AP Inter 1st Year Chemistry Notes Chapter 5 స్టాయికియోమెట్రీ

Students can go through AP Inter 1st Year Chemistry Notes 5th Lesson స్టాయికియోమెట్రీ will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Chemistry Notes 5th Lesson స్టాయికియోమెట్రీ

→ ద్రవ్యనిత్యత్వ నియమమ : ఒక రసాయనచర్యలో పదార్థాన్ని కొత్తగా ఏర్పరచడం గానీ నాశనం చేయడంగానీ జరగదు.

→ స్థిరానుపాత నియమము: ఒక నిర్ధిష్ట రసాయన సంయోగ పదార్థంలో ‘ఒకే మూలకాలు స్థిర భార నిష్పత్తిలో కలిసివుంటాయి.

→ బహ్యను పాత నియమము : రెండు మూలకాలు రసాయనికంగా కలిసి రెండు లేక అంతకంటే ఎక్కువ సంయోగ పదార్థాల నేర్పరిస్తే అప్పుడు ఆ సంయోగ పదార్థాల్లో స్థిరభారం గల ఒక మూలకంతో కలిసే రెండో మూలకం భారాలు ఆ సంయోగ పదార్థాల్లో ఒక సరళాంక నిష్పత్తిలో వుంటాయి.

→ గేలుసాక్ నియమము : సమాన ఉష్ణోగ్రతా, పీడనాల్లో వాయువులు రసాయనికంగా కలిస్తే వాటి ఘనపరిమాణాలు ఒక సరళాంక నిష్పత్తిని కలిగివుంటాయి.

→ అవగాడ్రో నియమము: సమాన మనపరిమాణాలు గల అన్ని వాయువులకు ఇచ్చిన ఉష్ణోగ్రత, పీడనాల్లో సమాన సంఖ్యలో పరమాణువులు ఉంటాయి.

→ మోలార్ ఘనపరిమాణం : ప్రమాణ ఉష్ణోగ్రతా పీడనాల వద్ద (273k & 1 అట్మా) 1 గ్రామ్ అణుభారం వాయుపదార్థం 22.414 లీటర్ ల ఘనపరిమాణాన్ని ఆక్రమించుకుంటుంది. ఈ ఘనపరిమాణాన్ని మోలార్ ఘనపరిమాణం అంటారు.

AP Inter 1st Year Chemistry Notes Chapter 5 స్టాయికియోమెట్రీ

→ మోల్ : ఒక పదార్థం గనుక దానిలోని కణాలు, పరమాణువులు, అణువులు లేదా అయాన్లు 12 గ్రాముల 12C లో ఎన్ని పరమాణువులుంటాయో దానికి సమాన సంఖ్యలో కలిగి వున్నట్లయితే ఆ పదార్థాన్ని ఒక మోల్ పదార్థం అంటారు.

→ ఒక సమ్మేళనం అణువులో ఘటక మూలకాల పరమాణు సంఖ్యల సాపేక్ష నిష్పత్తిని తెలిపే అతిసూక్ష్మమైన, సరళమైన ఫార్ములాను అనుభావిక ఫార్ములా అంటారు.

→ ఒక సమ్మేళనం అణువులో ఉన్న మూలక పరమాణువుల యధార్థ సంఖ్యను వ్యక్తపరిచే ఫార్ములాను ఆ పదార్థం అణుఫార్ములా అంటారు.

→ రిడాక్స్ చర్యల్లో రకాలు : రసాయన సంయోగ చర్యలు, రసాయన వియోగ చర్యలు, స్థానభ్రంశ చర్యలు, అనుపాత చర్యలు, సహాను పాత చర్యలు.

→ సార్థక అంకెలు : ప్రాయోగికంగా (లేదా) సిద్ధాంతరీత్యా రాబట్టిన విలువలలో అనిశ్చితత్వం ఉంటుంది. దానిని సార్థక అంకెలలో సూచిస్తారు. కచ్ఛితంగా తెలిసిన అర్థవంతమైన అంకెలను సార్థక అంకెలు అంటారు.

→ జాన్ డాల్టన్ (1776-1884)
జాన్ డాల్టన్ ఇంగ్లీషు రసాయన శాస్త్ర వేత్త. 1803లో బాహ్యానుపాతం నియమం ప్రతిపాదించాడు.

AP Inter 1st Year Chemistry Notes Chapter 4 పదార్ధం స్థితులు : వాయువులు, ద్రవాలు

Students can go through AP Inter 1st Year Chemistry Notes 4th Lesson పదార్ధం స్థితులు : వాయువులు, ద్రవాలు will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Chemistry Notes 4th Lesson పదార్ధం స్థితులు : వాయువులు, ద్రవాలు

→ అయాన్ – ద్విధృవ బలాలు, ద్విధృవ – ద్విధృవ ఆకర్షణలు, లండన్ విక్షేపక బలాలు, ద్విధృవ ప్రేరిత ద్విధృవ బలాలు మొ॥ అంతరణు బలాలు.

→ గ్రాహమ్ వాయు నియమము:
“ఇచ్చిన పీడనం, ఉష్ణోగ్రతల వద్ద ఒక వాయువు నిస్సరణ వేగం ఆ వాయువు సాంద్రత వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుంది.
r ∝ \(\frac{1}{\sqrt{d}}\)

→ డాల్టన్ పాక్షిక పీడనాల నియమం :
ఇచ్చిన ఘనపరిమాణం గల ఒక పాత్రలో ఆదర్శ వాయువుల మిశ్రమం కలుగజేసే పీడనం, ఆ మిశ్రమంలోని వాయువులు ఒక్కొక్కటి అదే పాత్రలో అదే ఉష్ణోగ్రత వద్ద తీసుకొన్నప్పుడు కలుగజేసే విడివిడి పీడనాల విలువల మొత్తానికి సమానం.
Pమిశ్రమం = P1 + P2 + P3 + ……….

→ అవగాడ్రో నియమం :
సమాన ఘనపరిమాణాలు గల వాయువులన్నీ సమాన ఉష్ణోగ్రత, పీడనాల వద్ద సమాన సంఖ్యలో అణువులు (లేదా) మోల్లు కలిగి ఉంటాయి.

→ బాయిల్ నియమం :
స్థిర ఉష్ణోగ్రత వద్ద నియమిత ద్రవ్యరాశి ఉన్న ఒక వాయువు ఘనపరిమాణం దాని పీడనానికి విలోమాను పాతంలో ఉంటుంది.

→ చార్లెస్ నియమం :
ఇచ్చిన ఘనపరిమాణం, ద్రవ్యరాశి గల ఒక వాయువు పీడనం దాని కెల్విన్ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది.

AP Inter 1st Year Chemistry Notes Chapter 4 పదార్ధం స్థితులు : వాయువులు, ద్రవాలు

→ అణుచలన సిద్ధాంత ప్రతిపాదనలను తు.చ. తప్పకుండా పాటించే వాయువులను ఆదర్శ వాయువులంటారు.

→ అణుచలన సిద్ధాంతం ప్రతిపాదికగా ఉత్పాదించిన సమీకరణాన్ని చలద్వాయు సమీకరణం అంటారు. అది
PV = \(\frac{1}{3}\)mnu2

→ ఒక వాయువులోని వివిధ అణువుల వేగ వర్గాల సగటు వర్గమూలాన్ని RMS వేగం అంటారు.

→ ఒక వాయువులో మొత్తం అణువులలో ఎక్కువ అణువులకు ఏ వేగం ఉంటుందో ఆ వేగాన్ని గరిష్ఠ సంభావ్యతా వేగం (Ump) అంటారు.

→ ఒక వాయువులో అన్ని అణువుల వేగాల సగటు విలువను సగటు వేగం (uav) అంటారు.

→ వివిధ ఉష్ణోగ్రతల వద్ద వాయువు యొక్క P – V వక్రాలను సమ ఉష్ణోగ్రత వక్రాలు అందురు.

→ సంపీడన గుణకం (Z)
AP Inter 1st Year Chemistry Notes Chapter 4 పదార్ధం స్థితులు వాయువులు, ద్రవాలు 1

→ ఆదర్శ వాయువుకు Z = 1

→ (P + \(\frac{a^2}{V^2}\))(V – nb) = nRT ను వాండర్ వాల్ స్థితి సమీకరణం అంటారు.

→ సందిగ్ధ పీడనం (Pc), సందిగ్ధ ఉష్ణోగ్రత (Tc) మరియు సందిగ్ధ ఘనపరిమాణం (Vc) లను సందిగ్ధ స్థిరాంకాలు

→ ఏ ఉష్ణోగ్రత వద్ద బాష్పపీడనం బాహ్య పీడనానికి సమం అవుతుందో ఆ ఉష్ణోగ్రతను ఆ పీడనం వద్ద ద్రవం బాష్పీభవన స్థానమంటారు.

AP Inter 1st Year Chemistry Notes Chapter 4 పదార్ధం స్థితులు : వాయువులు, ద్రవాలు

→ స్నిగ్ధత అనేది ద్రవం ప్రవహించడానికి వీలుకాకుండా వ్యతిరేకించే బలం. ‘n’ అనేది స్నిగ్ధతా గుణకం.

→ లూయీ డీబోలీ (1892-1987)
లూయీ డీబ్రోలీ ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త. ఎలక్ట్రాన్కు తరంగ స్వభావం ఉందని కనుక్కొన్నందుకు 1929లో నోబెల్ బహువతి లభించింది.

AP Inter 1st Year Chemistry Notes Chapter 3 రసాయన బంధం – అణు నిర్మాణం 

Students can go through AP Inter 1st Year Chemistry Notes 3rd Lesson రసాయన బంధం – అణు నిర్మాణం will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Chemistry Notes 3rd Lesson రసాయన బంధం – అణు నిర్మాణం

→ శక్తిపరంగానూ, ఎలక్ట్రాన్ విన్యాసపరంగానూ స్థిరత్వాన్ని పొందుటకు పరమాణువులు సంయోగం చెంది అణువులను ఇస్తాయి.

→ వేలన్సీ ఎలక్ట్రాన్లు మాత్రమే బంధంలో పాల్గొంటాయి.

→ ns2 np6 విన్యాసం కలిగి ఉన్న పరమాణువులు లేక అయాన్లు మిగిలిన వాని కన్నా ఎక్కువ స్థిరమైనవి.

→ రసాయన బంధం మూడు రకాలు. అవి

  • అయానిక బంధం
  • సమయోజనీయ బంధం
  • సమన్వయ సమయోజనీయ

→ విరుద్ధ విద్యుదావేశాలు గల అయాన్ల మధ్య ఉండే స్థిర విద్యుదాకర్షణ బలాలనే అయానిక బంధం అంటారు.

→ అనంత దూరంలో, వాయుస్థితిలో గల విరుద్ధ ఆవేశం గల అయాన్లు ఒకదానినొకటి ఆకర్షించుకొని ఒక మోల్ అయానిక స్ఫటికం ఏర్పడేటపుడు విడుదలయ్యే శక్తిని జాలకశక్తి లేక లాటిస్ శక్తి అంటారు.

→ అయానిక స్ఫటికంలో ఒక అయాన్ చుట్టూ అతి సన్నిహితంగా సమాన దూరాలలో ఉన్న విరుద్ధ ఆవేశం గల అయాన్ల సంఖ్యనే దాని సమన్వయ సంఖ్య అంటారు.

→ NaCl స్ఫటికం – ఫలక కేంద్రిత ఘనం – దాని సమన్వయ సంఖ్య 6. CsCl స్ఫటికం – అంతఃకేంద్రిత ఘనం – దాని సమన్వయ సంఖ్య 8.

AP Inter 1st Year Chemistry Notes Chapter 3 రసాయన బంధం - అణు నిర్మాణం

→ పరమాణువులు ఎలక్ట్రాన్ జంటలను పంచుకొనుట వలన సమయోజనీయ బంధం ఏర్పడుతుంది.

→ వ్యతిరేక స్పిన్లు గల ఒంటరి ఎలక్ట్రాన్లున్న ఆర్బిటాళ్ళు అతిపాతం చెందుట వలన సమయోజనీయ బంధం ఏర్పడుతుంది.

→ రేఖీయ అతిపాతం వలన 6 – బంధం, ప్రక్కవాటు అతిపాతం వలన T బంధం ఏర్పడతాయి.

→ దాదాపు సమాన శక్తి గల ఆర్బిటాళ్ళు కలిసిపోయి తిరిగి అదే సంఖ్యలో సర్వసమానాలైన క్రొత్త ఆర్బిటాళ్ళు ఏర్పడుటను సంకరీకరణం అంటారు.

→ సాధారణంగా sp, sp, sp3, spld, sp’d’ సంకరీకరణాలు జరుగుతాయి.

→ అణువు రెండు చివరలయందు రెండు రకాల ఆవేశాలు గల దానిని ద్విధ్రువం అంటారు.

→ ఒక అణువు నందలి అధిక ఋణవిద్యుదాత్మకత గల పరమాణువుకి బంధితమైన హైడ్రోజన్ పరమాణువుకు అదే అణువులోని లేక మరొక అణువు నందలి అధిక ఋణవిద్యుదాత్మక పరమాణువు (F, O లేదా N) నకు గల బలహీనమైన ఆకర్షణ బలాన్ని హైడ్రోజన్ బంధం అంటారు.

→ అణువులో బంధిత కేంద్రకాల చుట్టూ ఎలక్ట్రాన్లను కనుగొనే సంభావ్యత అధికంగా ఉన్న ప్రాంతాన్ని అణు ఆర్బిటాల్ అంటారు. అణు తరంగ అణుప్రమేయంను అణు ఆర్బిటాల్ అంటారు.

→ ఆక్సిజన్ (లేదా) దానికంటే భారమూలకాల విషయంలో అణు ఆర్బిటాల్ల శక్తిస్థాయిల వరసక్రమము
AP Inter 1st Year Chemistry Notes Chapter 3 రసాయన బంధం - అణు నిర్మాణం 1

→ బంధక్రమము (Bond order)
AP Inter 1st Year Chemistry Notes Chapter 3 రసాయన బంధం - అణు నిర్మాణం 2

→ అణు ఆర్బిటాల్ సిద్ధాంతం ద్వారా ఆక్సిజన్ అణువుకు పారాయస్కాంత స్వభావముంటుందని ఋజువు చేయబడినది.

→ పదార్థాలు వాయువులు, ద్రవాలు, ఘనపదార్థాలు అనే మూడు స్థితులలో ఉంటాయి.

AP Inter 1st Year Chemistry Notes Chapter 3 రసాయన బంధం - అణు నిర్మాణం

→ ద్విధృవ భ్రామకం (µ) = ఆవేశం (Q) × రెండు ధృవాల మధ్య దూరం (r)

→ పీటర్ డిజై:
పీటర్ డిబై డచ్ దేశస్తుడు. X- కిరణాల వివర్తన, ద్విదువభ్రామక పరిశోధ నలకు 1936లో నోబుల్ బహుమతి లభించింది. ఆయన జ్ఞాపకార్థం ద్విధ్రువ భ్రామక పరిమాణ ప్రమాణానికి డిబైగా నిర్ణయించారు.

AP Inter 1st Year Chemistry Notes Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు 

Students can go through AP Inter 1st Year Chemistry Notes 2nd Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Chemistry Notes 2nd Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు

→ “మూలకాలు, వాటి సమ్మేళనాల ధర్మాలు వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు” – మెండలీఫ్ ఆవర్తన నియమము.

→ EKaAl – గాలియమ్, EKa Si – జెర్మేనియం,
Eka B – స్కాండియమ్.

→ Ar – k, Co – Ni. Te – I. Th – Pa లను అసంగత జంటలు అంటారు.

→ √υ = a(Z – b) మోస్లే సమీకరణము.
మూలకానికి విలక్షణమయిన ధర్మం పరమాణు సంఖ్య అనీ పరమాణు భారం కాదనీ మోస్లే నిరూపించాడు.

→ “మూలకాల భౌతిక, రసాయన ధర్మాలు వాటి పరమాణు సంఖ్యల ఆవర్తన ప్రమేయాలు” – ఆధునిక ఆవర్తన నియమము.

→ మూలకాల భౌతిక, రసాయనిక ధర్మాలు వాటి పరమాణు సంఖ్యల ఆవర్తన ప్రమేయాలు (లేక) ఎలక్ట్రాన్ విన్యాసం యొక్క ఆవర్తన ప్రమేయాలు.

→ ఆధునిక ఆవర్తన పట్టికలో 7 పీరియడ్లు మరియు 18 గ్రూపులు ఉన్నాయి. దీనిలో s, p, d, f అనే 4 బ్లాకులు ఉంటాయి. ఎలక్ట్రాన్ విన్యాసపరంగా మూలకాలను 4 రకాలుగా విభజన చేశారు. అవి (a) జడవాయువులు, (b) ప్రాతినిధ్య మూలకాలు, (c) పరివర్తన మూలకాలు, (d) అంతర పరివర్తన మూలకాలు.

→ పరమాణు కేంద్రకం మధ్యభాగం నుండి దాని చివరి కర్పరం వరకు గల దూరాన్ని పరమాణు వ్యాసార్థం అంటారు.

→ సమయోజనీయ బంధం ద్వారా బంధించబడిన పరమాణువుల కేంద్రకాల మధ్య గల సమతాస్థితి దూరంలో సగాన్ని సమయోజనీయ వ్యాసార్థం అంటారు.

→ వాండర్ వాల్ ఆకర్షణ బలాలచే బంధితమై ఉన్న రెండు ఒకేవిధమైన పరమాణువుల కేంద్రకాల మధ్య గల సమతాస్థితి దూరంలోని సగభాగాన్ని ‘వాండర్వాల్’ వ్యాసార్థం అంటారు.

AP Inter 1st Year Chemistry Notes Chapter 2 మూలకాల వర్గీకరణ - ఆవర్తన ధర్మాలు 

→ అయాన్ కేంద్రకం మధ్యభాగం నుండి దాని చివరి కర్పరం వరకు గల దూరాన్ని అయానిక వ్యాసార్థం అంటారు.

→ లాంథనైడ్ మూలకాల పరమాణువుల మరియు అయాన్ల పరిమాణంలోని క్రమబద్ధమైన తగ్గుదలను లాంథనైడ్ సంకోచం అంటారు.

→ సంయోగస్థితిలో ఉన్న అణువులోని పరమాణువుల మీది దృశ్య ఆవేశాన్ని ఆక్సిడేషన్ సంఖ్య అంటారు.

→ వాయుస్థితిలోని ఒంటరి తటస్థ పరమాణువు యొక్క బాహ్య కర్పరంలోని ఒక ఎలక్ట్రాను తీసివేయుటకు కావలసిన శక్తిని అయనీకరణ శక్తి (ప్రథమ అయనీకరణ శక్తి) అంటారు.

→ అంతర కర్పరాలలోని ఎలక్ట్రాన్లు బాహ్య కర్పరాలలోని ఎలక్ట్రాన్లను కేంద్రక ఆకర్షణ నుండి రక్షించే ప్రభావాన్ని పరిరక్షక ప్రభావం అంటారు.

→ వాయుస్థితిలో ఉన్న ఒంటరి తటస్థ పరమాణువుకు ఒక ఎలక్ట్రానన్ను చేర్చినపుడు విడుదలయ్యే శక్తిని ఎలక్ట్రాన్ ఎఫినిటి అంటారు.

→ సమయోజనీయ బంధంతో బంధితమై ఉన్న రెండు పరమాణువులలో, ఒక పరమాణువు బంధజంట ఎలక్ట్రాన్ల ను తన వైపుకు ఆకర్షించుకునే స్వభావాన్ని ఋణవిద్యుదాత్మకత అంటారు.

→ కర్ణ సంబంధం : “ఆవర్తన పట్టికలో రెండవ పీరియడ్లోని ఒక మూలకానికి మూడవ పీరియడ్లోని తరవాత గ్రూపు రెండో మూలకానికి సారూప్య ధర్మాలుంటాయి. ఈ సంబంధాన్ని కర్ణ సంబంధం అంటారు.”
ఉదా : (Li, Mg); (Be, Al); (B, Si)

→ ధృవణ సామర్థ్యం : అయానిక ఆవేశం / (అయానిక వ్యాసార్థం)2

AP Inter 1st Year Chemistry Notes Chapter 2 మూలకాల వర్గీకరణ - ఆవర్తన ధర్మాలు 

→ “f- ఎలక్ట్రాన్ల ల దుర్భల పరిరక్షక ప్రభావం వలన ఆక్టినైడ్ మూలకాలలో పరిమాణం తగ్గడాన్ని ఆక్టినైడ్ సంకోచం అంటారు.”

→ డిమి ఇవనోవిచ్ మెండలీవ్ (1834-1907):
డిమి మెండలీవ్ రష్యాలోని సైబేరియాలో ఉన్న టొబాస్క్ లో జన్మించాడు. 1867లో సాధారణ రసాయనశాస్త్ర ప్రొఫెసర్గా నియమితుడై రసాయనశాస్త్ర నియమం మూలకాల ఆవర్తన పట్టిక నిర్మాణానికి దోహదం చేసింది.

AP Inter 1st Year Chemistry Notes Chapter 1 పరమాణు నిర్మాణం

Students can go through AP Inter 1st Year Chemistry Notes 1st Lesson పరమాణు నిర్మాణం will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Chemistry Notes 1st Lesson పరమాణు నిర్మాణం

→ కాథోడ్ కిరణాలలో ఋణవిద్యుదాత్మక కణాలుంటాయి. వీటినే ఎలక్ట్రాన్లు అంటారు.

→ ఎలక్ట్రాన్ ఆవేశానికి ద్రవ్యరాశికి గల నిష్పత్తి (e/m) విలువ 1.75 88 × 1011 e kg-1.

→ మార్పు చేసిన కాథోడ్ కిరణ నాళికలో ధారగా పోయే ధనావేశ కణాలను కెనాల్ కిరణాలు (లేదా) ప్రోటాన్లు అంటారు.

→ రూథర్ ఫర్డ్ పరమాణు నమూనా సౌరకుటుంబాన్ని పోలి ఉంటుంది. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు గుండ్రంగా తిరుగు తుంటాయి. ఎలక్ట్రాన్లు తిరిగే మార్గాలను కక్ష్యలు అంటారు.

→ రూథర్ ఫర్డ్ నమూనా పరమాణువులో ఎలక్ట్రాన్ నిర్మాణాన్ని విశదీకరించలేదు.

→ విద్యుదయస్కాంత వికిరణం : అయస్కాంత క్షేత్రం మరియు విద్యుత్ క్షేత్రాలు పరస్పరం అంబ దిశలో కలిగి ఉన్న వికిరణాలను విద్యుదయస్కాంత వికిరణాలు అంటారు. అట్టి తరంగాన్ని విద్యుదయస్కాంత తరంగం అంటారు.

→ విద్యుదయస్కాంత వర్ణపటం : తరంగ దైర్ఘ్య క్రమంలో అమర్చబడిన విద్యుదయస్కాంత తరంగాలను విద్యుదయస్కాంత వర్ణపటం అంటారు.

→ తనపై పడ్డ శక్తిని పూర్తిగా శోషించుకొని, మరలా మొత్తాన్ని ఉద్గారం చేసే వస్తువును కృష్ణవస్తువు లేక నల్లని వస్తువు అంటారు.

→ ప్లాంక్ భావన ప్రకారం, శక్తి ఉద్గారం విచ్ఛిన్నంగా ‘క్వాంటం’ అని పిలువబడే చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో జరుగుతుంది.

→ ఐన్స్టీన్ భావన ప్రకారం, శక్తి ఉద్గారం ఫోటాన్ల రూపంలో జరుగుతుంది. ఈ ఫోటానన్ను ఆయన తరంగ కణంగా భావన చేశాడు.

AP Inter 1st Year Chemistry Notes Chapter 1 పరమాణు నిర్మాణం

→ దగ్గరదగ్గరగా ఉన్న రేఖలను కలిగి ఉన్న వర్ణపటాన్ని పట్టీ వర్ణపటం అంటారు. ఇది అణువుల అభిలాక్షణిక ధర్మం.

→ సునిశితమైన, విడివిడిగా ఉండే రేఖలను కలిగి ఉండే వర్ణపటాన్ని రేఖావర్ణపటం అంటారు. ఇది పరమాణువుల అభిలాక్షణిక ధర్మం.

→ శక్తిని ఉద్గారం చేసుకొనడం వలన ఏర్పడే వర్ణపటాన్ని ఉద్గార వర్ణపటం అంటారు. దీనిలో నల్లని పట్టీపై తెల్లని గీతలు ఏర్పడతాయి.

→ శక్తిని శోషణం చేసుకొనడం వలన ఏర్పడే వర్ణపటాన్ని శోషణ వర్ణపటం అంటారు. దీనిలో తెల్లని పట్టీపై నల్లని గీతలు ఏర్పడతాయి.

→ హైడ్రోజన్ యొక్క ఉద్గార వర్ణపటంలో లైమన్, బామర్, పాషన్, బ్రాకెట్ మరియు ఫండ్ శ్రేణులుంటాయి.

→ బోర్ నమూనా ప్రకారం ఎలక్ట్రాన్లు నిర్ణీతమైన శక్తి విలువలు కలిగిన స్థిర కర్పరాలు అనబడే వృత్తాకార మార్గాలలో తిరుగుతూ ఉంటాయి.

→ బలమైన అయస్కాంత క్షేత్రంలో పరమాణు వర్ణపటంలోని ప్రతి ఒక్క గీత మరలా చిన్నచిన్న గీతలుగా విభజింపబడటాన్ని జీమన్ ఫలితం అంటారు.

→ బలమైన విద్యుత్ క్షేత్రంలో పరమాణు వర్ణపటంలోని ప్రతిఒక్క గీత మరలా చిన్నచిన్న గీతలుగా విభజింపబడటాన్ని స్టార్క్ ఫలితం అంటారు.

→ సోమర్ఫెల్డ్ నమూనా ప్రకారం ఎలక్ట్రాన్ వృత్తాకార మార్గాలలోనే కాకుండా, దీర్గ వృత్తాకార మార్గాలలో కూడా తిరుగుతాయి.

→ ప్రధాన క్వాంటం సంఖ్య పరమాణువు యొక్క సైజును మరియు కర్పరం శక్తిని తెలియచేస్తుంది.

→ ఎజిమ్యుథల్ క్వాంటం సంఖ్య, ఆర్బిటాల్ యొక్క ఆకృతిని సూచిస్తుంది. అయస్కాంత క్వాంటం సంఖ్యఆర్బిటాళ్ళ ప్రాదేశిక విన్యాసాన్ని సూచిస్తుంది. స్పిన్ క్వాంటం సంఖ్య ఎలక్ట్రాన్ యొక్క భ్రమణ దిశను తెలియచేస్తుంది.

→ డీబ్రౌలీ ఎలక్ట్రాన్కు తరంగస్వభావం ఉంటుందని ప్రతిపాదించాడు.

→ పరమాణువులో ఎలక్ట్రాన్ యొక్క వేగాన్ని మరియు స్థానాన్ని ఒకేసారి ఖచ్చితంగా నిర్ణయించి చెప్పలేము. దీనినే హైసన్బర్గ్ అనిశ్చితత్వ నియమం అంటారు.

→ Ψ ను తరంగ ప్రమేయం అనీ, Ψ2 ను సంభావ్యతా ప్రమేయం అని అంటారు.

→ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రానన్ను కనుగొనే సంభావ్యత గరిష్ఠంగా గల ప్రదేశాన్ని ఆర్బిటాల్ అంటారు.

→ సమానశక్తి గల ఆర్బిటాళ్ళను సమశక్తి ఆర్బిటాళ్ళు (డీజనరేట్ ఆర్బిటాళ్ళు) అంటారు.

AP Inter 1st Year Chemistry Notes Chapter 1 పరమాణు నిర్మాణం

→ ఆర్బిటాల్ గోళాకారంలోను, P – ఆర్బిటాల్ ముద్గరాకృతిలోను, d – ఆర్బిటాల్ ద్విముద్దరాకృతిలోను ఉంటాయి.

→ నీల్స్ బోర్ (1885-1962)
నీలో బోర్ డెన్మార్డ్ భౌతిక శాస్త్రవేత్త. – 1911లో కోపెన్ హాగన్ విశ్వ విద్యాలయం నుంచి పిహెచ్.డి. పొందాడు. 1922 భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.

AP Inter 1st Year Botany Notes Chapter 3 మొక్కల విజ్ఞానం – వృక్షశాస్త్రం

Students can go through AP Inter 1st Year Botany Notes 3rd Lesson మొక్కల విజ్ఞానం – వృక్షశాస్త్రం will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Botany Notes 3rd Lesson మొక్కల విజ్ఞానం – వృక్షశాస్త్రం

→ జీవులను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘జీవశాస్త్రం’ అంటారు.

→ ‘బోటనీ’ అనుపదము ‘బోస్కిన్’ అను గ్రీకుపదం నుంచి ఏర్పడి, బోటేన్ అను పదముగా మారి, ‘బోటనీ’గా వాడుకలో ఉన్నది.

→ క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాలనాటికే ఈజిప్టు దేశస్థులు, ఆస్సీరియన్లు పైరు మొక్కల, ఫలవృక్షాల గురించిన సమాచారాన్ని చిత్రాల రూపంలో హీరోగ్లిఫిక్స్ (Heiroglyphics) నమోదుచేసారు.

→ క్రీ. పూ. 1300 సం॥ కాలంలో పరాశరుడు ‘కృషిపరాశరం’ అను గ్రంథంను రచించారు. ఇది వ్యవసాయానికి సంబంధించిన అతి ప్రాచీన గ్రంథము. దీనిలో వ్యవసాయం మరియు కలుపుమొక్కల గురించి వివరించారు.

→ ఆయన ‘వృక్షాయుర్వేదం’ అను గ్రంధంలో వివిధ రకాల అడవులు మొక్కల బాహ్య లక్షణాలు, అంతర లక్షణాలు, ఔషదమొక్కలను గురించి వివరించారు.

→ థియోఫ్రాస్టస్ (340 B.C) రచించిన “డీ హిస్టోరియా ప్లాంటారమ్ అను గ్రంథంలో 500 రకాల మొక్కల బాహ్య, అంతర లక్షణాలు వివరించారు. ఆయనను వృక్షశాస్త్ర పితగా భావిస్తారు.

→ గాస్పర్డ్ బాహిన్ (1623) 6000 మొక్కలకు సంబంధించిన వర్ణన, గుర్తింపు లక్షణాలను ప్రచురించి, మొట్టమొదట ద్వినామనామీకరణ విధానాన్ని ప్రవేశపెట్టారు.

AP Inter 1st Year Botany Notes Chapter 3 మొక్కల విజ్ఞానం - వృక్షశాస్త్రం

→ రాబర్ట్ హుక్ కణంను కనుక్కోవడం, 1665లో మైక్రోగ్రాఫియా అను గ్రంధంను ప్రచురించారు.

→ కామేరేరియస్ (1694) మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తిని వర్ణించారు.

→ కెరోలస్ వాన్ లిన్నెయస్ ద్వినామనామీకరణ విధానాన్ని వాడుకలోనికి తేవడమే కాకుండా లైంగిక వర్గీకరణ వ్యవస్థను ప్రతిపాదించారు.

→ గ్రెగర్ జోహన్ మెండల్, అనువంశిక సూత్రాలను ప్రవేశపెట్టారు. కావున ఆయనను జన్యుశాస్త్రపిత అంటారు.

→ చార్లెస్ డార్విన్ జీవపరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.

→ బుక్నర్ (1898) ఈస్ట్ కణాలలో ‘జైమేజ్’ అను ఎంజైంను కనుగొన్నారు.

→ హ్యూగోడీవీస్ (1901) మొక్కలలో ఉత్పరివర్తనలను, సట్టన్ మరియు బవెరిలు (1902) అనువంశికతలో క్రోమోసోమ్ల పాత్రను కనుగొన్నారు.

→ DNA ద్విసర్పిల నమూనాను వాట్సన్ మరియు క్రిక్ లు, RNA జనుతత్వంను ఫ్రాంకిల్ మరియు కోన్రాట్లు, కృత్రిమజన్యుసంశ్లేషణను హరగోవింద్ ఖొరానా, కణజాలవర్ధనం ప్రయోగాలను హన్నింగ్, షిమకురా, స్కూగ్, వైట్లు కనుగొన్నారు.

→ FW. వెంట్ అనువారు ఆక్సిన్లను (1928) కనుగొన్నారు.

→ C3 – కరనస్వాంగీకరణ పథకాన్ని మాల్విన్ కెల్విన్, బెన్సన్, భాషమ్లు కనుగొన్నారు.

→ TCA వలయమును హన్స్ క్రెబ్స్ (1937) కనుగొన్నారు.

→ C3 – పథంను హోబ్ – స్లాక్ అనువారు కనుగొన్నారు.

→ మొక్కల పోషణలో మూలకాలపాత్ర తెలియుటవల్ల, రసాయన ఎరువులు ఉపయోగించి, మౌలిక లోపాలను అధిగమించి అధిక దిగుబడులు సాధించవచ్చు. (వృక్ష శరీర ధర్మశాస్త్రం)

→ వృక్ష వ్యాధి శాస్త్రంలో పరిశోధనలవల్ల మొక్కలలో వచ్చే అనేక వ్యాధులను నివారించడం, నిర్మూలించడానికి ఉపయోగపడతాయి.

→ పర్యావరణ సంబంధ సమస్యలు అయిన హరితగృహ ప్రభావాన్ని విరివిగా మొక్కలు నాటడంవల్ల నియంత్రించడం, బయోరెమిడియేషన్ ద్వారా మృత్తికా కాలుష్యాన్ని తగ్గించడం, పూతికాహారుల ద్వారా పోషక పదార్థాల పునశ్చక్రీయం సాధ్యపడుతుంది.

→ మొక్కలలోని వివిధ భాగాల అధ్యయనము, వర్ణనకు సంబంధించిన శాస్త్రంను స్వరూపశాస్త్రం అంటారు.

→ స్త్రీ, పురుష సంయోగ భీజదాలు ఏర్పడుట, సంయోగ భీజాల ఉత్పత్తి, ఫలదీకరణ విధానం, పిండం, అంకురచ్చదం, విత్తనాలు, ఏర్పడుటను గురించి చదివే శాస్త్రంను పిండోత్పత్తి శాస్త్రం అంటారు.

AP Inter 1st Year Botany Notes Chapter 3 మొక్కల విజ్ఞానం - వృక్షశాస్త్రం

→ పరాగ రేణువుల ఉత్పత్తి, నిర్మాణంలాంటి అంశాల గురించిన అద్యయనంను పేలినాలజీ అంటారు.

→ మొక్కల శిలాజాల గురించి అద్యయనం చేయుటను పురాజీవ శాస్త్రం అంటారు.

→ గత, ప్రస్తుత కాలాల్లో, భూమండలంలోని వివిధ ప్రాంతాలలో మొక్కల వితరణ గురించి అధ్యయనంను వృక్ష భౌగోళికశాస్త్రం అంటారు.

→ ఒక శైవలం, ఒక శిలీంధ్రం పరస్పరం ఆధారపడుతూ సహజీవనం గడిపే ప్రత్యేకవర్గం మొక్కల అధ్యయనంను లైకెనాలజి అంటారు.

→ జున్నుగడ్డి (Agar-agar) : ఇది ఎరుపురంగు శైవలాల నుంచి నిష్కర్షించబడే జడ పాలిశాఖరైడ్. పాక్షిక ఘనీభవన యానకాలలో ఇది ఒక భాగం.

→ పానీయాలు : ఇవి ఉల్లాసం కోసం ఆల్కహాల్ ఉన్న లేదా ఆల్కహాల్ లేని తాగే పదార్థాలు.

→ జీవ ఎరువులు : ఇవి మొక్కల పెరుగుదలకు అవసరమైన పోషకాలను సరఫరా చేసే జీవ సంబంధ పదార్థాలు.

→ హెర్బల్స్ : ఇవి ఔషధ మొక్కల గురించిన వర్ణన ఉన్న పుస్తకాలు.

→ పేలినాలజీ : పరాగ రేణువుల ఉత్పత్తి, నిర్మాణము వంటి అంశాలను గురించి చదివే శాస్త్రము.

→ వృక్షకణజాల, అంగవర్ధనం : ఇది కృత్రిమ పోషకయానకం మీద, కణాలను కణజాలాలను, అంగాలను పెంచే ప్రక్రియ.

→ వృక్షవ్యాధి శాస్త్రము : మొక్కలలోని వ్యాధి కారకాలు, లక్షణాలు, నియంత్రణ చర్యలను గురించి చదివే శాస్త్రము.

→ ఏకకణ ప్రోటీన్లు : ఆహారంలోని ప్రోటీన్ల మూలం కోసంవాడే ఒకేజాతికి చెందిన సూక్ష్మజీవుల శుష్క జీవ ద్రవ్యరాశి.

→ సుగంధ ద్రవ్యాలు, కాండిమెంట్లు : వివిధ రకాలైన ఆహార పదార్థాలకు రుచికరమైన వాసనల కోసం వాడేవి, జీర్ణరసాల ఉత్పత్తిని పెంచేవి సుగంధ ద్రవ్యాలు. కాండిమెంట్లు ఆహారం వండిన తరువాత ఆహారానికి చేర్చే సుగంధ ద్రవ్యాలు.

AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 8 అవకలన సమీకరణాలు Ex 8(a)

Practicing the Intermediate 2nd Year Maths 2B Textbook Solutions Chapter 8 అవకలన సమీకరణాలు Exercise 8(a) will help students to clear their doubts quickly.

AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 8 అవకలన సమీకరణాలు Exercise 8(a)

అభ్యాసం – 8(ఎ)

I.

ప్రశ్న 1.
xy = c ex + b e-x + x2 నుంచి యాదృచ్ఛిక స్థిర సంఖ్యలు b, c లను తొలగిస్తే వచ్చే అవకలన సమీకరణం పరిమాణం కనుక్కోండి.
సాధన:
పరిమాణము = 2

ప్రశ్న 2.
మూలబిందువు కేంద్రంగా గల వృత్తాల కుటుంబపు అవకలన సమీకరణం పరిమాణం కనుక్కోండి. (Mar. ’11)
సాధన:
మూల బిందువు కేంద్రంగా గల వృత్తం x2 + y2 = r2
పరిమాణం = యాదృశ్చిక స్థిరాంకాల సంఖ్య = 1

AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 8 అవకలన సమీకరణాలు Ex 8(a)

II.

ప్రశ్న 1.
బ్రాకెట్లలో చూపిన పరామితులతో కింది ఇచ్చిన వక్రాల కుటుంబాల అవకలన సమీకరణాలను కనుక్కోండి. (T.S. Mar. ’16)
i) y = c(x – c)2; (c)
ii) xy = aex + be-x; (a, b)
iii) y = (a + bx)ekx; (a, b)
iv) y = a cos (nx + b); (a, b)
సాధన:
i) y = c(x – c)2 ——- (1)
x దృష్ట్యా అవకలనం చేయగా
(2) ను (1) తో భాగించగా
\(\frac{\mathrm{y}_1}{\mathrm{y}}\) = \(\frac{2 c(x-c)}{c(x-c)^2}\)
x – c = \(\frac{2 y}{y_1}\)
c = x – \(\frac{2 y}{y_1}\)
(1) లో ప్రతిక్షేపించగా
У = \(\left(x-\frac{2 y}{y_1}\right)\left(\frac{2 y}{y_1}\right)^2\)
= \(\frac{x y_1-2 y}{y_1} \cdot \frac{4 y^2}{y_1^2}\)
y.\(\mathrm{y}_1^3\) = 4y2 (xy1 -2y)
i.e., \(\mathrm{y}_1^3\) = 4y (xy1 – 2y)
= 4xyy1 – 8y2
\(\left(\frac{d y}{d x}\right)^3\) – 4xy \(\frac{d y}{d x}\) + 8y2 = 0

ii) xy = aex + be-x ; (a, b)
సాధన:
xy = aex + be-x
x దృష్ట్యా అవకలనం చేయగా
x. y1 + y = aex + b. e-x
x దృష్ట్యా మరల అవకలనం చేయగా
xy2 + y1 + y1 = aex + be-x
= xy
x\(\frac{d^2 y}{d x^2}\) + 2\(\frac{d y}{d x}\) – xy = 0

iii) y = (a + bx)ekx; (a, b)
సాధన:
y = (a + bx)ekx
x దృష్ట్యా అవకలనం చేయగా
y1 = (a + bx) ekx. k + ekx. b
= k. y + b.ekx
y1 – ky = b.ekx —– (1)
x దృష్ట్యా మరల అవకలనం చేయగా
y2 – ky1 = kb ekx
= k(y1 – ky) —– (2)
= ky1 – k2y
\(\frac{d^2 y}{d x^2}\) – 2k\(\frac{d y}{d x}\) + k2y = 0

iv) y = a cos (nx + b) ; (a, b)
సాధన:
y = a cos (nx + b)
y1 = -a sin (nx + b) n
y2 = – an. cos (nx + b) n
= – n2. y
\(\frac{d^2 y}{d x^2}\) + n2.y = 0

AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 8 అవకలన సమీకరణాలు Ex 8(a)

ప్రశ్న 2.
కింది వక్రాల కుటుంబాలకి అనుగుణంగా ఉండే అవకలన సమీకరణాలను కనుక్కోండి.

i) నిరూపకాక్షాలు అనంత స్పర్శరేఖలుగా ఉన్న లంబ అతిపరావలయాలు.
సాధన:
లంబ అతి పరావలయ సమీకరణము
xy = c2, c యాదృశ్చిక స్థిరాంకం
x దృష్ట్యా అవకలనం చేయగా
x\(\frac{d y}{d x}\) + y = 0

ii) మూల బిందువు వద్ద కేంద్రం ఉండి నిరూపకాక్షాలు అక్షాలుగా ఉన్న దీర్ఘ వృత్తాలు.
సాధన:
దీర్ఘవృత్త సమీకరణము
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 8 అవకలన సమీకరణాలు Ex 8(a) 1
(ii) ను X తో గుణించి (i) నుండి తీసివేయగా
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 8 అవకలన సమీకరణాలు Ex 8(a) 2

III.

ప్రశ్న 1.
బ్రాకెట్లలో చూపిన పరామితులతో కింద ఇచ్చిన వక్రాల కుటుంబాల అవకలన సమీకరణాలను కనుక్కోండి.

i) ae3x + be4x; (a, b)
సాధన:
x దృష్ట్యా అవకలనం చేయగా
y1 = 3ae3x + 4be3x
y1 – 3a. e3x = 4b.e3x
= 4(y – a. e3x)
= 4y – 4a. e3x
y1 – 4y = -a.e3x —- (1)
x దృష్ట్యా మరల అవకలనం చేయగా
y2 – 4y1 = -3a. e3x
= 3 (y1 -4y) by (1)
= 3y1 – 12y
\(\frac{d^2 y}{d x^2}\) – 7\(\frac{d y}{d x}\) + 12y = 0

AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 8 అవకలన సమీకరణాలు Ex 8(a)

ii) y = ax2 + bx; (a, b)
సాధన:
\(\frac{d y}{d x}\) = 2ax + b
\(\frac{d^2 y}{d x^2}\) = 2a
x2 \(\frac{d^2 y}{d x^2}\) = 2ax2 —- (i)
– 2x\(\frac{d y}{d x}\) = -4ax2 – 2bx —— (ii)
2y = 2ax2 + 2bx —— (iii)
ఈ మూడు సమీకరణాలు కూడగా
x2 \(\frac{d^2 y}{d x^2}\) – 2x \(\frac{d y}{d x}\) + 2y = 0

iii) ax2 + by2 = 1; (a, b)
సాధన:
ax2 + by2 = 1
by2 = 1 – ax2 — (1)
x దృష్ట్యా అవకలనం చేయగా
2by. y1 = – 2ax —- (2)
(2) ను (1) తో భాగించగా
\(\frac{\text { by. } y_1}{\text { by }^2}\) = \(\frac{-a x}{1-a x^2}\)
\(\frac{1-a x^2}{a x}\) = \(\frac{-y}{y_1}\)
y1 – ax2y1 = -axy1
y1 = ax2y1 – axy1
= ax(xy1 – y)
a = \(\frac{y_1}{\left(x^2 y_1-x y\right)}\)
x దృష్ట్యా అవకలన సమీకరణాలు.
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 8 అవకలన సమీకరణాలు Ex 8(a) 3

iv) xy = ax2 + \(\frac{\mathbf{b}}{\mathbf{x}}\) ; (a, b)
సాధన:
xy = ax2 + \(\frac{b}{x}\)
x2y = ax3 + b
x దృష్ట్యా అవకలనం చేయగా
x2y1 + 2xy = 3ax2
x తో భాగించగా
xy1 + 2y = 3ax —— (1)
x దృష్ట్యా మరల అవకలనం చేయగా
xy2 + y1 + 2y1 = 3a
xy2 + 3y1 = 3a —- (2)
(1) ను (2) తో భాగించగా
\(\frac{x y_1+2 y}{x y_2+3 y_1}\) = \(\frac{3 a x}{3 a}\) = x
అడ్డగుణకారము చేయగా
xy1 + 2y = x2 y2 + 3xy
x2y2 + 2xy1 – 2y = 0
x2\(\frac{d^2 y}{d x^2}\) – 2x\(\frac{d y}{d x}\) – 2y = 0

ప్రశ్న 2.
కింది వక్రాల కుటుంబాలకు అనుగుణంగా ఉండే అవకలన సమీకరణాలను కనుక్కోండి.

i) మూల బిందువు వద్ద Y – అక్షాన్ని స్పృశించే వృత్తాలు.
సాధన:
కావలసిన వృత్త సమీకరణం
x2 + y2 + 2gx = 0
x2 + y2 = -2gx —- (1)
x దృష్ట్యా అవకలనం చేయగా
2x + 2yy1 = – 2g. —- (2)
(1) తో ప్రతిక్షేపించగా
(2) నుండి x2 + y2 = x(2x + 2yy1)
= 2x2 + 2xyy1
yy2 – 2xyy1 – 2x2 = 0
y2 – x2 = 2xy \(\frac{d y}{d x}\)

ii) ప్రతిదాని అక్షం x – అక్షానికి సమాంతరంగానూ, నాభి లంబం 4a గానూ ఉన్న పరావలయాలు.
సాధన:
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 8 అవకలన సమీకరణాలు Ex 8(a) 5
కావలసిన పరావలయ సమీకరణం
(y – k)2 = 4a(x – h) —- (1)
x దృష్ట్యా అవకలనం చేయగా
2 (y – k) y1 = 4a — (2)
x దృష్ట్యా అవకలనం చేయగా
(y – k) y2 + \(\mathrm{y}_1^2\) = 0 — (3)
(2) నుండి y – k = \(\frac{2 a}{y_1}\)
(3) లో ప్రతిక్షేపిస్తే
\(\frac{2 a}{y_1}\)· y2 + \(\mathrm{y}_1^2\) = 0
2ay2 + \(y_1^3\) = 0

AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 8 అవకలన సమీకరణాలు Ex 8(a)

iii) మూల బిందువు వద్ద నాభి, X – అక్షం గుండా అక్షం గల పరావలయాల కుటుంబం.
సాధన:
పరావలయ సమీకరణం y2 = 4a (x + a)
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 8 అవకలన సమీకరణాలు Ex 8(a) 6
AP Inter 2nd Year Maths 2B Solutions Chapter 8 అవకలన సమీకరణాలు Ex 8(a) 7

AP Inter 1st Year Botany Notes Chapter 2 జీవశాస్త్ర వర్గీకరణ

Students can go through AP Inter 1st Year Botany Notes 2nd Lesson జీవశాస్త్ర వర్గీకరణ will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Botany Notes 2nd Lesson జీవశాస్త్ర వర్గీకరణ

→ రెండు రాజ్యాల వర్గీకరణను లిన్నేయస్ ప్రవేశపెట్టారు.

→ బాక్టీరియమ్లు, శైవలాలు, శిలీంధ్రాలు, బ్రయోఫైట్లు, టెరిడోఫైట్లు, వివృతబీజాలు, ఆవృతబీజాలన్నీ మొక్కల కిందే ఉంటాయి.

→ ఐదు రాజ్యాల వర్గీకరణను ఆర్.హెచ్. విటాకర్ ప్రవేశ పెట్టారు. దీనిలో మొనీరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే మరియు ఆనిమేలియాలు కలవు.

→ మొనీరా కాకుండా మిగిలినవన్ని నిజకేంద్రక జీవులే.

→ మొనీరాలో ఆర్కి బాక్టీరియా, యూబాక్టీరియాలు కలవు.

→ ఆకారంను బట్టి బాక్టీరియమ్లు నాలుగు రకాలు అవి గోళాకారం (కోకస్) దండాకారం (బాసిల్లస్) సర్పిలాకారము (స్పైరిల్లమ్) కామా ఆకారం (విబ్రియో)

→ సయనో బాక్టీరియమ్లు ఏకకణంగాను, సహనివేశకంగాను లేదా తంతురూపంలోను ఉంటాయి.

AP Inter 1st Year Botany Notes Chapter 2 జీవశాస్త్ర వర్గీకరణ

→ కొన్ని జీవులు హెటిరోసిస్ట్ అనబడే ప్రత్యేకమైన కణాలలో వాతావరణంలోని నత్రజనిని స్థాపిస్తాయి. ఉదా : నాస్టాక్, అబీనా

→ మధ్యదరా సముద్రములోని ఎరుపు అలలకు “ట్రైకోడెస్మియం ఎరిథ్రియం” కారణము

→ పరపోషిత బాక్టీరియాలలో అధికభాగం పూతికాహారులు లేక విచ్ఛిన్నకారులు

→ బాక్టీరియాలు ద్విధావిచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి.

→ మైకోప్లాస్మాలు కణకవచం లేకుండా బహుళ రూపాలలో ఉండే జీవులు మొక్కలలో మంత్రగత్తె చీపురుకట్ట వ్యాధిని, పశువులలో ఫ్లూరోనిమోనియా, మానవులలో మైకోప్లాస్మల్ యురిథ్రెటిస్ వ్యాధులను కలుగచేస్తాయి.

→ ఆక్టినోమైసిటిస్ శాఖాయుతమైన, తంతురూప బాక్టీరియమ్లు వాటి కణకవచంలో మైకోలిక్ ఆమ్లము ఉంటుంది.

→ ప్రొటిస్టా రాజ్యంలో క్రైసోఫైట్లు, డైనోఫ్లాజెల్లేట్లు, యూగ్లినాయిడ్లు జిగురు బూజులు, ప్రొటోజోవన్లు ఉన్నాయి.

→ ఫంగై రాజ్యం పరిపోషిత జీవులను కలిగిన ప్రత్యేకమై రాజ్యం

→ చాలా శిలీంధ్రాలు పరపోషితాలు. మృతిచెందిన అధస్థ పదార్థాల నుంచి కరిగిన సేంద్రియ పదార్థాలను గ్రహిస్తాయి. వీటిని పూతికాహారులు అంటారు.

→ శాకీయ ప్రత్యుత్పత్తి ముక్కలవడం, కణవిచ్ఛిత్తి, ప్రరోహలేర్పడటం ద్వారా జరుగుతుంది. అలైంగిక ప్రత్యుత్పత్తి కోనిడియంల ద్వారా లేదా గమన సిద్ధబీజాల ద్వారా జరుగుతుంది. లైంగికంగా గోళాకార సిద్ధబీజాలు ఆస్కోసోరులు, బెసీడియోస్టోరుల ద్వారా జరుగుతుంది.

→ ఫంగై రాజ్యంలో ఫైకోమైసిటోస్ (పక్సీనియా), డ్యుటీరోమైసిటీస్ (ఆల్టర్నేరియా) కలవు.

→ ప్లాంటే రాజ్యంలో నిజకేంద్రకయుత, హరితం కల జీవులన్నీ చేర్చారు.

→ ఆనిమేలియా రాజ్యంలో బహుకణయుతమై, కణకవచం లేని కణాలు గల పరపోషిత నిజకేంద్రక జీవులను చేర్చారు.

→ కార్ల్ వోస్ (Carl Wóese) ఆరు రాజ్యాల వర్గీకణను ప్రతిపాదించారు. అవి బాక్టీరియమ్లు, ఆర్కి బాక్టీరియమ్లు, ప్రొటిస్ట్గా, శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులు.

AP Inter 1st Year Botany Notes Chapter 2 జీవశాస్త్ర వర్గీకరణ

→ వైరస్లు కేంద్రకామ్లం, ప్రొటీన్లు కలిగిన అవికల్ప పరాన్నజీవులు.

→ టీ.ఓ. డైనెర్ (T. O. Diener) అనువారు ప్రోటీను కవచం లేని కేంద్రకామ్లం (RNA) కల చిన్న సంక్రమణ కారకాన్ని గుర్తించారు.

→ కొన్ని సంక్రమణకారకాలలో ప్రొటీన్ కవచం ఉంటుంది. కేంద్రికామ్లం ఉండదు. వాటిని ప్రియాన్లు అంటారు.

→ ఒక శైవలం, ఒక శిలీంధ్రం కలసి సన్నిహితంగా ఏర్పడిన మొక్కలను లైకెన్లు అంటారు. లైకెన్ ని శైవలమును ఫైకోబయాంట్ అని, శిలీంధ్రంను మైకోబయాంట్ అని అంటారు.

→ సూక్ష్మజీవనాశకాలు : ఇవి సూక్ష్మజీవులు ఉత్పత్తి చేసే రసాయనిక పదార్థాలు. ఇతర సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించడం లేదా చంపగల సామర్థ్యం ఉన్నవి.

→ నిశ్చల సిద్ధబీజాలు : చలనరహితమైన, పలచటి గోడలు ఉన్న సిద్ధబీజాలు.

→ ఆస్కోకార్ప్ : ఇది (ఆస్కోమైసిటిస్కు చెందిన శిలీంధ్రాలలోని ఫలనాంగం.

→ ఆస్కోస్పోర్ : ఇది ఆస్కస్ (ఆస్కోకార్స్లోనిది) లో ఉత్పత్తి అయ్యే సిద్ధబీజం.

→ స్వయం పోషితాలు : అసేంద్రియ పదార్థాల నుంచి వాటి ఆహార పదార్థాలను తయారు చేసుకోగల జీవులు.

→ బెసీడియోకార్ప్ : ఇది బెసిడియోమైసిటీస్ తరగతికి చెందిన శిలీంధ్రాలలో గల ఫలనాంగం.

→ బెసీడియోస్పోర్ : ఇది బెసీడియం ఉత్పత్తిచేసే (బెసీడియోకార్ప్ లోనిది) సిద్ధబీజం.

→ జీవవాయువు (బయోగ్యాస్) : జంతువుల పేడలాంటి జీవద్రవ్యరాశి నుంచి అవాయుసహిత కిణ్వనం ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. దీనిలో 50-70 శాతం మీథేన్, 30-40 శాతం కార్బన్-డై-ఆక్సైడ్, ఉదజని, నత్రజని, హైడ్రోజన్ సల్ఫైడ్లు అతి సూక్ష్మమైన పాళ్ళలో ఉంటాయి.

→ జీవసందీప్తి : ఇది జీవులు బహిర్గతం చేసే కాంతి.

→ రసాయనిక స్వయంపోషితాలు : వివిధ అసేంద్రియ పదార్థాల ఆక్సీకరణ ద్వారా విడుదలైన శక్తిని ఉపయోగించుకొని ఆహారాన్ని తయారు చేసుకొనే జీవులు.

→ నిజ కేంద్రక జీవులు : జన్యుపదార్ధమైన DNA క్రొమాటిన్ రూపంలో సంవిధానం చెంది నిజమైన కేంద్రకాన్ని కలిగివున్న జీవులు. వీటిలో త్వచంతో ఆవరించబడిన అనేక కణాంగాలు ఉంటాయి.

→ ఆవాసం : ఒక జీవి సాధారణంగా నివసించే సహజ ప్రదేశం లేదా ప్రాంతం.

→ ఏకస్థితిక జీవిత చక్రం (haplontic) : ఏకస్థితిక దశలు ప్రాధాన్యం కలిగి, ద్వయస్థితిక దశ సంయుక్త బీజానికి మాత్రమే పరిమితమైన జీవిత చక్రం.

→ గుల్మం : చేవదేరిన భాగాలేవీ లేకుండా ఉన్న చిన్న నాజూకైన మొక్క

→ పరపోషితాలు : వాటి ఆహార పదార్ధాన్ని అవి తయారు చేసుకోలేవు. కానీ ఇతర జీవులపై కాని లేదా నిర్జీవమైన సేంద్రియ పదార్థాలపై కానీ వాటి ఆహారం కోసం ఆధారపడే జీవులు.

→ హోలోఫైటిక్ : స్వయంపోషిత పోషణనే హోలో ఫైటిక్ పోషణ అని కూడా అంటారు.

→ జాంతవ భక్షణ పోషణ : ఘనరూపంలో గల సేంద్రియ ఆహార పదార్థాలను నేరుగా లోపలికి తీసుకోవడం పోషణ పొందగలగడం.

→ కారియోగమీ : ‘రెండు కేంద్రకాల కలయిక’.

→ శిలీంధ్ర మూలాలు : శిలీంధ్రానికి, నాళికాయుత మొక్కల వేర్లకు మధ్య ఉన్న సన్నిహిత సంబంధం వల్ల ఇవి ఏర్పడతాయి. మొక్క వేర్ల ఫాస్పేట్ శోషణను పెంపొందిస్తాయి. అందుకే, వీటిని జీవ ఎరువులుగా ఉపయోగిస్తారు.

→ నత్రజని స్థాపన : వాతావరణంలోని ద్వినత్రజని అమ్మోనియా లేదా నైట్రేట్ లాంటి స్థిరమైన రూపంలోకి మార్పు చెందే ప్రక్రియనే నత్రజని స్థాపన అంటారు.

→ అవికల్ప పరాన్నజీవులు : వికల్ప పరాన్నజీవికి భిన్నంగా ఈ పరాన్నజీవి స్వతంత్రంగా అంటే పరాన్న జీవిగా కాకుండా జీవితం గడపలేదు.

→ గోళాకార సంయుక్త బీజం (oospore) : ఇది ఫలదీకరణ చెందిన స్త్రీబీజ కణం లేదా సంయుక్త బీజం. ముఖ్యంగా మందమైన ఖైటిన్ సహిత గోడను కలిగి ఉండేది.

→ పామెల్లా దశ : కొన్ని కశాభాయుత ఆకుపచ్చ శైవలాలు లేదా మొక్కలవంటి ప్లాజెల్లేట్ల లేదా కశాభాయుత జీవుల జీవిత చక్రంలో ఏర్పడే చలనరహిత, కశాభారహిత విడికణాల సమూహం.

→ పరాన్న జీవులు : ఇవి ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడతాయి.

→ కాంతి స్వయం పోషితాలు : ఇవి సూర్యరశ్మిలోని శక్తిని వినియోగించుకొని సరళ పదార్థాల నుంచి ఆహారాన్ని తయారు చేసుకొనే జీవులు.

→ ప్లవకాలు : ఇవి నీటి అలలపై అచేతనంగా తేలే చిన్న జీవులు.

→ ప్లాస్మోడియం : జిగురు బూజులలోని (శిలీంధ్రాలలోని) ప్లాస్మాత్వచంతో కూడి వున్న బహు కేంద్రకయుత జీవపదార్థ ద్రవ్యరాశిని ప్లాస్మోడియం అంటారు.

→ ప్లాస్మోగమీ : ‘చలన లేక చలనరహిత సంయోగ బీజాల జీవ పదార్థాల కలయిక.

→ ప్లియోమార్ఫిక్ : ఒక జీవి తన జీవిత చరిత్రలో ఒకటి కంటే ఎక్కువ విడి రూపాలలో ఉండటాన్ని ప్లియోమార్ఫిక్ అంటారు. పరభక్షి : తన ఆహారం కోసం వేరొక జంతువును చంపి తినే జంతువు.

AP Inter 1st Year Botany Notes Chapter 2 జీవశాస్త్ర వర్గీకరణ

→ ప్రియాన్లు : ప్రోటీన్ కవచం కలిగి, కేంద్రకామ్లం లేకుండా ఉన్న వ్యాధికారక క్రమములు.

→ స్పోరోజోవన్లు : జీవిత చక్రంలో సంక్రామక సిద్ధబీజం కల వాటిని స్పోరోజోవన్లు అంటారు.

→ కేంద్రకపూర్వ జీవులు : కణాలలో కేంద్రకం లేని లేదా ఇతర కణాంగాలు త్వచరహితంగా గల జీవులు. వీటి జన్యు పదార్థం క్రొమాటిన్ రూపంలో సంవిధానం చెంది ఉండదు.

→ పూతికాహారులు : ఇవి ఆహారం కోసం మృతిచెందిన లేదా నిర్జీవ సేంద్రియ పదార్థాలపై ఆధారపడి ఉంటాయి. పొదలు : ఇవి గుబురుగా పెరుగుతూ చేవదేరిన బహువార్షిక మొక్కలు.

→ సిద్ధబీజం : ఇది ప్రత్యక్షంగా కొత్తమొక్కగా అభివృద్ధి చెందగల అలైంగిక ఏకకణ ప్రత్యుత్పత్తి ప్రమాణం. ఇది వ్యాప్తి చెందడం కోసం అనుకూలనాలను ఏర్పరచుకొని ప్రతికూల పరిస్థితులలో కూడా అనేక కాలాలపాటు జీవించి ఉండగలదు. సిద్ధబీజాలు అనేక బాక్టీరియమ్లు, మొక్కలు, శైవలాలు, శిలీంధ్రాలు, కొన్ని ప్రోటోజోవన్ల జీవిత చక్రంలో ఒక భాగంగా ఉంటాయి. ఉన్నతశ్రేణి మొక్కలలో సిద్ధబీజమాతృకలలో క్షయకరణ విభజన అనంతరం ఏర్పడే సిద్ధబీజాలను ‘మియోస్పోరులు’ అంటారు. ధాలోఫైటాలో సిద్ధబీజాలు సమవిభజన ఫలితంగా ఏర్పడవచ్చు. అట్టి వాటిని ‘మైటోస్పోరులు’ అంటారు.

→ సహజీవులు : రెండు భిన్న జీవుల మధ్యగల సహసంబంధంలో రెండూ పరస్పరం లబ్ది పొందడాన్ని సహజీవనం అని అలాంటి జీవులను సహజీవులు అని పిలుస్తారు.

→ వృక్షం : ఇది ఒక పెద్ద చేవదేరిన బహువార్షిక మొక్క

→ గమనసిద్ధబీజం : కొన్ని శైవలాలు, శిలీంధ్రాలలో కశాభాల సహాయంతో చలించగల అలైంగిక సిద్ధబీజం. దీనిని చలత్కసిద్ధబీజం (swarm spore) అని కూడా అంటారు.

AP Inter 1st Year Botany Notes Chapter 1 జీవ ప్రపంచం

Students can go through AP Inter 1st Year Botany Notes 1st Lesson జీవ ప్రపంచం will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Botany Notes 1st Lesson జీవ ప్రపంచం

→ పెరుగుదల, ప్రత్యుత్పత్తి పరిస్థితులను గమనించే సామర్థ్యం, దానికి తగిన అనుక్రియను చూపడం, జీవక్రియ, పునరుత్పత్తి సామర్థ్యం స్వయం సంవిధానం, పరస్పరచర్య, లక్షణాల వ్యక్తీకరణ వంటివి జీవుల ప్రత్యేక లక్షణాలు.

→ మొక్కలలో కణవిభజన ద్వారా పెరుగుదల జీవిత కాలమంతా నిరంతరం జరుగుతుంది.

→ కణవిభజనలు జరిగేవరకు, ఏకకణ జీవులలో కుడా పరిమాణం పెరుగుతుంది.

→ జనకుల లక్షణాలను పోలిన లక్షణాలు కల సంతతిని ఉత్పత్తి చేయుటను బహుకణజీవుల – ప్రత్యుత్పత్తి అంటారు.

→ శిలీంధ్రాలు అలైంగికంగా సిద్ధ బీజాలను ఉత్పత్తి చేసి, వ్యాప్తి చెందుతాయి. ఈస్ట్, హైడ్రా లాంటి నిమ్న జీవులలో పురోహాలు ఏర్పడతాయి.

→ శిలీంధ్రాలు తంతురూప శైవలాలు, నాచులలో ప్రథమతంతువు ముక్కలవడం ద్వారా సంఖ్యలో పెరుగుతాయి.

AP Inter 1st Year Botany Notes Chapter 1 జీవ ప్రపంచం

→ అన్ని జీవులు రసాయినాలతో నిర్మితమై ఉంటాయి. జీవులలో జరిగే రసాయన చర్యల మొత్తాన్ని జీవక్రియ అంటారు.

→ అన్ని మొక్కలు, జంతువులు, శిలీంధ్రాలు మరియు సూక్ష్మజీవులు జీవక్రియను చూపుతాయి.

→ ఏ నిర్జీవి జీవక్రియను ప్రదర్శించదు.

→ అన్ని జీవరాశులకు గల అతి స్పష్టమైన, సాంకేతాకంగా సంక్లిష్టమైన ప్రక్రియ, పర్యావరణ ప్రేరణలకు జీవి అనుక్రియను చూపుట. దీనికి క్షోభ్యత అంటారు.

→ అన్ని జీవరాశులు వాటి పరిసరాలకు అప్రమత్తంగా ఉంటాయి. దీనినే సహ అంటారు.

→ మనకు తెలిసిన, వర్ణించబడిన జాతులు 1.7 నుండి 1.8 మిలియన్ల వరకు ఉంటాయి. దీన్నిజీవ వైవిధ్యం అంటారు. ఇది భూమిపైగల జీవుల సంఖ్య రకాలను సూచిస్తుంది.

→ సేకరించిన జీవి పూర్తిగా కొత్తదా లేక పూర్వం తెలిసి ఉన్నదా అనే విషయాన్ని నిర్ధారించడమే గుర్తింపు.

→ గుర్తించిన జీవికి, ప్రపంచవ్యాప్తంగా ఒకే పేరు పెట్టుటను నామీకరణ అంటారు.

→ గుర్తించిన మొక్కకు అంతర్జాతీయ వృక్ష నామీకరణ నియమాలు (ICBN) ప్రకారం శాస్త్రీయ నామము ఇస్తారు.

→ మొక్కకు 2 పదాలతో కూడిన పేరు పెట్టుటను ద్వినామ నామీకరణ అంటారు. దీనిని లిన్నేయస్ ప్రవేశపెట్టారు.

→ వివిధ రకాల జీవులు, వాటి వైవిధ్యాలు సంబంధ బాంధవ్యాల అధ్యయనాన్ని సిస్టమాటిక్స్ అంటారు.

→ వృక్ష, జంతురాజ్యాలలో కనిష్ట ప్రమాణాన్ని జాతి అంటారు.

→ మౌళికమైన పోలికలు కల జీవుల సముదాయాన్ని జాతి అంటారు.

→ దగ్గర సంబంధాలు కల జాతుల సమూహాలను ప్రజాతి అంటారు.

→ సన్నిహిత సంబంధంకల ప్రజాతుల సముదాయాలను కుటుంబము అంటారు.

→ తక్కువ లక్షణాలతో మాత్రమే సారూప్యతకల వేర్వేరు కుటుంబాలను క్రమం అంటారు.

→ పోలికలు కలిగిన క్రమాలను తరగతి అంటారు.

→ పోలికలు కల తరగతులను విభాగం అంటారు.

→ వివిధ విభాగాలకు చెందిన మొక్కలన్నీంటిని వృక్షరాజ్యంలో ఉంచారు.

→ మొక్కల, జంతుజాతుల సరైన నమూనాల సేకరణ వర్గీకరణ అధ్యయనాలకు మూలాధారము.

→ సేకరించిన వృక్ష నమూనాను ఆరబెట్టి, ప్రెస్చేసి, షీట్లపై భద్రపరిచే ప్రదేశాన్ని హెర్బేరియం అంటారు.

AP Inter 1st Year Botany Notes Chapter 1 జీవ ప్రపంచం

→ ఇంగ్లండ్ లోని ‘క్యూ’ వద్ద ‘రాయల్ బొటానికల్ గార్డెన్’ అతి పెద్ద హెర్బేరియం కలిగి ఉన్నది.

→ హోరాలోని ఇండియన్ బొటానికల్ గార్డెన్స్, లక్నోలోని నేషనల్ బొటానికల్ రిసెర్చి ఇన్స్టిట్యూట్లు భారతదేశంలోని వృక్షశాస్త్ర ఉద్యానవనాలు.

→ భద్రపరచబడిన వృక్ష, జంతునమూనాలు సేకరణలు, అధ్యాయనం కోసం సంప్రదింపులకు మ్యూజియంలు తోడ్పడతాయి.

→ వివిధ రకాల మొక్కలు, జంతువుల మధ్య ఉన్న పోలికలు, వ్యత్యాసాల ఆధారంగా వాటి గుర్తింపుకు తోడ్పడే వర్గీకరణ సహాయకంను ‘కీ’ (key) అంటారు.

→ ఫ్లోరా, మాన్యుయల్లు, మోనోగ్రాఫు, కాటలాగ్లు వర్ణనలు చేయడానికి తోడ్పడతాయి.

→ ప్రరోహాలేర్పడటం : ఇది ఏక కణజీవుల (ఉదా : ఈస్ట్) అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతులలో ఒకటి. ఈ పద్ధతిలో పక్వస్థితిలో గల జనకుల నుంచి బహిర్జనితంగా పెరిగిన భాగం, కుంచనం ఏర్పడటం ద్వారా వేరై కొత్తజీవిగా అభివృద్ధి చెందుతుంది. స్పృహ : జీవులలో పరిసరాల్ని గ్రహించగల సామర్థ్యమే స్పృహ,

→ విచ్ఛిత్తి : ఏకకణజీవులలో కేంద్రకం, కణద్రవ్య విభజనలవల్ల రెండుగానీ, అంతకంటే ఎక్కువగానీ కొత్త కణాల్ని (జీవుల్ని) ఏర్పరిచే అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతి.

→ ఫ్లోరా : ఒక ప్రదేశంలో ఉన్న మొక్కల ఆవాసం, వితరణల సమాచారాన్ని, మొక్కల జాబితాను ఒక క్రమపద్ధతిలో కలిగి ఉంటుంది.

→ ముక్కలవడం : ఇది తంతురూప జీవులలో సాధారణంగా గుర్తించబడే శాకీయ ప్రత్యుత్పత్తి పద్ధతి. దీనిలో మొక్క చిన్న చిన్న ముక్కలుగా యాంత్రిక పద్ధతుల ద్వారా విరిగి, ప్రతి ముక్కా కొత్త మొక్కగా అభివృద్ధి చెందుతుంది. పెరుగుదల : ఇది జీవుల పరిమాణంలో జరిగే శాశ్వతమైన, అద్వితమైన వృద్ధి. సాధారణంగా ఇది జీవుల శుష్క భారంలో మార్పుతో ముడిబడి ఉంటుంది.

→ హెర్బేరియం : సేకరించిన వృక్షనమూనాను ఆరబెట్టి, ప్రెస్ చేసి, షీట్లపై భద్రపరచే ప్రదేశాన్ని హెర్బేరియం అంటారు.

→ పరస్థానిక (in vitro) : జీవి ప్రమేయం లేకుండా వెలుపల ఉండే కృత్రిమ వాతావరణం.

→ ICBN : అంతర్జాతీయ వృక్ష నామకరణ నియమావళి.

→ మాన్యుయల్ : ఇది తక్షణ సంప్రదింపు కోసం రూపొందించిన చిన్న పుస్తకం.

→ జీవక్రియ : ఒక జీవి శరీరంలో జరిగే అన్ని రసాయనిక చర్యలను కలిపి జీవక్రియగా పేర్కొంటారు. సరళమైన అణువుల నుంచి సంక్లిష్టమైన అణువులు ఏర్పడే నిర్మాణాత్మక జీవక్రియను నిర్మాణక్రియ (anabolism) అంటారు. సంక్లిష్టమైన అణువులు సరళమైన అణువులుగా విడగొట్టబడే విచ్ఛిన్న జీవక్రియను విచ్ఛిన్నక్రియ (catabolism) అని అంటారు.

→ కాంతి కాలావధి : మొక్కలు పుష్పించే అనుక్రియపై పగలు, రాత్రి సాపేక్ష వ్యవధుల ప్రభావాన్ని కాంతికాలావధి అంటారు.

→ ప్రత్యుత్పత్తి : తల్లిదండ్రులతో దాదాపు సమానమైన లక్షణాలను కలిగిన సంతతిని ఉత్పత్తి చేయడం.

→ సిద్ధబీజం : ఇది ప్రత్యక్షంగా కొత్తమొక్కగా అభివృద్ధి చెందగల అలైంగిక ఏకకణ ప్రత్యుత్పత్తి ప్రమాణం. ఇది వ్యాప్తి చెందడంకోసం అనుకూలనాలను ఏర్పరచుకొని ప్రతికూల పరిస్థితులలో కూడా అనేక కాలాలపాటు జీవించి ఉండగలదు. సిద్ధబీజాలు అనేక బాక్టీరియమ్లు, మొక్కలు, శైవలాలు, శిలీంధ్రాలు, కొన్ని ప్రోటోజోవన్ల జీవిత చక్రంలో ఒక భాగంగా ఉంటాయి. ఉన్నతశ్రేణి మొక్కలలో సిద్ధబీజ మాతృకలలో క్షయకరణ విభజన అనంతరం ఏర్పడే సిద్ధబీజాలను ‘మియోస్పోరులు’ అంటారు. థాలోఫైటాలో సిద్ధబీజాలు సమవిభజన ఫలితంగా ఏర్పడవచ్చు. అట్టి వాటిని ‘మైటోస్పోరులు’ అంటారు.

→ సిస్టమాటిక్స్ : వివిధ రకాల జీవులు, వాటి వైవిధ్యాలు సంబంధ బాంధవ్యల అధ్యాయనాన్ని సిస్టమాటిక్స్ అంటారు.

AP Inter 1st Year Botany Notes Chapter 1 జీవ ప్రపంచం

→ టాక్సన్ (Taxon) : వర్గీకరణ వ్యవస్థలోని ఏ స్థాయికి చెందిన ప్రమాణాన్నైనా లేదా రకాన్నైనా టాక్సాన్ అంటారు. ఈ టాక్సా (బహువచనం) లను వృక్షరాజ్యం నుంచి ఉపజాతుల వరకు క్రమ స్థాయిలో అమరుస్తారు.

→ వర్గీకరణ స్థాయి క్రమం : జీవులను ఆరోహణ క్రమంలో పెద్ద, విస్తృత సముదాయాలుగా అమర్చడం. దీనివల్ల తక్కువ స్థాయి సముదాయాలు ఎప్పుడూ ఉన్నత స్థాయి సముదాయాలలో ఇమడ్చబడతాయి.

AP Board 4th Class EVS Solutions 1st Lesson Family

Andhra Pradesh AP Board 4th Class EVS Solutions 1st Lesson Family Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 4th Class EVS Solutions Lesson 1 Family

I. Conceptual Understanding:

Question 1.
State two reasons for the increase of nuclear families.
Answer:

  • Due to marriages, transfers to other towns.
  • Due to business, studies and employment.

Question 2.
Write the reasons for changes in a family?
Answer:

  1. A wedding, the arrival of a new born baby and transfers etc are reasons for changes in a family.
  2. Bussiness, studies, death of someone in the family also causes change in a family.

Question 3.
Give two reasons how the use of home appliances changed the life style of people?
Answer:

  1. In olden days people did all the house hold works manually.
  2. But now-a-days, we use different appliances that make our work easier and faster.
  3. Home appliances have changed the method of working. Due to this we have reduced physical exercise to the body.

AP Board 4th Class EVS Solutions 1st Lesson Family

II. Questioning and Hypothesis:

Question 4.
A new family moved to your neighbourhood. What questions do you ask to know about their family?
Answer:

  1. Where do you come from?
  2. Why are you come here?
  3. What do you do?
  4. Who are your family members?

III. Experiments and field observations:

Question 5.
Draw some pictures of home appliances.
Answer:

AP Board 4th Class EVS Solutions 1st Lesson Family 1

AP Board 4th Class EVS Solutions 1st Lesson Family

IV. Information Skills & Project Works:

Question 6.
Collect names of your family members and draw your family tree.
Answer:
Maternal Grand Parents:
Venkateswara Rao, Sri devi

Paternal Grand Parents:
Lakshmaiah, Narayanamma,
Father: Prabhakar,
Mother: Padma.

Maternal Grand Parents: – Paternal Grand Parents:

AP Board 4th Class EVS Solutions 1st Lesson Family 2

V. Drawing Pictures and Model Making:

Question 7.
Make your family tree with paper carving.
Answer:
Student activity.

AP Board 4th Class EVS Solutions 1st Lesson Family

VI. Appreciation:

Question 8.
Whom do you like most in your family, write a few lines about them ?
Answer:
I like my mother and father very much in my family.

  • My Mother cooks my favourite dishes.
  • She helps me in my studies
  • My father bought books clothes and groceries for us.

Let us Do: (TextBook Page No.3)

Match the following:

AP Board 4th Class EVS Solutions 1st Lesson Family 3

Answer:
1. d
2. a
3. c
4. b

Activity: (TextBook Page No.4)

Write the names of your family members and make your family tree.

AP Board 4th Class EVS Solutions 1st Lesson Family 4

Answer:
Student activity.

AP Board 4th Class EVS Solutions 1st Lesson Family

Group Activity: (TextBook Page No.9)

Discuss with your friends and write to which type of a family they belong to

AP Board 4th Class EVS Solutions 1st Lesson Family 5

Answer:

S.No.Friend NameType of family
1.RajuJoint family
2.DurgaMother dependent family
3.RaviSingle parent family
4.RamyaNuclear family

Think and Discuss: (TextBook Page No.10)

Question 1.
Why do people use these appliances?
Answer:
People use different appliances to make their work easier and faster.

Question 2.
How did people do the different kinds of work when these appliances were not there?
Answer:
When these appliances were not there , people did all the house hold works manually.

AP Board 4th Class EVS Solutions 1st Lesson Family

Additional Questions:

Conceptual Understanding:

Question 1.
What is a nuclear family?
Answer:
A family with mother, father and children is called a nuclear family.

Question 2.
What is a joint family?
Answer:
A family with grand parents, uncles,anuts and cousins is called a joint family.

Question 3.
What is grand parent family?
Answer:
If children lost their parents and live with their grand parents that family is called grand parent family.

Question 4.
Ask your grandfather and write the differences in sleeping in then and now?
Answer:
In those days people slept in verandahs and in courtyards. They enjoyed the fresh air of plam leaves or bamboo fans.
Now mostly people sleep indoors. They use fans or air coolers in the room.

AP Board 4th Class EVS Solutions 1st Lesson Family

Question 5.
What is single parent family?
Answer:
If a family lost their father and mother takes care of the family that family is known as single parent family.

Question 6.
Who are maternal family members and peternal family members?
Answer:

  • The members of family related to mother are maternal family members. The parents of mothers are called maternal grand parents.
  • The members of family related to father are paternal family members . The parents of father are called paternal grand parents.

Question 7.
Write the reasons for changes in a family?
Answer:

  1. A wedding, the arrival of a new born baby and transfers etc are reasons for changes in a family.
  2. Business, studies, death of someone in the family also causes change in a family.

Question 8.
Whom do you like most in your family, write a few lines about them ?
Answer:
I like my mother and father very much in my family.

  1. My Mother cooks my favourite dishes.
  2. She helps me in my studies.
  3. My father bought books clothes and groceries for us.

AP Board 4th Class EVS Solutions 1st Lesson Family

Multiple Choice Questions:

Choose the correct answer:

Question 1.
Our relatives are also a part of our family. We call them our …………….. family. ( B )
A) joint
B) extended
C) nuclear
D) single parent
Answer:
B) extended

Question 2.
A family with mother, father and children is called a …………….. family.
A) Nuclear
B) joint
C) single
D) mother dependent
Answer:
A) Nuclear

AP Board 4th Class EVS Solutions 1st Lesson Family

Question 3.
…………….. is the reason for changes to the structure of a family . ( D )
A) marriage
B) transfer
C) arrival of new bom babby
D) all the above
Answer:
D) all the above

Question 4.
Ravi’s father is ill. His mother take care of the family. Ravi’s family is …………….. family.
A) Nuclear
B) joint
C) mother dependent
D) single parent
Answer:
C) mother dependent

Question 5.
We call father’s sister as ……………..
A) grand mother
B) cousin
C) aunty
D) all
Answer:
C) aunty

AP Board 4th Class EVS Solutions 1st Lesson Family

Question 6.
Which of the following is called as uncle.
A) father’s brother
B) father’s father
C) mother’s father
D) all
Answer:
A) father’s brother

AP Board 5th Class EVS Solutions 9th Lesson ప్రమాదాలు – ప్రథమ చికిత్స

Andhra Pradesh AP Board 5th Class EVS Solutions 9th Lesson ప్రమాదాలు – ప్రథమ చికిత్స Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 5th Class EVS Solutions Lesson 9 ప్రమాదాలు – ప్రథమ చికిత్స

I. విషయావగాహన:

ప్రశ్న 1.
మనం ఎందుకు భద్రతా చర్యలు పాటించాలి?
జవాబు:
ప్రమాదాలనివారణకు పొటించే చర్యలను “భద్రతాచర్యలు”అంటారు. ప్రమాదాలను నివారించుటకు మనం కొన్ని నియమాలు, మరియు భద్రతా చర్యలు తప్పక పాటించాలి.

ప్రశ్న 2.
ప్రధమ చికిత్స అంటే ఏమిటి? ఎప్పుడు అవసరం అవుతుంది?
జవాబు:
ప్రధమ చికిత్స :
ఆసుపత్రికి వెళ్ళేలోపు బాధితుడికి అందించాల్సిన తక్షణ చికిత్సను “ప్రధమచికిత్స” అంటాం. గాయాలకు, కాలినగాయాలకు,కుక్క కాటుకు, పాముకాటుకు, తేలు కుట్టినప్పుడు, నీళ్ళలో మనిగినప్పుడు ప్రమచికిత్స అవసరం.

ప్రశ్న 3.
అపర్ల వాళ్ళ తాతయ్యను పాము కాటు వేసింది. అతనికి ఎటువంటి ప్రధమ చికిత్సను సూచిస్తావు?
జవాబు:

  1. మొదట కాటు వేయబడిన భాగాన్ని నిశితంగా పరిశీలించి,విష సర్పమో కాదో నిర్ధారించుకోవాలి.
  2. సాధారణంగా పాము కాటుకు గురైన వ్యక్తి భయంతో సృహ తప్పి పడిపోతాడు అతని భయం తగ్గించేలా మాట్లాడాలి.
  3. విషం శరీరంలో ఇతర భాగాలకు వ్యాపంచకుండా ఒక గుడ్డతో గాయం పై భాగంలో గట్టిగా కట్టు కట్టాలి.
  4.  పాము కరిచిన వ్యక్తి అచేతనంలోకి పోకుండా చూడాలి. 5. వెంటనే భాదితుడిని డాక్టరు వద్దకు తీసుకు వెళ్ళాలి.

AP Board 5th Class EVS Solutions 9th Lesson ప్రమాదాలు - ప్రథమ చికిత్స

II. ప్రశ్నించడం – పరికల్పనలు చేయడం:

ప్రశ్న 4.
108 సేవలు గురించి మరింతగా తెలుసుకోవడానికి 108 సిబ్బందిని ఏయే ప్రశ్నలు అడుగుతావు?
జవాబు:

  1. 108 సేవలు ఎప్పుడు మొదలైనవి?
  2. 108 అంబలెన్స్ కి మొబైల్ ద్వారా ఎలాసమాచారం ఇవ్వాలి?
  3. 108 ఎందుకు ఎమర్జెన్సీ నెంబర్?
  4. ఎందుకు 108 నెంబర్‌నే ఇచ్చారు?

III. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:

ప్రశ్న 5.
మీకు దగ్గరలోని ఒక ప్రమాద స్థలాన్ని సందర్శించండి. ఆ ప్రమాదం జరగటానికి కారణాలు అన్వేషించండి. మీ పరిశీలనలు నమోదు చేయండి?
జవాబు:
విధ్యార్థి కృత్యము.

IV. సమాచార నైపుణ్యాలు – ప్రాజెక్టుల పని:

ప్రశ్న 6.
దీపావళికి బాణా సంచా తయారు చేసే సందర్భంలో తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు చర్చించండి?
జవాబు:

  1. కాటన్ దుస్తులను ధరించాలి. నైలాన్ వంటి సింధటిక్ వస్త్రాలను ధరించరాదు. ఎందుకంటే అవి మంటలను తేలికగా గ్రహిస్తాయి.
  2. క్రాకర్ లను కాల్చేటప్పుడు తగినంత దూరంగా ఉండాలి.
  3. ముఖాన్ని క్రాకర్స్ వెలిగించేటప్పుడు దూరంగా ఉండాలి
  4. ఇంటిలోపల, రద్దీ ప్రదేశాలలో బాణాసంచాకాల్చరాదు.
  5. పెద్ద వారి సమక్షంలో మాత్రమే బాణాసంచా కాల్చాలి.

AP Board 5th Class EVS Solutions 9th Lesson ప్రమాదాలు - ప్రథమ చికిత్స

IV. బొమ్మలు గీయడం – నమునాలు తయారు చేయడం:

ప్రశ్న 7.
బస్సులో ప్రయాణం చేసేటప్పుడు తీసుకోవలసిన ముందు జాగ్రత్త చర్యలను సూచిస్తూ ఒక మైండ్ మేప్ గీయండి.
జవాబు:

AP Board 5th Class EVS Solutions 9th Lesson ప్రమాదాలు - ప్రథమ చికిత్స1

VI. ప్రశంస:

ప్రశ్న 8.
108 మరియు 104 సేవలను ఏవిధంగా ప్రశంసిస్తావు?
జవాబు:

  1. ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాలలోని ఆరోగ్య పరిస్థితిని మెరుగు పరచటానికి ఉద్దేసించిన సేవలు 104 మరియు 108.
  2. భారతదేశంలో అత్యవసర సేవలు నిర్వహించే స్వచ్చంద సంస్థ EMRI
  3. 108 అనేది అత్యవసర సేవలను నిరంతరం అందించే విభాగం. ఇది వైద్య పోలీస్ మరియు అగ్నిమాపక విభాగాలకు సంబంధించినది
  4. 104 అనేది మనకు ఉచిత వైద్య సలహాలు అందించే సేవ.

AP Board 5th Class EVS Solutions 9th Lesson ప్రమాదాలు - ప్రథమ చికిత్స

అదనపు ప్రశ్నలు:

ప్రశ్న 1.
కరెంటు పనివారు రబ్బరుతో తయారు చేసిన చేతి తోడుగులను ధరిస్తారు ఎందుకు ?
జవాబు:
ఎలక్ట్రిక్ షాక్ నుంచి రక్షించు కొనుట కోసం కరెంటు పనివారు రబ్బరుతో తయారు చేసిన చేతి తోడుగులను ధరిస్తారు.

ప్రశ్న 2.
ఆటలు ఆడేటప్పుడు పాటించే నియమాలేవి?
జవాబు:
ఆటలు ఆడేటప్పుడు పాటించే నియమాలు:

  1. ఆటనియమాలు తప్పనిసరిగా పాటించాలి .
  2. ఆటలు ఆడేటప్పుడు ఒకరిని ఒకరు తోసుకోరాదు.
  3. అనవసరపు వాదనలు చేయరాదు.
  4. ఆటల్లో బృంద స్ఫూర్తిని పెంపొందించు కోవాలి.

ప్రశ్న 3.
సెలవుల్లో స్కూల్ మాజమాన్యాలు స్కూళ్ళలో ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలి?
జవాబు:
ప్రతి స్కూలు సరియైన ప్రణాళికతో విద్యార్థులను ప్రమాదం జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు క్రింది విధంగా చేపట్టాలి:

  1. అగ్ని ప్రమాదాలు నివారించుటకు ఫైర్ ఎక్స్ టింగ్విషర్లు పెట్టించాలి.
  2. వాటర్ ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రపరచాలి మరియు లీకేట్లు లేకుండా ఎప్పటికప్పుడు రిపేర్లు చేయించాలి.
  3. స్విచ్ బోర్డకు రిపేర్లు చేయించాలి. స్విచ్ బోర్డులు 6 అడుగులకు పై ఎత్తులో ఉండేటట్లు చూడాలి.
  4.  విద్యార్థుల రక్షణకు కాంపాండ్ గొడ తగిన ఎత్తు కల్గి ఉండాలి.
  5. అంగ వైకల్యం గల పిల్లల కోసం ర్యాంప్ నిర్మించాలి.

AP Board 5th Class EVS Solutions 9th Lesson ప్రమాదాలు - ప్రథమ చికిత్స

II. సమాచార నైపుణ్యాలు – ప్రాజెక్టుల పని:

ప్రశ్న 3.
క్రింది మైండ్ మాప్ ను పూరించండి :

AP Board 5th Class EVS Solutions 9th Lesson ప్రమాదాలు - ప్రథమ చికిత్స2

జవాబు:
విధ్యార్ధి కృత్యము

ప్రశ్న 4.
“ప్రధమచికిత్స పెట్టె ” నమూనాను తయారు చేయండి?
జవాబు:
విధ్యార్ధి కృత్యము

AP Board 5th Class EVS Solutions 9th Lesson ప్రమాదాలు - ప్రథమ చికిత్స

బహుళైచ్ఛిక ప్రశ్నలు:

సరియైన సమాధానాలను గుర్తించండి:

ప్రశ్న 1.
పోలీస్ కు సంబంధించిన అత్యపవర సేవల నెంబరు
(A) 108
(B) 104
(C) 100
(D) 102
జవాబు:
(C) 100

ప్రశ్న 2.
క్రింది వాటిలో ప్రకృతి వైపరీత్యాలకు ఉదాహరణలు.
(A) భూకంపాలు
(B) తూఫానులు
(C) వరదలు
(D) పై వన్నీ
జవాబు:
(D) పై వన్నీ
ప్రశ్న 3.
భద్రతా చర్యలను పాటించటం ద్వారా……………….. ను నివారించవచ్చు. .
(A) భద్రత
(B) ప్రమాదాలు
(C) విషాదాలు
(D) ఏదీకాదు
జవాబు:
(B) ప్రమాదాలు

AP Board 5th Class EVS Solutions 9th Lesson ప్రమాదాలు - ప్రథమ చికిత్స

ప్రశ్న 4.
రోడ్డు దాటుటకు ………………..ను వాడాలి.
(A) ట్రాఫిక్ సిగ్నల్స్
(B) జీబ్రాక్రాసింగ్స్
(C) కూడలి
(D) ఏదీకాదు
జవాబు:
(B) జీబ్రాక్రాసింగ్స్

ప్రశ్న 5.
+ అనే సింబల్ ను……………….. పై చూడగలం
(A) ప్రధమచికిత్స పెట్టె
(B) అంబలెన్స్
(C) ఎ మరియు బి
(D) ఏదీకాదు
జవాబు:
(C) ఎ మరియు బి

ప్రశ్న 6.
AP Board 5th Class EVS Solutions 9th Lesson ప్రమాదాలు - ప్రథమ చికిత్స3
ఇది దేనిని సూచించును.
(A) కుడిచేతి మలుపు
(B) ఎడమచేతి మలుపు
(C) క్రాస్ రోడ్డు
(D) ఏదీకాదు
జవాబు:
(A) కుడిచేతి మలుపు

AP Board 5th Class EVS Solutions 9th Lesson ప్రమాదాలు - ప్రథమ చికిత్స

ప్రశ్న 7.
క్రింది వాటిపై ప్రయాణాలు మాదకరం
(A) ఫుట్ బోర్డు
(B) ఫుట్ పాత్
(C) జీబ్రాక్రాసింగ్
(D) ఏదీకాదు
జవాబు:
(A) ఫుట్ బోర్డు

ప్రశ్న 8.
AP Board 5th Class EVS Solutions 9th Lesson ప్రమాదాలు - ప్రథమ చికిత్స4
గుర్తు దేనిని సూచించును ………………..
(A) రోడ్డుకాస్
(B) స్కూల్
(C) పెడెస్టి యన్ క్రాసింగ్
(D) ఏదీకాదు
జవాబు:
(B) స్కూల్

ప్రశ్న 9.
నడవటానికి  ……………….. న ఉపయోగించాలి.
(A) ఫూట్ బోర్డు
(B) ఫూట్ పాత్
(C) జీ బ్రాక్రాసింగ్
(D) ఏదీకాదు
జవాబు:
(B) ఫూట్ పాత్

AP Board 5th Class EVS Solutions 9th Lesson ప్రమాదాలు - ప్రథమ చికిత్స

ప్రశ్న 10.
ప్రయాణం లో చేయకూడనిది ………………..
(A) అధికవేగం
(B) త్రాగి డ్రైవ్ చేయటం
(C) అధికబరువులతో ప్రయాణం
(D) పై అన్నీ
జవాబు:
(D) పై అన్నీ

AP 7th Class Science Notes Chapter 5 చలనం – కాలం

Students can go through AP Board 7th Class Science Notes 5th Lesson చలనం – కాలం to understand and remember the concept easily.

AP Board 7th Class Science Notes 5th Lesson చలనం – కాలం

→ మన నిత్య జీవితంలో చలనం అనేది ఒక సాధారణమైన అనుభవము.

→ వస్తువు ఒకచోట నుంచి మరొక చోటుకు ప్రయాణం చేసిన మార్గం యొక్క మొత్తం పొడవును దూరం అంటాం.

→ దూరమునకు ప్రాథమిక ప్రమాణం సెంటీ మీటర్.

→ వస్తువు పరిసరాల పరంగా తన స్థానాన్ని మార్చుకుంటే అది చలనంలో ఉన్నట్లు, అలాగే ఒక వస్తువు తన స్థానాన్ని మార్చుకోకపోతే అది విరామంలో ఉంది అని అంటాం.

→ వస్తువుల్లో చలనం మూడు రకాలుగా ఉంటుంది స్థానాంతర చలనం, భ్రమణ చలనం, డోలన చలనం.

→ స్పీడోమీటర్ వాహనాల యొక్క వడిని తెలుసుకొనుటకు ఉపయోగపడుతుంది.

→ వడి యొక్క ప్రమాణాలు మీటర్/ సెకండ్.

AP 7th Class Science Notes Chapter 5 చలనం – కాలం

→ సమాచార ప్రసారం మరియు నావిగేషన్లో కృత్రిమ ఉపగ్రహాలు ఉపయోగపడతాయి.

→ దూరానికి S.I ప్రమాణం మీటరు. కాని ఎక్కువ దూరాలను కొలవటానికి కిలోమీటరును ఉపయోగిస్తారు.

→ రెండు ప్రదేశాల మధ్యగల అతి తక్కువ దూరాన్ని ‘స్థానభ్రంశం’, అంటారు.

→ కొన్ని సందర్భములలో కాలం అనే పదం వాడకుండా త్వరగా, ఆలస్యంగా వంటి పదాలను వాడతాము.

→ చలనం మూడురకాలు అవి

  1. స్థానాంతర చలనం
  2. భ్రమణ చలనం
  3. డోలన చలనం.

→ ఒక వస్తువు ఏకకాలంలో స్థానాంతర మరియు భ్రమణ చలనం రెండింటిని కల్గి ఉండవచ్చు.
ఉదా : కదులుతున్న సైకిల్ చక్రం

→ ఒక వస్తువు సమాన కాల వ్యవధులలో సమాన దూరాలు ప్రయాణిస్తే దానిని సమచలనం అంటారు.
ఉదా : గడియారం ముల్లు.

→ నిర్ణీత కాలవ్యవధిలో ప్రయాణించిన దూరం ఆధారంగా ఒక వస్తువు యొక్క చలనం వేగంగా ఉన్నదో లేక నెమ్మదిగా ఉన్నదో మనం నిర్ణయించవచ్చు.

→ స్పీడోమీటరు వాహనం యొక్క వేగాన్ని, ఓడో మీటరు వాహనం ప్రయాణించిన దూరాన్ని కొలుస్తుంది.

→ 1 కిలోమీటర్ / గంట = 5/18 మీటర్/సెకన్.

→ దూరం – కాలం గ్రాఫ్ సరళరేఖ అయితే ఆ వస్తువు స్థిరమైన వడితో ప్రయాణిస్తుందని అర్థం.

→ రాకెట్ల ద్వారా ఉపగ్రహాలను ప్రవేశపెడతారు.

→ చలనము : ఒక వస్తువు యొక్క స్థానము పరిసరాల పరంగా మారినట్లయితే ఆ వస్తువు చలనంలో ఉంది అంటారు.

→ విరామ స్థితి : ఒక వస్తువు యొక్క స్థానము దాని పరిసరాల పరంగా మారకుండా ఒకేవిధంగా ఉన్నట్లయితే ఆ వస్తువు విరామస్థితిలో ఉందని అంటారు.

AP 7th Class Science Notes Chapter 5 చలనం – కాలం

→ దూరము : వస్తువు రెండు స్థానాల మధ్య ప్రయాణించిన మార్గం యొక్క మొత్తము పొడవును దూరము అంటారు. దూరం యొక్క ప్రాథమిక ప్రమాణం సెంటీమీటర్.

→ స్థానాంతర చలనం : చలించే వస్తువు యొక్క అన్ని భాగాలు, వస్తువుతో పాటుగా ఒకేదిశలో కదులుతూ ఉంటే అటువంటి చలనాన్ని స్థానాంతర చలనం అంటారు.

→ భ్రమణ చలనం : చలిస్తున్న వస్తువు యొక్క అన్ని బిందువులు ఒక స్థిరకేంద్రం లేదా అక్షం చుట్టూ వక్రరేఖా మార్గంలో చరిస్తూ ఉంటే ఆ చలనాన్ని భ్రమణ చలనం అంటారు.
ఉదా : బొంగరం

→ భ్రమణాక్షం : భ్రమణ చలనంలో వస్తువు స్థిరకేంద్రం గుండా పోయే ఊహారేఖ ‘భ్రమణ అక్షం’ అని అంటారు.

→ డోలన చలనం : ఒక స్థిరబిందువు ఆధారంగా ముందుకు వెనుకకూ ఒకే మార్గంలో ఉండే చలనాన్ని డోలన లేదా కంపన చలనం అంటారు.
ఉదా : ఊయల.

→ వడి : ఒక వస్తువు ఏకాంక కాలంలో ప్రయాణించిన మొత్తం దూరాన్ని వడి అంటారు.

→ సగటు వడి : వస్తువు ప్రయాణించిన మొత్తం దూరం మరియు పట్టిన కాలముల నిష్పత్తిని సగటు వడి అంటారు.

→ కాలం : రెండు సంఘటనల మధ్య కొలవదగిన వ్యవరిని కాలం అంటారు. కాలానికి ప్రమాణం సెకన్.

→ కృత్రిమ ఉపగ్రహం : మానవ నిర్మితమైన భూమి యొక్క కక్ష్యలోనికి ప్రయోగింపబడే వస్తువును కృత్రిమ ఉపగ్రహం అంటారు.

→ బలం : వస్తువును కదిలించేవి లేదా కదిలించటానికి ప్రయత్నించే దానిని బలం అంటారు.

→ స్థానభ్రంశం : రెండు ప్రదేశాల మధ్యగల అతి తక్కువ దూరాన్ని స్థానభ్రంశం అంటారు.

→ సమచలనం : ఒక వస్తువు సమాన కాలవ్యవధులలో సమాన దూరాలు ప్రయాణించినట్లయితే దానిని సమచలనం అంటారు.

AP 7th Class Science Notes Chapter 5 చలనం – కాలం

→ అసమచలనం : ఒక వస్తువు సమాన కాలవ్యవధులలో అసమాన దూరాలు ప్రయాణించినట్లయితే దానిని అసమచలనం అంటారు.

→ ఓడో మీటరు : వాహనం ప్రయాణించి ఓడో దూరాన్ని కిలోమీటర్లలో సూచించే పరికరము.

→ స్పీడోమీటరు : వాహన వడిని గంటకు కిలోమీటర్లలో చూపే పరికరము.

→ రాకెట్ : ఒక వస్తువును ముందుకు నెట్టటానికి అవసరమయ్యే బలాన్ని అందించే పరికరం రాకెట్.

AP 7th Class Science Notes Chapter 5 చలనం – కాలం 1