AP Inter 1st Year Civics Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం, పరిధి-ప్రాముఖ్యత

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Civics Study Material 1st Lesson రాజనీతిశాస్త్రం, పరిధి-ప్రాముఖ్యత Textbook Questions and Answers.

AP Inter 1st Year Civics Study Material 1st Lesson రాజనీతిశాస్త్రం, పరిధి-ప్రాముఖ్యత

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాజనీతిశాస్త్రాన్ని నిర్వచించి, ఆ శాస్త్ర పరిధిని వివరించండి. [Mar 19′,’17, ’16]
జవాబు:
పరిచయం: సాంఘిక శాస్త్రాలలో రాజనీతిశాస్త్రము ప్రధానమైనది. ప్రాచీన గ్రీకునగర రాజ్యాలైన ఏథెన్స్, స్పార్టా, గ్రీస్, రోమ్ లో క్రీ.పూ. 4వ శతాబ్దంలో ప్రారంభమైనది. ప్రముఖ గ్రీకు రాజనీతివేత్తలైన సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ రాజనీతిని తత్త్వశాస్త్రము నుండి వేరుచేసి ప్రత్యేక అధ్యయన శాస్త్రముగా అభివృద్ధి చేసిరి. అరిస్టాటిల్ రాజనీతిశాస్త్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాడు. అందువలన ఇతను “మొట్టమొదటి రాజనీతి శాస్త్రవేత్త”గాను, “రాజనీతి “శాస్త్ర పితామహుడు”గా కీర్తింపబడినాడు. అరిస్టాటిల్ తన ప్రఖ్యాత గ్రంథమైన “పాలిటిక్స్”లో రాజ్యము, ప్రభుత్వము గురించి అధ్యయనము చేసే శాస్త్రము రాజనీతిశాస్త్రమని పేర్కొనినాడు.

పద పరిణామము: “పాలిటిక్స్ అనే పదం “పోలిస్” (Polis) మరియు “పొలిటికస్” (Politicus) అనే లాటిన్ పదాల నుండి గ్రహించడమైనది. వీటి అర్థం నగర రాజ్యం (City State).

రాజనీతిశాస్త్ర నిర్వచనాలు (Definitions of Political Science): రాజనీతి శాస్త్రజ్ఞులు రాజనీతిశాస్త్రాన్ని వివిధ రకాలుగా నిర్వచించినారు. వాటిని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.

  1. సాంప్రదాయ నిర్వచనాలు
  2. ఆధునిక నిర్వచనాలు.

1. సాంప్రదాయక నిర్వచనాలు (Traditional Definitions): సాంప్రదాయకమైన నిర్వచనాలను మూడు ఉపవర్గాలుగా వర్గీకరించారు. వాటిని కింది విధంగా పేర్కొనవచ్చు.
i) రాజ్యం గురించి అధ్యయనం చేసేదే రాజనీతిశాస్త్రం (Study of the State): రాజనీతి తత్వవేత్తలైన జె.డబ్ల్యు. గార్నర్, ఆర్.జి.గెటిల్, అప్పాదొరై మరియు ఇతరులు రాజనీతిశాస్త్రం రాజ్యాన్ని గురించి అధ్యయనం చేస్తుందని వివరించారు.

  1. జె.డబ్ల్యు. గార్నర్: “రాజనీతిశాస్త్రం రాజ్యంతో ఆరంభమై రాజ్యంతోనే అంతమవుతుంది”.
  2. ఆర్.జి.గెటిల్: “రాజనీతిశాస్త్రమంటే రాజ్యం గతంలో ఎలా ఉండేదో పరిశోధించి, వర్తమాన కాలంలో ఎలా ఉన్నదో విశ్లేషించి, భవిష్యత్ కాలంలో ఎలా ఉండాలి అనే అంశంపై జరిపే రాజకీయ, నైతిక చర్చల సారాంశం”.

AP Inter 1st Year Civics Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం, పరిధి-ప్రాముఖ్యత

ii) ప్రభుత్వాన్ని గురించి అధ్యయనం చేసేదే రాజనీతిశాస్త్రం (Study of the Government): రాజనీతి తత్వవేత్తలైన స్టీఫెన్ లీకాక్, జాన్ రిచర్డు సీలీ ఇతరులు రాజనీతి శాస్త్రం ప్రభుత్వాన్ని గురించి అధ్యయనం చేస్తుందని తెలిపారు.

  1. స్టీఫెన్ లీకాక్: “రాజనీతిశాస్త్రమంటే ప్రభుత్వం గురించి అధ్యయనం చేసే శాస్త్రం”.
  2. జాన్ రిచర్డు సీలీ: “ప్రభుత్వ దృగ్విషయాన్ని గురించి పరిశోధన జరిపే శాస్త్రమే రాజనీతిశాస్త్రం”.

iii) రాజ్యం, ప్రభుత్వం గూర్చి అధ్యయనం చేసేది (Study of State and Government): రాజనీతి
తత్వవేత్తలైన పాలానెట్, ఆర్.ఎన్. గిల్ క్రిస్ట్, డిమాక్, ప్రొఫెసర్ కాట్లిన్ ఇతరులు రాజనీతిశాస్త్రం రాజ్యాన్ని మరియు ప్రభుత్వాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రంగా తెలియజేసారు.
“ప్రభుత్వాన్ని గురించి వివరిస్తుంది”:

  1. పాలానెట్: “రాజనీతిశాస్త్రమంటే రాజ్య మూలాధారాలు, ప్రభుత్వ సూత్రాల గురించి తెలియజేసే సామాజిక శాస్త్రంలోని ఒక విభాగం”.
  2. ఆర్.ఎన్.గిల్ క్రిస్ట్: ‘రాజ్యం, ప్రభుత్వ సూత్రాలను, అధ్యయనం చేసే శాస్త్రమే రాజనీతిశాస్త్రం’.
  3. కాట్లిన్: ‘ప్రభుత్వాంగాలు, వ్యక్తుల రాజకీయ కార్యకలాపాలను అధ్యయనం చేసే శాస్త్రమే రాజనీతిశాస్త్రం’.

2. ఆధునిక నిర్వచనాలు:

  • లాస్వెల్, కాప్లాన్: “రాజనీతిశాస్త్రం ఒక అనుభవాత్మక శాస్త్రంగా ఉంటూ అధికార రూపకల్పన, అధికారుల భాగస్వామ్యం గురించి అధ్యయనం చేస్తుంది”.
  • డేవిడ్ ఈస్టన్: “రాజనీతిశాస్త్రం సమాజం కోసం విలువలను (వస్తువులను) అధికారయుతంగా పంపిణీ చేయడానికి సంబంధించి అధ్యయనం చేస్తుంది”.

రాజనీతి శాస్త్రం-పరిధి: గత వంద సంవత్సరాలలో రాజనీతిశాస్త్ర పరిధి చాలా విస్తరించింది. ప్రస్తుతం ఉన్న ఆధునిక రాజ్యాల కార్యకలాపాలను వివరించే శాస్త్రముగా అభివృద్ధి చెందింది. వ్యక్తి స్వేచ్ఛను ఎలా కాపాడుకోవాలి, రాజ్యానికి, శాసనానికి ఎందుకు విధేయత చూపాలి అనే విషయాలను తెలియజేయును. వాస్తవానికి ప్రభుత్వ ప్రమేయం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో లేని మానవ కార్యకలాపాలుండవు. రాజనీతిశాస్త్రము మానవుని ప్రవర్తనను అధ్యయనం చేస్తుంది. అందువలన ప్రవర్తనావాదులు “సర్వత్రా వ్యాపించిన రాజకీయాలు” (Ubiquity of Politics) అని అంటారు.

రాజనీతిశాస్త్రములో చర్చించబడే విషయాలను ఈక్రింది విధంగా వివరించవచ్చును.
i) సమాజం, రాజ్యాలతో మానవునికి గల సంబంధాలు అధ్యయనం (Study of Man in relation to the Society and State): మానవుడు సంఘజీవి అని అరిస్టాటిల్ భావించాడు. మానవుడు తన ఆహారం, వస్త్రం, గృహం వంటి ప్రాథమిక అవసరాలను సమాజంలో తీర్చుకొంటాడు. రాజనీతిశాస్త్రం మానవుడికి, సమాజానికి మధ్య గల సంబంధాన్ని వివరిస్తుంది. అంతేకాకుండా సమాజం పుట్టుక, పరిణామం, ఉద్దేశ్యాలను కూడా అది తెలుపుతుంది. మానవుడు సమాజంలో ఏ విధంగా సర్దుబాటు చేసుకొని జీవిస్తాడు అనే అంశాన్ని పరిశీలిస్తుంది. ఈ సందర్భంలో రాజనీతిశాస్త్ర అధ్యయనం వ్యక్తికి, సమాజానికి ఎంతో ప్రాముఖ్యతగలదిగా ‘దిలాన్’ అనే పండితుడు భావించాడు. సమాజం పట్ల ఆధునిక మానవుడు సరైన దృక్పథాన్ని ఏర్పర్చుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. సమాజంలో మానవుడు | మమేకం అయినప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుందని వివరించారు.

వ్యక్తులకు, రాజ్యానికి మధ్య సరియైన సంబంధాన్ని నెలకొల్పే ప్రధాన అంశాలపైనే రాజనీతిశాస్త్ర అధ్యయనం కేంద్రీకృతమవుతుంది. రాజ్యంలోని రాజకీయ సంస్థల ప్రాముఖ్యతను వివరించడం ద్వారా అనేక సంక్లిష్ట సమస్యల పరిష్కారానికి ఈ శాస్త్రం దోహదపడుతుంది. ఈ సందర్భంలో అది రాజ్యాధికార పరిమితులు, వ్యక్తి స్వాతంత్ర్యాల అవధులు వంటి అనేక విషయాలను చర్చిస్తుంది.

ii) రాజ్య అధ్యయనం (Study of State): పాలానెట్, బ్లంటి షిల్లీ, గార్నర్ లాంటి రాజనీతి శాస్త్రవేత్తలు రాజనీతిశాస్త్రాన్ని రాజ్యానికి సంబంధించిన అధ్యయన శాస్త్రంగా పరిగణించారు. వారి ప్రకారం, రాజ్యమనేది రాజకీయ సంస్థగా వారు భావించారు. రాజ్యం ప్రతి వ్యక్తికీ అవసరమైనది. రాజ్యానికి, పౌరులకు మధ్యగల సన్నిహిత సంబంధాన్ని రాజనీతిశాస్త్రం తెలుపుతుంది. అలాగే రాజ్య అవతరణ సిద్ధాంతాలను వివరిస్తుంది. అంతేకాకుండా రాజ్యం స్వభావం విధులు, వివిధ రాజ్యాధికార సిద్ధాంతాలను పేర్కొంటుంది. రాజనీతిశాస్త్రం గతంలో రాజ్య అవతరణ అభివృద్ధి గురించి, వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ రాజకీయ సంస్థ, రాజకీయ భావాలను వర్ణించి విశ్లేషించేందుకు దోహదపడుతుందని ఈ సందర్భంలో ఆర్.జి. గెటిల్ పేర్కొన్నాడు.
i) వర్తమానంలో రాజ్యం పరిస్థితి ii) గతంలో రాజ్యపు ఉనికి iii) భవిష్యత్లో రాజ్యం ఎలా ఉండబోతుంది అనే మూడు విషయాల విశ్లేషణలు రాజనీతిశాస్త్రం పరిధిలో ఉంటాయి.

iii) ప్రభుత్వ అధ్యయనం (Study of Government): రాజనీతిశాస్త్ర పరిధిలో ప్రభుత్వం గురించిన అంశాలు ఉంటాయి. స్టీఫెన్ లీకాక్, జాన్ రిచర్డ్ సీలీ లాంటి కొందరు రాజనీతిశాస్త్రవేత్తలు ఈ శాస్త్ర పరిధిని ప్రభుత్వ అధ్యయనానికి పరిమితం చేశారు. వారి ప్రకారం, ఈ శాస్త్రం ప్రభుత్వం గురించి అధ్యయనం చేస్తుంది. ప్రభుత్వమనేది రాజ్యపు ప్రతినిధి అని, ప్రభుత్వం లేకుండా రాజ్యం ఉండదని వారు భావించారు. ప్రభుత్వం ద్వారానే రాజ్య ఆశయాలు నెరవేరతాయి. రాజ్య అభీష్టాన్ని ప్రభుత్వం రూపొందించి, వ్యక్తీకరించి, అమలులో ఉంచుతుంది. కొంతమంది వ్యక్తులు లేదా వ్యక్తుల సముదాయం రాజ్యం తరపున అధికారికంగా ఆజ్ఞలను జారీచేస్తారు. వారినే ప్రభుత్వంగా పరిగణించడమైంది. రాజనీతిశాస్త్రం, ప్రభుత్వానికి గల అర్థం, నిర్మితి, రకాలు స్వభావం, కర్తవ్యాలను అధ్యయనం చేస్తుంది. అలాగే ప్రభుత్వ అంశాల మధ్య సంబంధాన్ని చర్చిస్తుంది. రాజ్యం, ప్రభుత్వాల మధ్య వ్యత్యాసాలను గుర్తిస్తుంది.

iv) సంఘాలు, సంస్థల అధ్యయనం (Study of Associations and Institutions): వ్యక్తి జీవనాన్ని ప్రభావితం చేసే అనేక సంఘాలు, సంస్థలు ఉన్నాయి. ప్రతి వ్యక్తి రాజ్యంలోని భిన్న సంఘాలు, సంస్థలలో సభ్యుడిగా ఉంటాడు. రాజ్యం వ్యక్తుల రాజకీయ అవసరాలను తీర్చగా, సంఘాలు, సంస్థలనేవి వ్యక్తుల నైతిక, మత, సాంస్కృతిక, వైజ్ఞానిక, సాంకేతిక ప్రగతికి సంబంధించిన విషయాలపై సహాయంగా ఉంటాయి. అవి స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో తమ కార్యక్రమాలను నిర్వహిస్తుంటాయి. వ్యక్తులు ఆ సంస్థలలో తమ ప్రయోజనాలు లేదా ఉద్దేశ్యాలకు అనుగుణంగా చేరి వ్యక్తిత్వ వికాసానికై కృషి చేస్తారు. పైన పేర్కొన్న సంఘాలు, సంస్థలు వ్యక్తుల సంపూర్ణ వికాసంలో కీలకపాత్ర పోషిస్తాయి. వ్యక్తులు, కుటుంబం, కులం, రాజకీయ పార్టీలు, మతం వంటి అనేక సంస్థలనుండి ప్రయోజనాలను పొందుతారు. రాజనీతిశాస్త్రం వివిధ సంస్థల నిర్మాణం, స్వభావం మరియు విధులను గురించి వివరిస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం, పరిధి-ప్రాముఖ్యత

v) హక్కులు, బాధ్యతల అధ్యయనం (Study of Rights and Responsibilities): రాజనీతిశాస్త్ర పరిధి, వ్యక్తుల హక్కులకు, బాధ్యతలకు సంబంధించిన అధ్యయనంగా ఉంది. ప్రజాస్వామ్య రాజ్యాలలోని పౌరులు జీవించే హక్కు, స్వాతంత్య్రపు హక్కు, ఆస్తిహక్కు కొన్ని హక్కులను అనుభవిస్తారు. ఈ సందర్భంలో రాజనీతిశాస్త్రం హక్కుల నిర్వచనం, వర్గీకరణ, వివిధ సిద్ధాంతాలను ప్రస్తావిస్తుంది. అలాగే ప్రాథమిక హక్కులకు సంబంధించిన రాజ్యాంగ అంశాలపై దృష్టిని సారిస్తుంది. రాజ్యం పట్ల పౌరులు కొన్ని బాధ్యతలు కలిగి ఉంటారు. అటువంటి బాధ్యతలలో పన్నుల చెల్లింపు, శాసన విధేయతలాంటివి ఉంటాయి. రాజనీతిశాస్త్రం, పౌరుల హక్కుల బాధ్యతల ప్రాముఖ్యతను
వివరిస్తుంది.

vi) జాతీయ – అంతర్జాతీయ అంశాల అధ్యయనం (Study of National and International Issues): రాజనీతిశాస్త్ర పరిధిలో 20వ శతాబ్ది ప్రారంభం నుంచి ప్రాముఖ్యత వహించిన అంతర్జాతీయ సంబంధాలనేవి చేర్చబడినాయి. ఈ శాస్త్రం వర్ధమాన జాతి రాజ్యాలతో పాటుగా అంతర్జాతీయ రాజకీయాలను కూడా చర్చిస్తుంది. ఆధునిక రాజ్యాలు ఇతర రాజ్యాలతో ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వం పరిరక్షణకు సంబంధించిన అంశాలను ఈ శాస్త్రం వివరిస్తుంది. ప్రచ్ఛన్న యుద్ధం, ప్రాబల్య సమతౌల్యం, నిరాయుధీకరణ, దౌత్యనీతి వంటి విషయాలను అధ్యయనం చేస్తుంది. అలాగే అంతర్జాతీయ రాజకీయాలు, అంతర్జాతీయ న్యాయం, అంతర్జాతీయ సంస్థలు వంటి అనేక అంశాలు ఈ శాస్త్ర అధ్యయనంలో ఉంటాయి.

vii) శక్తి అధ్యయనం (Study of Power): 20వ శతాబ్ద కాలం నాటి ప్రవర్తనావాదులు రాజనీతిశాస్త్రాన్ని రాజకీయ శక్తి నిర్మాణం, దాని భాగస్వాములను గురించి అధ్యయనం చేసే శాస్త్రంగా భావించారు. ఈ శాస్త్రం శక్తి ఏ విధంగా దక్కించుకోబడి, వినియోగించబడుతుందనే విషయాన్ని వివరిస్తుందన్నారు. రాజకీయ సామాజికీకరణ రాజకీయ సంస్కృతి, రాజకీయ ప్రాతినిధ్యంలాంటి అనేక అంశాలు ఈ శాస్త్ర అధ్యయనంలో ఉన్నాయన్నారు. అంతేకాకుండా, రాజకీయ ప్రసరణ, ప్రయోజనాల వ్యక్తీకరణ, ప్రయోజనాల సమీకరణల వంటి లాంఛనప్రాయం కాని రాజకీయశక్తి దృక్కోణాలు కూడా ఈ శాస్త్ర అధ్యయనంలో భాగంగా ఉన్నాయన్నారు.

viii) ప్రభుత్వ విధానాల అధ్యయనం (Study of Public Policy): డేవిడ్ ఈస్టన్, ఆండర్సన్, ఛార్లెస్ లిండ్బామ్ లాంటి ఆధునిక రాజనీతిశాస్త్రవేత్తలు రాజనీతిశాస్త్రాన్ని విధానశాస్త్రమని వాదించారు. రాజనీతిశాస్త్రాన్ని ప్రభుత్వ విధాన రూపకల్పన, అమలు, మూల్యాంకనాలకు సంబంధించినదన్నారు. లాంఛనప్రాయమైన రాజకీయ నిర్మితులు, లాంఛనప్రాయంకాని రాజకీయ వర్గాల పాత్రను ఈ శాస్త్రం అధ్యయనం చేస్తుందన్నారు.

ఒక రాజ్యం యొక్క ప్రభుత్వ విధానాన్ని అధ్యయనం చేసే సందర్భంలో అంతర్జాతీయ సంబంధాలపరంగా దౌత్యపరమైన, ఆర్థిక, సైనికపరమైన అంశాలకు శాస్త్రీయ వ్యూహాల రూపకల్పన కీలకపాత్రను పోషిస్తుంది.

ప్రశ్న 2.
రాజనీతిశాస్త్ర అధ్యయన ప్రాముఖ్యతను చర్చించండి.
జవాబు:
పరిచయం: సాంఘిక శాస్త్రాలలో రాజనీతిశాస్త్రము ప్రధానమైనది. ప్రాచీన గ్రీకునగర రాజ్యాలైన ఏథెన్స్, స్పార్టా, గ్రీస్, రోమ్ లో క్రీ.పూ. 4వ శతాబ్దంలో ప్రారంభమైనది. ప్రముఖ గ్రీకు రాజనీతివేత్తలైన సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ రాజనీతిని తత్త్వశాస్త్రము నుండి వేరుచేసి ప్రత్యేక అధ్యయన శాస్త్రముగా అభివృద్ధి చేసిరి. అరిస్టాటిల్ రాజనీతిశాస్త్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాడు. అందువలన ఇతను “మొట్టమొదటి రాజనీతి శాస్త్రవేత్త”గాను, “రాజనీతి శాస్త్ర పితామహుడు”గా కీర్తింపబడినాడు. అరిస్టాటిల్ తన ప్రఖ్యాత గ్రంథమైన “పాలిటిక్స్”లో రాజ్యము, ప్రభుత్వము గురించి అధ్యయనము చేసే శాస్త్రము రాజనీతిశాస్త్రమని పేర్కొనినాడు.

పద పరిణామము: “పాలిటిక్స్ అనే పదం “పోలిస్” (Polis) మరియు “పొలిటికస్” (Politicus) అనే లాటిన్ పదాల నుండి గ్రహించడమైనది. వీటి అర్థం నగర రాజ్యం (City State).
నిర్వచనం:

  1. జె.డబ్ల్యు.గార్నర్: “రాజనీతి శాస్త్రం రాజ్యంతో ఆరంభమై రాజ్యంతోనే అంతమవుతుంది”.
  2. డేవిడ్ ఈస్టన్: “రాజనీతిశాస్త్రం సమాజం కోసం విలువలను (వస్తువులను) అధికారయుతంగా పంపిణీ చేయడానికి సంబంధించి అధ్యయనం చేస్తుంది”.

రాజనీతిశాస్త్రం ప్రాముఖ్యత (Significance of Political Science): రాజనీతిశాస్త్ర అధ్యయనం ఎంతో ప్రయోజనకరమైనది, విలువైనదిగా పేర్కొనవచ్చు. ఈ శాస్త్ర పరిజ్ఞానం పాలకులు, పాలితులు ఇరువురికీ ఎంతగానో ఆవశ్యకమైంది. ఈ శాస్త్ర ప్రాముఖ్యతను కింద పేర్కొన్న విధంగా విశ్లేషించవచ్చు.

1) రాజ్యం గురించి సమాచారం (Information about the State): రాజనీతిశాస్త్ర అధ్యయనం ప్రధానంగా రాజ్యానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అందించేందుకు ఉద్దేశించింది. రాజ్యం అవతరణ, దాని స్వభావం, నిర్మితి విధుల గురించి ఈ శాస్త్రం తెలుపుతుంది. రాజ్యానికి సంబంధించిన పరిజ్ఞానం ప్రతి ఒక్కరికీ ఎంతగానో అవసరం. రాజ్యాలలో రాజకీయ సంస్థల పాత్ర పట్ల సరియైన అవగాహన కలిగి ఉన్నప్పుడు వివిధ రాజకీయ సమస్యలకు పరిష్కారం కనుగొనే వీలుంటుంది. అలాగే తగిన సామాజిక అవగాహన కూడా ఎంతగానో అవసరమవుతుంది. ఈ విషయంలో రాజనీతిశాస్త్రం చాలినంత పరిజ్ఞానం, అవగాహనను వ్యక్తులకు అందిస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం, పరిధి-ప్రాముఖ్యత

2) ప్రభుత్వం – పరిపాలనల పరిజ్ఞానం (Knowledge of Government and Administration): రాజ్య కార్యకలాపాలను నిర్వహించే పరిపాలకులు, రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకై రాజనీతిశాస్త్ర పరిజ్ఞానం ఎంతగానో అవసరమవుతుంది. పరిపాలన యంత్రాంగం, సిబ్బంది, పాలన, ప్రజా సంబంధాల నిర్వహణ, పరిపాలన న్యాయం, సంప్రదింపులు వంటి అంశాల గురించి వారికి ఈ శాస్త్ర అధ్యయనం విశేషమైన అవగాహనను ఏర్పరుస్తుంది. అలాగే ఈ శాస్త్ర అధ్యయనం ద్వారా స్థానిక స్వపరిపాలన సంస్థలైన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, గ్రామ పంచాయితీలు లాంటి సంస్థలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవచ్చు.

3) ప్రజాస్వామ్య విలువల సమాచారం (Information about Democratic Values): రాజనీతిశాస్త్ర అధ్యయనం రాజ్యం, ప్రభుత్వం, జాతి, జాతీయత, రాజ్యాంగం ప్రజాస్వామ్యం, ఉదారవాదం, పెట్టుబడిదారీ విధానం, సామ్యవాదం, కమ్యూనిజంలాంటి అనేక రాజకీయ భావనలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది. ఈ భావనలు మానవ జీవనంలో అనేక రంగాలలో వాడుకలో ఉన్నాయి. వాటి సారం, స్వభావం, పరిధుల గురించి ఖచ్చితమైన అర్థాన్ని గురించి రాజనీతిశాస్త్రం తెలుపుతుంది. రాజనీతిశాస్త్రం రాజకీయ భావనలైన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం పట్ల మంచి పరిజ్ఞానం, అవగాహనలను ఏర్పరుస్తుంది.

4) ప్రజాస్వామ్య విజయం (Success of Democracy):’ వర్తమాన ప్రపంచంలో ప్రజాస్వామ్యం అత్యంత ప్రాముఖ్యతగల ప్రభుత్వ విధానంగా రూపొందింది. అది “ప్రపంచ గొప్ప రాజకీయ మతం” గా భావించబడింది. ఈ విధానంలో ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకోవడం, ఆ ప్రతినిధులు ప్రజలను పరిపాలించడం జరుగుతుంది.
రాజనీతిశాస్త్రం ఓటుహక్కు ప్రాముఖ్యతను వివరిస్తుంది. ప్రజాస్వామ్య భావాలు, ఆదర్శాలను సామాన్య వ్యక్తులకు నేర్పుతుంది. ప్రజాస్వామ్య విజయానికి ఈ శాస్త్రం ఎంతగానో ఉపకరిస్తుంది. ఈ శాస్త్ర అధ్యయనం పౌరులలో ప్రజాస్వామ్య విలువలను, వివేకాన్ని, దేశభక్తిని మరియు అప్రమత్తతను ఏర్పరుస్తుంది.

5) హక్కులు, బాధ్యతల పట్ల అవగాహన (Awareness about Rights and Responsibilities): రాజనీతిశాస్త్ర అధ్యయనం ప్రజలలో హక్కులు, బాధ్యతల పట్ల చక్కని అవగాహనను పెంపొందిస్తుంది. ఈ శాస్త్ర అధ్యయనం ద్వారా పౌరులు తమ హక్కులు, బాధ్యతలను గుర్తుంచుకొని, ఆ రెండింటి మధ్య పరస్పర సంబంధాన్ని తెలుసుకోగలుగుతారు. ప్రజాస్వామ్య ప్రభుత్వ విజయం హక్కులు, విధుల మధ్యగల సంబంధాన్ని సక్రమంగా అర్థం చేసుకొనే అంశంపైనే ఆధారపడి ఉంటుంది.

6) మంచి పౌరసత్వ గుణాల బోధన (Teaching the qualities of good citizenship): రాజనీతి శాస్త్ర అధ్యయనం మంచి పౌరసత్వాన్ని పొందేందుకు, జాతీయ సమైక్యతను సాధించేందుకు ఎంతో అవసరం. ఈ శాస్త్ర అధ్యయనం పౌరులకు జాతీయ ఆశయాలు, లక్ష్యాలను గుర్తుచేస్తుంది. మంచి పౌరుడనేవాడు చట్టాలు ఎలా రూపొందించబడి అమలు చేయబడతాయనే విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. రాజనీతిశాస్త్రం మంచి పౌరసత్వపు వివిధ దృక్కోణాలను, ప్రయోజనాలను బోధిస్తుంది. పౌరులను ఆదర్శపౌరులుగా తీర్చిదిద్దేందుకు శిక్షణ ఇస్తుంది. విధేయత, సామాజిక సేవ, నిస్వార్థంలాంటి మంచి పౌరసత్వ గుణాలను పెంపొందిస్తుంది. పౌరులు సమాజం, రాజ్యం పట్ల బాధ్యత కలిగి ఉండాల్సిన అవసరాన్ని తెలుపుతుంది. మొత్తం మీద వ్యక్తుల మూర్తిమత్వాన్ని పెంపొందిస్తుంది.

7) ప్రపంచ వ్యవహారాల పరిజ్ఞానం (Knowledge of World Affairs): రాజనీతిశాస్త్ర అధ్యయనం వలన వ్యక్తులకు ప్రపంచ వ్యవహారాల పరిజ్ఞానం పెంపొందుతుంది. వ్యక్తుల మేధోపరమైన పరిధి విస్తృతమవుతుంది. సమకాలీన ప్రపంచ వ్యవహారాలను పరిశీలించి అవగాహన చేసుకొనుటకు ఈ శాస్త్ర అధ్యయనం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. అంతర్జాతీయ రాజకీయాలకు సంబంధించిన అనేక దృగ్విషయాలను అర్థం చేసుకొనేందుకు అవసరమైన ఆలోచన విధానం, విశాలదృష్టి వంటి లక్షణాలను వ్యక్తులకు పెంపొందిస్తుంది.

8) అంతర్జాతీయ సంస్థల పరిజ్ఞానం (Knowledge of International Organisations): రాజనీతి శాస్త్ర అధ్యయనం అంతర్జాతీయవాద స్ఫూర్తిని పెంపొందిస్తుంది. ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ సంస్థల గురించి పరిజ్ఞానాన్ని అందిస్తుంది. ఈనాటి ప్రపంచ రాజ్యాల మధ్య ఉత్పన్నమయ్యే ఉద్రిక్తతలను తొలగించే విషయంలో ఈ శాస్త్ర అధ్యయనం ఎంతగానో అవసరమవుతుంది. నిరాయుధీకరణ ఆవశ్యతకను గట్టిగా వాంఛిస్తుంది. అంతేకాకుండా ఈ శాస్త్రం పౌరులకు ప్రచ్ఛన్నయుద్ధం, వలసవాదం, సామ్రాజ్యవాదం, నయావలసవాదాల వల్ల ఏర్పడే ప్రమాదాలను తెలిపి, ప్రపంచశాంతి స్థాపన ఆవశ్యకతను వివరిస్తుంది.

9) రాజకీయ అవగాహనను పెంపొందించడం (Developing Political Awareness): రాజనీతిశాస్త్ర అధ్యయనం ద్వారా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం వంటి రాజకీయ ఆదర్శాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ పొందవచ్చు. అలాగే ఈ శాస్త్ర అధ్యయనం ద్వారా ఫాసిజం, సామ్యవాదం, కమ్యూనిజం లాంటి కొన్ని రాజకీయ భావజాలాల గురించి సమగ్రమైన అవగాహనను పొందవచ్చు. భావజాలాల గురించి ప్రజలలో ఉండే అజ్ఞానాన్ని పారద్రోలవచ్చు. ఈ శాస్త్ర అధ్యయనం అంతిమంగా ప్రజలలో రాజకీయ అవగాహనను పెంపొందిస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం, పరిధి-ప్రాముఖ్యత

10) సహకారం, సహనం, ఆవశ్యకతల వివరణ (Explaining the need for Co-operation and Toleration): అనేక రాజ్యాలలో జాతీయ సమైక్యత అత్యంత ప్రాముఖ్యత గల అంశంగా గుర్తించబడింది. ఈ రాజ్యాలలో మతతత్వం, భాషాతత్వం, ఉప, జాతీయ, ప్రాంతీయభావాల వంటి ఆటంకాలు జాతీయ సమైక్యతకు సవాళ్ళుగా పరిణమించాయి. ఈ సందర్భంలో రాజనీతిశాస్త్ర అధ్యయనం సర్దుబాటు, సహకారం, సహనం వంటి అంశాల ఆవశ్యకతను బోధిస్తుంది. ప్రజలలో సంకుచిత మనస్తత్వం, స్వార్ధ దృక్పథాలను తొలగిస్తుంది. వర్గ సంబంధమైన ఆసక్తులను అధిగమించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతుంది. సమాజంలో ప్రతి ఒక్కరూ పరస్పర గౌరవంతో జీవించాల్సిన అవసరాన్ని వివరిస్తుంది.

ప్రశ్న 3.
రాజనీతిశాస్త్రాన్ని నిర్వచించి, ఆ శాస్త్ర స్వభావాన్ని పేర్కొనండి.
జవాబు:
పరిచయం: సాంఘిక శాస్త్రాలలో రాజనీతి శాస్త్రము ప్రధానమైనది. ప్రాచీన గ్రీకునగర రాజ్యాలైన ఏథెన్స్, స్పార్టా, గ్రీస్, రోమ్ లో క్రీ.పూ. 4వ శతాబ్దంలో ప్రారంభమైనది. ప్రముఖ గ్రీకు రాజనీతివేత్తలైన సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ రాజనీతిని తత్త్వశాస్త్రము నుండి వేరుచేసి ప్రత్యేక అధ్యయన శాస్త్రముగా అభివృద్ధి చేసిరి. అరిస్టాటిల్ రాజనీతిశాస్త్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాడు. అందువలన ఇతను “మొట్టమొదటి రాజనీతి శాస్త్రవేత్త”గాను, “రాజనీతి శాస్త్ర పితామహుడు”గా కీర్తింపబడినాడు. అరిస్టాటిల్ తన ప్రఖ్యాత గ్రంథమైన “పాలిటిక్స్”లో రాజ్యము, ప్రభుత్వము గురించి అధ్యయనము చేసే శాస్త్రము రాజనీతిశాస్త్రమని పేర్కొనినాడు.

పద పరిణామము: “పాలిటిక్స్ అనే పదం “పోలిస్” (Polis) మరియు “పొలిటికస్” (Politicus) అనే లాటిన్ పదాల నుండి గ్రహించడమైనది. వీటి అర్థం నగర రాజ్యం (City State).

నిర్వచనం:
1. జె.డబ్ల్యు. గార్నర్: “రాజనీతిశాస్త్రం రాజ్యంతో ఆరంభమై రాజ్యంతోనే అంతమవుతుంది”.

2. డేవిడ్ ఈస్టన్: “రాజనీతిశాస్త్రం సమాజం కోసం విలువలను (వస్తువులను) అధికారయుతంగా పంపిణీ చేయడానికి సంబంధించి అధ్యయనం చేస్తుంది”.

రాజనీతిశాస్త్ర స్వభావం (Nature of Political Science): రాజనీతిశాస్త్ర స్వభావం విషయంలో రాజనీతి శాస్త్రజ్ఞుల మధ్య కొంత వివాదముంది. కొంతమంది రాజనీతిశాస్త్రం ఒక శాస్త్రమని, మరికొందరు ఇది ఒక ‘కళ” అని అంటారు. అరిస్టాటిల్, బ్లంటే లీ, బోడిన్, హాబ్స్, జెల్లినిక్, మాంటెస్క్యూ, సిడ్జివిక్ మొదలైనవారు రాజనీతిశాస్త్రాన్ని ఒక శాస్త్రమని పేర్కొనగా మరోవైపు బార్కర్, కొలిన్, మెయిట్లాండ్, జె.యస్. మిల్ రాజనీతిశాస్త్రం ఒక కళ అని పేర్కొన్నారు.
1) రాజనీతి శాస్త్రం ఒక శాస్త్రమా ? (Is Political Science a Science ?): రాజనీతిశాస్త్రాన్ని క్రింది అంశాల ప్రాతిపదికగా పరిగణించవచ్చు.

  1. రాజనీతిశాస్త్రాన్ని ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయవచ్చు.
  2. రాజకీయాలలో ప్రయోగాత్మకతకు అవకాశం ఉంది.
  3. ఇతర సామాజిక శాస్త్రాల వలె నిరపేక్షమైన, విశ్వవ్యాప్తమైన చట్టాలను కలిగి ఉంటుంది.
  4. రాజకీయాలలో అంచనాలను సులభంగా వర్తింపచేయవచ్చు.
  5. రాజనీతిశాస్త్ర అధ్యయనంలో నిర్దిష్టమైన సార్వత్రిక ఆమోదిత సూత్రాలను పొందుపరచవచ్చు.
  6. రాజనీతిశాస్త్రం శాస్త్రీయ స్వభావాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల ఈ శాస్త్ర అధ్యయనంలో శాస్త్రీయమైన సూత్రాలను పొందుపరచటం జరిగింది.
  7. రాజనీతిశాస్త్రం ఇతర శాస్త్రాల వలె కార్యకారణ సంబంధాన్ని అమలు చేసేందుకు అవకాశమిస్తుంది.

2) రాజనీతి శాస్త్రం ఒక కళా ? (Is Political Science an Art ?): రాజనీతిశాస్త్రాన్ని క్రింది అంశాలను బట్టి ఒక కళగా భావించవచ్చు.

  1. రాజనీతిశాస్త్రం, భౌతికశాస్త్రాలకు భిన్నంగా నిరపేక్షమైన, విశ్వవ్యాప్త చట్టాలను కలిగి ఉండదు.
  2. రాజనీతిశాస్త్రంలో కొన్ని దృగ్విషయాలను సమయం సందర్భాన్ని బట్టి వివిధ రకాలుగా వ్యాఖ్యానించి అధ్యయనం చేయవచ్చు. అందువల్ల ఈ శాస్త్రం వివిధ భావనల వ్యాఖ్యానాలకు సంబంధించి ఏకరూపతను కలిగి ఉండదు.
  3. అన్ని శాస్త్రాలకు ప్రాతిపదికగా పరిగణించే కార్యకారణ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా అనుసరించేందుకు ఈ శాస్త్రం అవకాశమివ్వదు.
  4. రాజనీతిశాస్త్రం పరిణామాత్మక స్వభావాన్ని కలిగి ఉండదు. ఎందుకంటే ఈ శాస్త్రంలోని భావనలు క్రమాను గతంగా నిరంతర ప్రాతిపదికపై రూపొందించబడి అభివృద్ధి చెందలేదు.
  5. రాజనీతిశాస్త్రంలో శాస్త్రీయ పద్ధతులైన పరిశీలన, ప్రయోగాత్మకతలు పాటించబడవు.
  6. రాజనీతిశాస్త్రంలోని వివిధ అధ్యయన అంశాల వివరణలలో సంపూర్ణమైన నిష్పాక్షికత, ప్రత్యేకత గోచరించవు.
  7. రాజనీతిశాస్త్రం ఖచ్చితమైన ఫలితాలకు అవకాశమివ్వదు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాజనీతిశాస్త్ర సాంప్రదాయక నిర్వచనాల గురించి రాయండి.
జవాబు:
సాంప్రదాయకమైన నిర్వచనాలను మూడు ఉప వర్గాలుగా వర్గీకరించారు. వాటిని క్రింది విధంగా పేర్కొనవచ్చు. i) రాజ్యం గురించి అధ్యయనం చేసేదే రాజనీతిశాస్త్రం (Study of the State): రాజనీతి తత్వవేత్తలైన జె.డబ్ల్యు గార్నర్, ఆర్.జి.గెటిల్, అప్పాదొరై మరియు ఇతరులు రాజనీతిశాస్త్రం రాజ్యాన్ని గురించి అధ్యయనం చేస్తుందని
వివరించారు.

  1. జె.డబ్ల్యు. గార్నర్: “రాజనీతిశాస్త్రం రాజ్యంతో ఆరంభమై రాజ్యంతోనే అంతమవుతుంది”.
  2. ఆర్.జి.గెటిల్: “రాజనీతిశాస్త్రమంటే రాజ్యం గతంలో ఎలా ఉండేదో పరిశోధించి, వర్తమాన కాలంలో ఎలా ఉన్నదో విశ్లేషించి, భవిష్యత్ కాలంలో ఎలా ఉండాలి అనే అంశంపై జరిపే రాజకీయ, నైతిక చర్చల సారాంశం”.
  3. అప్పాదొరై: “రాజ్య మనుగడ, అభివృద్ధికి అవసరమైన పరిస్థితుల గురించి అధ్యయనం చేసే శాస్త్రమే” రాజనీతి శాస్త్రం.

AP Inter 1st Year Civics Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం, పరిధి-ప్రాముఖ్యత

ii) ప్రభుత్వాన్ని గురించి అధ్యయనం చేసేదే రాజనీతిశాస్త్రం (Study of the Government): రాజనీతి తత్వవేత్తలైన స్టీఫెన్ లీకాక్, జాన్ రిచర్డ్ సీలి, ఇతరులు రాజనీతిశాస్త్రం ప్రభుత్వాన్ని గురించి అధ్యయనం చేస్తుందని తెలిపారు.

  1. స్టీఫెన్ లీకాక్: “రాజనీతిశాస్త్రమంటే ప్రభుత్వం గురించి అధ్యయనం చేసే శాస్త్రం”.
  2. జాన్ రిచర్డ్ సీలీ: “ప్రభుత్వ దృగ్విషయాన్ని గురించి పరిశోధన జరిపే శాస్త్రమే రాజనీతిశాస్త్రం”.

iii) రాజ్యం, ప్రభుత్వం గురించి అధ్యయనం చేసేది (Study of State and Government): రాజనీతి తత్వవేత్తలైన పాల్ జానెట్, ఆర్.ఎన్.గిల్ క్రిస్ట్, డిమాక్, ప్రొఫెసర్ కాట్లిన్, ఇతరులు రాజనీతి శాస్త్రం రాజ్యాన్ని మరియు ప్రభుత్వాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రంగా తెలియజేసారు.
“ప్రభుత్వాన్ని గురించి వివరిస్తుంది”

  1. పాల్ జానెట్: “రాజనీతిశాస్త్రమంటే రాజ్య మూలాధారాలు, ప్రభుత్వ సూత్రాల గురించి తెలియజేసే సామాజిక శాస్త్రంలోని ఒక విభాగం”.
  2. ఆర్.ఎన్.గిల్ క్రిస్ట్: “రాజ్యం, ప్రభుత్వ సూత్రాలను అధ్యయనం చేసే శాస్త్రమే రాజనీతిశాస్త్రం”.
  3. ప్రొఫెసర్ కాట్లిన్: “ప్రభుత్వాంగాలు, వ్యక్తుల రాజకీయ కార్యకలాపాలను అధ్యయనం చేసే శాస్త్రమే రాజనీతిశాస్త్రం”.

ప్రశ్న 2.
రాజనీతిశాస్త్రపు ఆధునిక నిర్వచనాలు ఏవి ?
జవాబు:
ఆధునిక రాజనీతి శాస్త్రజ్ఞుల దృష్టిలో సాంప్రదాయక నిర్వచనాలు చాలా సంకుచితంగాను, న్యాయ, సంస్థాగత దృక్పథంతో కూడి ఉన్నవని వారి అభిప్రాయం. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత రాజనీతిశాస్త్ర దృష్టి రాజకీయ సంస్థల నుంచి రాజకీయ ప్రక్రియల వైపు మళ్ళింది. ప్రవర్తనావాద దృక్పథం వాడుకలోకి వచ్చింది. దీనివల్ల రాజనీతి శాస్త్ర అధ్యయనంలో పెనుమార్పులు సంభవించాయి. పౌరుల రాజకీయ ప్రవర్తనా అధ్యయన ప్రాముఖ్యత పెరిగింది. ఆధునిక రాజనీతిశాస్త్రజ్ఞులు, రాజనీతిశాస్త్రాన్ని ఒక విధాన శాస్త్రంగా పేర్కొన్నారు. అంతేకాకుండా, రాజనీతిశాస్త్ర అధ్యయనంలో శక్తిని ఒక ముఖ్య అంశంగా వివరించారు.
అవి:
మొత్తానికి ఆధునిక రాజనీతిశాస్త్రజ్ఞులు రాజనీతిశాస్త్ర నిర్వచనాలను రెండు ఉప తరగతులుగా విభజించారు.
i) రాజనీతిశాస్త్రం – శక్తి అధ్యయనం (Study of Power):

  1. లాస్వెల్, కాప్లాన్: “రాజనీతిశాస్త్రం ఒక అనుభవాత్మక శాస్త్రంగా ఉంటూ అధికార రూపకల్పన, అధికారుల భాగస్వామ్యం గురించి అధ్యయనం చేస్తుంది”.
  2. విలియం.ఎ.రాబ్సన్: “రాజనీతిశాస్త్రం ప్రధానంగా సమాజంలో అధికారానికి సంబంధించినది”.

ii) రాజనీతిశాస్త్రం – విలువల పంపకాన్ని అధ్యయనం చేస్తుంది (Study of allocation of values):

  1. డేవిడ్ ఈస్టన్: “రాజనీతిశాస్త్రం సమాజం కోసం విలువలను (వస్తువులను) అధికారయుతంగా పంపిణీ చేయడానికి సంబంధించి అధ్యయనం చేస్తుంది”.
  2. హిల్మన్: “రాజనీతిశాస్త్రం ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఏమి, ఎలా పొందుతారో అధ్యయనం చేసే శాస్త్రం”.
    పైన పేర్కొన్న ఆధునిక నిర్వచనాలు రాజకీయ’ సంస్థల అధికారాలు, ఇతర కార్యకలాపాలను మూల్యాంకనం చేసే అంశాల అధ్యయనంగా రాజనీతిశాస్త్రాన్ని పరిగణించారని మనం చెప్పవచ్చు.

ప్రశ్న 3.
రాజనీతిశాస్త్ర పరిధిలోని ఏవైనా మూడు అంశాలను పేర్కొనండి.
జవాబు:
రాజనీతిశాస్త్రం – పరిధి:
i) సమాజం, రాజ్యాలతో మానవునికి గల సంబంధాలు అధ్యయనం (Study of Man in relation to the Society and State): మానవుడు సంఘజీవి అని అరిస్టాటిల్ భావించాడు. మానవుడు తన ఆహారం, వస్త్రం, గృహం వంటి ప్రాథమిక అవసరాలను సమాజంలో తీర్చుకొంటాడు. రాజనీతిశాస్త్రం మానవుడికి, సమాజానికి మధ్య గల సంబంధాన్ని వివరిస్తుంది. అంతేకాకుండా సమాజం పుట్టుక, పరిణామం, ఉద్దేశ్యాలను కూడా అది తెలుపుతుంది. మానవుడు సమాజంలో ఏ విధంగా సర్దుబాటు చేసుకొని జీవిస్తాడు అనే అంశాన్ని పరిశీలిస్తుంది. ఈ సందర్భంలో రాజనీతిశాస్త్ర అధ్యయనం వ్యక్తికి, సమాజానికి ఎంతో ప్రాముఖ్యతగలదిగా ‘దిలాన్’ అనే పండితుడు భావించాడు. సమాజం పట్ల ఆధునిక మానవుడు సరైన దృక్పథాన్ని ఏర్పర్చుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. సమాజంలో మానవుడు మమేకం అయినప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుందని వివరించారు.

AP Inter 1st Year Civics Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం, పరిధి-ప్రాముఖ్యత

వ్యక్తులకు, రాజ్యానికి మధ్య సరియైన సంబంధాన్ని నెలకొల్పే ప్రధాన అంశాలపైనే రాజనీతిశాస్త్ర అధ్యయనం కేంద్రీకృతమవుతుంది. రాజ్యంలోని రాజకీయ సంస్థల ప్రాముఖ్యతను వివరించడం ద్వారా అనేక సంక్లిష్ట సమస్యల పరిష్కారానికి ఈ శాస్త్రం దోహదపడుతుంది. ఈ సందర్భంలో అది రాజ్యాధికార పరిమితులు, వ్యక్తి స్వాతంత్ర్యాల అవధులు వంటి అనేక విషయాలను చర్చిస్తుంది.

ii) రాజ్య అధ్యయనం (Study of State): పాలానెట్, బ్లంటి షిల్లీ, గార్నర్ లాంటి రాజనీతిశాస్త్రవేత్తలు రాజనీతిశాస్త్రాన్ని రాజ్యానికి సంబంధించిన అధ్యయన శాస్త్రంగా పరిగణించారు. వారి ప్రకారం, రాజ్యమనేది రాజకీయ సంస్థగా వారు భావించారు. రాజ్యం ప్రతి వ్యక్తికీ అవసరమైనది. రాజ్యానికి, పౌరులకు మధ్యగల సన్నిహిత సంబంధాన్ని రాజనీతిశాస్త్రం తెలుపుతుంది. అలాగే రాజ్య అవతరణ సిద్ధాంతాలను వివరిస్తుంది. అంతేకాకుండా రాజ్యం స్వభావం విధులు, వివిధ రాజ్యాధికార సిద్ధాంతాలను పేర్కొంటుంది. రాజనీతిశాస్త్రం గతంలో రాజ్య అవతరణ అభివృద్ధి గురించి, వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ రాజకీయ సంస్థ, రాజకీయ భావాలను వర్ణించి విశ్లేషించేందుకు దోహదపడుతుందని ఈ సందర్భంలో ఆర్.జి.గెటిల్ పేర్కొన్నాడు.

  • వర్తమానంలో రాజ్యం పరిస్థితి
  • గతంలో రాజ్యపు ఉనికి
  • భవిష్యత్లో రాజ్యం ఎలా ఉండబోతుంది అనే మూడు విషయాల విశ్లేషణలు రాజనీతిశాస్త్రం పరిధిలో ఉంటాయి.

iii) ప్రభుత్వ అధ్యయనం (Study of Government): రాజనీతిశాస్త్ర పరిధిలో ప్రభుత్వం గురించిన అంశాలు ఉంటాయి. స్టీఫెన్ లీకాక్, జాన్ రిచర్డ్ సీలీ లాంటి కొందరు రాజనీతిశాస్త్రవేత్తలు ఈ శాస్త్ర పరిధిని ప్రభుత్వ అధ్యయనానికి పరిమితం చేశారు. వారి ప్రకారం, ఈ శాస్త్రం ప్రభుత్వం గురించి అధ్యయనం చేస్తుంది. ప్రభుత్వమనేది రాజ్యపు ప్రతినిధి అని, ప్రభుత్వం లేకుండా రాజ్యం ఉండదని వారు భావించారు. ప్రభుత్వం ద్వారానే రాజ్య ఆశయాలు నెరవేరతాయి. రాజ్య అభీష్టాన్ని ప్రభుత్వం రూపొందించి, వ్యక్తీకరించి, అమలులో ఉంచుతుంది. కొంతమంది వ్యక్తులు లేదా వ్యక్తుల సముదాయం రాజ్యం తరపున అధికారికంగా ఆజ్ఞలను జారీచేస్తారు. వారినే ప్రభుత్వంగా పరిగణించడమైంది. రాజనీతిశాస్త్రం, ప్రభుత్వానికి గల అర్థం, నిర్మితి, రకాలు స్వభావం, కర్తవ్యాలను అధ్యయనం చేస్తుంది. అలాగే ప్రభుత్వ అంశాల మధ్య సంబంధాన్ని చర్చిస్తుంది. రాజ్యం, ప్రభుత్వాల మధ్య వ్యత్యాసాలను గుర్తిస్తుంది.

ప్రశ్న 4.
ప్రభుత్వానికి సంబంధించి రాజనీతిశాస్త్ర పరిధిని వర్ణించండి.
జవాబు:
రాజనీతిశాస్త్ర పరిధిలో ప్రభుత్వం గురించిన అంశాలు ఉంటాయి. స్టీఫెన్ లీకాక్, జాన్ రిచర్డ్ సీలీ లాంటి కొందరు రాజనీతిశాస్త్రవేత్తలు ఈ శాస్త్ర పరిధిని ప్రభుత్వ అధ్యయనానికి పరిమితం చేశారు. వారి ప్రకారం, ఈ శాస్త్రం ప్రభుత్వం గురించి అధ్యయనం చేస్తుంది. ప్రభుత్వమనేది రాజ్యపు ప్రతినిధి అని, ప్రభుత్వం లేకుండా రాజ్యం ఉండదని వారు భావించారు. ప్రభుత్వం ద్వారానే రాజ్య ఆశయాలు నెరవేరతాయి. రాజ్య అభీష్టాన్ని ప్రభుత్వం రూపొందించి, వ్యక్తీకరించి, అమలులో ఉంచుతుంది. కొంతమంది వ్యక్తులు లేదా వ్యక్తుల సముదాయం రాజ్యం తరపున అధికారికంగా ఆజ్ఞలను జారీచేస్తారు. వారినే ప్రభుత్వంగా పరిగణించడమైంది. రాజనీతిశాస్త్రం, ప్రభుత్వానికి గల అర్థం, నిర్మితి, రకాలు స్వభావం, కర్తవ్యాలను అధ్యయనం చేస్తుంది. అలాగే ప్రభుత్వ అంశాల మధ్య సంబంధాన్ని చర్చిస్తుంది. రాజ్యం, ప్రభుత్వాల మధ్య వ్యత్యాసాలను గుర్తిస్తుంది.

ప్రశ్న 5.
“రాజనీతిశాస్త్రమనేది రాజ్యపు గతం, వర్తమాన, భవిష్యత్ విషయాల అధ్యయనం” విశ్లేషించండి.
జవాబు:
వర్తమానంలో రాజ్యం పరిస్థితి, గతంలో రాజ్యపు ఉనికి మరియు భవిష్యత్లో రాజ్యం ఎలా ఉండబోతుంది అనే మూడు విషయాల విశ్లేషణలు రాజనీతిశాస్త్ర పరిధిలో ఉంటాయి. వాటిని క్రింది విధంగా వివరించవచ్చు.
i) వర్తమానంలో రాజ్యం పరిస్థితి (Study of State in the Present): రాజనీతిశాస్త్రం వర్తమాన కాలంలో రాజ్యం పరిస్థితిని చర్చిస్తుంది. రాజ్యం, అర్థం, స్వభావం, ఉద్దేశ్యం, అభివృద్ధి, పనితీరులను వివరిస్తుంది. అలాగే రాజ్య అవతరణ సిద్ధాంతాలను అధ్యయనం చేస్తుంది. ప్రజాభిప్రాయం, రాజకీయ పార్టీలు, ప్రభావ వర్గాలు ఏ విధంగా రాజకీయ అధికార సాధనకు ప్రభుత్వ విధానాల ప్రభావానికి కృషి చేస్తాయనే విషయాలను తెలుపుతుంది.

ii) గతంలో రాజ్యపు ఉనికి (Study of State in the Past): రాజనీతిశాస్త్రం రాజ్యవ్యవస్థ అవతరణ, దాని పరిణామ క్రమాలను వివరిస్తుంది. అలాగే రాజ్యంలోని వివిధ రాజకీయ సంస్థల గురించి చర్చిస్తుంది. రాజ్య ఆవిర్భావం, వికాసాలను ప్రభావితం చేసిన వివిధ అంశాలను అధ్యయనం చేస్తుంది. ఇటువంటి చారిత్రక అధ్యయనం ఒక్క రాజనీతిశాస్త్రంలోనే సాధ్యమవుతుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం, పరిధి-ప్రాముఖ్యత

iii) భవిష్యత్లో రాజ్యం ఎలా ఉంటుంది ? (Study of State in Future): ఆదర్శ రాజ్య సూత్రాలను, భావనలను నిర్ణయించే అంశాలను రాజనీతిశాస్త్రం అధ్యయనం చేస్తుంది. అదే విధంగా, రాజ్య పరిధిలో ఆచరణలో ఉన్న వివిధ రాజకీయ సంస్థలను గురించి చర్చిస్తుంది. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో రాజకీయ సంస్థల ప్రమాణాలను, కార్యకలాపాలను మెరుగుపరచేందుకు అనుసరించాల్సిన మార్గాలను రాజనీతిశాస్త్రం సూచిస్తుంది. మొత్తం మీద రాజనీతిశాస్త్ర పరిధిలో రాజ్య స్వభావం, ఆవిర్భావం, పరిణామం, అభివృద్ధి వంటి అనేక అంశాలు ఉంటాయని చెప్పవచ్చు. అలాగే ఈ శాస్త్రంలో వివిధ రాజ్యావతరణ సిద్ధాంతాలు అధ్యయనం చేయబడతాయి. ప్రాచీన కాలపు పోలీసు రాజ్యం మొదలుకొని ఆధునిక కాలపు సంక్షేమరాజ్యం వరకు గల రాజ్య కార్యకలాపాల అధ్యయనం చేస్తుంది. కాబట్టి రాజనీతిశాస్త్రం రాజ్యపు భూత, వర్తమాన, భవిష్యత్ అంశాలను చర్చిస్తుందని పేర్కొనవచ్చు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రాచీన రాజ్యాల గురించి రాయండి. [Mar. ’18, ’17, ’16]
జవాబు:
రాజనీతిశాస్త్రం ప్రాచీన గ్రీకునగర రాజ్యాలలో ఆవిర్భవించిందని రాజనీతిశాస్త్రజ్ఞుల అభిప్రాయం. మొదట గ్రీకు నగరాలు అయిన ఏథెన్స్, కోరింత్, మెసిడోనియా, థేబ్స్, స్పార్టా, మిలాన్ నగరాలలో నాగరికత విరాజిల్లినట్లుగా రాజనీతి శాస్త్రజ్ఞులు వివరించారు. ఈ నగర రాజ్యాలు సార్వభౌమాధికారాన్ని, అవి స్వయం సమృద్ధి, స్వయం ఆధారితలను కలిగి ఉండేవి. ప్రొఫెసర్ కాల్టిన్ వీటిని నగర సమాజాలుగా అభివర్ణించారు. ఈ నగర నివాసితులను మూడు రకాలకు చెందినవారిగా పరిగణించారు. వారికి (1) పౌరులు (2) విదేశీయులు (పరులు) (3) బానిసలుగా పేర్కొన్నారు. వీరిలో పౌరులు నగర రాజ్యాల కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు.

ప్రశ్న 2.
రాజనీతిశాస్త్ర ఏవైనా రెండు సాంప్రదాయక నిర్వచనాలను పేర్కొనండి.
జవాబు:
సాంప్రదాయకమైన నిర్వచనాలను మూడు ఉప వర్గాలుగా వర్గీకరించారు. వాటిని క్రింది విధంగా పేర్కొనవచ్చు.

  1. రాజ్యం గురించి అధ్యయనం చేసేదే రాజనీతిశాస్త్రం (Study of the State): రాజనీతి తత్వవేత్తలైన జె.డబ్ల్యు గార్నర్, గెటిల్; అప్పాదొరై మరియు ఇతరులు రాజనీతిశాస్త్రం రాజ్యాన్ని గురించి అధ్యయనం చేస్తుందని వివరించారు.
  2. ఆర్.జి.గెటిల్: “రాజనీతిశాస్త్రమంటే రాజ్యం గతంలో ఎలా ఉండేదో పరిశోధించి, వర్తమాన కాలంలో ఎలా ఉన్నదో విశ్లేషించి, భవిష్యత్ కాలంలో ఎలా ఉండాలి అనే అంశంపై జరిపే రాజకీయ, నైతిక చర్చల సారాంశం”.
  3. అప్పాదొరై: “రాజ్య మనుగడ, అభివృద్ధికి అవసరమైన పరిస్థితుల గురించి అధ్యయనం చేసే శాస్త్రమే” రాజనీతిశాస్త్రం.

ii) ప్రభుత్వాన్ని గురించి అధ్యయనం చేసేదే రాజనీతిశాస్త్రం (Study of the Government): రాజనీతి ‘తత్వవేత్తలైన స్టీఫెన్ లీకాక్, జాన్ రిచర్డ్ సీలి, ఇతరులు రాజనీతిశాస్త్రం ప్రభుత్వాన్ని గురించి అధ్యయనం చేస్తుందని తెలిపారు.

  1. స్టీఫెన్ లీకాక్: “రాజనీతిశాస్త్రమంటే ప్రభుత్వం గురించి అధ్యయనం చేసే శాస్త్రం”.
  2. జాన్ రిచర్డ్ సీలీ: “ప్రభుత్వ దృగ్విషయాన్ని గురించి పరిశోధన జరిపే శాస్త్రమే రాజనీతిశాస్త్రం”.

ప్రశ్న 3.
ఏవైనా రెండు రాజనీతి శాస్త్ర ఆధునిక నిర్వచనాలను రాయండి.
జవాబు:
ఆధునిక రాజనీతిశాస్త్రజ్ఞులు రాజనీతిశాస్త్ర నిర్వచనాలను రెండు ఉప తరగతులుగా విభజించారు. అవి:
i) రాజనీతిశాస్త్రం – శక్తి అధ్యయనం (Study of Power):
1. లాస్వెల్, కాప్లాన్: “రాజనీతిశాస్త్రం ఒక అనుభవాత్మక శాస్త్రంగా ఉంటూ అధికార రూపకల్పన, అధికారుల భాగస్వామ్యం గురించి అధ్యయనం చేస్తుంది”.
2. విలియం.ఎ.రాబ్సన్: “రాజనీతిశాస్త్రం ప్రధానంగా సమాజంలో అధికారానికి సంబంధించినది”.

ii) రాజనీతిశాస్త్రం – విలువల పంపకాన్ని అధ్యయనం చేస్తుంది (Study of allocation of values): 1. డేవిడ్ ఈస్టన్: “రాజనీతిశాస్త్రం సమాజం కోసం విలువలను (వస్తువులను) అధికారయుతంగా పంపిణీ చేయడానికి సంబంధించి అధ్యయనం చేస్తుంది”.

AP Inter 1st Year Civics Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం, పరిధి-ప్రాముఖ్యత

2. హిల్మన్: “రాజనీతిశాస్త్రం ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఏమి, ఎలా పొందుతారో అధ్యయనం చేసే శాస్త్రం”. .
పైన పేర్కొన్న ఆధునిక నిర్వచనాలు రాజకీయ సంస్థల అధికారాలు, ఇతర కార్యకలాపాలను మూల్యాంకనం చేసే అంశాల అధ్యయనంగా రాజనీతిశాస్త్రాన్ని పరిగణించారని మనం చెప్పవచ్చు.

ప్రశ్న 4.
రాజనీతిశాస్త్రం ఏ విధంగా ఉత్తమ పౌరసత్వ గుణాలను బోధిస్తుంది ?
జవాబు:
మంచి పౌరసత్వ గుణాల బోధన (Teaching the qualities of good citizenship): రాజనీతి శాస్త్ర అధ్యయనం మంచి పౌరసత్వాన్ని పొందేందుకు, జాతీయ సమైక్యతను సాధించేందుకు ఎంతో అవసరం. ఈ శాస్త్ర అధ్యయనం పౌరులకు జాతీయ ఆశయాలు, లక్ష్యాలను గుర్తుచేస్తుంది. మంచి పౌరుడనేవాడు చట్టాలు ఎలా రూపొందించబడి అమలు చేయబడతాయనే విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. రాజనీతిశాస్త్రం మంచి పౌరసత్వపు వివిధ దృక్కోణాలను, ప్రయోజనాలను బోధిస్తుంది. పౌరులను ఆదర్శపౌరులుగా తీర్చిదిద్దేందుకు శిక్షణ ఇస్తుంది. విధేయత, సామాజిక సేవ, నిస్వార్థంలాంటి మంచి పౌరసత్వ గుణాలను పెంపొందిస్తుంది. పౌరులు సమాజం, రాజ్యం పట్ల బాధ్యత కలిగి ఉండాల్సిన అవసరాన్ని తెలుపుతుంది. మొత్తం మీద వ్యక్తుల మూర్తిమత్వాన్ని పెంపొందిస్తుంది.

ప్రశ్న 5.
రాజనీతిశాస్త్రం ఒక కళయని ప్రకటించడాన్ని సమర్థించండి.
జవాబు:
రాజనీతి శాస్త్రం ఒక కళా ? (Is Political Science an Art ?): రాజనీతిశాస్త్రాన్ని క్రింది అంశాలను బట్టి ఒక కళగా భావించవచ్చు.

  1. రాజనీతిశాస్త్రం, భౌతికశాస్త్రాలకు భిన్నంగా నిరపేక్షమైన, విశ్వవ్యాప్త చట్టాలను కలిగి ఉండదు.
  2. రాజనీతిశాస్త్రంలో కొన్ని దృగ్విషయాలను సమయం సందర్భాన్ని బట్టి వివిధ రకాలుగా వ్యాఖ్యానించి అధ్యయనం చేయవచ్చు. అందువల్ల ఈ శాస్త్రం వివిధ భావనల వ్యాఖ్యానాలకు సంబంధించి ఏకరూపతను కలిగి ఉండదు.
  3. అన్ని శాస్త్రాలకు ప్రాతిపదికగా పరిగణించే కార్యకారణ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా అనుసరించేందుకు ఈ శాస్త్రం అవకాశమివ్వదు.
  4. రాజనీతిశాస్త్రం పరిణామాత్మక స్వభావాన్ని కలిగి ఉండదు. ఎందుకంటే ఈ శాస్త్రంలోని భావనలు క్రమానుగతంగా నిరంతర ప్రాతిపదికపై రూపొందించబడి అభివృద్ధి చెందలేదు.
  5. రాజనీతిశాస్త్రంలో శాస్త్రీయ పద్ధతులైన పరిశీలన, ప్రయోగాత్మకతలు పాటించబడవు.
  6. రాజనీతిశాస్త్రంలోని వివిధ అధ్యయన అంశాల వివరణలలో సంపూర్ణమైన నిష్పాక్షికత, ప్రత్యేకత గోచరించవు.
  7. రాజనీతిశాస్త్రం ఖచ్చితమైన ఫలితాలకు అవకాశమివ్వదు.

ప్రశ్న 6.
ఏ అంశాల ప్రాతిపదికగా రాజనీతిశాస్త్రాన్ని ఒక శాస్త్రంగా పరిగణించవచ్చు ?
జవాబు:
రాజనీతిశాస్త్రం ఒక శాస్త్రమా ? (Is Political Science a Science ?): రాజనీతిశాస్త్రాన్ని క్రింది అంశాల ప్రాతిపదికగా పరిగణించవచ్చు.

  1. రాజనీతిశాస్త్రాన్ని ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయవచ్చు.
  2. రాజకీయాలలో ప్రయోగాత్మకతకు అవకాశం ఉంది.
  3. ఇతర సామాజిక శాస్త్రాల వలె నిరపేక్షమైన, విశ్వవ్యాప్తమైన చట్టాలను కలిగి ఉంటుంది.
  4. రాజకీయాలలో అంచనాలను సులభంగా వర్తింపచేయవచ్చు.
  5. రాజనీతిశాస్త్ర అధ్యయనంలో నిర్దిష్టమైన సార్వత్రిక ఆమోదిత సూత్రాలను పొందుపరచవచ్చు.
  6. రాజనీతిశాస్త్రం శాస్త్రీయ స్వభావాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల ఈ శాస్త్ర అధ్యయనంలో శాస్త్రీయమైన సూత్రాలను పొందుపరచటం జరిగింది.
  7. రాజనీతిశాస్త్రం ఇతర శాస్త్రాల వలె కార్యకారణ సంబంధాన్ని అమలు చేసేందుకు అవకాశమిస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం, పరిధి-ప్రాముఖ్యత

ప్రశ్న 7.
రాజనీతిశాస్త్ర పరిధిలో ఏవైనా నాలుగు విషయాలను తెలపండి.
జవాబు:

  1. రాజ్య అధ్యయనం
  2. ప్రభుత్వ అధ్యయనం
  3. సంఘాలు, సంస్థల అధ్యయనం
  4. హక్కులు, బాధ్యతల అధ్యయనం

ప్రశ్న 8.
రాజనీతిశాస్త్రం ఏ విధంగా ప్రభుత్వ అధ్యయనశాస్త్రంగా పరిగణించబడింది ?
జవాబు:
స్టీఫెన్ లీకాక్, జె.ఆర్.సీలి లాంటి ప్రముఖ రాజనీతిశాస్త్రవేత్తలు రాజనీతిశాస్త్రం ప్రభుత్వం గురించి అధ్యయనం చేసేదని పేర్కొన్నారు. ప్రభుత్వమనేది రాజ్యపు ప్రతినిధి అని, ప్రభుత్వం లేకుండా రాజ్యం ఉండదని వారు భావించారు. ప్రభుత్వం ద్వారానే రాజ్య ఆశయాలు నెరవేరుతాయి. రాజ్య అభీష్టాన్ని ప్రభుత్వం రూపొందించి, వ్యక్తీకరించి అమలులో ఉంచుతుంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Zoology Study Material 6th Lesson మానవ సంక్షేమంలో జీవశాస్త్రం Textbook Questions and Answers.

AP Inter 1st Year Zoology Study Material 6th Lesson మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పరాన్న జీవనాన్ని నిర్వచించి, వివరించండి.
జవాబు:
రెండు వేరువేరు జాతులకు చెందిన జీవుల మధ్య గల ఒక రకమైన సహవాసంలో ఒక జీవి రెండవ దానికి తీవ్రంగా నష్టం కలిగిస్తూ లేదా ఎటువంటి నష్టం లేకుండా తాను లాభం పొందుతూ జీవించడాన్ని పరాన్న జీవనం అంటారు.
ఉదా : మానవ దేహంలో నివసించే ఎంటమీబా హిస్టాలిటికా. చెదపురుగు జీర్ణవ్యవస్థలో నివసించే ట్రెకోనింఫా.

ప్రశ్న 2.
వాహకం, ఆశయ అతిథేయి మధ్యగల భేదాన్ని గుర్తించండి.
జవాబు:
వాహకం :
పరాన్నజీవుల సాంక్రమిక దశలను ముఖ్య అతిథేయి నుంచి వేరొక అతిథేయికి చేరవేసే జీవిని వాహకం (vector) అంటారు.
ఉదా : ఈగలు, బొద్దింకలు

ఆశయ అతిథేయి :
ముఖ్య అతిథేయి దొరకనప్పుడు పరాన్నజీవుల సంక్రమణ దశలకు ఆశ్రయం కల్పించే అతిథేయిలను ఆశ్రయాతిథేయి అంటారు. వీటిలో పరాన్నజీవులు అభివృద్ధి చెందవు, వ్యాధులను కలిగించవు. ఉదా : ప్లాస్మోడియంకు కోతి.

ప్రశ్న 3.
యాంత్రిక వాహనం, జీవసంబంధ వాహకం మధ్య ఉండే భేదాన్ని గుర్తించండి.
జవాబు:
యాంత్రిక వాహనం :
పరాన్నజీవి సాంక్రమిక దశలను ఒక అతిథేయి నుండి వేరొక అతిథేయికి రవాణా మాత్రమే చేసే జీవులను యాంత్రిక వాహనం అంటారు. ఈ విషయంలో వాహక జీవికి, పరాన్న జీవికి ఎటువంటి సంబంధం ఉండదు.
ఉదా : ఎంటమీబాకు ఈగలు.

జీవ సంబంధ వాహకం :
ఈ వాహకంలో పరాన్నజీవి సాంక్రమిక దశలు మనుగడ సాగించగలిగి, ఇంకొక జీవికి సంక్రమించేలోపు కొంతవరకు అభివృద్ధి చెందుతాయి.
ఉదా : ప్లాస్మోడియంకు ఆడ ఎనాఫిలిస్ దోమ.

ప్రశ్న 4.
అథి పరాన్నజీవి అంటే ఏమిటి? ఒకదాని పేరు రాయండి. [Mar. ’14]
జవాబు:
ఒక పరాన్నజీవిపై బాహ్యంగా గాని, అంతర్గతంగా గాని పరాన్న జీవనం సాగించే పరాన్నజీవిని అధి పరాన్నజీవి అంటారు.
ఉదా : టోడ్ చేప (అతిథేయి) – స్పీరోస్పోరా పాలిమార్పా (పరాన్నజీవి) – నోసిమా నొటాబిలిస్ (అధి పరాన్నజీవి)

ప్రశ్న 5.
పరాన్నజీవ కాస్ట్రేషన్ అంటే ఏమిటి ? ఉదాహరణ రాయండి.
జవాబు:
కొన్ని పరాన్న జీవులు వాటి అతిథేయి బీజకోశాలను నాశనం చేసి వాటిని వంధ్య జీవులుగా మారుస్తాయి. ఈ విషయాన్ని పరాన్నజీవ కాస్ట్రేషన్ అంటారు.
ఉదా : సాక్యులినా అనే పరాన్నజీవి తన అతిథేయి కార్సినస్ మీనాస్ అనే పీత బీజకోశాలను నాశనం చేస్తుంది. దీని వలన మగ పీతలోని లైంగిక హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని మగపీత ఆడ లక్షణాలను సంతరించుకుంటుంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 6.
ఫాసియోల హెపాటికాలో అంతర్ పరాన్నజీవ అనుకూలనాలను తెలపండి.
జవాబు:
ఫాసియోల హెపాటికా నత్తలో పరాన్న జీవనం సాగిస్తాయి. వీటి డింభకాలు నత్త దేహం విపరీతంగా పెరిగేలా ప్రభావితం చేస్తాయి. దీనిని అతికాయత (Gigantism) అంటారు.

ప్రశ్న 7.
నియోప్లాసియాను నిర్వచించండి. దీనికి ఒక ఉదాహరణ తెలపండి.
జవాబు:
కొన్ని పరాన్నజీవులు అతిథేయి కణజాలంలో కణాల సంఖ్యను విపరీతంగా పెరిగేలా ప్రభావితం చేసి కొత్త నిర్మాణాలను ఏర్పరుస్తాయి. దీనినే నియోప్లాసియా అంటారు. ఇది క్యాన్సర్కు దారితీస్తుంది.
ఉదా : కొన్ని వైరస్లు.

ప్రశ్న 8.
ఆరోగ్యాన్ని చక్కగా నిర్వచించి, ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే రెండు అంశాలను తెలపండి.
జవాబు:
ఆరోగ్యం అంటే పరిపూర్ణమైన భౌతిక, మానసిక, సామాజిక స్థితిని కలిగి ఉండటం. ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ప్రధాన జన్యు రుగ్మతలు, సంక్రమణలు, వ్యక్తి జీవన విధానం. అంశాలు

ప్రశ్న 9.
సంక్రమణ, అసంక్రమణ వ్యాధుల మధ్య భేదాన్ని తెలపండి. ఒక్కొక్క దానికి రెండు ఉదాహరణలు తెలపండి.
జవాబు:
సంక్రమణ వ్యాధులు :
ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి సంక్రమించే వ్యాధులను సంక్రమణ వ్యాధులు అంటారు.
ఉదా : అమీబిక్ విరేచనాలు, మలేరియా జ్వరం, బోదకాలు వ్యాధి, సాధారణ జలుబులు, AIDS మొదలైనవి.

అసంక్రమణ వ్యాధులు :
ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాపించని వ్యాధులను అసంక్రమణ వ్యాధులు అంటారు.
ఉదా : జన్యు సంబంధ వ్యాధులు, మూత్రపిండ వ్యాధులు, హృదయ సమస్యలు.

ప్రశ్న 10.
‘ఎంటమీబా హిస్టోలైటికా అవికల్పిక అవాయు పరాన్నజీవి’ అని ఎలా చెప్పగలవు?
జవాబు:
ఎంటమీబా హిస్టోలైటికా మానవ దేహంలో మాత్రమే జీవించగలదు. కనుక ఇది అవికల్పక పరాన్నజీవి. ఇది మానవ జీర్ణవ్యవస్థలో అవాయు శ్వాసక్రియ జరుపుకుంటుంది. కనుక ఇది ‘అవికల్పక అవాయు పరాన్నజీవి’ అని చెప్పవచ్చును.

ప్రశ్న 11.
ఎంటమీబా హిస్టోలైటికా పూర్వ కోశస్థ దశ మరియు కోశస్థ దశ మధ్య భేదాన్ని గుర్తించండి.
జవాబు:
పూర్వ కోశస్థ దశ :
జీవి చిన్నగా, గుండ్రంగా లేదా అండాకారంగా ఉంటుంది. జీవ పదార్థంలో గ్లైకోజన్ రేణువులు, కడ్డీల వంటి క్రొమాటిడ్ దేహాలు ఉంటాయి.

కోశస్థ దశ :
జీవి దేహం గుండ్రంగా ఉండి పలుచని, మృదువైన అధిక నిరోధక శక్తి కలిగి కోశకుడ్యాన్ని ఏర్పరచుకుంటుంది. జీవి దేహంలో నాలుగు పిల్ల కేంద్రకాలుంటాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 12.
ఎంటమీబా హిస్టోలైటికా పూర్వకోశస్థ దశ మరియు కోశస్థ ప్రారంభ (early) దశలో నిల్వ ఆహారమేది?
జవాబు:
ఎంటమీబా హిస్టోలైటికా పూర్వ కోశస్థ దశ మరియు కోశస్థ ప్రారంభ దశలో నిలువ ఆహారము గ్లైకోజన్ రేణువుల రూపంలో, క్రొమాటిడ్ దేహాల రూపం (రైబోన్యూక్లియో ప్రొటీన్)లో ఉంటుంది.

ప్రశ్న 13.
ఒక వ్యక్తి పేగులో క్రమరహితం, ఉదర నొప్పి, మలంలో రక్తం, శ్లేష్మం ఉన్నాయి. ఈ లక్షణాల ఆధారంగా జీవి పేరు, వ్యాధిని తెలపండి.
జవాబు:
మానవ పేగులో క్రమరహితం, ఉదర నొప్పి, మలంలో రక్తం, శ్లేష్మం మొదలైన లక్షణాలను ఎంటమీబా హిస్టోలైటికా పరాన్న జీవి కారణం. ఈ వ్యాధిని అమీబిక్ విరేచనాలు లేదా అమీబిక్ డిసెంట్రి లేదా అమీబియాసిస్ అంటారు.

ప్రశ్న 14.
ఒక వ్యక్తి డాక్టరు సలహాతో క్లినికల్ ప్రయోగశాలలో మల పరీక్షకు వెళ్లాడు. అందులోని టెక్నీషియన్ మలంను పరీక్షించి అమీబియాసిస్తో బాధపడుతున్నాడని గుర్తించాడు. టెక్నీషియన్ గుర్తించిన రెండు లక్షణాలను తెలపండి.
జవాబు:
అమీబియాసిస్తో బాధపడే వ్యక్తి మలంను పరీక్షించినట్లయితే మానవ మలంలో శ్లేష్మం, రక్తంతో బాటుగా చతుష్కేంద్రక దశలో ఉండే ఎంటమీబా హిస్టోలైటికా కోశస్థ దశలను గమనించవచ్చును.

ప్రశ్న 15.
ఎంటమీబా హిస్టోలైటికాను ఉద్దేశించి ఎసింప్టమాటిక్ సిస్ట్ పాసర్స్ను నిర్వచించండి.
జవాబు:
కొందరి వ్యక్తులలో ఎంటమీబా హిస్టోలైటికా పరాన్నజీవి ఉన్నప్పటికి వీరిలో అమీబియాసిస్ లక్షణాలు కనపడవు. కాని వీరి మలాన్ని పరిశీలించినట్లయితే చతుష్కేంద్రక కోశాలుంటాయి. ఇటువంటి వారిని ‘ఎసింప్టమాటిక్ సిస్టాపాసర్స్’ అంటారు.

ప్రశ్న 16.
మానవునిలో హిపాటోసైట్స్ను సంక్రమించే ప్లాస్మోడియం వైవాక్స్ దశలను తెలపండి.
జవాబు:
ప్లాస్మోడియం యొక్క స్పోరోజాయిట్ దశలు మానవ కాలేయ కణాలను (హిపాటోసైట్స్) సంక్రమణ దశలు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 17.
ప్రీపేటెంట్ కాలంను నిర్వచించండి. ప్లాస్మోడియం వైవాక్స్ జీవితచక్రంలో దీనికి ఎంత కాలం ఉంటుంది?
జవాబు:
ప్లాస్మోడియం ప్రప్రథమంగా స్పోరోజాయిట్ రూపంలో మానవ రక్తంలోకి ప్రవేశించినప్పటి నుండి, రెండవసారి క్రిప్టోజాయిట్లు రక్తంలోకి విడుదలయ్యే వరకు పట్టే కాలాన్ని ప్రీపేటెంట్ కాలం అంటారు. దీనికి ఎనిమిది రోజుల కాలం పడుతుంది.

ప్రశ్న 18.
పొదిగే కాలంను నిర్వచించండి. ప్లాస్మోడియం వైవాక్స్ జీవితచక్రంలో ఇది ఎంతకాలం ఉంటుంది?
జవాబు:
ప్లాస్మోడియం స్పోరోజాయిట్ దశలో మొదట మానవ దేహంలో ప్రవేశించిన నాటినుండి, మొదటిసారి మలేరియా జ్వరం వచ్చే వరకు పట్టే కాలాన్ని పొదిగే కాలం అంటారు. ఇది 10 నుండి 14 రోజులు పడుతుంది.

ప్రశ్న 19.
షఫ్నర్ చుక్కలు అంటే ఏమిటి? వీటి ప్రాముఖ్యం తెలపండి.
జవాబు:
ప్లాస్మోడియం పరాన్నజీవి RBC లోని హిమోగ్లోబిన్లోని హిమ్ను జీర్ణం చేసుకొని, జీర్ణం కాని హిమోజాయిను కణికలుగా ఏర్పరుస్తుంది. ఈ దశలో చిన్న ఎర్రని మచ్చలు ఎర్ర రక్తకణాల జీవపదార్థంలో ఏర్పడతాయి. వీటినే షఫ్నర్ చుక్కలు అంటారు.

ప్రశ్న 20.
హీమోజాయిన్ రేణువులు అంటే ఏమిటి ? వీటి ప్రాముఖ్యం తెలపండి.
జవాబు:
ప్లాస్మోడియం RBC లోని హిమోగ్లోబిన్ లోని గ్లోబిన్ భాగాన్ని గ్రహించిన తరువాత మిగిలిన జీర్ణంకాని హిమటిన్ భాగం హిమోజాయిన్ కణికలుగా ఏర్పడుతుంది. ఇది మలేరియా జ్వరాన్ని కలుగజేసే విష పదార్థం. ఇది రక్తంలోని ప్లాస్మాతో కలిసినప్పుడు మలేరియా జ్వరం వస్తుంది.

ప్రశ్న 21.
కశాభ నిర్మోచనం అంటే ఏమిటి? దీనివల్ల ఏర్పడినవి ఏవి?
జవాబు:
ప్లాస్మోడియం దోమలలో జరుపుకునే లైంగిక ప్రత్యుత్పత్తిలో పురుష లేదా సూక్ష్మ సంయోగ బీజాలు కొరడా మాదిరి కదలికలను చూపుతూ జీవ పదార్థం నుండి విడుదలవుతాయి. ఈ విధంగా ఏర్పడిన పురుష సంయోగ బీజాలు విడుదల కావడాన్ని ‘కశాభ నిర్మోచనం’ అంటారు.

ప్రశ్న 22.
ప్లాస్మోడియంలో బీజకణాల కలయికను అసమసంయోగం అని ఎందుకంటారు?
జవాబు:
ప్లాస్మోడియంలో సంయోగ బీజాలు పరిమాణ రీత్యా అసమానంగా ఉంటాయి. కనుక వీటి మధ్య జరిగే సంయోగం లేదా కలయికను అసమసంయోగం అంటారు.

ప్రశ్న 23.
గమన సంయుక్తబీజం అంటే ఏమిటి ? క్రోమోసోముల స్థితిని (sets) అనుసరించి దీన్ని ఎలా వివరిస్తావు?
జవాబు:
ప్లాస్మోడియంలో లైంగిక ప్రత్యుత్పత్తిలో ఏర్పడే సంయుక్త బీజం సన్నగా, పొడవుగా, కదలిక చూపే క్రిమి రూపాన్ని పొందుతుంది. దీనిని గమన సంయుక్త బీజం అంటారు. దీని క్రోమోసోముల స్థితి ద్వయస్థితికం.

ప్రశ్న 24.
ఒక వ్యక్తి చలి, వణుకుడు, అధిక ఉష్ణోగ్రతతో బాధపడుతున్నాడు. విపరీతమైన చెమటలతో ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి చేరింది. ఈ లక్షణాల ఆధారంగా వ్యాధిని, కారక జీవిని తెలపండి.
జవాబు:
రోగి చలి, వణుకుడు, అధిక ఉష్ణోగ్రతతో బాధపడుతూ, విపరీతమైన చెమటతో ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి చేరే లక్షణం ఉన్నట్లయితే అతడు మలేరియా జ్వరంతో బాధపడుతున్నాడు. దీనికి ప్లాస్మోడియం వైవాక్స్ అనే పరాన్నజీవి కారణం.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 25.
దోమలను అరికట్టడానికి జీవసంబంధమైన నియంత్రణ తెలపండి.
జవాబు:
దోమలను అరికట్టడానికి జీవసంబంధమైన నియంత్రణ : దోమ డింభకాలను తినే గంబూసియా చేపలను, కీటకాహార మొక్కలైన ముట్రిక్యులేరియాలను దోమలు వృద్ధిచెందే ప్రాంతాలలో పెంచాలి.

ప్రశ్న 26.
ఆస్కారిస్ గుడ్లను ‘మామ్మిల్లేటిడ్ గుడ్లు’ అని ఎందుకు అంటారు?
జవాబు:
ఆస్కారిస్ అండము ఉపరితలంలో బుడిపెలుగా ఏర్పడిన ప్రొటీన్ పొరచే కప్పబడి ఉంటుంది. అందువలన ఆస్కారిస్ గుడ్లను మామిల్లేటిడ్ గుడ్లు అంటారు.

ప్రశ్న 27.
మీరు చదివిన నిమటోడా పరాన్నజీవి జీవితచక్రంలో నిశా కాలగమనం అంటే ఏమిటి?
జవాబు:
నిమటోడా పరాన్నజీవి ఉకరేరియా యొక్క మైక్రోఫైలేరియా డింభకాలు వేరొక అతిథేయిని చేరడానికి అనువుగా రాత్రి సమయంలో 10 నుండి ఉదయం 4 వరకు రోగి పరిధీయ రక్త ప్రసరణలో ఉంటాయి. ఇటువంటి రాత్రి సమయంలో చూపే గమనాన్ని ‘నిశా కాల అంటారు.

ప్రశ్న 28.
లింఫాడినైటిస్ మరియు లింఫాంజైటిస్ మధ్య భేదాన్ని తెలపండి.
జవాబు:
లింఫాంజైటిస్ :
సాధారణంగా ఫైలేరియా సంక్రమణతో శోషరస నాళాలు, వాపు కనిపిస్తుంది. దీనిని లింఫాంజైటిస్ అంటారు.

లింఫాడినైటిస్ :
శోషరస గ్రంథులలో కలిగే వాపును లింఫాడినైటిస్ అంటారు.

ప్రశ్న 29.
ఫైలేరియాసిస్ వ్యాధి చివరి ఘట్టం బోదకాలు / ఎలిఫెంటియాసిస్ నిరూపించండి.
జవాబు:
ఫైలేరియాసిస్ వ్యాధి తీవ్రత వలన వాపు చెందిన భాగాలలో ఫైబ్రోబ్లాస్ట్లు అభివృద్ధి చెంది తంతుయుత కణజాలంగా మారతాయి. ప్రభావిత భాగాలలో స్వేదగ్రంథులు క్షీణించి, అక్కడి చర్మం పొడిగాను, గరుకుగాను అవుతుంది. ఈ చివరి స్థితిని బోదకాలు లేదా ఎలిఫెంటియాసిస్ వ్యాధి అంటారు.

ప్రశ్న 30.
పొగాకు ఏ విధంగా శ్వాసక్రియను ప్రభావితం చేస్తుంది? దీనిలో గల ఆల్కలాయిడ్ ఏది?
జవాబు:
పొగాకులో నికోటిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. పొగాకు పీల్చడం వలన పొగలలో ఉండే కార్బన్ మోనాక్సైడ్ ఎర్ర రక్తకణాలలోని హిమోగ్లోబిన్ లో కలిసి, Hb యొక్క ఆక్సిజన్ రవాణా సామర్థ్యాన్ని తగ్గించడం ద్వారా శ్వాసక్రియపై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది.

ప్రశ్న 31.
మందుల దుర్వినియోగాన్ని నిర్వచించండి.
జవాబు:
వ్యాధులను నివారించి తద్వారా శారీరక, మానసిక సుఖశాంతులు పొందడానికి మనం మందులు వాడుతున్నాం. వీటిని వైద్యపరంగా కాకుండా వేరే విధంగా వినియోగించడం వల్ల శారీరక లేదా మానసిక రుగ్మతలకు గురవుతున్నాం. దీనినే మందుల దుర్వినియోగం అంటారు. ఉదా : హోలీ రోజున వాడే బంగ్, డాక్టర్ సలహాపై మత్తుకు వాడే వివిధ మందులు – డాక్టరు ద్వారా కాకుండా విపరీతంగా తీసుకోవడం.

ప్రశ్న 32.
కోక్, స్మాక్ దేని నుంచి లభిస్తాయి?
జవాబు:
కోక్ :
దీనిని ఎరిత్రోజైలం కొకా అనే మొక్క ఆకుల నుండి తయారుచేస్తారు.

స్మాక్ :
హెరాయిన్ను స్మాక్ అంటారు. దీనిని ఓపియం పాపి, పపావర్ సోమ్నిఫెరం (నల్లమందు మొక్క) అనే మొక్కల నుండి తయారు చేస్తారు.

ప్రశ్న 33.
మొక్కలలో చాలా ద్వితీయ జీవాణువులకు ఔషధ ధర్మాలు ఉన్నాయి. వీటి దుర్వినియోగం వల్ల సమస్యలు ఏర్పడుతున్నాయా? సరైన ఉదాహరణలతో నిరూపించండి.
జవాబు:
చాలా మొక్కల ద్వితీయ జీవాణువులకు ఔషధ ధర్మాలున్నాయి. ఇవి ఓపియోడ్స్, కనభినాయిడ్స్, కొకా ఆల్కలాయిడ్స్. వీటిని మందు రూపంలో కాక అతిగా మాదక ద్రవ్యాలుగా వినియోగిస్తూ దుర్వినియోగం చేయడం వలన అనేక ఆరోగ్య, సామాజిక సమస్యలు ఏర్పడుతున్నాయి.

ప్రశ్న 34.
ఆటలు, క్రీడలలో నిషేధించిన కనబినాయిడ్స్, అనబాలిక్ స్టీరాయిడ్స్ ఏవి?
జవాబు:
కొందరు క్రీడాకారులు ఆటలలో అలసత్వం రాకుండా ఉత్తేజాన్నిచ్చే స్థాయిలో కనబినాయిడ్స్, అనబాలిక్ స్టిరాయిడ్ను ఉపయోగిస్తున్నారు. ఇలా స్టిరాయిడ్ను ఉపయోగించడం చట్టరీత్యా నేరం కనుక వీటిని నిషేధించారు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 35.
కుంగిపోవడం, నిద్రలేమి మొదలైన మానసిక జబ్బులకు వాడే తరచుగా దుర్వినియోగం అయ్యే నాలుగు మందులను తెలపండి.
జవాబు:
కుంగిపోవడం, నిద్రలేమి మొదలైన మానసిక జబ్బులకు వాడే మందులు తరచుగా దుర్వినియోగమయ్యేవి.

  1. బార్బిటురేట్ – నిద్రమాత్రలు
  2. ఆంఫిటమైన్స్ – నిద్రహరిణి మాత్రలు
  3. బెంజోడయాజిపైన్స్ – ప్రశాంతకాలు
  4. లైసర్జిక్ ఆమ్ల డైఈథైల్ అమైడ్స్ – ప్రశాంతకాలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పరాన్నజీవులలో ప్రత్యేక అనుకూలనాల అభివృద్ధి అవసరమేమిటి? పరాన్నజీవులలో ఏర్పడిన కొన్ని ప్రత్యేక అనుకూలనాలను తెలపండి.
జవాబు:
అతిథేయిలో విజయవంతమైన జీవనం కొనసాగించడానికి అనువుగా పరాన్నజీవులు ప్రత్యేక అనుకూలనాలను ఏర్పర్చుకుంటాయి.

  1. ఆస్కారిస్ వంటి ఆంత్ర పరాన్నజీవులైన గుండ్రటి పురుగులు వాటి అతిథేయిలు స్రవించే జీర్ణక్రియా ఎంజైముల నుంచి రక్షించుకోవడానికి అవభాసినిని ఏర్పరుచుకుంటాయి.
  2. బద్దె పురుగువంటి జీవులు వాటి అతిథేయి పేగు గోడలకు అంటి పెట్టుకోవడానికి చూషకాలు, కొక్కేలు వంటి అంగాలను ఏర్పరచుకుంటాయి.
  3. ఎంటమీబా హిస్టోలైటికా వంటి పరాన్న జీవులు తమ జీవిత చరిత్రలో కోశస్థ దశను ఏర్పరచుకుంటాయి. ఈవిధంగా ఇవి కొత్త అతిథేయిలోకి ప్రవేశిస్తాయి.
  4. పరాన్న జీవుల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా అభివృద్ధిచెంది ఉంటుంది. వీటి స్త్రీ జీవులు అధిక సంఖ్యలో అండాలను విడుదల చేస్తాయి.
  5. ద్వంద్వ అతిథేయి వంటి లివరూక్ పరాన్నజీవులలో బహుపిండత్వాన్ని వ్యక్తంచేస్తూ క్లిష్టమైన జీవిత చరిత్రను కలిగి ఉంటుంది.
  6. ప్లాస్మోడియంవంటి పరాన్న జీవులు అవి ఉత్పత్తిచేసే ప్రతిజనకాలను తరచుగా మారుస్తాయి.

ప్రశ్న 2.
హైపర్ ట్రోఫీ మరియు హైపర్ ప్లాసియాల మధ్య భేదాలను ఒక్కొక్క ఉదాహరణతో వివరించండి.
జవాబు:
హైపర్ ట్రోఫీ :
ప్లాస్మాడియం వైవాక్స్ మానవ ఎర్ర రక్తకణంలోకి ప్రవేశించి రక్తకణంలోని జీవ పదార్థాన్ని, వర్ణకాన్ని తిన్న తరువాత తన ఆకృతిని పెంచుకుంటుంది. దీని ప్రభావం వలన RBC పరిమాణం కూడా పెరుగుతుంది. ఇలా పరాన్నజీవి ప్రభావంవలన అతిథేయి కణాకృతి పెరగడాన్ని హైపర్ ట్రోఫీ అంటారు.

హైపర్ ప్లాసియా :
ప్లాటి హెల్మింథస్ వర్గానికి చెందిన ఫాసియోలా హెపాటికా పరాన్నజీవి గొర్రెలలో పరాన్నజీవనం సాగిస్తుంది. దీని ప్రభావం వలన ఈ పరాన్నజీవి ఉండే గొర్రెలలో పైత్యరసనాళాలలో కణాలసంఖ్య పెరిగి పైత్యరస నాళాలు మందంగా మారతాయి. ఇలా పరాన్నజీవి ప్రభావం వలన అతిథేయి దేహంలో కణాల సంఖ్య పెరగడాన్ని హైపర్ ప్లాసియా అంటారు.

ప్రశ్న 3.
ఎంటమీబా హిస్టోలైటికా పోషకజీవి నిర్మాణాన్ని వివరించండి.
జవాబు:
AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 1
ఎంటమీబా హిస్టోలైటికా మానవుడి పెద్దపేగు, అంధనాళాలలో ఉండే ఆంత్ర పరాన్నజీవి. ఇది 20 నుంచి 30 మైక్రానుల లోతైన కణజాలాల్లో ఉంటుంది. పోషకజీవిని ఆవరించి ఉన్న పొరను ప్లాస్మాలెమ్మా అంటారు. జీవ పదార్థం వెలుపలి కణికారహితమైన బాహ్యజీవద్రవ్యంగాను, లోపలి కణికాయుతమైన అంతర్జీవ ద్రవ్యంగాను విభజించబడి ఉంటుంది. పోషక జీవి కదిలే వైపు పొట్టిగా, మొండిగా ఉండే మిథ్యాపాదం ఉంటుంది. ఎంటమీబా హిస్టోలైటికా అంతర్జీవ ద్రవ్యం మధ్యలో తిత్తి వంటి కేంద్రకం ఉంటుంది. కేంద్రక త్వచం లోపలి తలాన్ని అంటిపెట్టుకొని పూసలలాగా ‘క్రొమోటిన్ పదార్థముంటుంది. కేంద్రకం మధ్యలో ఎండోసోమ్ ఉంటుంది. సన్నని క్రొమాటిన్ తంతువులు, పూసల వంటి నిర్మాణాల నుంచి ఎండోసోమ్ వైపుకు చక్రంలోని చువ్వల మాదిరిగా ప్రసరించి ఉంటాయి. ఈ స్థితి కేంద్రకానికి బండి చక్రం రూపాన్నిస్తుంది. దీని ఆహారరిక్తికలలో ఎర్రరక్త కణాలుంటాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 4.
ఎంటమీబా హిస్టోలైటికా జీవిత చక్రంను తెలపండి.
జవాబు:
ఎంటమీబా హిస్టోలైటికా మానవ పెద్దపేగులో నివసించే పరాన్నజీవి. దీనివలన మానవులలో అమీబియాసిస్ లేదా అమీబిక్ డిసెంట్రీ (బంక విరేచనాలు) అనే వ్యాధి వస్తుంది. ఇది కలుషిత ఆహారం, నీరు వలన మానవ జీర్ణ వ్యవస్థలో ప్రవేశిస్తుంది.

జీవిత చక్రం :
పెద్దపేగు కుడ్యంలో ఎంటమీబా పోషక జీవులు ద్విధా విచ్ఛిత్తి జరిపి అనేక ఎంటమీబాలను ఏర్పరుస్తాయి. ఇవి బాక్టీరియా, అతిథేయి కణజాల భాగాలను పెరిగి మళ్ళీ విభజనచెంది, అనేకసార్లు జరిగిన ద్విధావిచ్ఛిత్తి వలన అనేక పోషకజీవులు ఏర్పడతాయి. వీటిలో కొన్ని పెద్ద పేగును చేరి పూర్వ కోశస్థ దశలుగా మారతాయి. తిరిగి ఈ దశలు కోశస్థ దశలుగా మారి చివరికి చతుష్కేంద్రక కోశాలుగా ఏర్పడతాయి. ఈ ప్రక్రియ మొత్తం కొన్ని గంటలలో జరుగుతుంది. చతుష్కేంద్రక దశలు మలంతోబాటు బయటకు విడుదలై సుమారు 10 రోజులు జీవంతో ఉంటాయి. ఈ కోశాలు కలుషితమైన నీరు, ఆహారంతోబాటు కొత్త అతిథేయిని చేరతాయి. ఇవి మానవ చిన్నపేగును చేరిన తరవాత ట్రిప్సిన్ ఎంజైమ్ చర్యవలన కోశం జీర్ణమై చతుష్కేంద్రక అమీబాలు విడుదలవుతాయి. వికోశీకరణం చెందిన చతుష్కేంద్రక అమీబాలను మెటాసిస్ట్ అంటారు.

మెటాసిస్ట్లోని నాలుగు కేంద్రకాలు సమవిభజనలో ఎనిమిది కేంద్రకాలుగా విభజన చెందుతాయి. ప్రతి కేంద్రకం కొంత జీవ పదార్థంతో ఎనిమిది పిల్ల ఎంటమీబాలు లేదా మెటాసిస్టిక్ పోషక జీవులు ఏర్పడతాయి. ఇవి పెద్దపేగు శ్లేష్మపొరలోకి ప్రవేశించి పరిపక్వ పోషక జీవులుగా పెరుగుతాయి.
AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 2

ప్రశ్న 5.
ఎంటమీబా హిస్టోలైటికా వ్యాధికారకతపై లఘుటీక రాయండి.
జవాబు:
ఎంటమీబా హిస్టోలైటికా పరాన్నజీవి మానవ పెద్దపేగులో ఉండే పరాన్నజీవి. ఇది కలుషిత ఆహారం, నీరు నుండి మరొకరికి వ్యాప్తి చెందుతుంది.

ఎంటమీబా పోషకజీవులు హిస్టోలైసిన్ అనే ఎంజైము స్రవించి అతిథేయి శ్లేష్మ స్థరాన్ని కరిగించిలోనికి ప్రవేశించి పెద్దపేగు కుడ్యంలో పుండ్లను ఏర్పరుస్తాయి. పుండ్లలో కణశిథిలాలు, లింఫోసైట్, ఎర్రరక్తకణాలు, బాక్టీరియాలు ఉంటాయి. పెద్దపేగు కుడ్యంలో చీముగడ్డలు ఏర్పడటానికి దారితీస్తాయి. చివరగా మలంలో రక్తం, శ్లేష్మం కనిపిస్తాయి. ఈ స్థితిని అమీబిక్ విరేచనాలు లేదా ఆంత్ర అమీబియాసిస్ లేదా ఉష్ణ అమీబియాసిస్ అంటారు. కొందరిలో ఎటువంటి వ్యాధి లక్షణాలు కనిపించవు. వీరిని వాహకులు లేదా ఎసింప్టోమాటిక్ సిస్ట్ పాసర్స్ అంటారు. వీరి మలంలో చతుష్కేంద్రక కోశాలు ఉంటాయి. ఇవి పరాన్నజీవి వ్యాప్తికి తోడ్పడతాయి.

ప్రశ్న 6.
ప్లాస్మోడియమ్ వైవాక్స్ స్పోరోజాయిట్ నిర్మాణాన్ని వివరించండి.
జవాబు:
ప్లాస్మోడియమ్ వైవాక్స్ స్పోరోజాయిట్ నిర్మాణం :
AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 3

  1. ప్లాస్మోడియమ్ వైవాక్స్ స్పోరోజాయిట్ యొక్క సూక్ష్మ నిర్మాణాన్ని గారోమ్ అధ్యయనం చేశాడు.
  2. ఇది కొడవలి ఆకారంలో ఒకవైపు వంగి ఉంటుంది. కణ దేహం కండె ఆకారంలో ఉంటుంది. మధ్యలో బొద్దుగా, కొన భాగాలు మొనదేలి ఉంటాయి. ఇది 15 మైక్రానుల పొడవు, 1 మైక్రాను వెడల్పు ఉంటుంది.
  3. స్పోరోజాయిట్ దేహాన్ని ఆవరించి సాగే గుణం కలిగిన పెలికల్ ఉంటుంది.
  4. పెలికిల్ మూడు పొరలలో ఏర్పడి ఉంటుంది. దీనిలో సూక్ష్మ నాళికలు లేదా పరిధీయ తంతువులు నిలువుగా అమరి ఉంటాయి. వీటి సంకోచాలు పరాన్నజీవి దేహంలో జరిగే క్రిమి చలనానికి తోడ్పడతాయి.
  5. కణ పూర్వభాగంలో ఒక “అగ్రచూషకం” లేదా “ఎపికల్ కప్” ఉంటుంది. ఒక జత పొడవైన స్రావక సూక్ష్మాంగాలు దీనిలోకి తెరుచుకుంటాయి. ఇవి కణవిచ్ఛిన్న ఎంజైములను స్రవిస్తూ, స్పోరోజాయిట్ కాలేయ కణాల్లోకి ప్రవేశించడానికి సహాయపడతాయి.
  6. కణదేహంలో అనేక సంవళిత నాళికలుంటాయి. వాటి నిర్దిష్టమైన విధి ఏమిటో తెలియదు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 7.
ప్లాస్మాడియం వైవాక్స్ జీవితచక్రంలో గాల్జి చక్రాన్ని వివరించండి.
జవాబు:
కాలేయ కణాలలో రక్తకణ పూర్వ, రక్తకణ బాహ్య జీవిత చక్రాలను పూర్తి చేసుకున్న పిదప ప్లాస్మోడియం పూర్వ తరంలోని క్రిప్టోజాయిట్స్ రూపంలోగాని, రక్తకణ బాహ్య చక్రంలోని సూక్ష్మ మెటాక్రిప్టోజాయిట్ల రూపంలోగాని రక్తంలోని RBC ని చేరి రక్తకణ జీవిత చక్రాన్ని ప్రారంభిస్తాయి. ఈ రక్తకణ జీవిత చక్రాన్ని మొదటగా కామిల్లోగాల్జి అనే శాస్త్రవేత్త వివరించాడు. కనుక ఈ చక్రాన్ని గాల్జిచక్రం అంటారు..

గాల్జి చక్రం :
ఇది పూర్వ తరంలోని క్రిప్టోజాయిట్లతో గాని లేదా రక్తకణబాహ్య జీవితచక్రంలోని సూక్ష్మ మెటాక్రిప్టోజాయిట్లతో గాని ప్రారంభమవుతుంది. ఎర్రరక్తకణాల్లోకి ప్రవేశించగానే మీరోజాయిట్లు గోళాకార ట్రోఫోజాయిట్లుగా మారతాయి. వీటిలో ఒక చిన్న రిక్తిక ఏర్పడి పరిమాణంలో పెరుగుతూ పోషకజీవిలోని జీవపదార్థాన్ని, కేంద్రకాన్ని అంచువైపుకు నెట్టడం వల్ల ఉంగరం మాదిరిగా కనిపిస్తుంది. ఈ దశను అంగుళీక దశ అంటారు. తరవాత రిక్తిక అదృశ్యమవుతుంది. పరాన్నజీవి మిథ్యాపాదాలను అభివృద్ధి చేసుకొని అమీబాయిడ్ దశగా మారుతుంది. ఇది RBC లోని పదార్థాలను మిథ్యాపాదాలతో గ్రహించి పోషణతో పరిమాణాన్ని పెంచుకొంటుంది. దీనివల్ల ఎర్రరక్తకణాల పరిమాణం రెండింతలు పెరుగుతుంది. ఈ స్థితిని అతివృద్ధి అంటారు. ఈ చక్రంలో ఎర్ర రక్తకణాల్లోని హీమోగ్లోబిన్ను పరాన్నజీవి ఆహారంగా తీసుకుంటుంది.

పరాన్నజీవి హీమోగ్లోబిన్లోని హీమ్ను జీర్ణం చేసుకొని మరియు కరిగే హీము కరగని హీమోజాయిన్ కణికలుగా ఏర్పరుస్తుంది. దీన్నే మలేరియా వర్ణకం అంటారు. ఈ దశలో చిన్న ఎర్రని మచ్చలు షఫ్నర్ చుక్కలు ఎర్రరక్తకణాల జీవపదార్థంలో ఏర్పడతాయి. ఇవి పరాన్నజీవి విడుదల చేసే ప్రతిజనకాలు. ప్లాస్మోడియం,మిథ్యాపాదాలను కోల్పోయి బాగా పెరిగి RBC ని మొత్తంగా ఆక్రమించి విఖండంగా మారుతుంది. ఇది రక్తకణపూర్వ చక్రంలో మాదిరిగా విఖండ జననం చెంది 12-24 ఎర్రరక్తకణ మీరోజాయిట్లను ఏర్పరుస్తుంది. ఇవన్నీ RBC లో గులాబీ రేకులా అమరి రోజెట్టిశగా మారుతుంది. చివరిగా ఎర్రరక్తకణం పగిలి హీమోజాయినను, మీరోజాయిట్లను రక్తంలో విడుదల చేస్తుంది. ఈ చక్రం దాదాపు 48 గంటలలో పూర్తవుతుంది.

స్పోరోజాయిట్లు దేహంలో ప్రవేశించిన నాటి నుంచి మొట్టమొదటిగా, మలేరియా లక్షణాలు జ్వరం వచ్చేవరకు పట్టే కాలాన్ని పొదిగే కాలం అంటారు. ఇది దాదాపు 10-14 రోజులలో పూర్తవుతుంది.

ప్రశ్న 8.
ఉకరేరియా బాంక్రాఫ్టి వల్ల మానవునిలో కలిగే వ్యాధి కారకతను తెలపండి.
జవాబు:
ఉకరేరియా బాంక్రాఫ్టి అనే నిమటొడా పరాన్నజీవి కారణంగా మానవులలో బోదకాలు వ్యాధి సంక్రమిస్తుంది. ఇది ఫైలేరిఫాం డింభక దశలో దోమకాటు ద్వారా మానవులకు సంక్రమిస్తుంది.

వ్యాధి కారకత :
సంక్రమణ స్వల్పంగా ఉంటే ఫైలేరియా జ్వరం, తలనొప్పి, మానసిక ఆందోళన, శరీర ఉష్ణోగ్రత పెరగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా ఫైలేరియా సంక్రమణతో శోషరస నాళాలు, శోషగ్రంథులలో వాపు (infalmation) కలుగుతుంది. శోషనాళాలలో కలిగే వాపును లింఫాంజైటిస్ (Lymphangitis) ( Gr. angeos – నాళాలు, itis – మంట) అనీ, శోషరస గ్రంథులలో కలిగే వాపును లింఫాడెంటిస్ (Lymphadenitis) (Gr. adenos – గ్రంథి, itis – మంట) అని అంటారు. పరాన్న జీవుల సంక్రమణ అధికంగా ఉంటే, చనిపోయి పేరుకుపోయిన పురుగులు శోషరస నాళాలలోనూ, శోషరస గ్రంథులలోనూ శోషరస ప్రవాహాన్ని ఆటంకపరుస్తాయి.

ఫలితంగా అధిక వాపు ఏర్పడుతుంది. దీన్ని లింఫోఎడిమా (Lymphoedema)(Gr. oiedema – వాపు) అంటారు. ఈ వాపు గమనాంగాల చివరి భాగాలు, పురుషుల్లో ముష్కగోణులు, స్త్రీల స్తనాలలో అనూహ్యంగా కనిపిస్తుంది. ఈ వాపు చెందిన భాగాలలో ఫైబ్రోబ్లాస్ట్లు అభివృద్ధి చెంది తంతుయుత కణజాలంగా మారతాయి. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ప్రభావిత భాగాలలో స్వేదగ్రంథులు క్షీణించి, అక్కడ చర్మం పొడిగాను, గరుకుగాను అవుతుంది. ఈ చివరి స్థితిని ఎలిఫెంటియాసిస్ (Elephantiasis) లేదా బోదకాలు అంటారు.

ప్రశ్న 9.
టైఫాయిడ్ జ్వరం మరియు రోగనిరోధకతపై లఘుటీక రాయండి.
జవాబు:
టైఫాయిడ్ జ్వరం :
ఈ వ్యాధి సాల్మొనెల్ల టైఫీ అనే గ్రామ్ నెగిటివ్ బాక్టీరియా వల్ల వస్తుంది. ఇది ముఖ్యంగా మానవుడి చిన్నపేగులో నివసిస్తూ రక్తం ద్వారా ఇతర అవయవాలలోకి ప్రవేశిస్తుంది. ఈ వ్యాధిని వైడాల్ పరీక్ష చేసి నిర్ధారిస్తారు. సంక్రమణ విధానం : ఈ వ్యాధి కలుషితమైన ఆహారం, నీరు ద్వారా వ్యాప్తి చెందుతుంది.

వ్యాధి లక్షణాలు :
ఈ వ్యాధి సోకిన రోగికి 104°F వరకు పెరిగే ఉష్ణోగ్రతతో స్థిరంగా ఉండే జ్వరం, నీరసం, కడుపునొప్పి, మలబద్దకం, తలనొప్పి, ఆకలి మందగించడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి తీవ్రతలో పేగుకు రంధ్రాలు ఏర్పడటం, తీవ్రమైన స్థాయిలో మరణం సంభవించడం జరుగుతుంది.

ప్రశ్న 10.
న్యుమోనియా మరియు రోగనిరోధకతపై లఘుటీక రాయండి.
జవాబు:
న్యుమోనియా వ్యాధి శ్వాస వ్యవస్థలో బాధలు గురిచేసే వ్యాధి. ఇది స్ట్రెప్టోకోకస్ న్యుమోనియే, హీమోఫిలస్ ఇన్ఫ్లుయోంజాల వంటి గ్రామ్ పాజిటివ్ బాక్టీరియాల వల్ల వస్తుంది. ఈ బాక్టీరియా మానవ వాయుకోశాలపై దాడి చేస్తాయి.

సంక్రమణ :
వ్యాధి సోకిన వ్యక్తి నోటి తుంపర్లు (గాలిద్వారా వ్యాప్తి) పీల్చడం వలన లేదా వ్యాధిగ్రస్తుని యొక్క వంట పాత్రలు, వారు వాడిన తువాలు (టవల్స్) వాడటం వలన ఇతరులు ఈ వ్యాధి బారిన పడతారు.

వ్యాధి లక్షణాలు :
ఈ వ్యాధిగ్రస్తుల వాయుకోశాలు ద్రవంతో పూర్తిగా నిండి శ్వాసక్రియలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాయుకోశాల శ్వాస వాయువుల మార్పిడి ఆటంకం ఏర్పడుతుంది. వ్యాధి తీవ్రతలో దేహంలో ఆక్సిజన్ శాతం తగ్గి, కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరగడం వలన పెదవులు, వేలిగోర్లు బూడిద లేదా నీలిరంగుకు మారతాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 11.
సాధారణ జలుబు మరియు రోగనిరోధకతపై లఘుటీక రాయండి.
జవాబు:
సాధారణ జలుబు :
ఈ వ్యాధి రైనోవైరస్ సమూహానికి చెందిన వైరస్ల వలన వస్తుంది. ఇది ముక్కు, వాయు మార్గానికి మాత్రమే సంక్రమిస్తుంది. ఊపిరితిత్తులపై ప్రభావం చూపదు. దీనికారణంగా ముక్కులో, వాయునాళంలో శ్లేష్మం స్రవించి శ్వాసలో ఇబ్బందులు (ముక్కు దిబ్బడ) ఎదురవుతాయి.

సంక్రమణ :
వ్యాధి సోకిన వ్యక్తి తుమ్ములు, దగ్గు వలన వెలువడిన నీటి తుంపరలను పీల్చడం ద్వారా (గాలి ద్వారా వ్యాప్తి) నేరుగాను, కలుషితమైన వస్తువులు అనగా రోగి వినియోగించే వస్తువు ద్వారా కర్చీఫ్, పెన్నులు, పుస్తకాలు, కప్పులు, డోర్ హాండిల్స్, కంప్యూటర్ కీబోర్డు, మౌస్ మొదలైన వాటిని శుభ్రపరచకుండా ఇతరులు వినియోగించడం వలన ఇతరులకు వ్యాప్తి చెందుతుంది.

వ్యాధి లక్షణాలు :
ముక్కు మూసుకుపోవడం (ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, తుమ్ములు, దగ్గడం, గొంతునొప్పి, బొంగురు గొంతు, తలనొప్పి, అలసట మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా 3 నుంచి 7 రోజులు ఉంటాయి.

ఈ వ్యాధి సోకినవారు ముఖ్యంగా విశ్రాంతి తీసుకొనవలెను. దుమ్ము, పొగ పీల్చకూడదు. గాటైన వాసనలు పీల్చరాదు. వేడి నీటి ఆవిరి పట్టినట్లయితే త్వరగా ఉపశమనం లభిస్తుంది.

ప్రశ్న 12.
తామర మరియు రోగనిరోధకతపై లఘుటీక రాయండి.
జవాబు:
తామర మానవులలో కలిగే సాధారణమైన, శిలీంధ్రాలవల్ల సంక్రమించే సంక్రమణ వ్యాధి. ఇది మైక్రోస్పోరం, ట్రైకోఫైటాన్, ఎఫిడెర్మోఫైటాన్ అనే ప్రజాతుల శిలీంధ్రాల వలన సంక్రమిస్తుంది. వేడిమి, తేమ ఈ శిలీంధ్రాల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఇది సాధారణంగా చర్మపు ముడుతలలో అంటే గజ్జలు, కాలివేళ్ళు, చంకలు మొదలైన భాగాలలో పెరుగుతాయి.

సంక్రమణ :
వ్యాధి సోకిన వ్యక్తి వాడిన వస్తువులు అనగా తువ్వాలు, దుస్తులు, దువ్వెన మొదలైన వస్తువుల వలన మరియు మట్టి ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.

వ్యాధి లక్షణాలు :
పొడిగా, పొలుసులు గల గుండ్రటి పుండ్లు లేదా దద్దురులు ఏర్పడతాయి. దీని వలన తీవ్రమైన దురద ఉంటుంది. ఇవి చర్మం, గోరు, తలపై కూడా ఏర్పడతాయి.

ఈ వ్యాధి నివారణకు పరిశుభ్రత ప్రధానమైన మార్గం.

ప్రశ్న 13.
పొగాకు వల్ల జరిగే దుష్పరిణామాలను తెలపండి. [Mar. ’14]
జవాబు:
పొగాకును మానవుడు వివిధ రూపాలలో 400 సం॥రాలుగా వినియోగిస్తున్నాడు. దీనిలో వివిధ రసాయన పదార్థాలతోబాటుగా నికోటిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. పొగాకును గుట్కా రూపంలో, పొగత్రాగడం (చుట్ట, బీడి, సిగరెట్), నమలడం లేదా నశ్యం రూపంలో పీల్చడం మొదలైన రూపాలలో వినియోగిస్తారు.

పొగాకును పొగరూపంలో (చుట్ట, బీడి, సిగరెట్) వినియోగించడం వలన పొగలో ఉండే కార్బన్మౌనాక్సైడ్ ఎర్రరక్త కణాలలోని హిమోగ్లోబిన్తో కలిసి, Hb యొక్క ఆక్సిజన్ రవాణా సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దీనిలోని నికోటిన్ ఎడ్రినల్ గ్రంథిని ప్రేరేపించి ఎడ్రినాలిన్, నార్ – ఎడ్రినాలిన్ను రక్తంలోకి విడుదల చేస్తుంది. ఈ హార్మోన్లు రక్త పీడనాన్ని, గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతాయి. పొగతాగడం వల్ల బ్రాంకైటిస్, ఎంఫిసిమా, కరోనరీ గుండె వ్యాధి, జఠరంలో పుండ్లు, గొంతు, ఊపిరితిత్తులు, మూత్రాశయం మొదలైన వాటిలో కాన్సర్ వచ్చే అవకాశాలున్నాయి.

పొగతాగే అలవాటు తీవ్రమైన మత్తుమందులు – మార్ఫిన్, హెరాయిన్, కొకైన్ను కూడా తీసుకునే అలవాటుకు దారితీస్తుంది. పొగాకును నమలడం వలన, గుట్కా రూపంలో నమలడం వలన నోటి కాన్సర్కు అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి పరిణామాలు చూస్తున్నా ఇంకా యువతలో, ముసలివారిలో పొగత్రాగడం, పొగాకు ఉత్పత్తుల వినియోగం ఇంకా మాన్పించలేకపోతున్నాము.

ప్రశ్న 14.
ఓపియోడ్స్పై లఘుటీక రాయండి.
జవాబు:
ఓపియోడ్స్ :
ఓపియోడ్స్ అనునవి మాదకద్రవ్యాలు. మందులను ఓపియం పాపి, పపావర్ సోమ్నిఫెరం (దీన్ని వాడుకలో నల్లమందు మొక్క అంటారు) నుంచి సేకరిస్తారు. ఈ మందులు మన కేంద్రనాడీ వ్యవస్థ, జీర్ణనాళంలోని ప్రత్యేక ఓపియోడ్ గ్రాహకాలతో బంధనం (bind) చెంది తమ ప్రభావాన్ని ప్రదర్శిస్తాయి. వీటిలో మార్ఫిన్, హెరాయిన్ మొదలైనవి ఉన్నాయి.

i) మార్ఫిన్ :
దీన్ని పాపి మొక్క అపరిపక్వ విత్తన గుళిక (capsule pad) యొక్క ఎండిన లేటెక్స్ (latex) నుంచి సేకరిస్తారు. ఇది రంగులేని స్ఫటికం (crystal) లేదా తెలుపు పటికపొడి రూపంలో లభిస్తుంది.

దుర్వినియోగ విధానం :
సాధారణంగా నీరు లేదా సూది (injection) ద్వారా తీసుకొంటారు.

ప్రభావం :
ఇది చాలా సమర్థమైన మత్తుమందు నొప్పి/బాధ నుంచి (pain killer) ఉపశమనం కలిగిస్తుంది. శస్త్ర చికిత్స చేసుకున్న రోగులకు ఈ మందు చాలా ఉపయోగపడుతుంది.

ii) హెరాయిన్ :
ఇది తెల్లని, వాసన రహిత, ఘాటుగా ఉండే స్ఫటిక సంయోగ పదార్థం. మార్ఫిన్ ను ఎసిటైలేషన్ చేయడం వల్ల ఇది ఏర్పడుతుంది. రసాయనికంగా దీన్ని డైఎసిటైల్ మార్ఫిన్ (diacetyl morphine) అంటారు. దీన్ని స్మాక్ (smack) అని కూడా అంటారు.

దుర్వినియోగ విధానం :
బలవంతంగా పీల్చుకోవడం (స్నార్టింగ్ – snorting) లేదా సూది ద్వారా తీసుకోవడం.

ప్రభావం :
ఇది ఉపశమనం కలిగించే మందు (anti depressant). ఇది శరీర చర్యలను నెమ్మదిస్తుంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 15.
కనబినాయిడ్స్పై లఘుటీక రాయండి.
జవాబు:
కనాబినాయిడ్స్ :
కనాబినాయిడ్స్ అనునవి మాదకద్రవ్యాలు. ఇవి సమూహ రసాయనాలు. వీటిని భారత హెంప్ మొక్క కనాబిస్ సటైవా (Indian hemp plant – Cannabis sativa) (దీన్ని వాడుకలో గంజాయి మొక్క అంటారు) నుంచి సంగ్రహిస్తారు. ఇవి మెదడులోని కనబినాయిడ్ గ్రాహకాలకు బంధించబడతాయి. మొక్క పుష్పాల చివరలు, పత్రాలు, రెసిన్ ను వివిధ పాళ్లలో వినియోగించి మరిజువాన, హాషిష్, చరస్, గంజా (marijuana, hashish, charas, ganja) ను ఉత్పత్తి చేస్తారు. ఈ మధ్యకాలంలో కనబినాయిడ్స్ను క్రీడాకారులు (డోపింగ్ -doping ) కూడా దుర్వినియోగం చేస్తున్నారు.

దుర్వినియోగ విధానం :
ముక్కుతో పీల్చడం లేదా నోటితో మింగడం.

ప్రభావం :
ఇది హృదయ ప్రసరణవ్యవస్థపై ప్రభావాన్ని చూపిస్తుంది.

ప్రశ్న 16.
కొకైన్పై లఘుటీక రాయండి.
జవాబు:
కోకా ఆల్కలాయిడ్ లేదా కొకైన్ :
దక్షిణ అమెరికాలో పెరిగే కోకా యొక్క ఎరిత్రోజైలం కోకా (Erythroxylum coca) ఆకుల నుంచి తెల్లటి ఆల్కలాయిడ్ పటికను తీస్తారు. దీన్ని సాధారణంగా కోక్ లేదా క్రాక్ (crack) అంటారు.

దుర్వినియోగ విధానం :
బలవంతంగా పీల్చడం (snorting).

ప్రభావం :
ఇది కేంద్ర నాడీవ్యవస్థను శక్తివంతంగా ప్రేరేపిస్తుంది. డోపమైన్ అనే నాడీ అభివాహకం (neurotransmitter) రవాణాలో జోక్యం చేసుకొంటుంది. దీనివల్ల ఉల్లాసస్థితి (euphoria), శక్తి పెరుగుదల కలుగుతుంది. అధిక మోతాదులు భ్రాంతికి (hallucinations) కారణమవుతాయి.

బాగా ప్రాచుర్యం గల హాల్లుసినోజెనిక్ ధర్మాలు గల మొక్కలలో అట్రోపా బెల్లడొనా, దతూరా ఉన్నాయి. బార్బిటురేట్ (barbiturates – నిద్రమాత్రలు), ఆంఫీటమైన్స్ (నిద్రహారిణి మాత్రలు),

బెంజోడయాజిపైన్స్ (Benzodiazepines : ప్రశాంతకాలు – tranquilizers), లైసర్జిక్ ఆమ్ల డైఈథైల్ అమైడ్స్ (LSD), ఇతర మందులను సాధారణంగా మానసిక వ్యాధిగ్రస్తులకు అంటే వ్యాకులత/కుంగిపోవడం(depression), నిద్రలేమి (insomnia) మొదలైన వాటిలో బాధపడే రోగుల చికిత్సలో వినియోగించే మందులను దుర్వినియోగం చేస్తున్నారు.

ప్రశ్న 17.
కౌమారదశను భేద్యమైన దశగా ఎందుకంటారు?
జవాబు:
కౌమార దశ :
దీన్ని యవ్వనారంభ దశ (Puberty) కు ప్రౌఢ దశకు మధ్యకాలం అంటారు. ఈ దశ చిన్నతనానికి (childhood), ప్రౌఢ దశకు వారధి. 12-18 సం|| వయస్సు మధ్యకాలాన్ని కౌమారదశ అంటారు. ఈ కాలంలో పిల్లలు పరిపక్వత చెందుతారు. దీనితో అనేక జీవసంబంధ, ప్రవర్తనా మార్పులు ముడిపడి ఉంటాయి. ఒక వ్యక్తి మానసిక, మనోవిజ్ఞాన అభివృద్ధిలో కౌమారదశను హానిపొందే (vulnerable) దశగా పరిగణిస్తారు. కనుక ఈ దశను భేద్యమైన దశగా వర్ణిస్తారు. ఈ వయస్సులో యువత జిజ్ఞాస (curiosity), కోరిక (desire)తో సాహసం (adventure) మరియు ప్రకోపం/రెచ్చగొట్టుట (excitement) వల్ల చేసే ప్రయోగాలు (experiments) యువతను పొగాకు, మందులు, ఆల్కహాలు వినియోగానికి ప్రేరేపించే (motivate) కారణాలు. కానీ మొట్టమొదటసారిగా మందులు లేదా ఆల్కహాల్ వినియోగం కేవలం జిజ్ఞాస, ప్రయోగాలతోనే ప్రారంభమవుతుంది.

ఆ తరవాత ఇబ్బందులనుంచి తప్పించుకోవడానికి వీటిని వినియోగిస్తారు. ఈ మధ్యకాలంలో యువత పరీక్షలు లేదా విద్యా విషయాలలో(academics) ప్రగతి సాధించే క్రమంలో ఒత్తిడి (stress) వల్ల మత్తుమందుల వైపు మొగ్గుతున్నారు. దీనికి తోడుగా టెలివిజన్, సినిమాలు, వార్తాపత్రికలు, ఇంటర్నెట్లు దోహదపడుతున్నాయి. వీటితో పాటు ఆసరా ఇవ్వని లేదా చపలచిత్త (unstable) కుటుంబం, తోటివారి వల్ల ఒత్తిడి (peer pressure) అనే అంశాలు కూడా యువతలో పొగాకు, మందులు, ఆల్కహాల్ దుర్వినియోగానికి ప్రేరేపిస్తాయి.

ప్రశ్న 18.
వ్యసనం, ఆధారం మధ్య భేదాలను తెలపండి.
జవాబు:
వ్యసనం (addiction) మరియు ఆధారపడటం (dependence) :
పొగాకు, మందులు, ఆల్కహాలు దుర్వినియోగం వ్యసనానికి, ఇతరులపై ఆధారపడటానికి దారితీస్తుంది.

వ్యసనం :
ఇది మానసిక ఉల్లాసస్థితితో కూడిన బంధం. ఇది పొగాకు, మందులు, ఆల్కహాలు వినియోగానికి తనలో గల వ్యసన ప్రవృత్తే (addictive nature) ముఖ్యమైందని ఎవ్వరూ గుర్తించరు. TDA లను తరచుగా వినియోగించడం వల్ల శరీరంలో గ్రాహకాల సహనస్థాయి (tolerance level) పెరుగుతుంది. దీనివల్ల గ్రాహకాలు ఎక్కువ మోతాదు (dose) కు స్పందిస్తాయి. దీనితో TDAలను ఎక్కువ తీసుకోవడం వల్ల వ్యసనపరులవుతారు. TDAలను ఒక్కసారి తీసుకొన్నా అది వ్యసనానికి దారి తీయవచ్చు అనే విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. వ్యసనశక్తి (addictive potential) గల పొగాకు, మందులు, ఆల్కహాల్స్ (TDAలు), వ్యసన స్వభావంగల (vicious circle) గుంపులోకి లాగేస్తాయి. దీనితో మందుల దుర్వినియోగం క్రమం తప్పకుండా మొదలై అందులోనుంచి బయటకు రాలేని స్థితికి త్వరగా దారితీస్తుంది. ఈ స్థితిలో సరైన సలహా లేదా కౌన్సిలింగ్ లేనప్పుడు ప్రజలు పూర్తిగా వ్యసనపరులై దానిపైనే ఆధారపడతారు.

ఆధారపడటం :
ఇది క్రమం తప్పని మోతాదులో మత్తుమందులు లేదా ఆల్కహాల్ వినియోగాన్ని ఒకేసారి మానివేయడం వల్ల శరీరంలో కనిపించే అసంతృప్తి లక్షణం లేదా ఉపసంహరణ సిండ్రోమ్ (withdrawl syndrome) . ఈ సిండ్రోమ్లో ఆందోళన(anxiety), వణకడం (tremors), వికారం(nausia), చెమట పట్టడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. TDAలను వాడటం మళ్ళీ మొదలెడితే ఇవి కనిపించవు. ఆధారం అనేది అన్ని సామాజిక కట్టుబాట్లను వదిలే స్థితికి దారితీస్తుంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 19.
TDA దుర్వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని “వ్యాధి చికిత్స కంటే నివారణ మంచిది” నిరూపించండి.
జవాబు:
TDA అనగా పొగాకు (Tobacco), మత్తుమందులు – మాదకద్రవ్యాలు (Drugs), సారాయి (Alcohol)లు. వీటి వినియోగం యువతపై చాలా చెడు ప్రభావాన్ని చూపిస్తున్నాయి. పొగాకు వినియోగం ఊపిరితిత్తులలో, నోటిలో కాన్సర్కు దారితీసే అవకాశం ఉంది. ఇంకా దీని ప్రభావం జీర్ణవ్యవస్థ, గుండె, రక్తప్రసరణ, శ్వాసవ్యవస్థపై విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయి.

మత్తుమందులు – మాదకద్రవ్యాలు – వీటి వినియోగాల మానసిక, శారీరక రుగ్మతలకు దారి తీస్తుంది.

ఆల్కహాల్ వినియోగం మానసిక దౌర్బల్యానికి దారితీసి వ్యక్తి వికాసాన్ని నాశనం చేస్తుంది. ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. TDA కు అలవాటు పడిన వ్యక్తులు మానసికంగా, శారీరకంగా, సామాజికంగా పతనానికి గురి అవుతారు. చికిత్స కంటే నివారణ మంచిది కనుక TDA కి అలవాటు పడిన వారిని క్రింది జాగ్రత్తలు పాటించినట్లయితే మంచి పౌరులుగా మార్చవచ్చును.

  1. తల్లిదండ్రులు తమ పిల్లలపై ఇతరులతో పోల్చి వత్తిడి తేకూడదు.
  2. తల్లిదండ్రులు, ఉపాధ్యాయ యువతకు వారి ప్రవర్తనను గుర్తించి హితబోధ చేయాలి.
  3. మత్తుమందులు, పొగతాగడం, ఆల్కహాల్ త్రాగడం వంటి వాటి వలన సంభవించే అనారోగ్యాలను వారికి తెలియజేయాలి. వాటి పీడితులను గూర్చి వారికి తెలియజేయాలి.
  4. యువతకు విద్యావిషయాలు, మానసిక వత్తిడి, సామాజిక సమస్యలు, వయస్సుతోపాటు వచ్చే మార్పులు జీవితంలో ఒక భాగం అని, ప్రత్యేకత ఏమీ కాదని, వాటిని అధిగమించే విధంగా హితబోధ చేయాలి.
  5. మనోవిజ్ఞాన వేత్తలు, మానసిక వైద్యులు, రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్, డీఅడిక్షన్ సలహాలు, వైద్యుల సూచనలు వారికి అందుబాటులో తీసుకురావాలి.

పై విధంగా వివిధ కార్యక్రమాల ద్వారా యువతను దుర్వినియోగం నుండి దూరంగా ఉంచి మంచి పౌరులుగా తీర్చిదిద్దవచ్చును.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఎంటమీబా హిస్టోలైటికా నిర్మాణాన్ని, జీవిత చక్రాన్ని వివరించండి. పటం గీసి భాగాలను గుర్తించండి.
జవాబు:
ఎంటమీబా హిస్టోలైటికా మానవుడి పెద్దపేగు, అంధనాళంలో ఉండే అంతర పరాన్న జీవి. దీని వలన మానవుడికి అమీబిక్ డిసెంటరీ లేదా అమీబియాసిస్ అనే వ్యాధి కలుగుతుంది. ఇది తన జీవిత చక్రంను ఒకే అతిథేయిలో పూర్తి చేసుకొనును. కనుక దీనిని “మోనోజెనిటిక్” పరాన్న జీవి అందురు. దీని జీవిత చక్రములో రెండు దశలుంటాయి.

  1. మాగ్నదశ లేక పోషకజీవి.
  2. మైన్యూట దశ లేక కోశస్థ పూర్వ దశ

1. మాగ్నదశ లేక పోషకజీవి :
పోషకజీవి పెద్ద ప్రేగు గోడలలో వుంటుంది. దీనిని ఆవరించి ప్లాస్మాలెమ్మా అనే పొర ఉంటుంది. దీనిలో బాహ్య జీవ ద్రవ్యం మందంగా పారదర్శకంగా కణికారహితంగావుంటుంది. అంతర్జీవ ద్రవ్యం కణికాయుతంగా ఉంటుంది. అంతరజీవ ద్రవ్యంలో తిత్తివంటి కేంద్రకంవుంటుంది. కేంద్రకం మధ్యలో ఎండోసోమ్ అనే నిర్మాణమువుంటుంది. కేంద్రక త్వచం యొక్క లోపలి తలాన్ని అంటి పెట్టుకొని పూసలవంటి క్రొమాటిన్ పదార్థం వుంటుంది. దీని నుండి సన్నని క్రొమాటిన్ తంతువులు, కేంద్రక బిందువు వైపుకు చక్రంలోని చువ్వల మాదిరిగా ప్రసరించి ఉంటాయి. దీని వలన కేంద్రకం బండి చక్రం రూపంలో కనిపిస్తుంది. పోషకజీవి ఒక వేలు వంటి మిధ్యాపాదాన్ని కలిగి ఉంటుంది. దీని ఆహార రక్తికల్లో ఎర్రరక్త కణాలుంటాయి. పోషక జీవి ద్విదావిచ్ఛిత్తి ద్వారా తన సంఖ్యను పెంచుకుంటుంది. వీటిలో కొన్ని పిల్ల జీవులు ప్రేగు కుహరంలోకి ప్రవేశించి కోశస్థ పూర్వదశగా మారతాయి.

2. కోశస్థ పూర్వదశ :
ఈ దశలో ఎంటమీబా ఆహార రక్తికలను, మిథ్యాపాదాన్ని కోల్పోతుంది, గోళాకారంగా మారుతుంది. పరిమాణం తగ్గుతుంది. గ్లైకోజన్ కణికలను, ఒకటి లేదా రెండు క్రొమాటాయిడ్ దేహాలను కణ ద్రవ్యంలో నిల్వచేసుకుంటుంది. క్రొమాటాయిడ్ దేహాలు రైబోన్యూక్లియో ప్రోటీను తత్వాన్ని కలిగి ఉంటాయి.
AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 1

కోశస్థ దశ :
కోశస్థ పూర్వదశ తన చుట్టూ సున్నితమైన కోశాన్ని తయారుచేసుకొని కోశస్థ దశను చేరుతుంది. కోశికరణం జరగగానే పరాన్న జీవిలోని కేంద్రకం రెండు సమవిభజనలను జరుపుకొని చతుష్కేంద్రక కోశంగా రూపొందుతుంది. ఈ దశ ఏర్పడటం ఎంటమీబా హిస్టోలైటికా యొక్క ప్రత్యేక లక్షణం.

సంక్రమణం :
చతుష్కేంద్రక దశలు మానవునికి సంక్రమణ దశలు. ఇవి మలముతో పాటు బయటకి విసర్జింపబడతాయి. ఈ కోశాలు కాయగూరకు అంటుకొని గాని, ఆహారపదార్థాలతో కలిసిగాని నీటిలో తేలుతూ గాని ఉంటాయి. ఈ విధంగా కలుషితమైన నీటిని లేదా ఆహారాన్ని మానవుడు స్వీకరించుట వలన పరాన్నజీవి అతిథేయిని చేరుతుంది. ఈ దశలను అతిథేయికి చేరవేయటంలో, బొద్దింకలు, ఈగలు కూడ ఏజెంట్లుగా పనిచేస్తాయి.

వికోశీకరణ :
చతుష్కేంద్రక కోశాలు కొత్త అతిథేయి పేగులోకి ప్రవేశించిన తరువాత అక్కడి ఎంజైముల చర్య వలన కోశము కరుగుతుంది. నాలుగు కేంద్రకములు గల జీవులు బయటకు వస్తాయి. ఈవిధంగా కోశం నుండి పరాన్నజీవి బయటకు రావడాన్ని వికోశికరణము అంటారు. వికోశీకరణ చెంది విడుదలైన నాలుగు కేంద్రకాలు గల పరాన్నజీవి “మెటాసిస్టిక్” దశ అంటారు.

మెటాసిస్టిక్ దశ :
మెటాసిస్టిక్ రూపములోని నాలుగు కేంద్రకాలు విభజన చెంది, ఎనిమిది కేంద్రకాలుగా ఏర్పడతాయి. జీవ ద్రవ్యం కూడా విభజన చెంది కేంద్రకాల చుట్టు చేరుతుంది. దీనివలన మొత్తం 8 పిల్ల ఎంటమీబాలు ఏర్పడి, పెద్దపేగు గోడను చేరి పోషక జీవులుగా మారతాయి.
AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 2

ప్రశ్న 2.
మానవుడిలో ప్లాస్మోడియం వైవాక్స్ జీవితచక్రాన్ని వివరించండి. దాని పటం గీసి భాగాలు గుర్తించండి.
జవాబు:
మానవునిలో (మాధ్యమిక అతిథేయి) ప్లాస్మాడియం’ జీవిత చక్రం :
మాధ్యమిక అతిథేయి అయిన మానవుడిలో ప్లాస్మాడియం విఖండ జననం అనే అలైంగిక పద్ధతిలో తన జీవిత చక్రాన్ని పూర్తి చేస్తుంది. ఇది రెండు భాగాలుగా ఉంటుంది. కాలేయంలో జరిగే దానిని కాలేయ విఖండ జననం అని, ఎర్ర రక్తకణాలలో జరిగేదానిని రక్తకణ విఖండ జననం అని అంటారు.

కాలేయ విఖండ జననం :
ఇది రెండు రకాలుగా ఉంటుంది. రక్తకణపూర్వ, రక్తకణ బాహ్య జీవిత చక్రం.

రక్తకణ పూర్వ జీవితచక్రం :
స్పోరోజాయిట్ దశలున్న దోమ మానవుడిని కుట్టినప్పుడు దోమ లాగా జలంతో బాటుగా స్పోరోజాయిట్లు మానవ రక్తంలో ప్రవేశిస్తాయి. రక్తంలోకి ప్రవేశించిన స్పోరోజాయిట్లు అర్థగంటలోపులోనే కాలేయకణాలలోకి చేరి, కాలేయకణ పదార్థాన్ని ఆహారంగా తీసుకుంటు తమ ఆకృతిని గోళాకారంగా మార్చుకుంటాయి. వీటిని షైజాంట్ అంటారు. వీటిలోని కేంద్రకం బహుధావిచ్ఛిత్తి చెంది అనేక పిల్ల కేంద్రకాలను ఏర్పరుస్తుంది. ఈ కేంద్రకాల చుట్టూ కణద్రవ్యం చేరి అనేక పిల్లజీవులు ఏర్పడతాయి. ఇప్పుడు షైజాంట్ పగిలి అనేక పిల్ల క్రిప్టోజాయిట్స్ కాలేయ కణాలలోకి విడుదలవుతాయి. వీటిలో కొన్ని ఎర్ర రక్తకణాలలో ప్రవేశిస్తాయి. కొన్ని తిరిగి కొత్తగా కాలేయ కణాలలోకి ప్రవేశిస్తాయి. ఈ ప్రక్రియ 8 రోజులు పడుతుంది.

రక్తకణ బాహ్య జీవిత చక్రం :
క్రిప్టోజాయిట్స్ తిరిగి కాలేయ కణాలను చేరి రక్తకణ పూర్వ చక్రంలో మాదిరిగా అనేక మార్పులు చెంది రెండోదశ మీరోజాయిట్లను మెటాక్రిప్టోజాయిట్లను విడుదల చేస్తాయి. వీటిలో రెండు రకాలుంటాయి. చిన్నవిగా ఉండే సూక్ష్మమెటాక్రిప్టోజాయిట్లు, పెద్దవిగా ఉండే స్థూల మెటాక్రిప్టోజాయిట్లు. ఈ ప్రక్రియ దాదాపు 2 రోజులలో పూర్తి అవుతుంది. వీటిలో స్థూల మెటాక్రిప్టోజాయిట్లు తిరిగి కొత్త కాలేయకణాలను చేరి రక్తకణ బాహ్యిజీవితచక్రాన్ని ప్రారంభిస్తాయి. సూక్షక్రిప్టోజాయిట్లు ఎర్రరక్తకణాలను చేరి రక్తకణ జీవిత చక్రాన్ని ప్రారంభిస్తాయి.

ప్లాస్మోడియం స్పోరోజాయిట్ రూపంలో మానవ రక్తంలో ప్రవేశించినప్పుడినుండి తిరిగి రెండవసారి క్రిప్టోజాయిట్లు ఎర్రరక్తకణాలోకి ప్రవేశించడానికి పట్టేకాలాన్ని ప్రీపేటెంట్ కాలం అంటారు. ఈ సమయంలో ఎలాంటి రోగలక్షణాలు కనిపించవు.

రక్తకణ జీవిత చక్రం :
ప్లాస్మోడియం జీవితచక్రంలో ఈ భాగాన్ని కామిల్లోగాల్జి అనే శాస్త్రవేత్త వివరించాడు. కనుక దీనిని గాల్జిచక్రం అని కూడా అంటారు. ఇది రక్తకణ పూర్వ లోని క్రిప్టోజాయిట్లతోగాని, రక్తకణ బాహ్యజీవితచక్రంలోని సూక్ష్మమెటాక్రిప్టోజాయిట్స్ లాగా ప్రారంభమవుతుంది.

ఎర్రరక్తకణాలోకి ప్రవేశించగానే మీరోజాయిట్లు గోళాకార పోషక జీవులుగా మారతాయి. ఇవి RBC లోని హిమోగ్లోబిన్ను ఆహారంగా తీసుకోవడం ప్రారంభమవుతుంది. వీటిలో ఒక చిన్న రిక్తిక ఏర్పడి, పరిమాణంలో పెరుగుతూ పోషకజీవిలోని జీవపదార్థాన్ని కేంద్రకాన్ని అంచువైపు నెట్టడం వలన ఉంగరం మాదిరిగా కనిపిస్తుంది. ఈ దశను అంగూళీక దశ అంటారు. తరువాత రిక్తిక అదృశ్యమవుతుంది. పరాన్నజీవి మిథ్యాపాదాలను ఏర్పరుచుకుంటుంది. ఈ దశను అమీబాయిడ్ దశ అంటారు. ఎర్రరక్తకణ జీవ పదార్థాన్ని తింటు పోషకజీవి పరిమాణం పెరుగుతుంది, దీనివలన RBC పరిమాణం పెరుగుతుంది. పరాన్నజీవి హిమోగ్లోబిన్ లోని గ్లోబిన్ ప్రోటీన్ ను జీర్ణం చేసుకొని జీర్ణం కాని హిమ్ బాగాని హిమోజాయిన్ అనే కణికలుగా ఏర్పరుస్తుంది.

ఇది మలేరియా జ్వరాన్ని కలుగుజేసే విష పదార్థం. ఇది చిన్న ఎర్రని మచ్చలుగా RBC జీవ పదార్థంతో ఏర్పడతాయి. వీటిని షఫ్నర్ చుక్కలు అంటారు. ప్లాస్మోడియం మిథ్యాపాదాలను కోల్పోయి బాగా పెరిగి RBC ని మొత్తంగా ఆక్రమించి షైజాంట్గా మారుతుంది. దీనిలోని కేంద్రకం విఖండజనన జరుపుట 12 నుండి 24 ఎర్రరక్తకణ మీరోజాయిట్స్ను ఏర్పరుస్తుంది. ఇవి RBC తో గులాబిరేకులాగా మారి రోజెట్ దశగా మారుతుంది. చివరిగా ఎర్రరక్తకణం పగిలి మీరోజాయిట్స్, హీమోజాయిన్ రక్తంలోకి విడుదలవుతాయి.

రక్తంలోకి విడుదలైన మీరోజాయిట్స్ తిరిగి కొత్త RBC లలోకి ప్రవేశిస్తాయి. హీమోజాయి విషపదార్థం ప్రభావం వలన మలేరియా జ్వరం వస్తుంది. స్పోరోజాయిట్ మొదట మానవుడిలో ప్రవేశించింది మొదలు మలేరియా జ్వర లక్షణాలు వచ్చే వరకు పట్టేకాలాన్ని పొదిగేకాలం అంటారు. ఇది దాదాపు 10 నుండి 14 రోజులు పడుతుంది.

సంయోగ బీజమాతృకలు ఏర్పడటం :
అనేక పర్యాయాలు రక్తకణ జీవితచక్రం పూర్తిచేసుకున్న ప్లాస్మోడియం మీరోజాయిట్స్ కొన్ని సంయోగబీజ మాతృకలుగా మారతాయి. వీటిలో రెండురకాలుగా ఉంటాయి. సూక్ష్మంగా ఉన్న వాటిని సూక్ష్మ లేదా పురుష సంయోగబీజమాతృకలు అని, పెద్దవిగా ఉన్న వాటిని స్థూల లేదా స్త్రీ సంయోగ బీజమాతృకలు అంటారు. ఈ దశలు తదుపరి దోమలో ప్రవేశించి మాత్రమే అభివృద్ధి చెందుతాయి.
AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 4

ప్రశ్న 3.
దోమలో ప్లాస్మోడియం వైవాక్స్ జీవితచక్రాన్ని పటం సహాయంతో వివరించండి. [Mar. ’14]
జవాబు:
ప్లాస్మోడియం వైవాక్స్ దోమలో జరుపుకునే జీవిత చక్రాన్ని సర్ రోనాల్డ్స్ వివరించడం వలన దీనిని రాస్ చక్రం అని కూడా అంటారు.

ఈ ఎనాఫిలిస్ దోమ వ్యాధిగ్రస్తుడైన మానవుణ్ని కుట్టి రక్తాన్ని పీల్చినప్పుడు రక్తం సంయోగబీజ మాతృకలు, ఇతర దశలు దోమ అన్నాశయాన్ని చేరతాయి. దోమ జీర్ణ వ్యవస్థలో సంయోగబీజ మాతృకలు మాత్రమే జీవించి ఉంటాయి. మిగతా దశలు జీర్ణమవుతాయి.

ప్లాస్మోడియం తన జీవిత చక్రంలో లైంగిక ప్రత్యుత్పత్తి దోమలో పూర్తి అవుతుంది. దీనిలో క్రింది దశలుంటాయి.

  1. బీజకణోత్పత్తి (Gametogony)
  2. ఫలదీకరణం (Fertilization)
  3. గమనసంయుక్తబీజం, సంయుక్త బీజకోశాలు ఏర్పడటం (Formation of ookinite and oocysts)
  4. సిద్ధబీజోత్పత్తి (sporogony)

i) బీజకణోత్పత్తి (Gametogony) :
సంయోగబీజ మాతృకణాల నుంచి పురుష, స్త్రీ బీజకణాలు ఏర్పడటాన్ని బీజకణోత్పత్తి అంటారు. దోమ అన్నాశయకుహరంలో బీజకణాలు ఏర్పడతాయి.

పురుష సంయోగబీజకణాలు ఏర్పడటం :
ఈ ప్రక్రియలో సూక్ష్మ సంయోగబీజమాతృక యొక్క కేంద్రకం విభజనతో ఎనిమిది పిల్ల కేంద్రకాలను ఏర్పరుస్తాయి. వీటిని ప్రాక్కేంద్రాలు (Pronuclei) అంటారు. ఈ కేంద్రకాలు అంచులను చేరతాయి. జీవపదార్థం ఎనిమిది కశాభాలను పోలిన కీలితాలను ఏర్పరుస్తుంది. ఒక్కొక్క కేంద్రక భాగం ఒక్కొక్క జీవపదార్థ కీలితంలోకి ప్రవేశించి కశాభం లాంటి సూక్ష్మ సంయోగబీజాలు లేదా పురుష సంయోగబీజాలను ఏర్పరుస్తుంది. ఈ సూక్ష్మ సంయోగబీజాలు విసిరిన కొరడా మాదిరి కదలికలను (lashing movements) చూపుతూ జీవపదార్థం నుంచి విడుదలవుతాయి. ఈ విధంగా పురుష సంయోగబీజాలు విడుదల కావడాన్ని కశాభ నిర్మోచనం (exflagellation) అంటారు.

స్త్రీ సంయోగబీజకణాలు ఏర్పడటం :
స్త్రీ సంయోగబీజ మాతృకణాలు కొద్ది మార్పులతో స్త్రీ సంయోగ బీజకణంగా ఏర్పడుతుంది. దీన్ని పరిపక్వత (maturation) అంటారు. స్త్రీ సంయోగ బీజకణాల కేంద్రకం పరిధి వైపు కదులుతుంది. ఆ ప్రాంతంలో జీవపదార్థం ఉబ్బుతుంది. ఉబ్బిన ఈ భాగాన్ని ఫలదీకరణ శంకువు (fertilization cone) అంటారు.

ii) ఫలదీకరణం :
స్త్రీ, పురుష బీజకణాలు కలవడాన్ని ఫలదీకరణ అంటారు. ఇది దోమ అన్నాశయ కుహరంలో జరుగుతుంది. సూక్ష్మ సంయోగబీజాలు చురుకుగా కదులుతూ స్థూల సంయోగబీజం యొక్క ఫలదీకరణ శంకువును తాకగానే, దానిలోకి ప్రవేశిస్తుంది. రెండు బీజకణాల ప్రాక్కేంద్రకాలు, జీవపదార్థం కలిసి సంయుక్త కేంద్రకం (synkaryon) ఏర్పడుతుంది. ఈ కలయికలో సంయోగబీజాలు పరిమాణరీత్యా అసమానంగా ఉంటాయి.

కాబట్టి దీన్ని అసమసంయోగం (anisogamy) అంటారు. సంయుక్త కేంద్రకాన్ని కలిగిన స్త్రీ సంయోగ బీజాన్ని సంయుక్త బీజం (zygote) అంటారు. ఇది గుండ్రంగా ఉండి కదలలేదు.
AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 5

i) గమన సంయుక్తబీజం, సంయుక్త బీజకోశం ఏర్పడటం :
సంయుక్త బీజం కొంతకాలం చైతన్యరహితంగా ఉంటుంది. 18-24 గంటలలో ఇవి ఊకినైట్ / గమనసంయుక్తబీజం అనే పొడవైన, సన్నటి, కదలిక చూపే క్రిమి రూపాన్ని పొందుతుంది. ఇది అన్నాశయ కుడ్యాన్ని తొలుచుకొని, ఆధారత్వచం కింద చేరుతుంది. ఇది గుండ్రంగా మారి తన చుట్టూ ఒక కోశాన్ని స్రవిస్తుంది. ఈ కోశస్థ దశను ఊసిస్ట్ (Oocyst) అంటారు. అన్నాశయ కుడ్యంపై 50-500 ఊసిస్ట్లు ఏర్పడి చిన్నచిన్న బుడిపెలుగా కనిపిస్తాయి. (ఈ ఊసిస్ట్లను సర్ రొనాల్డ్ రాస్ మొట్టమొదటగా గుర్తించాడు).

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 6
iv) సిద్ధబీజోత్పత్తి :
ఊసిస్ట్ స్పోరోజాయిట్లు ఏర్పడటాన్ని సిద్ధబీజోత్పత్తి అంటారు. బానో (Bano) అనే శాస్త్రజ్ఞుడు చెప్పిన ప్రకారం కేంద్రకం మొదట క్షయకరణ విభజన జరుపుకుంటుంది. ఆ తరువాత అనేకసార్లు సమవిభజనలను కొనసాగిస్తూ 1000 వరకు పిల్ల కేంద్రకాలను ఏర్పరుస్తుంది. ప్రతీ కేంద్రకం చుట్టూ కొంత జీవపదార్థం చేరి కొడవలి ఆకారం స్పోరోజాయిట్స్ ఏర్పడతాయి. స్పోరోజాయిట్స్ గల ఊసిస్ట్ను సిద్ధబీజకోశం (sporocyst) అంటారు. సిద్ధబీజకోశం పగిలినప్పుడు స్పోరోజాయిట్లు దోమ రక్తకుహరం (haemocoel) లోకి విడుదలవుతాయి. ఇవి అక్కడి నుంచి లాలాజలగ్రంథులలోనికి చేరి సంక్రమణకు సిద్ధంగా ఉంటాయి. దోమలో ప్లాస్మోడియం జీవితచక్రం పూర్తికావడానికి దాదాపుగా 10-24 రోజులు పడుతుంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 4.
ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ నిర్మాణాన్ని, జీవితచక్ర పటాలతో వివరించండి.
జవాబు:
AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 7
నిమటోడా వర్గానికి చెందిన ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ మాన ఆంత్రంలో నివశించే అతి సాధారణ పరాన్నజీవి. ఇది కలుషిత నీరు, ఆహారం ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీని పిండసహిత అండాలు మానవులకు సాంక్రమిక దశలు.

నిర్మాణం :
స్త్రీ, పురుష జీవులు వేరువేరుగా ఉంటాయి. స్పష్టమైన లైంగిక ద్విరూపకత ఉంటుంది. రెండు జీవులు స్తూపాకారంలో, సన్నగా ఉంటాయి. పూర్వాంతంలో నోరు మూడు కైటిన్ పెదవులతో ఆవరించి ఉంటుంది. నోటికి దగ్గరగా ఉదర మధ్యంగా చిన్న విసర్జక రంధ్రం ఉంటుంది.

పురుషజీవి :
దీని తోక వంపు తిరిగి ఉంటుంది. పరాంతంలో అవస్కర రంధ్రం, ఒక జత కైటిన్ నిర్మిత పీనియల్ కంటకాలు (pineal spicules) లేదా పీనియల్ శూకాలు (pineal saetae) ఉంటాయి. ఇది సంపర్కంలో శుక్రకణాలను ప్రవేశపె ట్టడానికి తోడ్పడుతుంది.

స్త్రీ జీవి :
దీని తోక నిటారుగా ఉంటుంది. జనన రంధ్రం లేదా యోనిరంధ్రం ఉదరతలంలో నోటి కింద 1/3 వంతుల దూరంలో ఉంటుంది. తోకకు కొంచెం పైగా పాయువు ఉంటుంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 8
జీవిత చక్రం :
మానవుడి చిన్నపేగులో సంపర్కం జరుగుతుంది. సంపర్కం తరువాత స్త్రీ జీవి రోజుకు దాదాపుగా రెండు లక్షల గుడ్లను విడుదల చేస్తుంది. ప్రతి గుడ్డుకూ ఉపరితంలో బుడిపెలుగా ఏర్పడిన ప్రోటీన్ పొర ఉంటుంది. అందువల్ల ఆస్కారిస్ గుడ్లను మామ్మిల్లేటెడ్ గుడ్లు (mammilated eggs) అంటారు. ప్రోటీన్ పొరకు లోపల కైటిన్ కర్పరం, లిపిడ్ పొరలు ఉంటాయి. మలంతో పాటు గుడ్లు విడుదలవుతాయి. తేమ నేలలో గుడ్డులో పిండాభివృద్ధి జరిగి మొదటి దశ రాబ్దిటిఫార్మ్ డింభకం ఏర్పడుతుంది. ఇది మొదటి నిర్మోచనంతో రెండో దశ రాబ్దిటిఫార్మ్ డింభకంగా మారుతుంది. ఇది మానవుడికి వ్యాధిని కలిగించే సాంక్రమికదశ. కలుషిత ఆహారం, నోటితో ఈ దశలు మానవుడి ఆహారనాళాన్ని చేరతాయి.
AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 9

చిన్నపేగులో కర్పరం కరిగి రెండోదశ డింభకం విడుదల అవుతుంది. ఇది బాహ్యాంత్రవలస (extra intestinal migration) చేస్తుంది. కాలేయ నిర్వాహక సిర ద్వారా మొదట కాలేయాన్ని చేరుతుంది. అక్కడి నుండి పరమహాసిర ద్వారా హృదయాన్ని చేరుతుంది. అక్కడి నుండి పుపుస ధమని ద్వారా ఊపిరితిత్తులను చేరి వాయుకోశాలలో రెండో నిర్మోచనం చెంది మూడోదశ డింభకంగా మారుతుంది. ఆ తరువాత మూడో నిర్మోచనాన్ని కూడా వాయుకోశాలలో పూర్తిచేసి నాలుగోదశ డింభకంగా మారుతుంది. చివరగా ఈ డింభకం శ్వాసనాళికలు (bronchi), వాయునాళం (trachea) స్వరపేటిక (larynx), కంఠబిలం (glottis), గ్రసని, (pharynx) ఆహారవాహిక, జీర్ణాశయ మార్గంలో ప్రయాణించి చిన్నపేగు చేరుతుంది. చిన్నపేగులో నాల్గవ, చివరి నిర్మోచనం చెంది పిల్లజీవిగా మారుతుంది. ఇది 8-10 వారాలలో లైంగిక పరిపక్వతను పొందుతుంది.

వ్యాధి కారకత :
ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ వల్ల ఆస్కారియాసిస్ వ్యాధి వస్తుంది. వీటి సంఖ్య తక్కువైనప్పుడు వ్యాధి లక్షణాలు కనిపించవు. అధిక సంక్రమణ వల్ల పోషణ లోపాలు, ఉదరంలో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. దీనివల్ల పిల్లలలో పెరుగుదల నిరోధించబడుతుంది.

నివారణ చర్యలు :
ఎంటమీబాకు వివరించిన అంశాలే వర్తిస్తాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 5.
ఉకరేరియా బాంక్రాఫ్టి జీవితచక్రాన్ని వివరించండి.
జవాబు:
ఉకరేరియా బాంక్రాఫ్టి తన జీవితచక్రాన్ని రెండు అతిథేయిలలో పూర్తి చేసుకుంటుంది.

  1. మానవుడు – ప్రాథమిక అతిథేయి,
  2. ఆడ క్యులెక్స్ దోమ – ద్వితీయ అతిథేయి.

మానవునిలో జీవితచక్రం :
ఉచరేరియా బాంక్రాఫ్టి యొక్క ఆడ, మగ జీవులు మానవుడి శోషరస వ్యవస్థలో నివాసముంటాయి. ఇక్కడే సంపర్కం జరుపుతాయి. స్త్రీ జీవులు అందశిశూత్పాదకాలు. ఇవి మైక్రోఫైలేరియా అనే డింభకాలను విడుదల చేస్తాయి. మైక్రోఫైలేరియాలు 0.2-0.3 మి.మీ. పొడవు ఉంటాయి. దీనిని ఆవరించి వదులుగా ఉండే అవభాసిని తొడుగు ఉంటుంది. డింభకం బాహ్య కేంద్రక స్థితిలో ఉంటుంది. డింభక పూర్వాంతంలో ఒక శూకిక ఉంటుంది. దీనిలో నాడీవలయం, వృక్కరంధ్రం, పాయురంధ్రం, లీనెటి కణం, నాలుగు పెద్ద జనన కణాలు, అధికంగా వర్ణకాలను గ్రహించిన కణ సముదాయం. అవశిష్ట ఆహార వాహిక ఉంటాయి.

శోషరస నాళికలోకి విడుదల చేయబడిన మైక్రొఫైలేరియాలు రక్తప్రసరణను చేరతాయి. మైక్రోఫైలేరియాలు అంతరాంగ అవయవాలలో లోతుగా ఉన్న రక్తనాళాలలో నివసిస్తూ రాత్రిపూట 10 గం. నుండి 4 గం.ల మధ్య పరిధీయ రక్తనాళాలోకి వస్తాయి. ఈ గమనాన్ని ‘నిశాకాల గమనం’ అంటారు. ఈ గమనానికి కారణం మాధ్యమిక అతిథేయి అయిన క్యూలెక్స్ దోమ మానవుని రక్తాన్ని రాత్రి సమయంలో పీల్చడమేనని తెలుస్తుంది. రోగగ్రస్తుని దోమ కుట్టి రక్తాన్ని పీల్చినపుడు రక్తంతో పాటుగా మైక్రోఫైలేరియా డింభకాలు క్యూలెక్స్ దోమలోకి చేరతాయి. 70 రోజుల లోపల దోమను చేరకపోతే మైక్రోఫైలేరియా డింభకాలు చనిపోతాయి. మైక్రోఫైలేరియా దోమకు సాంక్రమిక దశలు.

దోమలో జీవిత చరిత్ర :
దోమ ఆహారనాళంలో 2-6 గం.లలో డింభకం తొడుగు కరిగిపోతుంది. ఈ డింభకం దోమ ఆహార కుడ్యాన్ని తొలుచుకొని దోమ రక్త కుహరాన్ని చేరుతుంది. ఇక్కడి నుండి ఉరఃకండరాలను చేరి రెండు రోజులలో సాసేజ్ ఆకార డింభకంగా మారుతుంది. దీన్ని మొదటి డింభకదశ లేదా మొదటిదశ మైక్రోఫైలేరియా అంటారు. ఇది 10-20 రోజులలో రెండు నిర్మోచనాలు పూర్తి చేసుకొని పొడవైన సాంక్రమిక మూడోదశ మైక్రోఫైలేరియాగా మారుతుంది. ఇది దోమ అధరాన్ని చేరుతుంది.

మూడోదశ మైక్రొఫైలేరియా డింభకాలు కలిగిన దోమ మానవుని కుట్టినప్పుడు డింభకాలు మానవ రక్త ప్రవాహాన్ని చేరి అక్కడి నుండి శోషరస నాళాలు చేరతాయి. ఇక్కడ డింభకాలు మూడో, నాలుగో నిర్మోచనాలు జరుపుకొని ప్రౌఢజీవులుగా మారతాయి. ఇవి 5 నుండి 18 నెలల కాలంలో లైంగిక పరిపక్వతను పొందుతాయి.
AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 10

వ్యాధి కారకత :
ఉకరేయా సంక్రమణ వలన ఫైలేరియా జ్వరం, తలనొప్పి, మానసిక ఆందోళన, శరీర ఉష్ణోగ్రత పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శోషరస నాళాలలో శోషరస గ్రంథులలో వాపు కనిపిస్తుంది. శోషరస నాళాలలో కలిగే వాపును లింఫాంజైటిస్ అంటారు. శోషరస గ్రంథులలో వాపును లింఫాడెంటిస్ అంటారు. శోషరస నాళాలలో ఆటంకం వలన శోషరసం సంచిత మవడం వలన అవయవాలలో వాపు ఏర్పడుతుంది. దీనిని లింఫొఎడిమా అంటారు.

వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ప్రభావిత భాగాలు (గమనాంగాలు, ముష్కగోణులు, స్తనాలు) అనూహ్యంగా వాపు కనిపిస్తుంది. ఈ భాగాలలో స్వేదగ్రంథులు క్షీణించి చర్మం పొడిబారి, గరుకుగా అవుతుంది. ఈ స్థితిని ఎలిఫెంటియాసిస్ లేదా బోదకాలు వ్యాధి అంటారు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 13 ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 13th Lesson ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు Textbook Questions and Answers.

AP Inter 2nd Year Civics Study Material 13th Lesson ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావాన్ని వర్ణించండి.
జవాబు:
ఆంధ్రులంతా ఒక్క రాష్ట్రంగా ఏర్పడాలన్న భావన కొత్తదేమీ కాదు. 1938లో ఉస్మానియా విశ్వవిద్యాలయ స్నాతకోపన్యాసానికి ఆహ్వానితుడై వచ్చిన సర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు తెలుగు మాట్లాడే ప్రజలంతా ఒక్క రాష్ట్రంలో మనుగడ సాగించే పరిస్థితులేర్పడితే బాగుంటుందని ప్రస్తావించారు. ఆ తరువాత ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారు ఒక రచనలో మద్రాసు ఆంధ్రులూ, నిజాం ఆంధ్రులూ ఒక్కటై బాధ్యతాయుత పాలన ఏర్పరిస్తే బాగుంటుందని అభిప్రాయపడినారు.

1) కమ్యూనిస్టు పార్టీ పాత్ర: ఈ భావాలకు వ్యక్తరూపాన్నిచ్చిన ఘనత ఆంధ్ర కమ్యూనిస్టులది. 1946లోనే విశాలాంధ్ర వాదాన్ని పైకి తెచ్చింది ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీయే. 1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అటు ఆంధ్రలోనూ, ఇటు తెలంగాణలోనూ కమ్యూనిస్టులు ఘనవిజయం సాధించారు. వారి ఎన్నికల నినాదంలో విశాలాంధ్ర కూడా ఒక. అంశం వారు ప్రత్యేకంగా “విశాలాంధ్ర” పత్రికను నడిపి ప్రజల్లో ముమ్మరమైన ప్రచారం కూడా చేశారు. 1953లో అక్టోబర్ మొదటి తేదీనాడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరగటంతో ఇటు ఆంధ్ర ప్రాంతంలోనూ, అటు తెలంగాణా ప్రాంతంలోనూ విశాలాంధ్ర స్థాపన దిశగా రాజకీయాలు నడిచాయి.

2) ప్రధమ విశాలాంధ్ర మహాసభ: 1949 నవంబరు, 26న శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు నాయకత్వంలో విజయవాడలో విశాలాంధ్ర మహాసభ జరిగెను.

3) రెండవ విశాలాంధ్ర మహాసభ: 1954 జూన్ 13, 14 తేదీలలో శ్రీశ్రీ అధ్యక్షతన రెండవ విశాలాంధ్ర మహాసభ హైదరాబాద్లో జరిగెను.

4) ఫజల్ అలీ కమీషన్: ప్రత్యేకాంధ్ర రాష్ట్రం ఏర్పాటు కావడంతో కేరళులు, కర్ణాటకులు ప్రత్యేక రాష్ట్రాలు కావాలని అందోళన చేయసాగారు. వారి జతకు మహారాష్ట్రులు కూడా కలిశారు. దక్షిణ భారతంలో కాంగ్రెస్ పార్టీ నిలబడాలంటే భాషా ప్రాతిపదికన రాష్ట్రాల నిర్మాణం అనివార్యమని ప్రధానమంత్రి నెహ్రూకు ఎన్.వి. గాద్గిల్ సలహా ఇచ్చారు. ఈ నేపధ్యంలో 22 డిసెంబర్ 1953 నాడు ఫజల్ ఆలీ నేతృత్వంలో రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ కమీషన్లో ఇతర సభ్యులు పండిట్ హృదయనాధ కుంజూ, సర్దార్ కె.ఎం.ఫణిక్కర్, కమిటీ తన నివేదికను 30 సెప్టెంబర్ 1955 నాడు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 13 ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

ఈ నివేదికలో విశాలాంధ్రను ఏర్పాటు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను, ఆ విధంగానే ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకు అనుకూల వాదాలను కూడా కూలంకుషంగా పరిశీలించింది. సదరు అనుకూల ప్రతికూల వాదాలను ప్రస్తావించి పూర్వం ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య శ్రీ భాగ్ ఒప్పందం లాంటిది కుదుర్చుకొని, తెలంగాణ ప్రాంతం అభివృద్ధికి గానీ, ఉద్యోగావకాశాలకు హాని కలిగించని రీతిలో తగిన పరిరక్షణలను కల్పించి విశాలాంధ్రను ఏర్పాటు చేసుకోవచ్చని కమీషన్ సూచించింది. అలాగే ఆంధ్రరాష్ట్రంతో ఏకం కావడానికి 1952లో ఎన్నికైన తెలంగాణా రాష్ట్ర శాసన సభ్యులు 2/3 మెజారిటీతో ఆ మేరకు తీర్మానాన్ని ఆమోదిస్తే విశాలాంధ్రను ఏర్పాటు చేసుకోవచ్చు.

5) పెద్ద మనుషుల ఒప్పందం: ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు మూలంగా తెలంగాణా ప్రయోజనాలకు భంగం కలుగుతుందేమోననే అనుమాలను నివారించడానికి పెద్ద మనుషుల ఒప్పందం 1956 ఫిబ్రవరి 20న ఢిల్లీలో జరిగింది.

ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డి, అతని మంత్రి మండలి సహచరులు సర్వ శ్రీ నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న, ఎ.పి.సి.సి. అధ్యక్షుడు అలూరి సత్యనారాయణ రాజు సమావేశానికి హాజరైనవారు.

హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు, అతని మంత్రి మండలి సహచరులు. సర్వ శ్రీ కొండా వెంకటరంగారెడ్డి, డా॥ మర్రి చెన్నారెడ్డి, హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జె.వి నర్సింగరావు వీరు ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఒప్పందంలోని అంశాలు:
1) రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర, సాధారణ పరిపాలన వ్యయం ఆంధ్ర తెలంగాణా నిష్పత్తి ప్రకారం భరించాలి. తెలంగాణాలో మిగులు, ఆ ప్రాంతపు అభివృద్ధికి కేటాయించాలి. అయిదేళ్ల దాకా ఈ ఏర్పాటు ఉండాలి. అటు తరువాత, తెలంగాణా శాసన సభ్యుల కోరికపై మరో అయిదేళ్లు పొడిగించవచ్చు.

2) తెలంగాణలో ఉన్న విద్యా సౌకర్యాలు తెలంగాణా వారికే లభింపజేసి ఇంకా అభివృద్ధి చేయాలి. లేకపోతే మొత్తం రాష్ట్రంలో సాంకేతిక విద్యతో సహా అన్ని విద్యాలయాల్లోను మూడోవంతు తెలంగాణా విద్యార్థులకు కేటాయించాలి.

3) ముందు రాబోయే ఉద్యోగాలు ఉభయ ప్రాంతాల జనాభా ప్రాతిపదిక మీద ఉండాలి.

4) తెలంగాణలో నిష్పత్తి ప్రకారం నిర్ణయించిన ఉద్యోగాల్లో ప్రవేశించడానికి అభ్యర్థులు ఆ ప్రాంతంలో 12 సంవత్సరాల నివాసం ఉండాలి.

5) తెలంగాణా సర్వతోముఖాభివృద్ధి సాధించడానికి ఒక ప్రాంతీయ మండలి ఉండాలి.

6) మంత్రివర్గంలో ఆంధ్ర ప్రాంతం నుంచి 60% తెలంగాణా ప్రాంతం నుంచి 40% ఉండాలి. తెలంగాణా భాగంలో ఒక ముస్లిం కూడా ఉండాలి.

7) ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం వాడైతే ఉపముఖ్యమంత్రి తెలంగాణా వ్యక్తి అయి ఉండాలి. ముఖ్యమంత్రి తెలంగాణా ప్రాంతం వాడైతే ఉపముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతంవాడై ఉండాలి. హోం, ఫైనాన్స్, రెవెన్యూ, ప్లానింగ్, డెవలప్మెంట్, వాణిజ్య పరిశ్రమల శాఖల్లో కనీసం రెండైనా తెలంగాణా వారికివ్వాలి.

పెద్ద మనుషుల ఒప్పందం కుదరడంతో విశాలాంధ్ర ఏర్పాటు సుగమమైంది. 1956 మార్చి 16వ తేదీన పార్లమెంటు ఉభయసభల్లో రాష్ట్రాల పునర్నిర్మాణ బిల్లును ప్రతిపాదించడమైంది.

  • 1956 ఏప్రిల్ 5న ఆంధ్ర శాసనసభలో సదరు బిల్లుపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. శాసనసభ కొన్ని సవరణలతో తీర్మానాన్ని ఆమోదించింది.
    1. రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్ అని వుండాలి.
    2. రాజధాని మరియు హైకోర్టు హైదరాబాద్లో నే వుండాలి.
    3. ఆంధ్రప్రదేశ్ అంతటికీ 1962లోనే సాధారణ ఎన్నికలు జరగాలి.
    4. 72 మంది సభ్యులతో కూడిన విధాన పరిషత్ ఏర్పాటుకావాలి.
  • 1956 ఏప్రిల్ 13న హైదరాబాదు రాష్ట్ర శాసనసభ రాష్ట్రాల పునర్నిర్మాణ బిల్లును ఆమోదించింది.
  • 1956 ఆగష్టు 25న రాజ్యసభ బిల్లును ఆమోదించింది. అటు తరువాత లోక్సభ కూడా ఆమోదించింది. + 1956 ఆగష్టు 31న బిల్లుపై రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు.
  • 1956 నవంబర్ 1న అక్షర క్రమంలో మొదటిది భాషా రాష్ట్రాల్లో కూడా మొదటిదై ఆంధ్రప్రదేశ్ దీపావళి పర్వదినాన అవతరించింది. నాటి గవర్నర్ సి.ఎం. త్రివేది, ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డిలు వ్యవహరించారు.

ప్రశ్న 2.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు దారి తీసిన కారణాలను పరిశీలించండి.
జవాబు:
2000 సంవత్సరంలో చత్తీస్ ఘడ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఏర్పాటుతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈ సారి తెలంగాణ రాష్ట్ర సమితి (Telangana Rastra Samithi – T.R.S) ఆధ్వర్యంలో రాజకీయ ఉద్యమం కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రమనే విషయాన్ని మనం ఈ సందర్భంలో గుర్తుంచుకోవాలి. ఐతే ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 57 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఒకే భాష (తెలుగు) రాష్ట్ర ప్రజలందరినీ కలిపి ఉంచడంలో విఫలమైందని చెప్పవచ్చు.

తెలంగాణ ఉద్యమానికి ఒక్క ఆర్థికంగా వెనుకబాటుతనమే ప్రధాన ఇతివృత్తం కాదు. దాంతోబాటుగా నీటి వనరులు, ఆర్థిక వనరుల పంపిణీ, ఉపాధి అవకాశాలు, సాంస్కృతిక వికాసం మొదలైన అనేక అంశాలలో తెలంగాణ ప్రాంతం వివక్షకు గురి అయిందని ఆ ప్రాంత నాయకులు భావించడం జరిగింది. అయితే అటువంటి అంశాలు వాదోపవాదనలతో కూడినవిగా కొందరు పేర్కొన్నారు. అయితే ఒకసారి ప్రజానీకంలో కొన్ని వర్గాలలో అసౌకర్యం, అనుమానం ఏర్పడి అధికమైతే ఇతర ప్రాంతాల ప్రజలతో కలిసిమెలిసి జీవనం సాగించడం సాధ్యం కాదని చెప్పవచ్చు.

2009 డిసెంబర్లో తెలంగాణ ఉద్యమం తీవ్రం అయిన సమయంలో దేశీయ వ్యవహారాల శాఖమంత్రి చిదంబరం తెలంగాణ విషయంలో కేంద్రం ఎంతో శ్రద్ధను ప్రదర్శిస్తున్నట్లుగా ప్రకటించాడు. అందులో భాగంగా 2010 ఫిబ్రవరి మూడో తేదీన భారత ప్రభుత్వం న్యాయమూర్తి బి.ఎన్.శ్రీకృష్ణ ఆధ్వర్యంలో ఒక సంఘాన్ని నియమించి తెలంగాణ విషయంలోనూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ రాజకీయ పరిస్థితిని అధ్యయనం చేయాల్సిందిగా కోరింది. ఆ సంఘం రెండు ప్రధాన అంశాలను విస్తృతంగా పరిశీలించింది. అవి 1) తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్ర హోదా కావాలని డిమాండ్ చేయడం. 2) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యథావిధంగా కొనసాగించడం. శ్రీకృష్ణ సంఘం తన నివేదికను 2010 డిసెంబరు 30వ తేదీన దేశీయ వ్యవహారాల శాఖకు సమర్పించింది.

తెలంగాణ నాయకులు శ్రీకృష్ణ సంఘం నివేదికను తిరస్కరించారు. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతంలో సమ్మెలు, నిరాహార దీక్షలు, ఆత్మహత్యలు విజ్ఞప్తులను అందించడం, ప్రభుత్వ అధికారులకు గులాబీపూల బహుకరణ, ప్రభుత్వ ఉత్సవాల బహిష్కరణ వంటి చర్యలకు ఆందోళనకారులు పాల్పడ్డారు. దాంతో పరిస్థితి తీవ్రతను గమనించి భారత ప్రభుత్వం 2013 జూలై 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించింది. తదుపరి 2014 ఫిబ్రవరిలో పార్లమెంటు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ |బిల్లును తీవ్ర గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఆమోదించింది. దాంతో సీమాంధ్ర ప్రాంతం అట్టుడిగిపోయింది. పార్లమెంటు ఆమోదించిన పై బిల్లు రాష్ట్రపతి 2014 మార్చి ఒకటో తేదీన సంతకం చేశారు. తెలంగాణ భారతదేశంలో 29వ రాష్ట్రంగా 2014 జూన్ రెండో తేదీన ఆవిర్భవించింది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 13 ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

ప్రశ్న 3.
మానవ హక్కులంటే ఏమిటో నిర్వచించి, భారతదేశంలో జాతీయ మానవ హక్కుల సంఘం నిర్మాణాన్ని వర్ణించండి.
జవాబు:
మానవ హక్కుల నిర్వచనం: మానవ హక్కుల పరిరక్షణ చట్టం, 1993, రెండో సెక్షన్ (d) మానవ హక్కులను క్రింది విధంగా నిర్వచించింది.

“మానవ హక్కులు అనేవి వ్యక్తి జీవనం, స్వేచ్ఛ, సమానత్వం, హోదాలకు సంబంధించినవి. రాజ్యాంగం చేత హామీ ఇవ్వబడిన అంతర్జాతీయ చట్టాలు, భారతదేశ న్యాయస్థానాల చర్యల ద్వారా అమలవుతాయి.”

జాతీయ మానవ హక్కుల సంఘం నిర్మాణం: జాతీయ మానవ హక్కుల సంఘం అనేది బహుళసభ్య సంస్థ. ఆ సంస్థ నియమావళి సభ్యుల అర్హతలు, నియామకం గురించి పేర్కొన్నది. ఆ సంస్థకు సంబంధించిన సెక్షన్ 3 ప్రకారం క్రింది పట్టికలో సూచించిన సభ్యులు ఉంటారు.
AP Inter 2nd Year Civics Study Material Chapter 13 ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు 1

దీనిలో నలుగురు సభ్యులు ఉంటారు. దీనికి సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షత వహిస్తాడు. దీనిలో సభ్యులుగా సుప్రీం కోర్టు ప్రస్తుత లేదా మాజీ న్యాయమూర్తి, హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి లేదా మాజీ ప్రధాన న్యాయమూర్తితో పాటుగా మానవ హక్కుల కార్యకలాపాలకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. ఈ కమీషన్ ఛైర్మన్, సభ్యులను భారత రాష్ట్రపతి నియమిస్తారు. ఈ విషయంలో అతడు కేంద్ర హోంమంత్రి, లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్, పార్లమెంటు ఉభయసభలలోని ప్రతిపక్ష నేతలను సంప్రదిస్తారు. ఛైర్మన్, సభ్యులు ఐదేళ్ళ పాటు లేదా 70 ఏళ్ళు నిండేవరకు వారి పదవులలో కొనసాగుతారు. ఈ కమీషన్లో జాతీయ షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల, మైనారిటీల, మహిళల కమీషన్లకు సంబంధించిన ఛైర్మన్లు పదవిరీత్యా సభ్యులుగా ఉంటారు. ఈ కమీషన్ సాధారణ కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వంలో సెక్రటరీ జనరల్ హోదా గల అధికారి వ్యవహరిస్తాడు.

విధులు: జాతీయ మానవ హక్కుల కమీషన్ కింద పేర్కొన్న ముఖ్య విధులను నిర్వహిస్తోంది.

  1. ప్రభుత్వాధికారులు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తే, వాటిపై జాతీయ మానవ హక్కుల కమీషన్ విచారణ జరిపిస్తుంది.
  2. న్యాయస్థానాలు అనుమతించినమేరకు మానవ హక్కుల ఉల్లంఘన ఉదంతాలపై విచారణ జరుపుతుంది.
  3. మానవ హక్కుల అమలుకు సంబంధించిన వివిధ చట్టబద్ధమైన చర్యలను సమీక్షిస్తుంది.
  4. మానవ హక్కులకు భంగం కలిగించే టెర్రరిస్టుల కార్యకలాపాలను నివారించేందుకై సలహాలు ఇస్తుంది.
  5. మానవ హక్కులకు సంబంధించిన విషయాలపై పరిశోధనలను కొనసాగిస్తుంది.
  6. మానవ హక్కుల పట్ల ప్రజలలో అవగాహనను పెంపొందించేందుకై తగిన చర్యలను తీసుకొంటుంది.
  7. మానవ హక్కులను పరిరక్షించే స్వచ్ఛంద సంస్థలకు తగిన ప్రోత్సాహకాలను అందిస్తుంది.

ప్రశ్న 4.
సమాచార హక్కు చట్టం గురించి వివరించండి.
జవాబు:
సమాచార హక్కు చట్టం 2005 పార్లమెంటు ద్వారా ఆమోదించబడి అమలులోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఏ సంస్థ నుండి అయినా సమాచారాన్ని కోరే హక్కు ప్రతి భారతీయుడికి కల్పించింది. ఈ చట్టం జమ్మూకాశ్మీర్ రాష్ట్రం మినహా యావత్ భారతదేశానికి వర్తిస్తుంది.

ఈ చట్టం ద్వారా పౌరులు ప్రభుత్వ డాక్యుమెంటులు, ఉత్తర్వులు, నివేదికలు, మెమోలు మొదలగు వాటికి సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు.

సమాచారం పొందగోరే వారు సంబంధిత సమాచార అధికారికి లిఖిత పూర్వకంగా ఆర్జీ పెట్టుకొని 10 రుసుము చెల్లించవలెను. దారిద్ర్య రేఖకు దిగువున ఉన్నవారు ఎట్టి రుసుము చెల్లించనవసరము లేదు. 30 రోజుల లోపు సమాధానము ఇవ్వాలి.

ప్రభుత్వ సమాచార అధికారులు: ప్రతి పాలనా విభాగంలో ఒక ప్రభుత్వ సమాచార అధికారిని ప్రభుత్వం నియమిస్తుంది. ఈ అధికారి పౌరులడిగిన సమాచారాన్ని అందించాలి. సాధారణ సమాచారం అయితే ముప్పది రోజుల లోపల సమాధానం ఇవ్వాలి. అదే వ్యక్తి ప్రాణానికి, స్వేచ్ఛకు సంబంధించిన సమాచారం అయితే 48 గంటల లోపు సమాధానం ఇవ్వాలి. సమాచారాన్ని తిరస్కరిస్తే దానికి తగు కారణాలను పేర్కొనాలి.

సమాచార హక్కు చట్టం మినహాయింపులు: దేశ సమగ్రతకు, సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశాలు (రక్షణ, అణుశాస్త్రీయ) సమాచార హక్కు చట్టం నుండి మినహాయింపబడినాయి. కేంద్ర, రాష్ట్రమంత్రి వర్గాల నిర్ణయాలు పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల హక్కులకు భంగం కల్గించే అంశాలు కూడా మినహాయింపబడినాయి.
ఇదిగాక పెక్కు సంస్థలు చట్ట పరిధి నుండి మినహాయించబడ్డాయి. అవి ఏమనగా: IBR మరియు AW, Direc- torate of Revenue Intelligence, Aviation Research Centre, BSF, CRPF, Assam Riffles, Special Branch CID, మున్నగునవి. కాని ఈ సంస్థలు అవినీతి చర్యలకు పాల్పడ్డా, మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డా సమాచారం కోరే హక్కు ఉంది.

సమాచార కమీషన్లు: సంబంధిత సమాచార అధికార ఫిర్యాదుదారునికి సరియైన సమాచారాన్ని సకాలంలో ఇవ్వకపోయినా, ఎక్కువ రుసుము వసూలు చేసినా, మరే విధంగానైనా ఇబ్బంది కల్గచేసినా అప్పీలు చేసుకోవటానికి సమాచార హక్కు చట్టం కేంద్ర స్థాయిలో కేంద్ర సమాచార కమీషను, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సమాచార కమీషన్ న్ను ఏర్పాటు చేసింది.

కేంద్ర సమాచార కమీషన్: ఈ కమీషన్లో ఒక ముఖ్య సమాచార కమీషనర్, 10 మందికి మించని సమాచార కమీషనర్లు ఉంటారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తాడు. వీరి పదవీకాలం 5 సం॥లు లేక 65 సం॥ వయోపరిమితి. రాష్ట్ర సమాచార కమీషన్: ఈ కమీషన్లో ఒక ముఖ్య సమాచార కమీషనర్ పది మంది మించని సమాచార కమీషనర్లు ఉంటారు. వీరిని గవర్నరు నియమిస్తారు. వీరి పదవీకాలం 5 సం॥లు లేక 68 సం॥లు వయోపరిమితి. కేంద్ర, రాష్ట్ర సమాచార కమీషన్ల నిర్ణయమేతుది తీర్పు, ఈ తీర్పులపై ఎవ్వరికి అప్పీలు చేసుకొనే అధికారం లేదు. కాని రాజ్యాంగం ద్వారా అధికారాలు కల్గిన హైకోర్టు ఈ కమీషన్ల తీర్పులపై రిట్ల ద్వారా ఫిర్యాదుదారునికి మేలు చేకూర్చవచ్చు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 13 ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

కేంద్ర సమాచార కమీషన్ మరియు రాష్ట్ర సమాచార కమీషన్ ఇచ్చే తీర్పులు సాధారణ న్యాయస్థానాలతో సమానమైనవి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆంధ్రరాష్ట్ర అవతరణ గురించి వర్ణించండి. [Mar. ’16]
జవాబు:
ప్రత్యేకాంధ్ర రాష్ట్ర వాంఛ: ఒకవైపు వందేమాతరం స్వదేశీ ఉద్యమం, దేశవ్యాప్తంగా పుంజుకొంటూ ఉండగా మచిలీపట్నంలో భోగరాజు పట్టాభి సీతారామయ్య పంతులుగారు, ముట్నూరి కృష్ణారావు పంతులుగారు, కొండా వెంకటప్పయ్య పంతులుగారు, టంగుటూరి ప్రకాశం పంతులుగారు సమావేశమై ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణా
ప్రాంతాలను ఏకం చేసి సంయుక్త ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటును గురించి ఆలోచించసాగారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో 58% తెలుగు ప్రాంతాలుండి 40% తెలుగు జనాభా ఉండి కూడా తెలుగు వారు వెనుకబడి ఉండడం వారిని రోషపూరితుల్ని చేసేది. ఆ తరువాత, 1912లో నిడదవోలులో గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల సంయుక్త సమావేశం ఒకటి జరిగింది. ఆ సమావేశానికి కీ.శే. వేమనరపు రామదాసు పంతులుగారు అధ్యక్షత వహించారు.

1. ప్రధమాంద్ర మహాసభ, బాపట్ల 1913: ఆంధ్రరాష్ట్ర నిర్మాణ సమస్యపై ప్రధమాంధ్ర మహాసభ 1913లో గుంటూరు జిల్లా, బాపట్లలో శ్రీ బి.ఎన్. శర్మగారి అధ్యక్షతన జరిగింది. ఆ మహాసభకు మొత్తం 800 మంది ప్రతినిధులు, 2000 మంది ప్రేక్షకులు హాజరయ్యారు.

2. ద్వితీయాంధ్ర మహాసభ, విజయవాడ 1914: రెండో ఆంధ్ర మహాసభ 1914లో విజయవాడలో ఏప్రిల్ 11న జరిగింది. ఈ సభకు న్యాపతి సుబ్బారావుగారు అధ్యక్షత వహించారు. ఈ సభకు విజయవాడకు చెందిన శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారు నిర్వహకులుగా వ్యవహరించారు. సుమారు 1600 మంది ప్రతినిధులు ఈ సభకు హజరయ్యారు.

3. తృతీయాంధ్ర మహాసభ, విశాఖపట్నం 1915: మూడో ఆంధ్ర మహాసభ విశాఖపట్నంలో 1915 మే నెలలో జరిగింది. ఈ సభకు పానగల్లు రాజారామారాయణింగారు అధ్యక్షత వహించారు. ఈ సభ రెండు తీర్మానాలు చేసింది.

  1. ప్రత్యేకాంధ్ర రాష్ట్రం అత్యవసరం.
  2. సెకండరీ స్కూలు స్థాయిలో మాతృభాషలోనే బోధన జరగాలి.

1920లో నాగపూర్లో జరిగిన కాంగ్రెస్ మహాసభ భాషా రాష్ట్రాల సిద్ధాంతాన్ని అంగీకరిస్తున్నట్లు అధికారికంగా ఒక ప్రకటన చేసింది. దానికి నాందిగా మొత్తం 21 భాషలను గుర్తించి, ఆ ప్రాతిపదికనే ప్రత్యేక ప్రదేశ్ కాంగ్రెస్లను ఏర్పాటుచేసింది.

మాంటేగ్ – ఛెమ్స్ఫర్డ్ నివేదిక ఆధారంగా భారత కౌన్సిల్ చట్టం 1919ని బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించింది. చట్టంలోని 52 (ఎ) ప్రకరణం రాష్ట్ర శాసనసభల్లో అత్యధిక సంఖ్యాకులు ప్రత్యేక రాష్ట్ర నిర్మాణాన్ని అంగీకరిస్తూ తీర్మానించినట్లయితే ప్రభుత్వం అందుకు సమ్మతించవచ్చు అని పేర్కొన్నది.

ఆ రోజుల్లో ఆంధ్రులకు ముఖ్యంగా బ్రహ్మణేతర విద్యార్థులకు మద్రాసు విశ్వవిద్యాలయంలో ప్రవేశం దొరకడం చాలా కష్టంగా వుండేది. ఆనాటి విద్యామంత్రి అనెం పరశురామ పాత్రో కృషి ఫలితంగా 1926లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటైంది.

1932లో మద్రాసులో శ్రీ కడప కోటిరెడ్డి గారు అధ్యక్షతన ప్రత్యేకాంధ్ర మహసభ జరిగింది. ఈ సభకు శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారితో పాటు ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన ముఖ్య నాయకులు హాజరైనారు.

ప్రశ్న 4.
శ్రీ భాగ్ ఒప్పందం 1937 నవంబర్: 14, నవంబర్ 1937 నాడు మద్రాసులో శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారి స్వగృహమైన “శ్రీ భాగ్”లో ఆంధ్ర, రాయలసీమ నాయకుల సమావేశం జరిగింది. ఆంధ్ర ప్రాంతం నుంచి శ్రీయుతులు డా॥ భోగరాజు పట్టాభి సీతారామయ్య, కొండా వెంకటప్పయ్య, మహబూబ్ ఆలీబేగ్, దేశిరాజు
హనుమంతరావు, ముళ్ళపూడి పళ్లం రాజు, కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారు, రాయలసీమ నుంచి శ్రీయుతులు కడప కోటిరెడ్డి, సీతారామిరెడ్డి, దేశపాండ్యా సుబ్బరామిరెడ్డి, టి.ఎన్. రామకృష్ణా రెడ్డి, పప్పురి రామాచారి, వరదాచారి పాల్గొన్నారు.

1938 మార్చి, 30న ప్రత్యేకాంధ్ర రాష్ట్రాన్ని స్థాపించాలని కోరుతూ దేశభక్త కొండా వెంకటప్పయ్యగారు మద్రాసు శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని కడప కోటిరెడ్డిగారు బలపరిచారు. తీర్మానాన్ని బలపరుస్తూ ముఖ్యమంత్రి రాజగోపాలాచారి గంభీరోపన్యాసం చేశారు. తీర్మానం ఏకగ్రీవామోదం పొందింది.
1938లో ఆంధ్ర మహాసభ డా॥, సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన జరిగింది. ఆ సభలో రాజధాని గురించి చర్చించారు.

5. జె.వి.పి. నివేదిక: జైపూర్, కాంగ్రెస్ సభల్లో సభ్యులు సమస్యను పునఃపరిశీలించాలని అభిప్రాయపడ్డారు. దాన్ని పురస్కరించుకొని పార్టీ ఒక ఉపసంఘాన్ని నియమించింది. అందులో జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభిసీతారామయ్య గారు సభ్యులు ముద్దుగా మూడక్షరాల మాటగా దీన్ని జె.వి.పి. కమిటీ అని పిలిచారు. ఈ కమిటీ ||ఏప్రిల్ 1949లో తన నివేదికను ప్రకటించింది. చిరకాలంగా ఆంధ్రుల్లో నెలకొని వున్న అలజడి దృష్ట్యా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు. అందుకోసం ఆంధ్రులు మద్రాసు నగరం కోరికను వదులుకోవాలని పేర్కొంది.

6. స్వామి సీతారం ఉపవాస దీక్ష: ఆంధ్ర రాష్ట్ర సిద్ధిని శుభం చేయాలనే సంకల్పంతో 15 ఆగష్టు 1952 నాడు శ్రీ స్వామి సీతారాం (శ్రీ గొల్లపూడి సీతారామశాస్త్రి గారు) ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈయన ఉపవాస దీక్ష గుంటూరు పట్టణంలో టౌన్ హాలులో జరిగింది. మొత్తం 36 రోజులు ఉపవాస దీక్ష సాగింది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 13 ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

7. పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష: ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 19 అక్టోబరు, 1952 నాడు పొట్టి శ్రీరాములు గారు మహర్షి బులుసు సాంబమూర్తి గారి ఇంట్లో దీక్ష ప్రారంభించారు. ఆ ఇంటికి “యజ్ఞశాల” అని నామకరణం చేశారు.

ఈ వాతావరణంలో డిశంబర్ 9, 1952 నాడు పార్లమెంటులో మద్రాసును వదులుకొని ఆంధ్ర రాష్ట్రానికి అంగీకరిస్తే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకాంధ్ర రాష్ట్రం ఏర్పాటును పరిశీలించగలదని ఒక ప్రకటన చేయడమైనది. ఈ ప్రకటన వెలువడే నాటికి శ్రీరాములు దీక్ష మొదలు పెట్టి 52 రోజులైంది. ఆ తరువాత 15 డిశంబరు, 1952 రాత్రి 11 గం॥ 39 ని॥లకు పొట్టి శ్రీరాములు అమరజీవి పొట్టి శ్రీరాములయ్యారు.

8. వాంఛూ కమిటీ 1953: 1953 జనవరిలో ప్రత్యేకాంధ్ర రాష్ట్ర నిర్మాణ విషయాలను పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.ఎన్.వాంఛను నియమించింది. వాంఛూ నివేదిక అందటంతోనే ప్రధానమంత్రి నెహ్రూ ఒక ప్రకటన చేస్తూ, ఆంధ్ర రాష్ట్రం అక్టోబరు 1, 1953 నాడే ఏర్పాటవుతుందని, కాబట్టి రాజధాని నగరం ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడ వుండాలో తేల్చుకోవాల్సిన బాధ్యత ఆంధ్ర శాసన సభ్యులదే అని తెలిపారు. అంతేకాని మద్రాసు నగర ప్రసక్తి మాత్రం లేదు అని ఆయన స్పష్టం చేశారు.

9) ఆంధ్ర రాష్ట్ర అవతరణ: నూతనంగా రాష్ట్ర నిర్మాణం చేయడానికి భారత ప్రభుత్వం సి.ఎం.త్రివేదీని ప్రత్యేకాధికారిగా నియమించింది. అనుకొన్న ప్రకారం 1 అక్టోబర్, 1953 నాడు కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అధికారికంగా ఏర్పాటయింది. దీనిలో శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు 11 జిల్లాలు వున్నాయి.

4 జూలై, 1954న గుంటూరులో హైకోర్టును ఏర్పాటు చేశారు. హైకోర్టుకు మొదటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్. కోకా సుబ్బారావుగారు, ఆంధ్రరాష్ట్రానికి మొదట గవర్నర్ సి.ఎం. త్రివేది ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. భారత ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ రాష్ట్రానికి 1 అక్టోబర్, 1953 నాడు ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రారంభోత్సవం చేశాడు. ఆనాడు అశేషాంధ్ర ప్రజానీకం వాడవాడలా విందులు, వినోదాలు జరుపుకున్నారు.

ప్రశ్న 2.
జై ఆంధ్ర ఉద్యమానికి దారితీసిన అంశాలను పరిశీలించండి.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావం తరువాత కూడా తెలంగాణ ప్రాంతంలో ముల్కీ నిబంధనలు అమలులో ఉన్నాయి. అటువంటి నిబంధనలు ఆంధ్రప్రాంత ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఆటంకంగా ఉన్నాయనే భావన ఏర్పడింది. దాంతో ఆ నిబంధనలను రాష్ట్ర హైకోర్టులో కొందరు సవాల్ చేయడమైంది. అప్పుడు ఆ అంశంపై రాష్ట్ర హైకోర్టు సమగ్రంగా విచారించి ముల్కీ నిబంధనలు చెల్లుబాటు కావని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై సమగ్ర వివరణ కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ ను దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ఆ అంశాన్ని క్షుణ్ణంగా విచారించి ముల్కీ నిబంధనలు సక్రమమే అని తీర్పును ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెనురాజకీయ ప్రకంపనలను సృష్టించింది. ఆంధ్రప్రాంత ప్రజలు హైదరాబాద్ రాజధాని పట్టణంలోని ద్వితీయశ్రేణి పౌరులుగా దిగజారిపోయామనే భావన వ్యక్తీకరించారు. ఆంధ్రప్రదేశ్ నుండి ఆంధ్రప్రాంతం విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలనే డిమాండ్తో వారు జై ఆంధ్ర ఉద్యమాన్ని చేపట్టారు.

ప్రశ్న 3.
జాతీయ మానవ హక్కుల సంఘం అమలు చేసిన ప్రతిపాదనలు ఏవి ?
జవాబు:

  1. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన అంశాల విచారణ.
  2. న్యాయస్థానం విచార క్రమంలో మానవ హక్కులకు సంబంధించిన అంశాలు ఉన్నట్లయితే జోక్యం చేసుకోవడం.
  3. కారాగారాలను సందర్శించి, అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి తగిన సూచనలు అందించడం.
  4. మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన రాజ్యాంగ, చట్టపరమైన పరిరక్షణలను సమీక్షించడం.
  5. మానవ హక్కులను అనుభవించడంలో ఎదురయ్యే ఆటంకాలను సమీక్షించి, నివారణ చర్యలను సూచించడం.
  6. మానవ హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ చట్టాలను అధ్యయనం చేసి, వాటిని సమర్థవంతంగా అమలులో ఉంచేందుకు సూచనలు అందించడం.
  7. మానవ హక్కులకు సంబంధించిన అంశాలపై పరిశోధనలు గావించడం.
  8. ప్రజలలో మానవ హక్కుల పట్ల అవగాహనను పెంపొందించి, మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన సమాచారాన్ని అందించడం.
  9. మానవ హక్కుల విషయంలో ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల కృషిని ప్రోత్సహించడం.
  10. మానవ హక్కులను కోల్పోయిన బాధితులకు నష్టపరిహారాన్ని అందించడంలో సంబంధిత అధికారులకు సూచనలు చేయడం.

ప్రశ్న 4.
జాతీయ, రాష్ట్రస్థాయిలలో మానవహక్కుల సంఘాలు ఎందుకు అవసరమో తెలపండి.
జవాబు:
జాతీయ మానవహక్కుల సంఘం (National Human Rights Commission – NHRC) అనేది చట్టబద్ధమైన సంస్థ. ఆ సంస్థ 1993 అక్టోబరు 12న ఏర్పాటయింది. దానికి సంబంధించిన అంశాలను 1993 నాటి మానవహక్కుల పరిరక్షణ చట్టం నుండి గ్రహించడమైంది. ఆ చట్టం 1991 అక్టోబరులో పారిస్ లో జరిగిన అంతర్జాతీయ అధ్యయన సదస్సులో ఆమోదించిన నియమాలకు అనుగుణంగా ఉంటుంది. అట్లాగే ఆ చట్టం మానవహక్కుల పరిరక్షణ, వికాసానికి దోహదపడుతుంది. ఆ నియమాలను 1993 డిసెంబర్ 20వ తేదీన ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 48/134 వ తీర్మానం ద్వారా ఆమోదించింది. మానవహక్కుల పరిరక్షణ, వికాసంలో భారతదేశపు ఆసక్తికి జాతీయ మానవహక్కుల సంఘం ప్రతీకగా ఉంటుంది. జాతీయ మానవహక్కుల సంఘం ఆ చట్టాన్ని 2006లో సవరించండం జరిగింది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 13 ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

మానవహక్కుల పరిరక్షణ చట్టం, 1993 జాతీయ మానవహక్కుల సంఘంతో బాటుగా రాష్ట్ర మానవహక్కుల సంఘాల ఏర్పాటుకు వీలు కల్పించింది. ప్రస్తుతం భారతదేశంలో 23 రాష్ట్రాలు మానవహక్కుల సంఘాలను ఏర్పాటుచేశాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉంది. భారత రాజ్యాంగం ఏడో షెడ్యూలులోని రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలలో పేర్కొన్న అంశాల విషయంలో, మానవ హక్కుల ఉల్లంఘనలపై విచారణ జరిపే ముఖ్య ఉద్దేశ్యంతో రాష్ట్ర మానవహక్కుల సంఘం ఏర్పాటయింది.

ప్రశ్న 5.
సమాచార సంఘాల అధికారాలు, విధులు ఏవి ?
జవాబు:
సమాచార సంఘాల అధికారాలు, విధులు: [Mar. ’17]
1. కేంద్ర సమాచార సంఘం / రాష్ట్ర సమాచార సంఘం ఏ వ్యక్తి వద్ద నుంచైనా ఫిర్యాదులను స్వీకరించవచ్చు. అటువంటి వ్యక్తులు

  • ప్రధాన సమాచార అధికారి నియామకం జరగకపోవడంతో సమాచారం పొందేందుకు అవకాశం లేనివారై ఉండాలి.
  • అడిగిన సమాచారాన్ని ఇచ్చేందుకు అధికారులు తిరస్కరించి ఉండాలి.

2. సహేతుక కారణాలపై విచారణ జరిపించే అధికారం.

3. కేంద్ర సమాచార సంఘం / రాష్ట్ర సమాచార సంఘాలకు పౌరన్యాయస్థానాలుగా నిర్వహించే అధికారాలు ఎ) వ్యక్తుల హాజరు, వారి ప్రమాణంపై మౌఖిక, రాతపూర్వక సాక్ష్యాలను తీసుకోవడం, రాతప్రతుల వస్తువులను సమకూర్చడం.
బి) రాతప్రతులను పరిశోధించి, తనిఖీ చేయడం.
సి) అఫిడవిట్ ఆధారంగా సాక్ష్యాన్ని తీసుకోవడం.

4. విచారణ సమయంలో ఈ చట్టం ప్రకారం అన్ని ప్రతులను కేంద్ర సమాచార సంఘం / రాష్ట్ర సమాచార సంఘాలకు అందించడం.

5. ప్రభుత్వ అధికారుల నుంచి తన నిర్ణయాల అమలు గురించి సమాచారాన్ని రాబట్టడం.

  • నిర్ణీత ఫారంలో సమాచారాన్ని అందించే వీలుకల్పించడం.
  • ఎవరూ లేనిచో ప్రజాసమాచార అధికారి (PIO) / సహాయ ప్రజాసమాచార అధికారి (APIO) నియామకం గురించి ప్రభుత్వ అధికారులను ఆదేశించడం.

ప్రశ్న 6.
కేంద్ర సమాచార సంఘం ఏ విధంగా నిర్మితమైంది ?
జవాబు:
కేంద్ర సమాచార సంఘాన్ని ఒక ప్రత్యేక గెజిట్ ప్రకటన ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆ సంఘంలో ఒక ప్రధాన సమాచార కమీషనర్, పది మందికి మించకుండా సమాచార కమీషనర్లు ఉంటారు. వారందరినీ భారత రాష్ట్రపతి నియమిస్తారు. భారత రాష్ట్రపతి వారిచే ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. ఆ సంఘం ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. కేంద్రప్రభుత్వం ఆ సంఘానికి సంబంధించిన కార్యాలయాలను దేశంలోని ఇతర ప్రాంతాలలో ఏర్పాటు చేయవచ్చు. ఆ సంఘం తన కార్యకలాపాలకు ఇతర అధికారులు / సంస్థల ఆదేశాలకు లోబడక స్వతంత్రంగా నిర్వహిస్తుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 13 ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

ప్రశ్న 7.
సమాచారం పొందేందుకు గల సమయ పరిమితి ఏమిటి ?
జవాబు:
దరఖాస్తుదారుడు ప్రజాసమాచార అధికారి లేదా సహాయ ప్రజా సంబంధాల అధికారికి తదుపరి ఏ ఇతర అధీకృత అధికారికి గానీ తనకు కావాల్సిన సమాచారాన్ని ఒక దరఖాస్తు ద్వారా కోరతాడు. అందుకు అతడు కౌ 10లతో కూడిన డిమాండ్ డ్రాఫ్ట్, బ్యాంకు చెక్కు, ఇండియన్ పోస్టల్ ఆర్డర్ కోర్టు స్టాంపునుగానీ దరఖాస్తుతో జతపరచాలి. పేదరికం దిగువన నివసించే వారికి అటువంటి రుసుము చెల్లింపు నుంచి మినహాయంపు ఇవ్వబడింది. అయితే అందుకు సంబంధించిన నకలు పత్రాన్ని వారు దరఖాస్తుతో జతపరచాలి. సమాచారాన్ని ప్రజా సంబంధాల అధికారి, సహాయ ప్రజా సంబంధాల అధికారి దరఖాస్తుదారుడికి 30 రోజులలోగా అందించాలి. ఒకవేళ దరఖాస్తుదారుడి జీవనం, స్వేచ్ఛలకు సంబంధించిన అంశాలు ఇమిడి ఉంటే, సమాచారాన్ని అతడికి 48 గంటలలోగా అందించాలి. మూడో వ్యక్తి ఉన్నట్లయితే, అతడికి 40 రోజుల వ్యవధిలోగా సమాచారాన్ని అందించాలి. ఆ నిర్ణీత వ్యవధిలో సమాచారాన్ని అందించని యెడల, శాఖాధిపతికి దరఖాస్తుదారుడు మొదటిసారి అప్పీలు చేసుకోవచ్చు. కొంత నిర్ణీత వ్యవధి తరువాత దరఖాస్తుదారుడు సమాచార సంఘానికి అప్పీలు చేసుకోవచ్చు. ఒకవేళ సమాచారం అందించే విషయంలో నిర్హేతుకమైన జాప్యం ఏర్పడినచో లేదా తప్పుడు సమాచారం అందించినచో రోజుకు సంబంధిత, అధికారి 250ల మొత్తాన్ని దరఖాస్తుదారుడికి చెల్లించాలి. ఆ మొత్తం గరిష్ఠంగా 25000 వరకు ఉంటుంది. సంబంధిత అధికారిని విచారణ చేసేందుకు వీలుంటుంది.

ప్రశ్న 8.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోదా గురించి శ్రీకృష్ణ కమిటీ సూచించిన వివిధ ప్రతిపాదనలేవి ? [Mar. ’17, ’16]
జవాబు:
1. శ్రీకృష్ణ కమిటీ ఆరు ఐచ్ఛిక అంశాలతో కూడిన ప్రతిపాదనలను సూచించింది. అవి: 1. యథాతథస్థితిని కొనసాగించడం.

2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణ అనే రెండు రాష్ట్రాలుగా విభజించి, హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం.

3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని (1) హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలతో కూడిన రాయల తెలంగాణగా ఏర్పరచడం (2) కోస్తా ప్రాంతాన్ని అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉంచడం.

4. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణలుగా విభజించి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచడం. దానిని భౌగోళికంగా కోస్తా ప్రాంతంలోని గుంటూరు జిల్లాతో అనుసంధానం గావించడం. అందులో భాగంగానే దక్షిణ ఆగ్నేయంలో ఉన్న నల్గొండ జిల్లాను దక్షిణాన ఉన్న మహబూబ్నగర్ జిల్లా మొదలుకొని రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు జిల్లాతో అనుసంధానం గావించడం.

5. ప్రస్తుతం ఉన్న సరిహద్దుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ, సీమాంధ్రలుగా విభజించి, తెలంగాణకు హైదరాబాదు రాజధానిగా ఉంచడం, సీమాంధ్రకు నూతన రాజధాని నిర్మాణం గావించడం.

6. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచి, తెలంగాణ ప్రాంత సామాజిక – ఆర్థిక అభివృద్ధికి, రాజకీయ ప్రగతికి ఒక ప్రాంతీయ మండలిని ఏర్పాటు గావించడం.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పెద్ద మనుషుల ఒప్పందం.
జవాబు:
హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత విలీనాన్ని గట్టిగా వ్యతిరేకించాడు. కాని కాంగ్రెస్ అధిష్ఠానవర్గం ఆంధ్రప్రాంత నాయకుల ఒత్తిళ్ళుకు తలొగ్గి విశాలాంధ్ర ఏర్పాటును ఆమోదించింది. తెలంగాణ ప్రజానీకంలో ఉన్న భయాందోళనలను నివారించేందుకై ఆంధ్ర, తెలంగాణ ప్రాంత నాయకుల మధ్య కుదిరిన ఒప్పందాన్ని పెద్ద మనుషుల ఒప్పందం అని అంటారు. ఈ ఒప్పందంలోని ప్రధాన ఆంశం ప్రకారం తెలంగాణ సంపూర్ణ అభివృద్ధి కొరకై ప్రాంతీయ మండలి ఏర్పాటయింది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 13 ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

ప్రశ్న 2.
జె.వి.పి కమిటీ. [Mar. ’16]
జవాబు:
దక్షిణ భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరగాలనే డిమాండ్ ఉదృతం కావడంతో, భారత జాతీయ కాంగ్రెస్ ఆ అంశాన్ని పరిశీలించేందుకై ఒక త్రిసభ్య సంఘాన్ని నియమించింది. ఆ సంఘంలో జవహర్లాల్నెహ్రూ, వల్లభబాయి పటేల్, పట్టాభి సీతారామయ్య సభ్యులు ఉన్నారు. ఈ సంఘాన్ని జె.వి.పి కమిటీ అంటారు. ఈ కమిటీ తన నివేదికను 1949 ఏప్రిల్ 1వ తేదిన సమర్పించింది.

ప్రశ్న 3.
శ్రీబాగ్ ఒడంబడిక.
జవాబు:
1953 అక్టోబర్ 1వ తేదిన ఆంధ్రరాష్ట్రం అవతరించింది. నూతన రాష్ట్రానికి కర్నూల్ పట్టణాన్ని రాజధానిగా ఎంపిక చేయటమైంది. ఈ సమయంలో రాయలసీమ ఆంధ్రప్రాంత నాయకుల మధ్య కుదిరిన ఒడంబడికనే శ్రీబాగ్ ఒడంబడిక అంటారు. ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవానికి ప్రధాని నెహ్రూ ముఖ్య అతిధిగా విచ్చేయడమైంది. ఆంధ్రరాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు వ్యవహరించారు.

ప్రశ్న 4.
ఫజల్ ఆలీ సంఘం.
జవాబు:
1952 డిసెంబర్ 15వ తేదిన ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆమరణ దీక్ష చేపట్టిన పొట్టి శ్రీరాములు అశువులు బాశారు. దాని ఫలితంగా ఆంధ్ర ప్రాంతంలో శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలగటంలో ప్రజాభిప్రాయానికి తలొగ్గి ఆనాటి ప్రధాని నెహ్రూ 1) ఫజల్ ఆలీ 2) కె.ఎమ్. ఫణిక్కర్ 3) హృదయేంద్ర నాథ్ కుంజ్రూలతో ఒక సంఘాన్ని నియమించటం జరిగింది. ఈ సంఘానికి ఫజల్ ఆలీ చైర్మన్ గా వ్యవహరించటంతో దీనిని ఫజల్ అలీ సంఘం అంటారు. ఈ సంఘం ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్ను పరిశీలించి తన నివేదికను 1955 అక్టోబర్లో కేంద్రప్రభుత్వానికి సమర్పించింది.

ప్రశ్న 5.
జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్ నియామకంలో అనుసరించాల్సిన నియమాలు.
జవాబు:
జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మను భారత రాష్ట్రపతి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిన తరువాత ఖరారు చేసి నియమించటం జరుగుతంది. ఈ సందర్భంలో రాష్ట్రపతి ఆరుగురు సభ్యులతో కూడిన నియామకపు సంఘం సూచనలను పాటిస్తాడు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 13 ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

ప్రశ్న 6.
మానవ హక్కుల సంఘం చైర్మన్, సభ్యుల నియామకంలో అనుసరించాల్సిన ప్రక్రియ. [Mar. ’17]
జవాబు:
రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్, సభ్యులను సంబంధిత రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. ఈ సందర్భంలో గవర్నర్కు సలహా ఇచ్చేందుకు అత్యున్నత స్థాయి సలహామండలి ఉంటుంది. అందులో రాష్ట్రముఖ్యమంత్రి, రాష్ట్ర హోం మంత్రి విధానసభ స్పీకర్, విధాన సభలోని ప్రతిపక్ష పార్టీ నాయకుడు సభ్యులుగా ఉంటారు. ఆ సలహా మండలికి ముఖ్యమంత్రి కన్వీనర్ ఉంటాడు. రాష్ట్ర మానవహక్కుల సంఘం సభ్యుల నియామకంలో గవర్నర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదిస్తాడు.

ప్రశ్న 7.
పౌర న్యాయస్థానంగా మానవ హక్కుల సంఘం.
జవాబు:
మానవ హక్కుల సంఘం పౌర న్యాయస్థానంగా పనిచేస్తుంది. పౌర శిక్షాస్మృతికి అనుగుణంగా పనిచేసే సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఈ సంఘానికి ఉంటాయి. దానితో సాక్షులను పిలిచేందుకు, ఏదైనా రాత ప్రతిని సమర్పించాలని కోరేందుకు, అఫిడవిట్లపై అవసరమైన సాక్ష్యాన్ని రాబట్టేందుకు మానవ హక్కుల సంఘం సంపూర్ణ అధికారాన్ని కలిగి ఉంది.

ప్రశ్న 8.
సైనిక దళాలపై జాతీయ మానవ హక్కుల సంఘం పరిధి.
జవాబు:
సైనిక దళాల సిబ్బంది మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన ఉదంతాలపై విచారణ జరిపే విషయంలో జాతీయ మానవ హక్కుల సంఘానికి పరిమితమైన పాత్ర మాత్రమే ఉంటుంది. అయితే ప్రభుత్వం ఆ సంఘం చేసిన సిఫార్సులను విమర్శించటానికి వీలులేదు అని ఆ కమీషన్ లోని మాజీ సభ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు.

ప్రశ్న 9.
ప్రజా సమాచార అధికారి (P.I.O).
జవాబు:
ప్రజా సమాచార అధికారిని సమాచార కమీషన్ ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఈ అధికారి |సమాచార కమీషన్కు తన అధికారాలు, విధులలో తన సహాయ సహకారాలను అందిస్తారు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 13 ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

ప్రశ్న 10.
సమాచారం అంటే ఏమిటి ?
జవాబు:
సమాచారమంటే ఏదో ఒక భౌతికరూపంలో ఉండేదిగా పేర్కొనవచ్చు. రికార్డులు, డాక్యుమెంట్లు, మెమోలు, ఈ-మెయిళ్ళు, అభిప్రాయాలు, సలహాలు, పత్రికాప్రకటనలు, సర్క్యులర్లు. ఆదేశాలు, లాగ్ పుస్తకాలు, నివేదికలు, కాగితాలు, నమూనాలు, ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే ఏమైనా మెటీరియల్ మొదలైనవి సమాచారం క్రిందకు వస్తాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 12 రాజకీయ పార్టీలు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 12th Lesson రాజకీయ పార్టీలు Textbook Questions and Answers.

AP Inter 2nd Year Civics Study Material 12th Lesson రాజకీయ పార్టీలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశంలోని జాతీయ పార్టీలపై ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
జాతీయ పార్టీ: దేశంలో నాలుగు (లేదా) అంతకు మించిన రాష్ట్రాలలో జరిగే ఎన్నికలలో పాల్గొని, పోలైన ఓట్లలో ఆరు శాతం పొందటంతో పాటు నాలుగు లోక్సభ సీట్లను గెలుచుకొన్న పార్టీని జాతీయ (లేదా) అఖిల భారత పార్టీగా భారత ఎన్నికల సంఘం గుర్తిస్తుంది.
భారతదేశంలోని ప్రధాన జాతీయ పార్టీలను ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు. అవి:

  1. భారత జాతీయ కాంగ్రెస్
  2. భారతీయ జనతా పార్టీ
  3. భారత కమ్యూనిస్టు పార్టీ
  4. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
  5. బహుజన సమాజ్ పార్టీ
  6. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ

1) భారత జాతీయ కాంగ్రెస్: భారత జాతీయ కాంగ్రెస్ మన దేశంలో అతి పురాతన పార్టీ. దీనిని 1885 డిశంబరు, 28వ తేదీన బ్రిటిష్ సివిల్ సర్వెంట్ (A. O) ఎ.ఒ హ్యూమ్ స్థాపించాడు. ఉమేష్ చంద్ర బెనర్జీ దీనికి ప్రధమ అధ్యక్షుడుగా వ్యవహరించాడు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఈ పార్టీ చురుకైన పాత్ర పోషించి దేశానికి స్వాతంత్య్రాన్ని తీసుకోచ్చింది.

స్వాతంత్ర్యానంతరం జరిగిన 15 సాధారణ ఎన్నికల్లో, కాంగ్రెస్ పార్టీ ఆరుసార్లు ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటి సాధించింది. నాలుగు సార్లు అధికార సంకీర్ణానికి నాయకత్వం వహించింది. మొత్తం దాదాపు 49 సంవత్సరాల పాటు కేంద్రప్రభుత్వానికి నాయకత్వం వహించింది. దీనిలో ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని (1947 – 64), ఇటీవలి మన్మోహన్ సింగ్ (2004-14) వరకు ఏడుగురు కాంగ్రెస్ ప్రధాన మంత్రులు దేశాన్ని పాలించారు. 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ నాయకత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (United Progressive Alliance – UPA) మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఎన్నో ప్రాంతీయ పార్టీల సంకీర్ణంగా ప్రభుత్వాన్ని ఏర్పరచింది. 2014లో జరిగిన పదహారవ సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్వాతంత్య్రానంతరం మొదటిసారిగా హీనమైన ఓటమిని చవిచూచి, 543 మంది గల లోక్సభలో 44 స్థానాలకు పరిమితమైంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 12 రాజకీయ పార్టీలు

2) భారతీయ జనతా పార్టీ: భారతీయ జనతా పార్టీ (బిజెపి) ని 1980లో స్థాపించారు. భారతీయ జనతా పార్టీ 1951 అక్టోబర్ 21న శ్యాంప్రసాద్ ముఖర్జీ అధ్యక్షతన స్థాపించిన భారతీయ జన సంఘ్క ఒక నూతన, సవరించిన స్వరూపంగా పేర్కొనవచ్చు. భారతీయ జనతా పార్టీ తన పూర్వపు జన సంఘ్్కు కొనసాగింపుగా క్రమశిక్షణ – చక్కని వ్యవస్థీకృత యంత్రాంగం, సంప్రదాయ హిందూ సాంఘిక – సాంస్కృతిక సంస్థలైన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ (ఆర్. ఎస్. ఎస్), విశ్వహిందూ పరిషత్ (వి. హెచ్. పి) తదితర సంస్థలతో అనుబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఏవో కొన్ని రాజకీయ దృక్పధాలు, పార్టీ స్థాపించిన తొలినాళ్ళలో 1984 సాధారణ ఎన్నికల్లో బిజెపి దేశ వ్యాప్తంగా రెండు సీట్లలో మాత్రమే విజయం సాధించింది. అయితే ఆ తరువాత కాలంలో రామజన్మ భూమి – బాబ్రీ మసీదు అంశం ఆధారంగా తన బలాన్ని బాగా పుంజుకుని గణనీయంగా పెంచుకోగలిగింది. ఎన్నో రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలలో విజయాలు సాధించడం, జాతీయ స్థాయి ఎన్నికల్లో చక్కని ఫలితాలు సాధించడంతో 1996 కల్లా బిజెపి పార్లమెంటులో అతి పెద్ద పార్టీగా మారింది. అయితే పార్లమెంటులోని దిగువ సభలో సరైన మెజారిటీ లేకపోవడంతో ఆ పార్టీ ప్రభుత్వం కేవలం 13 రోజులు మాత్రమే అధికారంలో కొనసాగింది.

అనంతరం 1998 సాధారణ ఎన్నికల్లో బిజెపి మాత్రమే నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (National Democratic Alliance) అటల్ బీహారీ వాజ్పాయ్ ప్రధానమంత్రిగా ఒక సంవత్సరంపాటు అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత మళ్ళీ తాజాగా ఎన్నికలు జరగడంతో ఎన్. డి. ఎ ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పాయ్ నాయకత్వంలో పూర్తి పదవీకాలం అధికారంలో కొనసాగింది. అందుచేత స్వాతంత్య్రానంతర చరిత్రలో కాంగ్రెసేతర ప్రభుత్వం అనేది పూర్తి పదవీకాలం కొనసాగడం ఇదే మొదటిసారిగా పేర్కొనవచ్చు. ఆ తరువాత 2004లో జరిగిన సాధారణ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) అనూహ్యంగా పరాజయం పాలైంది. అలాగే 2009లో జరిగిన లోక్సభ సాధారణ ఎన్నికలలో కూడా ఇదే జరిగింది. ఫలితంగా దాదాపు 10 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కొనసాగింది. ఆ తరువాత 2014 సాధారణ ఎన్నికలలో సుదీర్ఘ కాలం గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ప్రధాన ప్రచారకునిగా, పార్టీలో జనాకర్షణ గల నాయకునిగా భారతీయ జనతాపార్టీని నడిపించి, పార్టీకి అద్భుతమైన విజయాన్ని అందించగలిగాడు. అప్పటి నుండి, నరేంద్ర మోడి ప్రధానమంత్రిగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఏర్పడిన 13 రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీల సంకీర్ణంగా జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) ప్రభుత్వం ఏర్పడి కొనసాగుతోంది.

3) భారత కమ్యూనిస్టు పార్టీ: భారతదేశంలోని రెండో అతి ప్రాచీన జాతీయ పార్టీయే భారత కమ్యూనిస్టు పార్టీ. |కమ్యూనిస్టు పార్టీ జాతీయోద్యమములో ప్రముఖపాత్ర వహించింది. భారతదేశంలో కమ్యూనిస్టు భావాలను వ్యాప్తి చేసే బాధ్యత ఎమ్. ఎన్. రాయ్కి అప్పజెప్పారు. 1925 డిశంబరు 26వ తేదీన మార్క్సిస్టు సిద్ధాంతములను విశ్వసించిన కొంతమంది కమ్యూనిస్టు పార్టీని స్థాపించారు. పశ్చిమ బెంగాల్, కేరళ, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో దీని ప్రాబల్యము హెచ్చుగా వుంది.

4) భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు): 1964 సంవత్సరములో విజయవాడ సమావేశములో భారత కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలిపోయి పి. సుందరయ్య, జ్యోతిబసు, నంబూద్రిపాద్ మొదలగు నాయకుల ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్టు పార్టీలోని అతివాదులు సి. పి. ఐ. (ఎమ్)గా ఏర్పడిరి. సి.పి.ఐ కి భిన్నముగా సి.పి.ఎమ్ నాయకులు (అతివాదులు) మావో సిద్ధాంతాలకు సన్నిహితులై చైనా కమ్యూనిజాన్ని అనుసరించిరి. పశ్చిమబంగ, త్రిపుర, కేరళలలో ఈ పార్టీకి చెప్పుకోదగ్గ మద్దతు ఉంది. ఈ పార్టీ పశ్చిమబంగలో 1977 నుండి 2012 వరకు అధికారంలో వుంది.

5) బహుజన సమాజ్ పార్టీ: బహుజన సమాజ్ పార్టీ దళితులు ఆధిపత్యం కలిగిన పార్టీ. ఈ పార్టీ ఉద్యోగుల సమాఖ్య. దళిత్ శోషిత్ సమాజ్ సమితిల విలీనం ఫలితంగా 1984లో ఏర్పండింది. కాన్షీరాం ఈ పార్టీ వ్యవస్థాపక నాయకుడు. మాయావతి ప్రస్తుతం ఈ పార్టీకి నాయకురాలుగా వ్యవహరిస్తున్నారు. ఈ పార్టీ భారత రాజకీయ వ్యవస్థలో జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. మాయావతి నాయకత్వంలో ఆ పార్టీ జనాకర్షణ క్రమేణా పెరుగుతూ వచ్చింది.

6) నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ: 1999, మే, 25 వ తేదీన కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన శరద్ పవార్, పి. ఎ. సంగ్మా, తారిక్ అన్వర్ తదితరులు స్థాపించిన పార్టీయే నేషనలిస్ట్ కాంగ్రెస్. ఈ పార్టీ స్థాపన సమయంలో ఇండియన్ కాంగ్రెస్ (సోషలిస్ట్) ను తనలో విలీనం చేసుకుంది. భారత ఎన్నికల సంఘం నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీని జాతీయ పార్టీగా గుర్తించింది. మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ మొదలగు రాష్ట్రాలలో ఈ పార్టీకి చెప్పుకోదగ్గ

2. పార్టీలలోని వివిధ రకాలను తెలిపి, భారతదేశంలో ప్రాంతీయ పార్టీల పాత్రను అంచనా వేయండి. జవాబు: పార్టీలలోని వివిధ రకాలు: ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాల్లో నాలుగు రకాలైన రాజకీయ పార్టీలు ఉంటాయి.

  1. నిరోధకవాద (ప్రతిక్రియాత్మక) పార్టీలు,
  2. సాంప్రదాయకవాద పార్టీలు,
  3. ఉదారవాద పార్టీలు,
  4. విప్లవాత్మక (సమూల సంస్కరణవాద పార్టీలు.

నిరోధకవాద (ప్రతిక్రియాత్మక) పార్టీలు పూర్వపు సాంఘిక, ఆర్థిక, రాజకీయ సంస్థలను సర్థిస్తూ ఉంటాయి. సాంప్రదాయకవాద పార్టీలు యథాతథ స్థితిని విశ్వసిస్తాయి. ఉదారవాద పార్టీలు వర్తమాన సంస్థలో సంస్కరణలను ప్రవేశపెట్టే లక్ష్యంతో పనిచేస్తాయి. విప్లవాత్మకవాద (సమూల సంస్కరణవాద) పార్టీలు ప్రస్తుత సంస్థలను కూలద్రోసి వినూత్న వ్యవస్థ స్థాపన లక్ష్యంతో పనిచేస్తాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 12 రాజకీయ పార్టీలు

భారతదేశంలో ప్రాంతీయ పార్టీల పాత్ర: భారత రాజకీయాల్లో ప్రాంతీయపార్టీల పాత్రను గురించి వ్యాఖ్యానిస్తూ డా॥ కె. ఆర్. బాంబువాల్ (Dr. K. R. Bambwal) కొన్ని విశిష్ట దృక్కోణాలను గుర్తించారు.
1) ప్రాంతీయ పార్టీలు భారతదేశంలోని ‘ఏకపార్టీ ఆధిపత్య వ్యవస్థ’ కు ఎంతో శక్తివంతమైన సవాలుగా నిలిచాయి.
2) ప్రాంతీయ పార్టీలు కేంద్ర, రాష్ట్ర సంబంధాల కూర్పుపైన, స్వభావంపైన ఒక బలమైన ప్రభావాన్ని చూపాయి. కేంద్ర ప్రభుత్వం వద్ద తమ వ్యవహారాల విషయంలో రాష్ట్ర నాయకులు మరింత హెచ్చుగా వ్యక్తీకరించుకోవడానికి ప్రయత్నించడం, కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ శక్తుల అవసరాలు, డిమాండ్లపై మరింతగా స్పందించడం మొదలైంది.
3) ప్రాంతీయ పార్టీలు రాజకీయాలను మరింత పోటీతత్త్వంతో ఉండే విధంగా మార్చాయి. అలాగే రాజకీయ ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యం అట్టడుగు స్థాయిలో మరింత విస్తృతంగా ఉండేలా చేశాయి.
4) ప్రాంతీయ పార్టీలతో ఉండే మరో ప్రయోజనం ఏమంటే ప్రజలు నాయకులతో సాన్నిహిత్యాన్ని కలిగి ఉండడం. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి, జాతీయపార్టీకి చెందిన ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తిని కలుసుకోవడం కంటే స్థానిక రాజకీయ పార్టీకి చెందిన నాయకుని కలుసుకోవడం తేలికగా భావిస్తారు.

భారతదేశంలో 1996 తరువాత అనేక ప్రాంతీయపార్టీలు జాతీయ రాజకీయాలలో కీలకంగా మారాయి. జాతీయ ప్రజాసామ్య కూటమి (NDA) లో భాగస్వామ్య పక్షాలుగా 23 ప్రాంతీయపార్టీలు 1999లో, 2004లో కేంద్ర ప్రభుత్వంలో అధికారాన్ని పంచుకున్నాయి. కొన్ని ప్రాంతీయపార్టీలు రాష్ట్రాల్లో అధికార పార్టీలుగా ఉన్నాయి. వీటిలో ఎఐఎడిఎంకె (AIADMK), టి.డి.పి (TDP), జె.డి.యు (JDU), బిజెడి (BJD), యుడిఎఫ్ (UDF), ఎస్.ఎ.డి (SAD) మొదలైనవి ఉన్నాయి. ఈ పరిణామం భారత రాజకీయాల్లో నిరంతరం పెరుగుత్ను, ప్రాముఖ్యంలో వృద్ధి కొనసాగుతున్న ప్రాంతీయపార్టీల ఉనికిని ప్రతిబింబిస్తుంది

ప్రశ్న 3.
భారతదేశంలో ఏకపార్టీ ఆధిపత్యంపై ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
భారతదేశంలో స్వాతంత్య్ర పోరాటం సమర్థవంతమైన రాజకీయ పార్టీల వ్యవస్థ స్థాపనకు పిలుపునిచ్చింది. దేశంలోని బ్రిటిషు వ్యతిరేక శక్తులను – జాతీయవాద శక్తులను సమీకరించి ఒకే గొడుకు క్రిందకు తెచ్చిన సంస్థగా భారత జాతీయ కాంగ్రెస్ అవతరించింది. భారతదేశం స్వాతంత్ర్యం సాధించిన తరువాత జాతిపిత మహాత్మగాంధీ ఈ పార్టీని ఒక సాంఘిక సంస్థగా మాత్రమే కొనసాగించాలని కోరినప్పటికీ, అది ఒక రాజకీయ పార్టీగానే కొనసాగుతూ వచ్చింది. స్వాతంత్య్రానంతర దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ క్రియాశీల పాత్ర ఎంతఘనమైనదంటే, చాలా తరుచుగా భారతదేశాన్ని ఏక పార్టీ ఆధిపత్య వ్యవస్థగా అభివర్ణించడం జరిగింది. ఈ పార్టీ సర్వసమ్మత పార్టీగా, అందరి సమీకృత ప్రయోజనాలే తన వ్యూహంగా పేర్కొన్నది. భారతీయ సమాజానికి ప్రతిరూపంగా కాంగ్రెస్ పార్టీ జాతి ఆవశ్యక లక్షణాలన్నింటిని తనలో ప్రతిబింబించింది.

జాతీయోద్యమ స్థాయి నుండి ఒక రాజకీయ పార్టీగా మారడంతో, కాంగ్రెస్, పార్టీ బ్రహ్మాండమైన సంస్థగా ఉంటూ విభిన్న అభిప్రాయాలు గల పలు సమూహాలను తనలో ఇముడ్చుకోగలిగింది. స్వాతంత్య్రానంతరం జరిగిన 15 సాధారణ ఎన్నికల్లో, కాంగ్రెస్ పార్టీ ఆరుసార్లు ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ సాధించింది. నాలుగు సార్లు అధికార సంకీర్ణానికి నాయకత్వం వహించింది. మొత్తం దాదాపు 49 సంవత్సరాల పాటు కేంద్రప్రభుత్వానికి నాయకత్వం వహించింది. దీనిలో ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మొదలుకొని (1947 – 64), ఇటీవలి మన్మోహన్ సింగ్ |(2004-14) వరకు ఏడుగురు కాంగ్రెస్ ప్రధాన మంత్రులు దేశాన్ని పాలించారు. 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ నాయకత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (United Progressive Alliance – UPA) మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఎన్నో ప్రాంతీయ పార్టీల సంకీర్ణంగా ప్రభుత్వాన్ని ఏర్పరచింది. 2014లో జరిగిన పదహారవ సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్వాతంత్య్రానంతరం మొదటిసారిగా హీనమైన ఓటమిని చవిచూచి, 543 మంది గల లోక్సభలో 44 స్థానాలకు పరిమితమైంది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాజకీయ పార్టీ అనగానేమి ? దాని లక్షణాలను, విధులను వివరించండి. [Mar. ’16]
జవాబు:
రాజకీయ పార్టీ అర్థం: రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యం సజీవంగా ఉండడానికి రక్తప్రసరణవలే పనిచేస్తాయి. అవి ప్రజాభిప్రాయాన్ని తీర్చిదిద్ది, వ్యక్తిగత అభిప్రాయాల ఫలితంగా ఏర్పడే సందిగ్ధత నుండి ప్రజాభిప్రాయాన్ని ఏర్పరుస్తాయి. ప్రజాభిప్రాయాన్ని పటిష్టంగా రూపొందించడంలో, పెంపొందించడంలో రాజకీయపార్టీలు ప్రధాన సాధనాల వలే పనిచేస్తాయి. విధాన రూపకర్తలనకు, పౌరులకు మధ్య రాజకీయ పార్టీలు మధ్యవర్తుల వలే పనిచేస్తాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 12 రాజకీయ పార్టీలు

రాజకీయ పార్టీ లక్షణాలు: రాజకీయ పార్టీకి ఈ దిగువ సూచించిన ముఖ్య లక్షణాలు ఉంటాయి.

  1. రాజకీయపార్టీ ఉమ్మడి ప్రయోజనాలు, ఒకేరకమైన విలువలు కలిగి ఉండే వ్యక్తుల సమూహంగా ఉంటుంది.
  2. రాజకీయపార్టీ తన స్వీయ రాజకీయ భావజాలాన్ని, కార్యక్రమాన్ని కలిగి ఉంటుంది.
  3. రాజ్యాంగపార్టీ సాధనాలతో ఎన్నికల ద్వారా మాత్రమే అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తుంది.
  4. జాతీయ ప్రయోజనాలను, జాతీయ, సంక్షేమాన్ని పెంపొందించడానికి రాజకీయ పార్టీ ప్రయత్నిస్తుంది.

రాజకీయపార్టీల విధులు:

  1. సామాజిక ప్రయోజనాల సమీకరణ, వ్యక్తీకరణ
  2. రాజకీయ భర్తీ
  3. ప్రజాభిప్రాయ సాధనాలు
  4. రాజకీయ సామాజికీకరణ, పౌరుల భాగస్వామ్యాన్ని పెంపొందించటం
  5. శాసనాల తయారీ
  6. ప్రతిపక్ష పాత్ర
  7. ప్రభుత్వ యంత్రాంగం, సంక్షేమ పథకాల అందుబాటు
  8. రాజకీయ వ్యవస్థకు న్యాయబద్ధతను చేకూర్చటం

ప్రశ్న 2.
పార్టీల వ్యవస్థ గురించి నీకేమి తెలియును ? పార్టీల వ్యవస్థ రకాలపై ఒక సంక్షిప్త సమాధానం వ్రాయండి.
జవాబు:
పార్టీల వ్యవస్థ అనేది సంక్లిష్ట సాంఘిక రాజకీయ ప్రక్రియలు, వ్యక్తిగత నాయకులు, సాంఘిక సంస్థలు, రాజకీయ సమూహాలు, సంస్థలు వాటిమధ్య పరస్పర చర్యలు, అంతర్గత సంబంధాలు మొదలైన వాటి సమాహారంగా పేర్కొనవచ్చు. ఈ చర్య – ప్రతిచర్యల రీతులు రాజ్యాంగాలు, శాసనాలు, నియమనిబంధనలు, సంస్థలు మొదలైన వాటి ఆధారంగా జరుగుతాయి. అలాగే ఒక సమాజంలో, రాజకీయ వ్యవస్థలో ఉండే రాజకీయ ఆలోచనలు, ప్రవర్తనలు కూడా వీటిని నిర్దేశిస్తాయి. ఈ విధమైన పరస్పర సంబంధాలు రాజకీయ భావజాలాల్లో, నాయకుల్లో, పార్టీ నిర్మాణంలో, పార్టీల్లో ఏర్పడే చీలికలలో, పార్టీ మద్దతు, నిరసన రీతుల్లో, ఓటర్ల సమీకరణలో, ఎన్నికల్లో జరిగే పోటీల్లో, ఇలా అనేక అంశాల్లో ప్రతిబింబిస్తుంది. భారతదేశం వంటి బహుళ సంస్కృతి సమాజంలో వివిధ స్థాయిల్లో అంటే జాతీయ, ప్రాంతీయ, ఉపప్రాంతీయ, గ్రామీణ – పట్టణ స్థాయిల్లో పార్టీల మధ్య సంకీర్ణాల నిర్మాణం జరుగుతుంది. పార్టీలు భారత రాజకీయాల్లో ఇతర ప్రధాన ప్రజాస్వామ్యాల్లో వలే కేంద్రస్థానాన్ని పొందుతాయి.

పార్టీల వ్యవస్థ – రకాలు: పార్టీల వ్యవస్థ మూడు రకాలు. అవి: 1) ఏక పార్టీ వ్యవస్థ 2) రెండు పార్టీల వ్యవస్థ 3) బహుళ పార్టీ వ్యవస్థ.
1) ఏక పార్టీ వ్యవస్థ: ఏక పార్టీ వ్యవస్థలో ఒకే ఒక రాజకీయపార్టీ మనుగడలో ఉంటుంది. ఇతర రాజకీయపార్టీలు పనిచేయడానికి అనుమతి ఉండదు. ఒకే రాజకీయపార్టీలో అసంతృప్తులు, వర్గాలు ఉండవచ్చు. ఉదాహరణకు జర్మనీలో నాజీ పార్టీ, ఇటలీలో ఫాసిస్టు పార్టీ, చైనాలో – పూర్వపు సోవియట్ యూనియన్ కమ్యూనిస్టు పార్టీలను ఏకపార్టీ వ్యవస్థగా పేర్కొనవచ్చు.

2) రెండు పార్టీల వ్యవస్థ: రెండు పార్టీల వ్యవస్థలో రాజకీయ వ్యవస్థ రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఆధారంగా పనిచేస్తుంది. వీటిలో ఒకటి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, మరొకటి ప్రతిపక్ష పార్టీగా విధులు నిర్వహిస్తుంది. ఈ తరహా వ్యవస్థలో రాజకీయ అధికారం రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పరస్పర ప్రత్యామ్నాయంగా పనిచేస్తాయి. ఇంగ్లాండ్ (యు.కె)లోని లేబర్ పార్టీ, కన్సర్వేటివ్ పార్టీలు, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని (USA) రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీలు వీటికి ఉదాహరణలుగా చెప్పవచ్చు.

3) బహుళ పార్టీ వ్యవస్థ: ఈ తరహా వ్యవస్థలో రెండు పార్టీల కంటే ఎక్కువ పార్టీలు ఉంటాయి. అయితే వాస్తవంలో అవి అధికార పార్టీకిగానీ, ప్రతిపక్ష పార్టీకి గానీ స్నేహబంధంతో ఉంటాయి. ఈ విధమైన బహుళ పార్టీ వ్యవస్థ భారతదేశం, ఫ్రాన్స్, స్వీడన్, నార్వే తదితర దేశాల్లో వాడుకలో ఉంది.

ప్రశ్న 3.
భారతీయ పార్టీ వ్యవస్థ లక్షణాలను సంక్షిప్తంగా వ్రాయండి.
జవాబు:
భారతదేశంలో పార్టీ వ్యవస్థ లక్షణాలు:

  1. బహుళ పార్టీ వ్యవస్థ: భారతదేశంలో బహుళ సంఖ్యలో పార్టీలున్నాయి. ప్రస్తుతం దేశంలో 6 జాతీయ పార్టీలు, 64 రాష్ట్రస్థాయి పార్టీలున్నాయి.
  2. ఏకపార్టీ ఆధిపత్య వ్యవస్థ భారతదేశ రాజకీయ రంగంలో సుదీర్ఘకాలంపాటు కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యంతో కొనసాగింది.
  3. స్పష్టమైన భావజాలం లేకపోవటం: BJP, CPI, CPI (M) మినహా మిగిలిన పార్టీలకు స్పష్టమైన సిద్ధాంత భావజాలం లేదు.
  4. వ్యక్తిపూజ: చాలా తరచుగా భారతదేశంలో రాజకీయ పార్టీలు గొప్ప నాయకుని చుట్టూ వ్యవస్థీకృతమై ఉంటాయి.
  5. సాంప్రదాయక అంశాలు: భారతదేశంలో అనేక పార్టీలు మతం, కులం, భాష, సంస్కృతి, తెగ తదితర |అంశాల ప్రాతిపదికగా ఏర్పడతాయి.
  6. ప్రాంతీయ పార్టీల అవతరణ: భారత రాజకీయ వ్యవస్థలో పెద్ద సంఖ్యలో ప్రాంతీయ పార్టీలు అవతరించటానికి ప్రధాన లక్షణంగా చెప్పవచ్చు..
  7. చీలికలు, ఫిరాయింపులు: వర్గపోరు, ఫిరాయింపులు, చీలికలు, విలీనాలు, విచ్ఛిన్నాలు, సమీకరణాలు భారతదేశ రాజకీయ పార్టీల కార్యాచరణలో ప్రధాన అంశాలుగా కొనసాగుతున్నాయి.
  8. సమర్థవంతమైన ప్రతిపక్షం లేకపోవటం: భారతదేశ రాజకీయ వ్యవస్థలో సమర్థవంతమైన ప్రతిపక్షం |లేకపోవటం ఒక ప్రధాన లోపంగా గోచరిస్తుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 12 రాజకీయ పార్టీలు

ప్రశ్న 4.
భారతదేశంలో కాంగ్రెస్ పార్టీపై సంక్షిప్త సమాధానం వ్రాయండి.
జవాబు:
భారత జాతీయ కాంగ్రెస్ మన దేశంలో అతి ప్రాచీన పార్టీ. దీనిని 1885 డిశంబరు 28వ తేదీన బ్రిటిష్ సివిల్ సర్వెంట్. A.O. హ్యూమ్ స్థాపించాడు.

భారత జాతీయ కాంగ్రెస్ ఆసియా – ఆఫ్రికా ఖండాల్లో బాగా విజయవంతమైన జాతీయోద్యమాల్లో ఒక దానిని నిర్వహించింది. స్వాతంత్ర్యం సాధించిన తరువాత, దేశాన్ని పరిపాలించే బాధ్యతను కాంగ్రెస్ స్వీకరించింది. స్వతంత్ర భారతదేశంలో రెండు దశాబ్దాల పాటు పూర్తి స్థాయి రాజకీయ ఆధిపత్యాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించింది. 1960వ దశకం చివరిభాగంలో కాంగ్రెస్ పార్టీ మొదటిసారిగా చీలిపోయింది. దాంతో కమ్యూనిస్టేతర పార్టీలు, కాంగ్రెస్ (ఒ)లు సంయుక్తంగా శ్రీమతి ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ (ఆర్)ను అధికారం నుండి తొలగించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. 1972లో జరిగిన ఎన్నికలలో శ్రీమతి ఇందిరాగాంధీ పూర్తి మెజారిటీ సాధించి తిరిగి అధికారంలోనికి వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ అనుసరించిన కొన్ని విధానాల వలన క్రమేణా దాని జనాకర్షణ తగ్గిపోయింది. దీంతో 1977లో పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో చారిత్రాత్మక కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా ఓటమిని చవిచూచి, ప్రతిపక్షపార్టీ స్థాయికి దిగజారిపోయింది.

స్వాతంత్య్రానంతరం జరిగిన గత 15 సాధారణ ఎన్నికల్లో, కాంగ్రెస్ పార్టీ ఆరుసార్లు ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ సాధించింది. నాలుగుసార్లు అధికార సంకీర్ణానికి నాయకత్వం వహించింది. మొత్తం దాదాపు 49 సంవత్సరాలపాటు కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించింది. దీనిలో ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని (1947-64), ఇటీవలి మన్మోహన్ సింగ్ (2004-14) వరకు ఏడుగురు కాంగ్రెస్ ప్రధాన మంత్రులు దేశాన్ని పాలించారు. 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ నాయకత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (United Progres- sive Alliance – UPA) మన్మోహన్సంగ్ ప్రధానమంత్రిగా ఎన్నో ప్రాంతీయపార్టీలు సంకీర్ణంగా ప్రభుత్వాన్ని ఏర్పరచింది. 2014లో జరిగిన పదహారవ సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్వాతంత్య్రానంతరం మొదటిసారిగా హీనమైన ఓటమిని చివిచూచి, 543 మంది గల లోక్సభలో 44 స్థానాలకు పరిమితమైంది.

ప్రశ్న 5.
భారతీయ జనతా పార్టీ గురించి సంక్షిప్తంగా వివరించండి.
జవాబు:
భారతీయ జనతా పార్టీ (బిజెపి) ని 1980లో స్థాపించారు. భారతీయ జనతా పార్టీ 1951 అక్టోబర్ 21న శ్యాంప్రసాద్ ముఖర్జీ అధ్యక్షతన స్థాపించిన భారతీయ జనసంఘక్కు ఒక నూతన, సవరించిన స్వరూపంగా పేర్కొనవచ్చు. భారతీయ జనతా పార్టీ తన పూర్వపు జనసంఘ్్కు కొనసాగింపుగా క్రమశిక్షణ – చక్కని వ్యవస్థీకృత యంత్రాంగం, సంప్రదాయ హిందూ సాంఘిక – సాంస్కృతిక సంస్థలైన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ (ఆర్ ఎస్ ఎస్), విశ్వహిందూ పరిషత్(వి హెచ్ పి) తదితర సంస్థలతో అనుబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఏవో కొన్ని రాజకీయ దృక్పథాలు, విధాన స్వభావాలలో వైవిధ్యాలు మినహా, బిజెపికి తన పూర్వపు జనసంఘ్ ఎంతో సామీప్య అనుబంధం ఉంది.

జనసంఘ్ తన అస్థిత్వాన్ని రద్దు చేసుకొని, 1977 మే ఒకటో తేదీన జనతా పార్టీలో విలీనమైంది. అయితే కొంతకాలం తరువాత జనతాపార్టీలో చీలిక రావడంతో, పూర్వపు జనసంఘ్ నాయకులు, సభ్యులు కొద్దిమందితో కలిసి జనతా పార్టీని విడిచిపెట్టి, భారతీయ జనతా పార్టీ పేరుతో కొనసాగుతున్నారు.

ప్రశ్న 6.
భారతదేశంలో ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యతను అంచనా వేయండి. [Mar. 17]
జవాబు:
అనేక ప్రాంతీయ పార్టీలు గణనీయమైన ప్రజా ఎన్నికల మద్దతుతో ముఖ్య రాజకీయ సంస్థలుగా సుస్థిరంగా కొనసాగుతున్నాయి. భారతదేశ సమాఖ్య ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థలో ప్రాంతీయపార్టీలు, స్థానిక పార్టీలు ఎంతో ఆవశ్యకంగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా కొన్ని ఆధిపత్య, సాంఘిక, ఆర్థిక ప్రయోజనాల కోసం ఇవి తప్పనిసరి అవుతాయి. రాజకీయపార్టీలలో విస్తృతస్థాయి పాత్ర విషయంలో చాలా పార్టీలకు ప్రయోజిత వర్గాలు, ప్రభావ వర్గాల వలె సమరూప లక్షణాలు ఉంటాయి. జాతీయపార్టీలు నడిపే విస్తృత పాత్ర నేపథ్యంలో ప్రాంతీయపార్టీల ప్రభావం కొన్నిసార్లు ప్రభావవంతంగా, మరికొన్నిసార్లు బలహీనంగా ఉంటుంది. అనేక ప్రాంతీయపార్టీలు రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటులో జాతీయపార్టీలకు సంకీర్ణ భాగస్వాములయ్యాయి. కొన్ని ప్రాంతీయ పార్టీలు స్థిరంగా ఉండి, కొన్ని రాష్ట్రాల్లో ప్రధాన రాజకీయ సంస్థలుగా పనిచేస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా, పెరుగుతున్న ప్రాంతీయ పార్టీల మనుగడ నిస్సందేహంగా, భారతదేశంలో ఒక విశిష్ట రాజకీయ పరిణామానికి చెందిన అంశంగా పేర్కొనవచ్చు.

ప్రశ్న 7.
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీపై ఒక సంక్షిప్త సమాధానం వ్రాయండి.
జవాబు:
1983వ సంవత్సరములో ఆకస్మాత్తుగా రాష్ట్ర రాజకీయ చిత్రపటంలో గణనీయమైన మార్పు వచ్చింది.
ఎన్.టి.రామారావు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ నూతన ప్రాంతీయ రాజకీయపార్టీగా ఆవిర్భవించింది. అప్పటికే కలతలతో, ముఠాలతో విడిపోయి ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో మట్టి కరిపించింది. ఎన్. టి. రామారావు తెలుగు చలనచిత్ర రంగంలో ప్రఖ్యాత కథానాయకునిగా ఎంతో పేరు ప్రతిష్టలు గడించాడు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఒక వేగుచుక్కవలె దూసుకురావడానికి ఎన్నో అంశాలు తోడ్పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ఎంతోకాలం అధికారంలో ఉండి అసమర్థతతో వ్యవహరించడంతో సామాన్య ప్రజల విశ్వసనీయతను కోల్పోయింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సరిగా నిర్వహించలేకపోవడం, ద్రవ్యోల్బణం, పెరుగుతున్న నిరుద్యోగాన్ని పట్టించుకోకపోవడం, పరిపాలన వ్యవస్థలో అన్ని స్థాయిల్లో అవినీతి వంటి అంశాలు ఆ పార్టీ పతనానికి దారితీసాయి. దీనికితోడు, తరచుగా ముఖ్యమంత్రుల మార్పుతో రాష్ట్రంలో నాయకత్వ శూన్యత ఏర్పడింది. ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రిమండలి కాంగ్రెస్ అధినాయకత్వం చేతిలో ఆట బొమ్మలుగా మారారు. దాంతో జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించి, ప్రాతినిధ్యం వహించే సామర్థ్యం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులలో లేదనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతిందనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో చాటి చెప్పింది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 12 రాజకీయ పార్టీలు

2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 14వ శాసనసభ ఎన్నికలలో ఆ పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 174 స్థానాలకు 102 స్థానాలు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పరచింది. శ్రీనారా చంద్రబాబునాయుడు విభజించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యాడు.

ప్రశ్న 8.
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అవతరణకు తోడ్పడిన పరిస్థితులను అంచనా వేయండి.
జవాబు:
ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు ప్రజల్లో సజీవంగా ఉన్నప్పటికీ, వాటిని నెరవేర్చే రీతిలో తీవ్రస్థాయిలో పోరాటం చేసే వేదిక అవతరించడానికి ఎంతో సమయం పట్టింది. 1990 దశకం మధ్యభాగంలో అనేక ప్రజాసంఘాలు, సంస్థలు ప్రత్యేక రాష్ట్ర అంశంపై సమావేశాలు ఏర్పాటు చేయడం మొదలుపెట్టాయి.

ఇదే తరుణంలో తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు, మాజీమంత్రి డిప్యూటీ స్పీకర్గా ఉన్న సిద్దిపేట శాసనసభ్యుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, ఆనాడు నారా చంద్రబాబునాయుడు పెంచిన విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా ఒక బహిరంగ లేఖ రాసినాడు. దానిలో పెంచిన విద్యుత్ బిల్లుల వలన తెలంగాణా ప్రాంత ప్రజలు, రైతులకు 80% తీవ్ర అన్యాయం జరుగుతుందని ఎదురు తిరుగుబాటుచేసి తెలంగాణావాదులకు కేంద్ర బిందువుగా మారినాడు. తెలంగాణావాదులు మేధావులు అందరూ తెలంగాణాకు జరుగుతున్న వివక్ష గురించి వివరించటం జరిగింది. దీనితో తెలంగాణా బలం గ్రహించిన కె.సి.ఆర్, కొన్ని వందల గంటలపాటు వివిధ వర్గాల వారితో చర్చించి తెలంగాణా రాష్ట్రమే ఏకైక ఎజెండాగా T.R.S. పార్టీ ఆవిర్భావానికి పునాది వేసినాడు.

కల్వకుంట్ల చంద్రశేఖరరావు (KCR) తెలంగాణ రాష్ట్ర సాధన అంశంపై 2000 సంవత్సరం మొదట్లో తన ప్రయత్నాలను ప్రారంభించాడు. 2001 మే నెల 17వ తేదీన కె. చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటుచేసుకున్నట్లు ప్రకటించాడు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ మద్ధతును కె. చంద్రశేఖరరావు పొందాడు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టి.ఆర్.ఎస్ (TRS) పార్టీ భారత జాతీయ కాంగ్రెస్తో మైత్రి ఏర్పరచుకొని తెలంగాణలో 26 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడమే కాక, జాతీయ స్థాయిలో 5 పార్లమెంటు స్థానాల్లో విజయం పొందింది. అలాగే రాష్ట్రస్థాయిలో, కేంద్రంలో టి.ఆర్.ఎస్. (TRS) పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంతో చేరింది. 2006 సెప్టెంబర్ నెలలో టి.ఆర్.ఎస్ (TRS) పార్టీ కేంద్ర ప్రభుత్వం నుండి వైదొలిగింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు విషయంలో ఎన్నికల వాగ్దానానికి అనుగుణంగా కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోవడాన్ని కారణంగా చూపి కేంద్రప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాజకీయ పార్టీ విధులు. [Mar. ’17]
జవాబు:
రాజకీయ పార్టీ విధులు:

  1. సామాజిక ప్రయోజనాల సమీకరణ, వ్యక్తీకరణ,
  2. రాజకీయ భర్తీ బాధ్యతలు,
  3. ప్రజాభిప్రాయ సాధనాలుగా పనిచేయడం,
  4. రాజకీయ సామాజికీకరణ, పౌరుల భాగస్వామ్యాన్ని పెంపొందించటం.
  5. శాసనాలను రూపొందించటం,
  6. ప్రతిపక్ష పాత్రను పోషించటం,
  7. ప్రభుత్వ యంత్రాంగం, సంక్షేమ పథకాలను అమలుచేయటం,
  8. రాజకీయ వ్యవస్థకు న్యాయబద్ధతను చేకూర్చటం మొదలగునవి.

ప్రశ్న 2.
పార్టీ వ్యవస్థ రకాలు.
జవాబు:
పార్టీ వ్యవస్థను ముడు రకాలుగా పేర్కొంటారు. అవి:
1) ఏకపార్టీ వ్యవస్థ: ఈ వ్యవస్థలో ఒకే రాజకీయ పార్టీ ఉంటుంది.
ఉదా: జర్మనీలో నాజీ పార్టీ, ఇటలీలో ఫాసిస్ట్ పార్టీ.

2) రెండు పార్టీల వ్యవస్థ: ఈ వ్యవస్థలో రెండు రాజకీయ పార్టీలుంటాయి. ఉదా: ఇంగ్లాండులో లేబర్ పార్టీ మరియు కన్సర్వేటివ్ పార్టీలు.

3) బహుళ పార్టీ వ్యవస్థ: ఈ వ్యవస్థలో ఎక్కువ పార్టీలు ఉంటాయి. ఉదా: భారతదేశం, ఫ్రాన్స్

AP Inter 2nd Year Civics Study Material Chapter 12 రాజకీయ పార్టీలు

ప్రశ్న 3.
జాతీయ పార్టీలు.
జవాబు:
జాతీయ స్థాయిలో దేశమంతటా విస్తరించి జాతీయ అజెండాను రూపొందించుకొని రాజ్యాంగ పద్ధతుల ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నిరంతరం కృషిచేసే ప్రజల స్వచ్ఛంద సంస్థ లేదా సమూహాన్ని జాతీయ పార్టీగా పేర్కొంటారు.
ఉదా: భారతదేశంలో కాంగ్రెస్, జనతాపార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ, భారతీయ జనతా పార్టీ మొదలగునవి.

ప్రశ్న 4.
ప్రాంతీయ పార్టీలు. [Mar. ’16]
జవాబు:
ప్రాంతీయ పార్టీలు భౌగోళిక, రాజకీయ, హేతుబద్ధమైన అంశాల ప్రాతిపదికగా అవతరిస్తాయి. సమాఖ్య వ్యవస్థలో జాతీయ పార్టీల నాయకుల ఆధిపత్య, సిరంకుశ ధోరణి, ప్రాంతీయ, రాష్ట్ర సమస్యలను నిర్లక్ష్యం చేయటం. రాష్ట్రస్థాయి నాయకశ్రేణిని అగౌరవపరచటం, అవమానించటం తదితర కారణాలు ప్రాంతీయ పార్టీల ఆవిర్భావానికి ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. ప్రాంతీయ పార్టీలు ఒక రాష్ట్రానికి పరిమితంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తాయి.
ఉదా: తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, ద్రవిడ మున్నేట్ర కజగం, ఆల్ ఇండియా అన్నా డి.ఎం.కె. మొదలగునవి.

ప్రశ్న 5.
డి.ఎం.కె.
జవాబు:
1949 వ సంవత్సరంలో సి. ఎస్. అన్నాదురై దాదాపు నాలుగింట మూడొంతులు అనుచర గణంతో ద్రవిడ కజగం నుండి వేరుపడి ద్రవిడ మున్నేట్ర కజగం (డి.ఎం.కె) అనే పార్టీని స్థాపించాడు. ఈ రాజకీయ పార్టీ తమిళుల గుర్తింపుపై దృష్టి నిలిపి, పార్టీ మౌళిక భావన అయిన బ్రాహ్మణ వ్యతిరేక వాదాన్ని చేపట్టింది. తరువాత ఎన్నికలలో క్రియాశీలంగా పాల్గొని తమిళనాడు రాష్ట్ర విధానసభలో బలీయమైన శక్తిగా అవతరించింది.

ప్రశ్న 6.
ఎ.ఐ.ఎ.డి.ఎం.కె.
జవాబు:
1972వ సంవత్సరంలో ఎం.జి. రామచంద్రన్ నాయకత్వంలో ఏర్పడిన అన్నా డి.ఎం.కె. పార్టీ తరువాత ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగంగా రూపాంతరం చెందింది. 1988వ సంవత్సరములో ఎం.జి. రామచంద్రన్ మరణం తరువాత ఎ.ఐ.ఎ.డి.ఎం.కె. పార్టీ జయలలిత నాయకత్వంలో బలపడి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పలుమార్లు ఘనవిజయం సాధించింది. నేడు ఆ పార్టీ నాయకురాలు కుమారి జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

ప్రశ్న 7.
ఏకపార్టీ ఆధిపత్యం.
జవాబు:
స్వాతంత్ర్యానంతరం దేశరాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీల పాత్ర పోషించటంతో తరుచుగా భారతదేశాన్ని ఏకపార్టీ ఆధిపత్యం వ్యవస్థగా అభివర్ణించటం జరిగింది. ఈ పార్టీ సర్వసమ్మత పార్టీగా, అందరి సమీకృత ప్రయోజనాలే ముఖ్యంగా, భారతీయ సమాజానికి ప్రతిరూపంగా కాంగ్రెస్ పార్టీ జాతి ఆవశ్యక లక్షణాలన్నింటిని తనలో ప్రతిబింబించింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం సంపూర్ణం కాదని కొద్దిమంది రాజకీయ విశ్లేషకులు పేర్కొంటారు.

ప్రశ్న 8.
బహుళ పార్టీ వ్యవస్థ. [Mar. ’16]
జవాబు:
దాదాపు ఒక భౌగోళిక ఖండం పరిమాణంలో విస్తరించిన దేశం. భిన్నభిన్న సంస్కృతుల స్వభావం, వయోజన ఓటుహక్కు విచిత్ర తరహా రాజకీయ ప్రక్రియ తదితర కారణాలు భారతదేశంలో బహుళ పార్టీ వ్యవస్థకు దారితీసినాయి. ప్రస్తుతం మన దేశంలో 6 జాతీయ పార్టీలు, 64 రాష్ట్రస్థాయి పార్టీలు, 1737 రిజిష్టర్ అయి గుర్తింపులేని పార్టీలు మన దేశంలో ఉన్నాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 12 రాజకీయ పార్టీలు

ప్రశ్న 9.
బహుజన సమాజ్ పార్టీ.
జవాబు:
బహుజన సమాజ్ పార్టీ దళితులు ఆధిపత్యం కలిగిన పార్టీ. ఈ పార్టీ ఉద్యోగుల సమాఖ్య, దళిత్ శోషిత్ సమాజ్ సమితిల వీలినం ఫలితంగా ఏర్పడింది. కాన్షీరాం ఈ పార్టీ వ్యవస్థాపక నాయకుడు. మాయావతి ప్రస్తుతం ఈ పార్టీకి నాయకురాలుగా వ్యవహరిస్తున్నారు. ఈ పార్టీ భారత రాజకీయ వ్యవస్థలో జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. మాయావతి నాయకత్వంలో ఆ పార్టీ జనాకర్షణ క్రమేణా పెరుగుతూ వచ్చింది.

ప్రశ్న 10.
నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ.
జవాబు:
కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన శరద్ పవార్, పి.ఎ. సంగ్మా, తారిక్ అన్వర్ తదితరులు స్థాపించిన పార్టీయే నేషనలిస్ట్ కాంగ్రెస్. ఈ పార్టీ స్థాపన సమయంలో ఇండియన్ కాంగ్రెస్ (సోషలిస్ట్)ను తనలో విలీనం చేసుకుంది. భారత ఎన్నికల సంఘం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీనీ జాతీయ పార్టీగా గుర్తించింది. మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ మొదలగు రాష్ట్రాలలో ఈ పార్టీకి చెప్పుకోదగ్గ బలముంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 11 ఎన్నికలు – ప్రాతినిధ్యం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 11th Lesson ఎన్నికలు – ప్రాతినిధ్యం Textbook Questions and Answers.

AP Inter 2nd Year Civics Study Material 11th Lesson ఎన్నికలు – ప్రాతినిధ్యం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశ ఎన్నికల వ్యవస్థపై ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
పౌరులందరూ ప్రభుత్వం చేసే నిర్ణయాలన్నింటిలో ప్రత్యక్షంగా పాల్గొనే వీలులేదు. కాబట్టి ప్రజాప్రతినిధులు ప్రజలచే ఎన్నుకోబడి వారి కోరికలు, ఆకాంక్షలు నెరవేర్చుతారు. కావున ఎన్నికలకు విశేషమైన ప్రాధాన్యత ఉన్నది. భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశమని మనం అనుకున్నప్పుడు మన ఆలోచనలు గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలవైపు మళ్ళుతాయి. నేడు ఎన్నికలు ప్రజాస్వామ్య ప్రక్రియకు ప్రతీకలుగా నిలిచాయి.

భారత ఎన్నికలవ్యవస్థ యొక్క ముఖ్య లక్షణాలు:
ఈ క్రింది ముఖ్యలక్షణాలు భారతదేశంలోని ఎన్నికల వ్యవస్థ యొక్క నిర్మాణాన్ని మరియు నిర్వహణను విశదీకరిస్తున్నాయి. అవి:
1) ప్రజాప్రతినిధుల ప్రత్యక్ష ఎన్నిక: భారతదేశంలోని ప్రజలు తమ ప్రజాప్రతినిధులను ప్రత్యక్షంగా ఎన్నుకొనుటకు రాజ్యాంగం వీలుకల్పించింది. పార్లమెంటు సభ్యులను, రాష్ట్ర శాసనసభలకు, పట్టణ, నగరపాలక సంస్థలు గ్రామ పంచాయితీ సభ్యులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటున్నారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ శాసనసభలు ప్రజల అధికారానికి ముఖ్యకేంద్రాలు.

2) కొన్ని సంస్థలకు పరోక్ష ఎన్నికలు: రాజ్యసభ, రాష్ట్రాలవిధానమండలు, రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు రాజ్యాంగం పరోక్ష ఎన్నికలకు అవకాశం కల్పించింది. ఆయా సంస్థలకు, పదవులకు పరోక్షంగా నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు పద్ధతిలో ఎన్నికలు నిర్వహించబడతాయి.

3) వయోజన ఓటు హక్కు: భారత రాజ్యాంగం పౌరులందరికి వయోజన ఓటుహక్కును కల్పించినది. 21 సంవత్సరములు నిండిన పౌరులందరికీ కుల, మత, జాతి, లింగవివక్షత లేకుండా ఓటుహక్కును కల్పించినది. ఆ తరువాత ఓటు హక్కుకు అర్హత వయస్సు 21 నుండి 18 సంవత్సరములకు తగ్గించడం జరిగినది. నేడు భారతదేశంలో 18 సంవత్సరములు నిండిన పౌరులందరి పేర్లు ఓటర్ల జాబితాలలో చేర్చబడి వారు స్వేచ్ఛగా తమ ఓటుహక్కు వినియోగించుకొనేందుకు అర్హత లభించింది.

4) షెడ్యూల్డ్ కులాలు, తెగలకు సీట్ల కేటాయింపులో ప్రాతినిధ్యం: షెడ్యూల్డ్ కులాలు, తెగల అభీష్టాన్ని పరిరక్షించేందుకు భారతరాజ్యాంగం వారికి పార్లమెంటు, శాసనసభ సీట్ల కేటాయింపులో ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించింది. రాజ్యాంగంలోని 330 ప్రకరణ లోక్సభలోని సీట్లు, 332 ప్రకరణ రాష్ట్రశాసనసభలలోని సీట్లు కేటాయింపులో ఆయాతరగతులకు ప్రాతినిధ్యం కల్పించాలని పేర్కొన్నది. వారికి కేటాయించిన స్థానాలలో ఆయా తెగలకు చెందిన అభ్యర్థులు మాత్రమే పోటీ చేయాలి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 11 ఎన్నికలు - ప్రాతినిధ్యం

5) నియామకపు ప్రతిపాదనలు: భారతరాజ్యాంగంలోని 337 ప్రకరణం పార్లమెంటులోని లోక్సభకు రాష్ట్రపతి ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను నియమించి చెయ్యవచ్చును. ఇదే పద్ధతిలో గవర్నర్ రాష్ట్రశాసన సభకు ఒక ఆంగ్లో ఇండియన్ను నియమించే అధికారం ఉంది.

6) ఓటరు జాబితాల సవరణ: భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒక సారి ఓటర్లనమోదు, ఓటరు జాబితాల సవరణ, తయారీ ప్రక్రియలను భారత ఎన్నికల సంఘం చేపడుతుంది. అంతేగాక ప్రతిసాధారణ ఎన్నికలకు ముందుగా ఎన్నికల జాబితాల సవరణ, కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాలకు ఎన్నికల సంఘం ఆదేశిస్తుంది. ప్రతి ఏడాది ఓటరు జాబితాల సవరణకు కూడా అవకాశం ఉన్నది. ఓటరు జాబితాలో ఎవరి పేరు నమోదు కాబడిందో వారు మాత్రమే ఎన్నికల తేదీన ఓటు హక్కు వినియోగించుకొనేందుకు అర్హులు.

7) ప్రాదేశిక, ఏక సభ్య నియోజకవర్గాలు: భారత ఎన్నికల వ్యవస్థ ఏక సభ్య ప్రాదేశిక నియోజకవర్గాల ఏర్పాటుకు అవకాశం కల్పించింది. నిర్దేశించబడిన ప్రతిపాదిత ప్రాంతంలో నివశించే ఓటర్లు అందర్నీ కలిపి ఒక నియోజకవర్గంగా పరిగణిస్తారు. ఇలాంటి ఒక నియోజకవర్గం నుండి ఒకే ప్రతినిధిని ఓటర్లు ఎన్నుకోవలసి ఉంటుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలూ శాసన, పార్లమెంటు నియోజకవర్గాలుగా విభజించబడ్డాయి. ప్రతీ నియోజకవర్గం నుండి ఒక శాసనసభ్యుడ్ని, పార్లమెంటు సభ్యుడ్ని ఓటర్లు ఎన్నిక చేసుకుంటారు. వీటిలో కొన్ని నియోజకవర్గాలు షెడ్యూలు కులాలు, తెగలకు కేటాయిస్తారు. `ఆయా నియోజకవర్గాలలో ఆ తెగలకు, కులాలకు చెందిన అభ్యర్థులను మాత్రమే ఎన్నిక చేసుకోవాలి.

8) నియోజకవర్గాల పునర్విభజన: ప్రతి పది సంవత్సరములకు జనాభాలెక్కల ఆధారంగా నియోజకవర్గాలు పునర్విభజన చేయబడుతాయి. దీనికొరకు నియోజ వర్గాల పునర్విభజన సంఘం ఏర్పాటు చేయబడుతుంది. ఈ సంఘం ప్రతిపాదనల మేరకు నియోజకవర్గాలు పునర్విభజన చేయబడవచ్చు లేదా ఒకదానిలో ఒకటి కలపవచ్చు. ఈ విషయంలో నియోజకవర్గాల పునర్విభజన సంఘం నిర్ణయమే అంతిమం. ఈ సంఘం యొక్క నిర్ణయాన్ని ఏ న్యాయస్థానంలోనూ సవాలు చేయుటకు వీలులేదు.

9) రహస్య బ్యాలెట్ పద్ధతి: ఓటర్లు ఓటును స్వేచ్ఛగా తమ అభీష్టం మేరకు వినియోగించుకొనేందుకు రహస్య ఓటింగుకు వీలు కల్పించింది. ఎన్నికలలో ఓటర్లు తమ ఓటుహక్కును నిర్భయంగా, రహస్యంగా వినియోగించుకొనేందుకు, దొంగ ఓట్లు వేసేవారిని గుర్తించేందుకు ప్రత్యేకమైన చర్యలు, తీసుకున్నారు. ఇటువంటి విధానం ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు చాలా అవసరం.

10) ఓటింగు యంత్రాలను ప్రవేశపెట్టడం: భారత ఎన్నికల సంఘం ఎన్నికలలో ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకొనేందుకు, ఓట్ల లెక్కింపుకు ఓటింగు యంత్రాలను ప్రవేశపెట్టింది. వీటిని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు అంటారు. ఓటింగులో బ్యాలెట్ పత్రాలకు బదులుగా ఓటింగు యంత్రాలను వినియోగించడమైంది.

11) పరస్పర ఆధిక్యత ఓటు పద్ధతి: ప్రతీ నియోజకవర్గంలోనూ ఎన్నికలలో తోటి అభ్యర్థుల కన్నా ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధిగా ప్రకటిస్తారు. ఈ పద్ధతిలో ఓట్ల లెక్కింపుకు అర్హత కల్గిన ఓట్లను మాత్రమే పరిగణనలోనికి తీసుకుంటారు. ఒక అభ్యర్థి విజయాన్ని ఆ అభ్యర్థితో పోటీపడిన అభ్యుర్థులకు వచ్చిన ఓట్లకన్నా ఎక్కువగా వచ్చిన ఓట్లను బట్టి నిర్దేశింపబడుతుంది. అంటే తోటి అభ్యర్థుల కన్నా ఏ అభ్యర్థికైతే ఎక్కువ ఓట్లు పోలౌతాయో ఆ అభ్యర్థి గెలుపొందినట్లు లెక్క

2) స్వయంప్రతిపత్తి కలిగిన యంత్రాంగం: రాజ్యాంగంలోని 324 ప్రకరణ ప్రకారం దేశంలోని ఎన్నికల నిర్వహణ భారత ఎన్నికల సంఘం యొక్క ముఖ్యబాధ్యత. ఎన్నికలను స్వతంత్రంగా, స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయబడిన స్వయంప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ వ్యవస్థ భారత ఎన్నికల సంఘం.

ప్రశ్న 2.
భారత ఎన్నికల సంఘం విధులను వివరించండి.
జవాబు:
భారత రాజ్యాంగంలోని ప్రకరణ 324(1) ప్రకారం పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులకు సంబంధించిన ఎన్నికలను పర్యవేక్షించి, నిర్వహించుటకై ఎన్నికల సంఘం ఏర్పాటు కొరకు వీలుకల్పించాయి.

భారత ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయబడిన శాశ్వతమైన స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. నిర్మాణం: భారత ఎన్నికల సంఘం ఒక ప్రధాన ఎన్నికల కమీషనర్ మరియు ఇద్దరు ఎన్నికల కమీషనర్లను కలిగి బహుళ సభ్య వ్యవస్థగా పనిచేయుచున్నది.

నియామకం: ప్రధాన ఎన్నికల కమీషనర్ మరియు ఇతర కమీషనర్లను భారత రాష్ట్రపతి నియమిస్తారు. పదవీకాలం: భారత ప్రధాన ఎన్నికల కమీషనర్ మరియు ఇద్దరు ఎన్నికల కమీషనర్లు 6 సంవత్సరములు లేదా 65 సంవత్సరమలు వయస్సు నిండే వరకు పదవిలో కొనసాగుతారు.

ఎన్నికల సంఘం విధులు: భారత రాజ్యాంగంలోని 324 నుండి 328 వరకు గల ప్రకరణలు ఎన్నికల సంఘం యొక్క ఏర్పాట్లు, అధికారాలు, విధులను విశదీకరిస్తున్నాయి. అవి.

  1. భారత ఎన్నికల సంఘం నిర్ణీత కాలవ్యవధిలో ఓటర్ల జాబితాలను సవరిస్తుంది.
  2. ఓటర్ల జాబితాలు నమోదు చేయబడ్డ అర్హత కలిగిన ఓటర్ల పేరులో తప్పులు లేకుండా తయారుచేయటం ఎన్నికల సంఘం విధి.
  3. ఎన్నికల నిర్వహణకు ఎన్నికల తేదీ, ఇతర వివరాలతో ఎన్నికల ప్రకటన, అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలన కూడా నిర్వహిస్తుంది.
  4. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు తగిన నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది.
  5. ఎన్నికల నిర్వహణ, ప్రశాంతతకు భంగం కలిగినట్లయితే దేశం మొత్తం ఎన్నికలను, లేదా కొన్ని రాష్ట్రాలలో లేదా రాష్ట్రంలో, కొన్ని నియోజకవర్గాలు లేదా నియోజకవర్గంలో ఎన్నికలను రద్దు చేయవచ్చు లేదా వాయిదా వేయవచ్చును.
  6. పార్టీలకు, ఎన్నికలలో పోటీచేయు అభ్యర్థులకు ఎన్నికల నియమావళిని వర్తింపచేస్తుంది.
  7. ఏదో ఒకటి లేదా కొన్ని నియోజకవర్గాలలో తిరిగి ఎన్నికల నిర్వహణకు ఆజ్ఞలు జారీ చేయవచ్చును.
  8. ఎన్నికల లెక్కింపు ప్రక్రియ సవ్యంగా జరగలేదని భావిస్తే ఎన్నికల సంఘం తిరిగి ఓట్ల లెక్కింపునకు ఆదేశించవచ్చును.
  9. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి ఎన్నికల గుర్తులు కేటాయించటం, రాజకీయ పార్టీలకు గుర్తింపునివ్వటం ఎన్నికల సంఘం ముఖ్యవిధి.
  10. రాష్ట్రపతి పాలన సమయంలో రాష్ట్రాలలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్రపతికి ఎన్నికల సంఘం సలహాలనిస్తుంది.
  11. రాష్ట్ర శాసనసభలో సభ్యుల అర్హత లేదా అనర్హత విషయాలలో రాష్ట్ర గవర్నర్కు సలహాలిస్తుంది.

ప్రశ్న 3.
ప్రాతినిధ్యం అనగానేమి ? భారతదేశంలో ఎన్ని రకాల ప్రాతినిధ్య వ్యవస్థలు ఉన్నాయో తెలపండి.
జవాబు:
ప్రాతినిధ్యం – అర్థం: ఆధునిక ప్రజాస్వామ్య దేశాలు ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులచే ఏర్పడిన ప్రాతినిధ్య లేదా పరోక్ష ప్రజాస్వామ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. ఆధునిక ప్రజాస్వామ్య దేశాలు ప్రత్యక్ష ప్రజాస్వామ్య లేదా |ప్రాతినిధ్య ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కలిగి ఉంటున్నాయి. ఇలాంటి వ్యవస్థలో ప్రజలు తమకు బదులుగా శాసనాల తయారీ కొరకు ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఈ ప్రతినిధులు శాసనసభలో ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తారు. భారతదేశంలో అమలులో ఉన్న ప్రాతినిధ్య వ్యవస్థలు:

AP Inter 2nd Year Civics Study Material Chapter 11 ఎన్నికలు - ప్రాతినిధ్యం

భారతదేశంలో రెండు రకాల ప్రాతినిధ్య వ్యవస్థలు లేదా పద్ధతులు ఉన్నాయి. అవి:

  1. ప్రాదేశిక ప్రాతినిధ్య పద్ధతి
  2. వృత్తి ఆధారిత ప్రాతినిధ్య పద్ధతి.

1) ప్రాదేశిక ప్రాతినిధ్య పద్ధతి: ప్రాదేశిక ప్రాతినిధ్య పద్ధతిలో దేశంలోని ఓటరులందరినీ వివిధ ప్రాదేశిక నియోజకవర్గాలుగా విభజించి, ప్రతి నియోజకవర్గం నుండి ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ ప్రతినిధులను ఓటర్లు ఎన్నుకుంటారు. అన్ని ప్రాదేశిక నియోజకవర్గాలు దాని పరిమాణంలోగాని, జనాభా సంఖ్యలో గాని సుమారుగా ఒకే విధంగా ఉంటాయి. నియోజకవర్గంలో నివసించే ఓటరులందరూ తమ ప్రజాప్రతినిధి ఎన్నికప్రక్రియలో భాగస్వామ్యులౌతారు. ప్రాదేశిక నియోజకవర్గం నుండి ఒకే ప్రజాప్రతినిధి ఎన్నిక కాబడితే అది ఏకసభ్య నియోజకవర్గంగా పరిగణిస్తారు. అలాకాక ఒక నియోజక వర్గం నుండి ఒకరికన్నా ఎక్కువమంది ప్రతినిధులు ఎన్నికైతే దానిని బహుళ సభ్య నియోజక వర్గం అంటారు. భారతదేశం లాంటి ఆధునిక ప్రజాస్వామ్య దేశాలలో దిగువసభ సభ్యుల ఎంపిక కొరకు ఏకసభ్య ప్రాదేశిక నియోజకవర్గ పద్దతిని అనుసరిస్తున్నారు.

2) వృత్తి ఆధారిత ప్రాతినిధ్య పద్ధతి: పౌరులు చేసే వృత్తుల ఆధారంగా ఇటువంటి నియోజకవర్గాలు ఏర్పాటవుతాయి. ఇటువంటి నియోజకవర్గాలలో పౌరులు ఒకే రకమైన వృత్తి లేదా సమాన లక్షణాలు కలిగిన వృత్తులలో నిమగ్నమై ప్రాదేశిక ప్రాంతంలో నివాసముంటారు. వైద్యులు, వ్యవసాయదారులు, వ్యాపారులు, పత్రికా విలేకరులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, శ్రామికులు తదితరులు వివిధ రకాల వృత్తి సంఘాల్ని కలిగి ఉంటారు. ఒకే వ్యక్తి అన్ని రకాల వృత్తులకు ప్రాతినిధ్యం వహించలేడు కనుక వృత్తి లేదా పని ఆధారంగా ప్రాతినిధ్యం ఉండాలి. ఇక చట్టసభలు వివిధ రకాల వృత్తుల సమూహాలకు ప్రాతినిధ్యం వహిస్తే, ఆ సభ వివిధ రకాల ప్రజాభీష్టాన్ని ప్రతిబింబిస్తూ వాటిని వ్యక్తీకరిస్తుంది. కాని అసంఖ్యాకమైన వృత్తులు, పనులను నిర్వహిస్తున్న అపరిమితమైన సమూహాలున్న దేశంలో అన్ని వృత్తుల వారికి, సమూహాలకు ప్రాతినిధ్యం కల్పించటం సాధ్యం కాదని చెప్పవచ్చు.

ప్రశ్న 4.
భారత ఎన్నికల వ్యవస్థను సంస్కరించాల్సిన అవసరం ఉందని నీవు భావిస్తున్నావా ?
జవాబు:
భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ, యంత్రాంగం, ఎన్నికల ప్రక్రియలను పరిశీలించి సంస్కరణలను ప్రతిపాదించుటకై అనేక కమిటీలు, కమిషన్లను భారత ప్రభుత్వం నియమించింది. అందులో కొన్నింటిని క్రింద పేర్కొనడం జరిగింది.

  1. 1974 తార్కుండై కమిటీని నియమించగా అది 1975లో తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
  2. 1990లో ఎన్నికల సంస్కరణల కొరకు దినేష్ గోస్వామి కమిటీని నియమించడమైంది.
  3. రాజకీయాలు, నేరాల మధ్య సంబంధాల అధ్యయనం కోసం 1993 సంసత్సరంలో ఓహ్రా కమిటీ నియామకం జరిగింది.
  4. ఎన్నికలలో రాజకీయ నిధుల అధ్యయనం కొరకు 1998 సంవత్సరంలో ఇంద్రజిత్ గుప్తా కమిటీ నియమించబడింది.

ఎన్నికల సంస్కరణలు:
పైన పేర్కొన్న వివిధ కమిటీలు ఎన్నికల సంస్కరణల కొరకు అనేక సూచనలు, సంస్కరణలు ప్రతిపాదించాయి. వాటిలో ముఖ్యమైనవిగా ఈ క్రింది వాటిని పేర్కొనవచ్చు. అవి.
1) ఓటు అర్హత వయస్సు తగ్గింపు:
ప్రాతినిధ్యం లేని యువతకు ఓటుహక్కు కల్పించేందుకు రాజ్యాంగం (61వ సవరణ) చట్టం 1998 ద్వారా ఓటుహక్కు వయస్సును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించడమైంది.

2) ఎన్నికల సంఘానికి ఉద్యోగుల బదిలీ: ఎన్నికల సమయాలలో ఓటర్ల జాబితా తయారీ, సవరణ మరియ తప్పులు సరిదిద్దడం వంటి విధుల నిర్వహణకు అధికారులు మరియు ప్రభుత్వ సిబ్బందికి 1988 నుండి ఎన్నికల సంఘంకు తాత్కాలికంగా బదిలీ చేయడమైంది. ఆ ఉద్యోగులు ఎన్నికల సమయాలలో ఎన్నికల సంఘం నియంత్రణ, పర్యవేక్షణా పరిధిలో ఉంటారు.

3) ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు:
ఎన్నికలలో ఎలక్ట్రానిక్ ఓటింగు యంత్రాలను (Electronic Voting Machines) వినియోగించేందుకు 1989లో అవకాశం కల్పించుట జరిగినది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ శాసనసభ ఎన్నికల కొరకు 1998 సంవత్సరంలో మొట్టమొదట ప్రయోగాత్మకంగా కొన్ని నియోజక వర్గాలలో ఎలక్ట్రానిక్ ఓటింగు యంత్రాలు ఉపయోగించడమైంది. దేశం మొత్తానికి 1999 సాధారణ ఎన్నికలలో మొదటిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగు యంత్రాలను ఉపయోగించుట జరిగినది.

4) మద్యం అమ్మకాలపై నిషేధం:
ఫలహార లేదా భోజనశాలలో గాని, ప్రభుత్వ ప్రయివేటు ప్రదేశాలలో గాని ఎన్నికల గడువు ముగియడానికి 48 గంటల ముందునుండి మద్యంగాని లేదా ఇతర మత్తుపానీయాలు గాని విక్రయించుట, పంపిణీ చేయుట, ఓటర్లకు అందించుట చేయరాదు. ఎవరైనా ఈ నిబంధన అతిక్రమించినట్లయితే వారు శిక్షార్హులుగా పరిగణించబడి శిక్షించబడటం జరుగుతుంది.

5) అభ్యర్థులు రెండు నియోజక వర్గాలలో పోటీకి పరిమితం చేయటం:
సాధారణ ఎన్నికలు లేదా ఉపఎన్నికలలో పార్లమెంటు, శాసనసభ నియోజకవర్గాలలో ఒకేసారి రెండు నియోజకవర్గాల కంటే ఎక్కువ నియోజకవర్గాలలో అభ్యర్థులు పోటీ చేయరాదు. ఇదే తరహా పరిమితి రాజ్యసభ, శాసనమండలి ఎన్నికలలో కూడా వర్తిస్తుంది.

6) ఆయుధాలపై నిషేధం:
పోలింగు కేంద్రం సమీపంలో గాని, పోలింగు కేంద్రం లోపలికి గాని ఏ రకమైన ఆయుధాలతో ఎవరు ప్రవేశించరాదు లేదా సంచరించరాదు. అలా చేసినచో అది నేరంగా పరిగణిస్తూ రెండు సంవత్సరాల జైలుశిక్ష లేదా కొంత మొత్తం అపరాధ రుసుము లేదా రెండూ విధించవచ్చును. అంతేగాక ఆ ఆయుధానికి సంబంధించిన లైసైన్సు కూడా రద్దు చేయబడుతుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 11 ఎన్నికలు - ప్రాతినిధ్యం

7) ఎన్నికల ప్రచార సమయం కుదింపు:
ఎన్నికలలో పోటీచేయు అభ్యుర్థుల నామినేషన్ పత్రాల ఉపసంహరణ గడుపునుండి పోలింగు తేది మధ్యగల కనీస వ్యవధి 20 రోజుల నుండి 14 రోజులకు కుదించడమైంది.

8) పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్:
కొందరు వ్యక్తులు తమ ఓటును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించేందుకు అవకాశం 1999 సంవత్సరంలో కల్పించబడింది. ఎన్నికల సంఘంచే గుర్తించబడిన కొన్ని వర్గాల వ్యక్తులు తమ ఓటుహక్కును సంబంధిత నియోజకవర్గాల ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా మాత్రమే వినియోగించుకోవాలి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఎన్నికల విధులపై లఘటీక రాయండి.
జవాబు:
ఎన్నికల విధులు: ఎన్నికల విధులను నాలుగు రకాలుగా వర్గీకరించారు. అవి 1) రాజకీయ ఎంపిక 2) రాజకీయ భాగస్వామ్యం 3) మద్దతును అందించడం, కొనసాగించడం 4) అనుబంధ విధులు.

1) రాజకీయ ఎంపిక:
ఎన్నికలను ప్లెబిసైట్, రిఫరెండం లేదా ప్రజానిర్ణయం వంటి వాటిని వివరించడానికి ఉపయోగిస్తారు. ఎన్నికలు ప్రజలు తమ నాయకుల్ని ఎన్నిక చేసుకొనేందుకు, జనేచ్ఛను నిర్ణయించడానికి ఎన్నికలు కీలకమైన సాధనాలుగా ఉంటాయి. అధికారం చట్టబద్ధంగా బదలాయించడానికి, శాంతిని పరిరక్షించడానికి ఎన్నికలు సహాయపడతాయి.

2) రాజకీయ భాగస్వామ్యం:
ఎన్నికల అతిపెద్ద విధి ప్రజలకు రాజకీయ భాగస్వామ్య అవకాశాల్ని, మార్గాల్ని కల్పించడం, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల రాజకీయ భాగస్వామ్యం అతిముఖ్యమైనది. కావున ఎన్నికలకు ఇది కేంద్రబిందువు. ప్రజల భాగస్వామ్యమే ప్రజాస్వామ్య వ్యవస్థకు బలం.

3) నిర్మాణ సహకారం – వ్యవస్థ నిర్వహణ:
ఒక రాజకీయ వ్యవస్థకు ఎన్నికలు చట్టబద్ధతను, రాజకీయ స్థిరత్వాన్ని, సమైక్యతను, గుర్తింపును కల్పించటం ద్వారా సహకరిస్తాయి. కాబట్టి ఎన్నికలు రాజకీయ వ్యవస్థ సహాయం అందించేవి మాత్రమేగాక దానిని నియంత్రించగలిగే కారకంగా చెప్పవచ్చును.

4) అనుబంధ విధులు:
ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య రాజకీయ సమాచారాన్ని అందించే ముఖ్యప్రతినిధులు ఎన్నికలే. ప్రజలు తమ రాజకీయ ప్రతినిధులతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండేందుకు ఎన్నికలు దోహదపడతాయి.

ప్రశ్న 2.
భారత ఎన్నికల ప్రక్రియను గూర్చి చర్చించండి.
జవాబు:
భారతదేశంలో పార్లమెంటులోని లోక్సభ (దిగువసభ) మరియు రాష్ట్ర విధానసభల సభ్యులను ఎన్నుకునేందుకై చేపట్టే సాధారణ ఎన్నికల నిర్వహణ ప్రపంచంలోనే పెద్ద ప్రక్రియగా చెప్పవచ్చు. ప్రతి ఐదుసంవత్సరాలకు రాష్ట్రపతి అదేశానుసారం ఎన్నికల ప్రకటన విడుదలవుతుంది. దేశంలోని ఓటర్లు తమ ప్రతినిధులను ఎంపిక చేసుకొనేందుకు రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్లు ఎన్నికల నోటిఫికేషన్లు ఇస్తారు. లోక్సభ, విధానసభల స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించవచ్చు లేదా వేర్వేరు సమయాలలోనూ నిర్వహించవచ్చు.

భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ వివిధ దశలలో నిర్వహించబడుతుంది. అవి:
1) నియోజక వర్గాల పునర్విభజన: ఎన్నికల ప్రక్రియలో మొదటి దశ నియోజక వర్గాల పునర్విభజనతో మొదలౌతుంది. రాష్ట్రపతిచే నియమితమైన నియోజకవర్గాల పునర్విభజనసంఘం ప్రతి పదిసంవత్సరాలకు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపడుతుంది. సాధారణంగా లోక్సభ నియోజవర్గం ఆరు లేక ఏడు శాసనసభ నియోజకవర్గాలలో కలిపి ఉంటుంది.

2) రాజకీయ పార్టీల గుర్తింపు: దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల సంఘం గుర్తింపు పొందాల్సి ఉంటుంది. ఎన్నికలలో పొందిన ఓట్ల శాతం ఆధారంగా పార్టీలను జాతీయ లేదా ప్రాంతీయ పార్టీలుగాను, లేదా నమోదు చేయబడి గుర్తింపు లేని పార్టీలుగాను వర్గీకరిస్తుంది. అలాగే పార్టీలకు ఎన్నికల గుర్తులను కేటాయిస్తుంది.

3) ఓటరు గుర్తింపు కార్డులు: ఓటరు జాబితాలు తప్పులు లేనివిగా తీర్చిదిద్దటం, ఎన్నికలలో అక్రమాలకు అడుకట్టవేయటం కొరకు ఎన్నికల సంఘం దేశంలోని అర్హతకలిగిన అందరు ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డులు ఆగష్టు 1993 నుండి జారీచేయటం జరిగింది.

4) ఓటర్ల జాబితాలు: ఎన్నికల నిర్వహణకు దేశంలోని అర్హత కలిగిన ఓటర్ల పేరుతో నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలను తయారు చేయటం ముఖ్యమైన విధి. ప్రతి పది సంవత్సరాలకు జరిపే జనాభా లెక్కలు ఆధారంగా ఓటర్లు జాబితాలు సవరించబడతాయి.

5) ఎన్నికల ప్రకటన – రిటర్నింగ్ అధికార్ల నియామకం: ప్రతీసాధారణ ఎన్నికల నిర్వహణకు రాష్ట్రపతి ఎన్నికలసంఘానికి ఆజ్ఞలు జారీ చేస్తారు. వెంటనే ఎన్నికల సంఘం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ఎన్నికలతేదీలు, నామినేషన్లు దాఖలు, ఉపసంహరణ తేదీలు ప్రకటిస్తుంది. వివిధ నియోజకవర్గాల ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ అధికారాలను ఎన్నికల సంఘం నియమిస్తుంది.

6) నామినేషన్ పత్రాల దాఖలు చేయుట: ఎన్నికలలో పోటీ చేయ్యాలనుకొనే అభ్యర్థులు తమతమ నియోజకవర్గాలలోని రిటర్నింగ్ అధికారులకు తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేయవలసి ఉంటుంది. ఎన్నికల సంఘంచే ఇవ్వబడిన నామినేషన్ పత్రాలను పూర్తివివరాలతో అభ్యర్థులు సమర్పించాల్సి ఉంటుంది. పార్టీ తరపున పోటీచేయు అభ్యర్థుల పేర్లను ఇద్దరు ప్రతిపాదించాల్సి వుంటుంది.

7) నామినేషన్ పత్రాల పరిశీలన: నామినేషన్ పత్రాల దాఖలుకు గడువు పూర్తయిన వెంటనే అభ్యర్థులు లేదా వారి అనుమతి పొందిన వ్యక్తుల సమక్షంలో సంబంధిత నియోజకవర్గాలలోని రిటర్నింగ్ అధికారులు అభ్యర్థులందరి నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు.

8) నామినేషన్ల ఉపసంహరణ: నామినేషన్ పత్రాల పరిశీలనానంతరం ఎన్నికల సంఘం ప్రకటించిన తేదీ, సమయంలోపుగా అభ్యర్థులు స్వచ్ఛందంగా తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చును.

AP Inter 2nd Year Civics Study Material Chapter 11 ఎన్నికలు - ప్రాతినిధ్యం

9) ఎన్నికల ప్రచారం: ఎన్నికల ప్రక్రియలో తరువాత దశ ఎన్నికల ప్రచారం. పోటీలో నిలిచిన అభ్యర్థులు, పార్టీలు తమ గెలుపు కోరుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. రాజకీయ పార్టీలు తమ విధానాలు, కార్యక్రమాలు, వాగ్దానాలుతో కూడిన ఎన్నికల ప్రణాళికలను (Election Manfesto) విడుదల చేస్తారు.

10) ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు: బ్యాలెట్ పత్రాలకు, బ్యాలెట్ పెట్టెలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రానిక్ ఓటింగు యంత్రాలను ఉపయోగించటం ద్వారా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

11) ఓటర్లు ఓటు వేయుట: ప్రతి ప్రాదేశిక నియోజక వర్గంలోనూ ఎన్నికల సిబ్బంది పోలింగు బూత్లు ఏర్పాటు చేసి ఓటర్లు తమ ఓటుహక్కును స్వేచ్ఛగా వినియోగించుకొనేందుకు తగిన ఏర్పాట్లు చేస్తారు.

12) ఎన్నికల పరిశీలకుల పర్యవేక్షణ: ఎన్నికలు సజావుగా జరిగేందుకు, ఎన్నికలప్రచారం నిబంధనల మేరకు నిర్వహించేందుకు, ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకొనేందుకు ఎన్నికల సంఘం ప్రతీ నియోజకవర్గంలోనూ ఎన్నికల పరిశీలకులను నియమిస్తుంది.

13) ప్రసార మాధ్యమాల ప్రచారం: ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా ఉంచేందుకు గాను ప్రచారమాధ్యమాలను ఎన్నికల తేదీల ఎన్నికల ప్రక్రియను ప్రసారం చేసేందుకు అవకాశం కల్పిస్తారు.

14) ఓట్లలెక్కింపు -ఫలితాల ప్రకటన ఓటింగు పూర్తయిన తర్వాత ఎన్నికల సంఘం నిర్దేశించిన తేదీన సమయానికి రిటర్నింగు అధికారి మరియు సిబ్బంది అభ్యర్థులు మరియు వారి ప్రతినిధులు సమక్షంలో ఓటింగు యంత్రాలను తెరుస్తారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రంలో ప్రతీ అభ్యర్థి తనకుపోలైన ఓట్లను సరిచూసుకుంటారు. ప్రతీ నియోజకవర్గంలోనూ ఏ అభ్యర్థికైతే సమీప అభ్యర్థి కన్నా ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ అభ్యర్థి గెలిచినట్లుగా ప్రకటిస్తారు. సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటిస్తూ గెలిచిన అభ్యర్థికి ధ్రువప్రతాన్ని అందజేస్తారు.

15) ఎన్నికల ఫిర్యాదులు: ఎన్నికలలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నట్లు భావిస్తే ఓటరు లేదా అభ్యర్థి ఎన్నికల సంఘానికి ఎన్నికలపై ఫిర్యాదు చేయవచ్చును. ఎన్నికల ఫిర్యాదు న్యాయస్థానంలో వేసే వాజ్యం (Suit) కాదు. కాని ఈ ఫిర్యాదులో మొత్తం నియోజకవర్గం అంతా భాగస్వామి అవుతుంది. న్యాయస్థానంలో కూడా ఎన్నిక చెల్లదు అని అభ్యర్థి ఎన్నికను సవాలు చేయవచ్చును. ఇలాంటి ఫిర్యాదు ఆయారాష్ట్రాల ఉన్నత న్యాయస్థానాల (High Court) లలో విచారించబడతాయి. ఎన్నికలలో అక్రమాలు రుజువైతే అభ్యర్థి ఎన్నిక నిలిపివేయబడి రద్దు చేయబడుతుంది.

ప్రశ్న 3.
భారత ఎన్నికల సంఘం నిర్మాణం, విధులను రాయండి. [Mar. ’16]
జవాబు:
నిర్మాణం: భారత ఎన్నికల సంఘం ఒక ప్రధాన ఎన్నికల కమీషనర్ మరియు ఇద్దరు ఎన్నికల కమీషనర్లను కలిగి బహుళసభ్య వ్యవస్థగా పనిచేయుచున్నది. దీనిని 1950 జనవరి 26న నెలకొల్పారు.

ఎన్నికల సంఘం విధులు:
భారత రాజ్యాంగంలోని 324 నుండి 328 వరకు గల ప్రకరణలు ఎన్నికల సంఘం యొక్క ఏర్పాటు, అధికారాలు, విధులను విశదీకరిస్తున్నాయి. అవి.

  1. భారత ఎన్నికల సంఘం నిర్ణీత కాలవ్యవధిలో ఓటర్ల జాబితాలను సవరిస్తుంది.
  2. ఓటర్ల జాబితాలు నమోదు చేయబడ్డ అర్హత కలిగిన ఓటర్ల పేరుతో తప్పులు లేకుండా తయారుచేయటం ఎన్నికల సంఘం విధి.
  3. ఎన్నికల నిర్వహణకు ఎన్నికల తేదీ, ఇతర వివరాలతో ఎన్నికల ప్రకటన, అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలన కూడా నిర్వహిస్తుంది.
  4. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు తగిన నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది.
  5. ఎన్నికల నిర్వహణ, ప్రశాంతతకు భంగం కలిగినట్లయితే దేశం మొత్తంగా ఎన్నికలను, లేదా కొన్ని రాష్ట్రాలలో లేదా రాష్ట్రంలో, కొన్ని నియోజకవర్గాలు లేదా నియోజకవర్గంలో ఎన్నికలను రద్దు చేయవచ్చు లేదా వాయిదా వేయవచ్చును.
  6. పార్టీలకు, ఎన్నికలలో పోటీచేయు అభ్యర్థులను ఎన్నికల నియమావళిని వర్తింపచేస్తుంది.

ప్రశ్న 4.
ప్రాతినిధ్యం అనగానేమి ? ప్రాదేశిక ప్రాతినిధ్యం గురించి నీకు ఏమి తెలుసో రాయండి.
జవాబు:
ప్రాతినిధ్యం – భావం:
ప్రభుత్వ ప్రక్రియలో పాల్గొనే అవకాశం లేదు. అందుచేతనే ఆధునిక ప్రజాస్వామ్య దేశాలు ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులచే ఏర్పడిన ప్రాతినిధ్య లేదా పరోక్ష ప్రజాస్వామ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. ఆధునిక ప్రజాస్వామ్య దేశాలు ప్రత్యక్ష ప్రజాస్వామ్య లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కలిగి ఉంటున్నాయి. ఇలాంటి వ్యవస్థలో ప్రజలు తమకు బదులుగా శాసనాల తయారీ కొరకు ప్రతినిధులను ఎన్నుకొంటారు. ఆ ప్రతినిధులు శాసనసభలో ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తారు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 11 ఎన్నికలు - ప్రాతినిధ్యం

ప్రాదేశిక ప్రాతినిధ్యం:
ప్రాదేశిక ప్రాతినిధ్య పద్ధతిలో దేశంలోని ఓటరులందరినీ వివిధ ప్రాదేశిక నియోజకవర్గాలుగా విభజించి, ప్రతి నియోజకవర్గం నుండి ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ ప్రతినిధులను ఓటర్లు ఎన్నుకుంటారు. అన్ని ప్రాదేశిక నియోజకవర్గాలు దాని పరిమాణంలోగాని, జనాభా సంఖ్యలో గాని సుమారుగా ఒకే విధంగా ఉంటాయి. నియోజక వర్గంలో నివసించే ఓటరులందరూ తమ ప్రజాప్రతినిధి ఎన్నిక ప్రక్రియలో భాగస్వామ్యలౌతారు. ప్రాదేశిక నియోజకవర్గం నుండి ఒకే ప్రజాప్రతినిధి ఎన్నిక కాబడితే అది ఏకసభ్య నియోజకవర్గంగా పరిగణిస్తారు. అలాకాక ఒక నియోజకవర్గం నుండి ఒకరికన్నా ఎక్కువమంది ప్రతినిధులు ఎన్నికైతే దానిని బహుళ సభ్య నియోజక వర్గం అంటారు. భారతదేశం లాంటి ఆధునిక ప్రజాస్వామ్య దేశాలలో దిగువసభ సభ్యుల ఎంపిక కొరకు ఏకసభ్య ప్రాదేశిక నియోజవర్గ పద్ధతిని అనుసరిస్తున్నారు.

ప్రశ్న 5.
ఎఫ్.పి.టి.సి వ్యవస్థ యొక్క గుణదోషాలను అంచనా వేయండి.
జవాబు:
ఎఫ్.పి.టి.పి పద్ధతినే “ప్రథమ ఆధిక్యతతో పదవీ విధానం” (First Past The Post System) (FPTP) అంటారు. ఎన్నికలబరిలో ఏ అభ్యర్థి అయితే ఇతర అభ్యర్థుల కన్నా ఆధిక్యంతో ఉంటాడో, ఎన్నికకు కావల్సిన అధిక ఓట్లు సంపాదిస్తాడో అతడే విజయం సాధించినట్లు ప్రకటిస్తారు. ఈ పద్ధతినే ‘బహుత్వ ప్రాతినిధ్య విధానం’ (ప్లూరల్ సిస్టమ్) అంటారు. ఇదే ఎన్నిక పద్ధతిని మన రాజ్యాంగం ప్రతిపాదించినది.

ఇండియాలో FPTP పద్ధతి యొక్క సాధారణ మరియు సున్నితమైన స్వభావం మూలంగా బహుళ ప్రాచుర్యంలో ఉండి విజయం సాధించినది. ఈ పద్ధతి రాజకీయాలు, ఎన్నికలలో స్పష్టమైన ఎటువంటి పరిజ్ఞానం లేని సాధారణ పౌరునికి కూడా అర్థమయ్యే రీతిలో ఉంటుంది. అంతేగాక ఎన్నికలలో స్పష్టమైన తమ నిర్ణయాన్ని ఓటర్లు ప్రకటించడానికి ఈ పద్ధతి అనువుగా ఉంటుంది. ఓటర్లు ఎన్నికలలో అత్యధిక ప్రాధాన్యత పార్టీకి, అభ్యర్థికి లేదా రెండింటికి సమతౌల్యంగా ఇస్తారు. ఈ పద్ధతి సాధారణంగా అతిపెద్ద జాతీయ పార్టీకి లేదా సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తుంది. ఈ విధానం- ఒక ప్రాంతంలోని వివిధ సామాజిక సమూహాలు ఒకటిగా కలిసి ఎన్నికలలో విజయం సాధించేందుకు వీలుకల్పిస్తూ ప్రోత్సాహాన్నిస్తుంది. ఏది ఏమైనప్పటికి FPTP వ్యవస్థ సాధారణ ఓటర్లకు సుపరిచయంగాను, సరళమైనదిగాను నిరూపితమైనది. కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో అతి పెద్ద పార్టీలు ఎన్నికలలో స్పష్టమైన ఆధిక్యతతో విజయం సాధించేందుకు ఈ పద్ధతి సహకరిస్తుంది.

ప్రశ్న 6.
ఎన్నికల సంస్కరణ పై లఘు వ్యాసం రాయండి. [Mar. ’17]
జవాబు:
భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ, యంత్రాంగం, ఎన్నికల ప్రక్రియలను పరిశీలించి సంస్కరణలను ప్రతిపాదించుటకై అనేక కమిటీలు, కమిషన్లను భారత ప్రభుత్వం’ నియమించింది. అందులో కొన్నింటిని క్రింద పేర్కొనడం జరిగింది.

  1. 1974లో తార్కుండె కమిటీని నియమించగా అది 1975లో తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
  2. 1990లో ఎన్నికల సంస్కరణల కొరకు దినేష్ గోస్వామి కమిటీని నియమించడమైంది.
  3. రాజకీయాలు, నేరాల మధ్య సంబంధాల అధ్యయనం కోసం 1993 సంవత్సరంలో ఓహ్రా కమిటీ నియామకం జరిగింది.
  4. ఎన్నికలలో రాజకీయ నిధుల అధ్యయనం కొరకు 1998 సంవత్సరంలో ఇంద్రజిత్ గుప్తా కమిటీ నియమించబడింది.
  5. ఎన్నికల చట్టాల సంస్కరణలపై భారత న్యాయసంఘం 1999లో నివేదిక సమర్పించినది.

పైన పేర్కొన్న కమిటీలు, కమిషన్లు ఎన్నికల సంస్కరణల కొరకు చేసిన సూచనలలో ముఖ్యమైనవి

  1. ఓటు అర్హత వయస్సు తగ్గింపు
  2. ఎన్నికల సంఘానికి ఉద్యోగుల బదిలీ
  3. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు
  4. మద్యం అమ్మకాలపై నిషేధం
  5. ఎన్నికల వ్యయపరిమితి పెంపు
  6. ఆయుధాలపై నిషేధం మొదలగునవి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 11 ఎన్నికలు - ప్రాతినిధ్యం

ప్రశ్న 7.
నైష్పత్తిక ప్రాతినిధ్య వ్యవస్థ గురించి నీకు ఏమి తెలుసు ?
జవాబు:
ఈ ఎన్నిక పద్ధతిలో రాజకీయ పార్టీల ఓటింగు బలాన్ని బట్టి తమ ప్రాతినిధ్యాన్ని పొందుతుంది. ఈ ఎన్నిక రహస్య పద్ధతిలో నిర్వహిస్తారు. భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ సభ్యులు, విధాన మండలి సభ్యుల ఎన్నికకు ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. రాష్ట్రాల మధ్య సమానత్వానికి సభ్యుడు చెలాయించే ఓటును విలువలతో గుణించడం చేస్తారు. ముందుగా రాష్ట్ర శాసనసభ్యుల ఓట్ల విలువలను నిర్ధారిస్తారు. ఒక రాష్ట్ర మొత్తం జనాభాను రాష్ట్ర శాసనసభలో ఎన్నికైన సభ్యుల సంఖ్యచే భాగించగా వచ్చిన లబ్దమును మరల వెయ్యిచే భాగించగా వచ్చిన సంఖ్యను ఆ రాష్ట్ర శాసనసభ్యుని ఓటు విలువగా లెక్కిస్తారు. రాష్ట్ర శాసనసభ్యుల మొత్తం ఓటు విలువలను ఎన్నికైన పార్లమెంటు ఉభయసభల సభ్యుల సంఖ్యచేత భాగించగా వచ్చిన సంఖ్య పార్లమెంటు సభ్యుని విలువగా పరిగణిస్తారు. ఓట్ల లెక్కింపులో మొదటి ప్రాధాన్యతా ఓటు లేదా ద్వితీయ ప్రాధాన్యతా ఓటును పరిగణనలోనికి తీసుకొని ఆధిక్యత సాధించిన అభ్యర్థిని గెలుపొందినట్లుగా ప్రకటిస్తారు. ఈ పద్ధతిలో ఎక్కువమంది ప్రతినిధులు, అల్పసంఖ్యాకులు అల్పసంఖ్యలో ప్రతినిధులను ఎంపిక చేసుకొనే వీలుంటుంది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఎన్నికలు, ప్రజాస్వామ్యంకు గల సంబంధం.
జవాబు:
ప్రజాస్వామ్య ప్రాతినిధ్య ప్రభుత్వాలకు ఎన్నికలు కీలకమైనవి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిర్ణీత కాలవ్యవధిలో జరుగుతాయి. ఎన్నికయ్యే ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అంతర్భాగం. రాజకీయ వ్యవస్థకు, దేశంలోని పౌరులకు ఎన్నికలు ముఖ్య సేవలందిస్తాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయీకరణను పెంపొందించేందుకు ఎన్నికలు పెద్ద ప్రతినిధి సంస్థలుగా పనిచేస్తాయి.

ప్రశ్న 2.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు. [Mar. ’16]
జవాబు:
భారత ఎన్నికల సంఘం ఎన్నికలలో ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు, ఓట్లు లెక్కింపుకు ఓటింగు యంత్రాలను ప్రవేశపెట్టింది. వీటినే ఎలక్ట్రానిక్ ఓటింగు యంత్రాలని అంటారు. ఓటింగులో బ్యాలెట్ పత్రాలను బదులుగా ఓటింగు యంత్రాలను వినియోగించటమైనది.

ప్రశ్న 3.
ప్రాదేశిక ప్రాతినిధ్యం.
జవాబు:
ప్రాదేశిక ప్రాతినిధ్య పద్ధతిలో దేశంలోని ఓటరులందరిని వివిధ ప్రాదేశిక నియోజకవర్గాలుగా విభజించి, ప్రతి నియోజక వర్గం నుండి ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ ప్రతినిధులను ఓటర్లు ఎన్నుకొంటారు. అన్ని ప్రాదేశిక నియోజకవర్గాలు దాని పరిమాణంలో కాని, జనాభా సంఖ్యలో కాని సుమారుగా ఒకే విధంగా ఉంటాయి. నియోజకవర్గంలో నివసించే ఓటర్లందరూ తమ ప్రజాప్రతినిధిని ఎన్నుకోవటంలో భాగస్వాములవుతారు.

ప్రశ్న 4.
వృత్తి ఆధారిత ప్రాతినిధ్యం.
జవాబు:
పౌరులు చేసే వృత్తుల ఆధారంగా ఇటువంటి నియోజకవర్గాలు ఏర్పాటవుతాయి. ఇటువంటి నియోజకవర్గంలో పౌరులు ఒకేరకమైన వృత్తి లేదా సమాన లక్షణాలు కలిగిన వృత్తులలో నిమగ్నమైన ప్రాదేశిక ప్రాంతాలలో నివాసముంటారు. వైద్యులు, వ్యవసాయదారులు, వ్యాపారులు, న్యాయవాదులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, శ్రామికులు, తదితరులు వివిధ రకాల వృత్తి సంఘాల్ని కల్గి ఉంటారు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 11 ఎన్నికలు - ప్రాతినిధ్యం

ప్రశ్న 5.
భారత ఎన్నికల సంఘం నిర్మాణం.
జవాబు:
భారత ఎన్నికల సంఘం ఒక ప్రధాన ఎన్నికల కమీషనర్ మరియు ఇద్దరు ఎన్నికల కమీషనర్లను కలిగి బహుళ సభ్య వ్యవస్థగా పని చేయుచున్నది. దీనిని 1950 జనవరి 26న నెలకొల్పారు.

ప్రశ్న 6.
ఎన్నికల సంస్కరణలు. [Mar. ’16]
జవాబు:
భారతదేశంలో ఎన్నికలను స్వేచ్చగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు వీలుగా స్వయంప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘాన్ని ఏర్పాటుచేయటం జరిగింది. అయిన్నప్పటికీ గడిచిన 65 సం॥ల అనుభవం మన ఎన్నికల వ్యవస్థలో సంస్కరణల అవసరాన్ని తెలియజేస్తుంది. ఎన్నికల సంఘం, వివిధ రాజకీయ పార్టీలు, అనేక స్వచ్ఛంద సంస్థలు, రాజ్యాంగ ఎన్నికల నిపుణులు ఎన్నికల వ్యవస్థలో అనేక సలహా సంప్రదింపులలో ముందుకు రావడం జరిగింది.

ప్రశ్న 7.
ఎన్నికల నేరాలు.
జవాబు:
ఎన్నికల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలు, లేదా పద్ధతులను పాల్పడినట్లయితే జైలుశిక్ష లేదా అపరాధ రుసుము లేదా రెండూ విధించబడతాయి. ఎన్నికల నేరాలకు జైలుశిక్ష మూడునెలల నుండి మూడు సంవత్సరాలవరకు ఉంటుంది. మతం, జాతి, కులం, భాష, ప్రాంతాల ఆధారంగా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, ఎన్నికల సభలలో గొడవలు సృష్టించి భగ్నం చేయటం ఎన్నికల నేరాలకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.

ప్రశ్న 8.
ఎన్నికలలో అక్రమ పద్ధతులు.
జవాబు:
ఎన్నికలలో అభ్యర్థులు అక్రమ పద్ధతులకు పాల్పడితే ఆ ఎన్నికలను సంఘం రద్దు చేయగలదు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన అభ్యర్థిని ఆరు సంవత్సరముల వరకు ఎన్నికలలో పోటీచేయటానికి అనర్హునిగా ప్రకటించడమేగాక అటువంటి అభ్యర్థిని న్యాయస్థానంలో విచారణ చేసి శిక్షిస్తారు. ఎన్నికల్లో ముఖ్యమైన అవినీతి, అక్రమ పద్ధతులను ఎన్నికల సంఘం నియంత్రించేందుకు అనేక చర్యలు తీసుకొంటుంది.

ప్రశ్న 9.
భారత ఎన్నికల సంఘం పాత్ర. [Mar, ’17]
జవాబు:
భారతదేశంలో నిష్పక్షపాతంగా, సమర్థవంతంగా ఎన్నికలను నిర్వహించే విషయంలో కాలానుగుణంగా ఎన్నికల సంఘం ఒక స్వతంత్ర మరియు స్వయంప్రతిపత్తి గల అధికార వ్యవస్థగా రూపుదిద్దుకొంది. ఎన్నికల ప్రక్రియ, పవిత్రతను కాపాడేందుకు ఎన్నికల సంఘం నిష్కర్షగాను, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంది. ఎన్నికల సంఘం గతంలో కన్నా మరింత స్వతంత్రంగా, నిర్ణయాత్మకంగా, క్రియాశీలకంగా నేడు వ్యవహరిస్తుందని అందరూ అంగీకరిస్తున్న మాట వాస్తవం.

AP Inter 2nd Year Civics Study Material Chapter 11 ఎన్నికలు - ప్రాతినిధ్యం

ప్రశ్న 10.
ప్రాతినిధ్యం.
జవాబు:
ఆధునిక దేశాలలో ప్రభుత్వ ప్రక్రియలో ప్రజలు నేరుగా భాగస్వాములు కాలేరు. ఇలాంటి వ్యవస్థలో ప్రజలు తమకు బదులుగా శాసనాలను రూపొందించుకొనటానికి ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఆ ప్రతినిధులు శాసనసభలో ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రపంచ దేశాలలో రెండు రకాల సాధారణ ప్రాతినిధ్యం ప్రామాణికంగా ఉన్నాయి. అవి 1) ప్రాదేశిక ఆధారిత ప్రాతినిధ్యం 2) వృత్తి ఆధారిత ప్రాతినిధ్యం.

AP Inter 1st Year Civics Study Material Chapter 2 రాజ్యం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Civics Study Material 2nd Lesson రాజ్యం Textbook Questions and Answers.

AP Inter 1st Year Civics Study Material 2nd Lesson రాజ్యం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాజ్యాన్ని నిర్వచించి, దాని ముఖ్య లక్షణాలను తెలపండి. [Mar. ’16]
జవాబు:
మానవుడు నిర్మించుకొన్న వివిధ సంస్థల్లో రాజ్యం అత్యంత ప్రధానమైనది, శక్తివంతమైనది కూడా. ఇది సాంఘిక జీవనాన్ని నియంత్రించి, క్రమబద్ధం చేస్తుంది.
క్రీ.శ. 16వ శతాబ్దంలో ఇటలీ దేశస్తుడైన మాఖియవెల్లి, తన గ్రంథమైన “ది ప్రిన్స్”లో మొదటిసారిగా ‘రాజ్యం’ అనే పదాన్ని ఉపయోగించారు. అప్పటి నుండి ఈ పదం బాగా వాడుకలోకి వచ్చింది.

అర్థం: రాజ్యాన్ని ఆంగ్లంలో ‘స్టేట్’ అంటారు. ఈ మాట ‘స్టేటస్’ అనే ట్యుటానిక్ పదం నుండి గ్రహించారు. దీనికి తెలుగులో సరైన అర్థం లేదు. కొందరు ‘స్టేట్’ అంటే ‘ప్రభుత్వం’ అని, ‘జాతి’ అని, ‘సమాజం’ అని భావిస్తున్నారు. కానీ రాజనీతి శాస్త్ర అధ్యయనం ప్రకారం స్టేట్ అంటే ‘రాజ్యం’ అనే అర్థంలో ఉపయోగిస్తున్నారు.
నిర్వచనాలు: రాజ్యాన్ని అనేకమంది రాజనీతి శాస్త్రజ్ఞులు నిర్వచించారు.
ఎ) “మానవునికి సుఖమైన, గౌరవమైన జీవనం ప్రసాదించడం లక్ష్యంగా కలిగిన కుటుంబాల, గ్రామాల సముదాయమే రాజ్యం’. – అరిస్టాటిల్
బి) ‘ఒక నిర్దిష్ట భూభాగంలో శాసనబద్ద ప్రభుత్వం గల ప్రజాసముదాయమే రాజ్యం’. – ఉడ్రోవిల్సన్
సి) “ఒక నిర్ణీత భూభాగంలో రాజకీయంగా వ్యవస్థాపితమైన ప్రజలే రాజ్యం”. – బ్లంటి షిలీ
డి) “ఒక నిర్దిష్ట భూభాగంలో నివసించే పౌరులు, ప్రభుత్వం ఉన్న రాజకీయ వ్యవస్థే రాజ్యం”. – రాబర్ట్ ఎ.డాల్

AP Inter 1st Year Civics Study Material Chapter 2 రాజ్యం

లక్షణాలు: పై నిర్వచనాలననుసరించి రాజ్యానికి నాలుగు ప్రధాన లక్షణాలున్నాయి. అవి 1. ప్రజలు 2. ప్రదేశం 3. ప్రభుత్వం 4. సార్వభౌమాధికారం. వీటితోపాటు ఆధునిక కాలంలో అంతర్జాతీయ గుర్తింపు రాజ్యలక్షణంగా ‘గుర్తించబడింది.

1) ప్రజలు: రాజ్యము ఒక మానవసంస్థ. ప్రజలు లేనిదే రాజ్యం లేదు. అయితే ఒక రాజ్యంలో ప్రజలు ఎంతమంది ఉండవలెననే అంశంపై రాజనీతి తత్త్వవేత్తలు ఒకే అభిప్రాయాన్ని కల్గిలేరు. ప్లేటో దృష్టిలో ఆదర్శ రాజ్య జనాభా 5,040. రూసో అభిప్రాయంలో ఆదర్శ రాజ్యానికి జనాభా 10,000 మంది. అరిస్టాటిల్ అభిప్రాయంలో ఆదర్శ రాజ్య జనాభా మరీ ఎక్కువగానూ, మరీ తక్కువగానూ ఉండరాదు. ప్రస్తుత కాలంలో ఆధునిక రాజ్యాలు కొన్ని తక్కువ జనాభాతోను (అండోరా, శాన్మారినో, వాటికన్ సిటీ), మరికొన్ని ఎక్కువ జనాభాతోను (చైనా, ఇండియా) ఉన్నాయి. ప్రజలు కష్టించి పనిచేసే తత్వాన్ని కల్గి ఉంటే జనాభా తక్కువగా ఉన్నా రాజ్యం అభివృద్ధి చెందుతుంది.

2) ప్రదేశము: నిర్ణీత ప్రదేశం రాజ్యానికి అవసరం. ప్రదేశము అనగా భూమి, ప్రాదేశిక వియత్తలము (ఆకాశము) మరియు ప్రాదేశిక జలాలు (సముద్రజలాలు 12 నాటికల్ మైళ్ళ వరకు) అయితే నాల్గువైపుల భూమినే సరిహద్దుగా కల్గిన, నేపాల్, భూటాన్ వంటి రాజ్యాలకు ప్రాదేశిక జలాలు ఉండవు. వాటికి ప్రదేశము అంటే భూమి, ప్రాదేశిక వియత్తలము మాత్రమే. తక్కువ ప్రదేశం ఉన్న రాజ్యాలు ఉత్తమమైనవిగా ప్లేటో, రూసో అభిప్రాయపడ్డారు. లార్డ్ ఆక్టన్, ట్రయష్కీలు పెద్ద ప్రదేశం కల్గిన రాజ్యాలు గొప్పవని విశ్వసించారు. అరిస్టాటిల్ రాజ్య ప్రదేశం మరీ ఎక్కువగాను, మరీ తక్కువగాను ఉండకూడదని తెల్పెను.

రాజ్యానికి ప్రదేశం ఎక్కువగా ఉంటే సహజవనరులు ఎక్కువగా దొరికే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో నేడు ఎక్కువ భూభాగం కలిగిన రష్యా, అమెరికా, ఆస్ట్రేలియా లాంటి రాజ్యాలు, తక్కువ భూభాగం కలిగిన బ్రూనాయి, అండోరా, శాన్ మారినో వంటి రాజ్యాలు ఉన్నాయి.

3) ప్రభుత్వము: రాజ్యము యొక్క ఏజెంట్ ప్రభుత్వం. ఇది రాజ్యం యొక్క అభీష్టాన్ని నెరవేరుస్తుంది. రాజ్యం |తరపున సార్వభౌమాధికారాన్ని వినియోగిస్తుంది. ప్రభుత్వమునకు శాసన నిర్మాణ సభ, కార్యనిర్వాహక వర్గం, న్యాయశాఖ అను మూడు అంగములు కలవు. ప్రభుత్వం రాజ్యం కంటే ముందే ఆవిర్భవించింది. అందువలననే రాజ్య లేకుండా ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం శాశ్వతమైన సంస్థ కాదు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ప్రభుత్వాలు అనేక రకాలు. ప్రజాస్వామ్య, నియంతృత్వ, పార్లమెంటరీ, అధ్యక్షతరహా ఏకకేంద్ర, సమాఖ్య మొదలగునవి.

4) సార్వభౌమాధికారము: రాజ్యం మౌలిక లక్షణాలలో అత్యంత ముఖ్యమైనది సార్వభౌమాధికారము. లాటిన్ పదమైన ‘సుప్రానస్’ నుండి స్వార్నిటీ అను ఆంగ్లపదం ఉద్భవించినది. సార్వభౌమాధికారము వలననే రాజ్యం విశిష్టమైన, అత్యున్నతమైన రాజకీయ సంస్థగా పరిగణించబడుతోంది. సార్వభౌమాధికారము వలన రాజ్యంలో నివసించే ప్రజలు పనిచేసే సంస్థలు రాజ్యానికి విధేయులై ఉండటం జరుగుతుంది. అలా విధేయత చూపించని వ్యక్తులను, సంస్థలను రాజ్యం దండిస్తుంది. సార్వభౌమాధికారము అంతిమ అధికారం. దీనిని మించిన మరొక అధికారం రాజ్యంలో ఉండదు. ఇది విభజించుటకు, బదిలీ చేయుటకు వీలులేని అధికారము.

ప్రశ్న 2.
రాజ్యం, ప్రభుత్వం ఏ విధంగా వ్యత్యాసాలను కలిగి ఉన్నాయి ?
జవాబు:
రాజ్యము, ప్రభుత్వము అనే మాటలు సాధారణంగా ఒకే అర్థాన్నిచ్చేవిగా వాడబడుతుంటాయి. కానీ రాజనీతి శాస్త్రంలో ఈ రెండు పదాలు ప్రత్యేక అర్థాలు కలిగి ఉన్నాయి. హాబ్స్ అనే రచయిత రాజ్యము, ప్రభుత్వాల మధ్య భేదము చూపలేదు. లాస్కీ అభిప్రాయము ప్రకారము “రాజ్యము అంటే ఆచరణలో ప్రభుత్వం”. ప్రభుత్వం రాజ్యం పేరు మీద పనిచేస్తుంది. జి.డి. హెచ్. కోల్ “ఒక సమాజంలోని ప్రభుత్వ రాజకీయ యంత్రాంగమే రాజ్యము” అని అభిప్రాయపడ్డాడు. ఈ విధంగా కొందరు రచయితలు రాజ్యము, ప్రభుత్వము ఒక్కటే అని చెప్పారు. ఇంగ్లాండ్లో స్టువర్ట్ వంశరాజులు రాజ్యాన్ని, ప్రభుత్వాన్ని ఒకటిగా భావించారు. ఫ్రాన్స్లో 14వ లూయీ రాజు “నేనే రాజ్యము” అని వాదించి, రాజ్యానికి, ప్రభుత్వానికి భేదం లేకుండా చేశాడు.

కానీ ప్రభుత్వం రాజ్యానికి ఒక లక్షణము. రాజ్య ఆశయాలు ప్రభుత్వం ద్వారా తీర్చబడతాయి. రాజ్యంలో ప్రజలంతా భాగం. ప్రభుత్వంలో కొందరు ప్రజలే పనిచేస్తారు. మెకైవర్ అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం రాజ్య ప్రతినిధి. ఈ విధంగా రాజ్యం, ప్రభుత్వాల మధ్య భేదాలున్నాయి.

AP Inter 1st Year Civics Study Material Chapter 2 రాజ్యం

భేదాలు:
రాజ్యం

  1. రాజ్యం శాశ్వతమైన రాజకీయ సంస్థ. మానవ సమాజం ఉన్నంతకాలం అది ఉంటుంది.
  2. రాజ్యమునకు 5 లక్షణాలుంటాయి. ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం, సార్వభౌమాధికారం, అంతర్జాతీయ గుర్తింపు దాని లక్షణాలు.
  3. రాజ్యము యజమాని వంటిది.
  4. రాజ్యానికి సార్వభౌమాధికారం సహజంగానే ఉంటుంది. అది ఉన్నతాధికారాలు చెలాయిస్తుంది.
  5. ప్రపంచంలోని అన్ని రాజ్యాలకు ముఖ్య లక్షణాలు ఒక్కటే.
  6. పౌరులంతా రాజ్యంలో సభ్యులే. రాజ్యంలో. ప్రజలకు సభ్యత్వం, తప్పనిసరిగా ఉంటుంది.
  7. రాజ్యానికి స్వతసిద్ధమైన రూపం లేదు. అది ప్రభుత్వ రూపంలోనే కనిపిస్తుంది.
  8. రాజ్యానికి ప్రదేశము ఒక ముఖ్య లక్షణము. ప్రదేశంలేని రాజ్యం ఉండదు.
  9. ప్రజలకు రాజ్యాన్ని వ్యతిరేకించే హక్కు లేదు.
  10. రాజ్యానికి మౌలికమైన అధికారాలున్నాయి.
    ఉదా: పార్లమెంటరీ, అధ్యక్షతరహా యూనిటరీ, సమాఖ్య మొదలగు ప్రభుత్వాలు.

ప్రభుత్వం

  1. ప్రభుత్వం ఎన్నికల వలనగానీ, విప్లవాల వలనగానీ మారవచ్చు. అందువలన అది శాశ్వతమైనది కాదు.
  2. ప్రభుత్వం రాజ్య లక్షణాలలో ఒకటి మాత్రమే. అది రాజ్య ప్రతినిధి, ఒక భాగము.
  3. ప్రభుత్వం రాజ్యానికి సేవకుని వంటిది. రాజ్యం పనులను ప్రభుత్వం చేస్తుంది.
  4. ప్రభుత్వం రాజ్యం తరపున సార్వభౌమాధికారాన్ని చెలాయిస్తుంది.
  5. ప్రపంచంలో ప్రభుత్వాలన్నీ ఒకే విధమైనవి కావు.
  6. ప్రభుత్వంలో కొద్దిమంది మాత్రమే సభ్యులు. సభ్యత్వం తప్పనిసరి కాదు.
  7. ప్రభుత్వము ఒక స్పష్టమైన రూపంలో కనిపిస్తుంది.
  8. ప్రభుత్వం నిర్దిష్ట ప్రదేశం లేకుండా పనిచేస్తుంది. అది ఎక్కడినుండైనా పనిచేస్తుంది.
  9. ప్రజలు తమకు నచ్చని ప్రభుత్వాన్ని ప్రతిఘటించ గలరు. న్యాయస్థానాల ద్వారా కూడా వ్యతిరేకించగలరు.
  10. ప్రభుత్వానికి రాజ్యాంగము ఇచ్చే అధికారాలే ఉంటాయి.

ప్రశ్న 3.
రాజ్యం, సమాజం మధ్యగల సంబంధం, వ్యత్యాసాలను వివరించండి.
జవాబు:
పరిచయం: రాజ్యం, సమాజం అనేవి ప్రముఖమైన మానవసంస్థలు. మేకైవర్ అభిప్రాయంలో రక్త సంబంధం సమాజ అవతరణకు దారితీస్తే, సమాజం రాజ్య ఆవిర్భావానికి నాంది పలికింది.

రాజ్యం: “ఒక నిర్ణీత భూభాగంలో రాజకీయంగా వ్యవస్థాపితమైన ప్రజలే రాజ్యం” – బ్లంటి సమాజం: “కొన్ని ఉమ్మడి లక్ష్యాలను సాధించేందుకై సమైక్యం చెందిన వ్యక్తుల సమూహం”.

రాజ్యానికి, సమాజానికి మధ్యగల సంబంధం (Relationship between State and Society):
1) ఒకే రకమైన లక్షణాలు (Common features): రాజ్యం, సమాజం రెండింటికి ఒకే తరహా లక్షణాలు ఉంటాయి. సాధారణంగా రాజ్యం, సమాజాలలో ప్రజలే ఉంటారు. సమాజంలోని సభ్యులే రాజ్యంలో సభ్యులుగా కొనసాగుతారు.

2) పరస్పర పూరకాలు (Complementary): రాజ్యం, సమాజం రెండూ పరస్పర పూరకాలు. ఒకదానికొకటి సహకరించుకొంటాయి. సమాజ ప్రగతి రాజ్య ప్రగతిపై ఆధారపడి ఉంటుంది. రాజ్య కార్యకలాపాలు లేదా పనితీరు సమాజంలోని ఆచారాలు, సంప్రదాయాలపై ఆధారపడి ఉంటాయి.

3) పర్యాయపదాలు (Synonymous terms): రాజ్యం, సమాజం అనే పదాలను అనేక సందర్భాలలో పర్యాయపదాలుగా వినియోగించడమైంది. గ్రీకు రాజనీతితత్త్వవేత్తలైన ప్లేటో, అరిస్టాటిల్లు, తరువాతి కాలంలో హెగెల్, బొసాంకేలు రాజ్యం, సమాజం రెండూ ఒకటే అని భావించారు. గ్రీకు రాజనీతి పండితులు నగర రాజ్యాలను, సమాజాన్ని పర్యాయపదాలుగా ఉపయోగించడం జరిగింది.

4) పరస్పర సంబంధం (Inter-relation): రాజ్యం, సమాజం మధ్యగల సంబంధాన్ని ఎవ్వరూ విస్మరించలేరు. రాజ్యం తాను రూపొందించిన చట్టాల ద్వారా సమాజంలో వ్యక్తుల బాహ్య ప్రవర్తనను నియంత్రిస్తుంది. సామాజిక వ్యవస్థకు విస్తృత పునాదిని ఏర్పరుస్తుంది. అందుచేత రాజ్యం సమాజాలను రెండు విభిన్న వ్యవస్థలలో విడదీయలేం. సమాజ ఆర్థిక, సాంస్కృతిక, మత, మానవతాపరమైన కార్యకలాపాల ద్వారా రాజ్యాన్ని పరిపుష్టంగావిస్తుంది.

రాజ్యం, సమాజం మధ్య వ్యత్యాసాలు (Differences between State and Society): రాజ్యం, సమాజాల మధ్య సన్నిహిత సంబంధం ఉన్నప్పటికీ, ఈ రెండూ ఒకదానికొకటి వ్యత్యాసాలను కలిగి ఉన్నాయి. వాటిని కింది పట్టిక ద్వారా తెలపవచ్చు.

రాజ్యం (State)

  1. రాజ్యం అనేది రాజకీయ సంస్థ.
  2. రాజ్యం వ్యక్తుల బాహ్య ప్రవర్తనను మాత్రమే నియంత్రిస్తుంది. ఈ విషయంలో అది కొన్ని నిబంధనలను రూపొందిస్తుంది.
  3. రాజ్యానికి దండనాధికారం ఉంది. రాజ్యశాసనాన్ని అతిక్రమించినవారు శిక్షార్హులుగా పరిగణించ బడతారు.
  4. రాజ్యం చేసే చట్టాలు రాజ్యానికి బలం చేకూరుస్తాయి.
  5. రాజ్యం అనేది ప్రాదేశిక సంస్థ. దానికి స్వీయ నిర్దిష్ట భూభాగం ఉంటుంది. ప్రాదేశికత అనేది రాజ్యానికి చెందిన ప్రధాన లక్షణంగా పేర్కొనవచ్చు.
  6. రాజ్యం ఒక్కటే సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటుంది. తన సార్వభౌమాధికారాన్ని వినియోగించి ప్రజల సంబంధాలను నిర్దేశించే అనేక చట్టాలను రూపొందించి, అమలు పరుస్తుంది.
  7. రాజ్యం సహజంగా ఏర్పడిన సంస్థ కాదు. అది మానవనిర్మితమైంది. దానిలో సభ్యత్వం వ్యక్తులకు నిర్బంధమైంది.
  8. రాజ్యం సమాజంలోని అతి ముఖ్యభాగం. సమాజంలోని రాజకీయంగా వ్యవస్థీకృతమైన భాగాన్ని అది సూచిస్తుంది.
  9. సాంఘిక వ్యవస్థ అభివృద్ధి చెందిన రూపమే రాజ్యం. అది సమాజం నుంచి ఆవిర్భవించింది.
  10. రాజ్యం శాశ్వతమైంది కాకపోవచ్చు. అది అంతరించి పోయే అవకాశం ఉంది. వేరొక రాజ్యం దానిని బలవంతంగా ఆక్రమించుకోవచ్చు.
  11. రాజ్య చట్టాలు, విధి, విధానాలు ఖచ్చితంగాను, స్పష్టంగాను ఉంటాయి.
  12. రాజ్యంలోని చట్టాలు ఒకే విధంగా ఉంటాయి. ఒకే చట్టాన్ని అతిక్రమించిన వ్యక్తులందరూ తారతమ్యం లేకుండా శిక్షకు గురవుతారు.
  13. రాజ్యానికి ప్రభుత్వం అనే రాజకీయ వ్యవస్థ ఉంటుంది. అది రాజ్యం తరపున చట్టాలను రూపొందించి, అమలుచేస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 2 రాజ్యం

సమాజం (Society)

  1. సమాజం అనేది సాంఘిక వ్యవస్థ.
  2. సమాజం మానవుల బాహ్య, అంతర్గత ప్రవర్తనలు రెండింటిని నియంత్రిస్తుంది. వ్యక్తుల సామాజిక జీవనాన్ని ఇది క్రమబద్దం చేస్తుంది.
  3. సమాజానికి దండనాధికారం లేదు. సాంఘిక ఆచారాలను అతిక్రమిస్తే వారిని సమాజం శిక్షించ లేదు.
  4. సమాజంలోని ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు సమాజానికి బలం చేకూరుస్తాయి.
  5. సమాజానికి నిర్దిష్టమైన భౌగోళిక హద్దులు లేవు. అది రాజ్యం కంటే విశాలమైంది కావచ్చు లేదా చిన్నదైనా కావచ్చు. సమాజం విశ్వమంతా విస్తరించి ఉంటుంది.
  6. సమాజానికి నిర్బంధ అధికారాలు అంటూ ఏవీ లేవు. సమాజం మానవ సామాజిక ప్రవర్తనను క్రమబద్దం చేసే నియమాలను రూపొందించి నప్పటికీ వాటికి చట్టబద్ధత ఉండదు.
  7. సమాజం సహజంగా, స్వతఃసిద్ధంగా ఏర్పడిన సంస్థ. వ్యక్తులు తమ విచక్షణను అనుసరించి దీనిలో సభ్యులుగా కొనసాగుతారు.
  8. రాజ్యం కంటే సమాజం విస్తృతమైంది. అనేక సంఘాలు, సంస్థలు, వ్యవస్థల ద్వారా అది ఏర్పడి అభివృద్ధి చెందుతుంది.
  9. సమాజం పెద్దది. రాజ్యం దానిలో అంతర్భాగం మాత్రమే. సమాజం రాజ్యం కంటే ముందు అవతరించింది. మానవుడు స్వభావరీత్యా సంఘ జీవి.
  10. సమాజం శాశ్వతమయింది. ఇది నిరంతరం కొనసాగుతుంది.
  11. సమాజ సూత్రాలు అస్పష్టమైనవి. అవి సాధారణంగా అనిర్దిష్టంగా ఉంటాయి. అవి సంప్రదాయాలు, కట్టుబాట్లపై ఆధారపడి ఉంటాయి.
  12. సమాజం నియమాలు ఒకే విధంగా ఉండవు. ఒక వర్గ నియమాలకు, వేరొక వర్గ నియమాలకు మధ్య వ్యత్యాసం ఉంటుంది. వివిధ సామాజిక వర్గాలు ఒకే రకమైన నేరానికి పాల్పడితే విధించే శిక్షలు వేరువేరుగా ఉంటాయి.
  13. సమాజ నియమాలను అమలుపరచడానికి ఒక ప్రత్యేకమైన యంత్రాంగమంటూ ఏదీ లేదు. ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్ల ద్వారా అది మానవ ప్రవర్తనను నియంత్రిస్తుంది.

ప్రశ్న 4.
రాజ్యం, సంస్థల మధ్యగల సంబంధం, వ్యత్యాసాలను వర్ణించండి.
జవాబు:
పరిచయం: మానవుని సామాజిక స్వభావం, అతడి విభిన్న అవసరాలను తీర్చే అనేక సంఘాల, సముదాయాల ద్వారా వెల్లడవుతుంది. మానవుడు ఒంటరి జీవితాన్ని గడపలేడు. తన అభివృద్ధికి ఇతరుల సహాయ సహకారాలను కోరతాడు. కొన్ని నిర్దిష్ట ప్రయోజనాలను సాధించుకొనేందుకు సన్నిహిత సామాజిక సంబంధాలనేవి సంఘాల ఏర్పాటుకు దారితీస్తాయి.

రాజ్యం: “ఒక నిర్ణీత భూభాగంలో రాజకీయంగా వ్యవస్థాపితమైన ప్రజలే రాజ్యం” – బ్లంట్ల

సంఘం: మేకైవర్ నిర్వచనం ప్రకారం ‘సాధారణమైన లేదా ఉమ్మడి ప్రయోజనాలను నెరవేర్చుకొనేందుకు మానవుడు తన ప్రయోజనాన్ని ఆశించి ఏర్పాటు చేసుకున్నదే సంఘం.”

రాజ్యం-సంఘాల మధ్య సంబంధం (Relationship between State and Association): రాజ్యం, సంఘం రెండూ కూడా వ్యక్తులతో కూడుకొన్న వ్వవస్థలే. రాజ్యం, సంఘంలో వ్యక్తులే సభ్యులు. ఈ రెండూ కూడా వ్యక్తుల అనేక అవసరాలను తీర్చేందుకు ఏర్పాటైనాయి. సమిష్టి ప్రయోజనాలను సాధించుకొనే లక్ష్యంతో రాజ్యం, సంఘాలు ఏర్పాటవుతాయి. రాజ్యం, సంఘంల మధ్యగల సంబంధాన్ని కింది విధంగా వివరించవచ్చు.

  1. ఒకేరకమైన సభ్యత్వం (Same membership): రాజ్యం, సంఘాలు రెండూ కూడా మానవ సమూహాలే. వ్యక్తులందరూ ఆ రెండింటిలో సభ్యులుగా ఉంటారు.
  2. ఉమ్మడి ప్రయోజనాలు (Common Interests): వ్యక్తులు తమ సమిష్టి ప్రయోజనాలను సాధించుకోవడానికి రాజ్యాన్ని, సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు.
  3. వ్యవస్థాపరమైనవి (Organisation): రాజ్యం, సంఘాలు రెండూ కూడా తమ ప్రయోజనాలను సాధించుకోవడానికి వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలే.
  4. ప్రవర్తనా నియమావళి (Code of conduct): రాజ్యం, సంఘాలు రెండూ తమ సభ్యులను నియంత్రించేందుకుగాను ప్రవర్తనా నియమావళిని కలిగి ఉన్నాయి. అటువంటి నియమావళి సభ్యులను ఒకతాటిపైన ఉంచుతాయి. అంతేకాకుండా అది వ్యవస్థకు స్థిరత్వాన్ని కలిగిస్తుంది.
  5. కార్యనిర్వహణశాఖ (Executive): ప్రతి రాజ్యానికి కార్యనిర్వాహకశాఖ ఉంటుంది. దీనినే ప్రభుత్వంగా పిలువబడుతుంది. ప్రతి సంఘానికి కూడా కార్యనిర్వాహక మండలి ఉండి, తమ విధివిధానాలను అమలుపరుస్తుంది.

రాజ్యం, సంఘాల మధ్యగల వ్యత్యాసాలు (Differences between State and Association):
రాజ్యం (State)

  1. రాజ్యం సభ్యత్వం నిర్బంధమైంది.
  2. రాజ్యం శాశ్వతమైంది.
  3. రాజ్యం ప్రజలందరి శ్రేయస్సు, ప్రగతి కోసం కృషి చేస్తుంది.
  4. రాజ్యం అనేది భౌగోళిక సంస్థ. దానికి నిర్దిష్టమైన సరిహద్దులు ఉంటాయి.
  5. రాజ్యం సార్వభౌమాధికారం గల సంస్థ.
  6. ఒక పౌరుడికి ఒకే సమయంలో ఒక రాజ్యంలో మాత్రమే సభ్యత్వం ఉంటుంది. తనకు సభ్యత్వం ఉన్న రాజ్యం పట్ల మాత్రమే విధేయత కనబరుస్తాడు.
  7. రాజ్య పరిధి విస్తృతమైనది.
  8. సంఘం కార్యకలాపాలలో రాజ్యం జోక్యం చేసుకోవచ్చు.
  9. రాజ్యం సంఘాల కంటే ఉన్నతమైంది.
  10. రాజ్యానికి పౌరులందరూ తప్పనిసరిగా విధేయులై ఉంటారు.
  11. ప్రపంచంలోని రాజ్యాలన్నింటికి ఒకే తరహా లక్షణాలు ఉంటాయి.
  12. రాజ్యం తనకున్న అధికారాన్ని చెలాయిస్తూ, రాజ్య చట్టాలను నిర్బంధంగా అమలుపరుస్తుంది.
  13. శాంతి భద్రతల నిర్వహణలో రాజ్యం బల ప్రయోగానికి పాల్పడవచ్చు.

AP Inter 1st Year Civics Study Material Chapter 2 రాజ్యం

సంఘాలు (Associations)

  1. సంఘంలో సభ్యత్వం ఐచ్ఛికమైంది.
  2. సంఘాలు శాశ్వతమైనవిగానూ, తాత్కాలికంగానూ ఉంటాయి.
  3. సంఘాలు తమ సభ్యుల ప్రయోజనాలను నెరవేర్చేం దుకు ప్రయత్నిస్తాయి.
  4. సంఘాలకు ఖచ్చితమైన సరిహద్దులు ఉండవు.
  5. సంఘాలకు సార్వభౌమాధికారం ఉండదు.
  6. ఒక వ్యక్తికి ఒకేసారి అనేక సంఘాలలో సభ్యత్వం ఉండవచ్చు.
  7. సంఘాల పరిధి పరిమితమైంది.
  8. రాజ్య కార్యకలాపాలలో సంఘం జోక్యం చేసుకో రాదు.
  9. సంఘాలు రాజ్యం కంటే ఉన్నతమైనవి కావు.
  10. సంఘాల నియమ నిబంధనలను సభ్యులు సమయం సందర్భాలను బట్టి ఆమోదించేందుకు లేదా అతిక్రమించేందుకు వీలుంటుంది.
  11. సంఘాలకు నిర్మాణం, స్వభావం, లక్ష్యాలు లేదా ఉద్దేశ్యాలలో వ్యత్యాసం ఉంటుంది.
  12. సంఘాలు తమ నియమ నిబంధనలను బలవంతంగా సభ్యులపైన రుద్దలేవు. సభ్యుల సహకారం పైన సంస్థల నియమావళి అమలు జరుపబడుతుంది.
  13. సభ్యుల అంగీకారంపై ఆధారపడి సంఘాలు తమ కార్యకలాపాలను నిర్వహిస్తాయి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాజ్యానికి గల ఏవైనా రెండు ముఖ్య లక్షణాలను వివరించండి. [Mar. ’18, ’17]
జవాబు:
లక్షణాలు: రాజ్యానికి నాలుగు ప్రధాన లక్షణాలున్నాయి. అవి 1. ప్రజలు 2. ప్రదేశం 3. ప్రభుత్వం 4. సార్వభౌమాధికారం. వీటితోపాటు ఆధునిక కాలంలో అంతర్జాతీయ గుర్తింపు రాజ్యలక్షణంగా గుర్తించబడింది.

1) ప్రజలు: రాజ్యము ఒక మానవసంస్థ. ప్రజలు లేనిదే రాజ్యం లేదు. అయితే ఒక రాజ్యంలో ప్రజలు ఎంతమంది ఉండవలెననే అంశంపై రాజనీతి తత్త్వవేత్తలు ఒకే అభిప్రాయాన్ని కల్గిలేరు. ప్లేటో దృష్టిలో ఆదర్శ రాజ్య జనాభా 5,040. రూసో అభిప్రాయంలో ఆదర్శ రాజ్యానికి జనాభా 10,000 మంది. అరిస్టాటిల్ అభిప్రాయంలో ఆదర్శ రాజ్య జనాభా మరీ ఎక్కువగానూ, మరీ తక్కువగానూ ఉండరాదు. ప్రస్తుత కాలంలో ఆధునిక రాజ్యాలు కొన్ని తక్కువ జనాభాతోను (అండోరా, శాన్ మారినో, వాటికన్ సిటీ), మరికొన్ని ఎక్కువ జనాభాతోను (చైనా, ఇండియా) ఉన్నాయి. ప్రజలు కష్టించి పనిచేసే తత్వాన్ని కల్గి ఉంటే జనాభా తక్కువగా ఉన్నా రాజ్యం అభివృద్ధి చెందుతుంది.

2) ప్రదేశము: నిర్ణీత ప్రదేశం రాజ్యానికి అవసరం. ప్రదేశము అనగా భూమి, ప్రాదేశిక వియత్తలము (ఆకాశము) మరియు ప్రాదేశిక జలాలు (సముద్రజలాలు 12 నాటికల్ మైళ్ళ వరకు) అయితే నాల్గువైపుల భూమినే సరిహద్దుగా కల్గిన, నేపాల్, భూటాన్ వంటి రాజ్యాలకు ప్రాదేశిక జలాలు ఉండవు. వాటికి ప్రదేశము అంటే భూమి, ప్రాదేశిక వియత్తలము మాత్రమే. తక్కువ ప్రదేశం ఉన్న రాజ్యాలు ఉత్తమమైనవిగా ప్లేటో, రూసో అభిప్రాయపడ్డారు. లార్డ్ ఆక్టన్, ట్రయమ్మీలు పెద్ద ప్రదేశం కల్గిన రాజ్యాలు గొప్పవని విశ్వసించారు. అరిస్టాటిల్ రాజ్య ప్రదేశం మరీ ఎక్కువగాను, మరీ తక్కువగాను ఉండకూడదని తెల్పెను.

AP Inter 1st Year Civics Study Material Chapter 2 రాజ్యం

ప్రశ్న 2.
రాజ్యానికి గల ఇతర లక్షణాలు ఏవి ?
జవాబు:
ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం, సార్వభౌమాధికారంతో పాటు రాజ్యం కొన్ని ఇతర లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. అవి:
1) అంతర్జాతీయ గుర్తింపు (International Recognition): అంతర్జాతీయ గుర్తింపు అంటే ఒక రాజ్య ఉనికిని, ప్రభుత్వాన్ని ప్రపంచంలోని ఇతర రాజ్యాలు గుర్తించడం. ఆధునిక యుగంలో ప్రపంచ రాజ్యాల మధ్య సంబంధాలు పెరగడంతో అనేక అంతర్జాతీయ సంస్థలు ఏర్పడ్డాయి. కొంతమంది రాజనీతి పండితుల అభిప్రాయంలో అంతర్జాతీయ గుర్తింపు కూడా రాజ్య మౌలిక లక్షణంగా పరిగణించడమైంది.

ప్రపంచంలోని ప్రతి రాజ్యం ఇతర సార్వభౌమ రాజ్యాల చేత గుర్తింపు పొందాలి. ఐక్యరాజ్యసమితి వంటి కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఆ రకమైన గుర్తింపును ఇస్తున్నాయి. ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వమున్నదంటే ఆ రాజ్యానికి చెందిన సార్వభౌమాధికారం గుర్తించబడినట్లుగా భావించవచ్చు. ఒక కొత్త రాజ్యం ఆవిర్భవించినప్పుడు, అది మిగతా ప్రపంచ రాజ్యాలతో పాటు ఐక్యరాజ్యసమితి చేత గుర్తించబడటం అత్యంత ఆవశ్యకం.

అంతర్జాతీయ గుర్తింపు అనే లక్షణం రాజకీయ దృక్కోణంతో కూడుకొని ఉంది. 1945 లో ఐక్యరాజ్యసమితి ఏర్పడక ముందునుంచే చైనా ఒక సమగ్రమైన రాజ్యం. 1949 నాటికి చైనా కమ్యూనిస్టుల వశమైంది. ప్రచ్ఛన్న యుద్ధ ప్రభావం వల్ల చైనా ఒక సార్వభౌమ రాజ్యంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల చేత గుర్తించబడలేదు. చైనా-అమెరికాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధ ఛాయలు తొలగిన తరువాత 1970వ దశకంలో ఐక్యరాజ్యసమితి చైనాను ఒక సార్వభౌమ రాజ్యంగా గుర్తించింది.

2) శాశ్వతత్వం (Permanence): రాజ్యం శాశ్వతమైన సంస్థ. ప్రాచీన కాలం నుంచి పరిశీలిస్తే ప్రజలు ఏదో ఒక రాజ్యంలో ప్రజాజీవనం సాగించడంతో పాటు తమ కార్యకలాపాలను నిర్వర్తించారు. రాజ్యానికున్న శాశ్వతత్వమనే లక్షణాన్ని రూపుమాపలేం. దురాక్రమణల ద్వారా ఒక రాజ్యం మరొక రాజ్యపరమైనప్పటికీ, దాని శాశ్వతత్వం అంతరించదు. ఒక రాజ్యం మరొక రాజ్యంలో విలీనమై కొత్త రాజ్యమేర్పడితే సార్వభౌమాధికారం బదిలీ అవుతుందే తప్ప రాజ్యం అంతరించదు. ఉదాహరణకు 1990వ దశకంలో సోవియటయూనియన్ విడిపోయి 15 స్వతంత్ర రాజ్యాలు ఆవిర్భవించాయి.

3) సాధారణ విధేయత (General Obediance): రాజ్య భౌగోళిక సరిహద్దులలో నివసించే ప్రజలందరి మీద రాజ్యాధికారం చెల్లుబాటవుతుంది. రాజ్యం ప్రజల నుండి, వారు ఏర్పాటుచేసుకున్న సంస్థల నుంచి విధేయతను కోరుకుంటుంది. రాజ్యంలోని ప్రజలు, వర్గాలన్నింటికీ విధేయత సూత్రం వర్తిస్తుంది. రాజ్యంలోని ప్రజలుగాని, సంస్థలు గాని రాజ్యాధికారానికి అతీతులమని భావించడానికి వీలులేదు. ప్రజలకు ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలను విమర్శించే హక్కు ఉంటుందే తప్ప, రాజ్యాన్ని విమర్శించే అధికారం వారికి ఉండదు. రాజ్యాధికారానికి లోబడిఉండటం ప్రజలకు తప్పనిసరి.

4) ప్రజాభీష్టం (Popular Will): విల్లోభి ప్రకారం ప్రజాభీష్టం రాజ్యానికి గల అత్యంత ముఖ్యమైన లక్షణం. ప్రజాసమ్మతి ఉన్నంతకాలం రాజ్య మనుగడకు ప్రమాదం ఉండదు. దురాక్రమణదారుల నుంచి రాజ్యాన్ని రక్షించుకోవాలన్నా, అంతర్గతవిప్లవాల నుంచి రాజ్యాన్ని తప్పించాలన్నా పటిష్టమైన ప్రజాభీష్టం అవసరం.

3. రాజ్య ముఖ్య లక్షణాలైన ప్రభుత్వం, సార్వభౌమాధికారం గురించి మీకు తెలిసింది రాయండి. జవాబు: ప్రభుత్వము: రాజ్యము యొక్క ఏజెంట్ ప్రభుత్వం. ఇది రాజ్యం యొక్క అభీష్టాన్ని నెరవేరుస్తుంది. రాజ్యం తరపున సార్వభౌమాధికారాన్ని వినియోగిస్తుంది. ప్రభుత్వమునకు శాసన నిర్మాణ సభ, కార్యనిర్వాహక వర్గం, న్యాయశాఖ అను మూడు అంగములు కలవు. ప్రభుత్వం రాజ్యం కంటే ముందే ఆవిర్భవించింది. అందువలననే రాజ్యం లేకుండా ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం శాశ్వతమైన సంస్థ కాదు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ప్రభుత్వాలు అనేక రకాలు. ప్రజాస్వామ్య, నియంతృత్వ, పార్లమెంటరీ, అధ్యక్షతరహా ఏకకేంద్ర, సమాఖ్య మొదలగునవి.

సార్వభౌమాధికారము: రాజ్యం మౌలిక లక్షణాలలో అత్యంత ముఖ్యమైనది సార్వభౌమాధికారము. లాటిన్ పదమైన ‘సుప్రానస్’ నుండి సావిర్నిటీ అను ఆంగ్లపదం ఉద్భవించినది. సార్వభౌమాధికారము వలననే రాజ్యం విశిష్టమైన, అత్యున్నతమైన రాజకీయ సంస్థగా పరిగణించబడుతోంది. సార్వభౌమాధికారము వలన రాజ్యంలో నివసించే ప్రజలు పనిచేసే సంస్థలు రాజ్యానికి విధేయులై ఉండటం జరుగుతుంది. అలా విధేయత చూపించని వ్యక్తులకు, సంస్థలను రాజ్యం దండిస్తుంది. సార్వభౌమాధికారము అంతిమ అధికారం. దీనిని మించిన మరొక అధికారం రాజ్యంలో ఉండదు. ఇది విభజించుటకు, బదిలీ చేయుటకు వీలులేని అధికారము.

ప్రశ్న 4.
రాజ్యం, సమాజం మధ్యగల సంబంధాన్ని వర్ణించండి.
జవాబు:
రాజ్యానికి, సమాజానికి మధ్యగల సంబంధం (Relationship between State and Society):
1) ఒకే రకమైన లక్షణాలు (Common features): రాజ్యం, సమాజం రెండింటికి ఒకే తరహా లక్షణాలు ఉంటాయి. సాధారణంగా రాజ్యం, సమాజాలలో ప్రజలే ఉంటారు. సమాజంలోని సభ్యులే రాజ్యంలో సభ్యులుగా కొనసాగుతారు.

2) పరస్పర పూరకాలు (Complementary): రాజ్యం, సమాజం రెండూ పరస్పర పూరకాలు. ఒకదాని కొకటి సహకరించుకొంటాయి. సమాజ ప్రగతి రాజ్య ప్రగతిపై ఆధారపడి ఉంటుంది. రాజ్య కార్యకలాపాలు లేదా పనితీరు సమాజంలోని ఆచారాలు, సంప్రదాయాలపై ఆధారపడి ఉంటాయి.

3) పర్యాయపదాలు (Synonymous terms): రాజ్యం, సమాజం అనే పదాలను అనేక సందర్భాలలో పర్యాయపదాలుగా వినియోగించడమైంది. గ్రీకు రాజనీతి తత్త్వవేత్తలైన ప్లేటో, అరిస్టాటిల్లు, తరువాతి కాలంలో హెగెల్, బొసాంకేలు రాజ్యం, సమాజం రెండూ ఒకటే అని భావించారు. గ్రీకు రాజనీతి పండితులు నగర రాజ్యాలను, | సమాజాన్ని పర్యాయపదాలుగా ఉపయోగించడం జరిగింది.

AP Inter 1st Year Civics Study Material Chapter 2 రాజ్యం

4) పరస్పర సంబంధం (Inter-relation): రాజ్యం, సమాజం మధ్యగల సంబంధాన్ని ఎవ్వరూ విస్మరించలేరు. రాజ్యం తాను రూపొందించిన చట్టాల ద్వారా సమాజంలో వ్యక్తుల బాహ్య ప్రవర్తనను నియంత్రిస్తుంది. సామాజిక వ్యవస్థకు విస్తృత పునాదిని ఏర్పరుస్తుంది. అందుచేత రాజ్యం సమాజాలను రెండు విభిన్న వ్యవస్థలలో విడదీయలేం. సమాజ ఆర్థిక, సాంస్కృతిక, మత, మానవతాపరమైన కార్యకలాపాల ద్వారా రాజ్యాన్ని పరిపుష్టంగావిస్తుంది.

ప్రశ్న 5.
రాజ్యం, సమాజం మధ్యగల వ్యత్యాసాలను పేర్కొనండి.
జవాబు:
రాజ్యం, సమాజం మధ్య వ్యత్యాసాలు (Differences between State and Society): రాజ్యం, సమాజాల మధ్య సన్నిహిత సంబంధం ఉన్నప్పటికీ, ఈ రెండూ ఒకదానికొకటి వ్యత్యాసాలను కలిగి ఉన్నాయి. వాటిని కింది పట్టిక ద్వారా తెలపవచ్చు.

రాజ్యం (State)

  1. రాజ్యం అనేది రాజకీయ సంస్థ.
  2. రాజ్యం వ్యక్తుల బాహ్య ప్రవర్తనను మాత్రమే నియంత్రిస్తుంది. ఈ విషయంలో అది కొన్ని నిబంధనలను రూపొందిస్తుంది.
  3. రాజ్యానికి దండనాధికారం ఉంది. రాజ్యశాసనాన్ని అతిక్రమించినవారు శిక్షార్హులుగా పరిగణించ బడతారు.
  4. రాజ్యం చేసే చట్టాలు రాజ్యానికి బలం చేకూరుస్తాయి.
  5. రాజ్యం అనేది ప్రాదేశిక సంస్థ. దానికి స్వీయ నిర్దిష్ట భూభాగం ఉంటుంది. ప్రాదేశికత అనేది రాజ్యానికి చెందిన ప్రధాన లక్షణంగా పేర్కొనవచ్చు.
  6. రాజ్యం ఒక్కటే సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటుంది. తన సార్వభౌమాధికారాన్ని వినియోగించి ప్రజల సంబంధాలను నిర్దేశించే అనేక చట్టాలను రూపొందించి, అమలు పరుస్తుంది.
  7. రాజ్యం సహజంగా ఏర్పడిన సంస్థ కాదు. అది మానవనిర్మితమైంది. దానిలో సభ్యత్వం వ్యక్తులకు నిర్బంధమైంది.
  8. రాజ్యం సమాజంలోని అతి ముఖ్యభాగం. సమాజంలోని రాజకీయంగా వ్యవస్థీకృతమైన భాగాన్ని అది సూచిస్తుంది.
  9. సాంఘిక వ్యవస్థ అభివృద్ధి చెందిన రూపమే రాజ్యం. అది సమాజం నుంచి ఆవిర్భవించింది.
  10. రాజ్యం శాశ్వతమైంది కాకపోవచ్చు. అది అంతరించి పోయే అవకాశం ఉంది. వేరొక దానిని బలవంతంగా ఆక్రమించుకోవచ్చు.
  11. రాజ్య చట్టాలు, విధి, విధానాలు ఖచ్చితంగాను, స్పష్టంగాను ఉంటాయి.
  12. రాజ్యంలోని చట్టాలు ఒకే విధంగా ఉంటాయి. చట్టాన్ని అతిక్రమించిన వ్యక్తులందరూ తారతమ్యం లేకుండా శిక్షకు గురవుతారు.
  13. రాజ్యానికి ప్రభుత్వం అనే రాజకీయ వ్యవస్థ ఉంటుంది. అది రాజ్యం తరపున చట్టాలను రూపొం దించి, అమలుచేస్తుంది.

సమాజం (Society)

  1. సమాజం అనేది సాంఘిక వ్యవస్థ.
  2. సమాజం మానవుల బాహ్య, అంతర్గత ప్రవర్తనలు రెండింటిని నియంత్రిస్తుంది. వ్యక్తుల సామాజిక జీవనాన్ని ఇది క్రమబద్ధం చేస్తుంది.
  3. సమాజానికి దండనాధికారం లేదు. సాంఘిక ఆచారాలను అతిక్రమిస్తే వారిని సమాజం శిక్షించ లేదు.
  4. సమాజంలోని ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు సమాజానికి బలం చేకూరుస్తాయి.
  5. సమాజానికి నిర్దిష్టమైన భౌగోళిక హద్దులు లేవు. అది రాజ్యం కంటే విశాలమైంది కావచ్చు లేదా చిన్నదైనా కావచ్చు. సమాజం విశ్వమంతా విస్తరించి ఉంటుంది.
  6. సమాజానికి నిర్బంధ అధికారాలు అంటూ ఏవీ లేవు. సమాజం మానవ సామాజిక ప్రవర్తనను క్రమబద్దం చేసే నియమాలను రూపొందించి నప్పటికీ వాటికి చట్టబద్ధత ఉండదు.
  7. సమాజం సహజంగా, స్వతఃసిద్ధంగా ఏర్పడిన సంస్థ. వ్యక్తులు తమ విచక్షణను అనుసరించి దీనిలో సభ్యులుగా కొనసాగుతారు.
  8. రాజ్యం కంటే సమాజం విస్తృతమైంది. అనేక సంఘాలు, సంస్థలు, వ్యవస్థల ద్వారా అది ఏర్పడి అభివృద్ధి చెందుతుంది.
  9. సమాజం పెద్దది. రాజ్యం దానిలో అంతర్భాగం మాత్రమే. సమాజం రాజ్యం కంటే ముందు అవతరించింది. మానవుడు స్వభావరీత్యా సంఘజీవి.
  10. సమాజం శాశ్వతమయంది. ఇది నిరంతరం కొనసాగుతుంది.
  11. సమాజ సూత్రాలు అస్పష్టమైనవి. అవి సాధారణంగా అనిర్దిష్టంగా ఉంటాయి. అవి సంప్రదాయాలు, కట్టుబాట్లపై ఆధారపడి ఉంటాయి.
  12. సమాజం నియమాలు ఒకే విధంగా ఉండవు. ఒకే ఒక వర్గ నియమాలకు, వేరొక వర్గ నియమాలకు మధ్య వ్యత్యాసం ఉంటుంది. వివిధ సామాజిక వర్గాలు ఒకే రకమైన నేరానికి పాల్పడితే విధించే శిక్షలు వేరువేరుగా ఉంటాయి
  13. సమాజ నియమాలను అమలు పరచడానికి ఒక ప్రత్యేకమైన యంత్రాంగమంటూ ఏదీ లేదు. ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్ల ద్వారా అది మానవ ప్రవర్తనను నియంత్రిస్తుంది.

ప్రశ్న 6.
రాజ్యం, సంస్థల మధ్య సంబంధం ఏమిటో తెలపండి.
జవాబు:
రాజ్యం-సంఘాల మధ్య సంబంధం (Relationship between State and Association): రాజ్యం, సంఘం రెండూ కూడా వ్యక్తులతో కూడుకొన్న వ్వవస్థలే. రాజ్యం, సంఘంలో వ్యక్తులే సభ్యులు. ఈ రెండూ కూడా వ్యక్తుల అనేక అవసరాలను తీర్చేందుకు ఏర్పాటైనాయి. సమిష్టి ప్రయోజనాలను సాధించుకొనే లక్ష్యంతో రాజ్యం, సంఘాలు ఏర్పాటవుతాయి. రాజ్యం, సంఘంల మధ్యగల సంబంధాన్ని కింది విధంగా వివరించవచ్చు.

1) ఒకేరకమైన సభ్యత్వం (Same membership): రాజ్యం, సంఘాలు రెండూ కూడా మానవ సమూహాలే. వ్యక్తులందరూ ఆ రెండింటిలో సభ్యులుగా ఉంటారు.

2) ఉమ్మడి ప్రయోజనాలు (Common Interests): వ్యక్తులు తమ సమిష్టి ప్రయోజనాలను సాధించుకోవడానికి రాజ్యాన్ని, సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు.

3) వ్యవస్థాపరమైనవి. (Organisation): రాజ్యం, సంఘాలు రెండూ కూడా తమ ప్రయోజనాలను సాధించుకోవడానికి వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలే.

AP Inter 1st Year Civics Study Material Chapter 2 రాజ్యం

4) ప్రవర్తనా నియమావళి (Code of conduct): రాజ్యం, సంఘాలు రెండూ తమ సభ్యులను నియంత్రించేందుకుగాను ప్రవర్తనా నియమావళిని కలిగి ఉన్నాయి. అటువంటి నియమావళి సభ్యులను ఒకతాటిపైన ఉంచుతాయి. అంతేకాకుండా అది వ్యవస్థకు స్థిరత్వాన్ని కలిగిస్తుంది.

5) కార్యనిర్వహణ శాఖ (Executive): ప్రతి రాజ్యానికి కార్యనిర్వాహకశాఖ ఉంటుంది. దీనినే ప్రభుత్వంగా పిలువబడుతుంది. ప్రతి సంఘానికి కూడా కార్యనిర్వాహక మండలి ఉండి, తమ విధివిధానాలను అమలు పరుస్తుంది.

ప్రశ్న 7.
రాజ్యం, సంస్థ మధ్యగల వ్యత్యాసాలను పేర్కొనండి.
జవాబు:
రాజ్యం, సంఘాల మధ్యగల వ్యత్యాసాలు (Differences between State and Association):
రాజ్యం (State)

  1. రాజ్యం సభ్యత్వం నిర్బంధమైంది.
  2. రాజ్యం శాశ్వతమైంది.
  3. రాజ్యం ప్రజలందరి శ్రేయస్సు, ప్రగతి కోసం కృషి చేస్తుంది.
  4. రాజ్యం అనేది భౌగోళిక సంస్థ. దానికి నిర్దిష్టమైన సరిహద్దులు ఉంటాయి.
  5. రాజ్యం సార్వభౌమాధికారం గల సంస్థ.
  6. ఒక పౌరుడికి ఒకే సమయంలో ఒక రాజ్యంలో మాత్రమే సభ్యత్వం ఉంటుంది. తనకు సభ్యత్వం ఉన్న రాజ్యం పట్ల మాత్రమే విధేయత కనబరుస్తారు.
  7. రాజ్య పరిధి విస్తృతమైనది.
  8. సంఘం కార్యకలాపాలలో రాజ్యం జోక్యం చేసు కోవచ్చు.
  9. రాజ్యం సంఘాల కంటే ఉన్నతమైంది.
  10. రాజ్యానికి పౌరులందరూ తప్పనిసరిగా విధేయులై ఉంటారు.
  11. ప్రపంచంలోని రాజ్యాలన్నింటికి ఒకే తరహా లక్షణాలు ఉంటాయి.
  12. రాజ్యం తనకున్న అధికారాన్ని చెలాయిస్తూ, రాజ్య చట్టాలను నిర్బంధంగా అమలుపరుస్తుంది.
  13. శాంతి భద్రతల నిర్వహణలో రాజ్యం బల ప్రయోగానికి పాల్పడవచ్చు.

సంఘాలు (Associations)

  1. సంఘంలో సభ్యత్వం ఐచ్ఛికమైంది.
  2. సంఘాలు శాశ్వతమైనవిగానూ, తాత్కాలికంగానూ ఉంటాయి.
  3. సంఘాలు తమ సభ్యుల ప్రయోజనాలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తాయి.
  4. సంఘాలకు ఖచ్చితమైన సరిహద్దులు ఉండవు.
  5. సంఘాలకు సార్వభౌమాధికారం ఉండదు.
  6. ఒక వ్యక్తికి ఒకేసారి అనేక సంఘాలలో సభ్యత్వం ఉండవచ్చు.
  7. సంఘాల పరిధి పరిమితమైంది.
  8. రాజ్య కార్యకలాపాలలో సంఘం జోక్యం చేసుకోరాదు.
  9. సంఘాలు రాజ కంటే ఉన్నతమైనవి కావు.
  10. సంఘాల నియమ నిబంధనలను సభ్యులు సమయం సందర్భాలను బట్టి ఆమోదించేందుకు లేదా అతిక్రమించేందుకు వీలుంటుంది.
  11. సంఘాలకు నిర్మాణం, స్వభావం, లక్ష్యాలు లేదా ఉద్దేశ్యాలలో వ్యత్యాసం ఉంటుంది.
  12. సంఘాలు తమ నియమ నిబంధనలను బలవంతంగా సభ్యులపైన రుద్దలేవు. సభ్యుల సహకారం పైన సంస్థల నియమావళి అమలు జరుపబడుతుంది.
  13. సభ్యుల అంగీకారంపై ఆధారపడి సంఘాలు తమ కార్యకలాపాలను నిర్వహిస్తాయి.

ప్రశ్న 8.
రాజ్యం, ప్రభుత్వం మధ్య ఏ విధమైన సంబంధం ఉందో తెలపండి.
జవాబు:
రాజ్యం, ప్రభుత్వం అనే పదాలను సామాన్య పరిభాషలో పర్యాయపదాలుగా ఉపయోగించడమైంది. సామాన్య ప్రజలు ఈ రెండింటిని ఒకేరకంగా పరిగణిస్తారు. అట్లాగే అనేకమంది పాలకులు రాజ్యానికి, ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాన్ని విస్మరించారు. ఉదాహరణకు ఫ్రాన్స్ చక్రవర్తి 14వ లూయీ ప్రకారం “నేనే రాజు, నేనే రాజ్యం” అని ప్రకటించాడు. రాజ్యాధికారాన్ని ప్రభుత్వం తరపున నిర్వహిస్తున్న అతడు ఈ విధంగా పరిగణించాడని చెప్పవచ్చు. రాజనీతి శాస్త్రజ్ఞులు రాజ్యం, ప్రభుత్వం మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపారు. తద్వారా అనేక క్లిష్టసమస్యలకు పరిష్కారం తెలిపారు.

రాజ్యం – ప్రభుత్వం మధ్య సంబంధం (Relationship between State and Government): రాజ్యం, ప్రభుత్వం మధ్య సంబంధాన్ని కింద చర్చించడమైంది.
1) వ్యక్తులచే ఏర్పాటు (Established by Individuals): రాజ్యం – ప్రభుత్వం రెండూ వ్యక్తులచే ఏర్పాటయినాయి. ఈ రెండు ప్రజలను రక్షించేందుకై, ప్రజల మధ్య సంబంధాలను క్రమబద్దం చేసేందుకై కృషి చేస్తాయి. వివిధ రంగాలలో ప్రజాప్రయోజనాలను పెంపొందించేందుకు అవి ఏర్పాటై, కొనసాగుతున్నాయి.

AP Inter 1st Year Civics Study Material Chapter 2 రాజ్యం

2) పరస్పర పోషకాలు (Complementary): రాజ్యాన్ని అన్ని రకాలుగా ఆచరణలో ప్రభుత్వంగా పరిగణించ డమైంది. ప్రభుత్వ కార్యకలాపాలు అన్నింటిని రాజ్యం పేరుతో నిర్వహిస్తారు. ఇంగ్లాండ్కు చెందిన స్టూవర్ట్ రాజులు, ఫ్రాన్స్కు చెందిన 14వ లూయీ చక్రవర్తి రాజ్యం, ప్రభుత్వాలను పరస్పర పోషకాలుగా భావించారు.

3) రాజ్య అభీష్టం ప్రభుత్వంచే వెల్లడవటం (Will of State expressed by the Government): ప్రభుత్వమనేది రాజ్యానికి సంబంధించిన అతి ముఖ్య లక్షణం. అది రాజ్య లక్ష్యాలు, ఆశయాలను వెల్లడించి అమలు చేస్తుంది. రాజ్య లక్షణాలను సాధించడంలో ప్రభుత్వం కీలకమైన పాత్రను నిర్వహిస్తుంది. అందువలన ‘ప్రభుత్వాన్ని రాజ్యానికి చెందిన మెదడు’ గా భావిస్తారు. రాజ్యం లక్ష్యాలను ప్రతిబింబించే చట్టాలను ప్రభుత్వం రూపొందించి, అమలుచేస్తుంది.

రాజ్యానికి చెందిన ప్రతిచర్య ప్రభుత్వచర్యగా భావించాల్సి ఉంటుందని లాస్కీ ప్రకటించాడు. రాజ్యాభిష్టం చట్టాల రూపంలో ఉంటుంది. అయితే అటువంటి చట్టాలకు జవసత్వాలు, ప్రయోజనాలను ప్రభుత్వం చేకూర్చుతుంది.

ప్రశ్న 9.
రాజ్యం, ప్రభుత్వం మధ్యగల వ్యత్యాసాలను గుర్తించండి. [Mar. ’18, ’17, ’16]
జవాబు:
రాజ్యం:

  1. రాజ్యం శాశ్వతమైన రాజకీయ సంస్థ. మానవ సమాజం ఉన్నంతకాలం అది ఉంటుంది.
  2. రాజ్యమునకు 5 లక్షణాలుంటాయి. ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం, సార్వభౌమాధికారం, అంతర్జాతీయ గుర్తింపు దాని లక్షణాలు.
  3. రాజ్యము యజమాని వంటిది.
  4. రాజ్యానికి సార్వభౌమాధికారం సహజంగానే ఉంటుంది. అది ఉన్నతాధికారాలు చెలాయిస్తుంది.
  5. ప్రపంచంలోని అన్ని రాజ్యాలకు ముఖ్య లక్షణాలు ఒక్కటే.
  6. పౌరులంతా రాజ్యంలో సభ్యులే. రాజ్యంలో ప్రజలకు సభ్యత్వం, తప్పనిసరిగా ఉంటుంది.
  7. రాజ్యానికి స్వతసిద్ధమైన రూపం లేదు. అది ప్రభుత్వ రూపంలోనే కనిపిస్తుంది.
  8. రాజ్యానికి ప్రదేశము ఒక ముఖ్య లక్షణము. ప్రదేశంలేని రాజ్యం ఉండదు.
  9. ప్రజలకు రాజ్యాన్ని వ్యతిరేకించే హక్కు లేదు.
  10. రాజ్యానికి మౌలికమైన అధికారాలున్నాయి.

ప్రభుత్వం:

  1. ప్రభుత్వం ఎన్నికల వలనగానీ, విప్లవాల వలనగానీ మారవచ్చు. అందువలన అది శాశ్వతమైనది కాదు.
  2. ప్రభుత్వం, రాజ్య లక్షణాలలో ఒకటి మాత్రమే. అది రాజ్య ప్రతినిధి, ఒక భాగము.
  3. ప్రభుత్వం రాజ్యానికి సేవకుని వంటిది. రాజ్యం పనులను ప్రభుత్వం చేస్తుంది.
  4. ప్రభుత్వం రాజ్యం తరపున సార్వభౌమాధికారాన్ని చెలాయిస్తుంది.
  5. ప్రపంచంలో ప్రభుత్వాలన్నీ ఒకే విధమైనవి కావు. ఉదా: పార్లమెంటరీ, అధ్యక్ష తరహా యూనిటరీ, సమాఖ్య మొదలగు ప్రభుత్వాలు.
  6. ప్రభుత్వంలో కొద్దిమంది మాత్రమే సభ్యులు. సభ్యత్వం తప్పనిసరి కాదు.
  7. ప్రభుత్వము ఒక స్పష్టమైన రూపంలో కనిపిస్తుంది.
  8. ప్రభుత్వం నిర్దిష్ట ప్రదేశం లేకుండా పనిచేస్తుంది. అది ఎక్కడినుండైనా పనిచేస్తుంది.
  9. ప్రజలు తమకు నచ్చని ప్రభుత్వాన్ని ప్రతిఘటించ గలరు. న్యాయస్థానాల ద్వారా కూడా వ్యతిరేకించగలరు.
  10. ప్రభుత్వానికి రాజ్యాంగము ఇచ్చే అధికారాలే ఉంటాయి.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాజ్యానికి గల ఏవైనా రెండు నిర్వచనాలను ఉదహరించండి.
జవాబు:
‘రాజ్యం’ అనే పదాన్ని అనేకమంది రాజనీతిశాస్త్ర పండితులు అనేక రకాలుగా నిర్వచించారు. వారిలో కొందరు ఇచ్చిన నిర్వచనాలను కింది విధంగా పేర్కొనడమైంది.

  1. అరిస్టాటిల్: “మానవునికి సుఖప్రదమైన, గౌరవప్రదమైన జీవనాన్ని ప్రసాదించడమే లక్ష్యంగా కలిగిన కుటుంబాలు, గ్రామాల సముదాయమే రాజ్యం”.
  2. బ్లంటి: “ఒక నిర్ణీత ప్రదేశంలో నివసిస్తూ రాజకీయంగా వ్యవస్థీకృతమైన ప్రజల సముదాయమే రాజ్యం”.

AP Inter 1st Year Civics Study Material Chapter 2 రాజ్యం

ప్రశ్న 2.
రాజ్యానికి ఎన్ని మౌలిక లక్షణాలుంటాయి? అవి ఏవి?
జవాబు:
రాజ్యానికి నాలుగు మౌలిక లక్షణాలుంటాయి. అవి:

  1. ప్రజలు
  2. ప్రదేశం
  3. ప్రభుత్వం
  4. సార్వభౌమాధికారం.

ప్రశ్న 3.
ప్రభుత్వం అంటే ‘ఏమిటి ?
జవాబు:
రాజ్యం యొక్క ఆశయాలను, లక్ష్యాలను నెరవేర్చే సాధనమే ప్రభుత్వం. ప్రభుత్వం మూడు అంగాలను కలిగి ఉంటుంది. అవి: 1) శాసనశాఖ 2) కార్యనిర్వాహక శాఖ 3) న్యాయ శాఖ.

ప్రశ్న 4.
రాజ్యానికి గల ఇతర లక్షణాలు ఎన్ని? వాటిని తెలపండి.
జవాబు:
ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం, సార్వభౌమాధికారంతోపాటు రాజ్యానికి నాలుగు ఇతర లక్షణాలు కూడా ఉంటాయి. అవి:

  1. అంతర్జాతీయ గుర్తింపు,
  2. శాశ్వతత్వం,
  3. సాధారణ విధేయత,
  4. ప్రజాభీష్టం.

ప్రశ్న 5.
“సమాజం” అంటే ఏమిటి ?
జవాబు:
సమాజం ప్రాచీనమైనది. రాజ్యం కంటే ముందు ఏర్పడినది. మానవుడు సంఘజీవి. సమాజంలో మాత్రమే వ్యక్తి సంపూర్ణ వికాసాన్ని, సుఖవంతమైన జీవితాన్ని గడపగలడు. “సమిష్టి జీవనాన్ని గడుపుతున్న మానవ సముదాయమే” సమాజము. సమాజంలో సభ్యత్వం లేని మానవుడిని ఊహించలేము. వలలాగా అల్లబడిన వివిధ రకాల మానవ సంబంధాలను ‘సమాజం’ అని చెప్పవచ్చు. అయితే రాజ్యంలాగా సార్వభౌమాధికారము, దండనాధికారం ఉండదు. సాంఘిక ఆచార సంప్రదాయాల ఆధారముగా శిక్షలు ఉంటాయి.

ప్రశ్న 6.
“సంస్థ” అంటే ఏమిటి ? [Mar. 2017]
జవాబు:
“ఒక లక్ష్యసిద్ధికి గాని, కొన్ని ఆశయాల సాధనకు గాని నిర్ణీత పద్ధతిలో ఐక్యతతో కృషి చేయుటకు ఏర్పడిన వ్యక్తుల సముదాయమే సంస్థ. మానవుడు కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి వివిధ రకాలైన సంస్థలను నిర్మించుకొన్నాడు. ఉదా: మత సంస్థలు, రాజకీయ సంస్థలు, ఆర్థిక సంస్థలు, సాంఘిక సంస్థలు, సాంస్కృతిక సంస్థలు మొ||నవి.

ప్రశ్న 7.
రాజ్యంలోని జనాభా గుణాత్మక ధృక్పధాన్ని వ్రాయండి.
జవాబు:
రాజ్యం జనాభా గుణాత్మకంగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొంది. ఒక రాజ్యం ఎటువంటి స్వభావంగల ప్రజలను కలిగి ఉంటుంది ? అక్కడి ప్రజలు విద్యావంతులు, అక్షరాస్యులు సాంస్కృతికంగా పురోగతి సాధించినవారై ఉంటారా ? అనే అంశాలకు ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ సందర్భంలో ఉత్తమ పౌరులు, ఉత్తమ రాజ్య రూపకల్పనకు దోహదకారిగా ఉంటారని అరిస్టాటిల్ చెప్పాడు. అందుచేత రాజ్యానికి సంబంధించిన ప్రజల స్వభావం, సంస్కృతి, అంకిత భావాలు ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి. అట్లాగే ప్రజల క్రమశిక్షణ, కష్టించి పనిచేసే గుణం, నిజాయితీ, వివేకం వంటి గుణాలను కలిగి ఉన్నట్లయితే, ఆ రాజ్యం శీఘ్రగతిన ప్రగతిని సాధించగలుగుతుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 2 రాజ్యం

ప్రశ్న 8.
రాజ్యానికి అంతర్జాతీయ గుర్తింపు అవసరమా ?
జవాబు:
అంతర్జాతీయ గుర్తింపు (International Recognition): అంతర్జాతీయ గుర్తింపు అంటే ఒక రాజ్య ఉనికిని, ప్రభుత్వాన్ని ప్రపంచంలోని ఇతర రాజ్యాలు గుర్తించడం. ఆధునిక యుగంలో ప్రపంచ రాజ్యాల మధ్య సంబంధాలు పెరగడంతో అనేక అంతర్జాతీయ సంస్థలు ఏర్పడ్డాయి. కొంతమంది రాజనీతి పండితుల అభిప్రాయంలో అంతర్జాతీయ గుర్తింపు కూడా రాజ్య మౌలిక లక్షణంగా పరిగణించడమైంది.

ప్రపంచంలోని ప్రతి రాజ్యం ఇతర సార్వభౌమ రాజ్యాల చేత గుర్తింపు పొందాలి. ఐక్యరాజ్యసమితి వంటి కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఆ రకమైన గుర్తింపును ఇస్తున్నాయి. ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వమున్నదంటే ఆ రాజ్యానికి చెందిన సార్వభౌమాధికారం గుర్తించబడినట్లుగా భావించవచ్చు. ఒక కొత్త రాజ్యం ఆవిర్భవించినప్పుడు, అది మిగతా ప్రపంచ రాజ్యాలతో పాటు ఐక్యరాజ్యసమితి చేత గుర్తించబడటం అత్యంత ఆవశ్యకం.

అంతర్జాతీయ గుర్తింపు అనే లక్షణం రాజకీయ దృక్కోణంతో కూడుకొని ఉంది. 1945లో ఐక్యరాజ్యసమితి ఏర్పడకముందు నుంచే చైనా ఒక సమగ్రమైన రాజ్యం. 1949 నాటికి చైనా కమ్యూనిస్టుల వశమైంది. ప్రచ్ఛన్న యుద్ధ ప్రభావం వల్ల చైనా ఒక సార్వభౌమ రాజ్యంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల చేత గుర్తించబడలేదు. చైనా-అమెరికాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధ ఛాయలు తొలగిన తరువాత 1970వ దశకంలో ఐక్యరాజ్యసమితి చైనాను ఒక సార్వభౌమరాజ్యంగా గుర్తించింది.

ప్రశ్న 9.
రాజ్యానికి గల నాలుగు ఇతర లక్షణాల పేర్లను రాయండి.
జవాబు:

  1. ప్రజలు
  2. ప్రదేశ
  3. ప్రభుత్వం
  4. సార్వభౌమాధికారం.

ప్రశ్న 10.
రాజ్యం, సమాజం మధ్యగల ఏవైనా రెండు వ్యత్యాసాలను పేర్కొనండి. [Mar. ’16]
జవాబు:
రాజ్యం (State)

  1. రాజ్యం అనేది రాజకీయ సంస్థ.
  2. రాజ్యం వ్యక్తుల బాహ్య ప్రవర్తనను మాత్రమే నియంత్రిస్తుంది. ఈ విషయంలో అది కొన్ని నిబంధనలను రూపొందిస్తుంది.

సమాజం (Society)

  1. సమాజం అనేది సాంఘిక వ్యవస్థ.
  2. సమాజం మానవుల బాహ్య, అంతర్గత ప్రవర్తనలు రెండింటిని నియంత్రిస్తుంది. వ్యక్తుల సామాజిక జీవనాన్ని ఇది క్రమబద్ధం చేస్తుంది.

ప్రశ్న 11.
రాజ్యం, ప్రభుత్వం మధ్యగల ఏవైనా రెండు వ్యత్యాసాలను వ్రాయండి.
జవాబు:
రాజ్యం

  1. రాజ్యం శాశ్వతమైన రాజకీయ సంస్థ. మానవ సమాజం ఉన్నంతకాలం అది ఉంటుంది.
  2. రాజ్యమునకు 5 లక్షణాలుంటాయి. ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం, సార్వభౌమాధికారం, అంతర్జాతీయ గుర్తింపు దాని లక్షణాలు.

ప్రభుత్వం

  1. ప్రభుత్వం ఎన్నికల వలన గానీ, విప్లవాల వలన గానీ మారవచ్చు.’ అందువలన అది శాశ్వత మైనది కాదు.
  2. ప్రభుత్వం, రాజ్య లక్షణాలలో ఒకటి మాత్రమే. అది రాజ్య ప్రతినిధి, ఒక భాగము.

ప్రశ్న 12.
ప్రభుత్వ అంగాలు ఎన్ని ? వాటి విధులను క్లుప్తంగా వివరించండి.
జవాబు:
ప్రభుత్వంలో మూడు అంగాలుంటాయి. అవి:

  1. శాసనశాఖ: ఇది పరిపాలనకు కావలసిన శాసనాలను రూపొందిస్తుంది.
  2. కార్యనిర్వాహకశాఖ: ఇది శాసనాలను అమలుచేస్తుంది.
  3. న్యాయశాఖ: ఇది శాసనాలను వ్యాఖ్యానించి అవి న్యాయబద్ధంగా ఉన్నాయో లేదో చెబుతుంది. ప్రజలకు న్యాయం చేస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 2 రాజ్యం

ప్రశ్న 13.
రాజ్యం, సంస్థల మధ్యగల ఏవైనా రెండు వ్యత్యాసాలను పేర్కొనండి. [Mar. ’18]
జవాబు:
రాజ్యం (State)

  1. రాజ్యం సభ్యత్వం నిర్బంధమైంది.
  2. రాజ్యం శాశ్వతమైంది.

సంఘాలు (Associations)

  1. సంఘంలో సభ్యత్వం ఐచ్ఛికమైంది.
  2. సంఘాలు శాశ్వతమైనవిగానూ, తాత్కాలికం గానూ ఉంటాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 10th Lesson భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు Textbook Questions and Answers.

AP Inter 2nd Year Civics Study Material 10th Lesson భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశంలో పంచాయతీరాజ్ సంస్థల విధులను వివరించండి.
జవాబు:
ప్రస్తుతం భారతదేశంలో పంచాయతీరాజ్ సంస్థలు భారత రాజ్యాంగం 73వ సవరణ చట్టం, 1992 ప్రకారం ఏర్పాటయ్యాయి. సాధారణంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో (జనాభా ఇరవై లక్షల కంటే తక్కువ కాకుండా) గ్రామీణ ప్రాంతాలలో ప్రతి జిల్లాలో మూడంచెల సంస్థలు ఏర్పాటయ్యాయి. అవి.
విధులు.

  1. గ్రామ పంచాయతీలు
  2. మధ్యస్థాయి సంస్థలు (మండల పరిషత్తు)
  3. జిల్లాస్థాయి (జిల్లా పరిషత్తు)

1) గ్రామ పంచాయతీ విధులు: గ్రామపంచాయతీ విధులు రెండు రకాలు: i) ఆవశ్యక విధులు ii) వివేచనాత్మక
i) ఆవశ్యక విధులు: ఆవశ్యక విధులను గ్రామపంచాయతీ తప్పనిసరిగా నిర్వహించవలసి ఉంటుంది. అలాంటి వాటిలో క్రింద పేర్కొన్నవి ఉంటాయి.

  1. రహదార్లను నిర్మించడం, మరమ్మత్తులు చేయించడం, నిర్వహించడం.
  2. శ్మశానవాటికలను నిర్మించడం, నిర్వహించడం..
  3. విద్యుత్ స్థంభాలను ఏర్పరచడం, విద్యుత్ సౌకర్యాలను అందించడం.
  4. జనన, మరణాల రిజిస్టర్లను నిర్వహించడం.
  5. అంటురోగాల బారి నుంచి ప్రజలను కాపాడటానికి వారికి తగిన టీకాలను వేయించడం.
  6. త్రాగునీటి సౌకర్యాలను సమకూర్చడం.
  7. కాలిబాటలు, చిన్నవంతెనలు, పబ్లిక్ పార్క్లు, క్రీడాస్థలాలను నిర్మించడం, మరమ్మత్తులు చేయించి నిర్వహించడం.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

ii) వివేచనాత్మక విధులు:
గ్రామపంచాయతి వివేచనాత్మక లేదా ఐచ్ఛిక విధులను ఆర్థిక వనరుల లభ్యతమేరకు నిర్వహిస్తుంది. వాటిలో క్రిందివి ఉంటాయి.

  1. విశ్రాంతి గృహాల నిర్మాణం, నిర్వహణ.
  2. ప్రాథమిక పాఠశాలలు, ఆరోగ్యకేంద్రాలు, గ్రంథాలయాలు, పఠన మందిరాల నిర్మాణం.
  3. మాత, శిశు సంక్షేమ కేంద్రాల నిర్మాణం, నిర్వహణ.
  4. సమాజాభివృద్ధి పథకాల అమలులో స్వచ్చంద శ్రామిక శిబిరాల నిర్వహణ.
  5. ఆధునిక సేద్య పద్ధతుల ప్రచారం.
  6. భూసంస్కరణల అమలు..

2) మధ్యస్థాయి సంస్థలు (మండల పరిషత్తు) విధులు:
మండల పరిషత్తు మండల పరిధిలో క్రింద పేర్కొన్న విధులను నిర్వహిస్తుంది.

  1. సమాజాభివృద్ధి పథకాల అమలుకు అవసరమైన చర్యలు తీసుకుంటుంది.
  2. వైద్యశాలలు, త్రాగునీరు, టీకాలు, పొగరాని పొయ్యలు వంటి సదుపాయాల కల్పనకు తగిన కార్యక్రమాలు చేపడుతుంది.
  3. సామాజిక విద్య, కమ్యూనికేషన్లు, సహకారం, కుటీరపరిశ్రమలు, మహిళాభివృద్ధి, సాంఘిక సంక్షేమం వంటి అనేక కార్యక్రమాల అమలుకు సంబంధించిన వ్యవహారాలను సమీక్షిస్తుంది.
  4. వ్యవసాయరంగంలో అధికోత్పత్తిని సాధించడానికి మేలు రకమైన ఎరువులు, క్రిమిసంహారకమందులు, అధునాతన వ్యవసాయ పరికరాలను వినియోగించుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటుంది.
  5. పశు సంపద అభివృద్ధి కోసం పశుగ్రాసాన్ని అందించడం కృత్రిమ వీర్యకేంద్రాలు, పశుగ్రాస క్షేత్రాల నిర్వహణ వంటి వివిధ కార్యక్రమాలను అమలుచేస్తుంది.

3) జిల్లా పరిషత్తు విధులు:
జిల్లా పరిషత్తు క్రింద పేర్కొన్న విధులను నిర్వహిస్తుంది.

  1. జిల్లాలోని మండల పరిషత్తుల వార్షిక బడ్జెట్లను ఆమోదిస్తుంది.
  2. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మండలాల అభివృద్ధి కోసం మంజూరు చేసిన సహాయక గ్రాంట్లను మండల పరిషత్తులకు కేటాయిస్తుంది.
  3. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణాభివృద్ధి కోసం ఇచ్చే ఆదేశాలను అమలుచేస్తుంది.
  4. వివిధ మండల పరిషత్తుల కార్యకలాపాలను సమన్వయపరిచి, పర్యవేక్షిస్తుంది.
  5. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా గణాంక సర్వేలను నిర్వహిస్తుంది.
  6. జిల్లాలోని సెకండరీ స్కూళ్ళను నిర్వహిస్తుంది.
  7. మండల పరిషత్తులు, గ్రామపంచాయతీల ఆర్థిక పరిపుష్టికి అవసరమైన సూచనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతుంది.

ప్రశ్న 2.
భారతదేశంలో వివిధ రకాల పట్టణ స్థానిక ప్రభుత్వాలను వర్ణించండి. [Mar. ’17]
జవాబు:
భారతదేశంలో పట్టణ స్థానిక ప్రభుత్వాలు 9 రకాలు. అవి

  1. నగరపాలక సంస్థలు
  2. పురపాలక సంస్థలు
  3. నగర పంచాయతీలు
  4. నోటిఫైడ్ ఏరియా కమిటీలు
  5. టౌన్ ఏరియా కమిటీలు
  6. కంటోన్మెంట్ బోర్డులు
  7. టౌన్ షిప్పులు
  8. పోర్ట్ ట్రస్ట్లు
  9. ప్రత్యేక ప్రయోజిత సంస్థలు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

1) నగరపాలక సంస్థలు:
పట్టణ స్థానిక ప్రభుత్వాలలో నగరపాలక సంస్థలు చాలా ముఖ్యమైనవి. ఇవి అత్యున్నత పట్టణ, స్థానిక సంస్థలుగా అతిపెద్ద నగరాలలో ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం ద్వారా ఈ నగరపాలక సంస్థలను ఏర్పాటుచేస్తుంది. భారతదేశంలో 1687లో మద్రాస్ నగరంలో మొట్టమొదటి నగరపాలక సంస్థ ఏర్పాటైంది. మూడు లక్షల జనాభా కలిగి నాలుగుకోట్ల వార్షికాదాయమున్న పట్టణాలను నగరపాలక సంస్థలుగా రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటుచేస్తుంది.

నగర జనాభా ఆధారంగా ఆయా నగర సంస్థలలోని ప్రతినిధుల సంఖ్యను రాష్ట్ర శాసన సభ నిర్ణయిస్తుంది. ప్రతి నగరపాలక సంస్థలో 1) నగరపాలక మండలి, 2) మేయర్, 3) కమీషనర్, 4) స్థాయీ సంఘాలు అనే నాలుగు ప్రధాన అంగాలు ఉంటాయి.

2) పురపాలక సంస్థలు:
ప్రతి పురపాలక సంస్థలో నాలుగు అంగాలు ఉంటాయి. 1) పురపాలక మండలి, 2) పురపాలక చైర్మన్, 3) మున్సిపల్ కమీషనర్, 4) స్థాయీ సంఘాలు. పురపాలక సంస్థ చర్చావేదికయే పురపాలక మండలి. దీనిలో 1) ఎన్నికయ్యే సభ్యులు 2) అనుబంధ సభ్యులు 3) గౌరవ సభ్యులు అనే మూడు రకాల సభ్యులు ఉంటారు. పురపాలక సంస్థ పరిధిలోని రిజిష్టర్ ఓటర్లు మొదటి తరహా సభ్యులను ఎన్నుకుంటారు. వీరిని కౌన్సిలర్స్ అంటారు.

3) నగర పంచాయతీలు:
గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయికి పరిణామం చెందే ప్రాంతం లేదా అతిచిన్న పట్టణ ప్రాంతాలలో ఏర్పాటయ్యే స్థానిక సంస్థలను నగర పంచాయతీ అంటారు. దీని కొరకు జనసాంద్రత, స్థానిక సంస్థల ఆదాయం, వ్యవసాయేతర రంగాలలో ఉపాధి అవకాశాలు. ఆ ప్రాంత ఆర్థిక ప్రాధాన్యత మొదలైన ప్రామాణికాల ఆధారంగా నగర పంచాయతీ ఏర్పాటు జరుగుతుంది.

నగర పంచాయితీ సభ్యుల సంఖ్యను ఆ రాష్ట్ర శాసనసభ నిర్ణయిస్తుంది. ఈ సభ్యులు ప్రజలచే వయోజన ఓటుహక్కు ద్వారా ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు. దీని కొరకు నగర పంచాయతీని వార్డులుగా విభజించి ప్రతి వార్డు నుండి ఒక ప్రతినిధిని ఎన్నుకునేందుకు అవకాశం కల్పిస్తారు.

4) నోటిఫైడ్ ఏరియా కమిటీలు:
శీఘ్రగతిన అభివృద్ధి పథంలో పురోగమించే పట్టణాలలో లేదా పురపాలక సంస్థల ఏర్పాటుకు అనుకూలంగాలేని పరిస్థితులలో ఈ కమిటీ ఏర్పాటవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రకటన ద్వారా ఈ కమిటీ ఏర్పడటంతో దీనిని నోటిఫైడ్ ఏరియా కమిటీగా వ్యవహరించడమైంది. దీనికి చట్టబద్ధమైన హోదా ఉండదు. దీనిలో ఒక చైర్మన్, కొందరు సభ్యులు ఉంటారు. వారిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది.

5) టౌన్ ఏరియా కమిటీలు:
రాష్ట్ర శాసనసభ ఆమోదించే ప్రత్యేక చట్టం ద్వారా టౌన్ ఏరియా కమిటీ ఏర్పాటవుతుంది. చిన్న పట్టణాల అవసరాలను తీర్చడానికి ఈ కమిటీలు అవసరమవుతాయి. అవి పరిమితమైన విధులను మాత్రమే నిర్వహిస్తుంటాయి. వీధిదీపాలను అమర్చడం, డ్రైనేజీ సౌకర్యాల కల్పన వంటి విధులను అవి నిర్వహిస్తాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

6) కంటోన్మెంట్ బోర్డులు:
భారతదేశంలో ప్రస్తుతం మూడు రకాల కంటోన్మెంట్ బోర్డులున్నాయి. అవి దేశరక్షణ మంత్రిత్వశాఖ ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా ఏర్పాటై కొనసాగుతున్నాయి. ప్రతి కంటోన్మెంట్ బోర్డులో కొందరు ఎన్నుకోబడినవారు సభ్యులుకాగా, కొందరు కేంద్ర ప్రభుత్వంతో నామినేట్ చేయబడినవారు, మరికొందరు పదవిరీత్యా సభ్యులుగా ఉంటారు. ప్రతి కంటోన్మెంట్ బోర్డులో ఒక జనరల్ ఆఫీసర్ – ఆఫ్- కంమాండర్ (GOC – General Officer of Commander) ఉంటాడు.

7) టౌన్ షిప్ లు:
టౌన్షిప్లు అనేవి ప్రభుత్వరంగ సంస్థలలో ఏర్పాటవుతాయి. ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేసే సిబ్బందికి మౌలిక సదుపాయాలను కల్పించడానికి అవి కృషిచేస్తాయి. వాటిలో ఎన్నుకోబడే సభ్యులు ఎవరూ ఉండరు. ప్రతి టౌన్షిప్కు ఒక టౌన్ పరిపాలన అధికారి ఉంటాడు. అతడిని కేంద్రప్రభుత్వంలోని సంబంధిత మంత్రిత్వశాఖ నియమిస్తుంది. టౌన్ షిప్ సేవలు సామాన్య ప్రజలకు కాకుండా అందులో పనిచేసే వారికే లభ్యమవుతాయి.

8) పోర్ట్ ట్రస్ట్:
దేశంలో సముద్రతీరంలో ఓడరేవులు ఉన్న ప్రాంతాలలో పోర్ట్ ట్రస్ట్లు ఏర్పాటవుతాయి. అలాగే నౌకాశ్రయాలలో పనిచేసే సిబ్బందికి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తాయి. అవి నౌకాశ్రయాలలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి కృషిచేస్తాయి. కేంద్రప్రభుత్వం అందుకోసం కొన్ని కమిటీలను నియమిస్తుంది. ఆ కమిటీల సభ్యులలో కొందరు ఎన్నుకోబడగా, మరికొందరు నామినేట్ అవుతారు.

9) ప్రత్యేక ప్రయోజిత సంస్థలు:
పట్టణ ప్రాంతాలలో నివసించే ప్రజలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి ఈ రకమైన సంస్థలు పనిచేస్తుంటాయి. పురపాలక సంఘాలు. ఇతర నోటిఫైడ్ ప్రాంతాలలో నివసించే ప్రజల ప్రత్యేక అవసరాలను తీర్చడానికి అవి కృషిచేస్తాయి. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ప్రత్యేక చట్టాల ప్రకారం వాటిని స్థాపించడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం ప్రత్యేకంగా జారీచేసే ఆజ్ఞల ద్వారా అవి ఏర్పడతాయి.

ప్రశ్న 3.
భారత రాజ్యాంగం 73వ సవరణ చట్టాన్ని గురించి క్లుప్తంగా వివరించండి.
జవాబు:
భారతదేశంలో పంచాయతీరాజ్ సంస్థలను సమర్థవంతమైనవిగా తీర్చిదిద్దడానికి ఏకీకృత చట్టం అవసరమని కేంద్ర, రాష్ట్రాల సంబంధాలపై నియమించిన సర్కారియా కమీషన్ సూచించింది. పర్యవసానంగా రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం 1988లో పి.కే. తుంగన్ ఆధ్వర్యంలో పార్లమెంటరీ ఉపసంఘాన్ని నియమించింది. జిల్లా కమిటీల ఏర్పాటుకు అవసరమైన ఆదర్శవంతమైన పరిపాలన, రాజకీయ యంత్రాంగాన్ని సూచించవలసిందిగా ఆ ఉపసంఘాన్ని కేంద్ర ప్రభుత్వం కోరింది. రెండేళ్ళ తరువాత 1991 జూన్లో శ్రీ పి.వి. నరసింహారావు ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన కేంద్రప్రభుత్వం పంచాయితీరాజ్ సంస్థలకు వెంటనే రాజ్యాంగ ప్రతివృత్తిని కల్పించవలసిన విషయాన్ని గుర్తించింది. 1991 సెప్టెంబర్ లో అందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రతిపాదించింది. తరువాత ఆ బిల్లు సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సమర్పించడమైంది. పార్లమెంటు ఆ కమిటీ సమర్పించిన నివేదికను ఆమోదించింది. ఆ బిల్లుపై రాష్ట్ర శాసనసభల ఆమోదం కోసం పంపడమైంది. మెజారిటీ రాష్ట్ర శాసనసభలు ఆ బిల్లుపట్ల తమ సమ్మతిని తెలిపాయి. దాంతో ఆ బిల్లును రాజ్యాంగం (73వ సవరణ) చట్టం, 1992గా పిలవడం జరిగింది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

ప్రధాన అంశాలు: రాజ్యాంగం (73వ సవరణ) చట్టం 1992లో క్రింది ముఖ్యాంశాలు ఉన్నాయి.
1. ఆ చట్టం నూతనంగా జిల్లా, గ్రామసభ, పంచాయితీ, గ్రామం అనే నూతన పదాలను చేర్చింది

2. ప్రతి గ్రామానికి ఒక గ్రామ సభను ఏర్పాటుచేసింది. ఆ గ్రామసభ గ్రామ స్థాయిలో శాసన నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తుంది.

3. ప్రతి రాష్ట్రప్రభుత్వం పంచాయతీరాజ్ యొక్క మూడంచెల విధానాన్ని ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఉదా: గ్రామ, మాధ్యమిక, జిల్లా స్థాయిలలో పంచాయతీలు

4. ప్రతి రాష్ట్ర శాసనసభ తప్పనిసరిగా పంచాయతీల నిర్మాణానికి సంబంధించిన చట్టాలను రూపొందించాలి. ప్రాదేశిక నియోజకవర్గాల ప్రాతిపదికపై పంచాయతీలకు ప్రత్యక్ష ఎన్నికలను నిర్వహించాలి. పంచాయతీల అధ్యక్షులకు, ఇతర సభ్యులకు, (వారు ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో ఎన్నుకోబడినప్పటికీ) తీర్మానాలపై ఓటుచేసే హక్కు ఉంటుంది.

5. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు పంచాయతీలలో రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. అలాగే మొత్తం సీట్లలో 1/3వ వంతుకు మించకుండా మహిళలకు రిజర్వేషన్ కేటాయించడమైంది. (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) ప్రభుత్వ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు పెంచడం జరిగింది.)

6. పంచాయతీల కాలపరిమితి అయిదేళ్ళు. ఆ గడుపు ముందే కొత్తగా ఎన్నికలు జరిపించుకోవచ్చు. కాలపరిమితికి ముందే అవి ఒకవేళ రద్దయితే వాటికి ఎన్నికలను నిర్వహించవలసి ఉంటుంది.

7. స్థానిక సంస్థలకు పోటీచేసే అభ్యర్థుల అర్హతలు, అనర్హతలను ఎదుర్కొనడమైంది.

8. ఈ చట్టం స్థానిక సంస్థలకు ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసింది.

9. పంచాయితీల ఖాతాలు, వ్యయాలపై తనిఖీ జరపడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది.

10. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న ఎన్నికల సంఘం ఏర్పాటవుతుంది.

ప్రశ్న 4.
భారత రాజ్యాంగం 74వ సవరణ చట్టాన్ని గురించి క్లుప్తంగా వివరించండి.
జవాబు:
74వ రాజ్యాంగ సవరణ చట్టం: రాజ్యాంగం 74వ సవరణ చట్టం, 1993ను భారత పార్లమెంటు 1992. డిసెంబర్ లో ఆమోదించింది. దానికి 1993, ఏప్రిల్ 20వ తేదీన రాష్ట్రపతి ఆమోదం లభించింది. భారతదేశంలో పట్టణస్థానిక ప్రభుత్వాలను పటిష్టపరచడంలో ఆ చట్టం అత్యంత ముఖ్యమైందిగాను, ప్రగతిశీలమైనదిగానూ వర్ణించడం జరిగింది. భారతదేశంలో పట్టణ స్థానిక ప్రభుత్వాలు సమర్థవంతంగా కార్యకలాపాలను నిర్వహించడానికి ఆ చట్టం ఒక ఉమ్మడి విధివిధానాలను రూపొందించింది. అంతకు పూర్వం ఆ చట్టాన్ని రూపొందించడానికి విశేషమైన కృషి జరిగింది. తొలుత పార్లమెంటు ఆ చట్టానికి సంబంధించిన బిల్లును 1989లో రాజ్యాంగం (65వ సవరణ) బిల్లుగా ప్రతిపాదించడం జరిగింది. అయితే లోక్సభ అర్ధంతర రద్దు కారణంగా ఆ బిల్లు పార్లమెంటు ఆమోదానికి నోచుకోలేదు.

తరువాత ఆ బిల్లులో కొన్ని సవరణలు చేసి, 1991, సెప్టెంబర్ 16వ తేదీన లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. దరిమిలా పార్లమెంటు ఉభయసభలు ఆ బిల్లును కూలంకషంగా పరిశీలించి, 1992 డిసెంబర్లో ఆమోదించాయి. చివరికి రాష్ట్రపతి ఆమోదం తరవాత ఆ బిల్లు చట్టంగా రూపొంది 1993, జూన్ 1వ తేదీన అమల్లోకి వచ్చింది. . ముఖ్యాంశాలు:
1. ఈ చట్టం పట్టణ స్థానిక సంస్థలకు మొట్టమొదటిసారిగా రాజ్యాంగపరమైన గుర్తింపునిచ్చింది. రాజ్యాంగంలో 9(ఎ) అనే భాగాన్ని అదనంగా చేర్చింది.

2. రాజ్యాంగంలో పన్నెండో షెడ్యూల్ను ప్రవేశపెట్టింది.

3. పట్టణ స్థానిక సంస్థలకు 18 అంశాలపై తీర్మానాలను రూపొందించుకొని అమలులో ఉంచుకోవడానికి అధికారాన్నిచ్చింది.

4. పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన వివిధ పదాలను నిర్వచించింది. జనాభా పదిలక్షలు లేదా అంతకుమించి ఉంటే పట్టణ ప్రాంతాన్ని మహానగర ప్రాంతం (మెట్రోపాలిటన్ ఏరియా) గా ప్రకటించింది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

5. నగరపాలకసంస్థ, మున్సిపల్ కౌన్సిల్, నగర పంచాయతీ వంటి అనేక సంస్థల నిర్మాణానికి ఈ సవరణ వీలు కల్పించింది. నగరపాలక సంస్థ అనేది విస్తృతమైన పట్టణ ప్రాంతాలను వర్తిస్తుంది. పట్టణ స్థానిక సంస్థల పేర్లను ఖరారు చేయడానికి, వాటి భౌగోళిక సరిహద్దులను స్పష్టంగా గుర్తించడానికి ఈ చట్టం రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇచ్చింది.

6. పురపాలక సంస్థ నిర్మాణాన్ని ఈ చట్టం ప్రత్యేకంగా గుర్తించింది. పురపాలక సంస్థ పరిధిలోని విధానసభ సభ్యులు, లోక్సభ సభ్యులు పురపాలక సంస్థల కౌన్సిళ్ళు సమావేశంలో పదవి రీత్యా సభ్యుల హోదాలో పాల్గొంటారని స్పష్టం చేసింది. అంతేకాకుండా పురపాలక సంస్థ సమావేశాలలో రాష్ట్ర విధానపరిషత్తు లేదా రాజ్యసభ సభ్యులు పాల్గొనడానికి అర్హులని ప్రకటించింది.

7. జనాభా మూడులక్షల లేదా అంతకుమించి ఉన్న పురసాలక సంస్థలలో వార్డ్ కమిటీల ఏర్పాటుకు అవకాశం ఇచ్చింది. అలాంటి వార్డు కమిటీల ఏర్పాటు విషయంలో శాసనాలను రూపొందించే అధికారాన్ని రాష్ట్ర శాసనసభలకు అప్పగించింది.

8. పట్టణ స్థానిక సంస్థలలో కొన్ని స్థానాలను షెడ్యూల్డ్ కులాలు, తెగలకు వారి జానాభా నిష్పత్తికి అనుగుణంగా కేటాయించడం జరుగుతుందని పేర్కొంది. అంతేకాకుండా ఆ సంస్థలలో మూడోవంతు స్థానాలు మహిళలకు, మహిళా అధ్యక్ష పదవులకు రొటేషన్ పద్ధతిలో కేటాయించునట్లు ప్రకటించింది.

ప్రశ్న 5.
జిల్లా కలెక్టర్ అధికారాలు, విధులను అంచనా వేయండి. [Mar. ’16]
జవాబు:
జిల్లా పరిపాలనలో కలెక్టర్ కీలకపాత్ర వహిస్తాడు. అతడు జిల్లా పరిపాలన అధిపతిగా వ్యవహరిస్తాడు. జిల్లాస్థాయిలో వివిధ పాలనా విధానాల రూపకల్పన, అమలులో ప్రత్యక్ష ప్రమేయం కలిగి ఉంటాడు. జిల్లా ప్రజల సత్వర వికాసానికి అవసరమయ్యే విధి విధానాలను రూపొందించి, అమలు చేయడంలో కలెక్టర్కు కీలకపాత్ర ఉంటుంది. అతడి అధికారాలు విధుల నిర్వహణలో అనేకమంది అధికారులు సహాయపడతారు.

భారతదేశంలో జిల్లా కలెక్టర్ పదవిని 1722లో మొదటిసారిగా తూర్పు ఇండియా కంపెనీ ప్రవేశపెట్టింది. కాలంలో ప్రజల వద్ద నుంచి భూమిశిస్తు వసూలుచేసే ఉద్దేశంతో ఆ పదవిని ఏర్పాటుచేసింది. అప్పటి నుంచి ఆ పదవిని నిర్వహించే వ్యక్తుల అధికారాలు, విధులలో విశేషమైన మార్పులు చోటుచేసుకున్నాయి. క్రమేణా తూర్పు ఇండియా కంపెనీ, తరువాత బ్రిటిష్ ప్రభుత్వం జిల్లా కలెక్టర్ అధికార విధులను గణనీయంగా పెంచుతూ వచ్చాయి. వర్తమాన కాలంలో భారతదేశంలో జిల్లా కలెక్టర్గా నియమితులయ్యేవారు ప్రతిష్టాత్మకమైన ఐ.ఏ.ఎస్. హోదా కలిగి ఉంటున్నారు. జిల్లా కలెక్టర్ను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది.

జిల్లా కలెక్టర్ అధికారాలు – విధులు: జిల్లా పాలన అధిపతిగా – కలెక్టర్కు విశేష అధికారాలు, విస్తృత విధులు ఉంటాయి. వాటిని క్రింది విధంగా వివరించడమైంది.
1) కలెక్టర్ – ప్రధాన రెవిన్యూ అధికారి: జిల్లాలో కలెక్టర్ ప్రధాన రెవిన్యూ అధికారిగా వ్యవహరిస్తాడు. ఆ హోదాలో అతడు జిల్లాలోని రైతులకు మార్గదర్శిగా ఉంటాడు. జిల్లాలోని గ్రామాలలో భూమిశిస్తు, జమాబందీ లెక్కలకు ఆధ్వర్యం వహిస్తాడు. భూమిశిస్తు వసూళ్ళు, రైతులకు రుణాల మంజూరు, ప్రకృతి విపత్తుల సమయంలో రైతులకు పంట నష్టపరిహారాలను చెల్లించడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికార బృందాలకు నష్టపరిహార అంచనా సేకరణ, తయారీలలో సహకరించడం, ప్రభుత్వ భూముల రికార్డులను నిర్వహించడం వంటివి జిల్లా కలెక్టర్కు ఉన్న రెవిన్యూ అధికారాలలో ముఖ్యమైనవి. కలెక్టర్ జిల్లాలో ప్రభుత్వ కోశాగారాల పనితీరును సమీక్షిస్తాడు. పైన పేర్కొన్న విధులన్నీ జిల్లా అభివృద్ధికి సంబంధించినవై ఉంటాయి. అంతేకాకుండా వాటి నిర్వహణలో భౌతిక, ఆర్థిక, మానవ సంబంధమైన వనరుల సమీకరణకు సంబంధం ఉంటుంది.

2) జిల్లా మెజిస్ట్రేట్గా వ్యవహరించడం: కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్ గా వ్యవహరిస్తాడు. జిల్లాలో పనిచేసే పోలీస్ సిబ్బంది వ్యవహారాలపై అతనికి పర్యవేక్షణాధికారం ఉంటుంది. జిల్లాలో శాంతిభద్రతలు సాధారణ స్థాయిలో కొనసాగేటట్లు చూడవలసిందిగా పోలీస్ అధికారులకు సూచిస్తాడు. జిల్లాలో పోలీస్ యంత్రాంగం అంతా కలెక్టర్కు సహాయకారిగా ఉంటుంది. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్, ఇతర అధికారులు కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యవహరిస్తారు. జిల్లాలోని కారాగారాలు, పోలీస్ సిబ్బంది వ్యవహారాలను కలెక్టర్ నిర్ణీత వ్యవధులలో సమీక్షిస్తాడు.

సబార్డినేట్ కోర్టులపై పర్యవేక్షణ, కార్మిక సమస్యల పరిష్కారం, పేలుడు పదార్థాల తయారీ, రవాణాకు అనుమతినివ్వడం, పెట్రోలు బంకులు, సినిమా థియేటర్లు వంటి అధునాతన సౌకర్యాలు కల్పించడానికి అనుమతులు మంజూరుచేయడం వంటి అనేక విధులను కలెక్టర్ నిర్వహిస్తాడు. పైన పేర్కొన్న విధులన్నీ జిల్లా అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాలపై విశేషమైన ప్రభావాన్ని చూపిస్తాయి.

3) ముఖ్య సమన్వయ కర్త: జిల్లాలోని వివిధ ప్రభుత్వశాఖల అధికారుల మధ్య కలెక్టర్ సమన్వయ కర్తగా వ్యవహరిస్తాడు. వ్యవసాయం, నీటిపారుదల, సహకారం, విద్య, పరిశ్రమలు వంటి వివిధ శాఖల అధిపతులతో సమీక్ష సమావేశాలను నిర్వహిస్తాడు. జిల్లాలోని వివిధ శాఖల అధికారుల పనితీరును తెలుసుకుంటాడు. ప్రభుత్వ పథకాల అమలులో వారికి తగిన ఆదేశాలను, సూచనలను ఇస్తాడు. వివిధ శాఖల అధిపతులు విడివిడిగా జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి, అమలు చేసినప్పటికీ, అంతిమంగా వారంతా కలెక్టర్కు జవాబుదారీగా ఉంటూ కలెక్టర్ సూచనల మేరకు వ్యవహరిస్తారు.

4) జిల్లా ముఖ్య ఎన్నికల అధికారి: జిల్లా ముఖ్య ఎన్నికల అధికారిగా కలెక్టర్ వ్యవహరిస్తాడు. భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున జిల్లాలోని వివిధ ప్రాతినిధ్య సంస్థల ప్రతినిధుల ఎన్నికకు అవసరమైన ఏర్పాట్లు చేస్తాడు. ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేటట్లు చూస్తాడు.

ఎన్నికలకు సంబంధించిన వారంతా పార్టీలు అభ్యర్థులు, అధికారులు, నాయకులు, ప్రజలు ఎన్నికల నియమావళిని పాటించేలా చూస్తాడు. జిల్లాలో సహకార బ్యాంకులు, డెయిరీ యూనిట్లు, నీటి వినియోగ కమిటీలు, పాఠశాల నిర్వహణ కమిటీలు మొదలైన వాటికి రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఎన్నికలను నిర్వహిస్తాడు.

5) జనాభా లెక్కల ముఖ్య అధికారి: కలెక్టర్ జిల్లాలో జనాభా లెక్కల ముఖ్య అధికారిగా వ్యవహరిస్తాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదేళ్ళకొకసారి జనాభా లెక్కల సేకరణకోసం పంపించే మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా జనాభా లెక్కల సేకరణకు చర్యలు తీసుకుంటాడు. అలాగే జిల్లాలో పాడిపశువులు, ఫలసాయమిచ్చే వృక్షాలు, పెంపుడు జంతువులకు సంబంధించిన గణాంక సమాచారాన్ని సేకరించడానికి తగిన ఏర్పాట్లు చేస్తాడు. జిల్లాలో నిరుపేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వడం, ఇతర కుటుంబ సంక్షేమ మహిళా సాధికారత వంటి అంశాలకు సంబంధించిన సమాచార సేకరణకు కలెక్టర్ ఏర్పాట్లు చేస్తాడు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

6) స్థానిక సంస్థల సమావేశాలకు శాశ్వత ఆహ్వానితుడు: జిల్లాలోని పంచాయితీరాజ్, పట్టణ పాలిత స్థానికసంస్థల సమావేశాలలో కలెక్టర్ శాశ్వత ఆహ్వానితుని హోదాలో పాల్గొంటాడు. జిల్లాలోని వివిధ స్థానిక సంస్థలకు, కేంద్ర, రాష్ట్రాల మధ్య కలెక్టర్ ప్రధాన సంధానకర్తగా వ్యవహరిస్తాడు. జిల్లా పరిషత్/మండల పరిషత్, సాధారణ/అత్యవసర సమావేశాలకు హాజరై వివిధ అంశాలపై ప్రజా ప్రతినిధులకు, అధికారులకు సలహాలిస్తాడు. జిల్లాలోని స్థానిక సంస్థల వ్యవహారాలు, పనితీరు గురించి రాష్ట్ర ప్రభుత్వానికి నిర్ణీత సమయాలలో విశ్వసనీయ నివేదికలను పంపుతాడు. జిల్లా పరిషత్ ఛైర్మన్పై వచ్చే అవిశ్వాస తీర్మానంపై జిల్లాపరిషత్తు సమావేశాన్ని నిర్వహించి, ఆ తీర్మానంపై ఓటింగ్ నిర్వహించి ఫలితాన్ని ప్రకటిస్తాడు. జిల్లాలో గ్రామీణ/పట్టణ ప్రాంతాలలో కొత్తగా స్థానిక సంస్థల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి తగిన ప్రతిపాదనలు పంపుతాడు.

ఇతర విధులు: జిల్లా కలెక్టర్ క్రింద పేర్కొన్న ఇతర విధులను నిర్వహిస్తాడు.

  1. మాజీ సైనికోద్యోగుల సంక్షేమం.
  2. నీటిపారుదల సౌకర్యాల కల్పన.
  3. ప్రభుత్వకోశాగారాలపై పర్యవేక్షణ.
  4. వివిధ ప్రభుత్వశాఖల మధ్య సమన్వయం చేకూర్చటం.
  5. జూనియర్ అధికారులకు వివిధ అంశాలపై తర్ఫీదు ఇప్పించటం.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల చారిత్రక నేపధ్యాన్ని సంక్షిప్తంగా రాయండి.
జవాబు:
చారిత్రక నేపథ్యం: భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలకు విశేషమైన చారిత్రక ప్రాముఖ్యత ఉంది. ప్రశస్తమైన నాలుగు వేదాలలో మొదటిదైన రుగ్వేదంలో సభ, సమితి అనే రెండు సంస్థల గురించి ప్రస్తావన ఉంది. ఆ రెండు సంస్థలూ, స్థానిక సంస్థలకు ప్రతిరూపాలే. గ్రామస్థాయిలో ఆ రెండూ అనేక పరిపాలన, రాజకీయ విధులను నిర్వర్తించాయి. ప్రాచీన భారతదేశంలో చక్కని సమర్థవంతమైన ప్రభుత్వ వ్యవస్థలు ఏర్పడి, పనిచేశాయి. గ్రామీణ సమాజానికి సంబంధించిన పరిపాలన, న్యాయ వ్యవహారాలను పర్యవేక్షించడానికి అవి కొనసాగాయి. వాటిని గ్రామపంచాయితీలు, కుల పంచాయితీలుగా పరిగణించడం జరిగింది. ఆనాటి పాలకుల మద్దతు లేకపోయినప్పటికీ అవి సమర్థవంతంగా వ్యవహరించాయి. మెగస్తనీస్, కౌటిల్యుడు, ఫాహియాన్ వంటి ప్రసిద్ధ పర్యాటకులు తమ గ్రంథాలలో పైన పేర్కొన్న సంస్థల గురించి ప్రస్తావించారు.

మధ్యయుగంలో దక్షిణ భారతదేశంలో చోళ వంశ రాజుల పరిపాలన కాలంలో గ్రామపంచాయితీలు వికసించాయి. స్థానిక సంస్థలను ఏర్పాటు చేసి పోషించిన వారిలో చోళులకు మంచిపేరు వచ్చింది. అయితే వర్తమాన స్థానిక ప్రభుత్వాల నిర్మాణం, పనితీరుపై బ్రిటీష్ ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారుల పాత్ర విస్మరించలేనిది. బ్రిటిష్ పాలకులు స్వీయ ప్రయోజనాలను పెంపొందించుకొనే లక్ష్యంతో స్థానిక ప్రభుత్వాల అభివృద్ధికి కృషి చేశారు. 1870 నాటి మేయో ప్రభువు, 1882 నాటి రిప్పన్ ప్రభువుల తీర్మానాలు భారతదేశంలో ఈ రకమైన ప్రభుత్వాల పురోగతికి మార్గదర్శకమయ్యాయి. అంతకు పూర్వం 1688లో తూర్పు ఇండియా కంపెనీ భారతదేశంలో మొదటిసారిగా మదరాసు (ప్రస్తుతం చెన్నై) నగరపాలక సంస్థను ఆనాటి బ్రిటిష్ చక్రవర్తి రెండో జార్జి అనుమతితో ఆరంభించింది. 1726 నాటికి మదరాసులో ప్రజల వద్ద నుంచి పన్నులను సేకరించడం, న్యాయపాలన వంటి ప్రధాన విధులను నిర్వహించడానికి కొన్ని మేయర్ కోర్టులు ఏర్పాటయ్యాయి. 1773 నాటి రెగ్యులేటింగ్ చట్టం ద్వారా కలకత్తా (కోల్కతా), మదరాసు (చెన్నై), బొంబాయి (ముంబై) నగరాలలో స్థానిక ప్రభుత్వాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

1935 చట్టం స్థానిక స్వపరిపాలన అనే అంశాన్ని ఆ చట్టం 12వ ప్రవేశ విషయంగా (Entry 12) ప్రకటించింది. భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ చట్టాలను రూపొందించడం ద్వారా గ్రామపంచాయితీల అధికారాలను విశేషంగా పెంచడానికి చర్యలు తీసుకున్నాయి. గ్రామపంచాయతీల ఆధీనంలో క్రిమినల్ న్యాయంతో సహా అనేక అంశాలను చేర్చడం జరిగింది. మహత్మాగాంధీ వంటి ప్రముఖ జాతీయోద్యమ నాయకులు స్థానిక ప్రభుత్వాలను వెంటనే ఏర్పాటు చేయవలసిందిగా బ్రిటీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

1935 భారత ప్రభుత్వ చట్టం స్థానిక ప్రభుత్వాలు సమర్థవంతంగా పనిచేయటానికి వీటి ఏర్పాటు నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది. స్థానిక స్వపరిపాలన రాష్ట్ర ప్రభుత్వ అధికారాలలో 12వ అంశంగా పేర్కొంటారు. వీటి పాలనతో పాటు క్రిమినల్ న్యాయవ్యవస్థలు స్థానిక ప్రభుత్వాల పరిధిలోకి తెచ్చారు. మనదేశ పెద్దలైన మహాత్మాగాంధీలాంటి వారు దీనిని గట్టిగా సమర్థించారు. అయితే రెండవ ప్రపంచయుద్ధం తరువాత తగినంత ప్రగతి స్థానిక ప్రభుత్వాలలో కొనసాగలేదు. మనం ఇప్పుడు స్థానిక ప్రభుత్వాల అధికారాలు, విధులను రెండు భాగాలుగా విభజించి అధ్యయనం చేయవచ్చు. 1) గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు 2) పట్టణ స్థానిక ప్రభుత్వాలు.

ప్రశ్న 2.
స్థానిక ప్రభుత్వాల ప్రయోజనాలను వివరించండి.
జవాబు:
ప్రయోజనాలు: వర్తమాన ప్రజాస్వామ్య రాజ్యాలలో స్థానిక ప్రభుత్వాలు పనిచేస్తుంటాయి. ఆ సంస్థల వల్ల అనేక ప్రయోజనాలు లభించడం వల్ల వాటిని ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ప్రోత్సహిస్తాయి. స్థానిక ప్రభుత్వాల వల్ల క్రింది ప్రయోజనాలు ఉంటాయి.

  1. స్థానిక ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని అట్టడుగు స్థాయిలో పెంపొందించి పటిష్టంగావిస్తాయి. మారుమూల ప్రాంతాల ప్రజలు సైతం స్థానిక రాజకీయ ప్రక్రియలో సమర్థవంతంగా పాల్గొనేటట్లు ప్రోత్సహిస్తాయి.
  2. స్థానిక ప్రభుత్వాలు ప్రజలలో రాజకీయ అవగాహనను, బాధ్యతను పెంపొందిస్తాయి. ఎందుకంటే అవి స్థానిక స్థాయిలో వివిధ రాజకీయ సంస్థల నిర్వహణలో విధానాలపై నిర్ణయం, విధానాల అమలులో ప్రజలకు అవకాశమిస్తాయి.
  3. స్థానిక ప్రభుత్వాలు స్థానిక స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించి ఆ సమస్యలు శీఘ్రంగానూ, సంపూర్ణంగానూ పరిష్కారమయ్యేలా చూస్తాయి.
  4. స్థానికంగా అందుబాటులో ఉండే మానవీయ, భౌతిక వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడంలోనూ, సక్రమంగా నిర్వహించుకోవడంలోనూ స్థానిక ప్రభుత్వాలు దోహదపడతాయి.
  5. స్థానిక ప్రభుత్వాలు పాలనలో పొదుపు పెంచుతాయి.
  6. ఇవి ప్రజలలో స్వేచ్ఛా వాతావరణాన్ని పెంపొందిస్తాయి.
  7. ఇవి స్వయం సహాయ, స్వయం ఆధారిత స్ఫూర్తిని అలవరుస్తాయి.

ప్రశ్న 3.
పంచాయితీ కార్యదర్శి విధులు ఏవి?
జవాబు:
ప్రతి గ్రామ పంచాయితీకి పూర్తి కాల ప్రభుత్వ అధికారిగా కార్యదర్శి వ్యవహరిస్తాడు. ఇతనిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. కార్యదర్శి జీతం ఇతర భత్యాలు ప్రభుత్వనిబంధనల ప్రకారం పంచాయితీ నిధుల నుంచి కేటాయిస్తారు. ఇతను సర్పంచ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేస్తాడు.

పంచాయతీ కార్యదర్శి ఈ క్రింది పేర్కొన్న విధులను నిర్వహిస్తాడు.

  1. పంచాయతీ బడ్జెట్ తయారుచేయడం, వార్షిక పాలనా నివేదికలు తయారుచేయడం.
  2. నెలవారీ, త్రైమాసిక, ఆర్థిక గణాంకాలు తయారుచేయడం.
  3. నగదు పుస్తక నిర్వహణ.
  4. పంచాయతీ రికార్డులను తన ఆధీనంలో భద్రపరుచుట.
  5. పంచాయతీలో ఇతర ఉద్యోగులకు విధులు కేటాయించడం.
  6. గ్రాంటు కోసం ధరఖాస్తుచేయడం, గ్రాంట్ ఇన్ ఎయిడ్ రిజిష్టరు చేయడం.
  7. పంచాయతీలో జరిగే పనులు తనిఖీ, పని ప్రగతిని పరిశీలించడం.
  8. అభివృద్ధి పనులకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించి, పరిశీలించి తగు చర్యలు తీసుకోవడం.

ప్రశ్న 4.
గ్రామ సభ గూర్చి నీకు ఏమి తెలియును?
జవాబు:
ప్రతి గ్రామపంచాయతీలో గ్రామసభ ఏర్పాటవుతుంది. దానిలో గ్రామానికి చెందిన రిజిష్టర్డ్ ఓటర్లు సభ్యులుగా ఉంటారు. అది సంవత్సరానికి కనీసం మూడుసార్లయినా సమావేశమవుతుంది. గ్రామసభ పంచాయతీకి సంబంధించిన వార్షిక పరిపాలన, ఆడిట్ నివేదికలను పరిశీలించి ఆమోదిస్తుంది. వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాను ఖరారు చేస్తుంది. సమాజ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు శ్రీఘ్రగతిన అమలుపరచడానికి, ప్రజల భౌతిక సేవలను స్వచ్ఛందంగా వినియోగించుకోవడానికి తగిన సూచనలిస్తుంది. గ్రామసభలను బీహార్లో పంచాయతీ అని, ఒడిస్సాలో పాలీ సభ అని వ్యవహరిస్తారు. కేంద్రప్రభుత్వం 2009-2010 సంవత్సరాన్ని పంచాయతీరాజ్ సంస్థలను ఏర్పరచి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో గ్రామసభ సంవత్సరంగా ప్రకటించింది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన గ్రామసభలను తప్పనిసరిగా నిర్వహించాలని పేర్కొంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 5.
మండల పరిషత్తు గూర్చి క్లుప్తంగా రాయండి.
జవాబు:
జిల్లాలో మాథ్యమిక స్థాయిలో గల స్థానిక సంస్థయే మండల పరిషత్తు, రాష్ట్ర ప్రభుత్వ చట్టం ద్వారా మండల పరిషత్తు ఏర్పాటవుతుంది. మండల పరిషత్తులను వివిధ రాష్ట్రాలలో వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. ఉదాహరణకు తమిళనాడులో పంచాయతి యూనియన్ కౌన్సిల్, కర్నాటకలో తాలూక అభివృద్ధి బోర్డు, గుజరాత్లో తాలూక పంచాయత్ అని అంటారు. అయినప్పటికీ దీనికి ప్రాచుర్యంలో ఉన్న పేరు పంచాయతీ సమితి.

నిర్మాణం: ప్రతి మండలాన్ని కొన్ని మండల ప్రాదేశిక నియోజకవర్గాలుగా (జనాభా ప్రాతిపదికన) విడదీస్తారు. ఓటర్లు మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులను ఎన్నుకుంటారు. మండల పరిషత్తులో నాలుగు అంగాలుంటాయి. అవి: 1) మండలపరిషత్తు, 2) మండల పరిషత్తు అధ్యక్షుడు 3) మండల పరిషత్తు అభివృద్ధి అధికారి 4) మండల మహాసభ.

ప్రశ్న 6.
జిల్లా పరిషత్తు నిర్మాణం గురించి వివరించండి.
జవాబు:
రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక జిల్లా పరిషత్తు ఉంటుంది. జిల్లా స్థాయిలో అత్యున్నత స్థాయి స్వపరిపాలన సంస్థయే జిల్లా పరిషత్తు, జిల్లా పరిషత్తుకు చట్టబద్ధమైన ప్రతిపత్తి ఉంటుంది.

జిల్లా పరిషత్: జిల్లా పరిషత్తులో ఆరు ప్రధాన అంగాలు ఉంటాయి. అవి:

  1. జిల్లా పరిషత్తు,
  2. ఛైర్మన్,
  3. జిల్లా మహాసభ,
  4. ముఖ్య కార్యనిర్వహణాధికారి,
  5. స్థాయీ సంఘాలు,
  6. జిల్లా కలెక్టర్.

జిల్లా పరిషత్తు అనేది జిల్లా స్థాయిలో శాసన నిర్మాణ అంగంగా వ్యవహరిస్తుంది. దానిలో వివిధ రకాల సభ్యులు ఉంటారు. వారిలో ఎన్నికయినవారు కో-ఆప్టెడ్ చేసుకోబడినవారు, ఎక్స్-అఫీషియో సభ్యులుంటారు. జిల్లా స్థాయి అధికారులైన జిల్లా కలెక్టర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ, జిల్లా గ్రంథాలయ సంస్థలకు చెందిన అధ్యక్షులు శాశ్వత ఆహ్వానితుల హోదాలో జిల్లా పరిషత్తు సమావేశాలలో పాల్గొంటారు. అంతేకాకుండా జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గ సభ్యులు (MLAs) జిల్లా పరిషత్తు సమావేశాలలో పాల్గొంటారు.

ప్రశ్న 7.
భారతదేశంలో వివిధ రకాల పట్టణ స్థానిక సంస్థల గూర్చి చర్చించండి.
జవాబు:
భారతదేశంలో 9 రకాల పట్టణ స్థానిక సంస్థలున్నాయి. అవి

  1. నగరపాలక సంస్థలు,
  2. పురపాలక సంస్థలు
  3. నగర పంచాయతీలు
  4. నోటిఫైడ్ ఏరియా కమిటీలు
  5. టౌన్ ఏరియా కమిటీలు
  6. కంటోన్మెంట్ బోర్డులు
  7. టౌన్ షిప్పులు
  8. పోర్టుట్రస్టులు
  9. ప్రత్యేక ప్రయోజిత సంస్థలు.

1) నగరపాలక సంస్థలు: పట్టణ స్థానిక ప్రభుత్వాలలో నగరపాలక సంస్థలు చాలా ముఖ్యమైనవి. ఇవి అత్యున్నత పట్టణ, స్థానిక సంస్థలుగా అతిపెద్ద నగరాలలో ఏర్పాటుచేస్తారు.

2) పురపాలక సంస్థలు: నగరపాలక సంస్థకు దిగువన, గ్రామపంచాయతీ/నగర పంచాయతీకి ఎగువన గల పట్టణ స్థానిక సంస్థలే పురపాలక సంస్థలు. సాధారణంగా జనాభా 20,001 లేదా అంతకుమించితే లేదా . అరవై లక్షలకు మించిన వార్షికాదాయం ఉంటే పురపాలక సంస్థలుగా ఏర్పాటవుతాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

3) నగర పంచాయతీలు: గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయికి పరిణామం చెందే ప్రాంతం’ లేదా అతిచిన్న పట్టణ ప్రాంతాలలో ఏర్పాటయ్యే స్థానిక సంస్థలను నగర పంచాయతీ అంటారు.

4) నోటిఫైడ్ ఏరియా కమిటీలు: శీఘ్రగతిన అభివృద్ధి పథంలో పురోగమించే పట్టణాలలో లేదా పురపాలక సంస్థల ఏర్పాటుకు అనుకూలంగా లేని పరిస్థితులలో ఈ కమిటీ ఏర్పాటవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రకటన ద్వారా ఈ కమిటీ ఏర్పడడంతో దీనిని నోటిఫైడ్ ఏరియా కమిటీగా వ్యవహరించడమైంది.

5) టౌన్ ఏరియా కమిటీలు: రాష్ట్ర శాసనసభ ఆమోదించే ప్రత్యేక చట్టం ద్వారా టౌన్ ఏరియా కమిటీ ఏర్పాటవుతుంది. చిన్న పట్టణాల అవసరాలను తీర్చడానికి ఈ కమిటీలు అవసరమవుతాయి. అవి పరిమితమైన విధులను మాత్రమే నిర్వహిస్తుంటాయి.

6) కంటోన్మెంట్ బోర్డులు భారతదేశంలో కంటోన్మెంట్ బోర్డులనేవి భారత ప్రభుత్వ కంటోన్మెంట్ చట్టం, 1904 ద్వారా ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం భారతదేశంలో 62 కంటోన్మెంట్ బోర్డులు పనిచేస్తున్నాయి. కంటోన్మెంట్ ప్రాంతాలలో నివసించే పౌరులు, సైనిక సిబ్బంది తాలుకు వ్యక్తుల ప్రయోజనాలను పెంపొందించడానికి అవి కృషి చేస్తున్నాయి.

7) టౌన్షిప్లు: టౌన్షిప్లు అనేవి ప్రభుత్వరంగ సంస్థలలో ఏర్పాటవుతాయి. ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేసే సిబ్బందికి మౌలిక సదుపాయాలను కల్పించడానికి అవి కృషిచేస్తాయి. వాటిలో ఎన్నుకోబడే సభ్యులు ఎవరూ ఉండరు. ప్రతి టౌన్షిప్కు ఒక టౌన్ పరిపాలన అధికారి ఉంటాడు.

8) పోర్ట్ స్ట్లు: దేశంలోని సముద్రతీరంలో ఓడరేవులు ఉన్న ప్రాంతాలలో పోర్ట్ స్ట్లు ఏర్పాటవుతాయి. అలాగే నౌకాశ్రయాలలో పనిచేసే సిబ్బందికి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తాయి.

9) ప్రత్యేక ప్రయోజిత సంస్థలు: పట్టణ ప్రాంతాలలో నివసించే ప్రజలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి ఈ రకమైన సంస్థలు పనిచేస్తుంటాయి. పురపాలక సంఘాలు. ఇతర నోటిఫైడ్ ప్రాంతాలలో నివసించే ప్రజల ప్రత్యేక అవసరాలను తీర్చడానికి అవి కృషిచేస్తాయి. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ప్రత్యేక చట్టాల ప్రకారం వాటిని స్థాపించడం జరుగుతుంది.

ప్రశ్న 8.
మున్సిపాలిటీల గురించి నీకు ఏమి తెలియును?
జవాబు:
నగరపాలక సంస్థకు దిగువన, గ్రామపంచాయతీ / నగర పంచాయితీకి ఎగువన గల పట్టణ స్థానిక సంస్థలే పురపాలక సంస్థలు. సాధారణంగా జనాభా 20,001 లేదా అంతకుమించితే లేదా అరవై లక్షలకు మించిన వార్షికాదాయం ఉంటే పురపాలక సంస్థలుగా ఏర్పాటవుతాయి.

ప్రతి పురపాలక సంస్థలో నాలుగు అంగాలు ఉంటాయి. 1) పురపాలక మండలి, 2) పురపాలక చైర్మన్, 3) మున్సిపల్ కమీషనర్, 4) స్థాయీ సంఘాలు, ఆ నాలుగు రకాల అంగాల గురించి క్రింది విధంగా వివరించవచ్చు.

పురపాలక సంస్థ చర్చావేదికయే పురపాలక మండలి. దీనిలో i) ఎన్నికయ్యే సభ్యులు ii) అనుబంధ సభ్యులు iii) గౌరవ సభ్యులు అనే మూడు రకాల సభ్యులు ఉంటారు. పురపాలక సంస్థ పరిధిలోని రిజిష్టర్డ్ ఓటర్లు మొదటి తరహా సభ్యులను ఎన్నుకుంటారు. వీరిని కౌన్సిలర్స్ అంటారు. అనుబంధ సభ్యులను, ఎన్నికయిన సభ్యులు ఎన్నుకుంటారు. జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమీషనర్, పురపాలక సంస్థ పరిధిలోని లోక్సభ, విధానసభ సభ్యులు తమ అధికార హోదారీత్యా పురపాలక మండలిలో సభ్యులుగా వ్యవహరిస్తారు.

ప్రశ్న 9.
జిల్లా కలెక్టర్ యొక్క ఏవైనా మూడు విధులను గూర్చి రాయండి.
జవాబు:
జిల్లా పాలనాధిపతిగా – కలెక్టరుకు విశేష అధికారాలు, విస్తృత విధులు ఉంటాయి. వాటిని ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు.
1) కలెక్టర్ – ప్రధాన రెవిన్యూ అధికారి: జిల్లాలో కలెక్టర్ ప్రధాన రెవిన్యూ అధికారిగా వ్యవహరిస్తాడు. హోదాలో అతడు జిల్లాలోని రైతులకు మార్గదర్శిగా ఉంటాడు. జిల్లాలోని గ్రామాలలో భూమిశిస్తు, జమాబందీ లెక్కలకు ఆధ్వర్యం వహిస్తాడు. భూమిశిస్తు వసూళ్ళు, రైతులకు రుణాల మంజూరు, ప్రకృతి విపత్తుల సమయంలో రైతులకు పంట నష్టపరిహారాలను చెల్లించడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికార బృందాలకు నష్టపరిహార అంచనా సేకరణ, తయారీలలో సహకరించడం, ప్రభుత్వ భూముల రికార్డులను నిర్వహించడం వంటివి జిల్లా కలెక్టర్కు ఉన్న రెవిన్యూ అధికారాలలో ముఖ్యమైనవి.

2) జిల్లా మెజిస్ట్రేట్గా వ్యవహరించడం: కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్గా వ్యవహరిస్తాడు. జిల్లాలో పనిచేసే పోలీస్ సిబ్బంది వ్యవహారాలపై అతనికి పర్యవేక్షణాధికారం ఉంటుంది. జిల్లాలో శాంతిభద్రతలు సాధారణ స్థాయిలో కొనసాగేటట్లు చూడవలసిందిగా పోలీస్ అధికారులకు సూచిస్తాడు. జిల్లాలో పోలీస్ యంత్రాంగం అంతా కలెక్టర్కు సహాయకారిగా ఉంటుంది. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్, ఇతర అధికారులు కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యవహరిస్తారు.

3) ముఖ్య సమన్వయ కర్త: జిల్లాలోని వివిధ ప్రభుత్వశాఖల అధికారుల మధ్య కలెక్టర్ సమన్వయ కర్తగా వ్యవహరిస్తాడు. వ్యవసాయం, నీటిపారుదల, సహకారం, విద్య, పరిశ్రమలు వంటి వివిధ శాఖల అధిపతులతో సమీక్ష సమావేశాలను నిర్వహిస్తాడు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పనితీరును తెలుసుకుంటాడు. ప్రభుత్వ పథకాల అమలులో వారికి తగిన ఆదేశాలను, సూచనలను ఇస్తాడు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 10.
జిల్లా కలెక్టరు పాత్రను అంచనా వేయండి.
జవాబు:
జిల్లాలోని వివిధ స్థానిక ప్రభుత్వాల వ్యవహారాల నిర్వహణలో కలెక్టర్ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాడు. జిల్లాలో నివసించే సాధారణ ప్రజానీకానికి కలెక్టర్ స్నేహితుడిగా, తాత్త్వికుడిగా, మార్గదర్శకుడిగా ఉంటాడు. జిల్లాలోని స్థానిక ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తాడు. ‘సాధారణంగా జిల్లాలోని సామాన్య ప్రజలు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కలెక్టర్ అందించే సహాయసహకారాల కోసం ఆత్రుతతో ఎదురుచూస్తూ ఉంటారు.

జిల్లాలోని స్థానిక ప్రభుత్వాల పనితీరు గురించి కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తగిన సూచనలందిస్తాడు. జిల్లాలో నూతనంగా స్థానిక సంస్థలను ఏర్పాటు చేసే విషయంలో కలెక్టర్ సిఫారసులు, వ్యాఖ్యానాలు అత్యంత కీలకమైన స్థానాన్ని ఆక్రమిస్తాయి. అనేక సందర్భాలలో జిల్లాలో వ్యవసాయం, పశుపోషణ, రెవిన్యూ, పోలీసు, ఆరోగ్యం, విద్య వంటి రంగాలలో పనిచేసే సిబ్బంది కలెక్టర్ సలహాల ప్రకారం వ్యవహరిస్తారు. జిల్లాలోని రైతులకు వ్యవసాయక ఉత్పాదితాలైన ఎరువులు, క్రిమిసంహారక మందులు, సహకార రుణాలు వంటి సౌకర్యాలు, వ్యవసాయ పంటల మార్కెటింగ్ సదుపాయాలు, ఆరోగ్యం, విద్యవంటి రంగాలలో పనిచేసే సిబ్బంది కలెక్టర్ సలహాల ప్రకారం వ్యవహరిస్తారు. జిల్లాలోని రైతులకు వ్యవసాయక ఉత్పాదితాలైన ఎరువులు, క్రిమిసంహారక మందులు, అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాడు. వ్యవసాయ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగడానికి కృషిచేస్తాడు. అలాగే పేదరిక రేఖ దిగువన నివసించే ప్రజలకు ఆరోగ్యం, ఆహారం, త్రాగునీరు, ఉపాధి వంటి సౌకర్యాలు కల్పించడానికి దోహదపడతాడు.

జిల్లా స్థాయిలో కలెక్టర్ దాదాపు నూరుకు పైగా కమిటీల సమావేశాలకు అధ్యక్షత వహించడమనే విషయం కలెక్టర్ పదవి ప్రాముఖ్యత గురించి, జిల్లా పాలనా వ్యవహారాలలో కలెక్టర్ నిర్వహించే కీలకపాత్ర గురించి తెలుపుతుంది. కలెక్టర్ జిల్లాస్థాయిలో వివిధ కమిటీల సమావేశాలకు అధ్యక్షత వహించడంతోపాటుగా ఆ సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలను అమలుచేయడానికి తగిన శ్రద్ధ వహిస్తాడు. జిల్లాలో వివిధ మండల పరిషత్తులు, గ్రామపంచాయతీలను నెలలో దాదాపు ఇరవై రోజులపాటు సందర్శించి, ఆయా సంస్థల పనితీరును సమీక్షించి, వాటి మెరుగుదలకు తగిన సూచనలిస్తాడు. రాష్ట్రస్థాయిలో ముఖ్యకార్యదర్శి వలె, జిల్లాస్థాయిలో కలెక్టర్ విశేషమైన ప్రభావాన్ని చూపిస్తూ, తన అధికారాల వినియోగంలో వివేకం, వివేచనలను ప్రదర్శిస్తాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అనేక అభివృద్ధి పథకాలైన జాతీయగ్రామీణ ఉపాధి హామీ పథకం (NREGS – National Rural Employment Guarantee Scheme), ప్రధానమంత్రి గ్రామ శోధక్ యోజన (PMGSY), జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం వంటి అనేక కార్యక్రమాల అమలు, విజయాలు, జిల్లా కలెక్టర్ చైతన్యవంతమైన నాయకత్వం పైనే ఆధారపడి ఉంటాయి. అందువల్ల జిల్లాస్థాయిలో ఉత్పన్నమయ్యే ఆర్థిక, రాజకీయ సమస్యల పరిష్కారంలో, జిల్లా ప్రజలతో మమేకమయ్యే జిల్లా కలెక్టర్తో ఆ ప్రభుత్వాలు నిరంతరం దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా సంబంధాలను కలిగి ఉంటాయి. జిల్లా స్థాయిలో జరిగే ప్రభుత్వ సంబంధమైన అనేక కమిటీలకు కలెక్టర్ కన్వీనర్గానో, సంధానకర్తగానో, సమన్వయ కర్తగానో వ్యవహరిస్తాడు.

ఇటీవలి కాలంలో కలెక్టర్ పదవిలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. సరళీకరణ, ప్రైవేటీకరణల ప్రభావంవల్ల కలెక్టర్ అధికార విధులు పునర్నిర్వచించబడినాయి. ఆ పరిణామాలు తమ అధికార విధుల నిర్వహణలో ఎంతో అప్రమత్తతతో వ్యవహరించేటట్లు కలెక్టర్ను తీర్చిదిద్దాయి. అంతేకాకుండా జనాభా పెరుగుదల, శాస్త్రసాంకేతిక రంగాలలో పురోగతి, ప్రణాళికలు, మహిళా సాధికారత, బలహీనవర్గాల సంక్షేమం, రాజ్యాంగపరమైన కర్తవ్యాలు మొదలైన అంశాలు జిల్లా కలెక్టర్ అధికార విధుల నిర్వహణలో విశేషమైన మార్పులకు దారితీశాయి.

ప్రశ్న 11.
ఆకర్షణీయ గ్రామ స్వభావాన్ని వివరించండి. [Mar. ’17]
జవాబు:
నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 2015లో ఆకర్షణీయ గ్రామ (Smart Village) పథకాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ సుస్థిరాభివృద్ధి సాధించాలనే లక్ష్యానికి కట్టుబడి స్వర్ణాంధ్ర లక్ష్యం విజన్ 2029 నాటికి దేశంలో అభివృద్ధి చెందిన మొదటి మూడు రాష్ట్రాలలో ఒకటి చేయాలనేది ప్రభుత్వలక్ష్యం. ఈ లక్ష్యసాఫల్యం కోసం ప్రభుత్వం మిషన్ ఆధారిత దృక్పథంతో సాంఘిక, ఆర్థిక, మౌలిక సదుపాయాల సౌకర్యాలను సృష్టిస్తారు. ఈ లక్ష్య సాధన కోసం రాష్ట్రంలో పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు.

జన్మభూమి, మా ఊరు కార్యక్రమానికి కొనసాగింపుగా ఆకర్షణీయ గ్రామం, ఆకర్షణీయ వార్డు కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించి పాలన వికేంద్రీకరణ, అధికార దత్తత, ప్రభుత్వసేవలు, అభివృద్ధి పథకాలు మొ॥ విషయాలలో ప్రజలను భాగస్వాములను చేసి వారి జీవన విధానంలో నాణ్యత పెంచడం ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయాలనేది ఈ పథకం లక్ష్యం.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు
జవాబు:
ప్రస్తుతం భారతదేశంలో పంచాయితీరాజ్ సంస్థలు లేదా గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ప్రకారం ఏర్పాటయ్యాయి. గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు మూడు అంచెలలో వుంటాయి. అవి:

  1. గ్రామస్థాయిలో గ్రామ పంచాయితీలు
  2. మండల లేదా మధ్య స్థాయిలో మండల పరిషత్లు
  3. జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్లు.

ప్రశ్న 2.
రాజ్యాంగం (73వ సవరణ చట్టం) 1992
జవాబు:
భారతదేశంలో గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు లేదా పంచాయితీరాజ్ సంస్థలను సమర్థవంతంగా తీర్చిదిద్దటానికి రాజ్యాంగం (73వ సవరణ) చట్టం 1992ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ చట్టంలో నూతనంగా జిల్లా, గ్రామసభ, పంచాయితీ గ్రామం అనే పదాలను చేర్చడం జరిగింది. ప్రతి గ్రామానికి ఒక గ్రామసభను ఏర్పాటు చేసింది. ఈ చట్టం షెడ్యూల్డు కులాలకు, షెడ్యూల్డు తెగలకు, వెనుకబడిన తరగతులకు మరియు మొత్తం సీట్లలో 33.3 శాతం మహిళలకు కేటాయిస్తూ పంచాయితీరాజ్ సంస్థలలో రిజర్వేషన్లను కల్పించింది.

ప్రశ్న 3.
గ్రామసభ
జవాబు:
ప్రతి గ్రామ పంచాయితీలో క గ్రామ సభ ఏర్పాటవుతుంది. దానిలో గ్రామానికి చెందిన రిజిష్టర్డ్ ఓటర్లు సభ్యులుగా ఉంటారు. ఇది సంవత్సరానికి కనీసం మూడుసార్లు సమావేశమవుతుంది. గ్రామసభ పంచాయితీకి సంబంధించిన వార్షిక పరిపాలన, ఆడిట్ నివేదికలను పరిశీలించి ఆమోదిస్తుంది. అభివృద్ధి, సంక్షేమం, ప్రభుత్వ పథకాలకు లబ్దిదారులను ఎంపిక చేయడం దీని పని.

ప్రశ్న 4.
జిల్లా పరిషత్
జవాబు:
రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక జిల్లా పరిషత్తు ఉంటుంది. జిల్లా స్థాయిలో అత్యున్నత స్థాయి స్వపరిపాలన సంస్థయే జిల్లా పరిషత్తు, జిల్లా పరిషత్కు చట్టబద్ధమైన ప్రతిపత్తి ఉంటుంది. జిల్లా పరిషత్లో ఆరు అంగాలుంటాయి. అవి:

  1. జిల్లా పరిషత్
  2. ఛైర్మన్
  3. జిల్లా మహాసభ
  4. ముఖ్య కార్యనిర్వహణాధికారి
  5. స్థాయీసంఘాలు
  6. జిల్లా కలెక్టరు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 5.
ఎం.పి.డి.ఒ (లేదా) మండల పరిషత్ అబివృద్ధి అధికారి [Mar. ’16]
జవాబు:
ఎం.పి.డి.ఒ అంటే మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారి. ఇతనిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఇతను మండల పరిషత్క పరిపాలనాధిపతిగా వ్యవహరిస్తారు. మండల పరిషత్, మండల మహాసభ తేదీలు, అజెండాల రూపకల్పనలోనూ ముఖ్యపాత్ర పోషిస్తాడు. మండల పరిషత్ వార్షిక బడ్జెట్ను రూపొందిస్తాడు. మండల పరిషత్ సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన చర్యలను తీసుకుంటాడు.

ప్రశ్న 6.
మండల పరిషత్తు
జవాబు:
జిల్లాలో మాధ్యమిక స్థాయిలో గల స్థానిక సంస్థయే మండల పరిషత్తు. రాష్ట్ర ప్రభుత్వ చట్టం ద్వారా మండల పరిషత్తు ఏర్పడుతుంది. ప్రతి మండలాన్ని కొన్ని మండల ప్రాదేశిక నియోజక వర్గాలుగా (జనాభా ప్రాతిపదికన) విభజిస్తారు. ఓటర్లు మండల ప్రాదేశిక నియోజక వర్గ సభ్యులను ఎన్నుకుంటారు. మండల పరిషత్తులో నాలుగు అంగాలుంటాయి. అవి: 1) మండల పరిషత్తు 2) మండల పరిషత్తు అధ్యక్షుడు 3) మండల పరిషత్తు అభివృద్ధి అధికారి 4) మండల మహాసభ.

ప్రశ్న 7.
జిల్లా మహాసభ
జవాబు:
ప్రతి జిల్లాపరిషత్లో జిల్లా మహాసభ ఉంటుంది. దానిలో జిల్లా పరిషత్ చైర్మన్, కొందరు సభ్యులుంటారు. జిల్లా మహాసభ జిల్లా పరిషత్కు సలహా సంస్థగా వ్యవహరిస్తుంది. దాని సమావేశాలకు జిల్లా పరిషత్ చైర్మన్ అధ్యక్షత వహిస్తాడు. జిల్లా పరిషత్ వార్షిక బడ్జెట్, ఆడిట్ నివేదికలను పరిశీలించడం, జిల్లా పరిషత్క సంబంధించిన గత సంవత్సరపు పరిపాలన నివేదికను పరిశీలించటం జిల్లా మహాసభ ముఖ్య విధులుగా భావిస్తారు.

ప్రశ్న 8.
జిల్లా పరిషత్తు స్థాయీ సంఘాలు
జవాబు:
ప్రతి జిల్లా పరిషత్తులో ఏడు స్థాయి సంఘాలుంటాయి. అవి జిల్లా పరిషత్కు అనేక అంశాలపై సలహాలిస్తుంటాయి. ప్రణాళికలు, విత్తం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, మహిళాభ్యుదయం, సామాజిక సంక్షేమం, విద్య, ఆరోగ్యం మొ॥ అంశాలు స్థాయి సంఘాలు పరిధిలో ఉన్నాయి. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి జిల్లా పరిషత్తు చైర్మన్ ను సంప్రదించి స్థాయి సంఘాల సమావేశాలను ఏర్పాటుచేస్తాడు.

ప్రశ్న 9.
జిల్లా పరిషత్తు ముఖ్య కార్యనిర్వహణ అధికారి
జవాబు:
ప్రతి జిల్లా పరిషత్తులో ఒక ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఉంటాడు. అతడిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. అతడు తన అధికారాల, విధుల నిర్వహణలో ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వానికి, మరొకవైపు జిల్లా పరిషత్తుకు బాధ్యత వహిస్తాడు. అతడు జిల్లా పరిషత్తు పరిపాలన అధిపతిగా వ్యవహరిస్తాడు. జిల్లా పరిషత్ సాధారణ సమావేశాల అజెండాను, వార్షిక బడ్జెట్ను రూపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాడు. జిల్లా పరిషత్తుకు సంబంధించిన సిబ్బంది, ఆస్తులు, భవనాలు, రికార్డులపై పరిపాలనాపరమైన అజమాయిషీ కలిగి ఉంటాడు. జిల్లా పరిషత్తు, జిల్లామహాసభ, జిల్లా స్థాయీ సంఘాలు తీసుకున్న నిర్ణయాలను, ఆమోదించిన తీర్మానాలను అమలులో ఉంచడానికి చర్యలు తీసుకుంటాడు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 10.
పురపాలక మండలి
జవాబు:
పురపాలక సంస్థ చర్చా వేదికయే పురపాలక మండలి. దీనిలో మూడు రకాల సభ్యులుంటారు. వారు 1) ఎన్నికయ్యే సభ్యులు 2) అనుబంధ సభ్యులు 3) గౌరవ సభ్యులు, పురపాలక మండలి సాధారణంగా నెలకొక పర్యాయం సమావేశమవుతుంది. పురపాలక మండలి సమావేశాల అజెండాను మున్సిపల్ కమీషనర్, మున్సిపల్ ఛైర్మన్ నన్ను సంప్రదించి రూపొందిస్తాడు. పురపాలక సంస్థకు సంబంధించిన వ్యవహారాలన్నింటిని పురపాలక మండలి పరిశీలిస్తుంది.

ప్రశ్న 11.
నగర పంచాయతి
జవాబు:
గ్రామస్థాయి నుండి పట్టణ స్థాయికి పరిణామం చెందే ప్రాంతం లేదా అతిచిన్న పట్టణ ప్రాంతాలలో ఏర్పాటయ్యే స్థానిక సంస్థలను నగర పంచాయతి అంటారు. జనసాంద్రత, స్థానిక సంస్థల ఆదాయం, వ్యవసాయేతర రంగాలలో ఉపాధి అవకాశాలు, ఆ ప్రాంత ఆర్థిక ప్రాధాన్యత మొదలైన అంశాల ఆధారంగా నగర పంచాయితీల ఏర్పాటు
జరుగుతుంది.

ప్రశ్న 12.
నోటిఫైడ్ ఏరియా కంపెనీ
జవాబు:
శీఘ్రగతిన అభివృద్ధి పథంలో పురోగమించే పట్టణాలలో లేదా పురపాలక సంస్థల ఏర్పాటుకు అనుకూలంగాలేని పరిస్థితులలో ఈ కమిటీ ఏర్పాటవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రకటన ద్వారా ఈ కమిటీ ఏర్పడుతుంది. కావున దీనిని నోటిఫైడ్ ఏరియా కమిటీ అని అంటారు. దీనికి చట్టబద్ధమైన హోదా ఉండదు. దీనిలో ఒక చైర్మన్. కొంతమంది సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. దీని విధులు పురపాలక సంస్థ విధులను పోలి ఉంటాయి.

ప్రశ్న 13.
కంటోన్మెంట్ బోర్డులు
జవాబు:
భారతదేశంలో కంటోన్మెంట్ బోర్డులనేవి భారత ప్రభుత్వ కంటోన్మెంట్ చట్టం, 1904 ద్వారా ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం భారతదేశంలో 62 కంటోన్మెంట్ బోర్డులు పనిచేస్తున్నాయి. కంటోన్మెంట్ ప్రాంతాలలో నివసించే పౌరులు, సైనిక సిబ్బంది తాలుకు వ్యక్తుల ప్రయోజనాలను పెంపొందించడానికి అవి కృషిచేస్తున్నాయి.

భారతదేశంలో ప్రస్తుతం మూడు రకాల కంటోన్మెంట్ బోర్డులున్నాయి. అవి దేశరక్షణ మంత్రిత్వశాఖ ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా ఏర్పాటై కొనసాగుతున్నాయి. ప్రతి కంటోన్మెంట్ బోర్డులో కొందరు ఎన్నుకోబడిన వారు సభ్యులుకాగా, కొందరు కేంద్ర ప్రభుత్వంతో నామినేట్ చేయబడినవారు, మరికొందరు పదవిరీత్యా సభ్యులుగా ఉంటారు. ప్రతి కంటోన్మెంట్ బోర్డులో ఒక జనరల్ ఆఫీసర్ – ఆఫ్ – కమాండర్ (GOC – General Officer of Commander) ఉంటాడు.

ప్రశ్న 14.
టౌన్ ఏరియా కమిటి
జవాబు:
రాష్ట్ర శాసనసభ ఆమోదించే ప్రత్యేక చట్టం ద్వారా టౌన్ ఏరియా కమిటీ ఏర్పాటవుతుంది. చిన్న పట్టణాల అవసరాలను తీర్చడానికి ఈ కమిటీలు అవసరమవుతాయి. ఈ కమిటీ నిర్వర్తించే విధులలో ముఖ్యమైనవి వీధి దీపాలను అమర్చటం, డ్రైనేజీ సౌకర్యాల కల్పన, పట్టణ ప్రాంతాలలో నివసించే ప్రజల స్థితిగతులను మెరుగుపరచటం మొదలగునవి.

ప్రశ్న 15.
టౌన్ షిప్
జవాబు:
టౌన్ షిప్ నేవి ప్రభుత్వరంగ సంస్థలలో ఏర్పాటవుతాయి. ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేసే సిబ్బందికి మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఇవి కృషిచేస్తాయి. వాటిలో ఎన్నుకోబడే సభ్యులు ఎవరూ ఉండరు. ప్రతి టౌన్షిప్కి ఒక టౌన్ పరిపాలన అధికారి ఉంటాడు. అతడిని కేంద్రప్రభుత్వంలోని సంబంధిత మంత్రిత్వశాఖ నియమిస్తుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 16.
పోర్ట్ ట్రస్ట్లు
జవాబు:
దేశంలోని సముద్రతీరంలో ఓడరేవులు ఉన్న ప్రాంతాలలో పోర్ట్ ట్రస్ట్లు ఏర్పాటవుతాయి. అలాగే నౌకాశ్రయాలలో పనిచేసే సిబ్బందికి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తాయి. అవి నౌకాశ్రయాలలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి కృషి చేస్తాయి. కేంద్ర ప్రభుత్వం అందుకోసం కొన్ని కమిటీలను నియమిస్తుంది. ఆ కమిటీల సభ్యులలో కొందరు ఎన్నుకోబడగా, మరికొందరు నామినేట్ అవుతారు.

ప్రశ్న 17.
జిల్లా రెవిన్యూ అధికారిగా కలెక్టర్ [Mar. ’17]
జవాబు:
జిల్లాలో కలెక్టర్ ప్రధాన రెవిన్యూ అధికారిగా వ్యవహరిస్తాడు. జిల్లాలోని గ్రామాలలో భూమిశిస్తు, జమాబందీ లెక్కలకు ఆధ్వర్యం వహిస్తాడు. భూమిశిస్తు వసూళ్ళు, రైతులకు రుణాల మంజూరు, ప్రకృతి విపత్తుల సమయంలో రైతులకు పంట నష్టపరిహారాలు చెల్లించటం, ప్రభుత్వభూముల రికార్డులను నిర్వహించటం మొదలగునవి జిల్లా కలెక్టరుకు ఉన్న రెవిన్యూ అధికారాలలో ముఖ్యమైనవి.

ప్రశ్న 18.
జిల్లా ముఖ్య ఎన్నికల అధికారిగా కలెక్టర్
జవాబు:
జిల్లా ముఖ్య ఎన్నికల అధికారిగా కలెక్టర్ వ్యవహరిస్తాడు. జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేటట్లు చూసే బాధ్యత కలెక్టర్పై ఉంది. ఓటర్ల జాబితా తయారీ, ఓటర్ల జాబితాలో సవరణలు, ఓటర్ల జాబితాలపై ఫిర్యాదుల పరిశీలన, కొత్త ఓటర్ల నమోదు, రిటర్నింగ్ అధికారుల నియాయకం మొదలగు అనేక విధులను కలెక్టర్ నిర్వహిస్తాడు.

ప్రశ్న 19.
స్వర్ణాంధ్రప్రదేశ్
జవాబు:
నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2015లో ఆకర్షణీయ గ్రామ పథకాన్ని ప్రారంభించారు. జన్మభూమి, మా వూరు కార్యక్రమానికి కొనసాగింపుగా ఆకర్షణీయ గ్రామం (Smart Village), ఆకర్షణీయ వార్డు కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించి, పాలనా వికేంద్రీకరణ, అధికార దత్తత, ప్రభుత్వ సేవలు, అభివృద్ధి పథకాలతో ప్రజలను భాగస్వాములను చేయటం ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ను ఏర్పాటు చేయటమే ఈ పథకం ఉద్దేశ్యం.

ప్రశ్న 20.
ఆకర్షణీయ నగరం [Mar. ’16]
జవాబు:
‘ఆకర్షణీయ నగరం (Smart City), అనేది అవస్థాపన సౌకర్యాల పరంగా ఎంతగానో అభివృద్ధి చెందిన పట్టణ ప్రాంతం. ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్, కమ్యూనికేషన్లు, మార్కెట్ల సామర్థ్యం వంటి అంశాలు ఉంటాయి. నివాసితులకు అత్యవసర, ప్రాథమిక సేవలను అందించేందుకు అవసరమైన ప్రధాన అవస్థాపక (Infrastracture), సమాచార సాంకేతికత (Information Technology) లు అందుబాటులో ఉంటాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

ఆకర్షణీయ నగరాలు పెట్టుబడులు తరలివచ్చేందుకు దోహదపడతాయి. మంచి అవస్థాపన, సాధారణ పారదర్శక, శీఘ్రతతో కూడిన స్థాపనాలకు వీలు కల్పిస్తాయి. పెట్టుబడిదారీ మితృత్వ నగరాలుగా ఉంటూ, ఉద్యమిత్య సంస్థలను స్థాపించి, సమర్థవంతంగా నిర్వహించుకొనేందుకు వీలుకల్పిస్తాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 9 కేంద్ర – రాష్ట్ర సంబంధాలు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 9th Lesson కేంద్ర – రాష్ట్ర సంబంధాలు Textbook Questions and Answers.

AP Inter 2nd Year Civics Study Material 9th Lesson కేంద్ర – రాష్ట్ర సంబంధాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశంలోని కేంద్ర – రాష్ట్ర సంబంధాలను క్లుప్తంగా వివరించండి.
జవాబు:
భారత రాజ్యాంగం కూడా అన్ని సమాఖ్య రాజ్యాంగాల వలె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలను విభజించింది. భారత రాజ్యాంగం 11, 12 భాగాలలోని 245 నుంచి 300 వరకు గల అధికరణాలు కేంద్ర, రాష్ట్రాల మధ్యగల సంబంధాలను ప్రస్తావించాయి. కేంద్ర, రాష్ట్ర సంబంధాలను స్థూలంగా మూడు శీర్షికల క్రింద అధ్యయనం చేయవచ్చు. అవి:

  1. శాసన సంబంధాలు
  2. పరిపాలనా సంబంధాలు
  3. ఆర్థిక సంబంధాలు.

1. శాసన సంబంధాలు: భారత రాజ్యాంగంలోని 245 నుంచి 255 వరకు గల 11 అధికరణాలలో కేంద్ర, రాష్ట్రాల మధ్యగల శాసన సంబంధాలు వివరించబడ్డాయి. శాసనపరమైన అంశాలను మూడు జాబితాల క్రింద వర్గీకరించారు. అవి:

  1. కేంద్ర జాబితా
  2. రాష్ట్ర జాబితా
  3. ఉమ్మడి జాబితా.

i) కేంద్ర జాబితా: జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ అంశాలపై శాసనాలను రూపొందించే అధికారం ఒక్క పార్లమెంటుకే ఇవ్వడం జరిగింది. ఉదా: దేశరక్షణ, సాయుధ దళాలు, విదేశీ వ్యవహారాలు, రైల్వేలు, తంతితపాలా, ఆకాశవాణి, దూరదర్శన్ మొదలగునవి.

ii) రాష్ట్ర జాబితా: ఈ జాబితాలోని అంశాలపై రాష్ట్ర శాసనసభలు చట్టాలు చేస్తాయి. ఉదా: శాంతి భద్రతలు, పోలీసు, జైళ్ళు, గ్రంథాలయాలు, వ్యవసాయం, పశుపోషణ మొదలగునవి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 9 కేంద్ర – రాష్ట్ర సంబంధాలు

iii) ఉమ్మడి జాబితా: ఈ జాబితాలోని అంశాలపై శాసనాలు చేసే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికీ ఉంది. అయితే పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు ఈ జాబితాలోని ఏదైనా ఒకానొక అంశంపై శాసనం రూపొందిస్తే, పార్లమెంటు రూపొందించిన శాసనానికి ఆధిక్యం ఇవ్వడం జరుగుతుంది. ఉదా: వివాహం, విడాకులు, ధర్మాదాయ, దేవాదాయ సంస్థలు, విద్య, విద్యుచ్ఛక్తి. వార్తాపత్రికలు మొదలగునవి.

పై మూడు జాబితాల్లో లేని అంశాలపై శాసనాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. ఈ అంశాలను అవశిష్టాధికారాలు అంటారు.

  • జాతీయ అత్యవసర పరిస్థితి ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్ర జాబితాలోని అంశాలపై కూడా పార్లమెంటు చట్టాలు చేసే అధికారం పొందుతుంది.
  • ఏదైనా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తే ఆ రాష్ట్రానికి అవసరమైన చట్టాలను పార్లమెంటు రూపొందిస్తుంది. శాసన వ్యవహారాల్లో రాష్ట్రాలకంటే కేంద్రానికే ఎక్కువ అధికారాలున్నాయి.

2. పరిపాలనా సంబంధాలు: భారత రాజ్యాంగంలోని 256 నుంచి 263 వరకు గల 8 అధికరణలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరిపాలనా సంబంధాలు వివరించబడ్డాయి.

  • కేంద్ర ప్రభుత్వం తన విధులను కొన్నింటిని రాష్ట్రాలకు అప్పగించవచ్చు. వాటికి అయ్యే ఖర్చు కేంద్రం భరిస్తుంది.
  • జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు పరిపాలనకు సంబంధించి కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలిస్తుంది.
  • కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వహణాధికారానికి భంగం వాటిల్లని రీతిలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ కార్యనిర్వహణాధికారాన్ని వినియోగించుకోవాలి.
  • కేంద్రం అంతర్ రాష్ట్రమండలిని ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రాల మధ్య ఏర్పడే తగాదాలను పరిష్కరిస్తుంది.

3. ఆర్థిక సంబంధాలు: భారత రాజ్యాంగంలోని 264 నుండి 300 వరకు అధికరణలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యగల ఆర్థిక సంబంధాలు వివరించబడ్డాయి. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక వ్యవహారాల్లో సంఘర్షణలు నివారించడానికి ఏయే పన్నులను ఏయే ప్రభుత్వాలు వసూలు చేయాలో, ఎలా పంచుకోవాలో అనే విషయాలపై ప్రత్యేక వివరణ ఇచ్చారు.

  • కేంద్ర ప్రభుత్వానికి 12 రకాల పాలనాంశాలపై విధించే పన్నుల ద్వారా ఆదాయం లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు 19 రకాల ఆదాయ మార్గాలు ఉన్నాయి.
  • అభివృద్ధి కోసం ఉద్దేశించిన కొన్ని ప్రత్యేక ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేంద్రం, రాష్ట్రాలకు ప్రత్యేక గ్రాంట్లను మంజూరు చేస్తుంది.
  • రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం సమ్మతి లేనిదే ఎటువంటి ఋణాలు పొందకూడదు. ఆర్థిక విషయాలలో రాష్ట్రాలు, కేంద్రంపై ఆధారపడి ఉన్నాయని తెలుస్తుంది.

ప్రశ్న 2.
కేంద్ర – రాష్ట్ర సంబంధాలలోని మూడు జాబితాలను చర్చించండి.
జవాబు:
భారతరాజ్యాంగం కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసనాధికారాల పంపిణీని మూడు రకాలుగా విభజించింది. అవి: మొదటి జాబితా (కేంద్ర జాబితా), రెండవ జాబితా (రాష్ట్ర జాబితా), మూడవ జాబితా (ఉమ్మడి జాబితా) కేంద్ర జాబితా: కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన సంబంధాలను ఒక ప్రత్యేకమైన పద్ధతిలో విభజించడం జరిగింది. కేంద్ర జాబితా చాలా సుదీర్ఘమైనది. భారతరాజ్యాంగ ప్రారంభంలో ఇందులో 97 అంశాలు ఉండేవి. ప్రస్తుతం ఇందులో 100 అంశాలు కలవు. ఈ జాబితాలోని అంశాలపైనా చట్టాలు చేయడానికి పార్లమెంట్కు మాత్రమే అధికారం కలదు. ఈ జాబితాలోని కొన్ని ముఖ్యాంశాలు: దేశభద్రత, ఐక్యరాజ్య సమితి సంబంధించిన అంశాలు, విదేశీ వ్యవహారాలు, దౌత్య సంబంధాలు, విదేశాలతో సంధులు చేసుకోవడం, యుద్ధం, శాంతి, పౌరసత్వం, రైల్వేలు, జాతీయ రహదారులు, విమానయానం, నౌకాయానం, విమానయాన నియంత్రణ, తపాలా, టెలిఫోన్, నాణెములు, వాణిజ్యం, బ్యాంకింగ్, అంతర్ రాష్ట్ర వ్యాపారం, బీమా, విదేశీ అప్పులు, పేటెంట్లు, తూనికలు, జలాలు, కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్, అఖిల భారత సర్వీసులు, పార్లమెంటుకు ఎన్నికలు, అణుశక్తి, ఆయుధాల తయారీ, నౌక, వైమానిక, సైనికదళాలు, కేంద్ర భద్రతా దళాలు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలు, వైమానిక రవాణా నియంత్రణ మరియు క్రమబద్ధీకరణ మొదలగునవి. ఈ అంశాలపై తయారుచేసిన చట్టాలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు మరియు దేశ పౌరులందరికీ సమానంగా వర్తిస్తాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 9 కేంద్ర – రాష్ట్ర సంబంధాలు

రాష్ట్ర జాబితా: సాధారణ పరిస్థితులలో రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టాలను తయారుచేయడానికి రాష్ట్ర శాసనసభలకు అధికారం కలదు. ఇందులో స్థానిక ప్రాముఖ్యత కలిగిన 66 అంశాలు ఉంటాయి. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వీటి సంఖ్యను 62కు కుదించడం జరిగింది.

ఈ జాబితాలోని కొన్ని ముఖ్య అంశాలు: శాంతిభద్రతలు, న్యాయం, జైళ్ళు, పోలీసులు, వ్యవసాయం, నీటిపారుదల, ప్రజారోగ్యం, స్థానిక స్వపరిపాలన సంస్థలు, తీర్థయాత్రలు, గ్రంథాలయం, ఫిషరీస్, మార్కెట్లు, సంతలు, భూమిశిస్తు మొదలగునవి. వీటిపై చేసిన చట్టాలు రాష్ట్రంలోని వ్యక్తులకు మరియు సంస్థలకు మాత్రమే వర్తిస్తాయి.

ఉమ్మడి జాబితా: ఈ జాబితాలోని అంశాలపై చట్టాలు చేయడానికి పార్లమెంట్కు మరియు రాష్ట్ర శాసనసభలకు అధికారం కలదు. ఇందులో జాతీయ మరియు స్థానిక ప్రాధాన్యత గల 47 అంశాలు ఉంటాయి. 42వ రాజ్యాంగ సవరణ తరువాత వీటి సంఖ్య 52కు పెరిగింది. ఈ అంశాలపై పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభలు చట్టాలు చేసినప్పటికీ ఏదైనా సమస్య ఉత్పన్నమయినపుడు పార్లమెంటు తయారుచేసిన చట్టాలు మాత్రమే అమలులో ఉంటాయి.

ఈ జాబితాలోని ముఖ్యాంశాలు: అడవులు, అడవి జంతువులు మరియు పక్షుల పరిరక్షణ, జనాభా నియంత్రణ, కుటుంబ నియంత్రణ, విద్య (సాంకేతిక మరియు వైద్య విద్య), నేర విచారణ విధానం, వివాహం మరియు విడాకులు, ధార్మిక సంస్థలు మరియు ధర్మకర్తృత్వ మండళ్ళు, కల్తీలు, కార్మిక సంఘాలు, విద్యుచ్ఛక్తి, ముద్రణాలయాలు, వార్తాపత్రికలు, తూనికలు మరియు కొలతలు (ప్రమాణముల నిర్థారణ మినహాయించి) మొదలగు ఈ జాబితాలో పొందుపరచిన అంశాలను సవరించుటకు మరియు రద్దు చేయుటకు, రాష్ట్ర శాసనసభలు ఈ అంశాలపై చేసిన చట్టాలను సవరించుటకు, రద్దు చేయుటకు పార్లమెంటు అధికారం కలదు. రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితాలలో పేర్కొనని ఏ అంశంపైన అయినా శాసనాలు తయారు చేయుటకు పార్లమెంట్కు ప్రత్యేక అధికారం కలదు. రాష్ట్ర శాసనసభలు తయారుచేసిన రాష్ట్ర జాబితాలోని అంశాలను కొన్ని ప్రత్యేక సందర్భాలలో రద్దు చేయుటకు కేంద్ర ప్రభుత్వానికి అధికారం కలదు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశంలోని కేంద్ర – రాష్ట్రాల మధ్య గల పరిపాలన సంబంధాలను తెలపండి. [Mar. ’17, ’16]
జవాబు:
భారత రాజ్యాంగంలోని 256 నుంచి 263 వరకు గల 8 అధికరణాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనా సంబంధాల గురించి వివరించాయి. ప్రగతి సాధనకు పాలనా వ్యవస్థ గుండెకాయ వంటిది. కేంద్ర, రాష్ట్రాల మధ్య పాలనా వ్యవహారాల్లో ఎటువంటి ఘర్షణలు రాకుండా చూసేందుకు మన రాజ్యాంగం తగిన విధంగా రూపొందించబడింది.

  1. కేంద్ర ప్రభుత్వ శాసనాల అమలుకు అనుగుణంగా రాష్ట్రాలు తమ పరిపాలనను నిర్వహించుకోవలెను.
  2. అవసరమని భావించినప్పుడు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలకు పరిపాలనా సంబంధమైన ఆదేశాలను ఇస్తుంది.
  3. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమానికి సంబంధించి కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వవచ్చు. ఈ విషయంలో కేంద్రం రూపొందించి, అమలుపరిచే పథకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఉండాలి.
  4. సైనిక లేదా జాతీయ ప్రాముఖ్యత కలిగిన రహదారులను నిర్మించి, వాటిని రక్షించుటలో రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలను ఇస్తుంది. వాటి నిర్మాణానికి అయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తుంది.
  5. రైల్వేలు మొదలైన ఆస్తుల రక్షణకు సంబంధించి కేంద్రం రాష్ట్రాలకు సూచనలు చేస్తుంది. 6) అంతర్ రాష్ట్ర నదీజలాల వివాదాలను పరిష్కరించే అధికారం కేంద్ర పార్లమెంటుకు ఉంది.
  6. ఏదైనా ఒక రాష్ట్రంలో పాలన రాజ్యాంగబద్ధంగా జరగనప్పుడు ఆ రాష్ట్రంలో కేంద్రం రాష్ట్రపతి పాలనను విధించవచ్చు.
  7. రాష్ట్ర పాలకులైన గవర్నర్లను రాష్ట్రపతి (కేంద్ర ప్రభుత్వం) నియమిస్తాడు. రాష్ట్రపతి పాలన విధించబడినప్పుడు వారు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా వ్యవహరిస్తారు.
  8. విదేశీ దురాక్రమణల నుంచి, అల్లకల్లోలాల నుంచి రాష్ట్రాలను కాపాడవలసిన బాధ్యత కేంద్రంపై ఉంది.
  9. కేంద్రం అంతర్ రాష్ట్రమండలిని ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రాల మధ్య ఏర్పడే తగాదాలను పరిష్కరిస్తుంది మొదలైనవి.
  10. కేంద్ర, రాష్ట్రాలలో ఎన్నికలను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం స్వతంత్రమైన రాజ్యాంగబద్ధ ఎన్నికల కమీషన్ను నియమిస్తుంది.
  11. రాష్ట్రాల ముఖ్యమంత్రుల పైన వచ్చే ఆరోపణలను విచారించడానికి కేంద్ర ప్రభుత్వం విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసే అధికారం కలదు.

ప్రశ్న 2.
కేంద్ర – రాష్ట్రాల మధ్య గల ఆర్థిక సంబంధాలను వివరించండి.
జవాబు:
రాజ్యాంగంలోని 12వ భాగంలోని 268 నుంచి 293 వరకు గల ప్రకరణలు కేంద్ర, రాష్ట్రాల మధ్యగల ఆర్థిక సంబంధాలను గూర్చి వివరిస్తాయి. ఈ క్రింది శీర్షికల ద్వారా కేంద్ర, రాష్ట్రాల మధ్యగల ఆర్థిక సంబంధాలను తెలుసుకోవచ్చు.
a) కేంద్ర విధించే పన్నులు, సుంకాలు: కొన్ని రకాల పన్నులను కేంద్ర ప్రభుత్వం మాత్రమే విధిస్తుంది. దిగుమతి సుంకాలు, కస్టమ్స్, పొగాకు, జనపనారపై ఎక్సైజ్ సుంకం, కార్పొరేషన్ పన్ను, మూలధన విలువపై పన్ను, వ్యవసాయేతర ఎస్టేట్లపై పన్ను, రైల్వేలు, తంతితపాలా, టెలిఫోన్స్, వైర్లెస్, విదేశీ మారకద్రవ్యం, కరెన్సీ, నాణేల ముద్రణ, ప్రసార మాధ్యమాలు, ఇతర రకాల కమ్యూనికేషన్లు మొదలైనవి ఇందులోకి వస్తాయి.

b) రాష్ట్రం విధించి, ఉపయోగించే పన్నులు, సుంకాలు: కొన్ని రకాల పన్నులు రాష్ట్ర ప్రభుత్వాల పరిధి క్రిందకు మాత్రమే వస్తాయి. భూమిశిస్తు, రోడ్డు మరియు దేశీయ జలమార్గాల ద్వారా ప్రయాణించే ప్రయాణికులు మరియు వస్తువులపై పన్నులు, విద్యుత్ వినియోగం మరియు అమ్మకంపై పన్ను, టోల్యాక్స్, మద్యపానంపై పన్ను, వినోదపు పన్ను, పందాలపై, జూదాలపై, విలాసాలపై పన్నులు మొదలగునవి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 9 కేంద్ర – రాష్ట్ర సంబంధాలు

c) కేంద్రం విధించి, రాష్ట్రాలు సేకరించి ఉపయోగించుకునే పన్నులు: ఈ క్రింద తెలిపిన పన్నులు కేంద్రంచే విధించబడతాయి. అయితే వాటిని రాష్ట్రాలు సేకరించి, ఉపయోగించుకుంటాయి. బిల్లుల మారకం, చెక్కులు, ప్రామిసరీ నోటులు, బిల్స్ ఆఫ్ లెండింగ్, కంపెనీ వాటాల బదలాయింపు, టాయ్లెట్ సంబంధ వస్తువులపై ఎక్సైజ్ డ్యూటీలు, మత్తుపదార్థాలు మొదలగునవి ఈ కోవకు చెందుతాయి.

d) కేంద్రం విధించి, సేకరించి రాష్ట్రాలకు పంపిణీ చేసే పన్నులు: ఈ క్రింద తెలిపిన పన్నులు కేంద్రం విధించి, రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది. వ్యవసాయేతర ఆస్తిపై ఎస్టేట్ సుంకం, రైల్వే ఛార్జీలు, రైల్వే వస్తువుల రవాణా ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను, రైలు, సముద్ర, వైమానిక, సాధనాల ద్వారా పంపే వస్తువులు, ప్రయాణీకులపై విధించే టెర్మినల్ పన్నులు మొదలైనవి ఈ కోవలోకి వస్తాయి.

e) కేంద్రం విధించి, వసూలు చేసి కేంద్ర – రాష్ట్రాల మధ్య పంపిణీ చేసే పన్నులు: ఈ పన్నులను కేంద్ర ప్రభుత్వం విధించి, వసూలు చేస్తుంది. కానీ రాష్ట్రాలతో కలిసి పంచుకుంటుంది. వ్యవసాయేతర ఆదాయంపై పన్ను, టాయ్లెట్, ఔషదేతర వస్తువులపై విధించే ఎక్సైజ్ సుంకాలు మొదలగునవి.

ప్రశ్న 3.
కేంద్ర – రాష్ట్రాల మధ్య గల శాసన సంబంధాలను పరిశీలించండి.
జవాబు:
భారత రాజ్యాంగం 11వ భాగంలోని మొదటి అధ్యాయంలోని 245 నుంచి 255 ప్రకరణలు కేంద్రం మరియు రాష్ట్రాల మధ్యగల శాసన సంబంధాలను తెలియజేస్తాయి. భారత రాజ్యాంగం కేంద్ర, రాష్ట్రాల మధ్య గల శాసన | సంబంధాలను ప్రాదేశిక పరిధి ప్రాతిపదికపై ఈ విధంగా తెలపవచ్చు.
ఎ) పార్లమెంటు భారతదేశం మొత్తానికి గానీ లేదా దేశంలో కొంత ప్రాంతానికి గానీ చట్టాలు చేయవచ్చు.

బి) కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా పార్లమెంటే చట్టాలు చేస్తుంది.

సి) భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లోని మొదటి జాబితా (కేంద్ర జాబితా) నందు పేర్కొన్న ఏదైనా అంశం మీద చట్టాలు చేయడానికి పార్లమెంటుకు మాత్రమే అధికారం కలదు.

డి) భారత రాజ్యాంగం 7వ షెడ్యూల్లోని తృతీయ జాబితా (ఉమ్మడి జాబితా) నందు పేర్కొన్న ఏదైనా అంశం మీద చట్టాలు చేయడానికి పార్లమెంటుకు, రాష్ట్ర శాసనసభలకు అధికారం కలదు.

ఇ) భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లోని ద్వితీయ జాబితా (రాష్ట్ర జాబితా) నందు తెలియజేయబడిన ఏదైనా అంశం మీద చట్టాలు చేయడానికి రాష్ట్ర శాసన సభలకు మాత్రమే అధికారం కలదు.

ఎఫ్) రాష్ట్ర ప్రభుత్వాల భౌగోళిక పరిధికి వెలుపలున్న భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు సంబంధించి పార్లమెంటు ఎటువంటి చట్టాలైన (రాష్ట్ర జాబితాలో వున్నప్పటికి చేయవచ్చు.

జి) మూడు జాబితాలలో పేర్కొనని ఏ అంశాల పైన అయినా చట్టాలు తయారు చేయడానికి పార్లమెంటుకు ప్రత్యేక అధికారం కలదు.

హెచ్) కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో ద్వితీయ జాబితాలోని (రాష్ట్ర జాబితా) అంశాలపైన చట్టాలు చేయడానికి పార్లమెంటుకు అధికారం కలదు. అవి: జాతీయ ప్రాధాన్యత గల అంశాలు; జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో రెండు లేక అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కలిసి పార్లమెంట్ను చట్టాలు చేయమని అడిగినప్పుడు; అంతర్జాతీయ సంధులు, ఒప్పందాలు అమలు చేసేటప్పుడు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 9 కేంద్ర – రాష్ట్ర సంబంధాలు

ప్రశ్న 4.
ఆర్థిక సంఘం నిర్మాణం, అధికారాలు, విధులను వివరించండి.
జవాబు:
నిర్మాణం: భారత రాజ్యాంగం 280వ ప్రకరణలో ఆర్థిక సంఘ నిర్మాణం, అధికారాలు మరియు విధులను గూర్చి చర్చించడం జరిగింది. పాక్షిక న్యాయాధికారాలు గల ఈ ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు. ఇందులో ఒక అధ్యక్షుడు మరియు నలుగురు సభ్యులు ఉంటారు. వీరిని ఐదు సంవత్సరాల పదవీ కాలానికి రాష్ట్రపతి నియమిస్తాడు. ఈ సభ్యులు తిరిగి నియమింపబడటానికి అర్హులు. ఈ సంఘ అధ్యక్ష మరియు ఇతర సభ్యుల అర్హతలు నిర్ణయించడానికి పార్లమెంటుకు రాజ్యాంగం అధికారం కల్పించింది. అందుకు అనుగుణంగా పార్లమెంట్ ఆర్థిక సంఘ అధ్యక్షునితో పాటు ఇతర సభ్యుల అర్హతలను ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. ఈ సంఘం కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ గురించి రాష్ట్రపతికి సిఫార్సులు చేస్తుంది. ఈ సంఘ అధ్యక్షుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలలో అనుభవజ్ఞుడై ఉండాలి. మిగిలిన నలుగురు సభ్యులు

ఈ క్రింది రంగాల నుండి నియమించబడుతారు.

  • హైకోర్టు న్యాయమూర్తి (లేదా) హైకోర్టు న్యాయమూర్తి నియామకానికి అర్హత గల వ్యక్తి అయి ఉండాలి.
  • మరో సభ్యుడు ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలు మరియు ఖాతాలలో అనుభవం కలిగి ఉండాలి.
  • మూడవ సభ్యుడు విత్త విషయాలలో నిష్ణాతుడై ఉండాలి.
  • నాల్గవ సభ్యుడు ఆర్థికశాస్త్రంలో నిపుణుడై ఉండాలి.

అధికారాలు విధులు: ఆర్థిక సంఘం కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షించి భారత రాష్ట్రపతికి తగు సిఫార్సులు ఈ క్రింది విషయాలలో చేయవలసి ఉంటుంది.

  1. కేంద్ర పన్నులను రాష్ట్రాలకు ఏ నిష్పత్తి ప్రకారం పంపిణీ చేయాలో సిఫార్సులు చేస్తుంది.
  2. భారత సంఘటిత నిధి నుండి రాష్ట్రాలకు సహాయక నిధులకు సంబంధించి ఏ సూత్రాల ఆధారంగా పంపిణీ చేయాలో తగు మార్గదర్శక సూత్రాలను సూచిస్తుంది.
  3. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో చేసుకున్న ఒప్పందాలను కొనసాగించాలా లేదా మార్పులు చేయాలా అనే విషయంలో ఈ సంఘం సిఫార్సులు చేస్తుంది.
  4. దేశ ఆర్థిక పటిష్టతకు సంబంధించి రాష్ట్రపతి కోరినప్పుడు తగిన సూచనలిస్తుంది.
  5. 73 మరియు 74 రాజ్యాంగ సవరణల ద్వారా ఈ ఆర్థిక సంఘ విధులు మరింత విస్తృతం అయ్యాయి. రాష్ట్రాలలోని పంచాయితీలకు మరియు మున్సిపాలిటీలకు ఆర్థిక వనరులు అందజేయుటకు భారత సంఘటిత నిధికి వనరులను ఏ విధంగా పెంచాలో చర్యలను సూచిస్తుంది.
  6. పటిష్టమైన ఆర్థిక స్థిరత్వం కొరకు పరిపాలన మరియు రాజకీయ రంగాలలోని ఉన్నతాధికారులతో ప్రముఖ నేతలతో చర్చలు జరుపుతుంది. దేశంలోని వివిధ ఆర్థిక సంఘాల అధినేతల సూచనలను ఆహ్వానిస్తుంది.

ఆర్థిక సంఘం తన నివేదిక రాష్ట్రపతికి సమర్పిస్తుంది. దీనిని సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది. రాష్ట్రపతి ఆర్థిక సంఘం చేసిన కొన్ని లేదా అన్ని సిఫార్సులను అంగీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఈ సిఫార్సులు ఐదు సంవత్సరాల కాలం అమలులో ఉంటాయి.

ప్రశ్న 5.
సర్కారియా కమీషన్ సిఫార్సులను మూల్యాంకనం చేయండి. [Mar. ’17]
జవాబు:
సర్కారియా కమిషన్ (1983 – ’87): 1983, జూన్ 9వ తేదీన కేంద్ర ప్రభుత్వం రంజిత్సింగ్ సర్కారియా ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిషను ఒకదానిని ఏర్పరచింది. కేంద్ర-రాష్ట్ర సంబంధాలను పునఃపరిశీలన జరిపి తగిన సిఫారసులు చేయవలసిందిగా ఆ కమిషన్ను కోరడమైంది. ఆ కమిషన్లో బి. శివరామన్, ఎస్. సేన్ అనే ఇద్దరు సభ్యులు ఉన్నారు. కమిషన్ కార్యదర్శిగా ఎమ్.ఆర్. సుబ్రహ్మణ్యం, రాజ్యాంగ సలహాదారుడిగా ఎల్.ఎన్. సిన్హా వ్యవహరించారు. 1987, అక్టోబరు 27వ తేదీన 247 సిఫారసులతో కూడిన 5000 పేజీలకు పైగా ఒక అంతిమ నివేదికను సర్కారియా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.

సిఫారసులు: సర్కారియా కమిషన్ పేర్కొన్న సిఫారసులలో కింద పేర్కొన్నవి అత్యంత ప్రధానమైనవి.

  1. రాజకీయేతర రంగాలకు చెందిన, వివాదాస్పదం కాని ప్రముఖ వ్యక్తులు, సాధ్యమైనంతవరకు మైనారిటీలకు చెందిన వ్యక్తులను రాష్ట్ర గవర్నర్లుగా నియమించాలి.
  2. రాష్ట్ర గవర్నర్ల నియామకంలో ముఖ్యమంత్రులను సంప్రదించాలి.
  3. ముఖ్యమంత్రి నియామకం, రాష్ట్ర మంత్రివర్గం కొనసాగింపు విషయాలలో విధానసభలో మెజారిటీ సభ్యుల అభిప్రాయాలను తెలుసుకోవాలి.
  4. అరుదైన సందర్భాలలో మాత్రమే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టాలి.
  5. అఖిల భారత సర్వీసు సిబ్బందికి సంబంధించిన విషయాలలో కేంద్రం రాష్ట్రాలను సంప్రదించాలి.
  6. జోనల్ కౌన్సిళ్ళను పునర్వ్యవస్థీకరించాలి.
  7. శాశ్వత ప్రాతిపదికపై అంతర్ ప్రభుత్వ మండలిని ఏర్పాటు చేయాలి.
  8. జాతీయ అభివృద్ధి మండలి పేరును జాతీయ ఆర్థిక అభివృద్ధి మండలిగా మార్చి, దాని అస్థిత్వాన్ని పరిరక్షించాలి.
  9. ఆర్థిక నిపుణులను ఆర్థిక సంఘ సభ్యులుగా నియమించాలి.
  10. భారతదేశ సమిష్టి సంస్కృతిని సంరక్షించేందుకు ప్రాంతీయ భాషలలో జాతీయ కార్యక్రమాలను ప్రసారం చేయాలి.
  11. జాతీయ వ్యవహారాల విషయంలో కేంద్రం – రాష్ట్రాల మధ్య సంప్రదింపులు జరగాలి.
  12. అవశిష్టాంశాలపై పన్నులు విధించే శాసన నిర్మాణాధికారాన్ని పార్లమెంటుకు అప్పగించాలి.
  13. రాష్ట్రాలతో సంప్రదించి కేంద్రం ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసు, ఇండియన్ హెల్త్ సర్వీసు, ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీసులను ఏర్పాటు చేయాలి.
  14. కార్పొరేషన్ పన్నులో కొంత భాగాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలి.
  15. రాష్ట్రాలకు సైన్యాన్ని పంపేముందు కేంద్రం రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 9 కేంద్ర – రాష్ట్ర సంబంధాలు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కేంద్ర – రాష్ట్రాల మధ్య గల ఏవైనా మూడు సంబంధాలు.
జవాబు:
కేంద్ర, రాష్ట్రాల మధ్య గల సంబంధాలను మూడు రకాలుగా వర్గీకరించటం జరిగింది. అవి:

  1. శాసన సంబంధాలు
  2. పరిపాలనా సంబంధాలు
  3. ఆర్థిక సంబంధాలు

ప్రశ్న 2.
కేంద్ర జాబితా.
జవాబు:
కేంద్ర జాబితా చాలా సుదీర్ఘమైనది. ప్రస్తుతం ఈ జాబితాలో 100 పరిపాలనాంశాలు ఉన్నాయి. ఈ జాబితాలోని అంశాలపై చట్టాలు చేయడానికి పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంది. ఈ జాబితాలో దేశభద్రత, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అంశాలు, విదేశీ వ్యవహారాలు, దౌత్య సంబంధాలు మొదలైన ముఖ్యమైన అంశాలు ఉన్నాయి.

ప్రశ్న 3.
అత్యవసర పరిస్థితులలో పరిపాలన సంబంధాలు.
జవాబు:
జాతీయ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్న సమయంలో, కేంద్ర ప్రభుత్వానికి ఏకకేంద్ర ప్రభుత్వం వలె అధికారాలు చెలాయించడానికి భారత రాజ్యాంగం అవకాశం కల్పించింది. ఈ పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు కాకుండా, కేంద్ర ప్రభుత్వం పూర్తి ఆధీనంలో పనిచేస్తాయి. రాష్ట్రపతి పాలన అమలులో ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను రాష్ట్రపతి తరుఫున గవర్నర్ చెలాయిస్తాడు.

ప్రశ్న 4.
కేంద్ర, రాష్ట్రాల మధ్యగల శాసన సంబంధాలు.
జవాబు:
పార్లమెంటు భారతదేశం మొత్తానికి గానీ లేదా దేశంలో కొంత ప్రాంతానికి గానీ చట్టాలు చేయవచ్చు. కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా పార్లమెంటే చట్టాలు చేస్తుంది. కేంద్ర జాబితాలో పేర్కొన్న ఏదైనా అంశంపై చట్టాలు చేయడానికి పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంది. కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలలో పేర్కొనబడని అంశాలపై చట్టాలు చేయడానికి పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంది.

ప్రశ్న 5.
అవశిష్ట అధికారాలు.
జవాబు:
కేంద్ర, రాష్ట్ర మరియు ఉమ్మడి జాబితాలలో లేని అంశాలను అవశిష్ట అధికారాలు అంటారు. వీటి పై శాసనాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు మాత్రమే కలదు.
ఉదా: ఆర్థిక వ్యవస్థలోని సేవారంగంపై పన్నులు విధించే అధికారం పార్లమెంటుకు ఉంది.

ప్రశ్న 6.
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రెండు రాజ్యాంగేతర సాధనాలు.
జవాబు:

  1. నీతి అయోగ్.
  2. జాతీయ అభివృద్ధి మండలి.

1) నీతి అయోగ్ జాతీయ ప్రణాళికా సంఘం స్థానంలో రాజ్యాంగేతర సంస్థగా ఏర్పాటు చేయబడింది. దీనినే 2015 జనవరి 1వ తేదీన ప్రస్తుత భారత ప్రధానమంత్రి నరేంద్రమోడి ఏర్పాటు చేయడం జరిగింది.

2) జాతీయ అభివృద్ధి మండలి రాజ్యాంగేతర, శాసనేతర సంస్థ. ఇది ప్రణాళికలను తయారు చేయటంలో సహాయపడుతుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 9 కేంద్ర – రాష్ట్ర సంబంధాలు

ప్రశ్న 7.
నీతి ఆయోగ్. [Mar. ’17, ’16]
జవాబు:
నీతి ఆయోగ్ జాతీయ ప్రణాళికా సంఘానికి ప్రత్యామ్నాయంగా ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోడి చేత | 2015 జనవరి 1వ తేదీన ఏర్పాటు చేయబడింది. ఇది విధాన, ఆర్థిక విషయాలకు సంబంధించిన సాంకేతిక, వ్యూహాత్మక సలహాలతో కూడిన జాతీయ అజెండాను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. గ్రామీణస్థాయి ప్రణాళికల యంత్రాంగాన్ని అభివృద్ధి చేయడంతోపాటు వివిధ స్థాయిలలోని ప్రభుత్వాల ప్రణాళికలకు సంబంధించి ఒక యంత్రాంగాన్ని అభివృద్ధి
పరుస్తుంది.

ప్రశ్న 8.
జాతీయ అభివృద్ధి మండలి.
జవాబు:
జాతీయ అభివృద్ధి మండలి రాజ్యాంగేతర, శాసనేతర సంస్థ. ఇది ప్రణాళికలను తయారు చేయడంలో సహాయపడుతుంది. ఈ సంస్థను 1952లో ఏర్పాటు చేశారు. దీనికి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉంటారు. కేంద్ర కేబినెట్ సభ్యులందరూ, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, నీతి ఆయోగ్ సభ్యులు ఇందులో సభ్యులుగా ఉంటారు. నీతి ఆయోగ్ దీనికి కార్య నిర్వాహక శాఖగా పనిచేస్తుంది.

ప్రశ్న 9.
జాతీయ సమగ్రత మండలి.
జవాబు:
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో “భిన్నత్వంలో ఏకత్వం” పై జరిగిన జాతీయ సదస్సులో తీసుకొన్న ఒక నిర్ణయం మేరకు మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ జాతీయ సమగ్రతా మండలి 1961లో న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి దీనికి అధ్యక్షులు కాగా, కేంద్ర హోంశాఖామంత్రి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీలకు చెందిన ఏడుగురు నాయకులు. యు.జి.సి. అధ్యక్షుడు, ఇద్దరు విద్యావేత్తలు మొదలగు వారు ఇందులో సభ్యులుగా ఉంటారు. మతవాదం, కులవాదం, ప్రాంతీయవాదం, భాషావాదం మరియు జాతీయ సమగ్రతకు సంబంధించి సంకుచిత భావనలు మొదలగు వాటికి సంబంధించిన సమస్యలను పరిశీలించి, వ్యవహరించవలసిన విధానం గూర్చి సిఫారసు చేస్తుంది.

ప్రశ్న10.
కేంద్ర, రాష్ట్ర సంబంధాలలో మూడు ఉద్రిక్త పరిస్థితులు.
జవాబు:

  1. గవర్నర్ల నియామక పద్ధతి
  2. గవర్నర్ల పక్షపాత వైఖరి
  3. రాష్ట్రాలపై 356 నిబంధనను ప్రయోగించడం.

ప్రశ్న 11.
పూంఛీ కమీషన్.
జవాబు:
కేంద్ర, రాష్ట్ర సంబంధాలను అధ్యయనానికై ఏర్పాటైన మరొక కమీషన్లే పూంఛీ కమీషన్.
పదవీ విరమణ పొందిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మదన్మోహన్ పూంఛీ అధ్యక్షతన కేంద్ర, రాష్ట్ర సంబంధాలను అధ్యయనం చేయడానికి UPA ప్రభుత్వం ఏప్రిల్ 28, 2007న ఈ కమీషన్ ను ఏర్పాటు చేసింది. భారత రాజకీయ వ్యవస్థలో వచ్చిన గణనీయమైన మార్పులను దృష్టిలో ఉంచుకొని కేంద్ర – రాష్ట్ర సంబంధాలను అధ్యయనం చేయవలసిందిగా ప్రభుత్వం కమీషన్ను కోరింది. ఎందుకంటే కేంద్ర, రాష్ట్ర సంబంధాలను సర్కారియా కమీషను సమీక్షించి దాదాపు దశాబ్దాలు గడిచిపోయాయి. కేంద్ర – రాష్ట్ర సంబంధాలలో ప్రాధాన్యత కలిగిన అంశాలతో ఏ విధంగా వ్యవహరించాలి అనే విషయంపై కమీషన్ దాదాపు 310 సిఫార్సులు చేసింది. కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి ఏప్రిల్ 20, 2010న సమర్పించింది. పూంఛీ కమీషన్ చాలా అంశాలలో కేంద్ర రాష్ట్ర సంబంధాలను లోతుగా పరిశీలించి, భారతదేశ సమైక్యతను, సమగ్రతకు భావితరాల ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి మెరుగు పరచడానికి భారతదేశం ఒక సహకార సమాఖ్యగా ఉండాలని సూచించింది. సహకార సమాఖ్య సూత్రాలు భారత రాజకీయ వ్యవస్థకు మరియు సుపరిపాలనకు ఆచరణలో మార్గదర్శకంగా ఉండాలని వివరించింది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 9 కేంద్ర – రాష్ట్ర సంబంధాలు

ప్రశ్న 12.
కేంద్ర – రాష్ట్ర సంబంధాలు.
జవాబు:
కేంద్ర – రాష్ట్ర సంబంధాలు అనగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలు, విధులు మరియు బాధ్యతలు ప్రధానాంశంగా నిలుస్తాయి. కేంద్ర – రాష్ట్ర సంబంధాలను గూర్చి భారత రాజ్యాంగంలోని 11 మరియు 12 భాగాలలో 245 – 300 వరకు గల ప్రకరణలలో వివరించడమైంది. భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలను మూడు శీర్షికల క్రింద చర్చించవచ్చు. అవి: i) శాసన సంబంధాలు ii) పరిపాలన సంబంధాలు. iii) ఆర్థిక సంబంధాలు.

AP Inter 1st Year Civics Study Material Chapter 3 జాతీయవాదం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Civics Study Material 3rd Lesson జాతీయవాదం Textbook Questions and Answers.

AP Inter 1st Year Civics Study Material 3rd Lesson జాతీయవాదం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
జాతీయత అంటే ఏమిటో నిర్వచించి, జాతీయత మౌలిక అంశాలను వివరించండి. [Mar. ’18, ’17, ’16]
జవాబు:
జాతీయతను ఆంగ్లంలో ‘నేషనాలిటీ’ (Nationality) అంటారు. ఈ ఆంగ్ల పదం ‘నేషియో’ అనే (Natio) లాటిన్ భాష నుండి గ్రహించబడినది. దీనికి “పుట్టుక” లేదా “జన్మ” అని అర్ధము. సంస్కృతంలో ‘జా’ అంటే ‘పుట్టుక’ అని అర్థం కలదు.

నిర్వచనం :
1. బర్జెస్ : “మొత్తం జనాభాలో మెజారిటీ సభ్యులతో కూడిన సామాజిక, సాంస్కృతిక సముదాయమే జాతీయత”. 2. జె.డబ్ల్యు గార్నర్ : “తెగవంటి అనేక ప్రజాబంధాలతో ఐక్యమైన ప్రజా సముదాయంలో భాగమే జాతీయత”. 3. ఆర్.జి.గెటిల్ : “ఒకే తెగ, భాష, మతం, ఆచారాలు, చరిత్ర వంటి ఉమ్మడి అంశాలు గల ప్రజానీకమే జాతీయత”.

జాతీయత లక్షణాలు :
1) స్వచ్ఛమైన తెగ (Purity of Race) : దీనిని ఏకజాతి లేదా వారసత్వము అనవచ్చు. ఒకే తెగ మనుషుల మధ్య రక్తసంబంధం ఉంటుంది. ఒకే సంతతికి చెందినవారమనే భావంతో ఒకే తెగ ప్రజలు ఐకమత్యభావంతో ఉంటారు. అది దృఢమైన జాతీయత, జాతిని పెంపొందిస్తుంది. ఉదా : హిట్లర్ కాలంలో జర్మనులు, తమిళనాడులో డి. యం. కె. పార్టీ తమ జాతీయతలను ప్రత్యేకమైనవిగా చెప్పుకున్నాయి. అయితే ఈ కాలంలో ఒకే తెగవారే ఒక రాజ్యంలో ఉండటం సాధ్యం కాదు.

AP Inter 1st Year Civics Study Material Chapter 3 జాతీయవాదం

2) ఉమ్మడి మతము (Common Religion) : ఒకే మతస్థుల మధ్య ఐకమత్య భావం ఏర్పడుతుంది. జాతులను సమైక్యపరచడంలో మతం ప్రముఖ పాత్ర వహించింది. అయితే ఆధునిక కాలంలో జాతీయతా భావానికి ఒకే మతం ఉండాలనే నియమం లేదు. ఉదా : 1947లో ముస్లిమ్లలంతా మత ప్రాతిపదికన పాకిస్థాన్ రాజ్యం ఏర్పరచుకున్నారు. అది 1972లో రెండుగా చీలిపోయి బంగ్లాదేశ్ ఏర్పడింది.

3) ఉమ్మడి భాష (Common Language) : ప్రజల మధ్య భావ వ్యక్తీకరణకు, సంప్రదింపులకు భాష అనేది ఒక సాధనం. ఒకే భాషను మాట్లాడే ప్రజలు ఎంతో సులభమైన రీతిలో ఒక జాతిగా రూపొందుతారు. ఉమ్మడి భాష, ఉమ్మడి సాన్నిహిత్యానికి దోహదపడుతుంది. ఒకే రకమైన భావాలు గల వ్యక్తులు సన్నిహితంగా మెలిగేందుకు భాష ముఖ్య సాధనంగా ఉంటుంది. ఉదా : స్విట్జర్లాండ్లో భాషాపరమైన వైవిధ్యాలు గల ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్ జాతులకు చెందిన ప్రజలు నివసిస్తున్నప్పటికీ, వారందరి మధ్య ఉమ్మడి జాతీయత భావాలు నెలకొన్నాయి. అటువంటి పరిస్థితియే కెనడా, ఇండియా వంటి రాజ్యాలలో గోచరిస్తున్నది.

4) భౌగోళిక ఐక్యత (Geographical Unity) : జాతీయత, జాతి భావనలో భౌగోళిక ఐక్యత అనేది మరొక ముఖ్య అంశం. భౌగోళిక ఐక్యత అనేది ప్రకృతిలోనే ఇమిడి ఉంది. ఒక దేశపు సమైక్యతకు భౌగోళిక ఐక్యత చిహ్నంగా ఉంటుంది. అంతేకాకుండా, ఒకే రకమైన వాతావరణ పరిస్థితులలో ప్రజలందరూ కలిసికట్టుగా జీవించేందుకు భౌగోళిక ఐక్యత దోహదపడుతుంది. ఒక నిర్ణీత ప్రదేశంలో నివసించే ప్రజల మనసులు, శరీరాలపై భౌగోళిక ఐక్యత అంశం ప్రకృతి సహజమైన ప్రభావాన్ని చూపుతుంది. అటువంటి ప్రజలు ఒకేరకమైన భావాలతో కూడిన మానసిక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటారు. అయితే భౌగోళిక ఐక్యత ఒక్కటే జాతీయ భావాన్ని పెంపొందిస్తుందని చెప్పలేం.
ఉదా : పాలస్తీనా రాజ్యం ఏర్పాటు జరుగకముందే యూదు జాతికి చెందిన ప్రజలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో శ్రీ నివాస స్థావరాలు ఏర్పరచుకొన్నారు.

5) ఉమ్మడి చరిత్ర (Common History) : జాతీయతాభావ ఆవిర్భావంలో ఉమ్మడి చరిత్రను ఇంకొక | ప్రధాన అంశంగా పరిగణించవచ్చు. ఉమ్మడి చరిత్ర ప్రజానీకంలో ఎంతో ఉత్తేజాన్ని నింపి, వారిని కలిపి ఉంచుతుంది. కొన్నిసార్లు, చారిత్రక సంఘటనలు ప్రజలలో జాతీయతాభావాల వ్యాప్తికి దోహదపడతాయి. ఉదా : బ్రిటిష్ పాలన నుంచి భారతీయులు జాతీయతకు సంబంధించిన అనేక పాఠాలను నేర్చుకున్నారు.

6) ఉమ్మడి సంస్కృతి (Common Culture) : సంస్కృతి అంటే విస్తృతార్థంలో జీవనవిధానం. సంస్కృతి అనేది కొన్ని ఉమ్మడి అంశాలైన దుస్తులు, ఆచారాలు, ఆహారపు అలవాట్లు, మత విశ్వాసాలు, నైతిక విలువలు మొదలైన వాటి ద్వారా వెల్లడించబడుతుంది. ఈ ఉమ్మడి అంశాలు ప్రజలను ఒక త్రాటిపైకి తెచ్చి కలిపి ఉంచుతాయి.

7) ఉమ్మడి రాజకీయ ఆకాంక్షలు (Common Political Aspirations) : ఒక ప్రదేశంలో నివసించే ప్రజలు ఉమ్మడి రాజకీయ ఆర్థిక ఆకాంక్షలచే ప్రేరణ పొందుతారు. అటువంటి ఆకాంక్షలు జాతి అవతరణలో శక్తివంతమైన పాత్రను పోషిస్తాయి. ప్రత్యేక రాజ్యాంగం ఏర్పాటై రాజ్యాన్ని నిర్వహించే సామర్థ్యం గల ప్రజలు తగినంత మంది ఉంటే, అటువంటివారు స్వతంత్ర రాజకీయ వ్యవస్థగా రూపొందాలనే ఆకాంక్షను కలిగి ఉంటారు. విభిన్నమైన అంశాలతో కూడిన ప్రజానీకం కూడా ఉమ్మడి జాతీయతగా ఏర్పడే అవకాశం ఉంటుంది. జర్మనీ, ఇటలీలలోని ఏకీకరణ ఉద్యమాలు, అమెరికా స్వాతంత్య్ర పోరాటం, భారత జాతీయోద్యమాల మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయి. ఇవన్నీ ఆయా దేశాల ప్రజల రాజకీయ ఆకాంక్షలకు ప్రతీకలుగా నిలిచాయి.

ప్రశ్న 2.
జాతి – జాతీయవాదం మధ్య సంబంధాన్ని చర్చించండి.
జవాబు:
ఆధునిక ప్రపంచ వ్యవహారాలలో జాతి, జాతీయవాదం అనేవి చాలా శక్తివంతమైన అంశాలు. ఈ రెండు భావనలు ప్రపంచవ్యాప్తంగా సర్వసత్తాక, సార్వభౌమాధికార రాజ్యవ్యవస్థలు ఏర్పరచుకొనేలా ప్రజలను ఉత్తేజపరిచాయి.

అర్థం : జాతి, జాతీయవాదం అనే ఈ రెండు పదాలు ఒకదానికొకటి పర్యాయపదాలుగా వాడబడతాయి. ఈ రెండు పదాలు లాటిన్ భాషలోని “నేషియో” (Natio) అనే పదం నుండి ఉద్భవించాయి. లాటిన్ భాషలో ఆ పదానికి జన్మతః పుట్టుక అనే అర్థం ఉంది.

జాతి (Nation) : ఈ ఆంగ్ల పదం ‘నేటస్’ (Nates), నేషియో (Natio) అనే లాటిన్ పదాల నుండి గ్రహించబడెను. దీనికి ‘పుట్టుక’ అని అర్థము కలదు. లార్డ్స్ ప్రకారము “స్వాతంత్య్రం పొందిన లేదా స్వాతంత్ర్యం పొందాలని కోరుకుంటూ, రాజకీయంగా వ్యవస్థీకృతమైన ప్రజలనే” జాతి అంటారు. బర్జెస్ ప్రకారం “భౌగోళిక ఐక్యత కలిగి ఉంటూ ఒక నిర్దిష్ట ప్రదేశములో నివసించే తెగకు సంబంధించిన జాతీయతయే జాతి”.

జాతీయవాదం (Nationalism) : జాతీయవాదం ఆధునిక రాజ్యానికి ఒక లక్షణం. ఇది ఒక మానసిక భావన. అంతర్గతంగా తమ హక్కులను పరిరక్షించుకునేందుకు, విదేశీ దండయాత్రల నుండి తమ దేశ స్వాతంత్య్రాన్ని రక్షించుకునేందుకు దేశ ప్రజలలో ఐకమత్యాన్ని ప్రేరేపించే మానసిక శక్తి ‘జాతీయవాదం’. దీనిని సంక్షిప్తంగా ‘ఐకమత్య ‘భావన’ అనవచ్చు. జాతుల స్వతంత్రానికి, దేశ అభివృద్ధికి ఇది అవసరం. కానీ సంకుచిత, మితిమీరిన జాతీయతా భావం హానికరము.

AP Inter 1st Year Civics Study Material Chapter 3 జాతీయవాదం

జాతి, జాతీయవాదం మధ్య సంబంధం :-
1) జాతీయవాదం ఒక మానసిక భావన. ఒక ప్రజా సమూహం స్వతంత్రంగా వేరుపడి, ప్రత్యేక రాజ్యం కలిగి ఉండటం అనే అంశం ఇందులో ఇమిడి ఉంటుంది.

2) ఈ భావం ప్రజలలో బలంగా నాటుకుపోవటంతో ప్రజలు తమ జాతి మనుగడ కోసం వారి సమస్త ప్రయోజనాలను పణంగా పెడతారు.

3) జాతీయత అనేది ప్రజల యొక్క ప్రగాఢమైన ఆకాంక్ష జాతిరాజ్య ఆవిర్భావానికి దోహదపడుటయే జాతీయవాదం.

4) 16వ శతాబ్దంలో ఐరోపాలో ఆవిర్భవించిన సాంస్కృతిక పునరుజ్జీవనం జాతీయవాదానికి బీజాలు వేసింది.

5) 1789లో సంభవించిన ఫ్రెంచ్ విప్లవం జాతీయవాదాన్ని ఐరోపాలో మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్ళింది. దాని నినాదాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఐరోపా జాతీయులలో తీవ్రమైన రాజకీయ చైతన్యాన్ని కలుగజేశాయి.

6) వియన్నా సమావేశం (1815) ఐరోపాలో జాతీయవాదాన్ని మరింత బలపరచింది.

7) ఇటలీ ఏకీకరణ మరియు జర్మనీ ఏకీకరణ జాతీయవాదానికి మరింత బలాన్నిచ్చాయి.

8) 1774లో సంభవించిన అమెరికా స్వాతంత్ర్య యుద్ధం ప్రజలలో జాతీయవాద వ్యాప్తికి బాగా తోడ్పడింది.

9) 1917లో నాటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్ ప్రతిపాదించిన “జాతుల స్వయం నిర్ణయహక్కు” ప్రపంచ ప్రజలలో ప్రతి జాతీయ సముదాయం ఒక ప్రత్యేక రాజ్యంగా ఏర్పడాలనే భావాన్ని బలంగా నాటింది.

10) రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఆసియా, ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికాలలోని దేశాలలో జాతిరాజ్య ఆవిర్భావం కోసం స్వాతంత్ర్యోద్యమాలు ఊపందుకున్నాయి.

11) 1885 నుండి 1947 మధ్య సాగిన భారత జాతీయోద్యమం భారత్, పాకిస్థాన్లు స్వతంత్ర రాజ్యాలుగా ఆవిర్భవించటానికి దోహదం చేసింది.

దీనిని బట్టి మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే జాతీయవాదం అనే భావం ఎప్పుడైతే ఐక్యతను, స్వాతంత్ర్యాన్ని సాధిస్తుందో, అప్పుడు అది సార్వభౌమాధికార జాతిగా రూపొందుతుంది.
కొంతమంది రాజనీతి శాస్త్రవేత్తలు ఈ రెండింటిని పర్యాయపదాలుగా పరిగణించారు.

ప్రశ్న 3.
జాతుల స్వయం నిర్ణయాధికారం డిమాండ్ గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:
ప్రతి జాతీయ సముదాయానికి స్వతంత్రంగా ఉండటానికి, అంటే రాజ్యంగా ఏర్పడటానికి సొంత హక్కు ఉన్నది – ‘అని చెప్పేదే జాతుల స్వయం నిర్ణయాధికార సిద్ధాంతం.
అమెరికా అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్ మొదటి ప్రపంచయుద్ధ కాలంలో తాను ప్రతిపాదించిన 14 అంశాల కార్యక్రమంలో ఈ సిద్ధాంతాన్ని చేర్చాడు. అప్పటి నుంచి –

1) ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో జాతుల స్వయం నిర్ణయాధికార డిమాండ్లు వెలుగులోకి వచ్చాయి. అటువంటి వాటిలో ఒకటి, స్పెయిన్లోని బాస్క్ అనే ప్రాంతం పర్వతాలతో కూడిన సంపన్న ప్రాంతం. ఆ ప్రాంతాన్ని స్పెయిన్ ప్రభుత్వం సమాఖ్య పరిధిలో స్వయంపాలిత ప్రాంతంగా గుర్తించింది. అయితే అటువంటి ఏర్పాటు పట్ల బాస్క్ ప్రాంత ప్రజలు ఏ మాత్రం సంతృప్తి చెందలేదు. తమ ప్రాంతం ప్రత్యేక రాజ్యంగా ఏర్పడాలని వారు గట్టిగా ఆకాంక్షించారు.

2) ప్రపంచ రాజ్యాలలోని ప్రజలు అనేక తెగలు, భిన్న సంస్కృతుల సముదాయాలకు చెందినవారు. ఇటువంటి సముదాయాలలోని ప్రజలు ఎన్నో నష్టాలకు గురి అయ్యామనే భావనను వ్యక్తీకరించారు. దాంతో మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజలకు జాతీయ జీవనస్రవంతిలో భాగస్వామ్యం కల్పించడమనేది విషమసమస్యగా మారింది. అయితే ఇక్కడ ఆసక్తిదాయక అంశం ఏమిటంటే విభిన్న సంస్కృతులకు చెందిన సముదాయాలకు ఆయా రాజ్యాలు రాజకీయ గుర్తింపును ప్రసాదించాయి. దీంతో ఆ సముదాయాలు పాలనలో భాగస్వామ్యం పొందేందుకు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకొనేందుకు ప్రయత్నించసాగాయి.

3) జాతీయ స్వయం నిర్ణయాధికార సిద్ధాంతం ఆసియా, ఆఫ్రికాలో జాతీయ విముక్తి పోరాటాలకు మద్దతు పలికింది. వలసప్రాంతాల ప్రజలు తమకు తగిన హోదా, గుర్తింపులు లభించాలనే హామీకై పట్టుబట్టారు. తమ సమిష్టి ప్రయోజనాల పరిరక్షణకై ఈ ఉద్యమాలు ప్రజలకు అండగా నిలిచాయి. జాతి ఔన్నత్యం, న్యాయసాధన అనే లక్ష్యాల సాధనకై అనేక జాతీయ ఉద్యమాలు నిర్వహించబడ్డాయి.

AP Inter 1st Year Civics Study Material Chapter 3 జాతీయవాదం

4) అయినప్పటికి ప్రతి సాంస్కృతిక సముదాయం ప్రత్యేక జాతిగా రూపొందాలనే ఆకాంక్షను వ్యక్తీకరిస్తూ రాజకీయ స్వాతంత్ర్యం, రాజత్వం పొందేటందుకు ప్రయత్నించటం సాధ్యంకాదని తేలిపోయింది. ఫలితంగా ప్రజలు వలస వెళ్ళడం, సరిహద్దుల్లో యుద్ధాలు, హింస అనేవి అనేక దేశాలలో సర్వసాధారణమయ్యాయి. దాంతో అనేక జాతి రాజ్యాలలో విచిత్రమైన ప్రత్యేక పరిస్థితులు తలెత్తాయి. జాతుల స్వయం నిర్ణయాధికారాన్ని కోరుతూ తమ భూభాగాలలో ఉద్యమాలు చేసి స్వాతంత్ర్యాలను సాధించిన దేశాలు, నేడు తమ దేశాలలోని మైనారిటీ వర్గాలకు వ్యతిరేకంగా ప్రవర్తించటాన్ని జాతీయ స్వయం నిర్ణయాధికారంగా ప్రకటించుకోవటం విడ్డూరంగా ఉంది.

ప్రశ్న 4.
భారతదేశం జాతిరాజ్యమా ? అనే విషయం గురించి సంగ్రహంగా వివరించండి.
జవాబు:
పాశ్చాత్య, ప్రాచ్య దేశాల రచయితలలో అనేకమంది భారతదేశాన్ని జాతిరాజ్యంగా వర్ణించారు. భారతదేశం జాతిరాజ్యం అని సమర్థించేందుకు అనేక బలమైన కారణాలు ఉన్నాయి. వాటిని ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు.
1) భారతీయులకు ఉమ్మడి చరిత్ర, సంస్కృతి ఉన్నాయి. అనేక సందర్భాలలో భారతీయులు జాతీయ సమైక్యతకు సంబంధించిన ప్రత్యేక లక్షణాలను ప్రదర్శించారు. చైనా, పాకిస్థాన్లు ఇండియాను ఆక్రమించిన సందర్భాలలో భారత ప్రభుత్వానికి ప్రజల నుండి సంపూర్ణ మద్దతు లభించింది.

2) భారతదేశ స్వాతంత్ర్య సాధనలో భారతీయులు అసమానమైన, అత్యున్నతమైన త్యాగాలను చేశారు. మహాత్మాగాంధీ నాయకత్వంలో విదేశీ పాలనకు వ్యతిరేకంగా ఎన్నో బాధలకు, దోపిడీలకు ఓర్చి ఉద్యమాలు చేశారు. బ్రిటిష్ ప్రభుత్వహయాంలో ఎన్నో అసౌకర్యాలకు లోనైన భారతీయులు మానసిక ఐక్యతను సాధించేందుకు కృషి చేశారు. అంతిమంగా వారి ప్రయత్నాలు ఫలించాయి.

3) భారతదేశంలో నెలకొన్న మిశ్రమ సంస్కృతి, ఆచార సాంప్రదాయాలు ప్రజలలో జాతీయభావాల పటిష్టతకు దోహదపడ్డాయి. అలాగే భారతమాత పట్ల నిబిడీకృతమైన భక్తిశ్రద్ధలు పెరిగి అంతిమంగా అది రాజకీయ ఆదర్శాల సాధనకు దోహదపడినాయి.

4) అనాదిగా భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రసిద్ధిగాంచింది. వివిధ రాష్ట్రాలలో నివసిస్తున్నప్పటికీ తామంతా మొదట భారతీయులమనే విషయాన్ని దేశ ప్రజలు గ్రహించారు. ఆ తరువాత తమ భాష, ప్రాంతాల పట్ల ఎంతో మమకారాన్ని పెంచుకొని ప్రకృతి ఉపద్రవాలు, రాజకీయ సంక్షోభాలు సంభవించినప్పుడు వారు ఒక త్రాటిపై నిలిచి ఐకమత్యంతో వ్యవహరించారు.

5) కన్నతల్లి, జన్మభూమి అనేవి స్వర్గం కంటే గొప్పవని భారతీయులు విశ్వసించారు. భారతదేశ చరిత్ర వారిని ఎంతగానో ఉత్తేజితులను గావించింది. జాతీయ వారసత్వం, సంస్కృతి, రాజ్యాంగం, ప్రభుత్వం వంటి ఉమ్మడి మౌలిక అంశాలు భారతీయులలో జాతీయభావాలను ప్రోగుచేసి జాతీయసమైక్యతను పెంపొందించాయి.

భారతజాతి విశిష్టత : ఒక జాతిగా భారతదేశం ఎన్ని ఒడుదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ రాజ్యాంగం, పండుగలు, జాతీయ వేడుకలు, ఉమ్మడి ఆశయాలు వంటి అంశాల ప్రభావం వల్ల భారతీయులు ఎంతగానో స్ఫూర్తిని పొందుతున్నారు. సువిశాలమైన భారతదేశంలో సుసంపన్నమైన భారతీయ సంస్కృతిని పెంపొందించుకొంటూ, ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రరాజ్యాలకు ధీటుగా ఒక శక్తివంతమైన రాజ్యంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. కాబట్టి భారతదేశాన్ని జాతిరాజ్యంగా పరిగణించవచ్చు.

AP Inter 1st Year Civics Study Material Chapter 3 జాతీయవాదం

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జాతీయత మౌలిక అంశాలను క్లుప్తంగా వివరించండి.
జవాబు:
జాతీయత లక్షణాలు :
1) స్వచ్ఛమైన తెగ (Purity of Race) : దీనిని ఏకజాతి లేదా వారసత్వము అనవచ్చు. ఒకే తెగ మనుషుల మధ్య రక్తసంబంధం ఉంటుంది. ఒకే సంతతికి చెందినవారమనే భావంతో ఒకే తెగ ప్రజలు ఐకమత్యభావంతో ఉంటారు. అది దృఢమైన జాతీయత, జాతిని పెంపొందిస్తుంది. ఉదా : హిట్లర్ కాలంలో జర్మనులు, తమిళనాడులో డి. యం. కె. పార్టీ తమ జాతీయతలను ప్రత్యేకమైనవిగా చెప్పుకున్నాయి. అయితే ఈ కాలంలో ఒకే తెగవారే ఒక రాజ్యంలో ఉండటం సాధ్యం కాదు.

2) ఉమ్మడి మతము (Common Religion) : ఒకే మతస్థుల మధ్య ఐకమత్య భావం ఏర్పడుతుంది. జాతులను సమైక్యపరచడంలో మతం ప్రముఖ పాత్ర వహించింది. అయితే ఆధునిక కాలంలో జాతీయతా భావానికి ఒకే మతం ఉండాలనే నియమం లేదు. ఉదా : 1947లో ముస్లిమ్లంతా మత ప్రాతిపదికన పాకిస్థాన్ రాజ్యం ఏర్పరచుకున్నారు. అది 1972లో రెండుగా చీలిపోయి బంగ్లాదేశ్ ఏర్పడింది.

3) ఉమ్మడి భాష (Common Language) : ప్రజల మధ్య భావ వ్యక్తీకరణకు, సంప్రదింపులకు భాష అనేది ఒక సాధనం. ఒకే భాషను మాట్లాడే ప్రజలు ఎంతో సులభమైన రీతిలో ఒక జాతిగా రూపొందుతారు. ఉమ్మడి భాష, ఉమ్మడి సాన్నిహిత్యానికి దోహదపడుతుంది. ఒకే రకమైన భావాలు గల వ్యక్తులు సన్నిహితంగా మెలిగేందుకు భాష ముఖ్య సాధనంగా ఉంటుంది. ఉదా : స్విట్జర్లాండ్లో భాషాపరమైన వైవిధ్యాలు గల ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్ జాతులకు చెందిన ప్రజలు నివసిస్తున్నప్పటికీ, వారందరి మధ్య ఉమ్మడి జాతీయత భావాలు నెలకొన్నాయి. అటువంటి పరిస్థితియే కెనడా, ఇండియా వంటి రాజ్యాలలో గోచరిస్తున్నది.

4) భౌగోళిక ఐక్యత (Geographical Unity) : జాతీయత, జాతి భావనలో భౌగోళిక ఐక్యత అనేది మరొక ముఖ్య అంశం. భౌగోళిక ఐక్యత అనేది ప్రకృతిలోనే ఇమిడి ఉంది. ఒక దేశపు సమైక్యతకు భౌగోళిక ఐక్యత చిహ్నంగా ఉంటుంది. అంతేకాకుండా, ఒకే రకమైన వాతావరణ పరిస్థితులలో ప్రజలందరూ కలిసికట్టుగా జీవించేందుకు భౌగోళిక ఐక్యత దోహదపడుతుంది. ఒక నిర్ణీత ప్రదేశంలో నివసించే ప్రజల మనసులు, శరీరాలపై భౌగోళిక ఐక్యత అంశం ప్రకృతి సహజమైన ప్రభావాన్ని చూపుతుంది. అటువంటి ప్రజలు ఒకేరకమైన భావాలతో కూడిన మానసిక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటారు. అయితే భౌగోళిక ఐక్యత ఒక్కటే జాతీయ భావాన్ని పెంపొందిస్తుందని చెప్పలేం. ఉదా : పాలస్తీనా రాజ్యం ఏర్పాటు జరుగకముందే యూదు జాతికి చెందిన ప్రజలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో నివాస స్థావరాలు ఏర్పరచుకొన్నారు.

ప్రశ్న 2.
జాతి, రాజ్యం ఏ విధంగా వ్యత్యాసాలను కలిగి ఉంటాయి ?
జవాబు:
జాతి, రాజ్యం ఒక్కటే అన్న భావాన్ని చాలామంది వ్యక్తపరిచారు. హేస్ అనే శాస్త్రజ్ఞుడి దృష్టిలో రాజకీయ ఐక్యత, సార్వభౌమత్వంతో కూడిన స్వాతంత్ర్యాన్ని పొందిన ఒక జాతీయ సముదాయం జాతి అవుతుంది. అలా ఏర్పడిన జాతినే జాతిరాజ్యం లేదా జాతీయరాజ్యం అని అనవచ్చునని హేస్ పేర్కొన్నాడు. అందువలన జాతి, రాజ్యం రెండు సమానార్థకాలుగా భావించవచ్చు. ఐక్యరాజ్యసమితి అనే అంతర్జాతీయ సంస్థను ఇంగ్లీషులో United Nations Organisation అంటారు. ఇక్కడ జాతి (Nation) అనే పదానికి రాజ్యం అనే అర్థం.

జాతి : లార్డ్ బ్రైస్ ప్రకారం, “స్వాతంత్య్రం పొందిన లేదా స్వాతంత్య్రం పొందాలని కోరుకుంటూ, రాజకీయంగా వ్యవస్థీకృతమైన ప్రజలే జాతి”.
రాజ్యం : ఉడ్రోవిల్సన్ ప్రకారం, “నిర్ణీత భూభాగంలో శాసనబద్ధులై నివసించే ప్రజలే రాజ్యం”.

AP Inter 1st Year Civics Study Material Chapter 3 జాతీయవాదం

జాతి, రాజ్యం మధ్య వ్యత్యాసాలు (Differences between Nation and State) :

జాతి (Nation)

  1. జాతి అనేది స్వతంత్ర రాజకీయ సముదాయం లేదా ఒకానొక బహుళజాతి రాజ్యంలో అంతర్భాగమైందిగా పరిగణించవచ్చు.
  2. రాజ్యం కంటే జాతి ముందుగా ఆవిర్భవించింది.
  3. ఒకే రకమైన మానసిక భావాలను కలిగి ఉమ్మడి లక్ష్యంతో నివసించే ప్రజా సముదాయమే జాతి.
  4. జాతి అనేది చారిత్రక, సాంస్కృతిక పరిణామాన్ని కలిగి ఉంటుంది.
  5. జాతి అనే భావన సుదీర్ఘకాలం పాటు జీవనం సాగించిన ప్రజలతో కూడిన సముదాయం.

రాజ్యం (State)

  1. రాజ్యం ఒక జాతి లేదా అనేక జాతుల ప్రజా సముదాయాన్ని కలిగి ఉండవచ్చు.
  2. రాజ్యం జాతి తరువాత ఉద్భవించింది. రాజ్యత్వ హోదాను కలిగి ఉండటమే జాతి అంతిమ లక్షణంగా పేర్కొనవచ్చు.
  3. ఒక నిర్దిష్ట ప్రదేశంలో శాసనబద్ధులైన ప్రజా సముదాయమే రాజ్యం.
  4. రాజ్యమనేది ఒకే రకమైన రాజకీయ, చట్టబద్ధమైన నిర్మితిని కలిగి ఉంటుంది.
  5. రాజ్యం పరిణామాత్మక స్వభావాన్ని కలిగి ఉండక పోవచ్చు. స్వాతంత్ర్యం గల కొన్ని చిన్న రాజకీయ సమాజాలు లేదా విభజన కారణంగా ఏర్పడిన రాజకీయ సమాజాల ఏకీకరణ ఫలితంగా రాజ్యం ఏర్పడుతుంది.

ప్రశ్న 3.
జాతీయవాదంలోని వివిధ దశలను వర్ణించండి.
జవాబు:
జాతీయవాదం అనే భావన ప్రపంచ వ్యవహారాలలో కీలకపాత్ర పోషించినది. గత రెండు శతాబ్దాలుగా జాతీయవాదం అత్యంత ప్రాముఖ్యత గల రాజకీయ సిద్ధాంతంగా ప్రాచుర్యం పొంది ప్రపంచ చరిత్రలో కీలక అంశంగా పరిణమించింది.

జాతీయవాదం (Nationalism) : జాతీయవాదం ఆధునిక రాజ్యానికి ఒక లక్షణం. ఇది ఒక మానసిక భావన. అంతర్గతంగా తమ హక్కులను పరిరక్షించుకునేందుకు, విదేశీ దండయాత్రల నుండి తమ దేశ స్వాతంత్ర్యాన్ని రక్షించుకునేందుకు దేశ ప్రజలలో ఐకమత్యాన్ని ప్రేరేపించే మానసిక శక్తి ‘జాతీయతావాదం’. దీనిని సంక్షిప్తంగా ‘ఐకమత్య భావన’ అనవచ్చు. జాతుల స్వతంత్రానికి, దేశ అభివృద్ధికి ఇది అవసరం. కానీ సంకుచిత, మితిమీరిన జాతీయతా భావం హానికరము.

జాతీయవాదం వివిధ దశలు (Different Phases of Nationalism) : జాతీయవాదాన్ని కాలానుగుణంగా, దేశాల వారీగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. హేయస్ (Hayes) అనే రచయిత ప్రకారం జాతీయవాదంలో ఐదు దశలు ఉన్నాయి. అవి :

  1. మానవతావాద దశ
  2. సాంప్రదాయక దశ
  3. సమీకృత దశ
  4. అధికారధిక్కారవాద దశ (జాకోబియన్ దశ)
  5. ఉదారవాద దశ

మొదటి నాలుగు దశలు 18, 19వ శతాబ్దాలలో సంభవించాయి. ఫ్రెంచ్ విప్లవం దాని పర్యవసానాలు ఐదోదశలో సంభవించాయి. ఈ దశలో సమీకృత జాతీయవాదం ఆవిర్భవించింది. నాలుగో దశ సంపూర్ణాధికారవాద రాజ్య లక్షణాలతో పాటు ప్రజాస్వామ్య రాజ్య విధానాలను అవలంబించినదిగా చెప్పవచ్చు.

జాతీయవాదం గురించి స్నైడర్ చేసిన పరిశీలనలు ఎంతో ఆసక్తిదాయకంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇతని అభిప్రాయం ప్రకారం జాతీయవాదంలో నాలుగు దశలు ఉన్నాయి. వాటిని కింది విధంగా తెలపవచ్చు.
1) సమీకృత జాతీయవాదం (Integrative Nationalism – 1815 – 1871) : ఈ దశలో జాతీయవాదం అనేది సమైక్యతాశక్తిగా పరిణమించి, అది ఇటలీ, జర్మనీల ఏకీకరణలో ప్రస్ఫుటంగా గోచరించింది.

2) విధ్వంసకర జాతీయవాదం (Disruptive Nationalism – 1871 – 1890) : ఈ దశలో ఆస్ట్రియా – హంగేరీలకు చెందిన జాతీయతా ప్రజా సముదాయాలు, ఇతర బహుళజాతి రాజ్యాల ప్రజలు స్వాతంత్ర్యం కోసం విశేషంగా కృషి చేయడమైంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 3 జాతీయవాదం

3) తీవ్రవాద జాతీయవాదం (Aggressive Nationalism – 1890 – 1945): ఈ దశలో జాతీయవాదాన్ని తీవ్రమైన సామ్రాజ్యవాదంతో సమానమైన భావనగా గుర్తించడమైంది. దాంతో రెండు ప్రపంచయుద్ధాల రూపంలో జాతీయ ప్రయోజనాలకై తీవ్రమైన ఘర్షణలు ఏర్పడినాయి.

4) సమకాలీన జాతీయవాదం (Contemporary Nationalism – 1945 తరువాత) : ఈ దశ ప్రారంభంలో రాజకీయ జాతీయవాదం అనేది ఐరోపా దేశాల అధినేతలపై తిరుగుబాట్ల రూపంలో పెల్లుబికి పూర్వపు సోవియట్ యూనియన్ ఆధ్వర్యాన స్టాలిన్ కమ్యూనిస్టు తరహా ఉద్యమం జరిగింది. అప్పటి నుంచి జాతీయవాదంలో తీవ్రమైన ధోరణులు చోటుచేసుకున్నాయి. పాశ్చాత్యదేశాల అంతర్జాతీయ రాజకీయాలకు ఈ దశలో ఊతం లభించింది. ఆసియా, ఆఫ్రికా ఖండాలలో కొత్తగా స్వాతంత్య్రం పొందిన అనేక దేశాలపై జాతీయవాదం విశిష్టమైన ప్రభావాన్ని చూపింది. అంతర్జాతీయ కమ్యూనిజంతో జాతీయవాదం అనుసంధానమైంది.

ప్రశ్న 4.
జాతి, జాతీయతల ప్రాముఖ్యతను పేర్కొనండి.
జవాబు:
జాతి, జాతీయత అనేవి పర్యాయపదాలుగా వాడబడుతున్నాయి. ఈ రెండు పదాలు లాటిన్ భాషలోని “నేషియో” (Natio) అనే పదం నుండి ఉద్భవించాయి. లాటిన్ భాషలో ఆ పదానికి జన్మతః పుట్టుక అనే అర్థం ఉంది.

జాతి అనే పదం రాజకీయ సంస్థను సూచిస్తుండగా, జాతీయత అనేది ఆధ్యాత్మిక, మానసిక సంబంధమైన విశ్వాసంగా పేర్కొనవచ్చు.

జాతి (Nation) : జాతిని ఆంగ్లంలో (Nation) ‘నేషన్’ అంటారు. ఈ ఆంగ్ల పదం ‘నేటస్’ (Nates), నేషియో (Natio) అనే లాటిన్ పదాల నుండి గ్రహించబడెను. దీనికి ‘పుట్టుక’ అని అర్థము కలదు. లార్డ్స్ ప్రకారం “స్వాతంత్య్రం పొందిన లేదా స్వాతంత్య్రం పొందాలని కోరుకుంటూ, రాజకీయంగా వ్యవస్థీకృతమైన ప్రజలనే” జాతి అంటారు. బర్జెస్ ప్రకారం “భౌగోళిక ఐక్యత కలిగిఉంటూ ఒక నిర్దిష్ట ప్రదేశంలో నివసించే తెగకు సంబంధించిన జాతీయతయే జాతి”.

జాతీయత (Nationality) : జాతీయతను ఆంగ్లంలో ‘నేషనాలిటీ’ అంటారు. ఇది (Natio) ‘నేషియో’ అనే లాటిన్ పదం నుంచి గ్రహించబడింది. దీనికి ‘పుట్టుక’ అని అర్థము. ఒక రాజకీయ వ్యవస్థగా రూపొందే జాతీయత జాతి అనబడుతుంది. అంటే రాజ్యము, జాతీయతల కలయిక జాతి అవుతుంది. “ఒకే రక్తసంబంధం, ఒకే భాష, సాహిత్యం, సంప్రదాయాలు, ఉండి కొన్ని కట్టుబాట్లకులోనై ఉన్న జనసమూహం” జాతీయత అని లార్డ్ బ్రైస్ నిర్వచించాడు.

జాతి, జాతీయతల ప్రాముఖ్యత (Importance of Nation and Nationality) : అనేక ఆధునిక రాజకీయ వ్యవస్థలకు జాతి, జాతీయతా భావనలు పటిష్టమైన పునాదులను వేశాయి. ఒక నిర్ణీత ప్రదేశానికి చెందిన ప్రజలలో ఈ రెండు భావనలు ఐక్యత, సౌభ్రాతృత్వం, సమైక్యతలను పెంపొందించాయి. జాతీయత, జాతీయవాదం తమ రాజ్యాలను నిర్మించుకోవడంలోనూ, స్వీయ ఆర్థిక ఔన్నత్యాన్ని తీర్చిదిద్దుకోవడంలోనూ ఈ రెండు భావనలు తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. వాస్తవానికి ఈ రెండు భావనలు అనేక ఆధునిక రాజ్యాలలో ప్రజల మధ్య ఐక్యత భావాల వ్యాప్తిలో కీలక పాత్రను పోషించాయి. కుటుంబ సభ్యులపట్ల ప్రేమానురాగాలు, జాతిపట్ల విశ్వాసం, ఇరుగుపొరుగు వారిపట్ల సహకార భావం మొదలైనవి ఆయా దేశాల ప్రజలలో జాతి, జాతీయతలు అనే భావనలచే పెంపొందాయని చెప్పవచ్చు. ఆధునిక రాజ్యాల నిర్మాణం, మనుగడ అనేవి చాలావరకు పైన పేర్కొన్న అంశాల ప్రేరణతో కూడిఉన్నాయని చెప్పవచ్చు.

జాతి, జాతీయత అనే రెండు భావనలు ఒకే రకమైన ఆవిర్భావాన్ని కలిగి ఉన్నాయి. ఈ రెండు భావనలకు అర్థం ఒక్కటే. ఈ సందర్భంలో లార్డ్ బ్రైస్, హేయస్ వంటి రాజనీతిశాస్త్ర రచయితలు రాజకీయంగా స్వాతంత్ర్యాన్ని సాధించిన ప్రజలే జాతిగా రూపొందుతారని వర్ణించారు. ప్రజలలో జాతీయపరమైన విశ్వాసాలు ఉంటే వారు జాతిగా రూపొందుతారు. ఉమ్మడి అవగాహన ప్రాతిపదికగా సజాతీయ సంస్థగా ప్రజలు ఏర్పడటం ద్వారా జాతి, జాతీయత అనే రెండు భావనలు ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి.

జాతి, జాతీయత అనే భావాల ప్రభావం వల్ల రాజ్యం అవతరిస్తుంది. ఐరోపాలోని అనేక దేశాల ప్రజలు నియంతృత్వపు కోరలలో చిక్కుకొన్న సమయంలో, జాతీయత భావాలు వారిని విశేషంగా ప్రభావితం చేశాయి. ఆయా దేశాల చక్రవర్తుల కబంధహస్తాల నుంచి విముక్తి పొంది, స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకొనే దిశగా ప్రజలలో జాతి, జాతీయత భావనలు ప్రేరణ కలిగించాయి. అంతేకాకుండా తమ భాష, మతం, ఆచారాల పట్ల ప్రజలలో ప్రగాఢమైన ప్రేమ, అభిమానం, గౌరవాలను అవి పెంపొందించాయి. స్వీయ సంస్కృతులను సంరక్షించుకొనేందుకు ప్రజలను ప్రోత్సహించాయి. కాబట్టి జాతి, జాతీయత భావనలు ప్రజలలో ఐక్యత, అవగాహనలను పెంపొందించే దిశలో కీలక పాత్ర వహించాయని చెప్పవచ్చు.

ప్రశ్న 5.
జాతి, జాతీయతల మధ్య వ్యత్యాసాలు ఏవి ? [Mar. ’18]
జవాబు:
జాతి, జాతీయతల మధ్య కింద అంశాలలో వ్యత్యాసాలు ఉన్నాయి.
జాతి (Nation)

  1. జాతి అనేది రాజకీయ భావన.
  2. జాతి అనేది ఎల్లప్పుడూ రాజకీయంగా సంఘటితమైన రాజ్యాన్ని సూచిస్తుంది.
  3. జాతి అనే భావన ఎల్లప్పుడూ స్వతంత్రతను కలిగి ఉంటుంది.
  4. జాతీయత లేకుండా జాతి అనేది ఉండదు.
  5. జాతిగా ఏర్పడిన ప్రజలు రాజ్య శాసనాలకు విధేయులుగా ఉంటారు.

జాతీయత (Nationality)

  1. జాతీయత అనేది మానసిక భావన.
  2. జాతీయత అనేది ఎల్లప్పుడూ అసంఘటితమైన, అతి సులభమైన భావన.
  3. జాతీయత అనే భావన స్వతంత్రతను కలిగి ఉండదు.
  4. జాతి లేకుండా జాతీయత ఉంటుంది.
  5. జాతీయతగల ప్రజలు జాతిగా రూపొందేవరకు, రాజ్యాంగ చట్టాలు ఉండవు. అయితే స్వీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రజలు కొన్ని ఉమ్మడి నియమాలను అనుసరిస్తారు.

AP Inter 1st Year Civics Study Material Chapter 3 జాతీయవాదం

ప్రశ్న 6.
జాతుల స్వయం నిర్ణయాధికారం గురించి రాయండి.
జవాబు:
ప్రతి జాతీయ సముదాయానికి స్వతంత్రంగా ఉండటానికి, అంటే రాజ్యంగా ఏర్పడటానికి సొంతహక్కు ఉన్నది. అని చెప్పేదే జాతి స్వయం నిర్ణయాధికార సిద్ధాంతం. వియన్నా కాంగ్రెసు (1815) కాలం నుంచి 19వ శతాబ్దం చివరి వరకు ‘ఒకే జాతీయ సముదాయం ఒకే జాతి రాజ్యం’ అనే సిద్ధాంతం యూరప్ రాజకీయాలను ప్రభావితం చేస్తూ వచ్చింది. ఈ సిద్ధాంతాన్ని కారల్మార్క్స్, ఏంజల్స్, లెనిన్ మొదలగువారు బలపరిచారు. అలాగే అమెరికా అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్ మొదటి ప్రపంచ యుద్ధకాలంలో తాను ప్రతిపాదించిన ’14 అంశాల కార్యక్రమంలో ఈ సిద్ధాంతాన్ని చేర్చాడు. 1945లో స్థాపించబడిన ఐక్యరాజ్యసమితి రాజ్యాంగం ఈ సిద్ధాంతానికి మరింత బలాన్ని చేకూర్చింది. ధర్మకర్తృత్వ మండలి ఉద్దేశ్యం జాతీయ సముదాయాలకు క్రమంగా స్వయం పాలన కలుగజేయటమే. ఒక్కోక్క జాతీయ సముదాయం ఒక్కొక్క జాతీయ రాజ్యంగా అవతరించినందువల్ల పెక్కు ప్రయోజనాలు ఉన్నమాట నిజమే. అయితే దానివలన కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ భావాన్ని ఖండిస్తూ దానిని మొత్తం ప్రజల వ్యవస్థీకృతమైన స్వార్థ ప్రయోజనంగా (Organised self interest of whole people) అభివర్ణించాడు. ఆధునిక కాలంలో జాతీయ భావం ఒక మత భావనకు దారితీస్తున్నదని షిలిటో (Schillito) హెచ్చరించాడు. లార్డ్ యాక్టన్ అభిప్రాయంలో ఏకజాతి రాజ్యం కన్నా బహుళ జాతిరాజ్యమే అన్ని విధాల మెరుగైనది.

ప్రశ్న 7.
భారతదేశం జాతిరాజ్యమా ? వివరించండి. [Mar. ’17, ’16]
జవాబు:
పాశ్చాత్య, ప్రాచ్య దేశాల రచయితలలో అనేకమంది భారతదేశాన్ని జాతిరాజ్యంగా వర్ణించారు. భారతదేశం జాతిరాజ్యం అని సమర్థించేందుకు అనేక బలమైన కారణాలు ఉన్నాయి. వాటిని ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు.

1) భారతీయులకు ఉమ్మడి చరిత్ర, సంస్కృతి ఉన్నాయి. అనేక సందర్భాలలో భారతీయులు జాతీయ సమైక్యతకు సంబంధించిన ప్రత్యేక లక్షణాలను ప్రదర్శించారు. చైనా, పాకిస్థాన్లు ఇండియాను ఆక్రమించిన సందర్భాలలో భారత ప్రభుత్వానికి ప్రజల నుండి సంపూర్ణ మద్దతు లభించింది.

2) భారతదేశ స్వాతంత్ర్య సాధనలో భారతీయులు అసమానమైన, అత్యున్నతమైన త్యాగాలను చేశారు. మహాత్మాగాంధీ నాయకత్వంలో విదేశీ పాలనకు వ్యతిరేకంగా ఎన్నో బాధలకు, దోపిడీలకు ఓర్చి ఉద్యమాలు చేశారు. |బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో ఎన్నో అసౌకర్యాలకు లోనైన భారతీయులు మానసిక ఐక్యతను సాధించేందుకు కృషి చేశారు. అంతిమంగా వారి ప్రయత్నాలు ఫలించాయి.

3) భారతదేశంలో నెలకొన్న మిశ్రమ సంస్కృతి, ఆచార సాంప్రదాయాలు ప్రజలలో జాతీయభావాల పటిష్టతకు దోహదపడ్డాయి. అలాగే భారతమాత పట్ల నిబిడీకృతమైన భక్తిశ్రద్ధలు పెరిగి అంతిమంగా అది రాజకీయ ఆదర్శాల సాధనకు దోహదపడినాయి.

4) అనాదిగా భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రసిద్ధిగాంచింది. వివిధ రాష్ట్రాలలో నివసిస్తున్నప్పటికీ తామంతా మొదట భారతీయులమనే విషయాన్ని దేశ ప్రజలు గ్రహించారు. ఆ తరువాత తమ భాష, ప్రాంతాల పట్ల ఎంతో మమకారాన్ని పెంచుకొని ప్రకృతి ఉపద్రవాలు, రాజకీయ సంక్షోభాలు సంభవించినప్పుడు వారు ఒక త్రాటిపై నిలిచి ఐకమత్యంతో వ్యవహరించారు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జాతీయత అంటే ఏమిటి ?
జవాబు:
జాతీయతను ఆంగ్లంలో ‘నేషనాలిటీ’ (Nationality) అంటారు. ఇది (Natio) ‘నేషియో’ అనే లాటిన్ పదం నుంచి గ్రహించబడింది. దీనికి “పుట్టుక” అని అర్థము. ఒక రాజకీయ వ్యవస్థగా రూపొందే జాతీయత జాతి అనబడుతుంది. అంటే రాజ్యము, జాతీయతల కలయిక జాతి అవుతుంది. “ఒకే రక్త సంబంధం, ఒకే భాష, సాహిత్యం, సంప్రదాయాలు, ఉండి కొన్ని కట్టుబాట్లకులోనై ఉన్న జనసమూహం” జాతీయత అని ‘లార్డ్ బ్రైస్’ నిర్వచించాడు.

AP Inter 1st Year Civics Study Material Chapter 3 జాతీయవాదం

ప్రశ్న 2.
జాతిని నిర్వచించండి.
జవాబు:
జాతిని ఆంగ్లంలో (Nation) ‘నేషన్’ అంటారు. ఈ ఆంగ్ల పదం ‘నేటస్’ (Nates), నేషియో (Natio) అనే లాటిన్ పదాల నుండి గ్రహించబడెను. దీనికి ‘పుట్టుక’ అని అర్థము కలదు. లార్డ్స్ ప్రకారము “స్వాతంత్ర్యం పొందిన లేదా స్వాతంత్ర్యం పొందాలని కోరుకుంటూ, రాజకీయంగా వ్యవస్థీకృతమైన ప్రజలనే” జాతి అంటారు. బడ్జెస్ ప్రకారం “భౌగోళిక ఐక్యత కలిగిఉంటూ ఒక నిర్దిష్ట ప్రదేశంలో నివసించే తెగకు సంబంధించిన జాతీయతయే జాతి”.

ప్రశ్న 3.
జాతి – రాజ్యాల మధ్య రెండు వ్యత్యాసాలను రాయండి.
జవాబు:
జాతి (Nation)

  1. జాతి అనేది స్వతంత్ర రాజకీయ సముదాయం లేదా ఒకానొక బహుళజాతి రాజ్యంలో అంతర్భాగం అయినదిగా పరిగణించవచ్చు.
  2. రాజ్యం కంటే జాతి ముందుగా ఆవిర్భవించింది.

రాజ్యం (State)

  1. రాజ్యం ఒక జాతి లేదా అనేక జాతుల ప్రజా సముదాయాన్ని కలిగి ఉండవచ్చు.
  2. రాజ్యం జాతి తరువాత ఉద్భవించింది. రాజ్యత్వ హోదాను కలిగి ఉండటమే జాతి అంతిమ లక్షణంగా పేర్కొనవచ్చు.

ప్రశ్న 4.
జాతీయతకు గల రెండు అర్థాలను పేర్కొనండి.
జవాబు:

  1. జాతీయత అనేది ఒక రాజ్యంలో పౌరుల చట్టబద్ధమైన హోదాలకు సంబంధించినది. పౌరులహోదా జాతీయతను సూచిస్తుంది.
  2. ఒక నిర్ణీతమైన దేశంలో వ్యక్తుల సముదాయానికి గల ప్రత్యేక గుర్తింపుకు జాతీయత చిహ్నంగా ఉంటుంది.

ప్రశ్న 5.
జాతీయత మౌలిక అంశాలలో రెండింటిని తెలపండి.
జవాబు:
జాతీయత లక్షణాలు :
1) స్వచ్ఛమైన తెగ (Purity of Race) : దీనిని ఏకజాతి లేదా వారసత్వము అనవచ్చు. ఒకే తెగ మనుషుల మధ్య రక్తసంబంధం ఉంటుంది. ఒకే సంతతికి చెందినవారమనే భావంతో ఒకే తెగ ప్రజలు ఐకమత్యభావంతో ఉంటారు. అది దృఢమైన జాతీయత, జాతిని పెంపొందిస్తుంది. ఉదా : హిట్లర్ కాలంలో జర్మనులు, తమిళనాడులో డి. యం. కె. పార్టీ తమ జాతీయతలను ప్రత్యేకమైనవిగా చెప్పుకున్నాయి. అయితే ఈ కాలంలో ఒకే తెగవారే ఒక రాజ్యంలో ఉండటం సాధ్యం కాదు.

2) ఉమ్మడి మతము (Common Religion) : ఒకే మతస్థుల మధ్య ఐకమత్య భావం ఏర్పడుతుంది. జాతులను సమైక్యపరచడంలో మతం ప్రముఖ పాత్ర వహించింది. అయితే ఆధునిక కాలంలో జాతీయతా భావానికి ఒకే మతం ఉండాలనే నియమం లేదు. ఉదా : 1947లో ముస్లిమ్లంతా మత ప్రాతిపదికన పాకిస్థాన్ రాజ్యం ఏర్పరచుకున్నారు. అది 1972లో రెండుగా చీలిపోయి బంగ్లాదేశ్ ఏర్పడింది.

AP Inter 1st Year Civics Study Material Chapter 3 జాతీయవాదం

ప్రశ్న 6.
జాతీయవాదం ప్రాముఖ్యత ఏమిటి ?
జవాబు:
జాతీయవాదాన్ని సూక్ష్మంగా పరిశీలించినచో ప్రపంచ వ్యవహారాలలో ఈ భావన కీలకపాత్ర పోషించినదని చెప్పవచ్చు. గత రెండు శతాబ్దాలుగా జాతీయవాదం అత్యంత ప్రాముఖ్యత గల రాజకీయ సిద్ధాంతంగా ప్రాచుర్యం పొంది ప్రపంచ చరిత్రలో కీలక అంశంగా పరిణమించింది. అయితే జాతీయవాదం ఒకవైపు ప్రపంచ ప్రజలను | ప్రభావితం చేయగా మరొకవైపు ప్రపంచ ప్రజానీకం మధ్య విద్వేషాలను కూడా సృష్టించింది. నియంతృత్వ పాలకుల ప్రతిఘటనల నుంచి ప్రజలకు విముక్తి గావించి అనేక సామ్రాజ్యాలు, పలు రాజ్యాల విభజనలలో నిర్ణయాత్మక పాత్రను పోషించింది. అనేక రాజ్యాల సరిహద్దులను నిర్ణయించడంలో సైతం కీలకపాత్ర పోషించింది.

ప్రశ్న 7.
జాతీయవాదంలోని రెండు సుగుణాలను రాయండి.
జవాబు:
1) జాతీయవాదం ప్రజల మధ్య నెలకొన్న పరస్పర వైరుధ్యాలు, వ్యక్తిగత విద్వేషాలు, అంతర్గతమైన ఘర్షణలను నిలువరించగలిగింది. ఒక జాతికి సంబంధించిన ప్రజలలో ఐక్యత, సమగ్రత, సంఘీభావాన్ని పెంపొందించింది. ఇరుగుపొరుగు ప్రజల ఉద్దేశ్యాలను తెలుసుకొనేందుకు వీలు కల్పించింది. కాబట్టి ప్రజల మధ్య చక్కని
అవగాహనను పెంపొందించింది.

2) ప్రజలు ప్రభుత్వం పట్ల విధేయత చూపించేలా జాతీయవాదం దోహదపడింది.

AP Inter 1st Year Civics Study Material Chapter 3 జాతీయవాదం

ప్రశ్న 8.
జాతీయవాదంలోని రెండు దోషాలను తెలపండి.
జవాబు:

  1. జాతీయవాదం ప్రజలలో అహంకారం, అసూయ, గర్వాలను ప్రోత్సహిస్తుంది. ఇటువంటి ధోరణులను జర్మన్, ఇటాలియన్ల చరిత్ర ద్వారా మనం గమనించవచ్చు.
  2. ఇరుగు పొరుగు రాజ్యాల ప్రజలపై మరొక రాజ్యం ప్రజలు ఆధిక్యతను ప్రదర్శించే ధోరణిని రెచ్చగొడుతుంది.

AP Inter 2nd Year History Study Material Chapter 3 ఖండాతర ఖ్యాతినార్జించిన రోమను సామ్రాజ్యం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 3rd Lesson ఖండాతర ఖ్యాతినార్జించిన రోమను సామ్రాజ్యం Textbook Questions and Answers.

AP Inter 2nd Year History Study Material 3rd Lesson ఖండాతర ఖ్యాతినార్జించిన రోమను సామ్రాజ్యం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మానవాళికి రోమనులు అందజేసిన వారసత్వం గూర్చి చర్చింపుము.
జవాబు:
రోమ్ సామ్రాజ్య వైభవ కాలంలో వారు ఈజిప్ట్, బాబిలోనియా, గ్రీస్, పశ్చిమ ఐరోపా, ఉత్తర ఆఫ్రికా భూభాగాలను పరిపాలించారు. ప్రాక్ దేశాల నాగరికత, సంస్కృతులకు రోమనులు వారసులయ్యారు. ఆ నాగరికతలను అనుసరించడమే కాక రోమన్లు కూడా ఎన్నో నూతన విషయాలను, భావాలను కల్పనలను ప్రపంచ సంస్కృతికి ప్రసాదించారు.
రోమన్లు మతము, తత్వశాస్త్రము, కళలు, భవననిర్మాణం, విజ్ఞానం, పాండిత్యం వంటి అనేక భావాలను గ్రీకుల నుండి గ్రహించారు. కేంద్ర, ప్రాదేశిక ప్రభుత్వపాలన, న్యాయసూత్రాలు, పన్నుల విధింపు సూత్రాలు, పౌరహక్కులు, వైద్య, ఆరోగ్య, మురుగు పారుదల విధానాలు, ప్రజోపయోగ పనులు, రహదారులు, నీటి ఊటలు, రంగస్థల వేదికలు, స్నానవాటికలు, వంతెనలు వంటి అనేక పనులు చేపట్టారు. రోమన్ ఇంజనీరింగ్ పరిజ్ఞానానికి వారి రహదారులు, నీటి సరఫరా పద్ధతులు నిదర్శనాలు.

న్యాయ సూత్రాలు : రోమన్ న్యాయశాసనాలు, పాలనా సిద్ధాంతాలు వారు ప్రపంచ నాగరికతకు చేసిన సేవలలో అత్యంత ప్రముఖమైనవి, శ్లాఘనీయమైనవి. వారి న్యాయశాసనాలు నేటి ప్రపంచంలోని దాదాపు అన్ని నాగరిక రాజ్యాలపై సంపూర్ణ ప్రభావాన్ని చూపాయి. 12 ఫలకాలపై రాసిన న్యాయసూత్రాలతో రోమన్ న్యాయశాస్త్రం ఆరంభమైనదని చెప్పవచ్చు. క్రీ.పూ. 150 నాటి ఈ 12 ఫలకాలు కంచుతో చేయబడి వ్యాపారకూడలి ప్రాంతాలలో ప్రదర్శించబడ్డాయి.

న్యాయాధీశులు ఇచ్చిన తీర్పులు రాయబడని చట్టాలై చిరస్థాయిని పొందాయి. ఘనమైన జస్టీనియన్ చక్రవర్తి ఈ న్యాయసూత్రాలను క్రోడీకరించుటతో వీటిని జస్టీనియన్ కోడ్ అన్నారు. రోమన్ న్యాయశాసనాలు సహజమైనవి. దయాగుణం కలవి. ప్రపంచంలోని అనేక రాజ్యాలు రోమన్ న్యాయసూత్రాలను ఆధారం చేసుకుని కొన్ని మార్పులతో, చేర్పులతో తమ న్యాయ సిద్ధాంతాలను రూపొందించుకున్నాయి. రోమన్ న్యాయశాసనం నిందితునికి తన వ్యాజ్యాన్ని నిరూపించుకునే అవకాశం ఇస్తుంది. నేరనిరూపణ జరిగే వరకు నిందితుడిని శిక్షించకూడదు. మరొక గొప్ప అంశమేమిటంటే పౌరులు ఎంత గొప్పవారైనా, బీదవారైనా చట్టం ముందు అందరూ సమానులే.

AP Inter 2nd Year History Study Material Chapter 3 ఖండాతర ఖ్యాతినార్జించిన రోమను సామ్రాజ్యం

మతం : ప్రాచీన రోమనులు దేవతలను, ఆత్మలను ఆరాధించారు. జూపిటర్, జునో, మార్స్, నెప్ట్యూన్, వీనస్లు వీరి దైవాలు. రోమన్లు అతీత శక్తులను విశ్వసించారు. దేవతలనారాధించడం వ్యక్తిగత విషయంగా కాక సామూహిక విధిగా రోమనులు భావించారు. జూదాతత్వం, క్రైస్తవమత బోధనలు నాడు ప్రచారంలో ఉన్నాయి.

తత్వశాస్త్రం : గ్రీకు తత్వశాస్త్రంలోగల స్థాయిసిజమ్, ఎకి క్యూరియానిజమ్ రెండూ రోమన్లను ప్రభావితపరచాయి. రోమన్ చింతనాపరులు స్థాయిక్ తత్వాన్ని ప్రచారం చేసారు. స్థాయిన్ తత్వవేత్తలలో ‘పనేషియస్’, ‘సేనేకా’ మరియు చక్రవర్తి ‘మార్కస్ అరీలియస్’ ప్రముఖులు. మార్కస్ అరీలియస్ తన భావాలను ‘మెడిటేషన్స్’ అనే గ్రంథంలో తన భావాలను వ్యక్తం చేసాడు. తాను చక్రవర్తి అయి ఉండి కూడా భోగభాగ్యాలకు దూరంగా నిరాడంబరంగా బ్రతికాడు.

సాహిత్యం : రోమన్ లు జిజ్ఞాసాపరులు. అలంకార, వ్యాకరణ, తర్క, ఖగోళ, గణిత, వైద్యశాస్త్రాలలో అధ్యయనం జరిగేది. అగస్టస్ కాలంలో లాటిన్ సాహిత్యం మహోన్నత శిఖరాలనందుకుంది. ఈ లాటిన్ యూరప్లోని అనేక | భాషలకు మూలధారంగా నిలచింది.

శాస్త్రవిజ్ఞానం : వైద్య విషయాలను గూర్చి ‘గాలన్’ కొన్ని పరిశోధనలు చేయడమే కాక, ‘వైద్య విజ్ఞాన సర్వస్వాన్ని’ రచించాడు. రోమన్ సామ్రాజ్యంలో ‘గాలన్’ గొప్ప వైద్యుడు. మానవ శరీర అవయవాలు, రక్తప్రసరణపై 500 పైగా గ్రంథాలు రచించాడు. ప్లిని ‘నేచురల్ హిస్టరీ’ రచించాడు. ఇది ఒక శాస్త్ర విజ్ఞానాల సర్వస్వం. రోమన్లు కాలెండర్ను అభివృద్ధి చేసారు. ఎన్నో నెలల పేర్లు రోమన్ చక్రవర్తులవే. జూలియస్ సీజర్ పేరున జూలై, ఆగస్టస్ పేరున ఆగస్ట్ నెలలు పిలువబడ్డాయి. సెప్టెంబర్, అక్టోబర్ లు లాటిన్ భాషలో తొమ్మిది, పది అని అర్థం. జాలియస్ కేలండర్ను సొసిజెనెస్ అనే అలెగ్జాండ్రియాకు చెందిన ఖగోళ శాస్త్రజ్ఞుడు తయారు చేసాడు.

ఈ విధంగా రోమన్ వాఙ్మయం, న్యాయశాస్త్రం, పాలనావిధానం, కళలు కూడా వారి మేథాశక్తికి, సంస్కృతికి చిహ్నాలుగా మిగిలిపోయాయి. రోమన్ న్యాయశాస్త్రం అనేక నాగరిక దేశాలకు ఒక నమూనాగా నిలిచిపోయింది. విశాల సామ్రాజ్య నిర్మాణంలో, అసంఖ్యాక జన సమూహాల్ని ఒక బలీయమైన జాతిగా తీర్చిదిద్దడంలో రోమన్లు గొప్ప పాత్రను పోషించారు.

ప్రశ్న 2.
రోమన్ సాంఘిక, ఆర్థిక వ్యవస్థల ప్రాథమిక లక్షణాలు పేర్కొనుము.
జవాబు:
సాంఘిక వ్యవస్థ : రోమ్ సాంఘిక వ్యవస్థలో ప్రముఖ వర్గాలున్నాయి. వారిని పేట్రిసియన్స్, ప్లీబియన్స్ అని పిలిచేవారు. పేట్రిసియన్స్ రాజకీయ, సాంఘిక, ఆర్థిక హక్కులను కలిగి ఉండేవారు. రోమన్ రాజ్యవ్యవస్థలో సెనేట్ ముఖ్యమైన సభ. సెనేట్ అధికారాలన్నీ భూస్వాములు, ఐశ్వర్యవంతులైన పేట్రీసియన్లు చలాయించగా, ప్లీబియన్స్ పిలవబడే పనివాళ్ళు, చిన్నరైతులు, వృత్తికళాకారులు, చిన్న చిన్న వరక్తకులు, సైనికులు మొదలైన వారికి హక్కులు తక్కువ. కానీ వారు చెల్లించవలసిన పన్నులు ఎక్కువగా ఉండేవి. కాగా రోమన్ న్యాయశాసనాలు ప్లేబియన్లు, పేట్రిసియన్లకు సమానంగా వర్తింపజేయబడ్డాయి.

రోమన్ సాంఘిక జీవనంలో ఉమ్మడి కుటుంబాలకు బదులు ఏకీకృత చిన్న కుటుంబాల సంఖ్య గణనీయంగా పెరిగింది. పెండ్లి అయిన అమ్మాయికి తను పుట్టి పెరిగిన కుటుంబంలో ఆస్తిహక్కు కలదు. వివాహిత స్త్రీకి చట్టబద్ధమైన స్వేచ్ఛ ఉంది. విడాకులు పొందడం అంత కష్టమేమీ కాదు. పెద్దలు కుదిర్చిన వివాహాలు కూడా జరిగేవి. భార్యను హింసించడం సామాన్య విషయంగా మారింది. సమాజంలో బిషప్పులు మతగురువులు. మతగురువులు సమాజంలో చాలా శక్తివంతమైన వారుగా ఉండేవారు. పిల్లలపై తల్లిదండ్రులకు చట్టబద్ధ అధికారాలుండేవి.

రోమన్ సమాజంలో బానిసత్వం ఒక పాతుకుపోయిన సాంఘిక దురాచారం. పై తరగతికి చెందిన రోమన్లు బానిసలను పైశాచికంగా చూసేవారు. వారి సాంఘిక వ్యవస్థలో మూడు వర్గాలు కలవు. సెనేటర్లు, మధ్య తరగతి మరియు దిగువ తరగతి గ్రామీణ శ్రామిక శక్తి దిగువ తరగతిగా ఏర్పడింది. నైట్స్ లేదా అశ్వదళాధిపతులు సాంప్రదాయకంగా శక్తిమంతులు. ధనిక వర్గానికి చెందినవారు. వారిలో చాలా మంది భూస్వాములు కలరు. సైనికులు, సైన్యాధికారులు, భూయజమానులలో చాలా మంది అక్షరాస్యులు. నాటి సమాజంలో సాంస్కృతిక వైవిధ్యం కన్పిస్తుంది. భిన్న మతాచారాలు, విభిన్న భాషలు, వివిధ రకాల వేషధారణ, అనేకరకాల ఆహారపుటలవాట్లు ఆ ప్రజలలో ఉండేవి. అరమిక్, కాప్టిక్, సెల్టిక్, లాటిన్ వంటి వివిధ భాషలు మాట్లాడేవారు. ప్రజలలో అధికులు లాటిన్ భాష మాట్లాడేవారు.

ఆర్థిక వ్యవస్థ : రోమన్ సామ్రాజ్యంలో ఆర్థికంగా మౌలికరంగానికి చెందిన హార్బర్లు, లోహఖనిజాలు, క్వారీలు, ఇటుకల, పరిశ్రమ, నూనె పరిశ్రమలు గణనీయమైనవి. గోధుమ, ద్రాక్ష సారాయి, ఆలివ్ననెల వ్యాపారం ముమ్మరంగా జరిగేది. ద్రవ పదార్థాలు ‘ఆప్ఫోరె’ అనే కంటైనర్లలో రవాణా చేయబడినవి. ఆసియా మైనర్ (టర్కీ), సిరియా, పాలస్తీనా వంటి ప్రదేశాల నుండి ద్రాక్షసారాయి, ఆలివ్ నూనెలు ఎగుమతి అయ్యేవి. కంపానియా నుండి ఉత్తమశ్రేణి సారాయి లభించేది. సిసిరీ, బైజాసియాని ప్రాంతాల నుండి గోధుమలు రోమ్ నగరానికి ఎగుమతి చేయబడేవి.

AP Inter 2nd Year History Study Material Chapter 3 ఖండాతర ఖ్యాతినార్జించిన రోమను సామ్రాజ్యం

రోమన్ సామ్రాజ్యంలో విశిష్టమైన సారవంతమైన ప్రాంతాలు ఎన్నో కలవు. ‘గలీలీ’ సాంద్ర వ్యవసాయానికి పేరుగాంచింది. అత్యాధునిక హైడ్రాలిక్ గని త్రవ్వకాల సాంకేతికతను చేపట్టి స్పానిష్ బంగారు, వెండి గనులు ప్రఖ్యాతి చెందాయి. రోమన్లు వాణిజ్య బ్యాంకింగ్ రంగంలో గణనీయమైన విజయాలు సాధించారు. వీరు విస్తృతంగా ద్రవ్య వినియోగం చేసేవారు. నాటి గ్రామీణ ఋణ గ్రస్తత కూడా విస్తృతమైనది. సామ్రాజ్యంలోని పెద్ద భూస్వాములు మార్కెట్లపై అదుపు సాధించడానికి పోటీపడేవారు. ‘డెమేరియస్’ అనే వెండి నాణెంను 41/2 గ్రాముల శుద్ధమైన వెండితో తయారు చేసారు. రోమన్లు బ్రహ్మాండమైన నిర్మాణాలు చేసారు. ఆనాటి ఇంజనీర్లు నిర్మించిన పెద్ద అక్విడెట్లు మూడు ఖండాలలో నీటి పారుదలను మెరుగుపరచాయి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1. 12 ఫలకాలపై రాసిన న్యాయసూత్రాలు.
జవాబు:
రోమన్ న్యాయశాసనాలు, పాలనా సిద్ధాంతాలు వారు ప్రపంచ నాగరికతకు చేసిన సేవలలో అత్యంత ప్రముఖమైనవి. శ్లాఘనీయమైనవి, వారి న్యాయశాసనాలు నేటి ప్రపంచంలోని దాదాపు అన్ని నాగరిక రాజ్యాలపై సంపూర్ణ ప్రభావాన్ని చూపాయి. 12 ఫలకాలపై వ్రాసిన న్యాయసూత్రాలతో రోమను న్యాయశాస్త్రం ఆరంభమైనదని చెప్పవచ్చు. క్రీ.పూ. 150 నాటి ఈ 12 ఫలకాలు కంచుతో చేయబడి వ్యాపారకూడలి ప్రాంతాలలో ప్రదర్శించబడ్డాయి.

ప్రశ్న 2.
రోమన్ సామ్రాజ్య చరిత్రకు లభించు చారిత్రక ఆధారాలు.
జవాబు:
ఖండాంతరాలలో ఖ్యాతినార్జించిన ప్రాచీన రోమన్ సామ్రాజ్య చరిత్రకు విస్తారంగా ఆధారాలు లభించాయి. లిఖిత ఆధారాలు : లివీ రచించిన ‘అన్నాల్స్’ (రోమ్ చరిత్ర); వర్జిల్ రచించిన ఏనియడ్; లుక్రేషియస్ ప్రకృతి రహస్యం; ఓవిడ్ హెరాస్, ప్లిని – నేచురల్ హిస్టరీ; టాసిటస్ – ఏనల్స్ + హిస్టరీ; చక్రవర్తి మార్కస్ అరలియస్ – మెడిటేషన్స్; జస్టీనియన్ చక్రవర్తి సంకలనం చేసిన న్యాయస్మృతి జస్టీనియన్ కోడ్, ఇవన్నీ ఆనాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ, న్యాయ, తాత్త్విక పరిస్థితులను మనకు తెలియజేస్తున్నాయి.

కట్టడాలు: రోమన్ ఇంజనీరింగ్ వైభవానికి చిహ్నాలుగా అనేక కట్టడాలు రోమ్, కార్తేజ్ ఆంటియోస్ అలెగ్జాండ్రియా, కాన్స్టాంట్్నపుల్ ఇంకా అనేక చోట్ల లభించాయి. ఎత్తైన స్తంభాలు, ఆర్చ్ లు గుమ్మటాలు, అక్విడక్ట్లు, కలోసియాలు, ప్రజాస్నాన వాటికలు ఎన్నో నాటి సాంకేతిక వైభవాన్ని చాటుతున్నాయి.

త్రవ్యకాలు: వెసూవియస్ అగ్నిపరత్వం దగ్గరలో ఉన్న పాంపేయీ నగరాన్ని క్రీ. శ. మొదటి శతాబ్దిలో హఠాత్తుగా బద్దలయిన పర్వతం లావా క్రింద నగరం పూడిపోయింది. దాదాపు 10 మీటర్లు మందం లావా క్రింద పూడుకపోయిన నగరాన్ని త్రవ్వకాలలో వెలికితీసారు. ఈ త్రవ్వకాలలో వీధులు, నివాసగృహాలు, ఫోరమ్, ఆంఫిధియేటర్, స్నానాగారాలు, దేవాలయాలు బయటపడ్డాయి.

శాసనాలు, నాణేలు : ఆగస్టస్ చక్రవర్తి వేయించిన శాసనం, ‘డెమిరియస్’ అనే 41/2 గ్రా వెండి నాణెం నాటి పరిస్థితులను తెలుపుతున్నాయి. ఇంకా అసంఖ్యాకంగా విగ్రహాలు, వర్గచిత్రాలు నాటి వైభవాన్ని చాటి చెబుతున్నాయి.

ప్రశ్న 3.
జూలియస్ సీజర్.
జవాబు:
విశ్వవిఖ్యాత విజేత జూలియస్ సీజర్. ఒక సంపన్న కుటుంబంలో క్రీ.పూ. 102 సంవత్సరంలో రోమ్లో జన్మించాడు. ఆంటోనియస్ వద్ద విద్యనభ్యసించాడు. అసాధారణ శౌర్యపరాక్రమాలు, విజ్ఞత ప్రదర్శించాడు. ఒక న్యాయాధికారిగా, మత పెద్దగా, స్పెయిన్కు గవర్నర్ గా బహుముఖ కార్యాలను నిర్వహించాడు. త్రిమూర్తులుగా పేరు గాంచిన సాంపే, సీజర్, కానన్లలో సీజర్ అగ్రగణ్యుడు. వాస్తవానికి సీజర్ ఒక నియంతగా పిలవబడినా గణతంత్ర సాంప్రదాయాలకు విలువనిచ్చాడు. ఈజిప్టు రాణి క్లియోపాత్రా అందానికి బానిసై ఆమె ద్వారా ఒక కుమానికి తండ్రి అయ్యాడు. క్రీ.పూ. 46లో రోమ్ నగరానికి తిరిగి వచ్చి నియంతగా ప్రకటించుకున్నాడు. ఈజిప్ట్ రోమన్ సామ్రాజ్యానికి మిత్రరాజ్యమయింది.

స్పెయిన్, ఈజిప్టులలో చెలరేగిన తిరుగుబాట్లను, అణచివేసిన తర్వాత రోమన్ సామ్రాజ్యంలో అనేక సంస్కరణలను ఆవిష్కరించాడు. వ్యవసాయాభివృద్ధి పన్నుల తగ్గింపు, అవినీతిమయమైన నిరంకుశ అధికారుల తొలగింపు, గాల్, సిసిలీ, ప్రజలకు పౌరహక్కులు ప్రసాదించుట, ప్రభుత్వ భూముల పంపిణీ, ప్రజా పనుల కొనసాగింపు, నాణేల వ్యవస్థను మెరుగుపరచుట, జూలియన్ కేలండర్ను పరిచయం చేయడం వంటి అనేక పనులు చేపట్టాడు. న్యాయస్మృతులు పరిచయం, గ్రంథాలయ నిర్మాణం వంటి పెక్కు పనులు ప్రారంభించాడు. కానీ పూర్తి చేయలేకపోయాడు. ‘బ్రూటస్’ వంటి శత్రువులు ఏకమై సీజర్ను క్రీ.పూ.44లో హత్య చేసారు.

AP Inter 2nd Year History Study Material Chapter 3 ఖండాతర ఖ్యాతినార్జించిన రోమను సామ్రాజ్యం

ప్రశ్న 4.
రోమన్ ల పట్టణీకరణ.
జవాబు:
రోమన్ సామ్రాజ్యంలోని పరిస్థితులు పట్టణీకరణను ప్రోత్సహించాయి. చక్రవర్తులు కూడా అనేక ప్రజోపయోగ పనులను చేపట్టి పేదవారికి ఉపాధి కల్పించారు. ఈ కాలంలో అనేక రహదారులు, భవనాలు, వంతెనలు, ప్రదర్శనశాలలు, నీటి ఊటలు నిర్మించబడ్డాయి. వీటి నిర్మాణం కోసం ఎంతోమంది శ్రామికులు అవసరమయ్యేవారు. అలా శ్రామికులుగా, బానిసలుగా వచ్చిన వారితో నగర విస్తీర్ణం పెరుగుతూపోయాయి.

కార్తేజ్, అలెగ్జాండ్రియా, ఆంటియోక్ వంటి ప్రసిద్ధ నగరాలు మధ్యథరా తీరప్రాంతంలో చూడగలం. రోమన్ సామ్రాజ్య సిరిసంపదలు ఇలా అనేక నగరాలలో చూడవచ్చు. విన్టోనిస్సా ప్రజాస్నాననాటిక నిర్మాణం రోమన్ నాగరికత ప్రత్యేక లక్షణం. పట్టణ ప్రజానీకం ఉన్నతశ్రేణి వినోదాన్ని అనుభవించింది. పెద్ద పెద్ద ప్రదర్శనలు తరచుగా ఏర్పాటు చేయబడేవి. విన్డోనిస్సా వద్ద నిర్మించబడిన ఏంపిధియేటర్ సైనిక విన్యాసాలకు, గొప్ప ప్రదర్శనలకు నిలయం. క్రీ.శ. 79లో నిర్మించబడిన పెద్ద ప్రదర్శనశాల కలోసియమ్లో 50,000 మంది వీక్షకులు కూర్చునే సౌకర్యం కలది. ఈ కలేసియామేలలో ‘గ్లాడియేటర్స్’ క్రూరమృగాలతో పోరాడేవారు. ‘సోంపెల్లి’, ‘ఆరంజ్’, ‘టారోమినిమమ్’ వంటి ప్రదర్శనశాలలు ఇట్టివే. ప్రజలను ప్రజా సమస్యల నుండి దూరంగా ఉంచడానికి రోమన్ ప్రభువులకు ఈ ప్రదర్శనశాలలో నిత్యం జరిగే ‘హింసాత్మక కార్యక్రమాలు కొంత వరకు తోడ్పడ్డాయి.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పేపిరస్.
జవాబు:
పేపిరస్ అనేది పేపిరస్ చెట్టు నుండి తయారు చేయబడిన పల్చని కాగితంలాంటిది. దీనిని విషయాలను రచించడానికి ఉపయోగించేవారు. పేపిరస్ ను పత్రాలను ఒక కట్టగా చుట్టేవారు. పేపిరస్ ను వ్రాతకోసం తొలిసారిగా ఈజిప్టు ప్రజలు వాడారు. పేపిరస్ చౌకగా తయారై తొందరగా చినగకుండా ఎక్కువ కాలం మన్నుతుంది. రోమన్లు సాహిత్యంగాని, లేఖలుగాని మరి ఇతర డాక్యుమెంట్లు గాని పేపిరస్ను వాడేవారు.

ప్రశ్న 2.
రిపబ్లిక్.
జవాబు:
పేట్రీషియన్లు తమ ప్రభుత్వ వ్యవస్థను ‘ప్రజా ఆశయం’ లాటిన్ భాషలో ‘రిపబ్లికా’ అనేవాళ్ళు. దాని నుండి రిపబ్లిక్ అనే మాట పుట్టింది. రిపబ్లిక్ అంటే ఒక నిర్ణీత కాలానికి ఎన్నుకోబడిన వాళ్ళచేత పరిపాలింపబడే రాజ్యం. రోమ్లో పాలన ఎన్నిక మీద ఆధారపడింది. ప్రతి సంవత్సరమూ ప్రజా సభచేత ఇద్దరు పేట్రీషియన్లు కాన్సళ్ళుగా ఎన్నుకోబడేవారు. వీరు కోర్టు తీర్పులు చెప్పడం, సైన్యానికి నాయకత్వం వహించేవారు. ఏడాది ముగిసాక వీరిలో అత్యున్నతులు సెనేట్ సభ్యులు అయ్యేవారు. సెట్కు విశేష అధికారాలుండేవి. అన్ని విషయాలు సెనేట్ లో చర్చించి అమలుచేయబడేవి.

ప్రశ్న 3.
బానిసల ఉత్పత్తి.
జవాబు:
రోమ్ చేసిన యుద్ధాల్లో చిక్కిన లక్షల కొలది ఖైదీలు బానిసలుగా మార్చబడేవారు. సకాలంలో పన్నులు కట్టని ప్లేబియన్లను కూడా బానిసలుగా మార్చడం ఉండేది. రోమ్ ఆక్రమించుకున్న ప్రాంతాలలో వందల కొద్దీ బానిస మార్కెట్లు ఉండేవి. రోజుకు 10,000 మంది బానిసలు దాక విక్రయించబడేవారు. రోమన్ బానిస యజమానులు, బానిసలను మనుషులుగా గుర్తించలేదు.

బానిసల పట్ల దయాదాక్షిణ్యాలు లేక గొడ్డుచాకిరీ చేయించేవారు. బానిసలలో బలిష్టులను గ్లాడియేటర్లుగా తీర్చిదిద్దేవారు. బానిసలను కఠినాతి కఠినంగా హింసించేవారు. దారుణ చిత్రహింసలు పెట్టేవాళ్ళు. బానిసలను రోమ్ దోచుకున్నంతగా ప్రపంచంలో మరే దేశం దోచుకోలేదు. ఎక్కడా అంతమంది బానిసలు లేరు.

AP Inter 2nd Year History Study Material Chapter 3 ఖండాతర ఖ్యాతినార్జించిన రోమను సామ్రాజ్యం

ప్రశ్న 4.
కలోసియమ్.
జవాబు:
రోమన్ పాలకుల విధానాలతో, గత్యంతరం లేని సోమరితనంతో, దానధర్మాలతో పాడుచేయబడిన రోమన్ పేదప్రజలకు పనిచేయాలని ఉండేది కాదు. పని చేయడం బానిసల వంతుగా బానిసల యజమానులు కూడా భావించేవారు. వీరు చక్రవర్తి నుండి ఉచిత ఆహారాన్ని, వినోదాన్ని డిమాండ్ చేసేవారు.

రోమన్ బానిస యజమానులకు, పేదవారికి వినోదార్థం గ్లాడియేటర్ల, పోరాటాల కోసం క్రీ.శ. మొదటి శతాబ్ది ఉత్తరార్థంలో రోమ్లో ‘కొలీసియం’ అనే బ్రహ్మాండమైన ఆంఫిథియేటర్ నిర్మించబడింది. ఈ కొలీసియంలో 50,000 మంది వరకు ప్రేక్షకులు కూర్చొనవచ్చు. ఈ కలోసియంలో గ్లాడియేటర్లు క్రూరమృగాలతోను, తమలో తాము పోరాడేవారు.

ప్రశ్న 5.
అగస్టస్.
జవాబు:
అగస్టస్ పేరు మార్చుకున్న జూలియస్ సీజర్ వారసుడు ఆక్టివియన్ రిపబ్లికన్ను అంతం చేసాడు. రోమ్ చరిత్రలో అగస్టస్ కాలం స్వర్ణయుగంగా బాసిల్లింది. శాంతి సౌభాగ్యాలకు ప్రతీకగా నిలిచింది. క్లిష్టపరిస్థితులలో పేదవారికి ఆగస్టస్ ఉచితంగా ఆహార పదార్థాలిచ్చి సంతోషపరచాడు. అనేక ప్రజాపనులను చేపట్టి పేదవారికి ఉపాధి కల్పించాడు. ఈ కాలంలో అనేక రహదారులు, వంతెనలు, భవనాలు, ప్రదర్శనశాలలు, నీటి ఊటలు నిర్మించబడ్డాయి. కలోసియమ్ వీటన్నింటిలో ప్రసిద్ధమైన కట్టడం 50,000 మంది ఒకేసారి కూర్చోగల ప్రదర్శనశాల. అగస్ట్ కాలంలో రోమ్ వాణిజ్యకేంద్రంగా ఉండేది. భారత, చైనాలతో సహా అనేక దేశాలతో సంబంధం కలిగిఉండేది.

ప్రశ్న 6.
కాన్స్టాంటైన్ చక్రవర్తి.
జవాబు:
డియోక్లిటియన్ పాలన అనంతరం అధికారం కోసం కాన్స్టాంటిన్ అనే సేనానాయకుడు ఎన్నో కుట్రలు, అరాచకాలు చేసి అధికారంలోకి వచ్చాడు. సింహాసనాన్ని కాంక్షిస్తున్నాడనే అనుమానంతో కన్నకొడుకును కూడా వధించాడు. ప్రజలను బానిసలను అధిక పన్నులతో తీవ్రంగా వేధించాడు.

తన అధికారాన్ని బలపరచుకోవడానికి కన్స్టంటైన్ క్రైస్తవ చర్చిని వినియోగించుకున్నాడు. చర్చికి డబ్బులు, భూములు, విలువైన వస్తువులు ధారాళంగా ఇచ్చాడు. బాస్ఫరస్ జలసంధి తీరంలో బైజాంటియమ్ అనే గ్రీకు వలస ఉన్నచోట కాన్స్టంటెన్ ఒక నగరాన్ని నిర్మించాడు. దీనినే కాన్స్టాంట్్నపిల్ అన్నారు. కాన్స్టంటిస్ ఎన్ని క్రూరకర్మలు చేసినా క్రైస్తవులు అతడిని పవిత్ర పురుషుడిగా ప్రకటించారు.

AP Inter 2nd Year History Study Material Chapter 2 ప్రపంచ ప్రాచీన నాగరికత – మెసపిటోమియా – వ్రాత విధానం – నగర జీవనం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 2nd Lesson ప్రపంచ ప్రాచీన నాగరికత – మెసపిటోమియా – వ్రాత విధానం – నగర జీవనం Textbook Questions and Answers.

AP Inter 2nd Year History Study Material 2nd Lesson ప్రపంచ ప్రాచీన నాగరికత – మెసపిటోమియా – వ్రాత విధానం – నగర జీవనం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న1.
మెసపిటోమియా నాగరికత ప్రధాన లక్షణాలు రాయండి.
జవాబు:
నాగరికత అనగా మానవ సమాజంలో వచ్చిన మేధాసంపత్తి, సాంస్కృతిక, నిత్యజీవన విధానంలో వచ్చిన అభివృద్ధి. అతి ప్రాచీన ప్రపంచ నాగరికతలలో మెసపిటోమియా నాగరికత మొదటిది. హరప్పా, ఈజిప్ట్, చైనా నాగరికతలు కూడా దాదాపుగా వీటి సమకాలీన నాగరికతలు. మెసపిటోమియా, ఈజిప్ట్ నాగరికతలు అక్కాచెల్లెళ్ళుగా ప్రసిద్ధికెక్కాయి. గ్రీకు భాషలోని ‘మెసోస్’, ‘పోటమస్’ అనే పదాల కలయికతో మెసపిటోమియా ఏర్పడింది. ఈ పదాలకు ‘రెండు నదుల మధ్య ప్రదేశం’ అని అర్థం. మెసపిటోమియా యూఫ్రిటిస్, టైగ్రిస్ అనే రెండు నదుల మధ్య ప్రదేశంలో ఉంది. ప్రస్తుతం ‘ఇరాక్’ అని పిలువబడుతున్న దేశమే మెసపిటోమియా నాగరికత కేంద్రం.

భౌగోళిక పరిస్థితులు: మెసపిటోమియాలో భిన్న భౌగోళిక పరిస్థితులుండేవి. పచ్చని మైదానాలు, ఎత్తు పల్లాలుగా ఉండే భూమి, జలపాతాలు, సెలయేర్లు, పూదోటలు, చక్కని వర్షపాతంతో, పంటలతో ఆహ్లాదకరంగా ఉండేది. వ్యవసాయం, పశుపోషణ ప్రజలకు ప్రధానాధారాలు. మెసపిటోమియా దక్షిణ దిక్కున ఎడారి ప్రాంతం ఉండేది. ఈ ప్రాంతానికి ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణులలో యూఫ్రిటిస్, టైగ్రిస్ నదులు జన్మించాయి. ఈ నదుల ప్రవాహం వలన సారవంతమైన మట్టితో ఆ పరిసర ప్రాంతాలు సారవంతమైన వ్యవసాయ మైదానాలుగా మారాయి.

రాజకీయ పరిస్థితులు: ‘గిల్గిమిష్’ అనే రాజు గురించి రెండు టేబ్లెట్స్ ద్వారా వివరించబడింది. గిల్గి మిష్ “ఉర్క్’ అనే నగర రాజ్య పాలకుడు. ఎంతోమంది ప్రజలకు సహాయపడిన నాయకుడు, గొప్ప స్నేహశీలి. తన ప్రియమిత్రుని మరణంతో విచారానికిలోనై, ప్రపంచంలో సుఖ, దు:ఖాలకు మరణానికి కారణాలు తెలుసుకోవాలని దేశ సంచారం చేసాడు. ఇతడు నగర నిర్మాణంలో ప్రసిద్ధిచెందాడు.

మెసపిటోమియా నగరాలు: 1930లో పురావస్తు శాఖ చేపట్టిన పరిశోధనలలో మెసపిటోమియాలోని అనేక ప్రాచీన నగరాలు బయల్పడ్డాయి.

‘ఉర్’ పట్టణం: ఈ పట్టణంలో వీధులు అతి సన్నగా ఉండేవి. కొన్ని ప్రాంతాలలో బండ్లు తిరగడానికి సాధ్యమయ్యేది. ఈ పట్టణ నిర్మాణానికి సరైన ప్రణాళిక (టౌన్ ప్లానింగ్) లేదని తెలుస్తుంది.

బాబిలోనియా నగరం: ప్రపంచ నాగరికతలలో ప్రముఖ పట్టణం బాబిలోనియా. ఇది 850 హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉండేది. ఈ పట్టణంలో గొప్ప రాజభవనాలు, దేవాలయాలు ఉండేవి. ఈ పట్టణాన్ని క్రీ.పూ 333లో అలెగ్జాండర్ ఆక్రమించినప్పటికీ గొప్ప నగరంగా పేరొందింది.

అబూసలాభిక్ పట్టణం: క్రీ.పూ. 2500 నాటి ఈ పట్టణం పది హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఈ పట్టణ తవ్వకాలలో చేప ఎముకలు, పంది ఎముకలు లభించాయి.

ఉరుక్ పట్టణం: క్రీ.పూ 3000 సంవత్సరానికి చెందిన ఈ నగరం దేవాలయాల నగరంగా పేరొందింది. ఇది దాదాపు 250 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది.

AP Inter 2nd Year History Study Material Chapter 2 ప్రపంచ ప్రాచీన నాగరికత - మెసపిటోమియా - వ్రాత విధానం - నగర జీవనం

ఆర్థిక పరిస్థితులు: మెసపీటోమియా నాగరికత ప్రపంచంలో వ్యవసాయ ప్రక్రియను ప్రారంభించిన నాగరికత. యూఫ్రటిస్, టైగ్రిస్ నదుల వలన వ్యవసాయం విస్తృతంగా సాగింది. గోధుమ, బార్లీ, వేరుశనగ పంటలు విస్తారంగా పండేవి. ప్రజలు గొర్రెలు, మేకలను విస్తృతంగా పోషించేవారు. ఖర్జూరం, తాటికాయలు వేసవిలో సమృద్ధిగా లభించేవి.

మెసపిటోమియా ప్రజలు టర్కీ, ఇరాన్ దేశాల వారితో ఎక్కువగా విదేశీ వ్యాపారాలు ఉండేవి. ఆహార పదార్థాలు, వస్త్రాలను టర్కీ, ఇరాన్లకు ఎగుమతి చేసి వారి నుండి కలప, రాగి, వెండి, బంగారం, సముద్రగవ్వలు, విలువైన రాతి ఆభరణాలు దిగుమతి చేసుకునేవారు. ఎగుమతి, దిగుమతులకు మెసపిటోమియాలోని సహజసిద్ధమైన నదీ మార్గాలు వారికెంతగానో ఉపయోగపడ్డాయి. నాడు ‘మేరీ పట్టణం’ ప్రముఖ నౌకా రవాణా పట్టణంగా వెలుగొందింది.

సాంఘిక పరిస్థితులు: మెసపిటోమియా నాగరికత నగర జీవనానికి ప్రసిద్ధిగాంచింది. అనేక నగరరాజ్యాలు ఏర్పడ్డాయి. వాటి చుట్టూ చిన్న చిన్న గ్రామాలు విస్తరించి ఉండేవి. ఉర్ అబూసలాభిక్, ఉరుక్ ఇటువంటి నగరాలే, బాబిలోనియా నాటికే ప్రసిద్ధి చెందిన మహానగరం.

నాటి సమాజంలో ధనవంతులు, సాధారణ ప్రజల మధ్య వ్యత్యాసం స్పష్టంగా ఉండేది. ధనవంతులు మరింత ధనవంతులు కాగా సామాన్యులు తమ జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవడానికి నిరంతరం కృషి చేసేవారు.

మెసపిటోమియా నాగరికత నాటి కుటుంబాలు చిన్నవిగా ఉండేవి. తండ్రి కుటుంబానికి పెద్ద. వివాహసమయంలో కానుకలు ఇచ్చి పుచ్చుకోవడం ఉండేవి. తండ్రి ఆస్తికి కుమారుడు మాత్రమే హక్కుదారులు. కుమారైలకు బహుమతులు ఇచ్చేవారు.

మెసపిటోమియా నాగరికతలో ప్రజలు స్థానిక దేవతలను పూజించడానికి నిర్మించుకున్న దేవాలయాలను జిగూరత్లను నిర్మించుకున్నారు. వీటిని స్వర్గానికి, భూమికి మధ్య వారధిగా భావించేవారు. ప్రజలకు మూఢనమ్మకాలు ఎక్కువని తెలుస్తుంది.

శాస్త్ర – సాంకేతిక అభివృద్ధి:
వ్రాత విధానం అభివృద్ధి: ప్రపంచ చరిత్రలో మొదటిసారిగా అక్షరాలు రాసే విధానం, జరిగిన సంఘటనలు, లెక్కలు మొదలైన వాటిని రాయడం ప్రారంభించినవారు మెసపిటోమియా ప్రజలు. సుమారు ఐదువేల సంవత్సరాలకు మనుపు రాత విధానాన్ని ప్రారంభించారు. మొదట్లో ఎక్కువగా చిత్రాలు కనిపించేవి. కాలక్రమంలో పదాలు, అర్థాలకు తగిన చిహ్నాలు అభివృద్ధి చెందాయి. ఈ పద్ధతిని ‘క్యూనిఫారమ్’ అంటారు. వీటిని మట్టిబిళ్ళలు సున్నపుముద్ద బిళ్ళలపై రాయించుట, చిత్రించుట ప్రారంభించారు. వీటిని ‘టేబ్లెట్స్’ అంటారు. వీటి వలన అనేక వివరాలు చరిత్రకారులు గ్రహించగలిగారు.

మెసపిటోమియా ప్రజలు ప్రపంచానికి అందించిన గొప్పకానుకలలో గణితశాస్త్ర అభివృద్ధి, కాలనిర్ణయ శాస్త్రం ప్రధానమైనవి. సంఖ్యాశాస్త్రంలో 6 మరియు 10 గుణకాలకు ప్రాధాన్యం ఉండేది. గుణకాలు, విభజనలు, స్క్వేర్, స్క్వేర్రూటు వంటివి మట్టిబిళ్ళలలో లభించాయి. మెసపిటోమియా వాసులు సంవత్సరానికి 12 నెలలు, నెలకు 30 రోజులు, వారానికి 7 రోజులు, గంటకు 60 నిముషాలు అనే కాల నిర్ణయ విభజనను కనుగొన్నారు. ఈ విధానం ఐరోపా, మధ్య ఆసియా దేశాలకు వ్యాపించింది. ఈ విధంగా నగర జీవనానికి, శాస్త్రీయ అభివృద్ధికి మెసపిటోమియా నాగరికత నాంది పలికింది.

ప్రశ్న 2.
వ్రాత విధానంలో మెసపిటోమియా నాగరికత పాత్ర తెలుపుము.
జవాబు:
ప్రాచీన సమాజంలోని ప్రజలు వివిధ శబ్దాలను తమ భావాలను వ్యక్తపరుచుకోవడానికి ఉపయోగించారు. వ్రాత పద్ధతి అనగా ‘ప్రజలు మాట్లాడే పదాలకు కంటికి కనబడే చిహ్నాలు’. ప్రపంచ చరిత్రలో మొదటిసారిగా అక్షరాలు రాసే విధానం, జరిగిన సంఘటనలు, లెక్కలు మొదలైన వాటిని రాయడం ప్రారంభించినవారు. మెసపిటోమియా ప్రజలు. సుమారు ఐదు వేల సంవత్సరాలకు మునుపు మెసపిటోమియా ప్రజలు తమ భావాలు, వివరాలు, లెక్కలు వంటి వివరాలను భద్రపరచుకోవడానికి వ్రాత విధానాన్ని ప్రారంభించారు. మొదట ఈ లిపిలో ఎక్కువగా చిత్రాలు కనిపించేవి. ఆ కాలం నాటి పంటలు, వాటిపై ప్రభుత్వం విధించే పన్నుల వివరాలు ఈ చిత్రాల ద్వారా వివరించబడ్డాయి. కాలక్రమంలో వ్రాత విధానం ప్రాధాన్యత పెరిగి కొన్ని పదాలు వాటి అర్థానికి తగిన చిహ్నాలు అభివృద్ధి చెందాయి. ఈ పద్దతిని ‘క్యూనిఫారమ్’ అంటారు.

వేల సంవత్సరాల క్రితం మెసపిటోమియా వాసులు ప్రతిరోజు జరిపే లావాదేవీలు, వ్యాపారం, నక్షత్ర పరిశోధనలు, సాహిత్యం మొదలైన వాటిని మట్టిబిళ్ళలపై వ్రాయించుట, చిత్రించుట ప్రారంభించారు. వీటిని టేబ్లెట్స్ అంటారు. క్రీ.పూ 3200 కాలంలో మొదటిసారి మట్టిబిళ్ళపై వ్రాత ప్రారంభమయింది. ఈ బిళ్ళలు మట్టితోను, రాళ్ళతోను తయారుచేయబడ్డాయి. వాటి మీద చిహ్నాలు, అంకెలు ఎక్కువగా కనపడేవి. దక్షిణ మెసపిటోమియా ప్రాంతంలోని ‘ఉరుక్’ నగరంలో ఇటువంటి ‘మట్టిబిళ్ళలు’ లభించాయి. సమాజం అభివృద్ధి చెందే కొద్దీ మానవ వ్యవహారాలను రాసి భద్రపరుచుకోవలసిన అవసరం పెరుగుట వలన వ్రాత విధానం ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. మెసపిటోమియా నాగరికత నగర జీవితానికి సంబంధించినందు వలన ప్రజల మధ్య అనేక రకాలైన వ్యవహారాలు, వృత్తులు, వస్తువిక్రయాలు జరిగి వాటిని వ్రాతపూర్వకంగా భద్రపరచుకోవలసిన అవసరం ఏర్పడింది.

మట్టిబిళ్ళలు – టేబ్లెట్స్: మెసపిటోమియా వాసులు సున్నపు ముద్దతో తయారుచేసిన బిళ్ళలను ఉపయోగించారు. అరచేతిలో సరిపడే సున్నపు ముద్దబిళ్ళ తడిగా ఉన్నప్పుడు దాని ఉపరితలాన్ని నునుపుగా తయారుచేసి దానిపై పదునుగా ఉండే సూదిలాంటి పరికరంతో వివరాలు చెక్కేవారు. తడిగా ఉన్నప్పుడు రాసిన ఈ పలకలను ఎండబెడితే అవి చెరగని ముద్రలతో బిళ్ళలుగా తయారయ్యేవి. అనేక వ్యవహారాలు వ్యాపార లావాదేవీలు ఇటువంటి బిళ్ళలపై చెక్కుట వలన వేల సంఖ్యలో బిళ్ళలు లభించాయి. వీటి ద్వారా చరిత్రకారులు అనేక విషయాలు తెలుసుకోగలిగారు.

క్యూనీఫారమ్: క్రీ.పూ. 2600 నాటికి మెసపిటోమియాలో రాత విధానం ‘క్యూనిఫారం’గా రూపొందింది. వారు వాడిన భాష సుమేరియన్ల అనేక రకాలైన పత్రాలు, నిఘంటువుల తయారీకి ఉపయోగపడింది. రాజపత్రాలు, భూముల, బదలాయింపు, స్థానిక సంప్రదాయాలు మొదలైనవి క్యూనిఫారమ్లో ఉపయోగించబడ్డాయి.

క్రీ.పూ. 2400 నాటికి సుమేరియా లిపికి బదులు అక్కాడియన్ లిపి వాడుకలోకి వచ్చింది. క్రీ.శ మొదటి శతాబ్ది వరకు మెసపిటోమియా ప్రజలు ఉపయోగించింది అక్కాడియన్ లిపి మాత్రమే. సుమారు రెండువేల సంవత్సరాలు ఈ అక్కాడియన్ లిపి వాడుకలో ఉంది.

AP Inter 2nd Year History Study Material Chapter 2 ప్రపంచ ప్రాచీన నాగరికత - మెసపిటోమియా - వ్రాత విధానం - నగర జీవనం

ప్రశ్న 3.
మెసపిటోమియా నగర జీవన విధానాన్ని గురించి రాయండి.
జవాబు:
మెసపిటోమియా నాగరికత నగరజీవితానికి ప్రసిద్ధిగాంచింది. అనేక నగరరాజ్యాలు ఏర్పడ్డాయి. వాటి చుట్టూ చిన్న చిన్న గ్రామాలు విస్తరించి ఉండేవి. పట్టణ ప్రజలు నగరరాజ్యాల పరిధిలో జీవించారు. సాధారణ నగరాలు 20వేల జనాభాతో ఉంటే అంతకంటే పెద్ద నగరాలలో జనాభా 50 వేల వరకు ఉండేది. బాబిలోనియా నాడు అతి పెద్ద నగరం. ఆ నగరంలో జనాభా లక్షమందికి పైన ఉండేవారు.

1930లో పురావస్తుశాఖ చేపట్టిన పరిశోధనలలో మెసపిటోమియాలోని అతి ప్రాచీన నగరాలు బయటపడ్డాయి. అందులో ‘ఉర్’ పట్టణం ఒకటి. ఈ పట్టణ నిర్మాణంలోని లక్షణాలను పరిశీలిస్తే వీధులు అతి సన్నగా ఉండుట వలన కొన్ని ప్రాంతాలకు మాత్రమే బండ్లు తిరగడానికి సాధ్యమయ్యేది. పట్టణ ప్రాంతంలో ఆహార ధాన్యాలు, కట్టెలు చేరవేయుటకు కంచరగాడిదలు ఉపయోగించేవారు. పట్టణ నిర్మాణానికి సరి అయిన ప్రణాళిక లేదు. మెసపిటోమియా నగర నిర్మాణంలో మూఢవిశ్వాసాలు ఎక్కువ. ‘ఉర్’ నగర శ్మశానవాటికలో రాజులు, సామాన్యుల సమాధులు లభించాయి.

ప్రపంచ నాగరికతలలో ప్రముఖ పట్టణం బాబిలోనియా. ఇది 850 హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉండేది. దీని చుట్టూ మూడు రక్షణ గోడలు ఉండేవి. ఈ పట్టణంలో గొప్ప రాజభవనాలు, దేవాలయాలు ఉండేవి. ఈ పట్టణాన్ని క్రీ.పూ. 593లో ఆర్కిమేడియన్లు, క్రీ.పూ. 333లో అలెగ్జాండర్ ఆక్రమించాడు. నాటికే ఇది గొప్ప నగరంగా పేరుగాంచింది.

మెసపిటోమియా నాగరికతలో లభించిన మరొక ప్రముఖ పట్టణం ‘అబూసలాభిక్’ క్రీ.పూ. 2500 నాటి ఈ పట్టణం పది హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉండేది. ఈ పట్టణంలో చేపల ఎముకలు, పందుల ఎముకలు లభించాయి. కాబట్టి నాడు ఈ ప్రాంతంలో పందిని కూడా ఆహారంగా స్వీకరించినట్లు తెలుస్తుంది.

మెసపిటోమియా నాగరికతకు చెందిన మరో ప్రముఖ నగరం ఉరుక్. క్రీ.పూ. 3000 సంవత్సరాలకు చెందిన ఈ నగరం దేవాలయాల నగరంగా గుర్తింపు పొందింది. ఇది 250 హెక్టార్ల విస్తరించి ఉండేది. ఈ నగరం హరప్పా నాగరికతలోని మొహంజోదారో పట్టణం కంటే రెండు రెట్లు పెద్దది. క్రీ.పూ. 2800 ప్రాంతాలలో చుట్టు ప్రక్కల గ్రామాల నుండి వచ్చిన ప్రజలతో ఈ నగర విస్తీర్ణం 400 హెక్టార్లుకు పెరిగింది. ఈ నగరంలో అనేక దేవాలయాలు ఉండేవి. వీటి నిర్మాణానికి యుద్ధ ఖైదీలను, స్థానిక ప్రజలను ఉపయోగించేవారు. వీరికి రాజు ఉపాధి కల్పించేవాడు. దేవాలయ నిర్మాణానికి రోజుకు 4500 మంది కూలీలను ఐదు సంవత్సరాల వరకు పనిచేయించారు. నాటి శిల్పులు కూడా నైపుణ్యం కలిగి ఉండేవారు. కుమ్మరి చక్రం ద్వారా అనేక కుటీర పరిశ్రమలు వృద్ధి చెంది, కుండల తయారీ పెద్ద ఎత్తున చేపట్టబడింది.

రవాణా రంగం: పట్టణ నాగరికత అభివృద్ధిలో ప్రధాన అంశం రవాణా సౌకర్యం. అతి చౌకగా రవాణా చేయుటకు నదుల, సముద్ర రవాణా అతి ముఖ్యమైనవి. మెసపిటోమియా ప్రజలు నదుల ద్వారా పడవలలో ఆహార ధాన్యాలు రవాణా చేసుకునేవారు. ప్రాచీన మెసపిటోమియాలోని సహజసిద్ధ నదీమార్గాల ద్వారా వస్తురవాణా జరిగేది. |జమరిలియిన్ రాజు కాలంలో మేరీ పట్టణం ప్రముఖ నౌకా రవాణా కేంద్రం.

సమాజం: మెసపిటోమియా నాగరికత నాటి సమాజంలో ధనవంతులు, సాధారణ ప్రజల మధ్య వ్యత్యాసం స్పష్టంగా ఉండేది. ధనవంతులు మరింత ధనవంతులు కాగా, సామాన్యులు తమ జీవనాన్ని మెరుగుపరుచుకోవడానికి నిరంతరం కృషి చేసేవారు. ధనవంతులు, దేశంలోని అధికశాతం ధనాన్ని, బంగారం, ఆభరణాలు, కలపవస్తువులు, సంగీత పరికరాలు అనుభవించేవారు. ఉర్ నగరం రాజుల సమాధులలో విలువైన ఆభరణాలు లభించాయి.

కుటుంబ జీవనం: నాడు కుటుంబాలు చిన్నవిగా ఉండేవి. తండ్రి కుటుంబానికి పెద్ద. వివాహ సంబంధం విషయంలో వధువు, వరుని కుటుంబాల పెద్దలు ఒక ప్రకటన ద్వారా సమ్మతిని తెలిపేవారు. ఇరువర్గాలు బహుమతులు ఇచ్చి పుచ్చుకునేవారు. తండ్రి సంపాందించిన ఆస్తికి కుమారులు మాత్రమే హక్కుదారులు. కుమార్తెలకు కొంత మొత్తం బహుమతి రూపంలో లభించేది తప్ప, ఆస్తిలో హక్కు ఉండేది కాదు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మెసపిటోమియా భౌగోళిక పరిస్థితులు తెలుపుము.
జవాబు:
మెసపిటోమియా భౌగోళిక పరిస్థితులలో ఎంతో వైవిధ్యముండేది. పచ్చని మైదానాలతో, ఎత్తు పల్లాలుగా ఉండే భూమి, కొండల నుండి జాలువారే జలపాతాలు, సెలయేర్లు, అందమైన పూదోటలు, వర్షపాతం తద్వారా పండే పంటలు, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండే నీటి వనరులు వంటి అంశాలతో ఆహ్లాదకర వాతావరణం ఉండేది.
మెసపిటోమియాకు దక్షిణాన ఎడారి ప్రాంతం ఉండేది. ఈ ప్రాంతానికి ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణులలో యూఫ్రిటిస్, టైగ్రిస్ నదులు జన్మించాయి. ఆ నదులు ప్రవాహం వలన సారవంతమైన మట్టితో ఆ పరిసర ప్రాంతాలు సారవంతమైన వ్యవసాయ మైదానాలుగా మారాయి. క్రీ.పూ. 7000 6000 సంవత్సరాల మధ్య కాలంలో ఇక్కడ వ్యవసాయం ఆరంభమయిందని చరిత్రకారులు అంచనా. ఇక్కడి ప్రజలు వందలు, వేల సంఖ్యలో గొర్రెలను పెంచుతూ ఉత్తర మెసపిటోమియా పచ్చికబైళ్ళని ఉపయోగించుకుంటూ ప్రజలు జీవించారు.

ప్రశ్న 2.
బాబిలోనియా నగర ప్రాధాన్యత ఏమిటి ?
జవాబు:
ప్రపంచ నాగరికతలలో ప్రముఖ పట్టణం బాబిలోనియా. ఇది 850 హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉండేది. దీని చుట్టూ మూడు రక్షణ గోడలు ఉండేవి. ఈ పట్టణంలో గొప్ప రాజభవనములు, దేవాలయములు ఉండేవి. ఆనాటి దేవాలయాన్ని ‘జిగూరత్’ అంటారు. ఈ జిగూరత్లు మెట్లు కలిగిన ఎత్తు నిర్మాణాలు. ఈ పట్టణాన్ని క్రీ.పూ. 593లో ఆర్కిమేడియన్లు ఆక్రమించారు. ఆ తరువాత కాలంలో క్రీ.పూ. 333లో అలెగ్జాండర్ ఆక్రమించారు. అప్పటికే బాబిలోనియా గొప్ప నగరంగా ప్రసిద్ధిగాంచింది.

ప్రశ్న 3.
మట్టిబిళ్ళలను టేబ్లేట్స్ అని ఎందుకంటారు ?
జవాబు:
వేల సంవత్సరాల క్రితం మొసపిటోమియా వాసులు ప్రతిరోజు జరిపే లావాదేవీలు, వ్యాపారం, నక్షత్ర పరిశోధనలు, సాహిత్యం మొదలైనవి మట్టిబిళ్ళలపై వ్రాయించుట, చిత్రించుట ప్రారంభించారు. అరచేతిలో సరిపోయే విధంగా ఈ |బిళ్ళలను మట్టితోను, రాతితోను, సున్నపు ముద్దలతోను తయారుచేసేవారు. అరచేతిలో సరిపడే సున్నపు ముద్ద బిళ్ళ తడిగా ఉన్నప్పుడు దాని ఉపరితలాన్ని నునుపుగా చేసి దానిపై పదునుగా ఉండే సూదిలాంటి పరికరంతో వివరాలు చెక్కేవారు. తడిగా ఉన్న వీటిని ఎండబెడితే అవి చెరగని బిళ్ళలుగా మారేవి. అనేక వ్యవహారాలు, వ్యాపార లావాదేవీలు ఈ బిళ్ళలపై చెక్కుట వలన వేలాదిగా టేబ్లెట్స్ లభిస్తున్నాయి.

AP Inter 2nd Year History Study Material Chapter 2 ప్రపంచ ప్రాచీన నాగరికత - మెసపిటోమియా - వ్రాత విధానం - నగర జీవనం

ప్రశ్న 4. మెసపిటోమియా సామాజిక పరిస్థితులు రాయండి.
జవాబు:
మెసపిటోమియా నాగరికత నాటి సమాజంలో ధనవంతులు, సాధారణ ప్రజల మధ్య వ్యత్యాసం స్పష్టంగా ఉండేది. ధనవంతులు మరింత ధనవంతులు కాగా, సామాన్యులు తమ జీవనాన్ని మెరుగుపరుచుకోవడానికి నిరంతరం కృషి చేసేవారు. ధనవంతులు దేశంలోని అధికశాతం ధనాన్ని, బంగారం, ఆభరణాలు, కలపవస్తువులు, సంగీత | పరికరాలు అనుభవించేవారు. ‘ఉర్’ నగర రాజుల సమాధులలో విలువైన ఆభరణాలు లభించాయి.

మెసపిటోమియా నాగరికతలో కుటుంబాలు చిన్నవిగా ఉండేవి. తండ్రి కుటుంబానికి పెద్ద. వివాహ సమయంలో ఇరువర్గాలు బహుమతులు ఇచ్చి పుచ్చుకునేవారు. తండ్రి ఆస్తికి కుమారుడు మాత్రమే హక్కుదారులు, కుమార్తెలకు కొంత మొత్తం బహుమతి రూపంలో లభించేది తప్ప వారికి ఆస్తి హక్కు లేదు. నాటి ప్రజలు వ్యవసాయం, పశుపోషణ చేసేవారు. టర్కీ, ఇరాన్ వంటి దేశాలతో విదేశీ వ్యాపారం జరిగేది.

ప్రశ్న 5.
మెసపిటోమియా వ్రాత విధానం గురించి తెలుపుము.
జవాబు:
ప్రాచీన సమాజంలోని ప్రజలు వివిధ శబ్దాలను తమ భావాలను వ్యక్తపరుచుకోవడానికి ఉపయోగించారు. వ్రాత పద్ధతి అనగా ‘ప్రజలు మాట్లాడే పదాలకు కంటికి కనబడే చిహ్నాలు’. ప్రపంచ చరిత్రలో మొదటిసారిగా అక్షరాలు రాసే విధానం, జరిగిన సంఘటనలు, లెక్కలు మొదలైనవి రాయడం ప్రారంభించినవారు మెసపిటోమియా ప్రజలు.
సుమారు ఐదువేల సంవత్సరాలకు మునుపు మెసపిటోమియా ప్రజలు తమ భావాలు, వివరాలు, లెక్కలు వంటి వివరాలను భద్రపరుచుకోవడానికి వ్రాత విధానాన్ని ప్రారంభించారు. మొదట ఈ లిపిలో ఎక్కువగా చిత్రాలు కనిపించాయి. ఆ కాలం నాటి పంటలు, వాటిపై ప్రభుత్వం విధించే పన్నుల వివరాలు ఈ చిత్రాల ద్వారా వివరించబడ్డాయి. కాలక్రమంలో వ్రాత విధానం ప్రాధాన్యత పెరిగి కొన్ని పదాలు, వాటి అర్థానికి తగిన చిహ్నాలు అభివృద్ధి చెందాయి. ఈ పద్ధతిని క్యూనిఫారమ్ అంటారు. క్రీ.పూ. 3200 కాలంలో మొదటిసారి మట్టిబిళ్ళపై వ్రాత ప్రారంభమైనట్లు చరిత్రకారులు నిర్ధారించారు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
క్యూనిఫారమ్.
జవాబు:
క్రీ.పూ. 3500 – 3200 సంవత్సరాల నాడే ప్రపంచ చరిత్రలో తొలిసారిగా అక్షరాలు రాసే విధానం ప్రారంభించినవారు మెసపిటోమియా ప్రజలు. వారు ప్రారంభించిన వ్రాత విధానంలో తొలినాళ్ళలో ఎక్కువగా చిత్రాలు కనిపించేవి. కాలక్రమంలో పదాలకు వాటి అర్థానికి తగిన చిహ్నాలు అభివృద్ధి చెందాయి. ఈ పద్ధతిని క్యూనిఫారం
అంటారు.

ప్రశ్న 2.
అక్కాడియన్ నాగరికత
జవాబు:
మెసపిటోమియా నాగరికత కాలక్రమంలో సమర్ ‘అక్కడ్’ ప్రాంతాలకు విస్తరించింది. తరువాత అక్కాడియన్ రాజ్యంగా రూపొందింది. అక్కాడియన్ రాజ్యం మెసపిటోమియాను చాలాకాలం పరిపాలించారు. ఈ నాగరికత సెమెటిక్ సుమేరియన్ భాషల వారిని ఒక పాలన క్రిందకు తెచ్చారు. క్రీ.పూ. 2400 నాటికి ఈ భాష అక్కాడియన్ భాషగా పిలవబడింది. ఈ కాలానికి ఈ నాగరికత ఉచ్ఛస్థితిలో ఉంది.

ప్రశ్న 3.
మేరీ భవనం.
జవాబు:
పురావస్తు త్రవ్వకాలలో లభించిన మరొక గొప్ప నిర్మాణం ‘మేరీ భవనం’. ఈ భవనం క్రీ.పూ. 1810-1760 మధ్య కాలంలో పరిపాలించిన జీమరిలియన్ నివాస భవనం. ఈ భవనం ఎంతో విలాసవంతమైనది, విశాలమైనది. ఇందులోని విశాలమైన హాలులో దేశ, విదేశీ అతిధులతో చర్చలు జరిగేవి. ఈ రాజభవనం అందమైన అలంకరణలతో సమారు రెండు నుండి నాలుగు హెక్టార్లలో విస్తరించి ఉండేది. ఇందులో 260 గదులుండేవని తెలుస్తోంది.

ప్రశ్న 4.
ఉరుక్ నగరం.
జవాబు:
మెసపిటోమియా నాగరికతకు చెందిన మరో ప్రముఖ నగరం. ‘ఉరుక్’. క్రీ.పూ. 3000 సంవత్సరానికి చెందిన ఈ నగరం దేవాలయాల నగరంగా గుర్తింపు పొందింది. ఇది 250 హెక్టార్లు విస్తరించి ఉండేది. ఈ నగరం హరప్పా నాగరికతలోని మొహంజోదారో పట్టణం కంటే రెండు రెట్లు పెద్దది. క్రీ.పూ 2800 మధ్య కాలంలో అనేక గ్రామాల నుండి ప్రజలు వచ్చి ఉరుక్ నగరాన్ని విస్తరించారు. దీనిలో నగర విస్తీర్ణం 400 హెక్టార్లకు పెరిగింది. ఈ నగరంలో అనేక దేవాలయాలు ఉండేవి. వీటి నిర్మాణానికి యుద్ధ ఖైదీలను, స్థానికులను వాడుకునేవారు.

ప్రశ్న 5.
గణితశాస్త్ర పరిస్థితులు.
జవాబు:
మెసపిటోమియా ప్రజలు గణితశాస్త్రంలో అనేక కొత్త విషయాలను కనుగొన్నారు. వారి సంఖ్యాశాస్త్రంలో మరియు 10 గుణకాలకు ప్రాధాన్యత ఉండేది. మొదటి క్రమంలో 10 సంఖ్య వరకు ప్రాధాన్యత ఉండేది. తరువాత 6తో కూడిన గుణకాలు ఉపయోగించి 60 నుండి 600 వరకు లెక్కించేవారు. బహుశా 60 అనే సంఖ్య అనేక సంఖ్యలతో విభజనకు అనుకూలంగా ఉండేది. క్రీ.పూ. 1800 సంవత్సరం నాటి మట్టిబిళ్ళలు మెసపిటోమియా గణితశాస్త్ర పరిశోధనకు నిదర్శనం. గుణకాలు, విభజనలు, స్క్వేర్, స్క్వేర్టు విధానాలు ఈ బిళ్ళలలో కనిపిస్తాయి.

ప్రశ్న 6.
యూఫ్రిటిస్, టైగ్రిస్ నదులు.
జవాబు:
మెసపిటోమియా యూఫ్రిటస్, టైగ్రిస్ నదుల మధ్య విలసిల్లిన నాగరికత. తూర్పు టర్కీలోని టారస్ పర్వతాలలో పుట్టి సిరియా మీదుగా ఇరాక్లో ప్రవేశిస్తాయి. తమ ఉపనదులతో కలిపి మెసపిటోమియా (నేటి ఇరాక్)లో సారవంతమైన మట్టిగల మైదాన ప్రాంతాలను ఏర్పరచాయి. దీనితో ఈ ప్రాంతం వ్యవసాయయోగ్య మైదానాలుగా మారాయి. ఈ విధంగా ప్రవహించి ఈ నదులు పర్షియన్ గల్ఫ్ లో కలుస్తాయి.

AP Inter 2nd Year History Study Material Chapter 2 ప్రపంచ ప్రాచీన నాగరికత - మెసపిటోమియా - వ్రాత విధానం - నగర జీవనం

ప్రశ్న 7.
కాల నిర్ణయ విధానం.
జవాబు:
మెసపిటోమియా వాసులు సంవత్సరానికి 12 నెలలు, నెలకు 30 రోజులు, వారానికి 7 రోజులు, గంటకు 60 నిమిషాలు అనే కాల నిర్ణయ విభజన విధానాన్ని కనుగొన్నారు. ఈ కాల నిర్ణయ విధానం అలెగ్జాండర్ అనంతర కాలం నుండి ఎక్కువగా వాడుకలోకి వచ్చి రోమన్ సామ్రాజ్యానికి, అటు మహమ్మదీయ రాజ్యాలకు, మధ్య ఐరోపా దేశాలకు వ్యాపించింది.

AP Inter 1st Year History Study Material Chapter 12 భారత జాతీయోద్యమం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 12th Lesson వలస పాలనలో భారతదేశం Textbook Questions and Answers.

AP Inter 1st Year History Study Material 12th Lesson వలస పాలనలో భారతదేశం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశంలో జరిగిన సామాజిక సంస్కరణోద్యమాలను వివరించండి.
జవాబు:
క్రీ.శ. 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనతో వచ్చిన వ్యవస్థాగత మార్పు విద్యావంతులైన ఒక కొత్త సామాజిక వర్గ ఆవిర్భావానికి దారితీసింది. పాశ్చాత్య విద్య, సంస్కృతితో ప్రభావితులైన విద్యాధికులు సామాజిక ఉద్యమాలకు పూనుకున్నారు.

సామాజిక సంస్కరణోద్యమాలు: 19వ శతాబ్ద ప్రారంభం నాటికి సమాజంలో నెలకొన్న సామాజిక కట్టుబాట్లు స్త్రీలను, దళితులను హీనస్థితికి గురిచేశాయి. బాలికల భ్రూణ హత్య, సతి, నిర్బంధ వైధవ్యం, బాల్యవివాహాలు ఆనాటి సమాజంలో నెలకొన్న కొన్ని దురాచారాలు. అయితే భారతీయ విద్యావంతులు ఆంగ్ల విద్య ద్వారా పాశ్చాత్యుల్లోని ఉదార, ఆశావాద దృక్పథాన్ని చూసి వాటిపట్ల ఆకర్షితులయ్యారు. భారతీయ సమాజంలోని వివక్షాపూరిత దృక్పథం, వెనకబాటుతనం వారి సంస్కరణాభిలాషను దృఢతరం చేసింది.

19వ శతాబ్దంలో ప్రారంభమైన సంస్కరణల్లో రెండు ప్రధాన ధోరణులున్నాయి. అవి మత, సామాజిక సంస్కరణలు, రాజారాంమోహన్ రాయ్ మతానికి హేతువాద దృక్పథాన్ని జోడించాడు. ఇతని కృషివల్ల 1829 డిసెంబర్ 4న సతీ దురాచారం నిషేధించబడింది. అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ ‘సతి’ని చట్టరీత్యా నేరంగాను, శిక్షార్హంగాను ప్రకటించాడు. బ్రహ్మసమాజం, ప్రార్థనా సమాజం, రామకృష్ణ మిషన్, ఆర్య సమాజం, థియోసాఫికల్ సంఘం లాంటి మత సంస్కరణాభిలాష గల సంస్థలు తమ కార్యక్రమాలను నడిపించాయి. బ్రహ్మసమాజం బ్రాహ్మణ వ్యవస్థకు వ్యతిరేకంగా ఏకేశ్వరోపాసనను ప్రోత్సహించింది. దయానంద సరస్వతి నాయకత్వంలో ఆర్యసమాజం విగ్రహారాధనకు వ్యతిరేకంగా ఉద్యమించి ‘వేదాలకు తరలండని’ ప్రబోధించారు. కరుడుగట్టిన సమాజ పునర్వ్యవస్థీకరణకు భారత తాత్విక సంస్థలు, థియోసాఫికల్ సొసైటీవంటివి పూనుకొన్నాయి. హేతుబద్ద పూజా విధానాన్ని రామకృష్ణ మిషన్ వారు ప్రవచించారు. జొరాస్ట్రియన్ల సంస్థ, రహనుమాయి మజ్దాయాన్ సభ, జొరాస్ట్రియన్ల ప్రాచీన పద్ధతుల పరిరక్షణను ప్రబోధించింది.

ఈ సంస్కర్తలు చేపట్టిన కార్యక్రమాలైన వితంతు పునర్వివాహం, కులాంతర వివాహాలు, స్త్రీ విద్య ఉదార పాశ్చాత్య లౌకిక ధోరణుల్ని సూచిస్తాయి. పర్దా నిషేధం, బాల్యవివాహం రద్దు, బహు భార్యత్వం, దళితుల పట్ల వివక్షను రూపమాపటం కోసం సంస్కర్తలు పూనుకొన్నారు. వివాహ వయోపరిమితి పెంపు, స్త్రీల ఆస్తి హక్కుల్ని వారు కాంక్షించారు. ఈ దురాచారాలను రూపుమాపడం కోసం చట్టాల ఏర్పాటుతోపాటు దేవాలయ ప్రవేశం, భోజన విషయాల్లో వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. ముఖ్యంగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం డిప్రెస్డ్ క్లాస్ మిషన్, డెక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ, సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ, అలీఘర్ సంస్థ, అమృత్సర్లోని దివానల్సా, బొంబాయి సోషల్ సర్వీసీగ్, ఇండియన్ నేషనల్ సోషల్ సర్వీస్ లీగ్లు, సత్యశోధక్ సమాజ్, హరిజన సేవక్ సంఘ్ లాంటి సంస్థలు కృషి చేశాయి.

AP Inter 1st Year History Study Material Chapter 12 భారత జాతీయోద్యమం

మహారాష్ట్రలో జ్యోతిరావు పూలే, సావిత్రి బాయి పూలేలు స్త్రీల విద్యావాప్తి, ముఖ్యంగా దళిత బాలికల విద్యా వ్యాప్తికై కృషి చేశారు. వితంతు స్త్రీల సంతానానికి అనాథాశ్రమం కట్టించారు. క్రీ.శ. 1873లో సత్యశోధక్ సమాజాన్ని 1882లో దీనబంధు సార్వజనిక్ సభను స్థాపించి వీటి ద్వారా సంస్కరణలు చేపట్టారు. పండిత రమాబాయి సంప్రదాయ కుటుంబంలో జన్మించింది. సంస్కృతంలో ప్రావీణ్యం గడించి సమాజంలోని మూఢాచారాలను ఏవగించుకొంది. సంస్కృత ప్రావీణ్యానికి ‘పండిత’ అనే గౌరవ బిరుదు రమాబాయి పొందారు. అనేక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి సామాజిక అన్యాయాల నుంచి హిందూ స్త్రీలను రక్షించడం కోసం కృషి చేశారు. పూణేలో మహిళా ఆర్యసమాజాన్ని, బొంబాయిలో శారదా సదన న్ను స్థాపించారు.

బెంగాల్లో హెన్రీలూయిస్ వివియన్ డొరేజియో హేతువాద దృక్పథంతో యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని నడిపాడు. విద్యాసంస్కరణలకోసం ఈశ్వరచంద్ర విద్యాసాగర్ పూనుకొన్నారు. ఈయన కృషి వల్లే 1856లో హిందూ స్త్రీల పునర్వివాహానికి ఉన్న నిర్బంధాలన్నీ తొలగి చట్టం చేయడమైంది. ప్రముఖ సంస్కర్త సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ముస్లింల విద్యావ్యాప్తికి కృషి చేశారు. 1825లో మహమ్మదీయ ఆంగ్లో ఓరియంటల్ కాలేజీని స్థాపించాడు. ఈ సంస్థే తరువాత అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంగా మారింది. ఆ తర్వాత కాలంలో వివేకానందుడుగా ప్రఖ్యాతి చెందిన నరేంద్రనాథ్ దత్తా రామకృష్ణ మిషన్ స్థాపించాడు. దీని ద్వారా యువతలో దేశభక్తిని రగిల్చి ప్రజోద్ధరణకు పనిచేసేలా వారిని ఉత్తేజపరిచాడు.

ప్రశ్న 2.
భారత జాతీయోద్యమంలో ‘వందేమాతరం’ ప్రాముఖ్యత తెల్పండి.
జవాబు:
భారతీయులలో పెరుగుతున్న జాతీయభావం బెంగాల్ విభజనతో బహిర్గతమై వందేమాతరం ఉద్యమంగా రూపుదాల్చింది. ఈ ఉద్యమం భవిష్యత్లో జరగబోయే ఉద్యమాలకు మార్గదర్శకమైంది.

కారణాలు: ఈ క్రింది కారణాలు వందేమాతర ఉద్యమానికి దోహదపడ్డాయి.
1) మితవాదుల వైఫల్యం: కాంగ్రెస్ స్థాపన జరిగినప్పటి నుంచి నాయకులు తమ కోర్కెల సాధన కోసం రాజ్యాంగ పద్ధతులను అవలంబించారు. వారు ఉద్యమించిన 20 సంవత్సరాల కాలంలో ప్రత్యేకంగా సాధించేందేమీ లేదు. దీనితో మితవాదుల యెడల ప్రజలలో అసంతృప్తి బయలుదేరింది.

2) అతివాద జాతీయభావం: అప్పటికే జాతీయోద్యమంలో తిలక్, లాలాలజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్ వంటి అతివాద జాతీయ నాయకులున్నారు. పోరాటం ద్వారానే తమ కోర్కెలు తీరుతాయని వారు భావించి తమకు స్వరాజ్యం కావాలని ప్రకటించారు.

3) ఆంగ్లేయుల విభజించు పాలించు విధానం: ప్రజల్లో పెరుగుతున్న జాతీయ భావాన్ని దెబ్బతీయటానికి బ్రిటీషు ప్రభుత్వం “విభజించి, పాలించు” అనే సాధనాన్ని వినియోగించింది. భారతీయులలోని ఐక్యతను దెబ్బతీసి, వారిని బలహీనపరచి, తద్వారా తాను లబ్ది పొందాలని భావించింది. ఈ లక్ష్య సాధనకు బెంగాల్ను విభజించింది.

4) బెంగాల్ విభజన: బెంగాల్ రాష్ట్రం జాతీయోద్యమానికి ఆయువుపట్టు. దానిని విభజించటం ద్వారా జాతీయోద్యమాన్ని దెబ్బతీయాలని, హిందూ, ముస్లింల మధ్య విభేదాలు సృష్టించాలని కర్జన్ ప్రభువు తలపోశాడు. ఈ కారణంగా బెంగాల్ నుంచి 3 కోట్లకు పైగా జనాభా ఉన్న తూర్పు బెంగాల్, అస్సాంలను విడదీసి ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచాడు. బెంగాల్ రాష్ట్రం అతివిశాలమైందని, పాలనా సౌలభ్యం కోసం దాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చని ప్రకటించాడు. ప్రజల్లో పెరుగుతున్న జాతీయ భావాన్ని మొగ్గలోనే తుంచేయడానికి, కాంగ్రెసు, ప్రజలను విడదీయటానికి ఆంగ్లేయులు ఈ పన్నాగం పన్నారని భారతీయులు భావించారు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా భారతీయులు ప్రారంభించిన ఉద్యమాన్ని వందేమాతరం ఉద్యమం అంటారు. దీనిని స్వదేశీ ఉద్యమం అని కూడా అంటారు.

వందేమాతరం ఉద్యమం: వందేమాతరం ఉద్యమం కాంగ్రెస్ నేతృత్వంలో జరిగిన మొట్టమొదటి ప్రజాఉద్యమం. బంకించంద్రుని ‘ఆనందమఠ్’ నవలలోని ‘వందేమాతరం’ గేయం ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చింది. అందువల్ల దీనిని వందేమాతర ఉద్యమం అన్నారు. ఉద్యమం బెంగాల్కు మాత్రమే పరిమితం కాక, దేశవ్యాప్తమైంది. మొదట్లో ఈ ఉద్యమం సురేంద్రనాథ్ బెనర్జీ వంటి మితవాదుల నేతృత్వంలో జరిగినా క్రమంగా అతివాద, తీవ్రవాద నాయకత్వానికి మరలింది.

బహిష్కరణోద్యమం: ఉద్యమంలో భాగంగా విదేశీ వస్తు బహిష్కరణ, బ్రిటీషు యాజమాన్యంలో ఉన్న విద్యాలయాలను బహిష్కరించటం దేశవ్యాప్తంగా జరిగాయి. విదేశీ వస్త్రాలను ఉద్యమకారులు కుప్పలు కుప్పలుగా పోసి తగులబెట్టారు. ఉద్యమంలో హిందువులు, మహమ్మదీయులు ఐక్యతతో పాల్గొన్నారు.

స్వదేశీ ఉద్యమం: ఈ కాలంలో ఉద్యమకారులు స్వదేశీ ఉద్యమాన్ని కూడా నడిపారు. స్వదేశీ వస్తువులకు ఆదరణ లభించింది. స్వదేశీ భావన అన్ని రంగాలకు వ్యాపించింది. విద్య, సంస్కృతి, వ్యాపారం, పరిశ్రమలు తదితర రంగాలలో స్వదేశీ భావం ప్రజ్వరిల్లింది.

నిర్మాణాత్మక కార్యక్రమం: స్వదేశీ, బహిష్కరణోద్యమాలతో పాటు ప్రజలు నిర్మాణాత్మక కార్యక్రమాలు కూడా చేపట్టారు. స్వదేశీ పరిశ్రమలను, స్వదేశీ విద్యాలయాలను స్థాపించారు.

ప్రభుత్వ దమన నీతి: ఈ ఉద్యమాన్ని అణచటానికి ప్రభుత్వం దమననీతిని సాగించింది. విద్యార్థులను లాఠీలతో కొట్టించింది. అనేకమంది నాయకులను ఎటువంటి విచారణ లేకుండా జైలులో పెట్టించింది. వందేమాతరం నినాదాలు చేయటం, జెండాలను ధరించటం, ఊరేగింపులను జరపటాన్ని నిషేధించింది. పత్రికా స్వాతంత్ర్యాన్ని కాలరాసింది. కర్జన్ తరువాత వచ్చిన వైస్రాయ్ లార్డ్ మింటో దేశద్రోహ చట్టాన్ని, విస్ఫోటక పదార్థాల చట్టాన్ని, భారతీయ పత్రికా చట్టాన్ని మొదలైన వానిని చేసి ప్రజల హక్కులను అణగద్రొక్కాడు. తిలక్కు 6 సంవత్సరాల కఠిన కారాగారశిక్ష విధించబడింది. అరవింద ఘోష్ అలీపూర్ బాంబు కేసులో ఇరికించబడ్డాడు. సురేంద్రనాథ్ బెనర్జీ, గాడిచర్ల హరి సర్వోత్తమరావులు నిర్బంధించబడ్డారు. పైగా బ్రిటిష్ ప్రభుత్వం మహమ్మదీయులను హిందువులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టింది.

విప్లవోద్యమం: ప్రభుత్వం అనుసరించిన దమననీతికి వ్యతిరేకంగా బ్రిటిష్ అధికారులను హత్యచేయడానికి కొందరు యువకులు రహస్య సంఘాలుగా ఏర్పడ్డారు. భూపేంద్రనాథ్ దత్, వి.డి. సావర్కర్, ఖుదీరామ్ బోస్ మొదలైనవారు వీరిలో ప్రముఖులు. ప్రభుత్వం ఖుదీరామ్ బోస్కు కింగ్స్ ఫోర్డ్ప హత్యాప్రయత్నం చేసినందుకు మరణశిక్ష విధించింది. ఈ ఉద్యమం బ్రిటిష్ అధికారులను భయభ్రాంతులను చేసింది. భారతీయులను తృప్తిపరచటానికి, మితవాదులను, అతివాదులను విడదీయడానికి, హిందూ, మహమ్మదీయుల మధ్య స్పర్ధలు సృష్టించటానికి బ్రిటిష్ ప్రభుత్వం 1909 భారతీయ కౌన్సిల్స్ చట్టాన్ని చేసింది. అయినా ఈ ఉద్యమం కొనసాగింది.

బెంగాల్ విభజన రద్దు: లార్డ్ మింటో స్థానంలో వైస్రాయ్ గా వచ్చిన లార్డ్ హార్డింజ్ ఉద్యమ తీవ్రతను అర్థం చేసుకొన్నాడు. బెంగాల్ విభజన రద్దుచేయాలని, అస్సాంను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచాలని బీహార్, ఛోటా నాగపూర్, ఒరిస్సాలను ఒక ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని, రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చాలని ప్రతిపాదించాడు. ఈ ప్రతిపాదనలను బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించగానే 1911లో బెంగాల్ విభజన రద్దయింది.

ఫలితాలు: బెంగాల్ విభజన కొన్ని ముఖ్య ఫలితాలనిచ్చింది.

  1. కేవలం నిరసనలు, ప్రదర్శనలు, తీర్మానాలు ఏవిధంగాను పనికిరావని, తీవ్రమైన చర్యలు అవసరమని కాంగ్రెస్ భావించింది. తీర్మానాలకు మద్దతుగా ప్రజాశక్తి తోడైతేగాని సమస్యలు పరిష్కారం కావని ప్రజలు భావించారు.
  2. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందేమాతరం ఉద్యమం రూపుదిద్దుకుంది.
  3. భారత జాతీయ కాంగ్రెస్ “స్వరాజ్యం” కావాలని కోరింది.
  4. విదేశీ వస్తువుల బహిష్కరణ, స్వదేశీ వస్తువుల ప్రోత్సాహం మంచి ఊపునందుకున్నాయి. దీనితో భారతీయ పరిశ్రమలు బాగా లబ్దిపొందాయి.
  5. ఈ ఉద్యమం సాంస్కృతిక కార్యకలాపాలను కూడా ప్రభావితం చేసింది. జాతీయ కవిత ఈ కాలంలో పెల్లుబుకింది. రవీంద్రనాథ్ ఠాగూర్, బంకించంద్ర ఛటర్జీ మొదలైన వారి రచనలను ప్రభావితం చేశాయి. జాతీయవిద్యకు ప్రోత్సాహం లభించింది.
  6. జాతీయోద్యమం తీవ్రతరమైంది. అతివాదులు శాంతియుత ప్రతిఘటనోద్యమాన్ని కూడా చేపట్టారు. ప్రజలు ప్రభుత్వంతో సహకరించడానికి నిరాకరించడం ఇందులోని ప్రధానాంశం.
  7. ఉగ్రవాదం చోటుచేసుకుంది. ఉగ్రవాదులు ఐరిష్ ఉగ్రవాదులు, రష్యన్ నిహిలిస్టుల విధానాలను అనుసరించి బ్రిటీషు ఉద్యోగులను చంపటానికి పూనుకొన్నారు.
  8. బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ కొనసాగిన తీవ్ర ఉద్యమం భారత జాతీయ కాంగ్రెస్ లో తీవ్ర భేదాభిప్రాయాలకు దారితీసింది. అతివాదులు, మితవాదులు అను రెండు వర్గాలుగా కాంగ్రెస్ చీలిపోయింది.

AP Inter 1st Year History Study Material Chapter 12 భారత జాతీయోద్యమం

ప్రశ్న 3.
సహాయ నిరాకరణ ఉద్యమాన్ని వివరించండి.
జవాబు:
గాంధీ నాయకత్వంలో జాతీయ కాంగ్రెస్ నిర్వహించిన ఉద్యమాల్లో మొదటిది సహాయ నిరాకరణోద్యమం. ఖిలాపత్ ఉద్యమ సందర్భంగా వ్యక్తమైన హిందూ, ముస్లిం సంఘీభావం గాంధీని సహాయ నిరాకరణోద్యమానికి పురికొల్పింది. 1920 సెప్టెంబరులో కలకత్తాలో లాలాలజపతిరాయ్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమ తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. తీర్మానం ఆమోదించడమైంది. 1920 డిసెంబర్ విజయరాఘవాచారి అధ్యక్షతన నాగపూర్లో జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశంలో దాన్ని ధృవీకరించడమైంది. రెండు సమావేశాల్లోనూ బెంగాల్ నాయకుడు చిత్తరంజన్ దాస్ నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. దాస్ సూచనలను కూడా తీర్మానంలో చేర్చడం ద్వారా గాంధీ ఆయనను సమ్మతింపచేశాడు.

ఉద్యమ కార్యక్రమం: ఈ ఉద్యమానికి మూడు అంశాల కార్యక్రమం కలదు. అవి: బహిష్కరణ, నిర్మాణాత్మక కార్యక్రమాలు, శాసనోల్లంఘనం.
బహిష్కరణ:

  1. ప్రభుత్వం ఇచ్చిన బిరుదులు, పదవులను త్యజించడం.
  2. ప్రభుత్వం ఏర్పాటు చేసే సన్మానాలు, తదితర కార్యక్రమాలను బహిష్కరించడం.
  3. విద్యార్థులు ప్రభుత్వ విద్యాలయాలను బహిష్కరించడం.
  4. ప్రభుత్వోద్యోగాలకు రాజీనామా చేయడం.
  5. ప్రభుత్వ న్యాయస్థానాలను బహిష్కరించడం. 6) విదేశీ వస్త్రాలను, వస్తువులను బహిష్కరించడం.
  6. శాసనసభలకు జరిగే ఎన్నికలను బహిష్కరించడం.
  7. 1921లో ఇంగ్లాండ్ దేశపు యువరాజు పర్యటన బహిష్కరించడం మొదలైనవి బహిష్కరణోద్యమంలో ముఖ్యమైనవి.

నిర్మాణాత్మక కార్యక్రమాలు:

  1. తిలక్ స్మారక నిధికి విరాళాలు వసూలు చేయడం.
  2. రాట్నాలపై నూలు వడికి, ఖద్దరు వస్త్రాలు తయారుచేయడం.
  3. అస్పృశ్యతను నిర్మూలించడం.
  4. మద్యపాన నిషేధానికి అనుకూలంగా ఉద్యమం నడపడం.
  5. జాతీయ విద్యాలయాలు నెలకొల్పడం.
  6. హిందూ, ముస్లిం సమైక్యతను సాధించడం అనేవి నిర్మాణాత్మక కార్యక్రమాలు.

శాసనోల్లంఘనం: పన్నులు చెల్లించటం, నిరాకరించటం ద్వారా కాంగ్రెస్ శాసనోల్లంఘనాన్ని చేపట్టాలని నిర్ణయించింది.
ఉద్యమ గమనం 1920లో ప్రారంభించిన ఈ ఉద్యమంలో ప్రజలు తమ విభేదాలను మరిచి చురుకుగా పాల్గొన్నారు. బ్రిటిష్ విద్యాసంస్థలను బహిష్కరించి జాతీయ విద్యాసంస్థలను నెలకొల్పారు. నెహ్రూ, చిత్తరంజన్ దాస్, ప్రకాశం పంతులు మొదలైన నాయకులు న్యాయస్థానాలను బహిష్కరించి న్యాయవాద వృత్తిని త్యజించారు. సుభాష్ చంద్రబోస్ మొదలైనవారు తమ ప్రభుత్వ పదవులకు రాజీనామా చేశారు. ప్రజలు విదేశీ వస్తువులను బహిష్కరించి ఖద్దరు వాడకాన్ని ప్రోత్సహించారు. హిందువుల ఐక్యతను పెంపొందించటానికి అస్పృశ్యతా నివారణను చేపట్టారు.

ఈ ఉద్యమం ఆంధ్రాలో అద్భుత విజయాన్ని సాధించింది. చీరాల-పేరాల సత్యాగ్రహం, పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమం, పల్నాడు పుల్లరి సత్యాగ్రహాలు జరిగాయి. పంజాబ్లో అకాలీలు మహంతులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్వహించారు. భారతదేశ సందర్శనానికి వచ్చిన వేల్స్ యువరాజు బహిష్కరించబడ్డాడు. ఈ ఉద్యమాన్ని అణచడానికి ప్రభుత్వం దమనకాండను సాగించింది. అయినప్పటికి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇంతలోనే ఉత్తరప్రదేశ్లోని చౌరీచౌరా అనేచోట హింస చెలరేగి అది అనేకమంది పోలీసులు సజీవదహనానికి దారితీసింది. హింసను సహించలేని గాంధీజీ ప్రజలు ఇంకా అహింసా పద్ధతులకు అలవాటుపడలేదని భావించి ఉద్యమాన్ని నిలుపు చేశాడు.

ఫలితాలు: సహాయ నిరాకరణోద్యమం అనేక గొప్ప ఫలితాలనిచ్చింది.

  1. భారత ప్రజలలోను, కాంగ్రెస్ నాయకులలోను నిరాశ ఏర్పడింది. దీని ఫలితంగా కాంగ్రెస్లోలో చీలిక వచ్చింది.
  2. ఉద్యమ కాలంలో హిందూ-మహమ్మదీయుల ఐక్యత సాధించబడింది.
  3. ఈ ఉద్యమ ప్రభావం వల్ల జాతీయభావం దేశం నలుమూలలా విస్తరించింది.
  4. ప్రజలలో ప్రభుత్వమంటే భయంపోయి వారిలో ఆత్మవిశ్వాసం పెరిగింది.
  5. కాంగ్రెస్లో వామపక్ష ధోరణులు ప్రారంభమైనాయి.
  6. ప్రభుత్వం దమననీతిని ఎదుర్కొనేందుకు భారతీయ యువత విప్లవోద్యమానికి దిగింది.
  7. ఈ ఉద్యమ విరమణ అనంతరం కాంగ్రెస్-లీగ్ మిత్రత్వం రద్దయింది. ఫలితంగా హిందువులు, ముస్లింల మధ్య మత కల్లోలాలు చెలరేగాయి.

ప్రశ్న 4.
భారత స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ పాత్రను విశ్లేషించండి.
జవాబు:
భారత జాతీయోద్యమ చరిత్రలో గాంధీజీ నిర్వహించిన పాత్ర అద్వితీయమైనది. తన నాయకత్వ పటిమతో ఆయన భారత జాతీయ శక్తులను ఏకం చేసి, వాటిని ఒక త్రాటిపై నడిపించిన ఘనుడు. 1919 నుంచి 1947 వరకు గల కాలంలో స్వాతంత్ర్యోద్యమానికి తానే స్ఫూర్తిగా మారిన మహామనిషి, అందువలననే 1919 నుండి 1947 వరకు గల కాలాన్ని “గాంధీ యుగం” అని పిలుస్తారు.

తొలి జీవితం: గాంధీజీ పూర్తిపేరు మోహన్దాస్ కరంచంద్ గాంధీ. ఆయన 1869 అక్టోబరు 2వ తారీఖున సౌరాష్ట్రలోని పోర్బందరులో జన్మించాడు. తన 19వ ఏట ఉన్నత విద్యకై లండన్ వెళ్ళి న్యాయవాద పట్టా పుచ్చుకొని మాతృదేశానికి వచ్చి రాజకోట, బొంబాయిలో న్యాయవాద వృత్తిని చేపట్టాడు. తరువాత రాజకీయాలలో ప్రవేశించాడు.
గాంధీజీ సిద్ధాంతాలు: స్వాతంత్య్ర సముపార్జనకై గాంధీజీ చేపట్టిన రెండు ఆయుధాలలో ఒకటి సత్యాగ్రహం, రెండు అహింస. ‘సత్యాగ్రహం అనగా సత్యమునకు కట్టుబడి ఉండటం అని అర్థం. సత్యాగ్రహము ఐదు విధాలు. అవి:

1) సహాయ నిరాకరణ: శాంతియుత సహాయ నిరాకరణ ద్వారా ఎటువంటి శక్తివంతమైన ప్రభుత్వాన్నైనా పడగొట్టవచ్చు. శాంతియుత ప్రతిఘటన ద్వారా హర్తాళ్ పాటించి, ప్రభుత్వం దమననీతిపై పోరాటం సాగించాలి. మన కోరికలు స్వచ్ఛమైనవిగాను, సమంజసమైనవిగాను ఉండాలి.

2) నిరాహారదీక్ష: ఇతర పద్ధతులు విఫలమైనప్పుడే దీనిని చేపట్టాలి.

3) హిజరత్: హింసాపూరిత వాతావరణంలో ఇమడలేని వ్యక్తులు తమంతట తాముగా ఇతరులకు దూరంగా ఉండాలి.

4) బహిష్కరణ: అన్నిరకాల చెడుకు వ్యతిరేకంగా చేపట్టే నిరాకరణ. ఒక వ్యక్తిని ఆ పనిని చేయకుండా నిరోధించటానికి చేపట్టే శాంతియుత పికెటింగ్. దీనిలో హింసకు తావులేదు.

5) శాసనోల్లంఘనం: ఈ చర్యను చేపట్టే ముందు చర్చలు, ప్రదర్శనలు జరిపి విఫలమైనప్పుడు మాత్రమే శాంతియుత ప్రతిఘటన చేపట్టాలి. ప్రతి చట్టాన్ని ఉల్లంఘించాలి.

అహింస: అహింసా పరమోధర్మః అన్నారు మనవారు. దానినే గాంధీజీ తన ఆయుధంగా స్వీకరించాడు. బౌద్ధ, జైనమతాలు, అశోక చక్రవర్తి ఈ విషయంలో గాంధీజీకి మార్గదర్శకులు. గాంధీజీకి ‘హింస’ అంటే పడదు. మాటల ” ద్వారాగాని, చేత ద్వారాగాని, ఆలోచనల ద్వారా గాని ఎవ్వరికీ హాని కలిగించకూడదన్నది ఆయన సిద్ధాంతం. దీనిలో మూడు రకాల వారున్నారు. మొదటిది అహింసను ఒక సిద్ధాంతంగా నమ్మి ఆచరించే ధైర్యవంతులు, రెండవది అహింసను ఒక విధానంగా చేపట్టేవారు, మూడవది భయస్తులు చేపట్టే అహింసా విధానం. దీనిని గాంధీజీ నిరసించాడు. అవమానాలపాలై, పిరికితనంతో విదేశీ పాలకులకు లొంగి ఉండటం కంటే భారతదేశం తన గౌరవాన్ని తిరిగి పొందటానికి అవసరమైతే ఆయుధాలు చేపట్టవచ్చునని కూడా ఆయన ఉద్బోధించాడు.

AP Inter 1st Year History Study Material Chapter 12 భారత జాతీయోద్యమం

దక్షిణాఫ్రికా వెళ్లటం: గాంధీజీ 1893లో ఒక కేసు విచారణ నిమిత్తం దక్షిణాఫ్రికా వెళ్లాడు. అచ్చట భారతీయుల దయనీయ పరిస్థితులు చూసి బాధాతప్తుడై వారి హక్కుల పరిరక్షణకై సత్యాగ్రహం, సహాయ నిరాకరణోద్యమ సాధనాలు ప్రవేశపెట్టి విజయాన్ని సాధించాడు.

భారత రాజకీయాలలో పాల్గొనుట: గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి 1915లో భారతదేశానికి తిరిగివచ్చి సబర్మతీ ఆశ్రమాన్ని స్థాపించాడు. బీహార్లోని చంపారన్ రైతులకు నాయకత్వం వహించి ఆంగ్లో-ఇండియన్ తోట యజమానుల బారినుండి వారిని రక్షించి ప్రఖ్యాతిగాంచాడు. అహ్మదాబాద్ మిల్లు యజమానులబారి నుండి కార్మికులను సంరక్షించి వారి ఉద్యమాన్ని విజయవంతం చేశాడు. గుజరాత్లో కరువు సంభవించినపుడు రైతులను ఋణబాధల నుండి, పన్ను చెల్లింపులనుండి విముక్తి గావించుటకు ‘కైరా’ సత్యాగ్రహాన్ని నిర్వహించి విజయాన్ని సాధించాడు. రౌలట్ శాసనము, జలియన్ వాలాబాగ్ మారణహోమం, గాంధీజీలో నూతన మార్పులు తెచ్చాయి. తిలక్ మరణానంతరం గాంధీజీ జాతీయోద్యమానికి నాయకత్వం వహించి జాతీయోద్యమాన్ని దిగ్విజయంగా నడిపాడు.

జాతీయోద్యమంలో గాంధీజీ నిర్వహించిన పాత్ర: గాంధీజీ జాతీయోద్యమ చరిత్రలో నిర్వహించిన పాత్ర చిరస్మరణీయం. జాతీయోద్యమ చరిత్రలో 1919 నుండి 1947 వరకు గల కాలాన్ని “గాంధీయుగం’ అంటారు.

ఎ) సహాయ నిరాకరణోద్యమం: గాంధీజీ 1920లో జాతీయ కాంగ్రెస్ నాగపూర్ సమావేశంలో శాంతియుత మార్గాల ద్వారా స్వాతంత్య్ర సముపార్జన కాంగ్రెస్ ధ్యేయమని ప్రకటించాడు. దీనిని సాధించటానికి 1920లో సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించాడు. ఈ ఉద్యమం దేశవ్యాప్తమై గాంధీజీ పేరు ప్రఖ్యాతులు పొందాడు. కానీ ఈ ఉద్యమం ‘చౌరీచౌరా’ సంఘటన ద్వారా విప్లవ ధోరణిలో ప్రయాణించుటచేత ప్రజలు శాంతియుత వైఖరికి సుముఖముగా లేరని ఉద్యమాన్ని నిలుపుదల చేసి పలు విమర్శలకు గురైనాడు. గాంధీజీ కారాగార శిక్షను అనుభవించాడు.

బి) శాసనోల్లంఘన ఉద్యమం: సంపూర్ణ స్వరాజ్య సాధనకు గాంధీజీ 1930లో “శాసనోల్లంఘనోద్యమము” ను ప్రారంభించాడు. నాటి ప్రభుత్వం ఉప్పుపై పన్నును విధించగా అది న్యాయసమ్మతం కాదని ఆ చట్టాన్ని ఉల్లంఘించి దండి గ్రామంలో ఉప్పు సత్యాగ్రహం జరిపి ఉప్పును తయారుచేశాడు. ఇదే జాతీయోద్యమ చరిత్రలో “దండి ఉప్పు సత్యాగ్రహం”గా పేరొందింది.

సి) రౌండేబుల్ సమావేశాలు: గాంధీజీ లండన్ లో జరిగిన మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కాలేదు. తదుపరి వైస్రాయ్ ఇర్విన్తో ఒడంబడిక చేసుకొని రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యాడు. జిన్నా వైఖరి వల్ల ఈ సమావేశం విఫలమైంది. మూడవ సమావేశానికి కాంగ్రెస్ హాజరు కాలేదు.

డి) పూనా ఒడంబడిక: బ్రిటిష్ ప్రధాని ‘మెక్ డోనాల్డ్’ భారతదేశంలో హరిజనులకు, క్రైస్తవులకు నియోజకవర్గ సౌకర్యాలను కల్పిస్తూ “కమ్యూనల్ అవార్డ్”ను ప్రకటించాడు. ఇది జాతీయ సమైక్యతకు హానియని గాంధీజీ బ్రిటిష్ పాలకుల వైఖరికి నిరసనగా ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించాడు. చివరకు నిమ్నజాతుల నాయకుడైన డా. అంబేద్కర్ కృషి వల్ల “పూనా ఒప్పందం” జరిగి గాంధీజీ ఆమరణ నిరాహారదీక్ష విరమించాడు.

ఇ) క్విట్ ఇండియా ఉద్యమం: 1942లో క్రిప్స్ రాయబారాన్ని తోసిపుచ్చి 1942 ఆగస్టు 8వ తారీఖున ఆంగ్లేయులు భారతదేశం నుండి వెళ్ళిపోవాలని “క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించాడు.

యఫ్) స్వాతంత్ర్య సముపార్జన: గాంధీజీ నడిపిన శాంతియుత ఉద్యమాలను అణచటంలో బ్రిటిష్ పాలకులు వైఫల్యం చెంది 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు. ఈ విధంగా విదేశీయ పాలనలో దాస్యమును అనుభవించిన భారతదేశం గాంధీజీ నేతృత్వంలో స్వాతంత్ర్యము పొందింది.

ప్రశ్న 5.
క్రిప్స్ మిషన్ ప్రతిపాదనలను, దాని వైఫల్యానికి కారణాలు వివరించండి.
జవాబు:
1941 డిసెంబర్లో జపాన్ రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నది. బ్రిటిష్ సామ్రాజ్య భాగాలైన సింగపూర్, బర్మాలను జపాన్ ఆక్రమించినది. జపాన్ సేన పురోగతిని ప్రతిఘటించడానికి భారతీయుల సహకారం అవసరమని బ్రిటిష్ ప్రభుత్వం భావించినది. అందుకుగాను సర్ఫర్డ్ క్రిప్స్న 1942లో భారతదేశం పంపినది. ఆయన భారతీయ నాయకులతో సంప్రదింపులు జరిపారు. ఆయన చేసిన ప్రతిపాదనలను రెండు భాగాలుగా విభజించవచ్చు. అవి: 1. దీర్ఘకాలిక ప్రతిపాదనలు లేదా యుద్ధానంతరం చేయతలపెట్టిన మార్పులు 2. తక్షణం చేయదగిన మార్పులు లేదా యుద్ధకాలానికి సంబంధించిన ప్రతిపాదనలు.
1. దీర్ఘకాలిక ప్రతిపాదనలు లేదా యుద్ధానంతరం చేయతలపెట్టిన మార్పులు:

  • యుద్ధానంతరము భారతదేశానికి డొమినియన్ ప్రతిపత్తి ఇవ్వబడుతుందని బ్రిటిష్ ప్రభుత్వం ప్రతిపాదించింది. భారతదేశానికి కామన్వెల్త్ నుండి వైదొలగే హక్కు కూడా ఉంటుంది.
  • యుద్ధం ముగిసిన తరువాత భారతదేశానికి ఒక నూతన రాజ్యాంగాన్ని రచించడానికిగాను రాజ్యాంగ పరిషత్ నెలకొల్పబడగలదు.
  • రాజ్యాంగ పరిషత్లో నైష్పత్తిక ప్రాతినిధ్య ప్రాతిపదికపై రాష్ట్ర శాసనసభల సభ్యులచే ఎన్నుకోబడిన సభ్యులు, స్వదేశీ సంస్థానాల జనాభా నిష్పత్తిని బట్టి సంస్థానాధిపతులు నియమించు సభ్యులుండగలరు.

i) కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించడానికి సిద్ధపడని రాష్ట్రాలు లేదా రాష్ట్రం వేరే యూనియన్ ఏర్పడడానికి హక్కులుండవలెను. స్వదేశీ సంస్థానాలకు కూడా అట్లే నూతన రాజ్యాంగానికి కట్టుబడి ఉండడానికి, లేకపోవటానికి స్వేచ్ఛ ఉండగలదు.

ii) బ్రిటిష్ ప్రభుత్వం పూర్తి అధికారాన్ని బదిలీ చేయటం వలన ఉత్పన్నమయ్యే విషయాలను చర్చించటానికి రాజ్యాంగ పరిషత్, బ్రిటిష్ ప్రభుత్వం మధ్య ఒక ఒడంబడిక కుదరవలెను.

2. తక్షణం చేయతగిన మార్పులు లేదా యుద్ధకాలానికి సంబంధించిన ప్రతిపాదనలు: తాత్కాలికంగా “రక్షణ” విషయాలపై బ్రిటిష్ ప్రభుత్వ నియంత్రణ ఉండగలదు. కాని భారతదేశ నైతిక, సైనిక, భౌతిక వనరులను సమీకరించే బాధ్యత భారత ప్రభుత్వానిదనీ, అందుకు భారత నాయకులు సలహా, సహకారములు అందించగలదని భావించబడినది.

క్రిప్స్ ప్రతిపాదనల మంచి, చెడ్డలు: క్రిప్స్ ప్రతిపాదనలు (1942) భారతదేశంలోని భిన్న రాజకీయ పక్షాలను సంతృప్తిపరచడానికి ఉద్దేశించినట్టివి. ఈ ప్రతిపాదనలు కాంగ్రెస్ డొమినియన్ ప్రతిపత్తి, రాజ్యాంగ పరిషత్, బ్రిటిష్ కామన్వెల్త్ నుండి విడిపోయే హక్కు మొదలైన ఆశలు చూపెట్టినవి. లీగ్ కోరికయైన పాకిస్తాన్ గుర్తింపు ఈ ప్రతిపాదనలో నిబిడీకృతమై ఉన్న స్వదేశ సంస్థానాధీపతులకు నూతన రాజ్యాంగమును ఆమోదించటానికి లేదా తిరస్కరించడానికి స్వేచ్ఛగలదని ఈ ప్రతిపాదనలో హామీగలదు. అల్పసంఖ్యాకుల భయాలు కూడా అనేక పరిరక్షణల ద్వారా నివృత్తి చేయబడినాయి. ఈ ప్రతిపాదన ఆగస్ట్ ప్రతిపాదనకన్నా మెరుగైనదని చెప్పవచ్చు.

AP Inter 1st Year History Study Material Chapter 12 భారత జాతీయోద్యమం

పూర్తి డొమినియన్ ప్రతిపత్తితో నూతన భారత యూనియన్ ఏర్పాటు చేయబడగలదనటం, కామన్వెల్త్ నుంచి విడిపోయే హక్కుండటం ప్రోత్సాహక విషయాలే కాని కాంగ్రెస్కు పూర్తి స్వాతంత్ర్య ప్రకటన మినహా మిగిలిన విషయాలేవీ సమ్మతం కావు. డొమినియన్ ప్రతిపత్తి ఎంతకాలములోపు ఇవ్వబడగలదో నిర్ధారణ చేయలేదు.

కాంగ్రెస్ కోరికను మన్నించడం కోసం యుద్ధం తరువాత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయగలదని ప్రతిపాదన కలదు. రాజ్యాంగ పరిషత్ నిర్మాణ సంబంధమైన పథకం సవ్యమైనది కాదు. ఉదా: స్వదేశ సంస్థానాల ప్రజలకు రాజ్యాంగ పరిషత్ ప్రతినిధుల ఎంపిక విషయాలలో ప్రమేయం ఉండదు. బ్రిటిష్ రాష్ట్రాల ప్రతినిధులు ఆయా రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికపై నిర్ణయించబడగలదు. పైగా స్వదేశ సంస్థానాధిపతుల ప్రతినిధులు రాజ్యాంగ పరిషత్లో ఉండటం అనేది భారత ప్రగతికి అవరోధమే.

నూతన రాజ్యాంగం ప్రకారం భారత యూనియన్ నుంచి బ్రిటిష్ రాష్ట్రాలకు, స్వదేశ సంస్థానాలకు విడిపోవటానికి హక్కు ఉండగలదనటం ఈ ప్రతిపాదనలో అతి ప్రమాదకరమైన భాగం. అంటే లీగ్ కోరికయైన పాకిస్తాన్ ఏర్పాటుకు బ్రిటిష్వారు సమ్మతించినట్లు అయినది. ఇది భారత యూనియన్ ఐక్యతకు గొడ్డలిపెట్టుకాగలదు.

వైస్రాయి కార్యనిర్వహణ మండలి సభ్యుల సంఖ్య మరికొందరు భారతీయ ప్రతినిధులతో విస్తృతపరచబడగలదని ఈ ప్రతిపాదనలో కలదు. కార్యనిర్వహణ మండలిగాని, దాని సభ్యులుగాని ఎలాంటి వాస్తవాధికారాన్ని చెలాయించలేరు. అధికారాలన్నీ వైస్రాయి చేతిలోనే కేంద్రీకరించబడగలవు. వివిధ రాజకీయ పక్షాల ప్రాతినిధ్యంతో జాతీయ ప్రభుత్వం ఏర్పాటు కావలెనని, దాని రాజ్యాంగబద్ధ అధిపతిగా మాత్రమే వైస్రాయి ఉండవలెననేది భారతీయల కోరిక. ఇట్టి – పరిస్థితులలో క్రిప్స్ ప్రతిపాదనలు భారతీయులకు ఆమోదయోగ్యం కాలేదు.

ప్రతిపాదనల తిరస్కృతి: విభిన్న కారణాలతో దాదాపు భారత రాజకీయ పార్టీలన్నీ ప్రతిపాదనలను తిరస్కరించినాయి. ఈ ప్రతిపాదనలలో భారతదేశ విభజనకు బ్రిటిష్వారు విషబీజాలు నాటారని కాంగ్రెస్ అభిప్రాయపడింది. రక్షణ సమస్య సంబంధంగా క్రిప్స్ కాంగ్రెస్ ఒక అంగీకారానికి రాలేకపోయింది. సంప్రదింపులు విఫలమైనాయి. అత్యవసర పరిస్థితిలో జాతీయ ప్రభుత్వం ఏర్పడవలెనని కాంగ్రెస్ చెప్పినది. రక్షణ విషయాలు కూడా జాతీయ ప్రభుత్వానికి అప్పగించవలెనని కాంగ్రెస్ కోరింది. కాని క్రిప్స్ ఈ కోర్కెలను తిరస్కరించినాడు. భారతీయులకు రక్షణ శాఖను బదిలీ చేయుటకు ఆయన ఇష్టపడలేదు. ‘ఇట్టి ఆపత్సమయములో కూడా బ్రిటిష్వారి మౌలిక వైఖరిలో మార్పులేదని భారతీయులు భావించారు. తత్ఫలితంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ క్రిప్స్ ప్రతిపాదనను ఆమోదించలేకపోయింది.

ప్రతిపాదనలలో ఇమిడియున్న పాకిస్తాన్ గుర్తింపును ముస్లింలీగ్ హర్షించినప్పటికీ దాని ఏర్పాటు గూర్చి స్పష్టీకరణ లేకపోయేసరికి విమర్శించింది. మిగిలిన రాజకీయ పక్షాలు కూడా క్రిప్స్ ప్రతిపాదనపట్ల తమ అసంతృప్తిని వెల్లడించినాయి. క్రిప్స్ ప్రతిపాదనల వైఫల్యమునకు కారణములు:

1) క్రిప్స్ రాయబారం విఫలమగుటకు ప్రధాన కారణం ప్రతిపాదనల అసమగ్రతయే. భారతీయుల దృష్టిలో ఈ ప్రతిపాదనలోని తాత్కాలిక, దీర్ఘకాలిక అంశాలు అసంతృప్తికరమైనవి. దీర్ఘకాలిక అంశమైన డొమినియన్ ప్రతిపత్తి, భారతీయుల ఆసక్తిని ఆకర్షించలేకపోయింది. తాత్కాలిక ప్రతిపాదనలు కూడా అస్పష్టము, అసంతృప్తికరములే. ప్రతిపాదనల ముసాయిదా ప్రకటన కూడా ప్రస్తుతము కన్నా భవిష్యత్తుపై నొక్కి చెప్పినది. అవి మొత్తంగా ఆమోదింపబడటమో, |తిరస్కరించటమో చేయవలెను. సవరణలకు అవకాశం లేదు. ఇన్ని లోపాలు గల ప్రతిపాదనలు సఫలమగుట |అనుమానాస్పదమే. కాంగ్రెస్, లీగ్, సిక్కులు, హిందూ మహాసభవారు ఈ ప్రతిపాదనలను తిరస్కరించారు.

2) క్రిప్స్ రాయబారం వైఫల్యానికి బ్రిటిష్ అధికారుల స్వార్థం కూడా దోహదపడింది. బ్రిటిష్ మంత్రివర్గం, భారత ప్రభుత్వం భారతీయులకు అధికారాన్ని అప్పగించుటకు ఇష్టపడలేదు. బ్రిటిష్ ప్రధాని చర్చిల్ క్రిప్స్క పూర్తి సహకారాన్ని ఇవ్వలేదు.

3) భారతదేశంలో అప్పుడు అనుకూల వాతారవణం కూడా లేదు. బ్రిటిష్ వారి వైఖరిపట్ల భారతీయులకు విశ్వాసం లేదు.

4) రక్షణశాఖ సమస్య విషయమై క్రిప్స్, కాంగ్రెస్ల మధ్య సంప్రదింపులు విఫలమైనాయి. యుద్ధం కొనసాగినంత కాలం రక్షణశాఖ బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండాలని క్రిప్స్ అభిప్రాయం. ఇందుకు జాతీయ కాంగ్రెస్ అంగీకరించలేదు. ఈ ప్రతిపాదనలను గాంధీజీ మొదటి నుండి వ్యతిరేకించెను. కనుకనే ఆయన ఈ ప్రతిపాదనలను “దివాలా తీయు బ్యాంకు మీద రాబోయే తేదీ వేసి ఇచ్చిన చెక్కు” అని అభివర్ణించెను. (“A post dated cheque on a withering Bank” -Gandhiji).

ప్రశ్న 6.
శాసనోల్లంఘన ఉద్యమానికి దారితీసిన కారణాలను, సంఘటనలను పేర్కొనండి.
జవాబు:
గాంధీజీ నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ 1930, మార్చి 12న చారిత్రాత్మకమైన శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించింది. కాంగ్రెస్ శాసనసభ్యులందరూ తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామాలు సమర్పించాలని ఆదేశించింది. ఆ సమయంలో కాంగ్రెస్ నాయకుల ఆవేశాలను చల్లార్చేందుకు గాంధీజీ ప్రయత్నించాడు. ఈ సందర్భంలో గాంధీజీ చివరి ప్రయత్నం చేస్తూ రాజ ప్రతినిధి ఇర్విన్ను సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నించాలని హెచ్చరించాడు. రాజ ప్రతినిధి ఇర్విన్ ఆ హెచ్చరికను పెడచెవిన పెట్టడంతో గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించేందుకు నిర్ణయించాడు.

శాసనోల్లంఘన ఉద్యమం మూడు దశలుగా జరిగింది. అవి:
1) మొదటి దశ (1930 మార్చి 12 – 1932 జనవరి 3 వరకు) 2) రెండో దశ (1932 జనవరి 4 – 1933 జులై 11 వరకు) 3) మూడో దశ (1933 జులై 12 – 1934 మే వరకు)
మొదటి దశ: దీనినే ఉప్పు సత్యాగ్రహ దశగా వర్ణించవచ్చు. ఈ ఉద్యమంను గాంధీజీ 1930, మార్చి 12వ తేదీన సబర్మతీ ఆశ్రమం నుంచి 78 మంది అనుచరులతో ప్రారంభించాడు. అతడు 200 మైళ్ళ దూరంలో అరేబియా సముద్రతీరం వద్ద గల దండి గ్రామాన్ని కాలిబాటన చేరుకొని ఉప్పును తయారుచేసేందుకు ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘించాడు. దీంతో దేశవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు సామూహిక ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా గాంధీజీ ప్రజలకు విజ్ఞప్తి చేసిన కార్యక్రమాలు:

  1. మద్యపాన దుకాణాలు, విదేశీ వస్త్ర విక్రయశాలల ఎదుట పికెటింగ్.
  2. రాట్నాల ద్వారా ఖద్దరు వడకటం.
  3. హిందూ – ముస్లింల మధ్య సంబంధాల పటిష్టత.
  4. అస్పృశ్యతా నివారణ.

ఉప్పు సత్యాగ్రహ పర్యవసానం:

  • బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీని నిర్బంధంలోనికి తీసుకొని ఎర్రవాడ కారాగారంలో ఉంచింది. దీంతో కోపోద్రిక్తులైన ప్రజలు దేశమంతటా హర్తాళ్ పాటించారు.
  • అనేకమంది ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేశారు.
  • 1930-32 మధ్యకాలంలో లండన్లో బ్రిటిష్ ప్రభుత్వం మూడు రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పరచింది.
  • రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీజీ పాల్గొని అల్పసంఖ్యాకుల ప్రాతినిధ్యం కంటే రాజ్యాంగ నిర్మాణమే ప్రధాన అంశమని వాదించాడు.
    కాని ఆయన వాదనలు ఆమోదయోగ్యం కాకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి.

రెండో దశ:
1) ఈ దశలో గాంధీజీని, ఇతర నాయకులను 1932, జనవరి 14న నిర్బంధంలో ఉంచడం జరిగింది. కాని ప్రజలు పికెటింగ్ను చేపట్టడం జరిగింది.

2) బ్రిటిష్ ప్రభుత్వం విధించిన నిషేధాజ్ఞలు ధిక్కరించి సమావేశాలు నిర్వహించడం, కరపత్రాల ముద్రణ వంటి చర్యలు అమలుచేయడం జరిగింది.

3) బ్రిటిష్ ప్రభుత్వం అన్ని రకాల ఊరేగింపులను నిషేధించింది.

4) ముస్లిం నాయకులు మినహా, జాతీయ నాయకులందరూ బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్ డొనాల్డ్ 1932, ఆగస్టు 10న ప్రకటించిన “కమ్యూనల్ అవార్డు”ను వ్యతిరేకించారు.

AP Inter 1st Year History Study Material Chapter 12 భారత జాతీయోద్యమం

5) కమ్యూనల్ అవార్డును వ్యతిరేకిస్తూ ఎర్రవాడ కారాగారంలో గాంధీజీ 1932, సెప్టెంబర్ 20న ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించారు.

6) బ్రిటిష్ ప్రభుత్వం, గాంధీజీ సంప్రదింపుల ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీ డిమాండ్లలో కొన్నింటికి
ఆమోదం తెలిపింది.

7) బ్రిటిష్ ప్రభుత్వం తమకు విధేయులైన నాయకులతో లండన్లో 1932, నవంబర్ 17 – డిసెంబర్ 24 మధ్య మూడో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో మహిళలకు ఓటుహక్కు వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

మూడో దశ:

  1. 1933 జులైలో గాంధీజీ, మరికొంతమంది నాయకులు వ్యక్తిగత శాసనోల్లంఘన ఉద్యమానికి ఉపక్రమించారు. వారిని బ్రిటిష్ ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది.
  2. కారాగారంలో గాంధీజీ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆయనను బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసింది.
  3. 1934 మే నెలలో పాట్నాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఉపసంహరించుకొంటున్నట్లు ప్రకటించింది.

ప్రశ్న 7.
భారత జాతీయోద్యమంలో సుభాష్ చంద్రబోస్ పాత్రను అంచనా వేయండి.
జవాబు:
భారత జాతీయోద్యమ చరిత్రలో ప్రముఖ స్థానాన్ని పొందిన దేశభక్తుడు సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ ఐ.సి.ఎస్ పరీక్ష పాసై సివిల్ సర్వెంట్గా తన జీవితాన్ని ప్రారంభించాడు. అయితే సహాయ నిరాకరణోద్యమ ప్రభావానికిలోనై తన సివిల్ సర్వీసు ఉద్యోగానికి రాజీనామా చేసి జాతీయోద్యమంలో పాల్గొన్నాడు.

కాంగ్రెస్లో పాత్ర: సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ రాజకీయాల్లో పాల్గొన్నాడు. 1938లో హరిపూర్లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడయ్యాడు. 1939లో త్రిపుర కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ అభ్యర్థియైన భోగరాజు పట్టాభి సీతారామయ్యను ఓడించి పార్టీ అధ్యక్షుడిగా గెలుపొందాడు. అయితే కాంగ్రెస్ అనుసరిస్తున్న శాంతియుత విధానాల యెడల బోస్కు విశ్వాసం లేదు. అందువల్ల గాంధీజీతో బోస్కు తీవ్రమైన భేదాభిప్రాయాలు కలిగాయి. అందువల్ల కాంగ్రెస్ నుంచి వైదొలగి ‘ఫార్వర్డ్ బ్లాక్’ అనే కొత్త పార్టీని స్థాపించాడు.

ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపన: బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి వెళ్లగొట్టాలంటే రెండవ ప్రపంచ యుద్ధం సరైన అవకాశమని బోస్ భావించాడు. అయితే యుద్ధకాలంలో బోస్ ను ప్రభుత్వం నిర్బంధించింది. బోస్ 1941లో నిర్భంధం నుంచి తప్పించుకొని మొదట రష్యాకు, తరువాత జర్మనీకి, జపాన్కు వెళ్ళాడు. యుద్ధసమయంలో ఆ దేశాల సహాయంతో ఇంగ్లీషువారితో పోరాడి, దేశానికి స్వాతంత్య్రం సాధించవచ్చని బోస్ తలచాడు. యుద్ధంలో జపాన్కు చిక్కిన భారతీయ యుద్ధఖైదీలందరినీ కూడగట్టుకొని 1943లో సింగపూర్లో ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ లేక ‘ఇండియన్ నేషనల్ ఆర్మీ’ని స్థాపించాడు. ఐ.ఎన్.ఏ. స్థాపనలో బోస్కు రాస్ బిహారీ బోస్, మోహన్సింగ్లు సహకరించారు. ఐ.ఎన్.ఏలో చేరిన సేనలు బోస్ న్ను “నేతాజీ” అని గౌరవంగా పిలిచేవారు. “జైహింద్” అనే నినాదాన్ని చేపట్టి బోస్ తన అనుచరులందరితో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి “ఛలో ఢిల్లీ” అంటూ భారతదేశంలో ఇంఫాల్ సమీపంలోని మోయిరాంగ్ వరకు వచ్చాడు. ఆయనకు తోడుగా వీరవనిత కెప్టెన్ లక్ష్మి మహిళలతో ఏర్పడిన ఝాన్సీరాణి దళనేత అయింది. ఆయన నాయకత్వంలోని ఐ.ఎన్.ఏ. సైన్యాలు దేశ స్వాతంత్ర్యానికి ప్రాణాలొడ్డి పోరాడాయి. కానీ దురదృష్టవశాత్తు 1945 సెప్టెంబర్ లో జపాన్ ఓడిపోవటంతో బోస్ ప్రయత్నాలు విఫలమైనాయి. తన ప్రయత్నాలు కార్యరూపం ధరించకుండానే బోస్ 1945లో ఒక విమాన ప్రమాదంలో మరణించాడు.

ఆజాద్ హింద్ ఫౌజ్ సభ్యుల విచారణ: యుద్ధానంతరం ప్రభుత్వం ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ సేనలను ఇండియాపై దాడిచేయడానికి ప్రయత్నించినందున దేశద్రోహులుగా ప్రకటించి ఎర్రకోటలో విచారణ జరిపించింది. సైనిక నాయకులైన మేజర్ జనరల్ షానవాజ్ ఖాన్ (ముస్లిం), కల్నల్ జి.ఎస్. ధిల్లాన్ (సిక్కు, మేజర్ ప్రేమ్ సెహగల్ (హిందూ) లపై విచారణ జరిపించింది. వారి తరఫున జవహర్లాల్ నెహ్రూ, తేజబహదూర్ సప్రూ, భూలాబాయ్ దేశాయ్లు వాదించారు. అయినప్పటికీ ప్రత్యేక న్యాయస్థానం వారికి శిక్షలు విధించింది. కానీ ఆ శిక్షలకు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవటంతో ప్రజాభిప్రాయాన్ని మన్నించి, ప్రభుత్వం వారిని విడుదల చేసింది. దీనితో ప్రజలకు, సైనికులకు ప్రభుత్వం పట్ల భయభక్తులు పోయాయి. హిందూ, సిక్కు, ముస్లింల సేనలను విచారించటం వలన కాంగ్రెస్, లీగ్లు సమైక్యంగా పోరాడాయి.

ఘనత: సుభాష్ చంద్రబోస్ విజయాన్ని సాధించలేకపోయినా, ఆయన ధైర్యసాహసాలు దేశంలో చాలామందికి స్ఫూర్తినిచ్చాయి. ఆయన అచంచల దేశభక్తి, క్రమశిక్షణ, కార్యదీక్ష తరతరాల భారతీయులకు ఆదర్శప్రాయం.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతీయులపై పాశ్చాత్య విద్య ప్రభావం గురించి రాయండి.
జవాబు:
పాశ్చాత్య విద్యావ్యాప్తి ద్వారా భారతీయుల్లో తార్కిక, లౌకిక, ప్రజాస్వామ్య భావాలు పునురుద్ధరింపబడ్డాయి. ఆంగ్ల | బోధన ప్రజల్లో ఏకత్వ భావన కలిగించి, రాజకీయ వికాసానికి తోడ్పడింది. ఆంగ్లవిద్య భారతదేశపు పూర్వ సంస్కృతి, సాహిత్యం, మతం, తాత్వికత, కళ అధ్యయనానికి, పునరుద్ధరణకు తోడ్పడింది. తవ్వకాల ద్వారా బయల్పడిన ప్రాచీన సంస్కృతీ వైభవాన్ని చూసి భారతీయులు గర్వించారు. ఆంగ్లవిద్య ద్వారా జరిగిన మరో ప్రయోజనం నూతనంగా బ్రిటిష్ ప్రభుత్వరంగాల్లో వచ్చిన ఉద్యోగావకాశాలు. దీంతో పాటు భారతీయ మేధావులు కూడా ఆంగ్లవిద్యను ప్రోత్సహించారు.

ఈస్ట్ ఇండియా కంపెనీ, క్రైస్తవ మిషనరీల ప్రోత్సాహం వల్ల పాశ్చాత్య విద్యనభ్యసించిన విద్యాధికుల సంఖ్య పెరిగింది. మొదటి నుంచి క్రైస్తవ మిషనరీలు విద్యను ప్రోత్సహించాయి. 1717 లో డానిష్ మిషనరీలు మద్రాసులో రెండు ఛారిటీ స్కూళ్ళను తెరిచారు. మద్రాసులోనే కాక అనేక ఇతర ప్రాంతాల్లో కూడా ఇటువంటి స్కూళ్ళను ప్రారంభించారు. కేరీ, మార్మోన్ లాంటి మిషనరీలు 1793వ సంవత్సరంలో వారి కార్యక్రమాలను విస్తృతం చేశారు. బొంబాయిలో విల్సన్ కాలేజి, మద్రాస్ లో మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. 1853 ఆగ్రాలో సెయింట్ జాన్ కాలేజీ మొదలైంది. మచిలీపట్నం, నాగపూర్లలో మిషనరీ కాలేజీలు స్థాపించబడ్డాయి.

ఆంగ్లవిద్య ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడమేకాక, అనేక గ్రంథాలను ప్రాంతీయ భాషల్లో రాయడానికి తోడ్పడింది. దీనివల్ల చదువురాని వారికి కూడా సమాజంలోని దురాచారాల పట్ల అవగాహన కలిగింది. బ్రిటిష్ పాలన దురాగతాలను తెలుసుకొన్న వీరు సంస్కరణావశ్యకతను గుర్తించారు. పాశ్చాత్య మేధావులైన మాకు ముల్లర్, విలియం జోన్స్ వేదాలను, ఉపనిషత్తులను, ఇతర గ్రంథాలను అనువదించారు. వారి పరిశోధనలు భారతదేశ గత చరిత్ర వైభవాన్ని వర్ణించాయి.

AP Inter 1st Year History Study Material Chapter 12 భారత జాతీయోద్యమం

ప్రశ్న 2.
హోం రూల్ ఉద్యమ పాత్రను విశ్లేషించండి.
జవాబు:
బ్రిటీషు సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉంటూనే భారతదేశానికి స్వపరిపాలనను సాధించాలన్న లక్ష్యంతో ప్రారంభమైన ఉద్యమాన్ని హోంరూల్ ఉద్యమం అంటారు. మొదటి ప్రపంచయుద్ధ కాలంలో 1916లో హోం రూల్ ఉద్యమం ఒక ప్రజా ఉద్యమంగా ప్రారంభమైంది. ఆ ఉద్యమానికి నాయకులు బాలగంగాధర్ తిలక్, అనిబిసెంట్లు.
బాలగంగాధర్ తిలక్: హోం రూల్ ఉద్యమాన్ని ప్రారంభించటానికి తిలక్ 1916 ఏప్రియల్లో బొంబాయిలో ఒక హోం రూల్ లీగ్ను స్థాపించాడు. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యభారత్ ప్రాంతాలలో తిలక్ తన ప్రచారాన్ని సాగించాడు. తన “మరాఠా”, “కేసరి” పత్రికల ద్వారా హోం రూల్ భావాన్ని ప్రచారం చేశాడు. తిలక్ హోం రూల్ ఉద్యమ ప్రచారం ప్రజలను చైతన్యవంతుల్ని చేసి, వారిలో స్వీయపాలనాభావాన్ని పటిష్టపరిచింది.

అనిబిసెంట్: హోం రూల్ ఉద్యమం కోసం అనిబిసెంట్ 1916 సెప్టెంబర్ నెలలో మద్రాసులో ఒక హోం రూల్ లీగ్ను స్థాపించింది. మద్రాసు పరిసర ప్రాంతాల్లో పర్యటించి ఉద్యమాన్ని అక్కడ ప్రచారం చేసింది. తన “న్యూ ఇండియా”, “కామన్వీల్” అనే పత్రికల ద్వారా అనిబిసెంట్ తన ప్రచారాన్ని సాగించింది.

హోం రూల్ ఉద్యమ వ్యాప్తి: తిలక్, అనిబిసెంట్ల కృషి వలన హోం రూల్ ఉద్యమం దేశవ్యాప్తమైంది. ఈ ఉద్యమం గురించి ప్రజలకు వివరించడానికి అనేక భాషల్లో అనేక కరపత్రాలను కూడా ప్రచురించారు. హోం రూల్ను సమర్థిస్తూ అనేక నగరాల్లో, గ్రామాల్లో కూడా సభలు ఏర్పాటు చేసి తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమాలలో ఎక్కువగా యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. హోం రూల్ ఉద్యమ కాలంలో అనిబిసెంట్ జాతీయవిద్యకు చాలా ప్రాముఖ్యం ఇచ్చింది. విద్యార్థుల్లో జాతీయ భావాలు పెంపొందించడం జాతీయ విద్య లక్ష్యం. ఈ లక్ష్యంతోనే ఆమె మదనపల్లిలో ఒక కళాశాల నెలకొల్పింది. వారణాసిలో హిందూ విద్యాలయాన్ని నెలకొల్పడానికి కూడా ఆమె కృషి చేసింది.

ప్రభుత్వ చర్యలు: 1917 నాటికి అనిబిసెంట్ చేస్తున్న ఉద్యమ ప్రచారానికి బ్రిటిష్ ప్రభుత్వం ఆందోళన చెంది, ఆమెను నిర్బంధించింది. ఆమె నిర్బంధాన్ని నిరసిస్తూ అనేక ప్రాంతాలలో సభలు, ప్రదర్శనలు జరిగాయి. తిలక్ దేశ ఉత్తర ప్రాంతాల్లో పర్యటించడాన్ని కూడా ప్రభుత్వం నిషేధించింది. దీనిని కూడా ప్రజలు వ్యతిరేకించారు. ప్రజా ఆందోళనకు తలవగ్గి, అనిబిసెంట్ను మద్రాస్ ప్రభుత్వం 1917 సెప్టెంబరు నెలలో విడుదల చేసింది. ఆమె దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా కాంగ్రెస్ ప్రతినిధులు ఆమెను 1917లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. భారత |జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అలంకరించిన తొలి మహిళ అనిబిసెంట్.

ఉద్యమవ్యాప్తికి కారణాలు’: బ్రిటిష్ ప్రభుత్వం ఉద్యమ నాయకులను నిర్బంధించి ఉద్యమ వ్యాప్తిని అరికట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఉద్యమం దేశవ్యాప్తమైంది. హోం రూల్ ఉద్యమ వ్యాప్తికి కొన్ని కారణాలున్నాయి.
1) 1907 సూరత్ సమావేశంలో చీలిపోయిన కాంగ్రెస్ 1916లో సమైక్యమై సంయుక్తంగా ఉద్యమించింది.

2) బెంగాల్ విభజన రద్దు కావటంతో వందేమాతరం ఉద్యమాన్ని నిర్వహించిన ఉద్యమకారులంతా తమ దృష్టిని హోం రూల్ ఉద్యమంవైపుకు మళ్లించి ఉద్యమానికి బలాన్ని చేకూర్చారు.

3) మొదటి ప్రపంచయుద్ధంలో బ్రిటన్ ముస్లిం రాజ్యాల యెడల అవలంబించిన వైఖరి భారతదేశంలో ముస్లింలకు కోపాన్ని కలిగించింది. అందువల్ల వారు కాంగ్రెస్ తో 1916లో లక్నో ఒడంబడికను కుదుర్చుకొని స్వీయపాలనోద్యమంలో పాల్గొన్నారు.

ఉద్యమ ముగింపు: హోం రూల్ ఉద్యమ ఫలితంగా ప్రజలలో నెలకొన్న రాజకీయ చైతన్యాన్ని, బ్రిటీషుపాలన యెడల వారిలో నెలకొన్న అసంతృప్తిని తొలగించటానికి 1917 ఆగస్టు 20వ తేదీన భారతరాజ్య వ్యవహారాల మంత్రి మాంటేగ్ ఒక ప్రకటన చేశాడు. ఈ ప్రకటన ప్రకారం క్రమక్రమంగా భారతీయులకు బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పరచబడుతుంది. ఈ ప్రకటన తరువాత బ్రిటీషు ప్రభుత్వం అనిబిసెంట్ను విడుదల చేయగా ఆమె హోం రూల్ ఉద్యమాన్ని నిలిపివేసింది. తిలక్ ఉద్యమాన్ని మరికొన్నాళ్లు కొనసాగించాడు.

ప్రశ్న 3.
జలియన్ వాలాబాగ్ మారణకాండ ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు:
1919లో ఆంగ్ల ప్రభుత్వం భారతదేశంలో మాంటేగు – ఛేమ్స్ఫర్డ్ సంస్కరణలు ప్రవేశపెట్టింది. ఈ సంస్కరణలు భారతీయులకు ఎట్టి ప్రత్యేక హక్కులు ఇవ్వకపోగా ముస్లింలతో పాటు సిక్కులకు కూడా ప్రత్యేక స్థానాలు కేటాయించాయి. అందుకు భారతీయులలో అసంతృప్తి ప్రబలింది. ఇదే సమయంలో 1915 1918 కాలంలో చోటు చేసుకున్న ఉగ్రవాద కార్యకలాపాలను సమీక్షించడానికి ఆంగ్ల ప్రభుత్వముచే నియమించబడిన రౌలట్ కమిటీ కొన్ని చర్యలను సూచించింది. ఈ చర్యలన్నీ చట్టరూపం దాల్చాయి. దీనినే రౌలట్ చట్టం అంటారు. ఈ చట్టం వలన ప్రభుత్వానికి అసాధారణ అధికారాలు సంక్రమించాయి. ఈ చట్టప్రకారం రాజకీయ ఆందోళనకారులను వారంట్ లేకుండా నిర్బంధించవచ్చు. నిర్బంధించిన వారిని విచారించవలసిన పనిలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకమయిన ఏ చిన్న కాగితాన్ని కలిగివున్నా అది నేరంగా పరిగణింపబడుతుంది. ఇంగ్లాండ్లో పౌరుల హక్కులకు పునాది అయిన హెబియస్ కార్పస్ హక్కు భారతీయులకు లేకుండా పోయింది. ఈ బిల్లులను కాంగ్రెస్ వ్యతిరేకించింది. గాంధీజీ ఆ బిల్లును ఆమోదించవద్దని గవర్నర్ జనరల్ను కోరాడు. కానీ అది ఆమోదించబడింది. కనుక వాటి ఉపసంహరణకు గాంధీజీ ఉద్యమించాడు. 1919 ఏప్రియల్ 6న హర్తాళ్ పాటించవలసిందిగా ఆయన ప్రజలకు పిలుపునిచ్చాడు. ఆ పిలుపునందుకొని దేశమంతటా హర్తాళ్ జరిగింది. హిందూ, ముస్లిం భేదం లేకుండా అందరూ ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఢిల్లీ, అహ్మదాబాద్, పంజాబ్లలో హింసాకాండ జరిగింది. ముఖ్యంగా పంజాబ్లో ప్రజల నాయకులైన సత్యపాల్, సైఫుద్దీన్ కిచ్లూలను ప్రభుత్వం నిర్బంధించింది.

ఈ నిర్భంధానికి వ్యతిరేకంగా అమృత్సర్ ప్రజలు జలియన్ వాలాబాగ్ వద్ద సమావేశమైనారు. సమావేశం సాగుతుండగానే అమృత్సర్ మిలిటరీ కమాండర్ జనరల్ డయ్యర్ అక్కడకు వచ్చి ప్రజలపై ఎటువంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపించాడు. ఈ కాల్పుల్లో 379 మంది మరణించగా, 1200 మంది గాయపడ్డారు. ఈ సంఘటనే చరిత్రలో జలియన్ వాలాబాగ్ దురంతంగా ప్రసిద్ధి చెందింది. జలియన్ వాలాబాగ్ సంఘటన భారత స్వాతంత్ర్య సమరంలో ఒక మైలురాయి. ఈ సంఘటన వలన భారత స్వాతంత్ర్యోద్యమం ఒక మహా సంగ్రామంగా మారింది.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మితవాదులు ఎవరు ?
జవాబు:
జాతీయ కాంగ్రెస్లో తొలి ఇరవై సంవత్సరాల వరకు (1885-1905) ఉన్నత వర్గాలకు చెందిన మితవాదులు ప్రాబల్యం వహించారు. వీరిలో ముఖ్యులు సురేంద్రనాథ్ బెనర్జీ, మదన్మోహన్ మాలవ్యా, గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నౌరోజీ ముఖ్యులు. బ్రిటిష్ పాలకులు భారతదేశం పట్ల న్యాయబద్ధంగా వ్యవహరిస్తారని వారు విశ్వసించారు. ప్రజల కోరికలను మహోజర్లు, సభలు, తీర్మానాల ద్వారా ప్రభుత్వానికి నివేదించడం ద్వారా జాతీయ ప్రగతి సాధించవచ్చునని భావించారు. రాజ్యాంగబద్ధ పోరాటాన్ని వారు చేయడం వల్ల వారిని మితవాదులన్నారు.

ప్రశ్న 2.
ఖేదా సత్యాగ్రహం గురించి రాయండి.
జవాబు:
అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మెలో గాంధీజీ పాలుపంచుకొన్నాడు. మిల్లు కార్మికుల వేతనాలను 35 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు. చివరకు మిల్లు యజమానులు దిగివచ్చి గాంధీజీ డిమాండ్లకు అంగీకరించారు. అక్కడి నుంచి గాంధీ గుజరాత్లోని ఖేడా ప్రాంతానికి వెళ్ళారు. అక్కడి రైతాంగం దుర్భర పరిస్థితుల్లో ఉంది. పంటల దిగుబడి 25 శాతానికి పడిపోయింది. దాంతో భూమిశిస్తును రద్దు చేయాలంటూ రైతులు ఉద్యమం ప్రారంభించారు. ఆ ఉద్యమానికి గాంధీజీ మద్దతు ప్రకటించారు. రైతుల డిమాండ్కు ప్రభుత్వం తలొగ్గలేదు. వల్లభాయ్ పటేల్, తదితర ఇతర నేతలు గాంధీజీకి జత కలిశారు. చివరకు రైతుల డిమాండు ప్రభుత్వం అంగీకరించింది. సత్యాగ్రహంలో భారతదేశం అద్భుతాలు చేసింది.

AP Inter 1st Year History Study Material Chapter 12 భారత జాతీయోద్యమం

ప్రశ్న 3.
రౌలట్ సత్యాగ్రహన్ని వివరించండి.
జవాబు:
మొదటి ప్రపంచ యుద్ధానంతరం భారత ప్రజల ఏకాభిప్రాయాన్ని పెడచెవిన పెట్టిన బ్రిటిష్ ప్రభుత్వం రౌలట్ చట్టాన్ని 1919 మార్చిలో ఆమోదించింది. గాంధీజీ రాజకీయ జీవితంలో ఈ అణచివేత చట్టం కీలకమైన మార్పును తీసుకువచ్చింది. సత్యాగ్రహం ఆయుధంతో ఆ చట్టాన్ని వ్యతిరేకించాలని గాంధీజీ’ నిర్ణయించాడు. 1919 ఏప్రిల్లో రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా గాంధీ దేశవ్యాప్త ఉద్యమానికి ఇచ్చిన పిలుపుకు ప్రజలు గొప్పగా స్పందించారు.

ప్రశ్న 4.
సైమన్ కమీషన్ గురించి రాయండి.
జవాబు:
భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణల గురించి సిఫారసు చేయాల్సిందిగా బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమీషన్ను నియమించింది. 1927 నవంబర్లో జాన్సైమన్ అధ్యక్షుడిగా ఒక స్థాయీ సంఘాన్ని నియమించింది. అధ్యక్షుడైన సైమన్ పేరు మీద ఆ సంఘానికి సైమన్ కమీషన్ అనే పేరు వచ్చింది. భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణలపై సిఫారసులు చేసేందుకు నియమించిన కమీషన్లో అందరూ ఆంగ్లేయులే ఉండటం, భారతీయులెవరికీ ఇందులో స్థానం కల్పించకపోవడం భారతీయులకు ఆగ్రహం తెప్పించింది. దాంతో ఆ కమీషన్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ సైమన్ కమీషన్ను ప్రజలు బహిష్కరించారు. ‘సైమన్ గో బ్యాక్’ నినాదం దేశమంతటా మార్మోగింది. అయినప్పటికీ సైమన్ కమీషన్ దేశంలోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో పర్యటించి నివేదిక రూపొందించింది.