AP 10th Class Physical Science Notes 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

Students can go through AP Board 10th Class Physical Science Notes 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం to understand and remember the concept easily.

AP Board 10th Class Physical Science Notes 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

→ వస్తువులపై పడిన కాంతి పరిక్షేపణం చెంది మన కంటిని చేరడం వలన మనం వస్తువులను చూడగలుగుతాము.

→ మానవుని కన్ను దృష్టి ప్రతిస్పందన అను నియమంపై ఆధారపడి పని చేస్తుంది.

→ మన కంటిలో ఒక కటకం ఉంటుంది.

→ మన కంటికి ఏ ఒత్తిడి లేకుండా, స్పష్టంగా ఒక వస్తువును మనం చూడాలంటే అది మన కంటికి దాదాపు 25 సెం.మీ.ల దూరంలో ఉండాలి. దీనినే “స్పష్ట దృష్టి కనీస దూరం” అంటారు.

→ ఈ స్పష్ట దృష్టి కనీస దూరం విలువ వ్యక్తి వ్యక్తికీ, వయసును బట్టి మారును.

→ ఏ గరిష్ఠ కోణంతో మనం వస్తువును పూర్తిగా చూడగలమో, సిలియరి ఆ కోణమును “దృష్టికోణం” అంటాం.
AP 10th Class Physical Science Notes 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 1

→ ఆరోగ్యవంతుని దృష్టికోణం సుమారుగా 60° ఉంటుంది.

→ మన చుట్టూ వున్న వివిధ వస్తువులను, రంగులను చూడడానికి కన్ను ఉపయోగపడును.

AP 10th Class Physical Science Notes 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

→ కనుగుడ్డు దాదాపు గోళాకారంగా ఉంటుంది.

→ ‘కంటి ముందు భాగం ఎక్కువ వడ్రంగా ఉండి, కార్నియా అను పారదర్శక రక్షణ పొరను కలిగి ఉంటుంది.

→ కంటిలోని కటకానికి ఆనుకొని ఉన్న సిలియరి కండరాలు కటక వక్రతావ్యాసార్ధాన్ని మార్చడం ద్వారా కటకం తన నాభ్యంతరాన్ని మార్చుకోవడానికి దోహదపడతాయి.

→ కంటి కటకం వస్తువు నిజ ప్రతిబింబాన్ని రెటీనాపై తలక్రిందులుగా ఏర్పరుస్తుంది.

→ రెటీనా అనేది ఒక సున్నితమైన పొర. దీనిలో దండాలు మరియు శంఖువులు అనబడే దాదాపు 125 మిలియన్ల గ్రాహకాలుంటాయి.

→ సిలియరి కండరాల సహాయంతో కంటి కటకం వస్తు దూరానికి అనుగుణంగా తన నాభ్యంతరాన్ని మార్చుకొనును.

→ కంటి కటకం తన నాభ్యంతరమును మార్చుకునే సామర్థ్యాన్ని కటక “సర్దుబాటు సామర్థ్యం” అంటారు.

→ కంటి కటక దోషాల వల్ల చూపు మసకబారినట్లుగా అవుతుంది.

→ కంటికటక సర్దుబాటు దోషాలు మూడు రకాలు. అవి :

  1. హ్రస్వదృష్టి
  2. దీర్ఘదృష్టి
  3. చత్వారం

→ దగ్గరగా ఉన్న వస్తువులను చూడగలిగి, దూరంలో వున్న వస్తువులను స్పష్టంగా చూడలేని కంటి దృష్టి దోషాన్ని “హ్రస్వదృష్టి” అంటాం.

→ హ్రస్వదృష్టి దోషం గల వ్యక్తులకు కంటి కటక గరిష్ఠ నాభ్యంతరం 2.5 సెం.మీ. కన్నా తక్కువ ఉంటుంది.

→ హ్రస్వదృష్టి దోషం నివారణకు పుటాకార కటకమును వాడతారు.

AP 10th Class Physical Science Notes 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

→ ఒక వ్యక్తి కనిష్ఠ దూర బిందువుకు లోపల ఉన్న వస్తువును చూడలేకపోయే దృష్టి దోషమును దీర్ఘ దృష్టి అంటాం.

→ దీర్ఘదృష్టి నివారణకు కుంభాకార కటకమును వాడతారు.

→ వయస్సురీత్యా కంటి కటక సర్దుబాటు సామర్థ్యం తగ్గిపోయే దృష్టిదోషాన్ని చత్వారం అంటాం.

→ ఒక కటకం కాంతికిరణాలను కేంద్రీకరించే స్థాయి లేదా వికేంద్రీకరించే స్థాయిని కటక సామర్థ్యం అంటారు.

→ కటక నాభ్యంతరం యొక్క విలోమమును “కటక సామర్థ్యం” అని కూడా అంటారు.
AP 10th Class Physical Science Notes 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 2

→ కటక సామర్థ్యంను డయాప్టర్లతో సూచిస్తారు.

→ ఒకదానికొకటి కొంత కోణం చేసే కనీసం రెండు సమతలాలతో పరిసరయానకం నుండి వేరు చేయబడి ఉన్న పారదర్శక యానకాన్ని “పట్టకం” అంటాం.

→ పట్టక వక్రీభవన గుణకమునకు సూత్రము \(\mathrm{n}=\frac{\sin \left[\frac{(\mathrm{A}+\mathrm{D})}{2}\right]}{\sin \frac{\mathrm{A}}{2}}\)

→ తెల్లని కాంతి వివిధ రంగులుగా విడిపోవడాన్ని “కాంతి విక్షేపణం” అంటాము.

→ కాంతి జనకం ఒక సెకనుకు విడుదల చేసే కాంతి తరంగాల సంఖ్యను “పౌనఃపున్యం” అంటాం.

→ కాంతి తరంగ వేగం (v), తరంగదైర్ఘ్యం (λ), పౌనఃపున్యం (f) ల మధ్య సంబంధము.
v= fλ

→ ఇంద్రధనుస్సు అనునది మన కంటి వద్ద తన కొనభాగాన్ని కలిగి వున్న త్రిమితీయ శంఖువు.

→ కాంతి పరిక్షేపణం ఒక సంక్లిష్ట దృగ్విషయం.

→ పరమాణువులు లేదా అణువులపై కాంతి పతనం చెందినపుడు అవి కాంతి శక్తిని శోషించుకుని, వివిధ దిశల్లో ఉద్గారం చేస్తాయి.

→ వాతావరణంలో వివిధ పరిమాణాలలో అణువులు, పరమాణువులుంటాయి. కావున వాటి పరిమాణాలకు అనుగుణంగా అవి కాంతి పరిక్షేపణను చేయుట వలన వర్ణపటము ఏర్పడుతుంది.

AP 10th Class Physical Science Notes 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

→ స్పష్టదృష్టి కనీస దూరం : మానవుని కంటికి ఎటువంటి ఒత్తిడి లేకుండా ఒక వస్తువును స్పష్టంగా చూసేందుకు కంటి నుండి వస్తువుకు ఉండవలసిన కనీస దూరము.

→ దృష్టికోణం : ఇది ఏ గరిష్ఠ కోణంతో మనము వస్తువును పూర్తిగా చూడగలమో ఆ కోణము విలువ.

→ కటక సర్దుబాటు : కంటి కటకము తన నాభ్యంతరమును మార్చుకునే సామర్థ్యాన్ని కటక సర్దుబాటు సామర్థ్యం అంటారు.

→ హ్రస్వదృష్టి : ఇది దగ్గరగా వున్న వస్తువులను చూడగలిగి, దూరంలో వున్న వస్తువులను స్పష్టంగా చూడలేని దృష్టి లోపము.

→ దీర్ఘదృష్టి : ఇది దూరంగా వున్న వస్తువులను స్పష్టంగా చూడగలిగి, దగ్గరలో వున్న వస్తువులను చూడలేని దృష్టి లోపము.

→ చత్వారం : ఇది వయస్సు రీత్యా కంటి కటక సర్దుబాటు సామర్థ్యం తగ్గిపోవు దృష్టిలోపము.

→ కటక సామర్థ్యం : ఇది నాభ్యంతరం యొక్క విలోమము.

→ పట్టకం : ఇది ఒకదానితో ఒకటి కొంతకోణం చేసే కనీసం రెండు సమతలాలతో పరిసర యానకం నుండి వేరు చేయబడి వున్న పారదర్శక యానకపు వస్తువు.

→ పట్టక కోణం (లేదా) పట్టక : ఒక పట్టకం యొక్క రెండు వక్రీభవన తలాల మధ్య గల కోణము పట్టక కోణం వక్రీభవన కోణం లేదా పట్టక వక్రీభవన కోణం అగును.

AP 10th Class Physical Science Notes 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

→ కనిష్ఠ విచలన కోణం : ఒక పట్టకం గుండా కాంతి ప్రయాణిస్తున్నప్పుడు పతన కోణం, బహిర్గత కోణానికి సమానమైన విచలన కోణం కనిష్ఠమగును. ఈ కోణమే కనిష్ఠ విచలన కోణం అగును.

→ విక్షేపణం : ఇది తెల్లని కాంతి వివిధ రంగులుగా విడిపోవు దృగ్విషయము.

→ పరిక్షేపణం : ఇది ఒక కణం శోషించుకున్న కాంతిని తిరిగి అన్ని దిశల్లో వేర్వేరు తీవ్రతలతో విడుదల చేయు ప్రక్రియ.

→ విచలన కోణం : ఒక పట్టకం గుండా కాంతి ప్రయాణిస్తున్నప్పుడు పతన కిరణమునకు, బహిర్గత కిరణమునకు మధ్యగల కోణము.

AP 10th Class Physical Science Notes 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 3

AP 10th Class Physical Science Notes 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం

Students can go through AP Board 10th Class Physical Science Notes 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం to understand and remember the concept easily.

AP Board 10th Class Physical Science Notes 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం

→ కాంతి ఒక యానకం నుండి మరొక యానకంలోనికి ప్రయాణించునప్పుడు రెండు యానకాలను వేరుచేసే తలం వద్ద కాంతివేగం మారిపోయే లక్షణంను కాంతి వక్రీభవనం అంటారు.

→ కాంతి సమతలాల వద్ద మరియు వక్రతలాల వద్ద కూడా వక్రీభవనం చెందును.

→ వక్రతలం ఏ గోళానికి సంబంధించినదో, ఆ గోళ కేంద్రాన్ని వక్రతా కేంద్రం (C) అంటారు.

→ వక్రతా యొక్క కేంద్రాన్ని ధృవం (పోల్) (P) అంటాము.

→ వక్రతా కేంద్రాన్ని, ధృవంను కలిపే రేఖను ప్రధానాక్షం అంటారు.

→ యానకాల వక్రీభవన గుణకాలు, వస్తుదూరం, ప్రతిబింబదూరం మరియు వక్రతావ్యాసార్ధాల మధ్య సంబందం \(\frac{n_{2}}{v}-\frac{n_{1}}{u}=\frac{n_{2}-n_{1}}{R}\) అగును.

AP 10th Class Physical Science Notes 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం

→ రెండు ఉపరితలాలతో ఆవృతమైన పారదర్శక పదార్థం యొక్క రెండు తలాలూ లేదా ఏదో ఒక తలం వక్రతలమైతే ఆ పారదర్శక పదార్థాన్ని ‘కటకం’ అంటాం.

→ కటకాలు వివిధ రకాలుగా ఉంటాయి. అవి :
AP 10th Class Physical Science Notes 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 1

→ కటకపు రెండు వక్రతలాలు రెండు గోళాలకు చెందినవి.

→ ఒక కటకానికి రెండు వక్రతలాలుంటే దాని వక్రతా కేంద్రాలను C1 మరియు C2 లతో సూచిస్తాం.

→ వక్రతా కేంద్రం నుండి వక్రతలం వరకు గల దూరాన్ని వక్రతా వ్యాసార్ధం(R) అంటాం.

→ కటకం యొక్క రెండు వక్రతా వ్యాసార్ధాలను R1 మరియు R2 లతో సూచిస్తాము.

→ ద్వికుంభాకార కటకంలో గల వక్రతా కేంద్రాలు C1, C2లను కలిపే రేఖను ప్రధానాక్షం అంటాం.

→ కటకం యొక్క మధ్య బిందువును కటక దృక కేంద్రం (P) అంటాం.

AP 10th Class Physical Science Notes 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం

→ ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తూ వచ్చి కటకంపై పడిన కాంతికిరణాలు వక్రీభవనం చెందాక కేంద్రీకరింపబడిన బిందువు లేదా కాంతికిరణాలు వెలువడుతున్నట్లు కనిపించే బిందువును కటక నాభి (F) అంటాం.

→ ప్రతి కటకానికి రెండు నాభులు ఉంటాయి.

→ నాభి మరియు దృక కేంద్రం మధ్య దూరాన్ని కటక నాభ్యంతరం “f’ అంటారు.


AP 10th Class Physical Science Notes 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 2

→ కటకంపై పతనమైన కొన్ని కాంతికిరణాల ప్రవర్తన :
i) ప్రధానాక్షం వెంబడి ప్రయాణించే ఏ కాంతికిరణమైనా విచలనం పొందదు.
AP 10th Class Physical Science Notes 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 3

ii) కటక దృక కేంద్రం గుండా ప్రయాణించే కాంతికిరణం కూడా విచలనం పొందదు.
AP 10th Class Physical Science Notes 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 4

iii) ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే కాంతికిరణాలు నాభి వద్ద కేంద్రీకరించబడతాయి లేదా నాభి నుండి వికేంద్రీకరించబడినట్లు కనిపిస్తాయి.
గమనిక: C1 మరియు C2 బిందువులు వక్రతా కేంద్రాలు కావు. ఇవి దృక్ కేంద్రం నుండి ‘2f’ దూరాన్ని సూచిస్తాయి.
AP 10th Class Physical Science Notes 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 5

iv)నాభి గుండా ప్రయాణించే కాంతికిరణం: వక్రీభవనం పొందాక ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించును.
AP 10th Class Physical Science Notes 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 6

v) ప్రధానాక్షంతో కొంత కోణం చేస్తూ వచ్చే సమాంతర కాంతికిరణాలు నాభీయతలంపై ఏదేని బిందువు వద్ద కేంద్రీకరింపబడతాయి లేదా నాభీయతలంపై ఏదేని బిందువు నుండి వికేంద్రీకరింపబడినట్లు కనిపిస్తాయి.
AP 10th Class Physical Science Notes 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 7

→ వస్తువు వివిధ స్థానాలలో ఉన్నప్పుడు కుంభాకార కటకం వలన ఏర్పడే ప్రతిబింబాలు, వాటి లక్షణాలు :
AP 10th Class Physical Science Notes 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 8

→ \(\frac{1}{v}=\frac{1}{u}-\frac{1}{f}\)ను వస్తువు దూరం, ప్రతిబింబదూరం మరియు కటక నాభ్యంతరాల మధ్య గల సంబంధం అంటారు. దీనినే ‘కటక సూత్రము’ అంటాము.

→ n1 వక్రీభవన గుణకం గల యానకం నుండి n2 వక్రీభవన గుణకం గల యానకంలోకి, R వక్రతావ్యాసార్ధం గల వక్రతలం గుండా ఒక కాంతికిరణం ప్రయాణించునపుడు \(\frac{n_{2}}{v}-\frac{n_{1}}{u}=\frac{n_{2}-n_{1}}{R}\) సూత్రాన్ని వినియోగిస్తాము.

→ కటక తయారీ సూత్రం : \(\frac{1}{f}=\{n-1)\left(\frac{1}{R_{1}}-\frac{1}{R_{2}}\right)\)
ఇందులో R1, R2లు వక్రతా వ్యాసార్ధాలు, n – వక్రీభవన గుణకం, f – నాభ్యంతరం.

→ కటకం : ఒక పారదర్శక యానకం యొక్క రెండు ఉపరితలాలలో కనీసం ఒకటి వక్రతలమై, అది మరొక యానకంను వేరుచేస్తుంటే దానిని కటకం అంటాం.

→ నాభ్యంతరం : కటక నాభి మరియు దాని దృక్ కేంద్రం మధ్య దూరము.

→ నాభి : ఒక కటకం పైన పడిన కాంతికిరణాలు వక్రీభవనం చెందిన తర్వాత కేంద్రీకరింపబడిన లేదా వెలువడుతున్నట్లు కనిపించే బిందువు.

→ దృక్ కేంద్రం : కటకపు మధ్య బిందువు.

AP 10th Class Physical Science Notes 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం

→ ప్రధానాక్షం : కటకపు వక్రతా కేంద్రాలను కలిపే రేఖ.

→ వక్రతా వ్యాసార్థం : వక్రతా కేంద్రం నుండి వక్రతలం వరకు గల దూరము.

→ వక్రతా కేంద్రం : వక్రతలంకు సంబంధించిన గోళం యొక్క కేంద్రం.

→ నాభీయ తలం : నాభీయ తలం అనేది ప్రధానాక్షానికి లంబంగా నాభి వద్ద గల తలం.

→ కాంతి కిరణాల కేంద్రీకరణ : కాంతి కిరణాలు ఒక బిందువు వద్దకు వచ్చి కలవడాన్ని ‘కేంద్రీకరణ’ అంటారు.

→ కాంతి కిరణాల వికేంద్రీకరణ : కాంతి కిరణాలు ఒక బిందువు నుండి బయలుదేరి వివిధ దిశలలో వెళ్ళడాన్ని ‘వికేంద్రీకరణ’ అంటారు.

AP 10th Class Physical Science Notes 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 9

AP Board 8th Class Maths Notes in Telugu & English Medium

Students can go through Andhra Pradesh SCERT AP State Board Syllabus 8th Class Maths Notes Pdf in English Medium and Telugu Medium to understand and remember the concepts easily. Besides, with our AP State 8th Class Maths Notes students can have a complete revision of the subject effectively while focusing on the important chapters and topics. Students can also read AP Board 8th Class Maths Solutions for exam preparation.

AP State Syllabus 8th Class Maths Notes in Telugu & English Medium

AP 8th Class Maths Notes in English Medium

AP 8th Class Maths Notes in Telugu Medium

AP State Board Notes

These AP State Board Syllabus 8th Class Maths Notes provide an extra edge and help students to boost their self-confidence before appearing for their final examinations.

AP 10th Class Physical Science Notes 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం

Students can go through AP Board 10th Class Physical Science Notes 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం to understand and remember the concept easily.

AP Board 10th Class Physical Science Notes 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం

→ కాంతి ఒక యానకం నుండి మరొక యానకంలోనికి ప్రయాణించేటప్పుడు కాంతివడి మారడం వల్ల, దాని దిశ మారే దృగ్విషయాన్ని కాంతి వక్రీభవనం అంటారు.

→ యానకంలో కాంతివడి మారడం వల్లనే వక్రీభవనం జరుగుతుంది.

→ రెండు వేర్వేరు యానకాలలో కాంతివడులు v1 మరియు v2 అయిన v1 > v2, అయిన మొదటి యానకం కన్నా, రెండో యానకం సాంద్రతర యానకం అగును.

→ v1 < v2 అయిన మొదటి యానకం కన్నా, రెండో యానకం విరళయానకం అగును.

→ రెండు యానకాలను వేరుచేసే తలం వద్ద కాంతి కిరణం తన పథాన్ని మార్చుకుంటుంది.

AP 10th Class Physical Science Notes 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం

→ లంబానికి – పతన కిరణానికి మధ్యకోణం (i)ని “పతన కోణం” అని, లంబానికి – వక్రీభవన కిరణానికి మధ్య కోణం(r)ను “వక్రీభవన కోణం” అని అంటారు.

→ పారదర్శక యానకంలో జరిగే వక్రీభవన ధర్మాన్ని వక్రీభవన గుణకం అంటారు.

→ ఏదైనా యానకంలో కాంతివడి (v) కు, శూన్యంలో కాంతివడికి (c) గల నిష్పత్తిని ఆ యానకం యొక్క “వక్రీభవన గుణకం (n) లేదా పరమ వక్రీభవన గుణకం” అంటాం.

AP 10th Class Physical Science Notes 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 1

→ వక్రీభవన గుణకం ‘n’ అంటే ఆ యానకంలో కాంతివేగం, శూన్యంలో కాంతివడి c లో n వ వంతు అగును.
ఉదా : గాజు యొక్క వక్రీభవన గుణకం 3/2 అంటే గాజులో కాంతివడి = \(\frac{2}{3}\) × 3 × 108 మీ/సె. =2 × 108 మీ/సె. అగును.

→ వక్రీభవన గుణకం పదార్థ స్వభావం మరియు ఉపయోగించిన కాంతి తరంగదైర్ఘ్యలపై ఆధారపడి ఉంటుంది.

→ ఒక యానకం పరంగా మరొక యానకం యొక్క వక్రీభవన గుణకాన్ని మొదటి యానకంలో కాంతివడి (v1), రెండో యానకంలో కాంతివడు (v2) ల నిష్పత్తిని “సాపేక్ష వక్రీభవన గుణకం” అంటారు.
AP 10th Class Physical Science Notes 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 2

→ కాంతి ఒక యానకం నుండి మరొక యానకంలోకి ప్రయాణించేటప్పుడు ఆ యానకాలలో కాంతివడుల నిషత్తి \(\left(\frac{v_{1}}{v_{2}}\right)\), ఆ యానకాల వక్రీభవన గుణకాల నిష్పత్తి \(\left(\frac{n_{2}}{n_{1}}\right)\) కు సమానం.

→ కాంతి వక్రీభవనం జరుగు నియమాలు :

  1. పతన కిరణం, వక్రీభవన కిరణం, రెండు యానకాలను వేరుచేసే తలంపై పతన బిందువు వద్ద గీసిన లంబం అన్నీ ఒకే తలంలో ఉంటాయి.
  2. వక్రీభవనంలో కాంతి, స్నెల్ నియమంను పాటిస్తుంది.
    AP 10th Class Physical Science Notes 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 3

→ సాంద్రతర యానకం నుండి విరళ యానకంలోకి ప్రయాణించే కాంతి కిరణం ఏ పతనకోణం వద్ద యానకాలను విభజించే తలానికి సమాంతరంగా ప్రయాణిస్తుందో ఆ పతనకోణాన్ని ఆ తలానికి సంబంధించిన “సందిగ్ధ కోణం” అంటాం.

సాంద్రతర యానకం యొక్క వక్రీభవన గుణకం (n1) విరళయానకం యొక్క వక్రీభవన గుణకం (n2)
అయితే sin C = \(\frac{n_{2}}{n_{1}}\)

→ సందిగ్ధ కోణం కన్నా పతన కోణం ఎక్కువైనప్పుడు యానకాలను వేరుచేసే తలం వద్ద కాంతి కిరణం తిరిగి సాంద్రతర యానకంలోకి పరావర్తనం చెందు దృగ్విషయాన్ని “సంపూర్ణాంతర పరావర్తనం” అంటారు.

→ వజ్రాల ప్రకాశం, ఆప్టికల్ ఫైబర్స్ అనునవి సంపూర్ణాంతర పరావర్తన అనువర్తనాలు.

→ ఎండమావులు అనునవి దృఢమ వల్ల ఏర్పడతాయి.

AP 10th Class Physical Science Notes 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం

→ ఒక గాజు దిమ్మె నుండి వెలువడిన పతనకిరణాలు మరియు వక్రీభవన కిరణాలను పొడిగించగా ఏర్పడిన సమాంతర రేఖల మధ్య దూరాన్ని “విస్థాపనం” అంటారు.

→ వక్రీభవనం : కాంతి వేర్వేరు యానకాల గుండా ప్రయాణించునపుడు రెండు యానకాలను వేరు చేసే తలం వద్ద కాంతి దిశ మారే దృగ్విషయం.

→ పతన కిరణం : వక్రీభవన తలం పై పడుతున్నటువంటి కాంతి కిరణం.

→ వక్రీభవన కిరణం : ఏ కాంతి కిరణం వక్రీభవన పదార్థంతో చేసిన తలం వద్ద వంగునో ఆ కిరణం వక్రీభవన కిరణం.

→ సతన కోణం : వక్రీభవన తలంపై గీసిన లంబానికి, పతనకిరణానికి మధ్యన గల కోణం.

→ వక్రీభవన కోణం : వక్రీభవన తలంపై గీసిన లంబానికి, వక్రీభవన కిరణానికి మధ్యన గల కోణం.

→ పరను వక్రీభవన గుణకం : శూన్యంలో కాంతి వేగానికి, యానకంలో కాంతి వేగానికి గల నిష్పత్తిని పరమ వక్రీభవన గుణకం అంటారు.

→ సాపేక్ష వక్రీభవన గుణకం : ఇది రెండో యానకం యొక్క వక్రీభవన గుణకం (n2), ఒకటో యానకం యొక్క వక్రీభవన గుణకాలకు (n1) గల నిష్పత్తి.

→ స్నెల్ నియమం : కాంతి ఒక యానకం నుండి మరొక యానకంలోనికి ప్రయాణించేటపుడు ఆ యానకాలలో కాంతి వేగాల నిష్పత్తి \(\left(\frac{v_{1}}{v_{2}}\right)\), ఆ యానకాల వక్రీభవన గుణకాల నిష్పత్తి \(\left(\frac{n_{2}}{n_{1}}\right)\)కి సమానంగా ఉంటుంది.
AP 10th Class Physical Science Notes 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 4

→ సందిగ్ధ కోణం : సాంద్రతర యానకం నుండి విరళ యానకంలోనికి ప్రయాణించే కాంతికిరణం ఏ పతన కోణం వద్ద, యానకాలను విభజించే తలానికి సమాంతరంగా ప్రయాణిస్తుందో ఆ పతన కోణాన్ని ఆ రెండు యానకాలకు సంబంధించిన ‘సందిగ్ధ కోణం” అంటారు.

AP 10th Class Physical Science Notes 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం

→ సంపూర్ణాంతర పరావర్తనం : సందిగ్ధకోణం కన్నా పతనకోణం ఎక్కువైనపుడు యానకాలను వేరుచేసే తలం వద్ద కాంతి కిరణం తిరిగి సాంద్రతర యానకంలోకి పరావర్తనం చెందుతుంది. ఈ దృగ్విషయాన్ని “సంపూర్ణాంతర పరావర్తనం” అంటారు.

→ విస్థాపనం : ఒక గాజు దిమ్మె నుండి వెలువడిన పతన కిరణాలు మరియు వక్రీభవన కిరణాలను పొడిగించగా ఏర్పడిన సమాంతర రేఖల మధ్య దూరం.

→ ఎండమావులు : భూమి పైన ఉండే సాంద్రతరమైన చల్లగాలిలో కంటే కింద ఉండే విరళమైన వేడిగాలిలో కాంతి వేగంగా ప్రయాణిస్తుంది. అలా దృక్ భ్రమ వల్ల ఏర్పడేవే ఎండమావులు.

→ ఆప్టికల్ ఫైబర్ : ఇది గాజు లేదా ప్లాస్టిక్ తో తయారుచేయబడిన అతి సన్నని తీగ. దీని వ్యాసార్ధం సుమారుగా 1 మైక్రోమీటర్ ఉంటుంది. ఇది సంపూర్ణాంతర పరావర్తనం పై ఆధారపడి పనిచేస్తుంది.

AP 10th Class Physical Science Notes 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 5

AP Board 7th Class Science Notes in Telugu & English Medium

AP State Syllabus 7th Class Science Notes in Telugu & English Medium

AP 7th Class Science Notes in English Medium

7th Class Science Notes Sem 1

AP 7th Class Science Notes Sem 2

AP 7th Class Science Notes in Telugu Medium

7th Class Science Guide Sem 2

AP 7th Class Science Notes in English Medium (Old Syllabus)

AP State Board Notes

AP Board 6th Class Science Notes in Telugu & English Medium

AP State Syllabus 6th Class Science Notes in Telugu & English Medium

AP 7th Class Social Notes in English Medium

6th Class Science Notes Sem 1

AP 6th Class Science Notes English Medium Sem 2

AP 6th Class Social Notes in Telugu Medium

SCERT Class 6 Science Notes Sem 1

AP 6th Class Science Notes Telugu Medium Sem 2

AP State Board Notes

AP Board 7th Class Social Studies Notes in Telugu & English Medium

AP State Syllabus 7th Class Social Studies Notes in Telugu & English Medium

AP 7th Class Social Notes in English Medium

7th Class Social Notes Sem 1

AP 7th Class Social Notes Sem 2

AP 7th Class Social Notes in Telugu Medium

7th Class Social Notes Sem 1

AP 7th Class Social Notes Sem 2

AP 7th Class Social Notes in English Medium (Old Syllabus)

AP State Board Notes

AP Board 10th Class Maths Notes in Telugu & English Medium

Students can go through Andhra Pradesh SCERT AP State Board Syllabus SSC 10th Class Maths Notes Pdf in English Medium and Telugu Medium to understand and remember the concepts easily. Besides, with our AP State 10th Class Maths Notes students can have a complete revision of the subject effectively while focusing on the important chapters and topics. Students can also read  AP 10th Class Maths Textbook Solutions for board exams.

AP State Syllabus 10th Class Maths Notes in Telugu & English Medium

AP 10th Class Maths Notes in English Medium

AP 10th Class Maths Notes in Telugu Medium

AP State Board Notes

These AP State Board Syllabus SSC 10th Class Maths Notes provide an extra edge and help students to boost their self-confidence before appearing for their final examinations.

AP 10th Class Physical Science Notes 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

Students can go through AP Board 10th Class Physical Science Notes 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు to understand and remember the concept easily.

AP Board 10th Class Physical Science Notes 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

→ ఆమ్లలు అనే పేరు “ఎసిడస్” అనే లాటిన్ పేరు నుండి వచ్చింది. ఎసిడస్ అనగా పుల్లని రుచి అని అర్థం.

→ క్షారాలు అనగా రుచికి చేదుగా ఉంటాయి. జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి.

→ నీలి లిట్మస్, ఎర్ర లిట్మస్, మిథైల్ ఆరెంజ్, ఫినాఫ్తలీన్లు సూచికలకు ఉదాహరణలు.

→ నీలి లిట్మస్ ను ఆమ్లాలు ఎరుపురంగులోనికి మార్చుతాయి.

→ ఎర్ర లిట్మసు క్షారాలు నీలిరంగులోనికి మార్చుతాయి.

→ మిథైల్ ఆరెంజ్ ఆమ్ల మాధ్యమంలో ఎరుపురంగులోకి మారును.

→ మిథైల్ ఆరెంజ్ క్షార మాధ్యమంలో పసుపురంగులోకి మారును.

→ ఫినాఫ్తలీన్‌కు ఆమ్ల మాధ్యమంలో రంగు లేదు.

AP 10th Class Physical Science Notes 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

→ ఫినాఫ్తలీన్ క్షార మాధ్యమంలో పింక్ రంగులోకి మారును.

→ లిట్మస్, రెడ్ క్యాబేజ్, పసుపు ద్రావణాలను సహజ సూచికలు అంటారు.

→ ఆమ్ల – క్షార సూచికలు అద్దకం లేదా అద్దకం యొక్క మిశ్రమాలు.

→ ఆమ్ల – క్షార సూచికలను ఆమ్ల-క్షార ద్రావణులుగా గుర్తించటానికి వాడతారు.

→ జల ద్రావణాలలో H+ అయాన్లను ఇచ్చే వాటిని ఆమ్లాలంటారు.
HCl, H2SO4, HNO3, CH3COOH ఆమ్లాలకు ఉదాహరణ.

→ జల ద్రావణాలలో OH అయాన్లను ఇచ్చే వాటిని క్షారాలంటారు.
ఉదా: NaOH, KOH, Ca(OH)2.

→ ఒక ద్రావణంలో H+ అయాను ఉండడం వలన ఆ ద్రావణానికి ఆమ్ల ధర్మం వస్తుంది. అదే విధంగా OH అయాన్ ఉండడం వలన ఆ ద్రావణానికి క్షార ధర్మం ఏర్పడుతుంది.

→ కొన్ని పదార్థాలు ఆమ్ల మరియు క్షార మాధ్యమాలలో వేర్వేరు వాసనలను ప్రదర్శిస్తాయి. వీటిని ఓల్ ఫ్యాక్టరీ సూచికలు అంటారు.

→ అలోహాలకు ఉదాహరణ : హైడ్రోజన్, కార్టన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, ఫాస్ఫరస్, సల్ఫర్, అయొడిన్, సిలికాన్.

→ అలోహ ఆక్సైడ్ లు CO2, NO2, N2O5, P2O3 P2O5.

→ అలోహ ఆక్సైడ్ లను నీటిలో కరిగిస్తే ఆమ్లాలు ఏర్పడతాయి.

→ ఆమ్లాలు, లోహాలతో చర్య జరిపి లోహ లవణాలను, హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి.

→ Zn లోహం సజల HNO తో చర్య జరిపి హైడ్రోజన్‌ను ఇవ్వదు.

→ ఆమ్లాలు కారొనేట్లు, బై కార్బొనేట్లతో చర్యజరిపి లోహ లవణాలను, CO2ను, నీటిని విడుదల చేస్తాయి.

AP 10th Class Physical Science Notes 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

→ లోహాలు : Na, P, Ca, Mg, AL లోహాలకు ఉదాహరణలు.

→ లోహ ఆక్సైలు : Na2O, K2O, MgO, CaO లాంటివి కలవు.

→ లోహ ఆక్సైడ్ లను నీటిలో కరిగిస్తే క్షారాలు ఏర్పడతాయి.

→ క్షారాలను వేడి చేస్తే వియోగం చెందుతాయి.

→ క్షారాలు, ఆమ్లాలతో చర్య జరిపి లవణాలను, నీటిని ఏర్పరుస్తాయి.

→ కేవలం జింక్ లోహం మాత్రమే NaOHతో చర్య జరిపి సోడియం జింకేట్ (Na2Zn)2) ను ఏగ్గరుస్తుంది.

→ ఒక ఆమ్లం, క్షారంతో చర్య జరిపి లవణాన్ని, నీటిని ఏర్పరచే చర్యను తటస్థీకరణ చర్య అంటారు.

→ ఆమ్లాన్ని, క్షారంతో కలిపినపుడు విడుదలయ్యే ఉష్ణాన్ని తటస్థీకరజోష్ణం అంటారు.

→ తటస్థీకరణం ఉష్ణమోచక చర్య.

→ ఆమ్లాలు, లోహ ఆక్సైడ్ లతో చర్య జరిపి లవణాన్ని, నీటిని ఏర్పరచును.

→ లోహ ఆక్సైడ్ లు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి.

→ ఆహారంలో విడుదలైన అధిక ఆమ్లాన్ని తటస్థీకరించే బలహీన క్షారాలను ఏంటాసిడ్ అంటారు.

→ జెలూసిల్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియాలు ఏంటాసిడ్లకు ఉదాహరణలు.

→ నీరు ద్రావణిగా ఉన్న ద్రవాలను జల ద్రావణాలు అంటారు.

→ ఆమ్ల జల ద్రావణాలలో H+ అయాన్లుంటాయి. కాబట్టి విద్యుత్ వాహకాలను ప్రదర్శిస్తాయి.

→ నీటిలో కరిగే క్షారాలను ఆల్కలీ అంటారు.

→ క్షార ద్రావణాలలో OH అయాన్లుంటాయి. కాబట్టి విద్యుత్ వాహకతను ప్రదర్శిస్తాయి.

→ ఆమ్ల, క్షార ద్రావణాలు విద్యుత్ వాహకతను ప్రదర్శించడానికి కారణం H+, OH లను కలిగి ఉంటాయి.

→ గ్లూకోజ్, యూరియా వంటి ద్రావణాలు విద్యుత్ వాహకతను ప్రదర్శించవు. కారణం వీటిలో H+, OH అయాన్లు లేకపోవడమే.

AP 10th Class Physical Science Notes 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

→ H+ అయానుకు స్వతంత్ర ఉనికి లేదు. హైడ్రోనియం (H3O+) అయానుగా ఉండును.

→ సజల ఆమ్లాలు తయారు చేయునపుడు నీటికి కొద్దిగా ఆమ్లాన్ని కలుపుతూ కలియబెట్టాలి.

→ గాఢ ఆమ్లంలోకి నీటిని కలిపితే అధిక ఉష్ణం విడుదలైతే ప్రమాదాలకు దారి తీస్తుంది.

→ ఏ ఆమ్లం యొక్క జల ద్రావణంలోనైనా H3O+ అయాన్లు ఎక్కువ ఉంటే అవి ఎక్కువ విద్యుత్ వాహకతను చూపును. వీటిని బలమైన ఆమ్లాలు అంటారు. ఉదా: HCl, H2SO4, HNO3.

→ ఏ ఆమ్లాల జలద్రావణంలో H3O+ అయాన్లు ఎక్కువ ఉంటాయో అవి తక్కువ విద్యుత్ వాహకతను ప్రదర్శిస్తాయి. వీటిని బలహీన ఆమ్లాలంటారు.
ఉదా : CH3COOH, H3PO4, H2CO3.

→ ఏ క్షారాల జల ద్రావణాలలో అధికంగా OH అయాన్లు కలిగి, అధిక విద్యుత్ వాహకతను చూపుతాయో వాటిని బలమైన క్షారాలంటారు. ఉదా: NaOH, KOH.

→ ఏ క్షారాల జల ద్రావణాలలో తక్కువ OH అయాన్లు కలిగి తక్కువ విద్యుత్ వాహకతను చూపుతాయో వాటిని బలహీన క్షారాలంటారు. ఉదా : NH4OH, Mg(OH)2, Ca(OH)2.

→ సార్వత్రిక ఆమ్ల, క్షార సూచికను ఉపయోగించి కూడా బలమైన, బలహీనమైన ఆమ్ల – క్షారాలను గుర్తించవచ్చు.

→ H+ అయాను యొక్క ఋణ సంవర్గమానాన్ని pH స్కేల్ అంటారు. * తటస్థ ద్రావణాలకు pH విలువ = 7

→ ఆమ్ల ద్రావణాలకు pH విలువ 7 కంటే తక్కువ.

→ క్షార ద్రావణాల pH విలువ 7 కంటే ఎక్కువ.

→ pH స్కేలు (0 – 14) ద్వారా ఆమ్ల – క్షార ద్రావణాల యొక్క బలాన్ని గుర్తించవచ్చు. ఈ pH స్కేలు విలువ ద్రావణంలో హైడ్రోజన్ అయాన్ గాఢతను తెలియజేస్తుంది.

→ జీవరాశుల యొక్క జీవన ప్రక్రియలు నిర్దిష్ట pH విలువను కలిగి ఉంటాయి.

AP 10th Class Physical Science Notes 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

→ వర్షపు నీటి యొక్క pH విలువ 5.6 కంటే తక్కువ ఉంటే దానిని ఆమ్ల వర్షం అంటారు.

→ pH విలువ 5.5 కంటే తక్కువ ఉంటే దంత క్షయం ఏర్పడుతుంది.

→ సోడియం క్లోరైడ్ ను సాధారణ ఉప్పు అంటారు.

→ NaCl నుండి 1) NaOH 2) బేకింగ్ సోడా 3) బట్టల సోడా 4) బ్లీచింగ్ పౌడర్ వంటి సమ్మేళనాలను తయారుచేస్తారు.

→ బ్లీచింగ్ పౌడర్‌ను విరంజనకారిగా, క్రిమిసంహారిణిగా వాడతారు.

→ బేకింగ్ సోడాను బేకింగ్ పౌడర్ తయారీలో మరియు వంటలలో విరివిగా వాడతారు.

→ వాషింగ్ సోడా గాజు తయారీలో ముడిపదార్థం.

→ లవణంలో నిర్దిష్ట సంఖ్యలో ఉన్న నీటి అణువులను స్ఫటిక జలం అంటారు.

→ స్ఫటిక జలం కలిగిన కొన్ని లవణాలు ఖచ్చితమైన సంఖ్యలో నీటి అణువులను కలిగి ఉంటాయి.

→ CaSO4, 2H2O ను జిప్సం అంటారు.

→ కాల్షియం సల్ఫేట్ హెమి హైడ్రేట్ (CaSO4 ½H2O)ను ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అంటారు.

→ సూచికలు : ఆమ్ల క్షార మాధ్యమాలలో వేర్వేరు రంగులనిచ్చు పదార్థాలను సూచికలు అంటారు.

→ ఆమ్లం : జల ద్రావణాలలో H + అయాన్లు ఇచ్చే వాటిని ఆమ్లాలు అంటారు. ఇవి రుచికి పుల్లగా ఉంటాయి.

→ క్షారం : ఏవైతే ఆమ్లాలతో చర్య జరిపి లవణాన్ని, నీటిని ఇస్తాయో వాటిని క్షారాలంటారు. ఇవి రుచికి చేదుగా ఉండి, జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి.

→ ఎర్ర లిట్మస్ కాగితం : క్షారాలను గుర్తించటానికి లిట్మస్ ద్రావణం నుండి తయారుకాబడిన ఎరుపు రంగు
కాగితపు పట్టీని ఎర్ర లిట్మస్ కాగితం అంటారు.

AP 10th Class Physical Science Notes 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

→ నీలి లిట్మస్ కాగితం : ఆమ్లాలను గుర్తించటానికి లిట్మస్ ద్రావణంతో తయారుకాబడిన నీలిరంగు కాగితపు పట్టీని నీలి లిట్మస్ కాగితం అంటారు.

→ ఫినాఫ్తలీన్ : క్షార మాధ్యమంతో పింక్ రంగును, ఆమ్ల మాధ్యమంతో రంగుచూపని ద్రావణాన్ని ఫినాఫ్తలీన్ అంటారు.

→ మిథైల్ ఆరెంజ్ : ఆమ్ల మాధ్యమంలో ఎరుపు రంగుకు, క్షార మాధ్యమంలో పసుపు రంగుకు మారగల రంజనాన్ని మిథైల్ ఆరెంజ్ అంటారు.

→ లవణం : ఆమ్లాన్ని క్షారంతో తటస్థీకరించినపుడు ఏర్పడు పదార్థాన్ని లవణం అంటారు.

→ తటస్థీకరణం : క్షారంతో ఒక ఆమ్లం చర్య జరిపి లవణాన్ని, నీటిని ఏర్పరచే చర్యను తటస్థీకరణ చర్య అంటారు.

→ హైడ్రోనియం అయాన్ : హైడ్రోజన్ అయాన్ (H+) స్వేచ్చా అయానుగా ఉండదు. మరొక నీటి అణువుతో కలుస్తుంది. దీనినే హైడ్రోనియం అయాన్ అంటారు.
H+ + H2O → H3O+

→ ఆల్కలీ : ఏ క్షారాలైతే నీటిలో కరుగుతాయో ఆ క్షారాలను ఆల్కలీ అంటారు.

→ బలమైన ఆమ్లం : ఏ ఆమ్లాలైతే ఎక్కువ సంఖ్యలో H3O+ అయానులనిస్తాయో వాటిని బలమైన ఆమ్లాలని అంటారు.
ఉదా : HCl, H2SO4, HNO3.

→ బలమైన క్షారం : ఏ క్షారాలైతే ఎక్కువ సంఖ్యలో OH అయానులనిస్తాయో వానిని బలమైన క్షారాలంటారు.
ఉదా : NaOH, KOH.

AP 10th Class Physical Science Notes 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

→ సార్వత్రిక సూచిక : అనేక సూచికల మిశ్రమాన్ని సార్వత్రిక ఆమ్ల – క్షార సూచిక అంటారు. ఇది వేర్వేరు హైడ్రోజన్ అయాను గాఢతలను బట్టి వేర్వేరు రంగులను చూపుతుంది.

→ pH స్కేల్ : హైడ్రోజన్ గాఢత యొక్క ఋణ సంవర్గమానాన్ని pH స్కేల్ అంటారు.
pH = – log (H+). దీనిని కనుగొన్నది సొరెన్సన్.

→ ఏంటాసిడ్ : ఏంటాసిడ్ అనగా బలహీన క్షారం. ఆహార పదార్థాల నుండి తయారైన అధిక పరిమాణంలోని ఆమ్లాలను తటస్థీకరించి ఉపశమనాన్ని కలుగజేయును.
ఉదా : జెలూసిల్ మరియు మిల్క్ ఆఫ్ మెగ్నీషియా.

→ దంతక్షయం : నోటిలోని అధిక పరిమాణం గల ఆమ్లాల వలన పండ్ల పైన అత్యంత ధృఢమైన ఎనామిల్ పొర క్షీణించి పన్ను నాశనం అవటాన్ని దంతక్షయం అంటారు.

→ లవణాల కుటుంబం : ఒకే విధమైన ధన అయాన్లను లేదా ఋణావేశ రాడికల్స్ ను కలిగియున్న లవణాలను ఒకే కుటుంబానికి చెందిన లవణాలు అంటారు.

→ సామాన్య లవణం : సోడియం క్లోరైడ్ ను సామాన్య లవణం అంటారు. ఆహార పదార్థాలకు రుచిని పెంచడానికి దీనిని వాడతారు. పదార్థాలకు ఉన్న రంజనాన్ని పోగొట్టడానికి బ్లీచింగ్ పౌడర్ వాడతారు. దీనినే విరంజన కారి అంటారు.

→ బేకింగ్ సోడా : సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ను (NaHCO3) బేకింగ్ సోడా అంటారు. దీనిని పదార్థాలను త్వరగా ఉడికించడానికి వాడతారు. బజ్జీలు, పూరీ పిండి తయారీలో బేకింగ్ పౌడర్ కలిపితే అవి బాగా ఉబ్బి ఆకర్షణీయంగా ఉంటాయి.

→ వాషింగ్ సోడా : సోడియం కార్బొనేట్ ను పునః స్ఫటికీకరణం చేస్తే వాషింగ్ సోడా లభిస్తుంది. దీనిని Na2CO3.10H2O తో సూచిస్తారు. దీనినే బట్టల సోడా అని కూడా అంటారు.

→ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ : కాల్షియం సల్ఫేట్ హెమి హైడ్రేట్ ను ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అంటారు. దీనిని CaSO4 ½H2O తో సూచిస్తారు.

→ ఆర్ధ లవణం : ఏదైనా లవణం నిర్దిష్ట సంఖ్యలో నీటి అణువులను కలిగి ఉంటే ఆ లవణాన్ని ఆర్ధ లవణం అంటారు.
ఉదా : CuSO4 5H2O, Na2CO3 10H2O.

→ స్పటిక జలం : ఏదైనా లవణం యొక్క ఫార్మూలాలో నిర్దిష్ట సంఖ్యలో ఉండే నీటి అణువులను స్ఫటిక జలం అంటారు.

AP 10th Class Physical Science Notes 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

→ గార్డ్ ట్యూబ్ : వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటే తేమ పోగొట్టడానికి కాల్షియం క్లోరైడ్ గల నిర్జలీకరణ గొట్టాన్ని గార్డ్ ట్యూబ్ అంటారు.

→ పొటెస్ట్ : pH స్కేలులో p అనగా పొటెస్ట్. జర్మనీ భాషలో పొటెస్ట్ అనగా సామర్థ్యం అని అర్థం.

→ అనార్ధ లవణం : ఆర్ధ లవణాలను వేడిచేసినపుడు స్పటిక జలం ఆవిరి రూపంలో పోయి, మిగిలిన లవణాన్ని అనార్ధ లవణం అంటారు.

→ ట్రైన్ ద్రావణం : NaCl జల ద్రావణాన్ని ట్రైన్ ద్రావణం అంటారు.

→ కాస్టిక్ సోడా : NaOH క్షారం చర్మాన్ని, బట్టలను, పేపర్లను తినివేస్తుంది. ఈ క్షారాన్ని కాస్టిక్ సోడా అంటారు.

→ క్విక్ లైమ్ : కాల్షియం ఆక్సైడ్ ను క్విక్ లైమ్ అంటారు.

→ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా : Mg(OH)2 ను మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటారు.

→ జిప్సం : CaSO4 2H2O ను జిప్సం అంటారు.

→ బేకింగ్ పౌడర్ : బేకింగ్ సోడాకు కాల్షియం డై హైడ్రోజన్ ఫాస్ఫేట్ మరియు పిండి పదార్థాలు కలుపగా ఏర్పడిన మిశ్రమాన్ని బేకింగ్ పౌడర్ అంటారు.

→ ఓల్ ఫ్యాక్టరీ : కొన్ని పదార్థాలు ఆమ్ల మరియు క్షార మాధ్యమంలో వేర్వేరు వాసనలను ప్రదర్శిస్తాయి. వీటిని ఓల్ ఫ్యాక్టరీ సూచికలు అంటారు.

AP 10th Class Physical Science Notes 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

→ విలీనత : ఆమ్లానికి గానీ, క్షారానికి గానీ నీటిని కలిపినపుడు ప్రమాణ ఘనపరిమాణంలో గల అయానుల గాఢత తగ్గుతుంది. ఈ దృగ్విషయాన్ని విలీనత అంటారు.

→ రాక్ సాల్ట్ : భూమి పొరలలో సోడియం క్లోరైడ్ స్పటికాలు మలినాలతో కలిసి ఉండడాన్ని రాక్ సాల్ట్ లేదా ఉప్పు అంటారు.

→ క్లోరో ఆల్కలీ ప్రక్రియ : NaCl జల ద్రావణం గుండా విద్యుతను ప్రసరింపజేస్తే అది వియోగం చెంది NaOH ఏర్పడుతుంది. ఈ ప్రక్రియను క్లోరో ఆల్కలీ ప్రక్రియ అంటారు.

→ ఫ్లేక్ట్ టైమ్ : CaOH కు నీళ్ళు కలిపి కాల్చబడిన సున్నపురాయిని స్లేక్ట్ లైమ్ అంటారు. లేదా పొడి Ca(OH)2 ను స్లేక్ట్ లైమ్ అంటారు.

→ క్లోరోఫామ్ : CHCl3ను క్లోరోఫాం అంటారు. దీనిని ఆపరేషన్ చేయునపుడు డాక్టర్ రోగికి క్లోరోఫామ్ ను మత్తుమందుగా వాడతారు.

AP 10th Class Physical Science Notes 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 3
AP 10th Class Physical Science Notes 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 4

AP Board 10th Class Physical Science Notes in Telugu & English Medium

AP State Syllabus 10th Class Physical Science Notes in Telugu & English Medium

AP 10th Class Physical Science Notes in English Medium

AP 10th Class Physical Science Notes in Telugu Medium

AP State Board Notes

AP 10th Class Physical Science Notes 1st Lesson ఉష్ణం

Students can go through AP Board 10th Class Physical Science Notes 1st Lesson ఉష్ణం to understand and remember the concept easily.

AP Board 10th Class Physical Science Notes 1st Lesson ఉష్ణం

→ చల్లదనం లేదా వెచ్చదనం తీవ్రతనే ఉష్ణోగ్రత అంటారు.

→ వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ఉష్ణశక్తి బదిలీ అవుతుంది.

→ రెండు వస్తువులు ఒకే వెచ్చదనం తీవ్రత పొందినట్లయితే ఆ రెండు వస్తువులు ఉష్ణ సమతాస్థితిలో ఉన్నాయని అర్థం.

→ ఉషేయ ధార్మిక స్పర్శలో ఉన్న A, B అనే రెండు వ్యవస్థలు విడివిడిగా C అనే వ్యవస్థతో ఉష్ణ సమతాస్థితిలో ఉంటే, A, B వ్యవస్థలు కూడా పరస్పరం ఉష్ణ సమతాస్థితిలో ఉంటాయి.

→ అధిక ఉష్ణోగ్రత గల వస్తువు నుండి అల్ప ఉష్ణోగ్రత గల వస్తువుకు ప్రవహించే శక్తి స్వరూపాన్ని ఉష్ణం అంటారు

→ ఉష్ణోగ్రత అనేది ఉష్ణ సమతాస్థితి యొక్క కొలత. లో ఒక గ్రాము నీటి ఉష్ణోగ్రతను 1°C పెంచటానికి అవసరమైన ఉష్ణాన్ని కెలోరీ అంటారు.

→ 1 కెలోరి = 4.18 జొళ్ళు

→ అణువుల సరాసరి గతిశక్తి చల్లని వస్తువులో కంటె వేడి వస్తువులో ఎక్కువగా ఉంటుంది.

AP 10th Class Physical Science Notes 1st Lesson ఉష్ణం

→ ఒక పదార్థంలోని అణువుల సరాసరి గతిజశక్తి ఆ పదార్థ పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది.

→ ఉష్ణశక్తి ప్రసార దిశను నిర్ణయించేది ఉష్ణోగ్రత.

→ ఉష్ణోగ్రత పెరుగుదల రేటు పదార్థ స్వభావంపై ఆధారపడి ఉంటుంది.

→ ప్రమాణ ద్రవ్యరాశి గల పదార్థ ఉష్ణోగ్రతను 1° పెంచటానికి కావలసిన ఉష్ణరాశిని ఆ పదార్థ విశిష్టోష్ణం అంటారు.
SS = Q/mat

→ వేడి వస్తువులు కోల్పోయిన ఉష్ణం = చల్లని వస్తువులు గ్రహించిన ఉష్ణం.

→ ద్రవ అణువులు ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ద్రవం ఉపరితలాన్ని విడిచి వెళ్లే ప్రక్రియను బాష్పీభవనం అంటాం. ఆ బాష్పీభవనం ఒక శీతలీకరణ ప్రక్రియ.

→ బాష్పీభవనం యొక్క వ్యతిరేక ప్రక్రియే సాంద్రీకరణం. ఆ వాయువు ద్రవంగా స్థితి మార్పు చెందటమే సాంద్రీకరణం అంటారు. ఈ గాలిలోని నీటి ఆవిరి పరిమాణాన్ని ఆర్ధత అంటారు.

→ స్థిరపీడనం మరియు స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలోని పదార్థం , వాయుస్థితిలోకి మారే ప్రక్రియను మరగటం అంటారు.

→ నీరు ద్రవస్థితి నుండి వాయు స్థితికి మారటానికి వినియోగపడిన ఉష్ణాన్ని బాషీషీభవన గుప్తోష్ణం అంటారు. * స్థిర ఉష్ణోగ్రత వద్ద ఘనస్థితిలో ఉన్న పదార్థం ద్రవస్థితిలోకి మారే ప్రక్రియను ద్రవీభవనం అంటారు.

→ ఉష్ణోగ్రత : చల్లదనం స్థాయిని, వెచ్చదనం స్థాయిని ఉష్ణోగ్రత అంటారు. దీనిని T తో సూచిస్తారు. C.G.S. ప్రమాణాలు – సెంటీగ్రేడ్ (°C), S.I. ప్రమాణం – కెల్విన్ (K)

→ ఉష్ణం : అధిక ఉష్ణోగ్రత ప్రాంతం నుండి అల్ప ఉష్ణోగ్రత గల వస్తువుకు ప్రవహించే శక్తి స్వరూపాన్ని ఉష్ణం అంటారు. దీనిని ‘Q’ తో సూచిస్తారు.
C.G.S. ప్రమాణాలు – కేలరీ, S.I. ప్రమాణం – బౌల్.

AP 10th Class Physical Science Notes 1st Lesson ఉష్ణం

→ ఉష్ణ సమతాస్థితి : అధిక, అల్ప ఉష్ణోగ్రతలున్న రెండు వస్తువులు ఒకదానితో ఒకటి తాకుతున్నప్పుడు రెండు వస్తువుల ఉష్ణోగ్రతలు సమానం అయ్యే వరకు ఉష్ణ ప్రసారం జరుగును. ఇప్పుడు రెండు వస్తువులు ఉష్ణ సమతాస్థితిలో ఉంటాయి. ఉష్ణ సమతాస్థితి అంటే ఒక వస్తువు ఉష్ణం బయటకు ఇవ్వలేని, స్వీకరించలేని స్థితి.

→ విశిష్టోష్ణం : ప్రమాణ ద్రవ్యరాశి గల పదార్థ ఉష్ణోగ్రతను ఒక డిగ్రీ పెంచడానికి కావల్సిన ఉష్ణరాశిని ఆ పదార్థం యొక్క విశిష్టోష్ణం అంటారు. దీనిని ‘S’ అనే అక్షరంతో సూచిస్తారు. ప్రమాణాలు : C.G.S. పద్ధతిలో కేలరీ /గ్రా. × °C
S.I. పద్ధతిలో బౌల్/కి.గ్రా.-K
అధిక విశిష్టోష్ణం గల పదార్థం – నీరు – కేలరీ / గ్రా.°C
అల్ప విశిష్టోష్ణం గల పదార్థం – సీసం – 0.31 కేలరీ / గ్రా.°C

→ బాష్పీభవనం : ద్రవంలోని అణువులు ఏ ఉష్ణోగ్రత ,వద్దనైనా ద్రవ ఉపరితలాన్ని విడిపోయే ప్రక్రియను బాష్పీభవనం అంటారు.
బాష్పీభవనం అనేది ఉపరితలానికి చెందిన దృగ్విషయం.
బాష్పీభవనం వలన వ్యవస్థ ఉష్ణోగ్రత తగ్గును.

→ సాంద్రీకరణం : వాయువు ద్రవంగా స్థితి మార్పు చెందడమే సాంద్రీకరణం. సాంద్రీకరణలో వ్యవస్థ ఉష్ణోగ్రత పెరుగును.

→ ఆర్ధత : గాలిలోని నీటి ఆవిరి పరిమాణాన్ని ఆర్ధత అంటారు.

→ తుషారం : శీతాకాలంలో భూమిపై ఉన్న ఘనపదార్థాలు తక్కువ ఉష్ణోగ్రతలో ఉంటాయి. ఈ చల్లటి పదార్థాలను తాకిన గాలిలోని నీటి ఆవిరి చిన్న చిన్న బిందువులుగా మారి వాటి ఉపరితలంపై ఏర్పడతాయి. దీనినే తుషారం అంటారు.

→ పొగమంచు : భూమి ఉపరితలంపై ఉన్న గాలి ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు గాలి పొరలలోని నీటి ఆవిరి గాలిలోని ధూళికణాల పై సాంద్రీకరణం చెంది చిన్నచిన్న నీటి బిందువులుగా ఏర్పడతాయి. ఈ నీటి బిందువులు గాలిలో తేలియాడుతూ పలుచని మేఘం వలె కనిపిస్తాయి. పొగవలె గాలిలో తేలియాడే నీటి బిందువులను పొగమంచు అంటారు.

AP 10th Class Physical Science Notes 1st Lesson ఉష్ణం

→ మరగటం : స్థిర పీడనం, స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలోని పదార్థం వాయుస్థితిలోనికి మారటం.

→ బాష్పీభవన గుప్తోష్ణం : స్థిర ఉష్ణోగ్రత వద్ద 1 గ్రా. ద్రవ పదార్థం పూర్తిగా ఆవిరిగా మారటానికి కావలసిన ఉష్ణాన్ని బాష్పీభవన గుప్తోష్ణం అంటారు.
నీటి బాష్పీభవన గుప్తోష్ణం విలువ 540 Cal/gram.

→ ద్రవీభవనం : స్థిర ఉష్ణోగ్రత వద్ద ఘనస్థితిలో ఉన్న పదార్థం ద్రవస్థితిలోకి మారే ప్రక్రియను ద్రవీభవనం అంటారు.

→ ఘనీభవనం : ద్రవస్థితిలో ఉన్న పదార్థం కొంత శక్తిని కోల్పోవడం ద్వారా ఘనస్థితిలోకి మారే ప్రక్రియను ఘనీభవనం అంటారు.

→ ద్రవీభవన గుప్తోష్ణం : స్థిర ఉష్ణోగ్రత వద్ద 1 గ్రా. ఘనపదార్థం పూర్తిగా ద్రవంగా మారటానికి కావల్సిన ఉష్ణాన్ని ద్రవీభవన గుప్తోష్ణం అంటారు.
మంచు ద్రవీభవన గుప్తోష్ణం విలువ 80 Cal/gram.

AP 10th Class Physical Science Notes 1st Lesson ఉష్ణం 1

AP Board 8th Class Physical Science Notes in Telugu & English Medium

AP State Syllabus 8th Class Physical Science Notes in Telugu & English Medium

AP 8th Class Physical Science Notes in English Medium

AP 8th Class Physical Science Notes in Telugu Medium

AP State Board Notes