప్రసిద్ధ తమిళ రచయిత తిరువళ్ళువార్ రచించిన ‘తిరుక్కురల్’ తమిళ దేశానికి బైబిల్ వంటిది. ఈ రచన ఆ కాలం నాటి సాంఘిక జీవనం, నైతిక విలువలకు అద్దం పడుతుంది.

శాతవాహనుల కాలంనాటి రాజకీయ, సాంఘిక, ఆర్థిక, మత పరిస్థితులకు మత్స్య, వాయు, విష్ణు, బ్రహ్మ పురాణాలు, గుణాడ్యుడి బృహత్కథ, హాలుడి గాథా సప్తసతి, వాత్సాయనుడి కామసూత్రాలు, మెగస్తనీస్ ఇండికా పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీలతోపాటు ప్లినీ, టాలేమీ రచనలు అద్దం పడుతున్నాయి. మొదటి మహేంద్రవర్మ ‘మత్తవిలాసప్రహసనం’ అనే గొప్ప కావ్యాన్ని రచించాడు. భారవి ‘కిరాతార్జునీయం’ దండిన్ ‘దక్షకుమార చరిత్ర’ అనే గ్రంథాలు తమిళ ప్రజల సాంఘిక, మత, జీవనానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని అందించాయి. చైనా యాత్రికుడు హుయానా త్సాంగ్ రచనలు పల్లవ, చాళుక్య యుగాలకు చెందిన విలువైన చారిత్రక విషయాలను వెల్లడించాయి.

శాసనాలు కూడా దక్షిణ భారతదేశ పాలకులకు సంబంధించిన విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి. శాతవాహనుల శాసనాలు నాసిక్, కార్లే, బెడ్స, అమరావతి, ధరణీకోట, నానాఘాట్, కొండాపూర్, పైథాన్, భట్టిప్రోలు, నాగార్జున కొండల్లో లభించాయి. వీటిలో శాతవాహనుల సాంఘిక, ఆర్థిక, రాజకీయ, మత విషయాలు వివరించబడ్డాయి.

చాళుక్యుల శాసనాల్లో బాదామి చాళుక్యుల ఐహోలు శాసనం రెండవ పులకేశి హర్షవర్ధనుడిపై సాధించిన విజయాన్ని వివరిస్తుంది. ఈ శాసనాలతో పాటు నాణాలు కూడా దక్షిణ భారతదేశ చరిత్ర అధ్యయనానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి.

AP Inter 1st Year History Study Material Chapter 6 దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు

ప్రశ్న 2.
సంగం యుగంలోని ప్రధాన అంశాలను వివరించండి.
జవాబు:
సంగం యుగంలో ఈ క్రింది అంశాలు కలవు. అవి.
రాజకీయ వ్యవస్థ: నాడు నిరంకుశ రాజరికపు వ్యవస్థ అమల్లో వుంది. రాజుకు సర్వాధికారాలు ఉండేవి. సభ అనే ప్రజాసభ పరిపాలన, న్యాయ వ్యవహారాల్లో రాజుకు సలహాలను ఇచ్చేది. గ్రామపాలనను గ్రామ సంఘాలు నిర్వహించేవి. చతురంగ బలాలతో పాటు రాజు నౌకాదళాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. యుద్ధంలో పాల్గొనడం, యుద్ధంలో వీరమరణం పొందడం గౌరవప్రదమైందిగా భావించేవారు.

సాంఘిక,ఆర్థిక, మతజీవనం: చాతుర్వర్ణ వ్యవస్థ అమల్లో ఉండేది. వనం, వరైని, తుడియం, కడంబన్ అనేవి చతుర్వర్ణాలు. అయితే వర్ణ వ్యవస్థ నిరంకుశంగా ఉండేది కాదు. సమాజంలో బ్రాహ్మణులు గౌరవప్రదమైన స్థానాన్ని అనుభవించేవారు. వ్యాపారులు, సంపన్నులు సుఖమయమైన జీవితాన్ని గడిపారు. బానిస వ్యవస్థ అమలులో ఉన్నట్లు
ఆధారాలున్నాయి.

వ్యవసాయం ప్రజల ప్రధాన వృత్తి, పశుపోషణ, కుండల తయారి, నేతపని వంటి వృత్తులు కూడా ఉండేవి. ప్రజల ఆర్థిక జీవనాన్ని శ్రేణులు క్రమబద్ధీకరించేవి. శ్రామికులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్ళే పద్ధతి అమలులో వుంది.

ప్రజల మత జీవనంలో వైదిక పద్ధతి, తమిళ సంప్రదాయం మిళితమై కనిపిస్తాయి. ప్రాచీన తమిళులు ప్రకృతి శక్తులు, సర్పాలు, వివిధ పిశాచాలను ఆరాధించేవారు. దేవతలకు యజ్ఞయాగాలను సమర్పించారు. దేవాలయ పూజా విధానంలో సంగీత, నృత్యాలు భాగంగా ఉండేవి. నాడు ప్రజలు శైవమతాన్ని అధికంగా అవలంబించారు. శివుడు, సుబ్రహ్మణ్యస్వామి ప్రధాన దేవతలు.

సాహిత్యం: సంగం యుగంలో తమిళ సాహిత్య చరిత్ర ప్రారంభమైంది. ‘తోలకప్పియం’ అనే వ్యాకరణ గ్రంథాన్ని ‘తోలకప్పియార్’ రచించాడు. ‘కురల్’ అనే ప్రసిద్ధ కావ్యాన్ని తిరువళ్ళువార్ రచించాడు. నైతిక విలువలతో కూడిన ఈ కావ్యం తమిళుల జీవితాల్లో ప్రధాన పాత్ర పోషించింది. జైన, బౌద్ధ కవులు, రచయితలు కూడా సంగం సాహిత్యాభివృద్ధికి కృషి చేశారు.

ప్రశ్న 3.
గౌతమీపుత్ర శాతకర్ణి గొప్పతనాన్ని అంచనా వేయండి.
జవాబు:
శాతవాహన పాలకులలో గౌతమీపుత్ర శాతకర్ణి (క్రీ.శ. 78-102) 23వ వాడు. ఇతని తల్లి గౌతమీ బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనం వలన ఇతని ఘనతను తెలుసుకోవచ్చు. ఈ శాసనం వలన ఇతడు శక, యవన, పహ్లవ, క్షహరాట వంశాలను నాశనం చేశాడని, శాతవాహన వంశ ప్రతిష్టను పునరుద్ధరించాడని తెలుస్తున్నది. గౌతమీ బాలశ్రీ మరొక నాసిక్ శాసనంలో తాను గొప్ప చక్రవర్తికి తల్లినని, మరొక రాజుకు “మహారాజ పితామహి”నని చెప్పుకుంది. దీనిని బట్టి శాతకర్ణి గొప్ప యుద్ధవీరుడని తెలుస్తున్నది. ఇతడు అనేక క్షత్రియ రాజవంశాలను జయించి “క్షత్రియ దర్పమానమర్ధన” అనే బిరుదు ధరించాడు. మూడు సముద్రాల మధ్య ప్రాంతాన్ని జయించి “త్రిసముద్రతోయ పీతవాహన” అను బిరుదును ధరించాడు. మహారాష్ట్ర, ఉత్తర కొంకణ, సౌరాష్ట్ర, మాళవ, విదర్భ రాజ్యాలు ఇతని ఆధీనంలో ఉన్నాయి. నాసిక్ శాసనాల వలన గౌతమీపుత్ర శాతకర్ణి ప్రజల కష్టసుఖాలను తెలుసుకొని న్యాయబద్ధంగా పన్నులు విధించేవాడని, పేదవారికి, బ్రాహ్మణులకు భూదానాలు చేసేవాడని తెలుస్తున్నది. ఈ శాసనాలే గౌతమీపుత్ర శాతకర్ణికి వర్ణవ్యవస్థ మీద ప్రగాఢమైన నమ్మకముందని, బ్రాహ్మణ కులాన్ని వర్ణసంకరం కాకుండా రక్షించాడని, “ఏకబ్రాహ్మణుడు” అనే బిరుదు ధరించాడని పేర్కొన్నాయి. ఇతడికి ఉన్న “ఆగమనిలయ” అను బిరుదు వల్ల ఇతనికి ఆగమశాస్త్రాలపై అవగాహన ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ కారణాల వలన గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహనుల్లో గొప్పవాడని చెప్పవచ్చు.

AP Inter 1st Year History Study Material Chapter 6 దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు

ప్రశ్న 4.
పల్లవ పాలకులైన మహేంద్రవర్మ, మొదటి నరసింహ వర్మ సాధించిన విజయాలను చర్చించండి.
జవాబు:
మొదటి మహేంద్రవర్మ (క్రీ.శ. 600-630): ఇతను సింహవిష్ణువు కుమారుడు. గొప్ప యోధుడు. ఇతను ఉత్తరాన కృష్ణానది వరకు తన అధికారాన్ని విస్తరింపచేశాడు. ఇతని కాలంలోనే పల్లవులకు చాళుక్యులకు మధ్య స్పర్థ ఆరంభమైంది. క్రీ.శ. 630లో చాళుక్య రాజైన రెండోపులకేశి పల్లవ రాజ్యం మీద దండెత్తి, పుల్లలూరు యుద్ధంలో మహేంద్రవర్మను ఓడించాడు. యుద్ధం తర్వాత కొద్ది కాలానికే మహేంద్రవర్మ మరణించాడు. మహేంద్రవర్మ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇతను మొదట జైనమతస్థుడైనప్పటికీ తర్వాత అప్పార్ బోధనలవల్ల శైవమతస్థుడయ్యాడు. ఇతను కవి. ‘మత్త విలాస ప్రహసన’మనే నాటకాన్ని రచించాడు. సంగీతంలో ఆసక్తి, ప్రవేశమూ ఉన్నవాడు. వాస్తు, శిల్ప, చిత్ర లేఖనాలను పోషించాడు. ఇన్ని విశిష్ట గుణాలున్నవాడవటం వల్ల ఇతను ‘చిత్రకారపులి’ అని, ‘విచిత్రచిత్తుడ’నే ప్రశంసనందుకొన్నాడు.

మొదటి నరసింహవర్మ (క్రీ.శ. 630-668): ఇతను మహేంద్రవర్మ కుమారుడు. పల్లవ రాజులందరిలోనూ అగ్రగణ్యుడు. సింహాసనమెక్కిన వెంటనే నరసింహవర్మ చాళుక్యుల దండయాత్రను ఎదుర్కోవలసి వచ్చింది. క్రీ.శ. 641లో రెండో పులకేశి పల్లవ రాజ్యంపైకి దండెత్తినప్పుడు పల్లవసేనలు అతణ్ణి ఓడించి తరమడమేకాక నరసింహవర్మ నాయకత్వంలో బాదామి వరకు నడిచి పులకేశిని వధించి బాదామిని దోచుకొన్నాయి. తర్వాత చోళ, పాండ్య ప్రభువులు నరసింహవర్మకు సామంతులయ్యారు. ఈ విజయాలకు నిదర్శనంగా నరసింహవర్మ ‘వాతాపికొండ’, ‘మహామల్ల’ బిరుదులను ధరించాడు.

నరసింహవర్మ కూడా తండ్రి మహేంద్రవర్మలాగా సారస్వతాన్నీ, వాస్తు, లలిత కళలనూ పోషించాడు. ఇతను మహామల్లపురం (మహాబలిపురం)లో ఏకశిలా రథాలనే దేవాలయాలను నిర్మింపచేశాడు. సంస్కృతంలో ‘కిరాతార్జునీయం’ అనే కావ్యాన్ని రచించిన భారవి కవిని ఇతను ఆదరించినట్లుగా తెలుస్తున్నది. నరసింహవర్మ కాలంలోనే హుయాన్ త్సాంగ్ అనే చైనా యాత్రికుడు కాంచీపురాన్ని దర్శించాడు. పల్లవుల రాజ్యాన్ని తమిళ దేశంగా వర్ణిస్తూ ఇక్కడి ప్రజలు నీతిపరులని, సత్యప్రియులని, శ్రమజీవులని, వీరికి విద్యావ్యాసాంగాలలో శ్రద్ధాసక్తులు అధికమని చెప్పాడు. కాంచీపురంలో దాదాపు 100 బౌద్ధారామాలు, 80 దేవాలయాలు ఉన్నట్లుగా కూడా ఇతను తెలిపాడు. నలందా విశ్వవిద్యాలయానికి ఆచార్యుడైన ధర్మపాలుడి జన్మస్థలం కాంచీపురమని ఇతను రాశాడు.

ప్రశ్న 5.
పల్లవయుగంలోని రాజకీయ, సామాజిక ప్రధాన అంశాలను వివరించండి.
జవాబు:
పల్లవుల రాజకీయ వ్యవస్థ: పల్లవులు దక్షిణ భారతదేశంలో సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించారు. భారతదేశ సాంస్కృతిక చరిత్రలో పల్లవయుగం గొప్పదశ. భారతదేశ సాంస్కృతిక ఐక్యత వీరి కాలంలో జరిగింది. పల్లవులు సంప్రదాయ నిరంకుశ రాజరిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. పరిపాలనా వ్యవస్థకు రాజే ప్రధాన సూత్రధారి. రాజుకు సర్వాధికారాలు ఉండేవి. అయినా నిరంకుశుడు కాదు. ధర్మాన్ని రక్షిస్తూ ఉండేవాడు. దైనందిన పరిపాలనలో రాజుకు అనేకమంది అధికారులు సహకరించేవారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని రాష్ట్రాలు, కొట్టాలు, గ్రామాలుగా విభజించారు. భూమిశిస్తు రాజ్యానికి ప్రధాన ఆదాయం. దీనికి తోడు వాణిజ్య పన్నులు, వస్తువులపై పన్నుల ద్వారా ఆదాయం లభించేది.

మతాభివృద్ధి: పల్లవులు వైదిక మతాభిమానులు. వీరిలో చాలామంది శైవులు. రాజసింహుడు వంటి కొంతమంది వైష్ణవ మతాభిమానులుండేవారు. శైవులను నాయనార్లని పిలిచేవారు. వీరిలో ‘అప్పార్’, ‘సంబంధార్’, ‘సుందరమూర్తి’, ‘మాళిక్కవాళగర్’ మొదలైనవారు శైవమత వ్యాప్తికి ఈ యుగంలో అంకితమయ్యారు. విప్రనారాయణ, తిరుమంగై మొదలైన ఆళ్వారులు వైష్ణవమత వ్యాప్తికి అంకితమయ్యారు. పల్లవ యుగంలో తిరుపతి, శ్రీరంగం మొదలైన వైష్ణవ క్షేత్రాలు భక్తులను ఆకర్షించాయి. జైన, బౌద్ధమతాలు కూడా ఈ యుగంలో విలసిల్లాయి. కాంచీపురంలో 180 బౌద్ధారామాలున్నట్లు హుయాన్ త్సాంగ్ రాశాడు. అయితే శైవమతం, వైష్ణవమతాల వ్యాప్తితో జైన, బౌద్ధమతాలు కొంతవరకు క్షీణించాయి.

విద్యాసారస్వతాల ప్రగతి: ప్రాచీన పల్లవుల కాలంలో సంస్కృతం రాజభాష అయింది. నవీన పల్లవులు తమ శాసనాలన్నిటినీ సంస్కృతంలోనే వేయించారు. వీరు ఘటికలను స్థాపించి, సంస్కృతాన్ని, వైదిక విద్యలను పోషించారు. ఈ ఘటికల్లో చతుర్విద విద్యలు అంటే అన్వీక్షకి (Philosophy), త్రయీ (Three vedas), వార్తా (Economics), దండనీతి (Politics) బోధించేవారు. కాంచీపుర ఘటికా స్థానం, దేశవ్యాప్తంగా ప్రసిద్ధి వహించి, దూర ప్రాంతాల నుంచి విద్యార్థులను ఆకర్షించింది. సంస్కృత కవులైన భారవి, దండి వీరి కాలం వారే. విద్యలతోబాటు, తమిళదేశంలో నాట్య సంగీతాల్లో కూడా విశేషమైన కృషి జరిగింది. ఆనాటి వాఙ్మయంలో మృదంగం, యాళి, విరళి మొదలైన వాయిద్యాల పేర్లున్నాయి.

వాస్తు శిల్పాల్లో పల్లవుల కృషి: దక్షిణ భారతదేశంలో వాస్తు చరిత్ర పల్లవుల కాలంలోనే ప్రారంభమైందని విన్సెట్ స్మిత్ అభిప్రాయం. మనోహరమైన భారతీయ శిల్పరీతుల్లో పల్లవశైలి ఒకటి. వీరి కాలంనాటి శిల్పాలు, నిర్మాణాలు అపురూప కళాఖండాలు. ముఖ్యంగా కొండను తొలిచి ఆలయాలను నిర్మించే అద్భుతమైన కొత్త పద్ధతిని, మహేంద్రవర్మ తమిళ దేశంలో ప్రవేశపెట్టాడు. ఇదే పద్ధతిలో నరసింహవర్మ మహామల్లవరం (మహాబలిపురం)లో పంచపాండవుల రథాలను తొలిపించాడు. రాజసింహుడు మహాబలిపురంలో తీరదేవాలయాన్ని, కాంచీపురంలో కైలాసనాథ ఆలయాన్ని నిర్మించాడు. పల్లవుల వాస్తు ప్రత్యేకత కైలాసనాథ ఆలయంలో ప్రతిబింబిస్తుంది. శిల్పాల్లో మహామల్లపురంలో ఉన్న ”గంగావతరణ’ శిల్పం విదేశీ కళావిమర్శకుల ప్రశంసలందుకున్నది.

AP Inter 1st Year History Study Material Chapter 6 దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు

ప్రశ్న 6.
రెండవ పులకేశి గొప్పతనాన్ని అంచనా వేయండి.
జవాబు:
రెండోపులకేశి (క్రీ.శ. 609-642): రెండో పులకేశి బాదామి చాళుక్యుల్లోనే గాక ప్రసిద్ధ భారతీయ చక్రవర్తుల్లో ఒకడు. గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత దక్షిణాపథాన్ని పూర్తిగా జయించి ఏలిన మొదటి సార్వభౌముడు రెండో పులకేశి. ఇతని విజయాలను రవికీర్తి అనే జైన పండితుడు ‘ఐహోలు’ (ఐహోళి) శాసనంలో వివరించాడు. అధికారాన్ని సుస్థిరం చేసుకున్న తర్వాత, రెండో పులకేశి దిగ్విజయ యాత్రలు సాగించాడు. ఇతడు బనవాసి, కొంకణ రాజ్యాలను జయించాడు. లాట, మాళవ, అళుప (ఉడిపి మండలం), ఘూర్జర ప్రభువులనణచి సామంతులుగా చేసుకున్నాడు. దక్షిణ కోసల, కళింగ రాజ్యాల మీద దండయాత్రలను నిర్వహించాడు. పిష్ఠపురం, కునాల (కొల్లేరు) యుద్ధాల్లో విజయాన్ని సాధించి వేంగిని ఆక్రమించాడు. అనంతరం తన తమ్ముడైన కుబ్జవిష్ణువర్ధనుణ్ణి ఈ ప్రాంతానికి రాజుగా నియమించాడు. పులకేశి మరణం తర్వాత, వేంగీ పాలకులు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుని, తూర్పు చాళుక్యులు లేదా వేంగీ చాళుక్యులుగా ప్రసిద్ధి గాంచారు. తర్వాత ఇతడు చేర, చోళ, పాండ్యరాజుల మైత్రిని సంపాదించి, పల్లవ రాజ్యంపై దండెత్తి, మహేంద్రవర్మను పుల్లలూరు యుద్ధంలో ఓడించాడు. చాళుక్య, పల్లవ రాజ్యాల మధ్య సంఘర్షణకు ఇది నాంది. పులకేశి విజయాలన్నిటిలో ఘనమైంది హర్షవర్ధనుణ్ణి ఓడించడం. ‘సకల ఉత్తరాపథేశ్వరుడైన, హర్షవర్ధనుడు దక్షిణాపథాన్ని జయించాలని దండెత్తి వచ్చినప్పుడు పులకేశి అతణ్ణి నర్మదానది ఒడ్డున ఓడించి ‘పరమేశ్వర’ బిరుదును స్వీకరించాడు.

ఈ విజయ పరంపరలతో పులకేశి కీర్తి ప్రతిష్ఠలు దిగంతాలకు వ్యాపించాయి. పారశీక చక్రవర్తి రెండో ఖుస్రూ పులకేశి శక్తి సామర్థ్యాలను గురించి విని అతనితో దౌత్య సంబంధాలను నెలకొల్పుకున్నాడు. అజంతా మొదటి గుహలోని రెండు చిత్రాలు, ఈ రాయబారాలకు సంబంధించినవేనని కొందరి అభిప్రాయం. క్రీ.శ. 640-641 ప్రాంతంలో చైనా యాత్రికుడైన హుయాన్సాంగ్ చాళుక్య రాజ్యాన్ని దర్శించి తన అనుభవాలను వివరించాడు. పులకేశి సామ్రాజ్యం సారవంతమై, సిరి సంపదలతో తులతూగుతున్న దేశమని అతను తెలిపాడు. అక్కడి ప్రజలు యుద్ధప్రియులని, మేలు చేసిన వారిపట్ల కృతజ్ఞులై ఉంటారని వారికోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సంసిద్ధులవుతారని, అలాగే కీడు తలపెట్టిన వారిపై ప్రతీకారం తీర్చుకోనిదే నిద్రపోరని అతను వివరించాడు. వారి రాజు పు-లో-కే-షి (పులకేశి) క్షత్రియ వీరుడని, తన ప్రజలను, సైనిక బలాన్ని చూసుకుని అతడు గర్విస్తాడని, పొరుగు రాజ్యాలంటే అతనికి లక్ష్యం లేదని అతను వర్ణించాడు.

ఇన్ని గొప్ప విజయాలను సాధించిన పులకేశి జీవితం విషాదాంతమైంది. క్రీ.శ. 641లో పులకేశి రెండోసారి పల్లవరాజ్యం మీద దండెత్తినపుడు పల్లవరాజైన నరసింహవర్మ పులకేశిని బాదామి వరకు తరిమి వధించాడు. ఈ పరాజయం నుంచి బాదామి చాళుక్యులు ఒక శతాబ్దం వరకు కోలుకోలేదు.

ప్రశ్న 7.
అమోఘవర్ష సాధించిన విజయాలను చర్చించండి.
జవాబు:
రాష్ట్రకూట పాలకుల్లో మొదటి అమోఘవర్ష (క్రీ.శ. 814-878) గొప్ప పాలకుడు. ఇతడు మూడవ గోవిందుడి కుమారుడు. అతడు స్థానిక పాలకులు, సామంతుల తిరుగుబాట్లను అణచివేశాడు. అతడు వేంగి పాలకుడు విజయాదిత్యుడితో వివాహ సంబంధాలను ఏర్పాటు చేసుకున్నాడు. గంగరాజును ఓడించాడు. అతడు స్వయంగా గొప్పకవి, కవిపండిత పోషకుడు. కన్నడంలో ‘కవిరాజమార్గం’ అనే వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు. ‘మంఖేడ్’ అనే నూతన రాజధాని నగరాన్ని నిర్మింపచేశాడు. అమోఘవర్ష తరువాత అతని కుమారుడైన రెండవ కృష్ణుడు సింహాసనాన్ని అధిష్టించాడు. రెండవ కృష్ణుడి పాలనాకాలంలో రాష్ట్రకూట రాజ్యం ప్రాభావాన్ని సంతరించుకొన్నది. చివరకు రాష్ట్ర కూట రాజ్యాన్ని (క్రీ.శ. 974-975 సం॥లో) తూర్పు చాళుక్య రాజు రెండవ శైలుడు అంతమొందించి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు.

ప్రశ్న 8.
రాజరాజ చోళుడు సాధించిన విజయాలను వివరించండి.
జవాబు:
మొదటి రాజరాజు కాలం నుంచి చోళ రాజ్యంలో నూతన శకం ప్రారంభమైంది. రాజరాజు అనేక ఘన విజయాలను సాధించి చోళ రాజ్యాన్ని మహాసామ్రాజ్యంగా విస్తరింపచేశాడు. రాజరాజుకు ‘జయంగొండ’, ‘చోళమార్తాండ’ మొదలైన బిరుదులున్నాయి. పాండ్యులను, చేర రాజులను ఓడించి వారి సామ్రాజ్య భాగాలైన కొడమలై, కొళ్ళంలను యుద్ధం చేసి ఆక్రమించాడు. నౌకాదళంతో దాడి చేసి, మలయా ద్వీపాన్ని ఆక్రమించడమే కాకుండా శ్రీలంక మీద అనూరాధపురాన్ని (ఉత్తర సింహళం) నాశనం చేశాడు. ఉత్తర సింహళానికి “ముమ్ముడి చోళమండల”మని నామకరణం చేశాడు. ఇతని కాలంలోనే కళ్యాణి చాళుక్యులకు, వేంగీ చాళుక్యులకు పోరు ప్రారంభమైంది. రాజరాజు వేంగీ చాళుక్యులకు మద్దతునిచ్చి తన ప్రాబల్యాన్ని వేంగీలో నెలకొల్పాడు.

రాజరాజు తన సామ్రాజ్యాన్ని విస్తరింపచేయడమే కాకుండా క్రమబద్ధమైన పాలనా విధానాన్ని ప్రవేశపెట్టాడు. పంటపొలాలను సర్వేచేయించి, న్యాయసమ్మతమైన పన్నులను వసూలు చేశాడు. రాజరాజు శివభక్తుడు. తంజావూర్లో ‘రాజరాజేశ్వర’మనే పేరున్న బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. శైవుడైనప్పటికీ రాజరాజు పరమత సహనం ఉన్నవాడు. శైలేంద్ర రాజైన శ్రీమార విజయోత్తుంగ వర్మకు నాగపట్టణంలో బౌద్ధ విహారాన్ని నిర్మించడానికి అనుమతినివ్వడమే కాకుండా ఆ విహారానికి ఒక గ్రామాన్ని దానం చేశాడు. ఇతను లలితకళల అభివృద్ధికి కూడా ఎంతో కృషి చేశాడు.

AP Inter 1st Year History Study Material Chapter 6 దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు

ప్రశ్న 9.
మొదటి రాజేంద్ర చోళుడి విజయాలను చర్చించండి.
జవాబు:
మొదటి రాజేంద్రుడు (క్రీ.శ. 1014-1044): రాజరాజు తరువాత చోళ సింహాసనాన్ని అధిష్టించినవాడు అతని కుమారుడు రాజేంద్ర చోళుడు. ఇతడు తండ్రిని మించిన శూరుడుగా కీర్తి ప్రతిష్టలను పొందాడు. అతడు తండ్రివలెనే దిగ్విజయ యాత్రలు సాగించి సామ్రాజ్య వ్యాప్తికి పాటుపడ్డాడు. మొదట పాండ్య, చేర రాజ్యములను జయించాడు. ఆ తరువాత సింహళముపై నౌకాదండయాత్రలు సాగించి దానినంతటిని జయించి తన ఆధిపత్యము క్రిందకు తెచ్చాడు. చాళుక్యరాజ్యంలో జరిగిన వారసత్వ యుద్ధాల్లో వేంగి చాళుక్యుల పక్షాన నిలిచి రాజరాజ నరేంద్రునకు సహాయం చేశాడు. రాజరాజనరేంద్రునికి తన కుమార్తె అమ్మంగదేవినిచ్చి వివాహం చేశాడు. తరువాత గంగానది వరకు దండయాత్రలు చేసి, బెంగాల్ పాలవంశీయుడైన మహీపాలుని ఓడించి “గంగైకొండచోళ” అను బిరుదు ధరించాడు. ఈ విజయానికి గుర్తుగా “గంగైకొండ చోళాపురము” అను నగరాన్ని నిర్మించి దానిని తన రాజధానిగా చేసుకున్నాడు. తరువాత గొప్ప నౌకాబలమును రూపొందించుకొని జావా, సుమత్రా ప్రాంతములను పాలించే శ్రీవిజయ సామ్రాజ్యాధినేతయైన సంగ్రామ విజయోత్తుంగవర్మను ఓడించి, అతని రాజధాని కడారం స్వాధీనం చేసుకొన్నాడు. ఈ విజయమునకు చిహ్నంగా “కడారంకొండ” అనే బిరుదును ధరించాడు. ఇట్టి దిగ్విజయముల వలన రాజేంద్రచోళుడు భారతదేశ సుప్రసిద్ధ పాలకులలో ఒకడుగా కీర్తిని పొందాడు. ఇతడు తన తండ్రివలె గొప్ప పరిపాలనాదక్షుడు. వ్యవసాయాభివృద్ధి కొరకు అనేక నీటివనరులను ఏర్పరచాడు. వైదిక కళాశాలను స్థాపించి, దాని పోషణకు కొంత భూభాగమును దానము చేశాడు. ఇతడు గొప్ప భవన నిర్మాత. ప్రజాసంక్షేమ పాలన సాగించి, “తండ్రిని మించిన తనయుడు” అనే కీర్తిని పొందాడు. ఇతడు శిల్పకళను ఆదరించాడు. గంగైకొండ చోళపురంలో ఒక శివాలయాన్ని నిర్మించాడు.

ప్రశ్న 10.
చోళుల స్థానిక స్వపరిపాలనలోని గొప్ప అంశాలను తెలియచేయండి.
జవాబు:
చోళుల పాలనా వ్యవస్థలోని ముఖ్య లక్షణం వారి స్థానిక స్వపరిపాలనా విధానం. చోళుల గ్రామ పరిపాలననే “స్థానిక స్వపరిపాలన” అని కూడా అంటారు. మొదటి పరాంతకుని ఉత్తరమేరూర్ శాసనంలోను, కులోత్తుంగుని శాసనాల్లోను చోళుల గ్రామ పాలనా పద్ధతి వివరించబడింది.

గ్రామ పాలన: చోళుల సామ్రాజ్యంలో ప్రతి గ్రామానికి స్వయం పాలనాధికారం ఉంది. ప్రతి గ్రామంలోను గ్రామ పెద్దల సభ వుండేది. ఈ గ్రామ సభ స్వరూప స్వభావాలను గ్రామ గ్రామానికి మారుతుండేవి.

గ్రామ సభలు: చోళుల కాలంలో గ్రామాల్లో మూడు రకాల సభలుండేవి. అవి: 1) ఊర్. 2) సభ. 3) నగరం. ఊర్ అనే సభలో గ్రామంలోని భూస్వాములందరూ సభ్యులే. “సభ”లో బ్రాహ్మణ అగ్రహారంలోని వారు మాత్రమే సభ్యులుగా ఉండేవారు. ‘నగరం’ అనేది వర్తకులకు సంబంధించిన సభ. బ్రాహ్మణ అగ్రహారంలోని సభ్యులకు దేవాలయమే సమావేశపు స్థలం. కొన్ని గ్రామాల్లో ప్రత్యేకించి కచేరీలుండేవి.

సభ్యుల ఎన్నిక: చోళుల కాలంలో ప్రతి గ్రామాన్ని 30 వార్డులుగా విభజించారు. ప్రతి వార్డు నుండి ఒక సభ్యుడ్ని లాటరీ పద్ధతిపై ఎన్నుకునేవారు. ఈ సభ్యులను గ్రామసభ ఉపసంఘాలుగా నియమించేది. చెరువులు, సత్రాలు, ఆలయాలు, తోటలు, పాఠశాలలు, నేర విచారణ, పన్నుల వసూలు మొదలైన వాటికి ప్రత్యేక ఉపసంఘాలుండేవి. “పంచదార వారియం” అనే ఉపసంఘం మిగిలిన సంఘాల కార్యక్రమాలను పరిశీలించేది.

అర్హతలు: గ్రామసభలోని సభ్యుల అర్హతలను గురించి ప్రత్యేక నిబంధనావళిని రూపొందించి అమలు చేశారు. సభ్యులుగా ఎన్నుకోబడుటకు ఒక వ్యక్తికి కొన్ని అర్హతలుండాలి. అతడు

  1. 30 నుండి 70 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వుండాలి.
  2. విద్యావంతుడై వుండాలి.
  3. సొంత ఇల్లు కలిగి భూమికి యజమానై వుండాలి.

అనర్హతలు: గ్రామసభ సభ్యులకు కొన్ని అర్హతలతో పాటు కొన్ని అనర్హతలు కూడా నిర్దేశించారు. గ్రామసభకు ఎన్నుకోబడదలచుకున్న వ్యక్తి

  1. పంచ మహాపాపాలు చేసినవాడై ఉండకూడదు.
  2. గత మూడు సంవత్సరాలుగా ఏ ఉపసంఘంలోను సభ్యుడిగా ఉండరాదు.
  3. ఒకసారి సభ్యుడిగా ఉండి లెక్కలను సరిగా అప్పగించని వాడు కూడా అనర్హుడే.
  4. నేరస్తులు వారి బంధువులు కూడా ఈ ఎన్నికల్లో పాల్గొనకూడదు.

గ్రామ సభ అధికారాలు: గ్రామంలోని భూములపై యాజమాన్యపు హక్కు సభకు ఉన్నది. పన్నులను విధించుట, అడవులను నరికించి కొత్త భూములను సాగులోకి తీసుకువచ్చుట మొదలగునవి ఈ సభ ముఖ్య విధులు. వీటితోపాటు భూమి, నీటి తగవులను పరిష్కరించుట, నేరాలను విచారించుట కూడా దీని విధులుగా చెప్పుకోవచ్చు. అయితే ఆదాయ వనరులు తక్కువ కావటంతో కేంద్ర ప్రభుత్వమే రహదారులు నిర్మించగా వాటిపై అజమాయిషీని సభ నిర్వహించేది. గ్రామసభలకు సలహాలివ్వటానికి అధికారులుండేవారు. కేంద్ర ప్రభుత్వము యొక్క అనవసర జోక్యము ఈ సభలలో ఉండేది కాదు.

AP Inter 1st Year History Study Material Chapter 6 దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు

ముగింపు: చోళుల గ్రామ పాలన సమర్థవంతమైనది, ఆదర్శవంతమైనది. చోళులు గ్రామ పరిపాలనను ఏర్పరచి అందులో ప్రజలను భాగస్వాములను చేయటం వల్ల పాలనలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సమన్వయం సాధ్యపడింది.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
దక్కన్, దక్షిణ భారతదేశం అనే పదాలను నిర్వచించండి.
జవాబు:
‘దక్కన్’ అనే పదానికి భాషాపరంగా భారతదేశ భూభాగంలోని దక్షిణ, ద్వీపకల్పభాగం అని అర్థం. క్రీ.శ. 1945సం||లో హైద్రాబాద్ లో జరిగిన దక్షిణ భారతదేశ చరిత్ర సమావేశంలో దక్కన్ భౌగోళిక సరిహద్దులను పేర్కొన్నారు. దీని ప్రకారం ఉత్తరాన తపతి నది నుంచి దక్షిణాన చివరి భూభాగం వరకు, తూర్పు సముద్రం నుంచి పడమర సముద్రం వరకు ఉన్న భూభాగమే దక్కన్. సాధారణంగా వింధ్య పర్వతాలు, నర్మదానదికి దక్షిణాన తూర్పు నుంచి పడమర వరకు ఉన్న భూభాగాన్ని దక్షిణ భారతదేశంగా వ్యవహరిస్తారు.

ప్రశ్న 2.
సంగం యుగం నాటి సాహిత్యం
జవాబు:
సంగం యుగంలో తమిళ సాహిత్య చరిత్ర ప్రారంభమైంది. ‘తోలకప్పియం’ అనే వ్యాకరణ గ్రంథాన్ని తోలకప్పియార్ రచించాడు. ‘కురల్’ అనే ప్రసిద్ధ కావ్యాన్ని తిరువళ్ళువార్ రచించాడు. నైతిక విలువలతో కూడిన ఈ కావ్యం తమిళుల జీవితాల్లో ప్రధానపాత్ర పోషించింది. జైన, బౌద్ధ కవులు, రచయితలు కూడా సంగం సాహిత్యాభివృద్ధికి కృషి చేశారు.

ప్రశ్న 3.
కరికాల చోళుడు.
జవాబు:
చోళ రాజుల్లో కరికాల చోళుడు (క్రీ.శ.190) గొప్పవాడు. అతను ‘వెన్ని’ వహైప్పరండలై యుద్ధాలలో చేర, పాండ్య రాజులపై గొప్ప విజయాన్ని సాధించాడు. పూహర్ (కావేరీ పట్టణం) అనే నూతన రాజధాని నగరాన్ని నిర్మింపచేశాడు. ప్రజాసంక్షేమానికి కృషి చేసి వ్యవసాయ, వ్యాపార వాణిజ్యాలను ప్రోత్సహించాడు. శ్రీరంగం సమీపంలో కావేరీనదిపై ఆనకట్టను నిర్మింపచేసి వ్యవసాయానికి నీటిపారుదల వసతిని కల్పించాడు. వైదిక మతాన్ని ప్రోత్సహించి యజ్ఞయాగాలను నిర్వహించాడు.

ప్రశ్న 4.
శాతవాహనుల శిల్పకళ
జవాబు:
శాతవాహనుల కాలంలో శిల్పకళ బాగా అభివృద్ధి చెందింది. ఆంధ్రదేశంలో బౌద్ధ విహారాలు, చైత్యాలు, స్థూపాలు, అధికంగా నిర్మించబడ్డాయి.. బుద్ధుడు లేదా బౌద్ధ భిక్షువుల అవశేషాలపై నిర్మించిన గొప్ప నిర్మాణమే స్తూపం. చైత్యం ఆరాధన ప్రదేశం. ప్రస్తుత గుంటూరు జిల్లాలోని కృష్ణానది తీరంలోగల అమరావతిలో ఉప స్థూపం శాతవాహనుల కాలం నాటి శిల్పకళావైభవానికి నిదర్శనంగా నిలుస్తుంది.

AP Inter 1st Year History Study Material Chapter 6 దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు

ప్రశ్న 5.
శాతవాహనుల కాలంలో మతం
జవాబు:
హిందువులు ఉన్నత స్థితిలో ఉండేవారు. వారిలో కొందరు శైవులు, మరికొందరు వైష్ణవులు. పశుపతి, గౌరి, రుద్రుడు, పార్వతి, లక్ష్మీనారాయణులను దైవాలుగా ప్రజలు పూజించేవారని గాథాసప్తశతి పేర్కొంది. అయితే వారందరిలోనూ త్రివిక్రముణ్ణి గొప్ప దైవంగా పేర్కొంది. కృష్ణుడి కథలు, లీలలు కూడా పరిచితమే. ఈ దేవతలతోబాటు, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, వరుణుడు, కుబేరుడు మొదలైన దేవతల ప్రసక్తి కూడా ఉంది.

రాజులు వైదిక మత క్రతువులను నిర్వహించేవారు. పుణ్యక్షేత్రాలను దర్శించడం, పుణ్యతీర్థాల్లో స్నానమాచరించడం వాడుకలోకి తెచ్చారు. బావులు, చెరువులను తవ్వించడం, బాటలకిరువైపుల చెట్లను నాటించడం, మార్గమధ్యంలో సేద తీర్చుకోవడానికి సత్రాలు కట్టించడం, మత సంస్థలకు విరాళాలు ఇవ్వడం, బ్రాహ్మణులకు ఎన్నో రకాల దానాలు చేయడం ఆనాటి రాజులు చేపట్టిన ప్రజాహిత కార్యక్రమాలు.

బౌద్ధమతానికి కూడా విశేష ప్రజాదరణ లభించింది. ముఖ్యంగా రాణుల ప్రోత్సాహంలో, బౌద్ధభిక్షువులు అంకిత భావంతో ప్రచారం చేయడం వల్ల బౌద్ధమతం ఎంతో అభివృద్ధి చెందినది.

ప్రశ్న 6.
ఐహోలు శాసనం
జవాబు:
ఐహోల్ కర్ణాటక రాష్ట్రములో ఉన్నది. ఈ ప్రదేశంలో పశ్చిమ చాళుక్యరాజు రెండవ పులకేశి యొక్క సేనాని రవికీర్తి వేయించిన “ఐహోల్” శాసనం ఉంది. ఈ శాసనంలో రెండవ పులకేశి యొక్క దిగ్విజయ యాత్ర, హర్షునిపై అతని విజయం వర్ణించబడ్డాయి. ఐహోల్లో పశ్చిమ చాళుక్యుల నాటి దేవాలయాలున్నాయి.

ప్రశ్న 7.
పల్లవుల శిల్పకళ
జవాబు:
భారతీయ వాస్తు శిల్పకళా రంగాల్లో పల్లవుల కళకు విశిష్ట స్థానం ఉంది. భారతీయ శిల్పకళ దక్షిణ భారతదేశంలో పల్లవులతోనే ప్రారంభమైందని చెప్పవచ్చు. కట్టడాల్లో రాతిని ఎక్కువగా ఉపయోగించింది మొట్టమొదటగా పల్లవులే కావటం విశేషం. కాంచీపురం, మహాబలిపురం పల్లవుల కాలం నాటి గొప్ప శిల్పకళా కేంద్రాలు. మహేంద్రవర్మ అనేక ఏకశిలా ఆలయాలను నిర్మింపచేశాడు. అందుకు మహాబలిపురంలోని వరాహ, దుర్గ గుహలు చక్కని తార్కాణం. మొదటి నరసింహవర్మ మహాబలిపురంలో అద్భుతమైన ఏడు పగోడాలను నిర్మింపచేశాడు. వీటినే ఏడు రథాలు అంటారు. కాంచీపురంలోని కైలాసనాథ ఆలయం, మహాబలిపురంలోని తీర దేవాలయాలు పల్లవుల నిర్మాణశైలికి, శిల్పకళకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

AP Inter 1st Year History Study Material Chapter 6 దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు

ప్రశ్న 8.
బృహదీశ్వర ఆలయం
జవాబు:
తంజావూరులోని బృహదీశ్వరాలయాన్ని చోళరాజు మొదటి రాజరాజు క్రీ.శ. 1009లో నిర్మించాడు. ఇది శివాలయం. ఇది భారతదేశ నిర్మాణాలన్నింటిలో పెద్దది. దీని విమానం ఎత్తు 200 అడుగులు. ఈ ఆలయం వెలుపలి గోడల నిండా మనోహరమైన శిల్పాలు, లోపలి భాగంలో వర్ణచిత్రాలు ఉన్నాయి. ఈ ఆలయం దక్షిణ భారతదేశ ఆలయ వాస్తు సాంప్రదాయానికి మకుటాయమానం వంటిది.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 5th Lesson క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి Textbook Questions and Answers.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మౌర్యుల పరిపాలనపై వ్యాసం వ్రాయండి.
జవాబు:
భారతదేశంలో ప్రప్రథమంగా ఒక నిర్దిష్టమైన పరిపాలనా విధానాన్ని ఏర్పాటు చేసింది మౌర్యులే. వీరి పాలనావిధానాన్ని తెలుసుకోవటానికి కౌటిల్యుని ‘అర్థశాస్త్రం’, మెగస్తనీస్ ‘ఇండికా’ గ్రంథం ముఖ్య ఆధారాలు.
1. కేంద్ర ప్రభుత్వం: మౌర్య పాలనావ్యవస్థలో చక్రవర్తి సర్వోన్నత అధికారి. అతడే ఉన్నత కార్యనిర్వహణాధికారి, శాసనాధికారి, న్యాయాధికారి కూడా. స్వధర్మాన్ని అమలుచేయటం, ప్రజల ప్రాణాలను కాపాడటం, వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమల ప్రగతికి కృషిచేయటం, న్యాయాన్ని పంచటం, విదేశీ వ్యవహారాల నిర్వహణ, సాహిత్య, లలితకళల పోషణ మొదలైన విషయాలను రాజు ఆచరించవలసిన ముఖ్య ధర్మాలుగా పరిగణించారు. మౌర్య చక్రవర్తులు నిరంకుశులైనప్పటికి ప్రజాసంక్షేమాన్ని ధ్యేయంగా పెట్టుకొని పాలించారు. “ప్రజల సుఖమే తన సుఖంగా, వారి కష్టాలే తన కష్టాలుగా చక్రవర్తి భావించాలి” అని కౌటిల్యుడు చెప్పడాన్నిబట్టి మౌర్య చక్రవర్తి నియంతగా వ్యవహరించి ఉండకపోవచ్చునని భావించవచ్చు.

ఎ) మంత్రిపరిషత్తు: పరిపాలనలో చక్రవర్తికి సలహాలను ఇవ్వడం కోసం ఒక మంత్రిపరిషత్తు ఉండేది. మంత్రిపరిషత్తు సభ్యుల్లో మంత్రి, పురోహితుడు, యువరాజు, సేనాపతి మొదలగువారు ముఖ్యులు. మంత్రిపరిషత్తును విధిగా సంప్రదించాలనే నిబంధన లేనప్పటికి ప్రజాసంక్షేమాన్ని ధ్యేయంగా పెట్టుకొని సాధారణంగా మంత్రుల సూచనలను చక్రవర్తి పాటించేవాడు.

బి) ప్రజా సభలు: మౌర్య చక్రవర్తులు ప్రజాభిప్రాయాలకు విలువనిచ్చేవారు. నాడు పౌరసభ, జానపదసభ అనే ప్రజాప్రతినిధులతో కూడిన సభలుండేవి. ఆ సభలను సమావేశపరచి వాటితో ప్రభుత్వ కార్యక్రమాలను చర్చించేవారు. అశోకుని కాలంలో ధర్మ ప్రచారార్థం ధర్మమహామాత్రులు అను ప్రత్యేక అధికారులు నియమింపబడ్డారు. ప్రభుత్వ వ్యవహారాలు 32 శాఖలుగా విభజించబడి అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించబడేవి.

సి) సైనిక వ్యవస్థ: మౌర్యులు సమర్థవంతమైన సైనిక వ్యవస్థను నిర్మించారు. మౌర్య సైన్యంలో 6 లక్షల కాల్బలం, 30 వేల అశ్వదళం, 9 వేల గజబలం, 8 వేల రథాలు వున్నట్లు గ్రీకు చరిత్రకారులు పేర్కొన్నారు. సైన్యానికి అనుబంధంగా నౌకాదళం కూడా ఉంది. సైనిక పర్యవేక్షణ బాధ్యతను 30 మంది సభ్యులున్న ఒక సంఘానికి అప్పగించారు. ఈ సంఘం ఐదేసి సభ్యులు గల 6 ఉపసంఘాలుగా విడివడి గజ, అశ్వక, రథ, పదాతి, నౌకాదళాల రవాణా, సరఫరా శాఖల నిర్వహణా బాధ్యతలను చేపట్టేది. మౌర్యుల కాలంలో గూఢచారి దళం కూడా అప్రమత్తతతో పనిచేసి, కీలకమైన రహస్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందించేది.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

డి) భూమిశిస్తు: మౌర్య సామ్రాజ్యానికి ప్రధానమైన ఆదాయం భూమిశిస్తు నుండి లభించేది. పండిన పంటలో 6 నుంచి 4వ వంతు వరకు భూమిశిస్తుగా వసూలు చేసేవారు. అశోకుడు బౌద్ధమతము యెడల భక్తితో లుంబినీ వనములో భూమిశిస్తును 8వ వంతుకు తగ్గించాడు. రాచపొలాలు, గనులు, నౌకాకేంద్రాలు, తదితర మార్గాల నుంచి కూడా ప్రభుత్వానికి ఆదాయం లభించేది. గోపుడు భూమిశిస్తును వసూలు చేసేవాడు. ఆదాయశాఖకు ముఖ్య అధికారి సమాహర్త. ప్రభుత్వ ఆదాయంలో 4వ వంతు ఉద్యోగుల జీతాలు, ప్రజాపనుల పద్దుల క్రింద ఖర్చయ్యేది.

ఇ) న్యాయపాలన: మౌర్యుల పాలనలో చక్రవర్తీ సామ్రాజ్యానికి ఉన్నత న్యాయాధిపతి. రాజాస్థానమే అత్యున్నత న్యాయస్థానం. ఆస్తి తగాదాలు మొదలగు సివిల్ కేసుల పరిష్కారానికి ధర్మస్థియ అను న్యాయస్థానాలు కృషిచేసేవి. అపరాధ విచారణ కోసం కంటకశోధన అనే క్రిమినల్ న్యాయస్థానాలుండేవి. నేరస్తులను దివ్యపరీక్షల ద్వారా విచారించేవారు. శిక్షలు కఠినంగా ఉండేవి. అయితే అశోక చక్రవర్తి కాలంలో ఈ కాఠిన్యాన్ని కొంతవరకు సడలించారు.

2. రాష్ట్ర ప్రభుత్వం: పరిపాలనా సౌలభ్యం కోసం మౌర్య సామ్రాజ్యాన్ని జనపదాలుగా విభజించారు. అశోకుని కాలంలో తక్షశిల, అవంతి, పాటలీపుత్రం, గిర్నార్లు రాజధానులుగా గల ఉత్తరాపథ జనపదాలు, ఉజ్జయిని, కళింగ, సౌరాష్ట్ర అను దక్షిణాపథ జనపదాలు వుండేవి. జనపదాలకు పాలకులుగా రాజకుమారులను నియమించేవారు. జనపదాన్ని తిరిగి ఆహారాలు, విషయాలు, ప్రదేశాలుగా విభజించారు. ప్రదేశానికి అధికారి ప్రాదేశికుడు. పరిపాలనా యంత్రాంగానికి గ్రామమే ప్రాతిపదిక. గ్రామానికి అధికారి గ్రామికుడు.

3. నగరపాలన: మౌర్యుల కాలంలో నగరపాలన గురించి మెగస్తనీస్ తన ఇండికా అను గ్రంథంలో పేర్కొన్నాడు. పాటలీపుత్ర నగరపాలన గురించి, సైనిక మండలుల గురించి సవివరంగా వర్ణించాడు. ఈ కాలంలో నగరపాలనకు ఒక విశిష్ట స్థానం ఉంది. నగరపాలనను నాగరికుడు అనే అధికారి నిర్వహించేవాడు. పాటలీపుత్ర నగరపాలన నిర్వహణలో నాగరికుడికి 30 మంది సభ్యులున్న ఒక సంఘం తోడ్పడేది. ఈ సంఘం ఐదేసి సభ్యులు గల 6 పంచాయితీలుగా ఏర్పడి 1) పరిశమ్రలు 2) విదేశీయుల సౌకర్యాలు 3) జనన, మరణాల లెక్కలు 4) వాణిజ్యం, వ్యాపారం, తూనికలు, కొలమానాలు 5) వస్తువిక్రయం 6) సుంకాల వసూలు అనే శాఖలకు సంబంధించిన విధులను నిర్వహించేది.

ముగింపు: మౌర్యుల పాలనలో కొన్ని గుణదోషములున్నాయి. ఉద్యోగుల పీడన, కఠిన శిక్షలు ఇందులోని లోపాలు. పౌర, సైనిక శాఖలు వేర్వేరుగా ఉండటం, సమర్థవంతమైన నగరపాలన, ప్రజాసంక్షేమ పాలన అనునవి. ఇందులోని సుగుణాలు. మౌర్యుల పరిపాలనా విధానం ఉత్తమము, ఉదారము, ఆదర్శప్రాయమైనది. వీరి పాలన మొఘలుల పాలన కంటే విశిష్టమైనదని వి.ఎ. స్మిత్ అను పండితుడు వ్యాఖ్యానించాడు. నేటి పాలనా వ్యవస్థలోని మౌలికాంశాలు మౌర్యులనాటివే అని సర్దార్ కె.ఎమ్. పణిక్కర్ అభిప్రాయపడ్డాడు.

ప్రశ్న 2.
గుప్తుల పాలనా లక్షణాలు పరిశీలించండి.
జవాబు:
గుప్త చక్రవర్తులు ఉత్తర భారతదేశమున రాజకీయ ఐక్యతను సాధించి సుభిక్షమైన పాలనావ్యవస్థను ప్రవేశపెట్టారు. వీరి పాలనలో ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగుల బాధ లేదు. ఫాహియాన్ “గుప్త పాలన ఉదారమైనది, ప్రభుత్వము ప్రజల విషయములో అనవసరముగా జోక్యం చేసుకొనెడిది కాదు” అని పేర్కొన్నాడు. అట్టి ఉదాత్త పాలనలో ప్రజలు సుఖశాంతులను అనుభవించారనుట అతిశయోక్తి కాదు.

కేంద్ర ప్రభుత్వము: గుప్త సామ్రాజ్యమునకు సర్వాధికారి చక్రవర్తి. గుప్త చక్రవర్తులు మహేశ్వర్, మహారాజాధిరాజా, పరమభట్టారక మొదలగు బిరుదులు ధరించారు. రాచరికం వంశపారంపర్యంగా లభించేది. రాజు దైవాంశ సంభూతుడని ప్రజలు విశ్వసించారు. రాజు నిరంకుశుడైనా ప్రజాక్షేమమే తన క్షేమముగా భావించేవాడు. పరిపాలనలో రాజుకు సలహాలు ఇవ్వడానికి ఒక మంత్రిమండలి ఉండేది. ఈ మండలిలో 1. మహాప్రధానామాత్యుడు 2. సచివుడు 3. కుమారామాత్యుడు 4. సంధి విగ్రహకుడు 5. మహాదండ నాయకుడు 6. రణభండారికుడు అనే ఉద్యోగులుండేవారు. వీరే కాకుండా కంచుకి అనే ఉద్యోగి చక్రవర్తికి, మంత్రిమండలికి మధ్యవర్తిగా వ్యవహరించేవాడు. ఉద్యోగుల నియామకంలో కుల, మత భేదములను పాటింపక అభ్యర్థుల శక్తిసామర్థ్యములను పరిగణనలోనికి తీసుకునేవారు. ఈ కాలంలో గూఢచారి వ్యవస్థ అమలులో ఉంది.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

రాష్ట్ర ప్రభుత్వం: పరిపాలనా సౌలభ్యం కోసం గుప్త చక్రవర్తులు తమ సామ్రాజ్యాన్ని భుక్తులుగా, భుక్తులను విషయాలుగా, విషయాలను ప్రదేశాలుగా విభజించారు. భుక్తికి అధిపతిని ఉపరిక అని పిలిచేవారు. విషయానికి అధిపతి విషయపతి. విషయపాలనలో విషయపతికి సహకరించేందుకు 5గురు సభ్యులు గల సభ సహాయపడేది. వారు నగరశ్రేష్టి, సార్ధవాహుడు, ప్రథమకులికుడు, ప్రథమ కాయస్థుడు, పుస్తపాలడు మొదలైనవారు. పాలనా వ్యవస్థలో చివరిది గ్రామము. గ్రామానికి పెద్ద గ్రామికుడు. గ్రామ పాలనలో గ్రామ పంచాయితీ అతడికి తోడ్పడేది.

నగరపాలన: నగర పరిపాలనకు గుప్తుల కాలంలో ప్రత్యేక ఏర్పాటు ఉంది. నగర పరిపాలనాధికారిని ”పురపాలుడు’ అనేవారు. పరిపాలనలో అతనికి సహాయపడేందుకు ఒక నగరసభ ఉండేది.

భూమిశిస్తు: గుప్త చక్రవర్తులకు ఆదాయం ముఖ్యంగా భూమిశిస్తు నుండి లభించేది. పండిన పంటలో 1/3వ వంతు పంటను భూమిశిస్తుగా నిర్ణయించేవారు. భూమిశిస్తును భాగకర, ఉద్యంగ అనేవారు. భూమిశిస్తుతో పాటు వృత్తిపన్ను, ఉప్పుపన్ను, వర్తక సుంకం, వాణిజ్య పన్నులు, రేవులు, అడవులు, గనులు మొదలగు వానిపై కూడా ప్రభుత్వానికి ఆదాయం లభించేది.

న్యాయపాలన: గుప్త పాలకులు ప్రజలకు నిష్పక్షపాతమైన, సమర్థవంతమైన పాలనను అందించారు. న్యాయ వ్యవహారాలలో చక్రవర్తి మాటకు తిరుగులేదు. ఆయనే ఉన్నత న్యాయాధీశుడు. న్యాయశాఖలో మహాదండ నాయకుడు, మహాక్షపతిలక వంటి న్యాయాధికారులుండేవారు. రాజదండన కఠినంగా ఉండేది కాదు. కాని తిరుగుబాటు చేసిన వారిపట్ల కఠినంగా వ్యవహరించేవారు. శిక్షగా వారి కుడిభుజాన్ని ఖండించేవారు లేదా కళ్ళు పీకించేవారు. మరణదండన తప్పనిసరైనప్పుడు అట్టివారిని ఏనుగులతో తొక్కించి చంపేవారు.

సైనిక వ్యవస్థ: గుప్త సామ్రాజ్యానికి చక్రవర్తే సర్వసైన్యాధ్యక్షుడు. గుప్త చక్రవర్తులు సంప్రదాయంగా అనుసరించబడుతున్న చతురంగ బలాలను పోషించారు. సైనిక రంగంలో సేనాపతి, మహాసేనాపతి, దండనాయకుడు మొదలైన ఉద్యోగులుండేవారు.

ముగింపు: గుప్తుల పరిపాలనలో అధికార వికేంద్రీకరణ చోటుచేసుకుంది. రాష్ట్రపాలకులు ఎక్కువ అధికారాలు అనుభవించారు. ప్రభువులు ప్రజాక్షేమాన్ని దృష్టిలో వుంచుకొని పరిపాలన సాగించటం గుప్త పాలనలోని విశేషం.

ప్రశ్న 3.
పుష్యభూతి వంశస్థుల పాలనలో రాజకీయ పరిస్థితులను వివరించండి.
జవాబు:
గుప్త సామ్రాజ్య పతనం తర్వాత దాని శిథిలాలపై ఉత్తర భారతదేశంలో అనేక చిన్నచిన్న స్వతంత్ర రాజ్యాలు వెలిశాయి. అవన్నీ దాదాపు ఒకప్పుడు గుప్త సామ్రాజ్యానికి సామంత రాజ్యాలుగా ఉన్నటువంటివే. అలాంటి రాజ్యాలలో ఒకటి స్థానేశ్వర రాజ్యం.

గుప్తులకు సామంతులుగా ఉన్న ఈ రాజ్య పాలకులు బలపడి ఇతర సామంత పాలకులను తమ అధికార పరిధిలోకి తెచ్చుకుని ఉత్తర భారతదేశంలో మళ్ళీ రాజకీయ సమైక్యతను, సుస్థిరతను సాధించగలిగారు. పుష్యభూతి వంశస్థులు స్థానేశ్వరాన్ని రాజధానిగా చేసుకుని స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించగా ఈ వంశంలోనివాడైన హర్షవర్ధనుడి కాలంలో ఉత్తరాపథం తిరిగి మహోన్నత దశకు చేరుకుంది.

పుష్యభూతి వంశ చరిత్ర: మహాశివభక్తుడైన పుష్యభూతి ఈ వంశానికి మూలపురుషుడైనందువల్ల, ఈ వంశానికి ఆ పేరు వచ్చినట్లు బాణుని “హర్షచరిత్ర” వల్ల తెలుస్తున్నది. ఈ వంశంలో మూడోతరంవాడైన ఆదిత్యవర్ధనుడి కుమారుడు ప్రభాకరవర్ధనుడు. ఇతను “మహారాజాధిరాజు” బిరుదాన్ని ధరించాడు. ప్రభాకరవర్ధనుణ్ణి ‘హూణ హరిణకేసరి” అంటూ
”హర్షచరిత్ర’ వర్ణించింది. ఇతని పట్టపురాణి యశోమతీదేవి మాళవరాజైన యశోధర్ముడి కుమార్తె కావడం వల్ల యశోధర్ముడితోపాటు ప్రభాకరవర్ధనుడు కూడా హూణులతో పోరాటంలో పాల్గొన్నాడని భావించవచ్చు. ప్రభాకరవర్ధనుడికి రాజ్యశ్రీ అనే కుమార్తె, రాజ్యవర్ధనుడు, హర్షవర్ధనుడనే కుమారులున్నారు. కుమార్తె రాజ్యశ్రీని మౌఖరీ రాజైన గృహవర్మకిచ్చి వివాహం జరిపించాడు.

క్రీ.శ. 604లో స్థానేశ్వర రాజ్యంపై హూణులు దండెత్తినప్పుడు, ప్రభాకరవర్ధనుడు తన పెద్ద కుమారుడు రాజ్యవర్ధనుణ్ణి హూణులను ఎదుర్కొనేందుకు పంపాడు. వారిపై విజయాన్ని సాధించి రాజ్యవర్ధనుడు రాజ్యానికి తిరిగి వచ్చేసరికి ప్రభాకరవర్ధనుడు జబ్బుచేసి మరణించాడని, యశోమతి సతీసహగమనం చేసిందని తెలిసింది. ఈ కారణంగా రాజ్యవర్ధనుడు పట్టాభిషక్తుడయ్యాడు.

ఇదేసమయంలో మాళవ రాజైన దేవగుప్తుడు గౌడ రాజైన శశాంకుడితో కలిసి కనోజ్పై దండెత్తి రాజ్యశ్రీ భర్త గృహవర్మను వధించాడు. ఇది తెలుసుకున్న రాజ్యవర్ధనుడు సైన్యంతో కనోజ్పై దండెత్తి దేవగుప్తుణ్ణి ఓడించాడు. రాజ్యశ్రీని బందిఖానా నుంచి విడిపించడానికి ముందే, దురదృష్టవశాత్తు రాజ్యవర్ధనుడు శశాంకుడి కుట్రకు బలయ్యాడు. ఇటువంటి పరిస్థితుల్లో హర్షవర్ధనుడు స్థానేశ్వర సింహాసనాన్ని అధిష్టించాడు.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

రాజకీయ పరిస్థితులు: హర్షవర్ధనుడు గొప్ప విజేతగాను, గొప్ప పరిపాలనదక్షుడిగాను పేరుపొందాడు. హర్ష చరిత్ర, సి-యూ-కి గ్రంథాల్లో హర్షుణ్ణి ఆదర్శవంతమైన ప్రభువుగా వర్ణించారు. హర్షుడు పరిపాలనలో స్వయంగా శ్రద్ధ వహించాడు. రాజ్యంలో స్వయంగా పర్యటించి, ప్రజల కష్టసుఖాలను స్వయంగా విచారించి, తక్షణమే న్యాయం చేకూర్చేవాడు. ప్రజాహిత కార్యక్రమాలను నిర్వహించడంలో హర్షుడికి వ్యవధి చాలేది కాదని, సి-యూ-కి గ్రంథంలో వివరంగా ఉంది.

పరిపాలన సౌలభ్యం కోసం సామ్రాజ్యాన్ని భుక్తులుగాను, భుక్తులను విషయాలుగాను, విషయాలను గ్రామాలు గాను విభజించారు. పాలనా విధానంలోను, విద్యా, సాంస్కృతిక రంగాల్లోను హర్షుడు గుప్తయుగం సంప్రదాయాలనే అనుసరించాడు. రాజుకు సలహాలిచ్చి సహాయం చేయడానికి మంత్రిపరిషత్ ఉండేది. ప్రభుత్వ విధానంలో మంత్రి పరిషత్కు గౌరవప్రదమైన స్థానం ఉంది. వారసత్వాన్ని నిర్ణయించడానికి కూడా మంత్రిపరిషత్తుకు అధికారం ఉంది. హర్షచరిత్ర నుంచి, శాసనాల నుంచి అనేకమంది ఉద్యోగుల పేర్లు తెలుస్తున్నాయి. వారిలో మహాసంధి-విగ్రహాధికృత (యుద్ధ వ్యవహారాలు), రాజస్థానీయ (విదేశీ వ్యవహారాలు), మహాబలాధికృత (సేనాపతి), ఆయుక్తక, భోగక (పన్నుల వసూలు), భాండాగారాధికృత (కోశాధికారి) మొదలైనవారు ముఖ్యులు. వీరికి జీతాలకు బదులు భూములను ఇచ్చేవారు. సైనికోద్యోగులకు మాత్రం జీతాలిచ్చేవారు.

భుక్తికి అధికారి ఉపరిక. ఇతనికే ‘భోగపతి’ అనికూడా పేరు ఉంది. విషయానికి అధికారి ‘విషయపతి’. ఇతనిని ‘కుమారామాత్య’ అనికూడా పిలిచేవారు. గ్రామమే ప్రభుత్వానికి పునాది. గ్రామంలో అక్షపడలిక, కరణిక అనేవారు ఉద్యోగులు. వీరికి గ్రామ వృద్ధుల సహకారం ఉండేది.

ఆదాయం: భూమిశిస్తు రాజ్యానికి ముఖ్య ఆదాయం. ప్రజలపై పన్నుల భారం ఎక్కువగా ఉండేది కాదు. పంటలో ఆరోవంతును మాత్రమే పన్నుగా వసూలుచేసేవారు. పన్నులను ధాన్యరూపంగాగాని, ధనరూపంగాగాని చెల్లించవచ్చు. బాటల మీద, రేవుల మీద సుంకాలుండేవి. వస్తువుల అమ్మకాల మీద కూడా పన్నులు ఉండేవి. అయితే ఇవి ఆయా వస్తువుల బరువులనుబట్టి, విలువలనుబట్టి ఉండేవి. ఈ విధంగా వస్తువుల బరువు ఆధారం చేసుకొని వసూలు చేసే అమ్మకం పన్నునే ‘తుల్యమేయ’ అన్నారు. పన్నులను వసూలు చేయడానికి ధ్రువాధికరణ, గౌల్మిక మొదలైన ఉద్యోగులు ఉండేవారు. ప్రభుత్వాదాయాన్ని ముఖ్యంగా నాలుగు పద్దుల మీద ఖర్చు పెట్టేవారు. అవి: 1. ప్రభుత్వ యంత్రాంగం 2. రాజప్రాసాదం 3. పండిత సత్కారం 4. దానధర్మాలు.

హర్షయుగంలో నేరాలు ఎక్కువని తెలుస్తున్నది. ఆ కారణంగా శిక్షాస్మృతి కఠినతరమైంది. దేశద్రోహ నేరానికి యావజ్జీవ కారాగార శిక్ష, సాంఘిక నియమావళిని ధిక్కరించిన వారికి, తల్లిదండ్రుల పట్ల అవిధేయులైన వారికి అంగచ్ఛేద శిక్షగాని లేదా దేశబహిష్కార శిక్షగాని అమలుపరిచేవారు. చిన్నచిన్న నేరాలకు జరిమానాలను విధించేవారు. నేర నిర్ణయానికి ‘దివ్య పరీక్షలుండేవి. రాజ పట్టాభిషేకం వంటి విశేష సందర్భాల్లో బాధితులను విడిచిపెట్టే ఆచారం ఉండేది.

సైన్యం: హర్షుడు పెద్ద సైన్యాన్ని పోషించాడు. సైన్యంలో చతురంగ బలాలుండేవి. క్రమంగా రథానికి ప్రాముఖ్యం తగ్గింది. హర్షుని సైన్యంలో 5000 ఏనుగులు, 2000 అశ్వాలు, 50,000 కాల్బలం ఉన్నట్లు తెలుస్తున్నది.

ప్రశ్న 4. క్రీ.పూ. 3 నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు భారతదేశ ఆర్థిక పరిస్థితిని పరిశీలించండి.
జవాబు:
క్రీ.పూ. 3 నుంచి క్రీ.శ. 7 వరకు గల ఆర్థిక పరిస్థితులు:
మౌర్యుల ఆర్థిక వ్యవస్థ:
1) వ్యవసాయం: మౌర్యుల కాలంలో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందింది. పన్నులు వసూలు చేయడంతో ఆర్థిక, సాంఘిక భద్రత ఉన్నట్లు భావించారు. రాజు తన సొంతభూముల ద్వారానే కాకుండా, రాజ్య భూముల నుంచి కూడా పన్నులు వసూలుచేసేవారు. రాజ్య ప్రధాన ఆదాయం పంటలో 1/4 నుంచి 1/6 వ వంతు శిస్తుగా వసూలు చేసేవారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి శిస్తులు మారేవి. మధ్యవర్తులు లేకుండా అధికారులే స్వయంగా శిస్తు వసూలు చేసేవారు.

2) పారిశ్రామిక వృత్తులు:
లోహ పరిశ్రమ: వివిధ రకాల లోహాలను ఇనుము, రాగి, తగరం, బంగారం, వెండి లోహాలను తమ పరిజ్ఞానంతో వెలికితీసి వివిధ రకాలైన వస్తువులు తయారుచేశారు. దారు (కొయ్య) పరిశ్రమ, రాతి పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ వంటివి. మధుర, కాశీ, పాటలీపుత్రం, వంగ, మహీశ మొదలైన నగరాల్లో కుండల తయారీ, మౌర్య రాజ్యంలోని వివిధ ప్రాంతాలలోనూ అభివృద్ధి చెందింది.

3) కుషాణుల పాలనలో వర్తక, వాణిజ్యం: మౌర్యుల కాలానికి భిన్నంగా క్రీ.పూ. 200 నుంచి క్రీ.శ. 300 కాలంలో అనేక చిన్నరాజ్యాలు ముఖ్యంగా విదేశీ రాజ్యాలు ఏర్పడ్డాయి. అందుకే సనాతన చరిత్రకారులు ఈ కాలాన్ని ‘అంధయుగం’గా భావించారు. అయితే ఆధునిక చరిత్రకారులు ఈ కాలాన్ని ‘భారతదేశ వాణిజ్యయుగం’గా చెప్పారు. ఎందుకంటే ఆ కాలంలో వర్తక వాణిజ్యాలు చాలా బాగా అభివృద్ధి చెందినాయి.

4) గుప్తుల కాలం నాటి ఆర్థిక వ్యవస్థ: మౌర్యులలాగా గాక, గుప్తులు గొప్ప బిరుదులను ధరించారు. ‘మహారాజాధిరాజ’ అనే బిరుదు వల్ల చిన్న రాజ్యాలు, రాజులు ఉండేవారని తెలుస్తుంది. గుప్తులు జయించిన చాలా రాజ్య భాగాలు భూస్వాముల పాలనలో ఉండేవి. బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాజ్యభాగాలు కేంద్రంగా గుప్త సామ్రాజ్య పాలన జరిగింది.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

5) భూస్వామ్య అంశాల అభివృద్ధి:

  • భూదానాలు చేయడం: పురోహితులకు దేవాలయాల భూములు, గ్రామాలు విరాళాలుగా ఇచ్చి, పన్నులు వసూలు, పాలనాధికారులు ఇవ్వడంతో అది వికేంద్రీకరణకు దారితీసింది. సేద్యపు కూలీల అణచివేత, దానం చేసిన గ్రామాల ప్రజల అణచివేతతో వారిపై పెత్తనం పెరిగింది.
  • సేద్యపు బానిసలు: భూదానాలు భూస్వామ్య వ్యవస్థకు దారితీసింది. చాలా శాసనాల్లో సేద్యపు బానిసత్వం గురించి తెలిపారు. భూములు అమ్మినప్పుడు ఇతరులకు ఇచ్చినప్పుడు దానితో సేద్యపు బానిసలను కూడా ఇచ్చారు.

6) పుష్యభూతి పాలనలో ఆర్థికవ్యవస్థ: పుష్యభూతి వంశపాలనలో ఆర్థికవ్యవస్థ స్వయంసమృద్ధిగా, మరింత భూస్వామ్య విధానాలతో ఉండేది. గుప్తుల కాలంలో ప్రారంభమైన వర్తక, వాణిజ్య క్షీణత, హర్షుని కాలంలో కూడా కొనసాగింది. వర్తక కేంద్రాలు క్షీణత నాణాల కొరత, వర్తక సంఘాలు లేకపోవటం దీనికి ఉదాహరణ. చేతివృత్తులు, ఇతర పరిశ్రమలు దెబ్బతిన్నాయి. తత్ఫలితంగా వ్యవసాయం కూడా పరోక్షంగా దెబ్బతిన్నది.

ప్రశ్న 5.
మౌర్యుల నుంచి పుష్యభూతి వంశం వరకు జరిగిన కళ, శిల్ప, నిర్మాణ అభివృద్ధిని చర్చించండి.
జవాబు: మౌర్యుల కళలు:
1) స్తంభాలు, శిల్ప నిర్మాణాలు: మౌర్యుల కళకు చాలా అందమైన నిర్మాణాత్మక నిదర్శనాలుగా అశోకుడు నిర్మించిన స్తంభాలు ఉన్నాయి. అశోకుని శాసనాలతో కూడిన స్తంభాలు, స్థూపాలు నగరాల్లో, కూడళ్లలో ప్రతిష్టించాడు. స్తంభాలను రెండు రకాలైన రాతితో నిర్మించారు. అవి:

  1. మధుర ప్రాంతానికి చెందిన ఎరుపు, తెలుపు మచ్చలలో ఉన్న ఇసుక రాయితో కొన్ని నిర్మించబడ్డాయి.
  2. బాగా పొడిచేసిన ఇసుకరాయి, బనారస్ సమీపంలోని చూనార్ వద్ద లభ్యం అవుతుంది. ఎక్కడైతే స్తంభాలు నిర్మిస్తారో అక్కడికి మధుర, చూనార్ నుంచి రాతిని రవాణాచేసి, అక్కడ శిల్పకారులు, తక్షశిల నుంచి వచ్చిన వారు తమ నైపుణ్యంతో చెక్కారు.

2) స్తూపాలు: స్తూపం అనేది ఇటుక లేదా రాయితో నిర్మించిన అర్ధగోళాకార నిర్మాణం. క్రింద గుండ్రని ఆధారపీఠం ఉంటుంది. చుట్టూ గొడుగు ఆకారం సార్వభౌమాధికారానికి గుర్తుగా ఉంటుంది. అశోకుడు భారతదేశంలోను, ఆఫ్ఘనిస్థాన్లలో ఎనభై నాలుగువేల స్థూపాలు నిర్మించాడు. క్రీ.శ. 7వ శతాబ్దంలో హుయన్ త్సాంగ్ తన భారత పర్యటనలో వీటిని చాలావరకు చూశాడు. వీటిలో మంచి ఉదాహరణగా చెప్పదగింది భోపాల్ సమీపంలోని సాంచి స్తూపం.

3) గుహలు: మౌర్యుల కట్టడాల్లో ముఖ్యమైనవి గుహలు. గట్టిరాళ్ళు, చీలిన రాళ్ళతో చెక్కబడినవి. గుహల లోపలి గోడలు బాగా నునుపుగా, అద్దంలాగా ఉంటాయి. ఈ అద్భుత కట్టడాలు సన్యాసుల నివాసగృహాలు, అసెంబ్లీ గదుల వలె ఉపయోగపడ్డాయి.

గాంధార, మధుర అమరావతి శిల్ప నిర్మాణాలు:
A. గాంధార శిల్పం:
1) కాలం, ప్రదేశం, పోషకులు: క్రీ.పూ. 1వ శతాబ్దం మధ్యకాలం నుండి క్రీ.శ. 5వ శతాబ్దం చివరి వరకు గాంధార ప్రాంతంలో ఉన్న అద్భుత శిల్పాలను గాంధార శిల్పాలు అంటారు. భారతీయ గ్రీకు శిల్పకళా సమ్మిళిత నిర్మాణంగా చెబుతారు. బాక్ట్రియా గ్రీకు రాజులు, వాయువ్య భారతం నుంచి ఆవిర్భవించాయి. శకులు, కుషాణులు
వీటి పోషకులు.

2) గాంధార శిల్ప లక్షణాలు: గ్రీకు, రోమన్ సంప్రదాయాల్లో బుద్ధుని విగ్రహాలు నిర్మించబడ్డాయి. మానవ శరీరాన్ని చాలా సహజంగా శిల్పులు చెక్కారు. కండరాలు, మీసాలు, ఉంగరాల జుత్తు మొదలైనవి చక్కగా ఉంటాయి.

B. మధుర శిల్పం: జైనమతం స్ఫూర్తితో ధ్యానంలో ఉన్న దిగంబర తీర్థంకరుల శిల్పాలను మధుర శిల్పులు నిర్మించారు. మొదట్లో బుద్ధుని, బోధిసత్వుని ప్రతిమలు నిర్మించారు. తర్వాత కాలంలో మత భావనలు ప్రదర్శితమయ్యేట్లు నిర్మించారు. బుద్ధుని ప్రతిమలు బిగుతు కండరాలు, బలమైన శరీరంతో హుందాగా, భక్తిభావంతో ఉండే విగ్రహాలను మధుర శిల్పులు నిర్మించారు. వైదిక దేవతలైన శివుడు, విష్ణువు, పార్వతి, లక్ష్మీ ప్రతిమలు కూడా ఈ శిల్పశైలిలో నిర్మించడం జరిగింది.

C. అమరావతి శిల్పం: అమరావతి స్తూపం దీనికి గొప్ప ఉదాహరణ. సున్నపురాయి సొబగులు, బుద్ధుని జీవితానికి సంబంధించిన చిత్రాలు, స్వతంత్రంగా ఉన్న బుద్ధుని విగ్రహాలు చుట్టూ ప్రదర్శితం అవుతాయి. భారతీయ శిల్పానికి అది గొప్ప మకుటంలాంటిది.

గుప్తుల కాలం నాటి సంస్కృతి:
1) నిర్మాణాలు: భారతీయ నిర్మాణాలలో గుప్తుల కాలానికి ప్రత్యేక స్థానం ఉంది. నగర, ద్రావిడ పద్ధతుల్లో గుప్తుల కళ భారతీయ నిర్మాణ చరిత్ర వైభవానికి ప్రతీకగా నిలిచింది.
a. రాతి గుహలు: అజంతా, ఎల్లోరా, బాగ్ గుహలు రాతి గుహలకు ప్రతీకలుగా నిలుస్తాయి.
b. దేవాలయాలు: దేవాలయాల్లో ముఖ్యమైనవి.

  1. చతురస్రాకార చదరపు పైకప్పు దేవాలయం.
  2. రెండో అంతస్తు (విమాన) గల చతురస్రాకార చదరపు పైకప్పు దేవాలయం.
  3. ఒక శిఖరంతో చతురస్రాకార దేవాలయం.
  4. దీర్ఘచతురస్రాకార దేవాలయం.
  5. వృత్తాకార దేవాలయం.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

నచనాకుధార వద్ద గల పార్వతీ దేవాలయం, భూమ్రా వద్ద గల శివాలయం రెండో రకం దేవాలయానికి చెందినవి. మధ్యప్రదేశ్లోని దేవఘడ్, భట్టార్గాంవ్ దేవాలయాలు మూడో రకానికి చెందినవి. వీటి ప్రాధాన్యత ఏమిటంటే గర్భగుడిపైన శిఖరం ఉంటుంది. ఇది నగరశిల్ప నిర్మాణశైలి.

గుప్తుల కళ: గుప్తుల కాలం శిల్ప కళారంగం స్వర్ణయుగంగా ప్రసిద్ధిచెందింది. భవనాలు, దేవాలయాలు, స్తంభాలు, స్తూపాలు అనేకం నిర్మించారు. వీరు నిర్మించిన అద్భుతమైన దేవాలయాల్లో హూణులు, ముస్లిం దాడుల తరువాత మిగిలినవి

  1. ఝాన్సీ జిల్లాలోని దేవఘడ్ వద్దగల దశావతార దేవాలయం.
  2. మధ్యప్రదేశ్లోని భూమారా వద్దగల శివాలయం.

పెర్సీ బ్రౌన్ అభిప్రాయంలో భిట్టర్గావ్ దేవాలయ శిల్ప నిర్మాణం సుదీర్ఘ సంప్రదాయానికి ప్రతీకగా ఉంది. ఇంకా కొన్ని స్తూపాలు, గుహలు, విహారాలు కూడా నిర్మించబడ్డాయి. సారనాధ్ స్తూపం, అజంతా, ఉదయగిరి గుహలు ఆనాటి గొప్ప నిర్మాణాలు. అందమైన బుద్ధుని విగ్రహాలు రాతితో, లోహంతో, బంకమట్టితో చేయడంతోపాటు వివిధ పౌరాణిక బొమ్మలు రాతిపై అందంగా చెక్కారు.

శిల్ప నిర్మాణం:
a. రాతి శిల్పం: సారనాధ్ బుద్ధ విగ్రహం, ఉదయగిరి వద్దగల గుహ ప్రవేశ ద్వారం వద్దగల వరాహ ప్రతిమ చక్కటి ఉదాహరణలు. గ్వాలియర్ వద్ద ఒక నృత్యకారిణితో మహిళా సంగీత విద్వాంసులు చిత్రాలు అద్భుతమైనవి.

b. లోహ నిర్మాణం: 18 అడుగుల ఎత్తైన బుద్ధుని రాగి విగ్రహం, క్రీ.శ. 6వ శతాబ్దంలో బీహారులో నలంద వద్ద నిర్మించారు. సుల్తాన్ గంజ్ లోని బుద్ధ విగ్రహం 7/2 అడుగుల ఎత్తు ఉంది. ఢిల్లీలో మెహరోలి వద్ద ఉన్న ఇనుప స్తంభం గుప్తుల సాంకేతిక పరిజ్ఞానానికి మచ్చుతునక.
కనిష్కుడు గొప్ప భవన నిర్మాత. కనిష్కపురం, పురుషపురం అనే రెండు నగరాలను నిర్మించాడు.

ప్రశ్న 6.
గుప్తుల కాలాన్ని ‘స్వర్ణయుగం’ అని ఎందుకు అంటారు ?
జవాబు:
ప్రాచీన భారతదేశ చరిత్రలో గుప్తుల కాలాన్ని స్వర్ణయుగమంటారు. ఈ కాలాన్ని గ్రీస్ చరిత్రలోని పెరిక్లిస్ యుగంతోను, రోమన్ చరిత్రలోని అగస్టస్ యుగంతోను పోలుస్తారు. ఈ యుగంలో భారతదేశం అన్ని రంగాల్లోను అభివృద్ధిని సాధించింది.

రాజకీయ ఐక్యత: గుప్తపాలకులు ఉత్తర భారతదేశాన్ని అనైక్యత నుండి కాపాడి, దేశ సమైక్యతను సాధించారు. మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, చంద్రగుప్త విక్రమాదిత్యుడు మొదలగు పాలకులు తమ దిగ్విజయ యాత్రల ద్వారా దేశ రాజకీయ ఏకీకరణను సాధించారు.

విజ్ఞులైన చక్రవర్తులు: గుప్త చక్రవర్తులు సమర్థులు, పండితులు, శూరులు. వీరిలో సముద్రగుప్తుడు అగ్రగణ్యుడు. ఇతడు అజేయుడైన వీరుడే కాక మంచి కవి కూడా. గుప్త చక్రవర్తులందరూ మత సహనమును పాటించారు. వీరి వ్యక్తిగత ప్రతిభాసంపత్తి గుప్తయుగము స్వర్ణయుగము కావటానికి దోహదపడింది.

ఆర్థికాభివృద్ధి: గుప్తుల సమర్థవంతమైన పాలన వలన రాజ్యంలో సుఖశాంతులు ఏర్పడి ఆర్థికాభివృద్ధి జరిగింది. ప్రజలు సంపన్నులై, సంతోషంగా జీవించేవారని ఫాహియాన్ పేర్కొన్నాడు. శిక్షలు స్వల్పంగా ఉండేవి. బాటసారులకు దొంగల భయం లేకుండా ఉండేది. స్వదేశీ, విదేశీ వాణిజ్యం పురోగమించుటచే దేశసంపద పెరిగింది. పరిశ్రమలు వర్ధిల్లాయి. వ్యవసాయమునకు మంచి ప్రోత్సాహం లభించింది.

మతసామరస్యము:
ఎ) గుప్త చక్రవర్తులు హిందువులవటంతో అశ్వమేథము మొదలగు వైదిక కర్మలను ఆచరించారు. త్రిమూర్తులకు ప్రాధాన్యతనిచ్చారు. గుప్తుల ఇష్టదైవం విష్ణువు కనుక విష్ణుపురాణం, విష్ణుస్మృతి, భాగవతం మున్నగు గ్రంథములు ఆదరింపబడ్డాయి. శివుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి మున్నగు దేవతలను కూడా వీరు పూజించారు. ఈ కాలంలో సగుణోపాసనకు ప్రాముఖ్యం పెరిగింది.

బి) తాము వైదిక మతమును అవలంబించినప్పటికి గుప్త చక్రవర్తులు జైన, బౌద్ధమతముల యెడల అపారమైన సహనాన్ని పాటించారు. ప్రసిద్ధ బౌద్ధపండితుడైన వసుబంధుని సముద్రగుప్తుడు ఆదరించాడు. సింహళ ప్రభువు మేఘవర్ణుడు భారతదేశములో బౌద్ధవిహారము నిర్మించుటకు ఇతడు అనుమతించాడు. కుమారగుప్తుడు నలందా బౌద్ధ విశ్వవిద్యాలయమును స్థాపించాడు. నాటి బౌద్ధ, జైన ప్రతిమలు అసంఖ్యాకముగా లభించుటయే గుప్తుల మత సహనమునకు తార్కాణం. కాలక్రమేణా బౌద్ధమతం క్షీణించింది. మహాయాన బౌద్ధమతము హిందూమత శాఖవలె తోచుటయే ఇందుకు కారణం. జైనమతం మాత్రమే కొన్ని ప్రాంతాలలో కొనసాగింది. గుప్తులు ఉన్నత ఉద్యోగాలలో మత ప్రమేయం లేకుండా బౌద్ధులను, జైనులను నియమించారు.

సారస్వతాభివృద్ధి: గుప్తుల కాలంలో సంస్కృత భాష పూర్తి వికాసాన్ని పొందింది. సముద్రగుప్తుడు స్వయంగా కవి. “కవిరాజు” అను బిరుదాంకితుడు. సముద్రగుప్తుని సేనాని హరిసేనుడు అలహాదాబ్ ప్రశస్థి శాసనాన్ని వ్రాశాడు. రెండో చంద్రగుప్తుని ఆస్థానంలో ‘నవరత్నాలు’ అనే కవులుండేవారు. వారు 1) కాళిదాసు 2) అమరసింహుడు 3) శంకు 4) ధన్వంతరి 5) క్షపణికుడు 6) భేతాళభట్టు 7) ఘటకర్షకుడు 8) వరరుచి 9) వరాహమిహిరుడు. కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతల’మనే కావ్యం అనేక ప్రపంచ భాషల్లోకి అనువదించబడింది. ‘మృచ్ఛకటికం’ నాటకాన్ని రచించిన శూద్రకుడు ఈ కాలంవాడే. నాడు వసుబంధు, దిజ్ఞాగుడు, బుద్ధపాలితుడు, భావవివేకుడు వంటి బౌద్ధ రచయితలు నిరుపమానమైన రచనలు చేశారు. ఈ రచనల ద్వారా ఆనాటి రాజాస్థాన జీవితం, ప్రభువర్గాల జీవన విధానం గురించి తెలుస్తుంది.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

విజ్ఞాన శాస్త్రాభివృద్ధి: విజ్ఞానశాస్త్రంలో కూడా గుప్తుల కాలం అద్భుతమైన ప్రగతిని సాధించింది. ఆర్యభట్టు ‘సూర్యసిద్దాంత’మనే గ్రంథాన్ని, వరాహమిహిరుడు ‘బృహత్సంహిత’ అనే గ్రంథాన్ని రచించారు. బ్రహ్మగుప్తుడు గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టి తన పుస్తకం ద్వారా దానిని లోకానికి వెల్లడి చేశాడు. వైద్యశాస్త్రాభివృద్ధికి విశేషంగా కృషిచేసిన శుశ్రుతుడు, వాగ్భటుడు, ధన్వంతరి మొదలైనవారు గుప్తులకాలం వారే.

కళాభివృద్ధి: గుప్తుల కాలంలో కళలు కూడా పరాకాష్టనందుకొన్నాయి. ఈ కాలంలో జరిగిన నిర్మాణాలన్నీ మతం వలన ప్రేరేపితమైనవే. ఉదా: దేవఘర్లోని దశావతార దేవాలయం, తిగావా, భూమారా ఆలయాలు, సాంచి, సారనాధ్ లోని బౌద్ధాలయాలు ఈ కాలంలో వాస్తుకళ సాధించిన ప్రగతికి నిదర్శనాలు. గుప్తుల కాలంలో శిల్పకళ కూడా పరిపక్వతను పొందింది. అజంతా గుహల్లోని కొన్ని కుడ్యచిత్రాలు ఈ కాలానికి చెందినవే. లోహాలతో విగ్రహాలను, ఉక్కుతో స్తంభాలను పోతపోయడంలోను, రకరకాల అందమైన నాణాల తయారీలో కూడా గుప్తయుగం తన ప్రత్యేకతను నిలబెట్టుకొంది.

ముగింపు: గుప్తుల యుగం భారతదేశ చరిత్రలో ఒక విశిష్టయుగం. ఈ విశిష్టత ప్రధానంగా సాహిత్యం, విజ్ఞానశాస్త్రాలు కళారంగాలలో కనిపిస్తుంది.

7. క్రీ.పూ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు జరిగిన సాహిత్యాభివృద్ధిని తెలపండి. జవాబు: మౌర్యుల కాలంలో విద్యారంగంలో చాలా అభివృద్ధి జరిగింది. ప్రజలను విద్యావంతులను చేయడానికి పాలకులు చాలా శ్రద్ధ తీసుకొన్నారు. అశోకుని శాసనాలు సామాన్య ప్రజలు కూడా చదివి అర్థం చేసుకొనేట్లు ఉంటాయి. ప్రాచీన భారతదేశంలో తక్షశిల అతిప్రాచీన విద్యాలయం. ఇది బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు సమానంగా విద్యాభ్యాసం చేయగల అత్యంత ప్రామాణిక విశ్వ విద్యాలయం. భారతదేశం నలుమూలల నుంచేగాక, ఇతర దేశాల నుంచి కూడా విద్యార్థులు కుల, మత, భేదాలు లేకుండా తక్షశిలకు వచ్చి విద్యాభ్యాసం చేశారు.

సారస్వత కార్యక్రమాలు: సారస్వత సంబంధ ప్రగతిలో మౌర్యుల కాలం ఉన్నత ప్రగతి సాధించింది. అశోకుని శాసనాల ద్వారా రెండు లిపులు ఉన్నట్లు తెలుస్తోంది. అవి బ్రహ్మ, ఖరోష్ఠి, కౌటిల్యుడు వ్రాసిన ‘అర్థశాస్త్రం’, భద్రుడు వ్రాసిన ‘కల్ప సూత్రాలు’, బౌద్ధ గ్రంథాలు కథావస్తువు, ధర్మ సూత్రాలు, గృహ సూత్రాలు ఈ కాలంలో రచించబడ్డాయి. కౌటిల్యుని ‘అర్థశాస్త్రం’ మౌర్యుల కాలంనాటి ప్రసిద్ధ గ్రంథం. మౌర్యుల పరిపాలన గురించి సమాచారం ఈ గ్రంథంలో ఉంది.

కనిష్కుడు – గొప్ప సాహిత్య పోషకుడు: కనిష్కుడు గొప్ప సాహిత్య, కళాపోషకుడు. అతడి ఆస్థానంలో చాలామంది పండితులు పోషణను అందుకొన్నారు. అశ్వఘోషుడు, నాగార్జునుడు, వసుమిత్రుడు, చరకుడు సుప్రసిద్ధ బౌద్ధ పండితులు. కనిష్కుడు ఆస్థానంలో ఉన్న అశ్వఘోషుడు వ్రాసిన గ్రంథాలు “బుద్ధచరిత్ర”, “సౌందరానంద కావ్యం”, “సరిపుత్త ప్రకరణ” ముఖ్యమైనవి. నాగార్జునుడు, వసుమిత్రుడు, చరకుడు తమ గ్రంథాలను సంస్కృతంలో వ్రాశారు. కనిష్కుని కాలంలో సంస్కృత భాష విరాజిల్లింది. కనిష్కుడు గొప్ప భవన నిర్మాత. కనిష్కపురం (కాశ్మీరు), పురుషపురం అనే రెండు నగరాలను నిర్మించాడు. బుద్ధుడి విగ్రహాలను గాంధార శిల్ప శైలిలో నిర్మింపజేశాడు. గ్రీకు – భారతీయ శిల్పకళా సమ్మేళనమే గాంధార శిల్పం.

గుప్తుల సారస్వతాభివృద్ధి గుప్తుల కాలంలో సంస్కృతభాష పూర్తి వికాసాన్ని పొందింది. సముద్రగుప్తుడు స్వయంగా కవి. “కవిరాజు” అను బిరుదాంకితుడు. సముద్రగుప్తుని సేనాని హరిసేనుడు అలహాబాద్ ప్రశస్తి శాసనాన్ని వ్రాశాడు. రెండో చంద్రగుప్తుని ఆస్థానంలో “నవరత్నాలు” అనే కవులుండేవారు. 1) కాళిదాసు 2) అమరసింహుడు 3) శంకు 4) ధన్వంతరి 5) క్షపణికుడు 6) భేతాళభట్టు 7) ఘటకర్షకుడు 8) వరరుచి 9) వరాహమిహిరుడు. కాళిదాసు రచించిన “అభిజ్ఞాన శాకుంతలం’ అనే కావ్యం అనేక ప్రపంచ భాషల్లోకి అనువదించబడింది. “మృచ్ఛకటికం” నాటకాన్ని రచించిన శూద్రకుడు ఈ కాలం వాడే. నాడు వసుబంధు, దిజ్ఞాగుడు, బుద్ధపాలితుడు, భావవివేకుడు వంటి బౌద్ధ రచయితలు నిరుపమానమైన రచనలు చేశారు. ఈ రచనల ద్వారా ఆనాటి రాజాస్థాన జీవితం, ప్రభు వర్గాల జీవన విధానం గురించి తెలుస్తుంది.

పుష్యభూతి వంశస్తుల సాంస్కృతిక ప్రగతి: హర్షుడు గొప్ప సాహిత్య, కళా పోషకుడు స్వయంగా పండితుడు. డా॥ రాయిచౌదరి హర్షుని గురించి ఇలా చెప్పాడు. “హర్షుడు గొప్ప సేనాపతి, పరిపాలనాదక్షుడు. మతపోషకుడిగా, సాహిత్య పోషకుడిగా ప్రఖ్యాతిగాంచాడు. విద్యా బోధనకు, పండితుల పోషణకు ఉదారంగా విరాళాలిచ్చాడు. సంస్కృతంలో హర్షవర్ధనుడు ‘నాగానందం’, ‘రత్నావళి’, ‘ప్రియదర్శిక’ అనే గ్రంథాలు వ్రాశాడు. అతడి ఆస్థానంలో ఉన్న బాణభట్టు గొప్ప పండితుడు. హర్షుడు ఉదార దానాల ద్వారా విద్యావ్యాప్తికి కృషిచేశాడు. నలంద విశ్వవిద్యాలయ పోషణకు వంద గ్రామాలను దానం చేశాడు. చాలామంది విద్యార్థులు సుదూర ప్రాంతాలైన చైనా, టిబెట్, మంగోలియా దేశాల నుంచి విద్యాభ్యాసం కోసం వచ్చారు. ఈ విశ్వవిద్యాలయంలో 1500 మంది అధ్యాపకులు ఉన్నారు. శీలభద్రుడు విశ్వవిద్యాలయ అధ్యక్షులు వేదాలు, వ్యాకరణం, ఖగోళశాస్త్రం, గణితం, జ్యోతిష్యం, సాహిత్యం, నైతిక విలువల బోధన సంస్కృత భాషలో చేశారు. హుయన్ త్సాంగ్ ఈ విశ్వవిద్యాలయ విద్యార్థి, ధర్మపాలుడు, చంద్రపాలుడు, గుణమతి, స్త్రీర్మతి, ధ్యాన్ చంద్ర, కమల్ శీల మొదలైనవారు ఆచార్యులు. డా॥ R.C. మజుందార్ అభిప్రాయంలో “హర్షుడు యుద్ధం, శాంతి, కళలలో సమాన ప్రతిభ కలిగి ఉన్నాడు. కలం, కత్తి సమానంగా వాడగల నిపుణుడు, మేధావి అతడు”.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మౌర్యులకు చెందిన ప్రధాన చారిత్రక ఆధారాలు తెలపండి.
జవాబు:
భారతదేశ చరిత్రలో మౌర్య వంశానికి ఒక విశిష్టస్థానం ఉంది. ఈ వంశంవారు ప్రప్రథమంగా సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించి దేశ సమైక్యతను చాలావరకు సాధించారు. తత్ఫలితంగా మౌర్య సామ్రాజ్య స్థాపనతో ఉత్తర భారతదేశ చరిత్రలో సామ్రాజ్యాల యుగం ప్రారంభమైనది. తమిళ, కేరళ ప్రాంతాలు మినహా మిగిలిన భారతదేశమంతా వీరి సార్వభౌమాధిపత్యం క్రిందికి రావడం గమనించదగ్గ విషయం. వీరు సమర్థవంతమైన పాలనావ్యవస్థను రూపొందించి ప్రజారంజకంగా పాలించారు. విశ్వమానవ కళ్యాణం, పరమత సహనం, శాంతి, అహింస, సర్వ మానవ సౌభ్రాతృత్వం వంటి ఉదాత్త లక్ష్యసాధనకు చివరి వరకు అహోరాత్రులు కృషిచేసిన విశ్వవిఖ్యాతులైన సామ్రాట్టులో అగ్రగణ్యుడైన అశోక చక్రవర్తి ఈ వంశానికి చెందినవాడు. ఇటువంటి మౌర్యుల చరిత్రను తెలుసుకొనుటకు ఈ క్రింది చారిత్రక ఆధారాలు ప్రధానమైనవి. అవి:

మౌర్యుల చరిత్ర అధ్యయనానికి ఉపకరించే ప్రధానమైన ఆధారాలు. శిలలపై రాతిస్తంభాలపై కనిపించే అశోకుడి శాసనాలు, కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రం గ్రీకు రచయితల రచనలు. అంతేగాక పురాణాలు బౌద్ధమత గ్రంథాలు, ‘ముద్రారాక్షసం’ అనే నాటకం కూడా వీరి చరిత్ర అధ్యయనానికి ఉపయోగపడుతున్నాయి.

ప్రశ్న 2.
చంద్రగుప్త మౌర్యుడు మొదటి జాతీయ పాలకుడు – చర్చించండి.
జవాబు:
మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు. ఇతడు చాణిక్యుని నేతృత్వంలో సకల విద్యాపారంగతుడై ఉత్తమ సైనికుడిగా రూపుదిద్దుకున్నాడు. చంద్రగుప్త మౌర్యుడు రెండు ఘనకార్యాలు సాధించాడు. మొదటిది వాయువ్య భారతదేశాన్ని గ్రీకుల నుంచి స్వాధీనం చేసుకోవటం కాగా, నందరాజులను ఓడించి మగధను ఆక్రమించటం రెండవది. అలెగ్జాండర్ భారతదేశమును వదిలివెళ్ళిన పిమ్మట చాణక్య, చంద్రగుప్త మౌర్యుడు మొదటగా పంజాబ్ ప్రాంతంలో ధైర్యసాహసాలకు పేరుబడ్డ జాతులవారిని చేరదీసి ఒక శక్తివంతమైన సైన్యమును సమకూర్చుకున్నారు. ఈ సైన్యం సహాయంతో చంద్రగుప్త మౌర్యుడు ప్రథమంగా గ్రీకులను పారద్రోలి పంజాబును విదేశీపాలన నుండి విముక్తి చేశాడు. ఆ తరువాత నందరాజు నిరంకుశత్వాన్ని నిర్మూలించి మగధ సింహాసనాన్ని అధిష్టించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. జైన, బౌద్ధ ఐతిహ్యాల ప్రకారం చంద్రగుప్త మౌర్యుడు రెండుసార్లు మగధపై దండయాత్ర జరిపాడని, రెండవ దండయాత్రలో విజయం సాధించి సామ్రాజ్య స్థాపనగావించాడని తెలుస్తున్నది. క్రీ.పూ. 305లో భారతదేశముపై దండెత్తి వచ్చిన గ్రీకు సేనాని సెల్యూకస్ నికటార్ను ఓడించి అతని వద్ద నుండి కాబూల్, కాందహార్, హీరట్, బెలూచిస్థాన్లను వశపరచుకొన్నాడు. చంద్రగుప్త మౌర్యుడు 6 లక్షల సైన్యంతో భారతదేశమంతటిని జయించాడని ప్లూటార్క్ అనే గ్రీకు చరిత్రకారుడు పేర్కొన్నాడు. ఈ దండయాత్రల వలన చంద్రగుప్త మౌర్యుని మౌర్య సామ్రాజ్యం పశ్చిమాన పర్షియా నుండి తూర్పున బీహార్ వరకు, దక్షిణాన తిరునల్వేలి జిల్లా వరకు విస్తరించింది.

భారతదేశంలోని అధిక భాగాలను ఒకే సామ్రాజ్య పరిధిలోనికి తీసుకొనివచ్చిన ఘనత చంద్రగుప్తు మౌర్యునికే దక్కుతుంది. అందువలన భారతదేశ చరిత్రలో చంద్రగుప్తమౌర్యుని జాతీయ పాలకుడుగా భావిస్తారు.

ప్రశ్న 3.
అశోకుని గొప్పతనాన్ని సంక్షిప్తంగా వివరించండి.
జవాబు:
భారతీయ చక్రవర్తులలోనే గాక ప్రపంచ చక్రవర్తులలో కూడా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నవాడు అశోకుడు. అశోకుని కాలంలో మౌర్య సామ్రాజ్యం ఆసేతు హిమాచల పర్యంతం విస్తరించింది.

తొలి జీవితం: అశోకుడు బిందుసారుని కుమారుడు. తండ్రి మరణానంతరం క్రీ.పూ. 273లో మౌర్య సింహాసనాన్ని అధిష్టించాడు. అయితే అశోకుడికి, అతని సోదరులకు మధ్య సింహాసనం కోసం పోరాటం జరగటం వల్ల అశోకుడు తన పట్టాభిషేకాన్ని క్రీ.పూ. 269లో జరుపుకున్నాడు. సింహళ చరిత్ర గ్రంథాలు అశోకుని స్వభావం క్రూరమైనదని, తండ్రి మరణానంతరం తన 99 మంది సోదరులను వధించి సింహాసనాన్ని ఆక్రమించాడని వివరిస్తున్నాయి. అయితే అశోకుడు ఒక శిలాశాసనంలో తన సోదరుల, బంధువుల సంక్షేమానికి తీసుకున్న శ్రద్ధను ప్రస్తావించాడు. కాబట్టి అశోకుని వ్యక్తిత్వాన్ని మార్చటంలో బౌద్ధమతం యొక్క గొప్పదనాన్ని నొక్కిచెప్పటం కోసం ఈ ఐతిహ్యాన్ని సృష్టించారని, అది వాస్తవం కాదని కొందరు చరిత్రకారుల అభిప్రాయం.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

అశోకుని చరిత్రకు ఆధారాలు: అశోకుని ఉదాత్త లక్ష్యాలు, ఆదర్శాలు, పరిపాలనా కాలంలోని ముఖ్య సంఘటనలను తెలుసుకోవడానికి అతడు దేశంలో వివిధ ప్రాంతాల్లో వేయించిన శిలాస్తంభ శాసనాలు ఎంతో ఉపకరిస్తాయి. ఈ శాసనాలు బ్రాహ్మీలిపిలో వున్నాయి. బౌద్ధమత గ్రంథాలైన “మహావంశ”, “దివ్యావదాన” కూడా అశోకుని చరిత్రకు సంబంధించిన అంశాలను వివరిస్తాయి. అశోకుడు తన శాసనాలలో తనను ‘దేవానాంప్రియ’ (దేవతలకు ప్రియమైనవాడు), ‘ప్రియదర్శి’ (చక్కని రూపం కలవాడు) అని చెప్పుకున్నాడు.

కళింగ యుద్ధం: అశోకుడు మౌర్య సింహాసనాన్ని అధిష్టించక పూర్వం ఉజ్జయిని పాలకుడుగా పనిచేసి పరిపాలనానుభవాన్ని గడించాడు. పట్టాభిషేకం జరుపుకున్న 9 సంవత్సరాలకు (క్రీ.పూ. 261) సామ్రాజ్య విస్తరణకాంక్షతో కళింగపై దండెత్తాడు. అందుకు కారణం మగధ సామ్రాజ్యంలో భాగంగా వున్న కళింగ, నందరాజుల పతనంతో స్వతంత్రించింది. పైగా దక్షిణ భారతదేశానికి వున్న, భూ, జల మార్గాలు కళింగ ద్వారా వుండటం వల్ల దానిని స్వాధీనం చేసుకోదలిచాడు. క్రీ.పూ. 261లో జరిగిన కళింగ యుద్ధంలో లక్షమంది హతులైనట్లు, లక్షన్నర మంది ఖైదీలుగా పట్టుబడినట్లు అశోకుడు తన 13వ శిలాశాసనంలో పేర్కొన్నాడు. ఈ విజయంతో కళింగ మౌర్య సామ్రాజ్యంలో అంతర్భాగమైంది. కళింగ యుద్ధం అశోకునిలో వినూత్నమైన హృదయ పరివర్తనను తెచ్చింది. చండాశోకుడు ధర్మాశోకుడుగా మారాడు. ఇకముందు యుద్ధాలు చేయకూడదని, ధర్మప్రచారం, ప్రజాసంక్షేమం కోసం పాటుపడాలని నిశ్చయించుకొన్నాడు. ఉపగుప్తుడనే బౌద్ధమతాచార్యుని వద్ద బౌద్ధమత దీక్ష తీసుకున్నాడు. రెండు సంవత్సరాల తరువాత బౌద్ధ భిక్షువుగా మారి బుద్ధగయ, లుంబిని, కపిలవస్తు, శ్రావస్తి, కుశ నగరాలను సందర్శించాడు. బౌద్ధభిక్షువుగానే రాజ్యభారాన్ని నిర్వహించాడు.

సామ్రాజ్య విస్తీర్ణం: అశోకుని సామ్రాజ్యం సువిశాలమైనది. తమిళనాడు, అస్సాం ప్రాంతాలు మినహా మిగిలిన భారతదేశమంతా అశోకుని సామ్రాజ్యంలో భాగంగా వుంది. భారతదేశం వెలుపలి ప్రాంతాలైన కాబూల్, కాందహార్, హీరత్, బెలూచిస్థాన్లు ఇతని సామ్రాజ్యంలో చేరివున్నాయి.

బౌద్ధమత వ్యాప్తి: బౌద్ధమతాన్ని స్వీకరించిన తరువాత అశోకుడు స్వదేశంలోను, విదేశాల్లోను బౌద్ధధర్మ ప్రచారం కోసం సంఘాలను ఏర్పాటు చేశాడు. బౌద్ధ ధర్మసూత్రాలను శిలలు, స్తంభాలపై చెక్కించి జనసమ్మర్ధ ప్రదేశాలలో, యాత్రాస్థలాల్లో వాటిని నెలకొల్పాడు. అహింసా సిద్ధాంతానికి అనుగుణంగా జంతు బలులు, వేటలు, మాంసాహార వంటకాలను నిషేధించాడు. పాటలీపుత్రంలో మూడవ బౌద్ధ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ధర్మబోధన చేయటానికి ధర్మ మహామాత్రులనే ప్రత్యేక అధికారులను నియమించాడు. మత ప్రచారకులను ఈజిప్టు, మాసిడోనియా, సైప్రస్, ఎపిరస్ మొదలైన దేశాలకు పంపాడు.

అశోకుని ధర్మం: తన సామ్రాజ్య పటిష్టత కోసం అశోకుడు ఒక ధర్మాన్ని ప్రవచించాడు. అశోకుని ఆదర్శాలు, ఆలోచనలు అశోకుని ధర్మంలో కనిపిస్తాయి. అన్ని మతాల మహోన్నత ఆదర్శాలకు ఈ ధర్మం అద్దంపడుతుంది. ఈ ధర్మసూత్రాల్లో ప్రధానమైనవి: జీవహింస చేయరాదు. ఇతరుల విశ్వాసాలు, భావాలపట్ల సహనాన్ని చూపాలి. సర్వప్రాణులపట్ల కరుణ, జాలి చూపాలి. బానిసలు, సేవకుల పట్ల దయతో మెలగాలి. గృహస్థులను, బ్రాహ్మణులను, సన్యాసులను దయతో సత్కరించాలి. వారికి ధనసహాయాన్ని చెయ్యాలి. మాటలను అదుపులో పెట్టుకొని ఇతరుల మతాన్ని గౌరవించటం ద్వారానే తమ మతాన్ని, మత పలుకుబడిని పెంచుకోవాలి. ఈ సార్వజనీనమైన సూత్రాలను ఆచరించినట్లయితే మానవుడు సత్ప్రవర్తన, నైతికతలను సాధించి మోక్షాన్ని పొందుతాడు.

అశోకుని పరిపాలన: అశోకుడు తన సామ్రాజ్యంలో రాష్ట్రస్థాయిలో పరిపాలనా వికేంద్రీకరణను ప్రవేశపెట్టాడు. పరిపాలనలో అతనికి యువరాజు, రాజకుమారుడు, కుమార, ఆర్యపుత్ర మొదలైనవారు సహాయపడేవారు. తక్షశిల, ఉజ్జయిని, వైశాలిలను రాష్ట్రాలకు కేంద్రాలుగా చేసి వాటికి కుమారులను రాష్ట్రపాలకులుగా నియమించాడు. రాజ్య వ్యవహారాల్లో రాజుదే తుదినిర్ణయం. న్యాయవిచారణలో అశోకుడు న్యాయమూర్తుల జాగు, అసహనాలను తొలగించి ప్రశంసనీయమైన మార్పులను ప్రవేశపెట్టాడు.

ప్రశ్న 4.
అశోకుని ధర్మము అంటే ఏమిటి ?
జవాబు:
అశోకుని కాలంలో వివిధ మతశాఖలు సామాజిక ఉద్రిక్తతను సృష్టించాయి. నగరాల్లో వ్యాపారవర్గాలు బలపడటంవల్ల నూతన సామాజిక స్థితి ఏర్పడింది. సామ్రాజ్య సువిశాలత్వం కూడా కొన్ని సమస్యలను సృష్టించింది. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొని, దేశ సమైక్యతను సాధించటానికి ఒక క్రొత్త విధానం కావలసి వచ్చింది. అందువలననే అశోకుడు తన ధర్మాన్ని ప్రతిపాదించాడు.

అశోకుని ఆదర్శాలు, ఆలోచనలు అతనిలో కనిపిస్తాయి. బౌద్ధధర్మం, అశోకుని ధర్మం ఒకటి కాదు. ప్రజలకు సులభంగా అర్థమయ్యే ప్రాకృత భాషలో అశోకుడు తన ధర్మాన్ని శిలాశాసనాల్లో పొందుపరిచాడు. అన్ని మతాల మహోన్నత ఆదర్శాలకు ఈ ధర్మం అద్దం పడుతుంది. అశోకుని ధర్మం ముఖ్యంగా మానవుల ప్రవర్తన, నీతికి సంబంధించిన నియమావళికి వర్తిస్తుంది. ఈ ధర్మసూత్రాల్లో ప్రధానమైనవి:

  1. జీవహింస చేయరాదు.
  2. ఇతరుల విశ్వాసాలు, భావాలపట్ల సహనాన్ని చూపాలి.
  3. సర్వప్రాణులపట్ల కరుణ, జాలి చూపాలి.
  4. బానిసలు, సేవకులపట్ల దయతో మెలగాలి.
  5. గృహస్థులను, బ్రాహ్మణులను, సన్యాసులను దయతో సత్కరించాలి. వారికి ధనసహాయాన్ని చేయాలి.
  6. మాటలను అదుపులో పెట్టుకొని ఇతరుల మతాన్ని గౌరవించటం ద్వారా తమ మతాన్ని, మత పలుకుబడిని పెంచుకోవాలి.

ఈ సార్వజనీనమైన సూత్రాలను ఆచరించినట్లయితే మానవుడు సత్ప్రవర్తన, నైతికతలను సాధించి మోక్షాన్ని పొందుతాడు. అశోకుడు కర్మకాండను, మూఢాచారాలను ఖండించాడు.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

ప్రశ్న 5.
భారతదేశ ఆర్థిక, సాంస్కృతిక జీవనంలో కుషాణుల కాలానికి గల ప్రాధాన్యత తెలపండి.
జవాబు:
కనిష్కుడి ఆస్థానం ఎంతోమంది పండితులకు ఆశ్రయం కల్పించింది. పార్శ్వుడు, వసుమిత్రుడిలాంటి బౌద్ధ పండితులు నాల్గవ బౌద్ధసంగీతిని నిర్వహించారు. ‘బుద్ధచరిత్ర’, ‘సౌందరనందం’ అనే గ్రంథాలు వ్రాసిన అశ్వఘోషుడు గొప్ప తత్వవేత్త, కవి. మహాయాన మతాన్ని ప్రచారం చేసిన నాగార్జునుడు కూడా కనిష్కుని కాలంవాడే. వీరిరువురు కనిష్కుని ఆదరణ అందుకొన్నారు. కనిష్కుడు మత గ్రంథాలనే కాకుండా లౌకిక గ్రంథాలు, శాస్త్రాలను కూడా ఆదరించాడు.

మాతంగుడనే రాజకీయ దురంధరుడు కనిష్కుడి అమాత్యుడు. ‘చరక సంహిత’ను రచించిన చరకుడు కనిష్కుని ఆస్థాన వైద్యుడు. ఈ చరక సంహితలో రోగనిర్ధారణ, రకరకాల రోగాలు, అవి రావడానికి కారణాలు, రక్తప్రసరణ-పరీక్ష, మానవ శరీరశాస్త్రం, పిండోత్పత్తి (embryology) మొదలైనవి విపులీకరించడం వల్ల పారశీకం మొదలైన భాషల్లోకి ఈ గ్రంథం అనువాదాలు వెలువడ్డాయి.

కళాసేవ: అశోకుడిలాగా ఎన్నో శిల్పాలు చెక్కించడానికి, కట్టడాలు నిర్మించడానికి, చిత్రాలు గీయించడానికి కనిష్కుడు పూనుకొన్నాడు. ‘కనిష్కపురం’ లోని 13 అంతస్తుల స్తంభం (Tower), మధురలోని శిల్పాలు, ‘పురుషపురం’ లోని బౌద్ధవిహారం, స్తూపం ఎంతో ప్రసిద్ధిచెందాయి. రాజధాని పురుషపురంలో 400 అడుగుల ఎత్తు గోపురం నిర్మించి అందులో నిలువెత్తు బుద్ధ విగ్రహం ప్రతిష్టించాడు. గాంధార శిల్పం ఇతని కాలంలోనే ఉచ్ఛస్థితికి చేరుకుంది. శిల్పాలకు మధుర కేంద్రమయింది. అనేక భంగిమలలో బుద్ధుని ప్రతిమలు మలచబడ్డాయి.

కనిష్కుడు విదేశీయుడైనా 41 సంవత్సరాల సుదీర్ఘపాలనలో భారతదేశ చరిత్రలో గొప్ప చక్రవర్తిగా పేరు తెచ్చుకున్నాడు. చరిత్రలో ఉత్తమ స్థానాన్ని సంపాదించుకున్నాడు. అతని తర్వాత వచ్చిన రాజుల (హనిష్కుడు, వసిష్కుడు) బలహీనత వల్ల, కుషాణుల రాజ్యం అంతరించింది.

ప్రశ్న 6.
గుప్తుల కాలానికి సంబంధించిన ప్రధాన చారిత్రక ఆధారాలను తెలపండి.
జవాబు:
కుషాణ సామ్రాజ్య పతనానంతరం భారతదేశంలో, ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో, క్రీ.శ. 4వ శతాబ్ది వరకు ఏ రాజ వంశము సామ్రాజ్యాధికారాన్ని నెలకొల్పలేదు. క్రీ.శ. 4వ శతాబ్ది ప్రథమార్థంలో గుప్త సామ్రాజ్య స్థాపన మగధలో జరిగింది. అంతవరకు, ఈ ప్రాంతమంతటా చిన్నచిన్న రాజ్యాల వ్యవస్థ కొనసాగింది. ఈ చిన్నచిన్న రాజ్యాల్లో రాజకీయ అస్థిరత్వం నెలకొనడంతో రాజకీయ ఆధిక్యత కోసం ఇక్కడి రాజులు తరచు యుద్ధాలు చేశారు. ఇటువంటి రాజకీయ కల్లోల పరిస్థితుల్లో, రాజకీయంగా, సాంస్కృతికంగా, దేశాన్ని సమైక్యపరిచి అన్నివిధాలా స్వర్ణయుగాన్ని సృష్టించడానికి కృషి చేసినవారు గుప్తులు. వీరు క్రీ.శ. 4వ శతాబ్ది నుంచి క్రీ.శ. 6వ శతాబ్ది మధ్య వరకు, భారతదేశాన్ని
పరిపాలించారు.

గుప్తుల కాలంనాటి ప్రాచీన భారతదేశ చరిత్ర రచనకు ఆధారాలు అనేకం ఉన్నాయి. ఆ ఆధారాలను మూడు విభాగాలు చేయవచ్చు. అవి 1. గ్రంథాలు 2. శాసనాలు 3. జ్ఞాపకచిహ్నాలు, ముద్రలు, కళాఖండాలు, చిత్రాలు, నాణాలు మొదలైనవి.

గ్రంథాల్లో ముఖ్యమైనవి, విశాఖదత్తుడు రచించిన ‘ముద్రారాక్షసం’, ‘దేవి చంద్రగుప్తం’ మొదలైన స్వదేశీ గ్రంథాలు, హుయాన్ త్సాంగ్, ఫాహియాన్ అనే విదేశీ రాయబారులు రచించిన సి-యూ-కి, షో-కువో-కి అనేవి.

శాసనాల్లో ముఖ్యమైనవి రెండో చంద్రగుప్తుడి కాలంనాటి ఉదయగిరి గుహల్లోని శాసనాలు, మధుర శిలా శాసనం, సాంచి శిలా శాసనం మొదలైనవి. ఇవి ఆనాటి ప్రభుత్వ విధానాన్ని, మత విధానాన్ని తెలియజేస్తాయి. జునాగఢ్ శాసనం, ఇండోర్ రాగి రేకు శాసనం, స్కంధగుప్తుని గురించి తెలుపుతున్నాయి.

ఇంకా గుప్తుల కాలంనాటి జ్ఞాపక చిహ్నాలైన అజంతా, ఎల్లోరా గుహల్లోని చిత్రలేఖనం, వారు ప్రవేశపెట్టిన వివిధ రకాలైన నాణాలు వారి ఆర్థిక, సాంస్కృతిక రంగాల ప్రగతిని తెలియజేస్తున్నాయి.

ప్రశ్న 7.
సముద్రగుప్తునిపై సంక్షిప్త వ్యాసం రాయండి.
జవాబు:
గుప్తచక్రవర్తులలో సముద్రగుప్తుడు (క్రీ.శ. 335-380) అగ్రగణ్యుడు. సముద్రగుప్తుని విజయాలను, వ్యక్తిత్వాన్ని అతడు జారీచేసిన శాసనాల ఆధారంగా తెలుసుకోవచ్చు.

తొలి జీవితం: సముద్రగుప్తుడు మొదటి చంద్రగుప్తుడు, కుమారదేవీలకు జన్మించాడు. మొదటి చంద్రగుప్తుడు తన వారసుడిగా సముద్రగుప్తుడిని నియమించాడు. కాని సముద్రగుప్తుడు జ్యేష్ఠుడు కానందున వారసత్వయుద్ధం జరిగిందని, అందులో తన అన్న “కచుని” సముద్రగుప్తుడు ఓడించాడని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. కాని “కచుడు” అనునది సముద్రగుప్తునికి గల మరియొక పేరని కొందరు చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.

సైనిక విజయాలు: సముద్రగుప్తుడు గొప్ప విజేత. విదేశీదాస్యం నుంచి భారతదేశానికి విముక్తిని కలిగించి భారతదేశమంతటిని ఒకే పాలన క్రిందకు తీసుకురావాలని ఇతడు ఆశించాడు. ఇతని ఆస్థాన పండితుడు, సేనాపతి అయిన హరిసేనుడు అలహాబాద్ లో అశోక స్తంభం మీద వ్రాయించిన “అలహాబాద్ ప్రశస్థి” ద్వారా ఇతని సైనిక విజయాలను తెలుసుకోవచ్చు. దీని ప్రకారం సముద్రగుప్తుని విజయాలను మూడు భాగాలుగా విభజించవచ్చు. అవి: 1) మొదటి ఆర్యావర్త విజయాలు 2) దక్షిణభారత విజయాలు 3) రెండో ఆర్యావర్త విజయాలు.

1) మొదటి ఆర్యావర్త విజయాలు: సింహాసనాన్ని అధిష్ఠించిన వెంటనే సముద్రగుప్తుడు తన అధికారాన్ని ధిక్కరించిన ఉత్తర భారతంలోని రాజులను జయించి పాటలీపుత్రంలో తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఈ యుద్ధాల్లో సముద్రగుప్తుడు ఓడించిన రాజులు: అహిచ్ఛత్రాన్ని పాలిస్తున్న అచ్యుతుడు, గ్వాలియర్ సమీపంలో పద్మావతీపురాన్ని పాలిస్తున్న నాగసేనుడు, మధురాపురాధీశుడైన గణపతి నాగుడు, ఇంకా చంద్రవర్మ, రుద్రదేవ వంటి మొత్తం 9 మంది రాజులను అణచి సముద్రగుప్తుడు తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇతని పరాక్రమాన్ని గుర్తించి సరిహద్దు రాజ్యాలైన సమతట, కామరూప, నేపాల్, దావక, కర్రిపుర మొదలైన రాజ్యపాలకులు సముద్రగుప్తుడితో మైత్రి చేసుకున్నారు. మాళవ, యౌధేయ, అభీర వంటి గణరాజ్యాలు ఇతని ఆధిపత్యాన్ని అంగీకరించాయి. ఈ విజయాల ఫలితంగా ఇతని సామ్రాజ్యం హిమాలయాల నుంచి ‘భిల్సా’ వరకు, పంజాబ్ నుంచి బెంగాల్ వరకు విస్తరించింది.

2) దక్షిణ భారత విజయాలు: మొదటి ఆర్యావర్త యుద్ధాల తరువాత సముద్రగుప్తుడు దక్షిణభారతంపై దండెత్తాడు. ఈ దండయాత్రలో సముద్రగుప్తుడు 12 మంది రాజ్యపాలకులను ఓడించి వారి రాజ్యాలను తిరిగి వారికే అప్పగించాడు. ఆ పాలకులు 1) కోసల పాలకుడైన మహేంద్రరాజు 2) మహాకాంతార పాలకుడైన వ్యాఘ్రరాజు 3) ఏరండపల్లి దమనుడు 4) పిష్టపుర రాజు మహేంద్రుడు 5) కొత్తూరును పాలించే స్వామిదత్తుడు 6) దేవరాష్ట్ర పాలకుడైన కుబేరుడు 7) వేంగి పాలకుడైన హస్తివర్మ 8) పాలక్క రాజైన ఉగ్రసేనుడు 9) కేరళ రాజ్యాన్ని పాలించే మంత్రరాజు 10) కుశస్థలపురం పాలకుడు ధనంజయుడు11) అవముక్త పాలకుడు నీలరాజు 12) కంచిని పాలించిన విష్ణుగోపుడు.
సముద్రగుప్తుని ఈ దండయాత్ర మార్గాన్ని గురించి చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలు వున్నాయి.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

3) రెండో ఆర్యావర్త విజయాలు: సముద్రగుప్తుడు దక్షిణ భారత విజయాల్లో మునిగివున్న సమయంలో ఉత్తరభారతంలోని రాజులు వాకాటక రాజు రుద్రసేనుని నాయకత్వంలో తిరుగుబాటు చేశారు. సముద్రగుప్తుడు వారిని “కౌశాంబి” యుద్ధంలో ఓడించి, అశ్వమేధయాగాన్ని చేసి సామ్రాట్టుగా ప్రకటించుకున్నాడు. ఈ విజయాలను గుర్తించి మధ్యభారతంలోని అనేక అటవీ రాజ్యాల అధిపతులు ఇతని ఆధిపత్యాన్ని అంగీకరించారు.

ఇట్టి విజయ పరంపరల వలన చరిత్రకారులు సముద్రగుప్తుని ఇండియన్ నెపోలియన్ అని కీర్తించారు.

ఇతర దేశాలతో సంబంధాలు: విజేతగా సముద్రగుప్తుడి కీర్తి, ప్రతిష్టలు విదేశాలకు కూడా వ్యాపించాయి. అనేకమంది విదేశీరాజులు ఇతనితో దౌత్య సంబంధాలనేర్పరుచుకొన్నారు. సింహళరాజైన మేఘవర్ణుడు క్రీ.శ. 351లో ఇతని ఆస్థానానికి రాయబారులను, కానుకలను పంపడమే కాకుండా తన దేశం నుంచి భారతదేశం వచ్చే బౌద్ధ యాత్రికుల కోసం బుద్ధగయ సమీపంలో ఒక విహారాన్ని నిర్మింపజేశాడు.

ప్రశ్న 8.
గుప్తుల పాలనలో సమాజం, ఆర్థిక స్థితి, మతం వివరించండి.
జవాబు:
సమాజం: సామాజిక ఏర్పాటుకు కుల వ్యవస్థ ఆధారం. సమాజం నాలుగు వర్గాలుగా విభజించబడింది. బ్రాహ్మణులు, క్షత్రియ, వైశ్య, శూద్రులు. బ్రాహ్మణులు సమాజంలో ఉన్నత స్థానంలో గౌరవించబడ్డారు. చక్రవర్తులు కూడా వీరిని సత్కరించేవారు. అనేక విషయాల్లో పురోహితుడే చక్రవర్తికి ప్రధాన సలహాదారుడు. బ్రాహ్మణుల తరువాత క్షత్రియులు, వైశ్యులు గౌరవ స్థానాల్లో ఉన్నారు. ‘చండాలుర’ గురించి ఫాహియాన్ తెలిపాడు. సాధారణంగా వారు వేటగాళ్ళు, మత్స్యకారులు, కసాయి వారు అయి ఉండవచ్చని తెలుస్తుంది.

స్త్రీ స్థానం: కొన్ని అంశాల్లో స్త్రీ హోదా గుప్తుల కాలంనాటి సమాజంలో తగ్గింది. బాల్య వివాహాలు విస్తారంగా జరిగేవి. ‘సతీసహగమనం’ క్రమంగా వాడుకలోకి వచ్చింది.

ఆర్థిక వ్యవస్థ: మౌర్యులలాగా గాక గుప్తులు గొప్ప బిరుదులను ధరించారు. ‘మహారాజాధిరాజ’ అనే బిరుదు వల్ల చిన్న రాజ్యాలు, రాజులు ఉండేవారని తెలుస్తుంది. గుప్తులు జయించిన చాలా రాజ్య భాగాలు భూస్వాముల పాలనలో ఉండేవి. బెంగాలు, బీహారు, ఉత్తరప్రదేశ్ రాజ్య భాగాలు కేంద్రంగా గుప్త సామ్రాజ్య పాలన జరిగింది.

పెద్ద కేంద్ర సైన్యం, అధికార వర్గం లేకపోవడం: మౌర్యులకు భిన్నంగా, గుప్తులకు పెద్ద వ్యవస్థీకృత సైన్యం లేదు. భూస్వాములు పంపే సైన్యమే గుప్తుల సైన్యంలో ప్రధాన భాగం. అదేవిధంగా అధికార వర్గం కూడా లేదు. వీటివల్ల పాలనా యంత్రాంగంపై చక్రవర్తి నియంత్రణ తగ్గింది.

భూస్వామ్య అంశాల అభివృద్ధి:

  • భూదానాలు చేయడం: పురోహితులకు, దేవాలయ భూములు, గ్రామాలు విరాళాలుగా ఇచ్చి, పన్నులు వసూలు, పాలనాధికారులు ఇవ్వడంతో అది వికేంద్రీకరణకు దారితీసింది. సేద్యపు కూలీల అణచివేత, దానం చేసిన గ్రామాల ప్రజల అణచివేతతో వారిపై పెత్తనం పెరిగింది.
  • సేద్యపు బానిసత్వం: భూదానాలు, భూస్వామ్య వ్యవస్థకు దారితీసింది. చాలా శాసనాల్లో సేద్యపు బానిసత్వం గురించి తెలిపారు. భూములు అమ్మినప్పుడు, ఇతరులకు ఇచ్చినప్పుడు దానితోపాటు సేద్యపు బానిసలను కూడా ఇచ్చారు.

ప్రశ్న 9.
హర్షవర్ధుని గొప్పతనాన్ని అంచనా వేయండి.
జవాబు:
గుప్త సామ్రాజ్యం పతనానంతరం ఉత్తర భారతదేశం అనేక చిన్న స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయింది. వాటిలో ఒకటి స్థానేశ్వర రాజ్యం. స్థానేశ్వర పాలకులలో హర్షుడు ప్రముఖుడు. (క్రీ.శ. 606-647). హర్షుడు తన జైత్రయాత్ర ద్వారా ఉత్తర భారత రాజకీయ ఏకీకరణను సాధించాడు.

చారిత్రక ఆధారాలు: హర్షుని చరిత్రను తెలుసుకోవటానికి బాణుడు రచించిన హర్షచరిత్ర, హుయాన్ త్సాంగ్ రచించిన సి-యూ-కి, హర్షుడు వేయించిన బన్సీభేరా, మధుబన్, సోనేపట్ శాసనాలు ముఖ్య ఆధారాలు. హర్షుడు రచించిన నాటకాలు కూడా నాటి సాంఘిక పరిస్థితులను వివరిస్తాయి.

తొలి జీవితం: హర్షుడు పుష్యభూతి వంశస్థుడు. ఇతడి తండ్రి ప్రభాకర వర్ధనుడు. ప్రభాకర వర్థనుడి మరణానంతరం హర్షుని సోదరుడు రాజ్యవర్ధనుడు రాజ్యానికి వచ్చాడు. అయితే గౌడ శశాంకుని కుట్రకు రాజ్యవర్ధనుడు బలైపోయాడు. అంతట క్రీ.శ. 606 లో హర్షుడు తన 16వ ఏట స్థానేశ్వర రాజ్య సింహాసనాన్ని ‘రాజపుత్ర’ అను బిరుదుతో అధిష్టించాడు.

తొలి ఘనకార్యాలు: సింహాసనానికి వచ్చిన వెంటనే హర్షుడు కామరూప దేశాధిపతియైన భాస్కరవర్మతో మైత్రిని పొందాడు. తరువాత మాళవ, గౌడాధీశులను ఓడించాడు. వింధ్య అడవులకు పారిపోయి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న తన సోదరి రాజ్యశ్రీని రక్షించాడు. అంతట కనోజ్ మంత్రి పరిషత్ విన్నపం మేరకు స్థానేశ్వరం, కనోజ్ రాజ్యాలను కలిపి “శ్రీలాదిత్య” అను బిరుదుతో పరిపాలనను ప్రారంభించాడు. తన రాజధానిని స్థానేశ్వరం నుంచి కనోజ్కు మార్చాడు. క్రీ.శ. 606 నుండి 647 వరకు హర్షుడు రాజ్యశ్రీతో కలిసి పాలించినట్లు తెలుస్తున్నది.

జైత్రయాత్రలు: శూరుడైన హర్షుడు విశాల సైన్యాన్ని సమకూర్చుకొని 6 సంవత్సరాలపాటు నిరంతరంగా దిగ్విజయ యాత్ర సాగించి సామ్రాజ్యాన్ని విస్తరింపచేసినట్లు హుయాన్ త్సాంగ్ పేర్కొన్నాడు. మొదట గృహవర్మ మరణానికి కారకుడైన మాళవరాజు దేవగుప్తుడిని తొలగించి, అతని తమ్ముడు మాధవగుప్తుడికి సింహాసనాన్ని అప్పగించి తనకు సామంతుడిగా చేసుకున్నాడు. వల్లభిరాజు ధృవసేనుడిని ఓడించి అతనికి తన కుమార్తెని ఇచ్చి వివాహం చేశాడు. క్రీ.శ. 637లో తూర్పు ప్రాంతానికి దండయాత్రలకు వెళ్ళి వంగ, మగధ, గంజామ్ (ఒరిస్సా) ప్రాంతాలను పాలిస్తున్న శశాంకుడిని ఓడించాడు.

పులకేశి చేతిలో ఓటమి: ఉత్తరాపథంలో తన అధికారాన్ని సుస్థిరం చేసుకొని దక్షిణాపథాన్ని కూడా జయించాలని హర్షుడు నిర్ణయించుకున్నాడు. ఈ ఆలోచనతో దక్షిణాపథంపై దండయాత్రకు బయలుదేరాడు. కాని పశ్చిమ చాళుక్య ప్రభువైన రెండవ పులకేశి హర్షుని నర్మదానదీ తీరప్రాంతంలో ఓడించి వెనుకకు మళ్ళించాడు. నర్మదానది ఇరువురి రాజ్యాలకు మధ్య సరిహద్దు అయింది. ఈ విషయాన్ని రెండవ పులకేశి తన ఐహోల్ శాసనంలో వివరించాడు.

రాజ్య విస్తీర్ణం: హర్షుని సామ్రాజ్యంలో తూర్పు పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్, గంజామ్ ప్రాంతాలు మాత్రమే చేరాయి. రెండవ పులకేశి తన ఐహోల్ శాసనంలో హర్షుని “సకలోత్తరపధేశ్వరుని”గా వర్ణించటాన్ని బట్టి ఉత్తర భారతదేశమంతా హర్షుని ఆధీనంలో ఉన్నట్లుగా తెలుస్తున్నది.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

పాలన: హర్షుడు సమర్ధవంతుడైన పాలకుడు. ప్రజాసంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపాడు. ప్రజల స్థితిగతులను కనుగొనుటకు అతడు విస్తృతంగా పర్యటించేవాడు. హర్షుడు విరామమెరుగక రాజ్యభారాన్ని నిర్వహించేవాడని హుయాన్ త్సాంగ్ వ్రాశాడు. హర్షుడు తన సామ్రాజ్యాన్ని భుక్తులుగాను, విషయాలుగాను, గ్రామాలుగాను విభజించాడు. పండిన పంటలో 6వ వంతును మాత్రమే పన్నుగా వసూలు చేసేవాడు. హర్షుని శిక్షాస్మృతి కఠినంగా ఉండేది. నేరములు అధికంగా ఉండేవి. హర్షుని సైన్యంలో 5వేల ఏనుగులు, 2వేల గుర్రాలు, 50వేల కాల్బలము ఉన్నట్లు తెలుస్తున్నది.

దాన ధర్మాలు: బీదలకు దానధర్మములు చేయుటలో హర్షుడు అశోకుని అనుసరించాడు. రోగులకు, బాటసారులకు అనేక సౌకర్యములు కల్పించాడు. ప్రయాగలో మహామోక్షపరిషత్తును ఐదేండ్లకొకసారి జరుపుచూ, సర్వస్వదానము అను మహావ్రతమును చేశాడు. అందు మొదటిరోజు బుద్ధుని, రెండవ రోజు సూర్యుని, మూడవ రోజు శివుని పూజించి 5 లక్షల జనులకు దానధర్మములు చేశాడు.

విద్యా, సారస్వత పోషణ: హర్షుడు విద్యా, సారస్వతాలను కూడా ఆదరించాడు. నలందా విశ్వవిధ్యాలయానికి 100 గ్రామాలను దానం చేశాడు. పండిత పోషణకు తన ఆదాయంలో 4వ వంతును వినియోగించాడు. హర్షుడు స్వయంగా కవి. ఇతడు రత్నావళి, నాగానందం, ప్రియదర్శిక అనే నాటకాలను రచించాడు. ఇతని ఆస్థాన కవి బాణుడు “హర్షచరిత్ర”, “కాదంబరి” అను వచన కావ్యాలను రచించాడు. సుభాషిత శతకాన్ని రచించిన భర్తృహరి, సూర్య శతకాన్ని రచించిన మయూరుడు, మతంగ దివాకరుడు హర్షుని ఆస్థానంలోనే వారే.

ఘనత: ప్రాచీన చరిత్రలో అగ్రగణ్యులైన చక్రవర్తులలో హర్షుడు ఒకడు. ఇతడు బహుముఖ ప్రజ్ఞాశాలి. విజేతగా, సామ్రాజ్య నిర్మాతగా, ధర్మతత్పరుడిగా, ఉదార పాలకుడిగా, సాహితీవేత్తగా, విద్యాభిమానిగా హర్షుడు విశిష్ట స్థానాన్ని ఆక్రమించాడు. ఇతనిలో అశోకుడు, సముద్రగుప్తుడు, భోజరాజువంటి ప్రముఖుల విశిష్ట లక్షణాలన్నీ ఉన్నాయి. గుప్త యుగానికి, రసపుత్ర యుగానికి మధ్య వారధిగా హర్షుని చరిత్రకారులు పేర్కొన్నారు.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కౌటిల్యుని ‘అర్థశాస్త్రం’
జవాబు:
అర్థశాస్త్ర రచయిత కౌటిల్యుడు. ఇతడు చంద్రగుప్త మౌర్యుని ప్రధానమంత్రి. మౌర్యుల చరిత్రను తెలుసుకొనుటకు గల ఆధారములలో అర్థశాస్త్రము ప్రముఖమైనది. అర్థశాస్త్రమనగా ఆర్థికశాస్త్రము కాదు. ఇది రాజనీతి శాస్త్రము. ఇందు చక్రవర్తి యొక్క విధులు, సైనిక విధానము, దండనీతి మొదలగు అంశములు పేర్కొనబడెను. అయితే రాజనీతి అంశములతోపాటు ఆర్థిక విషయములు కూడా పేర్కొనబడెను. అర్థశాస్త్రమందు కౌటిల్యుడు “రాజ్యమును సంపాదించుటకు కుటిల మార్గములను” కూడా పేర్కొనెను. అటులనే చెరువులో గల చేపలు నీరు త్రాగకుండా ఎట్లు ఉండలేవో, ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు కూడా తీసుకోకుండా ఉండలేరు అని పేర్కొనెను.

ప్రశ్న 2.
ఇండికా
జవాబు:
చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో గ్రీకు రాజైన సెల్యూకస్ రాయబారి మెగస్తనీస్. భారతదేశంలో ఉన్నంతకాలం తాను చూచిన, విన్న విషయాలను ఇండికా అను పేరుతో గ్రంథస్తం చేశాడు. అయితే ఇండికాలోని కొన్ని భాగాలు మాత్రమే నేడు లభ్యమౌతున్నాయి. ఈ గ్రంథం వల్ల నాటి పాలనావిధానం, సామాజిక, ఆర్థిక పరిస్థితులు తెలుస్తున్నాయి. భారతదేశంలో బానిసవ్యవస్థ లేదని, భారతీయులలో 7 కులాలవారున్నారని మెగస్తనీస్ ఈ గ్రంథంలో పేర్కొన్నాడు. పాటలీపుత్ర నగరపాలన గురించి, సైనిక మండలుల గురించి మెగస్తనీస్ సవివరంగా వివరించాడు. ఇతడు విదేశీయుడు. ఇతనికి భారతీయ సంస్కృతీ పరిజ్ఞానం పూజ్యం కాబట్టి ఇతని రచనను స్వవిమర్శతో స్వీకరించవలసి ఉంటుంది.

ప్రశ్న 3.
ధమ్మ మహామాత్రులు
జవాబు:
అశోకుడు నూతన నైతిక నియమావళిని ప్రజలముందుంచాడు. ప్రజల నైతికతను అభివృద్ధి చేయాలనుకొన్నాడు. తన మతాన్ని వ్యాప్తిచేయడానికి ‘ధమ్మ మహామాత్రులు’ అనే ఉద్యోగులను నియమించాడు. 13వ శిలాశాసనంలో అశోకుడు ధమ్మ మహామాత్రుల నియామకం గురించి ఇలా అన్నాడు. “అన్ని మత శాఖలకు ధమ్మ మహామాత్రులను నియమించాను వారు అన్ని ధార్మిక ప్రదేశాలను పరిరక్షిస్తూ ఉంటారు. ప్రజలకు తన మత నైతిక నియమావళిని బోధించడమే వారి విధి. మానవుల సంక్షేమం, వివిధ మత, ధార్మిక కార్యక్రమాల అమలుకు కృషిచేయాలి”. 6వ శిలాశాసనంలో ‘ధమ్మ మహామాత్రుల పనితీరుపై పర్యవేక్షణ కోసం తగిన ఏర్పాట్లు అశోకుడు చేశాడు’ అని పేర్కొనబడింది.

ప్రశ్న 4.
కళింగ యుద్ధం
జవాబు:
కళింగ ప్రాభవం తగ్గించడానికి అశోకుడు కళింగ యుద్ధం (క్రీ.పూ. 261) చేశాడు. అనేకమంది చంపబడటం తీవ్ర రక్తపాతానికి దారితీసింది. చివరికి అశోకుడు యుద్ధంలో గెలిచాడు. కళింగ యుద్ధ వివరాలు అశోకుని 13వ శాసనంలో ఉన్నాయి. ఇది చాలా ప్రాధాన్యత ఉన్న యుద్ధంగా గుర్తించబడింది. ఎందుకంటే ఈ యుద్ధానంతరం అశోకుడు ధర్మ అశోకుడిగా గుర్తించబడ్డాడు.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

ప్రశ్న 5.
సారనాధ్
జవాబు:
అశోకుడు నిర్మించిన స్తంభాలలో మిక్కిలి ప్రఖ్యాతి గాంచినది సారనాధ్ స్తంభం. సారనాధ్ స్తంభంపై గంట, ఫలక, నాలుగు దిక్కులను తెలిపే నాలుగు జంతువులు (ఏనుగు, గుర్రం, ఎద్దు, సింహం) ఉన్నాయి. జంతువుల మధ్య ధర్మచక్రం ఉంది. వీటికిపైన నాలుగు సింహాల ప్రతిమలు ఉన్నాయి. అవి నాలుగు దిక్కులకు అభిముఖంగా, తమ వెనుక భాగాలు ఒకదానితో ఒకటి తాకుతున్నట్లుగా నిలిచి ఉన్నాయి. స్తంభపీఠం అంచులచుట్టూ మృగాలు, పుష్పాలు, పక్షులు మనోహరంగా చిత్రించబడి ఉన్నాయి. నాలుగు సింహాలలో మూడు మాత్రమే మనకు కనిపిస్తాయి. సింహాల క్రింద భాగంలో ‘సత్యమేవజయతే’ (సత్యమే జయిస్తుంది) అని వ్రాసి ఉంది.’ ఈ సూక్తిని మండకోపనిషత్ నుండి గ్రహించారు. ఈ సారనాధ్ సింహాల కిరీటాన్ని భారత ప్రభుత్వం అధికార చిహ్నంగా స్వీకరించింది.

ప్రశ్న 6.
ఫాహియాన్
జవాబు:
గుప్త చక్రవర్తి చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఫాహియాన్. బుద్ధుడు జన్మించిన పవిత్రభూమిని చూడాలని, బుద్ధుని ధాతువులను, బౌద్ధ గ్రంథాలను సేకరించాలని ఇతడు భారతదేశం వచ్చాడు. గుప్తుల కాలంనాటి భారతదేశ స్థితిగతులను తన పో-కూ-వో-కి అను గ్రంథంలో వివరించాడు.

ప్రశ్న 7.
అలహాబాద్ స్తంభ శాసనము
జవాబు:
అలహాబాద్ ప్రశస్థిని సముద్రగుప్తుని సేనాని హరిసేనుడు సంస్కృతభాషలో వ్రాయించాడు. ఇది ఒక శాసనం రూపంలో ఉంది. దీనిలో సముద్రగుప్తుని దిగ్విజయాలు వివరించబడ్డాయి. దీనిని కావ్యశైలిలో రచించారు. ఇది అలహాబాద్ లోని అశోక స్తంభంపై వ్రాయబడి ఉంది.

ప్రశ్న 8.
కాళిదాసు
జవాబు:
గుప్త చక్రవర్తి చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానమును అలంకరించిన నవరత్నములు అను కవులలో అగ్రగణ్యుడు కాళిదాసు. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలము, కుమార సంభవము, విక్రమోర్వశీయము, మేఘసందేశము, మాళవికాగ్నిమిత్రము మొదలగు ప్రముఖ గ్రంథములు రచించాడు.

ప్రశ్న 9.
అజంతా గుహలు
జవాబు:
భారతీయ నిర్మాణాలలో గుప్తుల కాలానికి ప్రత్యేక స్థానం ఉంది. నగర, ద్రావిడ పద్దతుల్లో గుప్తుల కళ భారతీయ నిర్మాణ చరిత్ర వైభోగానికి ప్రతీకగా నిలిచిన అజంతా గుహలు ముఖ్యమైనవి. ఈ అజంతా గుహలు మహారాష్ట్రలో కలవు. ఈ గుహల నిర్మాణం ఆనాటి కళానైపుణ్యమునకు నిదర్శనం.

ప్రశ్న 10.
కనిష్కుడు
జవాబు:
కనిష్కుడు గొప్ప సాహిత్య కళాపోషకుడు. అతడి ఆస్థానంలో చాలామంది పండితులు పోషణను అందుకొన్నారు. అశ్వఘోషుడు, నాగార్జునుడు, వసుమిత్రుడు, చరకుడు సుప్రసిద్ధ బౌద్ధ పండితులు. కనిష్కుని ఆస్థానంలో ఉన్న అశ్వఘోషుడు రాసిన గ్రంథాలు ‘బుద్ధ చరిత్ర’, ‘సౌందరానంద కావ్యం’ ముఖ్యమైనవి. ఇతని కాలంలో సంస్కృత భాష విరాజిల్లింది. కనిష్కుడు గొప్ప భవన నిర్మాత, కనిష్కపురం, పురుషపురం అనే రెండు నగరాలను నిర్మించాడు.

ప్రశ్న 11.
గాంధార శిల్పం
జవాబు:
భారతదేశ వాయువ్య ప్రాంతంలో సింధూ నదికి ఇరువైపులావున్న ప్రాంతాన్ని గాంధారము అంటారు. ఈ ప్రాంతంలో ఉద్భవించిన కళను గాంధార కళ అంటారు. ఇక్కడి బౌద్ధశిల్పాలు భారతీయ, గ్రీకో-రోమన్ లక్షణాలను కలిగివుంటాయి. కనుక భారతీయ, గ్రీకు, రోమన్ శిల్పకళల సమ్మేళనాన్ని గాంధార శిల్పకళ అంటారు. ఈ శిల్పంలో మలచబడిన బుద్ధుని విగ్రహాలకు పలుచని వస్త్రాలు, రోమన్ ఉంగరాల జుట్టు, సహజత్వం, కండలు తిరిగిన శరీర భాగాలు ఎంతో అందంగా ఉంటాయి. అందువల్లనే గాంధార శిల్పికి భారతీయుల హృదయము, గ్రీకుల నేర్పరితనము ఉన్నాయని అంటారు. ఈ కళ ఇండో-గ్రీకుల కాలంలో భారతదేశంలోకి ప్రవేశించింది. కుషాణుల కాలంలో, ముఖ్యంగా కనిష్కుని కాలంలో ఉచ్ఛస్థితికి చేరుకుంది.

ప్రశ్న 12.
మధుర కళ
జవాబు:
జైన మతం స్ఫూర్తితో ధ్యానంలో ఉన్న దిగంబర తీర్థంకరుల శిల్పాలను మధుర శిల్పులు నిర్మించారు. మొదట్లో బుద్ధుని, బోధిసత్వుని ప్రతిమలు నిర్మించారు. తర్వాత కాలంలో, మత భావనలు ప్రదర్శితమయ్యేటట్లు నిర్మించారు. బుద్ధుని ప్రతిమలు బిగుతు కండరాలు, బలమైన శరీరంతో హుందాగా, భక్తి భావంతో ఉండే విగ్రహాలను మధుర శిల్పులు నిర్మించారు. వైదిక దేవతలైన శివుడు, విష్ణువు, పార్వతి, లక్ష్మీ ప్రతిమలు కూడా ఈ శిల్ప శైలిలో నిర్మించడం జరిగింది.

ప్రశ్న 13.
హుయన్సాంగ్
జవాబు:
హర్షుని కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయన్ త్సాంగ్ (క్రీ.శ. 630-644). ఇతడు దేశంలోని అనేక ప్రాంతాల్లో, బౌద్ధమత పవిత్ర స్థలాల్లో నలందా విశ్వవిద్యాలయంలో గడిపి అనేక బౌద్ధ గ్రంథాలను అధ్యయనం చేశాడు. హర్షునికి సన్నిహితుడైనాడు. హర్షుడు కనోజ్, ప్రయాగలలో జరిపిన మోక్ష పరిషత్లలో పాల్గొన్నాడు. భారతదేశంలో అనేక బౌద్ధ గ్రంథాలను, బుద్ధుని ధాతువులను సేకరించాడు. తన పర్యటన అనుభవాలను సి-యూ-కి అను గ్రంథంగా రచించాడు. ఈ గ్రంథం హర్షుని రాజ్యంలోని రాజకీయ, సాంఘిక, మత పరిస్థితులను వివరిస్తుంది.

 

ప్రశ్న 14.
మహామోక్ష పరిషత్
జవాబు:
హర్షుడు ప్రయాగ వద్ద ప్రతి 5 సంవత్సరములకొకసారి సర్వస్వదాన కార్యక్రమాన్ని నిర్వహించేవాడు. దీనినే మహామోక్ష పరిషత్ అంటారు. ఇటువంటి పరిషత్లను హర్షుడు ఆరింటిని జరిపాడు. క్రీ.శ. 643లో జరిగిన 6వ పరిషత్కు హుయాన్ త్సాంగ్ హాజరయ్యాడు. ఈ పరిషత్తులో హర్షుడు తన సర్వస్వాన్ని బ్రాహ్మణులకు, అనాథలకు పంచి, కట్టుగుడ్డలతో రాజధానికి తిరిగి వచ్చేవాడట.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

ప్రశ్న 15.
హూణులు
జవాబు:
హూణులు చైనా పరిసర ప్రాంతాలకు చెందిన అనాగరిక మోటుజాతి ప్రజలు. వీరిలో నల్లహూణులు, తెల్లహూణులు అను రెండు శాఖలవారున్నారు. తెల్లహూణులు భారతదేశముపై దాడిచేసి గుప్తుల సామ్రాజ్యంలో శాంతిభద్రతలకు అంతరాయం కలిగించారు. వీరిలో తోరమాణుడు, మిహిరకులుడు ముఖ్యులు. వీరి దండయాత్రల వలన గుప్త సామ్రాజ్యం బలహీనపడింది. గణతంత్ర రాజ్యాలు అంతరించాయి. బౌద్ధమతం నాశనమైంది. కాలక్రమంలో హూణులు క్షత్రియులుగా గుర్తింపు పొందారు.

ప్రశ్న 16.
బాణుని ‘హర్ష చరిత్ర’
జవాబు:
హర్షచరిత్ర అను గ్రంథాన్ని హర్షుని ఆస్థానకవి బాణుడు రచించాడు. మహాశివభక్తుడైన ‘పుష్యభూతి’ ఈ వంశానికి మూలపురుషుడైనందువల్ల హర్షుని వంశానికి పుష్యభూతి వంశమని పేరు వచ్చినట్లు ఈ గ్రంథం వల్ల తెలుస్తున్నది. ఈ గ్రంథం హర్షుని తండ్రి ప్రభాకరవర్ధనుని ‘హూణ హరిణకేసరి’ అని వర్ణించింది. ఈ గ్రంథము హర్షుని జీవితమును, |అతని పాలనాకాలం నాటి దేశ, కాల పరిస్థితులను తెలుసుకొనుటకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

AP Inter 1st Year History Study Material Chapter 4 తొలి సమాజాలు, మతోద్యమాలు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 4th Lesson తొలి సమాజాలు, మతోద్యమాలు Textbook Questions and Answers.

AP Inter 1st Year History Study Material 4th Lesson తొలి సమాజాలు, మతోద్యమాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
క్రీ.పూ. 6వ శతాబ్దంలో సాంఘిక, వర్గ విభేదాలను, సాంఘిక పురోగతిని వర్ణించండి.
జవాబు:
సమాజాలు: క్రీ.పూ. 6వ శతాబ్దం నాటికి తెగల సంస్కృతి తెరమరుగై సమాజంలో వర్ణవ్యవస్థ అమల్లోకి వచ్చింది. సమాజంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే నాలుగు వర్ణాలు ఏర్పడ్డాయి. వర్ణాశ్రమ ధర్మాలు అమల్లోకి వచ్చాయి. ఋగ్వేదంలోని పురుష సూక్తం వర్ణ విభజనను, బ్రాహ్మణుల ఆధిక్యాన్ని పేర్కొంది.
పురుష సూక్తంలో ప్రజాపతి దేహం నుంచి నాలుగు వర్ణాలు ఆవిర్భవించినట్లు చెప్పబడింది.

బ్రాహ్మణులు – తల నుంచి
క్షత్రియులు – దేహం నుంచి
వైశ్యులు – తొడల నుంచి
శూద్రులు – పాదాల నుంచి ఏర్పడ్డారని పేర్కొంది

వర్ణధర్మాన్ని ప్రజలు ఉల్లంఘించడంతో ధర్మశాస్త్రాలు, ధర్మసూత్రాలను తయారుచేశారు. వీటన్నింటివల్ల దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించడం అనేది రాజు కర్తవ్యంగా మారింది. ఫలితంగా రాజుకు న్యాయాధికారాలు లభించాయి. నాడు నాలుగు వర్ణాలే నాలుగు కులాలుగా మారాయి. వీరిలో బ్రాహ్మణులు ఉన్నత వర్గంగా, శూద్రులు తక్కువ వర్గంగా పేరుపొందారు.

రక్త సంబంధం వివాహాలు: రక్త సంబంధీకులందరూ కుటుంబంలో ఉండేవారు. కొన్ని కుటుంబాల్లో రక్త సంబంధీకులనే వివాహం చేసుకొనే ఆచారం ఉండేది. తొలి సమాజాల్లోని కుటుంబ వ్యవస్థ కుటుంబీకుల సంబంధాలను తెలుసుకోవడం కష్టం.

ఈ కాలంలో పితృస్వామ్య వ్యవస్థ అమలులో ఉండేది. ఆడపిల్లలను భారంగా భావించేవారు. రక్త సంబంధం ఉన్న వారిని కాకుండా ఇతరులను వివాహం చేసుకొనేందుకు ఆసక్తి కనబరిచేవారు ‘కన్యాదానం’ చేయడం ఆచారమైంది. అయితే మారుతున్న వ్యవస్థ ఫలితంగా ఈ ఆచారాలను ప్రశ్నించడం ఆరంభమైంది. ఇలాంటి స్థితిలో ధర్మసూత్రాలు, ధర్మశాస్త్రాలు ఏర్పడ్డాయి. మనుస్మృతిలో ఎనిమిది రకాల వివాహ పద్ధతులు వివరించబడ్డాయి.

AP Inter 1st Year History Study Material Chapter 4 తొలి సమాజాలు, మతోద్యమాలు

సామాజిక విభేదాలు: ధర్మశాస్త్రాలు, ‘వర్ణధర్మాలు’, ‘వృత్తిధర్మాలను’ వివరించాయి. పుట్టుకను బట్టి వర్ణం నిర్ణయించబడుతుంది. మనదేశంలో ఈ కాలంలోనే న్యాయవ్యవస్థ ఏర్పడింది. వర్ణ ధర్మాలను బట్టి సివిల్, క్రిమినల్ శిక్షల్లో హెచ్చుతగ్గులు ఉండేవి. వర్ణ ధర్మాలను బట్టి సమాజంలో గౌరవం, పదవులు, వివాహాలు నిర్ణయింపబడ్డాయి. వర్ణ ధర్మాలను ఉల్లంఘించిన శూద్రులకు శిక్షలు అమానుషంగా ఉండేవి: ఉదా: తలలు తీసివేయడం, నాలుక కోయడం, కంటికి కన్ను, పంటికి పన్నుగా ఉండేవి. శూద్రులు, ద్విజులకు బానిసలుగా, వ్యవసాయ కూలీలుగా ఉండటం వల్ల వారిని తాకడం, స్నేహం చేయడం, వివాహాలు చేసుకోవడం నిషేధంగా ఉండేది.

వర్ణ తారతమ్యాలు: ఈ క్రింది పట్టిక పని విభజనను తెలుపుతుంది.

1. బ్రాహ్మణులు – 1. వేదాల అధ్యయనం, బోధన, యజ్ఞ యాగాదులు చేయటం, బహుమతుల స్వీకరణ.
2. క్షత్రియులు – 2. యుద్ధాలు చేస్తూ ప్రజలను రక్షించడం పరిపాటి.
3. వైశ్యులు – 3. వేదాధ్యయనం, యజ్ఞయాగాదుల నిర్వహణ, వ్యవసాయ వ్యాపారాల నిర్వహణ.
4. శూద్రులు – 4. పై మూడు వర్ణాల వారికి సేవలు, వ్యవసాయ కార్యక్రమాల నిర్వహణ.

సామాజిక పురోగతి: వర్ణాలు నాలుగుగా విభజింపబడినట్లు పై పట్టిక తెలియజేస్తుంది. అయితే సమాజ పురోగతిలో జాతులు కూడా కలిసిపోయాయి. ఇతర గ్రంథాల్లో జాతులను కూడా వర్ణాలుగా పేర్కొనడమైంది. వర్ణాలు నాలుగుగా విభజింపబడగా, జాతులకు నిర్దిష్ట సంఖ్య లేదు. జాతులను వర్ణాలుగా బ్రాహ్మణులు ఒప్పుకునేవారు కాదు. ఉదా: బంగారుపని చేసే కొందరు నిషాధుల్ని ‘స్వర్ణకారు’ అనడానికి బ్రాహ్మణులు ఒప్పుకొనేవారు కాదు. అందువల్ల ‘జాతులు ‘శ్రేణులుగా’ ఏర్పడి అన్ని వృత్తులు నిర్వహించేవారు. శూద్రులు ఈ కాలానికి సేవకుల స్థాయి నుంచి వ్యవసాయదారులుగా పురోగమించారు.

సమాజంలో స్త్రీల పరిస్థితి: మనుస్మృతి, ధర్మశాస్త్రాల ప్రకారం స్త్రీలకు ఆస్తిలో భాగం లేదు. వివాహ సందర్భంలో స్త్రీలకు ఇచ్చే కానుకలను వారు స్త్రీ ధనంగా పొందవచ్చు. ఈ ధనంపై స్త్రీకి పూర్తి హక్కులు ఉంటాయి. దీనిపై భర్తకు హక్కు లేదు. మనుస్మృతి భర్త అనుమతి లేకుండా స్త్రీలు ఆస్తి కలిగి ఉండటం నేరంగా పేర్కొంది.

స్త్రీలు బయట సమూహం నుంచి వివాహం చేసుకోవడాన్ని ‘ఎక్సోగమి’ అంటారు. తండ్రి ‘కన్యాదానం’ చేయడాన్ని ముఖ్య బాధ్యతగా, గౌరవ మర్యాదలుగా భావించి సరైన సమయంలో వివాహం చేసేవారు. ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పుల వల్ల దూర ప్రాంతాలలో ఏర్పడిన వర్తక సంబంధాల వల్ల సంప్రదాయాలు, విశ్వాసాలు, విమర్శలకు దారితీయడంతో బ్రాహ్మణులు క్రీ.పూ. 600వ సం||లో వివాహ వ్యవస్థలో మార్పులు తెచ్చారు.

ప్రశ్న 2.
బ్రాహ్మణ మతంలోని గోత్రం, రక్త సంబంధం, వివాహ పద్ధతులను చర్చించండి.
జవాబు:
క్రీ.పూ. 6వ శతాబ్దం నాటికి తెగల సంస్కృతి తెరమరుగై సమాజంలో వర్ణవ్యవస్థ అమల్లోకి వచ్చింది. సమాజంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే నాలుగు వర్ణాలు ఏర్పడ్డాయి. వర్ణాశ్రమ ధర్మాలు అమల్లోకి వచ్చాయి. ఋగ్వేదంలోని పురుషసూక్తం వర్ణ విభజనను, బ్రాహ్మణుల ఆధిక్యాన్ని పేర్కొంది. నాలుగు వర్ణాలే నాలుగు కులాలుగా మారాయి. వీరిలో బ్రాహ్మణులు ఉన్నతవర్గంగా, శూద్రులు తక్కువ వర్గంగా పేరుపొందారు. క్రీ.పూ. 1000వ సం॥లో బ్రాహ్మణులు రూపొందించిన మరొక సామాజిక విధానం గోత్రం.

గోత్రం: గోత్రం అనే పద్ధతి బ్రాహ్మణులతో ప్రారంభమై, బ్రాహ్మణ వ్యవస్థలోనే కొనసాగుతూ ఉంది. అసలు ‘గోత్రం’ అనే పదానికి అర్థం ‘ఆవులకు సంబంధించినది’. బహుశా ఆవులను బట్టి ఆ సమూహ బ్రాహ్మణులు ఆయా గోత్రాలను పెట్టుకొని ఉండవచ్చు. ఆ తరువాత కాలంలో గోత్రం సమూహ పెద్ద పేరుతో కొనసాగింది. చాలాకాలం తరువాత ఏడుమంది ఋషుల పేర్లతో గోత్రనామాలు ఏర్పడినట్లు గృహ్య సూత్రాలు పేర్కొంటున్నాయి. సగోత్రీకులు అంటే ఒకే గోత్రం వారు వివాహం చేసుకోకూడదు అని చెప్పబడింది.

రక్త సంబంధం: కుటుంబంలోని వారందరూ ఆహారం, పని, వనరులు, పూజా కార్యక్రమాలను పంచుకొనేవారు. రక్త సంబంధీకులందరూ కుటుంబంలో ఉండేవారు. కొన్ని కుటుంబాల్లో రక్త సంబంధీకులనే వివాహం చేసుకొనే ఆచారం ఉండేది. తొలి సమాజాల్లోని కుటుంబ వ్యవస్థ, కుటుంబీకుల మధ్య సంబంధాలను తెలుసుకోవడం కష్టం. సంస్కృత గ్రంథాల ప్రకారం ‘కులం’ కుటుంబాలకు గుర్తింపును ఇస్తుంది. వంశం అనేది వారి ‘పుట్టుకను’ తెలియజేస్తుంది.

వివాహాలు: ఈ కాలంలో పితృస్వామ్య వ్యవస్థ అమలులో ఉండేది. ఆడపిల్లలను భారంగా భావించేవారు. రక్త సంబంధం ఉన్న వారిని కాకుండా ఇతరులను వివాహం చేసుకొనేందుకు ఆసక్తి కనబరిచేవారు. ‘కన్యాదానం’ చేయడం ఆచారమైంది. అయితే మారుతున్న ఆర్థిక వ్యవస్థ ఫలితంగా ఈ ఆచారాలను ప్రశ్నించడం ఆరంభమైంది. ఇలాంటి స్థితిలోనే ధర్మసూత్రాలు, ధర్మశాస్త్రాలు ఏర్పడ్డాయి. మనుస్మృతిలో ఎనిమిది రకాల వివాహ పద్ధతులు వివరించబడ్డాయి.

వివాహ రీతులు:

  1. ఎండోగమి – అదే ప్రాంతానికి చెందిన వారిని వివాహం చేసుకోవడం.
  2. ఎక్సోగమి – ఇతర ప్రాంతాల వారిని వివాహం చేసుకోవడం.
  3. పోలోగమి – బహుభార్యత్వ
  4. పోలయాండ్రి – బహు భర్తృత్వం

మొదలగు వివాహ రీతులు 6వ శతాబ్దంలో అమలులో ఉండేవి.

ప్రశ్న 3.
జైనమత బోధనలను, భారత సమాజంపై వాటి ప్రభావాన్ని వర్ణించండి.
జవాబు:
జైనమతం, బౌద్ధమతం కంటే ప్రాచీనమైనది. జైనమత ప్రబోధకులను తీర్థంకరులు అంటారు. వారు 24 మంది. వారిలో మొదటి తీర్థంకరుడు ఋషభనాథుడు. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. 24వ వాడైన మహావీరుడు ఆఖరి తీర్థంకరుడు. మహావీరుడు జైనమత స్థాపకుడు కాదని, ఆ మతాన్ని సంస్కరించి చక్కని రూపాన్ని అందించినవాడని జైనుల విశ్వాసం.

వర్ధమాన మహావీరుడు: వర్ధమాన మహావీరుడు జైనమత 24వ తీర్థంకరుడు. మహావీరుని అసలు పేరు వర్ధమానుడు. అతడు క్రీ.పూ. 540వ సంవత్సరంలో వైశాలి సమీపంలోని కుంద గ్రామంలో జ్ఞాత్రిక క్షత్రియ వంశంలో సిద్ధార్థుడు, త్రిశలకు జన్మించాడు. ఇతని భార్య యశోద, కుమార్తె ప్రియదర్శిని. వర్ధమానుడు 30 ఏళ్ళు నిండకముందే జీవిత సుఖాలను వదిలి, ఇంటి నుంచి నిష్క్రమించి, సత్యాన్వేషణ కోసం బయలుదేరాడు. 12 సంవత్సరాల కఠిన తపస్సు చేసి జ్ఞానోదయాన్ని పొందాడు. పరిపూర్ణ జ్ఞానము పొందిన పిమ్మట ‘జినుడు’ అని, ధైర్యసాహసములతో తపస్సు సాగించుటచేత “మహావీరుడని”, మహాజ్ఞాని అయినందువల్ల “కేవలుడు” అని సమస్త భవబంధములను తెంచుకొనుటచే ‘నిగ్రంథుడ’ని పిలువబడ్డాడు. మహావీరుడని “జినుడు” (జయించినవాడు) అను బిరుదు నుంచి ఈ మతానికి జైనమతమనే పేరు వచ్చింది. మానవుల మోక్షసాధన కోసం మహావీరుడు పంచవ్రతాలను, త్రిరత్నాలను, సల్లేఖన వ్రతమును బోధించాడు. వీటిని ఆచరించుట ద్వారా మానవులు మోక్షము లేదా కేవలావస్థను పొందగలరని బోధించాడు. తన సందేశాన్ని నిర్విరామంగా ప్రచారం చేస్తూ మహావీరుడు తన 72వ ఏట పావా అనే నగరములో హస్తిపాలుడనే రాజు గృహములో క్రీ.పూ. 468లో మరణించాడు.

AP Inter 1st Year History Study Material Chapter 4 తొలి సమాజాలు, మతోద్యమాలు

మహావీరుని బోధనలు:
1) పంచవ్రతాలు: జైనమత 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు నాలుగు సూత్రములను బోధించాడు. అవి: ఎ) జీవహింస చేయరాదు. బి) అసత్యమాడరాదు. సి) దొంగతనము చేయరాదు. డి) ఆస్తిపాస్తులు వుండరాదు. ఈ నాలుగు సూత్రాలకు లేక వ్రతాలకు 24వ తీర్థంకరుడైన మహావీరుడు బ్రహ్మచర్యము అనే ఐదవ సూత్రాన్ని జోడించాడు. ఈ ఐదు సూత్రాలను పంచవ్రతాలు లేక పంచకళ్యాణాలు అంటారు.

2) త్రిరత్నాలు: పంచవ్రతాలతోపాటు త్రిరత్నాలను కూడా మోక్ష సాధనకోసం పాటించాలని మహావీరుడు ప్రబోధించాడు. అవి: ఎ) సమ్యక్ దర్శనం లేక సరియైన విశ్వాసం. బి) సమ్యక్ జ్ఞానం లేక సరియైన జ్ఞానం. సి) సమ్యక్ చరిత్ర లేక సరియైన క్రియ. తీర్థంకరుల బోధనలకై శ్రద్ధను కలిగివుండటమే సమ్యక్ దర్శనము. వాటిలో సత్యాన్ని గ్రహించటమే సమ్యక్ జ్ఞానము. వాటిని పాటించడమే సమ్యక్ చరిత్ర. ఈ మూడింటిని త్రిరత్నాలు అంటారు. వీటిని అనుసరించుట ద్వారా దుఃఖలేశం లేని మోక్షం లేదా కైవలావస్థను మానవుడు పొందగలుగుతాడు.

3) సల్లేఖనా వ్రతం: పార్శ్వనాథుడు చేతన, అచేతన వస్తువులన్నింటిలో జీవముందని బోధించాడు. ఆత్మ శరీరమంతటా వ్యాపించి ఉంటుందని తపస్సు మాత్రమే కర్మ బంధాన్ని తొలగిస్తుందని చెప్పాడు. ప్రాపంచిక బంధాల నుంచి, కర్మ నుంచి విముక్తిని సాధించటమే మోక్షమని ఆయన ప్రవచించాడు. కర్మచేయటం ద్వారా కర్మఫలాన్ని అనుభవించటం కోసం పునర్జన్మను ఎత్తవలసి వస్తుందని, కనుక కర్మను నాశనం చేయటం ద్వారానే మోక్షప్రాప్తిని పొందగలమని ఆయన బోధించాడు. కనుక ఉపవాసములచేత శరీరమును శుష్కింపచేసుకొని ప్రాణత్యాగము చేయటం ద్వారా కర్మను అణచివేయవచ్చునని ఆయన బోధించాడు. ఈ ప్రక్రియనే “సల్లేఖనా వ్రతము” అంటారు.

4) కైవల్యం: జైనమతం యొక్క అంతిమ లక్ష్యం కైవల్యం లేక మోక్షము. పంచవ్రతాలను, త్రిరత్నాలను, సల్లేఖనా వ్రతమును ఆచరించుట ద్వారా మోక్షాన్ని సాధించవచ్చునని ఆయన ప్రవచించాడు. దుఃఖరహితము, అనంత సౌఖ్యప్రదము అయినదే మోక్షము. దీనినే కైవల్యావస్థ అంటారు. కైవల్యావస్థ పొందుట ద్వారా మానవుడు కర్మ, పునర్జన్మ వలయము నుండి శాశ్వత విముక్తిని పొందగలుగుతాడు.

5) ఇతర సూత్రాలు: జైనమతం కర్మ సిద్ధాంతాన్ని, పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతుంది. దేవుడున్నాడా లేదా అనే విషయానికి ఈ మతంలో ప్రాముఖ్యత లేదు. మోక్షాన్ని పొందటం, ఆత్మశుద్ధి, భవబంధ విముక్తి అనే వైదిక మత సూత్రాలపై ఆధారపడివుంది. వర్థమాన మహావీరుడు వర్ణవ్యవస్థను ఖండించలేదు. నాటి సామాజిక అసమానతలకు ఆలవాలమైన వర్ణవ్యవస్థను వ్యతిరేకించకుండా పూర్వజన్మ సుకృతాన్నిబట్టి మానవుడు అగ్ర లేక అధమ వర్ణాల్లో జన్మిస్తాడని అభిప్రాయపడ్డాడు. జైనమతం జంతు బలులను, బ్రాహ్మణ ఆధిక్యతను, వేదాల ఆధిక్యతను నిరసించినది.

జైనమత వ్యాప్తి: జైనమత ప్రచారం కోసం మహావీరుడు జైన సంఘాన్ని స్థాపించాడు. స్త్రీ, పురుషులిద్దరు ఈ సంఘంలో సభ్యులు కావచ్చు. ఈ సంఘాలలో జైన భిక్షువులే కాక, తమ మత సూత్రాల ప్రకారం జీవితం గడుపుతూ విరాళాలు, కానుకల ద్వారా ఆ సంస్థలను పోషించే ఉపాసకులు కూడా వుండేవారు. మహావీరుడు సంవత్సరంలో నెలలు పర్యటన చేస్తూ తన బోధనలను ప్రచారం చేసేవాడు. జైనమతానికి రాజాదరణ కూడా లభించింది. మగధ పాలకులైన హర్యంక, నందవంశ రాజులు, చంద్రగుప్త మౌర్యుడు, కడపటి మౌర్యరాజైన సంప్రతి జైనమతాన్ని పోషించారు. భారతదేశంలో జైనమతం రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలలో బాగా ప్రచారంలో వుంది.

ప్రశ్న 4.
బౌద్ధమత బోధనలను, భారత సమాజంపై వాటి ప్రభావాన్ని వర్ణించండి.
జవాబు:
క్రీ.పూ. భారతదేశంలో జనించిన అనేక మతాలలో బౌద్ధమతం ఒకటి. దీని స్థాపకుడు గౌతమబుద్ధుడు. గౌతమబుద్ధుని జీవితం: గౌతమబుద్ధుని అసలు పేరు సిద్ధార్థుడు. ఇతడు క్రీ.పూ. 563వ సం||లో ‘శాక్య’ వంశమునకు చెందిన శుద్దోధనుడు, మాయాదేవీలకు లుంబినీవనమున జన్మించాడు. చిన్నతనమునే తల్లిని కోల్పోయి సవతి తల్లి ప్రజాపతి గౌతమిచే పెంచబడి ‘గౌతముడు’ అని పిలువబడ్డాడు. ఇతనికి ‘యశోధర’ అను రాకుమార్తెతో వివాహం జరిగింది. వారి కుమారుడు ‘రాహులుడు’.

మహా పరిత్యాగము: సిద్ధార్థుడు తన 29వ ఏట ఒక ముదుసలిని, రోగిని, శవాన్ని, సన్యాసిని చూచి వైరాగ్యానికి లోనై సకల సంపదలను, భోగభాగ్యాలను, భార్యాబిడ్డలను వదిలి ఇల్లు విడిచి వెళ్ళాడు. ఈ సంఘటనతో అతని మనస్సు వికలమైంది. ప్రపంచమంతా దుఃఖమయమని, జీవితము అశాశ్వతమని గ్రహించి బవబంధములను తెంచుకొని అడవులకు వెళ్ళి సన్యసించాడు. ఈ సంఘటననే ‘మహా పరిత్యాగము’ లేక ‘మహాభినిష్క్రమణము’ అంటారు.

జ్ఞానోదయమును పొందుట సన్యసించిన పిమ్మట సిద్ధార్థుడు సత్యాన్వేషణకై గయను చేరి అచ్చట ఒక అశ్వత్థ వృక్షము క్రింద 40 రోజులు ధ్యానము చేసి జ్ఞానమును పొందాడు. ఈ సంఘటనకే సంబోధి అని పేరు. అప్పటి నుండి సిద్ధార్థుడు బుద్ధుడు అని పిలువబడినాడు. బుద్ధుడు అనగా జ్ఞానము పొందినవాడు అని అర్ధము. బుద్ధుని శాక్యముని అని, తథాగతుడు అని పిలుస్తారు. నాటి నుండి అశ్వత్థ వృక్షము బోధి వృక్షముగాను, గయ బుద్ధగయగాను ప్రసిద్ధి చెందాయి.

ధర్మచక్ర ప్రవర్తనము: బుద్ధుడు గయ నుండి సారనాథ్ చేరి సమీపమున గల జింకల తోటలో తన పూర్వ సహవాసులైన బ్రాహ్మణులకు మొదటిసారిగా తాను ఆర్జించిన జ్ఞానాన్ని ఉపదేశించాడు. ఈ సంఘటననే ధర్మచక్ర ప్రవర్తనము అంటారు. అప్పటి నుండి అనేక సంవత్సరములు బుద్ధుడు తన బోధనలను ప్రచారం చేశాడు. తన శిష్యులలో ప్రముఖులైన వారిని సంఘంలో ఏర్పరచాడు.

నిర్వాణం: విస్తృతంగా బౌద్ధమతాన్ని ఉత్తరాపథమంతటా ప్రచారం చేసి బుద్ధుడు తన 80వ ఏట మల్ల రాజధానియైన కుశి నగరమున క్రీ.పూ. 483లో నిర్వాణం పొందాడు.

AP Inter 1st Year History Study Material Chapter 4 తొలి సమాజాలు, మతోద్యమాలు

బుద్ధుని బోధనలు: బుద్ధుని బోధనల ప్రకారం మానవ జీవితం కార్యకారణ సంబంధంతో ముడిపడి ఉన్నది. మానవుడు చేసిన కర్మఫలము వలననే ఈ శరీరము మరల మరల జన్మనెత్తవలసి వస్తున్నది. కర్మ ఆచరణకు కోర్కెలే మూలము. అజ్ఞానము వలన కోర్కెలు జనించుచున్నాయి. కోర్కెల వలన మానవుడు కర్మలు ఆచరిస్తాడు. ఈ కర్మ ఫలితమే పునర్జన్మ. పునర్జన్మలేని సుఖమైన, ప్రశాంతమైన జీవనమే నిర్వాణము అని బుద్ధుడు బోధించాడు. నిర్వాణ సాధనకు మానవుడు ఆర్య సత్యములను గ్రహించి అష్టాంగ మార్గమును, దశసూత్ర నీతిని పాటించవలెను.

ఆర్య సత్యములు: గౌతమ బుద్ధుడు తన దివ్య పరిజ్ఞానము వలన నాలుగు ప్రధానమైన సత్యములను గ్రహించాడు. వీటినే ఆర్య సత్యములు అంటారు. అవి:

  1. ప్రపంచమంతా దుఃఖమయము.
  2. దుఃఖమునకు కారణము కోర్కెలు.
  3. దుఃఖమును అంతము చేయుటకు కోర్కెలను నిరోధించవలెను.
  4. కోర్కెలను నిరోధించుటకు అష్టాంగమార్గమును అవలంబించవలెను.

అష్టాంగ మార్గము: నిర్వాణమును పొందుటకు మానవుడు తన నిత్య జీవితంలో ఈ అష్టాంగ మార్గమును అనుసరించిన చాలని బుద్ధుడు బోధించాడు. అవి: 1) సరియైన విశ్వాసము 2) సరియైన జ్ఞానము 3) సరియైన వాక్కు 4) సరియైన క్రియ 5) సరియైన జీవనము 6) సరియైన ప్రయత్నం 7) సరియైన ఆలోచన 8) సరియైన ధ్యానము. అష్టాంగ మార్గము ద్వారా ప్రతి వ్యక్తీ శీలసంపదను పెంపొందించుకొని జ్ఞాని కాగలడు. ఈ మార్గము అందరికీ అందుబాటులో ఉండుటచే దీనిని మధ్యేమార్గం అని అంటారు.

దశసూత్ర నీతి: ఆర్యసత్యములు, అష్టాంగ మార్గములతోపాటు బుద్ధుడు పది అంశములు గల దశసూత్ర నీతిని ప్రబోధించాడు. ఈ సూత్రాలు:

  1. జీవహింస చేయరాదు
  2. అసత్యమాడరాదు.
  3. దొంగతనము చేయరాదు.
  4. ఆస్తిపాస్తులు సమకూర్చుకొనరాదు.
  5. బ్రహ్మచర్యను పాటించవలెను.
  6. మత్తు పదార్దములు సేవించరాదు.
  7. పరుష వాక్యములు వాడరాదు.
  8. ఇతరుల ఆస్తులను కోరరాదు.
  9. అవినీతి పనులు చేయరాదు.
  10. విలాసాలను విడనాడాలి.

నిర్వాణము: ఆర్యసత్యములను గ్రహించి, అష్టాంగ మార్గమును, దశసూత్ర నీతిని ఆదరించటం వలన మానవుడు మోక్షమును పొందుటకు అర్హుడవుతాడు. మోక్షమనగా పునర్జన్మలేని జన్మరాహిత్యము. దీనినే బుద్ధుడు నిర్వాణంగా పేర్కొన్నాడు. నిర్వాణ సాధనే ప్రతి వ్యక్తి ధ్యేయం కావలెను అని బుద్ధుడు బోధించాడు.

బౌద్ధమతతత్వం: బుద్ధుడు భగవంతుని ఉనికిని గురించి, ఆత్మను గురించి మౌనం వహించాడు. హిందూమతమందలి కర్మ, పునర్జన్మ, మోక్ష సిద్ధాంతాలను అంగీకరించాడు. మహావీరుని వలె బుద్ధుడు కూడా యజ్ఞయాగాదులను, జంతుబలులను, బ్రాహ్మణుల ఆధికత్యను ఖండించాడు. వేదములను ప్రామాణిక గ్రంథములుగా బుద్ధుడు అంగీకరించాడు.

ముగింపు: ప్రపంచమునకు శాంతి సందేశమునందించుటకు అవతరించిన మహాపురుషులలో సుప్రసిద్ధుడు గౌతమ బుద్ధుడు. కామ, క్రోధములతో, హింసాత్మక చర్యలతో కొట్టుమిట్టాడుతున్న మానవకోటిని ధర్మం, అహింస, కరుణ, మానవత అనే మహోన్నత ఆశయాలతో తీర్చిదిద్దుటకు అవతరించిన పుణ్య పురుషుడు. అందువల్లనే ఆసియా జ్యోతియని, ప్రపంచ జ్యోతియని శ్లాఘించబడ్డాడు.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వర్ణ వ్యవస్థ సమాజం
జవాబు:
ధర్మశాస్త్రాలు, ధర్మసూత్రాలు ‘వర్ణధర్మాలు’ ‘వృత్తి ధర్మాలను’ వివరించాయి. పుట్టుకను బట్టి వర్ణం నిర్ణయించబడుతుంది. వర్ణ ధర్మాలను బట్టి సివిల్, క్రిమినల్ శిక్షల్లో హెచ్చుతగ్గులు ఉండేవి. వర్ణ ధర్మాలను బట్టి సమాజంలో గౌరవం, పదవులు, వివాహాలు నిర్ణయింపబడ్డాయి. వర్ణ ధర్మాలను ఉల్లంఘించిన శూద్రులకు శిక్షలు అమానుషంగా ఉండేవి. ఉదా: తలలు తీసివేయడం, నాలుక కోయడం.

ప్రశ్న 2.
జాతి అంటే ఏమిటి ?
జవాబు:
ఒకే రకమైన మానసిక భావాలను కలిగి ఉమ్మడి లక్ష్యంతో నివసించే ప్రజా సముదాయమే జాతి. ఒక రాజ్యంలో నివసించే ప్రజలందరూ ఒకే ఉమ్మడి రక్త సంబంధం, పుట్టుకలకు సంబంధించినవారు కాకపోవచ్చు. అయినప్పటికీ పరస్పర గౌరవంతో కూడిన జాతులుగా మెలుగుతున్నాయని చెప్పవచ్చును.

AP Inter 1st Year History Study Material Chapter 4 తొలి సమాజాలు, మతోద్యమాలు

ప్రశ్న 3.
రక్త సంబంధం
జవాబు:
కుటుంబంలోని వారందరూ ఆహారం, పని, వనరులు, పూజా కార్యక్రమాలను పంచుకొనేవారు. రక్త సంబంధీకులందరూ కుటుంబంలో ఉండేవారు. కొన్ని కుటుంబాల్లో రక్త సంబంధీకులనే వివాహం చేసుకొనే ఆచారం ఉండేది. ఈ కాలంలో పితృస్వామ్య వ్యవస్థ అమలులో ఉండేది. ఆడపిల్లలను భారంగా భావించేవారు. రక్త సంబంధం ఉన్న వారిని కాకుండా ఇతరులను వివాహం చేసుకొనేందుకు ఆసక్తి కనబరిచేవారు.

ప్రశ్న 4.
త్రిరత్నాలు
జవాబు:
జైనమత సూత్రాలను త్రిరత్నాలు అని అంటారు. అవి:

  1. సరైన నమ్మకం
  2. సరైన జ్ఞానం
  3. సరైన శీలం.

ప్రశ్న 5.
బౌద్దమత సూత్రాలు
జవాబు:
బుద్ధుడు నాలుగు ఆర్య సత్యాలను ప్రబోధించాడు. అవి:

  1. ప్రపంచం దుఃఖమయం.
  2. దుఃఖానికి కోరికలు కారణం.
  3. కోరికలను నిరోధిస్తే దుఃఖం నశిస్తుంది.
  4. దానికి మార్గం ఉన్నది. అదే అష్టాంగ మార్గం.

ప్రశ్న 6.
అజవికులు
జవాబు:
అజవికుల ప్రచారకుడు మక్కలి గోసలి. ఇతడు నగ్నంగా తిరుగుతూ, తాగుతూ ఉండేవాడు. ఇతని విపరీత ధోరణి వల్ల ప్రజలకు ఎక్కువగా చేరలేదు. ఏదీ మానవుడి చేతిలో లేదు. జరగాల్సింది జరిగి తీరుతుంది’ అని ఈ బాబావారి నమ్మకం. ఈ అజవికులు ఒక సన్యాస వర్గంగా ఏర్పడి తమ మత ప్రచారం చేశారు. మక్కలి గోసలి గురువు పురాణ కశ్యపుడు.

ప్రశ్న 7.
తీర్థంకరులు
జవాబు:
జైనమతంలో మొత్తం 24 మంది తీర్థంకరులు కలరు. వీరిలో మొదటివాడు వృషభనాథుడు. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు, 24వ తీర్థంకరుడు వర్థమాన మహావీరుడు. తీర్థంకరులు అనగా ‘మత గురువులు’ లేదా జీవనస్రవంతిని దాటుటకు మార్గాన్ని చూపించేవారని అర్థం.

AP Inter 1st Year History Study Material Chapter 4 తొలి సమాజాలు, మతోద్యమాలు

ప్రశ్న 8.
బహుభార్యత్వం
జవాబు:
బహు భార్యత్వం అనగా ఒక వ్యక్తి ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకొనుట. దీనినే ‘పోలోగమి’ అని కూడా అంటారు. పూర్వం ఋగ్వేద, మలివేద కాలంలో రాజులలో ఈ పద్ధతి ఉండేది.

ప్రశ్న 9.
ఎక్సోగమి
జవాబు:
స్త్రీలు బయట సమూహం నుంచి వివాహం చేసుకోవడాన్ని ఎక్సోగమి అని అంటారు. తండ్రి. ‘కన్యాదానం’ చేయడాన్ని ముఖ్య బాధ్యతగా, గౌరవ మర్యాదలుగా భావించి, సరైన సమయంలో వివాహం చేసేవారు.