AP Inter 1st Year Civics Study Material Chapter 10 లౌకికవాదం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Civics Study Material 10th Lesson లౌకికవాదం Textbook Questions and Answers.

AP Inter 1st Year Civics Study Material 10th Lesson లౌకికవాదం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
లౌకిక వాదమంటే ఏమిటో నిర్వచించి, లౌకికవాద భావనలను వివరించండి.
జవాబు:
పరిచయం: లౌకికవాదమనేది ఒక ప్రధానమైన సామాజిక, రాజకీయ దృగ్విషయం. అనేక సమకాలీన ప్రపంచదేశాలు తమ ప్రభుత్వ వ్యవహారాలలో లౌకికతను అనుసరిస్తున్నాయి. లౌకికవాదం ప్రత్యేకంగా మతంతో. సంబంధంలేని, స్వతంత్ర ఆదర్శాలను ప్రభోదిస్తుంది. ప్రభుత్వాలు మతంతో నిమిత్తం లేకుండా నైతికత, విద్యలాంటి సూత్రంపై ఆధారపడతాయనే దృక్పథమే లౌకికవాదం. వర్తమాన ప్రాపంచిక జీవనం దైవికమైనది కాకుండా కొన్ని నైతిక ప్రమాణాలు, పాలనా నియమాలు మానవ కార్యకలాపాలను నిర్ణయిస్తాయని లౌకికవాదం పేర్కొంటుంది. లౌకికవాదానికి మతాన్ని దూషించే ఉద్దేశం లేదు. మతం, రాజ్యం అనేవి రెండు ప్రత్యేక విభాగాలని అది గట్టిగా ఉద్ఘాటించింది.

అర్థం: Secular అనే ఆంగ్ల పదానికి లాటిన్ భాషలో అర్థం “ఇహలోకం” (This World) ఈ పదం మతానికి వ్యతిరేకమనే అర్థాన్ని ఇస్తుంది.

నిర్వచనం:

  1. జి. జె. హోల్యోక్: “లౌకికవాదం అంటే మతవిశ్వాసాలను విమర్శించకుండా లేదా తిరస్కరించకుండా మతంతో సంబంధంలేని ఒకానొక సామాజిక వ్యవస్థను ప్రోత్సహించటమనే భావన” గా నిర్వచించారు.
  2. ఎరిక్ ఎస్. వాటర్ హౌస్: “మతంలో పేర్కొన్న దానికంటే భిన్నమైన జీవనం, ప్రవర్తనలకు సంబంధించిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించే ఒకానొక ఆదర్శమే లౌకికవాదం” అని అభిప్రాయపడ్డారు.

లౌకికవాద భావనలు (Concepts of secularism): లౌకికవాదం ప్రధానంగా నాలుగు భావనలను కలిగి ఉంది. అవి

  1. మానవతావాదం, హేతువాద భావన
  2. రాజకీయ, సామాజిక దృక్కోణం
  3. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం
  4. మతం పట్ల వ్యతిరేకత

AP Inter 1st Year Civics Study Material Chapter 10 లౌకికవాదం

ఈ నాలుగు భావనలను గురించి ఈ దిగువ పేర్కొన్న విధంగా వివరించవచ్చు.
1) మానవతావాదం, హేతువాద భావన (Humanistic and Atheistic philosophy): లౌకికవాదం అనేక వ్యక్తిగత, సాంస్కృతిక, రాజకీయ, సామాజిక అంతరార్థాలను కలిగి ఉంటుంది. మానవుల శ్రేయస్సును కోరుకొనుట చేత అది మానవతా స్వభావాన్ని కలిగి ఉంటుంది. మానవుడు అన్ని విషయాలకు కొలమానం అనే సామెతకు అది ప్రాముఖ్యతను ఇస్తుంది. ఇది మతాన్ని సమర్థించదు లేదా వ్యతిరేకించదు. వ్యక్తులు తమకు ఇష్టమైన మతాన్ని ఎంపిక చేసుకొని, అనుసరించేందుకు వీలు కల్పిస్తుంది.

2) రాజకీయ, సామాజిక దృక్కోణం (Political and Social dimension): లౌకిక వాదానికి నిర్దిష్టమైన రాజకీయ, సామాజిక దృక్కోణాలున్నాయి. అది సహజసిద్ధమైన, భౌతిక దృక్పథాలతోనూ, రాజకీయ, ఆర్థిక స్వావలంబనలతో కూడిన వ్యవస్థాపనకు ప్రతీకగా ఉంటుంది. కుటుంబానికి, సంస్థలకు మరియు సమాజానికి మత స్వాతంత్య్రానికి ఇది వీలు కల్పిస్తుంది.

3) స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం (Liberty and Democracy): స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి లౌకికవాదం ప్రయోజనకరమైనది. అలాగే ఉదార ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికగా ఉంటుంది. లౌకికవాదం అధికారిక మత నాయకత్వాన్ని మత సంస్థల ఉనికి, కొనసాగింపు, మనుగడలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రజాసామ్యం, ప్రభుత్వాధికారాల వికేంద్రీకరణను సమర్ధిస్తుంది.

4) మతం పట్ల వ్యతిరేకత (Opposition to Religion): లౌకికవాదం ప్రజా వ్యవహారాలను మతం సమర్థించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మతాధికారుల ప్రాబల్యతలను ఖండిస్తుంది. మానవజీవనానికి సంబంధించిన అప్రధాన అంశాలలో మతం ఒకటిగా పేర్కొంటూ, మత ప్రాధాన్యాన్ని తగ్గిస్తుంది. సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలగని రీతిలో ప్రజలు వారి మత విశ్వాసాలను, ఆచారాలను అనుసరించవచ్చని పేర్కొంటుంది. ఇతర మతాలకు చెందిన వారికి ఏ విధమైన అపకారం, ద్వేషం, అసూయలు కలిగించకుండా వ్యక్తులు వారి మత కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చని స్పష్టీకరించింది. రాజ్యాంగపు మహోన్నత ఆశయాలు, ఆకాంక్షలను ప్రతి ఒక్కరూ దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుందని ఉద్ఘాటించింది.

ప్రశ్న 2.
లౌకికవాదం అర్థం, విభిన్న దృక్కోణాలు వర్ణించండి.
జవాబు:
అర్థం: Secular అనే ఆంగ్ల పదానికి లాటిన్ భాషలో అర్థం “ఇహలోకం” (This World) ఈ పదం మతానికి వ్యతిరేకమనే అర్థాన్ని ఇస్తుంది.

నిర్వచనం:
1. జి. జె. హోల్యోక్: “లౌకికవాదం అంటే మతవిశ్వాసాలను విమర్శించకుండా లేదా తిరస్కరించకుండా మతంతో సంబంధంలేని ఒకానొక సామాజిక వ్యవస్థను ప్రోత్సహించటమనే భావన” గా నిర్వచించారు.

2. ఎరిక్ ఎస్. వాటర్ హౌస్: “మతంలో పేర్కొన్న దానికంటే భిన్నమైన జీవనం, ప్రవర్తనలకు సంబంధించిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించే ఒకానొక ఆదర్శమే లౌకికవాదం” అని అభిప్రాయపడ్డారు.

లౌకికవాదం దృక్కోణాలు (Dimensios of Secularism): లౌకికవాదం దృక్కోణాలు మూడు రకాలు. అవి 1) సామాజిక దృక్కోణం 2) ఆర్థిక దృక్కోణం 3) రాజకీయ దృక్కోణం. వీటిని గురించి క్రింద పేర్కొన్న విధంగా పరిశీలించవచ్చు.

1) సామాజిక దృక్కోణం (Social dimension): లౌకికవాద భావన సామాజిక జీవనంలో మూఢత్వాలను విస్మరించడం లేదా వదిలి వేయడానికి సంబంధించింది. కుల, మత, వర్గాల పరంగా వ్యక్తులు వ్యవహరించడాన్ని లౌకికవాదం ఎట్టి పరిస్థితులలో అనుమతించదు. సమాజంలో ఇరుగు పొరుగు వారితో వ్యవహరించేటప్పుడు వ్యక్తులు అస్త్రశ్యత, వెట్టి చాకిరీ వంటి దురాచారాలను పాటించరాదని అభిలషిస్తుంది. ఇతరులను తమతో సమానంగాను, గౌరప్రదంగానూ చూసుకోవాలని సలహా ఇస్తుంది. కుల వ్యత్యాసాలు, వర్గ వివక్షతలు, జాతి విద్వేషాలు వంటి దుర్గుణాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని బోధిస్తుంది. అంతిమంగా సమాజంలో వ్యక్తుల మధ్య సామరస్య పూర్వక సంబంధాలను సూచిస్తుంది.

2) ఆర్థిక దృక్కోణం (Economic dimension): లౌకికవాదం వ్యక్తులు తమ ఇష్టానుసారంగా తమకు నచ్చిన వృత్తులను ఎన్నుకొని వాటిని ఆచరించటానికి, అనుసరించటానికి, ప్రచారం చేసుకోవడానికి కావలసిన స్వేచ్ఛను లౌకికవాదం కల్పిస్తుంది.

సమాజంలోని సహజ, మానవ, ఆర్థిక సంపదల ఉత్పత్తి కార్యకలాపాలలో వ్యక్తుల మధ్య మతపరమైన వివక్షతలను పాటించడాన్ని లౌకికవాదం నివారిస్తుంది. పారిశ్రామికవేత్తలకు లైసెన్సుల మంజూరులో మతపరమైన అంశాలను రాజ్యాధికారులు పాటించడాన్ని అనుమతించదు. ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక లైసెన్సుల మంజూరు వంటి వ్యవహారాలలో యోగ్యత, నైపుణ్యం, ప్రోత్సాహస్ఫూర్తి వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తుంది.

3) రాజకీయ దృక్కోణం (Political dimension): లౌకికవాదానికి కొన్ని రాజకీయ దృక్కోణాలు ఉంటాయి. లౌకిక వాదం రాజకీయ వ్యవహారాలలో పౌరులందరికీ పూర్తిస్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను అనుమతిస్తుంది. మతం, పరిపాలన, రాజకీయ, చట్టనిర్మాణం, ప్రభుత్వ విధానాల అమలు వంటివి పూర్తిగా మతంతో సంబంధం లేనివిగా విశ్వసిస్తుంది. లౌకిక రాజ్యంలో ప్రజా ప్రతినిధులను ఎన్నుకొనే విషయంలో పౌరులకు అనేక రాజకీయ హక్కులు, స్వాతంత్ర్యాలు ప్రసాదిస్తుంది. మతపరమైన అంశాలతో సంబంధం లేకుండా ప్రతి పౌరుడు ప్రభుత్వ పదవిని చేపట్టేందుకు అవకాశం ఇస్తుంది. రాజకీయ హక్కులను ప్రసాదించడంలో మతం అనేది ఒక ఆవశ్యక అంశంగా పరిగణించకుండా ప్రజల యొక్క ప్రజాస్వామిక ఆకాంక్షలు, స్వాతంత్ర్యాలకు మార్గాన్ని ఏర్పరుస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే లౌకికవాదపు రాజకీయ దృక్కోణం ఆధునిక రాజ్యపు ప్రజాస్వామిక పనితీరుతో సమానంగా పరిగణించబడుతుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 10 లౌకికవాదం

ప్రశ్న 3.
లౌకికవాదం అర్థం, సుగుణాల గురించి మీకు తెలిసింది రాయండి.
జవాబు:
అర్థం: Secular అనే ఆంగ్ల పదానికి లాటిన్ భాషలో అర్థం “ఇహలోకం” (This World) ఈ పదం మతానికి వ్యతిరేకమనే అర్థాన్ని ఇస్తుంది.

నిర్వచనం: “మతంలో పేర్కొన్న దానికంటే భిన్నమైన జీవనం, ప్రవర్తనలకు సంబంధించిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించే ఒకానొక ఆదర్శమే లౌకికవాదం” అని ఎరిక్. ఎస్. వాటర్ హౌస్ పేర్కొన్నాడు.

లౌకికవాదం సుగుణాలు (Merits of Secularism):
1) సమత (Equity): లౌకికవాదం సమసమాజానికి ప్రాతిపదిక. అన్ని మతాల వారిని సమానంగా పరిగణిస్తుంది. మానవులు సృష్టించిన అసమానతలను గుర్తించదు. అలాగే కుల, మత, వర్ణ, వర్గ, ప్రాంతీయ భాషాపరమైన వివక్షతలకు తావు ఇవ్వదు. దాంతో ప్రజలు జాతిపట్ల ఎంతో దృఢమైన సానుకూలమైన భావాన్ని కలిగి ఉంటారు.

2) మత స్వాతంత్ర్యం (Religious Freedom): లౌకికవాదం, మత స్వాతంత్య్రాన్ని ప్రజలు సంపూర్ణంగా అనుభవించుటకు దోహదపడుతుంది. రాజ్యం వ్యక్తుల మత వ్యవహారాలలో జోకం్య చేసుకోదు. లౌకిక రాజ్యంలో రాజ్యాంగం, వివిధ చట్టాలు, వ్యక్తులకు తమ ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించుటకు, ప్రబోధించుటకు, ప్రచారం చేసుకొనేందుకు, సంపూర్ణమైన స్వాతంత్ర్యాన్ని ప్రసాదిస్తాయి.

3) శాంతి భద్రతలు (Law and Order): వర్తమాన కాలంలో రాజ్యం, ప్రభుత్వం, ఇతర సంస్థలు ఎంతో విచారకరమైన, దుఃఖదాయకమైన మతానుకూల ఉద్యమాలను ప్రోత్సహించడం లేదా ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు. దాంతో విభిన్న మతసముదాయాలకు చెందిన ప్రజల మధ్య సామరస్యం సాధించడం అనేది పెద్ద సవాలుగా పరిణమించింది. అటువంటి సందర్భాలలో లౌకికవాదం మతపరమైన ఘర్షణలను, విద్వేషాలను నివారించగలుగుతుంది. అంతిమంగా, ప్రజల మధ్య మత సామరస్యాన్ని లౌకికవాదం పెంపొందించడం జరుగుతుంది.

4) సమన్యాయ పాలన (Rule of Law): లౌకికవాదం సమన్యాయపాలన అనే భావనకు ప్రాధాన్యతనిస్తుంది. లౌకికవాదాన్ని అనుసరించే రాజ ఏ ఒక్క మతానికి కాకుండా అన్ని మతాలకు చెందిన ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చట్టాలను రూపొందించి అమలు చేస్తుంది. చట్ట నిర్మాణ సమయంలో ప్రజలకు మత ఛాందస భావాలను పరిగణనలోనికి తీసుకోదు. అలాగే చట్ట నిర్మాణం, చట్టాల అమలు, చట్టాల వ్యాఖ్యానంలో ప్రజలకు ఏ మతంతో సంబంధం లేకుండా లౌకిక రాజ్యం వ్యవహరిస్తుంది.

5) సహనం (Tolerance): లౌకికవాదం సహనం, దయార్ధ గుణాన్ని ప్రబోధిస్తుంది. విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని, భగవంతుడి పితృత్వంల (Fatherhood) పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటుంది. దాతృత్వం, జాలి, ప్రేమ, ఔదార్యం, అహింస వంటి మహోన్నత గుణాలను ప్రబోధించి, ప్రచారం గావించి ఆచరణలో ఉంచుతుంది.

6) జాతీయ సమైక్యత (National Integration): లౌకికవాదం, ప్రజలలో జాతీయ సమైక్యత, సమగ్రత భావాలను పెంపొందించే ఉత్తమ సాధనంగా దోహదపడుతుంది. భిన్నత్వంలో ఏకత్వ సాధనకు ఉత్తమ కారకంగా భావించబడుతుంది. విభిన్న మతాలు, వాడుకలు అనుసరించే ప్రజల మధ్య ఐక్యతను సాధిస్తుంది.

7) మైనారిటీల రక్షణ (Protection to the Minorities): లౌకికవాద రాజ్యం అందరినీ ఒకే రకంగా ఆదరిస్తుంది. సమాజంలో మెజారిటీ వర్గం ఇతర వర్గాల మధ్య ఎటువంటి వివక్షతను చూపదు. అదే సమయంలో మతపరమైన మెజారిటీ వర్గం ఆధిపత్యాల నుంచి మైనారిటీ వర్గాల ప్రయోజనాలను పరిరక్షించి, వారికి ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తుంది. మైనారిటీ వర్గాల వారి పట్ల మతసహనాన్ని పాటించాల్సిందిగా ప్రజలకు బోధిస్తుంది.

8) అన్ని రంగాల ప్రగతి (Allround Progress): లౌకికవాదంలోని అత్యంత గొప్ప సుగుణం ఏమిటంటే ప్రజలు అన్ని రంగాలలో ప్రగతిని సాధించేందుకు దోహదపడుతుంది. సమాన్యాయ పాలన, మత సహనం, ప్రభుత్వ తటస్థ వైఖరి వంటి అంశాలు లౌకికవాదంలో ఉండుట చేత ఆ రకమైన ప్రగతి సాధ్యమవుతుంది. ప్రత్యేకంగా సంక్షేమం, సామాజిక న్యాయం, అసౌకర్యానికి గురైన వర్గాల ప్రయోజనాల పరిరక్షణ వంటి విషయాలకు సంబంధించి అన్ని మతాలకు చెందిన ప్రజల ప్రగతికి లౌకిక వాదం కృషి చేస్తుంది.

ప్రశ్న 4.
లౌకిక రాజ్యాన్ని నిర్వచించి, లౌకిక రాజ్యం లక్షణాలు, ప్రాముఖ్యతను విశదీకరించండి. [Mar. 2016]
జవాబు:
నిర్వచనాలు:
1. జి. జె. హోల్యోక్: “లౌకికవాదం అంటే మతవిశ్వాసాలను విమర్శించకుండా లేదా తిరస్కరించకుండా మతంతో సంబంధంలేని ఒకానొక సామాజిక వ్యవస్థను ప్రోత్సహించటమనే భావన” గా నిర్వచించారు.

2. ఎరిక్ ఎస్. వాటర్ హౌస్: “మతంలో పేర్కొన్న దానికంటే భిన్నమైన జీవనం, ప్రవర్తనలకు సంబంధించిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించే ఒకానొక ఆదర్శమే లౌకికవాదం” అని అభిప్రాయపడ్డారు.

లక్షణాలు:- లౌకిక రాజ్యం కింది లక్షణాలను కలిగి ఉంటుంది.
1. మతానికి తావు లేదు (No place for religion): లౌకిక రాజ్యం ఏ ఒక్క మతం పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపదు. మతపరమైన అంశాల ప్రాతిపదికపై చట్టాలను రూపొందించదు, అమలు చేయదు.

2. సమాన హోదా (Equal status): లౌకికరాజ్యం ప్రజలందరికీ సమాన హోదాను కల్పిస్తుంది. వ్యక్తుల మధ్య కులం, వర్ణం, మతం, తెగ, ప్రాంతం, భాషలవారీగా ఎటువంటి వివక్షతను చూపదు. దాంతో ప్రజలు సంతృప్తి చెంది, వివిధ విధానాలు, కార్యక్రమాల అమలులో ప్రభుత్వానికి సహకారాన్ని అందిస్తారు. విభిన్న మత సముదాయాలకు చెందిన వారందరూ ఇరుగు పొరుగు వారితో సామరస్యంతో కలసిమెలసి నివసిస్తారు.

AP Inter 1st Year Civics Study Material Chapter 10 లౌకికవాదం

3. అధికారిక మతం లేకుండుట (No State reglion): లౌకిక రాజ్యం ఏ ఒక్క మతాన్ని అధికార మతంగా గుర్తించదు. మత వ్యవహారాలలో తటస్థ వైఖరిని అవలంబిస్తుంది. ప్రజల మతపరమైన భావాలతో సంబంధం లేకుండా వివిధ చట్టాలను, సామాజిక సంక్షేమ కార్యకలాపాలను అమలు చేస్తుంది. ప్రభుత్వ వ్యవహారాలలో ఏ ఒక్క మతానికి ప్రత్యేకమైన ప్రాధాన్యతను ఇవ్వదు. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయ సంస్థలు వంటి అన్ని ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను ఏ ఒక్క మతంతో సంబంధం లేకుండా నిర్వహిస్తుంది.

లౌకికరాజ్యం ప్రాముఖ్యత (Importance of Secular State): ఇటీవలి కాలంలో లౌకిక రాజ్య భావన ఎంతగానో ప్రాముఖ్యతను సంతరించుకొంది. ప్రజాస్వామిక స్ఫూర్తి, శాస్త్ర సాంకేతికత, రవాణా సదుపాయాల అభివృద్ధి, హేతుబద్ధమైన చింతన, శ్రేయోవాదం వంటి అంశాల ప్రభావం చేత లౌకిక రాజ్య ప్రాముఖ్యత పెరిగింది. మొత్తం మీద | లౌకిక రాజ్య ప్రాముఖ్యతను కింది అంశాల ద్వారా వివరించవచ్చు.

  1. లౌకిక రాజ్యం దేశంలోని వివిధ రంగాలలోని మతేతర శక్తులను బలపరుస్తుంది.
  2. ప్రజల హృదయాలలో పాతుకుపోయిన దురాచారాలను, మూఢ విశ్వాసాలను పారద్రోలుతుంది.
  3. మత పరమైన విద్వేషం, మతమౌఢ్యాలను పారద్రోలడం ద్వారా సామాజిక సంస్కరణలకు దోహదపడుతుంది.
  4. ప్రజలలో శాస్త్రీయ చింతనను పెంపొందించి, వారి మేధోపరమైన వికాసానికి తోడ్పడుతుంది.
  5. విశ్వాసంపై హేతువుకు, కాల్పనికతపై తర్కానికి, కట్టుకథలపై వాస్తవికతలకు ఆధిక్యతనిస్తుంది.
  6. మతపరమైన మైనారిటీ వర్గాలకు భద్రతను కల్పించి వారి రక్షణకు హామీనిస్తుంది.
  7. ప్రతి వ్యక్తి మతపరమైన విశ్వాసాలను గౌరవిస్తుంది.

భారత రాజ్యాంగ మూడవ భాగములో ప్రాథమిక హక్కుల జాబితాలో మత స్వాతంత్య్రపు హక్కు 25వ నిబంధన నుండి 28వ నిబంధన వరకు వివరించబడెను. ఈ హక్కు ప్రకారం భారతదేశంలో మతస్వేచ్ఛ అమలు చేయబడుతుంది.

భారతదేశంలో లౌకిక రాజ్యం – లక్షణాలు:

  1. 25వ నిబంధన ప్రకారం: ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించి పూజ, ఆరాధన కార్యక్రమాలను స్వేచ్ఛగా నిర్వహించుకొనవచ్చును.
  2. 26వ నిబంధన ప్రకారం: మతాభివృద్ధిని చేసుకొనవచ్చును.
  3. 27వ నిబంధన ప్రకారం: మతపరమైన పన్నులు, చందాలు నిర్బంధముగా వసూలు చేయకూడదు.
  4. 28వ నిబంధన ప్రకారం: ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నిర్వహించబడే విద్యాసంస్థలలో మతబోధనలు చేయకూడదు.
  5. 14వ నిబంధన ప్రకారం: భారత ప్రజలందరూ ఏ మతము, ఏ శాఖ వారైనప్పటికిని సమానముగా చూడబడతారు.
  6. సమాజంలో అశాంతి కలగకుండా మత విధానాల వ్యాప్తి, పూజా ప్రార్థనా విధానాలు, పూజా ప్రార్థనా మందిరాల నిర్మాణం చేపట్టవచ్చు.
  7. అవసరమైతే స్వచ్ఛందంగా నిధులు సమకూర్చుకోవచ్చు. స్వచ్ఛందంగా మతస్థుల ద్వారా పన్నులు వసూలు చేసుకోవచ్చు.
  8. ఏ మత కార్యకలాపమైనా పరమత సహనాన్ని కలిగి ఉండాలి.
  9. మరో మతాన్ని లేదా మతాభిప్రాయాలను కించపరచే విధంగా గానీ, రెచ్చగొట్టే విధంగా గాని ఉండరాదు.
  10. మత కార్యకలాపాలు సమాజ శాంతి భద్రతలకు విఘాతం కలిగించరాదు.

భారతదేశంలో ఏ వ్యక్తి పట్ల మతపరంగా విచక్షణ చూపరు. ఏ మతానికి చెందిన వ్యక్తి అయినా విచక్షణకు గురి కాకుండా ఎలాంటి ఉన్నత పదవులనైనా చేపట్టవచ్చు. ఈ విధంగా రాజ్యాంగం మన దేశాన్ని లౌకిక రాజ్యంగా తీర్చిదిద్దింది. ఆచరణలో మన లౌకికతత్వంలో చిన్న చిన్న పొరపాట్లు దొర్లినా మన మౌలిక లక్ష్యం, గమ్యం లౌకిక రాజ్యస్థాపనే!

ప్రశ్న 7.
భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా రూపొందించేందుకు అవసరమైన చర్యలను సూచించండి.
జవాబు:
భారతదేశంలో హిందూ, ఇస్లామ్, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, జైన, పార్శీ మతాలకు చెందిన ప్రజలు నివశిస్తున్నారు. భారత సమాజపు లౌకిక స్వరూపానికి కొన్ని కులాల మధ్య ఏర్పడిన ఘర్షణలు, పెచ్చరిల్లిన హింస భంగం కలిగించాయి. అటువంటి విచారకర సంఘటనల గురించి పత్రికలు ప్రతిరోజూ వెల్లడిస్తూనే ఉన్నాయి. అటువంటి సంఘటనలన్నింటికి మతమౌడ్యం, కులజాడ్యాలే కారణంగా పేర్కొనవచ్చు. స్వాతంత్య్రం తరువాత కుల, మత ప్రాతిపదికపై అనేక సంఘాలు స్థాపించబడినాయి. రాజకీయ నాయకులు, అసాంఘిక శక్తుల మధ్యగల సంబంధం కుల, మత తత్త్వాలను వెల్లడించాయి. అధికార, ప్రతిపక్ష స్థానాలలోని రాజకీయ నాయకులు రాజకీయ కారణాలతో ప్రజల మధ్య మతపరమైన ఆవేశాలను రెచ్చగొట్టడం సర్వసాధారణమైంది. అంతేకాకుండా కొందరు మతపెద్దలు ప్రజలలో మతపరమైన భావాలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకొన్నారు. పైన పేర్కొన్న అంశాలన్నీ సమాజంలో శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తున్నాయి.

కాబట్టి ప్రజల మనస్సులలో పాతుకుపోయిన మతపరమైన సంకుచిత భావాలను నిర్మూలించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ సందర్భంలో ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు క్రింద పేర్కొన్న చర్యలను చేపట్టాల్సి ఉంటుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 10 లౌకికవాదం

  1. మత సంస్థలు నిర్వహించే సమావేశాలలో మంత్రులు, ప్రభుత్వ అధికారులు పాల్గొనరాదు. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం వంటి కార్యక్రమాలలో మతపరమైన ప్రార్థనలు, పూజలు జరుపరాదు. ఏ ఒక్క మతం పట్ల ప్రత్యేక అభిమానాన్ని చూపేందుకు ప్రయత్నించరాదు.
  2. జాతీయ లేదా సామాజిక ప్రయోజనాలకు, రాజ్యాంగానికి భంగం కలిగించే మతసంస్థలను ప్రభుత్వం నిషేధించాలి.

ప్రశ్న 5.
భారతదేశంలో లౌకికవాద నేపధ్యాన్ని పేర్కొనండి.
జవాబు:
బ్రిటిష్ ప్రభుత్వపాలన భారతదేశంలో అనేక విద్యా సంస్కరణలను ప్రారంభించింది. శాస్త్రవిజ్ఞానానికి ప్రాముఖ్యతను ఇచ్చింది. అదే సమయంలో భారతదేశంలోని రెండు ప్రధాన మతాలైన హిందువులు, మహమ్మదీయుల మధ్య మతపరమైన విషబీజాలను నాటింది. అందులో భాగంగా చట్టసభలలో మహమ్మదీయులకు ప్రత్యేక స్థానాలను కేటాయించింది. దాంతో భారత రాజకీయాలలో మతపరమైన ఘర్షణలు ఎడతెగని లక్షణంగా పరిణమించాయి. ఈ పరిస్థితి పట్ల చరిత్రకారులు కూడా తీవ్ర విచారాన్ని వెలిబుచ్చారు. ఈ సందర్భంలో వారు భిన్నమైన వివరణలను అందించారు. స్వాతంత్ర్యానికి పూర్వం భారతదేశంలో నెలకొన్న విచారకరమైన మత పరిస్థితులకు బ్రిటిష్ పాలకులను వారు నిందించారు. జనాభా పరిమాణం ఆధారంగా బ్రిటిష్ పాలకులు హిందువులు, మహమ్మదీయుల మధ్య ప్రాధాన్యత ఇవ్వటంతో మత అంశాల ప్రాతిపదికపై భారతీయుల మధ్య ఆవేశాలను ప్రోవు చేశారు. దాంతో భారతదేశంలో నివసించే విషయంలో మైనారిటీలలో అభద్రతా భావం నెలకొంది. కాలక్రమేణా మతఘర్షణలు, మతవిద్వేషాలు అనేవి భారతదేశంలో దైనందిన చర్యలుగా పరిణమించాయి. ఈ రకమైన పరిస్థితి అంతిమంగా మహమ్మదాలీ జిన్నా వంటి నాయకులు ‘ద్విజాతి సిద్ధాంతం’ (Two Nations Theory) ప్రతిపాదించేందుకు దారితీసింది. మరొకవైపు హిందూ మహాసభ వంటివి మత ప్రయోజనాలకు ప్రతీకగా నిలిచాయి. ఈ సంస్థలు భారతదేశాన్ని హిందూ ఆధిక్య ప్రధానమైన దేశంగా పరిగణించాయి. 1947 ఆగస్టులో భారత యూనియన్ ఇండియా, పాకిస్థాన్లుగా విడిపోవుటకు రాజకీయ పరిస్థితుల తీవ్రతయే కారణంగా పేర్కొనవచ్చు. దేశ విభజన తరువాత కూడా మతపరమైన విబేధాలు కొనసాగడం మతతత్వానికి పరాకాష్టగా భావించవచ్చు. స్వాతంత్ర్యం సిద్ధించి ఆరు దశాబ్దాలు గడిచినప్పటికీ భారతదేశంలో ఏదో ఒక ప్రాంతంలో మత ఘర్షణలు సంభవించడం లౌకిక వాదానికి సవాలుగా పరిణమించిందని చెప్పవచ్చు.

భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత ఆమోదించబడిన భారత రాజ్యాంగం లౌకిక వాదాన్ని భారతదేశ గణతంత్ర వ్యవస్థకు ప్రధాన ఆలంబనగా పేర్కొన్నది. దాని ప్రకారం భారతరాజ్యాంగం భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా ప్రకటించింది. భారతదేశంలోని కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు లౌకిక వాదాన్ని సిద్ధాంతపరమైన ఆచరణాత్మక భావనగా అనుసరించసాగాయి. చట్ట నిర్మాణం, దాని అమలు, రాజ్య పరిపాలనకు సంబంధించిన వ్యవహారాలలో ఆ ప్రభుత్వాలేవీ మతాన్ని అనుసరించరాదని భారత రాజ్యాంగం పేర్కొంది. భారతీయులు తమకు ఇష్టమైన మతవిశ్వాసాలను ప్రబోధించుకొనేందుకు, ప్రచారంగావించేందుకు సంపూర్ణమైన మతస్వాతంత్ర్యాన్ని కలిగి ఉండేందుకు భారత రాజ్యాంగం వీలు కల్పించింది. భారతదేశంలో రాజ్యం మతానుకూలమైనది, మత వ్యతిరేకమైనది కాదు. అందుకు బదులుగా అది రాజ్య వ్యవహారాలలో తటస్థ వైఖరిని అనుసరిస్తుంది. భారతరాజ్యాంగం మతం ఆధారంగా ప్రజలపై పన్నులు విధించి, వసూలు చేసేందుకు వీలు కల్పించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిధులతో సంపూర్ణంగా గానీ, పాక్షికంగా గానీ నిర్వహించబడే విద్యాసంస్థలలో మతం ఆధారంగా ప్రవేశాలను నిషేదించమని పేర్కొంది. అలాగే పైన పేర్కొన్న సంస్థలలో మత బోధనలను నిషేధించడమైంది. కాబట్టి రాజ్యాంగ పరమైన అంశాల ప్రకారం లౌకిక వాదానికి ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పవచ్చు.

భారత రాజ్యాంగ పీఠికలో ‘లౌకిక’ అనే పదాన్ని (42వ సవరణ) చట్టం ద్వారా 1976లో చేర్చడమైంది. పార్లమెంటులో భారత రాజ్యాంగం (42వ సవరణ) ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా భారతదేశ తృతీయ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ కింది విధంగా ప్రకటించారు. “లౌకికవాదం అనేది మతానికి మతానికి మధ్య అభిమానాన్ని, వివక్షతను చూపడం కాదు. అన్ని మతాల ప్రజల పట్ల సమానమైన గౌరవాన్ని ప్రదర్శించడమే లౌకిక వాదం. కేవలం మతసహనాన్ని ప్రదర్శించడం ద్వారానే ఏ దేశ భవిష్యత్తు ఆధారపడి ఉండదు. ప్రతి మత సముదాయానికి చెందిన వారు ఇతర మతాల సముదాయాలకు చెందిన వారి పట్ల సానుకూల గౌరవాన్ని చూపడమనేది అందరి కర్తవ్యం”.

AP Inter 1st Year Civics Study Material Chapter 10 లౌకికవాదం

ప్రశ్న 6.
భారతదేశం లౌకిక రాజ్యమా ? కొన్ని ఉదాహరణల ద్వారా సమర్థిస్తూ జవాబు రాయండి.
జవాబు:
భారతదేశం లౌకిక రాజ్యముగా ప్రకటించబడినది. ప్రాచీన కాలం నుండి భారతదేశములో లౌకిక భావాలు ఉన్నాయి. పరమత సహనము, సహజీవనము భారతీయులలో ఉన్నత ఆదర్శాలుగా ఉన్నవి. భారతదేశంలో క్రైస్తవ, ఇస్లామ్, జైన, సిక్కు, బౌద్ధ, పార్శిక, హిందూ మతాలు సమానంగా ఆదరించబడుచున్నవి.

భారత రాజ్యాంగ పీఠిక భారతదేశాన్ని రాజ్యంగా ప్రకటించింది. భారత రాజ్యాంగాన్ని 1976వ సంవత్సరములో 42వ రాజ్యాంగ సవరణ జరిపి “లౌకిక” అనే పదాన్ని చేర్చడం జరిగింది.

భారత రాజ్యాంగ మూడవ భాగములో ప్రాథమిక హక్కుల జాబితాలో మత స్వాతంత్య్రపు హక్కు 25వ నిబంధన నుండి 28వ నిబంధన వరకు వివరించబడెను. ఈ హక్కు ప్రకారం భారతదేశంలో మతస్వేచ్ఛ అమలు చేయబడుతుంది.
భారతదేశంలో లౌకిక రాజ్యం – లక్షణాలు:

  1. 25వ నిబంధన ప్రకారం: ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించి పూజ, ఆరాధన కార్యక్రమాలను స్వేచ్ఛగా నిర్వహించుకొనవచ్చును.
  2. 26వ నిబంధన ప్రకారం: మతాభివృద్ధిని చేసుకొనవచ్చును.
  3. 27వ నిబంధన ప్రకారం: మతపరమైన పన్నులు, చందాలు నిర్బంధముగా వసూలు చేయకూడదు.
  4. 28వ నిబంధన ప్రకారం: ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నిర్వహించబడే విద్యాసంస్థలలో మతబోధనలు చేయకూడదు.
  5. 14వ నిబంధన ప్రకారం: భారత ప్రజలందరూ ఏ మతము, ఏ శాఖ వారైనప్పటికిని సమానముగా చూడబడతారు.
  6. సమాజంలో అశాంతి కలగకుండా మత విధానాల వ్యాప్తి, పూజా ప్రార్థనా విధానాలు, పూజా ప్రార్థనా మందిరాల నిర్మాణం చేపట్టవచ్చు.
  7. అవసరమైతే స్వచ్ఛందంగా నిధులు సమకూర్చుకోవచ్చు. స్వచ్ఛందంగా మతస్థుల ద్వారా పన్నులు వసూలు చేసుకోవచ్చు.
  8. ఏ మత కార్యకలాపమైనా పరమత సహనాన్ని కలిగి ఉండాలి.
  9. మరో మతాన్ని లేదా మతాభిప్రాయాలను కించపరచే విధంగా గానీ, రెచ్చగొట్టే విధంగా గాని ఉండరాదు.
  10. మత కార్యకలాపాలు సమాజ శాంతి భద్రతలకు విఘాతం కలిగించరాదు.

భారతదేశంలో ఏ వ్యక్తి పట్ల మతపరంగా విచక్షణ చూపరు. ఏ మతానికి చెందిన వ్యక్తి అయినా విచక్షణకు గురి కాకుండా ఎలాంటి ఉన్నత పదవులనైనా చేపట్టవచ్చు. ఈ విధంగా రాజ్యాంగం మన దేశాన్ని లౌకిక రాజ్యంగా తీర్చిదిద్దింది. ఆచరణలో మన లౌకికతత్వంలో చిన్న చిన్న పొరపాట్లు దొర్లినా మన మౌలిక లక్ష్యం, గమ్యం లౌకిక | రాజ్యస్థాపనే !

ప్రశ్న 7.
భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా రూపొందించేందుకు అవసరమైన చర్యలను సూచించండి.
జవాబు:
భారతదేశంలో హిందూ, ఇస్లామ్, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, జైన, పార్శీ మతాలకు చెందిన ప్రజలు నివశిస్తున్నారు. భారత సమాజపు లౌకిక స్వరూపానికి కొన్ని కులాల మధ్య ఏర్పడిన ఘర్షణలు, పెచ్చరిల్లిన హింస భంగం కలిగించాయి. అటువంటి విచారకర సంఘటనల గురించి పత్రికలు ప్రతిరోజూ వెల్లడిస్తూనే ఉన్నాయి. అటువంటి సంఘటనలన్నింటికి మతమౌడ్యం, కులజాడ్యాలే కారణంగా పేర్కొనవచ్చు. స్వాతంత్ర్యం తరువాత కుల, మత ప్రాతిపదికపై అనేక సంఘాలు స్థాపించబడినాయి. రాజకీయ నాయకులు, అసాంఘిక శక్తుల మధ్యగల సంబంధం కుల, మత తత్త్వాలను వెల్లడించాయి. అధికార, ప్రతిపక్ష స్థానాలలోని రాజకీయ నాయకులు రాజకీయ కారణాలతో ప్రజల మధ్య మతపరమైన ఆవేశాలను రెచ్చగొట్టడం సర్వసాధారణమైంది. అంతేకాకుండా కొందరు మతపెద్దలు ప్రజలలో మతపరమైన భావాలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకొన్నారు. పైన పేర్కొన్న అంశాలన్నీ సమాజంలో శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తున్నాయి.

కాబట్టి ప్రజల మనస్సులలో పాతుకుపోయిన మతపరమైన సంకుచిత భావాలను నిర్మూలించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ సందర్భంలో ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు క్రింద పేర్కొన్న చర్యలను చేపట్టాల్సి ఉంటుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 10 లౌకికవాదం

  1. మత సంస్థలు నిర్వహించే సమావేశాలలో మంత్రులు, ప్రభుత్వ అధికారులు పాల్గొనరాదు. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం వంటి కార్యక్రమాలలో మతపరమైన ప్రార్థనలు, పూజలు జరుపరాదు.
  2. ఒక్క మతం పట్ల ప్రత్యేక అభిమానాన్ని చూపేందుకు ప్రయత్నించరాదు.
  3. జాతీయ లేదా సామాజిక ప్రయోజనాలకు, రాజ్యాంగానికి భంగం కలిగించే మతసంస్థలను ప్రభుత్వం నిషేధించాలి.
  4. కొన్ని ప్రత్యేక ప్రాంతాలలో మతసామరస్యానికి భంగం కలిగించే రీతిలో మతపరమైన కట్టడాలను ప్రభుత్వం
    అనుమతించరాదు.
  5. భూసంస్కరణలు, కుటుంబ సంక్షేమం, ఉపాధి విస్తరణ వంటి ఇతర కార్యక్రమాలను మతంతో సంబంధం లేకుండా ప్రభుత్వం అమలుచేయాలి.
  6. ఎన్నికల సమయంలో ఓట్లను చేజిక్కించుకొనేందుకై రాజకీయ పార్టీలు మతాన్ని వాడుకోవడాన్ని ప్రభుత్వం నిషేధించాలి. అలాగే మతపరమైన అంశాల ఆధారంగా పార్టీల స్థాపన, నిర్వహణలపై నిషేధం విధించాలి. ఎన్నికల సమయంలో మతపరమైన చిహ్నాలను ఎవరూ వినియోగించకుండా చర్యలు చేపట్టాలి.
  7. ప్రభుత్వం పాఠ్యగ్రంథాలను లౌకిక ప్రాతిపదికపై ప్రచురించాలి. పాఠ్యగ్రంథాలలో మతసామరస్యాన్ని పాటిస్తూ, విశ్వమతాలకు సంబంధించిన అంశాలను పొందుపరచాలి.
  8. వివిధ సమాచార ప్రసారాల సంస్థలన్నీ మత ప్రాతిపదికపై వార్తలను ప్రచురించి, ప్రచారంలోకి తీసుకు రాకూడదు. మతపరమైన ఘర్షణలకు అనవసరమైన ప్రాధాన్యతనిస్తూ ఇతర ప్రాంతాలలో ఆ రకమైన ఘర్షణలు చోటుచేసుకొనేందుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వరాదు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
లౌకికవాద ఆవిర్భావం గురించి రాయండి.
జవాబు:
ప్రాచీన, మధ్యయుగాలలో మతపరమైన రాజ్యాలుండేవి. ఆ యుగాలలో రాజ్య వ్యవహారాలలో మతం ఎంతో ప్రాధాన్యమైన పాత్రను పోషించింది. పాలకులు, ప్రజల మతవిశ్వాసాలను గుర్తించి, గౌరవించి పరిపాలించేవారు. మతం సమాజంలో శాంతి భద్రత, స్థిరత్వాలను అందించి వ్యక్తుల మధ్య సంబంధాలను నియంత్రించింది. దేశ పరిపాలన సాఫీగా కొనసాగేందుకు అవసరమైన రాజకీయ విధేయతను అందించేందుకు మతం దోహదకారి అయింది.

అయినప్పటికీ మతాచార్యులకు, సంస్కరణవాదులకు మధ్య ఘర్షణలు ఏర్పడి సమాజంలో అరాచకం ప్రబలింది. మతం పేరుతో ప్రజల మీద అత్యున్నతాధికారం చెలాయించేందుకు ఆధ్యాత్మికవాదులు, మత పెద్దలు ప్రయత్నిస్తే లౌకిక పాలకులు వారి వ్యూహాలను నిర్వీర్యపరచారు. రాజ్య వ్యవహారాల నుంచి మతాన్ని వేరు చేసారు. ప్రాచీన రోమన్ చక్రవర్తులు క్రైస్తవ మతాన్ని గుర్తించేందుకు నిరాకరించారు. మధ్యయుగంలో మార్టిన్ లూథర్, కాల్విన్ జ్వింగిలాంటి సాంఘిక, మత సంస్కరణవాదులు మత పెద్దల ఆధ్యాత్మిక గుత్తాధిపత్యాన్ని సవాలు చేశారు. మత, ఆధ్యాత్మిక విషయాలన్ని కూడా పూర్తిగా వ్యక్తిగత, స్వీయ వ్యవహారాలుగా వీరు భావించారు. మతపరమైన విషయాలపై వారి ప్రసంగాలు విశేషమైన ప్రభావాన్ని చూపాయి. ఆధునిక కాలంలో మాకియవెల్లి, జీనోడిన్ వంటి రాజనీతి తత్వవేత్తలు రాజకీయాల నుంచి మతాన్ని వేరుచేయాలని గట్టిగా పేర్కొన్నారు. జాన్లాక్ వంటి ఉదారవాద తత్వవేత్తలు మత సహనాన్ని ప్రజలు అనుసరించాలని సూచించారు. పైన పేర్కొన్న తాత్వికుల రచనలు కాలక్రమేణ ప్రజలపై ప్రభావాన్ని చూపటంతో, మతమనేది ఒక వైయుక్తిక, స్వీయ వ్యవహారంగా భావించటం మొదలైంది. అమెరికా దేశాధ్యక్షుడైన థామస్ జఫర్సన్ లౌకికవాదపు నిజమైన అర్థాన్ని వివరిస్తూ రాజ్యం, మతం మధ్య స్పష్టమైన హద్దులు ఉన్నాయని ప్రకటించారు.

కాబట్టి ఆధునిక కాలంలో లౌకికవాదాన్ని పైన పేర్కొన్న కారణాలు ప్రగాఢంగా ప్రభావితం చేసాయని పేర్కొనవచ్చు.

ప్రశ్న 2.
లౌకికవాద వ్యాప్తికి దోహదపడే అంశాలను పేర్కొనండి.
జవాబు:
ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో లౌకికవాద వ్యాప్తికి క్రింద పేర్కొన్న కారకాలు దోహదపడ్డాయని చెప్పవచ్చు.

  1. మూఢనమ్మకాల పట్ల ప్రజలలో వ్యతిరేక ధోరణి.
  2. హేతుబద్ధమైన చింతన, వ్యాప్తి.
  3. ప్రజాస్వామ్య విలువలు, సంస్థల విస్తరణ.
  4. శాస్త్రసాంకేతిక రంగాలలో పురోగతి.
  5. మతపరమైన దోషాల పట్ల అప్రమత్తత.
  6. సామాజిక శాసనాల ప్రభావం.
  7. లౌకిక దృక్పథం, ఆవశ్యకత.
  8. సామాజిక, ఆర్థిక రంగాలలో వ్యక్తుల పురోగతి.
  9. లౌకిక రాజకీయ నాయకత్వ ప్రభావం.
  10. అంతర్జాతీయ శాంతి భావనలకు ప్రాధాన్యత.

AP Inter 1st Year Civics Study Material Chapter 10 లౌకికవాదం

ప్రశ్న 3.
లౌకికవాదంలోని ఏ మూడు భావనలైనా విశదీకరించండి.
జవాబు:
లౌకికవాద భావనలు (Concepts of secularism): లౌకికవాదం ప్రధానంగా నాలుగు భావనలను కలిగి ఉంది. అవి

  1. మానవతావాదం, హేతువాద భావన
  2. రాజకీయ, సామాజిక దృక్కోణం
  3. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం
  4. మతం పట్ల వ్యతిరేకత

ఈ నాలుగు భావనలను గురించి ఈ దిగువ పేర్కొన్న విధంగా వివరించవచ్చు.
1) మానవతావాదం, హేతువాద భావన (Humanistic and Atheistic philosophy): లౌకికవాదం కోరుకొనుట అనేక వ్యక్తిగత, సాంస్కృతిక, రాజకీయ, సామాజిక అంతరార్థాలను కలిగి ఉంటుంది. మానవుల శ్రేయస్సును చేత అది మానవతా స్వభావాన్ని కలిగిఉంటుంది. మానవుడు అన్ని విషయాలకు కొలమానం అనే సామెతకు అది ప్రాముఖ్యతను ఇస్తుంది. ఇది మతాన్ని సమర్థించదు లేదా వ్యతిరేకించదు. వ్యక్తులు తమకు ఇష్టమైన మతాన్ని ఎంపిక చేసుకొని, అనుసరించేందుకు వీలు కల్పిస్తుంది.

2) రాజకీయ, సామాజిక దృక్కోణం (Political and Social dimension): లౌకిక వాదానికి నిర్దిష్టమైన రాజకీయ, సామాజిక దృక్కోణాలున్నాయి. అది సహజసిద్ధమైన, భౌతిక దృక్పథాలతోనూ, రాజకీయ, ఆర్థిక స్వావలంబనలతో కూడిన వ్యవస్థాపనకు ప్రతీకగా ఉంటుంది. కుటుంబానికి, సంస్థలకు మరియు సమాజానికి మత స్వాతంత్ర్యానికి ఇది వీలు కల్పిస్తుంది.

3) స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం (Liberty and Democracy): స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి లౌకికవాదం ప్రయోజనకరమైనది. అలాగే ఉదార ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికగా ఉంటుంది. లౌకికవాదం అధికారిక మత నాయకత్వాన్ని మత సంస్థల ఉనికి, కొనసాగింపు, మనుగడలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రజాసామ్యం, ప్రభుత్వాధికారాల వికేంద్రీకరణను సమర్థిస్తుంది.

4) మతం పట్ల వ్యతిరేకత (Opposition to Religion): లౌకికవాదం ప్రజా వ్యవహారాలను మతం సమర్థించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మతాధికారుల ప్రాబల్యతలను ఖండిస్తుంది. మానవజీవనానికి సంబంధించిన అప్రధాన అంశాలలో మతం ఒకటిగా పేర్కొంటూ, మత ప్రాధాన్యాన్ని తగ్గిస్తుంది. సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలగని రీతిలో ప్రజలు వారి మత విశ్వాసాలను, ఆచారాలను అనుసరించవచ్చని పేర్కొంటుంది. ఇతర మతాలకు చెందిన వారికి ఏ విధమైన అపకారం, ద్వేషం, అసూయలు కలిగించకుండా వ్యక్తులు వారి మత కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చని స్పష్టీకరించింది. రాజ్యాంగపు మహోన్నత ఆశయాలు, ఆకాంక్షలను ప్రతి ఒక్కరూ దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుందని ఉద్ఘాటించింది.

ప్రశ్న 4.
లౌకికవాదం దృక్కోణాలను క్లుప్తంగా విశ్లేషించండి.
జవాబు:
లౌకికవాదం దృక్కోణాలు (Dimensions of Secularism): లౌకికవాదం దృక్కోణాలు మూడు రకాలు. అవి 1) సామాజిక దృక్కోణం 2) ఆర్థిక దృక్కోణం 3) రాజకీయ దృక్కోణం. వీటిని గురించి క్రింద పేర్కొన్న విధంగా పరిశీలించవచ్చు.

1) సామాజిక దృక్కోణం (Social dimension): లౌకికవాద భావన సామాజిక జీవనంలో మూఢత్వాలను విస్మరించడం లేదా వదిలివేయడానికి సంబంధించింది. కుల, మత, వర్గాల పరంగా వ్యక్తులు వ్యవహరించడాన్ని లౌకికవాదం ఎట్టి పరిస్థితులలో అనుమతించదు. సమాజంలో ఇరుగు పొరుగు వారితో వ్యవహరించేటప్పుడు వ్యక్తులు అస్పృశ్యత, వెట్టి చాకిరీ వంటి దురాచారాలను పాటించరాదని అభిలషిస్తుంది. ఇతరులను తమతో సమానంగాను, గౌరవప్రదంగానూ చూసుకోవాలని సలహా ఇస్తుంది. కుల వ్యత్యాసాలు, వర్గ వివక్షతలు, జాతి విద్వేషాలు వంటి దుర్గుణాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని బోధిస్తుంది. అంతిమంగా సమాజంలో వ్యక్తుల మధ్య | సామరస్యపూర్వక సంబంధాలను సూచిస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 10 లౌకికవాదం

2) ఆర్థిక దృక్కోణం (Economic dimension): లౌకికవాదం వ్యక్తులు తమ ఇష్టానుసారంగా తమకు నచ్చిన వృత్తులను ఎన్నుకొని వాటిని ఆచరించటానికి, అనుసరించటానికి, ప్రచారం చేసుకోవడానికి కావలసిన స్వేచ్ఛను లౌకికవాదం కల్పిస్తుంది.

సమాజంలోని సహజ, మానవ, ఆర్థిక సంపదల ఉత్పత్తి కార్యకలాపాలలో వ్యక్తుల మధ్య మతపరమైన వివక్షతలను పాటించడాన్ని లౌకికవాదం నివారిస్తుంది. పారిశ్రామికవేత్తలకు లైసెన్సుల మంజూరులో మతపరమైన అంశాలను రాజ్యాధికారులు పాటించడాన్ని అనుమతించదు. ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక లైసెన్సుల మంజూరు వంటి వ్యవహారాలలో యోగ్యత, నైపుణ్యం, ప్రోత్సాహస్ఫూర్తి వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తుంది.

3) రాజకీయ దృక్కోణం (Political dimension): లౌకికవాదానికి కొన్ని రాజకీయ దృక్కోణాలు ఉంటాయి. లౌకిక వాదం రాజకీయ వ్యవహారాలలో పౌరులందరికీ పూర్తిస్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను అనుమతిస్తుంది. మతం, పరిపాలన, రాజకీయ, చట్టనిర్మాణం, ప్రభుత్వ విధానాల అమలు వంటివి పూర్తిగా మతంతో సంబంధం లేనివిగా విశ్వసిస్తుంది. లౌకిక రాజ్యంలో ప్రజా ప్రతినిధులను ఎన్నుకొనే విషయంలో పౌరులకు అనేక రాజకీయ హక్కులు, స్వాతంత్ర్యాలు ప్రసాదిస్తుంది. మతపరమైన అంశాలతో సంబంధం లేకుండా ప్రతి పౌరుడు ప్రభుత్వ పదవిని చేపట్టేందుకు అవకాశం ఇస్తుంది. రాజకీయ హక్కులను ప్రసాదించడంలో మతం అనేది ఒక ఆవశ్యక అంశంగా పరిగణించకుండా ప్రజల యొక్క ప్రజాస్వామిక ఆకాంక్షలు, స్వాతంత్ర్యాలకు మార్గాన్ని ఏర్పరుస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే లౌకికవాదపు రాజకీయ దృక్కోణం ఆధునిక రాజ్యపు ప్రజాస్వామిక పనితీరుతో సమానంగా పరిగణించబడుతుంది.

ప్రశ్న 5.
మతరాజ్యం అంటే ఏమిటి ? [Mar. 2016]
జవాబు:
మతరాజ్యం (Theocratic State) అంటే రాజ్యానికి ఒక అధికార మతం ఉంటుంది. సాధారణంగా అధికార మతం ఉన్న మతరాజ్యాలలో ఇతర మతాల నిషేధం ఉంటుంది. లేదా ఇతర మతాల కార్యకలాపాలపై చాలా నియంత్రణ ఉంటుంది. మత రాజ్యాలలో దేశంలోని అన్ని కీలక పదవులకు అధికార మతస్థులనే నియమించడం గానీ లేదా ఎన్నుకోవడానికి గాని అర్హత కలిగి ఉంటారు. రాజ్యం మత కార్యకలాపాలలో అధికారికంగా పాల్గొంటుంది. మత | వ్యాప్తికి, పునరుద్ధరణకు, ప్రార్థనాలయాల నిర్మాణానికి రాజ్యం నిధులు సమకూరుస్తుంది. మతసహనం, సహజీవనం ఈ రాజ్యాలలో చాలా తక్కువగా ఉంటుంది. రాజ్యకార్యకలాపాలలో మతపెద్దల, మతాచారాలకు అగ్రతాంబూలం ఉంటుంది. మతపరమైన న్యాయం, చట్టాలలో, ప్రజల జీవనవిధానంలో ప్రముఖంగా కన్పిస్తుంది. ప్రజల జీవన విధానం, వేషధారణ, ఆహారపు అలవాట్లలో కూడా మత ప్రాధాన్యత ఈ రాజ్యాలలో స్పష్టంగా కనిపిస్తుంది.

ప్రశ్న 6.
లౌకికరాజ్యం, మతపరమైన రాజ్యం మధ్య వ్యత్యాసాలను పేర్కొనండి. [Mar. 2018]
జవాబు:
లౌకికరాజ్యం, మతపరమైన రాజ్యం ఒకటి కాదు. ఈ రెండూ రాజ్యంలాంటి మానవీయ రాజకీయ సంస్థలుగా ఉన్నప్పటికీ వీటి మధ్య ఈ క్రింది వ్యత్యాసాలు కలవు.

లౌకికరాజ్యం (Secular State)

  1. లౌకికరాజ్యం మతేతర అంశాలపై ఆధార పడుతుంది.
  2. లౌకిక రాజ్యంలో అధికారమతం అంటూ ఏదీ ఉండదు.
  3. లౌకిక రాజ్యంలో అన్ని మతాలకు చెందిన పౌరులు ఏ విధమైన వివక్షతలు లేకుండా మత స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తారు.
  4. లౌకిక రాజ్యంలో సమన్యాయపాలన ఉంటుంది.
  5. ఈ రాజ్యంలో పౌరులందరూ శాసన, పాలన, విద్యా, మత, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో సమాన అవకాశాలు పొందుతారు.
  6. రాజకీయ వ్యవహారాలలో మతాచార్యులకు, ఆధ్యాత్మిక అధిపతులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉండదు.
  7. సర్వమత సమానత్వం అనే సూత్రంపై లౌకిక రాజ్యం ఆధారపడుతుంది.
  8. పన్నుల విధింపులలో మతం అనేది ప్రధాన ప్రాతిపదిక కాదు.
  9. రాజ్యం మతానుకూలంగానూ, మత వ్యతిరేకంగానూ వ్యవహరించదు.
  10. ప్రభుత్వ ఆధీనంలో పూర్తిగాను లేదా పాక్షికంగాను నిర్వహించబడుతున్న విద్యాసంస్థలలో విద్యాబోధన లౌకిక తరహాలో జరుగుతుంది.
  11. తీర్పులను ప్రకటించే, వివాదాల పరిష్కార విషయంలో న్యాయ సంస్థలు మతానికి ప్రత్యేక ప్రాము ఖ్యతను ఇవ్వవు.

AP Inter 1st Year Civics Study Material Chapter 10 లౌకికవాదం

మతపరమైన రాజ్యం (Theocratic State)

  1. ఇది ప్రధానంగా మతపరమైన అంశాలపై ఆధార పడుతుంది.
  2. మతపరమైన రాజ్యంలో ఏదో ఒక మతానికి అధికారిక మతహోదా కల్పించబడుతుంది.
  3. అధికారిక హోదా కలిగిన మతానికి సంబంధించిన వారు ఇతర మతాల వారితో పోల్చినట్లయితే ఆధిక్యతను కలిగివుండి, ప్రత్యేక సౌకర్యాలను పొందుతారు.
  4. సాధారణ చట్టాలపై మతపరమైన ఆదేశాలు పైచేయిగా ఉంటాయి. ఆజ్ఞలకు ఆధిక్యం ఉంటుంది.
  5. అధికారిక మతానికి చెందిన వారికి సమాజం, రాజ్యం, ప్రభుత్వ రంగాలలో అధిక ప్రాధాన్యత లభిస్తుంది.
  6. మతాచార్యులకు, ఆధ్యాత్మిక అధిపతులకు అన్ని రంగాలలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది.
  7. ప్రజా వ్యవహారాలలో అధికారిక మతానికి చెందిన వారికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందన్న ప్రమేయంపై మతపరమైన రాజ్యం ఆధారపడి ఉంటుంది.
  8. పన్నుల విధింపులోనూ, పన్ను రాయితీల వర్తింపు విషయంలోనూ మతాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు.
  9. రాజ్యం అధికారిక మతానికి సంబంధించిన వారిపట్ల ప్రత్యేక అభిమానాన్ని ఆదరణను ప్రదర్శిస్తుంది.
  10. విద్యా విషయాలలో మతానుకూల అంశాలు అధ్యయనంగా ఉంటాయి.
  11. వివాదాల పరిష్కారంలో మతపరమైన భావాలను, విశ్వాసాలను న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకొంటాయి.

ప్రశ్న 7.
లౌకికవాదంలోని నాలుగు సుగుణాలను వివరించండి.
జవాబు:
లౌకికవాదం సుగుణాలు (Merits of Secularism):
1) సమత (Equity): లౌకికవాదం సమసమాజానికి ప్రాతిపదిక. అన్ని మతాల వారిని సమానంగా పరిగణిస్తుంది. మానవులు సృష్టించిన అసమానతలను గుర్తించదు. అలాగే కుల, మత, వర్ణ, వర్గ, ప్రాంతీయ భాషాపరమైన వివక్షతలకు తావు ఇవ్వదు. దాంతో ప్రజలు జాతిపట్ల ఎంతో దృఢమైన సానుకూలమైన భావాన్ని కలిగి ఉంటారు.

2) మత స్వాతంత్ర్యం (Religious Freedom): లౌకికవాదం, మత స్వాతంత్ర్యాన్ని ప్రజలు సంపూర్ణంగా అనుభవించుటకు దోహదపడుతుంది. రాజ్యం వ్యక్తుల మత వ్యవహారాలలో జోకం్య చేసుకోదు. లౌకిక రాజ్యంలో రాజ్యాంగం, వివిధ చట్టాలు, వ్యక్తులకు తమ ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించుటకు, ప్రబోధించుటకు, ప్రచారం చేసుకొనేందుకు, సంపూర్ణమైన స్వాతంత్ర్యాన్ని ప్రసాదిస్తాయి.

3) శాంతి భద్రతలు (Law and Order): వర్తమాన కాలంలో రాజ్యం, ప్రభుత్వం, ఇతర సంస్థలు ఎంతో విచారకరమైన, దుఃఖదాయకమైన మతానుకూల ఉద్యమాలను ప్రోత్సహించడం లేదా ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు. దాంతో విభిన్న మతసముదాయాలకు చెందిన ప్రజల మధ్య సామరస్యం సాధించడం అనేది పెద్ద సవాలుగా పరిణమించింది. అటువంటి సందర్భాలలో లౌకికవాదం మతపరమైన ఘర్షణలను, విద్వేషాలను నివారించగలుగుతుంది. అంతిమంగా, ప్రజల మధ్య మత సామరస్యాన్ని లౌకికవాదం పెంపొందించడం జరుగుతుంది.

4) సమన్యాయ పాలన (Rule of Law): లౌకికవాదం సమన్యాయ పాలన అనే భావనకు ప్రాధాన్యతనిస్తుంది. లౌకికవాదాన్ని అనుసరించే రాజ్యం ఏ ఒక్క మతానికి కాకుండా అన్ని మతాలకు చెందిన ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చట్టాలను రూపొందించి అమలు చేస్తుంది. చట్ట నిర్మాణ సమయంలో ప్రజలకు మత ఛాందస భావాలను పరిగణనలోనికి తీసుకోదు. అలాగే చట్ట నిర్మాణం, చట్టాల అమలు, చట్టాల వ్యాఖ్యానంలో ప్రజలకు ఏ మతంతో సంబంధం లేకుండా లౌకిక రాజ్యం వ్యవహరిస్తుంది.

ప్రశ్న 8.
లౌకికరాజ్యం లక్షణాలేవి ? [Mar. 2017]
జవాబు:
లౌకికరాజ్యం కింది లక్షణాలను కలిగి ఉంటుంది.
1. మతానికి తావు లేదు (No place for religion): లౌకిక రాజ్యం ఏ ఒక్క మతం పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపదు. మతపరమైన అంశాల ప్రాతిపదికపై చట్టాలను రూపొందించదు, అమలు చేయదు.

2. సమాన హోదా (Equal status): లౌకికరాజ్యం ప్రజలందరికీ సమాన హోదాను కల్పిస్తుంది. వ్యక్తుల మధ్య కులం, వర్ణం, మతం. తెగ, ప్రాంతం, భాషలవారీగా ఎటువంటి వివక్షతను చూపదు. దాంతో ప్రజలు సంతృప్తి చెంది, వివిధ విధానాలు, కార్యక్రమాల అమలులో ప్రభుత్వానికి సహకారాన్ని అందిస్తారు. విభిన్న మత సముదాయాలకు చెందిన వారందరూ ఇరుగు పొరుగు వారితో సామరస్యంతో కలసిమెలసి నివసిస్తారు.

3. అధికారిక మతం లేకుండుట (No State reglion): లౌకిక రాజ్యం ఏ ఒక్క మతాన్ని అధికార మతంగా గుర్తించదు. మత వ్యవహారాలలో తటస్థ వైఖరిని అవలంబిస్తుంది. ప్రజల మతపరమైన భావాలతో సంబంధం లేకుండా వివిధ చట్టాలను, సామాజిక సంక్షేమ కార్యకలాపాలను అమలు చేస్తుంది. ప్రభుత్వ వ్యవహారాలలో ఏ ఒక్క మతానికి ప్రత్యేకమైన ప్రాధాన్యతను ఇవ్వదు. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయ సంస్థల వంటి అన్ని ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను ఏ ఒక్క మతంతో సంబంధం లేకుండా నిర్వహిస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 10 లౌకికవాదం

ప్రశ్న 9.
లౌకిక రాజ్యం ప్రాముఖ్యత గురించి వ్రాయండి.
జవాబు:
లౌకికరాజ్యం ప్రాముఖ్యత (Importance of Secular State): ఇటీవలి కాలంలో లౌకిక రాజ్య భావన ఎంతగానో ప్రాముఖ్యతను సంతరించుకొంది. ప్రజాస్వామిక స్ఫూర్తి, శాస్త్ర సాంకేతికత, రవాణా సదుపాయాల అభివృద్ధి, హేతుబద్ధమైన చింతన, శ్రేయోవాదం వంటి అంశాల ప్రభావం చేత లౌకిక రాజ్య ప్రాముఖ్యత పెరిగింది. మొత్తం మీద లౌకిక రాజ్య ప్రాముఖ్యతను కింది అంశాల ద్వారా వివరించవచ్చు.

  1. లౌకిక రాజ్యం దేశంలోని వివిధ రంగాలలోని మతేతర శక్తులను బలపరుస్తుంది.
  2. ప్రజల హృదయాలలో పాతుకుపోయిన దురాచారాలను, మూఢ విశ్వాసాలను పారద్రోలుతుంది.
  3. మత పరమైన విద్వేషం, మతమౌఢ్యాలను పారద్రోలడం ద్వారా సామాజిక సంస్కరణలకు దోహదపడుతుంది.
  4. ప్రజలలో శాస్త్రీయ చింతనను పెంపొందించి, వారి మేధోపరమైన వికాసానికి తోడ్పడుతుంది.
  5. విశ్వాసంపై హేతువుకు, కాల్పనికతపై తర్కానికి, కట్టుకథలపై వాస్తవికతలకు ఆధిక్యతనిస్తుంది.
  6. మతపరమైన మైనారిటీ వర్గాలకు భద్రతను కల్పించి వారి రక్షణకు హామీనిస్తుంది.
  7. ప్రతి వ్యక్తి మతపరమైన విశ్వాసాలను గౌరవిస్తుంది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
లౌకికవాదాన్ని నిర్వచించండి. [Mar. 2017]
జవాబు:

  1. “లౌకికవాదం అంటే మతవిశ్వాసాలను విమర్శించకుండా లేదా తిరస్కరించకుండా మతంతో సంబంధం లేని ఒకానొక సామాజిక వ్యవస్థను ప్రోత్సహించటమనే భావన” అని జి.జె. హోల్యోక్ నిర్వచించాడు.
  2. “మతంలో పేర్కొన్న దానికంటే భిన్నమైన జీవనం, ప్రవర్తనలకు సంబంధించిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించే ఒకానొక ఆదర్శమే లౌకికవాదం” అని వాటర్ హౌస్ పేర్కొన్నాడు.

ప్రశ్న 2.
లౌకికవాదం రకాలు ఏవి ?
జవాబు:
లౌకికవాదం ప్రధానంగా రెండు రకాలు. అవి

  1. వ్యక్తిపరమైన లౌకికవాదం
  2. వస్తుపరమైన లౌకికవాదం

మొదటిది ప్రజల దైనందిన కార్యక్రమాలను మతపరమైన భావాల నుండి విడదీస్తుంది. రెండవది ప్రభుత్వ వ్యవహారాలు, ప్రజా జీవనానికి సంబంధించిన సంస్థలను మతపరమైన వేడుకలు, భావనల నుండి వేరుచేస్తుంది.

ప్రశ్న 3.
లౌకికవాదం గురించి డి.ఇ. స్మిత్ ఇచ్చిన నిర్వచనం ఏది ?
జవాబు:
డి.ఇ. స్మిత్ ప్రకారం లౌకికవాదం మూడు అర్థాలను కలిగి ఉంటుంది. అవి

  1. మత సంబంధమైన స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు.
  2. పౌరసత్వం, సమానత్వపు హక్కు వివక్షతా లేమి, తటస్థతలు.
  3. మతం నుండి రాజ్యాన్ని వేరుచేయటం.

ప్రశ్న 4.
లౌకికవాదం ఆవిర్భావం గురించి రాయండి.
జవాబు:
మతాచార్యులకు, సంస్కరణవాదులకు మధ్య ఘర్షణలు సమాజంలో అరాచకం ఏర్పడటానికి దారితీసినాయి. మతం పేరుతో ప్రజల మీద అత్యున్నతాధికారాన్ని చెలాయించేందుకు ఆధ్యాత్మికవాదులు, మత పెద్దలు ప్రయత్నిస్తే లౌకిక పాలకులు వారి వ్యూహాలను నిర్వీర్యపరచారు. రాజ్య వ్యవహారాల నుండి మతాన్ని వేరు చేసారు. ఈ క్రమంలో ఆవిర్భవించిన వాదమే లౌకికవాదం అని భావించవచ్చు.

AP Inter 1st Year Civics Study Material Chapter 10 లౌకికవాదం

ప్రశ్న 5.
లౌకికవాద వ్యాప్తికి దోహదపడే నాలుగు అంశాలను ఉదహరించండి.
జవాబు:

  1. మూఢనమ్మకాల పట్ల ప్రజలలో వ్యతిరేక ధోరణి.
  2. హేతుబద్ధమైన చింతన, వ్యాప్తి.
  3. ప్రజాస్వామ్య విలువలు, సంస్థల విస్తరణ.
  4. శాస్త్ర, సాంకేతిక రంగాలలో పురోగతి.

ప్రశ్న 6.
లౌకికవాదంలోని ఒక భావన గురించి రాయండి.
జవాబు:
మానవతావాదం, హేతువాద భావన: లౌకికవాదం అనేక వ్యక్తిగత, సాంస్కృతిక, రాజకీయ, సామాజిక అంతరార్థాలను కలిగి ఉంటుంది. మానవుల శ్రేయస్సును కోరుకొనుటచేత అది మానవతా స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది మతాన్ని సమర్థించదు లేదా వ్యతిరేకించదు. వ్యక్తులు తమకు ఇష్టమైన మతాన్ని ఎంపిక చేసుకొని అనుసరించేందుకు వీలు కల్పిస్తుంది.

ప్రశ్న 7.
లౌకికవాదం సామాజిక ధృక్కోణాన్ని తెలపండి.
జవాబు:
సామాజిక దృక్కోణం (Social dimension): లౌకికవాద భావన సామాజిక జీవనంలో మూఢత్వాలను విస్మరించడం లేదా వదిలి వేయడానికి సంబంధించింది. కుల, మత, వర్గాల పరంగా వ్యక్తులు వ్యవహరించడాన్ని లౌకికవాదం ఎట్టి పరిస్థితులలో అనుమతించదు. సమాజంలో ఇరుగు పొరుగు వారితో వ్యవహరించేటప్పుడు వ్యక్తులు అస్త్రశ్యత, వెట్టి చాకిరీ వంటి దురాచారాలను పాటించరాదని అభిలషిస్తుంది. ఇతరులను తమతో సమానంగాను, గౌరప్రదంగానూ చూసుకోవాలని సలహా ఇస్తుంది. కుల వ్యత్యాసాలు, వర్గ వివక్షతలు, జాతి విద్వేషాలు వంటి దుర్గుణాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని బోధిస్తుంది. అంతిమంగా సమాజంలో వ్యక్తుల మధ్య సామరస్య పూర్వక సంబంధాలను సూచిస్తుంది.

ప్రశ్న 8.
మతస్వామ్యం అంటే ఏమిటి ? [Mar. 2018]
జవాబు:
సాంకేతికంగా మతస్వామ్యం అంటే ‘భగవంతుడి పాలన’ అని అర్థం. ఆచరణలో మతాచార్యుల పాలన. భగవంతుడి నుంచి సర్వాధికారాలు సంక్రమిస్తాయనే సిద్ధాంతంపై ఈ భావన రూపొందింది. హిందూమతం, ప్రాచీన యూదు మతం మొదలైన వాటిలో పేర్కొన్నట్లు చట్టాలను వ్యాఖ్యానించే ఏకైక హక్కుతో కూడిన మతాధిపతుల వ్యవస్థను మతపాలన సూచిస్తుంది. వర్తమాన కాలపు ఇస్లాం మతంలో కూడా ఈ భావన ప్రదర్శితమవుతుంది.

ప్రశ్న 9.
లౌకిక రాజ్యానికి, మత రాజ్యానికి మధ్యగల రెండు వ్యత్యాసాలను గుర్తించండి.
జవాబు:

  1. లౌకిక రాజ్యం మతేతర అంశాలపై ఆధారపడుతుంది. మత రాజ్యం మతపరమైన అంశాలపై ఆధార – పడుతుంది.
  2. లౌకిక రాజ్యంలో అధికార మతమంటూ ఏదీ ఉండదు. మత రాజ్యాలలో ఏదో ఒక మతానికి అధికారిక మతహోదా కల్పించబడుతుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 10 లౌకికవాదం

ప్రశ్న 10.
లౌకికవాదం ఏ విధంగా వ్యక్తుల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు దోహదపడుతుంది ?
జవాబు:
లౌకిక వ్యవస్థ అమలులో ఉన్న రాజ్యాలలో వ్యక్తులంతా సంపూర్ణ మత, స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను కలిగి ఉంటారు. ప్రతి వ్యక్తి తన అంతరాత్మ ప్రబోధం ప్రకారం తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు లేదా మతరహితంగా, హేతువాదిగా ఉండిపోవచ్చు. తాను నమ్మిన మత సిద్ధాంతాలను వ్యాప్తి చేసుకోవచ్చు. మతవ్యాప్తికై వెచ్చించే ధనంపై ఎటువంటి పన్ను చెల్లించనవసరం లేదు.

ప్రశ్న 11.
సమన్యాయ పాలన లౌకికవాదాన్ని ఏ విధంగా పెంపొందిస్తుంది ?
జవాబు:
లౌకికవాదం సమన్యాయ పాలన అనే భావానికి ప్రాధాన్యతనిస్తుంది. రాజ్యం ఏ ఒక్క మతానికి కాకుండా అన్ని మతాలకు చెందిన ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చట్టాలను రూపొందించి అమలు చేస్తుంది. చట్ట నిర్మాణ సమయంలో ప్రజల మతఛాందస భావాలను పరిగణనలోకి తీసుకోదు. అందువలన లౌకిక రాజ్యాలలో ప్రజలు సంతృప్తిని, సంతోషాన్ని పొందుతారు.

ప్రశ్న 12.
లౌకిక రాజ్యాన్ని నిర్వచించండి. [Mar. 2018]
జవాబు:
“వ్యక్తులకు స్వీయ, సమిష్టి మత స్వాతంత్ర్యాన్ని హామీ ఇస్తూ వ్యక్తులకు వారి మతంతో సంబంధం లేకుండా పౌరులుగా గుర్తించే రాజ్యమే లౌకిక రాజ్యం” అని డి.ఇ. స్మిత్ పేర్కొన్నాడు.

ప్రశ్న 13.
లౌకిక రాజ్యం రెండు లక్షణాలను గురించి రాయండి. [Mar. 2018]
జవాబు:

  1. మతానికి తావులేదు: లౌకిక రాజ్యం ఏ ఒక్క మతం పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపదు. మతపరమైన అంశాల ప్రాతిపదికపై చట్టాలను రూపొందించదు, అమలు చేయదు.
  2. సమాన హోదా: లౌకిక రాజ్యం ప్రజలందరికి సమాన హోదాను కల్పిస్తుంది. వ్యక్తుల మధ్య కులం, వర్ణం, మతం, తెగ, ప్రాంతం భాషల వారీగా ఎటువంటి వివక్షతను చూపదు.

ప్రశ్న 14.
లౌకిక రాజ్యం ప్రాముఖ్యత ఏమిటి ?
జవాబు:
ప్రస్తుత కాలంలో లౌకిక రాజ్య భావన ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొంది. ప్రజాస్వామిక స్ఫూర్తి, శాస్త్ర సాంకేతికత, రవాణా సదుపాయాల అభివృద్ధి, హేతుబద్ధమైన చింతన, శ్రేయోవాదం మొదలగు అంశాల ప్రభావం చేత లౌకికరాజ్యం ప్రాముఖ్యత పెరిగింది.

AP Inter 1st Year Civics Study Material Chapter 10 లౌకికవాదం

ప్రశ్న 15.
భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా సమర్థించేందుకు రెండు అంశాలను ఉదహరించండి.
జవాబు:

  1. భారత రాజ్యాంగంలో 1976వ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ‘లౌకిక’ అనే పదమును చేర్చడం జరిగింది.
  2. భారత పౌరులకు ప్రసాదించిన ప్రాథమిక హక్కులలో మత స్వాతంత్య్రపు హక్కు ముఖ్యమైనది. భారతీయ పౌరులందరూ ఎటువంటి విచక్షణ లేకుండా సంపూర్ణ మత స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను అనుభవిస్తున్నారు.

AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Civics Study Material 9th Lesson ప్రజాస్వామ్యం Textbook Questions and Answers.

AP Inter 1st Year Civics Study Material 9th Lesson ప్రజాస్వామ్యం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రజాస్వామ్యంలోని ప్రయోజనాలు, లోపాలను వివరించండి. [Mar. 2016]
జవాబు:
అర్థం: Democracy అనే ఇంగ్లీషు పదం ‘Demos’ మరియు ‘Kratos’ అనే రెండు గ్రీకు పదాల కలయిక నుంచి ఆవిర్భవించింది. డెమోస్ అంటే ‘ప్రజలు’ క్రటోస్ అంటే ‘అధికారం’ లేదా ‘పాలన’ అని అర్థం.

నిర్వచనం: “ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క ప్రజల చేత, ప్రజల కొరకు నిర్వహించబడే ప్రభుత్వం”.

అబ్రహాం లింకన్ ప్రజాస్వామ్యం ప్రయోజనాలు (Merits of Democracy): సమకాలీన ప్రపంచంలో ప్రజాస్వామ్యం విశేషమైన ప్రజాభిమానాన్ని చూరగొంది. దాదాపు ప్రముఖ రాజ్యాలన్నీ ప్రజాస్వామ్యాన్ని తమ రాజకీయ సిద్ధాంతంగా అనుసరిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో కింద పేర్కొన్న ప్రయోజనాలున్నాయి.

1) సమర్థవంతమైన ప్రభుత్వం (Efficient Government): ప్రజాస్వామ్యాన్ని సమర్థవంతమైన, పటిష్టమైన ప్రభుత్వంగా ప్రొఫెసర్ గార్నర్ వర్ణించాడు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సాధారణ సమయాలలోనూ, అత్యవసర పరిస్థితులలోనూ ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగానూ, పటిష్టంగానూ కొనసాగుతాయి. ప్రజలచే ఎన్నిక, ప్రజల నియంత్రణ, ప్రజలకు బాధ్యత అనే ప్రజాస్వామ్య సూత్రాలు గోచరిస్తాయి. అవి ఇతర ప్రభుత్వాలతో పోల్చినపుడు ఇందులో సమర్ధతను చేకూర్చుతాయి.

2) వ్యక్తి స్వేచ్ఛల సమర్థన (Upholds Individual Liberties): ప్రజాస్వామ్య ప్రభుత్వం మాత్రమే వ్యక్తి స్వేచ్ఛలను సమర్థిస్తుంది. రాజ్యాంగపరమైన అనేక రక్షణల ద్వారా వ్యక్తుల హామీలకు హామీ ఇస్తుంది. ఈ అంశం ప్రాతిపదికపై జె.ఎస్.మిల్ ప్రజాస్వామ్యాన్ని సమర్థించాడు. ప్రజాస్వామ్యం ప్రజలకు వాక్, సభా, పత్రికా స్వాతంత్రాలు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలను ప్రసాదిస్తుందని అతడు ప్రకటించాడు.

3) సమానత్వానికి హామీ (Assures Equality): ప్రజాస్వామ్యం రాజకీయ, ఆర్థిక రంగాలలోని వ్యక్తుల యొక్క సమానత్వానికి హామీ ఇస్తుంది. రాజకీయ రంగంలో పౌరుల కుల, వర్ణం, పుట్టుక వంటి అంశాలతో ప్రమేయం లేకుండా వారికి ఓటు హక్కు, ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీచేసే హక్కు, ప్రభుత్వ పదవులను చేపట్టే హక్కు వంటి రాజకీయ హక్కులను పౌరులకు ప్రసాదిస్తుంది. సమాజంలో ఇతర వర్గాలను విస్మరించి కొద్దిమంది వ్యక్తులకు ప్రత్యేక హక్కులను కల్పించడాన్ని వ్యతిరేకిస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

4) ప్రజలను విద్యావంతులను చేయడం (Educates the Masses): ప్రజలను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు బృహత్తర ప్రయోగాలకు వీలు కల్పించే సాధనంగా ప్రజాస్వామ్యాన్ని కొందరు వర్ణించారు. వివిధ ప్రాతినిధ్య సంస్థలకు విభిన్న సమయాలలో జరిగే ఎన్నికలు, సంబంధిత ప్రచార ఉద్యమాలు ప్రజాస్వామ్యంలో పౌరులను విద్యావంతులుగా తీర్చిదిద్దుతుంది.

5) దేశభక్తిని పెంపొందించడం (Instills Patriotism): ప్రజాస్వామ్యం ప్రజలలో దేశభక్తిని పెంపొందిస్తుంది. ప్రజాస్వామ్యంలో వివిధ సంస్థల సభ్యుల ఎంపిక, ఎన్నికలలో ప్రజలకు ఎన్నో అవకాశాలు లభిస్తాయి. ప్రాతినిధ్య సంస్థలలో ప్రజలు పాల్గొని అవి విజయవంతంగా పనిచేసేటట్లు జాగ్రత్త వహిస్తారు. వీటి నిర్వహణలో పాల్గొనడాన్ని ప్రజలు ఎంతో గర్వంగా భావిస్తారు. దేశం క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు ప్రజలు తమ సహాయ సహకారాలను అందించడంలో ఎంతో ఆసక్తిని చూపుతారు. గతంలో ఇండియాపై చైనా, పాకిస్తాన్లు దురాక్రమణ జరిపిన సందర్భాలలో భారతీయులు చూపించిన చొరవ, ప్రదర్శించిన దేశభక్తి ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు.

6) స్థిరత్వానికి హామీ (Ensures Stability): ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వం ఉండటం వల్ల విప్లవాల బారి నుంచి దేశాన్ని కాపాడేందుకు అవకాశం ఉంటుంది. ఈ వ్యవస్థలో ప్రజలు ఎన్నికల సమయంలో వ్యతిరేక ఓటు (Negative Vote) వినియోగం ద్వారా ప్రభుత్వాన్ని మార్చివేయగలుగుతారు.

7) ఒకే సమయంలో శాంతి, ప్రగతి (Simultaneous Order and Progress): నియంతృత్వం దేశ ప్రగతిని నిర్లక్ష్యం చేసి భద్రతకు హామీ ఇస్తుంది. అందుకు విరుద్ధంగా ప్రజాస్వామ్యం రాజ్యాంగబద్దమైన పాలన ద్వారా శాంతి భద్రతల నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తుంది. వివిధ రంగాలలో ప్రజల ఔన్నత్యానికి కృషి చేస్తుంది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో దీనిని మనం గమనించవచ్చు. జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబ్దుల్ కలామ్ అజాద్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వంటి ఆదర్శవంతమైన నాయకులు, రాజనీతిజ్ఞులు శైశవదశలో ఉన్న భారత ప్రజాస్వామ్యాన్ని జాతీయ, అంతర్జాతీయ రంగాలలో శక్తివంతమైన, సార్థకమైందిగా తీర్చిదిద్దేందుకు ఎంతగానో కృషి చేశారు.

8) ప్రజలను బాధ్యతాయుతులుగా చేయడం (Makes the People Responsible): ప్రజాస్వామ్యం వ్యక్తి సామర్థ్యాన్ని గుర్తిస్తుంది. వ్యక్తులలో చొరవను ఏర్పరచేందుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ప్రజలలో బాధ్యతాయుత ప్రవర్తనను పెంపొందిస్తుంది. ఈ రకమైన పరిస్థితి ఇతర ప్రభుత్వ రకాలలో గోచరించదు. అంతేకాకుండా ప్రజాస్వామ్యం వ్యక్తుల వ్యక్తిత్వ వికాస సాధనకు దోహదపడి వారి ఔన్నత్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.

9) పౌరసత్వ శిక్షణ పాఠశాల (Training School for Citizenship): ప్రజాస్వామ్యపు మరొక సుగుణం ఏమిటంటే ఇది ఒక ఉత్తమ పౌరసత్వ పాఠశాలగా వ్యవహరిస్తుంది. ఎన్నికల సమయంలో ఓటుహక్కు, అభ్యర్థులను ఎన్నుకొనే హక్కు వంటి రాజకీయ హక్కులను పౌరులకు అందించడంలో హామీ ఇస్తుంది. అటువంటి హక్కులు, ఇతర రాజకీయ హక్కులలాగా, పౌరసత్వ పాఠాలను నేర్చుకొనేందుకు పౌరులకు సహాయకారిగా ఉంటాయి.

10) హేతుబద్ధమైన ప్రభుత్వం (A Rational Government): “ఏ ఒక్కరూ సంపూర్ణంగా దోషరహితులు ‘కారు’ అనే సూత్రంపై ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంటుంది. అధికార దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అవసరమైన చర్యలు, విమర్శలతో కూడిన ప్రక్రియను ప్రజాస్వామ్యం అనుసరిస్తుంది. అంతేకాకుండా రాజకీయ వ్యవస్థ హేతుబద్ధ స్వభావాన్ని ప్రజాస్వామ్యం సంరక్షిస్తుంది.

ప్రజాస్వామ్యం లోపాలు:
1) అజ్ఞానుల పాలన (Rule by Ignorants): అరిస్టాటిల్ ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వ వికృత రూపంగా పరిగణించాడు. ప్రజాస్వామ్యమనేది ఒక రకమైన మూకపాలనగా భావించాడు. అతడి గురువైన ప్లేటో ప్రజాస్వామ్యాన్ని అజ్ఞానుల పాలనగా పిలిచాడు. ప్రజాస్వామ్యంలో ఓట్ల లెక్కింపు మాత్రమే జరుగుతుందని మరికొందరు విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అనేక అంశాలపై నిర్ణయాలనేవి శాసనసభ, మంత్రివర్గ సమావేశాలలో మెజారిటీ సభ్యుల అభీష్టం మేరకు జరుగుతాయి. దాంతో యోగ్యులు, నిజాయితీ గల వ్యక్తులు దూరంగా ఉంచబడి, అజ్ఞానులు, మూర్ఖులు ప్రాధాన్యత కలిగి ఉంటారు.

2) ధనికులకు అనుకూలత (Favours the Rich): ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాలలో అధికభాగం పెట్టుబడిదారీ స్వభావాన్ని కలిగి ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు సంపన్న వర్గాల వారి పట్ల సానుకూలతను ప్రదర్శిస్తాయి. ఎన్నికలనేవి ఒక ప్రహసనంగా మారుతాయి. ప్రజాస్వామ్యంలో ఓటర్లను దైవంగా గుర్తించడమవుతుంది. ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు కులం, వర్ణం, మతం, పుట్టుక, ప్రాంతం వంటి అంశాల వారీగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తారు. వారికి భౌతిక, ధన, కనక వస్తువులను అందించడం ద్వారా ఆకర్షిస్తారు.

AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

3) అధిక సంఖ్యాకుల పాలన అనేది ఒక భ్రమ (Majority rule – a Myth): ఒకప్పుడు 1980వ దశకం వరకు ప్రజాస్వామ్యాన్ని అధిక సంఖ్యాకుల పాలనగా పరిగణించడమైంది. ఆ తరువాత జాతీయ, అంతర్జాతీయ రంగాలలో సంభవించిన నాటకీయ పరిణామాల ఫలితంగా అనేక మార్పులు సంభవించాయి. విద్య, అక్షరాస్యత, విజ్ఞాన వికాసం, పత్రికలు, వార్తా దృశ్య సాధనాలు, ఫేస్బుక్, ట్విట్టర్, ఇతర సామాజిక మాధ్యమాలు రాజకీయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చాయి. సంకీర్ణ ప్రభుత్వ రాజకీయ సంస్కృతి సాధారణ రాజకీయ పరిణామంగా మారింది. ప్రాచీన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలుగా పేరుగాంచిన బ్రిటన్ వంటి రాజ్యాలలో సైతం సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటయినాయి. అలాగే అభివృద్ధి చెందుతున్న ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ వంటి దేశాలలో కూడా సంకీర్ణ ప్రభుత్వాలు అనివార్యమవుతున్నాయి.

అందుకు కారణం ఆయా దేశాలలో శాసనసభలలో ఏ ఒక్క పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పరచే సంపూర్ణమైన మెజారిటీ స్థానాలు లభించకపోవడంగా పేర్కొనవచ్చు. దాంతో శాసనసభలలో ఎక్కువ స్థానాలు (మెజారిటీ స్థానాలు కాకుండ) గెల్చుకున్న అతిపెద్ద పార్టీ మిగిలిన చిన్న పార్టీలతో కలసి సంకీర్ణ భాగస్వామ్యంగా ఏర్పడి, కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం సర్వ సాధారణమైంది. అటువంటి ప్రభుత్వాలు శాసనసభలలో మెజారిటీ సభ్యుల మద్దతును పొందక పార్లమెంటరీ ప్రమాణాల పతనానికి దారితీశాయి. భారతదేశంలో 1990వ దశకం ద్వితీయార్థం నుంచి 2014 ప్రథమార్థం వరకు జాతీయ స్థాయిలో ఏర్పడిన ఐక్య సంఘటన (United Front), జాతీయ ప్రజాస్వామ్య కూటమి (National Democratic Alliance), ఐక్య ప్రగతిశీల కూటమి (United Progressive Alliance) ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు.

4) సందేహాస్పద ప్రాతినిధ్య సూత్రం (Representative Principle Doubtful): ప్రజాస్వామ్యం ప్రాదేశిక ప్రాతినిధ్యం అనే సూత్రంపై ఆధారపడుతుంది. ఈ సూత్రం ప్రకారం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి భావాలకు, ఒకే శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహించాలి. ఈ విధానం లోపభూయిష్టం మరియు అన్ని వర్గాలకు సరైన ప్రాతినిధ్యం
లభించదు.

5) సమానత్వ సూత్రం దుర్వినియోగం (Abuse of Equality Principle): ప్రజాస్వామ్య ప్రభుత్వ ముఖ్య భావనయైన సమానత్వ సూత్రాన్ని ప్రభుత్వ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ దుర్వినియోగ పరచడమవుతుంది. ప్రజాస్వామ్యం అనేది ప్రతి ఒక్కరూ యోగ్యత, పాండిత్యంతో సంబంధం లేకుండా అందరితో సమానులే అనే అసత్య వాక్యంపై ఆధారపడిందని కొందరు విమర్శించారు..

6) ప్రగతికి ఆటంకం (Impedes Progress): కళలు, సాహిత్యం, శాస్త్ర రంగాలలో ప్రగతికి ప్రజాస్వామ్యం ఆటంకంగా ఉంటుంది. ప్రభుత్వ వ్యవహారాల గురించి అట్టడుగు స్థాయిలో ప్రజలు అంతగా ఆసక్తి చూపించకపోవడమే ఇందుకు కారణం. సాంప్రదాయ దృక్పథం గల సామాన్య ప్రజలు దేశంలో శాస్త్రీయ ప్రగతికి విముఖతను ప్రదర్శిస్తారు.

7) నైతిక విలువలు లేకపోవడం (Lack of Ethical Values): ప్రజాస్వామ్య ప్రభుత్వం నైతిక విలువలు కలిగి ఉండదని కొందరు నినదించారు. వ్యక్తుల నైతికతను ప్రజాస్వామ్యం దిగజారుస్తుందని వారు ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో నిరంతరం నిందలు, అసత్యం వంటి అనైతిక పద్ధతులు ప్రచారంలో ఉంటాయి.

8) వ్యక్తి స్వాతంత్ర్యాల పట్ల వ్యతిరేకత (Opposes Individual Freedoms): ప్రజాస్వామ్యం స్వేచ్ఛాయుత | భావాలను అణచివేసి, హేతువును అడ్డుకొంటుంది. ప్రజాస్వామ్య రాజ్యంలో సృజనాత్మక భావాలు గల తాత్త్వికులు మూర్ఖులుగా పరిగణించబడతారు. ప్రాచీన ఏథెన్స్ పాలకుల ఒత్తిడిచే విషం తాగిన మేధావి సోక్రటీస్ ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. కాబట్టి ప్రజాస్వామ్యంలో వ్యక్తిత్వం గల వారిపట్ల ఏ ఒక్కరూ సహనాన్ని కలిగిఉండరు. 9) వ్యయంతో కూడుకున్న ప్రభుత్వం (Expensive One): ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ, ప్రచార కార్యక్రమం భారీ వ్యయంతో కూడుకుని ఉంటుంది. దాంతో సంపద, ఐశ్వర్యం గల వ్యక్తులు మాత్రమే ఎన్నికల బరిలో | ప్రవేశించి విజయపథాన కొనసాగుతారు. అటువంటప్పుడు పేదలు, యోగ్యులు, సేవాతత్పరత గల వ్యక్తులు ఎన్నికల వ్యయాన్ని భరించలేరు. పార్టీ నాయకత్వం కూడా సంపన్న పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రభావిత వ్యక్తులకే ప్రాధాన్యత ఇస్తుంది.

ప్రశ్న 2.
ప్రజాస్వామ్యాన్ని నిర్వచించి సమకాలీన రాజకీయాలలో ప్రజాస్వామ్యం ప్రయోజనాలు, లోపాలను విశ్లేషించండి.
జవాబు:
అర్థం: Democracy అనే ఇంగ్లీషు పదం ‘Demos’ మరియు ‘Kratos’ అనే రెండు గ్రీకు పదాల కలయిక నుంచి ఆవిర్భవించింది. డెమోస్ అంటే ‘ప్రజలు’ క్రటోస్ అంటే ‘అధికారం’ లేదా ‘పాలన’ అని అర్థం.
నిర్వచనాలు:

  1. “ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క ప్రజల చేత, ప్రజల కొరకు నిర్వహించబడే ప్రభుత్వం” అని అబ్రహాం లింకన్ పేర్కొన్నాడు.
  2. “పాలనా అధికారం సమాజంలో ఏ ఒక్క వర్గానికో, వర్గాలకో కాకుండా అన్ని వర్గాలకు చెంది ఉండే ప్రభుత్వ విధానమే ప్రజాస్వామ్యం” అని లార్డ్స్ పేర్కొన్నాడు.
  3. “ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వమే ప్రజాస్వామ్యం” అని జే.ఆర్.సీలీ పేర్కొన్నాడు.

AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

సమకాలీన రాజకీయాలలో ప్రజాస్వామ్యం వలన కలిగే ప్రయోజనాలు:
1) సమర్థవంతమైన ప్రభుత్వం (Efficient Government): ప్రజాస్వామ్యాన్ని సమర్థవంతమైన, పటిష్టమైన ప్రభుత్వంగా ప్రొఫెసర్ గార్నర్ వర్ణించాడు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సాధారణ సమయాలలోనూ, అత్యవసర పరిస్థితులలోనూ ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగానూ, పటిష్టంగానూ కొనసాగుతాయి. ప్రజలచే ఎన్నిక, ప్రజల నియంత్రణ, ప్రజలకు బాధ్యత అనే ప్రజాస్వామ్య సూత్రాలు గోచరిస్తాయి. అవి ఇతర ప్రభుత్వాలతో పోల్చినపుడు ఇందులో సమర్థతను చేకూర్చుతాయి.

2) వ్యక్తి స్వేచ్ఛల సమర్థన (Upholds Individual Liberties): ప్రజాస్వామ్య ప్రభుత్వం మాత్రమే వ్యక్తి స్వేచ్ఛలను సమర్థిస్తుంది. రాజ్యాంగపరమైన అనేక రక్షణల ద్వారా వ్యక్తుల హామీలకు హామీ ఇస్తుంది. ఈ అంశం ప్రాతిపదికపై జె. ఎస్. మిల్ ప్రజాస్వామ్యాన్ని సమర్థించాడు. ప్రజాస్వామ్యం ప్రజలకు వాక్, సభా, పత్రికా స్వాతంత్రాలు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలను ప్రసాదిస్తుందని అతడు ప్రకటించాడు.

3) సమానత్వానికి హామీ (Assures Equality): ప్రజాస్వామ్యం రాజకీయ, ఆర్థిక రంగాలలోని వ్యక్తుల యొక్క సమానత్వానికి హామీ ఇస్తుంది. రాజకీయ రంగంలో పౌరుల కుల, వర్ణం, పుట్టుక వంటి అంశాలతో ప్రమేయం లేకుండా వారికి ఓటు హక్కు, ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీచేసే హక్కు, ప్రభుత్వ పదవులను చేపట్టే హక్కు వంటి రాజకీయ హక్కులను పౌరులకు ప్రసాదిస్తుంది. సమాజంలో ఇతర వర్గాలను విస్మరించి కొద్దిమంది వ్యక్తులకు ప్రత్యేక హక్కులను కల్పించడాన్ని వ్యతిరేకిస్తుంది.

4) ప్రజలను విద్యావంతులను చేయడం (Educates the Masses): ప్రజలను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు బృహత్తర ప్రయోగాలకు వీలు కల్పించే సాధనంగా ప్రజాస్వామ్యాన్ని కొందరు వర్ణించారు. వివిధ ప్రాతినిధ్య సంస్థలకు విభిన్న సమయాలలో జరిగే ఎన్నికలు, సంబంధిత ప్రచార ఉద్యమాలు ప్రజాస్వామ్యంలో పౌరులను విద్యావంతులుగా తీర్చిదిద్దుతుంది.

5) దేశభక్తిని పెంపొందించడం (Instills Patriotism): ప్రజాస్వామ్యం ప్రజలలో దేశభక్తిని పెంపొందిస్తుంది. ప్రజాస్వామ్యంలో వివిధ సంస్థల సభ్యుల ఎంపిక, ఎన్నికలలో ప్రజలకు ఎన్నో అవకాశాలు లభిస్తాయి. ప్రాతినిధ్య సంస్థలలో ప్రజలు పాల్గొని అవి విజయవంతంగా పనిచేసేటట్లు జాగ్రత్త వహిస్తారు. వీటి నిర్వహణలో పాల్గొనడాన్ని ప్రజలు ఎంతో గర్వంగా భావిస్తారు. దేశం క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు ప్రజలు తమ సహాయ సహకారాలను అందించడంలో ఎంతో ఆసక్తిని చూపుతారు. గతంలో ఇండియాపై చైనా, పాకిస్తాన్లు దురాక్రమణ జరిపిన సందర్భాలలో భారతీయులు చూపించిన చొరవ, ప్రదర్శించిన దేశభక్తి ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు.

6) స్థిరత్వానికి హామీ (Ensures Stability): ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వం ఉండటం వల్ల విప్లవాల బారి నుంచి దేశాన్ని కాపాడేందుకు అవకాశం ఉంటుంది. ఈ వ్యవస్థలో ప్రజలు ఎన్నికల సమయంలో వ్యతిరేక ఓటు (Negative Vote) వినియోగం ద్వారా ప్రభుత్వాన్ని మార్చివేయగలుగుతారు.

7) ఒకే సమయంలో శాంతి, ప్రగతి (Simultaneous Order and Progress): నియంతృత్వం దేశ ప్రగతిని నిర్లక్ష్యం చేసి భద్రతకు హామీ ఇస్తుంది. అందుకు విరుద్ధంగా ప్రజాస్వామ్యం రాజ్యాంగబద్దమైన పాలన ద్వారా శాంతి భద్రతల నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తుంది. వివిధ రంగాలలో ప్రజల ఔన్నత్యానికి కృషి చేస్తుంది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో దీనిని మనం గమనించవచ్చు. జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబ్దుల్ కలామ్ అజాద్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వంటి ఆదర్శవంతమైన నాయకులు, రాజనీతిజ్ఞులు శైశవదశలో ఉన్న భారత ప్రజాస్వామ్యాన్ని జాతీయ, అంతర్జాతీయ రంగాలలో శక్తివంతమైన, సార్థకమైందిగా తీర్చిదిద్దేందుకు ఎంతగానో కృషి చేశారు.

8) ప్రజలను బాధ్యతాయుతులుగా చేయడం (Makes the People Responsible): ప్రజాస్వామ్యం వ్యక్తి సామర్థ్యాన్ని గుర్తిస్తుంది. వ్యక్తులలో చొరవను ఏర్పరచేందుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ప్రజలలో బాధ్యతాయుత ప్రవర్తనను పెంపొందిస్తుంది. ఈ రకమైన పరిస్థితి ఇతర ప్రభుత్వ రకాలలో గోచరించదు. అంతేకాకుండా ప్రజాస్వామ్యం వ్యక్తుల వ్యక్తిత్వ వికాస సాధనకు దోహదపడి వారి ఔన్నత్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.

9) పౌరసత్వ శిక్షణ పాఠశాల (Training School for Citizenship): ప్రజాస్వామ్యపు మరొక సుగుణం ఏమిటంటే ఇది ఒక ఉత్తమ పౌరసత్వ పాఠశాలగా వ్యవహరిస్తుంది. ఎన్నికల సమయంలో ఓటుహక్కు, అభ్యర్థులను ఎన్నుకొనే హక్కు వంటి రాజకీయ హక్కులను పౌరులకు అందించడంలో హామీ ఇస్తుంది. అటువంటి హక్కులు, ఇతర రాజకీయ హక్కులలాగా, పౌరసత్వ పాఠాలను నేర్చుకొనేందుకు పౌరులకు సహాయకారిగా ఉంటాయి.

10) హేతుబద్ధమైన ప్రభుత్వం (A Rational Government): “ఏ ఒక్కరూ సంపూర్ణంగా దోషరహితులు కారు’ అనే సూత్రంపై ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంటుంది. అధికార దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అవసరమైన చర్యలు, విమర్శలతో కూడిన ప్రక్రియను ప్రజాస్వామ్యం అనుసరిస్తుంది. అంతేకాకుండా రాజకీయ వ్యవస్థ హేతుబద్ధ స్వభావాన్ని ప్రజాస్వామ్యం సంరక్షిస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

ప్రజాస్వామ్యం లోపాలు:
1) అజ్ఞానుల పాలన (Rule by Ignorants): అరిస్టాటిల్ ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వ వికృత రూపంగా పరిగణించాడు. ప్రజాస్వామ్యమనేది ఒక రకమైన మూకపాలనగా భావించాడు. అతడి గురువైన ప్లేటో ప్రజాస్వామ్యాన్ని అజ్ఞానుల పాలనగా పిలిచాడు. ప్రజాస్వామ్యంలో ఓట్ల లెక్కింపు మాత్రమే జరుగుతుందని మరికొందరు విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అనేక అంశాలపై నిర్ణయాలనేవి శాసనసభ, మంత్రివర్గ సమావేశాలలో మెజారిటీ సభ్యుల అభీష్టం మేరకు జరుగుతాయి. దాంతో యోగ్యులు, నిజాయితీ గల వ్యక్తులు దూరంగా ఉంచబడి, అజ్ఞానులు, మూర్ఖులు ప్రాధాన్యత కలిగి ఉంటారు.

2) ధనికులకు అనుకూలత (Favours the Rich): ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాలలో అధికభాగం పెట్టుబడిదారీ స్వభావాన్ని కలిగి ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు సంపన్న వర్గాల వారి పట్ల సానుకూలతను ప్రదర్శిస్తాయి. ఎన్నికలనేవి ఒక ప్రహసనంగా మారుతాయి. ప్రజాస్వామ్యంలో ఓటర్లను దైవంగా గుర్తించడమవుతుంది. ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు కులం, వర్ణం, మతం, పుట్టుక, ప్రాంతం వంటి అంశాల వారీగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తారు. వారికి భౌతిక, ధన, కనక వస్తువులను అందించడం ద్వారా ఆకర్షిస్తారు.

3) అధిక సంఖ్యాకుల పాలన అనేది ఒక భ్రమ (Majority rule – a Myth): ఒకప్పుడు 1980వ దశకం వరకు ప్రజాస్వామ్యాన్ని అధిక సంఖ్యాకుల పాలనగా పరిగణించడమైంది. ఆ తరువాత జాతీయ, అంతర్జాతీయ రంగాలలో సంభవించిన నాటకీయ పరిణామాల ఫలితంగా అనేక మార్పులు సంభవించాయి. విద్య, అక్షరాస్యత, విజ్ఞాన వికాసం, పత్రికలు, వార్తా దృశ్య సాధనాలు, ఫేస్బుక్, ట్విట్టర్, ఇతర సామాజిక మాధ్యమాలు రాజకీయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చాయి. సంకీర్ణ ప్రభుత్వ రాజకీయ సంస్కృతి సాధారణ రాజకీయ పరిణామంగా మారింది. ప్రాచీన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలుగా పేరుగాంచిన బ్రిటన్ వంటి రాజ్యాలలో సైతం సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటయినాయి. అలాగే అభివృద్ధి చెందుతున్న ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ వంటి దేశాలలో కూడా సంకీర్ణ ప్రభుత్వాలు అనివార్యమవుతున్నాయి. అందుకు కారణం ఆయా దేశాలలో శాసనసభలలో ఏ ఒక్క పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పరచే సంపూర్ణమైన మెజారిటీ స్థానాలు లభించకపోవడంగా పేర్కొనవచ్చు. దాంతో శాసనసభలలో ఎక్కువ స్థానాలు (మెజారిటీ స్థానాలు కాకుండ) గెల్చుకున్న అతిపెద్ద పార్టీ మిగిలిన చిన్న పార్టీలతో కలసి సంకీర్ణ భాగస్వామ్యంగా ఏర్పడి, కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం సర్వ సాధారణమైంది. అటువంటి ప్రభుత్వాలు శాసనసభలలో మెజారిటీ సభ్యుల మద్దతును పొందక పార్లమెంటరీ ప్రమాణాల పతనానికి దారితీశాయి. భారతదేశంలో 1990వ దశకం ద్వితీయార్థం నుంచి 2014 ప్రథమార్థం వరకు జాతీయ స్థాయిలో ఏర్పడిన ఐక్య సంఘటన (United Front), జాతీయ ప్రజాస్వామ్య కూటమి (National Democratic Alliance), ఐక్య ప్రగతిశీల కూటమి (United Progressive Alliance) ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు.

4) సందేహాస్పద ప్రాతినిధ్య సూత్రం (Representative Principle – Doubtful): ప్రజాస్వామ్యం ప్రాదేశిక ప్రాతినిధ్యం అనే సూత్రంపై ఆధారపడుతుంది. ఈ సూత్రం ప్రకారం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి భావాలకు, ఒకే | శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహించాలి. ఈ విధానం లోపభూయిష్టం మరియు అన్ని వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లభించదు.

5) సమానత్వ సూత్రం దుర్వినియోగం (Abuse of Equality Principle): ప్రజాస్వామ్య ప్రభుత్వ ముఖ్య భావనయైన సమానత్వ సూత్రాన్ని ప్రభుత్వ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ దుర్వినియోగ పరచడమవుతుంది. ప్రజాస్వామ్యం అనేది ప్రతి ఒక్కరూ యోగ్యత, పాండిత్యంతో సంబంధం లేకుండా అందరితో సమానులే అనే అసత్య వాక్యంపై ఆధారపడిందని కొందరు విమర్శించారు.

6) ప్రగతికి ఆటంకం (Impedes Progress): కళలు, సాహిత్యం, శాస్త్ర రంగాలలో ప్రగతికి ప్రజాస్వామ్యం ఆటంకంగా ఉంటుంది. ప్రభుత్వ వ్యవహారాల గురించి అట్టడుగు స్థాయిలో ప్రజలు అంతగా ఆసక్తి చూపించకపోవడమే ఇందుకు కారణం. సాంప్రదాయ దృక్పథం గల సామాన్య ప్రజలు దేశంలో శాస్త్రీయ ప్రగతికి విముఖతను ప్రదర్శిస్తారు.

7) నైతిక విలువలు లేకపోవడం (Lack of Ethical Values): ప్రజాస్వామ్య ప్రభుత్వం నైతిక విలువలు కలిగి ఉండదని కొందరు నినదించారు. వ్యక్తుల నైతికతను ప్రజాస్వామ్యం దిగజారుస్తుందని వారు ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో నిరంతరం నిందలు, అసత్యం వంటి అనైతిక పద్ధతులు ప్రచారంలో ఉంటాయి.

8) వ్యక్తి స్వాతంత్ర్యాల పట్ల వ్యతిరేకత (Opposes Individual Freedoms): ప్రజాస్వామ్యం స్వేచ్చాయుత భావాలను అణచివేసి, హేతువును అడ్డుకొంటుంది. ప్రజాస్వామ్య రాజ్యంలో సృజనాత్మక భావాలు గల తాత్త్వికులు మూర్ఖులుగా పరిగణించబడతారు. ప్రాచీన ఏథెన్స్ పాలకుల ఒత్తిడిచే విషం తాగిన మేధావి సోక్రటీస్ ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. కాబట్టి ప్రజాస్వామ్యంలో వ్యక్తిత్వం గల వారిపట్ల ఏ ఒక్కరూ సహనాన్ని కలిగిఉండరు.

9) వ్యయంతో కూడుకున్న ప్రభుత్వం (Expensive One): ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ, ప్రచార కార్యక్రమం భారీ వ్యయంతో కూడుకుని ఉంటుంది. దాంతో సంపద, ఐశ్వర్యం గల వ్యక్తులు మాత్రమే ఎన్నికల బరిలో ప్రవేశించి విజయపథాన కొనసాగుతారు. అటువంటప్పుడు పేదలు, యోగ్యులు, సేవాతత్పరత గల వ్యక్తులు ఎన్నికల వ్యయాన్ని భరించలేరు. పార్టీ నాయకత్వం కూడా సంపన్న పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రభావిత వ్యక్తులకే ప్రాధాన్యత ఇస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

ప్రశ్న 3.
ప్రజాస్వామ్యం విజయవంతమయ్యేందుకు అవసరమైన పరిస్థితులను సూచించండి.
జవాబు:
అర్థం: Democracy అనే ఇంగ్లీషు పదం ‘Demos’ మరియు ‘Kratos’ అనే రెండు గ్రీకు పదాల కలయిక నుంచి ఆవిర్భవించింది. డెమోస్ అంటే ‘ప్రజలు’ క్రటోస్ అంటే ‘అధికారం’ లేదా ‘పాలన’ అని అర్థం.

నిర్వచనం: “ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క ప్రజల చేత, ప్రజల కొరకు నిర్వహించబడే ప్రభుత్వం”.

అబ్రహాం లింకన్
ప్రజాస్వామ్య విజయానికి అవసరమైన పరిస్థితులు (Essential conditions to the success of Democracy): ప్రజాస్వామ్య విజయానికి కింద పేర్కొన్న పరిస్థితులు అవసరమవుతాయి.
1) సరైన విద్య (Sound system of Education): ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే పౌరులకు సరైన విద్య ఎంతో అవసరం. అజ్ఞానం, అమాయకత్వం, అవిద్య గల పౌరులు సరైన దృక్పథాన్ని కలిగి ఉండక, భారీ సంస్కరణల పట్ల విముఖత ప్రదర్శిస్తారు. విద్య అనేది వ్యక్తుల వివేకానికి పదును పెడుతుంది. అనేక విషయాల పట్ల సరియైన అవగాహనను పెంపొందిస్తుంది. పౌరులను అప్రమత్తులుగా చేస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వ విధానాలను అంచనా వేయడంలో, విమర్శించడంలో విద్య దోహదపడుతుంది.

2) వికాసవంతమైన పౌరసత్వం (Enlightened Citizenship): ప్రజాస్వామ్య రాజ్యానికి వికాసవంతమైన పౌరులు విలువైన ఆస్థిగా పరిగణించబడతారు. వారు ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు. వీరు ప్రభుత్వ వ్యవహారాలలో చురుకుగా పాల్గొని, హక్కులు, విధుల సక్రమ నిర్వహణలో తోటి పౌరులకు సహాయంగా ఉంటారు. ప్రభుత్వం అమలుచేసే అన్ని మంచి కార్యక్రమాలకు సహకారాన్ని అందిస్తారు.

3) స్వతంత్ర పత్రికలు (Independent Press): ప్రజాస్వామ్యానికి స్వతంత్రమైన పత్రికలు ఎంతో ఆవశ్యకమైనవి. పత్రికలు ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని ఖచ్చితంగానూ, నిష్పక్షపాతంగానూ ప్రజలకు తెలుపుతాయి. ప్రభుత్వ కార్యకలాపాల పట్ల ప్రజలకు సంబంధం కలిగి ఉండేటట్లు చూస్తాయి. ప్రజల ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతాయి. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సామరస్యపూర్వక సంబంధాలను పెంపొందించేందుకు కృషి చేస్తాయి.

4) దృఢమైన ప్రతిపక్షం (Strong Opposition): పార్లమెంటరీ ప్రజాస్వామ్య విజయం దృఢమైన, సమర్థవంతమైన ప్రతిపక్షంపై చాలా వరకు ఆధారపడుతుంది. అటువంటి ప్రతిపక్షం ప్రభుత్వ విధానాల లోపాలను వెల్లడించి, వాటి నివారణకు కృషి చేస్తుంది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి కొన్ని అభివృద్ధి చెందిన దేశాలలో ప్రతిపక్షాలు ప్రశంసనీయమైన పాత్రను పోషిస్తున్నాయనే విషయాన్ని ఈ సందర్భంలో మనం ప్రస్తావించవచ్చు. భారతదేశంలో కూడా ఇటీవలి కాలంలో అధికారంలో కొనసాగిన అధికార పార్టీలకు చెందిన వ్యక్తులు పాల్పడిన కుంభకోణాలను వెలికి తీయడంలో ప్రతిపక్షం బృహత్తరమైన పాత్రను పోషించింది. పైన ఉదహరించిన దేశాలలోని అధికార పార్టీలు అనేక అంశాలలో ఎదురైన చిక్కుముడులను పరిష్కరించడంలో ప్రతిపక్షాల సలహాలను తీసుకోవడమైనది. ఇటువంటి పరిస్థితి అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాలు రెండింటిలో ప్రజాస్వామ్యపు ఆరోగ్యకర చిహ్నంగా పరిగణించవచ్చు.

5) అధికారాల వికేంద్రీరణ (Decentralization of Powers): ప్రజాస్వామ్య వ్యవస్థ ఆరోగ్యకరంగా పనిచేసేందుకు అట్టడుగు స్థాయిలో అధికారాల వికేంద్రీకరణ అత్యంత ఆవశ్యకం. భారతదేశంలో అట్టుడుగు స్థాయిలోని ప్రాతినిధ్య సంస్థలు (పంచాయితీరాజ్ సంస్థలు) కిందిస్థాయి శాసనసభలుగా వ్యవహరించడం ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. స్థానిక ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు తమ ఓటుహక్కును ఎలా వినియోగించుకోవాలనే విషయంలో | ఇవి పూర్తి అవగాహన కలిగిస్తాయి.

6) ఆర్థిక అసమానతలు లేకుండుట (Absence of economic disparities): దేశంలో ఆర్థిక వ్యత్యాసాలు లేనప్పుడు ప్రజాస్వామ్యం సాఫీగా పనిచేయగలుగుతుంది. దేశంలో ఎక్కువ మంది పేదవారుగానూ, కొద్దిమంది ఐశ్వర్య వంతులుగానూ ఉంటే ప్రజాస్వామ్యం విజయవంతం కాలేదు. వికాసవంతమైన, వివేకవంతమైన పౌరసత్వం గల వ్యక్తులు ఉన్నప్పుడే, ప్రభుత్వ వ్యవహారాలలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు. కాబట్టి ప్రజాస్వామ్యం విజయవంతంగా పనిచేసేందుకు ఆర్థిక అసమానతలు లేని సమాజ నిర్మాణానికి కృషి చేయాలి.

7) సాంఘిక సమానత్వం (Social Equality): సాంఘిక సమానత్వం అనేది ప్రజాస్వామ్య విజయానికి మరొక ఆవశ్యకంగా పేర్కొనవచ్చు. కులం, వర్గం, తెగల వ్యత్యాసాలు అనేవి ప్రజాస్వామ్యపు ఆరోగ్యకరమైన పనితీరును అడ్డుకుంటాయి. ఇటువంటి అంశాలు సంకుచిత అంశాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి ఉమ్మడి శ్రేయస్సుకు హాని కలిగిస్తాయి. అట్లాగే భాషా, ప్రాంతీయపరమైన అంశాలు ప్రజాస్వామ్య రాజ్య నిర్వహణకు ఆటంకంగా ఉంటాయి. ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే సామాజిక రంగంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించాలి. సాంఘిక సమానత్వాన్ని సిద్ధాంతరీత్యా ఆచరణలోను ఉంచే ప్రయత్నం జరగాలి.

8) ప్రజాస్వామ్యంపై విశ్వాసం (Faith in Democracy): ప్రజాస్వామ్యానికి సంబంధించిన కొన్ని విలువలైన వ్యక్తి యోగ్యత, విభిన్న వైఖరుల పట్ల సహనం, చర్చల ద్వారా నిర్ణయాలు తీసుకోవడం మొదలగు వాటిని ప్రజలకు నేర్పాలి. ప్రజా జీవనంలో సోదరభావాన్ని ఇతరుల అభిప్రాయాలు, ఆలోచనలకు తగిన ప్రాముఖ్యతను ఇవ్వడంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కాబట్టి ప్రభుత్వాలు ప్రజలలో ప్రజాస్వామ్య విలువల పట్ల విశ్వాసం కల్పించినప్పుడే ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి అవకాశముంటుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

9) ప్రాథమిక అంశాలపై ఆమోదం (Agreement on Fundamental Issues): ప్రజాస్వామ్యం |విజయవంతం కావాలంటే ప్రాథమిక అంశాలపై ఆమోదం కావాలి. లేనట్లయితే ప్రజల మధ్య విపరీతమైన వ్యత్యాసాలు నెలకొంటాయి. అటువంటి వ్యత్యాసాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలి. లేనట్లయితే ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్ధకమై ప్రమాదంలో పడుతుంది. కాబట్టి ప్రజాస్వామ్య ప్రక్రియపై సమాజంలోని అన్ని ప్రధాన వర్గాలకు గట్టి నమ్మకం ఉండాల్సిన అవసరం ఉంది. తమ మధ్య తలెత్తే ఘర్షణలను చర్చల ద్వారానే పరిష్కరించుకొనేందుకు ప్రజలు సన్నద్ధులుగా ఉండాలి.

10) వివేకవంతమైన నాయకత్వం (Sagacious Leadership): ప్రజాస్వామ్య మౌలిక అంశాలలో వివేక వంతమైన పాలకులు తమ పరిపాలనా సూక్ష్మత, రాజకీయ ఔచిత్యం, సామాజిక అంకిత భావం, ఆర్థిక దృక్పథం వంటి లక్షణాలతో ప్రజాస్వామ్య రాజ్యాన్ని మహోన్నత స్థాయికి తీసుకువెళ్ళగలుగుతారు. చెడు ఆచరణలకు, మహోన్నత ఆదర్శాలకు మధ్యగల వ్యత్యాసాన్ని గుర్తించగలుగుతారు. వివిధ సంఘటనల వల్ల ప్రతిస్పందించే విషయంలో సంకుచిత భావాలను మంచి నిర్ణయాల ద్వారా అధిగమిస్తారు.

11) నిజాయితీ, పారదర్శకతలు (Honesty and Transparency): వివిధ రంగాలకు చెందిన నిజాయితీ పరులైన వ్యక్తులు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించినప్పుడు వారు ప్రజాస్వామ్య విజయానికి కృషి చేస్తారు. అదే విధంగా పాలనలో పారదర్శకత కూడా ప్రజాస్వామ్య విజయానికి ప్రధాన సాధనంగా ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు అసత్య, అనైతికత, అశ్లీల చర్యలకు పాల్పడినప్పుడు ప్రజాస్వామ్యం అపహాస్యమవుతుంది. అలాగే స్వార్థపరత్వం, అధికార దాహం, వక్రభావాలు గల నాయకులు నిగూఢమైన అజెండాతో వ్యవహరించినట్లయితే దేశం కోలుకోలేని స్థితికి దిగజారిపోతుంది.

12) సైన్యం పెత్తనం లేకుండుట (Absence of militarism): సైన్యం అజమాయిషీ, పెత్తనం లేని దేశాలలో ప్రజాస్వామ్యం పనిచేయగలుగుతుంది. బలప్రయోగానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా, వ్యక్తుల యోగత్యను విశ్వసిస్తుంది. సామర్థ్యం, అంకిత భావం, యోగ్యతల ఆధారంగా వ్యక్తులకు అనేక అవకాశాలను కల్పిస్తుంది. అందుకు విరుద్ధమైన పరిస్థితులు సైన్యం పెత్తనం ఉన్న దేశాలలో నెలకొని ఉంటాయి. సైనిక పాలనలో అధికారాల కేంద్రీకరణ జరిగి, నియంతృత్వం పట్ల అనుకూలత ఉంటుంది. యుద్ధం, సంఘర్షణల పట్ల మొగ్గు చూపుతున్న దేశాలలో సైన్యం పెత్తనం చెలాయిస్తుంది. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యాన్ని పెంచి పోషించాలంటే అందుకు అనుకూలమైన పరిస్థితులు ఉండాలి.

ప్రశ్న 4.
ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తెలిపి, ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాల గురించి రాయండి. [Mar. ’18, ’17, ’16’]
జవాబు:
పరిచయం: ప్రజాస్వామ్యం ఒక ఆధునిక ప్రభుత్వ స్వరూపం. ఇందులో వివిధ స్థాయిలలో ప్రభుత్వములు ప్రజలచే ప్రత్యక్షముగా గాని లేదా పరోక్షముగా గాని ఏర్పాటు చేయబడి నిర్వహించబడతాయి. ఈ వ్యవస్థలో వంశపారంపర్య పదవులకు ఏ స్థాయిలోనూ అవకాశం ఉండదు.

అర్థం: Democracy అనే ఇంగ్లీషు పదం ‘Demos’ మరియు ‘Krates’ అనే రెండు గ్రీకు పదాల కలయిక నుంచి ఆవిర్భవించింది. డెమోస్ అంటే ‘ప్రజలు’ క్రటోస్ అంటే ‘అధికారం’ లేదా ‘పాలన’ అని అర్థం.

నిర్వచనం: “ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క ప్రజల చేత, ప్రజల కొరకు నిర్వహించబడే ప్రభుత్వం”.

అబ్రహాం లింకన్ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం: ఈ పద్ధతిలో ప్రజలు ప్రభుత్వ పాలన వ్యవహారాలలో ప్రత్యక్షంగా పాల్గొంటారు. శాసన సంబంధమైన అధికారాలన్నీ వారు చెలాయిస్తారు. ప్రజలే చట్ట సభలలో పాల్గొని చట్టాలను రూపొందిస్తారు. రాజ్య వ్యవహారాలలో ప్రజలు ప్రత్యక్షంగా భాగస్వామ్యం వహిస్తారు.ప్రత్యక్ష ప్రజాస్వామ్య విధానం ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో కొన్ని కాంటన్ల (Cantons) లోనూ, అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలోనూ నెలకొని ఉంది.

ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలు: ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలు నాలుగు రకాలుగా ఉంటాయి. అవి:

  1. ప్రజాభిప్రాయ సేకరణ (Referendum)
  2. ప్రజాభిప్రాయ నివేదన (Initiative)
  3. పునరాయనం (Recall)
  4. ప్రజాభిప్రాయ నిర్ణయం (Plebiscite)

పైన పేర్కొన్న నాలుగు రకాల ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలను కింది విధంగా చర్చించవచ్చు.
1) ప్రజాభిప్రాయ సేకరణ (Referendum): రిఫరెండమ్ (referendum) అనే ఆంగ్ల పదానికి అర్థం “ప్రజాభిప్రాయ సేకరణ”. ఒకానొక అంశంపై ప్రజల అభిప్రాయాన్ని ప్రత్యక్షంగా తెలుసుకొనే ప్రక్రియనే ప్రజాభిప్రాయ సేకరణ అంటారు. ఇటువంటి అంశం సాధారణమైనది లేదా రాజ్యాంగపరమైనది కావచ్చు. ఆర్.సి. బ్రూక్స్ ప్రకారం | ప్రజాభిప్రాయ సేకరణ అనేది శాసనసభ అప్పటికే ఆమోదించిన బిల్లు లేదా చట్టంపై నియోజకుల అభిప్రాయాన్ని తెలుసుకొనేందుకు ఉద్దేశించింది.

AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

ప్రజాభిప్రాయ సేకరణ రకాలు (Types of Referendum): ప్రజాభిప్రాయ సేకరణ రెండు రకాలు. అవి: 1. నిర్బంధమైనవి 2. స్వచ్ఛందమైనవి. ఒకానొక శాసన అంశంపై నియోజకుల అభిప్రాయాన్ని విధిగానూ, ఖచ్ఛితమైన నియమంగానూ పరిగణనలోకి తీసుకొని తెలుసుకోవడాన్ని నిర్బంధ ప్రజాభిప్రాయ సేకరణ అంటారు. ఈ రకమైన ప్రజాభిప్రాయ సేకరణ స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా రాజ్యాంగాల సవరణల విషయంలో అనుసరించడమైంది. ఉదాహరణకు స్విట్జర్లాండ్ లోని కొన్ని కాంటన్లలో (రాష్ట్రాలలో) సాధారణ బిల్లులపై కూడా నిర్బంధంగా ప్రజాభిప్రాయ సేకరణ జరగాలనే రాజ్యాంగ ప్రకరణం ఉంది. అదే విధంగా ఒక నిర్ణీత సంఖ్యలో పౌరులు శాసనసభ ఆమోదించిన అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని కోరితే ఆ అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. ఇటువంటి దానిని స్వచ్ఛందమైన ప్రజాభిప్రాయ సేకరణ అంటారు. ఉదాహరణకు 30,000 మంది పౌరులుగానీ, ఎనిమిది కాంటన్లు (8 రాష్ట్రాలు) |గానీ ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని కోరినట్లయితే ఈ విధమైన ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది.

2) ప్రజాభిప్రాయ నివేదన (Initiative): ప్రత్యక్ష ప్రజాస్వామ్య సమర్థకులు ఒక్క ప్రజాభిప్రాయ సేకరణతో సంతృప్తి చెందలేదు. దాంతో ప్రజలు శాసన నిర్మాణ ప్రక్రియలో ప్రజలు పాల్గొనేలా ప్రజాభిప్రాయ నివేదన గురించి వారు గట్టిగా చెప్పారు. ఉదాహరణకు స్విట్జర్లాండ్లో 50,000 మంది పౌరులు ఏదైనా ఒక అంశంపై చట్టాన్ని రూపొందించాల్సిందిగా శాసనసభను కోరుతూ ఒక అర్జీపై సంతకం చేయవచ్చు. అప్పుడు వారి ప్రతిపాదనను ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి పంపించబడుతుంది. మెజారిటీ పౌరులు ఆ ప్రతిపాదన ఆమోదించినట్లయితే, ఆ అంశం చట్టంగా ఆమోదితమై అమల్లోకి వస్తుంది. స్విట్జర్లాండ్లోని కాంటన్లలో (రాష్ట్రాలలో) సాధారణ అంశాలతోపాటుగా రాజ్యాంగ ప్రాముఖ్యతగల అంశాలపై ప్రజల అభిప్రాయాన్ని కోరడం ఎప్పటి నుంచో వాడుకలో ఉంది. అయితే అటువంటి ప్రతిపాదనపై సంతకం చేసే వారి సంఖ్య ఆ దేశంలో రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటుంది.

ప్రజాభిప్రాయ నివేదన రకాలు (Types of Initiative): ప్రజాభిప్రాయ నివేదన 1. విధాయకమైనది లేదా నిర్ణీత నియమాలతో కూడినది. 2. విధాయకం కానిది లేదా నిర్ణీత నియమాలు లేనిది అని రెండు రకాలుగా చెప్పవచ్చు. మొదటిదైన విధాయకమైన అభిప్రాయ నివేదన అనేది ఒక బిల్లులోని అన్ని అంశాలకు సంబంధించినది. ఆ బిల్లు విషయంలో శాసనసభ ప్రజలు ప్రతిపాదించిన అంశాలన్నింటినీ యధాతధంగా ఆమోదించాల్సి ఉంటుంది. లేనియెడల ప్రజల తీర్పును తెలుసుకొనేందుకు ఓటింగ్ నిర్వహణకు పంపించబడుతుంది. ఇక రెండోదైన విధాయకంగాని ప్రజాభిప్రాయ నివేదన అనేది కేవలం బిల్లులోని సాధారణ అంశాల సూచనకు సంబంధించినది. ప్రజల డిమాండ్లు ఏమిటనే విషయంలో ఆ బిల్లులో పేర్కొనడం జరగదు. ఉదాహరణకు స్విట్జర్లాండులో శాసనసభ ప్రజలు పంపిన ప్రతిపాదనలను ఆమోదించి, వాటికి అనుగుణంగా బిల్లు ముసాయిదాను రూపొందించి, ప్రజల నిర్ణయాన్ని తెలుసుకొనేలా ఓటింగ్ జరిగేందుకు చర్యలు గైకొనడం జరుగుతుంది. ఒకవేళ స్విస్ ఫెడరల్ అసెంబ్లీ ప్రజలు పంపిన నివేదనలోని అంశాలను ఆమోదించినట్లయితే, ఫెడరల్ అసెంబ్లీ ప్రతిపాదిత అంశాలతో కూడిన బిల్లు రూపొందించి ఆమోదిస్తుంది. అయితే మొత్తం రాజ్యాంగమంతటిని సవరించాలనే డిమాండు అందుకు భిన్నంగా ఉంటుంది.

రాజ్యాంగ సవరణ గురించి ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకొనేందుకు ఓటింగు నిర్వహించబడుతుంది. మెజారిటీ స్విస్ పౌరులు పూర్తి సవరణ పట్ల అనుకూలంగా ఉంటే, ఫెడరల్ అసెంబ్లీ రద్దవుతుంది. క్రొత్తగా ఎన్నుకోబడిన ఫెడరల్ అసెంబ్లీ సభ్యులు, పౌరులు ప్రతిపాదించిన రీతిలో ముసాయిదా రాజ్యాంగ బిల్లును రూపొందించి ఆమోదిస్తారు. ఆ తరువాత ఆ బిల్లుపై ప్రజాభీష్టాన్ని తెలుసుకొనేందుకై దేశవ్యాప్తంగా ఓటింగ్ నిర్వహించబడుతుంది. ఆ బిల్లును దేశంలోని మెజారిటీ దేశ ప్రజలు, కాంటన్లు ఆమోదించినట్లయితే ఆ అంశంపై రాజ్యాంగ సవరణ జరుగుతుంది.

3) పునరాయనం (Recall): పునరాయనం అనేది ఒక ముఖ్యమైన ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనం. ఈ పద్దతిలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు లేదా అధికారులు ఉద్దేశ్యపూర్వకంగా తమ కర్తవ్యాలను నిర్వహించడంలో విఫలమైతే వారిని ఓటర్లు వెనుకకు పిలిచేందుకు వీలుంటుంది. దీనినే పునరాయనం అంటారు. ఈ రకమైన పద్ధతి అమెరికాలోని అరిజోనా, మోంటానా, లూసియానా, కాన్సాస్, కాలిఫోర్నియా, నెవెడా, ఓరెగాన్ మొదలగు రాష్ట్రాలలో అమలులో ఉంది.

4) ప్రజాభిప్రాయ నిర్ణయం (Plebiscite): ప్రజాభిప్రాయ నిర్ణయం (Plebiscite) అనే పదానికి ఫ్రాన్స్లో మూలాలున్నాయి. ఆ పదం లాటిన్ భాషలోని ప్లెబిస్ (Plebis), సెటిమ్ (Scitum) అనే రెండు పదాల నుంచి ఉద్భవించింది. లాటిన్ భాషలో ప్లెబిస్ అంటే ‘ప్రజలు’, సెటమ్’ అంటే ‘నిర్ణయం’ లేదా తీర్పు. ప్రజా నిర్ణయం లేదా ప్రజాతీర్పని అర్థం. అదేవిధంగా ఒకానొక ప్రభుత్వ విధానంపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకొనేందుకు అనుసరించే ప్రజాస్వామ్య సాధనమే ప్రజాభిప్రాయ నిర్ణయంగా పేర్కొనవచ్చు. ప్రజా నిర్ణయానికి దైనందిన చట్ట నిర్మాణ కార్యక్రమానికి ఎటువంటి సంబంధం లేదు. ప్రజాభిప్రాయ నిర్ణయంలోని ముఖ్య లక్షణం ఏమిటంటే ఈ పద్ధతి ప్రకారం వెలువడిన ప్రజల నిర్ణయాలు అంతిమమైనవి. వాటికి ఏ విధమైన మార్పులు చేయబడవు.

AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

ఆధునిక కాలంలో 1804లో ఫ్రాన్స్లో ఆనాటి రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు నెపోలియన్ మొదటిసారిగా ఈ సాధనాన్ని వినియోగించాడు. అప్పటి నుంచి దానిని పలు పర్యాయాలు వినియోగించడమైంది.

భారత ఉపఖండంలో ఈ సాధనాన్ని వినియోగించే విషయంలో భారత్ పాకిస్తాన్ల మధ్య గతంలో వాదోపవాదనలు జరిగాయి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రజాస్వామ్యం వివిధ దృక్కోణాలేవి ?
జవాబు:
ప్రజాస్వామ్యం వివిధ దృక్కోణాలను కలిగి ఉంది. వాటిలో ముఖ్యమైనవి స్వేచ్ఛ, సమానత్వం, రాజకీయ పార్టీలు, సమన్యాయ పాలన, అధికార వికేంద్రీకరణ మొదలగునవి. వాటిని గురించి ఈ క్రింది పేర్కొన్న విధంగా భావించవచ్చు. అవి:
1) స్వేచ్ఛ: ప్రజాస్వామ్యం యొక్క ముఖ్య దృక్కోణంగా స్వేచ్ఛను పేర్కొనవచ్చు. ఈ వ్యవస్థ అమలులో ఉన్న రాజ్యాలలో నివసించే పౌరులు సంపూర్ణ స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను కలిగి ఉంటారు.

2) సమానత్వం: ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ప్రధాన ప్రాతిపదిక సమానత్వం. ఈ వ్యవస్థ అమలులో ఉన్న రాజ్యాలలో నివసించే ప్రజలంతా ఎటువంటి తారతమ్యాలు, వ్యత్యాసాలు లేకుండా ఆర్థిక, రాజకీయ, సాంఘిక, పౌర సమానత్వాన్ని కలిగి ఉంటారు.

3) రాజకీయ పార్టీలు: రాజకీయ పార్టీలను ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క మరొక దృక్కోణంగా మనం భావించవచ్చు. ఈ వ్యవస్థలో నిర్ణీత కాలంలో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలలో మెజారిటీ నియోజక వర్గాలలో గెలుపొందిన రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుంది. రెండవ పార్టీ ప్రతిపక్ష పార్టీగా వ్యవహరిస్తుంది. ఇది ద్విరాజకీయ పార్టీ విధానం అమలులో ఉన్న రాజ్యాలలో జరిగే సాధారణ లేదా సహజ ప్రక్రియ.

4) సమన్యాయ పాలన: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలంతా చట్టం ముందు సమానులే. చట్టాలను అమలు పరచే విషయంలో రాజ్యం, ప్రభుత్వం, జాతి, మత, కుల, వర్గ, వర్ణ, లింగ ప్రాతిపదికన ఏ వ్యక్తిని ఎటువంటి వివక్షతకు, పక్షపాతానికి గురి చేయకూడదు.

5) అధికార వికేంద్రీకరణ: అధికార వికేంద్రీకరణను ప్రజాస్వామ్య ప్రభుత్వం యొక్క ముఖ్యమైన దృక్కోణంగా పేర్కొనవచ్చు. రాజ్యము యొక్క సర్వ అధికారములు ప్రభుత్వ శాఖల మధ్య వికేంద్రీకరించబడతాయి.

ప్రశ్న 2.
ప్రజాస్వామ్యంలోని వివిధ రకాలను వర్ణించండి.
జవాబు:
అర్థం: Democracy అనే ఇంగ్లీషు పదం ‘Demos’ మరియు ‘Kratos’ అనే రెండు గ్రీకు పదాల కలయిక నుంచి ఆవిర్భవించింది. డెమోస్ అంటే ‘ప్రజలు’ క్రటోస్ అంటే ‘అధికారం’ లేదా ‘పాలన’ అని అర్థం.

నిర్వచనం: “ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క ప్రజల చేత, ప్రజల కొరకు నిర్వహించబడే ప్రభుత్వం”. – అబ్రహాం లింకన్

ప్రజాస్వామ్యం – వివిధ రకాలు:
1) ప్రత్యక్ష లేదా స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం: ఈ పద్ధతిలో ప్రజలు ప్రభుత్వ పాలన వ్యవహారాలలో ప్రత్యక్షంగా పాల్గొంటారు. శాసన సంబంధమైన అధికారాలన్నీ వారు చెలాయిస్తారు. ప్రజలే చట్ట సభలలో పాల్గొని చట్టాలను రూపొందిస్తారు. రాజ్య వ్యవహారాలలో ప్రజలు ప్రత్యక్షంగా భాగస్వామ్యం వహిస్తారు.
ప్రత్యక్ష ప్రజాస్వామ్య విధానం ప్రస్తుతం స్విట్జర్లాండ్లో కొన్ని కాంటన్ల (Cantons) లోనూ, అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలోనూ నెలకొని ఉంది.

2) పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం: ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రతినిధుల ద్వారా ప్రభుత్వ పాలన నిర్వహించబడటాన్ని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం లేదా పరోక్ష ప్రజాస్వామ్యం అని అంటారు. నిర్ణీత సమయానికి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు తమ అధికార, విధుల నిర్వహణలో ప్రజలకు బాధ్యత వహిస్తారు. ప్రజా ప్రతినిధులు తమ అధికార విధుల నిర్వహణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించటంలో విఫలమైతే వారిని ప్రజలు ఎన్నికల సమయంలో పదవుల నుండి తొలగిస్తారు.

AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

ప్రశ్న 3.
ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:
ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధుల ద్వారా ప్రభుత్వ పాలన నిర్వహించబడటాన్ని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం లేదా పరోక్ష ప్రజాస్వామ్యం అని అంటారు. నిర్ణీత సమయానికి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు తమ అధికార, విధుల నిర్వహణలో ప్రజలకు బాధ్యత వహిస్తారు. ప్రజా ప్రతినిధులు తమ అధికార విధుల నిర్వహణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించటంలో విఫలమైతే వారిని ప్రజలు ఎన్నికల సమయంలో పదవుల నుండి తొలగిస్తారు.

పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంను తిరిగి రెండు రకాలుగా వర్గీకరించడమైనది. అవి: 1) అధ్యక్ష ప్రజాస్వామ్యం 2) పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. అధ్యక్ష ప్రజాస్వామ్య విధానంలో అధికారాలన్నీ ఒకే ఒక కార్యనిర్వాహక అధిపతి వినియోగించడమే కాక కార్యనిర్వాహక అధికారాలన్నీ అధ్యక్షుడి చేతిలో కేంద్రీకృతమై ఉంటాయి. ఉదా: అమెరికా అధ్యక్షుడు అందుకు విరుద్ధంగా పార్లమెంటరీ విధానంలో ప్రధానమంత్రి నాయకత్వంలోని కొందరు మంత్రులు దేశ ‘ అధ్యక్షుడి పేరుతో కార్య నిర్వాహక అధికారాలను వినియోగిస్తారు. ప్రధానమంత్రితో కూడిన మంత్రులు తమ అధికార విధుల నిర్వహణలో పార్లమెంటుకు బాధ్యత వహిస్తారు. ఉదా: బ్రిటన్, ఇండియా, ఆస్ట్రేలియా మొదలైనవి.

ప్రశ్న 4.
ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలను వివరించండి.
జవాబు:
ప్రత్యక్ష ప్రజాస్వామ్యం: ఈ పద్ధతిలో ప్రజలు ప్రభుత్వ పాలన వ్యవహారాలలో ప్రత్యక్షంగా పాల్గొంటారు. శాసన సంబంధమైన అధికారాలన్నీ వారు చెలాయిస్తారు. ప్రజలే చట్ట సభలలో పాల్గొని చట్టాలను రూపొందిస్తారు. రాజ్య వ్యవహారాలలో ప్రజలు ప్రత్యక్షంగా భాగస్వామ్యం వహిస్తారు.

ప్రత్యక్ష ప్రజాస్వామ్య విధానం ప్రస్తుతం స్విట్జర్లాండ్లో కొన్ని కాంటన్ల (Cantons) లోనూ, అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలోనూ నెలకొని ఉంది.
ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలు: ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలు నాలుగు రకాలుగా ఉంటాయి. అవి: –

  1. ప్రజాభిప్రాయ సేకరణ (Referendum)
  2. ప్రజాభిప్రాయ నివేదన (Initiative)
  3. పునరాయనం (Recall)
  4. ప్రజాభిప్రాయ నిర్ణయం (Plebiscite)

1) ప్రజాభిప్రాయ సేకరణ (Referendum): రిఫరెండమ్ (referendum) అనే ఆంగ్ల పదానికి అర్థం “ప్రజాభిప్రాయ సేకరణ”. ఒకానొక అంశంపై ప్రజల అభిప్రాయాన్ని ప్రత్యక్షంగా తెలుసుకొనే ప్రక్రియనే ప్రజాభిప్రాయ సేకరణ అంటారు. ఇటువంటి అంశం సాధారణమైనది లేదా రాజ్యాంగపరమైనది కావచ్చు. ఆర్.సి. బ్రూక్స్ ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ అనేది శాసనసభ అప్పటికే ఆమోదించిన బిల్లు లేదా చట్టంపై నియోజకుల అభిప్రాయాన్ని తెలుసుకొనేందుకు ఉద్దేశించింది.

2) ప్రజాభిప్రాయ నివేదన (Initiative): ప్రత్యక్ష ప్రజాస్వామ్య సమర్థకులు ఒక్క ప్రజాభిప్రాయ సేకరణతో సంతృప్తి చెందలేదు. దాంతో ప్రజలు శాసన నిర్మాణ ప్రక్రియలో ప్రజలు పాల్గొనేలా ప్రజాభిప్రాయ నివేదన గురించి వారు గట్టిగా చెప్పారు. ఉదాహరణకు స్విట్జర్లాండ్లో 50,000 మంది పౌరులు ఏదైనా ఒక అంశం పై చట్టాన్ని రూపొందించాల్సిందిగా శాసనసభను కోరుతూ ఒక అర్జీపై సంతకం చేయవచ్చు. అప్పుడు వారి ప్రతిపాదనను ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి పంపించబడుతుంది. మెజారిటీ పౌరులు ఆ ప్రతిపాదన ఆమోదించినట్లయితే, ఆ అంశం చట్టంగా ఆమోదితమై అమల్లోకి వస్తుంది. స్విట్జర్లాండ్ లోని కాంటన్లలో (రాష్ట్రాలలో) సాధారణ అంశాలతోపాటుగా రాజ్యాంగ ప్రాముఖ్యతగల అంశాలపై ప్రజల అభిప్రాయాన్ని కోరడం ఎప్పటి నుంచో వాడుకలో ఉంది. అయితే అటువంటి ప్రతిపాదనపై సంతకం చేసే వారి సంఖ్య ఆ దేశంలో రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటుంది.

3) పునరాయనం (Recall): పునరాయనం అనేది ఒక ముఖ్యమైన ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనం. ఈ పద్ధతిలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు లేదా అధికారులు ఉద్దేశ్యపూర్వకంగా తమ కర్తవ్యాలను నిర్వహించడంలో విఫలమైతే వారిని ఓటర్లు వెనుకకు పిలిచేందుకు వీలుంటుంది. దీనినే పునరాయనం అంటారు. ఈ రకమైన పద్దతి అమెరికాలోని అరిజోనా, ‘మోంటానా, లూసియానా, కాన్సాస్, కాలిఫోర్నియా, నెవెడా, ఓరెగాన్ మొదలగు రాష్ట్రాలలో అమలులో ఉంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

4) ప్రజాభిప్రాయ నిర్ణయం (Plebiscite): ప్రజాభిప్రాయ నిర్ణయం (Plebiscite) అనే పదానికి ఫ్రాన్స్లో మూలాలున్నాయి. ఆ పదం లాటిన్ భాషలోని ప్లెబిస్ (Plebis), సెటమ్ (Scitum) అనే రెండు పదాల నుంచి ఉద్భవించింది. లాటిన్ భాషలో ప్లెబిస్ అంటే ‘ప్రజలు’, సెటమ్ అంటే ‘నిర్ణయం’ లేదా తీర్పు. ప్రజా నిర్ణయం లేదా ప్రజా తీర్పని అర్థం. అదేవిధంగా ఒకానొక ప్రభుత్వ విధానంపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకొనేందుకు అనుసరించే ప్రజాస్వామ్య సాధనమే ప్రజాభిప్రాయ నిర్ణయంగా పేర్కొనవచ్చు. ప్రజా నిర్ణయానికి దైనందిన చట్ట నిర్మాణ కార్యక్రమానికి ఎటువంటి సంబంధం లేదు. ప్రజాభిప్రాయ నిర్ణయంలోని ముఖ్య లక్షణం ఏమిటంటే ఈ పద్ధతి ప్రకారం వెలువడిన ప్రజల నిర్ణయాలు అంతిమమైనవి. వాటికి ఏ విధమైన మార్పులు చేయబడవు.

ప్రశ్న 5.
ప్రజాస్వామ్యాన్ని నిర్వచించి, ప్రజాస్వామ్య ప్రాముఖ్యతను పేర్కొనండి.
జవాబు:
నిర్వచనాలు:
1) “ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క ప్రజల చేత, ప్రజల కొరకు నిర్వహించబడే ప్రభుత్వం” అని అబ్రహాం లింకన్ పేర్కొన్నాడు.

2) “ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వమే ప్రజాస్వామ్యం” అని జె.ఆర్.సీలీ పేర్కొన్నాడు. ప్రజాస్వామ్య ప్రాముఖ్యత: ప్రజాస్వామ్యం అనేది ఆధునిక జీవన విధానం. ప్రజాస్వామ్యంలో మాత్రమే వ్యక్తుల స్వీయ గౌరవాలకు హామీ ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలు మొదలుకొని వర్తమాన కాలం వరకు అనుసరిస్తున్నారు. వర్తమాన కాలంలో సమాజం, రాజ్యం, ప్రభుత్వం వంటి అనేక సంస్థల నిర్మాణ నిర్వహణలలో ప్రజాస్వామ్యం ముఖ్యమైన సాధనంగా భావించబడింది.

ప్రజాస్వామ్యం వివక్షతలు లేని సమాజాన్ని ఏర్పాటు చేయాలని ఆశిస్తుంది. ప్రజాస్వామ్యం ప్రజలకు అనేక హక్కులను ప్రసాదిస్తుంది. అదే సమయంలో వారు కొన్ని బాధ్యతలను నిర్వర్తించేలా చూస్తుంది. ప్రజాస్వామ్యం అన్ని కాలాలకు సౌకర్యవంతమైన ప్రభుత్వంగా భావించబడుతుంది. ప్రబలమైన రాజకీయ ఉద్రిక్తతలు, సామాజిక ఒత్తిడులు ఉన్నప్పుడు కూడా ప్రజాస్వామ్యం శాంతియుతమైన, రాజ్యాంగబద్ధమైన పరిష్కారాలను అందిస్తుంది.

ప్రజాస్వామ్యం విభిన్నమైన సామాజిక, ఆర్థిక శక్తులు పరస్పరం పనిచేసేందుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ సందర్భంలో లార్డ్ బ్రైస్ ప్రజాస్వామ్యం గురించి వ్యాఖ్యానిస్తూ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఆస్తి, సామాజిక హోదాలతో సంబంధం లేకుండా స్నేహపూర్వక, సామరస్య ధోరణులతో వ్యవహరిస్తారని పేర్కొన్నాడు. ఒక్క మాటలో ప్రజాస్వామ్యంలో అసమ్మతివాదులు, వ్యతిరేకులు, విరుద్ధ భావాలు గల వారికి కూడా ప్రభుత్వ వ్యవహారాలలో భాగస్వామ్యం ఉంటుంది. ఈ ప్రక్రియలో సంప్రదింపులు, సఖ్యత, రాజీ, ఏకాభిప్రాయం వంటి నాలుగు రకాల సాధనాల ద్వారా నిర్ణయాలను తీసుకోవడమవుతుంది. కాబట్టి పై అంశాలను బట్టి ఆధునిక సమాజాలలో ప్రజాస్వామ్య విలువను గమనించవచ్చు.

ప్రశ్న 6.
ప్రజాస్వామ్యంలోని ఏవైనా మూడు సుగుణాలు, లోపాలను వివరించండి. [Mar. 2017]
జవాబు:
ప్రజాస్వామ్యం ప్రయోజనాలు (Merits of Democracy): సమకాలీన ప్రపంచంలో ప్రజాస్వామ్యం విశేషమైన ప్రజాభిమానాన్ని చూరగొంది. దాదాపు ప్రముఖ రాజ్యాలన్నీ ప్రజాస్వామ్యాన్ని తమ రాజకీయ సిద్ధాంతంగా అనుసరిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో కింద పేర్కొన్న ప్రయోజనాలున్నాయి.
1) సమర్థవంతమైన ప్రభుత్వం (Efficient Government): ప్రజాస్వామ్యాన్ని సమర్థవంతమైన, పటిష్టమైన ప్రభుత్వంగా ప్రొఫెసర్ గార్నర్ వర్ణించాడు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సాధారణ సమయాలలోనూ, అత్యవసర పరిస్థితులలోనూ ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగానూ, పటిష్టంగానూ కొనసాగుతాయి. ప్రజలచే ఎన్నిక, ప్రజల నియంత్రణ, ప్రజలకు బాధ్యత అనే ప్రజాస్వామ్య సూత్రాలు గోచరిస్తాయి. అవి ఇతర ప్రభుత్వాలతో పోల్చినపుడు ఇందులో సమర్థతను చేకూర్చుతాయి.

2) వ్యక్తి స్వేచ్ఛల సమర్థన (Upholds Individual Liberties): ప్రజాస్వామ్య ప్రభుత్వం మాత్రమే వ్యక్తి స్వేచ్ఛలను సమర్థిస్తుంది. రాజ్యాంగపరమైన అనేక రక్షణల ద్వారా వ్యక్తుల హామీలకు హామీ ఇస్తుంది. ఈ అంశం ప్రాతిపదికపై జె.ఎస్.మిల్ ప్రజాస్వామ్యాన్ని సమర్థించాడు. ప్రజాస్వామ్యం ప్రజలకు వాక్, సభా, పత్రికా స్వాతంత్రాలు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలను ప్రసాదిస్తుందని అతడు ప్రకటించాడు.

3) సమానత్వానికి హామీ (Assures Equality): ప్రజాస్వామ్యం రాజకీయ, ఆర్థిక రంగాలలోని వ్యక్తుల యొక్క సమానత్వానికి హామీ ఇస్తుంది. రాజకీయ రంగంలో పౌరుల కుల, వర్ణం, పుట్టుక వంటి అంశాలతో ప్రమేయం లేకుండా వారికి ఓటు హక్కు, ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీచేసే హక్కు, ప్రభుత్వ పదవులను చేపట్టే హక్కు వంటి రాజకీయ హక్కులను పౌరులకు ప్రసాదిస్తుంది. సమాజంలో ఇతర వర్గాలను విస్మరించి కొద్దిమంది వ్యక్తులకు ప్రత్యేక హక్కులను కల్పించడాన్ని వ్యతిరేకిస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

ప్రజాస్వామ్యం లోపాలు:
1) అజ్ఞానుల పాలన (Rule by Ignorants): అరిస్టాటిల్ ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వ వికృత రూపంగా పరిగణించాడు. ప్రజాస్వామ్యమనేది ఒక రకమైన మూకపాలనగా భావించాడు. అతడి గురువైన ప్లేటో ప్రజాస్వామ్యాన్ని అజ్ఞానుల పాలనగా పిలిచాడు. ప్రజాస్వామ్యంలో ఓట్ల లెక్కింపు మాత్రమే జరుగుతుందని మరికొందరు విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అనేక అంశాలపై నిర్ణయాలనేవి శాసనసభ, మంత్రివర్గ సమావేశాలలో మెజారిటీ సభ్యుల అభీష్టం మేరకు జరుగుతాయి. దాంతో యోగ్యులు, నిజాయితీ గల వ్యక్తులు దూరంగా ఉంచబడి, అజ్ఞానులు, మూర్ఖులు ప్రాధాన్యత కలిగి ఉంటారు.

2) ధనికులకు అనుకూలత (Favours the Rich): ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాలలో అధిక భాగం పెట్టుబడిదారీ స్వభావాన్ని కలిగి ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు సంపన్న వర్గాల వారి పట్ల సానుకూలతను ప్రదర్శిస్తాయి. ఎన్నికలనేవి ఒక ప్రహసనంగా మారుతాయి. ప్రజాస్వామ్యంలో ఓటర్లను దైవంగా గుర్తించడమవుతుంది. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు కులం, వర్ణం, మతం, పుట్టుక, ప్రాంతం వంటి అంశాల వారీగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తారు. వారికి భౌతిక, ధన, కనక వస్తువులను అందించడం ద్వారా ఆకర్షిస్తారు.

3) అధిక సంఖ్యాకుల పాలన అనేది ఒక భ్రమ (Majority rule-a Myth): ఒకప్పుడు 1980వ దశకం వరకు ప్రజాస్వామ్యాన్ని అధిక సంఖ్యాకుల పాలనగా పరిగణించడమైంది. ఆ తరువాత జాతీయ, అంతర్జాతీయ రంగాలలో సంభవించిన నాటకీయ పరిణామాల ఫలితంగా అనేక మార్పులు సంభవించాయి. విద్య, అక్షరాస్యత, విజ్ఞాన వికాసం, పత్రికలు, వార్తా దృశ్య సాధనాలు, ఫేస్బుక్, ట్విట్టర్, ఇతర సామాజిక మాధ్యమాలు రాజకీయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చాయి. సంకీర్ణ ప్రభుత్వ రాజకీయ సంస్కృతి సాధారణ రాజకీయ పరిణామంగా మారింది. ప్రాచీన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలుగా పేరుగాంచిన బ్రిటన్ వంటి రాజ్యాలలో సైతం సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటయినాయి. అలాగే అభివృద్ధి చెందుతున్న ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ వంటి దేశాలలో కూడా సంకీర్ణ ప్రభుత్వాలు అనివార్యమవుతున్నాయి. అందుకు కారణం ఆయా దేశాలలో శాసనసభలలో ఏ ఒక్క పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పరచే సంపూర్ణమైన మెజారిటీ స్థానాలు లభించకపోవడంగా పేర్కొనవచ్చు. దాంతో శాసనసభలలో ఎక్కువ స్థానాలు (మెజారిటీ స్థానాలు కాకుండ) గెల్చుకున్న అతిపెద్ద పార్టీ మిగిలిన చిన్న పార్టీలతో కలసి సంకీర్ణ భాగస్వామ్యంగా ఏర్పడి, కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం సర్వ సాధారణమైంది. అటువంటి ప్రభుత్వాలు శాసనసభలలో మెజారిటీ సభ్యుల మద్దతును పొందక పార్లమెంటరీ ప్రమాణాల పతనానికి దారితీశాయి. భారతదేశంలో 1990వ దశకం ద్వితీయార్థం నుంచి 2014 ప్రథమార్థం వరకు జాతీయ స్థాయిలో ఏర్పడిన ఐక్య సంఘటన (United Front), జాతీయ ప్రజాస్వామ్య కూటమి (National Democratic Alliance), ఐక్య ప్రగతిశీల కూటమి (United Progressive Alliance) ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు.

ప్రశ్న 7.
ప్రజాస్వామ్యాన్ని నిర్వచించి, ప్రజాస్వామ్య సుగుణాలను తెలపండి.
జవాబు:
నిర్వచనాలు:
1) “ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క ప్రజల చేత, ప్రజల కొరకు పరిపాలించే, నిర్వహించబడే ప్రభుత్వం” అని అబ్రహాం లింకన్ పేర్కొన్నాడు.

2) “ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వమే ప్రజాస్వామ్యం” అని జె.ఆర్.సీలీ పేర్కొన్నాడు.
1) సమర్థవంతమైన ప్రభుత్వం (Efficient Government): ప్రజాస్వామ్యాన్ని సమర్థవంతమైన, పటిష్టమైన ప్రభుత్వంగా ప్రొఫెసర్ గార్నర్ వర్ణించాడు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సాధారణ సమయాలలోనూ, అత్యవసర పరిస్థితులలోనూ ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగానూ, పటిష్టంగానూ కొనసాగుతాయి. ప్రజలచే ఎన్నిక, ప్రజల నియంత్రణ, ప్రజలకు బాధ్యత అనే ప్రజాస్వామ్య సూత్రాలు గోచరిస్తాయి. అవి ఇతర ప్రభుత్వాలతో పోల్చినపుడు ఇందులో సమర్థతను చేకూర్చుతాయి.

2) వ్యక్తి స్వేచ్ఛల సమర్థన (Upholds Individual Liberties): ప్రజాస్వామ్య ప్రభుత్వం మాత్రమే వ్యక్తి స్వేచ్ఛలను సమర్థిస్తుంది. రాజ్యాంగపరమైన అనేక రక్షణల ద్వారా వ్యక్తుల హామీలకు హామీ ఇస్తుంది. ఈ అంశం ప్రాతిపదికపై జె. ఎస్. మిల్ ప్రజాస్వామ్యాన్ని సమర్థించాడు. ప్రజాస్వామ్యం ప్రజలకు వాక్, సభా, పత్రికా స్వాతంత్రాలు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలను ప్రసాదిస్తుందని అతడు ప్రకటించాడు.

3) సమానత్వానికి హామీ (Assures Equality): ప్రజాస్వామ్యం రాజకీయ, ఆర్థిక రంగాలలోని వ్యక్తుల యొక్క సమానత్వానికి హామీ ఇస్తుంది. రాజకీయ రంగంలో పౌరుల కుల, వర్ణం, పుట్టుక వంటి అంశాలతో ప్రమేయం లేకుండా వారికి ఓటు హక్కు, ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీచేసే హక్కు, ప్రభుత్వ పదవులను చేపట్టే హక్కు వంటి రాజకీయ హక్కులను పౌరులకు ప్రసాదిస్తుంది. సమాజంలో ఇతర వర్గాలను విస్మరించి కొద్దిమంది వ్యక్తులకు ప్రత్యేక హక్కులను కల్పించడాన్ని వ్యతిరేకిస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

4) ప్రజలను విద్యావంతులను చేయడం (Educates the Masses): ప్రజలను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు బృహత్తర ప్రయోగాలకు వీలు కల్పించే సాధనంగా ప్రజాస్వామ్యాన్ని కొందరు వర్ణించారు. వివిధ ప్రాతినిధ్య సంస్థలకు విభిన్న సమయాలలో జరిగే ఎన్నికలు, సంబంధిత ప్రచార ఉద్యమాలు ప్రజాస్వామ్యంలో పౌరులను విద్యావంతులుగా తీర్చిదిద్దుతుంది.

5) దేశభక్తిని పెంపొందించడం (Instills Patriotism): ప్రజాస్వామ్యం ప్రజలలో దేశభక్తిని పెంపొందిస్తుంది. ప్రజాస్వామ్యంలో వివిధ సంస్థల సభ్యుల ఎంపిక, ఎన్నికలలో ప్రజలకు ఎన్నో అవకాశాలు లభిస్తాయి. ప్రాతినిధ్య సంస్థలలో ప్రజలు పాల్గొని అవి విజయవంతంగా పనిచేసేటట్లు జాగ్రత్త వహిస్తారు. వీటి నిర్వహణలో పాల్గొనడాన్ని ప్రజలు ఎంతో గర్వంగా భావిస్తారు. దేశం క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు ప్రజలు తమ సహాయ సహకారాలను అందించడంలో ఎంతో ఆసక్తిని చూపుతారు. గతంలో ఇండియాపై చైనా, పాకిస్తాన్లు దురాక్రమణ జరిపిన సందర్భాలలో భారతీయులు చూపించిన చొరవ, ప్రదర్శించిన దేశభక్తి ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు.

6) స్థిరత్వానికి హామీ (Ensures Stability): ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వం ఉండటం వల్ల విప్లవాల బారి నుంచి దేశాన్ని కాపాడేందుకు అవకాశం ఉంటుంది. ఈ.వ్యవస్థలో ప్రజలు ఎన్నికల సమయంలో వ్యతిరేక ఓటు (Negative Vote) వినియోగం ద్వారా ప్రభుత్వాన్ని మార్చివేయగలుగుతారు.

7) ఒకే సమయంలో శాంతి, ప్రగతి (Simultaneous Order and Progress): నియంతృత్వం దేశ ప్రగతిని నిర్లక్ష్యం చేసి భద్రతకు హామీ ఇస్తుంది. అందుకు విరుద్ధంగా ప్రజాస్వామ్యం రాజ్యాంగబద్ధమైన పాలన ద్వారా శాంతి భద్రతల నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తుంది. వివిధ రంగాలలో ప్రజల ఔన్నత్యానికి కృషి చేస్తుంది. భారత
ప్రజాస్వామ్య వ్యవస్థలో దీనిని మనం గమనించవచ్చు. జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబ్దుల్ కలామ్ అజాద్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వంటి ఆదర్శవంతమైన నాయకులు, రాజనీతిజ్ఞులు శైశవదశలో ఉన్న భారత ప్రజాస్వామ్యాన్ని జాతీయ, అంతర్జాతీయ రంగాలలో శక్తివంతమైన, సార్థకమైందిగా తీర్చిదిద్దేందుకు ఎంతగానో, కృషి చేశారు.

8) ప్రజలను బాధ్యతాయుతులుగా చేయడం (Makes the People Responsible): ప్రజాస్వామ్యం వ్యక్తి సామర్థ్యాన్ని గుర్తిస్తుంది. వ్యక్తులలో చొరవను ఏర్పరచేందుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ప్రజలలో బాధ్యతాయుత ప్రవర్తనను పెంపొందిస్తుంది. ఈ రకమైన పరిస్థితి ఇతర ప్రభుత్వ రకాలలో గోచరించదు. అంతేకాకుండా ప్రజాస్వామ్యం వ్యక్తుల వ్యక్తిత్వ వికాస సాధనకు దోహదపడి వారి ఔన్నత్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.

9) పౌరసత్వ శిక్షణ పాఠశాల (Training School for Citizenship): ప్రజాస్వామ్యపు మరొక సుగుణం ఏమిటంటే ఇది ఒక ఉత్తమ పౌరసత్వ పాఠశాలగా వ్యవహరిస్తుంది. ఎన్నికల సమయంలో ఓటుహక్కు, అభ్యర్థులను ఎన్నుకొనే హక్కు వంటి రాజకీయ హక్కులను పౌరులకు అందించడంలో హామీ ఇస్తుంది. అటువంటి హక్కులు, ఇతర రాజకీయ హక్కులలాగా, పౌరసత్వ పాఠాలను నేర్చుకొనేందుకు పౌరులకు సహాయకారిగా ఉంటాయి.

10) హేతుబద్ధమైన ప్రభుత్వం (A Rational Government): “ఏ ఒక్కరూ సంపూర్ణంగా దోషరహితులు ‘కారు’ అనే సూత్రంపై ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంటుంది. అధికార దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అవసరమైన చర్యలు, విమర్శలతో కూడిన ప్రక్రియను ప్రజాస్వామ్యం అనుసరిస్తుంది. అంతేకాకుండా రాజకీయ వ్యవస్థ హేతుబద్ద స్వభావాన్ని ప్రజాస్వామ్యం సంరక్షిస్తుంది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రజాస్వామ్యమనగానేమి ? రెండు నిర్వచనాలను రాయండి. [Mar. ’18, ’17, ’16]
జవాబు:
ప్రజాస్వామ్యాన్ని ఆంగ్లంలో ‘డెమోక్రసీ’ అంటారు. ఈ పదము రెండు గ్రీకు పదాలైన ‘డెమోస్’ మరియు ‘క్రటోస్’ ల నుండి గ్రహించబడింది. డెమోస్ అంటే ప్రజలు, క్రటోస్ అంటే అధికారం లేదా పాలన అని అర్థం. అంటే డెమోక్రసీ అంటే ప్రజల అధికారం లేదా ప్రజల పాలన.

  1. “ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క ప్రజల చేత, ప్రజల కొరకు పరిపాలించే, నిర్వహించబడే ప్రభుత్వం” అని అబ్రహాం లింకన్ పేర్కొన్నాడు.
  2. “ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వమే ప్రజాస్వామ్యం” అని జె.ఆర్.సీలీ పేర్కొన్నాడు.

AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

ప్రశ్న 2.
ప్రత్యక్ష ప్రజాస్వామ్యం గురించి నీకు తెలిసింది రాయండి.
జవాబు:
ప్రత్యక్ష ప్రజాస్వామ్యం: ఈ పద్ధతిలో ప్రజలు ప్రభుత్వ పాలన వ్యవహారాలలో ప్రత్యక్షంగా పాల్గొంటారు. శాసన సంబంధమైన అధికారాలన్నీ వారు చెలాయిస్తారు. ప్రజలే చట్ట సభలలో పాల్గొని చట్టాలను రూపొందిస్తారు. రాజ్య వ్యవహారాలలో ప్రజలు ప్రత్యక్షంగా భాగస్వామ్యం వహిస్తారు.

ప్రత్యక్ష ప్రజాస్వామ్య విధానం ప్రస్తుతం స్విట్జర్లాండ్లో కొన్ని కాంటన్ల (Cantons) లోనూ, అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలోనూ నెలకొని ఉంది.

ప్రశ్న 3.
ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం గురించి నీకు గల అవగాహన ఏమిటి ?
జవాబు:
ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధుల ద్వారా ప్రభుత్వ పాలన నిర్వహించబడటాన్ని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం లేదా పరోక్ష ప్రజాస్వామ్యం అని అంటారు. నిర్ణీత సమయానికి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు తమ అధికార, విధుల నిర్వహణలో ప్రజలకు బాధ్యత వహిస్తారు. ప్రజా ప్రతినిధులు తమ అధికార విధుల నిర్వహణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించటంలో విఫలమైతే వారిని ప్రజలు ఎన్నికల సమయంలో పదవుల నుండి తొలగిస్తారు.

ప్రశ్న 4.
ప్రజాస్వామ్య లక్షణాలు ఏవి ?
జవాబు:
ప్రజా ప్రభుత్వం, ప్రజల నియంత్రణ, వ్యక్తి హుందాతనం, ఎన్నికలు, ప్రజలకు జవాబుదారీతనం, ప్రాథమిక స్వేచ్ఛలు, స్వతంత్ర న్యాయశాఖ మరియు సమానత్వం మొదలగు వాటిని ప్రజాస్వామ్య లక్షణాలుగా పేర్కొనవచ్చు.

ప్రశ్న 5.
ప్రజాస్వామ్య విజయానికి నాలుగు పరిస్థితులను రాయండి.
జవాబు:

  1. సరైన విద్య
  2. వికాసవంతమైన పౌరసత్వం
  3. స్వతంత్ర పత్రికలు
  4. దృఢమైన ప్రతిపక్షం.

ప్రశ్న 6.
ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలను రాయండి. [Mar. ’18, ’17, ’16]
జవాబు:
ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలు నాలుగు. అవి:

  1. ప్రజాభిప్రాయ సేకరణ
  2. ప్రజాభిప్రాయ నివేదన
  3. పునరాయనము
  4. ప్రజాభిప్రాయ నిర్ణయం.

ప్రశ్న 7.
ప్రజాభిప్రాయ సేకరణ గురించి నీకు తెలిసింది రాయండి.
జవాబు:
‘ప్రజాభిప్రాయ సేకరణ’ ని ఆంగ్లంలో ‘రిఫరెండమ్ (Referendum)’ అంటారు. ఒకానొక అంశంపై ప్రజల అభిప్రాయాన్ని ప్రత్యక్షంగా తెలుసుకొనే ప్రక్రియనే ప్రజాభిప్రాయ సేకరణ అంటారు. ఇటువంటి అంశం సాధారణమైనది కావచ్చు లేదా రాజ్యాంగపరమైనది కావచ్చు. ఆర్.సి. బ్రూక్స్ ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ అనేది శాసనసభ ఇప్పటికే ఆమోదించిన బిల్లు లేదా చట్టంపై నియోజకుల అభిప్రాయాన్ని తెలుసుకొనేందుకు ఉద్దేశించింది.

ప్రశ్న 8.
ప్రజాభిప్రాయ నివేదన అంటే ఏమిటి ?
జవాబు:
శాసన నిర్మాణ ప్రక్రియలో ప్రజలు పాల్గొనేందుకు తోడ్పడే ప్రక్రియనే ప్రజాభిప్రాయ నివేదన అని అంటారు. ఉదా: స్విట్జర్లాండ్లో 50,000 మంది పౌరులు ఏదైనా ఒక అంశంపై చట్టాన్ని రూపొందించాల్సిందిగా శాసనసభను కోరుతూ ఒక అర్జీపై సంతకం చేసినట్లయితే, వారి ప్రతిపాదనను ప్రజల అభిప్రాయానికి పంపబడుతుంది. మెజారిటీ ప్రజలు ఆ ప్రతిపాదనను ఆమోదించినట్లయితే ఆ అంశం చట్టంగా ఆమోదితమై అమల్లోకి వస్తుంది. ఇది రెండు రకాలు:

  1. విధాయక రూపంలో ఉన్న ప్రజాభిప్రాయ నివేదన
  2. విధాయక రూపంలో లేని ప్రజాభిప్రాయ నివేదన.

ప్రశ్న 9.
ప్రజాభిప్రాయ నిర్ణయం అంటే ఏమిటి ?
జవాబు:
ప్రజాభిప్రాయ నిర్ణయాన్ని ఆంగ్లంలో ‘ప్లెబిసైట్’ అంటారు. ఈ పదం లాటిన్ భాషలోని ‘ప్లెబిస్’ మరియు ‘సెటమ్’ అనే రెండు పదాల నుండి గ్రహించబడింది. ప్లెబిస్ అంటే ప్రజలు, సెటమ్ అంటే నిర్ణయం లేదా తీర్పు అని అర్థం. అంటే దీని అర్థం ప్రజా నిర్ణయం లేదా ప్రజాతీర్పు. ఒక ప్రభుత్వ విధానంపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు అనుసరించే ప్రజాస్వామ్య సాధనమే ప్రజాభిప్రాయ నిర్ణయమని భావించవచ్చు.

AP Inter 1st Year Civics Study Material Chapter 9 ప్రజాస్వామ్యం

ప్రశ్న 10.
పునరాయనం అనగా ఏమిటి ?
జవాబు:
పునరాయనం అనేది ఒక ముఖ్యమైన ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనం. ఈ పద్ధతిలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు లేదా అధికారులు ఉద్దేశ్యపూర్వకంగా తమ కర్తవ్యాలను నిర్వహించడంలో విఫలమైతే వారిని ఓటర్లు వెనుకకు పిలిచేందుకు వీలుంటుంది. దీనినే పునరాయనం అంటారు. ఈ రకమైన పద్దతి అమెరికాలోని అరిజోనా, మోంటానా, లూసియానా, కాన్సాస్, కాలిఫోర్నియా, నెవెడా, ఓరెగాన్ మొదలగు రాష్ట్రాలలో అమలులో ఉంది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Physics Study Material 1st Lesson తరంగాలు Textbook Questions and Answers.

AP Inter 2nd Year Physics Study Material 1st Lesson తరంగాలు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
తరంగం ఏమి సూచిస్తుంది?
జవాబు:
యానకం స్థానాంతరణ లేకుండా, ఒక బిందువు నుండి మరియొక బిందువుకు శక్తి ప్రసారంను యానకం సూచిస్తుంది.

ప్రశ్న 2.
తిర్యక్, అనుదైర్ఘ్య తరంగాల మధ్య భేదాన్ని గుర్తించండి.
జవాబు:

తిర్యక్ తరంగాలుఅనుదైర్ఘ్య తరంగాలు
1. యానకంలోని కణాలు, తరంగ ప్రసారదిశకు లంబంగా కంపిస్తాయి.1. యానకంలోని కణాలు, తరంగ ప్రసారదిశకు సమాంతరంగా కంపిస్తాయి.
2. శృంగాలు మరియు ద్రోణులు ఏర్పడతాయి.2. సంపీడనాలు మరియు విరళీకరణాలు ఏర్పడతాయి.

ప్రశ్న 3.
ఒక పురోగామి హరాత్మక తరంగాన్ని వర్ణించడానికి ఉపయోగించే పరామితులు ఏమిటి?
జవాబు:
పురోగామి తరంగ సమీకరణం y = a sin (ωt – kx), ఇక్కడ ω = 2πν = \(\frac{2 \pi}{T}\); k = \(\frac{2 \pi}{\lambda}\)

పరామితులు :
1) a = కంపన పరిమతి 2) λ = తరంగదైర్ఘ్యం 3) T = ఆవర్తన కాలం 4) ν = పౌనఃపున్యం 5) k = ప్రసార స్థిరాంకం 6) ω = కోణీయ పౌనఃపున్యం.

ప్రశ్న 4.
ఈ పరామితుల పదాలలో తరంగవేగానికి ఒక సమాసాన్ని పొందండి.
జవాబు:
తరంగవేగము ” పౌనఃపున్యం ‘ν’ మరియు తరంగదైర్ఘ్యం ‘λ’. డోలనావర్తన కాలం ‘T’ అయితే,
అప్పుడు ν = \(\frac{1}{T}\)
కాలం ‘T’ లో తరంగం ప్రయాణించిన దూరం = λ.
1 సెకనులో ప్రయాణించిన దూరం = \(\frac{\lambda}{T}\)
ఇది తరంగ వేగంనకు సమీకరణం ∴ υ = νλ

AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు

ప్రశ్న 5.
మితీయ విశ్లేషణను ఉపయోగించి ఒక సాగదీసిన తంత్రిలో తిర్యక్ తరంగాల వడికి ఒక సమాసాన్ని పొందండి.
జవాబు:
తరంగ వేగం v α Ta µb ⇒ v =K Ta µb → (1)
v మితులు = M°L¹T-1, తన్యత T = M¹L¹T-2
రేఖీయ ద్రవ్యరాశి µ = M¹L-1, స్థిరాంకం K = M°L°T°
ఇప్పుడు (1)వ సమీకరణం M°L¹L-1 = [M¹L¹T-2]a [M¹L-1]b
M°L¹T¹ = Ma+b La-b T-2a
ఒకే భౌతికరాశి ఘాతాలను పోల్చగా,
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 1

ప్రశ్న 6.
మితీయ విశ్లేషణను ఉపయోగించి ఒక యానకంలో ధ్వని తరంగాల వడికి ఒక సమాసాన్ని పొందండి.
జవాబు:
ధ్వని వేగం v α Baρb = v =KBaρb → (1)
v మితులు = M°L¹T-1, యానకం స్థితిస్థాపకత
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 2

ప్రశ్న 7.
తరంగాల అధ్యారోపణ సూత్రం అంటే ఏమిటి?
జవాబు:
ఒక యానకంలోని రెండు లేక మూడు తరంగాలు వరుసగా ఒక కణంపై పనిచేస్తే, ఫలిత స్థానభ్రంశం వైయక్తిక తరంగాల స్థానభ్రంశాల మొత్తంనకు సమానము.

y1, y2, y3, ……….. లు కణం వైయక్తిక స్థానభ్రంశాలు అయితే, ఫలిత స్థానభ్రంశము y = y1 + y2 + …………….. + yn.

ప్రశ్న 8.
ఏ నిబంధనలకు లోబడి ఒక తరంగం పరావర్తనం చెందుతుంది?
జవాబు:

  1. ఏదైనా బిందువు వద్ద యానకం చివర మారితే
  2. ఏదైనా బిందువు వద్ద యానకం సాంద్రత మరియు దృఢతా గుణకం మారిన తరంగాలు పరావర్తనం చెందుతాయి.

ప్రశ్న 9.
తరంగం దృఢ సరిహద్దు వద్ద పరావర్తనం చెందితే, పతన, పరావర్తిత తరంగాల మధ్య దశా భేదం ఎంత ?
జవాబు:
π రేడియన్ లేక 180°.

ప్రశ్న 10.
స్థావర లేదా స్థిర తరంగం అంటే ఏమిటి?
జవాబు:
రెండు ఒకే రకమైన పురోగామి (తిర్యక్ లేక అనుదైర్ఘ్య తరంగాలు, యానకంలో సరళరేఖలో వ్యతిరేక దిశలలో ప్రయాణిస్తూ అధ్యారోపణం చెందితే, స్థిర తరంగాలు ఏర్పడతాయి.

ప్రశ్న 11.
అస్పందన, ప్రస్పందన పదాల వల్ల మీరు ఏమి అర్థం చేసుకొన్నారు?
జవాబు:
అస్పందన స్థానం :
కణం శూన్య కంపన పరిమితి స్థానంను అస్పందన స్థానం అంటారు.

ప్రస్పందన స్థానం :
కణం గరిష్ఠ కంపన పరిమితి స్థానంను ప్రస్పందన స్థానం అంటారు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు

ప్రశ్న 12.
ఒక స్థిర తరంగంలో ఒక అస్పందన, ఒక ప్రస్పందనల మధ్య దూరం ఎంత?
జవాబు:
అస్పందన మరియు ప్రస్పందన స్థానాల మధ్య దూరం = \(\frac{\lambda}{4}\)

ప్రశ్న 13.
సహజ పౌనఃపున్యం లేదా సామాన్య కంపనరీతితో మీరు ఏమి అర్థం చేసుకొన్నారు?
జవాబు:
ఒక వస్తువును స్వేచ్ఛగా కంపించేటట్లు చేసి వదిలితే, ఆ వస్తు కంపనాలను స్వేచ్ఛా లేక సహజ కంపనాలు అంటారు. ఆ వస్తు పౌనఃపున్యంను సహజ పౌనఃపున్యం లేక సాధారణరీతి కంపనం అంటారు.

ప్రశ్న 14.
అనుస్వరాలు అంటే ఏమిటి?
జవాబు:
స్థిర తరంగాలు ఏర్పడే పౌనఃపున్యాలను అనుస్వరాలు అంటారు. (లేక) ప్రాథమిక పౌనఃపున్యాల సహజ గుణిజాలను అనుస్వరాలు అంటారు.

ప్రశ్న 15.
రెండు దృఢ ఆధారాల మధ్య ఒక తంత్రి సాగదీయడమైంది. అటువంటి తంత్రిలో సాధ్యమయ్యే కంపన పౌనఃపున్యాలు ఏవి?
జవాబు:
రెండు దృఢ ఆధారాల మధ్య సాగదీసిన తంత్రి (తీగ)లో సాధ్యమగు కంపనాల పౌనఃపున్యాలను యిచ్చు సమీకరణము
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 3

ప్రశ్న 16.
ఒక చివర మూసిన పొడవైన గొట్టంలో గాలి స్తంభాన్ని కంపింపచేస్తే సాధ్యమయ్యే అనుస్వరాలు ఏమిటి?
జవాబు:
ఒక పొడవాటి మూసిన గొట్టంలో గాలిస్థంభ కంపనంలో సాధ్యమగు అనుస్వరాలను యిచ్చు సమీకరణము
vn = [2n +1] \(\frac{υ}{4l}\) ఇక్కడ n = 0, 1, 2, 3, ………….

ప్రశ్న 17.
రెండువైపుల తెరచిన ఒక గొట్టంలోని గాలి స్తంభాన్ని కంపింపచేస్తే సాధ్యమయ్యే అనుస్వరాలు ఏమిటి?
జవాబు:
ఒక తెరిచిన గొట్టంలో గాలి స్తంబ కంపనంలో సాధ్యమగు అనుస్వరాలను యిచ్చు సమీకరణము
vn = \(\frac{nυ}{2l}\) ఇక్కడ n = 1, 2, 3, ………………

ప్రశ్న 18.
విస్పందనాలు అంటే ఏమిటి?
జవాబు:
విస్పందనాలు :
సమీప పౌనఃపున్యం ఉన్న రెండు ధ్వని తరంగాలు ఒకే దిశలో చలిస్తూ, వ్యతికరణం చెందితే, క్రమ కాల వ్యవధులలో ధ్వని వృద్ధి మరియు క్షీణత ఉండును. ఈ దృగ్విషయంను “విస్పందనాలు” అంటారు.

ప్రశ్న 19.
విస్పందన పౌనఃపున్యం కోసం ఒక సమాసాన్ని వ్రాయండి. దానిలో ఉండే పదాలను వివరించండి.
జవాబు:
విస్పందన పౌనఃపున్య సమీకరణం, ∆ν = ν1 ~ ν2
ఇక్కడ v1 మరియు v2 లు రెండు తరంగాల పౌనఃపున్యాలు.

ప్రశ్న 20.
డాప్లర్ ప్రభావం అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
డాప్లర్ ప్రభావం :
ధ్వని జనకం మరియు పరిశీలకుని మధ్య సాపేక్ష చలనం ఉన్నప్పుడు, పరిశీలకుడు వినే దృశ్య పౌనః పున్యంలోని మార్పును, డాప్లర్ ప్రభావం అంటారు.
ఉదా : ఈల వేస్తున్న రైలు, ఫ్లాట్ఫాంపై నిల్చున్న పరిశీలకుని సమీపిస్తూ ఉంటే, దృశ్య పౌనఃపున్యం పెరుగును. దూరంగా చలిస్తే, దృశ్య పౌనఃపున్యం తగ్గును.

ప్రశ్న 21.
జనకం, పరిశీలకుడు ఒకదానితో మరొకటి సాపేక్షంగా ఒకే దిశలో చలిస్తున్నప్పుడు పరిశీలించిన పౌనఃపున్యానికి ఒక సమాసాన్ని వ్రాయండి.
జవాబు:
పరిశీలకుడు వినే దృశ్య పౌనఃపున్యం,
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 4

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
తిర్యక్ తరంగాలు అంటే ఏమిటి? అటువంటి తరంగాలకు వివరణాత్మకమయిన ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
తిర్యక్ తరంగాలు :
కణాల కంపనము మరియు తరంగ ప్రసార దిశ ఒకదానికొకటి లంబంగా ఉంటే, ఆ తరంగాలను తిర్యక్ తరంగాలు అంటారు.

  1. సాగదీసిన తంత్రి (తీగ)లో ఏర్పడు తరంగాలు తిర్యక్ తరంగాలు.
  2. సాగదీసిన తంత్రిని తాకితే, దాని వెంట తిర్యక్ తరంగాలు ఏర్పడతాయి.
  3. తంత్రిలో కణాలు తరంగ ప్రసార దిశకు లంబంగా కంపిస్తాయి.
  4. తిర్యక్ తరంగాలు ఘన పదార్థంలో మరియు ద్రవం ఉపరితలంపై ప్రసారమవుతాయి.
    ఉదా : కాంతి తరంగాలు, ఉపరితల జల తరంగాలు.

ప్రశ్న 2.
అనుదైర్ఘ్య తరంగాలు అంటే ఏమిటి? అటువంటి తరంగాలకు వివరణాత్మక ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
అనుదైర్ఘ్య తరంగాలు:
తరంగ ప్రసార దిశ మరియు కణాల కంపన దిశలు, ఒకే దిశలో ఉంటే, ఆ తరంగాలను అనుదైర్ఘ్య తరంగాలు అంటారు.

  1. ఒక సంపీడన స్ప్రింగ్న, వదిలితే అనుదైర్ఘ్య తరంగాలు ఏర్పడతాయి.
  2. స్ప్రింగ్ వెంట సంపీడన మరియు విరళీకరణాలు ప్రసారమవుతాయి.
    AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 5
    C = సంపీడనం; R = విరళీకరణం.
  3. అవి ఘన, ద్రవ మరియు వాయువుల గుండా ప్రయాణిస్తాయి.
    ఉదా : ధ్వని తరంగాలు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు

ప్రశ్న 3.
పురోగామి హరాత్మక తరంగానికి సమాసాన్ని వ్రాయండి. ఆ సమాసంలో ఉపయోగించిన విభిన్న పరామితులను వివరించండి.
జవాబు:
పురోగామి అనుస్వర తరంగ సమీకరణం
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 6

పరామితులు:
1) కంపన పరిమితి (a) :
మాధ్యమిక స్థానం నుండి కంపన కణం గరిష్ట స్థానభ్రంశంను కంపన పరిమితి అంటారు.

2) పౌనఃపున్యం (V) :
కంపిస్తున్న వస్తువు ఒక సెకనులో చేయు పూర్తి కంపనాల సంఖ్యను పౌనఃపున్యం అంటారు.

3) తరంగదైర్ఘ్యం (λ) :
ఒక తరంగము ఒక పూర్తి కంపనంలో ప్రయాణించు దూరంను తరంగదైర్ఘ్యం అంటారు. (లేక) రెండు వరుస బిందువులు ఒకే దశలో ఉన్నప్పుడు వాని మధ్య దూరంను తరంగదైర్ఘ్యం అంటారు.

4) కంపన దశ (Φ) :
ఏదైనా క్షణాన కంపిస్తున్న కణం యొక్క స్థానభ్రంశ స్థితిని, ఆ కణం యొక్క కంపన దశ అంటారు. ఇది దశా కోణంను ఇస్తుంది.

ప్రశ్న 4.
ఒక సాగదీసిన తంత్రి కంపన రీతులను ఉదాహరణలతో వివరించండి.
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 7
సాగదీసిన తీగలో కంపన రీతులు:
1) ఒక సాగదీసిన తంత్రి వేర్వేరు పౌనఃపున్యాల వద్ద కంపిస్తే, స్థిర తరంగాలు ఏర్పడతాయి. ఈ కంపన రీతులను అనుస్వరాలు అంటారు.

2) తంత్రి ఒక భాగంగా కంపిస్తే, దానిని ప్రాథమిక అనుస్వరం అంటారు. ఎక్కువ అనుస్వరాలను అతిస్వరాలు అంటారు.

3) తంత్రి రెండు భాగాలుగా కంపిస్తే, రెండవ అనుస్వరంను శ్రీ మొదటి అతి స్వరం అంటారు. ఇదేవిధంగా కంపనాల వరుస పటంలో చూపబడినవి.

4) సాగదీసిన తంత్రి P భాగాలుగా (ఉచ్చులుగా) కంపిస్తే,
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 8
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 9
అనుస్వరాల పౌనఃపున్యాల నిష్పత్తి ν : ν1 : ν2 = ν : 2ν : 3ν = 1 : 2 : 3

ప్రశ్న 5.
ఒక తెరిచిన గొట్టంలోని గాలిస్తంభపు కంపనాల రీతులను వివరించండి. [A.P (Mar.’17)]
జవాబు:
తెరిచిన గొట్టంలో గాలిస్తంభ కంపన రీతులు :
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 10

  1. తెరిచిన గొట్టం రెండువైపులా తెరిచి ఉండును. తెరిచిన చివరల వద్ద ప్రస్పందన స్థానాలు ఏర్పడును. వాని మధ్య అస్పందన స్థానం ఏర్పడును.
  2. తెరిచిన గొట్టంలో కంపిస్తున్న గాలిస్తంభంలో సాధ్యమగు అనుస్వరాలు, ν = \(\frac{nυ}{2l}\)
    ఇక్కడ n = 1, 2, 3
  3. మొదటి కంపన రీతిలో, n = 1 అప్పుడు v1 = \(\frac{υ}{2l}\)
    (మొదటి అనుస్వరం లేక ప్రాథమిక పౌనఃపున్యం).
  4. రెండవ కంపన రీతిలో, n = 2 అప్పుడు v2 = \(\frac{2υ}{2l}\)
    (రెండవ అనుస్వరం లేక మొదటి అతిస్వరం).
  5. మూడవ కంపన రీతిలో, n = 3 అప్పుడు v3 = \(\frac{3υ}{2l}\)
    (మూడవ అనుస్వరం లేక రెండవ అతిస్వరం).
  6. తెరిచిన గొట్టంలో అనుస్వరాల’ పౌనఃపున్యాల నిష్పత్తి
    v1 : v2 : v3 = v : 2v : 3v = 1 : 2 : 3

ప్రశ్న 6.
అనునాదం అంటే మీరు ఏమి అర్థం చేసుకొన్నారు? గాలిలో ధ్వని వేగాన్ని కనుక్కోవడానికి అనునాదాన్ని మీరెలా ఉపయోగిస్తారు?
జవాబు:
అనునాదం :
కంపిస్తున్న వస్తు సహజ పౌనఃపున్యము, బాహ్య ఆవర్తన బలం పౌనఃపున్యంనకు సమానం అయితే, ఆ రెండు వస్తువులు అనునాదంలో ఉన్నాయంటారు. అనునాదం వద్ద వస్తువులు పెరుగుతున్న కంపన పరిమితితో కంపిస్తాయి.

అనునాదంను ఉపయోగించి గాలిలో ధ్వనివేగంను నిర్ణయించుట:
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 11
1) అనునాద గొట్టంలో, గాలిస్తంభం కంపిస్తున్న శృతిదండాంలో కంపిస్తుంది. నిర్ధిష్ట గాలిస్తంభం పొడవు వద్ద, పౌనఃపున్యంనకు సమానమైన పౌనఃపున్యం వద్ద గాలి స్తంభం కంపిస్తుంది. అప్పుడు గాలిస్తంభం, గరిష్ఠ కంపన పరిమితి మరియు తీవ్రతతో ధ్వని ఏర్పడును.
2) తెరిచిన గొట్టం పైన తెలిసిన పౌనఃపున్యం (ν) ఉన్న కంపిస్తున్న శృతిదండాన్ని ఉంచుదాము.
3) గాలిస్తంభం పొడవును క్రమంగా పెంచితే, రెండు వేర్వేరు గాలిస్తంభ పొడవుల వద్ద ఎక్కువ శబ్దం (booming sound) వినిపిస్తుంది.
4) మొదటి అనునాదంలో, గాలిస్తంభ పొడవు l, అయితే, అప్పుడు
\(\frac{\lambda}{4}\) = l1 + C ………….. (1)

ఇక్కడ λ ఉరించు ధ్వని తరంగదైర్ఘ్యం మరియు c గొట్టం తుది సవరణ.
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 12

5) రెండవ అనునాదంలో, గాలి స్తంభం పొడవు l1 అయితే,
అప్పుడు \(\frac{3 \lambda}{4}\) = l2 + C ………….(2)
(2) – (1) ⇒ \(\frac{\lambda}{2}\) = l2 – l1
λ = 2 (l2 – l1)

ధ్వని వేగం, v = v2(l1 – l1)
∴ v = 2v (l2 – l1)

6) v1, l1, l2 లు తెలిసిన ధ్వని వేగంను గణిస్తారు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు

ప్రశ్న 7.
స్థిర తరంగాలు అంటే ఏమిటి? ఒక సాగదీసిన తంత్రిలో స్థిర తరంగాలు ఏవిధంగా ఏర్పడతాయో వివరించండి.
జవాబు:
స్థిర తరంగాలు లేక స్థావర తరంగాలు:
రెండు సర్వ సమ పురోగామి (తిర్యక్ లేక అనుదైర్ఘ్య తరంగాలు, యానకంలో ఒకే రేఖలో వ్యతిరేక దిశలలో అధ్యారోపణం చెందితే, ఏర్పడు ఫలిత తరంగంను, స్థావర తరంగం అంటారు.

సాగదీసిన తీగలో స్థావర తరంగం ఏర్పడుట :

  1. రెండు ‘స్థిర బిందువుల మధ్య ‘l’ పొడవు ఉన్న తండ్రిని దృఢంగా బిగించి, కంపింపచేస్తే, తంత్రి వెంట తిర్యక్ పురోగామి తరంగం ప్రయాణిస్తుంది.
  2. తరంగం, దృఢంగా బిగించిన రెండవ చివర నుండి పరావర్తనం చెందును.
  3. పతన మరియు పరావర్తన తరంగాలు వ్యతికరణం పల్ల, స్థావర తరంగాలు ఏర్పడతాయి.
  4. అస్పందన మరియు ప్రస్పందన స్థానాలతో ఏర్పడిన స్థావర తరంగం పటంలో చూపబడింది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 13

ప్రశ్న 8.
ఒక సాగదీసిన తంత్రిలో ధ్వని వేగాన్ని కొలవడానికి ఒక పద్ధతిని వర్ణించండి.
జవాబు:
ప్రాథమిక రీతిలో సాగదీసిన తంత్రి వెంట, ప్రయాణించు తిర్యక్ తరంగం వేగం v = 2vl, ఇక్కడ υ = పౌనఃపున్యం, l = అనునాదం పొడవు.

సోనోమీటర్ ఉపయోగించి సాగదీసిన తండ్రి (తీగ) వెంట ధ్వని వేగంను నిర్ణయించుట :
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 14

  1. సరైన భారంతో తంత్రిని స్థిర తన్యతకు గురి చేస్తారు.
  2. పౌనఃపున్యం (v) ఉన్న కంపిస్తున్న శృతి దండం కాడను, సోనోమీటర్ పెట్టె పై ఉంచుతారు
  3. రెండు బ్రిడ్జిల మధ్య స్థిర దూరంలో అనునాదం వద్ద B1 B2 ల మధ్య పేపర్ రైడర్ పడిపోతుంది.
  4. రెండు బ్రిడ్జిల మధ్య అనునాదం పొడవు ‘l’ ను, స్కేలుతో కొలుస్తారు.
  5. v మరియు l లు తెల్సుకొని, తరంగవేగం v = 2vl నుపయోగించి కనుగొంటారు.

ప్రశ్న 9.
మూసిన గొట్టంలో స్థిర తరంగాలు ఏర్పడటాన్ని పటం సహాయంతో వివరించండి. ధ్వని జనకం పౌనఃపున్యాన్ని కనుక్కోవడానికి దీన్ని ఏవిధంగా ఉపయోగించవచ్చు?
జవాబు:
మూసిన గొట్టంలో స్థిర తరంగాలు ఏర్పడుట :
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 15
1) మూసిన గొట్టంలో ఒక చివర మూసి, రెండవ చివర తెరిచి ఉండును. తెరిచిన చివర ప్రస్పంద స్థానం, మూసిన చివర అస్పందన స్థానం ఏర్పడును.

2) మూసిన గొట్టంలో, కంపిస్తున్న గాలిస్తంభంలో సాధ్యమగు అనుస్వరాలను యిచ్చే సమీకరణం vn = \(\frac{(2n + 1)v}{4l}\)
ఇక్కడ n = 0, 1, 2, 3,

3) మొదట కంపన రీతిలో, మూసిన గొట్టంలో గాలిస్తంభ పౌనఃపున్యం ν1
= \(\frac{υ}{4l}\)(మొదటి అనుస్వరం లేక ప్రాథమిక పౌనఃపున్యం)

4) రెండవ కంపనరీతిలో, మూసిన గొట్టంలో గాలిస్తంభ పౌనః
పున్యము, ν3 = \(\frac{3υ}{4l}\) (మూడవ అనుస్వరం లేక మొదటి అతిస్వరం)

5) మూడవ కంపనరీతిలో, మూసిన గొట్టంలో గాలిస్తంభ పౌనః
పున్యం, ν5 = \(\frac{5υ}{4l}\) (ఐదవ అనుస్వరం లేక రెండవ అతిస్వరం)

ధ్వని జనకం పౌనఃపున్యంను నిర్ణయించుట :
1) తెరిచిన గొట్టంపైన, తెలియని పౌనఃపున్య శృతి దండం (v) ను ఉంచుదాము.
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 16
2) రిజర్వాయర్ను నెమ్మదిగా క్రిందికి జరుపుతూ, బిగ్గరగా శబ్దం వినబడే వరకు జరపాలి. మొదటి అనునాదం గాలి స్తంభం పొడవు l1 ను కొలుద్దాం.

3) రిజర్వాయరు, రెండవ అనునాదం బిగ్గరగా శబ్దం వినబడేటట్లు క్రిందికి జరపాలి. రెండవ అనునాద గాలిస్తంభ పొడవు l2 ను కొలుద్దాం.

4) 0°C వద్ద తరంగవేగము υ = 331m/s.

5) ν = \(\frac{υ}{2(l_2-l_1)}\) సమీకరణంలో ν, l1 మరియు l2 లను ప్రతిక్షేపించి, శృతిదండం తెలియని పౌనఃపున్యం కనుక్కోవచ్చును.

ప్రశ్న 10.
విస్పందనాలు అంటే ఏమిటి? అవి ఎప్పుడు సంభవిస్తాయి? వాటి ఉపయోగాలు ఏమైనా ఉంటే వివరించండి.
జవాబు:
దాదాపు సమాన పౌనఃపున్యం ఉన్న రెండు ధ్వని తరంగాలు, ఒకే దిశలో ప్రయాణిస్తూ, వ్యతికరణం చెందితే, ఫలితంగా ధ్వని తరంగాల తీవ్రత, క్రమకాలవ్యవధులవద్ద గరిష్ఠ ధ్వని మరియు కనిష్ఠ ధ్వని ఏర్పడటాన్ని విస్పందనాలు అంటారు. కంపిస్తున్న వస్తువుల పౌనఃపున్యాలలో స్వల్ప తేడా ఉంటే, విస్పందనాలు ఏర్పడతాయి. విస్పందనాల సంఖ్య.
∆ν = ν1 ~ ν2

ప్రాముఖ్యత :

  1. మ్యూజికల్ పరికరాలను ట్యూన్ చేయుటకు విస్పందనాలు ఉపయోగిస్తారు.
  2. విషవాయువులను గుర్తించుటకు విస్పందనాలు ఉపయోగిస్తారు.

విస్పందనాలతో మ్యూసికల్ పరికరాలను ట్యూన్ చేయుట-వివరణ :
మ్యుజీషియన్స్, మ్యూజిక్ పరికరములను ట్యూన్ చేయుటకు విస్పందనాలను ఉపయోగిస్తారు. ఒక పరికరంను ధ్వనింపచేసి, ప్రామాణిక పౌనఃపున్యంనకు దగ్గరగా ఉంచి విస్పందనాలు అదృశ్యమయ్యే వరకు ట్యూన్ చేస్తారు. అప్పుడు పరికరం ప్రామాణిక పౌనఃపున్యంతో ట్యూన్ చేయబడింది అంటారు.

ప్రశ్న 11.
డాప్లర్ ప్రభావం అంటే ఏమిటి? వివరణాత్మకమయిన ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
డాప్లర్ ప్రభావం :
ధ్వని జనకం మరియు పరిశీలకులు సాపేక్ష చలనంలో ఉన్నప్పుడు, పరిశీలకుడు వినే దృశ్య పౌనః పున్యంలో మార్పును డాప్లర్ ప్రభావం అంటారు.

ఉదాహరణలు :

  1. ఈల వేస్తున్న రైలు ఫ్లాట్ఫాంపై ఉన్న పరిశీలకుని సమీపిస్తూ ఉంటే, పరిశీలకుడు వినే ధ్వని దృశ్య పౌనఃపున్యం పెరుగును. రైలు ఇంజన్ పరిశీలకుని దాటి వెళ్తూ ఉన్నప్పుడు, అతడు వినే ధ్వని దృశ్య పౌనఃపున్యం తగ్గును.
  2. ఈల వేస్తున్న అంబులెన్స్ పరిశీలకుని సమీపిస్తూ ఉంటే, అతడు వినే దృశ్య పౌనఃపున్యం పెరుగును. అంబులెన్స్ పరిశీలకుని దాటి వెళ్తూ ఉన్నప్పుడు, అతడు వినే దృశ్య పౌనఃపున్యం తగ్గును.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సాగదీసిన తంత్రుల్లో స్థిర తరంగాలు ఏర్పడటాన్ని వివరించండి. దాని నుంచి సాగదీసిన తంత్రుల్లో తిర్యక్ తరంగాల నియమాలను ఉత్పాదించండి.
జవాబు:
ఒక పొడవాటి లోహపు తంత్రి రెండు చివలను దృఢ ఆధారాల మధ్య బిగించి, మధ్య బిందువు వద్ద మీటితే, ఒకే పౌనః పున్యం, ఒకే కంపన పరిమితిగల రెండు పరావర్తన తరంగాల తీగవెంట వ్యతిరేక దిశలలో ప్రయాణిస్తూ కలుస్తాయి. అప్పుడు ఏర్పడు ఫలిత తరంగాలను స్థావర లేక స్థిర తరంగాలు అంటారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 17

ఒకే కంపన పరిమితి ‘a’, ఒకే తరంగదైర్ఘ్యం ‘λ’ మరియు ఒకే పౌనఃపున్యం ‘ν’ ఉండి, వ్యతిరేక దిశలలో ప్రయాణించు రెండు పురోగామి తరంగాలు వరుసగా,
y1 = a sin (kx – ωt) మరియు y2 = + a sin (kx + ωt)
ఇక్కడ 1 = 2πν మరియు k = \(\frac{2 \pi}{\lambda}\)
ఫలిత తరంగం, y = y1 + y2
y = a sin (kx – ωt) + a sin (kx + ωt)
y = (2a sin kx) cos ωt
2a sin kx = ఫలిత తరంగం కంపన పరిమితి

ఇది ‘kx’ పై ఆధారపడును
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 18
ఈ స్థానాలను అస్పందన స్థానాలు అంటారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 19
ఈ స్థానాలను ప్రస్పందన స్థానాలు అంటారు.
తంత్రి రెండు భాగాలలో కలిస్తే, దాని రెండవ అనుస్వరం లేక మొదటి అతిస్వరం అంటారు. ఇదేవిధంగా కంపనాలు వరుసలు పటంలో చూపబడినవి.

‘l’ పొడవు ఉన్న ఒక తంత్రి p (ఉచ్చులలో) భాగాలలో కంపిస్తే ప్రతి భాగం పొడవు = \(\frac{l}{p}\)
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 20

p = 1 అయితే, దానిని ప్రాధమిక పౌనఃపున్యం (లేక) మొదటి హరాత్మక పౌనఃపున్యం అంటారు.

సాగదీసిన తంత్రి (తీగ) వెంట తిర్యక్ తరంగాల నియమాలు :
కంపన తీగ (తంత్రి) ప్రాథమిక పౌనఃపున్యం v = \(\frac{1}{2 l} \sqrt{\frac{\mathrm{T}}{\mu}}\)

మొదటి నియమము :
తంత్రి తన్యత (1) మరియు రేఖీయ సాంద్రత (u) లు స్థిరంగా ఉన్నప్పుడు, కంపిస్తున్న తంత్రి పౌనఃపున్యం (V), దాని పొడవు (1) కు విలోమానుపాతంలో ఉండును.
∴ v ∝ \(\frac{1}{l}\) ⇒ vl = స్థిరాంకం

రెండవ నియమము :
తంత్రి పొడవు (I) మరియు రేఖీయ సాంద్రత (m) లు స్థిరంగా ఉన్నప్పుడు, కంపిస్తున్న తంత్రి | ప్రాథమిక పౌనఃపున్యం (v), రేఖీయ సాంద్రత వర్గమూలంనకు అనులోమానుపాతంలో ఉండును.
∴ v ∝ √T ⇒ \(\frac{v}{\sqrt{T}}\) = స్థిరాంకం

మూడవ నియమము :
తంత్రి పొడవు (l) మరియు తన్యత (T) లు స్థిరంగా ఉన్నప్పుడు, కంపిస్తున్న తంత్రి ప్రాథమిక పౌనఃపున్యం (υ) తంత్రి రేఖీయ సాంద్రత (m) వర్గమూలమునకు విలోమానుపాతంలో ఉండును.
v ∝ + ⇒ V VI = స్థిరాంకం

AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు

ప్రశ్న 2.
తెరచిన గొట్టంలో ఆవృతమైన గాలి స్తంభంలో స్థిర తరంగాలు ఏర్పడటాన్ని వివరించండి. ఉత్పత్తి అయ్యే అనుస్వరాల పౌనఃపున్యాలకు సమీకరణాలు ఉత్పాదించండి.
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 21
రెండువైపులా తెరిచి ఉన్న గొట్టాలను తెరిచిన గొట్టం అంటారు. తెరిచిన గొట్టంలోనికి, ధ్వని తరంగంను పంపితే, భూమి వల్ల పరావర్తనం చెందును. ఒకే పౌనఃపున్యం ఉన్న పతన మరియు పరావర్తన తరంగాలు వ్యతిరేక దిశలో అధ్యారోపణం చెంది గొట్టంలో స్థిరతరంగాలు ఏర్పడును.

తెరిచిన గొట్టంలో అనుస్వరాలు :
i) తెరిచిన గొట్టంలో స్థిర తరంగం ఏర్పడుటకు, గొట్టం చివరల రెండు ప్రస్పందన స్థానాలు మరియు మధ్యలో ఒక అస్పందన స్థానం ఉండాలి.
అప్పుడు కంపన పొడవు (l)
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 22

(ii) రెండవ అనుస్వరం (మొదటి అతిస్వరం) లో మూడు అనుస్వరాలు మరియు రెండు అతిస్వరాలు ఏర్పడును.
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 23

ఇదే విధంగా మూడవ అనుస్వరంలో (రెండవ అతిస్వరంలో) నాల్గు ప్రస్పందన స్థానాలు మరియు మూడు అస్పందన స్థానాలు ఏర్పడును.
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 24
తెరిచిన గొట్టంలో అనుస్వరాల పౌనఃపున్యాల నిష్పత్తి ν : ν1 : ν2 = 1 : 2 : 3 ………

ప్రశ్న 3.
మూసిన గొట్టాలలో స్థిర తరంగాలు ఏవిధంగా ఏర్పడతాయి ? విభిన్న కంపనరీతులను వివరించండి. వాటి పౌనఃపున్యాలకు సంబంధాలను పొందండి. [AP & TS (Mar. ’15)]
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 25
గొట్టం ఒకవైపు మూసి ఉండి, రెండవ వైపు తెరిచి ఉన్న గొట్టంను మూసిన గొట్టం అంటారు. మూసిన గొట్టం తెరిచిన చివర ధ్వని తరంగంను పంపితే, తరంగము మూసిన చివర నుండి పరావర్తనము చెందును. పతన మరియు పరావర్తన తరంగాలు ఒకే పౌనఃపున్యంతో, వ్యతిరేక దిశలలో అధ్యారోపణం చెందుటవల్ల మూసిన గొట్టంలో స్థిర తరంగాలు ఏర్పడును.

మూసిన గొట్టంలో స్థిర తరంగము ఏర్పడుటకు కనీసం మూసిన చివర అస్పందన స్థానం మరియు తెరిచిన చివర ప్రస్పందన స్థానం ఏర్పడాలి. అప్పుడు గొట్టం ప్రాథమిక పౌనః పున్యంతో కంపిస్తుంది. అప్పుడు గొట్టం పొడవు (l) తరంగదైర్ఘ్యంలో నాల్గవ వంతుకు సమానం.
∴ l = \(\frac{\lambda_1}{4}\) ⇒ λ1 = 4l
‘ν1‘ ప్రాథమిక పౌనఃపున్యం అయితే,
ν1 = \(\frac{υ}{\lambda_1}\) ఇక్కడ ‘υ’ గాలిలో ధ్వని వేగం.
ν1 = \(\frac{υ}{4l}\) = ν ………….. (1)

మూసిన గొట్టంలో తరువాత అనుస్వరంను ఏర్పరుచుటకు గొట్టంలో రెండు అస్పందన మరియు రెండు ప్రస్పందన స్థాయి ఏర్పడాలి. అప్పుడు మూసిన గొట్టము మూడవ అనుస్వరంతో కంపిస్తుంది. అప్పుడు మూసిన గొట్టం పొడవు తరంగదైర్ఘ్యంనకు
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 26

ఇదే విధంగా రెండవ అతిస్వరం లేక ఐదవ అనుస్వరం మూడు అస్పందన మరియు మూడు. ప్రస్పందన స్థానాలలో ఏర్పడును. అప్పుడు గొట్టం పొడవు, తరంగదైర్ఘ్యం λ5 కు \(\frac{5}{4}\) రేట్లు
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 27
(1), (2) మరియు (3) సమీకరణాలనుండి అనుస్వర పౌనఃపున్యాల నిష్పత్తి
ν1 : ν3 : ν5 = ν : 3ν : 5ν
ν1 : ν3 : ν5 = 1 : 3 : 5

ప్రశ్న 4.
విస్పందనాలు అంటే ఏమిటి? విస్పందన పౌనఃపున్యానికి ఒక సమాసాన్ని పొందండి. విస్పందనాలు ఎక్కడ, ఎలా ఉపయోగపడతాయి?
జవాబు:
విస్పందనాలు :
సమీప పౌనఃపున్యంగల రెండు ధ్వని తరంగాలు ఒకే దిశలో ప్రయాణిస్తూ, వ్యతికరణం చెందితే, క్రమ కాలవ్యవధుల వద్ద, ఫలిత ధ్వని తీవ్రత వృద్ధి మరియు క్షీణత ఉండు దృగ్విషయంను విస్పందనాలు అంటారు.

ఒకే దిశలో అధ్యారోపణం చెందు ధ్వని తరంగాల పౌనఃపున్యాలు ν1 మరియు ν2 అయితే, ఒక సెకనులో వినే విస్పందనాల సంఖ్య ∆ν = ν1 – ν2.

స్పష్టంగా వినటానికి సెకనుకు వినే గరిష్ఠ విస్పందనాల సంఖ్య 10.

విస్పందన పౌనఃపున్యంనకు సమానము:

  1. దాదాపు సమాన పౌనఃపున్యాలు, ఒకే కంపన పరిమితిగల రెండు ధ్వని తరంగాలను భావిద్దాం.
  2. రెండు తరంగాల పౌనఃపున్యాలు ν1 మరియు ν2. ν1 > ν2 అనుకుందాము.
  3. విస్పందన ఆవర్తన కాలం T సెకనులు
  4. మొదటి తరంగం T సెకనులలో చేయు కంపనాల సంఖ్య = ν1T
    [∵ 1 సెకనులో కంపనాల సంఖ్య = ν]
    [T సెకనులో కంపనాల సంఖ్య = νt]
  5. రెండవ తరంగం T సెకనులలో చేయు కంపనాల సంఖ్య = ν2 T
  6. T కాలవ్యవధిలో రెండవ తరంగంకన్నా మొదటి తరంగం ఒక పూర్తి భ్రమణంను అధికంగా కలిగి ఉండును.
  7. కావున, ν1T – ν2T = 1 లేక ν1 – ν2 = \(\frac{1}{T}\)
  8. ఒక సెకనులో ఏర్పడే విస్పందనాల సంఖ్య = \(\frac{1}{T}\) ఇక్కడ T విస్పందన ఆవర్తన కాలం.
  9. ∵ విస్పందన పౌనఃపున్యం = \(\frac{1}{T}\) = ν1 – ν2 = ∆ν
  10. విస్పందన పౌనఃపున్యం, రెండు తరంగాల పౌనఃపున్యాల భేదంనకు సమానము.

విస్పందనాల ప్రాయోగిక అనువర్తనాలు:

  1. శృతిదండం తెలియని పౌనఃపున్యంను కనుగొనవచ్చును.
  2. సంగీత పరికరములను ట్యూన్ చేయుటకు ఉపయోగిస్తారు.
  3. సినిమాటోగ్రఫిలోని ప్రత్యేక ప్రభావం ఉత్పత్తిచేయుటకు ఉపయోగిస్తారు.
  4. గనులలో విషవాయువులను గుర్తించుటకు ఉపయోగిస్తారు.

ప్రశ్న 5.
డాప్లర్ ప్రభావం అంటే ఏమిటి? నిశ్చల స్థితిలో ఒక పరిశీలకుని దృష్ట్యా జనకం చలనంలో ఉన్నప్పుడు వినపడే ధ్వని దృశ్య పౌనఃపున్యానికి ఒక సమాసాన్ని పొందండి. [T.S (Mar. ’17) AP (Mar.’16) (Mar. ’14)]
జవాబు:
డాప్లర్ ప్రభావము :
ధ్వని జనకము మరియు పరిశీలకుడు సాపేక్ష చలనంలో ఉన్నప్పుడు, పరిశీలకుడు విని దృశ్య పౌనఃపున్యంలోని మార్పును, డాప్లర్ ప్రభావము అంటారు.

ఈల వేస్తున్న రైలు ఇంజన్, ప్లాట్ఫాంపై ఉన్న పరిశీలకుని సమీపిస్తూ ఉంటే, పరిశీలకుడు వినే దృశ్య పౌనఃపున్యం పెరుగును. రైలు ఇంజన్ పరిశీలకుని దాటితే, పరిశీలకుడు వినే దృశ్య పౌనఃపున్యం తగ్గును.

ధ్వనిజనకం చలనంలో మరియు పరిశీలకుడు నిశ్చలంగా ఉన్నప్పుడు, దృశ్య పౌనఃపున్యంనకు సమాసము :
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 28
S = ధ్వని జనకం
O = పరిశీలకుడు

ధ్వని జనకం, ‘S’ నిశ్చలంగా ఉన్న పరిశీలకుని వైపు ‘υs‘ వేగంతో చలిస్తుందని భావిద్దాం.
ఆవర్తన కాలం T లో జనకం ప్రయాణించు దూరం = υs T
వరుస సంపీడనాలు మరియు విరళీకరణాలు పరిశీలకునికి దగ్గరగా గీయబడినవి.
∴ దృశ్య తరంగదైర్ఘ్యం, λ’ = λ – υsT.
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 29

∴ దృశ్య పౌనఃపున్యం, నిజ పౌనఃపున్యం కన్నా ఎక్కువ.

ఇదేవిధంగా, ధ్వని జనకం, నిశ్చలంగా ఉన్న పరిశీలకుని నుండి దూరం చలిస్తుంటే, పరిశీలకుడు వినే దృశ్య పౌనఃపున్యం . పరిశీలకుడు వినే దృశ్య పౌనఃపున్యం, నిజ పౌనఃపున్యం కన్నా తక్కువ.

AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు

ప్రశ్న 6.
డాప్లర్ విస్థాపనం అంటే ఏమిటి? నిశ్చల స్థితిలో ఒక జనకం దృష్ట్యా పరిశీలకుడు చలనంలో ఉన్నప్పుడు వినపడే ధ్వని దృశ్య పౌనఃపున్యానికి ఒక సమాసాన్ని పొందండి.
జవాబు:
డాప్లర్ విస్థాపనం :
సాపేక్ష చలనంలో ధ్వని జనకము, పరిశీలకుని దగ్గరకు వచ్చినపుడు, దృశ్య పౌనఃపున్యం, నిజ పౌనఃపున్యం కన్నా ఎక్కువ. ధ్వని జనకము, పరిశీలకునికి దూరంగా ఉన్నప్పుడు, దృశ్య పౌనఃపున్యం నిజ పౌనఃపున్యంకన్నా తక్కువ. దృశ్య మరియు నిజ పౌనఃపున్యాల భేదంను డాప్లర్ విస్థాపనం అంటారు.

చలన పరిశీలకుడు వినే దృశ్య పౌనఃపున్యంనకు సమానము:

సందర్భం (1) :
పరిశీలకుడు జనకంవైపు చలిస్తూ ఉన్నప్పుడు : పరిశీలకుడు ‘O’, vo వేగంతో నిశ్చలంగా ఉన్న జనకం ‘S’ వైపు పటములో చూపినట్లు చలిస్తుందని భావిద్దాం. అందువల్ల పరిశీలకుడు ప్రతి సెకనులో గ్రహించే తరంగాల సంఖ్య ఎక్కువ.
ఒక సెకనులో పరిశీలకుడు ప్రయాణించు దూరం = υ0
పరిశీలకుడు గ్రహించే అదనపు తరంగాల సంఖ్య = \(\frac{υ_0}{\lambda}\)
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 30
∴ దృశ్య పౌనఃపున్యం, నిజ పౌనఃపున్యం కన్నా ఎక్కువ.

సందర్భం (2) :
పరిశీలకుడు నిశ్చలంగా ఉన్న జనకం నుండి దూరంగా చలిస్తూ ఉన్నప్పుడు
పరిశీలకుడు, నిశ్చలంగా ఉన్న జనకం నుండి దూరంగా చలిస్తూ ఉన్నప్పుడు, పరిశీలకుడు కోల్పోయే తరంగాల సంఖ్య \(\frac{ν_0}{\lambda}\)
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 31

లెక్కలు Problems

ప్రశ్న 1.
0.6m పొడవు గల ఒక సాగదీసిన తంత్రి ప్రాథమిక కంపనరీతిలో 30Hzల పౌనఃపున్యంతో కంపిస్తుందని పరిశీలించారు. తంత్రి 0.05 kg/m ల రేఖీయ సాంద్రత కలిగి ఉంటే (a) ఆ తంత్రిలో తిర్యక్ తరంగాల ప్రసార వేగాన్ని (b) తండ్రిలో తర్వతుడు కనుక్కోండి.
సాధన:
v = 30Hz; l = 0.6 m ; µ = 0.05 kg m-1
υ = ?; T = ?
a) υ = 2vl = 2 × 30 × 0.6 = 36 m/s
b) T = vu = 36 × 36 × 0.05 = 64.8 N

ప్రశ్న 2.
3cm వ్యాసం గల ఒక ఉక్కు కేబుల్ను 10kN తన్యతకు లోబడి ఉంచారు. ఉక్కు సాంద్రత 7.8 g/cm³. ఆ కేబుల్ వెంట ఎంత వడితో తిర్యక్ తరంగాలు ప్రయాణిస్తాయి?
సాధన:
T = 10 kN = 104

AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 32

AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 33

ప్రశ్న 3.
ఒక సాగదీసిన తంత్రి వెంబడి ప్రయాణిస్తున్న రెండు పురోగామి తరంగాలు y = 0.07 sinπ (12x- 500t), y2 = 0.07 sinπ (12x + 500t) అస్పందనాలు, ప్రస్పందనలను ఏర్పరుస్తున్నాయి. (a) అస్పందనలు (b) విస్పందనల వద్ద స్థానభ్రంశం ఎంత ? స్థిర తరంగం తరంగదైర్ఘ్యం ఏమిటి ?
సాధన:
A1 = 0.07; A2 = 0.07; K = 12π
a) అస్పందన స్థానాల వద్ద, స్థానభ్రంశము,
y = A1 – A2 = 0.07 0.07 = 0.

b) ప్రస్పందన స్థానాల వద్ద, స్థానభ్రంశము,
y = A1 + A2 = 0.07 + 0.07 = 0.14 m

c) తరంగదైర్ఘ్యం λ = \(\frac{2 \pi}{K}=\frac{2 \pi}{12 \pi}\) = 0.16m

ప్రశ్న 4.
ఒక తంత్రి 0.4m పొడవు, 0.16g ద్రవ్యరాశి కలిగి ఉంది. తంత్రిలో తన్యత 70N అయితే, దాన్ని మీటినప్పుడు అది ఉత్పత్తిచేసే మూడు అత్యల్ప పౌనః పున్యాలు ఏమిటి?
సాధన:
l = 0.4 m; M = 0.16g = 0.16 × 10-3 kg;
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 34
v2 = 2v1 = 2 × 523 = 1046 Hz
v3 = 3v1 = 3 × 523 = 1569 Hz

ప్రశ్న 5.
ఒక లోహపు కడ్డీని దాని మధ్య బిందువు వద్ద బిగించి నప్పుడు దాని ప్రాథమిక పౌనఃపున్యంలో, 4kHz పౌనః పున్యంగల అనుదైర్ఘ్య తరంగాలతో అనునాదం చేస్తుంది. ఆ బిగింపును ఒక చివరికి జరిపితే దాని ప్రాధమిక అనునాద పౌనఃపున్యం ఎంత అవుతుంది?
సాధన:
l పొడవు ఉన్న ఒక లోహపు కడ్డీ మధ్యలో బిగింపు ఉంచి ప్రాధమిక రీతిలో కంపింపచేస్తే, మధ్యలో ఒక అస్పందన స్థానం, కడ్డీ రెండు స్వేచ్ఛా చివరల ప్రస్పందన స్థానంబు ఏర్పడును.
l = \(\frac{\lambda}{2}\) ⇒ λ = 2l
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 35

ప్రాథమిక’ రీతిలో కడ్డీ పౌనఃపున్యం = తరంగ పౌనః పున్యం = 4 kHz.
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 36

ప్రశ్న 6.
70 cm పొడవు గల ఒక మూసిన ఆర్గాన్ పైపును ధ్వనింపచేశారు. ధ్వనివేగం 331 m/s అయితే గాలి స్తంభపు కంపన ప్రాథమిక పౌనఃపున్యం ఎంత? [A.P (Mar. ’17)]
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 37

ప్రశ్న 7.
ఒక నిట్టనిలువు గొట్టాన్ని నీటితో నిల్చి ఉండేటట్లు ఉంచారు. దానిలో నీటి మట్టాన్ని సర్దుబాటు చేయవచ్చు. ఆ గొట్టంపై నుంచి 320 Hz పౌనఃపున్యం గల ధ్వని తరంగాలను పంపించారు. రెండు వరుస నీటిమట్టాలు 20cm, 73 cm వద్ద స్థిర తరంగాలు ఏర్పడితే, ఆ గొట్టపు గాలిలో ధ్వని తరంగాల వడి ఎంత?
సాధన:
v = 320 Hz; l1 = 20cm = 20 × 10-2 m
l2 = 73 cm = 73 × 10-2m; υ = ?
υ = 2v (l2 – l1)
= 2 × 320 (73 × 10-2 – 20 × 10-2)
∴ υ = 339 m/s

AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు

ప్రశ్న 8.
65cm, 70cm పొడవులు గల రెండు ఆర్గాన్ పైపులను ఒకేసారి ధ్వనింపచేస్తే, ఆ రెండు పైపుల ప్రాథమిక పౌనఃపున్యాల మధ్య సెకనుకు ఎన్ని విస్పందనాలు ఉత్పత్తి అవుతాయి? (ధ్వని వేగం = 330 m/s).
సాధన:
l1 = 65 cm = 0.65 m
l2 = 70 cm = 0.7 m
υ = 330 m/s
ఒక సెకనులో విస్పందనాల సంఖ్య ∆ν = ν1 – ν2

AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 38

ప్రశ్న 9.
ఒక రైలు ఒక లెవెల్ క్రాసింగ్ను సమీపిస్తున్నప్పుడు, దాటేప్పుడు ఈల వేస్తుంది. ఆ క్రాసింగ్ వద్ద ఉన్న ఒక పరిశీలకుడు ఆ రైలు సమీపిస్తున్నప్పుడు 219 Hz పౌనః పున్యంగా, అది వెళ్ళేటప్పుడు 184 Hz పౌనఃపున్యంగా కొలిచాడు. ధ్వని వడిని 340 m/s గా తీసుకొంటే ఆ రైలు వడిని, దాని ఈల పౌనఃపున్యాన్ని కనుక్కోండి. [T.S (Mar.’17)]
సాధన:
ఈల వేస్తున్న ఒక రైలు క్రాసింగ్ వద్ద ఉన్న పరిశీలకుని సమీపిస్తూ ఉంటే,
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 39
ఈల వేస్తున్న ఒక రైలు క్రాసింగ్ వద్ద ఉన్న పరిశీలకుని నుండి దాటి వెళ్ళేటప్పుడు,
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 40
ఇక్కడ v’. = 219 Hz; v” = 184Hz;
υ = 340 m/s
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 41

ప్రశ్న 10.
60 kmph, 70 kmph వడులతో రెండు ట్రక్కులు వ్యతిరేకదిశలలో ఎదురవుతూ సమీపిస్తున్నాయి. మొదటి ట్రక్కు చోదకుడు (driver) 400Hz పౌనఃపున్యంతో హారన్ ధ్వని చేస్తున్నాడు. రెండవ ట్రక్కు చోదకుడు ఎంత పౌనఃపున్యాన్ని వింటాడు? (ధ్వని వేగం 330 m/s). ఆ రెండు ట్రక్కులు ఒకదానిని మరొకటి దాటిన తరవాత రెండవ ట్రక్కు చోదకుడు ఎంత పౌనః పున్యాన్ని వింటాడు?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 42
రెండు ట్రక్కులు ఒకదానికొకటి సమీపిస్తూ ఉంటే, రెండవ ట్రక్కు చోదకుడు వినే పౌనఃపున్యం
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 43
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 44

రెండు ట్రక్కులు ఒకదానికొకటి దాటిన తరువాత,
రెండవ ట్రక్కు చోదకుడు పౌనఃపున్యం
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 45

అభ్యాసాలు Textual Exercises

ప్రశ్న 1.
2.50 kg ద్రవ్యరాశి గల ఒక తంత్రి 200 N తన్యతకు లోబడి ఉన్నది. సాగదీసిన తంత్రి పొడవు 20.0 m. ఆ తంత్రి ఒక చివర తిర్యక్ కుదుపును కలిగిస్తే, ఆ అలజడి మరొక చివరకు చేరడానికి ఎంత సమయం పడుతుంది?
సాధన:
M = 2.50 kg, T = 200N, T = 20.0M
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 46

ప్రశ్న 2.
300m ఎత్తుగల ఒక గోపురం పైభాగం నుంచి ఒక రాయిని జారవిడిస్తే అది దాని పీఠం దగ్గర ఉన్న కొలనులోని నీటిలో పడింది. గాలిలో ధ్వని వడి 340 ms-1 గా ఇస్తే నీటిలో పడినప్పుడు వచ్చే శబ్దం పైభాగాన ఎప్పుడు వినిపిస్తుంది? (g = 9.8m s-2)
సాధన:
h = 300m, g= 9.8 m/s²), υ = 340 m/s.
నీటి మడుగు ఉపరితలంపై రాయి తాకుటకు పట్టు కాలం t1 అయితే,
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 47
ధ్వని గోపురం పైకి చేరుటకు పట్టుకాలం
t2 = \(\frac{h}{ν}=\frac{300}{400}\) = 0.88s
రాయి నీటిని తాకిన తరువాత శబ్దం వినుటకు పట్టు కాలం = t1 + t2 = 7.82 + 0.88 = 8.70s.

ప్రశ్న 3.
ఒక ఉక్కు తీగ 12.0 m పొడవు, 2.10 kg ల ద్రవ్యరాశి కలిగి ఉంది. ఆ తీగపై తిర్యక్ తరంగ వడి, 20° C వద్ద గల పొడి గాలిలో ధ్వని వడి 343 m s-1 కు సమానం అయితే ఆ తీగలో తన్యత ఎంత ఉండాలి?
సాధన:
l = 12.0m, µ = 2.10 kg, T = ?
v = 343 m/s
ప్రమాణ పొడవుకు ద్రవ్యరాశి µ = \(\frac{m}{l}=\frac{2.10}{12.0}\) = 0.175 kg/m
v = \(\sqrt{\frac{\mathrm{T}}{\mu}}\)
T = υ².µ = (343)² × 0.175 2.06 × 104 N.

AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు

ప్రశ్న 4.
v = \(\sqrt{\frac{\gamma \mathbf{P}}{\rho}}\) ఫార్ములాను ఉపయోగించి ఈ క్రింది వాటిని వివరించండి.
a) గాలిలో ధ్వని వడి పీడనం మీద ఆధారపడదు.
b) గాలిలో ధ్వని వడి ఉష్ణోగ్రతతో పెరుగుతుంది.
c) గాలిలో ధ్వని వడి తేమతో పెరుగుతుంది.
సాధన:
పీడన ప్రభావము:
వాయువులలో ధ్వని వడి υ = \(\sqrt{\frac{\gamma \mathbf{P}}{\rho}}\)
స్థిర ఉష్ణోగ్రతవద్ద, PV = స్థిరాంకము
P\(\frac{\mathrm{m}}{\rho}\) = స్థిరాంకము ⇒ \(\frac{\mathrm{P}}{\rho}\) = స్థిరాంకము
పీడనం పెరిగిన, P కూడా పెరుగును. కావున గాలిలో ధ్వని వడి, పీడనంపై ఆధారపడదు.

ఉష్ణోగ్రత ప్రభావము :
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 48
STP వద్ద నీటిఆవిరి సాంద్రత, పొడిగాలి సాంద్రత కన్నా తక్కువ. గాలిలో తేమ, గాలిసాంద్రత తగ్గించును. ధ్వనివడి సాంద్రత మార్గమూలంనకు విలోమానుపాతంలో ఉండును. ధ్వని పొడిగాలిలో కన్నా తేమ గాలిలో ఎక్కువ వడితో ప్రయాణించును. కావున ధ్వని వడి υ ∝ తేమ.

ప్రశ్న 5.
ఏకమితీయంలో ప్రయాణించే తరంగాన్ని y = f(x, t) అనే ఒక ప్రమేయంతో సూచిస్తారని మీకు తెలుసు. ఇక్కడ x, t లు x – υt లేదా x + υt ల సంయోగంగా కనిపిస్తుంది. అంటే, y = f(x ± υt). దీని విపర్యయం సత్యమా? y యొక్క క్రింది ప్రమేయాలు ప్రయాణ తరంగాలను సూచిస్తాయో లేదో పరీక్షించండి:
a) (x – υt)²
b) log[(x + υt) / x0]
e) 1/(x + υt)
సాధన:
కాదు, విలోమము సత్యం కాదు. X మరియు t విలువలకు ప్రయాణించు తరంగంను సూచించుటకు తరంగ ప్రమేయం కావాలి. తరంగ ప్రమేయం నిర్ణీత విలువ కలిగి ఉండును.

ఇచ్చిన ప్రమేయంలలో, ప్రమేయంను ఏది కూడా సంతృప్తపరచదు.
∴ ప్రయాణించు తరంగంను ఏది కూడా సూచించదు.

ప్రశ్న 6.
ఒక గబ్బిలం 1000 kHz పౌనఃపున్యం గల అతిధ్వనిని గాలిలో విడుదల చేస్తుంది. ఆ ధ్వని ఒక నీటి ఉపరితలాన్ని తాకితే, (a) పరావర్తిత ధ్వని (b) ప్రసారిత ధ్వనుల తరంగదైర్ఘ్యం ఎంత? గాలిలో ధ్వని వడి 340 m s-1, నీటిలో ధ్వని వడి 1486 m s-1.
సాధన:
υ = 100KHz = 105 Hz, υa = 340 m/s,
υw = 1486 ms-1

AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 49

ప్రశ్న 7.
ఒక వైద్యశాలలో అతిధ్వని క్రమ వీక్షణాన్ని (ultrasonic scanner) కణజాలకంలోని కణతుల స్థానాన్ని గుర్తించ దానికి ఉపయోగిస్తున్నారు. ఆ కణజాలకంలో ధ్వని వడి 1.7 km s-1 అయితే దానిలో ధ్వని తరంగదైర్ఘ్యం ఎంత? ఆ క్రమ వీక్షణ లేదా స్కానర్ పనిచేసే (ప్రచాలనమయ్యే) పౌనఃపున్యం 4.2 MHz.
సాధన:
v = 1.7 Kms-1 = 1700 ms-1
v = 4.2 MHz = 4.2 × 106Hz
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 50

ప్రశ్న 8.
ఒక తంత్రిపై ఒక తిర్యక్ హరాత్మక తరంగాన్ని ఈ విధంగా వర్ణించారు.
y(x, t) = 3.0 sin (36 t + 0.018 x + π/4)
ఇక్కడ x, y cm లో; t సెకను (S) లలో ఉన్నాయి. x ధన దిశ ఎడమ నుంచి కుడివైపుకు ఉంది.
a) ఇది ప్రయాణించే తరంగమా లేదా స్థిర తరంగమా? ఇది ప్రయాణించేది అయితే దాని ప్రసార వడి, ప్రసార దిశ ఏమిటి?
b) దాని కంపనపరిమితి, పౌనఃపున్యం ఎంత?
c) మూల బిందువు వద్ద దాని తొలిదశ ఏమిటి?
d) ఆ తరంగంలో రెండు వరస శృంగాల మధ్య కనిష్ఠ దూరం ఎంత?
సాధన:
ఇచ్చిన సమీకరణంను, కుడి నుండి ఎడమ వైపుకు υ వడితో ప్రయాణించు ‘r’ కంపన పరిమితిగల సమతల పురోగామి తరంగంతో పోలిస్తే,
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 51

a) ఇచ్చిన సమీకరణం, కుడి నుండి ఎడమకు ప్రయాణించు తిర్యక్ హరాత్మక తరంగంను సూచిస్తుంది.
b) ఇచ్చిన సమీకరణంను ఇంకొక విధంగా వ్రాస్తే,
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 52

తరంగం రెండు వరుస శృంగాల మధ్య
కనిష్ట దూరము = తరంగదైర్ఘ్యం
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 53

ప్రశ్న 9.
అభ్యాసం 8 లో వివరించిన తరంగానికి, స్థానభ్రంశం (y), కాలం (t) గ్రాఫ్ను x = 0.2, 4 cm లకు గీయండి. ఈ గ్రాఫ్ ఆకారాలు ఏమిటి? ప్రయాణ తరంగంలోని డోలన చలనం, ఏ రీతిలో ఒక బిందువు నుంచి మరొక బిందువుకు కంపనపరిమితి, పౌనఃపున్యం లేదా దశలు విభేదిస్తాయి?
సాధన:
తిర్యక్ హరాత్మక తరంగము y(x, t) = 3.0
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 54

వేర్వేరు t విలువలకు, (i) ను ఉపయోగించి yని గణించి, పట్టికలో పొందుపరచుదాము.
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 55

x = 2 cm మరియు x = 4 cm కు ఇదేవిధము అయిన గ్రాఫ్లు వస్తాయి. తరంగ ప్రయాణంలో డోలన చలనం ఒక స్థానం నుండి మరియొక స్థానంనకు దశ పడములలో వేర్వేరుగా ఉండును. కంపన పరిమితి మరియు పౌనఃపున్యాలు మూడు సందర్భాలలో డోలన చలనం స్థిరంగా ఉండును.

ప్రశ్న 10.
ప్రయాణించే హరాత్మక తరంగానికి y(x, t) = 2.0 cos 2 π (10 – 0.0080 x + 0.35) ఇక్కడ x, y cm లో, t సెకను (S) లో ఉన్నాయి. క్రింద ఇచ్చిన దూరంతో వేరుచేసిన డోలన చలనం చేసే రెండు బిందువుల మధ్య దశా భేదాన్ని గణించండి.
a) 4 m
b) 0.5 m
c) λ/2
d) 3λ/4
సాధన:
ఇచ్చిన సమీకరణంను ఇంకొక విధంగా వ్రాస్తే
y = 2.0 cos[2л(10t – 0.0080x) + 2л × 0.35]
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 56
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 57

ప్రశ్న 11.
ఒక తంత్రి (రెండు చివరలు బిగించి ఉన్న) తిర్యక్ స్దాన భ్రంశాన్ని y(x, t) = 0.06 sin (\(\frac{2 \pi}{3}\) x) cos (120 πt) తో సూచిస్తున్నారు. ఇక్కడ x, y m లో t సెకన్ (s) ఉన్నాయి. ఆ తంత్రి పొడవు 1.5 m, ద్రవ్యరాశి 3.0 × 10-2 kg.
క్రింది వాటికి జవాబు ఇవ్వండి.
a) ఆ ప్రమేయం ఒక ప్రయాణ తరంగాన్ని లేదా ఒక స్థిర తరంగాన్ని సూచిస్తుందా?
b) ఆ తరంగాన్ని వ్యతిరేక దిశలలో ప్రయాణించే రెండు తరంగాల అధ్యారోపణంగా అర్థం చేసుకోండి. ప్రతీ తరంగపు తరంగదైర్ఘ్యం, పౌనఃపున్యం వడి ఎంత?
c) ఆ తంత్రిలో తన్యతను కనుక్కోండి.
సాధన:
ఇచ్చిన సమీకరణం
y(x, t) = 0.06 sin\(\frac{2 \pi}{3}\) x cos 120 πt ………… (i)

a) సమీకరణం x మరియు tలతో హరాత్మక ప్రమేయం కలిగి, స్థావర తరంగంన తెల్పును.
b) తరంగము
y1 = r sin \(\frac{2 \pi}{\lambda}\) (υt + x)
ధన X-అక్షం దిశలో ప్రయాణిస్తూ, పరావర్తన తరంగం
y2 = -r sin \(\frac{2 \pi}{\lambda}\) (υt + x) తో వ్యతిరేక దిశలో అధ్యారోపణం చెందితే, స్థావర తరంగం
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 58

రెండు తరంగాలు ఒకే తరంగదైర్ఘ్యం, ఒకే పౌనఃపున్యం మరియు ఒకే వడిని కల్గి ఉండును.
c) తిర్యక్ తరంగ వడి
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 59

AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు

ప్రశ్న 12.
i) అభ్యాసం 11లో ఇచ్చిన ఒక తంత్రిపై ఉన్న తరంగానికి, ఆ తంత్రిపై ఉన్న అన్ని బిందువులు ఒకే (a) కంపనపరిమితి, (b) దశ, (c) పౌనఃపున్యంతో డోలనాలు చేస్తాయా? మీ జవాబులను వివరించండి. (ii) ఒక చివర నుంచి 0.375 m దూరంలో ఉన్న ఒక బిందువు కంపనపరిమితి ఎంత?
సాధన:
తీగపై అన్ని స్థానాల వద్ద
i) అస్పందన స్థానాల వద్ద (పౌనఃపున్యం సున్న) తప్ప మిగిలిన అన్ని స్థానాల వద్ద ఒకే పౌనఃపున్య విలువను కలిగి ఉండును.
ii) అస్పందన స్థానాల వద్ద తప్పు ఉచ్చులో ఎక్కడైనా ఒకేఒక దశ కలిగి ఉండును. వేర్వేరు స్థానాల వద్ద కంపన పరిమితులు వేర్వేరుగా ఉండును.
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 60

ప్రశ్న 13.
ఒక స్థితిస్థాపక తరంగ స్థానభ్రంశాన్ని (తిర్యక్ లేదా అనుదైర్ఘ్య) సూచించడానికి x, tలలో కొన్ని ప్రమేయాలు కింద ఇవ్వడమైంది. వీటిలో ఏవి (i) ఒక ప్రయాణించే తరంగాన్ని, (ii) ఒక స్థిర తరంగాన్ని లేదా (iii) ఏదీ కాని దాన్ని సూచిస్తాయి?
a) y = 2 cos (3x) sin (10t)
b) y = \(2 \sqrt{x-v t}\)
c) y = 3 sin (5x-0.5t) + 4 cos (5x-0.5t)
d) y = cos x sin t + cos 2x sin 2t
సాధన:
a) సమీకరణంలో x మరియు t లు వేరుగా ఉన్న హరాత్మక ప్రమేయంలతో స్థావర తరంగంను సూచించును.

b) ఏ రకమైన తరంగంను సూచించదు.

c) ఇది పురోగామి లేక హరాత్మక తరంగంను సూచిస్తుంది.

d) ఈ సమీకరణం రెండు ప్రమేయాల మొత్తం ఒక్కొక్కటి స్థావర తరంగంను సూచిస్తుంది. ఇది స్థావర తరంగాల అధ్యారోపణంను సూచిస్తుంది.

ప్రశ్న 14.
రెండు దృఢ ఆధారాల మధ్య సాగదీసిన తీగ 45 Hz పౌనఃపున్యంతో దాని ప్రాథమిక రీతిలో కంపిస్తుంది. ఆ తీగ ద్రవ్యరాశి 3.5 × 10-2 kg రేఖీయ ద్రవ్యరాశి సాంద్రత 4.0 × 10-2 kg m-1. (a) ఆ తీగపై తిర్యక్ తరంగ వడి, (b) ఆ తీగలో తన్యత ఎంత?
సాధన:
v = 45Hz, u = 3.5 × 10-2 kg
ద్రవ్యరాశి/పొడవు = u = 4.0 × 10-2 kg/m-1

AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 61

ప్రశ్న 15.
ఒక మీటరు పొడవు గల ఒక గొట్టం ఒక చివర తెరవబడి, మరొక చివర కదలగలిగే పిస్టన్ (ముషలకం)తో ఒక స్థిరమైన పౌనఃపున్యం గల జనకం (340 Hz పౌనః పున్యం గల శృతిదండం) తో గొట్టం పొడవు 25.5 cm లేదా 79.3 cm ఉన్నప్పుడు అనునాదంలో ఉన్నది. ప్రయోగ ఉష్ణోగ్రత వద్ద గాలిలో ధ్వని వడిని అంచనా వేయండి. అంచు ప్రభావాలను (edge effects) ఉపేక్షించవచ్చు.
సాధన:
గొట్టంలో ముషలకం ఒక చివర ఉంటే, మూసిన గొట్టం వలె ఉండి బేసి అనుస్వరాలను ఉత్పత్తి చేయును.

గొట్టం ప్రాథమిక పౌనఃపున్యంతో అనునాదంలో ఉండి మూడవ అనుస్వరం 79.3 సెం.మీ ఘమారు 25.5 సెం.మీ.కు 3 రెట్లు ఉండును.

ప్రాథమిక అనుస్వరం వద్ద \(\frac{\lambda}{4}\) = l1 = 25.5
λ = 4 × 25.5 = 102 cm = 1.02 m
గాలిలో ధ్వని వడి
v = vλ = 340 × 1.02
= 346.8 m/s

AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు

ప్రశ్న 16.
100 cm పొడవు ఉన్న ఒక ఉక్కు కడ్డీని దాని మధ్య భాగంలో బిగించారు. ఆ కడ్డీ అనుదైర్ఘ్య కంపనాల ప్రాథమిక పౌనఃపున్యాన్ని 2.53 kHz లుగా ఇస్తే ఉక్కులో ధ్వని వడి ఎంత?
సాధన:
l = 100 cm = Im, v = 2.53 KHz
= 2.53 × 10³ Hz

కడ్డీని మధ్యలో బిగిస్తే, కడ్డీ ప్రాథమిక కంపన పద్ధతిలో, మధ్యలో అస్పందన మరియు చివరల స్పందన స్థానాలు ఏర్పడును.
పటం నుండి
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 62

ప్రశ్న 17.
20 cm పొడవు గల గొట్టం ఒక చివర మూసి ఉన్నది. 430 Hz ల ఒక జనకంతో ఉత్తేజపరిస్తే, ఆ గొట్టపు ఏ అనుస్వరరీతి అనునాదంలో ఉంటుంది? ఆ గొట్టం రెండు చివరలు తెరచి ఉంటే అదే జనకంతో అనునాదంలో ఉండగలదా?
(గాలిలో ధ్వని వడి 340 m s-1).
సాధన:
l = 20 cm = 0.2m, vn = 430 Hz
υ = 340m/s
0.2m, vn = 430 Hz,
మూసిన గొట్టం nవ సాధారణ కంపన స్థితిలో పౌనఃపున్యం
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 63
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 64

n ఇంటిజిర్ను కల్గి ఉంటే, తెరిచిన గొట్టం జనకంతో అనునాదంలో ఉండును.

ప్రశ్న 18.
A, B అనే రెండు సితార్ తంత్రులతో ‘గ’ స్వరాన్ని వాయిస్తున్నప్పుడు కాస్తంత శృతి తప్పి 6 Hz పౌనః పున్యంగల విస్పందనాలను ఉత్పత్తి చేసాయి. A తంత్రిలో కాస్తంత తన్యతను తగ్గిస్తే విస్పందన పౌనఃపున్యం 3 Hz లకు తగ్గిందని కనుక్కొన్నారు. A అసలు పౌనఃపున్యం 324 Hz అయితే, B పౌనఃపున్యం ఎంత?
సాధన:
A సితార్ తంత్రి యదార్థ పౌనఃపున్యం na మరియు B సితార్ తంత్రి యదార్ధ పౌనఃపున్యం nb.
1 సెకన్ ఏర్పడు విస్పందనాల సంఖ్య = 6
nb = na ± 6 = 324 ± 6 = 330 లేక 318Hz.
∴ Aలో తన్యత తగ్గిస్తే పౌనఃపున్యం తగ్గును.
(∴ n ∝ √T).
ఒక సెకనుకు విస్పందనాల సంఖ్య 3 కు తగ్గితే,
B పౌనఃపున్యం = 324 – 6
= 318Hz.

ప్రశ్న 19.
ఎందుకు (లేదా ఎలా) వివరించండి :
a) ధ్వని తరంగంలో స్థానభ్రంశ అస్పందనమే పీడన ప్రస్పందనం, స్థానభ్రంశం ప్రస్పందనమే పీడన అస్పందనం.
b) ఏవిధమైన ‘కళ్ళు’ లేకుండానే గబ్బిలాలు అడ్డంకుల దూరాలను, దిశలను, స్వభావాన్ని, పరిమాణాలను రూఢీపరచుకోగలవు –
c) ఒక వయోలిన్ స్వరం, సితార్ స్వరం ఒకే పౌనః పున్యాన్ని కలిగి ఉండవచ్చు. అయినప్పటికీ మనం ఆ రెండు స్వరాల మధ్య తేడా తెలుసుకోగలం.
d) ఘనపదార్థాలు అనుదైర్ఘ్య, తిర్యక్ తరంగాలు రెండింటిని ప్రసారం చేయగలవు. కాని వాయువులలో అనుదైర్ఘ్య తరంగాలు మాత్రమే ప్రసరిస్తాయి.
e) ఒక విక్షేపక (dispersive) యానకంలో స్పందన ఆకారం ప్రసార సమయంలో విరూపణ చెందుతుంది.
సాధన:
a) అస్పందన (N) స్థానం వద్ద డోలన కంపన పరిమితి శూన్యం (మరియు పీడనం గరిష్ఠం). ప్రస్పందన (A) స్థానంవద్ద డోలన కంపన పరిమితి గరిష్ఠం (పీడనం కనిష్ఠం). ఈ అస్పందన, ప్రస్పందనాలు పీడన అస్పందన మరియు ప్రస్పందనాలతో ఏకీభవించవు. నిర్వచనాల నుండి స్పష్టంగా N, పీడన ప్రస్పందన మరియు A, పీడన అస్పందన స్థానాలతో ఏకీభవించును.

b) గబ్బిలాలు ఎక్కువ పౌనఃపున్యమున్న అతిధ్వనులను ఉద్గారం చేయును. ఈ తరంగాలు అవే మార్గంలో. వస్తువుల నుండి పరావర్తనం చెందును. అవి దూరం, దిశ, పరిమాణం మరియు వస్తువు స్వభావం గూర్చిన ఉపాయంను ఇస్తుంది.

c) వయోలిన్ మరియు సితార్ ల స్వర పౌనఃపున్యం సమానం, అప్పుడు అతిస్వరాలు ఏర్పడును. వాని ప్రతిచర్య బలాలు వేరుగా ఉండుట వలన రెండు స్వరాలను వేరుపరచవచ్చును.

d) ఘనపదార్థాలు, ఘనపరిమాణం స్థితిస్థాపకత మరియు వియోటన స్థితిస్థాపక కలిగి ఉండును. కాని వాయువు ఘనపరిమాణ స్థితిస్థాపకతను మాత్రమే కల్గి ఉండును.

e) ధ్వని సంకేతం, వేర్వేరు తరంగదైర్ఘ్యాలగల తరంగాల సంయోగం వేర్వేరు తరంగదైర్ఘ్యాలగల తరంగాలు యానకంలో వేర్వేరు వడులతో వేర్వేరుగ ప్రయాణించును. కావున ధ్వని తరంగ సంకేతము విరూపణ చెందును.

AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు

ప్రశ్న 20.
ఒక రైల్వే స్టేషన్లో బయటి సిగ్నల్ వద్ద నిలబడిన రైలు నిలకడ గాలిలో 100 Hz పౌనఃపున్యంతో ఈల వేసింది. i) ఆ రైలు (a) 10ms-1 వడితో ప్లాట్ఫామ్న సమీపిస్తున్నప్పుడు, b) 10 m s-1 వడితో ప్లాట్ఫామ్ నుంచి దూరంగా పోతున్నప్పుడు, ప్లాట్ఫామ్ మీద పరిశీలకుడు వినే ఈల పౌనఃపున్యం ఏమిటి? ii) ప్రతి సందర్భంలో ధ్వని వడి ఎంత?’ నిలకడ గాలిలో ధ్వని వడిని 340 m s-1 గా తీసుకోవచ్చు?
సాధన:
v = 400Hz, υ = 340m/s-1

a) ప్లాట్ఫాం దగ్గరకు రైలు సమీపిస్తుండగా ఉంటే,
υ = 10m/s
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 65

b) రైలు ప్లాట్ఫాంను వదులుతూ ఉన్నప్పుడు,
υs = 10m/s
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 66

ii) ప్రతి సందర్భంలో ధ్వని సమానం = 340m/s

ప్రశ్న 21.
ఒక రైల్వే స్టేషన్-ప్రాంగణ స్థలం (station-yard)లో నిల్చున్న రైలు నిలకడ గాలిలో 400 Hz ల పౌనః పున్యంతో ఈల వేసింది. 10ms-1 వడితో స్థలం నుంచి ప్రాంగణం దిశలో పవనం వీయడం మొదలయితే ఆ ప్రాంగణ ప్లాట్ఫామ్ మీద నిల్చొన్న పరిశీలకుడు వినే ధ్వని పౌనఃపున్యం, తరంగదైర్ఘ్యం, వడి ఎంత? ఈ పరిస్థితి గాలి నిలకడగా ఉండి, పరిశీలకుడు స్థలంవైపు 10 m s-1 వడితో పరిగెత్తే సందర్భంతో కచ్చితంగా సర్వసమంగా ఉంటుందా? నిలకడ గాలిలో ధ్వని వడిని 340 m s-1 గా తీసుకోవచ్చు.
సాధన:
v = 400 Hz, υm = 10ms-1, υ = 340m/s-1
గాలి ధ్వని ప్రయాణ దిశలో చలిస్తే, ధ్వని తుల్యవడి
= υ + υm = 340 + 10 = 350m/s-1
జనకం మరియు పరిశీలకుడు విరామ స్థితిలో ఉంటే, పౌనఃపున్యం మారదు.
i.e. v = 400 Hz.
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 67

జనకం విరామ స్థితివద్ద ఉంటే, తరంగదైర్ఘ్యం మారదు.
i.e, λ¹ = λ = 0.875M.
ధ్వని వడి = υ + υm = 340 + 0 = 340 m/s
పై రెండు సందర్భాలలో పరిస్థితులు పూర్తిగా వేరుగా, ఉండును.

అదనపు అభ్యాసాలు Additional Exercises

ప్రశ్న 22.
ఒక తంత్రిపై ప్రయాణించే ఒక హరాత్మక తరంగాన్ని ఈ విధంగా వర్ణిస్తే,
y(x, t)= 7.5 sin (0.0050x + 12t + π/4)
a) x = 1 cm, t = 1 s వద్ద ఉన్న ఒక బిందువు డోలన స్థానభ్రంశం, వేగం ఎంత? ఈ వేగం తరంగ ప్రసార వేగానికి సమానంగా ఉంటుందా?
b) t = 2s,11s ల వద్ద x = 1 cm బిందువులాగా స్థానభ్రంశాలు, వేగాలు కలిగి ఉన్న బిందువుల స్థానాలను గుర్తించండి.
సాధన:
a) హరాత్మక తరంగము y(x, t)
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 68
(1) నుండి, y(1, 1) = 7.5 sin (732.55°)
= 7.5 sin (720 + 12.55°)
7.5 sin12.55° = 7.5 × 0.2173 = 1.63 cm
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 69
= 90 cos (732.55°)
= 90 cos(72) + 12.55°)
υ = 90 cos (12.55°)
= 90 × 0.9765
= 87.89 cm/s.
ఇచ్చిన సమీకరణంను ప్రమాణ రూపంతో పోల్చగా
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 70
x = 1 cm t = 1 sec వద్ద వేగం, తరంగ ప్రసార వేగంనకు సమానం కాదు.

b) x = 1cm నుండి అన్ని స్థానాల దూరాలు ±λ, ± 2λ, ± 3λ లు ఒకే తిర్యక్ స్థానభ్రంశము మరియు వేగం కలిగియుండును. λ = 12.56 m అయిన t = 2sec, 5 sec మరియు 11 sec ల వద్ద x = 10m నుండి అన్ని స్థానాల దూరాలు ±12.6m, ±25.2m ,±37.8m

ప్రశ్న 23.
ఒక సన్నని ధ్వని స్పందనను (ఉదాహరణకు, ఒక చిన్న పిప్ (pip) ఈల) ఒక యానకం ద్వారా పంపారు. (a) ఆ స్పందనకు ఒక నిర్ణీత (i) పౌనఃపున్యం, (ii) తరంగదైర్ఘ్యం, (iii) ప్రసార వడి ఉంటాయా? (b) స్పందన రేటు ప్రతి 20 s తరవాత 1 ఉంటే (అంటే ఆ ఈలను ప్రతి 20 సెకనుల తరవాత రెండవ స్పందన వెలువడేటట్లు అతిస్వల్ప సెకండు వరకు ఊదితే) ఆ ఈల ఏర్పరచే స్వర పౌనఃపున్యం 1/20 లేదా 0.05 Hz లకు సమానం అవుతుందా?
సాధన:
a) ఒక చిన్న పిప్ ఈలను ఊదితే, నిర్దిష్ట తరంగదైర్ఘ్యంను మరియు నిర్దిష్ట పౌనఃపున్యం కలిగి ఉండవు. ప్రసార వడిని స్థిరంగా ఉంచితే, అది గాలిలో ధ్వని వడినకు సమానము.

b) కాదు. ఈల ఏర్పరచు ధ్వని పౌనఃపున్యం = 1/20 = 0.05 Hz. ఒక చిన్న పిప్ ఈల వల్ల పునరుత్పాదన పౌనఃపున్యం = 0.05 Hz

AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు

ప్రశ్న 24.
రేఖీయ ద్రవ్యరాశి సాంద్రత 8.0 × 10-3 kg m-1 ఉన్న ఒక పొడవైన తంత్రి ఒక చివర విద్యుత్ నడిచే 256 Hz పౌనఃపున్యం గల ఒక శృతిదండానికి కలిపారు. రెండవ చివరను కప్పి మీదగా పోయేటట్లు చేసి 90 kg ద్రవ్యరాశి గల ఒక పళ్ళానికి కట్టారు. కప్పీ చివర వస్తున్న మొత్తం శక్తిని శోషించుకోవడంవల్ల ఆ చివర పరావర్తనం చెందే తరంగ కంపనపరిమితి ఉపేక్షించే విధంగా ఉంటుంది. t = 0 వద్ద, ఆ తంత్రి ఎడమ చివర (దండం చివర) ×=0, శూన్య తిర్యక్ స్థానభ్రంశం (y = 0) కలిగి ఉండి, ధన y-దిశలో చలిస్తుంది. ఆ తరంగ కంపనపరిమితి 5.0 cm. ఆ తంత్రిపై రంగాన్ని వర్ణించే తిర్యక్ స్థానభ్రంశం y ని x, tల ప్రమేయంగా వ్రాయండి.
సాధన:
m = 8.0 × 10-3 kgm-1, v = 256 Hz,
T= 90kg = 90 × 9.8 = 882N.
తరంగ వేగము, = 5.0m = 0.05m.
తీగవెంట ప్రసారించు తిర్యక్ తరంగ వేగము
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 71

తరంగము ధన x-అక్ష దిశలో ప్రసారమయితే, తరంగ సమీకరణము
y(x, t) = r sin (ωt – kx) = 0.05 sin (1.61 × 10³t – 4.84x)
ఇక్కడ x, y లు మీటర్లు మరియు t secలలో ఉండును.

ప్రశ్న 25.
ఒక జలాంతర్గామిలో అమర్చిన ఒక సోనార్ (SONAR) వ్యవస్థ 40.0 kHz పౌనఃపున్యం వద్ద పనిచేస్తుంది. ఆ సోనార్ వైపు ఒక శత్రు జలాంతర్గామి 360 km h-1వడితో చలిస్తుంది. ఆ శత్రు జలాంతర్గామి పరావర్తనం `చేసే ధ్వని పౌనఃపున్యం ఎంత? నీటిలో ధ్వని వడిని 1450 m s-1 గా తీసుకోండి.
సాధన:
సోనార్ పౌనఃపున్యం,
v = 40kHz = 40 × 10³ Hz.
పరిశీలకుని/శత్రు జలాంతర్గామి వడి
υL = 360 km/h 360 ×\(\frac{5}{18}\) ms-1 = 100ms-1

నీటిలో ధ్వని తరంగ వడి υ = 1450 ms-1.

నిశ్చల స్థితిలో ఉన్న జనకంవైపు పరిశీలకుడు చలిస్తున్నప్పుడు, శత్రు జలాంతర్గమి గ్రహించే దృశ్య పౌనఃపున్యము
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 72

ఈ పౌనఃపున్యంను శత్రు జలాంతర్గామి (జనకం) పరావర్తనం చేయును. దీనిని సోనార్ పరిశీలించును. ఈ సందర్భంలో
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 73

ప్రశ్న 26.
భూకంపాలు భూమిలోపల ధ్వని తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. ఒక వాయువు లాగా కాకుండా భూమిలో తిర్యక్ (S), అనుదైర్ఘ్య (P) ధ్వని తరంగాలు రెండూ ప్రసరిస్తాయి. విలక్షణంగా S తరంగ వడి సుమారు 4.0 km s-1. P తరంగానికి అది 8.0 km s-1. ఒక భూకంపం నుంచి ఒక భూకంపలేఖిని (seismograph P, S తరంగాలను నమోదు చేస్తుంది. మొదటి P తరంగం మొదటి S తరంగం కంటే 4 నిమిషాలు ముందుగా చేరుతుంది. ఆ తరంగాలు సరళరేఖ మార్గంలో ప్రయాణిస్తాయని ఊహిస్తే, ఆ భూకంపం ఎంత దూరంలో సంభవించినట్లు?
సాధన:
S తరంగాలు మరియు తరంగాల వేగాలు υ1 మరియు υ2. సెస్మోగ్రాఫ్ను చేరుటకు వాటికి పట్టుకాలాలు t1 మరియు t2. సెస్మోగ్రాఫ్ నుండి భూకంపం ఏర్పడిన దూరం 1.
అప్పుడు l = υ1t1 = υ2t2 ……… (i)
υ1 = 4 kms-1 మరియు υ2 = 8 kms-1
∴ 4t1 = 8t2 లేక t1 = 2t2 ……… (ii)
t1 – t2 = = 4min = 240s.

(ii) నుపయోగించి 2t2 – t2 = 240s, t2 = 240s
(i) నుండి l = υ1t1 = 4 × 480 1920 km.
కావున భూకంపం, భూకంపలేఖిని నుండి 1920 km వద్ద ఏర్పడును.

ప్రశ్న 27.
ఒక గబ్బిలం తన రెక్కలను రెపరెపలాడిస్తూ అతిధ్వని శబ్దాల ద్వారా మార్గాన్ని నిర్దేశించుకొంటూ ఒక గుహలో అటు ఇటు తిరుగుతుంది. గబ్బిలం వెలువరిచే ధ్వని పౌనఃపున్యాన్ని 40 kHz గా ఊహించండి. ఆ గబ్బిలం గాలిలో ధ్వని వడికి 0.03 రెట్ల వడితో చలిస్తున్నప్పుడు, ఎదురుగా ఉన్న ఒక పెద్ద గోడ ఉపరితలాన్ని దూరం నుంచి అకస్మాత్తుగా ఎదుర్కొన్నది. ఆ గోడ నుంచి పరావర్తనాన్ని ఆ గబ్బిలం ఎంత పౌనఃపున్యంతో వింటుంది?
సాధన:
గబ్బిలం వెలువరించు ధ్వని పౌనఃపున్యం, v = 40kHz.
గబ్బిళం వడి υs = 0.03υ, ఇక్కడ υ ధ్వని గోడను తాకు ధ్వని దృశ్య పౌనఃపున్యం,
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 74

ఈ పౌనఃపున్యంను గోడ పరావర్తనం చెందించును మరియు గబ్బిలం గోడవైపు చలించేటప్పుడు గ్రహించును. అందువలన υs = 0.
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 75

సాధించిన సమస్యలు Textual Examples

ప్రశ్న 1.
క్రింద ఇచ్చిన తరంగ చలనానికి కొన్ని ఉదాహరణలు. ప్రతి సందర్భంలో తరంగ చలనం తిర్యక్, అనుదైర్ఘ్య లేదా ఆ రెండింటి కలయికలలో ఏది అవుతుందో తెలపండి.
a) ఒక అనుదైర్ఘ్య స్ప్రింగ్ ఒక చివరను పక్కలకు స్థానభ్రంశం చెందిస్తే, ఆ స్ప్రింగ్లో ఉత్పన్నమయ్యే నొక్కు (kink) చలనం.
b) ద్రవంతో నిండిన స్తూపం ముషలకం (piston) స్థానాన్ని ముందుకు, వెనకకు కదిలిస్తే స్తూపంలో ఉత్పన్నమయ్యే తరంగాలు.
c) మోటారు పడవను నీటిలో నడిపినప్పుడు ఉత్పన్నమయ్యే తరంగాలు
d) కంపించే క్వార్డ్ స్పటికంపల్ల ఉత్పన్నమయ్యే గాలి లోని అతిధ్వని తరంగాలు.
సాధన:
a) తిర్యక్, అనుదైర్ఘ్య
b) అనుదైర్ఘ్య
c) తిర్యక్, అనుదైర్ఘ్య
d) అనుదైర్ఘ్య

AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు

ప్రశ్న 2.
ఒక తీగ వెంబడి ప్రయాణించే ఒక తరంగాన్ని ఈ విధంగా వర్ణించారు. y(x, t) = 0.005 sin (80.00 x 3.0t), ఇందులో సంఖ్యా స్థిరాంకాలు SI ప్రమాణాలలో ఉన్నాయి (0.005 m, 80.0 rad m-1, 3.00 rad s-1) ఆ తరంగం (a) కంపనపరిమితి, (b) తరంగదైర్ఘ్యం, (c) ఆవర్తన కాలం పౌనఃపున్యాలను గణించండి. x = 30.0 cm దూరం వద్ద, కాలం t = 20 s వద్ద ఉన్నప్పుడు కూడా ఆ తరంగ స్థానభ్రంశం y ని గణించండి.
సాధన:
ఇచ్చిన స్థానభ్రంశ సమీకరణాన్ని y(x, t) = a sin (kx – ωt + Φ) తో పోల్చగా y(x, t) = a sin (kx – ωt) దీని నుంచి,
a) ఆ తరంగ కంపనపరిమితి 0.005m – 5 mm.
b) కోణీయ తరంగ సంఖ్య k, కోణీయ పౌనఃపున్యం ω లు k = 80.0 m-1, ω = 3.0 s-1 అని తెలుస్తాయి.
λ = \(\frac{2 \pi}{k}\) లేదా k = k = \(\frac{2 \pi}{\lambda}\)

అప్పుడు మనం సమీకరణం (1.6) ద్వారా తరంగ దైర్ఘ్యం λ ని k కి సంబంధపరుస్తాం.
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 76

c) ఇప్పుడు T ని ω పరంగా రాస్తే,
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 77
x = 30.0 cm, కాలం t= 20s వద్ద స్థానభ్రంశం
y = (0.005 m) sin (80.0 × 0.3 – 3.0 × 20)
= (0.005 m) sin (-36 + 12π)
= (0.005 m) sin (1.699)
= (0.005 m) sin (97°) ≅ 5 mm

ప్రశ్న 3.
0.72 m పొడవు గల ఒక ఉక్కు తీగ 5.0 × 10-3 kgల ద్రవ్యరాశి కలిగి ఉంది. ఆ తీగ 60 N తన్యతకు లోనయితే తీగపై తిర్యక్ తరంగ వడి ఎంత?
సాధన:
తీగ ఏకాంక పొడవుకు ద్రవ్యరాశి
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 78

ప్రశ్న 4.
ప్రామాణిక ఉష్ణోగ్రత, పీడనాల వద్ద గాలిలో ధ్వని వడిని అంచనావేయండి. 1 mole గాలి ద్రవ్యరాశి 29.0 × 103 kg.
సాధన:
ప్రామాణిక ఉష్ణోగ్రత, పీడనాలు (STP) వద్ద 1 mole ఏ వాయువైనా 22.4 లీటర్లు ఆక్రమిస్తుంది. అందువల్ల STP వద్ద గాలి సాంద్రత :

ρ0 (ఒక మోల్ గాలి ద్రవ్యరాశి) / (STP వద్ద ఒక మోల్ గాలి ఘనపరిమాణం).
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 79

యానకంలో ధ్వని వడికి న్యూటన్ ఫార్ములా ప్రకారం, STP వద్ద గాలిలో పొందగలిగే ధ్వని వడి,
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 80

ప్రశ్న 5.
30.0cm పొడవు గల ఒక గొట్టం రెండు చివరలు తెరచి ఉన్నాయి. ఆ గొట్టం ఏ అనుస్వరం 1.1 kHz జనకంతో అనునాదంలో ఉంటుంది ? ఆ గొట్టం ఒక చివరను మూసివేస్తే అదే జనకంతో అనునాదాన్ని గమనించవచ్చా? గాలిలో ధ్వని వడిని 330 ms-1 గా తీసుకోండి.
సాధన:
మొదటి అనుస్వర పౌనఃపున్యం,
v1 = \(\frac{υ}{\lambda_1}=\frac{υ}{2L}\) (తెరచిన గొట్టం)

ఇక్కడ L అనేది గొట్టం పొడవు. దాని nవ అనుస్వర పౌనఃపున్యం:
vn = \(\frac{nυ}{2L}\), n = 1, 2, 3, ……………. (తెరచిన గొట్టం)
తెరచిన గొట్టపు మొదటి కొన్ని కంపనరీతులు పటంలో చూపడమైంది.
L = 30.0 cm. υ = 330 m s-1

AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 81

(a) తెరచిన గొట్టంలో స్థావర తరంగాలు, మొదటి నాలుగు అనుస్వరాలు :
స్పష్టంగా 1.1 kHz పౌనః పున్యం గల జనకానికి, గాలి స్తంభం υ2 వద్ద అనునాదం చెందగలదు. అంటే రెండడ అనుస్వరం వద్ద, ఇప్పుడు ఆ గొట్టం ఒక చివర మూసివేస్తే ప్రాథమిక పౌనఃపున్యం.
ν1 = \(\frac{υ}{\lambda_1}=\frac{υ}{4L}\) (ఒక చివర మూసిన గొట్టం)
బేసి సంఖ్య అనుస్వరాలు మాత్రమే, కింద చూపినట్లు, ఉంటాయి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 82

(2) ఒక చివర తెరచిన మరొక చివర మూసిన ఒక గాలి స్థంభపు సామాన్య కంపనరీతులు. కేవలం బేసి అనుస్వరాలు మాత్రమే సాధ్యమవుతున్నట్లు తెలుస్తుంది.
ν3 = \(\frac{3υ}{4L}\), ν5 = \(\frac{5υ}{4L}\)

L = 30 cm, υ = 3300 m s-1కు, చివర మూసిన గొట్టపు ప్రాథమిక పౌనఃపున్యం 275 Hz దాని నాల్గవ అనుస్వరానికి జనక పౌనఃపున్యం అనురూపంగా
ఉంటుంది.

ప్రశ్న 6.
A, B అనే రెండు సితార్ తంత్రులు ‘ద’ స్వరాన్ని వాయించేటప్పుడు వాటి కృతిలో కొద్ది తేడా వల్ల అవి 5 Hz పౌనఃపున్యం గల విస్పందనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. B తీగ తన్యతను కొద్దిగా పెంచితే విస్పందనాల పౌనఃపున్యం 3 Hz కు తగ్గినట్లు కనుక్కొన్నారు. A పౌనఃపున్యం 427 Hz అయితే B అసలు పౌనఃపున్యం ఎంత?
సాధన:
తీగ తన్యతలో పెరుగుదల దాని పౌనఃపున్యాన్ని పెంచుతుంది. B అసలు పౌనఃపున్యం (νB), A(νA), కంటే ఎక్కువగా ఉంటే, νB లోని మరింత పెరుగుదల విస్పందన పౌనః పున్యాన్ని పెంచుతుంది. కాని విస్పందన పౌనఃపున్యం తగినట్లు కనుక్కొన్నారు. దీని ద్వారా తెలిసేదేమిటంటే
νB < νA, νA – νB = 5 Hz, νA = 427 Hz కాబట్టి
νB = 422 Hz.

AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు

ప్రశ్న 7.
ఒక రాకెట్ 200 m s-1 వడితో ఒక స్థిర లక్ష్యం వైపు చలిస్తున్నది. చలిస్తున్నప్పుడు అది 1000 Hz పౌనఃపున్యం గల ఒక తరంగాన్ని ఉద్గారిస్తుంది. లక్ష్యాన్ని చేరే ధ్వనిలోని కొంత భాగం ఒక ప్రతిధ్వనిలాగా రాకెట్ వైపుకు వెనుకకు పరావర్తనం చెందుతుంది. 1) లక్ష్యం గుర్తించిన ధ్వని పౌనఃపున్యాన్ని, 2) రాకెట్ గుర్తించిన ప్రతిధ్వని పౌనః పున్యాన్ని లెక్కించండి. [AP (Mar.’16)]
సాధన:
1) పరిశీలకుడు నిశ్చల స్థితిలో ఉన్నాడు. జనకం 200 msā వడితో చలిస్తుంది. ఇది ధ్వని వేగం 330 ms-1 తో పోల్చదగినదిగా ఉన్నందువల్ల
(\(\frac{1+υ_s}{υ}\))-1 సమీకరణం υ = υ0 ని ఉపయోగించాలి. కాని ఉజ్జాయింపు ని కాదు. జనకం స్థిరంగా
సమీకరణం ν0 (1 – \(\frac{υ_s}{υ}\))ఉన్న లక్ష్యాన్ని సమీపిస్తున్నందువల్ల υ0 = 0, νsని బదులు -υs ని తీసుకోవాలి. అందువల్ల,
υ0 = 0 (\(\frac{1+υ_s}{υ}\))-1
(దీనిలో ν0 జనకం ఉద్గారించే పౌనఃపున్యం).
ν = 1000 Hz × [1 – 200 m s-1/330 m s-1]-1 ≅ 2540 Hz

2) ఇప్పుడు లక్ష్యం జనకం (ఎందుకంటే ఇది ప్రతిధ్వని జనకం), రాకెట్ శోధకం ఇప్పుడు పరిశీలకుడు (ఎందుకంటే అది ప్రతిధ్వనిని గుర్తిస్తుంది). అందువల్ల, υ0 = 0, υ0 ఒక ధనాత్మక విలువను కలిగి ఉంటుంది. జనకం (లక్ష్యం) ఉద్గారించే ధ్వని పౌనః పున్యం ν లక్ష్యం అడ్డగించే ధ్వని పౌనఃపున్యం అవుతుంది. అది ν0 మాత్రం కాదు. అందువల్ల, రాకెట్ నమోదు చేసే పౌనఃపున్యం
AP Inter 2nd Year Physics Study Material Chapter 1 తరంగాలు 83

AP Inter 1st Year Civics Study Material Chapter 8 పౌరసత్వం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Civics Study Material 8th Lesson పౌరసత్వం Textbook Questions and Answers.

AP Inter 1st Year Civics Study Material 8th Lesson పౌరసత్వం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పౌరసత్వాన్ని నిర్వచించి, పౌరసత్వ ఆర్జన పద్ధతులను వర్ణించండి. [Mar. ’16]
జవాబు:
పరిచయం: పౌరసత్వం అనేది ప్రజాస్వామ్య రాజ్యాలలో నివసించే వ్యక్తుల ప్రత్యేక హక్కు వ్యక్తులు తమ దేశంలో పౌరసత్వాన్ని కలిగి ఉండటాన్ని ప్రతిష్టాత్మకంగానూ, గర్వదాయకంగానూ భావిస్తారు. వాస్తవానికి రాజ్యంలోని పౌరులను వివిధ తరహాల వ్యక్తుల నుంచి విడదీసేందుకు పౌరసత్వం దోహదపడుతుంది. రాజ్యంలో సుఖ సంతోషాలు, సహృద్భావాలతో జీవనం కొనసాగించేందుకు పౌరసత్వం సాధనంగా ఉంటుందని ప్రజలు భావిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే పౌరసత్వం ప్రజలలో దేశభక్తి, త్యాగనిరతి, విశాల దృక్పథం వంటి భావాలను పెంపొందిస్తుంది. పౌరసత్వం అనేది సాంప్రదాయాలు లేదా చట్టాల ద్వారా గుర్తించబడే వ్యక్తుల హోదాను సూచిస్తుంది. పౌరసత్వం గల వ్యక్తులనే పౌరులుగా వ్యవహరిస్తారు. అటువంటి పౌరులు రాజకీయ వ్యవస్థ అయిన రాజ్యం వ్యవహారాలలో పాల్గొంటారు. సాల్మండ్ ప్రకారం పౌరులు రాజ్య సభ్యులుగా ఉంటూ రాజ్యంలో వైయుక్తిక, శాశ్వతమైన సంబంధాలను కలిగి ఉంటారు. వారు అనేక హక్కులు, సౌకర్యాలను అనుభవిస్తారు. అటువంటి వాటిలో ఓటుహక్కు, ఆస్తిహక్కు, నివాసం వంటి హక్కులు ఉన్నాయి. అంతేకాకుండా పన్నులను చెల్లించడం, సైనికపరమైన సేవలను అందించడం వంటి కొన్ని బాధ్యతలు కూడా ప్రతి పౌరుడికి ఉంటాయి.

నిర్వచనాలు:

  1. అరిస్టాటిల్: “రాజ్య వ్యవహారాలలో ప్రత్యక్షంగా, చురుకైన పాత్ర కలిగిన వ్యక్తియే పౌరుడు”.
  2. ప్రొఫెసర్ లాస్కీ: “ప్రజాహితానికి వ్యక్తులు అందించే నిర్ణాయక సేవయే పౌరసత్వం”.
  3. టి.హెచ్.మార్షల్: “రాజకీయ సమాజంలో సంపూర్ణ సభ్యులుగా ఉండేవారికి కల్పించే హోదాయే పౌరసత్వం. అటువంటి హోదాగల వ్యక్తులు హక్కులు, బాధ్యతల విషయంలో సమాన హోదాను కలిగి ఉంటారు”.

పౌరసత్వ ఆర్జన పద్ధతులు (Methods of acquiring Citizenship): పౌరసత్వం రెండు పద్ధతుల ద్వారా సంక్రమిస్తుంది. అవి: A) సహజమైనది B) సహజీకృతమైనది. ఆ రెండు పద్ధతులను కింద అధ్యయనం చేయడమైంది.

A) సహజ పౌరసత్వం: అధికారులకు ఏ విధమైన విజ్ఞప్తి చేయకుండా లేదా ప్రత్యేక దరఖాస్తును పంపించకుండా వ్యక్తులకు సంక్రమించే పౌరసత్వాన్ని సహజ పౌరసత్వం అంటారు. సహజ పౌరసత్వంలో మూడు అంశాలు ఇమిడి ఉంటాయి. అవి:

  1. భూమి లేదా జన్మస్థలం (జస్ సోలి)
  2. బంధుత్వం లేదా రక్తసంబంధం (జస్ సాంగ్వినస్)
  3. మిశ్రమ అంశం

పైన పేర్కొన్న వాటిని కింది విధంగా వివరించవచ్చు.
1) జస్ సోలి – భూమి లేదా జన్మస్థలం (Jus soli – Land or Place of Birth): ‘జస్ సోలి’ అంటే భూమి లేదా జన్మస్థలం సూత్రం ఆధారంగా పౌరసత్వ సంక్రమణగా భావించవచ్చు. ఈ పద్ధతి ప్రకారం తల్లిదండ్రులను బట్టి కాకుండా పుట్టిన ప్రదేశం ప్రాతిపదికపై పౌరసత్వం నిర్ణయించడమవుతుంది. జన్మించిన ప్రదేశమే పౌరసత్వాన్ని నిర్ణయించడంలో కీలకపాత్రను పోషిస్తుంది. అయితే ఆధునిక కాలంలో ఈ రకమైన పద్ధతి అంతగా ప్రాచుర్యం పొందలేదు. భూమితో సంబంధం గల మధ్యయుగంలో ఈ రకమైన పౌరసత్వం ఎంతో ప్రసిద్ధిగాంచింది. వర్తమాన కాలంలో ఈ పద్ధతి అర్జంటీనాలో మాత్రమే పాటించబడుతున్నది.

2) జస్ సాంగ్వినిస్ – బంధుత్వం లేదా రక్తసంబంధం (Jus Sanguinis – Kinship or Blood Relationship): ‘జస్ సాంగ్వినస్’ అనేది బంధుత్వం లేదా రక్తసంబంధం ద్వారా పౌరసత్వం సంక్రమిస్తుందనే అంశాన్ని సూచిస్తుంది. ఈ పద్ధతి ప్రకారం ఒక శిశువు తాను జన్మించిన ప్రదేశంతో సంబంధం లేకుండానే తన తల్లిదండ్రుల పౌరసత్వాన్ని పొందుతుంది. ఇక్కడ బంధుత్వం లేదా రక్తసంబంధం ఒక్కటే పౌరసత్వ ఆర్జనను నిర్ణయిస్తుంది. ఉదాహరణకు భారతీయ తల్లిదండ్రులకు జన్మించిన శిశువు జన్మస్థలంతో నిమిత్తం లేకుండా భారత పౌరుడిగానే పరిగణించడమవుతుంది. ఈ రకమైన పౌరసత్వం అనేది ప్రాచీనకాలంలో ఎంతగానో ప్రాచుర్యం పొందింది. ఇప్పటికీ ఈ పద్ధతిని ప్రపంచంలోని అనేక రాజ్యాలు అనుసరిస్తున్నాయి. ఈ రకమైన పౌరసత్వ సంక్రమణం అనేది సహజమైనదిగానూ, హేతుబద్ధమైనదిగానూ భావించబడింది. మొత్తం మీద జర్మనీ, నార్వే, ఇటలీ, స్వీడన్ వంటి అనేక రాజ్యాలలో ఈ రకమైన పౌరసత్వ పద్ధతి అమలులో ఉంది.

3) మిశ్రమ సూత్రం (Mixed Principle): ఈ సూత్రాన్ని అనుసరించి రక్తసంబంధంతో పాటు జన్మస్థల సంబంధమైన సూత్రం ప్రకారం పౌరసత్వాన్ని ప్రసాదించడమైంది. అనేక రాజ్యాలు ఈ సూత్రాన్ని అనుసరిస్తున్నాయి. ఉదాహరణకు బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు రక్తసంబంధంతో పాటుగా జన్మస్థల సంబంధమైన అంశం ద్వారా పౌరసత్వాన్ని ప్రసాదిస్తున్నాయి. అయితే ఈ సందర్భంలో పౌరసత్వాన్ని ప్రసాదించడంలో పైన పేర్కొన్న రెండు సూత్రాలను పాటించడంతో ఒకే సమయంలో రెండు దేశాల పౌరసత్వం లభించే అవకాశం ఉంది. ఉదాహరణకు బ్రిటిష్ తల్లిదండ్రులకు శిశువు అమెరికాలో జన్మిస్తే జన్మస్థల సంబంధమైన పద్ధతి ప్రకారం అమెరికా పౌరసత్వం లభిస్తుంది. అదే శిశువు రక్తసంబంధమైన పద్ధతిని అనుసరించి బ్రిటిష్ పౌరసత్వం పొందుతుంది. అటువంటి సందర్భంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అప్పుడు ఆ శిశువుకు యుక్తవయస్సు వచ్చిన తరువాత తన ఇష్టం వచ్చిన రాజ్య పౌరసత్వాన్ని ఎంపిక చేసుకొనే స్వేచ్ఛ ఉంటుంది.

B. సహజీకృత పౌరసత్వం (Naturalised Citizenship): సహజ పౌరసత్వం లేని వ్యక్తి సహజీకృత పద్ధతి ద్వారా రాజ్య పౌరసత్వాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ పద్ధతి ద్వారా విదేశీయులు కొన్ని షరతులకు లోబడి రాజ్య పౌరసత్వాన్ని పొందవచ్చు. అటువంటి షరతులు అన్ని రాజ్యాలలో ఒకే విధంగా ఉండవు. వాటిలో కొన్నింటిని కింద పేర్కొనడమైంది.

1) నివాసం (Residence): విదేశీయుడు తాను నివసిస్తున్న రాజ్యంలో పౌరసత్వాన్ని పొందేందుకు నిర్ణీత కాలం పాటు నివసించాలి. అతడు ఆ దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో తప్పనిసరిగా నివసించాల్సి ఉంటుంది. ఆ పరిమితి అన్ని రాజ్యాలలో ఒకే రకంగా లేదు. ఉదాహరణకు ఆ కాలపరిమితి బ్రిటన్, అమెరికాలలో 5 సంవత్సరాలు కాగా, ఫ్రాన్సులో 10 సంవత్సరాలుగా నిర్ణయించడమైంది.

2) ఎంపిక (Choice): విదేశీ తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలు యుక్తవయస్సు వచ్చిన తరువాత తమ ఇష్టం వచ్చిన రాజ్య పౌరసత్వాన్ని ఎంపిక చేసుకొని పొందవచ్చు.

3) దరఖాస్తు (Application): విదేశీయుడు తాను కోరుకున్న రాజ్యంలో పౌరసత్వం పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ రాజ్యానికి చెందిన ప్రభుత్వం విధించే షరతులను సంతృప్తిపరచాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి పౌరసత్వం కోసం చేసుకున్న దరఖాస్తు యోగ్యతను రాజ్యం పరిశీలించి ఆమోదించినట్లయితే అతనికి పౌరసత్వం లభిస్తుంది. నిర్దిష్ట కాలం పాటు నివాసం, సత్ప్రవర్తన, ఆర్థిక సామర్థ్యం, రాజ్యంలోని ఏదైనా ఒక జాతీయ భాషను అవగాహన చేసుకోవడం వంటి షరతులను ఆయా విదేశీయులు ఆమోదించాల్సి ఉంటుంది. పై వాటితో పాటుగా తాము పౌరసత్వం పొందగోరే రాజ్యానికి విధేయతను కలిగి ఉంటామనే లిఖితపూర్వక ప్రమాణం చేయడం ద్వారా విదేశీయులు పౌరసత్వాన్ని
పొందగలుగుతారు.

4) స్థిరాస్తులు (Fixed Assets): భూమి, ఇళ్ళు వంటి స్థిరాస్తులను సంపాదించుకోవడం ద్వారా రాజ్య పౌరసత్వాన్ని విదేశీయులు పొందగలుగుతారు.

5) సేవలు (Services) (ప్రభుత్వ లేదా ప్రైవేటు): ప్రభుత్వం లేదా గుర్తింపు పొందిన ప్రైవేటు సంస్థలలో సేవలను అందించడం ద్వారా విదేశీయుడు పౌరసత్వాన్ని పొందవచ్చు. అధికారిక సంస్థలలో పనిచేసినప్పుడే ఈ నియమం వర్తిస్తుంది. విదేశీ పౌరుడు ప్రతిభావంతమైన సేవలను అందించడం ద్వారా తాను కోరుకున్న దేశం పౌరసత్వాన్ని పొందవచ్చు.

6) వివాహం (Marriage): వివాహం వల్ల పౌరసత్వం లభించవచ్చు. కొన్ని దేశాలలో అన్య దేశీయుని వివాహమాడిన “స్త్రీకి తన భర్త రాజ్యంలో పౌరసత్వం పొందవచ్చు. మరికొన్ని దేశాలలో పౌరులు విదేశ వనిత లేదా విదేశీ పురుషుడిని గానీ వివాహం చేసుకొంటే, వారికి భర్త లేదా భార్యకు చెందిన రాజ్య పౌరసత్వం లభిస్తుంది. ఉదాహరణకు ఒక బ్రిటిష్ దేశస్థురాలు భారతీయుడిని వివాహమాడితే ఆమెకు భారతదేశ పౌరసత్వమివ్వడం జరుగుతుంది. విదేశస్థుడిని వివాహం చేసుకొన్నప్పటికీ జపాన్ దేశస్థురాలు తన స్వదేశీ పౌరసత్వాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా జపాన్ దేశస్థురాలిని వివాహమాడిన విదేశీయునికి కూడా జపాన్ పౌరసత్వం ఇవ్వబడుతుంది.

ప్రశ్న 2.
మంచి పౌరుడి వివిధ లక్షణాలను వివరించండి.
జవాబు:
పౌరుడు: “రాజ్య వ్యవహారాలలో ప్రత్యక్షంగా, చురుకైన పాత్ర కలిగిన వ్యక్తియే పౌరుడు” – అరిస్టాటిల్.

మంచి పౌరుడి లక్షణాలు (Qualities of a Good Citizen): అరిస్టాటిల్ ఉద్దేశ్యంలో మంచి పౌరులు రాజ్యాన్ని మంచి రాజ్యాన్ని నిర్మించగలుగుతారు. వారు ఆదర్శ గుణాలను కలిగి ఉండటమే అందుకు కారణం. ఈ సందర్భంలో లార్డ్ బ్రైస్ మంచి పౌరుడి లక్షణాలలో మూడింటిని పేర్కొన్నాడు.

అవి: 1) అంతరాత్మ ప్రకారం వ్యవహరించడం ii) తెలివితేటలను కలిగి ఉండటం iii) ఆత్మ నిగ్రహాన్ని పాటించడం. మొత్తం మీద మంచి పౌరుడు కింది లక్షణాలను కలిగి ఉంటాడని చెప్పవచ్చు.

1) మంచి ప్రవర్తన (Good Character): మంచి పౌరుడు మంచి ప్రవర్తనను కలిగి ఉండాలి. అతడు ధైర్యం, న్యాయబుద్ధి, సహాయధోరణి, ఉదార స్వభావం, సానుభూతి, సత్యభాషణ, నిజాయితీ వంటి గుణాలను త్రికరణ శుద్ధిగా కలిగి ఉండాలి.

2) సంపూర్ణ ఆరోగ్యం (Sound Health): మంచి పౌరుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని, శక్తిని కలిగి ఉండాలి. ఆరోగ్యవంతులైన పౌరులే ఆరోగ్యకరమైన జాతిని నిర్మిస్తారు. ఎందుకంటే మంచి ఆలోచనలు గల వ్యక్తులే మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. అటువంటి పౌరులు అనేక రంగాలలో రాజ్య ప్రగతికి దోహదపడతారు.

3) తెలివితేటలు, విద్య (Intelligence and Education): తెలివితేటలు, విద్య అనేవి పౌరుడికి గల మరొక లక్షణంగా పరిగణించవచ్చు. ప్రతి పౌరుడు తన హక్కులు, బాధ్యతల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి. వివిధ సంఘటనల పరిశీలనలో ఎటువంటి ఆవేశాలకు లోనుకారాదు. ఈ సందర్భంలో సరైన విద్యను అభ్యసించిన వారు సమాజంలో తగిన పాత్రను పోషించగలుగుతారు. తెలివితేటలు గల పౌరులు రాజ్యం ఎదుర్కొనే సమస్యలను సరైన రీతిలో అవగాహన చేసుకుంటారు.

4) ఆత్మ నిగ్రహం (Self Control): ఆత్మ నిగ్రహం అనేది మంచి పౌరుడి లక్షణాలలో ఒకటిగా భావించవచ్చు. మంచి పౌరుడు రాగ ద్వేషాలకు గురయ్యే స్వభావాన్ని కలిగి ఉండరాదు. ప్రజా వ్యవహారాలలో అతడు ఆత్మ నిగ్రహాన్ని ప్రదర్శించాలి. ఆత్మ నిగ్రహం, ఆత్మ విశ్వాసం అనేవి అతడిని క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని గడిపేందుకు దోహదపడతాయి. అట్లాగే మంచి పౌరుడనే వ్యక్తి అమానవీయ కార్యక్రమాలలో పాల్గొనరాదు.

5) ప్రజాస్ఫూర్తి (Public Spirit): మంచి పౌరుడు విశాలమైన, ఉదారమైన దృక్పథాలను కలిగి ఉండాలి. ప్రజా వ్యవహారాలలో అతడు క్రియాశీలక పాత్రను పోషించేందుకు సిద్ధంగా ఉండాలి. తన హక్కులు, బాధ్యతల వినియోగంలో తెలివితేటలతో వ్యవహరించాలి. అట్లాగే సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలి. ప్రజా సేవాభావాన్ని కలిగి ఉంటూ సమాజ సమిష్టి సంక్షేమానికి తన సేవలను అందించేందుకు సదా సంసిద్ధుడై ఉండాలి.

6) స్వార్థ పరిత్యాగం (Self-Sacrifice): మంచి పౌరుడు స్వార్థాన్ని పరిత్యజించాల్సి ఉంటుంది. అతడు తన స్వార్థ ప్రయోజనాలను సమాజ ప్రయోజనాల కోసం విస్మరించాలి. సేవాతత్పరతతో పాటుగా సమాజం, ప్రభుత్వం, రాజ్యం పట్ల అంకిత భావాలను కలిగి ఉండాలి.

7) నిజాయితీతో ఓటుహక్కు వినియోగం (Honest exercise of franchise): ఓటుహక్కును నిజాయితీతో వినియోగించడం అనేది మంచి పౌరుడి మరొక లక్షణంగా పేర్కొనవచ్చు. స్వార్థబుద్ధి, వర్గం, కులం, మతం వంటి అంశాలు ఈ సందర్భంలో మంచి పౌరసత్వానికి ప్రతిబంధకాలుగా ఉంటాయి.

8) బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించడం (Sincere Performance of Obligations): మంచి పౌరుడు తన బాధ్యతలను చిత్తశుద్ధితో, విశ్వాసపాత్రుడిగా నిర్వహిస్తాడు. ఈ విషయంలో అతడు సంబంధిత అధికారులకు తగిన సహకారాన్ని అందిస్తాడు. అట్లాగే వివిధ ప్రభుత్వ సంస్థలకు చెల్లించాల్సిన పన్నులను సకాలంలో సరియైన రీతిలో చెల్లిస్తాడు.

9) క్రమానుగత విధేయతలు (Right Ordering of Loyalties): మంచి పౌరుడు తన కుటుంబం, వర్గం, కులం, కార్మిక సంఘం, ప్రాంతం, జాతి పట్ల క్రమానుగత విధేయతలను చూపుతాడు. వివిధ సంస్థల పట్ల క్రమానుగత విధేయతలను చూపుతూ, వాటి మధ్య ఘర్షణలు తలెత్తకుండా చూస్తాడు. విశాల ప్రయోజనాల కోసం స్వప్రయోజనాలను త్యాగం చేస్తాడు. తాను నివసించే కుటుంబం, ప్రాంతాల మధ్య ఘర్షణలు తలెత్తినచో, కుటుంబ ప్రయోజనాలను త్యాగం చేయాల్సి ఉంటుంది.

ప్రశ్న 3.
మంచి పౌరసత్వానికి గల వివిధ అవరోధాలను వర్ణించండి.
జవాబు:
మంచి పౌరసత్వ వికాసానికి అనేక అవరోధాలు ఉంటాయి. అటువంటి వాటిలో కులవ్యవస్థ, మతతత్త్వం, అజ్ఞానం, నిరక్షరాస్యత, పేదరికం, సామాజిక వివక్షతలు వంటివి ఉన్నాయి. మంచి పౌరసత్వానికి గల అవరోధాలను క్రింది విధంగా చర్చించవచ్చు.

1) సోమరితనం (Laziness): సోమరితనం పౌరులను ఉత్తమ పౌరులుగా రూపొందించకుండా నిరోధిస్తుంది. ప్రజాస్వామ్య ప్రభుత్వం విజయవంతం కావాలంటే పౌరులు రాజకీయంగా చైతన్యవంతులై ఉండాలి. సోమరితనం పౌరులకు సామాజిక, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకుండా చేస్తుంది.

2) అజ్ఞానం, నిరక్షరాస్యత (Ignorance and Illiteracy): మంచి పౌరసత్వానికి అజ్ఞానం, నిరక్షరాస్యతలనేవి గొప్ప ఆటంకాలుగా భావించవచ్చు. అజ్ఞానులు నిరక్షరాస్యులైన ప్రజలు తమ హక్కులను, బాధ్యతలను గురించి సరైన రీతిలో తెలుసుకోలేరు.

3) పేదరికం (Poverty): పేదరికం అన్ని రకాల అనర్థాలకు మూలకారణంగా పరిగణించవచ్చు. సంపదపరమైన అసమానతలు ఉన్న దేశంలో మంచి పౌరసత్వం పెంపొందదు. పేదరికం వల్ల ప్రజా జీవనం పట్ల ప్రజలలో నిరాసక్తత, అలసత్వం నెలకొంటాయని ఈ సందర్భంలో గుర్తుంచుకోవాలి.

4) అనారోగ్యం (Ill-Health): మంచి పౌరసత్వానికి మరొక ఆటంకమే అనారోగ్యం. ఎందుకంటే అనారోగ్యంపాలైన పౌరులు రాజ్యం, సమాజ శ్రేయస్సుకు తమ సేవలను అందించలేరు.

5) సంకుచిత రాజకీయ ప్రయోజనాలు (Narrow Political Interests): రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత ఆవశ్యకమైనవి. అవి మంచి పౌరసత్వ ఆదర్శాలను పెంపొందిచడంలో కీలక పాత్రను పోషిస్తాయి. అయితే రాజకీయ పార్టీలకు చెందిన అనేకమంది జాతి లేదా సమాజం కొరకు కాకుండా పార్టీ ప్రయోజనాలకే పనిచేస్తున్నారు. అనేక పార్టీలకు చెందిన నాయకులు అధికారాన్ని చేజిక్కించుకొనే విషయంపై తమ దృష్టిని సారించారు. దాంతో ప్రజా శ్రేయస్సును పెంపొందించడం పట్ల పెద్దగా శ్రద్ధ వహించరు. కొన్ని రాజకీయ పార్టీలైతే ప్రజలలో శతృత్వాలు, వైరుధ్యాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తాయి. కొన్ని సమయాలలో అవి పార్టీ ప్రయోజనాలకై సమాజ ప్రయోజనాలను పరిత్యజించడం సర్వసాధారణమైంది.

6) కుల, మతతత్త్వాలు (Casteism and Communalism): మంచి పౌరసత్వ సాధనలో కుల, మతతత్త్వాలు అనేవి రెండు ముఖ్యమైన ఆటంకాలుగా పేర్కొనవచ్చు. కుల వ్యవస్థ, వర్గ వ్యత్యాసాలు కూడా ప్రజల మధ్య ద్వేషాన్ని కలిగించటంలో ప్రత్యేకమైన పాత్రను పోషిస్తున్నాయి. రాజ్యంలో సామాజిక, రాజకీయ సంఘీభావాలకు అవి ఆటంకాన్ని కలిగిస్తున్నాయని చెప్పవచ్చు.

7) స్వార్థపరత్వం (Selfishness): మంచి పౌరసత్వం, స్వార్థపరత్వం ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి. స్వార్ధబుద్ధి గల పౌరులు స్వీయ ప్రయోజనాల సాధనకే తమ ఆలోచనలు, చర్యలను పరిమితం చేస్తారు. తోటివారితో పాటుగా మాతృభూమి పట్ల తమ శక్తియుక్తులను కేటాయించలేరు.

8) ఉదాసీనత(Indifference): ఉదాసీనత అనేది పౌరులను మందబుద్ధులు, సోమరులుగా మార్చి, మంచి పౌరసత్వానికి ఆటంకంగా నిలుస్తుంది. ఉదాసీనులైన పౌరులు సమకాలీన సంఘటనల పట్ల ఏ మాత్రం పట్టించుకోరు. రాజ్య యంత్రాంగ నిర్మాణ నిర్వహణలలో పాల్గొనరు.

ప్రశ్న 4.
పౌరసత్వం ఎన్ని రకాలుగా ఉంటుందో వివరంగా తెలపండి.
జవాబు:
పౌరసత్వాన్ని మూడు రకాలుగా పేర్కొనవచ్చు. అవి:

  1. ఏక పౌరసత్వం
  2. ద్వంద్వ పౌరసత్వం
  3. విశ్వ పౌరసత్వం.

i) ఏక పౌరసత్వం (Single Citizenship): ఏక పౌరసత్వం అంటే రాజ్యంలో పౌరులు ఒకే రకమైన పౌరసత్వాన్ని కలిగి ఉండడంగా పేర్కొనవచ్చు. అట్లాగే ఒకే రకమైన హక్కులు, సౌకర్యాలు, రక్షణలు పౌరులకు ఏకపౌరసత్వ పద్ధతిలో ఉంటాయి. ఈ రకమైన పౌరసత్వం ఆధునిక ప్రపంచంలోని అనేక రాజ్యాలలో వాడుకలో ఉంది. ఉదాహరణకు భారత రాజ్యాంగం భారత పౌరుల జన్మస్థలం, నివాసం వంటి అంశాలతో సంబంధం లేకుండా ఏక పౌరసత్వాన్ని ప్రసాదించింది.

ii) ద్వంద్వ పౌరసత్వం (Double Citizenship): పౌరులకు రెండు రాజ్యాలలో పౌరసత్వం ఉండడాన్ని ద్వంద్వ పౌరసత్వంగా వ్యవహరిస్తారు. ఈ రకమైన పౌరసత్వం అనేక అభివృద్ధి చెందిన, వర్థమాన దేశాలలో వాడుకలో ఉంది. ఉదాహరణకు అమెరికన్ పౌరులకు విదేశాలలో జన్మించిన పిల్లలకు రెండు రాజ్యాల్లోనూ పౌరసత్వం పొందే అవకాశం ఉంది. ఆ రెండింటిలో ఒకటి మాతృదేశ పౌరసత్వం కాగా రెండోది తాము జన్మించిన రాజ్య పౌరసత్వానికి సంబంధించినవై ఉంటాయి. అయితే ద్వంద్వ పౌరసత్వం గల వ్యక్తులకు ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు ఉండవు. వారు రెండు రాజ్యాల చట్టాలకు విధేయులై ఉంటారు. ద్వంద్వ పౌరసత్వం అనేది యుక్తవయస్సు వచ్చే వరకు పిల్లలకు ఉంటుంది. ఆ తరువాత వారు రెండు రాజ్యాలలోని ఏదో ఒకదానిలో పౌరసత్వాన్ని ఎంపిక చేసుకొంటారు.

iii) విశ్వ పౌరసత్వం (Universal Citizenship): అంతర్జాతీయ, జాతీయ రాజకీయాలలో ఇటీవలి కాలంలో ఆవిష్కృతమైన భావనయే విశ్వ పౌరసత్వం. 1980, 1990 దశకాలలో సంభవించిన నాటకీయ పరిణామాలు విశ్వవ్యాప్తంగా శాస్త్ర, సాంకేతిక, కమ్యూనికేషన్లు వంటి రంగాలలో ఏర్పడిన పురోగతి మానవ జీవనాన్ని అద్భుతమైన రీతిలో మార్చివేసింది. సామాన్యులలో అతి సామాన్యులు సైతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన వివిధ సాధనాలను వినియోగించుకొని సౌకర్యవంతమైన, సౌఖ్యప్రదమైన, ఆర్థిక ప్రయోజనాలను పొందగలిగారు. అట్లాగే సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ వల్ల కలిగే ఫలితాలు వారికి వరప్రదాయినిగా పరిగణించబడినాయి.

అభివృద్ధి చెందిన దేశాలతో పాటుగా తృతీయ ప్రపంచ దేశాలలోని ప్రభుత్వాలు రక్షణ రంగం నుంచి సామాన్య ప్రజల సంక్షేమం దిశగా తమ ప్రాధాన్యతలను నిర్ణయించుకొన్నాయి. వివిధ రంగాలకు చెందిన మేధావులు విదేశాలకు వెళ్ళి, అశేష ప్రయోజనాలను పొందే విషయంలో ఆసక్తిని ప్రదర్శించసాగారు. ఈ ప్రక్రియలో భాగంగా వారు స్వదేశంతో పాటుగా, తాము పనిచేసే విదేశాలలో సైతం పౌరసత్వాన్ని పొందేందుకు ప్రయత్నించారు. ఇటువంటి సందర్భాలలో కొన్ని రాజ్యాలు ఇతర పౌరులకు తమ రాజ్య పౌరసత్వాన్ని ప్రసాదించే దిశగా అడుగులు వేశాయి. ఈ భావనే విశ్వ పౌరసత్వానికి ప్రాతిపదిక అయింది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సహజ పౌరసత్వం ఆర్జనకు సంబంధించిన రెండు పద్ధతులను రాయండి. [Mar. 2018]
జవాబు:
సహజ పౌరసత్వం: అధికారులకు ఏ విధమైన విజ్ఞప్తి చేయకుండా లేదా ప్రత్యేక దరఖాస్తును పంపించకుండా వ్యక్తులకు సంక్రమించే పౌరసత్వాన్ని సహజ పౌరసత్వం అంటారు. సహజ పౌరసత్వంలో మూడు అంశాలు ఇమిడి ఉంటాయి. అవి:

  1. భూమి లేదా జన్మస్థలం (జన్ సోలి)
  2. బంధుత్వం లేదా రక్త సంబంధం (జస్ సాంగ్వినస్)
  3. మిశ్రమ అంశం

పైన పేర్కొన్న వాటిని కింది విధంగా వివరించవచ్చు.

1) జసోసోలి – భూమి లేదా జన్మస్థలం (Jus soli – Land or Place of Birth): ‘జస్ సోలి’ అంటే భూమి లేదా జన్మస్థలం సూత్రం ఆధారంగా పౌరసత్వ సంక్రమణగా భావించవచ్చు. ఈ పద్ధతి ప్రకారం తల్లిదండ్రులను బట్టి కాకుండా పుట్టిన ప్రదేశం ప్రాతిపదికపై పౌరసత్వం నిర్ణయించడమవుతుంది. జన్మించిన ప్రదేశమే పౌరసత్వాన్ని నిర్ణయించడంలో కీలకపాత్రను పోషిస్తుంది. అయితే ఆధునిక కాలంలో ఈ రకమైన పద్దతి అంతగా ప్రాచుర్యం పొందలేదు. భూమితో సంబంధం గల మధ్యయుగంలో ఈ రకమైన పౌరసత్వం ఎంతో ప్రసిద్ధిగాంచింది. వర్తమాన కాలంలో ఈ పద్ధతి అర్జంటీనాలో మాత్రమే పాటించబడుతున్నది.

2) జన్ సాంగ్వినిస్ – బంధుత్వం లేదా రక్తసంబంధం (Jus Sanguinis – Kinship or Blood Relationship): ‘జస్ సాంగ్వినస్’ అనేది బంధుత్వం లేదా రక్తసంబంధం ద్వారా పౌరసత్వం సంక్రమిస్తుందనే అంశాన్ని సూచిస్తుంది. ఈ పద్ధతి ప్రకారం ఒక శిశువు తాను జన్మించిన ప్రదేశంతో సంబంధం లేకుండానే తన తల్లిదండ్రుల పౌరసత్వాన్ని పొందుతుంది. ఇక్కడ బంధుత్వం లేదా రక్తసంబంధం ఒక్కటే పౌరసత్వ ఆర్జనను నిర్ణయిస్తుంది. ఉదాహరణకు భారతీయ తల్లిదండ్రులకు జన్మించిన శిశువు జన్మస్థలంతో నిమిత్తం లేకుండా భారత పౌరుడిగానే పరిగణించడమవుతుంది. ఈ రకమైన పౌరసత్వం అనేది ప్రాచీనకాలంలో ఎంతగానో ప్రాచుర్యం పొందింది. ఇప్పటికీ ఈ పద్ధతిని ప్రపంచంలోని అనేక రాజ్యాలు అనుసరిస్తున్నాయి. ఈ రకమైన పౌరసత్వ సంక్రమణం అనేది సహజమైనదిగానూ, హేతుబద్ధమైనదిగానూ భావించబడింది. మొత్తం మీద జర్మనీ, నార్వే, ఇటలీ, స్వీడన్ వంటి అనేక రాజ్యాలలో ఈ రకమైన పౌరసత్వ పద్ధతి అమలులో ఉంది.

ప్రశ్న 2.
పౌరుడు, విదేశీయుడి మధ్య ఉన్న వ్యత్యాసాలు ఏవి ?
జవాబు:
పౌరుడు: అరిస్టాటిల్ ప్రకారం “రాజ్య వ్యవహారాలలో ప్రత్యక్షంగా, చురుకైన పాత్ర కలిగిన వ్యక్తి”.
విదేశీయుడు: “ఒక రాజ్యానికి చెందిన వ్యక్తి ఇతర రాజ్యంలో నివసించినట్లయితే అతనిని విదేశీయుడు అంటారు. పౌరుడు, విదేశీయునికి మధ్యగల వ్యత్యాసాలు (Differences between Citizen and Alien):
పౌరుడు (Citizen)

  1. రాజ్యంలో పౌరుడు శాశ్వత ప్రాతిపదికన నివసిస్తాడు.
  2. పౌరుడు తాను నివసించే రాజ్యం పట్ల పూర్తి విధేయతను చూపుతాడు.
  3. పౌరుడికి పౌర, రాజకీయ హక్కులు ఉంటాయి.
  4. ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలను పౌరుడు విమర్శించవచ్చు.
  5. పౌరుడికి హక్కులు, బాధ్యతలు రెండూ ఉంటాయి.

విదేశీయుడు (Alien)

  1. రాజ్యంలో విదేశీయుడు తాత్కాలిక ప్రాతిపదికన నివసిస్తాడు.
  2. విదేశీయుడు తాను ప్రస్తుతం నివసించే రాజ్యం పట్ల కాకుండా తన మాతృదేశం పట్ల విధేయతను ప్రదర్శిస్తాడు.
  3. విదేశీయుడికి పౌరహక్కులు మాత్రమే ఉంటాయి.
  4. విదేశీయుడు ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలను విమర్శించకూడదు.
  5. విదేశీయుడికి హక్కుల కంటే బాధ్యతలే ఎక్కువగా ఉంటాయి.

ప్రశ్న 3.
సహజీకృత పౌరసత్వం ఏ విధంగా సంక్రమిస్తుంది ? [Mar. 2017]
జవాబు:
సహజీకృత పౌరసత్వం (Naturalised Citizenship): సహజ పౌరసత్వం లేని వ్యక్తి సహజీకృత పద్ధతి ద్వారా రాజ్య పౌరసత్వాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ పద్ధతి ద్వారా విదేశీయులు కొన్ని షరతులకు లోబడి రాజ్య పౌరసత్వాన్ని పొందవచ్చు. అటువంటి షరతులు అన్ని రాజ్యాలలో ఒకే విధంగా ఉండవు. వాటిలో కొన్నింటిని కింద పేర్కొనడమైంది.

1) నివాసం (Residence): విదేశీయుడు తాను నివసిస్తున్న రాజ్యంలో పౌరసత్వాన్ని పొందేందుకు నిర్ణీత కాలం పాటు నివసించాలి. అతడు ఆ దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో తప్పనిసరిగా నివసించాల్సి ఉంటుంది. ఆ పరిమితి అన్ని రాజ్యాలలో ఒకే రకంగా లేదు. ఉదాహరణకు ఆ కాలపరిమితి బ్రిటన్, అమెరికాలలో 5 సంవత్సరాలు కాగా, ఫ్రాన్స్లో 10 సంవత్సరాలుగా నిర్ణయించడమైంది.

2) ఎంపిక (Choice): విదేశీ తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలు యుక్తవయస్సు వచ్చిన తరువాత తమ ఇష్టం వచ్చిన రాజ్య పౌరసత్వాన్ని ఎంపిక చేసుకొని పొందవచ్చు.

3) దరఖాస్తు (Application): విదేశీయుడు తాను కోరుకున్న రాజ్యంలో పౌరసత్వం పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ రాజ్యానికి చెందిన ప్రభుత్వం విధించే షరతులను సంతృప్తిపరచాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి పౌరసత్వం కోసం చేసుకున్న దరఖాస్తు యోగ్యతను రాజ్యం పరిశీలించి ఆమోదించినట్లయితే అతనికి పౌరసత్వం లభిస్తుంది. నిర్దిష్ట కాలం పాటు నివాసం, సత్ప్రవర్తన, ఆర్థిక సామర్థ్యం, రాజ్యంలోని ఏదైనా ఒక జాతీయ భాషను అవగాహన చేసుకోవడం వంటి షరతులను ఆయా విదేశీయులు ఆమోదించాల్సి ఉంటుంది. పై వాటితో పాటుగా తాము పౌరసత్వం పొందగోరే రాజ్యానికి విధేయతను కలిగి ఉంటామనే లిఖితపూర్వక ప్రమాణం చేయడం ద్వారా విదేశీయులు పౌరసత్వాన్ని పొందగలుగుతారు.

4) స్థిరాస్తులు (Fixed Assets): భూమి, ఇళ్ళు వంటి స్థిరాస్తులను సంపాదించుకోవడం ద్వారా రాజ్య పౌరసత్వాన్ని విదేశీయులు పొందగలుగుతారు.

5) సేవలు (Services) (ప్రభుత్వ లేదా ప్రైవేటు): ప్రభుత్వం లేదా గుర్తింపు పొందిన ప్రైవేటు సంస్థలలో సేవలను అందించడం ద్వారా విదేశీయుడు పౌరసత్వాన్ని పొందవచ్చు. అధికారిక సంస్థలలో పనిచేసినప్పుడే ఈ నియమం వర్తిస్తుంది. విదేశీ పౌరుడు ప్రతిభావంతమైన సేవలను అందించడం ద్వారా తాను కోరుకున్న దేశం పౌరసత్వాన్ని పొందవచ్చు.

6) వివాహం (Marriage): వివాహం వల్ల పౌరసత్వం లభించవచ్చు. కొన్ని దేశాలలో అన్య దేశీయుని వివాహమాడిన స్త్రీకి తన భర్త రాజ్యంలో పౌరసత్వం పొందవచ్చు. మరికొన్ని దేశాలలో పౌరులు విదేశ వనిత లేదా విదేశీ పురుషుడిని కానీ వివాహం చేసుకొంటే, వారికి భర్త లేదా భార్యకు చెందిన రాజ్య పౌరసత్వం లభిస్తుంది. ఉదాహరణకు ఒక బ్రిటిష్ దేశస్థురాలు భారతీయుడిని వివాహమాడితే ఆమెకు భారతదేశ పౌరసత్వమివ్వడం జరుగుతుంది. విదేశస్తుడిని వివాహం చేసుకొన్నప్పటికీ జపాన్ దేశస్థురాలు తన స్వదేశీ పౌరసత్వాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా జపాన్ దేశస్తురాలిని వివాహమాడిన విదేశీయునికి కూడా జపాన్ పౌరసత్వం ఇవ్వబడుతుంది.

ప్రశ్న 4.
పౌరసత్వం ఏ విధంగా కోల్పోబడుతుంది ?
జవాబు:
పౌరసత్వం అనేక విధాలుగా రద్దవుతుంది. పౌరసత్వం ఏ షరతుల వల్లనయితే లభించిందో ఆ షరతులు ఉల్లంఘించినచో అది రద్దవుతుంది. పౌరసత్వం రద్దు కావటానికి గల కారణాలను ఈ కింది విధంగా వివరించవచ్చు.

1) పౌరసత్వ త్యాగం (Renunciation of Citizenship): ఒక వ్యక్తి వేరొక రాజ్య పౌరసత్వాన్ని పొందినట్లయితే తన రాజ్యంలో పౌరసత్వాన్ని కోల్పోతాడు. సహజీకృత పౌరసత్వ పద్ధతి ద్వారా వేరే దేశ పౌరసత్వం కనుక లభించినట్లయితే అతడు మాతృదేశ పౌరసత్వాన్ని కోల్పోతాడు. భారత రాజ్యాంగం ప్రకారం భారతీయ పౌరులు ఇతర రాజ్యాలలో పౌరసత్వాన్ని పొందినట్లయితే భారతదేశ పౌరులుగా పరిగణించబడరు.

2) వివాహం (Marriage): విదేశీ పురుషుడిని వివాహం చేసుకొన్న మహిళ తన దేశ పౌరసత్వాన్ని కోల్పోయి, తన భర్తకు చెందిన రాజ్య పౌరసత్వాన్ని పొందుతుంది. అయితే కొన్ని రాజ్యాలు ఈ విషయంలో మినహాయింపును ఇచ్చి, ఏ రాజ్య పౌరసత్వం కావాలనే విషయాన్ని ఆ మహిళకే వదిలివేయడమైంది. ఉదాహరణకు బ్రిటన్ యువతికి అటువంటి ఎంపిక సదుపాయాన్ని ఇవ్వడమైంది.

3) విదేశాలలో ఉద్యోగం (Accepting Foreign Service): విదేశాలలో ప్రభుత్వ ఉద్యోగాన్ని శాశ్వత ప్రాతిపదికపై చేపట్టే వ్యక్తి, తన దేశానికి దూరంగా విదేశాలలో దీర్ఘకాలం గడిపిన వ్యక్తి మాతృదేశ పౌరసత్వాన్ని కోల్పోతాడు.

4) విదేశీ బిరుదుల స్వీకారం (Obliging foreign Tiles): స్వదేశీ ప్రభుత్వానుమతి లేకుండా విదేశీ బిరుదులను అంగీకరించిన లేదా స్వీకరించిన పౌరులు పౌరసత్వం రద్దవుతుంది.

5) ఎక్కువ కాలం దేశంలో లేకపోవడం (Prolonged Absence): ఒక రాజ్యంలో ఎక్కువ కాలం నివసించని వారు పౌరసత్వాన్ని కోల్పోతారు. కాలపరిమితి విషయంలో వివిధ రాజ్యాలు భిన్నమైన చట్టాలను రూపొందించాయి. ఫ్రాన్స్, జర్మనీలాంటి రాజ్యాలలో పది సంవత్సరాలకు మించి నివాసం లేని పౌరుల పౌరసత్వం రద్దు చేయడం
జరుగుతుంది.

6) దేశద్రోహం (Treason): కొన్ని దేశాలలో అత్యంత దారుణమైన నేరాలకు పాల్పడిన వ్యక్తులు, రాజ్యానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నిన వ్యక్తుల పౌరసత్వం రద్దు చేయబడతుంది. అంటే దేశద్రోహం వంటి నేరాలకు పాల్పడిన ప్రభుత్వమే వారి పౌరసత్వాన్ని ప్రభుత్వం తొలగిస్తుంది.

7) సైన్యం నుంచి పారిపోవడం (Desertion from Army): సైన్యం నుంచి పారిపోయిన వ్యక్తుల పౌరసత్వం రద్దవుతుంది. అనేక రాజ్యాలలో దీనికి సంబంధించిన ప్రత్యేక చట్టాలను రూపొందించటమైంది.

ప్రశ్న 5.
సహజీకృత పౌరసత్వాన్ని పొందేందుకు గల మూడు పరిస్థితులను వివరించండి.
జవాబు:
1) నివాసం (Residence): విదేశీయుడు తాను నివసిస్తున్న రాజ్యంలో పౌరసత్వాన్ని పొందేందుకు నిర్ణీత కాలం పాటు నివసించాలి. అతడు ఆ దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో తప్పనిసరిగా నివసించాల్సి ఉంటుంది. ఆ పరిమితి అన్ని రాజ్యాలలో ఒకే రకంగా లేదు. ఉదాహరణకు ఆ కాలపరిమితి బ్రిటన్, అమెరికాలలో 5 సంవత్సరాలు కాగా, ఫ్రాన్స్లో 10 సంవత్సరాలుగా నిర్ణయించడమైంది.

2) ఎంపిక (Choice): విదేశీ తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలు యుక్తవయస్సు వచ్చిన తరువాత తమకు ఇష్టం వచ్చిన రాజ్య పౌరసత్వాన్ని ఎంపిక చేసుకొని పొందవచ్చు.

3) దరఖాస్తు (Application): విదేశీయుడు తాను కోరుకున్న రాజ్యంలో పౌరసత్వం పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ రాజ్యానికి చెందిన ప్రభుత్వం విధించే షరతులను సంతృప్తిపరచాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి పౌరసత్వం కోసం చేసుకున్న దరఖాస్తు యోగ్యతను రాజ్యం పరిశీలించి ఆమోదించినట్లయితే అతనికి పౌరసత్వం లభిస్తుంది. నిర్దిష్ట కాలం పాటు నివాసం, సత్ప్రవర్తన, ఆర్థిక సామర్థ్యం, రాజ్యంలోని ఏదైనా ఒక జాతీయ భాషను అవగాహన చేసుకోవడం వంటి షరతులను ఆయా విదేశీయులు ఆమోదించాల్సి ఉంటుంది. పై వాటితో పాటుగా తాము పౌరసత్వం పొందగోరే రాజ్యానికి విధేయతను కలిగి ఉంటామనే లిఖితపూర్వక ప్రమాణం చేయడం ద్వారా విదేశీయులు పౌరసత్వాన్ని పొందగలుగుతారు.

ప్రశ్న 6.
విశ్వ పౌరసత్వం గురించి సంగ్రహంగా వర్ణించండి.
జవాబు:
విశ్వ పౌరసత్వం (Universal Citizenship): అంతర్జాతీయ, జాతీయ రాజకీయాలలో ఇటీవలి కాలంలో ఆవిష్కృతమైన భావనయే విశ్వ పౌరసత్వం. 1980, 1990 దశకాలలో సంభవించిన నాటకీయ పరిణామాలు విశ్వవ్యాప్తంగా శాస్త్ర, సాంకేతిక, కమ్యూనికేషన్లు వంటి రంగాలలో ఏర్పడిన పురోగతి మానవ జీవనాన్ని అద్భుతమైన రీతిలో మార్చివేసింది. సామాన్యులలో అతి సామాన్యులు సైతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన వివిధ సాధనాలను వినియోగించుకొని సౌకర్యవంతమైన, సౌఖ్యప్రదమైన, ఆర్థిక ప్రయోజనాలను పొందగలిగారు. అట్లాగే సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ వల్ల కలిగే ఫలితాలు వారికి వరప్రదాయినిగా పరిగణించబడినాయి. అభివృద్ధి చెందిన దేశాలతో పాటుగా తృతీయ ప్రపంచ దేశాలలోని ప్రభుత్వాలు రక్షణ రంగం నుంచి సామాన్య ప్రజల సంక్షేమం దిశగా తమ ప్రాధాన్యతలను నిర్ణయించుకొన్నాయి. వివిధ రంగాలకు చెందిన మేధావులు విదేశాలకు వెళ్ళి, అశేష ప్రయోజనాలను పొందే విషయంలో ఆసక్తిని ప్రదర్శించసాగారు. ఈ ప్రక్రియలో భాగంగా వారు స్వదేశంతో పాటుగా, తాము పనిచేసే విదేశాలలో సైతం పౌరసత్వాన్ని పొందేందుకు ప్రయత్నించారు. ఇటువంటి సందర్భాలలో కొన్ని రాజ్యాలు ఇతర పౌరులకు తమ రాజ్య పౌరసత్వాన్ని ప్రసాదించే దిశగా అడుగులు వేశాయి. ఈ భావనే విశ్వ పౌరసత్వానికి ప్రాతిపదిక అయింది.

ప్రశ్న 7.
ఉత్తమ పౌరసత్వానికి గల ఆటంకాలను, తొలగించే నివారణలను సూచించండి.
జవాబు:
మంచి పౌరసత్వానికి గల అవరోధాలను అధిగమించేందుకై రాజకీయ పార్టీలు, ప్రజలు, పత్రికలు, రాజ్యాలతో పాటు అందరి సమిష్టి కృషి అవసరం. ఈ సందర్భంలో లాస్కీ పండితుడు “ప్రజాహితానికి వ్యక్తి తీర్పు ద్వారా అందించే సేవయే పౌరసత్వమని” పేర్కొన్నాడు. కింద పేర్కొన్న కొన్ని మార్గాల ద్వారా ఉత్తమ పౌరసత్వానికి గల అవరోధాలను అధిగమించవచ్చు.

1) ప్రజల విజ్ఞప్తుల పరిష్కారం (Solving People’s Grievances): మంచి పౌరసత్వ సాధనకు ప్రభుత్వం ప్రజల కనీస విజ్ఞప్తుల పట్ల స్పందించాల్సిన తక్షణ ఆవశ్యకత ఎంతైనా ఉంది. పేదరికం, నిరుద్యోగిత వంటి సమస్యలను మిక్కిలి అంకిత భావంతో పరిష్కరించాలి. ప్రజల తక్షణ అవసరాలను తీర్చనిది మంచి పౌరసత్వం సాధ్యం కాదు.

2) విద్య, అవగాహన (Education and Awareness): ఈనాడు అత్యంత ఆవశ్యకమైన విద్యకు విశేషమైన ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంటుంది. ప్రజలలో విద్య, అవగాహనలను పెంపొందించేందుకై చర్యలు గైకొనాలి. మానవ జీవనాన్ని అవగాహన చేసుకొనేందుకై అవసరమైన విద్యను పౌరులకు అందించాల్సి ఉంటుంది. నిత్య జీవనంలో ప్రజల కనీస అవసరాలు తీరనిచో, మంచి పౌరసత్వాన్ని పొందడం సాధ్యం కాదు.

3) నాయకుల కృషి (Efforts of Leaders): ప్రభుత్వమే ప్రతి సందర్భంలో తమకు సహాయపడదనే అభిప్రాయాన్ని పౌరులు కలిగి ఉండాలి. వివిధ స్థాయిలలోని నాయకులు ప్రభుత్వానికి సహకారం అందించడం ద్వారా మంచి పౌరసత్వాన్ని పెంపొందించేందుకు కృషి చేయాల్సి ఉంటుంది.

మొత్తం మీద మంచి పౌరసత్వ ఆటంకాలను అధిగమించేందుకై లార్డ్ బ్రైస్ రెండు రకాల నివారణ మార్గాలను సూచించాడు. అవి:

  1. యాంత్రికపరమైనవి
  2. నైతికపరమైనవి.

మొదటివి రాజ్య చట్టాలకు సంబంధించినవి కాగా రెండోవి పౌరుల ప్రవర్తన గురించి ప్రస్తావించాయి. యాంత్రికపరమైన నివారణ చర్యలు రాజ్య యంత్రాంగాన్ని మెరుగుపరచడమేగాక అవి ప్రజలకు మిక్కిలి ఉపయోగకరంగా ఉండేటట్లు తీర్చిదిద్దుతాయి. అట్లాగే సామాజిక వ్యవస్థను సమానత్వం, న్యాయం, ప్రజాస్వామ్య సూత్రాల ప్రాతిపదికపై రూపొందించాల్సి ఉంటుంది. తమ పౌర, రాజకీయ హక్కులను పౌరులు గరిష్ట స్థాయిలో వినియోగించేందుకు అనుమతించాల్సి ఉంటుంది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పౌరసత్వ నిర్వచనం
జవాబు:

  1. అరిస్టాటిల్: “రాజ్య వ్యవహారాలలో ప్రత్యక్షంగా, చురుకైన పాత్ర కలిగిన వ్యక్తియే పౌరుడు”,
  2. ప్రొఫెసర్ లాస్కీ: “ప్రజాహితానికి వ్యక్తులు అందించే నిర్ణాయక సేవయే పౌరసత్వం”.
  3. టి. హెచ్.మార్షల్: “రాజకీయ సమాజంలో సంపూర్ణ సభ్యులుగా ఉండేవారికి కల్పించే హోదాయే పౌరసత్వం. అటువంటి హోదాగల వ్యక్తులు హక్కులు, బాధ్యతల విషయంలో సమాన హోదాను కలిగి ఉంటారు”.

ప్రశ్న 2.
జస్ సాంగ్వినస్ అంటే ఏమిటి ?
జవాబు:
‘జస్ సాంగ్వినస్’ అంటే ‘బంధుత్వం’ లేదా ‘రక్తసంబంధం’ అని అర్థం. బంధుత్వం లేదా రక్తసంబంధం ద్వారా పౌరసత్వం సంక్రమిస్తుందని జస్ సాంగ్వినస్ భావం. ఈ పద్దతి ప్రకారం ఒక శిశువు తాను జన్మించిన ప్రదేశంతో సంబంధం లేకుండానే తన తల్లిదండ్రుల పౌరసత్వాన్ని పొందుతుంది.

ప్రశ్న 3.
జస్ సోలి అంటే ఏమిటి ? [Mar. ’17, ’16]
జవాబు:
జస్ సోలి అంటే భూమి లేదా జన్మస్థలం అని అర్థం. భూమి లేదా పుట్టిన ప్రదేశం ప్రాతిపదికగా పౌరసత్వం సంక్రమించే పద్ధతినే జస్ సోలి అని అంటారు. ఈ పద్ధతి ప్రకారం శిశువుకు తన తల్లిదండ్రులను బట్టి కాకుండా, పుట్టిన ప్రదేశం ప్రాతిపదికగా పౌరసత్వం లభిస్తుంది. ప్రస్తుతం ఈ పద్దతి అర్జంటీనాలో అమలులో ఉన్నది.

ప్రశ్న 4.
విదేశీయుడంటే ఎవరు ?
జవాబు:
ఒక రాజ్యానికి చెందిన వ్యక్తి ఏదైనా కారణంచేత ఇతర రాజ్యములో నివసిస్తున్నట్లయితే ఆ వ్యక్తిని ‘విదేశీయుడు’ అని అంటారు. విదేశీయులు తాము నివసిస్తున్న రాజ్యంలోని చట్టాలలో పేర్కొన్న హక్కులు, బాధ్యతలను కలిగి ఉంటారు. విదేశీయులకు ఆయా రాజ్య చట్టాల ప్రకారం రక్షణ కల్పించబడుతుంది. అయితే విదేశీయులకు రాజకీయ హక్కులు ఉండవు.

ప్రశ్న 5.
సహజ పౌరసత్వాన్ని పొందే ఏవైనా రెండు పరిస్థితులను వ్రాయండి.
జవాబు:
అధికారులకు ఏ విధమైన విజ్ఞప్తి చేయకుండా లేదా ప్రత్యేక దరఖాస్తును పంపించకుండా వ్యక్తులకు సహజ సిద్ధంగా సంక్రమించే పౌరసత్వాన్ని సహజ పౌరసత్వం అంటారు. సహజ పౌరసత్వాన్ని పొందేందుకు మూడు అంశాలు తోడ్పడతాయి. అవి:

  1. జస్ సోలి అనగా పుట్టిన ప్రదేశ ప్రాతిపదికగా పౌరసత్వం లభిస్తుంది.
  2. జస్ సాంగ్వినస్ అనగా బంధుత్వం లేదా రక్త సంబంధం ప్రాతిపదికగా పౌరసత్వం లభించటం.
  3. మిశ్రమ అంశం. అనగా పై రెండు పద్ధతులలో ఏ పద్ధతి ప్రాతిపదికగానైనా పౌరసత్వం లభిస్తుంది.

ప్రశ్న 6.
పౌరసత్వాన్ని కోల్పోయే ఏవైనా రెండు పరిస్థితులను ఉదహరించండి.
జవాబు:
1) పౌరసత్వ త్యాగం (Renunciation of Citizenship): ఒక వ్యక్తి వేరొక రాజ్య పౌరసత్వాన్ని పొందినట్లయితే తన రాజ్యంలో పౌరసత్వాన్ని కోల్పోతాడు. సహజీకృత పౌరసత్వ పద్దతి ద్వారా వేరే దేశ పౌరసత్వం కనుక లభించినట్లయితే అతడు మాతృదేశ పౌరసత్వాన్ని కోల్పోతాడు. భారత రాజ్యాంగం ప్రకారం భారతీయ పౌరులు ఇతర రాజ్యాలలో పౌరసత్వాన్ని పొందినట్లయితే భారతదేశ పౌరులుగా పరిగణించబడరు.

2) వివాహం (Marriage): విదేశీ పురుషుడిని వివాహం చేసుకొన్న మహిళ తన దేశ పౌరసత్వాన్ని కోల్పోయి, తన భర్తకు చెందిన రాజ్య పౌరసత్వాన్ని పొందుతుంది. అయితే కొన్ని రాజ్యాలు ఈ విషయంలో మినహాయింపును ఇచ్చి, ఏ రాజ్య పౌరసత్వం కావాలనే విషయాన్ని ఆ మహిళకే వదిలివేయడమైంది. ఉదాహరణకు బ్రిటన్ యువతికి అటువంటి ఎంపిక సదుపాయాన్ని ఇవ్వడమైంది.

ప్రశ్న 7.
మంచి పౌరుడి లక్షణాలలో రెండింటిని ఉదహరించండి.
జవాబు:
1) మంచి ప్రవర్తన (Good Character): మంచి పౌరుడు మంచి ప్రవర్తనను కలిగి ఉండాలి. అతడు ధైర్యం, న్యాయబుద్ధి, సహాయధోరణి, ఉదార స్వభావం, సానుభూతి, సత్యభాషణ, నిజాయితీ వంటి గుణాలను త్రికరణ శుద్ధిగా కలిగి ఉండాలి.

2) సంపూర్ణ ఆరోగ్యం (Sound Health): మంచి పౌరుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని, శక్తిని కలిగి ఉండాలి. ఆరోగ్యవంతులైన పౌరులే ఆరోగ్యకరమైన జాతిని నిర్మిస్తారు. ఎందుకంటే మంచి ఆలోచనలు గల వ్యక్తులే మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. అటువంటి పౌరులు అనేక రంగాలలో రాజ్య ప్రగతికి దోహదపడతారు.

ప్రశ్న 8.
పౌరసత్వ ప్రాధాన్యతను వివరించండి.
జవాబు:
రాజ్యాంగంలో ఉదహరించబడిన ప్రాథమిక హక్కులు పౌరులందరికీ అందుబాటులోకి వచ్చినట్లయితే పౌరసత్వం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. అంతేకాకుండా పౌరులు అనేక రాజకీయ హక్కులకు అనుభవించేందుకు పౌరసత్వం దోహదపడుతుంది. పౌరసత్వం గలవారు వివిధ ప్రాతినిధ్య సంస్థలకు జరిగే ఎన్నికలలో ఓటుహక్కును వినియోగిస్తారు. శాసననిర్మాణ సంస్థల సభ్యత్వానికి వారు పోటీ చేయగలుగుతారు. అన్నింటికీ మించి రాజ్యంలోని అత్యున్నత పదవులైన దేశాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు వంటి ఎన్నో పదవులను అలంకరించుటకు అర్హతను పొందుతారు. పై హక్కులతో పాటుగా పన్నుల చెల్లింపు, అవసరమైతే దేశ రక్షణకు దోహద పడడం వంటి కొన్ని నిర్దిష్ట బాధ్యతలను కూడా పౌరులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

ప్రశ్న 9.
అజ్ఞానం, నిరక్షరాస్యతలనేవి ఏ విధంగా ఉత్తమ పౌరసత్వానికి ఆటంకాలుగా ఉంటాయి ?
జవాబు:
మంచి పౌరసత్వానికి అజ్ఞానం, నిరక్షరాస్యతలనేవి గొప్ప ఆటంకాలుగా భావించవచ్చు. వీరు తమ హక్కులను, బాధ్యతలను సరైన రీతిలో తెలుసుకోలేరు. ప్రజా వ్యవహారాలలో నైపుణ్యంగా వ్యవహరించలేరు. అజ్ఞానులు, నిరక్షరాస్యుల చేతిలో ప్రజాస్వామ్య ప్రభుత్వం మూకపాలనకు దారితీసే ప్రమాదం ఉంది.

ప్రశ్న 10.
మంచి పౌరసత్వానికి గల ఆటంకాలను అధిగమించేందుకు లార్డ్ బ్రైస్ చేసిన సూచనలు ఏవి ?
జవాబు:
మంచి పౌరసత్వానికి గల ఆటంకాలను అధిగమించేందుకు లార్డ్ బ్రైస్ రెండు సూచనలు చేయటం జరిగింది. అవి: 1) యాంత్రికపరమైనవి 2) నైతికపరమైనవి. మొదటిది రాజ్య చట్టాలకు సంబంధించినది కాగా రెండవ సూచన రాజ్య యంత్రాంగాన్ని మెరుగుపరచేందుకు తోడ్పడుతుంది.

ప్రశ్న 11.
ద్వంద్వ పౌరసత్వం గురించి సంగ్రహంగా రాయండి.
జవాబు:
ద్వంద్వ పౌరసత్వం (Double Citizenship): పౌరులకు రెండు రాజ్యాలలో పౌరసత్వం ఉండడాన్ని ద్వంద్వ పౌరసత్వంగా వ్యవహరిస్తారు. ఈ రకమైన పౌరసత్వం అనేక అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాలలో వాడుకలో ఉంది. ఉదాహరణకు అమెరికన్ పౌరులకు విదేశాలలో జన్మించిన పిల్లలకు రెండు రాజ్యాల్లోనూ పౌరసత్వం పొందే అవకాశం ఉంది. ఆ రెండింటిలో ఒకటి మాతృదేశ పౌరసత్వం కాగా రెండోది తాము జన్మించిన రాజ్య పౌరసత్వానికి సంబంధించినవై ఉంటాయి. అయితే ద్వంద్వ పౌరసత్వం గల వ్యక్తులకు ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు ఉండవు. వారు రెండు రాజ్యాల చట్టాలకు విధేయులై ఉంటారు. ద్వంద్వ పౌరసత్వం అనేది యుక్తవయస్సు వచ్చే వరకు పిల్లలకు ఉంటుంది. ఆ తరువాత వారు రెండు రాజ్యాలలోని ఏదో ఒకదానిలో పౌరసత్వాన్ని ఎంపిక చేసుకొంటారు.

AP Inter 1st Year Civics Study Material Chapter 7 న్యాయం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Civics Study Material 7th Lesson న్యాయం Textbook Questions and Answers.

AP Inter 1st Year Civics Study Material 7th Lesson న్యాయం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
న్యాయం అంటే ఏమిటో నిర్వచించి, న్యాయం రకాలను వర్ణించండి.
జవాబు:
పరిచయం: రాజనీతిశాస్త్ర అధ్యయనంలో న్యాయం ఒక ముఖ్యమైన భావన. సమకాలీన సమాజంలో దాదాపు ప్రపంచ రాజ్యాలన్నీ తమ రాజకీయ, ఆర్థిక సిద్ధాంతాల వైరుధ్యాలతో సంబంధం లేకుండా మానవ సమాజంలో న్యాయం చేకూర్చి కొనసాగేందుకు కృషి చేస్తున్నాయి.

అర్థం: న్యాయం (Justice) అనే ఇంగ్లీష్ పదం “జస్” (Jus) అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. లాటిన్ భాషలో “జస్” అంటే “బంధించి ఉండటం” లేదా “కలిపి ఉంచడం” అని అర్థం.

  1. నిర్వచనాలు:
    ప్లేటో: “వ్యక్తి తన పని తాను చేసుకుంటూ, ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే న్యాయం”;
  2. అరిస్టాటిల్: “న్యాయం అంటే సమాజంలో ప్రతి వ్యక్తీ తన నైతిక బాధ్యతలను నిర్వర్తించడం తప్ప మరేదీకాదు”.
  3. కెఫాలస్: “న్యాయం అంటే ప్రతి ఒక్కరూ సత్యాన్ని పలకడం, ఇతరులకు ఇవ్వాల్సింది ఇవ్వడం”.

న్యాయం రకాలు (Types of Justice): న్యాయం అనేక రకాలుగా ఉంటుంది. ఇది సహజ, ఆర్థిక, సామాజిక, రాజకీయ, చట్టబద్ధమైన పార్శాలకు సంబంధించినది. న్యాయభావనలోని వివిధ రకాలను కింది పట్టిక ద్వారా తెలుసు కోవచ్చు.

1) సహజ న్యాయం (Natural Justice): ప్రపంచంలో లభించే సహజ వనరులను ప్రతి ఒక్కరూ వినియోగించు కోవచ్చుననే సూత్రం ఆధారంగా ప్రతిపాదించబడినదే సహజ న్యాయం. భూమిపై నివసించే ప్రతి ఒక్కరికీ సహజ వనరులు జీవన ఆధారంగా ఉంటాయి. మానవులు ఒక్కరే హేతుబద్ధమైన జీవనం గడపటం వల్ల, సహజ వనరులను న్యాయబద్ధంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఈ సందర్భంలో మానవులు భవిష్యతరాల అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి.

AP Inter 1st Year Civics Study Material Chapter 7 న్యాయం

2) సామాజిక న్యాయం (Social Justice): సామాజిక న్యాయం అనేది వ్యక్తుల హక్కులు, సమాజం నియంత్రణల మధ్య చక్కని సమతౌల్యాన్ని నెలకొల్పేందుకు ఉద్దేశించింది. వర్తమాన చట్టాలకు లోబడి వ్యక్తుల న్యాయబద్ధమైన ఆకాంక్షలను నెరవేర్చుకొనేందుకు ఈ రకమైన న్యాయం వీలు కల్పిస్తుంది. చట్టం దృష్టిలో అందరూ సమానులే అనే సూత్రాన్ని సామాజిక న్యాయం నమ్ముతుంది, సామాజిక అనర్థాలైన పేదరికం, నిరుద్యోగం, అనారోగ్యం, ఆకలి వంటి వాటిని అధిగమించేందుకు సామాజిక న్యాయం హామీ ఇస్తుంది. సమాజంలోని నిమ్నవర్గాలు, బడుగు, బలహీన వర్గాలకు రక్షణ కల్పిస్తుంది. అంతిమంగా వ్యక్తుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తుంది.

3) రాజకీయ న్యాయం (Political Justice): రాజకీయ న్యాయం అనేది రాజకీయ సమానత్వాన్ని సూచిస్తుంది. రాజ్యంలోని వయోజనులైన పౌరులకు రాజకీయ హక్కులను ఈ రకమైన న్యాయం ప్రతిపాదిస్తుంది. దేశ పాలనలో పౌరులు స్వేచ్ఛగానూ, నిర్భయంగానూ పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. ఎన్నికల సమయంలో రాజకీయ న్యాయ భావన విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకొంటుంది. రోజువారి పాలనలో పౌరులు చురుకుగా పాల్గొనేందుకు రాజకీయ న్యాయం సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. ప్రతి ఒక్కరూ ఇతరులతో పాటుగా సమానులేనని, ఏ ఒక్కరూ ఇతరుల కంటే ఏ విషయంలోనూ అధికులు కారనీ, ఎటువంటి ప్రత్యేకతలు కలిగి ఉండరనే సూత్రంపై ఈ భావన రూపొందింది. రాజ్యంలో రాజకీయ న్యాయం ఉండాలంటే కింద పేర్కొన్న పరిస్థితులు నెలకొనాలి.

  1. సమన్యాయ పాలన
  2. స్వతంత్ర న్యాయశాఖ
  3. ప్రాతినిధ్య సంస్థలకు ఎన్నికలు
  4. రాజకీయ పార్టీలు
  5. పత్రికా స్వాతంత్ర్యం
  6. ప్రజాస్వామ్య పాలన మొదలైనవి.

4) ఆర్థిక న్యాయం (Economic Justice): వ్యక్తుల మధ్య నిర్హేతుకమైన, ప్రకృతి విరుద్ధమైన వ్యత్యాసాలు లేని పరిస్థితినే ఆర్థికన్యాయంగా పేర్కొనవచ్చు. ఆదాయం, ద్రవ్యం, సంపద, ఆస్తివంటి వ్యత్యాసాలు లేకుండా వ్యక్తులందరికీ సమానమైన ఆదరణ కల్పించేందుకు ఆర్థికన్యాయం ఉద్దేశించింది. సానుకూల దృష్టిలో ఆర్థిక న్యాయం అనేది శ్రామికులకు చాలినంత వేతనాలను చెల్లించేందుకు దోహదపడుతుంది. సంపద, ఆదాయంలో విపరీతమైన అంతరాలను తొలగించేందుకు కృషి చేస్తుంది. బడుగు బలహీనవర్గాలు దోపిడీకి గురికావడాన్ని ఎట్టి పరిస్థితులలో ఈ న్యాయం అనుమతించదు. ప్రతి ఒక్కరూ కనీస ప్రాథమికావసరాలను పొందేందుకు ఎదురయ్యే ఆటంకాలను తొలగిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడు, గుడ్డ, వసతి వంటి ప్రాథమిక అవసరాలు కలిగి ఉండేందుకు చర్యలు తీసుకొంటుంది. సమాజంలో న్యాయబద్ధమైన ఆర్థిక వ్యవస్థాపనకు తోడ్పడుతుంది. “ప్రతి ఒక్కరూ వారి సామర్ధ్యాన్ని బట్టి ఉపాధి పొందడం, అవసరాన్ని బట్టి ఆర్థిక వనరులను వినియోగించుకోవడం” అనే భావనను ఆర్థికన్యాయం బలపరుస్తుంది.

5) చట్టబద్ధమైన న్యాయం (Legal Justice): చట్టబద్ధమైన న్యాయం అనేది రాజ్యాంగ శాసనాల ద్వారా వెల్లడి అవుతుంది. సమాజంలో ఎంతోకాలంగా ప్రాచుర్యంలో ఉన్న ఆచార సంప్రదాయాలతో ఈ రకమైన న్యాయం సంబంధాన్ని కలిగి ఉంటుంది. రాజ్యంలోని రాజ్యాంగం, ఇతర శాసనచట్టాల రూపంలో అది వ్యక్తమవుతుంది. న్యాయం చట్టబద్ధమైన పరిమితులను నిర్ణయిస్తుంది. చట్టబద్ధమైన న్యాయంలో రెండు అంశాలు ఇమిడి ఉంటాయి. అవి:

1. సమాజంలో చట్టాలన్నీ సమన్యాయ పాలన సూత్రంపై ఆధారపడి రూపొందితమై, అమలులో ఉంటాయి.
2. చట్టాలన్నీ సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగా రూపొందుతాయి. మొత్తం సమాజ సంక్షేమాన్ని చట్టాలు ఆకాంక్షిస్తాయి. అయితే చట్టబద్ధమైన న్యాయం అనేది పూర్తిగా న్యాయంగా పరిగణితం కాదు. ఈ సందర్భంలో న్యాయం అంటే న్యాయం ప్రకారం చట్టం అని ఎర్నస్ట్ బార్కర్ పేర్కొన్నాడు. చట్టబద్ధమైన న్యాయం అనేది న్యాయాన్ని ప్రసాదించేందుకు ఉద్దేశించిందని కొందరు పేర్కొన్నారు. మొత్తం మీద చట్టం అనేది న్యాయానికి కొంతమేరకు ప్రత్యామ్నాయంగా ఉంటుందని మరికొందరు భావించారు.

AP Inter 1st Year Civics Study Material Chapter 7 న్యాయం

ప్రశ్న 2.
న్యాయం అంటే ఏమిటి ? న్యాయం ఏ విధంగా పరిణామం చెందింది ?
జవాబు:
పరిచయం: రాజనీతి శాస్త్ర అధ్యయనంలో న్యాయం ఒక ముఖ్యమైన భావన. సమకాలీన సమాజంలో దాదాపు ప్రపంచ రాజ్యాలన్నీ తమ రాజకీయ, ఆర్థిక సిద్ధాంతాల వైరుధ్యాలతో సంబంధం లేకుండా మానవ సమాజంలో న్యాయం చేకూర్చి కొనసాగేందుకు కృషి చేస్తున్నాయి.

అర్థం: న్యాయం (Justice) అనే ఇంగ్లీష్ పదం “జస్” (Jus) అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. లాటిన్ భాషలో “జస్” అంటే “బంధించి ఉండటం” లేదా “కలిపి ఉంచడం” అని అర్థం.

న్యాయం – పరిణామం: ప్రాచీన భారతదేశంలో న్యాయం అనేది ధర్మంతో ముడిపడి ఉంది. అటువంటి ధర్మం గురించి ప్రాచీన హిందూ స్మృతులలో ప్రస్తావించడమైంది. వాటి ప్రకారం రాజు కర్తవ్యాలలో న్యాయం ఒకటి. ధర్మం ప్రాతిపదికపై న్యాయబద్ధమైన సామాజిక వ్యవస్థను ఏర్పరచి, నిర్వహించేందుకు రాజు కృషి చేసేవాడు. ప్రఖ్యాత చైనా తత్త్వవేత్త అయిన కన్ఫ్యూసియస్ రాజు, ప్రధాన కర్తవ్యం చెడు పనులకు పాల్పడే వారిని శిక్షించడం మంచి వ్యక్తులకు బహుమానాలిచ్చి ప్రోత్సహించడంగా పేర్కొన్నాడు.

సాధారణంగా న్యాయమంటే ఇతరులకు ఇవ్వాల్సింది ఇవ్వడమే. అయితే న్యాయభావన అర్థం వ్యక్తులను బట్టి మారుతుంది. ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన మానవీయ దృక్కోణంలో న్యాయాన్ని అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. జర్మనీ తత్త్వవేత్త ఇమ్మాన్యుయల్ కాంట్ ప్రకారం మానవులందరూ గౌరవాన్ని కలిగి ఉంటారు. వ్యక్తులందరికీ గౌరవం లభించినట్లయితే వారంతా శక్తి సామర్థ్యాలను వినియోగించుకొని తమ లక్ష్యాల సాధనకై చాలినన్ని అవకాశాలను పొందగలుగుతారు. అందువల్ల న్యాయభావన ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తికీ సమానమైన గుర్తింపు, గౌరవం ఇవ్వడమైంది.

ప్లేటో వల్ల ప్రభావితుడైన సెయింట్ ఆగస్టీన్ అనే మధ్యయుగ రాజనీతి తత్త్వవేత్త న్యాయభావనను వివరించాడు. సమాజం సరైన రీతిలో కొనసాగేందుకు వ్యక్తుల మధ్య సౌహార్ధ సంబంధాల గురించి అతడు ప్రముఖంగా ప్రస్తావించాడు. ఆ తరువాత న్యాయాన్ని మతం నుంచి వేరుచేసిన వారిలో ప్రథముడిగా మరొక మధ్యయుగ రాజనీతి తత్త్వవేత్త థామస్ ఆక్వినాసన్ను పరిగణించవచ్చు.

పదహారవ శతాబ్దంనాటికి న్యాయభావన పూర్తిగా లౌకిక భావాల చేత మార్పులకు గురయ్యింది. థామస్ హాబ్స్ వంటి సామాజిక ఒడంబడిక సిద్ధాంతకర్తలు న్యాయభావనను సార్వభౌమాధికారి ఆజ్ఞగా పరిగణించారు. ఆ తరువాత జాన్లాక్, రూసో, ఇమ్మాన్యుయల్ కాంట్ వంటివారు న్యాయమంటే స్వేచ్ఛ, సమానత్వ భావనల సమ్మేళనంగా పరిగణించారు. సహజ న్యాయ సిద్ధాంత ప్రతిపాదకులు వైయక్తిక న్యాయభావనను అభివృద్ధి చేశారు. సామ్యవాదులు న్యాయభావనను ఆర్థిక దృక్కోణం నుంచి అవలోకించారు. వేరొకవైపు సాంప్రదాయక రాజనీతి తత్వవేత్తలు న్యాయ భావనను వ్యక్తిపరంగా వివరించారు. ఆధునిక రాజనీతి శాస్త్రవేత్తలు ఆ భావనను సామాజిక దృక్కోణంలో పరిశీలించారు.

ప్రశ్న 3.
సామాజిక న్యాయం గురించి వ్యాసాన్ని వ్రాయండి.
జవాబు:
సామాజిక న్యాయం అనేది సాధారణంగా సమానత్వ భావనగా పరిగణించడమైంది. అలాగే సామాజిక న్యాయంలో సమానత్వం అనేది అంతర్లీనమైన, వివాదరహితమైన అంశం. సామాజిక న్యాయం (Social Justice) అనే పదానికి విస్తృతమైన అర్థం ఉంది. సమాజంలో నిష్పాక్షికత, పరస్పర కర్తవ్యం వంటి బాధ్యతలను ఇది సూచిస్తుంది. ప్రతి ఒక్కరూ ఇతరులకు బాధ్యత వహించాలని అది విశ్వసిస్తుంది. ప్రతి ఒక్కరికీ చాలినంత అవకాశాలు కల్పించాలని కోరుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే అన్యాయాన్ని పారద్రోలి న్యాయబద్ధమైన సమాజ సాధనకు సామాజిక న్యాయం సంకల్పిస్తుంది. సమాజంలో లభించే వస్తుసేవలను పంచుకోవాలనే నమ్మకం ప్రజలలో ఉన్నప్పుడు సామాజిక న్యాయం నెలకొంటుంది. ప్రజలందరికీ సమానమైన ఆదరణ, మానవ హక్కులను కల్పించి ఉమ్మడి వనరులను నిష్పక్షపాతమైన రీతిలో ప్రతి ఒక్కరూ వ్యవహరించినప్పుడే సామాజిక న్యాయాన్ని సాధించడం సులభమవుతుంది.

ఈ సందర్భంలో జాన్రాల్స్, డేవిడ్ మిల్లర్ వంటి ఆధునిక రాజనీతి శాస్త్రవేత్తలు రెండు ముఖ్యమైన ప్రకటనలు చేశారు. జాన్ రాల్స్ సామాజిక న్యాయం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అతడు ఈ సిద్ధాంతాన్ని న్యాయం లేదా ‘నిష్పాక్షికత’ అని సాధారణంగా వ్యవహరించడమైంది. అతడి ప్రకారం ‘సామాజిక న్యాయం’ అనేది ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ హక్కులు, ఇతర అవకాశాలు కల్పించడానికి సంబంధించినది. అలాగే సమాజంలో నిరాదరణకు గురైన వర్గాల ప్రయోజనాల గురించి శ్రద్ధ వహించడానికి ఉద్దేశించింది. వ్యక్తుల కార్యకలాపాల ప్రయోజనాన్ని బట్టి వ్యక్తుల మంచి చెడులను నిర్ణయించవచ్చనీ అతడు పేర్కొన్నాడు. సామాజిక న్యాయం ద్వారా వ్యక్తులు సుఖ సంతోషాలతో కూడిన జీవనాన్ని గడిపేందుకు అవకాశం ఉంటుందన్నాడు. సామాజిక న్యాయం భావన వ్యాప్తి ద్వారా నిరాదరణకు గురైన వ్యక్తుల గురించి పట్టించుకోవడం సాధ్యం అవుతుందని ఉద్ఘాటించాడు.

పైన పేర్కొన్న జాన్రాల్స్ సిద్ధాంతం సామాజిక ఒడంబడిక భావన ఆధారంగా రూపొందింది. ఆ భావన ప్రకారం ప్రజలందరూ ఒకానొక ఒప్పందంపై సంతకం చేస్తారు. తద్వారా మెరుగైన సమాజ స్థాపనకై వారంతా కొన్ని నియమ నిబంధనలను అనుసరించి వాటికి విధేయత చూపించేందుకు సంసిద్ధంగా ఉంటారు. అటువంటి నియమ నిబంధనలు కొన్ని మౌలిక హక్కులు, కర్తవ్యాలను నిర్దేశిస్తాయి. సామాజిక, రాజకీయ సంస్థలలో ప్రజలే సభ్యులుగా అంతిమంగా కొనసాగుతారు. సామాజిక సహకారం ద్వారా ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి.

AP Inter 1st Year Civics Study Material Chapter 7 న్యాయం

డేవిడ్ మిల్లర్ సామాజిక న్యాయం అనేది సమాజంలో మంచి చెడుల పంపిణీకి సంబంధించినది. మంచి ఎన్నో ప్రయోజనాలు, చెడు ద్వారా ఎన్నో నష్టాలు ప్రజలకు ఒనగూరుతాయి. సామాజిక రాజకీయ సంస్థలు ఏ విధంగా ప్రజల మధ్య వనరుల పంపిణీకి చర్యలు తీసుకొంటాయనే విషయాన్ని సామాజిక న్యాయం సూచిస్తుందని మిల్లర్ పేర్కొన్నాడు. సామాజిక న్యాయం ద్వారా ప్రజలు విద్య, ఉపాధి, ఆరోగ్యం, సంపద, సంక్షేమం, రవాణా వంటి రంగాలలో అనేక ప్రయోజనాలను పొందుతారని ఉద్ఘాటించాడు. అయితే సామాజిక న్యాయం వల్ల కొన్ని దుష్ఫరిణామాలు ఎదురవుతాయని అతడు హెచ్చరించాడు. వ్యక్తుల స్వీయ వ్యవహారాలలో రాజ్యం జోక్యం, వ్యక్తులు నిర్బంధంగా సైనిక పరమైన సేవలను అందించడం వంటి దుష్ఫరిణామాలు ఉంటాయని పేర్కొన్నాడు.

మిల్లర్ సిద్ధాంతం ప్రభుత్వ, ప్రైవేటురంగాలు రెండింటికీ వర్తిస్తుంది. అతడి సిద్ధాంతం ప్రకారం సామాజిక న్యాయం అనేది సామాజిక సుగుణంగా భావిస్తుంది. వ్యక్తులు సమాజంలో వేటిని కలిగిఉంటారో, సమాజానికి వారు అందించాల్సినవి ఏమిటో అనే విషయాన్ని ఇతడి సిద్ధాంతం ప్రస్తావించింది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
న్యాయం యొక్క ముఖ్య భావనలను వివరించండి.
జవాబు:
అర్థం: న్యాయం (Justice) అనే ఇంగ్లీష్ పదం “జస్” (Jus) అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. లాటిన్ భాషలో “జస్” అంటే “బంధించి ఉండటం” లేదా “కలిపి ఉంచడం” అని అర్థం.

నిర్వచనాలు:
1. ప్లేటో: “వ్యక్తి తన పని తాను చేసుకుంటూ, ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే న్యాయం”. 2. అరిస్టాటిల్: “న్యాయం అంటే సమాజంలో ప్రతి వ్యక్తీ తన నైతిక బాధ్యతలను నిర్వర్తించడం తప్ప మరేదీకాదు”. 3. కెఫాలస్: “న్యాయం అంటే ప్రతి ఒక్కరూ సత్యాన్ని పలకడం, ఇతరులకు ఇవ్వాల్సింది ఇవ్వడం”. న్యాయం ముఖ్య భావనలు: న్యాయం ప్రధానంగా రెండు ముఖ్య భావనలను కలిగివుంది. అవి: 1) సంఖ్యాత్మక భావన (Numerical concept) 2) క్షేత్రగణిత భావన (Geometrical concept). వీటిని ఈ క్రింది విధంగా వివరించవచ్చు.

1) సంఖ్యాత్మక భావన (Numerical concept): సంఖ్యాత్మక భావన ప్రకారం సామాజిక వ్యవహారాలలో ప్రతి ఒక్కరికీ సమానమైన వాటా, భాగస్వామ్యం, ప్రమేయం ఉంటాయి. ప్రాచీన గ్రీకునగర రాజ్యాలు ప్రజలకు సంబంధించిన వ్యవహారాల నిర్వహణలో ఈ రకమైన భావనను అనుసరించాయి. ఆనాటి పాలకులు ప్రభుత్వంలోని వివిధ పదవుల భర్తీ విషయంలో సమానత్వ భావనను అమలులో ఉంచేందుకు శాయశక్తులా కృషి చేశారు. ప్రభుత్వ పదవులను చేపట్టి, వాటిని నిర్వహించే విషయంలో ప్రత్యేక పరిజ్ఞానం, అర్హతలను పరిగణనలోకి నగర రాజ్యాలు తీసుకోలేదు. ఆధునిక కాలంలో ప్రముఖ బ్రిటిష్ రాజనీతి తత్త్వవేత్త జెరిమీ బెంథామ్ ఈ రకమైన భావనను ప్రతిపాదించాడు. ప్రతి ఒక్కరూ ఒకరుగానే పరిగణించబడతారనీ, ఏ ఒక్కరూ ఒకరి కంటే అధికంగా పరిగణించబడరనీ అతడు ఈ సందర్భంలో ప్రకటించాడు. ఆధునిక కాలంలో అనేక ఉదారవాద రాజ్యాలు ఈ భావన ప్రాతిపదికపై పనిచేయటం ప్రారంభించాయి.

2) క్షేత్రగణిత భావన (Geometrical concept): క్షేత్రగణిత (Geometrical) భావన నైష్పత్తిక సమానత్వ సూత్రంపై ఆధారపడి రూపొందింది. సమానులకు సమానమైన భాగస్వామ్యం, అసమానులకు అసమానమైన భాగస్వామ్యం కల్పించాలనే సూత్రాన్ని ఈ భావన ప్రతిపాదిస్తుంది. వ్యక్తుల అర్హత, యోగ్యత లేదా వారు అందించే సేవల ప్రాతిపదికపై ప్రభుత్వ పదవులు, అధికారాన్ని పంపిణీ చేయాల్సి ఉంటుందని ఈ భావన పేర్కొంటుంది. ప్లేటో, అరిస్టాటిల్ వంటి ప్రముఖ ప్రాచీన రాజనీతి తత్త్వవేత్తలు ఈ భావన పట్ల సుముఖత వ్యక్తం చేశారు. అరిస్టాటిల్ ఈ భావన గురించి వివరిస్తూ క్రింది విధంగా ప్రకటించాడు. “వేణువులను పంపిణీ చేయాలంటే, వాటిని వాయిద్యాలుగా ఉపయోగించే సామర్థ్యం గల వారికే అందించాల్సి ఉంటుందని” అతడు పేర్కొన్నాడు. ఈ భావన ప్రకారం గ్రహీతల యోగ్యతను బట్టి సౌకర్యాలు, ప్రయోజనాలను సమాన ప్రాతిపదికపై పంపకం చేసేందుకై ప్రత్యేక కృషి జరపాల్సి ఉంటుంది.

ప్రశ్న 2.
న్యాయం ఏ విధంగా పరిణామం చెందింది ?
జవాబు:
న్యాయం – పరిణామం: ప్రాచీన భారతదేశంలో న్యాయం అనేది ధర్మంతో ముడిపడి ఉంది. అటువంటి ధర్మం గురించి ప్రాచీన హిందూ స్మృతులలో ప్రస్తావించడమైంది. వాటి ప్రకారం రాజు కర్తవ్యాలలో న్యాయం ఒకటి. ధర్మం ప్రాతిపదికపై న్యాయబద్ధమైన సామాజిక వ్యవస్థను ఏర్పరచి, నిర్వహించేందుకు రాజు కృషి చేసేవాడు. ప్రఖ్యాత చైనా తత్త్వవేత్త అయిన కన్ఫ్యూసియస్ రాజు ప్రధాన కర్తవ్యం చెడు పనులకు పాల్పడే వారిని శిక్షించడం మంచి వ్యక్తులకు బహుమానాలిచ్చి ప్రోత్సహించడంగా పేర్కొన్నాడు.

AP Inter 1st Year Civics Study Material Chapter 7 న్యాయం

సాధారణంగా న్యాయమంటే ఇతరులకు ఇవ్వాల్సింది ఇవ్వడమే. అయితే న్యాయభావన అర్థం వ్యక్తులను బట్టి మారుతుంది. ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన మానవీయ దృక్కోణంలో న్యాయాన్ని అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. జర్మనీ తత్త్వవేత్త ఇమ్మాన్యుయల్ కాంట్ ప్రకారం మానవులందరూ గౌరవాన్ని కలిగి ఉంటారు. వ్యక్తులందరికీ గౌరవం లభించినట్లయితే వారంతా శక్తి సామర్థ్యాలను వినియోగించుకొని తమ లక్ష్యాల సాధనకై చాలినన్ని అవకాశాలను పొందగలుగుతారు. అందువల్ల న్యాయభావన ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తికీ సమానమైన గుర్తింపు, గౌరవం ఇవ్వడమైంది.

ప్లేటో వల్ల ప్రభావితుడైన సెయింట్ ఆగస్టీన్ అనే మధ్యయుగ రాజనీతి తత్త్వవేత్త న్యాయభావనను వివరించాడు. సమాజం సరైన రీతిలో కొనసాగేందుకు వ్యక్తుల మధ్య సౌహార్ద్ర సంబంధాల గురించి అతడు ప్రముఖంగా ప్రస్తావించాడు. ఆ తరువాత న్యాయాన్ని మతం నుంచి వేరుచేసిన వారిలో ప్రథముడిగా మరొక మధ్యయుగ రాజనీతి తత్త్వవేత్త థామస్ ఆక్వినాన్ను పరిగణించవచ్చు.

పదహారవ శతాబ్దంనాటికి న్యాయ భావన పూర్తిగా లౌకిక భావాల చేత మార్పులకు గురయ్యింది. థామస్ హాబ్స్ వంటి సామాజిక ఒడంబడిక సిద్ధాంతకర్తలు న్యాయభావనను సార్వభౌమాధికారి ఆజ్ఞగా పరిగణించారు. ఆ తరువాత జాన్లాక్, రూసో, ఇమ్మాన్యుయల్ కాంట్ వంటివారు న్యాయమంటే స్వేచ్ఛ, సమానత్వ భావనల సమ్మేళనంగా పరిగణించారు. సహజ న్యాయ సిద్ధాంత ప్రతిపాదకులు వైయక్తిక న్యాయ భావనను అభివృద్ధి చేశారు. సామ్యవాదులు న్యాయభావనను ఆర్థిక దృక్కోణం నుంచి అవలోకించారు. వేరొకవైపు సాంప్రదాయక రాజనీతి తత్వవేత్తలు న్యాయ భావనను వ్యక్తిపరంగా వివరించారు. ఆధునిక రాజనీతి శాస్త్రవేత్తలు ఆ భావనను సామాజిక దృక్కోణంలో పరిశీలించారు.

ప్రశ్న 3.
న్యాయంలోని మూడు రకాలను వర్ణించండి. [Mar. ’16]
జవాబు:
న్యాయం రకాలు (Types of Justice): న్యాయం అనేక రకాలుగా ఉంటుంది. ఇది సహజ, ఆర్థిక, సామాజిక, రాజకీయ, చట్టబద్ధమైన పార్శాలకు సంబంధించినది. న్యాయభావనలోని వివిధ రకాలను కింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.

1) సహజ న్యాయం (Natural Justice): ప్రపంచంలో లభించే సహజ వనరులను ప్రతి ఒక్కరూ వినియోగించకోవచ్చుననే సూత్రం ఆధారంగా ప్రతిపాదించబడినదే సహజ న్యాయం. భూమిపై నివసించే ప్రతి ఒక్కరికీ సహజ వనరులు జీవన ఆధారంగా ఉంటాయి. మానవులు ఒక్కరే హేతుబద్ధమైన జీవనం గడపటం వల్ల, సహజ వనరులను న్యాయబద్ధంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఈ సందర్భంలో మానవులు భవిష్యతరాల అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి.

2) సామాజిక న్యాయం (Social Justice): సామాజిక న్యాయం అనేది వ్యక్తుల హక్కులు, సమాజం నియంత్రణల మధ్య చక్కని సమతౌల్యాన్ని నెలకొల్పేందుకు ఉద్దేశించింది. వర్తమాన చట్టాలకు లోబడి వ్యక్తుల న్యాయబద్ధమైన ఆకాంక్షలను నెరవేర్చుకొనేందుకు ఈ రకమైన న్యాయం వీలు కల్పిస్తుంది. చట్టం దృష్టిలో అందరూ సమానులే అనే సూత్రాన్ని సామాజిక న్యాయం నమ్ముతుంది, సామాజిక అనర్థాలైన పేదరికం, నిరుద్యోగం, అనారోగ్యం, ఆకలి వంటి వాటిని అధిగమించేందుకు సామాజిక న్యాయం హామీ ఇస్తుంది. సమాజంలోని నిమ్నవర్గాలు, బడుగు, బలహీన వర్గాలకు రక్షణ కల్పిస్తుంది. అంతిమంగా వ్యక్తుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తుంది.

3) రాజకీయ న్యాయం (Political Justice): రాజకీయ న్యాయం అనేది రాజకీయ సమానత్వాన్ని సూచిస్తుంది. రాజ్యంలోని వయోజనులైన పౌరులకు రాజకీయ హక్కులను ఈ రకమైన న్యాయం ప్రతిపాదిస్తుంది. దేశ పాలనలో పౌరులు స్వేచ్ఛగానూ, నిర్భయంగానూ పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. ఎన్నికల సమయంలో రాజకీయ న్యాయ భావన విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకొంటుంది. రోజువారి పాలనలో పౌరులు చురుకుగా పాల్గొనేందుకు రాజకీయ న్యాయం సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. ప్రతి ఒక్కరూ ఇతరులతో పాటుగా సమానులేనని, ఏ ఒక్కరూ ఇతరుల కంటే ఏ విషయంలోనూ అధికులు కారనీ, ఎటువంటి ప్రత్యేకతలు కలిగి ఉండరనే సూత్రంపై ఈ భావన రూపొందింది. రాజ్యంలో రాజకీయ న్యాయం ఉండాలంటే కింద పేర్కొన్న పరిస్థితులు నెలకొనాలి.

  1. సమన్యాయ పాలన
  2. స్వతంత్ర న్యాయశాఖ
  3.  ప్రాతినిధ్య సంస్థలకు ఎన్నికలు
  4. రాజకీయ పార్టీలు
  5. పత్రికా స్వాతంత్య్రం
  6. ప్రజాస్వామ్య పాలన మొదలైనవి.

AP Inter 1st Year Civics Study Material Chapter 7 న్యాయం

ప్రశ్న 4.
న్యాయానికి గల మూడు ఆధారాలను పేర్కొనండి. [Mar. ’18, ’17]
జవాబు:
న్యాయం – నిర్వచనాలు:

  1. ప్లేటో: “వ్యక్తి తన పని తాను చేసుకుంటూ, ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే న్యాయం”.
  2. అరిస్టాటిల్: “న్యాయం అంటే సమాజంలో ప్రతి వ్యక్తీ తన నైతిక బాధ్యతలను నిర్వర్తించడం తప్ప మరేదీకాదు”.
  3. కెఫాలస్: “న్యాయం అంటే ప్రతి ఒక్కరూ సత్యాన్ని పలకడం, ఇతరులకు ఇవ్వాల్సింది ఇవ్వడం”. న్యాయం ఆధారాలు: ఎర్నస్ట్ బార్కర్ న్యాయానికి నాలుగు ఆధారాలున్నాయని పేర్కొన్నాడు. అవి: 1) ప్రకృతి 2) నైతికత 3) మతం 4) ఆర్థిక అంశాలు. వాటిని క్రింది విధంగా వివరించవచ్చు.

1) ప్రకృతి (Nature): గ్రీకు యధేచ్ఛావాదులు (Stoics) ప్రకృతిని న్యాయం ఆధారాలలో ఒకటిగా భావించారు. వారి దృష్టిలో ప్రకృతి అనేది నైతిక తాత్వికత, మత విశ్వాసాల సమ్మేళనం. ప్రకృతి, దైవం, హేతువులనేవి అవిభాజ్యాలు. ప్రకృతి నియమాల ప్రకారం జీవనం సాగించే వ్యక్తులు భగవంతుడు, హేతువులపట్ల ఒకే విధమైన భావాలను కలిగి ఉంటారని వారు ఉద్ఘాటించారు. ప్రకృతి మూడు ప్రధాన అంశాలను సూచిస్తుందని వారు పేర్కొన్నారు. అవి: 1) మానవుడికి స్వాతంత్ర్యం ఉండాలి. 2) మానవులందరూ సమానమైన గుర్తింపును కలిగి ఉండాలి. 3) మానవులందరూ తోటి మానవులతో హేతువు ఆధారంగా స్నేహ సంబంధాలను కలిగి ఉండాలి. పైన పేర్కొన్న మూడు అంశాలు కాలక్రమేణా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే మూడు భావనలకు ఆధారాలయ్యాయి.

2) నైతికత (Ethics): ఆదర్శవాదులైన ప్లేటో, ఎమ్మాన్యుయెల్ కాంట్, థామస్ హిల్లీ గ్రీన్, ఎర్నెస్ట్ బార్కర్లు న్యాయం అనేది నైతిక సూత్రాల అవలంబన ద్వారా అవతరించిందని ఉద్ఘాటించారు. కాలానుగుణంగా సమాజం |ఆమోదం పొందిన విలువలే సంవర్ధక న్యాయభావన (Concept of Positive Justice) కు ఆధారమయ్యాయని వారు పేర్కొన్నారు. తరువాత కాలంలో రాజ్యం సంవర్ధక న్యాయాన్ని అమలులో ఉంచేందుకు చర్యలు తీసుకొన్నదన్నారు.

3) మతం (Religion): న్యాయానికి గల మరొక ఆధారమే మతం. మధ్యయుగం నుంచి మతం న్యాయానికి ఆధారంగా కొనసాగుతూ వచ్చింది. న్యాయం, మంచి, చెడులకు సంబంధించిన భావనలను భగవంతుడు ప్రవచించాడని క్రైస్తవమతాధిపతులు పేర్కొన్నారు. మతం ద్వారా న్యాయభావనలకు అంకురార్పణ చేసి, బలవంతుడే రాజ్య పాలకుడిగా ఉంటాడనీ వారు ఉద్ఘాటించారు. థామస్ అక్వినాస్ అనే మతాచార్యుడిగా మారిన తత్వవేత్త మతాన్ని క్రైస్తవచర్చికి ప్రతిరూపంగా విశ్వసించాడు. ఇతని ప్రకారం చట్టం ఆధారంగా కొనసాగే జీవనం ఉత్తమమైందిగా భావించాడు. రాజు ఎల్లప్పుడు ప్రజలను సన్మార్గంలో నడిపించాలన్నారు. రాజు తన అధికారాలను మతాధిపతి ఆధిపత్యానికి బద్ధుడై వినియోగించాలన్నాడు.

ప్రశ్న 5.
సామాజిక న్యాయాన్ని ఏ విధంగా పొందవచ్చు ?
జవాబు:
సామాజిక న్యాయం (Social Justice): సామాజిక న్యాయం అనేది వ్యక్తుల హక్కులు, సమాజం నియంత్రణల మధ్య చక్కని సమతౌల్యాన్ని నెలకొల్పేందుకు ఉద్దేశించింది. వర్తమాన చట్టాలకు లోబడి వ్యక్తుల న్యాయబద్ధమైన ఆకాంక్షలను నెరవేర్చుకొనేందుకు ఈ రకమైన న్యాయం వీలు కల్పిస్తుంది. చట్టం దృష్టిలో అందరూ సమానులే అనే సూత్రాన్ని సామాజిక న్యాయం నమ్ముతుంది, సామాజిక అనర్థాలైన పేదరికం, నిరుద్యోగం, అనారోగ్యం, ఆకలి వంటి వాటిని అధిగమించేందుకు సామాజిక న్యాయం హామీ ఇస్తుంది. సమాజంలోని నిమ్నవర్గాలు, బడుగు, బలహీన వర్గాలకు రక్షణ కల్పిస్తుంది. అంతిమంగా వ్యక్తుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తుంది.

సామాజిక న్యాయాన్ని క్రింది విధంగా పొందవచ్చు (లేదా) సాధించవచ్చు సమాజంలోని విభిన్న వర్గాల మధ్య విపరీతమైన వ్యత్యాసాలు ఉన్నప్పుడు సామాజిక న్యాయం అనేది భ్రాంతిగా మిగిలిపోతుంది. ఈ సందర్భంలో సామాజిక న్యాయాన్ని ఖచ్ఛితంగా అవగాహన చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఆధునిక సమాజంలో సమానత్వంతో పాటుగా న్యాయాన్ని కలిగి ఉండటం అనేది ప్రతి ఒక్కరి ఆకాంక్ష. అనైతిక, అన్యాయ, పక్షపాత ధోరణులు ఆధిపత్యం వహించినంత కాలం సమాజంలో ప్రగతిని సాధించడం సాధ్యం కాదు. అటువంటి సమాజంలో నిరాదరణ, అసౌకర్యాలకు గురైన వర్గాలు దైనందిన జీవనంలో నిరాశా నిస్పృహలకు లోనవుతాయి. అటువంటి పరిస్థితులలో అత్యధిక సంఖ్యలో ఉన్న పేద ప్రజానీకానికి, కొద్ది సంఖ్యలో ఉన్న సంపన్న వర్గానికి మధ్య ఘర్షణలు నెలకొంటాయి. కాబట్టి కనీస సౌకర్యాలు, సంతోషం భద్రతతో కూడిన న్యాయమైన సమాజం ఆవశ్యకత ఎంతైనా అవసరం. అప్పుడే సమాజంలోని విభిన్న వర్గాలకు చెందిన ప్రజలు తమ లక్ష్యాలను చేరుకొనేందుకు ప్రయత్నిస్తారు.

AP Inter 1st Year Civics Study Material Chapter 7 న్యాయం

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
న్యాయాన్ని నిర్వచించండి. [Mar. ’17, ’16]
జవాబు:
నిర్వచనాలు:

  1. ప్లేటో: “వ్యక్తి తన పని తాను చేసుకుంటూ, ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే న్యాయం”.
  2. అరిస్టాటిల్: “న్యాయం అంటే సమాజంలో ప్రతి వ్యక్తీ తన నైతిక బాధ్యతలను నిర్వర్తించడం తప్ప మరేదీకాదు”.
  3. కెఫాలస్: “న్యాయం అంటే ప్రతి ఒక్కరూ సత్యాన్ని పలకడం, ఇతరులకు ఇవ్వాల్సింది ఇవ్వడం”.

ప్రశ్న 2.
వితరణశీల న్యాయం అంటే ఏమిటి ?
జవాబు:
వ్యక్తుల మధ్య యోగ్యత ప్రాతిపదికపై వస్తు సంపదను రాజ్యం పంపిణీ చేయడాన్ని వితరణశీల న్యాయం అని అంటారు. న్యాయమంటే ఒక రకమైన వితరణ పద్దతి అని అరిస్టాటిల్ పేర్కొన్నాడు. న్యాయాన్ని విప్లవాలకు వ్యతిరేకంగా వినియోగించే సాధనమని అరిస్టాటిల్ ఉద్దేశ్యం.

ప్రశ్న 3.
సరియైన న్యాయం అనగానేమి ?
జవాబు:
ఇతరుల చర్యల కారణంగా కోల్పోయిన హక్కులను ఒక వ్యక్తికి అప్పగించడాన్ని సరైన న్యాయం అంటారు. ఈ రకమైన న్యాయాన్ని అరిస్టాటిల్ నిషేధాత్మక న్యాయంగా భావించాడు. ఈ రకమైన న్యాయం కొన్ని రకాల వ్యాపార లావాదేవీలకు సంబంధించినదై ఉంటుంది.

ప్రశ్న 4.
ఆర్థిక అంశాలను ఏ విధంగా న్యాయానికి ఆధారంగా పరిగణించవచ్చు ?
జవాబు:
ఆర్థిక అంశాలను కూడా న్యాయానికి మరొక ఆధారంగా పరిగణించవచ్చు. పారిశ్రామిక విప్లవ ఫలితంగా ఆర్థిక అంశాలకు ప్రాధాన్యం పెరిగింది. కారల్మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగిల్స్ వంటి విప్లవాత్మక సామ్యవాదులు న్యాయానికి ఆర్థిక అంశాలే ఆధారాలుగా ఉంటాయని గట్టిగా విశ్వసించారు. వర్గరహిత సమాజ స్థాపన ద్వారా ఆర్థిక సమానత్వం సాధించినపుడే న్యాయం ఆచరణ సాధ్యమని వారి విశ్వాసం.

ప్రశ్న 5.
రాజకీయ న్యాయం అనగానేమి ? [Mar. 16]
జవాబు:
రాజకీయ న్యాయం (Political Justice): రాజకీయ న్యాయం అనేది రాజకీయ సమానత్వాన్ని సూచిస్తుంది. రాజ్యంలోని వయోజనులైన పౌరులకు రాజకీయ హక్కులను ఈ రకమైన న్యాయం ప్రతిపాదిస్తుంది. దేశ పాలనలో, పౌరులు స్వేచ్ఛగానూ, నిర్భయంగానూ పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. ఎన్నికల సమయంలో రాజకీయ న్యాయ భావన విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకొంటుంది. రోజువారి పాలనలో పౌరులు చురుకుగా పాల్గొనేందుకు రాజకీయ న్యాయం సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. ప్రతి ఒక్కరూ ఇతరులతో పాటుగా సమానులేనని, ఏ ఒక్కరూ ఇతరుల కంటే ఏ విషయంలోనూ అధికులు కారనీ, ఎటువంటి ప్రత్యేకతలు కలిగి ఉండరనే సూత్రంపై ఈ భావన రూపొందింది. రాజ్యంలో రాజకీయ న్యాయం ఉండాలంటే కింద పేర్కొన్న పరిస్థితులు నెలకొనాలి.

AP Inter 1st Year Civics Study Material Chapter 7 న్యాయం

ప్రశ్న 6.
సామాజిక న్యాయం అనగానేమి ? [Mar. ’17]
జవాబు:
సామాజిక న్యాయం (Social Justice): సామాజిక న్యాయం అనేది వ్యక్తుల హక్కులు, సమాజం నియంత్రణల మధ్య చక్కని సమతౌల్యాన్ని నెలకొల్పేందుకు ఉద్దేశించింది. వర్తమాన చట్టాలకు లోబడి వ్యక్తుల న్యాయబద్దమైన ఆకాంక్షలను నెరవేర్చుకొనేందుకు ఈ రకమైన న్యాయం వీలు కల్పిస్తుంది. చట్టం దృష్టిలో అందరూ సమానులే అనే సూత్రాన్ని సామాజిక న్యాయం నమ్ముతుంది, సామాజిక అనర్థాలైన పేదరికం, నిరుద్యోగం, అనారోగ్యం, ఆకలి వంటి వాటిని అధిగమించేందుకు సామాజిక న్యాయం హామీ ఇస్తుంది. సమాజంలోని నిమ్నవర్గాలు, బడుగు, బలహీన వర్గాలకు రక్షణ కల్పిస్తుంది. అంతిమంగా వ్యక్తుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తుంది.

ప్రశ్న 7.
చట్టబద్ధమైన న్యాయంలోని పర్యవసానాలు ఏవి ?
జవాబు:
చట్టబద్ధమైన న్యాయం రాజ్యాంగ శాసనాల ద్వారా వెల్లడి అవుతుంది. రాజ్యంలోని రాజ్యాంగం, ఇతర శాసన చట్టాల రూపంలో ఇది వ్యక్తమవుతుంది. న్యాయం చట్టబద్ధమైన పరిమితులను నిర్ణయిస్తుంది. చట్టబద్ధమైన న్యాయంలో రెండు అంశాలు ఇమిడి ఉంటాయి. అవి:

  1. సమాజంలో చట్టాలన్నీ సమన్యాయ పాలన సూత్రంపై ఆధారపడి రూపొందించబడి, అమలు చేయబడతాయి.
  2. చట్టాలన్నీ సహాయ న్యాయ సూత్రాలకు అనుగుణంగా రూపొందించబడతాయి.

ప్రశ్న 8.
సామాజిక న్యాయంపై జాన్రాల్స్ అభిప్రాయాలను తెల్పండి. [Mar. ’18]
జవాబు:
జాన్ రాల్స్ ‘సామాజిక న్యాయం’ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతాన్ని ‘న్యాయం’ లేదా ‘నిష్పాక్షికత’ అని జాన్రాల్స్ పేర్కొన్నాడు. సామాజిక న్యాయం అంటే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, హక్కులను, ఇతర అవకాశాలను కల్పించటం అని ఆయన భావన. సామాజిక న్యాయం ద్వారానే వ్యక్తులు సుఖసంతోషాలతో కూడిన జీవనాన్ని పొందుతారని జాన్ రాల్స్ పేర్కొన్నాడు.

ప్రశ్న 9.
స్వేచ్ఛాయుత మార్కెట్ యంత్రాంగ సమర్థకుల అభిప్రాయాలు ఏమిటో పేర్కొనండి.
జవాబు:
స్వేచ్ఛాయుత మార్కెట్ యంత్రాంగ సమర్థకుల అభిప్రాయం ప్రకారం రాజ్యంలో వ్యక్తులందరూ సంపూర్ణమైన ఆర్థిక స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను కలిగి ఉండాలి. ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి కారకాల మధ్య స్వేచ్ఛాయుత పోటీ ఉండాలి. ఆస్తిహక్కు, ఒప్పందాల స్వేచ్ఛ, ఆర్థిక వ్యవహారాలలో భాగస్వామ్యం ఏర్పరచుకొనే స్వాతంత్ర్యం ప్రతి వ్యక్తి కలిగి ఉండాలి అని స్వేచ్ఛాయుత మార్కెట్ యంత్రాంగ సమర్థకులు భావిస్తారు.

AP Inter 1st Year Civics Study Material Chapter 7 న్యాయం

ప్రశ్న 10.
మతాన్ని ఏ విధంగా న్యాయానికి ఆధారంగా పరిగణించవచ్చు ?
జవాబు:
మతం (Religion): న్యాయానికి గల మరొక ఆధారమే మతం. మధ్యయుగం నుంచి మతం న్యాయానికి ఆధారంగా కొనసాగుతూ వచ్చింది. న్యాయం, మంచి, చెడులకు సంబంధించిన భావనలను భగవంతుడు ప్రవచించాడని క్రైస్తవమతాధిపతులు పేర్కొన్నారు. మతం ద్వారా న్యాయభావనలకు అంకురార్పణ చేసి, బలవంతుడే రాజ్య పాలకుడిగా ఉంటాడనీ వారు ఉద్ఘాటించారు. థామస్ అక్వినాస్ అనే మతాచార్యుడిగా మారిన తత్వవేత్త మతాన్ని క్రైస్తవచర్చికి ప్రతిరూపంగా విశ్వసించాడు. ఇతని ప్రకారం చట్టం ఆధారంగా కొనసాగే జీవనం ఉత్తమమైందిగా భావించాడు. రాజు ” ఎల్లప్పుడు ప్రజలను సన్మార్గంలో నడిపించాలన్నారు. రాజు తన అధికారాలను మతాధిపతి ఆధిపత్యానికి బద్ధుడై వినియోగించాలన్నాడు.

AP Inter 1st Year Civics Study Material Chapter 6 హక్కులు – బాధ్యతలు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Civics Study Material 6th Lesson హక్కులు – బాధ్యతలు Textbook Questions and Answers.

AP Inter 1st Year Civics Study Material 6th Lesson హక్కులు – బాధ్యతలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
హక్కులను నిర్వచించి పౌర, రాజకీయ హక్కులను వర్ణించండి. [Mar. ’17, ’16]
జవాబు:
పరిచయం: రాజనీతిశాస్త్ర అధ్యయనంలో హక్కుల భావనకు చాలా ప్రాముఖ్యత ఉంది. సామాజిక జీవనానికి హక్కులనేవి అత్యంత ఆవశ్యకమైనవి. సామాజిక సంక్షేమ సాధనగా హక్కులు పరిగణించబడినాయి. హక్కులను వినియోగించుకోవటం ద్వారానే రాజ్యంలోని పౌర వ్యక్తిత్వం వికసిస్తుంది. సమాజంలోనూ, రాజ్యంలోనూ సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి హక్కులు అవసరమవుతాయి. రాజ్యం పౌరులకు ప్రసాదించే హక్కుల ద్వారానే దాని ఔన్నత్యం గుర్తించబడుతుందని హెచ్.జె. లాస్కి పేర్కొన్నాడు. సాధారణంగా ప్రతి రాజ్యం తన పౌరులకు వివిధ రంగాలలో అనేక హక్కులను ప్రసాదిస్తుంది.

హక్కులనేవి రాజ్యం, సమాజంచేత గుర్తించబడే కనీస పరిస్థితులు, అవకాశాలుగా పరిగణించవచ్చు. వాటిని రాజ్యంలోని వివిధ చట్టాలు పరిరక్షిస్తాయి. ఆధునిక రాజ్యాలు తమ రాజ్యాంగం, చట్టాల ద్వారా పౌరుల వికాసానికి అనేక ఏర్పాట్లుగావించాయి. ఇక హక్కులు, బాధ్యతలు అనేవి వ్యక్తుల సంపూర్ణ వికాసానికి అత్యంత ఆవశ్యకమైనవి.

AP Inter 1st Year Civics Study Material Chapter 6 హక్కులు – బాధ్యతలు

అర్థం: “హక్కు” అంటే “కలిగి ఉండటము” అని అర్థం. సమాజ సంక్షేమం కోసం, ప్రగతి కోసం వ్యక్తులందరూ పాటించవలసిన బాధ్యతల రూపమే హక్కులు. హక్కులు మానవునకు స్వేచ్ఛను ఇచ్చి, వికాసానికి తోడ్పడతాయి. హక్కుల నిర్వచనాలు: రాజనీతి శాస్త్రవేత్తలు హక్కు అనే పదాన్ని అనేక విధాలుగా నిర్వచించారు. వాటిలో కొన్నింటిని కింద వివరించడమైనది.

  1. ఎర్నెస్ట్ బార్కర్: “వ్యక్తి మూర్తిమత్వ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన బాహ్యపరమైన పరిస్థితులే హక్కులు”.
  2. బొసాంకే: “సమాజం చేత గుర్తించబడి, రాజ్యంచేత అమలులో ఉంచబడే అధికారాలే హక్కులు”.
  3. టి.హెచ్. గ్రీన్: “ఉమ్మడి శ్రేయస్సుకు దోహదపడే వాటిని కోరేందుకు, గుర్తించేందుకు ఉండే అధికారాలే హక్కులు.”
  4. హెచ్.జె. లాస్కి: “హక్కులనేవి మానవుల సామాజిక జీవనానికి అవసరమైనవి. అవి లేకుండా ఏ ఒక్కరూ సాధారణంగా అత్యుత్తమమైన వ్యక్తిగా రూపొందటం సాధ్యం కాదు.”

పౌరహక్కులు: నాగరిక జీవనాన్ని గడపటానికి అవసరమయ్యే హక్కులనే పౌరహక్కులు అంటారు. అన్ని రాజ్యాలు తమ ప్రజలకు ఈ హక్కులను ఇస్తున్నాయి. ఈ హక్కులపై అనేక మినహాయింపులు ఉంటాయి. ముఖ్యమైన పౌర హక్కులు ఏమనగా:

1. జీవించే హక్కు (Right to life): జీవించే హక్కు అనేది పౌరహక్కులలో అత్యంత ముఖ్యమైనదని టి.హెచ్. గ్రీన్ భావించాడు. ఈ హక్కు వ్యక్తుల జీవనానికి భద్రతను కల్పిస్తుంది. ఈ హక్కు లేనట్లయితే వ్యక్తులు తమ జీవనాన్ని గడిపేందుకు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రతి వ్యక్తికీ ఈ హక్కు ఎంతో విలువైనదే కాకుండా, సమాజం, రాజ్యం మొత్తానికి కూడా ఎంత విలువైనదనే ప్రమేయంపై ఈ హక్కు ఆధారపడి ఉంది. అందువల్ల ఈ హక్కు ద్వారా రాజ్యం వ్యక్తుల జీవనానికి ఎంతగానో రక్షణను కల్పిస్తుంది. అయితే ఈ హక్కును అనుభవించే విషయంలో వ్యక్తులపై రాజ్యం కొన్ని సహేతుకమైన ఆంక్షలను విధించవచ్చు. ఈ సందర్భంలో రాజ్యం ఏ వ్యక్తినైనా జాతి ప్రయోజనం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని ఆజ్ఞాపించవచ్చు. ఈ హక్కులలో ఆత్మరక్షణ హక్కు కూడా ఇమిడి ఉంది.

2. స్వేచ్ఛా హక్కు (Right to Liberty): స్వేచ్ఛా హక్కు వ్యక్తులకు అనేక రంగాలలో స్వాతంత్ర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ హక్కు వారి జీవనాన్ని అర్థవంతం చేస్తుంది. వ్యక్తులు అనేక రంగాలలో వారి వ్యక్తిత్వాన్ని వికసింపచేసుకొనేందుకు వీలు కల్పిస్తుంది. సంచరించే హక్కు, వాక్ స్వాతంత్ర్యపు హక్కు, భావవ్యక్తీకరణ హక్కు, ఆలోచనా హక్కు, నివసించే హక్కు మొదలైనవి ఇందులో ఉన్నాయి.

3. సమానత్వ హక్కు (Right to Equality): సమానత్వ హక్కు అంటే చట్టం దృష్టిలో అందరూ సమానులే అని అర్థంగా చెప్పవచ్చు. వ్యక్తుల మధ్య కులం, వర్ణం, పుట్టుక, మతం, ప్రాంతం, సంపద, విద్యలాంటి పలురకాల విచక్షణలను ఈ హక్కు నిషేధిస్తుంది. అందరినీ ఒకే రకంగా ఆదరిస్తుంది. రాజ్యంలో చట్టాలను ఒకే విధంగా వర్తించుటకు ఈ హక్కు ఉద్దేశించింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో వ్యక్తులందరికీ సమానమైన అవకాశాలను ఈ హక్కు కల్పిస్తుంది.

4. ఆస్తి హక్కు (Right to Property): ఈ హక్కు ప్రకారం ప్రతి వ్యక్తి ఆస్తిని సంపాదించేందుకు, అనుభవించేందుకు, దానధర్మాలకు వినియోగించుకొనేందుకు లేదా వారసత్వంగా పొందేందుకు వీలుంటుంది. ప్రతి వ్యక్తి ఉన్నత ప్రమాణాలతో జీవనాన్ని కొనసాగించేందుకు ఈ హక్కు అవసరమవుతుంది. అలాగే వ్యక్తి మూర్తిమత్వ వికాసానికి ఇది ఎంతో కీలకమైనది.

5. కుటుంబ హక్కు (Right to Family): కుటుంబం అనేది ఒక ప్రాథమిక, సామాజిక వ్యవస్థ. కుటుంబ ” హక్కు సమాజంలో వ్యక్తులకు కుటుంబపరమైన సంబంధాలను ఏర్పరచుకొనేందుకు వీలు కల్పిస్తుంది. పర్యవసానంగా ఈ హక్కు ద్వారా వ్యక్తులు తమకు నచ్చినవారిని వివాహం చేసుకొనే స్వేచ్ఛను కలిగి ఉంటారు. అలాగే సంతానాన్ని పొందేందుకు, పిల్లలను పోషించేందుకు వారికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అయితే జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ హక్కుపై రాజ్యం కొన్ని నిర్దిష్టమైన ఆంక్షలను విధించవచ్చు. ఉదాహరణకి ఇటీవలి కాలం వరకు చైనా ప్రభుత్వం అక్కడి పౌరుల కుటుంబసభ్యుల సంఖ్యపై కఠిన ఆంక్షలను విధించింది. ఇప్పుడిప్పుడే ఈ రాజ్యం పైన పేర్కొన్న విషయంలో కొన్ని సవరణలు చేస్తున్నది.

6. మత హక్కు (Right to Religion): ఈ హక్కు ప్రకారం వ్యక్తులు తమకు ఇష్టమైన మతాన్ని స్వీకరించేందుకు, ప్రచారం చేసేందుకు, ప్రభోదించేందుకు స్వేచ్ఛను కలిగి ఉంటారు. వారు ఈ విషయంలో సంపూర్ణమైన స్వాతంత్ర్యాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా లౌకికరాజ్యాలు తమ పౌరులకు విశేషమైన మత స్వాతంత్ర్యాలను ప్రసాదించాయి.

AP Inter 1st Year Civics Study Material Chapter 6 హక్కులు – బాధ్యతలు

7. ఒప్పందం హక్కు (Right to Contract): ఒప్పందం హక్కు ప్రకారం వ్యక్తులు తమ జీవనం, ఆస్తి, ఉపాధి వంటి విషయాలలో చట్టబద్ధమైన ఏర్పాట్లను చేసుకొనేందుకు లేదా ఒప్పందాలను కుదుర్చుకొనేందుకు స్వాతంత్ర్యాన్ని కలిగి ఉంటారు. ఈ విషయంలో ఈ హక్కు ప్రకారం సంబంధిత వ్యక్తులు స్పష్టమైన నియమ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. రాజ్యం వ్యక్తుల శ్రేయస్సును పెంపొందించే ఒప్పందాలను మాత్రమే ఈ సందర్భంలో గుర్తిస్తుంది.

8. విద్యా హక్కు (Right to Education): ఆధునిక కాలంలో విద్యాహక్కు అనేది ప్రతి వ్యక్తికి అత్యంత ఆవశ్యకమైనదిగా పరిగణించబడింది. విద్యలేనివారు, అమాయకులు ప్రభుత్వ వ్యవహారాలలో చురుకుగా పాల్గొనలేరు. అలాగే నిరక్షరాస్యులు తమ శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకోలేరు. అందుచేత విద్య, అక్షరాస్యత అనేవి సమాజంలో వివిధ సామాజిక సమస్యలను అవగాహన చేసుకొనేందుకు, ప్రభుత్వ విధానాలను తెలుసుకొనేందుకు దోహదపడతాయి. ప్రజాస్వామ్య రాజ్యాలలో ఈ హక్కు ప్రతి పౌరుడికి కనీస స్థాయి విద్యను అందించేందుకు హామీ ఇస్తుంది.

9. సంస్థలు, సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు (Right to form Associations and Unions): ఈ హక్కు ప్రకారం వ్యక్తులు తమకు ఇష్టమైన సంస్థలు, సంఘాలను నెలకొల్పుకొని, కొన్ని నిర్దిష్ట లక్ష్యాలను నెరవేర్చుకొనేందుకు వీలుంటుంది. వ్యక్తులు ఈ హక్కును వినియోగించుకోవటం ద్వారా తమ అభీష్టం ప్రకారం వివిధ సంస్థలు, సంఘాలలో సభ్యులుగా చేరేందుకు, కొనసాగేందుకు మరియు సభ్యత్వాలను ఉపసంహరించుకొనేందుకు పూర్తి స్వేచ్ఛను కలిగి ఉంటారు. అయితే ఒకవేళ వ్యక్తులు జాతి శ్రేయస్సును విస్మరించి సంస్థలను స్థాపించి నిర్వహించినచో, రాజ్యం వారి చర్యలపై కొన్ని ఆంక్షలను విధించవచ్చు.

10. రాజ్యాంగ పరిహారపు హక్కు (Right to Constitutional Remedies): వ్యక్తి హక్కుల పరిరక్షణకు ఈ హక్కు అత్యంత ఆవశ్యకమైనది. ఈ హక్కు లేనిచో పౌరహక్కులనేవి అర్థరహితమవుతాయి. ఈ హక్కు ప్రకారం ఇతరుల జోక్యం లేదా దాడి ఫలితంగా నష్టం పొందిన వ్యక్తి తన స్వాతంత్ర్యాన్ని కోల్పోయినచో, తగిన ఉపశమనాన్ని, న్యాయాన్ని న్యాయస్థానాల ద్వారా పొందుతాడు. ఈ సందర్భంలో ఉన్నత న్యాయస్థానాలు, అనేక ఆజ్ఞలను (writs) జారీ చేస్తాయి. అటువంటి వాటిలో హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, కో వారంటో, సెర్షియోరరి లాంటివి ఉన్నాయి.

రాజకీయ హక్కులు: ప్రజాస్వామ్య దేశాలలో ప్రభుత్వ వ్యవహారాలలో పౌరులు పాల్గొనటానికి అవకాశం కల్పించబడింది. ఈ అవకాశాలనే రాజకీయ హక్కులు అందురు. రాజకీయ హక్కులు ముఖ్యంగా 5 అవి:

1. ఓటు హక్కు (Right to Vote): ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాలలో పౌరులు అనుభవించే అతి ముఖ్యమైన రాజకీయ హక్కు ఓటు హక్కు వయోజన పౌరులు ఈ హక్కును వివిధ శాసన నిర్మాణ సంస్థలలో తమ ప్రతినిధులను ఎన్నుకొనేందుకు శక్తివంతమైన ఆయుధంగా వినియోగిస్తారు. ఈ హక్కు వారిని నిజమైన సార్వభౌములుగా రూపొందిస్తుంది. వయోజన పౌరులందరూ వర్ణం, పుట్టుక, భాష, తెగ, మతం, ప్రాంతం వంటి తారతమ్యాలు లేకుండా ఈ హక్కును కలిగి ఉంటారు. అయితే విదేశీయులు, మైనర్లకు ఈ హక్కు వర్తించదు.

2. ఎన్నికలలో అభ్యర్థిగా పోటీచేసే హక్కు (Right to Contest in Elections): రాజ్యంలో పౌరులు వివిధ శాసన నిర్మాణ సంస్థలకు అభ్యర్థులుగా పోటీచేసేందుకు ఈ హక్కు అధికారమిస్తుంది. రాజకీయ సామర్థ్యం ఆసక్తి, శక్తివంతమైన నాయకత్వం వంటి లక్షణాలు గల పౌరులు రాజ్యానికి సంబంధించిన రాజకీయ యంత్రాంగ నిర్వహణలలో చురుకుగా పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. దాంతో ఈ హక్కు పౌరులలో విశేషమైన రాజకీయ పరిజ్ఞానాన్ని, ఆసక్తిని పెంపొందిస్తుంది. ఈ హక్కు ప్రజాస్వామ్య రాజ్యానికి ప్రధాన ప్రాతిపదికగా ఉంటుంది.

3. ప్రభుత్వ పదవులను చేపట్టే హక్కు (Right to Hold Public Offices): పౌరులు వివిధ రకాల ప్రభుత్వ పదవులను చేపట్టి, నిర్వహించేందుకు ఈ హక్కు అనేక అవకాశాలను కల్పిస్తుంది. ఈ హక్కు ప్రకారం ఏ ఒక్క పౌరుడు ఇతరులతో పోల్చినచో ఎటువంటి ప్రత్యేకమైన సౌకర్యాలను కానీ, మినహాయింపులు కానీ పొందేందుకు వీలులేదు. ప్రభుత్వాధికారాన్ని ఎంతో హుందాగా నిర్వహించేందుకు ఈ హక్కు పౌరులకు సహాయకారిగా ఉంటుంది.

4. విజ్ఞాపన హక్కు (Right to Petition): పౌరులు తమ అవసరాలు లేదా సమస్యలను ప్రభుత్వ దృష్టికి విజ్ఞప్తుల ద్వారా తెచ్చేందుకు ఈ హక్కు దోహదపడుతుంది. ఆధునిక రాజ్యంలో ఈ హక్కు ఎంతో ప్రాధాన్యత గల రాజకీయ హక్కుగా పరిగణించబడింది. ఈ హక్కు ద్వారా పౌరులు ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి, తగిన పరిష్కారాలను పొందుతారు. అలాగే ప్రభుత్వాధికారులు ప్రజా సమస్యలను తెలుసుకొని, వాటిని సకాలంలో పరిష్కరించేటట్లు ఈ హక్కు సహాయపడుతుంది.

5. విమర్శించే హక్కు (Right to Criticism): ఈ హక్కు ప్రభుత్వానికి సంబంధించిన అనేక విధానాలు, కార్యక్రమాలను విమర్శించేందుకు పౌరులకు అవకాశం ఇస్తుంది. అలాగే వివిధ స్థాయిలలో నాయకులు, పరిపాలన సిబ్బంది పాల్పడే అవకతవకలను బహిర్గతం చేసేందుకు ఇది తోడ్పడుతుంది. అంతేకాకుండా కాలానుగుణంగా ప్రభుత్వం అనుసరించే విధానాలపై పౌరులు సహేతుకమైన, నిర్మాణాత్మకమైన విమర్శలను చేసేందుకు అవకాశమిస్తుంది. ఈ హక్కు అంతిమంగా పరిపాలనాధికారులు, విధాన రూపకర్తలు తమ విద్యుక్త ధర్మాలను ఎంతో అప్రమత్తంగా, జాగ్రత్తగా నిర్వహించేటట్లు చూస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 6 హక్కులు – బాధ్యతలు

ప్రశ్న 2.
హక్కుల పరిరక్షణ అంశాలను గుర్తించండి. [Mar. 2018]
జవాబు:
పరిచయం: రాజనీతిశాస్త్ర అధ్యయనంలో హక్కుల భావనకు చాలా ప్రాముఖ్యత ఉంది. సామాజిక జీవనానికి హక్కులనేవి అత్యంత ఆవశ్యకమైనవి. సామాజిక సంక్షేమ సాధనగా హక్కులు పరిగణించబడినాయి. హక్కులను వినియోగించుకోవటం ద్వారానే రాజ్యంలోని పౌర వ్యక్తిత్వం వికసిస్తుంది. సమాజంలోనూ, రాజ్యంలోనూ సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి హక్కులు అవసరమవుతాయి. రాజ్యం పౌరులకు ప్రసాదించే హక్కుల ద్వారానే దాని ఔన్నత్యం గుర్తించబడుతుందని హెచ్.జె. లాస్కి పేర్కొన్నాడు. సాధారణంగా ప్రతి రాజ్యం తన పౌరులకు వివిధ రంగాలలో అనేక హక్కులను ప్రసాదిస్తుంది.

హక్కులనేవి రాజ్యం, సమాజంచేత గుర్తించబడే కనీస పరిస్థితులు, అవకాశాలుగా పరిగణించవచ్చు. వాటిని రాజ్యంలోని వివిధ చట్టాలు పరిరక్షిస్తాయి. ఆధునిక రాజ్యాలు తమ రాజ్యాంగం, చట్టాల ద్వారా పౌరులు వికాసానికి అనేక ఏర్పాట్లు గావించాయి. ఇక హక్కులు, బాధ్యతలు అనేవి వ్యక్తుల సంపూర్ణ వికాసానికి అత్యంత ఆవశ్యకమైనవి.

అర్థం: “హక్కు” అంటే “కలిగి ఉండటము” అని అర్థం. సమాజ సంక్షేమం కోసం, ప్రగతి కోసం వ్యక్తులందరూ పాటించవలసిన బాధ్యతల రూపమే హక్కులు. హక్కులు మానవునకు స్వేచ్ఛను ఇచ్చి, వికాసానికి తోడ్పడతాయి. హక్కుల నిర్వచనాలు: రాజనీతి శాస్త్రవేత్తలు హక్కు అనే పదాన్ని అనేక విధాలుగా నిర్వచించారు. వాటిలో కొన్నింటిని కింద వివరించడమైనది.

  1. ఎర్నెస్ట్ బార్కర్: “వ్యక్తి మూర్తిమత్వ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన బాహ్యపరమైన పరిస్థితులే హక్కులు”.
  2. బొసాంకే: “సమాజం చేత గుర్తించబడి, రాజ్యంచేత అమలులో ఉంచబడే అధికారాలే హక్కులు”.
  3. టి.హెచ్. గ్రీన్: “ఉమ్మడి శ్రేయస్సుకు దోహదపడే వాటిని కోరేందుకు, గుర్తించేందుకు ఉండే అధికారాలే హక్కులు.”
  4. హెచ్.జె. లాస్కి: “హక్కులనేవి మానవుల సామాజిక జీవనానికి అవసరమైనవి. అవి లేకుండా ఏ ఒక్కరూ సాధారణంగా అత్యుత్తమమైన వ్యక్తిగా రూపొందటం సాధ్యం కాదు.”

హక్కుల పరిరక్షణలు (Safeguards of Rights): హక్కులను రాజ్యం పరిరక్షించినప్పుడే వ్యక్తులు వాటిని అనుభవించగలుగుతారు. ఈ సందర్భంలో కింది అంశాలు హక్కుల పరిరక్షణకు దోహదపడతాయి.

1. ప్రజాస్వామ్య పాలన (Democratic Rule): ప్రజాస్వామ్య పాలన ప్రజల హక్కులను పరిరక్షించుటలో ఎంతగానో కృషిచేస్తుంది. ఒక్క ప్రజాస్వామ్య రాజ్యాలలోనే తమ హక్కులను స్వేచ్ఛగా సంపూర్ణంగా అనుభవిస్తారు. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థ వారి హక్కులకు రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన నియమనిబంధనల ద్వారా రక్షణలు కల్పిస్తుంది.

2. లిఖిత, దృఢ రాజ్యాంగం (Written and Rigid Constitution): లిఖిత రాజ్యాంగం ప్రభుత్వ అధికారాలు, కర్తవ్యాలను స్పష్టంగా నిర్వచిస్తుంది. అలాగే ఇది ప్రభుత్వాధికారానికి గల వివిధ పరిమితులను వివరిస్తుంది. అంతేకాకుండా ప్రజల హక్కులకు హామీ ఇస్తుంది. ఈ రాజ్యాంగాన్ని చిన్న కారణాలతో పాలకులు, శాసనసభ్యులు సవరించేందుకు అనుమతించదు.

3. ప్రాథమిక హక్కులను పొందుపరచుట (Incorporation of Fundamental Rights): ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరచడం ద్వారా వ్యక్తుల హక్కులను ప్రభుత్వం అతిక్రమించకుండా చూడవచ్చు. ఇటువంటి ఏర్పాటు వ్యక్తుల హక్కులను ఎంతగానో కాపాడుతుంది.

4. అధికారాల వేర్పాటు (Separation of Powers): హక్కుల పరిరక్షణకు అధికారాలు వేర్పాటు ఎంతో అవసరం. అధికారాలన్నీ ప్రభుత్వంలోని మూడు శాఖల మధ్య వేర్పాటు చేసినప్పుడే వ్యక్తి స్వేచ్ఛ కాపాడబడుతుంది. అప్పుడు మాత్రమే ఒక శాఖ నియంతృత్వాన్ని వేరొక శాఖ నివారించగలుగుతుంది.

5. అధికారాల వికేంద్రీకరణ (Decentralisation of Powers): ప్రభుత్వాధికారాలు వికేంద్రీకృతం అయినప్పుడే వ్యక్తులు హక్కులను అనుభవిస్తారు. అందుకోసం అధికారాలన్నీ జాతీయ, ప్రాంతీయ, స్థానిక స్థాయిలలో వికేంద్రీకరణం కావాలి. అటువంటి ఏర్పాటు ప్రాదేశిక లేదా కర్తవ్యాల ప్రాతిపదికపై జరుగుతుంది.

6. సమన్యాయపాలన (Rule of Law): చట్టం ముందు అందరూ సమానులే అనే అర్థాన్ని సమన్యాయపాలన సూచిస్తుంది. అంతేకాకుండా పౌరులందరికీ చట్టాలు సమానంగా వర్తిస్తాయని దీని అర్థం. చట్టం పౌరుల మధ్య ప్రాంతం, కులం, మతం, వర్ణం, తెగ వంటి తారతమ్యాలను చూపదు. అప్పుడు మాత్రమే వ్యక్తులందరూ హక్కులను అనుభవిస్తారు.

7. స్వతంత్ర, నిష్పాక్షిక న్యాయశాఖ (Independent and Impartial Judiciary): వ్యక్తుల పరిరక్షణకు తోడ్పడే మరో ముఖ్య అంశమే స్వతంత్ర, నిష్పాక్షిక న్యాయశాఖ. ఉన్నత న్యాయస్థానాలలోని న్యాయమూర్తులు నిష్పక్షపాతంతో, స్వతంత్ర వైఖరితో తీర్పులను అందించాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియలో భాగంగా వారు వ్యక్తుల హక్కులను తక్షణమే పరిరక్షించేందుకై కొన్ని రిట్లను (Writs) మంజూరు చేస్తారు.

AP Inter 1st Year Civics Study Material Chapter 6 హక్కులు – బాధ్యతలు

8. స్వతంత్ర పత్రికలు (Independent Press): వ్యక్తుల హక్కుల పరిరక్షణకు దోహదపడే మరొక అంశమే స్వతంత్ర పత్రికలు. స్వతంత్ర దృక్పథం గల పత్రికలు వార్తలు, అభిప్రాయాలను నిష్పక్షపాతంగా, రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు తెలియజేస్తాయి. ఈ విషయంలో రాజ్యం పత్రికలపై ఎటువంటి ఆంక్షలను విధించేందుకు లేదా పత్రికలను అడ్డుకునేందుకు ప్రయత్నించరాదు. అప్పుడు మాత్రమే వ్యక్తులు తమ హక్కులను సంపూర్ణంగా అనుభవిస్తారు.

9. సాంఘిక, ఆర్థిక సమానత్వాలు (Social and Economic Equalities): సాంఘిక, ఆర్థిక సమానత్వాలు అనేవి వ్యక్తులకు హక్కులను అనుభవించేందుకు ఎంతగానో అవసరమవుతాయి. రాజ్యంలో సాంఘిక, ఆర్థిక సమానత్వాలు నెలకొన్నప్పుడే వ్యక్తులు తమ హక్కులను సక్రమంగా, సంవర్ధక రీతిలో అనుభవిస్తారు. కులతత్త్వం, మతత్త్వం, భాషాతత్త్వం వంటి సాంఘిక అనర్థాలు, ఆర్థిక అసమానతలు, దోపిడీని పెంచినప్పుడు సాంఘిక, ఆర్థిక సమానత్వాలను సాధించలేము.

10. నిరంతర అప్రమత్తత (Eternal Vigilance): వ్యక్తుల హక్కులను పరిరక్షించటంలో నిరంతర అప్రమత్తత అనేది అత్యంత ముఖ్యమైన అంశంగా చెప్పవచ్చు. వ్యక్తులు ఎప్పటికప్పుడు ప్రభుత్వ విధానాలపట్ల అప్రమత్తతతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రభుత్వం కనక నియంతృత్వ ధోరణులను అనుసరిస్తే, వాటిని ప్రజాస్వామ్య, రాజ్యాంగ పద్ధతుల ద్వారా వ్యతిరేకించాలి. వారు ఎట్టి పరిస్థితులలోనూ అధికారం కోసం ఆరాటపడే స్వార్థపరులైన నాయకులను ప్రోత్సహించరాదు. అంతేకాకుండా న్యాయసమీక్ష (Judicial Review), పునరాయనం (Recal), దృఢమైన ప్రతిపక్షంలాంటి ఇతర అంశాలు కూడా వ్యక్తుల హక్కులను పరిరక్షించేందుకు దోహదపడతాయి.

ప్రశ్న 3.
మానవ హక్కులపై ఒక వ్యాసాన్ని రాయండి.
జవాబు:
భావం: మానవుల ప్రాథమిక జీవనానికి అత్యంత ఆవశ్యకమైనవే మానవ హక్కులు. మానవులందరూ ఈ హక్కులను కుల, మత, ప్రాంత, వర్ణ, వర్గ తారతమ్యాలు లేకుండా అనుభవిస్తారు. ప్రజాస్వామ్య రాజ్యాలలోని రాజ్యాంగ, సాధారణ చట్టాలు ఇటువంటి హక్కులను గుర్తిస్తాయి. అలాగే ఈ హక్కులను ప్రజలకు అందించేందుకై ప్రజాస్వామ్య రాజ్యాలలోని వివిధ ప్రభుత్వాలు అనేక చర్యలను తీసుకొంటాయి.

మానవ హక్కుల ఆవిర్భావం: ఒకానొక సమయంలో ప్రాచీన, మధ్యయుగ సమాజాలలో ఎవరో కొన్ని వర్గాలు మాత్రమే మానవ హక్కులను అనుభవించేవారు. దాంతో మెజార్టీ ప్రజలు ఆ హక్కులను నోచుకోలేకపోయారు. వారు హక్కుల సాధనకై అవిశ్రాంతంగా ప్రయత్నించారు.

మానవ హక్కుల సాధనకై ప్రయత్నాలు జరిపిన వారిలో గ్రీకు పాలకులను మొదటిసారిగా పేర్కొనవచ్చు. గ్రీకు పాలకులు మానవ వ్యక్తిత్వ వికాసానికి ఆరోగ్యం, దేహదారుఢ్యం తప్పనిసరిగా ఉండాలని గుర్తించారు. అలాగే జాతి అభివృద్ధిలో మానవ హక్కులు అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తాయనే విషయాన్ని పేర్కొన్నారు. అయితే దురదృష్టం కొద్దీ కొందరు పాలకులు అణచివేత, స్వార్థబుద్ధి కారణంగా ప్రజలలో మతతత్త్వం బాగా వ్యాప్తి చెందింది. ఈ పరిస్థితులలో ‘మానవ హక్కులు కనుమరుగయ్యాయి.

మానవ హక్కుల సాధనలో ఇంగ్లాండులోని మాగ్నా కార్టా (Magna Carta) అనేది మానవ హక్కుల సాధనలో, చేసిన మొదటి ప్రయత్నంగా చరిత్రకారులు భావించారు. మాగ్నా కార్టా ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను వీలు కల్పించింది. చరిత్రకారులు దానిని బ్రిటీషు రాజ్యంగపు ‘బైబిల్’గా వర్ణించారు.
మానవ హక్కుల ఆశయాలు:

  1. ప్రజలందరికీ ఎటువంటి వివక్షత లేని స్వాతంత్ర్యాన్ని అందించటం.
  2. పేదరికం నుండి విముక్తి.
  3. వ్యక్తులలో నిబిడీకృతమై ఉన్న సామర్థ్యాలను వినియోగించుకొనే స్వేచ్ఛ.
  4. భయం నుండి విముక్తి.
  5. రక్షణ పొందే స్వేచ్ఛ.
  6. అన్యాయానికి వ్యతిరేకంగా స్వేచ్ఛ.
  7. వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వాతంత్య్రం.
  8. సంస్థలను ఏర్పరచుకొనే స్వేచ్ఛ.
  9. గౌరవప్రదంగా వ్యక్తి తన కార్యకలాపాలు నిర్వర్తించుకొనే స్వేచ్ఛ.
  10. దౌర్జన్యాన్ని నిరోధించి వ్యతిరేకించే స్వేచ్ఛ.

AP Inter 1st Year Civics Study Material Chapter 6 హక్కులు – బాధ్యతలు

ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 1995 – 2005 దశకాన్ని అంతర్జాతీయ మానవ హక్కుల దశాబ్దిగా ప్రకటించింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా నివసించే ప్రజలందరికీ మానవ హక్కులను ప్రసాదించే ఉద్దేశంతో ఈ కాలంలో అనేక చర్యలను గైకొన్నది.

మానవ హక్కుల వర్గీకరణ: మానవ హక్కులను స్థూలంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి (1) పౌర, రాజకీయ హక్కులు (ii) సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక హక్కులు. సమాజంలో పౌరహక్కులు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి. జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు, వ్యక్తుల భద్రత హక్కు, బానిసత్వం లేదా వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందే హక్కు వంటి అనేక హక్కులు పౌరహక్కులలో పేర్కొనడమైంది. చట్టం నుంచి సమానంగా రక్షణ పొందేహక్కు, బలవంతంగా నిర్భందించడం నుంచి రక్షణ పొందే హక్కు, నిష్పాక్షికంగా విచారణ పొందే హక్కు, ఆస్తి హక్కు, వివాహపు హక్కు వంటి ఇతర హక్కులు కూడా పౌరహక్కులలో ఇమిడి ఉన్నాయి.

ప్రశ్న 4.
“హక్కులు, బాధ్యతలు అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి” విశ్లేషించండి.
జవాబు:
హక్కులు: “హక్కు” అంటే “కలిగి ఉండటము” అని అర్థం. సమాజ సంక్షేమం కోసం, ప్రగతి కోసం వ్యక్తులందరూ పాటించవలసిన బాధ్యతల రూపమే హక్కులు. హక్కులు మానవునకు స్వేచ్ఛను ఇచ్చి, వికాసానికి తోడ్పడతాయి.

బాధ్యతలు: సమాజంలో నివశించే వ్యక్తులు ఇతర వ్యక్తుల పట్ల నిర్వర్తించే అంశాలనే బాధ్యతలు అంటారు. బాధ్యతలు అనేవి ఇతరుల పట్ల ఒక వ్యక్తి కలిగి ఉండే కర్తవ్యం, విధి అని అర్థం.

హక్కులు, బాధ్యతల మధ్య సంబంధం (Relationship between Rights and Responsibilities): హక్కులు, బాధ్యతల మధ్య సన్నిహిత సంబంధముంది. అవి రెండూ ఒకే నాణానికి ఉన్న బొమ్మా, బొరుసులాంటివి. హక్కులు లేని బాధ్యతలు, బాధ్యతలు లేని హక్కులు అర్థరహితం. హక్కులలో బాధ్యతలు ఇమిడి ఉంటాయి. అలాగే బాధ్యతలనేవి హక్కులతో సంబంధం కలిగి ఉంటాయి. ఈ రెండూ విడదీయరానివి. వీటిని మానవుల ఉచ్ఛ్వాస నిశ్ఛ్వాసాలతో పోల్చవచ్చు.

1. హక్కులు – బాధ్యతలు సామాజిక జీవనానికి అత్యంత అవసరం: అనేకమంది రాజనీతిశాస్త్ర రచయితలు హక్కులు, బాధ్యతలను సామాజిక జీవనపు రెండు ఆవశ్యక నియమాలుగా వర్ణించారు. వీటిని రాజ్యానికి కవచకుండలాలుగా పరిగణించారు. ప్రతి ఒక్క హక్కుకు సంబంధించిన బాధ్యత కూడా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క బాధ్యతకు సంబంధించిన హక్కు కూడా ఉంటుంది. ఈ రెండూ సమాజంలో వ్యక్తులు సంతోషకరమైన, గౌరవప్రదమైన, సమన్వయమైన, సౌభాగ్యమైన జీవనాన్ని గడిపేందుకు దోహదపడతాయి. ఉదాహరణకు మతహక్కు అనేది ప్రతి ఒక్క వ్యక్తి తన ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించి అనుసరించేందుకు అవకాశమిస్తుంది. అలాగే సమాజంలో తన మత విశ్వాసాలను ప్రబోధించి, ప్రచారం చేసేందుకు వీలు కల్పిస్తుంది. అదే సమయంలో ఆ వ్యక్తి మత వ్యవహారాలకు సంబంధించిన బాధ్యతను కూడా కలిగి ఉంటాడు. అతడు తన మతహక్కును తోటి పౌరుల మత విశ్వాసాలకు భంగం కలగని రీతిలో అనుభవించాల్సిన బాధ్యతను కలిగి ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లోను ఇతర మతస్థుల వ్యవహారాలలో జోక్యం చేసుకోరాదు. ఇతర మతస్థుల విశ్వాసాలకు భంగం కలిగించరాదు. వేరొక మాటలో చెప్పాలంటే ప్రతి వ్యక్తి ఇతరులను గౌరవించటం ద్వారానే గౌరవం పొందుతాడు. కాబట్టి హక్కులు, బాధ్యతలు అనేవి సమ్మిళితాలు. హక్కులు లేకుండా బాధ్యతలను గాని, బాధ్యతలను నిర్వహించకుండా హక్కులను గాని ఏ ఒక్కరూ ఆశించరాదు.

2. హక్కులు – బాధ్యతలు సమాజ ప్రగతికి అత్యంత అవసరం: సమాజ ప్రగతికి దోహదపడే విధంగా ప్రతి ఒక్కరూ తమ కార్యక్రమాలను నిర్వహించుకుంటూ హక్కులను అనుభవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరూ తమ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండి, తమ బాధ్యతలను న్యాయమైన రీతిలో నిర్వహించాలి. ప్రతి ఒక్కరూ సామాజిక ప్రగతిని పెంపొందించే అంతిమ ఆశయంతో తమ కార్యక్రమాలను నిర్వహించుకోవాలి.

హక్కులు, బాధ్యతలు మధ్యగల సంబంధం రాజ్యంలోని శాంతి భద్రతలకు సంబంధించినదిగా పేర్కొనవచ్చు. సమాజంలో శాంతియుత వాతావరణానికి భంగం కలిగించే విధంగా ఏ ఒక్కరూ వ్యవహరించకుండా తమ హక్కులను వినియోగించుకోవాలి. అట్లాగే ప్రభుత్వ సంస్థలు రూపొందించి, అమలుచేసే నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలి. సమాజంలో ఇతరుల హక్కులకు భంగం కలగని విధంగా వివిధ రంగాలలో తమ కార్యక్రమాలను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. దీని అర్థం ప్రతి ఒక్కరూ తమ హక్కులను అనుభవిస్తూనే, ఇతరులను గౌరవించే బాధ్యతలను కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఎట్టి పరిస్థితులలోనూ ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోరాదు.
హక్కులు, బాధ్యతలు అనేవి వేరువేరుగా ఉంటూ భిన్నమైన లక్ష్యాలను కలిగి ఉండవు. అవి రెండూ మనిషి శరీరం, నీడవలె కలిసి ఉంటాయి.

ఒకరి హక్కు వేరొకరి బాధ్యతగాను, వేరొకరి బాధ్యత ఒకరి హక్కుగాను పరిగణించవచ్చు. ఈ రెండూ అంటే హక్కులు, బాధ్యతలు కలిసినప్పుడే వ్యక్తి ఉత్తమ పౌరుడిగా రూపొందుతాడు.

AP Inter 1st Year Civics Study Material Chapter 6 హక్కులు – బాధ్యతలు

ప్రశ్న 5.
జాతీయ మానవ హక్కుల కమీషన్ గురించి వ్యాసాన్ని రాయండి.
జవాబు:
పరిచయం: ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం మానవ హక్కులను తన పౌరులకు అందించేందుకు విశేషమైన కృషిచేస్తుంది. మానవ హక్కుల పట్ల ప్రజలలో తగిన అవగాహనను కలిగించేందుకు, మానవ హక్కుల అతిక్రమణ ప్రయత్నాలను నివారించేందుకు దేశంలో కొన్ని చట్టాలు చేయబడినాయి. ఇందులో భాగంగా భారత పార్లమెంటు 1993 లో మానవ హక్కుల పరిరక్షణ చట్టాన్ని ఆమోదించింది. ఫలితంగా జాతీయ మానవ హక్కుల కమీషన్ ఏర్పాటు చేయబడింది.

జాతీయ మానవ హక్కుల కమీషన్ నిర్మాణం: జాతీయ మానవ హక్కుల కమీషన్ బహుసభ్య సంస్థ. దానిలో ఈ క్రిందివారు సభ్యులుగా ఉంటారు.

సభ్యులు:

  1. సుప్రీంకోర్టు మాజీ ప్రధానన్యాయమూర్తి అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.
  2. సుప్రీంకోర్టు ప్రస్తుత (లేదా) మాజీన్యాయమూర్తి.
  3. హైకోర్టు ప్రస్తుతన్యాయమూర్తి (లేదా) మాజీ ప్రధాన న్యాయమూర్తి.
  4. మానవ హక్కుల కార్యకలాపాలకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు, వీరితోపాటు
  5. జాతీయ షెడ్యూల్డ్ కులాల, తెగల కమీషన్, ఛైర్మన్.
  6. జాతీయ మైనారిటీల కమీషన్ ఛైర్మన్.
  7. జాతీయ మహిళల కమీషన్ ఛైర్మన్లు పదవీరీత్యా సభ్యులుగా ఉంటారు.
  8. ఈ కమీషన్ సభ్య కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వంలో సెక్రటరీ జనరల్ హోదాగల అధికారి వ్యవహరిస్తారు.

నియామకం: జాతీయ మానవ హక్కుల కమీషన్ ఛైర్మన్ మరియు సభ్యులను భారతరాష్ట్రపతి నియమిస్తారు.

పదవీకాలం: ఛైర్మన్ మరియు సభ్యుల పదవీ కాలం 5 సంవత్సరాలు లేదా 70 ఏళ్ళు నిండే వరకు పదవిలో కొనసాగుతారు.

కమీషన్ విధులు: జాతీయ మానవ హక్కుల కమీషన్ కింద పేర్కొన్న ముఖ్య విధులను నిర్వహిస్తోంది.

  1. ప్రభుత్వాధికారులు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తే, వాటిపై జాతీయ మానవ హక్కులు కమీషన్ విచారణ జరిపిస్తుంది.
  2. న్యాయస్థానాలు అనుమతించిన మేరకు మానవ హక్కుల ఉల్లంఘన ఉదంతాలపై విచారణ జరుపుతుంది.
  3. మానవ హక్కుల అమలుకు సంబంధించిన వివిధ చట్టబద్ధమైన చర్యలను సమీక్షిస్తుంది.
  4. మానవ హక్కులకు భంగం కలిగించే టెర్రరిస్టుల కార్యకలాపాలను నివారించేందుకై సలహాలు ఇస్తుంది.
  5. మానవ హక్కులకు సంబంధించిన విషయాలపై పరిశోధనలను కొనసాగిస్తుంది.
  6. మానవ హక్కుల పట్ల ప్రజలలో అవగాహనను పెంపొందించేందుకై తగిన చర్యలను తీసుకొంటుంది.
  7. మానవ హక్కులను పరిరక్షించే స్వచ్ఛంద సంస్థలకు తగిన ప్రోత్సాహకాలను అందిస్తుంది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
హక్కుల లక్షణాలేవి ? [Mar. 2016]
జవాబు:
హక్కులు-నిర్వచనం: “హక్కులనేవి మానవుల సామాజిక జీవనానికి అవసరమైనవి. అవి లేకుండా ఏ ఒక్కరూ సాధారణంగా అత్యుత్తమమైన వ్యక్తిగా రూపొందటం సాధ్యం కాదు” అని హెచ్.జె. లాస్కి పేర్కొన్నారు.

హక్కుల లక్షణాలు (Features of Rights): హక్కులు కింద పేర్కొన్న లక్షణాలను కలిగి ఉంటాయి.

1. సమాజంలోనే సాధ్యం (Possible only in Society): హక్కులు సమాజంలోనే ఉద్భవిస్తాయి. మానవుల సామాజిక జీవనానికి ప్రతీకగా ఉంటాయి. సమాజం వెలుపల అవి ఉండవు.

2. సామాజిక స్వభావం (Social Nature): హక్కులను వ్యక్తుల కోర్కెలుగా భావించవచ్చు. అటువంటి కోర్కెలు సమాజంలోనే నెరవేరుతాయి. రాజ్యం వాటిని గుర్తించి పెంపొందించేందుకు దోహదపడుతుంది. కాబట్టి హక్కులనేవి సామాజిక స్వభావమైనవని చెప్పవచ్చు.

3. ప్రకృతిసిద్ధమైనవి (Natural): హక్కులనేవి మానవుల సామాజిక ప్రవృత్తికి నిదర్శనంగా ఉంటాయి. ఈ విషయాన్ని సామాజిక ఒడంబడిక సిద్ధాంతకర్తలు ప్రకటించారు. వారి భావాలను ఆధునిక కాలంలో కొంతమేరకు ఆమోదించడమైనది.

4. రాజ్యంచే అమలై రక్షించబడటం (Enforced and Protected by state): హక్కులనేవి రాజ్యంచేత అమలుచేయబడి రక్షించబడతాయి. రాజ్యంలోని వివిధ ఉన్నత న్యాయసంస్థలు వాటికి సంరక్షకులుగా వ్యవహరిస్తాయి. వేరొక రకంగా చెప్పాలంటే ఉన్నత న్యాయస్థానాలు హక్కులను కాపాడతాయి. మరొక విషయం ఏమిటంటే హక్కులను ఒక్క ప్రజాస్వామ్య రాజ్యాలలోని పౌరులు మాత్రమే అనుభవిస్తారు.

AP Inter 1st Year Civics Study Material Chapter 6 హక్కులు – బాధ్యతలు

5. నిరపేక్షమైనవి కావు (Not Absolute): హక్కులు నిరపేక్షమైనవి కావు. వాటి వినియోగంపై రాజ్యం, సమాజం కొన్ని ఆంక్షలను విధిస్తుంది. అటువంటి ఆంక్షలు సమాజంలో శాంతి భద్రతల నిర్వహణకు ఉద్దేశించినవి. అంతేకాకుండా హక్కులనేవి సామాజిక శ్రేయస్సు, భద్రతలను పెంపొందించేందుకు దోహదపడతాయని చెప్పవచ్చు.

6. సంబంధిత బాధ్యతలు (Corresponding Responsibilities): హక్కులు, బాధ్యతలు ఒకదానికొకటి పరస్పర ఆధారాలుగా ఉంటాయి. ప్రతి హక్కు ఒక బాధ్యతను కలిగి ఉంటుంది. అందుచేత సమాజంలో నివసించే ప్రతి వ్యక్తి తనకు గల హక్కులనే తోటివారు కూడా కలిగి ఉంటారని గ్రహించాలి. అట్లాగే తోటివారు కూడా వారి హక్కులను వినియోగించుకోవటంలో ప్రతి వ్యక్తికి తగిన సహకారాన్ని అందించాలి. హక్కులు లేని బాధ్యతలు లేదా బాధ్యతలు లేని హక్కులు అనేవి నాగరిక సమాజంలో ఉండవు. హక్కులు, బాధ్యతలు రెండూ వ్యక్తుల ప్రశాంత సామాజిక జీవనానికి ఎంతగానో ఆవశ్యకమైనవి.

7. విశ్వవ్యాప్తమైనవి (Universal): హక్కులనేవి విశ్వవ్యాప్తమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి అందరికి వర్తిస్తాయి. వీటిని ప్రజలందరు ఎటువంటి తారతమ్యాలు లేకుండా అనుభవిస్తారు.

8. మార్పులకు అవకాశం (Scope for changes): హక్కులనేవి కాలానుగుణంగా ప్రజల అవసరాలను బట్టి మారుతుంటాయి. అట్లాగే దేశ కాలపరిస్థితులలో వచ్చే మార్పులనుబట్టి అభివృద్ధి చెందుతాయి. గతంలో లేని కొన్ని హక్కులు వర్తమాన కాలంలో ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద సామాజిక, ఆర్థిక, | రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులు వ్యక్తుల హక్కులపై విశేషమైన ప్రభావాన్ని చూపుతాయి.

9. రాజ్యం కంటే ముందుగా ఉండటం (Precede the State): చరిత్ర ఫలితాలే హక్కులు. హక్కులు కాలక్రమేణా ఒక క్రమానుగత రీతిలో ఆవిర్భవించాయని విశ్వసించారు. రాజ్యం ఆవిర్భావానికి ముందే హక్కులు ఉన్నాయి. అయితే ఆ తరువాత వాటిని రాజ్యం గుర్తించింది.

10. ఉమ్మడి శ్రేయస్సు (Common Good): హక్కులనేవి ఎల్లప్పుడూ ఉమ్మడి శ్రేయస్సును పెంపొందించేందుకై ఏర్పడి వికసించాయి. సమాజం, రాజ్యం చేత గుర్తింపు పొంది, ఉమ్మడి శ్రేయస్సును పెంపొందించే హక్కులను మాత్రమే వ్యక్తులు అనుభవిస్తారు. వ్యక్తులు సుఖసౌభాగ్యవంతమైన జీవనాన్ని గడిపేందుకు హక్కులు అవసరమవుతాయి.

ప్రశ్న 2.
రాజకీయ హక్కులను వివరించండి. [Mar. 2018]
జవాబు:
ప్రజాస్వామ్య దేశాలలో ప్రభుత్వ వ్యవహారాలలో పౌరులు పాల్గొనటానికి అవకాశం కల్పించబడింది. ఈ అవకాశాలనే రాజకీయ హక్కులు అందురు. రాజకీయ హక్కులు ముఖ్యంగా 5 అవి:
1. ఓటు హక్కు (Right to Vote): ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాలలో పౌరులు అనుభవించే అతి ముఖ్యమైన రాజకీయ హక్కు ఓటు హక్కు వయోజన పౌరులు ఈ హక్కును వివిధ శాసన నిర్మాణ సంస్థలలో తమ ప్రతినిధులను ఎన్నుకొనేందుకు శక్తివంతమైన ఆయుధంగా వినియోగిస్తారు. ఈ హక్కు వారిని నిజమైన సార్వభౌములుగా రూపొందిస్తుంది. వయోజన పౌరులందరూ వర్ణం, పుట్టుక, భాష, తెగ, మతం, ప్రాంతం వంటి తారతమ్యాలు లేకుండా ఈ హక్కును కలిగి ఉంటారు. అయితే విదేశీయులు, మైనర్లకు ఈ హక్కు వర్తించదు.

2. ఎన్నికలలో అభ్యర్థిగా పోటీచేసే హక్కు (Right to Contest in Elections): రాజ్యంలో పౌరులు వివిధ శాసన నిర్మాణ సంస్థలకు అభ్యర్థులుగా పోటీచేసేందుకు ఈ హక్కు అధికారమిస్తుంది. రాజకీయ సామర్థ్యం ఆసక్తి, శక్తివంతమైన నాయకత్వం వంటి లక్షణాలు గల పౌరులు రాజ్యానికి సంబంధించిన రాజకీయ యంత్రాంగ నిర్వహణలలో చురుకుగా పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. దాంతో ఈ హక్కు పౌరులలో విశేషమైన రాజకీయ పరిజ్ఞానాన్ని, ఆసక్తిని పెంపొందిస్తుంది. ఈ హక్కు ప్రజాస్వామ్య రాజ్యానికి ప్రధాన ప్రాతిపదికగా ఉంటుంది.

3. ప్రభుత్వ పదవులను చేపట్టే హక్కు (Right to Hold Public Offices): పౌరులు వివిధ రకాల ప్రభుత్వ పదవులను చేపట్టి, నిర్వహించేందుకు ఈ హక్కు అనేక అవకాశాలను కల్పిస్తుంది. ఈ హక్కు ప్రకారం ఏ ఒక్క పౌరుడు ఇతరులతో పోల్చినచో ఎటువంటి ప్రత్యేకమైన సౌకర్యాలను కానీ, మినహాయింపులు కానీ పొందేందుకు వీలులేదు. ప్రభుత్వాధికారాన్ని ఎంతో హుందాగా నిర్వహించేందుకు ఈ హక్కు పౌరులకు సహాయకారిగా ఉంటుంది.

4. విజ్ఞాపన హక్కు (Right to Petition): పౌరులు తమ అవసరాలు లేదా సమస్యలను ప్రభుత్వ దృష్టికి విజ్ఞప్తుల ద్వారా తెచ్చేందుకు ఈ హక్కు దోహదపడుతుంది. ఆధునిక రాజ్యంలో ఈ హక్కు ఎంతో ప్రాధాన్యత గల రాజకీయ హక్కుగా పరిగణించబడింది. ఈ హక్కు ద్వారా పౌరులు ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి, తగిన పరిష్కారాలను పొందుతారు. అలాగే ప్రభుత్వాధికారులు ప్రజా సమస్యలను తెలుసుకొని, వాటిని సకాలంలో పరిష్కరించేటట్లు ఈ హక్కు సహాయపడుతుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 6 హక్కులు – బాధ్యతలు

5. విమర్శించే హక్కు (Right to Criticism): ఈ హక్కు ప్రభుత్వానికి సంబంధించిన అనేక విధానాలు, కార్యక్రమాలను విమర్శించేందుకు పౌరులకు అవకాశం ఇస్తుంది. అలాగే వివిధ స్థాయిలలో నాయకులు, పరిపాలన సిబ్బంది పాల్పడే అవకతవకలను బహిర్గతం చేసేందుకు ఇది తోడ్పడుతుంది. అంతేకాకుండా కాలానుగుణంగా ప్రభుత్వం అనుసరించే విధానాలపై పౌరులు సహేతుకమైన, నిర్మాణాత్మకమైన విమర్శలను చేసేందుకు అవకాశమిస్తుంది. ఈ హక్కు అంతిమంగా పరిపాలనాధికారులు, విధాన రూపకర్తలు తమ విద్యుక్త ధర్మాలను ఎంతో అప్రమత్తంగా, జాగ్రత్తగా నిర్వహించేటట్లు చూస్తుంది.

ప్రశ్న 3.
మానవ హక్కుల లక్షణాలేవి ? [Mar. 2017]
జవాబు:
మానవుల ప్రాథమిక జీవనానికి అత్యంత ఆవశ్యకమైనవే మానవ హక్కులు. మానవులందరూ ఈ హక్కులను కుల, మత, ప్రాంత, వర్ణ, వర్గ తారతమ్యాలు లేకుండా అనుభవిస్తారు. ప్రజాస్వామ్య రాజ్యాలలోని రాజ్యాంగ, సాధారణ చట్టాలు ఇటువంటి హక్కులను గుర్తిస్తాయి. అలాగే ఈ హక్కులను ప్రజలకు అందించేందుకై ప్రజాస్వామ్య రాజ్యాలలోని వివిధ ప్రభుత్వాలు అనేక చర్యలను తీసుకొంటాయి.

రోనాల్డ్ డార్విన్ (Ronald Darwin) అనే శాస్త్రవేత్త మానవ హక్కులనేవి వ్యక్తులకు సంరక్షక కవచాలుగా దోహదపడతాయని భావించాడు. ఎప్పుడైనా రాజ్యం వ్యక్తుల పౌర స్వాతంత్ర్యాలలో జోక్యం చేసుకుంటే ఇటువంటి హక్కుల ద్వారా వ్యక్తులు తమ ప్రయోజనాలను కాపాడుకొంటారని చెప్పారు. జాన్ డోస్కీ (John Dowski) మానవ హక్కులను నాగరికతకు సంబంధించిన నూతన ప్రమాణాలుగా వర్ణించాడు.

మానవ హక్కుల లక్షణాలు (Features of Human Rights): మానవ హక్కులు కొన్ని మౌలికమైన లక్షణాలను కలిగి ఉన్నాయి. వాటిని కింద పేర్కొన్నవిధంగా చెప్పవచ్చు.

  1. ఎటువంటి వివక్షత లేకుండా ప్రజలందరూ హక్కులను కలిగి ఉంటారు.
  2. ఇవి సార్వజనీనమైంది.
  3. ఇవి ప్రజలందరిని సమానంగా పరిగణిస్తాయి.
  4. వ్యక్తులను మౌలికంగా ఇవి మానవులుగా భావిస్తాయి.
  5. మానవత్వానికి చెందిన ప్రాథమిక సూత్రాలను పరిగణనలోనికి తీసుకుంటాయి.
  6. వీటిని భౌగోళిక సరిహద్దులు పరిమితం చేయలేవు.

ఐక్యరాజ్యసమితిలోని సభ్యరాజ్యాలన్నీ సిద్ధాంతపరంగా పైన పేర్కొన్న మానవ హక్కులను అమలుపరుస్తాయి.

ప్రశ్న 4.
మానవ హక్కుల ఆశయాలను, వర్గీకరణను రాయండి.
జవాబు:
మానవ హక్కుల ఆశయాలు (Objectives of Human Rights): మానవ హక్కుల ఆశయాలను కింది విధంగా పేర్కొనవచ్చు.

  1. ప్రజలందరికీ ఎటువంటి వివక్షత లేని స్వాతంత్ర్యాన్ని అందించటం.
  2. పేదరికం నుండి విముక్తి.
  3. వ్యక్తులలో నిబిడీకృతమై ఉన్న సామర్థ్యాలను వినియోగించుకొనే స్వేచ్ఛ.
  4. భయం నుండి విముక్తి.
  5. రక్షణను పొందే స్వేచ్ఛ.
  6. అన్యాయానికి వ్యతిరేకంగా స్వేచ్ఛ.
  7. వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వాతంత్ర్యం.
  8. సంస్థలను ఏర్పరచుకొనే స్వేచ్ఛ.
  9. గౌరవప్రదంగా వ్యక్తి తన కార్యకలాపాలు నిర్వర్తించుకొనే స్వేచ్ఛ.
  10. దౌర్జన్యాన్ని నిరోధించి వ్యతిరేకించే స్వేచ్ఛ.

ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 1995-2005 దశకాన్ని అంతర్జాతీయ మానవ హక్కుల దశాబ్దిగా ప్రకటించింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా నివసించే ప్రజలందరికీ మానవ హక్కులను ప్రసాదించే ఉద్దేశంతో ఈ కాలంలో అనేక చర్యలను గైకొన్నది.

మానవ హక్కుల వర్గీకరణ: మానవ హక్కులను స్థూలంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి:

  1. పౌర, రాజకీయ హక్కులు
  2. సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక హక్కులు.

AP Inter 1st Year Civics Study Material Chapter 6 హక్కులు – బాధ్యతలు

1. A. పౌరహక్కులు: సమాజంలో పౌరహక్కులు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి. పౌరహక్కులకు
ఉదాహరణలు.

  1. జీవించే హక్కు
  2. స్వేచ్ఛ హక్కు
  3. వ్యక్తుల భద్రత హక్కు
  4. వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందే హక్కు
  5. చట్టం నుంచి సమానంగా రక్షణ పొందే హక్కు
  6. బలవంతంగా నిర్భందించడం నుంచి రక్షణ పొందే హక్కు
  7. నిష్పాక్షికంగా విచారణ పొందే హక్కు
  8. ఆస్తి హక్కు
  9. వివాహపు హక్కు
  10. వాక్ స్వాతంత్య్రపు హక్కు
  11. భావ ప్రకటన హక్కు
  12. సంస్థలను, సంఘాలను స్థాపించుకునే హక్కు
  13. సభలు, సమావేశాలు నిర్వహించుకునే హక్కు
  14. స్వేచ్ఛగా సంచరించే హక్కు

1.B. రాజకీయ హక్కులు:

  1. ఓటు హక్కు
  2. ఎన్నికలలో పోటీచేసే హక్కు
  3. అధికారం పొందే హక్కు
  4. విమర్శించే హక్కు
  5. విజ్ఞాపన హక్కు

2.A. సాంఘిక హక్కులు:

  1. విద్యా హక్కు
  2. ఆరోగ్య హక్కు
  3. వినోదపు హక్కు మొదలైనవి

2.B. ఆర్థిక హక్కులు:

  1. పని హక్కు
  2. సమానమైన పనికి సమానమైన వేతనం పొందే హక్కు
  3. కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు
  4. సంతృప్తికరమైన జీవనస్థాయిని కలిగి ఉండే హక్కు

2.C. సాంస్కృతిక హక్కులు:

  1. నాగరికత
  2. కళలు
  3. సంస్కృతిని గౌరవించడం వంటి అంశాలు.

ప్రశ్న 5.
వివిధ రకాలైన బాధ్యతలను చర్చించండి.
జవాబు:
బాధ్యతలు: సమాజంలో నివశించే వ్యక్తులు ఇతర వ్యక్తుల పట్ల నిర్వర్తించే అంశాలనే బాధ్యతలు అంటారు. బాధ్యతలు అనేవి ఇతరుల పట్ల ఒక వ్యక్తి కలిగి ఉండే కర్తవ్యం, విధి అని అర్థం.

బాధ్యతల రకాలు (Types of Responsibilities): బాధ్యతలు స్థూలంగా రెండు రకాలుగా చెప్పవచ్చు. అవి: (i) నైతిక బాధ్యతలు (ii) చట్టబద్ధమైన బాధ్యతలు. ఈ రెండింటిని కింది విధంగా వివరించవచ్చు.

(i) నైతిక బాధ్యతలు (Moral Responsibilities): నైతిక బాధ్యతలు అనేవి నైతిక అంశాల ప్రాతిపదికపై వ్యక్తులు నిర్వహించాల్సిన కర్తవ్యాలను సూచిస్తాయి. వీటకి రాజ్యంచేత రూపొందించబడే చట్టాలు మద్దతు ఇవ్వవు, బలపరచవు. ఇవి ప్రజల నైతిక విశ్వాశాలపై ఆధారపడి రూపొందుతాయి. సమాజంలోని కొన్ని ఆచార సాంప్రదాయాలు వాడుకల ఆధారంగా ఇవి ఏర్పడతాయి. వీటి ఉల్లంఘన ఎటువంటి శిక్షకు దారితీయదు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం, అస్వస్థులకు సహాయపడటంలాంటివి నైతిక బాధ్యతలకు కొన్ని ఉదాహరణలుగా పేర్కొనవచ్చు.

(ii) చట్టబద్ధమైన బాధ్యతలు (Legal Responsibilities): చట్టబద్ధమైన బాధ్యతలనేవి న్యాయస్థానాలు, చట్టాల మద్దతుతో అమలులోకి వస్తాయి. వీటికి శాసనాత్మక ప్రాముఖ్యత ఉంటుంది. ఇవి ఎంతో స్పష్టమైనవి, ఖచ్చితమైనవి. ఇవి నిర్బంధమైన, శిక్షాత్మకమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని ఉల్లంఘించినవారు శిక్షకు పాత్రులవుతారు. రాజ్య చట్టాలకు విధేయత చూపటం, పన్నులు చెల్లించటం, శాంతి భద్రతల నిర్వహణలలో అధికారులకు సహాయం అందించటంలాంటివి చట్టబద్దమైన బాధ్యతలలో ముఖ్యమైనవి.

AP Inter 1st Year Civics Study Material Chapter 6 హక్కులు – బాధ్యతలు

చట్టబద్ధమైన బాధ్యతలు మరలా రెండు రకాలుగా వర్గీకరించబడినాయి. అవి: 1. సంవర్ధక బాధ్యతలు 2. సంరక్షక బాధ్యతలు.
1. సంవర్థక బాధ్యతలు (Positive Responsibilities): సంవర్దక బాధ్యతలనేవి సమాజ ప్రగతి, సంక్షేమాల’ సాధన, పటిష్టతలకై ఉద్దేశించబడినవి. రాజ్య చట్టాల పట్ల విధేయత, దేశ రక్షణ, పన్నుల చెల్లింపులాంటివి ఈ రకమైన బాధ్యతలకు ఉదాహరణలు చెప్పవచ్చు. ఇటువంటి బాధ్యతలు రాజ్య ఆశయాలను నెరవేర్చడంలో ప్రభుత్వానికి ప్రజలు సహకారాన్ని అందించేందుకు ఉద్దేశించినాయి.

2. సంరక్షక బాధ్యతలు (Negative Responsibilities): చట్టం నిషేధించిన కార్యక్రమాలను చేపట్టకుండా వ్యక్తులు దూరంగా ఉండేందుకు పేర్కొన్నవే సంరక్షక బాధ్యతలు. ఈ రకమైన బాధ్యతలు ప్రజలను కొన్ని నిర్ధిష్టమైన కార్యక్రమాలలో పాల్గొనకుండా ఉంచుతాయి. రాజ్యం తరపున ప్రభుత్వం ఈ సందర్భంలో కొన్ని నియమ నిబంధనలను రూపొందించి అమలుచేస్తుంది.

ప్రశ్న 6.
ప్రాథమిక హక్కుల లక్షణాలేవి ?
జవాబు:
వ్యక్తుల మూర్తిమత్వాన్ని పెంపొందించేందుకు ప్రాథమికహక్కులు అత్యంత ఆవశ్యకమైనవి. ప్రాథమికహక్కులు ఈనాటి ప్రజాస్వామ్య రాజ్యాంగాలలో పొందుపరచబడ్డాయి. ఈ విషయంలో ప్రజాస్వామ్యం, వ్యక్తి స్వాతంత్ర్యాలు, మైనార్టీల ప్రయోజనాలు, మానవ జీవనంలో స్వేచ్ఛా, ఆస్తులకు విశేష ప్రాముఖ్యతలాంటి అనేక అంశాలు ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరచడానికి దోహదపడ్డాయి.

ప్రాథమిక హక్కుల లక్షణాలు (Characteristics of Fundamental Rights): ప్రాథమిక హక్కులు దిగువ పేర్కొన్న లక్షణాలను కలిగి ఉంటాయి.

  1. ప్రాథమిక హక్కులు నిర్దిష్టమైనవి, స్పష్టమైనవి మరియు ఖచ్చితమైనవి.
  2. ఇవి రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి.
  3. ఇవి స్వభావరీత్యా శిక్షాత్మకమైనవి.
  4. ఇవి పౌరులకు మాత్రమే ఇవ్వబడినాయి.
  5. ఇవి రాజ్యాలనుబట్టి మారుతుంటాయి.
  6. వీటిని కొన్ని ప్రత్యేక పరిస్థితులలో సవరించవచ్చు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
హక్కులను నిర్వచించండి. [Mar. 2016]
జవాబు:

  1. “వ్యక్తి మూర్తిమత్వ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన బాహ్యపరమైన పరిస్థితులే హక్కులు” అని బార్కర్ పేర్కొన్నాడు.
  2. “హక్కులనేవి మానవుల సామాజిక జీవనానికి అవసరమైనవి. అవి లేకుండా ఏ ఒక్కరూ సాధారణంగా అత్యుత్తమమైన వ్యక్తిగా రూపొందటం సాధ్యం కాదు” అని హెచ్.జె. లాస్కి పేర్కొన్నాడు.

ప్రశ్న 2.
హక్కులను వర్గీకరించండి.
జవాబు:
హక్కులను విస్తృత ప్రాతిపదికపై మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి: 1) సహజ హక్కులు 2) నైతిక హక్కులు 3) చట్టబద్ధమైన హక్కులు. చట్టబద్ధమైన హక్కులు మరలా మూడు రకాలుగా వర్గీకరింపబడినాయి. అవి: 1) పౌర హక్కులు 2) రాజకీయ హక్కులు 3) ఆర్థిక హక్కులు.

AP Inter 1st Year Civics Study Material Chapter 6 హక్కులు – బాధ్యతలు

ప్రశ్న 3.
పౌర హక్కులేవి ?
జవాబు:
నాగరిక జీవనాన్ని గడపటానికి అవసరమయ్యే హక్కులనే పౌరహక్కులు అంటారు. అన్ని రాజ్యాలు తమ ప్రజలకు ఈ హక్కులను ఇస్తున్నాయి. ఈ హక్కులపై అనేక మినహాయింపులు ఉంటాయి. ముఖ్యమైన పౌరహక్కులు ఏమనగా: (i) జీవించే హక్కు (ii) స్వేచ్ఛ హక్కు (iii) సమానత్వపు హక్కు (iv) ఆస్తి హక్కు (v) కుటుంబపు హక్కు (i) విద్యా హక్కు మొదలైనవి.

ప్రశ్న 4.
సహజ హక్కులు.
జవాబు:
మానవులు జన్మతః అనుభవించే హక్కులే సహజ హక్కులుగా పరిగణించడమైనది. నాగరిక సమాజ ఆవిర్భావానికి ముందే ఈ హక్కులను మానవులు అనుభవించారు. సమాజం, రాజ్యం వీటిని గుర్తించి, గౌరవించాయి. సహజ హక్కుల సిద్ధాంత ప్రతిపాదకుడైన జాన్ లాక్ హక్కులనేవి సమాజం, రాజకీయ వ్యవస్థలు ఏర్పడక ముందే ఉన్నాయన్నాడు. జీవించే హక్కు, స్వాతంత్ర్యాన్ని అనుభవించే హక్కు, ఆస్తి హక్కు వంటివి ప్రధానమైన సహజ హక్కులకు ఉదాహరణలుగా పేర్కొన్నాడు. మానవులకు గల ఈ హక్కులను రాజ్యం తిరస్కరించరాదన్నాడు.

ప్రశ్న 5.
నైతిక హక్కులు. [Mar. ’18, ’17]
జవాబు:
నైతిక హక్కులు సమాజంలోని నైతిక సూత్రాలు ఆధారంగా రూపొందాయి. సమాజంలో నివసించే వ్యక్తులకు నైతికపరమైన అవగాహనను కలిగించేందుకు ఈ రకమైన హక్కులను ఇవ్వటమైనది. సమాజంలోని నైతిక సూత్రాలే ఇటువంటి హక్కులకు ప్రాతిపదికగా ఉన్నాయి. ప్రజల ఆచారాలు, సాంప్రదాయాలు, వాడుకలు కూడా వీటికి ఆధారంగా ఉంటాయి. ఇవి ప్రజల అంతరాత్మకు సంబంధించినవి. పౌర సమాజంలోని వ్యక్తులు వీటిని అనుభవిస్తారు. వీటికి చట్టపరమైన మద్దతు లేనప్పటికి సమాజం వీటిని బలపరుస్తుంది. అందుచేత వీటి ఉల్లంఘన ఏ రకమైన శిక్షకు దారితీయదు.

ప్రశ్న 6.
రాజకీయ హక్కులేవి ? [Mar. ’16]
జవాబు:
రాజ్యము యొక్క ప్రభుత్వము యొక్క కార్యకలాపాలలో పాల్గొనేందుకై ప్రజలకు పూర్తి అవకాశాలను కల్పించే హక్కులనే రాజకీయ హక్కులని అంటారు. ఉదాహరణకు ఓటు హక్కు, ఎన్నికలలో అభ్యర్థిగా పోటీచేసే హక్కు, ప్రభుత్వ పదవులు చేపట్టే హక్కు, విజ్ఞాపన హక్కు, విమర్శించే హక్కు మొదలగునవి.

ప్రశ్న 7.
మానవ హక్కుల ఆశయాలేవి ?
జవాబు:
మానవ హక్కులు కింది ఆశయాలను కలిగి ఉంటాయి.

  1. ప్రజలందరికీ ఎటువంటి వివక్షత లేని స్వాతంత్ర్యాన్ని అందించటం.
  2. పేదరికం నుండి విముక్తి.
  3. వ్యక్తులలో నిబిడీకృతమై ఉన్న సామర్థ్యాలను వినియోగించుకొనే స్వేచ్ఛ.
  4. భయం నుండి విముక్తి.

ప్రశ్న 8.
మానవ హక్కులు ఎన్ని రకాలు ? వాటిని తెలపండి.
జవాబు:
మానవ హక్కులను స్థూలంగా రెండు రకములుగా వర్గీకరించవచ్చు. అవి 1) పౌర, రాజకీయ హక్కులు 2) సాంఘిక, ఆర్థిక సాంస్కృతిక హక్కులు.

AP Inter 1st Year Civics Study Material Chapter 6 హక్కులు – బాధ్యతలు

ప్రశ్న 9.
మానవ హక్కుల ప్రాముఖ్యత.
జవాబు:
మానవుల ప్రాథమిక జీవనానికి అత్యంత ఆవశ్యకమైనవే మానవ హక్కులు. మానవులందరూ ఈ హక్కులను కుల, మత, ప్రాంత, వర్గ, వర్ణ తారతమ్యం లేకుండా అనుభవిస్తారు. మానవ హక్కుల సాధనలో ఇంగ్లాండులోని ‘మాగ్నా కార్టా’ అనేది మొదటి ప్రయత్నంగా చెప్పవచ్చు. ఐక్యరాజ్యసమితి కృషి వలన మానవ హక్కులను ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలలో ప్రజలు అనుభవిస్తున్నారు.

ప్రశ్న 10.
బాధ్యతల వర్గీకరణ. [Mar. ’18, ’17]
జవాబు:
బాధ్యతలను స్థూలంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి 1) నైతిక బాధ్యతలు 2) చట్టబద్ధమైన బాధ్యతలు. చట్టబద్ధమైన బాధ్యతలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి 1) సంవర్థక బాధ్యతలు 2) సంరక్షక బాధ్యతలు.

ప్రశ్న 11.
నైతిక బాధ్యతలు.
జవాబు:
నైతిక బాధ్యతలు నైతిక అంశాల ప్రాతిపదికపై వ్యక్తులు నిర్వహించాల్సిన కర్తవ్యాలను సూచిస్తాయి. వీటికి చట్టపరమైన ఆంక్షలు ఉండవు. ఇవి ప్రజల నైతిక విశ్వాసాలపై ఆధారపడి రూపొందుతాయి. సమాజంలోని ఆచారాలు, సాంప్రదాయాలు, వాడుక పద్ధతుల ఆధారంగా ఇవి ఏర్పడతాయి. వీటికి ఉదాహరణ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం, అస్వస్థులకు సహాయపడటం మొదలైనవి.

AP Inter 1st Year Civics Study Material Chapter 6 హక్కులు – బాధ్యతలు

ప్రశ్న 12.
బాధ్యతలకు ఉదాహరణలను ఇవ్వండి. [Mar. 2016]
జవాబు:
రాజ్యంలో నివసించే ప్రతి పౌరుడు కొన్ని ముఖ్యమైన బాధ్యతలను నిర్వర్తించాలి. వాటిలో ముఖ్యమైనవి:

  1. రాజ్యవిధేయత
  2. చట్టాల విధేయత
  3. పన్నులను నిజాయితీగా చెల్లించటం
  4. ఓటుహక్కును వినియోగించుకొనటం, ప్రభుత్వ పదవుల నిర్వహణలో నిజాయితీ
  5. శాంతి భద్రతల నిర్వహణలో సహకారం
  6. ఇతర బాధ్యతలు.

AP Inter 1st Year Civics Study Material Chapter 5 స్వేచ్ఛ – సమానత్వం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Civics Study Material 5th Lesson స్వేచ్ఛ – సమానత్వం Textbook Questions and Answers.

AP Inter 1st Year Civics Study Material 5th Lesson స్వేచ్ఛ – సమానత్వం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
స్వేచ్ఛను నిర్వచించీ, వివిధ రకాల స్వేచ్ఛలను వర్ణించండి.
జవాబు:
పరిచయం: స్వేచ్ఛ అనేది రాజనీతిశాస్త్ర అధ్యయనంలో ఒక ముఖ్యమైన భావన. వ్యక్తులకు గల స్వేచ్ఛపైనే రాజకీయ వ్యవస్థ విజయం ఆధారపడి ఉంటుంది. వ్యక్తులు తమ సర్వతోముఖాభివృద్ధి కోసం స్వేచ్ఛను వాంఛిస్తారు. సామాజిక స్థితిగతులను మెరుగుపరచుకోవడంలో వ్యక్తులకు స్వేచ్ఛ తగిన శక్తిని ప్రసాదిస్తుంది. జె. ఎస్. మిల్, హెర్బర్ట్ స్పెన్సర్, మాంటెస్క్యూ, హెచ్. జె. లాస్కీ, సీలీ లాంటి రాజనీతి శాస్త్రవేత్తలు స్వేచ్ఛను పెంపొందించటంలో ప్రధాన పాత్రను పోషించారు.

అర్థం: స్వేచ్ఛను ఇంగ్లీషులో ‘లిబర్టీ’ (LIBERTY) అంటారు. లిబర్టీ (LIBERTY) అనే ఇంగ్లీషు పదం “లిబర్” (LIBER) అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. లాటిన్ భాషలో “లిబర్” అనే పదానికి అర్థం “ఆంక్షల నుంచి విముక్తి”.

నిర్వచనాలు:

  1. హెచ్.జె.లాస్కీ: “వ్యక్తులు వారంతటవారు ఉత్తమమైన అవకాశాలను పొందగలిగి, నిర్వహించుకోగల వాతావరణమే స్వేచ్ఛ”.
  2. మాంటెస్క్యూ: “వ్యక్తులు సంకల్పించుకొని, సాధించగలిగే శక్తియే స్వేచ్ఛ.”
  3. జె.ఆర్. సీలీ: “మితిమీరిన ప్రభుత్వానికి వ్యతిరేకమైనదే స్వేచ్ఛ.”

స్వేచ్ఛ రకములు: స్వేచ్ఛ ఐదు రకాలు. అవి 1) సహజ స్వేచ్ఛ 2) పౌర స్వేచ్ఛ 3) ఆర్థిక స్వేచ్ఛ 4) రాజకీయ స్వేచ్ఛ. ‘5) జాతీయ స్వేచ్ఛ. వీటిని గురించి ఈ కింద పేర్కొన్న విధంగా విపులీకరించవచ్చు.
1) సహజ స్వేచ్ఛ (Natural Liberty): సహజ స్వేచ్ఛ అనేది ఎటువంటి ఆంక్ష లేకుండా ఏదైనా చేయడాన్ని సూచిస్తుంది. ఇది ఎలాంటి జోక్యానికి లేదా నిర్భంధాలకు తావివ్వదు. వ్యక్తులు తమ ఇచ్ఛానుసారం చేయదలచిన దాన్ని సుసాధ్యం చేస్తుంది. అయితే, నిర్నిబంధమైన స్వేచ్ఛ వ్యక్తుల స్వేచ్ఛలను హరిస్తుంది. నేటి సమాజంలో సహజ స్వేచ్ఛ అనేది కనిపించదు. ఇది అన్యాయం అరాచకత్వాలకు పర్యాయపదమైనది. సహజ స్వేచ్ఛగల చోట స్వాతంత్ర్యం మృగ్యమవుతుంది. ఆదిలో రోమన్ రాజనీతి తత్త్వవేత్తలు ఈ భావనను సమర్థించారు. ఎటువంటి అవధుల్లేని ప్రాకృతిక వ్యవస్థలోని మానవులు అపరిమితమైన స్వేచ్ఛను అనుభవించారన్నారు. అటువంటి స్వేచ్ఛ- రాజ్యం, సమాజాల అవిర్భావానికి ముందు మాత్రమే ఉనికిలో ఉండేది.

AP Inter 1st Year Civics Study Material Chapter 5 స్వేచ్ఛ - సమానత్వం

2) పౌర స్వేచ్ఛ (Civil Liberty): పౌరస్వేచ్ఛను వ్యక్తిగత స్వేచ్ఛ అని కూడ అంటారు. ఇది సామాజిక సంస్థలోని సభ్యుడైన వ్యక్తి జీవనంలోని స్వాతంత్ర్యాన్ని తెలియజేస్తుంది. పౌరస్వేచ్ఛలో కింద పేర్కొన్న మూడు అంశాలు ఇమిడి ఉంటాయని బార్కర్ పేర్కొన్నాడు. i) సంచార స్వేచ్ఛను సూచించే భౌతిక స్వాతంత్ర్యం ii) ఆలోచన, అభివ్యక్తి, విశ్వాసాన్ని కలిగి ఉండే భౌద్ధిక స్వాతంత్య్రం iii) నిజజీవితంలోని ఆచరణాత్మక ఐచ్ఛిక స్వాతంత్ర్యం. పౌరస్వేచ్చ అనేది మిగతా స్వేచ్ఛలకు ప్రాతిపదికగా ఉంటుంది. సహజ స్వేచ్ఛకు ఇది విరుద్ధమైంది. సమాజంలోని పౌరులు దానిని అనుభవిస్తారు. ఒంటరిగా ఉంటున్న వ్యక్తులకిది ఆవశ్యకమైనది సమాజంలోని ప్రతిఒక్కరూ ప్రాపంచిక విషయాలను ‘ఉమ్మడిగా అనుభవించగలిగినప్పుడే పౌర స్వేచ్ఛ వాస్తవమవుతుంది.

“రాజ్యం చేత గుర్తించబడి అమలయ్యే హక్కుల సముదాయమే పౌర స్వేచ్ఛ” అని గెటిల్ పేర్కొన్నాడు. పౌరస్వేచ్ఛ అనేది అనేక హక్కుల రూపంలో ఉంటుంది. అవి (i) జీవించే హక్కు (ii) పనిచేసే హక్కు (iii) ఆస్తిహక్కు (iv) వాక్ స్వాతంత్య్రం, భావవ్యక్తీకరణ, సమావేశ, సంచార, స్థిర నివాసపు హక్కులు మొదలైనవి.

3) ఆర్థిక స్వేచ్ఛ (Economic Liberty): ఆర్థిక స్వేచ్ఛ అంటే ప్రతి ఒక్కరూ తమ జీవనోపాధిని తామే సంపాదించుకోగలగడం. ఒక వ్యక్తి తన రోజువారీ ఆహారాన్ని హేతుబద్ధంగా సంపాదించుకొనే భద్రమైన అవకాశమే ఆర్థికస్వేచ్ఛగా లాస్కీ అభివర్ణించాడు. కోరిక – భయము, ఆకలి – పస్తులు, నిరద్యోగం – అసంపూర్ణతల నుంచి విముక్తి కలిగించేదే ఆర్థిక స్వేచ్ఛ. ఇది ఆర్థిక సంబంధమైన లేమి లేదా అభద్రతల నుంచి స్వాతంత్ర్యాన్ని సూచిస్తుంది. ఆర్థిక స్వేచ్ఛలేని ప్రజాస్వామ్యం అర్థరహితమైంది.

ఈ దిగువ పేర్కొన్న చర్యల అమలు ద్వారా ఆర్థిక స్వేచ్ఛను పొందవచ్చు.

  1. కనీస వేతనాలను అందించడం.
  2. పనిహక్కుకు భరోసా కల్పించడం.
  3. నిరుద్యోగం, అనారోగ్యం వంటి వివిధ రకాల అభద్రతల నుంచి కార్మికులను రక్షించడం
  4. తగినంత విశ్రాంతిని కల్పించడం.
  5. పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు ప్రాతినిధ్యం కల్పించడం.

4) రాజకీయ స్వేచ్ఛ (Political Liberty): రాజకీయ స్వేచ్ఛ పౌరులు రాజకీయాంశాలలో పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. ఈ రకమైన స్వేచ్ఛ పౌరులకు రాజ్య కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనే శక్తినిస్తుందని లాస్కీ పరిగణించాడు. రాజకీయ స్వేచ్ఛను ప్రజాస్వామ్యానికి పర్యాయపదంగా గిల్ క్రిస్ట్ భావించాడు. రాజకీయ స్వేచ్ఛ అంటే ఎవరికి వారు తమ ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకొనే రాజ్యాంగ స్వేచ్ఛగా లీకాక్ వర్ణించాడు. రాజకీయ స్వేచ్ఛ పౌరులకు మాత్రమే పరిమితమైంది. అది సంవర్ధక స్వభావాన్ని కలిగి ఉంటుంది. రాజకీయ స్వేచ్ఛ పౌరులకు రాజకీయాంశాలలో వివిధ హక్కులను కల్పిస్తుంది. అటువంటి వాటిలో i) ఓటు వేసే హక్కు ii) ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీ చేసే హక్కు iii) ప్రభుత్వ పదవులను చేపట్టే హక్కు iv) విమర్శించే హక్కువంటివి ఉన్నాయి. విద్య, నిజాయితీ, నిష్పక్షపాతమైన పత్రికలు మొదలైనవి ఉన్నప్పుడే రాజకీయ స్వేచ్ఛ వాస్తవం అవుతుందని లాస్కీ నొక్కి చెప్పాడు.

5) జాతీయ స్వేచ్ఛ (National Liberty): జాతీయ స్వేచ్ఛ అంటే రాజ్యం – స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కలిగి ఉండడంగా పేర్కొనవచ్చు. రాజ్యపు సార్వభౌమత్వాన్ని అది సూచిస్తుంది. ప్రతి రాజ్యం ఈ స్వేచ్ఛను అనుభవిస్తూ ఇతర రాజ్యాల ఆధిపత్యానికి లోనుకాకుండా ఉంటుంది. అన్ని రంగాలలో జాతి అభివృద్ధికి ఈ స్వేచ్ఛ ఆవశ్యకమైంది. ప్రాచీన కాలం నుంచి అనేక దేశాల్లో ఇది విశదమైంది. ఈ రకమైన స్వేచ్ఛను పొందడం కోసం అనేక దేశాలు ఎంతగానో ప్రయత్నించాయి. గతంలో టర్కీ ప్రజలకు వ్యతిరేకంగా గ్రీకులు స్వాతంత్య్ర సమరం సాగించారు. అట్లాగే మహాత్మాగాంధీ నాయకత్వంలో భారత ప్రజలు బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం కోసం అహింసాయుత పోరాటం చేశారు. జాతీయ స్వేచ్ఛ ఎంతో విలువైంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 5 స్వేచ్ఛ - సమానత్వం

ప్రశ్న 2.
స్వేచ్ఛ అంటే ఏమిటి ? స్వేచ్ఛ సంరక్షణలను పేర్కొనండి.
జవాబు:
పరిచయం: స్వేచ్ఛ అనేది రాజనీతి శాస్త్ర అధ్యయనంలో ఒక ముఖ్యమైన భావన. వ్యక్తులకు గల స్వేచ్ఛపైనే రాజకీయ వ్యవస్థ విజయం ఆధారపడి ఉంటుంది. వ్యక్తులు తమ సర్వతోముఖాభివృద్ధి కోసం స్వేచ్ఛను వాంఛిస్తారు. సామాజిక స్థితిగతులను మెరుగుపరచుకోవడంలో వ్యక్తులకు స్వేచ్ఛ తగిన శక్తిని ప్రసాదిస్తుంది. జె. ఎస్. మిల్, హెర్బర్ట్ స్పెన్సర్, మాంటెస్క్యూ, హెచ్. జె. లాస్కీ, సీలీ లాంటి రాజనీతిశాస్త్రవేత్తలు స్వేచ్ఛను పెంపొందించటంలో ప్రధాన పాత్రను పోషించారు.

అర్థం: స్వేచ్ఛను ఇంగ్లీషులో ‘లిబర్టీ’ (LIBERTY) అంటారు. లిబర్టీ (LIBERTY) అనే ఇంగ్లీషు పదం “లిబర్” (LIBER) అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. లాటిన్ భాషలో “లిబర్” అనే పదానికి అర్థం “ఆంక్షల నుంచి విముక్తి”.

నిర్వచనాలు:

  1. హెచ్.జె.లాస్కీ: “వ్యక్తులు వారంతటవారు ఉత్తమమైన అవకాశాలను పొందగలిగి, నిర్వహించుకోగల వాతావరణమే స్వేచ్ఛ”.
  2. మాంటెస్క్యూ: “వ్యక్తులు సంకల్పించుకొని, సాధించగలిగే శక్తియే స్వేచ్ఛ.” 3) జె.ఆర్. సీలీ: “మితిమీరిన ప్రభుత్వానికి వ్యతిరేకమైనదే స్వేచ్ఛ.”

స్వేచ్ఛ సంరక్షణలు (లేదా) పరిరక్షణ మార్గాలు:
స్వేచ్ఛ అనేది మానవుల పాలిట అత్యంత విలువైన ఆదర్శం. కాబట్టి దానిని సమాజ, రాజ్య విస్తృత ప్రయోజనాల దృష్ట్యా పరిరక్షించుకోవాలి. ఈ సందర్భంగా స్వేచ్ఛ పరిరక్షణలో కిందివాటిని పేర్కొనవచ్చు.
1. ప్రజాస్వామ్య వ్యవస్థ (Democratic Rule): ప్రజాస్వామ్య వ్యవస్థ వ్యక్తి స్వేచ్ఛను పరిరక్షిస్తుంది. ప్రజాస్వామ్యం అంటే ప్రజల ప్రభుత్వం. ఎన్నికైన ప్రతినిధులు ప్రజల స్వేచ్ఛను నిరంతరం కాపాడుతుంటారు. కేవలం ప్రజాస్వామ్య సంస్థలు మాత్రమే స్వేచ్ఛను పరిరక్షించగలవు.

2. లిఖిత మరియు ధృడ రాజ్యాంగం (Written and Rigid Constitution): వ్యక్తి స్వేచ్ఛకు లిఖిత, ధృడ . రాజ్యాంగాన్ని వేరొక ముఖ్య లక్షణంగా భావించవచ్చు. ఇటువంటి రాజ్యాంగం అనేక నిబంధనలలో వ్యక్తి స్వాతంత్ర్యాలను పేర్కొంటుంది. ప్రజల స్వేచ్ఛ, హక్కులకు అది రక్షకురాలిగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వాంగాల చర్యలకు అది హద్దులను ఏర్పరుస్తుంది. ప్రభుత్వాధికారులు లేదా మరెవరి చేతనైనా ప్రజల స్వాతంత్ర్యాలు ఉల్లంఘించబడినప్పుడు చేపట్టవలసిన వివిధ చర్యలను వివరిస్తుంది. తమ సంకుచిత ప్రయోజనాల కోసం రాజ్యాంగంలోని అంశాలను సవరించేందుకు ప్రయత్నించే పార్టీలపై ఆంక్షలను విధిస్తుంది.

3. స్వతంత్ర న్యాయవ్యవస్థ (Independent Judiciary): పౌరుల స్వేచ్ఛా పరిరక్షణకు స్వయం ప్రతిపత్తి ఉన్న నిష్పాక్షిక న్యాయ వ్యవస్థ తప్పనిసరి. దేశంలో స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న న్యాయస్థానాలు ఉన్నప్పుడే అవి శాసనసభ చేయగల ప్రజావ్యతిరేక చట్టాలను, కార్యనిర్వహక శాఖ అమలుపరచగల ప్రజావ్యతిరేక విధానాలను ఆపగలవు.

4. సమన్యాయపాలన (Rule of Law): స్వేచ్ఛకున్న వేరొక పరిరక్షణయే సమన్యాయపాలన. బ్రిటన్, ఇండియా, అమెరికా సంయుక్తరాష్ట్రాలు వంటి అనేక దేశాల్లో ఇది అమలులో ఉంది. వ్యక్తుల స్వేచ్ఛలను సమన్యాయపాలన మూడు విధాలుగా పరిరక్షిస్తుంది. అవి (i) ఇది వ్యక్తులందరినీ సమానంగా చూస్తుంది. (ii) రాజ్యమంతటా ఒకే విధమైన చట్టాలు అమలయ్యేటట్లు చేస్తుంది. (iii) కార్యనిర్వాహకవర్గపు నిరంకుశాధికారాలపైన తగిన ఆంక్షలను విధిస్తుంది.

5. ప్రాథమిక హక్కులు (Fundamental Rights): ప్రాథమిక హక్కులనేవి వ్యక్తి స్వేచ్ఛలను చాలావరకు పరిరక్షిస్తాయి. ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరచడం వల్ల ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రజలు స్వేచ్ఛలను పొందుతారు. పౌరులలో నిబిడీకృతమైన నైపుణ్యాలను అభివృద్ధిపరచుటకు, విభిన్న రంగాలలో వారు తమ ప్రతిభను చాటుకొనేందుకు ప్రాథమిక హక్కులు దోహదపడతాయి.

6. ఆర్థిక సమానత్వం (Economic Equality): వ్యక్తుల స్వేచ్ఛా పరిరక్షణలో ఆర్థిక సమానత్వం కూడా ప్రధానమైంది. ఆకలి, పేదరికం, నిరుద్యోగం వంటి దుష్ప్రభావాల నుంచి బయటపడేందుకు వ్యక్తులకు చాలినన్ని అవకాశాలను కల్పించాలనే భావన ఇందులో ఇమిడి ఉంది. ఆర్థిక సమానత్వం నెలకొన్నప్పుడే స్వేచ్ఛ సాధ్యమవుతుంది. ఆర్థిక సమానత్వంలో ఆర్థిక న్యాయం అంతర్భాగంగా ఉంటుంది. దీనిని రాజ్యం ప్రసాదిస్తుంది.

7. అధికారాల వికేంద్రీకరణ (Decentralisation of Powers): అధికారాలు వికేంద్రీకరణ ద్వారా స్వేచ్ఛను మెరుగైన రీతిలో పరిరక్షించవచ్చు. ప్రభుత్వాధికారాల కేంద్రీకరణ నుంచి దేశానికి విముక్తి కలిగినప్పుడే వ్యక్తులు స్వేచ్ఛను అనుభవించగలరు. కేంద్రం రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాల మధ్య అధికారాలను కేటాయించినప్పుడు నిరంకుశత్వానికి, వ్యక్తి స్వేచ్ఛల హరింపునకు తావుండదు లేనిచో రాజ్యాంగంలో పొందుపరచిన హక్కులను అనుభవించటమన్నది ప్రజలకు కష్టమవుతుంది.

8. పత్రికాస్వాతంత్ర్యం (Independent Press): ప్రజాస్వామ్యాన్ని కొందరు వ్యక్తి స్వేచ్ఛా పరిరక్షణ కవచంగా భావించారు. తమ పనితీరులో చాలినంత స్వతంత్ర ప్రతిపత్తిని పత్రికలు, ఇతర మాధ్యమాలు కలిగి ఉన్నప్పుడే వ్యక్తులు స్వేచ్ఛలను అనుభవించగలరు. ప్రజాభిప్రాయాన్ని ఏర్పరచి, సంఘటితపరచి, వ్యక్తీకరించడంలో పత్రికలు ముఖ్యమైన వాహకంగా వ్యవహరిస్తాయి. అవి తమ నిష్పాక్షిక సంపాదకీయాలు, సత్య సమ్మతమైన వార్తలు, అభిప్రాయాల ద్వారా వ్యక్తి స్వేచ్ఛలను పరిరక్షించగలుగుతాయి.

AP Inter 1st Year Civics Study Material Chapter 5 స్వేచ్ఛ - సమానత్వం

9. బలమైన ప్రతిపక్షం (Strong Opposition): వ్యక్తి స్వేచ్ఛను పెంపొందించేందుకు బలమైన ప్రతిపక్షం అవసరమవుతుంది. ఒకవిధంగా వ్యక్తి స్వేచ్ఛకు ప్రతిపక్షం కాపలాదారుడిగా పనిచేస్తుంది. అధికారంలో ఉన్న పార్టీ లేదా ప్రభుత్వంలో ఉన్నత స్థానంలోని వ్యక్తులు నిరంకుశ చట్టాల అమలుద్వారా సామాన్యుల స్వేచ్ఛలకు హద్దులు గీసి హరించి వేసినపుడు, ప్రతిపక్షం అట్టి చర్యలను తీవ్రంగా అడ్డుకుంటుంది. అంతిమంగా, అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా వ్యక్తుల స్వేచ్ఛలను కాపాడుతుంది.

10. ప్రజల అప్రమత్తత (People vigilance): స్వేచ్ఛకు అన్నింటికన్నా ముఖ్యమైంది ప్రజల అప్రమత్తత. స్వేచ్ఛ పరిరక్షణకు ప్రజలు నిరంతరం అప్రమత్తతతో ఉండాలి. తమ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పరిరక్షించుకోవాలనే ఆకాంక్ష, స్ఫూర్తి, పట్టుదల పౌరస్వేచ్ఛకు శక్తివంతమైన రక్షణ కవచంగా పనిచేస్తాయి.

ప్రశ్న 3.
సమానత్వం అంటే ఏమిటి ? సమానత్వమందలి రకాలు ఏవి ?
జవాబు:
సమానత్వం ఆధునికకాలంలో ఒక ప్రధాన ఆశయం. అది ప్రజాస్వామ్య ఆదర్శం. మానవులంతా పుట్టుకతో సమానులని కొందరు నమ్మారు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ వ్యవహారాలలో ప్రజలందరికి జాతి, మత, కుల, లింగ, భాషా, ప్రాంతీయ, వర్ణ, వర్గ భేదాలు లేకుండా సమానావకాశాలుండటమే సమానత్వము. సమానత్వం అంటే (i) ఏ అడ్డంకులూ లేకుండా ప్రతి వ్యక్తీ వికాసం పొందడం (ii) శాసనాలు పాలనలలో వ్యక్తుల మధ్య భేదం లేకుండా చేయడం (iii) చట్టం ప్రకారం లభించే హక్కులు సమానంగా లభించడం.

నిర్వచనం: “సమానత్వం అంటే సమాజంలో కొందరికి మాత్రమే ప్రత్యేకమైన హక్కులు, అవకాశాలు కాకుండా అందరికీ సమానావకాలు ఉండటమే” అని లాస్కీ నిర్వచించాడు. పుట్టుక, కులం, మతం, ఆస్తి వంటి అర్హతలనుబట్టి వ్యక్తులకు అవకాశాలు కలుగజేస్తే సమానత్వం లభించదు. అందరికీ సమానఆదరణ ఉండటమే సమానత్వానికి అవసరం. సమానత్వ సిద్ధాంతం ప్రకారం చట్టం ముందు అంతా సమానులే. ఆధునిక రాజ్యం ప్రజలందరికీ సాంఘిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో సమానావకాశాలు కల్పించాలి.

సమానత్వం – రకాలు: సమానత్వం ప్రధానంగా ఐదు రకాలు. అవి 1) సహజ సమానత్వం 2) సాంఘిక సమానత్వం 3) ఆర్థిక సమానత్వం 4) రాజకీయ సమానత్వం 5) అంతర్జాతీయ సమానత్వం. వీటిని గురించి ఈ కింద పేర్కొన్న విధంగా విపులీకరించవచ్చు.

1. సహజ సమానత్వం (Natural Equality): సహజ సమానత్వం అంటే అన్ని రకాల అవరోధాలు, సాంఘిక కట్టుబాట్ల నుంచి స్వాతంత్ర్యాన్ని పొందడం. దీని అర్థం వ్యక్తిపరిధిలో ఎటువంటి ఆంక్షలు ఉండకపోవడం. సహజ సమానత్వం గురించి థామస్ హాబ్స్ ప్రతిపాదించిన సామాజిక ఒడంబడిక సిద్ధాంతంలో పేర్కొనడమైంది. పౌర సమాజం ఆవిర్భవించక ముందే ప్రజలు ప్రాకృతిక వ్యవస్థలో జీవించారని ఈ సిద్ధాంతం పేర్కొన్నది. అసమానతలు, బంధనాలకు నాగరికత దారితీసిందని హాబ్స్ ఉద్ఘాటించాడు. గ్రీకు రోమన్ రాజకీయ తత్త్వవేత్తల రచనలలో ఈ భావం కనపడుతుంది.

2. సాంఘిక సమానత్వం (Social Equality): వర్గ వ్యత్యాసాలు లేకపోవడం, సమానమైన హోదాలు కలిగి ఉండటాన్ని సాంఘిక సమానత్వం సూచిస్తుంది. ఏ వ్యక్తి మతం, వర్గం, వర్ణ, లింగం, పుట్టుక వంటి అంశాల ఆధారంగా వివక్షతకు గురికాకుండా ఉంటే సాంఘిక సమానత్వం నెలకొంటుంది.

ఉదాహరణకు భారతరాజ్యాంగం కుల, వర్గపరమైన వ్యత్యాసాలను నిషేధించింది. వాస్తవానికి అస్త్రశ్యతను అది వ్యతిరేకించింది. పౌరులందరూ సాంఘిక సమానత్వాన్ని అనుభవించినప్పుడు, ఏ ఒక్కరు ఇతరులతో పోల్చినచో కులం, వర్గం, వర్ణం, పుట్టుక, తెగ, జన్మస్థలం వంటి అంశాలపై ఏ విధమైన వివక్షతకు గురికారు. సందర్భంలో క్రింద పేర్కొన్న అంశాలు సాంఘిక సమానత్వ సాధన, కొనసాగింపులకు సహాయపడతాయని చెప్పవచ్చు.

  1. రాజ్యం ఏ ఒక్క పౌరుడికి ప్రత్యేక సౌకర్యాలను అనుమతించరాదు.
  2. విద్య, ఉపాధి, పరిపాలన, శాసన నిర్మాణం వంటి రంగాలలో ప్రభుత్వం ఒకే విధానాన్ని పాటించి, అమలు చేయాలి..
  3. సాంఘిక, మతపరమైన వ్యవహారాలలో ప్రజలు సహనం, త్యాగం, నిజాయితీ వంటి లక్షణాలతో కూడిన విశాల దృక్పథాన్ని కలిగి ఉండాలి.
  4. రాజ్యంలోని పౌరులు తోటి పౌరులతో సహృద్భావ సంబంధాలను ఏర్పరచుకొని కొనసాగించుకోవాలి.
  5. తమ విజ్ఞాపనలను పంపించేటప్పుడు కులం, తెగ, లేక మతం వంటి వాటిని సూచించే పేర్లను ప్రజలు ఉపయోగించరాదు.
  6. కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి.

3. ఆర్థిక సమానత్వం (Economic Equality): ఆర్థిక సమానత్వాన్ని సాంఘిక, రాజకీయ సమానత్వాలకు పునాదిగా పరిగణించడమైంది. ఆధునిక రాజ్యకార్యకలాపాల వెనుక అదొక ముఖ్యమైన చోదకశక్తిగా పనిచేస్తుంది. ఆర్థిక సమానత్వమంటే ఆదాయం, ఆస్తి, సంపదలలో విపరీతమైన వ్యత్యాసాలు లేకుండా చేయడంగా పేర్కొనవచ్చు. ఎర్నెస్ట్ బార్కర్ దృష్టిలో ఆర్థిక సమానత్వం అనేది హోదాకు, పాక్షికంగా ఆస్తి-ఆదాయాలకు సంబంధించిన అంశం. ఆర్థిక సమానత్వాన్ని “సంపదకు చెందిన వ్యత్యాసాలను తొలగించి ప్రయత్నంగా, ప్రాపంచిక వస్తువులను స్త్రీ, పురుషుల మధ్య సమానంగా పంపిణీ చేయాల్సిన ప్రయత్నం”గా లార్డ్స్ భావించాడు. ప్రొఫెసర్ లాస్కీ “పారిశ్రామిక ప్రపంచంలో విశృంఖలమైన, బాధ్యతారహిత ఇచ్ఛను నిషేధించడాన్ని ఆర్థిక సమానత్వం”గా భావించాడు.

AP Inter 1st Year Civics Study Material Chapter 5 స్వేచ్ఛ - సమానత్వం

4. రాజకీయ సమానత్వం (Political Equality): రాజకీయ సమానత్వం రాజకీయ కార్యకలాపాలలో ప్రజలకు చాలినన్ని అవకాశాలను కల్పించేందుకు అనుకూల పరిస్థితులను సూచిస్తుంది. రాజ్యంలోని పౌరులకు వివిధ రకాల రాజకీయ హక్కులను ప్రసాదించడం ద్వారా ఆ రకమైన సమానత్వాన్ని సాధించవచ్చు. ఈ సందర్భంలో రాజకీయ సమానత్వాన్ని పౌరులు మాత్రమే అనుభవిస్తారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రాజ్యంలో నివసించే అన్యులు, విదేశీయులకు ఇది వర్తించదు. ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేసేందుకు రాజకీయ సమానత్వమన్నది అత్యంత ఆవశ్యకమైంది. వివిధ రాజకీయ హక్కులను ప్రసాదించినప్పుడే పౌరులు రాజకీయ స్వేచ్ఛను అనుభవిస్తారు. అంటే, రాజకీయ సమానత్వమనేది రాజకీయ స్వేచ్ఛకు పర్యాయపదంగా భావించవచ్చు.

5. అంతర్జాతీయ సమానత్వం (International Equality): అంతర్జాతీయ సమానత్వమంటే భౌగోళిక, ఆర్థిక లేదా సైనికపరమైన అంశాలతో నిమిత్తం లేకుండా అన్ని రాజ్యాలనూ సమానంగా చూడటంగా పేర్కొనవచ్చును. ఈ విధమైన సమానత్వం ద్వారా ప్రపంచంలోని చిన్న, పెద్ద రాజ్యాలన్నీ సమానమవుతాయి. ఉదాహరణకు ఐక్యరాజ్యసమితి తన చార్టర్ లో అన్ని రాజ్యాలకు సమానమైన గౌరవం, హోదాలను కల్పించింది. అంతర్జాతీయ సమానత్వం మానవీయ లక్షణాలను ప్రతిబింబిస్తుంది. రాజ్యాల మధ్య ఉత్పన్నమయ్యే వివాదాలను శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలని నొక్కిచెబుతుంది. అంతర్జాతీయ న్యాయానికి గౌరవం లోపించినప్పుడు మూడో ప్రపంచ యుద్ధం సంభవించవచ్చని కొందరు హెచ్చరించారు.

ప్రశ్న 4.
స్వేచ్ఛ, సమానత్వం మధ్యగల సంబంధాన్ని గురించి వివరించండి.
జవాబు:
వ్యక్తులకు గల స్వేచ్ఛ – సమానత్వాలపైనే రాజకీయ వ్యవస్థ విజయం ఆధారపడి ఉంటుంది. రాజనీతి శాస్త్ర అధ్యయనంలో ఈ రెండు అంశాలు విశేషమైన ప్రాముఖ్యతను సంతరించుకొన్నాయి. వ్యక్తులు తమ సర్వ సమగ్రమైన అభివృద్ధి కోసం స్వేచ్ఛ, సమానత్వాలను వాంఛిస్తారు.

స్వేచ్ఛ, సమానత్వం మధ్య సంబంధం (Relationship between Liberty and Equality): స్వేచ్ఛ సమానత్వం మధ్యగల సంబంధం గురించి రాజనీతి తత్త్వవేత్తలు రెండు భిన్న అభిప్రాయాలను వెల్లడించారు. ఆ రెండింటి భావనలు రాజనీతిశాస్త్రం అధ్యయనంలో ముఖ్యమైనవిగా వారు అంగీకరించారు. అయితే కొందరు ఆ రెండింటి మధ్య సంబంధం ఉందని పేర్కొనగా, మరికొందరు అవి ఒకదానికొకటి వ్యతిరేకమైనవిగా పరిగణించారు.

స్వేచ్ఛ, సమానత్వం పరస్పర సంబంధం కలిగి ఉంటాయనే భావనను రాజనీతి తత్త్వవేత్తలైన రూసో, టానీ, లాస్కీ, జి.డి. హెచ్. కోల్ వంటివారు ప్రతిపాదించారు. ఇక స్వేచ్ఛ, సమానత్వం అనేది పరస్పర వ్యతిరేకమైన భావనలని పేర్కొన్న వారిలో లార్డ్ మాధ్యూ, ఆర్నార్డ్, లార్డ్ ఆక్టన్, డి టాక్విల్లీ వంటి రాజనీతితత్వవేత్తలు ఉన్నారు. పైన పేర్కొన్న రెండు వాదనల గురించి కింది విధంగా తెలపడమైంది.

1) స్వేచ్ఛ, సమానత్వం పరస్పర పోషకాలు:

  1. వ్యక్తి శ్రేయోవాదులు, అరాచకవాదులు, కమ్యూనిస్టుల దృష్టిలో స్వేచ్ఛ, సమానత్వం పరస్పర పోషకాలు.
  2. సమానత్వం లేని స్వేచ్ఛ అర్థరహితం, ‘సమానత్వం’ నెలకొల్పబడిన తరువాతే స్వేచ్ఛను గురించి ఆలోచించాలని కమ్యూనిస్టులు భావిస్తారు.
  3. సక్రమమైన, ఆదర్శమైన రాజ్యం స్థాపించబడాలంటే తప్పనిసరిగా సమానత్వ ప్రాతిపదికగా ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించాలి. ఈ రెండు విస్తృత పరిధిలో చూడబడాలి.
  4. స్వేచ్ఛ, సమానత్వం – ఈ రెండింటిలో దేన్నీ త్యాగం చేయడానికి ప్రయత్నించరాదు. సమానత్వం, స్వేచ్ఛ లోపించినట్లయితే అరాచకత్వం ప్రబలుతుంది. కావున ప్రభుత్వం శాసనాల ద్వారా ప్రజలందరికి ఎటువంటి జాతి, మత, కుల, వర్గ, వర్ణ, లింగ భేదము లేకుండా సమానంగా ‘స్వేచ్ఛను’ ప్రసాదించాలి.
  5. రాజకీయ స్వేచ్ఛ ద్వారా భావ ప్రకటనా స్వాతంత్ర్యం, ఓటుహక్కు, అర్హత ప్రాతిపదికగా పదవులకు పోటీచేసే హక్కు లభిస్తాయి. సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమానత్వాలను ప్రజలందరూ కలిగి ఉండాలంటే వారందరూ స్వేచ్ఛను పొంది ఉండాలి. అందువలనే స్వేచ్ఛ లేకుండా సమానత్వం, సమానత్వం లేకుండా స్వేచ్ఛ ఉండవు.
  6. ఏ రాజ్యంలో ప్రజలు ఆర్థిక, సాంఘిక, రాజకీయ రంగాలలో స్వేచ్ఛ, సమానత్వాలను సమానంగా పొంది ఉంటారో ఆ రాజ్యం బహుముఖంగా త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని పరిశీలకులు భావిస్తారు.

AP Inter 1st Year Civics Study Material Chapter 5 స్వేచ్ఛ - సమానత్వం

2) స్వేచ్ఛ-సమానత్వాలు పరస్పర విరుద్ధాలు: స్వేచ్ఛ, సమానత్వం పరస్పర శత్రువులు అని పేర్కొన్న వారిలో లార్డ్ ఆక్టన్ ముఖ్యుడు. రాజ్యముగాని, వ్యక్తులుగాని సమానత్వానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తే స్వేచ్ఛ మరుగున పడిపోతుంది అని ఆక్టన్ మహాశయుడు వాదిస్తాడు. ‘మితిమీరని ప్రభుత్వ పరిపాలననే స్వేచ్ఛ’ అని సీలీ మహాశయుడు పేర్కొన్నాడు. ప్రభుత్వ అధికారాలు మితిమీరడమంటే ప్రజలు తమ స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను కోల్పోవటమేనని వీరు భావిస్తారు. ప్రజల వ్యక్తిగత వ్యవహారాలలో, కార్యకలాపాలలో ప్రభుత్వము జోక్యం కల్పించుకోరాదు అని ఆక్టన్ అభిప్రాయం. ప్రజలందరికి ఆర్థిక స్వేచ్ఛను ప్రసాదించినట్లయితే శక్తిసామర్థ్యాలు, తెలివితేటలు, విద్యా పరిజ్ఞానం కలిగినవారు అపారమైన సంపదను కూడబెడితే, అమాయకులు, నిరక్షరాస్యులు, సోమరిపోతులు తమతమ కనీస అవసరాలను కూడా సమకూర్చుకోలేరు. ఇది సమాజములో ఆర్థిక అసమానత్వానికి, వర్గతత్వానికి దారితీస్తుంది. కావున స్వేచ్ఛ-సమానత్వం పరస్పరం శతృ సంబంధాన్ని కలిగి ఉంటాయి. “ఎక్కడ స్వేచ్ఛ ఉంటుందో, అక్కడ సమానత్వం ఉండదు. ఎక్కడ సమానత్వం ఉంటుందో, అక్కడ స్వేచ్ఛ ఉండదు. స్వేచ్ఛ-సమానత్వం రెండు కత్తుల వంటివి. అవి ఒక ఒరలో ఇమడవు” అని ‘లార్డ్ ఆక్టివ్’, ‘డి టాక్వెల్లీ’, ‘సీలీ’ మొదలగు రాజనీతిజ్ఞులు వాదిస్తారు.

పైన పేర్కొన్న రెండు రకాల వాదనలు పూర్తిగా నిజమైనవికావు. వాస్తవ అంశం ఆ రెండింటికీ మధ్య ఉంటుంది. స్వేచ్ఛ, సమానత్వాలు రెండూ ఒకదానికొకటి పరస్పర పోషక, పరస్పర వ్యతిరేక స్వభావాన్ని కలిగి ఉండవు. ఈ సందర్భంలో ఆ రెండు భావనల మధ్య ఉండే వాస్తవిక సంబంధాన్ని క్రింది విధంగా వివరించడమైంది.

సమానత్వానికి స్వేచ్ఛ అవసరం (Liberty is essential for Equality):
i) స్వేచ్ఛ అంటే నిరపేక్షమైనదికాదు. దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. కొన్ని నిబంధనలకు లోబడి సామాజిక సంక్షేమాన్ని సాధించేందుకై ఈ స్వేచ్ఛ అందరికీ అందుబాటులో ఉంటుంది.

ii) స్వేచ్ఛ అంటే ఏ ఒక్కవ్యక్తి లేదా వ్యక్తుల సముదాయపు గుత్తాధికారంగా భావించరాదు.

iii) ఒకానొక వ్యక్తి స్వేచ్ఛను అనుభవించడమనేది ఇతరులకు స్వేచ్ఛకు భంగం కలిగించేదిగా ఉండకూడదనే ఈ సూత్రాన్ని ఆమోదించారు. సమానత్వ సూత్రాన్ని గౌరవించవలసి ఉంటుంది. దాని అర్థం స్వేచ్ఛా ఫలాలు సమానత్వమనే వృక్షానికి చెందిన శాఖలలో ఉంటాయని పేర్కొనవచ్చు. కాబట్టి స్వేచ్ఛ, సమానత్వాలు ఒకదానికొకటి పరస్పర పోషకాలుగా భావించడమైంది. సమానత్వ సూత్రం ఆధారంగా స్వేచ్ఛను వర్తింపజేస్తే, స్వేచ్ఛాలక్ష్యం వాస్తవానికి నెరవేరినట్లవుతుంది.

స్వేచ్ఛకు సమానత్వం అవసరం (Equality is essential for Liberty): సమానత్వం అంటే ఒకే విధమైన ఆదరణ అని అర్థం కాదు. ఎందుకంటే అటువంటి సమానత్వం పౌర సమాజంలో సాధ్యంకాదు. అందుకు బదులుగా ఒకేరకమైన పరిస్థితులలో సమానమైన ఆదరణయే సమానత్వంగా పేర్కొనవచ్చు. పౌర సమాజంలో కొందరు ఇతరులతో సమానమైన హోదాను కలిగి ఉండరు. అయితే వారికి తమ వ్యక్తిత్వం, హోదాలను పెంపొందించుకొనేందుకై కొన్ని పరిస్థితులు, అవకాశాలను కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలందరూ సమానంగా ఉన్నప్పుడు స్వేచ్ఛా, ఫలాలను వారందరూ అనుభవిస్తారని చెప్పవచ్చు.

పైన పేర్కొన్న విధంగా స్వేచ్ఛ, సమానత్వం ఒకదానికొకటి పరస్పర పోషకాలుగా ఉంటాయి. ఆ రెండు భావనలు ఒకే ఉమ్మడి లక్ష్యాన్ని కలిగి ఉంటాయి. సమానత్వాన్ని విస్మరించినందునే స్వేచ్ఛ అనే అరాచకం, నియంతృత్వాలకు దారితీస్తుంది. అట్లాగే స్వేచ్ఛను పట్టించుకోకుండా, సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తే, బానిసత్వం ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి వ్యక్తి, సమాజాల ఔన్నత్యానికి ఆ రెండు భావనలు ఆవశ్యకమైనవిగా పేర్కొనవచ్చు.

AP Inter 1st Year Civics Study Material Chapter 5 స్వేచ్ఛ - సమానత్వం

ప్రశ్న 5.
సమానత్వమనే పదాన్ని నిర్వచించి, సాంఘిక, ఆర్థిక సమానత్వాల గురించి రాయండి.
జవాబు:
సమానత్వం ఆధునికకాలంలో ఒక ప్రధాన ఆశయం. అది ప్రజాస్వామ్య ఆదర్శం. మానవులంతా పుట్టుకతో సమానులని కొందరు నమ్మారు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ వ్యవహారాలలో ప్రజలందరికి జాతి, మత, కుల, లింగ, భాషా, ప్రాంతీయ, వర్ణ, వర్గ భేదాలు లేకుండా సమానావకాశాలుండటమే సమానత్వము. సమానత్వం అంటే (i) ఏ అడ్డంకులూ లేకుండా ప్రతి వ్యక్తీ వికాసం పొందడం (ii) శాసనాలు పాలనలలో వ్యక్తుల మధ్య భేదం లేకుండా చేయడం (iii) చట్టం ప్రకారం లభించే హక్కులు సమానంగా లభించడం.

నిర్వచనం: “సమానత్వం అంటే సమాజంలో కొందరికి మాత్రమే ప్రత్యేకమైన హక్కులు, అవకాశాలు కాకుండా అందరికీ సమానావకాశాలు ఉండటమే” అని లాస్కీ నిర్వచించాడు. పుట్టుక, కులం, మతం, ఆస్తి వంటి అర్హతలనుబట్టి వ్యక్తులకు అవకాశాలు కలుగజేస్తే సమానత్వం లభించదు. అందరికీ సమానఆదరణ ఉండటమే సమానత్వానికి అవసరం. సమానత్వ సిద్ధాంతం ప్రకారం చట్టం ముందు అందరు సమానులే. ఆధునిక రాజ్యం ప్రజలందరికీ సాంఘిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో సమానావకాశాలు కల్పించాలి.

సాంఘిక సమానత్వం (Social Equality): వర్గ వ్యత్యాసాలు లేకపోవడం, సమానమైన హోదాలు కలిగి ఉండటాన్ని సాంఘిక సమానత్వం సూచిస్తుంది. ఏ వ్యక్తి మతం, వర్గం, వర్ణ, లింగం, పుట్టుక వంటి అంశాల ఆధారంగా వివక్షతకు గురికాకుండా ఉంటే సాంఘిక సమానత్వం నెలకొంటుంది.

ఉదాహరణకు భారతరాజ్యాంగం కుల, వర్గపరమైన వ్యత్యాసాలను నిషేధించింది. వాస్తవానికి అస్త్రశ్యతను అది వ్యతిరేకించింది. పౌరులందరూ సాంఘిక సమానత్వాన్ని అనుభవించినప్పుడు, ఏ ఒక్కరు ఇతరులతో పోల్చినచో కులం, వర్గం, వర్ణం, పుట్టుక, తెగ, జన్మస్థలం వంటి అంశాలపై ఏ విధమైన వివక్షతకు గురికారు. ఈ సందర్భంలో క్రింద పేర్కొన్న అంశాలు సాంఘిక సమానత్వ సాధన, కొనసాగింపులకు సహాయపడతాయని చెప్పవచ్చు.

  1. రాజ్యం ఏ ఒక్క పౌరుడికి ప్రత్యేక సౌకర్యాలను అనుమతించరాదు.
  2. విద్య, ఉపాధి, పరిపాలన, శాసన నిర్మాణం వంటి రంగాలలో ప్రభుత్వం ఒకే విధానాన్ని పాటించి, అమలు చేయాలి.
  3. సాంఘిక, మతపరమైన వ్యవహారాలలో ప్రజలు సహనం, త్యాగం, నిజాయితీ వంటి లక్షణాలతో కూడిన విశాల దృక్పథాన్ని కలిగి ఉండాలి.
  4. రాజ్యంలోని పౌరులు తోటి పౌరులతో సహృద్భావ సంబంధాలను ఏర్పరచుకొని కొనసాగించుకోవాలి.
  5. తమ విజ్ఞాపనలను పంపించేటప్పుడు కులం, తెగ, లేక మతం వంటి వాటిని సూచించే పేర్లను ప్రజలు ఉపయోగించరాదు.
  6. కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి.

ఆర్థిక సమానత్వం (Economic Equality): ఆర్థిక సమానత్వాన్ని సాంఘిక, రాజకీయ సమానత్వాలకు పునాదిగా పరిగణించడమైంది. ఆధునిక రాజ్యకార్యకలాపాల వెనుక అదొక ముఖ్యమైన చోదకశక్తిగా పనిచేస్తుంది. ఆర్థిక సమానత్వమంటే ఆదాయం, ఆస్తి, సంపదలలో విపరీతమైన వ్యత్యాసాలు లేకుండా చేయడంగా పేర్కొనవచ్చు. ఎర్నెస్ట్ బార్కర్ దృష్టిలో ఆర్థిక సమానత్వం అనేది హోదాకు, పాక్షికంగా ఆస్తి-ఆదాయాలకు సంబంధించిన అంశం. ఆర్థిక సమానత్వాన్ని “సంపదకు చెందిన వ్యత్యాసాలను తొలగించి ప్రయత్నంగా, ప్రాపంచిక వస్తువులను స్త్రీ, పురుషుల మధ్య సమానంగా పంపిణీ చేయాల్సిన ప్రయత్నం”గా లార్డ్ బ్రైస్ భావించాడు. ప్రొఫెసర్ లాస్కీ “పారిశ్రామిక ప్రపంచంలో విశృంఖలమైన, బాధ్యతారహిత ఇచ్ఛను నిషేధించడాన్ని ఆర్థిక సమానత్వం”గా భావించాడు.

AP Inter 1st Year Civics Study Material Chapter 5 స్వేచ్ఛ - సమానత్వం

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
స్వేచ్ఛను నిర్వచించి, ఏవైనా మూడు రకాలైన స్వేచ్ఛలను వర్ణించండి. [Mar. ’18, ’16]
జవాబు:
పరిచయం: స్వేచ్ఛ అనేది రాజనీతి శాస్త్ర అధ్యయనంలో ఒక ముఖ్యమైన భావన. వ్యక్తులకు గల స్వేచ్ఛపైనే రాజకీయ వ్యవస్థ విజయం ఆధారపడి ఉంటుంది. వ్యక్తులు తమ సర్వతోముఖాభివృద్ధి కోసం స్వేచ్ఛను వాంఛిస్తారు. సామాజిక స్థితిగతులను మెరుగుపరచుకోవడంలో వ్యక్తులకు స్వేచ్ఛ తగిన శక్తిని ప్రసాదిస్తుంది. జె. ఎస్. మిల్, హెర్బర్ట్ స్పెన్సర్, మాంటెస్క్యూ, హెచ్. జె. లాస్కీ, సీలీ లాంటి రాజనీతి శాస్త్రవేత్తలు స్వేచ్ఛను పెంపొందించటంలో ప్రధాన పాత్రను పోషించారు.

అర్థం: స్వేచ్ఛను ఇంగ్లీషులో ‘లిబర్టీ’ (LIBERTY) అంటారు. లిబర్టీ (LIBERTY) అనే ఇంగ్లీషు పదం “లిబర్” (LIBER) అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. లాటిన్ భాషలో “లిబర్” అనే పదానికి అర్థం “ఆంక్షల నుంచి విముక్తి.

నిర్వచనాలు:

  1. హెచ్.జె.లాస్కీ: “వ్యక్తులు వారంతటవారు ఉత్తమమైన అవకాశాలను పొందగలిగి, నిర్వహించుకోగల వాతావరణమే స్వేచ్ఛ”.
  2. మాంటెస్క్యూ: “వ్యక్తులు సంకల్పించుకొని, సాధించగలిగే శక్తియే స్వేచ్ఛ.”
  3. జె.ఆర్. సీలీ: “మితిమీరిన ప్రభుత్వానికి వ్యతిరేకమైనదే స్వేచ్ఛ.”

1) సహజ స్వేచ్ఛ (Natural Liberty): సహజ స్వేచ్ఛ అనేది ఎటువంటి ఆంక్ష లేకుండా ఏదైనా చేయడాన్ని సూచిస్తుంది. ఇది ఎలాంటి జోక్యానికి లేదా నిర్భంధాలకు తావివ్వదు. వ్యక్తులు తమ ఇచ్ఛానుసారం చేయదలచిన దాన్ని సుసాధ్యం చేస్తుంది. అయితే, నిర్నిబంధమైన స్వేచ్ఛ వ్యక్తుల స్వేచ్ఛలను హరిస్తుంది. నేటి సమాజంలో సహజ స్వేచ్ఛ అనేది కనిపించదు. ఇది అన్యాయం, అరాచకత్వాలకు పర్యాయపదమైనది. సహజ స్వేచ్ఛగల చోట స్వాతంత్య్రం మృగ్యమవుతుంది. ఆదిలో రోమన్ రాజనీతి తత్త్వవేత్తలు ఈ భావనను సమర్థించారు. ఎటువంటి అవధుల్లేని ప్రాకృతిక వ్యవస్థలోని మానవులు అపరిమితమైన స్వేచ్ఛను అనుభవించారన్నారు. అటువంటి స్వేచ్ఛ-రాజ్యం, సమాజాల అవిర్భావానికి ముందు మాత్రమే ఉనికిలో ఉండేది.

2) పౌర స్వేచ్ఛ (Civil Liberty): పౌరస్వేచ్ఛను వ్యక్తిగత స్వేచ్ఛ అని కూడ అంటారు. ఇది సామాజిక సంస్థలోని సభ్యుడైన వ్యక్తి జీవనంలోని స్వాతంత్ర్యాన్ని తెలియజేస్తుంది. పౌరస్వేచ్ఛలో కింద పేర్కొన్న మూడు అంశాలు ఇమిడి ఉంటాయని బార్కర్ పేర్కొన్నాడు. i) సంచార స్వేచ్ఛను సూచించే భౌతిక స్వాతంత్య్రం. ii) ఆలోచన, అభివ్యక్తి, విశ్వాసాన్ని కలిగి ఉండే భౌద్ధిక స్వాతంత్ర్యం iii) నిజజీవితంలోని ఆచరణాత్మక ఐచ్ఛిక స్వాతంత్ర్యం. పౌర స్వేచ్ఛ అనేది మిగతా స్వేచ్ఛలకు ప్రాతిపదికగా ఉంటుంది. సహజ స్వేచ్ఛకు ఇది విరుద్ధమైంది. సమాజంలోని పౌరులు దానిని అనుభవిస్తారు. ఒంటరిగా ఉంటున్న వ్యక్తులకిది ఆవశ్యకమైనది. సమాజంలోని ప్రతిఒక్కరూ ప్రాపంచిక విషయాలను ఉమ్మడిగా అనుభవించగలిగినప్పుడే పౌర స్వేచ్ఛ వాస్తవమవుతుంది.

“రాజ్యం చేత గుర్తించబడి అమలయ్యే హక్కుల సముదాయమే పౌరస్వేచ్చ” అని గెటిల్ పేర్కొన్నాడు. పౌరస్వేచ్ఛ అనేది అనేక హక్కుల రూపంలో ఉంటుంది. అవి (i) జీవించే హక్కు (ii) పనిచేసే హక్కు (iii) ఆస్తిహక్కు iv) వాక్ స్వాతంత్ర్యం, భావవ్యక్తీకరణ, సమావేశ, సంచార, స్థిరనివాసపు హక్కులు మొదలైనవి.

3) ఆర్థిక స్వేచ్ఛ (Economic Liberty): ఆర్థిక స్వేచ్ఛ అంటే ప్రతిఒక్కరూ తమ జీవనోపాధిని తామే సంపాదించుకోగలగడం. ఒక వ్యక్తి తన రోజువారీ ఆహారాన్ని హేతుబద్ధంగా సంపాదించుకొనే భద్రమైన అవకాశమే | ఆర్థికస్వేచ్ఛగా లాస్కీ అభివర్ణించాడు. కోరిక – భయము, ఆకలి – పస్తులు, నిరద్యోగం – అసంపూర్ణతల నుంచి విముక్తి కలిగించేదే ఆర్థిక స్వేచ్ఛ. ఇది ఆర్థిక సంబంధమైన లేమి లేదా అభద్రతల నుంచి స్వాతంత్ర్యాన్ని సూచిస్తుంది. ఆర్థిక స్వేచ్ఛలేని ప్రజాస్వామ్యం అర్థరహితమైంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 5 స్వేచ్ఛ - సమానత్వం

ఈ దిగువ పేర్కొన్న చర్యల అమలు ద్వారా ఆర్థిక స్వేచ్ఛను పొందవచ్చు.

  1. కనీస వేతనాలను అందించడం.
  2. పనిహక్కుకు భరోసా కల్పించడం.
  3. నిరుద్యోగం, అనారోగ్యం వంటి వివిధ రకాల అభద్రతల నుంచి కార్మికులను రక్షించడం.
  4. తగినంత విశ్రాంతిని కల్పించడం.
  5. పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు ప్రాతినిధ్యం కల్పించడం.

ప్రశ్న 2.
స్వేచ్ఛకు గల ఏవైనా మూడు పరిరక్షణలను వివరించండి. [Mar. 2017]
జవాబు:
1. ఆర్థిక సమానత్వం (Economic Equality): వ్యక్తుల స్వేచ్ఛా పరిరక్షణలో ఆర్థిక సమానత్వం కూడా ప్రధానమైంది. ఆకలి, పేదరికం, నిరుద్యోగం వంటి దుష్ప్రభావాల నుంచి బయటపడేందుకు వ్యక్తులకు చాలినన్ని అవకాశాలను కల్పించాలనే భావన ఇందులో ఇమిడి ఉంది. ఆర్థిక సమానత్వం నెలకొన్నప్పుడే స్వేచ్ఛ సాధ్యమవుతుంది. ఆర్థిక సమానత్వంలో ఆర్థిక న్యాయం అంతర్భాగంగా ఉంటుంది. దీనిని రాజ్యం ప్రసాదిస్తుంది.

2. అధికారాల వికేంద్రీకరణ (Decentralisation of Powers): అధికారాల వికేంద్రీకరణ ద్వారా స్వేచ్ఛను మెరుగైన రీతిలో పరిరక్షించవచ్చు. ప్రభుత్వాధికారాల కేంద్రీకరణ నుంచి దేశానికి విముక్తి కలిగినప్పుడే వ్యక్తులు స్వేచ్ఛను అనుభవించగలరు. కేంద్రం రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాల మధ్య అధికారాలను కేటాయించినప్పుడు నిరంకుశత్వానికి, వ్యక్తి స్వేచ్ఛల హరింపునకు తావుండదు, లేనిచో రాజ్యాంగంలో పొందుపరచిన హక్కులను అనుభవించటమన్నది ప్రజలకు కష్టమవుతుంది.

3. పత్రికాస్వాతంత్ర్యం (Independent Press): ప్రజాస్వామ్యాన్ని కొందరు వ్యక్తి స్వేచ్ఛా పరిరక్షణ కవచంగా భావించారు. తమ పనితీరులో చాలినంత స్వతంత్ర ప్రతిపత్తిని పత్రికలు, ఇతర మాధ్యమాలు కలిగి ఉన్నప్పుడే వ్యక్తులు స్వేచ్ఛలను అనుభవించగలరు. ప్రజాభిప్రాయాన్ని ఏర్పరచి, సంఘటితపరచి, వ్యక్తీకరించడంలో పత్రికలు ముఖ్యమైన వాహకంగా వ్యవహరిస్తాయి. అవి తమ నిష్పాక్షిక సంపాదకీయాలు, సత్య సమ్మతమైన వార్తలు, అభిప్రాయాల ద్వారా వ్యక్తి స్వేచ్ఛలను పరిరక్షించగలుగుతాయి.

ప్రశ్న 3.
స్వేచ్ఛ లక్షణాలేవి ?
జవాబు:
పరిచయం: స్వేచ్ఛ అనేది రాజనీతి శాస్త్ర అధ్యయనంలో ఒక ముఖ్యమైన భావన. వ్యక్తులకు గల స్వేచ్ఛపైనే రాజకీయ వ్యవస్థ విజయం ఆధారపడి ఉంటుంది. వ్యక్తులు తమ సర్వతోముఖాభివృద్ధి కోసం స్వేచ్ఛను వాంఛిస్తారు. సామాజిక స్థితిగతులను మెరుగుపరచుకోవడంలో వ్యక్తులకు స్వేచ్ఛ తగిన శక్తిని ప్రసాదిస్తుంది. ‘జె. ఎస్. మిల్, హెర్బర్ట్ స్పైన్సర్, మాంటెస్క్యూ, హెచ్. జె. లాస్కీ, సీలీ లాంటి రాజనీతి శాస్త్రవేత్తలు స్వేచ్ఛను పెంపొందించటంలో ప్రధాన పాత్రను పోషించారు.

అర్థం: స్వేచ్ఛను ఇంగ్లీషులో ‘లిబర్టీ’ (LIBERTY) అంటారు. లిబర్టీ (LIBERTY) అనే ఇంగ్లీషు పదం “లిబర్” (LIBER) అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. లాటిన్ భాషలో “లిబర్” అనే పదానికి అర్థం “ఆంక్షల నుంచి విముక్తి”.
నిర్వచనాలు:

  1. హెచ్.జె.లాస్కీ: “వ్యక్తులు వారంతటవారు ఉత్తమమైన అవకాశాలను పొందగలిగి, నిర్వహించుకోగల వాతావరణమే స్వేచ్ఛ”.
  2. మాంటెస్క్యూ: “వ్యక్తులు సంకల్పించుకొని, సాధించగలిగే శక్తియే స్వేచ్ఛ.”
  3. జె.ఆర్. సీలీ: “మితిమీరిన ప్రభుత్వానికి వ్యతిరేకమైనదే స్వేచ్ఛ.”

AP Inter 1st Year Civics Study Material Chapter 5 స్వేచ్ఛ - సమానత్వం

స్వేచ్ఛ లక్షణాలు (Characteristics of Liberty): స్వేచ్ఛ ముఖ్య లక్షణాలను కింద పేర్కొనడమైనది.

  1. స్వేచ్ఛ ఒక శక్తివంతమైన భావన. దాని వ్యాఖ్యానమనేది స్థలం, కాలం, ప్రాంతం, ప్రజల ఆకాంక్షలను బట్టి ఉంటుంది.
  2. రాజకీయంగా లోబరచుకోవడం, బానిసలుగా మార్చటాన్ని స్వేచ్ఛ ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తుంది.
  3. వ్యక్తుల ఆకాంక్షలను సదా వాస్తవం చేయడమే స్వేచ్ఛలక్ష్యం అవుతుంది.
  4. నిర్హేతుకమైన ఆంక్షలకు బదులు నిరంతరం సానుకూల పరిస్థితులను కలిగి ఉండటమే స్వేచ్ఛ. 5. ఇది హక్కుల ఫలం.
  5. మానవీయ వ్యక్తిత్వాల సాధనకు అత్యంత ఆవశ్యకమైంది.
  6. ప్రజాస్వామ్య రాజ్యాలలోనే ఇది కనిపిస్తుంది.
  7. హక్కుల రూపంలో ఇది సాకారమవుతుంది.
  8. స్వేచ్ఛ అంటే ఏ ఒక్కరు యధేచ్ఛగా వ్యవహరించడం కాదు. ఇది ఎన్నో పరిమితులతో కూడుకొని ఉంటుంది.

ప్రశ్న 4.
స్వేచ్ఛకు గల వివిధ ధృక్కోణాలను తెలపండి.
జవాబు:
అర్థం: స్వేచ్ఛను ఇంగ్లీషులో ‘లిబర్టీ’ (LIBERTY) అంటారు. లిబర్టీ (LIBERTY) అనే ఇంగ్లీషు పదం “లిబర్” (LIBER) అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. లాటిన్ భాషలో “లిబర్” అనే పదానికి అర్థం “ఆంక్షల నుంచి విముక్తి”.
నిర్వచనాలు:

  1. హెచ్.జె.లాస్కీ: “వ్యక్తులు వారంతటవారు ఉత్తమమైన అవకాశాలను పొందగలిగి, నిర్వహించుకోగల వాతావరణమే స్వేచ్ఛ”.
  2. మాంటెస్క్యూ: “వ్యక్తులు సంకల్పించుకొని, సాధించగలిగే శక్తియే స్వేచ్ఛ.”
  3. జె.ఆర్. సీలీ: “మితిమీరిన ప్రభుత్వానికి వ్యతిరేకమైనదే స్వేచ్ఛ.”

స్వేచ్ఛ ధృక్కోణాలు (Aspects of Liberty): స్వేచ్ఛకు రెండు ధృక్కోణాలు ఉంటాయి. అవి 1. సకారాత్మకమైన ధృక్కోణం 2. నకారాత్మకమైన ధృక్కోణం.

1. సకారాత్మక ధృక్కోణం (Positive Aspect): సకారాత్మక ధృక్కోణంలో స్వేచ్ఛ అనేది వ్యక్తి తన అభీష్టం మేరకు నడుచుకుంటూ ఇతరులు కూడా తనవలె నడుచుకోవాలనే పరిస్థితిని సూచిస్తుంది. వేరొక మాటలో చెప్పాలంటే, ఇతరులకు హాని కలిగించని అధికారమే స్వేచ్ఛ అనే ధృక్కోణాన్ని సూచిస్తుంది. టి.హెచ్. గ్రీన్ అనే ఆదర్శ తత్త్వవేత్త ఈ రకమైన స్వేచ్ఛా ధృక్కోణాన్ని ప్రతిపాదించాడు. “ఇతరులతో సమానంగా ఆనందంతో ఏదైనా చేసి అనుభవించేందుకు గల అధికారమే స్వేచ్ఛ” గా అతడు భావించాడు.

2. నకారాత్మక ధృక్కోణం (Nagative Aspect): నకారాత్మక ధృక్కోణంలో స్వేచ్ఛ అంటే ఎటువంటి ఆంక్షలు లేకపోవడం. తమ స్వాతంత్ర్యాల మీద ఎలాంటి ఆంక్షలు లేనప్పుడే వ్యక్తులు స్వాతంత్ర్యాన్ని పొందగలరు. అయితే, కొందరు దీన్ని వాస్తవ విరుద్ధమైనదిగా భావించారు. రాజ్యం ఆవిర్భావానికి పూర్యం మాత్రమే వ్యక్తులకు ఆంక్షలు లేని, స్వేచ్ఛ ఉందన్నారు. వారి ప్రకారం అటువంటి రాజ్యం అసాధ్యమైందే కాకుండా, ఆధునిక కాలంలో వ్యక్తులు స్వాతంత్ర్యాన్ని అనుభవించే వీలులేనిది కూడా అవుతుంది.

ప్రశ్న 5.
పౌర స్వేచ్ఛ అంటే ఏమిటి ?
జవాబు:
పౌర స్వేచ్ఛ (Civil Liberty): పౌరస్వేచ్ఛను వ్యక్తిగత స్వేచ్ఛ అని కూడ అంటారు. ఇది సామాజిక సంస్థలోని సభ్యుడైన వ్యక్తి జీవనంలోని స్వాతంత్ర్యాన్ని తెలియజేస్తుంది. పౌరస్వేచ్ఛలో కింద పేర్కొన్న మూడు అంశాలు ఇమిడి | ఉంటాయని బార్కర్ పేర్కొన్నాడు. i) సంచార స్వేచ్ఛను సూచించే భౌతిక స్వాతంత్ర్యం ii) ఆలోచన, అభివ్యక్తి, విశ్వాసాన్ని కలిగి ఉండే భౌద్ధిక స్వాతంత్ర్యం, iii) నిజజీవితంలోని ఆచరణాత్మక ఐచ్ఛిక స్వాతంత్య్రం. పౌర స్వేచ్ఛ అనేది మిగతా స్వేచ్ఛలకు ప్రాతిపదికగా ఉంటుంది. సహజస్వేచ్ఛకు ఇది విరుద్ధమైంది. సమాజంలోని పౌరులు దానిని అనుభవిస్తారు. ఒంటరిగా ఉంటున్న వ్యక్తులకిది ఆవశ్యకమైనది సమాజంలోని ప్రతిఒక్కరూ ప్రాపంచిక విషయాలను ఉమ్మడిగా అనుభవించగలిగినప్పుడే పౌరస్వేచ్ఛ వాస్తవమవుతుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 5 స్వేచ్ఛ - సమానత్వం

“రాజ్యం చేత గుర్తించబడి అమలయ్యే హక్కుల సముదాయమే పౌర స్వేచ్ఛ” అని గెటిల్ పేర్కొన్నాడు. పౌరస్వేచ్ఛ అనేది అనేక హక్కుల రూపంలో ఉంటుంది. అవి (i) జీవించే హక్కు (ii) పనిచేసే హక్కు (iii) ఆస్తిహక్కు (iv) వాక్ స్వాతంత్య్రం, భావవ్యక్తీకరణ, సమావేశ, సంచార, స్థిర నివాసపు హక్కులు మొదలైనవి.

ప్రశ్న 6.
వ్యక్తి స్వేచ్ఛలను ఆటంకపరిచే ఏవైనా రెండు అంశాలను సూచించండి.
జవాబు:
అర్థం: స్వేచ్ఛను ఇంగ్లీషులో ‘లిబర్టీ’ (LIBERTY) అంటారు. లిబర్టీ (LIBERTY) అనే ఇంగ్లీషు పదం “లిబర్” (LIBER) అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. లాటిన్ భాషలో “లిబర్” అనే పదానికి అర్థం “ఆంక్షల నుంచి విముక్తి”.

నిర్వచనాలు:

  1. హెచ్.జె.లాస్కీ: “వ్యక్తులు వారంతటవారు ఉత్తమమైన అవకాశాలను పొందగలిగి, నిర్వహించుకోగల వాతావరణమే స్వేచ్ఛ”.
  2. మాంటెస్క్యూ “వ్యక్తులు సంకల్పించుకొని, సాధించగలిగే శక్తియే స్వేచ్ఛ.”
  3. జె.ఆర్. సీలీ: “మితిమీరిన ప్రభుత్వానికి వ్యతిరేకమైనదే స్వేచ్ఛ.”

ఆధునిక కాలంలో వ్యక్తిస్వేచ్ఛకు కింద పేర్కొన్న అంశాలు భంగం కలిగిస్తాయి.
1. రాజ్యాధికార పెరుగుదల (Enhancement of State Authority): ఆధునిక ప్రజాస్వామ్యరాజ్యం సంక్షేమ సిద్ధాంతం పేరుతో అనిర్వచనీయమైన అధికారాలను సంతరించుకుంది. దాంతో అది ప్రజలకు సంబంధించిన ప్రతి కార్యక్రమంలో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టింది. జనాభా నియంత్రణ పేరుతో అది కుటుంబ విషయాలలో కూడా జోక్యం చేసుకుంటున్నది. అట్లాగే ఆర్థిక వ్యవస్థ, సంస్కృతి, కళలు, శాస్త్రవిజ్ఞాన రంగాలలో సైతం రాజ్యం జోక్యం పెరిగింది. పైన పేర్కొన్న అంశాలన్నీ ప్రభుత్వ వ్యవహారాలలో రాజ్యం జోక్యానికి నిదర్శనంగా నిలిచాయి. దాంతో వ్యక్తిస్వేచ్ఛకు చెప్పుకోదగిన రీతిలో ఆటంకాలు ఏర్పడినాయి.

2. మితిమీరిన చట్టాలు (Too many Laws): ఆధునిక కాలంలో ప్రభుత్వం అనేక సదుపాయాలను కల్పించడం ద్వారా తమను ఆదుకోవలసి ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. అటువంటి భావన ప్రజల వ్యవహారాలలో ప్రభుత్వం జోక్యం చేసుకునేందుకు కారణమైంది. ఆ ప్రక్రియలో అనేక చట్టాలు అమలులోకి రావడం ఈనాడు సర్వసాధారణమైంది. చట్టాలు విస్తృతమయ్యేకొద్దీ వ్యక్తి స్వేచ్ఛలు క్రమేణ తగ్గిపోతూ వచ్చాయి.

3. ప్రతికూల ధోరణి (Negative Attitude): ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి అనుగుణంగా స్పందిస్తూ ప్రజలకు తన విధానాలను తెలియజేస్తుంది. ఆ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వంలో సంబంధిత వ్యక్తులు ప్రజాభిప్రాయాన్ని వక్రీకరించేందుకు ప్రయత్నించే అవకాశం ఏర్పడింది. అటువంటి ధోరణి వర్తమాన ప్రపంచంలో ఇండియాతో సహా అనేక రాజ్యాలలో మనం గమనించవచ్చు.

4. మెజారిటీ నియంతృత్వం (Tyranny of Majority): వ్యక్తి స్వేచ్ఛ మెజారిటీ నియంతృత్వంచే అణచివేతకు గురవుతుంది. శాసనసభలో మెజారిటీ సభ్యులు మద్దతును కలిగి ఉండడం ద్వారా అధికారపక్షం ప్రజల అభిప్రాయాలు, ఆకాంక్షలను పట్టించుకోకుండా చట్టాలను రూపొందిస్తుంది. అటువంటప్పుడు అధికారపక్ష వైఖరితో వ్యక్తిస్వేచ్ఛకు ప్రమాదం ఏర్పడుతుంది. అటువంటి పార్టీకి అధికారంలో కొనసాగేందుకు లేదా ప్రతిపక్షంగా వ్యవహరించేందుకు అవకాశాన్నివ్వకుండా పౌరులు రాబోయే ఎన్నికలలో ఓటు హక్కుద్వారా అప్రమత్తంగా వ్యవహరించాలి.

AP Inter 1st Year Civics Study Material Chapter 5 స్వేచ్ఛ - సమానత్వం

ప్రశ్న 7.
స్వేచ్ఛ అంటే ఏమిటి ?
జవాబు:
ఏది లేకుండా మానవుడు తన మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసుకోలేడో, అటువంటి అనివార్యమైన నిబంధనే స్వేచ్ఛ. నిజానికి స్వేచ్ఛకు తగిన అర్థాన్ని ఇవ్వటమన్నది బహుకష్టమైన పని. ఎందుకంటే, దీనిని విభిన్న వర్గాలకు చెందినవారు విభిన్నమైన అర్థాలతో సంబోధించారు.

Liberty అనే ఇంగ్లీషు పదం ‘లిబర్’ అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. లాటిన్ భాషలో ‘లిబర్’ అనే పదానికి అర్థం ‘ఆంక్షల నుంచి విముక్తి. రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో వ్యక్తులు పాల్గొనుటకు ఉండే హక్కులు, బాధ్యతల సాధనమే స్వేచ్ఛ అని ప్రాచీన గ్రీకు రాజనీతి తత్త్వవేత్తలు భావించారు. నిఘంటువులలో స్వేచ్ఛపదాన్ని వివిధ రకాలుగా ప్రస్తావించడమైంది. కొలంబియా విజ్ఞాన సర్వస్వంలో వ్యక్తుల వాక్ స్వాతంత్ర్యం, ఆత్మరక్షణ హక్కు వంటి విభిన్న స్వాతంత్ర్యాలను వర్ణించేందుకై ‘స్వేచ్ఛ’ అనే పదాన్ని ఉపయోగించడమైనది. వాస్తవానికి వ్యక్తి తన ఇష్టానుసారం, ఏదిపడితే అది చేయటానికి స్వేచ్ఛ అనుమతినివ్వదు. సమాజం నియంత్రించిన కొన్ని సాంఘిక, నైతిక ఆంక్షలకు లోబడి వ్యక్తులు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు స్వేచ్ఛను వినియోగించుకోవాలి. ఇతరులకు హాని కలిగించని వ్యక్తి ప్రవర్తనే స్వేచ్ఛ పరమార్థంగా పేర్కొనవచ్చు.

ప్రశ్న 8.
స్వేచ్ఛకు గల ఏవైనా మూడు ధృక్కోణాలను పేర్కొనండి.
జవాబు:
స్వేచ్ఛకు రెండు ధృక్కోణాలు ఉంటాయి. అవి 1. సకారాత్మకమైన ధృక్కోణం 2. నకారాత్మకమైన ధృక్కోణం.

1. సకారాత్మక ధృక్కోణం (Positive Aspect): సకారాత్మక ధృక్కోణంలో స్వేచ్ఛ అనేది వ్యక్తి తన అభీష్టం మేరకు నడుచుకొంటూ ఇతరులు కూడా తనవలె నడుచుకోవాలనే పరిస్థితిని సూచిస్తుంది. వేరొక మాటలో చెప్పాలంటే, ఇతరులకు హాని కలిగించని అధికారమే స్వేచ్ఛ అనే ధృక్కోణాన్ని సూచిస్తుంది. టి.హెచ్. గ్రీన్ అనే ఆదర్శ తత్త్వవేత్త ఈ రకమైన స్వేచ్ఛా ధృక్కోణాన్ని ప్రతిపాదించాడు. “ఇతరులతో సమానంగా ఆనందంతో ఏదైనా చేసి అనుభవించేందుకు గల అధికారమే స్వేచ్ఛ” గా అతడు భావించాడు.

2. నకారాత్మక ధృక్కోణం (Nagative Aspect): నకారాత్మక ధృక్కోణంలో స్వేచ్ఛ అంటే ఎటువంటి ఆంక్షలు లేకపోవడం. తమ స్వాతంత్ర్యాల మీద ఎలాంటి ఆంక్షలు లేనప్పుడే వ్యక్తులు స్వాతంత్ర్యాన్ని పొందగలరు. అయితే, కొందరు దీన్ని వాస్తవ విరుద్ధమైనదిగా భావించారు. రాజ్యం ఆవిర్భావానికి పూర్యం మాత్రమే వ్యక్తులకు ఆంక్షలేని, స్వేచ్ఛ ఉందన్నారు. వారి ప్రకారం అటువంటి రాజ్యం అసాధ్యమైందే కాకుండా, ఆధునిక కాలంలో వ్యక్తులు స్వాతంత్య్రాన్ని అనుభవించే వీలు లేనిది కూడా అవుతుంది.

ప్రశ్న 9.
సమానత్వం అంటే ఏమిటి ? ఏవైనా మూడు రకాల సమానత్వాలను వివరించండి.
జవాబు:
సమానత్వం ఆధునికకాలంలో ఒక ప్రధాన ఆశయం. అది ప్రజాస్వామ్య ఆదర్శం. మానవులంతా పుట్టుకతో సమానులని కొందరు నమ్మారు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ వ్యవహారాలలో ప్రజలందరికి జాతి, మత, కుల, లింగ, | భాషా, ప్రాంతీయ, వర్ణ, వర్గ భేదాలు లేకుండా సమానావకాశాలుండటమే సమానత్వము. సమానత్వం అంటే (i) ఏ అడ్డంకులూ లేకుండా ప్రతి వ్యక్తీ వికాసం పొందడం, (ii) శాసనాలు పాలనలలో వ్యక్తుల మధ్య భేదం లేకుండా చేయడం (iii) చట్టం ప్రకారం లభించే హక్కులు సమానంగా లభించడం.

నిర్వచనం: “సమానత్వం అంటే సమాజంలో కొందరికి మాత్రమే ప్రత్యేకమైన హక్కులు, అవకాశాలు కాకుండా అందరికీ సమానావకాలు ఉండటమే” అని లాస్కీ నిర్వచించాడు. పుట్టుక, కులం, మతం, ఆస్తి వంటి అర్హతలనుబట్టి వ్యక్తులకు అవకాశాలు కలుగజేస్తే సమానత్వం లభించదు. అందరికీ సమానఆదరణ ఉండటమే సమానత్వానికి అవసరం. సమానత్వ సిద్ధాంతం ప్రకారం చట్టం ముందు అంతా సమానులే. ఆధునిక రాజ్యం ప్రజలందరికీ సాంఘిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో సమానావకాశాలు కల్పించాలి.

AP Inter 1st Year Civics Study Material Chapter 5 స్వేచ్ఛ - సమానత్వం

1. సహజ సమానత్వం (Natural Equality): సహజ సమానత్వం అంటే అన్ని రకాల అవరోధాలు, సాంఘిక కట్టుబాట్ల నుంచి స్వాతంత్ర్యాన్ని పొందడం. దీని అర్థం వ్యక్తి పరిధిలో ఎటువంటి ఆంక్షలు ఉండకపోవడం. సహజ సమానత్వం గురించి థామస్ హాబ్స్ ప్రతిపాదించిన సామాజిక ఒడంబడిక సిద్ధాంతంలో పేర్కొనడమైంది. పౌర సమాజం ఆవిర్భవించక ముందే ప్రజలు ప్రాకృతిక వ్యవస్థలో జీవించారని ఈ సిద్ధాంతం పేర్కొన్నది. అసమానతలు, బంధనాలకు నాగరికత దారితీసిందని హాబ్స్ ఉద్ఘాటించాడు. గ్రీకు రోమన్ రాజకీయ తత్త్వవేత్తల రచనలలో ఈ భావం కనపడుతుంది.

2. సాంఘిక సమానత్వం (Social Equality): వర్గ వ్యత్యాసాలు లేకపోవడం, సమానమైన హోదాలు కలిగి ఉండటాన్ని సాంఘిక సమానత్వం సూచిస్తుంది. ఏ వ్యక్తి మతం, వర్గం, వర్ణ, లింగం, పుట్టుక వంటి అంశాల ఆధారంగా వివక్షతకు గురికాకుండా ఉంటే సాంఘిక సమానత్వం నెలకొంటుంది.

ఉదాహరణకు భారతరాజ్యాంగం కుల, వర్గపరమైన వ్యత్యాసాలను నిషేధించింది. వాస్తవానికి అస్త్రశ్యతను అది వ్యతిరేకించింది. పౌరులందరూ సాంఘిక సమానత్వాన్ని అనుభవించినప్పుడు, ఏ ఒక్కరు ఇతరులతో పోల్చినచో కులం, వర్గం, వర్ణం, పుట్టుక, తెగ, జన్మస్థలం వంటి అంశాలపై ఏ విధమైన వివక్షతకు గురికారు. ఈ సందర్భంలో క్రింద పేర్కొన్న అంశాలు సాంఘిక సమానత్వ సాధన, కొనసాగింపులకు సహాయపడతాయని చెప్పవచ్చు.

  1. రాజ్యం ఏ ఒక్క పౌరుడికి ప్రత్యేక సౌకర్యాలను అనుమతించరాదు.
  2. విద్య, ఉపాధి, పరిపాలన, శాసన నిర్మాణం వంటి రంగాలలో ప్రభుత్వం ఒకే విధానాన్ని పాటించి, అమలు చేయాలి.
  3. సాంఘిక, మతపరమైన వ్యవహారాలలో ప్రజలు సహనం, త్యాగం, నిజాయితీ వంటి లక్షణాలతో కూడిన విశాల దృక్పథాన్ని కలిగి ఉండాలి.
  4. రాజ్యంలోని పౌరులు తోటి పౌరులతో సహృద్భావ సంబంధాలను ఏర్పరచుకొని కొనసాగించుకోవాలి.
  5. తమ విజ్ఞాపనలను పంపించేటప్పుడు కులం, తెగ, లేక మతం వంటి వాటిని సూచించే పేర్లను ప్రజలు ఉపయోగించరాదు.
  6. కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి.

3. ఆర్థిక సమానత్వం (Economic Equality): ఆర్థిక సమానత్వాన్ని సాంఘిక, రాజకీయ సమానత్వాలకు పునాదిగా పరిగణించడమైంది. ఆధునిక రాజ్యకార్యకలాపాల వెనుక అదొక ముఖ్యమైన చోదకశక్తిగా పనిచేస్తుంది. ఆర్థిక సమానత్వమంటే ఆదాయం, ఆస్తి, సంపదలలో విపరీతమైన వ్యత్యాసాలు లేకుండా చేయడంగా పేర్కొనవచ్చు. ఎర్నెస్ట్ బార్కర్ దృష్టిలో ఆర్థిక సమానత్వం అనేది హోదాకు, పాక్షికంగా ఆస్తి-ఆదాయాలకు సంబంధించిన అంశం. ఆర్థిక సమానత్వాన్ని “సంపదకు చెందిన వ్యత్యాసాలను తొలగించి ప్రయత్నంగా, ప్రాపంచిక వస్తువులను స్త్రీ, పురుషల మధ్య సమానంగా పంపిణీ చేయాల్సిన ప్రయత్నం”గా లార్డ్స్ భావించాడు. ప్రొఫెసర్ లాస్కీ “పారిశ్రామిక ప్రపంచంలో విశృంఖలమైన, బాధ్యతారహిత ఇచ్ఛను నిషేధించడాన్ని ఆర్థిక సమానత్వం”గా భావించాడు.

ప్రశ్న 10.
రాజకీయ సమానత్వం అంటే ఏమిటో రాయండి.
జవాబు:
రాజకీయ సమానత్వం (Political Equality): రాజకీయ సమానత్వం రాజకీయ కార్యకలాపాలలో ప్రజలకు చాలినన్ని అవకాశాలను కల్పించేందుకు అనుకూల పరిస్థితులను సూచిస్తుంది. రాజ్యంలోని పౌరులకు వివిధ రకాల రాజకీయ హక్కులను ప్రసాదించడం ద్వారా ఆ రకమైన సమానత్వాన్ని సాధించవచ్చు. ఈ సందర్భంలో రాజకీయ సమానత్వాన్ని పౌరులు మాత్రమే అనుభవిస్తారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రాజ్యంలో నివసించే అన్యులు, విదేశీయులకు ఇది వర్తించదు. ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేసేందుకు రాజకీయ సమానత్వమన్నది అత్యంత ఆవశ్యకమైంది. వివిధ రాజకీయ హక్కులను ప్రసాదించినప్పుడే పౌరులు రాజకీయ స్వేచ్ఛను అనుభవిస్తారు. అంటే, రాజకీయ సమానత్వమనేది రాజకీయ స్వేచ్ఛకు పర్యాయపదంగా భావించవచ్చు. రాజకీయ హక్కులను పౌరులు సక్రమంగా వినియోగించుకొన్నప్పుడే రాజకీయ సమానత్వం ఆచరణలో ఉన్నట్లుగా పేర్కొనవచ్చు. దూరదృష్టి, చిత్తశుద్ధి, నిజాయితీలు గల మంచి ఆదర్శప్రాయమైన అభ్యర్థులను ఎన్నుకొనేందుకు పౌరులు తమ రాజకీయ హక్కులను సద్వినియోగపరచుకోవాలి. ఓటు హక్కును వినియోగించుకొనేటప్పుడు వారు ఎటువంటి బహుమానాలు లేదా ప్రలోభాలకు లోనుకాకూడదు. దేశప్రగతి కోసం గట్టిగా కృషి చేసేవారికే వారు తమ మద్దతు ప్రకటించాలి. కనీస విద్య, అక్షరాస్యత, ఆర్ధిక స్వయంసమృద్ధి, రాజకీయ అవగాహనలను వారు కలిగి ఉండాలి. తమ అభీష్టానికి విరుద్ధంగా వ్యవహరించే పాలన, కార్య- నిర్వహణాధికారులు, శాసనసభ్యుల విధానాలను విమర్శించేందుకు వారు సందేహించరాదు. అయితే అటువంటి విమర్శలు రాజ్యాంగ అంశాల పరిధిలోనే జరగాలి. శాంతియుత మార్గాల ద్వారా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలి. ప్రభుత్వాధికారాన్ని చేపట్టే అవకాశం ఉన్నప్పుడు ఎంతో హేతువు, బాధ్యత, విశ్వసనీయతలతో వారు తమ అధికారాలను నిర్వహించాలి. అటువంటప్పుడే రాజ్యంలో రాజకీయ సమానత్వం ఉనికిలో ఉంటుందని చెప్పవచ్చు.

AP Inter 1st Year Civics Study Material Chapter 5 స్వేచ్ఛ - సమానత్వం

రాజకీయ సమానత్వం అనేది ప్రజాస్వామ్య రాజ్యంలో మాత్రమే అమలులో ఉంటుంది. రాజరికం, కులీన పాలన వంటి ఇతర ప్రభుత్వ రకాలలో అది కానరాదు. ఎందుకంటే రాజకీయ వ్యవహారాలలో పౌరులకు ఆ ప్రభుత్వాలు సమానావకాశాలను కల్పించవు.

ప్రశ్న 11.
ఆర్థిక సమానత్వం ప్రాధాన్యత గురించి చర్చించండి.
జవాబు:
ఆర్థిక సమానత్వం (Economic Equality): ఆర్థిక సమానత్వాన్ని సాంఘిక, రాజకీయ సమానత్వాలకు | పునాదిగా పరిగణించడమైంది. ఆధునిక రాజ్య కార్యకలాపాల వెనుక అదొక ముఖ్యమైన చోదకశక్తిగా పనిచేస్తుంది. ఆర్థిక సమానత్వమంటే ఆదాయం, ఆస్తి, సంపదలలో విపరీతమైన వ్యత్యాసాలు లేకుండా చేయడంగా పేర్కొనవచ్చు. ఎర్నెస్ట్ బార్కర్ దృష్టిలో ఆర్థిక సమానత్వం అనేది హోదాకు, పాక్షికంగా ఆస్తి – ఆదాయాలకు సంబంధించిన అంశం. ఆర్థిక సమానత్వాన్ని “సంపదకు చెందిన వ్యత్యాసాలకు తొలగించి ప్రయత్నంగా, ప్రాపంచిక వస్తువులను స్త్రీ పురుషుల మధ్య సమానంగా పంపిణీచేయాల్సిన ప్రయత్నంగా లార్డ్స్ భావించాడు. ఇక ప్రొఫెసర్ లాస్కి “పారిశ్రామిక ప్రపంచంలో విశృంఖలమైన, బాధ్యతారహిత ఇచ్ఛను భావించాడు. అదేసమయంలో ఆర్థిక సమానత్వమనేది సమాన ఆదరణ, ప్రతిఫలంగా భావించరాదు. వ్యక్తులు తగిన పనిని పొందే అవకాశం ద్వారా జీవనభృతిని సంపాదించుకొని, తమ ఆర్థిక హోదాను పెంపొందించుకొనేందుకు అది సంకేతంగా ఉంటుంది. అనేక సామ్యవాద దేశాలు ఆర్థిక సమానత్వ సాధనకు ప్రయత్నించి పాక్షికంగా విజయవంతమైనాయి.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
స్వేచ్ఛకు చెందిన ఏవైనా రెండు నిర్వచనాలను పేర్కొనండి.
జవాబు:

  1. హెచ్.జె.లాస్కీ: “వ్యక్తులు వారంతటవారు ఉత్తమమైన అవకాశాలను పొందగలిగి, నిర్వహించుకోగల వాతావరణమే స్వేచ్ఛ”.
  2. మాంటెస్క్యూ: “వ్యక్తులు సంకల్పించుకొని, సాధించగలిగే శక్తియే స్వేచ్ఛ.”

ప్రశ్న 2.
స్వేచ్ఛ యొక్క సకారాత్మక ధృక్పథాన్ని తెలపండి.
జవాబు:
సకారాత్మక ధృక్కోణం (Positive Aspect): సకారాత్మక ధృక్కోణంలో స్వేచ్ఛ అనేది వ్యక్తి తన అభీష్టం మేరకు నడుచుకొంటూ ఇతరులు కూడా తనవలె నడుచుకోవాలనే పరిస్థితిని సూచిస్తుంది. వేరొక మాటలో చెప్పాలంటే, ఇతరులకు హాని కలిగించని అధికారమే స్వేచ్ఛ అనే ధృక్కోణాన్ని సూచిస్తుంది. టి.హెచ్. గ్రీన్ అనే ఆదర్శ తత్త్వవేత్త ఈ రకమైన స్వేచ్ఛా ధృక్కోణాన్ని ప్రతిపాదించాడు. “ఇతరులతో సమానంగా ఆనందంతో ఏదైనా చేసి అనుభవించేందుకు గల అధికారమే స్వేచ్ఛ” గా అతడు భావించాడు.

ప్రశ్న 3.
స్వేచ్ఛకు చెందిన ఏవైనా నాలుగు లక్షణాలను పేర్కొనండి.
జవాబు:

  1. మానవీయ వ్యక్తిత్వాల సాధనకు అత్యంత ఆవశ్యకమైంది.
  2. స్వేచ్ఛ ఒక శక్తిమంతమైన భావన. దాని వ్యాఖ్యానమనేది స్థలం, కాలం, ప్రాంతం, ప్రజల ఆకాంక్షలను బట్టి ఉంటుంది.
  3. వ్యక్తుల ఆకాంక్షలను సదా వాస్తవం చేయడమే స్వేచ్ఛలక్ష్యం అవుతుంది.
  4. నిర్హేతుకమైన ఆంక్షలకు బదులు నిరంతరం సానుకూల పరిస్థితులను కలిగి ఉండటమే స్వేచ్ఛ.

AP Inter 1st Year Civics Study Material Chapter 5 స్వేచ్ఛ - సమానత్వం

ప్రశ్న 4.
స్వేచ్ఛలోని నాలుగు రకాలను ఉదహరించండి.
జవాబు:
స్వేచ్ఛలోని నాలుగు రకాలు:

  1. సహజ స్వేచ్ఛ
  2. పౌర స్వేచ్ఛ
  3. రాజకీయ స్వేచ్ఛ
  4. ఆర్థిక స్వేచ్ఛ.

ప్రశ్న 5.
పౌర స్వేచ్ఛ అంటే ఏమిటి ? [Mar. 2017]
జవాబు:
పౌర స్వేచ్ఛ (Civil Liberty): పౌరస్వేచ్ఛను వ్యక్తిగత స్వేచ్ఛ అని కూడ అంటారు. ఇది సామాజిక సంస్థలోని సభ్యుడైన వ్యక్తి జీవనంలోని స్వాతంత్య్రాన్ని తెలియజేస్తుంది. పౌరస్వేచ్ఛలో కింద పేర్కొన్న మూడు అంశాలు ఇమిడి ఉంటాయని బార్కర్ పేర్కొన్నాడు. 1) సంచార స్వేచ్ఛను సూచించే భౌతిక స్వాతంత్ర్యం ii) ఆలోచన, అభివ్యక్తి, విశ్వాసాన్ని కలిగి ఉండే భౌద్ధిక స్వాతంత్ర్యం, iii) నిజజీవితంలోని ఆచరణాత్మక ఐచ్ఛిక స్వాతంత్య్రం. పౌర స్వేచ్ఛ అనేది మిగతా స్వేచ్ఛలకు ప్రాతిపదికగా ఉంటుంది. సహజ స్వేచ్ఛకు ఇది విరుద్ధమైంది. సమాజంలోని పౌరులు దానిని అనుభవిస్తారు. ఒంటరిగా ఉంటున్న వ్యక్తులకిది ఆవశ్యకమైనది సమాజంలోని ప్రతిఒక్కరూ ప్రాపంచిక విషయాలను ఉమ్మడిగా అనుభవించ గలిగినప్పుడే పౌర స్వేచ్ఛ వాస్తవమవుతుంది.

“రాజ్యం చేత గుర్తించబడి అమలయ్యే హక్కుల సముదాయమే పౌర స్వేచ్ఛ” అని గెటిల్ పేర్కొన్నాడు.

పౌర స్వేచ్ఛ అనేది అనేక హక్కుల రూపంలో ఉంటుంది. అవి (i) జీవించే హక్కు (ii) పనిచేసే హక్కు (iii) ఆస్తి హక్కు (iv) వాక్ స్వాతంత్య్రం, భావవ్యక్తీకరణ, సమావేశ, సంచార, స్థిర నివాసపు హక్కులు మొదలైనవి.

ప్రశ్న 6.
రాజకీయ స్వేచ్ఛ గురించి రాయండి.
జవాబు:
రాజకీయ స్వేచ్ఛ (Political Liberty): రాజకీయ స్వేచ్ఛ పౌరులు రాజకీయాంశాలలో పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. ఈ రకమైన స్వేచ్ఛ పౌరులకు రాజ్య కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనే శక్తినిస్తుందని లాస్కీ పరిగణించాడు. రాజకీయ స్వేచ్ఛను ప్రజాస్వామ్యానికి పర్యాయపదంగా గిల్ క్రిస్ట్ భావించాడు. రాజకీయ స్వేచ్ఛ అంటే ఎవరికి వారు
తమ ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకొనే రాజ్యాంగ స్వేచ్ఛగా లీకాక్ వర్ణించాడు. రాజకీయ స్వేచ్ఛ పౌరులకు మాత్రమే పరిమితమైంది. అది సంవర్ధక స్వభావాన్ని కలిగి ఉంటుంది. రాజకీయ స్వేచ్ఛ పౌరులకు రాజకీయాంశాలలో వివిధ హక్కులను కల్పిస్తుంది. అటువంటి వాటిలో 1) ఓటు వేసే హక్కు ii) ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీ చేసేహక్కు iii) ప్రభుత్వ పదవులను చేపట్టే హక్కు iv) విమర్శించే హక్కువంటివి ఉన్నాయి. విద్య, నిజాయితీ, నిష్పక్షపాతమైన పత్రికలు మొదలైనవి ఉన్నప్పుడే రాజకీయ స్వేచ్ఛ వాస్తవం అవుతుందని లాస్కీ నొక్కి చెప్పాడు.

AP Inter 1st Year Civics Study Material Chapter 5 స్వేచ్ఛ - సమానత్వం

ప్రశ్న 7.
సంపూర్ణ ఆర్థిక స్వేచ్చ సాధన సాధ్యమేనా అన్న విషయాన్ని తెలపండి.
జవాబు:
సంపూర్ణ ఆర్థిక స్వేచ్ఛసాధన ఈ క్రింది చర్యల ద్వారా సాధ్యమవుతుంది. అవి 1) కనీస వేతనాలను అందించటం 2) పనిహక్కుకు భరోసా కల్పించటం 3) నిరుద్యోగం, అనారోగ్యం వంటి అభద్రతల నుండి కార్మికులను రక్షించటం 4) తగినంత విశ్రాంతిని కల్పింటం 5) పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు ప్రాతినిధ్యం కల్పించటం.

ప్రశ్న 8.
ఆర్థిక స్వేచ్ఛ అంటే ఏమిటి ? [Mar. 2016]
జవాబు:
ఆర్థిక స్వేచ్ఛ (Economic Liberty): ఆర్థిక స్వేచ్ఛ అంటే ప్రతిఒక్కరూ తమ జీవనోపాధిని తామే సంపాదించుకోగలగడం. ఒక వ్యక్తి తన రోజువారీ ఆహారాన్ని హేతుబద్ధంగా సంపాదించుకొనే భద్రమైన అవకాశమే ఆర్థికస్వేచ్ఛగా లాస్కీ అభివర్ణించాడు. కోరిక – భయము, ఆకలి – పస్తులు, నిరద్యోగం – అసంపూర్ణతల నుంచి విముక్తి కలిగించేదే ఆర్థిక స్వేచ్ఛ. ఇది ఆర్థిక సంబంధమైన లేమి లేదా అభద్రతల నుంచి స్వాతంత్ర్యాన్ని సూచిస్తుంది. ఆర్థిక స్వేచ్ఛలేని ప్రజాస్వామ్యం అర్థరహితమైంది.

ఈ దిగువ పేర్కొన్న చర్యల అమలు ద్వారా ఆర్థిక స్వేచ్ఛను పొందవచ్చు.

  1. కనీస వేతనాలను అందించడం.
  2. పనిహక్కుకు భరోసా కల్పించడం.
  3. నిరుద్యోగం, అనారోగ్యం వంటి వివిధ రకాల అభద్రతల నుంచి కార్మికులను రక్షించడం.
  4. తగినంత విశ్రాంతిని కల్పించడం.
  5. పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు ప్రాతినిధ్యం కల్పించడం.

ప్రశ్న 9.
జాతీయ స్వేచ్ఛ గురించి తెలపండి.
జవాబు:
జాతీయ స్వేచ్ఛ (National Liberty): జాతీయ స్వేచ్ఛ అంటే రాజ్యం – స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కలిగి ఉండడంగా పేర్కొనవచ్చు. రాజ్యపు సార్వభౌమత్వాన్ని అది సూచిస్తుంది. ప్రతి రాజ్యం ఈ స్వేచ్ఛను అనుభవిస్తూ ఇతర రాజ్యాల ఆధిపత్యానికి లోనుగాకుండా ఉంటుంది. అన్ని రంగాలలో జాతి అభివృద్ధికి ఈ స్వేచ్ఛ ఆవశ్యకమైంది. ప్రాచీనకాలం నుంచి అనేక దేశాల్లో ఇది విశదమైంది. ఈ రకమైన స్వేచ్ఛను పొందడం కోసం అనేకదేశాలు ఎంతగానో ప్రయత్నించాయి. గతంలో టర్కీ ప్రజలకు వ్యతిరేకంగా గ్రీకులు స్వాతంత్య్ర సమరం సాగించారు. అట్లాగే మహాత్మాగాంధీ నాయకత్వంలో భారత ప్రజలు బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం కోసం అహింసాయుత పోరాటం చేశారు. జాతీయ స్వేచ్ఛ ఎంతో విలువైంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 5 స్వేచ్ఛ - సమానత్వం

ప్రశ్న 10.
స్వేచ్ఛకు గల ఏవైనా నాలుగు పరిరక్షణలను పేర్కొనండి.
జవాబు:
స్వేచ్ఛకు గల నాలుగు పరిరక్షణలు

  1. ప్రజాస్వామ్య పాలన
  2. లిఖిత మరియు దృఢ రాజ్యాంగం
  3. స్వతంత్ర న్యాయవ్యవస్థ
  4. సమన్యాయపాలన.

ప్రశ్న 11.
స్వేచ్ఛా పరిరక్షణగా స్వతంత్ర న్యాయశాఖను గురించి వ్రాయండి.
జవాబు:
వ్యక్తి స్వేచ్ఛకు పరిరక్షణయే స్వతంత్ర, నిష్పాక్షిక న్యాయవ్యవస్థ. న్యాయవ్యవస్థ రాజ్యాంగాన్ని సమర్థించి, ప్రభుత్వం ప్రజలకు బాధ్యత వహించేటట్లు చూస్తుంది. పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడేందుకు వివిధ రక్షణలను సూచిస్తుంది. కావున స్వేచ్ఛ పరిరక్షించబడటానికి స్వతంత్ర న్యాయశాఖ అత్యంత అవసరం అని రాజనీతిజ్ఞులు భావిస్తారు.

ప్రశ్న 12.
సమానత్వం అంటే ఏమిటి ?
జవాబు:
సమానత్వం ఆధునిక కాలంలో ఒక ప్రథాన ఆశయం. అది ప్రజాస్వామ్య ఆదర్శం. మానవులంతా పుట్టుకతో సమానులని కొందరు నమ్మారు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ వ్యవహారాలలో ప్రజలందరికి జాతి, మత, కుల, లింగ, భాష, ప్రాంతీయ, వర్ణ, వర్గ భేదాలు లేకుండా సమానావకాశాలు ఉండటమే సమానత్వము. సమానత్వం అంటే (i) ఏ అడ్డంకులు లేకుండా ప్రతి వ్యక్తి వికాసం పొందడం (ii) శాసనాలు పాలనలలో వ్యక్తుల మధ్య భేదం లేకుండా చేయడం (iii) చట్ట ప్రకారం లభించే హక్కులు సమానంగా లభించడం.

ప్రశ్న 13.
సమానత్వంలోని వివిధ సూచితార్థాలను పేర్కొనండి.
జవాబు:

  1. ఏ వ్యక్తికి లేదా వ్యక్తుల సమూహానికి ఎటువంటి అదనపు సౌకర్యాలు ఉండరాదు.
  2. తమ వ్యక్తిత్వాలను అభివృద్ధి చేసుకొనుటకు సరిపడినన్ని అవకాశాలు వ్యక్తులకు ఉండాలి.
  3. వ్యక్తుల మధ్య కులం, మతం, రంగు, జన్మస్థలం వంటి వివక్షలు ఉండరాదు. అయితే కొన్ని న్యాయ సమ్మతమైన కారణాల వల్ల రక్షిత వివక్షను పాటించవచ్చు.

AP Inter 1st Year Civics Study Material Chapter 5 స్వేచ్ఛ - సమానత్వం

ప్రశ్న 14.
సంపూర్ణ సమానత్వపు దృక్పథాలేవి ?
జవాబు:
సంపూర్ణ సమానత్వానికి రెండు దృక్పథాలున్నాయి. అవి 1) సకారాత్మక దృక్పథం 2) నకారాత్మక దృక్పథం. సమానత్వం అంటే అందరికి తగినన్ని అవకాశాలను కల్పించాలి అని సకారాత్మక దృక్పథం సూచిస్తుంది. కులం, మతం, రంగు, పుట్టుక, ప్రాంతం వంటి కృత్రిమ కారణాలతో ఎటువంటి వివక్షతను పాటించరాదని నకారాత్మక దృక్పథం సూచిస్తుంది.

ప్రశ్న 15.
సమానత్వం లక్షణాలలో రెండింటిని గురించి రాయండి.
జవాబు:

  1. సమానత్వం ప్రకృతి ప్రసాదించింది కాదు. తిరుగులేని సమాతన్వం ఎక్కడా కనిపించదు.
  2. సమానత్వం నిరపేక్షమైనదికాదు. నిరపేక్ష సమానత్వం సాకారమయ్యేదికాదు. అభిలాషించేదికాదు. చరిత్రలో ఏ కాలంలోనూ వ్యక్తులు తిరుగులేని సమానత్వాన్ని కోరలేదు. కాబట్టి సమానత్వానికి అర్థం ఏకరూపత కాదు.

ప్రశ్న 16.
సమానత్వపు వివిధ రకాలను తెలపండి.
జవాబు:
సమానత్వపు వివిధ రకాలు

  1. సహజ సమానత్వం
  2. సాంఘిక సమానత్వం
  3. ఆర్థిక సమానత్వం
  4. రాజకీయ సమానత్వం
  5. అంతర్జాతీయ సమానత్వం.

ప్రశ్న 17.
సహజ సమానత్వాన్ని వివరించండి. [Mar. 2016]
జవాబు:
సహజ సమానత్వం (Natural Equality): సహజ సమానత్వం అంటే అన్ని రకాల అవరోధాలు, సాంఘిక కట్టుబాట్ల నుంచి స్వాతంత్ర్యాన్ని పొందడం. దీని అర్థం వ్యక్తి పరిధిలో ఎటువంటి ఆంక్షలు ఉండకపోవడం. సహజ సమానత్వం గురించి థామస్ హాబ్స్ ప్రతిపాదించిన సామాజిక ఒడంబడిక సిద్ధాంతంలో పేర్కొనడమైంది. పౌర సమాజం ఆవిర్భవించక ముందే ప్రజలు ప్రాకృతిక వ్యవస్థలో జీవించారని ఈ సిద్ధాంతం పేర్కొన్నది. అసమానతలు, బంధనాలకు నాగరికత దారితీసిందని హాబ్స్ ఉద్ఘాటించాడు. గ్రీకు రోమన్ రాజకీయ తత్త్వవేత్తల రచనలలో ఈ భావం కనపడుతుంది.

ప్రశ్న 18.
సాంఘిక సమానత్వం అంటే ఏమిటి ? [Mar. 2017]
జవాబు:
వర్గ వ్యత్యాసాలు లేకపోవడం, సమానమైన హోదాను కలిగి ఉండటాన్ని సాంఘిక సమానత్వం సూచిస్తుంది. ఏ వ్యక్తి మతం, వర్గం, వర్ణం, లింగం, పుట్టుక మొదలగు అంశాల ఆధారంగా వివక్షతకు గురికాకుండా ఉంటే సాంఘిక సామానత్వం నెలకొంటుంది. సమాజంలో పౌరులందరినీ సమానమైనవారుగా సాంఘిక సమానత్వం భావిస్తుంది. పౌరులందరూ సమానమైన సాంఘిక, రాజకీయ, ఆర్థిక, చట్టపరమైన హక్కులను అనుభవించేందుకు వీలు కల్పించే సమానత్వాన్నే సాంఘిక సమానత్వం అని అంటారు.

AP Inter 1st Year Civics Study Material Chapter 5 స్వేచ్ఛ - సమానత్వం

ప్రశ్న 19.
రాజకీయ సమానత్వం అంటే ఏమిటి ? [Mar. 2018]
జవాబు:
రాజకీయ సమానత్వం (Political Equality): రాజకీయ సమానత్వం రాజకీయ కార్యకలాపాలలో ప్రజలకు చాలినన్ని అవకాశాలను కల్పించేందుకు అనుకూల పరిస్థితులను సూచిస్తుంది. రాజ్యంలోని పౌరులకు వివిధ రకాల రాజకీయ హక్కులను ప్రసాదించడం ద్వారా ఆ రకమైన సమానత్వాన్ని సాధించవచ్చు. ఈ సందర్భంలో రాజకీయ సమానత్వాన్ని పౌరులు మాత్రమే అనుభవిస్తారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రాజ్యంలో నివసించే అన్యులు, విదేశీయులకు ఇది వర్తించదు. ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేసేందుకు రాజకీయ సమానత్వమన్నది అత్యంత ఆవశ్యకమైంది. వివిధ రాజకీయ హక్కులను ప్రసాదించినప్పుడే పౌరులు రాజకీయ స్వేచ్ఛను అనుభవిస్తారు. అంటే, రాజకీయ సమానత్వమనేది రాజకీయ స్వేచ్ఛకు పర్యాయపదంగా భావించవచ్చు.

ప్రశ్న 20.
ఆర్థిక సమానత్వ సాధనకై చేపట్టే చర్యలను పేర్కొనండి.
జవాబు:
ఈ దిగువ పేర్కొన్న చర్యలను చేపట్టడం ద్వారా ఆర్థిక సమానత్వాన్ని సాధించవచ్చు.

  1. ఆస్తి, సంపద మరియు ఆదాయాలలో ఉన్న విపరీతమైన వ్యత్యాసాలను తొలగించాలి.
  2. ప్రాపంచిక వస్తువులను స్త్రీ, పురుషుల మధ్య సమానంగా పంపిణీ చేయాలి.
  3. వ్యక్తులకు వారికి తగిన పనిని పొంది, జీవనభృతిని సంపాదించుకొని, తమ ఆర్థిక హోదాను పెంపొందించుకొనేలా అవకాశాలను కల్పించాలి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Zoology Study Material 8th Lesson జీవావరణం – పర్యావరణం Textbook Questions and Answers.

AP Inter 1st Year Zoology Study Material 8th Lesson జీవావరణం – పర్యావరణం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జీవావరణాన్ని నిర్వచించండి. (జీవావరణ శాస్త్రం నిర్వచించండి)
జవాబు:
జీవావరణ శాస్త్రం (Ecology) అనేపదం గ్రీకు భాషనుండి గ్రహించబడినది.

జీవులకు, పరిసరాలకు మధ్యగల సంబంధాన్ని తెలిపే విజ్ఞాన శాస్త్ర విభాగాన్ని జీవావరణశాస్త్రం’ అని ఎర్నెస్ట్వెక్ల్ నిర్వచించారు.

ప్రశ్న 2.
జీవావరణ జనాభా అంటే ఏమిటి?
జవాబు:
ఒక నిర్ధిష్ట ప్రదేశంలో నివసించే ఒకేజాతికి చెందిన జీవుల సమోహాన్ని ఒక ‘జీవావరణ జనాభా’ అంటారు.

ప్రశ్న 3.
జీవ సమాజాన్ని నిర్వచించండి.
జవాబు:
ఒక ప్రాంతంలో ఉంటే వివిధ జాతుల జనాభాను మొత్తాన్ని జీవ సమాజంగా చెప్పవచ్చును. దీనిలో ఉత్పత్తి దారులు, వినియోగదారులు, విచ్ఛినకారులు అందరు చర్య ప్రతిచర్య జరుపుతూ జీవిస్తారు.

ప్రశ్న 4.
జీవావరణ వ్యవస్థ అంటే ఏమిటి?
జవాబు:
జీవ సమాజం తరువాత స్థాయి జీవావరణ వ్యవస్థ (Ecosystem) ఇది జీవగోళం యొక్క క్రియాత్మక ప్రమాణం దీనిలో జీవులు ఒక వైపు తమలో తాము, మరొకవైపు పరిసరాలతోను అంతరచర్యలు జరుపుతాయి.

ప్రశ్న 5.
జీవావరణ వ్యవస్థ, జీవ మండలాల మధ్య వ్యత్యాసాన్ని చూపండి.
జవాబు:

జీవావరణ వ్యవస్థజీవ మండలం
ఇది ఒక నిర్ధిష్ట ప్రాంతానికి చెందని జీవవ్యవస్థ. దీనిలో జీవ జాతులు, భౌగోళిక పరిస్థితులు నిర్ధిష్టంగా ఉంటాయి.ఇది భూతల ప్రకృతి భౌమిక ప్రమాణంగానే సహజ సరిహద్దులతో కూడిన వివిధ రకాల జీవావరణ వ్యవస్థలను కలిగి ఉంటుంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 6.
జీవ మండలం అంటే ఏమిటి? మీరు చదివిన ఏవైనా రెండు జీవ మండలాల పేర్లు రాయండి.
జవాబు:
ఒక విశాల ప్రాంతంలో జీవించే మొక్కలు, జంతువులు సమూహాన్ని జీవమండలం అంటారు.
ఉదా : ఉష్ణమండల వర్ష అరణ్యాలు, ఎడారులు, కోనిఫెరస్ అరణ్యాలు, టండ్రాలు మొదలగునవి.

ప్రశ్న 7.
జీవ గోళం అంటే ఏమిటి?
జవాబు:
భూమండలంలోని అన్ని రకాల ఆవాసప్రాంతాలన్నీ సంయుక్తంగా జీవ గోళం లేదా ఇకోస్ఫియర్ లేదా బయోస్ఫియర్ అంటారు.

ప్రశ్న 8.
ఒక జీవి ఆవాసం, నిచేల మధ్య భేదాన్ని తెలపండి.
జవాబు:
ఆవాసం ఒక జీవి నివసించే ఒక నిర్థిష్ట ప్రాంతాన్ని ఆవాసం అంటారు. నిచే ఒక సమాజంలో జీవులు నిర్వహించే క్రియాత్మక పాత్రను నిచే (Niche) అంటారు.

ప్రశ్న 9.
జీవసమాజంలో కంటే జనాభాలో జన్యు సారూప్యం గల జీవులు అధికంగా ఉంటాయి. వివరించండి.
జవాబు:
జీవ సమాజం అనగా ఒక నిర్ధిష్ట ప్రాంతంలో వివిధ జాతుల జీవులు కలిసి జీవించడాన్ని జీవ సమాజంఅంటారు. దీనిలో జీవ జాతులు చాలా వైవిధ్యాలు కలిగి ఉంటాయి.

జనాభా :
ఒక నిర్దిష్ట ప్రాంతంలో నివసించే ఒక జాతి జీవుల సమూహాన్ని ఆ జాతి జనాభా అంటారు. ఒకజాతి ఒకేరకమైన జన్యువులను పంచుకుంటాయి.

ప్రశ్న 10.
అంటార్కిటిక్ జలాలలోని చేపలు తమ జీవ ద్రవాలను గడ్డకట్టకుండా ఏవిధంగా చూసుకొంటాయి?
జవాబు:
మిలియన్ల కొద్ది జరిగిన జీవ పరిణామక్రమంలో చేపల వంటి జీవులు అననుకూల పరిస్థితులలో (నీరు గడ్డకట్టినపుడు) కూడా జీవించడానికి అనుకూలంగా తమ దేహ బాహ్య, అంతర రూపాలలో అనుకూలతను సాధించాయి. జీవరసాయన అనకూలత వల్ల మరియు మంచు పొరక్రియ బొరియలు చేసుకుని సుప్తావస్థలో గడుపుతాయి.

ప్రశ్న 11.
ఎత్తైన పర్వతాలను ఎక్కినపుడు మీ శరీరం ఆల్టిట్యూడ్ సిక్నెస్ సమస్యను ఏవిధంగా పరిష్కరిస్తుంది?
జవాబు:
ఎత్తైన పర్వతాలను ఎక్కినపుడు ఏర్పడే ఆల్టిట్యూడ్ సిక్నెస్ సమస్య శరీరం ఎర్రరక్తకణాలపై ఉత్పత్తిని పెంచడం, శ్వాసక్రియా రేటుపెంచడం మరియు హీమోగ్లోబిన్ బంధన సామర్థ్యాన్ని కణ స్థాయిలలో తగ్గించడం ద్వారా తక్కువ ఆక్సిజన్ లభ్యతను భర్తీచేస్తుంది.

ప్రశ్న 12.
జంతువుల వర్ణకాలపై కాంతి ప్రభావం ఏమిటి?
జవాబు:
జంతువుల దేహరణంపై కాంతి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. తక్కువ కాంతిలో నివసించే జంతువులు లేత వర్ణంలోను, ఎక్కువ కాంతిలో నివసించే జంతువు గాఢ వర్ణంలో ఉంటాయి.

ప్రశ్న 13.
కాంతి గతిక్రమం, (Phototaxis) కాంతి అనుగమనం (Photokinesis) మధ్య భేదాలను తెలపండి.
జవాబు:
కాంతి గతిక్రమం :
కాంతి గతిక్రమం లేదా కాంతి అనుచలనం, కాంతి మార్గానికి అనుగుణంగా లేదా వ్యతిరేకదిశలో జీవులు చూపే దిగ్విన్యాసాన్ని కాంతి అనుచలనం అంటారు.
ఉదా : యుగ్లీనా ధనాత్మక అనుక్రియ.

కాంతి అనుగమనం :
జీవుల నిర్ధిష్ట చలనం మీద కాంతి కలుగజేసే ప్రభావాన్ని కాంతి అనుగమనం అంటారు.
ఉదా : మాసెల్ పీత డింభకాల చలనం కాంతి తీవ్రత వలన వేగవంతమవుతుంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 14.
సర్కేడియన్ లయలు అంటే ఏమిటి?
జవాబు:
24 గం|| కాలచక్రంలో ఏర్పడే జీవలయలను సర్కేడియన్ లయలు అంటారు.

ప్రశ్న 15.
కాంతి ఆవర్తిత్వం అంటే ఏమిటి?
జవాబు:
ఒక రోజులో లభించే కాంతి కాలాన్ని కాంతి వ్యవధి అంటారు. కాంతి వ్యవధికి అనుగుణంగా జీవి చూపే స్పందన చర్యలను కాంతి కాలావధి లేదా కాంతి ఆవర్తిత్వం అంటారు.

ప్రశ్న 16.
ఫోటోపీరియడ్, సందిగ్ధ(కీలక) ఫోటోపీరియడ్ మధ్యభేదాలను రాయండి.
జవాబు:
పోటోపీరియడ్ :
ఒకరోజులో లభించే కాంతి బలాన్ని ఫోటోపీరియడ్ లేదా కాంతివ్యవధి అంటారు.

సందిగ్ధ పోటోపీరియడ్ :
వివిధ ఋతువులలో జీవులలో కలిగే సంఘటనలు ప్రేరేపించడానికి అవసరమయ్యే కాంతి వ్యవధిని సందిగ్ధ కాంతి కాలం లేదా సందిగ్ధ పోటోపీరియడ్ అంటారు.

ప్రశ్న 17.
కొన్ని UV కిరణాల వల్ల మనం పొందే లాభాలు తెలపండి. [Mar. ’14]
జవాబు:
కొన్ని అతినీలలోహిత కిరణాలు (UV కిరణాలు) జంతువుల దేహం పైగల సూక్ష్మజీవులను నశింపజేస్తాయి. కొన్ని UV కిరణాలు క్షీరదాలు చర్మంలో గల స్టిరాల్స్న విటమిన్ D గా మార్చడంలో సహాయపడతాయి.

ప్రశ్న 18.
భ్రమణ రూప విక్రియ (Cyclomorphosis) అంటే ఏమిటి? డాఫ్నియాలో దాని ప్రాముఖ్యం వివరించండి.
జవాబు:
కొన్ని జంతువులలో రుతువులను బట్టి వాటి శరీర ఆకృతిలో మార్పులు ఏర్పడతాయి. ఈ దృగ్విషయాన్ని భ్రమణ రూప విక్రియ అంటారు.

డాఫ్నియా (వాటర్ ఫ్లీ) లో ఈ విషయాన్ని గమనించవచ్చు. దీని తలపై రుతువులకు అనుగుణంగా హెల్మెట్ వంటి నిర్మాణం అభివృద్ధి చెందటం తగ్గి పోవడం జరుగుతుంది. ఇది సరస్సులోని నీటి సాంద్రతలో సంభవించే మార్పులకు అనుగుణంగా జరుగుతుందని భావిస్తారు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 19.
నియంత్రకాలు (Regulators) అంటే ఏమిటి?
జవాబు:
జీవులు శరీరధార్మిక చర్యల ద్వారా సమస్థితిని సాధించి, దేహ ఉష్ణోగ్రతను, ద్రవాభిసరణ గాఢతలను స్థిరంగా ఉంచుకుంటాయి. వీటినే నియంత్రకాలు అంటారు.
ఉదా : క్షీరదాలు, పక్షులు

ప్రశ్న 20.
ద్రవాభిసరణ అనువర్తనకారులు (Conformers) అంటే ఏమిటి?
జవాబు:
జలచర జీవులలో పరిసర ప్రాంత నీటి గాఢతను బట్టి శరీర ద్రవాల ద్రవాభిసరణ గాఢత మారుతుది. అటువంటి జీవులను ద్రవాభిసరణ అనువర్తకాలు లేదా ద్రవాభిసరణ అనురూపకాలు అంటారు.

ప్రశ్న 21.
సహభోజకత్వాన్ని (Commensalism) నిర్వచించండి. ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
రెండు వేర్వేరు జాతుల జీవుల మధ్య ఏర్పడే సన్నిహిత సంబంధం (అంతరచర్యలు) లో ఒక జీవి లాభం పొందుతుంది. రెండవ జీవి దానికి లాభం కాని, నష్టం కాని ఉండదు. ఇటువంటి అంతర చర్యలను సహభోజకత్వం అంటారు.
ఉదా : బర్నాకిల్ అనే చిన్న చేప తిమింగలంపై అంటుకొని ప్రయాణిస్తుంది. దీనివలన తిమింగలానికి లాభం కాని, నష్టంకాని లేదు.

ప్రశ్న 22.
అన్యోన్యాశ్రయ సహజీవనాన్ని (Mutualism) నిర్వచించండి. ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
వేరువేరు జాతి జీవుల మధ్య సహజీవనం (అంతర చర్యలు)లో రెండు జీవులు లబ్ధిపొందుతాయి. ఇటువంటి సహజీవనాన్ని ‘అన్యోన్యాశ్రయ సహజీవనం’అంటారు.
ఉదా : లైకెన్స్ – దానిలో ఫంగస్ ఆల్గె సహజీవన చేస్తాయి.
ఉదా : చెదపురుగు జీర్ణవ్యవస్థ ట్రైకోనిఫా. ప్రోటోజోవన్ అంతర పరాన్నజీవిగా ఉంటుంది. ఇది చెదపురుగులో సెల్యులోజ్న జీర్ణం చేస్తుంది. చెదపురుగు దీనికి ఆశ్రయమిస్తుంది.

ప్రశ్న 23.
ఎమెన్సాలిజమ్ (Amensalism) అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఎమెన్సాలిజమ్ అనేఅంతర చర్యల వల్ల ఒకజీవి నష్టపోతుంది. రెండవజీవిపై ఎటువంటి ప్రభావం ఉండదు.

ప్రశ్న 24.
జాత్యంతర పోటీ (Interspecific competition) అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
భిన్నజాతుల జీవుల మధ్య అందుబాటులోగల ఒకే రకమైన వనరుకోసం పోటీ ఉంటుంది. ఇటువంటి పోటీని జాత్యంతర పోటీ అంటారు. ఉదాహరణ : దక్షిణ అమెరికాలోని లోతు తక్కువగా ఉండే సరస్సులకు తరచుగా వేచే ఫ్లెమింగో పక్షులకు, అక్కడి చేపలకు ఒకే రకమైన ఆహారం జంతుప్లవకాల కోసం పోటీ ఉంటుంది.

ప్రశ్న 25.
కమోఫ్లేజ్ (Camouflage) అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యం ఏమిటి?
జవాబు:
కొన్ని కీటకాలు, కప్పలు పరిసరాల రంగుతో సరిపోయేలా దేహపు రంగును మార్చుకుంటూ పరభక్షకాల నుండి రక్షించుకుంటాయి. దీనినే కమోప్లేజ్ అంటారు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 26.
గాసె సూత్రం (Gause’s Principle) అంటే ఏమిటి? దాన్ని ఎప్పుడు అన్వయించవచ్చు?
జవాబు:
గాసె సూత్రం :
వనరులు తక్కువగా ఉన్నప్పుడు పోటీతత్వంలో బలమైన జీవులు మిగిలిన జాతులను నిర్మూలిస్తాయి. దీనిని ప్రయోగశాలలో సులువుగా నిరూపించవచ్చును.

ప్రశ్న 27.
మైకోరైజాలో ఉండే సహవాసం ఏమిటి?
జవాబు:
మైకోరైజాలో సహవాసం అన్యోన్యాశ్రయ సహజీవనం కనిపిస్తుంది.

ప్రశ్న 28.
స్థిరజల (Lentic), ప్రవాహజల (Lotic) ఆవాసాల మధ్య భేదాలను తెలపండి.
జవాబు:
స్థిర జల ఆవాసం :
నీరు నిలకడగా ఉండే స్థితిలోని జలాశయంను స్థిర జల (Lentic) జలావాసం అంటారు.
ఉదా : చెరువులు, కొలనులు.

ప్రవాహజల ఆవాసం :
ప్రవహించే స్థితిలోని జలవాసంను ప్రవాహజల (Lotic) జలావాసం అంటారు.
ఉదా : నదులు, కాలువలు

ప్రశ్న 29.
నీటి ఆవరణ వ్యవస్థలో ప్రతీకరణ మండలం (Compensation Zone) అంటే ఏమిటి?
జవాబు:
నీటి ఆవరణ వ్యవస్థలో తీరానికి దూరంగా కాంతి సమర్ధవంతంగా నీటిలోకి ప్రసరించగలిగే ప్రాంతంను ప్రతీకరణ లేదా ప్రతీహర మండలం అంటారు.

ప్రశ్న 30.
వృక్ష ప్లవకాలు, జంతు ప్లవకాల మధ్య భేదాలు రాయండి.
జవాబు:
వృక్ష ప్లవకాలు :
నీటిలో అవలంబితమై ఉండే వృక్ష సంబంధ సూక్షజీవులను వృక్ష ప్లవకాలు అంటారు. ఇవి స్వయం పోషకాలు. తమంత తాము చలించలేవు.
ఉదా : డయాటమ్స్ శైవలాలు, యుగ్లీనాయిడ్స్

జంతు ప్లవకాలు :
నీటిలో అవలంబితమై ఉండే సూక్ష్మ జంతుసంబంధ జీవులను జంతుప్లవకాలు అంటారు. ఇవి కొలనులో ప్రథమ వినియోగదారులు.
ఉదా : డాఫ్నియా, అమీబా, పేరమీషియం.

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 31.
నెక్టాన్ (Nekton), న్యూస్టాన్ (Neuston) ల మధ్య భేదాలను రాయండి.
జవాబు:
నెక్టాన్ :
నీటిలో తమంత తాము చలించగలిగే జీవులను నెక్టాన్ అంటారు. ఉదా : చేపలు, తాబేళ్ళు, కప్పలు, నీటి తేళ్ళు.

న్యూస్టాన్ :
కొలను ఉపరితంలో నీరు, గాలి కలిసేస్థానంలో ఉండే జీవులను న్యూస్టాన్ అంటారు. ఉదా : వాటర్ స్పైడర్స్, బీటిల్స్, దోమ డింబకాలు.

ప్రశ్న 32.
పెరిఫైటాన్ అంటే ఏమిటి?
జవాబు:
జలావరణంలో నీటి మొక్కలను అంటిపెట్టుకొని లేదా పాకుతున్న జీవులకు పెరిఫైటాన్ అంటారు.
ఉదా : హైడ్రాలు, బ్రయోజోవన్స్, టర్బల్లేరియన్స్, కొన్ని కీటక డింబకాలు.

ప్రశ్న 33.
మానవ నిర్మిత (man-made) జీవావరణ వ్యవస్థలకు మూడు ఉదాహరణలు రాయండి.
జవాబు:
మానవ నిర్మిత జీవావరణం:
పంటభూమి జీవావర్ణం, జలసంవర్ధన చెరువులు, ఎక్వేరియం.

ప్రశ్న 34.
ద్రవాభిసర పోషణ అంటే ఏమిటి?
జవాబు:
ముందుగా జీర్ణమైన ఆహారాన్ని శరీర ఉపరితలం ద్వారా తీసుకోవడాన్ని ద్రవాభిసర పోషణ (Osmotrophic Nutrition) అంటారు.

ప్రశ్న 35.
విక్షాళన (Leaching) ప్రక్రియను వివరించండి.
జవాబు:
నీటిలో కరిగే అకర్బన పోషక పదార్థాలు నేలలోకి ఇంకి లభ్యంకాని (వినియోగపడని) లవణ అవక్షేపాలుగా ఏర్పడతాయి. దీనినే విక్షాళనం (Leaching) అంటారు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 36.
PAR అంటే ఏమిటి?
జవాబు:
PAR :
మొక్కలు కిరణజన్య సంయోగ క్రియకు వినియోగార్హమైన వికిరణాన్ని లేదా సౌరశక్తిని PAR అంటారు.

ప్రశ్న 37.
పతన సౌర వికిరణంలో PAR శాతం ఎంత?
జవాబు:
పతన సౌర వికిరణంలో PAR శాతం 50% కంటే తక్కువ.

ప్రశ్న 38.
ఎంట్రోపీని నిర్వచించండి.
జవాబు:
ఉష్ణగతిక శాస్త్రం రెండవ సూత్రం ప్రకారం ఒక వ్యవస్థలోశక్తి మార్పిడికి లోనయ్యే ఏ ప్రక్రియ కూడా శక్తి నష్టం లేకుండా సహజంగా జరగదు. ఈ విధంగా కొంత శక్తి పనిచేయడానికి అందుబాటులో లేని ఉష్ణశక్తి రూపంలో వెలువడుతుంది. దీనినే ఎంట్రోపీ అంటారు.

ప్రశ్న 39.
స్టాండింగ్ క్రాప్ (Standing Crop) అంటే ఏమిటి?
జవాబు:
ఒక నిర్ణీత కాలంలో ప్రతి పోషక స్థాయిలో నిర్ణీత జీవపదార్థ ద్రవ్యరాశి ఉంటుంది. దీనిని స్టాండింగ్ క్రాప్ (Standing Crop) అంటారు.

ప్రశ్న 40.
GPP, NPP పదాలను వివరించండి.
జవాబు:
GPP – Gross primary productivity స్థూల ప్రాథమిక ఉత్పాదకత
NPP – Net Primary Porductivity నికర ప్రాథమిక ఉత్పాదకత.

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 41.
నిటారు, తిరగబడిన జీవావరణ పిరమిడ్ల మధ్య తేడా తెలపండి.
జవాబు:

నిటారు పిరమిడ్స్తిరగబడిన పిరమిడ్స్
1. ఈ పిరమిడ్స్ ఉత్పత్తిదారుల స్థాయి నుండి శక్తి తరువాత స్థాయిలైన వినియోగదారులకు ప్రవాహాన్ని తెలియజేస్తాయి.1. ఇక్కడ ఉత్పత్తి దారులు లేదా ప్రథమస్థాయి వారి సంఖ్య తక్కువగా ఉంటుంది.
2. ఉత్పత్తిదారుల నుండి వినియోగదారుల సంఖ్య ‘తగ్గుతూ పోతుంది.
ఉదా : మేసే ఆహారపు గొలుసు
2. ఇది ప్రథమస్థాయి నుండి పైకి పోయిన కొలది జీవుల సంఖ్య పెరగడాన్ని చూసిస్తుంది.
ఉదా : పరాన్నజీవుల ఆహారపు గొలుసు

ప్రశ్న 42.
ఆహారగొలుసు, ఆహార జాలకాల మధ్య భేదాలు తెలపండి.
జవాబు:
ఆహారపు గొలుసు :
ఆహారశక్తి ఒక పోషణస్థాయి (ఉత్పత్తిదారులు) నుండి మరొక పోషణస్థాయి (వినియోగదారులకు) బదిలీ అయ్యే మార్గాన్ని నిలువుగా తీసుకుంటే వీటి మధ్యసంబంధాలు ఒక గొలుసులా ఉంటాయి. దీనిని ఆహారపు గొలుసు అంటారు.
ఉదా : మేసే ఆహారపు గొలుసు

ఆహార జాలకం :
ఆహారశక్తి ఒక పోషణ స్థాయినుండి (ఉత్పత్తిదారులు) నుండి మరొక పోషణ స్థాయికి (వినియోగదారులు) బదిలీ అయ్యే మార్గంలో వివిధ పోషణ స్థాయిలలోని జీవులు వేరు వేరు ఆహారపు అలవాట్లను కలిగి ఉంటే ఆహార శక్తి ప్రసరణ మార్గాన్ని తెలిపే రేఖాచిత్రం ఒక వలలా ఉంటుంది. దీనినే ఆహార జాలకం అంటారు.

ప్రశ్న 43.
లిట్టర్, డెట్రిటన్ల మధ్య భేదాలు తెలపండి.
జవాబు:
లిట్టర్ :
లిట్టర్ అంటే మృతజీవులు దేహ పదార్థంతో ఏర్పడిన ఒక రకమైన కర్బన సంబంధ ఎరువు. ఇది డెట్రయిటస్ ఆహారపు గొలుసులో ప్రధాన ఆహార వనరుగా ఉంటుంది.

డెట్రిటస్ :
ఇది కుళ్ళుతున్న కర్బన సంబంధ పదార్థం. ఇది విచ్ఛిన్న కారులచే విచ్ఛిన్నం చేయబడుతుంది.

ప్రశ్న 44.
ప్రాథమిక, ద్వితీయ ఉత్పాదకత మధ్య భేదాలను తెలపండి.
జవాబు:
ప్రాథమిక ఉత్పాదకత :
నిర్ణీత కాలంలో, నిర్ణీత వైశాల్యంలో మొక్కలలో ఉత్పత్తి చేయబడిన కర్బన పదార్థాన్ని లేదా జీవ ద్రవ్యరాశి మొత్తాన్ని ప్రాథమిక ఉత్పాదకత అంటారు.

ద్వితీయ ఉత్పాదకత :
ఉత్పత్తిదారుల నుండి గ్రహించిన పదార్థాలనుండి వినియోగదారులు కొత్తగా కర్బన పదార్థాలను ఏర్పరచే రేటును ద్వితీయ ఉత్పాదకత అంటారు.

ప్రశ్న 45.
ఆమ్ల వర్షాలకు కారకాలైన వాయు కాలుష్యాలు ఏమిటి?
జవాబు:
వాయు కాలుష్యకారకాలైన సల్ఫర్ డై ఆక్సైడ్ (SO2), నత్రజని ఆక్సైడ్ (NO2)లు ఆమ్లవర్షాలకు కారణమయ్యే వాయు కాలుష్యాలు.

ప్రశ్న 46.
BOD అంటే ఏమిటి?
జవాబు:
BOD – బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (Biological Oxygen Demand), ఇది మురుగు నీటిలోని నిర్థిష్ట/ఉష్ణోగ్రత కాలవ్యవధిలో సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేయడానికి కావలసిన వాయు సహిత జీవులకు అవసరం అయ్యే ఆక్సిజన్ స్థాయిని చూసిస్తుంది. దీనిలో పెరిగే ఆ నీరు కలుషితమైనదిగా భావించవచ్చును.

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 47.
జీవావర్ధనం అంటే ఏమిటి?
జవాబు:
నీటి ఆహారపు గొలుసులో కాలుష్యం లేదా విషపదార్థ గాఢత ఒక పోషకస్థాయి నుంచి వేరొక పోషక స్థాయికి పెరుగుతూపోతే దాన్ని ‘జీవావర్ధనం’ అంటారు.

ప్రశ్న 48.
ఆసుపత్రులలో భస్మీకరణ యంత్రాలను ఎందుకు వాడతారు?
జవాబు:
ఆసుపత్రుల నుండి వెలువడే వ్యర్థాలలో ప్రమాదకర రసాయనాలు, వ్యాధికారక సూక్ష్మజీవులు ఉంటాయి. కనుక వీటిని వెంటనే కాల్చివేయవలెను. ఇలాకాల్చివేయడానికి భస్మీకరణ యంత్రాలను ఉపయోగిస్తారు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జీవికి స్థిర అంతర వాతావరణం వల్ల లాభాల దృష్ట్యా ‘అనుకారులు క్రమతాకారులుగా ఎందుకు పరిణామం చెందలేదు’ అని ఎందుకు అడుగుతాం?
జవాబు:
అనేక జంతువులు ఒక స్థిరమైన అంతర వాతావరణాన్ని కలిగి ఉండలేవు. పరిసరాలలోని ఉష్ణోగ్రతను బట్టి దేహ ఉష్ణోగ్రత మారుతుంది. జలచర జీవులలో పరిసర ప్రాంత నీటి గాఢతను బట్టి శరీరద్రవాల ద్రవాభిసరణ గాఢత మారుతుంది. అటువంటి జీవులను అనురూపకాలు (Conformers) అంటారు.

ఒంటెలాంటి జంతువులు ఒక స్థాయి వరకు ఉష్ణోగ్రత అనురూపకాలుగా, తరువాత నియంత్రకాలుగా ఉంటాయి. అందువల్ల వీటిని పాక్షిక నియంత్రకాలు (Partial regulators) లేదా పాక్షిక అనురూపకాలు (Partial conformers) అంటారు.

అనేక జంతువులలో శక్తి రీత్యా ఉష్ణ నియంత్రణ ‘ఖరీదైంది’. ఇది చిన్న జంతువులైన చుంచెలుకలు, హమ్మింగ్ పక్షులలో మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఉష్ణాన్ని గ్రహించడం, కోల్పోవడం అనేది ఉపరితల వైశాల్యంపై ఆధారపడుతుంది. చిన్న జంతువులలో ఉపరితల వైశాల్యం వాటి ఘనపరిమాణం కంటే ఎక్కువగా ఉండటం వల్ల బయట చల్లగా ఉన్నప్పుడు దేహం నుంచి ఉష్ణాన్ని త్వరగా కోల్పోతాయి. ఫలితంగా ఆ జీవులలో జీవక్రియ ద్వారా అత్యంత శక్తిని ఉపయోగించి ఉష్ణాన్ని ఉత్పత్తి చేసుకోవాలి. అందువల్ల ధృవ ప్రాంతాలలో చిన్న పరిమాణం గల జీవులు చాలా అరుదుగా ఉంటాయి. జీవపరిణామం జరుగుతున్న సందర్భాలలో స్థిర అంతర వాతావరణ నిర్వహణ జమ ఖర్చులను ప్రధానంగా పరిగణనలోకి తీసుకొంటారు. కొన్ని జాతులు వాతావరణ స్థితిగతులకు కొంతమేర నియంత్రణ సామర్థ్యాన్ని పెంపొందించుకున్నాయి. అది సాధ్యం కాకపోతే అనురూపకాలుగా ఉండిపోతాయి.

ప్రశ్న 2.
మంచులో దీర్ఘకాలం కూరుకుపోయిన వారిని పునరుద్ధరించడం సాధ్యమేనా? వివరించండి.
జవాబు:
వాతావరణంలోని ఉష్ణోగ్రత ఋతువులకు అనుగుణంగా మారుతూ ఉంటుంది. ఈ ఉష్ణోగ్రతా వ్యత్యాసాల వలన నీటిలో ఉష్ణస్థరాలు ఏర్పడతాయి. దీనినే ఉష్ణ స్థరీభవనం అంటారు. నీరు 4°C వద్ద అత్యధిక సాంద్రతను కలిగి ఉంటుంది. సాధారణంగా శీతాకాలంలో నీరు బాగా చల్లబడి 0°C కు చేరినప్పుడు ఉపరితల నీరు గడ్డకట్టి ఉపరితలంలో మంచుపొర ఏర్పడుతుంది. పైనున్న మంచుపొర క్రింద చల్లని నీరు 4°C తో ఉండి సరస్సును ఆక్రమిస్తుంది. మంచు పొరకు దిగువన జీవులు నివసించడానికి ఆవాసయోగ్యంగా ఉంటుంది. తక్కువ ఉష్ణోగ్రత వద్ద బాక్టీరియా క్రియాశీలత జంతువులలో ఆక్సిజన్ వినియోగం రేటు తగ్గుతుంది. అందువలన ఘనీభవనం చెందిన దిగువ ప్రాంతంలోని ఉపరితల నీటిలో హైపోక్సియా (ఆక్సిజన్ అందుబాటు తక్కువగా ఉన్నా) స్థితికి గురికాకుండా జీవులు మనుగడ సాగిస్తాయి.

పై విషయం ఆధారంగా మంచులో కూరుకుపోయిన జీవులు కొంతకాలం మంచుక్రింద (జలజీవులు) మనుగడ సాగించే అవకాశం ఉంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 3.
గ్రీష్మకాల స్థరీభవనం (Summer stratification) అంటే ఏమిటో వివరించండి.
జవాబు:
గ్రీష్మకాల స్థరీభవనం :
సమశీతోష్ణ సరస్సులలో గ్రీష్మకాలంలో ఉష్ణోగ్రత (21 – 25°C) కు పెరగడం వల్ల ఉపరితల నీటి సాంద్రత తగ్గుతుంది. సరస్సులోని ఉపరితంలో గల ఈ వెచ్చని నీటిపొరను ఎపిలిమ్నియాస్ (Epilimnion) అంటారు. ఎపిలిమ్నియాస్ కింద థర్మోక్లైన్ (Thermocline) లేదా మెటాలిమ్నియాస్ మండలం ఉంటుంది. ఈ నీటిలో లోతుకు వెళ్ళినకొద్దీ మీటరుకు 1°C చొప్పున ఉష్ణోగ్రత తగ్గుతుంది. సరస్సులో అడుగు పొరను హైపోలిమ్నియాన్ (Hypolimnion) అంటారు. ఈ ప్రాంతంలోని నీరు చల్లగా, నిలకడగా ఉండి, ఆక్సిజన్ శాతం బాగా తక్కువగా ఉంటుంది. (కిరణజన్య సంయోగక్రియ చర్య లేకపోవడం వల్ల).

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం 1
శరదృతువు (ఆకురాలే కాలం) రాగానే ఉపరితల ఎపిలిమ్నియాన్లో నీరు చల్లబడి 4°C కు ఉష్ణోగ్రత చేరగానే, నీటి బరువు అధికమైన పైనున్న పొర సరస్సు కిందకు కుంగుతుంది. నీరు తారుమారవడం ద్వారా ఈ కాలంలో సరస్సంతా ఒకే రకమైన ఉష్ణోగ్రత ఏర్పడుతుంది. శరదృతువులో జరిగే ఈ నీటి ప్రసరణను ఆకురాలే కాల తారుమారు లేదా శరదృతువు తారుమారు (Autumn overturn) అంటారు. అధిక ఆక్సిజన్ గల ఉపరితల నీరు హైపోలిమ్నియాన్ చేరి అధిక పోషక పదార్థాలు గల అడుగు భాగం నీరు ఉపరితలాన్ని చేరుతుంది. అందువల్ల సరస్సులో పోషక పదార్థాలు, ఆక్సిజన్ సమంగా విస్తరిస్తాయి.

ప్రశ్న 4.
సరస్సులలో స్తరీభవనం ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు:
సమశీతోష్ణ ప్రాంతాలలో ఋతువులు మారుతున్నప్పుడు ఉష్ణోగ్రతా వ్యత్యాసాల కారణంగా నీటిలో ఉష్ణస్తరాలు ఏర్పడతాయి. దీనినే ఉష్ణ స్తరీభవనం అంటారు.

శీతాకాలంలో వాతావరణం చల్లబడటం వలన ఉపరితల జలం చల్లబడి 4°C ఉష్ణోగ్రతను చేరగానే అధిక సాంద్రతను పొంది సరస్సులో అడుగుకు చేరుతుంది. నీరు తారుమారు అవడం వలన ఈ కాలంలో సరస్సంతా ఒకే రకమైన ఉష్ణోగ్రత ఏర్పడుతుంది. శరదృతువులో జరిగే ఈ నీటి ప్రసరణను శరదృతు ఓవర్ టర్న్ అంటారు. అధిక ఆక్సిజన్ గల నీరు హైపొలిమ్నియాన్ చేరడం వలన అధిక పోషక పదార్థాలు గల అడుగు భాగం నీరు ఉపరితలాన్ని చేరుతుంది. అందువలన సరస్సులో పోషక పదార్థాలు, ఆక్సిజన్ సమంగా విస్తరిస్తాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం 2
వసంతకాలంలో ఉష్ణోగ్రత పెరగడం ప్రారంభం అవుతుంది. ఉష్ణోగ్రత 4°C వద్దకు చేరగానే నీటి సాంద్రత అధికమై, బరువెక్కి, అడుగు భాగంలోకి కుంగిపోతూ అధిక ఆక్సిజన్ గల నీటిని అడుగు భాగానికి చేరవేస్తుంది. ఉపరితల ప్రాంతంలోని అధిక ఆక్సిజన్ గల నీరు కిందికి కుంగుతూ, అడుగుభాగాన గల ‘పోషక పదార్థాలు గల నీటిని’ ఉపరితల ప్రాంతానికి చేరవేస్తుంది. దీన్నే వసంత ఋతు తారుమారు (Spring overturn) అంటారు. సంవత్సరానికి రెండుసార్లు సరస్సులోని నీరు తారుమారు కావడం వల్ల వీటిని ‘డైమిక్క్ సరస్సులు’ అంటారు. ఈ విధమైన స్తరీభవనాలు సరస్సులోని అన్ని స్థాయిలలో జీవుల మనుగడకు తోడ్పడతాయి.

ప్రశ్న 5.
వాస్ట్ హాఫ్ సూత్రాన్ని వివరించండి.
జవాబు:
జీవులలో చాలా జీవక్రియలు వివిధ రకాల ఎంజైముల నియంత్రణలో ఉంటాయి. ఈ ఎంజైములు ఉష్ణోగ్రత వల్ల ప్రభావితమవుతాయి. ఉష్ణోగ్రత పెరుగుదలతో బాటు ఎంజైముల చర్యకూడా పెరుగుతుంది. దీనివలన జీవక్రియ రేటు పెరుగుతుంది. అస్థిర ఉష్ణోగ్రత జంతువులలో జీవక్రియలపై ఉష్ణోగ్రతా ప్రభావం స్థిరోష్ణ జీవులతో పోల్చితే తక్కువగా ఉంటుంది. దీని ప్రకారం ప్రతి 10°C ల ఉష్ణోగ్రత పెంచితే జీవక్రియా రేటు రెట్టింపవుతుంది. దీనినే ‘వాస్ట్ హాఫ్’ సూత్రం అంటారు.

ఒక రసాయన చర్యారేటు మీద ఉష్ణోగ్రతా ప్రభావాన్ని ‘ఉష్ణోగ్రతా కోఎఫిషియంట్’ లేదా Q10 తో తెలుపుతారు. అంటే 10°C ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల జీవక్రియా రేటులో పెరుగుదలను ఇది తెలుపుతుంది. Q10 విలువను X°C, X 10°C వద్ద చర్యా రేటు నిష్పత్తి ఆధారంగా అంచనా వేస్తారు. జీవ వ్యవస్థలలో Q10 విలువ దాదాపు 2గా ఉంటుంది.

ప్రశ్న 6.
ఉష్ణోగ్రతా మార్పులను క్షీరదాలు సహించినట్టు సరీసృపాలు సహించలేవు. అవి ఎడారిలో సార్థక జీవనానికి పరిస్థితులకు అనుగుణంగా ఏవిధంగా మార్పు చేసుకొంటాయి?
జవాబు:
ఉష్ణోగ్రతలో మార్పులను క్షీరదాలు సహించినట్లుగా సరీసృపాలు సహించవు. ఇవి ఎడారిలో సార్థక జీవనానికి, పరిస్థితులకు అనుగుణంగా అనేక రకాల మార్పులను ఏర్పరచుకుంటాయి.

ఎడారి బల్లులు వాటి ప్రవర్తనా పద్ధతుల ద్వారా శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుకుంటాయి. అవి వాటికి అనువైన దానికంటే శరీర ఉష్ణోగ్రత ఎక్కువైతే అవి ఎండలోకి వెళ్ళి సూర్యరశ్మి సోకేటట్లు వాటి శరీరాన్ని ఉంచి ఉష్ణాన్ని గ్రహిస్తాయి. ఉష్ణోగ్రత ఎక్కువ అయితే నీటిలోకి తిరిగి వెళతాయి. కొన్ని జంతువులు వాతావరణంలో గల అధిక వేడిని తట్టుకోవడానికి నేలలో బొరియలు చేసుకొని జీవిస్తాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 7.
భౌమ్య జీవులు నిర్జలీకరణ (Dehydration) ప్రమాదాల నుండి ఏవిధంగా రక్షించుకొంటాయి?
జవాబు:
భూమిపై నివసించే జీవులు నిర్జలీకరణం (దేహంలో నీటిని కోల్పోవడం) ప్రమాదం నుండి తప్పించుకోవడానికి, నీటి నష్టాన్ని తగ్గించడానికి అనేక అనుకూలనాలను కలిగి ఉంటాయి.

  1. బొరియలలో నివసించే జీవులు ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు, రాత్రి వేళలో బయటకు వస్తాయి.
  2. ఎడారి జీవులకు నీటి సంరక్షణ అతి ముఖ్యమైనది. ఎడారిలో నివసించే కంగారు ఎలుక అతి గాఢత కలిగిన మూత్రాన్ని విసర్జిస్తుంది.
  3. కీటకాలు యూరికామ్ల రూపంలో, ఆహార విసర్జితాలతో కలిపి ఘనరూపంలో నత్రజని సంబంధ విసర్జకాలను విసర్జిస్తాయి. దేహంపై గట్టి కైటిన్ నిర్మిత పెంకును కలిగి స్వేదన క్రియ ద్వారా నీటి వృధాను అరికడతాయి.
  4. వానపాములు వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతను తట్టుకోవడానికి నేలలో లోతుగా బొరియలు చేసుకొని, కనిష్ట స్థాయిలో వాటిని వినియోగిస్తూ జీవిస్తాయి.
  5. ఒంటె శరీరం బరువులో 40 శాతం నీరు నష్టపోయినప్పటికీ జీవించగలదు. ఇతర జంతువులు జీవించలేవు.

పై విధంగా భూచర జీవులు నిర్జలీకరణాన్ని అరికట్టి తమని తాము రక్షించుకుంటాయి.

ప్రశ్న 8.
సముద్ర జంతువులు అధిక గాఢత జలానికి ఏ విధంగా అనుకూలనం ఏర్పరచుకొంటాయి?
జవాబు:
సముద్ర ఆవాసాల్లో అనుకూలనాలు :
సముద్రపు నీటిలో లవణ గాఢత దేహద్రవ్యాల గాఢత కంటే ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా సముద్ర జంతువుల దేహం నుంచి నిరంతరం బాహ్య ద్రవాభిసరణ (exosmosis) ద్వారా నీరు వెలుపలికి వెళ్ళడం ద్వారా దేహం నిర్జలీకరణకు గురవుతుంది. ఇలాంటి నీరు కోల్పోయే సమస్య నుంచి బయటపడటానికి సముద్ర చేపలలో వృక్క ప్రమాణాలు తక్కువగానున్న రక్తకేశనాళికా, గుచ్చరహిత మూత్రపిండాలు (algomerular kidneys, ఉంటాయి. ఇవి మూత్రం ద్వారా విసర్జింపబడే నీటిని తగ్గిస్తాయి.

కోల్పోయిన నీటిని భర్తీ చేయడానికి సముద్ర చేపలు ఎక్కువగా నీటిని లోనికి తీసుకోవడం వల్ల, లవణాలు దేహద్రవ్యాలతో కలిసి అంతర సమతుల్యతలో అస్థిరత ఏర్పడుతుంది. దేహంలో లవణ సమస్థితి (Salt homeostasis) నియంత్రించడంలో లవణాలను స్రవించే క్లోరైడ్ కణాలు మొప్పలలో ఉంటాయి. సాగర పక్షులైన సీ గల్స్ (Sea gulls), పెంగ్విన్ (Penguin) పక్షుల నాసికానాళాల నుంచి లవణద్రవం చుక్కలుగా వెలువడుతుంది. తాబేళ్లలో (Turtles) నేత్రాల సమీపంలో క్లోరైడ్ స్రవించే గ్రంథినాళాలు తెరచుకొని ఉంటాయి. కొన్ని మృదులాస్థి చేపలలో యూరియా, ట్రైమిథైల్ అమైన్ ఆక్సైడ్ (TMO) రక్తంలో ఉండి, దేహ ద్రవ్యాలను సాగరనీటితో సమగాఢతలో ఉండచంలో, బాహ్య ద్రవాభిసరణతో జరిగే నిర్జలీకరణం జరగకుండా ఆపుతుంది.

ప్రశ్న 9.
స్వాదుజల జీవుల అనుకూలనాల రకాలను తెలపండి.
జవాబు:
మంచినీటిలో నివసించే జంతువులు అంతర ద్రవాభిసరణ (osmosis) సమస్యను ఎదుర్కోవాలి. మంచినీటిలో ద్రవాభిసరణ పీడనం తక్కువగా ఉంటుంది, జంతుదేహంలోని ద్రవాలలో ద్రవాభిసరణ పీడనం అధికంగా ఉండటం వల్ల, వెలుపలి ప్రాంతపు నీరు జీవి శరీరంలోకి అంతర ద్రవాభిసరణం ద్వారా ప్రవేశిస్తుంది. మంచినీటి జీవులు దేహంలోని నీటి సమతుల్యతను నిర్వహించడానికి అనేక అనుకూలనలు పొందాయి. అవి : మంచినీటి ప్రోటోజోవా జీవులలో సంకోచరిక్తికలు, చేపలలో పెద్ద రక్తకేశనాళికా గుచ్ఛ మూత్రపిండాలు (Glomelular kidneys) మొదలైనవి. ఇవి దేహం నుంచి అధిక మొత్తంలో విసర్జించే మూత్రంలో కొన్ని లవణాలను కూడా కోల్పోతాయి.

దేహం నుంచి కోల్పోయిన లవణాలను భర్తీ చేయడానికి, మంచినీటి చేపలు వాటి మొప్పలలో లవణాలను గ్రహించే క్లోరైడ్ కణాలు (chloride cells) కలిగి ఉంటాయి. మంచినీటి చెరువులలో ప్రధాన సమస్య ఏమిటంటే ఎండాకాలంలో అనేక కుంటలు ఎండిపోతాయి. ఇటువంటి సమస్య నుంచి రక్షణ కోసం మంచినీటి ప్రొటిస్టా జీవులు కోశీభవన (Encystment) ప్రక్రియను ప్రదర్శిస్తాయి. ఎండాకాలంలో ప్రతికూల సమస్యల నుంచి రక్షణ కోసం మంచినీటి స్పంజికలు అలైంగికోత్పత్తి నిర్మాణాలైన జెమ్యూల్స్న ఏర్పరుస్తాయి. ఎండాకాలంలో మనుగడ కోసం “ఆఫ్రికన్ ఊపిరితిత్తి చేప” (African lugn fish) ప్రోటాక్టిరస్ (Protopterus) బురద మట్టిలో బొరియలు చేసుకొని, దేహం చుట్టూ జిగట పదార్థ కోశాన్ని ఏర్పరచుకుంటుంది.

ప్రశ్న 10.
మంచినీటి, సముద్రనీటి జీవనానికి జంతువులు ఏ విధంగా అనుకూలనాలను పోల్చండి.
జవాబు:

మంచినీటి జీవనానికి అనుకూలనంసముద్ర జీవనానికి అనుకూలనం
1. మంచినీటి చేపలు మూత్రపిండాలలో అధిక గ్లోమరాలత్ను కలిగిన వృక్కాలను కలిగి ఉంటాయి.1. సముద్రజల చేపలు గ్లోమరూలస్ లేకుండా తక్కువ సంఖ్యలో వృక్కాలు గల మూత్రపిండాలను కలిగి ఉంటాయి.
2. విసర్జన ద్వారా అధిక నీటిని బయటకు పంపిస్తాయి.2. మూత్రాంత్రం ద్వారా తక్కువ నీటిని విసర్జిస్తాయి.
3. మూత్రం ద్వారా కోల్పోయిన లవణాలను భర్తీ చేయడానికి మొప్పలలో ఉండే క్లోరైడ్ కణాలు తిరిగి నీటి నుండి లవణాలను గ్రహిస్తాయి.3. దేహంలో చేరిన అధిక లవణాలను మొప్పలలో క్లోరైడ్ కణాల ద్వారా బయటకు విసర్జిస్తాయి.
4. వేసవికాలంలో దేహంలోని నీటిని రక్షించుకోడానికి కొన్ని ప్రొటిస్టా జీవులు కోశీభవనాన్ని ప్రదర్శిస్తాయి.4. మృదులాస్థి చేపలలో యూరియా TMO రూపంలో నిలువ చేయబడుతుంది. ఇది దేహ ద్రవ్యాలను సాగర జలాలతో సమగాఢతలో ఉంచడానికి తోడ్పడుతుంది.

ప్రశ్న 11.
యూరి హైలిన్, స్టీనో హైలిన్ జంతువుల మధ్య తేడాలను వివరించండి.
జవాబు:
యూరి హైలిన్ :
అధిక మొత్తంలో నీటిలో కరిగే లవణీయత మార్పును తట్టుకునే జీవులను యూరిహైలిన్ జీవులంటారు. ఉదా : సాల్మన్ చేపలు, ఈల్ చేపలు.

స్టీనోహైలిన్ :
తక్కువ మొత్తంలో మాత్రమే నీటిలో కలిగే లవణీయత మార్పులను తట్టుకోగలిగిన జీవులను స్టీనో హైలిన్ జంతువులు అంటారు.
ఉదా : Armatic insects.

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 12.
అధిక ఎత్తు గల హిమాలయ ప్రాంతాలలో నివసించే అనేక తెగలలో మైదానాలలో నివసించేవారిలో కంటే సాధారణంగా ఎర్ర రక్తకణాలు లేదా హిమోగ్లోబిన్ మోతాదు అధికంగా ఉంటుంది. వివరించండి.
జవాబు:
సాగర మట్టం నుండి అత్యంత ఎత్తయిన ప్రదేశాలు హిమాలయ ప్రాంతాలలో పర్యటనకు వెళ్ళిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆల్టిట్యూడ్ సిక్నెస్కు లోనవుతారు. వీటి లక్షణం నాసియా, అలసట, అసాధారణ హృదయస్పందన మొదలగునవి. దీనికి కారణం ఎత్తైన ప్రదేశాలలో అతి తక్కువ స్థాయిలో వాతావరణ పీడనం, శరీరానికి కావలసినంత ఆక్సిజన్ లభించకపోవడం.

ఎత్తైన హిమాలయ ప్రాంతాలలో నివసించే అనేక తెగల జనాభాలో ఆల్టిట్యూడ్ సిక్నెస్ ను తట్టుకోవడానికి అనుకూలనాలు ఉంటాయి. వీరు క్రమంగా వాతావరణానుకూలత ద్వారా అధిగమించవచ్చు. శ్వాసక్రియ రేటును పెంచడం ద్వారా, హిమోగ్లోబిన్ బంధన సామర్థ్యాన్ని కణస్థాయిలో తగ్గించడం ద్వారా శరీరం తక్కువ ఆక్సిజన్ లభ్యతను భర్తీ చేస్తుంది.

ప్రశ్న 13.
ఒక మామిడి చెట్టుకు, దానిపై పెరిగే ఆర్కిడ్ మొక్క మధ్య పరస్పర చర్యను వివరించండి.
జవాబు:
మామిడిచెట్టుపై ఆర్కిడ్ మొక్క పరాన్నజీవిగా జీవించే సహజీవనంలో ఆర్కిడ్ మొక్క సూర్యరశ్మిని పొందే విధంగా మామిడి శాఖలపై పెరుగుతుంది. కనుక ఆర్కిడ్ మొక్క ఇది లాభదాయకం. కాని ఈ విషయంలో మామిడిచెట్టుకు గమనించదగిన లాభం గాని, నష్టం కాని జరగలేదు. కనుక ఇటువంటి సహజీవనాన్ని సహభోజకత్వ చర్యగా భావించవచ్చును.

ప్రశ్న 14.
జాతుల వైవిధ్యాన్ని నిర్వహించడంలో పరజీవ భక్షణ ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వివరించండి.
జవాబు:
సమాజంలో జాతుల వైవిధ్యాన్ని నిర్వహించడంలో పరభక్షకాలు ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అమెరికా పసిఫిక్ తీర ప్రాంతంలోని రాతిమయ అల తీరప్రాంతం (Rocky intertidal region) సమాజంలో సముద్ర నక్షత్రం పిసాస్టర్ ఒక ముఖ్యమైన పరభక్షకి. ఒక క్షేత్ర పరిశోధనలో ఒక నిర్దిష్ట తీరప్రాంతంలోని సముద్ర నక్షత్రాలన్నింటిని వేరుచేసినప్పుడు, ఒక సంవత్సర కాలంలో 10 జాతుల కంటే ఎక్కువ అకశేరుకాలు అంతరించిపోవడానికి కారణం జాత్యంతర జీవుల మధ్య పోటీ పెరగడమే.

పై విషయ సందర్భం ఆధారంగా జాతుల వైవిధ్యాన్ని నిర్వహించడంలో పరజీవ భక్షణ ప్రాముఖ్యమైనదిగా భావించవచ్చును.

ప్రశ్న 15.
వినాశకర కీటకాల జీవ నియంత్రణ పద్ధతి వెనుక ఉన్న జీవ సూత్రం ఏమిటి?
జవాబు:
ఆకులు, ముళ్ళు లేని నిర్మాణం కలిగిన పియర్ కాక్టస్ మొక్కలను 1920లో ఆస్ట్రేలియాలో ప్రవేశపెట్టారు. ఫలితంగా అది అతివేగంగా అభివృద్ధి చెంది మిలియన్ల హెక్టార్ల భూమి (సహజ గడ్డిభూములు)లో వ్యాపించి అస్థవ్యస్థ పరిస్థితి కలిగించింది. చివరకు అపాయకరంగా వ్యాపిస్తున్న కాక్టస్ను నియంత్రించడానికి కాక్టస్ను ఆహారంగా తీసుకొనే పరభక్షి (మిడత)ను ఆ దేశంలో ప్రవేశపెట్టారు. తరువాత పరిస్థితి చక్కబడింది.

ఆహార జీవి జనాభాను నియంత్రించే భక్షక జీవుల సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకొని వ్యవసాయ చీడల నియంత్రణలో జీవ నియంత్రణ పద్ధతులను వినియోగిస్తున్నారు.

ప్రశ్న 16.
పోటీ బహిష్కరణను చర్చించండి.
జవాబు:
ప్రకృతిలో పోటీతత్వ విధానానికి లభించిన మరొక నిదర్శనం పోటీతత్వాన్ని విడుదల చేయడం లేదా బహిష్కరించడం. నిర్దిష్ట ప్రదేశం నుంచి పోటీపడే రెండు జాతులలో ఒక జాతి జీవులను వేరు చేయడం ద్వారా వాటి జనాభా పరిమితిని తగ్గించే ఒక కారకం నుంచి రెండవ జాతి జీవులకు పోటీతత్త్వ విడుదల లభిస్తుంది. పోటీతత్వం గల ఉన్నత జాతుల జనాభా ఉండటం వల్ల చిన్న భౌగోళిక ప్రాంతానికి మాత్రమే విస్తరించిన ఒక జాతి, ప్రయోగాత్మకంగా పోటీతత్వ జాతులను నిర్మూలించడం ద్వారా అవి

వాటి విస్తరణ పరిధిని పెంచుకోవడం గమనించవచ్చు. ఇది పోటీతత్వ విడుదల అనే దృగ్విషయం వల్ల జరుగుతుంది. కొన్నెల్ (Connel) క్షేత్ర పరిశోధనల్లో స్కాట్లాండ్లోని సాగర రాతి తీర ప్రాంతాలలో గల బర్నాకిల్ బెలానస్ అలల మధ్య ప్రాంతంలో పోటీతత్త్వంలో బలంగా ఉండి చిన్న బర్నాకిల్ అయిన కెథామలన న్ను ఆ ప్రాంతం నుంచి లేకుండా చేస్తాయి. ప్రయోగాత్మకంగా బలంగా ఉన్న జీవులను వేరుచేస్తే చిన్నజీవుల జనాభా బాగా వృద్ధి చెందుతుంది. సాధారణంగా, మాంసాహారుల కంటే శాకాహారజీవులు, మొక్కలు ఎక్కువగా పోటీతత్వ ప్రభావానికి లోనవుతాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 17.
పరాన్నజీవుల అనుకూలనాల మీద సంక్షిప్త వ్యాఖ్య రాయండి.
జవాబు:
పరాన్నజీవనం విజయవంతంగా ఉండటానికి పరాన్నజీవులు ప్రత్యేకమైన అనుకూలనాలు ఏర్పరచుకొన్నాయి. అవి :
ఎ. జ్ఞానావయవాలు కోల్పోవడం (అధికశాతం పరాన్నజీవులకు అవసరం లేదు).

బి. సంసజనక అవయవాలను కలిగి ఉండటం. అంటే చూషకాలు, కొక్కేలు మొదలైనవి అతిథేయి దేహ భాగాలను అంటిపెట్టుకోడానికి తోడ్పడతాయి.

సి. జీర్ణవ్యవస్థ లేకపోవడం, అధిక ప్రత్యుత్పత్తి సామర్థ్యం కలిగి ఉండటం.

డి. పరాన్నజీవుల జీవితచరిత్రలు చాలా సంక్లిష్టమైనవి. వీటిలో ఒకటి లేదా రెండు మాధ్యమిక అతిథేయిలు లేదా వాహకాలు పరాన్నజీవనాన్ని వాటి ప్రాథమిక అతిథేయికి చేరడానికి మార్గం సుగమం చేస్తాయి.
ఉదా 1 : మానవ లివర్ ఫ్లూక్ రెండు మాధ్యమిక (ద్వితీయ) అతిథేయిలలో (నత్త, చేప) జీవితచరిత్రను పూర్తి చేస్తాయి.
ఉదా 2 : మలేరియా పరాన్నజీవికి మరొక అతిథేయికి వ్యాప్తి చేయడానికి వాహకం (దోమ) అవసరం.

అధిక శాతం పరాన్నజీవులు అతిథేయికి హాని కలుగజేస్తాయి; అతిథేయిలో మనుగడ, పెరుగుదల, ప్రత్యుత్పత్తి క్షీణిస్తాయి. వీటితోపాటు జనాభా సాంద్రత తగ్గుతుంది. పరాన్నజీవి బాగా వృద్ధి చెందుతూ పరభక్షత్వానికి వీలుగా అతిథేయిని బలహీనపరుస్తుంది.

ప్రశ్న 18.
గుడ్లకోశ (Brood) పరాన్నజీవనం గురించి సోదాహరణగా వివరించండి.
జవాబు:
కొన్ని పక్షులు ప్రత్యేకమైన పరాన్నజీవనానికి మంచి ఉదాహరణలుగా ఉంటాయి. పరాన్న జీవ పక్షి వాటి గుడ్లను అతిథేయి పక్షి గూటిలో ఉంచి అతిథేయిచే గుడ్లను పొదిగిస్తాయి. పరిణామ క్రమంలో పరాన్నజీవ పక్షిగుడ్లు, అతిథేయి జీవి గుడ్లు పరిమాణం, వర్ణం ఒకే విధంగా ఉండేటట్లు అభివృద్ధి చెందటం వల్ల, పరాన్నజీవ పక్షి గుడ్లను అతిథేయి గుర్తు పట్టలేకపోవడం వల్ల, గుడ్లు గూటి నుండి వెలికితీయబడకుండా పొదగబడతాయి.
ఉదా : కోయిల, కాకి పక్షుల కదలికలను మనం దగ్గర పరిసరాలనుండి పరిశీలిస్తే సంపర్క కాలంలో గర్భకోశ లేదా గుడ్లకోశ పరాన్నజీవ చర్యలను గమనించవచ్చును.

ప్రశ్న 19.
పరజీవ భక్షక జీవులు జీవ నియంత్రణకారులుగా ఎలా పనిచేస్తాయి?
జవాబు:
ఆకులు, ముళ్ళు లేని నిర్మాణం కలిగిన పియర్ కాక్టస్ మొక్కలను 1920లో ఆస్ట్రేలియాలో ప్రవేశపెట్టారు. ఫలితంగా అది అతివేగంగా అభివృద్ధి చెంది మిలియన్ల హెక్టార్ల భూమి (సహజ గడ్డిభూములు)లో వ్యాపించి అస్థవ్యస్థ పరిస్థితి కలిగించింది. చివరకు అపాయకరంగా వ్యాపిస్తున్న కాక్టస్ ను నియంత్రించడానికి కాక్టస్ను ఆహారంగా తీసుకొనే పరభక్షి (మిడత)ను ఆ ప్రదేశంలో ప్రవేశపెట్టారు. తరువాత పరిస్థితి చక్కబడింది.

ఆహార జీవి జనాభాను నియంత్రించే భక్షక జీవుల సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకొని వ్యవసాయ చీడల నియంత్రణలో జీవ నియంత్రణ పద్ధతులను వినియోగిస్తున్నారు.

ప్రశ్న 20.
జీవావరణ వ్యవస్థ నిర్మాణం, విధులను వివరించండి.
జవాబు:
జీవావరణ వ్యవస్థ ప్రకృతిలో క్రియాత్మక ప్రమాణం. దీనిలో నివసించే జీవులు తమలో తాము అంతర చర్యలు జరపడమే కాకుండా వాటి చుట్టూ గల భౌతికపరమైన పరిసరాలతో అంతర చర్యలు జరుపుతూ ఉంటాయి. జీవావరణ వ్యవస్థ పరిమాణం చిన్న సరస్సు నుంచి అత్యంత పెద్ద అరణ్యాలు లేదా సముద్రాల వరకు కూడా విస్తరిస్తుంది. అనేకమంది జీవావరణ శాస్త్రవేత్తలు యావత్తు జీవగోళాన్ని ఒక ప్రపంచ జీవావరణ వ్యవస్థగా చెప్తూ అది భూమండలంపై గల అన్ని రకాల జీవావరణవ్యవస్థల సమ్మేళనమేనని అభివర్ణించారు.

ఈ వ్యవస్థ పెద్దది, సంక్లిష్టమైంది కావడం వల్ల ఒక్కసారే అధ్యయనం చేయడం కష్టం కాబట్టి సౌకర్యం కోసం రెండు ప్రాథమిక స్థాయి విభాగాలుగా విభజించారు. అవి, సహజ జీవావరణవ్యవస్థ, కృత్రిమ జీవావరణ వ్యవస్థ. సహజ జీవావరణ వ్యవస్థలో జలజీవావరణ వ్యవస్థ, భూమికి సంబంధించిన భూచర జీవావరణ వ్యవస్థ ఉన్నాయి. సహజ, కృత్రిమ జీవావరణ వ్యవస్థలలో పలు రకాలైన ఉప విభాగాలు ఉన్నాయి.

ఇవి సహజసిద్ధంగా ఏర్పడే జీవావరణవ్యవస్థలు. వీటి ఏర్పాటులో మానవుడికి ఎలాంటి పాత్ర లేదు. ప్రధానంగా వీటిలో రెండు రకాలు ఉన్నాయి. అవి – జల జీవావరణ వ్యవస్థ, భూచర జీవావరణ వ్యవస్థ.

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 21.
వివిధ రకాల జల జీవావరణ వ్యవస్థలను వివరించండి.
జవాబు:
జల జీవావరణవ్యవస్థలు (Aquatic Ecosystems) : నీటి లవణీయతను ఆధారంగా చేసుకొని జీవావరణవ్యవస్థలను మూడు రకాలుగా విభజించారు. అవి – సముద్రనీటి జీవావరణ వ్యవస్థ, నదీముఖద్వార జీవావరణవ్యవస్థ, మంచినీటి జీవావరణవ్యవస్థ.

1. సముద్రనీటి జీవావరణవ్యవస్థ (The Marine Ecosystem) :
జీవావరణవ్యవస్థలన్నింటిలోనూ సముద్రనీటి జీవావరణవ్యవస్థ అతిపెద్దది. ఇది అత్యంత స్థిరమైన జీవావరణవ్యవస్థగా చెప్పబడింది.

2. నదీముఖద్వార జీవావరణవ్యవస్థ (Estuarine Ecosystem) :
ఏ ప్రాంతంలో నది సముద్రం కలుస్తుందో దాన్ని నదీముఖద్వారం అంటారు. సముద్రపు నీరు రోజుకు రెండుసార్లు నదీ నీటిలోకి ప్రవేశిస్తుంది. (అలల ఆటుపోట్లు ప్రభావంవలన) నదీముఖ ద్వారంలోని నీటి లవణీయత స్థాయి రుతువులపై ఆధారపడి ఉంటుంది. వానాకాలంలో అధిక వర్షపాత ప్రభావంచేత నదీముఖద్వారంలోని నీరు బయటికి వెళ్ళడం వల్ల లవణీయత స్థాయి తగ్గుతుంది. ఎండాకాలంలో దీనికి వ్యతిరేకంగా జరగడం వలన అంటే లవణీయత స్థాయి పెరుగుతుంది. నదీముఖద్వార జీవులు లవణీయతలోని హెచ్చుతగ్గులను తట్టుకొనే సామర్థ్యాన్ని ఉంటాయి.

3. మంచినీటి జీవావరణవ్యవస్థ (The Fresh water Ecosystem) :
మంచినీటి జీవావరణవ్యవస్థ జలచర జీవావరణవ్యవస్థలో అతి చిన్నది. దీనిలో నదులు, సరస్సులు, చెరువులు (నీటి కుంట) మొదలైనవి ఉంటాయి. ఇది రెండు గ్రూపులుగా విభజింపబడింది. అవి 1. స్థిర జల జీవావరణవ్యవస్థ (Lentic Ecosystem), 2. ప్రవాహ జల జీవావరణవ్యవస్థ (Lotic Ecosystem). నిశ్చలమైన నీరు అంటే, చెరువులు, సరస్సులు, జలాశయాలు మొదలైనవి స్థిర జలజీవావరణవ్యవస్థ కిందికి వస్తాయి. సెలయేర్లు, నదులు ప్రవహించే నీటి కాలువలు ప్రవాహ జల జీవావరణ వ్యవస్థ కిందికి వస్తాయి. పైన పేర్కొన్న రెండురకాల సమాజాలు స్థిరజల సమాజం, ప్రవాహజల సమాజంగా చెప్పబడినాయి. మంచినీటి (స్వాదుజల) జీవావరణంను, అధ్యయనంచేసే శాస్త్రాన్ని లిమ్నాలజీ అంటారు.

ప్రశ్న 22.
వివిధ రకాల భౌమ్య జీవావరణ వ్యవస్థలను వివరించండి.
జవాబు:
భూచర జీవావరణ వ్యవస్థలు (The Terrestrial Ecosystems) :
భూమిపై ఉన్న జీవావరణవ్యవస్థలను భూచర జీవావరణవ్యవస్థలని అంటారు. భూచర జీవావరణ వ్యవస్థలకు కొన్ని ఉదాహరణలుగా అరణ్యాలు, పచ్చికబయలు, ఎడారులు ఉన్నాయి.

i) అరణ్య జీవావరణవ్యవస్థలు (The forest Ecosystem) :
భారతదేశంలో రెండు ప్రధానమైన అరణ్యాలు-1. వర్షాధార ఉష్ణమండల అడవులు (Tropical Rain forest), 2. ఆకురాల్చే ఉష్ణమండల అడవులు (Tropical Deciduous forests) ఉన్నాయి.

ii) పచ్చికబయలు జీవావరణవ్యవస్థలు (The grassland Ecosystem) :
భారతదేశంలో హిమాలయ ప్రాంతాలలో ఉంటాయి. ఇవి పశ్చిమ రాజస్థాన్ ప్రాంతంలోని విశాల ఇసుక నేల ప్రాంతాలను ఉప్పునేల ప్రాంతాలను ఆవరించి ఉంటాయి.

iii) ఎడారి జీవావరణ వ్యవస్థలు :
ఒక సంవత్సరానికి 25 సెం.మీ. కంటే తక్కువ వర్షపాతం గల వర్ష ప్రాంతాలను ఎడారులు అంటారు. వీటిలో ప్రత్యేకమైన మొక్కలు, జంతువులు ఉంటాయి. ఎడారులు రెండు రకాలు. ఉష్ణ ఎడారులు, శీతల ఎడారులు. ఉష్ణ ఎడారికి ఉదాహరణ రాజస్థాన్లోని ‘థార్’ ఎడారి (Thar Desert). శీతల ఎడారి ‘లడక్’లో చూడవచ్చు.

ప్రశ్న 23.
మహాసముద్రాలలో అల్ప ఉత్పాదకతకు ముఖ్య కారణాన్ని చర్చించండి.
జవాబు:
సముద్ర జలావరణంలో ప్రాథమిక ఉత్పాదకత భౌమ్య ఆవరణ వ్యవస్థతో పోల్చితే చాలా తక్కువగా ఉంటుంది.

భౌమ్య జీవావరణంతో అనేక రకాల వృక్షజాతులు ప్రాథమిక ఉత్పాదకతలో పాల్గొంటాయి. సముద్ర జీవావరణంలో ప్రాథమిక ఉత్పాదకత ప్రధానంగా వృక్షప్లవకాల పైనే ఆధారపడి ఉంటుంది. లిటరల్ జాన్లో నివసించే ఆల్గి జాతులైన సముద్ర కలుపు మొక్కలు, సూక్ష్మ ఆలు మొదలైనవి మాత్రమే కనిపిస్తాయి.

సముద్రజలాల్లో కాంతి ప్రసరించే ప్రాంతాన్ని ఫోటిక్ మండలం లేదా యూఫోటిక్ మండలం అంటారు. ఇది సాధారణంగా ఉపరితలం నుండి సుమారు 10 నుండి 100 మీ లోతు కలిగి, కిరణజన్యసంయోగక్రియకు అవసరమైన సూర్యరశ్మిని కలిగి ఉండే ప్రాంతం. కాంతి కిరణాలు నీటి లోతులలోకి ప్రసరించే సమయంలో నీటిచే శోషించబడి, కొంత లోతుకు పోయినప్పుడు అసలు కాంతి లేకుండా అవుతుంది. కనుక కాంతి ప్రసరించే ఫోటిక్ మండలం లేదా దాని దిగువన కొద్ది లోతులో మాత్రమే కిరణజన్య సంయోగక్రియకు అవకాశం ఉంటుంది. ఇటీవల పరిశోధనల ఆధారంగా తెలిసిన విషయం ఏమంటే సముద్రజలాల్లో ఇనుపధాతువు తక్కువగా ఉంటుంది. ఇది కూడా ప్రాథమిక ఉత్పాదకతపై ప్రభావం చూపిస్తుంది. కనుక సముద్ర అగాధ జలాల్లో కాంతి ప్రసరణకు అవకాశం లేదు కనుక ప్రాథమిక ఉత్పాదకత ఉండదు. కనుక మహాసముద్రాలలో ప్రాథమిక ఉత్పాదకత తక్కువగా ఉంటుంది.

ప్రశ్న 24.
పూతికాహార జీవులు, డెట్రిటివోర్లు, ఖనిజీకర జీవుల (Mineralizers)ను వివరించండి.
జవాబు:
పూతికాహరులు :
మృతజీవుల దేహంపై ఆహారం కోసం ఆధారపడే బాక్టీరియా, ఫంగై వంటి సూక్ష్మజీవులను పూతికాహారులు అంటారు.

డెట్రిటివోర్సు :
మృతజీవుల నుండి ఆహారాన్ని గ్రహించి, ఆహారపు గొలుసులలోకి శక్తిని తిరిగి ప్రవేశపెట్టే మృతజీవుల దేహాలను కుళ్ళింపచేస్తాయి.

ఖనిజీకరణ జీవులు :
ఇవి కూడా ఒక రకంగా డెట్రిటీజీవులే. ఇవి ఖనిజ లవణాలను మృతజీవుల నుండి విచ్ఛిన్నం చేయడం వలన తిరిగి మట్టిలో కలిసిపోయేలాగున చేస్తాయి.

ప్రశ్న 25.
విచ్ఛిన్నతను ప్రభావితం చేసే కారకాలను చర్చించండి.
జవాబు:
విచ్ఛిన్నకారులు సంక్లిష్ట కర్బన పదార్థాలను కార్బన్ డైఆక్సైడ్, నీరు, పోషకాల లాంటి సరళ అకర్బన పదార్థాలుగా విడగొడతాయి. ఈ ప్రక్రియను విచ్ఛిన్నక్రియ అంటారు.

విచ్ఛిన్నతను ప్రభావితం చేసే కారకాలు :

  1. డెట్రిటస్లోని రసాయన సంఘటన, శోతోష్ణస్థితి కారకాలు విచ్ఛిన్నక్రియ రేటును నియంత్రిస్తాయి.
  2. నిర్ణీత వాతావరణ పరిస్థితులలో డెట్రిటస్లో లిగ్నిన్, కైటిన్ అధికంగా ఉండే విచ్ఛిన్నక్రియా రేటు నెమ్మదిగా ఉంటుంది.
  3. అధిక నైట్రోజన్, నీటిలో కరిగే పదార్థాలైన చక్కెరలు ఉన్నట్లయితే డెట్రిటస్ విచ్ఛిన్నక్రియా రేటు వేగంగా ఉంటుంది.
  4. శీతోష్ణస్థితి కారకాలలో ఉష్ణోగ్రత, నేలలోని తేమ ప్రధానమైనవి. ఇవి నేలలోని సూక్ష్మజీవులపై ప్రభావం చూపి విచ్ఛిన్నక్రియను క్రమపరుస్తాయి.
  5. వేడిగా, తేమగా ఉన్న పరిసరాలు విచ్ఛిన్నక్రియకు ఉపకరిస్తాయి.
  6. తక్కువ ఉష్ణోగ్రత, అవాయు పరిసరాలు విచ్ఛిన్నక్రియను నిరోధించి కర్బనపదార్థాల నిర్మాణం జరుపుతాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 26.
DFC గురించి రాసి, భౌమ్య జీవావరణ వ్యవస్థలో దాని ప్రాముఖ్యాన్ని వివరించండి.
జవాబు:
డెట్రిటస్ ఆహార గొలుసు (Detritus Food Chain) : డెట్రిటస్ ఆహార గొలుసు (DFC) మృత కర్బన పదార్థాల (అంటే కుళ్ళిన ఆకులు, మృతిచెందిన జీవుల కళేబరాలు) తో మొదలవుతుంది. పరపోషకాలైన శిలీంధ్రాలు, బాక్టీరియాలు. డెట్రిటస్ను విచ్ఛిన్నం చేసి దాని నుంచి శక్తి, పోషక అవసరాలు గ్రహిస్తాయి. వీటిని పూతికాహారులు అని కూడా అంటారు. ఇవి జీర్ణక్రియా ఎంజైములను స్రవించి, మృత పదార్థాలను, వ్యర్థ పదార్థాలను (మలపదార్థాలను) సరళమైన శోషణకు అనుగుణమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి.

డెట్రిటస్ ఆహార గొలుసుకు ఉదాహరణలు :

  1. డెట్రిటస్ (కుళ్ళిన ఆకుల ద్వారా ఏర్పడింది). → వానపాములు → కప్పలు → సర్పాలు.
  2. మృతిచెందిన జీవులు → ఈగలు, మాగట్స్ → కప్పలు → సర్పాలు.

జల జీవావరణవ్యవస్థలో మేసేజీవుల ఆహార గొలుసు, శక్తి ప్రసరణకు ప్రధాన మార్గంగా పనిచేస్తుంది. దీనికి వ్యతిరేకంగా భూచర జీవావరణవ్యవస్థలో, మేసే జీవుల ఆహార గొలుసు కంటే డెట్రిటస్ ఆహార గొలుసు ద్వారా అధిక భాగం శక్తి ప్రసరణ జరుగుతుంది. డెట్రిటస్ ఆహారగొలుసు కొన్ని స్థాయిలలో మేసే ఆహార గొలుసుతో సంబంధం కలిగి ఉండవచ్చు. డెట్రిటస్ ఆహార గొలుసులోని కొన్ని జీవులు, మేసే జీవుల ఆహార గొలుసులోని కొన్ని జీవులకు ఆహారంగా ఉంటాయి. ఉదా : పైన చూపిన డెట్రిటస్ ఆహారగొలుసులోని వానపాములు మేసే జీవుల ఆహారగొలుసులోని పక్షులకు ఆహారంగా ఉంటాయి. ఈ విధంగా పరిశీలిస్తే ఆహార గొలుసులు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయని తెలుస్తుంది.

ప్రశ్న 27.
ప్రాథమిక ఉత్పాదకత అంటే ఏమిటి? దానిని ప్రభావితం చేసే కారకాలను క్లుప్తంగా వివరించండి.
జవాబు:
జీవద్రవ్యరాశి ఉత్పత్తి రేటును ఉత్పాదకత అంటారు. దీనిని ప్రాథమిక, ద్వితీయ ఉత్పాదకత అని రెండు రకాలుగా వర్గీకరిస్తారు.

1) ప్రాథమిక ఉత్పాదకత (Primary Productivity) :
మొక్కల కిరణజన్యసంయోగక్రియ ద్వారా నిర్ణీత కాలంలో నిర్దిష్టమైన వైశాల్యంలో ఉత్పత్తి చేసిన కర్బన పదార్థాన్ని లేదా జీవద్రవ్యరాశి మొత్తాన్ని ప్రాథమిక ఉత్పాదకత అని నిర్వచిస్తారు. దీన్ని స్థూల ప్రాథమిక ఉత్పాదకత (Gross Primary Productivity, (GPP)) నికర ప్రాథమిక ఉత్పాదకత (Net Primary Productivity, (NPP)) గా విభజించవచ్చు.

ఎ) స్థూల ప్రాథమిక ఉత్పాదకత :
జీవావరణ వ్యవస్థలో కిరణజన్యసంయోగక్రియలో కర్బన పదార్థ ఉత్పత్తి రేటును స్థూల ప్రాథమిక ఉత్పాదకత అంటారు. GPPలో కొంత మొత్తాన్ని మొక్కలు శ్వాసక్రియలో వినియోగించుకొంటాయి.

బి) నికర ప్రాథమిక ఉత్పాతకత :
స్థూల ప్రాథమిక ఉత్పాదకత నుంచి శ్వాసక్రియలో కోల్పోయినది (R) తీసివేయగా మిగిలినదాన్ని నికర ప్రాథమిక ఉత్పాదకత (NPP) అంటారు. స్థూల ప్రాథమిక ఉత్పాదకత (GPP)లో సగటున 20-25 శాతం విచ్ఛిన్నక్రియ (శ్వాసక్రియ) లో ఉపయోగించబడుతుంది.

GPP-R NPP
నికర ప్రాథమిక ఉత్పాదకత అంటే పరపోషకాలు (శాకాహారులు, విచ్ఛిన్నకారులు) ఉపయోగించుకోవడానికి అందుబాటులో ఉన్న జీవద్రవ్యరాశి.

ప్రశ్న 28.
జీవావరణ పిరమిడ్లను నిర్వచించి, సంఖ్యా పిరమిడ్లు, జీవరాశి పిరమిడ్లను సోదాహరణంగా వివరించండి.
జవాబు:
జీవావరణంలో పోషక స్థాయిలను, వాటి స్థాయిని రేఖీయంగా వివరించే నిర్మాణాలు పిరమిడ్ ఆకృతిలో ఉంటాయి. ప్రతి పిరమిడ్ పీఠ భాగంలో ఉత్పత్తిదారులు లేదా ప్రాథమిక పోషక స్థాయి, శిఖర భాగంలో తృతీయ లేదా ఉన్నతస్థాయి వినియోగదారులు ఉంటాయి. జీవావరణ పిరమిడ్లు మూడు రకాలు. 1) సంఖ్యా పిరమిడ్లు, 2) ద్రవ్యరాశి పిరమిడ్లు, 3) శక్తి పిరమిడ్లు. ఈ పిరమిడ్లను మొదటిసారిగా వివరించినవారు ఎల్టన్. అందువలన వీటిని ఎల్టోనియన్ పిరమిడ్స్ లేదా జీవావరణ పిరమిడ్లు అంటారు.
AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం 3

ఒక పోషకస్థాయిలో శక్తి మోతాదు, జీవద్రవ్యరాశి, జీవుల సంఖ్య మొదలైనవి లెక్కించవలసి వచ్చినప్పుడు ఆ పోషక స్థాయిలోని జీవులను అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. కొన్ని జీవులను మాత్రమే లెక్కలోకి తీసుకొని సాధారణీకరణాలను చేస్తే అది సవ్యం కాదు. అనేక జీవావరణవ్యవస్థలలో సంఖ్యా, శక్తి, జీవద్రవ్యరాశుల పిరమిడ్లన్నీ నిటారుగా ఉంటాయి. అంటే ఉత్పత్తిదారులు శాకాహారుల కంటే సంఖ్యలోను, జీవద్రవ్యరాశిలోను అధికంగా ఉంటాయి. శాకాహారులు మాంసాహారుల కంటే జీవ ద్రవ్యరాశి సంఖ్యలోను ఎక్కువగా ఉంటాయి. శక్తి (అందుబాటులో ఉన్నది) కింది పోషకస్థాయిలో కంటే పై పోషక స్థాయిలో ఎప్పుడూ అధికంగా ఉంటుంది.

ఈ సాధారణీకరణానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. పరాన్నజీవుల ఆహార గొలుసులో సంఖ్యా పిరమిడ్ తలకిందులుగా ఉంటుంది. ఒక పెద్ద వృక్షం (ఏకైక ఉత్పత్తిదారి), ఫలాలను తినే ఉడుతలు, పక్షులు లాంటి అనేక శాకాహారులకు ఆహారాన్ని ఇస్తుంది. వీటిపై పలు బాహ్య పరాన్నజీవులు, అంటే గోమార్లు (Ticks), పిడుదులు (Mites), తలలో పేను (Lice) లాంటివి. (ద్వితీయ వినియోగదారులు) నివసిస్తాయి. ఈ ద్వితీయ వినియోగదారులు అనేక పైస్థాయి వినియోగదారులకు, ఇంకా అథిపరాన్నజీవులకు ఊతమిస్తాయి. ఈ విధంగా ప్రతి పోషకస్థాయిలో కింది నుంచి పై వరకు, జీవుల సంఖ్య పెరుగుతుంది. ఫలితంగా సంఖ్యా పిరమిడ్ తలకిందులుగా ఉంటుంది.

ప్రశ్న 29.
స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ క్షీణత వల్ల వచ్చే దుష్ప్రభావాలు ఏమిటి?
జవాబు:
ఓజోన్ విచ్ఛిన్నత అంటార్కిటికా ప్రాంతంలో గమనించదగిన ప్రమాదకర పరిస్థితిలో ఉంది. అందువల్ల అక్కడి ఓజోన్ పొర మందం క్షీణించింది. దీనిని సామాన్యంగా ఓజోన్ రంధ్రం అంటారు.

ఓజోన్ పొర పటిష్టంగా ఉంటే UV-B కంటే తక్కువ తరంగదైర్ఘ్యం గల UV-కిరణాలు దాదాపు సంపూర్ణంగా భూవాతావరణంలో శోషణ చెందుతాయి. UV-B కిరణాలు DNA ని దెబ్బతీసి, ఉత్పరివర్తనాలకు దారితీయవచ్చు. వాటి వల్ల చర్మంపై ముడతలు, చర్మ కణాలు దెబ్బతినడం, వివిధ రకాల చర్మ క్యాన్సర్లు కలుగుతాయి. మన కంటిలోని కార్నియా UV-B కిరణాలను శోషించుకుంటుంది. అధిక మోతాదు వల్ల కార్నియా దెబ్బతిని, స్నోబ్లైండ్నెస్, కాటరాక్ట్ లాంటి సమస్యలు వస్తాయి. ఇది కార్నియాను శాశ్వతంగా దెబ్బతీయవచ్చును.

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 30.
‘హరిత గృహ ప్రభావం’ గురించి రాయండి. [Mar. ’14]
జవాబు:
హరిత గృహ ప్రభావం, భూతాపం (Global warning) :
హరిత గృహంలో ఏర్పడే ఒక దృగ్విషయం నుంచి హరిత గృహ ప్రభావం అనే పదం గ్రహించబడింది. ప్రత్యేకించి శీతాకాలంలో మొక్కలను పెంచడానికి నిర్మించే గాజు గృహాలను (Glass houses) హరిత గృహాలంటారు. గాజు పలకల నుంచి కాంతి లోపలికి వెళ్లే వీలుంది. కానీ ఉష్ణం మాత్రం లోపలే బంధించ బడుతుంది. తత్ఫలితంగా కొద్ది గంటలు ఎండలో అద్దాలు మూసి పార్క్ చేసిన కారులో లాగా హరిత గృహం లోపల వేడిగా ఉంటుంది.

భూమి మీద కూడా హరిత గృహ ప్రభావం సహజంగా సంభవిస్తూ, ఉపరితల వాతావరణాన్ని వేడెక్కిస్తుంది. విశేషమేమిటంటే, హరిత గృహ ప్రభావం లేకపోతే భూఉపరితల సగటు ఉష్ణోగ్రత -18°C ఉంటుంది. ప్రస్తుత సగటు ఉష్ణోగ్రత 15°C.

సూర్యకాంతి వాతావరణ బాహ్య పొరను చేరగానే మేఘాలు, వాయువుల వల్ల దాదాపు పావు వంతు సౌరవికిరణం పరావర్తనం చెందుతుంది. కొంత పీల్చుకోబడుతుంది. మొత్తం సౌర వికిరణంలో కొద్ది భాగం పరావర్తనం చెందితే సగానికవ పైగా భూమిపై పడి భూగోళాన్ని వేడెక్కిస్తుంది. భూఉపరితలం పరారుణ వికిరణం (Infra red radiation) రూపంలో ఉష్ణాన్ని తిరిగి అంతరిక్షంలోకి పంపివేస్తుంది. కానీ అందులో అధిక భాగాన్ని వాతావరణంలోని వాయువులు (ఉదా : కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ మొదలైనవి) పీల్చుకొంటాయి. ఈ వాయువు అణువులు ఉష్ణశక్తిని తిరిగి భూమి మీదకు విడుదల చేసి, భూఉపరితలాన్ని మళ్ళీ వేడెక్కిస్తాయి. పైన పేర్కొన్న కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ వాయువులు హరిత గృహ ప్రభావాన్ని (Green House Effect) కలిగిస్తున్నందువల్ల వాటిని హరిత గృహ వాయువులు అంటారు.

ప్రశ్న 31.
కింది వాటిని క్లుప్తంగా చర్చించండి.
ఎ) హరిత గృహ వాయువులు, బి) శబ్ద కాలుష్యం, సి) సేంద్రియ వ్యవసాయం, డి) మున్సిపల్ ఘన వ్యర్థాలు.
జవాబు:
ఎ) హరిత గృహ వాయువులు :
కార్బన్ డైఆక్సైడ్ వంటి కొన్ని వాయువులు భూవాతావరణంలో ఉష్ణోగ్రతను బంధించి ఉంచి భూవాతావరణం యొక్క వేడిని పెంచుతున్నాయి. దీనినే హరిత గృహ ప్రభావం అంటారు. కార్బన్ డైఆక్సైడ్, మీథేన్లు, హరిత గృహ ప్రభావాన్ని కలుగజేసే వాయువులు. దీనివలన జీవుల మనుగడ ప్రశ్నార్ధకం కావచ్చును.

బి) శబ్ద కాలుష్యం :
ఆవశ్యకం కాని పెద్ద శబ్దాలు శబ్ద కాలుష్యం క్రిందకు వస్తాయి. శబ్దాన్ని డెసిబిల్స్ (dB) ప్రమాణంతో కొలుస్తారు. మనిషి చెవులు 0 – 180 dB మధ్య శబ్దాన్ని మాత్రమే గ్రహించగలుగుతాయి. 120 dB దాటిన శబ్దాలు చెవిలో నొప్పి కలిగించే స్పర్శ ప్రేరణకు హద్దు. 120 dB దాటిన ఏ శబ్దమైనా శబ్ద కాలుష్యంగా పరిగణించబడుతుంది. ఉదా : జెట్ విమానాలు ఎగిరేటప్పుడు 120 dB దాటిన శబ్దం విడుదలవుతుంది. ఇది కర్ణభేరిని నాశనం చేసి శాశ్వతంగా వినికిడి లోపాన్ని కలిగించవచ్చు. పట్టణాలలో తక్కువ స్థాయి శబ్దాలు కూడా దీర్ఘ కాలం వినినట్లయితే వినికిడి కోల్పోయే స్థితి రావచ్చును. అధిక శబ్దాలు అలసటను, తలనొప్పిని, ఆత్రుతను, నిద్రలేమిని కలుగజేస్తాయి. హృదయస్పందన రేటును పెంచుతాయి. వీటివలన మానవులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు.

సి) సేంద్రియ వ్యర్థాలు :
సమగ్ర సేంద్రియ వ్యవసాయంలో వ్యర్థ పదార్థాల పునశ్చక్రీయం సమర్థవంతంగా జరగడం వల్ల అది శూన్యవ్యర్థ (zero-waste) ప్రక్రియ. ఒక ప్రక్రియలో ఉత్పన్నమైన వ్యర్థ పదార్థాలు వేరొక ప్రక్రియలో పోషకాలుగా వినియోగించబడతాయి. దీనివల్ల వనరుల వినియోగం గరిష్ఠంగా పెరిగి, ఉత్పాదకత సామర్థ్యం అధికమవుతుంది. హర్యానాలోని సోనిపత్కు చెందిన రమేష్చంద్ర దాగర్ అనే రైతు అవలంబించిన పద్ధతి ఇందుకు మంచి ఉదాహరణ. అతను తేనెటీగల పెంపకం, పాడి పశువుల నిర్వహణ, వాననీటి సంరక్షణ, కంపోస్టింగ్ ఒక గొలుసు ప్రక్రియలుగా సమీకృతం చేశాడు. ఈ కార్యక్రమాలన్నీ ఒకదానికి ఒకటి సహాయపడుతూ పొదుపుగా, దీర్ఘకాలం నిలిచి ఉండే ప్రక్రియగా రూపొందింది. పంటల వ్యర్థాలు, పశువుల విసర్జకాలు (పేడ) కంపోస్టు చేయడానికి ఉపయోగపడతాయి. కంపోస్టు సహజ ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియలో ఉత్పన్నమయ్యే బయోగ్యాస్ వ్యవసాయక్షేత్ర ఇంధన అవసరాలకు సరిపోతుంది. సమగ్ర సేంద్రియ వ్యవసాయాన్ని వ్యాప్తి చేసేందుకు, దాని వివరాలను తెలియజేసేందుకు దాగర్ హర్యానా కిసాన్ వెల్ఫేర్ క్లబ్ను స్థాపించాడు.

డి) మున్సిపల్ ఘన వ్యర్థాలు :
ఏదైనా పదార్థం / వస్తువులు ఘనరూపంలో ఉన్న వ్యర్థాలను బయటకు పారవేసినట్లయితే వాటి ఘనవ్యర్థాలు అంటారు. ఇవి గృహాలు, హోటళ్ళు, రెస్టారెంట్లు, టీ దుకాణాలు మొ॥ వాటి నుండి వస్తాయి.

నగరపాలక సంస్థలు సేకరించే ఘనవ్యర్థాలు సాధారణంగా కాగితం, ఆహార పదార్థాలు, ప్లాస్టిక్, గ్లాస్, లోహాలు, రబ్బర్, తోలు, బట్టలు మొ||నవి ఈ వ్యర్థాల మొత్తాలను తగ్గించడానికి వాటిని తగులబెడతారు. అయితే అవి పూర్తిగా కాలకపోవడం వల్ల బహిరంగ డంప్లు గాలి పరిసరాల కాలుష్యానికి దారితీస్తుంది. అనారోగ్యాలు ప్రబలుతాయి.

ఈ సమాజంలో అవగాహన కలిగించడం ద్వారా వ్యర్థాల తొలగింపుకు ఉత్తమ పరిష్కారం. ఇటువంటి మున్సిపల్ ఘనవ్యర్థాలను పునశ్చక్రీయ ప్రక్రియ ద్వారా తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చినట్లయితే పరిసరాల కాలుష్యాన్ని అరికట్టవచ్చును.

ప్రశ్న 32.
భూతాప కారణాలను, ప్రభావాలను చర్చించండి. భూతాపాన్ని నియంత్రించడానికి ఏ చర్యలు చేపట్టాలి?
జవాబు:
హరితగృహ వాయువుల స్థాయి పెరగడం వల్ల భూమి ఉష్ణోగ్రత గణనీయంగా పెరిగి భూతాపం (Global Warming)కు దారితీస్తుంది. గత శతాబ్ద కాలంలో భూతాపం 0.6°C వరకు పెరిగింది. అందులో అధిక భాగం చివరి మూడు దశాబ్దాలలోనే పెరిగింది. ఈ ఉష్ణోగ్రత పెరుగుదల భూవాతావరణంలో తీవ్ర మార్పులు కలిగిస్తుందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. అందువల్ల తీవ్ర వాతావరణ మార్పులు (ఎల్నినో (ELNINO)) లాంటి), ధ్రువ ప్రాంతాలలోను, హిమాలయాల లాంటి పర్వతాల పైన ఉన్న మంచు కరగడంలాంటివి సంభవిస్తాయి. తత్ఫలితంగా కాలక్రమేణా సముద్ర మట్టం పెరిగి, తీరప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. గ్లోబల్ వార్మింగ్ కలిగించే అపార దుష్పరిమాణాల అధ్యయనం కొనసాగుతోంది.

గ్లోబల్ వార్మింగ్ – నియంత్రణా పద్ధతులు :

  1. శిలాజ ఇంధనాల వాడకం తగ్గింపు
  2. శక్తి (energy) వినియోగ సామర్థ్యత పెంపు
  3. అడవుల నరికివేత ఆపడం, వృక్షాలు పెంచడం
  4. మానవ జనాభా పెరుగుదల వేగాన్ని తగ్గించడం

ప్రశ్న 33.
కింది వాటికి క్లుప్తంగా, విమర్శనాత్మక వివరణ ఇవ్వండి.
ఎ) యూట్రోఫికేషన్
బి) జీవ ఆవర్థనం
సి) భూగర్భ జల క్షీణత, వాటి పరిపుష్టతకు మార్గాలు.
జవాబు:
AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం 4
ఎ) యూట్రోఫికేషన్ (Eutrophication) :
నీటిలో పోషక పదార్థాలు పెరిగిపోవడం వల్ల సరస్సులో ఏర్పడే సహజమైన వార్ధక్యాన్ని యూట్రోఫికేషన్ అంటారు. కొత్తగా ఏర్పడిన సరస్సులలో నీరు చల్లగాను, తేటగాను ఉండటం వల్ల ప్రాణులకు ఆధారంగా ఉండదు. కాలానుగుణంగా నైట్రేట్స్, ఫాస్ఫేట్స్ లాంటి పోషక పదార్థాలు పిల్ల కాలువల ద్వారా సరస్సులలోకి నెమ్మదిగా చేరతాయి. ఇవి నీటిలో శైవలాలు, ఇతర మొక్కల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. తదనుగుణంగా జంతువులు వృద్ధి చెందుతాయి. కర్బన పదార్థాలు సరస్సు అడుగు భాగంలో చేరి పేరుకుపోతాయి. కొన్ని శతాబ్దాల తరువాత సిల్ట్ (silt), కర్బన డెబ్రిస్ పేరుకుపోయి సరస్సు లోతు తగ్గిపోయి వేడిగా మారుతుంది. దాని ఫలితంగా శీతల వాతావరణంలో జీవించే జీవుల స్థానంలో నెమ్మదిగా ఉష్ణనీటి జీవుల ప్రతిస్థాపన జరుగుతుంది.

బి) జీవ ఆవర్థనం (Bio-magnification) :
నీటి ఆహారపు గొలుసులో కాలుష్యం లేదా విషపదార్థ గాఢత ఒక పోషక స్థాయి నుంచి వేరొక పోషక స్థాయికి పెరుగుతూపోతే దాన్ని జీవ ఆవర్థనం అంటారు. జీవుల్లో ప్రవేశించిన విష పదార్థం జీవక్రియ లేదా విసర్జన ప్రక్రియల వల్ల క్షీణించకుండా తరువాతి పోషణ స్థాయికి వెళ్ళి అక్కడ విష పదార్థాలు పేరుకుపోయే పరిస్థితులలో జీవ ఆవర్ధనం జరుగుతుంది. DDT, పాదరస కాలుష్యం విషయంలో ఈ దృగ్విషయం బాగా తెలుస్తుంది.

సి) భూగర్భ జల క్షీణత, వాటి పరిపుష్టతకు మార్గాలు :
వర్షం కురిసిన తరువాత కొంత నీరు భూమిలోనికి ఇంకిపోయి భూమి పొరల మధ్య, మట్టి రేణువులతో కూడి ఉంటుంది. అలాగే జలాశయాల నుండి, ఇతర జలవనరుల నుండి కూడా భూమి పొరలలోకి నీరు ఇంకిపోతుంది. ఇలా ఇంకిన నీటిని భూగర్భజలం అంటారు. భూగర్భ జలాలు ప్రధానంగా వృక్షజాతికి జీవనాధారం. అలాగే మానవులు భూమి నుండి బావులు, బోరుబావుల ద్వారా నీటిని బయటకు తీసి వాడుకుంటారు.

ఇటీవల కాలంలో పర్యావరణ కాలుష్య కారణంగా, ఇతర పరిస్థితుల ప్రభావం వలన వర్షపాతంలో తరుగుదల కనిపిస్తుంది. దీనివలన భూగర్భజల స్థాయి పడిపోతుంది. కనుక ఇంకుడు గుంటలను, చిన్నచిన్న జలవనరులను ఏర్పర్చి, ఎక్కడి నీటిని అక్కడే భూమిలోకి ఇంకిపోయేటట్లు చేసి జీవజాతిని రక్షించుకోవాలి.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఉష్ణోగ్రత ఒక జీవావరణ కారకం అనే విషయంపై వ్యాసం రాయండి.
జవాబు:
వేడి తీవ్రతను తెలియజేసే ప్రమాణం ఉష్ణోగ్రత. భూమిపై ఉష్ణశక్తికి మూలాధారం సూర్యుడు. భూమిపై ఉష్ణోగ్రత ఆయా ఋతువులు, భౌగోళిక ప్రాంతాలపై ఆధారపడి ఉంటుంది. భూమధ్యరేఖ నుండి ధృవాల వైపుకు ప్రయాణించేటప్పుడు ఉష్ణోగ్రత క్రమేణా తగ్గుతుంది. భూఉపరితలం నుండి పర్వతాల పైకి వెళుతున్నప్పుడు క్రమేణా తగ్గుతుంది. భూమిపై గల ఉష్ణోగ్రతా వ్యత్యాసాలు జలావాసాలలోని ఉష్ణోగ్రతా వ్యత్యాసాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే నీటి కంటే నేల త్వరితంగా వేడెక్కుతుంది, చల్లబడుతుంది.

జీవావర్ణంలో జీవులపై, నిర్జీవులపై ఉష్ణోగ్రతా ప్రభావం అధికంగా ఉంటుంది. ఉష్ణోగ్రత ఒక జీవావరణ కారకం.

సరస్సులలో ఉష్ణోగ్రతా ప్రభావం :
సమశీతోష్ణ ప్రాంతాలలో ఋతువులు మారుతున్నప్పుడు ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఏర్పడతాయి. దీని కారణంగా సరస్సు ఆవరణంలో ఉష్ణస్తరాలు ఏర్పడతాయి. దీనినే ఉష్ణస్తరీభవనం అంటారు. ఉష్ణస్తరీభవనం వలన ఋతువులకు అనుగుణంగా సరస్సులో నీరు కలియబెట్టబడుతుంది. వీటిని ఋతువులకు అనుగుణంగా గ్రీష్మకాల స్తరీభవనం, శీతాకాల స్తరీభవనంగా వివరించవచ్చును. ఈ విధమైన స్తరీభవనాలు లోతైన సరస్సులో అన్ని స్థాయిల జీవుల మనుగడకు దోహదపడతాయి.

ఉష్ణోగ్రత సహనం :
ప్రకృతిలో కొన్ని జీవులు అత్యధిక ఉష్ణోగ్రత మార్పులను తట్టుకునే అనుకూలనాలను కలిగివుంటాయి. వీటిని యూరీథర్మల్ జీవులు అంటారు. అనేక జీవులు అత్యల్ప ఉష్ణోగ్రత మార్పులను మాత్రమే తట్టుకునే అనుకూలనాలను కలిగి ఉంటాయి. వీటిని స్టీనోథర్మల్ జీవులు అంటారు. వివిధ జీవ జాతులలో ఉష్ణోగ్రత సహనస్థాయి వాటి భౌగోళిక విస్తరణను నిర్ణయిస్తాయి.

ఉష్ణోగ్రత – జీవక్రియలు :
ఉష్ణోగ్రతా ప్రభావం జీవులలోని ఎంజైముల చర్యలపై, తద్వారా ఆధార జీవక్రియలపై, జీవుల శరీరధర్మ క్రియలపై, నిర్మాణంపై పడుతుంది. జీవులు ఏ ఉష్ణోగ్రత వద్ద తమ జీవక్రియలను పతాకస్థాయిలో నిర్వర్తించగలుగుతాయో ఆ ఉష్ణోగ్రతను యుక్తతమ ఉష్ణోగ్రత అంటారు. ఉష్ణోగ్రత పెరిగినకొద్దీ జీవక్రియా రేటు పెరుగుతుంది. ఉష్ణోగ్రతకు జీవక్రియ రేటుకు మధ్యగల సంబంధాన్ని వాస్టాఫ్ సూత్రం వివరిస్తుంది. జీవులు నిరంతరంగా లేదా దీర్ఘకాలికంగా జీవించగల కనిష్ట ఉష్ణోగ్రతను కనిష్ట ప్రభావ ఉష్ణోగ్రత అంటారు.

కొన్ని జంతువులలో ఋతువులనుబట్టి వాటి శరీర ఆకృతిలో మార్పులు ఏర్పడతాయి. దీనినే భ్రమణ రూపవిక్రియ అంటారు.
ఉదా : డాఫ్నియా.
AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం 5

జీవులలో ఉష్ణోగ్రతా అనుకూలనాలు :
జీవులు తమ దేహంలో బాహ్యంగా, అంతరంగా పరిసర ఉష్ణోగ్రతా ప్రభావాలకు కొన్ని అనుకూలనాలను సంతరించుకొంటాయి. వాటిని మూడు రకాలుగా చెప్పవచ్చును.

  1. ప్రవర్తన అనుకూలనాలు,
  2. స్వరూప, అంతర్నిర్మాణ అనుకూలనాలు,
  3. శరీరధర్మ అనుకూలనాలు.

1) ప్రవర్తన అనుకూలనాలు :
పరిసరాలలోని ఉష్ణోగ్రత భేదాలను ఎదుర్కొనే వీలుగా ఎడారి బల్లి వంటి జీవులు అనేక ప్రవర్తనా పద్ధతులను అవలంబిస్తాయి. పరిసర ఉష్ణోగ్రత దేహ ఉష్ణోగ్రత కంటే తగ్గితే ఎండలోకి వెళ్ళి సూర్యరశ్మి సోకేవిధంగా తమ దేహాన్ని ఉంచి ఉష్ణోగ్రతను పొందుతాయి. అలాగే బాహ్యఉష్ణోగ్రత పెరిగితే నీడలోకి కాని, బొరియలలోకి కాని వెళతాయి.

2) స్వరూప, అంతర్నిర్మాణ అనుకూలనాలు :
ధృవ ప్రాంత సముద్రాలలో నివసించే సీలాంటి జలక్షీరదారులలో చర్మానికి క్రింద మందమైన కొవ్వుపొర (బ్లబ్బర్) ఏర్పరచబడి ఉంటుంది. అది శరీరం నుండి ఉష్ణం వెలుపలకు వెళ్ళకుండా ఉష్ణబంధకంగా పనిచేస్తుంది. సాధారణంగా శీతల ప్రాంతంలో నివసించే జీవుల దేహాలు విశాలంగా, పెద్దవిగా ఉంటాయి. ఉష్ణ ప్రాంతంలో నివసించే జీవుల దేహాలు చిన్నవిగా ఉంటాయి.

3) శరీరధర్మ అనుకూలనాలు :
చాలా జంతువులలో శరీరధర్మ క్రియలు యుక్తతమ ఉష్ణోగ్రతా శ్రేణిలో నిర్వహించబడతాయి. మానవ శరీర ఉష్ణోగ్రత 37°C. పరిసర ఉష్ణోగ్రత అధికమైనపుడు దేహం చెమట పట్టించడం, చెమట ఆవిరిగా మారిన ఫలితంగా ఏర్పడిన చల్లదనం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రించబడుతుంది. పరిసర ఉష్ణోగ్రత తగ్గినప్పుడు దేహం ఉష్ణోగ్రతను ఉత్పన్నం చేసి జీవి కాపాడబడుతుంది. మొక్కలలో ఈవిధంగా అంతర ఉష్ణోగ్రతను ఏర్పరచే యంత్రాంగం లేదు.

అనేక జంతువులు ఒక స్థిరమైన అంతర ఉష్ణోగ్రతను క్రమపరచే యంత్రాంగమును కలిగి లేవు. ఇవి పరిసరాలకు అనుగుణంగా తమ దేహ ఉష్ణోగ్రతను మార్చుకుంటాయి. వీటిని బాహ్య ఉష్ణజీవులు లేదా అనురూపకాలు అంటారు.

ఉష్ణోగ్రతా ఒత్తిడిని తట్టుకోవడానికి కొన్ని జంతువులు తాత్కాలికంగా తమ నివాస ప్రాంతాలు వదిలి అనుకూల ప్రదేశాలలో నివసిస్తాయి. ఉదా : మన రాష్ట్రంలో కొల్లేటి ప్రాంతానికి వలస వచ్చే పక్షులు. కొన్ని జీవులు ప్రతికూల ఉష్ణోగ్రత సమయంలో జీవన చర్యలను నిమ్న స్థాయిలో నిర్వహించుకుంటూ సుప్తావస్థలోకి వెళతాయి. కొన్ని కోశాలను ఏర్పరచుకుంటాయి.

కొన్ని జంతువులు అననుకూల ఉష్ణోగ్రతా స్థితిలో పిండాభివృద్ధి తాత్కాలికంగా నిలిపివేస్తాయి. దీనినే డయాపాస్ అంటారు.

పై విధంగా జీవావరణంలో ఉష్ణోగ్రత జీవావరణం కారకంగా పనిచేస్తుంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 2.
నీరు జీవావరణంలో ఒక కారకం అనే విషయాన్ని సవివరంగా రాయండి.
జవాబు:
జంతువుల జీవనశైలిపై ప్రభావం చూపే ఒక ప్రధాన కారకం నీరు. నీరు లేనిదే జీవం నిలువలేదు. ఎడారులలో నీటి లభ్యత చాలా తక్కువగా ఉండటం వల్ల ప్రత్యేకమైన అనుకూలనాలను ఏర్పరచుకోవడం ద్వారా ఆ ప్రాంతాలలో నివసించడం సాధ్యమైంది. సముద్రాలు, నదులు, సరస్సులలో నివసించే జంతువులకు నీటి సంబంధ సమస్యలే ఉండవని అనుకోవచ్చు. కాని ఇది నిజం కాదు. జలచర జీవులకు నీటి నాణ్యత (రసాయన సంఘటన, pH మొదలైనవి) అత్యంత ప్రధానమైంది. మంచినీటి లవణ గాఢత 5% కంటే తక్కువగాను, సాగరనీటిలో 30-35% గాను ఉంటుంది.

కొన్ని అధిక లవణీయత గల లాగూన్స్లలో 100% ఉంటుంది. కొన్ని జంతువులు ఎక్కువ మేర లవణీయతలో అనుకూలనాలను ప్రదర్శిస్తాయి. (వ్యాపిత లవణీయత- Euryhaline), మిగిలినవి తక్కువ మేర లవణీయతలో అనుకూలనాలను కలిగి ఉంటాయి. (మిత లవణీయత – Stenohaline). అనేక మంచినీటి చేపలు ద్రవాభిసరణ సమస్యలు ఎదుర్కోలేక ఎక్కువ కాలం సముద్రంలో నివసించలేవు. అదేవిధంగా సముద్రచేపలు మంచినీటిలో నివసించలేవు.

మంచినీటి ఆవాసాల్లో అనుకూలనాలు :
మంచినీటిలో నివసించే జంతువులు అంతర ద్రవాభిసరణ (Osmosis) సమస్యను ఎదుర్కోవాలి. మంచినీటిలో ద్రవాభిసరణ పీడనం తక్కువగా ఉంటుంది. జంతుదేహంలోని ద్రవాలలో ద్రవాభిసరణ పీడనం అధికంగా ఉండటం వల్ల వెలుపలి ప్రాంతపు నీరు జీవి శరీరంలోకి అంతర ద్రవాభిసరణం ద్వారా ప్రవేశిస్తుంది. మంచినీటి జీవులు దేహంలోని నీటి సమతుల్యతను నిర్వహించడానికి అనేక అనుకూలనాలు పొందాయి. అవి : మంచినీటి ప్రోటోజోవా జీవులలో సంకోచరిక్తికలు, చేపలలో పెద్ద రక్తకేశ నాళికాగుచ్ఛ మూత్రపిండాలు (Glomelular kidneys) మొదలైనవి. ఇవి దేహం నుంచి అధిక మొత్తంలో విసర్జించే మూత్రంలో కొన్ని లవణాలను కూడా కోల్పోతాయి.

దేహం నుంచి కోల్పోయిన లవణాలను భర్తీ చేయడానికి, మంచినీటి చేపలు వాటి మొప్పలలో లవణాలను గ్రహించే క్లోరైడ్ కణాలు (Chloride cells) కలిగి ఉంటాయి. మంచినీటి చెరువులలో ప్రధాన సమస్య ఏమిటంటే ఎండాకాలంలో అనేక కుంటలు ఎండిపోతాయి. ఇటువంటి సమస్య నుంచి రక్షణ కోసం మంచినీటి ప్రొటిస్టా జీవులు కోశీభవన (Encystment) ప్రక్రియను ప్రదర్శిస్తాయి. ఎండాకాలంలో ప్రతికూల సమస్యల నుంచి రక్షణ కోసం మంచినీటి స్పంజికలు అలైంగికోత్పత్తి నిర్మాణాలైన జెమ్యూల్స్న ఏర్పరుస్తాయి. ఎండాకాలంలో మనుగడ కోసం “ఆఫ్రికన్ ఊపిరితిత్తి చేప” (African lung fish) ప్రోటాక్టిరస్ (Protopterus) బురద మట్టిలో బొరియలు చేసుకొని, దేహం చుట్టూ జిగట పదార్థ కోశాన్ని ఏర్పరచుకొంటుంది.

సముద్ర ఆవాసాల్లో అనుకూలనాలు :
సముద్రపు నీటిలో లవణ గాఢత దేహద్రవ్యాల గాఢత కంటే ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా సముద్ర జంతువుల దేహం నుంచి నిరంతరం బాహ్యద్రవాభిసరణ (Exosmosis) ద్వారా నీరు వెలుపలికి వెళ్ళడం ద్వారా దేహం నిర్జలీకరణకు గురవుతుంది. ఇలాంటి నీరు కోల్పోయే సమస్య నుంచి బయటపడటానికి సముద్రచేపలలో వృక్క ప్రమాణాలు (Nephrons) తక్కువగానున్న రక్తకేశనాళికాగుచ్ఛరహిత మూత్రపిండాలు (Aglomerular kidneys) ఉంటాయి. ఇవి మూత్రం ద్వారా విసర్జింపబడే నీటిని తగ్గిస్తాయి. కోల్పోయిన నీటిని భర్తీ చేయడానికి సముద్రచేపలు ఎక్కువగా నీటిని లోనికి తీసుకోవడం వల్ల, లవణాలు దేహద్రవ్యాలతో కలిసి అంతర సమతుల్యతలో అస్థిరత ఏర్పడుతుంది.

దేహంలో లవణ సమస్థితి (Salt homeostasis) నియంత్రించడంలో లవణాలను స్రవించే క్లోరైడ్ కణాలు మొప్పలలో ఉంటాయి. సాగర పక్షులైన సీగల్స్ (Sea gulls), పెంగ్విన్ (Penguin) పక్షుల నాసికానాళాల నుంచి లవణద్రవం చుక్కలుగా వెలువడుతుంది. తాబేళ్లలో (Turtles) నేత్రాల సమీపంలో క్లోరైడ్ స్రవించే గ్రంథినాళాలు తెరచుకొని ఉంటాయి. కొన్ని మృదులాస్థి చేపలలో యూరియా, ట్రైమిథైల్ అమైన్ ఆక్సైడ్ (TMO) రక్తంలో ఉండి, దేహద్రవ్యాలను సాగరనీటితో సమగాఢతలో ఉంచడంలో, బాహ్యద్రవాభిసరణతో జరిగే నిర్జలీకరణ జరగకుండా అవుతుంది.

ఉప్పునీటికయ్య జంతువులలో నీటి సంబంధ అనుకూలనాలు :
ఉప్పునీటికయ్య జంతువులు స్థూల లవణీయత మార్పులను ఎదుర్కోవడానికి అనుకూలనాలను కలిగివుంటాయి. అటువంటి జంతువులను వ్యాపిత లవణీయ (Euryhaline) జంతువులని, అటువంటి వ్యత్యాసాలకు తట్టుకోలేనివాటిని మిత లవణీయత జీవులు (Stenohaline) అంటారు. సాల్మన్, హిల్సా చేపలను అనాడ్రామస్ చేపలు అంటారు. ఇవి ప్రజననం కోసం సముద్రపు నీటి నుంచి మంచినీటిలోకి వలస వెళ్తాయి. ఆంగ్విల్లా బెంగాలెన్సిస్ ఒక కెటాడ్రామస్ చేప. ఇది ప్రజననం కోసం నదుల నుంచి సముద్రాలలోకి వలస వెళ్తుంది.

నీటి లవణీయ మార్పులకు అనుగుణంగా ఈ చేపలలోని రక్తకేశనాళికాగుచ్ఛ మూత్రపిండాలు (Glomerular kidneys) సర్దుబాటు చేసుకొంటాయి. క్లోరైడ్ కణాలు పరిస్థితినిబట్టి లవణాలను విసర్జించే లేదా గ్రహించే అనుకూలనం చెంది ఉంటాయి. నదులలోకి ప్రవేశించగానే సాల్మన్ చేపలు ఎక్కువ నీటిని తాగడం ద్వారా వాటి దేహ ద్రవ్యాలు గాఢత పరిసర నీటి గాఢతతో సమానంగా ఉంటుంది.

భూచర జీవనానికి నీటి సంబంధ అనుకూలనాలు :
బాహ్యంగా లభించే నీటివనరులు లభ్యం కాకపోతే, ఉత్తర అమెరికా ఎడారులలోని కంగారు ఎలుక కావలసిన నీటి అవసరాన్ని దేహంలోని కొవ్వుని ఆక్సీకరణ చేయడం ద్వారా తీర్చుకుంటుంది. ఈ క్రియలో నీరు ఒక ఉపఉత్పాదితం. అంతేకాకుండా కంగారు ఎలుక అతి గాఢత కలిగిన మూత్రాన్ని విసర్జిస్తుంది. ఈ చర్య వల్ల విసర్జనక్రియ ద్వారా నీరు వృధా కాకుండా అది సంరక్షించుకుంటుంది.

ప్రశ్న 3.
సరస్సుని జీవావరణ వ్యవస్థగా వివరిస్తూ, అందులో వివిధ మండలాలను, జీవ సంఘటకాలను సోదాహరణంగా వివరించండి.
జవాబు:
సరస్సు జీవావరణ వ్యవస్థ (Lake Ecosystem) :
జలచర జీవావరణవ్యవస్థను గురించిన ప్రాథమిక అవగాహన కోసం ‘సరస్సు’ అధ్యయనాన్ని ఉదాహరణగా తీసుకొందాం. ఇది స్వతంత్ర జీవనాధార ప్రామాణికంగా పరిగణించవచ్చు. దీని సహాయంతో జలచర జీవావరణవ్యవస్థలోని సంక్లిష్ట అంతరచర్యలన్నీ కూడా అధ్యయనం చేయవచ్చు.
AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం 6

సరస్సులు సముద్ర తీరప్రాంతానికి దూరంగా ఉన్నా చుట్టూ భూమి (inland) ఉండి, పెద్ద స్థిర జల ప్రాంతాలుగా నిశ్చలమైన / స్థిరమైన నీటిని కలిగి ఉంటాయి. (గుర్తు తెచ్చుకోండి : స్థిర జల సమాజం). ఇవి చెరువుల కంటే లోతుగా ఉంటాయి. అత్యధిక సరస్సులలో సంవత్సరమంతా నీరు ఉంటుంది. లోతైన సరస్సులో కాంతి 200 మీ. కంటే ఎక్కువ లోతుకు చొచ్చుకొని పోలేదు. కాంతి తీవ్రత, ఉష్ణోగ్రత, పీడనాలను ఆధారం చేసుకొని సరస్సును నిలువుగా స్తరీకరించారు. లోతైన నీటి సరస్సులలో మూడు నిర్దిష్ట ప్రాంతాలు ఉన్నాయి. అవి :

  1. వేలాంచల మండలం (Littoral zone),
  2. లిమ్నెటిక్ మండలం (Limnetic zone)
  3. ప్రొఫండల్ మండలం (Profundal zone).

వేలాంచల మండలం (Littoral zone) :
తీరానికి దగ్గరగా ఉండి, లోతు తక్కువగా ఉన్న ప్రాంతాన్ని వేలాంచల మండలం అంటారు. కాంతి అడుగు భాగం వరకు ప్రసరిస్తుంది.

లిమ్నెటిక్ మండలం(Limnetic zone) :
ఇది తీరానికి దగ్గరగా ఉండే జలాశయ ప్రాంతం. కాంతి సమర్థవంతంగా లోపలికి చొరబడగలిగే ప్రాంతం వరకు కొనసాగుతుంది.

ప్రొఫండల్ మండలం (Profundal zone) :
ఇది లిమ్నెటిక్ మండలానికి కింద ఉన్న లోతైన నీటి ప్రదేశం. దీనిలో కాంతి ఉండదు. కిరణజన్య సంయోగక్రియ జీవులుండవు. ఈ నీటిలో ఆక్సిజన్ తక్కువ స్థాయిలో ఉంటుంది. దీనిలో అవాయు శ్వాసక్రియ జరిపి కుళ్ళిన ఆహార పదార్థాలను తినే డెట్రిటస్ జీవులు ఉంటాయి.

స్థిర జల ఆవాసంలో ఉన్న జీవులను పిడానిక్ రూపాలు, లిమ్నెటిక్ రూపాలుగా విభజించారు. వీటిలో సరస్సు అడుగుభాగంలో గల జీవులను పిడానిక్ (pedonic form) రూపాలుగా, సరస్సు పై భాగంలో తీరం దగ్గర ఉన్న మొక్కలకు దూరంగా ఉన్న జీవులను లిమ్నెటిక్ రూపాలని (Limnetic forms) అంటారు.

వేలాంచల మండలంలోని జంతు వృక్ష జీవం (బయోటా) :
ఈ మండలంలో కాంతి ప్రవేశించు స్థాయి వరకు పిడానిక్ మొక్కలు ఎక్కువగా ఉంటాయి. తీరప్రాంతంలో ఉద్భవించిన మొక్కల సమూహం (Emergent vegetation) ఉంటుంది. ఈ మొక్కల వేళ్ళు నీటి అడుగు భాగంలోనూ, కొమ్మలు, ఆకులు వీటి ఉపరితలంపైన ఉంటాయి. ఇవి ఉభయచర మొక్కలు (Amphibious plants). వేలాంచల మండలంలోని మొక్కల వేర్లు బహిర్గతంగా కనిపిస్తాయి.

క్యాట్ టెయిల్స్ (టైఫా), బలషస్ (స్కిర్పస్) ఆరోహెడ్స్ (సాజిట్టేరియా) మొదలైనవి. కొద్దిగా లోతుగా ఉన్నవి వేళ్ళు కలిగి, నీటిలో తేలియాడుతూన్న పత్రాలు కలిగిన, మొక్కలు నీటి లిల్లీలు (నింఫియా), నెలుంబో, ట్రాపా మొదలైనవి. ఇంకా లోతుగా ఉన్నవి నీటిలో పూర్తిగా మునిగిన మొక్కలైన హైడ్రిల్లా, కారా, పొటామోజిటాన్ మొదలైనవి. స్వేచ్ఛగా తేలియాడే మొక్కల సమూహంలో పిస్టియా, ఉల్ఫియా, లెమ్నా, (డక్వోడ్) ఎజొల్లా, ఐకార్నియా మొదలైనవి ఉంటాయి.

వేలాంచల మండలంలోని వృక్ష ప్లవకాలలో డయాటమ్స్ (కొసినోడిస్కస్, నిట్సియా మొదలైనవి), ఆకుపచ్చ శైవలాలు (వాల్వాక్స్, స్పైరోగైరా మొదలైనవి), యూగ్లినాయిడ్స్ (యూగ్లీనా, ఫాకస్ మొదలైనవి), డైనోఫ్లాజెల్లేట్స్ (జిమ్నోడినియమ్, సిస్టోడినియమ్ మొదలైనవి) ఉన్నాయి.

సరస్సులో వేలాంచల మండలంలో వినియోగదారులైన జంతువులు అధికసంఖ్యలో ఉంటాయి. జంతుప్లవకాలు, న్యూస్టాస్, క్టాన్, పెరీఫైటాన్, బెన్డోస్లుగా వర్గీకరించారు. వేలాంచల మండలంలోని జంతు ప్లవకాలలో వాటర్ ప్లీస్ (Water fleas) అయిన డాఫ్నియా, రోటిఫర్లు, ఆస్ట్రకాడ్స్ ఉన్నాయి.

నీటి ఉపరితలంలో గాలీ నీరు కలిసేచోట ఉండే జంతువులను న్యూస్టాన్ అంటారు. ఇవి రెండు రకాలు. 1. ఎపిన్యూస్టాన్, 2. హైపోన్యూస్టాన్. ఎపిన్యూస్టాన్ / సుప్రాన్యూస్టాన్లో వాటర్ స్టైడర్స్ (గెర్రిస్), బీటిల్స్, వాటర్ బగ్స్ (డైన్యూట్స్) ఉంటాయి. హైపోన్యూస్టాన్ / ఇన్ఫ్రాన్యూస్టాన్లో దోమ డింభకాలు మొదలైనవి ఉంటాయి.

నీటిలో ఈదుతూ జీవించే చేపలు, ఉభయచరాలు, నీటి సర్పాలు, టెర్రాపిన్స్ (తాబేళ్ళు), కీటకాలైన నీటి తేలు (రనత్రా), నోటోనెక్టా (వెనుకకు ఈదే జీవి), డైవింగ్ బీటిల్స్ (డైటిస్కస్) మొదలైన వాటిని నెక్టాన్ అంటారు.

నీటి మొక్కలపై అంటిపెట్టుకొని లేదా పాకుతున్న జంతువులు. నీటినత్తలు, కీటకాల డింభకాలు (Nymphs of Insects), బ్రయోజోవన్స్, టర్బల్లేరియన్స్, హైడ్రాలు మొదలైనవి పెరిఫైటాన్ గా చెప్పబడతాయి.

సరస్సు అడుగుభాగంలో విశ్రాంతి తీసుకొనే లేదా చరించే జీవులను బెన్డోస్ (Benthos) అంటారు. ఉదా : ఎర్రటి, అనెలిడ్లు, కైరొనోమిడ్ డింభకాలు, క్రే చేపలు, కొన్ని ఐసోపోడ్స్, ఆంఫిపోడ్స్, క్లామ్స్ మొదలైనవి.

లిమ్నెటిక్ మండలంలోని బయోటా (Biota of the Limnetic zone) :
సరస్సులో అతిపెద్ద మండలం లిమ్నెటిక్ మండలం. ఈ మండలంలో సమయానుకూలంగా నీటిస్థాయి, ఉష్ణోగ్రత, ఆక్సిజన్ లభ్యత మొదలైనవి వేగవంతంగా మారతాయి. లిమ్నెటిక్ మండలంలో స్వయంపోషకాలు అధికంగా ఉంటాయి. (కిరణజన్యసంయోగక్రియ మొక్కలు). ఈ ప్రాంతంలోని ముఖ్యమైన స్వయంపోషకాలు వృక్ష ప్లవకాలైన యూగ్లినాయిడ్స్, డయాటమ్స్, సైనోబాక్టీరియా, డైనోఫ్లాజెల్లేట్లు, ఆకుపచ్చని శైవలాలు ఉన్నాయి. లిమ్నెటిక్ మండలంలోని వినియోగదారులు జంతు ప్లవకాలు, ఉదా: కోపిపోడ్స్, చేపలు, కప్పలు, నీటి సర్పాలు మొదలైనవి. లిమ్నెటిక్ నెక్టాన్గా పిలవబడతాయి.

ప్రొఫండల్ మండలంలోని బయోటా (Biota of the Profoundal zone) :
ఈ ప్రాంతంలోని జీవులు విచ్ఛిన్నకారులు (బాక్టీరియా), కైరొనొమిడ్ డింభకాలు, చావోబోరస్ (ఫాంటమ్ డింభకాలు), ఎర్ర అనలిడ్డు, క్లామ్స్ (clams) మొదలైనవి తక్కువ స్థాయిలో ఆక్సిజన్ ఉన్నప్పటికీ జీవిస్తాయి. ఈ మండలంలోని విచ్ఛిన్నకారులు, చనిపోయిన మొక్కలు, జంతువులను విచ్ఛిన్నం చేసి అందులో గల పోషక పదార్థాలను విడుదల చేస్తాయి. వాటిని వేలాంచల మండలం, లిమ్నెటిక్ మండలాలలోని జీవసమాజాలు వినియోగించుకుంటాయి.

సరస్సు జీవావరణవ్యవస్థ ఒక ఉన్నత స్థాయి జీవావరణవ్యవస్థ లేదా జీవగోళం నిర్వహించే విధులన్నిటినీ నిర్వహిస్తుంది. వికిరణ సౌరశక్తి సహాయంతో స్వయంపోషకాలు అకర్బన పదార్థాలను కర్బన పదార్థాలుగా మార్చడం, పరపోషకాలతో విచ్ఛిన్నకారులలో స్వయంపోషకాల వినియోగం అనగా చనిపోయిన జీవులను విచ్ఛిన్నం చేసి పోషక పదార్థాలు, ఖనిజాలు విడుదల చేయడం, అవి తిరిగి స్వయంపోషకాల చేత వినియోగింపబడడం (ఖనిజాలు పునఃవలయం) మొదలైన క్రియలు ఇందులో జరుగుతాయి.

ప్రశ్న 4.
జీవావరణ వ్యవస్థలో కనిపించే వివిధ ఆహార గొలుసులను వివరించండి. [Mar. ’14]
జవాబు:
సూర్యుడి నుండి శక్తి జీవావరణవ్యవస్థలోకి కిరణజన్య సంయోగక్రియ ద్వారా ప్రసరిస్తుంది. జీవావరణ వ్యవస్థలో అనేక స్థాయిలుంటాయి. వీటిని పోషకస్థాయిలు అంటారు.

ఆహార పదార్థాలలోని శక్తి క్రింది పోషక స్థాయి నుంచి పై పోషక స్థాయికి బదిలీ చేయబడుతుంది. ఆహారశక్తి మార్గాన్ని నిలువు వరుసగా తీసుకుంటే, వీటిలోని అనుఘటకాలు ఒకదానితో ఒకటి గొలుసు లింకులలాగా ఉండటం వల్ల దీనిని ‘ఆహార గొలుసు’ గా పిలుస్తారు. సాధారణంగా ఆహార గొలుసు ఉత్పత్తిదారులైన వృక్ష జాతులలో మొదలై విచ్ఛిన్నకారులతో అంతమవుతుంది. జీవావరణవ్యవస్థలో మూడు రకాల ప్రధానమైన ఆహారగొలుసులు ఉన్నాయి. అవి :

  1. మేసే జీవుల ఆహార గొలుసు,
  2. పరాన్న జీవుల ఆహార గొలుసు,
  3. డెట్రిటస్ ఆహార గొలుసు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం 7
1. మేసే జీవుల ఆహార గొలుసు (Predatory food chain) :
దీన్ని పరభక్ష ఆహార గొలుసు అని కూడా అంటారు. ఈ ఆహార గొలుసు ఆకుపచ్చని మొక్కలతో (ఉత్పత్తిదారులు) మొదలై ద్వితీయ, తృతీయ, చతుర్థ పోషక స్థాయిలలో వరుసగా శాకాహారులు. ప్రాథమిక మాంసాహారులు, ద్వితీయ మాంసాహారులు ఉంటాయి. కొన్ని రకాల ఆహార గొలుసులో మరొక పోషకస్థాయి (పరాకాష్ట మాంసాహారులు Climax carnivores) ఉంటుంది. ఆహార గొలుసులో సాధారణంగా 3 నుంచి 5 వరకు పోషక స్థాయిలు ఉంటాయి. మేసే జీవుల ఆహార గొలుసు (GFC) సంబంధిత ఉదాహరణలు కింద పట్టికలో ఇవ్వడం జరిగింది.
AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం 8

2. పరాన్నజీవుల ఆహార గొలుసు (Parasitic food chain) :
కొంతమంది శాస్త్రవేత్తలు పరాన్నజీవుల ఆహార గొలుసును మేసే జీవుల ఆహార గొలుసు కింద చేర్చారు. మేసే జీవుల ఆహార గొలుసు లాగా ఇది కూడా (ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉత్పత్తిదారులైన మొక్కలతో ప్రారంభమవుతుంది. కాని, పరాన్నజీవుల ఆహార గొలుసులో పోషకశక్తి స్థూలజీవుల నుంచి చిన్న పరిమాణం గల జీవులకు బదిలీ చేయబడుతుంది. ఉదాహరణకు ప్రాథమిక పోషక స్థాయిని ఆక్రమించే వృక్షం, అనేక పక్షులకు ఆవాసాన్ని, ఆహారాన్ని అందజేస్తుంది. ఈ పక్షులు అనేకమైన బాహ్యపరాన్నజీవులకు, అంతఃపరాన్నజీవులకు ఆతిథ్యమిస్తాయి.

3. డెట్రిటస్ ఆహార గొలుసు (Detritus food chain) :
డెట్రిటస్ ఆహార గొలుసు (DFC) మృత కర్బన పదార్థాల (అంటే కుళ్ళిన ఆకులు, మృతి చెందిన జీవుల కళేబరాలు) తో మొదలవుతుంది. పరపోషకాలైన శిలీంధ్రాలు, బాక్టీరియాలు. డెట్రిటసు విచ్ఛిన్నం చేసి దాని నుంచి శక్తి, పోషక అవసరాలు గ్రహిస్తాయి. వీటిని పూతికాహారులు అని కూడా అంటారు. ఇవి జీర్ణక్రియా ఎంజైములను స్రవించి, మృత పదార్థాలను, వ్యర్థపదార్థాలను (మలపదార్థాలను) సరళమైన శోషణకు అనుగుణమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. డెట్రిటస్ ఆహార గొలుసుకు
ఉదాహరణలు :

  1. డెట్రిటస్ (కుళ్ళిన ఆకుల ద్వారా ఏర్పడింది) – → వానపాములు → కప్పలు సర్పాలు
  2. మృతిచెందిన జీవులు ఈగలు, మాగట్స్ → కప్పలు → సర్పాలు.

జల జీవావరణవ్యవస్థలో మేసేజీవుల ఆహార గొలుసు, శక్తి ప్రసరణకు ప్రధాన మార్గంగా పనిచేస్తుంది. దీనికి వ్యతిరేకంగా భూచర జీవావరణవ్యవస్థలో, మేసే జీవుల ఆహారగొలుసు కంటే డెట్రిటస్ ఆహార గొలుసు ద్వారా అధిక భాగం శక్తి ప్రసరణ జరుగుతుంది. డెట్రిటస్ ఆహార గొలుసు కొన్ని స్థాయిలలో మేసే ఆహారగొలుసుతో సంబంధం కలిగి ఉండవచ్చు. డెట్రిటస్ ఆహార గొలుసులోని కొన్ని జీవులు, మేసే జీవుల ఆహారగొలుసులోని కొన్ని జీవులకు ఆహారంగా ఉంటాయి. ఉదా : పైన చూపిన డెట్రిటస్ ఆహారగొలుసులోని వానపాములు మేసే జీవుల ఆహారగొలుసులోని పక్షులకు ఆహారంగా ఉంటాయి. ఈ విధంగా పరిశీలిస్తే ఆహార గొలుసులు ఒక దానితో ఒకటి కలిసి ఉంటాయని తెలుస్తుంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 5.
జీవావరణ వ్యవస్థలో శక్తి ప్రవాహాన్ని వివరించండి.
జవాబు:
శక్తి ప్రసరణ :
లోతైన సాగర జలోష్ణ జీవావరణవ్యవస్థ (Hydrothermal ecosystem)’ లో తప్ప, మిగతా అన్నింటిలోనూ సూర్యుడే శక్తి మూలం. భూమికి చేరే సూర్యరశ్మిలో 50% కంటే తక్కువ భాగం మాత్రమే క్రియాశీల కిరణజన్యసంయోగక్రియ ఉపయోగపడుతుంది. మొక్కలు మరియు కిరణజన్యసంయోగక్రియ జరిపే బాక్టీరియా సూర్యుని వికిరణశక్తిని వినియోగించి సాధారణ అకర్బనపదార్థాల నుంచి ఆహారాన్ని సంశ్లేషిస్తాయి. మొక్కలు కిరణజన్య సంయోగక్రియకు వినియోగార్హమైన సౌర వికిరణాన్ని లేదా సౌరశక్తి (PAR) ని 2-10% మాత్రమే వినియోగించుకుంటాయి. ఈ కొద్ది శక్తే మొత్తం జీవప్రపంచాన్ని నిలబెడుతుంది. మొక్కలు గ్రహించిన సౌరశక్తి జీవావరణవ్యవస్థలోని వివిధ జీవుల ద్వారా ఎలా ప్రసరిస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అన్ని పరపోషకాలు (heterotrophs) ఆహారం కోసం ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఉత్పత్తిదారులపై ఆధారపడతాయి. ఉష్ణగతిక శాస్త్రం (Thermo dynamics) లో మొదటి సూత్రం శక్తి నిత్యత్వసూత్రంగా చెప్పబడుతుంది. దీని ప్రకారం శక్తి ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మార్చబడుతుందే కానీ సృష్టించబడదు, నాశనం చేయబడదు.

జీవావరణవ్యవస్థలో జీవనాధారానికి శక్తి బదిలీ చాలా అవసరం. శక్తి బదిలీ లేకుండా జీవం, జీవావరణ వ్యవస్థ లేదు. జీవుల సహజవృద్ధి నిరంతర శక్తి ప్రసరణపై ఆధారపడి ఉంటుంది.

జీవావరణవ్యవస్థలకు ఉష్ణగతిక శాస్త్ర రెండవ సూత్రం నుంచి మినహాయింపు లేదు. ఈ సూత్రం ప్రకారం ఒక వ్యవస్థలో శక్తి మార్పిడికి లోనయ్యే ఏ ప్రక్రియ కూడా శక్తి నష్టం లేకుండా సహజంగా జరగదు. ఈ విధంగా కొంత శక్తి పనిచేయడానికి అందుబాటులో లేని ఉష్ణశక్తి రూపంలో వెలువడుతుంది. దీనినే ఎంట్రోపి (Entropy) అంటారు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం 9
జీవులు వివిధ రకాల పనులు నిర్వర్తించడానికి నిరంతరంగా శక్తి సరఫరా జరగాలి. జీవులు ఈ శక్తిని ఆహార రూపంలో గ్రహిస్తాయి. శక్తి ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు ఆహారగొలుసు ద్వారా బదిలీ చేయబడుతుంది. దీనినే శక్తి ప్రసరణ అంటారు. ఏ జీవావరణవ్యవస్థ అయినా క్రియత్మకంగా 3వ పోషక స్థాయి పని చేయడానికి ప్రాథమికంగా అవసరమైనది నిరంతర సౌరశక్తి. ముఖ్యంగా గమనించవలసిన అంశం ఏమిటంటే అందుబాటులో ఉండే శక్తి అనుక్రామిక (వరసక్రమ) పోషక స్థాయిలలో క్రమేణా తగ్గుతుంది. జీవి చనిపోయిన తరవాత అది డెట్రైటస్/మరణ జీవద్రవ్యరాశిగా ఏర్పడి విచ్ఛిన్నకారులకు శక్తివనరులగా ఉపయోగపడుతుంది. ప్రతి పోషకస్థాయిలోని జీవులు వాటికి కావలసిన మేరకు శక్తి కోసం కింది పోషక స్థాయిలోని జీవులపై ఆధారపడి ఉంటాయి.

ఒక నిర్ణీతకాలంలో ప్రతి పోషక స్థాయిలో నిర్ణీత జీవపదార్థ ద్రవ్యరాశి ఉంటుంది. దాన్ని స్టాండింగ్ క్రాప్ (Standing crop) అంటారు. ఒక నిర్ణీత వైశాల్యంలోని జీవుల ద్రవ్యరాశి (జీవ ద్రవ్యరాశి – దేహం పూర్తి బరువు) లేదా జీవుల సంఖ్య ఆధారంగా స్టాండింగ్ క్రాప్ను లెక్కిస్తారు. ఒక జాతిలోని జీవుల ద్రవ్యరాశిని స్వచ్ఛమైన లేదా పొడిబరువు ద్వారా ప్రకటిస్తారు. పొడిబరువు చాలా ఖచ్ఛితమైంది. ఎందుకంటే తడి బరువులోని నీటిలో ఉపయోగార్హమైన శక్తి ఉండదు కాబట్టి.

10 శాతం సూత్రం (The 10 per cent law) :
లిండేమన్ (Lindeman) 10 శాతం సూత్రాన్ని ప్రతిపాదించాడు (లిండేమన్ ఆధునిక జీవావరణ వ్యవస్థ / జీవావరణశాస్త్ర స్థాపకుడు). ఈ సూత్రం ప్రకారం ఒక పోషకస్థాయి నుంచి మరొక పోషకస్థాయిలోకి శక్తి బదిలీ చెందేటప్పుడు 10% శక్తి మాత్రమే శరీర ద్రవ్యరాశి (జీవ ద్రవ్యరాశి) గా నిల్వ ఉంటుంది లేదా మార్చబడుతుంది. మిగిలిన శక్తి బదిలీ చెందే సమయంలో కోల్పోబడుతుంది లేదా విచ్ఛిన్నక్రియలో (శ్వాసక్రియ) వెలువడుతుంది. దీనినే లిండేమన్ పోషక సామర్థ్యతా సూత్రం అంటారు. ఇది జీవావరణ వ్యవస్థ సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించేవాటిలో మొదటిది, ప్రధానమైనది. ఉదా : మొక్కలో NPP (Net Primary Product నికర ప్రాథమిక ఉత్పాదకత) 100 KJ అయితే, వాటిని ఆహారంగా తీసుకునే శాకాహారుల్లో కర్బన పదార్థం శరీరద్రవ్యరాశిగా మారేది 10 KJ మాత్రమే. అదే విధంగా మాంసాహారులు -1 లో శరీర ద్రవ్యరాశి గా మారేది 1 KJ మాత్రమే.

ప్రశ్న 6.
ముఖ్యమైన వాయు కాలుష్యకాలను తెలిపి, మానవులపై వాటి ప్రభావాల గురించి రాయండి.
జవాబు:
Undesirable changes in our environment is known as pollution.
వాయుకాలుష్యం :
భూమి అనేక వాయువులతో కూడిన గాలితో కప్పబడి ఉంటుంది. దానినే వాతావరణ అంటారు. వాతావరణ వాయువుల దుప్పటిగా ఏర్పడి ఉష్ణ నిరోధకంగా పనిచేస్తుంది. వాతావరణ సూర్యవికిరణం ద్వారా వచ్చే అతి నీలలోహిత కిరణాలను వరణాత్మకంగా శోషించుకొని ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది.

పొడిగాలిలో ఉండే ప్రధాన వాయువుల ఘటకాల ఘనపరిమాణాలు ఈవిధంగా ఉంటాయి. నత్రజని 78.09%, ఆక్సిజన్ 20.94%, ఆర్గాన్ 0.93%, కార్బన్ డై ఆక్సైడ్ 0.03%. ఆక్సిజన్ లేకుండా భూమి మీద జీవం ఉండలేదు. వాయు కాలుష్యకాలు అన్ని జీవులకు హాని కలిగిస్తాయి. అవి పంటల పెరుగుదల, ఉత్పత్తిని తగ్గిస్తాయి. వాయు కాలుష్యకాలు మానవులు, జంతువులు శ్వాసవ్యవస్థకు హాని కలిగిస్తాయి. కాలుష్యాల సాంద్రత ఎక్కువైనా, దానికి గురి అయ్యే అవధి ఎక్కువైనా జీవులపై చాలా దుష్ఫలితాలుంటాయి.

ప్రధాన వాయు కాలుష్యకాలు :
1. కార్బన్ మోనాక్సైడ్ (CO):
కార్బన్ మోనాక్సైడ్ ప్రధానంగా అసంపూర్తిగా మండించబడిన శిలాజ ఇంధనాల (fossil fuels) నుంచి ఉత్పత్తి అవుతుంది. పెద్ద పెద్ద నగరాలు, పట్టణాలలో వాహనాలు కార్బన్ మోనాక్సైడ్ కాలుష్యానికి ముఖ్యమైన కారణం. వాహనాల నుంచి, ఫ్యాక్టరీల నుంచి వెలువడే పొగ, పవర్ ప్లాంట్స్ విడుదల చేసే ఉద్గారాలు, అడవులు తగలబడటం, వంటచెరకు తగలబెట్టడం లాంటివి కూడా CO కాలుష్యానికి కారణమవుతాయి. హీమోగ్లోబిన్కు CO తో బలమైన బంధక బలం (Affinity) ఉంటుంది. దానివల్ల CO ఆక్సిజన్ రవాణాలో తీవ్రంగా ప్రభావం చూపుతుంది. తక్కువ గాఢతలో CO తలనొప్పి, మసకబారిన దృష్టిని కలుగచేస్తుంది. ఎక్కువ గాఢతలో ఇది కోమాకు దారి తీసి చివరికి మరణం సంభవిస్తుంది.

2. కార్బన్ డై ఆక్సైడ్ (CO2):
గ్లోబల్ వార్మింగ్క ముఖ్య కాలుష్యకారకం కార్బన్ డై ఆక్సైడ్. మొక్కలు కిరణజన్య సంయోగక్రియలో CO2 ను వినియోగించుకొంటాయి. అన్ని జీవులు శ్వాసక్రియ జరిపేటప్పుడు CO2 ను విడుదల చేస్తాయి. వేగంగా పెరిగిపోతున్న పట్టణీకరణ, వాహనాలు, విమానాలు, విద్యుత్ ప్లాంట్స్, గాసోలిన్ లాంటి శిలాజ ఇంధనాన్ని మండించడం వంటి మానవ చర్యల ద్వారా ఏర్పడే కార్బన్ డై ఆక్సైడ్ (CO2) ఆందోళన కలిగించే కాలుష్యకారకంగా ఉంది.

3. సల్ఫర్ డై ఆక్సైడ్ (SO2):
ఇది ప్రధానంగా శిలాజ ఇంధనాన్ని మండించడం ద్వారా ఉత్పత్తి అవుతుంది. సల్ఫర్ ముడి ఖనిజాన్ని కరిగించడం ఇంకొక ముఖ్యమైన మూలం. లోహాల ప్రగలనం, ఇతర పారిశ్రామిక ప్రక్రియలు కూడా (SO2) కాలుష్యానికి తోడ్పడతాయి. సల్ఫర్ డై ఆక్సైడ్ (SO2), నత్రజని ఆక్సైడ్లు (NO2), ఆమ్ల వర్షాలకు (Acid Rains) ప్రధాన కారణాలు. దాని వల్ల మృత్తికలు, సరస్సులు, కాలువలు అన్నీ ఆమ్లయుతంగా మారతాయి. అంతేకాకుండా భవనాలు, చారిత్రక కట్టడాలు త్వరగా శిథిలమవుతాయి. ఉబ్బసం వ్యాధికి గురైన పిల్లలు, పెద్దల్లో SO2 అధిక సాంద్రత వల్ల శ్వాస సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి. ఎక్కువ రోజులు సల్ఫర్ డై ఆక్సైడ్ (SO,) కాలుష్యానికి గురికావడం వల్ల శ్వాస వ్యాధులు, ఊపిరితిత్తుల రోగ నిరోధకతలో మార్పులు, ఏవైనా హృదయానికి సంబంధించిన సమస్యలుంటే అవి ఎక్కువ కావడం జరుగుతుంది.

4. నైట్రోజన్ ఆక్సైడ్లు :
నైట్రోజన్ ఆక్సైడ్లు ముఖ్యమైన ప్రాథమిక కాలుష్యకారకాలుగా పరిగణించబడ్డాయి. నైట్రోజన్ ఆక్సైడ్లు ప్రధానంగా ఆటోమొబైల్ ఉద్గారకాల ద్వారా వెలువడతాయి. నైట్రోజన్ ఆక్సైడ్ వాయు కాలుష్యం మానవులకు, జంతువులకే కాకుండా మొక్కలకు కూడా హానికరం. నైట్రోజన్ ఆక్సైడ్ కాలుష్యం ఆమ్ల వర్షానికీ, కాంతి రసాయన పొగమంచు ఏర్పడటానికీ కారణం అవుతుంది. నైట్రోజన్ ఆక్సైడ్స్ ప్రభావం వల్ల మొక్కల్లోని ఆకులపై భాగంలో కణజాలక్షయ మచ్చలు (Necrotic spots) ఏర్పడతాయి. దీని ప్రభావం వల్ల పంటపొలాల్లో కిరణజన్య సంయోగక్రియ దెబ్బతిని ఉత్పత్తి తగ్గుతుంది. నైట్రోజన్ ఆక్సైడ్లు కాంతిచర్య ద్వారా బాష్పశీలి కర్బన పదార్థాలతో చర్య జరిపి పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్ (PAN) లాంటి ద్వితీయ కాలుష్య కారకాలను ఏర్పరుస్తాయి. ఇవి ప్రత్యేకంగా కాంతి రసాయన పొగమంచు (smog) లో ఉంటాయి. ఇది శ్వాసనాళానికి, కళ్లకు తీవ్రమైన మంటను కలగజేస్తుంది.

5. రేణురూప (Particulate) పదార్థాలు / ఎరోసాల్స్ :
వాయువులు లేదా ద్రవాల్లో తేలియాడే ఘన పదార్థ రేణువులను ‘రేణురూప పదార్థాలు’ అంటారు. రేణువులు లేదా ద్రవ బిందువులు, వాయువులు అన్నీ కలిసి ఏర్పడే మిశ్రమాన్ని ‘ఎరోసాల్స్’ (వాయువుల్లో విక్షేపణం (disperse) చెందిన కొల్లాయిడల్ రేణువుల వ్యవస్థ) అంటారు. ‘శిలాజ ఇంధనాన్ని’ మండించడం (పెట్రోల్, డీజిల్ మొదలైనవి) థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో ఏర్పడే బూడిద (Fly Ash), అడవులు తగలబడటం, సిమెంట్ కర్మాగారాలు, ఆస్బెస్టాస్ మైనింగ్ మరియు తయారీ యూనిట్లు, స్పిన్నింగ్, జిన్నింగ్ మిల్స్ మొదలైనవి ప్రధాన రేణుపదార్థాల కాలుష్యానికి మూలాలు. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) సూచన ప్రకారం 2.5 మైక్రోమీటర్ల లేదా అంతకంటే తక్కువ వ్యాసార్ధం ఉన్న రేణువులు మానవుడికి, ఇతర గాలి పీల్చే జంతువులకు చాలా హానికరం.

AP Inter 1st Year Zoology Study Material Chapter 8 జీవావరణం – పర్యావరణం

ప్రశ్న 7.
జల కాలుష్యానికి కారణాలు వివరించి, దాని నివారణ పద్ధతులను సూచించండి.
జవాబు:
Undesirble changes in our environment is known as pollution.
భూగోళంపై లభ్యమవుతున్న నీటిలో 3% మాత్రమే మంచినీరుగా ఉండి మనం ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మిగిలిన 97% సముద్రజలాలు. మానవ వినియోగానికి పనికిరాదు.

ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో నీటికాలుష్యం ఒకటిగా ప్రస్తావించ బడుతుంది.

నీరు ప్రధానంగా గృహసంబంధ మురుగుతో, పారిశ్రామిక వ్యర్థాలతో, వ్యవసాయ రసాయన పెర్టిలైజర్స్, ఫెస్టిసైడ్తో కలుషితమై మంచినీటి జలవనరులు వినియోగానికి పనికి రాకుండా, విషతుల్యమై పనికి రాకుండా పోతున్నాయి.

గృహసంబంధ మురుగు :
పెద్ద పెద్ద నగరాలు, పట్టణాలలో నీటికాలుష్యానికి ప్రధాన కారణం మురుగు. ఇందులో ముఖ్యంగా మానవ, జంతువుల విసర్జితాలు. గృహాలనుండి విడుదలవుతున్న వంటింటి వ్యర్థాలు, స్నానాలు, బట్టలు శుభ్రపరిచినప్పుడు విడుదలయ్యే డిటర్జెంట్స్ మొదలైన వ్యర్థాలుంటాయి. ఇటువంటి మురుగునీరు కేవలం 1% మంచినీటి జలవనరులలో కలిసినా అది మానవ వినియోగానికి పనికిరాదు. ఈ మురుగు ఆక్సీకరణ తొట్టెలలో పంపండం వలన మురుగులోని వివిధరకాల మలినాలు (నీటిలో కరగని, కరిగిన) వేరుపరచి మాత్రమే జలవనరులలోకి విడుదల చేయవచ్చును.

బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (BOD) :
ఇది మురుగు నీటిలోని జీవక్షయమయ్యే మలినాలను కొలిచే సూచిక. నీటిగుంటలలో ఉండే సేంద్రియ పదార్థాలను జీవక్షయం చేయడానికి సహాయపడే సూక్ష్మజీవులు చాలా ఎక్కువ ఆక్సిజన్ ను వినియోగించుకుంటాయి. దానిఫలితంగా ఆక్సిజన్ తగ్గిపోయి అక్కడ జీవించే చేపలు, నీటి జంతువులు చనిపోయే అవకాశం ఉంది.

శైవల మంజరులు (Algal Blooms):
గృహవర్గాలలో చాలా సేంద్రియ పదార్థాలుంటాయి. నీటిలో ఎక్కువ స్థాయిలో సేంద్రీయ పోషకాలు ఉన్నట్లయితే వృక్షప్లవ శైవలాలు చాలా ఎక్కువ మొత్తంలో, చాలా వేగంగా పెరుగుతాయి. వీటినే శైవలమంజరులు అంటారు. ఇలా జలవనరులలో శైవలాల తెట్టులు ఏర్పడినట్లయితే ఆ జలవనరు మురుగునీటితో కలుషితమైనదని చెప్పవచ్చును. ఇలా అధిక పోషకాలు కలిగిన మురుగు జలవనరులో చేరటం వలన ఒక్కసారిగా శైవలాల పెరుగుదల పెరగడాని ‘యూట్రిఫికేషన్’ అంటారు.

గృహాలనుండి, ఆస్పత్రుల నుండి మురుగులో అవాంచిత సూక్ష్మజీవులు ఉంటాయి. ఒకవేళ వీటిని శుద్ధిచేయకుండా నీటి ఆవాసాలలోకి విడుదల చేసినట్లయితే అతిసారం, టైఫాయిడ్, పచ్చకామెర్లు, కలరా, మొదలైన వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.

పారిశ్రామిక వ్యర్థాలు :
కర్మాగారాలనుండి శుద్ధిచేయబడని వ్యర్థాలను నీటి అవాసాలలోకి విడుదల చేయడం వల్ల మంచినీటి కాలువలు, జలాశయాలు కలుషితమవుతున్నాయి. పారిశ్రామిక వ్యర్థాలలో వివిధరకాల, చాలా ప్రమాదకరమైన రసాయన వ్యర్థాలుంటాయి. వీటిని తప్పని సరిగా ప్రమాదరహితమైన పదార్థాలుగా మార్చి మాత్రమే జలవనరులలోకి విడుదల చేయాలి. (హైదరాబాద్లోని పటాన్ చెరువును బాబా గారు సందర్శించి – ఇది భూలోకంలో నరకం అని వర్ణించారు). ఈ పారిశ్రామిక వ్యర్ధాలలో చాలా ప్రమాదకారాలైన అర్సెనిక్, కాడ్మియం, కాపర్, క్రోమియం, పాదరసం, జింక్, నికెల్ మొదలైన భారలోహకాలుష్యకాలు ఉంటాయి.

జీవ ఆవర్ధనం (Bio-Magnification) :
నీటి ఆహారపు గొలుసులో కాలుష్యం లేదా విషపదార్థాల గాఢత ఒక పోషణ స్తాయి నుంచి వేరొక పోషణ స్థాయికి పెరుగుతూపోతే దాన్ని జీవ ఆవర్ధనం అంటారు. ఉదా : ఆస్ట్రేలియాలో సంభవించిన మినీమెటావ్యాధికి – పాదరస ఉత్పనాలు కారణం.

వ్యవసాయ కాలుష్యం :
వ్యవసాయదారులు తెలిసి తెలియక పంట పొలాలకు ఎక్కువ మోతాదులో వినియోగించే ఎరువులు, క్రిమిసంహారిణులు, వర్షం కురిసినప్పుడు ప్రవాహ జలాలతో కలిసి, జలవనరులలోకి ప్రవేశిస్తుంది. ఇటువంటి విషపదార్థాల వలన జంతువుల మరణం, మానవులకు ప్రమాదాలు సంభవిస్తాయి.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Civics Study Material 4th Lesson చట్టం Textbook Questions and Answers.

AP Inter 1st Year Civics Study Material 4th Lesson చట్టం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
చట్టం అంటే ఏమిటో నిర్వచించి, చట్టానికి గల వివిధ ఆధారాలను వివరించండి. (లేదా)
ప్రశ్న 2.
చట్టం అంటే ఏమిటి ? చట్టానికి గల వివిధ ఆధారాలను చర్చించండి.
జవాబు:
పరిచయం : రాజనీతిశాస్త్ర అధ్యయనంలో చట్టం అనేది ఒక ముఖ్యమైన భావన.

రాజ్యం శాసనాల ద్వారా ప్రజలను పరిపాలిస్తుంది. శాసనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. రాజ్య సార్వ భౌమాధికారం శాసనాల ద్వారా వ్యక్తమవుతుంది. రాజ్యం ఆశించే సాంఘిక, ఆర్థిక, రాజకీయ మార్పులు శాసనం ద్వారానే సాధించగలవు. మానవుని బాహ్య ప్రవర్తనను క్రమబద్ధం చేసే నియమాలే శాసనాలు. వ్యక్తులు రాజ్యంలో చేయవలసినవి, చేయకూడనివి శాసనం చెబుతుంది. ప్రభుత్వంలోని శాసనశాఖ శాసనాలు చేస్తుంది.

అర్థం : శాసనాన్ని ఆంగ్లంలో ‘లా’ అంటారు. ‘లాగ్’ అనే ట్యూటానిక్ పదం నుండి ‘లా’ అనే మాట వచ్చింది. ‘లాగ్’ అంటే ‘సమమైన’ లేదా ‘స్థిరమైన’ అని అర్థం. శాసనాలు స్థిరమైన నిబంధనలు.

నిర్వచనాలు :
1) “సార్వభౌముడి ఆదేశమే చట్టం. ప్రజలందరూ సార్వభౌముడికి విధేయులుగా ఉండేందుకు చట్టం కొన్ని ఉమ్మడి నియమాలను రూపొందిస్తుంది” అని జాన్ ఎరిస్కిన్ పేర్కొన్నాడు.

2) “రాజకీయాధికారాన్ని పొందిన సార్వభౌముడిచే అమలు చేసే బాహ్య చర్యలకు సంబంధించిన సాధారణ నియమమే చట్టం” అని టి. ఇ. హాలండ్ పేర్కొన్నాడు.

3) న్యాయపాలనలో రాజ్యం ఉపయోగించే సూత్ర సముదాయమే చట్టం” అని జాన్ సాల్మండ్ పేర్కొన్నాడు.

శాసనానికి ఆధారాలు : హాలెండ్ అనే రచయిత సంప్రదాయాలు, మతము, ధర్మబద్ధత (సమత), న్యాయమూర్తుల తీర్పులు, శాస్త్రీయ వ్యాఖ్యానాలు, శాసనశాఖ అనేవి శాసనాలకు ఆధారాలని చెప్పాడు. శాసనాలు వివిధ రంగాలలో క్రమంగా రూపొందుతాయి. అనేక అంశాల ప్రభావం వాటిపై ఉంటుంది. రాజనీతి శాస్త్రజ్ఞులు చెప్పిన శాసనాల ఆధారాలు ఈ క్రింది విధంగా చెప్పవచ్చు.

1) ఆచార, సంప్రదాయాలు, వాడుకలు (Customs) : ఇవి శాసనానికి తొలి ఆధారాలు. ప్రజల ఆచారాలు, వాడుకలు, సంప్రదాయాలు శాసనాలకు మూలాధారము. సంప్రదాయాలు సంఘంలో ఒక అలవాటుగా, క్రమంగా రూపొందుతాయి. పూర్వం సంప్రదాయాలే సమాజ జీవితాన్ని క్రమబద్ధం చేసేవి. రాజ్యం వీటిని గుర్తించి, వాటిని ఆధారం చేసుకొని కొన్ని శాసనాలను రూపొందిస్తుంది. రాజకీయ ఆచారాలు కూడా రాజ్యంచే గుర్తించబడి అమలు చేయబడితే అవి శాసనాలవుతాయి. బ్రిటన్లో ‘సామాన్య న్యాయం’ సంప్రదాయబద్ధమైన శాసనానికి ఉదాహరణ. అదే విధంగా భారతదేశంలో వివాహ చట్టాలు, ఆస్తి పంపిణీ చట్టాలు మొదలగునవి సంప్రదాయాలు ఆధారంగా చేయబడ్డాయి.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

2) మతం (Religion) : ఆచారానికి మతం సమాజాన్ని విపరీతంగా ప్రభావితం చేసే వ్యవస్థ. సంఘ జీవితం మత నియమాలకు అనుగుణంగా జరుపుకుంటారు. పూర్వం మతాధిపతులు చెప్పే నియమాలు శాసనాల వలె చెలామణి అయ్యేవి. ఆధునిక కాలంలో కూడా శాసనాలు చేయడానికి మతం ఒక ఆధారం. వారసత్వం, వివాహం, కుటుంబ ఆస్తి మొదలైన వాటి శాసనాలు మతం ఆధారంగా చేయబడ్డాయి. హిందువులు, క్రైస్తవులు, ముస్లిములకు గల శాసనాలు వారి మతాలు ఆధారంగా రూపొందాయి. ఇరాన్, పాకిస్థాన్ వంటి మత ప్రమేయ దేశాలలో సంఘ జీవనానికి మత నియమాలే ఆధారం.

3) న్యాయస్థానాల తీర్పులు (Judicial Decisions) : న్యాయస్థానాలలో న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు శాసన నిర్మాణానికి ఆధారాలు. న్యాయస్థానాలు చట్టాలను వ్యాఖ్యానిస్తాయి. ఈ విధి నిర్వహణలో న్యాయమూర్తులు తీర్పులిచ్చేటప్పుడు క్రొత్త న్యాయ సూత్రాలను సృష్టిస్తారు. ఈ తీర్పులు అదే విధమైన వివాదాలు తలెత్తినప్పుడు న్యాయసూత్రల వలె వర్తింపచేస్తారు. నేడు న్యాయమూర్తుల నిర్ణయాలు శాసనాలలో అంతర్భాగమవుతున్నాయి. ఉదా : భారతదేశంలో సుప్రీంకోర్టు తీర్పులిచ్చిన గోలక్నాథ్ కేసు, కేశవానంద భారతి కేసు, మినర్వామిల్స్ కేసు.

4) శాస్త్రీయ వ్యాఖ్యానాలు (Scientific commentories) : ప్రముఖ న్యాయశాస్త్ర కోవిదులు, రచయితలు, విమర్శకులు చేసే వ్యాఖ్యానాలు శాసన నిర్మాణానికి ఆధారమవుతాయి. ఇవి న్యాయస్థానాలలో న్యాయమూర్తుల వ్యాఖ్యానాలు, | వివరణలు, శాసనాలు చేయటానికి ప్రభుత్వానికి ఉపయోగిస్తాయి. న్యాయమూర్తుల నిర్ణయాలు, తీర్పులు, భవిష్యత్లో శాసన నిర్మాణానికి తోడ్పడతాయి. ఇంగ్లండ్లో కోక్, బ్లాక్టన్, అమెరికాలో స్టోరీ, కెంట్, భారతదేశంలో విజ్ఞానేశ్వర, ఆపరార్క వంటి వారి వ్యాఖ్యానాలు శాసన నిర్మాణానికి ఆధారాలు.

5) సమత లేదా సమబద్ధత (Equity) : ‘సమత’ అనే పదానికి నిష్పక్షపాతం, న్యాయంలాంటి సూత్రాలను పర్యాయపదాలుగా వాడుతున్నారు. సమత అంటే సహజన్యాయం. అమలులో ఉన్న చట్టాలు వివాదాల పరిష్కారానికి సరిపడని సందర్భాలలో న్యాయమూర్తులు తమ విజ్ఞతతో, సక్రమ అవగాహన ద్వారా వివాదాల పరిష్కారంలో కక్షిదారులకు
న్యాయం చేకూర్చేందుకు ప్రయత్నిస్తారు. సమత అనేది సహజన్యాయ భావన ద్వారా రూపొందింది. దానినే న్యాయమూర్తులచే నిర్మితమైన చట్టాలుగా పరిగణించడమైంది. ఈ సందర్భంలో హెన్రీమెయిన్ అనే పండితుడు సహజన్యాయం గురించి ప్రస్తావిస్తూ అది కొన్ని ప్రత్యేక సూత్రాల ఆధారంగా రూపొంది పౌరన్యాయంతో కూడిన నియమాల సముదాయంగా పేర్కొన్నాడు. పౌరన్యాయం కంటే సమత అనేది ఉన్నతమైనది. సమదృక్పథం, సహజన్యాయం లాంటి సూత్రాల ఆధారంగా పాత చట్టాల స్థానంలో కొత్త చట్టాలను రూపొందించే సాంప్రదాయకమైన పద్ధతికి సమత సంకేతంగా ఉంటుంది.

6) శాసనసభ (Legislature) : ప్రజాస్వామ్యంలో శాసన నిర్మాణశాఖ చట్టం ఆధారాలలో ముఖ్యమైనదిగా భావిస్తారు. ప్రభుత్వ సంస్థలలో ఒకటైన శాసనసభ, చట్టాలను ఆమోదిస్తుంది. అందుచేత శాసననిర్మాణ శాఖను చట్టం ఆధారాలలో ప్రత్యక్షమైన అంశంగా గుర్తించడమైంది. ఆధునిక కాలంలో చట్టాల రూపకల్పనలో శాసనసభలు ప్రముఖమైనవిగా భావించడమైంది. చట్ట నిర్మాణంలో శాసనసభలు సాధారణ ప్రజానీకం ఆకాంక్షలకు ప్రతీకగా ఉంటాయి. | శాసనసభలోని అధికార, ప్రతిపక్షాలు రెండూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తాయి.

ప్రశ్న 3.
మేకైవర్ పేర్కొన్న చట్టాల వర్గీకరణను వివరించండి.
జవాబు:
అర్థం : శాసనాన్ని ఆంగ్లంలో ‘లా’ అంటారు. ‘లాగ్’ అనే ట్యూటానిక్ పదం నుండి ‘లా’ అనే మాట వచ్చింది. ‘లాగ్’ అంటే ‘సమమైన’ లేదా ‘స్థిరమైన’ అని అర్థం. శాసనాలు స్థిరమైన నిబంధనలు.

నిర్వచనాలు :

  1. “సార్వభౌముడి ఆదేశమే చట్టం. ప్రజలందరూ సార్వభౌముడికి విధేయులుగా ఉండేందుకు చట్టం కొన్ని ఉమ్మడి నియమాలను రూపొందిస్తుంది” అని జాన్ ఎరిస్కిన్ పేర్కొన్నాడు.
  2. “రాజకీయాధికారాన్ని పొందిన సార్వభౌముడిచే అమలు చేసే బాహ్య చర్యలకు సంబంధించిన సాధారణ నియమమే చట్టం” అని టి. ఇ. హాలండ్ పేర్కొన్నాడు.
  3. న్యాయపాలనలో రాజ్యం ఉపయోగించే సూత్ర సముదాయమే చట్టం” అని జాన్ సాల్మండ్ పేర్కొన్నాడు.

చట్టం వర్గీకరణ : చట్టం వర్గీకరణ గురించి అనేకమంది రాజనీతి తత్త్వవేత్తలు భిన్నమైన ప్రతిపాదనలను చేశారు. అటువంటి వారిలో మేకైవర్ ప్రతిపాదించిన చట్ట వర్గీకరణ ప్రముఖమైనదిగా పరిగణించవచ్చు.

మేకైవర్ ప్రకారం చట్టం ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. అవి : 1) సహజ చట్టం (Natural Law), 2) సహేతుక చట్టం (Positive Law).

సహేతుక చట్టాన్ని (Positive Law), జాతీయ చట్టం (National Law), అంతర్జాతీయ చట్టం (International Law) అని రెండు రకాలుగా వర్గీకరించారు.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

జాతీయ చట్టాన్ని (National Law), మరల రెండు రకాలుగా వర్గీకరించారు. అవి : రాజ్యాంగ చట్టం (Constitutional Law), సాధారణ చట్టం (Ordinary Law).

సాధారణ చట్టం (Ordinary Law), అనేది పబ్లిక్ చట్టం (Public Law), ప్రైవేట్ చట్టం (Private Law) అని రెండు రకాలుగా విభజించారు.

పబ్లిక్ చట్టాన్ని (Public Law), పరిపాలన చట్టం (Administrative Law), సార్వత్రిక చట్టం (General Law) అని తిరిగి రెండు రకాలుగా వర్గీకరించబడింది.

సార్వత్రిక చట్టాన్ని (General Law), శాసనాత్మక చట్టం (Statutory Law), ఉమ్మడి చట్టం (Common Law) అని రెండు రకాలుగా విభజించారు. పైన పేర్కొన్న వివిధ రకాల చట్టాలను కింది విధంగా వివరించవచ్చు.

1) సహజ చట్టం (Natural Law) : సహజచట్టాన్ని దైవిక న్యాయంగా కూడ వ్యవహరిస్తారు. సహజచట్టం అనేది ఏ ఒక్కరిచేత రూపొందినది కాదు. అది భౌతికశక్తి ఆధారంగా ప్రకృతిచేత ప్రసాదితమైనది. మానవ స్వభావాన్ని విశ్లేషించేందుకు హేతువును వినియోగించడాన్ని సహజ చట్టంగా పేర్కొనవచ్చు. భగవంతుని స్వహస్తాలతో మానవుల హృదయాలలో లిఖించబడినదే సహజ చట్టంగా కొందరు వర్ణించారు.

2) సహేతుక చట్టం (Positive Law) : మానవ సంస్థలచే రూపొందించబడేదే సహేతుక చట్టం. ఈ చట్టాన్ని రాజకీయ చట్టం అని కొందరు పేర్కొన్నారు. వర్తమాన, సామాజిక, రాజకీయ పరిస్థితుల ఆధారంగా ఈ చట్టం నిర్మితమైంది. సార్వభౌమత్వ రాజకీయ అధికారి ఈ చట్టానికి అనుమతిస్తాడు. ఈ చట్టాన్ని అతిక్రమించినవారు శిక్షకు గురి అవుతారు. ఈ చట్టాన్ని తిరిగి జాతీయ చట్టమని, అంతర్జాతీయ చట్టమని రెండు రకాలుగా పేర్కొన్నారు.

జాతీయ చట్టాన్ని మున్సిపల్ చట్టం లేదా రాజ్యచట్టం అని కూడ వ్యవహరిస్తారు.

జాతీయ చట్టం, రాజ్య భౌగోళిక ప్రదేశానికి పరిమితమవుతుంది. సార్వభౌమాధికారి ద్వారా అది అమలులోకి వస్తుంది. రాజ్యంలోని ప్రజలందరికీ వర్తిస్తుంది. ఇక అంతర్జాతీయ చట్టమనేది వివిధ రాజ్యాల మధ్య సౌహార్ధ సంబంధాలను నెలకొల్పి, నియంత్రణ చేసేందుకు ఉద్దేశించింది. అయితే ఈ రకమైన చట్టానికి వ్యక్తులను శిక్షించే అధికారం ఉండదు. ఐక్యరాజ్యసమితి ఆమోదించిన అంతర్జాతీయ చట్టాలు ఇందుకు ఉదాహరణలుగా పేర్కొనవచ్చు. అంతర్జాతీయ శాంతిభద్రతలను పెంపొందించేందుకై సభ్య రాజ్యాలచే పాటించబడే నియమనిబంధనల సముదాయమే అంతర్జాతీయ చట్టంగా పరిగణించవచ్చు.

జాతీయ చట్టాన్ని మరల రెండు రకాలుగా వర్గీకరించారు. అవి : 1) రాజ్యాంగ చట్టం 2) సాధారణ చట్టం. 3) రాజ్యాంగ చట్టం (Constitutional Law): రాజ్యాంగ చట్టమనేది సాధారణ చట్టం కంటే భిన్నంగా ఉంటుంది. రాజ్యంలో ఈ రకమైన చట్టం అత్యున్నతమైనది. ప్రభుత్వ నిర్మాణానికి ఇది వీలు కల్పిస్తుంది. ప్రభుత్వాంగాల మధ్య సంబంధాన్ని వివరిస్తుంది. ప్రభుత్వాంగాల అధికార పరిధిని నిర్ణయిస్తుంది. ఈ రకమైన చట్టం లిఖిత పూర్వకంగా ఉంటుంది. రాజ్యంలో నివసించే పౌరుల హక్కులు, బాధ్యతల గురించి వివరిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఈ చట్టానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఇది ప్రజాభీష్టానికి ప్రతీకగా ఉంటుంది.

4) సాధారణ చట్టం (Ordinary Law) : సాధారణ చట్టం అనేది రాజ్యాంగ చట్టానికి అనుగుణంగా ఉంటుంది. రాజ్యంలో నిర్దిష్ట అధికారాలు గల సంస్థచే రూపొందించబడి అమలవుతుంది. పౌరులకు సమాజం, ప్రభుత్వం, రాజ్యాలతో ఉండే సంబంధాలను అది వివరిస్తుంది. ఆచారాలు, సంప్రదాయాలు, మతం అనేవి ఈ రకమైన చట్టానికి ప్రాతిపదికగా ఉంటాయి. శాసనసభ అటువంటి చట్టాలను రూపొందించి, అవసరమైతే సవరణలు చేస్తుంది. సాధారణ చట్టాన్ని మరల పబ్లిక్ చట్టం, ప్రైవేట్ చట్టం అని రెండు రకాలుగా వర్గీకరించడమైంది.

5) పబ్లిక్ చట్టం (Public Law) : పబ్లిక్ చట్టం, రాజ్యం వ్యక్తుల మధ్య సంబంధాలను నియంత్రిస్తుంది. రాజ్యానికి సంబంధించిన మౌలిక నిర్మితి, విధులను పబ్లిక్ చట్టం వివరిస్తుంది. రాజ్యపు మితిమీరిన జోక్యానికి వ్యతిరేకంగా వ్యక్తులకు అవసరమైన హక్కులను అందిస్తుంది. పౌరులందరు ఈ చట్టాన్ని అనుసరించాల్సి ఉంటుంది. ఈ చట్టాన్ని అతిక్రమించడం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు.

6) ప్రైవేట్ చట్టం (Private Law) : ప్రైవేట్ చట్టం వ్యక్తుల మధ్య సంబంధాలను నియంత్రిస్తుంది. సమాజంలో వ్యక్తుల ప్రవర్తనలను క్రమబద్దీకరిస్తుంది. వ్యక్తులందరూ తమ హక్కులను అనుభవించేందుకు తగిన హామీ ఇస్తుంది. ప్రైవేట్ చట్టాన్ని కొన్నిసార్లు సివిల్ చట్టంగా వ్యవహరిస్తారు. వ్యక్తుల మధ్య ఉత్పన్నమయ్యే వివాదాలు విచారణలో దేశంలోని వివిధ న్యాయస్థానాలు ప్రైవేట్ చట్టాన్ని పరిగణనలోకి తీసుకుంటాయి.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

పబ్లిక్ చట్టాన్ని పరిపాలన చట్టం, సార్వత్రిక చట్టం అని రెండు రకాలుగా వర్గీకరించడమైంది.

7) పరిపాలక చట్టం (Administrative Law) : పరిపాలన నిర్విఘ్నంగానూ, ప్రశాంతంగానూ కొనసాగే విషయంలో చట్టం కీలకపాత్రను పోషిస్తుంది. ప్రజలకు ప్రభుత్వాధికారులకు మధ్య సంబంధాలను ఈ రకమైన చట్టం నియంత్రిస్తుంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన సంస్కరణలను తీసుకురావడంలో ఇది దోహదపడుతుంది. పరిపాలక చట్టాలను అనుసరించడం ద్వారా ఈనాటి రాజ్యాలు అనేక దశలుగా శీఘ్రగతిన అభివృద్ధిని సాధించాయి. ప్రభుత్వ సిబ్బంది క్రమశిక్షణతో పనిచేసేటట్లు పరిపాలక చట్టం దోహదపడుతుంది.

8) సార్వత్రిక చట్టం (General Law) : రాజ్యం, సాధారణ పౌరుల మధ్య సంబంధాన్ని సార్వత్రిక చట్టం నిర్ణయిస్తుంది. ఈ చట్టం రాజ్యానికి – వ్యక్తులకు మధ్య ఉండే వ్యవహారాలకు సంబంధించినదై ఉంటుంది. వివాహం, విడాకులు, ఒప్పందాలు వంటి అనేక విషయాలకు సంబంధించిన వాటిని ఈ రకమైన చట్టాలకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. సార్వత్రిక చట్టం తిరిగి శాసనాత్మక చట్టం, సామాన్య చట్టం అని రెండు రకాలుగా వర్గీకరించడమైంది.

9) శాసనాత్మక చట్టం (Statutory Law) : ఆధునిక చట్టంలోని అధిక భాగాన్ని శాసనాత్మక చట్టం అని పిలుస్తారు. దైనందిన పరిపాలన నిమిత్తమై రాజ్యంలోని శాసనసభ ఇటువంటి చట్టాన్ని రూపొందిస్తుంది. భారతదేశంలో పార్లమెంటు, అమెరికాలో కాంగ్రెసు, బ్రిటన్లో పార్లమెంటు ఈ రకమైన చట్టాన్ని రూపొందిస్తాయి.

10) సామాన్య చట్టం (Common Law) : సామాన్య చట్టాన్ని సంప్రదాయక చట్టంగా కొందరు వ్యవహరించారు. ప్రజానీకంలో బహుళవ్యాప్తి చెందిన ఆచార సంప్రదాయాల ఫలితమే సామాన్య చట్టం. ఈ రకమైన చట్టాన్ని న్యాయవ్యవస్థలో | భాగంగా న్యాయస్థానాలు తగిన గుర్తింపునిస్తాయి.

ప్రశ్న 4.
చట్టాన్ని నిర్వచించి, చట్టం – స్వేచ్ఛ మధ్య సంబంధాన్ని వర్ణించండి.
జవాబు:
నిర్వచనాలు :
1) “సార్వభౌముడి ఆదేశమే చట్టం. ప్రజలందరూ సార్వభౌముడికి విధేయులుగా ఉండేందుకు చట్టం కొన్ని ఉమ్మడి నియమాలను రూపొందిస్తుంది” అని జాన్ ఎరిస్కిన్ పేర్కొన్నాడు.

2) రాజకీయాధికారాన్ని పొందిన సార్వభౌముడిచే అమలుచేసే బాహ్య చర్యలకు సంబంధించిన సాధారణ నియమమే చట్టం” అని టి. ఇ. హాలండ్ పేర్కొన్నాడు.

చట్టం – స్వేచ్ఛ మధ్య సంబంధం (Relation between Law and Liberty) : రాజనీతి శాస్త్రంలో చట్టం, నైతికత అనేవి రెండు ప్రధాన భావనలు. రాజ్యం, ప్రభుత్వాలు పనిచేసేందుకు చట్టం ప్రాతిపదికగా ఉంటుంది. కొన్ని నియమ నిబంధనలను సూచించడం ద్వారా సమాజానికి స్థిరమైన పునాదిని చట్టం ఏర్పరుస్తుంది. చట్టం, స్వేచ్ఛ రెండూ పరస్పర ఆధారిత భావనలు. అయితే ఈ రెండు భావనల మధ్య ఉండే సంబంధం విషయంలో రాజనీతి శాస్త్రవేత్తల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ విషయంలో రాజనీతి శాస్త్రవేత్తలు రెండు విభిన్నమైన అభిప్రాయాలను వెల్లడించారు. వారిలో కొందరు ఈ రెండు భావనలు ఒకదానికొకటి పరస్పర విరుద్ధమైనవిగా పేర్కొన్నారు. మరి కొందరు ఈ రెండు భావనలు ఒకదానికొకటి సన్నిహిత సంబంధంగలవిగా భావించారు. ఈ రెండు భావనల గురించి కింది విధంగా వివరించవచ్చు.

1) చట్టం, స్వేచ్ఛ పరస్పరం విరుద్ధమైనవి (Law and Liberty are Antithetical) : చట్టం ఎల్లప్పుడు మానవుల కార్యకలాపాలపై నిర్బంధాలు విధిస్తుందని వ్యక్తి స్వేచ్ఛను సమర్థించేవారు భావిస్తారు. జె.ఎస్. మిల్, హెర్బర్ట్ స్పెన్సర్, ఆడమ్ స్మిత్, మార్షల్ వంటి వ్యక్తి స్వేచ్ఛావాదులు, ప్రౌధాన్, బకూనిస్, క్రొపోట్కిన్ వంటి అరాచకవాదుల ప్రకారం వ్యక్తి స్వేచ్ఛకు చట్టం ఆటంకాలను సృష్టిస్తుంది. వారి దృష్టిలో రాజ్యం వ్యక్తుల స్వేచ్ఛలకు భంగం కలిగించే ప్రధాన సాధనం. చట్టం అనేది ఎల్లప్పుడు వ్యక్తుల స్వేచ్ఛపై ఆంక్షలు విధిస్తుంది. రాజ్యం, ప్రభుత్వాలకు సంబంధించిన వ్యవహారాలలో వ్యక్తులు పాల్గొనేందుకు చట్టం అనుమతించదు. అలాగే రాజ్యానికి సంబంధించిన ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో చట్టం ఆటంకంగా పరిణమిస్తుంది. అయితే ఇటీవలి కాలంలో అనేక రాజ్యాలలో అమలులో ఉన్న సరళీకృత ఆర్థిక విధానాలు ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు శీఘ్రగతిన ప్రగతి దిశలో పయనించేందుకు అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ విధానాలు ఆర్థిక వ్యవహారాలలో ప్రజలు స్వేచ్ఛగా పాల్గొనేందుకు వీలు కల్పించాయి. అవి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల మధ్య ఏ విధమైన కఠినమైన ఆర్థిక చట్టాలతో ప్రమేయం లేకుండా పోటీకి అవకాశం ఏర్పరచాయి. రాజ్యమనేది ‘ఒక అవసరమైన చెడు’ (State is a necessary evil) గా వ్యక్తి స్వేచ్ఛావాదులు విశ్వసించారు. ఏ ప్రభుత్వమైతే అతి తక్కువగా పాలనగావిస్తుందో అదియే ఉత్తమమైన ప్రభుత్వంగా వారు వివరించారు. చట్టం వ్యక్తుల కార్యకలాపాలపై కొన్ని ఆంక్షలు విధిస్తుందని వారు పేర్కొన్నారు. అటువంటి ఆంక్షలు లేనప్పుడే వ్యక్తులు స్వీయవ్యక్తిత్వ వికాసానికి కృషి చేయగలుగుతారు. కాబట్టి చట్టం, స్వేచ్ఛ, ఒకదానికొకటి పరస్పరం విరుద్ధమైనవి.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

2) చట్టం, స్వేచ్ఛ పరస్పర పోషకాలు (Law and Liberty are Complimentary) : సామ్యవాదులు, కమ్యూనిస్టుల ప్రకారం చట్టం, స్వేచ్ఛ ఒకదానికొకటి పరస్పర పోషకాలు. వారి దృష్టిలో రాజ్యం అనేది ఒక సంక్షేమ సంస్థ. రాజ్యం తన చట్టబద్ధమైన యంత్రాంగం ద్వారా మెరుగైన, న్యాయంతో కూడిన సామాజిక వ్యవస్థను సాధించవచ్చు. సామాజిక సంక్షేమానికి అవసరమైన ఆంక్షలను చట్టం విధిస్తుంది. పెట్టుబడిదారీవర్గం కార్మికవర్గాన్ని దోపిడీకి గురి చేస్తుందనే విషయం వాస్తవం. అటువంటి నేపథ్యంలో రాజ్యం దోపిడికి సంబంధించిన వర్గాలపై ఆంక్షలు విధించగలుగుతుంది. స్వేచ్ఛ అనేది అపరిమితమైనది కాదు. హక్కులను అనుభవించే రాజ్యం ప్రజలపై కొన్ని అవసరమైన ఆంక్షలను విధించేందుకు అధికారం కలిగి ఉంటుంది. ఈ సందర్భంలో లాస్కి కింది విధంగా పేర్కొన్నాడు. “మానవులు సామూహిక నాగరిక జీవనాన్ని గడిపేందుకు అవసరమైన ప్రవర్తనా నియమావళిని రూపొందించే విషయంలో చట్టం స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం కలిగి ఉంటుంది. “రాజ్యాన్ని ఒక నైతిక సంస్థగా ఆదర్శవాదులు విశ్వసించారు. రాజ్యం సమాజంలోని జనేచ్ఛకు ప్రతీకగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ చట్టాలను విధిగా పాటించవలసి ఉంటుంది. వ్యక్తులు రాజ్యానికి, చట్టాలకు విధేయత చూపడం ద్వారా స్వేచ్ఛగా జీవించగలుగుతారు. చట్టం, స్వేచ్ఛల మధ్య సంబంధం గురించి ఫాసిస్టులు ఆచరణాత్మకమైన సంబంధాన్ని వెల్లడించారు. రాజ్యానికి వ్యతిరేకంగానూ, విరుద్ధంగానూ ఏదీ ఉండదన్న నినాదాన్ని ముస్సోలిని ఈ సందర్భంగా ఇవ్వడమైంది. రాజ్యం ఎల్లప్పుడూ ప్రజా ప్రయోజనాలను పరిరక్షిస్తుంది కాబట్టి చట్టం, స్వేచ్ఛ అనే రెండు భావనలు పరస్పర పోషకాలని చెప్పవచ్చు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
చట్టాన్ని నిర్వచించి, చట్టం లక్షణాలను పేర్కొనండి.
జవాబు:
పరిచయం : రాజనీతిశాస్త్ర అధ్యయనంలో చట్టం అనేది ఒక ముఖ్యమైన భావన.

రాజ్యం శాసనాల ద్వారా ప్రజలను పరిపాలిస్తుంది. శాసనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. రాజ్య సార్వ భౌమాధికారం శాసనాల ద్వారా వ్యక్తమవుతుంది. రాజ్యం ఆశించే సాంఘిక, ఆర్థిక, రాజకీయ మార్పులు శాసనం ద్వారానే సాధించగలవు. మానవుని బాహ్య ప్రవర్తనను క్రమబద్ధం చేసే నియమాలే శాసనాలు. వ్యక్తులు రాజ్యంలో చేయవలసినవి, చేయకూడనివి శాసనం చెబుతుంది. ప్రభుత్వంలోని శాసనశాఖ శాసనాలు చేస్తుంది.

అర్థం : శాసనాన్ని ఆంగ్లంలో ‘లా’ అంటారు. ‘లాగ్’ అనే ట్యూటానిక్ పదం నుండి ‘లా’ అనే మాట వచ్చింది. ‘లాగ్’ అంటే ‘సమమైన’ లేదా ‘స్థిరమైన’ అని అర్థం. శాసనాలు స్థిరమైన నిబంధనలు.

నిర్వచనాలు :
1) “సార్వభౌముడి ఆదేశమే చట్టం. ప్రజలందరూ సార్వభౌముడికి విధేయులుగా ఉండేందుకు చట్టం కొన్ని ఉమ్మడి నియమాలను రూపొందిస్తుంది” అని జాన్ ఎరిస్కిన్ పేర్కొన్నాడు.

2) “రాజకీయాధికారాన్ని పొందిన సార్వభౌముడిచే అమలు చేసే బాహ్య చర్యలకు సంబంధించిన సాధారణ నియమమే చట్టం” అని టి.ఇ. హాలండ్ పేర్కొన్నాడు.

3) న్యాయపాలనలో రాజ్యం ఉపయోగించే సూత్ర సముదాయమే చట్టం” అని జాన్ సాల్మండ్ పేర్కొన్నాడు.

శాసనానికి ఆధారాలు : హాలెండ్ అనే రచయిత సంప్రదాయాలు, మతము, ధర్మబద్ధత (సమత), న్యాయమూర్తుల తీర్పులు, శాస్త్రీయ వ్యాఖ్యానాలు, శాసనశాఖ అనేవి శాసనాలకు ఆధారాలని చెప్పాడు. శాసనాలు వివిధ రంగాలలో క్రమంగా రూపొందుతాయి. అనేక అంశాల ప్రభావం వాటిపై ఉంటుంది. రాజనీతి శాస్త్రజ్ఞులు చెప్పిన శాసనాల ఆధారాలు ఈ క్రింది విధంగా చెప్పవచ్చు.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

చట్టం ముఖ్య లక్షణాలు (Features of Law) : చట్టానికి కింద పేర్కొన్న లక్షణాలు ఉన్నాయి.

  1. సార్వభౌముడు ఆమోదించిన నియమ నిబంధనల సముధాయమే చట్టం.
  2. చట్టాన్ని రాజ్యం అమలుపరుస్తుంది. రాజ్యం అనుమతి పొందడంతో చట్టాన్ని యోగ్యమైందిగా పరిగణించవచ్చు.
  3. చట్టం నిర్దిష్టమైనది, ఖచ్చితమైనది, విశ్వవ్యాప్తమైనది.
  4. చట్టం ప్రజల అభీష్టాన్ని ప్రతిబింబిస్తుంది.
  5. చట్టం ఉల్లంఘన శిక్షకు దారితీస్తుంది.
  6. చట్టాలు నిర్బంధమైన, శిక్షాత్మక స్వభావాన్ని కలిగి ఉంటాయి.
  7. చట్టం వైయుక్తిక, సాధారణ సంక్షేమాన్ని సంరక్షించే ఉద్దేశ్యాన్ని కలిగి ఉంటుంది.
  8. చట్టం ప్రజల అవసరాల మేరకు మార్చబడుతుంది.

ప్రశ్న 2.
వివిధ రకాల చట్టాలను తెలపండి.
జవాబు:
చట్టం వర్గీకరణ : చట్టం వర్గీకరణ గురించి అనేకమంది రాజనీతి తత్త్వవేత్తలు భిన్నమైన ప్రతిపాదనలను చేశారు. అటువంటి వారిలో మేకైవర్ ప్రతిపాదించిన చట్ట వర్గీకరణ ప్రముఖమైనదిగా పరిగణించవచ్చు.

మేకైవర్ ప్రకారం చట్టం ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. అవి : 1) సహజ చట్టం (Natural Law), 2) సహేతుక చట్టం (Positive Law).

సహేతుక చట్టాన్ని (Positive Law), జాతీయ చట్టం (National Law), అంతర్జాతీయ చట్టం (International Law) అని రెండు రకాలుగా వర్గీకరించారు.

జాతీయ చట్టాన్ని (National Law), మరల రెండు రకాలుగా వర్గీకరించారు. అవి : రాజ్యాంగ చట్టం (Constitutional Law), సాధారణ చట్టం (Ordinary Law).

సాధారణ చట్టం (Ordinary Law), అనేది పబ్లిక్ చట్టం (Public Law), ప్రైవేట్ చట్టం (Private Law) అని రెండు రకాలుగా విభజించారు.

పబ్లిక్ చట్టాన్ని (Public Law), పరిపాలన చట్టం (Administrative Law), సార్వత్రిక చట్టం (General Law) అని తిరిగి రెండు రకాలుగా వర్గీకరించబడింది.

సార్వత్రిక చట్టాన్ని (General Law), శాసనాత్మక చట్టం (Statutory Law), ఉమ్మడి చట్టం (Common Law) అని రెండు రకాలుగా విభజించారు. పైన పేర్కొన్న వివిధ రకాల చట్టాలను కింది విధంగా వివరించవచ్చు.

1) సహజ చట్టం (Natural Law) : సహజచట్టాన్ని దైవిక న్యాయంగా కూడ వ్యవహరిస్తారు. సహజచట్టం అనేది ఏ ఒక్కరిచేత రూపొందినది కాదు. అది భౌతికశక్తి ఆధారంగా ప్రకృతిచేత ప్రసాదితమైనది. మానవ స్వభావాన్ని విశ్లేషించేందుకు హేతువును వినియోగించడాన్ని సహజ చట్టంగా పేర్కొనవచ్చు. భగవంతుని స్వహస్తాలతో మానవుల హృదయాలలో లిఖించబడినదే సహజ చట్టంగా కొందరు వర్ణించారు.

2) సహేతుక చట్టం (Positive Law) : మానవ సంస్థలచే రూపొందించబడేదే సహేతుక చట్టం. ఈ చట్టాన్ని రాజకీయ చట్టం అని కొందరు పేర్కొన్నారు. వర్తమాన, సామాజిక, రాజకీయ పరిస్థితుల ఆధారంగా ఈ చట్టం నిర్మితమైంది. సార్వభౌమత్వ రాజకీయ అధికారి ఈ చట్టానికి అనుమతిస్తాడు. ఈ చట్టాన్ని అతిక్రమించినవారు శిక్షకు గురి అవుతారు. ఈ చట్టాన్ని తిరిగి జాతీయ చట్టమని, అంతర్జాతీయ చట్టమని రెండు రకాలుగా పేర్కొన్నారు.

జాతీయ చట్టాన్ని మున్సిపల్ చట్టం లేదా రాజ్య చట్టం అని కూడ వ్యవహరిస్తారు.

జాతీయ చట్టం, రాజ్య భౌగోళిక ప్రదేశానికి పరిమితమవుతుంది. సార్వభౌమాధికారి ద్వారా అది అమలులోకి వస్తుంది. రాజ్యంలోని ప్రజలందరికీ వర్తిస్తుంది. ఇక అంతర్జాతీయ చట్టమనేది వివిధ రాజ్యాల మధ్య సౌహార్ధ సంబంధాలను నెలకొల్పి, నియంత్రణ చేసేందుకు ఉద్దేశించింది. అయితే ఈ రకమైన చట్టానికి వ్యక్తులను శిక్షించే అధికారం ఉండదు. ఐక్యరాజ్యసమితి ఆమోదించిన అంతర్జాతీయ చట్టాలు ఇందుకు ఉదాహరణలుగా పేర్కొనవచ్చు. అంతర్జాతీయ శాంతిభద్రతలను పెంపొందించేందుకై సభ్య రాజ్యాలచే పాటించబడే నియమనిబంధనల సముదాయమే అంతర్జాతీయ చట్టంగా పరిగణించవచ్చు.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

ప్రశ్న 3.
చట్టానికి గల మూడు ఆధారాలను రాయండి. [Mar. ’18, ’17]
జవాబు:
1) ఆచార, సంప్రదాయాలు, వాడుకలు (Customs) : ఇవి శాసనానికి తొలి ఆధారాలు. ప్రజల ఆచారాలు, వాడుకలు, సంప్రదాయాలు శాసనాలకు మూలాధారము. సంప్రదాయాలు సంఘంలో ఒక అలవాటుగా, క్రమంగా రూపొందుతాయి. పూర్వం సంప్రదాయాలే సమాజ జీవితాన్ని క్రమబద్ధం చేసేవి. రాజ్యం వీటిని గుర్తించి, వాటిని ఆధారం చేసుకొని కొన్ని శాసనాలను రూపొందిస్తుంది. రాజకీయ ఆచారాలు కూడా రాజ్యంచే గుర్తించబడి అమలు చేయబడితే అవి శాసనాలవుతాయి. బ్రిటన్లో ‘సామాన్య న్యాయం’ సంప్రదాయబద్ధమైన శాసనానికి ఉదాహరణ. అదే విధంగా భారతదేశంలో వివాహ చట్టాలు, ఆస్తి పంపిణీ చట్టాలు మొదలగునవి సంప్రదాయాలు ఆధారంగా చేయబడ్డాయి.

2) మతం (Religion) : ఆచారానికి మతం సమాజాన్ని విపరీతంగా ప్రభావితం చేసే వ్యవస్థ. సంఘ జీవితం మత నియమాలకు అనుగుణంగా జరుపుకుంటారు. పూర్వం మతాధిపతులు చెప్పే నియమాలు శాసనాల వలె చెలామణి అయ్యేవి. ఆధునిక కాలంలో కూడా శాసనాలు చేయడానికి మతం ఒక ఆధారం. వారసత్వం, వివాహం, కుటుంబ ఆస్తి మొదలైన వాటి శాసనాలు మతం ఆధారంగా చేయబడ్డాయి. హిందువులు, క్రైస్తవులు, ముస్లిములకు గల శాసనాలు వారి మతాలు ఆధారంగా రూపొందాయి. ఇరాన్, పాకిస్థాన్ వంటి మత ప్రమేయ దేశాలలో సంఘ జీవనానికి మత నియమాలే ఆధారం.

3) న్యాయస్థానాల తీర్పులు (Judicial Decisions) న్యాయస్థానాలలో న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు శాసన నిర్మాణానికి ఆధారాలు. న్యాయస్థానాలు చట్టాలను వ్యాఖ్యానిస్తాయి. ఈ విధి నిర్వహణలో న్యాయమూర్తులు తీర్పులిచ్చేటప్పుడు క్రొత్త న్యాయ సూత్రాలను సృష్టిస్తారు. ఈ తీర్పులు అదే విధమైన వివాదాలు తలెత్తినప్పుడు న్యాయసూత్రల వలె వర్తింపచేస్తారు. నేడు న్యాయమూర్తుల నిర్ణయాలు శాసనాలలో అంతర్భాగమవుతున్నాయి. ఉదా : భారతదేశంలో సుప్రీంకోర్టు తీర్పులిచ్చిన గోలక్నాథ్ కేసు, కేశవానంద భారతి కేసు, మినర్వామిల్స్ కేసు.

4) శాస్త్రీయ వ్యాఖ్యానాలు (Scientific commentories) : ప్రముఖ న్యాయశాస్త్ర కోవిదులు, రచయితలు, విమర్శకులు చేసే వ్యాఖ్యానాలు శాసన నిర్మాణానికి ఆధారమవుతాయి. ఇవి న్యాయస్థానాలలో న్యాయమూర్తుల వ్యాఖ్యానాలు, వివరణలు, శాసనాలు చేయటానికి ప్రభుత్వానికి ఉపయోగిస్తాయి. న్యాయమూర్తుల నిర్ణయాలు, తీర్పులు, భవిష్యత్లో శాసన నిర్మాణానికి తోడ్పడతాయి. ఇంగ్లండ్లో కోక్, బ్లాక్టన్, అమెరికాలో స్టోరీ, కెంట్, భారతదేశంలో విజ్ఞానేశ్వర, అపరార్క వంటి వారి వ్యాఖ్యానాలు శాసన నిర్మాణానికి ఆధారాలు.

ప్రశ్న 4.
చట్టం, నైతికత మధ్య వ్యత్యాసాలను తెలపండి.
జవాబు:
చట్టం, నైతికతల మధ్య వ్యత్యాసాలను క్రింది విధంగా పేర్కొనవచ్చు.
చట్టం (Law)

  1. చట్టం వ్యక్తుల బాహ్య ప్రవర్తనకు సంబంధించినది.
  2. చట్టం రాజ్యానికి సంబంధించినది.
  3. చట్టం రాజ్యాధికారపు నిర్భంధిత శక్తిచే ముడిపడి ఉంటుంది.
  4. చట్టం నిర్దిష్టమైంది, ఖచ్చితమైంది.
  5. రాజ్య భూభాగంలో మాత్రమే చట్టం వర్తిస్తుంది.
  6. చట్టాన్ని ఒక నిర్దిష్ట లక్ష్యంతో రూపొందించడం అవుతుంది.
  7. సార్వభౌమాధికారి చట్టానికి అనుమతి ఇస్తాడు.
  8. చట్టం అనేది రాజనీతిశాస్త్ర విషయ పరిధిలోకి వస్తుంది.
  9. చట్ట అతిక్రమణ శిక్షకు దారితీస్తుంది.
  10. చట్టాన్ని రూపొందించి అమలులో ఉంచేందుకు యంత్రాంగం ఉంటుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

నైతికత (Morality)

  1. నైతికత అనేది వ్యక్తుల మొత్తం జీవనానికి సంబంధించినది.
  2. నైతికత వ్యక్తి అంతరాత్మకు సంబంధించినది.
  3. నైతికతకు ప్రజాభిప్రాయం, వ్యక్తుల అంతరాత్మలు ఆలంబనగా ఉంటాయి.
  4. నైతికత అస్పష్టమైంది, అనిశ్చితమైంది.
  5. నైతిక సూత్రాలు విశ్వ వ్యాప్తమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి.
  6. నైతిక సూత్రాలు సమాజంలో అంతర్లీనంగా ఉంటాయి.
  7. సమాజం నైతిక సూత్రాలను ఆమోదిస్తుంది.
  8. నైతిక సూత్రాలనేవి నీతిశాస్త్రం పరిధిలోకి వస్తాయి.
  9. నైతిక సూత్రాల అతిక్రమణ ఎటువంటి శిక్షకు దారితీయదు.
  10. నైతిక సూత్రాల అమలుకు ఎటువంటి ప్రత్యేక రాజ్య యంత్రాంగం ఉండదు.

ప్రశ్న 5.
“చట్టం, స్వేచ్ఛ పరస్పర విరుద్ధాలు” విశ్లేషించండి.
జవాబు:
చట్టం, స్వేచ్ఛ పరస్పరం విరుద్ధమైనవి (Law and Liberty are Antithetical) : చట్టం ఎల్లప్పుడు మానవుల కార్యకలాపాలపై నిర్బంధాలు విధిస్తుందని వ్యక్తి స్వేచ్ఛను సమర్థించేవారు భావిస్తారు. జె.ఎస్. మిల్, హెర్బర్ట్ స్పెన్సర్, ఆడమ్ స్మిత్, మార్షల్ వంటి వ్యక్తి స్వేచ్ఛావాదులు, ప్రాధాన్, బకూనిన్, క్రొపోట్కిన్ వంటి అరాచకవాదుల ప్రకారం వ్యక్తి స్వేచ్ఛకు చట్టం ఆటంకాలను సృష్టిస్తుంది. వారి దృష్టిలో రాజ్యం వ్యక్తుల స్వేచ్ఛలకు భంగం కలిగించే ప్రధాన సాధనం. చట్టం అనేది ఎల్లప్పుడు వ్యక్తుల స్వేచ్ఛపై ఆంక్షలు విధిస్తుంది. రాజ్యం, ప్రభుత్వాలకు సంబంధించిన వ్యవహారాలలో వ్యక్తులు పాల్గొనేందుకు చట్టం అనుమతించదు. అలాగే రాజ్యానికి సంబంధించిన ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో చట్టం ఆటంకంగా పరిణమిస్తుంది. అయితే ఇటీవలి కాలంలో అనేక రాజ్యాలలో ‘అమలులో ఉన్న సరళీకృత ఆర్థిక విధానాలు ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు శీఘ్రగతిన ప్రగతి దిశలో పయనించేందుకు అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ విధానాలు ఆర్థిక వ్యవహారాలలో ప్రజలు స్వేచ్ఛగా పాల్గొనేందుకు వీలు కల్పించాయి. అవి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల మధ్య ఏ విధమైన కఠినమైన ఆర్థిక చట్టాలతో ప్రమేయం లేకుండా పోటీకి అవకాశం ఏర్పరచాయి. రాజ్యమనేది ‘ఒక అవసరమైన చెడు’ (State is a necessary evil) గా వ్యక్తి స్వేచ్ఛావాదులు విశ్వసించారు. ఏ ప్రభుత్వమైతే అతి తక్కువగా పాలనగావిస్తుందో అదియే ఉత్తమమైన ప్రభుత్వంగా వారు వివరించారు. చట్టం వ్యక్తుల కార్యకలాపాలపై కొన్ని ఆంక్షలు విధిస్తుందని వారు పేర్కొన్నారు. అటువంటి ఆంక్షలు లేనప్పుడే వ్యక్తులు స్వీయ ‘ వ్యక్తిత్వ వికాసానికి కృషి చేయగలుగుతారు. కాబట్టి చట్టం, స్వేచ్ఛ, ఒకదానికొకటి పరస్పరం విరుద్ధమైనవి.

ప్రశ్న 6.
చట్టం, స్వేచ్ఛ ఏ విధంగా పరస్పర పోషకాలో వివరించండి.
జవాబు:
చట్టం, స్వేచ్ఛ పరస్పర పోషకాలు (Law and Liberty are Complimentary) : సామ్యవాదులు, కమ్యూనిస్టుల ప్రకారం చట్టం, స్వేచ్ఛ ఒకదానికొకటి పరస్పర పోషకాలు. వారి దృష్టిలో రాజ్యం అనేది ఒక సంక్షేమ సంస్థ. రాజ్యం తన చట్టబద్దమైన యంత్రాంగం ద్వారా మెరుగైన, న్యాయంతో కూడిన సామాజిక వ్యవస్థను సాధించవచ్చు.
సామాజిక సంక్షేమానికి అవసరమైన ఆంక్షలను చట్టం విధిస్తుంది. పెట్టుబడిదారీవర్గం కార్మికవర్గాన్ని దోపిడీకి గురి చేస్తుందనే విషయం వాస్తవం. అటువంటి నేపథ్యంలో రాజ్యం దోపిడికి సంబంధించిన వర్గాలపై ఆంక్షలు విధించగలుగుతుంది. స్వేచ్ఛ అనేది అపరిమితమైనది కాదు. హక్కులను అనుభవించే రాజ్యం ప్రజలపై కొన్ని అవసరమైన ఆంక్షలను విధించేందుకు అధికారం కలిగి ఉంటుంది. ఈ సందర్భంలో లాస్కి కింది విధంగా పేర్కొన్నాడు. “మానవులు సామూహిక నాగరిక జీవనాన్ని గడిపేందుకు అవసరమైన ప్రవర్తనా నియమావళిని రూపొందించే విషయంలో చట్టం స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం కలిగి ఉంటుంది. “రాజ్యాన్ని ఒక నైతిక సంస్థగా ఆదర్శవాదులు విశ్వసించారు. రాజ్యం సమాజంలోని జనేచ్ఛకు ప్రతీకగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ చట్టాలను విధిగా పాటించవలసి ఉంటుంది. వ్యక్తులు రాజ్యానికి, చట్టాలకు విధేయత చూపడం ద్వారా స్వేచ్ఛగా జీవించగలుగుతారు. చట్టం, స్వేచ్ఛల మధ్య సంబంధం గురించి ఫాసిస్టులు ఆచరణాత్మకమైన సంబంధాన్ని వెల్లడించారు. రాజ్యానికి వ్యతిరేకంగానూ, విరుద్ధంగానూ ఏదీ ఉండదన్న నినాదాన్ని ముస్సోలిని ఈ సందర్భంగా ఇవ్వడమైంది. రాజ్యం ఎల్లప్పుడూ ప్రజా ప్రయోజనాలను పరిరక్షిస్తుంది కాబట్టి చట్టం, స్వేచ్ఛ అనే రెండు భావనలు పరస్పర పోషకాలని చెప్పవచ్చు.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

ప్రశ్న 7.
చట్టం, నైతికతల మధ్య ఎటువంటి సంబంధం ఉంది ?
జవాబు:
చట్టం – నైతికత అనేవి సామాజిక సంస్థలకు ప్రధాన మూలాధారాలుగా పరిగణించవచ్చు. సమాజంలో శాంతి భద్రతల నిర్వహణలోనూ, ప్రగతి సాధనలోనూ ఈ రెండు అంశాలు ఎంతో కీలకపాత్రను పోషిస్తాయి. ఈ రెండు అంశాలు వేర్వేరు దృక్పథాలను కలిగి ఉన్నప్పటికీ ఒకే లక్ష్యాన్ని కలిగి ఉన్నాయి. అవి ఒకదానికొకటి పరస్పర సంబంధం కలిగి ఉంటూ పరస్పర ఆధారితాలుగా ఉంటాయి. కొందరు రాజనీతి తత్త్వవేత్తలు ఈ రెండింటినీ ఒకటిగా పరిగణించారు. ఈ సందర్భంలో ఆర్.జి.గెటిల్ కింది విధంగా ప్రకటించాడు. “చట్టం – నైతికత రెండూ ఒకే విధమైనవి. అవి రెండూ ప్రాచీన సామాజిక జీవనపు అలవాట్లు, అనుభవాల నుంచి ఉద్భవించాయి. ప్రాచీన సమాజంలో వ్యక్తుల నైతిక, సామాజిక వ్యవహారాలు అవిభాజ్యాలుగా ఉండేవి”. ఈ రెండింటి మధ్య కొన్ని నిర్దిష్టమైన వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, శాసనం, నైతికత రెండూ ఉమ్మడి సంక్షేమాన్ని ఉద్దేశించి వాడుకలోకి వచ్చాయి.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
చట్టం పదవృత్తాంతాన్ని వివరించండి.
జవాబు: ‘చట్టం’ అనే పదం టైటానిక్ భాష (జర్మన్) లోని ‘లాగ్’ అనే పదం నుండి గ్రహించబడింది. లాగ్ అనగా ‘స్థిరంగా ఉండటం’ అని అర్థం. పద అర్థాన్ని బట్టి సార్వభౌమత్వ రాజకీయ అధికారిచే ప్రతిపాదించబడి, అమల్లోకి వచ్చిన ప్రవర్తనా నియమావళియే చట్టం అని భావించవచ్చు. మరికొందరు రాజనీతిజ్ఞులు ‘చట్టం’ అనే పదం లాటిన్ భాషలోని ‘జస్’, ‘జంగేరి’ అనే రెండు పదాల నుండి గ్రహించబడిందని పేర్కొన్నారు. లాటిన్ భాషలోని ఈ రెండు పదాలకు ‘బంధం’ అనే అర్థం ఉంది.

ప్రశ్న 2.
చట్టానికి గల రెండు నిర్వచనాలను తెలపండి.
జవాబు:

  1. “రాజకీయాధికారాన్ని పొందిన సార్వభౌముడిచే అమలుచేసే బాహ్య చర్యలకు సంబంధించిన సాధారణ నియమమే చట్టం” అని టి. ఇ. హాలండ్ పేర్కొన్నాడు.
  2. “న్యాయపాలనలో రాజ్యం ఉపయోగించే సూత్ర సముదాయమే చట్టం” అని జాన్ సాల్మండ్ పేర్కొన్నాడు.

ప్రశ్న 3.
చట్టం లక్షణాలు ఏవీ ?
జవాబు:
చట్టం ఈ క్రింది ముఖ్య లక్షణాలను కలిగి ఉంటుంది.

  1. సార్వభౌముడు ఆమోదించిన నియమ నిబంధనల సముదాయమే చట్టం.
  2. చట్టం నిర్దిష్టమైనది, ఖచ్చితమైనది మరియు విశ్వవ్యాప్తమైనది.
  3. చట్టం ప్రజాభిప్రాయానికి అనుకూలంగా ఉంటుంది.
  4. చట్టం ఉల్లంఘన శిక్షకు దారితీస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

ప్రశ్న 4.
సమన్యాయపాలన అంటే ఏమిటి ? [Mar. ’16, ’17 ]
జవాబు:
సమన్యాయపాలన అంటే చట్టం ఆధిక్యత అని అర్థం. సమన్యాయపాలన అమలులో ఉన్న దేశాలలో ప్రభుత్వాధికారాలు చట్టాల ద్వారా నిర్ణయించబడతాయి. ప్రభుత్వ చర్యలన్నింటికి చట్టసమ్మతి ఉండాలి. చట్టాన్ని ఉల్లంఘించినపుడు మాత్రమే వ్యక్తి శిక్షింపబడతాడు. ధనిక, పేద అనే విచక్షణ లేకుండా చట్టం అందరినీ సమానంగా చూస్తుంది. చట్ట ఆధిక్యత లేదా సమన్యాయ పాలన ఉండటం వలన వ్యక్తులకు స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు లభిస్తాయి.

ప్రశ్న 5.
సహజ చట్టం అంటే ఏమిటి ?
జవాబు:
సహజ చట్టం (Natural Law) : సహజచట్టాన్ని దైవిక న్యాయంగా కూడ వ్యవహరిస్తారు. సహజచట్టం అనేది ఏ ఒక్కరిచేత రూపొందినది కాదు. అది భౌతికశక్తి ఆధారంగా ప్రకృతిచేత ప్రసాదితమైనది. మానవ స్వభావాన్ని విశ్లేషించేందుకు హేతువును వినియోగించడాన్ని సహజ చట్టంగా పేర్కొనవచ్చు. భగవంతుని స్వహస్తాలతో మానవుల హృదయాలలో లిఖించబడినదే సహజ చట్టంగా కొందరు వర్ణించారు.

ప్రశ్న 6.
పరిపాలక చట్టం అంటే ఏమిటో తెలపండి. (లేదా) పరిపాలక న్యాయం గురించి నీకేమి తెలియును ?
జవాబు:
పరిపాలక చట్టం (Administrative Law) : పరిపాలన నిర్విఘ్నంగానూ, ప్రశాంతంగానూ కొనసాగే విషయంలో చట్టం కీలకపాత్రను పోషిస్తుంది. ప్రజలకు ప్రభుత్వాధికారులకు మధ్య సంబంధాలను ఈ రకమైన చట్టం నియంత్రిస్తుంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన సంస్కరణలను తీసుకురావడంలో ఇది దోహదపడుతుంది. పరిపాలక చట్టాలను అనుసరించడం ద్వారా ఈనాటి రాజ్యాలు అనేక దశలుగా శీఘ్రగతిన అభివృద్ధిని సాధించాయి. ప్రభుత్వ సిబ్బంది క్రమశిక్షణతో పనిచేసేటట్లు పరిపాలక చట్టం దోహదపడుతుంది.

ప్రశ్న 7.
చట్టానికి గల ఏ మూడు ఆధారాలనైనా రాయండి.
జవాబు:
చట్టానికి గల మూడు ఆధారాలు : i) ఆచారాలు ii) మతం iii) శాసనసభ.

ప్రశ్న 8.
రాజ్యాంగ చట్టం అంటే ఏమిటి ? [Mar. ’18]
జవాబు:
రాజ్యాంగ చట్టం (Constitutional Law): రాజ్యాంగ చట్టమనేది సాధారణ చట్టం కంటే భిన్నంగా ఉంటుంది. రాజ్యంలో ఈ రకమైన చట్టం అత్యున్నతమైనది. ప్రభుత్వ నిర్మాణానికి ఇది వీలు కల్పిస్తుంది. ప్రభుత్వాంగాల మధ్య సంబంధాన్ని వివరిస్తుంది. ప్రభుత్వాంగాల అధికార పరిధిని నిర్ణయిస్తుంది. ఈ రకమైన చట్టం లిఖిత పూర్వకంగా ఉంటుంది. రాజ్యంలో నివసించే పౌరుల హక్కులు, బాధ్యతల గురించి వివరిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఈ చట్టానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఇది ప్రజాభీష్టానికి ప్రతీకగా ఉంటుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

ప్రశ్న 9.
పబ్లిక్ చట్టాన్ని నిర్వచించండి.
జవాబు:
పబ్లిక్ చట్టం (Public Law) : పబ్లిక్ చట్టం, రాజ్యం వ్యక్తుల మధ్య సంబంధాలను నియంత్రిస్తుంది. రాజ్యానికి సంబంధించిన మౌలిక నిర్మితి, విధులను పబ్లిక్ చట్టం వివరిస్తుంది. రాజ్యపు మితిమీరిన జోక్యానికి వ్యతిరేకంగా వ్యక్తులకు అవసరమైన హక్కులను అందిస్తుంది. పౌరులందరు ఈ చట్టాన్ని అనుసరించాల్సి ఉంటుంది. ఈ చట్టాన్ని అతిక్రమించడం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు.

ప్రశ్న 10.
జస్, జంగేరి పదవృత్తాంతాలను వివరించండి.
జవాబు:
కొంతమంది రాజనీతిజ్ఞుల ప్రకారం ‘చట్టం’ అనే పదం లాటిన్ భాషలోని ‘జస్’, ‘జంగేరి’ అనే రెండు పదాల నుండి ఉద్భవించింది. లాటిన్ భాషలో ఈ రెండు పదాలకు ‘బంధం’ అనే అర్థం ఉంది. సాధారణంగా చట్టం అనేది రాజకీయ సార్వభౌమాధికారిచే వ్యక్తుల బాహ్య ప్రవర్తనను నియంత్రించేందుకై రూపొందించబడిన నియమావళి అని పేర్కొనవచ్చు.

ప్రశ్న 11.
చట్టం అధ్యయనానికి గల దృక్పథాలు ఏవి ?
జవాబు:
చట్టం అధ్యయనానికి గల ప్రధాన దృక్పథాలు నాలుగు. అవి : 1) నైతిక దృక్పథం 2) రాజకీయ దృక్పథం 3) శాస్త్రీయ దృక్పథం 4) సాంఘిక లేదా సామాజిక దృక్పథం.

ప్రశ్న 12.
సమత అంటే ఏమిటో నిర్వచించండి. [Mar. ’16]
జవాబు:
‘సమత’ అనే పదానికి నిష్పక్షపాతం, న్యాయం లాంటి సూత్రాలను పర్యాయపదాలుగా వాడుతున్నారు. సమత అంటే సహజ న్యాయం. అమలులో ఉన్న చట్టాలు వివాదాల పరిష్కారానికి సహాయపడిన సందర్భాలలో న్యాయమూర్తులు తమ విజ్ఞత, విచక్షణతో వివాదాలను పరిష్కరిస్తారు. ఈ పరిష్కారాలే రాజ్యముచేత గుర్తించబడి చట్టాలుగా ప్రకటించబడతాయి.

ప్రశ్న 13.
శాస్త్రవేత్తల వ్యాఖ్యానాలు అంటే ఏవి ?
జవాబు:
శాస్త్రవేత్తల వ్యాఖ్యానాలు చట్టానికి మరొక ముఖ్యమైన ఆధారం. ప్రఖ్యాత న్యాయమూర్తులు, న్యాయవాదులు వెల్లడించే అభిప్రాయాలు ఎనలేని ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. న్యాయవేత్తలు తమ వ్యాఖ్యానాల ద్వారా చట్టంలోని దోషాలను గుర్తించి, వాటి నివారణకు కొన్ని సూచనలు చేస్తారు. కాలక్రమంలో ఈ సూచనలే చట్ట నిర్మాణానికి ప్రధాన ఆధారాలవుతాయి.

AP Inter 1st Year Civics Study Material Chapter 4 చట్టం

ప్రశ్న 14.
శాసన నిర్మాణ ప్రక్రియలో శాసనసభ పాత్ర ఏమిటి ?
జవాబు:
ప్రజాస్వామ్యంలో శాసనసభ శాసన నిర్మాణ ప్రక్రియలో ప్రధానపాత్ర పోషిస్తుంది. కావున శాసనసభను చట్టం యొక్క ప్రత్యక్ష ఆధారంగా పేర్కొంటారు. చట్ట నిర్మాణంలో శాసనసభలు ప్రజానీకం ఆకాంక్షలకు ప్రతీకగా ఉంటాయి. శాసనసభలోని అధికార, ప్రతిపక్షాలు రెండూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 8 రాష్ట్ర న్యాయశాఖ

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 8th Lesson రాష్ట్ర న్యాయశాఖ Textbook Questions and Answers.

AP Inter 2nd Year Civics Study Material 8th Lesson రాష్ట్ర న్యాయశాఖ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
హైకోర్టు అధికార విధులను వివరించండి.
జవాబు:
భారత రాజ్యాంగం ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టును ఏర్పాటు చేసింది. 1956వ సంవత్సరములో చేపట్టిన 7వ రాజ్యాంగ సవరణను అనుసరించి 2 లేదా 3 రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉమ్మడి హైకోర్టును ఏర్పరిచేందుకు పార్లమెంటుకు అధికారం కల్పించబడింది. దేశంలోని చాలా రాష్ట్రాలలో హైకోర్టులు కలిగియున్నాయి.

భారత రాజ్యాంగంలోని ఆరో భాగంలో 214 నుండి 231 వరకు గల నిబంధనలు రాష్ట్ర హైకోర్టు నిర్మాణం, న్యాయమూర్తుల అర్హతలు, నియామకం, స్వతంత్ర ప్రతిపత్తి, న్యాయపరిధి, అధికారాలు, ప్రక్రియల గురించి పేర్కొన్నాయి. నిర్మాణం: ప్రతి హైకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, కొందరు ఇతర న్యాయమూర్తులుంటారు. వీరిని భారత రాష్ట్రపతి నియమిస్తారు.

న్యాయమూర్తుల అర్హతలు: హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించబడుటకు రాజ్యాంగంలో నిర్ధేశించిన విధంగా క్రింది అర్హతలు కలిగి వుండాలి.

  1. భారతీయ పౌరుడై వుండాలి.
  2. భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర న్యాయ సర్వీసులలో కనీసం 10 సంవత్సరాలు న్యాయాధికారిగా అనుభవం కలిగి ఉండాలి. లేదా
  3. రెండుగాని అంతకన్నా ఎక్కువ హైకోర్టులలో 10 సంవత్సరాలు న్యాయవాదిగా అనుభవముండాలి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 8 రాష్ట్ర న్యాయశాఖ

హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి రాజ్యాంగంలో ఎటువంటి కనీస వయోపరిమితి ప్రస్తావన లేదు. జీతభత్యములు: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నెలసరి వేతనంగా 90,000/- ఇతర న్యాయమూర్తులకు 3 80,000/- లభిస్తాయి. వేతనంతో పాటు వారికి ఉచిత నివాస సౌకర్యం, వైద్యం, టెలిఫోన్, కారు సౌకర్యాలు మరియు ఇతర అలవెన్సులు ఉంటాయి.

ప్రమాణ స్వీకారం: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు సంబంధిత రాష్ట్ర గవర్నర్ సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు.

పదవీ కాలం: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు 62 సంవత్సరముల వయస్సు నిండే వరకు పదవిలో కొనసాగుతారు.

తొలగింపు విధానం: హైకోర్టు న్యాయమూర్తుల నిరూపించబడిన అధికార దుర్వినియోగం, అవినీతి, అసమర్థత, అనైతిక ప్రవర్తనల ఆధారంగా భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధంగా హైకోర్టు న్యాయమూర్తులను తొలగిస్తారు.

హైకోర్టు అధికారాలు విధులు: భారత రాజ్యాంగం ప్రకారం హైకోర్టు ఈ క్రింది పేర్కొన్న అధికారాలను, విధులను కల్గి ఉంది. అవి:
1) ప్రారంభ అధికార పరిధి: భారతదేశంలోని ప్రతి హైకోర్టుకు క్రింది విషయాలలో ప్రారంభ అధికార పరిధిని భారత రాజ్యాంగం కల్పించింది. వాటిలో వీలునామా, వివాహము, విడాకులు, కంపెనీ చట్టము, కోర్టు ధిక్కరణ, రెవెన్యూ వివాదాలు మొదలైనవి ఉన్నాయి. ప్రతి హైకోర్టు కొన్ని సూచనలను, ఆదేశాలను లేదా ఆజ్ఞలను (రిట్) ప్రాథమిక హక్కుల అమలుకు జారీచేస్తుంది. పార్లమెంటు సభ్యుల, రాష్ట్ర శాసన సభ్యుల ఎన్నికల వివాదాలు హైకోర్టు పరిధిలోనే పరిష్కరించబడతాయి.

2) అప్పీళ్ళ విచారణ పరిధి: సబార్డినేట్ కోర్టు తీర్పులపై వచ్చే అప్పీళ్ళపై హైకోర్టుకు విచారణ చేసే అధికారముంది. హైకోర్టు సివిల్, క్రిమినల్ వివాదాలపై వచ్చే అప్పీళ్ళను విచారిస్తుంది.

సివిల్ కేసులు: హైకోర్టుకు వచ్చే సివిల్ వివాదాలు మొదటి అప్పీలు లేదా రెండవ అప్పీలుగా ఉంటాయి. సివిల్ వివాదాలలో హైకోర్టుకు వచ్చే అప్పీళ్ళు జిల్లా కోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. ఏదైనా వివాదం విలువ కౌ 5,00,000/- లు లేదా అంతకు మించివుంటే అటువంటి వివాదాలపై సబార్డినేటు కోర్టులు ఇచ్చిన తీర్పులపై వచ్చే అప్పీళ్ళను హైకోర్టు విచారణకు స్వీకరిస్తుంది.

క్రిమినల్ కేసులు: జిల్లా సెషన్స్ కోర్టులు ఏడు సంవత్సరాల పైబడి కారాగార శిక్ష విధించిన సందర్భాలలో వచ్చే అప్పీళ్ళను హైకోర్టు విచారణకు స్వీకరిస్తుంది. అలాగే మరణ శిక్ష విధించిన జిల్లా సెషన్స్ కోర్టు తీర్పులన్నీ హైకోర్టు పరిశీలనకు, అంతిమ ఆమోదం కొరకు నివేదించబడతాయి.

3) కోర్టు ఆఫ్ రికార్డ్: రాష్ట్ర హైకోర్టు ‘కోర్ట్ ఆఫ్ రికార్డ్’గా వ్యవహరిస్తుంది. వ్యక్తులు గానీ, సంస్థలు కానీ, కోర్టు ధిక్కారానికి పాల్పడితే, హైకోర్టు వారిని విచారించి శిక్షిస్తుంది. హైకోర్టు ఇచ్చిన తీర్పులు, వెలువరించిన నిర్ణయాలు రికార్డుల రూపంలో భద్రపరుస్తుంది. ఆ రికార్డులకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. హైకోర్టు ఇచ్చిన తీర్పులు రాష్ట్రంలోని క్రింది న్యాయస్థానాలకు మార్గదర్శకాలుగా ఉంటాయి.

4) న్యాయ సమీక్ష: సుప్రీంకోర్టు వలే హైకోర్టుకు న్యాయ సమీక్ష అధికారం ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన చట్టాలు లేదా జారీ చేసే ఆదేశాలు రాజ్యాంగ మూల సూత్రాలకు విరుద్ధంగా ఉంటే అవి చెల్లవని (Ultra vires) ప్రకటించే అధికారం హైకోర్టుకు ఉంటుంది.

5) సర్టిఫికేషన్ అధికారం: హైకోర్టు ఇచ్చిన తీర్పుల పట్ల సంతృప్తి చెందని వారు సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు. అటువంటి అప్పీళ్ళను సర్టిఫై చేసే అధికారం హైకోర్టుకు ఉంది. కనుక సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకొనే వ్యక్తులందరూ చాలావరకు హైకోర్టు ధృవీకరణను తీసుకోవాల్సి ఉంటుంది.

6) సలహాపూర్వక విధులు: హైకోర్టు న్యాయసంబంధ విషయాలలో గవర్నరుకు సలహాలిస్తుంది. జిల్లా న్యాయమూర్తుల నియామకం, పదోన్నతి, బదిలీలు మొదలగు అంశాల విషయములో కూడా సలహాలు ఇస్తుంది. జిల్లా న్యాయస్థానాలలో జిల్లా జడ్జి మినహా ఇతర పదవులలో ఏర్పడే ఖాళీల భర్తీ విషయంలో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్తో పాటు హైకోర్టు గవర్నర్కు సలహా ఇస్తుంది.

7) పరిపాలనా సంబంధమైన విధులు: హైకోర్టు తన ప్రాదేశిక పరిధిలో కొన్ని పాలనా సంబంధమైన విధులను నిర్వహిస్తుంది. అవి:

  • 227వ ప్రకరణను అనుసరించి హైకోర్టు రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాలు, ట్రిబునల్స్పై (మిలిటరీ కోర్టులు మినహా) పర్యవేక్షణాధికారాన్ని కలిగి ఉంటుంది.
  • దిగువ కోర్టులు సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన నియమనిబంధనలను రూపొందించడంలో కీలక పాత్ర వహిస్తుంది.
  • రాజ్యాంగంలోని 228వ ప్రకరణ ప్రకారం హైకోర్టు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో కేసులను ఒక కోర్టు నుండి మరొక కోర్టుకు బదిలీ చేస్తుంది.

ప్రశ్న 2.
జిల్లాస్థాయి న్యాయ వ్యవస్థలపై ఒక వ్యాసం రాయండి.
జవాబు:
ప్రతి రాష్ట్రంలో హైకోర్టుకు దిగువన సబార్డినేట్ కోర్టుల వ్యవస్థ ఉంటుంది. భారత రాజ్యాంగం అధీన న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుతుంది. రాజ్యాంగంలోని VIవ భాగంలో 233 నుండి 237 వరకు గల ప్రకరణలు సబార్డినేట్ కోర్టుల గురించి పేర్కొన్నాయి. 233వ ప్రకరణ రాష్ట్రంలోని జిల్లా జడ్జిల నియామకం, పదోన్నతి మొదలగు అంశాలను వివరిస్తుంది.

రాష్ట్రంలో రెండు రకాల సబార్డినేట్ కోర్టులుంటాయి. అవి:

  1. సివిల్ కోర్టులు
  2. క్రిమినల్ కోర్టులు

AP Inter 2nd Year Civics Study Material Chapter 8 రాష్ట్ర న్యాయశాఖ

1) సివిల్ కోర్టులు: సివిల్ సంబంధమైన వివాదంతో ముడిపడిన వివాహాలు, విడాకులు, వారసత్వం, వ్యాపారం మొదలగు సివిల్ కేసులను సివిల్ కోర్టులు విచారణకు స్వీకరిస్తాయి. జిల్లా అంతటికి జిల్లా కోర్టుంటుంది. జిల్లా జడ్జి సివిల్ కోర్టుకు అధిపతిగా వ్యవహరిస్తారు. జిల్లాలోని అన్ని సివిల్ కోర్టులపై జిల్లా జడ్జి నియంత్రణ, పర్యవేక్షణా అధికారాలను కలిగి ఉంటాడు. జిల్లా సివిల్ కోర్టుకు దిగువన సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు ఉంటాయి. వీటితో పాటు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు ఉంటాయి. సబార్డినేట్ కోర్టులలోని క్రింద పేర్కొన్న న్యాయాధికారులు ఉంటారు.

  1. ప్రిన్సిపల్ జిల్లా జడ్జి.
  2. కుటుంబ కోర్టు జడ్జి.
  3. యస్.సి & యస్. టి. చట్టం కోర్టు జడ్జి.
  4. సీనియర్ సివిల్ కోర్టు జడ్జి
  5. జూనియర్ సివిల్ కోర్టు జడ్జి.

< 10 లక్షల అంతకు మించిన ఆస్థి విలువ కలిగిన వివాదాలపై ప్రిన్సిపల్ జిల్లాకోర్టు విచారణ జరిపి తీర్పునిస్తుంది. ప్రిన్సిపల్ జిల్లా జడ్జిని ప్రత్యక్ష భర్తీ విధానం లేదా పరోక్ష భర్తీ విధానం (పదోన్నతి) ద్వారా నియమించబడతారు. జిల్లా జడ్జి కేడర్ కలిగిన న్యాయాధికారులు కుటుంబ కోర్టులకు న్యాయమూర్తులుగా వ్యవహరిస్తారు.

సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు లక్ష రూపాయలకు పైబడి పదిలక్షలలోపు ఆస్థి విలువ గల కేసులను విచారించి తీర్పునిస్తాయి. లక్ష రూపాయలలోపు ఆస్థివిలువ గల కేసులను జూనియర్ సివిల్ జడ్జి కోర్టు విచారించి తీర్పునిస్తుంది. స్థానిక న్యాయ వివాదాలను పరిష్కరించేందుకు జిల్లాలో క్రింది స్థాయిలో న్యాయ పంచాయితీలు, గ్రామ కచేరీలు, అదాలత్ పంచాయితీలు ఉంటాయి.

2) క్రిమినల్ కోర్టులు: జిల్లాలో సెషన్స్ కోర్టు అత్యున్నత క్రిమినల్ కోర్టు. క్రిమినల్ వివాదాలను జిల్లాస్థాయిలో విచారించేందుకు సెషన్స్ కోర్టు అత్యున్నత న్యాయస్థానంగా వ్యవహరిస్తుంది. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని అంశాల ఆధారంగా సెషన్స్ జడ్జి తీర్పునిస్తాడు. జిల్లాస్థాయిలో క్రింద పేర్కొన్న న్యాయమూర్తులు క్రిమినల్ కేసులను విచారిస్తారు.

  1. జిల్లా సెషన్స్ జడ్జి.
  2. సీనియర్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి.
  3. జూనియర్ సివిల్ జడ్జి.
  4. స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్.

ప్రిన్సిపల్ జిల్లా న్యాయమూర్తే జిల్లా సెషన్స్ జడ్జిగా వ్యవహరించి హత్య, మోటారు వాహనాల చట్ట ఉల్లంఘన కేసులను విచారించి, దోషులకు జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధిస్తాడు. అయితే అటువంటి శిక్షలను హైకోర్టు ధృవీకరించాల్సి ఉంటుంది. సీనియర్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కేసు స్వభావాన్ని బట్టి ఐదు నుండి ఏడు సంవత్సరాల | వరకు కారాగార శిక్షను విధించవచ్చు.

జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏదైనా పట్టణములో ఉన్నట్లయితే ఆ కోర్టు సివిల్ మరియు క్రిమినల్ కోర్టుగా వ్యవహరించి సంబంధిత కేసులను విచారించి మూడు సంవత్సరాలలోపు కారాగార శిక్ష విధించవచ్చు. సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులు ఐదు వందల రూపాయల వరకు పెనాల్టీని లేదా ఒక సంవత్సరం కారాగార శిక్షను లేక రెండింటిని విధించవచ్చు.

స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టును ప్రతి పట్టణములోను ఏర్పాటు చేయవచ్చు. ఇవి చిల్లర (పెట్టీ) కేసులను విచారించి ఐదు వందల రూపాయలలోపు జరిమానా, ఆరునెలలలోపు కారాగార శిక్షను విధించవచ్చు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
హైకోర్టు నిర్మాణాన్ని గూర్చి సంక్షిప్తంగా వివరించండి.
జవాబు:
ప్రతి హైకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, కొందరు ఇతర న్యాయమూర్తులుంటారు. వీరిని భారత రాష్ట్రపతి సందర్భానుసారంగా నియమిస్తాడు. హైకోర్టు న్యాయమూర్తి తాత్కాలికంగా శెలవుపై ఉన్నా లేదా విధులను నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నా అతడు తన బాధ్యతలను తిరిగి చేపట్టేంతవరకు తాత్కాలిక న్యాయమూర్తిని రెండు సంవత్సరాల పదవీకాలానికి మించకుండా భారత రాష్ట్రపతి నియమించవచ్చు.

రాజ్యాంగం హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఉదా: అలహాబాద్ హైకోర్టులో అత్యధికంగా 48మంది న్యాయమూర్తులు ఉండగా గౌహతి హైకోర్టులో అతి తక్కువగా 5గురు న్యాయమూర్తులు ఉన్నారు. రాష్ట్రపతి విచక్షణపై, హైకోర్టుల పనిభారాన్ని దృష్టిలోవుంచుకొని రాష్ట్రపతి కాలానుగుణంగా హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయిస్తాడు.

ప్రశ్న 2.
రాష్ట్ర హైకోర్టు ఏవైనా రెండు అధికార విధులను గూర్చి రాయండి. [Mar. 16]
జవాబు:
1) ప్రారంభ అధికార పరిధి: భారతదేశంలోని ప్రతి హైకోర్టుకు క్రింది విషయాలలో ప్రారంభ అధికార పరిధిని భారత రాజ్యాంగం కల్పించింది. వాటిలో వీలునామా, వివాహము, విడాకులు, కంపెనీ చట్టము, కోర్టు ధిక్కరణ, రెవెన్యూ వివాదాలు మొదలైనవి ఉన్నాయి. ప్రతి హైకోర్టు కొన్ని సూచనలను, ఆదేశాలను లేదా ఆజ్ఞలను (రిట్) ప్రాథమిక హక్కుల అమలుకు జారీచేస్తుంది. పార్లమెంటు సభ్యుల, రాష్ట్ర శాసన సభ్యుల ఎన్నికల వివాదాలు హైకోర్టు పరిధిలోనే పరిష్కరించబడతాయి.

226వ ప్రకరణను అనుసరించి ప్రాథమిక హక్కుల పరిరక్షణకు ఐదు రకాల రిట్లను హైకోర్టు జారీచేసే అధికారం కలిగి ఉంది. అవి హెబియస్ కార్పస్, సెర్షియోరరీ, మాండమస్, కో-వారంటో, ఇంజక్షన్ మొదలైనవి.

2) అప్పీళ్ళ విచారణ పరిధి: సబార్డినేట్ కోర్టు తీర్పులపై వచ్చే అప్పీళ్ళపై హైకోర్టుకు విచారణ చేసే అధికారముంది. హైకోర్టు సివిల్, క్రిమినల్ వివాదాలపై వచ్చే అప్పీళ్ళను విచారిస్తుంది.

సివిల్ కేసులు: హైకోర్టుకు వచ్చే సివిల్ వివాదాలు మొదటి అప్పీలు లేదా రెండవ అప్పీలుగా ఉంటాయి. సివిల్ వివాదాలలో హైకోర్టుకు వచ్చే అప్పీళ్ళు జిల్లా కోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. ఏదైనా వివాదం విలువ 5,00,000/- లు లేదా అంతకు మించివుంటే అటువంటి వివాదాలపై సబార్డినేటు కోర్టులు ఇచ్చిన తీర్పులపై వచ్చే అప్పీళ్ళను హైకోర్టు విచారణకు స్వీకరిస్తుంది.

క్రిమినల్ కేసులు: జిల్లా సెషన్స్ కోర్టులు ఏడు సంవత్సరాల పైబడి కారాగార శిక్ష విధించిన సందర్భాలలో వచ్చే అప్పీళ్ళను హైకోర్టు విచారణకు స్వీకరిస్తుంది. అలాగే మరణ శిక్ష విధించిన జిల్లా సెషన్స్ కోర్టు తీర్పులన్నీ హైకోర్టు పరిశీలనకు, అంతిమ ఆమోదం కొరకు నివేదించబడతాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 8 రాష్ట్ర న్యాయశాఖ

ప్రశ్న 3.
హైకోర్టు పాలన విధులను వివరించండి.
జవాబు:
హైకోర్టు తన ప్రాదేశిక పరిధిలో కొన్ని పాలనా సంబంధమైన విధులను నిర్వహిస్తుంది. అవి:
ఎ) 227వ ప్రకరణను అనుసరించి హైకోర్టు రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాలు, ట్రిబునల్స్పై (మిలిటరీ కోర్టులు మినహా) పర్యవేక్షణాధికారాన్ని కలిగి ఉంటుంది.

బి) దిగువ కోర్టులు సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన నియమ నిబంధనలను రూపొందించడంలో కీలక పాత్ర వహిస్తుంది.

సి) రాజ్యాంగంలోని 228వ ప్రకరణ ప్రకారం హైకోర్టు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో కేసులను ఒక కోర్టు నుండి మరొక కోర్టుకు బదిలీ చేస్తుంది.

డి) దిగువ న్యాయస్థానాల రికార్డులను, సంబంధిత పత్రాలను తనిఖీ చేసే అధికారం హైకోర్టుకు కలదు.

ఇ) హైకోర్టు తన పరిధిలోని పాలనాపరమైన ఉద్యోగులను నియమించి వారి జీతభత్యాలను నిర్ణయించే అధికారంతో పాటు దిగువ న్యాయస్థానాలలోని ఉద్యోగుల సర్వీసు నిబంధనలను రూపొందించే అధికారాన్ని కలిగి ఉంటుంది.

ఎఫ్) రాజ్యాంగ వ్యాఖ్యానానికి సంబంధించిన ఎటువంటి వివాదంపై విచారణ కొనసాగించేందుకు లేదా నిలిపివేసేందుకు అధికారాన్ని కలిగి ఉంటుంది.

జి) రాష్ట్రంలో హైకోర్టు అత్యున్నత న్యాయ వ్యవస్థ. రాష్ట్రంలోని అన్ని కోర్టులు, ట్రిబునల్స్ (మిలటరీ కోర్టులు మినహా) హైకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణ, నియంత్రణలో పనిచేస్తాయి.

ప్రశ్న 4.
జిల్లా కోర్టు అధికార విధులను వివరించండి.
జవాబు:
భారతదేశంలో రాష్ట్ర న్యాయ వ్యవస్థలో హైకోర్టుకు దిగువన సబార్డినేట్ కోర్టులు లేదా జిల్లా కోర్టులు ఉంటాయి. జిల్లా స్థాయి న్యాయపాలనలో జిల్లాకోర్టులు ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. జిల్లాకోర్టులో జిల్లా జడ్జి, ఇతర జడ్జిలు ఉంటారు. వారు జిల్లాస్థాయిలోను, పట్టణ, మేజర్ పంచాయితీల స్థాయిలో అనేక కర్తవ్యాలను, బాధ్యతలను నిర్వహిస్తూ సివిల్, క్రిమినల్ కేసులను విచారిస్తారు. జిల్లా కోర్టులు పాలనా వ్యవహారాలలో రాష్ట్ర ప్రభుత్వ అధికారానికి, నియంత్రణకు లోబడి పనిచేస్తాయి. న్యాయ విషయాలలో హైకోర్టుకు లోబడి పనిచేస్తాయి.

రాష్ట్రంలో రెండు రకాల సబార్డినేట్ కోర్టులుంటాయి. అవి: 1) సివిల్ కోర్టులు 2) క్రిమినల్ కోర్టులు

1) సివిల్ కోర్టులు: సివిల్ సంబంధమైన వివాదంతో ముడిపడిన వివాహాలు, విడాకులు, వారసత్వం, వ్యాపారం మొదలగు సివిల్ కేసులను సివిల్ కోర్టులు విచారణకు స్వీకరిస్తాయి. జిల్లా అంతటికి జిల్లా కోర్టుంటుంది. జిల్లా జడ్జి సివిల్ కోర్టుకు అధిపతిగా వ్యవహరిస్తారు. జిల్లాలోని అన్ని సివిల్ కోర్టులపై జిల్లా జడ్జి నియంత్రణ, పర్యవేక్షణా అధికారాలను కలిగి ఉంటాడు. జిల్లా సివిల్ కోర్టుకు దిగువన సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు ఉంటాయి. వీటితో పాటు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు ఉంటాయి. సబార్డినేట్ కోర్టులలోని క్రింద పేర్కొన్న న్యాయాధికారులు ఉంటారు.

  1. ప్రిన్సిపల్ జిల్లా జడ్జి.
  2. కుటుంబ కోర్టు జడ్జి.
  3. యస్.సి & యస్. టి. చట్టం కోర్టు జడ్జి.
  4. సీనియర్ సివిల్ కోర్టు జడ్జి.
  5. జూనియర్ సివిల్ కోర్టు జడ్జి.

< 10 లక్షల అంతకు మించిన ఆస్థి విలువ కలిగిన వివాదాలపై ప్రిన్సిపల్ జిల్లాకోర్టు విచారణ జరిపి తీర్పునిస్తుంది. ప్రిన్సిపల్ జిల్లా జడ్జిని ప్రత్యక్ష భర్తీ విధానం లేదా పరోక్ష భర్తీ విధానం (పదోన్నతి) ద్వారా నియమించబడతారు.

జిల్లా జడ్జి కేడర్ కలిగిన న్యాయాధికారులు కుటుంబ కోర్టులకు న్యాయమూర్తులుగా వ్యవహరిస్తారు. ఈ కోర్టు హిందూ వివాహ చట్టానికి సంబంధించి విడాకులు, మధ్యంతర భరణం, పిల్లల సంరక్షణలకు సంబంధించిన కేసులను విచారిస్తుంది. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల వారి హక్కులను కాపాడటానికి యస్. సి & యస్. టి. చట్టాన్ని తు.చ. తప్పకుండా అమలు చేయుటకు జిల్లా మొత్తానికి ఒక న్యాయస్థానం ఉంటుంది.

సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు లక్ష రూపాయలకు పైబడి పదిలక్షలలోపు ఆస్థి విలువ గల కేసులను విచారించి తీర్పునిస్తాయి. లక్ష రూపాయలలోపు ఆస్థివిలువ గల కేసులను జూనియర్ సివిల్ జడ్జి కోర్టు విచారించి తీర్పునిస్తుంది. స్థానిక న్యాయ వివాదాలను పరిష్కరించేందుకు జిల్లాలో క్రింది స్థాయిలో న్యాయ పంచాయితీలు, గ్రామ కచేరీలు, అదాలత్ పంచాయితీలు ఉంటాయి.

2) క్రిమినల్ కోర్టులు: జిల్లాలో సెషన్స్ కోర్టు అత్యున్నత క్రిమినల్ కోర్టు. క్రిమినల్ వివాదాలను జిల్లాస్థాయిలో విచారించేందుకు సెషన్స్ కోర్టు అత్యున్నత న్యాయస్థానంగా వ్యవహరిస్తుంది. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని అంశాల ఆధారంగా సెషన్స్ జడ్జి తీర్పునిస్తాడు. జిల్లాస్థాయిలో క్రింద పేర్కొన్న న్యాయమూర్తులు క్రిమినల్ కేసులను విచారిస్తారు.

  1. జిల్లా సెషన్స్ జడ్జి.
  2. సీనియర్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి.
  3. జూనియర్ సివిల్ జడ్జి.
  4. స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్.

ప్రిన్సిపల్ జిల్లా న్యాయమూర్తే జిల్లా సెషన్స్ జడ్జిగా వ్యవహరించి హత్య, మోటారు వాహనాల చట్ట ఉల్లంఘన కేసులను విచారించి, దోషులకు జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధిస్తాడు. అయితే అటువంటి శిక్షలను హైకోర్టు ధృవీకరించాల్సి ఉంటుంది. సీనియర్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కేసు స్వభావాన్ని బట్టి ఐదు నుండి ఏడు సంవత్సరాల వరకు కారాగార శిక్షను విధించవచ్చు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 8 రాష్ట్ర న్యాయశాఖ

జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏదైనా పట్టణములో ఉన్నట్లయితే ఆ కోర్టు సివిల్ మరియు క్రిమినల్ కోర్టుగా వ్యవహరించి సంబంధిత కేసులను విచారించి మూడు సంవత్సరాలలోపు కారాగార శిక్ష విధించవచ్చు. సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులు ఐదు వందల రూపాయల వరకు పెనాల్టీని లేదా ఒక సంవత్సరం కారాగార శిక్షను లేక రెండింటిని విధించవచ్చు.

స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టును ప్రతి పట్టణములోను ఏర్పాటు చేయవచ్చు. ఇవి చిల్లర (పెట్టీ కేసులను విచారించి ఐదు వందల రూపాయలలోపు జరిమానా, ఆరునెలలోపు కారాగార శిక్షను విధించవచ్చు.

ప్రశ్న 5.
రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అధికార విధులను గూర్చి చర్చించండి. [Mar. ’17]
జవాబు:
భారత యూనియన్లో ప్రతి రాష్ట్రంలో ఒక అడ్వకేట్ జనరల్ పదవి ఏర్పాటైంది. ఆ పదవి భారత అటార్నీ జనరల్ పదవిని పోలి ఉంటుంది. అందుచేత రాష్ట్ర అడ్వకేట్ జనరల్ భారత అటార్నీ జనరల్ నిర్వహించే విధులను కలిగి ఉంటాడు. అతడు రాష్ట్రంలో ఉన్నత న్యాయ అధికారిగా వ్యవహరిస్తారు.

నియామకం:
రాజ్యాంగంలోని 165వ ప్రకరణ అనుసరించి రాష్ట్ర అడ్వకేట్ జనరల్ను గవర్నరు నియమిస్తాడు. అడ్వకేట్ జనరల్ నియమించబడే వ్యక్తి ఈ క్రింది అర్హతలను కలిగి ఉండాలి.

  • భారత పౌరుడై ఉండాలి.
  • ఏదైనా న్యాయ వ్యవస్థలో ముఖ్య పదవిలో 10 సంవత్సరముల అనుభవం కలిగి వుండాలి. లేదా ఏదైనా హైకోర్టులో 10 సంవత్సరాల న్యాయవాదిగా పనిచేసియుండాలి.
  • హైకోర్టు న్యాయమూర్తిగా నియమింపబడుటకు కావలసిన అర్హతలను కలిగి ఉండవలెను.

అధికారాలు – విధులు:
రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత న్యాయాధికారి అయిన అడ్వకేట్ జనరల్ క్రింది విధులను నిర్వహిస్తాడు.

  1. గవర్నరు కోరిక మేరకు న్యాయపరమైన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలిస్తాడు.
  2. న్యాయ సంబంధమైన ఇతర విధులను గవర్నరు కోరిక మేరకు నిర్వర్తిస్తాడు.
  3. రాజ్యాంగం నిర్దేశించిన విధులను నిర్వహిస్తాడు.
  4. తన బాధ్యతల నిర్వహణలో భాగంగా రాష్ట్రంలోని ఏ న్యాయ స్థానంలోనైనా అడ్వకేట్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరవుతాడు.
  5. రాష్ట్ర శాసనసభా కార్యక్రమాలలో పాల్గొని మాట్లాడే హక్కు అడ్వకేట్ జనరల్ కు కలదు. అయితే అతడికి సభలో బిల్లులపై ఓటింగ్ లో పాల్గొనే హక్కు మాత్రం లేదు.
  6. రాష్ట్ర శాసనసభ స్థాయీసంఘాల సమావేశాలకు హాజరవుతాడు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
హైకోర్టు జడ్జీల నియామకం. [Mar 17]
జవాబు:
సంబంధిత రాష్ట్ర గవర్నర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన తరువాత భారత రాష్ట్రపతి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను నియమిస్తాడు. అదేవిధంగా ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులను నియమించేందుకు సంబంధిత రాష్ట్రాల గవర్నర్లను సంప్రదిస్తాడు.

ప్రశ్న 2.
హైకోర్టు జడ్జీల అర్హతలు.
జవాబు:

  1. భారతీయ పౌరుడై ఉండాలి. [Mar. 16]
  2. భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర న్యాయ సర్వీసులలో కనీసం 10 సంవత్సరములు న్యాయాధికారిగా అనుభవం కలిగి ఉండాలి.
  3. రెండు కాని లేదా అంతకన్నా ఎక్కువ హైకోర్టులలో కాని 10 సంవత్సరాలు న్యాయవాదిగా అనుభవం

ప్రశ్న 3.
హైకోర్టు కోర్టు ఆఫ్ రికార్డు.
జవాబు:
రాష్ట్ర హైకోర్టు కోర్టు ఆఫ్ రికార్డుగా వ్యవహరిస్తుంది. వ్యక్తులుకాని, సంస్థలు కానీ కోర్టు ధిక్కారానికి పాల్పడితే, హైకోర్టు వారిని విచారించి శిక్షిస్తుంది. హైకోర్టు ఇచ్చిన తీర్పులు, వెలువరించిన నిర్ణయాలు రికార్డుల రూపంలో భద్రపరుస్తుంది. ఈ రికార్డు దిగువ న్యాయస్థానాలకు మార్గదర్శకంగా పనిచేస్తుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 8 రాష్ట్ర న్యాయశాఖ

ప్రశ్న 4.
హైకోర్టు సలహా రూపక విధులు.
జవాబు:
హైకోర్టు న్యాయ సంబంధ విషయాలలో గవర్నర్కు సలహాలిస్తుంది. జిల్లా న్యాయమూర్తుల నియమకం, పదోన్నతి, బదిలీలు మొదలగు అంశాలలో కూడా సలహాలిస్తుంది. జిల్లా న్యాయస్థానాలలో జిల్లా జడ్జి మినహా ఇతర పదవులలో ఏర్పడే ఖాళీల భర్తీ విషయంలో రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమీషన్ తోపాటు, హైకోర్టు గవర్నర్కు సలహా ఇస్తుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 7 రాష్ట్ర శాసననిర్మాణ శాఖ

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 7th Lesson రాష్ట్ర శాసననిర్మాణ శాఖ Textbook Questions and Answers.

AP Inter 2nd Year Civics Study Material 7th Lesson రాష్ట్ర శాసననిర్మాణ శాఖ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
విధానసభ నిర్మాణం, అధికారాలు, విధులను వివరించండి.
జవాబు:
రాష్ట్ర శాసననిర్మాణ శాఖలో దిగువ సభను విధానసభ అంటారు. విధానసభ సభ్యులను యం.యల్.ఎ. (Members of Legislative Assembly) లు అని అంటారు. భారత రాజ్యాంగంలోని 170వ ప్రకరణ ప్రకారం రాష్ట్ర విధానసభలో సభ్యుల సంఖ్య 500కు మించకుండా 60కి తగ్గకుండా ఉండాలి. విధానసభ సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర జనాభాపైన మరియు విస్తీర్ణం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి చిన్న రాష్ట్రాలైన గోవా, మిజోరామ్లలో 40 మంది, సిక్కింలో 32 మంది సభ్యులు ఉండుటకు అవకాశం కల్పించబడింది.

నిర్మాణం: ప్రతి రాష్ట్రంలోను విధానసభ సభ్యులు వయోజన ఓటర్లు ద్వారా ప్రాదేశిక నియోజక వర్గాల వారీగా ప్రత్యక్షంగా ఎన్నకోబడతారు. విధానసభలో ఆంగ్లో-ఇండియన్ వర్గానికి తగిన ప్రాతినిధ్యం లేదని రాష్ట్ర గవర్నరు భావించినపుడు ఆ వర్గానికి చెందిన ఒకరిని విధానసభ సభ్యునిగా నియమిస్తారు. విధానసభ నియోజక వర్గాల సంఖ్య రాష్ట్ర జనాభా నిష్పత్తికి తగిన విధంగా ఉంటుంది.

విధానసభలో కొన్ని స్థానాలు షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల ప్రతినిధులకు కేటాయించబడినవి. దేశంలోని రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా 404 మంది శాసనసభ్యులను కలిగి ఉండగా, సిక్కింలాంటి చిన్న రాష్ట్రాలలో అతి తక్కువ 32 మంది సభ్యులను కలిగి ఉన్నది. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ విధానసభ సభ్యుల సంఖ్య 175 మందిగా నిర్ణయించడమైంది.

సభ్యుల అర్హతలు: విధానసభ సభ్యుడిగా పోటీచేయు వారికి క్రింద పేర్కొన్న అర్హతలను కలిగి ఉండాలి.

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. 25 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
  3. పార్లమెంట్ నిర్ణయించిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి.
  4. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలలో ఒక వ్యక్తి ఒకేసారి రెండింటిలో సభ్యుడిగా వుండరాదు.

పదవీకాలము: విధానసభ సాధారణ కాల పరిమితి 5 సంవత్సరాలు. అయితే 5 సంవత్సరాలకు ముందుగానే అర్థాంతరంగా రద్దుచేయవచ్చు. రాజ్యాంగం 356వ ప్రకరణ ప్రకారం రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించిన సందర్భంలో విధానసభ కాలపరిమితిని గరిష్టంగా ఒక సంవత్సరము పొడిగించవచ్చును. అత్యవసర పరిస్థితిని తొలగించిన ఆరు నెలలలోగా విధానసభకు ఎన్నికలు జరిపించాలి.

విధానసభ అధికారాలు – విధులు

ఎ) శాసన నిర్మాణ అధికారాలు విధులు: విధానసభ అనేది ప్రధానమైన శాసన రూపకల్పనా విభాగము. విధానసభకు రాష్ట్ర జాబితాలోని అన్ని అంశాలపై చట్టాలను రూపొందించేందుకు అధికారముంది. అంతేగాకుండా అది ఉమ్మడి జాబితాలోని అంశాలపై కూడా చట్టాలను రూపొందించవచ్చు. అయితే ఒకవేళ విధానసభ ఉమ్మడి జాబితాలోని అంశాలపై చట్టాలు రూపొందిస్తే ఆ చట్టం పార్లమెంటు రూపొందించిన చట్టాలకు భిన్నంగా ఉండకూడదు.

ఒకవేళ భిన్నంగా ఉన్నట్లయితే పార్లమెంటు రూపొందించిన చట్టం మాత్రమే అమలులో ఉంటుంది. విధానసభ సమావేశంలో లేని కాలంలో గవర్నరు జారీచేసే ఆర్డినెన్స్లను విధానసభ ఆమోదిస్తుంది.

బి) కార్యనిర్వాహక అధికారాలు విధులు: విధానసభకు రాష్ట్ర మంత్రిమండలిని నియంత్రించే అధికారం ఉంది. ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి విధానసభకు వ్యక్తిగతంగాను, సమిష్టిగాను బాధ్యత వహిస్తుంది. విధానసభ విశ్వాసం ఉన్నంతవరకే రాష్ట్ర మంత్రిమండలి అధికారంలో కొనసాగుతుంది. విధానసభ రాష్ట్ర మంత్రిమండలిని అనేక విధాలుగా నియంత్రిస్తుంది. అవి: సావధాన తీర్మానం, వాయిదా తీర్మానం, ప్రశ్నోత్తరాలు, అనుబంధ ప్రశ్నలు, కోత తీర్మానం, అవిశ్వాస తీర్మానం. ఈ సందర్భంలో విధానసభ, విధానపరిషత్ కంటే ఎక్కువ అధికారాలను చెలాయిస్తుంది.

సి) ఆర్థిక అధికారాలు – విధులు: విధానసభకు కొన్ని నిర్దిష్టమైన ఆర్థిక సంబంధమైన అధికారాలు ఉంటాయి. విత్త సంబంధమైన నిధులను కేటాయించడానికి, ఆమోదించడానికి దానికి అధికారమున్నది. విత్తం లేకుండా ప్రభుత్వం ఏ రకమయిన విధులను నిర్వహించలేదు. ఎందుకంటే పాలనాయంత్రాంగానికి విత్తం అనేది ఇంధనం వంటిది. ద్రవ్య సంబంధమైన బిల్లులను విధానసభలోనే ప్రవేశపెట్టాలి. విధానసభ ఆర్థిక బిల్లును తిరస్కరిస్తే మంత్రిమండలి రాజీనామా చేయాల్సి ఉంటుంది.

డి) రాజ్యాంగ సంబంధమైన అధికారాలు: రాజ్యాంగ సవరణ విషయంలో విధానసభ ద్వితీయ పాత్రను పోషిస్తుంది. రాజ్యాంగ సవరణ ప్రక్రియలో విధానసభ ఎటువంటి చొరవ చూపదు. అయినప్పటికీ ముఖ్యమైన రాజ్యాంగ సవరణలన్నింటికి సగానికిపైగా రాష్ట్రాల శాసనసభల ఆమోదం అవసరం. ఏదైనా ఒక రాష్ట్రం సరిహద్దులను మార్చవలసివస్తే పార్లమెంటు సంబంధిత విధానసభ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది.

ఇ) ఎన్నికల సంబంధమైన విధులు: విధానసభ సభ్యులు భారత రాష్ట్రపతి పదవికి జరిగే ఎన్నికలలో పాల్గొంటారు. సంబంధిత రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే రాజ్యసభ సభ్యులను విధాన సభ సభ్యులు పరోక్ష ఎన్నిక పద్ధతిలో ఎన్నుకుంటారు. విధానపరిషత్తు సభ్యులలో 1/3వ వంతు సభ్యులను విధానసభ సభ్యులు ఎన్నుకొంటారు.
ఎఫ్) ఇతర విధులు: విధానసభ ప్రజాభిప్రాయాన్ని వ్యక్తీకరించే వేదికగా పనిచేస్తుంది. నూతనంగా ఎన్నుకోబడిన సభ్యులకు శిక్షణాసంస్థగా వ్యవహరిస్తుంది. రాష్ట్రంలో విధానపరిషత్తు ఏర్పాటు చేయుటకు లేదా రద్దుచేయుటకు ఒక తీర్మానం ద్వారా పార్లమెంటుకు నివేదిస్తుంది.

ప్రశ్న 2.
విధానపరిషత్తు నిర్మాణం, అధికారాలు, విధులను క్లుప్తముగా రాయండి.
జవాబు:
విధానపరిషత్తు లేదా విధానమండలి అనేది రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో ఎగువ సభ. విధానపరిషత్తు సభ్యులను యం.యల్.సి. (మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్)లు అంటారు. భారతదేశంలో ఏడు రాష్ట్రాలలో విధాన పరిషత్తులు ఉన్నాయి. విధానపరిషత్తు సభ్యుల సంఖ్య కనీసం 40 మందికి తగ్గకుండా, విధానసభ సభ్యులు సంఖ్యలో 1/3వ వంతుకు మించకుండా ఉండాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విధానపరిషత్లో 58 మంది సభ్యులు ఉన్నారు. విధానపరిషత్ కొనసాగింపు విషయంలో విధాన సభ అభీష్టంతో పాటుగా పార్లమెంట్ సాధారణ మెజారీటీతో ఆమోదం తెలపాలి. సంబంధిత శాసనసభ తీర్మానం మేరకు విధానపరిషత్ ఏర్పాటుకు లేక తొలగింపు పార్లమెంట్ తన ఆమోదాన్ని తెలియజేస్తే విధానపరిషత్ ఏర్పాటు లేదా రద్దు అవుతుంది.

నిర్మాణం: విధానపరిషత్తులో కొందరు ఎన్నిక ద్వారా మరికొందరు నియామకం ద్వారా సభ్యత్వం పొందుతారు. వారు పరోక్ష ఎన్నిక ద్వారా నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు పద్ధతిద్వారా ఎన్నుకోబడతారు.

విధానపరిషత్ సభ్యులు ఐదు విధాలుగా ఎన్నుకోబడతారు.

  1. మొత్తం సభ్యులలో 1/3వ వంతు మంది సభ్యులను రాష్ట్రంలోని స్థానిక సంస్థలైన పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, జిల్లాపరిషత్తులు మొదలగు సంస్థల ప్రతినిధులు ఎన్నుకొంటారు.
  2. 1/3వ వంతు మంది సభ్యులను విధానసభ సభ్యులు ఎన్నుకొంటారు.
  3. 1/12వ వంతు మంది సభ్యులను రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల పట్టభద్రులు ఎన్నుకొంటారు.
  4. 1/12వ వంతు మంది సభ్యులను రాష్ట్రంలోని సెకండరీ పాఠశాల స్థాయికి తగ్గకుండా కనీసం మూడేళ్ళపాటు పనిచేసిన ఉపాధ్యాయులు ఎన్నుకొంటారు.
  5. మిగిలిన 1/6 వంతు మంది సభ్యులను సాహిత్యం, కళలు, సహకారోద్యమం, సామాజిక సేవలకు సంబంధించి ప్రత్యేక పరిజ్ఞానం కలవారిని గవర్నర్ నియామకం చేస్తాడు.

సభ్యుల అర్హతలు: విధానపరిషత్తు సభ్యునిగా పోటీ చేయుటకు ఈ దిగువ తెలిపిన అర్హతలు కలిగి ఉండవలెను.

  • భారత పౌరుడై ఉండవలెను.
  • 30 సం||ల వయస్సు నిండి యుండాలి.
  • పార్లమెంటు చట్టం ద్వారా నిర్ణయించే ఇతర అర్హతలు కలిగి ఉండాలి.

పదవీకాలం: విధానపరిషత్తు శాశ్వత సభ. అయితే మొత్తం సభ్యులలో 1/3వ వంతు సభ్యులు ప్రతి రెండు సంవత్సరములకు ఒకసారి పదవీ విరమణ చేస్తారు. ఇది శాశ్వతసభ కాబట్టి పదవీ విరమణ చేసిన సభ్యుల స్థానంలో నూతన సభ్యులు ఎన్నుకోబడతారు. ఒక్కొక్క సభ్యుడి పదవీకాలం 6 సం॥లు. సంవత్సరానికి కనీసం రెండుసార్లు ఈ సభ సమావేశమౌతుంది.

విధానపరిషత్తు అధికారాలు విధులు

ఎ) శాసన నిర్మాణ అధికారాలు విధులు: రాష్ట్ర విధానసభతో పోల్చినప్పుడు విధానపరిషత్తుకు తక్కువ అధికారాలు ఉంటాయి. విధానపరిషత్తు అధికారాలు హుందాతనంతో కూడుకున్నట్టివి మాత్రమే. సాధారణ బిల్లులను విధానపరిషత్తులో కూడా ముందుగా ప్రవేశపెట్టవచ్చును. ఉభయ సభల ఆమోదంతోనే అటువంటి బిల్లులను గవర్నర్ | ఆమోదం కొరకు పంపుతారు. విధానసభ ఆమోదించిన సాధారణ బిల్లులను విధానపరిషత్తు తిరస్కరించడానికి లేదా | పునఃపరిశీలనకు పంపడానికి అధికారం కలదు.

బి) కార్యనిర్వాహక అధికారాలు విధులు: విధానసభ అధికారాలతో పోలిస్తే విధానపరిషత్తుకు పరిమితమైన కార్యనిర్వాహక అధికారాలు ఉంటాయి. ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి విధానసభకే బాధ్యత వహిస్తుంది. విధానపరిషత్తు మంత్రిమండలి భవిష్యత్తును నిర్ధారించలేదు. అయినప్పటికీ ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలను ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలు, సావధాన తీర్మానం ద్వారా అది మంత్రిమండలిని ప్రభావితం చేస్తుంది కాని మంత్రిమండలిని పదవి నుండి తొలగించే అధికారం మాత్రం విధానపరిషత్తుకు లేదు.

సి) ఆర్థిక అధికారాలు విధులు: ఆర్థికాధికారాల విషయంలో విధానపరిషత్తుకు పరిమితమైన అధికారాలు మాత్రమే ఉంటాయి. ఆర్థిక బిల్లులను విధానపరిషత్తులో ముందుగా ప్రవేశపెట్టకూడదు. ఆర్థిక బిల్లులను తిరస్కరించే అధికారం విధానపరిషత్తుకు లేదు. విధానసభ ఆమోదించిన ఆర్థిక బిల్లులను 14 రోజుల వ్యవధిలోగా విధానపరిషత్తు ఆమోదించాల్సి ఉంటుంది.

డి) ఎన్నికల సంబంధమైన విధులు: విధానపరిషత్తు సభా కార్యక్రమాలను హుందాగా నిర్వహించేందుకు తమలో ఒకరిని చైర్మన్గాను, వేరొకరిని డిప్యూటీ చైర్మన్ గానూ ఎన్నుకొంటుంది. సభా సంఘాలైన ప్రభుత్వ ఖాతాల సంఘం, ప్రభుత్వరంగ సంస్థల సంఘాల సభ్యులను ఎన్నుకుంటుంది.

ఇ) ఇతర విధులు: ప్రజాభిప్రాయాన్ని సేకరించి, సంఘటిత పరచి వ్యక్తీకరించేందుకు విధానపరిషత్తు ఒక వేదికగా పనిచేస్తుంది. కళలు, సాహిత్యం, సామాజిక సేవ మరియు సహకారోద్యమంకు చెందిన వివిధ రంగాల ప్రముఖులకు సభ్యత్వం కల్పించడం ద్వారా విధానపరిషత్తు శాసన నిర్మాణంలో వారి సేవలను వినియోగించుకొంటుంది.

ప్రశ్న 3.
విధానసభ స్పీకరు బాధ్యతలను, పాత్రను వివరించండి.
జవాబు:
సభా కార్యక్రమాల నిర్వహణ కొరకు విధానసభ సభ్యులు తమలో ఒకరిని స్పీకరుగా ఎన్నుకొంటారు. స్పీకరు పదవీకాలం 5 సంవత్సరములు.

విధానసభ స్పీకరు అధికారాలు – విధులు: విధానసభ స్పీకరు అధికారాలు – విధులు లోక్సభ స్పీకరు యొక్క అధికారాలు విధులను పోలిఉంటాయి. స్పీకరు అధికారాలు విధులు ఈ క్రింది విధముగా వివరింపవచ్చు.

  1. స్పీకరు విధానసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. సభా కార్యక్రమాలను అత్యంత హుందాగా, ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహిస్తాడు.
  2. సభా కార్యక్రమాల నిర్వహణలో వివిధ అంశాలపై చర్చించుటకు తగిన సమయాన్ని కేటాయిస్తాడు.
  3. సభలో నియమ నిబంధనల గూర్చి వివరిస్తాడు.
  4. వివిధ బిల్లులపై ఓటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తాడు.
  5. ఏదైనా ఒక బిల్లు ఆమోదం విషయంలో ప్రతిష్టంబన ఏర్పడితే, తన నిర్ణాయక ఓటు (కాస్టింగ్ ఓటు)ను వినియోగించి బిల్లు భవితవ్యాన్ని నిర్ణయిస్తాడు.
  6. బిల్లులపై చర్చ సందర్భంగా అనేక తీర్మానాలను, పాయింట్ ఆఫ్ అర్డర్లను ప్రతిపాదించడానికి సభ్యులకు అనుమతినిస్తాడు.
  7. కోరమ్లోని సందర్భంలో సభా కార్యక్రమాలను వాయిదా వేస్తాడు.
  8. సభలో సభ్యుల గౌరవానికి భంగం కలిగించే అనుచిత వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగిస్తాడు.
  9. సభలో సభ్యులు ప్రసంగించేందుకు అవకాశం కల్పిస్తాడు.
  10. సభా కార్యక్రమాల నిర్వహణకు భంగం కలిగించే సభ్యులను సభనుండి బయటకు వెళ్ళమని ఆదేశిస్తాడు.
  11. సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడినప్పుడు సభను వాయిదావేసే అధికారం స్పీకరుకు ఉంటుంది.
  12. సభ్యుల రాజీనామాలను ఆమోదించుటకు లేదా తిరస్కరించుటకు స్పీకరుకు అధికారముంది. ఒకవేళ రాజీనామాలను ఆమోదించదలచుకుంటే, అవి నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో పరిశీలిస్తారు.
  13. శాసనసభా కమిటీల ఛైర్మన్లను నియమించి వాటి పనితీరును పర్యవేక్షిస్తాడు. శాసనసభ వ్యవహారాల కమిటీ, రూల్స్ కమిటీ, సాధారణ ప్రయోజన కమిటీలకు ఛైర్మన్ గా వ్యవహరిస్తాడు.
  14. సభలో ప్రవేశపెట్టే బిల్లు సాధారణ బిల్లా ? లేక ఆర్థిక బిల్లా ? అని నిర్ణయించడంలో అంతిమ నిర్ణయాధికారాన్ని కలిగి ఉంటాడు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
విధానసభ గురించి క్లుప్తంగా తెలపండి.
జవాబు:
రాజ్యాంగంలో 6వ భాగం 3వ అధ్యాయంలో రాష్ట్ర శాసన నిర్మాణశాఖను గురించి పేర్కొనబడింది. రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ గవర్నర్, రెండు సభలు లేదా ఒక సభతో కూడి ఉండును. విధానసభనే శాసనసభ అని కూడా అంటారు. రెండు సభలుంటే ఒకటి విధానసభ, రెండవది విధాన పరిషత్తు.

విధానసభ లేదా శాసనసభ నిర్మాణము:
సభ్యుల సంఖ్య: విధానసభ ప్రజాప్రతినిధుల సభ. రాష్ట్ర శాసనసభలో ఇది దిగువసభ. దీని సభ్యుల సంఖ్య 500కి మించరాదు. 60కి తగ్గకూడదు. ఈ సభలోని సభ్యులను వయోజనులైన ఓటర్లు ఎన్నుకుంటారు. ఒక ఆంగ్లో – ఇండియన్ సభ్యుడిని అవసరమని భావిస్తే గవర్నర్ నామినేట్ చేస్తాడు. విధానసభ సభ్యులను M.L.A. లు (మెంబర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ) అని అంటారు.

సభ్యుల అర్హతలు: విధానసభ సభ్యులు 1) భారతీయ పౌరులై ఉండాలి. 2) 25 సం||ల వయస్సు నిండినవారై ఉండాలి. 3) ఆదాయాన్నిచ్చే ప్రభుత్వ ఉద్యోగంగాని, లాభసాటి వ్యాపారం గాని చేయకూడనివారై ఉండాలి.

సభ్యుల పదవీకాలం: విధానసభ సభ్యుల పదవీకాలం 5 సంవత్సరాలు. ముఖ్యమంత్రి సలహాపై గవర్నర్ కాలపరిమితికి ముందే రద్దు చేయవచ్చు.

సభాపతి – ఉపసభాపతి (స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్): విధానసభ సభ్యులు తమలో ఒకరిని సభాపతిగాను, మరొకరిని ఉపసభాపతిగాను ఎన్నుకుంటారు. వీరు సభా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ప్రశ్న 2.
అంచనాల కమిటీ గురించి రాయండి.
జవాబు:
విధానసభ నియమనిబంధనలు, సభావ్యవహారాల నిర్వహణ ప్రకారం అంచనాల కమిటీలో 20 మంది సభ్యులుంటారు. వీరిలో విధానసభ నుండి 15 మంది, విధానపరిషత్తు నుండి 5గురు సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తారు. సభ్యుల పదవీకాలం ఒక సంవత్సరము. వీరు పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకోబడతారు. ఈ కమిటీ చైర్మన న్ను స్పీకరు నియమిస్తాడు. అధికార పక్షానికి చెందిన సభ్యుడు చైర్మన్ గా నియమించబడుతారు.

అంచనాల కమిటీ విధులు: అంచనాల కమిటీ విధులు లోక్సభ అంచనాల కమిటీ విధులను పోలివుంటాయి. అవి:

  1. ప్రభుత్వ వ్యయాన్ని నియంత్రించడం.
  2. ప్రభుత్వ అంచనాల విషయంలో విత్త సంస్కరణలను, పరిపాలనా సామర్థ్యం పెంపుదలకు తగిన సూచనలను అందించడం.
  3. ప్రభుత్వ పాలనా సామర్థ్యాన్ని, ఆదాను పెంపొందించడానికి ప్రత్యామ్నాయ విధానాలను సూచించడం.
  4. విధానాల పరిధిలో వివిధ మంత్రిత్వ శాఖల అంచనాల పరిధిని పరీక్షించడం.
  5. విధానసభకు అంచనాలను సమర్పించే పద్ధతిపై సలహాలివ్వడం.

ప్రశ్న 3.
ప్రభుత్వ ఖాతాల కమిటీ గురించి నీకేమి తెలియును ? [Mar. ’17]
జవాబు:
ఈ కమిటీలో 20 మంది సభ్యులు ఉంటారు. వారిలో 15 మంది విధానసభ సభ్యులు, 5గురు విధానపరిషత్తు సభ్యులు. వారు నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు ద్వారా ఒక సంవత్సర పదవీకాలానికి ఎన్నుకోబడతారు. ప్రభుత్వ ఖాతాల |కమిటీ చైర్మన్ గా ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యుడు స్పీకర్చే నియమింపబడతాడు. ఈ కమిటీలో మంత్రులు సభ్యులుగా
ఉండరాదు.

ప్రభుత్వ ఖాతాల కమిటీ విధులు:
ప్రభుత్వ ఖాతాల కమిటీ ఈ క్రింది విధులను నిర్వర్తిస్తుంది.

  1. ఈ కమిటీ ప్రభుత్వ ఖాతాలను పరిశీలించి ఆయా శాఖలకు బడ్జెట్ ద్వారా కేటాయించిన నిధులు సక్రమంగా వినియోగించినది, లేనిది నిర్ధారిస్తుంది.
  2. కంప్టోలర్ & ఆడిటర్ జనరల్ సమర్పించిన వార్షిక నివేదికలోని అంశాలను, రాష్ట్ర ప్రభుత్వ ఉపకల్పనా ఖాతాలను తనిఖీ చేయడం.
  3. ఈ కమిటీ ప్రభుత్వ ఖాతాల నిర్వహణలో ఏవైనా లోపాలు ఉన్నట్లయితే వాటిని విధానసభ దృష్టికి తెస్తుంది.
  4. రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలు, ఆదాయ వ్యయాలు, లాభనష్టాలకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తుంది.
  5. ప్రభుత్వ ఖాతాలు మరియు తనిఖీ పద్ధతులు ప్రక్రియలకు సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది.
  6. వివిధ శాఖలు చేసిన వ్యయాన్ని, విధానాల అమలుకు సంబంధించిన విషయాలను దర్యాప్తు చేస్తుంది.

ప్రశ్న 4.
విధానసభ స్పీకరుకు గల అధికారాలు – విధులను తెలపండి. [Mar. ’16]
జవాబు:

  1. స్పీకరు విధానసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. సభా కార్యక్రమాలను అత్యంత హుందాగా, ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహిస్తాడు.
  2. సభా కార్యక్రమాల నిర్వహణలో వివిధ అంశాలపై చర్చించుటకు తగిన సమయాన్ని కేటాయిస్తాడు.
  3. సభలో నియమనిబంధనల గూర్చి వివరిస్తాడు.
  4. వివిధ బిల్లులపై ఓటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తాడు.
  5. ఏదైనా ఒక బిల్లు ఆమోదం విషయంలో ప్రతిష్టంభన ఏర్పడితే, తన నిర్ణాయక ఓటు (కాస్టింగ్ ఓటు)ను వినియోగించి బిల్లు భవితవ్యాన్ని నిర్ణయిస్తాడు.
  6. బిల్లులపై చర్చ సందర్భంగా అనేక తీర్మానాలను, పాయింట్ ఆఫ్ ఆర్డర్లను ప్రతిపాదించడానికి సభ్యులకు అనుమతినిస్తాడు.
  7. కోరమ్లని సందర్భంలో సభా కార్యక్రమాలను వాయిదా వేస్తాడు.
  8. సభలో సభ్యుల గౌరవానికి భంగం కలిగించే అనుచిత వ్యాఖ్యలను రికార్డులనుండి తొలగిస్తాడు.
  9. సభలో సభ్యులు ప్రసంగించేందుకు అవకాశం కల్పిస్తాడు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
విధానసభ సభ్యుడి అర్హతలు.
జవాబు:

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. 25 సంవత్సరముల వయస్సు నిండి ఉండాలి.
  3. పార్లమెంటు నిర్ణయించిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి.
  4. పార్లమెంటు, రాష్ట్రశాసన సభలలో ఒక వ్యక్తి ఒకేసారి రెండింటిలో సభ్యుడిగా ఉండరాదు.

ప్రశ్న 2.
విధానపరిషత్తు సభ్యుడి అర్హతలు.
జవాబు:

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. 30 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
  3. పార్లమెంటు చట్టం ద్వారా నిర్ణయించే ఇతర అర్హతలు కలిగి ఉండాలి.

ప్రశ్న 3.
కోరమ్. [Mar. ’17]
జవాబు:
విధానసభ కార్యక్రమాల నిర్వహణకు హాజరు కావలసిన కనీస సభ్యుల సంఖ్యను కోరమ్ అంటారు. భారత రాజ్యాంగంలోని 188వ ప్రకరణ ప్రకారం విధానసభ కోరమ్ సభ్యుల సంఖ్య 1/10వ వంతు.

ప్రశ్న 4.
రాష్ట్ర శాసనసభ్యుల జీతభత్యాలు.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ విధానసభ సభ్యులు ఒక్కొక్కరు నెలకు 90,000/-ల జీతభత్యాలను పొందుతారు. అందులో వేతనం 15,000/-లు, నియోజకవర్గ అలవెన్సుగా 75,000/- లు చెల్లించబడతాయి. రాష్ట్రప్రభుత్వం నివాస వసతి కల్పించకపోతే అందుకుగాను ఇంటి అద్దె అలవెన్సుగా నెలకు 10,000/-లు చెల్లించటం జరుగుతుంది. శాసనసభ సమావేశాలకు హాజరైన సభ్యులకు రోజుకు 3 800/-లు దినసరిభత్యం ఇవ్వబడుతుంది.

ప్రశ్న 5.
రాష్ట్రశాసన సభ విశేషాధికారాలు.
జవాబు:
విధానసభ సభ్యులకు విధి నిర్వహణలో కల్పించిన ప్రత్యేక హక్కులే వారికి విశేషాధికారాల రూపంలో ఉంటాయి. ఈ అధికారాలు లేకుంటే విధానసభ హుందాగా, గౌరవప్రదంగా నిర్వహించబడదు. విశేషాధికారాలు రెండు రకాలు. అవి. 1. సమిష్టి విశేషాధికారాలు. 2. వ్యక్తిగత విశేషాధికారాలు. శాసనసభ్యుల ప్రసంగాలు, చర్చలను ఇతరులు ప్రచురించకుండా నిరోధించే హక్కును కల్గి ఉంటారు. శాసన సభ సమావేశాలకు 40 రోజుల ముందు గానీ సమావేశాలనంతరం 40 రోజుల వరకు గానీ సభ్యులను అరెస్టు చేయరాదు.

ప్రశ్న 6.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సంక్షిప్త చరిత్ర. [Mar. ’17]
జవాబు:
ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వున్న 13 జిల్లాల ప్రాంతం కర్నూలు రాజధానిగా 1953 సంవత్సరం అక్టోబరు 1వ తేదీన ఆంధ్రరాష్ట్రం అవతరించింది. అప్పుడు ఆంధ్రరాష్ట్ర శాసనసభలో 140 మంది సభ్యులు ఉన్నారు. 1956 నవంబరు 1వ తేదీన ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 245 మంది సభ్యులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా 2014 జూన్ 2వ తేదీన విభజించడమైంది.

ప్రశ్న 7.
విధానపరిషత్తు చైర్మన్. [Mar, ’16]
జవాబు:
విధాన పరిషత్తు సమావేశాలను నిర్వహించటానికి ఒక చైర్మన్ మరియు ఒక డిప్యూటీ చైర్మన్ ఉంటారు. విధాన పరిషత్ చైర్మన్ అధికారాలు విధానసభ స్పీకర్ అధికారాలతో పోలి ఉంటాయి. కాని ఏది ఆర్థిక బిల్లో ? ఏది సాధారణ బిల్లో నిర్ణయించే విశిష్ట అధికారం స్పీకరు కల్గి ఉన్నాను. చైర్మన్కు ఆ అధికారం లేదు.

ప్రశ్న 8.
డిప్యూటీ స్పీకర్.
జవాబు:
సభ కార్యక్రమాల నిర్వహణకు విధానసభ సభ్యులు తమలో ఒకరిని స్పీకరుగాను మరొకరిని డిప్యూటీ స్పీకర్గాను ఎన్నుకొంటారు. స్పీకర్ సమావేశాలకు హాజరుగాని సమయంలో డిప్యూటీ స్పీకర్ సభా కార్యక్రమాలు నిర్వహిస్తాడు. ఇటువంటి సందర్భంలో స్పీకర్ అధికారాలన్ని డిప్యూటీ స్పీకరుకు వర్తిస్తాయి.

ప్రశ్న 9.
విధానపరిషత్తు డిప్యూటీ చైర్మన్.
జవాబు:
విధానపరిషత్తు సమావేశాలను నిర్వహించటానికి సభలోని సభ్యులు తమలో నుంచి ఒకరిని చైర్మన్గాను మరొకరిని డిప్యూటీ చైర్మన్ గాను ఎన్నుకొంటారు. చైర్మన్ పదవి ఖాళీ అయిన సందర్భంలోనూ, లేక చైర్మన్ సభకు హాజరు కాని సమయంలోను డిప్యూటీ చైర్మన్ సభా కార్యక్రమాలను నిర్వహిస్తారు.

ప్రశ్న 10.
కమిటీల రకాలు.
జవాబు:
రాజ్యాంగ నిర్మాతల ఆశయాలకనుగుణంగా పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలలో వివిధ రకాల కార్యక్రమాల నిర్వహణ కొరకు కమిటీలు ఏర్పడినాయి. స్థూలంగా కమిటీలు రెండు రకాలు. అవి:

  1. స్థాయి సంఘాలు.
  2. తాత్కాలిక సంఘాలు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 6 రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 6th Lesson రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ Textbook Questions and Answers.

AP Inter 2nd Year Civics Study Material 6th Lesson రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాష్ట్ర గవర్నర్ అధికారాలు – విధులను చర్చించండి.
జవాబు:
గవర్నర్ రాజ్యాంగం ఏర్పాటు చేసిన రాష్ట్ర అధినేత. అతను రాజ్యాంగం యొక్క ప్రతినిధి. కేంద్ర ప్రభుత్వ నియమితుడు. మన రాజ్యాంగం రాష్ట్ర స్థాయిలో గవర్నర్ పదవికి అవకాశం కల్పించింది. ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలని రాజ్యాంగంలోని 153వ ప్రకరణ తెలుపుతున్నది. అయితే రాజ్యాంగ (7వ సవరణ) చట్టం, 1956 ఒక వ్యక్తిని రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్ నియమించడానికి వీలు కల్పించింది. ఈ చట్టం ప్రకారమే ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఒకే వ్యక్తి గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం బీహార్ – పశ్చిమ బెంగాల్, మణిపూర్ – మేఘాలయ, త్రిపుర – నాగాలాండ్ రాష్ట్రాలకు కూడా ఉమ్మడి గవర్నర్లు ఉన్నారు.

అర్హతలు: రాజ్యాంగంలోని 157వ ప్రకరణ ప్రకారం గవర్నర్ గా నియమింపబడే వ్యక్తికి క్రింది పేర్కొన్న అర్హతలు ఉండాలి.

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. 35 సంవత్సరాల వయసు నిండి ఉండాలి.

అలాగే గవర్నర్గా నియమితుడయ్యే వ్యక్తి 158వ ప్రకరణ ప్రకారం క్రింద తెలిపిన షరతులను నిర్దేశించింది.

  1. పార్లమెంట్లో ఏ సభలోనూ లేదా రాష్ట్ర శాసన నిర్మాణశాఖలోని ఏ సభలోనూ సభ్యుడై ఉండకూడదు.
  2. ఎటువంటి లాభదాయకమైన పదవిని నిర్వహించకూడదు.
  3. కోర్టు ద్వారా దివాళా తీసిన వ్యక్తిగా ప్రకటింపబడి ఉండకూడదు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 6 రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ

నియామకం : రాజ్యాంగ ప్రకరణ 155 ప్రకారం రాష్ట్రపతి ప్రధానమంత్రి సలహా ప్రకారం గవర్నర్ను నియమిస్తాడు. గవర్నర్ నియామక విషయంలో రాష్ట్రపతి క్రింది రెండు సంప్రదాయాలను పాటిస్తాడు.

  1. సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రితో సంప్రదించడం.
  2. సంబంధిత రాష్ట్రానికి చెందని ప్రముఖ వ్యక్తిని గవర్నర్ గా నియమించడం.

జీతభత్యములు:- ప్రస్తుతం గవర్నర్కు నెలకు రూ. 1,10,000 లు జీతం లభిస్తుంది. “రాజభవన్” అనే ఉచిత అధికార గృహంలో నివసిస్తాడు. వీటితోపాటు అనేక ఇతర భత్యాలు, సౌకర్యాలు, మినహాయింపులు గవర్నర్కు లభిస్తాయి. పదవీ ప్రమాణ స్వీకారం: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవర్నర్ చేత పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తాడు.
పదవీకాలం: గవర్నర్ పదవిని స్వీకరించిన నాటినుండి 5 సంవత్సరాలు పదవిలో ఉండటం సాంప్రదాయం. అయితే రాష్ట్రపతి విశ్వాసాన్ని పొందినంతకాలం గవర్నర్ పదవిలో కొనసాగగలడు. వాస్తవానికి ఆచరణలో రాష్ట్రపతి విశ్వాసం అనేది ప్రధానమంత్రి అభిప్రాయంపైన ఆధారపడి ఉంటుంది. అంటే ప్రధానమంత్రి దృష్టిలో సదభిప్రాయం పొందినంతకాలం పదవిలో ఉండగలరు.

అధికారాలు – విధులు:
రాజ్యాంగం ప్రకారం గవర్నర్ రాజ్యాంగబద్ధమైన అధినేత. గవర్నర్ కొన్ని ముఖ్యమైన అధికారాలను, విధులను నిర్వర్తిస్తాడు. వాటిని క్రింది విధంగా పేర్కొనవచ్చు.

  1. కార్యనిర్వాహణ అధికారాలు విధులు
  2. శాసననిర్మాణ అధికారాలు – విధులు
  3. న్యాయాధికారాలు – విధులు
  4. ఆర్థికాధికారాలు – విధులు
  5. ఇతర అధికారాలు – విధులు
  6. వివేచనాధికారాలు

1) కార్యనిర్వాహణాధికారాలు – విధులు: రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలను స్వయంగా సాగించడానికి అవసరమైన నియమ నిబంధనలను గవర్నర్ రూపొందిస్తాడు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ విధివిధానాలను సక్రమంగా నిర్వహించి అమలు చేయడానికి అనుకూలంగా రాష్ట్ర స్థాయిలో రాజ్యాంగ ఉన్నత పదవులలో కొన్నింటికి ప్రత్యక్షంగా నియామకాలు జరుపుతాడు. అందులో ముఖ్యమైనవి.

  1. గవర్నర్ ముఖ్యమంత్రిని నియమిస్తాడు. ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రులను నియమిస్తాడు.
  2. మంత్రులకు మంత్రిత్వ శాఖలను కేటాయించడం లేదా మంత్రివర్గ నిర్మాణంలో మార్పులు చేయడం, మంత్రుల శాఖలలో మార్పులు చేయడం వంటి విధులను నిర్వహిస్తాడు.
  3. ముఖ్యమంత్రి సూచనలపై మంత్రులను పదవుల నుండి తొలగిస్తాడు.
  4. రాష్ట్ర విశ్వ విద్యాలయాలకు ఉపకులపతులను నియమించడమే గాక కులపతిగా కూడా వ్యవహరిస్తాడు.
  5. రాష్ట్ర ముఖ్య కార్యదర్శి మరియు అడ్వకేట్ జనరల్ను నియమిస్తాడు.

2) శాసననిర్మాణ అధికారాలు విధులు: గవర్నర్ రాష్ట్ర శాసనసభలో సభ్యుడు కాదు. కాని అందులో ఒక అంతర్భాగంగా 168వ ప్రకరణ వర్ణిస్తుంది. ఆ స్థాయిలో శాసన నిర్మాణశాఖకు సంబంధించిన కొన్ని విధులను, అధికారాలను గవర్నర్ నిర్వహిస్తాడు.

  1. విధానసభ సాధారణ ఎన్నికల తరువాత మొదటి సమావేశాన్ని ఆవిష్కరిస్తాడు.
  2. విధానసభ మొదటి సమావేశానికి (బడ్జెట్ సమావేశం) ప్రారంభ ఉపన్యాసం చేస్తాడు.
  3. విధానసభకు సాధారణ ఎన్నికల అనంతరం ప్రొటెం స్పీకర్ను నియమించి, స్పీకర్ ఎన్నికకు మార్గం సుగమం చేస్తాడు.
  4. శాసన నిర్మాణశాఖలోని సభా సమావేశాలకు ఆదేశించడం లేదా వాయిదా వేసే అధికారం గవర్నర్కు కలదు.

3) న్యాయాధికారాలు విధులు: రాష్ట్ర గవర్నరు న్యాయ సంబంధమైన కొన్ని ముఖ్య అధికార విధులను నిర్వర్తిస్తాడు.

  1. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో రాష్ట్రపతి కోరినచో సలహా ఇస్తాడు.
  2. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ న్ను నియమిస్తాడు.
  3. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి జిల్లా జడ్జీల నియామకం, పోస్టింగులు, పదోన్నతులు వంటి విషయాలలో అధికారాలను చెలాయిస్తాడు.
  4. రాష్ట్ర హైకోర్టు (జిల్లా జడ్జీలను మినహాయించి) రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సూచనలపై రాష్ట్రంలోని అధీన న్యాయస్థానాల (Sub-ordinate courts) లోని న్యాయ సిబ్బందిని నియమిస్తాడు.
  5. సంబంధిత రాష్ట్ర హైకోర్టు విధించిన శిక్షను తగ్గించడానికి, క్షమాభిక్ష పెట్టడానికి లేదా శిక్షను పూర్తిగా రద్దు చేయడానికి రాష్ట్ర గవర్నర్కు అధికారం ఉంటుందీ.

4) ఆర్థికాధిరాలు – విధులు:

  1. ప్రతి ఆర్థిక సంవత్సరములో రాష్ట్రవార్షిక ఆర్థిక నివేదికను (బడ్జెట్ను) విధాన సభలో సమర్పించే విధంగా చూస్తాడు.
  2. గవర్నర్ ముందస్తు అనుమతి ద్రవ్య బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టరాదు.
  3. గవర్నరు అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక గ్రాంట్లకు సంబంధించిన ఏ సిఫార్సులనైనా విధానసభలో ప్రవేశపెట్టడానికి వీలులేదు.
  4. రాష్ట్ర ప్రభుత్వ ఆగంతుక నిధి (Contingency fund) ని నిర్వహించడం, అనుకోని వ్యయాన్ని భరించడానికి ఆ నిధి నుండి నిధులను విడుదలచేసే అధికారం గవర్నర్కే ఉంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 6 రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ

5) ఇతర అధికారాలు, విధులు:

  1. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సమర్పించిన వార్షిక నివేదికను గవర్నర్ మంత్రిమండలి పరిశీలనకు పంపుతాడు. తరువాత ఆ నివేదికను, దానిపై మంత్రిమండలి సూచనలను రాష్ట్ర అసెంబ్లీకి పంపించి, దానిపై చర్చ జరిగేటట్లు చర్యలు తీసుకుంటాడు.
  2. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల ఆదాయ వ్యయాల గురించి ఆడిటర్ జనరల్ పంపించిన నివేదికలను గవర్నర్ స్వీకరిస్తాడు. గవర్నర్ ఆ నివేదికను కూడా మంత్రి మండలికి, ఆ తరువాత శాసనసభకు పంపడానికి చర్యలు తీసుకుంటాడు.

6) వివేచనాధికారాలు: రాజ్యాంగంలోని 163(1) అధికరణ రాష్ట్ర గవర్నర్కు కొన్ని వివేచనాధికారాలను ప్రసాదించింది. ఈ విధులను మంత్రిమండలి సహాయ సలహాలతో నిమిత్తం లేకుండా గవర్నర్ తన వివేచన, విజ్ఞతలను ఉపయోగించి నిర్వహిస్తాడు. గవర్నరుకు క్రింద పేర్కొన్న వివేచనాధికారాలు ఉంటాయి.

  1. ఏ పార్టీకి పూర్తి మెజార్టీ లేని పరిస్థితులలో కొత్త ముఖ్యమంత్రిని ఎంపికచేయడం. ఈ సందర్భంలో గవర్నరు చాలా చురుకైన పాత్రను నిర్వహిస్తాడు.
  2. మెజార్టీ సభ్యుల మద్దతు కోల్పోయిన మంత్రి మండలి రాజీనామా చేయడానికి నిరాకరించినపుడు ఆ మంత్రిమండలిని రద్దుచేయడం.
  3. మంత్రిమండలి శాసనసభలో మెజారిటీ సభ్యుల విశ్వాసం కోల్పోయినపుడు, ముఖ్యమంత్రి సలహామేరకు శాసనసభను రద్దు చేయవచ్చు.
  4. రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని (రాష్ట్రపతిపాలన) విధించాల్సిందిగా రాష్ట్రపతిని కోరడం.
  5. విధానసభ ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతి పరిశీలన కోసం నిలుపుదల చేయడం.

ప్రశ్న 2.
ముఖ్యమంత్రి అధికారాలు – విధులను వివరించండి.
జవాబు:
రాష్ట్ర ప్రభుత్వ రథసారథి ముఖ్యమంత్రి. అతడు ప్రభుత్వాధిపతి. మంత్రిమండలికి నాయకుడు. అధికార పక్షానికి నాయకుడు. గవర్నర్కు, మంత్రిమండలికి మధ్య వారధి వంటివాడు. ఈయన సమర్థతపై ఆధారపడి రాష్ట్ర పరిపాలన నడుస్తుంది. కేంద్రంలో ప్రధాని వలె, రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానం ఉంటుంది.

నియామకం: సాధారణ ఎన్నికల తరువాత మెజారిటీ పార్టీ నాయకుడు గవర్నర్చే ముఖ్యమంత్రిగా నియమింపబడతాడు. ఆయన సలహాపై ఇతర మంత్రులను గవర్నర్ నియమిస్తాడు.

పదవీకాలం: రాజ్యాంగరీత్యా ముఖ్యమంత్రి గవర్నర్ విశ్వాసం పొందగలిగినంత కాలం పదవిలో ఉంటాడు. వాస్తవానికి అసెంబ్లీలో (విధానసభ) మెజారిటీ నిలుపుకొన్నంత కాలమే పదవిలో కొనసాగుతాడు.

అర్హతలు:

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. శాసనసభలో సభ్యుడై ఉండాలి. కాకపోతే 6 నెలల్లో శాసనసభా సభ్యత్వం పొందాలి. లేకుంటే పదవి పోతుంది.

ముఖ్యమంత్రి అధికారాలు

విధులు:
1) మంత్రిమండలి ఏర్పాటు: తన అభీష్టం మేరకు మంత్రిమండలిని ఏర్పాటుచేయడం ముఖ్యమంత్రి మొదటి ప్రధాన విధి. సాధారణంగా మంత్రివర్గ సభ్యుల ఎంపిక, నియామకాలలో ముఖ్యమంత్రికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. తన పార్టీలో లేదా సంకీర్ణ ప్రభుత్వమైతే భాగస్వామ్య పార్టీలలోని కొందరు సభ్యులను ఎంపిక చేసుకొని వారి పేర్లను గవర్నర్కు సిఫారసు చేసి మంత్రులుగా వారు నియమితులయ్యేటట్లు చూస్తాడు.

2) మంత్రిమండలి నాయకుడు: ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రిమండలి నాయకుడు. ఆ హోదాలో అత్యున్నత, అసామాన్యమైన అధికార స్థానాన్ని ముఖ్యమంత్రి అలంకరిస్తాడు. అతడు కేబినేట్ ఛైర్మన్ గా ఉంటూ, కేబినేట్ సమావేశ చర్చనీయాంశాలు (అజెండా), ప్రదేశం, సమయాలను నిర్ణయిస్తాడు. కేబినేట్ సమావేశాలకు అధ్యక్షత వహించి, అందులో చర్చలు సజావుగా, అర్థవంతంగా జరిగేందుకు మార్గనిర్దేశం చేస్తాడు.

3) గవర్నర్ – మంత్రిమండలి మధ్య వారధి: ముఖ్యమంత్రి, గవర్నర్ – మంత్రిమండలికి మధ్య ప్రధాన సమాచార మార్గంగానూ, వారధిగానూ పనిచేస్తాడు. మంత్రిమండలి సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలను గవర్నర్కు తెలియజేయవలసిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంటుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పాలనా నిర్ణయాలు, చేపట్టిన శాసనప్రతిపాదనల గురించి గవర్నర్కు తెలియజేస్తాడు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 6 రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ

4) విధానసభ నాయకుడు: విధానసభలోని మెజార్టీ సభ్యుల విశ్వాసం, మద్దతులు ముఖ్యమంత్రికి ఉంటాయి. అందుచేత విధానసభకు నాయకుడుగా వ్యవహరిస్తాడు. సభా వ్యవహారాలను సజావుగా, సక్రమంగా నడుపుటకు సభాధ్యక్షునికి (Presiding Officer) పూర్తి సహకారాన్ని అందిస్తాడు.

5) రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి: ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తాడు. ప్రభుత్వం ముఖ్య విధానాలు, నిర్ణయాలు, కార్యక్రమాలను అధికారికంగా ప్రకటిస్తాడు. కొన్ని సందర్భాలలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలని, విస్పష్ట ప్రకటన చేయాలని విధానసభలో సభ్యులు పట్టుబట్టినప్పుడు ముఖ్యమంత్రి సభకు వచ్చి ఆమేరకు ప్రభుత్వ విధానం గురించి ప్రకటన చేస్తాడు.

6) అధికార పార్టీ నాయకుడు: రాష్ట్రంలో ముఖ్యమంత్రి అధికార పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తాడు. తన పార్టీ ఏర్పాటు చేసిన సమావేశాలలో పాల్గొంటాడు. అధికార పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చుటకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు, అమలు చేస్తున్న కార్యక్రమాలను పార్టీ సభ్యులకు వివరిస్తాడు.

7) ప్రజల నాయకుడు: ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల ఆలోచనలు, ఆశయాలు, ఆకాంక్షలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అందుకొరకు తరచుగా వివిధ ప్రాంతాలలో పర్యటించి, ప్రజా సమూహాలను ఉద్దేశించి ప్రసంగిస్తాడు.. ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించి, వారి సమస్యలను, అభ్యర్థనలను ఓర్పుగా ఆలకిస్తాడు.

8) గవర్నర్కు ముఖ్య సలహాదారు: రాష్ట్ర గవర్నర్ విధి నిర్వహణలో ముఖ్య సలహాదారుడిగా వ్యవహరించాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అంశాలపై గవర్నర్కు ముఖ్యమంత్రి సలహాలు, సహాయం అందిస్తాడు.

9) కేంద్ర ప్రభుత్వంతో సుహృద్భావ సంబంధాలు కేంద్ర ప్రభుత్వంతో సుహృద్భావ సంబంధాలను కొనసాగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ వాస్తవ కార్యనిర్వాహక అధిపతిగా ముఖ్యమంత్రిపై ఉంటుంది. ప్రధానమంత్రి, అతని మంత్రివర్గ సభ్యులతో స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించుకోవాలి. కేంద్ర మంత్రులతో సముచిత సంబంధాలను ఏర్పరచుకోవాలి.

10) ప్రతిపక్ష పార్టీతో సంబంధాలు: ముఖ్యమంత్రి ప్రతిపక్షాలకు చెందిన పార్టీ అధ్యక్షులు, సభా నాయకులు, శాసన సభ్యులతో మంచి సంబంధాలను కొనసాగించాలి. తరచుగా కలవడం, ఆరోగ్యకరమైన సంబంధాలు, ఉత్సాహంతో కూడిన స్నేహ పూర్వక దృక్పథం వంటి చర్యల ద్వారా ప్రతిపక్షాల నుంచి నిర్మాణాత్మక సహకారాన్ని పొందవచ్చు.

11) రాజ్యాంగ సంబంధ విధులు: భారత రాజ్యాంగం రాష్ట్రంలో వాస్తవ కార్య నిర్వాహణ అధికారాలన్నింటిని ముఖ్యమంత్రిపై ఉంచింది. ముఖ్యమంత్రి పదవి, స్థాయి రాజ్యాంగం నుంచి ఏర్పడతాయి. ముఖ్యమంత్రి తన అధికారాలను చెలాయించడంలోనూ, బాధ్యతలను నిర్వర్తించడంలోనూ రాజ్యాంగ సూత్రాలకు కట్టుబడి, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి.

ప్రశ్న 3.
రాష్ట్ర మంత్రిమండలి అధికారాలు – విధులను పేర్కొనండి.
జవాబు:
రాజ్యాంగంలోని 163(1)వ ప్రకరణ ప్రకారం ప్రతి రాష్ట్రంలో ఒక రాష్ట్ర మంత్రిమండలి ఉంటుంది. రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర పాలన నడపడంలోనూ, అధికారాలను నిర్వహించడంలోనూ తగిన సలహాను ఇచ్చి, సహాయం అందించేందుకై ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక మంత్రిమండలి ఉండాలని పై ప్రకరణ నిర్దేశిస్తుంది.

నిర్మాణం: సాధారణంగా రాష్ట్ర మంత్రిమండలి అనేది మూడంచెల వ్యవస్థ. అందులో 1) కేబినెట్ హోదా మంత్రులు 2) స్టేట్ హోదా మంత్రులు 3) డిప్యూటీ మంత్రులు ఉంటారు. అరుదైన సందర్భాలలో కొన్ని రాష్ట్రాలలో పార్లమెంటరీ సెక్రటరీలను నియమిస్తారు. వీరు మంత్రిమండలిలో నాల్గవ శ్రేణిలో ఉంటారు.

1) కేబినెట్ మంత్రులు: రాష్ట్ర ప్రభుత్వంలోని హోం, ఆర్థిక, ప్రణాళిక, పరిశ్రమలు, గనులు భూగర్భ వనరులు వంటి ప్రధాన మంత్రిత్వశాఖకు అధిపతులుగా కేబినెట్ మంత్రులుంటారు. వీరు తమ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన నిర్ణయాలను తీసుకొని అమలు చేయడంలో స్వతంత్రంగా వ్యవహరిస్తారు. కేబినెట్ సమావేశాలలో కేవలం వీరు మాత్రమే పాల్గొంటారు.

2) స్టేట్ హోదా మంత్రులు: కేబినెట్ మంత్రులతో పోల్చితే తక్కువ ప్రాధాన్యం గల శాఖలకు వీరు ఆధ్వర్యం వహిస్తారు. మంత్రిత్వ శాఖలకు వీరిని అనుసంధానం చేయవచ్చు లేదా స్వతంత్రంగా వ్యవహరించవచ్చు. వీరు నేరుగా ముఖ్యమంత్రికి జవాబుదారులుగా ఉంటారు. వీరిపై కేబినెట్ మంత్రుల అజమాయిషీ ఉండదు.

3) డిప్యూటీ మంత్రులు: డిప్యూటీ మంత్రులను కేబినెట్ మంత్రులకు అనుబంధంగా నియమిస్తారు. వీరు కేబినెట్ మంత్రులు తమకు అప్పగించిన విధులను మాత్రమే నిర్వహిస్తారు. మంత్రిత్వ శాఖకు సంబంధించిన శాసన, పరిపాలనా వ్యవహారాలలో కేబినెట్ మంత్రులకు వీరు సహాయపడతారు. అందుకే వీరిని సహాయ మంత్రులు అని కూడా పిలుస్తారు.

అర్హతలు: ఒక వ్యక్తి మంత్రిగా నియమించబడాలంటే ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి.

  1. ఆ వ్యక్తి శాసన నిర్మాణ శాఖలోని ఏదో ఒక సభలో సభ్యుడై ఉండాలి. (ద్విసభా విధానం అయినట్లయితే)
  2. ఒకవేళ ఏ సభలోనూ సభ్యులు కానివారు మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన 6 నెలల వ్యవధిలోగా విధానసభ సభ్యులుగా ఎన్నిక కావలసి ఉంటుంది. లేకుంటే వారు మంత్రి పదవిని కోల్పోతారు.
  3. పార్లమెంటు నిర్దేశించే ఇతర అర్హతలను కలిగిఉండాలి.

నియామకం: రాజ్యాంగంలోని 164వ ప్రకరణ ప్రకారం మంత్రులందరినీ గవర్నర్ ముఖ్యమంత్రి సలహా మేరకు నియమిస్తాడు. విధాన సభలోని తన పార్టీకి (లేదా భాగస్వామ్య పార్టీలకు చెందిన కొందరు సభ్యులను ఎంపిక చేసుకొని వారి పేర్లను గవర్నరు నివేదించి, వారిని మంత్రులుగా నియమించాల్సిందిగా ముఖ్యమంత్రి గవర్నర్కు సిఫారసు చేస్తాడు. ముఖ్యమంత్రి సూచనల ప్రకారం గవర్నర్ మంత్రులను నియమించి వారికి శాఖలను కేటాయిస్తాడు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 6 రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ

పదవీ కాలం: గవర్నర్ మంత్రుల విధి నిర్వాహణ పట్ల సంతోషంగా ఉన్నంతకాలం మంత్రులు తమ పదవిలో కొనసాగగలరని రాజ్యాంగంలో 164(2)వ ప్రకరణ తెలియజేస్తుంది. 164(3)వ ప్రకరణ ప్రకారం మంత్రిమండలి విధానసభకు సమిష్టిగా బాధ్యత వహించాలి. కాబట్టి మంత్రులు ఈ క్రింద చూపిన నియమాలను అనుసరించి పదవిలో
కొనసాగుతారు. అవి:

  1. గవర్నర్ సంతోషంగా ఉన్నంతకాలం.
  2. విధానసభకు సమిష్టి బాధ్యతను నెరవేర్చుతూ ఆ సభ విశ్వాసాన్ని పొందినంతకాలం.

రాష్ట్ర మంత్రిమండలి అధికారాలు
విధులు:
1) విధానాల రూపకల్పన: ప్రజా ప్రగతికి, రాష్ట్ర అభివృద్ధికి అవసరం అయిన విధానాలను రాష్ట్ర మంత్రిమండలి రూపొందిస్తుంది. ఇది ఎంతో శ్రమతో కూడిన మేథోపరమైన విధి. మంత్రిమండలి సభ్యులు ముఖ్యంగా కేబినెట్ మంత్రులు ముఖ్యమంత్రి నాయకత్వాన తరచుగా సమావేశమై రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల నిర్వహణ కోసం అన్ని అంశాలపై కూలంకషంగా చర్చిస్తారు.

2) చట్టాలను రూపొందించటం: రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ అంశాలపై చట్టాలను రూపొందించే అధికారం, బాధ్యత రాష్ట్ర మంత్రిమండలిపై ఉంది. అందుకై చొరవ తీసుకొని ముసాయిదా బిల్లును రూపొందించి ఖరారు చేస్తుంది. మంత్రిమండలి ఆమోదం పొందిన తరువాత సంబంధిత మంత్రి ముసాయిదా బిల్లును విధానసభలో ప్రవేశపెట్టి, విధానసభ ఆమోదం పొందేటట్లు ప్రతి స్థాయిలో కృషి చేస్తాడు.

3) సుపరిపాలనను అందించడం: రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్ర వాస్తవ కార్యనిర్వాహక అధిపతి. ప్రజలకు సుపరిపాలన అందించే బాధ్యతను మంత్రిమండలిపై ఉంచి ఓటు ద్వారా వారికి అధికారాన్ని అప్పగించారు. రాజ్యాంగ మూలసూత్రాలకు, ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు అనుగుణంగా మంత్రిమండలి రాష్ట్ర పాలనను సాగించాలి.

4) ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయం: వివిధ ప్రభుత్వ విభాగాల కార్యక్రమాలను, సమన్వయం చేసే అధికారం, బాధ్యత రాష్ట్ర మంత్రిమండలికి ఉంటుంది. మంత్రిత్వశాఖల మధ్య సమన్వయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన సంఘం కాజాలదు.

5) నియామక అధికారాలు: రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని ముఖ్యమైన ఉన్నత పదవుల నియామకంలో మంత్రిమండలి అత్యంత కీలక పాత్రను పోషిస్తుంది. ఉన్నతాధికారులందరినీ మంత్రిమండలి గవర్నర్ పేరుతో నియమిస్తుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి అభీష్టం చెల్లుబాటు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అడ్వకేట్ జనరల్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ముఖ్య కార్యదర్శులు, ఇతర కార్యదర్శులు, డిపార్ట్మెంట్ అధిపతులు మొదలగువారు మంత్రిమండలిచే నియమించబడతారు.

6) ఆర్థిక అధికారాలు – విధులు: రాష్ట్ర ఆర్థిక వనరులపై మంత్రిమండలి నియంత్రణ కలిగి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ద్రవ్య విధానాన్ని నిర్ణయించి అమలు చేస్తుంది. రాష్ట్ర మంత్రిమండలి ప్రభుత్వ రాబడి, వ్యయం, పెట్టుబడులు, ఆడిట్ వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి, ఆయా అంశాలలో మెరుగైన ఫలితాల కోసం చర్యలను తీసుకుంటుంది.. రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించి విధానసభ పరిశీలన, ఆమోదాలకు సమర్పిస్తుంది.

7) ఇతర విధులు: రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయం, నీటి పారుదల, పరిశ్రమలు, రవాణా, విద్య, ప్రణాళికలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజి వంటి రంగాలలో వ్యూహాలను ఖరారు చేసి అమలు చేస్తుంది. రాష్ట్ర శాసనసభ సమావేశాలు లేని సమయంలో గవర్నర్ పేరుతో అత్యవసర ఆజ్ఞలను (ఆరినెన్స్లను) జారీ చేస్తుంది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాష్ట్ర గవర్నర్ ఏవైనా మూడు అధికారాలను వివరించండి.
జవాబు:
గవర్నర్ యొక్క అధికారాలు విధులు:
1) కార్యనిర్వాహణాధికారాలు – విధులు: రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలను స్వయంగా సాగించడానికి అవసరమైన నియమ నిబంధనలను గవర్నర్ రూపొందిస్తాడు. అందులో భాగంగా రాష్ట్రప్రభుత్వ విధివిధానాలను సక్రమంగా నిర్వహించి అమలు చేయడానికి అనుకూలంగా రాష్ట్ర స్థాయిలో రాజ్యాంగ ఉన్నత పదవులలో కొన్నింటికి ప్రత్యక్షంగా నియామకాలు జరుపుతాడు. అందులో ముఖ్యమైనవి:

  1. గవర్నర్ ముఖ్యమంత్రిని నియమిస్తాడు. ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రులను నియమిస్తాడు.
  2. మంత్రులకు మంత్రిత్వ శాఖలను కేటాయించడం లేదా మంత్రివర్గ నిర్మాణంలో మార్పులు చేయడం, మంత్రుల శాఖలలో మార్పులు చేయడం వంటి విధులను నిర్వహిస్తాడు.
  3. ముఖ్యమంత్రి సూచనలపై మంత్రులను పదవుల నుండి తొలగిస్తాడు.
  4. రాష్ట్ర విశ్వ విద్యాలయాలకు ఉపకులపతులను నియమించడమే గాక కులపతిగా కూడా వ్యవహరిస్తాడు.
  5. రాష్ట్ర ముఖ్య కార్యదర్శి మరియు అడ్వకేట్ జనరల్ను నియమిస్తాడు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 6 రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ

2) శాసననిర్మాణ అధికారాలు విధులు: గవర్నర్ రాష్ట్ర శాసనసభలో సభ్యుడు కాదు. కాని అందులో ఒక అంతర్భాగంగా 168వ ప్రకరణ వర్ణిస్తుంది. ఆ స్థాయిలో శాసన నిర్మాణశాఖకు సంబంధించిన కొన్ని విధులను, అధికారాలను గవర్నర్ నిర్వహిస్తాడు.

  1. విధానసభ సాధారణ ఎన్నికల తరువాత మొదటి సమావేశాన్ని ఆవిష్కరిస్తాడు.
  2. విధానసభ మొదటి సమావేశానికి (బడ్జెట్ సమావేశం) ప్రారంభ ఉపన్యాసాన్ని చేస్తాడు.
  3. విధానసభకు సాధారణ ఎన్నికల అనంతరం ప్రోటెం స్పీకర్ను నియమించి, స్పీకర్ ఎన్నికకు మార్గం సుగమం చేస్తాడు.
  4. శాసన నిర్మాణశాఖలోని సభా సమావేశాలకు ఆదేశించడం లేదా వాయిదా వేసే అధికారం గవర్నర్కు కలదు.

3) న్యాయాధికారాలు – విధులు:

  1. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో రాష్ట్రపతి కోరినచో సలహా ఇస్తాడు.
  2. రాష్ట్ర అడ్వకేట్ జనరలున్ను నియమిస్తాడు.
  3. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి జిల్లా జడ్జీల నియామకం, పోస్టింగులు, పదోన్నతులు వంటి విషయాలలో అధికారాలను చెలాయిస్తాడు.
  4. రాష్ట్ర హైకోర్టు (జిల్లా జడ్జీలను మినహాయించి) రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సూచనలపై రాష్ట్రంలోని అధీన న్యాయస్థానాల (Sub-ordinate courts) లోని న్యాయ సిబ్బందిని నియమిస్తాడు.
  5. సంబంధిత రాష్ట్ర హైకోర్టు విధించిన శిక్షను తగ్గించడానికి, క్షమాభిక్ష పెట్టడానికి లేదా శిక్షను పూర్తిగా రద్దు చేయడానికి రాష్ట్ర గవర్నర్కు అధికారం ఉంటుంది.

ప్రశ్న 2.
రాష్ట్రపతి – గవర్నర్ పదవుల మధ్యగల వ్యత్యాసాలు ఏవి ?
జవాబు:
రాష్ట్రపతి – గవర్నర్ మధ్య గల వ్యత్యాసాలు:

రాష్ట్రపతి

  1. రాష్ట్రపతి ఎన్నుకోబడే వ్యక్తి.
  2. రాష్ట్రపతి పదవీకాలం సాధారణంగా 5 సం॥లు ఉంటుంది.
  3. రాష్ట్రపతి పదవి నుంచి తొలగించడానికి క్లిష్టమైన మహాభిశంసన తీర్మానం అవసరం.
  4. రాష్ట్రపతికి వివేచనాధికారాలు లేవు.
  5. రాష్ట్రపతికి సైనిక మరియు దౌత్య సంబంధమైన అధికారాలు ఉంటాయి.
  6. రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారం పరిపూర్ణమైనది. మరణశిక్షను కానీ, సైనిక కోర్టులు విధించే శిక్షలను గానీ రద్దుచేసి క్షమించే అధికారం అతడికి ఉంది.
  7. రాష్ట్రపతికి మూడు రకాల అత్యవసర పరిస్థితులు ఉంటాయి.
  8. యూనియన్ పబ్లిక్ కమీషన్ ఛైర్మన్, ఇతర సభ్యులను రాజ్యాంగం నిర్దేశించిన కారణాల ప్రకారం తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది.
  9. ఏ బిల్లునూ మరే ఇతర అధికారుల పరిశీలన కోసం రాష్ట్రపతి నిలుపుదల చేయవలసిన అవసరం లేదు.

గవర్నర్

  1. గవర్నర్ నియమింపబడే వ్యక్తి.
  2. గవర్నర్కు పదవీ కాల భద్రత లేదు. రాష్ట్రపతి సంతృప్తిపైన అతడి పదవీకాలం ఆధారపడి ఉంటుంది.
  3. గవర్నర్ను సులభంగా తొలగించవచ్చు.
  4. గవర్నర్కు వివేచనాధికారాలు ఉంటాయి.
  5. గవర్నర్కు సైనిక మరియు దౌత్య సంబంధమైన అధికారాలు ఉండవు.
  6. గవర్నర్ క్షమాభిక్ష అధికారాలు పరిమితమైనవి. మరణశిక్షను, సైనిక కోర్టులు విధించిన శిక్షను రద్దుచేసే అధికారం అతడికి లేదు.
  7. గవర్నర్కు ఎటువంటి అత్యవసర అధికారాలు ఉంటాయి.
  8. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఛైర్మన్, సభ్యులను తొలగించే అధికారం గవర్నర్కు లేదు.
  9. కొన్ని బిల్లులను, కొన్ని సమయాలలో రాష్ట్రపతి అనుమతి కోసం నిలుపుదల చేసే అధికారం గవర్నర్కు ఉన్నది.

ప్రశ్న 3.
రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నర్ స్థానం, ప్రాముఖ్యతను పేర్కొనండి.
జవాబు:
రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలలో గవర్నర్ స్థానం ఎంతో కీలకమైంది. గవర్నర్ ఒకవైపు తనను నియమించిన రాష్ట్రపతికి బాధ్యత వహిస్తూ, వేరొకవైపు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని రాష్ట్ర మంత్రిమండలి సూచనల ప్రకారం తన అధికారాలను నిర్వహిస్తాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాస్తవ కార్యనిర్వాహక అధిపతులతో అతడు సుహృద్భావ సంబంధాలను కలిగి ఉంటాడు. అలాగే అతడు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వంలోని రాజకీయ, పరిపాలక అధిపతులు కృషి చేసేటట్లు చూస్తాడు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలు రాజ్యాంగబద్ధంగా కొనసాగేటట్లు చూడవలసిన బాధ్యత కూడా గవర్నర్దే. రాజకీయ, పాలనాపరమైన ఒత్తిళ్ళకు లొంగి ఉండక, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సూత్రాలను రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, అధికార సిబ్బంది పాటించేటట్లు చూస్తాడు. క్రియాశీలక రాజకీయాలలో ఆసక్తి చూపించకుండా విస్తృత రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు కృషిచేస్తాడు. అందువల్ల గవర్నర్ గా నియమితులయ్యే వ్యక్తులకు సునిశిత బుద్ధి, లౌకిక దృక్పథం, మానవతా విలువలు, జాతీయ సమైక్యతా స్ఫూర్తి వంటి లక్షణాలు ఉండాలి. అధికార, ప్రతిపక్ష పార్టీల పట్ల సమదృక్పథం చూపించాలి. తన అధికార పరిమితులను, రాజ్యాంగ సంప్రదాయాలను గుర్తించి ప్రవర్తిస్తూ ప్రజల మన్ననలను పొందాలి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 6 రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ

సంకీర్ణ మంత్రివర్గాలు ఏర్పాటవుతున్న ప్రస్తుత తరుణంలో గవర్నర్లస్థానం, వారు నిర్వహించే అధికారాలు, విధులు ఆ పదవిలో ఉన్న వ్యక్తి తీరుకు పరీక్షగా పేర్కొనవచ్చు. నిష్కళంక ప్రవర్తన, నిష్పాక్షికత, రాజ్యాంగ సూత్రాల పట్ల నిబద్ధత, పారదర్శకత వంటి లక్షణాలను గవర్నర్లు కలిగి ఉండాలనీ, సామాన్య ప్రజలు, ముఖ్యంగా బలహీన వర్గాలు, మైనారిటీలకు చెందిన ప్రయోజనాలను పరిరక్షించడానికి వారు కృషి చేయవలసి ఉంటుందనీ పదకొండో రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలాం ఒక సందర్భంలో ఉద్భోదించారు.

2010 మే7న బి.పి. సింఘాల్ వర్సస్ యూనియన్ గవర్నమెంట్ వివాదంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గవర్నర్ స్థానం గురించి చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఆ తీర్పులో గవర్నర్ అంకితభావంతో రాజ్యాంగబద్ధులై పనిచేయాలి. | ఏదైనా రాజకీయ పార్టీకి కాకుండా రాజ్యాంగానికి రక్షకుడిగా ఉండాలి. గవర్నర్ కేంద్రప్రభుత్వ ఏజెంట్ లేదా ఉద్యోగి కాదని పేర్కొంది. గవర్నర్ను చాలా అరుదైన, ప్రత్యేకమైన సందర్భాలలో కేంద్రం తొలగించవలసి ఉంటుందని ఉద్భోదించింది. సర్కారియా కమీషన్ కూడా 1947-1986 మధ్య 154 మంది గవర్నర్ల పదవీ కాలాలను పరిశీలించి వాటిలో 104 మంది పదవీకాలం అసంపూర్తిగా ముగిశాయని పేర్కొంది. 2004లో ఐక్య ప్రగతి కూటమి ప్రభుత్వం ఉత్తరప్రదేశ్, హర్యానా, గుజరాత్, గోవాలో గవర్నర్లను తొలగించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. గతంలో గవర్నర్లుగా వ్యవహరించిన వారిలో సరోజినీనాయుడు (ఉత్తరప్రదేశ్), పద్మజానాయుడు (పశ్చిమబెంగాల్), విజయలక్ష్మి పండిట్ (మహారాష్ట్ర), శంకర్ దయాళ్ శర్మ, కృష్ణకాంత్ వంటి వారు తరువాత ఉపరాష్ట్రపతులుగానూ వ్యవహరించారు.

ప్రశ్న 4.
ముఖ్యమంత్రి అధికారాలు – విధులలో ఏవైనా మూడింటిని తెలపండి. [Mar. ’16]
జవాబు:
ముఖ్యమంత్రి తన అధికారాలను, విధులను నిర్వర్తించుటలో ఎంతో అధికార బాధ్యతతో వ్యవహరిస్తారు. అతడి అధికార బాధ్యతలను ఈ క్రింది శీర్షికల ద్వారా వివరించవచ్చు.
1) మంత్రిమండలి ఏర్పాటు: తన అభీష్టం మేరకు మంత్రిమండలిని ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి మొదటి ప్రధానవిధి. సాధారణంగా మంత్రివర్గ సభ్యుల ఎంపిక, నియామకాలలో ముఖ్యమంత్రికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. తన పార్టీలో లేదా సంకీర్ణ ప్రభుత్వమైతే భాగస్వామ్య పార్టీలలోని కొందరు సభ్యులను ఎంపిక చేసుకొని వారి పేర్లను గవర్నర్కు సిఫారసు చేసి మంత్రులుగా వారు నియమితులయ్యేటట్లు చూస్తాడు. వారికి మంత్రిత్వశాఖల కేటాయింపులో గవర్నరుకు సలహాలిస్తాడు. మంత్రిమండలి పరిమాణం కూడా ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు ఉంటుంది.

2) మంత్రిమండలి నాయకుడు: ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రిమండలి నాయకుడు. ఆ హోదాలో అత్యున్నత, అసామాన్యమైన అధికార స్థానాన్ని ముఖ్యమంత్రి అలంకరిస్తాడు. అతడు రాష్ట్ర కేబినేట్ ఛైర్మన్ గా ఉంటూ, కాబినేట్ సమావేశ చర్చనీయాంశాలు (అజెండా), ప్రదేశం, సమయాలను నిర్ణయిస్తాడు. కేబినేట్ సమావేశాలకు అధ్యక్షత వహించి, అందులో చర్చలు సజావుగా, అర్థవంతంగా జరిగేందుకు మార్గనిర్ధేశం చేస్తాడు. మంత్రిమండలి విధానాలను ప్రభావితం చేస్తాడు. ఏదైనా అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనపుడు ముఖ్యమంత్రి చొరవ చూపి తగు సలహాలు, సూచనల ద్వారా ఏకాభిప్రాయ సాధన దిశ వైపు మంత్రిమండలిని నడిపిస్తాడు.

3) గవర్నర్ – మంత్రిమండలి మధ్య వారధి: ముఖ్యమంత్రి, గవర్నర్ – మంత్రిమండలికి మధ్య ప్రధాన సమాచార మార్గంగానూ, వారధిగా పనిచేస్తాడు. మంత్రిమండలి సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలను గవర్నర్కు తెలియజేయవలసిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంటుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పాలనా నిర్ణయాలు, చేపట్టిన శాసన ప్రతిపాదనల గురించి గవర్నర్కు తెలియజేస్తాడు. మంత్రుల చర్యలకు సంబంధించిన సమాచారం కావాలని గవర్నర్ కోరితే సంబంధిత సమాచారాన్ని గవర్నరుకు పంపుతాడు. ముఖ్యమంత్రి ముందు అనుమతిలేనిదే మంత్రులు ఎవ్వరూ గవర్నర్ను కలిసి సంప్రదించకూడదు.

ప్రశ్న 5.
రాష్ట్ర మంత్రిమండలి నిర్మాణం గురించి తెలపండి.
జవాబు:
సాధారణంగా రాష్ట్ర మంత్రిమండలి అనేది మూడంచెల వ్యవస్థ. అందులో 1) కేబినెట్ హోదా మంత్రులు 2) స్టేట్ హోదా మంత్రులు 3) డిప్యూటీ మంత్రులు ఉంటారు. అరుదైన సందర్భాలలో కొన్ని రాష్ట్రాలలో పార్లమెంటరీ సెక్రటరీలను నియమిస్తాడు. వీరు మంత్రిమండలిలో నాల్గవ శ్రేణిలో ఉంటారు.

1) కేబినెట్ హోదా మంత్రులు: రాష్ట్ర ప్రభుత్వంలోని హోం, ఆర్థిక, ప్రణాళిక, పరిశ్రమలు, గనులు – భూగర్భ వనరులు వంటి ప్రధాన మంత్రిత్వశాఖలకు అధిపతులుగా కేబినెట్ మంత్రులుంటారు. వీరు తమ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన నిర్ణయాలను తీసుకొని అమలు చేయడంలో స్వతంత్రంగా వ్యవహరిస్తారు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 6 రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ

2) స్టేట్ హోదా మంత్రులు: కేబినెట్ మంత్రులతో పోల్చితే తక్కువ ప్రాధాన్యం గల శాఖలకు వీరు ఆధ్వర్యం వహిస్తారు. మంత్రిత్వ శాఖలకు వీరిని అనుసంధానం చేయవచ్చు లేదా స్వతంత్రంగా వ్యవహరించవచ్చు. వీరు నేరుగా ముఖ్యమంత్రికి జవాబుదారులుగా ఉంటారు. వీరిపై కేబినెట్ మంత్రుల అజమాయిషీ ఉండదు.

3) డిప్యూటీ మంత్రులు: డిప్యూటీ మంత్రులను కేబినెట్ మంత్రులకు అనుబంధంగా నియమిస్తారు. వీరు కేబినెట్ మంత్రులు తమకు అప్పగించిన విధులను మాత్రమే నిర్వహిస్తారు. మంత్రిత్వ శాఖకు సంబంధించిన శాసన, పరిపాలనా వ్యవహారాలలో కేబినెట్ మంత్రులకు వీరు సహాయపడతారు. అందుకే వీరిని సహాయ మంత్రులు అని కూడా పిలుస్తారు.