Andhra Pradesh AP Board 3rd Class EVS Solutions 1st Lesson ఆనందమైన కుటుంబం Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 3rd Class EVS Solutions Lesson 1 ఆనందమైన కుటుంబం
I. విషయావగాహన:
ప్రశ్న 1.
 కుటుంబం అంటే ఏమిటి ? మీ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు?
 జవాబు.
 రక్త సంబంధం, కల్గిన వ్యక్తుల సముదాయమునే “కుటుంబం” అంటారు. సాధారణంగా కుటుంబంలో తల్లి, తండ్రులు వారి పిల్లలు కలిసి జీవిస్తారు. మా కుటుంబంలో నలుగురు సభ్యులు
 ఉంటాము.
    
ప్రశ్న 2.
 మీ ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నాయా? ఉంటే పేర్లు చెప్పండి ?
 జవాబు.
 మా ఇంట్లో ఉన్న పెంపుడు జంతువు కుక్క. దాని పేరు జానీ.
ప్రశ్న 3.
 మీ కుటుంబంలో ఎవరిని బాగా ఇష్టపడతారు ? ఎందుకు ?
 జవాబు.
 నేను మా కుటుంబంలో అమ్మమ్మను బాగా ఇష్టపడతాను. ఎందుకంటే అమ్మమ్మ మంచి మంచి కథలు చెప్తుంది. మా అమ్మ, నాన్నలు ఉద్యోగానికి వెళ్తే అమ్మమ్మ మా ఆలన పాలన చూస్తుంది.
    

II. ప్రశ్నించడం – పరికల్పనలు చేయడం:
    
ప్రశ్న 4.
 నువ్వు మీ స్నేహితురాలి ఇంటికి వెళ్ళావు. వాళ్ళ ఇంట్లో వారు అనుసరిస్తున్న మంచి విధానాలు తెలుసుకోవాలని అనుకున్నప్పుడు, నువ్వు ఎటువంటి ప్రశ్నలు అడుగుతావు?
 జవాబు.
 నేను మా స్నేహితురాలి ఇంటికి వెళ్ళినప్పుడు వారు అనుసరిస్తున్న మంచి విధానాలు తెలుసుకొనుటకు క్రింది ప్రశ్నలు అడుగుతాను.
- మీరు చెప్పులు ఎక్కడ విడుస్తారు ?
- మీ ఇంట్లో అనుసరించే మంచి విధానాలు ఏమిటి ?
- మీరు భోజనం చేసే ముందు దేవుణ్ణి ప్రార్థిస్తారా ?
- మీరు మీ తాతయ్య, నానమ్మలకు ఏ విధంగా సహాయం చేస్తారు ?
- మీరు మీ బ్యాగ్స్, ఇతర వస్తువులను తగిన విధంగా వాటి వాటి స్థానాల్లో సర్దుకుంటారా?
III. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:
ప్రశ్న 5.
 మీ బంధువులలో ఎవరెవరి ముఖాలు పోలికలు, భేదాలు కలిగి ఉన్నాయో రాయండి.
 జవాబు.
 విద్యార్థి కృత్యము.
IV. సమాచార నైపుణ్యాలు – ప్రాజెక్టులు:
ప్రశ్న 6.
 మీ కుటుంబం సభ్యులు ఏ పని చేస్తారో దాని ఎదురుగా ‘✓ ‘ పెట్టండి.
 జవాబు.

 జవాబు.
 విద్యార్థి కృత్యము.

V. పటనైపుణ్యాలు, బొమ్మలు గీయడం, నమునాలు తయారు చేయడం:
ప్రశ్న 7.
 పెంపుడు జంతువులు కుక్క, పిల్లి మొదలైనవి బొమ్మలు గీయండి.
 జవాబు.
 విద్యార్థి కృత్యము.
VI. ప్రశంస – విలువలు జీవవైవిధ్యంపట్ల స్పృహ కల్గి ఉండడం:
ప్రశ్న 8.
 జెస్సీతవ తోటలో ఉన్న మొక్కల్ని, పెంపుడు జంతువుల్ని ఎంతో ప్రేమగా చూస్తుంది. మీరు అలాంటివి – ఏమైనా చేస్తున్నారా? తరగతిలో చర్చించండి.
 జవాబు.
 నేను కూడా జెస్సీలాగానే మాతోటలోని మొక్కల్ని, పెంపుడు జంతువుల్ని ప్రేమగా చూస్తాను.
 మనం జంతువులను, మొక్కలను కూడా ప్రేమగా చూడాలి. ప్రకృతిలో సమతూకం ఉండాలంటే జంతువులు, మొక్కలకు సమాన ప్రాధాన్యం ఉండాలి.
అదనపు ప్రశ్నలు – జవాబులు:
I. విషయావగాహన:
ప్రశ్న 1.
 రాణీ కుటుంబంలో ఎవరెవరు ఉంటారు ? జవాబు.
 రాణీ కుటుంబంలో తాతయ్య, నానమ్మలు, అమ్మ, నాన్నలు, రాణీ మరియు ఆమె సోదరుడు. చింటు ఉన్నారు.
ప్రశ్న 2.
 మీ ఇంట్లో వంట మరియు పాత్రలను శుభ్రపరచటం ఎవరు చేస్తారు ?
 జవాబు.
 మా ఇంట్లో వంటపని, పాత్రలను శుభ్రపరచటం మా అమ్మ చేస్తుంది.
ప్రశ్న 3.
 మీ వాన్నగారు ఏమి చేస్తారు ?
 జవాబు.
 మా నాన్నగారు. పాఠశాల ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. కుటుంబ పోషణ కోసం, సంపాదించుటకు మా నాన్నగారు ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు.

ప్రశ్న 4.
 నీవు ఇంటిలో ఎలాంటి పనులు చేస్తావు ?
 జవాబు.
 నేను మా తల్లిదండ్రులకు వారి వారి పనులలో సహకరిస్తాను. నేను మొక్కలకు నీళ్ళు పోయుట, నా బ్యా గ్లు మరియు ఇతర వస్తువులను వాటి వాటి స్థానాలలో ఉంచటం వంటి పనులు చేస్తాను.
ప్రశ్న 5.
 ఎలాంటి పనులు కుటుంబ సభ్యులందరూ కలిసి చేస్తారు ?
 జవాబు.
 ఇంటి పనులు చేయటంలో కుటుంబ సభ్యులందరూ కలిసి పని చేస్తారు. కుటుంబ పనుల్లో కుటుంబ సభ్యులందరూ ఒకరినొకరు సహకరించుకుంటూ పనిని విభజించుకుని పనిచేస్తారు.
ప్రశ్న 6.
 కలిసి పనిచేయటం వల్ల కుటుంబ సభ్యులకు కళ్లే ప్రయోజనాలేమిటి ?
 జవాబు.
 కుటుంబ సభ్యులంతా పనిని విభజించుకుని, ఒకరికొకరు సహకరించుకుంటూ పనిచేయటంవల్ల వారి మధ్య ప్రేమ, సహకారం పెంపొందుతాయి. .
ప్రశ్న 7.
 మీ అవసరాలను మీ కుటుంబంలో ఎవరు తీరుస్తారు ?
 జవాబు.
 మా తల్లిదండ్రులు మా అవసరాలను తీరుస్తారు.

ప్రశ్న 8.
 మీ నాన్నగారి వృత్తి ఏమిటి ?
 జవాబు.
 మా నాన్నగారి వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఆయన విద్యార్థులకు పాఠాలు బోధిస్తారు.
ప్రశ్న 9.
 మీ గ్రామంలో ఇంకా ఎలాంటి వృత్తుల వారున్నారు? వారివల్ల ప్రయోజనాలేంటి?
 జవాబు.


ప్రశ్న 11.

ఎ) పై చిత్రంలోని వ్యక్తి ఏమిచేస్తున్నాడు ? అతను ఎవరు ?
 జవాబు.
 పై చిత్రంలోని వ్యక్తి రోడ్లు, కాలువలను శుభ్రంచేసే వ్యక్తి. అతడు గ్రామంలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుడు.
బి) పారిశుద్ధ్య కార్మికులు (అతను) రోడ్లు, కాలువలను శుభ్రం చేయకపోతే ఏమిజరుగును?
 జవాబు.
 పారిశుద్ధ్య కార్మికులు రోడ్లు, కాలువలను శుభ్రం చేయకపోతే పరిసరాల అపరిశుభ్రతవల్ల ప్రజల ఆరోగ్యం పాడవుతుంది.
ప్రశ్న 12.
 “బాల కార్మికులు” అనగా నేమి ?
 జవాబు.
 “బాల కార్మికులు” అనగా 17 సం||లలోపు వయస్సు ఉండి వివిధ పనులలో నియమింపబడిన పిల్లలు.
ప్రశ్న 13.
 “బాల కార్మికులు” వ్యవస్థ ఉండటానికి కారణం ఏమిటి ?
 జవాబు.
 పేదరికం, సాంఘిక అసమానతలు, వలసలు “బాలకార్మిక వ్యవస్థ ఏర్పడుటకు కారణాలు.

సమాచార నైపుణ్యాలు – ప్రాజెక్టులు:
ప్రశ్న 14.
 ఎవరైనా ఐదుగురు నీ మిత్రులను అడిగి వారి తల్లిదండ్రులు చేసే పనుల గురించి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కలిసి చేసే పనులగురించి క్రింది టేబుల్ లో సమాచారంను పూరించండి.
 జవాబు.

ప్రశ్న 15.
 క్రింది పనులు చేయుచున్నప్పుడు మీ కుటుంబ సభ్యుల స్పందనను సంతోషపడితే  తోనూ, విచారపడితే
 తోనూ, విచారపడితే  తోను సూచించండి.
 తోను సూచించండి.

జవాబు.


ప్రశ్న 16.
 క్రింది పనులకు నీవు సమ్మతిస్తే (Thumbs up sign)  , నీవు సమ్మతించకపోతే (Thumbs down sign)
, నీవు సమ్మతించకపోతే (Thumbs down sign)  , సూచించుము.
, సూచించుము.
1. నేను తరగతి గదిలోకి ప్రవేశించే ముందు చెప్పులను బయట విప్పి తగిన స్థానంలో ఉంచుతాను.
 జవాబు.
 
2. మధ్యాహ్న భోజనంకు వెళ్ళేటప్పుడు వరుసక్రమంలో వెళ్తాను.
 జవాబు.
 
3. తరగతి గదిని శుభ్రంగా ఉంచుతాను.
 జవాబు.
 
4. వారానికి ఒకసారి గోళ్ళు కత్తిరించుకుంటాను.
 జవాబు.
 
5. రోజూ తలను దువ్వుకుంటాను.
 జవాబు.
 
6. తినేముందు, తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కుంటాను.
 జవాబు.
 
ప్రశ్న 17.
 మీ కుటుంబ సభ్యులు ఎవరెవరికి ఎవరితో పోలికలుంటాయో క్రింది టేబుల్ లో సూచించండి.

జవాబు.
| క్రమసంఖ్య | కుటుంబసభ్యులు | పోలిక | 
| 1 | నాన్నగారు | తాతగార్ని పోలి ఉంటారు. | 
| 2 | అమ్మ | తాతగార్ని పోలి ఉంటారు | 
| 3 | నేను | అమ్మను పోలి ఉంటాను | 
| 4 | అక్క | నాన్నను పోలి ఉంటుంది. | 

బొమ్మలు గీయడం – రంగులు వేయడం:
ప్రశ్న 18.
 మీ కుటుంబం యొక్క చిత్రాన్ని అగ్గిపుల్లలు, గుండీల సహాయంతో గీయండి.

జవాబు.
 విద్యార్థి కృత్యము
ప్రశ్న 19.
 గుండ్రని త్రిభుజాకార, చతురస్రాకార మరియు కోల మొఖాలులు కల్గిన మీ మిత్రుల పేర్లు – తెల్పి వారి ముఖాల ఆకారాలను గీయండి.

జవాబు.
 విద్యార్థి కృత్యము
ప్రశ్న 20.
 నీకు బాల కార్మికులు కనిపిస్తే ఏం చేస్తావు ?
 జవాబు.
 నాకు ఎవరైనా “బాల కార్మికులు” కనిపిస్తే వారిని, వారి తల్లిదండ్రులను ఒప్పించి వారిని బడికి పంపించమని కోరతాను. చదువు అనేది పిల్లల హక్కు అని వివరిస్తాను. ప్రభుత్వం ప్రస్తుతం చదువుకునే – పిల్లలకు సమకూరుస్తున్న సౌకర్యాలను వారికి వివరించి ఆ పిల్లలను బడికి పంపించేలా చేస్తాను.
ప్రశ్న 21.
 కుటుంబ సభ్యులు ఎలా ఉండాలి ?
 జవాబు.
 కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరి ప్రేమ, ఆప్యాయతలతో ఉండాలి. ఇంటి పనులలో ఒకరికొకరు సహకరించుకుంటూ, పనిని విభజించుకుని చేయాలి.

ప్రశ్న 22.
 మనం పెద్దల పట్ల ఎలా ఉండాలి ?
 జవాబు.
 మనం పెద్దల్ని గౌరవించాలి. వారు మన తాతగారిలాగా బాగా పెద్దవారైతే వారికి సహకరాం అందించాలి. పెద్దవారిపట్ల ప్రేమ మరియు గౌరవంతో ఉండాలి.
ప్రశ్న 23.
 మనం వివిధ వృత్తులవారిపట్ల ఎలా వ్యవహరించాలి ?
 జవాబు.
 అన్ని రకాల వృత్తులు, మరియు వృత్తిపనివారిని మనం గౌరవించాలి. ఎందుకంటే వివిధ ఆగా అవసరాలకు మనం వారిపై ఆధారపడతాం.
ప్రశ్న 24.
 మనం పాటించాల్సిన కొన్ని పనులు, దాని విలువను తెల్పండి.
 జవాబు.
| క్రమ సంఖ్య | మంచిపని | విలువ | 
| 1 | చెప్పులు బయట తగుస్థానంలో విడవటం | వస్తువులను వాటివాటి స్థానాలలో ఉంచటం | 
| 2 | మా తల్లిదండ్రులు తాతయ్య, నానమ్మలకు ఊరు విడిచి వచ్చేటప్పుడు నమస్కరిస్తారు | పెద్దలను గౌరవించుట | 
| 3 | పుట్టినరోజు సందర్భంగా మొక్కను నాటుట | మొక్కలను నాటడం ద్వారా ప్రకృతిని పరిరక్షించుట | 
| 4 | కుటుంబ సభ్యులంతా రాత్రిపూట కలిసి భోజనం చేయుట | కుటుంబ సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. | 

ప్రశ్న 25.
 పైన పేర్కొన్న మంచిపనులు, విలువల ద్వారా ఏమి గమనించావు?
 జవాబు.
 పిల్లలు తమ తల్లిదండ్రులనుంచి మంచి పనులను ఆచరించటం, మరియు నైతిక విలువలను నేర్చుకుంటారు. కావున తల్లిదండ్రులు పిల్లలకు ఆదర్శంగా ఉండాలి. 3వ తరగతి- పరిసరాల విజ్ఞానం
ప్రశ్న 26.
 ప్రజలందరూ రంగు, రూపం, బరువు, ఎత్తు, సామర్థ్యాలతో సమానంగా ఉంటారా ? ఇతరులతో మనం ఎలా మెలగాలి ?
 జవాబు.
 ప్రజలందరూ రంగు, రూపం, బరువు, ఎత్తు, సామర్థ్యాలలో సమానంగా ఉండరు. కుటుంబ సభ్యుల మధ్య కొన్ని పోలికలు ఉండవచ్చు. మనం అందరితో ప్రేమ, ఆప్యాయతలతో మెలగాలి తప్ప ఎవరినీ వెక్కిరించరాదు.

బహుళైచ్ఛిక ప్రశ్నలు:
ప్రశ్న 1.
 రక్త సంబంధం కల్గిన వ్యక్తుల సముదాయం ____________ అంటారు.
 A) కుటుంబం
 B) సభ్యులు
 C) తల్లిదండ్రులు
 D) పిల్లలు
 జవాబు.
 A) కుటుంబం
ప్రశ్న 2.
 క్రింది వాటిలో కుటుంబ సభ్యులు పంచుకోవలసినవి ____________.
 A) పని
 B) ప్రేమ
 C) సంతోషం
 D) పైవన్నీ
 జవాబు.
 B) ప్రేమ
ప్రశ్న 3.
 పెద్దలపట్ల మనం ____________ తో ఉండాలి.
 A) మోసం
 B) గౌరవం
 C) మాట్లాడుతూ
 D) ఏదీకాదు
 జవాబు.
 B) గౌరవం

ప్రశ్న 4.
 చెప్పులు కుట్టే వారిని ____________ అంటారు.
 A) కుమ్మరి
 B) వడ్రంగి
 C) చెప్పులు కుట్టేవాడు (కోబ్లర్)
 D) ఉపాధ్యాయుడు
 జవాబు.
 C) చెప్పులు కుట్టేవాడు (కోబ్లర్)
ప్రశ్న 5.
 ____________ పిల్లలందరి హక్కు.
 A) ఆటలు
 B) తినటం
 C) చదువు
 D) నిద్రపోవుట
 జవాబు.
 C) చదువు
ప్రశ్న 6.
 కుటుంబంలో క్రింది వారుంటారు.
 A) తాతయ్య, నానమ్మలు
 B) అమ్మ, నాన్నలు
 C) అన్న, దమ్ములు
 D) పైవారందరూ
 జవాబు.
 D) పైవారందరూ

ప్రశ్న 7.
 మనకు క్రింది వాటిలో కుటుంబం నుంచి లభించేవి ____________
 A) ప్రేమ
 B) జాగ్రత్త
 C) చేయూత
 D) పైవన్నీ
 జవాబు.
 D) పైవన్నీ
ప్రశ్న 8.
 క్రింది పనుల్లో కుటుంబ సభ్యులందరూ కలిసి పని చేస్తారు.
 A) ఇంటి పనులు
 B) వ్యవసాయ పనులు
 C) A & B
 D) పైవేవీకావు
 జవాబు.
 C) A & B
ప్రశ్న 9.
 బ్రతుకు తెరువు కోసం వ్యక్తులు చేసే నైపుణ్యంతో కూడుకున్న పనిని ____________ అంటారు.
 A) పని
 B) వృత్తి
 C) A & B
 D) ఏదీకాదు
 జవాబు.
 B) వృత్తి

ప్రశ్న 10.
 బట్టలు కుట్టే వారిని ____________ అంటారు.
 A) దర్జీ
 B) నేతపనివారు
 C) కుమ్మరి
 D) కోట్లర్
 జవాబు.
 A) దర్జీ